మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-146

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-146

146-‘’పితా ,అసలే విశాఖజనం ,ఇనుప ముక్కలతో కోడతారనిభయం ‘’డైలాగ్ ఫేం ,గొల్లపూడే ఫాన్ అయిన అదృష్టవంతుడైన విలక్షణ మాటల వాణీ   –పొట్టి ప్రసాద్

పొట్టి ప్రసాద్ అసలు పేరు కవివరపు ప్రసాదరావు. ఆయన భార్య రాజ్యలక్ష్మి. కుమారుడు జగన్నాథ రావు. మెదడు సంబంధిత వ్యాధితో మరణించాడు.

కెరీర్

పొట్టి ప్రసాద్ నాటకరంగం నుంచి వచ్చినవాడు. రంగస్థలంలో హాస్యం ఆయన ప్రత్యేకత. ఒకసారి మద్రాసులో కె. వెంకటేశ్వరరావు బృందంలో బెల్లంకొండ రామదాసు రాసిన ఆకాశరామన్న అనే నాటకంలో నటించడానికి వచ్చాడు. ఈ ప్రదర్శనను చక్రపాణి చూడటం తటస్థించింది. చక్రపాణి ఆయన చిరునామా తీసుకుని పంపేశారు. ఇవన్నీ మామూలనుకున్న ప్రసాద్ కు ఒక నెల రోజుల తర్వాత సినిమాలో అవకాశం వచ్చింది. అలా వచ్చిన అవకాశమే ఆయన మొదటి సినిమా అప్పుచేసి పప్పుకూడు. ఈ సినిమా తర్వాత కూడా నాటకాలు వేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.[2]

చంటబ్బాయ్ సినిమాలో పత్రికా సంపాదకుడి పాత్ర, సాగర సంగమం లో పనివాడి పాత్ర, హై హై నాయక సినిమాలో అవధాని పాత్ర ఆయన పోషించిన కొన్ని ముఖ్యమైన పాత్రలు

నటించిన సినిమాలు

·         ఈనాటి బంధం ఏనాటిదో (1977)[3]

·         చంటబ్బాయ్

·         సాగర సంగమం

·         శ్రీవారికి ప్రేమలేఖ

·         రెండు రెళ్ళ ఆరు

·         ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)

·         శుభలేఖ

·         కృష్ణ గారడీ (1986)

·         వివాహ భోజనంబు

·         హై హై నాయకా

·         మయూరి

·         చిరంజీవి రాంబాబు

·         రుద్రకాళి (1983)

·         చాణక్య చంద్రగుప్త

పేరు తెచ్చిన పాత్రలు[మార్చు]

·         చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి రాసే కవితలు విని పిచ్చెక్కినట్లయిపోయే పత్రికా సంపాదకుడి పాత్ర

·         ఎలిజీలు – గొల్లపూడి మారుతి రావు

·         ====================

·         పొట్టి ప్రసాద్

·         ====================

·         పొట్టి ప్రసాద్ పేరులోనే ‘పొట్టి’ కాని నిజానికి చాలా పొడుగు. దాదాపు 40 సంవత్సరాల క్రిందటే అతనికి నాలాంటి ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. ‘అలనాడు-అంటే 1959లో విజయనగరంలో రాఘవ మెమోరియల్

·         ఉత్సవాలలో ‘ఆకాశరామన్న’ నాటకం చూస్తూ ఇద్దరి అఖండమయిన ప్రతిభ చూసి నిశ్చేష్టుడినయ్యాను. ఒకరు కె. వెంకటేశ్వరరావు, రెండో వ్యక్తి పొట్టి ప్రసాద్.

·         నిజజీవితంలో కూడా నాటకం లాగే మాట అనడంలో, తనదయిన బాణీలో చమత్కారాన్ని విసరడంలో నిష్ణాతుడు ప్రసాద్. ఆ రోజుల్లో మా లాంటి చిన్న నటులకి ఇద్దరు నటులంటే పెద్ద గ్లామర్ – పొట్టి ప్రసాద్, నిర్మలమ్మ.

