మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 44

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 44 · 44-నవ్యమానవ వాది,అసమర్ధుని జీవితయాత్ర ఫేం ,తెలుగులోచైతన్య స్రవంతి ప్రవేశపెట్టిన జీనియస్ సినీ దర్శకుడు –గోపీ చంద్

జననం , విద్య
గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో త్రిపురనేని రామస్వామి చౌదరి, పున్నాంబలకు జన్మించారు. ఈయన తండ్రి కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు హేతువాది సంఘసంస్కర్త. గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నారు .ఇంటి పనులతోపాటు, తండ్రి నాస్తికోద్యమమునకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాలా గడచి పోయింది.

ఈయనకు కొమ్మా నారయ్య గారి పుత్రిక శకుంతలా దేవితో 1932 లో వివాహం జరిగింది, 1933లో బి.ఎ పట్టా పొంది ఆ తర్వాత నద్రాసులో లా డిగ్రీ చదివారు. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయారు. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమాయిలు.ఈయన ఆఖరి కుమారుడు త్రిపురనేని సాయిచంద్ సినీ నటుడు, దర్శకుడు.

రచనావ్యాసంగం
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. అతని మీద చాలా కాలము వారి నాన్నగారి ప్రభావం ఉండేది. ఆయన మొదట వ్రాసిన చాలా నవలలో మార్క్సిస్టు భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి. మొదట్లో కథా సాహిత్యంపై దృష్టి సారించిన ఆయన కొద్దికాలానికి నవలా రంగంవైపు కూడా మళ్ళారు. ఆయన రచనల్లో అసమర్ధుని జీవితయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా మొదలైనవి పేరు గాంచాయి. ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.[1]

భావజాలం
గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించారు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించారు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువుగా, తత్వవేత్తగా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది. ఒక పుస్తకాన్ని ఆయన తండ్రిగారికి అంకితం ఇస్తూ- ‘ఎందుకు’ అని అడగటం నేర్పిన నాన్నకి అని వ్రాసారు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికి ఎదిగారు.

నవ్య మానవ వాది
మార్కిజాన్నిఅధ్యనం చేసి ‘బీదవాళ్ళాంతా ఒక్కటే’ , గోడమీద మూడోవాడు , పిరికివాడు వంటి కథలు రాసారు. మార్కిజం అంటే ఏమిటి? , పట్టాభి గారి సోషలిజం, సోషలిజం ఉద్యమ చరిత్ర వంటి గ్రంధాలు రాసారు. తరువాత మార్కిజంలో లోటుపాటులు గ్రహించి ఎం.ఎన్. రాయ్ గారి నవ్య మానవ వాదం వైపు పయనించారు. రాడికల్ డెమక్రటిక్ పార్టీ కార్యదర్శిగా నవ్య మానవ వాదాన్ని విస్త్రుతంగా ప్రచారం చేసారు. పార్టీ రహిత నవ్య మానవ సమాజం నిర్మాణం వైపుగా భావ విప్లవం కొరకు సాహిత్య కృషి చేసారు.

గోపీచంద్ నెమ్మదిగా నాస్తిక సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు – ఈ గ్రంథాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది.

గోపిచంద్ ఒక చోట ఇలా అంటాడు, “మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు”. మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి, చలం కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ.

సినిమా రంగం
1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు. కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు. చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, రైతుబిడ్డ మొదలైన చిత్రాలకు మాటలు రాశాడు. ప్రియురాలు, పేరంటాలు, లక్ష్మమ్మ మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

తెలుగు సినిమాలు
చదువుకున్న అమ్మాయిలు (1963) (మాటల రచయిత)

      ధర్మదేవత (1952) (మాటల రచయిత)

      ప్రియురాలు (1952) (కథ, మాటల రచయిత, దర్శకుడు)

      పేరంటాలు (1951) (దర్శకుడు)

      లక్ష్మమ్మ (1950) (దర్శకుడు)

      గృహప్రవేశం (1946) (కథా రచయిత)

      రైతుబిడ్డ (1939) (మాటల రచయిత)

జీవిత క్రమం[2][మార్చు]
8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ.

      హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. అయితే తరువాతి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారాడు.

      1932 లో వివాహం; 1933లో బి.ఎ పట్టా, ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం (మార్క్సిజం) పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.

      ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ మానవతావాదం ఆయన పై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.

      1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు.

      తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల పరివర్తనం (1943). నూతన దృక్పదంతో షూమారు 300 కథలు రాసారు.

      1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు.

      1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసారు.

      1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసారు. వారి 'ఉభయకుశలోపరి ' కార్యక్రమం జనరంజకమైనది. కాళిదాసు రచనలన్నిటిని రేడియో రూపకాలుగా రాసారు. వీరు రచించిన అనేక నాటకాలు, నాటికలు శ్రోతలను విశేషంగా ఆకర్షిచాయి. ఈ దశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించారు.

మరణం
1962 నవంబర్ 2 నాడు 52 సంవత్సరాల వయస్సులోబహుముఖ ప్రతిభాశాలి అయిన గోపీచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.

1963లో వీరు రాసిన [పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ‘ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.[1]

భారత ప్రభుత్వము 2011 సెప్టెంబరు 8న గోపీ చంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది. అంతకుముందు 1987 వ సంత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శతజయంతి వేడుకలలో త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారక తపాళా బిళ్ళను జారీ చేయడం జరిగింది. తెలుగు వారిలో తండ్రి, కొడుకులు ఇద్దరికి తపాల బిళ్ళలు విడుదల చేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది.

రచనలు
నవలలు
అసమర్థుని జీవయాత్ర

      గడియపడని తలుపులు

      చీకటి గదులు

      పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

      ప్రేమోపహతులు

      పరివర్తన

      యమపాశం

      శిధిలాలయం

వాస్తవిక రచనలు
తత్వవేత్తలు

      పోస్టు చేయని ఉత్తరాలు

      మాకూ ఉన్నాయి సొగతాలు

      నవ్య మానవతా వాదాన్ని అవలంబించి వ్యాపింపజేశారు గోపీచంద్.ఆంధ్రా రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ కార్యదర్శిగా ఎందరో హేతువాదులను తయారు చేశారు .విశ్వ కథా సాహిత్యంలోని మెళకువలు ఆకళింపు చేసుకొని సమకాలీన వాస్తవిక ఆంద్ర జీవిత చిత్రణ ధ్యేయంగా శతాధిక రచనలు చేశారు .నిరాడంబర శైలి ,సూటిదనం,సంక్షిప్తత ,నిర్దుష్ట దృక్పధం ,ఆయన రచనలలో ప్రధాన లక్షణాలు  .భార్యల్లోనే  ఉంది ,గీతాపారాయణం ,తండ్రులు కొడుకులు దేశం ఏమయ్యేట్లు ,సరే కానివ్వండి,ధర్మాసుపత్రి ,దేవుని జీవితం మొదలైనవి గోపీచంద్ కథా సంపుటాలు .హేతువాదం మార్క్సిజం మొదట్లో ఆకర్షించినా ‘’ఆకలి ‘’ని తృప్తి పరచటం తో సాంఘికన్యాయం చేకూరదని గ్రహించారు .నవ్య మానవతావాదం తో అసమర్ధుని జీవిత యాత్ర నవల రాశారు .తెలుగు నవలా సాహిత్యం లో ఇదొక మైలురాయి .’’ స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్’’ ను తెలుగు వారికి దీనిలోనే మొదటిసారిగా పరిచయం చేశారు .జీవిత తత్వ చర్చ అంతా దీన్లో ఉంటుంది .దీనికి ముందు భావకవుల దారిలో ‘’పరివర్తన ‘’నవల రాశారు .తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారి భావ ధార బాటలో పడి,చివరకు పుదుచ్చేరి వెళ్లి అరవిందుల దర్శనం చేసి ,మహర్షి రాసిన ‘’లైఫ్ డివైన్ ‘’మొదలైన ఉద్గ్రంధాలు అధ్యయనం చేసి భౌతిక –ఆధ్యాత్మిక వాదాల సమన్వయము సాధించారు .అంతకు మునుపే ఆయనలో ఉన్న నవ్యమానవతా వాదం జోడించి విశాలమైన సమ్యక్ దృక్పధం తో ‘’పోస్ట్ చేయని ఉత్తరాలు ‘’గ్రంధం రాశారు .భౌతిక,ఆధ్యాత్మక వాదాలలో దేనినీ వదిలిపెట్టకుండా సమన్వయము తో ‘’పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా ‘’నవల రాశారు .

       మాంచాల ,పశ్చిమ వాహిని గ్రుడ్డిసంఘం అభాగిని ,తత్వమసి నాటకాలు కూడా గోపీ చ౦ద్ రాశారు .మరో గొప్పరచన ఉన్నవ వారి విఖ్యాత నవల ‘’మాలపల్లి ‘’ని నాటకంగా మలచారు .దీన్ని రేడియో ద్వారా ప్రసారం చేశారు .ఆంధ్రగ్రామీణ జీవితం ఆధునిక నాగరకతా ప్రభావం వలన ఏయే మార్గాలలో ప్రయా ణి౦చి౦దో విశ్లేషిస్తూ ‘’ఉభయ కుశలోపరి ‘’పేరిట రేడియోలో అత్యద్భుత ప్రసంగాలు చేసి ఆకట్టుకొన్నారు .

        1953లో ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంద్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ గా పని చేశారు .తర్వాత హైదరాబాద్ రేడియో కేంద్రం లో గ్రామస్తుల కార్యక్రమాల ప్రయోక్తగా పని చేశారు .గోపీచంద్ గొప్ప జీనియస్ .ఆయన ప్రాచ్య పాశ్చాచ్య తత్వ వేత్తల దృక్పధాలను చర్చిస్తూ అమూల్యమైన ‘’తత్వ వేత్తలు ‘’గ్రంథం రెండుభాగాలుగా  రచించారు .

       ఇంతటి ప్రతిభా సంపన్నుడు జీనియస్ సమన్వయదృక్పధమున్న సృజన శీలి త్రిపురనేని గోపీచంద్ 52వ ఏట నడి వయసులోనే 22-11-1962న పరమపదించారు .

         సశేషం

      మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపుమన వెండి తెర మహానుభావులు 43

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 43

· 43-నట యోగి ముదిగొండ లింగమూర్తి

· ముదిగొండ లింగమూర్తి తెనాలి ప్రాంత్రం నుండి వచ్చిన పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు. ప్రతి విషయాన్నీ తర్కం, స్వభావం, శాస్త్రాలతో రంగరించి, విపులీకరించే లింగమూర్తిగారు చివరి దశలో సన్యాసాశ్రమం తీసుకున్నారు.
కుటుంబం

లింగమూర్తి పూర్వీకులు కాశ్మీర శైవులు. వీరి చరిత్ర కల్హణుని రాజతరంగిణి (12వ వతాబ్దం) అనే సంస్కృత గ్రంథంలో కన్పడుతుంది. ఉద్భటారాధ్యుడు జయాపీడుడు అనే రాజుకు గురువు. అతని వంశస్థులు వారణాసి వచ్చారు. వారి వారసుడు 12వ శతాబ్దంలో కాకతీయ ప్రభువైన మహాదేవుని పిలుపుపై ఓరుగల్లు వచ్చాడు. వారికి నల్గొండ జిల్లాలోని ముదిగొండ గ్రామం అగ్రహారంగా ఇచ్చారు. 1310 మాలిక్‌ కాఫిర్‌ దండయాత్ర తర్వాత ఈ కుటుంబాలవారు కృష్ణా తీరానికి వలస వెళ్లారు. లింగమూర్తి పూర్వీకులు గొప్ప మంత్రసిద్ధులు. బాల్యం నుండే నటనపై ఆసక్తి గల లింగమూర్తి మద్రాసువెళ్లి తన ప్రతిభను ప్రదర్శించి చిత్రసీమలో స్థిరపడ్డాడు. లింగమూర్తి సంతానం చంద్రశేఖర్‌, త్యాగరాజు ప్రభృతులు బ్యాంకు ఉద్యోగాలు చేసుకుంటున్నా నాటకరంగానికి సేవ చేస్తున్నారు[1]
సినిమా రంగం

నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి, పేరుతెచ్చుకుని, సినిమా రంగంలో ప్రవేశించారు లింగమూర్తి. తుకారామ్‌ (1937) లో నటించినా వందేమాతరం (1939) తో అందరికీ తెలిసారాయన. రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రాక, సాంఘిక నాటకాల్లో నటించినట్టుగానే, తెరమీద కూడా నటించారు. బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం – వాహిని బృందంతో లింగమూర్తినీ కలిపింది. ఆయనా, ఆ యూనిట్‌లో ఒకరైనారు. వేషం వున్నా లేకపోయినా, నిర్మాణవ్యవహారాల్లో పాలుపంచుకునేవారు. కొంతకాలం అధికారికంగా ప్రొడక్షన్‌ మేనేజరుగా వ్యవహరించారు.

క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా వుండేది. వివిధ భూమికానిర్వహణ సమర్థుడు అనిపించుకున్నాడు లింగమూర్తి. తమిళ చిత్రం ఆధారంగా నిర్మించిన ఆడజన్మలో అతిగా నటించారన్న పేరు తెచ్చుకున్నారు. తరువాత అది పాత్ర, పరిస్థితి కారణంగా అలా చేశానని చెప్పుకొన్నారు
వ్యక్తిత్వం]

లింగమూర్తికి పాత్ర, దర్శకుడు, పారితోషికం అన్నీ నచ్చితేనే సినిమాలు ఒప్పుకొనే వారు. దీని కారణంగా ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. అన్ని విషయాల్లోనూ కచ్చితమైన మనిషి. ముక్కుకి సూటిగా పోయే మనస్తత్వం, రాజీపడని మనస్తత్వం. మొహమాటం వుండేది కాదు. ఏదైనా కుండ పగలగొట్టినట్టు చెప్పేవాడు. సభల్లో మాట్లాడినప్పుడు కూడా నిర్మొహమాటంగా, బల్లగుద్ది మాట్లాడేవారు. లింగమూర్తిగారు మాట్లాడతారంటే, ప్రేక్షకుల్లో చిన్న కలకలం లేచేది – ఎవర్నో గట్టిగా దుయ్యబడతారని.
ఇతర విశేషాలు[మార్చు]

నిజానికి దర్శకుడు చెప్పింది వేదం. అతను చెప్పింది చెయ్యాలి. కాని మనం కూడా ‘కన్విన్స్‌’ కావాలిగదా! గుడ్డిగా వెళ్లడం నాకు చేతకాదు. అది డిసిప్లిన్‌కి విరుద్ధయమైతే నేనేం చెయ్యలేను. ఒకసారి బి.ఎన్‌.రెడ్డితోనే వచ్చింది. ‘స్వర్గసీమ’లో నేను భానుమతి తండ్రిని. పల్లెటూరివాడిని. హాస్యంపాలు కూడా వున్న పాత్ర అది. హీరోని వల్లో వేసుకోవాలని కూతురితో చెప్పే సన్నివేశం వుంది. ‘ఎన్నాళ్లని ఈ బిగువు? వాడేం దయ్యమా, రాక్షసుడా? దగ్గరకెళ్లి అంతా సరిచేసుకో’ అని డైలాగు. అందులో నాకు చమత్కారం కనిపించలేదు. ఆ మాటే బి.ఎన్‌.తో అంటే కస్సుమని లేచాడాయన. ‘చమత్కారం ఏం చేస్తావో చేసి చూపించు!’ అని కోపంగా అన్నాడు. ‘నేను చెప్తాను బాగుంటే వుంచండి – లేకపోతే ఉన్నదే చెప్తాను’ అన్నాను. ‘చెప్పు’ అన్నట్టు మొహం పెట్టారు డైరెక్టరు ధుమధుమలాడుతూనే. ‘వాడేం పులా, సింగమా?’ అని ‘వూ’ అని చమత్కారంగా అన్నాను. ‘వూ’ అనడంలో ఒక చమత్కారం వచ్చింది. డైరెక్టరూ, రైటరూ సరే అన్నారు. సినిమాలో ఆ మార్పు బాగానే పట్టుకుంది జన్నాని‘ అని ఒక సందర్భంలో చెప్పారు లింగమూర్తి. ’అందుకే కొందరు దర్శకులూ, నిర్మాతలూ నా జోలికిరారు. పోనీ! అనేవారాయన.

నర్తనశాల (1963) లో శకుని వేషానికి లింగమూర్తిని అడిగారు. ‘అప్పుడు నాకు వేషాలులేవు. ఖాళీగానే వున్నాను. అంచేత డబ్బు తగ్గించమన్నారు. నేను తగ్గించనన్నాను. ’నాకు సినిమాలు తగ్గవచ్చు కాని, నా టాలెంట్‌ తగ్గలేదు. మీరిచ్చే డబ్బు నా టాలెంట్‌కి!‘ అని చెప్పేశాను’ అని చెప్పారొకసారి.

‘పాండవవనవాసం’లో రంగారావు ధుర్యోధనుడు. లింగమూర్తి శకుని. ‘ఈ సీనులో రంగణ్ని జయిస్తాను చూడు!’ అని లింగమూర్తి అంటే ‘రమ్మను, నా శక్తి నేనూ చూపిస్తాను’ అని రంగారావు అనేవారు. ‘అలాంటి ఆరోగ్యకరమైన పోటీలు వుండేవి. నాటకరంగం మీదా అంతే!’ అన్నారు లింగమూర్తి.

‘టాకీషాట్స్‌లో సైలెంట్‌ రియాక్షన్స్‌ ఇవ్వడంలో లింగమూర్తి గట్టివాడు’ అని కె.వి. రెడ్డి పొగిడేవారు. దానికి ఉదాహరణ: ‘యోగివేమన’ చివరి దృశ్యంలో వేమన చివరిసారిగా అభిరాముడిని (లింగమూర్తి) హత్తుకుంటాడు. ఆ షాటులో లింగమూర్తి వీపు మాత్రమే కెమెరా వైపు వుంటుంది. కనిపించేది నాగయ్యే. ‘వేమన కావలించుకోగానే, ఒళ్లు పులకరించినట్టు, జలదరించినట్టు లింగమూర్తి వీపుతోనే ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. గ్రేట్‌!’ అని అభినందించారు కె.వి.రెడ్డి ఒక సందర్భంలో.

‘యాక్షన్‌ కంటె రియాక్షన్‌ కష్టం. మన రియాక్షన్‌ బాగుంటే, అవతలి నటుడి యాక్షనూ మెరుగుపడుతుంది’ అని చెప్పేవారా మహానటుడు. ఆయన రేడియో నాటకాల్లో కూడా తరుచూ పాల్గొనేవారు. ‘అక్కడ వాచకమే ప్రధానం. కళ్లతోనూ, చేతులతోనూ చేసే నటనంతా ఒక్క కంఠంతో చెయ్యాలి. దాని కష్టం దానికుంది’ అని చెప్పేవారు. పానగల్‌ పార్కుకి సాయంకాలం పూట కాలక్షేపం కోసం వెళ్లినా, మిత్రులతో సంభాషించినా ‘ప్రయోజనం’ కనిపించకపోతే నిష్క్రమించేవారాయన.
అవసాన దశ

1960లలో షష్టిపూర్తి తర్వాత లింగమూరి వయోభారం వల్ల సినీరంగం నుండి విరమించాడు. 1974లో భార్య చనిపోయిన తర్వాత పూర్తిగా సన్యాసాశ్రమం పుచ్చుకొని వారణాసిలో జీవించసాగాడు.. ఈయన 1980 జనవరి 24న వారణాసిలో మరణించాడు[2]

బాల్యం నుంచి కలాభిమానిఅవటం తో తెనాలి శ్రీరామ విలాస సభ వారి నాటకాలలో చిన్నా ,పెద్దా పాత్రలు పోషించారు .కన్యాశుల్కం నాటకం లో రామప్ప పందులు వేషం లో అఖందకీర్తి సాధించారు

1937లో సెంట్రల్ స్టూడియోస్ వారు నిర్మంచిన ‘’తుకారాం ‘’సినిమాలో నటించి వెండి తేరా కు పరిచయమయ్యారు .వాహినీవారి దేవత,,పోతన ,స్వర్గసీమ ,సారదీ వారి పంతులమ్మ స్వర్గసీమ,రేణుకావారి త్యాగయ్య ,ఎం ఆర్ ఎ వారి లక్ష్మమ ,రాజరాజేశ్వరీవారి పేదరైతు ,భాస్కరవారి భక్తిమాల ,వినోదావారి కన్యాశుల్కం ,శారదా వారి పెద్ద మనుష్యులు ,గౌతమీ వారి మహామంత్రి తిమ్మరుసు ,విఎన్ వారి రామదాసు చిత్రాలలో విభిన్న ప్రవ్రుట్టులతో ప్రక్రుతులతో ఉన్న పాత్రలు ధరించి ఆపాత్రలక్ను చిరస్మ్మరనీయం చేశారు ‘

ఆంద్ర నాటక కళా పరిషత్ ,ఇతర సాంస్కృతిక సంస్థలు లింగామూర్తిగారిని గనంగా సత్కరించాయి .పెద్దమనుసులు వీరి రామదాసు పాత్ర తిమ్మరుసులో హం వీర పాత్ర లకు ప్రభుత్వ ప్రశంసా పత్రాలు ,పారితోషికాలు పొందారు .సిద్ధిపొండిన నటులేకాక లింగమూర్తి సంస్కారం అనుభవం పుష్కలంగా ఉన్న రచయితా అని వీరి కలం నుండి వెలువడిన ‘’వెంకన్నకాపురం ‘’నాటకం రుజువు చేసింది .ఈ నాటకాన్ని ఎన్నో కంపెనీలు ప్రదర్శించి బహుమతులు పొందాయి .పండిత ప్రకాండుల చేత ,విమర్శకుల చేత ‘’నటయోగి ‘’అని పిలువబడిన ముదిగొండ లింగమూర్తి 24-1-1980 న శివైక్యం చెందారు

నటించిన సినిమాలు

· వందేమాతరం (1939) (లింగమూర్తి)

· సుమంగళి (1940)

· భక్తిమాల (1941)

· దేవత (1941)

· భక్త పోతన (1942) (అజామీళుడు)

· స్వర్గసీమ (1945) (భానుమతి తండ్రి)

· త్యాగయ్య (1946) (జపేశం)

· పల్నాటి యుద్ధం (1947) (నరసింగరాజు)

· యోగి వేమన (1947) (అభిరామ)

· సువర్ణమాల (1948)

· మంత్ర దండం (1951) (మాంత్రికుడు)

· ధర్మ దేవత (1952) (వీరసేన రాజు)

· నా ఇల్లు (1953) (ధనరాజ్)

· పెద్దమనుషులు (1954) (పత్రిక సంపాదకుడు రామదాసు)

· కాళహస్తీశ్వర మాహాత్మ్యం (1954) (కైలాసనాథ శాస్త్రి)

· మహామంత్రి తిమ్మరుసు (1962)

· రామదాసు (1964)

· పాండవ వనవాసం (1965) (శకుని)

· శ్రీకృష్ణావతారం (1967) (శకుని)

ప్రొడక్షన్ మేనేజర్ గా

· స్వర్గసీమ (1945)

· భక్త పోతన (1942)

లింగమూర్తి గారు నటన పై భారతిలో ఒక వ్యాసం రాశారు. అందులోని ముఖ్యవిషయాలు –‘’నటన అత్యుత్తమ కళ.మిక్కిలి కష్ట సాధ్యమైందికూడా.’’ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని మరుగు పరచుకొనివేరొక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటం నటన’’.అత్యుత్తమ పరిణామ దశలోని నటన ప్రయోజనం సాధిస్తుంది .నటన అనేది దైహిక,మానసిక ఏకైకమై ప్రదర్శించే ఒక విచిత్ర ప్రక్రియ .ఒకానోకఅత్యద్భుత అనుభూతికి ప్రతిఫలం .దీనికి మనవ మనస్తత్వ పరిచయం ఉండాలి .మానవ జీవితం లో వివిధ అనుభావాలపునశ్చరణ లేక ప్రతిబింబమే నటన .ఒకరకమైన పరకాయ ప్రవేశం .నటనకు ముఖ్యంగా కావాల్సింది తన వ్యక్తిత్వాన్ని దాచుకోవటమే .

నటన అసత్యంతో పరమసత్యాన్ని సాధించటమే .ఉపాసనా విశేషం .నటాశ్రయం .నటనకు రససిద్ధి ,ప్రేక్షక రంజనం అనే రెండు ప్రయోజనాలున్నాయి .ప్రేక్షక రంజకంగా నటించటానికి నటునికి బాధ్యతలు చాలా ఉంటాయి .పాత్ర ప్రవృత్తిని అమూలంగా అర్ధం చేసుకొంటేనే నటన పండుతుంది .నటుడు పాత్రలో లీనమై తన్మయత్వం పొంద కూడదు .తానె పాత్రగా మారిపోకూడదు. ప్రీక్షక హృదయాలలో చొచ్చుకొని పోయేట్లు నటించాలి .పాత్ర అనుభవాలతో ప్రేక్షకుని అంతః కరణలు లీనమై రసాను భూతి పొందితే నటుడి ప్రయత్నం సార్ధకమై నటుడు కృతార్ధుడౌతాడు .నటుని ప్రదర్శన కేవలం సహజం ,వాస్తవికం గా ఉండాల్సిందే .

Posted in సినిమా | Tagged | Leave a comment

26-  కరుణా భాస హాస్యం

26-  కరుణా భాస హాస్యం

తాత్కాలిక ఎడబాటును భయంకర వియోగంగా వర్ణించి వికృతి సాధించి హాస్యం పిండవచ్చు.ఉదాహరణ –ఒకడు మిత్రుడిని వదిలి పనిమీద వేరే ఊరు వెళ్ళాడు  .దీన్ని భరించలేక మిత్రుడు ‘’మిత్రమా వెడుతున్నావా /మమ్మల్ని వదిలి వెడుతున్నావా ?దుఃఖ సాగరం లో ముంచి వెడుతున్నావా ?రెండు రోజులదాకా నీ ప్రసన్న మందహాసం చూడ లెం కదా .నీ వియోగం ఎలా భరించం ?మిత్ర వియోగం కంటే దుఖం ఇంకా ఏమి ఉంటుంది? నిప్పులోనైనా  నీటిలోనైనా దూకుతా విషం పుచ్చుకొంటా.. తాడు దొరికితే ఉరేసుకొంటా .నేనే నీకు నిజమైన స్నేహితుడిని అయితే నేను తాగుతున్న కాఫీ విషమై నాప్రాణాలు హరించి నేను హరీ అగుదునుగాక ‘’అని ఏడుస్తుంటే మనం పిచ్చపిచ్చగా నవ్వుకొంటాం .

  శృంగారాభాసం –దంపతులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొన్నారు .ఒకర్నొకరు తరచుగా మెచ్చుకొంటారు .కొంతసేపటికి అది పోట్లాటగా మార్తుంది .ఇదే శృంగారాభాసం అన్నారు మునిమాణిక్యం సార్.

భీభత్సాభాసం –‘’మా ఇంట్లో ఆ మూల చూడండి భీభత్సం .అదొక మహారణ్యం సింహాలు పెద్దపులులు ఏనుగులు ఉన్నాయి .ఒకరోజు అవి పోట్లాడుకొంటున్నాయి .భయంకర యుద్ధం చేశాయి .తొండాలు తెగాయి తలలు కాళ్ళూ చేతులు తెగిపోయాయి. మా అబ్బాయి అమ్మాయి చికిత్స చేశారు .గుడ్డపేలికలతో తలలను అతికించారు. సింహాలు గాండ్రు మంటున్నా లెక్క చేయకుండా కట్లు కట్టారు. అవి ఏడుస్తున్నాయి ‘’ఇదే భీభత్సాభాసం అంటారు మాష్టారు .

 భక్తి రసాభాసం –స్వంత అనుభవమే చెప్పారు మునిమాణిక్యం –‘’మా ఆవిడ హరినాధ భజనలు చేసేది .అమ్మలక్కల అంతా చేరి భజన చేస్తారు .భజన మాంచి పట్టులో ఉన్నప్పుడు తన్మయత్వం లో కళ్ళు మూసుకొని పాడుతారు. దేవతా నైవేద్యాలకు తెచ్చిన ఫలహారప్పళ్ళాలు  ఖాళీ లయి పోయేవి .బాబా గారికోసం వెండి గిన్నెలో పరమాన్నం లడ్డూ లు పెట్టేవారు .బాబా ఎప్పుడో అప్పుడు వచ్చి ఆరగించి పోయేవారు .కానీ ఆస్వామి రావటం ,పోవటం ఎవరికీ తెలీదు .భక్తులు కళ్ళు తెరిచి చూసేసరికి పదార్ధాలు హుళక్కి .అంటే బాబా తినేశారని చెప్పుకొనే వాళ్ళు ‘’. మా ఇంట్లో కూడా భజనలు  ఏర్పాటు చేసింది మా ఆవిడ .కొన్ని రోజులు బాబా ఆరగింపు జరక్కపోయేసరికి ఆవిడకు చాలా విచారం కలిగి ,ఇంకా తీవ్రంగా భజనలు  సాగించింది .ఒక రోజు బాబాకు మా అవిడపైనా అనుగ్రహం కలిగింది .అందరిళ్ళలో  పదార్ధాలు మాయమవుతుంటే ,మా ఇంట్లో పదార్ధాలతో పాటు వెండి గిన్నె కూడా మాయమయింది .అంటే స్వామి పదార్దాలతోపాటు వెండి గిన్నె కూడా ఆరగింపు  చేశాడన్నమాట .దీనికి ఎవరేం చేస్తారు ?నేనుమాత్రం ‘’బాబా !నేను నీ భక్తుడిని మా ఇంట్లోనూ ఆరగిస్తున్నందుకు ధన్యులమయ్యాం .అందరీళ్లల్లోలాగా నీకిష్టమైనవి ఆరగించు. కానీ మహా ప్రభో వెండి గిన్నెల్ని ,గుండు   చెంబుల్నిమాత్రం  మాయం చేసి నీ మహాత్యం ప్రదర్శించద్దు.భక్తీ ముదిరి మా ఆవిడ మెడలోని బంగారపు గొలుసు మాయం చేయబోకు .భజన సమయం లో పటికబెల్లమో కొబ్బరిముక్కలో వర్షిస్తున్నావట.మా ఇంట్లో మాత్రం బంగారు కడ్డీలు వర్షించి ధన్యులను చెయ్యి ‘’ ‘’అని వేడుకోన్నాను ‘’అని చెబితే విన్నవాళ్ళు పగలబడి నవ్వకేం చేస్తారు?

శ్రీ మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-22-ఉయ్యూరు

.

.

Posted in రచనలు | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 42


     మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 42

     42-గానకోయిల,సంగీత సరస్వతి  అందాలరాముని బామ్మ - నటి పూర్ణిమ

     సురభి నాటక సమాజం తోటలో విరిమల్లె పూవు లాంటి నటి .పగోజి భీమవరం దగ్గర పొలసానిపల్లె వీరి పూర్వీకుల ఊరు .1-3-1918న అత్తిలి లో నడి ఏటిలో పడవలో సురభి లక్ష్మమ్మ ,గోవిందరావు లకు జన్మించారు .తండ్రి సురభి నాటక  సమాజానికి మకుటం లేని మహారాజ నటుడు చిన్నతనం నుంచే సంగీతం అభ్యసించారు .అప్పటికే నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆమె 15వ ఏట అవేటి రామయ్యగారిని వివాహమాడారు .పుట్టింట బాలనటిగా ప్రారంభమైన నట జీవిత౦1936లో ‘’శ్రీ శారద మనో వినోదిని ‘’పేరిట స్థాపించిన స్వంత నాటక కంపెనీలో నాయిక పాత్ర ధారణతో పరిపక్వమైంది .

      శైశవం లో పోషించిన చిన్న కృష్ణుడు ,లవుడు ,కుశుడు ,పాత్రలు యుక్తవయసులో సత్యభామ ,సక్కుబాయి ,సావిత్రి ,చిత్రాంగి ,ప్రమీల ,చంద్రమతి ,మల్లమాంబ ,కమల వంటి పాత్రలతో మలుపు తిరిగి ఆమె కీర్తి కిరీటం లో కలికితురాయి లుగా వెలుగు లీనాయి .కురుక్షేత్రం ,పాండవోద్యోగావిజయాలు ,సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకాలలో పూర్ణిమ ద్రౌపది కృష్ణ ,చంద్రమతిగా నటించి పాత్రలకు జీవం పోశారు విప్రనారాయణలో దేవదేవి గా ,నటించి మెప్పించారు .

      సాంఘిక నాటకాలు కన్యాశుల్కం లో మధురవాణి బాలనాగమ్మ లో సంగు పాత్ర డాక్టర్ గోవింద రాజుల సుబ్బారావు గారి సరసన నటించి వన్నె తెచ్చారు .ఆనాటి స్టేజి ఆర్టిస్ట్ లైన సీస్ ఆర్ ,బళ్ళారి రాఘవ ,మాధవపెద్ది సత్యం ,సూరిబాబు ,అబ్బూరి వరప్రసాదరావు ,పీసపాటి నరసింహమూర్తి ,వంగర వెంకట సుబ్బయ్య ,బందా కనక లింగేశ్వరరావు ,రెండు చింతల సత్యనారాయణ వంటి హేమా హేమీలతో నటించిన నతపూర్నిమ ఆమె .ఏలూరులోని మోతే వారి ‘’సీతారామాంజనేయ నాటక సమాజం ‘’,సురభి నాటక సమాజాలలో కూడా నాయిక పాత్రలు ధరించి ఒప్పించిమేప్పించారు

       1934లో స్వయంగా పూర్ణిమా దియేటర్ ను స్థాపించి స్వీయ సారధ్యం లో ఎన్నో నాటకాలు ఆంద్ర దేశం లోసమర్ధవంతంగా  ప్రదర్శించి సమర్ధత చాటారు .బీహార్ ఒరిస్సా చెన్నై ఢిల్లీ లలోనూ ప్రదర్శనలు నిర్వహించి రాష్ట్రేతరుల అభిమానం విపరీతంగా పొందారు .ఇలా శుక్ల పక్ష పౌర్ణమిగా నాటకరంగం పై పూర్ణిమ సంపూర్నా వెలుగులతో రాగ రంజితం చేశారు .రంగూన్ వంటి ఇతర దేశాలలోనూ నాటక ప్రదర్శనలు నిర్వహించి మెప్పించారు .

       1941లో గూడవల్లి రామబ్రహ్మం గారి అపవాదు సినిమాలో కోవెలమూడి ప్రకాశరావు లక్ష్మీ రాజ్యం రఘురామయ్య బాలసరస్వతి ల సరసన వెంకయ్యగా వేసిన ఎం సి రాఘవన్ భార్య అనసూయగా పూర్ణిమ అసమాన నటన తో నటించారు .పాటలు బసవరాజు అప్పారావు తాపీ ,కోసరాజులు రాశారు .సత్యభూమి సినిమాలోనూ నటించారు .

       1973లో బాపు దర్శకత్వం లో నాగేశ్వరరావు నాగభూషణం ,అల్లు రాజబాబు ,లత లతోపాటు బామ్మగారుగా  నాగభూషణం తల్లిగా పూర్ణిమ నటించారు .బహుశా ఇదే ఆమె చివరి సినిమా అయి ఉండచ్చు .

      హరికధా గానం చేసి ,మెప్పించారు ఆకాశవాణిలో తమ గానం తో ఆకర్షించారు .గ్రామ ఫోన్ రికార్డు లద్వారా తన గానమాదుర్యాన్ని శ్రోతలకు వినిపించారు సకలకళా పూర్ణిమ .

       ఆంధ్రనాటక కళాపరిషత్ ,చెన్నై తెలుగు అకాడెమీలు పూర్ణిమను ఘనంగా సత్కరించి గౌరవించాయి .1958లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమనటి పురస్కారాన్ని గవర్నర్ భీమసేన్ సచార్ గారి ద్వారా ’’సువర్ణ ఘంటా కంకణం ‘’ అందజేసి సత్కరించింది. అనేక సంఘాలు ఆమెను సన్మానించి ‘’గానకోకిల’’ ,’’ సంగీత  సరస్వతి ‘’వంటి సార్ధక బిరుదులను ప్రదానం చేశాయి .సంఘ  సేవాపరాయణురాలుగా ,కార్యకర్తగా కీర్తిపొందారు .వరద బాధితుల సహాయార్ధం రాష్ట్రం లో చాలా చోట్ల ప్రదర్శనలిచ్చి ఆ డబ్బును వరదబాధితులకు ,ఇతర అభ్యుదయ కార్యక్రమాలకుందించిన దాన శీలి పూర్ణిమ .

       జీవిత చరమా౦కం లో ఏలూరులో ఉంటూ పక్ష వాటం తో బాధ పడుతున్నా ,లెక్క చేయకుండా ఏలూరు జిల్లా కేంద్ర గ్రంధాలయం లో నిర్వహించిన బళ్ళారి రాఘవ గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొని ,తన నటనా కౌశలాన్ని ప్రదర్శించిన నట సామ్రాజ్ఞి పూర్ణిమ .26-5-1995న 77వ ఏట నట పూర్ణిమ పూర్ణిమ నటరాజులో ఐక్యమయ్యారు .

       సశేషం

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 41


  మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 41
      మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 41

   41-బుర్రకధల ఫేం,హిట్లర్ వేషం వేసిన  –ఏపూరు రామకోటి

   1944లో గుంటూరు జిల్లా ప్రజా నాట్య మండలిలో సంబంధము ఏర్పడింది. వేములపల్లి శ్రీకృష్ణ, షేక్ నాజర్, వేపూరి రామకోటి మున్నగు వారితో తోడు.

వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. వేపూరి రామకోటి కథకుడు, నాజర్‌ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు.

ముక్కామల అమరేశ్వరరావు స్థాపించిన
“నవజ్యోతి”, 1948 లో తోట రత్తయ్య, కూర్మా వేణుగోపాలస్వామిగార్లు స్థాపిం
చిన నాట్యసమితి, నాట్యకళామందిర్‌, హిందూకొలేజి హైస్కూలు నాట్యమండలి,
భారతీనాటకసమితి, సాహితీ ఆర్డు థియేటర్స్‌,సాహిణీ ఆర్డు థియేటర్సు, బాలానంద
కేందం,రవి ఆర్డు ధియేటర్‌, లలిత కళాసమితి, నటరాజసేవాసంఘం, మారుతీ నాట్య
మండలి, సీతారామ నాట్యకళాసమితి, నటరాజకళామండలి, కల్చరల్‌ అసోసియేషన్‌,
నటరాజ నాట్యమండలి, విజయవాణీ కళాసమితి మొదలై న సమాజాలు ఏర్పడి పని
చే స్తున్నాయి.
ఈ సమాజాలలో…
ధూళిపాళ సీతారామశొన్రీ, బండారు రామస్వామి, కడియాల రత్తయ్య,
సవరం వీరాస్వామి, పెళ్ళూరి శేషగిరిరావు, ముప్పవరపు భీమారావు, మందపాటి
రామలింగేశ్వరరావు, కురిచేటి నాగేశ్వరరావు, బి. జగన్నాధం, బి. కె. విశ్వేశ్వర
రావు, వేమారావు, జి. విద్యాసాగర్‌, డి. రామచం(ద్రరావు, టి. పుండరీకాక్షయ్య.
జి. రామచంద్రరావు, జె. సీతారామళౌ స్త్రి, గుంటపల్లి వెంకటరత్నం, యం. ఆర్‌.
ఆంజనేయులు, ఎ. యన్‌. ఆర్‌, ఆంజనేయులు, అరవపల్లి సుబ్బారావు, రవీంద్ర
నాధ్‌, పి. కౌళిదాసు, డి. కుమార్‌, ఎ. లక్ష్మణరావు, పి. వి. స్వామినాయుడు,
కె. కృష్ణమూర్తి, టి. యస్‌. వెంకటేశ్వరరావు, కె. చక్రపాణి, కె. యస్‌. ఆర్‌.
ఆంజనేయులు, బొగ్గవరపు రామకృష్ణరావు, వె. మృత్యుం, జయశర్మ, ఆకుల
సత్యనారాయణ, యం. వి. యస్‌. శాస్తి, అరిపిరాల రాధాకృష్ణ, చిలుకూరి
సుబ్బారావు, షేక్‌ నాజర్‌, కాకుమాను నాగభూషణం, (శ్రీమతి బి. కోమలి, ముక్కా
మల కృష్ణమూర్తి, వల్లథ జోళ్యుల,శివరామ్‌, కె. శివరామకృష్ణయ్య, జి. వరలక్ష్మీ,
ఛాయాదేవి, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, వేపూరి రామకోటి,
పినీనటుడు బాలయ్య, కె. రఘురామయ్య, వై. వి. రాజు, సీనియర్‌ శ్రీరంజిని,
జూనియర్‌ (శ్రీరోంజిని. పి. శ్రీరామశొస్తి. డి. లక్ష్మీనరసింహారావు, తంగిరాల
(శ్రీరామమూర్తి, వలి వేటి రామసుబ్రహ్మణం,

ఆంధ్రదేశంలో ఆంధ్రప్రజా నాట్యమండలికి సంబంధించిన అనేక
దళాలు పగటి వేషాలను ధరించి, తద్వారా రాఒకీయ (ప్రబోధాన్ని కలిగించారు.
నంఘవిద్రోహుల్ని చీల్చి చెండాడే సాహిత్యంద్వారా (ప్రజా ప్రబోధాన్ని కలిగించారు.
ఇలా పగటి వేషాలను ధరించిన వారిలో కోగంటి, కోనూరు పున్నయ్య, మాచినేని,
మిక్కిలినేని, డాక్టరు రాజారావు, నాజరు, రామకోటి మొదలై నవారు ముఖ్యులు.

రామకోటి, పురుషోత్తం చెంచు వేషాలు ధరించారు. దుగ్గిరాలకు చెందిన డాక్టరు
చలమయ్యకూడ కళారూపాన్ని (ప్రదర్శించాడు.
ఆ (ప్రదర్శనంలో నాజరు కోలాటం, కోగంటి కోయవేషమూ, మిక్కిలి
నని హీట్లరు వేషమూ (పత్యేక (పళశంస లందుకున్నాయి.

రాష్ట్రదళ సభ్యులు :
1948 జనవరిలో అహమ్మదాబాదులో జరిగిన అఖిల భారత |వజా నాట్య
మండలి మహాసభకు రాష్ట్రదళ సభ్యులైన డా. రాజారావు.కోసూరు పున్నయ్య.
మిక్కి-లినేనిసి. మోహన్‌దాసు.నాజర్లు.నుంకర నత్యనారాయణ.మాచినేని పూర్ణ చంద్రరావు-సిరివి శెట్టి సుబ్బారావు మిక్కిలినేని సీకారత్నం . చిరంజీవి సూర్య
కొంతం.కోగంటి గోపాలకృష్ణ య్య.వట్టం శెట్టి ఉమామహేశ్వరరావు. వెంపటి రాధా
కృష్ణ – ఏపూరు రామకోటి _ పురుషోత్తం _ బి. గోపాలం = జయరాం – సుబ
హ్మణ్య _ (శ్రీహరి . అమృతయ్య – ఏసుదాసు _ డాక్టరు చంద్రశేఖరం
ఆంధ్రదేశంలో 1048 లో (ప్రభుత్వదమననీతి ఫలితంగా ఆం(ధ్మపజా
నొటగమండలి ఆణచివేయబడడంతో (పజా నాట్యమండలి కళాకారులు 1949. 50
ప్రాంతాల్లో మద్రాసు సినీరంగంలో (ప్రవేశించారు. ఇంతకుముందే యువజనోద్య
మంలో కాకలు తీరిన తాతినేని (పకాశరావు సినిమారంగంలో వున్నారు.
చదలవాడ, మిక్కిలినేని, పెరుమాళ్ళు, వల్లం నరసింహారావు, వీరమాచ
నేని మధుసూదనరోవు, వి. సరోజని, మిక్కిలినేని సీత, సాలార్‌, ఆచార $
ఆశ్రయ, సుంకర, వాసిరెడ్డి, సి, మోహన్‌దాస్‌ (మ్యూజిక్‌ డైరెక్టరు, టి. చల
షతిరావు (మ్యూజిక్‌ డైరెక్టరు, ప్రత్యగాత్మ, కొండేపూడి లక్ష్మీనారాయణ,
రాజారావు, వెంపటి, రామకోటి, అలు రామలింగయ్య, పొట్లూరు వెంకటసుబ్బారావు,
బి. గోపాలం, వేణుగోపాల్‌ మొదలైన కళాకారు లందరూ మద్రాసు సినీరంగంలో –
(ప్రవేశించారు,
నాజరు బెంగాలీ కరువు బుర్రకథను. పల్నాటి వీరచర్మిత్రను, బొణ్సిలి
యుద్ధం మొదలైన బృురకథలను (పజాొనాట్యమండలి కళాకా రులై న నాజరు, పరు
షో త్తం, రామకోటి, మిక్కిలినేని, మాచినేవి, పట్టం సెట్టి, కోనూరి పున్నయ్య, సిరివి
సెట్టి, పెరుమాళ్ళు, చదలవాడ, వల్లం, కేశవరావు “మొదలై న అనేకమంది కళాకారులు
రాష్ట్ర వ్యాపితంగా వ్యాపింపచేశారు.

   --

నాజర్‌ బురకథ దళం అనగానే రామకోటి, పురు పోత్తం స్మృతిపథంలోకి వస్తారు. ఫురుహోల్సేమునకో మతి ఇెలించి పోవడంతో రామకోటి సినీరంగంలోకి (ఫ వేశించడంతో శీ) కర్నాటిీ లకీ నర్సయ్య, మాచి “జీని వెంక ‘టేళ్ళగ రావు గారలు దళ౦ రాణించడానికి తోడ్పడిన మీ[తులు. అదేనిధంగా నంది Xo చిన్న బాయిలు దళంలో పనిజేశారు.

   “బెం గాలు కరువు” ఆనే బుర్రకథను (వాస్‌ మిగతులైన రామకోటి పురుషోత్తం గార్ల సహకారంతో ఆం(ధ జీశం నలంమూలల గానంచేసి లక్షలాది (పజానీకాన్ని ఉఊ(రూత లూగించి ఆం భీకర [పాంతాల (పముఖులగు అబ్బాస్‌, బలరాజ్‌ సహానీల (పశంసల నేకాక నాట్య కళాపఫూర్ష బళ్ళారి రాఘవ, డా॥ గోవిందరాజుల సుబ్బారావు, గూడవల్లి రామ(బహ్మం గార్గ ఆశీ స్సులం పొందటం జరిగింది. 

     సన్నగా బక్కపలుచగా చలాకీగా ఉండే రామకోటి చాలాసినిమాలలో మిగిలిన హాస్యనటులతో కలిసి నటించారు ఆయన్ను చూడగానే హాస్యం పొంగిపోర్లుతుంది మాట కూడా తమాషాగా ఉండటం విశేషం .ఎన్ని సినిమాలలో నటించారో తెలియదు ఇంతకంటే వివరాలు అందుబాటు కాలేదు .

      సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-1-22-ఉయ్యూరు 
Posted in సినిమా | Tagged | Leave a comment

25-భావాశ్రయ హాస్యం  

25-భావాశ్రయ హాస్యం  

ఒక వైపరీత్యం ,అసంగత్వం ,అసహజత్వం ,క్రమభంగం ఉంటె అలాంటి భావం వలన హాస్యం పుడితే భావాశ్రయ హాస్యం అంటారు .అల్ప విషయాలను అద్భుతాలుగా ,అద్భుతాలను అల్పాలుగా, ఉదాత్త విషయాలను అనుదాత్త విషయాలుగా భావించటం లో భావ వక్రత ఉంది అంటారు మునిమాణిక్యం మాష్టారు .తెలివి తక్కువదాన్ని తెలివైనదిగా, అసహజత్వాన్ని సహజం ,,అన్యాయాన్ని న్యాయంగా గా వర్ణించటం భావ హాస్య కల్పన తో ఉన్నపనులు అన్నారు మాష్టారు .మిధ్యాభిమానం, స్వార్ధం ,అసూయ మొదలైన వాటినే సుగుణాలుగా చెప్పటం భావవక్రతే .వీటికి భావనా శక్తి ముఖ్యం .అందుకే ‘’ఇమాజినేటివ్ హ్యూమర్ ‘’అన్నారు దీన్ని .గంభీరాన్ని పేలవంగా ,పేలవమైన దాన్ని అతి గంభీరంగా చెప్పటమూ వికృత భావ ప్రదర్శనమే అంటారు మునిమాణిక్యం .భావశ్రయంఅంతతరిగానికి సంబంధించింది .శబ్దాశ్రయ హాస్యం లో చమత్కారం భాషలో ఉంటె ,దీనిలో చమత్కారం భావం లో ఉంటుంది అని నిర్వచించారు మాష్టారు .’’Humour  lies in what is suggested to the imagination and not in what is perceived ‘’.శాబ్దిక హాస్యం పువ్వు రూపాన్ని మాత్రమె చూసి ఆనందించటం వంటిది .భావాశ్రయ హాస్యం పువ్వు పరిమళాన్ని ఆస్వాదించటం వంటిది అని వివరించారు .శబ్దాశ్రయ హాస్యం వస్తురూపం లో వికృతిని చూపిస్తే ,భావాశ్రయహాస్యం వస్తు ధర్మం లో వికృతిని చూపిస్తుంది .అర్దాశ్రయ హాస్యం మాత్రం వికృతితో ప్రమేయం లేకుండా అర్ధ వైభవాన్ని కలిగి ఉంటుంది అని మాష్టారు వివరణ ఇచ్చారు .ఈ భావాశ్రయ హాస్యం అనేక విదానులుగా సాధించవచ్చు .

 1-రసాభాసం

వీరా భాసం -అల్ప జీవుల్ని చంపటంషౌరుషం కాదు. దీన్ని శౌర్యంగా చెబితే భావ వక్రత ఏర్పడి వీర రసాభాసం అవుతుంది .ఉదాహరణ –ఈగలు పక్కమీద వాలితే ఒకడు తువ్వాలు తో వాటిని ఒక్కొక్కటీ చంపటానికి పూనుకొంటే అదెదొఅద్భుత౦ గా , ‘’వైరి వీర సంహారం చేస్తున్నట్లు వర్ణిస్తే వీరరసం అభాసం అయి హాస్యం పుడుతుంది . అనవసర పౌరుష ప్రదర్శన ,అసంగత శౌర్య ధైర్యాదుల ప్రశంస చేస్తే హాస్యం పుట్టి వీరాభాసం అవుతుంది .అధమ పాత్ర ద్వారా వీరం చూపించటం వీరాభాసం .భారత విరాట పర్వం లో ఉత్తరకుమారుడు కౌరవులపై దాడికి వెళ్ళటం లో ఈ రకమైన హాస్యం కనపడుతుంది .అప్పటికే దక్షిణ గోగ్రహణం జరిగి మహారాజుమొదలైన పెద్దలూ , సైన్యం రక్షణకు వెళ్ళారు .ఇప్పుడు ఉత్తర గోగ్రహణమూ జరిగిందని వార్త వస్తే రక్షించటానికి ఉత్తరుడు తప్ప ఎవ్వరూ మిగలలేదు .అతడు చిన్నవాడు పెద్దగా పౌరుషమున్న వాడూ కాదు .అయినా అతడు  ‘’ కౌరవుల పొగరు అణచటానికి ఎవరూ లేరనుకోన్నారా ?నేనొక్కడినే వెళ్లి శత్రువుల్ని  వేటుకుకు ఒక్కడిగా నరికి గోవుల్ని మళ్ళించుకు రాగలను .ఐతే పట్టణం లో ఒక్క రధసారదికూడా లేడు .అంతా నాన్నగారితో వెళ్ళారు .ఒక్క సారధిదొరికితే చాలు శత్రువుల అంతు చూసే వాడిని ‘’అంటాడు అక్కడే ఉన్న ఉత్తర ,సైరన్ధ్రీ ‘’బృహన్నల మంచి సారధ్యం చేస్తాడు .అతనిని తీసుకు వెళ్ళండి ‘’అని ప్రోత్సహిస్తే ‘’పేడిమూతి వాడి సారధ్యం నాకు పనికి రాదు ‘’అని బింకాలు పోతాడు. చచ్చిచెడి చివరికి అతడే గతి అయ్యాడు .గురూ గారుమాత్రం ‘బృహన్నలా !తీరా యుద్ధభూమి చూసి భయపడి పారిపోవు కదా ‘’అని చెణికాడు.తీరా యుద్ధభూమి చేరాక ‘’అబ్బో ఇంతమంది యోధాను యోధులతో నేను పోరాడగలనా ?వద్దు బాబూ వద్దు .వెనక్కితిప్పు. నే చస్తే మా అమ్మ ఏడుస్తుంది ‘’అని బతిమాలాడు .

  ఉత్తర కుమారుని మాటలు పట్టి౦చు కోకుండా రధాన్ని పోనిస్తున్న బృహన్నలతో ‘’నాకు భయమేస్తోందయ్యా బాబూ నేనిక్కడ ఉండలేను మా మ్మకు నేనొక్కడినే కొడుకుని. తెలియకుండా వచ్చాను .నన్ను ఇంటి దగ్గర దిగబెట్టు లేకపోతె కి౦దికి దూకుతాను ‘’అన్నాడాప్రగల్భాల ఉత్త కుమార ప్రబుద్ధుడు .అందుకే అతడి మాటలన్నీ లోకం లో ‘’ఉత్తర కుమార ప్రజ్ఞలు గా చెలామణి అయ్యాయి .ఇలాలోపల సరుకు లేకపోయినా పైకి బీరాలు పలికితే వీరరసాభాసమే అవుతుంది అన్నారు మునిమాణిక్యం గారు .

 మరో ఉదాహరణ –‘’భళి భళీ మా తాత బల్లెంబు చేబూని పుల్లాకు తూటుగా పొడిచినాడు .ఎద్దుచ్చ పోయంగా ఏరులై పారంగ  లంఘించి  లంఘించి దాటినాడు .కలుగులోన కప్ప గురుగుర్రు మనంగ కఠారి తీసుకొని గదిమినాడు .నాగలాపురికాడ నక్క తర్ముకు రాగ ,తిరువళూరు దాకా తరిమినాడు .ఎలుక ఎదురుగ రాగ ఈటె చేబూని ఏడారు బారులు ఎగిరినాడు .ఔరా ! వీని పరాక్రమ౦ బద్భుతంబు ‘’అని  నడిచే ఒకపద్యం లో వీరాభాసమే ఉన్నది అంటారు మాష్టారు.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-22-ఉయ్యూరు  .

Posted in రచనలు | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 40

1 of 12,828

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 40

· 40-రెండు సార్లు భక్తప్రహ్లాద దర్శకుడై న పౌరాణిక దర్శక బ్రహ్మ –చిత్రపు నారాయణ మూర్తి

· చిత్రపు నారాయణమూర్తి (1913-1985) తొలితరం చలనచిత్ర దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఇతడు తన మొదట తన సోదరుడు చిత్రపు నరసింహమూర్తికి సహాయకుడిగా సీతాకళ్యాణం, సతీతులసి, మోహినీరుక్మాంగద, కృష్ణ జరాసంధ మొదలైన సినిమాలకుపనిచేశాడు. దర్శకుడిగా ఇతని తొలిచిత్రం భక్త మార్కండేయ. ఈ చిత్రం ఇతడిని మంచి దర్శకుడిగా నిలబెట్టింది. తరువాత ఇతడు తెలుగు, తమిళ,కన్నడ భాషలలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు 1961లో కృష్ణకుచేల అనే సినిమాను నిర్మించాడు. అది అతనికి ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టింది.ఆయన తెలుగు,తమిళం,కన్నడంలో సినిమాలకు దర్శకత్వం వహించారు.

