వారణాసి వారి వాల్మీకి రామాయణ రహస్యాలు.4వ భాగం.7.1.22

వారణాసి వారి వాల్మీకి రామాయణ రహస్యాలు.4వ భాగం.7.1.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో తేల్చుకొందామా ‘’?అని సవాలువిసిరిన దేశ భక్తురాలు కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ-

నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో తేల్చుకొందామా ‘’?అని సవాలువిసిరిన దేశ భక్తురాలు కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ-

 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోని గునుపూడి లో 30-9-1860 న వేలూరి లక్ష్మీ నారాయణ ,వెంకమ్మ దంపతులకు 14వ చివరి  సంతానంగా కనక మహాలక్ష్మమ్మ పుట్టింది .తండ్రి సంస్కృత,ఆంధ్రాలలో  మహా పండితుడైన శ్రోత్రియుడు ,పరమ చా౦దసుడు .యజ్ఞం చేసి సోమయాజి అయినవాడు .ఆయిదవ ఏటనే కూతుర్ని40ఏళ్ళ కోటమర్తి సూర్యనారాయణకు ఇచ్చి వివాహం చేశాడు .లోకజ్ఞానం లేని ఆ అమాయక పిల్ల పెళ్ళిలో పేచీలు పెడితే మొగుడే ఎత్తుకొని ఆడించి లాలించాడు .అగ్రహారీకుడు సిరి సంపదలతో తులతూగుతున్న భర్త, మామగార్ని మించిన పరమ ఛాందసుడు .కానీ మహా పండితుడు. ఆఇంట నిత్యం పురాణపఠనాలు,సత్కాలక్షేపాలు జరిగేవి .ఇవన్నీ వింటూ ఆమెకు రామాయణ భాగవత భారతాలు కొట్టిన పిండి అయ్యాయి. అన్నీ వాచో విధేయాలయ్యాయి .ధారణా శక్తి అమోఘం కనుక ఆమెకు రానిశ్లోకం పద్యం ఉండేవికావు .పుట్టింటి లోని సంగీతం వంటబట్టిపద్యాలు శ్లోకాలు రాగయుక్తంగా ,ఇంపుగా ,అనర్గళంగా పాడుతూ వినే వారిని మైమరపించేది .స్వయం గా పద్యాలు ,పాటలూ రాసి౦ది కూడా ..తనకు తెలిసిన విషయాలను సులభంగా అర్ధమయేట్లు కధలు గా చెబుతూ తగినట్లు పద్య శ్లోకాలుభావ గర్భితంగా పాడుతూ శ్రోతలను రంజింపజేసేది .30ఏళ్ళ వయసులో అయిదుగురు బిడ్డల తల్లి అయింది ,ఆరవ బిడ్డ పుట్టటానికి నెల రోజుల ముందే భర్త మరణించటం వలన వైధవ్యం ప్రాప్తించింది . పుట్టింటికి భీమవరం చేరింది .కాని పుట్టింట్లో ఆదరణ లభించకపోవటం వలన ఆమె అహం దెబ్బతిని ,తనమనసులోని అభ్యుదయభావాల వ్యాప్తికోసం  భీమవరంలో దూరంగా ఒక కుటీరం నిర్మించుకొని అక్కడే నివాసమున్నది .పరమ ఛా౦దసులైన తన అత్తగారింట తన పిల్లలు పెరిగితే, వారికి అభి వృద్ధి ఉండదు అని గ్రహించి పిల్లలతో సహా కుటీరంలోనే ఉన్నది .ఆమెకున్న వివేచనా శక్తి ,పాండిత్య ప్రకర్ష ,పురాణ ఇతిహాసాలపై ఉన్న అద్భుతమైన పట్టు ,ధర్మ బోధనా పటిమ ,ధైర్యం నిస్సంకోచంగా చెప్పి ఒప్పించగల నేర్పు గమనించిన ఆవూరి క్షత్రియ స్త్రీలు ఆమెకు పరమ ఆత్మీయులయ్యారు .ఆమెను గురుభావంతో అత్య౦త గౌరవంగా చూస్తూ అన్నిట్లోనూ సహాయ సహకారాలు అందించి ఆదరించారు .కనకమ్మ గారికి అక్కడ ఏ లోటూ లేదు .

  సంఘ సంస్కరణ పట్ల ,రాజకీయాలపట్ల ఆసక్తి చూపి అంకితభావంతో పని  చేసింది .క్షణం తీరికలేకుండా మాట్లాడుతున్నా ,నడుస్తున్నా తకిలీతో  నూలు తీస్తూనే ఉండేది.తాను  ఖద్దరు ధరించి అందరి చేతాధరి౦పజేస్తూ ,ఇంటింటికీ తిరిగి ఖద్దరు వస్త్రాలు అమ్మి ఖద్దరు వ్యాప్తికి విశేష కృషి చేసింది .స్వదేశీయ వస్తువులనే వాడింది .పిల్లలకూ అవే అలవాట్లు నేర్పించి ,జాతీయభావాలతో పెంచి ఉత్తమ పౌరులుగా  బాధ్యతగల వ్యక్తులుగా తీర్చి దిద్దింది .తన తండ్రి యజ్ఞం చేసిన భీమవరం లోనే ఆమె కాంగ్రెస్ పెద్దలను ,హరిజనులను ఆహ్వానించి కొడుకు ,కోడలు చేత సత్యనారాయణ వ్రతం జరిపించి౦ది.హరిజన వాడలకు వెళ్లి అక్కడిపిల్లలకు స్నానాలు చేయించి , వాళ్ళ ఇళ్ళను  శుభ్రపరచి ఆరోగ్యానికి శుభ్రత ఎంత అవసరమో నేర్పించేది .ఒకసారి ఆమెరైలులో ప్రయాణం చేస్తుంటే ఒక నిండు చూలాలైన హరిజన స్త్రీకి పురుటి నొప్పులు రావటం చూసి ,పక్క స్టేషన్ లో ఆమెను దింపి ,తాను  కట్టుకొన్న బట్టనే ఆవరణగా చేసి ఆమెకు పురుడు పోసింది .నిజమైన సాంఘిక సేవకు ఇంతకంటే ఉత్తమ ఆచరణ ఎక్కడ ఉంది ?.

  కనకమహాలక్ష్మి సేవానిరతి ,నిర్మాణ కార్యక్రమాలపట్ల ఆపేక్ష ,స్వాతంత్రేచ్చ ,నిరర్గళ అమోఘ వాగ్దోరణి గమనించిన కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ఉద్యమ ,ప్రచార బాధ్యతలను  ఆమెకు అప్పగించారు .ముఖ్య ప్రబోధకురాలిగా ప్రచారకురాలిగా చేశారు .ప్రచార కార్యక్రమం లో ఆమె రాత్రనక పగలనక తిరిగింది తాను  స్త్రీ అనే విషయమే మర్చిపోయింది .ఆమె ప్రసంగాలకు ప్రజలు ఉత్తేజితులయే వారు.’’రెండవ బార్డోలి ‘’గా ప్రసిద్ధి చెందిన భీమవరం లో ,వేలాది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొనటానికి ,కాంగ్రెస్ కు ఆర్ధిక బలం చేకూరటానికి  ఆమె ప్రచార ప్రబోదాలే ముఖ్యకారణం .అందుకే పోలీసు వ్యవస్థ ఆమెను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు .కానీ వాళ్ళు అనుకొన్న సమయం లో వారికి కనిపించేదికాదు అవాక్కయ్యేవారు .కనిపించినట్లే కనిపింఛి  మాయమయ్యేది. ఒక సారి నిండు చూలాలైన తన కూతుర్ని పురిటికి మేనాలో అక్కగారింటికి తీసుకు వెడుతుంటే పోలీసులు ఆమెను అటకాయించారు .అప్పుడు ఆమె తాను కనకమ్మ కాదని ,కూతురు పురిటికి కనకమ్మ తప్పక వస్తుందని చెప్పగా  ,పోలీసులు నమ్మి ఇంటిముందు కాపలా కాశారు .లోపల పురుడురావటం బిడ్డపుట్టటం జరిగిపోయాయి కాని కనకమ్మ వాళ్లకు కనిపించనే లేదు .ఆమె తమ చెవిలో పెద్ద కాబేజీ పువ్వే పెట్టిందని ఆలస్యంగా గ్రహించారు .ఎన్నో సార్లు ఇలా పోలీసుల కళ్ళు కప్పి తిరిగింది .కాంగ్రెస్ నాయకులే ఆమె ప్రతిభకు ఆశ్చర్య పోయేవారు ..1930జూన్ 10న ,1931 ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు అరెస్ట్ చేసి రాయవెల్లూరు రెండవసారి జైలుకు పంపారు .రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో ప్రజలు ఐచ్చికంగా నిరసన ప్రదర్శనలు,సత్యాగ్రహాలు  చేశారు .అప్పుడు మూడవ సారి ఆమెను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు .నాల్గవసారి 1941వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొని జైలుపాలయ్యారు .సుమారు అయిదేళ్ళు ఆమె రాయవెల్లూరు, బళ్ళారి కర్నూలు జిల్లాలో కారాగార వాస శిక్ష అనుభవించిన వీర ,ధీర  దేశ భక్తురాలు .అపక్వ ఆహారమే తినేది .నానబోసిన పెసలు సెనగలు ,ఇంటినుంచి వచ్చిన పళ్ళుమాత్రమే ఆహారం .గోవి౦దనామాలు హుషారుగా పాడుతూ పాడిస్తూ జైలు అంతాతిరిగేది .పురాణకాలక్షేపలు హరికథలతో అందర్నీ అలరించి హాయి కూర్చేది .కరడుగట్టిన పగ ద్వేషం కోపం తాపం ,అసూయ ఉన్న జైలును నవ్వులతో చతురోక్తులతో భక్తిభావ ,ఆధ్యాత్మిక బోధనలతో చిరునవ్వుల పందిరిగా చేసి ఖైదీలలో నిస్తేజం నిరాశా నిస్పృహ లను పోగొట్టేది .జైలు అధికారులకూ ఆమె అంటే మహా పవిత్రభావం ఉండేది .వారితో మాట్లాడుతూ చకచకా పచారులు చేస్తూ తకిలీపై నూలు వడుకుతూ ఒక్క క్షణం కూడా వృధా చేసేదికాదు.

  1928నుంచి 1942వరకు కనకమ్మ ఉద్ధృతంగా రాజకీయంలో పాల్గొన్నది .ఒకసారి 1930 జూన్ 10న సాయంత్రం 7 గం.లకు భీమవరం తాలూకా శృంగ వృక్షం లో కలిదిండి వెంకటరామరాజు గారింటి ముందున్న పెద్ద ఖాళీ స్థలం లో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు  .స్థానికులేకాక చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలూ కనకమ్మ గారి ఉపన్యాసం వినటానికి తండోప తండాలుగా వచ్చేశారు .అప్పటికి ఆమె వయస్సు .50.వితంతువు .తెల్లని ఖాదీ  వస్త్రం ధరించి  బోడిగుండుపై ముసుగుకప్పుకొని ఉపన్యాసం ఇవ్వటానికి వేదిక ఎక్కింది .ఆమె మాట్లాడుతున్నా పాటలు పాడుతున్నా శ్లోకాలు ,పద్యాలు పాడుతున్నా ఒక సంగీత కచేరీ లా ఉండేది .శ్రోతలుమైమరచి తన్మయులై వింటున్నారు   .అక్కడ చేరిన అసంఖ్యాక జనాన్ని చూసి ఉత్తేజితురాలై పొంగిపోయింది .పోలీసులు జీపు లతో వచ్చి మోహరించారు .ఇద్దరుముగ్గురు పోలీసు జవాన్లతో,ఒక  పోలీసు అధికారి  ,వేదిక దగ్గరకు రాగా ,అక్కడే ముందు వరుసలో కూర్చున్న సుప్రసిద్ధ జాతీయవాదీ  ,ప్రముఖ లాయరు శ్రీ ముష్టి లక్ష్మీ నారాయణ గౌరవంగా లేచినిలబడి ‘’అయ్యా నమస్కారం కనకమ్మ గారి ఉపన్యాసంమహా రసవత్తరంగా సాగుతోంది .ఇలాసభలు ఏర్పాటు చేసుకొని భావాలు వెలిలిబుచ్చుకొనే ఒక్కటేఇప్పుదు ఈప్రభుత్వం లో ఉన్న ప్రజా స్వేచ్చ .మీరు ఆస్వేచ్ఛ ను అరికట్టకండి .ఉపన్యాసమవగానే మీ విధి నిర్వహణ మీరు చేయండి ‘’అని చెప్పి ఒక కుర్చీ తెప్పించి ఆఫీసర్ ను కూర్చోబెట్టారు .కనకమహాలక్ష్మి స్వరాన్ని మరింతపె౦చి ‘’అయ్యా !మీరంతా భారత మాతను  దాస్యం నుంచి తప్పించటానికి కంకణం కట్టుకొన్న భారత వీరులు .ఈ పోలీసుల్ని చూసి బెదిరి పోకండి .వాళ్ళూ మన సోదరులే .పొట్టకూటికోసం పిరికిగా పరులకు దాస్యం చేస్తున్నారు .అలాంటి వారి పిస్తోలు గుండ్లకు పిసరంతకూడా పస ఉండదు .ఏమయ్యా  ఇన్స్పెక్టర్  బాబూ !  నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో చూస్తావా “’అని సవాలు విసిరి ,నెత్తిమీది ముసుగు తీసి, తలకాయ వంచి నిలబడింది .క్షణాలలో జనం భారత మాతాకు జై  గాంధీ మహాత్మునికీ జై ,కోటమర్తి కనకమ్మ గారికీ జై అంటూ దిక్కులు పిక్కటిల్లెట్లుగా  అంటూ  మైదానం అంతా మారుమోగేట్లు స్పందించారు  .ఉపన్యాసం అవగానే ఆమెను అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళారు  ఇలాంటి సంఘటనలు ఆమె జీవితకాలం లో చాలా జరిగాయి .

  ఎట్టకేలకు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది .స్వాతంత్ర సమరభావనానికి రాళ్ళు ఎత్తిన కూలీలను కాంగ్రెస్ పాలకులు మర్చిపోయారు .అలాగే కనకమ్మగారినీ పక్కన పెట్టేశారు .అయినా ఆమె ఊరుకోలేదు ఆంధ్రరాష్ట్ర ఉ ద్యమం లో చురుకుగా పాల్గొన్నది .స్వామి సీతారాం 1952లో భీమవరం లో 7రోజులు సత్యాగ్రహ శిబిరం నిర్వహిస్తే ,పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా ఏడు రోజులు కఠిన ఉపవాసం చేసింది .ఆంధ్రరాష్ట్రం విషయం అధిష్టాన వర్గం నాయకులతో మాట్లాడటానికి ఆ వృద్ధ నారి ఢిల్లీ వెళ్ళి మంతనాలు జరిపింది .

 జీవితాన్ని పరమ శాంతంగా తన కుటీరంలోనే  సాధారణంగా గడిపింది ఆ అసాధారణ దేశ భక్తురాలు .12-1-1962న ఆ ధీరోదాత్త దేశభక్తురాలు శ్రీమతి కోటమర్తి కనకమహా లక్ష్మమ్మశతాధిక ఆయుస్సుతో జీవించి 102 ఏట పరమ పదించింది . .

 గబ్బిట దుర్గా ప్రసాద్-7-1-23-ఉయ్యూరు  

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -381

• మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -381
• 381-నటుడు ,గబ్బర్ సింగ్ ,బాద్షా సినీ నిర్మాత –బండ్ల గణేష్
బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో చిత్రాలు నిర్మించాడు. 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు.ఆయన 2021లో జరిగే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోటీ చేయనున్నాని ప్రకటించాడు.[1]
రాజకీయాలు
2018 తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో సెప్టెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] కానీ టికెట్ దక్కలేదు.[3] ఏప్రిల్ 5, 2019 న తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.[4]
నిర్మాతగా తీసిన చిత్రాలు
• అంజనేయులు – 2009
• తీన్ మార్ – 2011
• గబ్బర్ సింగ్ – 2012
• బాద్ షా – 2013
• ఇద్దరమ్మాయిలతో – 2013
నటుడిగా
• సుస్వాగతం
• సూర్యవంశం
• సాంబయ్య (1999)
• భరతసింహారెడ్డి (2002)
• విలన్ (2003)
• మనసులో మాట
• నువ్వు నాకు నచ్చావ్
• మల్లీశ్వరి
• ఆంధ్రావాలా (2004)[5]
• 143 (2004)[6][7]
• సరిలేరు నీకెవ్వరు (2020)
• డేగల బాబ్జీ
వివాదాలు
గణేష్ తమని కులం పేరుతో దూషించారంటూ హైదరాబాదుకు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకు మునుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టే నేతలు కొంతమంది తమ ఎమ్మెల్యే రోజా మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విజయవాడ జాయింట్ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. 2017 నవంబరులో సినీ రచయిత వక్కంతం వంశీ ఇతనిపై హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టులో చెక్ బౌన్సింగ్ కేసు వేశాడు. కోర్టు ఇతనికి ఆరు నెలలు కారాగార శిక్ష, సుమారు 16 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అయితే వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిలు లభించింది.[8]
382-గీతాఆర్ట్స్ వ్యాపకుడు ,100పర్సెంట్ లవ్ ,పిల్లా నువ్వు లేనిజీవితం సినీ నిర్మాత ,డిష్ట్రిబ్యూటర్ –బన్నీ వాసు
న్నీ వాసు తెలుగు సినిమా నిర్మాత. ఆయన సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, చావు కబురు చల్లగా (2021) సినిమాలకు నిర్మాణసారధ్యం వహించాడు. [
జీవిత విశేషాలు
ఆయన గీతా ఆర్ట్స్ ను ముందుకు తీసుకొని వెళ్ళే వ్యక్తులలో ఒకరు. ఆయన అల్లు అర్జున్కి మంచి స్నేహితుడు అయినందున ఆయనను బన్నీ వాసు గా పిలుస్తారు. ఆయన ఎం.ఐ.టి (మాస్టర్ ఇన్ ఐ.టి) కోర్సు నుండి తప్పుకొని పెంటా సాఫ్ట్ వద్ద 3D ఆనిమేషన్ నేర్చుకున్నారు. జానీ చిత్రం యొక్క లోగో ఏనిమేషన్ కొరకు అల్లూ బాబీ (అల్లు అర్జున్ యొక్క అన్నయ్య) వద్ద చేరారు. ఆయన బన్నీ వాస్ పనిని యిష్టపడ్డాడు. బన్నీ వాసు పాలకొల్లు వాసి. ఆయన గీతార్ట్స్ లో శిక్షకునిగా చేరాడు. ఆయన వంశీ (యు.వి.క్రియేషన్స్) తో కలసి 57 చిత్రాలను గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాఅల్లో పంపిణీ చేసారు. వాటిలో మంచి సినిమాలైన పోకిరి, ఆర్య, మగధీర మొదలైనవి ఉన్నాయి. చివరిగా గబ్బర్‌సింగ్ చిత్రాన్ని పంపిణీ చేసారు. ఆయన బన్నీ అన్ని చిత్రాల నిర్మాణంలో, సృజనాత్మక అంశాలలోనూ పాల్గొన్నారు. [2]
ఫిల్మోగ్రఫీ
Year Film Notes
2011 100% లవ్
నిర్మాత
2014 కొత్త జంట
నిర్మాత
2014 పిల్లా నువ్వు లేని జీవితం
నిర్మాత
2015 భలే భలే మొగాడివోయ్
నిర్మాత
2016 సరైనోడు
సహా నిర్మాత
2017 నెక్స్ట్ నువ్వే
నిర్మాత
2018 నా పేరు సూర్య
Co-నిర్మాత
2018 గీత గోవిందం
నిర్మాత
2019 ప్రతి రోజు పండగే
నిర్మాత
2021 చావు కబురు చల్లగా
నిర్మాత
2021 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
నిర్మాత
2022 పక్కా కమర్షియల్
నిర్మాత
2022 18 పేజెస్
నిర్మాత
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -7 రిచర్డ్ హెచ్ .గ్రాంట్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -7

7-రిచర్డ్ హెచ్ .గ్రాంట్

 హెన్రి ఫోర్డ్ ను కింగ్ ఆఫ్ మోటార్స్ అంటారు .ఆయనతో పాటు దీటుగా ‘’చెవ్రోలెట్ ‘’కార్లను ఉత్పత్తి చేసి ,,ఫోర్డ్ కూడా తన చేవ్రోలేట్ మోడల్గా ఫోర్డ్ కారు ను మార్చుకోనేట్లు చేసిన మోటార్ సుప్రీం రిచర్డ్ .హెచ్. గ్రాంట్ .ఫోర్డ్ కార్లకంటే చేవ్రోలేట్ కార్లు అధికధరకు అమ్ముడయ్యేవి .దీనికి ముఖ్యకారకుడు చేవ్రోలేట్ మోటార్ కార్ సేల్స్ మేనేజర్ అయిన రిచర్డ్ హెచ్ .గ్రాంట్.ఫోర్డ్ కార్లు,ట్రక్కుల కంటే అత్యధికమైన నాణ్యతతో కస్టమర్ సాటిస్ఫాక్షన్ సాధించాడు .

  1920లో చేవ్రోలేట్ కంపెని సేల్స్ మేనేజర్ అయ్యాడు గ్రాంట్ .నాలుగేళ్ళలో చేవ్రోలేట్ కార్ల అమ్మకాన్ని అయిదు రెట్లు పెంచగలిగాడు .1924లో రెండున్నర లక్షల కార్లు అమ్మితే ,1928కి 12లక్షల 25వేలకార్లు అమ్మాడు ..ప్రపంచం మొత్తం మీద ఇంతటి సేల్స్ మగాడు లేనేలేడు.అతడి ప్రతిభ అమెరికాలో తెలిసినట్లు యూరప్ ఆసియాలలో తెలియలేదు .అతడు స్కాటిష్ జాతికి చెందిన అమెరికన్ .తలిదండ్రులు ధనవంతులు .హార్వర్డ్ గ్రాడ్యుయేట్ .మొదట్లో మూడేళ్ళు ఒక టెలిఫోన్ కంపెనీ సేల్స్ మేనేజర్గా ఉన్నాడు .తర్వాత నేషనల్ కాష్ రిజిష్ట్రర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు .తొమ్మిదేళ్ళలో అ కంపెని  సేల్స్ మేనేజర్ అయ్యాడు .తర్వాత జనరల్ మోటార్స్ కు చెందిన డేల్కొలైట్ కంపెనీలో వ్యవసాయదారులకు దీపపు సామగ్రి అమ్మే పనిలో కుదిరాడు ఇది చాలాకష్టమైన పనే .అలాంటి కంపెనీలు అప్పుడు 50ఉన్నాయి .ఆ కంపెనీ లన్నీ కలిసి ఏడాదికి 10వేల లైటింగ్ ప్లాంట్ లకంటే ఎక్కువ అమ్మలేక పోయాయి.అప్పుడు అతడి వయసు 30.దీక్షగా పని చేసి  డెల్కోలైట్ లైటింగ్ ప్లాంట్ లను ఏడాదికి 25వేలు విడుదల చేయించి అమ్మి౦చగలిగాడు .

  ప్రతి అమ్మక స్థలానికి స్వయంగా వెళ్ళేవాడు .అ సామగ్రి అవసరం చక్కగా వివరించేవాడు .రైతులను ఉత్సాహపరచి కోనేట్లు చేయగలిగాడు .అందుకే యాభై కంపెనీలు ఏడాదికి పది వేల లైట్లను అమ్మగలిగితే ,తన ఒక్క  కంపెనీ యే ఏడాదికి 25వేలు అమ్మేట్లు చేయగలిగిన బుద్ధి శాలి గ్రాంట్ .ఇదొక ట్రేడ్ గారడీ అన్నారు .తర్వాత ఎలెక్ట్రిక్ రిఫ్రిజి రేటర్ల కంపెనీలో చేరి ,అక్కడా తన ప్రతిభ సామర్ధ్యాలు చూపి అత్యదికంగారిఫ్రిజి రేటర్లను అమ్మించాడు .కార్ల దిగ్గజం హెన్రి ఫోర్డ్ కు కూడా చుక్కలు చూపించాడు గ్రాంట్ .ఇతడి ప్రతిభను గుర్తించి ఫోర్డ్ కార్లను చేవ్రోలేట్ కార్లు మించి పోవాలని చేవ్రోలేట్ కంపెనీ గ్రాంట్ ను ఆహ్వానించి సేల్స్ మేనేజర్ ను చేసింది.

