మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -37 •

• మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -37 • 37-షావుకారు ,బ్రహ్మనాయుడు గ ప్రసిద్ధి చెందినా గుబురుమీసాల గంభీర నటులు –డా.శ్రీ గోవిందరాజు సుబ్బారావుగారు.. తెలుగు నాటకాలలో సినిమాలలో, తొలితరం నటులు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు. వీరు 1895 సంవత్సరంలో జన్మించారు. వీరు మొదట్లో చరిత్ర విద్యార్థిగా తన చదువు ప్రారంభించారు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు.డాక్టరుగా తెనాలిలో స్థిరపడి పేరుప్రతిష్ఠలు సంపాదించారు. తరువాతి కాలంలో హోమియోపతి వైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి ఐన్‌స్టీన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. ఇతను విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవారు. ఆంగ్లంలో ఇనార్గానిక్ ఎవల్యూషన్ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించారు. అయితే గోవిందరాజు సుబ్బారావుగారు నటునిగానే సుప్రసిద్ధుడయ్యారు. పాఠశాలలో చదివేటప్పుడు వార్షికోత్సవ సందర్భంలో మర్చంట్ ఆఫ్ వెనిస్ అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో సుబ్బారావు నట జీవితం ప్రారంభమైంది. సంగీతాన్ని నేర్చుకున్న సుబ్బారావు 20 రాగాలను క్షుణ్ణంగా అభ్యసించారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో గయోపాఖ్యానం నాటకంలో సాత్యకిగా, భీముడుగా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. తెనాలిలో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని బొబ్బిలి యుద్ధంలో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లు, ప్రతాపరుద్రీయంలో పిచ్చివాడి పాత్రల్లో వీరి నటన తెలుగు నాట పేరు ప్రఖ్యాతులు తెచ్చింది • గోవిందరాజు సుబ్బారావు గురించి ఈ నాటి తరానికి తెలియదు. బాగా పెద్దవారికి తెలిసి ఉండవచ్చు. తెలుగు సినిమాలలోనూ, నాటక రంగంలోనూ నటించిన తొలితరం నటుడు. బాలనాగమ్మ సినిమాలో మాయల మరాఠీగా నటించారు. వృత్తిరీత్యా వైద్యుడు. తెనాలిలో స్థిరపడి వైద్యుడిగా పేరుపొందారు. తరువాత హోమియోపతిలో కూడా ప్రావీణ్యం సంపాదించి హోమియో వైద్యం కూడా చేసేవారు. • చదువుకునే రోజులలోనే నాటకాలలో నటించేవారు. గయోపాఖ్యానంలో సాత్యకి, భీముడు, బొబ్బిలి యుద్ధంలో హైదర్ జంగ్ పాత్రలు పొషించారు. కన్యాశుల్కం, ప్రతాప రుద్రీయం నాటకాలలో నటించారు. అప్పడప్పుడే ప్రారంభమవుతున్న సినీరంగంలో ప్రవేశించి కేరక్టర్ నటునిగా, ప్రతినాయకునిగా నటించారు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో రంగయ్యగా, బాలనాగమ్మలో మాయల మరాఠీగా నటించి నటుడిగా పేరు పొందారు. • గోవిందరాజులు సుబ్బారావు, తెలుగు సినిమాలలో మరియు నాటకాలలో తొలితరం నటుడు తెనాలి ప్రాంతానికి చెందిన గోవిందరాజులు సుబ్బారావు గారు వైద్యులు, సాహిత్య ప్రియులు, రచయిత, తెలుగు సినిమా మొదటితరం నటులు. వీరు నవంబర్ 11,1895 సంవత్సరంలో తెనాలిలో జన్మించారు. వీరు వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణులై డాక్టరుగా