కరోనా నిజాలు

నిజాలు

1-కరోనా అంటే ఎందుకు చింత ?-పారా  సెట్మాల్ఉందిగా మీ చెంత .-అని చెబితే నమ్మితే మీ పని మటాష్

2-కోవిడ్ అంటే భయమెందుకు ?బ్లీచింగ్ దానికి అభయం అని తెలీదా –అని నీతి బోధిస్తే మీరు లేవలేని గోతిలో పడ్డట్లే

3-కరోనా ముసలాళ్ళ కే అని దిగులా ? 60దాటితే ఆస్పత్రిలో చేర్చుకోరుగా –ఇక నేరుగా వైకుంఠ యాత్రే

4-నాగరకత కు నిలయం ఇటలీ –ఇప్పుడు కరోనాతో కళేబరం అవుతోంది

5-కప్పలు కుక్కలు పాములు తినే చైనాలో  కరోనా రాకేం చేస్తుందని ఈసడింపా ?

  వాళ్ళే ము౦దుమేల్కొని అన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారి ని తరిమేశారని తెలుసుకో

6-ధనిక దేశాలమని విర్రవీగే అమెరికా ,యూరప్  లు  కరోనాతో కల్లోలమై ఆర్ధిక మాంద్యం లో విలవిలలాడుతుంటే –చైనా తన ఆర్ధిక స్థితిని ఎన్నో రెట్లు పెంచుకొన్నది కరోనా కష్టకాలంలో కూడా

7-అమెరికాలో షాపుల్లో సరుకులు నిల్-చైనాలో సరుకులతో షాపులు ఫుల్

8-అసలే ఆర్ధికంగా ఈ ఐదేళ్ళలో కుంగిన భారత్ –కరోనా తో మళ్ళీ తల పైకెత్తు కుంటుందని నమ్మగలమా

9-మాటలు కోటలు దాటటం కాదు –చేతల్లో సత్తా నిరూపించాలి నాయకమ్మన్యులు

10-స్పర్శ వైరస్ కరోనా  కులం గజ్జి సలపరింతతో  మరీ  విజ్రు౦భిస్తే –మందే లేదు ఇక భస్మాసుర హస్తమే .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు, సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.