ఆధునిక ఆంధ్ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 45-
45-ప్రముఖ పారాసైకాలజి శాస్త్రవేత్త ,తత్వ వేత్త పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు
శ్రీ కోనేరు రామకృ శాస్త్ర రత్నాలుష్ణారావు గారు కోస్తాతీరం లో 4-10-1932న జన్మించి ,ఆంధ్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీలో బి .ఏ ఆనర్స్1953లో చేసి సైకాలజీ లో ,ఎం.ఏ. ఆనర్స్1955లో పాసై ,1962 పిహెచ్ డి అయ్యారు .అక్కడే ఫిలాసఫీ సైకాలజీ లెక్చరర్ గా చేరి 1953నుండి 1958వరకు అయిదేళ్ళు ప్రొఫెసర్ శైలేంద్ర సేన్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానంద మూర్తి గార్ల ఆధ్వర్యం లో పని చేశారు .1958లో ఫుల్ బ్రైట్ స్కాలర్ గా అమెరికా వెళ్ళారు .చికాగో యూని వర్సిటిలో చేరి రాక ఫెల్లర్ ఫెలో షిప్ తో మరో ఏడాది గడిపి పిహెచ్ డి చేసి ,డి.లిట్ అయ్యారు .1960లో విశాఖ వచ్చి ఆంధ్రా యూనివర్సిటి లో లైబ్రేరియన్ గా చేరి ,ఒక ఏడాది తర్వాత అమెరికాలోని నార్త్ కరోలిన రాష్ట్రం లోని డ్యూక్ యూని వర్సిటిలో పారా సైకాలజీ లాబరేటరిలో జే బి రైన్ తో కలిసి పని చేశారు .తర్వాత మానవ ప్రవృత్తి (నేచర్ ఆఫ్ మాన్ )పై పరిశోధనకు నాంది పలికి ,ఎక్సి క్యూటివ్ డైరెక్టర్ అయ్యారు .
1960మధ్యలో ,1967లో మళ్ళీ ఆంద్ర విశ్వ విద్యాలయానికి వచ్చి పారా సైకాలజీ డిపార్ట్ మెంట్ శాఖను నెలకొల్పారు .ప్రపంచం మొత్తం మీద పారాసైకాలజి పై ఏర్పడిన మొట్ట మొదటి డిపార్ట్ మెంట్ ఇదే .పారాసైకాలజి అసోసియేషన్ కి చార్టర్ మెంబర్ అయి ,1963 లో సెక్రెటరి ,1965లో ప్రెసిడెంట్ అయ్యారు 1978లో రెండవసారి ప్రెసిడెంట్ అయిన ఘనత ఆయనది 1977లో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పారా సైకాలజికి డైరెక్టర్ అయినారు .
శ్రీ యెన్ టి రామారావు ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అయ్యాక ఆయన అభ్యర్ధనపై ,మళ్ళీ విశాఖ వచ్చి ఆంధ్రాయూని వర్సిటి వైస్ చాన్సలర్ పదవి అధిష్టించారు .రాష్ట్రం లో ఉన్నత విద్యామండలి స్థాపింఛి మార్గ దర్శి అయ్యారు . ఇదే మన దేశం లో ఏర్పడిన తొలి విద్యామండలి .దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత, చాలా రాష్ట్రాలు వాటిని స్థాపించాయి మానవీయ విజ్ఞాన శాస్త్రం ,సేవలపరిశోధన పై స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశారు . యోగా, చైతన్యం (కాన్షస్నెస్)సంస్తనేర్పరచి డైరెక్టర్ అయ్యారు .1987లో మళ్ళీ పారాసైకాలజి హెడ్ అయి చాలాకాలం పని చేశారు .భారత ప్రభుత్వ కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రిసెర్చ్ కు చైర్మన్ గా వ్యవహరించారు .అమెరికా, కెనడా, బ్రిటన్ ,జర్మని ,ఫ్రాన్స్ ,గ్రీస్,స్వీడెన్, నెదర్ లాండ్స్ ,డెన్మార్క్, ఐస్ లాండ్, ఇటలి ,జపాన్, పాకిస్తాన్, ధాయిలాండ్ ,సింగపూర్ ,శ్రీలంక లలో పర్యటించి యూని వర్సిటీలలో ప్రసంగాలు చేశారు .
