గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం
561-వాణికీతౌ యక్షౌ పునరాయతౌ కర్త –గుళ్ళపల్లి శ్రీ రామ కృష్ణ మూర్తి (1918)
గుళ్ళపల్లి శ్రీరామ కృష్ణమూర్తి 11-11-1918న ప గో జి లో పుట్టాడు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత పీఠం హెడ్ .శిక్షాశాస్త్రి సాహిత్య ప్రవీణ ,విద్యా వారిధి . వాణికీతౌ యక్షౌ పునరాయతౌ అనే ఒకేఒక పుస్తకం రాశాడు .ఉత్తర ప్రదేశ్ సంస్కృత సాహిత్యపురస్కారం అందుకొన్నాడు
562-ఉదాహరణ కావ్య కర్త –సంగీత గుండేచ(1974)
సంగీత గుండెచ 1-4-1974 ఉజ్జైన్ దగ్గర శక్తిపూర్ లో పుట్టాడు .భోపాల్ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ .సంస్కృత ఎం ఏ పిహెచ్ డి,మ్యూజిక్ లో మాస్టరీ .ఉదాహరణకావ్య ,భాషాకా రంగమంచ ,సమకాలీన రంగమంచ మే నవన్యాయ శాస్త్రకి ఉపస్థితి అనే 3పుస్తకాలు రాశాడు
563-అభినవ సీతా రామ సంవాద ఝరి కర్త –బచ్చు సుబ్బారాయ గుప్త (1902)
1902 నవంబర్ లో కర్నూలులో పుట్టిన బచ్చు సుబ్బారాయ గుప్తఒకే ఒక గ్రంథం అభినవ సీతా రామ సంవాద ఝరి రాశాడు
564-సులభ సోపాన కర్త –అఘోరే నాథ గుప్త (1841)
1841యుపి నాడియాజిల్లా శాంతిపూర్ లో జన్మించిన అఘోరే నాథ గుప్త 9పుస్తకాలు రాశాడు .అందులో శ్లోక సంగ్రహ ,సులభ సోపాన ,ధర్మతత్వ ,సులభ సమాచార ఉన్నాయి .బౌద్ధధర్మ నిష్ణాతుడు ,బ్రహ్మ సమాజ ఉపాధ్యాయుడు ,తాపసి .
565-చందోలోకారమంజరి కర్త –కాంత గుప్త (1935)
11-11-1935 యుపి లో నగీనాలో పుట్టిన కాంత గుప్త రసిక బిహారీ శిష్యుడు .ప్రొఫెసర్ .చందోలోకారమంజరి మాత్రమె రాశాడు .
566-వేదాంత సార కర్త –మనోరమా గుప్త (1956)
సాహిత్య వేద దర్శన లో డిలిట్ మనోరమాగుప్త 1956 డిసెంబర్ 10 కాన్పూర్ లో పుట్టింది .కాన్పూర్ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యామందిర్ లో సంస్కృత హెడ్ .2పుస్తకాలు –వేదాంతసార ,సాంఖ్యకారిక రాసింది .
567-మూల్యాన్య మూల్యాని కర్త –శశి గుప్త( 1946)
1946 నవంబర్ 8 రాజస్థాన్ బికనీర్ లో పుట్టిన శశి గుప్త,అక్కడే భైరవ రత్న స్కూల్ సంస్కృత లెక్చరర్ . మూల్యాన్య మూల్యాని అనే పుస్తకం మాత్రమె రాసింది
568-ఋగ్వేద పరిచయ కర్త –సుదీర్ కుమార్ గుప్తా (1917)
1917లోహర్యానా గుర్గావ్ లో పుట్టిన సుదీర్ కుమార్ గుప్తా సంస్కృత ఎం. ఏ .పి.హెచ్ డి.యూనివర్సిటి ఆఫ్ రాజస్థాన్ ,గోరఖ్ పూర్ యూని వర్సిటీలలో లెక్చరర్.రాసిన 5లో ఋగ్వేద పరిచయం ,సంస్కృత సాహిత్యస్య సుబోధ ఇతిహాస ,భారతీయ దర్శనస్య సంప్రదాయ ,దండి భాణయోరేక మధ్యయానం ,వేదలావణ్యం రాశాడు .రాజస్థా సంస్కృత అకాడెమి పురస్కార గ్రహీత .
569-సంస్కృత ఛందో విధానం కర్త-వినోద్ కుమార్ గుప్తా (1972)
వినోద్ కుమార్ గుప్తా 1972 నవంబర్ 14 తెహ్రిగద్వాల్ లో పుట్టాడు. అక్కడే ప్రభుత్వ పి.జి .కాలేజిలో ప్రొఫెసర్ .సంస్కృత ఛందో విధానం మాత్రమె రాశాడు .
570-హితోప దేశ నీతి శతక కర్త – బ్రిజేంద్ర సింగ్ గుజార్ (1972)
1972 ఆగస్ట్ 1 రాజస్థాన్ లో పుట్టిన బ్రిజేంద్ర సింగ్ గుజార్ విద్యావారధి ,ప్రవక్త ,ప్రాచార్య శ్రీ మా మహా విద్యాలయ .హితోపదేశ నీతి శతకం మాత్రమె రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-20-ఉయ్యూరు
—

