కార్తీక, మార్గశిర మాసాలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు
సాహితీ బంధువులకు ఆధ్యాత్మిక భావుకులకు దీపావళి శుభాకాంక్షలు –
1-పరమ శివునికి ఇష్టమైన పవిత్ర కార్తీక మాస సందర్భంగా సరసభారతి ఫేస్ బుక్ ద్వారా 16-11-20 కార్తీక శుద్ధ పాడ్యమి సోమవారం ఉదయం 10గంటలనుండి –విజయనగర సామ్రాజ్య సంస్థాపనా చార్య , శ్రీ శ్రీ మాధవ విద్యారణ్య స్వామి సంస్కృతం లో రచించిన ‘’శ్రీ శంకర విజయం ‘’-జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య చరిత్ర- ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది .
2-మాధవునికి అత్యంత ప్రీతి పాత్రమైన మార్గశిర మాసం లో 15-12-20 మార్గశిర శుద్ధ పాడ్యమి మంగళ వారం ఉదయం 10 గంటలనుంచి’’ శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం ‘’ డా .ఇలపావులూరి పాండు రంగారావు గారి ‘’సహస్ర ధార’’ఆధారంగా ప్రత్యక్ష ప్రసారం
3-కార్తీక మాసం లో 16-11-20 సోమవారం నుండి అంతర్జాలం లో మహాకవి భారవి రచించిన ‘’కిరాతార్జునీయం ‘’ 4 వ సర్గ నుండి దారావాహికగా రాసి అందిస్తున్నానని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది –
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-20-ఉయ్యూరు

