హాస్యం భేదాలు

హాస్యం భేదాలు

హాస్యం గురించి చెప్పమంటే ఎదో  ఒకపద్యం చదివి ఎంతహాస్యం ఉందొ చూడమంటారు .హాస్య భేదాల గురించి ఏ లక్షణ గ్రంథమూ లేదు .అసలు భేదాలున్నట్లే ఎవరూ గుర్తించనే లేదు .అలంకారాలలో శబ్దాలంకారాలు అర్ధా లంకరాలు ఉన్నాయి .శబ్దాలంకారాలలో యమకం ,అనుప్రాసం ముక్తపద గ్రస్తం అని ఎన్నో రకాలు . అర్ధాలంకారాలు వంద దాకా ఉన్నాయి .ఉపమ రూపక భ్రా౦తిమత్ వగైరా .ఇలాగే హాస్యంలోనూ భేదాలున్నాయి .వీటిని ఎవరూ గుర్తించకపోవటం వలన మునిమాణిక్యం గారు వాటి గుర్తించి,  పరిశీలించితెలియజేశారు .

శబ్దాశ్రయం –వాక్కు గత హాస్యాన్ని శబ్దాశ్రయం,భావాశ్రయం అర్దాశ్రయం అని మూడు భాగాలు చేశారు మాస్టారు .శబ్దాల కూర్పుతో వికృతి చూపించవచ్చు ఉచ్చారణలో తేడా ,ఇతరభాషా ప్రయోగాలు ,అస్తవ్యస్త పద ప్రయోగం ,అశ్లీల అసభ్య పద ప్రయోగం క్లిష్ట ,శ్లిష్ట విశ్లధ పద ప్రయోగం వలన వికృతి వస్తుంది ఇలాంటిహాస్యం బాగుంటుంది .ఇదంతా శబ్దాశ్రయ హాస్యం .

  భావాశ్రయం –లో ఒక మెలిక ఒక వైపరీత్యం ,ఒక విచిత్రం వింతపోకడ ,విరోధ భావాల కలయిక ,వేర్వేరు అర్ధాలు కల మాటలకలయిక వలన భావాశ్రయ హాస్యం వస్తుంది రసం ,కారణం ,అలంకారం భావాలు  ఆభాస రూపం లో నవ్విస్తాయి .ఇవి భావాశ్రయ హాస్యం లో అంతర్భాగాలు .

అర్దాశ్రయం –జుగుప్స కలిగించనిదీ,రమణీయార్ధం తో ఉన్నదీ,అలంకారం తో ఉన్నదీ ,ధ్వని వ్యన్జకంగా ఉండేదీ ,వికార రహితమైనదీ ,రసాను భూతి కలిగించేదీ ,క్షుద్ర భావం లేనిదీ ,చిత్త వృత్తికి కారణం అయిందీ ,ఆనందమే హద్దుగా ఉండేదీ అర్దాశ్రయహాస్యం .

 అర్దాశ్రయం లో1- పెర్సేప్ట్యువల్ హ్యూమర్ అంటే అనువిదాశ్రయం అంటే చూసిన, విన్న విషయాలలో వక్రత మాత్రమె గుర్తించటం 2-ఇమాజినేటివ్ హ్యూమర్ అంటే భావాశ్రయానికి పైన ఉండేది .భావాశ్రయం లో లేని దాన్ని ఊహించుకొని ,దాన్ని వికృతంగా భావించి నవ్వటం. రసం ఉన్న చోట లేనట్లు ,కారణం లేని చోట ఉన్నట్లు అనుకోని ఆ భావనలో వికృతిని చూసి నవ్వటం ను ఇమాజినేటివ్ హ్యూమర్ అంటారని మునిమాణిక్యం ఉవాచ .

  అర్దాశ్రయ హాస్యం హృదయానికి సంబంధించింది .ప్రేమ సానుభూతి మొదలైన మానవీయ లక్షణాలకు సంబంధించింది .అర్దాశ్రయం లో భాగమైన ఉక్తి విశేషాలు నిశితమైన మేధ వలన ఏర్పడినవి  .ఈ ఉక్తులు రసభావనా సామర్ధ్యం కలవి అంటారు మాస్టారు .కనుక అర్దాశ్రయ హాస్యం హృదయానికి ,మేధస్సుకు సంబంధించింది అని తేల్చారు మాస్టారు .అందుకే ఇది అత్యుత్తమ హాస్యం అని విశ్లేషకులు సర్టి ఫై చేశారు

    శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి  కృతజ్ఞతలతో

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-21-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ నిర్మల్ చేతిలో అందంగా ఎగిరిన రవీంద్రుని ‘’భావ విహంగాలు ‘’

శ్రీ నిర్మల్ చేతిలో అందంగా ఎగిరిన రవీంద్రుని ‘’భావ విహంగాలు ‘’

 వారం క్రితం నాకు ‘’భావ విహంగాలు ‘’పుస్తకం వచ్చింది .రచయితతో నాకు బొత్తిగా పరిచయం లేదు .అందులోనినంబర్ కు ఫోన్ చేస్తే కవి గారు మాట్లాడారు .మీరు నాకు పంపిన పుస్తకం అందింది అన్నాను. ఆయనా ఆశ్చర్యపోయారు .ఎవరు పంపి ఉంటారు అని అడిగితె ,శ్రీ వడలి రాధాకృష్ణ కాని శ్రీ చలపాక ప్రకాష్ కానీ పంపి ఉంటారని చెప్పారు .మొదటి వారి గురించి తెలుసుకాని ,పుస్తకం పంపే౦త పరిచయం లేదు కనుక చలపాక పంపి ఉంటారని అనుకొన్నా . ఈపుస్తకం ,ఆయన ‘’కరోనా నానీలు ‘’కలిపి వచ్చాయని మా శ్రీమతి చెప్పింది .ఈపుస్తకం కూడా ప్రకాష్, కళాసాగర్ జంట నేతృత్వం లో ముద్రణ పొందినదే .అందుకే క్వాలిటీ కూడా బాగుంది ,.కవి  అసలుపేరు వల్లభుని నిర్మల ప్రసాద్ –‘’నిర్మల్ ‘’గా ప్రసిద్ధుడు .విజయవాడలో పుట్టి అక్కడే చదివి ,వరంగల్ ఇంజినీరింగ్ కాలేజిలో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ మొదటి బాచ్ విద్యార్ధిగా చేరి ,పాసై విద్యుత్ ఇంజినీర్ గా చాలా శాఖలలో పని చేసి విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ లో డివిజనల్ ఇంజనీర్ గా  రిటైరయ్యాడు .భార్య శ్రీమతి సత్యమణి చీరాల ప్రభుత్వ మహిళా కాలేజిలో ఫిజిక్స్ హెడ్ గా చేసి ఇన్ చార్జి ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు. ఈమెకే ఈపుస్తకాన్ని కవి అంకితమిచ్చారు .ఇంతకు  ముందు ఈ కవి ‘’వెన్నెల సుమ మాలికలు ‘’,ముత్యాల మెరుపులు ‘’కవితా సంపుటులు రాసి ప్రచురించిన అనుభవం ఉంది .పుస్తకం ఈ సెప్టెంబర్ లోనే విడుదలైంది .వెల150 రూపాయలు .ఈ పుస్తకాన్ని ఈ పూటే చదివి స్పందిస్తున్నాను .

  విశ్వకవి రవీంద్ర నాథ టాగూర్ బెంగాలిలో రాసి తానే ఇంగ్లీష్ లోకి అనువదించిన ‘’స్ట్రె బర్డ్స్’’లోని 320కవితలలో 286 కవితలకు నిర్మల్ చేసిన భావాను వాదమే ‘’భావ విహంగాలు ‘’.ఇవి దేనికది హైకూ లలాగా ముక్తకాలు .చైనాభాషలోకి దీని అనువాదాలు చాలా వచ్చాయి .అందులో ఫీయింగ్ అనే అతడు చేసిన అనువాదం లో’’పుట్స్ ఆఫ్ ఇట్స్ మాస్క్ ఆఫ్ వాస్ట్ నెస్ టు ఇట్స్ లవర్ ‘’ ను పొరబాటున ‘’ఆమె పాంట్ ను తీసేసింది ‘’అనే అర్ధం వచ్చే ఫ్రేజు గా అనువదించగా ,పెద్ద ఎత్తున నిరసన జరిగి ఆపుస్తకాన్ని బాన్ చేయటం కూడా జరిగింది .అతడికి టాగూర్ పై అంతగా విశ్వాసం లేదనీ ,ఆయన హృదయం అర్ధం చేసుకోలేదని అన్నారు విమర్శకులు .కనుక అనువాదకుడికి ఎంతటి నిబద్ధత ,ఆరాధనా భావం ఉండాలో తెలుస్తోంది .ఇంతకీ స్ట్రె బర్డ్స్ అంటే దారి ‘’తప్పినపక్షులు’’ .అంటే ఎలా పడితే అలా సంచరించేవి .మన ఆలోచనలూ అలాంటివే అని రవీంద్రుని  భావం .అలాగే ఆయన వాడిన ‘’రగ్గేడ్ ఫెదర్స్ ‘’అంటే పూర్వ వైభవం ,బాధ విషాద ఛాయా అని అర్ధం..టాగూర్ దృష్టిలో పక్షి అంటే ప్రకృతి కి చిహ్నం .పాటకు ,స్వేచ్చ కు రూపకం .ఒక్కొక్కసారి ఒక్కో పక్షి ని ఆయన సూచిస్తాడు .టైలర్బర్డ్ ,నెమలి ,కోయిల ,కాకి వగైరా .నిర్మల్ గారి అనువాదం రవీంద్ర భావానికి సమీపంగా ,నిండుగా సాగింది .హృదయావిష్కరణ జరిగింది .వీటిలో నాకు నచ్చిన పద్యాలను మీకు తెలియ జేస్తాను .ఇంగ్లీష్ వెర్షన్ ,దానికింద తెలుగు సేత తో కవితలు ఉంటాయి .కనుక వేరే ఎక్కడా వెతుక్కోవక్కర్లేదు .ముందుగా కవి రవి కవికి కవితాంజలి ఘటింఛి ,ఉపక్రమి౦చాడు.ఆ భావ విహ౦గ సోయగం ‘’ నా మాటలలో’’ చూద్దాం రండి .

మొదటి కవిత -‘’స్ట్రె బర్డ్స్ ఆఫ్ సమ్మర్ కం టు మై –విండో టుసింగ్ అండ్ ఫ్లై అవే ‘’

అనువాదం –‘’వేసవికాలం లో –విచ్చలవిడిగా తిరిగే పక్షులు-నాకిటికీ వద్దకు వచ్చి –కిలకిలారావాలతో  –పులకింప జేసి –ఎగిరిపోయాయి ‘’

ఆఖరి కవిత –‘’ది నైట్స్ సైలెన్స్ ,లైక్ ఎ డీప్ లాంప్ –ఈజ్ బర్నింగ్ విత్ ది లైట్ ఆఫ్ ఇట్స్ మిల్కీ వే’’

అనువాదం –రాత్రి లోని నిశ్శబ్దం –వెలుగుతున్న దీపంగా –పాలపుంత కాంతిలో –వెలిగి పోతున్నది .

ఇక ఈ మధ్యలో ఉన్న అనువాద కవితల సౌరు  నామాటలలో చూద్దాం –‘’సుధలోలికే పాపలార –యదేచ్ఛా విహారులారా –పలికెడు నా పదములందు –పాదముద్రలు వేయ రండి ‘’చలికాలం లో పలుకు లేని పండుటాకులు –జాలి గొలుపుతూ రాలుతున్నాయి ‘’,జగతి తన సువిశాల ముఖా౦బరాన్నితొలగించి –వలపు గీతికా రవలళింపగా  –అంతులేని ప్రేమను తొణికిస్తూ –భూదేవిని ముద్దాడింది’’ .భూమి కనుల నుంచి  వెలువడే నీరే ఆమె నవ్వుల పువ్వుల్ని కుసుమి౦పజేస్తోంది .గరిక పోచ పొందుకోసం ఎడారి పరితపించింది .అస్తమించే రవిని చూసి విలపిస్తే మిలమిల మెరిసే తారకలను చూడలేవు .అర్ధరాత్రి వర్షించే ముసురు లాగ మమతలూరే ఆమె ముఖం కలలలో వెంటాడింది .ఒకప్పుడు అపరిచితులే నిద్ర లేచాక అత్యంత సన్నిహితులని తెలిసింది .మనసులోని వేదనసంజేవేళ చెట్లలో సద్దు మనిగినట్లు  ప్రశాంత శాంతిగా మారుతుంది .సాగరాన్నీ, గగనాన్నీ నీ భాష ఏమిటి అని అడిగితె ‘’నిత్య మౌనరాగం ‘’అన్నాయి .చీకటి రాత్రి వంటిది. సృష్టి రహస్యం ఉదయకాల పొగమంచు లాంటిది భ్రాంతి భరిత జ్ఞానం .ప్రేమను ఉన్నత శిఖరాలపై నిలిపితే ఎవ్వరికీ అందుబాటు లో ఉండదు .ఆకులగలగలలే నా మృదు భావాలు ,మనసులోని ఊగే ఆనంద డోలికలు .నువ్వెవరివో చూడలేవు –చూసేది నీ నీడనే .ఉత్తమమైనది నేను ఎన్ను కోలేదు అదే నన్ను ఎన్నుకొన్నది .లాంతరును వెనుక పెట్టుకొన్నవాళ్ళు తమ నీడనే తాము ముందు చూస్తారు .నేను చిరు కుసుమాన్ని ,ప్రకృతి దరహాసాన్ని అంటుంది గలగలమనే ఆకులు  ఎవరు నీవు  నిశ్శబ్దంగా ఉన్నావు అని అడిగితె .  కనులకు కనురేప్పల్లాగా శ్రమకు చెందేది విశ్రాంతి .పుట్టుకతో పసివాడైన మనిషి కి ఎదగటమే అతడి శక్తి .పచ్చటి ఆకులపై నర్తించే పసిడికాంతికి’’మనిషి అబద్ధం ఆడతాడని తెలీదు .చంద్రుని నిరీక్షణ –సూర్యుడికి నమస్కరించి,దారి ఇవ్వటానికి అట .ఎంత నమ్రతగా ఉంటె ఉన్నతికి అంత దగ్గరౌతాం .అందమైన బరువైన నెమలి పింఛ౦  చూసి పిచ్చుక విచారం వెలిబుచ్చిందట .తుఫానుకు దారి లేకపోతె అడ్డంగా వస్తుంది .దార్లు మూసుకుపోతే వెంటనే ఆగిపోతుంది .దేవుడు మనిషితో –నీకు నయం చేయటానికి గాయం చేస్తా –నిన్ను ప్రేమిస్తా కనుక శిక్షిస్తా ‘’అన్నాడు .

   గడ్డిపోచ పాదాలకింద భూమిని దాచిపెట్టి౦ది .తప్పు వోటమిని  ఒప్పుకోక పొయినా ఒప్పు అంగీకరిస్తుంది.దాహార్తుల దాహం తీర్చటానికి కొంచెం నీరు సరిపోయినా తన సర్వస్వాన్నీ ఇస్తానంటు౦ది ఉదార జలపాతం .గొడ్డలి పిడికోసం చెట్టు నడిగితే ,అనుమానించకుండా పిడి నిచ్చేసింది దానితో వాడు నరుకు తాడని తెలిసినా అదీ లోకం లో ఉదారతా లక్షణం .పవిత్రం అనే భాగ్యం అపరిమిత ప్రేమలోనే పుడుతుంది .గడ్డి తన సమూహాన్ని భూమిలోనే వెతికితే ,చెట్టు తన ఏకాంతాన్ని ఆకాశం లో చూస్తుంది .మనిషి నుంచి మనిషే రక్షణకోసం అడ్డగోలుగాఅడ్డ గోడలు కట్టుకొంటాడు .మరణం లో అందరూ ఒక్కటైతే జీవితం లో సమూహంగా మారుతారు .దేవుడు లేకపోతే మతాలన్నీ ఏకమైపోతాయి.చిత్రకారుడు ప్రకృతి ఆరాధకుడు, దాసుడు ,యజమాని కూడా .ఓ పండూ ఎంత దూరం లో ఉన్నావు అని పువ్వు అడిగితె –‘’నీ హృదయం లోనే ఒదిగి ఉన్నానే ‘’అంది .కత్తిపదును కాపాడే ఒర తను మోద్దుబారినా తృప్తి పడుతుంది .ఎవరికోసం తపిస్తుందో మ౦చు అదేసూర్యుడిని కప్పేస్తుంది .మట్టి నిత్యం అనుమానాలు భరిస్తూ కూడా పువ్వుల్ని సమర్పిస్తుంది .సూర్యుడు పశ్చిమాద్రికిచేరగా ఉదయాద్రి మౌనంగా నిలబడింది ముందు .పొగడ్తలకు మొహమాట పడతా కానీ రహస్యంగా దానికే అర్రులు చాస్తా .ఉత్తమమైనది ఒంటరిగా కాక ఎంతో మంది మధ్యనుంచి వస్తుంది .దేవుడి కుడి చేయి సున్నితం ఎడమ చేయి ఉగ్రం .తాను సృష్టించిన పూలను తనకే తిరిగి కానుకగా ఇవ్వాలని దేవుడు కోరుకొంటాడు  .మనుషులు క్రూరాత్ములు కానీ మనిషి దయామయుడు ఇది  మాస్ మెంటాలిటి అన్నమాట .మరణానికి బీటలు ఉండవుకనుక ప్రపంచం జారిపోయి అదృశ్యం కాదు .జీవితం ప్రేమను పంచటం తో భాగ్యమౌతుంది .మరణం అనే నీటి బుగ్గ చలనం లేని జీవజలాన్ని చలి౦పజేస్తుంది .జీవిత గమనానికి జీవన గానమే విశ్రాంతి .గులాబీ అందాన్నే కాదు ముళ్ళూ చూడాలి .పక్షి రెక్కలకు బంగారం పూస్తే స్వేచ్ఛ కోల్పోతుంది .ప్రపంచమంతా వెన్నెలలు నింపే చందమామ తన మచ్చలను తనలోనే దాచుకొంటు౦ది  .పిరికి ఆలోచనల్లారా నా దగ్గరకు రాకండి నేను కవి ని .ఎలా పూజించాలి నిన్ను అని సూర్యుడిని పువ్వు అడిగితె ‘’నీ పవిత్ర మౌన రాగం తో ‘’అని జవాబు .మానవుడు మృగంగా మారితే దానికంటే క్రూరంగా మారుతాడు .’’మృగాడు’’ అవుతాడని భావం .అబద్ధం అధికారం పొందినంతమాత్రాన సత్యంగా మారలేదు .కళ్ళు తన చూపుని గురించికాక తన కళ్ళద్దాల ను చూసి గర్వపడతాయట.అడుగు పైకేస్తూ కిందకు జారటమే జీవనయానం .కలయిక అనే దీపం కలకాలం వెలుగుతుంది .విడిపోయిన మరుక్షణం ఆరిపోతుంది .ప్రపంచాన్నిప్రేమిస్తేనే అందులో జీవి౦చ గలం..మనిషి నవ్వితే లోకం ప్రేమించింది పరిహాసం చేస్తే భయపడింది .దివ్యమౌనం ఆలోచనల్ని మాటలుగా మారుస్తుంది .కాంతి అనే మామూలు వస్త్రాన్ని సూర్యుడు కట్టుకొంటే ,మబ్బులు మహోజ్వలంగా అల౦కరించుకొన్నాయి .గడ్డిపోచ మహా ప్రపంచానికి పచ్చదనంతో దీటుగా నిలుస్తుంది .నీటిలో బతికే   చేపను బయటికి తీసి, దానికి స్వేచ్ఛ ఇచ్చానని గర్వపడుతుందట  పక్షి    .అసాధ్యం అసమర్ధుడి కలలోనే ఉంటుంది .దేవుడి గొప్పశక్తి హాయినిచ్చే చిరుగాలిలో ఉంటుందికాని ,భీభత్స తుఫానులో కాదు .సాలె పురుగు మంచు బిందువులను పట్టుకొన్నట్లు నటిస్తూ ఈగల్ని పట్టుకొంటు౦ది.కాపట్యానికి గొప్ప ఉదాహరణ .పరులకు మంచి చేయటం లో నిమగ్నమైన వాడు తనమంచి ఆలోచించాడు .దూసుకుపోయే బాణం తో విల్లు ‘’నీ స్వేచ్చే నా స్వేచ్చ ‘’అంటుంది .దేవుడు తను సృష్టించిన నక్షత్రాలకన్నా .మానవుడు వెలిగించే దీపాలనే బాగా ప్రేమిస్తాడు .సూర్యాస్తమయం లో సూర్యుడి ముద్దుకు పసిడిభరిణ మబ్బు హృదయం .కాలిపోతున్నదుంగ ఇదినా పువ్వు నా మరణం అనుకొన్నది .చీకటి వెలుగు వైపుకు, గుడ్డితనం చెవిటి వైపుకు సాగుతాయి .ప్రతిధ్వని వెక్కిరిస్తోంది ధ్వనిని ‘’నేనే మొదటి ధ్వని ‘’అని .తీరిక  కదిలితే పని అవుతుంది .సముద్ర నిశ్చలత అలలను కదిలిస్తుంది .రాత్రి విచ్చిన పువ్వును ఉదయకాంతి ముద్దాడితే అది చలించి నిట్టూర్చి నేలవాలిపోయింది .కెరటాలకడలి దాటి  గీతాలాపన జరిగే సంగీత దీవిని చేరాలని నా వాంఛ.జీవిత జీవకా౦తుల దీవి చుట్టూ రాత్రీ పగళ్ళు అంతులేని మరణం అనే సముద్ర గీతం హోరుమంటు౦ది .సంధ్యాసమయం నాకు ఒక కిటికీ ,వెలిగించిన దీప స్తంభం –దాని వెనక ఎవరిదో నిరీక్షణ.నిశ్చలంగా నిష్కల్మషంగా ఉన్న హృదయంప్రపంచాన్నీ ,దైవాన్నీ చేరే మార్గం చూపిస్తుంది .సముద్ర ప్రయాణ జీవితం లో ఇరుకైన ఓడలోకలుసుకొనే వారు మరణం తో ఒడ్డుకు చేరతారు ఎవరిలోకాలకు వాళ్ళు వెళ్ళిపోతారు .

  ఎన్నో ఎన్నెన్నో ఉదాత్తభావాలు తాత్వికత ,ఆలోచామృతం ,జీవిత సత్యాలు మనుషుల నడవడి, మార్గ నిర్దేశం ,మనసుల రాపిడి ,అందాన్ని చూసి పరవశం ,ఏదినిత్యం ఏది భ్రమ తెలిపే తత్వ బోధ ,జీవిత పాఠాలు రవీంద్రుని కలం నుండి అమృతవాహిని గా జాలువారిన కవితలివి .ప్రతిదానికి ఎంతైనా విశ్లేషణ చేయవచ్చు .ఇదంతా ఉపనిషత్ ప్రబోధం. మానవ స్వేచ్చా గీతం .మానవ హృదయ ఆవిష్కరణ .నిసర్గ రమణీయ సుందరం .పండిన రవికవి జ్ఞానఫలం .అనుభవించటం మనకర్తవ్యం .

 నిర్మల్ గారి అనువాదం బాగానే ఉన్నా,’’ బ్రివిటి’’ లేక పోవటం వలన ‘’బ్యూటీ ‘’తగ్గిందని పించింది .ఏమైనా ,ఒక టెక్నికల్ వ్యక్తిఇలాంటి భావ సంపదను తెలుగు వారికి అందించినందుకు మనస్పూర్తి గా అభినందిస్తున్నాను .

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-21-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

కవిత్వం –శాశ్వతత్వ౦  

కవిత్వం –శాశ్వతత్వ౦

కవిత్వానికైనా ,హాస్యానికైనా ,దృష్టిలో వక్రత ఉండాలి. వస్తువును చూసి సామాన్యుడు అనుకొనే దానికంటే కొత్తగా ఉంటేనే కవిత్వమైనా ,హాస్యమైనా పండుతుంది .గిన్నెలో పోసిన ఎర్రని ద్రాక్ష సారాయి పైభాగాన నురుగుతో అందంగా ఉంది. సారాయి నురుగుకట్టింది అని సామాన్యుడు అనుకొంటాడు . .మధువు సిగ్గుపడి మందహాసం చేసింది  అంటాడు కవి .ఎర్రదనాన్ని సిగ్గుగా నురుగును నవ్వుగా భావించాడు కవి .మధువుకు ప్రాణం పోసి ,మందహాస సుందర సౌందర్య మూర్తిని చేశాడు కవి .మామూలు విషయమే దృష్టిలోని విలక్షణ వలన ఇలా తయారైంది .

