శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 16వ భాగం.12.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 16వ భాగం.12.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.12.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 9వ భాగం.12.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

స్వయం క్రమశిక్షణ కు సాధనం స్వాతంత్ర౦

సఅని చాటి నిరూపించిన వాడు ఐసెన్ హోవర్ .దాదాపు 30 యేళ్ళు  ఆకర్షణ లేని మిలిటరీ ఉద్యోగాలలో శ్రమిస్తేకాని ఆయనకు జనరల్ పదవి దక్కలేదు .అప్పటికే ఆయన సహోద్యోగులు అనేక మెడల్స్ సాధించి యుద్ధరంగం లో కీర్తి ప్రతిష్టలు పొంది అమెరికా ప్రజలను ఆకర్షించారు .1944లో మిత్రపక్షాల తరఫున  రెండవ ప్రపంచ యుద్ధం లో సుప్రీం కమాండర్ గా నియమింప బడ్డాడు అప్పుడు అతడు అమాంతం మూడు మిలియన్ల సేనలకు,  50మిలియన్ల పైగాఉన్న ప్రజలకు .కమాండర్ అయ్యాడు అలయన్స్ సేనలకు కమాండర్ గా 700మిలియన్ల సిటిజన్స్ కు నాయకుడు .అందుక ఇదివరకు తానున్న తీరుకు భిన్నంగా తాను మిక్కిలిగా యెక్కువగా 

కఠినంగావ్యవహరించాల్సి వచ్చింది -.అప్పుడు ఆయనకు  .ఆదేశం  భయ పెట్టటం కన్నా పరస్పర సంప్రదింపులే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని తోచింది  ..తన ఉద్రేక భావా వేశాలు  కంట్రోల్ లో ఉంచుకొని ఓర్పుతో నేర్పుతో ,తానే ఒక ఉదాహరణగా ఉంటూ వ్యవహరించాలని నిర్ణయించుకొని అద్భుత ఫలితాలు సాధించాడు .యుద్ధంలో అజేయ పరాక్రమ శౌర్యాలను ప్రదర్శించి రెండవ ప్రపంచ యుద్ధ  విజేతగా నిలిచి ప్రపంచ ప్రజల మన్ననలు అందుకొన్నాడు .కమాండర్ గా ఐసెన్ హోవర్ సాధించిన యుద్ధ విజయాలు ,అంతకు ముందు ఎవరూ సాధించనూ లేదు ఆతర్వాత ఎవరూ సాధిస్తారని ఆశించనూ లేము 

  యుద్ధానంతరం డ్వైట్ డి..ఐసెన్ హోవర్ ఆమెరికా 34వ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడి ,ఆయుధ శాలగా మారిన ప్రపంచం లో ,ఆయనఒక్కడే యెకైక బహు శక్తి వంతుడైన మానవ నేతగా నిలబడి మళ్ళీ ప్రపంచ దేశప్రజలచే ఆరాధింపబడ్డాడు .నిజంగా అప్పుడు ఆయనకు ఇలా,అలా  చేయాలని చెప్పగల సాహసం కలవారుకాని ,మరే బలీయమైన శక్తి కానీ ఆయనను ఆపగలిగే స్థితిలో లేదు .అంతటి విశిష్ట విపరీత అధికారాలు చేతిలో ఉన్న యుద్ధ విజేత అయిన కమాండర్ ప్రెసిడెంట్ ఆయన ..ఆయన ఎదుటబడి  పొగడటానికి కానీ ,భయంతో దూరంగా ఉండటానికి కానీ ఎవరూ ప్రయత్నించలేదు .అయినా ఆయన ప్రెసిడెన్సీ లో కొత్త యుద్ధాలు కాని ,విచక్షణారహిత మారణ ఆయుధ ప్రయోగాలుకాని జరగకపోవటం ,సంఘర్షణలు తీవ్రరూపం దాల్చటం వంటివి లేకపోవటం మరో విచిత్రం .ప్రెసిడెంట్ గా పదవీ విరమణ చేస్తూ దూర దృష్టితో యుద్ధ యంత్రాల అంటేమిలిటరీ -ఇండస్ట్రియల్  సృష్టి యుద్ధాలను పెంచేవే ఆని , వార్నింగ్ ఇచ్చాడు .ఆయన ప్రెసిడెంట్ పదవిలో ఉండగా చేసిన ఒకే ఒక మిలిటరీ ఆపరేషన్  జరిగింది అదేమిటి అంటే 101 వ యిర్ బార్న్ డివిజన్ ను స్కూలుకు వెడుతున్న ఆఫ్రో అమెరికన్ విద్యార్ధ బృందాన్ని సురక్షితంగా స్కూల్ కు చేర్చటం .అంతకు మించి ఆయన ప్రెసిడెన్సీలో మిలిటరీ ఫోర్స్ ఎప్పుడూ ఉపయోగించలేదు .ఆయన చేసిన వాగ్దానాలు భంగం కాలేదు నెరవేర్చాడు. అధోస్థితిలో ఉన్నప్రజలను ఆర్ధికంగా ఉచ్చ స్థితికి తెచ్చాడు ఇదంతా న్యూడీల్  వలన సాధించిన దేశప్రగతి .

  ఐసెన్ హోవర్ గొప్పతనం అంతా అసూయలో ,లేక ఆక్రమణ లేక దూకుడు దుందుడుకు స్వభావం లో ,లేక అత్యాశతో ప్రపంచ కుబేరుడు కావాలన్న కోరికతో కాదు .కేవలం సింప్లిసిటీ ,సంయమనం వల్లనే సాధించాడు .ఇవి తనను తాను నిగ్రహించుకోవటానికి తోడ్పడి,ఇతరులను నియంత్రించటానికి తోడ్పడ్డాయి .అదేకాలమ్ లో ఆయన సమకాలికులైన హిట్లర్  ముసోలిని ,స్టాలిన్ అనే విజేతలకంటే అతి భిన్నమైన ప్రవృత్తి ఉన్నవాడు ఐసెన్ హోవర్ ..అలానే మేకార్ధర,పాట్టన్ లకు భిన్నమైనవాడు అంతకు ముందూకాలమ్ లోని అలెగ్జాండర్ ,xerxes ,నెపోలియన్ లకూ చాలా భిన్నమైన వాడు .ఇంతకీ అతని లోని గొప్పగుణం  ఆశ అత్యాశకాదు సెల్ఫ్ మాస్టరీ అంటేస్వీయ స్వావలంబన .అదే స్వీయ అవగాహన -సెల్ఫ్ అవేర్ నెస్  స్వీయ నిగ్రహణ -టెంపెరెన్స్. అదే అందరి ఆదర్శం కావాలి .

  ఐసెన్ హోవర్ కు ప్రేరణ అతని తల్లి .ఆమె ఎప్పుడూ అతనికి ఒక సామెత చెప్పేది -”కోపం పై నియంత్రణ ఉన్నవాడు మహా బలశాలికన్న శక్తి మంతుడు”.అలాగే ”తననను తాను నియంత్రించుకొన్నవాడు ఒక మహానగరాన్ని ఆక్రమించినవాడికంటే బలవంతుడు ”ఇదే ఐక్ ను సరైన మార్గం లో నిలబెట్టింది .అలాగే రోమ్ కు చెందిన స్తాయిక్ ఫిలాసఫర్ ”సెనేకా వేదాంతి” రాజ్యపాలకులైన తన శిష్యులకు ”Most powerful is he who has himself in his own power ” అని ఉపదేశించేవాడు .

కనుక అయిసేన్ హోవర్ ”తనను తాను జయించి ,ప్రపంచాన్ని జయించాడు ”అని మనం గుర్తించాలి అదే ఆదర్శం కావాలి .

ఆధారం -రియాన్ హాలిడే రాసిన ”డిసిప్లిన్ ఈజ్ డేస్టిని”

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్ 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం48వ భాగం.11.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం48వ భాగం.11.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 15వ భాగం.11.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 15వ భాగం.11.12.22

Video link

Video link

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం47వ భాగం.10.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం47వ భాగం.10.12.22

Video link

Video link

Video link

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 14వ భాగం.9.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 14వ భాగం.9.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీ శంకర విజయం.,22వ భాగం

శ్రీ శంకర విజయం.,22వ భాగం

Video link

Posted in రచనలు | Leave a comment

మా మనవడు Sankalp, మాధురి ల ఎంగేజ్మెంట్ లో గబ్బిట ఫ్యామిలీ

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ శంకర విజయం.21వభాగం

శ్రీ శంకర విజయం.21వభాగం

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 13వ భాగం.7.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 13వ భాగం.7.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 46వ భాగం.7.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 46వ భాగం.7.12.22

Video link

Video link

Posted in రచనలు | Leave a comment

కృష్ణాజిల్లా ఉయ్యూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీసువర్చలాంజనేయస్వామి వారి సన్నిధిలో హనుమద్వత్రం టీటీడీ ఎస్.వి.బి.సి.భక్తి ఛానల్ లో ప్రసారం జరిగిన న్యూస్ క్లిప్పింగ్

కృష్ణాజిల్లా ఉయ్యూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీసువర్చలాంజనేయస్వామి వారి సన్నిధిలో హనుమద్వత్రం టీటీడీ ఎస్.వి.బి.సి.భక్తి ఛానల్ లో ప్రసారం జరిగిన న్యూస్ క్లిప్పింగ్

Video link

Posted in రచనలు | Leave a comment

  మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -373

  మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -373

·         373-నటి ,ప్రవీణా ఆర్ట్స్ స్థాపకురాలు  ‘’కేరాఫ్ కంచరపాలెం ‘’సినీ నిర్మాత –పరుచూరి విజయ ప్రవీణ

·         పరుచూరి విజయ ప్రవీణ తెలుగు సినిమా నటి, నిర్మాత. కేరాఫ్ కంచరపాలెం సినిమాను నిర్మించడమేకాకుండా అందులోని ఒక ప్రధానపాత్రలో నటించింది.[

జీవిత విశేషాలు

ఆమె ప్రవాసభారతీయురాలు, న్యూయార్క్ లో సెయింట్ జార్జ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో వైద్యవిద్యనభ్యసించి కార్డియాలజిస్టుగా ఉంది. ఆమె తల్లిదండ్రులు తెలుగు భాష నేపద్యం కలవారు. చిన్నతనంలో తెలుగు చిత్రాల పట్ల ఆకర్షితురాలై ఫిల్మ్‌ స్కూలు లో చేరింది.[2] ఆమె తన స్నేహితురాలిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు దర్శకుడు వెంకటేష్ మహాతో మొదలైన పరిచయం కథ వినడంతో ఆగలేదు ఏకంగా సినిమా తీసే దాకా వెళ్లిపోయింది. సలీమా పాత్రకు ఎన్ని ఆడిషన్స్ చేసినా ఎవరు సెట్ కాకపోవడంతో ఆలస్యం జరగడం మొదలైంది. ఇలాగే అయితే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందనే భయంతో సలీమాగా తనే నటించడానికి రెడీ అయ్యారు ప్రవీణ. స్కైప్ ద్వారా వెంకటేష్ మహా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు.[3]

సంస్థలు

ప్రవీణ గారు “పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్” ని స్థాపించారు మరియు తెలుగు సినీ దర్శకుడైన వెంకటేష్ మహా గారితో “మహాయాన మోషన్ పిక్చర్స్” కి ఈమె భాగస్వామ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.

374-తెలుగు ,హిందీ సినీనిర్మాత ,జ్వాలాద్వీపరహస్యం ,ఇద్దరుమొనగాళ్ళు నిర్మాత –పి.మల్లికార్జునరావు

పర్వతనేని మల్లిఖార్జునరావు సుప్రసిద్ధ సినిమా నిర్మాత.ఆయన 70వ దశకంలో తెలుగులో అనేక మంచి చిత్రాలను నిర్మించారు

జీవిత విశేషాలు

ఆయన 1935 జూలై 27న కృష్ణా జిల్లాలో జన్మించారు.

సినిమా ప్రస్థానం

ఆయన సినిమాలపై మక్కువతో మధుపిక్చర్‌, భారతీ ఇంటర్‌, నేషనల్‌, సునందిని పిక్చర్స్‌ పతాకంపై పలు తెలుగుహిందీ చిత్రాలను నిర్మించారు. 1965లో జ్వాలాద్వీప రహస్యం (కాంతారావు- విఠలాచార్య)..ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత ఇద్దరు మొనగాళ్ళు, మంచి కుటుంబం, మంచి మిత్రులుఇంటి గౌరవం, ఇంటికోడలు, మహాబలుడు, నేనంటే నేనే తదితర చిత్రాలను నిర్మించారు. హిందీలో హిమ్మత్‌ (జితేంద్రతో), కీమత్‌ (ధర్మేంద్ర, రేఖ), మౌసుమ్‌ (సంజరుకుమార్‌) చిత్రాలను నిర్మించారు. 1976లో ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసలు లభించాయి. ఇవికాక సంజోగ్‌, ఆగాడిన్‌ ఆదిరాత్‌, ఏతో ఖనాల్‌ హోగయా, ఏ దేశ్‌, ఈశ్వర్‌ తదితర చిత్రాలు నిర్మించారు. జ్వాలాద్వీప రహస్యం, ఇద్దరు మొనగాళ్లు, మంచి కుటుంబం, మంచి మిత్రులు, ఇంటి గౌరవం, ఇంటి కోడలు, మహాబలుడు, నేనంటే నేనే లాంటి చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు. బాలీవుడ్‌ లో కూడా హిమ్మత్, కీమత్, వౌసమ్, సంజోగ్, ఏతో ఖమాల్ హోగయా, ఏ దేశ్, ఈశ్వర్ వంటి చిత్రాలను నిర్మించి తెలుగు పతాకాన్ని ముంబాయిలో ఎగురవేశారు. 1976లో రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు.[1]

వ్యక్తిగత జీవితం

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరణం

పర్వతనేని మల్లిఖార్జునరావు (76) 2012 ఫిబ్రవరి 21 న హైదరాబాద్‌లోని మెడ్విన్‌ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు.

375-తెలుగు హిందీ బెంగాలీ సినీ దర్శకుడు ,ఆత్రేయగారి శిష్యుడు ,హిందీ,బెంగాలీ  పాండవ వనవాస చిత్ర నిర్మాత ఇంటింటి రామాయణం సినీ ఫేం –పి.సాంబశివరావు

పర్వతనేని సాంబశివరావు సినిమా దర్శకుడు. ఆయన సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో తెలుగుతో పాటు హిందీబెంగాలీ చిత్రాలు కూడా ఉన్నాయి

జీవిత విశేషాలు

ఆయన 1935 సెప్టెంబరు 20 న ఏలూరులో జన్మించారు. బి.ఎస్.సి. వరకూ ఏలూరులోనే చదువుకున్నారు. డిగ్రీ పూర్తయ్యేటప్పటికి ఆయన నాన్నగారు చనిపోయారు. తరువాత ఆయన చదువు కొనసాగలేదు. ఆయన అన్నయ్య “నవశక్తి” గంగాధరరావుగారు అప్పటికే చిత్రపరిశ్రమలో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. ఆయన దగ్గరకు వెళ్లడంతో విక్రమ్ లాబరేటరీలో ఆఫ్రెంటీస్ గా చేర్పించారు. ఏడాది అక్కడ పనిచేసిన తర్వాత 1959లో సారథీ సూడియోస్ వారి ల్యాబ్ లో చేరారు. అయితే ఎందువల్లనో గానీ ఆయనకు తాను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదు. మానేద్దామనుకున్న తరుణంలో ఆయన అన్నయ్య “మా ఇంటి మహాలక్ష్మి” చిత్ర నిర్మాణం ప్రారంభించారు. హైదరాబాదులో పూర్తి స్థాయిలో రూపుదిదుకున్న తొలి చిత్రం అదే. ఆయన సొంత సినిమా కావడ చేత ఆయన ఉద్యోగం వరిలేసి ఆ చిత్రనిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆ చిత్ర దర్శకుడు రామినీడు గారి దగ్గర అసిస్టెంట్ గా చేరడంతో పాటు ప్రాడక్షన్ పనులు కూడా పర్యవేక్షించే వారాయన. ఆ సినిమా పూర్తయిన తర్వాత తాపీ చాణక్య గారి దగ్గర “జల్సారాయుడు” చిత్రానికి, సి.ఎస్.రా వుగారి దగ్గర “పెళ్లికాని పిల్లలు” చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. సి.ఎస్.రావుగారి దగ్గర చాలా సినిమాలకు పనిచేశారు.

ఆత్రేయ గారి వద్ద శిష్యరికం

ఆయన కొంతకాలం ఆదుర్తి సుబ్బారావుగారి దగ్గర పనిచేశారు. సుబ్బారావు గారి చిత్రాలకు ఆత్రేయ గారు రచయిత. రాసే అలవాటు ఆత్రేయగారికి లేనందువల్ల ఆయన డిక్లేట్ చేస్తుంటే అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకోవాలి. అందుకే ఆదుర్తి సుబ్బారావుగారు సాంబశివరావు గారిని ఆయన దగ్గరకి రాసుకొనే నిమిత్తం పంపించే వారు. అలా ఓ ఏడాది పాటు ఆత్రేయగారి శిష్యరికం చేశారు. అలాగే అవకాశం దొరికినప్పుడల్లా ఎడిటర్, డైరెక్టర్ అక్కినేని సంజీవి గారి దగ్గరకు వెళ్లి ఎడిటింగ్ నేర్చుకునేవారు.

బెంగాలీ లోకి “పాండవ వనవాసం

ఎన్.టి.రామారావుఎస్.వి.రంగారావుసావిత్రి వంటి ఉద్దండుల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ‘పాండవ వనవాసం” చిత్రాన్ని ఆ చిత్ర నిర్మాత ఎ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సాంబశివరావుగారి అన్నయ్య బెంగాలీ లో డబ్ చేసారు. బెంగాలీలోనికి అనువదింపబడిన తొలి చిత్రం అది. దీని డబ్బింగ్ బాద్యతలను సాంబశివరావుగారే నిర్వహించారు. దీనికోసం ఆయన కలకత్తా వెళ్ళి రెండు నెలలు ఉండి డబ్ చేసారు. “పాండబేర్ బనవాస్” పేరుతో విడుదలైన ఆ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది.

