మా వూరు -మావాళ్లు కవిత
మావూరూ మా వాళ్ళు గురించి ఎంత చెప్పినా తరగని జ్ఞాపకాల గని
అవన్నీ మధురోహల ఊసులే మమతల మల్లెజాజి సువాసనలే
ఆప్యాయత , ఆత్మీయత రంగరించిన సుగంధ పరిమళ లహరులే
మదిలో నాటుకు పోయిన సన్నజాజి లతా నికుంజాలే
వీరందరి గురించి ఆత్మీయంగా రాసిందే
ఊసుల్లో ఉయ్యూరు అందుకే అన్నీ మా ఊళ్లే అంతా మా వాళ్ళే అంటాను నేను
ఈ శార్వరి ఉగాది శుభ సందర్భంగా మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-3-20-ఉయ్యూరు