శాశ్వతత్వం –హాస్యం లో బరువు లేకపోతె శాశ్వతంగా ఉండటానికి తగిన జీవ శక్తి లేదనీ ,అందుకే అది క్షణికం అనీ ,తాత్కాలిక ఆనందాన్నే ఇస్తుంది తప్ప శాశ్వతంగా అంటే మళ్ళీ మళ్ళీ చదివినప్పుడల్లా ఆనందాన్ని ఇవ్వగల సత్తా దానికి లేదని తెలుస్తుంది .కవిత్వానికీ ,హాస్యానికీ ఇదొక ముఖ్య భేదం అంటారు విజ్ఞులు .మంచి పద్యం ఎన్ని సార్లు చదివినా ఆనందం ఇస్తుంది .మళ్ళీ మళ్ళీ చదవాలని పిస్తుంది .ఒక హాస్యాపు తునక మొదటిసారి వింటే ఆన౦దిస్తాం.మళ్ళీ చదవాలని పించదుఅంటారు కొందరు.పద్యం లో సంగీతం ఊపు ,లాలిత్యం ,లాలన ఉండటం వలన ఫలితం అది. హాస్యానికి కూడా ఇలా౦టి అద్భుత శక్తి ఉందని చాలామంది భావిస్తారు .వస్తువును బట్టి,అందులోని పదార్ధాన్ని బట్టి  క్షణికత్వం ,శాశ్వతత్వం కలుగుతుంది  .ఒక విశిష్టమైన పరిస్థితినిబట్టి ,శాశ్వతమైన సమస్యను బట్టి హాస్యానికి చావు లేదు .వితంతు ,రజస్వలానంతర విషయాలు తాత్కాలికం .వీటికి సంబంధిన రచనలు ఆ సమస్యలు సమసి పోగానే కనుమరుగౌతాయి .భార్యాభర్తల జీవిత సమస్యలు ఒకకాలానికి పరిమితం కాదు .అందరికి సంబంధించినవి .మానవుడు మానవుడుగా ఉన్నంతకాలం అది సజీవంగా ఉంటుంది .తెనాలి రామలింగని హాస్యం   బీర్బల్ హాస్యం వందల ఏళ్ళు గడిచినా ఆనందాన్నిస్తుంది .

    శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి  కృతజ్ఞతలతో

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-10-21-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

కల్లోల’’ కరోనా’’కు అద్దం పట్టిన చలపాక ‘’నానీలు’

కల్లోల’’ కరోనా’’కు అద్దం పట్టిన చలపాక ‘’నానీలు’’
గత రెండేళ్లుగా కరోనా సృష్టించిన కల్లోలం ,మానవ జీవితాలు ఛిద్రమైన విధానం విలువలు మంటగలిసిపోవటం,కరోనాతో చనిపోయిన వారిని పలకరించలేని, కనీసం కడసారి చూసే౦దుకు ,కుటుంబ సభ్యులైనా అంత్యక్రియలలో పాల్గొన వీలులేని దయనీయదుస్థితి , వైద్యానికి లక్షల్లో ఖర్చు తో కుదేలైన ఆర్ధిక పరిస్థితి అన్నిరంగాలలో ఎదురైన మాంద్యం ,తిండికి లేక కటకటలాడిన బడుగు బలహీన వర్గాల దైన్యం ,వలసకార్మికులు వేలాది మైళ్ళు నడిచి స్వగ్రామలు చేరుకొనే హైన్యం ,పార్టీలు వీటిని వేటినీ పట్టించుకోకుండా తమ రాచకీయపాచికలాటలో రాక్షసానందం పొందటం ,ఇంతటి కల్లోలం లోకూడా వైద్య ,పోలీసు, వెట్టి సిబ్బంది చూపిన మానవ కారుణ్యం ,సాయమందించిన ఆపన్న హస్తాలకుచూపిన కృతజ్ఞతా భావం తో ‘’నానో వైరస్’’కరోనా పై నాలుగేపాదాల ‘’నానీలశతకం’’ రాసి ,ప్రచురించి ,అన్నికోణాలలోనూ ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకుడు శ్రీ చలపాక ప్రకాష్ అభినందనీయుడు .కరోనా కాటుకు బలైన తన పెదనాన్న శ్రీ చలపాక సాధు సత్యనారాయణ గారికి అ అంకిత మివ్వటం సముచితంగా ఉంది .అంతే కాదు చివరలో కరోనాకాలం లో మరణించిన సంగీత ,సాహిత్య ,వివిధ రంగాలలో మిత్రుల పేర్లను ,మరణ తేదీలను కూడా ప్రచురించి స్మరించటం ఉదాత్తంగా ఉంది .,కరోనాపై ఇంతకు ముందు వివిధ రచయితలు , కవులు ప్రచురించిన కరోనా సాహిత్యం సూక్ష్మ పరిచయాలు ముఖ చిత్రాలు చేర్చటం కూడా ప్రకాష్ కున్న నిబద్ధతను చాటింది . ఇప్పుడు లోపలి విషయాలు తెలియజేస్తాను .
‘’మిత్రువెవడో శత్రువెవడో కరోనా తెలిపింది ‘’అన్న మొదటి నానీ నుంచి ‘’ఫస్ట్ వేవ్ ఆస్పత్రి వైపు –సెకండ్ చావు లైతే –ఇక థర్డ్ కేం మిగిలింది ?తో కరోనా నానీలు పూర్తయ్యాయి .అనుబంధంగా వివిధ అంశాల నానీలు ,చివరగా చిన్నారి చలపాక లోకేశ్వరి ‘’జలుబొస్తే వస్తుంది ‘’తుమ్ము’’ –కరోనా వస్తే నువ్వు మూస్తావు’’కన్ను ‘’.చివరగా ‘’లాక్ డౌన్ లో బయటికెడితే –పోలీసు’’ కేసు’’ –జరిమానాతో –నీ కౌతుంది ‘’లాసు ‘’అని’’క్లాసు ‘’గా రాసి మంచి భవిష్యత్తు ఉందనిరుజువు చేసిందిచిన్నారికవి .
కరోనా పడవ ముంచేసి కుటు౦బాన్నిచిన్నాభిన్నం చేసింది ,ఆదుకోటానికి వెళ్ళిన అంబులెన్స్ –మహాప్రస్థానమై తిరిగి వచ్చింది ‘’అనగానే దుఖాశ్రువులు జలజల రాలిపోతాయి .శావాలకుప్పల్లో –శత్రుమిత్రులు కలిసిపోయారట .జాషువారాసిన స్మశాన వాటిక పద్యం గుర్తుకు తెస్తుంది.మాస్కుల, శాని టైజర్ల ,ఆక్సిజన్ సిలిండర్ల వ్యాపారాలతో కోటికి పడగలెత్తినవారున్నారు .’’కాదేదీ వ్యాపారానికి అనర్హం ‘’అని రుజువు చేసుకొన్నారు .పెళ్ళికి వెళ్ళిన మితిమీరిన జనం తిరిగి వెళ్ళేది – ఆస్పత్రికో , స్మశానానికో ‘’?ప్రశ్న ఆలోచన రేకెత్తించేదే .కరోనా నంజుడుకు గుడైనానా బడైనా తీర్ధమైనా క్షేత్రమైనా ఒక్కటే అనే వేదాంతం .ఆప్యాయతను ప్రేమను సూచించే కౌగలింత ,ముద్దు లేనప్పుడు ప్రయోజనం ఏమిటని నిర్వేదం .కుగ్రామమైన ప్రపంచమంతా ‘’ఒకే మాస్కులో’’ అనే దరువు ..
‘’ కరోనాలో –ప్రాణాలు పోసే వారికంటే –మోసుకెళ్ళే వాళ్ళ- అవసరమే ఎక్కువ’’ ఆమహమ్మారి విలయతాండవానికి ప్రతీక . సెకండ్ వేవ్ లో’’ కావాల్సింది –ఆక్సిజనో –స్మశానాలలో జాగానో ‘’అని దాని విపరీత పరిణామాన్ని కనులము౦దు౦చాడు కవి .చెట్లు నరికి సహజ ప్రణవాయువు కు నష్టం కలిగించి –దొరకని ఆక్సిజన తో ప్రాణాలపై ఆశ ‘’పెట్టుకొన్న తెలివి తక్కువ ప్రజలకు చెంప వాయింపు .లాక్ డౌన్ నేర్పిన పాఠం’’ఇల్లేరా స్వర్గసీమ ‘’.’’ఆన్ లైన్ పార్సిల్ ఫుడ్ –ఆస్పత్రి లో బెడ్ .కుదారి అనే హెచ్చరిక .అప్పుడు ఆక్సిజన సిలిండర్ తోఅంతరిక్షానికి –ఇప్పుడు అదే సిలిండర్ తో ముందు ఆస్పత్రికి ,తర్వాత కాటికి ‘’అనే కఠోర సత్యావిష్కరణ .ఒకప్పుడు తుమ్ము మంచిదే లోపలి ఛిద్రం బయటికి పోతుందని నమ్మకం –ఇప్పుడు తుమ్మినా దగ్గినా శిక్షార్హమే- ‘’ఐసొలెషన్ కే’’అనే చమత్కారం .కరోనాను జయించిన వాడే నేడు మొగాడు ‘’.మనీ పర్సు తప్ప అన్నీఆన్ లైన్ లోనే అనే వెటకార౦ .ప్రపంచమంతా దాదాపు అన్నికుటుంబాలు కరోనా బాధితులే ఏరూపంలోనైనా—కారణం –క్షణం క్రితం పక్కనున్నవాడు –ఇప్పుడు మాయం .ఆశ్చర్యం ,విషాదం, కన్నీళ్లు, ఉద్వేగం .,నిర్వేదం .
‘’కరోనా –నువ్వు అంటే భయపడంది-ఎవరో తెలుసా ?-సూర్యుడు చంద్రుడు ‘’అంటే వారిద్దర్నీ తప్పించి అందరి పనీ పట్టేసిందింది కరోనా .పుణ్యం చేస్తే స్వర్గం –పాపం చేస్తే నరకం –కరోనాతో పొతే –ఎక్కడికి ??అనే ప్రశ్న .నా సమాధానం ‘’త్రిశంకు స్వర్గం ?వర్క్ ఫ్రం హోం లో మగాళ్ళకు పెరిగింది ఇంటిపనులు .కాటికాపరి పెట్టె కన్నీళ్లు శవాలు కాల్చలేకా ?ఖాళీలు లేకా ?అర్ధం కావటం లేదు .ఇదో దయనీయ పరిస్థితి .’’కాలిపోతున్న కొవ్వొత్తిలా జనాలు –రాలిపోతున్న పిట్టలై –మరణాలు ‘’ యదార్ధానికి అద్దం పట్టిన నానీ ‘’అరిచే నోటికి తాళం –నేటి మాస్కు ‘’కరోనాను అ౦తమొందించే వైద్యం కోసం అందరం కలిసి తపస్సు చేయాలని విన్నపం అంటే అందరం జైన మౌనులవ్వాలన్నమాట .టెర్రరిజ౦ ఆట కట్టించింది –ప్రభుత్వం కాదు –కరోనా అని నిష్టూరం .సోనూ సూద్ లాంటి విలనే నిజమైన ప్రాణ రక్షక హీరో –మనహీరోలు అతని ముందు జీరోలు ‘’అని నిర్భయంగా చాటిన నానీ .అందరికీ లాక్ డౌన్ ఉందికానీ –‘’పంట పం డించేవాడికీ –వంటవండి వడ్డించే వాడికీ లేదు ‘’అన్న సానుభూతి .ఇదివరకు భూతల స్వర్గాలు౦డేవి-ఇప్పుడు భూలోక నరకాలే అన్నీ అనే ఆవేదన .మితిమీరిన జాగ్రత్తతో పక్క ఊరినుంచి వచ్చినా –కరోనా టెస్ట్.లాక్ డౌన్లో మనుషులు –ప౦జర౦ లో పక్షులే .కరోనాకాలం లో శవవాహకులెవరు అంటే –‘’అందరూ ఉన్నా ఏమీ కాని వాళ్ళు ‘’
‘’వెలి వెయ బడిన వాడికన్నా –నీచమైపోయాడు కరోనా పేషెంట్ ‘’ అంటుకొనే ముట్టుకోనే, రాసుకు, పూసుకు తిరిగే వారు లేక. అదీ దౌర్భాగ్యం .అంటరాని వాడైపోయాడు కరోనాపే షేషంట్ అని ఆక్రందన, జాలి ,సానుభూతి, సహవేదన ఆవేదన .కరోనాలో కరువుతో బాటు ఉవ్వెత్తున లేచింది –కరుణ ‘’అన్న వాక్యం కోటబుల్ కోట్ .విదేశీ టూరిష్టు లు –హాస్పిటల్ బెడ్ ల కోసం వెతుకుతున్నారని చమత్కారమే అయినా, నిజమైనకంటి ముందు సత్యమే .కరోనా చేసిన మేలు –నమస్కారం అనే సంస్కారాన్ని గుర్తు చేయటం అంటాడు ప్రకాష్ .మరోమేలు చడదువులేకుండా పైతరగతికి ‘’బ్రహ్మానంద రెడ్డి పాస్ ‘’.దీనమ్మకడుపుకాలా –సినిమాలన్నీ ‘’ఒటిటి’’ లో ,సభలు జూమ్ లలో అయిపోయాయి నిబంధనలతో .కరోనా సమయం లో ఇల్లంతా పిల్లల సందడి –తో ని౦డినందుకు –దానికో నమస్కారం పెట్టి సంస్కారం చూపింఛి కరోనా నానీలను చాలించాడు చలపాక .
ప్రకాష్ లోక పరిశీలను ,నిశిత దృష్టికీ,సానుభూతి సహవేదనలకు ,దయాంతర హృదయానికి ,కారుణ్య సంవేదనలకు ఈ కరోనా నానీలు అద్దం పట్టాయి .ప్రతి నానీకి పైన ఒక వార్తా చిత్రమో ,ఒక దృశ్యమో జత చేసి గొప్ప ఎఫెక్ట్ కలిపించారు .అందమైన అర్ధవంతమైన ముఖ చిత్రాలతో పుస్తకం, కరోనా తరుమబడ్డ లోకం లా ప్రశాంతంగా ఉంది .
గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-21-ఉయ్యూరు
.

Posted in సమీక్ష | Tagged | Leave a comment

ఎవరు హాస్యం  రాయటానికి అర్హులు ?

ఎవరు హాస్యం  రాయటానికి అర్హులు ?

రామాయణం రాయటానికిఎలా౦టి ప్రతిభకావాలో ,హాస్య గ్రంథం రాయటానికి అలాంటి ప్రతిభ కావాలి .ఒక అంగ్ల విమర్శకుడి అభిప్రాయం –‘’Mark Twain s ‘’Huckel  bury fin ‘’is a great work of art than Kant;s ‘’Critique of reason .Charles Dickens did more for the elevation of human race than Cardinal Newman’s’’Lead Kindly light amidst encircling gloom ‘’.Newman only cried for light in the gloom of a sad world .Dickens gave it ‘’.ప్రతిభ లేని వాడు హాస్య రచన చేయలేడు.కవికి ప్రతిభతో పాటు పాండిత్యం కూడా ఉండాలి ..హాస్య రచయితకు భాషలో ఉండే వడుపు ,ఊపు ,పలుకుబడి తెలిసి ఉండాలి .

  హాస్యానికీ ,కవిత్వానికీ వస్తువు ఒకటే .సూర్యోదయ సూర్యాస్తమయాలు నక్షత్రాలు ప్రకృతిసౌందర్యం,జీవిత సంఘటనలు కావ్యకర్తకు వస్తు సామగ్రి .హాస్య విషయం లో కూడా అంతే.మానవ జీవితం లో సుందర సత్యం ,విచిత్రానుభూతి ,గిలిగింత ,ఉచ్చారణా వైపరీత్యం ,ఊపు మాటలకూర్పులో మెలిక వింత చేర్పు ,మధుర భావన ,హఠాత్తుగా కలిగే మధురోహ హాస్యానికి వస్తువు అవుతుంది .

  హాస్య సృష్టి కూడా లలిత కళా సృష్టి లాంటిదే .ప్రతిభాశీలి గణాలలో ఆనందాన్ని  వెలి బుచ్చుతాడు .అదే కవిత్వం అవుతుంది .చిత్రకారుడు బొమ్మ గీయటం  లో తన ప్రతిభ ఒలకబోస్తాడు .గాయకుడు గానం లో చమత్కార౦ చూపిస్తే , కల్పనా చమత్కారం తో హాస్యం సృష్టిస్తాడు హాస్య రచయిత .వాక్కును నగిషీలతో అలంకారం చేస్తే కవిత్వమా అవుతుంది  .అలాగే ఒక వాక్కును ఒక ప్రత్యెక రసం సాధించటానికి రచన చేస్తే అది హాస్యం అవుతుంది .

 హాస్యానికైనా కవిత్వానికైనా వస్తువులో విశిష్టత ఉండక్కర లేదు .దేనిలో నుంచైనా హాస్యం సృష్టించవచ్చు .చాకలి బట్టలు ఉదకటం అతి సామాన్యమైన విషయమే .విశేషం ఏమీ లేదు. దీన్ని రామణీయపద్యాలలో రాయవచ్చు.దీన్నే హాస్యం పండించుకోవటానికి సమర్ధుడైన రచయితా వాడుకోవచ్చు .మార్క్ ట్వైన్ అనే అమెరికన్ మహా హాస్య ,నవలా రచయిత ప్రక్కనున్న మిత్రుడితో ‘’ఏమి టండీ అది.అతడు గుడ్డ ముక్కలతో బండను బద్దలు చేయాలని చూస్తున్నాడు ‘’అన్నాడు మనకు పెదవులపై చిరునవ్వు చిలుకుతుంది

    శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి  కృతజ్ఞతలతో

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | 1 Comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -2

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -2
విఠల్ భాయ్ పటేల్ శాసన సభ ను వదిలేసి ఇంపీరియల్ కౌన్సిల్ లో ప్రవేశించి ,అసలైన రాజకీయ జీవితం ప్రారంభించాడు .ఆతడి నేతృత్వం వికాసానికి పునాది కూడా ఏర్పడింది .రాష్ట్రీయ స్వపరిపాలనం ఇంకా రూపు దాల్చకముందే ,రాష్ట్ర ఆదాయం పై ఆధారపడకుండా ఉండే కేంద్ర ప్రభుత్వం గురించి ఆలోచించాడు .23-2-1920న ఇంపీరియల్ కౌన్సిల్ లో ఆయన ఒక తీర్మానం ప్రవేశపెట్టి ,కేంద్ర ప్రభుత్వం స్వయం పోషకత్వానికి సూచనలతో తీర్మానం చేశాడు కానీ అది వీగిపోయింది .కానీ శ్రీనివాస శాస్త్రి ,బిఎన్ శర్మ ,సర్ దిన్ షా వాచా ,సచ్చిదానంద సిన్హా .సర్ గంగాధర చిట్నవిస్ ,సురెంద్రనాద్ బెనర్జీ ,జిఎస్ కపర్దీ మొదలైన ప్రముఖులు ఆతీర్మానాన్ని బలపరచారు .
బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని ప్రవేశ పెట్టె సమయం లో వల్లభాయి పటేల్ ఢిల్లీ లో కెవి అయ్యంగారి ఇంట్లో బస చేశాడు .ఆ చట్టం అమలుకాకుండా చూడటానికి విశ్వ ప్రయత్నం చేశాడు .అత్యంత రహస్యంగా ముగ్గురు సభ్యుల మెడలు వ౦చి చట్టాన్ని తెచ్చింది ప్రభుత్వం ఒక విలేకరి ఈ రహస్యాన్ని బయటపెట్టి,పటేల్ ,కపర్దీలతో సంప్రదించి ,అమృతబజార్ పత్రికలో వ్యాసం రాశాడు .అతి రహస్యం బట్టబయలై ఆముగ్గురు తలలు వంచుకొని ,తమ అంగీకారం ఉపసంహరించుకొని అపోజిషన్ పార్టీలో చేరారు .అప్పటి పరిస్థితులలో ప్రజాభిప్రాయం విజయం పొందే అవకాశం ఉండదని ,కొద్దిరోజుల్లో వచ్చే మాంటేగు –చేమ్స్ ఫర్డ్ సంస్కరణలలో ఏవైనా మార్పులు వస్తాయేమో నని ఎదురు చూశారు .ఈ నేపధ్యం లో రౌలట్ చట్టం 6 నెలలు అమలుకాకుండా ఉండటానికి విఠల్భాయ్ ఒక ఎమెండ్ మెంట్ ను ప్రతిపాదించినా ,వైస్రాయి పవర్ ముందు ఆగలేదు .
రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించటం లో వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం .కానీ చివరకు 1919మార్చి 13చేమ్సఫర్డ్ కౌన్సిల్ లో ఒంటిగంటదాకా చర్చ జరిగి విడుదలైంది .రౌలట్ చట్టమే పంజాబు దురంతాలకు నాంది పలికింది .పంజాబ్ లో మార్షల్ లా పెట్టారు .ప్రభుత్వం దురన్యాయంగా దురంతాలుఅమానుష హింస ప్రోత్సహించింది .ప్రజలను క్రూరాతిక్రూరంగా శిక్షించింది .ఈ చర్యలను సభ్యప్రపంచమంతా ఏవగించుకోన్నది.రౌలట్ యాక్ట్ కారణంగా కాంగ్రెస్ శాసనసభా బహిష్కారం చేసింది .కాంగ్రెస్ నియమాలనను సారించి విఠల్ భాయ్ తర్వాత ఎన్నికలకు నిలబడలేదు .
కాంగ్రెస్ రాజకీయాలు
విఠల్ భాయ్ రాజకీయం లో ప్రవేశించే నాటికే కాంగ్రెస్ లో అతివాద ,మితవాదులున్నారు .అమృతబజార్ పత్రిక సంపాదకులు అతివాదులు .బొంబాయి లో లోకమాన్య బాల గంగాధర తిలక్ అతివాది .దేశ గౌరవమే ఆయన లక్ష్యం. మిగిలినవారికి అధికారమే లక్ష్యం .తిలక్ కార్య దీక్ష ఆలోచన ప్రభుత్వానికి వణుకు పుట్టింది .1891లో ఏదో నేరం మోపి ఆయన్ను అరెస్ట్ చేసింది .సారీ చెబితే వదిలేస్తామని చెప్పింది. అమృత బజార్ పత్రిక తిలక్ కు రాసిన ఒక లేఖకు ఆయన సమాధానం –‘’నేను తప్పు చేశానని ఒప్పుకోను .ప్రజలలో నా స్థానం నా నడవడి బట్టి ఉంటుంది .ప్రభుత్వం నన్ను శిక్షిస్తే అంతకంటే అన్యాయ మైన తీర్పు ఉండదు .సంకెళ్ళతో మహారాష్ట్రలో ఉన్నా,అ౦డమాన్ లో ఉన్నా నాకు ఒకటే .దేశ సేవలో కస్టాలు తప్పవు .నా వ్యాసాలు రాజద్రోహం చేసేవి కావు .ప్రభుత్వం పొరబాటు పడింది .పూనా నాయకులను అవమానించటమే వాళ్ళ పని .గోఖలె లాగా నేను ప్రవర్తించను .మనమందరం ప్రజా సేవకులమే .ఈ స్థితో మనోనిబ్బరం లేకుండా జారిపోతే ప్రజల్ని మోసగించి నట్లే ‘’.ఇలాంటి ఆత్మ విశ్వాసం ధైర్యం వితల్ భాయ్ లోనూ ఉన్నాయి .
మొదట్లో కాంగ్రెస్ అర్జీలు అభ్యర్ధనలద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని ప్రయత్నించగా ,అరవింద ఘోష్ ,తిలక్, కపర్దీ ,లజపతిరాయ్, బిపిన్ చంద్ర పాల్ లు 1907 సూరత్ కాంగ్రెస్ లో నిరసించారు .మొదటి ప్రపంచ యుద్ధం అయిన రెండేళ్లకు 1916లో లక్నో కాంగ్రెస్ లో అనిబిసెంట్ హోం రూల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది .తిలక్ తోపాటు విఠల్ భాయ్ కూడా అందులో చేరాడు .సుబ్రహ్మణ్య అయ్యర్ ,రంగస్వామి అయ్య౦గార్ ,సిపి రామస్వామి అయ్యర్ ఉత్సాహంగా పాల్గొన్నారు .బిసెంట్ సతీమణిపై కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహించింది .దీనితో ఉద్యమమ మరింత బలీయమైంది .1918 బొంబాయి ప్రత్యెక కాంగ్రెస్ సమావేశం లో విఠల్ భాయ్ పటేల్ ఆహ్వాన సంఘాధ్యక్షుడు .మాంటేగ్ –చేమ్స్ ఫర్డ్ సంస్కరణలపై చర్చ దీని ముఖ్యోద్దేశ్యం .ఇందులో పటేల్ ప్రసంగం ఆయన దూర దృష్టినీ ,ప్రజ్ఞా విశేషాలను ప్రదర్శించి ,ఆయనపలుకుబడి పెరిగి కాంగ్రెస్ కార్య దర్శి అయ్యాడు .ఈకాలం లోనే జాయింట్ పార్లమెంటరి కమిటీముందు సంస్కరణలపై కాంగ్రెస్ ఆలోచనలను తెలియ జేయటానికి లండన్ వెళ్ళాడు ‘’స్వపరిపాలన కావాలి ‘’అన్న కాంగ్రెస్ కోరికను లండన్ లో సమర్ధించాడు .పాలనా బాధ్యతలు తీసుకొనే సామర్ధ్యం భారతీయులకు ఉంది అని గట్టిగా చెప్పాడు .సంస్కరణలు భారతీయులకు అనుగుణంగా లేవు అని నిర్మొహమాటంగా చెప్పాడు .రెండవ సారి కాంగ్రెస్ సభ్యులతో లండన్ వెళ్లి కామన్స్ సభలో సంస్కరణల విషయం లో కాంగ్రెస్ అభిప్రాయాలను వివరించాడు .ఆకమిటిలోస్పూర్ అనే ఆయన ఒక్కడే భారతీయులకోరికలు న్యాయమైనవి అని చెప్పాడు .రివైజ్ బిల్ కామన్స్ సభకు వస్తే తాను మద్దతు ప్రకటిస్తానని హామీ కూడా ఇచ్చాడు పటేల్ కు .లేబర్ పార్టీ సభ్యులకు కూడా తెలియజేస్తే ,ఎమెండ్ మెంట్ లను చర్చించటానికి సిద్ధపడ్డారు .కానీ అనిబిసెంట్ రివైజ్ చేసిన బిల్లునే ఎలాంటి ఎమెండ్ మెంట్ లు లేకుండా కామన్స్ సభ ఆమోదించాలని ప్రచారం చేసింది .లేబర్ పార్టీ కార్యవర్గం పటేల్ ఆలోచనలను అంగీకరించి తన ఎమెండ్ మెంట్ లను పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని హామీ ఇచ్చింది .మిగతా వారి సహకారం తోపాటు మాక్ ఆలం స్కాట్ మద్దతు కూడా సంపాదించాడు .బొంబాయిలో లా ,పోలీసు శాఖలు శాఖలు తప్పమిగిలిన వాటిని ప్రజాయత్తం చేసే ఎమెండ్ మెంట్ బిల్ ను ప్రవేశపెట్టటానికి స్కాట్ అంగీకరించాడు .కామన్స్ సభలో మూడు రోజులచర్చజరిగింది పటేల్ కు గ్యాలరీలో సీటు ఏర్పాటు చేయటం వలన ఆమూలాగ్రం చూసి ,అవసరమైన చోట సలహాలు ఇచ్చే అవకాశం దొరికింది .ఎమెండ్ మెంట్ లేవీ నెగ్గలేదు .కానీ భారతీయుల న్యాయమైన కోర్కెలకు గొప్ప ప్రచారం లభించింది .ఇండియాకు తిరిగి వస్తూ లేబర్ పార్టీ సభ్యులకు మళ్ళీ కలిసి ఇండియాకు స్వపరిపాలన విషయం లో అధికార ప్రకటనకు చేయమని కోరాడు .దీనిఫలితంగా 18-12-1919న కామన్స్ సభలో పటేల్ బృందానికి ఏర్పాటైన వీడ్కోలు విందు సభలో హెండర్సన్ ఒక ప్రకటన చేయగా బ్రిటిష్ లేబర్ పార్టీ ఆమోదించింది .ఇది విఠల్ భాయ్ పటేల్ సాధించిన అద్భుత విజయం ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-25-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హాస్యానందం

హాస్యానందం

1-ఒక చిత్రకారుడు సుందర స్త్రీని త్రిభంగిమలో చిత్రించి మురిసిపోయి తన డాక్టర్ స్నేహితుడికి చూపిస్తే ‘’అపెండి సైటిస్ ‘’అన్నాట్ట .