· తెలుగులో అయన దర్శకత్వం వహించిన సినిమాలు:-
1938 భక్త మార్కండేయ – వేమూరి గగ్గయ్య, శ్రీరంజని (సీనియర్)
1940 మైరావణ – వేమూరి గగ్గయ్య,చిత్తజల్లు కాంచనమాల
1941 దక్షయజ్ఞం – వేమూరి గగ్గయ్య, సి.కృష్ణవేణి, త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి, సదాశివరావు, బెజవాడ రాజారత్నం, టీ.జి. కమలాదేవి, జి.వరలక్ష్మి
1942 భక్త ప్రహ్లాద – వేమూరి గగ్గయ్య, జి.వరలక్ష్మి
1943 భక్త కబీర్
1944 భీష్మ – జంధ్యాల గౌరీనాథశాస్త్రి, కృష్ణవేణి, లక్ష్మీరాజ్యం, సి.ఎస్.ఆర్, పారుపల్లి సుబ్బారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, పారుపల్లి సత్యనారాయణ
1944 సంసార నారది – మద్దాలి కృష్ణమూర్తి
1947 బ్రహ్మరథం – బి.జయమ్మ, సి.కృష్ణవేణి, అద్దంకి శ్రీరామమూర్తి,పారుపల్లి సుబ్బారావు, ఏ.వి.సుబ్బారావు, కళ్యాణం రఘురామయ్య
1948 మదాలస – సి.కృష్ణవేణి, అంజలీ దేవి, శ్రీరంజని, కళ్యాణం రఘురామయ్య, ఏ.వి.సుబ్బారావు
1949 బ్రహ్మరథం
1953 నా చెల్లెలు – జి.వరలక్ష్మి, సూర్యకళ, రామశర్మ, అమరనాథ్
1956 నాగులచవితి – ఆర్.నాగేంద్రరావు, షావుకారు జానకి
1960 భక్తశబరి – శోభన్ బాబు, చిత్తూరు నాగయ్య, పండరీబాయి
1961 కృష్ణ కుచేల — సి.ఎస్.ఆర్., కన్నాంబ, ముక్కామల, రాజశ్రీ,పద్మనాభం
1964 పతివ్రత — సావిత్రి, రాజసులోచన, జి.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావు,కుచలకుమారి, జెమినీగణేశన్
1967 భక్త ప్రహ్లాద — రోజారమణి, ఎస్.వి.రంగారావు

· తెలుగు సినిమాల ప్రారభాదశలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించి ,పౌరాణిక చిత్రాలతో చిత్రపరిశ్రమను సుసంపన్నం చేసినవారు చిత్రపు నారాయణ మూర్తి .పోరానికం తీయాలంటే అందరూ ఆయన్నే కోరేవారు అంతటి అధారిటి ఆయనది .సుమారు మూడు దశాబ్దాలు చిత్ర దర్శకుడుగా ఉన్నా తీసిన సాంఘికాలు చాలా తక్కువే ,భక్తప్రహ్లాద రెండు సార్లు డైరెక్ట్ చేసిన ఘనత ఆయనది .మొదటిదానిలో గగ్గయ్య మొదలైనవారు రెండవదానిలో రంగారావు రోజారమణి .రెండూ గొప్ప హిట్ సాధించినవే .ముఖ్యంగా రోజా రమణి ప్రహ్లాడుడుగా నటించిన చిత్రం ప్రతి అంగుళం భక్తిభావ భంజనమే నిర్మాతగా బ్రహ్మరధం ,శ్రీకృష్ణ కుచేల తీసి చేతులు కాల్చుకొన్నారు .

· బందర్లో మళ్ళీ ట్యూషన్లు చెప్పుకొని బతికారు .తర్వాత సతి తులసి చేయమని ఆహ్వానం వస్తే డైరెక్ట్ చేశారు .తర్వాత మోహినీ రుక్మాంగద ఆఫర్ వస్తే దర్శకత్వం చేశారు .మీర్జాపురం రాజా కృష్ణ జరాసంధ నిర్మిస్తూ అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకొన్నారు ,కొంతకాలం ప్రొడక్షన్ మేనేజర్ గా చేశారు .తర్వాత భక్తమార్కండేయ ,మైరావణ లకు దర్శక,ఎడిటర్ గా పని చేశారు శోభనాచాలవారు భక్తప్రహ్లాద ,దక్షయజ్ఞం సినిమాలకు ఒకరోజు ఒక సినిమాలో రెండో రోజు రెండో సినిమాకు దర్శకత్వం చేసి సమర్ధంగా పూర్తీ చేశారు .దక్షయజ్ఞం లో గగ్గయ్య ,కృష్ణవేణి నటించారు .ప్రహ్లాదలో గగ్గయ్య హిరణ్యకశిపుడు వేశారు .

· ఆతర్వాత శోభనాచాలవారి భీష్మ సినిమాకు డైరెక్టర్ గా చేహారు .భీష్ముడుగా జంధ్యాల గౌరీనాధ శాస్త్రి నటించారు .వయోభారం తో తిలోత్తమ ,తెలుగు తమిళం లకు దర్శకులు ఆయనే .చిత్తూరు రాణి పద్మిని తెలుగు తమిళ వర్షన్ లకు ఆయనే దర్శకులు .చివరిదాకా ఆయన దర్శకత్వ బాధ్యతలలోనే గడిపారు .

· సశేషం

· మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -39

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -39

· 39-శ్రీనాదుడిలాగా రాజసం ఉట్టిపడే ఆగర్భ శ్రీమంత నటుడు –జంధ్యాల గౌరీనాధ శాస్త్రి

· అతడే భీష్ముడు.. అతడే శ్రీనాథుడు..

·

నాగయ్య గారు నటించిన భక్త పోతన సినిమాలో ఒకదృశ్యం. కవిసార్వభౌముడు శ్రీనాథుని పాత్ర పోషించినది జంధ్యాల గౌరీనాథ శాస్త్రిగారని గొప్ప నటుడు. మా . ఆయన స్వయంగా బాగా ఆస్తిపరుడు. డబ్బుకోసమని ఒకపని చెయ్యవలసిన అవసరం ఆయనకి లేదు. అందుకని, తన ప్రవృత్తి రీత్యా నాటకాలని సినిమాలని, అదీను తనకి నచ్చిన నప్పిన పాత్ర అయితేనే చేస్తూండేవారు.. పెద్దమనుషులు సినిమాలో మ్యునిసిపలిర్మన్ పాత్రని చాలా సమర్ధవెత్తు విగ్రహం, కొనదేరిన ముక్కు, తీర్చిదిద్దినట్టున్న ముఖం, పెద్దపెద్ద కళ్ళు, వొంటితీరులో ఒక సహజమైన రాజసం ఈయన సొత్తు.

·

·

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా పిడమర్రు గ్రామంలో5/10/1911న ఆగర్బ శ్రీమంతుల ఇంట జన్మించారు.పెద్దగా చదువు అబ్బలేదుగాని కళలపట్ల బాగా మక్కువ ఉండేది.
డా.గోవిందరాజుల సుబ్బారావు,ముదిగొండ లింగమూర్తి,గౌరినాధ శాస్త్రి గార్లు మంచి స్నేహంగా తెనాలి పట్టణంలో కలసి మెలసి తిరుగుతుండేవారు. ఈముగ్గురు మిత్రులు కొద్దిపాటి నెలల తేడాలో మద్రాసులో అడుగు పెట్టారు.
మంచిరూపము,చక్కని అభినయము,పదప్రయోగంలో విషిష్టత కలాగిన శాస్త్రి గారు తొలిసారి కావలి గుప్తా గారు లక్ష్మిఫిలింమ్స్ పేరిట’దౌపతి మానసంరక్షణము’ చిత్రంలో జంధ్యాల వారికి అవకాశం కలిగించారు. ఇందులో బందా కనకలింగేశ్వరరావు శ్రీకృష్ణుడుగా,బళ్ళారి రాఘవా ధుర్యోధనుడుగా,మునిపల్లె సుబ్బయ్య భీముడుగా,సురభి కమలాబాయి (పాతాళభైరవిలో తోటరాముడు తల్లి) ద్రౌపతిగా డా.శివరామకృష్ణయ్య గారికికూడా ఇది తొలి చిత్రమే! (లవకుశలో గిరిజ తండ్రి)కర్ణుగా నటించారు. ‘ద్రౌపతి వస్త్రాపహరం’అనె చిత్రానికి పోటీగా తయారైన చిత్రం ఇది. 1936/మార్చి/24 వతేదిన విడుదలైనది.
అనంతరం వాహినీ వారి ‘భక్తపోతన’ (1942) చిత్రంలో శ్రీనాధుడిగా నటిస్తూ పద్యాలు గోప్పగా పాడుతూ,మంచి అభినయం ప్రదర్శించారు. దర్శకుడు కే.వి.రెడ్డిగారు తేలిసారి దర్శకత్వం వహిస్తున్నతొి చిత్రం ఇది.వారి దృష్టికి వచ్చిన శాస్త్రిగారిని నాటకానుభవం లేకున్నా శ్రీనాధుని పాత్రకు ఎంపిక చేసారు.వీరి దర్శకత్వంలో వచ్చిన మరో వాహిని వారి ‘పెద్దమనుషులు’ (1954)చిత్రంలో ఛైర్మెన్ ధర్మారావు పాత్ర జంధ్యాల వారికి మరింత వన్నెతెచ్చింది.ఈచిత్రం ద్వారా డి.వి.నరసరాజు మాటల రచయితగా పరిచయం చేయబడ్డారు.అనంతరం పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ‘మాయమఛ్ఛీంద్ర'( 1945)జంద్యాలవారు నటించారు.నటుడు ముక్కామల కు ఇది తొలిచిత్రం.అనంతరం శోభనాచలవారి ‘భీష్మ’ (1944)చిత్రంలో భీష్ముని పాత్రలో జీవించారు.జూ”శ్రీరంజనీకి ఇది తొలి చిత్రం.
సినీరంగంలో జంధ్యాల,ముక్కామలా,ఎస్.వి.రంగారావు మంచిమిత్రులుగా ఉండేవారు.జంధ్యాల వారు నిర్మాతగామారి త్రిమూర్తి బేనర్ పైన’గీతాంజలి’ (1948)’గుణసుందరికథ’ (1949) ‘ఆకాశరాజు(1951) (జానపదం)చిత్రాలు నిర్మించారు.దర్శకుడు జ్యోతిసిన్హ.ఆవేటి పూర్ణిమ(అక్కినేని వారి అందాలరాముడు చిత్రంలో పడవలో బామ్మ పాత్రధారి) అనే ఏలూరుకు చెందిన అమ్మాయిని కథానాయకిగా పరిచయంచేయడం కోసం ‘ఆకాశరాజు’తీసారు.మూక్కామలా సలహపై కొత్తగూడెంలో లాయర్ గా ఉన్న ‘మంత్రవాది శ్రీరామమూర్తి కి పూర్ణిమ సరసన కథానాయకుడు పాత్రఇచ్చారు.కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు ఈచిత్రానికి మాటలు రాసారు.ఆచిత్రం ఆర్ధికంగా విజయం సాధించక పోవడంతో ఆస్తి అంతా పోగోట్టుకుని రోడ్డుపాలైయ్యారు.
మందుకు ,పూర్ణిమకు దాసుడుగా మారిపోయాడు.ఒక రోజు బాగాతాగి పూర్ణిమ కొరకు ఏలూరు వెళుతూ రైలులో సృహతప్పగా ప్రయాణీకులు ఆయనను బంధువుల ఇంటికి చేర్చారు. అలా ఆయన చరిత్ర అక్కడితో 7/5/1964. లో ముగిసింది.జంధ్యాలవారి మనవడు(కూతురు కుమారుడు)రాంబాబు బాపువారి’త్యాగయ్య’చిత్రంలో శ్రీరాముడిగా,విశ్వనాధ్ వారి ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలోనూ నటించాడు. ‘భలేరాముడు'(1956) ‘జయభేరి(1959) వీరు నటించిన చివరిచిత్రం.

సినీరంగ ప్రవేశం[మార్చు]
నిండైన విగ్రహమూ, విశాల నేత్రాలు గల వ్యక్తి కోసం అన్వేషిస్తున్న తరుణంలో దర్శకుడు కె.వి.రెడ్డికి ఒక సభలో గౌరీనాథశాస్త్రి తారపడ్డాడు. నాటకానుభవం లేకపోయినా ఉత్సాహం ఉంది గనుక, పాత్రకు న్యాయం జరుగుతుందని శ్రీనాథుడి పాత్రకు ఎంపిక చేశారు. శాస్త్రి గారి మంచి కంఠం, చక్కని వాచికం, రెండూ ఉన్నాయి కనుక ఇరువురికీ అంగీకారమైంది. సంభాషణల వల్లె వేయించి, క్షుణ్ణంగా రిహార్సల్సు చేయించారు. దృశ్యాలు షూట్‌ చేసే ముందు, కనీసం మూడు, నాలుగు రోజులైనా రిహార్సల్సు ఉండేవి. పోతన పాత్రలాంటిది నటించడం నాగయ్యకీ కొత్త. కొత్తవాడైన గౌరీనాథశాస్త్రికి మరీ కొత్త. పాత్ర లక్షణాలను గ్రహించి, దర్పాన్ని జోడించి ఎంతో సహజంగా నటించారు శాస్త్రి. పోతన చిత్రం విజయవంతమై శ్రీనాథుడి పాత్రధారి గురించి ఒక గొప్ప సహజ నటుడు లభించాడు అని అందరూ చెప్పుకున్నారు.

1956లో వచ్చిన ‘బలే రాముడు’ సినిమాలో కూడా గౌరీనాథశాస్త్రి నటించారు. నాగయ్య ‘రామదాసు’ చిత్రం ఆరంభిస్తూ శాస్త్రిని కబీర్‌ పాత్రకు తీసుకున్నారు. కాని, కొన్ని దృశ్యాల్లో నటించిన తర్వాత 1958లో గౌరీనాథ శాస్త్రి మరణించడంతో ఆ పాత్రను గుమ్మడి పూర్తి చేశారు .

· శ్రీనాథుడుడంటే ఇలానే ఉండేవాడు కాబోలు ముమ్మూర్తులా!” అని సాహితీవేత్తలు కూడా భావించి శ్లాఘించారు. ఆయనకు సంగీతం వచ్చు. హిందూస్థానీ సంగీతమూ తెలుసు. జమీందారీ వంశం లాంటి

” భక్తపోతన “(1943)- సినిమాలో శ్రీనాధుడు పాత్రను ,
భీష్మ (1944),
‘మయామచ్ఛీంద్ర’ (1945) మచ్ఛీంద్రుడి పాత్రను ,
‘భీష్మ’ (1944)లో గౌరీనాథశాస్త్రి భీష్ముడు.
‘ఒక రోజు రాజు’ అనే జానపదం (1944) ,
‘రామాంజనేయ యుద్ధం’ ఆంజనేయుడు పాత్రని,

· ‘గీతాంజలి’ (1948) .

·
‘ఆకాశ రాజు’ (1951) రొనాల్డ్‌ కాల్మన్‌ అనే హలీవుడ్‌ నటుడు నటించిన ఒక చిత్రంలోని గెటప్‌తో, శాస్త్రిగారు దుష్ట పాత్ర ధరించారు.
‘పెద్ద మనుషులు’ (1954) చిత్రంలో ఛైర్‌మన్‌ పాత్ర ,
1956లో వచ్చిన ‘బలే రాముడు’లో కూడ నటించా రాయన.
‘రామదాసు’ చిత్రం లో కబీర్‌ పాత్రకు తీసుకున్నారు. కాని, కొన్ని దృశ్యాల్లో నటించిన తర్వాత – 1958లో గౌరీనాథ శాస్త్రి మరణించారు. (ఆ పాత్రను గుమ్మడి గారు చేశారు)) .

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -38

• మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -38 • 38-నాట్య విద్యాలయ అధ్యాపకులు,పెద్దమనుషులు హీరో –రామచంద్ర కాశ్యప • రామచంద్ర కాశ్యప అడ్వొకేటు. విజయవాడ. అనుభవం గల రంగస్థల నటుడు. డి.వి.నరసరాజుగారు రాసిన ”నాటకం” నాటకంలో ముఖ్యపాత్రధారిగా మంచి గుర్తింపు. ‘దేవదాసు’ సినిమాకి ముందు వినోదావారు కొంతమంది కొత్తవారితో ”శాంతి” (1952) తీశారు. రామచంద్ర కాశ్యప అందులో నాయక పాత్రధారి. తర్వాత ‘కోడరికం’ (1953)లో నటించారు- ముఖ్యపాత్రే. కె.వి.రెడ్డి గారు ‘పెద్ద మనుషులు’ (1954)లో కాశ్యప హీరో. హీరో అంటే ఆ రోజుల్లో అమ్మాయిలతో పాడుతూ, విలన్‌ని కొట్టడం కాదు. ముఖ్యపాత్ర అని అర్థం. తర్వాత ‘ఆడబిడ్డ’ (1955) లాంటి చిత్రాల్లో నాయకుడిగా నటించినా, ప్రాముఖ్యం లేని పాత్రలు ధరించడానికి ఇష్టపడేవారు కాదు. మధ్య మధ్య విజయవాడ వెళుతూ సాంఘిక నాటకాల్లో, రేడియో నాటకాల్లో నటిస్తూ వచ్చారు. తక్కువ చిత్రాల్లోనే నటించినా, ‘పెద్ద మనుషులు’ గుర్తున్నట్టు అందులోని కాశ్యప కూడా గుర్తిండిపోయాడు. • కోప్పరపువారి నాటకం 1950లోప్రదర్శిమ్పబడి ఆంధ్రనాటక కళా పరిషత్ పోటీలలో రాఘవ కళా కేంద్రం వారిచే ప్రదర్శింపబడి బహుమతి పొందింది శ్రీ కే పార్ధసారధి శ్రీ వెంపటి రాధాకృష్ణ,శ్రీ పి.రామచంద్ర కాశ్యప్ ,మాచినేని వెంకటేశ్వరరావు ,దివి నరసరాజు ,విన్నకోట రామన్నపంతులు ఎం ఎస్ మూర్తి కొంగరజగ్గయ్య కేవీస్ శర్మ శ్రీమతి కొప్పరపు సరోజినీ ,శ్రీమతి టి.సీతాలత వంటి ఉద్దండులు నటింఛి అఖండ ఖ్యాతి తెచ్చారు . • ఆంద్ర ప్రదేశ్ నాటక అకాడెమి సహాయంతో ఆంద్ర నాటక కళా పరిషత్ ఆధ్వర్యం లో విజయవాడలో 1950 ఆగస్ట్ 1న ‘’నాట్య విద్యాలయం ‘’ఏర్పడింది .శ్రీ పసల సూర్య చంద్రరావు శ్రీ ఎం ఆర్ అప్పారావు లు ప్రారంభించారు .శ్రీ శ్రీనివాస చక్రవర్తి ప్రిన్సిపాల్.విన్నకోట రామన్నపంతులు కొడాలి ఆది శేషయ్య ,పి.రామ చంద్ర కాశ్యప ,బసవరాజు సుబ్బారావు గార్లు అధ్యాపకులు .నటన ,నాటక లక్షణాలు నాటక ప్రయోగం నాటక రంగ చరిత్ర బోధించారు .క్లాసులు సాయంత్రం పూట జరిగేవి . • *రామచంద్ర కాశ్వపతో నా మొట్ప్బమొదటి ఏరిచయం- మదరాసు లయోలా కాలీజిలో- 040లో! అతను నాకంటి ఒక సంవత్సరం జూనియర్‌! నోను నియర్‌ ‘బి.ఏ.లో వుండగా- అతను వచ్చి- ఏ.యేు.లో చేరాడు. రామస్న పంతులుగారితో పరిచయం౦– విజయవాడలో – 1948 ప్రాంతాల! మెము ముగ్గురమూ విజయవాొడ- (అవ్వుడు ఎజవాడ) వాసులమ్తైనా- ఫ్లాస్కూలు బైస్కూలు, వాళ్ళిద్చ్వరూ మునసిసివ చదువులు – ల పైస్కూలు చేరడంతో – వాళ్ళిద్చరికి పరసృరం పరిచయం వుందిగాని- “నాకు వాళ్ళతో పరిచయం లేదు. – మదరాసు లయోలా కాలేజిలో- ఆంధ్ర విజ్నాన మితి- నాటక విభాగానికి నేను కార్యదర్శిని. ప్రతి సంవత్సరం ఒక నాటకం ప్రదర్శించాతమానవాయితీ ‘ఆ సంవత్సరం (1940) ““రాభూప్రతాప్‌” పదర్శించాం, అందులో నేను రాణాప్రతాప్‌- కొండముది గోపాలరాయ శర్మ ప్రఖ్యాత సినీ- నాటక రచయిత నా’ సహాధ్యాయి) శక్తసింహుడు- రామచంద్ర చదువుతున్నారు). గోపాల రాయ శర్మకు గూడ ఒక బహుమతి లభించింది. ఆ తరువాత గూడా- కాలేటీలో నూ- నాటకాలు కాశ్యప లా కాలేటలొ నూ–. . ప్రదర్శించి బహుమతులు పొందాడు, నేను బి.యు.తో చదువు ముగించి. బెజవాడ వచ్చేశాను. కాశ్యప లా పూర్తిచేసి- బెజవాడలొ – ,ప్రాక్టిసు పెట్టాడు. 1947-. ఉసెంబర్‌లొ అనుకుంటాను– బెజవాడలో ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలు- దుర్గా కళామందిరంలొ జరిగాయి! ఆచార్య. ఆత్రేయా – “ఈనాడు” నాటకం, ప్రదర్శించారు. ప్రస్తుత ఆంధ్ర ముఖ మంత్రి శ్రి యన్‌, ట్‌. రామారావు గారు- “చేసన పావం” నాటీక ప్రదర్శించారు. రచన- కొప్పరపు నుబ్బారావుగారు. , జగ్గయ్యగారు గూడ ఒక నాటికలో పాల్గొన్నారు. ఆ నాటకాలు చూచి- కాశ్యప– రామన్నపంతులు- నెనూ- వుత్పాహపడి- మళ్ళీ నాటకాలు ప్రదర్శ్నించాలని- నిర్ణయించుకున్నాం! అప్పుటీకే- కొప్పురపు సుబ్బారావు గారు- లిటిల్‌ ధియేటర్‌ తరఫున మంచి సమకూర్చారు- విజయవాడలో నాటక (ప్రదర్ననలకు– స్త్పాపంచాం! మొచట- సోమంచి యజ్ఞాన్నశాస్తి గారి- “విశ్వం హనుమంతరాయ (గ్రంధాలయం రాఘవకళా కేంద్రం గ్రంవాలయంలొ ప్రవర్సించాం, అంచులో – ప్రఛాన పాత్రధారులు- కాశ్యప, గుడిపాటి వెంకటచలంగారి కుమార్తె, కుమారి నిర్మల! ఆంచులో నేనొష చిన్న వేషం వేళాను! ఆ తరువాత- కొప్పుఎవు న్‌. గాతు- చె. బి. ప్రసన్న వ్రానన “యిన్‌స్రుష్షర్‌ మ. “ఇనప తెరలు”గా వ్రాయు. ఆ నాటకం- రాఘవ ఇళాచం ఎం తిల్టున 1950లొ కాకినాడలొ. ఎరిగిన నాటళ సభాఫరిషత్తులో. ప్రదర్సించాం! . నేనూ- మాచినోని వెంజటేశ్వతరావు, రామచంద్ర. కాశ్వప, _ వెంపటి…రాదా కృష్ణ కోటగిరి; పొరృసారధిరావు- న్రిమతులు కొప్పురవు సరొ జినీవేవి, వీరమాచనేని సరోజినిచేవి- అందులో పాృతధారులం! • కాశ్యప– అక్బర్‌! యిప్పుడు ఆంధప్రదేశ్‌ హైకోర్చు (వధాన న్యాయమూర్సిగా రిటైర్‌ ఆయిన– క్రి జస్పిస్‌- కోకా రామచం(దరావు గారు- అందులో ఒక పాత్ర ‘ ధరించారు, ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ కార్యదర్శిగా పనిచేస్తూ అకాల మరణం వాతబడిన- శ్రి ఎ. చందశేఖర్‌ ఐ.ఎ.యస్‌. కూడ మరొక పొత్ర ధరించారు. ‘ప్రస్కుతం- ఆంధప్రదేశ్‌ పోలీస్‌ యిన్‌స్సెక్టర్‌ జనరల్‌గా రిటైర్‌ అయిన శ్రీ కొన రామచందారెడ్ని గారు గూడ ఒకవేషంవేశారు. ” .. ఆ నాటకం చూచడాసిక్ష వచ్చిన=’.. ఫ్‌లిం ప్రొడ్యూసర్‌ శ్రి పంతం చిన్నారావుగారు- కాశ్యప. నటనకు ముగ్భులై- ఒక బహుమతి (ప్రకటించారు. . ప్రస్నుతం-= హైకోర్టు సినియర్‌ అడ్వకేట్‌- శ్రి కటికినేని జగన్నాథరావు. గారు- నాకు ఒక బహుమతి ప్రకటించారు,’’అని గుర్తు చేసుకొన్నారు నరసరాజుగారు . • సశేషం • రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-22-ఉయ్యూరు • • • , _! • • • • • • •

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -37 •

• మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -37 • 37-షావుకారు ,బ్రహ్మనాయుడు గ ప్రసిద్ధి చెందినా గుబురుమీసాల గంభీర నటులు –డా.శ్రీ గోవిందరాజు సుబ్బారావుగారు.. తెలుగు నాటకాలలో సినిమాలలో, తొలితరం నటులు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు. వీరు 1895 సంవత్సరంలో జన్మించారు. వీరు మొదట్లో చరిత్ర విద్యార్థిగా తన చదువు ప్రారంభించారు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు.డాక్టరుగా తెనాలిలో స్థిరపడి పేరుప్రతిష్ఠలు సంపాదించారు. తరువాతి కాలంలో హోమియోపతి వైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి ఐన్‌స్టీన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. ఇతను విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవారు. ఆంగ్లంలో ఇనార్గానిక్ ఎవల్యూషన్ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించారు. అయితే గోవిందరాజు సుబ్బారావుగారు నటునిగానే సుప్రసిద్ధుడయ్యారు. పాఠశాలలో చదివేటప్పుడు వార్షికోత్సవ సందర్భంలో మర్చంట్ ఆఫ్ వెనిస్ అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో సుబ్బారావు నట జీవితం ప్రారంభమైంది. సంగీతాన్ని నేర్చుకున్న సుబ్బారావు 20 రాగాలను క్షుణ్ణంగా అభ్యసించారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో గయోపాఖ్యానం నాటకంలో సాత్యకిగా, భీముడుగా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. తెనాలిలో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని బొబ్బిలి యుద్ధంలో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లు, ప్రతాపరుద్రీయంలో పిచ్చివాడి పాత్రల్లో వీరి నటన తెలుగు నాట పేరు ప్రఖ్యాతులు తెచ్చింది • గోవిందరాజు సుబ్బారావు గురించి ఈ నాటి తరానికి తెలియదు. బాగా పెద్దవారికి తెలిసి ఉండవచ్చు. తెలుగు సినిమాలలోనూ, నాటక రంగంలోనూ నటించిన తొలితరం నటుడు. బాలనాగమ్మ సినిమాలో మాయల మరాఠీగా నటించారు. వృత్తిరీత్యా వైద్యుడు. తెనాలిలో స్థిరపడి వైద్యుడిగా పేరుపొందారు. తరువాత హోమియోపతిలో కూడా ప్రావీణ్యం సంపాదించి హోమియో వైద్యం కూడా చేసేవారు. • చదువుకునే రోజులలోనే నాటకాలలో నటించేవారు. గయోపాఖ్యానంలో సాత్యకి, భీముడు, బొబ్బిలి యుద్ధంలో హైదర్ జంగ్ పాత్రలు పొషించారు. కన్యాశుల్కం, ప్రతాప రుద్రీయం నాటకాలలో నటించారు. అప్పడప్పుడే ప్రారంభమవుతున్న సినీరంగంలో ప్రవేశించి కేరక్టర్ నటునిగా, ప్రతినాయకునిగా నటించారు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో రంగయ్యగా, బాలనాగమ్మలో మాయల మరాఠీగా నటించి నటుడిగా పేరు పొందారు. • గోవిందరాజులు సుబ్బారావు, తెలుగు సినిమాలలో మరియు నాటకాలలో తొలితరం నటుడు తెనాలి ప్రాంతానికి చెందిన గోవిందరాజులు సుబ్బారావు గారు వైద్యులు, సాహిత్య ప్రియులు, రచయిత, తెలుగు సినిమా మొదటితరం నటులు. వీరు నవంబర్ 11,1895 సంవత్సరంలో తెనాలిలో జన్మించారు. వీరు వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణులై డాక్టరుగా తెనాలిలో స్థిరపడి, దానివలన పేరుప్రతిష్టలు సంపాదించారు. తరువాత కాలంలో వీరు హోమియోపతి వైద్యానికి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి, ఐన్ స్టీన్తోఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. అయితే ఆంధ్ర రాష్ట్రమంతా మంచి పేరు తెచ్చిపెట్టింది వీరి నటనా వైదుష్యం. పాఠశాలలో చదివేటప్పుడు, వార్షికోత్సవ సందర్భంలో ‘మర్చంట్ ఆఫ్ వెనిస్’ అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో వీరి నట జీవితం ప్రారంభమైంది. వీరు 20 ప్రముఖ రాగాలు పాడాటం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో గయోపాఖ్యానం నాటకంలో సాత్యకిగా, భీముడుగా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. తెనాలిలో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని ‘బొబ్బిలి’లో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. ‘కన్యాశుల్కం’లో లుబ్ధావధానులు పాత్రవలననూ, ‘ప్రతాపరుద్రీయం’లో పిచ్చివాడు పాత్రవలననూ సుబ్బారావు ఆంధ్రదేశంలో అసమాన ఖ్యతిని పొందారు. సినిమా రంగంలో వీరు ఎంతగానో రాణించారు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో చెంగయ్య, ‘బాలనాగమ్మ’లో మాయల మరాఠీగా వీరు ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందారు. వీరు విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవారు. ఆంగ్లంలో ‘ఇనార్గానిక్ ఎవల్యూషన్’ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించారు. వీరు చెన్నైలోని స్వగృహంలో అక్టోబరు 29, 1959 సంవత్సరంలో65వ ఏట పరమపదించారు. • గోవిందరాజుల సుబ్బారావు .. అలనాటి నటులలో ప్రముఖంగా వినిపించిన పేరు. మూకీల నుంచి ముక్తిని పొందినట్టుగా తెలుగుసినిమా టాకీల దిశగా అడుగులు వేస్తున్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన తెనాలి నుంచి మద్రాసు వెళ్లి నటుడిగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు. అప్పట్లోనే ఆయనది ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్. తెరపై ఆయన నటిస్తున్నట్టుగా ఉండేది కాదు. సన్నివేశం మన కళ్లముందు జరుగుతుందా అన్నంత సహజంగా ఆయా పాత్రలలో జీవించేవారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా, ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ అన్నట్టుగా ఆ సినిమాలు నిలుస్తాయి. • అసలు ఆయన ఇంటిపేరు గోవిందరాజు .. కానీ అంతా కూడా గోవిందరాజుల అనే పిలిచేవారు. అందుకు ఆయన పెద్దగా అభ్యంతరం చెప్పేవారు కాదు. దాంతో గోవిందరాజుల అనే జనానికి తెలుసు. మొదటి నుంచి కూడా ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆ తరువాత నాటకాల పట్ల తనకి గల మక్కువ వయసుతో పాటు పెరుగుతూ పోయింది. అప్పట్లో ఆయన వేసిన నాటకాల్లో ‘ప్రతాప రుద్రీయం’, ‘కన్యాశుల్కం’ మంచి పేరు తెచ్చిపెట్టాయి. • ఫలానా ఊరిలో ఫలానా నాటకం ఆడుతున్నారంటే అందులో గోవిందరాజుల ఉన్నారా? అని ఆరా తీసి, ఉన్నారంటే ఎంత దూరమైనా నడిచివెళ్లేవారట. అంతటి పేరు ప్రతిష్ఠలతో ఆయన ప్రభ వెలిగిపోయింది. ఒక వైపున వైద్య వృత్తిని కొనసాగిస్తూనే, మరో వైపున రాత్రి వేళలో నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన గురించి గూడవల్లి రామబ్రహ్మం గారికి తెలిసింది. అప్పుడు ఆయన ‘మాలపిల్ల’ సినిమా చేయడానికిగాను తగిన నటీనటుల కోసం వెతుకుతున్నాడు. గోవిందరాజుల గురించి తెలిసి వెంటనే ఆయన కోసం కబురుచేశారు. • • గోవిందరాజులను .. ఆయన తీరు తెన్నులను చూడాగానే, ‘మాలపిల్ల’ సినిమాలో తాను అనుకున్న ‘సుందరరామశాస్త్రి’ పాత్రకి ఆయన బాగా సెట్ అవుతారని గూడవల్లికి నిపించింది. దాంతో వెంటనే ఆ పాత్రకి ఆయనను ఓకే చేసేశారు .. త్వరలో ‘మీసాలు’ తీసేసి తనని కలవమని చెప్పారు. గోవిందరాజులవారివి గుబురు మీసాలు .. ఆ మీసాలు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. తాను నిండుగా .. గంభీరంగా కనిపించేలా చేసేవి ఆ మీసాలే. అలాంటి మీసాలు తీయడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. కానీ ఆ తరువాత ఆయన అయిష్టంగానే అందుకు అంగీకరించారు. అలా ఆయన 1938లో ‘మాలపిల్ల’ సినిమాలో అవకాశాన్ని సంపాదించుకున్నారు. • ఆ సినిమా ఆయనకి తీసుకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఇక నటుడిగా ఆయన అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. “కులం చాలా గొప్పది .. దాని గొప్పతనం కొత్తగా ఇంగ్లిషు చదువులు చదువుకొచ్చినవారికి అర్థం కాదులే” అంటూ ‘మాలపిల్ల’లో కులాభిమానం చూపించే ఆ పాత్రలో ఆయన జీవించారు. ఆ పాత్రను అంతకంటే గొప్పగా ఎవరూ చేయలేరనే ప్రశంసలు అందుకున్నారు. అదే ఏడాది వచ్చిన ‘బాలనాగమ్మ’లో మాయల ఫకీరుగా ఆయన అద్భుతంగా మెప్పించారు. తెలుగు తెరపై తొలి మాంత్రికుడిగా మార్కులు కొట్టేశారు. • ఇక ‘పల్నాటి యుద్ధం’ సినిమాలో ‘బ్రహ్మనాయుడు’ పాత్రలో ఆయన చూపించిన హావభావ విన్యాసానికి అంతా ఆశ్చర్యపోయారు. బ్రహ్మనాయుడు అలాగే ఉండేవారేమోనని అనుకున్నారు. సాత్మికమైన పాత్రలను మాత్రమే కాదు, ఆవేశపూరితమైన .. రౌద్రరస భరితమైన పాత్రలను కూడా ఆయన అద్భుతంగా చేయగలరనే విషయం స్పష్టమైంది. • • ఆ తరువాత ఆయన చేసిన మరో జానపద చిత్రమే ‘గుణసుందరి కథ’. ఈ సినిమాలో ఉగ్రసేన మహారాజు పాత్రలో ఆయన ఆవిష్కరించిన అభినయం అసమానం. ఒక వైపున అసమర్థులైన అల్లుళ్లు .. మరో వైవున అనురాగం లేని కూతుళ్లు. తనని ఎంతగానో ప్రేమించే చిన్న కూతురుని దూరం చేసుకున్నానే అనే బాధ. మంచంలో మరణయాతన .. ఏమీ చేయలేని ఆ నిస్సహాయతను ఆయన ఆవిష్కరించిన తీరు చూస్తే, గోవిందరాజుల ఇప్పటికీ గుర్తుండిపోవడానికి గల కారణం ఆయన నటనలోని సహజత్వమేకదా అనిపిస్తుంది. ఇక ఆ తరువాత ఆయన చేసిన సినిమానే ‘షావుకారు’. తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాలలో .. గోవిందరాజుల సుబ్బారావు నట వైభవాన్ని చాటిచెప్పే చిత్రాలలో ‘షావుకారు’ ఒకటిగా కనిపిస్తుంది. • • ఈ సినిమాలో ‘షావుకారు’ గోవిందరాజులవారే. కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తాకట్టు వ్యాపారం చేసే మహాలోభిగా ‘చెంగయ్య’ పాత్రను ఆయన పండించిన తీరును అభినందించకుండా ఉండలేం. డబ్బు తప్ప మరీ ఏదీ ముఖ్యమైనదీ కాదనీ .. అంతకంటే ప్రాధాన్యతను ఇవ్వలసినది ఏదీ లేదని బలంగా నమ్మే ఈ పాత్రకి ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. కథాకథనాలతో పాటు ప్రధానపాత్రధారి అయిన ఆయన నటన ఆ సినిమాను నిలబెట్టేసింది. ఇప్పటికీ ఆ సినిమాను గురించి మాట్లాడుకునేలా చేసింది. • ఇక వీటితో పాటు గోవిందరాజుల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో చేరిపోయిన మరో ఆణిముత్యమే ‘కన్యాశుల్కం’. ఆనాటి సాంఘిక దురాచారాలపై ‘గురజాడ అప్పారావు’ ఎక్కుపెట్టిన అస్త్రమే కన్యాశుల్కం. ఆ నాటకాన్ని సినిమాగా తెరపై ఆ ఆవిష్కరించారు. అంతకుముందు నాటకాలలో ‘గిరీశం’ పాత్రను పోషించిన గోవిందరాజుల, ఈ సినిమాలో ‘లుబ్ధావధానులు’ పాత్రను చేశారు. పడుచుదనం రాని పిల్లను పెళ్లి చేసుకోవడానికి తహతహలాడే ముదుసలి పాత్రలో ఆయన నటన చూసితీరవలసిందే. ఇలా ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించి, జన హృదయాలపై చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను ఒకసారి స్మరించుకుందాం. • ధర్మాంగద • ధర్మాంగద హెచ్.వి.బాబు దర్శకత్వంలో, ఋష్యేంద్రమణి, గోవిందరాజుల సుబ్బారావు తదితరులు నటించిన 1949 నాటి తెలుగు చలనచిత్రం. ధర్మాంగద సినిమాకే పాముపాట అనే మరో పేరుండేది. సినిమా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ పూర్తైంది. • బాలనాగమ్మలో మాయల మరాఠీగా ,షావుకారులో తటిల్ పాత్రగా ,గుణ సుందరికద లో ముసలి రాజుగా ,కన్యాశుల్కంలో లుబ్దావధనులుగా ఆయనకు ఆయనే సాటి .నాటకం లో గిరీశం వేసే ఈయన సినిమాలో లుబ్దావధాన్లు వేయటం తమాషా .ఇందులోనూ జీవించి గురజాడ పేరు నిలిపారు .వేదం వెంకటరాయ శాస్త్రి గారి ప్రతాప రుద్రీయం నాటకం లో యుగంధర మంత్రిగా ,పిచ్చివాడుగా అద్భుత నటన ప్రదర్శింఛి శాస్త్రి గారికి కీర్తి తెచ్చారు • ఎల్ ఎం పి చదివి ప్రాక్తేస్ చేస్తున్నా ,హోమియో వైద్యం లో సిద్ధ హస్తులయ్యారు అణు విజ్ఞానం చదివి ప్రఖ్యాత శాస్స్త్రవేత్త అయిన స్టీన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే వారు ‘’ఇనార్గానిక్ ఇవల్యూషన్ ‘’. అనే గ్రంధాన్ని ఇంగ్లీష్ లో రాశారు .రామాయణ కావ్యగానం చేయటమే కాదు 20 రాగాలను క్షుణ్ణంగా నేర్చి పాడేవారు .గోవిందరాజుల వారి నాటకాను భావం గురించి రావి కొండలరావు ‘’ఇప్పుడైతే రేడియో స్టేషన్ లో చలిమంట కాచుకోన్నట్లు మైకు చుట్టూరా కళాకారులు కూర్చుని డైలాగులు చెప్పే విధానం వచ్చింది కానీ అప్పట్లో విడివిడిగా స్టాండింగ్ మైకులే .రంగస్థలం నున్చివచ్చిన సుబ్బారావు గారికి మైకు ముందు నిలబడి మాట్లాడటం కుదిరేదికాడు .మైకు చేత్తోపట్టుకొని ,అటూ ఇటూ తిరుగుతూ డైలాగ్స్ చెప్పేవారు .రికార్డింగ్ చేసే స్టాఫ్ మొత్తుకోనేవారు’’అని రాశారు • 1958లో సామ్రాట్ విక్రమార్క సినిమాలో –ప్రచండుడు ,భాగ్యరేఖ ,పాండురంగ మహాత్మ్యం ,చరనదాసిలో బసవయ్య ,కన్యాశుల్కం లో లుబ్దావధాన్లు ,పల్నాటి యుద్ధం లో బ్రహ్మనాయుడు షావుకారులో షావుకారు చంగయ్య ,మాలపల్లి లో సుందరరామ శాస్త్రి గా గోవిందరాజులవారి నటన చిరస్మరణీయం . • సశేషం • గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-22 • • •

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -36

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -36

36-రక్తకన్నీరు సీత

1933 అక్టోబర్‌ 14న కాకినాడలో జన్మించిన సీత తొలిసారిగా కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యోగి వేమన’(1946)లో బాలనటిగా నటించారు. అప్పటినుంచి తను దర్శకత్వం వహించిన ‘గుణసుందరి కథ’, ‘పెద్ద మనుషులు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘మాయాబజార్‌’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు ఇచ్చి సీతను ప్రోత్సహించారు కేవీ రెడ్డి. బాలనటిగానే కాకుండా హాస్య తారగా సరికొత్త మేనరిజమ్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు సీత. 1946లో ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం 2002 లో వచ్చిన ‘నేనేరా పోలీస్‌’ చిత్రం వరకూ కొనసాగింది.

దాదాపు 250 చిత్రాల్లో నటించారు. ‘రుతురాగాలు’ సహా పలు టీవీ సీరియల్స్‌లో కూడా సీత నటించారు. ‘రక్తకన్నీరు’ నాటకాన్ని నటుడు నాగభూషణంతో కలసి పలు ప్రాంతాల్లో ప్రదర్శించేవారు సీత. మనసులు కలవడంతో 1956లో నాగభూషణం సీతను పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. భువనేశ్వరి, నరేందర్‌. ఓ పెద్ద నటుడికి భార్యననీ, మంచి నటిననీ అనే అహంభావం సీతలో కనిపించేది కాదని ఆమెను ఎరిగిన వారు చెప్పేమాట. పెళ్లయ్యాక నటనకు దూరం జరిగిన సీత పిల్లలకు పెళ్లిళ్లు కావడంతో మళ్లీ నటన మీద ఆసక్తి చూపి కొన్ని సినిమాల్లో నటించారు. తనకు నటన నేర్పిన తొలి గురువు సీత అని నటి వాణిశ్రీ చెబుతుంటారు.

సుమారు 3 దశాబ్దాలు సినిమాలు, నాటకాలలో నటించిన సీత 1935లో సినిమా నటుడు, వస్తాదు, నిర్మాత, దర్శకుడు అయిన రాజా శాండో, మూకీ,టాకీల తొలితరం సినిమా నటి లీలాబాయిలకు జన్మించారు .[1]. ఈమె పూర్వీకుల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ. తల్లిదండ్రులు ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారు కావడం వల్ల ఈమెకు చిన్నతనం నుండి సినిమా పరిశ్రమ, నటన పట్ల అవగాహన ఏర్పడింది. ఈమె శేషాద్రి అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకున్నారు . మంచి కంఠస్వరం, గ్రహణశక్తి ఈమెను మంచి గాయనిగా తీర్చిదిద్దింది. ఈమె వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు. ఈమెకు నాలుగేళ్ల చిన్నవయసులోనే ముఖానికి రంగువేసుకుని సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత అనేక సినిమాలలో, నాటకాలలో నటించారు .. ఈమెకు 1956లో ప్రముఖ నటుడు సి.నాగభూషణంతో వివాహం జరిగింది.

కుటుంబం
ఈమె కుటుంబంలో అందరూ సినిమా రంగానికి చెందిన వారే. ఈమె తల్లిదండ్రులు సినిమా నటీనటులు. భర్త సినిమా, నాటకాలలో రాటుదేలిన నటుడు. ఈమె వియ్యంకుడు ఎస్.డి.లాల్ ప్రముఖ సినిమా దర్శకుడు. కూతురు భువనేశ్వరి భర్త, ఎస్.డి.లాల్ తనయుడు మీర్ టెలివిజన్ రంగంలో ప్రముఖ కెమరామ్యాన్, దర్శకుడు, ఎడిటర్. ఈమె కుమారుడు సి.సురేంద్ర కూడా పేరొందిన కెమరామ్యాన్, టి.వి. నటుడు. ఇతడు భార్యాభర్తలు, ఆత్మ మొదలైన టెలివిజన్ సీరియళ్లలో నటించాడు.

సినిమా రంగం
సీత నాలుగేళ్ల ప్రాయంలో త్యాగభూమి అనే సినిమాలో తొలిసారి నటించారు . పన్నెండేళ్ల వయసులో చిత్తూరు నాగయ్య నటించిన యోగివేమన సినిమాలో మోహనాంగి చెల్లెలు కనకాంగిగా నటించారు . ఇంకా ఈమె నాటకాల రాయుడు, బికారి రాముడు, నేనేరా పులి, రియల్ స్టోరి తదితర చిత్రాలలో నటించారు . ఋతురాగాలు, శివలీలలు మొదలైన టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించారు

నాటక రంగం
ఈమె చెన్నపురి ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ప్రదర్శితమైన మోహినీ రుక్మాంగద నాటకంలో ధర్మాంగద పాత్రను ఏడేళ్ల వయసులో అభినయించి ప్రేక్షకుల మెప్పును పొందారు. అప్పటి నుండి రంగూన్ రౌడీ, తులాభారం, చింతామణి మొదలైన నాటకాలలో ప్రదాన పాత్రలను పోషించారు కలికాలం, పాపం పండింది, బికారి రాముడు మొదలైన నాటకాలలో నటించారు

రక్తకన్నీరు
1958లో ఆవిర్భవించిన రక్తకన్నీరు నాటకం ఈమె జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. తమిళంలో ఎం.ఆర్.రాధా విరివిగా ప్రదర్శించిన ఈ నాటకాన్ని పాలగుమ్మి పద్మరాజు తెలుగులోనికి అనువదించాడు. నాగభూషణం దీనిని రంగస్థలంపై రసవద్ఘట్టంగా తీర్చిదిద్దాడు. రక్తకన్నీరు నాటకంలో సుందరి పాత్రను ఈమె నటించేది. ఇది వాంప్ తరహా పాత్ర. హీరో నాగభూషణం భార్య ఇందిరను అలక్ష్యం చేసి సుందరి పంచన చేరతాడు. ఇందిర పాత్రను వాణిశ్రీ, శారద చాలాకాలం వీరి ట్రూపుతో కలిసి నటించారు. ఈమె వాణిశ్రీకి డైలాగులు పలకడంలో, వేషధారణ, ఆంగికాభినయంలో శిక్షణ ఇచ్చారు . రక్తకన్నీరు నాటకం విజయవంతం కావడానికి నాగభూషణం సతీమణిగా, నాటక సమాజం నిర్మాతగా ఈమె పాత్ర అదృశ్యమే అయినా ప్రముఖమైనది. రక్తకన్నీరు ప్రదర్శించబడిన 20 సంవత్సరాలు కూతురు భువనేశ్వరి పుట్టినప్పుడు రెండు నెలలు మినహాయిస్తే మిగిలిన అన్నిరోజులు ఈమె ఆ నాటకంలో ఇందిర పాత్రను పోషించారు . వెనుక వుండి నిర్వహణ పనులను అంకితభావంతో చూసుకునేవారు .

1940లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీత.. దేవదాసు, మాయాబజార్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. దాదాపు 250 చిత్రాల్లో ఆమె కనిపించారు. చివరగా 2002లో నేనేరా పోలీస్‌లో ఆమె కనిపించారు. అంతేకాదు భర్త నాగభూషణంతో కలిసి రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి లాంటి నాటకాల్లో నటించారు. దాదాపు 2 వేలకు పైగా ఆమె ప్రదర్శనలు ఇచ్చారు.నాగభూషణంకు కుడి భుజంగా ఉండేవాళ్లు . దీంతో ఆ పరిచయమే చనువుగా మారి.. పెళ్లి చేసుకున్నాడు నాగభూషణం. అప్పటికే ఆయనకు పెళ్లి అయినా కూడా సీతను మరో పెళ్లి చేసుకున్నాడు నాగభూషణం. ఇదిలా ఉంటే సీత అంత్యక్రియలు2020 సెప్టెంబర్ 20న మరణించారు .హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు 21న ముగిశాయి. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

సశేషం

రిపబ్లిక్ దే శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి-3(చివరిభాగం )

·           1955లో విఠాలాచార్య డైరెక్షన్ లో వచ్చిన కన్యాదానం లో కాంతారావు జానకి ,వహీదా రెహ్మాన్ లతోపాటు బాలసరస్వతి’’ లీల’’ గా నటించారు.మాటలు పాటలు శ్రీ శ్రీ .యోగానంద్ డైరెక్షన్ లో విజయగౌరి లో రామారావు లలితా పద్మిని లతో నటించారు .జూనియర్ సముద్రాల రచన ..1956లో జోయాఫిలిమ్స్ బాల  సన్యాసమ్మ లో పి.సుబ్బారావు డైరెక్షన్ లో జగ్గయ్య జివరలక్ష్మి కృష్ణకుమారి ల సరసన నటించారు .జు సముద్రాల రచన .బీస్ రంగా డైరెక్షన్ లో భక్తమార్కండేయ లో పుష్పవల్లి రఘురామయ్య లతో నటించారు రచన సముద్రాల .విశ్వనాధం రామమూర్తి సంగీతం .వేదాంతం రాఘవయ్య దర్శకత్వం మల్లాదివారి మాటలుపాటలు ,ఘంటసాల సంగీతం తో వచ్చిన వినోదావారి చిరంజీవులు సినిమాలో నటించారు .విక్రం ప్రొడక్షన్స్ తెనాలి రామ కృష్ణలో బీస్ రంగా డైరెక్షన్ లో అగ్ర తారాగణంతో నటించారు .పి.పుల్లయ్య డైరెక్షన్ లో జూపిటర్ వారిఉమా సుందరి చిత్రం లో రామారావు నాగయ్య కన్నాంబ శ్రీరంజని లతోపాటు నటించారు. సంగీతం అశ్వత్ధామ రచన సదా శివ బ్రహ్మం .’’రాయే రాయే సిన్నదానా రంగైన పిల్లదానా ‘’పాటపిఠాపురం పాడగా ఈమెపై చిత్రించారు .  …1957లో సారంగధర లో రామారావు భానుమతి లతోపాటు మల్లిక వేషం వేశారు .శాంతినివాసం లో ‘చక్కనిదానా చిక్కని దానా ఇంకా అలకేనా ‘’పాట కు రేలంగితో నటించారు .శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం లో శరభగా రామణా రెడ్డి సరసన భార్యగా చేశారు .పదవే పోదాముగౌరి ‘’పాట వీరిద్దరిపై తీశారు .సిరిసంపదలు లో కొండమ్మగా చేశారు .కొసరాజు రాసిన ‘’కొండమ్మో ఓ బంగారపు కొండమ్మో’’ఈమెపై చిత్రించారు .1963 శ్రీ కృష్ణార్జున యుద్ధం లో చినముని అల్లుతో సరసాలు సాగించే సుభద్ర చెలికత్తె గా వేసి ‘’ అంచలంచెలు  లేనిమోక్షము చాలాకష్టమే భామినీ- ‘ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చినమునీ ‘’అన్న పాటలో చిరస్మరణీయంగా నటించారు .పెండ్యాల మ్యూజిక్ పింగళి సాహిత్యం ,బిగోపాలం ,స్వర్ణలత గానం లో మైమరపించారు .తిరుపతమ్మకధలో ‘పో పోరాపోకిరి మామయ్యా’’సాంగ్ చిత్రీకరణ లో ఉన్నారు .కానిస్టేబుల్ కూతురులో,నాదీ ఆడజన్మే లో  నటించారు .

·           1965బొబ్బిలి యుద్ధం లో వెంకటలక్ష్మి గా నమ్మకమైన రాణీ వాసపు దాసిగా నటించి రంగారాయుడు మల్లమ్మ ఏకైక సంతానాన్ని తెల్ల దొరలకళ్ళు కప్పి రక్షింఛి చివరికి ప్రాణాలు సైతం పోగొట్టుకొన్న పాత్రలో అత్యద్భుతంగా నటించారు .1969లో ఆదర్శకుటుంబం లో నూ ,మాతృదేవత లోనూ ,1971లో ఆనందనిలయం లో ,జీవిత చక్రం మొదలైన సినిమాలలో  తనదైన శైలిలో నటించి  మెప్పించారు సురభి బాలసరస్వతి .

ఆమెగురించి నాకు వీకీపీడియాలో ‘’-సురభి బాలసరస్వతి తెలుగు చలనచిత్ర హాస్యనటి. ఈమె హాస్యపాత్రలతో పాటు కొన్ని చిత్రాలలో నాయికగా, ప్రతినాయికగా కూడా నటించింది. సురభి బాలసరస్వతి1931,జూలై 3న ఏలూరులో జన్మించారు.[‘’

అనే వాక్యం తప్ప ఏరకమైన సమాచారమూ ఎక్కడా  దొరకలేదు .నాకు చాలా బాధకలిగి నేనే వరుసపెట్టి 1940నుంచి 1960 వరకు వచ్చిన సినిమాలు ఆతర్వాత వచ్చిన సినిమాలు వెతికి ఆమె నటించిన పాత్రలు ఆమెపై  చిత్రించిన పాటలు , రచన ,దర్శకులు సంగీత దర్శకుల వివరాలతో మూడు ఎపి సోడ్  లు రాసి హమ్మయ్య అని తృప్తి చెందాను .

 మంచి భారీ పర్సనాలిటి ,చలాకీ  కవ్వించే కళ్ళు చక్కని డైలాగ్  డెలివరి ఎలాంటి పాత్ర కైనా  నప్పే అవయవ సౌష్టవం ,కమ్మగా పాడే స్వరం బాల సరస్వతికి పెట్టని ఆభరణాలు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

  మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి-2

·         1951లో వచ్చిన జ్ఞానాంబిక వారి మంత్రదండం సినిమాలో బాలసరస్వతి గిరిజగా నటించారు .అక్కినేని శ్రీరంజని శివరావు వగైర ఇతర  తారాగణం .ఈమె గిరిజ పాత్రపైఒక పాట ఉంది –‘’తలుపులు తలుపులు పరుగిడవా హాయ్ వలపులు పెనగోనవా హాయ్ –జిలిబిలి పలుకుల కలకల చెలగే

·         పులుగులు కనుగొన పులకలు కలుగవా హాయ్ –జలజల కురిసే కలికి వెన్నెలల తళుకులకలువకు కులుక విదేలా ‘’—దీనికి తాపీ వారు రచన ,నాళ౦ నాగేశ్వరరావు సంగీతం కూర్చారు .బాగ్రౌండ్ మ్యూజిక్ ఎస్ రాజేశ్వరరావు .1951లో ఆశ్వినివారి శ్రీధర్ డైరెక్షన్ లో వచ్చిన మాయలమారి లో అంజలి నాగేశ్వరరావు గార్లతో పాటు బాలసరస్వతి ‘’కురంజి ‘’గా నటించారు . ఈమెకూ ప్రతాప్ గా వేసిన నాగేశ్వరరావు కు ఒకపాట ఉంది .కురంజి –‘’మియాం మియం హి –హువాహువా –జమ్బాలో బాలో మియాం –ప్రతాప్ –మియాం మియాం కురంజి –సంబాలో గేర్రయ్యయ్యో –ప్రతాప్ –హువాహువాహువా ,కురంజి –హిహిప్పేప్పే హియుకేన్ కేరేఫైహి –ఇద్దరూకలిసి –టికోటికో హుం ఫక్-కుంగల కూడియో హే’’ దీని అర్ధం ఏమిటో మనకు బుర్ర బద్దలు కొట్టు కున్నా అర్ధం కాదు .చివరికి కురంజి –బాగ్గెం కలిగే సెయ్యి ,-బంగారం సిలికే సెయ్యి –పాడిపంటలగల సెయ్యి –ఫలవంతమైనదీ ఈసేయ్యి –అంటూ ‘’నామాట నమ్మ వె కొమ్మా –పెళ్లి రేకలే పెల్లుగ ఉండాయ్-పోల్లుగాదులే తల్లీ –మూతిని మీసం ఉన్న వొళ్ళు –నీకు ముగ్గురు మొగుల్లె తల్లీ ‘’అని బహుశా సోదే చెప్పివుంటుంది . ఒక జిప్సీ డాన్స్ లో కూడా కురంజి గా బాలసరస్వతి నటించారు –ఝాలకిల బోలె షికోరిబోలె జోజో ఖోలే అంటే మిగిలిన జిప్సీలు –లకిబికి బొమికిలియా –రఖి రఖి రోమికిలియా – అని పదం కలిపితే కురంజి –రాఖిలా షోకిలా ,-జనుక బులన మీలానా జాను బొలన ‘’అంటూ సాగే తమాషా గీతం .మొదటిపాట ఆదినారాయణరావు రాస్తే రెండో దాన్ని తాపీ రాశారు .సినీ సంగీతం ఆదినారాయణరావు కూర్చారు .

