ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -2(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం

21-అరబ్బీ సాహిత్యం -2(చివరిభాగం )

ఖసీదాలను ప్రాచీన పద్ధతిలో రాసే అబూ హమ్మాం -845అల్ బుహతురి -897ముఖ్యులు .సిరియా నుంచి బాగ్దాద్ వచ్చి రాజాశ్రయం పొంది ,అక్కడే ఉండి’’అల్-హసన్ ‘’అనే స్పుట గేయ సంకలనం సమకూర్చారు .అప్పుడే స్పెయిన్ లో మువా షాహ్,జజాల్ అనే ఇద్దరు కొత్త కావ్యశైలి కవిత్వం రాశారు .అబ్బానీ సైఫుద్దౌలా హందానీ సభ అరబ్బీ సాహిత్య కేంద్రంగా విలసిల్లింది .అక్కడే అల్-ము-తనబ్బీ అనే గొప్ప కవి ఉండేవాడు .1054కు చెందిన అంధకవి మ –అరి ఇస్లాం, గ్రీకు  ,భారతీయ వేదాంతాలలో నిష్ణాతుడు .సాహిత్య విమర్శలతోపాటు,సకత్ –ఉల్-జంద్,లుజుం –మయా లుజుం మహా కావ్యాలుకూడా రాశాడు .సమకాలీన  పరిస్థితుల్ని రాజకీయాల్ని,ప్రభుత్వ తీరు తెన్నుల్ని  తీవ్రంగా తన రనలద్వారా విమర్శించేవాడు .అబ్బానీ ఖలీఫా ద్వారా పార్శీ గ్రీకు సిరియా సాహిత్య రచనల అనువాదం తో గద్య రచనలకు మంచి ప్రోత్సాహం లభించింది .పార్శీ నుంచి లలిత సాహిత్యం ,గ్రీకు నుంచి తత్వ శాస్త్రం ,భౌతిక శాస్త్రం భారత్ నుంచి గణిత శాస్త్రం లను అనువదించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది .పంచతంత్రం ,ఖుదాయి నామా ,అరేబియన్ నైట్స్ అనే కథాత్మక రచనలు బహు జనాదరణ పొందాయి . కితాబ్ –ఉల్-బయాన్ ,అల్-త-బయీన్ ,అలముబాష్ అనే మంచి కథలు రాశాడు . బస్రా నివాసి  చారిత్రకుడు భాషా శాస్త్రవేత్త ఇబ్నకు –తైబా-883అల్ జహీజ్ కు సమకాలికుడు –ఆదాబ్ –ఉల్-కబీర్ గ్రంథం రాసి వ్యాకరణం భాషా సమస్యలను చర్చించాడు .ఇతని ఇతర రచనలు –ఉలమా ఆరిఫ్ ,మెయిన్ ఉల్ అబ్బార్ ,

  విజ్ఞాన సర్వస్వ రచనకూడా బాగా జరిగింది. స్పెయిన్ నివాసి ఇబ్న – అబ్దుల్ –ఖని -939 దీనిలో నిపుణుడు. రాగిల్ ఉల్ ఇఫహామి -1109,అజ్-జ-సమరి -1143కూడా విజ్ఞానసర్వస్వ కారులే .రాజకీయ కరపత్రాలలో ఆలంకారిక గద్య శైలి ప్రవేశించి బాగా ఆకర్షణ తెచ్చింది .

   ఈ కాలం లోనే ‘’మకమా ‘’అనే ఏకాంకికలు బాగా ప్రచారమయ్యాయి ..వీటిలో వచన గేయాలుంటాయి .వీటిలో ప్రసిద్ధుడు ,ప్రథముడు-అహమ్మద్-ఉల్-హన్దునీ-1007,.మకామా ప్రతిష్ట పెంచినవాడు అల్-హరీరీ -1121.యుద్ధ గాథలు,అత్తారా కథలు ,చారిత్రకగాథలు  బాగా ప్రచారం పొందాయి .