  చేవ్రోలేట్ కంపెని లో చేరిన మొదటి ఏడాదే ఆకార్ల అమ్మకాన్ని రెట్టింపు చేయగలిగాడు గ్రాంట్ .మరో రెండేళ్లలో మళ్ళీ రెట్టింపు అమ్మకాలు సాధించాడు .1929కి 12.50శాతం అభి వృద్ధి చూపించాడు .ఆఏడు 12లక్షల 25వేల కార్లను రికార్డ్ స్థాయిలో అమ్మగలిగాడు గ్రాంట్ .గ్రాండ్ సేల్స్ మేనేజర్ గ్రాంట్ అని పించాడు .ఈ అమ్మకం బ్రిటన్ లోని మొత్తం కార్ల సంఖ్య కంటే చాలా ఎక్కువ .ఇంతకీ గ్రాంట్ వ్యాపార విజయ రహస్యం ఏమిటి?’’ప్రదర్శన –ప్రకటన ‘’.మాత్రమె .అమ్మకాలలో మర్యాద పాటించటం మూడవది .కస్టమర్ శాటిస్ఫాక్షన్ పైనే ఎక్కువ దృష్టిపెట్టాడు .ఒక వ్యాపారి పరిధిలోకి రెండవ వ్యాపారి చొరబడకూడదు అనే నియమాన్ని ప్రవేశపెట్టి అద్భుతంగా అమలు చేసి అభి వృద్ది సాధించాడు .వ్యాపారులను తన భాగస్వాములుగా నే చూసేవాడు .వాళ్ళ హక్కులు పరిరక్షించాడు .కంపెని జమాఖర్చులు నిర్దుష్టంగా ఉండేట్లు చేసేవాడు .పాతకార్లు అమ్మటానికి అమితంగా సాయం చేసేవాడు .ఇవన్నీ విజయానికిసోపానాలయ్యాయి .అమ్మగలిగిన వాటికంటే ఎక్కువ కార్లు తీసుకోమని బలవంతంగా నెత్తిన రుద్దేవాడు కాదు .

  గ్రాంట్ యాజమాన్యంలో చేవ్రోలేట్ కంపెనీకి 4,500 మంది డీలర్స్ ,5,500మంది అసిస్టెంట్ డీలర్స్ ఉండేవారు .వారందరితో మంచి స్నేహం నేరిపెవాడు .వారిని విశ్వాసం లోకి తీసుకొనేవాడు .ప్రతినెలావారినుండి నివేదికలు తెప్పించుకొని పరిశీలించేవాడు ,తనవద్ద పని చేస్తున్న 50మంది సేల్స్ మెన్ ను సూపర్ వైజర్స్ గా పంపుతూ ,డీలర్లకు ,తనకు చక్కని సాన్నిహిత్యం రాపోర్ట్ ఉండేట్లు చూసుకొనేవాడు .కార్లపై మంచి విజ్ఞానం కలిగించటానికి ఫిలిం లు కరపత్రాలు ,పోస్టర్లు కార్డ్ లు పుస్తకాలు తయారు చేయించి అందజేయి౦చేవాడు .వ్యాపారం నీరసిచకుండా ఎప్పటికప్పుడు ఉత్సాహ పరచేవాడు .మంచి వ్యాపారం చేసిన వారిని గుర్తించి అభిన౦దింది౦ చేవాడు .తగిన పారితోషికాలు అందజేసేవాడు .’’అమ్మకానికి ఉత్సాహం ఉండాలి ‘’అనే సూత్రాన్ని తానుపాటించి ,అందరి చేతా పాటింప జేసేవాడు.

  1878లో  అమెరికాలోని మాసా చూసేట్స్ రాష్ట్రం  ఇప్స్ విచ్ లో పుట్టాడు .హార్వర్డ్ లో చదివి గ్రాడ్యుయేట్ అయ్యాడు .పొట్టివాడు కనుక గట్టి వాడు .జనరల్ మోటార్స్ లో చేరి డేల్కో లైట్ కంపెని సేల్స్ మాన్ అయ్యాడు .ఫోర్డ్ ను మించిపోవాలని చేవ్రోలేట్ కంపెనీ ఇతడిని ఆహ్వానించి సేల్స్ మేనేజర్ చేసింది .అప్పుడు He lead Chevy past Ford in 1927, but that year is sort of an asterisk,” Grant said. “Ford was switching to the Model A, but Chevy still beat them handily in 1928 and then for the next few years, the two companies traded the No. 1 spot back and forth.”  

అని చెప్పి తన సామర్ధ్యాన్ని నిరూపించాడు .1929లో జనరల్ మోటార్స్ అతడిని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సేల్స్ చేయగా ,ఆటో మోటివ్ మార్కెట్ లో అన్ని కంపెనీలను అధిగమించేట్లు చేసి 26 బిలియన్ డాలర్ల టర్నోవర్ చూపించాడు .తన డీలర్లను ఉత్తేజపరుస్తూ గ్రాంట్ – He was also known for his many quotes, often called “Grantisms.” About his team, he said, “A salesman, like the storage battery in your car, is constantly discharging energy. Unless he is recharged at frequent intervals he soon runs dry. This is one of my greatest responsibilities of sales leadership.

  అని చెప్పేవాడు .1944లో చేవ్రోలేట్ లో రిటైర్ అయ్యాడు .కానే 1950దాకా అందులో సభ్యుడుగా ఉన్నాడు .రేనాల్డ్స్ కంపెనీతో కూడా సన్నిహితంగా ఉండేవాడు .ఇతనికొడుకు జూనియర్ గ్రాంట్ ఆకంపేని ప్రెసిడెంట్ అయ్యాడు .పబ్లిక్ పార్క్ కోసం గ్రాంట్ కుటుంబం 45ఎకరాల మంచి స్థలాన్ని దానం చేసింది .నార్మండిలో కొడుకు డైరీ ఫారం స్థాపించాడు .సీనియర్ గ్రాంట్ 1957లో చనిపోయాడు .1920-30కాలం లో ‘’అమెరికా  నంబర్ వన్ సేల్స్ మాన్ ‘’గాప్రభుత్వం  గుర్తి౦చి,గౌరవించింది .

    ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర.9వ భాగం.6.1.23.

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర.9వ భాగం.6.1.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

వారణాసి వారి వాల్మీకి రామాయణ రహస్యాలు. 3వ భాగం.6.1.23.

వారణాసి వారి వాల్మీకి రామాయణ రహస్యాలు. 3వ భాగం.6.1.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -378

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -378

· 378-నిర్మాత ,రాజకీయ నాయకుడు ,తెలంగాణా రాష్ట్ర సినీ టివీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ –పుష్కర్ రామమోహనరావు

పుష్కర్‌ రామ్మోహన్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సినీ జీవితం
పుష్కర్ రామ్మోహన్ రావు మల్టీడైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా సినీ ఎగ్జిబిటర్‌గా, పంపిణీదారుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి దేశవ్యాప్తంగా 250కిపైగా సినిమాలను విడుదల చేశాడు. ఆయన 1993 నుండి 95 వరకు కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా, ది హైదరాబాద్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కార్యదర్శిగా పని చేశాడు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో మే 2017లో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) తొలి చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[3]

నిర్మించిన సినిమాలు
· లవ్ స్టోరీ

· లక్ష్య[4]

· ది ఘోస్ట్ (2022)

· ప్రిన్స్ (2022)

· మైఖేల్ (2023)

· చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ తొలి చైర్మన్‌గా పని చేశాడు.

· 379- అర్జున్ రెడ్డి సినీ నిర్మాత –ప్రణయ్ రెడ్డి వంగా

ప్రణయ్ రెడ్డి వంగా భారతీయ సినిమా నిర్మాత. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందినవాడు.
ప్రారంభ జీవితం
ఆయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జన్మించాడు. ఆయన తన ప్రాథమిక విద్యను వరంగల్ లోని ప్లాటినం జూబ్లీ హైస్కూలు లో పూర్తిచేసాడు. ఆయన సోదరుడు సందీప్ రెడ్డి వంగా 2017లో నిర్మితమైన అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించాడు.

కళాశాల జీవితం
ఆయన కర్ణాటక లోని భల్కీలో ఉన్న గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టాను పొందాడు. ఉన్నత చదువులకు 2001లో ఆయన యూరోప్ వెళ్ళాడు. అచటా స్వీడన్ లోని డలర్నా విశ్వవిద్యాలయం నుండి 2003లో మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఆయన స్విర్జర్లాండ్ లోణి బెర్న్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజిమెంటు డిగ్ర్రీని పొందాడు.

జీవిత విశేషాలు
ప్రణయ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నాడు. ఆయన అమెరికాలోని కాపిటల్ ఒన్, కైసెర్ పెర్మనెంటె, కోగ్నిజంట్ కంపెనీలకు ఇ.టి.ఎల్ కన్సల్టంట్ గా పనిచేస్తున్నాడు. ఆయన వర్జీనియా లో గత 13 యేళ్ల నుండి నివసిస్తున్నారు.

అర్జున్ రెడ్డి
ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకురాకపోవడంతో తన తండ్రితో కలసి ఆయన భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి, ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 25, 2017న విడుదలయింది. ఈ చిత్రం హిట్ కావడంతో ప్రణయ్ నిర్మాతగా గుర్తింపు పొందాడు.

వివాదాలు
ఈ సినిమాలో పొగత్రాగడం, డ్రగ్స్ సేవించడం వంటి అంశాల వల్ల సెన్సార్ బోర్డులో యిబ్బందులు వచ్చాయి. ఈ చిత్రం పోస్టర్ కూడా ముద్దు సన్నివేశంతో కూడుకొన్నందున యిబ్బందులెదురైనా తెలంగాన ఫిలిం చాంబర్ చే ఆమోదించబడినది.

పునర్నిర్మాణం
ఈ చిత్రం కన్నడం, హిందీ, తమిళ భాషలలో పునర్నిర్మించబడినది.

వ్యక్తిగత జీవితం
ఆయన శ్వేతను వివాహమాడాడు. ఆయనకు రిషిక్ నందన్ రెడ్డి వంగా (జ.2009), విభుం స్మారణ్ వంగా ( జ.2011) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

380-‘’ఈగ’’ చిత్ర నిర్మాత ,గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ లో భాగస్వామి ,ఉదారుడైన స్పాన్సర్ –ప్రసాద్ వి .పొట్లూరి

ప్రసాద్ వి. పొట్లూరి (జ.సెప్టెంబరు 8, 1970) (పి.వి.పిగా సుపరిచితుడు) సీరియల్ వ్యవస్థాపకుడు, లోకోపకారి, విద్యావేత్త. [3][4] ఆయన పూర్తి పేరు పొట్లూరి వరప్రసాద్. ఆయన స్వంతంగా పి.వి.పి సినిమా అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాడు. పివిపి సినిమా బేనర్‌పై ఇప్పటి వరకు తమిళం, తెలుగులో పలు భారీ సినిమాలు నిర్మించాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రాన్ని తమిళంలో ‘నాన్ఈ’ పేరుతో పివిపి సినిమా వారు ప్రొడ్యూస్ చేసాడు.

గ్లోబల్ అవుట్ సోర్సింగ్ సర్వీసు రంగంలోని సీరియల్ వ్యవస్థాపకునిగా ఆయన మూడు కంపెనీలను విజయవంతంగా నిర్మించి వాటిని “ఫోర్టూన్ 1000 మార్కెట్ ప్లేస్” యొక్క అవసరాలను తీర్చడానికి అమ్మారు.[5] [6] గ్లోబల్ ఇన్వెస్టుమెంటు సమాజంలో ఆయన గౌరవ ప్రథమైన నాయకుడు.

ఆ వ్యవస్థాపక-ప్యాక్ దశాబ్దంలో, అతను ప్రోకాన్, ఓరియన్ కంపెనీ ఎల్ ఎల్ సి, ఐరెవ్నా లిలిటెడ్[7] [8][9]వంటి అనేక సంస్థల వెనుక చోదక శక్తిగా ఉన్నాడు.[10] ప్రోకాన్ ఐ.ఎన్.సి టెక్నాలజీస్ ను 1998 లో కొనుగోలు చేసాడు. AOC, LLC లను 2000 లో SSI[11] ద్వారా INR 2.92 లకు కొనుగోలు చేసాడు.[12] అప్పటికి అది అతి పెద్ద వ్యవహారం. ఇరెవ్నా లిమిటెడ్ 2005 లో CRISIL (S&P భారతదేశం) ద్వారా కొనుగోలు చేసాడు. ఆయన మావెన్ కార్ప్, కార్వే కన్సల్టెంట్స్[13] లలో వ్యూహాత్మక పెట్టుబడిదారుడు.[14][15], సిబై సిస్టమ్*స్ కు స్థాపక ఇన్వెస్టరు.[16][17][18][19]

ప్రస్తుతం ఆయన పి.వి.పి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చైర్మన్, మేనేజింగ్ డైరక్టరు. [20] ఈ సంస్థల్ రియాల్టీ, మీడియా, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంటు రంగాలలో ఇన్వెస్టుమెంటు ఆసక్తితో నాయకునిగా పరిణమిస్తుంది. ప్రతి వాటాదారునికి ప్రయోజనం కలిగించే ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా వృద్ధి చెందుతోంది.[21][22][23] పివిపి బహిరంగంగా వర్తకం చేసే వ్యాపార సంస్థ. ఇది 35,000 మంది షేర్ హోల్డర్లతో BSE, [24] NSE[25] & LSE[26] పై ట్రేడింగ్ చేస్తుంది. జూలై 2010లో పి.వి.పి గ్రూపు భారతీయ మీడియా&ఎంటర్‌టైన్‌మెంటు రంగంలో “పిక్చర్‌హౌస్ మీడియా లిమిటెడ్” ద్వారా అడుగు పెట్టింది. ఇది భారతీయ ఎంటర్‌టైన్‌మెంటు పరిశ్రమ యొక్క ఆర్థిక అవసరాలకు తోడ్పాటు అందించే భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత మీడియా కేపిటల్ హౌస్.

పి.హె.ఎం.ఎల్ ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలో పి.వి.పి సినిమా బ్యానర్ తో అడుగిడింది. అది దేశంలో అతి పెద్ద నిర్మాణ సంస్థ.[27][28][29][30]

ఆయన విజయవాడ లోని “ప్రసాద్ వి. పొట్లూరి సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ “కి ముఖ్య పోషకుడు.[31][32][33] ఆయన ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి కూడా దాతగా ఉన్నాడు.[34] ఆయాన్ హైదరాబాద్ హాట్‌షాట్స్ కు యజమాని.[35][36][37] ఆయన ఇండియన్ బ్యాడ్‌మెంటన్ లీగ్ కు గల ఆరుగురు ఫ్రాంచైజీలలో ఒకరు. ఆయన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్.సికు సహ యజమాని.

ప్రారంభ జీవితం, కుటుంబం
ప్రసాద్ వి. పొట్లూరి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో రాఘవేంద్రరావు, మంగతారా దేవి దంపతులకు జన్మించాడు. విజయవాడలోని ఎన్.ఎస్.ఎం పబ్లిక్ పాఠశాలలో పాఠశాల విద్యనభ్యసించిన తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగులో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు.

ఆయన భార్త ఝాన్సీ సురెడ్డి. ఆయన పిల్లలు పెరల్, పరమ్‌.

వ్యాపార జీవితం
· సి.ఇ.ఒ/వ్యవస్థాపకుడు, ప్రోకాన్ ఐ.ఇన్.సి. మిచిగాన్, 1996 నుండి 1998[38]

· సి.ఇ.ఒ/వ్యవస్థాపకుడు, ఆల్బియన్ ఓరియన్ కంపెనీ ఎల్.ఎల్.సి., మిచిగా, 2000[39][40]

· చైర్మన్/వ్యవస్థాపకుడు, IREVNA లిమిటెడ్, లండన్, యునైటెడ్ కింగ్‌డం, 2001 నుండి 2005.[41][42]

· చైర్మన్, మేనేజింగ్ డైరక్టరు, పి.వి.పి వెంచర్స్ లిమిటెడ్, సెప్టెంబరు 2006 నుండి ఇప్పతి వరకు.[43]

దాతృత్వం
ఆయన చదరంగం క్రీడాకారిణి ప్రియాంకా నూతక్కిని ఇరాన్ లో జరిగిన ఆసియన్ చెస్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొనేందుకు గానూ ప్రాయోజితం చేసాడు. [44]

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-2023-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -6 బెరన్ హార్డ్ బారన్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -6

6-బెరన్ హార్డ్ బారన్

సిగరెట్ వర్తక చక్రవర్తి బెరన్ హార్డ్ బారన్ స్వయం కృషి వలన అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వాడు .యంత్రాలమీద సిగరెట్స్ తయారు చేసి కుబేరుడయ్యాడు ఎందరికో మార్గదర్శి అయ్యాడు .ఉత్పత్తిలో శుచిత్వం పాటించటం అతడి విజయానికి ముఖ్య కారణమైంది .మొదట్లో సిగరెట్ వర్తకులు ఇతడిని ‘’లైట్ తీసుకొన్నారు ‘’అదే వారి కొంప కొల్లేరు చేసింది .ప్రజలు  యంత్రాలపై  తయారైన సిగరెట్ లకు అలవాటై నాటు సిగరెట్లు మోటు అని వదిలేశారు .ఎంతగా డబ్బు సంపాదించాడో అంతగా దాన ధర్మాలు చేసి జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు .చనిపోయేముందు కూడా 20లక్షల పౌండ్లు దానధర్మాలు చేసిన వితరణ శీలి .ఇంతగా అతడికి డబ్బు సంపాదించి పెట్టిన సంస్థ పేరు1788లో స్థాపించిన  ‘’కార్రి రాస్ లిమిటెడ్ ‘’.

  జోస్ జోక్వెన్ కార్రిరాస్ అనే స్పానిష్ విదేశీయుడు లండన్ లో రీజెంట్ స్ట్రీట్ లో మూడవ జార్జి పరిపాలనా కాలం లో ఒక చిన్న దుకాణం పెట్టాడు .అది బాగా కిక్ అయి అందరి అభిమానం పొంది కాతాదారుల్ని విపరీతంగా ఆకర్షించింది .గొట్టాలు అంటే పైపులలో పొగపీల్చే వారికోసం తయారు చేసిన పొగాకు పొడిని ఆ కంపెని వారు 1567 నుంచి తయారు చేసి అమ్ముతున్నారు .దీన్ని కమ్మగా తయారు చేసినవాడు ‘’ఎరల్ ఆఫ్ క్రేవన్ ‘.ఇతర వస్తువులతో పాటు ఈ పొగాకు పొడిన కార్రిరాస్ తన దుకాణం లో అమ్మేవాడు .1903లో  ఈ వ్యాపారం బెరన్ హార్డ్ బారన్ చేతికి వచ్చింది .దాని చాలా గొప్పగా అతడు వ్యాప్తి చేశాడు తన స్వీయ ప్రతిభా సామర్ధ్యాలతో .

  యంత్రాలమీద సిగరెట్ లను అత్యంత నాణ్యంగా శుచిగా తయారు చేయటం ప్రారంభించి పొగ పీల్చేవారికి స్వర్గం చూపించి కొద్ది కాలం లోనే విశ్వవ్యాప్త సిగరెట్ వ్యాపారం చేశాడు .దీన్ని సాధించటానికి ముఖ్యకారణం లండన్ ఉత్తర భాగం లో ఒక కొత్త సిగరెట్ ఫాక్టరీ స్థాపించటమే .భవిష్యత్ వ్యాపారానికి ఇది ఒక కొలమానం –యార్డ్ స్టిక్ అయింది .యూరప్ ,అమెరికాలోని ఉత్పత్తి దారులంతా చూసి అబ్బురపడే అద్భుత యంత్రాగారం ఇది .ఆ ఫాక్టరీ ని దేవాలయంగా కట్టి ,ఇంటిలాగా నిర్వహి౦పబడటం గొప్ప విశేషం .అదే ఒక టంక శాల అంటే మింట్ లాగా డబ్బును ఉత్పత్తి చేస్తోంది .ఫాక్టరీ ధనాన్ని నూటికి యాభై శాతం లాభాలు పంచటం మరొక విశేషం. దీనిపై పన్నుకూడా లేకపోవటం మరో విశేషం .

  ఈ ఫాక్టరీ నిర్మాణానికి బెరయన్ హార్డ్ బారన్ 10లక్షల పౌడ్లు ఖర్చు చేశాడు లండన్ మహా నగరం లో నాలుగు వీధులమధ్య ఒక చతురస్రాకార ప్రదేశం లో దీన్ని నిర్మించి ఆకర్షణీయం గా చేశాడు .అందం లోనే కాదు వెరైటీ లోనూ ప్రాముఖ్యత చూపాడు .ఇందులో అనేక రకాల  బ్రాండ్  ల సిగరెట్లు ఉత్పత్తి అవుతున్నాయి .అందులో ‘’బ్లాక్ కాట్ ‘’మార్క్ సిగరెట్ ముఖ్యమైంది .ఫాక్టరీ మెయిన్ గెట్ పై రెండు వైపులా రెండు నల్లపిల్లి విగ్రహాలు ఏర్పాటు చేశాడు .ఫాక్టరీ లోపల బయట నలుపు ఎరుపు ఆకు పచ్చ రంగు చారలతో అలంకారం చేశాడు .మందిరానికి ఎదుట 12పెద్ద స్తంభాలు ఏర్పాటు చేశాడు. రాత్రిపూట ఆఫాక్టరి ,ఆవరణ భాగమంతా విద్యుత్ దీపాలకాంతి తో మెరిసి పోతుంది .సహస్ర చంద్ర మాసోత్సవం నిత్యం అక్కడ జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ దీపకా౦తుల ముందు వీధి దీపాలు బలాదూర్ అనిపిస్తాయి .గ్రేట్ బ్రిటన్ లో  రీ ఇంఫోర్సేడ్ కాంక్రీట్ తో కట్టిన భవనాలలో ఈ ఫాక్టరీ పెద్దది .ఆరు అంతస్తుల భవనం. ఇది 65లక్షల క్యూబిక్ అడుగుల వైశాల్యం కల ఆవరణ .

   ఫాక్టరీ లోపల 8 బ్రహ్మాండమైన మెషిన్స్ ఉన్నాయి .అవి నిమిషానికి వెయ్యి సిగరెట్స్ ఉత్పత్తి చేస్తాయి .అప్సరసలు లాంటి అనేకమంది సుందర కన్యలు వివిధ భాగాలలో పని చేస్తూ కస్టమర్ శాటిస్ఫాక్షన్ కల్గిస్తారు .మొత్తం మీద 3వేల మంది పని వాళ్ళు ఉంటారు .కంపెని డైరెక్టర్ సమావేశమందిరం దేవేంద్రుని సభలా ఉంటుంది .తప్పక చూడ తగింది .ఇంతటి సుందర మందిరం బ్రిటిష్ దీవులలో మరెక్కడా లేనే లేదు .ఆవాతావరణం అంతా ఒక సుందర చిత్రంలాగా పరమ మనోహరంగా ఉంటుంది .గోడలపై అనేక చిత్రాలు కనులకు విందు చేస్తాయి .నేల అద్దం లాగా నున్నగామెరుస్తూ ఉంటుంది  .