·            1951లో వచ్చిన స్వాతి వారి రూపవతి సినిమాలో బాలసరస్వతి హీరోయిన్ రూపవతిగా నటించారు నారాయణరావు ,శివరావు ,జిఎన్ స్వామి మగపాత్రలు .బాలసరస్వతిపై ఒకపాట-‘’నాడిచూడ గలరా –మందులేవి దాచినా-సెలవిండి దయయుంచి –భలేభలే వైద్యులే దండము ఆడెను దాసోహం –మీ చేతిమాత్రా వైకుంఠ యాత్రా ‘’ఇందులో చివరిమాట లోకం లో పాతుకుపోయినమాట .రూపకు కుమార్ కు యుగళగీతం –‘’రూప –కలవరమాయే నా మదిలోనా ఇదేమిటీ వేళా-ఆనందమాయే హేతువేమో మరి హేతువేమో –అంటే కుమార్-విధియే వెర్రి గాలి ఎన్నో అలలై వీచీ వీచీ –కలదోసేగానా మనజీవితాలూ మేలాయే నీ వేళా’’అంటాడు .మరో యుగళం లో రూప –తెలుసుకోవోయి తెలుసుకోవోయి నేదాచినదీ తాయమేమో –అంటే కుమార్ –దాచినదీ తాయమేమో తెలుసునే రాణీ ‘’అని సాగుతుంది .రూపకు ఒక విషాదగీతం కూడా ఉంది –‘’నీకు నే దిక్కనుకొంటి నాడు తారుమారాయేనా బతుకు తీరు –దిక్కుమాలితి నేడు రావమ్మ తోడూ –ఎన్నెన్నో ఆశలు అడుగంటేనే కంటి నీరే ఆ పై మిగిలినదీ ‘’.రూపవతికి మరో భక్తిపాట –‘’ప్రభో నీ చల్లని చూపుల స్వాతి వానయే ప్రవిమలానందదాయీ –కనవా వినవా రావిదేల కోపమా నిన్నే ఎంతోనమ్మినానే నీకిది న్యాయమా ‘’ మరో డ్యూయెట్ కూడా రూపా కుమార్ కు ఉంటుంది .రూపకు –కన్నారచూచి  దీవించికరుణించ రాలేనేవా ప్రభూ –కనుదోయి నాకేల దీనముగా ఈ బ్రతుకెల “’ అనే విషాదగీతం ,మరో గీతం లో ఇద్దరూ –కానలేవా స్త్రీధనమోయి ,,శీలమోయీ పావనమోయీ –రావోయి స్వర్గంమోయి కాదా సతి లీలా ఇలా అనిరూప అంటే –సత్యశీలా నువ్వేనే ధన్యజీవీ నేనేనీ –స్వర్గామేదే లేదే ఇదే లేవే నిజంగా ‘’  అంటూ ఆనందంగా పాడి సుఖాంతం చేస్తారు అక్కినేని బాలసరస్వతి నాయకా నాయికలుగా .

·          .రచన శ్రీ శర్మ సంగీతం సుబ్బరాయన్ .గానం పిఠాపురం ,జిక్కి ,రావు బాలసరస్వతి .దర్శకత్వం కే ప్రభాకర్ .అంటే ఈసినిమాలో బాలసరస్వతి నవరసాలు పోషించిందని అర్ధమౌతోంది హీరోయిన్ గా తన సత్తా నిరూపించారు .1954 పక్షిరజావారి అగ్గిరాముడు సినిమాలో రామారావు భానుమతి లతో పాటు జానకి పాత్రలో బాలసరస్వతి నటించారు .ఇదే ఏడాది గోకుల్ ఆర్ట్ పిక్చర్స్ తాతినేని ప్రకాశరావు డైరెక్షన్ లో నాగేశ్వరరావు జమున మొదలైన వారు నటించిన నిరుపేదలు సినిమాలో బాలసరస్వతి నటించారు .అలాగే జనతావారి పరివర్తన లో సావిత్రి ,రామారావు లతో కాసులు పాత్ర పోషించారు .ఇందులో ఒకపాట-ఇంతచల్లనివేళ విన్తపిలుపులివేల –ఇంతమోహమిదేలా ‘’ఆమెపై చిత్రించారు మాటలు అనిశెట్టి ,పాటలు పినిశెట్టి మ్యూజిక్ చలపతిరావు డైరెక్షన్ తాతినేని ప్రకాశరావు గార్లు .అలాగే అంజలి వారి అనార్కలి లో అనార్ సఖి గుల్నార్ గా బాలసరస్వతి నటించారు ఈమెపై –‘’కులాసాల సరసాల కురిపింతురా .-ఖుషీగా విలాసాల మురిపింతురా – హమేషా తమాషాల అలరింతురా ‘’పాటచిత్రించారు .ప్రేమ జగానా వియోగానికేనా ప్రేమగాధ విషాదాన్తమేనా-బ్రతికించు శ్రహరాజదసూ ఐ ఖుదా –నీకో సలామో ఖుదా ఖుదాఖుదా’’ చాలా అర్ధవంతమైన డీ అనార్కలిని కాపడేది ఈ పాట.సముద్రాల సాహిత్యం ఆదినారాయణరావు సంగీతం వేదాంతం రాఘవయ్య గార్ల దర్శకత్వం లో ఈ సినిమా ఒక క్లాసిక్ అయింది .

·           1955లో పి.పుల్లయ్యగారి డైరెక్షన్ లో శాంతకుమారి ,నాగేశ్వరరావు జగ్గయ్యలతో పాటు జగ్గయ్య లతోపాటు జగ్గయ్య రప్ర్మికురాలు వాంప్ నీల వేణి గా బాలసరస్వతి గొప్పగా నటించారు .నీలవేణి పాడిన ‘’ఏడవనీ ఏడ్చే వాళ్లను ఏడవనీ నవ్వే వాళ్ళ అదృష్టమేమని –నాలుగు ఘడియల నరజీవితమూ –నవ్వండి నవ్వే వాళ్ళతో నవ్వండి –నవ్వుల తోటగా చేయండి ‘’పాట సూపర్ హిట్ అయి చాలాకాలం మోతమోగించింది .అలాగే ‘’సిగ్గేస్తాదోయ్ బావ  సిగ్గేస్తాదోయ్ –మొగ్గలేను ఒగ్గలేను మొగమెత్తీ చూడలేను –పచ్చికా బయలులోన మచ్చికగా మనముంటే –సిగ్గులేని చందమామ చాటు నుండీ చూస్తాడు ‘’పాటకూడా హిట్ సాంగే .వీటి అభినయం గురంచి వేరే చెప్పాలా ?ఆత్రేయ రచనకు పరాకాష్ట .

·           కాంతారావు సీస్ ఆర్ జానకి వగైరా నటించి  విఠాలాచార్య దర్శకత్వం లో వచ్చిన కన్యాదానం సినిమాలో బాలసరస్వతి గిరిజ గా నటించారు .మాటలుపాటలు శ్రీశ్రీ

·          సశేషం

·         మీ గబ్బిట దుర్గాప్రసాద్ -24-1-22-ఉయ్యూరు .

·              

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి -1

సురభి బాలసరస్వతి తెలుగు చలనచిత్ర హాస్యనటి. ఈమె హాస్యపాత్రలతో పాటు కొన్ని చిత్రాలలో నాయికగా, ప్రతినాయికగా కూడా నటించారు. సురభి బాలసరస్వతి1931,జూలై 3న ఏలూరులో జన్మించారు .

  1947లో వచ్చిన పల్నాటి యుద్ధం సినిమాలో మొదటిసారిగా నటించారు .ఆ ఏడాదే వచ్చిన ఛత్రపతి వారి రాధిక లో మరో బాలసరస్వతి కథానాయకి గా ఈమె ఉపనాయకిగా  నటించారు.దీనికి మ్యూజిక్ సాలూరు హనుమంతరావు అందించగా డైరక్షన్ విపిటి  సకే చేశారు ..స్వతంత్ర వారి ద్రోహి చిత్రంలో నర్సుగా నటించారు .వరలక్ష్మి లక్ష్మీరాజ్యం ,శివరావు వగైరా నటించగా మ్యూజిక్ పెండ్యాల ,ఇందులో కామ్పౌండర్, నర్స్ యుగళగీతం ఉంది .’’చక్కర కొట్టుకు వచ్చావా –బలే టక్కరి దానివే చినదాకా’’ అని శివరావు  అంటే –నర్స్ –‘’టమారి మాటల పిలగాడా –నీ దిమాకు చూపకు నా మీద ‘’పాటకాంపౌ౦డర్ శివరావు నర్సు బాలసరస్వతిపై చిత్రీకరించారు .1949లో వచ్చిన ఆక్కినేని,అంజలి నటించి ,ఘంటసాల సంగీతం కూర్చి మీర్జాపురం రాజా డైరెక్ట్ చేసిన కీలుగుఱ్ఱం లో నటించారు .అదే సంవత్సరం భరణీ వారి లైలా మజ్ను లో భానుమతి ,నాగేశ్వరరావు లతోపాటు సురభి బాలసరస్వతి’’ జోరా’’ పాత్ర పోషించారు .ఇందులో బాలసరస్వతి ఒకపాట –‘’అనగా అనగా ఒకఖాను –ఆ ఖానుకో జనానా –ఆ జనానాలో తొంభై తొమ్మిది మంది బేగాలూ రాగాలు –హమేషా గానా పీనా బజానా –అయినా సరదాతీరని –సర్దార్ మరో నిఖాకు తయార్ –అందని ఆకాశం లో ఒక చందమామ కావాలి –కనమంటే కళ్ళున్న కబోది –వినమంటే చెవిటి –కళ్ళూ మనసూ గల ఏ పిల్లదీ –  రమ్మంటున్నదీ ఆ తిమ్మన్ననీ –అమావాస్య అర్ధరాత్రి మస్తుమస్తుగా ముస్తాబై –కొమ్మో బొమ్మో తెలియని చీకట్లో –ఓచిన్నదాన్ని చూసి చేయి సాచి –ముసుగు తీసి చూశాడు –అంతకంటే చక్కందాఇంతుల మేల్బంతి –మెల్లకన్నూ సొట్టమూతీ-పిల్లను చూశాడు –గుభేల్ గుభేల్ మని గుండెల్లో –సైతాన్ సైతాన్ అంటూ ఖాన్ ఒకటే దౌడు ‘’దీని దర్శకత్వం భానుమతి భర్త రామ కృష్ణ. సంగీతం సుబ్బరామన్ .రచన సీనియర్ సముద్రాల .బాలసరస్వతి చలాకీ తనానికి మచ్చు గా ఉంటుంది ఈ పాట.

  నాగయ్య రామారావు రేలంగి కృష్ణవేణి హేమలత వగైరా నటించి ,ప్రసాద్ డైరెక్షన్ లో సముద్రాలరచన ,ఘంటసాల సంగీతం కూర్చిన ‘’మనదేశం ‘’సినిమాలో శోభగా వేసిన కృష్ణవేణి స్నేహితురాలు గా బాలసరస్వతి నటించారు .బిఎ సుబ్బారావు డైరెక్షన్ లో శోభనాచాలావారి పల్లెటూరిపిల్ల సినిమాలో అంజలి ,నాగేశ్వరరావు లతోపాటు ‘’కంప ‘ పాత్ర పోషించారు .శివరావు దర్శకత్వం లో పరమానందయ్య శిష్యులు లో నటించారు. దీనికి ఓగిరాల సుసర్ల  సంగీతం.తాపీధర్మారావుగారు  రచన .   

  1950లో వచ్చిన సాధనావారి సంసారం లో రామారావు నాగేశ్వరరావు ,లక్ష్మీరాజ్యం సూర్యకాంతం లతో పాటు కామాక్షిగా నటించారు.రేలంగి తాతారాం ఈమె కామాక్షి.ఇద్దరికి –‘’ నా మాట వినవె రవ్వంత మోమాటమెందుకే ఇంత –ఏ నాటికైనా నీ వాడనే –అని అతడు అంటే ‘’చాలు చాలులే సరసాలు –చనువిచ్చితిననికాబోలు –చాటుకు రమ్మని ఒంటిపాటునా –ఇవా మంతనాలు –నీకు నాకు జోడు –ఈ అద్దం లో చూడు ‘’అనే సరదాగీతం లో ఇద్దరూ గొప్పగా నటించారు .ఘంటసాల బలరామయ్య గారి దర్శకత్వం లో 1950లో వచ్చిన ప్రతిభావారి శ్రీ లక్ష్మమ్మకథ సినిమాలో అంజలి నాగేశ్వరరావు లు హీరో హీరోయిన్ లు గా నటిస్తే బాలసరస్వతి ‘’చిట్టి ‘’పాత్ర నటించారు .రంగడు గా నటించిన శివరావు తో చిట్టిగా నటించిన బాలసరస్వతి లకు ఒక సరదా పాట ఉంది –‘’చీటికి మాటికి చిట్టేమ్మంటావ్-పెదరాయు డుంటడు చిన రాయు డుంటడు –కరణాలుంటరు కాపులుంటరు –చీపురు దెబ్బలు తింటవురో-అయ్యా పిల్లోడా మా అయ్యోస్తే మరి తంటారో’’అని  చిట్టి అంటే రంగడు –‘’అబ్బో అబ్బో అలాగునైతే –అంతకు తగిన బొంతను నేను –అయ్యకు దయ్యం వదిలిస్తాను పట్టుకు భరతం పట్టిస్తాను –అమ్మీ చిట్టమ్మీ-మీ అయ్యకు భరతం పడతానే ‘’పాట సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా ఫ్లాప్ అయినా . వీళ్లిద్దరిమీదా మరోపాటకూడా ఉంది – ‘’రాకరాక నీ వోచ్చావోయ్ నా కేటి సరుకులు తెచ్చావోయ్ –‘’అని ఆమె అంటే –అతడు –‘’సీరరెడతా సారేడతా-సెవిలోకి పోగేడతా –కాసుల పెరేడతా ,బేసరి కొని బెడతా ‘’-సిట్టి పొట్ట౦టావు-మిట్టిపడిపోతావు –గట్టి సరుకేమున్దోయ్ గడసరి బావా ‘’అంటే అతడు ‘’నా జిలిబిలి పలుకుల చిలకా –నా తలపుల వలపుల గిలకా –నా అత్తరి బిత్తరి ఇత్తడి పిత్తడిబంగారు బొమ్మా ‘’ అంటూ సాగే పాడే పాటలోకూడా ఇద్దరూ ఒకర్నిమించి ఒకరు నటిస్తారు .పాటలు మాటలు –బలిజే పల్లి ,గోపాలరాయ వర్మ ద్వయం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | 1 Comment

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -34

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -34

34- స్త్రీ పాత్రలలో రాణించిన రంగస్థల ప్రసూన – వడ్లమాని విశ్వనాధం

వడ్లమాని విశ్వనాథం నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి బళ్లారి రాఘవ వంటి వారి మెప్పును పొందినవారు

. జీవిత విశేషాలు
ఇతడు 1912లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, నందంపూడి అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడుగారల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించారు

నాటకరంగ
1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ద్వారా పెద్దాపురం విద్యా వినోదినీ సభలో ప్రవేశించారు. చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి, కేశవరపు కామరాజు, కోఠీ శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణతో “హరిశ్చంద్ర” నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించారు. ఆ నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వింజమూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి పాత్రను మద్దూరి కోదండరామదీక్షితులు నటించారు. ఉద్దండులు ప్రదర్శించే ఆ నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం అడుగడుగునా అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక నూతన కాంతి ఏర్పడేది. కాలకౌశికునకు చంద్రమతిని విక్రయించి, తాను వీరబాహునకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో దుఃఖించేటప్పడు ఇతడు లోహితుడుగా చూపించిన సాత్వికాభినయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది. కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో కాకినాడ లోని యంగ్ మెన్స్ హాపీ క్లబ్ వారు ఇతడిని తీసుకువెళ్ళారు. ప్రప్రథమంగా ‘కృష్ణలీల’లో చిన్న కృష్ణుని పాత్రను, ప్రహ్లాద పాత్రను, ధ్రువ, మార్కండేయ, లవుడు, రఘురాముడు మొదలైన ముఖ్య బాలపాత్రలను అద్భుతంగా నటించి బాలనటుడిగా ఒక స్థానాన్ని సంపాదించారు. 1926 నాటికి ప్రమీలార్జునీయంలో ప్రమీల, ‘చింతామణి’లో చింతామణి, జవ్హరీబాయి, సావిత్రి, మోహిని మొదలైన ముఖ్య స్త్రీ పాత్రలను పోషించారు. బాలకృష్ణుడు మొదలు భక్తరామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు సమస్త ముఖ్య స్త్రీ, పురుష పాత్రలను ఇతడు ధరించారు.

ముఖ్యంగా ఇతడు నటించిన “ప్రమీల”, “రోషనార”, “చింతామణి” నాటక ప్రదర్శనాలతో వచ్చిన డబ్బుతో కాకినాడలో ది యంగ్ మెన్స్ పాలెస్ థియేటర్ కట్టడమనేది చర్చిత ప్రసిద్ధమైన విషయం. ఆ గౌరవం ఇతడికే దక్కింది.

ఇతడు స్త్రీ పాత్రలేకాక, రామదాసు లో “రామదాసు”, విప్రనారాయణలో “విప్రనారాయణ” మొదలైన పురుష పాత్రలను అద్భుతంగా అభినయించి మెప్పించాడు.

1930 లో “యంగ్‌మెన్స్ యూనియన్” పేరుతో స్వంత కంపెనీ స్థాపించి 1932 వరకు నడిపి, ఎస్.పి.లక్ష్మణస్వామి, ఎ.వి.సుబ్బారావు, రేలంగి మొదలయిన బాల్యమిత్రులతో ఆనేక నాటకాలను ప్రదర్శించారు. ఆ తరువాత 1935 వరకు పారుపల్లి సుబ్బారావుగారి కంపెనీలో బలిజేపల్లి వారితో హీరోయిన్‌గా ఎన్నో నాటకాలు ఆడారు. సి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఈయన సహకారంతో స్వంత కంపెనీ స్థాపించి “తుకారాం”, “పతితపావన”, “చింతామణి”, “రాధాకృష్ణ” వగైరా నాటకాలు ప్రదర్శించారు. దురదృష్టవశాత్తు 1937 లో తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెడిపోయి, రంగస్థలం నుంచి నిష్క్రమించారు

సినిమారంగం
ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడం వల్ల సినిమా రంగంలో ప్రవేశించారు. పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన శ్రీవేంకటేశ్వర మహత్యం (1939) నుండి శ్రీవెంకటేశ్వర మహత్యం (1960) వరకు, నాటి శివరావు నటించిన పరమానందయ్య శిష్యులకథ(1950) నుండి పరమానందయ్య శిష్యులకథ(1966) వరకు అనేక చిత్రాలలో బహువిధమైన పాత్రలను ధరించారు.

ఇతడు నటించిన సినిమాల జాబితా:

  1. శ్రీ వెంకటేశ్వర మహత్యం (1939)
  2. పరమానందయ్య శిష్యులు (1950)
  3. సంతోషం (1955)
  4. శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
  5. నవగ్రహ పూజామహిమ (1964)
  6. పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా) (1966)
  7. తల్లి ప్రేమ (1968)
  8. రాజకోట రహస్యం (1971)
  9. మల్లమ్మ కథ (1973)

సన్మానాలు
తెలుగుదేశంలో ఉన్న పెద్ద నటులందరితోను నటించి, లెక్కలేనన్ని బంగారు పతకాలు, రజితపాత్రలు అందుకున్నారు. మైసూర్ మహారాజా, హైదరాబాదు రాజా కృష్ణప్రసాద్, జయపూర్ మహారాజా వంటి కళాపోషకులతో సత్కరింపబడ్డారు.

బిరుదులు
·

ఆంధ్ర రంగస్థల నక్షత్రం

బాలనట భానుడు

· రంగస్థల ప్రసూన

· భావ చింతామణి

· నటశిఖామణి

· ద్వారంవెంకటస్వామి నాయుడు గార్ల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించారు. అదేసంవత్సంలో వింజమూరివెంకట లక్ష్మినరసింహా రావుగారి ద్వారా, పెద్దాపురం విద్యావినోదిని నాటకసంస్ధలొ ప్రవేసించారు. చావలిలక్ష్శినారాయణశాస్త్రి, కేశవరావుకామరాజు, కోఠీశేషగిరిరావు వారిసరసన హరిశ్చంద్ర నాటకంలో లోహితుని పాత్రను పోషిస్తూ నాటక రంగంలో ప్రవేశించారు. అనంతరం కాకినాడ లోని యంగ్ మెన్స్ హేపి క్లబ్ లో చేరి చిన్నికృష్ణుడు, ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, లవుడు మెదలగు బాలపాత్రలు చేయసాగారు. అలా బాలకృష్ణుని మెదలు భక్తరామదాసు వరకు, చిత్ర మెదలుకొని చింతామణి వరకు స్త్రీ పాత్రలతో సమంగా పురుషపాత్రలు ధరిస్తూ వందలాది నాటకాలు నాటి ప్రముఖ నటీ, నటులు అందరి సరసన నటించారు.

అదేకంపెనీలో రేలంగి, ఎస్.పి.లక్ష్మణస్వామి, ఏ.వి.సుబ్బారావు వీరికి మంచి మిత్రులుగా ఉండేవారు. అనంతరం 1935 వరకు పారుపల్లి సుబ్బారావు. బలిజేపల్లి, సి.యస్.ఆర్.గార్లతో పలునాటకాలు ప్రదర్శించారు. 1937 అనారోగ్యంతో నాటకరంగానికి దూరమై కొంతకాలానికి సినిమా రంగంలో ప్రవేసించారు. జానపద-పౌరాణిక చిత్రాలలో దాదాపువీరు మునిగా, బ్రాహ్మణుడుగా, పండితుడిగా ఎన్నో వందలరకాల పాత్రలు వందల సినిమాలలో కనిపిస్తారు అన్ని అతిథి పాత్రలే! అలా ముపై సంవత్సరాలు వెండితెరపై వెలుగొందారు. 1973 మార్చి18 వతేదిన 62వ ఏటమద్రాసు రాయపేటలోని వైద్యశాలలో తుదిశ్వాస వదిలారు.

· ఈయన మొదటి సారిగా విజయావారి పాతాళభైరవిలో నటించినపుడు కొడుకు పుడితే విజయప్రసాద్ అని పేరుపెట్టారు .ఈయనే ఆతర్వాత విజ్జిబాబు పేరుతొ జంధ్యాల మల్లె పందిరి సినిమా హీరోగా నటించారు .ఆతర్వాత చాలా సినిమాలలో నటించారు .

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -33

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -33

33-పొట్టను బుజాలపై వేలాడే బొందుల పాంట్ కుక్కి , మెడలో స్టెతస్కోప్ తో నవ్వించే –డా .శివరామ కృష్ణయ్య

సుమారు నలభై ఏళ్లకు పైబడిన విషయం జ్ఞాపకం వస్తోంది .మాపెద్ద క్కయ్యలోపాముద్ర, బావ కృపానిధి గారి ఇంటికి మద్రాస్ వెళ్లాను .వాళ్ళుండేది షినాయ్ నగర్ . అప్పటికి మా మేనల్లుడు మేనకోడళ్ళు చిన్న వాళ్ళు .ఏమీ తోచక ఒక రోజుఉదయం షినాయ్ నగర్ లో సిటి బస్ ఎక్కి తాంబరం లో దిగి అక్కడ లోకల్ ట్రెయిన్ ఎక్కి సరదాగా అది ఎక్కడిదాకా వెడితే అక్కడికి టికెట్ తీశాను .పది నిమిషాలు దాటగానే కుడివైపు ఇళ్ళల్లో ఒక ఇంటి వసారాలో గావంచా కట్టి పైన తువాలు తో ఒక భారీకాయం బాదం ఆకు విస్తళ్ళు కుడుతున్నట్లుగా చూశాను .ఎక్కడిదీ శాల్తీ అని ఆలోచిస్తే ఆయన సినిమాలో హాస్య వేషాలు వేసే డాక్టర్ శివరామ కృష్ణయ్య అని గుర్తుకొచ్చింది .ఇంటికి వచ్చాక ఆ విషయ౦ మా అక్కయ్యకు చెబితే నిజమే ఆయనే అని చెప్పింది .విజయవాడలో ఇంటర్ చదివేటప్పుడు విజయ టాకీస్ దగ్గర సిగరెట్ కాలుస్తూ ఉన్న సి ఎస్ ఆర్ ను చూశాను మళ్ళీ ఇప్పుడు ఈయన్ని చూశాను .అదేదో గర్వంగా ఉండేది .

సుమారు ఏడెనిమిది ఏళ్ల క్రితం బెంగుళూర్ లో ఉండే కవన శర్మ అనే కందుల వరాహ నరసింహ శర్మగారు రచన మాసపత్రికలో ఒక కాలం నడుపుతూ శివరామ కృష్ణయ్యగారు తమ బంధువే అని ఆయన గురించినతన జ్ఞాపకాలు రాస్తే ,నేను ఆయన మెయిల్ అడ్రస్ కు పైన రాసిన మద్రాస్ విషయ౦ రాశాను .వెంటనే ఆయన స్పందించి జవాబిచ్చారు .అప్పటినుంచి మా ఇద్దరిమధ్యా మెయిల్స్ ‘’మొయిళ్ళు’’ లాగా కొంతకాలం నడిచాయి .శర్మగారు ప్రముఖ సైంటిస్ట్ .సైంటిఫిక్ రచనలు, కధలు మహా బాగా రాసేవారు .అవంటే నాకు బాగా ఇష్టం కూడా .ఒకసారి బందరులో కృష్ణా యూని వర్సిటి తెలుగు శాఖకు కు మా సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు (అమెరికా)విరాళంగా అందజేసిన 20 వేల రూపాయల చెక్ ను వైస్ చాన్సలర్ గారికి అందజేయటానికి మా దంపతులం ,శ్రీ వైబిజి రావు గారు వెళ్లి వేదికపై శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి చేతులమీదుగా వైస్ చాన్సలర్ మైనేని దుర్గా ప్రసాద్ గారికి సరసభారతి ద్వారా అందజేశాను .అప్పుడు లంచ్ బ్రేక్ సమయం లో కవన శర్మగారితో పరిచయమైంది. చాలా సౌమ్యంగా ఆప్యాయంగా మాట్లాడారు .శర్మగారు శ్రీకాకుళం లోని కారా మాస్టారి కదా నిలయంతో గొప్ప అనుబంధమున్నవారు తరచుగా అక్కడికి వెళ్లి వస్తూండేవారు .

శివరామ క్రిష్ణయ్యగారి అసలుపేరు డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య (1899 – ) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులు.[1]

తెనాలి సమీపంలోని పెదరావూరు గ్రామ వాస్తవ్యులు. వీరు వైద్యవిద్యలో పట్టభద్రులు.

వీరు కొంతకాలం కొంగర సీతారామయ్య గారు స్థాపించిన నాటక సమాజంలోను, రామవిలాస సభ లోను వివిధ పాత్రలు పోషించారు. దుర్యోధనుడు, రామదాసు, కబీరు, చాణక్యుడు, హిరణ్యకశిపుడు, కాశీపతి మొదలైన పాత్రలు ధరించి పేరుపొందారు.

వీరు మొదటగా నటించిన చలనచిత్రం భలే పెళ్ళి (1941). జీవన్ముక్తి (1942) సినిమాలో కథానాయకుడిగా కూడా నటించి మెప్పించారు. తర్వాత కాలంలో వీరు సుమారు 200 సినిమాలలో నటించారు. వీరు స్థూలకాయం కలిగివుండడం మూలంగా ఎక్కువగా హాస్య పాత్రలు ధరించేవారు.

చక్రపాణి సినిమాలో నాగేశ్వరరావు అక్క చాయాదేవి భర్తగా శర్మ భలే చలాకీగా నటించారు .పింగళిగారి మొదటిసినిమా భలేపెళ్లి ,పెళ్లి చేసి చూడు లో రామారావు తండ్రి సివివి పంతులుగా ,తోడు దొంగలు లో డాక్టర్ గా , ,కే ఎస్ ప్రకాశరావు దర్శకత్వం లో వచ్చిన అంతేకావాలి లో ,యోగానంద్ డైరెక్షన్ లో వచ్చిన ఇలవేల్పులో ,పెళ్లినాటి ప్రమాణాలు లో నందాజీగా ,వి మధుసూదనరావు డైరెక్షన్ లో ఆరాధనలో ,దక్షయజ్ఞం లో ,లవకుశలో రేలంగి మామగా ,పరమానందయ్య శిష్యులకధలో విరూపాక్షయ్యగా ,ప్రాణమిత్రులు లో ,బాపు దర్శకత్వం లో సాక్షి లో , కెవిఎస్ కుటుంబరావు డైరెక్షన్ లో రాజనాల కాళేశ్వర రావు అంటే రాజనాల ,విజయనిర్మల నటించి చెళ్ళపిళ్ళ సత్యం అంటే సత్యం సంగీతం కూర్చిన ఒకనారి వంద తుపాకులు అనే 1973లో వచ్చిన సినిమాస్కోప్ చిత్రం లో శివరామ కృష్ణయ్యగారు కొత్వాల్ కోటి లింగం గా నటించారు . గబగాబగా మాట్లాడటం ,నోటిలో పైప్ ,అవతలివాడు చెప్పేది వినకపోవటం వంటి లక్షణాలు ఆయన నటన వలన ఆరోగ్యమైన హాస్యాన్ని కురిపించింది .నిజమైన సినీ డాక్టర్ శివరామకృష్ణయ్య .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు మరుగు న  వెండి తెరమహానుభావులు -32

మన మరుపు మరుగు న  వెండి  తెరమహానుభావులు -32

32-కట్టబొమ్మన డైలాగ్ ఫేం- కెవిఎస్ శర్మ-2

ఎన్‌టీఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం, కె.వి.ఎస్,శర్మ మొదలైన వారందరినీ సభ్యులుగా చేర్చుకొని సొంతంగా ‘నవజ్యోతి సమితి’ అనే నాటక సంస్థను స్థాపించి, అనేక నాటకాలలో నటించారు.
ఠాగూర్ రాసిన ‘శాక్రిఫైస్’, రాయప్రోలు రాసిన ‘కొండవీటి పతనం’ నాటకాలలో నటించారు. 

‘‘వీరపాండ్య కట్టబ్రహ్మన్న’’ చిత్రం తమిళంలో 175 రోజులు పైగా ప్రదర్శింపబడింది. తెలుగులోనూ విజయవంతంగా నడిచింది.
ఈ చిత్రాన్ని హిందీలో ‘అమర్ షాహిద్‌గా’ 1960లో రూపొందించారు.

నటులు కె.వి.యస్.శర్మ, శివాజీ గణేషన్‌కి డబ్బింగ్ చెప్పారు

ఎస్సెల్సీ తర్వాత ఎస్‌ఆర్‌ఆర్‌ (అప్పటికి సివిఆర్‌ అని చేరలేదు) కాలేజీలో ఇంటరు (అప్పట్లో ఎఫ్‌ఏ)లో చేరాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు లెక్చరరు. కాలేజీలోనే కెవిఎస్‌ శర్మ (తర్వాతి కాలంలో సినిమా నటుడు)
1950 ప్రాంతంలో విజయవాడలో సుంకర కనకారావు, కొప్పరపు సుబ్బారావు, డి.వి.నరసరాజు, కె.వి.ఎస్‌.శర్మ, నిర్మలమ్మ మొదలైనవారితో కలిసి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించేవాడు.

ఇతివృత్తాన్ని అనుసరించి కథనంలో ఉత్కంఠతనీ, ఆశ్చర్యాన్ని కలిగించే అంశాన్నీ అవసరం మేరకు ఆయన జొప్పించేవారు. ‘లక్షాధికారి’లో కెవిఎస్‌ శర్మ పాత్రని విభన్నంగా చూపిస్తూ, గుమ్మడి పాత్రని సస్పెన్స్‌లో ఉంచడం ఓ టెక్నిక్‌. ‘జమీందార్‌’లో ఏయన్నార్‌ పాత్రను చివరివరకు డిటెక్టివ్‌ ఆఫీసర్‌ అని తెలియనివ్వకుండా కథ నడిపించడం మరో తార్కాణం. ‘అంతస్తులు’లో గుమ్మడి పాత్రలోని చీకటి కోణాలు చూపించిన విధానం మరువలేనిదే. ఇవన్నీ మధుసూదనరావు ‘మార్కు’లే

తెలుగులో తొలిసారి దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావు పరిచయమైన చిత్రం -అమర సందేశం. హిందీలో విజయవంతమైన బైజూ బావారా చిత్రానికి రీమేక్‌గా దీన్ని రూపొందించారు. కథానాయకుడు అమరనాథ్. జూ.శ్రీరంజని, పద్మిని, రేలంగి, తుర్లపాటి విజయలక్ష్మి, మాస్టర్ మోహన్, మిక్కిలినేని, కెవిఎస్ శర్మలాంటి ఉద్దండ నటులు.

 సశేషం

మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -21-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -32

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -32

32-కట్టబొమ్మన డైలాగ్ ఫేం- కెవిఎస్ శర్మ

సాధారణంగా శివాజీ గనేషన్ కు తెలుగు డబ్బింగ్ చెప్పాలంటే జగ్గయ్య కంచు కంఠమే సరైనది చాలాకాలం అనుకున్నాం కారణం ఆ గాంభీర్యం కంచు ఘంట లాంటి స్వరం అంతకు ముందు ఎవ్వరికీ లేదు .మనోహర సినిమాలో ఆయన శివాజీకి చెప్పిన డైలాగ్స్ రికార్డులు గా ప్రతి ఇంటా మారుమోగాయి .ఆయనకు దీటుగా కన్నాంబ డైలాగ్స్ అదిరిపోయాయి .కాని వీరపాండ్య కట్ట బొమ్మన సినిమాలో ఒక విలక్షణమైన అత్యంత ఉద్రేక పూరితమైన అన్ని రసాలను ఒలికించే కాంఠాన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలో విని ఆశ్చర్యపోయాం అవాక్కైయ్యాం .అద్భుతః అనుకొన్నాం ఎవరిదీ స్వరం అని ఆలోచించి కేవీస్ శర్మగారిదని తెలిసి పులకిన్చాం నిండారా అభినందించాం.

స్ఫురద్రూపం కళ్ళల్లోనే అన్ని భావాలు పలికించే నేర్పు విలక్షణమైనమేనరిజం తో కోటేరు తీసినట్లుందడే ముక్కుతో కొద్దిగా వంగినట్లు ఉండే రూపం ,తో ప్రతి డైలాగ్ అత్యంత స్పష్టంగా చెప్పగలిగే నేర్పున్నవారు శర్మగారు .

కె.వి.ఎస్‌.శర్మ రంగస్థల, సినిమా నటుడు. గుంటూరులోని ఎ.సి.కాలేజిలో చదువుకున్నారు. ఇతడు ముక్కామల, ఎన్.టి.ఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం మొదలైన వారితో కలిసి నవజ్యోతి సమితి అనే నాటక సంస్థ ద్వారా అనేక నాటకాలను ప్రదర్శించారు[1]. ఎన్.టి.ఆర్ స్థాపించిన నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థద్వారా “చేసినపాపం” వంటి ఎన్నో నాటకాలలో నటించారు[2].సాంఘిక జానపద పౌరాణికాలలో తనదైన ముద్రతో నటించిన డైలాగ్ కింగ్ శర్మాజీ .

1955లో వచ్చిన పాండురంగ మహాత్మ్యం లో సినీ రంగ ప్రవేశం చేసిన శర్మ ,అదే ఏడాది విడుదలైన దొంగల్లో దొర లో తాతాజీగా ,తర్వాత సువర్ణ సుందరి ,వీరకంకణం లో ముఖ్యపాత్ర ,అన్నాతమ్ముడు ,రాజ నందినిలో సదానందస్వామి గా ,శ్రీకృష్ణమాయ లో బ్రహ్మ దేవుడుగా ,అభిమానం లో చలం తండ్రి పిసినిగొట్టు సింగరాజు లింగారాజుగానటించారు ఇందులో ఆయనకూ చలానికి ఒకపాటలో మహా గొప్పగా నటించారు –‘’మదిని నిను నెరనమ్మితినే మాతా దయగను ధన లక్ష్మీ ఇదే తీరుగా ఖడే రావుగా నిలిచి ఉండవే ధనలక్ష్మీ ‘’పాట విని నవ్వుకొని వారుండరు . 1960లో వచ్చిన దేవా౦త కుడులో భద్రయ్యగా ,పినిశెట్టి డైరెక్షన్ లో నిత్యకళ్యాణం పచ్చతోరణం లో దాదా గా ,మహాకవి కాళిదాసు ,సీతారామకల్యాణం ,ఉషాపరిణయం ,అప్పగింతలు లో రామచంద్రయ్యగా ,గులేబకావళి ,చిట్టితమ్ముడు లో వింత పాత్రలో ,ఈడూ జోడూ లో ఆధ్యాత్మిక గురువు లక్ష్మీ పతిగా ,లక్షాధికారి , శకుంతలలో దుర్వాస మహర్షిగా ,1966లో శ్రీమతి సినిమాలో చివరిసారిగా శర్మ నటించారు .ప్రతిపాత్ర ఆయన చేతిలో పండింది .జీవించారు .ఆయన చెప్పిన ప్రతిడైలాగ్ వన్స్ మోర్ అనిపించేట్లుగా ఉంటుంది .ఇంతటి విలక్షణ విశిష్ట నటుడి గురించి పూర్తీ వివరాలు లభించకపోవటం శోచనీయం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనక మన వెండి తేర మహానుభావులు -31

మనమరుపు వెనక మన వెండి తేర మహానుభావులు -31

31-తొలి మహిళా చిత్ర నిర్మాత –దాసరికోటిరత్నం

గారంగస్థలంపై మహిళల పాత్రలను పురుషులే పోషించే కాలంలో నాలుగు దశాబ్దాలు నాటక రంగంలో స్త్రీ, పురుష పాత్రలను పోషించిన అసమాన నటీమణి దాసరి కోటిరత్నం. సినీరంగంలో ప్రవేశించి అనేక సినిమాల్లో నటించి చిత్రాలను నిర్మించిన తొలి మహిళా నిర్మాత ఆమె. 1935లో విడుదలైన ‘సతీ అనసూయ’ చిత్రానికి ఆమే నిర్మాత. తెలుగు సినిమా, నాటక రంగాలలో 45 సంవత్సరాల పాటు విశేషక షిచేశారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కోటిరత్నం 21-12-1910న జన్మించారు. ఆమె తండ్రి రంగస్థల నటుడు కావడంతో చిన్నప్పటినుండే కోటిరత్నానికి నటనలో శిక్షణ ఇచ్చాడు. తొమిదో యేటనే రంగస్థల వేదికపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితస్య, బొబ్బిలి యుద్ధం నాటకంలో చిన్నరంగారావు, లవకుశలో కుశుడు, ప్రహ్లాదలో ప్రహ్లాద మొదలైన పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారు. నాటకాలలో నటిస్తూనే రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అద్భుత నటనకు మధుర స్వరం తోడవటంతో మంచి నటీమణిగా పేరుతెచ్చుకున్నారు.
దాసరి కోటిరత్నానికి రంగస్థల నటిగా, గాయనిగా ప్రఖ్యాతి పొందిన ఆమె మహిళా నాటక సమాజాన్ని స్థాపించారు. నాటకల్లో స్త్రీ పాత్రలతో పాటు అనేక పురుష పత్రాలు ధరించేవారు. లవకుశ పాత్రలతోనే కాదు గంభీరమైన కంసుడు భీముడు వంటి పురుష పాత్రలను వేసి మెప్పించారు. సావిత్రి నాటకంలో సత్యవంతుడు, సక్కుబాయి నాటకంలో క ష్ణుడు, సతీ అనసూయ, గంగావతరణం మొదలైన నాటకాల్లో నారదుని పాత్ర కూడా పోషించారు.
నక్కబొక్కల పాడులో స్థిరపడి అక్కడ ఆమె స్థాపించిన నాటక సమాజానికి అనతి కాలంలోనే మంచి పేరు వచ్చింది. ఈ సమాజం వేసిన నాటకాలు కొన్ని ఐదు సంవత్సరాల పాటు నిరవధికంగా ప్రదర్శించబడ్డాయి. ఆ తర్వాత మకాం గుంటూరుకు మార్చి అక్కడ నాటక సమాజాన్ని కొనసాగించారు. ఆమె నాటక సమాజంలో పారుపల్లి సుబ్బారావు, తుంగల చలపతిరావు,25మంది మహిళా కళాకారులు ఉండేవారు. ఎన్నో నాటకాలు అభ్యాసం చేసి, ఊరూరా ప్రదర్శించేవారు. కోటి రత్నం నాటక సమాజంలోని వారందరికీ నెలవారీ జీతాలు ఇచ్చేవారు.
1935లో తన నాటక బ ందంతో కలకత్తా వెళ్ళి అక్కడ ఆరోరా ఫిలింస్‌ కంపెనీలో భాగస్వామిగా, బి.వి.రామానందం, తుంగల చలపతిరావులతో కలిసి భారతలక్ష్మి ఫిలింస్‌ అనే సంస్థను నెలకొల్పి, ‘సతీసక్కుబాయి’ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కోటిరత్నం టైటిల్‌ పాత్రలో సక్కుబాయిగా, తుంగల చలపతిరావు క ష్ణుడిగా నటించారు. టైటిల్‌ పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆమే కావడం గమనార్హం. 1935లో విడుదలైన ఈ సినిమాకు చారుచంద్ర రారయ్ దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ‘సతీ అనసూయ’ అనే మరో చిత్రాన్ని నిర్మించి, అందులోనూ టైటిల్‌ పాత్రలో నటించారు. లంకాదహనం, మోహినీ భస్మాసుర, వరవిక్రయం, పాండురంగ విఠల, వరూధిని, పాదుకా పట్టాభిషేకం, గొల్లభామ, బంగారు భూమి, అగ్నిపరీక్ష, చంద్రవంక మొదలైన సినిమాలలో నటించారు. 

 తండ్రి వద్దే నటన లో శిక్షణ పొంది 9 వ ఏట రంగస్థలం పై కాలుపెట్టి ,పేరుపొంది ,కొద్దికాలం లో  హరిశ్చంద్ర  లోహితాస్యుడు ,బొబ్బిలి యుద్ధం లో చిన రంగారావు ,లవకుశ లో కుశుడు ,భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుడు ,పాత్ర పోషణ చేసి మగవాళ్ళతో దీటుగా నటించి సెబాస్ అనిపించుకొన్నారు .నటిస్తూనే సంగీతం లో శిక్షణ పొందారు .అద్భుత నటనకు మంచి స్వరం తోడవటం తో గొప్ప నటీమణిగా స్థిరపడ్డారు .మహిళలు నాటకాలలో నటించటాన్ని వ్యతిరేకించే కాలం లో తాను నటించటమే కాకుండా ఒక నాటక సమాజం స్థాపించి ,ఊరూరా ప్రదర్శనలిచ్చిన సాహసి కోటి రత్నం .ప్రత్తిపాడు వదిలి తాతగారిఊరు నక్క బొక్కలపాడు చేరి నాటక సమాజం పెట్టిన ఘనత ,గౌరవం ఆమెది  ఈ సమాజంతో ఉషా పరిణయం శశి రేఖా పరిణయం,కృష్ణాలీలలు రామదాసు ,సావిత్రి  నాటకాలు ఆడారు  .తెనాలిలో పుట్టిన తోట రాఘవయ్య ,మల్లాది గోవింద శాస్త్రి ,పారుపల్లి సుబ్బారావు పారుపల్లి సత్యనారాయణ వంటి ఉద్దండ నటులు ఆమె నాటకాలలో పాత్రలు ధరించారు .అయిదేళ్ళు తాతగారి ఊరులోనే ఉండి నాటకాలు ప్రదర్శించి ,తర్వాత గుంటూరు చేరారు .

  కోటిరత్నం ప్రతిభ గుర్తించిన నవలానాటక సమాజం అధినేత  దంటు వెంకట కృష్ణయ్య ఈమెను పురుష వేషం వేయటానికి ఆహ్వానించారు .అప్పటికే ఆ సమాజం లో కన్నాంబ ,బందరు రమాబాయి ,గుంటూరు తిలకం ,శ్రీహరి ,అన్జనీబాయి ,సరస్వతమ్మ మొదలైన గొప్ప నటులున్నారు .వారితో కలిసి నటించే గొప్ప అవకాశం ఆమెకు లభించింది .నారద పాత్ర వేశారు .సతీ అనసూయ ,గంగావతరణం ,నాటకాలలో నారడుడుగా నటింఛి దాదాపు రెండు వందల రజత పతకాలను పొందారు .అవన్నీ మెడలో వేసుకొని పరవశం పొందేవారు .ఆరోజుల్లో కోటిరత్నం నాటకం అంటే చాలు ఎంతెంతో దూరాలనుంచి బళ్ళుకట్టుకొని వచ్చి చూసి మురిసిపోయేవారు ప్రేక్షకజబనం .

  పెరుగుతున్న ఆదరణ కు తగినట్లు మరొక నాటక సమాజం ఏర్పరచి సావిత్రి నాటకం ప్రదర్శించి సత్యవంతునిగా నటించారు .దీనికి కొప్పరపు సుబ్బారావు  దర్శకులు .మద్రాస్ లో రాయల్ టాకీస్ లో ఈ నాటకాన్ని చూసిన కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు ఆమెను ప్రత్యేకంగా అభినందించి బంగారు కంకణాలు బహూకరించారు .నైజాం లో నిజాం నవాబుకోటలో ఈ నాటక ప్రదర్శన చూసిన దివాన్ శ్రీ రాజా కృష్ణప్రసాద్ కోటిరత్నంగారికి వెండి గొడ్డలి, వెండి తాడు బహూకరించారు .ప్రదర్శి౦చిన ప్రతిచోటా సన్మానాలు బహుమానాలు పొందారు .

  శ్రీ కృష్ణ తులాభారం నాటకం లో కృష్ణ ,నారద పాత్రలు రెండూఆమే పోషించేవారు సమర్ధంగా ..తన సమాజం లో ప్రముఖనటులు దొమ్మేటి సత్యనారాయణ,  సూర్య నారాయణ లను చేర్చుకొని ‘’రంగూన్ రౌడీ నాటకం ‘’నాలుగేళ్ళు ప్రదర్శించి లెక్కలేని బహుమతులు,సన్మానాలు  పొందారు కోటిరత్నం .,

 ఇంతటి ప్రతిభా వంతమైన నటన ,సమాజ నిర్వహణ ఉన్న కోటి రత్నం గారికి అరుదైన సినిమా చాన్స్ లభించింది .ఈమె సమాజాన్నికలకత్తాలోని భారత లక్ష్మీ సంస్థ ఆహ్వానించి సతీ సక్కుబాయి సినిమాను నిర్మించింది .రామ చంద్రరే దర్శకుడు .కానీ ఈ సినిమాలో కోటిరత్నం సక్కూ బాయిగా ,తుంగల చలపతి రావు కృష్ణుడుగా  నటించటం గొప్ప విశేషం .సక్కు భర్తగా కుంపట్ల సుబ్బారావు ,గయ్యాళి అత్తగా సూరవరపు వెంకటేశ్వర్లు నటించారు .దీనికి రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులుగారు .1935మే21న సినిమా రిలీజయింది . ఈ సినిమాకోసం కలకత్తాలో నాలుగు నెలలు ఉన్నారు కోటిరత్నం .సినిమా నిర్మాణ మెలకువలన్నీ అవగతం చేసుకొన్న ప్రజ్ఞాశీలి ఆమె .

  ప్రయోగాలు చేయటం లో ముందు ఉండే కోటిరత్నం తన బృందంతో సంప్రదించి లాభాలు సమానం గా పంచుకొందామని తామే సినిమా నిర్మించటానికి పూనుకొన్నారు .స్థానిక మద్దతు కావాలికనుక ఆరోరా ఫిలిం కార్పోరేషన్ వారిని సంప్రదించి ఒప్పించి ఉమ్మడి భాగస్వామ్యంతో ‘’సతీ అనసూయ ‘’సినిమా నిర్మాణం ప్రారంభించారు .ఇలా ఒక తెలుగు మహిళా మొట్ట మొదటి సారిగా సినిమా నిర్మించిన ఘనత ,రికార్డ్ సాధించారు కోటిరత్నం హాట్స్ ఆఫ్ .అనసూయగా కోటిరత్నం టైటిల్ పాత్ర పోషించారు . ఈసినిమా 1935అక్టోబర్ 4 విడుదలై తెలుగు చిత్రరంగ నిర్మాణం లో ఒక నూతన శకం ఆరంభమైంది .ఆతర్వాత కలకత్తా లోనే తయారైన లంక దహనం ,మోహినీ భస్మాసుర ,వరవిక్రయం ,పాండు రంగ విఠల్,వరూధిని సినిమాలలో కోటిరత్నం నటించారు ఆ తర్వాత కొత్త హీరోయిన్లు రావటంతో వీరికి అవకాశాలు తగ్గగా ,తుంగల సూరిబాబు సూరవరపు తదితరులతోకలిసి ‘’సక్కుబాయి ‘’నాటకం ప్రదర్శిస్తూ తాను కృష్ణుడుపాత్ర పోషించారు .తుంగల మరణం తర్వాత సక్కుబాయిగా నటిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు .

  1943లో కోటిరత్నం మళ్ళీ సినిమాలో నటించారు .కన్నాంబ గారు ఈమెను స్వయంగా ఆహ్వానించి తమ పాదుకా పట్టాభిషేకం చిత్రం లో కౌసల్య పాత్ర ఇచ్చి నటి౦పజేశారు .మళ్ళీ నాటకాలకు వెళ్ళాల్సిన పరిస్తిస్థితికలగలేదు .గొల్లభామ చంద్రవంక ,అగ్ని పరిక్ష బంగారుభూమి మొదలైన సినిమాలో వరుసగా పది హీను సంవత్సరాలు నాన్ స్టాప్ గా నటించారు .1958లో కోటిరత్నం అనారోగ్యం పాలై గొంతు దెబ్బతినటం తో సినీ అవకాశాలు తగ్గి ఆదుకొనే వారుకూడా లేక ,దుర్భర జీవితాన్ని గడుపుతూ జీవితం గడిపారు .1960లో తణుకులో ఆంధ్రనాటక పరిషత్ కోటి రత్నంగార్ని ఘనంగా సత్కరించారు .ఈ తృప్తితో రెండేళ్ళ తర్వాత ఆమె 45 ఎల్లా పాటు అవిశ్రాంత నటనతో ఆంద్ర దేశాన్ని ఉర్రూత లూగించిన,పురుష వేషాలు ధరించి మగవారికి దీటుగా నటించి ,నాటక సమాజం నెలకొల్పి ఊరూరా ప్రదర్శనలిచ్చి వేలాది స్వర్ణ రజత పతకాలు సత్కారాలు అందుకొన్న  తోలి మహిళా సినీ నిర్మాత ,’’నటకోటి రత్నం ‘’శ్రీమతి దాసరి కోటి రత్నం 21-12-1972న చిలకలూరి పేటలో 63వ ఏట మరణించారు . .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-1-21-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -30 నీకథా శివ బ్రహ్మం భారతీతీర్ధ ,శతావధాని –వెంపటి సదాశివ బ్రహ్మ౦

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -30

30-సినీకథా శివ బ్రహ్మం భారతీతీర్ధ ,శతావధాని –వెంపటి సదాశివ బ్రహ్మ౦

సినీగీత సుమసౌరభం సదాశివ బ్రహ్మం

  • ఓహో మేఘమాల…నీలాల మేఘమాల చల్లగ రావేలా, మెల్లగ రావేలా?… అని ఆ కలం పరిమళాలు సుతిమెత్తగా మన హృదయాలను స్పృశిస్తాయి.
  • మది ఉయ్యాల లూగి నవభావాలేవో… అని ప్రేమతో గగనవీథులలో భావాలు మనల్ని విహరింప జేస్తాయి.
  • అల్లదే ఆవల అదిగో నా ప్రియ కుటీర వాటిక… అని అక్షరాల గవాక్షాల్లోంచి వలపుల పర్ణశాలకు దారిచూపిస్తుంది.
    ఈ జన్మసరిపోదు గురుడా… అని తాత్త్వికంగా జీవితాన్ని చిత్రించినా -అది ఆ కవన బ్రెహ్మకే చెల్లింది!
    తెలుగు చలన చిత్రాలకు అందమైన కతలు అల్లి, ఆబాల గోపాలానికి చేరేలా మాటలు రాసి, అందరూ మెచ్చేలా పాటలను, పద్యాలను సృష్టించిన విశిష్టులు, ”భారతీతీర్థ ”శతావధాని” -కీ|| శే|| వెంపటి సదాశివబ్రహ్మం.
    పద్యంలో ఆశు కవిత ఘనమైతే, గద్యంలో జీవితం మీద అనర్గళంగా ఆశువుగా చెప్పగలడం వీరి ప్రజ్ఞ! ‘కథ’ అనగా చెప్పడం కాబట్టి, ఈ ‘చెప్పగలిగే కళ’ను సొంతం చేసుకొని ఎందరినో ఒప్పించి, మెప్పించగలిగిన కథామేటి -వెంపటి. తెలుగు సినిమా మలియుగం (1940 వ దశకం)లో కాలుపెట్టిన ఈ కలం యోధుడు సినిమా కథా కథన నాడీ వైద్యుడు.
    వెంపటి వంశం వారు హరితస గోత్రీకులు. అయితే కూచిపూడి నాట్యాచార్యులైన వెంపటి సత్యం ప్రభ్నతులకు, సదాశివ బ్రహ్మం వారికి ఇంటిపేరు మినహా, ఏ సంబంధ బాంధవ్యాలు లేవు.
    ఇహ మన ‘కథా’నాయకుడైన వెంపటి సదాశివబ్రహ్మం గారు, 1905 ఫిబ్రవరి 18 వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, తుని గ్రామంలో వెంపటి బ్రహ్మయ్యశాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించారు.
    తునిలో కవన మాలికలు అల్లుతూ ‘కావ్యగాన వినోదేన, కాలోగచ్ఛతి’ అన్నట్లుగా వెంపటివారు పాటలు, పడుతూ నాటకాలు వేస్తూ తిరిగేవారు. వారు చదివింది ఎనిమిదవ తరగతి మాత్రమే! కానీ సరస్వతీ మాత వరపుత్రునిగా, పద్యస్ఫూర్తితో పదేళ్ల వయసులోనే పద్యాలు ఆశువుగా చెప్పేవారు. పాఠశాలకు వెళ్లడానికి ఇచ్ఛగించక స్వయంగా సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషలు నేర్చుకొన్నారు. పంచకావ్యాలను, ఆంగ్లసాహిత్యాన్ని అధ్యయనం చేసారు. అనతి కాలంలోనే ఆ ప్రాంతంలో ‘బాలకవి’గా పేరు తెచ్చుకున్నారు. తిరుపతి వేంకటకవుల ప్రభావంతో అవధాన విద్యపై మొగ్గు చూపారు. తన ధారణాసామర్థ్యంతో, ఆశు కవితా ధారతో అవధానాలు చేస్తూ, శతావధాని”గా పేరు తెచ్చుకున్నారు.
    ఇన్‌సైడ్ స్టోరీఎప్పుడూ ఎక్కడా ఓ చోట కాలు నిలవని వెంపటివారికి పెళ్లి చేస్తేనైనా ఇంటిపట్టున వుంటాడని భావించి, 1928 లో వారి 23 వ ఏట శ్రీకాకుళానికి చెందిన జానకమ్మగారితో పెళ్లి జరిపించారు.
    అప్పటికావిడ వయస్సు ఎనిమిది సంవత్సరాలే! వివాహమయ్యాక ఆమెను తునిలో దించి, తాను మాత్రం స్వాతంత్య్రోద్యంలోకి దూకాడు. ముఖ్యంగా రంపచోడవరం మొదలగు ఏజెన్సీ ప్రాంతాలలో అల్లూరి సీతారామరాజు నిర్వహించిన పితూరీలలో పాల్గొన్నాడు. ఆ తరువాత కాంగ్రెసు పార్టీలో చేరారు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించారు. జైల్లో దేశభక్తి పూరితమైన పద్యాలను, గేయాలను రాసి ఎలుగెత్తి ఆలపించేవారట. ఆనాటి కాంగ్రెసు సభల్లో పాల్గొని, హరికథ, ప్రక్రియలో ప్రబోధాత్మక కథాగానాలను ఆలపిస్తు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటంలో తన వంతు పాత్రను నిర్వహించినారు.
    ఆ రోజుల్లో ఆంద్రపత్రిక, శారద, భారత, మొదలగు పత్రికలలో వీరి కథలు ప్రతిఫలించే విధంగా వీరి రచనలు సాగేవి. అయితే వీరి రచనలకన్నా హరికథా గానానికే ముగ్ధులైయ్యేవారు ప్రజలు.
    ప్రప్రథమ తెలుగుటాకీ నిర్మాత, దర్శకుడు, రోహిణీ సంస్థ అధినేత హెచ్‌.ఎం.రెడ్డి గారు, వెంపటి సదాశివబ్రహ్మం గారి హరికథను విని, వెంటనే తను నిర్మించే ‘తెనాలిరామకృష్ణ’ (1941) చిత్రానికి రచన చేయాల్సిందిగా ఆహ్వానించారు. 1941 వరకే తెలుగులో దాదాపు 75 చిత్రాలు విడుదలై ‘చిత్రవజ్రోత్సవాన్ని’ చేసుకొంది. దైతాగోపాలం, బలిజేపల్లి కాళ్లకూరి, చందాల కేశవదాసు మొదలగు నాటకరచయితలు, సముద్రాల, కొసరాజు ప్రభృతులు సినీ రచనను మెరుగులు పెట్టి, కొత్త మార్గం పట్టించారు. వెంపటి వారి ప్రవేశంతో స్క్రీన్‌ ప్లే విధానంలో మార్పు వచ్చింది. అలాగే పాత్రల స్వరూప స్వభావాలను మరింత స్పష్టపరచే విధంగా సంభాషణలు రాయడంలో కొత్త ఒరవడిని వెంపటి సదాశివబ్రహ్మం సృష్టించారు. అలా వారు తొలి చిత్రంతోనే రచయితగా విజయం సాధించారు. ‘తెనాలిరామకృష్ణ’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి, అందులో నటించిన ప్రముఖ దర్శక, నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ గారు అనంతర కాలంలో వెంపటిగారితో ఎన్నో రచనలు చేయించారు.
    1941 లోనే రాజాశాండో దర్శకత్వం వహించిన ‘చూడామణి’ చిత్రానికి వెంపటి వారు స్క్రీన్‌ ప్లే సమకూర్చారు. నటగాయని టి.జి.కమలాదేవికి ఇదే తొలిచిత్రం. పుష్ప వల్లి, నారాయణరావు, పి.ఎస్‌.ఆర్‌.సుందరమ్మ ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రం విజయం సాధించింది. 1941 లో వచ్చినా 1950 దశకంలో రాబోతున్న సినిమాల తాలూకు ఛాయలన్ని అందులో పొడచూపాయి. అప్పటి వరకు వచ్చిన పౌరాణిక చిత్రాల మూసను వదిలిపెట్టి ‘చూడామణి’ కొత్త పుంతల్ని తొక్కింది.
    ప్రముఖ హాస్యనటి, గాయని టి. కనకం ‘దేశదిమ్మరి’ అనే చిత్రాన్ని వెంపటి వారితో ప్రారంభిచినారు. కాని చిత్రం తొలిదశలోనే ఆగిపోయింది. ఈ సినిమా కోసం రాసిన కథే 1957 లో ”స్వయంప్రభ” (1957 -సంగీతం -రమేశ్‌ నాయుడు) గా అవతరించింది.
    1942 లో రోహిణి బ్యానర్‌ కింద హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన ‘ఘరాన దొంగ’ చిత్రాన్ని వెంపటి రచన చేశారు. ఈ చిత్రానికి ‘హేనెస్ట్‌ రోగ్‌’, ”సత్యమేవ జయం” అని మరి రెండు పేర్లు కూడా ఉపశీర్షికలుగా సూచించారు. ఇందులో ఎల్‌.వి.ప్రసాద్‌, దాసరి తిలకం హీరో హీరోయిన్లుగా నటించారు.
    1943 నుంచి 1945 వరకు, దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా చిత్రనిర్మాణం కుంటుపడింది. అప్పటికే మద్రాసులో మాంబళంలో క్రిసెంట్‌పార్కు వద్ద ఓ అద్దే ఇంటికి కుటుంబంతో సహా మకాం పెట్టిన వెంపటి వారు, చేతినిండా సినీరచనలు లేక మళ్లీ అవధానాలు, హరికథలు చెబుతూ కాలక్షేపం చేయసాగారు. ఈ కాలం వెలువడిన చిత్రాలకు ‘ఘోస్టురైటర్‌’గా పని చేశారు కూడా! గూడవల్లి రామబ్రహ్మం గారు నిర్మించి ‘పల్నాటి యుద్ధం’ (1947) చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే రాసింది వెంపటివారే (టైటిల్స్‌లో పేరు కనిపించదు) అలాగే కాళ్లకూరి సదాశివరావు దర్శకత్వంలో వచ్చిన ”రాధిక (1948) సువర్ణమాల చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే ‘అందించారు’.
    1948 లో దర్శక నిర్మాత సి.వి.రంగనాథ్‌ దాస్‌ సాధనా సంస్థను స్థాపించి ‘దాసి’ చిత్రాన్ని నిర్మిస్తూ వెంపటి సదాశివబ్రహ్మానికే కథ, మాటలు, పాటలు రాసే అవకాశం ఇచ్చారు. కానీ ఆ చిత్రం సగంలోనే ఆగిపోయింది. ఆ తరువాత, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్‌.టి.రామారావు, లక్ష్మీరాజ్యంలతో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సంసారం’ చిత్రానికి రచన చేశారు. ‘సంసారం’ ఘనవిజయం సాధించింది. మహానటి సావిత్రి ఈ సినిమాలో ఓ చిన్న పాత్రను ధరించింది. అక్కినేని గారి తొలి సాంఘిక చిత్రమిది.
    1948 సం|| లోనే ‘దాసి’ విడుదలై వుంటే సదాశివబ్రహ్మం గారి కథ మరికొంత ‘అడ్వాన్స్‌’ అయ్యేది. తెలుగు తొలిటాకీ చిత్రం నుండి (1931) స్వాతంత్య్రా నంతరకాలం వరకు (1948) వెలువడిన సినిమాల గురించి వెలువడిన పత్రిక ‘చిత్రకళ’ (1948) వెంపటి సదాశివబ్రహ్మం గారిని సృజనాత్మకతగల రచయితగా అభివర్ణిస్తూ హాస్యనటుడిగా (మదాలస చిత్రంలో టిట్టికుడి పాత్ర) కితాబు నిచ్చి, దర్శకత్వం నెరపే సత్తా పున్నవాడని ప్రశంసించింది.
    1950 దశకం సదాశివబ్రహ్మం గారికి స్వర్ణయుగం. ఈ కాలంలో సంసారం (1950), దాసి (19520, పెంపుడు కొడుకు (1953), కోడరికం (1953), వద్దంటె డబ్బు (1954), కన్యాశుల్కం (1955), చరణదాసి (1956), ఉమాసుందరి (1956), భలేరాముడు (1956), భలే అమ్మాయిలు (1957), సువర్ణ సుందరి (1957), చెంచులక్ష్మి (1958), దొంగల్లో దొర (1957), ఇంటిగుట్టు (1958), స్త్రీ శపథం (1959), శభాష్‌ రాముడా (1959), కృష్ణలీలలు (1959), అప్పుచేసి పప్పుకూడు (1958), శరద (1957) మొదలైన చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రాసి సినీ రచయితగా తారాపథంలో దూసుకెళ్లారు. ఈ చిత్రాలన్ని ఘనవిజయం సాధించినవే! ఇక ఇల్లరికం (1959) కథను అల్లిన వారు వెంపటి వారే!
    1960 లో ‘దేవాంతకుడు’, చిత్రానికి కత, మాటలు రాసింది వవెంపటిగారే. (ఈ సోషియే ఫాంటసీ చిత్లం లోని ‘గోగ్గో గోంగూర’ పాట జనాదరణ పొందింది) ఈ చిత్రమే మళ్లీ 1977 లో ‘యమగోల’గా నిర్మించినపుడు బాక్సాఫీసును బద్దలు చేసింది. ఆ తరువాత ‘యమలీల, యమదొంగ’ వంటి చిత్రాలకు ముల కథా బిందువుకు వెంపటివారి కలమే ఆధారం.
    1961 లో ‘ఉషా పరిణయం’, ‘కన్న కొడుకు’ ‘శభాష్‌ రాజా’ చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు రాశారు. ‘చరణ దాసి’ చితరానికి రచన చేయించిన లలితా శివజ్యేతి అధినేత శంకరరెడ్డి, ‘లవకుశ’ (1963) చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రచించి, ఓ అపురూప దృశ్యకావ్యంగా అందించిన ఘనత వెంపటి వారిదే! ఇందులో ‘రావణుని సంహరించి, ‘ఏ మహనీయ సాధ్వి, ఇంతకు బూనివచ్చి, ఇదేమన ఆశ్రమంబు, నవరత్నోజ్వల కాంతి’ పద్యాలను లక్ష్మణ -లవకుశలు, శ్రీరామ -లవకుశుల వాద సంవాద పద్యాలైన ‘తండ్రిపంపున, స్త్రీ బాలవృద్ధుల’ను రచించారు. సాధారణంగా జానపదధోరణిలో గాసే పాటలను కొసరాజు గారికే అప్పగిస్తారు. కానీ ‘లవకుశ’ లో ‘వెయ్యర దెబ్బ దరువెయ్య దెబ్బ’ ఒల్లనోరి మామా నీ పిల్లని, రామన్న రాముడు కోదండరాముడు పాటలను వెంపటి వారే రాసి జానపద కవి అనిపించుకున్నారు.
    1964 లో బి.ఎ. సుబ్బారావు నిర్మించి దర్శకత్వం వహించిన ‘మై రావణ’కు కథ, మాటలు, కొన్ని పాటలు రాశారు. ఇందులో రేలంగి ఆంజనేయునిగా, శోభన్‌బాబు లక్ష్మణునిగా, రాజనాల రావణునిగా, కాంతారావు రామునిగా, కృష్ణకుమారి చంద్రసేనగా నటించారు.
    గుత్తారామనీడు దర్శకత్వంలో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు వెంపటివారే సమకూర్చారు.
    1966లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన పరమానందయ శిష్యుల కథ (ఎన్‌.టి.ఆర్‌, కె.ఆర్‌. విజయ) చిత్రానికి కథ మాటలు కొన్ని పాటలు పద్యాలు రాశారు. ”ఎనలేని ఆనంద మీరేయి’ (ఘంటసాల జానకి) ‘వనిత తనంతటి తావలచిన (లీల, సుశీల) పాటలు హిట్టయ్యాయి.
    లలితా శివజ్యోతి వారి ‘రహస్యం’ (1967) వీరి చివరి చిత్రం. ఈ చిత్రానికి కథను సుబ్రహ్మణ్యం పిళ్లె అందించారు. మాటలు, కొన్ని పాటలు పద్యాలు సదాశివబ్రహ్మం గారే రాశారు. ‘ఈ జన్మ సరిపోదు గురుడా’ అన్ని తత్త్వగీతంతో పాటు ”జలజతాసన’, మొదలు 15 పద్యాలు రాశారు.
    ‘వద్దంటే డబ్బు’ చిత్రం కోసం ”అల్లదే, నా ప్రియా! కుటీర వాటిక” (గానం. జిక్కి) పాట విలువలున్నదే. కథానాయిక తన చిరునామ చెబుతున్న వైనాన్ని సహజంగా వర్ణించాడు. మెలికలున్న కాలిబాట గుండా, లేమావి తోట దాటుతూ మెల్లిగా వస్తే అగుపించేదే తన కుటీరమని, ”కెమెరా కన్ను”తో అక్షరాల్లో దృశ్యాలను ఆవిష్కరించారు. టి.ఎ.కల్యాణం స్వరపరచిన ఆపాత మధురగీతమిది.
    ‘సంసారం’ చిత్రంలోని పాటలు, (టముకుల బండి లంఖణాల బండి, జోడెద్దుల బండి పాటతో సహా) సాహితీ విలువలున్నవే! ”అందాల చందమామ -నిన్ను వలచి అలలు లేసి ఎగసినాయే భామా!” అని కతానాయకిని శ్లేషగా వర్ణించే రొమాంటిక్‌ గీతం -ఈ పాటను చతురస్రగతిలో ప్రారంభించి, రెండో చరణాన్ని ఖండగతిలో (ఏ పాటి మనసైనదేమోనే) నడిపించటం వెంపటి కలం ‘నడకకు’ ఉదాహరణ. ఈ చిత్రంలోని ”దారుణమీ దరిద్రమ విధాత సృజించిన బాధలందునన్‌, రౌరప మాదిగా గల నిరంతర కష్టముల సాటియే, ఘోర దరిద్ర భారమున ఆ నలచక్రవర్తియే దారను వీడిపోయే గదా, ఇక అన్యులు లెక్క అవుదురే” అన్న పద్యం, హృద్యం!
    చందమామను ప్రతీకగా తీసుకొని పాటలు రాయడం పట్ల వెంపటి వారు మొగ్గుచూపే వారు. ‘ఉమా సుందరి’ (సంగీతం -అశ్వద్ధామ) లో ”ఎందుకో రేరాజ మా మీద దాడి! వెన్నెల్లో వేడి, పూవుల్ల వాడి” (ఘంటసాల, జిక్కి) గీతంలో నిందారోపణ చేస్తూ ప్రణయగీతంగా మలచినారు.
    ‘సంసారం’లో నాయికపరంగా చందమామను సంకేతంగా తీసుకొని రాసినట్లే ‘జయంమనదే’ చిత్రంలో ‘చుక్కకు చందమామ’కు జోడు కలిపి చక్కని పాట రాశారు. నాయిక ”అందాల చందమామా/ఆడదాననోయి/ఎందుకో నిన్ను చూస్తే ఎంతో సిగ్గవుతుందోయ్‌” (ఘంటసాల -లీల) అని ఎత్తుకొంటే ”చాడ చక్కని చుక్క” అని మురిపెంగా నాయకుడు చిటికె వేస్తూ మురిపెంగ పాడుకొంటాడు. ఘంటసాల స్వరపరచిన విధానం కూడా హుషారు కలిగిస్తుంది. ప్రతినాయక పాత్రధారి ఆర్‌. నాగేశ్వరరావునీ ఆటపట్టిస్తూ హీరో హీరోయిన్లు (ఎన్‌.టి.ఆర్‌, అంజలి) రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపిస్తారు తెరపై. ఈ చిత్రానికి తాతినేని ప్రకాశరావు దర్శకులు. విక్టరీ మధుసూదన్‌రావు, కె.ప్రత్యగాత్మ సహాయదర్శకులు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ శబ్ద గ్రహణ దర్శకుడు!
    చందమామ పాటలే కాదు మేఘమాలికలపై సదాశివబ్రహ్మం ‘భలేరాముడు’ (అక్కినేని, సావిత్రి, దర్శకులు -వేదాంతం రాఘవయ్య) చిత్రం కోసం రాసిన ”ఓహో మేఘమాల!’ గీతం వారి పాటల పూతోటలో నిత్యం పరిమళించే పారిజాతం వంటిది.
    ఓహో మేఘమాల! మీలాల మేఘమాల
    చల్లగా రావేలా మెల్లగ రావేలా, వినీల మేఘమాల
    నిదురపోయే రామచిలక బెదిరిపోతుంది -కల చెదిరిపోతుది.
    (హీరోయిన్‌ సావిత్రికి నిద్రాభంగం అవుతుందని చల్లగ రావాలని అభ్యర్థన)
    ప్రేమసిమలలో చరించే బాటసారీ -ఆగవోయి
    పరవశంతో ప్రేమగీతం పాడబోకోయి!
    అని రిక్వెస్టు చేస్తాడు. ”ప్రేమసీమలలో.. అనే పంక్తితో ఒక్కసారి మనల్ని కాళిదాసు రచించిన ‘మేఘసందేశం’ కావ్యంలోని మేఘుని (రాయబారి) వరకు తీసికెళ్లారు వెంపటి. అదీ, వారి కావ్య పరిజ్ఞానం! సందర్భోచితంగా ధ్వనింప జేయడం వారి రసజ్ఞత…
    చమత్కారమేమిటంటే, నిద్రాభంగ చేయొద్దని మేఘాన్ని ప్రార్థించే నాయకుని గాత్రానికి, నాయిక నిద్దురలోంచి లేవనే లేస్తుంది.. ఆలాపనలో సల్లాపాలు చేస్తూ.
    ”మాయజేసి మనసు దోచి పారిపోతావా? దొంగా” అని మురిపొంగా ప్రశ్నిస్తుంది. సాలూరి రాజేశ్వర్రావు స్వరకల్పనా? లేదా ఘంటసాల లీల గాత్రమాధుర్యోమా? లేదా అక్కినేని, సావిత్రిలల అభినయమా లేదా వెండితెర వెన్నెల వెలుగుల ఛాయాగ్రహణమా? -అని ప్రేక్షకుడు పరి పరి, ప్రశ్నించుకొని -”అన్నీనూ” అని సమాధాన పరచుకొనే అంశం (సమష్టికృషి) ఈ ‘గీతామకరందం’లో నిక్షిప్తమై వుంది. ‘భలేరాముడు’ హిందీలో ‘కిస్మిత్‌’ చిత్రానికి రీమేక్‌.
    వెన్నెల రేయి ప్రస్తావన వచ్చింది కాబట్టి ‘శభాష రాముడు’ (1957) (హిందీలోని ‘బడాభాయి’ చిత్రానికి రీమేక్‌) లోని ”రేయి మించే నోయ్‌ రాజా” వెంపటి వారి సృజనలో మరో మంచిపాట. నాయకుడిని నిదురపుచ్చే పాటలలో (సడిసేయకో గాలి -దేవులపల్లి -రాజమకుటం మొ||) ఇది విలక్షణమైనది. ఘంటసాల స్వరకల్పన తీరు, సుశీల పాడిన రీతి ఆ పాత మధురం. ‘చీకటి వెంటా వెలుగే రాదా’ అని చెబుతూ ఈ లాలింపు పాటలో ఓదార్పును కూడా చేర్చారు. వెంపటి సదాశివబ్రహ్మం, భావగీతాలే కాదు, హాస్యగీతాలు విషాద గీతాలు, అభ్యుదయ గీతాలు, శాస్త్రీయ నృత్యగీతాలు, చిలిపిగీతాలు, తాత్త్విక గీతాలు కూడా ఆయా సన్నివేసాలకు అనుగుణంగా రాశారు.
    సదాశివబ్రహ్మం పేరు వినగానే సదా గుర్తుకొచ్చే పాట ‘చెంచులక్ష్మి’ చిత్రంలో సుశీల పాడింది. కమనీయం, రమణీయం అదే.
    పాలకడలి పై శేషతల్పమున
    పవళించేవా దేవా!
    బాలుని నను దయ పాలించుటకై
    కనుపించేవా మహాను భావా!
    ఎస్‌. రాజేశ్వర్రావు యమన్‌లో స్వరపరచిన ఈ పాటను, ప్రముఖ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తన చిన్నతనంలో ఎప్పుడు పాడుకొనేవారట. తన కంఠాన్ని తాను ఓ టేప్‌ రికార్డర్‌లో మొదటిసారిగా విన్నదీ ఈ పాటతోనేనని చెప్పుకున్నారు కూడా!
    వెంపటి వారు లలిత గీతాల శైలిలో కూడా ఎన్నో పాటలు రాశారు. తొలి నేపత్య గాయని శ్రీమతి రావు బాలసరస్వతీ దేవి పాడిన
    ”గోపాల కృష్ణుడు నల్లన
    గోకులములో పాలు తెల్లన
    కాళిందిలో నీళ్లు చల్లన
    పాట పాడెద నీ గుండె ఝల్లున” (రాధిక (చిత్రం) -సంగీతం సాలూరి హన్మంతరావు) ఆల్‌ టైమ్‌ హిట్‌ అని చెప్పవచ్చు. ఈ పాట స్ఫూర్తితోనే బహుశ: వేటూరి వారు ‘సప్తపది’ చిత్రంలో (ఏ కులము నీదంటె, గోవుల్లు నల్లన) పాటలు రాశారనిపిస్తుంది
    వెంపటి సదాశివబ్రహ్మం రాసిన పాటలు రాసిపరంగా తక్కువే! కానీ వాశిలో గుణుతించదగ్గవే! హిందీ చిత్రాలకు కూడా వీరు కథలు సమకూర్చారు. ప్రముఖ నటుడు, నిర్మాత గురుదత్‌ వీరిని అభిమానించేవారు. ‘తీన్‌ దేవియా’ (దేవానంద్‌, నందా మొ|| నటించినది) (1965), ససురాల్‌ (1961), ప్యార్‌మొహబ్బత్‌ (1966), ఘూంఘట్‌ (1964), శారద (1957) చిత్రాలకు పరోక్షంగా కథను అందించారు. తీన్‌దేవియా (1965) చిత్రం టైటిల్స్‌లో స్టోరీ -సదాశివబ్రహ్మం అని కనిపిస్తుంది. అలాగే కన్నడ సినీ గీత రచయిత ఉదయ్‌శంకర్‌ తండ్రి సదాశివయ్యగారికి వెంపటి కథలు అందించేవారు. తెలుగులో హిట్టైన చిత్రాలను తమిళంలో తీసినపుడు, (డబ్‌ చేసినపుడు) వెంపటి తమిళంలో కూడా రచన చేశారంటే, వారి బహుభాషా పాండితీ ప్రకర్ష, పట్టు అర్థమవుతుంది. కణవణ కణ్‌ కండ దైవమ్‌, మాదరుకుల మాణిక్యమ్‌, మాడివేటు మాప్పిళై మొదలగునవి ఉదాహరణలు మాత్రమే. మొత్తం కలిపి వెంపటి 75 చిత్రాలకు రచన చేసి 150 పాటల వరకు రాశారు.
    వెంపటి సదాశిబ్రహ్మం, జానకమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు (గిరిబాల, ఉషాబాల) ముగ్గురు కుమారులు బ్రహ్మయ్యశాస్త్రి ఆనందశర్మ, వాసుదేవ బ్రహ్మం) కలిగారు. వీరిలో గిరిబాల గారు అందరికన్నా పెద్ద. వాసుదేవబ్రహ్మం అందిరికన్నా చిన్నవాడు. గిరిబాల (1936) గాలికి తండ్రి సాహిత్య సంగీతాలు అబ్బినప్పటికీ, ఆ రంగంలో కృషిచేయలేదు. కానీ ఆమె మధురగాయని. గట్టిగా ప్రయత్నించి వుంటే సుశీల, జిక్కి స్థాయిలో గాయకురాలై వుండేది. ఇప్పటికీ ఆమె గాత్రంలో మాధుర్యం చెక్కు చెదరలేదు. ‘ఉమా సుందరి’ చిత్ర నిర్మాణ దశలో ఆమెకు బిడ్డ పుట్టినప్పుడు (1956) ఆమెకు ఉమాసుందరి’ అని వెంపటివారు పేరు పెట్టారట. ఆ అమ్మాయని తన రెండో తమ్ముడు ఆనందశర్మకిచ్చి పెళ్లి చేసింది. ఆనంద్‌ శర్మ ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులలో ఉన్నతాధికారిగా పనిచేసి ప్రస్తుతం నేషనల్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజి కన్సల్టెంట్‌గా, యూ.కె.కంపెనీ తరఫున ఇంటర్వ్యూ పానెల్‌ మెంబర్‌గా కూడా ఉంటున్నారు. వీరికిద్దరు అబ్బాయిలు. వెంపటి చిన్న కుమారుడు, వాసు దేవబ్రహ్మం చాలా కాలం సంగీత దర్శకుడు ఎం.రంగారావు వద్ద అసిస్టెంట్‌గా పనిచేసి చెన్నైలో స్థిరపడ్డారు. వెంపటివారి ధర్మపత్ని 1986 లో దివంగతులయ్యారు.
    కథా శివబ్రహ్మంగా పేరు గాంచినప్పటికీ, వెంపటి బహుముఖ ప్రజ్ఞాశీలి. ‘గుడ్‌మార్నింగ్‌’ గుడు ఈవినింగ్‌’ చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించాలనుకొన్నారు. కానీ 1968 జనవరి 8 వ తేదీన, గుండెపాటుతో ఆకస్మిక మృతి నొందారు. ఎల్‌.వి.ప్రసాద్‌, పి.బి.శ్రీనివాస్‌, పరాత్పరరావు, ప్రభృతులు వెంపటిని ఎంతో అభిమానంచేవారు. తెలుగు సినీ రచనకు కొత్త దిశను చూపించిన వెంపటి, నిజంగా సినీ రచనా సుమసౌరభం.

జీవితం (1949 సినిమా)..

తారాగణం:–
టి.ఆర్.రామచంద్రన్ (పతి),
సి.హెచ్.నారాయణరావు (మూర్తి),
వైజయంతిమాల (మోహిని),
యస్.వరలక్ష్మి (వరలక్ష్మి),
సి.యస్.ఆర్.ఆంజనేయులు,
కంచి నరసింహారావు
.
సంగీతం ఆర్.సుదర్శనం
నేపథ్య గానం యస్.వరలక్ష్మి, ఎమ్.ఎస్.రామారావు
గీతరచన వెంపటి సదాశివబ్రహ్మం
సంభాషణలు తోలేటి వెంకటరెడ్డి
నిర్మాణ సంస్థ ఎ.వి.యం.ప్రొడక్షన్స్

పాటలు……
మేలుకోండి తెల్లవారె తెల్లగా – ఎస్.వరలక్ష్మి
ప్రియమైన రాణీ మోహినీ
మన మనసూ మనసూ ఏకమై

ఇదేనా మా దేశం, ఇదా భారతదేశం – యం.ఎస్.రామారావు

  1. కదా శివ బ్రహ్మ ముళ్లపూడి వెంకటరమణ

తలా తోకా చటుక్కున పోల్చుకుందుకు
వీల్లేనివాటిలో నిత్యశంకితుని భావాలూ, నూలుపోగూ,
వానపామూ, రెండు జడలపిల్లా కొత్తకార్లూ వగైరా
చరాచర పదార్ధాలతోపాటు _ చెప్పుకోతగ్గ మరో
జడపదార్థం తెలుగు సినిమా కధ అంటారు. అలాగే
మిథ్యావాదాన్ని బలపరిచే ఉదాహరణలలో ప్రబంధ
నాయికల నడుమూ, ఎన్నికల వాగ్గానాలలో నిజాయితీ,
అవకాశవాది నిశ్చితాభిప్రాయం, తెలుగు సినిమాలో కధ చెప్పుకోతగ్గవంటారు.
ఇటువంటి తెలుగు సినిమా కధను
వెనకేసుకొచ్చి నిలబెట్టగల వారిలో, ఇదీ కథేను అని
కధగా చెప్పగల గొప్పగలవారిలో శ్రీ వెంపటి
సదాశివబ్రహ్మం ముఖ్యులు.
తెలుగు సినిమా చిన్నతనం రోజులలో (అవే గొప్పతనం
రోజులూను) (ప్రవేశించి నేటివరకూ, ‘ఇదిగో సినిమా
కొక కధ చెబుతా విను అని చెప్పి, ‘కథా రచయితగా”
(చాలామంది మాటల పాటల రచయితలే) నిలబడి నెగ్గుకొస్తున్న ఒకే ఒక్క వ్యక్తి
ఈయనే. కాలంనాడు హిందీలోనూ బెంగాలీలోనూ సినిమాకి గురి అయి చనిపోయిన కథల్ని తవ్వి తీసి బ్రతికించి తెలుగు ప్రాణం పోస్తాడని విమర్శించే గిట్టని వాళ్ళు
ఉన్నా నేటి సినిమాల కధల విలువ తెలిసినవారూ, ఆయన వాగ్థాటిని ఎరిగినవారూ
సగౌరవంగా ‘కథాశివ బ్రహ్మం) అంటారు.
సదాశివబ్రహ్మంగారు ఒక రకంగా ఆశుకవి. ఒకే ఒక కధావస్తువు దొరక బుచ్చుకుని ఒకరోజు పొద్దుటనుంచి సాయంకాలం లోపల పద్ధెనమండుగురు నిర్మాతలకు నలభయ్యేడు కథలు- చెప్పింది చెప్పకుండా చెప్పుకుపోగలడు. గుడ్లు తిప్పుకుంటూ, పొడుగుపాటి సిగరెట్లు పీల్చేస్తూ చేతు లెగరేస్తూ “విశాపట్నం’ యాసలో ‘ఆయనలాఘ కథ లల్లీసుకుపోతూ, వాటిలో సన్నివేశాలు కళ్ళకృట్టీలా, ఉద్వేగంతో ఉత్సాహంతో చెప్పుకుపోతూ ఉంటే నిర్మాతలు దర్శకులు కూడా ముగ్గులైపోయి వింటూ ఉండిపోతారు. అంతా విన్నాక వారు ఆ విన్నదేమిటో చెప్పుకోలేరన్నది వేరు విషయం. ఐంద్రజాలికుడు సదాశివబ్రహ్మం చెప్పినపుడు కళ్ళకృట్టినట్లు అద్భుతంగా కనిపించిన సన్నివేశాలు తీరా తెర కెక్ళాక తలా తోకా

తెలియకుండా తయారైతే అది ఆయన తప్పుకాదు. అసూర్యంపశ్యలలో అతిలోక
సొందర్యవతులున్నారని ఒప్పుకుంటే ప్రేక్షకుల దాకా సాగిరాని ప్రతిభగల వారిలో
(కధకీ తెరకీ మధ్య లక్షగందాలు) సదాశివబ్రహ్మం ఘనుడనే చెప్పుకోవాలి. పద్యంలో
ఆశుకవిత ఘనమైతే గద్యంలో జీవితం మీద అనర్గళంగా ఆశువు చెప్పగలగడం
ఈయన ప్రజ్ఞ (పద్యాలు కూడా బాగా చెప్పగలడు). ఎటొచ్చీ ఆశుకవులు ఒక
మూసలో వర్ణననే తిరగామరగావేసి రకరకాలుగా చెప్పినట్టు ఈ “ఆశుకధకుడు”
కూడా ఒకే కధను ఒక్కపూటలో ఇరవై నాలుగు మోస్తర్లలో అల్లుకుపోతాడు. మధ్యలో
అతుకులూ, టంకాలూ, పాత్రలూ, తీరులూ సవ్యంగా కుదరకపోయినా, అప్పుడు
తెలియవు. తెలిసేసరికి కాలాతీతం అయిపోతుంది. అందుకే సినిమాలైన ఆయన కధలు కొన్నిటిలో ఏనుగుతల పాముకీ, చీమతల ఏనుక్కీ దాని తోక పిచిక్కీ ఉన్నట్టు
కనబిడతాయి.
ఇరవయ్యేళ్ళ సినీ జీవితంలో సదాశివబ్రహ్మంగారి కథలతో సినిమాలై
కండపుష్టితో రూపొంది బ్రహ్మాండమైన విజయం సాధించిన చిత్రాలలో
ఘరానాదొంగ, సంసారం, చరణదాసి, భలేరాముడు, ఇంటిగుట్టు, ఇల్లరికం,
అన్నపూర్ణ మొదలైనవెన్నో ఉన్నాయి. వీటిలో కొన్నిటి కాయన మాటలు పాటలు
కూడా వ్రాశాడు. ఇవేకాక ఆ మధ్య నటనలోను దర్శకత్వంలోను కూడా తేలిగ్గా
చేయి కాల్చుకుని మళ్ళీ తన “కధాస్థలానికి వెళ్ళిపోయొచ్చేశాడు. ఇప్పటికీ చిన్న
నటులతో కొత్తవాళ్ళతో అద్భుతమైన చిత్రం తీసి స్టార్‌వాల్యూ అనేది అపోహ అని
నిరూపించాలని దర్శకుడుగా మంచి కధలు చిత్రించాలని ఆయనకు చాలా మోజు
ఉంది.

హెచ్‌.ఎం. రెడ్డిగారి “తెనాలిరామకృష్ణు నుంచి నేటివరకు సినిమా కథలతో
కలిసి అడుగులు వేస్తున్నవాడు కాబట్టి, తన అనుభవం, పలుకుబడి ఉపయోగించి
కథను కొత్తదారులు పట్టించడం బాధ్యతగా స్వీకరించగల హక్కు అధికారం
ఈయనకు ఉన్నవి, ప్రేక్షకుల తరపున నిర్మాతలకు మంచి కధలను, కొత్తవాటిని
సిఫార్సుచేసి ఒప్పించగల సామర్థ్యమూ ఉంది. మంచివాడన్న మంచి పేరూ ఉంది.
వీటన్నిటినీ మంచి లక్ష్యాలు సాధించడానికీ ప్రయోగించి సాధించిననాడు ఆయనకు
తెలుగు సినిమాకధ కథలో కథాశివబ్రహ్మం అన్న పేరు స్థిరవడితీరుతుంది.
(ఆం|ధ-వారప,తిక- 1959)

సదాశివబ్రహ్మం (1905-68) సదాశివబ్రహ్మం కెరియర్‌ చివరివరకూ ఉజ్జ్వలంగానే సాగింది. “లవకుశ “పరమానందయ్య శిష్యుల కధి, ‘భువనసుందరి కథి ‘భామావిజయంి రణభేరి – ఇలా అనేక హిట్‌ సినిమాలకు కధ అందించారు. ‘కణవన్‌ కన్‌కండ దైవం) (తమిళం) సినిమాకు కూడా కధ అయనదే! రాధిక (1947) సినిమాకు దర్శకత్వం వహించారు. అయన తలపెట్టిన గుడ్‌ మార్చింగు”, “గుడ్‌ ఈవెనింగు నిర్మాణదశలోనే ఆగిపోయాయి.లం

50వ దశకం
1950 దశకం సదాశివబ్రహ్మం సినిమా ప్రస్థానంలో స్వర్ణయుగం. ఈ కాలంలో సంసారం (1950), దాసి (19520, పెంపుడు కొడుకు (1953), కోడరికం (1953), వద్దంటె డబ్బు (1954), కన్యాశుల్కం (1955), చరణదాసి (1956), ఉమాసుందరి (1956), భలేరాముడు (1956), భలే అమ్మాయిలు (1957), సువర్ణ సుందరి (1957), చెంచులక్ష్మి (1958), దొంగల్లో దొర (1957), ఇంటిగుట్టు (1958), స్త్రీ శపథం (1959), శభాష్‌ రాముడా (1959), కృష్ణలీలలు (1959), అప్పుచేసి పప్పుకూడు (1958), శరద (1957) మొదలైన చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రాసి సినీ రచయితగా తారాపథంలో దూసుకెళ్లారు. ఈ చిత్రాలన్ని ఘనవిజయం సాధించినవే! ఇక ఇల్లరికం (1959) కథను అల్లిన వారు వెంపటి వారే!

60వ దశకం
1960 లో ‘దేవాంతకుడు’, చిత్రానికి కథ, మాటలు వ్రాసింది వెంపటే. (ఈ సోషియో ఫాంటసీ చిత్రంలోని ‘గోగ్గో గోంగూర’ పాట జనాదరణ పొందింది) ఈ చిత్రమే మళ్లీ 1977 లో ‘యమగోల’గా నిర్మించినపుడు బాక్సాఫీసును బద్దలు చేసింది. ఆ తరువాత ‘యమలీల, యమదొంగ’ వంటి చిత్రాలకు మూల బిందువు వెంపటి కథే. 1961 లో ‘ఉషా పరిణయం’, ‘కన్న కొడుకు’ ‘శభాష్‌ రాజా’ చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు వ్రాశాడు. ‘లవకుశ’ (1963) చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రచించి, ఓ అపురూప దృశ్యకావ్యంగా అందించిన ఘనత వెంపటిదే. 1964 లో బి.ఎ. సుబ్బారావు దర్శకత్వం వహించిన ‘మై రావణ’కు, గుత్తారామనీడు దర్శకత్వంలో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’ చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు వ్రాశాడు. 1966లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన పరమానందయ శిష్యుల కథ చిత్రానికి కథ మాటలు కొన్ని పాటలు పద్యాలు వ్రాశాడు. లలితా శివజ్యోతి వారి ‘రహస్యం’ (1967) ఈయన చివరి చిత్రం. ఈ చిత్రానికి కథను సుబ్రహ్మణ్యం పిళ్లె అందించాడు. మాటలు, కొన్ని పాటలు పద్యాలు సదాశివబ్రహ్మం వ్రాశాడు.

సదాశివబ్రహ్మం జనవరి 1, 1968 సంవత్సరంలో గుండెపోటుతో ఆకస్మికంగా చెన్నైలో పరమపదించారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -29

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -29

29-‘’స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి’’ గీతరచయిత ,శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమా ఫేం-తోలేటి

1954లో గుబ్బి కర్నాటక వారి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమాకు మాటలు ,పాటలు రాసి ఆంధ్రలోకం లో ఆ భక్తిసినిమాను బంగారు ఉయ్యాలలో ఊగించిన రచయిత శ్రీ తోలేటి వెంకట శాస్త్రి అనే వెంకట రెడ్డి .ఇందులో కన్నడ రాజకుమార్ భక్తకన్నప్పగా గొప్ప గా అద్భుతంగా నటించారు .కుమారి ,మాలతి ఋష్యేంద్రమణి,పద్మనాభం ,రామచంద్ర శాస్త్రి రాజసులోచన ,లింగమూర్తి నటించి తమ నట జీవితం సార్ధకం చేసుకొన్నారు .ఆర్ సుదర్శనం మహా గొప్ప సంగీతం అందించిన ఈ సినిమా దర్శకుడు హెచ్ ఎం ఎల్ సింహా .జయజయ మహా దేవా శంభో ,పాహీ శంకరా మాం పాహీ శంకరా ,మహేశా పాపవినాశా కైలాస వాసా ఈశా ,మధురం శివమంత్రం ,మాయ జాలమున మునిగేవు నరుడా ,స్వామీ చంచలమైన ‘’మొదలైన పాటలన్నీ భక్తీ బంధురంగా తోలేటి రాస్తే అంతే గొప్పగా ఘంటసాల మాస్టారు గానం చేశారు .ఇంతమంది మహామహుల వలన ఆసినిమా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచింది ఆ సినిమాపేరు చెబితే చాలు పరవశమే కలుగుతుంది నాకు .

ఘంటసాల గారు విజయనగరం లో సంగీతం అభ్యసిస్తున్న సమయం లో తోలేటి పరిచయమై చివరిదాకా మిత్రులుగా ఉన్నారు .విజయనగరం లో జన్మించిన తోలేటి ఇంటర్ వరకు మాత్రమె చదువుకొన్నారు. తర్వాత మద్రాస్ వచ్చి కొలంబియా ,హెచ్ ఎం వి గ్రామఫోన్ కంపెనీలకు పాటలు రాశారు .కాళహస్తీశ్వర మహాత్మ్యం(1954) కాకుండా ఎవిఎమ్ . వారి జీవితం(1950) ,మొదటిరాత్రి ఆడజన్మ ,నవ్వితే నవ రత్నాలు అత్తి౦టికాపురం(డైలాగ్స్ ,పాటలు )సంఘం –డైలాగ్స్ ,పాటలు ,కాంచన , సవతిపోరు వదిన ,ఆలీబాబా నలభై దొంగలు ,సదారమ సినిమాలకు రచన చేశారు .

జీవితం లో ‘’,’’ఇదేనా మా దేశం భారత దేశం ‘’ మనమనసు మనసు ఏకమై , ’టిప్పు టిప్పు టప్పు నాది

  1. సంఘం లో – నమ్మరాదురా ఆడదాని నమ్మరాదురా – మాధవపెద్ది బృందం పెళ్ళి పెళ్ళి పెళ్ళి పెళ్ళి ఈడైన దానితో జోడిగా హాయిగా – పిఠాపురం
  2. భారత వీరకుమారిని నేనే నారి రతనము నేనే – పి.సుశీల
  3. సుందరాంగ మరువగలేనోయ్ రావేలా నా అందచందములు – పి.సుశీల, టి.ఎస్.భగవతి

మొదలైన హిట్ సాంగ్స్ రాశారు తోలేటి

తోలేటి సినిమా గీత రచయిత గానే కాకుండా స్వాతంత్ర్యోద్యమ గీత రచయితగా గొప్ప పేరు పొందారు .ఆయన రాసిన ఆణిముత్యాల వంటి పాటలు

1-స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి –నిరంకుశంబు లైన శక్తులేగిరినా నిర్భయముగా ఎదిరించండి

2-అమ్మాసరోజినీదేవీ –స్త్రీ జాతి శిరోమణి వమ్మా

3-కనవోయి వసంతరేయి

4-వలపుపూలబాల

5-ఆనందమే లేదా

సుమారు 12 సినిమాలకు రచన చేసిన తోలేటి వెంకట శాస్త్రి (రెడ్డి )41వ ఏటనే 6-6-1951 న మద్రాస్ లో తల్లి ,భార్య ఆరుగురు సంతానం ను వదిలి మరణించారు .

స్వాతంత్య్రమె నా జన్మహక్కని చాటండి
నిరంకుశంబగు శక్తులెగిరినా
నిర్భయముగ నెదిరించండి
పరుల దాస్యమున బాధలు పొంది
బ్రతికిన చచ్చిన భేదమె లేదు॥
కవోష్ణ రుధిర జ్వాలల తోటి
స్వతంత్ర సమరం నెరపండి
ఎంతకాలమిటు సహించియున్న
దోపిడి మూకకు దయ రాదన్న॥
సంఘములోను ఐక్యత వేగమె
సంఘటపరుపుము శాంతిపథాన
స్వర్గతుల్యవౌ స్వతంత్ర జ్యోతికి
మాంగల్యపు హారతులిమ్మా॥
‘ఆ మొగల్ రణధీరులు’ అనే పద్యాన్ని ఒక్కసారి మోహన రాగంలో సమ్మోహనంగా పాడేసి అందుకున్న ఈ పాట ‘భీంపలాస్’లో మొక్కుబడిగా ఈ పాట ఏదో మీ కోసమో నా కోసమో పాడలేదు. మనసా, వాచా, ఆర్తితో దేశం కోసమే పాడినట్లుగా అనిపిస్తుంది.
కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా? దేశభకె్తైనా సహజంగానే స్వతస్సిద్ధంగానే పుట్టాలి. నేను, నా దేశం, నా ప్రజలు అంటూ జెండా మోసి, జైలు జీవితం కూడా గడిపిన ఘంటసాల జీవితానుభవమంతా ఈ పాటలో ప్రతిధ్వనించిందేమో అనిపిస్తుంది.
అందుకే అంటారు. అంతరాత్మను మించిన గురువు లేడు. లోకాన్ని మించిన పెద్ద గ్రంథం లేదని. నేను రేడియోలో పని చేసిన రోజుల్లో వెనకటి తరంలోని ప్రసిద్ధ గాయనీ గాయకుల రికార్డులు వెదికేవాణ్ణి.
ఆలిండియా రేడియోలో లలిత సంగీతం ప్రసారానికి అంకురార్పణ జరిగిన తొలి రోజుల్లో వెలువడిన పాటల్లో ఇదొకటి.
కేవలం 3 నిమిషాల 20 సెకన్లలో తిరిగే గ్రామఫోన్ రికార్డులతో (78 ఆర్‌పిఎం) లభ్యమైన పాటలు అసంఖ్యాకంగా ఆ రోజుల్లో విడుదలయ్యేవి.
క్రమక్రమంగా ఘంటసాల కంఠాన్ని అమితంగా ఇష్టపడిన వారి కోసం తయారైన ఆ పాటలన్నీ ఒక ఎల్‌పి రికార్డ్‌గా వేశారు. తోలేటి రాసిన పాటల్లో చాలా ప్రసిద్ధమైన గీతం ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కు’. ఘంటసాల విజయనగరంలో వున్న రోజుల్లో పరిచయమైన తోలేటి క్రమంగా సన్నిహితుడై స్నేహితుడయ్యాడు. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, జీవితం, సంఘం, వదిన లాంటి కొన్ని సినిమాలక్కూడా పాటలు రాశాడు.
తోలేటి వెంకటరెడ్డిగా పేరు మార్చినా, అసలు పేరు తోలేటి వెంకటశాస్ర్తీ. ముత్యాల్లాంటి మాటలకు సర్వాంగసుందరమైన రాగాన్ని జోడించి గమక సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఘంటసాల ఎంత నాద సుఖం అనుభవించాడో?
పాటలో ప్రతి మాట, ప్రతి అక్షరం నాదాన్ని నింపుకుని చెవికి సోకితే కలిగే ఆనందం వంద మందిలో ఏ ఒకరిద్దరికో మాత్రమే లభిస్తుంది. మిగిలిన వారూ వింటారు. కానీ అర్థమై అనుభవించేది మాత్రం ఆ ఇద్దరే. పాట చెవికి వినబడితే చాలదు. అంతరంగాన్ని చైతన్యపరచాలి. తివాసీ పరిచినట్లు పచ్చని పొలాల్లో బారులు తీరి వాలే కొంగల్ని చూస్తూంటే కలిగే అనుభూతి, పాట వింటే కలగాలి. అదీ పాటంటే – కబుర్లు చెప్తూ, కాలక్షేపం కోసం వినే మిగిలినవన్నీ ఇలా వింటే, అలా మరిచిపోయేవే. కాలచక్రంలో కనిపించకుండా పోయేవే.- మల్లాది సూరిబాబు

ఆరుద్ర

తన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకోకుండా 1948లో శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారికి పరిచయమై ఎన్నడూ ఆశించని సినీరంగ జీవితాన్ని ప్రారంభించినట్టే- డబ్బింగ్ చిత్ర రచయితగా స్థిరపడే ఉద్దేశం లేకపోయినా మోడరన్ థియేటర్స్ వారి ‘ఆలీబాబా- 40 దొంగలు’ అనువాద చిత్రానికి దాని రచయిత అయిన తోలేటి వెంకటరెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఆపద్ధర్మంగా పూర్తి చెయ్యవలసి వచ్చింది. దాంతో అనువాద చిత్ర రచన కూడా కొనసాగించారు. దానికి ముందే ‘ప్రేమలేఖలు’ (1953)కి మాటలు, పాటలు రాస్తే అది ట్రాక్ ఛేంజ్ చిత్రమే అయినా ఆ సినిమాను పరిశ్రమలో డబ్బింగ్ చిత్రంగా పరిగణించడం వల్ల అప్పటికే ఆరుద్రకు అనువాద రచయితగా కూడా ముద్రపడింది.

కాళహస్తీశ్వర మహాత్మ్యం లో తోలేటి పాటలు మూడు మచ్చుకి

1-జయజయ మహాదేవ శంభో హరా శంకరా సత్యశివసుందరా నిత్య గంగాధరా ……
బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ …… దయాసాగరా ……
భీకారారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షిసంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్ ……
దివ్య జపహోమతపమంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్ ……
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్ …… దుష్టాత్ముడన్ ……
విశ్వరూపా …… మహా మేరుచాపా …… జగత్‌సృష్టి సంరక్ష సంహార కార్యత్కలాపా ……
మహిన్ పంచభూతాత్మవీవే కదా …… దేవ దేవా …… శివా ……
పృధ్వి జలవాయురాకాశ తేజోవిలాసా …… మహేశా …… ప్రభో ……

2-రంగుబంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా …… కాశీపురాధీశ విశ్వేశ్వరా ……
నీలి మేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వరా ….. శ్రీశైల మల్లేశ్వరా …..
కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా …… శ్రీరామలింగేశ్వరా ……
నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా …… భీమేశ్వరా ……
దివ్యఫలపుష్పసందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా …… శ్రీకాళహస్తీశ్వరా …… దేవ దేవా ……
నమస్తే నమస్తే నమస్తే నమ: ……

3-శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి: మా పూజలే తల్లి గౌరీ శంకరీ గౌరీ శంకరీ: (పాట)
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి 1954లో విడుదలైన కాళహస్తి మహాత్యం చిత్రంలోని పేరుపొందిన పాటలలో ఒకటి. ఇది భక్తిగీతం. దీనిని పి.సుశీల అలనాటి నటి కుమారి కోసం ఆలాపించారు. తోలేటి వెంకటరెడ్డి సాహిత్యం అందించగా, ఆర్.సుదర్శనం సంగీతం అందించారు.

ఈ పాట పి.సుశీల మొదటి పాటలలో ఒకటి, నటి కుమారికి చివరి పాట, ఈ చిత్రం ఆవిడ చివరి చిత్రం కూడా. తోలేటి పార్వతీదేవిని కీర్తిస్తూ ఎంతో అందంగా రాయగా, ఆర్.సుదర్శనం కోమలమైన సంగీతం అందించిన ఈ పాటను సుశీల ఎంతో శ్రావ్యంగా పాడగా, కుమారి అద్భుతంగా అభినయించారు. ఈ పాట చివరిలో నటుడు లింగమూర్తి కూడా వస్తారు. ఈ పాట ద్వారా కుమారి పాత్ర అయిన ‘గౌరి’ కథలోకి ప్రవేశిస్తుంది. ఈ పాటను వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలన్నంత అద్భుతంగా ఉంటుంది.

ప్రాపు నీవె పాపహారి పద్మపత్రనేత్రి

కాపాడరావమ్మా కాత్యాయినీ

కాపాడరావమ్మా కాత్యాయినీ

శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి

మా పూజలే తల్లి గౌరీ శంకరీ

గౌరీ శంకరీ

నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ

నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ

పాలించరావమ్మా పరమేశ్వరీ

పాలించరావమ్మా పరమేశ్వరీ

శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి

మా పూజలే తల్లి గౌరీ శంకరీ

గౌరీ శంకరీ.-

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -28 28-సినీ వరూధిని,గానకోకిల  –రామతిలకం

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -28

28-సినీ వరూధిని,గానకోకిల  –రామతిలకం

6-6-1905న శ్రీమతి దాసరి రామతిలకం విజయవాడలో జన్మించారు .దైవ దత్త మైన కోకిల క౦ఠం తో ,స్వయం కృషితో చిన్నప్పటి నుంచి సంగీతం లో సాధన చేసి ,తన సంగీత సామర్ధ్యానికి నాటకరంగం దోహదం చేస్తుందని కాళ్ళకూరి నారాయణ రావు గారి ‘’ చింతామణి ‘’నాటకం లో చింతామణి గా సాక్షాత్కరించి కళాభిజ్ఞుల హర్షధ్వానాలు పొందారు. శ్రీ కృష్ణ తులాభారం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ లీలు నాటకాలలో కథానాయికగా నటించి రాణించారు .

  గానకోకిలగా కీర్తి పొందిన రామ తిలకం తండ్రి పువ్వుల వెంకటరత్నం నాయుడు ఆంధ్రదేశం లో గొప్ప మృదంగ విద్వాంసునిగా గుర్తింపు పొందారు .పువ్వుల నారాయణరావు గారి వద్ద తిలకం సంగీతం అభ్యసింఛి కచేరీలు చేసే సామర్ధ్యం సాధింఛి పదకొండు కచేరీలు చేశారు .అందమైన ముఖం ,నొక్కులజుట్టు ,విశాల నేత్రాలు ,దివ్యమైన స్వరం ,గొప్ప అభినయం ,చలాకీతనం ,వయ్యారం వొలకబోస్తూ ఉండటం తో  ఆమెను ఆ కాలం లో ‘’వరూధిని గా ‘’భావించేవారు .సంస్కారవంతమైన భాష ఉచ్చారణ ఆమె సొత్తు .కొమ్మూరు లక్ష్మీ నారాయణరావు గారు స్థాపించిన మైలవరం లోని లక్ష్మీ విలాస సభలో ,తర్వాత కపిలవాయి రామనాథ శాస్త్రిగారి బాలభారతి నాట్యమండలి లో చింతామణి, చిత్రాంగి ,సత్యభామ, అహల్య, సావిత్రి వేషాలు ధరించి ప్రేక్షక నీరాజనాలందుకొన్న మేటి నటీతిలకం రామ తిలకం  .

 1982లో కలకత్తా ఈస్ట్ ఇండియా ఫలిం కంపెనీ వారి సావిత్రి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి అఖండ కీర్తి గౌరవాలు పొందారు .ఆమె అభినయానికి ముగ్ధులై ఈ సినిమా చూడటానికి  ప్రేక్షకులు తండోప తండాలుగా ,తీర్ధ ప్రజలాగా వచ్చేవారు .  1933లో మదన్ దియేటర్స్ వారు కలకత్తాలో కాళ్ళకూరి సదాశివ రావు దర్శకత్వం లో నిర్మించిన ‘’చింతామణి ‘’చిత్రం లో చింతామణి గా నటించి సినీ రంగాప్రావేశం చేశారు .తర్వాత ఈస్ట్ ఇండియా కంపెని వారి సావిత్రిలో ,సరస్వతీ టాకీస్ వారి ద్రౌపదీ వస్త్రాపహరణం లో ,నేషనల్ మువి టోన్ వారిచిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం లో  వేమూరి గగ్గయ్య ,పులిపాటి వెంకటేశ్వర్లు ,కృష్ణ వేణి మొదలైన వారు నటించిన  ‘’మోహినీ రుక్మాంగద ‘’లో వేల్ పిక్చర్స్ వారి ‘’శ్రీ కృష్ణ లీలలు ‘’ లో నటించారు ఈ కృష్ణలీలలు లో యశోదగా నటించి కంఠం ఎత్తి ‘’కలయో వైష్ణవ మాయయో ‘’పద్యాన్ని పాడితే ఆంద్ర ప్రేక్షకలోకం తన్మయత్వ౦ తో పరవశించి పోయింది .రామతికం ను ‘’గానకోకిల ‘’గా ఆంధ్రప్రేక్షకలోకం ఆరాధించింది . .తిలకం పాడిన పాటలన్నీ హెచ్ ఎం వి గ్రామ ఫోన్ రికార్డ్ లుగా విడుదలై ఇంటింటా ప్రతిధ్వనించాయి . ఈస్ట్ ఇండియా వారి రామదాసు లోనూ ,కృష్ణా ఫిలిమ్స్ వారి రామదాసులోను తిలకం నటించటం విశేషం .బాలయోగిని ,తెనాలి రామకృష్ణ ,ఆనేస్ట్ రోగ్లలో కూడా నటించారు . అల్లసాని పెద్దనకవి రచించిన ‘’మను చరిత్ర ‘’ప్రబంధం ఆధారంగా ,బివి రామానందం డైరెక్షన్ లో ,తాండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి కదా రచన చేయగా విశ్వనాధ మాటలు పాటలు రాసి ఎస్వి రంగారావు ప్రవరాఖ్యుడుగా వచ్చిన వరూధిని సినిమాలో వరూధిని పాత్ర పోషించారు రామ తిలకం .సినిమా అట్టర్ ఫ్లాప్ . క్రమంగా సినిమాలలో నేపధ్యగానానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉండటం తో సంగీతం క్షుణ్ణం తెలిసిన రామతిలకం వెండి తెరకు దూరమయ్యారు .ప్రముఖ హాస్యనటి గిరిజ  రామతిలకం కుమార్తె .

  14-3-1952న 48వ ఏటనే సినీ వరూధిని రామ తిలకం అమరలోకం చేరారు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-22-ఉయ్యూరు

 

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -27 27-కీలుగుఱ్ఱం రాక్షసి పాత్రలో రాణించిన గాయని –కనకం

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -27 27-కీలుగుఱ్ఱం రాక్షసి పాత్రలో రాణించిన గాయని –కనకం

పురస్కారాలు
· నాటకరంగంలో చేసిన కృషికిగాను తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక పురస్కారము 2014లో లభించింది.

· సినీ రంగంలో సేవలందిన వారికి ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ ఆర్ట్ అవార్డ్ ను 2004 సంవత్సరానికి గాను కనకం అందుకున్నారు.