దర్శకునిగా

దర్శకునిగా ఆయనకు తొలి అవకాశాన్ని ఆయన తండ్రిగారు యిచ్చారు. హైదరాబాద్ మూవీస్ పేరిట ఒక సంస్థను నెలకొల్పి ఆయనతో సినిమా చేయడానికి సన్నాహాలు ప్రారంభించారాయన. అయితే ముందే ఒక షరతు పెట్టారాయన. కథ ఏమిటో దాన్ని ఎలా తీయాలో వివరంగా రాసివ్వమని, అది నచ్చితేనే సినిమా తీయుటకు అంగీకరిస్తానని తన తండ్రి చెప్పారు. అపుడు సాంబశివరావుగారు చెప్పిన “అర్థరాత్రి” సినిమా కథ నచ్చి సినిమా నిర్మించారు. దర్శకుడిగా అదే ఆయన తొలి సినిమా. జగ్గయ్య గారు హీరో, గ్రూప్ డాన్సర్ అయిన భారతికి హీరోయిన్‌గా ఇదే తొలి చిత్రం. ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు బి.ఎన్.రెడ్డి గారు కూడా తాన “బంగారు పంజరం” సినిమాలో ఈయన మార్గాన్ని అనుసరించారు. అర్థరాత్రి సినిమా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టింది. తరువాత అంత గుర్తింపు తెచ్చిన సినిమాలు రాలేదు.

ఇంటింటి రామాయణం

ఏలూరులో ఉంటున్న నిర్మాత, దర్శకుడైన విజయబాపినీడు గారు ఆయన స్నేహితుడు. సాంబశివరావు గారు దర్శకత్వం వహించిన కొన్ని సినిమూలు చూసి ఆయన “రంభ ఊర్వశి మేనక(1976) చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. కొద్ది కాలం విరామం తర్వాత చేసిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఆయనకు మళ్లీ వరుసగా అవకాశాలు ఆయనకు వచ్చాయి. “రంభ ఊర్వశి మేనక” చిత్రం షూటింగ్ జరుగుతుండగానే నవతా కృష్ణంరాజు గారు ఓ సినిమా చేయమని అడిగారు. ఆయన కూడా ఏలూరులో ఆయన స్నేహితుడు. ఇదే ‘ఇంటింటి రామాయణం‘. ఆ సినిమా పెద్ద హిట్ అయి ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.

హిందీ సినిమా ప్రస్థానం

ఆయన ప్రముఖ నిర్మాత, సత్యచిత్ర అధినేత అయిన సత్యనారాయణ గారి కుమార రాజాకొత్తపేట రౌడీఉద్దండుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఉద్దండుడు చిత్రం ప్లాప్ అయింది. ఆయన దర్శకత్వం వహించిన ఇంటింటి రామాయణం యొక్క ఘనవిజయాన్ని చూసిన నాగిరెడ్డి గారు గుండమ్మ కథ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయమని కోరారు. గుండమ్మ కథ హిందీలో “స్వయంవర్” పేరుతో ప్రారంభమైనది. ఆ చిత్రానికి ఎన్.టి.ఆర్ పాత్రను సంజీవ్ కుమార్, ఎ.ఎన్.ఆర్ పాత్రను శశికపూర్, సావిత్రి పాత్రను విద్యాసిన్హా, సూర్యకాంతం పాత్రను నాదీరా పోషించారు.

దర్శకత్వం వహించిన సినిమాలు

1.    అర్ధరాత్రి (1968)

2.    భలే మోసగాడు (1972)

3.    వంశోధ్ధారకుడు (1972)

4.    నిండు కుటుంబం (1973)

5.    ఉత్తమ ఇల్లాలు (1974)

6.    అమ్మాయిలూ జాగ్రత్త (1975)

7.    రంభ ఊర్వశి మేనక (1977)

8.    మనస్సాక్షి (1977)

9.    కలియుగ స్త్రీ (1978)

10.  కుమారరాజా (1978)

11.  ఇంటింటి రామాయణం (1979)

12.  అల్లరి బావ (1980)

13.  కొత్తపేట రౌడీ (1980)

14.  ప్రణయ గీతం (1981)

15.  ఈనాడు (1982)

16.  ఎంత ఘాటు ప్రేమయో (1982)

17.  ప్రేమ నక్షత్రం (1982)

18.  పెళ్ళి చూపులు (1983)

19.  ఉద్దండుడు (1984)

20.  మృగతృష్ణ (1992)

నిర్మించిన సినిమాలు

1.    ఇదికాదు ముగింపు (1983)

వ్యక్తిగత జీవితం

ఆయనకు ఇద్దరు పిల్లలు. 1990 నుండి సీరియల్స్ కి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో విజయవంతమైన “సత్యం” సినిమాను బెంగాలీ లోనికి రీమేక్ చేసారాయన. అలాగే అనేక టెలీఫిల్మ్‌ లను కూడా రూపొందిస్తున్నారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-22-ఉయ్యూరు 

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 12వ భాగం.5.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 12వ భాగం.5.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 45వ భాగం.5.12.22బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 45వ భాగం.5.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 45వ భాగం.5.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -371

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -371

· 371-మల్లయోధుడు ,టైగర ప్రొడక్షన్ అధినేత ,రేచుక్క పగటి చుక్క లో సినీ ఎంట్రీ ,కిమ్మీర ఘటోత్కచ పాత్రధారి ,అసాధ్యుడు ఆకహందుడు సినీ నిర్మాత –నెల్లూరు కాంతారావు

· నెల్లూరు కాంతారావు చలన చిత్ర నటుడు, వస్తాడు, సినిమా నిర్మాత. అనేక సినిమాలలో ప్రతినాయక పాత్ర పోషించాడు. టైగర్ ప్రొడక్షన్స్ అనే చిత్రనిర్మాణ సంస్థను ఎస్.హెచ్.హుసేన్ అనే వ్యక్తితో కలిసి స్థాపించి కొన్ని చిత్రాలను నిర్మించాడు. ఇతనికి నెల్లూరులో కనకమహల్ అనే సినిమా ప్రదర్శనశాల ఉండేది.

జీవిత విశేషాలు
ఇతడు నెల్లూరులో 1931, జనవరి 24న జన్మించాడు. నెల్లూరు వి.ఆర్.కాలేజిలో ఇంటర్‌మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇతనికి ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. చిన్నతనం నుండే శరీరవ్యాయామం చేస్తూ, దేహధారుఢ్యాన్ని పెంచుకున్నాడు. 1948 నుండి 1956 వరకు ఆంధ్ర, ఉమ్మడి మద్రాసు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఎందరో వస్తాదులను ఓడించి అనేక బిరుదులు, బహుమతులు, ఛాంపియన్‌షిప్‌లు సంపాదించాడు. ‘ఆంధ్రా టైగర్’ అనే బిరుదును పొందాడు.1952లో ఇండియా ఒలింపిక్ గేమ్స్‌కు ఉమ్మడి మద్రాసురాష్ట్ర ప్రతినిధిగా, 1956లో పోలాండ్ దేశం వార్సాలో జరిగిన వరల్డ్ యూత్ ఫెస్టివల్‌కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నాడు[1]. 1955 ప్రాంతాల్లో నెల్లూరుకు మల్లయుద్ధ యోధులను పిలిపించి నెల్లూరు వి .ఆర్క.కళాశాల మైదానంలో పోటీలు నిర్వహించాడు. కింగ్ కాంగ్ , దారాసింగ్ వంటిప్రసిద్దుల కుస్తీపోటీలు నెల్లూరివారికి చూచే అవకాశం కలిగింది. కొన్ని కుస్తీపోటీలలో కాంతారావు కూడా పాల్గొన్నాడు. ఆత్మీయులు ‘కాంతం’ అనే పిలిచేవారు. నెల్లూరులో ఉన్న కనకమహల్ థియేటర్‌లో ఇతడు, ఉమ్మడి కుటుంబంలో ఇతరులు కూడా భాగస్వాములు . కనకమహల్ వెనక భాగంలో వ్యాయామశాల, కుస్తిగరిడి ఎర్పాటుచేసి స్థానికులకు వ్యాయామం చేసుకొనే వీలు కల్పించాడు. 1959లో రేచుక్క-పగటిచుక్క సినిమాలో వస్తాదు పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించి నటుడిగా, నిర్మాతగా మారాడు. టైగర్ ఫిలింస్ బ్యానరు మీదనే సినిమాలు తీసాడు. ఇతణ్ణి సినిమాల్లో ప్రవేశపెట్టింది ఎన్.టి,ఆర్.కు సంబంధిచిన నిర్మాణసంస్థ స్వస్తిశ్రీ ఫిలిమ్స్. పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే ఇతడు ఎందరికో స్నేహపాత్రుడైనాడు. నెల్లూరు కాంతారావు తోకలిసి హుస్సేన్ అనే మరొక వ్యక్తి టైగర్ ఫిలింస్.లో భాగ స్వామిగా ఉండేవాడు. కొన్ని హిందీ సినిమాలలో కూడా కాంతారావు నటించాడు. అంతగా అనుభవం లేకున్నా కేవలం తన మంచితనంతోనే నిర్మాతగా మారి అసాధ్యుడు, అఖండుడు లాంటి సినిమాలను నిర్మించాడు.

కాంతారావు నెల్లూరు వామపక్ష రాజకీయాలకు అండదండగా ఉన్నాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినపుడు మార్క్సిస్టు కమ్యూనిస్టుపార్టీవైపు వెళ్ళాడు. ఇతడు 1970, అక్టోబరు 8వ తేదీ నూజివీడులో ఆసుపత్రిలో మరణించాడు[2].

చిత్రరంగం
నటుడిగా

  1. బొబ్బిలి యుద్ధం (1964) – మల్లయోధుడు
  2. అంతస్తులు (1965)
  3. జమీందార్ (1965) – మూర్తి
  4. జ్వాలాద్వీప రహస్యం (1965)
  5. నర్తనశాల (1965) – మల్లయోధుడు
  6. పాండవ వనవాసం (1965) – కిమీరుడు
  7. వీరాభిమన్యు (1965) – ఘటోత్కచుడు
  8. గూఢచారి 116 (1966)
  9. అసాధ్యుడు (1967)
  10. ఇద్దరు మొనగాళ్లు (1967)
  11. కంచుకోట (1967)
  12. నిలువు దోపిడి (1968)
  13. నేనంటే నేనే (1968)
  14. వింత కాపురం (1968) – పులి
  15. ప్రేమ మనసులు (1969)
  16. అఖండుడు (1970)
  17. అగ్నిపరీక్ష (1970)
  18. రౌడీరాణి (1970)
  19. అల్లుడే మేనల్లుడు (1970)
  20. అందరికీ మొనగాడు (1971)
  21. భలేపాప (1971)

నిర్మాతగా

  1. సర్వర్ సుందరం (1966)
  2. నువ్వే (1967)
  3. అసాధ్యుడు (1967)
  4. అఖండుడు (1970)

372-కవి ,పఠాభిపంచాంగం ఫిడేలు రాగాలు డజన్ ఫేం ,తెలుగు,కన్నడ సినీ నిర్మాత .సంస్కార దర్శకుడు, స్వర్ణకమల విజేత –పఠాభి
తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. పఠాభిగా అతను ప్రసిద్ధుడు. ఫిడేలు రాగాల డజన్‌, పఠాభి పన్‌చాంగం అనేవి అతను ప్రసిద్ధ రచనలు. అతను తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం సినిమాలు నిర్మించాడు. కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన సంస్కార చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. చండ మారుత, శృంగార మాస, దేవర కాడు అనే కన్నడ సినిమాలను నిర్మించాడు. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేసాడు.
జీవిత విశేషాలు
పఠాభి 1919 ఫిబ్రవరి 19 న నెల్లూరులో జన్మించాడు. తండ్రి పేరు రామిరెడ్డి. భూస్వామి. మహాత్మా గాంధీ వారి ఇంటికి వచ్చినపుడు, అతను స్ఫూర్తితో అంతా స్వాతంత్ర్య సమరంలోకి దూకారు. రవీంద్రనాధ టాగూరు స్ఫూర్తితో పఠాభి శాంతినికేతన్‌కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. 1938లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు గూడూరులో కుటుంబ వ్యాపారమైన అభ్రకం ఎగుమతి వ్యాపారం చేసాడు. తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం చదివాడు. అమెరికా వెళ్లేముందే ఫిడేలు రాగాల డజన్‌ రచించాడు. తెలుగు ఆధునిక కవిత్వంలో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆదరణ ఉండడం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో చేరాలని అమెరికా బలవంతపెట్టింది. బ్రిటిషువాళ్లు భారతీయుల్ని జైళ్లలో నెట్టినందుకు నిరసనగా సైన్యంలో చేరేందుకు నిరాకరించారు. సాహసోపేత యాత్రతో అమెరికా వదిలి దక్షిణ అమెరికా, ఆఫ్రికాల మీదుగా నౌకలో భారత్‌ చేరుకున్నాడు.

దేశంలో అడుగుపెట్టాక 1947లో స్నేహలతా పావెల్‌ అనే మహిళను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆమె నటి. సామాజిక కార్యకర్త కూడా. 1925 హేడెన్లో జన్మించిన స్నేహలతా పావెల్ పూర్తిపేరు స్నేహలతా జాయిస్ పాట్రిషియా పావెల్. తల్లి లీలావతీ ఘోష్ అనే బెంగాలీ మహిళ, తండ్రి జేమ్స్ ఎబనైజర్ తంగరాజ్ పావెల్ అనే తమిళుడు. ఆమె కోసం అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నాడు. దంపతులిద్దరూ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్ వ్యవస్థాపక సభ్యుల్లో అతనుొకడు. సోషలిస్టు పార్టీలో పనిచేశాడు. వీరికి ఇద్దరు సంతానము. కుమారుడు కోణార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్యకారుడు. కూతురు నందనారెడ్డి కార్మిక న్యాయవాది, సామాజిక సేవా కార్యకర్త. 1947లో మదరాసులో ఫోకస్ అనే ఆంగ్ల వారపత్రిక నెలకొల్పి 36 వారాలు వెలువరించాక నిలిచిపోయింది. దీనికి స్నేహలత ప్రచురణకర్తగా వ్యవహరించగా, టి.పి.ఉన్నికృష్ణన్ సంపాదక బాధ్యతలు నిర్వర్తించాడు.

కె.వి.రెడ్డితో కలిసి జయంతి పిక్చర్స్‌ను స్థాపించి తెలుగు చిత్రాలు తీశారు. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అవార్డు దక్కించుకుంది. 1971లో సంస్కార చిత్రం రాష్ట్రపతి నుంచి స్వర్ణకమలం అందుకుంది. ఈ సినిమాలో అతను భార్య స్నేహలత ఒక ప్రధాన పాత్ర ధరించింది. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం అనుభవించి, అనారోగ్యంతో స్నేహలత 1977లో మరణించింది.

87 ఏళ్ళ వయసులో 2006 మే 6న పఠాభి బెంగుళూరులో మరణించాడు.

పఠాభి గురించి
· పఠాభి పంచాంగంలోని పసిడి పలుకుల విటమిన్‌-బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనస్సుకి ఆరోగ్యము, ఉల్లాసము సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను. ఏ సిద్ధ మకరధ్వజానికి, వసంత కుసుమాకరానికీ లేని పునరుజ్జీవన శక్తి ఈ మాత్రలకుంది. – అని మహాకవి శ్రీశ్రీ అతనుకు కితాబిచ్చాడు.

· భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది. – వెల్చేరు వారాయణరావు [1]

· 1930-40ల మధ్య భావ కవిత్వం మీద తిరుగుబాటు చేసి క్రొత్త ప్రయోగాలు చేసిన కవులు … భావ ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు. ఛందస్సు ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శిష్ట్లా, పఠాభి. – రావి రంగారావు[2]

· 2000 సంవత్సరానికి అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి అవార్డును పఠాబికి ఇచ్చారు.

· తెలుగులో ముద్రింపబడ్డ తొలి తెలుగు వచనకవితల సంపుటి “ఫిడేలు రాగాల డజన్”

· 1973లో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం పఠాభి ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత పుస్తకాలను పునర్ముద్రణ చేసింది.

· మనసు ఫౌండేషన్, (బెంగుళూరు) పఠాభి శతజయంతి సందర్భంగా, 2019 ఫిబ్రవరి 19న పఠాభి లభ్య సమగ్ర రచనల సంపుటాన్నినెల్లూరులో జరిగిన శతజయంతి సభలో విడుదల చేసింది. ఈ సంపుటానికి డాక్టర్ ఆర్.వి.సుందరం, డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, పారా అశోక్ సంపాదకులు.

రచనలు
· ఫిడేలు రాగాల డజన్

· కయిత‌ నా దయిత

· పఠాభి పన్‌చాంగం

ఉదాహరణగా కొన్ని కవితలు

పఠాభి కథలు, వ్యాసాలు, ఇంగ్లీషు కవితలు, జాబులు,

గణిత సమస్యలను సాధించేందుకు చేసిన కృషి,

తదితరాలు పఠాభి లభ్య సమగ్ర రచనల సంపుటంలో

చేర్చబడినవి.

నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరగ దంతాను
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాల దండిస్తాను…
అనుసరిస్తాను నవీన పంథా, కానీ
భావకవిన్ మాత్రము కాను నే
నహంభావకవిని.

మహానగరము మీద మబ్బుగమ్మి
గర్జిస్తున్నది
దేవుని ఏరోప్లేనుల్ భువికి దిగుచుననటుల

క్రాస్వర్డు పజిల్ లాగున్న
నీ కన్నులను సాల్వుజేసే మహాభాగ్యం
ఏ మానవునిదోగదా!

వాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందున టెలిస్కోపులు
మయిక్రాస్కోపులున్నవి

సినిమాలు
· సంస్కార (1970)

· చండమారుత (1977)

· నిమజ్జనం (1979)

· శృంగార మాస (1984)

· దేవర కాడు (1993)

· పెళ్లినాటి ప్రమాణాలు

· శ్రీకృష్ణార్జున యుద్ధం

· భాగ్యచక్రం

సశేషం
శ్రీ హనుమద్వ్రతం శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-5-12-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 11వ భాగం.4.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 11వ భాగం.4.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 43వ భాగం.3.12.22బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 43వ భాగం.3.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 43వ భాగం.3.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

బహుముఖ సేవాపరాయణి ,సహృదయ సంస్కారిణి ,స్వాతంత్రోద్యమ వీర నారి -ఓరుగంటి మహలక్ష్మమ్మ(వ్యాసం)-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -డిసెంబర్ 01/12/2022 గబ్బిట దుర్గాప్రసాద్

బహుముఖ సేవాపరాయణి ,సహృదయ సంస్కారిణి ,స్వాతంత్రోద్యమ వీర నారి -ఓరుగంటి మహలక్ష్మమ్మ(వ్యాసం)-గబ్బిట దుర్గా ప్రసాద్ -విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -డిసెంబర్ 01/12/2022 గబ్బిట దుర్గాప్రసాద్ నెల్లూరు జిల్లా కావలిలో 1884లో సంపన్నులైన తూములూరి శివకామయ్య ,రమణమ్మ దంపతులకు మహాలక్ష్మమ్మ జన్మించింది .ఆడపిల్లలకు బడి లేకపోవటంతో ఇంట్లోనే మంచి గ్రంథాలు చదివి గొప్ప పాండిత్యం సాధించింది .పడవకొండవ ఏట 1895లో కావలిలో నిరతాన్న దాతలైనలైన కుటుంబం లోని ఓరుగంటి వెంకట సుబ్బయ్యతో వివాహం జరిగింది .పెండ్లినాటికి ఆయన హైస్కూల్ విద్యార్దిమాత్రమే అయిన ఆయన తర్వాత పై చదువులు చదివి తాత, తండ్రిలాగా లాయరయ్యాడు .ఆయుర్వేదంపై మహా అభిరుచి ఉండటంతో ఆమందులు తయారు చేసి అమ్ముతూ వైద్యం చేసేవాడు .92ఏళ్ళ వయసులో ‘’ఆయుర్వేద యోగ సింధు ‘’అనే ఉద్గ్రంథం రాసిన మహా వైద్య శిఖామణి వెంకట సుబ్బయ్య . వెంకట సుబ్బయ్యకు దేశాభిమానం హెచ్చు .దేశ విషయాలు తెలుసుకొంటూ అందరికీ చెప్పేవాడు .మహాలక్ష్మమ్మ కాపురానికి రావటం తోనే రాజకీయాలతో పాటు భర్త ఆశయాలకు కూడా అలవాటు పడింది .దేశాభిమానం జాలి సేవాభావం ఆమెకు స్వతస్సిద్ధంగా అలవడినాయి . స్వయంగా వంట చేసి ,ఆర్తితోఅన్నదానం చేసేది .కష్టాలు, బాధలలో ఉన్నవారికి చేయూతనిచ్చి సాయం చేసి తృప్తి చెందేది ..1898నుంచే స్వదేశీ చేనేత వస్త్రాలు ధరించటం ప్రారంభించి ,విదేశీ వస్త్రాలను బహిష్కరించింది .అప్పటికి ఖాదీ అంటేవరికీ తెలీదు .గాంధీ ఇంకాదక్షిణాఫ్రికాలోనే ఉండ టం తో ఆయనకూ ఆభావన లేనేలేదు .అప్పటికే తిలక్ విదేశీ వస్తు వస్త్ర బహిష్కరణ,స్వదేశీ వస్తు వస్త్ర అభిమానం భారతస్వాతంత్ర్యోద్యమానికి సాధనాలు అని ఎలుగెత్తి చాటాడు .తిలక్ ప్రబోధంతో మహాలక్ష్మమ్మ కావలిలో స్వదేశీ వస్త్ర విక్రయ శాల స్థాపించింది .మంచి రంగులు ,జరీ పనితనంతో ఆ వస్త్రాలు మహిళలను విపరీతంగా ఆకర్షించాయి .చేనేత వారికి చేతినిండా పనిదొరికి, గొప్ప ఉపాధి లభించింది .. ఆమెకు అది గొప్ప పండుగ అయింది . 1905లో బెంగాల్ విభజన జరిగి ,బ్రిటిష్ ప్రభుత్వం పై ప్రజలకు విముఖత పెరిగింది .బహిరంగ జాతీయోద్యమం చేయాల్సిందే అని మహాలక్ష్మమ్మ దంపతులు భావించారు .సంగీత సమాజం ,భక్త సమాజం స్థాపించి ,నగర సంకీర్తన చేస్తూ ,నాలుగురోడ్ల కూడలి లో ఉపన్యాసాలిస్తూ ,దేశ భక్తీ స్వాతంత్రేచ్ఛ ప్రచారంచేశారు .ఇది తిలక్ గారి గణపతి ఉత్సవాలలాగా ఊప౦దు కొని వినూత్న ప్రయోగంగా ఆంధ్రదేశం లో జాతీయోద్యమానికి తోడ్పడింది ..దేశంలోని స్త్రీలు జాతీయోద్యమం లో చేరి చురుకుకుగా పని చేయాలని భావించి కావలి లో 1910లో మహిళాసమాజం ఏర్పరచి మహాలక్ష్మమ్మ కార్యదర్శిగా ఉంటూ ,ఆత్మ విశ్వాసం ,మహిళాభ్యుదయం పట్ల అచంచల విశ్వాసం ,దేశభక్తిని రుజువు చేసుకొన్నది .ఆకాలానికి అంతటి సాహసం చేసిన మహిళలేనే లేదు అనిపించుకొన్నది . బాలికా విద్యా వ్యాప్తికోసం కావలిలో 1912లో బాలికా పాఠశాలస్థాపించి ,తన ఇంట్లో రాత్రి పాఠశాల కూడా నిర్వహించింది .పదిమందికి ప్రయోజనకరమైన పని చేయాలనీ ,నవసమాజానికి దారితీయాలని ఆమె నిత్యం ఆలోచనలతో ఉండేది 1914-15లో కర్నూలు లో శ్రీ ముత్తరాజు వెంకట కృష్ణయ్య బాలవితంతువైన తనకుమార్తెకు విధవా పునర్వివాహం చేశాడని తెలుసుకొని చాలా సంతోషించి ఆకుటుంబాన్ని కావలికి ఆహ్వానించి పెద్ద ఎత్తున వనభోజనాలు ఏర్పాటు చేసింది .స్వాములవారు ఆంక్షపత్రాన్ని పంపితే ఆమెపుట్టింటి వారు కూడా వెలివేస్తే ,ఆమె చలించలేదు .కాశీ విద్యా పీఠం లో చరిత్ర, ఆయుర్వేద, వేదాంత, వ్యాకరణ,అలంకార శాస్త్ర కోవిదుడైన తమ మూడవ కుమారునికి బాలవితంతువుతో మద్రాస్ లో కాశీ నాథుని నాగేశ్వరరావు గారి సమక్షంలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించి తాను నమ్మిందీ చెప్పిందీ ఆచరణలో చూపిన ఆదర్శ మహిళ మహాలక్షమ్మ . 1917కు భర్త వెంకటసుబ్బయ్య కు న్యాయవృత్తి పై విముఖత కలిగి దేశసేవలో తరించాలని నిర్ణయించుకొని ,కుటుంబాన్ని నెల్లూరుకు తరలించాడు .అక్కడ అనీబిసెంట్ ప్రభావంతో హోం రూల్ లీగ్ స్థాపించి భార్యా భర్తలిద్దరూ తీవ్రంగా ప్రచారం చేశారు .పట్టణమంతా హో౦ రూల్ లీగ్ బాడ్జి లతో కళకళ లాడింది .1921లోశ్రీమతి పొణకా కనకమ్మ తో కలిసి నెల్లూరులోకాంగ్రెస్ సంఘ మహిళా విభాగం ఏర్పరచి తాను అధ్యక్షురాలుగా కనకమ్మ కార్యదర్శిగా సేవలు అందిస్తూ జాతీయవిద్యా విధానం లో విద్య నేర్పటానికి ‘’కస్తూరీ దేవి విద్యాలయం స్థాపించారు .దీనిని మహాత్మా గాంధీ సందర్శించి ‘’నెల్లూరులో చూడదగిన ముఖ్య ప్రదేశం ‘’కస్తూరీ దేవి విద్యాలయం ‘’అన్నాడు .ఆబాలికా విద్యాలయం ఈరోజు కళాశాలగా అభి వృద్ధి చెందింది . 1921లో గాంధీ పూరించిన స్వాతంత్ర్య శంఖారావం విని మహాలక్ష్మమ్మ వేలాది జనంతో రణరంగంలో దూకింది .ఆమెకు సహకరించినవారిలో తిక్కవరపు సుదర్శనమ్మ,కందాళై యతిరాజమ్మ మొదలైన వారున్నారు .ఎల్లాయిపాలెం ,బుచ్చిరెడ్డిపాలెం వగైరా గ్రామాలలోసంచారం చేసి ఖాదీ ,మద్యపాన నిషేధం ప్రచారం చేశారు .దీనితో 2లక్షలున్న ఆబ్కారీ ఆదాయం కేవలం 2వందలకు దిగజారిపోయింది. అంతటి ప్రభావం చూపించారు ఈ మహిళా మాణిక్యాలు, వారితోపాటు వెన్నెలకంటి రాఘవయ్య ,వెంకటసుబ్బయ్య ,తిక్కవరపు రామి రెడ్దిగార్లు .ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి తీవ్రనష్టం, అంతకంటే ఘోర అవమానం కూడా . మహాలక్ష్మమ్మ కుటుంబం వారంతా నూలు వడికేవారు ఖాదీనే ధరించేవారు .వీరి మూడవ కుమార్తె మైత్రేయి నూలు వడకటం పోటీలో స్వర్ణ పతకం గెలుచుకొన్నది .కావలిలో చేనేత వస్త్రాలయం స్థానం ఖాదీ విక్రయశాల నెలకొల్పారు .ఎంతోమందికి జీవనోపాధి కలిగించిన దూర దృష్టికల మహిళా మహలక్షమ్మ .ఉత్పత్తి అయిన ఖాదీ బట్టలను బుజాన వేసుకొని ,జాతీయ గీతాలు పాడుకొంటూ ఇల్లిల్లూ తిరిగి అమ్మేవారామె . 1927లో నెల్లూరు లో తుఫాను,కావలిలో కలరా వస్తే , 1928లో కావలిలో పేదల ఇల్లు కాలిపోయి నిరాదారులైనప్పుడు స్వయంగా పూనుకొని ,ఆహర పదార్ధాలు మందులు వస్త్రాలు సేకరించి ఆదుకొన్న దయాశీలి ఆమె .1930ఉప్పు సత్యాగ్రహం లో భార్తతో, కనకమ్మ మొదలైన వారితో కలిసి మైపాడు ,తుమ్మపెంట ,గోగులపల్లి లలో పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు .ఆరునెలలు రాయవెల్లూరు లో జైలు శిక్ష అనుభవించింది. అది జైలు అనిపించలేదు .మహిళలకు విజయ లాస్యంగా ఉండేది .1930డిసెంబర్ 26న విడుదలై ఇంటికి చేరింది . రెట్టించిన ఉత్సాహంతో స్వాతంత్ర్య సమరరంగంలోకి దూకి మహాలక్ష్మమ్మ ఖాదీప్రచారం ,మద్యపాన నిషేధం ,విదేశీ వస్తు బహిష్కరణ లతోపాటు అస్పృశ్యతా నివారణ ,ఉద్యమాలలో మహా చురుకుగా పాల్గొన్నది .జాలి, సానుభూతి ,దయ కల ఆమె హరిజన సేవలో ధన్యురాలైనది .1932 శాసనోల్లంఘన లో బహిరంగ ఉపన్యాసాలు చేస్తూ ప్రజలను చైతన్యపరచింది .నెల్లూరు శ్రీరంగనాయకస్వామి తిరుణాల జనసందోహం మధ్య ఆమె ఉపన్యసిస్తుంటే ,అరెస్ట్ చేసి ,దుకాణాలవద్ద పికెటింగ్ చేస్తోందని కేసుబనాయించి ఒక ఏడాది శిక్ష విధించి ,రాయవెల్లూరు జైలుకు పంపారు .అక్కడ ఆమెకు నరాలబలహీనత పెరిగి ,పక్షవాతం వచ్చి ,శిక్షాకాలం పూర్తికాకుండానే 27-8-1932న విడుదల చేశారు .ఈ జబ్బు అయిదుసార్లు వచ్చింది భర్త వైద్యంతో కోలుకొన్నది. భర్త వెంట నీడలా ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొన్నది మహాలక్ష్మమ్మ.వీరిద్దరి కుమారులు కూడా జాతీయోద్యమం లో పాల్గొన్నారు. అంటే మొత్తం కుటుంబం అంతా జాతీయోద్యమం లో పాల్గొని ధన్యత చెందింది .1942లో ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు భర్త మూడవ సారి జైలుకు వెళ్ళాడు .బలహీనంగా ఉన్న ఆమె భరించలేకపోయింది .మతి చలించింది మళ్ళీ మామూలు స్థితికి రాలేకపోయింది .భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందే 1945లో 61ఏట వీరనారి శ్రీమతి ఓరుగంటి మహాలక్ష్మమ్మ పుణ్యలోకాలు చేరింది .ఆమె త్యాగం సేవ సంస్కారం అనితర సాధ్యం . -గబ్బిట దుర్గా ప్రసాద్ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు .10వ భాగం.3.12.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు .10వ భాగం.3.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 9వ భాగం.2.12.22.

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 9వ భాగం.2.12.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కోటీశ్వర శతకం  

శ్రీ కోటీశ్వర శతకం  

శ్రీ ఈశ్వర ప్రగడ నృసింహారావు కవి తెలంగాణాలో శ్రీ గిరికి ఈశాన్యం లో నల్లగొండ జిల్లాసూర్యాపేట తాలూకా బేతవోలు గ్రామం లో శ్రీ తడకమళ్ళ సీతారామ చంద్రరావు దేశముఖ్ దేశపా౦డ్య ముఖద్దార్ ధర్మ కర్త్రుత్వంలో వర్ష పర్వతాగ్ర స్థితుడైన శ్రీ కోటీశ్వర స్వామిపై శ్రీ కోటీశ్వర శతకం రచించి ఆస్వామికి అంకితం చేశారు .మత్తేభ, శార్దూల విరాజిత పద్య శతకం .’’కొటీశ్వరా ‘’శతక మకుటం.వెల ,సంవత్సరం తెలుపలేదు .

  మత్తేభం లో విఘ్నేశుని ‘’గిరిజానందన యో గజానన మహా కీర్తి ప్రతాపోన్నతా ‘’అంటూ  ,చంపకమాలలో సరస్వతి ని’’మంజుల వాణివాణి సుర మాన్య శిరోమణిదేవి భారతీ ‘’అనీ .  స్తుతించారు .

 శతకం లో మొదటి పద్యం మత్తేభం లో –శ్రీ మత్సర్వ జగత్స్వరూప విబుధ శ్రేణీ నుతప్రాభవా –కామక్రోధ మదాద్యరి ప్రకర శిక్షా దక్ష ,సద్రక్షకా –భూమానంద మరంద సంభరిత హృత్ఫుల్లాబ్జలోకేశ్వరా –శ్రీ మద్బెతనవోలు వాస హర గౌరీనాథ కొటీశ్వరా ‘’అని ప్రారంభించి రెండవపద్యం శార్దూలం లో ‘’నీ సేవల్ స్తుతుల్ నతుల్ గృతులు నిర్నిద్ర ప్రభావంబుచే –రాసన్ వర్ణన చేయబూనుటకు  నామ్నాయంబులే క్రిందు మీదై’’తే నా వలన సాధ్యమా అని ఒక బీదఅరుపు అరిచారు ‘’దోషఘ్నమౌ నీ స్తవ ప్రసృతిన్ దా,బరుసంబునన్ గలసి స్వర్ణం బైన లోహం ‘’లాగా ‘’పస గాంచున్ గటయకృతీ౦ద్రము శుచిత్వం బంది’’అని గొప్పగా చెప్పారు .జగత్తులో పద్మం పుట్టి నీ హృదయ కాసారం లో ఆ నిగమాలు నిగమా౦తాలు విరిసి తేనెల్ వార  తుమ్మెదలనే భక్త బృందం ఆ మధువును తాగి ,నీనామ స్మరణతో ధన్యులౌతున్నారు .

  కవుల౦దరిలాగా తనదగ్గర రూకలు,విద్యా కౌశలం ,తీర్ధయాత్రా ఫలం లేవని ,నిన్నేస్మరిస్తా మోక్షం ఇవ్వమని కోరారు .ఇక్కడో ఎక్కడో నువ్వు ఉండేది తెలీదు కానీ నీ సన్నిధిలో ఆనందం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది .పాలసముద్రం త్రచ్చి విషం ఇవ్వలేను,పులి చర్మ౦  ఇచ్చే ధైర్యం లేదు ,ఆభరణాలు ఇవ్వాలంటే పాములంటేనే నాకు భయం కనుక ఒక నమస్కారం చేస్తా క్షమించు అని మస్కా కొట్టారు .అయ్యా అని ఎన్నోసార్లు పిలిచినా ‘’కుయ్యాలి౦పవు –రావయ్యా మ్రొక్కెద గదయ్యా బ్రోవరావయ్యా ‘’అంటూ అయ్యాపదంతో ఆర్తిగా అర్ధించారు .

  ‘’వర గాంభీర్యమగడ్తయై ధృతియే వప్రవ్రాతమై సద్గుణో త్కరముల్ సైన్యములై –నిజెంద్రియములే ద్వారములై తావక స్మరణ జ్ఞానమే ద్రవ్యమై యలరు యస్మత్స్వాంత దుర్గంబునన్-గరుణం గాపుర ముండుము ‘’అని మంచి పద్యం శ౦కరుల శివానందలహరి శ్లోకం తీరులో రాశారు .తన విశుద్ధ హృదయ క్షేత్రంలో దురితారణ్యంబాగా పెరిగి ,భయంకరంగా ఉందని ,దాన్నిఫాలనేత్రాగ్నితో  భస్మీటలం చేసి కాపాడమన్నారు  .సృష్టికి ప్రతి సృష్టి చేసే ఎంతటిమొనగాడైనా నిను కొల్వకపోతే ‘’కడు దుర్గతి పాలౌతాడు ‘’   .

