పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-4

పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-4

తారాశంకర్ ఎక్కడా నెలజీతం తీసుకోలేదు .రచనలపైనే ఆధారం .కలకత్తా దక్షిణం లో రేకులగదిలో నెలకు  ఆరు  రూపాయల అద్దెకి ఉన్నాడు హోటల్ భోజనం నెలకు ఎనిమిది ,టీ,టిఫిన్లకు ఏడురూపాయలయ్యేది .బస్ చార్జీలుకూడా అంతే .వంటపని ఇంటిపని ఆయనే చేసుకొనేవాడు నేలమీద పడుకోనేవాడు .తనరేకు పెట్టే రాసుకొనే బల్లగా వాడేవాడు .ఇలా సాహిత్యమే వృత్తిగా జీవించాడు .1933లో ఆయన కలకత్తా కాపురానికి వచ్చేసరికి అది బెంగాల్ నాడీ కేంద్రంగా ఉంది .రచయితలూ తరచుగా కలుసుకోనేవారు .టాగూర్ శరత్ లకు తప్ప మిగిలినవారికి రచనలపై పెద్దగా రాబడి ఉండేదికాదు .అయినా యువకులు సాహిత్య౦ పైనే జీవించేవారు .సాహితీ సేవలో కొందరు ప్రాణాలు కోల్పోయారుకూడా .ఈ విషయాలను అచి౦త్య కుమార్ ‘’మేము మృత్యువును ప్రేమించటం నేర్చుకోన్నాం  .రాజకీయ సాహిత్యరంగాలలో మృత్యువు ఆకర్షణీయంగా కనిపించేది .యువకులు రచయితలుగానే విప్లవకారులు గానో తయారయ్యేవారు .రచన అంటే పేదరికం ,ఆకలి ని ఆహ్వానించటమే ‘’అన్నాడు

 ఆశతాబ్దం ఉత్తరార్ధంలో టాగూర్ మాలంచ –ఉద్యానవనం ,చార్ అధ్యాయ్ ,దుయిబోన్ –అక్కా చెల్లెళ్ళు ,శరత్ శ్రీకాంత్ ,శేషప్రశ్న వంటి ఉత్తమ  రచనలు వచ్చాయి .అంతకుముందే టాగూర్ చతురంగ ,ఘరె బైరే ‘’శరత్ పధేర్ డాబి –కోరిక వెలువడ్డాయి .కల్లోల్ పత్రికను నవయువకులు నడిపారు .కనుక అలజడి ఆందోళనలు అందులో చోటు చేసుకొన్నాయి .అట్టడుగు వర్గాల జీవితాలు ఇందులో ఎక్కువగా వస్తువులయ్యాయి .పేదరికం బిచ్చగాళ్ళు వేశ్యలు పై మాణిక్ ఘటక్ ప్రత్యేకంగా రాశాడు .నృపేంద్ర కృష్ణచటర్జి గోర్కీ మదర్ నవల అనువాదం చేశాడు .ఆనాటి రచనలు ఐరోపా పోకడలను పోలిఉన్నాయి,అసంతృప్తి ,ఆందోళన ఉన్నాయని తారాశంకర్ అన్నాడు .1929లో విభూతి భూషణ్ బెనర్జీ ‘’పధేర్ పాంచాలి ‘’-ఒక రోడ్డు కధ విచిత్రపత్రిక లో ధారావాహికంగా వచ్చి సంచలనం సృష్టించి సత్యజిత్ రేచేత సినిమా తీయించింది .సురేష్ చంద్ర ఉత్తర పత్రిక నిర్వహించాడు .దీనిలో దూర్జటిప్రసాద్ ఎక్కువగా రాసేవాడు .బుద్దదేవ బస్ కవిత త్రైమాసికపత్రిక నడిపాడు .పరిచయ పత్రిక ఉత్తమసాహిత్యాన్ని అందించింది .

  తారాశంకర్ తన రాయి కమల్ నవలను ,చల్ నామోయి –అంతుచిక్కనిమనిషి కధా సంపుటిని టాగూర్ కు పంపిస్తే ,నవలబాగా నచ్చి తనఅభిప్రాయాన్ని,కధలు మెచ్చుతూ మరో ఉత్తరాన్ని శంకర్ కు రాశాడు .బెంగాల్ రచయితలకుదేశంగురించి చాలా తక్కువగా పరిచయం ఉండటం టాగూర్ కు నచ్చలేదు .మరో సారి టాగూర్ ను కలిసినప్పుడు తన ‘’జల్సాఘర్ –విలాసమందిరం కధా సంపుటి  ఇచ్చాడు.తర్వాత కొద్దిరోజులకే టాగూర్ అనారోగ్యం పాలయ్యాడు . అచేతన స్తితి నుంచి చేతనావస్తకు వచ్చిన యువకుడి జీవితం అందులో టాగూర్ కు బాగా నచ్చింది .శంకర్ శాంతినికేతన్ కు తరచుగా ఎందుకు రావటం లేదని అడిగాడు .శాంతినికేతన్ ఆ జిల్లా ప్రజలకు దూరమై పోయిందని టాగూర్ బాధ పడేవాడు .ప్రజకు దీనికి ఉన్న మధ్యగోడ ఆయన గ్రహించలేకపోయాడు .నాటి బెంగాల్ గురించి క్షుణ్ణమైన పరిశోధన చేసిన బ్రజెంద్రనాదధ బంద్యోపాధ్యాయ కూడా తారాశంకర్ సన్నిహితుడయ్యాడు .రామానంద చటర్జీతారాశంకర్ రచనలను తరచూ ప్రచురించి ప్రోత్సహించాడు .గ్రామసీమలను ఆయన విభిన్న దృక్కోణంలో చూసిరాశాడు .చాలాభాగంసంప్రదాయవాది.

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.