ఆధునిక ఆంద్ర శాస్త్ర రత్నాలు-21-లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ రూప శిల్పి –కోట హరినారాయణ
21-లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ రూప శిల్పి –కోట హరినారాయణ
శ్రీ కోట హరినారాయణ 1943లో బరంపురం లో జన్మించిన తెలుగు వాడు .బెనారస్ హిందూ యూని వర్సిటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు .బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి , బొంబాయి ఐ .ఐ.టి.లో పిహెచ్ డి చేశారు .న్యాయశాస్త్రమూ చదివి పట్టా చేబట్టారు .విద్యాభ్యాసం అంతా స్వదేశం లోనే చేసిన ఆంద్ర శాస్త్ర వేత్త కోట .
1967లో హిందుస్థాన్ ఏరో నాటిక్స్ లో ఉద్యోగం పొంది1970లో రక్షణ పరిశోధన ,అభి వృద్ధి సంస్థ D.R.D.O.లో చేరి సుమారు 12ఏళ్ళు కీలకపదవులలో రాణించారు .1982లో మళ్ళీ H.A.L. లో చీఫ్ డిజైనర్ గా నాసిక్ లో పని చేశారు .మిగ్ విమాన ఆయుర్దాయం పెంచే ప్రాజెక్ట్ లో కీలక పాత్ర పోషించారు .దాని సామర్ధ్యాన్ని బాగా పెంచి బరువును కూడా బాగా తగ్గించారు .దీనితో మిగ్-21 విమానాల విడిభాగాల ఉత్పత్తి మనదేశంలోనే చేయటానికి సాధ్యపడింది .
కోట గారు 1985లో బెంగుళూరు లోని ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ A.D.E;కి డైరెక్టర్ అయ్యారు .అప్పటికే ఆయన పరిశోధన ప్రభావం వలన తేలిక రకం యుద్ధ విమానాలు అంటే లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ L.C.A.మనదేశం లో నిర్మించే ప్రాజెక్ట్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా హరినారాయణ గారిని నియమించి పూర్తి బాధ్యతలను అప్పగించింది .ఎల్ సి ఏ కి రూపకల్పన చేసి వివిధరకాల ఫ్లైట్ పరిక్షలునిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేశారు .దీనితో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం తో భారత దేశం లో ప్రపంచ దేశాలకు దీటుగా మొదటి యుద్ధవిమాన౦ లైట్ కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారై౦ది .ఇదంతా కోటవారి శాస్త్ర సాంకేతిక సామర్ధ్యానికి, ముందు చూపుకు నిదర్శనం .1995లో ఆయనను ప్రముఖ శాస్త్ర వేత్తగా గుర్తించారు .ఇండియా చైనాయుద్ధం లో వోడిపోవటానికి ఇలాంటి యుద్ధ విమానాలు లేకపోవటమే కారణం .పాకిస్తాన్ యుద్ధం లో గెలవటానికిఇలాంటి యుద్ధ విమానాలే కీలకమయ్యాయి .L.C.A.నిర్మాణం తో భారత్ యుద్ధ విమా న రంగం లో అగ్రరాజ్యాల స్థాయికి చేరింది .2002లోవీటి నిర్మాణానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల నిధి మంజూరు చేసింది .తేజస్ ప్రోగ్రాం లోకూడా వీరి పాత్ర గణనీయంగా ఉంది .కోటగారు హైదరాబాద్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా కూడా పని చేశారు .డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనై జేషన్ నుంచి ‘’డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అవార్డ్ ‘’అందుకొన్నారు .2002లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది .
ఆధారం- శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-19-ఉయ్యూరు

