బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.19.వ భాగం.3.10.22
Video link
బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.19.వ భాగం.3.10.22
Video link
ప్రముఖ నాటక,చరిత్ర రచయిత ,సాహిత్య అకాడెమి అవార్డీ-శ్రీ అంగర సూర్యారావు
అంగర సూర్యారావు (జూలై 4, 1927 – జనవరి 13, 2017) ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన “చంద్రసేన” ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. ‘సమగ్ర విశాఖ నగర చరిత్ర’ రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.[1][2] ఆయన సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత.[3]
బాల్యం
అంగర సూర్యారావు 1927 జూలై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు.
విద్య
విద్యాభ్యాసం మండపేట, రామచంద్రపురంలలో జరిగింది.
వృత్తి
1949లో విశాఖపట్నంలో విద్యాశాఖలో గుమాస్తాగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యారావు విశాఖనగరంపై ప్రేమను పెంచుకొని, బదిలీలు ఇష్టపడక పదోన్నతులను వదులుకొని రిటైర్ అయ్యేవరకూ గుమాస్తాగానే వుండిపోయారు.
రచనలు
• తొలి రచన 1945లో ‘ కృష్ణా పత్రిక’ లో వచ్చింది. ( వ్యాసం)
• మొదటి కథ ‘ వినోదిని ‘ మాస పత్రికలో ప్రచురితమయింది.
• ‘ చిత్రగుప్త’, ‘ చిత్రాంగి’, ‘ ఆనందవాణి’, ‘ సమీక్ష’, వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి.
• 1948 నుండి 1958 వరకు ‘ తెలుగు స్వతంత్ర’ లో కథలు, స్కెచ్ లు వచ్చాయి.
• ‘ ఆంధ్ర సచిత్ర వార పత్రిక’, ‘ భారతి సాహిత్య మాస పత్రిక’, ‘ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక’లలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.
• పలు నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -3-10-22-ఉయ్యూరు
‘మనకు తెలియని మహాత్ముని కబుర్లు -4(చివరిభాగం )
శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్యగారు మహాత్మునితో తన పరిచయాన్ని వివరిస్తూ ‘’1942ఫిబ్రవరి నెలలో హిందూస్తానీ ప్రచార సభ కార్యక్రమం గాంధీజీ అధ్యక్షతన వార్ధాలో జరిగింది.ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధిగా నేనూ హాజరయ్యాను .ఇంకా అప్పటికి జవహర్ లాల్ ,ఆజాద్ ,రాజేంద్రప్రసాద్ ,డా పట్టాభి జైళ్ళలోనే మగ్గుతున్నారు .గాంధీజీ తన అధ్యక్షోపన్యాసంలో ‘’నాయకుల్ని విడుదల చేయమని నేను ప్రభుత్వాన్ని యాచిస్తానా ?మనం నిర్మాణ కార్యక్రమం తీవ్రం చేస్తే ,మనశక్తి పెరిగి ,అప్పుడు వారంతట వారే విడుదల అవుతారు .అంతేకాని వాళ్ళంతా జైలులో చచ్చినా సరే ప్రభుత్వాన్ని మటుకు యాచించను’’అని గద్గదస్వరంతో గాంధీ అన్నమాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి .ప్రభుత్వ విధానం వల్లా ,కొపాతి రేకం వల్లా జేవురించిన ఆముఖమూ ,,అనుచరులు జైళ్లలో అనుభవిస్తున్న నరకయాతన తలచుకొని పడే ఆవేదనవల్ల ,కంపిస్తున్న ఆధరం ‘’చచ్చినా సరే ప్రభుత్వాన్ని యాచించను ‘’ అనే దృఢప్రతిజ్ఞను సూచించే జ్యోతిర్మయ నేత్ర యుగ్మమూ ఇప్పటికీ నా మనసులో ప్రత్యక్షమౌతూనే ఉంది .ఎంత తపన పడ్డారో ఆ మహాత్ముడు అర్ధమయింది .
గాంధీజీ మాటలే కాక ,చేతలు కూడా ఒక్కొక్కప్పుడు మహా కఠొరంగా,మరొక్కప్పుడు మహా మృదులంగా ఉంటాయి .కొన్ని పెద్ద విషయాలలో చాలా లొంగుబాటు తనం ,కొన్ని చిన్నవిషయాలలో అమితమైన పట్టుదల చూపిస్తారని పిస్తుంది .’స్వరాజ్యం ఇవ్వండి అని బ్రిటిష్ ప్రభుత్వం ముందు సాగిల పడతా ‘’ అన్నారొకసారి .ఆశ్రమం లో పెట్టెకు చిన్న తాళం వేసిందని కస్తూర్బా తో సంవత్సరం మాట్లాడలేదాయన..’’వజ్రాదపి కఠొరాని,మృదూనికుసుమాదపి ‘’అనే సూక్తి ఆయనకు పూర్తిగా సరిపోతుంది .
‘’ బాపూజీ ‘’అంటే నాన్న అని అర్ధం .గాంధీజీకి తన బిడ్డలేకాదు యావద్భారత ప్రజలకూ, కాదుకాదు అఖిల ప్రపంచానికీ తండ్రి అయ్యాడు .అందుకే ఆయన్ను బాపూజీ అని పిలుచుకొంటూ ఆయన్ను మనం అతి సన్నిహితుని చేసుకొన్నాం .కనుకనే ఆయన మనల్ని విడిచి వెళ్లేసరికి ఇంతగా పరితపిస్తున్నాం .ఆయన భౌతిక శరీరాన్ని మనం ఇక చూడలేం. ఆయన వాణి ప్రత్యక్షంగా వినలేం .కానీ విశ్వ శరీరాన్ని ధరించి ,ప్రణవ నాదం తో తన వాణిని మేళవించి ,బాపూజీ తరతరాలకు అదివ్య సందేశాన్ని అందిస్తూనే ఉంటారు .ఆసందేశాన్ని మనకు ప్రసాది౦ప బడుగాక ‘’అంటూ ముగించారు శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్య గారు.
మహాత్మునితో ఇంతటి ప్రత్యక్ష సంబంధం ఉన్న మహితాత్ముడైన ఈ హిందీ ఉద్యమకారుని గురించి ఎక్కడా ఎవరూ ప్రస్తావించిన దాఖలా లేదు .మా అబ్బాయి శర్మ ఎక్కడో రెండు పేజీలు సంపాదించి నాకు పంపించి ఆయనమీద ఎవరూ రాయలేదు అయన చెప్పిన విషయాలు ఎవరూ ఎక్కడా చెప్పినట్లు లేదు మనమే రాయాలి అంటే కనిపించీ కనిపించని చిన్నచిన్న అక్షరాలలో ఉన్న ఆ సమాచారాన్ని కళ్ళు పెద్దవి చేసుకొని ,భూతద్దంలో చూసి నట్లు పెంచి చూసి ఆదివ్య సందేశాన్ని మీకు అందించగలిగినందుకు నేను ధన్యుడిని .అలాంటి ఉన్నవ వారి మాటలు అమృతపు ఊటలు అనిపిచాయి .అందుకే ఈ వ్యాస పరంపర బాపూకే కాక, ఉన్నవ వారికీ చిరుకానుకే . .
గాంధీ జయంతి శుభా కాంక్షలతో
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-22-ఉయ్యూరు
పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.7వ భాగం.2.10.22
Video link
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -3
శ్రీ ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య గారు ‘’నేనెరిగిన గాంధి ‘’లో విషయాలు తెలుసుకొంటున్నాం మనం .1916నాటి ఉదంతాన్ని ఆయన మాటలలోనే ‘’1916లో దక్షిణ భారత హిందీ ప్రచార సమితి రజతోత్సవాల సందర్భంగా గాంధీజీ ఆంధ్రదేశం లో చివరి సారిగా పర్యటించారు .జనవరి 20వ తేదీ ఉదయం 10-30 గం లకు గాంధీ పరివారపు స్పెషల్ ట్రైన్ వాల్తేరు చేరింది .నేను వాల్తేరునుంచి మద్రాస్ వరకు ఆయనతో ప్రయాణం చేశాను .వాల్తేరు స్టేషన్ దగ్గర బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది .అక్కడే గాంధీ మొదటిసారిగా ప్రసంగించారు .అసంఖ్యాకం గా ఉన్న జన సమూహం నుంచి కొద్దిగా గల్లంతు బయల్దేరేసరికి గాంధీజీ కొంచెం తీవ్రంగా ‘’క్రమశిక్షణ అవసరం. లక్షలాది జనం వచ్చినచోట కూడామనం మహాసభలను ప్రశాంతంగా జరుపు కోలేకపోతే ,స్వరాజ్యానికి అర్హులమే కాజాలం .ఒక వేళ స్వరాజ్యం వచ్చినా ,నిలుపుకోలేము ‘’అని హెచ్చరించారు .అంతటితో మంత్రద్రష్టంగా సభఒక్క సారి నిశ్శబ్దమై పోయింది .అందుకు బాపూజీ ప్రజలను అభినందించారు .ఆయనమాట్లడుతూ ‘’స్వతంత్ర్య భారత దేశం లో ప్రతిభారతీయుడూ హిందూ స్తానీ నేర్చుకోవాలి .ఆంధ్రదేశం లో హిందీ బాగా ప్రచారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది .’’అన్నారు .
వాల్తేరు నుంచి మద్రాస్ చేరేలోపు ప్రతి చోటా వేలకు వేలు జనం గాంధీ దర్శనార్ధం వచ్చారు .రైతులు ,కూలీలు ఎక్కడి పనులు అక్కడ వదిలేసి పరిగెత్తుకొని వచ్చి ఆయన్ను దర్శించి తన్మయం చెందిన దృశ్యాలను నేను మరవలేదు .మహాత్ముని ముఖ దర్శనం కాగానే ఆ అమాయక ప్రజలముఖాలలో అనుభూతి ,దివ్య వికాసం ,ఆనందం ,కళ్ళల్లో కలిగిన తృప్తి ,కారుతున్న ఆనంద బాష్పాలు నాకు అమితాశ్చర్యం కలిగించాయి. చేతులెత్తి మొక్కటం, వేడుకోవటం , సాస్టాంగపడటం చూస్తె ,అది ‘’మూఢ భక్తేమో ‘’అనిపించింది .పుణ్య క్షేత్రాలు దర్శింఛి నప్పుడు, భగవత్ ఉత్సవాలలో ,ఊరేగింపులలో కలిగే తన్మయత్వం మహాత్ముని చూస్తె కలగటం నేను చూసి పరవశం చెందాను .ఆయన దర్శనం ఒక్క క్షణకాలమే అయినా వారు పొందిన తన్మయత్వం ,ఆత్మ పురోగతిమార్గం లో వారిని ఒక మెట్టు పైకి ఎక్కి౦చి౦దని నానమ్మకం . గాంధీజీ సంక్షంలో గడిపే వారు ఎపుడైనా ఆఅయకులు పొందిన అనుభూతి పొందారా అని నా అనుమానం .
గాంధీజీ పరివారం భోజన విశ్రా౦తులకు సింహాద్రిపురంలో రైలు సుమారు 3గంటలు ఆగింది .అప్పుడే అక్కడికి ఒక మిలిటరీ స్పెషల్ వచ్చింది .అందులోని సైనికులంతా పరుగుపరుగునవచ్చి మహాత్ముని దర్శనం చేసుకొన్నారు .కనిపించిన ప్రతి మనిషిని హరిజన నిధికి డబ్బు ఇవ్వమని గాంధీ తన అక్షయ హస్తం చాచారు .సైనికులనూ అలాగే అడిగితె వాళ్ళు చేతిలో ఏమీ రాల్చకుండా కోయ్యబోమ్మల్లా నుంచుంటే ‘’మీరేనా దేశాన్ని,ప్రజల్నీ రక్షించేది ?బీదవారికి ఒక్కపైసా కూడా ఇవ్వటానికి సాహసించని మీరు దేశాన్ని ఏం రక్షిస్తారు?హరిజన సేవకు విరాళాలివ్వమని గవర్నర్లనూ వైశ్రాయిల్నీకూడా అర్ధిస్తాను .ఇది రాజ ద్రోహం కాదు ‘’అనేసరికి సైనికులు బారులు తీరి కానుకల వర్షం కురిపించారు .బాపు వాక్కు అమృత వాక్కు కదా !
సహచరులఎడ గాన్దీకున్న గౌరవ ప్రతిపత్తులు తెలియ జేస్తా..ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచార సభాధ్యక్షులు శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు అనారోగ్యం వల్ల గాంధీ దర్శనానికి రాలేక పోయారు .ఆ విషయం బాపూజీతో నేను చెప్పాను .వెంటనే మహాత్ముడు ‘’ఎంత మాట ?వారు నా దగ్గరకు రావాలా ?నేనే వారి వద్దకు వెళ్లి దర్శనం చేసుకోవాలి .కానీ అవకాశం లేకపోతోంది ‘’అని ఎంతో చింతించారు బాపు .కానీ తర్వాత బెజవాడ స్టేషన్ లో దేశభక్తుడు గాంధీని దర్శించగా ,అప్పటికే మౌనవ్రతం మొదలు పెట్టిన ఆయన ఒక కాగితం పై ‘’మనం చాలాకాలం కలిసి పని చేశాం .ఇప్పుడు మీరు బాగా వృద్దులైపోయారు .ఇంతశ్రమ పడి ఎందుకు వచ్చారు?’’అని రాసి వెంకటప్పయ్యగారికిచ్చారు .రైలులోనే వారిద్దరూ నిష్కామ కర్మ ,భగవద్భక్తి పురుష ప్రయత్నం మొదలైనగహన విషయాలపై కాగితాలమీదే రాత పూర్వకంగాచర్చలు జరిపారు .ఆ కాగితం ముక్కలు కొండా వారి దగ్గర ఉన్నాయేమో?
శ్రీ దిగుమర్తి రామస్వామిగారు గొప్ప దేశ భక్తులు ,నిష్కలంకులు వారు గాంధీ దర్శనానికి వస్తే బాపూ వేసిన ప్రశ్నలు –‘’మీ తల్లిగారు క్షేమంగా ఉన్నారా ?ఆమె వృద్ధాప్యంవలన లేవలేని స్థితిలో ఉన్నారని తెలుసుకొన్నాను .అలా జీవించటం దుర్భరం ‘’అంటూ చింతించారు బాపు .’’మీరు 125ఏళ్ళు జీవిస్తారని తెలుసుకొని మా తల్లిగారు చాలాసంతోషించారు ‘’అని రామస్వామిగారు అనగా గాంధీజీ ‘’నేను 125సంవత్సరాలు జీవిస్తానని జోస్యం చెప్పలేదు .ఈ దాసుని సేవ అవసరం అని భగవంతుడు భావిస్తే,మానవ సేవ చేసేందుకు అన్నేళ్ళు బతుకుతాను అన్నాను .అంతే కాని జరాభారంతో క్రుంగి కృశించిపోయి లేవలేని స్థితిలో అన్నేళ్ళు బతకాలనికాదు నా ఉద్దేశ్యం ‘’అన్నారు బాపు .అలాగే వెళ్ళిపోయాడు బాపు ఆఖరిక్షణం వరకు మానవ సేవాకర్యంలోనే నిమగ్నుడై .జగత్పితను ఆరాధించటానికి వేదిక నెక్కబోతుండగా తన భౌతిక శరీరం వదిలేశారు మహాత్ముడు .ఆయన సంకల్ప సిద్ధుడు, స్థిత ప్రజ్ఞుడు ‘’.
గాంధీ జయంతి సందర్భంగా బాపూకొక చిరుకానుకగా
సశేషం
గాంధీ జయంతి శుభా కాంక్షలతో
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-22-ఉయ్యూరు
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.18వ భాగం.2.10.22
Video link
హాస్యానందం
36- ద్వంద్వార్ధోక్తి
రెండు అర్ధాలు గల మాటలను ఉపయోగించటం .ఆ పండితుడు ‘’పతిత ద్విజుడు ‘’అంటే ఆయన పళ్ళు ఊడిపోయాయి అని అర్ధం కానీ పతితుడైన బ్రాహ్మణుడు అనీ అర్ధం ఉంది అప్పుడు నవ్వు ఆపుకోలెం అంటారు హాస్య మాణిక్యం గారు .ఒక సారి మొక్కపాటి వారిని మాస్టారు ‘’గురు పాదులు ‘’అన్నారట. ఆయన ఈయనకు గురు తుల్యులే కానీ ఇందులో కొంటె తనం దాగి ఉందని మునిమాణిక్యం మాస్టారు చెప్పారు .అంటే ఆయన పాదాలు చాలా పెద్దవి అనే అర్ధం కూడా ఉంది అని విప్పి చెప్పారు .వాడు కైంకర్యం చేశాడు అంటే దేవుడికి నైవేద్యం పెట్టాడు అని పైకి అనిపించినా దేవుడి సొత్తు కాజేశాడని ఇన్నర్ మీనింగ్ ఉందండోయ్ .
ఆమె మోము తామర అంటే ,కన్ను తామర ,చరణములు తామర ,కరంబులు తామర అనే ఒక పద్యం ఉంది ఒక హాస్యగాడు ‘’మొల తామర అని విన్నాం కానీ ఒళ్ళంతా తామరే అన్నమాట అదేదో దూలగొండి లాగున్నది ‘’అని చమత్కరించాడట .పద్మ౦ అనటానికి బదులు తామర పదం వాడినందువల్ల ఆ దురద గోక్కోలేక నవ్వలేక ఉక్కిరి బిక్కిరౌతాం .ఇంతకీ ఆపద్య రాజం ఏమిటి అంటే అని మాస్టారు చెప్పారు –‘’అటుపయి మోము దామరట,యక్షియు తామర లోన దామరేయట,-చరణంబులు దామర యేయంట,కరంబున దామర౦ట-ఇంతటి విపరీత మున్నెమొల తామర వింటిమి గాని మేని యందంతట నిటు తామరం గలుగు తన్వి నిజంబుగదూల గొండియే’’-ఇది శెట్టి నరసింహం గారి పద్యం అని చెప్పారు మాస్టారు .కాసేపు గోక్కుందాం .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-10-22-ఉయ్యూరు
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -2
ఉన్నవ వారు చెప్పిన బాపూ కబుర్లు –‘’గాంధీజీ తన జీవిత చరిత్రలో తన జీవిత ఉద్దేశ్యాలను స్పష్టంగా చెప్పారు .ఆయన లక్ష్యం భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించటం మాత్రమె కాదు .స్వారాజ్యాన్నీ ,ఈశ్వర సాక్షాత్కారాన్నీ ఆత్మ దర్శనాన్నీ పొందటమే ఆయన లక్ష్యం .తాను చేసిన ప్రతిపని భగవద్దర్శనం కోసమేనని ,ఈ ప్రయత్నం లో తాను ఆహుతి అవటానికి కూడా వెనుదీయననీ ,,తానూ రాజకీయ రంగం లో ప్రవేశించటం కూడా ఆత్మ సాక్షాత్కారం పొందటానికే అని గాంధీ రాశారు .తనకు ఇంకా భగవద్దర్శనం పూర్తిగా కలగలేదని అనేవారు .
ఒక సారి గాంధీని ఇలా ప్రశ్నించా ‘’బాపూ !మీరు ఆత్మ కథలో ముప్పై ఏళ్ళుగా భగవంతుని దర్శనంకోసం నిరంతరం శ్రమిస్తున్నానని ,ఆ ప్రయత్నం లో అగ్ని గుండాన దూకటానికైనా సిద్ధమే అని రాశారు కదా .మీ ఉద్దేశ్యంలో భగవంతుడు ఎలా ఉంటాడు ?ఏ రూపం లో మీరు భగవంతుని చూడాలని అనుకొంటున్నారు ?శ౦ఖుచక్రగాదాయుధాలతో ఉన్న విష్ణు మూర్తిని చూడాలనుకొంటున్నారా ‘’అంటే బాపు చిరునవ్వు నవ్వి ‘’క్రైస్తవులకు ఆరూపం లో సాక్షాత్కరించడు కదా ‘’అన్నారు .’’కానీ భక్త శిరోమణి తులసీ దాస్ కు విష్ణు రూపం లోనే దర్శనమిచ్చినట్లు తెలుస్తోందికదా ‘’అన్నాను .’’అవును .యద్భావం తద్భవతి .అన్నట్లు ఎవరు ఏ భావంలో ఆరాధిస్తే ఆ రూపం లో భగవద్దర్శనం లభిస్తుంది .కాని నాకు ఏదో ఒక ఆకార మూర్తిగా దర్శించాలని లేదు .నిరాకార ,నిరంజన ఆత్మ స్వరూపాన్నే సాక్షాత్కరింప జేయమని కోరుతున్నాను ‘’అన్నారు బాపు .ఆయన అన్నిమతాలను సమభావం తో చూశారు .రామనామ సంకీర్తనం చేసేవారు .సాకారమూర్తిని సేవించలేదు .నిజానికి ఆయన ఆరాధించిన రాం రహీం యేసు లకు భేదమే లేదు .
‘’గాంధీజీ రాసిన గీతా బోధన నాకు తెలుగులో రాయటానికి అదృష్టం కలిగింది .అందులో అయిదవ అధ్యాయం 18వ శ్లోకం ‘’విద్యా వినయ సంపన్నేబ్రాహ్మణే గవి హస్తిని – శుని చైవ స్వపాకం చ పండితా స్సమ దర్శనః ‘’భావం నాకు స్పష్టంగా గోచరించలేదు .వెంటనే గాంధీని ‘’బాపూ !అందర్నీ సమాన దృష్టితో చూడటం అంటే ఏమిటి ?అది ఎలా సాధ్యమౌతుంది ?మిమ్మల్నీ ,మురికి బట్టలు ఉతికే చాకలిని సమానంగా గౌరవించటం ఎలా ?ఆ చాకల్ని ‘’దయ చేయండి ఈ కుర్చీలో కూర్చోండి ‘’అని గౌరవిస్తే లోకులు నన్ను పిచ్చి వాడు అనుకోరా ?కనుక ఈ సమత్వాన్ని మా నిత్య జీవితం లో ఆచరణలో పెట్టటం ఎలాగో వివరించి చెప్పండి ?’’అన్నాను .బోసినవ్వుల బాపు ‘’సమత్వం అంటే అదికాదు ..ఎవరికీ ఏది అవసరమో గుర్తించి ,వారికి ఆ విధంగా సేవ చేయటం ‘హాథీకో మన్,చివుంటేకో కణ్’’అన్నట్లు ఏనుగు కు మణుగు ఆహారాన్ని చీమకు ఒక కణం ఆహారాన్ని పెట్టినా రెండిటికి సమానంగా ఆహారం పెట్టినట్లే లెక్క ..ఆకలేసిన వాడికి ,ఆకలి లేని వాడికీ సమానంగా పెడితే ఇద్దరికీ అపచారం చేసిన వాళ్ళమవుతాం .వారిద్దర్నీ సమాన దృష్టితో మనం చూడలేదన్నమాట .కనుక ఎవరికీ ఏది ఎంత అవసరమో వారికి ఆ సేవను ప్రతిఫలాపేక్ష లేకుండా చేయటం వల్లనే సమదృష్టికలుగుతుంది .అభ్యాసం అనుభవాలవలన ఈ ధర్మ సూక్ష్మాలు బోధ పడతాయి ‘’అని ఉపదేశించారు మహాత్మాజీ .