   ఆరబ్ మొదటి తత్వగ్రంథ రచయిత-అబూ యూసఫ్ –యాకూబ్ –ఉల్ –కింది-862,యితడు తత్త్వం తోపాటు జ్యోతిషం వైద్యం సంగీతం  గణితం లలో కూడా 200 రచనలు చేశాడు .వేదాంత రచయితలలలో అబూ సనర్ –ఉల్ ఫరాబి -950,అబూ –అలీ –ఇబ్నె సీనా ,అల్    గజ్జాలీ ముఖ్యులు .తత్వ చింతనలో నూతనమార్గాన్వేషి. ఇబ్నరాన్  షర్ద్-1198,ఐతే అబ్న ఆవజ్జా -1139 దీన్ని కొనసాగించాడు .పాశ్చాత్య తత్వశాస్త్రం లో ఇబ్న-తుఫైల్ సుప్రసిద్ధుడు .అల్-ఖ్వారాజ్మీ ,తావీత్ ఇబ్న కుర్రా ,అల్-క-రఖి గణిత శాస్త్ర గ్రంథాలు,ఇబ్రహీం అల్ ఫజరీ  జ్యోతిష గ్రంథాలు ,రాశారు .బాగ్దాద్ ,డమాస్కస్ ,కాహిరా లలో నక్షత్ర శాలలు ఏర్పడటం తో ఖగోళ వాజ్మయం వృద్ధి చెందింది .అబూ జకారియా ఆర్ రాజీ -932,అజ్ జహారోయి -1009,ఇబ్న సీనా -1037,ఇబ్న మసావహ్-1015,ఇబ్న మొయూర్-1209మొదలైన వారు వైద్య గ్రంథాలు రాశారు .వైద్య ప్రయోగ శాలలు ఔషధాలయాలు బాగా అభి వృద్ధి చెందాయి .ఖలీఫాల కాలం లో సువ్యస్తిత వలన ,రవాణా సౌకర్యాలవలనా భూగోళ విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెందింది .ఇబ్న ఖుర్ డాద్ బీహ్,కూబీ ,ఇబ్న రూస్తా ,అల్ మక్దసి అల్ బెరూని ,యాత్రా సాహిత్యం రాశారు .నకిరీ ,యాకూబ్ లు భౌగోళిక నిఘంటు నిర్మాణం చేశారు .పైగంబర్ మొహమ్మద్ జీవిత చరిత్ర ఇబ్న ఇషాక్ రాస్తే ,ఇబ్న ఇషం దాన్ని సంస్కరించి ప్రచురించాడు .స్పెయిన్ కు చెందిన హిసముద్దీన్-ఇబ్న అల్-ఖలీల్ గొప్ప చారిత్రిక పరిశోధకుడు .అల్ మకరి రాసిన అరబ్బుల సాంస్కృతిక ,సాహిత్య వికాసాల గూర్చిన గ్రంథం ప్రసిద్ధ రచన .