  తనువు డస్సింది నాడులు సడిలాయి.బలం తగ్గింది  ,దంతాలు దిగజారాయి,జరా ,మాంద్యం ఆక్రమింఛి క్రుంగ దీశాయి .ఇక నిన్ను సేవి౦చ లేను .ఒక్కనమస్కారం చేస్తా మోక్షం ఇవ్వు అన్నారు .’’నీ విశుద్ధ భజనలే మాకు అండా,దండా ‘’.నీకోటి సూర్య ప్రభా రూపంతో నా అవివేక అంధకారానికి వెలుగు ప్రసాదించు .ఒకసారి నుదిటిపై ఏదో రాస్తే దానికే కట్టుపడాలా .అదిమార్చి నాకు సద్గతికల్గించు సర్వేశా అన్నారు చమత్కారంగా .నిన్ను అర్చించక స్మరించక నుతించక ఉన్నవాడు పుట్ట గానే చావటం మంచిది .

  ‘’భూమీచక్రము స్యన్దనంబుగ,నభంబు న్నీకపర్ధంబు-స్వామీ దిక్కులు కట్టు పుట్టములుగా వర్ధిల్లు నీ ఉన్నతా-వేమూలం గలదంచు  నెంతునిక ‘’నాకు ఈభావం చెప్పి ప్రేమతో దయచూడుకోటీశ్వరా ‘’  అన్నారు .ఆద్యం లేని సర్వాత్మ స్వరూపం చిద్యాగం చేసేవారికి స్వస్తి ,మోక్షమిచ్చే సామర్ధ్యం నీదే .

 చివరి నూరవ మత్తేభ పద్యం –‘’బలు పెక్కన్,సమరప్రధాన విజయ ప్రస్ఫూర్తి లేదింక,నా  – సాలు దృగ్జాలము చిక్క జేసే నను దీక్ష్ణ౦బౌ తపో వృత్తి గే-వల మాసింపక ,తల్లిదండ్రి గురు నాప్త శ్రేణినీవంచు మా-యలచే ద్రెళ్ళగ ముక్తి మార్గమిడి డాయం జేర్పు కోటీశ్వరా ‘’అని శతకం ముగించారు .

 కవి తనగురించి తన కుటుంబం గురించి ఏమీ చెప్పలేదు .మత్తేభ,శార్దూలాల పై  సులభంగా భక్తి స్వారీ చేశారుకవి .కవిత్వం లో కుంటులేదు .గెంతులు లేవు . హృది నిండా కోటీశ్వర ధ్యానమగ్నత తో ఇంపుగా కూర్చిన శతకం .శతకం లో భావాలు సాధారణంగా అందరు భక్తకవులు రాసేవే .నాకే ఈశతకాన్ని ఇదివరకు ఒకసారి పరిచయం చేశానేమో అనే భ్రమ కలిగింది .కోటీశ్వర శతకాన్ని ,శతకకర్త ఈశ్వర ప్రగడ నృసింహా రావు గారిని పరిచయం చేసి పరమేశ్వర దర్శన భాగ్యం పొందాను .కవి గారి ఇంటి పేరు లోనే ఈశ్వర శబ్దం ఉంది అందులో ప్రగ్గడ శబ్దం వారి కవితా ప్రతిభకూ నిదర్శనమే .కవి నృసింహుడు  అంటే కవితలో నృసింహుడు .కానీ ఇందులో ఉగ్ర నరసింహుడు కాడు,ప్రహ్లాదవరదుడైన వాత్సల్య నారసింహుడు అనిపించారు.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -369

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -369

· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -369

369-విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పెర్ట్ –నవీన్ మేడారం

· నవీన్ మేడారం,[1] భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. పైరేట్ ఆఫ్ కరేబియన్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా: ది సాండ్స్ ఆఫ్ టైమ్, హ్యారీ పాటర్, ద డార్క్ నైట్ వంటి వివిధ హాలీవుడ్‌ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు.

జీవిత విషయాలు
నవీన్ 1979, ఆగస్టు 7న నిజామాబాదు జిల్లాలో జన్మించాడు. హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేవాడు. ఆ తరువాత యునైటెడ్ కింగ్‌డమ్ లోని బౌర్న్‌మౌత్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఎఫెక్ట్స్ లో మాస్టర్ డిగ్రీ చదివాడు.

సినిమారంగం
లండన్‌లోని రెయిన్‌డాన్స్ ఫిల్మ్ స్కూల్ నుండి ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లొమా పొందాడు. రెయిన్‌డాన్స్ ఫిల్మ్ స్కూల్‌లో ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకొని లఘు చిత్రాలకు, సినిమాలకు పనిచేశాడు. ఫిల్మ్ స్కూల్‌లోని ఐదుగురు దర్శకుల బృందంతో కలిసి “మూవింగ్ ఆన్” అనే ఒక షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించాడు. తరువాత “ఫిలోఫోబియా” అనే లఘు చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని డబుల్ నెగటివ్ స్టూడియోస్, ది మూవింగ్ పిక్చర్ కంపెనీ, పైన్‌వుడ్ స్టూడియోలలో విజువల్ ఎఫెక్ట్స్ కంపోజిటర్‌గా పనిచేశాడు. ఎఫెక్ట్స్ ఆర్టిస్టుగా ది డా విన్సీ కోడ్, ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండ్ ది లాస్ట్ స్టాండ్, సిక్స్టి సిక్స్, సన్ షైన్ మొదలైన సినిమాలకు పనిచేశాడు.

లండన్ లైఫ్, నైస్ టూ మీట్ యు వంటి బ్రిటిష్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నవీన్, బాబు బాగా బిజి[2][3] (హిందీ చిత్రం హంటర్ర్ రిమేక్)[4] సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[5][6] నార్త్‌స్టార్ ప్రొడక్షన్ బ్యానరలో శరత్ మరార్ నిర్మాతగా “సిన్” అనే వెబ్ సిరీస్ ను రూపొందించి, అల్లు అరవింద్కు చెందిన ఆహా (ఓటిటి) ద్వారా విడుదల చేశాడు.[7][8]

సినిమాలు
సంవత్సరం

శీర్షిక

దర్శకుడు

నిర్మాత

రచయిత

ఇతరులు

గమనికలు

2015

నైస్ టూ మీట్ యు

Yes

Yes

Yes

[9]

2016

లండన్ లైఫ్

Yes

కాదు

Yes

విఎఫెక్స్ ఆర్టిస్టుగా

2017

బాబు బాగా బిజి

Yes

కాదు

స్క్రీన్ ప్లే

[10][11]

2020

సిన్

Yes

కాదు

Yes

వెబ్ సిరీస్[12]

2021

డెవిల్

Yes

కాదు

కాదు

[13]

విఎఫెక్స్ ఆర్టిస్టుగా
· లెస్ మిజరబుల్స్

· ఆల్ థింగ్స్ టూ ఆల్ మెన్

· డార్క్ షాడోస్

· ప్లానెట్ డైనోసార్

· పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్

· ది వెటరన్

· ది డెబ్యూట్

· స్కాట్ పిల్గ్రిమ్ వర్సెస్ ది వరల్డ్

· ప్రిన్స్ ఆఫ్ పర్షియా: ది సాండ్స్ ఆఫ్ టైమ్

· గ్రీన్ జోన్

· 2012

· హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్

· ది బోట్ దట్ రాక్

· కెప్టెన్ స్కార్లెట్

· ఇంక్ హార్ట్

· ది డార్క్ నైట్

· 10,000 బిసి

· క్లోవర్ఫీల్డ్

· హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్

· రైడ్ బై[14]

· సన్ షైన్

· సిక్స్టి సిక్స్

· ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండ్

· ది డా విన్సీ కోడ్

· పోసిడాన్

370-తెలుగు ఫిలిం చేంబర్ అధ్యక్షుడు ,నిర్మాత డిష్ట్రిబ్యూటర్-నారాయణ్ దాస్ నారంగ్
నారాయణ్‌దాస్‌ కిషన్‌దాస్‌ నారంగ్‌ (1946 జూలై 27 – 2022 ఏప్రిల్ 19) తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి (Telugu Film Chamber of Commerce) అధ్య‌క్షుడు (2019 – 2022).[1] ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్ అధినేత. సినిమా నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గాను సుపరిచితుడు. సుమారు 650కు పైగా సినిమాలకు ఆయన ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ చేశారు.

ఆయన పూర్వీకులది పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ ప్రాంతం. దేశ విభజన జరిగిన తర్వాత ఇండియా వచ్చారు. ముంబైలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత 1950లలో హైదరాబాదు వచ్చారు. కన్యలాల్ నారంగ్, లీలావతి నారంగ్ దంపతులకు నారాయణ్ దాస్ నారంగ్ జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. నారాయణ్ దాస్ కి భార్య సునీత, ముగ్గురు సంతానం. వారు సునీల్ నారంగ్, భరత్, మోనా.

76 ఏళ్ళ నారాయణ్ దాస్ నారంగ్ తీవ్ర అస్వస్థతతో 2022 ఏప్రిల్ 19న హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.[2] మరణ సమయానికి నాగార్జునతో ‘ఘోస్ట్’, ధనుశ్‌తో ‘సార్’ సినిమాతో పాటు సుమారు పది సినిమాల వరకూ నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా గతంలో తన శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో లవ్ స్టొరీ, లక్ష్య తదితర సినిమాలను నిర్మించారు.

సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 42వ భాగం.2.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 42వ భాగం.2.12.22

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారి మాతామహులు ,తొలి భాషా శాస్త్ర వేత్త –తాత వెళ్ళి మిఠా దార్ ,మహామహోపాధ్యాయ -ప్రొఫెసర్ టి.ఎం.శేష గిరి శాస్త్రి

శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారి మాతామహులు ,తొలి భాషా శాస్త్ర వేత్త –తాత వెళ్ళి మిఠా దార్ ,మహామహోపాధ్యాయ -ప్రొఫెసర్ టి.ఎం.శేష గిరి శాస్త్రి
18భాషలు నేర్చి ,దక్షిణ భారతం లో అగ్రగణ్యులై ‘’వీణాగాన కళా నారద ‘’బిరుదాంకితులై ,విద్యార్ధి కామధేనువుగా ప్రసిద్ధి చెందిన,తొలి భాషాశాస్త్ర(పైలాలజి ) వేత్త ,ఆంద్ర –ద్రావిడ పైలాలజి ,ఆంధ్ర శబ్దతత్వ ,తమిళ శబ్దతత్వ ,అర్ధానునుస్వారాది వ్యాకర్త,మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి సంస్కృత మహొపాధ్యాయులు ,ప్రాచ్య భాషాప్రవచనాధ్యక్షులు, ఆచార్య శేషగిరి శాస్త్రి గారు బ్రహ్మశ్రీ వేద౦ వేంకట రాయ శాస్త్రిగారికి మాతామహులు .
జననం –భాషలపై పట్టు ,ఇంగ్లీష్ పై అభిరుచిలేకపోవటం ,మద్రాస్ చేరటం
పూర్వ సేలం జిల్లా ఉత్తర ఆర్కాటు లోని తిరువత్తూరు తాలూకా లో వేంకట రమణశాస్త్రులు అనే భూస్వాములు (మిఠా దార్లు )పుదూరు ద్రావిడ శాఖీయులు .వారికుమారులే శేషగిరి శాస్త్రి 1847 లో మార్చి 20 న జన్మించారు .మహా పండితులైన తండ్రి కుమారుని తన అంతటి వానిని చేయాలనే సంకల్పం తో ఉన్నారు. కుర్రాడుకూడా సంస్కృత మహారాష్ట్ర ఆంద్ర ద్రావిడ కర్నాటక భాషలలో అద్భుత జ్ఞానం సంపాదించుకొన్నాడు .అయితే ఇంగ్లీష్ నేర్వాలని ఉండేది కాదు .కొడుకుతో ఇంగ్లీష్ చదివించాలని తండ్రి విశ్వ ప్రయత్నం చేశారు .అది తనవల్లకాదని ప్రయత్నం మానేశారు .చిన్నప్పటి నుంచీ స్వాతంత్ర ఇచ్చ ఉన్న కుమారుడు ,తండ్రి దగ్గరే ఉంటె బలవంతంగా ఇంగ్లీష్ నేర్పిస్తారని ,ఎవరికీ చెప్పకుండా రైలెక్కి మద్రాస్ చెక్కేశాడు .కొడుక్కు ఇష్టం లేకుండా ఏపనీ చెయ్యరాదని గ్రహించి తానె కుటుంబంతో మద్రాస్ చేరారు .అప్పటికి గాని మోకాలులో బల్బు వెలగలేదు పుత్ర రత్నానికి .ఇంగ్లీష్ అధ్యయనం అవసరం అని గ్రహించి ,ఆంగ్లం నేర్చి మెట్రిక్ పాసై ఇంగ్లీష్ తోపాటు పైన చెప్పుకొన్న భాషలన్నిటినీ నేర్చారు శేషగిరి శాస్త్రి .ఆది శేషావతారం కదా .
మాతృభాషా మమకారం –సంస్కృత పండిత ఉద్యోగం
ఇంగ్లీష్ ప్రభావంతో మాత్రు భాషలను మర్చి పోతున్న జనాలమనసు మార్చటం తన తక్షణ కర్తవ్యం గా భావించి ముందుకు దూకారు శాస్త్రి .ప్రెసిడెన్సి కాలేజిలో చేరి ఎఫ్ ఎ బిఎ లను 1871లో పాసై నారు ఈయనకున్న సంస్కృత పాండిత్యాన్ని గ్రహించి ,సంస్కృత పండితుడుగా ఉన్న ఆబర్ట్ దొర అయిదు నెలలు సెలవు పెట్టటంతో కాలేజి అధికారులు శేషగిరి శాస్త్రి గారిని ,ఆస్థానంలో సంస్కృత పండితులుగా నియమించారు .27ఏళ్ళ ఈ యువకుడు తన బోధనా పటిమచే ,విద్యార్ధుల సహోపాధ్యాయుల పై అధికారుల అభిమానం పొందారు .ప్రిన్సిపాల్ థాంప్సన్ ఈయన్ను ప్రొఫెసర్ నిచేసి జీతం పెంచాలని పై అధికారులకు రాశాడు కానీఆది ఫలించ లేదు .ఆపర్ట్ దొర శలవు పూర్తియి మళ్ళీ ఉద్యోగం లో చేరగానే శాస్త్రిగారి కొలువు ముగిసింది .
ప్రాచ్యలిఖిత పరిశోధన
శాస్త్రిగారి దృష్టి ప్రాచ్యలిఖిత గ్రంథ పరిశోధనపై పడి,1879నుంచి అలాంటి గ్రంథాలు సేకరిస్తూ ,ఆ సంవత్సరం అక్టోబర్ లో అమ్మకానికి వచ్చిన కొన్ని గ్రంథాలపై సవిమర్శకంగా ఒక లేఖను ప్రభుత్వానికి రాశారు .ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయనకు సహకారం అందించగా ,గ్రంథ సముపార్జన ధ్యేయంగా ఉన్నారు .
మొదటి సంస్కృత ఎం .ఎ ., భాషాశాస్తం –పైలాలజీ అభిరుచి ప్రాచ్యభాషా ప్రవచనా ధ్యక్షులు
పైలాలజిపై శాస్త్రి గారికి ఎపుడు అభి రుచి కలిగిందో తెలియదుకానీ ,ఆయన రాసిన ‘’ఆర్య ద్రవిడ’’పైలాలజి లో ని ఉపోద్ఘాతాన్ని చూస్తె ,విద్యార్ధి దశనుంచి ఆయనకు భాషా శాస్త్రంపై అభిమానం ఉందని అర్ధమవుతుంది .1875లో సంస్కృతంలో ఎం ఎ పరీక్ష ను ఇంగ్లీష్ లో రాశారు .మద్రాస్ ప్రెసిడెన్సి మొత్తం మీద శేషగిరి శాస్త్రి గారే మొదటి సంస్కృత ఎం ఎ .ఆతర్వాత మలయాళం ఒరియా హిందీ బెంగాలీ కొండు,లాటిన్ గ్రీకు భాషలు నేర్చి ప్రావీణ్యం సంపాదించారు .ప్రిన్సిపాల్ థాంప్సన్ చివరి రెండు భాషలు శాస్త్రిగారు నేర్వటానికి చాలా దోహదం చేశాడు .1877లో పాఠశాలల ఇన్స్పెక్టర్ గా నియమింపబడి ,మరుసటి ఏడాది ప్రెసి డెన్సికాలేజి ప్రాచ్యభాషా ప్రవచనా ధ్యక్షులయ్యారు .
ఫస్ట్ పైలాలజి ప్రవర్తకులు ,మహామహోపాధ్యాయులు ,క్యురేటర్
ఆ పదవిలో ఉండగానే అనేక భాషలు వాటి వాగ్మయం వాటి పైలాలజీ లపై గొప్ప ఉపన్యాసాలు చేసేవారు .కొద్దికాలం లోనే’’ పైలాలజి –ప్రథమ ప్రవర్తకులు ‘’గా గుర్తింపు పొందారు .1882లో ఆపర్ట్ దొర మళ్ళీ సెలవుపెట్టి స్వదేశానికి వెళ్ళగా ,ఆయన స్థానం లో శేషగిరి శాస్త్రి గారిని ‘’ప్రేసిడేన్సికాలేజి సంస్కృత మహామహోపాధ్యాయులుగా ,ప్రాచ్యలిఖిత పుస్తక భా౦డాగారానికి క్యురేటర్ గా ఒక సంవత్సర కాలం పని చేశారు .ఈకాలం లోనూ అందరి అభిమానాన్ని సంపూర్తిగా పొందారు .శాస్త్రిగారి భాషా సేవను ప్రస్తుతిస్తూ డాక్టర్ డంకన్ ప్రభుత్వానికి రాశాడు .గవర్నకు ఈయనపై గొప్ప సదభిప్రాయం ఉండేది .
సంస్కృత ప్రథాన సహోపాధ్యాయులు ,బహుభాషా పరీక్షాధికారి,ఫెలో
1885లో శాస్త్రిగారిని సంస్కృతం లో రెండవ సహాయ ఉపాధ్యాయులుగా నియమించారు .ఆమరుసటిఏడు ప్రథాన సహోపాధ్యాయులయ్యారు .డాక్టర్ అపర్ట్ 1893లో రిటైర అవగానే ఆస్థానం లో శాస్త్రి గారిని నియమించారు .ఆ ఉద్యోగం లో 1901 వరకు పని చేశారు .1876లోనే సంస్కృత పరీక్షకులుగా నియమి౦ప బడి,1883వరకు ఉన్నారు .1885నుంచి 1889వరకు తమిళ పరీక్షాదికరులై ఆపదివిలో సేవలందించారు .1890లో సంస్కృత పరీక్షక సభకు అధ్యక్షులై పదేళ్ళున్నారు . 1888నుంచి 1893 వరకు బి.ఎ.పరీక్షలకు పైలాలజి పరీక్షకులుగా ఉన్నారు .దివాన్ బహదూర్ ఆర్. రఘునాథ రావు సహాయకులుగా మహారాష్ట్ర భాషకు చాలాకాలం పరీక్షకులుగా ఉన్నారు .1882లో విశ్వవిద్యాలయ ఫెలోగా ఎన్నుకో బడ్డారు .
విశ్వవిద్యాలయం లో వేద,తర్క ,వ్యాకరణ ,అలంకార శాస్త్రాల బోధనా అధ్యయనం
శాస్త్రిగారు ప్రాచ్యభాషా ప్రవచానాధ్యక్షులుగా ఉన్నకాలం లోనే ,వారి పూనిక ప్రోత్సాహంతో బీ ఎం ఎ క్లాసులకు వేద,తర్క ,వ్యాకరణ ,అలంకార శాస్త్రాలబోధన, అధ్యయనం జరిగింది .విద్యాశాఖవారికి ,ప్రభుత్వానికి తెలుగు భాషా విషయంలో విశేషంగా తోడ్పడ్డారు .సంస్కృత భాషా పరీక్ష క సభాధ్యక్షులుగా ఉంటూనే ,తమిళ ఆంద్ర కర్నాటక ,మళయాళమొదలైన భాషలకు ఉపసభల సభ్యులుగా ఉన్నారు.
. అమూల్య పైలాలజి గ్రంథ రచన ,మహాప్రస్థానం
శాస్త్రి గారి గ్రంథ రచనా సామర్ధ్యం గురించి –మానియర్ విలియమ్స్ ,ఫౌకాకౌన్ ,డా హోరన్లి,గ్రయర్సన్ ,డా బర్నేల్ ,కొలంబియాకు చెందిన డా జాక్సన్ మొదలైన దొరలూ ,ప్రాచ్యభాషా పండితులు గొప్పగా శ్లాఘించారు .శాస్త్రి గారు 1884లో ‘’నోట్స్ ఆన్ ఆర్యన్ అండ్ ద్రవిడియన్ పైలాలజి ‘’గ్రంథంమొదటిభాగం ప్రచురించారు .అందులో తన పరిశోధనా ఫలితాలను పొందు పరచారు .ఇలాంటి విషయంలో ఇంతటి పరిశోధన చేసిన వారు అప్పటికి శాస్త్రి గారు ఒక్కరే .కానీ దురదృష్టవశాత్తు శేషగిరి శాస్త్రిగారు 1901మార్చి 4న ఆదిత్య ప్రభా మండలం చేరారు .అప్పుడప్పుడు తాము గ్రహించి సేకరించిన విషయాలను ‘’తమిళ్ పైలాలజి ‘’గా ప్రచురించారు .తర్వాత ఆంధ్ర శబ్ద తత్త్వం –రెండుభాగాలు ,అర్ధానుస్వార తత్త్వం అనే వ్యాకరణ గ్రంథం రచించి ప్రచురించారు .
సంగీత నాట్య కోవిదులు
శ్రీ శేషగిరి శాస్త్రి గారు సంగీతం లో అపార పాండిత్యం ఉన్నవారు .కర్నాటక ,హిందూస్తానీ ,యూరోపియన్ సంగీతాలు మూడూ కరతలామలకాలే .అప్పటికే ఒక ఒక సంగీత సమాజం ఐరోపా పండితుల చేత స్థాపింపబడింది .అందులో ఈయన ఒక్కరే హిందూ సభ్యులు .పై మూడు సంగీతాల తారతమ్యం శాస్త్రిగారికి బాగా తెలుసు .ప్రభుత్వం తరఫున డైరెక్టర్ యూని వర్సిటిలో సంగీత బోధనకు అవకాశం కల్పించేట్లు చేయమనగా శాస్త్రిగారు ఒక ప్రపోజల్ రాసి పంపారు .కానీ శాస్త్రిగారి మరణం అప్పుడే జరిగిపోయింది .వీరి తర్వాత వచ్చిన డా బోరాన్ శ్రద్ధ వహించ లేదు .శాస్త్రి గారే ఉండిఉంటె విశ్వవిద్యాలయం లో సంగీత బోధన తప్పక ప్రారంభమై ఉండేది .
శాస్త్రి గారింట్లో నిత్యం విద్యా ,వినోదాలు జరిగేవి .అయన అన్న శ్రీ కృష్ణయ్య ,తమ్ముళ్ళు రామచంద్రయ్య ,వెంకటేశ్వర శాస్త్రి గార్లు గొప్ప సంగీత విద్వాంసులు ,శాస్త్రిగారి పాండిత్యంతో సమానులుకూడా .సంగీతస్వబోధిని వంటి అనేక సంగీత గ్రంథాలు రాసి ప్రచురించిన వారు .అందరూ విద్వత్ సభలలో సమ్మానితులే .శాస్త్రి గారు సంగీత పరీక్ష చేయగల సమర్ధులు .భరత నాట్యం కూడా శాస్త్రిగారికి అరచేతిలో ఆమలకమే .ఆఇంట లక్ష్మీ సరస్వతులు ఆనంద నాట్యమాడేవారు .ఆసక్తిగల బీద విద్యార్ధులను ఇంట్లోనే వసతి భోజనాలు కల్పించి నేర్పించేవారు .
వేదం వెంకట రాయశాస్త్రిగారు తాము రాసిన ‘’ఉషా నాటకం ‘’ను మాతామహులు శేషాద్రి శాస్త్రి గారికి అంకితమిచ్చారు .ఆసందర్భంగా ‘’ఈ ఉషా నాటకమును వీణా గాన కళానారదులు ,సాంగ వేదం లో అధీదితులు, సర్వ దర్శనాలలో అధీష్ణులు ,సంస్కృత ప్రాకృత ఆంధ్రద్రావిడ కర్నాటక మహారాష్ట్ర ఆంగ్లేయ గ్రీకు ,లాటిన్ మొదలైన అష్టాదశ భాషా లక్ష్య లక్షణా భిజ్ఞ సార్వ భౌములు ,ద్రావిడ భాషా పైలాలజి దర్శన ప్రథమ ప్రవర్తకులు ,మదరాసు ప్రెసిడెన్సి కాలేజి పైలాజి ప్రాక్తన భాషా మహోపాధ్యాయులు ,బోధిసత్వ సంపన్నులు,అస్మన్మిత్ర రత్నము ,తాతవెళ్ళి మిఠా దారు శ్రీ శేషగిరి శాస్త్రి ఎం .ఎ. గారి కీర్తి మూర్తికి సమర్పించినవాడను ‘’అని రాశారు .వీరిని గురించి తనకు తెలియజేసిన తన మాతుల మహాశయులు శ్రీ టి .ఎం. సుందరయ్యరు గారిని ఈ సందర్భంగా స్మరిస్తున్నాను ‘’అని వేదం వారు 25-4-1948 న మద్రాసు లో రాశారు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 8 వ భాగం.1.12.22.