రేపు గాంధీ జయంతి సందర్భంగా బాపూకొక చిరుకానుకగా
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-22-ఉయ్యూరు
శమీ అష్టోత్తరం
ఈశాన్యైనమః
పాపశమన్యైనమః
వశన్యైనమః
శివాఫలాయైనమః
లోహిత కంకటాయైనమః
అర్జున బాణ సంరక్షకాయైనమః
రామస్య ప్రియ దర్శినిన్యైనమః
యాత్రాయాం సుఖ ప్రదాయైనమః
నిర్విఘ్న కర్త్రుకాయైనమ
10-శ్రీరామ పూజితాయైనమః
అగ్నికాంతిప్రతీకాయైనమః
విఘ్నేశ పూజా విధాయకాయైనమః
శని దోష నివారకాయైనమః
యుద్ధ విజయ సాధకాయైనమః
పాండవాయుధ రక్షకాయైనమ
కుష్ఠువ్యాధి నివారకాయైనమః
ఇభ వక్త్రాయనమః
గర్భ స్రావ నివారకాయైనమః
కఫ నివారకాయైనమః
20-శ్లేష్మధ్వ౦స కాయైనమః
ఏక వింశతి పత్రికా ముఖ్యైనమః
రోమనివారణాయైనమః
భూసార వృద్ధిదాయైనమః
పాంధఛాయా కల్పితాయైనమః
పోషకాహారాయైనమః
శాకపాక వినియోగాయైనమః
దంత వ్యాధి నివారిణ్యైనమః
సర్వ రోగనివారిణ్యైనమః
అపరాజితా దేవీ ప్రియాయైనమః
30-గోత్ర వంశాభి వృద్ధి దాయిన్యైనమః
క్షీర పక్షి ప్రియాయైనమః
కల్ప వృక్ష సమాయైనమః
పశు సంరక్షకాయైనమః
శ్రీ భద్రాయై నమః
పుణ్యదాయైనమః
పుణ్యరూపిణ్యైనమః
జానకీదుఃఖ శమన్యైనమః
సర్వ కల్మష సంహార్యై నమః
కామితార్ధ ప్రదాయై నమః
40-సత్య రూపాయయై నమః
శుభ ప్రదాయై నమః
శుద్ధాయై నమః
శక్త్యైనమః
పూతాత్మికాయై నమః
చతుర్వర్గ ఫలదాయైనమః
త్రిలోక జనన్యై నమః
మూల ప్రకృతిసంజ్నికాయైనమః
బ్రహ్మ రూపి ణ్యైనమః
అవాజ్మానస గోచరాయై నమః
50-పంచ భూతాత్మికాయైనమః
పంచ కలాత్మికాయైనమః
నిర్గుణాయై నమః
నిత్యాయైనమః
నిరాటంకాయనమః
దీన జన వత్సలాయై నమః
చతురానన సేవితాయైనమః
సిద్ధి ప్రదాయై నమః
అమలాయై నమః
కమలాయై నమః
60-లోక వందితాయై నమః
లక్ష్మైనమః
రామ ప్రియాయైనమః
విష్ణు ప్రియాయై నమః
తటిల్లతా౦గ్యై నమః
ప్రకృత్యై నమః
సర్వ భూత హిత ప్రదాయై నమః
విభూత్యై నమః
పరమాత్మికాయై నమః
శుచయే నమః
70-ధన్యాయై నమః
నిత్య పుష్టాయై నమః
దీప్తాయై నమః
రమాయై నమః
వసు ధారి ణ్యై నమః
క్రోధ సంభవాయై నమః
అనుగ్రహ ప్రదాయై నమః
అశోకాయై నమః
లోక శోక వినాశిన్యై నమః
అనఘాయై నమః
80-కరుణాయై నమః
ధర్మ నిలయాయై నమః
లోక మాత్రేనమః
దేవ్యై నమః
సుప్రసన్నాయైనమః
ప్రభాయై నమః
ఆహ్లాద జనన్యై నమః
విమలాయై నమః
విశ్వ జనన్యై నమః
వహ్ని ధరాయై నమః
90-యశస్విన్యై నమః
జయాయై నమః
మంగళ ప్రదాయై నమః
సర్వ దిక్ శుభ దాయకా యైనమః
వంశ ప్రవృద్ధయై నమః
గోత్రాభి వృద్యైనమః
ప్రసన్నాక్షాయై నమః
సర్వోపద్రవ వారి ణ్యైనమః
బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
100-పూర్ణాయై నమః
అనంగాయై నమః
స్తవ్యాయై నమః
పరమాయై నమః
తరణాయై నమః
భగవత్యై నమః
తత్వ త్రయ్యై నమః
మత్యై నమః
మాత్రేనమః
హిత కారిణే నమః
110-మాన్యాయై నమః
రాజ్య లక్ష్మై నమః
సర్వ సంపత్తి దాయై నమః
భోగ లక్శ్మైనమః
మహా జయాయై నమః
మహా బోధాయై నమః
మహా బంధన సంహారి ణ్యై నమః
మహా వృక్షాయై నమః
మహా ఛాయాయై నమః
మహానఘాయై నమః
120-మహా శ్వాసాయై నమః
మహా సారాయై నమః
మహా క్షాన్త్యై నమః
యశస్విన్యై నమః
మహారోగ వినాశిన్యై నమః
మహా క్షేమంకర్యై నమః
మహా విష నివారిణ్యై నమః
మహా శుభద్రాయై నమః
మహా సత్యై నమః
మహా నిత్యాయై నమః ‘
130-మహా శివ ప్రియాయైనమః
చిన్మయాకారాయై నమః
కాత్యాయిన్యై నమః
మాతృకాయై నమః
అజ్ఞాన శుధ్యైనమః
సృష్టి రూపాయైనమః
పురుషార్ధ ప్రదాయిన్యైనమః
వరదాయై నమః
భయ నాశిన్యైనమః
140-విశ్వ తోష్యణ్యైనమః
కుల సంపత్ప్రదాయై నమః
ప్రణవాత్మికాయై నమః
ఈశ్వర్యై నమః
చి౦తితార్ధ ఫల ప్రదాయి నమః
సర్వ మంత్ర మన్యైనమః
అమేయాయై నమః
అక్రూరాయై నమః
సర్వాస్త్ర ధారిణ్యై నమః
భూమిజాయై నమః
150-స్వ తేజసాయై నమః
బ్రాహ్మైనమః
జగద్ధితాయైనమః
మాన్యాయై నమః
నిరంజనాయై నమః
నిగమ గోచరాయై నమః
పూజ్యయైనమః
ధర్మ ప్రియాయై నమః
సర్వోపద్రవ వారిణ్యైనమః
లోకానంద దాయికాయైనమః
160-ఓం శ్రీ శమీ దేవతాయై నమః
ఓం శ్రీ శమీ దేవతాయై నమః
ఓం శ్రీ శమీ దేవతాయై నమః
ఓం శ్రీ శమీ దేవతాయై నమః
పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.6వ భాగం.1.10.22
Video link
బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.17వ.భాగం.1.10.22
Video link
మనకు తెలియని మహాత్ముని కబుర్లు -1
హిందీ భాషోద్యమాన్ని 40 సంవత్సరాలు దిగ్విజయంగా నిర్వహించిన వారు శ్రీ ఉన్నవ రాజ గోపాల కృష్ణయ్యగారు .ఆయన ‘’నే నెరిగిన గాంధీ ‘’అనే పుస్తకం రాసి గాంధీజీతో తన అనుభవాలు తెలియజేశారు .అందులో గాంధీ మరణ వార్త గురించి ఆయన ఏమి రాశారో తెలుసుకొందాం .
‘’గుంటూరు జిల్లా ఉన్నవా అనే కుగ్రామం లో ఉన్న మాకు 30వ తేదీ రాత్రికే గాంధీజీ మృత్యు వార్త తెలిసింది .ఆ రోజు నేను పడిన ఆవేదన నాకే ఆశ్చర్యమేసింది .మాతల్లి మరణి౦చి నప్పటి కన్నా ఎక్కువగా దుఖించాను .అంత దుఖపడటం అవసరమా అని పించింది .మస్తిష్కం ఉచితానుచితాలను పట్టించుకోదు.దుఖం కొంతతగ్గాక అందుకు కారణం వెతుక్కొని కొంతతృప్తి చెందాను .గాంధీ మాట విని పాథశాల స్వస్తి చెప్పి ,30ఏళ్ళుఉడతా భక్తిగా దేశ హితైక కార్యక్రమాలలో మునిగి తేలాను .ప్రతినిమిషం ఆయనతో పెనవేసుకుపోయాయి మా లాంటి వారి జీవితాలు .అలా౦టిమాకు ఈ గ్రంధి తెగేసరికి విసిరి ఒడ్డుమీద పడేసినట్లయింది .తీరని వేదన, వ్యధ పడక తప్పదు.
1934లో గాంధీతో ప్రత్యక్ష పరిచయభాగ్యం హరిజనోద్ధరణ సందర్భంగా ,అంతకు ముందు 1916లో దక్షిణ భారత హిందీ ప్రచారసభ రజతోత్సవం నాడు మహాత్ముని ఆంద్ర దేశానికి తోడ్కొని వచ్చే మహా అదృష్టం నాకు దక్కింది .నా జన్మ చరితార్ధమైంది ..1934 గాంధీ ని ఆహ్వానింఛి తీసుకురావటానికి ఆంధ్రరాష్ట్ర హరిజన సేవా సంఘ కార్యదర్శి శ్రీ మాగంటి అంకినీడు గారు పంపగా ,నేను డోర్నకల్లు స్టేషన్ కు వెళ్లి ,గాంధీజీ పరివారంతో బెజవాడకు వచ్చాను .ఆరోజుల్లో గాంధీజీకి మీరాబెన్ సుశ్రూష చేసేవారు .
తెల్లారుతోంది గాంధీ ఇంకా ఏదో రాసుకొంటూనే ఉన్నారు .ఆయన నెత్తిమీదున్న నాలుగు వెంట్రుకలు పిల్ల తెమ్మేరలకు నృత్యం చేస్తున్నాయి .ఆ దృశ్యం చూడగానే బసవరాజు అప్పారావు గారి గేయం ‘’నాలుగు పరకల పిలక .నాట్యమాడే పిలక –నాలుగూ వేదాల నాణ్యమెరిగిన పిలక –కొల్లాయిగట్టితేనేమి మా గాంధి కోమటైపుట్టితేనేమి ?”’అనే గేయం పాడి ,మీరాబెన్ కు వినిపించి హిందీలో అర్ధం చెప్పాను .ఆమె ఎంతో సంతోషించింది .ఆంధ్రకవి కల్పనా శక్తికి అబ్బురపడి శ్లాఘించింది .అప్పుడు గాంధీజీ బస బందరులో జాతీయ కళాశాలలో ఏర్పాటు చేయబడింది .అప్పుడు నేను ఆకళాశాలలో హిందీఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను .మూడు రోజులు గాంధీ ఇక్కడే ఉన్నారు .కార్యక్రమం బాగా ప్రశాంతంగా జరిగింది .విశాలంగా ఉన్న కాలేజి ఆవరణలోకి గాడిదలను రాకుండా చేయలేకపోయాం .ఒక రోజుఒక గాడిద గట్టిగాఓ౦డ్ర పెడుతోంది .గాంధీ విని ‘’అచ్చా అచ్చా సురీలాహై ‘’అంటే శ్రావ్యంగా ఉంది అన్నారునవ్వుతూ .నేను వెంటనే అందుకొని ‘’గాంధీజీ !గాడిద తత్వ విచారణ చేస్తోంది ‘’ఖుదాహై ‘’?అంటే దేవుడున్నాడు’’అని .కానీ ఎందుకో సందేహ౦ కలిగి ‘’హైకి నహీ హైకి ,నహీ ‘’ఉన్నాడా ,లేడా,ఉన్నాడా లేడాఅని వితర్కిన్చుకొని చివరాఖరికి ‘’హై హై హై’’ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అని నిర్ణయానికి వచ్చింది అంటూ ఇంచుమించు అదేస్వరంతో నే చెప్పాను ఆయన సంతోషం తో పకపకా నవ్వారు .ఆయన అంతరం ఏమిటి /నా అంతరం ఏమిటి ?ఈ ఛలోక్తి విసిరేసాహాసం నాకు ఎలా వచ్చింది .నాకే ఆశ్చర్యమేసింది నిజానికి బాపూజీకి సామాన్యుల యెడ వాత్సల్యం ,సహజ వినోదప్రయత్నమే నన్నీ సాహసానికి ప్రోత్సహించింది .
రేపు గాంధీ జయంతి సందర్భంగా బాపూకొక చిరుకానుకగా
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-22-ఉయ్యూరు
పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.5వభాగం .30.9.22
Video link
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-6
తారాశంకర్ రాసిన చైతాలిఘూర్ని ,పాషాణపూరి ,నీలకంఠ,మన్వంతర నవలలు ఆయన మానసిక అశాంతికి దర్పణాలు .అశాంతి అలజడి ఆయన రచనలలో తరచుకనిపిస్తాయి .ధనవంతుల సాంఘిక వ్యవస్తఃలో సగటుమనిషి జీవితం వ్యధాభరితం అని చైతాలి తెలియజేసింది .ఇందులో దుర్భరక్షామ౦ వర్ణించాడు .గోష్టఅనే నే పేదరైతు భార్య దామినితో ఉన్నవూరు వదిలి పెట్టి పోవాల్సి వస్తుంది .కాబూలీవాలవద్ద తీసుకొన్న అప్పు తీర్చలేకపోయాడు .బతక టానికి బస్తీ వెళ్లి ఫాక్టరీ లో రోజుకు యాభైపైసల కూలీ గా చేరి ,రోజుకు 8గంటలు పనిచేసినా బతకటం కష్టమైంది. స్త్రీలమానం పెట్టుబడి దారులకు అతి సులభం .దామి పై వాడి చూపుపదిండి.ఒక రాజకీయపార్తి సమ్మె చేయమంటారు .ఫాక్టరీ మూసేస్తారు .ఆకలి విలయ తాండవం చేస్తుంది .కొందరుకూలీలు తట్టుకోలేక యజమానిని పనిలోకి తీసుకోమని ప్రాధేయపడతారు .సమ్మె చేయాలన్న వారు వీరితో ఘర్షణ పడతారు .ఆదోమ్మీలో మేస్త్రి గోష్టను చంపేస్తాడు .’’చైత్రమాసపు తుఫాను భయంకరమైందేమీ కాదు ముందు రాబోయే భయంకర తుఫానుకు సూచన మాత్రమె ‘’అని నవలముగిస్తాడు తారాశంకర్ .
పాషాణ పురి నవల బిగుతుగా నడుస్తుంది .హత్యా,గృహదాహన నేరాలకు మరణ శిక్ష అనుభావిన్చాల్సిన ఒక కవి జీవిత గాథ ఇది .రసవత్తరమానసిక రుగ్మత ఉంది .జైలు శిక్ష పడి బయటికొచ్చినవాడు ఎవర్నీ లక్ష్యం చేయక నేరస్తుడౌతాడు అనేసత్యం చూపిస్తాడు .నీలకంఠ నవలలో కథ ఉండదు .ఒకపేద భార్యాభర్తల కథ .యజమాని వాడినికొట్టించి జైలులో పెట్టిస్తాడు. ఆమె ఒంటరిదావ్వగా బంధువొకడు ఆమె శీలాన్ని శంకి౦చి ప్రచారం చేస్తే ,ఆమె ఆగ్రామాన్ని తగలబెట్టి పట్నం చేరి మగపిల్లాడని కని నీలకంఠ పేరుపెట్టి చచ్చిపోతుంది .కొడుకు పెద్దవాడై గ్రామానికి వస్తాడు .తండ్రి అని తెలియకపోయినా బంధువుగా ఉంటూ ఇద్దరూ పట్నం చేరతారు .బలహీనకథ
మిడ్నపూర్లో క్షామం తుఫాను వరద ఉకిరిబిక్కిరి చేస్తాయి .కని తోకలిసి నీల సాయం చేస్తుంది .యుద్ధప్రభావం మనుషులపై ఎక్కువైంది .కొందరుకోటీశ్వరులైతే ఎక్కువమంది దరిద్రనారాయణులయ్యారు .కన్నెపిల్లల్ని వ్యభిచారంలోకి దింపి డబ్బు సంపాదిస్తున్నారుకొందరు తండ్రులు .యుద్ధం వలన కొత్త తరం ఏర్పడింది .తలిదండ్రులకు పిల్లలకు ఆమధ్య అగాధమేర్పడింది .కమ్యూనిస్ట్ పార్టీలో ఇద్దరూ చేరతారు .సమకాలీన సమస్యాచిత్రణం ఇందులో రచయిత బాగా చేశాడు .సరోజకుమార్ చౌదరినవల కాలో ఘోడా-నల్లగుర్రం తప్ప యుద్ధ భీభత్సం ఏ నవలాకారుడు రాయలేదు .మళ్ళీ తారాశంకర్ రాసి సాహితీ గౌరవం పెంచాడు .కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు కాకపోయినా యుద్ధ సమయంలో వారి సేవాస్పూర్తి నచ్చి ఈనవల రాసి న్యాయం చేకూర్చాడు .
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -30-9-22-ఉయ్యూరు ,
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.16వ భాగం.30.9.22
Video link
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -16
· 49-రాళ్ళపల్లి వారి గాదా సప్తశతికి ఆంగ్లానువాదం,అలియరామరాయభూపాలుడు రాసి,హిందూ విలేకరి ,తాలూకా బోర్డ్ ప్రేసే డెంట్ శ్రీ టి.శివ శంకరం పిళ్ళే ,
టి.శివశంకరం పిళ్లె అనంతపురం జిల్లా పెనుకొండ లో నివసించాడు. న్యాయవాదిగా పేరు సంపాదించాడు. మంచి రచయిత. మంచి వక్త. ఇతడు గుత్తిలో డాక్టర్ సుబ్బయ్య పిళ్లె పెంపుడు కొడుకు. డాక్టర్ సుబ్బయ్య గుత్తి నుండి పెనుకొండకు బదిలీ అయ్యాడు. పెనుకొండలో ఉండగా శివశంకరం పిళ్లెను పెంచి పెద్ద చేశాడు. ఎలిమెంటరీ విద్య పెనుకొండలో చదివాడు. ఆ కాలంలో పెనుకొండలో ఉన్నత పాఠశాల లేదు. దానితో శివశంకరంపిళ్లెను బళ్లారికి పంపించి మెట్రిక్యులేషన్ చదివించాడు. తరువాత పెనుకొండలో రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా చేరాడు. భారత,భాగవత పురాణాలన్నీ బాగా చదువుకున్నాడు. తెలుగు సాహిత్యంలో పాండిత్యం సంపాదించాడు. ఆ కాలంలో బహుళ ప్రచారంలో ఉన్న కందుకూరి వీరేశలింగం సాహిత్యం చదివి ప్రభావితుడై పెనుకొండలో ఉన్న విధవరాలైన ఒక మధ్వ బ్రాహ్మణస్త్రీని పునర్వివాహానికి అంగీకరింపజేసి బెంగళూరులోని తన మిత్రుడితో విధవావివాహం జరిపించాడు. గుమాస్తా ఉద్యోగం వదిలి వకీలు పరీక్షకు కట్టి ప్యాసై వకీలు వృత్తిని చేపట్టాడు. శివశంకరం పిళ్లె ఒక మరాటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికే ఆమె మృతి చెందింది. ఇతడు తాలూకా బోర్డు ప్రెసిడెంటుగా చాలా కాలం పనిచేశాడు. 1913లో బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు హాజరయ్యాడు. హిందూ పత్రికకు పెనుకొండ నుండి విలేఖరిగా ఉండి వార్తలు, వ్యాసాలు పంపేవాడు. కృషి పేరుతో ఒక పత్రికను కూడా నడిపాడు.
చనలు
50-సంగీత భావ ప్రధాన రచనలు,గంగావతరణ శివ తాండవం చేసి న ,విద్యాప్రభాస సంస్థ స్థాపకురాలు ,కవయిత్రీతిలక –శ్రీమతి కొలకలూరి స్వరూప రాణి
కొలకలూరి స్వరూపరాణి ప్రముఖ తెలుగు రచయిత్రి.[1]
ఈమె తండ్రి నడికుర్తి వెంకటరత్నం గారు కవి, పండితులు. ఈమె గోవాడ గ్రామంలో జన్మించింది. విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత పంచకావ్యాలు, కాళిదాసత్రయం, భారవి, మాఘం తదితర కావ్యాలు, ప్రబంధాలు చదివింది.
ఆమె తొలి రచన స్వాతంత్ర్యం మళ్లీ వచ్చింది కృష్ణా పత్రికలో ప్రచురించబడింది. ఉపాధ్యాయం అనే కవిత సాహితీపరుల మెప్పుపొందింది. గంగావతరణ శివతాండవం ద్విపద కవితా ప్రక్రియలో సంగీతభావ ప్రధానంగా సాగిన రచన. నన్నయ మహిళ అనేది భారతం గురించిన సమీక్షా గ్రంథం ఆమె ఉత్తమ రచనల్లో ఒకటి. విద్యాధర ప్రభాస అనే సాహిత్యసంస్థను నెలకొల్పి దానిద్వారా తన రచనలను ప్రచురించింది.