2-కలెక్టర్ గారి భార్యను అత్తయ్యగారూ అంటావు ఎలా వచ్చింది ఆ వరుస ?

 రెండోవాడు –నేను తాసిల్దార్ గారి భార్యను అక్కగారూ అని పిలుస్తా ..తాసీల్దార్ భార్య అక్క అయితే ,కలెక్టర్ గారి భార్య అత్తేగా ??అన్నాడు

3-ఒక అమాయకం భార్య భర్తకు ఉత్తరం రాసి చివర్లో ‘’మీకు అందకపోతే వెంటనే తెలియ జేస్తే , ,ఈవిషయాలన్నీ మళ్ళీ రాస్తాను ‘’అని రాసింది

4-చెట్టుకింద కొందరు సైనికులు వచ్చే పోయే వారిని ఆటపట్టిస్తున్నారు .ఇద్దరు కుర్రాళ్ళు ఒకగాడిదను నడిపించుకొని వస్తుంటే సైనికులు ‘’గాడిద అంటే అంత ప్రేమా మీకు ?’’అని హేళన చేశారు .ఆ కుర్రకారు ‘’దానికోకారణం ఉంది గురూలూ .దాన్ని వదిలేస్తే సైన్యం లో చేరిపోతుందని మా భయం ‘’అని రిపార్టీ ఇచ్చారు .

5-ప్లీడర్ దొరసామి మంచిహాస్యగాడు .ఒక సారి గుంటూరు వీధుల్లో నడుస్తుంటే ,ఒకప్లీడర్ గారిల్లు కనిపించి బయట బోర్డు మీద ఆయన పేరు చూసి,,లోపలి వెళ్లి ఆపేరుతో పిల్చాడు. ఇంటావిడ ‘’ఇంట్లో లేరండీ ప్లీడర్ గారు ‘’అంది .ఎక్కడికి వెళ్ళారని అడిగితె  బెజవాడ వెళ్ళారని రెండు రోజులదాకా రారని చెప్పింది .దీన్ని హాస్యం తో కాష్ చేసుకోవాలని అనిపించి బెజవాడ వెళ్లి ఆప్లీడర్ కి ఒక ఉత్తరం రాస్తూ ‘’ప్రియా !మీరు నా దగ్గర ఒక్క రోజే ఉన్నారు .ఆ ఒక్కరోజే జీవతానికి సరిపడ ఆనందాన్నిచ్చారు .మళ్ళీ ఎప్పుడు వస్తారు ?మీ ప్రియురాలు ‘’శశి ‘’అని రాశాడు దొరసామి .ఆ ఉత్తరం ప్లీడర్ గారి భార్య చూసి ఆమె చేసేహన్గామా మనం ఊహించుకోవాల్సిందే .

6-ఒక సోషల్ మాస్టారు క్లాసులో అలేగ్జా౦డర్ జైత్రయాత్ర గురించి గంభీరంగా పాఠం చెప్పి చివరికి ‘’చివరికి అతడు ఏం చేశాడంటే ?అని అర్దోక్తిగా ఆపి సస్పెన్స్ సృష్టించాడు .అందరూ నోరు వెళ్ళబెట్టి గురువుగారు తర్వాత చెప్పేదాన్ని గురించి కుతూహలంగా ఎదురు చూస్తున్నారు .మాస్టారు ‘’అంతటి చక్రవర్తీ ఎవరికీ  చెప్పకుండా ఢామ్మని చచ్చాడు ‘’అని ముగించాడు .

7-ఒక మంగలి ఒకాయనకు క్షవరం చేస్తుంటే గాట్లు పడి రక్తం కారుతుంటే బాధ మాన్పించటానికి ‘’బాబూ ఇదివరకు ఎప్పుడైనా మా షాపుకు వచ్చారా ??అని మాటల్లోకి దించాడు

ఆ ‘’క్షవరితుడు’’ ‘’లేదు ఆ చెయ్యి యుద్ధంలో తెగింది ‘’అని చెప్పాడు .ఇందులో మ౦గలి అసమర్ధత కనిపిస్తుంది .

8-ఒక ఊళ్ళో భూకంపాలు వస్తుంటే ఒకడు పిల్లలను స్నేహితుడింటికి పంపాడు .నాలుగు రోజుల తర్వాత ఆ తండ్రికిటేలిగ్రాం పంపిస్తూ ‘’నీ పిల్లల్ని నీ దగ్గరకే పంపిస్తున్నాను .భూ కంపాలను మా వూరు నుంచి తరిమేస్తున్నాను ‘’అని రాశాడు .ఎంతో అప్రియమైన సంగతిని అత్యంత సుకుమారంగా చెప్పాడన్నమాట

9-ఒకడు నాకు ఎపెంది సైటిస్ రెండు సార్లు తీశారు .వాడికి తెలీదు అది ఒకసారి తీస్తే మళ్ళీ రాదనీ.

10-ఒకడు న వజ్రాలు అరిగి పోయాయి అన్నాట్ట ,వజ్రాలు అరగటం జరగదని వాడికి తెలియదు .

  శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి  కృతజ్ఞతలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్  

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్  

గారి జీవిత చరిత్రను ‘’ప్రెసిడెంట్ వి.జే,పటేల్ జీవితం’’పేరుతొ శ్రీ పురాణం కుమార రాఘవ శాస్త్రి సంపాదకత్వం లో శ్రీ కంభం మెట్టు సత్యనారాయణ రావు రచించి తండ్రి స్వర్గీయ కంభం మెట్టు బ్రహ్మాజీ రావు గారి పవిత్ర స్మృతి చిహ్నంగా విజయవాడ గవర్నర్ పేట లోని అరుణ ప్రచురణలు –వెరైటీ ఏజెన్సీస్ లో 1946లో ముద్రించారు.వెల-కేవలం ఒక రూపాయి .  

  జనన విద్యాభ్యాసాలు

విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ 18-2-1871న గుజరాత్ కైరాజిల్లా కర్సాద్ గ్రామం లో జన్మించాడు. ముగ్గురన్నదన్న దమ్ములలో పెద్దవాడు కొన్నేళ్ళు బతికి చనిపోగా మిగిలిన ఇద్దరిలో విఠల్ భాయ్ పటేల్, భారత తొలి ఉపప్రధాని ,హో౦ మినిస్టర్ వల్లభ భాయ్ పటేల్ ఉన్నారు .సోదరులిద్దరూ నవభారత నిర్మాతలుగా ప్రసిద్ధులు .సుమారు 80ఏళ్ల క్రితమే వీరికుటు౦బ౦ స్వగ్రామం వదలి అహ్మదాబాద్ , బొంబాయ్ లకు చేరింది.

  చిన్నతనం నుంచి గడుగ్గాయిగా ఉన్న విఠల్ భాయ్ తనలోని  తేజస్సును  దాచుకొన్నాడు  .స్వగ్రామం లో చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్యకు నడియాడ్ వెళ్లి ,లా చదివి పట్టా పొంది 1904లో బార్ అట్-లా చదువుకోసం లండన్ వెళ్ళాడు .ప్లీడర్ గా పెద్దగా సంపాదించింది లేదు ఉన్నదానితోనే పొదుపుగా లండన్ లో కాలం గడుపుతూ ,1908లో ఇండియాకు తిరిగి వచ్చాడు .అకస్మాత్తుగా భార్య చనిపోయింది .దేశ సేవలో జీవితం ధన్యం చేసుకోవాలని నిశ్చయించాడు .లాయర్ గా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు .బొంబాయ్ దగ్గర బాంద్రా ప్రాంతం సివిల్ వ్యవహారాలూ చూస్తూ 1922-23లో జాతీయవాదం తో ఒక పార్టీ పెట్టి బొంబాయి మున్సిపాలిటిలో ప్రవేశించి కే .ఎఫ్ .నారీమన్ ,జమాన్ దాస్ మెహతా ,మోతీలాల్ నెహ్రు మొదలైన ప్రసిద్ధులతో కలిసి మునిసిపాలిటిలోప్రజోపయోగమైన  అనేక మార్పులు  తీసుకురావాలని భావించాడు .నెలలోనే   వివిధ వార్డులలో 250మీటింగులలో మాట్లాడి ప్రజా చైతన్యం తెచ్చి ,గెల్చి మున్సిపాలిటి కైవశం చేసుకొన్నాడు .అవినీతి అధికారులకు సింహ స్వప్నమైనాడు .

  ఈ జాతీయవాదులు పటేల్ నాయకత్వం లో అనేక సంస్కరణలు తెచ్చి ప్రజాస్వామిక సంస్థగా తీర్చి దిద్దారు .మునిసిపల్ వోటింగ్ హక్కు తెచ్చారు .ఖద్దరు ప్రచారం ,స్వదేశీ వస్తు ఉత్పత్తి  పెంచారు .ఆయుర్వేద ,యునానీ వంటి దేశీయ వైద్యానికి ప్రాధాన్యత పెంచారు .అన్ని వార్డులలో  జాతీయ వైద్య శాలలు ఏర్పాటు చేశారు .ప్రజారోగ్య రక్షణకు తాలిమ్ఖానాలు పెట్టారు .కోట్ల రూపాయల అప్పులో ఉన్న బొంబాయి కార్పోరేషన్ ను పటేల్ సముద్ధరించి నిల్వధనం పెంచాడు .గవర్నర్లకు వైస్రాయి కి స్వాగత పత్రాలు సమర్పించే ఆచారం రద్దు చేసి ప్రజాధనాన్ని కాపాడాడు.

  మున్సిపల్ కమీషనర్ లను ప్రజలే ఎన్నుకోవాలి .అప్పుడే స్వపరి పాలన జరుగుతుందని భావించి కృషి చేశాడు .1922నుంచి 25వరకు కార్పోరేషన్ లో కాంగ్రెస్ హవానే సాగింది.1925లో విఠల్భాయ్ బొంబాయ్ శాసన సభలో ప్రవేశించాడు .మొదట్లో పాఠశాలల కమిటీ కి అధ్యక్షుడుగా ఉండి ,ప్రజాభిమానం తో మున్సిపాలిటీ అధ్యక్షుడయ్యాడు .ఒకప్పుడు బొంబాయి కార్పోరేషన్ వారు లార్డ్ కర్జన్ కు స్వాగతం ఇవ్వాలని సంకల్పించగా  ఫిరోజ్ షా మెహతా నెగ్గనియ్య లేదు . అలాగే ఇప్పుడు పటేల్ కూడా వైస్రాయ్ రీడింగ్ కు స్వాగతం ఇవ్వటానికి ఒప్పుకోలేదు .రీడింగ్ విక్టోరియా రాణి ప్రకటనలకు విరుద్ధంగా ,భారత ప్రజల ఆశయాలకు వ్యతిరేకంగా నిరంకుశంగా పాలన చేసే వాడు .ఇలాంటి వాడికి స్వాగతం ఇవ్వటం ఏమిటి అని పటేల్ వాదిస్తే ,చాలామంది ఆయన్ను వ్యతి రేకి౦ఛి విమర్శించగా గా  ఆయనమాట నెగ్గలేదు .నిరసనగా తన అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చేశాడు .కానీ మళ్ళీ ఆయననే ప్రజలు గెలిపింఛి అధ్యక్షుని చేశారు .ఆయనమాట ప్రజావాక్కు అయింది .ప్రభుత్వం లోని జోహుకుం చేసే వాళ్ళతో పోరాడుతూ, ప్రజా సక్షేమం కోసం కృషి చేస్తూ మున్సిపల్ వ్యవహారాలను సర్వ సమర్ధంగా నిర్వహించాడు పటేల్ భాయ్.ఈ అనుభవంతో శాసన సభలో కూడా విజయం సాధించాడు  .

  రైతు పక్షపాతి

 త్రికరణ శుద్ధి ,దయా ఉన్న మనీషి పటేల్ .ఇతరులకష్టాలను చూసి సహించలేడు.కార్యదక్ష దీక్షా పరుడు .గుజరాతీయుల ప్రియ బాంధవుడు .గుజరాత్ లోని బార్డోలి రైతు సత్యాగ్రహం ఈయనతమ్ముడు వల్లభాయి పటేల్ నాయకత్వం లో విజయవంతమై దేశ విదేశీయులను ఆకర్షించింది.గాంధీ ఆశీస్సులు పొంది౦ది కూడా .  బ్రిటిష్ ప్రభుత్వం శిస్తులను 22శాతం పెంచింది .ఇది అన్యాయం ,లాండ్ రెవిన్యు కోడ్ కు విరుద్ధం అని బార్డోలీ రైతుప్రజలతరఫున ప్రతిఘటించి సహాయ నిరాకరణ చేసి శిస్తులు చెల్లించకుండా రైతులు సత్యాగ్రహం చేశారు .ఈ సందర్భంగా విఠల్ భాయ్ గాంధీగారికి ఒక ఉత్తరం  –‘’బార్డోలి సత్యాగ్రహం న్యాయమైనదే .రైతులు నిష్పాక్షిక విచారణ కోర్తుతున్నారు .తమకష్టాలు తీరాలన్నదే వారికోరిక .కానీ ప్రభుత్వం దమననీతితో అణచటానికి ప్రయత్నిస్తోంది .హింసతో శిస్తులు వసూలు చేసే ప్రయత్నం చేస్తోంది .ఈ పరిస్థితులలో నేను చేతులు ముడుచుకొని కూర్చోలేను. ఈ సత్యాగ్రహం కోసం మీరు నిధిని పోగుచేయటం సముచితం .నా వంతుగా వెయ్యి రోపాయలు అందజేస్తున్నాను .ఉద్యమం సాగిన౦తకాలం నేను ప్రతి నెలా వెయ్యి రూపాయలు అందిస్తాను .బార్డోలీ రైతులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను ‘’   అని రాసిన ఉదార హృదయుడు విఠల్ భాయ్ పటేల్ . చివరికి ప్రభుత్వం లొంగి వచ్చి ఆర్ .ఎస్. బ్రూం ఫీల్డ్ ,ఆర్. ఎం .మాక్స్ వెల్ లతో విచారణ సంఘాన్ని నియమించి,  వారు రైతులది న్యాయమైన కోరిక అని నివేదిక ఇవ్వగా ,శిస్తు 6శాతం మాత్రమె పెంచి ఊరట కలిగించింది .1918లో పటేల్ గోకుల్ దాస్ పరాన్ దాస్ పరేఖ్ తో కలిసి కైరా జిల్లా పర్యటించి రైతుల కష్టనష్టాలు విని సానుభూతి చూపాడు .

 హరిజన పటేల్

హరిజనుల మీద అపారమైన దరాభిమానాలున్న విఠల్ భాయ్ ని చూసి మహాత్మాగాంధీయే స్వయంగా ‘’1916లో నేను గోద్రా వెళ్లాను. అక్కడ ఒక రాజకీయ సమావేశం జరుగుతోంది .అదే సమయంలో అక్కడ ఒక హరిజనుల సమావేశమూ జరిగింది .రాజకీయ సమావేశానికి వచ్చినవారందర్నీ నేను హరిజనవాడలో జరిగే హరిజనసమావేశానికి కూడా రమ్మని పిలిచాను .తీరా నేను వెళ్ళే సరికి అక్కడి దృశ్యం చూసి నేను జీవితం లో మరవలేకపోయాను .అప్పటికే అక్కడ విఠల్ భాయ్ పటేల్ వచ్చి ఉన్నాడు .శాసన సభాధ్యక్షుడు అక్కడ రైతు వేషం లో ,సాధువుల టోపీ పెట్టుకొని ,హరిజనులతో కలిసిపోయి కనిపించి నన్ను ఆశ్చర్యపరచాడు .హరిజనులపై అతడికి ఎంతటి మమకారమో గ్రహించాను .సనాతనులు ఏమనుకొంటారో అనే సందేహం అతడికి లేదు ‘’అని చెప్పాడు .అంతటి నిబద్ధత విఠల్ భాయ్ ది.

        శాసన సభా ప్రవేశం

1909లో మింటో –మార్లే సంస్కరణలు అమలులోకి వచ్చాయి .లాన్స్ డౌన్ కాలం లో ప్రవేశపెట్టబడిన సంసరణలకు ఇవి అనుబంధాలు .దీని వలన పరిపాలనలో చెప్పుకోదగిన మార్పులు రాలేదు .పరిపాలనా విధానం ప్రజలు అర్ధం చేసుకోవటానికి ఇవి తోడ్పడ్డాయి .శాసన సభ్యుల సంఖ్య పెరిగింది .సభలో ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరిగింది .పాలన ,ఆర్ధిక విషయాలలో సభ్యులకు కొన్ని అధికారాలు లభించాయి .ప్రజా సమస్యలను శాసన చర్చించే వీలుకలిగింది .

  ఒకసారి బెంగాల్ సభలో లార్డ్ కాల్ మైకేల్  ‘’ప్రభుత్వం శాసన సభకు బాధ్యత వహించి ఉండనంతవరకు ,సభలలో ప్రభుత్వం ఓటములపాలు అయినా ప్రయోజనం ఉండదు ‘’అన్నాడు అయినా ఈ సంస్కరణలు ఆహ్వానిమ్పదగినవే .నిశిత విమర్శకుడు గోఖలే ‘’ఉదార న్యాయమైన సంస్కరణలే ‘’అన్నాడు .కాంగ్రెస్ కూడా స్వాగతించింది .

  విఠల్ భాయ్ కి ఇది మంచి అవకాశం అనిపించి ,ప్లీడరీకి స్వస్తి చెప్పి ,బొంబాయి శాసన సభలో చేరాడు. లార్డ్ వెల్లింగ్టన్ గవర్నర్ .శాసన సభాధ్యక్షుడు కూడా గవర్నరే .ఆయన విఠల్ భాయ్ ప్రతిభాసామర్ధ్యాలు చాకచక్యం అర్ధం చేసుకొని గుర్తించాడు .శాసన సభా ప్రవేశం చేయగానే పటేల్ కు ఉత్సాహం ఉరకలు వేసింది .క్షణం కూడా వృధాకాకుండా ప్రజా సంక్షేమం ,రైతు సేవకు నడుం కట్టాడు .హిందువులలో వర్ణాంతర వివాహాలను అంగీకరిస్తూ ఒక తీర్మానం ప్రతిపాదించాడు .కానీ అది నెగ్గలేదు .ఈ తీర్మాన్నే ఇంపీరియల్ కౌన్సిల్ పో ప్రతిపాది౦చాడుకానీ అక్కడా చుక్కెదురైంది .ఈ రెండు సార్లు సనాతనుల ఆందోళన మిన్నంటింది.అంతమాత్రాన నిరుత్సాహపడలేదు .సంఘ సంస్కరణాభిలాష తగ్గలేదు .దేశాన్ని సాంఘిక రాజకీయ వైజ్ఞానికంగా ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన దీక్ష .దీనికోసం బొంబాయి శాసనసభలో ‘’ఎడ్యుకేషన్ యాక్ట్ ‘’ప్రవేశపెట్టాడు .అంతకు ముందు గోపాలకృష్ణ గోఖలే తన రాష్ట్రం లో నిర్బంధ ప్రాధమిక విద్య ప్రవేశపెట్టటానికి ప్రయత్నించి విఫలుడయాడు.

  విఠల్ భాయి బొంబాయి శాసన సభలో ఐరిష్ పధ్ధతి ప్రవేశపెట్టాడు .అంటే ప్రభుత్వ బిల్లులను వ్యతిరేకించటం .వీరిది సభలో మైనారిటీ వర్గం కనుక తోసెయ్యలేకపోయారు .పతిఘటన మాత్రం చేయగలిగారు .ఇండియాకార్యదర్శిగా ఉన్న మాంటేగ్ –‘’శాసన సభలో ప్రజా సమస్యల  లగురించి చర్చించే సమయం లేకపోవటం పటేల్కు  బాధకలిగించింది .దేశీయవైద్యానికి తీర్మానం చేస్తే ప్రభుత్వం తిరస్కరించింది .ప్రభుత్వ ఖర్చు తగ్గించమని 50 తీర్మానాలు పెట్టాడు .ఫైనాన్స్ సభ్యుడు వాటినన్నిటినీ తోసేశాడు .ఫైనాన్స్ ఖర్చు గురించి మాట్లాడే అవకాశం ఫైనాన్స్ కమిటీలోనైనా ఇవ్వమని కోరాడు .దాన్నీ తిరస్కరించాడు .నిర్బంధ విద్యావిధానాన్ని కూడా ప్రభుత్వం తిరస్కరించింది .మొత్తం మీద శాసన సభలో ఎక్కువ హడావిడి గల్లంతు చేసి౦దిమాత్రం విఠల్ భాయ్ పటేలే ‘’అని చెప్పాడు మాంటేగ్ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-21-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -4(చివరి భాగం )

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -4(చివరి భాగం )

వలత్తోలళ్ నారాయణ మీనన్ ‘’చిత్రయోగం ‘’అనే పెద్ద కథా కవిత రాశాడు .ఇవికాక ఇంకో నాలుగు రాసినట్లు ముందే చెప్పుకొన్నాం .1914లో అనిరుద్ధన్ ప్రచురింపబడి పెద్దపేరు పొందాడు .నాలుగు చరనాలున్న 73కవితలు ఇవి .నాటకీయత పండించాడు .అనిరుద్ధుడికి కారాగార శిక్ష పడినప్పుడు ఉష తనకు మరణ శిక్షకంటే తక్కువ శిక్ష అన్యాయం అంటుంది .’’ఎంతలేని వాడికైనా పెళ్లిపండుగ –సొంతయి౦టికిచేర్చు బతుకుపండుగ –వేయి శరములకైన వెరువను నేను –ఒక్క నీ అశ్రువుకు ఓర్వ లేకున్నాను ‘’అని పరితపిస్తుంది .చెర వదిలి బయటికి అతడిని రమ్మంటుంది .ఆతడు ‘’యాదవులకోడలవు –తగునటే అది –నీ కొత్త బంధువుల ధాటి వినలేదా ?’’ఈశ్వరుడే ప్రేమ బీజం నాటాడు .ఆయనే పెకలిస్తాడా ?అన్నాడు .కానివేళఒంటరిగా  కారాగృహానికి వెళ్లి ,అనిరుథ్ ను కలిస్తే అతడి గుండె చెరువైంది .ఆమెను హత్తుకోగా అతని దృఢ సంకల్పం మెత్తని హృదయం ఉషకు అర్ధమయ్యాయి .