  ఆ ఫాక్టరీ లో పనులన్నీ యంత్రాలే చేస్తాయి .ట్రేలలో సిగరెట్స్ తీసుకొని వెళ్ళేవి ,పార్సిల్స్ కట్టేవి, పొగాకును చిన్న చిన్న ముక్కలుగా కత్తి రించేవి ,సిగరెట్ డబ్బాలకు రేపర్లు అతికించేవి ,అసలైన సిగరెట్ లను తయారు చేసే ముఖ్యమైనవి  అన్నీ యంత్రాలే . యంత్ర మాయాజాలం అంతా అక్కడ చూసి అవాక్కై పోతాం .యంత్రాలనుంచి తయారైన సిగరెట్స్ పడే చోట్లు లెక్కపెట్టి టిన్స్ లో వేసేవి అన్నీ యంత్రపు పనులే .ఫాక్టరీ కి రెండే ద్వారాలు .ఒకటి బయటి సరుకులోపలికి తీసుకు రావటానికి, రెండోది లోపలి సరుకు బయటకు రవాణా చేయటానికి .అన్నిపనులు ఠంచన్ గా నిర్ణీత సమయం లో జరిగి పోతూ ఉంటాయి .కంగారు హడావిడి ఉండవు .ఇంతపెద్ద ఫాక్టరీ లో ఎక్కడ వెతికినా దుమ్ము అనేది కనిపించనే కనిపించదు .’’డస్ట్ ఎక్ష్ట్రాక్టర్లు ‘’ఎప్పటికప్పుడు దుమ్ము తీసేసి ప్రాంగణాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచుతాయి .ఆరోగ్యానికి గొప్పవిలువ ఇచ్చేఫాక్టరి ఇది .వాయు దేవుడు కూడా ఫాక్టరీ మాట వినాల్సిందే ఎప్పుడు ఎక్కడ ఎంత శీతోష్ణస్తితికావాలో అలానే ఏర్పాటు చేస్తాయి అక్కడి ఏసిలు .పొగాకుకు కావాల్సిన క్లైమేట్ కూడా ఆ ఫాక్టరీ ఏ ఏర్పాటు చేస్తుంది .ఇక్కడ ఉన్న ఏసిలు యూరప్ లో ఇంకెక్కడా ఏ ఫాక్టరీలోనూ లేవు .ఆరు వేల పౌన్ల ఖర్చుతో వాటిని ఏర్పాటు చేశారు .లోపలి వచ్చేగాని క్షణాలమీద క్షాళనం చేసి వేడి చేస్తారు .తర్వాత చల్లబడేట్లు చేస్తారు .అన్ని సీజన్ లలోనూ ఫాక్టరీ లోపల ఒకే రకంగా ఉండటం ఇక్కడి ఇంకో ప్రత్యేకత .నడి శీతాకాలం లోకూడా ఆడ కూలీలు చేతులకు గ్లౌజులు తొడుక్కొనే అవసరం ఉండదు .ఫాక్టరీలో గాలి స్వచ్చం శుచిగా ఉంటుంది .మహామహా కాజిల్స్ లో ఉండే ఐశ్వర్యవంతులకు కూడా ఇంతటి స్వచ్చమైన గాలి లభించదు ‘

 1927లో ఈ ఫాక్టరీ 12 ,58,847పౌన్ల లాభాన్ని ఆర్జి౦చి పెట్టింది .ఈలాభం కంపెనీ యజమానికి మాత్రమె కాదు అక్కడ పని చేసేవారందరికి చెందుతుంది అదీ ఈ ఫాక్టరీ విశేషం .కేర్రాస్ కంపెనీ వారికి మేధస్సుతోపాటు హృదయం కూడా ఉంది. అది అరుదైన విషయం .పని వారి ఆరోగ్యం కోసం డాక్టర్లు నర్సులు సదా హాజరుగా ఉంటారు .వ్యాదితగ్గి మళ్ళీ ఆరోగ్యం పొందేదాకా విశ్రాంతి వినోదాలు కల్పించే ఏర్పాట్లున్నాయి .విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది అన్నిరకాల ఆటలు ఆడుకోవచ్చు.రోగ సమయంలోజీతాలు ఇవ్వటానికి ,పని విరమణలో ఉపకార వేతనాలు పొందటానికి ప్రత్యెక ఏర్పాట్లున్నాయి .ప్రతి కిస్మస్ కు ఒక వారం కూలి అదనంగాప్రతివారికీ ఇస్తారు .పెద్ద సభ జరుపుతారు .బారన్ బ్రతికి ఉన్నంతకాలం ఆయనే ఆసభకు అధ్యక్షుడుగా ఉండేవాడు .ఆఏడు వర్క్ ప్రోగ్రెస్ అంతా వివరించి చెప్పేవాడు .పన్ను లేకుండా నూటికి 50శాతం లాభాలు పంచి పని చేసేవారి పాలిటి కల్ప వృక్షంగా వ్యవహరించాడు ఆసిగరేట్ కుబేరుడు బారన్ .గౌరవాలు బిరుదులకోసం ఎన్నడూ ఆశించలేదు .అతడుచనిపోయాక అతడికుమారుడికి 1930లో ప్రభుత్వం గౌరవ సూచకంగా ‘’బార్ నెట్సి ‘’ అవార్డ్ అందజేసింది .

  బెరన్ హార్డ్ బారన్ 5-12-1850న పుట్టి 1-8-1929 న 80ఏళ్ళ వయసులో మరణించాడు .అమెరికాలో సిగరెట్ తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టి 1890-నుంచి 95దాకా ..’’నేషనల్ సిగరెట్ టుబాకో కంపెని ‘’ కి మేనేగింగ్ డైరెక్టర గా ఉన్నాడు .పేటెంట్ రైట్స్ కోసం 1895లో ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే లండన్ లో స్థిరపడ్డాడు .లండన్ లోని ఆల్డ్ గేట్ వద్ద ‘’బారన్ సిగరెట్ మెషీన్ కంపెని లిమిటెడ్ ‘’స్థాపించాడు .తన పేటెంట్ ను 1,20,౦౦౦ పౌండ్లకు అమ్మేశాడు .తర్వాత కేరిరాస్ టొబాకో కంపెని బోర్డ్ లో చేరి 1904లో మేనేగింగ్ డైరెక్టర్,1905లో చైర్మన్  అయ్యాడు .అతడు చనిపోయేనాటికి అతని ఆస్తివిలువ 5మిలియన్ పౌండ్స్ గా ఉంది.

  ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర.8వ భాగం.5.1.23.

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర.8వ భాగం.5.1.23.

Posted in రచనలు | Leave a comment

వారణాసి వారి వాల్మీకి రామాయణ రహస్యాలు. 2వ భాగం.5.1.23.

వారణాసి వారి వాల్మీకి రామాయణ రహస్యాలు. 2వ భాగం.5.1.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -5 5-జాన్ హార్వీ కెల్లాగ్ 

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -5

5-జాన్ హార్వీ కెల్లాగ్ 

అమెరికాలోని’’ బాటిల్ క్రీక్ శాని టోరియం ‘’ప్రపంచ ప్రఖ్యాతమైనది దీన్ని స్థాపించిన వాడే జాన్ హార్వీ కెల్లాగ్  .దాని నిర్వహణ సమర్ధుడూ ఆయనే .లోకం లో ప్రఖ్యాత డాక్టర్ లలో కెల్లాగ్ ఒకడు .సుమారు  వెయ్యేళ్ళ క్రితం ఐరోపాలోని నార్మండీ నుంచి దండయాత్రగా ఇంగ్లాండ్  పైకి వచ్చి,జయించి,ప్రభుత్వం స్థాపించిన  విలియం  తో పాటు ఇంగ్లాండ్ కు వచ్చిన కుటుంబాలలో కెల్లాగ్ కుటుంబం కూడా ఒకటి .విలియంతో పాటు వచ్చిన కెల్లాగ్గ్ వంశస్తుడు జాన్ కెల్లాగ్ .ఈ వంశం తర్వాత అమెరికాకు వలస వెళ్ళింది .ఈ వంశం వాడే మన జాన్ హార్వీ కెల్లాగ్.యితడు డాక్టర్ లోనే కాదు ధన సంపాదనలోనూ ప్రపంచంలో ప్రసిద్ధి చెందాడు .హార్లిక్స్ మెల్లిన్స్ మొదలైన పదార్ధాల తయారీ దారుడు కూడా ఇతడే .అతడిలో వైద్యాంశ కంటే వ్యాపారా౦శ ఎక్కువ .గొప్పవిద్యా ప్రదాత కూడా .

  స్వతహాగా తెలివి తేటలు పుష్కలంగా ఉండటం స్వయంగా నిర్ణయాలు తీసుకొనే సామర్ధ్యం ఉండటం వలన అతడు ఎవరినీ సలహాలు అడిగే వాడు కాదు .ఇతని తలిదండ్రులు వ్యవసాయం పై జీవించే వారు .వాళ్ళకున్న కొద్దిపాటి  వ్యవసాయ క్షేత్రం రాళ్ళు రప్పలతో ఉండేది ఇక్కడే జాన్ పుట్టాడు .14ఏళ్ళ వయసులో తన కాళ్ళ మీద తానూ నిలబడాలని ,అక్కడి బడిలో మేస్టరుగా చేరాడు .పుస్తకాలు చదవటం పై అభిలాష ఎక్కువ .రోమన్ వేదాంతి సెనేకా రచనలు అంటే మహా ఇష్టం.ఆయన చెప్పిన ‘’సత్యా న్వేషణ చేయి – సత్కార్యాలు చేయి  ‘’అనే సూక్తి బాగా నచ్చి ,ఆమార్గంలోనే ప్రయాణించాడు .

  14 ఏళ్ళ వయసులో ఏఅనుభవమూ లేని జాన్ ,ఒక చిన్న పాత కొంపలో పది మంది పిల్లల్ని పోగేసి  వాళ్లకు అక్షరజ్ఞానం కల్పించాడు .బలహీనుడు క్షయరోగి కూడా .బతికి బట్ట కడతాడనిని తలిదండ్రులు కూడా నమ్మ లేదు .కానీ సేనేకా సిద్ధాంతం అతనికి ప్రేరణగా నిలిచి ముందు తన ఆరోగ్యం బాగు చేసుకోవాలని ,ఒక మెడికల్ కాలేజి లో  చేరాడు .అనుకొన్న గడువులో డాక్టరీ చదువు పూర్తీ చేసి డాక్టర్ అయ్యాడు .తన క్షయరోగాన్ని  ఆరు బయట పడుకొని నిద్ర పోవటం వలన పూర్తిగా కుదుర్చుకో గలిగాడు .సన్ లైట్ సబ్బు దిగ్గజం’’ లీవర్ హ్యూమ్’’ లాగానే డాక్టర్ జాన్ హార్వీ కెల్లాగ్ కూడా యాభై ఏళ్ళు ఆరుబయటనే నిద్రపోయేవాడు. అదే అతని ఆరోగ్య రహస్యం .ఆరు బయట అంటే చంద్ర కిరణాలు నక్షత్రకాంతులు శరీరం పై పడే బంగన బయలు లోనే నిద్రపోయేవాడు .ఉదయం లేచి చూసేసరికి పక్క అంతా మంచుతో తడిసి ముద్దయి కనిపించేది.

  యాభై ఏళ్ళు ఆరుబయట పడుకోటమేకాదు , యాభై ఏళ్ళు మాంసం కూడా తినలేదు జాన్ .పప్పు దినుసులు  ,పండ్లు మాత్రమె అతని ఆహారం .వీటిని రోజుకు రెండు సార్లు తినే వాడు .ఏరోగానికైనా కారణం పెద్ద ప్రేగులలో క్రిములు చేరటమే అని తెలుసుకొన్నాడు .మాంసాహారం వలన బాక్టీరియా ఎక్కువ చేరుతుందని గ్రహించాడు .కనుక సప్ప్లి మెంటరి ఫుడ్ కోసంప్రయోగాలు చేసి హార్లిక్స్ ,మెల్లిన్స్ తయారు చేశాడు .వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి విశేషంగా డబ్బు సంపాదించాడు .ఆడబ్బును సార్ధకం చేయదలచి ‘’బాటిల్ క్రీక్ శాని టోరియం ‘’అ౦టేఆరొగ్య దేవాలయం కట్టించాడు .1500మంది డాక్టర్లు అంతే సంఖ్యలో నర్సులు పని చేస్తున్న ఆ వైద్య దేవాల౦  అన్ని హ౦గులుకలిగి ఉంటుంది అంటే ఎంత పెద్దదో మనమే ఊహించుకోవాలి .1940లో ఆ హాస్పిటల్ లో ఒక లక్షా నలభై వేలమంది రోగులు రోగాలనుంచి విముక్తులయ్యారు .ఇప్పుడున్న కార్పోరేట్ ఆస్పత్రులు లాగా డబ్బే ప్రధానం గా నడిపే హాస్పిటల్ కాదు అది .దాని నిర్వహణకు కావాల్సిన డబ్బు అంతా దానివలననే వచ్చేట్లుగా గొప్ప నిర్వహణ సామర్ధ్యంతో నడిపాడు డాక్టర్ జాన్ కెల్లాగ్ .అంటే రోగులనుంచి బలవంతంగా డబ్బు కట్టిస్తారనికాదు.ఎందరికో రోజూ ఉచితంగా చికిత్స చేస్తారు .40మంది అనాధ పిల్లలను చేరదీసి వారికి వసతి భోజనం సమకూర్చి విద్యా వంతులను చేశాడు .

  జాన్ హార్వీ కెల్లాగ్ 26-2-1852లో పుట్టి 14-12-1943న మరణించాడు .ఆయనను అమెరికన్ డాక్టర్ ,ఇన్వెంటర్ ,బిజినెస్ మాన్ గా ప్రసిద్ధుడు .మిచిగన్ రాష్ట్రం లోని బాటిల్ క్రీక్ లో ఉన్న బాటిల్ క్రీక్ శాని టోరియం కు ఆయన డైరెక్టర్ .లిబరల్ ధియాలజి అతడి ఆదర్శం .సైన్స్ కు బైబిల్ కు మధ్య చక్కని హార్మని సాధించాడు. The heart is a muscle. The heart beats. My arm will contract and cause the fist to beat; but it beats only when my will commands. But here is a muscle in the body that beats when I am asleep. It beats when my will is inactive and I am utterly unconscious. It keeps on beating all the time. What will is it that causes this heart to beat? The heart can not beat once without a command. To me it is a most wonderful thing that a man’s heart goes on beating. It does not beat by means of my will; for I can not stop the heart’s beating, or make it beat faster or slower by commanding it by my will. But there is a will that controls the heart. It is the divine will that causes it to beat, and in the beating of that heart that you can feel, as you put your hand upon the breast, or as you put your finger against the pulse, an evidence of the divine presence that we have within us, that God is within, that there is an intelligence, a power, a will within, that is commanding the functions of our bodies and controlling them…

అంటాడు కెల్లాగ్ .’’ది లివింగ్ టెంపుల్ ‘’అనే పుస్తకం రాశాడు .అందులో There is a clear, complete, satisfactory explanation of the most subtle, the most marvelous phenomena of nature, – namely, an infinite Intelligence working out its purposes. God is the explanation of nature, – not a God outside of nature, but in nature, manifesting himself through and in all the objects, movements, and varied phenomena of the universe. … The tree does not create itself; a creative power is constantly going forward in it. Buds and leaves come forth from within the tree … So there is present in the tree a power which creates and maintains it, a tree-maker in the tree, a flower-maker in the flower, – a divine architect who understands every law of proportion, an infinite artist who possesses a limitless power of expression in color and form; there is, in all the world about us, an infinite, divine, though invisible Presence, to which the unenlightened may be blind, but which is ever declaring itself by its ceaseless, beneficent activity.[

 అని రాశాడు .

  ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం తేలికగా చప్పరించి తినగలిగే అరిగే పదార్ధాలు వాడాడు.వీటిని గోధుమ కారన్ లతో  తయారు చేసి సీరియల్ అని పేరు పెట్టాడు .అతడి కారన్ ఫ్లేక్స్ ,హార్లిక్స్  విశ్వ వ్యాప్తమైనాయి.అంతేకాదు ‘’పీనట్ బట్టర్ ‘’కూడా తయారు చేశాడు .రెండురకాల పీనట్ బట్టర్ కు పేటెంట్లు పొందాడు .మాంసానికి బదులుగా ‘’నట్టోస్’’ తయారు చేసి వాడాడు. దీనికి పేటెంట్ తీసుకోలేదు .విత్తనాలు సోయాబీన్స్ లను చక్కగాఉపయొగిన్చి ఆరోగ్యం  పెంచుకోవచ్చని చెప్పాడు .అతడు పేటెంట్ పొందిన వాటిలో –రేడియంట్ హీట్ బాత్ ,మువ్ మెంట్ క్యూర్ ఆపరేటస్ ,ఎక్సేర్ సైజింగ్ ఆపరేటస్, మాసేజ్ ఆపరేటస్ ఉన్నాయి .తన హాస్పిటల్స్ లో ఎలెక్ట్రో ధేరపి హైడ్రో ధేరపి ,మోటార్ ధేరపి లను చికిత్సావిధనాలుగా  ఉపయోగించాడు .జాన్ గైనకాలజికల్ సర్జరీలో ప్రసిద్ధుడు .ఫోటో ధేరప్యూటికల్ ఇన్వెన్షన్స్ కూడా చేసిన ఘనవైద్యుడు .

  ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-1-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర.7వ భాగం.4.1.22

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర.7వ భాగం.4.1.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వాల్మీకి రామాయణ రహస్యాలు. 1వ.భాగం.4.1.23

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వాల్మీకి రామాయణ రహస్యాలు. 1వ.భాగం.4.1.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -4 4-హైబ్రిడ్ పితామహ -లూధర్ బర్ బ్యాంక్

అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -4

4-హైబ్రిడ్ పితామహ -లూధర్ బర్ బ్యాంక్

గింజలు లేని గంగరేగి పళ్ళు  ,,ముళ్ళు లేని బొమ్మ జెముడు మొక్కలు(కాక్టస్) ,చప్పని పండ్ల చెట్లకు తియ్యని ఫలాలు,వాసనలేని పుష్పజాతులనుంచి సుగంధ పుష్పాలు ,సహజ రంగులు మార్చి కొత్త రంగులపూలుగా పెంచి ,ఇలాకనిపెట్టిన 7రకాల మొక్కలను ఒకే సారి 1200 పౌండ్లకు అమ్మిన మేధావి లూధర్ బర్ బ్యాంక్ .మొక్కల మంత్రగాడు గా పేరుపొందాడు .మొక్కలలో ,కూరగాయలలో ,పండ్లలో కొత్తరకాలు సృష్టించిన అపర బ్రహ్మ బర్ బ్యాంక్ .’’భలే భలే అందాలు సృష్టించావు ‘’అని భక్త తుకారాం భగవంతుని కీర్తిస్తాడు .ఇప్పుడు ఆ పాట తో  మనం బర్ బ్యాంక్  ని కీర్తించాలి .అమెరికాలోని కాలిఫోర్నియాలో దీక్షగా 40ఏళ్ళు తన పరిశోధన సాగించిన  బర్ బ్యాంక్ అదే తోటలో మరణించగా అక్కడే ఖననం చేశారు .అతడు ఎప్పుడూ తోటదాటి బయటి ప్రదేశానికి వెళ్ళినవాడు కాదు .కాని అతని పేరు ప్రపంచం అంతా మారు మోగింది .77ఏళ్ళ వయసులో నవ యువకుడిగా చలాకీ గా ఉండేవాడు .జీవితమంతా ఆనంద,ఉత్సాహాలతో గడిపాడు .నిర్మాణాత్మక దృష్టిగల చి౦తనాపరుడు .అతడి జీవితం తో ప్రపంచం అనేక రకాలుగా సుసంపన్నం అయింది .మొక్కలు పెరిగే ప్రదేశం వాతావరణం మార్చితే ,మొక్కలుకూడా మనకు కావాల్సిన ఫలితాలు ఇస్తాయని రుజువు చేశాడు .

    బర్ బ్యాంక్ సిద్ధాంతమంతా డార్విన్ సిద్ధాంతానికి అనుసంధింపబడింది .డార్విన్ ను మహా తత్వ వేత్తగా భావించాడు .ప్రపంచాన్ని సరైన దారిలో పెట్టిన వాడు డార్విన్ అని నమ్మాడు .మొక్కలు చాలాఆలస్యంగా పెరుతాయి అని గ్రహించి వాటికి చురుకుదనం కల్పించాడు బర్ బ్యాంక్ .ఒకసారి ఆయనకు 20వేల ఆపిల్ చెట్లను 9నెలలలో  బట్వాడా చేయటానికి ఆర్డర్ వచ్చింది .చక్కగా ఆలోచించి అనుకొన్న సమయానికిసప్లై చేసి పేరుపొందాడు .అందులో అతడు పాటించిన సిద్ధాంతం –‘’పెంచి ఎంచటం ,ఎంచి పెంచటం’’ .మొదట్లో 10వేల కొమ్మలు కాని గి౦జలు కాని నాటుతాడు.క్రమంగా వాటి పెరుగుదల పరీక్షిస్తాడు .వాటిలో బాగా ఏపుగా  పెరిగిన వాటిని గుర్తించి వాటికి సన్నని గుడ్డ పెలిక కడతాడు .అవి సుమారుగా 30 దాటి ఉండవు .ఎంపికచేసిన మొక్కల్ని ఉంచి ,మిగిలిన వాటిని నాశనం చేస్తాడు .తానూ ఎంచిన మొక్కల కొమ్మల్నికాని గిన్జల్నికాని మళ్ళీ నాటి వాటిలో నుంచి మంచి వాటినిఎంచి ,మిగిలినవి తీసి పారేస్తాడు .కావాల్సిన సంఖ్యకు ఈప్రశస్తమైన మొక్కలు లభ్యం అయ్యేవరకు ఇలా చేస్తూనే ఉంటాడు .ఏపుగా పెరిగిన మూడు నాలుగు మొక్కల్ని ఎంచుకోవటం ,మేలైన మొక్కల్నుంచి మాత్రమె విత్తనాలు సేకరించటం ,మిగిలినవాటిని తీసెయ్యటం అతడు చేసేపని .దీనినే ప్రయోజనకరమైన ఫలకరణమైన విధానం అన్నాడు   బర్ బ్యాంక్ .

  పెంచి ఎంచటం ఎంచి పెంచటం అనేది తోటలకే కాదు ఫాక్ట రీలకు, దుకాణాలకు కూడా వర్తిస్తుంది అని చెప్పాడు .పనికి సమర్ధులైన పని వాళ్ళను పెట్టుకోవటమే నాణ్యమైన ఉత్పత్తికి పునాది .మారే శక్తి మొక్కలకు ఉంది అని మొదట గుర్తించిన వాడు బర్ బ్యాంక్ .అనువుగా అనుకొన్న విధంగా మొక్కలు పెరగటానికి చక్కని అవకాశం కల్పించి ప్రయోజనం సాధించాడు .మామూలు బటాణీ గిన్జలకంటే చిన్న సైజువి,తియ్యగా ఉండేవి అయిన బటాణీ తీగలను ఎనిమిదేళ్ళ లో  తయారు చేయటానికి ఒక సారి అతడికి ఆర్డర్ వచ్చింది .మూడేళ్ళలోనే దాన్ని సాధించి సప్లై చేశాడు . అవే  ఇప్పుడు ‘’బర్ బ్యాంక్ ఎప్సన్ పీ ‘’అనే పేరుతొ ప్రపంచ మంతా పాకాయి గొప్ప ఫలితాలిచ్చాయి .వీటిని హాయిగా డబ్బాలలో పెంచేస్తున్నారు .

  అలాగే ‘’నెక్టారిన్ ‘’ అనే పండును తన విశేష కృషితో మధురాతి మధుర పండుగా మార్చాడు .దీనికోసం 12ఏళ్ళు శ్రమించాడు .1200పౌండ్లకు అమ్మాడు .ఈపండుపెద్దదిగా ఎక్కువ రసం కలదిగా మహా మంచితీపిగా ,సువాసనా భరితంగా ఉంటుంది .జపాన్ దేశం లో పట్టు పరిశ్రమ దారుల కోరికమేరకు ఒక కొత్త మల్బరీ మొక్క తయారు చేశాడు .మామూలు చెట్టుకంటే దీనికి ఆకులు రెట్టింపు ఆకులు ఉంటాయి .ఈ మల్బరీ ఆకులనే ఇష్టంగా తిని పట్టు పురుగులు పెరుగుతాయి .అవి బాగా పెరిగి గూళ్ళు పెట్టేసమయం లో వాటినిఉపయొగిఛి  పట్టు దారం తీస్తారు .గింజలు లేని అంటే సీడ్ లెస్ ఆపిల్స్ కూడా సృష్టించాడు .ఆపిల్స్ పై 25వేల పరిశోధనలు చేసి లూదర్ బర్ బ్యాంక్  ప్రసిద్ధి చెందాడు .

  అతడు చేసిన వాటిలో అతి కష్టమైనా పని ముళ్ళు లేని బొమ్మ జెముడు(కాక్టస్ ) మొక్కలు తయారు చేయటం .బొమ్మ జెముడు పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది దాని ముళ్ళు జంతువులకు ఇబ్బందిగా ఉంటాయి .600 ల బొమ్మ జెముడు జాతులు నాటాడు .16ఏళ్ళు వాటిపై సుదీర్ఘంగా పరిశోధనలు చేశాడు .చివరకు అతని తపస్సు ఫలించి ముళ్ళులేని బొమ్మ జెముడు మొక్కలను తయారు చేసి సృష్టికి ప్రతి సృష్టి అంటే విశ్వామిత్ర సృష్టి చేశాడు  .బొమ్మ జెముడు మొండిది .ఎక్కడ వేసినా పెరుగుతుంది .చావదు .ఒక సారి అతడు యాదాలాపం గా బొమ్మ జెముడు మట్టను ఒకదాన్ని ‘’బర్ లాప్’’తో కప్పబడిన బీరువా పై పడేశాడు .అది కొద్దికాలం లోనే ఆ బర్ లాక్ గుండా ,గోడపోడవునా నేలకు పాకి ఆశ్చర్యం కలిగించింది .

