ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
44—మెదడు పై విశేష పరిశోధన చేసిన మానసిక శాస్త్రవేత్త –డా .తురగ దేశి రాజు
26-5-1935న పశ్చిమ గోదావరిజిల్లా పెరవలి మండలంలో లోని పిట్టలవేమవరం గ్రామం లో తురగ దేశి రాజు జన్మించారు .1954లో ఆంధ్రా యూని వర్సిటిలో బిఎస్ సి పాసై బెనారస్ హిందూ యూని వర్సిటి లో చదివి ఏం ఎస్.సి పొందారు .1964లో ఆంధ్రా యూని వర్సిటి నుంచి పిహెచ్ డి అందుకొన్నారు .అమెరికాలోని న్యూయార్క్ దగ్గరున్న అయిన్ స్టీన్ కాలేజి ఆఫ్ మెడిసిన్ 1967-69కాలం లో డాక్టోరల్ రిసెర్చ్ చేశారు .
విజయనగరం మహారాజా కాలేజిలో లెక్చరర్ గా 1956 లో చేరి రెండేళ్ళు పని చే,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఆఫీసర్ గా పరిశోధనలు చేశారు .విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజి లోనూ 1958-64 వరకు పరిశోధనలు కొనసాగించారు.తర్వాత ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్ స్టి ట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సీనియర్ రిసెర్చ్ ఆఫీసర్ గా 1961నుంచి 75వరకు 14 ఏళ్ళు ఉన్నారు .బెంగుళూరు నేషనల్ హెల్త్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ N.I.M.H.A.N.Sలో అసిస్టెంట్ డైరెక్టర్గా ,అసోసియేట్ ప్రొఫెసర్ గా 1975-76లో రాణించారు .న్యూరో ఫిజియాలజీ కి ప్రొఫెసర్ గా హెడ్ గా కీర్తిపొందారు
మానసిక శాస్త్రానికి సంబంధించిన 185కు పైగా విలువైన పరిశోధనా వ్యాసాలను జాతీయ అంతర్జాతీయ పత్రికలకు రాశారు దేశి రాజుగారు .మెదడుపై పరిశోధనలో వీరికృషి అద్వితీయం అపూర్వం .చేతనావస్తలోని వివిధ దశలలో ‘’Trasmission of neuronnal messages by chemical transmitters electricala potential ‘’అనే విషయం పైనా ,’’ట్రాన్స్మిషన్ అఫ్ సిగ్నల్స్ ఆఫ్ సేరేబ్రిల్ కార్టెక్స్ న్యూరాన్స్ ‘’పైనా విస్తృత పరి శోధనలు చేసి గణనీయమైన ఫలితాలు సాధించారు .మెదడు పనితీరు ,నిర్మాణం అందులోని న్యూరాన్ల మెత్తదనం అభి వృద్ధి పరచటం లో దేశిరాజు గారు అపూర్వ కృషి చేసి ‘’మానసిక వైద్యవిధాన మహారాజు ‘’అనిపించారు .యోగా ద్వారా మెదడుకు కలిగే ప్రతిస్పందన ,మెదడు పని తీరు పెంపుడు మీద అనితరసాధ్యమైన కృషి చేశారు .తురగ వారి మెదడు’’ తురగ వేగం ‘’తో పని చేసేదేమో అనిపిస్తుంది
ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ పత్రికా సంపాదకులుగా,న్యూరాలజి పత్రిక కు సహాయ సంపాదకులుగా తురగ వారున్నారు . .వీరి పరిశోధన కృషికి నేషనల్ అకాడెమి ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,జువలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లు ఫెలోషిప్ లు అందించాయి .అంతేకాక ఇంటర్నేషనల్ బ్రెయిన్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ,న్యురోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ,సొసైటీ ఆఫ్ న్యూరో సైన్స్ ఇన్ ఇండియా ,ఇండియన్ అకాడెమి ఆఫ్ యోగా ,అసోసియేషన్ ఆఫ్ ఫిజియాలజిస్ట్స్అండ్ ఫార్మోకాలజిస్త్స్ ఆఫ్ ఇండియా ,ప్రిమటలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ,ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ బయో మెడికల్ సైన్సెస్ ,ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ న్యూరో పాథాలజి (అమెరికా ),సొసైటీ ఆఫ్ బయోమెడికల్ కమ్యూని కేషన్స్ మొదలైన ప్రసిద్ధ సంస్థలకు వివిధ పదవులలో ఉంటూ మార్గ దర్శనం చేశారు .
దేశిరాజు వారి అమూల్య వైద్యవిధాన సేవలకు ఎన్నో అవార్డ్ లు ,రివార్డ్ లు పొందారు 1966లో శకుంతలాదేవి అమీర్ చ౦ద్ రిసెర్చ్ ప్రైజ్ ,1971లో గ్లాక్సో వోరేష న్ గోల్డ్ మెడల్ ,1980లో శాంతిస్వరూప్ భట్ నగర్ పురస్కారం ,ఎస్ ఎల్ భాటియా వోరేషన్ అవార్డ్ ,1982లో , డాక్టర్ బిసి రాయ్ నేషనల్ అవార్డ్ ,1985లో బసంతి దేవి అమీర్ చంద్ ప్రైజ్ ,1986లో డాక్టర్ మేనినో డిసౌజా న్యూరాలజీ ఒరేషన్ అవార్డ్ ,1986-87లో హెచ్ జే మెహతా మెమోరియల్ ఒరేషన్ అవార్డ్ మొదలైనవి ఎన్నో అందుకొన్నారు .
మానసిక రోగుల చికిత్సా విదానం లో అత్యాధునిక ప్రక్రియలు ఎన్నో ప్రవేశ పెట్టిన దేశిరాజుగారు ‘’కరెంట్ షాక్ ట్రీట్ మెంట్ ‘’ను పూర్తిగా వ్యతిరేకించారు .’’మనస్తత్వ శాస్త్రాన్ని సరైన పద్ధతిలో అధ్యయనం చేయని వైద్యులు మానసిక వ్యాధుల చికిత్స చేయరా దు ‘’అనే సిద్ధాంతాన్ని ఆయన జీవిత కాలమంతా ప్రచారం చేసిన మానవీయమూర్తి .ఈ విషయం లో మనదేశం ఎన్నో శతాబ్దాలు వెనకపడి ఉందని భావించారు .దేశిరాజుగారు 1992లో 57 వ ఏట మరణించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-19-ఉయ్యూరు

