స్ట్రక్చరల్ ఇంజినీర్ –పట్నాయకుని ఇందు భూషణ్
విజయనగరం జిల్లా పార్వతీపురానికి సమీప గ్రామం నిడుగల్లు లో పట్నాయకుని ఇందు భూషణ్ జన్మించారు .ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొంది ,కాన్పూర్ ఐ ఐ టి నుంచి ఎం .టెక్ అందుకున్న ఘనులు .1970లో ఆస్ట్రేలియా చేరి అక్కడే ఉండిపోయి మాతృభాష తెలుగుకు అవిరళ కృషి చేశారు .
ఆస్ట్రేలియా లోనిస్త్రక్చారాల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా ,మెల్ బోర్న్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోను పనిచేసి అనేక పరిశోధనలో నిమగ్నమయ్యారు .స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి కొత్త ఊపిరులూదారు .తన పరిశోధనలు నూతన ఆవిష్కరణలు చేస్తూనే మాతృభాష తెలుగు పై ప్రేమాభిమానాలు పెల్లుబికి 1991లో తెలుగు అసోసియేషన్ స్థాపించారు .ఆస్ట్రేలియాలో జన్మించిన తెలుగు పిల్లలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని తెలుగు విద్యా బోధనకు నడుం కట్టారు .ఆస్ట్రేలియా లోని ‘’ఎథినిక్ రేడియో సర్వీస్ ‘’లో రోజూ ఒక గంట సేపు తెలుగు కార్యక్రమాలు ప్రసారం చేయించే కార్యక్రమం చేబట్టి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు .మెల్ బోర్న్ లో ఉన్న 400 తెలుగు కుటుంబాలకు ,ఇతర ఆస్ట్రేలియన్ల కు తెలుగు నేర్పడం లో తన శాస్త్ర సాంకేతికతను అద్భుతంగా విని యోగిస్తున్నారు
తెలుగు వారి అభి వ్రుద్ధికోసం ఆస్ట్రేలియాలో ‘’తెలుగు విద్యాలయం ‘’నెలకొల్పిన మార్గ దర్శి క్రాంత దర్శి ఇంజనీరింగ్ విద్యా భూషణ్ గారు .దౌన్ అండర్ ప్రాంతం లో ఉంటూ తెలుగు భాషా మాధుర్యాన్ని పంచుతున్న పట్నాయకుని ఇందుభూషణ్ గారికి జేజేలు .
హైబ్రిడ్ ఇంజన్ రూప శిల్పి –కర్రి విశ్వనాథ్
కర్రి విశ్వనాథ్అనకాపల్లిలో జన్మించి ,హైదరాబాద్ ఉస్మానియాలో మెకానికల్ ఇ౦జ నీరింగ్ పూర్తీ చేశారు .ఆస్ట్రేలియా వెళ్లి పిహెచ్ డి ,,ఎంఏఐ ఎస్ టిఇడి,ఎంఏ ఐ ఏ ఎఫ్ సి ,ఏం ఎస్ ఏ ఏం యి ,ఏం ఐ ఐ వంటి అనేక డిగ్రీలు ఆర్జించారు .ఉస్మానియాలో చదువుతూనే ఇంజనీరింగ్ రంగం లో పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు .
‘’ఇ౦టలిజేంట్ కార్ ప్రోగ్రాం ‘’లో కర్రి ఆలోచనలు కొత్త ప్రక్రియలకు దారి చూపటం తో ఆయన పేరు ప్రఖ్యాతులు బాగా ప్రచారం పొంది,అంతర్జాతీయ పరిశోధకులుగా గుర్తింపు పొందారు .ఇంధన సమస్యలు తీర్చటానికి ‘’దీజెల్ –హైడ్రోజెన్ ‘’మిశ్రమం తయారు చేశారు .పర్యావరణాన్ని రక్షిస్తూ అత్యంత శక్తివంతంగా పని చేసే ‘’హైబ్రిడ్ ఇంజన్ ‘’ నిర్మాణ బృంద నాయకులుగా, రూప శిల్పిగా విఖ్యాతులయ్యా రు .ఈ ఇంజన్ వలన ఇంధన వినియోగం 70శాతం తగ్గి, ఇంజన్ సామర్ధ్యం 20 శాతం పెరిగి వాడకం దారుల పాలిటి కల్ప వృక్షమే అయింది .ఈ పరిశోధన ‘’హైబ్రిడ్ ఎకానమి’’కి నాంది పలికింది .
కేవలం ఒక స్పూన్ డీజెల్ ఉపయోగించి ఇంజన్ ను హైడ్రోజెన్ తో నడిపిస్తే దాని శక్తి సామర్ధ్యం 20 శాతం పెరుగుతుందని శ్రీ కర్రి ప్రయోగపూర్వాకం రుజువు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యం లో ముంచేశారు .హైడ్రోజెన్ లో డీజల్ కలపటం అనేది అంతర్జాతీయంగా నూతన విషయంగా ఖ్యాతి పొంది విశ్వనాథ విజయానికి ప్రపంచం శిరసు వంచింది .ఇది ‘’పునర్వినియోగ ఇంధన పరిశోధన’’కు మార్గ దర్శనం చేసి ‘’డాక్టర్ వి.పి.’’గా జగత్ ప్రసిద్ధులయ్యారు . ‘’కర్రి సృష్టి’’ ఇంధన ‘’వర్రీ’’లను దూరం చేసింది .అంతర్జాతీయ స్థాయిలో’’ ప్రగతి చోదక చక్రంగా ‘’ హైడ్రోజెన్ –డీజెల్ ‘’ఇంజన్ సృష్టి కర్త 40 ఏళ్ళ వయసు మాత్రమే ఉన్న ఆంద్ర శాస్త్రవేత్త శ్రీ కర్రి విశ్వనాథ్ కు దక్కటం మనకు గర్వకారణం .పర్యావరణం కాపాడటం లో ఇంజన్ సామర్ధ్యం పెంచటం లో ఈ కృషి అత్యంత విలువైనది మన దేశానికి మన రాష్ట్రానికి కీర్తికారణమైనది .
ఆధారం –శ్రీ వాసవ్య రాసిన ‘’ఆంద్ర శాస్త్రవేత్తలు ‘’
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-19-ఉయ్యూరు