మరణం
అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలో చికిత్స పొందుతూ88వ ఏట కనకం 2015 జూలై 21 మంగళవారం మృతి చెందారు[

చిత్రసమాహారం[మార్చు]
గృహప్రవేశం (1946)
బ్రహ్మరథం (1947)
కీలుగుర్రం (1949)
రక్షరేఖ (1949)
గుణసుందరి కథ (1949)
షావుకారు (1950)
పల్లెటూరి పిల్ల (1950)
చంద్రవంక (1951)
సౌదామిని (1951)
అగ్నిపరీక్ష (1951)
మాయపిల్ల (1951)
ఆకాశరాజు (1951)
మానవతి (1952)
రాజేశ్వరి (1952)
టింగ్ రంగా (1952)
ప్రియురాలు (1952)
నలదమయంతి (1957)
లేత మనసులు (1966)
భక్త ప్రహ్లాద (1967)
అవేకళ్లు (1967)
సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -26

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -26

26-‘’వినరా సూరమ్మ కూతురు మొగుడా ‘’పాటఫేం –అప్పలాచార్య

1966లోనే పొట్టిప్లీడరు సినిమాలో పద్మనాభానికి ‘’పోపోపో పొట్టి ప్లీడరు’’పాటరాసినా ,1972లో వచ్చిన ఇల్లు ఇల్లాలు సినిమాలో రాజబాబు ,రామాప్రభాలకు స్టోరీ సాంగ్ ‘’వినరా సూరమ్మ కూతురు మొగుడా వివరము చెబుతాను ‘’పాట వచ్చేదాకా కవి అప్పలాచార్య పేరు ఎవరికీ తెలియదు ఈ పాత దాదాపు మూడు దశాబ్దాలు ప్రతి ఇంట్లోనూ మారు మోగింది అంతటి హిట్ సాంగ్ రాశారు అప్పలాచార్య .అసలుపేరు

కొడకండ్ల అప్పలాచార్య  సినిమాలలో హాస్య సన్నివేశాలను, హాస్య గీతాలను వ్రాయడంలో ప్రసిద్ధి చెందా. ఈయన సముద్రాల రాఘవాచార్య మేనల్లుడు. పద్మనాభం సినిమాలకు ఎక్కువగా  హాస్యగీతాలను వ్రాశారు[1].1966నుంచి 86 వరకు 20 ఏళ్ళు సిని రచన చేశారు

3-5-1999లో మద్రాస్ లో చనిపోయారు .

70ల్లోనే అప్పలాచార్య చేసిన కొన్ని ప్రయోగాల్ని చెప్పుకుతీరాలి. ఒకటి ఇల్లుఇల్లాలు అనే సినిమాలో “వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయం చెబుతాను అసలు విషయం చెబుతాను” అనే పాట. బహుశా తెలుగులో ఇలాటి పాట మరోటి లేదనుకుంటాను. మంచి సస్పెన్స్‌, హాస్యం, చమత్కారం అన్నీ సమపాళ్ళలో కలబోసిన పాట ఇది. కారు మబ్బులూ కమ్మిన వేళా…
కాకులు గూటికి చేరే వేళ…కా..కా…

చందమామ తొంగి చూసేవేళా …
సన్నజాజులు పూసే వేళ ..అహా…ఓహో…
ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే..
ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే
లాలీ లాలీ లాలీ లలీ లాలీ లాలీ లాలీ లలీ లో…

ఏం జలిగిందీ…

తలుపు కిర్రునా చప్పుడైనది…
గుండె ఝల్లునా కొట్టుకున్నది…
తలుపు కిర్రునా చప్పుడైనది…
గుండె ఝల్లునా కొట్టుకున్నది…
మెల్ల మెల్లగా కళ్ళు తెరచి
నే వచ్చినదెవరో చూశాను…
ఎవలాలూ…
నల్లనివాడు…గుంట కన్నుల వాడు ..
గుబురుమీసాల వాడు …
అయ్యబాబోయ్…
ఆరడుగుల పొడుగు వాడు …
ముద్దులిమ్మని నన్ను అడిగినాడు …
ఏయ్ వాణ్ణీ నే నలికేత్తాను….

నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ మొగము దాచుకొన్నా…
పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడూ …
అమ్మా…నాన్నా….
అమ్మా…నాన్నా…కాపాడమంటూ…అల్లాడిపోయాను..
అయినా గానీ వదలక నన్ను ఒడిసిపట్టినాడు…

అంతలో వచ్చింది… ఏవిటీ మూల్చా?

కాదు… మా అమ్మ… హి హి ఏవంది?

వెళ్ళవే నా తల్లి… వెళ్ళవే అమ్మా…
ముద్దులిస్తే… నీకు డబ్బులిస్తాడు…
మంచి బట్టలిస్తాడు… డబ్బులిస్తాడు…
మంచి బట్టలిస్తాడు….అనీ ముందుకు తోసింది

హా అది తల్లా!!.. కాదు లాచ్చసి..
పిశాచి…దెయ్యం….
తలవాతేవైందో చెప్పు …

తప్పనిసరియై వెళ్ళేను .సిగ్గుపడుతు నిలుచున్నాను..హా..
గదిలోకెత్తుకు పోయేడు కథలూ కబుర్లు చెప్పేడు…
తన దుప్పటిలో చోటిచ్చాడు…

ఛీ.. కులతా పాపాత్ములాలా…
నువ్వు నాకొద్దు.. ఫో.. వాడిదగ్గిరికే పో…

అంత కోపం ఎందుకయ్యా …అప్పుడు నావయసైదయ్య …
ఏవిటీ అప్పుడూ నీకైదేళ్ళా..ఆ…హహ..

అంత కోపం ఎందుకయ్యా… అప్పుడు నావయసైదయ్యా …
ఆ వచ్చినదీ మా తాతయ్య…
తాతయ్య….తాతయ్యా…
తకతయ్య… మలి చెప్పవేం….
తాతయ్య….తకతయ్య..
తాతయ్య….తకతయ్య..
తాతయ్య….తకతయ్య.. హహహ..
తాతయ్యా…నేనూ ఎవలో అనుకున్నాను….
తాతయ్య కొంప ముంచేశాలు.. హహహహహ..

  • అలాగే, పూర్తి హాస్యం కోసం రాసిన మరోపాట “ఆకాశం నుంచి నాకోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయిపొట్లం తెచ్చావా” అనేది. దీన్లో చాలా గమ్మ్తౖతెన పోలికలు వాడటం జరిగింది. ఉదాహరణకి, “నీ జడపిన్ను నా తలరాతకు పెన్ను, నీ సిగపువ్వు బుజబుజరేకుల లవ్వు, నీ చిలిపి బిడియం అమృతంలో కూరిన వడియం, నీ పెదవులు రెండు నా ముక్కుకు దొండ పండ్లు” అనే చరణంలో ఉన్న ఉపమానాలు ఎప్పుడూ ఎక్కడా విన్నవి కావు. 70ల్లో వచ్చిన మరో ప్రయోగం హిందీలో బాగా హిట్‌ అయిన పాటల ట్యూన్లకి తెలుగులో హాస్యపాటలు రాయటం.

“మీనా” చితానికి అప్పలాచార్య మాట, లను రాస్తున్నారు కలం బలం వుండి కూడా. అంగబలం లేమివల్ట (పసిద్భుడు కాలేకపోయిన రచయిత అప్పలాచార్య. ఇప్పుడు అతని శక్తిని పరీక్షించ బాధ్యతను అప్పగించి ది విజయనిర్మల ఇందులో. నెగ్గితే ఆఫర్లు వస్తాయి ఈ చిన్నతనంలో కృష్ణ, జగ్గయ్య ఎన్వీ? రాజబాబు; విజయ”) , చందకళ, ఎస్వరలక్షీ సూర్యకాంతం, రమా(ప్రభ, ఛాయాదేవి అల్టురామరింగయ్య, సాక్షి రంగా రావు – ముఖ్య ప్మాతధారులు నందినీలో నిర్మాణ నిర్వాహకుడిగ్గా వుండి, పనులన్నీ సామర్శ్య్యంతో చక్కబెట్టిన పివి రమ ణయ్య ఈ చితానికి నిర్మాత .ఛాయను వి ఎస్‌. అర్‌ స్వామి, కూర్పును కోటగిరి గోపాలరావు, కళను తోట నిర్వహిస్తున్నారు (శీ ఫిలింస్‌ విడుదల. మొత్తానికి. “మీనా కధను తనకే దక్కిం చుకొన్నాడు, రమణయ్య న్యాయం జయిస్తుంది, మంచితనం ఫలితాన్ని యిస్తుంది అని నిరు పించబడింది

 

ఎన్నో దు:ఖాలకు ఆలవాలమైన ఈ ప్రపంచంలో ఎన్నో అందాలు వున్నట్లే
కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, సరదాలు హాస్యాలు చలోక్తులు చమత్కారాలు వెల్లి విరిసి నవ్వుల పువ్వులవుతూ వుంటాయి.
.
అదే మానవ జీవితం- ఈ ప్రపంచం రచనల్లో హాస్యం సన్నగిల్లిపోయింది. హాస్యరస ప్రధానమైన కథ పత్రికలో కనిపించటమే అరుదైపోయింది – కనిపించినా అందులో హాస్యం పల్చగా వార్చినా గంజిలా వుంటోంది. ఇంక సినిమాల్లో హాస్యపు సన్నివేశాలు పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించడానికి తెగ అవస్థ పడుపోతున్నారు-,

 

  1. “మోసగాళ్లకు మోసగాడు”

 

నక్క జిత్తుల నాగన్న పాత్రలో నాగభూషణం జీవించారు ..ఆ క్యారెక్టర్ ఊతపదం ‘అబ్బయ్య’  కూడా బాగా పేలింది.  నాగభూషణం పై చిత్రీకరించిన పాట ‘ఎలాగుంది  ఎలాగుంది అబ్బాయా’  కూడా సరిగ్గా కథకు సరిపోయింది.   ఆదినారాయణరావు సంగీతం కూడా సినిమాకు ఊపు నిచ్చింది.   కృష్ణ ఆస్థాన రచయిత అప్పలాచార్య నాగభూషణం పాత్ర ద్వారా కొంత కామెడీ అందించారు

విజయనిర్మల డైరెక్ట్ చేసిన మీనా సినిమాకు అప్పలాచార్య మాటలు రాస్తున్నారు .కలం బలం ఉన్నా అంగబలం లేక వెనకబడి పోయిన రచయితా

ఎన్నో దు:ఖాలకు ఆలవాలమైన ఈ ప్రపంచంలో ఎన్నో అందాలు వున్నట్లే
కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, సరదాలు హాస్యాలు చలోక్తులు చమత్కారాలు వెల్లి విరిసి నవ్వుల పువ్వులవుతూ వుంటాయి.
.
అదే మానవ జీవితం- ఈ ప్రపంచం రచనల్లో హాస్యం సన్నగిల్లిపోయింది. హాస్యరస ప్రధానమైన కథ పత్రికలో కనిపించటమే అరుదైపోయింది – కనిపించినా అందులో హాస్యం పల్చగా వార్చినా గంజిలా వుంటోంది. ఇంక సినిమాల్లో హాస్యపు సన్నివేశాలు పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించడానికి తెగ అవస్థ పడుపోతున్నారు-,

 

హాస్యనటుడు పద్మనాభం సినిమా’’పొట్టిప్లీడరు ‘’లో పోపోపో పొట్టి ప్లీడర్ పాట తోపాటు ,మరపురానికధలో ‘’ఉలికి ఉలికి చిరునవ్వులోలికే పాపా తళుకు బెళుకు ‘’,చెల్లెలికోసం లో-కన్నీటి కోనేటిలో చిన్నారి కలువపూసింది ,నేనేంటే నేను లో ‘’బలే బలే నరసిమసామినిర, నిన్ను నంచుక తి౦టనురా ,’’కర్పూరహారతి లో –‘’కిల్లాడెంకటసామి బలే వకీలయా ‘’,శ్రీరామ కధలో –చారుచారు బలే చారు చామంతి విలే ‘’,మొల్ల లో –‘’తిక్కన్న పెళ్లి కొడుకాయెనే ‘’,జగజ్జెట్టీలు లో ‘’సోకైనమల్లెపువ్వు మీదా మగాడా నీకు మోజు లేదా ?’’,పగసాధిస్తా లో’’ఓ మై డార్లింగ్ నిన్ను విడిచి ‘’,మా మంచి అక్కయ్య లో –ఏమోఏమోఅడగాలనుకొన్నాను ‘’,అత్తా కోడళ్ళు లో –‘’బలేబాలే బావయ్యో గబగబా రావయ్యో ‘’,అనూరాధ లో ‘’యాదయ్యయాదయ్యజాజిరీ యదలోన యాదయ్య ‘’,కత్తికి కంకణం లో –గప్పం గప్పం కత్తులు బల్ గమ్మత్తైన కత్తులు ‘’,దైవం లేదా దైవం లేదా ‘’,జాతకరత్న మిడత౦ భొట్లు లో-‘’అమ్మమ్మయ్యో అయ్యయ్యయ్యో తాళలేని బాధరా ‘’,కనరావా ఓ ప్రియా ,’’చెలియా సఖియా ‘’,దయ చూడవే గాడిదా పాటలు, ‘’వీరమ్మ సంపద విషయంము వివరించి ‘’పద్యం,నా తమ్ముడులో –హేమ సుందరాకారా ‘’,మనసు మాంగల్యం లో –ఎలాఉన్నది ఎలాఉన్నది ‘’,ఆజన్మ బ్రహ్మ చారిలో –పెళ్ళిమానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్ ‘’,’’వినుమా వేదాంతసారం ,అడవిన పూలకట్టేల పద్యం ,మాయామోహ జగమే సత్యమని ,ఇన్స్పెక్టర్ భార్య లో’’ చూడు చూడు చూడు ‘’,ద్రౌపది వస్త్రాపహరణం నాటిక ,’’నా వళ్ళంతా బంగారం  ,నీ కళ్ళు చెదిరే సింగారం ,’’ఇల్లు ఇల్లాలు లో ‘’వినరా సూరమ్మ కూతురు మగడా ‘’,ఇల్లే ఇలలో స్వర్గమని ఇల్లాలే ఇంటికి దీపమని ‘’,గూడు పుఠానిలో –ఓమాయా ముదరమగ్గిన బొప్పాసుకాయా ‘’పద్యం ,’’ఓసీ మాయా పచ్చి అరటికాయా ‘’విరివిగా కన్నాలు వేసిన మొనగాడు మా తాత ‘’హాన్డ్సప్పు హాన్డ్సప్పు నాఎదుట కూర్చొనుట తప్పు ‘’పండంటికాపురం లో –‘’ఆడి పాడే కాలం లోనే అనుభవించాలి’’,తల్లీ కొడుకులు లో- వెయ వెయ ఇంకా వేయి ‘’,మమత లో –గరంగరం పప్పు ఇది బరం పురం పప్పు పాటలు రాశారు .

ఇవికాక మా౦గల్యభాగ్యం, హారతి ,అమ్మా నాన్న, దేవుడే గెలిచాడు ,పెద్దన్నయ్య ,పోరుగింటికాపురం ,వనజ గిరిజ ,జన్మజన్మల బంధం ,పల్లెసీమ, మొరటోడు ,,సావాసగాళ్ళు, లవ్ మారేజ్ , ,కిలాడి కిష్టుడు శాంతి ,సంఘం చెక్కిన శిల్పాలు ,సినిమా పిచ్చోడు ,అమాయకుడు కాదు అసాధ్యుడు, భోగిమంటలు సినిమాలకు పాటలు రాశారు. చివరి సినిమా,1986లో వచ్చిన ఆది దంపతులు సినిమాలో ‘’సాగి౦చరా  మామ సంసారం సాగించారా ‘’చివరి పాట సత్యం సంగీత దర్శకత్వం లో రాశారు అప్పలాచార్య.

ఎక్కువగా కోదండపాణి సంగీతం చేసిన సినిమాలకు పాటలు రాశారు .ఆతర్వాత సత్యం, మహదేవన్ ,పెండ్యాల ,చక్రవర్తి, జికే వెంకటేష్ ,చలపతిరావు ,రాఘవులు ,రమేష్ నాయుడు సంగీతం చేసిన చిత్రాలకూ పాటలు రాశారు .

‘’వినర సూరమ్మ కూతురు మగడా’’సినిమాతో వెలిగిపోయిన అప్పలాచార్య దమ్మున్న గీత రచయితా అని పించుకొన్నారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-21-ఉయ్యూరు

 

 

 

 

 

, ,

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Posted in సినిమా | Tagged | Leave a comment

రౌతు జగన్నాథ రాయుని జీవిత చరిత్రము

రౌతు జగన్నాథ రాయుని జీవిత చరిత్రము
అనే పద్యకావ్యాన్ని విజయనగర వాస్తవ్యులులు విజయనగర ఆస్థాన నాట్య శాల కవీశ్వరుడు శ్రీ సోమయాజుల సూరి దాస కవి రచించి ,శ్రీ సెట్టి నరసింహం గారిచే సరి చూడబడి ,తిరుపతి పుండరీక ముద్రాక్షర శాలలో 1920లో ప్రచురింపబడింది .వెల వివరాలు లేవు .
ఉపోద్ఘాతం లో కవి ‘’ఇప్పటి మనుషుల జీవితం రాయటం కష్టమే అయినా ,సత్పురుషుడు సుగుణ శీలి అయిన రౌతు జగన్నాథ రాయుని గురించి అనేకులు చెప్పటం ,కవిగాయక శిఖామణులు పేర్కొనటం చేత ఈ సత్పురుషుని జీవితం శ్రీ మదాన్జనేయ స్వామి అనుగ్రహం తో రాస్తున్నాను కాని నాకున్న గ్రంథ పరిచయం చాలదు ‘’అని వినయంగా చెప్పుకొన్నారు .
మొదటగా తన గురువు దాస నారాయణ గారి గురించి సీసం లో వివరిస్తూ అజ్జాడ గ్రామవాసి ,సౌందర్య చారు యశో శీలి ,విద్యలభోజుడైన విజయనగర ప్రభువు ఆనంద గజపతి ఆస్థాన పండితోత్తముడు ,దేవ దేవుని సత్కథలెన్నో తెలిపినవాడు ‘’అని తెలియజేశాడు .
తన వంశాళి గురించి సీసం లో –‘’విజయనగరం లో సోమయాజుల సోమశేఖర ,భద్రాంబ దంపతులకు జన్మించి ఇంగ్లీషు విద్య కొంత నేర్చి ,సర్కారు నౌకరీ చేసి ,మానేసి నాటక రంగాన్ని ఎన్నుకొని ‘’వనితా వేషము దాల్చి వర నృత్య గీతాభినయ విద్యల ‘’చే ప్రజల మెప్పుపొంది ,ప్రఖ్యాతిపొంది కొన్ని సమాజాలేర్పరచి ,గురువై వారికి నేర్పి ,చివరికి సర్కస్ కంపెనీ కూడా పెట్టి .తర్వాత గురువు దాస నారాయణాఖ్యుని చేరి హరికథాగానం నేర్చి ,ఆ అనుభవంతో ఈ కావ్యం రాశాను ‘’అని చెప్పాడు .
ఇష్ట దేవతా ప్రార్ధనలో మొదటగా ‘’దానవ భంజన రామ భక్త,నిష్కామ యశో చారు ,వనఖండన కారణ వాయు నందనుని’’ స్తుతించాడు .తర్వాత విఘ్నేశ్వర సరస్వతి ,స్తుతి చేసి కాళిదాసాది కవులను వినుతించి ‘’పండితుడ నని బింకము జూపను ,సూరి దాసుడన్ తగు సరసుండు రౌతు కులధన్యుడు గాన చరిత్ర వ్రాసెదన్ ‘’అన్నాడు .
మొదటిభాగం లో రౌతు వంశాన్ని వివరించాడుకవి .రౌతు వెంకట కృష్ణమ్మకు వెంకట నరస మా౦బ దంపతులు సుఖ జీవితం గడుపుతూ పుత్రికలను పొంది రామసేవలో తరిస్తున్నారు .పుత్రులు లేరనే చింతతో ఎన్నో దానాలు ధర్మకార్యాలు చేశారు .జగన్నాథాది క్షేత్ర సందర్శనం చేయగా స్వామి అనుగ్రహం లో పుట్టిన పెద్ద కుమారునికి జగన్నాథుడు అని ,చిన్నవాడికి బలరాముడు అనీ పేర్లు పెట్టుకొన్నారు.పెద్ద కూతురు విశాఖ లోమండవిల్లి అప్పలనరసయ్యకిచ్చి పెళ్లి చేశారు .ఆయన గొప్ప వైద్యుడు .వైద్యో నారాయణ అనే మాటకు సార్ధకత తెచ్చాడు హస్తవాసి మంచిది .బావ వెంకట కృష్ణమ్మ కొడుకులను చదివించక పోవటం వలన జగన్నాథుడిని తానె తీసుకువచ్చి చదివించాడు .
రెండవ భాగం లో –అయిదేళ్ళ జగనాథుడు పార్వతీ పురం లో అక్షరాభ్యాసం చేయబడి చదువుపై ఆసక్తిపెంచుకొని ,బుద్ధిమంతుడై ,సద్గుణ గరిష్ఠుడై క్రమంగా ,విద్యా గరిష్ఠుడై బియేపాసై ,మద్రాస్ వెళ్లి ,కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం పొంది ,అందరి మెప్పూ పొందాడు .గోపాలరాయడు తనకూతురు విజయలక్ష్మి నిచ్చి పెళ్లి చేశాడు .వెల్లూరులోట్రెయినింగ్ పూర్తీ చేశాడు రెండువందలమందిలో మొదటి వాడుగా ఉత్తీర్ణుడయ్యాడు .
మూడవ భాగం లో- వెంటనే గుంటూరుజిల్లాలో ఒంగోలులో సబ్ ఇన్స్పెక్టర్ గా చేరి ,లంచాలకు వ్యసనాలకు బానిస కాకుండా ప్రజా క్షేమానికి పాటుపడ్డాడు .ఒక మ్లేచ్చమిత్రుడు అపకారం తలబెడితే ముందే గ్రహించి వాడిని దూరం చేస్తే వాడు వచ్ఛి ప్రాధేయపడితే క్షమించాడు .వేటపాలెం, చీరాలలో పని చేసి ,చాక చక్యంగా అవినీతిని అణచి వేస్తూ పురజనులకు మేలు చేశాడు .లక్షాదిపతులైనా కొటీశ్వరులైనా లెక్క చేయకుండా అన్యాయం చేస్తే కఠినంగా శిక్షించేవాడు. న్యాయ ధర్మాలను రెండు కళ్ళుగా భావించిన సేవామూర్తి .
నాలుగవ భాగం లో-పాలకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేరి ,గుణుపురంలో కాపురం పెట్టాడు .సక్రమగా విధి నిర్వహిస్తూ భార్య విజయలక్ష్మితో కలిసి దానధర్మాలు చేస్తూ దైవభక్తితో జీవితం గడుపుతూ ప్రజాభిమానం పొందాడు .ఒకసారి వరదలవల విపరీతంగా జన ఆస్తి నష్టం జరుగగా సంతర్పణలు చేసి జనుల ప్రాణాలు నిలిపాడు .పర్లాకిమిడిలో సివిల్ మేజిష్ట్రేట్ తగవులన్నీ తన పర్య వేక్షణలో నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పి ప్రజాదరం పొందాడు.భార్య చనిపోయింది అకస్మాత్తుగా .చనిపోయేటప్పుడు భార్య తన సోదరి సత్యమా౦బ పెళ్లి చేసుకోమని కోరగా ,ఆమెమరణానంతరం అలానే పెళ్ళాడాడు .
అయిదవభాగం లో –పార్వతీపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాడు .పేదకన్యలకు పెళ్ళిళ్ళు చేయించాడు .దానం శీలం సత్యం తాపం ధైర్యం కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు .చివరగా
‘’రాయుడు సత్యమా౦బయు రమ్యత మీరగ వెంకటాద్రి నిర్మాయకులై చెలంగుచును మన్నన లందుచు నుండ్రి భక్తులై –కాయము సత్యమే యశము కన్న ధరిత్రిని భాగ్యమే మదే-శ్రేయము ముక్తితీరమును జేరగా జేసేడినావ యు జుడీ ‘’అని ముగించారు కావ్యాన్ని .
కవిగారిది చెయ్యితిరిగిన కవిత్వ విధానం .పద్యాలన్నీ గుర్రం పై రౌతు స్వారిగా మహా వేగంగా సాగిపోతాయి .సందర్భశుద్ధి గా సరళంగా కవిత్వం సాగింది .ఈ కావ్య౦గురి౦చి , కవిగురించీ ఎక్కడా పేర్కొన్నట్లు కనపడలేదు .పరిచయం చేసే భాగ్యం నాకు కల్గినందుకు సంతోషంగా ఉంది .
మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -18-1-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -25

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -25 25- నిష్కర్షగా ,కర్కశంగా మాట్లాడే విదూషక – వ్యంగర వెంకట సుబ్బయ్య (వంగర) మాయాబజార్ సినిమాలో ‘’శాస్త్రం నిష్కర్షగా కర్కశంగా చెబుతుంది .మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి ‘’అని జాతక పరీక్షలో చాకచక్యంగా మాట్లాడిన వంగర నటన గుర్తు ఉండే ఉంటుంది .అసలు పేరు వంగర వెంకట సుబ్బయ్య .24-11-1897 న ప్రకాశం జిల్లా ఒ౦గోలు తాలూకా లో సంగం జాగర్ల మూడి లో జన్మించారు .ఇంగ్లీష్ చదువులపై దృష్టి పోనీకుండా ,సంస్కృతమే నేర్చుకొని పండితులయ్యారు .తెనాలిలో ఉంటూ స్థానం వారి శ్రీ కృష్ణ తులాభారం నాటకం లో వసంతకుడు వేసి కళాభిజ్ఞుల మన్ననలు పొందారు .విప్రనారాయణ ,సక్కూబాయి నాటకాలలో హాస్య పాత్రలు వేశారు 1936లో ఆరోరా ఫిలిమ్స్ వారి ‘’విప్రనారాయణ ‘’సినిమాలో శిష్యుడుగా నటించి ,సినీ ప్రేక్షకులను సంమోహ పరచారు .తర్వాత మోహన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ కంబైన్స్ వారి ‘’బాలయోగిని ‘’ అనే మొదటి బాలల చిత్రం లో చిత్రం లో ముఖ్య పాత్ర పోషించారు .దీని దర్శక నిర్మాత కే సుబ్రహ్మణ్యం .ఆరణి సత్యనారాయణ ,కమలకుమారి ఇతర నటులు . తెలుగు సినిమా మాట నేర్చుకుని .. తడబడుతున్న అడుగులను సరిచేసుకుంటూ నడక నేర్చుకుంటున్న రోజులవి. అప్పటివరకూ నాటకాలే అందరికీ వినోదాన్ని కలిగిస్తూ ఉండేవి. ఆ కాలంలో నాటకాలలో అనుభవం ఉన్నవారిని మాత్రమే సినిమాల్లోకి తీసుకునేవారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మాట వాళ్లు మాట్లాడవలసిందే. ఎవరి పాటలను .. పద్యాలను వాళ్లు పాడుకోవలసిందే. అందువలన ప్రధానమైన పాత్రలను పోషించాలనుకువేవారికి రూపంతో పాటు నాటకానుభవం తప్పనిసరి. అలాగే మంచి గాత్రం ఉండటం అంతే అవసరం. ఇక ఇతర పాత్రలను చేయాలకునేవారికి నాటకానుభవం .. డైలాగ్ చెప్పడంలో స్పష్టత ఉంటే సరిపోతుంది. ఆ ధైర్యంతోనే వంగర వెంకట సుబ్బయ్య కూడా అప్పట్లో మద్రాసు బాట పట్టారు. అందరూ కూడా ఆయనను ‘వంగర’ అనే పిలుస్తుండేవారు. 1897 నవంబర్ 24వ తేదీన ఆయన ఒంగోలు తాలూక ‘సంగం జాగర్లమూడి’ గ్రామంలో జన్మించారు. ఊహతెలిసిన దగ్గర నుంచి ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఒక వయసు వచ్చిన తరువాత ఆయన నాటకలలో బిజీ అయ్యారు. మొదటి నుంచి కూడా తాను ఏ పాత్రలకి ఎక్కువగా పనికివస్తాననే విషయంపై ఆయనకి మంచి అవగాహన ఉండేది. అందువల్ల ఆ తరహా పాత్రలనే ఆయన చేస్తూ ఉండేవారు. అలా సాంఘిక .. జానపద .. పౌరాణిక పాత్రలను నాటకాలలో పోషించి ఆయన శభాష్ అనిపించుకున్నారు. అప్పట్లో ఆయన పోషించిన పాత్రలను చేయడానికి ఎవరూ కూడా సాహసించేవారు కాదు. అంతగా ఆయన ఆ పాత్రల ద్వారా పేరుప్రతిష్ఠలను తెచ్చుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ .. సహజమైన నటనను ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తుండిపోయేవారు. అలా ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో నాటకాల ద్వారా ఎంతో అనుభవాన్ని గడించిన ఆయన, ఆ తరువాత స్నేహితుల ప్రోత్సాహంతో సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపించారు. 1936లో ‘బాలయోగిని’ సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యారు. స్టేజ్ పై నటించడానికి .. కెమెరా ముందు నటించడానికి మధ్య గల తేడా ఆయనను కాస్త ఇబ్బంది పెట్టింది. అయినా నిదానంగా పరిశీలన చేసి కొన్ని పట్లు పట్టేశారు. ఆ తరువాత ఇక కెమెరా ముందు కూడా విజృంభించారు. మాలపిల్ల .. రైతుబిడ్డ .. మనదేశం .. సినిమాల్లో వరుస అవకాశాలను అందుకుంటూ వెళ్లారు. ఈ ‘మనదేశం’ సినిమా ద్వారానే ఎన్టీ రామారావు పరిచయమైంది. ఇక ‘షావుకారు’ సినిమా గోవిందరాజుల సుబ్బారావు పోషించిన చెంగయ్య పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రను సపోర్ట్ చేసే పంతులు పాత్రలో వంగర ఇమిడిపోయారు. ఆ సినిమాలో ‘అదంతేలే .. ‘ అనే అర్థంతో నోటితో చిత్రమైన సౌండ్ చేస్తూ చేయి ఎగరేస్తారు. అప్పట్లో ఆ మేనరిజం జనానికి బాగా నచ్చేసింది. ఆ తరువాత నుంచి ఆయన ఊరి పెద్ద మనుషులకు అనుకూలంగా ఉంటూ .. వాళ్ల దుర్మార్గాలలో పాలుపంచుకునే పాత్రలను ఎక్కువగా చేస్తూ వెళ్లారు. అలాంటి సినిమాల్లో ‘పెద్దమనుషులు’ ఒకటి. ఒకప్పటి గ్రామీణ జీవనవ్యవస్థకు ‘పెద్దమనుషులు’ సినిమా అద్దం పడుతుంది. ఆ సినిమాలో ఛైర్మన్ భజనపరుడైన సిద్ధాంతి పాత్రలో వంగర నటన చూసి తీరవలసిందే. గుడిలో ఉన్న నిధిని రహస్యంగా ఛైర్మన్ కి చెందేలా చేయాలనే స్వార్థంతో ఆయన ప్రాణాల మీదకి తీసుకుని రావడమే కాకుండా, తాను కూడా ప్రాణాలను పోగొట్టుకునే పాత్రలో ఆయన జీవించారు. ఇక ‘కన్యాశుల్కం’లో కరటక శాస్త్రిగా .. ‘తెనాలి రామకృష్ణ’లో తాతాచార్యులవారి శిష్యుడిగా ఆయన ప్రదర్శించిన నటన అలా గుర్తుండిపోతుందంతే. ఇక తెలుగు పౌరాణికాలలో మకుటాయమానమై నిలిచిన ‘మాయాబజార్’లోను వంగర చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో అత్యంత కీలకమైన వివాహ వేడుకకి సంబంధించిన సన్నివేశాల్లో వంగర చాలా సేపు కనిపిస్తారు. తమకి మర్యాదలు జరగడం లేదంటూ అల్లూతో కలిసి రమణారెడ్డి బృందంపై అసహనాన్ని వ్యక్తం చేసే ‘శాస్త్రి’ పాత్రలో ఆయన ప్రేక్షకులను నవ్విస్తారు. ఆ తరువాత చెంచులక్ష్మి .. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం .. మహాకవి కాళిదాసు .. నర్తన శాల .. పరమానందయ్య శిష్యుల కథ వంటి ఆణిముత్యాలు ఆయన జాబితాలో కనిపిస్తాయి. ఇలా వంగర తెలుగు సినిమా తొలినాళ్లలో ఓ మారుమూల గ్రామం నుంచి మద్రాసుకు వెళ్లి, అక్కడ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. ఎస్వీఆర్ వంటి వారంతా ఆయన తరువాత ఇండస్ట్రీకి వచ్చి ఆయన కళ్లముందు ఎదిగినవారే. సీనియర్ ఆర్టిస్ట్ గా వాళ్ల నుంచి ఆయన గౌరవాన్ని పొందినవారే. సహజమైన నటనకు చిరునామాగా ఆయన.. పాత సినిమాలంటే ఇష్టపడేవారికి వంగర వెంకట సుబ్బయ్య గారిని ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కరలేదు. ఆయన నటుడే కాదు. వేద వేదాంగాలు అథ్యయనం చేసిన పండితుడు. సంగీతం, చిత్రలేఖనం, జ్యోతిష్యం వగైరాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఆయనకు గురువు ఆయన తండ్రి గారే! ఆయన తండ్రి గారు నేర్పిన మరో విషయం భోజన సమయంలో మొదటి ముద్ద నోటిలో పెట్టుకునే ముందు మన ప్రాణాన్ని నిలిపే ఆహారాన్ని మనకు అందిస్తున్న ఆ శ్రీమన్నారాయణుని స్మరించుకోవాలని. ఆయన ఎట్టి పరిస్థితులలోనూ తప్పకుండా ఆ నియమాన్ని పాటించేవారు. ఒకసారి ఆయన షూటింగ్ నిమిత్తం అమరావతి వెళ్ళారు. అక్కడ ఆయనతో బాటు ఆ గదిలో సి. యస్. ఆర్. కూడా వున్నారు. ఈయన న్యూస్ పేపర్ చదువుకుంటుంటే వంగర గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు. ఉన్నట్టుండి బాత్రూంలో నుంచి ‘ భోజన కాలస్మరణే గోవిందా… గోవిందా… ‘ అని వంగర గారి గొంతు వినబడింది. సి. యస్. ఆర్. గారు ఆశ్చర్యపోయారు. ఆయనకేమీ అర్థం కాలేదు. అప్పుడే బాత్రూం లోనుంచి బయిటకు వచ్చిన వంగర గారిని ” భోజనానికి ముందు గోవింద స్మరణ చేసే అలవాటు మీకు వుందని తెలుసు. కానీ బాత్రూం లో ఈ విష్ణు సంకీర్తన ఏమిటయ్యా ? ” అనడిగారు. దానికి వంగర వెంకట సుబ్బయ్య గారు ” ఏం చెప్పమంటారు ? ఇందాక స్నానం చేస్తూ సబ్బుతో ముఖం తోముకుంటుంటే, ఆ పిడికెడు సబ్బు ముక్క కాస్తా గొంతులోకి జారిపోయింది. ఈరోజుకి ఇదే మొదటి ముద్ద కదా ! అందుకే గోవింద కొట్టాను ” అన్నారు ఏడ్పుముఖంతో . మరోసంగతి –ఒక మలయాళం సినిమాలో ఒకపాత్ర వంగర లాగా ఉంటె ,ఆయన్నీ పిల్చి ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పమన్నారు .వంగారగారి గొంతులో పచ్చి వెలక్కాయ పది నట్లయింది మాట పెగలటం లేదు .దీన్ని గురించి ఆయనే ‘’బొమ్మ చూస్తూ నేను మాట అందుకొనే సరికి బొమ్మ వెళ్ళిపోతోంది .పోనీ ముందే అందుకుందామంటే బొమ్మ లోని వాడు స్లోఅవుతున్నాడు .దీనికీ మనకీ కుదరదు అని చెప్పేసి పారిపోయాను ‘’అన్నారు నవ్వుతూ .రమణారెడ్డి గార్ని చెప్పమంటే ‘’నేను చెప్పేది చెబ్తా మీరు సర్దుకోగలిగితే సర్దుకొండి.’’అని ఆయనా తప్పుకున్నారట . ‘’ఇంతకీ వంగర వారి ఆహార్య విలాసం ఎలా ఉంటుందో తెలుసా –మొకాళ్ళపైకి పంచ ,పైన జుబ్బా ,ఆపైన అన్గోస్త్రం ,,చంకలో ముడిచిన గొడుగు .పెద్దపెద్ద అంగలు వేస్తూ నడక .ఎప్పుడైనా బస్సు ఎక్కే వారేమోకాని దాదాపుగా నడకే ఎక్కడికైనా’’ అన్నారు రావి కొండలరావు .1936లో వచ్చిన విప్రనారాయణ నుంచి 76లో వచ్చిన రహస్యం సినిమా వరకు 30 సంవత్సరాలలో 300కు పైగా సినిమాలో నటించి మెప్పించారు .హాస్య నటులుగా ముద్ర పడినా ,వివిధ పాత్రలు నటించిన మేటి నటులు .తాను హాస్యం చెయ్యకుండా సంభాషణ ద్వారా హాస్యం పుట్టిస్తారు .పండితులు, సంస్కృత ఆంధ్రాలు క్షుణ్ణంగా నేర్చిన విద్వాంసులు .వేదం పఠించిన వేదపండితులుకూడా’’ వ్యంగ్యర వెంకట సుబ్బయ్య ‘’గారు .శోభనాచాలవారి లక్ష్మమ్మ ,,భారత లక్ష్మీవారి ప్రియురాలు,రాజరాజేశ్వరి వారి ‘’లక్ష్మి ‘’కృష్ణ తులాభారం ,సక్కుబాయి .భరణీవారి చక్రపాణి ,శ్యామలా వారి గీతాంజలి ,జ్ఞానంబికా వారిమంత్రదండం ,విజయలక్ష్మీ వారి పేరంటాలు వినోదావారి శాంతిమొదలైన సినిమాలో నటించారు వంగర గారు స్థానం వారిపై రాసిన వ్యాసం 12 వ తరగతి తెలుగు పుస్తకం లో పాఠ్య అంశంగా ఉంది అంటే ఆశ్చర్యమేస్తుంది .ఆ వ్యాసంలోని విశేషాలు –‘’నేను స్థానం వారి రామవిలాస సభలో చాలాకాలం ఉన్నాను .అంతకు ముందు తెనాలిలో ఫస్ట్ కంపెని లో ఉన్నాను .1925లో రామవిలాస సభలో చేరాను .అప్పుడు వజ్హ బాబూరావు గారు మేనేజర్ ,భాగవతుల రాజగోపాలం గారు వ్యవస్థాపకులు .త్రిపురారిభట్ల వీరరాఘవయ్య గారు కండక్టర్ . నాకు నాటకానికి మూడు రూపాయలిచ్చేవారు .అయితేనేం నెలకు సుమారు 20 నాటకాలు ఆడే వాళ్ళం .అది మాంచి జీతమ కిందే లెక్క .తర్వాత నాటకానికి 5రూపాయలు ఇవ్వటం తో నాపని బాగుంది . స్థానం వారు మహా ప్రజ్ఞావంతులు వలపులు గ్రుమ్మరించే పాత్రలు అభినయించటం లో మొనగాడు .మొదట్లో రోహిణీ రుక్మా౦గధర నాటకం వేశారు మోహిని నిజంగానే ప్రేక్షకులను మోహింప జేసింది .రుక్మా౦గదుని సంగతి చెప్పాలా ?ఆ నాటకం చాలాభాగం స్థానం వారే రాశారు .తర్వాత అనేక నాటకాలలో నటించారు .రోషనార ఆయనకు ఎంతో పేరు తెచ్చింది .మద్రాస్ రాష్ట్రం లో దాన్ని నిషేధించారు .ఆసమయం లో మేము హైదరాబాద్ లో ప్రదర్శనలిచ్చాం . స్థానంవారి వేషాలు రంగస్థలానికి అల౦కారాలుగా మారాయి .ఒకమామూలు వ్యక్తీ రంగస్థలం మీద వన్నెల రామ చిలుకగా మారటం మాకే ఆశ్చర్యాన్ని కలిగించేది .కొన్ని కంపెనీల వాళ్ళు ఎంతో అందమైన ఆడవాళ్ళ చేత వేషాలు వేయించి చూశారు .కానీ రంగస్థలం మీదకు రాగానే ఆ అందం ఎందుకూ పనికి రాకుండా పోయేది .అభినయం ఎక్కడినుంచి వస్తుంది ? మా సమాజం రంగూన్ లో నాటక ప్రదర్శనల నిచ్చింది.రంగూన్ లోని సీతారామ దేవాలయానికి స్థానం వారు మూడు వేల రూపాయలు విరాళం అందించారు .అక్కడి ఆంధ్రులు స్థానం వారికి బంగారు కిరీటం తొడిగి అత్యంత గొప్పగా సత్కరించారు .ఒక తెలుగు నాటకనటుడు సముద్రాలు దాటి ఘన సత్కారం పొందటం స్థానం వారికే దక్కిన అదృష్టం . స్థానం వారు అప్పుడప్పుడు సహాయ నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చారు .ఒకసారి తెనాలిలో గృహదహనాలు జరిగితే ,అధికారులతో ఉచిత ప్రదర్శన ఇస్తామని చెప్పి,నాటకం ప్రదర్శించివచ్చిన డబ్బు 5వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు .ఇలాంటివి ఎన్నో చేశారు .వారి కళాభిలాషకు వదాన్యత గీటు రాయిగా ఉండేది . ఒకసారి కలకత్తాలో చంద్ర గుప్త నాటకం ప్రదర్శించాం .అది డి ఎల్ రాయ్ గారి బెంగాలీ నాటకానికి అనువాదం .స్థానం వారు చంద్ర గుప్తుని తల్లి ముర పాత్ర ధరించారు .మూడు సీన్లలో మురపాత్ర లో గంభీరత గోచరించేది .ఒక బెంగాలీ ప్రొఫెసర్ నాటకాన్ని చూసి స్థానం వారి నటనా వైదుష్యానికి ముగ్ధుడై ,పులకి౦చి పోయాడు .’’మా రాయ్ నాటకానికి న్యాయం చేకూర్చింది ఈ తెలుగు నాటకం ‘’అని పరవశించి చెప్పాడు .స్టేజి మీదకు వచ్చి ఆయన ‘’చంద్రగుప్త నాటకం మా బెంగాలీ రచయిత సృష్టించాడు ఈ నాటకాన్నఈ తెలుగు నాటక సంఘం వచ్చి ప్రదర్శిస్తే ఆనందిస్తున్నాం .ముఖ్యంగా ముర పాత్రనిర్వహణ చూసిముగ్దులమై పోయాం .నేను ముఖ్యంగా స్థానం వారి నటన చూసి పులకి౦చి పోయాను .మా రాయ్ నాటకానికి న్యాయం చేకూర్చింది ఈ తెలుగు నాటక సంఘం ‘’అని పరవశంతో చెప్పాడు . కన్నడ దేశం లో కృష్ణ తులాభారం నాటకం అంటే ఎంతో ఇష్టం .బెంగుళూరులో ఈప్రదర్శనలు ఎన్ని ఇచ్చామో చెప్పలేను .ఒకే నెలలో 27ప్రదర్శనలిచ్చాం .మరో రాష్ట్రం లో తెలుగు సమాజం ఇలాంటి ఖ్యాతి గడించింది అంటే ఎంతో గర్వించాల్సిన విషయం ..మైసూరు రాజమాత ప్రత్యేకి౦చితులాభారం చూశారు .తర్వాత కుమారుడైన మహారాజా వారితో చెప్పి ,ఆయన్నికూడచూడమన్నారు .వారూ చూసి పొంగిపోయిస్థానం వారిని ఘనంగా సత్కరించారు . ఇక్కడ ఒక ఉదంతం జ్ఞాపకం వస్తోంది .స్థానం వారు నాటకం అయిన మర్నాడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం అయిదు వరకు మౌన వ్రతం లో ఉంటారు .మేము బెంగుళూరులో ఉన్నాం .ఒకరోజు మామూలుప్రకారం స్థానం వారు మౌనం లో ఉన్నారు .ఇంతలో ఎవరో వారికోసం వచ్చారు .మౌనవ్రతం లో ఉన్నారు అయిదు తర్వాత వస్తే మాట్లాడుతారు అని చెప్పాం .ఆయన వాకిట్లో పచార్లు చేస్తున్నాడు .ఆ ఇంటి యజమానురాలు పరిగెత్తుకొచ్చి ‘’ఇదేం అన్యాయం మహా రాజావారిదర్బారు బక్షీ ఇలా వాకిట్లో పచార్లు చేస్తుంటే చూస్తూ ఊరు కున్నారేమిటి .ఎంత అపరాధం ?క్షమాపణ చెప్పి లోపలి ఆహ్వానించండి ‘’అని చెప్పింది మేము వెళ్లి ఆయన్ను లోపలి ఆహ్వానించాం.మహారాజావారికి వినోద విజ్ఞానకార్యక్రమాలు ఏర్పాటు చేసే ఉద్యోగి ఆయన .అప్పటికి ఇంకా స్థానం వారి మౌనం పూర్తీ కావటానికి పది హీను నిముషాలు ఉంది .ఆయన అప్పాతిదాకా ఉండి,స్థానం వారితోమాట్లాది ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని వెళ్ళాడు .దీన్నిబట్టి స్థానం వారి గౌరవ ప్రతిఅపత్తులు అర్ధం చేసుకోవచ్చు . స్థానం వారిలో చెప్పుకోదగిన మరో ముఖ్యవిషయం కంఠాన్ని క్రమ శిక్షణలో ఉంచుకోవటం .మొదటి వరుసలో ఉన్నవారికీ చివరి వరుసలో వారికీ ఒకే రీతిగా వినబదేట్లు మాట్లాడేవారు .ఆనాడు మైకులు లేవు .నటుడి ప్రతిభ కంఠ స్వరం మీదే ఆధార పడి ఉండేది .భావ ప్రకటన తోపాటు ,సంభాషణల చాతుర్యం తోనూ ఆయన స్ఫుటమైన కంఠ ధ్వని వారికి ఎక్కువ తోడ్పడేది . స్థానం వారు మరపురాని మహానటులు .వారితో కలిసి నాటకాలు వేయటమనే మహా భాగ్యం నాకు కలిగింది .ఆంద్ర నాటక రంగానికి ఆయన ఎంతో ప్రతిష్ట సంపాదించారు .ఆయన ఆంద్ర రంగస్థల ప్రతిష్ట కోసం అవతరించిన కళాదేవత ‘’ అని వంగారగారు రాశారు . ఒక తెలుగు నాటకనటుడు వంగర మరొక ప్రఖ్యాత నాటకమహా నటుడు స్థానం నరసింహారావు గారిపై రాసిన వ్యాసం తెలుగు పాఠ్యా౦శం గా ఉండటం ఈ ఇద్దరికీ దక్కిన అరుదైన గౌరవం .హాట్సాఫ్ వంగర అండ్ స్థానం . స్వచ్చమైన వాక్కు ,వికార చేష్టలకు లోనుకాని హాస్యం వంగరను అసమాన నటునిగా చేశాయి .1975లో జరిగిన ప్రపంచ తెలుగుమహా సభలలో వంగర వారిని సముచితంగా సత్కరించింది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం .స్థిర విదూషకుడుగా వెలుగొందిన వంగర వెంకట సుబ్బయ్య గారు ఒక నాటకం లో పాల్గొనటానికి తెనాలి వెళ్లి అక్కడే 6-3-1976న 79వ ఏట పరమపదించారు. సశేషం మీ-గబ్బిట దుర్గాప్రసాద్-17-1-22-ఉయ్యూరు , , •

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -24

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -24

24-సినీ హరి కథల మోపర్రు దాసు

 ఎత్తుగా గిరజాల ఒత్తు జుట్టుతో ,ఆజానుబాహువుగా ,దబ్బపండు వంటి మై చాయతో ,చెవులకు కుండలాలతో ,నుదుట  వెడల్పైన నిలువు కుంకుమ బొట్టుతో ,పంచె కట్టు ,సిల్క్ లాల్చీ తో మహా అందంగా కనిపించే వారు మోపర్రు దాసు .సంమోహ పరచే గాత్రం .స్పష్టమైన ఉచ్చారణ .ఉదయం చూస్తె కళ్ళు ఎర్రగా ఉండేవి .కృష్ణా జిల్లా పామర్రు దగ్గర మోపర్రు ఆయన స్వగ్రామం .ఘంటసాల మాష్టారికి చిరకాల ఆప్తమిత్రులాయన .అసలు పేరు బసవ లింగాచారి .సినిమాలో హరికథా గానం చేసేవారు .ఆంద్ర దేశం లో నంబర్ వన్ హరికథలుగా మంచి పేరు ఉండేది .

  సముద్రాలవారు నిర్మించి దర్శకత్వం వహించిన ‘’వినాయకచవితి సినిమాలో మోపర్రు దాసు వినాయక చవితి కథను బోధించే సాధువు వేషం లో కనిపిస్తారు . వినాయక చవితి పాటల కంపోజింగ్ ఘంటసాల వారింటి లోనే  జరిగేది.సముద్రాల రాఘవాచార్యులు గారితోపాటు ,అసోసియేట్ డైరెక్టర వి ఎం స్వామి ,నిర్మాత కే గోపాలరావు సోదరుడు,మేనేజర్ అయిన కే హనుమంతరావు గార్లు కూడా మాష్టారింటికే వచ్చి పాల్గొనేవారు .  రోజులు మారాయి సినిమాలో డప్పుల వాడు గా కనిపిస్తారు .1950లో వచ్చిన షావుకారు సినిమాలో సముద్రాల రాసిన ‘’శ్రీలు చెలంగె భారతభూమి ‘’పాటకు మోపర్రు దాసుగారి వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది   .విప్రనారాయణ ,మొదలైన సినిమాలు చాలా వాటిలో హరికథకులుగానో చిన్న చిన్న వేషాలలోనో కనిపిస్తారు .జయభేరి సినిమాలోనూ హరికథకులుగా నటించారు .దేశభక్తి గీతాలు పద్యాలు తప్పని సరిగా పాడి రక్తి కట్టించేవారు. ప్రేక్షకులు అడిగి మరీ పాడించే వారు .అప్పుడు ఆయన గాత్రానికి పట్టపగ్గాలు ఉండేదికాదు .ఆస్థాయికి అంతు ఉండేదికాదు .అందులో మనం లీనమవ్వాల్సిందే .మై మర్చి పోవాల్సిందే .

  సినిమా షూటింగ్ లు ఉంటె మద్రాస్ వచ్చి ఘంటసాల మాష్టారి మేడ మీద గది లోనే బస చేసేవారు .బయట షూటింగు లు అయి, ఏ రాత్రికో గదికి చేరేవారు.మర్నాడు ఉదయం  మిత్రులిద్దరూ చుట్టకాల్చుకొంటూ కారు షెడ్ దగ్గర కబుర్లు చెప్పుకొనేవారు  .

 సుమారు నలభై ఏళ్ల క్రితం  మా ఉయ్యూరులో ధనుర్మాసం లో కాపులవీధి రామాలయం దగ్గర ,శివాలయం లో హరికథలు పోటా పోటీగా జరిగేవి .శ్రీ కోట  సచ్చిదానంద శాస్త్రి,శ్రీ  కడలి వీరయ్య ,శ్రీ పొడుగు పా౦డురంగదాసు ,శ్రీ పట్నాల మల్లేశ్వరరావు శ్రీ జగన్నాధ రావు ,చైనా రాకెట్ అనిపిలువబడే శ్రీమతిప్రభ  మొదలైన వారంతా కమ్మని హరికథలు చెప్పి జనాలను ఉర్రూత లూగించేవారు .’’ఓం హరా శంకరా ‘’అని పాన్డురంగాదాసు గారుపాడుతుంటే ఒళ్ళు గగు ర్పొడిచేది

 ఒకసారి మా బజారుకు అవతల తూర్పు వైపు ఊరవారి వీధి, విష్ణ్వాలయం వీధి  క్రాస్ సెంటర్ లో ఆది రాజు వారి ఇళ్ళకు దగ్గరగా మోపర్రు దాసుగారు హరికథ చెప్పారు .నేను వెళ్లి చూశాను .అందులో ఆయన పాడిన దేశ భక్తీ గీతం చివర్లో అకస్మాత్తుగా కింద కూర్చుని  బల్లలపై చేతితో శబ్దిస్తూ పాటకు ఫినిషింగ్ టచ్ ఇవ్వటం జీవితం లో మర్చిపోలేను .అది ఆయన ప్రత్యేకత .ఎక్కడైనా అలానే చేస్తారట .మన నరాలు ఉద్రేకం చెంది ఊగిపోవాల్సిందే. రోమాలు నిక్క బోడుచుకోవాల్సిందే. దటీజ్ మోపర్రు దాస్ .ఇంతకంటే ఆయన గురించి వివరాలు తెలియలేదు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -23

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -23

23- బ్రహ్మ చారి నటుడు

 దొరైస్వామి

పింగళి నాగేంద్రరావు  సంభాషణా రచయితగా  కవిగా ,విజయావారి ఆస్థాన మహా కవిగా సుప్రసిద్ధులు .ఆజన్మ  బ్రహ్మ చారి. అలాగే ఆదే కాలం లో సినిమాలకు పరిచయమైన కేరక్టర్ యాక్టర్ దొరైస్వామి కూడా బ్రహ్మ చారే అని తెలిస్తే అవాక్కై పోతాం కాని నిజం .దొరస్వామి పూర్తిపేరు పాల్ దొరస్వామి .దొరైస్వామి అనీ అంటారు .1897లో జన్మించారు .

  1951లో బిఎన్ రెడ్డిగారి దర్శకత్వం లో వాహినీ వారి మల్లీశ్వరి సినిమాలో  భానుమతి రామారావు వంటి ఉద్దండులతో దొరైస్వామి నటించారు .భానుమతి తండ్రిగా దొరైస్వామి నటించిన తీరు పరమాద్భుతం .కూతురుకు ఇష్టం లేని రాణి వాస భోగం ,భార్య ఋష్యేంద్ర మణి ని ఎదిరించలేని నిస్సహాయత, మేనల్లుడు రామారావు ను సోదరినీ తనభార్య తేలికగా చూడటం మొదలైన విషయాలలో గుండెలు పిండేదుఖాన్ని అదుపులో పెట్టుకొన్న తండ్రిగా దొరైస్వామి నటన చిరస్మరణీయం . నాగయ్య ,కాంచనమాల హీరో హీరోయిన్ లు గా బిఎన్ రెడ్డి గారి దర్శకత్వం లో 1939లో వచ్చిన వందేమాతరం సినిమాలో నాగయ్యగారి తండ్రిగా అదే బిఎన్ రెడ్డిగారి దర్శకత్వం లో నాగయ్య ,కుమారి  వగైరాలతో వచ్చిన సుమంగళి లో కూడా హీరో తండ్రిగా నటించారు .అంటే తెలుగు టాకీల తొలియుగపు నటులు దొరస్వామి .

 1952లో ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో రామారావు సావిత్రి ,జి వరలక్ష్మి నటించిన ‘’పెళ్లి చేసి చూడు ‘’సినిమాలో గోవిందయ్య గా విలన్ వేషం కూడా వేసి బాగానటించి మెప్పించారు .హీరో పెళ్లి చెడ గొట్టటానికి విశ్వ ప్రయత్నం చేసి ,చివరికి రంగారావు నటించిన  దూపాటి వియ్యన్న చేతిలో అవమానం పొందిన కేరక్టర్ లో దొరైస్వామి విజ్రుమ్భిమ్చి నటించి మెప్పించారు .అసలు ఆయన వేసినవన్నీ సాఫ్ట్ కారక్టర్స్ మాత్రమే .ఇదే విలక్షణ విలనిజం ఉన్న పాత్ర .1955లో ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో రామారావు, సావిత్రి వగైరా  హేమా హేమీలు నటించిన మిస్సమ్మ చిత్రం లో మేరీ అనే సావిత్రి పెంపుడు తండ్రి గా క్రిష్టియన్ పాత్రను గంభీరంగా ,అమాయకంగా ,కూతురుపై అభిమానం ఉన్నవాడుగా దొరైస్వామి నటించి రక్తి కట్టించారు .

  ఆతర్వాత చాలా సినిమాలలో అంతగా ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించి మెప్పించారు .దాదాపు ఆ సినిమాలో ఆయన కన్నీరుతో, బాధలతో, దరిద్రంతో ,జబ్బులతో తీసుకు తీసుకొని కుళ్ళి కుళ్ళిమరణించే పాత్రలే ఎక్కువ .ఏ పాత్రనైనా తన నటనా సామర్ధ్యం తో దానికి జీవం పోసి నిలబెట్టినవారు దొరైస్వామి .