‘’శిష్యుడూ –పుత్రుడు ‘’లో పరశురాముడు కైలాసం వెళ్ళే  దృశ్య వర్ణన పరమాద్భుతం .’’పురజనులతోపాటు –లక్షలాది యక్ష స్త్రీలు –అతనిలాంటి సుతుడు –కావాలని కోరుకున్నారు –‘’మనసు కనులు గుచ్చి విచ్చి పరవశంగా చూశారు .కైలాసంలో ముందుగా గణపతి కుమారస్వామికనిపిస్తే మర్యాదగా పలకరించి ము౦దుకు పోతుంటే తండ్రి విశ్రాంతిలో ఉన్నారు తొందరపడకు అన్నాడుగణపతి.తనకు ఆమాత్రం చనువుందిలే అని ముందుకు అడుగువేస్తే తొండంపెట్టి గిరగిరతిప్పగా ‘’బోజ్జగణపతి చేతిలో-బొంగరమై పోయాడు’’.ఆగ్రహోదగ్రుడై అవమానం సహించలేక శివుడు ఇచ్చి దివ్యాస్త్రం, ఖడ్గం ప్రయోగించగా చెంపను తాకి పిడుగులు పడే భయంకర శబ్దంతో రెండు దంతాలలో ఒకటి తెగి కిందపడింది .మనవడి పతనం మనసును కలవరపరచగా హిమాచలం ,కైలాసం వణికి పోయాయి కర్మసాక్షి కందిపోయాడు .స్కందుడునవ్వగా నంది నొచ్చుకున్నాడు వీరభద్రుడు ఉద్రేకం తో త్రిశూలం ఊపగా రురుడు చండుడు ఉసూరుమన్నారు.సమస్తలోకం దిగ్భ్రమ చెందే సమయం లో రక్తం కారుతూ వినాయకుని దంతం నేల రాలింది.పార్వతికి ఒళ్ళు మండిపోయి అందర్నీ తోసుకొంటూ ముందుకు వెళ్లి మొగుడిమీద విరుచుకుపడి –‘’గురువంటే తమ శిష్యునికి ఎంత గౌరవం –ఇప్పుడు కనబడి తరించాం-దివ్యాస్స్త్రాలు ఏవైనా మిగిలి ఉంటె –ఆయనకు ప్రసాదించండి –అందుకే అయోగ్యులకు విద్యాదానం తగదు అన్నారు ‘’అని దెప్పగా శివుడు ఏమీ అనలేక ,నివ్వెరపోయి నిలుచు౦డి  పోతే మురళీ రవంతో రాధాదేవితో శ్రీ కృష్ణుడు –‘’నగుమోము కలవాడు నల్లానల్లని వాడు మేటి ఆటలవాడు ,మెరపు వలువలవాడు –మురళిపట్టినవాడు ,మౌళి పింఛమువాడు –సంపెంగ పువుజోడు సఖిని కూడి ‘’సాక్షాత్కరించాడు .రాధ –‘’ఇనుడుపొడిచిన వేళ-కమల కళకళలీల ‘’గా ఉంది .పార్వతితో రాధ ‘’పిల్లలు అల్లరిపడితే తల్లడిల్లటం తల్లికి తగదు  -‘’పరశు రాముని నీ పతి శిష్యుని చేసిన దాదిగ-నీకు పుత్రులు ముగ్గురు ‘’అంది .అతడు పురుటి నెప్పులు లేకుండా పుట్టిన ఘటం. అతడిని అందరికంటే ఎక్కువగా ఆదరించాలి అని హితవు చెప్పగా పార్వతి శాంతించటం తో అయిపోతుంది .

  మేరీమాగ్డలీన్ లో బైబిల్ కథఇతి వృత్తం .క్రీస్తు ధనికుడైన సైమన్ ఇంటికి వెడితెఅతది ఆహ్వానం లో ఆత్మీయత కనిపించదు –నడమంత్రపు సిరి మిడిసిపాటు తో –అహంకరించిన శిరము వొంగునే ‘’అంటాడు కవి .వాడి భటులు క్రీస్తుముందు మధుర ఖాద్యాలు ఉంచుతారు. క్రీస్తు జుట్టు ముఖం చూస్తె ‘’కల్లోలిత కాళిందీ తరంగాలు ‘’కనిపించాయి .మేరీ ప్రవేశించాక అక్కడ స్వర్గద్వారం ఉన్నట్లు భావించింది –‘’నీ కాళ్ళకంటిన నేరాల బురద-నీ కంటి కన్నీరు కడిగినే ప్రమదా ‘’అంటాడు కవి .పేద గుడిసెలో జన్మించిన మేరీ ని చుట్టుముట్టినకాముకులను వారించినా వాళ్ళ పొగడ్తల ఊబిలో కూరుకుపోయింది ఆ అందాల రాశి .రొంపిలో దిగబడింది .క్రీస్తు గురించి బృందావన వేణుగానం విన్న హరిణి అయి   తన పాప ప్రక్షాళన చేసుకోవాలని వచ్చింది . గుండెలు అవిసేట్లుగా రోదించి బాధకొంత ది౦చు కొన్నది –‘’రోది౦చ వే హరిణాక్షిరోది౦చవే –రోదించ మనక్రీస్తు ఓదార్చులే ‘’ అనే అనునయవాక్యాలు వినిపించి వచ్చి ,తనపడుపు వృత్తి సంపాదన అంతా పేదలకు పంచేసి శషజీవితం ప్రార్ధనలతో గడిపి జీవితాన్ని సార్ధకం చేసుకొన్నది మేరీ మాగ్డనాల్డ్.

   1945లో సెప్టెంబర్ దాకా కేరళ ప్రళయ వర్షాలతో మునిగిపోయింది.దాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రించాడు ‘’అన్య వేషభ్రమం ‘’కవితలో .కేరళీయుల దుస్తుల్లో పాశ్చాత్య పోకడలు గమనించి గేలి చేస్తూ జాలిలేని వానతో కవి అంటాడు –

‘కప్పు బెకబెక ఆపే నెందుకు –కుప్పతిప్పలు కురిసినందుకు –నెమలి పురి విడి ఆడదేందుకు –నిలువునా ఇల మున్చినందుకు – మెరపు నిను విడి తొలగే నెందుకు పుడమి ఆశలు పూడ్చినందుకు ‘’అంటాడు .పున్నమి రాత్రుల్లల్లో కూడా అర్ధరాత్రి అయినా చంద్రుడూ ,,పగలు మిట్ట మధ్యాహ్నమైనా సూర్యుడు కనిపించలేదు –‘’పంటను కోసే వేళలలో – కంటికి నీరయే కేరళలో ‘’’

‘’పొరుగింటి పులుపుకూర మధురమా –నలుపు నీకు సొగసు నీదు శిశిరమా –జిలుగుచున్న చలువవలువ దాల్చుమా ‘’అని విదేశీ వస్త్ర వ్యామోహం పై కవితాశరం ఎక్కు పెట్టాడు .వేసవిలో చినుకు పడకపోవటాన్ని –‘’ఫెళఫెళా ఉరుములభేరీమృదంగాలు –తళతళామెరుపుల మిరుమిట్లు నాట్యాలు –కుండపోతగా వానకురియు సూచనలు –ఓ చుక్కవానైనా పడదుఅసలు ‘’

పావురాన్ని –‘’ముక్కున ,పదమున చిక్కని లత్తుక –రెక్కల సందున రంగుల అల్లిక –ఎర్రనికన్నుల కుంకుమ అమరిక –అరటి పూవు నీ దేహము పోలిక –వివరించుటకై చాలునే నాలుక ?’’అని వర్ణించాడు మీనన్ .మనదేశ అహింసా పధ్ధతి చెబుతూ –‘’గరిక పరకను పెకలించటానికైనా పాపం అనుకొనే దేశం లో –అహింసను పరమ ధర్మంగా త్రికరణ శుద్ధిగా పాటించే దేశం లో –మహాత్ములు నివశించే దేశం లో ‘’ఇంకా ఆటవికత్వమా మనుష్యులలో అని ప్రశ్నించాడు .పొలాల దగ్గర పశువులపాలన లో –‘’దున్నలూ మీరు మాకు అన్నలు –మా అమ్మపాలకోసం మేమూ ఎదురు చూస్తాం తెన్నులు .ఎద్దులూ –మీరేమాకు నిజమైన పెద్దలు –మీరు దున్ని పండిస్తేనే మా నోటికి అందుతాయి ముద్దలు ‘’.

  తనకు వచ్చిన చెవుడు పై రాసిన’’ బధిర విలాపం’’ లో’’తెల్లవారినా –చింతయే మిగిలేన్ ‘’.సాటికవులు వచ్చి కవితలు వినిపిస్తుంటే ‘’చెవికి చేరక తెలియనేరక –కష్టం ‘’అనిపించింది .

  వచనంలోనూ చాలా విశిష్టరచనలు చేశాడు వలుత్తోల్ .అతని కవితా శిల్పం అమోఘమైనది .నైర్మల్య మాధుర్య సౌందర్య విలసిత౦ కవితలు రాశాడు .మధుర మనోజ్ఞ వర్ణనలతో మనసు ఆకర్షిస్తాడు .సత్వం మృదుత్వం కోమలత్వం అతని సొత్తు .మాటలతో కదలికలు కవళికలు వివిధ ఉచ్చారణలు చిత్రి౦చగల నేర్పరి .అతని వర్ణనాత్మక ప్రతిభ అనన్య సదృశమని పిస్తుంది .

స్వతంత్ర భారతం గురించి –‘’భారతమను మత్తేభము –సాధించెను స్వాతంత్ర్యము –అణగ ద్రోక్క కాదుసుమీ –నిస్సహాయ జనరక్షకు ‘’అని దేనికోసమో వివరించాడు .అతనికవితలలో ధ్వనీ ఔచిత్యమూ పుష్కలంగా దర్శనమిస్తాయి .సంస్కృత ,ద్రావిడ ఛందస్సులపై అతడి ఆధిపత్యం తిరుగు లేనిది .లయలో ఉయ్యాలలూగిస్తాడు .పురాతన సంప్రదాయ రీతిలోని గొప్ప మంచి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకొన్నాడు .లఘుకావ్యాలను నాటకీయతతో సజీవం చేశాడు గేయాలను  అత్యంత చలన శీలంగా మలిచాడు. పద సముదాయ నిర్మాణం లో అతడొక మహా శిల్పి .తన జీవన దృక్పధం తో పొందిన ,పండిన  ఆనందాన్నితనదైన శబ్ద జాలం తో మలచి జనావళికి అందజేసిన మహాకవి వల్లత్తోళ్ నారాయణ మీనన్ .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -3

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -3

తన ప్రతిభకు తగిన పురస్కార గౌరవాలు అందుకొన్నాడు వలత్తోళ్ నారాయణ మీనన్ .1919లో కొచ్చిన్ మహారాజు ‘’కవి తిలక ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .1948లో మద్రాస్ ప్రభుత్వం నలుగురు ఆస్థానకవులలో  ఒకరుగా చేసి గౌరవిన్చింది.కేంద్ర సాహిత్య ఎకాడమి సభ్యుడిగా ,కేరళ సాహిత్య అకాడెమి ఉపాధ్యక్షుడుగా పని చేశాడు .1955లో భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారమిచ్చి గౌరవించింది .పాఠక అభిమానులు ఆయనను ‘’మహాకవి ‘’బిరుదునిచ్చి హృదయం లో ప్రతిష్టించుకొన్నారు

   1950లో 72వ ఏట వార్సా లోని శాంతి సమావేశానికి హాజరయ్యాడు .ఇంగ్లీష్ కాని మరే ఇతర పాశ్చాత్య భాష కానీ రాని ఆయన వార్సాలో తనపద్యం వినిపించాడు .పారిస్ యూని వర్సిటిలో కథాకళి గురించి మహోపన్యాసం చేశాడు .చైనా ,మలయా సింగపూర్ లో కథా కళీ ప్రదర్శనలిప్పించాడు .తను చాలాకాలం సభ్యుడుగా ఉన్న కేరళ సాహిత్య పరిషత్ కు 1946లో అధ్యక్షుడై,పదేళ్ళు నిరాటంకంగా దాన్ని మహారాజులా ఏలాడు .సంస్థ వార్షిక సమావేశాలో అతని ప్రసంగాలన్నీ పుస్తక రూపం పొందాయి .13-3-1957 న 79వ ఏట కేరళ సాహిత్య సరస్వతి పద్మభూషణ్ వలత్తోళ్ నారాయణ మీనన్ నారాయణ సాన్నిధ్యం చేరుకున్నాడు . .

   సాహితీ నారాయణీయం

12వ శతాబ్దినుంచి మలయాళకవిత్వం ‘’మణిప్రవాళ’’శైలిలో -అంటే సంస్కృత మణులు. మళయాళ పగడాలతో శోభగా ఉండేది .ఎన్నెన్నో సంస్కృతపదాలను మలయాళం జీర్ణించు కొన్నది.దీన్ని బాగా వంట పట్టించుకొన్న మీనన్ గేయకవిత్వంలోనూ పరుగులు తీసే సంస్కృతపదాలు వాడి కొత్తదనం తెచ్చాడు .ఎంటే గురునాథన్ –నాగురువు గాంధి అనే కవితలో –‘’గీత జన్మించిన భూమి మాత్రమె –కర్మవీరునికి జన్మభూమి –హిమగిరి వి౦ధ్యలమధ్య దేశమే నిగ్రహమెరిగిన కేసరి అవుతుంది –తల్లి గంగచే తడుపబడిన భూమే –కల్పతరువుకు కన్నతల్లి అవుతుంది ‘’.గాంధీలో ఆయనకు విశ్వామిత్రుని వైరాగ్యం ,జనకుడి కర్మయోగం ,భీష్ముడి ధర్మ యుద్ధ పరాక్రమంకనిపించాయి .మేరీ మేగ్దలీన్ లో ఏసు క్రీస్తు కృష్ణుడుగా కనిపించాడు –సాటి ఎరుగని శ్రావ్యమా మురళి –క్రీస్తుయే కృష్ణుడైసవరించే మురళి ‘’అంటాడు .సూర్యుడిని మూర్తీభవించిన జ్ఞానం అన్నాడు –‘’పూజారి పూలపళ్ళేమైనా ,జాలారి వంటకుండ అయినా –సమంగా ముద్దిస్తాయి నీ కిరణాలు –సహజంగా అవి అతి పవిత్ర కిరణాలు ‘’అన్నాడు .

 పాలుపితుకుతున్న తల్లి యశోదను ఆనుకొన్న చిన్ని కృష్ణుడు –అడపా దడపా భూమిని పుడుతూ –చెడు ఖండించి మంచి పెంచుతాడు –‘’త్రిలోకాలకూ సరిపడు పదాల –త్రిస్థాయిలో నృత్యం చేస్తాడు .-‘’పసి బాలుడిగా పైకి కనిపించినా –ఏలే దొరవని తెలుసులే –రక్షణ నిచ్చే రాజ విరాజా –నల్లని సామీ నమస్సులివిగో ‘’అంటాడు నారయణమీనన్ .అక్రూరుడికి కనిపించిన కృష్ణుడు –నందుని నట్టింట హరి వెలిగించిన ఆశల అందాల దివ్వె –యశోద గుండెనిండా నీలాల రవ్వ –గోపికలతో గెంతే చిన్నారి నెమలి –వెర్రిగొల్లల బతుకు వెన్నెల చేసినవాడు ,వేదాలు నేర్చిన  విద్వాంసులు ఎరిగిన విశ్వ రహస్యం ఆతడు ‘’

  గాంధీ అవతరణలో –కొత్త బుద్ధుని చూడ కోర్కె కలిగింది –కనులని౦డుగా కాంతి నింపింది –రూపు దాల్చిన వెలుగు ఎదుట నిల్చింది –గురుపాద దర్శన భాగ్యమమరింది  -కాశీ ప్రయాణం కుదిరింది కానీ –గంగలో మునిగే భాగ్యమబ్బలేదు ‘’అని నిట్టూర్చాడు .కవిత అతనికి –‘’అలసి ఉన్న పసిబాలుని చిరుబుగ్గల చిత్తడిలో –కవితా ! నీ కమనీయాకృతి-కన్నుల కనుపట్టు సుమీ ‘’

   లంకలో ‘’మండోదరి ఉండే దరి –లంకాపురి కేదీ సరి ?అన్నాడు

  జాతీయ కవిత్వం

మాతృవందనం లో –అమ్మకు హారతులు –మాఅమ్మకు నతులు-జీవనమిడి,దీవేనలిడు-సత్రాజితుకు అ మిత్రుడు శమంతకం ఇచ్చినట్లు-కడలి పరశురాముడికిడిన రత్నమిదే ‘-అమ్మమాట వేదము ,అమ్మసేవ పరమార్ధము –అమ్మకొరకు నైవేద్యమైన –బ్రతుకు కడు ధన్యము –పుణ్య మాతృభూమి మ్రోల –పుడమి వేరు దైవమేల ?”’అని తన ప్రగాఢ దేశభక్తి చాటుకోన్నకవి మీనన్.’’శాంతి మా ఐశ్వర్యం ‘’అని చాటాడు .’’సంగ్రామ సంరంభం లో వైరాగ్యపు పిలుపు ,వేటగాడి గుడిసెలో పడుపుకత్తె నివాసం లో నైనా –పవిత్రత గుబాళింపు –ఇదే హిందూ దేశం దాని ఔన్నత్యం హిమాలయ శృంగం ‘’అన్నాడు .కర్ణుడు మన తాతలనాటి నేత –తాతల తలదన్ను దాత ‘’-ఓ పాముబతుకు పాలుపోద్దామని –ఒక పక్షికాలేదా కుక్షికి కూడు ?’’అని త్యాగపురుషులను కీర్తించాడు .తనగురువు గాంధీకి –‘’తారకలే మాలికలై వెలుతురూ వెదజిమ్మాయి ‘’ఆయనకు క్రీస్తుత్యాగం కృష్ణుని ధర్మగుణం ,బుద్ధుని అహింస ,రంతిదేవుని కారుణ్యం ,హరిశ్చంద్రుని సత్యవ్రతం .మహమ్మదు స్థిరత్వం ఆవేశించాయి .

  ఇంగ్లీషు వారి ఆటలిక సాగవు అని అన్యాపదేశంగా –‘’పెనుచీకటి ఆటవికులు ఇక చెల్లా చెదరు –అడవిలో చిక్కుకున్న వెలుతురుకు విడుపు –తూర్పు దిశతనదారిద్ర్యపు ఉడుపు –సాగరాన పారవేసి సరిగా చీర దాల్చు –నా వెనుక యువకులనాజూకు పాదాలు –నలగకుండా ఉంటె అదే పది వేలు ‘’అన్నాడు

  లఘు కృతులు

లలో సమస్తజగమూ కవితాగానం చేస్తుంది .ద్రావిడ ఛందస్సు మంజరి లో ‘’కిలిక్కొంచల్ ‘’రాసి తన  కళాభిజ్ఞత నంతటినీ  ప్రదర్శించాడు –బాల సీత –మణులతో పసిడితో మెరసేటి మెడపైన-పషి కూనల నదిమి పరవశించింది –చిన్ని ఎర్రని నోరు –చెవిప్రక్క తాకించ –  కెంపు అతికినయట్లు ‘’కన్పించి౦ది-పక్షి దేహము సొగసు ‘’ .’’నరేంద్రుని ప్రార్ధన లో స్వామి వివేకానందకళ్ళల్లో  ఒకరోజు  రామకృష్ణ పరమహంస కు  నీళ్ళు కన్పించాయి .స్వామి గానం అమృత లహరి ఆయనకు .శిష్యుడి దుఖానికి చలించిపోయిన గురువు –‘’లోకం శోకం తుడుస్తావని –శపథం చేసిన  నరేంద్రబాబూ – నీ కంట్లోనా కడివెడు దుఖం ??’’అని అడిగితె తన తల్లి చాలారోజులనుంచి పస్తులు ఉంటోందని చెప్పాడు .తండ్రి ఉన్నప్పుడు ఆయిల్లు మానవ సేవకు కేంద్రం ఇప్పుడు దారిద్ర తాండవం .గురువు తరుణోపాయం చెప్పాడు –‘’కరిగి దొరలే వెండిఏ గంగ చలువ ?-విరిసి మురిసే పైడి ఇనుడు ఎవ్వరివాడు –ఇరులు చీల్చే మణుల తారల తావేది ?కాళికాజననికి-కేళకావని ఇది –ఆమాతనే అడుగు –లేమి తొలగు ‘’అని హితవు చెప్పాడు .అల్లాగే కాళికాలయానికి వెళ్లి, కాసేపట్లో మళ్ళీ గురువు దగ్గరకు కన్నీళ్ళతో రాగా కారణం అడిగితె –సంపదకాదు నేను అడిగింది గురువరా –సంపద అనే సంకెల లనుంచి విడుదల ‘’అన్నాడు .’’నువ్వే ఈమాయను విడదీయగలవు ‘’అన్నాడు గురువు .

  రైతు జీవితాన్ని అక్షరబద్ధం చేసి చివరికి ‘’సర్వే జనా సుఖినో భవంతు ‘’తో పూర్తి చేశాడు కవి .తనకు  మళయాళ భాషపై ఉన్న అభిమానాన్ని చాటుతూ ‘’ఎంతేభాష ‘’-నా భాష ను మక౦ద మంజరి ఛందస్సులో రాశాడు –‘’పెరియార్ మధుప్రవాహాలు –చందనవన పరిమళాలు –సంస్కృత సహజ రుచులు –మధుర తమిళ నుడి సొగసులు –కలుపుకున్న కలభాషిణి –నామళయాళ౦  మందాకిని  ‘’అని ఉప్పొంగిపోతాడు .’’కన్నతల్లీ నుడులు గంపెడు మల్లెలు –తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలే –ఆరోగ్యభాగ్యాన అలరారు ధన్యులు –సురలోకము నుండి సుధను తెచ్చిచ్చినా –అమ్మ వడ్డిస్తేనే అమృతము మాకు ‘’అని తల్లిభాషలోనే అన్నీ నేర్చుకోవాలని ఆనాడే హితబోధ చేశాడు నారాయణ మీనన్ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -2

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -2

  తిరుచూరు వదిలి వెళ్లేలోపే మీనన్ వాల్మీకి రామాయణ అనువాదం మొదలుపెట్టాడు .ఎంతటి పనిఒత్తిడిలొ ఉన్నా ,రోజుకు కనీసం నలభై శ్లోకాలు అనువది౦చేవాడు .విద్వాంసులు ఆమోదించారు .కొందరు చందా దార్లను పోగేసి ధారావాహికంగా 1907లో ప్రచురించాడు .కావ్యం పూర్తయ్యాక ఎన్నో పునర్ముద్రణలు పొందింది .చివరి చివరి ముద్రణలో నగిషీలు చెక్కి భేష్ అని పించాడు ..తిరుచూరులో ఉండగానే ఒకసారి విపరీతమైన జలుబు చేసి చెవులు వినిపించని స్థితి ఏర్పడితే తల్లడిల్లి పోయాడు .ఎందఱో వైద్య ,జ్యోతిష్యులకు చూపించినా,ఎన్నో రోజులు చికిత్స అవసరమైనా,ఫలితం దక్కక, దేవుళ్ళను ప్రార్ధిస్తూ పద్యాలు గుప్పించి రాస్తూ మొరపెట్టుకొన్నాడు .ఫలితం పుట్టెడు చెవుడు ప్రాప్తించింది .గంగ వెర్రు లెత్తాడు.’’బధిర విపాపం ‘’అనే ఆత్మాశ్రయకావ్యం రాశాడు చేసేది లేక .

  1910స్వంతూరు చేరి గొప్ప కావ్యనిర్మాణ౦ చేయాలని భావించాడు అప్పటికే అజకతు పద్మనాభ కురూప్ ‘’రామ చంద్ర విలాసం ‘’,పండాలంకేరళవర్మ’’రుక్మాంగద చరితం ‘’,కోడంగల్లూర్ కాజుణ్ణి తంపురాన్’’పాండవోదయం ‘’,కేసి కేశవ పిళ్ళై ‘’కేశవీయం ‘’ఉల్ళూరు ‘’ఉయా కేరళం ‘’రాసి ప్రసిద్ధికెక్కారు .ఆ ధోరణిలో వలత్తోళ్’’చిత్ర యోగం ‘’ 36వ ఏటరాశాడు .దీనికి సంస్కృత కథా సరిత్సాగర కథ ఆధారం .1591పద్యాలతో రెండేళ్ళు రాశాడు సనాతనులు మెచ్చినా ఆధునికులు ఇంకా పాత చింతకాయ పచ్చడేనా  అన్నారు . ఆతర్వాత 15ఏళ్ళు అతని రచన నిరాఘాటంగా సాగింది.నాటక గేయ వర్ణనాత్మకాలు ఎన్నో రాశాడు.’’బంధనాస్తనాయ అనిరుద్ధన్’’-బందీగా అని రుద్దుడు ,శిష్యానుం మకానుం ‘’-శిష్యుడూ కొడుకూ ,’’మేగ్డలేన మేరియం ‘’  -మేరీ మాగ్డలీన్ వజ్రపు తునకలు .సాహిత్య పద్యమంజరి లోని పద్యసంకలనాలు అప్పుడు రాసినవే .ఇందులో మొదటిది 1917లో, చివరిదైన ఏడవది 1930లో వచ్చాయి .ఆతర్వాత మళ్ళీ నాలుగు సంకలనాలు తెచ్చాడు .కొన్ని సంస్కృత పురాణాలు ,స్వప్నవాసవదత్తం వంటి నాటకాలు అనువదించాడు .కేరళోదయం పత్రికకు సాహితీ సంపాదకుడుగా ఉన్నాడు .