  రుచి లేని పండ్లను తీయని ఫలాలు ఇచ్చేవాటిగా ,వాసన లేని పూలను సువాసనలు ఇచ్చేవానిగా మార్చిన ప్రతిభ బర్ బ్యాంక్ సైంటిస్ట్ ది..అతడి మొక్కల తోట ఇంద్రజాల శాల అని పిస్తుంది .ప్రతి కొత్తరకం మొక్కను అతడు 1200పౌండ్లకు పైనే అమ్మేవాడు .అతడు మరో పదేళ్ళు బతికి ఉంటె మానవ జాతిలో అన్ని మంచి లక్షణాలుకల కొత్తరకం మానవులను తాయారు చేసి ఉ౦డేవాదుఅని అందరూ నమ్ముతారు .దీనినే యుజేనిక్స్ అంటారు .

  ఫాదర్ బర్ బ్యాంక్ 7-3-1849లో పుట్టి 11-4-1926న 77ఏళ్ళ వయసులో చనిపోయాడు .అమెరికన్ బోటానిస్ట్ ,హార్టి కల్చరిస్ట్  గా పేరు పొందాడు .అమెరికాలోని మాసా చూసేట్స్ లో .ఓ తండ్రికి ఉన్న 15మంది సంతానంలో 13వ వాడుగా పుట్టాడు .18ఏట తండ్రి చనిపోతే ,తనవంతు వచ్చిన డబ్బుతో లూసేన్ బర్గ్ సెంటర్ లో 17ఎకరాల ప్లాట్ లాండ్ కొన్నాడు .అక్కడే మొదటిసారిగా బర్ బ్యాంక్ పొటాటో’’ను పెంచి రాత్రిళ్ళు ఒక్కోటి 15౦ డాలర్లకు అమ్మేవాడు.తర్వాత దీన్ని రస్సెల్ బర్ బ్యాంక్ పొటాటో గా అమెరికా అంతటా పండించారు .తర్వాత 4ఎకరాలపొలం కొని నర్సరీ ని ప్రయోగాత్మక పరిశోధనలను చేశాడు .1893లో ‘’న్యు క్రియేషన్స్ ఇన్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ‘’తో గొప్ప పేరు పొందాడు .డేలిషియస్ ఆపిల్ అంటే మధురమైన ఆపిల్ సృష్టికర్త అయ్యాడు .దీన్ని’’ ఫైనేస్ట్ ఆపిల్ వెరైటీ ఇన్ ది వరల్డ్ ‘’గా భావిస్తారు .ఇదే రకం హిమాచల్ ప్రదేశ్ చేరి ఆపిల్ తోటలకు మార్గదర్శనం చేసింది .నర్సరిలో కంటే ‘’హైబ్రిడ్ ఉత్పత్తులలో బుర్రపెడితే నీఖ్యాతి విశ్వ వ్యాపితం అవుతుంది  అని ఒక మిత్రుడు సలహా ఇస్తేదానిపై  దృష్టిపెట్టాడు .తర్వాత ధామస్ ఎడిసన్ తో కలిసి అతడి పరిశోధనలకు సాయపడ్డాడు ‘’లూధర్ బర్ బాంక్ సొసైటీ ‘’స్థాపించాడు .

బర్ బ్యాంక్ సాధించిన విజాలు -113రకాల ప్లమ్స్ అండ్ ప్రూన్స్ ,66 నట్స్,35 ఫ్రూటింగ్ కాక్టస్ ,16 రకాల బ్లాక్ బెర్రీస్ ,13రకాల రాస్ బెర్రీస్ ,11రకాల క్విన్సేస్ ,11రకాల ప్లం కాట్స్ ,10రకాల చెర్రీలు ,10రకాల ష్ట్రాబెర్రీస్ ,10రకాల ఆపిల్స్ ,8రకాల పీచేస్ ,6రకాల చెస్ట్ నట్స్ ,4రకాల గ్రేప్స్ ,4రకాల పియర్స్ ,3రకాల వాల్ నట్స్ ,2రకాల ఫిగ్స్ ,ఒక ఆల్మండ్ ,9రకాల గ్రాస్ ,26రకాల కూరగాయలు ,91రకాల ఆర్నమెంటల్స్. అనేక పుస్తకాలు కూడా రాశాడు తన చేసిన రిసెర్చ్ పైన .- We are more crossed than any other nation in the history of the world, and here we meet the same results that are always seen in a much-crossed race of plants: all the worst as well as all the best qualities of each are brought out in their fullest intensities. When all the necessary crossing has been done, then comes the elimination, the work of refining, until we shall get an ultimate product that should be the finest race ever.[19]

— Luther Burbank, The Training of the Human Plant, 1907, page 11.

అని రాశాడు .అమెరికన్ యూజేనిక్స్ కు మార్గదర్శనం చేశాడు బర్ బ్యాంక్

 Heredity is simply the sum of all the effects of all the environments of all past generations on the responsive, ever-moving life forces. There is no doubt that if a child with a vicious temper be placed in an environment of peace and quiet the temper will change. Put a boy born of gentle white parents among Indians and he will grow up like an Indian. Let the child born of criminal parents have a setting of morality, integrity, and love, and the chances are that he will not grow into a criminal, but into an upright man. [19]

  ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి ఇంకో … మజిలీ .. ఉసుల గూడు (బ్లాగ్) పదివేల గువ్వలు (పోస్ట్). పదివేలు

సరసభారతి ఇంకో … మజిలీ .. ఉసుల గూడు (బ్లాగ్) పదివేల గువ్వలు (పోస్ట్). పదివేలు

పూర్తీ రివ్యూ …… త్వరలో….

Posted in రచనలు | Leave a comment

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర. 6వ భాగం.3.1.23.

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర. 6వ భాగం.3.1.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 65వ భాగం 03.01.2023

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 65వ భాగం 03.01.2023

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -33-ఫాయిల్ బ్రదర్స్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -3
3-ఫాయిల్ బ్రదర్స్
ఫయిల్ బ్రదర్స్ అనే పేరుతొ ఆ సోదరులు  సెకండ్ హాండ్ పుస్తకాలు అమ్మేవారు . వారి మెయిన్ ఆఫీస్ 34వేల చదరపు అడుగుల వైశాల్యం గల ఆరు అంతస్తుల బ్రహ్మాండమైన భవనం .అందులో 2లక్షల పుస్తకాలు పెట్టె చోటు ఉంది .విపిపై పుస్తకాలు పంపమని రోజుకు 2వేల ఉత్తరాలు వస్తాయి .ఈ సోదరులు లండన్ లో సివిల్ పరీక్ష రాసి తప్పారు  సుమారు అర్ధ శతాబ్దం క్రిందట .కొద్దిగా నిరుత్సాహపడ్డారు విలియం ఫాయిల్ ,గిల్బర్ట్ ఫాయిల్ బ్రదర్స్ .తండ్రికి టోకు సరుకుల దుకాణం ఉంది .తమవద్ద ఉన్న సెకండ్ హాండ్ పుస్తకాలే తమకు జీవనోపాధి కలిగిస్తాయని భావించి వాటి అమ్మకం పై శ్రద్ధ పెట్టారు .
  ఒక చిన్న ప్రకటన తయారు చేసి 1903లో ఒక ఎడ్యుకేషనల్  మాగజైన్ కు ఇచ్చారు .అప్రకటన వారికి గొప్ప వారమే అయింది కానీ ఆ పత్రిక పేరు ఇప్పుడు ఎవరికీ తెలియదు .ఆ ప్రకటనలో ఈ బ్రదర్స్ రాసిన వాక్యాలు అందరినీ ఆకర్షించాయి .విపరీతంగా సెకండ్ బుక్స్ అమ్మకం జోరుగాసాగింది .వాళ్ళ దగ్గర ఆ నాడు ఉన్న పుస్తకాలకు మూడు రెట్ల ఆర్డర్స్ వచ్చాయి వాళ్ళు కూడా ఇంత సక్సెస్ అవుతుందని ఊహించ లేదు .మారు బేరం లో సెకండ్ హాండ్ బుక్స్ కొని ఎందుకు అమ్మరాదు ?అనే ఆలోచన వచ్చింది ఆబ్రదర్స్ కు .దానికోసం ప్రకటనల మీదప్రకటనలు గుప్పించారు .పెద్ద మార్కెట్ ఏర్పడింది .చాలా జాగ్రత్తగా నిర్వహణ చేశారు .
  మొదట వాళ్ళ ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించారు .కొన్న సెకండ్ హాండ్ పుస్తకాలు కూడా ఆ ఇంట్లోనే నిల్వ చేసేవారు .వ్యాపారం దిన దినాభి వృద్ధి చెందుతోంది ఇల్లు ఇరుకైపోయింది .అందుకని వ్యాపారానికి పెక్ హ్యాం అనే చోట ఒక షాపు అద్దె కు తీసుకొన్నారు .పుస్తకాలు కొనటం అమ్మటం అంతా పోస్ట్ ద్వారాజరిపెవారు .కారణం అప్పటికి ఈ సోదరులకు వయసు మైనారిటి దాటలేదు .అందుకని కాంట్రాక్ట్ చేయటానికి వయసు చాలదు కనుక పోస్టాఫీస్ మాత్రమె తేలిక ..ఉన్న షాప్ కు ప్రక్కన ఇంకో గది అద్దెకు తీసుకొన్నారు .అందులోనే ఈ బ్రదర్స్ ఉండేవారు .షాపు వెనక తమ వంట తామే చేసుకొనేవారు .పని చేయటం లో వాళ్లకు పగలు రాత్రీతెదాలేదు ఆదివారం సెలవూ తీసుకోకుండా పని చేశారు .ఇలా ఒక ఏడాది గడిచింది .
  తర్వాత వ్యాపారాన్ని బాగా పెంచాలని ఫాయిల్ బ్రదర్స్కు ఆలోచన వచ్చింది
లండన్ లో చారింగ్ క్రాస్ రోడ్ దగ్గర ఒక పెద్ద దుకాణం ను ఏడాదికి 60పౌన్లుకు  అద్దెకు తీసుకొన్నారు  .మునిసిపల్ పన్నులు వీళ్ళే కట్టుకోవాలి .ఆ షాప్ లో పని చేస్తున్న ఒక అసిస్టెంట్ వీళ్ళకు తెలీకుండా 7 పౌన్లు నాకేసి పారిపోయాడు .కొట్టాసిస్తేంట్ ను పెట్టుకొన్నారు అతడు చాలాసమర్ధంగా విశ్వాసంగా పని చేసి వ్యాపారాభివృద్ధికి గొప్ప సాయం చేశాడు .ఫాయిల్ బ్రదర్స్ కు ప్రపంచమంతా కాతాదారులు ఏర్పడ్డారు .పుస్తకాలకోసం రోజుకు కనీసం 2నుంచి 5వేల వరకు ఆర్డర్లు వచ్చేవి .విజ్ఞాన సముపార్జనకు ఈ సెకండ్ హాండ్ పుస్తకాలు ఎంతగానో దోహదం చేసేవి .ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ .1910నాటికి లండన్ లో నాలుగు చోట్ల సబర్బన్ బ్రాంచీలు ఏర్పాటు చేశారు .ప్రతిపుస్తకం మీద పర్మనెంట్ లేబుల్ అడ్వర్టైజ్ మెంట్ ముద్రించేవారు .సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో చర్చి స్ట్రీట్ లో ఒక బ్రాంచ్ నెలకొల్పారు .
1949నాటికి ఫాయిల్ బ్రదర్స్ అద్దె షాపులను వదిలేసి స్వంత భావన నిర్మాణం ప్రారంభించి అందులోనే వ్యాపారం చేయటం మొదలు పెట్టారు .ఆరు అంతస్తుల భవనం కట్టారు .బిల్డింగ్ 30 వేల స్క్వేర్ ఫీట్ వైశాల్యం .ఒకే సారి 20లక్షల పుస్తకాలు పెట్టటానికి వీలుగా ఉండేది .పుస్తక ప్రదర్శనకు విశాలమైన గదులు ఏర్పాటు చేశారు .ప్రఖ్యాత గ్రంధ కర్తలను పిలిపించి వారితో ప్రేరణాత్మక ప్రసంగాలు చేయించటానికి అన్ని వసతులతో పెద్ద హాలు ఏర్పాటు చేశారు .మొదటి 80ఏళ్ళలో వెయ్యిమంది రచయితలూ ,5లక్షలమంది గెస్ట్ లు  ఈ సమావేశాలలో పాల్గొన్నారు .రెండవ ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రైం మినిస్టర్లు ,డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ ,చార్లెస్ డిగాల్లె ,ఇధియోపియా చక్రవర్తి మొదలైన ప్రముఖులు సందర్శించారు .
  కంపెనీ దిగ్విజయంగా 25 ఏళ్ళు నడిచిన సందర్భంగా పెద్ద ఎత్తున ఫాయిల్ బ్రదర్స్ రజతోత్సవం జరిపారు .ఈ షాప్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు చేసుకొన్నది . సెకండ్ హాండ్ బుక్ అమ్మకం లో రికార్ద్సాధించి కుబెరులైనవారు ఫాయిల్ బ్రదర్స్ .ఫాయిల్ బ్రదర్స్ వారసురాలు క్రిస్టియానా కూడా చాలా అభి వృద్ధి చేసింది .
మన దేశం లో మద్రాస్ లో సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర ‘’మూర్ మార్కెట్ ‘’లో సెకండ్ హాండ్ బుక్స్ బాగా దొరికేవి .తర్వాత అగ్నిప్రమాదానికి గురై పారిస్ ప్రాంతానికి మార్చారు .బెజవాడలో అలంకార్ టాకీస్ దగ్గర ,కారల్ మార్క్స్ రోడ్డుమీద సెకండ్ హాండ్ బుక్ షాప్ లు తామర తంపరగా ఉన్నాయి. అక్కడ దొరకని పుస్తకం ఉండదు .
  సశేషం
ముక్కోటి ఏకాదశి  శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం

శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం

 సరసభారతి 169వ కార్యక్రమ౦గా 12-1-2023 పుష్యబహుళ పంచమి గురు వారం సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 175 వ ఆరాధనోత్సవం నిర్వహింప బడును .సంగీత సాహిత్యాభిమానులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

 కార్యక్రమం

12-1-22 –గురు వారం సాయంత్రం -6గం .లకు త్యాగరాజస్వామి పటానికి అష్టోత్తర పూజ

సాయంత్రం 6-30 కు డా .టేకుమళ్ళ వెంకటప్పయ్య-నెల్లూరు  గారిచే –‘’త్యాగరాజు గారి ‘’రామ భక్తి సామ్రాజ్యం ‘’ –ప్రసంగం .

సాయంత్రం 7 గం .లకు –త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు గానం

పాల్గొను వారు –1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరస భారతి గౌరవాధ్యక్షులు

                 2-శ్రీమతి టేకుమళ్ళ చిదంబరి –ప్రముఖ సంగీత విద్వా౦సు రాలు ,ఎ గ్రేడ్ రేడియో, టివి ఆర్టిస్ట్-నెల్లూరు

3-శ్రీ రొయ్యూరు సురేష్ –సంగీత విద్వాంసులు, వ్యాఖ్యాత –విజయవాడ

4-శ్రీమతి గూడ మాధవి –సంగీత౦ టీచర్ –ఉయ్యూరు

5- శ్రీమతి పి.పద్మజ –ఔత్సాహికగాయని –ఉయ్యూరు

6-శ్రీమతి సీతంరాజు మల్లిక –ఔత్సాహిక గాయని –ఉయ్యూరు

7-కుమారి నాగ వెంకట అమృత వర్షిణి –వర్ధమాన గాయని-ఉయ్యూరు

8-శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి –కార్యదర్శి 

మొదలైనవారు

  సంక్రాంతి శుభా కాంక్షలతో

 గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -2-1-2023

image.png


Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర. 5వ భాగం.2.1.23.

దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర. 5వ భాగం.2.1.23.

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 64వ భాగం 02.01.2023

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 64వ భాగం 02.01.2023

Posted in రచనలు | Leave a comment

శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వారదర్శనం 02.01.2023

https://www.youtube.com/post/UgkxWiEqQtaxejt1nDIgdLNu6mQd0C3iDCoq

https://www.youtube.com/post/UgkxTjFC_1NYO4FZkuyGQ7Lakerl-bPeuBbC

Posted in సమయం - సందర్భం | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -2 ఫ్రాంక్ హెచ్ .డేవిడ్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -2

2-ఫ్రాంక్ హెచ్ .డేవిడ్

అలనాటిఎల్. ఐ .సి .కుబేరుడు ఫ్రాంక్ హెచ్ .డేవిడ్ .8 వేలమంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్  పై మేనేజర్,కంపెనీ ఉపాధ్యక్షుడు .ఎలాంటి ఉద్యోగం సంపాదన లేని వాడు ఒకప్పుడు ఫ్రాంక్ .ముప్ఫై ఏళ్ళు వచ్చినా దేశందాటి ఎప్పుడూ బయటికి పోలేదు .అనేక చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు దేనిలోనూ మిలబడ లేదు .కూలీనుంచి కాన్వాసర్ దాకా అన్నీ వెలగబెట్టాడు .మనిషి ఆరడులవాడు. గుణాలు సామాన్యం .బట్ట తల పిల్లి కళ్ళు.అందరి కి ప్రేమపాత్రుడు .అప్పుడు హఠాత్తుగా జ్ఞానోదయం అయింది .తనకున్న వస్తు విక్రయ అభిలాష ,అందరు మనుషులపై గొప్ప శ్రద్ధ లనే పెట్టుబడి గా పెట్టి స్థిరపడాలని నిర్ణయించుకొన్నాడు .ఏ వ్యాపారం తనను తీర్చి దిద్దగలదు,తనను నమ్మినవారికి న్యాయం ఎలా కలిగించగలను  అని తీవ్రంగా ఆలోచించి చివరికి ‘’బీమా వ్యాపారం ‘’శ్రేష్టం అని భావించాడు .

  డేవిడ్ తండ్రి అకస్మాత్తుగా తుపాకీ ప్రమాదం లో చనిపోయాడు .తండ్రి 1500పౌన్లకు ఒక పాలసి తీసుకొన్నాడు .అదే ఆ కుటుంబాన్ని కాపాడింది .తండ్రికి ఆ పాలసీ ఇచ్చిన పుణ్యాత్ముడు తమకు జీవనోపాధి కల్పించాడని ధన్యవాదాలు చెప్పుకొన్నాడు మనసులో .వెంటనే ఇన్సూరెన్స్ కాన్వాసర్ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాడు .వెంటనే ఉద్యోగం వచ్చింది .అప్పటికి అతడికి దానిపైనా అసలు అవగాహనే లేదు .మూడు నెలలు దాటినా ఒక్కరికీ పాలసీ ఇప్పించలేక పోయాడు .నిరాశ పడక ఇన్సూరెన్స్ పుస్తకాలన్నీ దీక్షగా చదివాడు .పాలసీ తీసుకొనే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పి మెప్పించాలో తెలుసుకొన్నాడు .అప్పటికి ఆ కంపెనీలో 200౦మంది ఏజెంట్స్ ఉన్నారు .ఒక్క నెలలో ఎక్కువ మంది పాలసీ దార్లను చేర్పించిన వారికి బహుమతి ఇస్తామని కంపెని ప్రకటించింది .ఇదే అదనుగా పగలు రాత్రి కష్టపడ్డాడు .పూర్వపు రికార్డ్ బద్దలుకొట్టి అత్యధికంగా పాలసీ దార్లను ఒప్పించి చేర్పించి కంపెనీ ఇచ్చిన బహుమతి పొందాడు .ఇదే కాక కంపెని 200పౌన్ల బోనస్ కూడాఅతడికి ఇచ్చింది.క్రమ౦గా ఒక్కొక్కమేట్టూ ఎక్కుతూ బీమా ప్రపంచ సౌధాన్ని ఎక్కాడు .

  ఆ కంపెనీ కి రాజీనామా చేసి ,మరో పెద్ద కంపెనికి దరఖాస్తు పెట్టి ‘’ఏ ప్రదేశం కష్టంగా ఉంటుందో అక్కడ నాకు ఉద్యగం ఇచ్చిపూర్తీ స్వాతంత్రం ఇవ్వండి ‘’అని కోరాడు .పాలసీలను కట్టటానికి ఇష్టం చూపని చోట ఉద్యోగం లో చేరి తన సమర్ధత చూపాడు .అక్కడ ఒక్క ఏడాదిలో మూడు లక్షల నుంచి ఆరు లక్షల పౌన్లకు భీమా వ్యాపారం పెంచి కంపెనీ వారి దృష్టిలో పడ్డాడు .తర్వాత దాన్ని 10లక్షలకు పెంచాడు .ఇతని సమర్ధత గుర్తించి మరొక గడ్డు ప్రదేశానికి నియమిస్తే 12లక్షలనుంచి 60లక్షలకు అంటే అయిదు రెట్లు అయిదేళ్ళలో పెంచి రికార్డ్ సృష్టించాడు .అతని కార్యదక్షతకు ముచ్చటపడి మెయిన్ బ్రాంచ్ లో పని చేసే ఏర్పాటు చేసి ,కంపెనీ కి వైస్ ప్రెసిడెంట్ ను చేశారు .అంటే 8వేలమంది ఏజెంట్ లపై పెత్తనం .ఇదంతా కేవలం 9ఏళ్ళ స్వల్పకాలం లో సాధించాడు ఫ్రాంక్ డేవిడ్ .

  సమ్మోహం పరచే వాక్చాతుర్యం ,ఒప్పించగల నేర్పు అతని కి పెట్టు బడులయ్యాయి .అతనికి ,కంపెనీకి ధనం తోపాతు యశోధనం కూడా పెరిగింది .చేసే పనిపై మనసు పెట్టి విశ్వాసంతో పని చేస్తే విజయమే మన వెంటపడు తుంది అంటాడు .ఒక్కోసారి మొండిగా వాదించేవారికి మొండిగానే సమాధానాలు చెప్పి ఒప్పించేవాడు .సౌమ్యులకు సౌమ్యంగా సమాధానం చెప్పేవాడు .ఒకాయన ‘’నాభార్యకు పెద్ద ఇన్సూరెన్స్ చెక్కు నేను ఎందుకు ఇవ్వాలి ?నేను చస్తే ఆవిడ ఒక పనికి రాని వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా ‘’అంటే ఫ్రాంక్ ‘’  నీ భార్యకు తగినంత డబ్బు ఇస్తే వేరొక అప్రయోజకుడిని పెళ్ళాడే గతి ఆమెకు పట్టదు కదా ‘’అని చెప్పి ఒప్పించి పాలసీ ఇచ్చాడు .ఏజెంట్ లకు ఉత్సాహం ,దూర దృష్టి సాహసం ఉండాలని బోధిస్తాడు .ఏజెంట్లకు ఎక్కువ స్వాతంత్ర్యం ఇస్తే ,ఎక్కువ బాధ్యతా,ఉత్సాహం తో పని చేసి  ,కంపెనీకి పాలసీ దార్లకు ఎక్కువ మేలు చేయవచ్చు అనే సిద్ధాంతాన్ని  నమ్మి కోటికి పడగలెత్తిన ఇన్సూరెన్స్ కుబేరుడైనాడు ఫ్రాంక్ డేవిడ్ .