ఈమెను 1986లో ఆనాటి ముఖ్యమంత్రి యన్.టి.రామారావు సన్మానించాడు. కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
రచనలు
· గంగావతరణ శివతాండవం
· చంద్రగ్రహణం
· ప్రబోధం
· కల్యాణవాణి
· నన్నయమహిళ
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-22-ఉయ్యూరు
—
హాస్యానందం
34-ఛలోక్తి
ముట్నూరు కృష్ణారావు గారి మనుమరాలు చిట్టెమ్మ యూరప్ అంతా తిరిగొచ్చింది.సరస౦ తెలిసిన చదువుకొన్న ఇల్లాలు .తాతగారిని చూడటానికి వచ్చి ‘’తాతాగారూ ఊరంతా గాడిదలేకనిపిస్తున్నాయి ?’’అనగా పంతులుగారు ‘’అవును చిట్టీ .అవి చాలనట్టు ఆ గాడిదల్ని చూడటానికి అప్పుడప్పుడు పొరుగూరి గాడిదలూ వస్తూంటాయి ‘’అన్నారు చిట్టెమ్మా నవ్వింది ఆయనతోపాటు .’’ఒకాయన డాక్టర్ దగ్గరకు వెడితే చాలామంది ఉండటం వలన డాక్టర్ ఈయన్ను చూడటానికి రావటానికి ఎక్కువ సేపు అయింది .డాక్టర్ ‘’పాపం చాలాసేపు వెయిట్ చేసినట్లున్నారు ‘’అనగా మనాయన ‘’ఎంతసేపైతేనేం డాక్టర్ .రోగం ముదరకముందే చికిత్స చేస్తారనే ఆశతోవచ్చాను ‘’అనగా ఆడాక్టర్ ముఖాన నెత్తురు చుక్కలేదు .
బందరు-గుంటూరు రైలు చాలా నిదానంగా నడిచేది.మంగళగిరి వద్ద ఒక అవ్వ పొలాల్లో అడ్డంగా నడుస్తుంటే జాలిపడ్డ గార్డ్ ‘’అవ్వా నడవలేవుకాని బండీ ఎక్కు గుంటూరులో దిగబెడతాను ‘’అనగా ఆమె ‘’నూరేళ్ళు బతుకు నాయనా .ఇవాళ కోర్టులో వాయిదా ఉంది .బండీ ఎక్కలేను ఎక్కితే ఆపని కి అందుకోలేను ఏమీ అనుకోకు మనవడా ‘’అంది .మరో ఛలోక్తి .గార్డు ఒకముసలమ్మతో ‘’ఈపిల్లాడికి అరటిక్కెట్టే తీశావేమిటి ? నిండు టికెట్ కొనకుండా ‘’అనగా ‘’నిజమేనయ్యా బెజవాడలో ఎక్కినప్పుడు వీడికి నిండు టికెట్టు తీసుకొనే వయసు రాలేదబ్బయ్యా ‘’అని రైలు నత్తనడకపై చాచి కొట్టింది .
ఒకావిడ బ్రష్ తో నగలు కడుగుతుంటే వెనగ్గా వచ్చినావిడ బ్రస్ష్ లాక్కొని’’ వదినా !పందివా?మనిషివనుకొన్నా ‘’అన్నది .’’అవునమ్మా పందివే ‘’అన్నది. ఆవిడ ఆబ్రష్ వెంట్రుకలు మనిషివా పందివా అని చలోక్తిగా అంటే ఈవిడ దాన్ని తిప్పి నువ్వు పందివే ‘’అనే అర్ధంలాగి చలోక్తితో కొట్టింది .
ఒక పిచ్చాసుపత్రి సూపరింటే౦ డెంట్ బదిలీ అవుతుంటే సభ జరిపి ఒకాయనను మాట్లాడమంటే ‘’ఈయన నిగర్వి .మాలో ఒకడుగా మెలిగాడు ‘’అనేసరికి అందరూ భళ్ళున గొల్లు మన్నారు .పార్వతీ పురంలో నడిమింటి మంగళేశ్వర శాస్త్రి గారు ఉద్దండ పండితులు .బొబ్బిలి రాజుగారికి మహా మిత్రుడు.ఒకసారి రాజు ఆయన్ను ‘’మనం ప్రయాణమై పోతున్నప్పుడు నక్క ఎదురైతే మంచిది అంటారు అయితే నాకో డౌటు ఎడమ వేపునుంచి కుడివైపుకు వెడితేనా ,కుడినుంచి ఎడమకు వెడితేనా ?అన్నారు ‘’కరవకుండా ఎటు పోయినా ఇబ్బంది లేదు మారాజా ‘’అన్నారు శాస్త్రిజీ .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-9-22-ఉయ్యూరు
పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.4వ భాగం.29.9.22
Video link
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-5
తారాశంకర్ కథలతోనే సాహిత్యం లో అడుగుపెట్టి అసంఖ్యాకం గా కథలురాశాడు .వాటిని కేటగరైజ్ చేయటం కష్టం.ముఖ్యమైన వాట్ని గురించి తెలుసుకొందాం .జల్సాఘర్ ,రాయ్ బారి ,సారే సత్ గండర్ జమీందార్ –చిన్న జమీందార్ లుఆనాటి జమీందార్ల జీవన విధానాన్ని వివిధ కోణాలలో ప్రతిబింబించేవి .విలాసాలు కామ వా౦చలకు అలవాటైన రోజే ఒక జమీందార్ మందిరంలోనే భార్యకుమారుడు చనిపోగా నిరాశతో వెళ్ళిపోదామనుకొని ఒక్క సారి మందిరం వైపు చూస్తె లోపలి దీపాలుఆహ్వానం పలికినట్లనిపించి మళ్ళీ లోపలి వెడతాడు .రాయ్ వంశీయుల పాత్ర చిత్రణ అద్భుతం .మరోజమీందర్ రైతులకు విపరీతపన్నులు వేసి పీడిస్తే ఎదురుతిరిగి కట్టకపోతే మేనల్లుని బతిమాలి కాశీకి వెళ్ళిపొతాడుఅవమాన౦ భరించలేక .అనురాగ మాధుర్యం తెలిసినవారే జీవించటానికి అర్హులు అని చెప్పే కథ’’బేదిని’’ గొప్పకథ .పడవనడిపే వ్యక్తీ ప్రవృత్తిని గొప్పగాచిత్రించాడు మరోకథలో .వరద భీభత్సంలో అతడు ,భార్యా కొట్టుకుపోతుంటే వాడికి బతకాలనే కోరికకల్గి భార్యను చంపేసి ఈదుకొంటు ఒడ్డుకు చేరాడు .తెచ్చిపెట్టుకున్న గుణాలు కోల్పోయాక మనిషి ఎలాప్రవర్తిస్తాడో వివరించాడు ఇందులో ..చలనామోయి అంటేఅంతు చిక్కనిమనిషి లో మనిషి ఆధునికమానవుడిగా ఆదిమ మానవుడిగా ఎలాప్రవర్తించ వచ్చో చూపాడు .
శంకర్ సంభాషణా చాతుర్యానికి ,రసవత్తరచిత్రీకరణకు అద్దంపట్టేది ‘’అగ్రదాని ‘’-తద్దినం బ్రాహ్మణులు కథ .మనుషులకు పశువులకు మధ్య ఉన్న సంబంధాన్ని ముఖ్యంగా పాములతో అనుబంధాన్ని గురించి ముచ్చటైన’’పడతి-పాము’’కథ, నాగకన్యనవల రాశాడు .హృదయాన్నికరిగించే ఎద్దు కథా రాశాడు .ఆయనకథలన్నీ భూమికిసంబంధించినవే .ఇలాంటికథలు దేశంలో ఎక్కడైనా జరగవచ్చు .చక్కగా పంట పండించి పౌష్యలక్ష్మిని చూసుకొని గర్వం ఆనందంపొంది ,వయసు పైబడి దుర్బలుడైనా ,అమానుష శక్తి తోపంటకోసి ధాన్యం బస్తాలు బండీకి ఎక్కించి ,ఒక ఎద్దు కాడి ఎత్తలేకపోతె,తానే కాడికాసి ,పట్టుతప్పి బండీకి౦దపడి ప్రాణాలు కోల్పోతూ చేతిలోకి ధాన్యంగింజల్ని చేతిలో తీసుకొని ,తన బంగారుపొలాన్ని ఆఖరి సారి చూస్తూ తుది శ్వాస వదిలే కథ గుండెల్ని పిండేస్తుంది .ఇల్లు కట్టే మేస్త్రీకి కూడా కొన్ని విలువలు ఉంటాయని ఇదూరత్ లో చూపించాడు .పల్లెప్రాంత పాత్రలు ప్రశ్నలు వేయవు ,ప్రతి ఘటి౦చవుకూడా .కానీ అరుదైన మానవతా లక్షణాలు వారిలో ఉంటాయి అని చెప్పేదే పోస్ట్ రన్నర్ దీను గురించిన కథ.
వంగ కథానికా రచయితలు ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు .కానీ తారాశంకర్ కథలలో నాటకీయత తగ్గటం క్లిష్టత కావాలని చెక్కే నగిషీ ఉండవు.అయినా ఉత్తమకథానిక రచయితగా పేరు పొందాడు .ఆయనకు జీవితం ఇంద్రధనుసులాగా బహు వర్ణ శోభిత౦గా కన్పించటం ,ఆయన్ను పరవశి౦ప జేయటం ,తాదాత్మ్యం పొందటం మనల్నికూడా ఆనుభూతులకు లోను చెయ్యటం వలన ఆకథలు ఉత్తమోత్తమంగా గుర్తింపు పొంది సర్వోత్క్రుష్టకథా రచయితగా భాసించాడు తారాశంకర్ బంద్యోపాధ్యాయ్ .నిర్జీవ మానవ మేధస్సు ఆయనకు పనికి రాదు .ఆయనకు నచ్చింది ఎప్పుడూ సగటు మనిషిమాత్రమే .పరిణతశిల్పం లేకపోయినా,బలీయమైన నాటకీయత ,స్వచమైన నిజాయితీ కన్పిస్తాయి .సూటిగా పఠితల హృదయాలలోకి చొచ్చుకుపోతాడు తారాశంకర్ .ఆయనకథలలో సగటు మనిషి తన నిజమైన ప్రతి బింబాన్ని చూసుకో గలడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-22-ఉయ్యూరు
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.15వ భాగం.29.9.22
Video link
• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -15
• 46-శ్రీశైల ప్రభ సంపాదకుడు ,తెలుగు గైడ్స్ తోపాటు ,నీతినవనీతం ,శ్రీశైల చరిత్రాది కర్త –రాయలసీమకవి బిరుదాంకితుడు –శ్రీ నూతలపాటి పేరరాజు
• నూతలపాటి పేరరాజు ప్రఖ్యాత రచయిత. సాహిత్యసరస్వతి, విద్యార్ణవ మొదలైన బిరుదులు ఇతనికి ఉన్నాయి. ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా), నూతలపాడు గ్రామంలో 1896లో సీతమ్మ, ఆదిరాజు దంపతులకు జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం నూతలపాడులో నడిచింది. ఇతడు పెక్కు సంవత్సరాలు ఆంధ్రభాషోపాధ్యాయుడిగా అనంతపురం జిల్లా ఉరవకొండలో పనిచేసి అక్కడే స్థిరపడిపోయాడు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాయలసీమ ప్రాంతంలో జీవించడం వల్ల ఇతడు రాయలసీమ కవిగా వాసికెక్కాడు. ఇతడు అనేక గ్రంథాలు రచించాడు. ఆనాటి స్కూల్ ఫైనల్ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాలను అరటిపండు వొలిచి చేతికిచ్చినట్లుగా సులభ పద్ధతిలో నోట్సులు తయారుచేసి ముద్రించాడు. ఇతడు శ్రీశైలప్రభ, శిశువిద్య, ఆరాధన పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు 1968, నవంబర్ 15న తనువు చాలించాడు[1].
రచనలు
1. భక్త అక్క మహాదేవి
2. భక్తమల్లమ్మ
3. హంపీ[2]
4. శ్రీశైలచరిత్ర
5. విజయనగర చరిత్రము[3]
6. తులసీ రామాయణం
7. ఆనంద రామాయణం
8. రామకథామృతము
9. వైదర్భీ విలాసము
10. శ్రీ సాయిబాబా చరిత్ర
11. శాంతి విజయము
12. తుళసీదళము
13. శ్రీ కృష్ణనిర్యాణము (అముద్రితం)
14. నీతినవనీతము
47-తెలుగు సంస్థానాలు హరికధా సర్వస్వం ,ఆకాశ వాని భాశషితాలు ,భారత శబ్ద రత్నాకరం కర్త తెలుగు విశ్వవిద్యాలయం తొలికులపతి,డిలిట్ –ఆచార్య తూమాటి దోణప్ప
ఆచార్య తూమాటి దోణప్ప (జూలై 1, 1926 – సెప్టెంబర్ 6, 1996) ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి (పూర్వ). కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు.
బాల్యం, విద్యాభ్యాసం
దోణప్ప అనంతపురం జిల్లా రాకెట్లలో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు ఎనిమిదవ సంతానంగా 1926, జూలై 1వ తేదీ జన్మించాడు. ఇతడి మొదటి పేరు దోణతిమ్మారాయ చౌదరి. తాతగారైన తూమాటి భీమప్ప వద్ద చిన్ననాటనే మాఘం తప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివాడు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివాడు. భాగవత ప్రవచనం చేశాడు. వజ్రకరూరులోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో 1939-42సం||ల కాలంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.1942-46 సం. ల మధ్య కాలంలో ఉరవకొండలోని కరిబసవ స్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు. ఈ సమయంలో నూతలపాటి పేరరాజు అనే తెలుగుపండితుడు ఇతనికి గురువుగా ఉండేవాడు. అతడి నుండి ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. 1948లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు, కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, చిలుకూరి నారాయణరావు మొదలైనవారు ఇతని గురువులు.1949-52సం.ల మధ్య ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్స్ చదివాడు. అక్కడ గంటి జోగి సోమయాజి, దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, కాకర్ల వెంకటరామ నరసింహం, భద్రిరాజు కృష్ణమూర్తి, ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూదన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి మొదలైన హేమాహేమీలు ఇతని గురువులుగా ఉండేవారు. 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.ఆనర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని సాధించాడు. ఆ సమయంలో ఇతనికి అనకాపల్లి కళాశాల వారు మొట్టమొదటే ఆంధ్రశాఖ అధ్యక్షపదవి ఇస్తామని ఆహ్వానించారు. గుడివాడ కళాశాల వారు కూడా ఆహ్వానించారు. కాని ఇతడు ఈ రెండు అవకాశాలను కాదని గంటి జోగి సోమయాజివద్ద పరిశోధక విద్యార్థిగా చేరి “తెలుగులో వైకృతపదాలు” అనే అంశంపై పరిశోధించి 1966లో పి.హెచ్.డి సంపాదించాడు.
ఉద్యోగం
1957లో “తెలుగు వ్యుత్పత్తి పదకోశం” నిర్మాణ ప్రాజెక్టులో ముఖ్యసహాయకుడిగా చేరి 1961 వరకు పనిచేశాడు.1958లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడిగా చేరాడు.1970లో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు.1976లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు. 1970-76లో “తెలుగు వ్యుత్పత్తి పదకోశం” ప్రాజెక్టు ముఖ్యసంపాదకుడిగా ఉన్నాడు.1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిష్ట్రారుగా, 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాలాధ్యక్షుడిగా వ్యవహరించాడు.1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా, అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరెక్టరుగా నియుక్తుడయ్యాడు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించబడ్డాడు. ఇతడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో అకడమిక్ బోర్డు సభ్యుడిగా, సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు.
నాటకాలు
తూమాటి దోణప్ప విద్యార్థిదశలో నాటకాలలో నటించి రాణించాడు. చింతామణి నాటకంలో ‘చిత్ర’ పాత్రధారిగా, ‘సుభద్రా పరిణయం’లో సుభద్ర పాత్రను, ‘మోహినీరుక్మాంగద’లో రుక్మాంగద పాత్రను ధరించి అనేక పతకాలను పొందాడు. పుట్టపర్తి సత్యసాయిబాబా పూర్వాశ్రమంలో రత్నాకరం సత్యనారాయణరాజు స్త్రీ పాత్రలు ధరించగా అతనితో కలిసి ఇతడు భర్తగా, మామగా అనేక నాటకాలలో పాత్రధారణ చేశాడు.సాయిలీల అనే నాటకంలో దోణప్ప ఒకసారి సాయిబాబాగా, ఒకసారి శిష్యుడిగా, మరోసారి మహావిష్ణువుగా నటించాడు.
రచనలు
ఇతని సాహిత్య రచనా వ్యాసంగం హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో చదివేరోజుల్లోనే ఆరంభమయింది. ఎనిమిదో తరగతి చదివేటప్పుడు చిత్రగుప్తలో ఇతని చంద్రుడు-కలువ అనే మొట్టమొదటి కథ అచ్చయింది. హైస్కూలులో చదివే సమయంలోనే ఇతడు వినోదిని, రూపవాణి, ఆనందవాణి, ఢంకా, సూర్యప్రభ, ప్రజాబంధు మొదలైన పత్రికలలో పద్యాలు, గేయాలు, వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా ప్రకటించాడు. దత్తమండల కళాశాలలో చదివేరోజులలో ఇతడు పద్యరచనలో, వ్యాసరచనలో ఎన్నో ప్రథమబహుమానాలు పొందాడు. “బైబిలు-ఖురాను-భగవద్గీత” అనే అంశంపై వ్యాసరచనచేసి మీనాక్షీసుందరాంబా స్మారక బహుమానాన్ని పొందాడు. 1949 మే, జూన్ మాసాల్లో ఆంధ్రప్రభ దినపత్రికలో మాండలిక పదవ్యాసాలను ప్రకటించాడు.వాల్తేరులో చదివేరోజుల్లో గేయ పద్య ఏకాంకికా రచనలు ఎన్నో చేశాడు. ఏకాంకికరచనల పోటీలో ఇతని ‘ఆదర్శశిఖరాలు’ మొదటి బహుమతి పొందింది. ఈ ఏకాంకిక జయశ్రీ పత్రికలో అచ్చయింది. శ్రీశ్రీ దేశచరిత్రలకు పేరడీగా హాస్టలుచరిత్ర వ్రాస్తే దానిని ఆనాటి విశ్వవిద్యాలయ కులపతి అనేక సార్లు చదివించుకుని ఆనందించాడు.
ప్రకటించిన గ్రంథాలు
1. ఆంధ్ర సంస్థానములు – సాహిత్య పోషణము
2. భాషాచారిత్రక వ్యాసావళి
3. తెలుగులో కొత్తవెలుగులు
4. జానపద కళాసంపద
5. తెలుగు హరికథాసర్వస్వము
6. తెలుగులో చేరిన ఇండో-ఆర్యన్ పదాలు
7. దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట
8. మన కళాప్రపూర్ణుల కవితారేఖలు
9. ఆకాశవాణి భాషితాలు
10. తెలుగు వ్యాకరణ వ్యాసాలు
11. ఆంధ్రుల అసలు కథ
12. బాలల శబ్ద రత్నాకరం
13. తెలుగు మాండలిక శబ్దకోశం
పురస్కారాలు
• 1965,1966లో వరుసగా ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి రఘుపతి వేంకటరత్నం నాయుడు స్వర్ణపతకాలు.
• తెలుగు హరికథాసర్వస్వము అనే గ్రంథానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి డి.లిట్.
• 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
• ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమానాలు మూడుసార్లు
48-ఆదర్శ రచయిత,కంకాళరాత్రి కర్త సాంస్కృతిక శాఖ ప్రత్యేకాధికారి –శ్రీ అంతటి నరసింహం
అంతటి నరసింహం సంఘ సంస్కరణాభిలాష కలిగిన రచయిత[1].
జీవిత విశేషాలు
ఇతడు 1925లో కడప జిల్లా, చిట్వేలు మండలం, వెంకట్రాజులపల్లెలో సుబ్బమ్మ, చెంచలయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు 1939-40లలో మిడిల్ స్కూలు ముగించుకుని 1943లో యస్.యస్.ఎల్.సి. ఉత్తీర్ణుడయ్యాడు. అనంతపురం దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్ ముగించి, 1949లో వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఆనర్సు పాస్ అయ్యాడు. 1974లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి “ప్రబంధాలలో ప్రకృతి వర్ణన” అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. 1946 నుండి 1976ల మధ్య అనేక ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వాటిలో తను చదివిన దత్తమండల కళాశాల కూడా ఉంది. 1976 నుండి కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేకాధికారిగా పనిచేశాడు. 2010లో మరణించారు.
రచనలు
ఇతడు గేయకావ్యాలు, సాంఘిక నవలలు, చారిత్రక నవలలు, పిల్లల నవలలు, నాటకాలు ఎన్నో వ్రాశాడు. వాటిలో అముద్రిత రచనలు ఎక్కువగా ఉన్నాయి.
కావ్యాలు
1. కంకాళ రాత్రి (పద్యకావ్యం)
2. ఇప్పుడే[2] (వచన కవితా సంపుటం)
సాంఘిక నవలలు
1. ఆదర్శం[3]
2. భావం
3. లేడీ లెక్చరర్ స్వగతం
4. ప్రేమభిక్ష
5. శోభాదేవి
6. శంపాలత
7. చీకట్లో కాంతిరేఖలు
నాటికలు, నాటకాలు
1. సహజీవనం
2. సామరస్యం[4]
3. మానవత్వం
4. పరిష్కారం
చారిత్రాత్మిక నవలలు
1. రామరాయలు
2. భువనవిజయం
బాలల నవలలు
1. కోటవీరన్న సాహసం
2. ఉదయగిరి పోలన్న ధైర్యం
3. మంత్రాల రామన్న మొండితనం
4. కవిగారి బాల్యం మొదలైనవి.
ఆదర్శ రచయిత
ఇతడు కేవలము తను నమ్మిన ఆదర్శాలను రచనలకే పరిమితం చేయక వాటిని స్వయంగా చిత్తశుద్ధితో ఆచరించాడు. కులవ్యవస్థను రూపుమాపుతూ, స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ, వరకట్నం నిషేధిస్తూ ఇతడు కులాంతర వివాహంగా ఒక చదువుకున్న అమ్మాయిని కట్నం లేకుండా వివాహమాడాడు. జీవితాంతం కాఫీ, టీ, సిగరెట్ ముట్టక ఆదర్శవంతంగా జీవించాడు. ” నా నవలలు చదివి పాఠకులు మెచ్చుకుంటే నాకంత ఉత్సాహం ఉండదు. దానిలో చెప్పినట్లు ఆచరిస్తే నాకానందం కలుగుతుంది. దీనివల్ల వారికి, దేశానికి, అసలు మానవజాతికి అభ్యుదయం కలుగుతుంది” అని తన మనసులోని మాటను ఒక సందర్భంలో వెల్లడించాడు.
