ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
23-చిప్ మేకర్ –మండవ సురేంద్ర బాబు
ఆంద్ర రాష్ట్రం లో 1960లో పుట్టి న మండవ సురేంద్ర బాబు తిరుచ్చి రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి లో ఇంజనీరింగ్ పట్టభద్రులై ,చండీ గడ్ లోని సెమి కండక్టర్ కాంప్లెక్స్ లో ఉద్యోగం లో 1983లో చేరి మూడేళ్ళు పని చేస్తూ పరిశోధన రంగం లో అడుగుపెట్టారు .సెమి కండక్టర్ పరిశోధనలో 17 ఏళ్ళ విశేష అనుభవం పొంది సిర్రజ్ లాజిక్ సంస్థలో ఇంటిగ్రేటెడ్ చీఫ్ డిజైనింగ్ పని చేస్తూ ,డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ తయారీ విభాగ మేనేజర్ అయ్యారు .జిలాగ్ సంస్థలో ఆయన చేసిన పరిదోధనలకు మూడు పేటెంట్ లు పొందారు .
కెనడాలో పిహెచ్ డి పొంది ,అట్టావాలో బెల్ నార్తాన్ రిసెర్చ్ సంస్థలో చీఫ్ రిసెర్చ్ ఆఫీసర్ పదవి పొంది కెనడాలోని మాట్రాక్స్ సంస్థ నుండి ‘’చిప్ మేకర్ ‘’మొదలైన గౌరవ పురస్కారాలెన్నో అందుకొని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్నునిగా గుర్తింపు ను అందుకొన్నారు .
1997లో సిర్రజ్ లాజిక్స్ సంస్థను వదిలి ,మరో ఇద్దరు శాస్త్ర వేత్తలతో కలిసి ‘’ సెంన్టిల్లం ‘’సంస్థను స్థాపించారు .ఈ కొత్త సంస్థ 2000 మే నాటికి పబ్లిక్ ఇస్స్యు లో మంచి పేరు పొందింది .బ్రాడ్ బాండ్ లో సురేంద్రబాబు గారికి, ఆయన సంస్థ సెంటిల్లం కు గొప్ప పేరు ప్రఖ్యాతులు లభించాయి .
ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-6-19-ఉయ్యూరు