   23వ ఏట ఏడవ ఎడ్వర్డ్ రాజు పై పద్యాలు రాశాడు మీనన్ .ప్రభుత్వం బహుమతి ప్రకటిస్తే ‘’నా గురువైన గాంధీని బంధించిన ప్రభుత్వం నుంచా నేను బహుమతి తీసుకొనేది ??’’అని చెప్పి వద్దన్నాడు .యావత్ప్రపంచాన్నీ గడగడ లాడించిన చక్రవర్తి బహుమతిని వద్దుపొమ్మన్న దేశభక్తికల జాతీయ గ్రామీణ కవి అనిపించాడు .అప్పుడప్పుడే పాదుకొంటున్న జాతీయవాదం మీనన్ ను ఆక్రమించింది .భారతీయ స్వేచ్చకోసం ఎన్నో పద్యాలు రాసి దేశ భక్తి చాటుకొన్నాడు .ఈ పద్యాలు మళయాళ ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసి జాతీయతతో స్వాతంత్ర్య సాధనకోసం ముందడుగు వేయించాయి

 వలత్తోల్ మొదటి ప్రాణం కవిత్వమైతే రెండవప్రాణ౦ కథాకళి.’దీనికి పునరుజ్జీవనం తేవటమే అతని ధ్యేయమైంది .ఈ కళ ప్రదర్శనకు ఒక శిక్షణాలయం పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తే మానాకులం రాజా స్పందించి  తనభవనం లో ఏర్పాటు చేయమని కోరగా ‘’కళామండలం ‘’స్థాపించి ,విరాళాలు స్వీకరించి సమర్ధులైన గురువులను ఏర్పాటు చేశాడు .పర్యవేక్షణలో రాత్రింబవళ్ళు గడిపేవాడు .విద్యార్ధులకు గట్టిపునాది ఏర్పడటానికి పండితుడు, విమర్శకుడు, స్నేహితుడు అయిన కృష్ణ మరార్ ను నియమించాడు .స్వంతభవన’’౦చేరు తిరుత్తి’’లో  నిర్మించి కళామండలం ‘’ను ఇక్కడికి మార్చాడు .కేరళలోని అన్ని ప్రాంతాలనుంచీ ,దేశ విదేశాలనుంచీ కూడా విద్యార్ధులు వచ్చిశిక్షణ పొందారు .కేరళ నృత్యానికీ శిక్షణ ఇచ్చేవారిక్కడ .1939లో తనబృందాన్ని రవీంద్రుని శాంతి నికేతనానికి తీసుకు వెళ్లి ప్రదర్శన ఇప్పించాడు. తిలకించిన రవికవి ,పులకించి ‘’ భారతీయ నృత్య సంప్రదాయం కనుమరుగై పోతున్న ఈ కాలంలో ఉత్తరాది వాళ్ళమైన మాకు ఈ మహత్తర నృత్య నాటి క ప్రదర్శన చూపించి,గగుర్పొడిచే  మధురానుభూతి కలిగించారు ‘’అని మనస్పూర్తిగా మెచ్చాడు.దేశ దేశాలను దృష్టిలో పెట్టుకొని మంచి క్రమ శిక్షణతో సంస్థను  మీనన్  తీర్చి దిద్దాడు .అదే తపన ఆయనకు .1941లో ఈ సంస్థను కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేశాడు .అది మూడుపూలు ఆరుకాయలుగా దినదిన ప్రవర్ధమానమై ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇదంతా వలత్తోళ్ నిరంతర కృషి ఫలితమే, విజన్  ఫలితమే . ఆయన ఇలాంటి శిక్షణాలయం స్థాపిస్తున్నప్పుడు చాలామది ‘’బూజు పట్టినకళ కు చైతన్యం తేవటం అసాధ్యం .మ్యూజియం లో భద్రపరచటం మంచిది ‘’అని విమర్శించి నిరుత్సాహపరచే ప్రయత్నం చేశారు .కానీ వలత్తోళ్ పుణ్యమా అని ఆ ‘’అవశేషం’’ కొత్త ఊపిరులు పోసుకొని నవనవోన్మేషంగా విరాజిల్లుతోంది .

  1930 తర్వాత కళామండలం కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ,కవిత్వం రాయటం ప్రచురించటం మానలేదు సాహిత్యమ౦జరి నాలుగు భాగాలతోపాటు, విషక్కుని ,దివాస్వప్నం,వీరశృ౦ఖల  లఘుకావ్యాలు రాసి ప్రచురించాడు .1941లో ‘’అచ్చానుం మాకలుం ‘’-తండ్రీ- కూతురుకావ్య౦ రాసి  గొప్ప ప్రశంసలు పొందాడు.1940-50మధ్య రాసినకవితలలో వామపక్ష భావం కనిపిస్తుంది .’’ఇండియా యుచే కరాచిల్ ‘’-ఇండియా కన్నీళ్లు ,’’వళ్ళత్తోళ్ రష్యాయిల్—రష్యాలో వల్లత్తోళ్ సంకలనాలు అతని వామపక్షభావ దృక్పధానికి ప్రతీకలు .

   1937లో కాళిదాస శాకుంతల నాటకం వంటి అనేకం అనువదించాడు .12వ శతాబ్ది సంస్కృతకవి వత్సరాజు నాలుగు నాటికలు –కపటకేళి,కర్పూర చరితం ,రుక్మిణీ హరణం ,త్రిపురదహనం తర్జుమా చేశాడు  .1951లో క్షేమేంద్రుని బోధి సత్వ సాధన ,కల్పలత లకు మీనన్ చేసిన అనువాదాలను తిరువాన్కూర్ యూని వర్సిటి ప్రచురించింది .1952లో హాలుని గాథా సప్తశతి ని ‘’గ్రామ సౌభాగ్యం ‘’గా అనువదించి వెలువరించాడు .

  75 ఏళ్ల వృద్ధాప్యం లో సంస్కృత ఋగ్వేదాన్ని మళయాళ భాషలోకి అనువాదం చేసే బృహత్తర బాధ్యతను తలకెత్తుకొన్నాడు. దీనికి ప్రేరణ ‘’వెనుకబడిన వర్గాలకు వేదాలు నేర్పాలి ‘’అన్న వివేకానందుని  స్పూర్తి వాక్కు  .రెండేళ్ళు విపరీతంగా కృషి  చేసి అనువాదం ప్రచురించాడు .పండితులనుంచి పెద్దగా మెచ్చికోలు రాకపోయినా, మలయాళం లో చిరకాలం మిగిలి పోయినస్వప్నం , కోరిక మాత్రం తీరిపోయింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-21-ఉయ్యూరు ,  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్
1878లో జన్మించి 1957లో మరణించిన వలత్తోళ్ నారాయణ మీనన్ మలయాళకవిత్వానికి కొత్త రీతులు చూపిన ప్రముఖులలో ఒకడు .సంప్రదాయబద్ధమైన చదువు చదివి ,సంస్కృతం లో నిష్ణాతుడై వాల్మీకి రామాయణం, ఋగ్వేదం లను మలయాళభాశషలోకి అనువదించిన ప్రజ్ఞాశాలి .బధిరత్వం బాధించినా ,సాహిత్య సేవలో ,కథాకళీ నృత్యాన్ని పునరుద్ధరించటం లోనూ జీవితాన్ని ధారపోసిన త్యాగి .’’కళామండపం’’ స్థాపించి తన బృందం తో శాంతినికేతన్ ,రష్యా, చైనా ,ఫ్రాన్స్ లలో పర్యటించినవాడు .మహాత్మా గాంధీని గురువుగా భావించాడు .బ్రిటిష్ ప్రభుత్వ బహుమతిని తిరస్కరించిన స్వాతంత్ర్యాభి మాని..తనమాతృభాషను సుసంపన్నంచేసి దానికి చేయగలిగినంత సేవా చేసిన కాల్పనిక స్రష్ట అయిన సరస్వతీ మూర్తి .కేంద్ర సాహిత్య అకాడెమి సభ్యుడిగా సేవలందించాడు .1955లో ‘’పద్మ భూషణ్ ‘’అయ్యాడు .ఈ సాహితీ మూర్తి జీవిత చరిత్రను ఆంగ్లం లో బి .హృదయకుమారి రాస్తే, శ్రీ అవసరాల రామ కృష్ణా రావు తెలుగు సేత చేస్తే ,ముఖ చిత్రరచన ప్రముఖ దర్శకుడు సత్య జిత్ రే చేయగా , కేంద్ర సాహిత్య అకాడెమి 1977లో ప్రచురించింది. వెల రూ-2-50.
మళయాళ సాహిత్య పునరుజ్జీవనకర్తలు ,పాతకొత్తల మేలుకలయికతోక్రొత్త మెరుగులు తీర్చిన కవిత్రయం కుమారన్ ఆశాన్ ,వలత్తోళ్ రాయణ మీనన్ ,ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ లు .వీరికవితలల్తో మలయాళకవిత్వం ఆధునిక మార్గం పట్టింది .ఈ ముగ్గురూ 1870ప్రాంతకవులే .’’వల్లత్తోళ్’’గా సుప్రసిద్ధుడైన నారాయణ మీనన్ 16-10-1878న మళయాళ బ్రాహ్మణ కుటుంబం లో దామోదరన్ ఎలాతూర్,కుట్టిప్పరమ్మ దంపతులకు ఉత్తర కేరళలోని పొన్నై తాలూకా చేన్నెర అనే పల్లెటూరిలో జన్మించాడు .ఇది వేట్టాడునాడ్ అనే స్వతంత్ర రాజ్యం లో భాగం .మళయాళ కవితా పితామహుడు తుంజతు ఎలుతప్పన్ ఇక్కడే పుట్టాడు .మలయాళం లో ప్రాథమిక విద్య పూర్తి చేసి ,ఆయుర్వేద వైద్యుడైన మేనమామ రాముణ్ణి మీనన్ వద్ద సంస్కృతం నేర్చి ,కావ్యనాటకాలు పూర్తి చేసి ,కైకలుంగార రామ వారియర్ అనే మహా సంస్కృత విద్వాంసుని వద్దమేనమామ ప్రోత్సాహం తో చేరి నిష్ణాతుడయ్యాడు. మేనల్లుడికి మేనమామ అప్పటికే ‘’అష్టాంగా హృదయం ‘’అనే భారతీయ ఆయుర్వేద మహా గ్రంథాన్ని బోధించేశాడు .కవిత్వం లో ప్రవేశం కలిగిన అతడితో శ్లోకాలు రాయించి ప్రోత్సహించాడు .ఇతని తండ్రికి కథాకేళి ఊపిరి,శ్వాస ,అన్న౦ ,నీరు .ఎక్కడ ప్రదర్శన జరిగినా తప్పకుండా వెళ్లి చూసేవాడు .ఈ ప్రభావం కొడుకుమీదకూడా బాగానే పడింది కవిత్వం తో బాటు .
13వ ఏట నే సునాయాసంగా సంస్కృత ,మళయాళ కవితలు రాసేవాడు .తల్లి చనిపోయినప్పుడు రాసిన విషాద గీతికలలో అతని పాండిత్యం ప్రస్ఫుటంగా కనిపించింది .20వ ఏట’’రుతువిలాసం ‘’ కాళిదాసుని కవితకు మళయాళఅనుసరణగా రాశాడు .ఇందులోకొన్ని పత్రికలలో అచ్చయ్యాయి .సాహితీ ప్రముఖుల ప్రశంసలు అందుకొన్నాడు ఈయువకవి .మహాపండితుడు పునస్సేరి నంపి నీలకంఠ శర్మ ,సమూరితి రాజ వంశానికి చెందిన ఎట్టన్ త౦పు రాన్ అనే కవిపోషకుడూ వలాత్తోళ్ ను మెచ్చుకొన్నారు .త౦పురాన్ సారధ్యం వహించే సాహితీసదస్సులలో ఉత్సాహంగా మనయువకవి పాల్గొనే వాడు .
ఆకాలం లో కేరళ భాగ్య సీమకాదు.రాజకీయ స్వేచ్చ తక్కువ .కానీ సంస్కృతం మాత్రం సంప్రదాయ బద్ధంగా జోరుగా వర్ధిల్లింది .ఎక్కడ చూసినా ,కవిపండితులే కనపడే వారు .రాజ్యాలు సంపదాతగ్గినా పాండిత్యాన్ని మాత్రం పోషించారు. రాజులు కూడా రసజ్ఞత కనిపెట్టగల దిట్టలు .సమర్దుడైనకవికి మంచి ప్రోత్సాహం లభించేది .పాఠకులు,శ్రోతలకూ తక్కువేమీ లేదు .ఈ వాతావరణం లో మనకవి నిలదొక్కుకొన్నాడు ప్రతిభా సామర్ధ్యం తో .
చిన్ననాటి నుంచి పరస్పరం ప్రేమించుకొన్న మేనమామ కూతురు మాధవి నే 23వఏట పెళ్ళాడిహాయిగా కాపురం చేశాడు .అప్పటికే చాలాపద్యాలు రాశాడు వైద్య గ్రంథ అనువాదాలు, దైవ ప్రార్ధనలు ,పురాణగాథలపై వర్ణణాత్మక పద్యాలురాశాడు .వైద్యం నేర్చినా వైద్యుడిగా ఉండిపోవాలనుకోలేదు .సాహిత్యానికే అంకితం అవ్వాలనుకొన్నాడు .మరి జీవనో పాధి ఎట్లా ?అదృష్టం తలుపు తట్టి తిరుచూరులో ‘’కేరళ కల్ప ద్రుమం ‘’అనేముద్రణాలయం లో నెలకు 30రూపాయల జీతం మీద మేనేజరు గా చేరాడు .మంచి ఉద్యోగం, ఆదాయమూ ఆకర్షణీయమే ,తీరుబడీ ఎక్కువే .పండాలం రాజు నడిపే ‘’కవన కౌమిది ‘’సాహిత్య పత్రిక ఆఫీసు అనుకోకుండా కల్పద్రుమం కి మారింది .ఆపత్రికకు బాగా సహాయపడ్డాడు మనకవి .తన రచనలూ అందులో పడే అవకాశమూ కలిగింది ..ఆ వూళ్ళో మిత్ర బృందమూ బాగా పెరిగింది .కున్జికుట్టన్ త౦పురాన్ , కుందూరు నారాయణ మీనన్ ,నాడువతు మోహనసంపూరితి,వాలియా రామన్ ఎలియాత్తి వంటి కవిపండితుల ఇళ్ళు సాహిత్య గోష్టులతో నిత్యకళ్యాణం ,పచ్చతోరణంగా ఉండేవి .వీరందర్నీ తన సహజ హాస్యం, కవితా స్పర్శతో తనవాళ్ళ ను చేసుకొన్నాడు .ప్రతి సాహితీ సభలో ఎలుత్తోళ్ ప్రసంగం ఉండి తీరాల్సిందే .అతని ఉపన్యాసం కోసం సాహితీ మూర్తులు ఎదురు చూసేవారు .అంతటి ప్రముఖుడయ్యాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

లక్ష్మీజనార్దన చరిత్రము

లక్ష్మీజనార్దన చరిత్రము

తూగోజి ధవళేశ్వరం పిడబ్ల్యుడి క్లార్క్ శ్రీ బొండాడ సూర్యనారాయణ లక్ష్మీ జనార్దన చరిత్రం, దానికి అనుబంధంగా శ్రీ వెంకటేశ్వర శతకం రాసి ,రాజమండ్రిలోని ఎస్ గున్నేశ్వరరావు బ్రదర్స్ కు చెందిన చింతామణి ప్రెస్ లో 1913లో ముద్రించారు వెల మూడు అణాలు .విజ్ఞాపనం లో కవి ‘’గౌతమీ తటం  ధవళగిరి పై వెలసిన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కి అంకితం చేస్తూ రాశానని చెప్పాడు .దీన్ని ఆసాంతం విన్న వ.సు .కవి  అంటే వడ్డాది సుబ్బారాయ కవి గారికి వందనాలు తెలియజేశాడు .

శార్దూల౦ లో మొదటి పద్యం ‘’శ్రీ రామామణి తో ,శేషాహిపై బండి ,యే-కారుణ్యా౦బుధి భక్త సంఘంబుల వేడ్కన్ గాంచి రక్షించు నే –

పారావార గభీరునిన్ గొలువగా  బ్రహ్మాదులున్ జాల ర-ద్ధీరున్ దైత్యకులా౦తకున్ ,వరదునిన్ .దీనావనున్ గొల్చెదన్’’ అని జనార్దన స్తవం చేసి ,కైలాస విభుడు అర్ధనారీశ్వరుడై ఆమె కోరగా హరికధలు చెప్పే శివుని గణపతిని స్తుతించి ,’’వెన్నున్ నాభిలో జనించిన చిన్నికుమారుడు ‘’బ్రహ్మను ఆయన అర్ధాంగి ‘’విరించి కూరిమి రాణి ‘’ని ,’’కరిముఖుని ‘’ కవిపెద్దలకు నమస్కరించి తర్వాత తన విషయం చెప్పాడు .తండ్రి కోదండరామస్వామి ఉదారుడు .తను బొండాడ సూర్యనారాయణ .మనసులో జనార్దానుని’’భవ్యకథ’’ రాయాలని కోరికపుట్టి౦ది సంస్కృతం తాను చదవలేదు .గౌతమీ మహాత్మ్యం లో ఉన్న కథను చదివి విపించి మనసుకు పట్టించారు శ్రీ నున్న వెంకటార్యులు .ఇక స్థల పురాణం జోలికి పోకుండా దానినే ఆధారంగా రాశాడు.ఇక కథలోకి వెడితే

‘’సత్యలోకంలో బ్రహ్మ సభలో వాణీ నాథుడు కొలువు తీరి ఉన్న సమయం లో నారద మహర్షి వచ్చి ‘’గౌతమీ తటమున ఉన్న తీర్ధాలలో ముఖ్యమైనదేది ?””అని అడుగగా ,బ్రహ్మ ‘’జహ్నుని సుతతో తుల్యమగుచుండును గౌతమి .దీన్ని గౌతమమహర్షి తెచ్చాడు .అనగా ఎందుకు తెచ్చాడు అని అడుగగా ,గౌతముడు తీవ్ర తపస్సు చేస్తుంటే మునులు ఆయన ఆశ్రమ౦ లో ఉంటూ సపర్యలు అందిస్తున్నారు .వామనావతారం లో బలిగర్వం పోగొట్టటానికి విష్ణువు వామనావతారం ఎత్తి ,బ్రహ్మా౦డమంతా ఆక్రమిస్తే ,అప్పుడు తాను  తన కమండలోదకం తో ఆయన పాదాలు కడుగగా ,ఆ జలం నాలుగుపాయలై ,శివుని జటాజూటం చేరింది .ఆమెపై శివుడికి మక్కువ పెరగటం తో పార్వతి ఖిన్నయై ఎలాగైనా గంగను వదిలించుకోవాలని సాయం చేయమని  కొడుకు వినాయకుని కోరితే , ‘’తల్లి చింత వలదు ,తధ్యంబుగా నీకు గలుగు –వంతదీర్ప గలను జుమ్మీ -‘ఎలుక వాహనం మీద పూర్వం ఘోరయుద్ధం చేశాను అని అభయమిచ్చి,తనకు అది పెద్దపనే కాదు అని ‘’కొక్కు తేజిపై హాయిగా ‘’కూర్చుని తల్లి దీవెనలు పొంది ,అతి వేగంగా గౌతమాశ్రమం చేరి .అక్కడి మునిజనం తో సఖ్యంగా ఉంటూ ఉన్నాడు .

గౌతముడు నివ్వరి ధాన్యం పొలం లో చల్లి రోజూ నీళ్ళు పెట్టి పెంచుతూ ఒక రోజు మర్చిపోతే .ఇదే అదను అనుకోని’’ మాయ గిడ్డి ‘’ని కల్పించి ఆపాలం అంతా మేసేట్లు చేస్తే మునికి కోపం వచ్చి దర్భపుల్లతో ఆ ఆవును అదలిస్తే అది ముని ఆశ్రమం ముందు చనిపోతే దుఖభారం పొందిన గౌతముడు ని  శ్చేస్టుడుగా ఉంటె మునులందరికీ ఒక ఉపాయం చెప్పాడు’’కనకాచల ధన్వి జటను గలిగిన గంగన్ –  ఇలకుగొని తెచ్చిగౌతముండిచట నదిని ‘’పారిస్తే ,మళ్ళీఆశ్రమ౦  పవిత్రవంతం అవుతుందని సలహాచేప్పాడు .ఆమాట నచ్చి ముని గౌతముడు కైలాసం వెళ్లి శివుని మెప్పించగా ,ఒక జడ ఊడదీసి గంగను పారించాడు .ఆ ముని వెంట ఆనది పరిగెత్తుకొంటూ ఆశ్రమం దాకా రాగా ,అందరు పవిత్ర స్నానాలు చేశారు .గౌతముడు తీసుకు వచ్చాడుకనుక ‘’గౌతమి ‘’అయింది .

నారదుడు మళ్ళీ బ్రహ్మను ‘’గౌతమమునిని వంచించటం వినాయకునికి సాధ్యమా ?””అని అడిగితె ‘’’’హరిహర లీలలు నెన్నగ-హరిహరులకే చెల్లుగాని యలవియె మనకున్ –  నరులకు మేలొనగూర్ప-హరిహరు లిట్లాచారింతురాశ్చ  ర్యముగాన్ ‘’అన్నాడు .గౌతమీ తీరం లో జనార్దన తీర్ధం ఉంది అది చాలామహత్తరమైనది దాని వివరాలు చెబుతా వినమన్నాడు –మొదట్లో నాముఖ గహ్వరం నుంచి వెలువడిన వేదాలు అన్నిటా వ్యాపించాయికాని మునిజనాలకు అందుబాటు కాలేదు .వారి మనోబాద తీర్చటానికి’’ జనార్దనుడు వాటినన్నిటి నొక ప్రోగుగా జేసె శిలోచ్చయాకృతిన్ –గాన జనార్దనాద్రి యన –గా నుతి గాంచెను నమ్మహీన్ద్రమున్ ‘’ఇలా నాలుగు వేదాలను అద్రి రూపంగా మార్చికరుణా ప్రపూర్ణు డయ్యాడు హరి .అక్కడ జనార్దన స్వామిగా వెలిశాడు.ఆతర్వాత బాదరాయణ వ్యాసమహర్షి అక్కడికి వచ్చి ‘’అత్య౦త భక్తితో శిఖరి యందలి నాలుగు తున్కలన్ గడున్ బ్రీతి ఎలర్పగాగొనుచు బృధ్వికొసంగెను బ్రాతమిన్కులన్ ‘’  .

గౌతమి ఒడ్డున ధవళేశ్వరం గిరిపై జనార్దనుడు లక్ష్మీ దేవితోశంఖ చక్ర గదాది ఆయుధాలతో  కొలువై ఉంటూ భక్తజనావళిని కాపాడుతూ ఉంటాడు .తర్వాత వ్యాస బ్రహ్మ ,శ్రీ కంఠుడు 10మత్తకోకిలలో జనార్దన స్తోత్రం చేసి పూజించారు .తర్వాత అనేక లలితపద వృత్తాలలో  శ్రీ రమా స్తుతి చేశారు .క్రౌంచపద వృత్తాలో జనార్దనాష్టకం పాడారు .వ్యాసాదులు చేసిన ఈ స్తోత్రాలకు పరమ ప్రీతి చెంది దేవ దేవులు సంతోషించి ఈ స్తోత్రాలు భక్తిగా పఠించిననవారికి మంచి జరుగుతుంది అంటే వ్యాసుడు దర్శించినవారికి మోక్షం  అనుగ్రహించమని కోరితే తధాస్తు అన్నారు .ఈ తీర్ధాన్ని వ్యాస కృత జనార్దన తీర్ధం అంటారని కూడా చెప్పాడు .

ఆతర్వాత రామావతారం  వర్ణించాడు కవి .వనమయూర వృత్తం లో శ్రీ రంగాష్టకం చెప్పాడు –‘’దేవ నిను గొల్చెదను దీనుడను బాపిన్ –గావదగు బబేరిమి ని గంజదళా నేత్రా –నీ విమలకార్యములు నేర్తునె నుతింపన్ –దేవతలకెల్ల సుర దేనువవు రంగా ‘.తర్వాతస్వాగత వృత్తాలలో రామాష్టకం రాశాడు కవి –‘’నన్ను బ్రోవు రఘునందనరామా- సన్నుతించెదను,జానకి నాథా – నిన్నే నమ్మితి ,నీకే భటుండన్-బన్నగారి రధ బంకజ నేత్రా ‘’.భుజంగ ప్రయాతం ఇంద్రవ్రజం వృత్తాలూ సమర్ధంగా రాశాడు .చివరగా –

‘’నీరజ నేత్రా ఘన నీలగాత్రా –కారుణ్య ధామా ,రిపుకంజ సోమా –శ్రీరామమూర్తీ .నరసింహమూర్తీ-సారెందు కీర్తీ సుర చక్రవర్తీ ‘’అని 188వ పద్యంతో ముగించాడు .