·         చేతిలో చిన్న గుడ్డసంచీ (ఆ రోజుల్లో ముక్కుపొడుం అలవాటుందేమో గుర్తులేదు) సైకిలూ పూర్ణానందం సత్రం దగ్గర స్టాండు చేసి రసన సమాఖ్య వేపు మెట్లెక్కుతూంటే ఎప్పటికయినా పొట్టి ప్రసాద్ లాంటి నటులం అవుతామా అని మేం కలలు కనేవాళ్లం. ప్రసాద్ కి మరొక ఫాన్ బి.ఎన్.రెడ్డి గారు. కొత్తనీ, అభిరుచినీ ఆదరించి, పోషించే ఆయన ఆ రోజుల్లోనే ప్రసాద్ని మద్రాసుకి రప్పించి, “పూజాఫలం’లో పూర్తి హాస్య పాత్రని ఇచ్చారు. అయితే – స్టేజి నటనకీ, సినీ నటనకి తేడాలున్నాయేమో నాకు తెలీదు. లేకపోతే పొట్టి ప్రసాద్, సి.హెచ్. కృష్ణమూర్తి వంటివారు రాణించక పోవడానికి, నాగభూషణం, రావుగోపాలరావు, నేనూ, భరణీ రాణించడానికి కారణాలు అర్ధం కావు. ఏమయినా, ప్రసాద్ ఇంతకన్నా మంచి రాణింపు, అదృష్టం పొందవలసిన నటుడు. స్టేజిమీద అంత గొప్ప improvisation చెయ్యగల నటులు అరుదుగా ఉంటారు.

·         1958-59 లో ఢిల్లీ ఏషియన్ థియేటర్ ఇన్స్టిట్యూట్ కి కె. వెంకటేశ్వరరావు, ప్రసాద్ స్కాలర్ షిప్ మీద వెళ్లారు. సంవత్సరం చివరలో నటన మీద చిన్న ప్రదర్శన ఏర్పాటయింది. సాధూ సేన్ ప్రఖ్యాత నటుడు, శంభుమిత్రకి గురుతుల్యుడూ సభకి

·         అధ్యక్షుడు. ఒక్కొక్కరికి పది నిమిషాల టైము. తొమ్మిది నిమిషాలకే బెల్ మోగుతుంది. అది హెచ్చరిక. రెండోసారి మోగగానే ఆపెయ్యాలి. పొట్టి ప్రసాద్ లేచాడు. బొత్తిగా ఇంగ్లీషు రాదు. కాని అతను చేసే నటనికి అంతా విరగబడి నవ్వుతున్నారు. ఎనిమిదో నిమిషానికి అధ్యక్షుల టేబుల్ దగ్గరకి వచ్చి వార్నింగ్ బెల్’ తీసి జేబులో పడేసుకొన్నాడు. సాధూసేన్ ఒకటే నవ్వు. నాకీ ఉదంతం వెంకటేశ్వరరావే చెప్పాడు. ఇలాంటివి నాటక రంగం మీద కోకొల్లలు. రావికొండలరావు గారి నాటకాల్లో ప్రసాద్, కాకరాల, రాజబాబు అద్భుతంగా పోషించిన పాత్రలు నాకు తెలుసు. ఈ దేశంలో గొప్ప నటులు సినిమా రంగానికి చేరితే కాని రాణించని దరిద్రం తప్పని తరంలో పుట్టాడు ప్రసాద్. నాటకరంగంలో నటుడయినందుకే గర్వపడే ఏ బ్రిటన్ లోనో, అమెరికాలోనో ఉంటే ఓ గిల్ గుడ్ లాగ, ఓ లారెన్స్ అలీవియర్ లాగ, ఎలెక్ గిన్నిస్ లాగ, ఓ ఆంథోనీ హాప్ కిన్స్ లాగ తనదయిన ప్రతిభతో రాణించేవాడు.

·         అతన్ని ‘నువ్వు’ అనడం అతను నాకిచ్చిన చొరవ. నాకంటే పెద్దవాడు – అన్నిటా. సినీమా రంగంలో అతనికి అనుకొన్నంత కలిసిరాలేదు. చాలా కాలం

·         కిందట – స్వల్పంగా పక్షవాతం వచ్చి మాట కాస్త దెబ్బతింది. అది అతనికి ఒక చెడ్డ మలుపు. స్నేహితుల్ని చూస్తే కళ్ళనీళ్ళు తిప్పుకొనేవాడు. గొప్ప నటుడికి అది పెద్ద శాపం. క్రమంగా ఆరోగ్యం దెబ్బతింది. ఇవాళ ఉదయమే రాళ్ళపల్లి ఫోన్ చేసి “రాత్రి ప్రసాద్ పోయాడు బావా!” అంటూంటే అతని గొంతు బొంగురుపోయింది. ఒకనాటి అమెచ్యూర్ నాటక రంగాన్ని సుసంపన్నం చేసిన ఆఖరి యోధుడు పొట్టి ప్రసాద్. ఈ తరం సినీ ప్రేక్షకులు అతని పేరులో ‘పొట్టి’ నే చూస్తారేమో కాని మా తరం నటులం ప్రసాద్ ని చూడాలంటే – తలలు కాస్త ఎత్తాలి. తప్పదు.

·         సేకరణ – శర్మ గారు

·          సశేషం

·         మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-3-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.