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-22-ఉయ్యూరు
హాస్యానందం
33-సరసోక్తి –
మనం కోతుల్లోంచి వచ్చాం అనేది మృదువైన సరసోక్తి ప్రియురాలి చెంప దెబ్బఅంత మధురం .’నేను మా అబ్బాయికి మనం కోతుల్నించి పుట్టాం ‘’అని చెప్పా. వాడు వాళ్ళమ్మకు ఈవిషయం చెప్పాడు .ఆవిడ పరిగెత్తుకొచ్చి ‘’ఏమో నాయనా మా తండ్రీ తాతాఅందరూ ఒక మోస్తరు మనుషులని తెల్సు .మీ నాన్న తలి దండ్రుల సంగతి మాత్రం నాకు తెలీదు ‘’అంది మాస్టారి నవ్వుముఖం బల్బు మాడి పోయింది.మరో సరసం .ఒకాయన భార్య వాగుడుకాయ .రాత్రీ పగలు జలపాతం లా హోరు పెడుతుంటే ,ఆయన నిద్రలేక అఘోరిస్తుంటే ఆమె డాక్టర్ ను చూడమంది .వెళ్లి మందు తెచ్ఛి ఆమెకిచ్చి రోజూ రెండు వేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది అన్నాడు .రెండెం కర్మ మూడేసుకోండి అంది ‘’అవి నాక్కాదు నీకు ‘’అనగానే అవాక్కైంది .అసలు విషయానికి సరసంగా సుకుమారంగా ప్రియం గా భర్త ఆమెకు విషయం చెప్పాడన్న మాట అన్నారు మునిమాణిక్యం.మూడో ఉదాహరణ .ఒకాయన డాక్టర్ తో తాను ముసలితనం లోకూడా ఆరోగ్యంగా ఉండటానికి కారణ౦ శాంతి సౌఖ్యాలతో ఆనంద జీవితం గడపటమే ‘’అన్నాడు .’’అంటే మీ ఇంట్లో పోట్లాటలు గట్రా ఉండవా ?అన్నాడు డౌట్ గా డాట్రు .’’లేకేమి మేమిద్దరం ఒక రాజీ కొచ్చాం .ఆవిడకు కోపం వస్తే నేను మాట్లాడకూడదు .నాకు కోపం వస్తే నేను ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళాలి ‘’అన్నాడు పగలబడి నవ్వాడా డాక్టర్ .
ఛలోక్తి
నడిమింటి మంగళేశ్వర శాస్త్రి గారి ఛలోక్తి ఒకటి ఉంది .పూరీ జగన్నాధం లో మర్రాకుల విస్తరిలో ఎవరూ భోజనం చచెయ్యరు .నిషిద్ధం .అక్కడి పండితుల్ని ఈయన అడిగితె ‘’వటపత్రశాయి పడుకొనే పత్రాలలో భోజనం నిషిద్ధం .ఇది స్వామి వారి అవతార క్షేత్రం ‘’అన్నాడు .శాస్త్రిగారు నవ్వి ‘’ఇలాంటి మహా క్షేత్రంలో స్వామి వారి అవతార మూర్తుల్నే తినేమీకు ఆయన శయనించే పత్రం నిషిద్ధమా ?అన్నారు .స్వామి మత్స్యావతారం ఎత్తాడు గా .ఆరూపం లో ఉన్న చేపలు తి౦ టారుగా మీరు అని ఎద్దేవా .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-22-ఉయ్యూరు
పద్మ భూషణ్ బృందావన్ లాల్ వర్మ.3వ భాగం.28.9.22
Video link
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-4
తారాశంకర్ ఎక్కడా నెలజీతం తీసుకోలేదు .రచనలపైనే ఆధారం .కలకత్తా దక్షిణం లో రేకులగదిలో నెలకు ఆరు రూపాయల అద్దెకి ఉన్నాడు హోటల్ భోజనం నెలకు ఎనిమిది ,టీ,టిఫిన్లకు ఏడురూపాయలయ్యేది .బస్ చార్జీలుకూడా అంతే .వంటపని ఇంటిపని ఆయనే చేసుకొనేవాడు నేలమీద పడుకోనేవాడు .తనరేకు పెట్టే రాసుకొనే బల్లగా వాడేవాడు .ఇలా సాహిత్యమే వృత్తిగా జీవించాడు .1933లో ఆయన కలకత్తా కాపురానికి వచ్చేసరికి అది బెంగాల్ నాడీ కేంద్రంగా ఉంది .రచయితలూ తరచుగా కలుసుకోనేవారు .టాగూర్ శరత్ లకు తప్ప మిగిలినవారికి రచనలపై పెద్దగా రాబడి ఉండేదికాదు .అయినా యువకులు సాహిత్య౦ పైనే జీవించేవారు .సాహితీ సేవలో కొందరు ప్రాణాలు కోల్పోయారుకూడా .ఈ విషయాలను అచి౦త్య కుమార్ ‘’మేము మృత్యువును ప్రేమించటం నేర్చుకోన్నాం .రాజకీయ సాహిత్యరంగాలలో మృత్యువు ఆకర్షణీయంగా కనిపించేది .యువకులు రచయితలుగానే విప్లవకారులు గానో తయారయ్యేవారు .రచన అంటే పేదరికం ,ఆకలి ని ఆహ్వానించటమే ‘’అన్నాడు
ఆశతాబ్దం ఉత్తరార్ధంలో టాగూర్ మాలంచ –ఉద్యానవనం ,చార్ అధ్యాయ్ ,దుయిబోన్ –అక్కా చెల్లెళ్ళు ,శరత్ శ్రీకాంత్ ,శేషప్రశ్న వంటి ఉత్తమ రచనలు వచ్చాయి .అంతకుముందే టాగూర్ చతురంగ ,ఘరె బైరే ‘’శరత్ పధేర్ డాబి –కోరిక వెలువడ్డాయి .కల్లోల్ పత్రికను నవయువకులు నడిపారు .కనుక అలజడి ఆందోళనలు అందులో చోటు చేసుకొన్నాయి .అట్టడుగు వర్గాల జీవితాలు ఇందులో ఎక్కువగా వస్తువులయ్యాయి .పేదరికం బిచ్చగాళ్ళు వేశ్యలు పై మాణిక్ ఘటక్ ప్రత్యేకంగా రాశాడు .నృపేంద్ర కృష్ణచటర్జి గోర్కీ మదర్ నవల అనువాదం చేశాడు .ఆనాటి రచనలు ఐరోపా పోకడలను పోలిఉన్నాయి,అసంతృప్తి ,ఆందోళన ఉన్నాయని తారాశంకర్ అన్నాడు .1929లో విభూతి భూషణ్ బెనర్జీ ‘’పధేర్ పాంచాలి ‘’-ఒక రోడ్డు కధ విచిత్రపత్రిక లో ధారావాహికంగా వచ్చి సంచలనం సృష్టించి సత్యజిత్ రేచేత సినిమా తీయించింది .సురేష్ చంద్ర ఉత్తర పత్రిక నిర్వహించాడు .దీనిలో దూర్జటిప్రసాద్ ఎక్కువగా రాసేవాడు .బుద్దదేవ బస్ కవిత త్రైమాసికపత్రిక నడిపాడు .పరిచయ పత్రిక ఉత్తమసాహిత్యాన్ని అందించింది .
తారాశంకర్ తన రాయి కమల్ నవలను ,చల్ నామోయి –అంతుచిక్కనిమనిషి కధా సంపుటిని టాగూర్ కు పంపిస్తే ,నవలబాగా నచ్చి తనఅభిప్రాయాన్ని,కధలు మెచ్చుతూ మరో ఉత్తరాన్ని శంకర్ కు రాశాడు .బెంగాల్ రచయితలకుదేశంగురించి చాలా తక్కువగా పరిచయం ఉండటం టాగూర్ కు నచ్చలేదు .మరో సారి టాగూర్ ను కలిసినప్పుడు తన ‘’జల్సాఘర్ –విలాసమందిరం కధా సంపుటి ఇచ్చాడు.తర్వాత కొద్దిరోజులకే టాగూర్ అనారోగ్యం పాలయ్యాడు . అచేతన స్తితి నుంచి చేతనావస్తకు వచ్చిన యువకుడి జీవితం అందులో టాగూర్ కు బాగా నచ్చింది .శంకర్ శాంతినికేతన్ కు తరచుగా ఎందుకు రావటం లేదని అడిగాడు .శాంతినికేతన్ ఆ జిల్లా ప్రజలకు దూరమై పోయిందని టాగూర్ బాధ పడేవాడు .ప్రజకు దీనికి ఉన్న మధ్యగోడ ఆయన గ్రహించలేకపోయాడు .నాటి బెంగాల్ గురించి క్షుణ్ణమైన పరిశోధన చేసిన బ్రజెంద్రనాదధ బంద్యోపాధ్యాయ కూడా తారాశంకర్ సన్నిహితుడయ్యాడు .రామానంద చటర్జీతారాశంకర్ రచనలను తరచూ ప్రచురించి ప్రోత్సహించాడు .గ్రామసీమలను ఆయన విభిన్న దృక్కోణంలో చూసిరాశాడు .చాలాభాగంసంప్రదాయవాది.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-22-ఉయ్యూరు
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.14వ భాగం.28.9.22.
Video link
• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -14
• 41-ధర్మజ్యోతి ,విశ్వేశ్వర నక్షత్రమాల కర్త –శ్రీ పాణ్యంలక్ష్మీ నరసయ్య
• పాణ్యం లక్ష్మీనరసింహయ్య 1920వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ గ్రామంలో సుబ్బలక్ష్మమ్మ, లక్ష్మీనరసయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు తన తండ్రివద్దను, పినతండ్రి వాసుదేవశాస్త్రి వద్దను, వెల్దుర్తి లోని అన్నదానం సుబ్బాశాస్త్రి వద్దను, గౌరిపెద్ది శేషశాస్త్రుల వద్దను సంస్కృతాంధ్రములు నేర్చాడు. ఇతనికి చిన్నతనంలోనే కవిత్వం అబ్బింది. ఇతడికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఇతని పెద్దకుమారుడు పాణ్యం నరసరామయ్య కూడా చక్కని కవితలు అల్లిన కవి. లోకోపకారార్థము ధార్మిక రచనలు చేసిన పాణ్యం లక్ష్మీనరసింహయ్య 1978-79 ప్రాంతంలో తనువుచాలించాడు[1].
• రచనలు
• ధర్మజ్యోతి[2]
• ఈశ్వరశతకము
• శ్రీ కోదండరామశతకము
• శ్రీ విశ్వేశ్వర నక్షత్రమాల
• శ్రీ రామతత్త్వ రహస్యము
• 42- స్కూళ్ళ ఇన్స్పెక్టర్ ,రోజా కధకు గిడుగు వారి ప్రశంసలుపొంది ,జానపద వాజ్మయం ,నాటకాలు,ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ ది సోల్ రాసిన –శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు
టేకుమళ్ల కామేశ్వరరావు కవి, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు. వ్యవహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరమనే అభిప్రాయమున్న వ్యవహారిక భాషవాది.
జీవిత విశేషాలు
తండ్రి టేకుమళ్ల అచ్యుతరావు వాజ్మయ విమర్శకుడు, బహుగ్రంథకర్త. ఇతడికి చిన్నప్పటి నుండే కవిత్వం వ్రాయడం అభ్యాసమైనది. బళ్లారిలో చదివాడు. 1927లో వివాహం జరిగింది. 1933లో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం ప్రారంభించి స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా రాయలసీమ,ఉత్తర సర్కారు జిల్లాలలో పనిచేశాడు.1935లో భార్యావియోగం కలుగగా అదే సంవత్సరం రెండవ వివాహమైనది.
ఈయన రాసిన రోజా కథ చదివిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు దేశ భాషలో ఎంతో కృషి చేసాను ఎందుకు? ఇటువంటి కథ ఒక్కటి రాసివుంటే ఎంత బాగుండేది అని మెచ్చుకున్నారు.
రచనలు
• రోజా (కథా సంపుటము)
• జానకి ప్రేమ (కథా సంపుటము)
• వెలుగు
• పాలపిట్ట
• మిణుగురు పురుగు (గేయాలు)
• కోపదారి మొగుడు (నాటకం)
• సాహిత్య చిత్రములు(కథల సంపుటి) [1]
• పాత పాటలు
• సాంప్రదాయ విజ్ఞానం
• నా వాజ్మయ మిత్రులు
• Further life of the Soul
• కలువలు (ఖండకావ్యము)
• వాడుక భాషారచన – కొన్ని నియమములు
• పూర్వాంధ్రకవులు
• తెలంగాణా రాజుల చరిత్ర
• ప్రకాశవిమర్శీయము (నాటకం)
• జానపదగేయ వాజ్మయ చరిత్ర
• 43-శతాధిక గ్రంధకర్త ,మహా పరిశోధక విమర్శకుడు,కళారత్న – ఆచార్య ఎస్.గంగప్ప
• సాహితీపరిశోధకుడు, బహుగ్రంథకర్త అయిన ఎస్.గంగప్ప అనంతపురం జిల్లాకు చెందినవాడు.
జీవిత విశేషాలు
ఎస్.గంగప్ప 1936, నవంబర్ నెల 8వ తేదీన నల్లగొండ్రాయని పల్లి లో వెంకటప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య సోమందేపల్లిలోను, మాధ్యమిక విద్య పెనుకొండలోను జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఏ. ఆనర్స్ చదివాడు. వాల్తేరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నుండి 1960లో ఎం.ఏ. పూర్తిచేశాడు. కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా “కోలాచలం శ్రీనివాసరావు – నాటక సాహిత్య సమాలోచనము” అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సాధించాడు. 1960లో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి కాకినాడ, విశాఖపట్నం,హైదరాబాదు, కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల లలో ఆంధ్రోపన్యాసకునిగా, తెలుగు శాఖాధిపతిగా 1978 వరకు పనిచేశాడు. 1978నుండి నాగార్జునాయూనివర్శిటీ ఆంధ్రోపన్యాసకుడిగా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1989-91లో తెలుగు ప్రాచ్యభాషాసంఘం అధ్యక్షుడిగా, 1994-96లో ఎం.ఏ పాఠ్యనిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా ఉండి 1996లో పదవీవిరమణ చేశాడు.
సాహిత్యసేవ
అనేక పత్రికలలో వివిధ సాహిత్యాంశాలపై వ్యాసాలను ప్రచురించాడు. అనేక సాహిత్య సదస్సులలో, గోష్టులలో పత్రాలు సమర్పించాడు. అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేశాడు. సుమారు 100కుపైగా గ్రంథాలను వ్రాసి ప్రచురించాడు. అనేక సాహిత్యాంశాలపై రేడియో ప్రసంగాలు చేశాడు. ఆయనను అనేక సంస్థలు సత్కరించాయి. అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు. కేంద్రసాహిత్య అకాడెమీ సీనియర్ ఫెలోషిప్‌ను పొందాడు. పదసాహిత్యంపై పరిశోధన జరిపాడు.
రచనలు
1. క్షేత్రయ్య పదసాహిత్యం
2. సారంగపాణి పదసాహిత్యం
3. అన్నమాచార్యులు – ఇతర ప్రముఖ వాగ్గేయకారులు – తులనాత్మక అధ్యయనం
4. తెలుగులో పదకవిత
5. కోలాచలం శ్రీనివాసరావు[1] (ఆం.ప్ర.సంగీత అకాడెమీ ప్రచురణ)
6. సాహిత్యసమాలోచన[2]
7. తెలుగుదేశపు జానపదగీతాలు
8. జానపద గేయరామాయణము
9. జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం
10. సాహిత్యసుధ[3]
11. సాహిత్యానుశీలన[4]
12. ఉన్నవ లక్ష్మీనారాయణ సాహిత్యజీవితం
13. సాహిత్యోపన్యాసములు
14. భాషావ్యాసాలు
15. తెలుగు నాటకం – ఆరంభం నుంచి అబ్సర్డు నాటకాలదాకా
16. విశ్వనాథవారి వేయిపడగలు – విశ్లేషణాత్మక విమర్శ
17. విశ్వనాథవారి నాటకాలు – విశ్లేషణ
18. సుహాసినీహాసం (నవల)
19. వేమన భావన
20. సిద్ధేంద్రయోగి
21. పురంధరదాసు
22. నాగార్జునుడు
23. ఎఱ్ఱన రసపోషణ
24. తిక్కన భారతం శాంతిపర్వం ద్వితీయాశ్వాసం వ్యాఖ్యానం
25. Literature of Asian Studies
26. అన్నమాచార్య సంకీర్తన సుధ
27. రాజరాజప్రశస్తి (నవల)
28. ఆత్మార్పణం (నవల)
29. పదకవితాపితామహుడు (నాటకం)
30. దివ్యదీపావళి (నాటకం)
31. దేశం బాగుపడాలంటే (నాటకం)
32. బాలగేయాలు
33. తీరిన భయం (కథలసంపుటి)
34. నవోదయం (కవిత్వం)
35. రెండు గులాబీలు (కవిత్వం)
36. అంతరంగతరంగాలు (కవిత్వం)
37. పగటివేషాలు
38. శ్రీకృష్ణస్తోత్రత్రయము
39. ప్రసంగసాహితి
పురస్కారాలు సత్కారాలు
• 1972 – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
• 1981 – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
• 1983-85 – కేంద్రప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ ఫెలోషిప్
• 1984 – విశ్వనాథ సాహిత్యపీఠం అవార్డు
• 1991 – యు.జి.సి. జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు
• 1992 – ఆం.ప్ర.ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు
• 1992 – తెలుగు విశ్వవిద్యాలయం తిక్కవరపు రామిరెడ్డి స్మారక ధర్మనిధి పురస్కారం
• 1993 – తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ పరిశోధన పురస్కారం
• 2013 – హంస (కళారత్న) పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[5]
44-‘’తెలుగు కాకి ‘’బిరుదాంకితుడు ,ఉత్తమ ఉపాధ్యాయుడు ,బహుప్రక్రియా రచయిత,ప్రజా కవి –శ్రీ కోగిర జయసీతారాం
గిర జయసీతారాం (నవంబర్ 14, 1924 – అక్టోబర్ 9, 2000) [1] అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 8వ తరగతి వరకు చదివాడు. కోనపురం, నడింపల్లె, బొంతలపల్లె, కోగిర, రామగిరి మొదలైన ప్రాంతాలలో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగా 1949 – 85 మధ్యకాలంలో పనిచేశాడు.[2] ఆ పల్లెలలో పేద ప్రజల నడుమ నిత్యము కలిసిమెలిసి తిరుగుతూ ఆ ప్రజాజీవితాన్ని,భాషను, ఆచార వ్యవహారాలను, వారి జీవితానుభవాలను పూర్తిగా తన రక్తంలో జీర్ణించుకుని వారికోసం వారి భాష, పలుకుబడులతో కవిత్వం అల్లి ప్రజాకవిగా నిలిచాడు.
జీవిత విశేషాలు
“తెలుగు సాహిత్యంలో కవికోకిల, కవి వృషభ, కవి సింహ, కవికిశోర మొదలైన బిరుదులు కలవారే ఎక్కువ మంది ఉన్నారు. కవికాకి బిరుదు ఎవరికీ ఉన్నట్లు లేదు. మీకు ఇస్తున్నాం. స్వీకరించగలరా?” అని ఒక నిండు సభలో ఆ సభాధ్యక్షుడు ఇతడిని ప్రశ్నించగా ఈయన నిస్సంకోచంగా ముందుకు వచ్చి “కాకి ప్రజల పక్షి. నిత్యము వాళ్ళను మేల్కొపుతూ వుంటుంది. నేనూ అటువంటి వాడినే. నాకు ఆ బిరుదు తగినదే” అని సభలో పలికి గౌరవాగౌరవాలను సమాన స్థాయిలో స్వీకరించిన సుకవి ఇతడు. అనంతపురం మాండలికాన్ని ఇతడు తన రచనలలో అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. 1983లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇతడిని ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇచ్చి సత్కరించింది. 1984-85 సంవత్సరానికి రెండవ తరగతి తెలుగువాచకాన్ని అందించాడు. ఇతడు చెయ్యి తిరిగిన రచయితే కాకుండా తబలా, హార్మోనియంలు వాయించడంలో దిట్ట. మంచి చిత్రకారుడు కూడా. ఇతడు 2000, అక్టోబరు 9 తేదీన చనిపోయాడు.
రచనలు[మార్చు]
1. నిట్టూర్పులు (పద్యకావ్యం)
2. విజయప్రభ (బుఱ్ఱకథ)
3. సుగుణా శతకము (400 పద్యాలు)
4. మదాంధబరాతము (వ్యంగ్య రచన)
5. అరణ్యరోదనము (సీసపద్యాలు)
6. కావ్ కావ్ శతకము
7. కాకిగోల (గేయాలు)
8. పండువెన్నెల (పిల్లల పాటలు)
9. జయభారతి (బుడబుక్కల కథ)
10. కృష్ణార్జున యుద్ధము (నాటకము)
11. రామాంజనేయ యుద్ధము (నాటకము)
12. సీతారామ కళ్యాణము (నాటకము)
13. మేం పిల్లలం (150 బాలగేయాల సంకలనం)
14. అక్షరసైన్యం
15. జైసీతారాం సీసాలు
రచనల నుండి మచ్చుతునకలు
ఆడ బెయ్యెదెవ్‌రు? ఆదిగా – “యాలవా”
“అగ్గిపెట్టె వుంద అనుముగా; నితావ?”
“వూను వుందితాలు నేనంటిత్త”
—- —- —-
“కప్కొనేకి యేడ్డి కప్పడమూ లేదు
దుప్టి గొందమంటె దుడ్లు లేవు
తొలుపుల్యాక వాకిలికి తడకడ్డం బెట్కోని
యేటి బతుకో యేమొ యల్ల కాల్ము”
“-యంగటమ్మా! లేత్వ, యింగా లేదా”
“ఏం, లేశ్ననత్తా! యెసురెంత బెట్టల్ల”
“రొండు జెమ్లు బెట్టు; పిండి వుందొ”
“యాడిదిప్‌డు రాగులిసురల్ల; యెసర్లోకి”
“సందకాడ వురికె సత్తారంద్రు….”
(సలిమంటలు అనే కవిత నుండి)
అక్కా! పెట్టు
చుక్కా బొట్టు!
అవ్వా! నాకు
బువ్వా పెట్టు!
అమ్మా! నాకు
బొమ్మా ఇవ్వు!
నాన్నా! నాకు
పెన్నూ ఇవ్వు!
