– ద్రావిడ భాషాశాస్త్ర కర్త ,అమెరికన్ లింగ్విస్ట్ –ఫ్రా౦క్లిన్ సి. సౌత్ వర్త్(1929)
ఫ్రా౦క్లిన్ సి. సౌత్ వర్త్ అమెరికన్ లింగ్విస్ట్ 1929లో పుట్టాడు .పెన్సిల్వేనియా యూని వర్సిటి లో సౌత్ ఏషియన్ లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .చాలా పుస్తకాలు రాశాడు .సౌత్ ఏషియా –1-ద్రవిడియన్ లింగ్విస్టిక్ హిస్టరీ 2-రైస్ ఇన్ ద్రవిడియన్ 3-ప్రోటో ద్రవిడియన్ అగ్రికల్చర్ 4-లింగ్విస్టిక్ ఆర్కియాలజీ ఇన్ సౌత్ ఏషియా 5-లింగ్విస్టిక్ ఆర్చియాలజి అండ్ ది ఇండస్ వాలీ కల్చర్ 6-ది సోషల్ కంటెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ స్టాండర్డై జేషన్ 7-లెక్సికల్ ఎవిడేన్సేస్ ఫర్ ఎర్లి కాంటాక్ట్స్ బిట్వీన్ ఇండో ఆర్యన్ అండ్ ద్రవిడియన్ వంటి 13 విలువైన రచనలు చేశాడు .
కొలామి అనేది తెలుగులో గోడ అయిందని ,కిట్ అనేది వ్రాత, తుడిచేయటం గా తెలుగు ,తమిళాలలో మారిందని ,అరి అంటే పన్ను ,పొగడ్త అని దీని అసలు రూపం ధాన్యం అని అదే వరి గా తెలుగులో మారిందని ,.దక్షిణ ద్రవిడియన్ లో ఒక్క్ అనేది గణితం లో ఒకటి అనే తెలుగు పదం అయిందని ,జంతువుల కొవ్వు ‘’నే’’ క్రమంగా నెయ్యి అయిందని ,ఫ్రా౦క్లిన్ చూపించాడు .ఎలి, ఇలి లోంచి తెలుగు ఎలుక వచ్చిందని అంటాడు .
4- భగవద్గీతానువాదం చేసిన అమెరికన్ లింగ్విస్ట్ ,స్కాలర్ -ఫ్రాన్క్లిన్ ఎడ్గర్టన్(1885-1963)
24-7-1885జన్మించి 7-12-1963న 78వ ఏట మరణించిన వాడు అమెరికన్ లింగ్విస్టిక్ ,విద్యావేత్త ఫ్రాన్క్లిన్ ఎడ్గర్టేన్.ఏల్ యూని వర్సిటిలో సాంస్క్రిట్ ,కంపారటివ్ ఫైలాలజి ప్రొఫెసర్ .1953-54 కాలం లో బెనారస్ హిందూ యూని వర్సిటికి విజిటింగ్ ప్రొఫెసర్ .1913 నుండి 1936వరకు పెన్సిల్వేనియా యూనివర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా 23ఏళ్ళు పని చేశాడు .భగవద్గీతను అనువాదం చేయటం తో ఆయన పేరు జగత్ ప్రసిద్ధమైంది .ఇది 38,39 హార్వర్డ్ ఓరియంటల్ సిరీస్ గా 1944లో ముద్రితమైంది .సింహాసన ద్వాత్రి౦సిక పునర్ముద్రణ లోను , ,పంచతంత్రం మూల ప్రతి శిదిలమైతే దాన్ని పూరించటం లో విశేష కృషి చేశాడు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-21-ఉయ్యూరు
