శ్రీ ప్లవ ఉగాది శుభా కాంక్షలు
1-సాహితీ బంధువులకు13-4-21మంగళవారం శ్రీ ప్లవ ఉగాది శుభాకాంక్షలు 2-సరసభారతి శ్రీప్లవ ఉగాది వేడుకలను రద్దు చేసిన సంగతి మీకు తెలుసు .కానీ ఈ ఉగాదిరోజు న మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి పాదాల వద్ద 1-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలంమల్లినాథ సూరి మనీష2-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు పుస్తకాలను ఉంచి స్వామి వారే ఆవిష్కరించినట్లు భావించాం .3-21-4-21బుధవారం శ్రీ రామనవమి కల్యాణం సందర్భం గా మన ఆలయం లో ఈ రెండు పుస్తకాలను భక్తులకు అందజేస్తాం .4-శ్రీరామనవమి తర్వాత సాహితీ బంధువులకు బుక్ పోస్ట్ ద్వారా పై రెండు పుస్తకాలు పంపిస్తాము 5-అవిష్కరించాల్సిన 3 వ పుస్తకం Nuclear Scientist Dr. Akunuri Venkata Ramayya పుస్తకాలు 50 కట్ట ను శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు నాకు సుమారు నాలుగైదు నెలల క్రితమే పంపారు ఆకట్ట నుభద్రంగా దాచాను .కాని పై రెండు పుస్తకాలు ప్రింట్ అయి వచ్చిన సందర్భంగా పుస్తకాలు సర్దాము .రామయ్యగారి పుస్తకాలకట్ట ఎక్కడ పెట్టామోగుర్తురాక,యెంత వెదికినా కనపడక పోయే సరికి పై రెండు పుస్తకాలే స్వామి పాదాల వద్ద ఉంచి ఆవిష్కరణ జరిపినట్లు భావించాం .అవి కనబడిన తర్వాత ఆవిష్కరించి అందరికి పంపుతాము .ఈ అసౌకర్యానికి మన్నించ మనవి -మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-21-ఉయ్యూరు