(మేం పిల్లలం పిల్లల గేయసంపుటి నుండి)
45-విద్వాంసులకు విద్వాంసుడు ,ఆంధ్రప్రభ సంపాదకుడు ,కదా సరిత్సాగర అనువాదకుడు ,పెన్నేటిపాట ఫేం –శ్రీ విద్వాన్ విశ్వం
విద్వాన్ విశ్వం, (1915 అక్టోబర్ 21 – అక్టోబర్ 19 1987 గా చిరపరచితుడైన మీసరగండ విశ్వరూపాచారి విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక “ఆంధ్రప్రభ” నడిపించిన సంపాదకుడు విశ్వం .
జీవిత చరిత్ర
బాల్యం, విద్యాభ్యాసం
1915, అక్టోబరు 21న అనంతపురం జిల్లాలో తరిమెల గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. విశ్వం చిన్నతనంలో స్వగ్రామంలోని రామాయణం శంకరశాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. సంప్రదాయ పద్ధతిలో కర్నూలు,ప్రొద్దుటూరు లలో సంస్కృత కావ్య నాటకాలంకారాలను, తర్కశాస్త్రాన్ని ఆభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలోనూ, ఆంధ్రంలోనూ విద్వాన్ పట్టాపుచ్చుకున్నాడు. అనంతపురంలో చిలుకూరు నారాయణరావు వద్ద శిష్యరికం చేశాడు. కాశీ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తూ అనారోగ్యం వలన పూర్తి చేయలేకపోయాడు.
రాజకీయరంగం
బెనారస్ నుండి అనంతపురం తిరిగిరాగానే తరిమెల నాగిరెడ్డితో కలిసి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు.ప్రజలను చైతన్యపరచటానికి గ్రంథ ప్రచురణ అవసరమని భావించి నవ్యసాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ఏర్పాటు చేసి నవ్యసాహితి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఫాసిజం మొదలైన అంశాలపై పుస్తకాలను ప్రచురించాడు. దానితో బ్రిటీషు ప్రభుత్వం రాజద్రోహం క్రింద తరిమెల నాగిరెడ్డిని, విద్వాన్ విశాన్ని అరెస్టు చేసి మొదట బళ్ళారిలోని అల్లీపూర్ జైల్లోనూ ఆ తర్వాత తిరుచిరాపల్లి జైలు లోనూ నిర్భందించింది. తిరుచిరాపల్లి జైలులో విశ్వం బెజవాడ గోపాలరెడ్డి వద్ద బెంగాలీ నేర్చుకున్నాడు. ఈ జైలులో రాజాజీ, టంగుటూరి ప్రకాశం వంటి నాయకుల సాహచర్యం లభించింది.ఇతను అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాయలసీమ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా, అనంతపురం జిల్లా జాతీయసభకు, జిల్లా లోకజనసంఘానికి, మండల క్షామనివారణ సభకు, జిల్లా ఆంధ్రమహాసభకు ప్రధాన కార్యదర్శిగా, జిల్లా రైతు మహాసభకు ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు.
పత్రికారంగం
ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా మరింత లోతుగా రాజకీయాలు శాస్త్రపద్ధతిలో వివరించడానికి పత్రికారంగం వైపు దృష్టి సారించాడు. అడవి బాపిరాజు ఆహ్వానించడంతో మీజాన్ పత్రికలో 1945లో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరి కొంతకాలం పనిచేశాడు. తరువాత విజయవాడలో ప్రజాశక్తి దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా సుమారు మూడు సంవత్సరాలు పనిచేశాడు. “మీజాన్” పత్రికలో రచనావ్యాసంగం, “ప్రజాశక్తి”లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయ్యాడు. తర్వాత మద్రాసుకు తరలివెళ్ళి అక్కడ బాలభారత్ విద్యాలయంలో సంపాదకుడిగా కొన్నాళ్ళు పనిచేశాడు. 1952 ఆగష్టు 15న ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక ప్రారంభమైనపుడు దానిలో ఎడిటర్ ఇన్‌చార్జ్‌గా చేరి 1959 వరకు పనిచేశాడు. 1959లో ఆంధ్రపత్రిక దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేసి 1960లో విజయవాడకు వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశాడు. మళ్ళీ 1963లో ఆంధ్రప్రభ దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్ చేరాడు. 1967లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకుడిగా మారాడు. ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో పదవీవిరమణ చేసిన తరువాత 1981నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. ఈ సమయంలో విశ్వం కథాసరిత్సాగరాన్ని 12 సంపుటాలుగా తెనుగించాడు. “చందమామ”లో ద్విపద కావ్యం రూపంలో వ్రాసిన పంచతంత్ర కథలను బాపు బొమ్మలతో తి.తి.దే.ప్రచురణగా వెలువరించాడు. బ్రహ్మసూత్రాలు శంకరభాష్యం నాలుగు సంపుటాలను, అధర్వణ వేదాన్ని అనువాదం చేసి ప్రచురించాడు. 1987 అక్టోబర్ 19వతేదీ తనువు చాలించాడు.
రచనలు
• విరికన్నె (కావ్యం)
• ఆత్మసాక్షి (కవిత్వం)
• ప్రేమించేను (నవల)
• పెన్నేటిపాట (కావ్యం)
• ఒకనాడు (కావ్యం)
• నాహృదయం (కావ్యం)
• పాపం
• రాతలూ గీతలూ
• సమీక్ష
• లెనిన్
• స్టాలిన్
• స్వతంత్రం
• మహాశిల్పి
• మహాసంకల్పం
• అదీ రష్యా
• స్వతంత్రం ఏం చేయటం
• ఫాసిజం దాని ధ్వంసం
• రష్యా యుద్ధకవులు
• రానున్న సంక్షోభం
• సత్యభామ
• ప్రథమ ప్రేమ
• ధర్మదుర్గం
• పొద్దుతిరిగింది
• స్వస్తిశ్రీ
• కచదేవయాని
• ద్వేషం
• దురాక్రమణ
• ఇరాన్
• ఇండియా
• ఇండోనేషియా
• వియత్నాం
• నీడలు – జాడలు
• విక్రమోర్వశీయము (రేడియో నాటకము)
• నాగానందము (రేడియో నాటకము)
• యుద్ధం మాకొద్దు (రేడియో నాటకము)
• ఏమి చెయ్యడం?
• మాణిక్యవీణ
అనువాదాలు
• కథాసరిత్సాగరం కథాలహరిని 12 సంపుటాల్లో ఆంధ్రీకరణం చేశారు.
• కాదంబరి (బాణుడు)
• కిరాతార్జునీయం (భారవి)
• దశకుమారచరిత్ర (దండి)
• మేఘసందేశం (కాళిదాసు)
• రఘువంశము (కాళిదాసు)
• కుమార సంభవము (కాళిదాసు)
• శిశుపాలవధ (మాఘుడు)
• రాజతరంగిణి (కల్హణుడు)
• మానవుడు (రోమారోలా నవల)
• నేటి భారతదేశం (రజనీ పామీదత్)
• ఫాసిజం
• భూమి (ఓప్లే హార్డీ నవల)
• వీడ్కోలు
• కర్ణకుంతి
• సతి
• ముక్తకములు
• చేకోవ్ కథలు
• గోర్కీ కథలు
• శిశు హృదయము
• శిశు రహస్యము
• యుద్ధానంతర ఆర్థిక పరిణామాలు
• బిల్హణీయము
• తెలుగు అధర్వ వేదసంహిత[1]
• పూలచెట్లు[2]
• రష్యా యుద్ధకథలు
• పేదరాలు (కథాసంకలనం)
• విలాసిని (కథల సంపుటి)
• ప్రజావిరోధి (నాటకము)
నిర్వహించిన శీర్షికలు
• విశ్వభావన – శ్రీసాధన పత్రిక 1938-1939
• తెలుపు-నలుపు – ఆంధ్రప్రభ వారపత్రిక 1952-1959
• అవీ-ఇవీ – ఆంధ్రపత్రిక దినపత్రిక 1958-1959
• ఇవ్వాళ – ఆంధ్రజ్యోతి దినపత్రిక 1960-1962
• టీకా-టిప్పణి – ఆంధ్రజ్యోతి దినపత్రిక
• మాణిక్యవీణ – ఆంధ్రప్రభ దినపత్రిక 1962-1966, ఆంధ్రప్రభ వారపత్రిక 1967-1987
మచ్చుతునక
14-9-1948న ఒడ్డు గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే భూస్వామిని చంపారన్న అభియోగం పై 17మందికి నిజాం ప్రభుత్వం 19-07-1950న ఉరిశిక్ష విధించింది. ఈ ఉదంతం పత్రికలలో చదివి ఒక ఐరిష్ కవి స్పందించి వ్రాసిన కవితకు తెలుగు అనువాదం ఇది. జనవాణి దినపత్రిక 1951 ఏప్రిల్ 24 సంచికలో ప్రచురింపబడింది.[3]
ఉరికంబం కదులుతోంది
స్వచ్చ రవికిరణ కాంతితో
స్వయం వ్యక్తిత్వంతో
జ్వలించవలసిన జీవితం
కాలుష్యాచ్ఛన్నమై మసకబారిపోయింది.
………….
పదిహేడుగురు తల్లులు
కదలకుండా కిటికీల వద్ద నిల్చొని
కంటనీరు పెడ్తున్నారు
కాళరాత్రి తెలంగాణాలో
కటిక చీకటిని పూసింది
…………..
నవయుగ నాందీగీతం
నగారా మోగిస్తోంది
నేడో రేపో వినితీరాలి
నేడే వినడం మంచిది
…………..
నరలోకపు గుండెల్లో
చిరచిరలాడుతోంది బాధ
ఉరికంబం కదులుతోంది
ఉచ్చు గాలికెగురుతోంది
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-28-9-22-ఉయ్యూరు
హాస్యానందం
32-ఆత్మాపకర్ష
ఆత్మస్తుతిలో ఎలాంటి హాస్యం పుడుతుందో ఆత్మానిందలోనూ అలాంటిదే జాలువారుతుందన్నారు మునిమాణిక్యం మాష్టారు .ఒకసారి ఒక శిష్యుడిని మాస్టారు ‘’నువ్వు వట్టివెధవాయివోయ్ ‘’అంటే వాడు ‘’నిజమేసార్ మా అమ్మా నాన్న అందరూ అలానే అంటారు ‘’అన్నాడట .’’మీకేమీ తెలీదు ఊరుకోండి ‘’అంటుంది ప్రతిభార్య తన మొగుణ్ణి.’’అంతేగా అంతేనేమో అనుకున్నారట మాస్టారు .’’త్రీమేన్ ఇన్ ఎ బోట్’’ అనీ జెరోం కే జెరోం రాసిన దానిలో ఒకపాత్ర తనకు లోకం లో ఉన్న జబ్బులన్నీ ఉన్నట్లు ఏకరువు పెడతాడు .వరుసక్రమంలో aనుంచి zదాకా ఆలిస్ట్ చెబుతాడు .ఒక డాక్టర్ గారి క్లినిక్ కు ఒక పెద్దమనిషి వచ్చి అక్కడి మందు సీసాలున్న బల్ల దగ్గరకు వెళ్లి ఒక గ్లాసులో అన్ని సీసాలలో అరకు కొద్దిగా పోస్తుంటే డాక్టర్ చూసి ఏంచేస్తున్నావు, ఎవరు చేయమన్నారు అని గద్దిస్తే ‘’తాగటానికి కలిపాను ‘’అనగా ‘’నీకేమైనా పిచ్చా ?’’అంటే ‘’బలే డయాగ్నైజ్ చేశారు డాక్టర్ .నాకు కొంచెం పిచ్చి ఉంది. అన్నాడు అందరూ నవ్వారు .ఆయనకు పిచ్చిలేదు కొద్దిగా మనో చాంచల్యం మాత్రమె ఉంది అనికవర్ చేశారు ముని సార్.
ఉక్తి మూల హాస్యం
దీన్ని ఉత్పత్తి చేసేశక్తిని విట్ అంటారు .విట్ వలన పుట్టిన రమణీయ వాక్ వైభవాన్ని ‘’జోక్ ‘’అంటారు .ఇదిఒక ‘’మేలము’’ అంటే హఠాత్తుగా వచ్చేదన్నమాట .దీనికి బుద్ధి ,సమయస్పూర్తికావాలి .ఇది సరస సంభాషణలో బాగా దొర్లుతుంది .ఇలాంటి దాన్ని మునిమాణిక్యం సార్ ‘’కేరడం’’అని డిఫైన్ చేశారు .ఇందులో ఉన్న ఉక్తి విశేషాన్ని అర్ధం చేసుకొని ,చమత్కారం గ్రహించి ఆనందించాలి .కొంత భాషాజ్ఞానం,పరిశీలనా శక్తి ,హాస్యం పై అనురక్తి కావాలి .జోక్ అంటే రసాత్మక వాక్యం అని సి౦పుల్ గా చెప్పారు సార్.ఉక్తిమూల హాస్యం ఆత్మశ్రయంగా ,పరాశ్రయంగా కూడా ఉంటుంది .అంటే హాస్య శీలుడు జోక్ ను తనపై తానూ సంధించుకోవచ్చు ,ఇతరులపై విసరనూ వచ్చు .ఇందులో చాలారకాలున్నాయి ఆ విశేషాలు రేపు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-22-ఉయ్యూరు
పద్మభూషణ్ బృందావన్ లాల్ వర్మ.2వ భాగం.27.9.22
Video link
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-3
కలికాల్, కల్లోల్ ,లతోపాటు ఉపాసనా ,దూప్ ఛాయా మొదలైన పత్రికలూ తారాశంకర్ ను కధలు రాసిపంపమని కోరితే రాసిపంపితే ప్రచురించాయి .జమీందార్ల దోపిడీ ,కాబూలీవాళ్ళ దౌష్ట్యం ,మలేరియా మసూచి పట్ల ప్రభుత్వ ఉదాసీనత లతో నలిగిపోయిన ఒక గ్రామ చరిత్రను ‘’ శ్మశా నేర్ పధే’’-శ్మశానానికి దారి కధగా రాశాడు .ఇదీ చైతాలీ ఘూర్ణి నవలకు బీజమైంది .కలకత్తా వెళ్లి వస్తున్నా అక్కడి జనజీవితపు లోతుపాతులు తెలియవు .ఆయన స్వభావంగా అవేశపూరితుడు .సున్నితఃరహృదయుడుశాంత చిత్తుడు .కలికాలం ఎడిటర్ మురళీ ధర బసు ఆయన్ను బాగా ఆకర్షించాడు .తర్వాత ప్రసిద్ధ రచయితలతో పరిచయం సాధించాడు .ఉపాసన సంపాదకుడు సావిత్రీ ప్రసన్న చటర్జీ చైతాలీ ఘూర్ణి ప్రచురణకు తోడ్పడ్డాడు .
1929నుండిఅలజడి ఆందోళన అశాంతి ఇండియాలో ఎక్కువయ్యాయి.మీరట్ కుట్ర తోఏర్పడిన అశాంతికి గాంధీ సహాయనిరాకరణంద్వారాశాంతికి దారి చూపాడు దండియాత్ర చేశాడు ఆసేతు హిమాచలం గాంధీ బాట లో నడిచింది .మేనెలలో గాంధీని అరెస్ట్ చేసి కాంగ్రెస్ ను నిషేధ సంస్థగా ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం 10నెలల కాలం లో 90వేల సత్యాగ్రహుల్ని అరెస్ట్ చేసింది .పోలీస్ కాల్పుల్లో ఇద్దరు రాజకీయ నిర్బంధితులు మరణిస్తే ,కలకత్తాలో బ్రహ్మాండమైన నిరసన సభజరిగి టాగూర్ అందులో ప్రసంగించాడు .1930లో తారాశంకర్ కూడా జైలుకు వెళ్ళాడు జైలు లోనే పాషాణ పూరి , ఘూర్ణి నవలలు రాశాడు , డిసెంబర్లో విడుదలయ్యాడు .
విడుదలకాగానే సుభాష్ చంద్ర బోస్ ను కలుసుకొన్నాడు బంద్యోపాధ్యాయ .బోస్ కు సేన్ గుప్తాకు మధ్య విభేదాలువస్తే పరి శీలించ టానికినిఆనె కలకత్తావస్తే ,బీర్భం నుండి మనవాడిని సాక్షిగా ఆహ్వానించారు .ఈయన నిర్మొహమైన మాటలకు బోసు సంతోషించాడు .సుభాష్ వ్యక్తిత్వం ఈయన్ను ఆకర్షించింది .చైతాలి ఘూర్ణి నవల బోసుబాబుకే అంకితమిచ్చాడు .ఇంటికి వచ్చి స్త్రీలనగలు అమ్మి అచ్చు యంత్రం కొని ఇంట్లో ఒక గదిలో పెట్టాడు .తారా రచనలను ఉపాసన అభ్యుదయపత్రికలు ప్రచురించేవి .
బెంగాళ జానపద నృత్యాలను పునరుద్ధరి౦చాలనిఒక జిల్లా ఆఫీసర్ గ్రామాలనుండి ప్రాచీన కళాఖండాలను బలవంతంగా దౌర్జన్యంగాసేకరిస్తుంటే ,అది జాతీయోద్యమాన్ని పక్కదారి పట్టించే ఎత్తుఅని కొందరు భావించారు .కోపం తో ఒక రాజకీయకార్యకర్త బాగా ప్రచారంలో ఉన్న ఒక జానపద గీతానికి పేరడీ రాసి ,ఈయన ముద్రణాలయం ఎవరు లేని సమయంలో ముద్రించాడు .అధికారికి తనగురించే అది అని తెలిసి అరెస్ట్ చేయించాడు .తారాశంకర్ కూడా గురయ్యాడు తప్పు లేకపోయినా .కుటిలకారణాలతో అరెస్ట్ ప్రయత్నం చేశారు .భోల్ పూర్ స్టేషన్ లో బోసును ఈయన రెండో సారికలియగా హామీపత్రం ఏదీ రాసివ్వద్దు,లొంగిపోవద్దు అని హితవు చెప్పాడు .ఈలోగా అచ్చు యంత్రం విప్పదీసి విడివిడిగా ఎడ్లబండీమీద లాభ పూర్ తీసుకు వెళ్ళాడు .
అశా౦తమనస్సుతో మళ్ళీ జిల్లా పర్యటన చేశాడు. ఒక చిన్న పిల్ల చావు కు సంబంధించిన కధ రాస్తుండగా ఆరేళ్ళ ఆయన కూతురు’’ బులు’’ చనిపోయింది .అత్య౦త విషాదంతోకలకత్తా చేరాడు .ఉపాసన పత్రిక మూసేస్తూ చటర్జీ ఆపత్రికలో ప్రచురించిన రచనలకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాడు .మనసుబాగోక స్వగ్రామం వెళ్ళినా లాభం లేక శాంతినికేతన్ వెళ్లి టాగూర్ గ్రామాభి వృద్ధి గురించి చర్చించాడు .భార్యబందువులు ఈయన్ను బొగ్గు వ్యాపార ముగ్గు లో దింపే ప్రయత్నం చేస్తే ఈయన ఒప్పుకోలేదు .ఆయన్ను అక్కడ అర్ధం చేసుకొన్న వారు అతితక్కువే .ఆవూళ్ళో ఒకయన ఇంగ్లాండ్ వెళ్లి వచ్చినవాడికి తనకూతుర్నిచ్చిపెళ్లిచేస్తే ,ఊళ్ళో వారు ఒప్పుకోకపోతే ఈయన ఒక్కడూ ఆయన్ని సమర్ధించాడు .
గురుడు మళ్ళీ కలకత్తా చేరగా ,పసిపిల్లాడి మరణం పై కధ’’శ్మశాన్ ఘాట్ ‘’ సజనీ కాంత్ దాస్ కు నచ్చి వగాశ్రీ మొదటి సంచికలోనే వేశాడు .ప్రముఖ చిత్రకారుడు జైమిని రాయ్ సలహాపై కలకత్తాలోనే ఉండిపోవాలనుకొని ఉన్నాడు .అక్కడ ఉండాలంటే కనీసం నెలకు పాతిక రూపాయలు కావాలి .మిణకలేక తిరిగి స్వగ్రామం చేరాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-22-ఉయ్యూరు
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.13వ భాగం.27.9.22
Video link
• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -13
• 37-సైరంధ్రి కావ్యం,జ్ఞాన ప్రసూనా౦బికా శతకం రాసిన , స్వర్ణకంకణ గ్రహీత ,సరస కవయిత్రి –శ్రీమతి గంటి కృష్ణ వేణమ్మ
• ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గంటి కృష్ణవేణమ్మ[1] గొప్ప కవయిత్రి. ఈమెది వాధూలస గోత్రము. ఈమె తండ్రి కఱ్ఱా రామశర్మ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. తల్లి సుబ్బలక్ష్మమ్మ కవయిత్రి. చంద్రకళా విలాసము అనే ప్రబంధాన్ని రచించింది. ఈ గ్రంథం విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. గంటి కృష్ణవేణమ్మ భర్త గంటి వెంకటసుబ్బయ్య కూడా గొప్ప పండితుడు. కవులుట్ల చెన్నకేశవ శతకము ను వ్రాశాడు. ఈమె పెద్దగా చదువుకోక పోయినా తాతగారైన నాగపూడి కుప్పుసామయ్య వద్ద తెలుగు సాహిత్యం చదువుకుంది. ఒంటిమిట్టలో వావిలికొలను సుబ్బారావు నిర్వహించిన పరీక్షలను చిన్న తనంలోనే ముగించింది. హిందీ విద్యాపీఠం వార్థా నిర్వహించే భాషాకోవిద వరకు చదివింది. ఇంగ్లీషు, కన్నడ భాషలలో కూడా కొంత ప్రవేశముంది. ఈమె గృహలక్ష్మి , భారతి, త్రిలిఙ్గ పత్రికలలో పద్యఖండికలను ప్రచురించింది. గృహలక్ష్మి పత్రికాధిపతులు ఈమెకు స్వర్ణకంకణమును బహూకరించి సరసకవయిత్రి అనే బిరుదుతో సత్కరించారు. తన 86వ యేట ప్రొద్దుటూరులో మరణించింది.
రచనలు
1. సైరంధ్రి (పద్యకావ్యము)
2. గిరిజాకళ్యాణము
3. పవనద్యూతము
4. రాజరాజేశ్వరీ శతకము
5. కామాక్షీ శతకము
6. శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము
7. తలపోత[2]
రచనల నుండి ఉదాహరణ
నాడటు పాండవాత్మజులు నన్నును, తమ్మును రాజ్యమెల్ల దా
నోడి మహార్తి నున్నతరి మద్యతులై ధృతరాష్ట్ర నందనున్
పాడి దొఱంగి వల్వలొలువన్‌గని సూతసుతుండు కొల్వులో
నాడిన మాట లకటా! తలపోయ మనంబు వ్రయ్యదే!