2002లో ఆయన గౌరవార్ధం ఒక ప్రత్యేకసంచికను వెలువరింఛి అందులో ‘’ a man of many interests… cross-cultural and cosmopolitan…. His writings are a blend of Eastern and Western traditions. They are an attempt to bring about, to use his own expression, the sangaman (confluence) of East-West streams of thought. Dr. K. Ramakrishna Rao is to Indian psychology what Dr. S. Radhakrishnan is to Indian philosophy“.[3]:3
అని అభి వర్ణించారు
2006లో రావుగారు ‘’భారతతత్వ శాస్త్ర పరిశోధన మండలి ‘’కి అధ్యక్షులుగా ఎన్నికయయారు
2011లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించి గౌరవించింది .ఆంద్ర ,కాకతీయ విశ్వ విద్యాలయాలు డాక్టర్ ఆఫ్ లెటర్స్ ,ఆచార్య నాగార్జున యూని వర్సిటి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డ్ లను అందించాయి .
రామకృష్ణారావు గారు ‘’గాంధీస్ ధర్మ ‘’,,కాన్షస్నెస్ స్టడీస్ –క్రాస్ కల్చరల్ పెర్ స్పెక్టివ్స్,యోగా అండ్ పారాసైకాలజి ,మిస్టిక్ అవేర్ నెస్,గాంధి అండ్ ప్రాగ్మాటిజం ,ఎక్స్పేరిమెంటల్ పారాసైకాలజి ,psi కాగ్నిషన్ మొదలైన విలువైన గ్రంధాలు రాశారు .గాంధీజీ విద్యా విధానం పై ఏర్పడిన ‘’ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ హ్యూమన్ సైన్సెస్ అండ్ సర్వీసెస్ అనే ప్రయోగాత్మకసంస్థకు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు .ఈ మధ్య వరకు విశాఖలోని గీతం యూని వర్సిటి చాన్సలర్ గా వ్యవహరించారు .
రావుగారు పరంజ్ పే, సి ఆనంద్ ,రైన్ మొదలైనవారి తో కలిసి సైకాలజీ ఇన్ ఇండియన్ ట్రెడిషన్, బుక్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ ఆన్ ది ఫ్రాన్టియర్స్ ఆఫ్ సైన్స్ ,,కే.ఎస్.మూర్తి అండ్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ థాట్,ఎక్స్ పెరిమెంటల్ స్టడీస్ డిఫరెంషియల్ ఎఫెక్ట్ ఇన్ లైఫ్ సెట్టింగ్ గ్రంథా రాశారు .అనేక జాతీయ అంతర్జాతీయ పత్రికలలో200కుపైగా విశేషమైన ఆర్టికల్స్ రాశారు
సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణగారు ఆంధ్రా యూని వర్సిటిలో రామ కృష్ణారావు గారి శిష్యులు .గురువుగారి ఘనత గురించి ఎంతసేపైనా మాట్లాడుతారు .రావు గారు అమెరికా వెడితే వారిని కలవకుండా తమ ఇంటికి తీసుకుకు వెళ్లి ఆతిధ్యమివ్వకుండా గోపాలకృష్ణగారు ఉండరు .వారి విశాఖ ఫోన్ నంబర్ నాకు ఇచ్చి నాతో మాట్లాడించేవారు .వారిని సరసభారతి కార్యక్రమాలకు ఒకటి రెండు సార్లు స్వయంగా నేనే ఫోన్ చేసి మాట్లాడి ఆహ్వానించాను. అప్పుడు వారి ఆరోగ్యం సరిగ్గా లేదని కదలటం కష్టమని వారూ ,వారి శ్రీమతిగారూ చెప్పారు .సరసభారతి ప్రచురణలు అన్నీ వారికి పంపించేవాడిని. అందినట్లు వెంటనే లెటర్ రాసేసౌజన్యం వారిది .వారి విలువైన పుస్తకాలను నాకు గోపాల కృష్ణగారు కొని పంపించగా చదివాను.
ఆధారం –వీకీ పీడియా ,శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-19-ఉయ్యూరు