  ఆయన నటించిన ముఖ్యమైన సినిమాలలో –సువర్ణమాల,నా ఇల్లు , భాగ్యలక్ష్మి,పరివర్తన ,త్యాగయ్య ,అన్నదాత ,కన్యకాపరమేశ్వరి మహాత్మ్యం మంగళ,ఆడ జన్మ ,దేవదాసులో పార్వతి తండ్రి గా ,విశ్వ మోహిని ధర్మ దేవత నిర్దోషి ,అర్ధాంగి లో సావిత్రి తండ్రిగా ,దొరైస్వామి నటించి మెప్పించారు .

  సశేషం

కనుమ శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22

22-వణుకుతున్నట్లున్న కంఠం తో రైతు వేషాలేసిన  పెరుమాళ్ళు

 సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు  కృష్ణా జిల్లా లోని ఉంగుటూరు లో జన్మించారు.వెడల్పు ముఖం  చెవికి పోగులు పంచె పైకి ఎగకట్టి ,బుజం మీద తుండుతో అసలు సిసలు కృష్ణా రైతుగా కనిపిస్తారు .సాఫ్ట్ కేరక్టర్లే ఎక్కువ చేసి మెప్పించారు .గొంతు ఎందుకో కొంచెం వణుకుతున్నట్లు అనిపిస్తుంది .యాస ను బాగా మాట్లాడేవారు .

విత విశేషాలు

చిన్నతనం నుండి పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించి జిల్లాలోని విజ్ఞానిక ఉద్యమం వైపు ఆకర్షితుడై ప్రాచీన కళారూపాల్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. వీరు బుర్రకథకులుగా సుంకర వాసిరెడ్డి రచించిన “కష్టజీవి” బుర్రకథను చెబుతూ నాటి కరువు పరిస్థితులను, యుద్ధాల భీభత్సాన్ని నాటి రాజకీయాల్ని, భూస్వామ్య వర్గాల దోపిడీ విధానాన్ని లంచగొండి తనాన్ని కళ్ళకుకట్టినట్లు చిత్రించినట్లు ప్రదర్శించేవారు. కరువు ప్రాంతాల సహాయ కార్యక్రమాలలో పనిచేశారు.

కృష్ణా జిల్లా ప్రజా నాట్యమండలి లో ప్రధాన బాధ్యతలను నిర్వహించారు. సుంకర వాసిరెడ్డి రచించిన “ముందడుగు” నాటకాన్ని కోడూరు అచ్చయ్య గారి దర్శకత్వంలో అద్వితీయంగా ప్రదర్శించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆ నాటకంలో వీరు కథానాయకుని ముసలి తల్లిగా నటించి మెప్పించారు. వీరు “మా భూమి” నాటకంలో దాదా పాత్రను అంతే చక్కగా పోషించారు.

తర్వాత మద్రాసు చేరి దాదాపు 50 తెలుగు సినిమాలలో పాత్రలు పోషించారు. వీరు బడుగు రైతు, రైతు కూలీ, పెద్ద సంసారాన్ని ఈదలేక అవస్థపడుతున్న సగటు మనిషి తరహా పాత్రలు ధరించడానికి పెట్టింది పేరు. వీరు ధరించిన పాత్రలలో రోజులు మారాయి (1955) లో కథానాయకుని తండ్రి పాత్ర, వరకట్నం (1968) లో కథానాయకురాలి తండ్రి పాత్ర, ప్రజానాయకుడు (1972) చిత్రంలో కోటేశు పాత్రలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.

మరణం

పెరుమాళ్ళు  1972 సంవత్సరంలో పరమపదించారు.

 సశేషం

కనుమ శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-22-ఉయ్యూరు

 

  , ,

Posted in సినిమా | Tagged | Leave a comment

సరస భారతి 161వ కార్యక్రమగా శ్రీ  త్యాగరాజస్వామి 173వ ఆరాధనోత్సవం

సరస భారతి 161వ కార్యక్రమగా శ్రీ  త్యాగరాజస్వామి 173వ ఆరాధనోత్సవం

  పుష్యబహుళ పంచమి 22-1-21 శనివారం సాయంత్రం 6-30 గం.లకు సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 173వ ఆరాధనోత్సవాన్ని సరసభారతి 161వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిర్వహిస్తోంది .గానగంధర్వస్వర్గీయ  శ్రీ ఘంటసాల శతజయంతి ,స్వర్గీయ శ్రీ బాలమురళి ,శ్రీ బాలు గార్ల జయంతి  కార్యక్రమమూ జరుపుతున్నాం .సాహిత్య ,సంగీతాభిమానులు  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ,పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

  పాల్గొను గాయనీ గాయకులు

శ్రీమతి జోశ్యులశ్యామల దేవి- ప్రసిద్ధ గాయని ,సరసభారతి గౌరవాధ్యక్షులు

,శ్రీమతి జి.మాధవి –ప్రముఖ  గాయని ,

చిరంజీవి జి.నితిన్ కౌశిక్-యువ గాయకుడు

మరియు స్థానిక ఔత్సాహిక గాయక గాయనీ మణులైన బాలబాలికలు

   గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షలు

          16-1-22-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -21

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -21

21-చిరుబొజ్జతో వినాయకుడిగా నటించిన హాస్యాంబుధి-బొడ్డపాటి

 బొడ్డపాటి ఇంటిపెరుతోనే ప్రసిద్ధులైన హాస్య   బొడ్డపాటి

బొడ్డపాటి కృష్ణారావు .మచిలీబందరు వారు. .వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడైన ఈయన స్వస్థలం మచిలీపట్టణం. విలక్షణమైన ఆకారం గల కృష్ణారావు గారు రంగస్థలం మీద ‘ సుబ్బిశెట్టి ‘ లాంటి వేషాలు వేసి చెళ్ళపిళ్ళ వారి వంటి ఉద్దండ పండితుల చేత ‘ హాస్యాంబుధి ‘ అనే బిరుదు పొందారు.

1954 లో ఆదుర్తి సుబ్బారావు గారి ‘ అమర సందేశం ‘ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లో వేషాలు వేస్తూనే ట్యూషన్లు కూడా చెప్పేవారు. నందమూరి తారక రామారావు గారి పిల్లలకి ఆయనే పాఠాలు చెప్పారు. సరిగా చదవకపోతే పిల్లలను దండించడంలో రామారావు గారు కృష్ణారావు గారికి పూర్తి స్వేచ్చనిచ్చారు.

ఒకసారి కృష్ణారావు గారు అందరికీ తాను ఒక చిత్రంలో హీరోగా చేస్తున్నట్లు చెప్పారు. ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆయన చాలా నమ్మకంగా చెప్పడంతో విచారించగా ‘ వినాయక చవితి ‘ చిత్రంలో వినాయకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది. తొండం, చాటంత చెవులు వగైరాలతో ముఖం కనిపించకుండా పోవడంతో ఆయనకి బాధ కలిగింది. ఆ మాటే దర్శక నిర్మాతలతో చెబితే అదే చిత్రంలో యదువీరుడి వేషం కూడా ఇచ్చారు. దాంతో కృష్ణారావు గారు గర్వంగా అందరికీ తాను ఆ చిత్రంలో ద్విపాత్రాభినయం కూడా చేస్తున్నట్లు చెప్పుకున్నారట.

  తానూ రాజనాల ,గుమ్మడి ,ముక్కామల లాగా ఇంటిపేరు బొడ్డపాటి తోనే చెలామణి అయ్యాను అని గర్వంగా చెప్పుకొనేవారు .వేదాలు ,సంస్కృత గ్రంధాలు క్షుణ్ణంగా చదివి పాండిత్యం సంపాదించిన ప్రతిభ బొడ్డపాటి వారిది .పండితులు ,సంస్కారి ,చమత్కారి కూడా .నందమూరి పిల్లలకు ట్యూషన్ చెబుతూ నెల నేలా జీతం అడగటానికి మొహమాతపదేవారు అడిగితె సినిమాలలో వేషం ఇవ్వరేమో అనే భయం కూడా ఉండేది .’’అప్పుడప్పుడు ‘’వేషం ‘’అంటూ గొణుగుతూ గుర్తు చేసేవాడిని. ఆయన ఎదో చిన్నో చితకో వేషమిచ్చి నటి౦పజేసేవారు .ఇలా ద్విపాత్రాభినయం చేసేవాడిని ‘’అని చెప్పేవారు బొడ్డపాటి .

  మాయాబజార్ లో ముహూర్తాలుపెట్టే శంఖు తీర్ధులు వేషం వేశారు బొడ్డపాటి .ఆయన ప్రక్కనే మరో ఆయన తలూపుతూ కూచుంటాడు డైలాగ్ ఉండదు ఆయనపేరు సివివి పంతులు .తమిళ పెళ్లి చేసి చూడు సినిమాలో రామారావు తండ్రిగా బొడ్డపాటి తెలుగు వెర్షన్ లో డా శివరామ కృష్ణయ్య నటించారు ,తమిళ మాయాబజార్ లో శంఖు తీర్ధులు శివరామ కృష్ణయ్య గారు అయితే ఆయన పక్కన మాట్లాడకుండా ఉండే మరో పండితుడు బొడ్డపాటి .

  ఆయన ఎన్ని సినిమాలో నటించారో ఆయన తలిదంద్రులెవరో పుట్టిన, ,మరణించిన తేదీలు ఎక్కడా దొరకలేదు .ఎవరికీ పట్టకపోవటం ఆశ్చర్యమే .నాకు దొరికిన విషయాలు మీ ముందు ఉంచాను .

 సశేషం

  సంక్రాంతి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20 20-పళ్ళికిలిస్తూ, మెలికలు తిరుగుతూ నవ్వులు పండించే అంజి –బాలకృష్ణ 1898లో జన్మించి 55ఏళ్ళు మాత్రమె జీవించి 1953లో మరణించిన హాస్య నటుడు బాలకృష్ణ ఇంటిపేరు వల్లూరి .1937లో కలకత్తా లో నిర్మించిన విజయ దశమి అనే కీచక వధ తో సినీ రంగ ప్రవేశం చేసి సుమారు 100 సినిమాలలో హాస్యం పండించారు .మాధవ పెద్ది ,స్థానం నరసింహారావు గార్లు ఈ సినిమాలో నటించటం వారి సరసన బాలకృష్ణ నటించటం చిరస్మరణీయం .అయినా 1951లో వచ్చిన బాక్సాఫీస్ బంపర్ హిట్టర్ ‘’పాతాళ భైరవి ‘’చిత్రం లో అంజి పాత్రతో నే గుర్తింపుపొందారు .ప్రేక్షక హృదయాలను హత్తుకొన్నది ఆపాత్ర .ఈయనకు తోడూ పద్మనాభం .ఇద్దరు కమేడియన్లతో పింగళి ,కెవి రెడ్డిగార్లు హాస్యం పండించారు ‘’కొత్తవాళ్ళయినా ,పాతవాళ్ళకంటే బాగా గొప్పగా చేసి నవ్వించారు ‘’అని అందరూ చెప్పుకొనేవారు పేరు తెచ్చుకొన్నారు .అ౦జిపాత్రతో సినీ కథను నడిపించటం లో బాలకృష్ణ గొప్పగా చేశారు పి.సూరిబాబు నిర్మించిన ‘’తారా శశాంకం’’లో కూడా హాస్య పాత్ర పోషించారు .వంకరలు తిరుగుతూ ,పళ్ళు ఇకిలిస్తూ చేతులు ముడుచు కొంటూ తిప్పుతూ నటించటం బాల కృష్ణ ప్రత్యేకత .షావుకారు మిస్సమ్మ చిత్రాలలో విజ్రుమ్భించి నటించారు .డైలాగులు చెబుతూ విచిత్రమైన నటన ప్రదర్శించటం ఈయన ప్రత్యేకత .మొదటి సినిమాల పేర్లు చెప్పమంటే ‘’నాకు గుర్తున్నాయికాని వేషం పేర్లు గుర్తు లేవు ఏదో వేషం వెయ్యమన్నారు వేశాను అంతే’’అన్నారు బాలకృష్ణ . ‘’చదువు సంధ్యలకు గుడ్బై చెప్పి నాటకాలకు గుడ్ మార్నింగ్ కొట్టి ,ఓ ఫైన్ మార్నింగ్ కలకత్తా పారిపోయి ,ఎవరేవర్నోపట్టుకొని ఒకటి రెండు హిందీ సినిమాలలో వేషాలు వేసి ,హిందీ మాట్లాడటం బెంగాలీ అర్ధం చేసుకోవటం వరకు ఎదిగిపోయాడు బాలకృష్ణ ‘’అన్నారు రావికొండలరావు గారు .ఆంధ్రా లో ఉన్న అన్ని జిల్లాల యాసల్నీ సునాయాసంగా మాట్లాడి మెప్పించేవారు .మాండ లీకాలకూ ప్రాణం పోసి పలికేవారు .ఇన్ని ఎలా వచ్చాయి అని అడిగితె ,ఈప్రాంతం లోదిగితే ఆప్రాంత భాష మాట్లాడి,అక్కడి వాళ్ళను ఆకట్టుకొని సులువుగా నేర్చేవాడినిఅన్నారు .సూరిబాబు గారి తారా శాశా౦కం లో లంబు జంబు లలో ఒకరుగా నటించి పిచ్చిపిచ్చినవ్వులతో ఆపాత్రకు జీవం పోశారు .ఈ నాటకంకేవి రెడ్డి గారు చూసి ముచ్చటపడి విజయాసినిమాలలో నెల జీతగానిగా తీసుకొని పాతాళ భైరవిలో ముఖ్యమైన అంజి పాత్ర ఇచ్చారు .తారాశశాంకం లో నవ్వునే ఈ సినిమాలో అక్కడక్కడ పెట్టించి బాలకృష్ణ పాత్రకు క్రేజ్ కలిపించారు రెడ్డిగారు .బయట వేషాలు వచ్చినా వెయ్యమనే రెడ్డి గారు ప్రోత్సహించారు .ఎక్కడెక్కడ షూటింగ్ ఉన్నా ,ఎంత బిజీ గా ఉన్నా ,రోజూ ఏదో టైంలో విజయా వాహినీ స్టూడియోకు వచ్చి కనిపించి వెళ్ళేవారు .ఎందుకు ఇలా అంటే ‘’అది దేవాలయం లాంటిదయ్యా .రోజు దర్శనం చేసుకోకపోతే తృప్తి ఉండేదికాదు .ఒక్కోసారి దేవుళ్ళు కన్పించేవారు ఒక్కో సారి లేదు ‘’అని అత్యంత విశ్వాసంగా చెప్పేవారు బాలకృష్ణ . బక్కపలచని శరీరం విచిత్రమైన ఇకిలి౦పుల తో తోటరాముడి తమ్ముడు అంజిగా పాతాళభైరవిలో బాలకృష్ణ జీవించారు .ఆయన పేరు మర్చిపోయి ఆపాత్ర కనిపించినపుదల్లా ‘’అంజిగాడ్రోయ్’’అని కేరింతలు పెట్టేవారు ప్రేక్షకులు .ఎన్నో జానపద సాంఘిక ,పౌరాణికాలలో నటించి మెప్పించారు .నవగ్రహ పూజా మహిమ సినిమాలో అవకాశ వాద యజమానిని ముప్పు తిప్పలు పెట్టె ,బుద్ధి చెప్పే నౌకరుగా బాలకృష్ణ చిరకాలం గుర్తుంచుకోనేట్లు నటించారు .అగ్గిబరాటా ,లక్ష్మీ కటాక్షం ,ప్రతిజ్ఞా పాలన ,,గురువును మించిన శిష్యుడు సినిమాలలో రామారావు ,కాంతారావు గార్లకు జతగాడుగా నటించారు .శ్రీ కృష్ణ తులాభారం ,శ్రీ కృష్ణ సత్య ,శ్రీ కృష్ణ విజయం లలో యాదవ ప్రముఖుడుగా నటించారు .చిట్టి చెల్లెలు గుండమ్మకధ ,దేవత సాంఘిక చిత్రాలలో ప్రాముఖ హాస్య పాత్రలే పోషించారు .జానపద బ్రహ్మ విఠాలాచార్య సినిమాలలో కధానాయకుడి చెలికాడు గా నటించారు .అగ్గివీరుడు ,పిడుగు రాముడు ,జ్వాలా ద్వీప రహస్యం సువర్ణ సుందరి ,గూలె బకావలి,కనక దుర్గాపూజామహిమ ,భట్టి విక్రమార్క ,కలిసిఉంటే కలదు సుఖం ,మదన కామ రాజు కథ,బొబ్బిలి యుద్ధం,మర్మయోగి ,పరమానందయ్య శిష్యులు మొదలైన ఎన్నో సినిమాలలో విలక్షణ పాత్రలు ధరించి మెప్పించారు ..తక్కువ డైలాగ్స్ ,ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ బాలకృష్ణ విలక్షణత .కడుపుబ్బా నవ్వించిన బాల కాదు కాదు ‘’పెద్ద కృష్ణ’’ ఆయన . మాయా బజార్ లో లక్ష్మణ కుమారుడు రేలంగి,తన అనుచరుడు బాలకృష్ణను ‘’సారధీ‘’అని పిలిచేవాడు .అతడి వెర్రి వెంగళప్ప తనం తెలిసిన జంట పండితులు శాస్త్రి –వంగర ,శర్మ –అల్లు లు కీర్తిస్తూ మంచినో ,మామూలో సంపాదించేవారు .ఆ పొగడ్తలలో మునిగి ఉక్కిరిబిక్కిరవుతున్న రేలంగిని బాలకృష్ణ ‘’హేరాజన్ ‘’అంటూ సంబోధిస్తూ ‘’తానా అంటే తందానా అంటూ వీళ్ళు బహుమానాలు పుచ్చుకొంటున్నారు .ఈ తాన శాస్త్రి తందానా శర్మ మనముందు పనికి రారు –‘’అటు ఇద్దరు ఇటు ఇద్దరు –అభిమన్యుని బాబాయిలు –అటుకూడిన ఇటుకూడిన –నలుగురంటే నలుగురే –మరి తమకో?-నూటికి ఒక్కరే తక్కువ మేటిమేటి బాబాయిలు –బాబో ఏమని చెప్పుదు-బాబాయిల సేన తమది బ్రహ్మాండముగా ‘’ ,ఈ సీను జన్మలో మర్చిపోగలమా ? మాయాబజార్ లోపెద్ద వేషం సారధి వేసినా రెడ్డి గారు ఆయన సమర్ధత తెలిసి , బాలకృష్ణ చేత అందులోనే ద్వారపాలకుడిగా ఇంకో వేషం వేయించారు .మిస్సమ్మ లో నోరు విప్పి మాట్లాడకుండా ఉండే అక్కినేని అసిస్టెంట్ గా గొప్పగా నటించారు . బాలకృష్ణకు మంచి ఆఫర్లోచ్చాయి రాబడి పెరిగింది మద్రాస్ లో ఇల్లు కట్టించుకొన్నారు విఠాలాచార్య ,భావనారాయణ గార్ల సినిమాలలో బాల కృష్ణ తప్పని సరిగా ఉండేవారు .డైలాగ్ టైమింగ్,ఎక్స్ప్రెషన్ బాగా ఉన్నవారు బాలకృష్ణ .పద్యాలు ,పాటలూ బాగా పాడేవారుకానీ ఈయన పాడతానని చెప్పలేదు తెలుసుకొని వాళ్ళు పాడి౦చనూ లేదు .బాలకృష్ణకు 7గురు ఆడపిల్లలు ‘’బాల కృష్ణ నుకదా బాలనాగమ్మ వంశం మాది .వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలో ‘’అని దిగులు పడేవారు .షూటింగ్ విరామ సమయాలలో ఆయన సందడి మహా ఎంజాయ్ చేసేవారు .’’జుట్టు ఊడిపోయాక బాలకృష్ణ ‘’బాల్డ్ కృష్ణ ‘’అయ్యాడు అని రావి కొండల్రావ్ చమత్కరించారు . సశేషం భోగి శుభా కాంక్షలతో మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-1-22-ఉయ్యూరు , , •

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -17

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -17

17-వెండి తెర తొలి గ్లామర్ హీరో –సి.హెచ్. నారాయణ రావు

చదలవాడ నారాయణ రావు (సెప్టెంబరు 13, 1913 – ఫిబ్రవరి 14, 1984) 1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా నటుడు. చిత్తూరు నాగయ్య, వేమూరి గగ్గయ్య, కన్నాంబ, ఋష్యేంద్రమణి, సురభి బాలసరస్వతి వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటకరంగాన్ని పరిపుష్టం చేసినవారే. అందుకు భిన్నంగా ఎలాంటి నాటకానుభవం, సిఫారసు లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి స్వయంకృషితో నటుడుగా పేరు తెచ్చుకొన్న వ్యక్తి సి.హెచ్‌.నారాయణరావు. వాహినీవారు భక్తి రసాత్మకమైన చిత్రం ‘భక్తపోతన’ (1944) ను విడుదల చేసారు. అందులో రెండు మూడు సార్లు శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడు. ఆ శ్రీరాముడ్ని చూసి ప్రేక్షకులు తన్మయులైనారు. అంతకుముందు అంత అందమైన, ఆకర్షణీయమైన శ్రీరామచంద్రుడ్ణి చూడలేదు. ‘సాక్షాత్తు రాముడే’ అన్నారు ప్రజ, పోతన పక్షమై. ఆ శ్రీరామ పాత్రధారి చదలవాడ నారాయణరావు.

బాల్యం
సి.హెచ్. నారాయణ రావుగా పిలువబడే ఈయన 1913 సెప్టెంబరు 13న కర్నాటకలో బెంగుళూరు – హుబ్లీ మార్గంలో ఉన్న మధుగిరిలో జన్మించారు. నారాయణరావు తల్లి వైపు తాత, ముత్తాతలు, మేనమామలు అప్పట్లో మైసూరు దివాణంలో పనిచేసేవారు. నారాయణరావు తండ్రి చదలవాడ లక్ష్మీ నరసింహారావు రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసేవారు. అనంత పద్మనాభ వ్రతం రోజున పుట్టిన బిడ్డ కావడంతో, ఆ దంపతులు పెట్టుకున్న పూర్తి పేరు చదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణరావు. ఆ పేరే వెండితెరపై సంక్షిప్తంగా సిహెచ్‌. నారాయణరావు అయింది.

విద్యాభ్యాసం
నారాయణరావు బాల్యంలో చదువంతా ఏలూరులో సాగింది. ఆ తరువాత చాలాకాలం గుంటూరులో ఉన్నారు. సోషలిస్టు భావాలున్న ఆ తరువాతి కాలంలో ట్రేడ్‌ యూనియనిస్ట్‌గా పనిచేశారు. రైల్వే వర్కర్స్‌ యూనియన్‌కు కార్యదర్శిగా, రైల్వే వర్కర్స్‌ బెనిఫిట్‌ ఫండ్‌కు కార్యదర్శిగా వ్యవహరించారు.అప్పట్లోనే రైల్వే సమ్మెకు నాయకుడై, రాజకీయ నాయకుడు వి.వి.గిరి తదితరులతో కలసి ఉత్తర భారతమంతటా తిరిగారు.సినీ రంగంలోకి రాక ముందు ఏలూరు లోని ప్రసిద్ధ ‘వెంకట్రామా అండ్‌ కో’ లో పనిచేశారు. పుస్తకాలు ప్రచురించడం, ఇంజనీరింగ్‌ వర్క్ షాపులో పనిచేయడం లాంటివన్నీ చేశాక, తలవని తలంపుగా సినిమా అవకాశం ఆయన తలుపు తట్టింది.

సినీ రంగ ప్రవేశం
అసలు సినిమాల్లోకి వస్తానని కానీ, రావాలని కానీ ఆయన అనుకోలేదు. ఆయన సినీ రంగప్రవేశం చాలా తమాషాగా జరిగింది. ఓ రోజు రైలు ప్రయాణం చేస్తున్న సినీ దర్శకుడు ద్రోణంరాజు చిన కామేశ్వరరావు, నారాయణరావును చూశారు. అందం, మాటతీరు చూసి ముగ్ధుడైన కామేశ్వరరావు ఆయనను ఏకంగా హీరో పాత్రకు ఎంపిక చేశారు. అనుభవం లేదంటున్నా సినీ నటుణ్ణి చేశారు. అలా మీర్జాపురం రాజావారు జయా ఫిలిమ్స్‌ పతాకంపై తీస్తున్న ‘జీవనజ్యోతి’ (1940)లో హీరోయిన్‌ కృష్ణవేణి సరసన కథానాయకుడిగా సిహెచ్‌. నారాయణరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు వచ్చింది.

కథానాయకుడిగ]
1940 లో వచ్చిన సాంఘికం ‘జీవనజ్యోతి’లో మాంచి పర్శనాలిటి గల హీరో ప్రవేశించాడు. నునుపైన, సహజమైన జుట్టు. సోగకళ్ళు, పొడుగైన ముక్కు, నవ్వితే నవరత్నాలు రాలినట్టు కనిపించే పెదవులు, పలువరసతోఅందర్నీ ఆకర్షించాడు. ఆ హీరో నారాయణరావు. నాగయ్య, సి.ఎస్‌.ఆర్‌., జి.వి.రావు., ఉమామహేశ్వరరావులు ముఖ్య పాత్రలు ధరిస్తున్నారు ఆ రోజుల్లో పర్సనాల్టీలో వీరికి భిన్నంగా కనిపిస్తూ నారాయణరావు రాగానే, ‘ హీరో అంటే ఇలా అందంగా ఉండాలన్న మాట… హీరోయిన్‌ లాగానే’ అనుకున్నారు ప్రేక్షకులు. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న నారాయణరావూని చూసి, ద్రోణంరాజు చినకామేశ్వరరావు (‘జీవనజ్యోతి’ దర్శకుడు) చిత్రాల్లో ప్రవేశ పెట్టారు. కృష్ణవేణి ఆ చిత్రంలో కథనాయిక. నారాయణరావు నటన చాలా సహజంగా ఉంటుందని, అవలీలగ నటించేస్తాడనీ పత్రికలు రాసేవి.

అయితే ఆయన కేవలం హీరో పాత్రలే ధరించలేదు. హీరోగా ఎష్టాబ్లిష్‌ అయిన తర్వాత విలన్‌ పాత్రలు కూడా ధరించారు. తర్వాత కారెక్టర్‌ యాక్టర్‌. ‘చెంచులక్ష్మి’, ‘తాసిల్దార్‌ ’, ‘మొదటిరాత్రి ’, ‘ మనదేశం’, ‘ తిరుగుబాటు’, మొదలైన చిత్రాల్లో హీరో అయితే, ‘ జీవితం’లో విలన్‌. ‘దేవత’, ‘స్వర్గసీమ’ చిత్రాల్లో విలన్‌ కాదుగాని, అదో తరహా పాత్రలు. ‘ గంగ గౌరీ సంవాదం’లో శివుడు, సాంఘికాలు, పౌరాణికాలు, జానపదాలు… అన్నింటిలో కూడా నారాయణరావు నటించారు.

నాటకాలలో
ఎక్కువగా నాటకానుభవం లేకపోయినా, సినిమాలకి వచ్చిన తర్వాత నాటకాల్లో నటించారు. మల్లాది కృష్ణ శర్మ రాసిన ‘మిస్‌ ప్రేమ బి.ఏ.’ (తిమ్మరాజు శివరావు దర్శకత్వం) లో నారాయణరావు హీరోగా నటించి, చాలా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పకడ్బందీగా, క్రమశిక్షణతో రిహార్సల్సు జరిపి ఆ నాటకంలో నటించారు. హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయతో సాన్నిహిత్యమున్న ఆయన తరువాతి రోజుల్లో పాలగుమ్మి పద్మరాజు ‘పట్నవాసం’ లాంటి రేడియో నాటికల్లోనూ పాల్గొన్నారు.

సినీ జీవితం
1939 సంవత్సరంలో నారాయణరావు చిన్న ఉద్యోగం చేసుకుంటూ తరచు చెన్నపట్నం వెళ్ళి వస్తుండేవారు. ఒకసారి హోటల్‌లో ఆయన భోజనం చేస్తుండగా ప్రముఖ దర్శకుడు ద్రోణంరాజు కామేశ్వరరావు గారితో పరిచయం అయింది. మొదట ద్రోణంరాజు గారు నారాయణరావుని చూసి బెంగాలీ అనుకొన్నారట. తరువాత నారాయణరావు తెలుగువాడే అని తెలిసిన మీదట తన దర్శకత్వంలో శోభనాచల సంస్థ నిర్మించబోయే జీవన జ్యోతి అనే చిత్రానికి స్క్రీన్‌ టెస్ట్‌కు రమ్మని చెప్పారు. స్క్రీన్‌ టెస్ట్‌లో భాగంగా నారాయణరావుకు కొన్ని సంభాషణలు ఇచ్చి చిత్రీకరించారు. ఆ టెస్ట్‌ పీస్‌ను థియేటర్లో ప్రొజెక్ట్‌ చేసే తతంగం సాగర్‌ టాకీస్‌లో మొదలైంది. దర్శకుడు రాజు గారు, నిర్మాతలు, కెమెరామెన్‌ కొట్నీస్‌, సౌండ్‌ ఇంజనీర్‌ రంగయ్య తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. తరువాత ఆ సినిమా అసిస్టెంట్‌ కెమెరామెన్‌ వచ్చి నారాయణరావు జీవన జ్యోతి సినిమాకు హీరోగా నారాయణరావు ఎంపికయ్యారు అన్న వార్తను చేరవేశారు. ఈ సినిమాకోసం ఆయనకు ఇచ్చిన పారితోషికం అక్షరాలా వంద రూపాయలు. అప్పట్లో వంద రూపాయల జీతగాఢంటే ధనవంతుడుగా లెక్క. అలా సిఫారసు లేకుండా నటుడైన నారాయణ రావు మనదేశం, ముగ్గురు మరాఠీలు, లక్ష్మమ్మ, వీలునామా, రహస్యం వంటి 50కి పైగా చిత్రాల్లో హీరోగా, సహాయ నటుడుగా నటించారు.

నారాయణరావు శోభనాచల స్టూడియోకి దగ్గర్లోనే అళ్వారుపేటలో ఉండేవారు. సినిమాల్లో ప్రవేశిస్తూ మొదట ఏ ఇంట్లో ప్రవేశించారోస్టార్‌ అయిన తరువాత కూడా అదే ఇంట్లో ఉన్నారు. ఆయనకి ఆర్భాటం లేక పోయినా, ఆత్మాభిమానం హెచ్చు. ఒక దశలో ఆయనకి చిత్రాలు లేవు.

1953 లో వై.వి.రావు దర్శకత్వంలో వరుణ అండ్‌ మహాత్మా అనే కంపెనీ ‘మంజరి’ (జానపదం) నిర్మించింది. నారాయణరావు దాదాపు నిర్మాత. తను సంపాదించుకున్నది ఆ చిత్రానికి ధారపోసారు. చిత్రంవిజయవంతం కాలేదు. అప్పులు మిగిలాయి. అప్పట్నుంచి నారాయణరావు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. చిత్రాలూ లేవు. జరుగుబాటుకీ, పిల్లల చదువులకీ ఎదురీత మొదలైంది. అయినా, ఆయన గుండె నిబ్బరం తగ్గలేదు. చాలా మంది తారలు, కళాకారులు ఉచ్ఛస్థితికి వెళ్ళీ, కిందికి పడిపోవడం సామాన్యంగా చూస్తూనే ఉంటాం. అదే జరిగింది నారాయణరావు జీవితంలోనూ. ఎంతటి ప్రసిద్దుడికైనా, గొప్పవాడికైనా ఒక దశ దాటిన తరువాత పరిస్థితి, స్థితీ మారడం విధాత శాపం కాబోలు.

తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీషుతో పాటు మలయాళం, హిందీ భాషలు కూడా ఆయన ధారాళంగా మాట్లాడేవారు. కెరీర్‌ తొలి రోజుల్లోనే ‘దీనబంధు’ (1942) చిత్రంలో వకీలుగా కోర్టు సీనులో ఆయన అనర్గళంగా చెప్పిన ఇంగ్లీషు డైలాగులు పరిశ్రమ వర్గీయులనూ, ప్రేక్షకులనూ ఆశ్చర్యపరిచాయి. మంచి గాత్రమున్న నారాయణరావు ఆ సినిమాలో సొంత గొంతుకలోనే పాట పాడారు. ఇక, ఘంటసాల పాడిన తొలి సినీ గీతం ‘స్వర్గసీమ’ (1946)లో నారాయణరావు, భానుమతులపై చిత్రీకరించినదే! ‘దేవత’ (1941)లో భావకవిగా చిన్న పాత్ర పోషించారు. అందాల నటుడిగా పేరు తెచ్చుకొని, ‘చెంచులక్ష్మి’ (1944)లో సవతుల పోట్లాటలో చిక్కిన కథానాయకుడిగా, ‘తాసిల్దార్‌’ (1944)లో పాశ్చాత్య జీవనశైలీ వ్యామోహంలో పడే తాసిల్దార్‌గా, ‘స్వర్గసీమ’ (1946)లో నెగటివ్‌ ఛాయలున్న పాత్రలో – అందరినీ ఆకట్టుకున్నారు. ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క కీలకమైన పాత్ర అయితే, చిన్నదైనా సరే నటించడానికి ఆయన వెనుకాడకపోవడం విశేషం.

ప్రముఖులతో అనుబంధాలు
కృష్ణవేణి, కమలా కోట్నీస్‌, ఋష్యేంద్రమణి, భానుమతి, రుక్మిణి, జి. వరలక్ష్మి, శాంతకుమారి, ‘షావుకారు’ జానకి, కృష్ణకుమారి లాంటి అప్పటి తరం నాయికల సరసన ఈ అందాల నటుడు అభినయించారు. అప్పట్లో నారాయణరావుకు బోలెడంతమంది అభిమానులు ఉండేవారు. తెలుగులో సినిమా హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడడం ఆయనతోనే మొదలైందని చెబుతారు. అలాంటి పాపులారిటీ వల్ల 1949లో విజయ వాడలో ఆకాశవాణి కేంద్రం ప్రారంభోత్సవానికి కూడా ఆయన ప్రత్యేక ఆహ్వానితులయ్యారు. ఇక, 1951 ప్రాంతంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనను సత్కరించడం విశేషం. వి.వి. గిరి, ప్రకాశం పంతులు, పి.వి. రాజమన్నార్‌, బెజవాడ గోపాలరెడ్డి, మాడభూషి వెంకటాచారి లాంటి అప్పటి రాజకీయ నాయకులతో ఆయనకు అనుబంధాలు ఉండేవి.

అభిప్రాయాలు
ఆంగ్ల చిత్రాలు, ఆ స్థాయి, ఆ నటనా మనకీ రావాలని, మనది బాగా ఓవర్‌ యాక్టింగ్‌లా కనిపిస్తుందనీ నారాయణరావు చెప్పేవారు. ‘ఆ చిత్రాల్లోని నటులు ఎక్కువగా హావభావాలు చూపించరు. మామూలుగా, మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు. సజీవమైన పాత్రలు అంటే అలాగే ఉంటాయి. నటించాలి కాబట్టి, మనం రెండాకులు ఎక్కువగా తగిలిస్తాం. పూర్వం రోజుల్లో నాటక నటన అయితే మరీ ఓవర్‌గా ఉండేది. మామూలుగా మనం ఎలా మాట్లాడతామో, ఎలా ప్రదర్శిస్తామో అలా… జీవితానికి దగ్గరగానే నటనా ఉండాలని నా ఉద్దేశం. ఎంతమంది నాతో ఏకీభవిస్తారో నాకు తెలియదు. అయితే చిత్రాల్లో నటిస్తున్నప్పుడు నేనోక్కడినే అలా నటిస్తే అతకదు. పైగా ఆ విధానాన్ని మన దర్శకులు అంగీకరించే స్థాయిలో లేరు. చిత్రంలోని పాత్రలన్నీ ఒకే రీతిలో నటించ గలగాలి’ అని నారాయణరవు చెప్పేవారు. అందుకే ఆయన నటనలో చేతులు ఎక్కువగా తిప్పడమూ, గట్టిగా అరవడమూ, కళ్ళూ కనుబొమలూ ఎగరవేయడమూ కనిపించేది కాదు. ఆయనదొక స్టడీ.

‘మనదేశం’ చిత్రం ఎన్‌.టి.రామారావు తొలి చిత్రం. అందులో నారాయణరావు హీరో, రామారావుది ఇన్స్పెక్టర్‌ పాత్ర. తనకి షూటింగులేని ఓ రోజున రామారావు తెల్లని పంచె, జుబ్బాతో కుడిచేత్తో పంచెకొంగుని పైకి పట్టుకుని నడుస్తూ వచ్చి, మేకప్పులో ఉన్న నారాయణరావుకు నమస్కరించి కూచున్నారు. ఆయన్ని చూడగానే ‘అరె..మీరా! ఇన్స్పెక్టర్‌ డ్రస్‌ లో చూసి, మాములుగా చూచేసరికి ఎవరో అనుకున్నాను. చాలా అందంగా ఉన్నారు. ఎప్పుడూ ఇలాగే వేసుకుంటారా డ్రెస్సు?’ అని అడిగారు నారాయణరావు.

వ్యక్తిత్వం
ఎంతమందిలో ఉన్నా నారాయణరావు మీదనే అందరి కళ్ళూ ఉండేవి. ఆ తరం ప్రేక్షకులకి నిరంతరం ఆయన బాగా గుర్తుంటారు. వ్యక్తిగా చూస్తే మృదువైన సంభాషణ. సౌమ్యుడు. ఆత్మాభిమానం గలవాడు. బాగా చదువుకున్నారు. ఆంగ్లభాషలో చక్కగా మాట్లాడేవారు. ఆంగ్లభాషలోని గొప్ప గొప్ప పుస్తకాలమీద నిత్యమూ మిత్రులతో చర్చించేవారు. తరచూ రేడియో నాటకాల్లో కూడా పాల్గొనేవారు.

‘నేను చిత్రాల్లో నటించడం మానేసానని ఎవరో అన్నారు. అలానెనేం చెప్పలేదు. నటుడిని నేను. ఎందుకు నటించను? అయితే నేనెవర్నీ వెళ్ళి అడగను. ఏభై చిత్రాల్లో నటించిన వాడిని… నన్నెరగరా ? అయినా నేను వెళ్ళి అడగడానికి ఆత్మాభిమానం అడ్డం వస్తుంది. అంతకంటెఅంతకంటె, ఇలా పుస్తకాలు చదువుకుంటూ, సిగరెట్లు కాల్చుకుంటూ, (ఆయన ఎక్కువగా సిగరెట్లు కాల్చేవారు) ఇంట్లో కూచోవడం నయం. ఈ మధ్య ఒక నిర్మాత వేషం వెయ్యమని అడిగారు. తప్పకుండా వేస్తానన్నాను. అయితే పారితోషికం చాలా తక్కువగా మాట్లాడాడు. ఎంచేతనంటే… నాకు సినిమాలు లేవుట. డిమాండ్‌ లేదుట.’ హీరో పాత్రధారణకి తీసుకున్నంత పారితోషికం అడగడం లేదు గాని, రీజనభాుల్‌గా ఇవ్వండి.‘ అన్నాను ప్రాధేయపడలేదు. మరీ నన్ను తక్కువగా అంచనా వెయ్యడం నాకు నచ్చలేదు. నాకు డబ్బు కావాలి…నిజమే. కాని, ఎంతో కొంతకి కక్కుర్తి పడి ఎలావెయ్యను? దానివల్ల నాకు అహంకారం అన్నారు. డిమాండ్‌ చేస్తాడన్నారు. అదేం కాదు…నా కున్న పేరునీ, ఒకనాటి నా అనిభవాన్నీ చవగ్గా వాడుకోవాలని చూస్తే సహించవలసిన అవసరంలేదు. ’అదీ ఆయన ధోరణి !

అందరికి అందుబాటులో ఉండే నటుడుగా గుర్తింపు పొందిన నారాయణరావు. 1984 ఫిబ్రవరి 14లో మరణించారు.[3]

చివరి రోజులు
చివరి రోజుల్లో ప్రోస్టేట్‌ గ్రంథి సమస్యతో, మూత్రపిండాల వ్యాధితో బాధపడిన ఆనాటి రొమాంటిక్‌ హీరో చివరకు తన 71వ ఏట 1984 ఫిబ్రవరి 14న మద్రాసులోని రాయపేటలో ఓ ప్రైవేటు నర్సింగ్‌హౌమ్‌లో కన్నుమూశారు. కనుమరుగై మూడు దశాబ్దాల కాలమవుతున్నా, ఇవాళ్టికీ సిహెచ్‌. నారాయణరావు పేరు చెప్పగానే పాతతరం వాళ్ళకు ‘మనదేశం’ (1949), కృష్ణవేణితో కలసి నటించిన శోభనాచల వారి ‘లక్ష్మమ్మ’ (1950), ఏ.వి.ఎం. వారి ‘జీవితం’ (1950), సేలంలోని మోడరన్‌ థియేటర్స్‌ వారి ‘ఆడజన్మ’ (1951) లాంటి చిత్రాలే గుర్తుకు వస్తాయి. హీరో నుంచి క్యారెక్టర్‌ యాక్టర్‌గా పూర్తిగా మారిపోయాక ఆయన నటించిన ‘బాల భారతం’, ‘కలెక్టర్‌ జానకి’, ‘శ్రీకృష్ణ తులా భారం’, ‘రహస్యం’, ‘దేశోద్ధారకుడు’, ‘రాణీ కాసుల రంగమ్మ’, ‘పులిబిడ్డ’ లాంటి చిత్రాలను చూసినప్పుడు పాత జ్ఞాపకాలు మెలిపెడతాయి.

నాటకాలలో నటిస్తూ గొంతెత్తి పాడుతున్న వారికే సినిమా చాన్స్ తగిలే రోజుల్లో అవేవీ లేకుండా డైరెక్ట్ గా మొదటి సారే హీరో అయిన గ్లామర్ కింగ్ నారాయణరావు గారు .ఓవర్ యాక్షన్ లేకుండా సాత్వికాభినయనానికి పెద్ద పీట వేసిన మార్గదర్శి .సృజనాత్మక శక్తితో సినీ హీరోలకు గ్లామర్ సంతరించిపెట్టిన తొలి తెలుగు హీరో నారాయణ రావు .సినీ కళాకారులకు ఏమాత్రం గౌరవం లేని రోజుల్లో నారాయణ రావు రంగప్రవేశం తో అవన్నీ కొట్టుకు పోయాయి .’’అందాల నటుడు ‘’అని పించుకోవటమే కాదు ‘’మహా నటుడు ‘’అని కూడా అని పించుకొన్నారు .ఆయనలోని సంస్కారాన్నీ ,నటనా కౌశలాన్ని సాధారణ ప్రేక్షకులే కాకుండా ,హిందీ దిగ్గజ మహానటులు బల్రాజ్ సహానీ ,పృధ్వీ రాజ్ కపూర్ ,భారత తోలి వైస్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాదాకృష్ణన్ ,ఆంధ్రా యూని వర్సిటి వైస్ చాన్సలర్ కట్టమంచి రామ లింగా రెడ్డి వంటి మేధావులు కొనియాడారు అంటే మామూలు విషయం కాదు .
సాంఘిక జానపద పౌరాణిక ,చారిత్రిక చిత్రాలు 50లో హీరోగా, కేరక్టర్ యాక్టర్ గా నటించిన తన ప్రతిభా వ్యుత్పత్తులు ప్రదర్శించిన మేటి నటులు నారాయణ రావు .తెలుగు సినిమా పుట్టిన పదేళ్లకు 1944లో సినీ రంగ ప్రవేశం చేసి ఒక దశాబ్దం పాటు తిరుగులేని హీరో గా వెలిగారు .అభిమాన సంఘాలు ఏర్పడిన మొట్టమొదటి హీరో నారాయణరావు .1951లో ఆంద్ర విశ్వ విశ్వవిద్యాలయం వీరి నటనా వైదుష్యాన్ని గుర్తించి సత్కరించింది .ఒక యూని వర్సిటి ఒక సినీ నటుడినిసత్కరించటం వీరితోనే ప్రారంభమైంది .నారాయణ రావు –కృష్ణ వేణి జంట ఆకాలం లో సక్సెస్ ఫుల్ పెయిర్ గా భావించారు .వీరిద్దరూ జంటగా నటించిన మనదేశం సినిమాలో రామారావు మొదటి సారి గా ఒక చిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర ధరించి సినీ రంగ ప్రవేశం చేశారు .శోభనాచల సంస్థ ఈ హిట్ పెయిర్ తో ‘’లక్షమ్మ సినిమా 1950లోనిర్మిస్తే ,ప్రతిభావారు అక్కినేని , అంజలి తో ‘’శ్రీ లక్ష్మమ కథ’’సినిమా తెశారు .నారాయణ రావు గారి సినిమానే ఘన విజయం సాధించి బాక్సా ఫీజు బద్దలు కొట్టింది .

1956లో ఎస్వి రంగారావు తో వీరు ఎదో పట్టింపు తో నటించను అని చెబితే ,లక్ష్మీ రాజ్యం గారితో హరిశ్చంద్ర లో నటించారని అంటారు ..గురజాడ కన్యా శుల్కం సినిమాలో ‘’గిరీశం పాత్ర నేనుకాకుండా సిహెచ్ నారాయణరావు గారు నటించి ఉంటె సినిమా ఘన విజయం సాధిచి కళా ఖండంగా మిగిలి పోయి ఉండేది ‘’అని ఎన్టి. రామారావు గారే స్వయం గా చెప్పారు .అలాగే స్వర్గ సీమ సినిమాలోసీనియర్ నటులు నాగయ్య గారు హీరో అయినా ,నారాయణరావు గారి చలాకీతనం తో కూడినకదలికలతో ,సంభాషణా చాతుర్యం తో ,అభినయ ప్రతిభతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించారని సినీ విశ్లేషకులు శ్రీ ఉడయవర్లు చెప్పారు .ఘంటసాల సినీ రంగ ప్రవేశం చేశాక పాడిన మొదటి ‘’హారే హా ,లే వెన్నెల ,చిరునవ్వులు విరజిమ్ము బఠానీ,నీ రాకకోరి నీ దారి కాచి యున్నానె పిల్లా ,వేచి యున్నానె ‘’పల్లవి గల పాట నారాయణ రావు గారికే స్వర్గ సీమ సినిమాలో పాడారు .వైజయ౦తీమాలతో జీవితం సినిమాలో ఒక ప్రత్యెక తతో నటించారు .జీవన జ్యోతి ,దేవత ,ప్రహ్లాద ,దీనబంధు ,చెంచు లక్ష్మి ,తాసిల్దారు ,ముగ్గురు మరాఠీలు ,ఆడ జన్మ ,మనదేశం వంటి చిత్రాలలో అపూర్వ నటన ప్రదర్శించారు నారాయణరావు గారు .

కలెక్టర్ జానకి,అర్ధరాత్రి ,రహస్యం ,వీలునామా ,గంగా గౌరీ సంవాదం లో శివుడు ,జంగమ దేవర ,జమ్పనవారి మేనరికం లో హీరోగా జి వరలక్ష్మితో ,వివి రావు డైరెక్షన్ లో మంజరిమానవతి సినిమాలలో జి వరలక్ష్మితో హీరోగా , ఆడజన్మ ,తిరుగుబాటు ,త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం లో కృష్ణవేణి తో హీరోగా ,బిఎన్ రెడ్డి గారి స్వర్గ సీమలో నాగయ్య భానుమతి గార్లతో ,వైవి రావుడైరేక్షన్ లో తాసిల్దార్ లో తాసిల్దార్ నరసయ్యగా భానుమతి తో బిఎ సుబ్బారావు డైరెక్షన్ లో చెంచు లక్ష్మిలో ,రాజా సాండో నిర్మించి దర్శకత్వం చేసిన చూడామణి లో పుష్పవల్లి ,సి ఎస్ ఆర్ లతో హీరోగా ,బిఎన్ రెడ్డి గారి దేవత లో సుకుమార్ గా , మొత్తం మీద 50 సినిమాలలో సక్సెస్ ఫుల్ నటుడుగా నటించి చారిస్మాతో ఆంధ్ర ఆంధ్రేతర ప్రెక్శకులను ఆకర్షించారు హీరో చదలవాడ నారాయణరావు .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -18

18,19-‘’ఇహీ బాగు బాగు ‘’ అంటూ నవ్వించే నల్లరామ్మూర్తి,ఆయన జంట సీతారాం

కోటపల్లి (నల్ల) రామమూర్తి ప్రముఖ తెలుగు చలనచిత్ర, రంగస్థల నటుడు. హాస్యనటుడిగా ఇతడు సుప్రసిద్ధుడు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలంలోని చింతపర్రు ఈయన స్వస్థలం. ఈయన 1913లో జన్మించారు. సుమారు రెండు వేల నాటకాలలో, 112 సినిమాలలో నటించారు

విశేషాలు
సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయనకు చదువు అంతగా అబ్బలేదు. చక్కని గాత్రం ఉండడంతో నాటకరంగాన్ని తేలికగా ఆకర్షించగలిగారు. తన 15వ యేటనే శ్రీకృష్ణతులాభారం నాటకంలో వసంతకుని వేషం వేసి అందర్నీ మెప్పించారు. ఇంగ్లీషు చదువు అబ్బకపోయినా తెలుగులో అనేక వచన గ్రంథాలను చదవడం వల్ల, నాటకాలలోని పద్యాలు కంఠస్తం చేయడం వల్ల అచిర కాలంలోనే రచయితగా మారారు. “తూర్పు సావిత్రి”, “సీతమ్మోరి వనవాసం”, “పండగ అల్లుళ్లు” మొదలైన హాస్యనాటికలను స్వయంగా రచించి తన బృందంతో ఆంధ్రదేశం అంతటా ప్రదర్శనలు ఇచ్చారు. గాత్రం కూడా ఉండడంతో అద్దంకి శ్రీరామమూర్తి, ఈలపాట రఘురామయ్య, పువ్వుల సూరిబాబు, కొచ్చర్లకోట సత్యనారాయణ, జొన్నవిత్తుల శేషగిరిరావు, స్థానం నరసింహారావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు మొదలైన రంగస్థల నటులతో కలిసి అనేక పౌరాణిక నాటకాలలో హాస్యభూమికలు ధరించారు.

తన 65వ యేట తన స్వగ్రామమైన చింతపఱ్ఱు గ్రామంలో 1978, మార్చి 20వ తేదీన మరణించారు ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కొన్నేళ్ళ క్రితం సినిమాలలో నవ్వుల పంట పండించటానికి ఒక హాస్య జంట ఉండేది .అదే తొలి జంట ,చివరి జంటా.ఒకరు నల్ల రామమూర్తి రెండవవారు సీతారాం .ఇద్దరు ఒక ఊరివారు ఒకే సారి సినీ ప్రవేశం చేసిన వారూ కాకపోయినా ,సినిమా ఊరిలో కలుసుకొని ,కూడ బలుక్కుని మిత్రులయ్యారు .వీరిలో సీతారాం ముందు రంగు పూసుకొన్నారు అంటే సీనియర్ .అందరూ సీతారామయ్యా అని పిలిచేవారు .అంత పెద్దపేరు ఉంటె పెద్ద వాడు అనుకొంటారని హెచ్ ఎం రెడ్డిగారు’’ సీతారాం’’ గా మార్చారు .

1940లో బెజవాడకు చెందిన పోతిన శ్రీనివాసరావు గారు ఈయన్ను ‘’కాళిదాసు ‘’సినిమాలో వేషం వేయించటానికి మద్రాస్ పంపారు .ఆ కంపెనీ వాళ్ళు తిండి బస ఏర్పాటు చేసి నాలుగు నెలలు జీతం ఇస్తే హాయిగా తిరిగారు కానీ వేషం ఇవ్వలేదు .వేషం వేయించి డబ్బులు ఎగగొట్టే వాళ్ళే ఎక్కువగాఉన్న రోజుల్లో వేషం ఇవ్వకుండా నాలుగు నెలలు పోషించటం అపూర్వమే అంటారు సీతారాం .ఇంకో ప్రొడ్యూసర్ వేషం వేయించి డబ్బు ఎగ గొట్టగా ఈయన అడిగితే ‘’వేషం వెయ్యకుండా అప్పుడు హాయిగా అనుభావి౦చావుగా ఇప్పుడు నా సినిమాతో సరి బెట్టుకో ‘’అని ఝలక్ ఇచ్చాడు .’’ఇదీ హాస్యం అంటే ‘’అనిపించింది గురూగారికి .1941లో వచ్చిన తెనాలి రామకృష్ణ సినిమా లో మొదటి వేషం వేశారు .ఒక సారి అవుట్ డోర్ షూటింగ్ లో ఎండలో కూర్చోలేక చెట్టుకింద కూర్చుని ఏదో సరదాగా మన పురాణాలగురించి ముస్లిం భాయ్ పాడినట్లుగా పాడిన తానే రాసిన పాట పాడారు –అందులో ‘’ధర్మారాజుకీ తంబ్డు కుంభా కర్నూడు,దమయంతీనీ తీస్కుని ఎల్లి లంకామే పెట్టేతల్కి ,అనుమంతుడికి కోపం వచ్చీ ,పాతాళలోకం ఎగ్రి ,బెమ్మా ముక్కూ పట్కోని లాగే తల్కిబెమ్మకి మూడు ముకాలే అయినాయ్ బాబూ అల్లాతూహీ ‘’.దీన్ని రెడ్డిగారు విని ఆపాటను కాగితం మీదరాసి మ్యూజిక్ డైరెక్టర్ కిస్తే ట్యూన్ కడతాడని చెప్పగా ఆ పాటను ‘’సత్యమే జయం’’ సినిమాలో పెట్టారు ,వేషం ఇచ్చి ఆపాట పాడించారు కూడా

నల్ల రామమూర్తి తో స్నేహం కలియక ముందూ అడపా దడపా వేషాలు వేశారు ,ఇద్దరూకలిసి మొదటి సారిగా అగ్ని పరీక్ష సినిమాలో ‘’ఓ భాగవతం’’ఆడారు .సీతారాం నరసింహసామి, రామమూర్తి చెంచులక్ష్మి వేశారు .వాళ్ళ పాట వాళ్ళే పాడుకొన్నారు .పల్లెటూరు పిల్ల సినిమా నుంచి ఇద్దరూ జంటగా స్థిరపడ్డారు .అందులో ‘’చిటపట చినుకుల దుప్పటి తడిసెను తలుపు తీయవే భామా ‘’అని వాళ్ళు పాడిన పాట సూపర్ డూపర్ హిట్ అయింది .జంటగానే కాకుండా విడివిడిగా కూదాసినిమాలలో నటించారు .బాలరాజు సినిమాలో ‘’సూడ సక్కని సిన్నది ఆ మేడ గదిలో ఉన్నది ‘’అనే పాట ను సీతారాం పాడారు .ముగ్గురు మరాటీలు రత్నమాల,లైలా మజ్ను సినిమాలో పెద్ద వేషాలే వేశారు సీతారాం .ఎన్ని సినిమాలో వేశారో తెలీదు ఇచ్చింది జేబులో కుక్కుకోవటమే అని చెప్పేవారు .

ఈ జంట సైకిళ్ళ మీద తిరిగేవారు వాహినీ స్టూడియో దగ్గరే ఇల్లు కనుక షూటింగ్ లకూ సైకిళ్ళ మీదే .’’మాతోనే సైకిళ్ళు .ఏం తప్పా ?’’అనేవారు .

నల్ల రామమూర్తి ఇంటిపేరు నల్లకాదు.వాళ్ళ ఊర్లో ఇద్దరు రామ్మూర్తులు వేషాలు వేస్తూ ఉండేవారు ఈయన నల్లగా ఉంటాడు కనుక ఐ డేన్టి టి కోసం నల్ల రామమూర్తి అనే వారు .పాటలు పద్యాలుపాడటం కామిక్ రికార్డులు ఇవ్వటం ఆయనపని .తూర్పు యాసతో ‘’తూర్పు సావిత్రి ‘’,తూర్పు రామాయణం రాసి,పాడి , నటించి బాగా పాప్యులర్ చేసి అవార్డ్ లు పొందారు .ఈ సావిత్రిని రంగస్థలం మీద కూడా బాగా పాడేవారు.ఈ ప్రదర్శన చివరి సారి మద్రాస్ లో జరిగితే నటి వాణిశ్రీ అందులో సావిత్రిగా నటించారు .ఏదో చిన్నా చితకా వేషాలు వేసినా పల్లెటూరి పిల్లసినిమాతో గుర్తింపు వచ్చింది .నల్ల రామమూర్తి బ్రాండ్ హాస్యం ఏమిటంటే ‘’సీరియస్ గా మొహం పెట్టి నవ్వించటం సన్నని గొంతుతో నవ్వించటం .కస్తూరి శివరావు తీసిన పరమానందయ్య సినిమాలో కడుపుబ్బా నవ్వించారు రామమూర్తి .ఇక మాయాబజార్ సంగతి చెప్పక్కర్లేదు .మంచి మనసుకు మంచిరోజులు సినిమాలో ‘’ఇహీ బాగుబాగు ‘’ అని తరచుగా అంటూ గొప్ప హాస్యం పుట్టించారు.రాజ్యం పిక్చర్స్ కృష్ణ లీలలు లో బాలకృష్ణుని సఖులుగా వీల్లుసృష్టించిన హాస్యం ‘’కిత్త మూతి మామయ్యా ‘’అనటం మర్చిపోలేము .