కురుపతి, భీష్ముడున్, గృపుడు, కుంభజ ముఖ్యులు గల్గుకొల్వులో
నరసి వచింపరైరకట! యాడుది వేడిన ధర్మసంశయం
బెరుఁగరె? ధర్మ శాస్త్రముల నేటికి గాల్పనె! పెద్దవారలం
దురుగద, యేటి పెద్దలిక నేటికి వారల గౌరవింపగన్?
(సైరంధ్రి పద్యకావ్యం నుండి)
38-ఆయుర్వేద ,జ్యోతిష పండితుడు,మహా౦ద్రో దయకావ్యకర్త కవి –శ్రీ గొల్లాపిన్ని రామకృష్ణ శాస్త్రి
గొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి (1922 – 2001) ప్రముఖ ఆయుర్వేద, జ్యోతిష పండితుడు.[1]
. ఇతను గొల్లాపిన్ని సీతారామశాస్త్రి, సుబ్బమ్మ దంపతుల సంతానం. ఇతనిది పండిత వంశము కనుక కవిత్వము ఉగ్గుపాలతోనే అబ్బింది. ఆయుర్వేదంలో కూడా అనుభవం సంపాదించుకున్నాడు. అబ్కారీ డిపార్ట్‌మెంటులో కడపలో పనిచేశాడు.
రచనలనుండి ఉదాహరణలు
సీ. కాకతి క్ష్మాపతి కాంచుచున్నాడు హ
ర్షాశ్రు ముక్తామాల సంతరించి
హరిహర బుక్కరాయలు కాంచుచున్నారు
తెలినవ్వు చలువ వెన్నెలల బరసి
ఘనుడు విద్యారణ్యముని పలుకుచున్నాడు
సిరిలొల్క వైదికాశీస్సు గురుసి
శ్రీకృష్ణరాయలు వాకొనుచున్నాడు
శక్రుతో నాంధ్ర ప్రశస్తియేమొ
గీ. గురుని కెఱిగించు చుండె తిమ్మరుసుమంత్రి
ఆంధ్రమంత్రుల సాహసౌదార్యములను
గతచరిత్రకు నీకు దార్కాణవారె!
వచ్చియున్నారు నీయుత్సవంబుఁజూడ.
(మహాంధ్రోదయము నుండి)
39-అన౦త ఆణిముఖ్యం ,ప్రకాశంగారి శిష్యుడు ,దశకావ్య కర్త –శ్రీ తక్కళ్ళపల్లి పాపా సాహెబ్
అనంతపురం జిల్లా కీర్తి ప్రతిష్ఠలు పెంచిన జాతిరత్నాలలో తక్కళ్లపల్లి పాపాసాహేబు ఒక అనంత ఆణిముత్యం.
జీవిత విశేషాలు
1928లో తక్కళ్లపల్లి పాపాసాహేబు[1],[2] తన మాతామహుల ఇంటిలో కేశవరాయునిపేటలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసము ప్యాపిలి, పత్తికొండ, గుత్తి గ్రామాలలో జరిగింది. కాశీ విద్యాలయంలో చదువబోయి కారణాంతరాల వల్ల ఆ ప్రయత్నాన్ని మానుకొని స్వయంకృషితో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. గాంధీగారి స్ఫూర్తితో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీకి అంకితమై దేశానికి సేవ చేశాడు. చిన్నతనం నుండి కవితాభ్యాసం చేసి పదికి పైగా కావ్యాలను వ్రాశాడు. ఇతని అంబ కావ్యము ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి భాషాప్రవీణ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. ఇతని రచనలపై విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్., పి.హెచ్.డి. స్థాయిలలో పరిశోధనలు జరిగాయి. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతనిని రాష్ట్రకవిగా గుర్తించి సత్కరించింది. రాయప్రోలు సుబ్బారావు ఇతడికి మహాకవి అనే బిరుదును ఇచ్చాడు. పాపాసాహేబు 1981లో మరణించాడు.
రాజకీయరంగం
ఇతడు టంగుటూరి ప్రకాశం పంతులును రాజకీయ గురువుగా భావించి రాజకీయాలలోకి ప్రవేశించాడు. ఇతడు కాసు బ్రహ్మానందరెడ్డి అనుయాయిగా అనంతపురం జిల్లా రాజకీయాలలో కీలకపాత్ర వహించాడు. 1958 నుండి జిల్లా కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభుడిగా ఉన్నాడు. 1962, 1967, 1972 శాసనసభ ఎన్నికలలో గుత్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు. రాజకీయాలలో తలమునకలుగా ఉండికూడా ఇతడు సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించాడు. ఇతడు తన రాజకీయ అనుభవాలను “నా రాజకీయ జీవితానుభవములు” అనే గ్రంథరూపంలో వివరించాడు[3].
రచనలు
1. అంబ
2. అవధి
3. కన్నీటి చుక్కలు
4. నా రాజకీయ జీవితానుభవాలు
5. పాపుసాబు మాట పైడిమూట
6. ప్రేమవిలాపము
7. రస ఖండము
8. రాజ్యశ్రీ
9. రాణీ సంయుక్త
10. శకుంతల
11. సత్యాన్వేషణ
12. విశ్వనాథ నాయకుడు
రచనల నుండి మచ్చుతునకలు
తన్నె వివాహమాడుట కెదన్ త్వరబొందెడు రుక్మిణిన్ మహా
పన్నత కుందు దాని మురభంజను డెత్తుక పోయినట్లు వే
గన్నరుదెమ్ము స్వామి నను గైకొని పోవగ వేచియుందు వే
గన్నుల నీదు రాకకయి కైరవ మిందుని కోస మట్టులన్
పరమ పవిత్రమైన మన భారతభూమి ప్రతిష్ఠ స్వార్థ త
త్పరమతి దుమ్ములో కలుపు తండ్రియెకాదు మరెవ్వరైననున్
స్థిర కరవాల ధారలను నిర్దయ గొంతులు కోతు, గొఱ్ఱెలం
గరణి దదసృగార్ద్ర శితఖడ్గము నిచ్చెద నీకు కాన్కగా
(రాణీసంయుక్త కావ్యం నుండి)
ప్రాణము పోవుచున్న దలవంచని పౌరుషసాహసాలు, వా
గ్దానమొసంగి తప్పని యుదార గభీరగుణమ్ము, లొంగుటే
గానని యాత్మగౌరవము, కంపము చెందని గట్టి చేవయున్
మానపరాయణత్వ మసమాన మఖండము నై విరాజిలున్
(సత్యాన్వేషణ నుండి)
యావజ్జీవము, మాతృదేశ భయదోద్యద్దాస్య నిర్మూలనా
భావోల్లాస వికాస చిత్తమున, దౌర్భాగ్యాభి పూత ప్రజా
సేవా దీక్షకు, ధారవోసిన దయాశ్రీసాంద్ర నిస్తంద్ర తే
జో విస్తార! జగత్పితా! కొనుమివే జోహారులర్పించెదన్
(మహాత్మాగాంధీ గురించి)
తురక కేమి తెలుసు పరమ వేదార్థమ
టంచు నెత్తి పొడుతు రవని సురులు
కన కబీరు తురక గాకేమి గరకయా
పాపుసాబు మాట పైడి మూట
(పాపుసాబు మాట పైడి మూట నుండ
40 –డిటెక్టివ్ నవలలతోసహా శతాధిక గ్రంధకర్త ,మహాకవి బిరుదాంకితుడు –శ్రీ గుంటి సుబ్రహ్మణ్యశర్మ
• గుంటి సుబ్రహ్మణ్యశర్మ[1] అనంతపురం జిల్లాకు చెందిన శతాధిక గ్రంథకర్త.
జీవిత విశేషాలు
సంస్కృత, ఆంగ్ల. ఆంధ్ర భాషలలో విద్యావంతుడు. సంస్కృతము గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. అనంతపురంజిల్లా లోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.కాం పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండి 18 నవలలు, 18 బాలసాహిత్య కథాసంపుటాలు,18 వచనప్రబంధాలు, 20 జాతీయనాయకుల జీవితచరిత్రలు, 8 పద్యకావ్యాలు, ఇంకా ఎన్నో ఇతర గ్రంథాలు వెలువడినవి. ఇతని అపరాధపరిశోధక నవల ‘భూతగృహము’ ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల కాకినాడచే 116/-రూ.ల బహుమతి గెలుచుకుంది.
రచనలు
• భూతగృహము (అపరాధపరిశోధక నవల)
• రహస్యశోధనము (అపరాధపరిశోధక నవల) [2]
• విశ్వజ్యోతి (గౌతమ బుద్ధుని చరిత్ర కావ్యము)
• మాధవాశ్రమము (నవల)
• విశ్వప్రేమ (బసవేశ్వరుని చరతము కావ్యము)
• శ్రీరామకృష్ణ భాగవతము (5000 పద్యాలున్న ఉద్గ్రంథము)
• జయాపజయములు
• కాసులదండ
• కాలభ్రమణం
• కన్నీటికాపురం
• ఆత్మతత్త్వవిచారము
రచనల నుండి ఉదాహరణలు
ఎన్నఁటికైన నన్ను నిను నేర్పడఁజేయును మిత్తి; సంపదల్
మిన్నలు కావు; నేను మిడిమేలపు జీవితమొంది భూమిపై
గ్రన్నన జచ్చుకంటె, బలకాయ సముత్థిత శక్తివెల్, నా
పన్నుల సేవఁజేతు; నిదిపాడియ; మద్భవసార మిద్ధరణన్
ఏమి సేతు నకట! ఎనలేని నీరూప
కాంతి, రెంట దీన కష్టజనుల
యోజ, చేరి మనసు నుఱ్ఱూత లూగించు
సుదతి నిన్ను విడుతు సుకృతమెంచి
తనయుడనై నీయొడిలో
దనరారుచు నుందు నింక తలఁకక,నాపై
మనసుంచక, యేలోటును
గనుపించక సుతునితోడ గడుపుము దినముల్
(విశ్వజ్యోతి నుండి)
మృత్యుముఖమున దరిజేరి మేధినీశు
లొక్కటౌదురు,భువిలోన సుక్కి పిదప
నెవర లేమౌదురో దేవు డెఱుగు? నకట!
మురిసిపోదురు మూన్నాళ్ళ ముచ్చటలకు
(విశ్వప్రేమ నుండి)
బిరుదులు
• అనంతపురము రాయలకళాగోష్ఠి ఇతడికి మహాకవి అనే బిరుదును ప్రదానం చేసింది.
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-22-ఉయ్యూరు
హాస్యానందం
31-సిన్క్లేయిర్ హాస్యం
లూయీ సింక్లైర్ కూడా ఆత్మాపకర్ష మూలంగా ,శబ్దార్ధ ఉభయ స్ఫురణతో రమణీయ హాస్యం వండి వడ్డించాడని మాస్టారువాచ .ఆయన కధకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ,అప్పుడు దాన్ని ఎలా చెప్పాడో ఆయనమాటలలోనే –‘’నోబెల్ బహుమానం మిలియన్ డాలర్లు వచ్చిందని పొంగిపోయాను .మా ఆవిడ చెవిలో ఈశుభ వార్త చెబుదామని ఎంతో తాపత్రయ పడ్డాను .ఆ ఉత్తరం తీసుకొని ఇంటికి పరిగెత్తాను .ఆవిడ నేను అంతత్వరగా ఇంటికి రావటం చూసి బోల్డు ఆశ్చర్యపోయి ‘’మీకేం జరిగింది అంత హడావిడిగా వచ్చారు ?’’అని అడిగితె ,నేను సంతోషంతో ఉప్పొంగిపోయి ‘నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందోచ్ ‘’అన్నాను .ఆవిడ మరింత ఆశ్చర్యంతో ‘’అది గొప్ప వాళ్లకు కదండీ వచ్చేది . మీకెలా వచ్చింది ?అన్నది .
బార్క్ –లేస్క్ –హాస్యం
దీనికి తెలుగులో ఏపేరు పెట్టాలో మునిమాణిక్యంగారికి తెలియలేదు .ఇది హాస్యానుకరణం ,అతిశయోక్తి ,వెక్కిరింత ,వ్యంగ్యం,నాన్సెన్స్ వంటిదే అన్నారు .ఉదాహరణ –‘’అడవిలో చలి అదరగొడుతోంది చెట్లు ముడుచుకుపోయాయి మర్రి చెట్లు వెంపలి చెట్లన్తయ్యాయి. కదలలేవు మెదల్లేవు .అప్పటికే సూర్యోదయం కావాలి .ప్రపంచంలోని నిప్పు అంతా గడ్డ కట్టుకు పోయింది .భూమి సూర్యుడి చుట్టూ తిరగటం మానేసింది .సూర్యరధం మంచులో కూరుకుపోయింది. ఆయన స్థాణువు అయ్యాడు .ఎలాగైనా తెల్లార్చాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .సృష్టి స్తంభించిపోయింది .అప్పుడు నాకో అయిడియా తట్టి సూర్యుడి రధ చక్రాలను రెండు తాపులు తన్నాను. అంతే మంచు విడిపోయి సూర్యరధం కదిలింది .బిగుసుకుపోయిన భూమిని రెండు సార్లు మనిషిని బుజాలు పట్టుకొని ఊపినట్లు ఊపి దార్లో పడేసేసరికి నా తలప్రాణం తోకకి వచ్చింది .ఇదే బర్-లేస్క్ కు ఉదాహరణ అన్నారు మీసాలు మెలేస్తూ మాస్టారుగారు .
మరో ఉదాహరణ –‘’ఆ రోజు స్కాట్ లాండ్డ్ తూర్పు తీరం నానాగందర గోళంగా ఉంది .సముద్రం లో తుఫాను రేగింది. అన్ని తీరాలూ అలానే ఉన్నాయి. మనకధ జరిగింది ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో .అక్కడ ఒకే రాజు పాలన. రాజుపేరు ‘’క్నో-ట్రాక్-స్పైన్-ట్వ్యి-న్మ్య’’.సాధారణంగా నోట్రం ట్వి అంటారు .రాజధాని పేరు క్న్యో-ట్మ్యా-స్వెం-ట్వ్యికో ‘’కాని అంతా దాన్నిక్నోస్సేట్’’అంటారు .కధకు పేర్లకూ అసలు సంబంధమే లేదు తన పేరు చెప్పక పొతే రాజు కోప్పడతాడని ఆపలక లేని పేరు చెప్పి మన బుర్ర తిన్నాడు రచయిత అంటారు నరసింహారావు జీ .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-22-ఉయ్యూరు
బృందావన్ లాల్ వర్మ.1వ భాగం.26.9.22/
Video link
పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-2
యవ్వన దశ
తారాశంకర్ కు యవ్వన దశ వచ్చాక నళిని బాగ్చి అనే అనే విప్లవకారుడితో పరిచయం కలిగింది .అతడుఇతనిలొ విప్లవభావాలు నాటాడు .1916లో జాదవలాల్ ఉన్నతాంగ్ల పాఠశాలలో చేరి మెట్రిక్ పాసయ్యాడు .తర్వాత కలకత్తాలో సెయింట్ జేవియర్ కలేజిలోచేరి ,రాజకీయ అనుమానితుల జాబితాలో అతని పేరు ఉండటం తో చదువు మానేయాల్సి వచ్చింది .అసుతోష్ కాలేజిఅనే సౌత్ సబర్బన్ కాలేజిలో చేరి ,అనారోగ్యం వల్ల మానేశాడు.1921లో విప్లవభావాలు కొంత స్తబ్దతతర్వాత నూతన ఉత్తేజం పొందాయి అతనిలో .గాంధీ సహాకనిరాకరణ పట్ల ఆకర్షితుడయ్యాడు .హి౦సావిధానం ఆయన మెచ్చలేదు. తానెప్పుడూ విప్లవవాదినికాను అని కల్లోల్ నవలలో చెప్పుకొన్నాడు .మనసులోని భావాలకు గాంధీ సిద్ధాంతాలు సమాధానం చెప్పినట్లు అనిపించింది .ప్రజల కష్టాలపై ఆసక్తి,ఆదుకోవాలనే కోరిక ,అభిమానం సానుభూతి ఆయనను మహా రచయితగా మార్చాయి .అనంత ప్రజావాహినే ఆయన మార్గదర్శి .
పరిపూర్ణ మానవతపై తారాశంకర్ కు మహా విశ్వాసం ఉంది .మహనీయ వ్యక్తులే ఆయన నవలలలోని పాత్రలు .కవి కావాలనే కోరిక ఉండేది.1920లో ఆయన బంధువు ఒకాయన ‘’త్రిపత్ర ‘’అంటేమూడాకులు అనే ఈయన కవితా సంపుటి ప్రచురించాడు .భారతవర్ష అనే ప్రముఖ పత్రికలఈయన కవిత అంతకు ముందే ప్రచురింపబడింది .త్రిపత్ర ఆయన బందుమిత్రులకే పరిమితం అవటం వలన తర్వాత కాల గర్భం లో కలిసిపోయింది .తర్వాతకాలం లో రాసిన కవిత్వం తక్కువేకాని, ఆయనలో భావుకుడైన కవి ఎప్పుడూ ఉండేవాడు .గురుముఖతనేర్వని ఆశుకవిత్వం ఈయనలో బాగా కనిపిస్తుంది .ఆకాలం లో ‘’కబియల్’’అంటే కవి-గాయకుడు అనేవారు గ్రామాలలో పద్యాలురాసి గానం చేస్తూ అలరించేవారు .ఈయన నవల ‘’కబి ‘’ఆ కవి –గాయక ప్రతిభకు నిదర్శనం .జానపద జీవితాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు తారాశంకర్ .
స్వగ్రామం లాభ పూర్ లో ధనిక భూస్వామి నిర్మలశివ బంద్యోపాధ్యాయ నాటకరచయితగా ప్రయోక్తగా పేరున్నవాడు .ఈయన నాటకాలను కలకత్తాలో కూడా ప్రదర్శించేవారు .తారాశంకర్ కూ నాటకాలు రాయాలనిపించింది .18రూపాయలతో గ్రాంట్ డఫ్ రాసిన మూడు సంపుటాల మహారాష్ట్ర చరిత్ర కొని ,పానిపట్టు యుద్ధంగురించి నాటకం రాశాడు శంకర్ .నిర్మల శివ ప్రోత్సాహంతో దాన్ని ఒక నాటకకంపెనియజమాని కిచ్చాడు .ఊరూ పేరులేని వాడు రాసిన దాన్ని చదవటం దండగ అని చులకనగా చూస్తె కోపం వచ్చి నాటకాన్ని అగ్నికిఆహుతి చేశాడు తారాశంకర్ .ఇంక రాయకూడదు అనుకొన్నాడు వ్యధతో .కాంగ్రెస్ లో ఉంటూ సమాజ సేవ చేసేవాడు. చిన్నతరహా భూస్వామికనుక కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు .
కొంతకాలం తర్వాత ఒక మిత్రునితోకలసి ‘’పూర్ణిమ ‘’మాస పత్రిక ప్రారంభించి ,తన రచనాసర్వస్వం అందులో ప్రచురించటం మొదలుపెట్టాడు .పెద్దగాసంతృప్తికలగలేదు అప్పుడే ‘’కవి-కలం’’అనే ఒక పత్రిక చూసి అందులో ప్రేమే౦ద్రమిత్ర ,శైలజానంద ముఖర్జీ లు రాసిన కథలు చదివి ,సంమోహితుడయ్యాడు .కలకత్తాకు వస్తూ పోతూ ఉన్నా సాహితీరంగంలో కొత్తపోకడలు గమనించనే లేదు .ఆరచయితలే తనకు మార్గదర్శులు అను కొన్నాడు .ఒకసారి తారాశంకర్ తన జమీన్ లో ఒక గ్రామానికి వెడితే అక్కడ ఒక సౌందర్యవతి అయిన ఒక వైష్ణవ యువతి కనిపిస్తే ,ఆమెపై ‘’రస-కలి ‘’అంటే చందనం కథ రాసి ప్రముఖ బెంగాలీ పత్రికకు పంపి౦చి 8నెలలతర్వాత ఆ పత్రికాఫీసుకు వెళ్లి అడిగితతే వావ్వరూ ఆకథ చదవలేదని చేబితెఅవాక్కై ,మధ్యకలకత్తానుంచి దక్షిణ కలకత్తా దాకా కాళ్ళీడ్చుకొంటూ నడిచి ‘’ఇక రచనలు చేయను .సేవాకార్యక్రమాలలో ఉంటాను ‘’అని నిశ్చయించాడు .
లాభపూర్ గ్రామయూనియాన్ బోర్డ్ కు అధ్యక్షుడయ్యాడు తారాశంకర్ .జిల్లా అంతా సైకిల్ పై తిరుగుతూ గ్రామజీవితాన్ని అధ్యయనం చేశాడు .నీటిఎద్దడి బాగా ఉన్న జిల్లా అది .కలరాతో రెండేళ్ళు ఇబ్బందిపడింది. ఆరునెలలు ప్రజల మధ్యగడిపి వ్యాధిని దూరం చేశాడు .ప్రజలకుఊరట కలిగించి సేవాకార్యాలలోసంతృప్తి చెందాడు ప్రజల కళ్లల్లోవెలుగు చూసితృప్తి చెందాడు .ఈ సంఘటనలన్నీ ఆయన రాసిన హన్సూలీ బంకర్ ‘’అంటే కొడవలి వంపు కథలో చోటుచేసుకొన్నాయి .
అభ్యుదయ సాహితీ వేదికగాఉన్న కల్లోల్ పత్రిక ముఖ చిత్రం ఒకసారి చూశాడు .తిరస్కరింపబడిన తన రస-కలి’’కథను దీనికిపంపితే ,నాలుగురోజుల్లోనేప్రచురణామోదం పొంది వెంటనే ప్రచురింపబడి,సాహితీ వేత్తల ప్రశంసలు పొంది , మరొకద రాసిపంపాని ఆహ్వానం అందుకుని పంపితే అదీ వెంటనే ప్రచురితమై ,కలికాలం అనే మరొక అభ్యుదయ సాహితీపత్రిక ‘’ఈ కథలు అరుదైన ఉత్తమకథలు ‘’అని ప్రసంశించింది .ఇవి 1929లో ప్రచురితాలు .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-22-ఉయ్యూరు .
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.12వ భాగం.26.9.22
Video link
త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య,ఆచలరమణుడు ,గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా కర్త –శ్రీ రావినూతల శ్రీరాములు
· రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లా, పమిడిపాడులో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు.
రచనలు
· 36-శ్రీరామాయణనిధి ,కధానిదధి ,బైబిల్ సూక్తులు రాసిన విద్యారత్న ,లలితకవికోకిల –శ్రీ తలమర్ల కళానిధి
· లమర్ల కళానిధి పేరుతో సాహిత్యలోకానికి పరిచయమైన ఈ కవి అసలు పేరు కొల్లప్ప[1].
జీవిత విశేషాలు
ఆయన అనంతపురం జిల్లా, కొత్తచెరువు మండలానికి చెందిన తలమర్ల గ్రామంలో 1915 లో ఓబమ్మ, ఓబన్న దంపతులకు జన్మించాడు.వారిది హరిజన కులం. మొదటి నుండి బీదతనంతో జీవితాన్ని గడిపిన ఆయన నిరాడంబరుడు, సుగుణ సంపన్నుడిగా పేరెన్నికగన్నాడు. ఇతడు స్వయంకృషితో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడై సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1970లో అనంతపురంలో తెలుగు పండితునిగా పదవీ విరమణ చేశాడు.
ఇతని సుగుణాన్ని నిరూపించే సంఘటన ఒకటి[2], [3]
ఆ రోజుల్లో పల్లెల్లో అక్షరాస్యతని వ్యాపింపచేయటం కోసం, ప్రైవేటు మేనేజ్‌మెంట్లు నిర్వహించే ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్నీ, ప్రాథమికోన్నత పాఠశాలల్నీ, ప్రభుత్వం గ్రాంటులిచ్చి ప్రోత్సహించేది. ఆ గ్రాంటుసొమ్ము ఎంతో తెలుసా? 1 నుండి 5వ తరగతి వరకూ ఉండే ప్రాథమిక పాఠశాలకి నెలకి 5 రూపాయలు. 6, 7, 8 తరగతులు కూడా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల అయితే, నెలకి 15 రూపాయలు. అంతే, ప్రభుత్వం అందించే సాయం. మరి, స్కూలుకి కావలసిన కుర్చీలూ, బెంచీలూ, బల్లలూ, రిజిష్టర్లూ, మ్యాపులూ, తెల్ల కాగితాలూ, చాక్`పీసులూ, ఇవి కాక, బిల్డింగ్ అద్దె, టీచర్ల జీతాలు – వీటన్నింటికీ డబ్బు కావాలి కదా – అది అంతా మేనేజ్‌మెంట్ వారే, ఊళ్లో ప్రజల విరాళాల ద్వారానో, విద్యార్థులు చెల్లించే స్కూలు ఫీజుల ద్వారానో సమకూర్చుకోవాలి. విద్యార్థుల దగ్గర్నుంచి ఫీజు, ఎట్టి పరిస్థితిలోనూ నెలకి అర్థ రూపాయి మించకుండా, అదైనా స్కూళ్ళ ఇన్‌స్పెక్టరు వారి అనుజ్ఞ లేకుండా వసూలు చెయ్యకూడదు – ఇదీ ఆనాటి ఎయిడెడ్ పాఠశాల పరిస్థితి. ఆ పాఠశాల మేనేజ్‌మెంట్ల దుస్థితీను. అటువంటి ప్రాథమిక పాఠశాల మేనేజ్‌మెంట్ అధిపతిగా తలమర్ల కళానిధి ఉండేవాడు. అప్పటికాయన వయస్సు ఇరవై నిండలేదు. అంతే కాదు, ఆయన ఎనిమిదవ క్లాసు వరకే చదువుకొని టీచర్ ట్రైనింగ్ అయ్యాడు. అలా ఎనిమిదవ క్లాసు మాత్రమే పాసయి టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళని హయ్యర్‌గ్రేడ్ టీచర్లనే వారు. అలా కాకుండా మెట్రిక్యులేషన్ పేసయి, టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్లని సెకండరీ గ్రేడ్ టీచర్లనే వారు. తలమర్ల వారు అప్పట్లో హయ్యర్ గ్రేడ్ టీచర్ మాత్రమే! బెళ్లూరి శ్రీనివాసమూర్తి మాత్రం సెకండరీ గ్రేడ్. అంటే బెళ్లూరి ఓ మెట్టు ఎక్కువ. అనగా 6, 7, 8 తరగతులకి పాఠం చెప్పే అర్హత వుంది ఆయనకి. అలా తనకంటే ఎక్కువ అర్హత ఉన్న తన మిత్రుడు బెళ్లూరి శ్రీనివాసమూర్తిని, ప్రాథమికోన్నత పాఠశాలగా ఎదిగి, తన మేనేజ్‌మెంట్ లోనే ఉన్నత పాఠశాలకి హెడ్‌మాస్టర్‌గా చెయ్యడమే కాకుండా, శ్రీనివాసమూర్తి తమ్ముడికీ, తండ్రిగారికీ, ఇద్దరికీ కూడా తన పాఠశాలలో టీచర్ ఉద్యోగాలిచ్చాడు తలమర్ల కళానిధి. మైత్రిపట్ల ఆయనకి ఉన్న అభిమానం అది. కాని శ్రీనివాసమూర్తి తండ్రి అయిన హనుమంతరావుగారికి, ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాల స్థాయికి ఎదిగిన ఆ పాఠశాల మేనేజ్‌మెంట్‌ని, తలమర్ల కళానిధి నుంచి తప్పించి తను చేజిక్కించుకోవాలనే చెడు తలంపు వచ్చింది. దాంతో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పై అధికార్లకి ఫిర్యాదులు చేశాడు. ఊళ్ళో కొందరిని తలమర్లపైకి ఉసిగొల్పాడు. లెక్కలు సరిగా లేవని తప్పుడు ప్రచారం చేశాడు. ఆయన ఎన్ని రకాల దుష్ప్రచారం చేసినా తలమర్ల కళానిధి కలత చెందలేదు. తన మిత్రుడైన శ్రీనివాసమూర్తి కూడా ఆ కుట్రలో కలిసి అందులో భాగస్వామి అయ్యాడే అని బాధపడ్డాడు. దాంతో ఎన్నో ఏళ్ళుగా వర్ధిల్లుతూన్న బెళ్ళూరి, తలమర్లల స్నేహానికి గ్రహణం పట్టింది. ఇద్దరి మధ్యామాటలూ, పలకరింపులూ అదృశ్యం అయ్యాయి. ఇద్దర్లో, ఏ ఒక్కరు సంస్కారి కాకపోయినా, ఆ విరామం వైషమ్యానికీ, వైషమ్యం విరోధానికి దారితీసేది. కాని ఇద్దరూ సంస్కారులు – ముభావంగా ఒకరికొకరు దూరంగా ఉండిపోయారు. పరస్పరం దూషించుకోలేదు. తగవులాడుకోలేదు. తర్వాత కొన్ని నెలలకి బెళ్లూరి విద్వాన్ పరీక్షకి కూర్చోవలసి వచ్చింది. అందుకాయనకో సర్టిఫికెట్ కావలసి వచ్చింది. బోనఫైడ్ టీచర్‌గా పనిచేసినట్లు. ఆ సర్టిఫికెట్ ఎవరుఇవ్వాలి? తను పనిచేసింది తలమర్ల స్కూల్లో, అందువల్ల ఆయన ఇవ్వాలి సర్టిఫికేట్. కాని ఇంత జరిగాక ఇస్తారా? సరాసరి తలమర్ల దగ్గరికి వెళ్ళి తలవంచుకొని కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు బెళ్లూరి. తలమర్ల కళవళపడి ‘ఏవిటిది స్వామీ?’ అనడిగాడు. ‘నీకు ద్రోహం చేశాను. మా నాన్నగారితో కలిసి నీపై కుట్రపన్నాను. దుష్ప్రచారం చేశాను. ఇప్పుడు క్షమించి బోనఫైడ్ టీచర్ సర్టిఫికేట్ నాకు ఎలా ఇస్తావు? ఇవ్వవు నాకు తెలుసు’ అన్నాడు. ‘ఎందుకివ్వను? ఇస్తాను. మన స్నేహానికి మధ్యలో ఏదో మబ్బుపట్టింది. ఇప్పుడు తొలిగిపోయింది ‘ అంటూ కౌగిలించుకొని, సర్టిఫికెట్ మీద సంతకం చేసి మిత్రుని భవిష్యత్తుకి బంగారుబాట వేశాడు తలమర్ల.
రచనలు
బిరుదులు
రచనల నుండి ఉదాహరణ
గిజిగాడు
నూతిలోనికి వ్రాలిన యీతరెమ్మ
ఆకును తూగుటుయ్యెలవోలె సఖియతోడ
నీకులాయము నల్లెదు నిపుణమైతో
ఓయి! గిజిగాడ! ధన్యుడవోయి జగతి
ప్రణయరాజ్యపు రమతోడ బవ్వళింప
అద్భుతాశ్చర్యములు గొల్ప నందముగను
ఎవ్వరెఱుగని యల్లికనెటులొయల్లి
గారడీవైతె! గిజిగాడ కళను బెంచ
ఓ కళారాధకుడ యెంత యోపికోయి
పూనివా వేదొ దీక్షను పూతమతిని
నీకళా రహస్యమ్మును నెరుగనైతి
ఔర గిజిగాడ యెవరు నీగురువు చెపుమ
(శ్రీసాధన పత్రిక 28 జూన్ 1947 సంచికనుండి
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-22-ఉయ్యూరు
దసరా శుభా కాంక్షలు
సాహితీ బంధువులకు -26-9-22సోమవారం నుంచి 5-10-22 బుధ వారం వరకు జరిగే నవరాత్రి దసరా శుభాకాంక్షలు -గబ్బిట దుర్గా ప్రసాద్
హాస్యానందం
30-ఫాల్స్టాఫ్ హాస్యం
షేక్స్పియర్ నాటకాలలో ఫాల్స్టాఫ్అనే హాస్యగాడు ఉంటాడు .ఒకసారి అతడు కొంతడబ్బుతో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న బాటసారుల్ని దోచుకోవాలని ప్రయత్నిస్తాడు .కానీ తన్నులు తింటాడు వాళ్ళ చేతుల్లో .స్థూలకాయుడు నడి వయస్సువాడు .వాళ్ళు ముగ్గురు .యితడు అనుచరులుకలిసి అయిదుగురు .ఈ అయిదుగురు ఆముగ్గురి చేతిలో చావు దెబ్బలు తింటారు కాని వాడు దాన్ని గా మలిచి చమత్కారంగా ఇలా చెప్పాడు –‘’నేను నా అనుచరులం దారి కాచాం.వాళ్ళు గుర్రాలపై డబ్బు సంచులతో వస్తున్నారు .వాళ్ళను దోచటానికి ఒకపధకం వేశాం .మా వాళ్ళు వట్టి పిరికి పందలు .వాళ్ళపై ఉరకటానికి సాహసించలేకపోయారు ‘’అన్నాడు నిజానికి పిరికి వెధవ వీడే .వాళ్ళను ముందుకు నెట్టి చచెట్టువెనక దాగాడు. వాళ్ళు చావగొట్టారు .పారిపోయారు .వాళ్ళతోపాటు వీడూ పారిపోతూ ఒక చోటికి వచ్చాక తానె వాళ్ళను చితక్కోట్టినట్లు తన స్నేహితులు పారిపోయి వచ్చినట్లు ప్రగల్భాలు పలికాడు దీన్నే మనవాళ్ళు ఇప్పుడు’’ బిల్డప్ ఇచ్చాడు’’ అంటున్నారు.పూర్వం రేలంగి హాస్యం గుర్తుకు వస్తుంది .
లీకాక్ హాస్యం
లీకాక్ అనే హాస్య రచనా చతురుడు ‘’మై ఫైనాన్షి యల్ కెరీర్’’అనే కధలో తనను తెలివి తక్కువవాడిగా లోకజ్ఞాన శూన్యుడిగా ప్రదర్శించుకొంటాడు .దీన్ని ఆధార౦గా మునిమాణిక్యం మాస్టారు ఒక కధఅల్లారు .’’ఒకసారి డబ్బు కావాల్సి వచ్చింది ఎవరూ అప్పు ఇవ్వలేదు .బ్యాంకి తక్కువ వడ్డీకి ఇస్తుందని ఎవరో చెప్పగా వెళ్లాను .అక్కడికి వెళ్ళాక భయమేసింది ఎవర్ని అడగాలో తెలీయలేదు ఒక కుర్రగుమాస్తాను అడిగితె ఏజెంట్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు .అనేక మెట్లు ఎక్కిదిగి వాడి వెంటనడుస్తున్నా అందరూ నన్ను చూసి జాలిపడుతున్నారు .కబేళాకు వెళ్ళే మేకపిల్లలాగా అయింది నా పరిస్థితి .తిప్పి తిప్పి అసలుగదికి తీసుకు వెళ్ళాడు .అధికారి కూర్చో మంటే కూర్చున్నాను .నేనెలా సాయపడగలను అని ఇంగ్లీష్ లో అడిగాడాయన .వదిలేస్తే కిందికి పారిపోయి బతుకు జీవుడా అందామని పించింది .ధైర్యం చేసి రెండు వందలు అప్పుకావాలని చెప్పాను .ఏదైనా హామీ పెట్టాలి అన్నాడు .పూర్వం పర్సనల్ సెక్యూరిటీ మీద ఇచ్చేవాళ్ళం .కానీ అప్పు తీసుకొనే వాడు ఏ తలకు మాసిన వెధవనో తెచ్చి చూపేవాడు .ఈ ఇవ్వలేని వాడికి ఇంకొక ఇవ్వలేని వాడు హామీ ఏమిటి అని మానేశాము .తలకొట్టేసినట్లైంది .ఒక ఇల్లు హామీ పెడతాను నా మాట నమ్ముతారా వచ్చి చూస్తారా అన్నాను .మా ఆఫీసు వాళ్ళు వచ్చి చూస్తారు అన్నాడు .ఎప్పుడు పంపిస్తారు అంటే రేపే అన్నాడు
మర్నాడు బాంకు నుంచి ఒకాయన వచ్చాడు .ఇల్లు చూపించాను .ఇది చిన్న ఇల్లే అయినా మీరు తీసుకొనే అప్పుకు సరిపోతు౦ది లెండి ‘’అన్నాడు లోపలి వెళ్లి చూదాం అన్నాడు .ఆ ఇంట్లో ముస్లిమ్స్ ఉన్నారు లోపలి రానివ్వరు అన్నాను డాక్యుమెంట్లు ఉన్నాయా అన్నాడు అలాంటివి లేవన్నాను. మీరు కొన్న ఇల్లేనా అంటే కాదు అన్నాను. మీ ఇల్లు ఎలా అయింది అని అడిగితె అది నాది అని చెప్పలేదే హామీ అంటే అది చూపించా అన్నాను .మీదికాకపోతే సెక్యూరిటి ఎలా ఇస్తారు అన్నాడు .సెక్యూరిటీగా చూపమంటే చూపాను ..అదికుదరదు అన్నాడు .పోనీ డా .రామరాజుగారిల్లు చూపిస్తా. అదీ నాది కాదు అన్నాను .మీదికానిది ఎలా తాకట్టు పెడతారు అన్నాడు .మీరు డాక్యుమెంట్లు అడగకపోతే ఆయన తగాదా పడకుండా చూసుకొంటా అన్నాను .మీస్వంతం ఏదైనా ఉంటె చెప్పండి అన్నాడు ‘’నా బొంద నాకు స్వంతం ఏమీ లేదు ఒక్క పెళ్ళాం తప్ప .బ్యాంకి వారికి అప్రతిష్టరాకూడదు. త్వరలో ఒక చిన్న ఇల్లు కట్టి సక్రమంగా హామీ పెట్టి నాలుగు రెట్లు అప్పు తీసుకాకపోతే నన్ను మారుపేరుతో పిలవండి ‘’అని అవమానం తో కుంగిపోతూ దిండులో దూరాను ‘’అన్నారు మునిమాణిక్యం అయ్యవారు .ఏదో సినిమాలో కళ్ళు చిదంబరం బ్యాంకి అధికారిమల్లి కార్జునరావు దగ్గరకు వెళ్లి అప్పు అడిగిన సీను గుర్తుకు వచ్చిందా భయ్యా .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్-25-9-22-ఉయ్యూరు
‘
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.14వ భాగం.25.9.22
Video link
తారా శంకర్ బంద్యోపాధ్యాయ
ఆంగ్లం లో మహా శ్వేతాదేవి రాసిన దానికి తెలుగులో ఎస్ ఎస్ ప్రభాకర్ అనువాదం చేసిన ‘’ తారా శంకర్ బంద్యోపాధ్యాయ’’పుస్తకాన్ని కేంద్ర సాహిత్యఅకాడమి 1978లో ప్రచురించింది వెల-2-50రూపాయలు .
జననం విద్యా భ్యాసం
తారాశంకర్ బంద్యో పాధ్యాయ పశ్చిమ బెంగాల్ బీర్భం జిల్లా లాభపూర్ గ్రామం లో 25-7-1898న జన్మించాడు .తండ్రి హరిదాస బంద్యోపాధ్యాయ తల్లి ప్రభావతీదేవి .మొదటి సంతానం .ఇద్దరు తమ్ముళ్ళు ,ఒకచెల్లెలు .అతడు పుట్టిన గ్రామం పురాణాలలో అట్టహాస అని పిలువ బడేది .సతీ దేవి శరీర భాగం పడిన పవిత్ర ప్రదేశం .ఇక్కడ శక్తి ఆరాధకులు ,వైష్ణవులు ఎక్కువ .జానపద సంగీతానికి ప్రసిద్ధి .చిన్న తనం లో శంకర్ బోలు వైష్ణవ శక్తి దాసరుల భక్తీ గీతాలు విని నిద్ర లేచేవాడు .గ్రామం మతసామరస్యానికి ప్రసిద్ధి .పాట్వాలు అనే సంచార జాతి వారు చేతితో రాసిన చిత్ర పటాలను పట్టుకొని తిరిగే వారు .అందులో కృష్ణలీలలు గౌరాంగ అనే చైతన్యప్రభు చిత్రాలు ఉండేవి .ఇక్కడి పాములవాళ్ళు మహమ్మదీయులు .వీరిలో పురుషులు బాగా అందంగా ఉంటారు .స్త్రీలుఎవరినీలెక్క చేసేవారుకాదు. గొప్ప నర్తకీ మణులు .సర్కస్ వాళ్ళు కూడా వచ్చి ప్రదర్శనలిచ్చేవారు .యువతకు బాగా ఆకర్షణ .సంచారజాతి స్త్రీలు ఆకుపసర్లు ,ప్రేమ లేపనాలు అమ్మేవారు .వారిలో మగాళ్ళు కుందేళ్ళను,అడవిపందుల్ని, అడవి బల్లులను వేటాడేవారు .
ఆగ్రామ చిన్నా పెద్ద జమీందార్లు ఉన్నత వంశీయులు .కొందరు బొగ్గుగనుల వ్యాపారంలో బాగా సంపాదించారు .పేదలు నిత్య దరిద్రులే .’’ రూపాయలతో ఎవరైనా మహా రాజుగా బతకవచ్చు .నెలకు సరిపడా ఆకుకూరలు 75పైసలే .వారానికి రెండు సార్లు జరిగే సంతలో అయితే మరీ కారు చౌక 37పైసలే .ఇంటి నౌకరు నెలజీతం రూపాయిన్నర .ఆడ వంటమనిషికి నెలకు రెండు రూపాయలు .మగ వంటగాడికి మూడు రూపాయలు .సంప్రదాయ ధనిక కుటుంబాలకు బొగ్గుగనులతో ‘’డబ్బు చేసిన ‘’వ్యాపారస్తులకు మధ్య స్పర్ధలు ఉండేవి .వ్యాపారుల్లో చాలామంది వైష్ణవులు .జమీందార్లు శాక్తేయులు.ఆలయ మరమ్మత్తులు చెరువుల బాగుకోసం బాధ్యత ఎవరిదీ అనే విషయం పై తగాదాపడేవారు .హైస్కూల్స్ కు చేసే ఆర్ధిక సహాయం లో కూడా భేదాలు కనబడేవి .పండుగలు మత ఉత్సవాలు చేసేటప్పుడు ఇవి బాగా బయటపదేవి .లాభపూర్ లో పటిష్టమైన నాటక సంప్రదాయం అనాదిగా ఉంది .అన్ని హంగులతో ర౦గస్థలం ఉండేది .’’యాత్రా ‘’నాటక సంస్థలు ఇక్కడికి వచ్చి ప్రదర్శనలిచ్చేవారు .ఇవీ ఆ నాటిసా౦ఘిక పరిస్తి తులు అని బంద్యో పాధ్యాయ చెప్పాడు . ఎర్రని భీర్భం అంటే వీర భూమిలో ,కోపాయ్ నది పరవళ్ళు తొక్కేది .మతదురాచారాలు వరదలు వర్షభీభత్సం తారాశంకర్ బాల్యం లోనే చవిచూశాడు .ఇవన్నీ ఆయన నవలలో ప్రత్యక్షంగా చూపాడు .తొలిరచన చైత్ర జంఝ నుంచి చనిపోయాక వచ్చిన ‘’శాతాబ్దిర్ మృత్యు అంటే ఒక శకం వెళ్లి పోయింది నవలదాకా ఆయన రచనలలో తనకు పరిచయమైన నేలను మనుష్యుల్ని పరిసరాలను ,ప్రకృతిని నిశితంగాపరిశీలించిరాశాడు .
తండ్రికి హైస్కూల్ విద్యకూడా లేదు అయినాస్వయంగా ఎన్నో గ్రంథాలు చదివి జీర్ణం చేసుకొన్నాడు .అన్నిరకాల పత్రికలూ వార్తా పత్రికలూ తెప్పించుకోనేవాడు మంచి లైబ్రరీ ఉండేదిఇంట్లో .తారా కు ఎనిమిదేళ్ళప్పుడే తండ్రినడి వయసులోనే చనిపోయాడు .తల్లి పాట్నాలోని విద్యాధిక కుటుంబానికి చెందినది .అప్పటి సనాతనాలు స్త్రీ విద్యను ప్రోత్సహించేవారుకాదుకానీ ఆమె తలిదండ్రులు ఆమెను బాగా చదివించారు .శంకర్ పై తల్లిప్రభావం జాస్తి. ఆమె అనేక మైన ఒడిదుడుకులు తట్టుకొని సంసారాన్ని నిలబెట్టింది .తల్లి అంటే అపారగౌరవం శంకర్ కు .అతని అత్త భర్తను కొడుకునుపోగోట్టుకొని వీరింటి లోనే ఉండేది .ఆమెకు మేనల్లునిపై అపార వాత్సల్యం,ప్రేమ .ఈ ఇద్దరు మహిళలు తారా శంకర్ జీవితానికి గొప్ప వెలుగులయ్యారు .అతనిలో ఉన్నత నైతిక విలువలను ప్రోది చేశారు .
తల్లి కథలను రసరమ్యంగా చెప్పేది .అతని రచనలలో ఈ కథకురాళ్ళు దర్శనమిస్తారు .ముఖ్యంగా గణ దేవత ,పంచగ్రామ నవలలో న్యాయరత్న పాత్ర తల్లియే .అతని మేనమామలు జాతీయోద్యమం లో పాల్గొన్నారు .1905లో కర్జన్ బెంగాల్ విభజన చేసినప్పుడు అతని మామయ్య చెల్లి చేతికి రక్షా బంధన్ కట్టాడు .తల్లికూడా ఈ కొడుకు చేతికి కట్టింది .అప్పటికి ఇతని వయసు చాలా తక్కువే.తండ్రి మరణం తల్లి ఆత్మ స్థైర్యం ,అత్త అపారప్రేమ ధాత్రీదేవత నవలలో అత్యద్భుతంగా చిత్రించాడు తారాశంకర్ .నాటి జమీందార్లు ధనవ్యయం బాగా చేస్తూ ,తాగుడుకు బానిసలైనావ్యక్తిగత,సాంఘిక ప్రవర్తన ఉన్నతంగా ఉండటంతో తారాశంకర్ కు వారిపై అభిమానం,సానుభూతి ఉండేవి. కాని రచనలలో వారి దురాచారాలను వ్యసనాలను ఖండించేవాడు .జమీందార్లు మతాచారాలను అత్యంత నియమ నిష్టలతో జరిపేవారు .ఇవి ఇతని కుటుంబానికీ ఎక్కువే .తరుణ వయస్సు వచ్చేసరికి శంకర్ కు ఆవిశ్వాసాలు ఆలోచనలపై స్థిర బుద్ధిఎర్పడింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-22-ఉయ్యూరు
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.11వ భాగం.25.9.22
Video link
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -11
· 34-బ్రౌన్ లైబ్రరిస్థాపకుడు,మా సీమ కవులు ,కడప సంస్కృతి ,ఎందఱో మహానుభావులు ,శక్తిపీఠాలు రచయిత,ధార్మిక రత్న , బ్రౌన్ శాస్త్రి –శ్రీ జానమద్ది హనుమచ్చాస్త్రి
· జానమద్ది హనుమచ్ఛాస్త్రి (జూన్ 5, 1926 – ఫిబ్రవరి 28, 2014) [1][2] తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత.
జీవిత విశేషాలు
ఇతడు జూన్ 5, 1926 లో అనంతపురం జిల్లా రాయదుర్గం లో జన్మించాడు.[3] రాయదుర్గం జిల్లా బోర్డు హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి చదివాడు. ప్రైవేటుగా బి.ఎ. ఉత్తీర్ణుడైనాడు. బి.ఇడి. కూడా పూర్తి చేశాడు. స్వయంకృషితో తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు.
1946లో బళ్ళారి లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కడప లో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించి, బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు. ‘బ్రౌన్ శాస్త్రి’గా పేరు గడించాడు. కడపజిల్లా రచయితల సంఘం 1973లో స్థాపించి 20ఏళ్లు కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్రంలోని సుప్రసిద్ధ రచయితలను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఇతనిదే. బెజవాడ గోపాలరెడ్డి, ఆరుద్ర, దాశరథి, కుందుర్తి, పురిపండా అప్పలస్వామి, శ్రీశ్రీ, సి.నా.రె.,దేవులపల్లి రామానుజరావు,దివాకర్ల వెంకటావధాని మొదలైన రచయితలను, విద్వాంసులను రప్పించి అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు.
రచనలు
జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసాడు. 16 గ్రంథాలు వెలువరించాడు.
గ్రంథాల జాబితా
పురస్కారాలు, సత్కారాలు
శాస్త్రి కి అనేక అవార్డులు లభించాయి.
మొదలైన అనేక పురస్కారాలు ఇతనికి లభించాయి.
మరణం
కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2014, ఫిబ్రవరి 28 న వీరు పరమపదించారు.
·
· శ్రీ హనుమ చ్చాస్త్రి గారితో నాకు మంచి పరిచయమే ఉండేది వారితో చాలాసార్లు ఫోన్ లో మాట్లాడాను సరసభారతి పుస్తకాలు పంపేవాడిని అందాయి అని చెప్పి చదివాక బ్రౌన్ లైబ్రరీకి అండ జేశానని చెప్పేవారు తన పుస్తకాలుకూడా నాకు పంపేవారు .కడప సాహితీ జ్యోతి శాస్త్రిగారు బహుముఖీనమైన ప్రతిభా సంపన్నులు .
· సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-22-ఉయ్యూ
మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -313
313-మూడు సినిమాల్లో మాత్రమె నటించిన సినీ తొలితరం హీరో ,న్యాయవాది రంగస్థల నటుడు ,షేక్స్ పియర్ నాటకాల అనువాదకర్త-వెల్లాల ఉమామహేశ్వరరావు
వెల్లాల ఉమామహేశ్వరరావు, తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది, రంగస్థల నటుడు.[1] రచయిత, నాటకకర్త, ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య దర్శకుడు), గూడవల్లి రాంబ్రహ్మం నిర్మించిన పంతులమ్మ.[2] “లేపాక్షి” అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిలింను నిర్మించాడు.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడిగా పేరు గడించాడు
విద్యాభ్యాసము
వెల్లాల ఉమామహేశ్వరరావు 4వ ఫారం వరకు చిత్తూరులో చదివి తరువాతి ఉన్నత విద్య కడపలో ముగించాడు. ఇంటర్మీడియెట్ మద్రాసులో చదివాడు. బి.ఎ. అనంతపురం దత్తమండల కళాశాలలో చదివాడు. మద్రాసులో లా చదివి అక్కడే న్యాయవాదిగా కొంతకాలం పనిచేశాడు.
సాహిత్యసేవ
అనంతపురంలో చదివేటప్పుడు 1932 ప్రాంతంలో మిత్రులు మఠం వాసుదేవమూర్తి, పాళ్ళూరు సుబ్బణాచార్యులుతో కలిసి ‘కవికుమారసమితి’గా ఏర్పడి క్రొక్కారు మెఱుగులు, తొలకరి చినుకులు అనే ఖండకావ్య సంకలనాలను వెలువరించాడు.[3] ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్‌పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. అతనికి పుట్టపర్తి నారాయణాచార్యులు బాల్యస్నేహితుడు.[4] అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ మహాత్ముని అంతరంగము అనే రచన చేశాడు.[5]
నటించిన సినిమాలు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-22-ఉయ్యూరు
శతక భారతం
కృష్ణా జిల్లా నూజి వీడుకు చెందినశ్రీ పిసిపాటి సోమయ్య కవిమహా భారత కథను ‘’భారత శతకం ‘’గా రచించి 1935లో ,అక్కడే ఉన్న శ్రీ గౌరీ ముద్రాక్షర శాలలో ప్రచురించారు .వెల 5 అణాలు .దీనికి ముందుమాటను నూజివీడు ఆర్.ఆర్ .అంటే రాజారంగయ్యప్పారావు హైస్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిల్ మాజీ ప్రెసిడెంట్ శ్రీ మద్దిరాల రామారావు ఆంగ్లం లో రాశారు అందులోని విశేషాలు –‘’భక్త వత్సల కృష్ణ ‘’మకుటంతో కవిగారు మహా భారత ఇతి వృత్తాన్ని శతకంగా చెప్పటం నమ్మలేక పోతున్నాను .ఈనాటి యువతకు ప్రోత్సాహకరంగా ఉంది .భారత దేశ క్లాసిక్ కావ్యాలలో భారతం ఒకటి .భారతం లోలేని విషయాలు ఎక్కడా ఉండవు .ఎక్కడున్న విషయమైనా భారతం లో ఉంటుంది .యువత ఈశతకం చదివి భగవద్ భక్తిని, మన సంస్కృతిపై ఆరాధనా భావాన్ని పెంపొందించుకోవాలి. ‘’
బందరు హిందూ కాలేజి ఎక్స్ ప్రిన్సిపాల్ శ్రీ వారణాసి శ్రీనివాసరావు కంద పద్యాలలో పండితాభిప్రాయం చెబుతూ ‘’ఒక చులుకమ్మున గు౦భజు –డకలంక ప్రతిభ గ్రోలె న౦బు ధులి౦కన్ –సుకరమ్ముగాని భారత –మొక శతకంబయ్యె నీదు యుక్తి స్ఫురణచే ‘’,అంటూ కవిది ‘’అతులిత మనీష ‘’అని శ్లాఘించారు .కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ‘’శయ్య మనోహరం ప్రధానాంశాలు వదిలిపెట్టకుండా భారతాన్ని శతక కమండలం లో ఇమిడ్చారు ‘’అన్నారు .కలువపాములనుంచి శతావధాని శ్రీ హరి రామలింగ శాస్త్రి ‘’రసమున్నించి ,యలంకృతులన్ జొనిపి ,మహాకథా విశేషమున్ గుంచించి ముఖ్యా౦శపు గోసలైనన్ విడబోక ,యాగమహితోక్తుల్ వెల్లిగా ‘’రాసినందుకు పద్యాలలో మెచ్చుకొన్నారు .నూజివీడు డిప్యూటీ తాసిల్దార్ ఆఫీస్ హెడ్ క్లార్క్ –శతావధాని శ్రీ పాగొలు సత్యనారాయణ ‘’భారత సారము శతకము –గా రచియించితివి ముద్దుగా బాలురకున్ –దీరైన శబ్ద సంపుటి –నౌరా యని యబ్బుర౦బు నంద మనీషుల్ ‘’అని ఆశీర్వదించారు .కలువపాములవాసి శ్రీ హరి రాదా కృష్ణ మూర్తి ‘’లలి లక్షాధికమైన భారతము నెల్లన్ నూరు పద్యంబుల౦- బలుకంగా వలెనందుగందముల గావ్య ప్రక్రియన్ ‘’భక్త వత్సల కృష్ణా యను సత్కిరీటమున –ఓహో నీకృతి దివ్యం ‘’అని వెన్ను తట్టారు .నూజివీడు కో ఆపరేటివ్ సూపర్వైజర్ శ్రీ జోశ్యుల సూర్యనారాయణ శాస్త్రి ‘’నన్నయ తిక్కన యెర్రన-పన్నిన యా ఫక్కి నెందు బస చెడకుండన్ –సన్నుత గతి శతకంబున –వన్నె లొలుక బలికి తీవు భారత గాథన్’’అన్నారు .కనుక ఈశతకం కంద శతకం .మకుటం –‘’భక్త వత్సల కృష్ణా ‘’.ప్రతిపద్యానికి సూక్ష్మగా తాత్పర్యమూ రాశారు కవి .
మొదటి కందపద్యం –‘’శ్రీ రుక్మిణీ మణీహృ-త్సార సమద భ్రు౦గాపార్ధ సారధి చక్రి
ద్వారవతీశా నీపద –వారిజ ములగోలుతుభక్తవత్సల కృష్ణా ‘’.తర్వాత దశావతారాలు ఎత్తిన నీకు స్తుతి అంటే లోకోపకారమైన జండాను ఎత్తటమే.తర్వాత వ్యాస వాల్మీకాదికవులను తెలుగు కవులను ప్రస్తుతించి ‘’మద్గ్రంథోచిత రచనాధిక వాగ్వై చిత్రి ‘’ప్రసాదించమని కంసారిని మనసారా కోరారు .భూదేవి ధరించిన ఆభారణమా అన్నట్లు హస్తినాపురమున్నది .పుట్టు గుడ్డి ధృత రాష్ట్ర మహారాజు న్యాయంగా పాలిస్తున్నాడు .పాండురాజు అన్నకు సాయపడుతున్నాడు .చాపకళా విదుడుబ్రహ్మచర్యాశ్రమ దీక్షా పరుడు పెదతండ్రి భీష్ముడు అన్నివిధాలా ప్రాపు .’’నయ విద్యా పాండితిలో మేటి విదురుడు రాచకార్య నిర్వాహకుడు .తర్వాత పాండవ కౌరవ జననం ,పెంపకం ,పాండురాజు ‘’కిందమముని ‘’శాపంతో చనిపోవటం ,మాద్రి సహగమనం చేయటం ,కుంతితో పాండవులు హస్తిన చేరటం విద్య విలువిద్యాదులలో పెరుపొందటం ,దుర్యోధనాదులు భీమాదులను అవమాన పరచి దుష్టంగా ప్రవర్తించటం,ద్రోణ గురువు వద్ద ధనుర్విద్యాభ్యాసం చెప్పారు . ‘’నరశర విద్యాకుశలత ,,మరుదాత్మజు బాహు విక్రమం ,యుధిష్ఠిరుని పదవి చూసి సహించలేకపోయాడు దుర్యోధనుడు .సౌబల కర్ణాహ్వాయులు అతడికి దుష్ట సలహాలిస్తూ దుష్ట చతుష్టయంయ్యారు .తండ్రికి మాయమాటలు చెప్పి పా౦ డుకుమారుల్ని వారణావతం పంపి ,లక్కింట కాపురం పెట్టించి, అర్ధరాత్రిదహనం చేయించాడు .’’విదుర దూత సమకూర్చిన భూబిల మార్గం లో అడవి లోకి ప్రవేశించారు తల్లితోసహా .హిడింబ భీమ వివాహం ,ఘటోత్కచ జననం ,విప్రవేషంలో ఏక చక్రపురం చేరి ,భీముడు బకాసుర సంహారం చేసి ప్రజల బాధలు తీర్చటం ,ద్రౌపదీ స్వయం వరంలో పాల్గొనటం .’’వచ్చిన రాసుతు లెల్లరు –జెచ్చెర జని భంగపడుట చే యంత్రం –బచ్చపు ద్విజ వేషుడువి-వ్వచ్చుడు దాని నేసె భక్తవత్సల కృష్ణా ‘’.తల్లికుంతి,వ్యాస మహర్షి అనుమతితో పాండవులు అయిదుగురు ద్రౌపదికి భర్తలయ్యారు .ఈ విషయం తెలిసిన పెద్దరాజు వారందర్నీ గజపురికి ఆహ్వానింఛి అర్ధ రాజ్యమివ్వగా ఇంద్ర ప్రస్తాన్ని రాజధానిగా ధర్మరాజు తమ్ముల సాయంతోపాలించాడు .తర్వాత ‘’మేనరిక మని త్వదీయసహోదరి సుభద్ర దేవేరిగనీ –వాయర్జునునకు ‘’కూర్చాడుకృష్ణుడు .సుభద్రార్జునులకు మహా పౌరుషవంతుడు అభిమన్యకుమారుడు జన్మించాడు .ద్రౌపదికి ధర్మజ భీమార్జున నకుల సహదేవుల వలన ప్రతి వింధ్య ,శ్రుతసోమ ,శ్రుతకీర్తి శతానీక ,శత్రుసేన అనే ఉపపాండవులు జన్మించారు
అర్జునుడు ఖాండవ దహనం చేసి అగ్నిని మెప్పించి ,ఇంద్రాదులను జయించి వీతి హోత్రుని తృప్తి పొందించాడు .మయుడు అఆగ్నిజ్వాలలో చిక్కుకొని కిరీటిని శరణు వెడితే , అతడు రక్షించగా ,కృతజ్ఞతగా అతడు ‘’శ్రీమన్మణి సభ –నాకస్వామియు నరుదొంద’’ధర్మపుత్రునికి నిర్మించి ఇచ్చాడు .మయసభా ప్రవేశం చేసి యుధిష్ఠిరుడు ధర్మ బద్ధంగా రాజ్యపాలన చేస్తూ ,నారద మహర్షి రాజసూయ యాగం చేయమని హితవు చెప్పగా బావ కృష్ణుని ఆహ్వానించి ‘’నీ నియోగంతో రాజలోకాన్ని జయించాలి ‘’అని కోరగా ,జరాసంధుని హతమార్చటానికి కృష్ణ భీమార్జునులు వెళ్లగా ,భీముడితో మల్ల యుద్ధం లో వాడు చనిపోయాడు .తమ్ముల సాయంతో పూర్వోత్తర పశ్చిమ దక్షిణ దిగ్విజం పొంది ధర్మరాజు రాజసూయాధ్వరం చేశాడు .అగ్రతాంబూలం శ్రీ కృష్ణుడికి ధర్మరాజు ఇస్తే ,శిశుపాలుడు అతడిని,కృష్ణుని దూషిస్తే ,’’నిన్నుదిట్టు శిశు పాలున్ –గూలిచి చక్రముచే –క్రతుపాలన ‘’చేశాడు .
పాండవ వైభవాన్ని కనులారా చూస్తున్న దుర్యోధనుడికి అ సూయ పరాకాష్టకు పెరిగి ,మాయాద్యూతం ఆడించి వనవాస అజ్ఞాత వాసాలకు పంపాడు పాండవుల్ని ‘కౌంతేయులు సతితో కాననమున బలు పాట్లు పడ్డారు .’’బకుని తమ్ముడు కిమ్మీరుడు అడ్డు వస్తే భీముడు చంపేశాడు .’’ఈశునికై తపము –పారాశర్యు ననుజ్ఞ సల్పి –ప్రత్యక్షముగా జేసికొని-నరుడు వొందెను – పాశుపతాస్త్రము ‘’.శతమఖ నందనుడు అర్జునుడు అమరావతికి వెళ్లి ఊర్వశికామించగా ,నిరాకరిస్తే ‘’పేడిగ బ్రతుకు మని ‘’శపించింది .ఇంద్రుని ఆజ్ఞతో పార్ధుడు పాతాళం లో ఉన్న నివాత కవచులు అనే 3కోట్ల రాక్షసులను ,హిరణ్య పురవాసులైన పౌలోమ కాలకేయాది 60వేల రాక్షసులని చంపి దేవతా ప్రీతి చేశాడు .
గంధర్వులు దుర్యోధనుడిని బంధిస్తే ,విడిపించి ‘’గంధర్వుల నోరిచిన –సద్బంధులు పాండవులు .కామ్యవనంలో పాండవులు ద్రౌపదిని ఒక్కదాన్నే ఆశ్రమ లో ఉంచి వేటకు వెడితే ‘’ద్రుపద సుత వలచి సైంధవుడు అపహరణము సేయగా –మారుతాత్మజుడు ‘’వాడి గర్వం అడచి ద్రోవదిని తెచ్చాడు .’’సురయక్ష మౌని భూసుర సమూహం వరాలు ఇస్తే ,12ఏళ్ళు సుఖంగా పాండవులు వనవాసం పూర్తి చేశారు .అజ్ఞాతవాసం ఏడాది గడపపటానికి మత్స్యనగరి వెళ్లి ,విరటునికొలువులో మారువేషాలతో ఉన్నారు .’’నరుడు బ్రహన్నల నాగను బరగెను బేడియయి ‘’.ద్రౌపదిని గా౦ క్షీంచియుంట-దుర్జ్నేయ విధిన్ –దేవి సహోదరు గీచకు –బావని వధించాడు ‘’అని కీచకవదను ఒకే ఒక పద్యంలో చెప్పేశారు .తర్వాత దక్షిణ గోగ్రహణం.’’అత్తరి విరటుని పుత్రకు –నుత్తరు గని పసుల వార లోగివెడితే ‘’అర్జునుడు వెళ్లి ఆలను రక్షించి దుర్యోధనాదులకు యుద్ధంలో బుద్ధిచెప్పి ‘’క్రీడి రధియై తా రహి కౌరవ సేనా –వారంబుల గవిసె ‘’అనిలో ఉరు విజయం’’ పొందాడు .పాండవులు తమ నిజస్వరూపాలు విరతునికి తెలియజేయటం అర్జునుని కోరికపై అతడు ఉత్తరను అభిమన్యునికిచ్చి వివాహం చేయటం ,ఉపప్లావ్యం చేరి పాండవులు ‘’తమపాలిమ్మని కురు పతిని ‘’కోరటం ,చివరగా శ్రీ కృష్ణ రాయబారం ‘’తమ పైతృకమగు ఉర్వీ సామ్రాజ్యం పాండవులకిచ్చి ,భువి వాసిగా మనుము ‘’అని హితవు చెప్పటం ,లేదంటే యుద్ధంలో జయించి వాళ్ళే రాజ్యం పొందుతారని హెచ్చరించటం ,యుద్ధంలోనే తేలుద్దాం అని పెద్దరాజుకొడుకు అనటం ,ఆదుష్టులు ‘’నిండు సభ బట్ట నేనొక రుండన ?”’అంటూ విశ్వరూపం చూపటం ,చెప్పారు .
‘’పోరున సారధి వగుమని –కోరుతట నిన్ను సవ్యసాచి గొనకొని నీవా -భారము బై నిడుకొన్నావు ‘’అపార కృపా లీలతో .కురుపాండవ సంగ్రామం .వరుసగా కౌరవులంతా పాండవులచేతిలో హతమవ్వటం ,18అక్షౌహిణుల సైన్యంతో 18రోజులు జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించగా ‘’శ్రీ మెరయ నంతధర్మజు –బ్రేమంబున హస్తిపురికి పృధ్వీ పతిగా –నేమించి ,ఏలితీవు ప్రభామయ సాధువుల భక్త వత్సల కృష్ణా ‘’111వ కందంలో పిసిపాటి సుబ్బయ నరసాంబ కుమారుడు సోమయకవి రాసిన భారత శతకం చదివిన విన్నవారు కృష్ణుని దయతో దీర్ఘాయుస్సు నిర్మలమనసు ,సమస్తసంపదలు సత్సంతానం ఇహపర సౌఖ్యం తప్పక పొండుతారని ఫలశృతి చెప్పారు .
ఇందులో నేను విశ్లేషించి చెప్పాల్సిందేమీ లేదు మున్డుమాతలలోనే మహా మహులు చెప్పే ఉన్నారు .ఈకవి రామాయణం కూడా శతకరామాయణ0గా రాసిన తర్వాత దీన్ని రాసి ఆటర్వార భాగావతాన్నికూడా శతక భాగవతంగా రాశారని నిన్న చెప్పుకొన్నాం .కొండను అడ్డం చూపినట్లు మహా ఉద్గ్రందాలను శతకాలుగా మలచిన ఈ కవిని శతవిధాల కీర్తించాలి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-22-ఉయ్యూరు