ఇప్పటి వరకు 1605మంది గీర్వాణ కవులగురించి రాశాను .ఇప్పుడు 1606వ కవిగా ఈ ఎపిసోడ్ లో 516 వ కవి ని గురించి రాస్తున్నాను’
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం
516 –శ్రీమద్భాగవత కావ్య సౌందర్య కర్త-శివ శరణ్ శర్మ ద్వివేది (1928)
15-3-1928 న ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ లో జన్మించిన శివ శరణ్ శర్మ ద్వివేది హిందీ సంస్కృతాలలో ఏం ఏ .పి.హెచ్ డి,ఎల్ ఎల్ బి కూడా ,మధ్యప్రదేశ్ ప్రభుత్వకాలేజి ప్రిన్సిపాల్ .10పుస్తకాలు రాశాడు .అందులో శ్రీమద్భాగవత కావ్య సౌందర్య ,జాగరణం, లోకార్చనం ,ఆవాహన మొదలైనవి .
517-సంస్కృత వ్యాకరణ పుస్తక రచన వర్క్ షాప్ నిర్వహించిన –శ్రేయాన్ష్ ద్వివేది (1969)
1969-జనవరి 10 పుట్టిన శ్రేయాన్ష్ ద్వివేది ఏం ఏ పిహెచ్ డి .స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ .సంస్కృతం లో రెండు పుస్తకాలు రాశాడు .సంస్కృత వ్యాకరణ పుస్తకరచన వర్క్ షాప్ నిర్వహించాడు .సంస్కృత ఆడియో ప్రోగ్రాం లు నిర్వహించాడు .సాంస్క్రిట్ సెలెక్టేడ్ స్టోరీస్ కు విద్యా వీడియోలు తీశాడు .సంస్కృత కర్రిక్యులం డిజైన్ చేశాడు .
518-విశాల భారత్ కర్త –శ్యాం వరణ్ ద్వివేది –(1916-1975)
1916లో పుట్టి 59 ఏళ్ళకే 1975లో చనిపోయిన శ్యాం వరణ్ ద్వివేది ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో జన్మించాడు .విశాల భారత్ అనేఒకే ఒక గ్రంథం రాశాడు .
519-దీర్ఘ వృత్త లక్షణ కర్త –సుధాకర్ ద్వివేది –(1917-1960)
వారణాసి లోని ఖజూరీలో 1917లో పుట్టి 43ఏళ్ళకే 1960నవంబర్ 28న చనిపోయిన సుధాకర్ ద్వివేది జ్యోతిష శాస్త్ర పారంగతుడు .34గ్రంధాలు రాశాడు. వారణాశి సంస్కృత కాలేజి లెక్చరర్ .దేవి కృష్ణమిశ్ర శిష్యుడు .మహామహోపాధ్యాయ పండిత మురళీధర మిశ్ర ,పండిట్ బలదేవ్ మిశ్ర ,పండిట్ రామాయణ్ ఓఝా,పండిట్ బలదేవ దత్ పాఠక్ వంటి ఉద్దండులవద్ద విద్య నేర్చాడు .రచించిన 34పుస్తకాలలో దీర్ఘ వృత్త లక్షణం ,వాస్తవ చంద్ర శ్రీరంగోన్నతి సాధనం ,భూ భ్రమ రేఖాని రూపనం ,గానకట రంగిని,దిన మీమాంస ఉన్నాయి ,బ్రిటిష్ ప్రభుత్వం మహా మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేసింది .సిద్ధాంత జ్యోతిషం లో అఖండుడు.
520-నారాయణ కావ్యకర్త –ఉమాపతి ద్వివేది –(1853-1911)
ఉమాపతి ద్వివేదివ్యాకరణ ,న్యాయ శాస్త్రాలలో అద్వితీయుడు .గోరఖ్ పూర్ లో సహువాపార్ లో 1853లో పుట్టి 58వ ఏట 1911లో మరణించాడు .అయోధ్యలోని వశిష్ట పాఠశాల సంస్కృత టీచర్ .పండిట్ హరిదత్ ద్వివేది శిష్యుడు .4గ్రంథాలు రాశాడు .సనాతన ధర్మోద్ధార ,శబ్దెందు శేఖర కు జట,టీకా ,పరభాషే౦దు శేఖర కు జటా, టీకా,నారాయణ కావ్యం రాశాడు .విద్యామహార్ణవ బిరుదాంకితుడు .
సశేషం
శ్రీ శార్వరి ఉగాది శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-20-ఉయ్యూరు