సినిమాలలోసపోర్తింగ్ కేరక్టర్ లు వచ్చినా ,తరచూ నాటకాలకు వెళ్ళాల్సి వచ్చేదికనుక కమెడియన్ గానే ఉండిపోయారు .వేషాలు లేకపోతె వాళ్ళ వూరికి వెళ్ళిపోయేవారు .అందుకే పైకి రాలేక పోయానేమో అనేవారు ‘’ఉంటే మాత్రం పైకి వచ్చే వాన్ణా?చాల్లెండి సారూ ‘’అని నవ్వేస్తారు .తెల్ల పైజమా సిల్కు జుబ్బా ,కళ్ళ జోడు తోఆయన ప్రత్యేకంగా కనిపించేవారు .ఆంధ్రా క్లబ్ లో చెట్టుకింద కూర్చుని కబుర్లు చెబుతూ నవ్వించటం హాబీ .ఒక సారి సీతారాం ,రామ్మూర్తితో ‘’నాకు డైరెక్షన్ ఆఫర్ వచ్చింది .నువ్వు మంచి వేషం వెయ్యాలి ‘’అంటే ‘’సంతోషం నిర్మాత ఎవరు “’?అని అడిగితె ‘’వెతుకుదాంపద సైకిల్లెక్కి ‘’అని జోక్చేశారట .’’నాకు డైరెక్షన్ చాన్స్ వస్తే నువ్వు అసూయ పడతావా లేదా అని తెలుసుకోవతానికే అలా చెప్పాను నువ్వు అసూయ పడలేదు ‘’అన్నారటసీతారామయ్య ‘’నువ్వేం ఆస్య నటుడి వయ్యా బాబూ ‘’అన్నారట నల్ల .

విజయ చిత్ర సినిమా పత్రిక వారు డి.రామానాయుడుగారిని ఇంటర్వ్యు చేస్తూ ‘’మీ అభిమాన నటుడు ఎవరు ?’’అని అడిగితె క్షణం కూడా ఆలోచించకుండా ‘’నల్ల రామమూర్తి ‘’అని చెప్పారట .నాయుడుగారిచ్చిన ఈ గౌరవం చాలదూ అబ్బో కడుపు నిండి పోయింది అన్నారట రామమూర్తి .సినిమాల సంఖ్య,సంపాదించిన డబ్బు గురించి ఈ జంటను అడిగితె ‘’మనకో రేటు లేదండి .అభిమానంగా ఎవరు ఎంతిస్తే అంత తీసుకోవటమే .’’అనేవారు వీరికి ‘’లారెల్ అండ్ హార్డీ జంట’’ హాస్యం చాలా ఇష్టం .సిగరెట్టో,బీడీయో ఏది ఉంటె దాన్ని కాలుస్తూ,పీలుస్తూ సైకిళ్ళమీద తిరుగుతూ తృప్తిగా కని పించేది ఈ’’ ఆస్యపు సీతా నల్ల రామ్మూర్తుల జంట .’’వారిద్దరూ కనుమరుగైనా వారు పండించిన హాస్యం మాత్రం చిరంజీవే .

సశేషం

ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -16

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -16

16-అమర సందేశం హీరో –ఆమరనాథ్

1950-60మధ్య కాలం లో తెలుగు చలన చిత్ర సీమకు అనేకమంది నటీ నటులు పరిచయమయ్యారు .అదృష్టం బాగుండి తారాజువ్వల్లాగా పైకి ఎదిగిన వారు కొందరు దురదృష్ట కాలసర్ప బాధ పడి అధోగతి పాలైనవారు కొందరు వీరిలో ఉన్నారు .1953లో వచ్చిన ‘’నా చెల్లెలు ‘’సినిమాలో పరిచయమైన అమరనాథ్,1954లో ఆదుర్తి సుబ్బారావు తొలిగా దర్శకత్వం వహించి ,ఘంటసాలమాస్తారు గారికి ఆర్కెస్ట్రా పార్టీ గా ఉంటున్న ప్రసాదరావు అండ్ పార్టీ సంగీతం అందించిన‘’ సంగీత ,సాహిత్యాల క్లాసిక్ ‘’అమర సందేశం ‘’ సినిమాలలో అద్భుత నటన ప్రదర్శించి ,ఆంధ్ర సినీ ప్రేక్షకుల హృదయాలలో స్థిరస్థానం సంపాదించుకొన్నారు .తర్వాత భరణి ,నేషనల్ పిక్చర్స్ ,భాస్కర్ ప్రొడక్షన్స్ ,గోకుల్ కృష్ణా ప్రోడక్షన్స్ వారి సినిమాలో ప్రధాన  పాత్రలు పోషించారు .

  అమరనాథ్ అసలుపేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్ .విశాఖ పట్టణం లో 1925లో జన్మించారు .చిన్నప్పటి నుంచి నటన ,సంగీతాలపై మోజు పడి,వాటిలో నైపుణ్యం సాధించటానికి తీవ్ర కృషి చేశారు .చాలా లలిత సంగీత కచేరీలు చేసి రంజింప జేశారు .ఆయన మధుర కంఠస్వర౦ తో శ్రోతలను సమ్మోహితులను చేసేవారు .నాటకాలలోనూ ప్రధాన పాత్రలు ధరించి మెప్పించేవారు .హాస్యం మిళితం చేసి కొన్ని గీతాలు రచించి గ్రామఫోన్ రికార్డ్ లు ఇచ్చారు .ఇవన్నీ 1950 ప్రాంతం లోఎం. ఎస్ .పట్నాయక్ పేరిట విడుదలైనాయి .ఈరికార్డ్ లకు మాంచి  గిరాకీ ఉండేది .

  ఇంటర్ పాసై,విశాఖ లో ఫుడ్ కార్పోరేషన్ లో గుమాస్తాగా చేరి పని చేస్తూ సినిమా అవకాశాలకోసం ప్రయత్నించారు .అప్పుడు జికే మంగరాజు ,ఎం ఎస్ నాయక్ లు కొందరు నిర్మాతలకు ఈతనిని పరిచయం చేశారు .దానిఫలితం గా ‘’అమ్మ లక్కలు ‘’ నా చెల్లెలు ‘’సినిమాలలో నటించే అవకాశం వచ్చింది .మంచి హావభావాలతో చక్కని నటన ప్రదర్శించటం చూసి ,ఇతరనిర్మాతలూ తమ చిత్రాలలో కాంట్రాక్ట్ చేసుకోవటం జరిగింది .నాచెల్లెలు చిత్రం లో పెద్దన్న పాత్ర గొప్పగా పోషించి ప్రేక్షక, నిర్మాత ,డైరెక్టర్లను ఆకర్షించారు .భరణి ప్రొడక్షన్స్ ని ర్మించి ,భానుమతి ,రామారావు రంగారావు మొదలైన అగ్ర శ్రేణి నటులు నటించి భానుమతి మొదటిసారిగా దర్శకత్వం చేసిన   చండీ రాణి లో కూడా నటించారు .ఇవన్నీ ఒకే ఏడాదిలో విడుదలై, వైవిధ్య పాత్రలను పోషించిన నటుడుగా అమరనాథ్ స్థిరపడ్డారు .ఆదుర్తి మొదటి సారి దర్శకత్వం వహించిన సంగీత సాహిత్య రసాత్మక చిత్రం అమర సందేశం లో అమరనాథ్ నాయక పాత్ర ధరించి అశేష ప్రేక్షకాభిమానం సంపాదించారు .54లో వచ్చిన చక్రపాణి లో భానుమతి అన్నగా ,55లో వచ్చినకోవెలమూడి భాస్కరరావు డైరెక్ట్ చేసిన జానకి, రామారావు నటించిన  ‘’చెడపకురా చెడేవు ‘’లో,అ౦జలీ దేవితో  అదే ఏడాదిలో రజనీ కాంత్ దర్శకత్వం లో వచ్చిన వదిన గారి గాజులు లో ,1956చిత్రం రజనీకాంత్ దర్శకత్వం ,ఎస్ వరలక్ష్మి రంగారావు ,గుమ్మడి నటించిన  కనకతార లో ,భానుమతి ,రామారావు నటించి భానుమతి భర్త రామకృష్ణ డైరెక్ట్ చేసిన చింతామణి లో ,1957లో కృష్ణకుమారి మొదలైన వారు నటించిన అక్కా చెల్లెళ్ళు లో రంజనితో ముఖ్యపాత్ర లో నటించారు .ఇందులో ఆరుద్రరాసి పిఠాపురం ,జిక్కిపాడిన ‘’ఇండియాకు రాజధాని ఢిల్లీ,నా గుండెల్లో ప్రేమరాణి లిల్లీ ‘’పాట సూపర్ హిట్ .భానుమతి ,జగ్గయ్య ,రామన్న పంతులు నటించి భరణి రామ కృష్ణ డైరెక్ట్ చేసిన వరుడు కావాలి లో,1959లో వచ్చిన సతీ సుకన్య లో చ్యవన మహర్షిగా ,సుకన్యగా  కృష్ణకుమారినటించగా చంద్రమోహన్ దర్శకత్వం చేశారు .1960లో విడుదలైన మగవారిమాయలు సినిమాలో కృష్ణకుమారితో హీరో గా  అమరనాథ్ నటింఛి నిర్మించిన చిత్రం . శోభనాద్రిరావు డైరెక్ట్ చేశారు ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి విపరీతంగా నష్టపోవాల్సి వచ్చి ఆతర్వాత సినిమా అవకాశాలు కూడా క్రమ౦గా తగ్గిపోయి ఫేడౌట్ అయిపోయారు .

  1973లో అమరచంద్ర మూవీస్ సంస్థ స్థాపించిఅమరనాథ్ హీరోగా ,విజయనిర్మల హీరోయిన్ గా  ‘’బాలయోగి ‘’సినిమా మొదలుపెట్టి ,సగం తీసి డబ్బు లేక,పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయి  ఆపేశారు .మానసికంగా ,ఆర్ధికంగా కుంగిపోయిన హీరో నిర్మాత అమరనాథ్ 65ఏళ్ల వయసులో అమరులైనారు.ఈయన కుమారుడు రాజేష్ ,కూతురు శ్రీ లక్ష్మి సినీ రంగం లోనే స్థిరపడ్డారు రాజేష్ చనిపోయి చాలాకాలమైంది .విలక్షణమైన హాస్యనటిగా శ్రీ లక్ష్మి అద్భుతంగా నటిస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు .అదృష్టం తో పైకెగసి మహాద్భుత నటనలో 7 సంవత్సరాలు మాత్రమె రాణించి దురదృష్టం కాటుకు బలైన హీరో  అమరనాథ్ అమర్ రహే .

  అమరనాథ్ నటించి జీవించి కీర్తి ప్రతిష్టలు పొందిన అమర సందేశం సినిమా హీరోయిన్ శ్రీ రంజని .సంగీతం ప్రసాదరావు అండ్ పార్టీ,కేల్కర్ లు .పాటలు ఏ.ఎం.రాజా  జిక్కీ ,పిబిశ్రీనివాస్పా ,మాధవపెద్ది పాడారు .దీనికి మూలం హిందీ సినిమా –బైజుబావరా ‘’  ఇందులో ఆణిముత్యాలలాంటి పాటలు -1-ఆనతికావలేనా గానానికి సమయము కావలెనా –(రాజా )ఏదో ఏదోనవీన భావం కదిలించే మధురమధుర (రాజా ),దయామయి దేవి శారదా –(పేరు తెలీదు )ప్రియతమా మరులుమా తిరిగిరాని పయన మేల(జిక్కి )మధురం మధురం మనోహరం రాధామాధవ (రాజా) ,మానస లాలస సంగీతం (రాజా )సరసత్ కళా క్షీరజముల (రాజా )

  ఈపాటలు  ఆరుద్ర ,శ్రీ శ్రీ ,తాపీ ధర్మారావు లు రాశారు  .వీటి పూర్తి స్క్రిప్ట్ కూడా దొరక లేదు . చరిత్ర,.లో కలిసిన ఈ మహా నటుడిని పరిచయం చేసే భాగ్యం కలిగింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-1-21-ఉయ్యూరు           

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -15

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -15

15-బెట్టీ డేవిస్ లాంటి మహానటి –హేమలత

శాంత సౌజన్యాలు మూర్తీభవించిన అలనాటి మేటి నటి పి.హేమలత. రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన హేమలత అంచెలంచెలుగా సినిమా నటిగా ఎదిగారు . ఆమె యన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్రకథానాయకుల చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ వచ్చారు . ముఖ్యంగా యన్టీఆర్ నటించిన పలు చిత్రాల్లో ఆయనకు తల్లిగా నటించి అలరించారు అనేక చిత్రాల్లో సాధుమూర్తిగా నటించిన హేమలత ‘బలిపీఠం’ వంటి చిత్రాల్లో గయ్యాళి పాత్రలూ పోషించారు [1] 1960ల నుండీ వచ్చిన సినిమాలలో అమ్మ పాత్ర కొంచెం మారింది. తనను తాను యస్సెర్ట్‌ చేసుకోవడం నేర్చుకున్నారు . హేమలత వారసత్వం, పరువు -ప్రతిష్ట సినిమాలలో ఇంటి వ్యవహారాలలో తన పట్టు నిలుపుకుంటూనే సినిమా ఆసాంతం ఒక ప్రధాన పాత్రలా కనిపించారు .

జీవిత విశేషాలు
ఆమె స్వస్థలం కృష్ణా జిల్లాలోని గుడివాడ. ఆమె 1926లో జన్మించారు .. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పెద్ద అభిలాష ఉండేది కాదు. అయితే ఆమె భర్త శేషగిరి రావు ప్రోత్సాహంతో నటిగా కెరీర్ ప్రారంభిం చారు . శేషగిరిరావు నాటక కళాభిమాని, రంగస్థల నటుడు కావడంతో ఆమెను నాటకాలలోకి ప్రవేశ పెట్టాలని అభిలషిస్తూ ఉండేవారు. ఏలూరు నాటక కళా పరిషత్తులో రావూరి గారు రచించిన “పరితాపం” అనే నాటకంలో ఆమె భర్త సహకారంతో నటించి,. తొలిసారిగా నటించినందుకు ఆమెకు బహుమతి కూడా వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమతి పొందిన ఆమెను పాలకొల్లు అదర్శ మండలి పినిశెట్టి శ్రీరామమూర్తి తమ నాటకం “పల్లె పడుచు” లో ఆమె చేత జమీందారిణి రమాదేవి పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు. ఈ నాటకం ఆంద్ర ప్రదేశ్ అంతా ప్రదర్శించబడి జమీందారిణి పాత్రలో అందరికీ సుపరితురాలయ్యారు .

వారికి మొదటి నుంచి గరికపాటి రాజారావు తోనూ, ప్రజా నాట్య మండలి తోనూ పరిచయాలుండేవి. ఈ పరిచయాల వల్ల సినిమాలలో అవకాశాలు లభించాయి. పీపుల్స్ ఆర్టు ప్రొడక్షన్స్ వారు “పల్లెటూరు” చిత్రాన్ని తిస్తున్నప్పుడు అందులో ప్లీడరు భార్య పాత్ర ధరించడానికి తగిన వ్యక్తి కావాల్సి వచ్చింది. ఆ సమయంలో చదలవాడ కుటుంబరావు, డైరక్టరు తాతినేని ప్రకాశరావు లు ఆమెను సిఫార్సు చేసారు. తాతినేని ప్రకాశరావు ఆమెను చూడనైనా చూడకుండా “అనసూయ” పాత్రను ఇచ్చారు. ఈ సమయంలో 10 నెలల వయసున్న ఆమె కుమారునికి జ్వరం వచ్చి మంచం పడినప్పటికీ హడావుడిగా మద్రాసు చేరుకన్నారు . అక్కడ కొందరు ఆమె “అనసూయ” పాత్రకు పనికిరాదన్నారు. కానీ ఆమె అధైర్యపడక సినిమాలో నటించారు

ఆ తర్వాత గుమస్తా (1953) లో నటించారు ఆత్రేయ గారి “ఎన్.జి.ఓ” నాటకం ఆధారంగా నిర్మించిన చిత్రం అది. దాని తర్వాత నవయుగ వారు శ్రీధర్ దర్శకత్వంలో నిర్మించిన “జ్యోతి”(1954)లో నటించే అవకాశం లభించింది. ఆ సినిమాలో కథానాయకుని తల్లిగా నటించారు .. తరువాత “అనుపమ” పతాకంపై నిర్మించిన చిత్రాల్లో చాలా పాత్రలను కె.బి.తిలక్ గారు ఇచ్చారు. అత్తా ఒకింటి కోడలే (1958) చిత్రంలో అత్త భూమిక మొత్తం పోషించారు

వద్దంటే డబ్బు సినిమాలో నటిస్తుండగా ఎన్.టి.రామారావు ఆమెలో నటనా పటిమను గుర్తించి తాను స్వంతంగా నిర్మిస్తున్న పిచ్చిపుల్లయ్య లో హీరో తల్లి పాత్ర ధరించడానికి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత రామారావు గారు తోడు దొంగలు సినిమాలో అతని భార్య పాత్ర ఇచ్చాడు. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ బహుమతి వచ్చింది.

ఆమె నట జీవితంలో గొప్ప మలుపు వాహినీ వారి బంగారు పాప (1954). వాహినీ సంస్థలో అవకాశం రావడమే గొప్పగా ఉండే రోజుల్లో ఆ సంస్థలో నటించడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

బి.ఎన్.రెడ్డి నిర్మించిన బంగారు పాప సినిమాలో రౌడీ కోటయ్య (ఎస్.వి.రంగారావు) ను మాటలతో కట్టడి చేసే మంగమ్మ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసాడు. ఆ సినిమాలో “మంగమ్మ” పాత్ర ఆమెను చక్కటి ఆర్టిస్టుగా చలన చిత్ర రంగంలోనిలబెట్టింది. ఈ సినిమా అవార్డు సభలో బి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ “బంగారు పాప లో మంగమ్మ పాత్ర ధరించిన హేమలత గారిలో నటనా కౌశలం మరుగున పడి ఉంది. మన నిర్మాతలందరూ అవకాశాలిస్తే అమెరికన్బె నటి” రూత్ ఎలిజబెత్ బెట్టీ డెవిస్ ”లాగ నటించి ప్రజానీకాన్ని మెప్పించగల సామర్థం గల వారని” ఆమెను మెచ్చుకున్నాడు.

ఆ తర్వాత దుక్కిపాటి మధుసూధనరావు, అక్కినేని నాగేశ్వరరావు లు అన్నపూర్ణా వారి దొంగరాముడు లో దొంగరాముడి తల్లి పాత్ర ధరించడానికి అవకాశమిచ్చారు.

ఆ చిత్రం తరువాత ఆమెకు మరికొన్ని సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. గురజాడ అప్పారావు రాసిన నాటకం కన్యాశుల్కం ను డి.ఎల్.నారాయణ తీస్తే అందులో విన్నకోట రామన్న పంతులు సరసన “వెంకమ్మ” పాత్రలో నటించారు తరువాత సి.ఎస్.ఆర్ గారితో నిత్య కళ్యాణం-పచ్చతోరణం (1960), విఠల్ ప్రొడక్షన్స్ వారి కన్యాదానం (1955)లో షావుకారు జానకికే తల్లి సీతమ్మ పాత్ర, ఘంటశాల గారి సొంత చిత్రం సొంతవూరు (1956) లో ఎన్.టి.రామారావు గారి తల్లి సుభధ్రమ్మ పాత్రను ధరించారు . భూకైలాస్ లో రావణుని తల్లి కైకసి పాత్ర హుందాగా పోషించారు తరువాత ఎన్నీ చారిత్రకాలు, పౌరాణికాలు, సాంఘికాలలో సుమారు 200 చిత్రాలలో నటించారు .

చాలా సినిమాలలో తల్లి పాత్రలే వేసినా అప్పుడప్పుడూ కొన్ని స్వభావానికి విరుద్ధమైన పాత్రలు కూడా వేసింది. ఇల్లరికం, తిరుపతమ్మ కథ, మల్లమ్మ కథ చిత్రాలలో గయ్యాళి పాత్రలను వేశారు . రాముడు భీముడు చిత్రంలో ఎన్.టి.రామారావుకు అమ్మమ్మ గా కూడా నటించారు . సంపూర్ణ రామాయణం సినిమాలో కౌసల్య పాత్ర వేశారు .

తన కుమారుడు ఉద్యోగంలో స్థిరపడిన తరువాత సినిమాలలో నుండి విరమించుకున్నారు . కానీ దేవీ వరప్రసాద్ అడిగితే కాదనలేక కథానాయకుని కథ (1975) లో నటించారు . ఆమె చివరి చిత్రం సీతమ్మ సంతానం (1976)

ఆమె సినిమాలు మానేసిన తర్వాత, దాదాపుగా 20 ఏళ్లు పాటు ఒక వృద్ధాశ్రమంలో (హైదరాబాదు) ఉన్నారు . ఆవిడ క్షేమంగానే ఉన్నా, చూడ్డానికి ఎవర్ని రానిచ్చేవారు కాదు. తన 93వ ఏట ఆమె మరణించారు . ఈ మరణవార్త ఎవరికీ తెలియలేదు. దత్తత తీసుకున్న కొడుకు పత్రికలకి చెప్పలేదు.[4]

తరువాత జీవితం
ఆమె సినీ రంగానికి దూరంగా మద్రాసులో నాగార్జుననగర్ లో ఉన్న పెద్ద భవంతిని అమ్మివేసి హైదరాబాదు చేరుకుని ప్రజాపిత బ్రహ్మకుమారి శాంతి మార్గంలో ప్రశాంతజీవితం గడిపారు

తెలుగు చలన చిత్ర రంగం లో కన్నాంబ ,ఋష్యే౦ద్ర మణి,హేమలత గార్లు నట త్రివేణీ సంగమం లాంటి వారు. ముగ్గురూ ముగ్గురే .మేటి మహా నటీ మణులు . వెండితెరకు తమ నటనా సొబగులద్ది అందం ఆనందం చేకూర్చారు .చిరస్మరణీయం చేశారు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -14

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -14

14- రాజసం ఉట్టిపడేధీర గంభీర  పాత్రలు, నారద ,కన్నగి పాత్రలు ధరించిన గాయని నటీమణి –ఋష్యేంద్ర మణి

విజయవాడలో జన్మించిన శ్రీమతి ఋష్యేంద్ర మణి,పెంపుడు తల్లి వెంకటరత్నమ్మ గారి పెంపకం లో పెరిగి ఏడవ ఏటనే వంశ పారంపర్య సంప్రదాయం ప్రకారం గజ్జ కట్టారు .అంటే చిన్న తనం లోనే సంగీత నృత్యాలను అభ్యసించారు .ఆకాలం లో నాటకరంగం మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు వెతుక్కొంటూ వచ్చేవి .స్ఫురద్రూపం చక్కని అభినయం  గంభీరమైన నటన ,మంచి గాత్ర ధర్మ ఉన్న ఆమె కొమ్మూరి పట్టాభి రామయ్య గారి ‘’లక్ష్మీ విలాస నాటక సభ ‘’చేరారు .అప్పటికే లబ్ధ ప్రతిష్టు లైన నటులు శ్రీ కపిలవాయి రామనాధ శాస్త్రి ,శ్రీమతి పువ్వుల రామ తిలకం గార్ల పర్యవేక్షణలో శిక్షణ పొంది ‘’చింతామణి ‘’,సావిత్రి నాటకాలలో ముఖ్య పాత్రలు ధరించారు

   ఆరోజుల్లో సినీ నిర్మాత రాజారావు నాయుడు నిర్మించిన ‘’శ్రీ కృష్ణ తులాభారం ‘’ సినిమాలో సత్యభామ గా నటించి గొప్ప నటన ప్రదర్శించినా సినిమా అపజయం పాలైంది .మళ్ళీ నాటకాలలో నటించి ‘’ప్రహ్లాద ‘’,రాధా కృష్ణ ,చింతామణి ,తులాభారం మొదలైన నాటకాలలో ప్రముఖ పాత్రలను ప్రతిభా వంతంగా నటించి నాటకరంగ  ఆశాజ్యోతి అనిపించుకొన్నారు .కాంట్రాక్ట్ నాటకాల ప్రభ ఉచ్చ స్థితి లో ఉన్న ఆకాలం లోశ్రీ కడారు నాగభూషణం ,శ్రీమతి పసుపు లేటి కన్నాంబ గార్ల ‘’రాజరాజేశ్వరీ నాట్య మండలి ‘’నటిస్తూ మూడేళ్ళు ఆంద్ర దేశమంతా పర్యటించి అసమాన నటిగా నిరూపించుకొన్నారు .ఏడాదిలో 11నెలలు నాటకాలలోనే పాత్రలు ధరించారు .రంగూన్ రౌడి ,లో ప్రభావతి ,సావిత్రిలో నారదుడు పాత్రలలో నటించి ప్రత్యేక ప్రశంసలు పొందారు .

  ఋష్యేంద్ర మణి భర్త శ్రీ జవ్వాది రామ కృష్ణారావు గారు 1939లో  తమిళ చిత్రం ‘’మాతృ భూమి ‘’ సినిమాకి సంగీతదర్శకత్వం వహించటానికి మద్రాస్ రావటం తో ఈమె కూడామద్రాస్ వచ్చారు .పాండు రంగ విఠల్అనే సినిమాలో దేవకన్యగా నటించారు .అప్పుడే గూడవల్లి రామ బ్రహ్మం గారు తమిళ పంచ మహా కావ్యాలలో ఒకటైన ‘’శిలప్పాది కారం ‘’ఆధారంగా నిర్మించిన ‘’కణ్ణగి’’సినిమాలో కణ్ణగి పాత్ర ధరించి జీవించారు .’కణ్ణగి భర్త కోవలన్ గా సుప్రసిద్ధ దర్శక నిర్మాత నటుడు కెఎస్ ప్రకాశరావు అనే  శ్రీ కోవెలమూడి ప్రకాశరావు గారు నటించారు . ’కణ్ణగి పాత్రలో ఋష్యేంద్ర మణి అనితర సాధ్యమైన నటన ప్రదర్శి౦చి ఉజ్వల తారగా నిలిచారు .తర్వాత తమిళనాడు టాకీస్ వారి చెంచు లక్ష్మి చిత్రం లో ఆది లక్ష్మి పాత్ర పోషించి తన నటనా సామర్ధ్యాన్ని రుజువు చేశారు .ఈ రెండు సినిమాలు అద్భుత విజయాలను సాధించి నిర్మాత దర్శక నటీనటులకు చిరయశస్సునేకాక కనక వర్షాన్ని కూడా కురిపించాయి .

  సీతారామ జననం లో కౌసల్యగా ,సేతు బంధన్ లో ఇంద్రాణి గా ,భక్త శిరియాళ లోకథానాయకిగా నటించి సరిరారు తనకెవ్వరూ అని పి౦చుకొన్నారు .ధర్మాంగద చిత్రం లో తల్లిపాత్ర ధరించారు .వీర ,రౌద్ర గంభీర రసాలను ఎంత గొప్పగా పోషిస్తారో,అంతే గొప్పగా కరుణ దుఃఖ రసాలనూ పోషించి మెప్పించారు .బిఎన్ రెడ్డిగారి మల్లీశ్వరిలో మల్లీశ్వరి తల్లి నాగమ్మ గా ,భానుమతిగారి విప్రనారాయణలో వేశ్య తల్లి శ్రీహరి గా ,మాయాబజార్ లో అభిమన్యుని తల్లి సుభద్రగా గొప్ప పాత్ర పోషణ చేశారు .అలాగే అగ్గిరాముడు ,కృష్ణ సత్య ,పాండు రంగ మహాత్మ్యం లో (లక్ష్మి)  మొదలైన 150 చిత్రాలలో వైవిధ్యభరిత పాత్రలలో నటించి రికార్డ్ సృష్టించారు .

 తన అసమాన నటనతో నాటకరంగానికి వెండి తెరకు విలువలు సాధించిన అసమాన నటీమణి,గాయని ఋష్యేంద్ర మణి 17-8-2002 న మద్రాస్ లో మరణించారు ..

  ఆమె సినిమాలో నటించే కాలానికి పాటలు పాడటానికి సాంకేతిక అభివృద్ధి జరగలేదు .అందుకని ఆ నాటి నటీ నటులు లాగానే తన పాత్రలకు పాటలు ఆమె పాడే వారు .ఆమెది గంభీరమైన స్వరం కంచు ఘంట మోగినట్లు ఉండేది .ఏభావమైనా ఆగొంతులో ఒదిగి బయటకు వచ్చి సమ్మోహితం చేసేది .కనుక గాయనిగా గొప్ప పేరు పొందారు .మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుని ఆశ్రమానికి రధంలో దారకుడు అభిమన్యుని సుభద్రను తీసుకు వెడుతుంటే రాక్షసమాయకు కొడుకు మూర్చిల్లితే ఋష్యేంద్ర మణి గారుపాడిన’’అఖిల రాక్షస మంత్ర తంత్ర అతిశయము నెనచు శ్రీ కృష్ణు సోదరి నగుదు నేని –దివ్య  శస్త్రాస్త్ర విద్యలతేజరిల్లు అనఘు అర్జునుపత్నినే యగుదు నేని –ఈ శరంబసురు గూల్చి సిద్ధి౦చుగాక –పాండవ కులలైక భూషణు ప్రాణ రక్ష ‘’  పద్యం ఇప్పటికీ చెవులలో రింగు మంటూనే ఉంటుంది .చంద్రహారం సినిమాలో –గౌరీ సవతితల్లి ,జాతకఫలం –రంగారావు భార్య ,సంఘం లో రత్నం , గంగాగౌరీ సంవాదం –రుద్రమ్మ ,దీపావళి లో అదితి,గులేబకావళిలో గుణవతి,ఆప్తమిత్రులో శాంతమ్మ ,శ్రీ కృష్ణార్జున యుద్ధం లో గయుని భార్య ,ఆడబ్రతుకు లో ఆయా ,శ్రీ కృష్ణావతారం లో కుంతీదేవి ,భాగ్య చక్రం లో విక్రం తల్లి ,సత్తెకాలపు సత్తెయ్యలో అమ్మమ్మ ,సిపాయి చిన్నయ్యలో బామ్మ ,సంపూర్ణ రామాయణం లో రావణుని తల్లి కైకసి ,గా నటించి వివిధపాత్రలు పోషించారు 1986 లో వచ్చిన శ్రీ షిర్డీ సాయి బాబా మహాత్మ్యం ఆమె చివరి సినిమా .

ఇంతకీ ఋష్యేంద్ర మణి అనే చక్కని మహిమాన్వితమైన పేరు ఆమెకు ఎవరు ఎలా ఎందుకు ఆలోచించి పెట్టారో తెలియదుకానీ చాలా అరుదైన పేరు .నాకు తెలిసిన దాన్ని బట్టి ఋష్య అంటే శ్రేష్టమైన  ఇంద్ర మణి అని అనుకొంటున్నాను .నవరసాల నటీమణి ఋష్యేంద్ర మణి.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

పాత బంగారం -3 3-సీతాకల్యాణం

పాత బంగారం -3 3-సీతాకల్యాణం


వేలు పిక్చర్స్ వారి సీతా కల్యాణం 1934లోనే వచ్చింది బాపు గారి కల్యాణం కంటే సుమారు 50ఏళ్ల ముందే వచ్చింది .ఇందులో విశ్వామిత్ర గా మాధవపెద్ది వెంకటరామయ్య ,దశరధుడు గా నెల్లూరు నాగరాజారావు ,శ్రీరాముడుగా మాస్టర్ కల్యాణి ,లక్ష్మణుడుగా నాగేశ్వరావు ,గౌతముడు గా మాస్టర్ సూరి బాబు ,జనకుడుగా గోవిందరాజుల వెంకటరామయ్య ,రావణుడు గా తీగెల వెంక టేశ్వర్లు,మారీచుడు కృత్తి వెంటి వెంకట సుబ్బారావు ,సుబాహు లంకా కృష్ణ కృష్ణమూర్తి ,కౌసల్య మిస్ శ్రీహరి ,కైకేయి మిస్ రామ తిలకం ,సుమిత్ర మిస్ కోకిలామణి,సీత మిస్ రాజారత్నం ,అహల్య మిస్ కమలాకుమారి నటించారు దర్శకుడు చిత్రపు నరసింహ మూర్తి .ఫోటోగ్రఫీ రామనాద్ ,పాటలు సంగీతం మాస్టర్ పెంచలయ్య  ,.కథమనకు తెలిసిందే .

పాటలు

1-ప్రార్ధన –  భక్త పోషిణేశక్తి ప్రదాయనే ముక్తి సంధాయనే –

            దీనావన పరాయణాయమధుర భాషి ణే-పారత్పరాయతే గుహాయ భవ్య కారి ణే-

ప్రణవ స్వరూపిణే ప్రేమైక దాయనే –నమోస్తు కార్తికేయ సుబ్రహ్మణ్య రూపి ణే

2-రావణ దర్బార్ లో నాట్యం –శివ దీక్షా పరురాలనురా –శీలలా మెంతైనా విడువ జాలనురా నే

  శివ శివ గురువాజ్ఞ మీరను రానే –వైష్ణవు డ౦టే  చేరనురా నే ‘’

2-కౌసల్య –సరస్వతి రాగం ఆది తాళం

‘’నిరాదరణ మేలా అంబ –వరాలొసగి పరిపాలింప వేలా

పరాత్పరివి నీవే యని మొరలిడ –పరాకేల పరమభక్త పోషిణి

సురాసురులకైన నీ మహిమ గన-తరంబే నిను పొగడ నెంతదానను

హరిహరాదులు నిను గొల్తురు గదా –బిరాన బ్రోవుము సరోజలోచని ‘’

3-శ్రీరాముడు –యమన్ కల్యాణి -త్రితాల్  –

‘’ప్రేమా మహిమమున్ తెలియగన తరమగునా జగతిన్

పరి  పూర్ణంబౌ ప్రకృతి గనగన్-పరమేస్శ్వారు లీలల నే మందున్ ?’’—

4-సీత –భ్యాగ్ రాగం –త్రితాల్

‘’చచెలియాపరిమెళ మిలిత సుమములచే –విలసితమౌ డోలిక

జలజాక్షుల కానంద భరితమై –యలరారు చుండేడు ఈ వనమున

అళికుల నినదములాటి మధురములై –సలలితములగు హృదయముల తరిమ్చున్

కిలకిల లాడెడు శుక పికరవములు –తరు శాఖలపై గుమి గూడేనుగా’’—

5-రాముడు –యమన్ జిల్లా –త్రితాల్

ఆరిజన విజయులమై అరుదెంతుము –సెలవొసగుము జనకా దయనుగని

పురహరాదులేతెంచిన వెరతుమే –కరమున కోదండమును ధరించిన

ధరపై శౌర్య సుధీరు లేవరన-దశరధ నందనులే యనవలె ‘’—

6-మారీచ సుబాహువులు –భూప –త్రితాల్

ప్రళయ కాల భైరవాకృతులమై –విలయంబుగా మునులన్ వధి యింతుము

త్రిభువనముల రావణ బ్రహ్మ యన –సేబాసను నటుల చేయగా వలదా

రక్త మాంస మలమూత్రనులతో యాగమంతమొనర్తుము

భక్తులమని విర్రవీగు మునులను –బడదోసి నోట రక్తము బోతము ‘’—

7-అహల్య –జోన్ పూరి –త్రితాల్

‘’సర్వేశ్వరా నను బ్రోవగ రారా-నిర్వికార గుణా నిర్గుణాత్మకా

పరబ్రహ్మ సచ్చిదానంద –పరమ పురుష పతిత పావన – పరంజ్యోతి స్వరూపుడ వీవే ‘’—

8-గౌతముడు –భీన్ పలాస్ –త్రితాల్

‘’రఘురామనామ స్మరణా మృత పానమే –కామిత ఫలదాయకమౌగా ‘’—

9-సీత –ఆఠణా-త్రితాల్

‘’శ్రీనాథా తరియిన్చితి నీ కృప చేతనే గాదా

సుకుమారకారా –సుకుమారకారున్ ధీరున్ కోరంగన్ –మదిగాలకోరిక దీరెన్ ‘’—

10-కైక –మిశ్రకాపి –త్రితాల్

‘’ప్రాణ నాథ ఏటి కిటులన్-చిన్త నొందన్ దగునా

గాథి నందను మహిమగనవా –ఖేదమేటికి నాథా ‘’—

11-మంగళం –యమన్ –త్రితాల్

‘’రామ జయతు జయరాజిత శ్యామా –అమరముని వినుత ఆశ్రిత వందిత

దాశరధే శుభదాయక నామా  -రఘుకులసోమా –రాక్షస భీమా –కమలనయన కరుణాకర శ్రీ రఘురామ ‘’

 ఇవన్నీ మచ్చుకి చూపాను .ఇవికాక ఇంకో పది పాటలున్నాయి .

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -13

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -13

13-పులకించని మది పులకింప జేసే గాయని -జిక్కి కృష్ణవేణి

తెలుగు పాటల తోటలో ఆమె ఒక కోకిల .అన్ని తరహా పాటలను ఎంతో వైవిధ్యం వైశిష్ట్యం తో  మంత్ర ముగ్ధుల్ని చేస్తూ మనోహరంగా ఆరు తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ సింహళం భాషలలో పాడి ఉర్రూతలూగించిన గాయని ఆమె పి.జిక్కి కృష్ణ వేణి .కానీ జిక్కి అంటే శృంగారం ,జానపదాలపాటలే గుర్తుకు వస్తాయి .3-11-1938 న చిత్తూరు జిల్లా చంద్రగిరిలోశ్రీ పిల్లవాలు  గజపతి నాయుడు ,రాజకా౦తమ్మ దంపతులకు కృష్ణ వేణి  జన్మించారు .ఇంట్లో అందరూ ముద్దుగా జిక్కి అని పిలవటం తో అదే అందరికి అలవాటయింది .

  1943లో వచ్చిన గూడవల్లి రామ బ్రహ్మం గారి పంతులమ్మ చిత్రం లో హీరోయిన్ లక్ష్మీ రాజ్యంగారికి శిష్యురాలిగా మొదట నటించారు జిక్కి .ఇందులో ‘’ఈ తీరున నన్నెరిగి పలుకగా నా తరమా జగదేకకారణ ‘’అనే పాటను కూడా పాడి గాయనిగా అరంగేట్రం చేశారు .తర్వాతమంగళ సూత్రం  పల్లె టూరి పిల్లగా నటించటమేకాదు ‘’అందగాడే బలే సోకోడే ‘’పాట కూడా పాడారు .ఆ తర్వాత నాగయ్య గారి త్యాగయ్య లో బొమ్మల పెళ్లి ఘట్టం లో పెళ్లి కొడుకు తల్లి వేషం వేసి ‘’రారే పిల్లల్లారా బొమ్మల పెళ్ళీ చేదాము ‘’పాట పాడారు కూడ .పిమ్మట గొల్లభామ సినిమాలో వేషమూ వేశారు పాటనూ పాడారు అందంగా బొద్దుగా చలాకీ గా ఉండటం చక్కని స్వరం ఉండటం తో ఆమెనే అవకాశాలు వెతుక్కొని వచ్చాయి .

  తర్వాత నటన కంటే పాటపై మోజు పెరగటం తో నటనకు స్వస్తి చెప్పి నేపధ్యగాయని గా స్థిర పడ్డారు .జిక్కి గాత్రం లో .జిగి బిగి పెరిగి ఆమెకు అనేక సినిమాలో పాడే అవకాశాలు కోకొల్లలుగా వచ్చాయి ,అనార్కలి సినిమాలో ‘’రాజ శేఖరా నీపై మోజు తీర లేదురా ‘’’’జీవితమే సఫలము ‘’,అర్ధాంగి చిత్రం లో ‘’వద్దురా కన్నయ్యా ‘’’’రాకరాక వ్చావు చందమామ ‘’గీతాలు మరచిపోలేనివి .తెలుగు డబ్బింగ్ సినిమా ‘’ప్రేమ లేఖలు ‘’లో ఏకాంతం సాయంతం ,’’పందిట్లో పెళ్లవుతున్నదీ’’,నీ పేరు విన్నా నీ రూపు కన్నా ‘’,ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సంగీతం ‘’పాటలు ఆకాలం లో పాడని యువతీ యువకులు లేరు ఆ గ్రామఫోన్ పాటలు వినిపించని పెండ్లి పందిళ్ళు ఉండేవికావు అంత పాప్యులర్ అయ్యాయి ఆమె స్వరంలో వాటికి ప్రాణం పోసి పాడారు జిక్కి .దొంగ రాముడు సినిమాలో పాడింది ఒక్కటే పాట’’అంద చందాల సొగసరి వాడు ‘’సావిత్రి నటన పెండ్యాల స్వర రచన జిక్కి గాత్రం ఏదో లోకాలో విహరింప జేసింది .పెంకి పెళ్ళాం చిత్రం లో కుర్రకారుకు కిక్కెక్కించే ఆరుద్ర పాట’’పడుచు దనం రైలు బండి పోతున్నదీ పడుచు వారిక౦దులో చోటున్నది ‘’ఒక ఊపు ఊపేసింది .

  పౌరాణిక చిత్రం చెంచు లక్ష్మి లో ‘’చెట్టు లెక్క గలవా ఓ నరహరి ‘’అని అక్కినేనిని ఆటపట్టిస్తూ అంజలి పాడే పాట,’’చిలకా గోరింక పలుకే పకాపకా ‘’గీతం జిక్కి గొంతులో అమృతపు సోనలే కురిపించాయి .అభిమానం సినిమాలో కృష్ణకుమారి తన వొదిన సావిత్రిని సరదాగా ఆటపట్టించే ‘’ఓహో బస్తీ దొరసాని ‘’ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు .ఇక సువర్ణ సుందరి సినిమాలో అంజలి అందాలు నటన ,జిక్కి గాత్రం త్రివేణీ సంగమమై ‘’పిలువకురా ,అలుగకురా ‘’పాటగా ప్రవహించింది ఆదినారాయణ రావు గారి సంగీతం దివి భువులను ఏకం చేసింది .ఇంతటి క్లాసికల్ సాంగ్ పాడిన జిక్కి రోజులు మారాయి సాంఘిక క్లాసిక్ లో ‘’ఏరు వాకా సాగారో రన్నో చిన్నన్నా’’పాట తో  సాంఘిక చైతన్యం కల్పించి అందరి నోటా పాడుకొనేట్లు చేసింది ఈ పాట వినిపించని పల్లె , పట్నం ఉండేవే కావు అంతటి ప్రభావం కలిగించింది .వేణు సంగీతం కొసరాజు రచన,జిక్కి గానం  పాటను  అమరం చేశాయి .ఇవన్నీ మచ్చు తునకలు మెచ్చు చెణుకులు అని శ్లాఘించారు శ్రీ టి.ఉడయవర్లు .

 నిజానికి జిక్కి ఎవరివద్దా సంగీతం నేర్చుకోకపోయినా వినికిడి వలన సంగీతం జ్ఞానం పొంది పండిత పామరులను ఆకర్షించే ట్లు తన గాత్రం తో పాడింది మెప్పించింది గుర్తింపు పొందింది .చదివింది రెండవ తరగతి అంటే ఆశ్చర్యపోతాం .తెలుగు చదవటం రాదు .ఏ పాటైనా, స్వరమైన నేర్చుకొని తిరుగు లేకుండా పాడటం ఆమె ప్రజ్ఞ.ఒక రోల్ మోడల్ .మరుపు అంటూ ఆమె జీవితం లో లేనే లేదు .రికార్డింగ్ కోసం పాత పాటలు ఎలాపాడారో ,సంగీత కచేరీలలోనూ అలానే అలవోకగా పాడేవారు .అదే జిక్కి ప్రత్యేకత .

  సువర్ణ సుందరి సినిమాలో అయిదు రాగాలలోఆదినారాయణ రావు గారు సముద్రాల సాహిత్యానికి చేసిన ‘’హాయి హాయిగా ఆమని సాగే ‘’ను హిందుస్తానీ ,కర్నాటక శాస్త్రీయ సంగీతం లో ఏ మాత్రమూ ప్రవేశం లేని జిక్కి పాడి స్వరదర్శకునితో సహా వీక్షకులను అవాక్కయేట్లు చేశారు .ఘంటసాల మాష్టారు జిక్కి పోటాటీగా గానం చేసి మనల్ని మధురోహలలో ముంచెత్తారు .అపూర్వంగా నిలిచి పోయిన క్లాసికల్ సాంగ్ అది .ఇదేపాటను హిందీ లతా మంగేష్కర్ ‘’కుహూ కుహూ కోయలియా ‘’ గా పాడారు .

   గాయనిగా జిక్కి బాగా దూసుకుపోతూ మాంచి డిమాండ్ గా ఉన్న కాలం లో శ్రీ మేముల మునిస్వామి రాజా అంటే ఎ.ఎం. రాజా చిత్ర రంగ ప్రవేశం చేసి ‘’మంత్రికుమారి ‘’చిత్రం లో జిక్కి తో యుగళ గీతం పాడారు.  ఎమ్జి ఆర్ కు రాజా ,మాధవీ దేవికి జిక్కి నేపధ్యగానం చేశారు .ఈపాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి .హిందీ లో వచ్చిన ప్రేమలేఖలు లో రాజకపూర్కు రాజా ,నర్గీస్ కు జిక్కి పాడారు .ఇవీ పిచ్చగా పాప్యులర్ అవటం తో రాజా ,జిక్కి జోడి హిట్ పెయిర్ అని పించుకొన్నది .దీన్ని నిజజీవితం లోనూ చేసుకోవాలనుకొని ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు .ఈ జంటకు నలుగురమ్మాయిలు ఇద్దరబ్బాయిలు .వీళ్ళందరి ఆలనాపాలనా కుటుంబ బాధ్యతా లతో జిక్కి నేపధ్యగానానికి దూరమయ్యారు .

1.      రాజా పెళ్ళికానుక మొదలైన సినిమాలకు సంగీత దర్శకులయ్యారు .దురదృష్టవశాత్తు రైలుప్రమాదం లో రాజా చనిపోయారు .పిల్లలు పెరగటం ఆర్ధికంగా కలిసి వస్తుందని జిక్కి మళ్ళీ తన గాత్ర మాధుర్యాన్ని తెలుగు ప్రజలకు చూపించారు .ఆదిత్య 369లో ‘’జాణవులే నెర జాణవులే కిలికి౦న్చి తాలలో జిక్కి పాట సూపర్ డూపర్ హిట్ కొట్టింది .ఆతర్వాత ఆరో ప్రాణం, నిన్నే పెళ్ళాడుతా ,ఆహ్వానం అమ్మకొడుకు ,మురారి సీతారామయ్యగారి మనవరాలు ,శ్రీ కృష్ణ పాండవీయంలో’’ఛాంగ్‌రే బంగారు రాజా ఛాంగ్ ఛాంగ్‌రె బంగారు రాజా మజ్జారే – పాటను సినారె రాయగా  హిడింబి కి పాడి చిరస్మరణీయం చేశారు

  మొత్తం మీద 10వేల పాటలకు పైగా పాడారు .సెకండ్ రన్ బాగా ఉంది అనుకొన్న సమయం లో జిక్కికి 2001లో బ్రెస్ట్ కేన్సర్ వ్యాధి వచ్చి ,తమిళనాడు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాలు అందించిన ఆర్ధిక సాయం తో ఆపరేషన్ చేయి౦చు కొని కేన్సర్ ను జయించి మామూలు మనిషయ్యారు .మద్రాస్ లో ఉంటూ దేశ విదేశాలలో సంగీత కచేరీలు చేస్తూ సినీసంగీతాభిమానుల మన్ననలు పొందారు ..

  మళ్ళీ కాలేయ కాన్సర్  పాలై జిక్కి16-8-2004న 66వ ఏట మరణించారు .

1.    సంపూర్ణ రామాయణ౦ లో సుశీలమ్మతో కలిసి

వానజల్లు కురిసింది లేరా లేరా ఒళ్ళు ఝల్లుఝల్లుంది రారా – పాడారు .లవ కుశ లో ‘’వల్లనోరి మామా నీ పిల్లని ‘’పాట ఘంటసాల ,రాణి ,రాఘవులు తో కలిసిపాడారు .బాటసారి లో ‘’కనులను దోచీ చేతి కందనీ ఎండమావులున్నాయ్ ‘’పాట వేణు స్వరపరచగా సముద్రాలరాయగా భానుమతి గారితో కలిసిపాడారు .ఎఎం రాజా మ్యూజిక్ డైరెక్షన్ లో పెళ్ళికానుక సినిమాలో ‘’పులకించనిమది పులకించు ‘’గానం తో సంమోహ పరచారు జిక్కి .అందులో రెండు చరణాలు -పులకించని మది పులకించు… వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు… మనసునే మరపించు గానం
పులకించని మది పులకించు… వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు… మనసునే మరపించు గానం
మనసునే మరపించు..

