ఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -2
కాకినాడ కలెక్టర్ ఆషి ని తిరునల్వేలి జిల్లాకు మార్చారు .అక్కడ విప్లవాగ్ని జ్వాలలు విపరీతంగా వ్యాపించాయి .రైల్ లో ఉండగానే విప్లవకారులు అతడిని కాల్చి చంపారు .జగ్గన్న శాస్త్రి పై వారంట్ పుట్టించి అరెస్ట్ చేసే ప్రయత్నం లో ప్రభుత్వం ఉంది .ఈ విషయం తెలిసిన మిత్రులు గున్నేశ్వరరావు వగైరా డబ్బులు వసూలు చేసి అర్ధరాత్రి రహస్యంగా శాస్త్రిని బొంబాయి రైల్ ఎక్కించి పంపించే ఏర్పాటు చేశారు పడవలో గోదావరి దాటి ,నడిచి నిడదవోలు వెళ్లి ,అక్కడినుంచి రైల్ లో బెజవాడ చేరి ,స్వరాజ్య పత్రిక ఆఫీస్ కు వెళ్ళే సరికి అక్కడ పత్రికాధిపతిని అరెస్ట్ చేయటానికి వారంట్ తో సిద్ధం గా ఉండటం చూశాడు .ఆయనకు తన సంగతి చెప్పి ,రాత్రి రైల్ ఎక్కి బొంబాయి వెళ్లి,మహీం లో ఉన్న జే ఎం పోధార్ ఇంటికి వెళ్ళాడు శాస్త్రి .ఇతడు జపాన్ లో వంగల వెంకట నారాయణ కు సహాధ్యాయి.పోధార్ బాంబులు తయారు చేసి నూతిలో దాచినట్లు పోలీసుల అనుమానం .అతడిని ఎప్పుడైనా అరెస్ట్ చేయచ్చు .అందుకని శాస్త్రిని కాల్ పత్రికాధిపతి పరంజపేయి దగ్గరకు తీసుకు వెళ్ళాడు .ఇతడిపైనా బొంబాయిలో కేసు ఉంది .తానె కోర్టులో వాదించు కొంటున్నాడు .ఇద్దరు ఒకరి సంగతి ఒకరు చెప్పుకొన్నారు .రెండు నిమిషాలలో శాస్త్రికి కావాల్సిన బస భోజనం డబ్బు పుస్తకాలు సమకూర్చాడు .ఇలా అజ్ఞాతం లో రెండు నెలలు గడిపాడు శాస్త్రి .శాస్త్రికోసం వెదకి వెదకి నిరాశ చెంది వారంట్ రద్దు చేసుకొన్నారు పోలీసులు .మరో మూడు నెలలతర్వాత రాజమండ్రి చేరాడు .పోలీసువారు ఇతనిపై రహస్యంగా విచారిస్తున్నారేకానీ కేసు పెట్టలేదు .కనుక ఆంధ్రులలో మొట్టమొదటి విప్లవకారుడు యర్రమిల్లి జగ్గన్న శాస్త్రిగా రికార్డ్ కు ఎక్కాడు .మారు వేషాలతో తిరిగేవాడు .తురక వేషం లో బాగా రాణించే వాడని అతని మిత్రులు చెప్పారు .1910చివరివరకు ఆంధ్రలో ప్రచారం చేసి ,1911లో డాక్టరీ చదవటానికి జగ్గన్న శాస్త్రి కలకత్తా వెళ్ళాడు .
నాలుగేళ్ళు కలకత్తాలో మెడిసిన్ చదువుతూ శ్యామ సుందర చక్రవర్తి తో స్నేహం సంపాదించి ,1914లో డాక్టర్ డిగ్రీ పాసయ్యాడు జగ్గన్న శాస్త్రి .ఈయనతోపాటు కలకత్తాలో చదివి డాక్టరీ పాసయిన ఆంధ్రులు డాక్టర్ బ్రహ్మా జోశ్యుల సుబ్రహ్మణ్యం, వేదాంతం వెంకట కృష్ణయ్య మొదలైనవారున్నారు .కానీ కలకత్తా నుంచి ఇంటికి రాగానే శాస్త్రిని అరెస్ట్ చేసి మద్రాస్ పంపారు .దీనికి కారణం రోడ్డా కంపెని కేసు.
సశేషం
75వభారత స్వాతంత్ర్య దినోత్సవం శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-8-22-ఉయ్యూరు
వీక్షకులు
- 1,120,561 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.18 వ భాగం.7.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.111 వ భాగం.7.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,725)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