తర్వాత శ్రీ వెంకటేశ్వర శతకం కూర్చాడు .మొదటిపద్యం గీతపద్యం –‘’శ్రీల జనులకోసగుచు సిరియు ధరయు –నీళలవయంబు రక్తితో నిను భజింప –వారలు నీ వొనరి౦చెద వందనములు –విగత భవ పాశ తిరుపతి వేంకటేశ ‘’

చివరి 101వ ఆట వెలది పద్యం తో శతకం ముగించాడు –‘’ని౦డుభక్తి తోడ బొండాడ సూర్య నా-రాయణుండుసేససెనర్పణము –గీత శతకమొకటి పీతాంబరా –దీని వేడ్కతోడ బొందు వేంకటేశ ‘’  తిరుపతి వేంకటేశ మకుటం లో రాసిన శతకమిది .గోదావరీ తీర క్షేత్రమైన జనార్దనునిని క్షేత్రమహాత్మ్యాన్ని ‘’గలగలా పారే గోదారిలా ,కమనీయంగా మృదు మధురంగా ,గోదావరీ పావనోదార పవిత్రంగా  భక్తీ అనురక్తీ ,కధాకధన శక్తీ మేళవించి మహా భక్తకవుల స్థాయిలో రసబందురంగా రాశాడు కవి .ఈ కావ్యం, ఈకవినీ పట్టించుకొన్న దాఖలాలు లేవు .నాకు పరిచయం చేసే మహద్భాగ్యం కలిగింది జైజనార్దనా .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-19-10-21-ఉయ్యూరు

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Telugu Wikipedia : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

 


You received this message because you are subscribed to the Google Groups “సరసభారతి సాహితీ బంధు” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z-gy4z-%3DH8eU5p8mp5cGpibqy%3DSTYxTBXUbGOdfsbwVdg%40mail.gmail.com.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శివపురాణం

విశ్వనాధ కల్ప వృక్షం  తర్వాత ”శివపురాణం” ,ఆతర్వాత” బ్రహ్మ వైవర్త మహా పురాణం” ప్రత్యక్ష ప్రసార౦  సాహితీ బంధువులకు శుభ కామనలు  .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసున్న ”విశ్వనాథ కల్ప వృక్ష శిల్పం ”పూర్తికాగానే ,కార్తీకమాస ప్రత్యేక కార్యక్రమంగా ,”శివ పురాణం ”,అది పూర్తయ్యాక ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమ౦గా ”బ్రహ్మ వైవర్త మహా పురాణం ”సరసభారతి ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను -దుర్గాప్రసాద్ -18-10-21-ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్

http://sarasabharati

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

దీక్షిత శతకం

దీక్షిత శతకం
‘’ శ్రీ నందిరాజు లక్ష్మీ నారాయణ దీక్షిత శతక౦’’ కర్తవఝల సూర్యనారాయణ కవి .ఇది బాపట్లలోని అత్రి –వాణి ప్రెస్ లో 1938లో ముద్రితం .వెల రెండు అణాలు అనబడే’’ బేడ’’ .ముందు తన వంశ చరిత్ర సీసాలలో ఒలికించాడు కవి .కృష్ణానది బంగాళాఖాతం లో సంగమించే హంసల దీవి క్షేత్రంకు దగ్గరలో ఉన్న రేపల్లె కు దగ్గర ధూళిపూడిలో కవి పుట్టాడు .రామయామాత్య వరతనూజుడైన వఝల వంశం లో సూర్యనారాయణ పేరుతొ పుట్టాడు .ఈశతకం రాయటానికి’’ధీ విశాల కోటీశ్వర దీక్షితార్య సార్వభౌమ మార్కండేయ శర్మ ప్రేరణకల్పించారు .
నందిరాజు వంశం లో ఘ౦టయ్య ,చిన్నమాంబ దంపతుల కుమారుడు దీక్షితులు .కొడుకును ఇంటివద్దనే వదిలి తండ్రి దేశాటనం వెడితే ,రేపల్లెలో దివాకరం రామమూర్తిగారు బాలుడిమీద అభిమానం తో సంస్కృత ఆంధ్రాలు ,సాహిత్యం నేర్పగా వాటిలో గొప్ప దక్షుడయ్యాడు .తెల్లవారుజ్హామునే లేచి స్నాన సంధ్యాది విధులన్నీ యధాప్రకారం చేసి ,బడికి వెళ్లి పాఠాలు బాగానేర్వగా సహాధ్యాయి విశ్వపతి ఓర్వలేక తనకంటే అన్నిటా ముందున్నాడని ఈర్ష్య తో రాజు శబ్దం పై అర్ధ వివరణ అడగటం లో ఈ భేదం మరీ ఎక్కి పోయింది .
కొంతకాలానికి సుంకర వంశంలోని మంత్రి ఒకాయన ఇతన్ని తీసుకొని వెళ్లి ,బంధు మిత్ర సముదాయంమధ్యలో లో తనకూతురు వీరమనిచ్చి వైభవోపేతంగా వివాహం చేశాడు .తర్వాత భార్యతో రేపల్లెలో కాపురం పెట్టాడు .అక్కడ తర్క వ్యాకరణ మీమా౦సాది శాస్త్రాలలో అక్కన శాస్త్రి వద్ద చదువుకోమని శేషగిరిరాయడు ప్రోత్సహించాడు .ఆయనవద్ద అలంకార శాస్త్రంతో సహా అన్నీ నేర్చాడు .గురువంతవాడు అనిపించుకొన్నాడు .అక్కడ నియోగి ,వైదీకి తేడాలొచ్చాయి
తండ్రి దేశాటనం నుంచి తిరిగివచ్చి ,కొడుకును ఇంటికి తీసుకొని వచ్చి నందిగామలో ఉన్న కోడలిని వెంటబెట్టుకొని తీసుకొని వచ్చాడు .ఈ దంపతులతో ఏకోదిష్టం, షోడశ౦ మొదలైన హోమాలు చేయించాడు .గురువు వద్ద అనుమతిపొంది రేపల్లె చేరి నిష్టతో హరదత్తభాష్యాదులు ఆమూలాగ్రంగా చదివి ,స్మార్తంలో నిష్ణాతుడై ‘’అభినవ బ్రహ్మ ‘’అని పించుకొన్నాడు .
బందరులో వడ్లమన్నాటి వెంకప శర్మ అనే ఆర్వేల నియోగి ,త్యాగి యజ్ఞం చేసి అవభ్రుతస్నానం చేసి అన్న సమారాధన మహా వైభవంగా చేశాడు.వైశ్వ దేవం చేసేవారికి విడిగా వంటలు వండించాడు . .విశ్వపతి మొదలైనవారు వచ్చి నియోగుల ఇంట్లో భోజనం చేయము మా సామగ్రి మాకు ఇస్తే వండుకుతింటాము అన్నారు .
బందరులో నియోగులపాఠశాల వేదం పాఠశాల నెలకొల్పి తానె అధ్యక్షుడై తీక్షితులు చక్కగా నిర్వహించాడు .ఇందులో వైదీకులు చేరి చదవనే లేదు .కృత్తి వెంటి వారి పురోహితులం అని కొందరు వైదికులు వచ్చి .తమకు యాజకత్వం ఇవ్వమని కోరగా వెంకపసోమయాజి ఒప్పుకోలేదు రాజభటుల్ని పిలిపించి గెంటి వేయించాడు .
తానుస్థాపించిన రెండు విద్యాలయాలో సమర్ధులైన ఉపాధ్యాయులను నియమించి ,విద్యాబోధన బాగా చేయించి ప్రామాణ్యం పెంచాడు.నియోగులుకూడా వైదీకులతో పోటీపదడిచెడుమార్గాలు పట్టి చెడ్డ పేరు తెచ్చుకొన్నారు .దీక్షితుల తండ్రి ఘంటయ సన్యసించి బ్రహ్మానంద సరస్వతి నామంతో పిలువబడినాడు .అప్పట్నించీ రేపల్లె వేద పాఠశాల బాధ్యతా తీసుకొన్నాడు .నూజి వీడు మొదలైన సంస్థానా ధీశులు వార్షి కాలు పంపుతూ శిష్యగణాలకు విద్యనేర్పటానికి సాయపడుతున్నారు .కలహాలు సద్దు మనగటానికి మేధా దక్షిణామూర్తి తపస్సు చేసి ,ఆనందనామ సంవత్సరం లో అగ్న్యాధానం చేసి ‘’దీక్షితులు ‘’అనే సార్ధక నామం పొందాడు .’’విశ్వపతి అసుర విజయం’’ ,పిష్టపశ్వధ్వరవివేకం ‘’ కావ్యాలు రాశాడు .
రక్తాక్షినామ సంవత్సర శరదృతువులో పుష్పగిరి పీఠాధిపతి రేపల్లెకు60మంది పండితులతోరాగా విశ్వపతి మంత్రిగా ఉన్నాడు. జంగనరాయ భూపాలుడు ,తాటి రామయమంత్రి కొలువు తీరి ఉన్నారు .పుష్పగిరి స్వామినుంచి ఆహ్వానం రాగావెళ్లి యతిపతికి నమస్కరించి ,ఎదురుగా ‘’గ్రంథం’’పెట్టగా అది ఆయనకు అవమానంగా భావించి చులకన చేశాడు శాస్త్ర చర్చలు ఒరుగా సాగాయి రెచ్చి పోయి వాదించాడు దీక్షితులు అందరూ భేష్ భేష్ అని మెచ్చారు కానీ యతిపతి’’నువ్వే గెల్చావు ‘’అనే మాట చెప్పకుండా మౌనంగా ఉన్నాడు .ఎదో ఒకటి చెప్పమని అధికారులు అనగా తీర్పు వ్రాసి పంపిస్తానన్నాడు .విశ్వపతి చిన్నబుచ్చుకున్నాడు మాటలతో గడిపాదేకాని పీఠాధిపతి తుది తీర్పు రాసి ప్రకటించలేదు.
ఇంతమంది మొనగాల్లను వాదం లో ఓడించి దీక్షితనామానికి సార్ధకత కల్పించిన దీక్షితులను మెచ్చుకోకపోవటం తో కలత చెంది సభలోని వారంతా ‘’దీక్షితుడన దేవ దేవుండు –తగు నీతనికి దీక్షిత ప్రశంస ‘’అనగా దేవతలు పుష్పవృష్టి కురిపించారు .కులసతి కోటిమాంబ వలన యజ్న నారాయణ ,సూర్యనారాయణ అనే ఇద్దరు కుమారులను పొందాడు .అద్వైతాన్ని అసురాద్వైతం దేవాద్వైతమ్గా విభజించి ,అసురాద్వైతం దోషమని నిరూపించాడు .తనవారికి దైవతాన్నం పంచాడు .క్రమంగా బ్రహ్మచర్య ,గార్హస్పత్య ,వానప్రస్థాశ్రమం గడిపి ,చివరికి తురీయమైన సన్యాసాశ్రమ౦ తీసుకొని ‘’చిదానంద సరస్వతి ‘’నామ ధేయంతో విరాజిల్లారు.శ్రీముఖ నామ సంవత్సర కార్తీక శుద్దనవమి నాడు దీక్షితార్య అనే చిదానంద సరస్వతి సిద్ధి పొందారు .అప్పటినుంచి ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి .
ప్రజోత్పత్తి నామ సంవత్సరం లో 60వ ఏట ఈ దీక్షిత శతకం రాశానని కుమారుడు సూర్యనారాయణ కవి తెలిపాడు .ఈయన కోటీశ్వర దీక్షిత శతకం మొదలైనవి రాసినట్లు చెప్పి 100 సీస పద్యాలతో శతకాన్ని ముగించాడు .
మొదటి పద్యం –
‘’శ్రీ మహితాచార శిష్ట భూయిష్ట ప్రకాశితా –ర్యవర్తదేశమందు-గాలికాల వశమున గులధర్మము లడ౦గి –వర్ణ సంకరముగా వచ్చినంత
విశ్వ హితార్ధమై ఈశ్వరంశమ్మున –నాది శంకరుడవై నవతరించి-తగువాదముల దుర్మతంబులు ఖండించి –సన్మత స్థాపన సలిపి యేగి
యప్పటప్పటికరుగు దెంచి –యరయవలసి –హరిహరా౦శను మరలి –ఈయవని కవత
రించి యద్వైతమతము భాగించినావు –భవ్య గుణ ధుర్య –లక్ష్మి నారాయణార్య’’
హంసల దీవి వర్ణన –‘’
‘’కృష్ణా మహా తరంగిణి సాగరుతోడ –గాలియు నెయ్యది కేళికా గృహంబు –సరస యౌవన దశా పురుషయిత క్రియా –భోగంబులకేది పూలపాన్పు –ఉర్విపై నేయది పర్వకాలస్నాన –పుణ్యంబులకు నెల్ల బుట్టినిల్లు
పరమభాగవతాది బహు పురాణంబులు –వినిచి స్వర్గము చూర విడుచునెద్ది –అట్టి హంసల దీవి ‘’
బందరు ఉప్పెన
‘’స్వామి తోడనే వచ్చే ఝ౦ఝానిలంబది-ప్రళయ భైరవ ముఖార్భటి యనంగ నీల మేఘమ్బులాని౦గిపై గాలికి –గొట్టుక పోయెడుకొండలనగ
పృధు వర్ష ధారలా యింద్రచాప విముక్త –రసలోహమయపు నారసములనంగ
ధన జీవంబులకు నిర్దయుడై బాధించు –యతిరాజు లయకాల యముడనంగ
దోచె యుప్పెన బందరు నూచె నేచె-లోకములెల్ల నల్లకల్లోలమయ్యె-యయ్యయో ఏమనంగలదా యవస్థ ‘’
చివరిపద్యం –
‘’బ్రహ్మ చర్యంబు గార్హస్త్యంబు నడిపి –వానప్రస్థమును దీర్చి సుప్రసిద్ధ
వాసరంబందు సన్యాసము గై కొంటి –రహి జిదానంద సరస్వతి యన
శ్రీ ముఖాబ్ది కార్తిక శుద్ధ నవమి ని –సిద్ధి గాంచితికీర్తి శేషుడగుచు
నాట నుండియు నీనాటికారాధనల్-వరలు చున్నవి నీకు వార్షికముగ
నఘ నిబర్హణమని భవదనఘ చరిత –సీస పద్యములయందు వ్రాసి శతకంబు
నీ దయన్ బూర్తి జేసితి నేర్చినట్లు –రమ్య గుణ ధుర్య-లక్ష్మి నారాయణార్య ‘
‘’దివ్య తేజుడైన కోటీశ్వర ,దీక్షితాది –కృతున కలరుగగృతి సమర్పించి నాడ
నందుకొను మివె నా యభినందనములు
రమ్యగుణదుర్య -లక్ష్మి నారాయణార్య’’
’అని శతకం ముగించాడు కవి
పద్యాలన్నీ నవనవోత్సాహంగా గంగా తరంగ నిర్ఝరిగా పవిత్రంగా ప్రవహించాయి ప్రతిపద్యం దీక్షితులకే సమర్పయామిగా రాశాడు కవి ‘’రమ్యగుణదుర్య -లక్ష్మి నారాయణార్య’’ అనే మకుటం మకుటాయమానమై భాసించింది .ఆయనకే శతకం విన్నవించుకొన్నాడు కవి .సార్ధక రచన .కవి గురించి ,దీక్షితులగారి గురించి పెద్దగా మనకు తెలిసింది తక్కువే .ఆలోటు తీర్చాడు సూర్యనారాయణకవి .అరుదైన ఈ శతకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పడమట లంక రామ స్తవం -3(చివరి భాగం )

పడమట లంక రామ స్తవం -3(చివరి భాగం )

9-శ్రీ నోరి హనుమత్సాస్త్రి –గుంటూరు

‘’జడమతి తోడ సోమకుడు చయ్యన వేదములన్ హరించి ,తా –జడనిధి యందు దాగగను జూడ నెరి౦గియు మత్స్య రూపమై

కడువడి రాక్షసున్ దునిమి గ్రక్కునదెచ్చితివీవే వేదముల్ –పడమట ‘’

10-బ్రహ్మశ్రీ నెమ్మలూరి రామమూర్తి –అమృతలూరు

‘’సుడి వడు గాలి చందమున సృక్కుచు నీ భువి భువి యందు మోహపుల్ – మడుగున మున్గితెప్పరిలు మార్గము దోచదు,నీ దయారసం –

బడిగితి యుద్ధరింతువను నాశను దేవర నీదు చిత్తమో-పడమట ‘’

‘’జడధి తనూజ ,యాసిరియే,జానకి ,లక్ష్మణుండాదిశేషు వౌ –కడు బలశాలు రాక పులెకా?సురలీ భువి నుద్ధరింప నా

యెడ జనుదెంచితయ్య ,జగదీశ్వర నీ వన  విష్ణువౌదువో –పడమట ‘’

11-బ్రహ్మశ్రీ జి .సుబ్బరాయ –నెల్లూరు

‘’నుడువక నీ చరిత్రమును వీనుల విందుగ విన్న ,నట్టెయిం-పడరగనీదు పేరు మనసార భజించిన ,నీ సురూపమున్

గడుకొని కన్నులార బొడగన్న నఘంబులు వాయకున్నెయో-పడమట ‘’

‘’జలజ భవాండ భాండముల జయ్యన కల్పన సేసి ,వాని బెం-పడరగ జేయుచున్ దుదకు నన్నియు  నెట్టులో రూపుమాపగా

దొడగుట కేమి కారణమొ తోచదు చిత్రమునీదు చర్యలో –పడమట ‘’

12-బ్రహ్మశ్రీ వి .లక్షమ్య్య –నెల్లూరు

‘’కొడుకులపైన వత్సలత కూర్మియు ,బేర్మియు జూపు చుండి యా –కొడుకుల తప్పులన్నియును గూడ క్షమియించు గాదెతండ్రి ,నీ

కొడుకునెయైన నాకు గలకోరికలిచ్చి క్షమింప వేల యో-పడమట ‘’

‘’పడమట లంకలో వెలసి భక్తుల నేలుచు దుష్ట సంతతిన్ –మడియగ జేయు చుందువట మాపును రేపును ,నీదు నామమున్

విడువక సంస్మరించినను వీడవె దుఃఖము లెట్టివైన యో –పడమట ‘’

13-బ్రహశ్రీ కాకటూరురామనాథ –నెల్లూరు

‘’కడగి మహాశు పద్యముల గట్టిగ భూప సభా౦తరమ్మునన్ –నుడువక నశక్తుడన్ బుధజనుల్ ధర మెచ్చగగావ్యభావముల్

వడిగని చెప్పలేనకటపాండితి చాలమి ,నెందు బోదునో –పడమట ‘’

‘’వెడద శిరమ్ముపై నొక పెద్ద నగమ్ము భరింప వాయుపు – త్రుడనొ,మహాశుగప్రగతి దూలగ వాలినో గాక నీకు నే

దడయకసాపడన్దనుజు తమ్ముడ నౌదునొనిన్ను జేరగా –పడమట ‘’

14-శతావధాని బ్రహ్మశ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి –నెల్లూరు

‘’కడుభరమైన కొండలుదకమ్మున దేలు ప్లవంగ మాత్రుడున్ –జడనిధి దాటు బల్వలము చాయ నమేయ మహత్వ మొప్పగా

బొడవడచున్నిశాచర సమూహము ,,నీ కృపసుంత యున్నచో –పడమటలంక రామ ,నను బాలన సేయవెజానకీ పతీ

‘’వడివడి దానముల్సలిపి వారును వీరును తన్ను మెచ్చుకో –గుడువగబెట్టి కొందరికి ,కుల్కుట ముక్తికి మార్గమా?మదిన్

సడలగనీక నీ భజన సారెకు జేయుటమార్గమా ? యాహో –పడమట ‘’

15-బ్రహ్మశ్రీ బలిజేపల్లి లక్ష్మీ కాంత కవి –గుంటూరు

‘’పుడమిని మానవుండ నయి పుట్టి గడించిన దేమి నీవు పే-రడవుల సంచలించు నపుడందొక బోయతనై పులుంగు నై

కడకొక క్రోతి నై నిను  దగన్ భజియింప గ నోచనైతినో-పడమట ‘’

‘’విడివడి ఘోరపాప పదవీ మద విభ్రమ లాలసుండనై-చెడితి మహాపచారములు జేసితి,ముందటికేమి దుర్గతిన్

బడయుదునో ,భయంపడివిపన్నుడనీదరి జేరినాడనో – పడమట ‘’

’16-శ్రీ బొగ్గవరం శ్రీరామ శర్మ –నరసరావుపేట

‘’ఎడతెగకుండరాత్రి బవలెప్పుడు నిన్,దనకంతరాత్మగా –నడుగడుగందు తత్వమసి యంచును లక్షలు గోట్ల సార్లు లో

బడని మనస్సమాధి నిను బాయక చింతిలు వాడె నీ వగున్ –పడమట ‘’

‘’గడియకు నూరుపద్యములు గల్పన జేతురదేమి ప్రజ్ఞయో-నుడివినవన్ని యక్కరలునోట వచించిన సాధ్యమో౦కృతిన్

బొడమె దదర మేనిని బొందితి దీనిని దెల్పరేకవుల్ – పడమటలంక రామ ,నను బాలన సేయవెజానకీ పతీ ‘’

 సాధారణంగా ఇద్దరుకవులు జంటకవిత్వం చెప్పటం రాయటం చూశాం .గోలుసుకథ,గొలుసు నవల పేరిట నలుగురైదుగురు రచయితలూ రాసిన దాఖలాలున్నాయి .కానీ ఒకే మకుటం పై 16మంది లబ్ధ ప్రతిష్టులైన మహా ఆవులు అన్డునాకొందరు శతావధానులూ కలిసి అరుదైన ఈ పద్యకావ్యాన్ని రాసి రికార్డ్ సృష్టించారు .అందులో ప్రాస అక్షరం ‘’డ ‘’ఉండటం క్లిష్టం .అయినా లెక్క చేయకుండా అందరుకవులు తమ ప్రతిభా  విశేషాలు ప్రదర్శించి ఆత్మ నివేదనగా ఆ తారకరామునికి పద్య  ‘’చంపకాల ‘’తో ‘’మాల’’ అల్లి కంఠ సీమను అలంకరించి వింత సొబగుచేకూర్చి ధన్యులయ్యారు .’’నాళ్ళ చెరువు’’ వారి మనసు చెరువు పద్యాలతో పొంగి పొరలింది .వారి కోరిక తీరింది .షోడశ కవి చంద్రుల షోడషోప చార పూజగా అతి పవిత్రంగా విరాజిల్లింది’’ పడమటలంక రామ స్తవం .

 బహుశా ఈ కావ్యం గురించి కూడా మనవారికెవరికీ పట్టినట్లు లేదు .ఎవరూ దీన్ని ప్రస్తావించినట్లు కనిపించదు . అరుదైన ఈ కావ్యాన్ని  పరిచయం చేసే అరుదైన అదృష్టం నాకు దక్కినందుకు మహదానందంగా ఉంది .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పడమట లంక రామ స్తవం -2

పడమట లంక రామ స్తవం -2

3-శతావధాని మధ్వశ్రీ కాశీ కృష్ణాచార్య –గుంటూరు

‘’జడుడన సత్యవాది నఘసక్తుడలోక విగర్హ్యవృత్తుడన్ –బిడియములేనివాడ నవివేకిని మూర్ఖుడ మూఢుడన్ స

సగర్వుడ నిటులయ్యు నిన్ను ,మదిరూఢిగగొల్చుచునుంటి గాననో

– పడమట లంక రామ ,ఆలన సేయవే జానకీ పతీ ‘’

‘’కడలికి నొక్క సేతువును గట్టి ,కపీ౦ద్రుల చేతబట్టి యా –కడుదురితాత్మురావణుని గర్వ మడంచిన నీకు నెన్నగా

బుడమిని లేక్కయేమి మము బోటుల బ్రోచుటనంగ నక్కటా –పడమట’’

 లంక  

4-బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి –చందోలు

‘’ఒడలి మెరుంగు మబ్బు నెడనొప్పెడు ,నమ్మెరుగట్లుజాళువా-మడుగునకు దోడునున్ దొడలమాలిమి జూపుచు కల్మికన్యపే

ర్వడసిన కల్కి మిన్న చెలువంబున కేయడ జొక్కు గా౦చునో –పడమటి ‘’

‘’జడము జరాది దూషిత మశాశ్వత మీ యొడలం చెరింగియున్-విడువగ నీయదాస ,దన వెర్రియెదానికి చుట్ట ,యిట్టులే

నడలితి దివ్యమూర్తి యినుమప్పరు సంబటులాండ గంటినో –పడమట ‘’

5-బ్రహ్మశ్రీ చల్లా పిచ్చయ్య శాస్త్రి –ఇంటూరు –గుంటూరు జిల్లా 

‘’బడలితినయ్య తండ్రి పలుబాములలో బడి యింక నేట్టులీ –తొడుగు కృతార్ధతన్ గనుట దొరపు నీ కడగంటి చూపు పూ

జడి గురియి౦పకున్నదివిజ స్తుతి వైభవ గుర్తెరింగి ,యో-పడమటి ‘’

6-మధ్వశ్రీ పళ్ళే పూర్ణ ప్రజ్ఞాచార్య –గుంటూరు

‘’పుడమిని నెల్ల మానవులు పుణ్యము సేసిన నింక నెట్టు లే –ర్పడు నల నీకు పతితపావన నామము ,పాపమంచనం

దడవని మమ్ము బోటి యనదల్ జనియి౦పకయున్నపట్టులన్ –పడమట ‘’

‘’చెడినది జ్ఞాన చక్షువిక జీకులమైతిమి గానమాకుసం –గడినొకదారి జూపుటదిగౌరవమై తగు ,మంచి వారు పై

పడిఎటులైన మార్గమును బట్టుదురయ్య పరానపేక్షగా-పడమట’’

7-బ్రహ్మశ్రీ శిష్ట్లా హనుమత్చాస్త్రి-గుంటూరు

‘’ విడివడి వేద శాస్త్రపద విశ్రుతి నేని గడి౦పనైతిబే-ర్వడిన బుధే౦ద్ర సేవ గుణవద్గణ గణ్యత గా౦చనైతి ,న

ల్గడలయశమ్ము గ్రమ్ము ననఘక్రియలం బచరింప నైతినో –పడమట ‘’

‘’’’తడవు తపంబులు నోములు పదల్ నను దృప్తు నొనర్పజాలవె-య్యెడ దృఢభక్తి మాడ్కి ,నది హెచ్చిలి లేశ మొసంగ మేరువం –

చొడ యడ నీవ పల్కిత ‘’ నుయోగులమాట వరాలమూటె కా-పడమట ‘’

 సశేషం

విజయ దశమి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పడమట లంక రామ స్తవం 

’పడమట లంక రామ స్తవం

అనే ఈ పద్యకావ్యాన్ని షోడశ కవులు కలిసికట్టుగా రాయగా ,గుంటూరు చంద్రికా ముద్రాక్షర శాలలో 1917లో నాళ్ళ చెరువు రంగారావు గారిచే ప్రచురింపబడింది .ఈ పుస్తకంలవలన లభించే ద్రవ్యాన్ని పడమటలంక ధర్మ వైద్య శాలకు వినియోగిస్తామని ,ఇందులో సాధకులకోసం ఒక ఆశ్రమాన్ని నిర్మిచామనీ మనవి మాటలలో ప్రకాశకులు తెలియ జేశారు  కానీ పుస్తకం వెల ఎంతో తెలుపలేదు .

