సాకర్ విజార్డ్ జోహార్
నీ చేతిలోఉన్నది మంత్రమా,యంత్రమా సాకర్ వీరా!
గోల్స్ కొట్టటం నీకు ఉగ్గుబాలతో అబ్బిన విద్యా మహాశయా!
సాకర్ శాసన కర్తా !పోస్ట్ పై నీ దాడి
వ్యూహాత్మకం ప్రత్యర్ధి చిత్తస్థైర్య విధ్వంసనం
కల్పితగోల్స్ నీ ప్రత్యేకతై మిరుమిట్లు గొల్పించి
విజయం నీ ముందుంఛి ‘’ఎల్ పైబ్ దివోరో’’ను చేశాయ్ నిన్ను
నీ సాకర్ మంత్రజాల౦ ప్రత్యర్దులచే లాల్ సలాం చేయించాయి
బార్సిలోనా ,నటోలీ,బోటేన్ హాం క్లబ్ లకు
అన్నీ నువ్వే అయి విజయ దుందుభి మోగించావ్
సాకర్ శిఖారోహణ చేసినా ,కొకైన్ కు బానిసత్వం
నీ కెరీర్ పాలిటి శాపమై వెంటాడి వేధించింది
ఎక్కడో అర్జెంటీనా వాడి వైనా నీ ఆటకౌశలం
ప్రపంచ ప్రజలందర్నీ సమ్మోహ పరచి
అందరి వాడవయ్యావు’’ఓ గోల్డెన్ బాయ్’’ మారడోనా డీగో
గోల్ ఆఫ్ ది సెంచరి చేసిన నీ హస్తం ‘’హాండ్ ఆఫ్ గాడ్ ‘’
వామన మూర్తి వైనా సాకర్ త్రివిక్రమడవై
విశ్వవిజయం సాధించిన నువ్వు చిరంజీవివే.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-20-ఉయ్యూరు
—