తెనాలిలో స్థిరపడి, దానివలన పేరుప్రతిష్టలు సంపాదించారు. తరువాత కాలంలో వీరు హోమియోపతి వైద్యానికి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి, ఐన్ స్టీన్తోఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. అయితే ఆంధ్ర రాష్ట్రమంతా మంచి పేరు తెచ్చిపెట్టింది వీరి నటనా వైదుష్యం. పాఠశాలలో చదివేటప్పుడు, వార్షికోత్సవ సందర్భంలో ‘మర్చంట్ ఆఫ్ వెనిస్’ అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో వీరి నట జీవితం ప్రారంభమైంది. వీరు 20 ప్రముఖ రాగాలు పాడాటం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో గయోపాఖ్యానం నాటకంలో సాత్యకిగా, భీముడుగా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. తెనాలిలో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని ‘బొబ్బిలి’లో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. ‘కన్యాశుల్కం’లో లుబ్ధావధానులు పాత్రవలననూ, ‘ప్రతాపరుద్రీయం’లో పిచ్చివాడు పాత్రవలననూ సుబ్బారావు ఆంధ్రదేశంలో అసమాన ఖ్యతిని పొందారు. సినిమా రంగంలో వీరు ఎంతగానో రాణించారు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో చెంగయ్య, ‘బాలనాగమ్మ’లో మాయల మరాఠీగా వీరు ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందారు. వీరు విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవారు. ఆంగ్లంలో ‘ఇనార్గానిక్ ఎవల్యూషన్’ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించారు. వీరు చెన్నైలోని స్వగృహంలో అక్టోబరు 29, 1959 సంవత్సరంలో65వ ఏట పరమపదించారు. • గోవిందరాజుల సుబ్బారావు .. అలనాటి నటులలో ప్రముఖంగా వినిపించిన పేరు. మూకీల నుంచి ముక్తిని పొందినట్టుగా తెలుగుసినిమా టాకీల దిశగా అడుగులు వేస్తున్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన తెనాలి నుంచి మద్రాసు వెళ్లి నటుడిగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు. అప్పట్లోనే ఆయనది ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్. తెరపై ఆయన నటిస్తున్నట్టుగా ఉండేది కాదు. సన్నివేశం మన కళ్లముందు జరుగుతుందా అన్నంత సహజంగా ఆయా పాత్రలలో జీవించేవారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా, ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ అన్నట్టుగా ఆ సినిమాలు నిలుస్తాయి. • అసలు ఆయన ఇంటిపేరు గోవిందరాజు .. కానీ అంతా కూడా గోవిందరాజుల అనే పిలిచేవారు. అందుకు ఆయన పెద్దగా అభ్యంతరం చెప్పేవారు కాదు. దాంతో గోవిందరాజుల అనే జనానికి తెలుసు. మొదటి నుంచి కూడా ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆ తరువాత నాటకాల పట్ల తనకి గల మక్కువ వయసుతో పాటు పెరుగుతూ పోయింది. అప్పట్లో ఆయన వేసిన నాటకాల్లో ‘ప్రతాప రుద్రీయం’, ‘కన్యాశుల్కం’ మంచి పేరు తెచ్చిపెట్టాయి. • ఫలానా ఊరిలో ఫలానా నాటకం ఆడుతున్నారంటే అందులో గోవిందరాజుల ఉన్నారా? అని ఆరా తీసి, ఉన్నారంటే ఎంత దూరమైనా నడిచివెళ్లేవారట. అంతటి పేరు ప్రతిష్ఠలతో ఆయన ప్రభ వెలిగిపోయింది. ఒక వైపున వైద్య వృత్తిని కొనసాగిస్తూనే, మరో