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 8 వ భాగం.1.12.22.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 41వ భాగం.1.12.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 41వ భాగం.1.12.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 7వ భాగం.30.11.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 7వ భాగం.30.11.22

Video link

Posted in రచనలు | Leave a comment

శ్రీ భీమేశ శతకం

శ్రీ భీమేశ శతకం

శ్రీ దేవరకొండ అనంతరావు  శ్రీ భీమేశ కందశతకం రచించి ,శ్రీకాకుళం శ్రీ రామ కృష్ణా ప్రింటింగ్ ప్రెస్ లో 1939 లో ముద్రించారు .వెల-పావలా .’’భీమేశా ‘’అనేది మకుటం .దీనికి  తొలిపలుకు శ్రీకాకుళం మునిసిపల్ హై స్కూల్ ఖగోళ శాస్తజ్ఞుడు బి.ఎ. బిఎడ్. హెచ్.ఎం. డి .శ్రీ బొమ్మిడాల ఆది వెంకట నరసింగ రావు రాశారు .తన శిష్యుడైన అనంతరావు ఈ శతకాన్ని కంద పద్యాలలో రాశాడని ,ఇది మొదటి ప్రయత్నం కనుక సాధ్యమైనంతవరకు తప్పులు సవరించాననీ ,సారం గ్రహించి ప్రోత్సహించమనీ,సరళంగా శబ్దాలంకారాలతో కవి కూర్చాడనీ మెచ్చుతూ –‘’స్మరహరుపై శతకము బుధ వర-పరమాదరమునకు బాత్రముగాని – ద్ధర నొనరిచి నెగడిన దే-వరకొండ అనంతరావు వర్ధి లు గాతన్ ‘’అని ఆశీర్వదించారు శిష్యుడిని .పీఠికలో కవి ‘’శ్రీ భీమేశు ప్రేరణతో రాశాను భాషాజ్ఞానం గ్రంథ పరిచయం లేని వాడిని .ముందుమాట రాసిన గురువుగారికి ,ముద్రణకు ద్రవ్య సాయం చేసిన శ్రీ కిల్లాన రామన్నాయడు లకు కృతజ్ఞతలు తెలిపారు .

  మొదటి పద్యం –‘’శ్రీకర యో సద్భక్త వ-శీకర ,రిపుభీకర ,సుర శేఖరహర మో-క్షాకర రజనీకరధర -శ్రీ కర కంఠాతలంతు భీమేశా’’ .అందాలకందాలనే మందార సుమాలు ఏరి మాలగా అత్యానందంగా కూర్చాను ఇందు ధరా దీన్ని తాల్చు అని కోరారు రెండవపద్యంలో .ఈశా గౌరీశా విశ్వేశా,రిపునాశా ,మహేశా పోషా ,ఆశాపాశ వినాశా ,నాశ రహిత దయ చూపు అన్నారు శకార యమకం తో .ధరణి రధం ,దానికి దినకర ,శశి చక్రాలు మిన్కు గమి తురగాలు ,ధరణీధరమే ధనువు ,హరి శరం .అజుడు నీ సూతుడు అని తనకే పాండిత్యం లేదన్న కవి అద్భుతంగా కవిత అల్లారు .నందీశ భ్రున్గీశ ,బృందారక బృందం అజుడు హరి రుషివరులు ‘’నీ సుందర పదపద్మాలను అందముగా గొల్తురు ‘’అన్నారు

  ‘’ఒక్కడవట  రక్కసులను –బెక్కుడువట,భక్త తాటికి జిక్కుడువట నీ –దిక్కును కోరిన వారి కి దక్కుడదువట ‘’అంటూ కకార ప్రాస లో కాలేకాలుడిని చమత్కారంగా భక్తసులభుడినిగా వర్ణించారు , మృత్యు నిత్యు సత్య లతో మరోఆణిముత్యం అందించారు .అకల౦కా ఉమా౦కా అంటూ కొడుకును భార్యను శివుడికి అర్పించిన భక్తుల గాథలు జ్ఞాపకం చేశారు .విల్లు కా౦చనమేగా,ఆభరణాలు చేయటానికి విశ్వకర్మ నీ సన్నిధిలోలేడు  అందుకే ‘’’’పాప’’ నగల దాల్చగల రూపం ‘’మర్మం చెప్పమన్నారు .ఏ పేరుతొ పిలిస్తే పలుకుతావో తెలీదు .నీదయ లేక నేను జడుడు గా ఉన్నా .దయతో మన్నించు .’’నీపలుకులు సుధలొలుకుతాయి ‘’అని పోతన్నగారి శైలి పద్యం రాశారు .నామొరలు వినబడలేదా దీన బంధో’’అన్నారు ఆర్తిగా .కాలుని చేతికి చిక్కకముందే కాలాంతక నీలీలలు పోగుడుతున్నాను .

  జడమతి నిడుముల దడబడి-కడుపడిసెడి నీ యడుగులకడ,బడ నీవీ –యెడ జేనిడ,నో మృడయే-డకేగుదు మగుడ దెల్పుమిక భీమేశా ‘’ పోతనగారికేమీ తీసిపోడు అనట్లుగా ఉందికదా పద్యం .కనికరపు గనివి .కరములు మోడ్చి వెడితే విని కరము గాచెదవని విబుధనికరము ‘’నిన్ను పొగుడుతుంది అని కరము తో కమ్మని కందం వండి వడ్డించారు .’’నిన్ను తెలుసుకోని చదువులు వ్యర్ధంకదా అని యదార్ధం చెప్పారు .పంచశర గర్వహర –పంచానన వరద భక్తవరా ‘’అంటూ హరనామాల తో భక్తికవితా ప్రవాహం పారించారు .నీఇల్లు ధవళం ,భూషలు జడ ,నెత్తిన సుధాకరుడు,నీ శరీరం కూడా  ధవళం అని ధవళవర్ణుని వర్ణించారు కవి .

  పిలిచినా రావు నా నేరమా గ్రహచారమా గజచర్మధరా హరా ‘’అంటూ పల్లవి౦చారు.హరి హరులు ఒక్కటే .భేద బుద్ధి పాటించినవాడు ‘’కరుణా మయ ,కాలుని కడ కరుగుట తధ్యం .బలి ఇంటికి హరి కావలి కాస్తే ,’’నువ్వు బాణుని ఇలు గాచితివి ‘’కనుక మీ ఇద్దరికీ భేదమే లేదు .ఇద్దరూ భక్తులకు కింకరులు వశంకరులే .నరు సఖుడా శ్రీహరి  .అలాంటి నరునికి పాశుపతం ఇచ్చావు నువ్వు .మీ ఇద్దరికీ భేదమేమిటి ఉమామహేశా ,రమేశా అన్నారు .నువ్వు ఎలాగూ నిత్య యాచకుడివే .ఆయనేమైనా పొడిచేశాడా ?  బలిని మూడడుగులు యాచించాడు .యాచనలోనూ తేడాలేదు అని చమత్కారం .పన్నగాలు నీ భూషలు ,పన్నగ శయనుడు ఆయన .ఇద్దరూ పాపవినాశులే .

  ‘’మురహరుడాతడు నీవో –పురహరుడవు సర్వ లోక పూజ్యా ,భువిపై –హరియన ,హరుడన భేదంబు లేదయా ‘’అని అద్వైతం ఆవిష్కరించారు కవి .నువ్వు శ్రీ(విషం ) గళుడవు.ఆయన శ్రీ(లక్ష్మి ) గలవాడు .మీకు భేదం ఏమిటి మా అజ్ఞానం కాక అన్నారు .ఆయనకు  తిరుపతి నీకు రజతగిరి ఉనికి పట్టు .ఇద్దరూ కొండల దేవుళ్లే.మాకోసం దిగొస్తారు .గట్టులరాయని (హిమవంతుడు )ముద్దులపట్టిని చేపట్టినట్టి పరమేశుడిని,పుట్టుట గిట్టుట లేని జెట్టిని భీమేశుని  మోక్షంకోసం ప్రార్ధిస్తా .శివుడు ‘’దినకర ,శశి, శిఖి త్రినేత్రుడు .ఒకరాజు కలంకుడు వేరొకరాజుకు వేయికన్నులు ,ఇంకోరాజు గ్రహబాధితుడు .కనుక రాజు అంటే నువ్వే అని చక్కని ఎనేక్డోట్స్ తో మంచి పద్యం రాశారు .’’నా చిత్తం అనే అశ్వం ఇచ్చవచ్చిన చిత్తంతో పరిగెత్తుతోంది చిత్త హరా ‘’ నువ్వే వచ్చి ఆగుర్రాన్ని దారికి తేవాలి అంటూ ఆదిశంకరుల శివానందలహరి శ్లోకాన్ని జ్ఞాపకం చేశారు .

  ‘’శ్రీకరములు సుగుణాలికి-భీకరములు దైత్యతతికి వీనుల విన మో-క్షాకరములు భక్తులకు వశీకరములు నీ చరితలు ‘’.శూలివి ,గిరిజాసతికి అనుకూలివి ,అసుర కుంజర తతినిర్మూలివి ,కడు బలశాలివి –పాలితలోకాళివరయ ప్రభు భీమేశా’’.తోలు ధరించి జలంధరు నేలకూల్చి ,కాలుని గెల్చి ,శిరియాళుని దయతో కాపాడావు ..

  99వ పద్యం లో ‘’శ్రీ విశ్వ కర్మ కులజుడ –దేవర కొండాన్వయుడను,ధీనుత చరితా – శ్రీ విశ్వభద్ర గోత్రుడ –బ్రోవుమనంతాఖ్యు నన్ను భువి భీమేశా ‘’అని తన విషయాలు చెప్పుకొన్నారు .నూరవ పద్యంలో మంగళం పాడుతూ –‘’మంగళమిదె గొనుమా –మంగళకర యో శుభాంగ ,మాధవహిత ,నా –మంగళమిదె గైకొనుమో –యంగజ హర భ్రు౦గి వినుత  హర భీమేశా “’అంటూ శతకం సమాప్తం చేశారు కవి .