  మంగోలుల దాడులవలన బాగ్దాద్ పతనం చెంది సిరియా ఈజిప్ట్ దేశాలు ఆరబ్ సంస్కృతీ కేంద్రాలయ్యాయి .సాహిత్య స్వరూప స్వభావాలు కూడా మార్పు చెందాయి ..ఇబ్న అల్ అస్కాలాని ,జలాలుద్దీన్ అల్ మహార్లి ,జలాలుద్దీన్ అనా సయీదీ,శలీబుద్దీన్అల్ కస్తలని  ,ఇబ్న తైమియా ,ఇబ్న ఉల్జౌజియా ,తకీ ఉద్దీన్ అస్ సుబకీ ,అల్ రౌరానీ ఈ యుగ సుప్రసిద్ధ రచయితలు .ఇబ్న ఖల్ దూన్ -1403చరిత్ర సాంఘిక శాస్త్ర రచనలలో నూత్న ఒరవడి ప్రవేశ పెట్టాడు .మొత్తం ఆరబ్ సాహిత్యాన్ని  మదించి కష్ ఫుల్ జుమాన్ అనే పరిశోధనాత్మక రచన చేశాడు టర్కీకి చెందిన హాజిఖల్ ఫా-1657.ఇండియాలో కూడా ఇస్లాం ప్రభావం పెరిగింది వ్యాపారం కోసం దక్షిణ భారత పడమటి తీరం చేరిన అరబ్బులు నివాసం ఉన్నారు .భారత్ వదిలి మధ్యప్రాచ్యం చేరిన భారతీయ ముస్లిం లలో అబూ అతావుల్ సింధీ కవిగా ,హసన్ అలీ సగని భాషా శాస్త్ర వేత్తగా ,సాఫీ ఉద్దీన్ అల్ హిందీ న్యాయ శాస్త్ర కోవిదుడుగా ప్రసిద్ధులు .మహీబు ఉల్లా బిహారీ -1707రాసిన ‘’సల్లుం ఉల్-ఉలూక్ ‘’గొప్ప తర్క శాస్త్ర గ్రంథం.

  సద్ బిన్ సమాన్ ,నిజాముద్దీన్ జౌలియా ,నజీరుద్దీన్ చిరాగ్ దేహాలని ,షహబుద్దీన్ ,అమీర్ ఖుస్రో ,ఆరబ్ సాహిత్యానికి అపార సేవ చేసిన భారతీయులు .మలబారు తీర వాసి ముహమ్మద్ –బ-అబ్దుల్ –అజీజ్ అనే రచయిత కాలికట్ జామోరిన్ కు ,పోర్చుగీస్ వారికి జరిగిన యుద్ధాన్ని 500పద్యాలతో ‘’ముస్నవీ ‘’రాశాడు .సయ్యద్ ఆలీఖాన్ ఇబ్నె మాసూం ,సయ్యద్ అబ్దుల్ జలీల్ బిల్గ్రామీ ,సయ్యద్ గులాం ఆలీ ఆజాద్ ,ఆలీ ముక్తకీ ,షాహ్ వలీ ఉల్లా ఆరబ్ సాహిత్య ప్రముఖ కవులు .జహీర్ ఆలీ రాసిన ‘’తాజ్ ‘’గ్రంథం దేశ విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది .

   1793లో పాశ్చాత్య నాగరకత సంపర్కం తో ఆరబ్ సాహిత్యం కొత్త పుంతలు తొక్కి,ఆధునిక యుగానికి నాంది పలికింది.పాఠశాలలు ముద్రణాలయాలు ,పత్రికలు ఐరోపా సాహిత్య అనువాదాలతో సాహిత్యం కొత్త గుబాళింపు పొందింది .భాషలో మార్పు వచ్చి వ్యావహారిక భాషా రచనలు విరివిగా వచ్చాయి .కథలు,నవలలు విమర్శ లపై పాశ్చాత్య ప్రభావం పడింది .షేక్ మహమ్మద్ అబ్దుల్ ఖురాన్ పై రాసిన వ్యాఖ్యానం ఇస్లాం కు కొత్తజవజీవాలనిచ్చింది .కావ్య వస్తువు ,ఛందస్సులలో గొప్ప మార్పులొచ్చాయి .నాటకాలు సినిమాల ద్వారా సాహిత్యం జన సామాన్యానికి చేరువైంది .

