ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
22-ఎలెక్ట్రానిక్ దిగ్గజాలైన ప్రవాసాంధ్రులు- ప్రభాకర్,,అప్పారావు –
బండారు ప్రభాకర్ ,ఎం.అప్పారావు లు ప్రవాస ఆంధ్రులు .ఎలెక్ట్రానిక్స్ దిగ్గజాలు .ఇద్దరూకలిసి ట్రాన్సిస్టర్ రూపకల్పన చేసి చరిత్ర సృష్టించారు .ప్రభాకర్ విజయవాడకు చెందినవాడు .హైదరాబాద్ వెళ్లి ఒక పబ్లిక్ స్కూల్ లో చదివి ఖర్గపూర్ ఐ ఐ టి లో చదువు అయ్యాక అమెరికా లోని కాలిఫోర్నియాకుయూని వర్సిటి లో పదార్ధ విజ్ఞాన శాస్త్రం లో పిహెచ్ డి సాధించాడు అదే యూని వర్సిటీ లో పని చేస్తూ y ఆకారం లో ఉండే నానో ట్యూబుల విద్యుత్ ధర్మాలను గుర్తించే అనేక పరిశోధనలుచేశాడు .ఆ పరిశోధనా ఫలితం గా కొత్త సాధనాలు రూపొందించాడు .
ఎం.అప్పారావు కూడా ఆంధ్రుడే .ఇక్కడ చదువు పూర్తి చేసి ముంబై యూని వర్సిటి లో ఉన్నత విద్య తర్వాత అమెరికా వెళ్లి కెంటకి యూని వర్సిటి నుంచి పిహెచ డి పొందాడు . .మాసా చూసేట్స్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లో ప్రొఫెసర్ గా చేరి పని చేస్తున్నాడు .సౌత్ కారోలీనా లోని ఈక్లెమెన్స్ యూని వర్సిటి లో ఎన్నో పరిశోధనలు చేశాడు .
కాలిఫోర్నియాలోని ప్రభాకర్ ,సౌత్ కరోలీనా లోని అప్పారావు కలిసి ఒక గ్రాడ్యుయేట్ విద్యార్ధిని సాయంగా పెట్ట్టుకొని ‘’నానో టెక్నాలజీ ‘’లో గొప్ప కృషి,పరిశోధన చేశారు.ప్రపంచం లోనే అతి చిన్నదైన ట్రాన్సిస్టర్ ని నానో ట్యూబ్ లతో తయారు చేసి ప్రపంచాన్ని నివ్వెర పోయేట్లు చేశారు .నానో ట్యూబులు వెంట్రుక కన్నా సన్నంగా ఉంటాయి .దీని నిర్మాణంతో ‘’అల్ట్రా మినియేచర్ ఎలక్ట్రానిక్ ‘’పరికరాల తయారీకి మార్గం సుగమమైంది .వై ఆకార నానో ట్యూబులతో తయారైన ఈ బుల్లి ట్రాన్సిస్టర్ కు సంబంధించిన వివరాలు విశేషాలను ఈ జంట శాస్త్ర వేత్తలు 2005 సెప్టెంబర్ ‘’నేచర్ మెటీరియల్స్ ‘’మాసపత్రికలో ప్రచురించారు .
సాధారణంగా ట్రాన్సిస్టర్ సైజు తగ్గినకొద్దీ వాటిలో వాడే చిప్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది .కానీ నానో టెక్నాలజీ తో తయారైన ఈ ట్రాన్సిస్టర్ అనూహ్య రూపం లో అతి సూక్ష్మ౦గా ఉండటమే కాక అత్యంత సమర్ధవంతంగా పని చేసింది .ఈ జంట ప్రవాసాంధ్ర శాస్త్రవేత్తలు ‘’ఐరన్ –టైటానియం ‘’రేణువుల కోసం ప్రత్యెక తరహా రసాయనాలు వాడి ,వినూత్న నానో ట్రాన్సిస్టర్లు తయారు చేసి ,ప్రపంచం లో ఎలెక్ట్రానిక్స్ దశను, దిశనూ మార్చి అభి వృద్ధిలో మార్గ దర్శుకు లయ్యారు .వీరిద్దరూ ఆంధ్రులవటం మనకు గర్వకారణం .
ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-6-19-ఉయ్యూరు