చరణం : 1
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చికూర్చును గానం
జీవమొసగును గానం మది చింతబాపును గానం

శాంతినివాసం లో ఘంటసాల డైరెక్షన్ లో –ఆశలు తీర్చవే ఓ జనని ఆడరమున్చావే జాలిగొని ‘’అంటూ ఆర్తిగా పాడారు .’’రాధ రావే రాణీ రావే రాధ నీవే కృష్ణుడు నేనే ‘’పాటలో ప్రేమ రసం ఒలకబోశారు

1959లో వచ్చిన కృష్ణ లీలలు ఆరుద్ర రాసిన –ఇంత చల్లని రేయి ఇంత చక్కని హాయి అంతయు తిలకించి ‘’పాటనుఅంత చల్లగా అంత చక్కగానూ పాడారు సుసర్లవారి సంగీత దర్శకత్వం లో .రాజమకుటం లో ‘’ఏటిఒడ్డునా మా వూరు ఎవ్వరు లేరు మా వారు ఏరు దాటి వచ్చారంటే ఎనక్కి పోలేరు ‘’పాటను అంత గడుసుగా గడుగ్గాయిగా పాడారు . రాజేశ్వరరావు గారు  సంగీతం కూర్చిన చెంచు లక్ష్మి సినిమాలో విష్ణువు లక్ష్మీ దేవి గార్లకు  ఆరుద్ర రాసిన యుగళగీతం –‘’ఆనందమాయే అలి నీల వేణీ,అరుదెంచినావా అందాల దేవి ‘’ పాటను ఘంటసాల మాస్టారి తో అంత ఉన్నతంగా పవిత్రంగా పాడి నిండు తనం తెచ్చారు .’’కానగారావా ఓ శ్రీహరి రావా ‘’లో ఆవేదన అంతా కురిపించారు .పాండు రంగ మహాత్మ్యం లో –‘’పెదవులరాగం ‘’పాట,’’సారంగధర లో –కలలు కరగిపోవునా ‘’,సాగెను బాలా ఈ సంధ్యవేళ ‘’పాటలు ,తోడికోడళ్ళు లో’’నీ సోకు చూడ రమణయ్యమావో ‘’అంటూ సూర్యకా౦తమ్మగారికి ,చిరంజీవులు లో –‘’తినే౦దుకున్నాయిరా ,కోనే౦దుకున్నాయిరా’’సరదాపాట ,భలే రాముడు లో ‘’నాడేమైన పచ్చబొట్టు పొడిపించుకోవా నే పొడవా మన్నావా ‘’,ఎన్దున్నావో మాధవా నందకుమారా కేశవా ‘’కొమలతో కోమలంగా ,రేచుక్కలో ‘’-ఆ సోగసేమో ఆ మనసేమో గారాము అది మారాము ‘’పాటను గారాముగా మారాములొలకబోస్తూ ,తోడు దొంగలు లో –‘’రాయేనా వయారం రాయే నా  వలపు దుమారం ‘’కొమలతో వయారం వలపు దుమారం రేపారు .బ్రతుకు తెరువు సినిమాలో –దారీ తెన్నూ కానగారానీ లోకానా ,వరదాయీ నీవే నిర్మల జ్యోతి ‘’అంటూ ఆర్తిగా ,’’వచ్చెనమ్మా వచ్చే ఉగాది పండగ వచ్చే ‘’సరోజినితో ఉగాది సరదా తీరేట్లు ,దేవదాసులో ‘’ఓ దేవాదా చదువూ ఇదేనా  ‘’ అంటూ ఎద్దేవా చేస్తూ ఘంటసాల గారితో ,పాతాళ భైరవిలో ‘’-‘’వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు ‘’పింగళి పాటకు ఘంటసాలగారితో వగలు కురిపించారు .షావుకారు లో –‘’వలపుల వలరాజా తామసమిక చాలురా ‘’పిఠాపురంగారితో,, విరహ వ్యధ మార్చు కథ తెలుపవే జాబిల్లీ ‘’అని ఆయనతోనే కలిసి విరహ గాథ వినిపించారు  .సంసారం సినిమాలో ‘’కలనిజమాయేగా కోరికా తీరెగా సాటి లేని రీతిగా మదినెంతొతో హాయిగా ‘’పాట సుసర్ల వారి సంగీతం లో 1950 దశకం అంతా ఊపేసింది యువతను .మనదేశం సినిమాలో ఎం ఎస్ రామారావు గారితోకలిసి సముద్రాలరాసిన –‘’ఏమిటో ఈ సంబంధం ఎందుకో ఈ అనుబంధం ‘’అలాగే ఘంటసాల తో –‘’కళ్ళ నిన్ను చూసినానే పిల్లా ఒళ్ళు ఝల్లన్నదే ‘’ను నిజంగానే ఒళ్ళు ఝల్లుమనేట్లు పాడారుజిక్కి. అలాగే ఘంటసాలగారితో ‘’జయజయనీ పరమ పావనీ జయజయ భారత జననీ ‘’దేశభక్తి తోనూ ,’’పంచదార వంటి పోలీ సెంకటసామి మరవలేనురా నిన్నూ మరవ లేనురా ‘’,మామా న౦దయ మామా  అందుకో నన్నందుకో ‘’ ఘంటసాలవారితో ‘’మాటా మర్మము నేర్చిన వారు ‘’పాట పాడారు కృష్ణవేణి జిక్కి .’’తకతక ఝనతా ,తకదిమి చిడతా ఎంట ఎంట తిరుగుతున్న జంట సోకు చూడరే ‘’అనే పాట భలే అమ్మాయిలు  సినిమాలో నందమూరి సావిత్రి లపై జిక్కి మనసు దోచేట్లు పాడారు .బాగా పాప్యులర్ అయిన సాంగ్ అది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-1-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

మోపూరు కాలభైరవుడు-2(చివరి భాగం )

మోపూరు కాలభైరవుడు-2(చివరి భాగం )
ప్రస్తుత క్రీడాభి రామం లో లేని ,పెద్దపాటి జగన్నాధకవి ప్రబంధ రత్నాకరం లో ఉన్న వల్లభ రాయుని వీధి నాటకం క్రీడాభి రామం లో ఉన్న పద్యాన్ని బట్టి మోపూరు కు పూర్వపు నామం ములికినాడు .ఇక్కడ మోహన శైలం ,మోహన గిరి ,మోహనాచలం ,మోపూరు తిప్ప ,మోపూరు కొండ అనే ఎత్తైన ప్రదేశం ఉంది .కొండమోపున మోపూరు గ్రామం ఉంది .అక్కడ కాలభైరవుడున్నాడు .
ఈ కాలభైరవుడు స్వయంభు .13అడుగుల ఎత్తు ,10అడుగుల వెడల్పు శిలా విగ్రహం దీని చుట్టూ దేవాలయ నిర్మాణం జరిగింది .ఎత్తైన విగ్రహం కనుకాలయాన్ని రెండు అంతస్తులుగా నిర్మించారు .స్వామి భూమి పుట్టినప్పుడు పుట్టాడుకనుక కాల నిర్ణయం లేదు .ఇక్కడే భస్మాసు రుడు మోహినీ అవతార విష్ణువు ను కామిస్తే స్నానం చేసి రమ్మంటే ,కిందున్న నదిలో స్నానంచేస్తూ పొరబాటున తనతలపై తానె హస్తం పెట్టుకొని భస్మమైపోయాడు .అందుకే మోహన గిరి అనిపేరు .
ఈ ప్రాంతాన్ని కాకతీయ ,విజయనగర రాజులు పాలించి నట్లు శాసనాలున్నాయి.ఇక్కడ శవ, కేశవ కుమారస్వామి మహిషాసుర మర్దిని విగ్రహాలు ఉండటం వలన సర్వమత సమాదర్శనమూ వర్ధిల్లింది .ఇక్కడ అయ్య పరసు అనే రాజు పాలించి నట్లు కవి గాయక నటులను ఆదరించినట్లు ,దేవ విద్వజ్జనులు ,రస సిద్ధులు,జ్ఞానులు ,ఋషులు ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడి యోగులే జోగులు పేరిట పీఠాధిపత్యం వహించేవారు .ఈ తంబళ్ళ వారు కూడా ఆలయాభి వృద్ధికి తోడ్పడ్డారు .ఈ ఆలయానికి రాజులు గ్రామాలు భూములు వరహాలు ,సువర్ణాభరణాలు దానమిచ్చినట్లు శాసనాలున్నాయి .వైశాఖ పౌర్ణమికి తిరుణాల జరుగుతుంది .
కొండపై ఒక చివర ఏటవాలుగా ఉన్న ప్రదేశం లో నిలువుగా ఉన్న గుండును చూసి ,ఏటవాలు ప్రదేశాన్ని చదును చేసి ,మట్టి కొట్టుకు పోకుండా రాతి కట్టడం కట్టి ,మళ్ళీ చదును చేసి రెండవ రాతి కట్టడం కట్టి దానిపై ఆలయ ప్రాకారం నిర్మించారు .నల్ల బండ రాళ్ళు ఎక్కువగా ఉండగా శ్రావణాలతో చీల్చి ప్రాకారం మధ్యలో ఆలయం కట్టారు .కొండ మోపున ఖాళీస్థలం లో మోపూరు అనే గ్రామం జోగులు అనే తంబళ్ళ పూజార్లకోసం ఏర్పరచారు .ఇక్కడే పూజారులు వాయిద్యకారులు నృత్యకారులు భటులు ఉండేవారు .అన్నికులాల వారు మోపూరు ఇంటిపేరుతో ఉన్నారు .ఈఊరు సుమారు 150ఏళ్ల క్రితం ఏర్పడింది .క్రమంగా రాజపోషణ ,ఆహార సదుపాయం లేక జనం వలస పోయినందున శిధిలంగా ఉంది .ఇప్పటికీ వెంకటయ్య తోటలు ,జోగొని తోటలు ,శాస్త్రాల తోటలు అని అక్కడి భూముల్ని పిలుస్తారు .
రెండు వేల ఏళ్లక్రితం ఉజ్జయిని విక్రమాదిత్య మహారాజు రాజ్య పతనం తర్వాత ,భోజమహారాజు సైన్యం తో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక జొన్న చేనులో మంచ పై ఒక పిల్ల కావలి కాస్తూ సైనుకులను జొన్న కంకులను కోసి ‘’పిసుకుల్ల’’ను తినమని చెప్పింది .వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తింటుంటే కిందికి వచ్చి తాము బీద వారమని చేను పాడు చేయద్దని బతిమాలగా వెళ్ళిపోయారు .మళ్ళీ మంచ ఎక్కి తినమని ఆహ్వానించింది .వాళ్ళు తింటుంటే మళ్ళీ పాతపాటే పాడగా భోజునకు విచిత్రమనిపించి ,ఆ మంచాకింద ఏదో మహాత్మ్యం ఉంటుందని త్రవ్విస్తే అక్కడ విక్రమార్కుని ద్వాత్రి౦శ సాల భంజికలసి౦హాసనం బయట పడింది .దాని దారానగరానికి తీసుకు వెళ్లి సింహాసనం ఎక్కుతుంటే ఒక్కో మెట్టు ఒక్కో కథ చెప్పిన సంగతి మనకు తెలుసు .
ఈమోహన శైలంలో మునులు తపస్వులు మహాత్ములు ఉన్నట్లు చెప్పుకొన్నాం వారు ఇప్పటికీ కొందరు పుణ్యాత్ములకు కనిపిస్తారని అంటారు .ఈ జోగులు మొదలైన వాళ్ళంతా కొండపైకి వెళ్లి నపుడు దేవాలయం అభి వృద్ధికిఏవెవొ చర్చించి కొండ దిగగానే మర్చే పోయేవారు. అందుకే ‘’మోపూరు జోగుల వాటం ‘’అనే సామెత పుట్టింది .మనం –‘’గుడిపూడి జ౦గాలలాగా’’అనేసాఎత వాడుతాం
ఆలయ నిర్మాణం
రస సిద్దులైన మునులు ఇక్కడి బండలను తాకితే అవి తేలికైపైకి ఎత్తటానికి వీలుగా ఉండి,ఆలయ నిర్మాణానికి తోడ్పడేవి .దీనికి ఉదాహరణ –లోపలి ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించే టప్పుడు ,దాన్ని పైకి లేపటానికి ఎంతోశ్రమపడాల్సి వచ్చినా లేవకపోతే ‘’జై భైరవా ‘’అని అందరూ భక్తిగా ,ఆర్తిగా గట్టిగా అంటే యిట్టె లేచి పీఠం లో కూర్చుందిట .గర్భ గుడి నిర్మాణం 2వేల ఏళ్లకు ముందే జరిగింది .శాలి వాహన శకం 1347 విశ్వావసు ఆశ్వయుజబహుళ అష్టమి నాడు విజయనగర వీర కుమార దేవరాయలు భ్రుత్యుడు కవితా మండలి గండ బిరుదాంకితుడు బొప్ప దేవుని విరూపన్న గారి కుమారుడు తిరుమల రాయడు తమ తల్లి తిమ్మాయమ్మ ,అక్కగారు నాగాయమ౦బా గారికోసం మోపూరు భైరవ దేవాలయ పశ్చిమ గోపురం కట్టించిన శాసనం ఉంది .ఇతడే కుమార కంపరాయలు .
1272నందన చైత్రం లో వీర శ్రీ సావణవొడయల పాలనలో తిప్పరాజు మోపూరు భైరవేశ్వరునిఅంగరంగ విభాగాలకు పులి వెందులలో సాగులో ఉన్న ముల్కినాటి భూమిలోని చెరువు కింద రెండవ మడి ధారా దత్తం చేశాడు .1231నందన మాఘ బహుళ సప్తమినాడు ముఖ మండపాన్ని బోగలదేవి బ్రహ్మ దేవుని మనవడు కట్టించాడు .1452లో వికృతి వైశాఖ శుద్ధ తదియ నాడు విజయనగర రాజు అచ్యుత దేవరాయలకాలం లో భారద్వాజస గోత్రీకులు ఆశ్వలాయన సూత్రం రుక్కు శాఖాధ్యాయులు రాయసం కొండ మరుసయ్య గారికుమారుడు అయ్యపరుసు గారు 235వరహాలు అందించినట్లు శాసనం ఉంది .
1466లో సదాశివరాయల కాలం లో తిమ్మయ దేవ రాజు నిత్యభోగాలకు రధోత్సవాలకు గండికోట భూములు దానం చేసినట్లు శాసనం ఉంది .
మోపూరు కొండ దిగువన పెద్ద ఏరు, చిన్న ఏరు ,ఉద్దండ వాగు కలిసి త్రివేణీ సంగమ౦గా మారి,అక్కడి నుంచి సంగమేశ్వరం చేరి శ్రీ గండి ఆంజనేయస్వామి దగ్గర ప్రవహించే పాపాఘ్ని నదిలోకలిసి ,తర్వాత కుందు ,పెన్నా చెయ్యేరు లతో కలిసిపోతుంది.

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-1-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పాతబంగారం -2 2-లవ కుశ

పాతబంగారం -2

2-లవ కుశ

‘’తెలుగులో మాట్లాడే ఫిలిం ‘’ అనే ప్రకటనతో సి.పుల్లయ్య గారు1934లో  తీసి డైరెక్ట్ చేసిన ‘’లవ కుశ ‘’లో శ్రీ పారుపల్లి సుబ్బారావు శ్రీ పారుపల్లి సత్యనారాయణ గారు ,శ్రీ భీమారావు మాస్టర్ మల్లెశ్వరావు ,మిస్ శ్రీ రంజని  నటించారు .ఆర్ సి ఏ యంత్రం చేత తయారు చేయబడింది .చమ్రియా టాకీస్ డిష్ట్రి బ్యూటర్స్ ద్వారా విడుదలైంది.కధ మనకు తెలిసిందే కనుక దాని జోలికి వెళ్ళటం లేదు .పాటలు ,పద్యాల విషయం లోకివెడదాం.

1-వశిష్టుడి పద్యం –

‘’ఎన్ని దోషములున్న నెంచక ఇంచుక –గుణములున్న మెచ్చి చే కొందు వనుచు –బాటించి పలికిన పలుకు  బ్రహ్మ వరంబు-గా ప్రతిష్టకు దెచ్చు ఘనుడ వనుచు

హీనుడైన సమాశ్రయించిన దమ్ముని –జూచిన చందాన జూతు వనుచు –గొల్చిన వారికి గూర్మి నా చంద్రార్క –ముగ సౌఖ్యములోసగి బ్రోతువనుచు

బరులు స్వజనులనక ప్రజలందర గన్న –ప్రజల లీల బ్రోచు ప్రభుడ వనుచు

నీ గుణంబు లెంచు నిఖిల లోకంబులు –రమ్య గుణ సముద్ర రామ భద్ర ‘’

2-శ్రీరాముడు

‘’రఘు రాజు నాదిగా రాజులౌ మమ్ముల –వర ప్రేమ గూర్పు భవ్యులార

ఏకొరంతయు లేక నే పాపమును లేక –ఘన రీతి వర్తించు ననఘులార

వనమున కే నేగ దనటచే నా వెంట –చను దెంచి నట్టియో సదయులార –మీ యనుగ్రహంముచే నీ యయోధ్య సుఖమ్ము –మీర చేరగ గంటి ధీరులార

మిమ్ము వంచించి మర్రి వృక్షమ్ము నీడ-పోయితిని నన్ను మన్నించి బ్రోవు డయ్య

భూరి యశులార సద్గుణా ధారులార – ధీరవ వరులార సాకేత పౌరులార’’

3-చాకలి వాడి పాట

‘’ఏటోలె  ఈ మురిపింత –చందమామా లాంటి చక్కని మొగము –నా కాసి దిప్పి మురియ రాదా –సరసముగా మురియరాదా’’

4-రాముడు సీత

సీత-‘’ముదమాయేగా నాథా –సదయాన్తరంగ నీ సరసన్ మమెలంగన్ –నాదథానవచీ కనుల కిమ్పౌ వనిన్  

రాముడు-వన చిత్రమున్ గనగా –ఘనమౌ ప్రమోదం బౌ-సురసాలముల గనుమా సఖియా –వర కీర శుకముల పరి భాషణముల్  -హృదయాను రాగంబౌ గాదె –ముదమాయగా మదిన్ ‘’

5-చాకలి ,ఈరి గాడి పాట

చాకలి –‘’ఎల్లేల్లె నంజా నీ వోటము నా కెరిక –నేదా బెంజాలి నంజా –సూరి గాడు నీ కాసి సూచిన చూపు నీకొల్లు –పులకరిమ్పులతో ఎత్తించే కైపు –నీ సైగలు నే సూడ లేదే  ఆ తోట వైపు ‘’

ఈరి –‘’అ పాటి సూపులకే వోపకపోతే –నీ చేపాటి కర్రకి తానోపగలదట్రా

లచ్చి –ఈ పాటి సూపులకే వోపకపోతే –నువ్వేపాటి మొగుడివిరో  రెంకయ్య బాబూ –నీ తాపు లిట్లు తి౦టదిరో  రెంకయ్యబాబూ

చాకలి –నువ్వోద్దె నాకింక తు౦టరీ గుంట-నిన్నోదిలేస్తే పోతాదే నా కీ తంటా ‘’

6=లక్ష్మణుడు

‘’ప్రభో ధర్మమా శ్రీరామ సుగుణ శీల యేరామా –సతిన్ సాధ్విన్ విధి కానన్ బనుప న్యాయమా రామా –‘’

7-సీత

‘’ఆహా ఏమి నా భాగ్యము స్వామి కరుణించెన్ నేటికి నా జన్మ తరియి౦చెన్ –మునిపత్నుల సంసేవ దొరికేన్ ,నా మనసునకానందముకలిగెన్ —‘’

8-వాల్మీకి

‘’సాహస మేల ఈ లీల జానకీ –వెత బడకేపతి సేవ భాగ్యమొదవు  -వినుత చరిత మాతా బేల తనమేలా –సుగుణో పేత స్థిరమా విచారము  

అరమర లేల నేనిలుచు నా శ్రమమునీది కాదె ?’’—

9-లవ కుశులు

‘’రామనామ  స్మరణామృత పానమే-తనివి తీర మనసార గ్రోలి ధన్యుడ నైతి ‘’

రఘురాము చరితము వినుమమ్మా ఇక –రాముని ,సీతారాముని దలచిన పాపము దొలగునుగా

ఖర దూష ణాదుల ఖండించెను గద –వాలిన్ కోలన్ గూలగ నేసెను రాముడు

ధర రావణు దునిమి దయ చెన్నారెను—‘’

10-రాముడు –రూపము మరువగానౌనా –జీవితం బెటోపావన చరితా –నీ వియోగము నే సహి౦తునా—‘’

11-సీత –‘’ఎట్టులనున్నవాడో మనుజేశుడు రామ విభుండు నక్కటా —‘’

12-ధరిత్రి

‘’నిరాదర మాయేనా నేటికి –భూమిజా కా ఈ బాములు గలిగే –రఘు కులేశా కరుణ లేదా –అనలపూతా యగుట లేదా

13-లవుడు

‘’దీరోత్తంసు డనేక వాహినులతో శత్రుఘ్ను౦ డు నీ ధారుణిన్-శూరుల్ గల్గిన ధైర్యలక్ష్మి హయ మాశు ప్రౌఢ మన్  బట్టుడీ’’—

14-శత్రుఘ్నుడు

‘’ఈ రీతి గా బల్కిన మీ నాలుకలు గోయన్ దగు నిపుడు –ఛీ దూరముగా జనుడు ‘’—

15-కుశుడు

‘’కడు౦ గడు పొగరు తలకేక్కేనా ఛీ దుష్టుడా –ఖలుడా ఖలుడా తులువా ‘’—

లవ కుశ –తురగము విడువముగా –‘’

16-లక్ష్మణ లవకుశులు

‘’తాటక మర్దించి తపసియాగము గాచే శ్రీ రాము నెరుగరే శిశువులార ?

‘’ఆడుదాని జంపినట్టి మీ రాముని నెరుగమే యత డొక్క వీరు డౌనే –‘’

ఇలా దెప్పుడు పద్యం వీర విజ్రు౦ భణగా  సాగుతుంది

17-శ్రీరాముడు .కుశుడు

‘’స్త్రీ ,బాలకుల జంప చెలగు పాప మటంచు పలికిరి గురువులో బాలులార

‘’తాటక జంపుచో నేటికి ఈ బుద్ధి కలుగక పోయెనో పలుకు మయ్య –‘’అని ఈ ఇద్దరూ వాది౦చు కొంటారు

‘’మీ తల్లి ఏ సాధ్వి మీరిచట నుండుట కేమి కారణమ్ము ?’’

‘’సర్వ లోకైక జనని మా తల్లి యిందు –చేరి యుండుట హేతువు చెప్పరాదు ‘’

18-మహిని మా తల్లి లోకైక మాతః యేని –ఆమె సత్కీర్తి జగముల నలరు నేని –జనని మాతల్లి సాధ్వి యేని –యితడు నీ అస్త్రమున మూర్చ నెనయుగాత’’

19-లవ,కుశులు

‘’ వర సరోజ లోచనా రామా –రఘుకులాబ్ధి  సురు చిర సోమా –రఘురామా పరంధామా అరి భీమా –ధరణిజా మనో౦బు జ కామా –సురవరాదభిరామా –దయ గనుమా మది గనుమా వరనామా ‘’

దాదాపు 30పాటలు పద్యాలున్న సినిమా ఇది .ముఖ్యమైనవి కథా సందర్భానికి తగినవే పేర్కొన్నాను .సంభాషణలు మొదలైనవన్నీ –శ్రీ రమణ మూర్తి రాశారు .

రాముడుగా శ్రీ పారుపల్లి సుబ్బారావు ,సీతగా శ్రీమతి శ్రీ రంజని ,లవుడుగా మాస్టర్ భీమారావు ,కుశుడుగా  మాస్టర్ మల్లేశ్వర .రావు లు నటించారు .ఈ చిత్త జల్లు పుల్లయ్యగారే 1963లొ వచ్చిన రామారావు ,అంజలి సీతారాములుగా నటించిన  లవకుశ కలర్ సినిమాకు డైరెక్టర్ .వారబ్బాయిసి ఎస్ రావు గారుకూడా డైరెక్షన్ లో సాయం చేశారు .

  సశేషం

మీ –గబ్బిట-దుర్గాప్రసాద్ -7-1-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మోపూరు కాలభైరవుడు-1

మోపూరు కాలభైరవుడు-1 అనే పుస్తకాన్ని తెలుగు పండిట్ విద్వాన్ రాయరే రచించి మోపూరు కాల భైరవ స్వామికే అంకితమిచ్చి ,2002లో ,జొన్నా ఈశ్వరయ్య వరలక్ష్మి దంపతుల బుజ్జి అనే సుబ్బ లక్ష్మి అకాలమరణానికి జ్ఞాపకార్ధంగా కడప జిల్లా పులివెందుల లోని మమత ఆఫ్ సెట్ ప్రింటర్స్ లో ప్రచురించారు .వెల 10రూపాయలు . సీస పద్యం లో కవి తన వంశాన్ని చెప్పారు .రామి రెడ్డి గంగంమలకు నారాయణుడుపుడితే ,ఈయనకు సూరమామ్బకు కొండ రెడ్డి పుట్టగా ,ఇతనికి సిద్ధమా౦బ చిన్న వీరా రెడ్డి కలుగగ ,ఈయనకు గంగమ్మకు మనకవి సంస్కృతాంధ్ర హి౦దీ విశారదుడు ,కర్షక కవి పండిత గాయకుడు రాయరె జన్మించాడు .అసలు పేరు రామి రెడ్డి యల్లారెడ్డి . ఈకవి తన హృదయ వేదనగా యల్లా రెడ్డి గాయాలు ,యల్లారెడ్డి సూక్తి ముక్తావళి ,అభినవాంధ్ర బిల్హ నీయం ,ఆధునికాంధ్ర మేఘ దూతం ,మోపూరు కాలభైరవుడు ,యల్లారెడ్డి రూపకాలు ,యల్లారెడ్డి గేయాలు నాటకాలు బుర్రకధలు ,పద్య ఖండికలు రాశాడు .తర్వాత మోపూరు కాలభైరవుడు గురంచి చెప్పారు . మోపూరు లేదుకాని మోపూరు కాలభైరవుడు కదలకుండా ఉన్నాడు .ప్రళయం వచ్చినా చెక్కు చెదరడు.కారణం స్వయంభు విగ్రహుడు ,.హరిహరాత్మజుడు భైరవుడు ప్రళయ జలాలలో మునిగిపోక నిలిచి ఉంటారు .కడప మండలం పులి వెందుల లో మురికినాట నల్ల చెరువు పల్లెకు అల్లంత దూరం లో మోహనగిరిపై మోపూరు లో తానుగా పుట్టి పెరిగిన దైవమైన దేవ దేవుడు కాలభైరవ స్వామి భక్తులపాలివాడు ,దర్శిస్తే చాలు ముక్తినిచ్చేవాడు కొలువై ఉన్నాడు అని సీస పద్యం లో కవి వర్ణించారు .కాలక్రమం లో అంతా మారి పట్టించుకొనే వారులేక సారాయి బట్టీల అడ్డా గా మారింది .స్వామికి పూజా పునస్కారాలు లేవు .అప్పుడు జోగి సుబ్బన్న అనే ఆయన కవి దగ్గరకు వచ్చి కాలభైరవుని ,స్థల మహాత్మ్యాన్ని సమాచారం ఉంటె ఇస్తే ప్రచారం చేస్తానన్నాడు .కవి ఇవ్వగా అతడు అలానే అని గుఱ్ఱము మీద తిరుగుతూ ప్రచారం చేసి డబ్బు సంపాదించగా కవి గారు దేవాలయాన్ని దేవుడినీ వదిలేసి ఇదేమి పని అని చీవాట్లుపెడితే ,తర్వాత దేవాలయం కోసం కొంత శ్రమించాడని కవి ఉవాచ .ఇక ఆలయ చరిత్ర స్వామి విశేషాలు రేపు తెలుసుకొందాం . సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ,జాతీయ విప్లవ వీరుడు –పృధ్వీ సింగ్ ఆజాద్

గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ,జాతీయ విప్లవ వీరుడు –పృధ్వీ సింగ్ ఆజాద్

పృథ్వీసింగ్ ఆజాద్ (1892–1989) భారత జాతీయ విప్లవ వీరుడు.[1] గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. ఇతడు స్వాతంత్ర్యానికి పూర్వం సెల్యులార్ జైల్‌తో సహా పలుచోట్ల అనేక సార్లు ఖైదు చేయబడ్డాడు.భారత ప్రభుత్వం స్వాతంత్ర్య పోరాటంలో ఇతని సేవకు గుర్తింపుగా 1977లో పద్మభూషణ్ పురస్కారంతో ఇతడిని సత్కరించింది.

జీవిత చరిత్ర
ఇతడు 1892 సెప్టెంబరు 15న పంజాబ్ రాష్ట్రం, మొహాలీ జిల్లాలోని లాల్రు అనే ఒక కుగ్రామంలో జన్మించాడు. ఇతడు రాజపుత్ర వంశంలో జన్మించినా దళితుల ఉన్నతి కోసం చాలా కృషి చేశాడు. ఇతడు పిన్న వయసులోనే జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1907-08లో బ్రిటీష్ ప్రభుత్వం లోకమాన్య తిలక్, ఖుదీరాం బోస్‌లను అరెస్టు చేయడం ఇతడిపై ప్రభావాన్ని చూపింది. ఇతడు 1912లో అమెరికా సందర్శించాడు. అక్కడ ఇతడు లాలా హర్ దయాళ్‌ను కలిసాడు. తరువాతి కాలంలో లాలా హర్ దయాళ్ భారతీయుల విముక్తి కోసం ఉత్తర అమెరికాలో గదర్ పార్టీ అనే మిలిటెంట్ సంస్థను ప్రారంభించాడు. పృథ్వీ సింగ్ ఆజాద్ ఆ పార్టీ వాణి ఐన హిందుస్తాన్ గదర్ అనే పత్రిక స్థాపనలో సహకరించాడు. ఇతడు 150 మంది సమరయోధులతో కలిసి తిరిగి భారతదేశానికి వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇతడిని 1914, డిసెంబర్ 7వ తేదీన పట్టి బంధించి 10 సంవత్సరాల కారాగరశిక్ష విధించి కలకత్తా, మద్రాసు, బళ్ళారి, సెల్యులార్ జైల్ వంటి అనేక చోట్ల నిర్భంధించింది.[3] ఇతడిని ఒక జైలు నుండి మరో జైలుకు తరలిస్తున్నప్పుడు కదిలే రైలు నుండి దూకి తప్పించుకుని పారిపోయాడు. తరువాత ఇతడు విప్లవ వీరుడు చంద్రశేఖర్ అజాద్ అనుయాయిగా మారాడు. అతడినుండి ఒక మౌసర్ తుపాకిని పొందాడు. ఒక కథనం ప్రకారం 1931, ఫిబ్రవరి 27న చంద్రశేఖర్ అజాద్‌ను ఆల్‌ఫ్రెడ్ పార్కులో బ్రిటీష్ సైనికులు చుట్టుముట్టినప్పుడు ఇతడు కూడా అక్కడే ఉన్నాడు. కానీ చంద్రశేఖర్ అజాద్ ఇతడిని తప్పించుకుని పారిపొమ్మని చెప్పి బ్రిటీషు వారితో పోరాడటం కొనసాగించాడు.[4] మరో కథనం ప్రకారం పై సంఘటనకు కొద్ది రోజుల ముందే ఇద్దరు అజాద్‌లూ ఆల్ప్రెడ్ పార్కులో కలుసుకున్నారు.[

భభగత్ సింగ్ కోరిక మేరకు చంద్రశేఖర్ అజాద్ ఇతడిని మరింత శిక్షణ కోసం రష్యా వెళ్ళమని సలహా ఇచ్చాడు.[5] ఇతడు రష్యా వెళ్ళి అక్కడ కొన్ని నెలలు ఉన్నాడు. ఇతడు రష్యాలో తన అనుభవాలను వివరిస్తూ “లెనిన్ కే దేశ్‌మే” అనే పుస్తకాన్ని రచించాడు. దీన్ని విజయ్ చౌహాన్ “పృథ్వీ సింగ్ ఆజాద్ ఇన్ లెనిన్స్ ల్యాండ్” అనే పేరుతో ఆంగ్లంలోనికి అనువదించాడు.[6] ఇతడు భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనేక మంది దేశనాయకులను కలుసుకున్నాడు. వారిలో మహాత్మా గాంధీ కూడా ఉన్నాడు. గాంధీ పిలుపు ఇచ్చిన జాతీయోద్యమంలో ఇతడు పాలుపంచుకున్నాడు. 1933 నుండి 1947 వరకు ఇతడు పలు పర్యాయాలు అరెస్ట్ అయ్యాడు. లాహోర్ కుట్రకేసులో ఇతనికి మరణశిక్ష విధించబడింది. తరువాత ఈ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి సెల్యులార్ జైలుకు తరలించారు.[7] భారత స్వాతంత్ర్యం తరువాత ఇతడు భారత రాజ్యాంగ పరిషత్తుకు సభ్యుడిగా పంజాబ్ తరఫున ఎన్నికైనాడు.[8] 1949లో భీంసేన్ సచార్ మంత్రివర్గంలో పంజాబ్ రాష్ట్రపు కార్మిక, స్థానిక స్వపరిపాలన శాఖల మంత్రిగా ఎన్నికైనాడు.[9] భారత ప్రభుత్వం ఇతడిని 1977లో మూడవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది.

ఇతడు 1989, మార్చి 5వ తేదీన తన 96వ యేట మరణించాడు. ఇతనిపై రెండు జీవితచరిత్రలు వెలువడ్డాయి. 1987లో భారతీయ విద్యాభవన్ “బాబా పృథ్వీసింగ్ ఆజాద్, ది లెజండరీ క్రూసేడర్” అనే పేరుతో ఒక గ్రంథాన్ని ప్రచురించింది.[10] 1990లో హర్యానా సాహిత్య అకాడమీ “క్రాంతిపథ్ కా పథిక్” పేరుతో మరొక గ్రంథాన్ని వెలువడింది.[11] న్యూఢిల్లీలోని “నెహ్రూ స్మారక మ్యూజియమ్&లైబ్రరీ”లో ఇతని జీవితానికి సంబంధించిన కొన్ని పత్రాలు “బాబా పృథ్వీసింగ్ ఆజాద్ పేపర్స్” పేరుతో భద్రపరచ బడినాయి.[12][13] ఇతని స్వగ్రామమైన లాల్రూలో ఇతని పేరుమీద “బాబా పృథ్వీ సింగ్ ఆజాద్ మెమోరియల్ హాస్పిటల్” ఏర్పాటు చేశారు.[14] ఇతని కుమార్తె “ప్రజ్ఞా కుమార్” పంజాబ్ విశ్వవిద్యాలయంలో ముఖ్య వైద్యాధికారిణిగా పనిచేస్తూ ఉంది.[1

ఆధారం –వీకీ పీడియా

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

పాత బంగారం -1 1-రామదాసు

అక్తర్ నవాజ్ దర్శకత్వం లో ఆర్ సి ఎ ఫోటోఫోన్ శబ్దగ్రాహక యంత్రం పై తయారు చేయబడి 1933లో విడుదలైన తెలుగు సినిమా’’ రామ దాసు ‘’శ్రీమాన్ బళ్ళారి ధర్మవర౦ రాజ గోపాలాచార్యుల నాటకం ఆధారం గా తీయడి౦దని,ఫోటో గ్రాఫర్ కృష్ణ గోపాల్ అనీ ,శబ్ద గ్రాహకులు ఆర్ సి విల్మన్ ,సిఎల్ నిగం అనీ ,రామదాసుగా శ్రీ ఆరణి సత్యనారాయణ ,కబీరు గా శ్రీ ఘంటసాల రాధా కృష్ణయ్య ,తానీషాగా శ్రీ నెల్లూరు నాగరాజారావు ,ధర్మకర్త శ్రీ కే శ్రీనివాసాచారి ,ఆహమక్ గా శ్రీ వెంకట సుబ్బయ్య ,రాముడుగా శ్రీ ఘంటసాల శేషయ్య ,లక్ష్మణుడుగా శ్రీ ఎం.ఎస్.రంగారావు కమలా౦బగా శ్రీమతి సరస్వతి, సితారా బేగం గా శ్రీమతి రామ్ పాప నటించారని నాకు ఇప్పటిదాకా తెలీదు ఇప్పుడే తెలిసి మీతో పంచుకొంటున్నాను. అందుకే దీన్ని ‘’పాతబంగారం’’ అన్నాను .కథ మనకు తెలిసిన భక్త రామదాసు అనే కంచర్ల గోపన్న గారి పాత కథే ,కనుక ఆ వివరం లోకి వెళ్ళటం లేదు .కానీ ఇందులోని కొన్ని కొత్త విషయాలు మాత్రం చెబుతాను .

 మహమ్మదీయ మతస్తుడు సూఫీ సిద్ధాంతకర్త  భక్తకబీర్ భద్రాద్రి శ్రీరామనవమి ఉత్సవాలు చూడటానికి హరి భక్తులతోకలిసి వెళ్ళాడు .ధర్మకర్త మొదలైన వారు నవమి ఉత్సవం జరుపుతుంటే ,మనసును శ్రీరామునిపై లగ్నం చేసి కబీర్ పాటపాడుకొంటూ కొండ శిఖరం చేరతాడు .కబీరు పాటవిన్న ధర్మకర్త ముస్లిం హిందూ దేవుడి పేరు ఉచ్చరించటానికి అనర్హుడని ,దేవాలయ ప్రవేశానికి అడ్డు చెప్పాడు .కబీరు ఏకాగ్ర చిత్తం తో రాముడినే ధ్యానిస్తున్నాడు .ఆయనను, అను చరులను గెంటి వేసే ప్రయత్నం చేశారు గోపన్న గారు అడ్డు పడి,ఆయన మహా భక్తుడని చెప్పి ‘’నేను కబీరు గారి దగ్గరే ఉంటాను .మీరు వెళ్లి ఉత్సవం చేసుకోండి ‘’అన్నాడు .కబీరు వద్ద రామ తారక మంత్రోపదేశం పొంది శిష్యుడయ్యాడు .కబీరు కొండ దిగి వెడుతుండగా ,శిఖరం పై ఉన్న ధర్మకర్త పూజారులకు సీతారామ లక్షణ విగ్రహాలు కనపడక గగ్గోలు పడుతుంటే ,గోపన్న గారి హితవుతో ఆ విగ్రహాలు ధర్మకర్త మొండివైఖరికి కినిసి కబీరు హృదయం లో లీనమవటం గమనించారు .అందరు వచ్చి కబీరు పాదాలపై పడి క్షమాపణ కోరితే ,ఆయన అనుగ్రహం తో విగ్రహాలు మళ్ళీ యధా స్థానం చేరాయి.

  భద్రాద్రి తాసీల్దార్ గా తానీషా చే నియమింపబడి గోపన్న భద్రాద్రి రాగా ,అక్కడి జనం తప్పతాగి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించటం చూసి ,సురాపానం పాపమని బోధించి మంచి మార్గం లో పెట్టి భద్రగిరిపై రామాలయం నిర్మించే ప్రయత్న౦ లో వారి సహాయ సహకారాలు పొందాడు .మిగతా దంతా మనకు తెలిసిందే .

కొన్ని పాటలు రుచి చూద్దాం –1-కమలాంబ మాండ్ రాగం ఆది తాళం లో పాడిన పాట-శ్రీ రమణ మృదు చరణ-స్మరమణా-పరమ పురుష శ్రీరామ –శ్రీ –

2-కాఫీ రాగం ఆది తాళం లో బ్రాహ్మణులు-‘’దానవ మర్దన దశరధ నందన –తామస భంజన ధర్మ గుణా-

తాప విదారణ తత్వ సిచారణ తాపస జనస్తుతి పారాయణా-జానకీ నాయక ,సత్య విధాయక ,జ్ఞాన ప్రదీపక ,శ్రీపదకా-సజ్జన రక్షక ,సౌఖ్య ప్రదాయక ,సామజ పతి పరిపాలకా .’’   

3-శంకరాభరణ రాగం లో రామదాసు –‘’భద్రాద్రి రఘురాము భజనకు జను చుండ –బంధు మిత్రుల యాజ్ఞ బడయ నేల ?

జీవాత్మ భరియింప శ్రీ వత్స ధరు డుండ –దనువుపై మనకి౦త తమక మేల?

హరినామకీర్త నాహార పానము లుండ –నాకలి దప్పుల కడల నేల ?

సాయుజ్యమును జెందసాధన తతులుండ-సంసార వహ్నిలో సమయ నేల ?

భక్తీ మీర కీర్తింపు డీ భద్ర వాసు –జేతులర బూజింపుడీశ్రీనివాసు

జిత్తమార సేవింపు డీ చిద్విలాసు –రాణ యోప్పార జేయుడీ రామ భజన ‘’

4-శంకరాభరణం ఆది తాళం లో అందరూ –

‘’రామరామ రఘురామ పరాత్పర –రావణ సంహార రణ ధీరా – రధాంగధరఘన పత౦గ వాహన – రమారమణ నారాయణ

సార శీలసురలోల నిరంజన ,సత్వ పరాయణసువిధానా –  సరొజ లోల నిరంజన –సత్వ పరాయణసువిధానా – సరోజ లోచన సురేశపాలన,శరణ్య ముని బృందావనా ‘’

5-నాదనామ క్రియరాగం –మిశ్ర చాపు తాళం లో రెడ్లు పాడిన పాట

‘’స్వామి సేవ  చేయబోదము  -నేడు సీతారాముల సేవ చేయ బోదము  

ఐదు జోళ్ళ తలల వాని –నట్టే నేల గూల్చె నన్న –ఆది మూర్తి బ్రహ్మమన్నా –అందమైన దేవుడన్నా —-

6-దాసరి పాట

‘’ఏడుకొండల వాడ వెంకట రమణ –ఏడు కొండలమధ్య వెలగరా గురుడా అమ్మబోసిన నూనె అయ్యకర్పితము –అయ్య బోసిన నూనె అమ్మ కర్పితము

శ్రీరంగం మన ఓబుళం ఓబుళం

నీ ప్రాదములు గంటిరారామ నీ ప్రాదములు గంటిరా –కుడి భోగమున సీత ఎడమ భోగమున రామ –వైభోగమున లక్ష్మణా —-

7-హిందూ స్థానీ సురట రాగం లోకబీరు

‘’కహో కాతిర్సే హృదయం రాం రాం రాం –నహీ రహీన్గే కాయం జహాన్ మే హం ‘’—

8-భీం పలాస్ ఆదితాళం లో కబీరు

‘’అఖల్ తేరి హుఈ గుంగురు యారో –కాహేకో గడబిడ కర్తా హై బాబా ‘’—

‘’9-కబీరు- ‘’మై గులాం మై గులాం మై గులాం తేరా –మై గులాం తేరా తూ హై సాహెబా మేరా ‘’—

10-కబీరు

‘’దర్శన్ దేవ్ రామా –తేరే సాథ్  హైహం –దాశరధే తేరా చరణకమలకే –జానకీ నాధా దయా కరో హం పర్-మనో హమారా భజన్ –‘’

11-యాద్ కరో అల్లా అల్లా యాద్ కరో  అల్లా యాద కరో తుమే –ధ్యాన కరో జపాకరో రే –రాం రహీం కా భేద న పాయా –దోరోజీ కీ దునియా ఝూటీ హై’’—

12-వరాలిరాగం ఆదితాళం  రామదాసు

‘’ఏడనున్నాడో భద్రాద్రి వాసు డేడనున్నాడో –నా పాలి రాము డేడ నున్నాడో—‘’

13-ధన్యాసి రాగం లో దాసు –‘’నాకున్ లేదొకగవ్వ నిధి –యా సీతామనో నాధుడే

14-శ్రీ రాగం లో దాసు-‘’ యమపాశంబును ఖండ ఖండములుగా  నామూల భిన్నంబులుగా –సమయం జేయుచు దివ్య మోక్ష పదవిన్ సంధింప గల్ప ద్రువై

విమలంబౌ రఘునామ నామము మదిన్ వేడ్కార నే వేళయున్-తమకం బేచిభజించు వారి తను వీ త్రాళ్లి౦క బంధించునా ‘’

15- జల్సా పాట-‘’వహ్వా సారాయి  వడుపైన సారాయి –బువ్వోద్దుపెదబాబు బుడ్డి ఏక్ రూపాయ్ –సప్త సముద్రాలు సారాయికావాల –పిల్లకాల్వలన్ని కల్లునీళ్ళు కావాల-దీన్కి తాగి చూడు –దీన్కి మజా చూడు –దీన్కి తాగితే బలే హుశారి కల్గుతాది

16-నాదనామ క్రియ ఆదితాళం –

ఏ తీరున నను దయ బ్రోచెదవో ిన వంశోత్తమ రామా —

17-కాంభోజి ఆదితాళం –‘’ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా బలుకవె రామ చంద్రా –‘’

18-జయతు జయతు మంత్రం –జన్మ సాఫల్యమంత్రం –జనన మరణ భీతి కలేశ  ‘’విచ్ఛేదమంత్రం –సకల నిగమమంత్రం సర్వ శాస్త్రైక మంత్రం –రఘుపతి నిజమంత్రం –రామరామేతి మంత్రం ‘’

 మొత్తం మీద 24 పద్యాలు, పాటలు ఉన్నఅడుగడుగునా భక్తీ చిప్పిలే  భక్తి ప్రధాన చిత్రం పాతబంగారం ‘’రామదాసు ‘’.

  నటీ నటులు మనకు తెలీదు ,ఎలా చేశారో కూడామనకు తెలియదు .అయినా అన్ని హంగులు ఉన్నట్లు కనబడుతోంది .

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-22-ఉయ్యూరు  

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -12

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -12 12-‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా మరియు అంచెలంచెలు లేని మోక్షము’’ ఫేం-స౦గీత దర్శకులు,కవి శ్రీ బి. గోపాలం శ్రీ వేములపల్లి శ్రీ కృష్ణ రచించిన ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా –గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’పాటనుస్వరపరచి దేశమంతటా విస్తృతంగా పర్యటించి గానం చేసి ,మహా ఉత్సాహాన్ని నింపిన సంగీత జ్ఞుడు శ్రీ బి గోపాలం అంటే బొడ్డు గోపాలం .ఇంతటి ఉత్తేజకరమైన పాటను పాడిన ఈ గాయకుడే శ్రీ కృష్ణార్జున యుద్ధం సినిమాలో చినముని అయిన అల్లు రామలింగయ్యకు ‘’ అంచెలంచెలు లేని మోక్షము’’ చాలకష్టమే భామినీ ‘’పాటపాడారంటే ఆశ్చర్యమేస్తుంది .గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామం లో 1927జనవరిలో శ్రీ బొడ్డురామదాసు దంపతులకు గోపాలం జన్మించారు తండ్రి సంగీత కళాకారుడు. హరికధలు చెప్పేవారు .ఆ జీన్స్ ఉన్న గోపాలం గారికి చిన్నప్పటి నుంచి సంగీతం పై మక్కువ ఉండటం గుర్తించిన తండ్రి బెజవాడలో సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు వారణాసి బ్రహ్మయ్య గారి వద్ద 1939లో చేర్చారు .గాత్రం తో పాటు వయోలిన్ కూడా నేర్చి నిష్ణాతులయ్యారు 1944లో గుంటూరు జిల్లా ప్రజా నాట్యమండలితో గోపాలం గారికి మంచి పరిచయం ఏర్పడింది .ఆ నాటి రాజకీయ ,సాంఘిక పరిస్థితులపై గొప్ప అవగాహన కల గోపాలం గారు పీడిత జనులపక్షాన నిలిచారు .ప్రజా నాట్యమండలిలో శ్రీ వేములపల్లి శ్రీ కృష్ణ ,బుర్రకథ వీరుడు షేక్ నాజర్, వేపూరి రామకోటి మొదలైన అభ్యుదయభావాలు కలవారితో గాఢ పరిచయమేర్పడింది .శ్రీ కృష్ణగారిని తెలుగు సంస్కృతిని ప్రతి బి౦బి౦ప జ ఒక పాట రాయమని గోపాలం గారు అడిగితె ఆవిర్భవించిన పాటే-చేయెత్తి జైకొట్టు తెలుగోడా ‘’. దీనికి గోపాలం గారే స్వరపరచి పాడారు .ఆనాటి ప్రజా నాట్యమండలి కార్యక్రమాలలో నాజర్ బుర్ర కథ,గోపాలంగారి ఈ పాట గొప్ప ఉత్తేజాన్ని కలిగించేవి .పూర్తిపాట ఇలా ఉంటుంది – చెయ్యేతి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తీ గలవోడా వీర రక్తపుదార వార వోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ తాండ్రపాపయ్య కూడ నీవోడోయ్ నాయకినాగమ్మ మల్లమాంబ మొల్ల మగువ మంచాల నీ తోడ బుట్టిన వోళ్ళే వీర వనితల కన్న తల్లేరా ధీరమాతల కన్నభూమేరా కల్లోల గౌతమీ వెల్లువలా కృష్ణమ్మ తుంగభద్రాతల్లి పొంగిపారిన చాలు ధాన్యరాశుల పండు దేశాన కూడు గుడ్డకు కొదువలేదోయి ముక్కోటి బలగామొక్కటై మనముంటే ఇరుగు పొరుగూలోనా ఊరుపేరుంటాది తల్లిఒకటే నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా పెనుగాలి వీచిందీ అణగారిపోయింది నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది చుక్కాని బట్టారా తెలుగోడా ..నావ దరి చేర్చరా మొనగోడ అలాగే శ్రీ పులుపుల వెంకట శివయ్యగారి ‘’పలనాడు వెల లేని మాగాణిరా ‘’పాటనుకూడా గోపాలం గారే స్వరం కట్టి పాడేవారు ఈ రెండు పాటలతో అటు రాసిన వారికీ వీరికీ గొప్ప పేరొచ్చింది . శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్య మిదెబ్రాహ్మ్య మిదెక్షాత్రమన్న గర్జా ఘోష పులకలే యెత్తించెరా పలనాట పౌరుషమ్మే పొంగెరా! తొలిసంజ దీక్షతో తెలుగు శిల్పుల చేతి పోగరలు మలచిన బుద్ధయుగ జీవితము నవశిల్ప రతనంబురా ,పలనాట నాగార్జునుడి కొండరా! బౌద్ధనాగార్జునిని బుద్ధవిజ్ఞాజ్యోతి వరమహా యానమై వసుమతిని ప్రవహింప హెచ్చుతగ్గులు సమసెరా పలనాట విజ్ఞాన ప్రభ వెలిగెరా! వర్ణధర్మాలన్న ఉక్కుచట్రము పగిలి మాల కన్నమదాసు మనసైన సుతుడుగా వీరవైష్ణవ మొచ్చెరా, పలనాట బ్రహ్మన్న కలిగీతలో! మగువ నాగమ్మతో మాయ యుద్ధము వచ్చి మగువ మాంచాల తా మగని రణమున కంప వీరవనితలు పుట్టిరీ ,పలనాట శౌర్యముగ్గులు పెట్టిరీ! బాలచంద్రుని కత్తి పదును మెరపులు మెరసి తరలి కారంపూడి ధర్మరణరంగాన వీరరక్తము చిందెరా,పలనాట నాగులేరై పారెరా! బాలచంద్రుని కదన కౌశలము కధలల్లి శ్రీనాధ కవిరాజు చంద్రవంకకు చెప్ప ఎదకరిగి ప్రవహించెరా ,పలనాట ఎత్తిపోతల దూకెరా! కృష్ణరాయల సభా కవిదిగ్గజాలలో ఘటికాశతగ్రంధ కరణధుర్యుండైన భట్టుమూర్తే వెలసెరా, పలనాట ప్రౌఢ శ్లేషలు పల్కెరా! కలిమి బలిమీ గల్గు కర్షకుల సీమలో కానికాలం వచ్చి కలహములు చెలరేగ కుంఫిణీ వాడొచ్చెరా, పలనాట ఖైదుకొట్టులు కట్టెరా! దాస్యమూ దోపిడీ దారిద్ర్యమూ హెచ్చి పాడిపంటల మేలి బంగారు నాతల్లి కరువుకాటకమొచ్చెరా, పలనాడు కంటనీరెట్టిందిరా! ఒక్క సుముహూర్తాన ఉప్పొంగి భరతోర్వి స్వాతంత్ర్య సమరాన సింహనాదం సేయ మేరువైనిలచిందిరా, పలనాడు ముందుండిపోరిందిరా! కన్నెగంటి హనుమంతు కోరమీసము త్రిప్పి పలనాటి ప్రజలచే పన్నులెగబెట్టించె బలియిచ్చె హనుమంతునూ, పలనాడు పరప్రభుత్వపు గుండ్లకూ! ఆనాటి పౌరుషాలానాటి విక్రమా లానాటి వైభవాలానాటి సంస్కృతుల్ ఈనాటికీ చరితలోనా, పలనాడు వెలయించె బంగారుతో! వెనుకతరములవారి వీరచరితల సిరులు నార్వోసి త్యాగంబు నీర్వెట్టి పెంచరా ! విరిసి సుఖములు పండురా, పలనాడు వెలలేని మాగాణిరా! రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో హిట్లర్ కీ అతడి నాజీ సైన్యానికి వ్యతిరేకంగా సోవియట్ ఎర్ర సైన్యానికి విజయం కలగాలని గోపాలం పాటలు రాసి పాడి ప్రచారం చేశారు –‘’స్టాలినో నీ ఎర్ర సైన్యం –ఫాసిజం వినాశ సైన్యం ‘’అనే ఆపాట విపరీతంగా జనాదరణ పొంది ఫాసిజం కు వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసి పడింది .హిందీ సినీ గాయక పితామహ సైగల్ మరణానికి చలించి గోపాలం రాసి పాడిన పాట కూడా బాగా ప్రాచుర్యం పొందింది .జిల్లా స్థాయి నుంచి వీరిపేరు రాష్ట్రస్తాయికి ఎదిగింది ప్రభుత్వ నిర్బందాలవల్ల ప్రజానాట్య మాండాలి కార్యక్రమాలు తెరమరుగయ్యాయి . వెంటనే విజయవాడ ఆకాశ వాణి కి దగ్గరై ,నండూరి వారి ఎంకి –నాయుడు బావ ,భక్తరామదాసు వంటి వాటితోపాటు దేవులపల్లి, విశ్వనాథ గార్ల సంగీత రూపకాలు ,గేయాలు ఆలపించి ప్రసిద్ధులయ్యారు .రేడియో కేంద్రం లోని గాయని రేణుక గారితో పరిచయమై వివాహం చేసుకొన్నారు . ప్రముఖ సినీ దర్శకులు శ్రీ తాతినేని ప్రకాశరావు గారి పిలుపు నందుకొని మద్రాస్ వెళ్లి 1952జనవరిలో ఘంట సాల వారి వద్ద సహాయకులుగా చేరారు .పల్లెటూరు ,బతుకు తెరువు,పరోపకారం సినిమాలకు సహాయమందించారు .మరో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ టివి రాజు గారి వద్ద తోడు దొంగలు జయ సింహ ,నిరుపేదలు సినిమాలకు పని చేశారు .ఈ మూడేళ్ళ సినీ అనుభవంతో గోపాలం గారు సంగీత దర్శకులయ్యారు .నలదమయంతి చిత్రానికి సంగీతః౦ కూర్చారు . ఆతర్వాత రక్తకన్నీరు నాగభూషణం గారి రక్తకన్నీరు ,కలికాలం ,పాపం పండింది ,నాటకాల రాయుడు నాటకాలకు సంగీతం అందించారు .మరో ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారితో కలిసి రంగుల రాట్నం హిందీ ,కన్నడ తమిళ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు .వీటిలో కొన్నిటికి నేపధ్యగానమూ అందించారు .1972-84 కాలం లో పన్నెండేళ్ళు నాట్యాచార్య శ్రీ వెంపటి చిన సత్యం గారి ఆధ్వర్యం లో శ్రీనివాస కల్యాణం ,రుక్మిణీ కల్యాణం ,పారిజాతాపహరణం మొదలైన నృత్య రూపకాలకు సంగీతం ,నేపధ్యగానం అందించి దేశ విదేశాలలో పర్యటించారు . బికారిరాముడు ,నలదమయంతి సినిమాలతర్వాత కొన్ని కన్నడ సినిమాలకు మ్యూజిక్ కూర్చారు .మధ్యమధ్యలో డబ్బింగ్ సినిమాలూ చేశారు .ఆయన చేసిన ముఖ్యమైన తెలుగు సినిమాలు –అప్పగింతలు ,రౌడీ రంగడు ,పెద్దలుమారాలి ,మునసబు గారి అల్లుడు ,పుణ్య భూమీ కళ్ళు తెరు ,ఒక అమ్మాయి కథ ,కరుణామయుడు మొదలైనవి గోపాలం గారి భార్య రేణుకగారు 1982 డిసెంబర్ లో మరణించటం తో తీవ్ర దిగ్భ్రాంతి,,మానసిక అశాంతికి లోనయ్యారు .సంతానం కూడా లేక పోవటం తో జీవితం వెలితిగా తోచింది .నిరాడంబరం కల నిగర్వి అహంకారం శూన్యులు గోపాలంగారు .ఎవర్నీ విమర్శించే వారు కాదు అందర్నీ చక్కని చిరునవ్వుతో పలకరించటం వీరి నైజం .అసూయ ద్వేషం లేని మనస్తత్వం .దీనికి తగ్గట్టే తెల్లని దుస్తులు ధరించి వ్యక్తిత్వాన్ని చూపేవారు .గోపాలంగారి మరో ప్రత్యేకత ఏమిటంటే ఫిడేలు వాయిస్తూ సునాయాసంగా పాడటం .ఇదో అరుదైన విషయం .శాస్త్రీయ సంగీత నేపధ్యం లో అపారమైన గానమాదుర్యంతో ఫిడేలు వాయిస్తూ ,అద్భుతంగా గానం చేసి శ్రోతలను ఉర్రూతలూగిస్తూ మై మరపించే వారు . 1943లో బెజవాడ లో జరిగిన అఖిల భారత రైతు మహా సభలలో ఫిడేలు వాయిస్తూ ,’’స్టాలినో నీ ఎర్ర సైన్యం ‘’పాటను ఎంతో ఉద్రేకంగా పాడి ,లక్షలాది జనాన్ని ఉత్తేజితులను చేసి హర్ష ధ్వానాలు అందుకొన్నారు .తెలంగాణా పోరాట ఉద్యమకాలం లో ‘’ఖబడ్దార్ –ఖబడ్దార్ –నైజాం పాదుషా ‘’గీతం పాడి ప్రజలను ఉద్రేక ఉత్సాహ పూరితులను చేశారు .ముందే చెప్పినట్లు ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా ,పలనాడు వెలలేని మాగాణి రా’’ గీతాలు గోపాలంగారి బాణీలకు తిరుగులేని సాఖ్యాలు మర్చిపోలేని తీపి గుర్తులు . శ్రీ బిఎన్ రెడ్డి గారి దర్శకత్వం లో వచ్చిన ‘’రంగుల రాట్నం ‘’చిత్రం లో రసాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం లో దాశరధి రాసిన ‘’నడి రేయి యే జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో –తిరుమల శిఖరాలు దిగివచ్చునో ??పాట శ్రీ విజయ చందర్ కరుణా మయుడు సినిమాలో పాటలు గోపాలంగారి సంగీత సామర్ధ్యానికి గీటు రాళ్ళు .ఆస్తిపరులు ఇల్లాలు ,,శ్రీ దేవి ,పూలరంగడు సినిమాలో పాడారు .రంగుల రాట్నం సినిమాలో’’ వెన్నెల రేయి చందమామ వెచ్చ గా ఉన్నది మామ మనాసేదోలా గున్నది నాకేదోలాగా ఉన్నది’’పాటను శ్రీమతి జానకిగారితో కలిసి శ్రీ చంద్రమోహన్ కు పాడారు . మాధవ పెద్దిగారితో తకలిసి ‘’దేశభక్తులం మేమండీ-దేహి అంటూ’’ ‘’పాటనుకూడా పాడారు .బిఎన్ రెడ్డిగారికి రాజేశ్వరరావు గారే సంగీత దర్శకులుగా ఉండాలి .’’ ఆయన ఎప్పుడొస్తారో తెలీదు ఎప్పుడు రారో తెలీదు అందుకని ఒక అనుభావజ్ఞుడిని ఐడియాకోసం పెట్టుకొనే వాడిని ‘’ అని రెడ్డి గారే చెప్పారు .మల్లీశ్వరికి శ్రీ అద్దేపల్లి రామారావు ,రంగులరాట్నం ,బంగారు పంజరం సినిమాలకు శ్రీ బి గోపాలం గార్లను పెట్టుకొన్నారు .గోపాలం గారు గాయకులుగా సంగీత దర్శకులుగా నిలద్రొక్కుకున్నా ,చొరవ లేనికారణంగా ఎక్కువ సినిమాలకు చేయలేక పోయారు కొన్ని భక్తిగీతాల డిస్క్ లు ఆల్బం లకు సంగీతం అందించినా ,శోభన్ బాబు చలం హరనాథ్ ,కన్నడ హీరో రాజ్ కుమార్ లకు కొన్ని సినిమాలో పాడినా ,ఆడంబర జీవితం గడపలేదు గోపాలంగారు .సినీ పరిశ్రమలో వచ్చే మార్పులు వస్తూనే ఉన్నాయి .ఎవరినైనా అడిగితె అవకాశాలు ఇచ్చేవారేమో ?అడిగె స్వభావం ఈయనకు లేనేలేదు .చిత్ర సీమలో ఇమడలేక పోయి విసిగి వేసారారు . ఇంత సుదీర్ఘ సంగీత ప్రస్థానం లో బి గోపాలం గారు సంపాదించి మిగుల్చుకున్నది ఏమీ లేదు ఒక్క కీర్తి ప్రతిష్టలు తప్ప .1995లో మంగళ గిరి వెళ్లి సోదరి వద్దశేష జీవితం గడిపి 22-4-2004 న 77 ఏళ్ల వయసులో గుండెపోటు తో మరణించారు . చాలా రోజులవరకు ఆయన మరణం లోకానికి తెలియలేదు .ఆయనకున్న మొహమాటం అలా కూడా వదిలిపెట్టలేదు .ఆయన తీపిగుర్తుగా మిగిలిన పాట శ్రీ కృష్ణార్జున యుద్ధం సినిమాలో పింగళి వారి సాహిత్యానికి పెండ్యాలవారు స్వరపరచి గోపాలం గారు ,స్వర్ణలత గార్లతో అల్లు గారికి సురభి బాలసరస్వతి గారికి పాడించిన హాస్య శృంగార మధురగీతం – సోహం.. సోహం.. సోహం.. సోహం.. అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ అయిన కుదురుగ ఎదుట కూర్చుని గాలి గట్టిగా పీల్చుమా స్వామీ స్వామీ… ఏమీ ఏమీ నేను పీల్చిన గాలి నిలువక అకటా మీపై విసిరెనేఅకట మీపై విసిరినే అందుకే మరి… అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ కనులు మూసుకు చూపును ముక్కుకొనపై నిలుపుమా స్వామీ స్వామీ…ఈ మారేమీ అచట నిలువక చుపులన్నీ అయ్యో మీపై దూకెనేఅయ్యో మీపై దూకెనే అదే మరి… అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ కష్టమైనను ఇష్టమేనని కోరి నిలిచితి చినమునీ ‘’ సశేషం మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-22-ఉయ్యూరు •

Posted in సినిమా | Tagged | Leave a comment