   10వ శాతాబ్దినాటికే ఆరబ్ డైరీలు వాడకం లో ఉన్నాయి .ఇవి ఈనాటి డైరీలులాగానే ఉండేవి .11వ శతాబ్ది ఐబాన్ బన్నా రాసిన డైరీ బయటపడింది .ఆరబ్ సెటైర్ కవితకు ‘హిజా’’అనిపేరు .ఈరచనలో ప్రసిద్ధుడు అల్ జహీర్ 9వ శతాబ్దివాడు .10వ శతాబ్దం లో తాలిబీ  సెటైర్ సాహిత్యం అంతా ఏర్చి కూర్చాడు .అరిస్టాటిల్ పోయేటిక్స్ వచ్చాక సెటైర్ కుకామేడి కి విభజన పోయింది .మధ్యయుగ ఇస్లాం కాలంలో తోలుబొమ్మలాటలు ,పాషన్ ప్లే లు బాగా ఉండేవి .ఆధునిక యుగం లోనే నాటక శాలలేర్పడ్డాయి .19వ శతాబ్దిలో సుప్రసిద్ధ కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో ను జబ్రైబ్రహిం జబ్రా మొదలైనవారు అరబ్బీ లోకి అనువాదం చేశారు .20వ శతాబ్దం లో రచయితలపై సెన్సార్ షిప్ ఉండేది .ఇరాక్ కు చెందిన మొహమ్మద్ సయీద్ ‘’సద్దాం సిటి ‘’పేరుతొ బిన్ బర్కా అలీ పుస్తకం బాగా ప్రచారం పొందింది .ప్రభుత్వ వ్యతిరేక రచనలు చేస్తున్నారన్న అభియోగం తో సోనల్లా ఇబ్రహీం ,అబ్దుల్ రహ్మాన్ మున్సిఫ్ లనుప్రభుత్వం అరెస్ట్ చేసింది .తాహా హుస్సేన్ ‘’ది ఫ్యూచర్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఈజిప్ట్ ‘’రాసి ఆరబ్ జాతీయవాదానికి ఊపు తెచ్చాడు .స్త్రీల హక్కు ఉద్యమానికీ మంచి రచనలు వచ్చాయి .19,20శతాబ్దాలలో ఆరబిక్ రినైసెన్స్ ఉద్యమ౦ ప్రారంభమై క్లాసిక్ కవిత్వాన్ని పునరుద్ధరించే కార్యక్రమం ప్రారంభమైంది .నవీన సంప్రదాయ వాదులుగా పిలువబడిన ఈకవులు సంప్రదాయ కవిత్వ రచన చేశారు .కొత్తతరం కవులు నియోక్లాసికల్ కవిత్వం రాశారు .వచన కవిత్వానికి ఆద్యులు బద్రి షకీర్  అల్ సయ్యబ్ ,నాజిక్ అల్ మలైకా కవులు .ఆధునిక కవిత్వం కూడా పూలూ కాయలూ కాసింది .’’ఆదునిస్ ‘’ఇందులో ప్రసిద్ధుడు .పాలస్తీనా జాతీయకవిగామహమూద్ దార్విష్  ప్రసిద్ధుడు .ఈయన అంత్యక్రియలకు లక్షలాది జనం హాజరై నివాళులు అర్పించారు .ఆధునిక నవల పలుపోకడలు పోయింది .కుటుంబ నేపధ్య నవలలు బాగా వచ్చాయి .నాగిబ్ మహ్ ఫుజ్ నవల కైరో నగర జీవితాన్ని ట్రయాలజి గా రాసి నోబెల్ బహుమతి1988లో  పొందాడు .నవలామణుల  నవలలు తక్కువే .యుద్ధానంతర  రచయితలలలో రబాబ్ అల్కాజ్మి –ఇరాక్ ,జలీలా రీడా-ఈజిప్ట్ ,సల్మా ఖాద్రా జయ్యూసి –పాలస్తీనా ,లామిలా అబ్బాస్ అమరా –ఇరాక్ ప్రముఖులు .సమకాలీన మహిళా రచయిత్రులు ఆరబ్ భాషలోనేకాక ఇంగ్లిష్ ,ఫ్రెంచ్ జర్మన్ సాహిత్య రచనలు చేస్తున్నారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-3-20-ఉయ్యూరు

image.png
image.png
image.png
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.