  కవి విశ్వకర్మ కులజుడు కనుక బంగారాన్ని ఎంత సున్నితంగా ఆభరణాలుగా మలుస్తారో ,అంతే సున్నితంగా ప్రతిపద్యాన్నీ శిల్పీకరించి ఆపరమశివుడే పరమాశ్చర్యం పొందేట్లు ‘’శతకనక ‘’శోభాయ మానంగా తయారు చేశారు .ప్రతిపద్యం ఒక ఉదాహరణమే .భక్తి శతకాలలో తలమానికమైన శతకం అని నేను భావిస్తాను .ప్రతి పద్య చమత్కృతి తో శతకం సహస్రగుణ శోభిత౦ గా  ఉంది .శతకకర్తకు కమోడ్పులు ఘటిస్తున్నాను .నిత్య పారాయణకు అద్భుతంగా పనికి వచ్చే శతకం ఇది .రసభరిత శతకం .కవితాధార నాగావళీ,  వంశధారా  సదృశ వేగంగా సాగింది .ప్రతిపద్య రమణీయం శతకం .బహుశా శ్రీ కాకుళం లోని ముఖ లింగేశ్వర స్వామిపై రాసి ఉండచ్చు .అక్కడ భీమేశ్వర దేవాలయం ఉన్నట్లు లేదు .గొప్ప భక్తిశతకాన్ని, తద్రచయితను పరిచయం చేసిన మహద్భాగ్యం నాకు దక్కింది .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-22-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .40,వ భాగం.30.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం .40,వ భాగం.30.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -366

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -366

· 366-1940లో ఒక గ్రామం దర్శకుడు ,కదా ,పాటలరచయిత ,నిర్మాత ,జాతీయ నందీపురస్కార గ్రహీత-నరసింహ నంది

· నరసింహనంది (జన్మనామం:నరసింహారెడ్డి) భారతీయ సినిమా కథా రచయిత, దర్శకుడు, నిర్మాత, పాటల రచయిత. ఆయన ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో సుపరిచితుడు. [1][2] 2008 లో 1940 లో ఒక గ్రామం చిత్రానికి దర్శకత్వం చేసినందుకు గానూ ఆయన జాతీయ ఫిలిం పురస్కారం, నంది పురస్కారం పొందాడు. [3] 2013 లో 60వ జాతీయ చిత్ర పురస్కారాలలో దక్షిణ విభాగం- 2 కు తన సేవలందించాడు.[4]

· హైస్కూలు,కమలతో నా ప్రయాణం ,లజ్జ ,జాతీయ రహదారి దర్శక కధారచయిత ,లజ్జ లో నటుడు

పురస్కారాలు
జాతీయ ఫిలిం పురస్కారాలు

· జాతీయ ఫిలిం పురస్కారం (ఉత్తమ తెలుగు సినిమా దర్శకుడు – 1940 లో ఒక గ్రామం) (2008)

నంది పురస్కారాలు

· సరోజినీ దేవి పురస్కారం (జాతీయ సమైక్యత పై చిత్రానికి దర్శకునిగా – 1940 లో ఒక గ్రామం ) (2008)

· 367-లక్ష్మీ ,లక్ష్యం రేసుగుర్రం నిర్మాణ ఫేం నందీ అవార్డీ –నల్లమలపు బుజ్జి

· నల్లమలపు బుజ్జి, తెలుగు సినిమా నిర్మాత.[1][2] 2001లో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి సినీరంగంలోకి అడుగుపెట్టాడు

సినిమాలు
నిర్మాతగా[మార్చు]
సంవత్సరం

సినిమా పేరు

నటులు

ఇతర వివరాలు

2001

రా

ఉపేంద్ర, ప్రియాంక ఉపేంద్ర

2006

లక్ష్మి

వెంకటేష్, నయన తార, ఛార్మీ కౌర్

2007

లక్ష్యం

గోపీచంద్, జగపతి బాబు, అనుష్క శెట్టి

2008

చింతకాయల రవి

వెంకటేష్, అనుష్క శెట్టి

2009

కొంచెం ఇష్టం కొంచెం కష్టం

సిద్ధార్థ్, తమన్నా

2011

నేను నా రాక్షసి

రానా దగ్గుబాటి, ఇలియానా

2011

మొగుడు

గోపీచంద్, తాప్సీ

2011

కాంచన

రాఘవ లారెన్స్, లక్ష్మీ రాయ్

తెలుగు వెర్షన్‌ మాత్రమే, బెల్లంకొండ సురేష్‌తో కలిసి నిర్మించాడు

2014

రేసుగుర్రం

అల్లు అర్జున్, శ్రుతి హాసన్

2014

అల్లుడు సీను

బెల్లంకొండ శ్రీనివాస్, సమంత

బెల్లంకొండ సురేష్‌తో కలిసి నిర్మించాడు.

2014

రభస

జూనియర్ ఎన్.టి.ఆర్, సమంత, ప్రణీత సుభాష్

బెల్లంకొండ సురేష్‌తో కలిసి నిర్మించాడు.

2014

ముకుంద

వరుణ్ తేజ్, పూజా హెగ్డే

ఠాగూర్ మధుతో కలిసి నిర్మించాడు.

2015

ఉపేంద్ర 2

ఉపేంద్ర, క్రిస్టినా అఖీవా

ఉప్పి 2 తెలుగు వెర్షన్.

2017

విజేత

సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్

ఠాగూర్ మధుతో సహ నిర్మాణం.

2017

మిస్టర్

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్

ఠాగూర్ మధుతో సహ నిర్మాణం.

2017

టచ్ చేసి చూడు

రవితేజ, రాశి ఖన్నా

వల్లభనేని వంశీతో సహ నిర్మాణం.

అవార్డులు
నంది అవార్డులు

· ఉత్తమ చలన చిత్రానికి నంది అవార్డు – లక్ష్యం (2007)

· ఉత్తమ కుటుంబ చిత్రానికి అక్కినేని అవార్డుకు నంది అవార్డు – కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)

· బి. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు – రేసుగుర్రం (డాక్టర్ వెంకటేశ్వర రావుతో పంచుకున్నాడు)

· సంతోషం ఉత్తమ నిర్మాత అవార్డు – రేసుగుర్రం (డాక్టర్ వెంకటేశ్వర రావుతో పంచుకున్నాడు)

368-ఆది, చెన్నకేశవరెడ్డి సినీ నిర్మాత –నల్లమలపు శ్రీనివాస్
నల్లమలపు శ్రీనివాస్ ఒక తెలుగు సినీ నిర్మాత. ఈయన్నే బుజ్జి అని కూడా పిలుస్తారు
జీవితం
శ్రీనివాస్ ది గుంటూరు. తండ్రి స్వంత లారీ నడిపేవాడు. తల్లి గృహిణి. అతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి గణితం పరీక్షలో మొదటి సారి ఉత్తీర్ణుడు కాలేక మళ్ళీ రాసి పాసయ్యాడు. కళాశాల చదువుకు వెళ్ళే సమయానికి తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం అతని మీద పడింది. వాళ్ళ పక్కింట్లో ఉన్న రంగారావు అనే వ్యక్తి పత్తి విత్తనాల వ్యాపారం చేస్తుంటే అందులో సహాయకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. అక్కడే ఐదారేళ్ళు పనిచేశాక తనే స్వంతంగా ఓ సంస్థను ప్రారంభించాడు. ఇప్పటికీ ఆ సంస్థ పనిచేస్తూనే ఉంది.

సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇతనికి మేనమామ. వ్యాపార నిమిత్తం హైదరాబాదుకు వెళ్ళి ఆయన్ను కలిసినప్పుడు సినీ నిర్మాణంతో అనుబంధం కలిగింది. అలా 1997 లో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అతను పనిచేసిన మొదటి సినిమా శ్రీహరి కథానాయకుడిగా నటించిన సాంబయ్య. హైదరాబాదులో శ్రీనివాస్, దర్శకులు వి. వి. వినాయక్, డాలీ, మిత్రుడు గోపిలతో కలిసి జూబ్లీహిల్స్ లో ఉండేవాళ్ళు.

కెరీర్
జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ఆది సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. తరువాత బాలకృష్ణ హీరోగా చెన్నకేశవరెడ్డి సినిమా తీశారు. తరువాత కల్యాణ రాముడు, లక్ష్మీ సినిమాలు తీశాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఇక సినిమాలు చాలనుకుని గుంటూరు వెళ్ళిపోయాడు. అక్కడే కొద్ది రోజులుండి వ్యాపారం చేద్దామనుకున్నాడు. కానీ స్నేహితుల సలహాతో మళ్ళీ సినీరంగం లోకి వచ్చాడు. గోపీచంద్ తో లక్ష్యం సినిమా చేశాడు. ఆ సినిమా బాగా విజయవంతం అయ్యింది. తరువాత డి. సురేష్ బాబు సహకారంతో చింతకాయల రవి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నేను నా రాక్షసి సినిమాలు తీశాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకు అవార్డులు వచ్చాయి కానీ ఆర్థికంగా పెద్దగా లాభాలు రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రేసుగుర్రం తీశాడు. దీని తర్వాత ముకుంద సినిమా తీశాడు.

సినిమాలు
· ఆది

· చెన్నకేశవ రెడ్డి

· కళ్యాణ రాముడు

· లక్ష్మి

· లక్ష్యం

· చింతకాయల రవి

· కొంచెం ఇష్టం కొంచెం కష్టం

· నేను నా రాక్షసి

· రేసుగుర్రం

· ముకుంద

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు .6వభాగ0.29.11.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు .6వభాగ0.29.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కన్నడ కాల్పనిక సాహిత్య  రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -5(చివరి భాగం )

కన్నడ కాల్పనిక సాహిత్య  రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -5(చివరి భాగం )

శ్రీ కంఠయ్య వివిధ సందర్భాలలో వ్రాసిన పద్య సంపుటి బంగారుకలలు –మైసూరు రాజవంశం పట్ల తనకున్న ఆరాధనాభావానికి అక్షరరూపం .ఆది ప్రాస పాటించాడు .స్వేచ్చా ప్రియుడే అయినా సంప్రదాయానికి విరోధిని కాను అని తెలియ జేశాడు .’’ఓ భారతమాతా –మళ్ళీ ఎప్పుడు నేను తలెత్తుకోనేట్లు చేస్తావు ‘’అనేది ప్రారంభగీతం .మన సంస్కృతీ ఘనతే మనకు మోయరాని భారమైంది ,’’సత్యం మీ ఆత్మల్ని ఉత్తేజితం చేసినపుడు –సరిహద్దుల్ని వెనక్కి నెట్ట లేకపోయారు –వెలుగు ప్రసరించిన చోట్ల నుంచి వెనుదిరిగి పారిపోయారు –గుహలలో బతికారు అహంకారం పెంచుకొని –కుల దురహంకారంతో ,సంకుచిత విశ్వాసాలతో .భారత దేశం తన బిడ్డలలో జడత్వాన్ని పోగెట్టే ఏఏ పనులు చేసిందో చెప్పాడు .ఇంగ్లాండ్ కు భారత్ కు మధ్య ఉన్న బాంధవ్యం గొప్పదిగా భావించాడు .బ్రిటిష్ సామ్రాజ్యం మనకు కొన్ని మేళ్ళు చేసి౦దినఅని గుర్తు చేశాడు .మనం మన దేశానికీ ఇంగ్లాండ్ కూ మేలు చేశామన్నాడు .

  కృష్ణ రాజు చనిపోయినప్పుడు ‘’బన్ కొండ కృష్ణన్ ‘’అనే స్మృతి గీతి రాశాడు .ఇదేకన్నడంలో పూర్తి స్మృతికావ్యం గా భావిస్తారు .విజయనగర సామ్రాజ్య ఆరవ శత వార్షికోత్సవం సందర్భంగా ‘’కన్నడ తాయ నోట ‘’కవితను దేశభాక్తిపూరిత౦గా ,ఆలంకారిక శైలిలో రాశాడు –‘’కర్నాటక అంతా చుట్టి వచ్చాను –దేశ వైభోగామంతా  ఆకళించుకొన్నాను –ఆమె పాద ధూళి తాకుతూ పరవశించాను –దాని అందానికి సోక్కిపోయాను –నా  గుండె ఆనందంతో చి౦దు లేసింది –నాట్యమే చేశాను ‘’ కర్నాటక అంటే నల్లని నేల అనే అర్ధం ఆయన చెప్పేవాడు .పై మబ్బు నలుపు కన్నెపిల్లల జుట్టు నలుపు ,నవ్వే కళ్ళు నలుపు అనేవాడు .

  కన్నడిగుల శక్తి యుక్తులకు ,కార్యశీలతను పురిగొల్పటానికి ‘’కన్నడ బావుటా ‘’రాశాడు .ఈ సంకలనం లో ఇదేఅద్భుత కవిత అన్నారు .జ్ఞానం సత్యం ఉన్నవారికే ఆభావం అర్ధమౌతుంది అనేవాడు –‘’వెలుతురు వచ్చు గాక ‘’అని సృష్టి ఆది లో అన్నప్పుడు –అంతటా వెలుతురూ ఇంపుగా ప్రసరించింది –అందులోంచి మెరుపులు దూసుకొచ్చాయి –అప్పుడు ఖగోళాలు ప్రకాశించాయి –సూర్య చంద్రులు లోకానికిసత్యధర్మాలులాగా ,క్షమా దయ లాగా  రెండు కళ్ళు’’అప్పుడు భూదేవి పచ్చని కోకతో అందంగా గానం చేస్తూ సాక్షాత్కరించింది –ప్రత్యగాత్మ ,విశ్వాత్మల వైభవంతో దీపించే దివ్య తలాలతో క్రీడిస్తూ –దేవతలు ఋషులు చూసిఆనందంతో చి౦దులేశారు .తమకు కనబడకుండా సత్యాన్ని మరుగు పరచిన బంగారు పళ్ళాన్ని తొలగించమని పూషుడి ని వేడుకొన్నారు .అసత్  నుంచి సత్ కు అజ్ఞానం నుంచి జ్ఞానానికి  చీకటి నుంచి వెలుతురుకు నడిపించమన్నారు .అమృతత్వాన్ని విశ్వమంతా వ్యాపింప జేయమన్నారు .

  కన్నడం లో అంగీకారయోగ్యమైన విమర్శ లేదు .విమర్శను మనం పెంపొందించుకోవాలని కోరాడు .ఆయన మరణానంతరం ప్రచురింపబడిన ‘’కన్నడిగరే ఒళ్లేయ సాహిత్య ‘’-కన్నడిగులకోసం మంచి సాహిత్యం అనేది అయన మూర్తి మత్వాన్ని గొప్పగా ఆవిష్కరిస్తుంది .అక్షర రాజ్యాధిపతి అయిన ఈయన అవసరమైతే క్షమాపణలు కూడాచెప్పగలడు..’’ఈనాటి కన్నడ సాహిత్యం లో వినిపించే మధురస్వరాలన్నిటికి మూలం  శ్రీ కంఠయ్య గారి వరవడి ,అభ్యాసం ‘’అని నిష్కర్షగా చెప్పవచ్చు .అయన నడిపిన కాల్పనికోద్యమం ఇప్పుడు తిరోగమించింది .నూతననాయకులు ఆయన గొప్పతనాన్నీ, కన్నడ సాహిత్యం పై ఆయన ప్రభావాన్నీ అంగీకరిస్తారు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-29-11-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 38వభాగం.28.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 38వభాగం.28.11.22

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -363

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -363

· 363-మహారధి కుమారుడు ,సంతానం ,గెలుపు సినీ దశక నిర్మాత –త్రిపురనేని వరప్రసాద్

· త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి) తెలుగు సినిమా దర్శకుడు.[1] అతని తండ్రి త్రిపురనేని మహారథి తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. అతని నాన్నగారి పినతండ్రి త్రిపురనేని సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ లోని తొలి థియేటర్ మారుతీ టాకీస్ లో పార్టనర్. అలా ఆ కుటుంబానికి సినిమా నేపథ్యం ఉంది.

జీవిత విశేషాలు
త్రిపురనేని మహారథి 1955 జూలై 28న కృష్ణా జిల్లాకు చెందిన గుడ్లవల్లేరు గ్రామంలో జన్మించాడు. తరువాత తన కుటుంబం నిజామాబాదులో స్థిరపడింది. అతని తండ్రి త్రిపురనేని మహారథి హైరదాబాదులో అప్పట్లో దక్కను రేడియో కేంద్రంలో అనౌన్సరుగా పనిచేయడంతో వారి కుటుంబం కొంత కాలం హైదరాబాదులో ఉండేది. ఆక్కడి నుండి చెన్నై వెళ్ళి మహారథి రచయితగా స్థిరపడినందున వరప్రసాద్ చదువంతా చెన్నైలోనే సాగింది. పాఠశాల జీవితంలో అతను నాటకాలలో నటిస్తుండేవాడు. చెన్నైలోని పచ్చయప్ప కాలేజీలో పి.యు.సి చదువుకుంటూనే సినిమా రంగంపై మక్కువతో తన తండ్రి నిర్మించిన దేశమంటే మనుషులోయ్ చిత్రం షూటింగ్ కు సరదాగా వెళ్లాడు. ఈ విధంగా వివిధ సినిమా అంశాల్ని గమనిస్తూ ఉండేవాడు. సినిమాలో దర్శకునిగా ఉండాలనే కోరిక బలంగా ఉండడంతో అతని తండ్రి అతనిని ఆత్రేయ, అప్పలాచార్యల వద్ద కొంత కాలం పనిచేసే ఏర్పాటు చేసాడు. వారివద్ద కొంతకాలం పనిచేసాడు. ఆత్రేయ సినిమాలు చూసి చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఆ తరువాత దర్శకుడు ఎం.మల్లికార్జునరావు వద్ద అప్రెంటిస్ గా చేరాడు. అతనితో పాటు కె.ఎస్.ఆర్.దాస్, కొమ్మినేని శేషగిరిరావు తో పాటు తమిళ దర్శకులు ఏ.సి.త్రిలోక్ చందర్, అమృతం, రాజేంద్రన్ దగ్గర కూడా పనిచేసాడు. పద్మాలయా సంస్థ నిర్మించిన హిందీ చిత్రాలకూ పనిచేసాడు. కురుక్షేత్రం సినిమాలో బాబూభాయ్ మిస్త్రీ అనే ఛాయాగ్రాహకునితో కూడా పనిచేసాడు. “నవభారత్” బాబూరావు నిర్మించిన చిత్రాలలో కో డైరక్టరుగా పని చేసాడు. ఈ అకవాశం రావడానికి ప్రధాన కారకుడు మోహన్ బాబు.[2]

దర్శకునిగా
అతను సంతానం సినిమాతో దర్శకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాకి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రభుత్వ పురస్కారాలు కూడా లభించాయి. ఇదే కథను కొంచెం మార్చి పదేళ్ల తరువాత మాతృదేవోభవ సినిమాగా తీసారు. సంతానం సినిమాలో హీరో ఘట్టమనేని కృష్ణ అతిథి పాత్రను పోషించాడు. అతని అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి కావడంతో కృష్ణ ఒక స్టార్ గా ఎదిగినా గెస్ట్ పాత్రను పోషించాడు.

సంతానం సినిమా విడుదల కాగానే అతనికి నాలుగు కొత్త ఆఫర్లు వచ్చాయి. అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు. ఆ తరుణంలో రాఘవ సినిమా చేద్దామని అతనిని కబురు పంపారు. రాఘవపై ఉన్న గౌరవంతో అతని ఆఫర్ ను అంగీకరించాడు. రాఘవ ఒప్పందం ప్రకారం ఒక సినిమా చేస్తున్నప్పుడు వేరే ఏ సినిమాకు పని చేయకూడదు. అతని తో చేయవలసిన సినిమా ఆలస్యమైంది. రాఘవతో అతనికి వచ్చిన చిన్న చిన్న అభిప్రాయ భేదాల వల్ల స్వంతంగా సినిమా తీయకుండా, మరో సినిమాలో చేయకుండా బ్లాక్ కావలసి వచ్చింది. వారి మధ్య రాజీ కుదరక రాఘవతో పనిచేయలేనని అతను చెప్పేసాడు.

రాఘవ సినిమా అతను వదిలెసిన తరువాత అతను అంగీకరించిన చిత్రం నా పేరే దుర్గ. ఆ సినిమాకు సిల్క్ స్మిత కథానాయిక. తరువాత సిల్క్ స్మిత బ్రహ్మా నీ రాత తారుమారు అనే సినిమాను తీస్తూ అందులో అతనిని దర్శకునిగా ఎన్నుకుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాత. కానీ ఆ సినిమా అనేక అడ్డంగులతో రిలీజ్ కాలేదు. అది కెరీర్ పరంగా అతనికి నష్టం కలిగిందించి. తరువాత స్వంతంగా సినిమా తీద్దామని భావించి రైతు భారతం సినిమాను ప్రారంభించాడు. అందులో సౌందర్యను కథానాయకిగా పరిచయం చేసాడు. కానీ దర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు అభ్యర్థన మేరకు ఆమెను మనవరాలి పెళ్ళి చిత్రానికి నటించేందుకు అవకాశం ఇచ్చాడు. అది హిట్ కావడంతో ఆమె మరో తమిళ సినిమాలో కూడా నటించింది. అలా రైతుభారతం విడుదల కాకుండానే ఆమె బిజీ హీరోయిన్ అయింది.

ఆతనికి సామాజిక సందేశంతో సినిమాలు తీయడమంటే యిష్టం. అందువల్ల కమర్షియల్ సినిమాలు కాకుండా ఇష్యూ ఆధారిత సినిమాలు తీయడానికి యిష్టపడుతుంటాడు. అలా కేరళలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా “గెలుపు” సినిమా తీసాడు. ఇది న్యూస్ ని ఆధారంగా తీసిన సినిమా. తరువాత అతను మా నాన్న పెళ్ళి సినిమా సినిమా తీసాడు ఈ సినిమా సౌందర్య నటించిన చివరి సినిమా. ఆమె తొలి సినిమా, చివరి సినిమా కూడా అతనిదే కావడం విశేషం. [3]

రాజకీయ జీవితం
1998లో అతని జీవితంలో మలుపు తిరిగింది. అతను భారతీయ జనతా పార్టీలో చేరాడు. నాలుగేళ్ళపాటు ఆ పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. వాజ్ పేయి గారిని ప్రధాన మంత్రిగా చూడాలనుకున్నాడు. అది నెరవేరిన తరువాత అతను మళ్లీ సినిమా రంగంలోని ప్రవేశించి “గెలుపు” సినిమాను తీసాడు.

· 364-బందరు కుర్రాడు యానిమేషన్ ఎక్స్పెర్ట్ ,ప్రతిరోజూ పండగే ,బస్టాప్ దర్శకుడు –దాసరి మారుతి

· దాసరి మారుతీ ఒక తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.[2]

నేపథ్యము
ఇతడిది మచిలీపట్నం.[3] పేదరికంలో పెరిగాడు. వీళ్ళ నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. ఇతను మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు. టూడీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో హైదరాబాదు వచ్చేశాడు. నిజాంపేటలోని వీళ్ళ అక్క వాళ్లింటో మొదటి నివాసము.

ఆ రోజుల్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఆటోలు కూడా వచ్చేవి కావు. జేఎన్‌టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచేవాడు. జూబ్లీహిల్స్‌ లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ యానిమేషన్ కోర్స్‌లో చేరాడు. ఉదయం పదింటికే నిజాంపేట నుంచి సైకిల్ మీద జేఎన్‌టీయూ బస్టాప్ చేరుకునేవాడు. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి రెండింటికి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేవాడు. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది.

ఇతడికి బొమ్మలేయడం అంటే సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడు. ఆ టైంలోనే బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడు. గోల్కొండ, చార్మినార్, నెహ్రూ జంతుప్రదర్శనశాలలోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో బొమ్మలు వేశాడు. సమయం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను స్కెచింగ్‌లో చూపించే ప్రయత్నం చే సేవాడు.

సినీ జీవితము
2008లో ఇతనికి పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించాడు. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం ఇతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాడు. కొన్ని ప్రకటనలు కూడా తీశాడు. తర్వాత దర్శకత్వం తన వృత్తిగా స్వీకరించాడు.

దర్శకత్వం వహించిన సినిమాలు

  1. ఈ రోజుల్లో (2012)
  2. బస్టాప్ (2012)
  3. ప్రేమకథా చిత్రమ్ (2013)
  4. కొత్తజంట (2014)
  5. భలే భలే మగాడివోయ్ (2015)
  6. బాబు బంగారం (2016)[4]
  7. మహానుభావుడు (2017)
  8. ప్రతిరోజూ పండగే (2019)

సహా నిర్మాత

  1. గ్రీన్ సిగ్నల్ (2014)[5]
  2. లవ్ యు బంగారమ్ (2014)

365-ఘరానామొగుడు ,అమ్మరాజీనామా సినీ నిర్మాత –దేవీ వరప్రసాద్
దేవీవర ప్రసాద్ తెలుగు సినీ నిర్మాత. దేవీఫిలింస్ బేనరు పై పలు విజయవంతమైన తెలుగు చిత్రాలు నిర్మంచాడు.
జీవిత విశేషాలు
అతను 1943 డిసెంబరు 6న విజయవాడలో జన్మించాడు. నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు.

దేవి వర ప్రసాద్ తండ్రి తిరుపతయ్య సినిమా పంపిణీదారుడు అయిన ఎన్టీఆర్ కు సన్నిహితుడు. అతను ఎన్టీఆర్ యొక్క మూడు సినిమాలకు కూడా భాగస్వామి. ప్రసాద్ నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. నిర్మాతగా అతను ఎన్‌టిఆర్‌తో కథానాయకుని కథ, కేడీ నంబర్ 1, తిరుగులేని మనీషి, నా దేశం వంటి చిత్రాలను తీసాడు[1]. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత దేవి వర ప్రసాద్ చిరంజీవితో సినిమాలు చేయడం ప్రారంభించాడు. చట్టంతో పోరాటం సగటు కంటే ఎక్కువగా ఉండగా కొండవీటి దొంగ, మంచి దొంగ పెద్ద విజయాలు సాధించాయి. ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్‌గా మారింది. చిరంజీవి యొక్క టాప్ 5 సూపర్ డూపర్ హిట్స్‌లో ఈ చిత్రాన్ని పేర్కొనాలి. తరువాత అల్లుడా మజాకా చిత్రం కూడా మంచి కలెక్షన్లు సాధించి విజయాన్ని సాధించింది. అయితే తదనంతరం మృగరాజు టైటిల్‌తో గుణ శేఖర్‌తో దర్శకుడిగా దేవి వర ప్రసాద్ చిత్రం పూర్తిగా అపజయం పాలైంది. దేవి వర ప్రసాద్ యొక్క దాదాపు అన్ని ఆదాయాలు ఈ చిత్రంతో కొట్టుకుపోయాయి.[2] ఆ తర్వాత అతను చిరంజీవితో సినిమా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. మృగరాజుతో ప్రతిదీ కోల్పోయినందున, చిరంజీవి తనపై దయ చూపవచ్చని ఆతను భావించాడు. కానీ అది జరుగలేదు. తర్వాత ఆర్థికంగా బాగా చితికిపోయాడు. అతని చివరి సినిమా భజంత్రీలు కూడా అనుకున్న విజయం సాధించక ఇంకా ఆర్థిక నష్టాలను అనుభవించి అనారోగ్య పాలయ్యాడు.

సినిమాలు
భలే తమ్ముడు , కథానాయకుని కథ, భలేదొంగ, మంచి దొంగ, కొండ వీటి రాజా, అల్లుడా మజాకా, కేడీ నెంబర్ వన్, ఘరానా మొగుడు ,మృగరాజు, భజంత్రీలు, అమ్మరాజీనామా వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.

మరణం
దేవి వర ప్రసాద్ కాలేయ సంబంధిత వ్యాధి, మధుమేహంతో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్లో చేరాడు. అతను 2010 డిసెంబరు 10 న మరణించాడు.[3]

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 5వ భాగం.28.11.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 5వ భాగం.28.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కన్నడ కాల్పనిక సాహిత్య  రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -4

కన్నడ కాల్పనిక సాహిత్య  రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -4

  గదా యుద్ధ నాటకం

అయిదు అంకాల ఈ నాటకాన్ని 1925లోప్రదర్శింఛి 1926లో ముద్రించారు .కన్నడం లో ‘’రన్న కవి ‘’రాసిన సాహస భీమ విజయ కావ్యం ఆధారంగా శ్రీ కంఠయ్య రాశాడు .గొప్ప నాటకీయత తో రన్న పండించాడు .ఈనాటకం కావ్య౦చదివిన అనుభూతికి భిన్న౦గా ఉంటుంది .కౌరవ కుమారులంతా చనిపోగా దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు .ధర్మరాజు భీముడిని శాంత పరచి వాణ్ని చంపకుండా వదిలేయమంటాడేమో అనే సందేహంతో నాటకం ప్రారంభమౌతుంది .వాడు తొడమీద గుదడ్డతీసి తనను అవమాని౦చాడు అన్న  విషయం ద్రౌపది మర్చిపోలేదు.వాడి తొడ విరుస్తానని ప్రతిజ్ఞ చేసిన భీముడు ఆరోజు సాయంత్రం లోపు వాడిని చంపక పొతే వాడు అజేయుడుఅవుతాడన్న విషయం గుర్తు చేశాడు .రెండవ అంకం లో ద్రోణ ఆశ్వత్దామలు తన్ను మోసం చేశారని దుర్యోధనుడు వారిని నిందిస్తాడు .సంజయుడు పాండవులను పొగడటం వాడికి ఇంకా కారం రాసినట్లయింది .తాను పాండవులకు చేసిన అవమానాలన్నీ మరోసారి ఏకరువు పెడతాడు .వాళ్ళు గతిలేక భరించారని గోప్పగాచెబుతాడు. అయితే ఏదైనా చేయబోయేముందు భీష్ముడిని సంప్రదిస్తాను అంటాడు . మూడవ అంకం లో అంపశయ్యపై ఉన్న పితామహుడి దగ్గరకు దుర్యోధనుడు వెడుతుంటే ,పీనుగులతో పొట్టని౦పు కొనే మూడు పిశాచాలు కనిపిస్తాయి .అవి వాడి పాపపు పనులు గుర్తు చేస్తూ వాడు బతికేది సూర్యాస్తమయం వరకే అని చెబుతాయి .కర్ణ దుశ్శాసన పీనుగుల్ని చూసి వాడు చలించిపోతాడు .అభిమన్య శరీరం చూసి ఉదారంగా శ్లాఘిస్తాడు .భీష్ముడు సంధి చేసుకోవటం మంచిది అని సలహా ఇస్తాడు వాడికి .వాడుఅలాచేయడని తెలిసి ఉపశమనంగా వైశంపాయన సరోవరంలో దాక్కొమని  చెబుతాడు .

 నాల్గవ ,అయిదవ అంకా లలో  కృష్ణ భీమ ధర్మరాజులు శత్రువుజాడ కనిపెట్టటానికి సరోవరం దగ్గరకు వస్తారు .భీముడి దేప్పిపోడుపులు ,కవ్వింపులు భరించలేకనీటి లోనుంచి బయటికి వస్తాడు .భీముడితో గదా యుద్ధం చేస్తాడు .ఒకసారి భీముడు పడిపోతే యుద్ధం ఆపేసి గదతో విసిరి సేద తీరుస్తాడు .చేసిన ప్రతిజ్ఞను కన్నయ్య భీమయ్యకు గుర్తు చేస్తాడు .గదతోదుర్యోధనుడి తొడపై కొడతాడు .వాడు కింద పడిపోగా కాలితో తంతాడు .దానితో భీమునిపై ప్రతీకారశక్తులు పగబట్టగా ,శివుడిని ధ్యానించటానికి పాండవులు నీలాద్రి చేరతారు

  రాజుదగ్గరకు అశ్వత్ధామ వచ్చి రారాజు దైన్య స్థితి చూసి చలించి పాండవుల తలలు కోసి తెస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోతాడు .కానీ వాడు తెచ్చింది ద్రౌపది కొడుకుల శిరస్సులు .నువ్వు పాపం చేశావంటాడు రాజు .దైవ శక్తిముందు మానవ శక్తి ఎందుకూ పనికిరాదని గ్రహించి ప్రాణం వదుల్తాడు దుర్యోధనుడు .పొద్దు గుంకిపోతుంది .

 నాటకం అంతా యుద్ధరంగం మీదనే జరుగుతుంది .ఆరంభం అంతమూఅక్కడే పాండవులకు ఒక్క అంగుళం నేలకూడా ఇవ్వను అన్న ప్రతిజ్ఞ ఒక్కటే దక్కించుకొన్నాడు రారాజు .రన్న కవికి వీడిపై సానుభూతి మిన్న వాడిచివరిమాటలలో ప్రశాంత గాంభీర్యం ఉంది శత్రువైన భీముడిపై ఔదార్యం చూపాడు .దుర్యోధనుడి సర్వ అవలక్షణాలు నాటకం లో చూపాడు శ్రీ కంఠయ్య .

  1929లో ‘’ఆశ్వత్దామన్ ‘’నాటకం రాశాడు .మహారాజా కాలేజిసంఘం వారు ప్రదర్శించారు .గ్రీకునాటకం మొట్టమొదటిసారిగా కన్నడ రంగస్థలం పై ప్రదర్శింప బడి నట్లయింది .గ్రీకులోని ‘’ఆయాస్ ‘’నాటకం స్పూర్తితో ఈనాటకం రాశాడు .గ్రీకు నాటకం లో అడిషియాస్ కవచాన్నిఅయాన్ కు కాకుండా  ఓడిన్యాస్ కు బహూకరిస్తాడు , దీన్ని అవమానంగా భావించి సేనానాయకుల౦దర్నీ చంపాలను కొంటాడు .కానీ ఎథినీ దేవత శాపం వలన పిచ్చెక్కుతుంది .పశువులమందల్ని చూసిసేనానాయకులని భ్రమపడి ఊచకోతకోసేస్తాడు .భ్రా౦తి తొలగి జరిగింది తెలిసి పశ్చాత్తాపం పొంది దేవతకు ఆగ్రహం కలిగించినందుకు చిన్న బుచ్చుకొంటాడు .ఆదేవత కోపం ఒక్క రోజే ఉంటుంది . ఈసంగతి తెలిసిన అయాన్ సవతి తమ్ముడు ట్యూసర్  తానూ తిరిగి వచ్చేదాకా అయాస్ ను జాగ్రత్తగా చూసుకోమని అయాస్ పెళ్లి చేసుకోబోయే బానిసపిల్ల టెక్ మేసాకు చెప్పి ,నావికులకు కబురుచేస్తాడు. ఈలోగానే అయాస్ అందరికళ్ళు కప్పి ఆత్మహత్య చేసుకొంటాడు .గ్రీకు సేనానులకు వాడు దేశ ద్రోహి .అతడి కళేబరాన్ని ముక్కలు ముక్కలు చేసి కాకులకు గద్దలకు వెయ్యాలంటారు .కానీ ట్యూసర్ ,ఉదారుడైన ఓడిన్యాస్ లు దాన్ని కాదని అమరవీరుడికి జరిగినట్లుగా అంత్యక్రియలు నిర్వహిస్తారు .

  ఈ గ్రీకు కథ ఆధారంగా మహాభారతం సౌప్తిక పర్వంలో కౌరవ యోధుల్లో మిగిలిన అశ్వత్ధామ తనరాజు రక్తం మడుగులోకొనూపిరితో  ఉన్నట్లు ,పిశాచాలు లు ఆయన రక్తమాంసాలు నంజుకొని జుర్రుకొని  తినటానికి సిద్ధంగా ఉన్నట్లు చూసి విచలితుడు అవుతాడు .తనతండ్రి ద్రోణుడు లాగా దుర్యోధనుడుకూడా అధర్మ యుద్ధంలో పాండవుల చేతిలో చచ్చాడని భావించి ,ఆరోజునే పాండవులందర్నీ చంపేస్తానని ప్రతిజ్ఞ చేయాగా సేనాపతిగా నియమించగా ,కృపాచార్య కృతతవర్మలతో దృష్టద్యుమ్నుని శిబిరానికి వెళ్లి ,పాంచాల ఉపపా౦ డవుల్ని చంపేస్తాడు .పాండవులకు తెలిసి వీడిని పట్టుకోటానికి బయల్దేరతారు .అశ్వత్ధామ ప్రయోగించిన భయంకర అస్త్రం నుండి కృష్ణుడు వారినికాపాడి వాడిని’’మానవులకు ఎవరికీ కనిపించకుండా  వారితో మాటా మంతీ లేకుండా మూడు వేల ఏళ్ళు అడవులలో ఎడారులలో తిరుగు ‘’అని  శపిస్తాడు .వాడి తలలో ఉన్న మణిని ఊడ బెరికి ద్రౌపదికి బహూకరిస్తారు .వాడు గబ్బుకంపు కొడుతూ దేశాలపాలయ్యాడు .

  అశ్వత్ధామకు రాజుపట్ల వీర విధేయత స్పష్టంగా నాటకం లో చూపాడు రచయిత .కపట నాటక సూత్రధారిగా కృష్ణుడిని చిత్రించాడు .అక్కడి గ్రీకుకథను ఇక్కడి మహాభారత కథతో అనుసంధానం చేసి అద్భుతంగా రాశాడు. చివరలో చచ్చిన రారాజు రెప్పలు  మూసి ,గౌరవంగా నమస్కరించి ,విల్లు విసిరిపారేసి ఒరలోంచి రెండు వైపులా పదునున్న కత్తి దూసి పళ్ళు పటపట లాడిస్తూ పాండవ శిబిరంలోకి ప్రతీకారం కోసం ప్రవేశిస్తాడు  .అసలు ఏమి జరిగిందో చెప్పమని కృష్ణుడు రుద్రుడిని అదుగు తాడు ‘’రుద్రుడు – ‘’సూర్యుడు అస్తమించాడు కౌరవనాథుడుకూడా .అర్ధరాత్రి మీ శిబిరం లో ప్రవేశిస్తుంటే చూశాను నేను .ఎక్కడికి,ఏ యుద్ధానికి ,ఏ వరం కావాలి యోధుడా ‘’అని అడిగా .’’పాండవ వంశాన్ని నాశనం చెయ్యాలి ‘’అన్నాడు .’’కొందర్ని తప్పించి ‘’అన్నాను నేను .వాడు ‘’చూడు రుద్రా .మనిషి బలం ఎలాంటిదో చూడు ‘’అని పొగరుగా నవ్వాడు .నేనూ అలానే నవ్వాను నర్మగర్భంగా .వాడికి మాయ కమ్మేట్లు చేశాను ..అది వాడి మనసును కమ్మేసింది .కళ్ళకు వాడికేమీకనిపించలేదు ,వాడిని నీ శిబిరంనుంచి లాక్కేళ్లి బయట శిబిరం వాళ్ళదగ్గర పడేశాను .అప్పుడు చూడు కృష్ణా వాడి ప్రలాపాలు ప్రగల్భాలు ,సంహారగర్వం .పశువుల్ని నరికాడు ఆడవాళ్ళను చంపేశాడు ,దాదుల చేతుల్లోనూఉన్న  పసిపిల్లల్ని కత్తిమొనకు గుచ్చి ముక్కలు ముక్కలు చేశాడు .శిబిరాలు నేలకూల్చాడు .నేను ఇంకా దగ్గరగా ఉంటూ వాడి పిచ్చిని మరింత ప్రకోపి౦పజేశాను .తుఫాను రేగిన సముద్ర కెరటాలుగా మారాడు వాడు .ఒక గుర్రాన్ని మెడనరికి ‘’ఒరరే దృష్టద్యుమ్నా !నువ్వు నీ గురువు గొంతు కోసింది ఇట్లాగేగా ‘’అన్నాడు .ఒక ఏనుగును ‘’ఒరేభీమా !కౌరవనాథుడిని తలదన్నిన పాదం ఏదిరా ‘’అ౦టూ పిచ్చిపట్టినవాడిలా ఊగుతూ అరిచాడు .దానికాలు నరికి కళేబరాన్ని తన్నాడు .అందర్నీ చంపేశాను అనుకోని ఒక గొర్రెపిల్లను చంకలో పెట్టుకొని ‘’ఒరే జిత్తులమారి నక్కా కృష్ణా రారా .నువ్వు విత్తు వేసిన మొక్కపళ్ళు  తి౦దువు గాని రారా .ప్రత్యెక గౌరవం పొందే అతిథివికదా తినుతిను ‘’అన్నాడు అని రుద్రుడు  శ్రీ కృష్ణుడికి ఆశ్వత్ధామ  ఉన్మాద వీర విహారం కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెప్పినట్లు శ్రీ క౦ఠయ్య తన నాటకం లోరాసి , ప్రేక్షకజనం ఉర్రూతలూగేట్లు చేశాడు ‘

  ఈనాటకం లో పగా ,దయా రెండూఉన్నాయి .’’నవ్వు మధురమైనది .పగవాడిని చూసి నవ్వే నవ్వు ఇంకా మధురమైనది ‘’అంటాడు రుద్రుడు .ఇక్కడి రుద్రపాత్ర గ్రీకు నాటకం లోని ఎధినీ పాత్ర వంటిది.ఆశ్వత్దామన్ కు గుడి కట్టించాలి అనే ప్రతిపాదన సెంటిమెంట్ కు విరుద్ధం .’’ఓదుష్ట యుద్ధమా ఎప్పుడు నువ్వు నశించేది?ఓ శాన్తిమాతాఎప్పుదు నువ్వు వర్ధిల్లేది ‘’అనే బృందగానం తో నాటకం ముగుస్తుంది .ధర్మ సంరక్షణకే నాటకం నడుం కట్టింది .ఛందో నైపుణ్యం శైలి నాటకానికి విజయం చేకూర్చాయి .భారతీయ ,పాశ్చాత్య సంస్కృతీ మేళవింపు నాటకం లో బాగా నే పండింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్-28-11-22-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 38వభాగం.28.11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం 38వభాగం.28.11.22

Video link

Posted in రచనలు | Leave a comment

షట్త్రి౦శత్  శతాధిక(136) గ్రంధ కర్త డా టి.రంగస్వామి 

షట్త్రి౦శత్  శతాధిక(136) గ్రంధ కర్త డా టి.రంగస్వామి 

వరంగల్ శ్రీ లేఖ సాహితి-సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ,నాకు పరమ ఆత్మీయులు ,విశ్వనాథ కృష్ణ కావ్యాలపై పరిశోధన చేసి పి.హెచ్ డి.పొందిన సరసభారతి పురస్కార గ్రహీత తమ సంస్థద్వారా 136-షట్త్రి౦శత్  శతాధిక(గ్రంథాలు ప్రచురించి 136వ పుస్తకమైన ”పలుకు జెలి”అనే సాహిత్య విమర్శ వ్యాస సంపుటిని నాకు పంపగా నిన్ననే అందింది .వారి నిరంతర సాహితీక్రుషిని అభినందిస్తూ , ద్విశత ప్రచురణ త్వరలొనె పూర్తీ చేయాలని ఆశిస్తున్నాను -దుర్గాప్రసాద్-27-11-22-ఉయ్యూరు  

Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 4వ భాగం.27.11.22

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు 4వ భాగం.27.11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -3

కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -3
బ్రిటిషర్ల పాలనలో మనపై మనకు ఆత్మ న్యూనతా భావం కలిగించింది .వాళ్ళ సాహిత్య పరిచయం వలన శ్రీ కంఠయ్య లో ఆయా దేశాలపట్ల గౌరవభావం ఏర్పడింది .ఈయన కాలేజి లో చేరేనాటికి ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి యూని వర్సిటీ లలో తర్ఫీదు అయిన కొత్తరకం పండితులు పరిచయమయ్యారు .వారిలో ఆత్మ న్యూనతా భావం లేదు .దేశానికి అప్రతిష్ట కలిగించే అంశాలను వాళ్ళు ఒప్పుకొనే వారుకాదు .ఈయనకు భవిష్యత్తు పై ఎక్కువ ఆసక్తి .కన్నడం తల ఎత్తుకోవాలని ఆయన గట్టిగా కోరాడు .అందుకే కన్నడ జెండా ఎగరేశాడు .సంస్కృతం ఒక్కటే మనల్ని తీర్చి దిద్దలేదు .పాశ్చాత్య సాహిత్య ప్రక్రియలు తెలుసుకోవాలి .కన్నడం ఇవ్వగలిగింది ఏమిటిఅనే మౌలిక ప్రశ్నకూడా వేసుకొన్నాడు .కన్నడ ప్రాచీన సాహిత్యంలో కన్నడంకన్నా సంస్కృత పదాలెక్కువ .ఆధునిక భాషాజ్ఞానం ఆధునిక సాహిత్య పరిచయం అందుకే కావాలన్నాడు .యువత ఆయన వెంట నడిచింది ..కర్నాటక ఏకీ కరణ ఉద్యమాన్ని ఆయన తలకెత్తుకొన్నాడు .దానికి వీరి మద్దతు పుష్కలంగా ఉంది .మైసూర్ యూని వర్సిటి ఏర్పడిన 15ఏళ్ళకు కానీ కన్నడ భాషా పీఠం ఏర్పడలేదు .కన్నడ పునరుద్ధరణకు ధార్వాడ లోని కర్నాటక విద్యావర్ధక సంఘం ,బెంగుళూరులోని కన్నడ సాహిత్య పరిషత్ కృషి చేశాయి .జాతీయోద్యమం కూడా ప్రాంతీయోద్యమానికి, భాషోద్యమానికి సహాయ పడింది .కర్ణాటకలోని అన్ని ప్రాంతాలవారినీ కలుపుకొని పోతూ ,రాజకీయ సాంఘిక సాంస్కృతిక శక్తులను ఏకం చేసే నాయకుడు కావాల్సి వచ్చింది దానికి తగినవాడు శ్రీ కంఠయ్య మాత్రమె .
‘’ఢిల్లీ దూరం ,పల్లె చాలు నాకు ‘’అన్నాడు శ్రీ కంఠయ్య .షేక్స్ పియర్ అన్నాడని చెప్పబడే ‘’నేను చనిపోయాక నా గుండె మీద ఇంగ్లాండ్ అని రాసి ఉంటుంది చూడండి ‘’అన్న వాక్యం ఈయనకూ వర్తిస్తుంది కర్నాటక విషయంలో ..మైసూర్ మహారాజా గారి ఏక చ్చత్రం కింద సమైక్య కర్నాటకం ఏర్పడాలని ఆయన చనిపోవటానికి ముందు కోరుకున్నాడు .లెక్చరర్ గా ఆయన విశేష గౌరవం పొందాడు .తాదాత్మ్య స్థితిలో పాఠాలు బోధించేవాడని ఆయన శిష్యులు గొప్పగా చెప్పుకొనేవారు ‘’.పాఠ్య భాగం సువిశాల ఆలోచనా సంవేదనలలోకి ఎగిరిపోవటానికి కాలు పెట్టె ఆధార పీఠం’’ అనే వాడు .ఎన్నెన్నో విషయాలు ఆయన బోధనలో దొర్లిపోయేవి .విద్యార్ధి దృక్పధం సువిశాలం చేయటమే ఆయన ధ్యేయం .ఆయనకు బాగా ఇష్టమైన కవితలు –‘’the spirit that dwells in the light of setting suns ‘’,..the young lambs bound as tabors’ sound ‘’అవి మాటలుకావు సంగీత ధ్వనులు .వీటిద్వారా గొప్ప అనుభూతిని కలిగించేవాడు .మాధ్యూ ఆర్నాల్డ్ పాఠం చెబుతూ అందులో డాంటే చెప్పిన మాటలు’’in His will is our peace ‘’ అంటూ పదే పదేమననం చేసుకొనేవాడు .వర్డ్స్ వర్త్ రాసిన ‘’the still sad music of humaanity ‘’బోధిస్తూ గంట దాటినా చెబుతూనే ఉన్నాడు ఒకసారి అంతా అయ్యాక పూర్తి నిశ్శబ్దం ఆవహించింది అని ఒక పూర్వ విద్యార్ధి జ్ఞాపకం చేసుకొన్నాడు .
ఇంగ్లీషు గీత గళు
పూర్వ కన్నడ కవిత్వాన్ని ఆయన ‘’రాయ కేళి౦దే’’-రాజా అవధరింపుము అని వెక్కిరించేవాడు .అవధానం నిలకడ గా ఉందని రాజుకు వినిపించటానికి రాసిన క్షీణయుగ కవిత్వం గా భావించేవాడు.ఇరవై ఖండికలున్న ఈ కవితా సంపుటి లో షెల్లీవి 9,బర్న్స్ వి 7,వర్డ్స్ వర్త్ వి 5,బ్రౌనింగ్ ,టెన్నిసన్ స్కాట్ లవి మూడేసి షేక్స్ పియర్ సౌదీ ,బైరన్ లవి రెండేసి ,మిగిలినవి ఇతరకవులవి ఉన్నాయి .వర్డ్స్ వర్త్ రాసిన ‘’లూసీ ‘’కవిత ,సాలిటరి రీపర్ లాంటివి వదిలేశాడు .తన శక్తికి మించినవి కావు అన్నవాటినే అనువదించినట్లు చెప్పుకొన్నాడాయన ..ఈయనకాలం లోనే హెచ్ నారాయణ రాకూడా ఆంగ్లకవితలను వాదాలు చేశాడు.
అన్నీ ఉత్తమ అనువాదాలు అనిపించుకోలేదు .కొన్ని మాత్రం అత్యున్నతంగా కనిపిస్తాయి ‘’కవిత్వం అనువాదానికి లొంగదు ‘’అన్న దాన్ని తారుమారు చేసేశాడు .సరళ శైలి అందం మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి .కొన్ని మూలాలనికి మించి అద్భుత సోయగాన్ని ప్రదర్శించాయి .చారిత్రిక ప్రాముఖ్యత వల్ల ఈకవితలు జీవిస్తాయి .మానవుడిని మానవుడిగా చిత్రిస్తూ రాసిన నవ్యకవిత్వాలు ఇవి .మానవ విషాద సంగీత౦ కూడా వినిపించింది .పదాడంబర క్షీణయుగ మహాకావ్యాల స్థానాన్ని ఈకవితలు ఆక్రమించేశాయి తర్వాత రెండు దశాబ్దాల కు కానీ కెవి పుట్టప్ప అనే’’ కు వెంపు’’రాసిన’’ శ్రీ రామాయణ దర్శనం ‘’మహాకావ్యంగా కొత్త చూపు హుందాతనతో ప్రవేశించలేదు .కర్నాటక సాహిత్య చరిత్రలో ,ప్రయోజనకర విప్లవాలలో ‘’ఇంగ్లీషుగీత గళు ‘’కు ఎప్పటికీ ప్రత్యెక స్థానం ఉంటుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-11-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం . 37వ భాగం.27..11.22

బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహా భారత తత్వ కథనం . 37వ భాగం.27..11.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -359

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -359

359-నిర్మాత ,దర్శకుడు ,సినీ పెద్ద మనిషి ,నందీ,స్వరలయ అవార్డీ–తమ్మారెడ్డి భరద్వాజ

· తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. ఆయన దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.

చిత్రాలు
దర్శకునిగా
· పోతే పోనీ (2006)

· సంచలనం (2000)

· ఎంత బావుందో! (2002)

· స్వర్ణముఖి (1998)

· అత్తా నీకొడుకు జాగ్రత్త (1997)

· కూతురు (1996)

· వేటగాడు (1995)

· రౌడీ అన్నయ్య (1993)

· ఊర్మిళ (1993)

· పచ్చని సంసారం (1992)

· శివశక్తి (1991)

· నేటి దౌర్జన్యం (1990)

· అలజడి (1990)

· మన్మధ సామ్రాజ్యం (1988)

· స్వర్ణక్క (1998)

నిర్మాతగా
· స్వర్ణక్క (1998)

· ఇద్దరు కిలాడీలు (1983)

· మరో కురుక్షేత్రం (1981)

· మొగుడు కావాలి (1980)

· కోతల రాయుడు (1979)

· (1/2)

సమర్పణ
· పలాస 1978 (2020)[1][2]

అవార్డులు
· పోతే పోనీ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందినాడు.

· 2022 ఉగాది సందర్భంగా సాహితీ, సాంస్కృతిక సంస్థ, తెనాలి, గుంటూరు జిల్లా వారిచే స్వరలయ జీవిత కాల సాఫల్య పురస్కారం.[3]

360-కేంద్ర మంత్రి కాంగ్రెస్ కు పెద్దదిక్కు ,పారిశ్రామికవేత్త ,భగవద్గీత సంస్కృత౦ ,స్వామి వివేకానంద హిందీ .జీవనపోరాటం .స్టేట్ రౌడీ సినీ నిర్మాత,ఆధ్యాత్మిక వేత్త –టి.సుబ్బ రామి రెడ్డి
· తిక్కవరపు సుబ్బరామిరెడ్డి (ఆంగ్లం: T. Subbarami Reddy) (జ. సెప్టెంబరు 17, 1943) భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త. వీరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు. ఈయన గనుల శాఖామాత్యునిగా ఉన్నాడు. ఈయన 1996, 1998 సంవత్సరాలలో 11వ, 12వ లోక్‌సభ లకు విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. ఇతడు 2002 సంవత్సరం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్నాడు.

· సుబ్బరామిరెడ్డి 1943, సెప్టెంబర్ 17న బాబు రెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించాడు.[1] హైదరాబాదు లోని నిజాం కళాశాల నుండి బి.కామ్ పట్టాపొందాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు, 1966 ఫిబ్రవరి 6న ఈయనకు ఇందిరా సుబ్బరామిరెడ్డితో వివాహమైన

సినిమా నిర్మాణం
ఇతడు తెలుగు, హిందీ, తమిళ, సంస్కృత భాషలలో కొన్ని సినిమాలను నిర్మించాడు. సంస్కృతంలో ఇతడు నిర్మించిన భగవద్గీత చలనచిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

ఇతడు నిర్మించిన సినిమాల పాక్షిక జాబితా:

తెలుగు

  1. జీవన పోరాటం
  2. స్టేట్ రౌడి
  3. గ్యాంగ్ మాస్టర్
  4. సూర్య ఐ.పి.ఎస్

హిందీ

  1. దిల్‌వాలా
  2. చాందినీ
  3. లమ్హే
  4. స్వామి వివేకానంద

సంస్కృతం

  1. భగవద్గీత

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-11-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు .3వ భాగం.26.11.22 గ

శ్రీమతి శ్రీదేవి మురళీధర్ రాసిన వేదాంత దేశికులు .3వ భాగం.26.11.22 గ

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment