ముక్తీశ్వర శతకం

ముక్తీశ్వరశతకం
శ్రీ ముదిగొండ బసవయ్య శాస్త్రి ,శ్రీ కొండపల్లి లక్ష్మణ పెరుమాళ్ళ రావు కలిసి ‘’ముక్తీశ్వర శతకం ‘’రాస్తే ,శ్రీ గరిణే సత్యనారాయణ బెజవాడ శ్రీ వాణీ ముద్రాక్షర శాలలో1916లో ముద్రించారు . ,వెల రెండుఅణాలు .
‘’శ్రీ మత్సర్వ జగస్వరూప విబుధ శ్రేణీ నుతప్రాభవా –కామక్రోధమదాద్యరిప్రకార శిక్షా దక్ష సద్రక్షకా
భూమానంద మరంద సంభరిత హృత్ఫుల్లాబ్జ లోకేశ్వరా –శ్రీ ముక్తీశ్వరపూర్నివాస హరగౌరీ నాధ ముక్తీశ్వరా ‘’అంటూ జంటకవులు శతకం ప్రారంభించారు .’’ముక్తీశ్వరా ‘’అనేది శతకానికి మకుటం .రెండవ పద్యం లో మనః ప్రక్షాళనం కోసమే శతకం రాశామన్నారు .రసమో నీరసమో కవిత్వం చెప్పి డబ్బు సంపాదించము నీభక్తితో చెప్పాం .’’పరుసంబుననం గలిసి స్వర్ణంబైనట్లు ‘’మాకృతిశుచి అవుతుంది .కొద్దో గొప్పో కవిత్వం నేర్చి నీ ఎదుట గంతులేస్తూ పద్యాలు చెప్పి జన్మ సార్ధక్యం చేసుకొంటాము .దైవోత్తముడవు భక్తజన పారిజాతానివి నిన్నే నమ్మి రాశాం .నీ హృదయ కాసారం లో జగం అనే పద్మం పుట్టి ,దానినుంచి నిగమ నిగామా౦తాలు పుట్టాయి.అందులోని తేనెను జుర్రటానికి భక్తగణం అనే తుమ్మెదలు ఎగబడి హాయిగాతాగి మత్తెక్కుతాయి.కించిత్ జ్ఞానిలాగా భిక్షుకుడవైతే నేను నీకు దాసుడిని .నిన్ను నమ్మాను జన్మ రాహిత్యం కల్గించు .’’ఆపాతాళ వియత్ ప్రవృద్ధ’’ఐన నీ మొదలు ,తుది తెలుసుకోవటానికి బ్రహ్మ విష్ణులు బయల్దేరి ‘’చూపోపక ‘’తిరిగి వచ్చారు .సత్వరస్తామోగుణాలు పెరిగి నన్ను పాతాళానికి నేట్టేస్తున్నాయి దీనినుంచి నువ్వే కాపాడాలి .
‘’అణువైనన్ బరమాణువైన భావదీయాకార రేఖావిచారణ పాత్రంబగు ‘’ .’’పరమార్ధం బన నెట్టిదో ఎరుగను ‘’.రాజు అనుగ్రహానికి ఎన్నోకష్టాలు పడ్డాను.’’జననీ గర్భం లో ఉన్నప్పుడు నిన్ను నెమ్మనంబుతో ఎంచాను ‘’.తనువూ డస్సింది నాడులు సడలాయి దంతాలు పట్టుతప్పాయి యవ్వనం పోయి జరప్రాప్తించి బలం తగ్గి దౌర్బల్య పాపభీతి వణుకు కుంగ దీశాయి .నువ్వే కాపాడాలి .నీ విశుద్ధ భజనోద్రేకాలే మోక్షానికి మార్గం .నీ వోక్కడివే జనాళి హృదయాదర్శ మ్ములన్ నిల్చు వాడివి ‘’.
‘’భూమీ చక్రము స్యన్దనంబుగా నభంబు నీ కపర్దంబుగా –స్వామీ దిక్కులు కట్టు పుట్టములుగా వర్ధిల్లు నీ ఉన్నతా-వే మూలం గలదంచు నెంతు ‘’అని శివరహస్యం చెప్పారు ..నిత్యానిత్య పదార్ధభావన కలానిర్నిద్ర తన్ గాంచి నీ –సత్యాకారమే నిత్యవస్తువని ‘’జగత్తు మిధ్య అని తెలుసుకొన్నాను .’’అధికార్తిం గుందగా జాల నింక నను బ్రోవగ రమ్ము భక్తజన రక్షా లోల ముక్తీశ్వారా ‘’అంటూ 93వ పద్యంతో శతకం పూర్తీ చేశారు .
ఈ శతకం సాధారణ శివ మహాదేవునిపై రాసిందే కాని ఏదో ఒక క్షేత్రం లోని స్వామి పై రాసినది కాదు ముక్తీశ్వరస్వామి జగ్గయ్యపేట దగ్గర కృష్ణానది ఒడ్డున ఉన్న ముక్త్యాల స్వామి కావచ్చు .శతకం అశ్వధాటి పరుగుతో నడిచింది. భక్తిజ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమంగా భాసించింది .కవుల గురింఛి ఎక్కడా చెప్పుకోలేదు .ఈ శతకాన్ని, కవులను పరిచయం చేసే అదృష్టం నాకు లభించింది . ఈ శతకం లోనే అనుబంధంగా గుంటూరు మండల సంతమాగులూరు గ్రామ వాసి ,సుకవి జనమిత్రుడు శ్రీ పొత్తూరి రాఘవయ్య రాసిన ‘’శ్రీ సాన౦దోపాఖ్యానం ‘’హరి కధ కూడా ఉన్నది .దీన్ని అదే గ్రామానికి చెందిన వైశ్యకుల తిలకుడు శ్రీ గుర్రం రామసుబ్బయ్య శ్రేష్టి ద్రవ్యసాయంతో బెజవాడ వాణీ ముద్రాక్షర శాలలో 1916లో ముద్రించారు , వెల-రెండు అణాలు ..అన్ని హంగులతో సలక్షణంగా సానంద రుషి చరిత్రను నవరస సమ్మేళనంగా కవిగారు మధుమదురంగా రచించి సార్ధకం చేశారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-3-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.