నిన్నటి శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం లో ఫేస్ బుక్ లో చూసి స్పందించిన సాహితీ బంధువులకు అభిమానులకు ,బంధు మిత్రులకు ధన్యవాదాలు .మా అబ్బాయి శర్మనిన్న ఉదయం 10గంటలకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఫేస్ బుక్ లో పంచాంగ శ్రవణం చేస్తే బాగుంటుంది అని సూచించటం ,మా అబ్బాయి రమణ ,మనవడు చరణ్ నా సెల్ ఫోన్ లో ఆ యాప్ డౌన్ లోడ్ చేసి రెడీ చేయటం తో సాయంత్రం 5 గం లకు పంచాంగ శ్రవణం లైవ్ జరిగింది .ఇదే మొదటి ప్రయత్నం అవటం వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోయాం .కెమెరా నాకు ఇంకొంచెం దగ్గరగా ఉండిఉంటె ,మరింత స్పష్టంగా కనిపించి, వినిపించి ఉండేదని గ్రహించాం .వీక్షకులు చాలా ఉత్సాహంగా చాలామంది చూసినట్లు అర్ధమయింది అందరికీ మరోమారు ధన్యవాదాలు -మీ దుర్గాప్రసాద్ -26-3-20

