శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -5

  శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -5

41-‘’త్యక్తా త్వమసి భోగా౦స్తు మయా సహా వినిర్గతః – దైవ యోగాచ్చ సౌమిత్రే భు౦క్ష్వ దుఖం దురత్యయం ‘’

సూర్య వంశంలో పుట్టి రాజపుత్రులమై ఇలా అడవులలఏడుస్తున్నాం ..రాజభోగాలన్నీ వదిలి నువ్వు నా వెంట వచ్చావు .నీ రాత అలా ఉంది. ఏం చేస్తాం అనుభవించు .దుఖం దిగ మింగుకో .రాముడు లక్ష్మణుడితో

42-‘’త్యజేప్రాణాన్నియ౦తృత్వే మైధిలీ భరతానుజ – న రావణస్య వశగా భవేదితి సునిశ్చయం ‘’

పరమపావని సీత .బలాత్కారం చేసినా రావణుడికి లొంగదు.ప్రాణాలైనా వదిలేస్తు౦దికాని స్వైరిణి లా ప్రవర్తించదు.

43-‘’రాజ్యా ద్యధా వనే వాసో వైదేహ్యాహరణం  యథా –  తథా కాలే సమీచీనే సంయోగో పి భవిష్యతి ‘’

అన్నా ప్రస్తుతం మనకు రోజులు బాగాలేవు అందుకే రాజ్యహాని వనవాసం సీతాపహరణం తో కష్టాలపాలయ్యాం .మంచి రోజులు వస్తాయి అప్పుడు అన్నీ మనకు అనుకూలం గా ఉంటాయి .తమ్ముడు రాముడితో .

44-‘’ సుఖస్యానంతరం దుఖం దుఖస్యానంతరం సుఖం -చక్రనేమిరివైకం తన్న భవేద్రఘు నందన

      మనోతికాతరం యస్య సుఖ దుఃఖ సముద్భవే – న శోక సాగరేమగ్నో నసుఖీస్యా కదాచన ‘’

సుఖడుఖాలు కాలనేమి క్రమంలో వస్తాయి పోతాయి .ఏ ఒక్కటీ ఎక్కువ కాలం ఉండదు అవి వచ్చినప్పుడు మనోధైర్యాన్ని పోగోట్టుకొంటే మనిషి శోక సాగరంలో మునిగిపోతాడే తప్ప మనిషి సుఖ పడలేదు ఆని మర్చి పోవద్దు .సౌమిత్రి అన్నతో .

45-కారణం సర్వ జంతూనాం బ్రహ్మా దీనాం రఘూద్వహ -తస్యాః శక్తిం వినాకోపి స్పందితుం న క్షమో భవేత్’’

చరాచర జగత్తుకూ ఆదిశక్తికారణం . త్రిమూర్తులకు అధిదేవత .ఆమె అనుగ్రహం లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించాను కూడా స్పందించ లేరు .

   చతుర్దాశ్వాసం

46-‘’గర్భ వాసాత్పరో నాస్తి నరకొ భువనత్రయః -తద్భీతాశ్చ ప్రకుర్వంతి మునయో దుస్తరం తపః ‘’

గర్భ వాసాన్ని మించిన నరకం మరోటిముల్లోకాల్లోనూ లేదు .దానికి భయపడితపస్వులు రాజ్యాలు భోగాలు వదిలి అరణ్యాలకు పరుగులు తీస్తారు .

47-‘’ఆప్త వాక్యం ప్రమాణం చేదాప్తః కః పరదేహవాన్ -పురుషో విషయాసక్తో రాగీ భవతి సర్వథా ‘’

ఆప్త వాక్యం ప్రమాణం అనుకొంటే అసలు ఆప్తుడు ఎవరు ?దేహధారి అయిన ప్రతి వాడూ విషయాసక్తుడే రాగసహితుడే .జనమేజయుడు వ్యాసునితో .

48-‘’ ధర్మహీనం కృతం కర్మ కదం తత్ఫలదం భవేత్ -ధర్మే స్థిరా మతిః క్వాపి న కస్యాపి ప్రతీయతే ‘’

ధర్మం పట్ల ఎవడికీ పట్టుదల ధ్యాస ఆసక్తి ఉన్నట్లు ఎక్కడా అనిపించటం లేదు . జనమేజయుడు వ్యాసునితో

49-‘’అహంకార సముద్భూత స్సంసారో యం యతో నృపః -రాగ ద్వేష విహీ నస్తున కథం జాయతే నృప .’’   

మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేష రహితుడు ఎక్కడ ఉంటాడు రాజా .వ్యాసుడు జనమేజయుడితో

50-‘’ద్రోహపరే ద్రోహపరో భవేదితి సమానతా-అద్రోహి ని తధా శాంతే విద్వేషః ఖలతా విద్వేషఃఖలతా స్మృతా ‘’

ద్రోహం చేసేవాడికి ద్రోహం చేయటం సమత .అద్రోహికి అతిశాన్తుడికీ ద్రోహం చేయటం ఖలత -నీచత్వం .వ్యాసుడు జనమేజయిడితో .

  సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-25-

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.