  సశేషం

  నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-1-2023-ఉయ్యూరు   .  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర.4వభాగం.1.1.2023

దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర.4వభాగం.1.1.2023

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 63వ భాగం 01.01.2023

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 63వ భాగం 01.01.2023

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

2023 శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో నూతన ఆంగ్ల సంవత్సరం నాడు లడ్డూలతో ప్రత్యేక పూజ

https://www.youtube.com/post/UgkxeBRe971N9yo34Iw5S8W7PqdI_-52JJ1L

https://www.youtube.com/post/UgkxDziF7yXv7PuAc1l1k26xz-MRTDY1Si6r

Posted in దేవాలయం | Leave a comment

అయిదవ ప్రపపంచ తెలుగు రచయితల మహా సభలు-2(చివరిభాగం )

అయిదవ ప్రపపంచ తెలుగు రచయితల మహా సభలు-2(చివరిభాగం )

తెలుగు భాష పరిరక్షణకోసం ప్రతి ఇంటి నుంచి ఉద్యమం రావాలి అని కోరారు వెంకయ్యనాయుడు. ప్రాధమిక విద్యలో తెలుగు ,పరిపాలనలో తెలుగు తప్పవు అన్నారు. ఉపాధ్యాయులు సాధించలేనిది ఎమీలేదన్నారు గరికపాటి సామాజికంగా భాషా పరంగా రావాల్సిన మార్పులు సూచించారు జస్టిస్ వెంకట రమణ .తెలుగు భాషను ఆధునిక మాధ్యమం లో ,నూతన ప్రక్రియలతో ముందుకు తీసుకు వెళ్ళటానికి ,భావితరాలకు తెనుగును నిత్యనూతనంగా తీర్చిదిద్ది అందించాలనే సంకల్పంతో అంతర్జాలం లో ‘’కోటి మాటలకోట ‘’గొప్ప ఉపకరణంగా తయారు చేస్తున్నామని కూచిభొట్ల ఆనంద్ చెప్పారు .ఇందులోని మాటలు ఏ ఒక్కరివోకావు అందరివీ అన్నారు .తెలుగు ఉనికిని కోల్పోవటం బాధాకరం గా ఉందని ఫ్రాన్స్ తెలుగు ఆచార్య డేనియల్ నిగార్స్ అన్నారు బుర్రకధలపై పరిశోధనలు చేశానని ,ఎప్పుడు ఎక్కడ ఇలాంటి సభలు జరుగుతున్నా  హాజరవుతున్నానని చెప్పారు .ప్రాధమిక విద్యనూ పరభాషలో నేర్పే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని వక్తలందరూ గర్హించారు .తెలుగు మనుగడ ఉపాధ్యాయులపై ఉందని ఉద్ఘాటించారు .తెలుగు మనుగడ కోసం ఇప్పటికీ పోరాడాల్సి రావటం చాలా బాధాకరం అన్నారు బుద్ధ ప్రసాద్ .తానా సాహిత్యవేదిక ‘’తెలుగు వెన్నెల ‘’పేరుతొ ప్రతినెలా ఆఖరి ఆదివారం అంతర్జాలం లో అనేక అంశాలపై నిర్వహిస్తున్నామని వేయి మందికి పైగా కవులు కళాకారులు సాహితీ వేత్తలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారని తోటకూర అన్నారు .స్కూళ్ళు పెట్టి తెలుగు పిల్లలకు తెలుగును దగ్గర చేస్తున్నామని చెప్పారు .బండి ఉష అమ్మకు అక్షర నైవేద్యం చేసినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ,జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ తనకు రావటం అదృష్టం అన్నారు .మరుగున పడిన సాహిత్యకారుల రచనలు ఇంకా ఎన్నో వెలుగు చూడలేదని వాటిని ముద్రించాలని కోరారు వీస్ ఆర్ ఎస్ సోమయాజులు .ఖర్గపూర్ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాళ్ళపల్లి సుందరరావు తమ సంస్థ 16రాష్ట్రాలలో తెలుగు భాషా పరిరక్షణ చేస్తోందని ,రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా ఉన్నాయని బాధ పడ్డారు .అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని అహమ్మదాబాద్ కు చెందిన పిఎపిసి ప్రసాద్ అన్నారు .సింగపూర్ లో రెండేళ్లలో 40కార్యక్రమాలు నిర్వహించామని 35దేశాలను కలుపుకొంటూ ఆన్ లైన్ లో కళాకారులను ఒక చోట చేరుస్తున్నామని సింగపూర్ సాంస్కృతిక కళా సారధి ఆర్గనైజింగ్ ప్రతినిధి మంగిపూడి రాధిక చెప్పారు .కందుకూరి స్ఫూర్తితో పత్రికా నిర్వహణ జరగాలని కవి సంధ్య అధ్యక్షులు శిఖామణి కోరారు .యువత నచ్చేలా మెచ్చేలా రచనలు చేయాలని రెంటాల జయదేవ్ అన్నారు .నాగబాల రాజన్న కవి పద్య కవితా పుస్తకాన్ని ఆ సాహిత్య వేదిక అధ్యక్షులు ఎం ప్రభాకర్ రామారావు వేదికపై ఆవిష్కరించారు .సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ‘’ప్రస్తుతం అమ్మభాష అంపశయ్య పై ఉంది ‘’అని ఆవేదన చెందారు .ఫ్రాన్స్ ఇటలిపోలాండ్ దేశాల తెలుగు ప్రతినిధులు తెలుగులొఅనర్గళ౦గా  పద్యాలు పాటలు పాడి ఆశ్చర్యపరచారు . దివ్యాంగు డైన  చిత్రకారుడు ‘’బ్నిం ‘’సభా వేదికపై ఉండటం అందరికి గొప్ప స్పూర్తి నిచ్చింది .లండన్ కు చెందిన జాక్ ఫ్రూట్ లాంటి  కుర్రాడు,మహేష్ బాబులాఉన్న వాడు  జాక్  ఘంట సాలపాటలను అలవోకగా పాడి అలరించి ప్రశంసలు పొందాడు .

  రచయితలే సమాజ నిదేశికులని సామాజిక రుగ్మతలపై సమైక్యంగా నినదిద్దామని ,యువత ఎందుకో ముందుకు రావటం లేదని సాహిత్యా౦శాలపై  లోతైన అధ్యయనం జరగాలని ,సినీనటులు స్టార్డం తో అనవసర ప్రచారం చేస్తున్నారని సమాజ బాధ్యత తీసుకోవటం లేదని కామోన్మాద కులోన్మాద మతోన్మాదాలు పెరిగాయని ఉక్కు పిడికిలి బిగించి ఎదిరించాలని ,సాహిత్య పరిధిలోకి రాని సంచార జాతుల అభ్యున్నతి ,వికాసం  కోసం రచనలు చేయాలని సాంఘిక లైంగిక ఆర్ధిక సమానత్వం కోసం రచనలు రావాలని ,మానవ సంబంధాలు వైవాహిక సంబంధాలు అత్యంత దారుణంగా పతనం చెందాయని వీటిని నిలబెట్టే రచనలూ రావాలని సాంకేతికంగా పిల్లల ఉత్పత్తి అనర్ధాలకు దారి తీస్తుందని ఆపే ప్రయత్నాలు జరగాలని ,విమర్శ ప్రగతికి మెట్టు అని ,సామాజికమార్పులతో కవిత్వం వెనకబడి పోతోందని మారే సమాజానికి అనుగుణంగా రచనలు చేయాలని ప్రముఖ రచయితలూ కవులు విమర్శకులు వివిధ వేదికలపై నినదించారు .

 గ్రామ చరిత్రలను తయారు చేయాలని మొవ్వ శ్రీనివాసరెడ్డి కోరగా ,వచనకవిత్వం లోఅవదానాలు రావాలనిసబ్బిని లక్ష్మీ నారాయణ కోరారు. రానికవిత్వాన్ని రుద్దకండి అని కవి ఎం విజే అంటే ,సైన్స్ ఫలాలు ప్రజలకు దక్కాలని కొండామోహన్ కోరారు .మోడీ కోరే ఒకే దేశం ఒకే భాష సిద్ధాంతం మంచిదికాదన్నారు కమ్యూనిస్ట్ నాయకుడు మధు .సాహిత్యం ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుంది అన్నారు జెడి లక్ష్మీనారాయణ .రాజకీయాలలోకి భాష వస్తే నలిగి పిప్పి అవుతుందని ఆంద్ర ప్రదేశ్ కు తెలుగు తప్పితే మరో అస్తిత్వం లేదు అని నొక్కి వక్కాణించారు మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఎబి వెంక టేశ్వరరావు .తెలుగు రచనలలో సృజనాత్మక తగ్గిపోయిందని ఆయన బాధ పడ్డారు .

 చివరగా ఇది వరకు చేసిన తీర్మానాలనే  మార్చి మళ్ళీ తీర్మానాలు చేశారు .

పదనిసలు -500రూపాయలు ప్రతినిధి రుసుము చెల్లించి స్వంతఖర్చులతో వచ్చి స్వయంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని రెండు రోజులు సాహిత్య పండగ లో పాల్గొన్నారు దాదాపు1500మంది .అందరికి జేజేలు ఉదయం రెండు రకాల టిఫిన్లు ,కాఫీ టీ,మధ్యాహ్నం రాత్రి కమ్మని భోజనాలు ,సాయంత్రం స్నాక్స్ తో సేద దీరారు హాయిగా .ముసలి వారే  ఎక్కువ. యువకుల విద్యార్దులజాడ తక్కువ .వారికి తగిన వేదికలు లేవు వారిఎనర్జిని ఉపయోగించుకోలేదు .నన్నయ లో ప్రారంభమైన ప్రారంభ సభ ఉపరాష్ట్రపతి, మాజీ సిజె ఉండటం వలన సైడ్ లో పెద్దగా చూపించేఎర్పాటు చేశారు. వాళ్ళు వెళ్ళాక అసలు సమాజానికి ప్రతినిధులకు ఆ గౌరవం దక్కలేదు .సాంకేతికంగా మనం ఎంత ఎదిగినా ఆ సంకేతికత్వాన్ని వేదికలపై ఉపయోగించు కోలేక పోయాం .

  చాలామంది శత జయంతి సంవత్సరం ఇది .అందులో ముఖ్యంగా ఘంటసాల కు వేదిక కల్పించకపోవటం అందరికి బాధ కలిగించింది. ఎన్ని సార్లు పిలుస్తారు సంగీత స్వర పాణి ని ?ఘంటసాల స్వరామృతం నిర్వహిస్తున్న టి .శరత్ చంద్ర కనిపించలేదా ?నిలయ విద్వాంసులు అన్నవరపు ,మోదుమూడి ,గజల్ శ్రీనివాస్ ,కాక వేరెవ్వరూ లేరా ?ప్రపంచ రచయితల సంఘం కు ఎవరు ఏమి రాస్తున్నారో పట్టదా ?99 ఏళ్ళ వయసులోనూ కవిత్వం రాస్తూ ఆంగ్లకవులకవిత్వాన్ని అనువదించి పుస్తకాలు గా వెలువరిస్తున్న విశాఖకు చెందిన రావి శాస్త్రిగారి తమ్ముడు  డా రాచకొండశార్మగారు ఆనలేదా .?

 సుమారు 30 సమావేశాలు మూడు వేదికలపై జరిగాయి .సమయం తక్కువ .ఆత్మీయ అతిధులు అంటూ పిల్చి వాళ్ళను ఏమీ కట్టడి చేయలేక అసలు మాట్లాడే వారికి అవకాశం తగ్గించడం బాధాకరం వెంకయ్యనాయుడు గారు 2014లో  పార్లమెంట్ సభ్యుడైన దగ్గర్నుంచి ఇప్పటిదాకా ఎన్ని సమావేశాలో మాట్లాడినా అవే చిలక పలుకులు .సమయ పాలనం అంటూ హితవు చెప్పి చివరికి తానూ పాటించకుండా రాసి తెచ్చుకొన్న కాగితాలు చదివి మరీ ఇబ్బంది పెట్టారు .అయ్యో అనిపించింది .భువన చంద్ర పోడిచేసిన్దేమీ లేదు .ఇనాక్ గారి వాక్ కూడా సందర్భానికి తగినట్లు లేదు .అవధానం ప్రారంభించటానికి పొడిమాటలతో అరగంట కాలక్షేపం చేసి సహనాన్ని పరీక్షించారు చురుగ్గా పద్యం ఎత్తుకుంటే అటేన్షన్  లోకి వస్తారు .విశేషంగా ఉండేది, నీరసంగా సాగింది .నాట్యంలో ఏలూరాయన సత్యనారాయణ గారు తప్ప ఇంకెవరూ దొరకలేదా ?కొత్తవారిని ప్రోత్సహించరా ?

  ప్రతి ప్రపంచ సభ లో సాంకేతిక సభ ఉత్కృష్టంగా ,దిశా నిర్దేశంగా ఉండేది .ఈ సారి ఆరంగంలో దిగ్దంతులు గారపాటి, రేహ్మనుద్దీన్ మొదలిన వారు లేకపోవటం వలన ఆకార్యక్రమం పండ లేదు .నాకు తెలిసి నంతవరకు శ్రీమతి తేళ్ళ అరుణ  కున్న ధైర్యసాహసాలు ఎవరూ ప్రదర్శించ లేకపోయారు .ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు అందులో ఒక్కస్త్రీ పేరు మీద కూడా జిల్లా లేకపోవటం ఆమె గమనించి ఉద్యమం చేశానని చెప్పింది .అన్యాయాన్ని మౌనంగా భరించమనే సందేశమే ఈ ప్రపంచ సభల ఉదేశ్యమా అని పిస్తుంది జొన్న విత్తుల ఉంటె ఆ పౌరుషం చూపేవాడు . ఆ వెలితి కొట్టవచ్చినట్లు కనిపించింది .నాలుగు సభల అనుభవం ఈసభల్లో కనిపించలేదు .

2023 నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-22-ఉయ్యూరు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అయిదవ ప్రపపంచ తెలుగు రచయితల మహా సభలు

అయిదవ ప్రపపంచ తెలుగు రచయితల మహా సభలు

  అయిదవ ప్రపపంచ తెలుగు రచయితల మహా సభలు  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో ,ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ),తానా ప్రపంచ సాహిత్య వేదిక ,సిలికానాంధ్ర ,విజయవాడ సిద్ధార్ధ అకాడెమి సహకారంతో 23-12-22శుక్రవారం ,24-12-22శనివారం పివి సిద్ధార్ధ ఆడి టోరియం ,సిద్దార్ధనగర్ –మొగల్రాజపురం లో’’మారుతున్న దేశ ,కాలమాన పరిస్థితులలో రచయితలపాత్ర ,కర్తవ్యమ్ ,కార్యాచరణ ‘’లక్ష్యాలుగా  జరిగాయి .సభలు జరిగిన ప్రాంగణానికి ‘’రాజరాజ నరేంద్ర సభా ప్రాంగణం ‘’అని ఆరాజు పట్టాభిషేక సహస్రాబ్దం కారణ౦ గానామకరణం చేశారు .ఈ ప్రాంగణం లో 1-ఆదికవి నన్నయ్య వేదిక 2-శ్రీ నందమూరి తారక రామారావు వేదిక 3-శ్రీ పివి నరసింహారావు వేదికలపై కార్యక్రమాలను నిర్వహించారు .రామారావు నరసింహారావు ల శతాబ్ది కూడా ఉండటం వలన ఆ పేర్లు పెట్టారు

https://www.youtube.com/post/UgkxEZ_SRomdAQuKi4J57–vI9Qli6KmJKsR

 మొదటి రోజు ఉదయం 10గం .లకు ఖచ్చితంగా ప్రారంభ సభ నన్నయ వేదికపై భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించారు ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ సభాధ్యక్షత వహించారు .ఆత్మీయ అతిధులుగా ఆచార్య కొలకలూరి ఇనాక్ ,ఫ్రాన్స్ తెలుగు ఆచార్యులు డేనియల్ నేగార్స్,తానా అధ్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి తానా ప్రపంచ సాహిత్యవేదిక అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ ,సిలికానాంధ్ర అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ ,సిద్ధార్ధ అకాడెమి అధ్యక్షులు డా చదలవాడ నాగేశ్వరరావు ,సింగపూర్ కు చెందిన శ్రీమతి మంగిపూడి రాధికా  బోట్సు వానకు చెందిన డా.శ్రీవల్లి శ్రీకాంత్ వేదిక పై ఆశీనులుకాగా ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తికొండ సుబ్బారావు స్వాగత వచనాలు పలుకగా ,ప్రధాన కార్య దర్శి డా .జివి పూర్ణ చాంద్ లక్ష్య ప్రస్తావన చేశారు .కోటిమాటలకోట,రాజరాజ నరేంద్ర గ్రంథా విష్కరణ జరిగాయి .

https://www.youtube.com/post/Ugkx-0ELYs3bzFW8rPBBFVuFHPeHvRN_fdeH

 ఉదయం 11-30కి ‘’అంతర్జాలం లో తెలుగు ‘’,సాయంత్రం 1-30కుశ్రీ మోదుమూడి ప్రభాకర్ చే  వాగ్గేయకార వైభవం ,సాయంత్రం 2కు కుదురాటఅద్భుతావధానం డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ఆధ్వర్యం లో  ,శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ ,తాతా సందీప శర్మ ,ఉప్పలధడియం భరత శర్మ గన్నవరం లలితాదిత్య ,నల్లాన్ చక్రవర్తుల సాహితి  యువ అవధానులచేత అవధానం జరిగింది ,సా 4కు తెలుగు వెలుగుల సభ లోసుప్రీం కోర్ట్ మాజీ సిజె జస్టిస్ నూతులపాటి వెంకటరమణ ,ముఖ్యఅతిదికాగా డా గరికపాటి నరసింహారావు కీలక ప్రసంగం చేశారు ఆత్మీయ అతిధులుగా శ్రీ అన్నవరపు రామస్వామి ,శ్రీమతి దండమూడి సుమతీ రామమోహనరావు ,శ్రీ భువన చంద్ర ,శ్రీస్వర వీణా పాణి పాల్గొన్నారు ,  మహాసభల ప్రచురణ ‘’గమ్యం –గమనం’’,ను శ్రీ పువ్వాడ శివరామ విట్టల్ ,వేణుగోపాల్ సమర్పించగా  ఆవిష్కరణ జరిగింది .శ్రీ పెద్ది సాంబశివరావు కూర్చిన ఇంగ్లీష్ –తెలుగు నిఘంటువు ఆవిష్కరణ అరిగింది .సాయంత్రం 6గం లకు –మహాసభల విజయానికి కారకులైన సాహితీబందువులకు అంటే 10వేలరూపాయలు,ఆపైన విరాళాలు ఇచ్చిన వదాన్యులకు శాలువాకప్పి జ్ఞాపిక అందించారు .నేనూ ఆ సన్మానం పొందిన వారిలో ఉన్నాను .రాత్రి 8గం లకు కుమారి నేక్షిత భరతనాట్య ప్రదర్శన జరిగింది .ముఖ్య అతిధి శ్రీ గజల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఔత్సాహిక గజల్స్ గాయనీ గాయకులూ గానం చేశారు

https://www.youtube.com/post/Ugkx-0ELYs3bzFW8rPBBFVuFHPeHvRN_fdeH

   24-12-22శనివారం రెండవ రోజు ‘’రచయితల పాత్ర ‘’పై సదస్సు ఉదయం 9గం లకు శ్రీ విహారి అధ్యక్షతన  శ్రీ వివి లక్ష్మీ నారాయణ ముఖ్యఅతిధిగా ‘’ జరిగింది .హాస్యబ్రహ్మ శంకనారాయణ,డా నాగులపల్లి భాస్కరరావు ,ఆచార్య పరిమి రామ నరసింహం ,శ్రీ వి లక్ష్మారెడ్డి ,ఎబి వెంకటేశ్వరరావు ,వేలిమళ్ళ జగన్నాథ్ ,నీలం దయానందరాజు ఆత్మీయ అతిధులుగా ,సింహప్రసాద్ .రాజ్యశ్రీ ,పెద్దింటి అశోక్ కుమార్ ,గంధం సుబ్బారావు మొదలైన వారు వక్తలు .మధ్యాహ్నం 11గం లకు విదేశీ ప్రతినిధుల సదస్సు తోటకూర ప్రసాద్ అధ్యక్షత న జరిగింది .అమెరికా ఆష్ట్రేలియా  దుబాయి కి చెందిన ప్రతినిధులు పాల్గొని చర్చించారు .మధ్యాహ్నం 12-30కు మహిళా సదస్సు కు డా తుర్లపాటి రాజేశ్వరి ఆధ్వర్యం లో జరిగింది .కర్నూలు హైదరాబాద్ ,మచిలీ పట్నం మొదలైన చోట్లనుంచి వచ్చిన వారు ప్రసంగించారు .మధ్యాహ్నం 2-30కు రాష్ట్రేతర ప్రతినిధుల సదస్సు పివిపిసి ప్రసాద్  అధ్యక్షతన  జరిగింది అహ్మదాబాద్ భువనేశ్వర్  ముంబై ,బెంగళూర్ హోసూర్ బళ్ళారి ప్రతినిధులు పాల్గొన్నారు .సాయంత్రం 4గం లకు భాషోద్యమ సదస్సు గుత్తికొండ ఆధ్వర్యం లో జరిగింది .సాయంత్రం 5-30కి ఆముక్తమాల్యద నృత్య రూపకం ను కెవివి సత్యనారాయణ ప్రదర్శించారు సాయంత్రం 6-౩౦ కి సమాపన సభ జరిగి సభలు సమాప్తమయ్యాయి .

https://www.youtube.com/post/UgkxeBk_XSNVPynl9m-pv_3b3J7Z1zWnx8du

  నందమూరి తారక రామారావు వేదిక

23-12-22 శుక్రవారం మధ్యాహ్నం 12గం లకు వంశీ రామరాజు ఆధ్వర్యం లో ‘’సాహితీ సంస్థల ప్రతినిధుల సదస్సు జరిగింది .యువభారతి అధ్యక్షులు ఆచార్య ఫణీంద్ర నవ్యాన్ధ్రరచయితల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ ,రఘుశ్రీ లు ఆత్మీయ అతిధులు పాల్గొన్న సంస్థల అధ్యక్షులుగా సరసభారతి కి చెందిన నేను ,ఆంద్ర సారస్వత సమితికి చెందిన శ్రీ కొట్టి రామారావు వగైరాలున్నారు .సాయ్నత్రం 2-30కి పత్రికాప్రతినిదుల సదస్సు శిఖామణి ఆధ్వర్యం లో జరిగింది చలపాక ప్రకాష్ ,శ్రీమతి స్వాతి మొదలైన వారున్నారు .సాయంత్రం 6గం లకు ఉపాధ్యాయులు –భాషా పరిరక్షణ సదస్సు లలితానంద ప్రసాద్ ఆధ్వర్యం లో జరిగింది డా వై శ్రీలత ,శ్రీహరికోటి అక్షరం ప్రభాక ర్ వగైరాలు పాల్గొన్నారు సాయంత్రం 7-30కి తెలుగు బోధనా సదస్సు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఆచార్య మన్నవ సత్యనారాయణ ,కానుకొల్లు బాలకృష్ణ మొదలైన వారు మాట్లాడారు .

https://www.youtube.com/post/UgkxaNxKHMgcpjFhQrWfEYp0vlDLOhjU-cV-

24-12-శనివారం –ఉదయం 9కి సాంస్కృతిక రంగ ప్రతినిధుల సదస్సు అక్కిరాజు సుందర రామ కృష్ణ అధ్యక్షతన జరిగింది .అప్పుడే పూర్ణచంద్ ,శ్రీ యాబలూరి లోకనాథ శర్మగార్లచేత 99 ఏళ్ళ డా .రాచకొండ నరసింహ శర్మగారు ఎం డి .రచించిన ‘’అనువాద కవితల సంపుటి –వెన్నెలలో నడుచుచున్న ఆమె ‘’ఆవిష్కరణ నేను దగ్గరుండి శర్మగారి కోరికపై జరిపించాను .కిందటి సభల్లోనూ ఒక పుస్తకం ఇలాగే ఆవిష్కరింప చేయించాము .శ్రీ గౌరినాయుడు శర్మగారి ప్రతినిధిగా విశాఖ నుంచి వచ్చారు .ఇందులో వడ్డేపల్లి కృష్ణ డా సప్పా దుర్గాప్రసాద్ ,అత్తలూరి విజయలక్ష్మి స్వతంత్రభారతి రమేష్ టివి మొదలైన వారు పాల్గొన్నారు .ఉదయం 11గం లకు చరిత్ర రంగ ప్రతినిధుల సదస్సు ఆచార్య శివనాగిరెడ్డి ఆధ్వర్యం లో జరిగింది. కొప్పర్తి వెంకటరమణ మూర్తి మహమ్మద్ సిలార్ ,మున్నగువారున్నారు .మధ్యాహ్నం 12కు వైజ్ఞానిక రంగ ప్రతినిధుల సదస్సు జంపా కృష్ణ కిషోర్ ఆధ్వర్యం లో జరిగింది .ముఖ్య అతిధి  కొండా మోహన్ మధ్యాహ్నం 1గం కు –విమర్శనారంగ ప్రతినిధుల సదస్సు డా తిరుమల ఆముక్తమాల్యద అధ్యక్షతన ,డా రేవూరు అనంత పద్మనాభరావు గారు ముఖ్యాతిధిగా జరిగింది సంగనభాట్లనరసయ్య కొండ్రెడ్డి వెంకటేశ్వరేద్ది రొక్కం కామేశ్వరావు  వేలువోలు నాగరాజ లక్ష్మి ,తాటికోలు పద్మావతి వగైరా పాల్గొన్నారు .మధ్యాహ్నం 2-30కి డా రావి రంగారావు ఆధ్యక్షతన తెలుగు కవిత సదస్సు జరిగింది ప్రముఖులు పాల్గొన్నారు .సాయంత్రం 4కు శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ డా రాధశ్రీ ,హాస్యబ్రహ్మ మొదలైన వారు పాల్గొన్నారు .