వైపున రాత్రి వేళలో నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన గురించి గూడవల్లి రామబ్రహ్మం గారికి తెలిసింది. అప్పుడు ఆయన ‘మాలపిల్ల’ సినిమా చేయడానికిగాను తగిన నటీనటుల కోసం వెతుకుతున్నాడు. గోవిందరాజుల గురించి తెలిసి వెంటనే ఆయన కోసం కబురుచేశారు. • • గోవిందరాజులను .. ఆయన తీరు తెన్నులను చూడాగానే, ‘మాలపిల్ల’ సినిమాలో తాను అనుకున్న ‘సుందరరామశాస్త్రి’ పాత్రకి ఆయన బాగా సెట్ అవుతారని గూడవల్లికి నిపించింది. దాంతో వెంటనే ఆ పాత్రకి ఆయనను ఓకే చేసేశారు .. త్వరలో ‘మీసాలు’ తీసేసి తనని కలవమని చెప్పారు. గోవిందరాజులవారివి గుబురు మీసాలు .. ఆ మీసాలు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. తాను నిండుగా .. గంభీరంగా కనిపించేలా చేసేవి ఆ మీసాలే. అలాంటి మీసాలు తీయడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. కానీ ఆ తరువాత ఆయన అయిష్టంగానే అందుకు అంగీకరించారు. అలా ఆయన 1938లో ‘మాలపిల్ల’ సినిమాలో అవకాశాన్ని సంపాదించుకున్నారు. • ఆ సినిమా ఆయనకి తీసుకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఇక నటుడిగా ఆయన అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. “కులం చాలా గొప్పది .. దాని గొప్పతనం కొత్తగా ఇంగ్లిషు చదువులు చదువుకొచ్చినవారికి అర్థం కాదులే” అంటూ ‘మాలపిల్ల’లో కులాభిమానం చూపించే ఆ పాత్రలో ఆయన జీవించారు. ఆ పాత్రను అంతకంటే గొప్పగా ఎవరూ చేయలేరనే ప్రశంసలు అందుకున్నారు. అదే ఏడాది వచ్చిన ‘బాలనాగమ్మ’లో మాయల ఫకీరుగా ఆయన అద్భుతంగా మెప్పించారు. తెలుగు తెరపై తొలి మాంత్రికుడిగా మార్కులు కొట్టేశారు. • ఇక ‘పల్నాటి యుద్ధం’ సినిమాలో ‘బ్రహ్మనాయుడు’ పాత్రలో ఆయన చూపించిన హావభావ విన్యాసానికి అంతా ఆశ్చర్యపోయారు. బ్రహ్మనాయుడు అలాగే ఉండేవారేమోనని అనుకున్నారు. సాత్మికమైన పాత్రలను మాత్రమే కాదు, ఆవేశపూరితమైన .. రౌద్రరస భరితమైన పాత్రలను కూడా ఆయన అద్భుతంగా చేయగలరనే విషయం స్పష్టమైంది. • • ఆ తరువాత ఆయన చేసిన మరో జానపద చిత్రమే ‘గుణసుందరి కథ’. ఈ సినిమాలో ఉగ్రసేన మహారాజు పాత్రలో ఆయన ఆవిష్కరించిన అభినయం అసమానం. ఒక వైపున అసమర్థులైన అల్లుళ్లు .. మరో వైవున అనురాగం లేని కూతుళ్లు. తనని ఎంతగానో ప్రేమించే చిన్న కూతురుని దూరం చేసుకున్నానే అనే బాధ. మంచంలో మరణయాతన .. ఏమీ చేయలేని ఆ నిస్సహాయతను ఆయన ఆవిష్కరించిన తీరు చూస్తే, గోవిందరాజుల ఇప్పటికీ గుర్తుండిపోవడానికి గల కారణం ఆయన నటనలోని సహజత్వమేకదా అనిపిస్తుంది. ఇక ఆ తరువాత ఆయన చేసిన సినిమానే ‘షావుకారు’. తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాలలో .. గోవిందరాజుల సుబ్బారావు నట వైభవాన్ని చాటిచెప్పే చిత్రాలలో ‘షావుకారు’ ఒకటిగా కనిపిస్తుంది. • • ఈ సినిమాలో ‘షావుకారు’ గోవిందరాజులవారే. కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తాకట్టు వ్యాపారం చేసే మహాలోభిగా ‘చెంగయ్య’ పాత్రను ఆయన పండించిన తీరును అభినందించకుండా ఉండలేం. డబ్బు తప్ప మరీ ఏదీ ముఖ్యమైనదీ కాదనీ .. అంతకంటే ప్రాధాన్యతను ఇవ్వలసినది ఏదీ లేదని బలంగా నమ్మే