మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -121,122

·           

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -121,122

· 121,122-ఘనత వహించిన అలనాటి ఛాయా గ్రాహకులు ,-కన్నయ్య ,రహ్మాన్

· 121- సత్యమేవ జయం,దానవీర శూర కర్ణ ఫేం -కన్నయ్య

· పాత చిత్రాలు బాగా చూసినవాళ్లకి ఛాయాగ్రాహకుడు కన్నప్ప పేరు చిరపరిచితమే. పేరు చూసి ఆయనెవరో కన్నడిగుడు అనుకుంటారు. కానీ, తూర్పు గోదావరి జిల్లావాడు. భక్తకన్నప్ప లాగా కన్నప్ప అని పేరు పెట్టి ఉంటారు పెద్దలు. అతని తండ్రిగారు మద్రాసు వచ్చి స్థిరపడడంతో బాల్యం, చదువూ అంతా మద్రాసులోనే గడిచింది.

జీవిత విశేషాలు (profile) :

·

· పేరు : కన్నప్ప ,
ఊరు : తూర్పు గోదావరి జిల్లా ,
నివాసము : మద్రాస్ ,
(filmography ):
కన్నప్ప ఛాయాగ్రహణం సినిమాలు కొన్ని –

సత్యమే జయం,
సుఖదుఃఖాలు,
రాజయోగం,
రాజసింహ,
బంగారు పిచిక,
జగత్‌ కిలాడీలు,
జగత్‌ జంత్రీలు,
అమ్మమాట,
బందిపోటు భీమన్న,
కిలాడి సింగన్న,
రౌడీ రాణి,
హంతకులు – దేవాంతకులు,
ఢిల్లీ టు మద్రాస్‌ (తమిళం),
రాణీ మేరానామ్‌ (హిందీ),
పాపం పసివాడు,
గుండెలు తీసిన మొనగాడు,
తాత-మనవడు,
బంగారు మనసులు,
దానవీర శూరకర్ణ
కెరీర్ ::
స్కూల్లో చదువుకుంటున్నప్పట్నుంచి చిన్న కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. స్కూలు పిక్నిక్‌ల్లోనూ, ఆట పాటలప్పుడూ బాగా కనిపించే దృశ్యాల్ని ఫొటోలు తీస్తూ ఉండేవాడు. ఫొటోగ్రఫీ నేర్చుకుంటూ మెట్రిక్‌ చదివి, రేడియో ఇంజనీరింగ్‌ చేసినా ఫొటోగ్రఫీ మీద ఉన్న ఉత్సాహం తగ్గిపోలేదు. అది నిదానంగా సినిమాటోగ్రఫీ మీదికి మళ్లింది. సినిమాలు చూడడం, కెమెరా పనితనాన్ని పరిశీలించడంతో – సినిమాల్లో చేరాలన్న ఉత్సాహం ప్రబలింది. కన్నప్ప అన్నగారికి నాగయ్యగారు తెలుసు. వీలైనప్పుడల్లా నాగయ్యగారిని కలుస్తూ తమ్ముడి ఉత్సాహం చెబుతూ ఉండేవాడు. ”ఉత్సాహం చూపేవాళ్లు శ్రద్ధగా, చిత్త శుద్ధితో నేర్చుకుంటారు” అని, ఎవరికైనా చెబుతానన్నారు. అలాగే ఆయన 1953లో ‘నా యిల్లు’ చిత్రం ఆరంభిస్తూ కన్నప్పని ఛాయాగ్రహణ దర్శకుడైన ఎమ్‌.ఎ.రెహమాన్‌ దగ్గర ప్రవేశపెట్టారు. ఏకోత్సాహంతో కన్నప్ప పన్నెండేళ్లపాటు రెహమాన్‌ దగ్గర వివిధ చిత్రాలకూ పనిచేశారు. అయితే, మొదట్లో జీతం లేదు. తరవాత కూడా వచ్చిన జీతం తక్కువ. కె.ఎస్‌.ప్రసాద్‌గారు కూడా అప్పుడు రెహమాన్‌ దగ్గర సహాయకుడిగా, ఆపరేటివ్‌ కెమెరామన్‌గా పనిచేస్తూ ఉండేవారు. కన్నప్పకి ప్రముఖ ఛాయాగ్రహకుడు జి.కె.రాము కొంత దారి చూపించారు. ఆయన మలయాళంలో ‘శ్రీరామ పట్టాభిషేకం’ చిత్రం చేస్తున్నారు. ఆయనే దర్శకుడు కూడా. అంచేత, కన్నప్పకి బాధ్యత పెరిగింది. కాస్త రాబడీ పెరిగింది. ఆ చిత్రం త్రివేండ్రంలోని మెర్రీలాండ్‌ స్టూడియోలో జరిగింది. కన్నప్ప సామర్థ్యం చూసి, మెర్రీలాండ్‌ వాళ్లు ఛాయాగ్రహకుడిగా అవకాశం కల్పించారు. ‘కరుత్తకయ్‌’, ‘ఆటంబాంబ్‌’ అనే రెండు మలయాళ చిత్రాలకు కన్నప్ప ఛాయాగ్రహకుడిగా పని చేశాడు.