‘’అందమైన ప్రకృతికి ఫల వృక్ష సమితికి ,పుష్పలతలకు  ఈ చిన్న గ్రామం పడమట లంక నిలయం .ప్రకృతికి బంగారు బిడ్డ .ఈ గ్రామం లో క్షత్రియ దంపతులు అవనిగడ్డ వల్లభ రాయలు ,మహాలక్ష్మమ్మ పుణ్య దంపతులకు  సంపన్నులైన అయిదుగురు పుత్రులు .వీరందరూ కలిసి ఆ గ్రామం లో శ్రీ కోదండ రామాలయం ,దానికి అనుబంధంగా బాటసారులకు ఉపయోగపడే సత్రం నిర్మించిన వదాన్యులు .వీరిలో వైద్య విద్య లో అనుభవమున్న తృతీయ సోదరులు శ్రీ బసవయ్యగారు ధర్మ వైద్య శాల స్థాపించి ,అందులోనే ఒక వెయ్యి రూపాయల విలువగల పుస్తకాలతో గ్రంథాలయం నెలకొల్పారు .ఈమొత్తం కార్య రూపం చెందటానికి శ్రీ సీతారామ అవధూత గారు  ముఖ్య కారకులు ,ప్రేరకులు .జ్యేష్ట సోదరుడు రామాలయ నిర్వహణ చూస్తారు .ఈయన విద్యాలయ ,పుస్తకాలయ నిర్వహణ బాధ్యత వహిస్తారు

పడమట లంక ప్రకృతి రామణీయకతకు అక్కడి పవిత్ర రామాలయానికి పులకిత గాత్రుడైన సత్కవివిధేయుడు శ్రీ నాళ్ళ చెఱువు రంగారావు గారికి ఒక రోజు స్వామిని  దర్శించినపుడు ‘’’’పడమట లంక రామనను బాలన సేయవే జానకీ పతీ ‘’అనే పద్య పాదం అకస్మాత్తుగా స్ఫురించి ,ఆత్మ సంతృప్తితో ఆ మకుటం తో పద్యాలు రాయాలని సంకల్పించి రాయటం మొదలు పెట్టారు .కానీ తనకే ఎందుకో నచ్చక పెద్దలైన కవులను దర్శించి వినిపించి వారి మెప్పు పొంది ,వారితోనూ పద్యాలు రాయించి ప్రచురించారు .ఈ కవి రాసిన మొదటి పద్యం ఉత్పలమాలిక –

‘’శ్రీ కవితాలతోపవన సీమల కేగి తదీయ పాలకా ,నీకము గోరంగసుమము లిచ్చిరి ,తత్సుమముల్ భవత్పద –

శ్రీ కమలార్పణ౦బు నొనరించితి దీనుడనయ్య నన్ గృపో-ద్రేకముతోడ బ్రోవవలయు దిక్కేవ్వరి౦క ను జానకీ పతీ ‘’

తర్వాత కవుల పద్యాలలో మచ్చుకి ఒకటీ రెండూ చూద్దాం

1-శ్రీ గొట్టుముక్కల రమాకాంతాచార్య  కవి-గుంటూరు

‘’దుడుకు దన౦బుగాక ,మది దోపదొకో ప్రణవంబు తోడ ని౦ –పడరిసమస్త వేదముల యాదిని నంతమున్ గరంబు వె

ల్గెడిహరినామ మొండేయని లేదిక నెవ్వరికట్టి కీర్తి యో

పడమట లంక రామ ,ఆలన సేయవే జానకీ పతీ ‘’

మరో పద్యరాజం

‘’అడుగ ద్రిలోక సేవయ భవదాకృతి చూపు మటంచు వైభవ౦ –బడుగ ద్రిపాద్విభూతియు నక్కరలేదు భవత్పదంబులే

నడిగెదదల్లి స్తన్యమె గదా పసికూనల కాస గొల్పెడిన్’’

2-శతావధానులు శ్రీ శేషాద్రి రమణకవులు –గంపలగూడెం ఆస్థానకవీశ్వరులు

‘’నడి చెడు వేళ,మంజుకలనాద వనప్రియ గీతిముల్ చెవిన్ –బడు  సమయాన ,నంగనల వాలిక చూపులు కౌతుకమ్మొన

ర్చెడి తరి యుష్మదీయ పదసేవనమున్ బొనరింప జేసి శ్రీ – పడమట లంక రామ ,ఆలన సేయవే జానకీ పతీ ‘’

మరో పద్యం

‘’కడలి పయిన్ సమగ్ర సితకాండ పరంపర నింప వింటి నె-క్కిడి,మరి యంతలోన బరికీర్ణ దయామయ దృగ్రుచిచ్ఛటల్

జడ నిధిపైన నింప నిను కాంతుడ వందునో ,గోపి యందునో ?”’

సశేషం

మహర్నవమి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -14-10-21-ఉయ్యూరు

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Telugu Wikipedia : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Virus-free. www.avast.com


You received this message because you are subscribed to the Google Groups “సరసభారతి సాహితీ బంధు” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z-ESkVsjGhGuwKmBiVryOZrwPGoxVbxqBBc7DAckoB-yg%40mail.gmail.co

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -2(చివరి భాగం )

బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -2(చివరి భాగం )

ద్వితీయాశ్వాసం లో ‘’మొక్కు లిచ్చెడి భక్తుల బ్రోవు తోడ –నికరమైనట్టి మహాత్య్మనియతి తోడ –సుకము కల్గించు మంచి వస్తువుల తోడ –రాజిలు చుండు నా సుబ్బా రాయ షష్టి ‘’.అన్ని రకాల ఆర్తులు బాధలు తొలగిస్తాడు .ఆయనమహిమలనుచాటే కథలు చెప్పారు కవి .మొదటిది విప్రకథ – ఒక ఊరిలో గొప్ప విప్రోత్తముడున్నాడు .భార్య అనురూపవతి .కానీ ‘’ధనభాగ్యమెంత తదనరి ఉన్నా –తనయుడొక్కండు గని దక్కని ‘’దౌర్భాగ్యం వారిది .ఎన్నో సత్కార్యాలు తీర్ధ యాత్రలు చేశారు .అనేకమంది మహనీయులను దర్శించి తరుణోపాయం అడిగితె బిక్కవోలు వెళ్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సేవ చేస్తే సంతానం కలుగుతుందని చెప్పగా ,దంపతులు ఆర్తిగా దర్శించి మనసులోని కోరిక విన్న వి౦చుకోగా ,సుబ్బారాయ షష్టినాడు చాల నిష్టగా సేవి౦చగా కలలో కన్పించి ‘’స్వాంతమున ప్రసన్నుడనై చింతలు దీర్చాను ‘’అని అభయమివ్వగా ,కొంతకాలానికి కడుపు పండి స్వామి అనుగ్రహం తో పండంటి బిడ్డపుట్టాడు .సుబ్రహ్మణ్యం అని పేరుపెట్టి పెంచారు .
రెండవది ‘’కళానిధి కథ’’-ఒక ఊరిలో పరమ నిష్టాగారిష్టుడు వేద వేదంగ పార౦గతుడు నిరుపేద బ్రాహ్మణుడున్నాడు.పెద్ద పట్నం లో ఒక సద్గురుని ఆశ్రయించి మరిన్ని విద్యలు నేర్చాడు .అక్కడ కళ అనే అపురూప సౌందర్యవతిని చూసి మనసు పారేసుకొన్నాడు .ఆమె దూరమయ్యేసరికి భరించలేక ,తాను సుబ్రహ్మణ్యస్వామి భక్తుడవటం వలన స్వామితో మొరపెట్టుకోగా ,ఆయన ప్రసన్నుడై కళానిధి తో పెళ్లి ఖాయమని చెప్పి అదృశ్యమయ్యాడు .వారిద్దరూ పెళ్ళాడి ఆజంట స్వామి సేవలో తరించారు అని చెప్పి ద్వితీయాశ్వాసం ముగించారు .
మూడవ ఆశ్వాసం లో మూడవ కథమహామహుని గురించి –అతడు గొప్ప రాజు నీతిమంతుడు రాజ్యం పై పక్కరాజు దండెత్తి బెదిరిస్తే ప్రాణాలు అర చేతపట్టుకొని భార్యాబిడ్డలతో అరణ్యానికి పారిపోయి ,అక్కడ ఒకసద్బ్రాహ్మనుడికి తన దీనగాథ చెప్పుకోగా ఆయన ‘’శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరు నాసమెయిన్-భక్తకోటి యాపద లెల్లన్-దాసు౦డై తీర్చును ‘’అని హితం చెప్పి అంతర్ధానం కాగా,కష్టపడి ‘’శేషస్వామి ‘’ని దర్శించి పూజించగా శక్తి సామర్ధ్యాలు వచ్చి శత్రురాజును జయించి తన రాజ్యం స్వాధీనం చేసుకొని సుఖంగా పాలించాడు .
అయిదవది కాంత కథ-ఒక ఊర్లో ఒక వైశ్యదంపతులు ధర్మంగా జీవిస్తూ ,పుట్టినకోడుకుకూడా వారి మార్గాన నడుస్తూ ఆనందం కల్గిస్తున్నాడు .తానుకూడా తండ్రిలా గొప్ప వ్యాపారికావాలనితండ్రితో కలిసి సముద్ర యానం చేసి ఒక ఊళ్లో దిగి వైశ్యుల ఇంట చేరి చిన్న వ్యాపారం మొదలుపెట్టి న్యాయం గా ఆర్జిస్తూ ,దానధర్మాలు చేస్తూ ,పేదలను ఆదుకొంటూ మంచి పేరుపొంది ,బాగా సంపాదించి మళ్ళీ స్వగ్రామం వెడుతుంటే నావ అనుకోని ప్రమాదానికి లోనై మునిగిపోతుంటే ,,తనకు సాయం చేసిన వీరిద్దరూ మునిగిపోవటం చూసిన ఒకడు వారిద్దర్నీ చనిపోవటం చూసి వారి ఇంటికి కబురు చేస్తే భార్య భర్త ,కొడుకును దూరం చేసుకొన్నందుకు విపరీతంగా దుఃఖించి భర్త తో పాటు అగ్నిప్రవేశం చేయాలనుకొని ప్రదక్షిణాలు చేస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి వృద్ధ బ్రాహ్మణ వేషం లో వచ్చి శాంత వచనాలతో ఆమె ప్రయత్నం మాన్పించాల్ని చేస్తే ఆమె ఒప్పుకోక అగ్ని ప్రవేశానికి అనుమతివ్వమని ప్రాధేయపడి ,ఆమెతో ‘’ఈ సాహసం ఇత్తరి వీడితి వేని నీ తనూజాతయు భర్తయున్ బ్రతికి చయ్యన రాగలరు ‘’అని చెప్పగా ,ఆయన పాదాలపై పడి నమస్కరించి ఆ కాంత ‘’దేవుడిలాగా వచ్చారు నాకు దారి చూపండి ‘’అనగా, బిక్కవోలుసుబ్బారాయుడు మహిమాన్విత దేవుడు ఆయన్ను దర్శించి పూజిస్తే మంచి జరుగు తుందని చెప్పగా ఆమె అలానే చేయగా స్వామికి ఆపద మొక్కులు మొక్కుకోగా ,వారిద్దరూ బతికి ఆనందాన్ని కూర్చగా సుబ్రాహ్మణ్య భక్తులయ్యారు
ఆరవది శూద్రక కథ –శూద్రుడైన ఒక నాస్తికుడు ఆస్తికులను భయపెట్టి బాధపెట్టి వీలయితే చంపేసి నాస్తికాన్ని పెంచుతుంటే ఒక సిద్ధ పురుష రూపం లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాడి దగ్గరకొచ్చి మంచిమాటలు చెబితే వినక నెట్టేస్తే , నేలమీదపడి తన్నుకొని పడ్డాడు ఆశూద్రుడు ..బాధ భరించలేక సిద్ధుని పాదాలపై పడి రక్షించమని ప్రార్ధిస్తే,స్వామి ప్రత్యక్షమై ‘’అనఘులను బాధ పెట్టి నందుకు ఫలితం ఇది ‘’అని బుద్ధి చెప్పగా వాడు ‘’స్వామీ నిన్ శరణంటి బ్రోవగదే-నీ మహాత్మ్యం బెరుగకప్పుడు ‘’మూఢంగా ప్రవర్తించాను బుద్ధి వచ్చింది ఇక ఎవరినీ హి౦సి౦చను ‘’అని కాళ్ళా వేళ్ళా పడగా
‘’నేను సుబ్రహ్మణ్యేశుడ-దాసుల యడ దాసుడ నయి తప్పింతు నిజం
బేసరి కష్టము లేనియు –గాసంతయు భయము నొందగా వలదు సుమీ ‘’అని అంతర్ధానమయ్యాడు .చివరలో మాలినీ వృత్తం లో పద్యం చెప్పాడు కవి –
‘’ముని హృదయ విహారా భూరిలోక ప్రచారా –వననిలయ గభీరా బ్రహ్మ చర్యాతిదీరా –ఘన ఫణి వరకాయా ఖండితస్వా విధేయా –వినతజన విధేయా –వినత జన విధేయా బిక్కవోల్ సుబ్బరాయా ‘’
మంచి ధారగల పద్యాలతో చక్కని సంభాషణలతో సులభమైన పద విన్యాసంతో గొప్ప వర్ణనా వైచిత్రితో భక్తి భావ బంధురంగా స్వామి మాహాత్మ్యాన్ని చాటే ఆరు కథలు రాసిస్వామి శతావధాని పిశుపాటి చిదంబర మహాకవి తన నిరుపమాన కవితా శక్తి చాటుకొన్నారు ‘
1100 సంవత్సలముల చరిత్ర కలిగిన బిక్కవోలు అతి ప్రాచీన శైవ క్షేత్రములలో ఒకటి, గోదావరి తీర మండలం, రాజమహేంద్రవరము, కాకినాడ కెనాల్ రోడ్డు ప్రక్కన ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మక విశేషాలతో తూర్పు చాళుక్యల శిల్పకళా వైభవంతో నిర్మించబడిన అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది.

ఈ ఆలయాన్ని చాళుక్య రాజులలో ఒకరైన విజయాదిత్య III 849 – 892 సెంచరీ AD లో నిర్మించారు. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్షముని పేరిట విక్షమపురంగాను, కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందినది.

ఈ పవిత్ర దేవాలయము శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయములో ఉన్నది. శ్రీ కుమార సుబ్రహ్మణ్యస్వామి వారు దక్షిణముగా కొలువుదీరి ఉన్నారు. అలాగే, ఇక్కడ పార్వతి, విజయ గణపతి, భద్రకాళి మరియు వీరభద్ర స్వామి ఆలయాలు గమనించవచ్చు. ఆలయలములో నెమలి వాహనం స్వామి విగ్రహం ముందు ఉంటుంది.

శ్రీ కుమార సుబ్రాహ్మణ్యస్వామి వారు బ్రహ్మచారిగా కొలవబడుచున్నారు. ఈ స్వామి అత్యoత తేజస్సు కలిగి చతుర్భుజుడై అభయ ముద్రలో దర్శనం ఇవ్వడం విశేషం. పై రెండు చేతులలో దండం, పాశం ఉంటాయి. ఇక క్రింద కుడి చేతిలో అభయమిస్తున్న స్వామి ఎడమ చేతిని తన నెమలి వాహనం పై ఉంచడం జరిగినది. స్వామి వారికి కుడి వైపున సహజ సిద్ధమైన పుట్టఉన్నది. ప్రతిరోజు రాత్రి పళ్లెంలో పాలు పోసి ఈ పుట్టవద్ద ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం.

శ్రీ కుమార స్వామి పళనిలోవలే దక్షిణ ముఖంగా, బ్రహ్మచారిగా కొలువై ఉన్నందున ఈ స్వామిని దర్శించి అభిషేకములు జరిపించినంతనే విశ్వాధిపతి అయిన స్వామి అనుగ్రహం వలన సకల గ్రహశాంతి కలిగి, కోరిన కోర్కెలు నెరవేరడం ఇక్కడ విశేషం. ప్రత్యేకించి రాహు, కేతు, కుజగ్రహశాంతిని కోరి జరిపించే దోష నివారణ పూజలు వలన అనేక మందికి వివాహ సిద్ధి, సంతానం, నష్టాలు మరియు శారీరక ఈతి బాధల నుండి పరిహారం లభిస్తుంది అని ప్రజల నమ్మకం.

ఈ ఆలయాన్ని దర్శించడం వలన అన్నిoటా విజయం లభిస్తుంది అని భక్తుల ప్రధాన విశ్వాసం. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున శ్రీ కుమార స్వామి వారి షష్ఠి మహోత్సవములు అత్యంత వైభవముగా జరుపబడతాయి. ఆ రోజున సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీర ధరించి స్వామి వారి వైపు శిరస్సు ఉంచి నిద్రించడం వలన సంతానవంతులు అవుతారు అని ప్రగాఢ నమ్మకం.

 

మీ-గబ్బిట దుర్గాప్రసాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి మహాత్మ్యం -1

బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి మహాత్మ్యం -1

‘’సుబ్రహ్మణ్యేశ్వరీయం ‘’అనే పేరుతొ బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి మహాత్మ్యం ను శతావధాని బ్రహ్మశ్రీ పిశుపాటి చిదంబర శాస్త్రి గారు రచించారు ,దీన్ని కాకినాడ సుజనరంజనీ ముద్రాక్షర శాలలో ప్రోలాప్రగడ బ్రహ్మానంద రావు గారి చేత 1912 కవిగారు ముద్రింప జేశారు .వెల ము౦దు రాసి, తర్వాత గీతలతో చెరిపేశారు. బహుశా పావలా ఉండవచ్చు.’

  కవిగారు విద్వత్ కవులకు ఒక విన్నపాన్ని పద్యాలలో చేస్తూ ‘’కృష్ణానదికి దక్షిణాన పది యోజనాల దూరంలో కరవది గ్రామం లో తాను పిశుపాటి వంశం లో  జన్మించాననీ,తనకు 20 ఏళ్ళు అనీ ,చిదంబర శాస్త్రి  అని తనను పిలుస్తారనీ ,’’పూర్వ పుణ్యమున నీ పుస్తకంబు భక్తీ కొలదిని రచియించి పరమ పురుషునకు సమర్పణం చేశాను ‘’అని చెప్పారు.

  ఆతర్వాత సంస్కృతం లో శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం రాశారు .మొదటి శ్లోకం –

‘’అ౦సా౦చ త్సర్వలోక  ప్రచిచిత మభరం దాస మందార మన్మ-చ్ఛ౦సా పాత్ర౦ సుగాత్రం భవ నిరతి లతాదాత్ర ముధ్య చ్చరిత్రం

హింసా హింసా విచారే పరమగురు మనంతాకృతి చింతిత నీయం –తమ్ సుబ్రహ్మణ్యదేవం భజత బుధ గణః శ్శ్రేయనామా మేష పంధాః’’

చివరగా ‘’చిదంబరాభి ధానోహం పిశుపాటి కులోద్భవః  -త్వా మేవ శరణం యాత స్సుబ్రహ్మణ్య ప్రసదమే’’ అని పూర్తి చేశారు .

  తర్వాత పద్యాలలో శ్రీ వర్ధిల్లే బిక్కవోలు లో ఆవిర్భవించి అందరినీ కాపాడుతూ ‘’విశద వీధుల ‘’చూపించే సుబ్రహ్మణ్య దేవోత్తముని కీర్తించారు .ఈ మహాత్యం రాసి స్వామికి అన్కితమిస్తున్నానని తన మనోగతం ఎరిగించారు .సరస్వతమ్మ ‘’పలుకు పలుకున వెలయు నప్పులకు వెలది ‘’అని స్తుతించి ,సౌభాగ్యశ్రీ కలిగించే ‘’కలిమి నెలత ‘’ను ప్రసన్నం చేసుకొని ,’’జగదంబ పరాదేవి ఆది శక్తి ,కాళి,భగవతి కవిలోక కల్పవల్లి ‘’కి కైమోడ్చారు .

  ఆతర్వాత తన కుల విశేషాలు చెప్పుకొన్నారు .వెలనాటి వారు వేద వేదాంగాలలో నిష్ణాతులు ,సరస గాన సాహిత్యాలలో మేటి వారు ,కర్ణ ధర్మ దధీచి లకు దీటైన దాన ధర్మానుయాయులు ,ఆపన్న రక్షకులు ,అలాంటి వశంలో పిశుపాటి వారింట చిదంబర బుధుడు పుట్టాడు .కామాక్షిని పెళ్ళాడి .చాలాకాలానికి పిల్లలు పుట్టకపోతే ,ఆ కులం లోనే పేరు భొట్లు అనే ఆయన కొడుకులలో ఒకరిని తమకు దత్తత ఇమ్మని కోరగా వెంటనే అంగీకరించి సీతారాముడు అనే కొడుకును దత్తత ఇవ్వటానికి ఇష్టపడగా స్వీకరించి చక్కగా పెంచుకొన్నారు .అతడు గొప్ప పేరు తెచ్చుకొని ,కనకాంబను పెళ్ళాడి ఆమె ద్రౌపదిలాగా పరమసాద్విగా సేవలు అందిస్తుంటే ,కడుపు పండి,పెద్దకొడుకు మనకవి చిదంబరం ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు .మాతామహులైన పాలపర్తి సుబ్బయ శాస్త్రి ,లింగామా౦బ దంపతులు . భారద్వాజ గోత్రీకుడైనకవి పెంచిన తలి దండ్రులకు విధేయుడుగా ఉన్నాడు .తనకు సంస్కృతాంధ్రాలు పాణినీయం ,వర కవిత్వ రచన నేర్పిన గురువులకు అంజలి ఘటించి ,కృతిని బిక్కవోలు సుబ్బరాయ దేవునికి అన్కితమిస్తున్నానని తెలిపాడు .సుకవి స్తుతి చేసి ,కుకవి నిరసనమూ చేసి ,దోషాలుంటే మన్నించమని కోరాడు.సుబ్రహ్మణ్య షష్ఠి నాడు బిక్కవోలు బుధులు ‘’కరువది గ్రామ రత్నానివి ఉభాయభాషలలో అద్వితీయుడవు కండగల కవిత్వం గీర్వాణ ఆంధ్రాలో చెప్పగల మేటివి ,కాళికా దేవి కృపా పాత్రుడవు .కనుక మనస్వామి మహాత్మ్యాన్ని కావ్యంగా రాసి తరించి మమ్మల్నీ తరిమ్పజెయ్యి ‘’అనికోరగా సరే అని  షస్త్యంతాలురాసి ప్రారంభించాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం )

 

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం )

ఆనంద గజపతి మహారాజు ‘’అరబీ ,పారసీ గ్రీకు లాతినుతెలుగా౦గ్ల౦బు గీర్వాణముల్ –పరి పూర్ణముగ నేర్చియన అన్నిటను’’ కావ్యాలు రాశాడు .దీనికి విజయనగర మోతీ మహల్ సాక్ష్యం .హరిశాస్త్రి ,పేరివెంకట శాస్త్రి గార్లు ఆచార్యులై శబ్ద శాస్త్ర రహస్యాలు నేర్పితే మహా పాండిత్యం పొంది ‘’రచనలు చేశాడు .అప్పుడు ప్రతి ఇల్లు శారదా నివాసమే .విజయనగరం భోజుని ధారా నగరమే .గానం ,వేదఘోష శాస్స్త్ర చర్చ ,నాట్య కేళి నిరంతర౦ మహా వైభవంగా సాగాయి .గాన్ధర్వా౦శులైన వైణికులున్నారు .ఆనంద రసం నిత్యప్రవాహమే అక్కడ .రాజు వైణిక శిఖామణి కూడా ‘’

ఆయన చల్లని పాలనలో సంస్కృత కళాశాల ప్రవర్ధమానమై రాయుడు శాస్త్రిగారు ఉపాధ్యాయులయ్యారు .రామానుజా చార్యులు ప్రిన్సిపాల్ .వీరిద్దరికీ కేమిష్ట్రి బాగా కుదిరింది .తారకనామంలాగా భాష్యాంతం చదివేవారు ఆర్ధిక ,తర్క మీమాంసలు నేర్చేవారు ,వ్యాకరణం  అవపోసన పట్టిన వారు  అక్కడ విద్యార్ధులుగా చేరి బాగా ఎదిగిపోయారు .హూణ విద్యలూ నేర్చారు .వ్యాకరణ బోధలో రాయుడు శాస్త్రిగారిని మించిన వారు లేరు అన్న గొప్ప ఖ్యాతి పొందారు .విద్యార్ధులకు గజపతి ఉపకార వేతనాలిచ్చి ప్రోత్సహించాడు  .కూరెళ్ళ సూర్యనారాయణ శాస్త్రిగారి వద్ద తర్కం అభ్యసించారు .ఆలూ బిడ్డల్ని వదిలేసి కాశీ వెళ్లి ప్రాయం అంతాకరగించి నేర్చిన శ్రీపాద సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద నడిమింటి సంగమేశ శాస్త్రిగారు సుశ్లోకుడు రాజుగారితో నిత్య చర్చలు చేసేవారు .ఈయనవద్ద కాణాదం,గౌతమీయం నేర్చారు రాయుడు శాస్త్రి .కొల్లూరి కామేశ్వర శాస్త్రి గారి వద్ద ‘’శంకర గురూత్తంబైన భాష్య త్రయం ‘’నేర్చారు .కావ్యాలు నాటకాలు బులుసు సుబ్బయ శాస్త్రి గారి వద్ద ,రుద్రాభట్ల రామ లక్ష్మణ శాస్త్రి సోదరులవద్ద వ్యాకరణం ,సంగమేశ్వరులవద్ద తర్కం ,కామేశంగారిదగ్గర శంకర భాష్య భారతి ,సూర్యనారాయణ శాస్త్రిగారి వద్ద గాన్ధర్వకళ ఇలా ఒకటేమిటి రాయుడు శాస్త్రిగారు సకల కళా శాస్త్ర వల్లభుడయ్యారు .లౌకికం లో, వేద శాస్త్రాలలో ఎదురులేనట్లు భాసించారు రాయుడు శాస్స్త్రి .తమ౦త వారు లేరని తొడలు కొట్టే కాశీ పండితులు ఈయను చూసి కిమిన్నాస్తి అయి పోయారు  గురువు గారిలాగా అక్షరం కూడా తప్పకుండా పాఠం చెప్పేభాగీరధ శాస్త్రి ,ప్రతివాది గర్వ నిర్వాపకుడు రాయప్ప శాస్త్రి ,గ్రంధకర్తలకు అర్ధం కాని సందేహాలు తీర్చే దిట్ట సూర్యనారాయణ సూరి ,పాణి ణీయాన్ని పుక్కిలిపట్టిన నరసింహశాస్త్రి లు రాయుడు శాస్త్రిగారి శిష్యులై మొదటిసారి మొదటి శ్రేణిలోకాశీ పండితుల కళ్ళు ఎర్రబడేట్లు  ఉత్తీర్ణులయ్యారు . అంతటి ఘనగురువు రాయుడు శాస్త్రిగారు .సంతానం కలగలేదు .భార్య’’సతియగు సూరమాంబ గ్రహచార వశాన నకాల మృత్యు గత’’అయింది .ద్వితీయంగా కాశీ నాద శాస్త్రి గారికుమార్తే పాప సోదెమ ను చేసుకొన్నారు .ఈమెతో దా౦పత్య౦  చక్కగా వర్ధిల్లి ,ఆమె శిష్యులపాటి తల్లిగా వ్యవహరిస్తూ ఆలనాపాలనా చూసేది .ఈ కొత్త దంపతులకు ఇద్దరు కుమారులు కల్గారు .పెద్దవాడు సూర్యనారాయణ శాస్త్రి ఆంగ్లం లో నిష్ణాతుడై ,ఏం ఎస్ సి పాసై ఆంద్ర విశ్వ విద్యాలయం లో రిసెర్చ్ స్కాలర్ అయ్యాడు .రెండవవాడు సన్యాసం తీసుకొన్నాడు .పెద్ద కూతురు బాల .చిన్నమ్మాయి, పెళ్లి ళ్ళుచేశారు.చిన్నకూతురు ‘’అసాధ్యరోగం పాలై తల్లిని చేరింది ‘’అల్లుడూచనిపోయాడు కొద్దికాలానికి దెబ్బ మీద దెబ్బ తీసింది విధి .