ఈ పాత్రకి ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. కథాకథనాలతో పాటు ప్రధానపాత్రధారి అయిన ఆయన నటన ఆ సినిమాను నిలబెట్టేసింది. ఇప్పటికీ ఆ సినిమాను గురించి మాట్లాడుకునేలా చేసింది. • ఇక వీటితో పాటు గోవిందరాజుల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో చేరిపోయిన మరో ఆణిముత్యమే ‘కన్యాశుల్కం’. ఆనాటి సాంఘిక దురాచారాలపై ‘గురజాడ అప్పారావు’ ఎక్కుపెట్టిన అస్త్రమే కన్యాశుల్కం. ఆ నాటకాన్ని సినిమాగా తెరపై ఆ ఆవిష్కరించారు. అంతకుముందు నాటకాలలో ‘గిరీశం’ పాత్రను పోషించిన గోవిందరాజుల, ఈ సినిమాలో ‘లుబ్ధావధానులు’ పాత్రను చేశారు. పడుచుదనం రాని పిల్లను పెళ్లి చేసుకోవడానికి తహతహలాడే ముదుసలి పాత్రలో ఆయన నటన చూసితీరవలసిందే. ఇలా ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించి, జన హృదయాలపై చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను ఒకసారి స్మరించుకుందాం. • ధర్మాంగద • ధర్మాంగద హెచ్.వి.బాబు దర్శకత్వంలో, ఋష్యేంద్రమణి, గోవిందరాజుల సుబ్బారావు తదితరులు నటించిన 1949 నాటి తెలుగు చలనచిత్రం. ధర్మాంగద సినిమాకే పాముపాట అనే మరో పేరుండేది. సినిమా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ పూర్తైంది. • బాలనాగమ్మలో మాయల మరాఠీగా ,షావుకారులో తటిల్ పాత్రగా ,గుణ సుందరికద లో ముసలి రాజుగా ,కన్యాశుల్కంలో లుబ్దావధనులుగా ఆయనకు ఆయనే సాటి .నాటకం లో గిరీశం వేసే ఈయన సినిమాలో లుబ్దావధాన్లు వేయటం తమాషా .ఇందులోనూ జీవించి గురజాడ పేరు నిలిపారు .వేదం వెంకటరాయ శాస్త్రి గారి ప్రతాప రుద్రీయం నాటకం లో యుగంధర మంత్రిగా ,పిచ్చివాడుగా అద్భుత నటన ప్రదర్శింఛి శాస్త్రి గారికి కీర్తి తెచ్చారు • ఎల్ ఎం పి చదివి ప్రాక్తేస్ చేస్తున్నా ,హోమియో వైద్యం లో సిద్ధ హస్తులయ్యారు అణు విజ్ఞానం చదివి ప్రఖ్యాత శాస్స్త్రవేత్త అయిన స్టీన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే వారు ‘’ఇనార్గానిక్ ఇవల్యూషన్ ‘’. అనే గ్రంధాన్ని ఇంగ్లీష్ లో రాశారు .రామాయణ కావ్యగానం చేయటమే కాదు 20 రాగాలను క్షుణ్ణంగా నేర్చి పాడేవారు .గోవిందరాజుల వారి నాటకాను భావం గురించి రావి కొండలరావు ‘’ఇప్పుడైతే రేడియో స్టేషన్ లో చలిమంట కాచుకోన్నట్లు మైకు చుట్టూరా కళాకారులు కూర్చుని డైలాగులు చెప్పే విధానం వచ్చింది కానీ అప్పట్లో విడివిడిగా స్టాండింగ్ మైకులే .రంగస్థలం నున్చివచ్చిన సుబ్బారావు గారికి మైకు ముందు నిలబడి మాట్లాడటం కుదిరేదికాడు .మైకు చేత్తోపట్టుకొని ,అటూ ఇటూ తిరుగుతూ డైలాగ్స్ చెప్పేవారు .రికార్డింగ్ చేసే స్టాఫ్ మొత్తుకోనేవారు’’అని రాశారు • 1958లో సామ్రాట్ విక్రమార్క సినిమాలో –ప్రచండుడు ,భాగ్యరేఖ ,పాండురంగ మహాత్మ్యం ,చరనదాసిలో బసవయ్య ,కన్యాశుల్కం లో లుబ్దావధాన్లు ,పల్నాటి యుద్ధం లో బ్రహ్మనాయుడు షావుకారులో షావుకారు చంగయ్య ,మాలపల్లి లో సుందరరామ శాస్త్రి గా గోవిందరాజులవారి నటన చిరస్మరణీయం . • సశేషం • గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-22 • • •

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.