”మలయాళ సినిమా రంగం – సామర్థ్యం ఉన్నట్టు తెలిస్తే ఎవర్నయినా సరే ప్రోత్సహిస్తుంది. అలా, నా ప్రయత్నం లేకుండా, వాళ్లే అవకాశం ఇచ్చారు” అని కన్నప్ప చెప్పేవారు. ఆ చిత్రాల తరవాత మద్రాసు చేరుకుని ‘సత్యమే జయం’ (1967) అనే చిత్రానికి పని చేశారు. ఇది తొలి తెలుగు చిత్రం. అప్పట్నుంచి మద్రాసులోనే స్థిరపడి, తెలుగు, కన్నడ చిత్రాలకు ఛాయాగ్రహకుడై ప్రసిద్ధి పొందారు కన్నప్ప.

తనమాటల్లో :

”నేను చాలా చిత్రాలు చేశాను. కుటుంబ కథలు, పురాణాలు, నేర కథలు, హాస్య కథలూ అన్నింటికీ పని చేశాను. ఆయా కథల్ని బట్టి, ఆ లైటింగు, షాటు ఉంటాయి. నేరం, సస్పెన్స్‌ గల చిత్రాలకు సంబంధించిన షాట్స్‌ కోణాలు వేరేగా ఉంటాయి. షాటే భయం పుట్టించేలా కనిపించాలి. అలాంటి షాట్స్‌ కుటుంబ కథలకి అవసరం లేదు కదా!” అని చెప్పారు కన్నప్ప ఒక సందర్భంలో.

”ఏ టెక్నిక్‌కి అయినా పరిశీలన చాలా అవసరం. విదేశీ చిత్రాలు, దేశీ చిత్రాలూ అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండాలి. ఛాయాగ్రహణంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. లెన్స్‌లు, ఫిలిమూ, కెమెరాలూ అన్నీ నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి. ‘దానవీరశూరకర్ణ’ (1977)లో కలర్‌ సెట్సుకి వాడే లైట్లు వేరు. ఆ చిష్క్‌ంలో ద్విపాత్రాభినయం కూడా ఉంది. ట్రిక్స్‌ ఉన్నాయి. ‘బంగారు పిచిక’ (1968) బాపు గారిది. ఆయన శైలి వేరు. ఎక్కడా సెట్టు వెయ్యలేదు. చిత్రం అంతా లొకేషన్లలోనే జరిగింది. తక్కువ లైట్లతో, సహజమైన వెలుగుతో తీసిన చిత్రం అది. అలాంటి చిత్రాలకు చెయ్యడం అంటే నాకు మోజు ఎక్కువ” అన్నారు కన్నప్ప. తాను పని చేసిన ‘పాపం పసివాడు’ గురించి ఓ సందర్భంలో చెబుతూ ”నాకున్న పెద్ద అనుభవం, గొప్ప అనుభవం – ‘పాపం పసివాడు’ సినిమాకి చేయడం. ఎక్కువ భాగం అవుట్‌డోర్‌. అదీ, ఎడారిలో. స్టూడియోలోని సెట్ట్సుకి లైట్లు వేస్తూ చెయ్యడం వేరు. ఎండలో చెయ్యడం వేరూ. ఎడారిలో ఎండ. ఎక్కడా చెట్టూ, నీడా లేవు. కింద ఇసుక. కాళ్లు మాడిపోతూ ఉంటాయి. పైన తలా, కింద కాళ్లూ వేడెక్కిపోతూ ఉంటే, పని చెయ్యాలి. అందరికీ కష్టమే. ముఖ్యంగా ఛాయాగ్రహణ సిబ్బందికి చాలా కష్టం. సూర్యుడి కాంతినే లైటుగా భావించి, ఆ విధంగా ఆ లైట్‌కి అనుగుణంగా చిత్రీకరించాలి. ఇసుకలో ట్రాలీ వేసి షాట్‌ తియ్యలేం. క్రేన్‌ షాటు తియ్యాలంటే కష్టం. ఇసుకలో చక్రాలు నడవవు. ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఆకాశం, ఇసుక తిన్నెలూ. దాంట్లోనే లోకల్‌ బ్యూటీని చూపించాలి. అతి కష్టం మీద కొంత దూరం వరకు జీపులు వెళ్లాయి. కొన్ని లాంగ్‌ షాట్స్‌, జీపుల మీద కెమెరా పెట్టి తియ్యవలసి వచ్చింది. కొన్ని ఒంటెల మీద కెమెరా పెట్టి తీశాం. షాటులో జెర్క్‌ రాకూడదు. కాని, ఒంటె నడుస్తూ ఉంటే, ఆ కదలిక లేకుండా ఎలా ఉంటుంది?

మధ్య మధ్యలో ఇసుక తుపాను లాంటి సుడిగాలులు వచ్చేవి. కళ్లలోకి, కెమెరాలోకీ ఇసుక చొచ్చుకుపోయేది. సుడిగాలి ఎప్పుడొస్తుందో తెలీదు. ఒకసారి చాలాసేపు నిరీక్షించి, సుడిగాలిని షాట్‌లో బిగించాలని ప్రయత్నించాం. అందర్నీ ఎగర గొట్టేసింది! నేనూ, కెమెరా గిర్రున తిరిగి పడ్డాము!

అంతా సాహసోపేతమైన చిత్రీకరణ. ఈ సినిమాకి మూలం- ‘లాస్ట్‌ ఇన్‌ ది డిజెర్ట్‌’ అనే ఆంగ్ల చిత్రం. ఆ చిత్రం అంతా దాదాపు ఎడారిలోనే తీశారు. వాళ్లు ఇంకా కష్టపడి ఉంటారు. అయితే, దర్శక నిర్మాతల సహకారం నాకు బాగా లభించింది. గనక, కష్టం తెలియకుండా సినిమాను పూర్తిచేశాం. ‘లాస్ట్‌ ఇన్‌ ది డిజెర్ట్‌’లో ఎండమావుల్లాంటి షాట్సు కూడా తీశారు. భయంకరమైన ఇసుక తుపానూ తీశారు. ఇలాంటి చిత్రాలు ఛాయాగ్రహకుడికి పెద్ద పరీక్ష. సాహసించాలి” ”టెన్షన్‌ పడుతుంటే పని జరగదు. టెన్షనుంటుంది. అవుడ్డోర్‌లో ఎక్కువ ఉంటుంది. అన్నీ దిగమింగుకుని, నార్మల్‌గా ఉంటేనే పని చెయ్యగలం. నాకు అదే అలవాటు” — కన్నప్ప.

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-22-ఉయ్యూరు

· 122-నర్తన శాల ,సువర్ణసుందరి విప్రనారాయణ ఫేం,రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీత –రహ్మాన్

·

ఎం.ఎ.రెహ్మాన్ ఒక చాయాగ్రహ దర్శకుడు .1983 లో ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ తో రఘుపతివెంకయ్య అవార్డ్ అందుకున్నాడు.

ఈయన చేసిన కొన్ని సినిమాలు:

హంజోలి (1970)–
వారిస్ (1969),-
-మంచి చెడు (1963).–
నర్తనశాల (1963),–
క్రిష్ణలీలలు (1959).–
సువర్ణసుందరి (1957).–
పాండురంగ మహత్యం (1957),–
జయసింహ (1955),–
సంతానం (1955),–
విప్రనారాయణ (1954),–
తోడుదొంగలు (1954).–
పిచ్చిపుల్లయ్య (1953),-
-సంసారం (1950),-
మనదేశం (1949),-
-త్యాగయ్య (1946),–
భక్తిమాళ (1941),–
హింద్ కేశరి (1935),

సశేషం

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -8-3-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.