శ్రీ  పివి నరసింహారావు వేదిక

23-12-22-శుక్రవారం  –మధ్యాహ్నం 12గం లకు ప్రతినిధుల కవి సమ్మేళనం .సాయంత్రం 6కు రసరాజు అధ్యక్షతన ప్రత్యెక కవి సమ్మేళనం, రాధేయ వడ్డేపల్లి మందరపు హైమవతి మాధవే సనార సుమనజానుకవి శిఖా ఆకాష్ వసుధ మొదలైన వారు పాల్గొన్నారు .రాత్రి 8కి యువకవి సమ్మేళనం –ఆలేఖ్య స్నిగ్ధమాధవి మోకా మాధవరావు శ్రావణి మొదలైన వారు కవితలు చదివారు .

24-12-22-శనివారం –ఉదయం 9కు మహిళాప్రతినిదుల కవి సమ్మేళనం ,ఉదయం 12కు ప్రత్యెక కవి సమ్మేళనం ,సాయంత్రం 3కు ప్రతినిధుల కవిసమ్మేళనం .జరిగాయి ఇక్కడ మైకులు లైట్లు పని చేయక ఇబ్బంది పడినట్లు చెప్పుకొన్నారు .

  అన్ని సభలలో పాల్గొనటం కష్టం కనుక నేను చూసిన సభలగురించి ,ఆంధ్రజ్యోతి కవరేజ్ ఆధారంగా మిగిలినవాటి గురించి తర్వాత వ్యాసం లో తెలియ జేస్తాను .

సశేషం

రేపు 2023నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-22-ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర. 3వ భాగం.31.12.22

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి జీవిత చరిత్ర. 3వ భాగం.31.12.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 62వ భాగం31. 12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 62వ భాగం31. 12.22

Posted in రచనలు | Leave a comment

‘’యమా’’(హా)నటుడు కైకాల -2(చివరిభాగం )

‘’యమా’’(హా)నటుడు కైకాల -2(చివరిభాగం )

కైకాల నట విశ్వరూపం –దాసరి నారాయణ రావు దర్శకత్వం లో ‘’మనుషులంతా ఒకటే ‘’సినిమాలో కైకాలను  రామారావు కు తాత గా నటించమని దాసరి చెబితే తాను  చేయలేనని అలా తాతగా నటించి మెప్పించటం అసాధ్యం అనీ కైకాల చెప్పాడు .దాసరి ఒప్పుకోలేదు చివరికి కైకాల రామారావు కు చెబితే ‘’నిన్ను పైకి తీసుకు వచ్చిన దర్శకుడు అంతగా నమ్మకం తో నిన్ను చేయ్యమంటే కాదనటం భావ్యం కాదు ‘’అని నచ్చచెప్పాక నటించి బాగా నటించి దాసరితో సహా అందర్నీ మెప్పించాడు .సైడ్ విలన్ గగా కనకదుర్గ పూజామహిమ లో నటించి ,మోహినీ రుక్మాంగద లో గెస్ట్ గా విష్ణుమూర్తిగా నటించి ,మొదటి సాంఘిక చిత్రం పరువు –ప్రతిష్ట లో నటించి ,శ్రీ కృష్ణార్జున యుద్ధం లో అక్కినేని ,రామారావు లతో కర్ణుడు గా గెస్ట్ రోల్ పోషించి ,నందమూరి తో తొలి విలన్  ‘’శ్రీతిరుపతమ్మ కధ ‘’లోనూ,అక్కినేనితో మొదటి విలన్ గా ‘’జమీందార్ ‘’లో,తోలి హీరోగా సిపాయి కూతురు లో హీరోయిన్ జమునతో నటించాడు .

  కైకాల నాటక నటుడు గా ‘’ప్రేమ లీల ‘’లో విలన్ వేషం ప్రభాకర నాట్య మండలి ఆధ్వర్యం లో 1950మే లో  వేసి ప్రదర్శించాడు .యమ గోల సినిమాలో హీరో రామారావుతో పోటాపోటీ గా యముడుగా నటించాడు .దుర్యోధనుడుగా పనికి రాడు అన్నప్పుడు అన్నగారి సూచన తో వేసి న్యాయం చేశాడు .ఇలా ఎన్నో యమ పాత్రలు వేసి యమహా అనిపించాడు. అన్ని పాత్రలూ సక్సెస్ అయ్యాయి .వైవిధ్యం కూడా చూపాడు నటనలో .అందుకే అవి పండాయి .రాముడు కృష్ణుడు తప్ప రామారావు వేసిన అన్ని పాత్రలూ తానూ వేశానని గర్వంగా చెప్పాడు కైకాల .అచ్చంగా రామారావు లాగా ఉంటాడుకనుక డూప్ గా కూడా వాడుకొన్నారు కైకాలను ఒక సారి రామారావు గారి కృష్ణ పాత్రకు డూప్ గా వేశాడు .యమ దొంగ లో కూడా యముడి వేషం ఆఫర్ వచ్చినా ,డబ్బు విషయం లో తేడా వచ్చి వేయలేదని ,మోహన్ బాబు చేశాడని చెప్పాడు .కొన్నిసినిమాలలో  మోహన్ బాబు తో  పేచీలు కూడా వచ్చాయని చెప్పాడు .

  బెజావాడలో ఇంటర్ చదువు తు నాటకాలు వేస్తుంటే అందరూ ‘’రామారావు బ్రదర్ ‘’అను కొనేవారు. ఒక సారి పోటీ నాటకం లో నటిస్తున్నప్పుడు న్యాయమూర్తులలో ఒకరైన గరికపాటి రాజారావు స్వయంగా కైకాలకు సినిమాలలో వేషం ఇస్తానని ఆఫర్ చేసి  ము౦దు డిగ్రీ పాసవు అని చెప్పాడు .బి.ఏ  పాసయ్యాక మద్రాస్ రమ్మని అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ కే ఎల్ ధర్ ఉత్తరం రాస్తే వెళ్ళగా ,డైరెక్టర్ బిఏ  సుబ్బారావు నుకలిస్తేచక్రపాణి దగ్గరకుపంపిస్తే ,ఆయన కె.వి. రెడ్డికి పరిచయం చేయాగా ,15రోజులతర్వాత రమ్మని చెప్పి ,రాగానే వాయిస్ టెస్ట్ చేయించి సెలెక్ట్ చేశాడు .సంక్రాంతి సెలవలకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి అపాత్ర ఆర్ నాగేశ్వర రావు కు ఇచ్చేశారు .ఇంకో సినిమాలో ఇస్తాను అని రెడ్డి అనగా నిర్మాత డి ఎల్ నారాయణ ను కలవగా ‘’సిపాయికూతురు ‘లో హీరో చేశాడు.ఇక చాన్సులు రావు అనుకోని  నిరాశ పడి కనీసం మద్రాస్ అయినా పూర్తిగా చూద్దాం అనుకోని తిరుగుతుంటే విఠాలాచార్య అపూర్వ సహస్ర శిర చ్చెద  చింతామణి లో విలన్ వేషం వేయించి మొదటి పారితోషికంగా 25వేలు ఇచ్చాడు .రామారావు తో కాంబినేషన్ జరిగిఆతర్వాత ‘’అగ్గిపిడుగు ‘’నుంచి  చాలా సినిమాలలో ఆయన హీరో ఈయన విలన్ గా నటించారు పోటాపోటీ గా .

 ‘’భానుమతి మరొకరిద్దరూ తప్ప అందర్నీ సినిమాలలో రేప్’’ చేశాను .నన్ను రరేపుల నారాయణ అనే వారు .కే ఆర్ విజయ నన్ను పక్కకి పిల్చి ‘’నేనేమీ అనుకోను మీ ఇష్టం వచ్చి నట్లు చేసుకోండి ‘’అని చెప్పి బాగా కోఆపరేట్ చేసింది ‘’అని నవ్వుతూ ఈమధ్య ఇంటర్వ్యు లో చెప్పాడు .అక్కినేనిని ‘’మీరు డాన్సులు స్టెప్పులూ వేసి ఇండష్ట్రీ ని చెడగొట్టారు ‘’అని నిర్మొహమాటంగా చెప్పానని చెప్పాడు. కైకాల రామారావు కు రంగారావు కు మధ్య ‘’ప్రొఫెషనల్ జలసి ‘’ఎక్కువగా ఉండేది .రంగారావు డైలాగ్ లను అలవోకగాచెబుతారు. రామారావు పట్టి పట్టి అంటాడు .ఒకసారి ఒకసినిమాలో రంగారావు ‘’బానిసలు ‘’అనే మాటను చాలా అర్ధ వంతంగా పలికితే రామారావు ‘’వన్స్ మోర్ ‘’అనగా రంగారావు ‘’నో మోర్ ‘’అన్నాడని గుర్తు చేశాడు కైకాల .రామారావు ఒక సారి పూర్తిగా పాత్రలో లీనమై కైకాలను నిజంగానే కత్తి తో పొడిచాడు .యాక్షన్ లో ఏ మాత్రం తేడా వచ్చినా నందమూరి సహించే వాడు కాదు అని చెప్పాడు .

  అన్ని సినిమాలో అన్ని రకాల వేషాలు వేసి మెప్పించినా పద్మ అవార్డ్ ఎందుకు రాలేదని అడిగితె ‘’నువ్వు తెలుగు దేశం ఎం. పి.వి  కనుక రాలలేదు ‘’అని శివరాజ్ పాటిల్ చెప్పాడని చెప్పాడు కైకాల .తన మొదటి సినీ కధను కైకాలకే చెప్పానని డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ అన్నాడు .రామారావుదానవీర కర్ణ షూటింగ్ హైదరాబాద్ లో కృష్ణ కురుక్షేత్రం మద్రాస్ లో షూటింగ్ జరుగుతోంది .కురు క్షేత్రం షూటింగ్ అయ్యాకకైకాల హైదరాబాద్ వెళ్ళాలి .అనుకోకుండా కైకాలకు కామెర్లు అయ్యాయి .కృష్ణం రాజు జాండిస్ కు మందు ఇచ్చేవాడు .రాజు మందు ఇచ్చాడు కాని పెద్దగా పనిచేయలేదు .కామెర్లు తగ్గకపోయినాహైదరాబాద్ వెళ్లి అన్నగారి షూటింగ్ లో పాల్గొనాలి అంటే కృష్ణం రాజు హైదరాబాద్ వెడితెఅక్కడ తనబావమరది రోజూ వచ్చి మందు ఇస్తాడు అని చెప్పి పంపాడు .హైదరాబాద్ వెళ్ళగా కామెర్లు మరింత పెరిగి చివరికి బట్టలు కూడా పచ్చగా మారిపోయాయి .ఏదీ తిన బుద్ధి అయ్యేదికాదు .కానీ షూటింగ్ మానలేదు .ఒక రోజు డాక్టర్ వచ్చి చూసి వెంటనే ఆస్పత్రిలో చేరకపోతే ప్రాణానికిప్రమాదమని చెబితే రామారావు మద్రాస్ వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకోమని సలహా ఇస్తే ,షూటింగ్ కు ఇబ్బంది అవుతుందని రెండు రోజులుఉండి మద్రాస్ వెళ్ళాడు .అక్కడ చెన్నైలో గాసిప్ లు షికారు చేశాయి  అన్నగారు వద్దన్నారుకనుక కైకాల మద్రాస్ రాలేదు అని ప్రచారం చేశారు .ఒకరోజు కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు కైకాల ఇంటికి వెళ్లిపరిస్థితి తెలుసుకొని ‘’హాయిగా రెస్ట్ తీసుకో మందులు వాడు ఆరోగ్యం కుదుటపడ్డాకే షూటింగ్ కు రా .కంగారు పడకు. కానీ కురుక్షేత్రం లో నటించటం లేదని ఎవరికీ చెప్పద్దు.మునిగిపోతాం ‘’అన్నాడు .అలాగే అన్నమాట ప్రకారం ఆరోగ్యం బాగుపడగానే కురుక్షేత్రం షూటింగ్ పూర్తీ చేసి ఇచ్చినన మాట నిలబెట్టుకొన్నాడు కైకాల .కృష్ణ సినిమాలలో నటించే వారందర్నీ ముందే హైదరాబాద్ కు తరలించి కాంప్ లో ఉంచి కురుక్షేత్రం షూటింగ్ జరిపించాడు అప్పుడు హైదరాబాద్ లో నటులుఎవరూ  లేరు.అందుకే రామారావు మూడుపాత్రలు చలపతిరావు అయిదుపాత్రలు దావీజు కర్ణలో చేయాల్సి వచ్చింది

  కైకాల కూతుళ్ళు ,కొడుకులు వెల్ సెటిల్డ్  .తమ్ముడిని చదివించి నిర్మాతను చేశాడు .తనపిల్లలు నిర్మాణ రంగం లో ఉన్నారు తప్ప నటనలోకి రాలేదని ,తన మనవలు తన వారసులుగా నటనలోకి రావాలని కైకాల సత్య నారాయణ కోరుకొన్నాడు .కరుడుగట్టిన విలన్ వేషాలు వేసిన కైకాల సినిమాలలో మెలోడీ పాటలు అంటే మహా ఇష్టం ‘’అనురాగం విరిసేనా ‘’,చుట్టూ చెంగావి చీర ‘’,ఎంతహాయి ఈరేయి నిండెనో ‘’,నిలువవే వాలుకనులదానా ‘’,వంటి పాటలు వింటూ మై మరచిపోతాడు .సువర్ణ సుందరి మాయాబజార్ ,పాతాళభైరవి దేవదాస్ సినీ గీతాలు వింటూ హాయిపొందుతాడు .ప్రాణం ఖరీదులోని జాలాది పాట ‘’యాతమేసి తోడినా ‘’నిప్పులాంటి మనిషిలోని ‘’స్నేహమేరా జీవితం ,డబ్బుకు లోకం దాసోహం లో ‘’తాగుతా నీ యబ్బ తాగుతా ‘’ఘటోత్కచుడు లో ‘’అపరంజి బొమ్మవంటి మెలోడీ సాంగ్స్ కు పరవశం చెందేవాడు .

 లవకుశ సినిమాలో భరతుడు ,పాండవవనవాసం ,పరమానందయ్య శిష్యుడులో –గజదొంగ ,ప్రేమ నగర్ లో కేశవ  వర్మ ,తాతామనవడులో రంగారావు కొడుకు ,రాజబాబు తండ్రి ,నిప్పులాంటి మనిషిలోషేర్ ఖాన్ ,జీవన జ్యోతి లో శోభన్ బాబు అన్నగా ,సిరిసిరి మువ్వ లో జయప్రద కు పక్షవాతం వచ్చిన తండ్రిగా ,చక్రధారి లో ,దావీ శు లో కర్ణుడు గా ,యమగోలలో యముడుగా ,శుభలేఖలో అంకెల ఆది శేషయ్యగా నటించాడు ,శృతి లయలు లో వాసిరెడ్డి నాయుడుగా సంగీత త్రయానికి గుడి కట్టే ప్రయత్నం లో సంగీత అభిమానిగా జీవించాడు .రుద్రవీణ లోనూ ,నారీనారీ నడుమమురారిలో జానకి భర్త జానకిరామయ్య గా ,సూత్రధారులు లో విలనీ షేడ్ ఉన్న నీలకంఠయ్య గా ,గాంగ్ లీడర్ లో జైలర్ గా ,భైరవద్వీపం లో బ్రహ్మాండ భూపతిగా ,ముద్దులప్రియుడు లో మేజర్ నారాయణ మూర్తిగా ,యమలీల లో యముడుగా ,ఘటోత్కచుడు లో ఘటోత్కచుడు గా గొప్ప హావభావాలు ప్రేమ కారుణ్యం ప్రదర్శించాడు ,సాహస వీరుడు –సాగర కన్య లో బంగారు రాజుగా ,సూర్య వంశం లో మీనాకు తండ్రిగా ,చేసినమేలు మరువని మహోన్నత వ్యక్తిగా ,శుభా కాంక్షలు లో సీతారామయ్య గా ,మురారిలో సత్తిపండుగా ,అరుంధతి లో భూపతి రాజుగా ,తాయారమ్మ బంగారయ్య లో జానకి భర్త గా,దేవుడు లో బాలకృష్ణ యజమానిగా ,’’ఓం సచ్చిదా నందా ఈ సర్వం గోవిందా ‘’పాటపాడే దొంగ బాబా గా , కైకాల నటించి తన నట విశ్వ రూపం ప్రదర్శించాడు .మరో నట దిగ్గజాన్ని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది .ఈ భర్తీ తీరేదికాదు .ఆయన ఆత్మకు శాంతికలగాలని, ఆకుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-12-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 61వ భాగం30. 12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 61వ భాగం30. 12.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి స్వీయ చరిత్ర 2వ భాగం. 30.12.2022

దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారి స్వీయ చరిత్ర 2వ భాగం. 30.12.2022

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

’యమా’’(హా)నటుడు కైకాల  

’యమా’’(హా)నటుడు కైకాల  

 కృష్ణా జిల్లాకు చెందిన మరో సినీ నక్షత్రం రాలిపోయింది క్రిందటి శుక్రవారం 23వ తేదీన .యమ పాత్రలలో యమహా గా నటించి మెప్పించాడు నవరస నటనా సార్వభౌముడు అనిపించుకొన్నాడు కైకాల సత్యనారాయణ .జానపద ,పౌరాణిక సాంఘికాల్లో తనదైన నట ముద్రను వేశాడు .ఎస్వి రంగారావు ను మించకపోయినా సమాన స్థాయి చూపాడు. ఇద్దరూ కలిసి నటించి మెప్పించారు .ఎన్ని చేసినా ‘’యముండ ‘’అనే పదంతో స్మృతి పధం లో ఎప్పుడూ నిల్చిపోతాడు .వైవిధ్యభరిత పాత్రలనే పోషించాడు .విలనీని బాగా ఒలికించాడు .శారద సినిమాలో శారద అన్నగా చాలా సౌమ్యమైన పాత్ర వేయించి ,నటిమ్పజేయించాడు దర్శకుడు విశ్వనాథ్ .ఈ పాత్ర విలన్ ఆర్. నాగేశ్వరరావు ఇలవేలుపు సినిమాలో ఆశ్రమాదికారి ‘’నాన్న గారు ‘’పాత్రను గుర్తుకు తెస్తుంది .ఇద్దరూ ఆయా పాత్రలకు పూర్తీ న్యాయాన్ని రొటీన్ కు భిన్నంగా నటించి సెభాష్ అని పించారు .

  కృష్ణాజిల్లా కౌతవరం లో 25-7-1935 న కైకాల లక్ష్మీనారాయణ,సీతమ్మ దంపతులకు  పుట్టిన కైకాల సత్యనారాయణ ప్రాధమిక,హైస్కూల్  విద్య అక్కడే చదివి ,తర్వాతగుడివాడలో ఎ ఎన్ ఆర్ కాలేజిలో చదివి డిగ్రీ పొంది నాగేశ్వరమ్మను  వివాహం చేసు కొని ఇద్దరు కూతుళ్ళకు ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు .మాంచి స్ఫురద్రూపం చక్కని డైలాగ్ డెలివరి తో ఉన్న ఆతడు హీరో వేషాలకోసం మద్రాస్ వెళ్ళాడు .నిర్మాత డిఎల్ నారాయణ అతడిని గుర్తించి సిపాయి కూతురు సినిమాలో హీరో వేషం వేయించాడు .సినిమా బాక్సాఫీస్ వద్ద డింకీ కొట్టనా  దర్శకుడు కైకాల ప్రతిభను గుర్తించి ,అందులోనూ ఎన్టిఆర్ పోలికలు బాగా ఉండటంతో బాగా పనికోస్తాడని నిర్ణయించుకొన్నాడు .ఎస్ డి.లాల్ దర్శకత్వం వహించిన ‘’అపూర్వ సహస్రశిరచ్చెద చింతామణి ‘’’లో రామారావు అతడికి ఒకవేషం ఇప్పించాడు

 జానపద  చిత్రనిర్మాత దర్శకుడు బి .విఠలాచార్య కు సత్యనారాయణలో విలన్ బాగా ఉన్నాడని గుర్తించి ,తన చిత్రాలలో’’కనకదుర్గ పూజా మహిమ ‘’తో ప్రారంభించి  ప్రతినాయక పాత్రలిచ్చి గొప్పగా నటించే అవకాశం కల్పించాడు .అలానే నటించి సత్తా నిరూపించుకొన్నాడు .విలన్ పాత్రలనే కాక సహాయనట పాత్రలు కూడా ఎంచుకొని వాటిలోనూ నటనతో మెప్పించాడు .ఆతర్వాత కేరక్టర్ నటుడు గా స్థిరపడ్డాడు అగ్రనాయకులందరికి తండ్రిగానో అన్నగానో మామ గానో నటించి సమర్ధత చాటుకొన్నాడు .అంటే సంపూర్ణ నటన ప్రదర్శించాడన్నమాట .యమలీల ,యమగోల సినిమాలలో యముడుగా నటించి రంగారావు కు భిన్నంగా తనదైన వరవడి పెట్టాడు .ఇవన్నీసూపార్ హిట్ అయ్యాయి .పౌరాణికాలలో దుర్యోధన,రావణ ,యమ పాత్రలు అత్యద్భుతంగా చేశాడు .జానపదాల్లో హీరో లు కాంతారావు రామారావు లతోపాటు గొప్పగా కత్తి యుద్ధాలూ చేసి వారిని మెప్పించాడు .సాంఘికాల్లో హీరోల తండ్రి ,తాత పాత్రలలో కూడా బాగా ఒదిగిపోయాడు .ఒకానొక సమయంలో కైకాల లేనిసినిమా ఉండేదికాదు .రమా ఫిలిమ్స్ సంస్థస్థాపించి’’ఇద్దరుదొంగలు ,కొదమ సింహం ,బంగారుకుటుంబం ,ముద్దులమొగుడు సినిమాలు నిర్మించాడు .

  అన్న ఎన్టిఆర్ తెలుగు దేశం స్థాపించినప్పుడు అందులో చేరి 1996లో మచిలీ పట్నం నుంచి 11వ లోక్ సభ కు పోటీచేసి లోక్ సభ సభ్యుడయ్యాడు .

  బంగారుకుటుంబం సినిమాకు నంది అవార్డ్ ను ,2011లో రఘుపతి వెంకయ్య అవార్డ్ ,2017లో జీవిత సాఫల్య పురస్కారం పొందాడు .ఇవికాక ఎన్టిఆర్ ట్రస్ట్ అవార్డ్ ,నటశేఖర అవార్డ్ ,కళాప్రపూర్ణ ,నవరస నటనాసార్వభౌమ పొందాడు

మొత్తం 777సినిమాలలో నటించాడు అందులో పౌరాణికాలు 28,జానపదాలు 51,చారిత్రకాలు 9,మిగిలినవి సాంఘికాలు .200మందిదర్శకులతో పని చేశాడు .100రోజులుఆడిన  సినిమాలు 223,అర్ధశతదినోత్సవాలు 59,సంవత్సరం పైగా ఆడిన సినిమాలు 10  .శతదినోత్సవం చేసుకొన్నవి 10.ఇదంతా ఘనమైన రికార్డే .

 నందమూరితో కలిసి 101 సినిమాలో నటించాడు .రౌద్ర ,వీర ,భీభత్స ,భయానక ,హాస్య ,కరుణ ,అద్భుత ,శాంతి ,శృంగార రసాలను అత్యద్భుతంగా పోషించి నవరస నటనా సార్వ భౌముడు అయ్యాడు .

 భోజన ప్రియుడైన సత్యనారాయణకు ‘’కౌతవరం వెంకట నారాయణ చెరువు చేపలు ‘’అంటే మహా ఇష్టం .వీలునిబట్టి ఇక్కడి ఈ చెరువు చేపలకూరను వండించి తెప్పించుకొని తన కుటుంబం తో పాటు అగ్రనటుల కుటుంబాలకు కూడా పంపేవాడు .అందుకే ఆ చెరువు చుట్టూరివెట్ మెంట్ ఏర్పాటు చేశాడు ఎంపి అయ్యాక .గ్రామం లో అనేక సిసి రోడ్లు వేయించాడు .ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు ఇప్పించాడు .ఆయన ముఖ్యస్నేహితులు ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు శ్రీ కే ఎల్ ఎన్ ప్రసాద్ ,గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి స్థాపకుడు వల్లూరుపల్లి వెంకటరామ శేషాద్రి రావు ,వల్లభనేని బాబూరావు ,మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి మాజీ డిఎస్పి లు ఉన్నారు .కౌతవర గ్రామ జనాలను పలకరిస్తూ తన సినిమాలు చూసి తప్పొప్పులను రాయమని కోరేవాడు .ఆరోగ్యాల గురించి వాకబు చేసేవాడు .కౌతవరం అంటే విపరీతమైన ప్రేమ కైకాలకు .

  బందరు తోనూ గొప్ప అనుబంధం ఉండేది .బందరువస్తే కళా బంధు చలమల శెట్టి నా౦చారయ్య  ,జిల్లా గ్రంధాలయ శాఖాధ్యక్షుడు గొర్రెపాటి గోపీ చ౦ద్ మాజీ  మంత్రి నడికుదిటి నరసింహారావు ఇంట్లోనో గడిపేవాడు .అక్కడి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో మహా ఇ ష్టంగా పాల్గొనేవాడు .హిందూకాలేజిలో కైకాలను సత్కరించే కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసినవారందరికీ ఆయనే ముందుగా సత్కరించాడు .హిందూకాలేజీ లెక్చరర్ ,నాటకరచయిత జంధ్యాల రాదా కృష్ణ ,రంగస్థల కళాకారుడు గాంధీ లతో మంచి స్నేహాన్ని నిలబెట్టుకొన్నాడు .బందరు రంగస్థల కళాకారుల సమాఖ్య మునిసిపల్ పార్క్ లో నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యేవాడు .కళాకారులపై ఆయన అభిమానం ఇంతా అంతా కాదు  కొండంత .మాజీ మంత్రి కొల్లురవీంద్ర కైకాల అభిమాని .బందరులో గెలిచాక రామారావు ను కలవటానికి వెళ్ళినప్పుడు కృతజ్ఞతగా కైకాల అన్నగారితో మాట్లాడిన మాటలను ఇప్పటికీ మరచిపోలేదని గొర్రెపాటి గోపీ చ౦ద్ గుర్తు చేసుకొన్నారు . ఈ గోపీ చంద్ గారేదక్షిణ భారతం లో ఎక్కడా లేని ఎ.సి. గ్రంధాలయాన్ని  ఉయ్యూరులో ఏర్పాటు చేయటానికి అమెరికాలో ఉన్న శ్రీ మైనేని గోపాలక్రిష్ణగారిని ఎం ఎల్ సి తాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయనను ఒప్పించి 5లక్షల రూపాయలునిధులు సేకరించి మైనేనిగారితలిదండ్రులు మైనేని వెంకట నరసయ్య శ్రీమటి  సౌభాగ్యమ్మ జ్ఞాపకార్ధం కట్టించారు నన్ను ఆభవన నిర్మాణానికి కన్వీనర్ చేశారు .నటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీని ప్రారంభోత్సవానికి  రావాలని ఉత్సాహపడ్డారు కానీ ఎన్నికలలో ఆప్రభుత్వం ఓడిపోవటం కాంగ్రెస్ ప్రభుత్వం రావటం వలన 204 జులై లో ప్రారంభోత్సవం కొత్తమంత్రుల చేత జరిగింది .మైనేనిగారు ఆయన అక్కగారు బావగారుడా. అన్నపూర్ణాదేవి డా రాచకొండ నరసింహ శర్మగారు ,గొర్రెపాటి గోపీచంద్ ,వెలగా వెంకటప్పయ్య మొదలలైన వారుపాల్గొన్నారు .  

  గుడివాడ లో కైకాల 1951-54వరకు ఇంటర్ ,డిగ్రీ చదివినపుడు ఎన్నో నాటికలలో నటించి మెప్పు పొందాడు .కాలేజి గోల్డెన్ జూబిలీ సమయం లో పూర్వ విద్యార్ధుల సంఘం లో కైకాల కీలక పాత్ర పోషించాడు .

నాటకాలను నాటక కళాకారులను ప్రోత్సహించాలని భావించేవాడు కైకాల .గుడివాడ అభివృద్ధికి ఆయన సేవలను గుర్తించి స్థానిక నెహ్రు చౌక్ సెంటర్ వద్ద గల ఒక వీధికి ‘’కైకాల వారి వీధి ‘’అని గౌరవంగా నామకరణం చేసింది గుడివాడ పురపాలక సంఘం . గుడివాడలో పూర్తీ హంగులతో ఒక కళామందిరాన్ని ఏర్పాటు చేయాలని కైకాల భావించి 8-6- 2011న తాను  పూర్వం స్థాపించిన కైకాల కళామందిరాన్ని పునర్నిర్మించటానికి అప్పటి మంత్రులను రప్పించి శ౦కు  స్థాపన చేయించాడు .తను 5లక్షలు ఇచ్చి టిటిడి నుంచి 10,పర్యాటక శాఖ నుంచి 10లక్షలు నిధులను సేకరించాడు .మిగిలినఖర్చు మునిసిపాలిటి భరించింది 15-2-2019 కి నిర్మాణం పూర్తీ చేసి ,మాజీ శాసన సభ్యుడు రావి వెంకటేశ్వరరావు ,మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు లు కళామందిరాన్ని ప్రారంభించి కళాకారులకు అందు బాటులోకి తెచ్చారు .పాతప్రభుత్వం పోయి  కొత్తది వచ్చినదగ్గర్నుంచి దాని ఆలనా పాలనా పట్టించుకొన్న వారు లేరు .కైకాల కృషిని నీరు గార్చారు ఘనతవహించిన వారు .సా౦స్క్రుతిక కార్యక్రమాలతో ,నాటకాలతో కళకళ లాడాల్సిన కళామందిరం నేడ నిరుపయోగం గా  మారింది.వేరే అవసరాలకు వాడుతూ కళాకారులకు తీవ్ర అన్యాయం చేస్తూ ,కైకాలను అవమానించారని ఆవేదన చెందారు శ్రీ రావి వెంకటేశ్వర రావు .కైకాల కళామందిరాన్ని తిరిగి కైకాలకు అంకితం చేయాలనీ కోరారు .

  ఇక్కడ నాకో విషయ౦  జ్ఞాపకం వచ్చింది .సుమారు 20ఏళ్ళ క్రితం అనుకొంటాను గుడివాడలో అవధాని  శ్రీ కడిమిళ్ళ వరప్రసాదరావు ఆయన శిష్యుడు శ్రీ కోట లక్ష్మీ నరసింహం కలిసి జంట శతావధానం చేశారు .ఉయ్యూరు నుంచి నేనూ గూడపాటికోటేశ్వరరావు ,పీసపాటి కోటేశ్వరావు తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు పృచ్చకులుగా ఉన్నాం .ఒక రోజు ఉదయంసెషన్ అవగానే నేనూ గూడపాటి భోజనాలు చేసి అలా బయటికి తిర్గి వద్దామని బయల్దేరితే  దగ్గరలో కైకాల సభ జరుగుతోందని తెలిసి వెళ్లాం .సభలో సినీ పాటల రచయిత జాలాది కూడా ఉన్నారు .ఆ సభ గుడివాడకు చెందిన ఒక  నాటకకళాకారుని జయ౦తి  సందర్భం ఆయన్ను ఆయన సేవలను ఇద్దరూ బాగా మెచ్చుకొన్నారు .ఆయన శిలావిగ్రహం ఆవిష్కరించారు .వారిద్దరికీ స్థానిక కళాకారుల సంఘం గొప్ప సన్మానం చేశారు .సభ అయ్యాక మేమిద్దరం కైకాలను జాలాదిని కలిసి కాసేపు మాట్లాడాం.ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడారు. అప్పుడు నేను సరసభారతి స్థాపించలేదు .మా గురువుగారు శ్రీ లంకా బసవాచారి గారు స్థాపించిన సాహితీ మండలికి కన్వీనర్ గా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. జాలాది ఫోన్ నంబర్ తీసుకొని ఉయ్యూరు కు ఆహ్వానిస్తాం వస్తారా అని అడిగితె తప్పక వస్తానన్నారు .ఒకటి రెండు సార్లు ఫోన్ లో మాట్లాడానుకూడా .ఆతర్వాత ఎందుకో ఆకార్యక్రమం రూపు దాల్చలేదు .జాలాదిపాట ‘’చూరట్టుకు రాలుతుంది సురుక్కుసురుక్కు  వాన సినుకు ‘’,ప్రాణం ఖరీదులో ‘’యాతమేసి తోడినా యేరు ఎండదూ –పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు –దేవుడి గుడిలోనైనా ,పూరి గుడిసె లోనైనా –గాలి ఇసిరికొడితే –దీపముండదు ‘’పాటలు అంటే నాకు మహా ఇష్టం .కృష్ణా జిల్లా రచయితల సంఘం బెజవాడలో నిర్వహించిన రెండవ ప్రపంచ రచయితల సభలలో జాలాది ప్రసంగం విని ఫిదా కాని వారులేరు .గంట సేపు మాటలతో పాటలతో గుండె తలుపు తట్టాడు. జాలాది మాటల గాలమేసి లోని మనస్సును పైకి ల ఏడ్పించాడు, నవ్వించాడు హెచ్చరించాడు మానవత్వ విలువలు చెప్పాడు .ప్రాణం ఖరీదు లో పైన చెప్పిన పాట కైకాల సత్యనారాయణ నోటి నుంచి వచ్చిందే .అందుకే గుర్తు చేశా.మిగిలిన వివరాలు రేపు .

  సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-12-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 26వ భాగం.29.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 26వ భాగం.29.12.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 60వ భాగం.29.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 60వ భాగం.29.12.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సినీ శత (సతత ?)రేపిస్ట్ చలపాయ్ అరుదైన గుణాలతో అయ్యాడు అందరికీ బాబాయ్

సినీ శత (సతత ?)రేపిస్ట్ చలపాయ్ అరుదైన గుణాలతో అయ్యాడు అందరికీ బాబాయ్

 తెలుగు చిత్ర సీమలో ఏ ఒకరిద్దరు హీరోయిన్లు తప్ప అందర్నీ రేప్ చేసే సంఘటనలతో శత రేపిస్ట్ గా కొండొకచో సతత రేపిస్ట్ గా తన దైన ముద్ర వేసుకొన్న చలపాయ్ అనే తమ్మారెడ్డి చలపతి రావు ఈ ఆదివారం అకస్మాత్తుగా మరణించాడు .సినిమా వాళ్లకు స్వర్గం ఉంటె అక్కడ రంభ ,తిలోత్తమాదులు ,తమపని పట్టుతాడన్న భయం తో భయపడి పారిపోతారేమో?ఒకసారి ఒక పల్లె టూరిలో ఒక సినిమాలో రౌడీ వేషం వేసి ఒక రోజు రోడ్డుమీద కత్తి నూరుతుంటే ,షూటింగ్ జరిగిన 15 రోజులు ఆవూరిలోని ఏ స్త్రీ కూడా బయటికి రాలేదట అలాగే షూటింగ్ కోసం  నిర్మాత ఏర్పాటు చేసిన రూమ్ లో ఉంటె ,ఆదగ్గర రూమ్స్ లో ఏ హీరోయిన్ కానీ లేడీ ఆర్టిస్ట్ కానీ ఉండటానికి భయపడేవారట .సినిమాల్లోలాగా ఎక్కడపడితే అక్కడ రేప్ చేస్తాడేమో నన్న భయం అన్నమాట .ఒడ్డూ ,పొడుగు కోటేరు తీసిన ముక్కు మంచి రంగు తో  నీలికనుల అందగాడు గా,హీరో అనిపించేట్లు  చలామణి అయ్యాడు .పంచ చొక్కా ఉత్తరీయం వేస్తె అసలైన ఆంధ్రత్వం ఉట్టిపడుతుంది .లాయర్ పోలీస్ ఇన్స్పెక్టర్ , వేషాలు వేస్తె ఆ డ్రెస్ కే అందాన్ని తెస్తాడు . గళ్ళలుంగి తెల్ల లేక చారల చొక్కా వేస్తె రౌడీ రంగడే అనిపిస్తాడు .హావభావాలు కొద్దిగా తక్కువేమోకాని ఉచ్చారణ నిర్దుస్టం .మొదట్లో కష్టపడి వేషాలు ఒకటి అరా దక్కించుకొన్నా ,ఆతర్వాత’’ అన్న ఎన్టీ ఆర్’’చలువతో పుష్కలంగా వేషాలు లభించాయి .తన పరిధికి మేర ఆ వేషాలన్నిటికీ న్యాయం చేశాడు .దానవీర శూరకర్ణ లో రామారావు మూడు పాత్రలు ధరిస్తే అందులో చలపాయ్ చేత అయిదు పాత్రలు వేయించాడు అన్న .’’అన్న గారూ !మరీ అయిదు వేషాలంటే జనం నవ్విపోతారేమో ?మీకయితే ఫర్లేదు కాని ,నాకు ఎబ్బెట్టుగా ఉంది ‘’అంటే ‘’బ్రదర్ !కంగారు పడకు .కొన్ని కొన్ని ఊళ్లలో నన్నే గుర్తు పట్టలేరు ప్రేక్షక జనం .నిన్నెవరు గుర్తిస్తారు చేసేయ్’’అని ప్రోత్సహించాడు అన్న .

 కృష్ణా జిల్లా పామర్రుదగ్గర బల్లిపర్రు కు చెందిన చలపతి రావు కు రెండు ఎకరాల  పొలం స్వంత ఇల్లు ఉన్నాయి ..విశాలమైన అన్ని హంగులు ఉన్న ఆయన ఇంట్లో 50 సిసి కేమేరాలున్నాయని ఈమధ్య ఎవరో చెప్పారు .తరచూ బల్లిపర్రు వచ్చి పొలాలు చూసుకొంటూ ఊరివారిని ఆప్యాయంగా పలకరిస్తూ  అవసరమైతే సాయం చేస్తాడట . అందుకే బాబాయ్ మరణం వాళ్లకు తీవ్ర దుఖం కలిగించి,ప్రతి ఇల్లూ రోదిన్చించింది .ప్రతి ఏడాదీ మే నెలలో బల్లిపర్రుకు కుటుంబం తో వచ్చి కొన్ని రోజులు గడిపేవాడు. అక్కడి రక్షిత మంచి నీటి సరఫరా కు సాయం చేశాడు .స్థానిక గంగానమ్మ ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు అందించాడు .గ్రామం లోని మర్రి చెట్టుకింద ఊరి పెద్దలతో కాలక్షేపం చేయటం మహా ఇష్టం .గ్రామస్తులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించేవాడు .తన ఇంటి ఆడపడుచు సర్పంచ్ అయిందని గర్వంగా చెప్పుకోనేవాడు .పెరుగన్నం లో ఆవకాయ కలిపి పెడితే మహా ఇష్టంగా తినేవాడని ఆ సర్పంచ్ శ్రీమతి బొప్పన స్వర్నలతః అన్నది  .గ్రామాభి వృద్ధి గురించి అడిగి తెలుసుకొని ,ఏ రకమైన సాయం కావాలన్నా వెంటనే అందించే వాడని చెప్పింది .తన చిన్ననాటి ఎలిమెంటరి స్కూలు మిత్రుడు శ్రీ వేదాంతం శేష భట్టా చార్యులు ‘’చలపాయ్ ఎప్పుడు వచ్చినా ,మా ఇంటికి వచ్చి నన్ను పలకరించే దేవాలయం దర్శించి వెళ్ళేవాడు ‘’అని మహా దుఖంతో చెప్పారు

  నేను మొదటి సారిగా చలపతి రావు ని మద్రాస్ లో 1996-97లో ధౌజండ్ లైట్స్ వద్ద ఉన్న అమెరికన్ ఎంబసీ దగ్గర  చూసి పలకరించాను .బాగా మాట్లాడాడు .ఏపని మీద వచ్చారని అడిగితె వాళ్ళ అమ్మాయి వీసా కోసం అన్నాడు .నన్ను కూడా ఆడిగితే మా అమ్మాయి మొదటిసారి అమెరికా వెళ్ళ టానికి వీసా కోసం వచ్చాం అన్నాను .అంతే.ఆ రోజుల్లో వీసా అంటే ఎంబసీ దగ్గర విపరీతమైన పడిగాపులు ,రోడ్లపై పేపర్లు పరిచి అర్ధరాత్రినుంచి సీట్ రిజర్వేషన్లు ,విపరీతమైన రద్దీ .మా అమ్మాయికి వీసా వచ్చింది వాళ్ళమ్మాయి కీ  వచ్చే ఉంటుంది .  

  విలన్ కేరక్టర్ కు తనదైన శైలి లో ప్రాణం పోశాడు చలపాయ్ .దాదాపు 1300సినిమాలలో నటించటం అంటే మాటలుకాదు .అతని దగ్గర సరుకు ఉండబట్టే చేయించారు .ప్రాధమిక విద్య బల్లిపర్రులో ,తర్వాత అమ్మమ్మ ఊరు భట్లపెనుమర్రు లో చదివి ,ఆతర్వాత బెజవాడ ఐటిఐ లో చదివాడు .ఆర్టిసి లో ఉద్యోగం చేస్తుండగా ,కాలేజి క్లాస్ మేట్ ,జమీ గొల్వేపల్లి అమ్మాయి ఇందుమతిని ప్రేమించి ఇద్దరూ పెద్దల అనుమతితో పెళ్లి చేసుకొన్నారు .వీరికి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు రవిబాబు సంతానం .రవికి ఏడేళ్ళ వయసులోనే చలపతిరావు భార్య స్టవ్ ప్రమాదం లో ఆయన చూస్తుండగానే కాలి చనిపోయింది .అది అతనిపై తీవ్ర ప్రభావం చూపింది. తట్టుకోలేక పోయాడు. భార్య చనిపోతూ ,పిల్లలకోసం మళ్ళీ పెళ్లి చేసుకోమని అడిగి చేతిలో చెయ్యి వేయిన్చుకొన్నా ఆమె ప్రశాన్తమరణం కోసం అలాగే అన్నాడు కానీ మళ్ళీ పెళ్లి ఆడలేదు . ఆటర్వాతపిల్లలు పెద్ద వాళ్ళు అయి పెళ్లి చేస్తామన్నా ఒప్పుకోలేదు .పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడాడు .మంచి చదువులు చదివించి గొప్ప భవిష్యత్తు కల్పించాడు .వాళ్ళపై తన పెత్తనం ఏనాడూ చూపలేదు .రవి పెళ్లి చేసి ,పెళ్లి పీటలమీద నుంచే ఆకోత్తదంపతులను కొత్త ఇంట్లో కాపురం పెట్టించి వారి సౌఖ్యానికి తాను అడ్డు ఉండకూడదని భావించాడు ‘’ఇదేమిటి నాన్నా ?అంటే అది అంతే .నీకు తెలీదు మనం రోజూ కలుసుకొందాం లేక వారానికిఒకసారి కలుద్దాం అప్పుడే నా పెద్దరికం నిలుస్తుంది అని నచ్చ చెప్పినవాడు .

  అన్ని- అంటే లెక్కప్రకారం 94 సినీ రేపులు చేసిన రౌడీ,ఆ ‘’రుచి ‘’మరిగి విశ్రు౦ ఖలం గా వీర విహారం చేస్తాడు .కానీ చలపాయ్ అలా కాలేదు .మనసు ను నిగ్రహించుకొన్నాడు .మకారద్వయం –మగువ, మద్యం ,సిగరెట్ లకు అసలు అలవాటు పడలేదు .జీవితాంతం వాటి జోలికే పోలేదు వ్యామోహ సినీ రంగం లో ఇలా నిగ్రహం గా బతకటం దుర్లభం .అయినా జితేంద్రియుడు అనిపించాడు .అలా ఋష్య శృంగుడు  గా ఆ సినీ రంగం లో ఉండటం ఎవరికీ సాధ్యం ?అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చలపాయ్ .అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ  ,కొంచెం పల్లెటూరి ముతక జోకులు పేలుస్తూ ,వాతావరణాన్ని చల్లబరుస్తూ  ఆడా, మగా అందరికి సన్నిహితుడై ,తన సద్గుణాలచేత అందరికి బాబాయ్ అయ్యాడు చలపాయ్ .చపల చిత్తం ప్రదర్శించని స్థిర చిత్తుడు చలపాయ్ బాబాయ్ .

  గూఢ చారి 116లో కృష్ణతో సినీ అరంగేట్రం చేశాడు .తర్వాత రామారావు కుటుంబం తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని సినీ నటుడుగా అప్రతిహతంగా కొనసాగాడు  .జూనియర్ ఏంటి ఆర్ సినిమా ‘’ఆది ‘’లో అతని బాబాయ్ వేషం లో మంచి గుర్తింపు వచ్చి అప్పటినుంచి ‘’బాబాయ్ పాత్ర ‘’లకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు .నిన్నే పెళ్ళాడుతా సినిమాలో హాస్యం పండించాడు చలపతిరావు చేత దర్శకుడు కృష్ణ వంశీ .అప్పటినుంచీ హాస్యం లోనూ రాణించాడు .నటిస్తూనే కలియుగ కృష్ణుడు ,కడప రెడ్దేమ్మ ,జగన్నాటకం ,ప్రెసిడెంట్ గారి అల్లుడు చిత్రాలు నిర్మించాడు .దర్శకుడు బోయపాటి శ్రీను బాబాయ్ కి మంచి పాత్రలిచ్చి నటిమ్పజేసి అతనిలోని నటన ను ఆవిష్కరింప జేశాడు . చనిపోవటానికి నాలుగు రోజులు ముందు కొడుకు రవి బాబు నిర్మంచి దర్శకత్వం చేస్తున్న సినిమాలో వీల్ చైర్ లో నే కూర్చుని నటించాడు .ఇదే ఆఖరి సినిమా .సినీ రంగం లో ఎవరికీ ఏరకమైన కష్టం వచ్చినా ఫోన్ చేస్తే వెంటనే స్పందించే సహృదయ౦  బాబాయ్ ది.

  రామారావు గారితో చాలా సన్నిహిత్వం ఉన్నవాడుకనుక ఆయనే అతని ఆరాధ్యదైవం .ఆయనకు తప్ప వేరే నటుడికీ నమస్కారం చేయలేదని చెప్పాడు .తర్వాత తర్వాత కొంత లోకజ్ఞానం పెరిగి అందర్నీ గౌరవిన్చానని చెప్పుకొన్నాడు .రామారావు మీద ఉన్న అనేక అభాండాలు –అంటే సెట్ లోని నాప్కిన్స్ ,గదలు కిరీటాలు ఇంటికి పట్టుకు పోవటం వంటి వాటిని ఆయన్నే అడిగితె ‘’బ్రదర్ !నా వేషం కోసం ఆ నాప్ కిన్స్ ఇచ్చారు .అవి పవిత్రమైనవిగా నేను భావిస్తాను వాటిని అక్కడే వదిలేస్తే ఎవరెవరో తీసుకు వెళ్లి  మూతికీ ముడ్డికీ తుడుచుకోవటానికి ఉపయోగిస్తే వాటి  sanctity పోతుందని ఇంటికి తెస్తాను .గదలు కిరీటాలు సినిమా అయ్యాక గోడౌన్స్ లో పారేస్తారు .అవి ఎవరికీ ఉపయోగపడవు .ఎప్పటికప్పుడు కొత్తవే వాడతారు వాటిని తెచ్చి మ్యూజియం లో పెడతాను .అయినా ఎవరో ఎదో అన్నారని మన ధర్మం మనం మానకూడదు ‘’అన్నారని చలపాయ్ చెప్పారు .అన్నగారు పార్టీ పెడితే ‘’నేను కూడా చేరతాను ‘’అంటే ‘’వద్దు నేనిప్పుడే రాజకీయ రొంపిలో పీకల్లోతు మునిగాను .మీరంతా హాయిగా నటిస్తూ జీవితాలు బాగు చేసుకోండి ఇది నామాట గా అందరికీ చెప్పు బ్రదర్ ‘’అన్నారట .

  విజయా వారి విజయవంతమైన చిత్రదర్శకుడు కెవి రెడ్డి ‘’ఉమా చండీ గౌరీ సంవాదం ‘’తీసి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతే విజయా సంస్థ  ఆయనకు ఇస్తున్న కారు సౌకర్యం కూడా రద్దు  చేస్తే రామారావు ఆదుకోన్నారని ,వాళ్ళ అమ్మాయిని చదువుకోసం అమెరికా పంపటానికి ఆయన అడగటానికి మొహమాట పడితే వెంటనే 50 వేలు ఇచ్చిపంపారానీ ,తాను  తీస్తున్న ఒక పౌరాణికి చిత్రానికి ఆయనే దర్శకుడు అని చెప్పి రోజూ సెట్ కు వచ్చి కూచోమని గౌరవంగా ఆహ్వానించి ,సినిమా రిలీజ్ కాగానే మరో లక్ష రూపాయలు ఇచ్చిన ఉదారుడు  ఎన్టిఆర్ అని పొంగిపోతూ చెప్పాడు చలపాయ్ బాబాయ్ .ఆయన  చేసిన గుప్తదానాలు లెక్కలేనన్ని అని ,వాటిని బయటకు చెప్పుకోవటం ఆయనకు ఇష్టం లేదని ఎందఱో పేద విద్యార్ధులకు ఆర్ధికసాయం చేశారని మనకు తెలియని విషయాలు ఎన్నో ఆన్తరంగికులుగా తనకు తెలిసినవి చెప్పాడు .

  నీలి కనుల చిన్నది అందానికి ప్రతిరూపం .ఈ నీలికనుల చినవాడు చలపతి రావు ,బల్లిపర్రు బుల్లోడు స్ఫురద్రూపంతో అందర్నీ యిట్టె ఆకర్షిస్తాడు .ఆయనతో ఉంటె టైం యిట్టె గడిచిపోతుందని అంటారు .అందర్నీ నవ్విస్తూ నవ్వుతూ సరదాగా గడిపే చలపాయ్ బాబాయ్ అలాగే  చిరునవ్వుతో,అనాయాస మరణం తో  78 వ ఏట మనకు దూరం అయ్యాడు .ఆయన ఆత్మకు శాంతికలగాలని, ఆకుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-12-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 25వ భాగం.28.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 25వ భాగం.28.12.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 59వ భాగం.28.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 59వ భాగం.28.12.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు-1

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు-1

  మనకు  వ్యాపార దిగ్గజాలుగా  టాటాలు,బిర్లాలు మోడీలు ,రాక్ ఫెల్లర్ లు మొదలైన వారు మాత్రే తెలుసు .కాని వీరికి ముందు చాలాకాలం క్రిందట వాణిజ్యం లో గణన కెక్కి ,పెద్దగా ప్రపంచానికి తెలియని వారి గురించి ఇప్పుడు తెలుసుకొందాం .వీరిజీవితలు, సాధించిన విజయాలు యువతకు మార్గదర్శకాలు .

1-సైమన్ పాటినో

స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అని మాత్రమె మనకు తెలుసు .కాని తన భార్య మాట విని ,తన ఆర్దికాభివృద్ధికి చక్కని రాచబాట వేసుకొన్నవాడు సైమన్ పాటినో.దక్షిణ అమెరికా బొలీవియా దేశం లో ,సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తు లో ఉన్న యాండీస్ పర్వత శ్రేణిలో ఓరూర్ అనే పట్టణం లో ఒకజర్మనీ దేశస్తుడు ఒక చిన్న స్టోర్స్ పెట్టి ,అనేకరకాల సరుకులు అమ్ముతున్నాడు .చుట్టుప్రక్కల చాలా చోట్ల నుంచి ప్రజలు వచ్చి ఈ దుకాణం లోనే సరుకులు కొనేవారు .ఈఖాతాదారుల్లో ఎక్కువ మంది తగరపు గనులు,కాఫీ తోటలు ఉన్న యజమానులు .ఆదుకాణ౦ లో  మన డాన్ సైమన్ పాటినో కేవలం గుమాస్తా మాత్రమె .అతడిపని కొట్టులో సరుకులుకొన్న వారినుంచి పాతబాకీలు వసూలు చేసి యజమానికి అప్పగించటమే .ఈ వలస దేశం లో బాకీలు వసూలు చేయటం చాలా కష్టమైన పనే.బాకీల వసూళ్ళకు రోజూ ఎక్కడికో అక్కడికి ప్రయాణం చేయాల్సి వచ్చేది .

 ఓరూర్ గ్రామానికి చాలా మైళ్ళ  దూరం లో తగరపు (టిన్ )గనులున్న యున్వియా అనే కుగ్రామం ఉంది .ఆగ్రామస్తుడు హిలేరియన్ ఆర్కి జర్మన్ స్టోర్స్ కు చాలాకాలం గా  17పౌన్లు బాకీ ఉన్నాడు .బాకీ తీర్చలేని పరిస్థితి ఏర్పడింది .ఈబాకీ వసూలుకు సైమన్ వచ్చాడు .ఇతడిని పంపుతూ జర్మన్ స్టోర్ కీపర్ ‘’బాకీవసూలు చేయకుండా తిరిగి వచ్చావో నీ ఉద్యోగం హుళక్కి ‘’అని గట్టిగా చెప్పి పంపాడు .బాకీదారు హిలేరియన్ దగ్గర ఒక్క పైసాకూడా లేదు ఆర్ధికంగా అప్పటికే కుంగిపోయి ఉన్నాడు .సైమన్ కు తన దయనీయ గాధ, అంతా వివరించి చెప్పాడు .సైమన్ కూడా తానూ బాకీ వసూలు చేసి తీసుకు వెళ్ళకపోతే తన ఉద్యోగం ఊడినట్లే అని బాకీ దారుకు చెప్పగా ,అతడూ ఎలాగో అలా ఈ గుమాస్తాను గట్టేక్కించి పంపాలని ఉన్నా, చేతిలో చిల్లిగావ్వకూడా లేదాయే .కిం కర్తవ్యమ్ ?చివరికి తన తగరపు గనిని జర్మన్ స్టోర్ యజమానికి హక్కుభుక్తాలతో దస్తావేజు రాయించి ,ఇంతకంటే తనదగ్గర ఏమీ లేదని బ్రతిమాలి ,దస్తావేజు ను సైమన్ చేతిలో పెట్టాడు .ఉత్త చేతులతో వెళ్ళటం కంటే ,ఇది కొంతనయం అనిపించి యజమాని సంతోషిస్తాడని తీసుకుని ఓరూర్  చేరి యజమాని చేతిలో పెట్టి అన్నీ వివరంగా చెప్పాడు .డబ్బు సంచులు వస్తాయని ఆశపడిన యజమాని,మెచ్చకుండా విపరీతంగా కోపం తెచ్చుకొని ‘’ఈ తగరపు కాగితం నాకెందుకు అక్కడ ఏముంది దిబ్బ తప్ప .కనుక నిన్ను శిక్షిస్తూ ఆ తగరపు దిబ్బ దాస్తా వేజు నీమొహం మీదే కొడతా దాన్ని నువ్వే అనుభవించు .ఇక నీ సేవలు చాలు దయచేయి ‘’అని మండిపడ్డాడు .చేసేది లేక తనపేర యజమాని రాయించిన దస్తావేజు తీసుకొని ,మళ్ళీ ఆ తగరపు గ్రామానికి బయల్దేరాడు సైమన్.అదృష్టం అంటే ఇలా తన్నుకొంటూ వస్తుంది .గుమాస్తా సైమన్ ఇప్పుడు తగరం గని యజమాని అయ్యాడు .

  సైమన్ పాటినో భార్య భర్తకు ధైర్యం చెప్పి ఆ కొండ కొంపలోనే కాపురం పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకొందామని చెప్పింది .కావాల్సిన త్రవ్వే పరికరాలు కొన్నాడు ఉన్నగోతులతో పాటు మరికొన్ని గోతులు తవ్వాడు .ఎంత తవ్వినా తగరపు పొర కనిపించక పోయే సరికి కు౦గి పోయాడు .అయినా పట్టు వదలక టిన్ రేకు తగిలే వరకు తవ్వగా తళతళమెరిసే గడ్డలు కనిపించి హమ్మయ్య అనుకొన్నాడు .వాటిని పరీక్ష చేయించటానికి లాపెజ్ నగరానికి తీసుకు వెళ్ళాడు .అక్కడి అమెరికన్ ఇంజనీర్ పరీక్షించి ‘’ఇవి తగరపు గడ్డలు తగరం పాలు బాగా ఎక్కువగా 60శాతం  ఉంది .రప్రపంచంలో ఎక్కడా ఇంత అత్యధిక శాతం లో తగరం ఉన్న గనులు లేవు నువ్వు అదృష్టవంతుడివి ‘’అని బుజం తట్టాడు .

  గనులుత్రవ్వి తగరం తీయాలంటే పెట్టుబడి కావాలి .భార్య పినతండ్రి 60 పౌన్లు అప్పు ఇచ్చి ప్రోత్సహించాడు .రెండేళ్ళు ఆగని దగ్గరే అజ్ఞాత వాసం చేస్తూ పాటినో దంపతులు ఉండిపోయారు . కూలీలలను పెట్టి వాళ్ళతోపాటు వీరిద్దరూ కూడా పని చేస్తూ పగలనక రాత్రనక విపరీతంగా కష్టపడ్డారు .గనిలో నుంచి ఒక వాగన్ తగరం తీయించి ,దాన్ని అమ్మి ,ఆ డబ్బుతో ,గనికి ప్రక్కల ఉన్న భూముల్ని కొనటం మొదలు పెట్టారు . రెండేళ్ళు ఆయెసరికి పనివాళ్ళు కొన్ని వందలమంది అయ్యారు .వారం వారం తగరం లోడు లాపెజ్ నగరానికి పంపిస్తూ ,అమ్మగా వచ్చిన డబ్బు జాగ్రత్త చేస్తున్నాడు .భార్య  సాయంతో.కొత్తభూములు కొంటూనే ఉన్నాడు .పెద్ద భూస్వామికూడా అయ్యాడు .

  ఒకరోజు పాటినో దగ్గరకు న్యూయార్క్ నగర ‘’గుగెన్ హీం బ్యాంక్ ‘’ప్రతినిధి వచ్చి ,అమెరికాలోని లోహవర్తకులు ఆ గనులనన్నిటిని కొనటానికి సిద్ధంగా ఉన్నారు అనే శుభ వార్త చెప్పాడు .ఎంత ఇస్తారు అని సైమన్ అడిగితె, ఒక లక్ష పౌన్లు ఇస్తారని చెప్పగా ,నమ్మలేకపోయాడు .మూడేళ్ళలో లక్ష పౌన్ల సంపాదన .ఆనందం ఉద్వేగం లతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు .తయారు చేసిన కాగితాలపై సంతకాలు పెట్టటానికి సైమన్ చేతిలో కలం పట్టుకోగా  తెలివైనది కనుక భార్య ‘’వాళ్ళంతట వాళ్ళే లక్ష ఇస్తామన్నారంటే దీనివిలువ కనీసం పది లక్షల పౌండ్లు ఉంటుంది .కనుక సంతకం పెట్టవద్దు కొద్దికాలం లో నువ్వు అమెరికాలో అందరికంటే అత్యధిక ధనవంతుడవు అవుతావు ‘’అని చెప్పింది .మూడేళ్ళ తర్వాత అమెరికన్ బ్యాంక్ మళ్ళీ కబురు చేసింది .భార్యకు చెప్పి విమానం మీద న్యూయార్క్ వెళ్లగా ఆగనులకంపెనీలో  సగంపైగా వాటాలు  అతనికే చెందేట్లు చేసి ,గనులు ఇచ్చినందుకు 10లక్షల పౌండ్లను సైమన్ కు ముట్ట జెప్పారు .

  అప్పటినుంచి సైమన్ గనుల్లో పని చేయలేదు .వ్యాపార నిర్వహణలో దేశ దేశాలు తిరిగాడు .ప్రపంచ తగర పరిశ్రమకుఅధ్యక్షు డయ్యాడు .అదులో సభ్యులు అందరూ ధనవంతులే .అందులో సైమన్ గొప్ప ధనవంతుడు అపర కుబేరుడు .60ఏళ్ళ వయసులోకూడా మాంచి చలాకీగా ఉండేవాడు .ప్రపంచ ధనవంతులలో ఒకడై, ప్రపంచ సుఖ వంతులలో కూడా సైమన్ పాటినోఒకడయ్యాడు .

  ఒక్కసారి 17పౌండ్లు నష్టపోయిన ఆ అదృష్టవంతుడు సైమన్ ,,తర్వాత ప్రతి అయిదు నిముషాలకు 17పౌన్లు లాభం గడిస్తున్నాడు .మొదటి ప్రపంచయుద్ధకాలం లో తగరం తగరపు రేకుల అవసరం యుద్ధ పరికరాల తయారు చేయటానికి చాలా అవసరమైంది .దీనితో సైమన్ పాటినో ధన సంపద ఎన్నో రెట్లు పెరిగింది .అమెరికాలో ఫోర్డ్ ‘’మోటారు కింగ్ ‘’అయినట్లే, పాటినో ‘’టిన్ కింగ్  ‘’అయ్యాడు ..స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో బొలీవియా మంత్రిగా కూడా సైమన్ పని చేశాడు .

టిన్ పరమాణు సంఖ్య50.సింబల్ –Sn.వెండి రంగులోహం మెత్తగా ఉంటుంది .పోస్ట్ ట్రాన్సిషన్ లోహం అంటారు .10స్థిర ఐసోటోప్స్ ఉంటాయి  .దీనికి మాజిక్ సంఖ్యలో ప్రోటాన్లు ఉంటాయి .ఆహార పాకింగ్ కోసం టిన్ డబ్బాలు తయారు చేస్తారు .

సైమన్ 1-6-1860లో పుట్టి ,20-4-1947న  88 ఏళ్ల వయసులో చనిపోయాడు 

ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-12-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 24వ భాగం.27.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 24వ భాగం.27.12.22

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 58వ భాగం.27.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 58వ భాగం.27.12.22

Posted in రచనలు | Leave a comment

ఏక ప్రాస శ్రీ కృష్ణ శతకం

ఏక ప్రాస శ్రీ కృష్ణ శతకం

వెల-కేవలం’’ భక్తి ‘’ గా ఏక ప్రాస శ్రీ కృష్ణ శతకాన్ని,అంతకు ముందే శ్రీరామ శతకం రాసిన అనుభవంతో తూగోజి లోని ‘’కాజాలకు,పూతరేకులకు ‘’ ప్రసిద్ధి చెందిన ‘’తాపేశ్వర౦’’ నివాసి శ్రీ ఏనుగు తమ్మిరాజు కవి రచించి ,రాజమండ్రి శ్రీ రామముద్రాక్షర శాలలో 1924న ప్రచురించారు .ఇది కంద పద్య శతకం ‘’.కృష్ణా’’అనేది శతక మకుటం .’’ ర ‘’కార ప్రాస తో రాసిన శతకం .

‘’శ్రీరామనామ తారక –మేరీతి నుతించె మున్ను నిష్టాప్తికి ,నా –గౌరీ మనోజ్ఞా భాస్కరు –నారాధించెద ద్రిశుద్ధి ననిశము గృష్ణా ‘’అని శతక ప్రారంభం చేశారుకవి .గౌరీశుని కొలిచి తర్వాత భారత వంశాన్ని ప్రస్తుతిస్తానని చెప్పారుకవి .భారతావనిలో పుడితే పాపాలుపోయి విష్ణు సేవా పరతంత్రులౌతారు,నానా ధర్మోద్ధరణతో వన్నె ,వాసికెక్కుతారు ,’’సత్యం వద ధర్మం చర’’నుబోదిస్తూ ఆచరిస్తారని ,భారతపుత్రులు సద్గుణ రాసులు ,సకల కార్య సాహసులు ,యశోదీరులు ,శూరులు ,విమలాకారులు ,కరుణాస్వరూప కలితులు    అని హామీ యిచ్చారు .తర్వాత ‘’భారతము చదువ కుండగ- నేరిచిన కవిత్వ మెల్ల నీరస మగుటన్ –భారతము జదివి పిమ్మట –ధీరులు  చెప్పెదరు కవిత ధీ ధృతి కృష్ణా’’అని భారత ప్రాశస్త్యాన్నిప్రస్తుతించారు .భారతం లోక పూజ్యమని కీర్తించి ,భారత కవిత్రయానికి ప్రమాణాలు సమర్పించారు . జీవకోటికి రాజేతల్లీ తండ్రీ ,రాజుమాట అందరికి ఆచరణీయం .నరపతి ధర్మం తప్పితే ,నరులు అక్రమ భూషణులైతే ,కరువుకాటకాలు తప్పక వస్తాయి .

  శరణు అన్నవాడిని రక్షించకపోతే ఆపాపానికి రాజు మరణం పాలౌతాడు .భూరమణుడు క్రూర అమాత్యుల మాటలకు అధిక ప్రాధాన్యమిస్తే ‘’కొంప కొల్లేరు ‘’అవుతుందని రాజులకు హెచ్చరిక చేశారు .రాజు పాలించే రాజ్యం పాప భూయిష్టం అయితే అందులోని ‘’శూరులు జీవచ్చవాలు ,క్రూరులు మృతజీవులు అవుతారని చెప్పారుకవి .’’రాజ్యాంతే నరకం ధృవం ‘’అని పరమపావనులు వాక్రుచ్చారన్నారు .’’నరజన్మ మెత్తినందుకు –కరుణారస మొండుహృదయకమలము నందున్ –గురితించి ,జీవకోటిని బరికి౦చుట భావ్యమండ్రు ప్రాజ్ఞులుకృష్ణా ‘’.మరణ భయంతో నరులు దారీతెన్నూ కానక పరితపిస్తున్నారు –‘’మరణించటం జన్మించటం పరమాద్భుత ప్రకృతి చర్య ‘’అని చక్కగా చెప్పారు .’’మరణార్తి దీర్చి బ్రోవగ సరగున ప్రత్యక్ష మవటం నిజం నిజం .

  శ్రీరామ తారకమంత్ర ప్రాశస్త్యం వర్ణిస్తూ –‘’శ్రీరామనామ తారక –సారామృతపానమత్త స్వా౦తుడు ‘’ జననమరణ క్రూర రుజా ఘోరభీతి చెందడు అని అభయమిచ్చారు కవి .వీరులలో వీరుడివిగా,రాజులలో రారాజువుగా ,శూరులలో శూరుడివి గా ‘’పౌరుష కీర్తులు గడించి ప్రబలినావుకృష్ణా ‘’ అన్నారు .సద్గుణాలు ఎన్ని ఉన్నా ,లోభం ఉంటె ‘’చిరజీవి రీతి బ్రతికెడు –చరజీవి ‘’అంటారు .నీకొడుకు మారుడు ,పాంధలోక మారకుడు ,దుర్వారుడు ఇలాంటి విచిత్రం ఎక్కడైనా ఉందా ?అని చిత్రంగా కడిగిపారేశారు .’’నీకుమారుడు మారుడు క్రూరుడు ,శుకపిక వారమైన సేనతో దుర్వార౦గా ఉంటాడు ‘’వాసంతిక భారము తాళజాలునే –నారీమణి రాధ జీవనమ్ములకృష్ణా ‘’అని ప్రశ్నించారు .

  క్రూరత్వంతో దుష్ట చతుష్టయం అభిమన్యకుమారుని చంపినా ,’’మారణము జేయ నెరిగియు –గారణ మెరిగింపని ఘనుదవునువ్వు ‘’అని నర్మోక్తితో పలికారు .తర్వాత కృష్ణావతార గాధను కమ్మని పద్యాలలో పలికించారు .దేవకీ కొడుకు యశోదానంద వర్ధనుడవటం ‘’ఏరికి గల్గని భాగ్య౦ –బీరీతి లభించే గొల్ల కేమందు భళీ !వారెట్టి పుణ్యమూర్తులో ,వారెట్టి తపః ప్రభావ భవ్యులో ‘’ , అని యశోదానందుల అదృష్టాన్ని కొనియాడారు .వీరికి పుట్టిన బిడ్డగానే భావించి వ్రేపల్లె పల్లెపడుచులు ప్రొద్దున్నే  వచ్చి మంగళహారతి పట్టారు శిశు  బలరామ ,కృష్ణమూర్తిలకు  .

‘’హారతి గైకొనవేమొకో- మారా సుకుమార  మారమా హృచ్చోరా –మారాకారా యని వె-మారాసుకుమారులు గూర్చి మగువలు కృష్ణా’’  అని సుకుమార పద్యరాజాన్ని అత్యంత సుందరంగా భావ గర్భితంగా రాశారుకవి తానూ మురిసిపోయి ,మనలనూ మురిపించారు .’’ఆరేళ్ళ ప్రాయంలోనే మేనమామ కంస రాజును మారణం చేశావు ‘’మాయురే కృష్ణా అని ఆశ్చర్యపోయారు .గోపవనితల విరహాలు తీర్చాడు .కేళి కారతిలో కరగించి ,వలపు తెనేలలోవంశీ నాదంలో ఆన౦ద సాగరంలో ముంచి తేల్చావని పొగిడారు .భయం వద్దు ‘’మై హూనా ‘’అంటూ ‘’మీరెలా చింత పొందెద-రీరేల నిరతంబు నిట విహరి౦పన్ –మీరతి సౌఖ్యము బొందగ-గోరికలీడేరు ననెదుకొ౦టెవు కృష్ణా ‘’అని ద్వంద్వార్ధ ప్రయోగంతో అతిసౌఖ్యం, రతి సౌఖ్యం కలిగించి తృప్తి చెందిస్తానని కొంటె కృష్ణయ్య అన్నాడని బలే రంజుగా చెప్పరుకవి .’’ఏరీ భూతములైదును ,-నుదారతసృష్టించు నట్టి దైవము మాకీ –తీరున బొడసూపుట మా –భూరి ప్రాభవము గాదె పుణ్యా కృష్ణా ‘’అని తమ అదృష్టానికి గొల్లెతలు పొంగిపోయారట.

  ‘’శారద చంద్ర జ్యోత్స్నల  -సారెకు సారెకు బిల్చి సారసముఖులన్ –గూరిమి రాసక్రీడలు ‘’కోరతావట ఇది న్యాయంగా ఉందా కృష్ణా ‘’అని నిలేశారు కవి .ఒక్కపెళ్ళాం తోనే వేగలేక మేము బెంబేలెత్తి పోతుంటే ‘’ఎలా పెళ్ళాడావయ్యా పదియారువేల దండ్రీ కృష్ణా ‘’అని బోల్డు ఆశ్చర్యపోయారు .నరనారాయణులు పరమ తపోధనులు ధర్మమార్గాన్వితులు భారతావనిలో జన్మించటం మన అదృష్టం అని పొంగిపోయారుకవి .కురుపాండవ యుద్ధం లోధర్మ మూర్తులైన పాండవులపక్షం లో ఉంటూ ‘’పార్ధునికి సారధి వైతివి భళీ !నీ సారధ్యము చిత్రమే కాదు లోకపావనం గీతా మకరంద సారజన్యం ‘’అంటారు .ఆయుక్షీణం,స్థిర చిత్త వినాశకం ,ధీ మాంద్యం ,మరణ ఆసన్నం ‘’పరకాంతా విహరణం ‘’అని గొప్ప సూక్తి పలికారు .

  ఏమీ తెలియకపోయినా ,విద్యలేవీ నేర్వకపోయినా అంతులేని నీ కృపారసం నాపై ప్రవహించగా –‘’శ్రీరమ కృష్ణ శతకము –లీరీతి రచించి నాడ నేక ప్రాసన్ మీరరసి వీని దోషము -లారూఢి,క్షమి౦పవలయు ననిశము కృష్ణా ‘’అని అపరాధ శతం గా 123 వ పద్యం చెప్పారు కవి .

124చివరి కందం లో ‘’ఏనుగు బుచ్చిరాజు కుమారుడు-‘’కవితా స్వారస్యామృత పాన వి-చార సదాచారనయుడు సాకుము కృష్ణా ‘’అని తండ్రిపేరు చెప్పి  సాకుము అని విన్నపాలు విన్నవించారు కవి .అత్యద్భుతకవితాదార ప్రతి కందంలో అందంగా కనిపిస్తుంది .కంద పిలకలు లాగా పద్యాలకుదురు మహదానందాన్ని కలిగిస్తుంది .ఒకరకంగా కందంలో కవితామరందాన్ని నింపి, ఆనంద అమృతాన్ని మనకు పంచిపెట్టారురుకవి .తాపేశ్వరం కాజాల ,పూతరేకుల తీపితనం ప్రతిపద్యంలో నింపారు .పూతరేకులు తయారు చేయటం గొప్ప విద్య .అందులో నాణ్యత ప్రధానం. ఆ నాణ్యతా ఆ తీయందనం ప్రతిపద్యంలో గోచరించింది .కాజా సౌందర్యం ,ఊరే రసం పద్యాలలో తొణికిసలాడాయి  .

ఊరిపేరుకు ఈరకంగా శతకంతో గౌరవం చేకూర్చారు తాపేశ్వర కవీశ్వరులు తమ్మిరాజుకవిరాజు .ఆయన ధన్యులై ,మనల్నీ  ధన్యులని చేసి తరి౦ప జేశారు .మహా భక్తకవి శ్రేణిలో నిలిచారు ఈ కవి వరెణ్యులు .కవిగారినీ శతకాన్ని పరిచయం చేసి, నేను ధన్యత చెందాను .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 23వ భాగం.26.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 23వ భాగం.26.12.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 57వ భాగం.26.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 57వ భాగం.26.12.22

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment