శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -5
శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -5
‘’చామ ! ఈశాన మౌళి నీచందమామ –కొంచెమై యుండు నవ యవామ్కురము కంటే-డాసి గ్రహమండనము నడుమ –గీల్కొనిన రాహు వక్త్ర మీక్షించి యొక్కొ’’
దమయంతీ !-ఈ చందమామ శంకరుని జటాజూటం లో కొత్త యావ ధాన్యం మొలక కంటే ,కొంచెం స్వల్పమై సమీపించి ,గ్రహాలనే కపాలాల దండ అనే మండలము మధ్య అలంకారం గా రాహువు ముఖం చూసి కాబోలు ఈశ్వరుని శిరస్సున పుర్రెల మాలిక ఉంటుందని వాడుక.
‘’శివుమకు ,జకోరములకున్ –దివిజులకును నిచ్చు దుహిన దీధితి యీతం –డవయవము రుచుల నమృతము –నువిద !తగుం గల్పతరు సహోదరు డౌటన్ ‘’
చల్లని కిరణాలు కల ఈ చంద్రుడు పదహారు కళల చేత అమృతాన్ని ఈశ్వరునికి ,చకోర పక్షులకు ,దేవతలకు ఇస్తున్నాడు .పాలకడలి లో పుట్టిన కల్ప వృక్షంతో పాటు పుట్టాడు కనుక కల్పవృక్షంలా అమృత దానం చేస్తున్నాడు .
‘’అంగద !న౦క వర్తి ,హరిణాభ్యవ్యవహార విలోల బుద్ధియై ,-మ్రింగు విధుం తుదుండనెడి మేటి భుజంగమ మె ,శశాంకు సా –రంగము బాయడీ యవసరంబున మేలని మెచ్చి యోచు మీ –మ్రింగియు గ్రాయునచ్చిలువ ,మెల్త!విధుం గాసు గంద కు౦డగన్ ‘’.
రాహువు అనే పెద్ద పాము ఆకలితో ,చంద్రుని ఒడిలో ఉన్న లేడిని తినటానికి ఆసక్తి గల మనసుతో ఈ చంద్రుని మింగేసె సమయం లో లేడిని వదలడు.ఆశ్రిత వాత్సల్యం గొప్పది కదా .అందుకే నేమో చంద్రుని మింగినా ,కొంచెమైనా నెప్పి కలగకుండా ,మళ్లీ బయటికి విడిచేస్తాడు .చంద్ర్రుని లోని లేడిని మింగుదామని రాహువు ప్రయత్నిస్తే లేడి ని వదల్లేక చంద్రుడు ఉంటే ,రాహువు లేడితో సహా చంద్రుడిని మింగేస్తాడు .అలా మింగినా చంద్రుడు లేడిని వదిలి పెట్టలేదు .రాహువు అతడి ఆశ్రిత వాత్సల్యాన్ని చూసి ఆశ్చర్యపోయి చంద్రునికి ఏమాత్రం నొప్పిలేకుండా వదిలేశాడు .ఇది గ్రహణ విషయం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-2-24-ఉయ్యూరు