 

.ఆన౦ద గజపతి   తర్వాత అలక్ నంద రాజయ్యాడు .శాస్త్రి గారి కీర్తి మరీ పెరిగింది .ఉర్లాం ,పిథాపురం మొదలైన సంస్థానాలు రాయుడు శాస్త్రిగారిని ఆహ్వానించి ఘన సన్మానాలు చేశాయి.కాశీలో అఖిలభారత రాజ సమావేశం జరిగింది .అక్కడ శాస్త్రిగారిని ఘనం గా సన్మానించారు .రాజమండ్రిలో జరిగిన శ్రౌతమార్గ విద్రాజుల గోష్టిలో పాల్గొని దిశా నిర్దేశం చేశారు .వేదసంపదకు బ్రహ్మావతారం ,కోపం లో దుర్వాసుడు ,ముక్కవలి బ్రహ్మావధానులు రాయుడు శాస్త్రి గారి ఉపన్యాసం విని ఫిదా అయ్యాడు .అక్కడి సభలకు మధ్యవర్తి రాయుడు శాస్త్రిగారే .నిష్పక్షపాతమైన తీర్పు ఆయనది .అందరూ శిరసున దాల్చాల్సిందే .శ్రీపాద నరసింహ శాస్త్రి రామ శాస్త్రి ఉద్దండులె అయినా శాస్త్రిగారి తీర్పుకు బద్దులే ..’’భరత ఖండా వతంస దీప్తి మెరయనొనర్చిన తీర్ధకరుడు ‘’రాయడు శాస్త్రి .సేతు సీతాచలపర్యంతం ఆయన పేరు మారుమోగింది .శాస్స్త్రిగారి శిష్యులను లెక్క పెట్టాలంటేఆది శేషుడుకూడా జారు కొంటాడు.

చివరిపద్యం –‘’కౌముదీ సుకుమార కాంతి కందలబృంద –పశ్యతో హరకీర్తి భారవాహు

డిందు శేఖర పదా స్పంద సద్భక్తి మం-జషాయమాణ ధీ శోభితుండు

బాభాష్యమాణ షడ్వదన దేవ భ్రాంతి- కారి వాన్ముఖ చమత్కార జలధి

కాశికా పండితాఖండల వినుత వి-జ్ఞత్వ హేతు గురుప్రసాదసుకృతి

సకల తంత్ర స్వతంత్రు డత్యకుటిలాధ్వ-తర్కనిది నిష్కళంకతాతా కులాంబు

నిధి కళానిధిసుబ్బరాట్సుధి చెలంగు –గాత శిష్యోపశిష్య సంఘములతోడ ‘’

ముందే చెప్పినట్లు ఈ ‘’రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక’’కావ్యాన్ని రచించినకవి శాస్త్రిగారి ముఖ్య శిష్యులు శ్రీ వెంపరాల సూర్య నారాయణ శాస్త్రి గారు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2

పాలు, తేనే, ఖండ , దధి స్వ చ్ఛజలం తో ఏ లోటు రాకుండా రుద్రమంత్రాలతో ఏకాదశ వృత్తి గా కాలగ్రీవుని అభిషేకం చేసేవారు లక్ష్మణ శాస్త్రి .ఆ లక్ష్మణ నిగమఖని అర్ధాంగి కామమాంబిక .వీరికి శంకరుడు కుమారుడు .భార్య పార్వతి .వీరికి సూర్యనారాయణ ,పాపన ,పేరి శాస్త్రి కుమారులు .సూర్యనారాయణ యజుస్సామాలను బాల్యం లోనే పూర్తిచేసి ,’’అమృత మయూఖ శేఖరుని ‘’నిత్యం షోడషోపచారాలతో పూజిస్తూ ,నిత్యం అఘమర్షణ స్నాన జపతపాదులు హరుని అభిషేకం చేస్తూ ‘’సూర్యనారాయణావధాని ‘’అయి ,సోమిదమ్మ పెళ్ళాడాడు భార్యపరమ సాధ్వి  అనిపించుకొన్నది .ఈదంపతుల కుమారులే  అప్పన ,సుబ్బారాయుడు ..అప్పన శాస్త్రి శైశవం లోనే ‘’యజుర్నిగమం ‘’అంతానేర్చి పూసపాటి విజయరామరాజు ఆస్థానం లో నిగమావధాన నిధి అయ్యాడు .భార్య సోదెమ్మ .వీరికొడుకు వెంకట నరసింహం వేద వేత్త ,రాముని అవతారం .యజుర్వేదం అంతం చూసి రాజాగారి వేద కళాశాలలో అధ్యాపకుడు అయ్యాడు .వీరికి కలిగిన లక్ష్మీ దేవిలాంటి కూతురికి పెళ్లి చేసి అల్లుడు  కూతురిని  ఇంట్లోనే ఉంచుకొన్నారు .వెంకట నరసింహం తమ్ముడు రామమూర్తి ఏణా౦కమనోజ్ఞ రూపమగు ఆత్మ భవ త్రితయాన్ని’’ పొంది వంశాభి వృద్ధి చేశాడు .

‘’  ఆయన్న దమ్ముల౦దు  ద్వితీయు౦డు –బుధ సభలనద్వితీయుడు సుబ్బా

రాయసుధీంద్రు౦డు విలసిలు –వైయాకరణౌఘ సార్వ భౌమాఖ్యాతిన్ ‘’

అక్షయనామ సంవత్సర పుష్య బహుళ పక్షం లో జనించారు  సుబ్బరాయశాస్త్రి .తలిదండ్రులు సుబ్రహ్మణ్యం గురువులు సుబ్బారాయుడు అంటే అందరికీ రాయుడు శాస్త్రి అయ్యారాయన .భాష్య బోధనలో అసలు సుబ్రహ్మణ్య స్వామిగా ,పత౦జలిగా భాసించారు .కన్నడం లో రాయ అంటే రాజు అని అర్ధం .తండ్రివద్దనే శ్రౌత స్మార్తాలు అభ్యసించారు .స్మృతికి మూలం స్మార్తం దీనికి మూలం సంస్కృతం కనుక సంస్కృతం ఆసాంతం అభ్యసించాలని రాయుడు శాస్త్రి గారు 8వయసులో రోజూ విజయనగరం వెళ్లి నేర్చుకొని వచ్చేవారు .శివాజీని తల్లి జిజియాబాయి తీర్చినట్లు రాయుడుగారి తల్లి శాస్త్రిగారినిఅలా తీర్చి దిద్దారు .

 ‘’ విజీనగరం ‘’లో రాయుడు శాస్త్రిగారు శ్రీ బులుసు సుబ్బయ శాస్త్రి గారివద్ద గీర్వాణ౦ నేర్చి ఘనులని పించుకొన్నారు .విజయరామరాజు ఉచితంగా విద్యాబోధన కలిగిస్తూ వసతి భోజనాదులు సమకూర్చి సంస్కృతానికి గొప్ప సేవ చేశాడు .ఈ రాజు ఈనినపులి ఉండే పొదలో దూరి దానిపిల్లను చెవులు పట్టుకొని బయటికి తెచ్చేవాడు .కళ్ళెం బల్లెం లేకుండా గుర్రాన్ని ఎక్కేవాడు .రెడ్డి  దొడ్డమల్లుని ఓడించిన పోటుగాడు .రూపాయి బిళ్ళను వేళ్ళమధ్యపెట్టి మైనంగా ముద్ద చేసే వాడు –‘’రామలీలా మహప్రణేత’’అనిపించాడు .ఎన్నెన్నో యజ్ఞాలు చేసి భూరి సంభావనలిచ్చి దేవతలను భూదేవతలను తృప్తి చెందించాడు .బ్రాహ్మణ కు కుటుంబాల్లో ఆడపిల్లలు ఎందరికో పెళ్ళిళ్ళు చేయించాడు .వేదవేత్తలకు అగ్రహారాలిచ్చి పోషించాడు .వీటినిశిలాశాసనాలపై రాయించాడు .’’కెసిఎస్’’అయి,అనేక సార్ధక బిరుదులూ పొందాడు .మాతా శిశు సంరక్షణకు దీనజనులకు వైద్యాలయం కట్టించాడు  .కాశీలో గురువు అంటే కాశీ విశ్వనాధుడే అన్నట్లు’’ పరి భాషేందు  శేఖరం ‘’కు గురువుతీర్చి  దిద్దిన వాడు,శబ్ద రత్నానికి సానబెట్టి కావ్యార్ధ చంద్రిక వెలార్చిన హరి శాస్త్రి గారిని తన ఆస్థాన పండితుని చేశాడు .

  అలాంటి రాజు పాలించే విజయనగరం లో రాజావారి కాలేజిలో రాయుడు శాస్త్రి గారు ఉపాధ్యాయుడు అయ్యారు .’’శ్రీ విద్యానిధి సుబ్బయ ధీమణి’’ప్రతి  ఏడాది  దేవీ నవరాత్రి ఉత్సవాలు అద్వితీయంగా నిర్వహిస్తూ ,అన్నసంతర్పణలు చివరిరోజున ఘనంగా నిర్వహించి అందరికి సంతృప్తి కల్గించారు.పన్నెండేళ్ళవయసులాయింతటి అద్భుతాలు  చేశారు ,.సంస్కృత దృశ్య కావ్యాన్తాలన్నీ మూడేళ్ళలో రోజూ అగ్రహారం నుంచి ఇక్కడికి వచ్చి నేర్చేశాడు .కుర్రాడు చాకులాఉన్నాడు బాకులా దూసుకు పోతున్నాడని గ్రహించి రుద్రాభట్ల రామ శాస్త్రి ,లక్ష్మణ శాస్త్రి సోదరద్వయం ‘’శబ్దాగమధ్యేత’’ గా తీర్చి దిద్దారు. ఆసోదరులు ‘’ఫణిపతి శాస్త్ర వాద పధ్ధతి యందు అసహాయ శూరులు .ధీబలం లో శంభునైన ఎదిరించగలరు .త్రిపుర సుందరీ ఉపాసకులు .నిత్యాన్న దాన నిరతులు .అసమాన సకల భోగ సమృద్ధి ఉన్నవారు.

 ‘’వ్యాకరణాధ్వనీన మతి పాటవమున్,ఘటియించి నంతతో-బోక ఆలంక్రియాగమా సముద్రము ద్రచ్చి ,తదుద్గ్తతామృత  

స్వీకృతి పాత్రు జేసి తమ శిష్యుని రాయుడు శాస్త్రి నాత్మ నెం-తో కృపనూని  పూర్ణ విబుధున్ బొనరించిరి  రామ లక్ష్మణుల్ ‘’

అలంకార ఆగమ శబ్దా మ్నానం ,మీమాంస మొదలైన వాటిలోఅద్వితీయుడై ‘’అచలాధీశాత్మజా మంత్రం ‘’(త్రిపురసుందరీ దేవి )దీక్ష పొందారు .ఇరవైఏళ్ల వయసు రాకముందే ఇన్నింటిలో అపార ప్రజ్ఞానిధిఅవటం అసాధ్యమే అయినా రాయుడు శాస్త్రి గారు సుసాధ్యం చేశారు .బ్రహ్మ చర్యం నుంచి  గృహస్థాశ్రమ౦ పొందాలని తగిన వధువు సూరమ్మగారిని వరించి పెళ్ళాడారు.అదే సమయంలో విజయనగర సంస్థానానికి ఆనంద గజపతి మహారాజయ్యాడు.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-9-10-21-ఉయ్యూరు      

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1

రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1

అ నే పద్యకావ్యాన్ని బ్రాహ్మశ్రీ తాతా సుబ్బారాయుడు శాస్త్రి గారి షష్టి పూర్తిమహోత్సవం నాడు వారి శిష్యులు గురువుగారి పాదపద్మాలకు సమర్పణగా ,ముద్రించినట్లు ఆసంఘ కార్యదర్శి శ్రీ వాసా అన్నప్ప శాస్త్రి గారు 20-4-1935 న తెలిపారు .ఈ కావ్య రచనకు ప్రోత్సాహం శాస్త్రి గారి ప్రధమ శిష్యులు పిఠాపురం సంస్థాన విద్వాంసులు బ్రహ్మశ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రిగారు ,.ప్రశిష్యులు , విద్యా ప్రపితామహులు  బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు కావ్య కర్త ..ఈ కావ్యాన్ని ఖర్చులన్నీ తామే భరించి మద్రాస్ లోని వావిళ్ళ ప్రెస్ అధినేత ,ఆర్ష విద్యా వ్యాప్తిదురీణ బ్రహ్మశ్రీ వావిళ్ళ వెంకటేశ్వర్లు అని కూడా తెలియ జేశారు .ఈ పుస్తకం లో మొదటినాలుగు పేజీలు  మిస్ అవటం వలన ఎక్కడ ఎప్పుడు ముద్రించారో వెల ఎంతో తెలియలేదు.250పద్యాల సరస కావ్యం .

వెంపరాల వారు శార్దూల పద్య రాజం ‘’శ్రీ వాణీ లలితాంబి కాప్తు౦డు,జగచ్చ్రేణీ గురుండాత్మ వి-ద్యావారాశి త్రిమూర్తి రూపుడగుమేధా దక్షిణా మూర్తి ‘’తా

తా’’వంశాబ్ధి కళానిధికిన్ ,జయ విహర్తన్ సుబ్బరాట్ఛాస్త్త్రి,వి-ద్యావాగీశు గురు ప్రసాద జనిత ఖ్యాతిన్ సదా బ్రోచుతన్ ‘’  తో కావ్యం ప్రారంభించి ‘’ఎవ్వాని శిష్యత్వ వృత్తిసాందీపని చిరుత పాపనికి సంజీవనంబో ‘’అని గురు స్తుతి ఉదాత్తంగా చేసి ‘’శక్తి శబ్దాభి ధేయ విశ్వమున నేక రీతి నే దేవి వెలిగే ‘’ఆ త్రిపురసుందరి కరుణార్ద్ర దృష్టితో శాస్త్రి గారిని చూడాలని ప్రార్ధించి ,’’శివోత్తమాన్గమయి,తౌషారచల౦బై ,ఫణాధర  లోకంబయి తేజరిల్లిన’’మునీన్ద్రశ్రేష్టులైన పాణిని .’వరరుచి పతంజలి లను సంస్తుతించి ,తనకు కవితా నైపుణ్యం కూర్చిన చావలి లక్ష్మీ నరసింహ గురు స్వామికి నమస్కరించి ,తర్క వ్యాకరణాలు బోధించిన దర్భా సర్వేశ విద్యార్కుని సంబోధించి ,తనను ప్రబంధ ప్రణతృణి చేసిన సూర్య బుధేంద్రుని పాదాలకు నమస్కరించి ,విజయరామ రాజు కొలువులో సుకవితకు సూత్రధారి గంటమంటక ఒక గడేకు  నూరు పద్యాలు చెప్పగల దమ్మున్న అడిదం సూరనకు మెచ్చాడు కవి .

అత్రి మహర్షి గోత్రోద్భవులు,ద్రావిడ దేశం లో మొదటపుట్టి ద్రావిడులు అనే శాఖగా విస్తరిల్లి ‘’తాతా యితడు వేద విద్యననిఆశ్చర్య పరచి  అదే ఇంటిపేరుగా మారింది .’’దాతలఖిలా వేదములకు ,ద్రాతలు దీనులకు ,శిష్యతతులకు విద్యా –దాతలు ,శుభ సంధాతలు తాతాపూతాన్వయులు శతక్రతు గాతల్ ‘’  అంటూ తాతా వారి గొప్పతనాన్ని అన్నికోణాలలోనూ ఆవిష్కరించారు .విజయనగర రాజులు పూసపాటి వారు వీరికి ‘’ఒంటి తాడి ‘’అగ్రహారం  ఈనాముగా  ప్రదానం చేశారు .ఆ వంశం లో తాతా కామేశ్వర శాస్త్రి మహా యశస్కుడు .వేదాలు నేర్చి బోధిస్తూ బ్రహ్మజ్ఞానం ఆర్జించి ,పెళ్లి చేసుకొని సత్సంతానం పొంది చివరికి సన్యాసం స్వీకరించాడు .ఆయనకొడుకు లక్ష్మణ శాస్త్రి వేద వేత్త .నిగమాగామాలలో మహాపండిత ప్రకా౦డునడు .పదం, క్రమం జట,ఘనలలోకొమ్ములు తిరిగినవారితో పోటీపడి విజయాలు సాధించి జయధ్వజాన్ని ఎగరేస్తూ లక్ష్మణావదానిగా ప్రసిద్ధుడయ్యాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-21-ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రామయాజి చరిత్ర

రామయాజి చరిత్ర

అనే పుస్తకాన్ని రాజమండ్రికి చెందిన బ్రహ్మశ్రీ శ్రీపతి భాస్కర శాస్త్రి రాశారు. వీరు కంచుమర్తి శ్రీ వెంకట సీతారామ చంద్రరావు బహద్దర్ జమీందారు గారి ఇండస్ట్రియల్ జనానా  స్కూల్ లో ప్రధాన ఆంధ్ర ఉపాధ్యాయులు .పుస్తకం 1914లో బ్రాసీ ఇండష్ట్రియల్ మిషిన్ ముద్రాక్షర శాలలో ముద్రితం .వెల పావలా.

  మద్రాస్ మండలం గుంటూరుజిల్లా ఒంగోలు తాలూకా కొప్పోలు గ్రామవాస్తవ్యులు కమ్మవారైన విబుధ వరేణ్యుడు సింగం నేని శ్రీరామయాజి గారి గురించిన విషయం .హిందూ జాతి ఉద్ధరణకోసం శ్రుతి స్మ్రుతి పురాణ ఇతిహాసాదుల సారాన్ని అందరికి అర్ధమయేట్లు ప్రచారం చేసి ,కర్మ ధర్మ మర్మ జ్ఞానం ఆచరించటానికి శ్రీరామ యజ్ఞం ,,వైశ్వ దేవం ,శ్రీరామ పట్టాభిషేకం నిరంతరంగా రామయాజి తీవ్ర కృషి చేశారు అని రచయిత ముందుమాటలో చెప్పారు ,ఇది 148పద్యాలతో అల్లిన కావ్యం .

 కందపద్యం లో రామయాజి గారి గురించి రాస్తున్నట్లు కవి శివుడికి విన్నవించి మొదలు పెట్టారు .జన్నిదాల గోత్రానికి చెందిన సింగమనేని వంశం లో ఆదినారాయణ ,యజ్ఞమా౦బిక దంపతులకు వెంకటరామయ్య జన్మించి ,వెంకట లక్ష్మిని పెళ్ళాడి కొదండరామయ్యకు జన్మ నిచ్చారు .ఈయన వైష్ణవభక్తి దుర్యుడు ,శ్రీరాముని ప్రతిష్టచేసి దేవాలయం నిర్మించి ,అహింసకు  ఆటపట్టుగా ,సత్య సంపదకు సొమ్ముగా వర్ధిల్లి కొప్పోలులో నివాసమున్నాడు .భార్య రామానుజమ్మ వీరికి నమ్బెరుమాళ్ ,రామయ్య ,పెద్ద కృష్ణయ్య  ,చిన్న కృష్ణయ్య అనే  నలుగురు కొడుకులు .వీరు ‘చతుర్విధ పురుషార్ధ సరణి గాంచు –నవని నాల్గు సముద్ర౦బులజెలంగు –నల చతుర్వ్యూహముల భాతి నలరు ‘’చున్నారు

  వీరిలో రెండవ కుమారుడు రామయ్య కొప్పోలులో రామ సిద్ధ సామ్రాజ్య పట్టాభి షేక వైశ్వ దేవ సంకల్పమొనరించి ‘’విఖ్యాతుడయ్యారు.ఆయన వాగ్ధాటి గభీర శక్తియుక్తులు సాహిత్య చింతనా ,విద్యా వైదుష్యం నిరుపమానం .గాంభీర్యానికి పాలకడలి .వితరణలో దధీచి .సద్భక్తిలో సనకసనందనాదులు .’’శేముషీ గుణ యాజి రామయాజి ‘’.

‘’కొప్పోలు లోపల కొట్టాయి నిర్మించి –వైశ్వ దేవమొనరించి వైభవమున

నాజ్య ధారాస్ఫూర్తి నగ్నిహోతరుని హోమ  -తర్పణాదుల నెల్లదైవములను

సంతర్పణాదుల సర్వజన౦బుల –సత్కారముల చేత సకల బుధుల

నిష్ఠ కామ్యములిచ్చి ఎల్ల భాగవతుల-దానధర్మముల సత్కవుల బుధుల

తగిన దక్షిణ లిచ్చి యధ్వర్యవరుల –జగతి దన్పుచు,నవ భ్రుధ స్నాతుడగుచు

నియతి జెలువొందు సి౦గము నేని రామ – యాజి సద్గుణ రాజి విఖ్యాతి గాంచు ‘’

  రామయాజిని దైవాంశ సంభూతునిగా కవి వర్ణించి –‘’అతడు వన్యాహారి యితడు ధన్యాచారు –డతని కంటే నితండేయధికుడగును ‘’అని తేల్చేశారు.ఆయన వాలిని కూలిస్తే ఈయన కీలిని వ్రేల్చాడు అతడు కోతికి మిత్రుడైతే యితడు నీతికి మిత్రుడు.ఆయన వైరులను కొడితే ఈయన క్రూరులను నెట్టాడు .ఆయన రాముడు అయితే ఈయన జగదభిరాముడు .

  తప్పటడుగుల దగ్గర్నుంచి ధర్మం తప్పేవాడుకాడు .చదవటం రాయటం తోపాటు బ్రహ్మ విద్య అబ్బింది .విశిష్టాద్వైత మార్గాన సుశ్లోకుడై ప్రవర్తిల్లాడు .అన్నిమతాల సారం ఆకళింపు చేసుకొన్నాడు .

‘’పంచాక్షరీ మంత్రపంచాయుధమును పూని –పంచముద్రలు పట్టు పంచ గట్టి

పంచ తన్మాత్రలన్ పాంచజన్యము బట్టి –పాంచ భౌతిక చక్ర మెంచి తట్టి

పంచపంచస్వన పటు కిరీటము దాల్చి –పంచవాయుల తారు్క్షు వాహనముగ

పంచ చిదావస్తలెంచి సెజ్జగజేసి – పంచ కర్తల గద్దె పై వసించి

పంచ వింశతి తత్వ ప్రపంచ రాజ్య –మేలు విష్ణుడు ‘’అనిపించాడు రామయాజి .ఆయన ఔదార్యం ,జితేంద్రియ నిష్ఠ అద్భుతం .బ్రహ్మ మహాస్మి అనే పరమ రహస్యం తెలిసినవాడు .తత్వమసి,అహమేవ బ్రహ్మల పరమార్ధం వంట బట్టి౦చు కొన్నాడు .త్రిఋణాలను చక్కగా తీర్చుకొన్నాడు .స్వప్నంలో కూడా అనృతం ఆడడు .రుతుకాలం లోనే భార్యతో క్రీడిస్తాడు.అందుకే’’ వెండి కొండ నవాబు(శివుడు ) ‘’యాజిగారి కోరికలన్నీ నెరవేరుస్తాడు ‘’అని కావ్యం ముగించారు కవి .

 కవి గారి సామర్ధ్యం గొప్పది .చెప్పిందే చెప్పినట్లున్నా ప్రతి సారీ కొత్తగా ఉంటుంది పద్య ధార సునాయాసంగా ప్రవహించింది .క్లిష్టంగా కాకుండా ఇష్టంగా ఆనందంగా రామయాజి గారి ఈవి యజ్ఞయాగాది వైదిక ధర్మకర్మలు, విశిష్టాద్వైత మత ప్రవర్తన కళ్ళకు కట్టించారు కవి విద్వాన్ శ్రీపతి భాస్కర శాస్త్రి .తన పాండిత్యాన్ని కవితా వైదుష్యాన్ని చక్కగా వెలువరించారు .ఈకావ్యాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .కవి గారి గురించి ఎక్కడా ఆయన చెప్పుకోలేదు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిరుపతమ్మ కథ పాట

తిరుపతమ్మ కథ పాట

కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు  తిరుపతమ్మ కథ ఇది .దీన్ని కామమ్మ కథపాట మాదిరిగా ఈ కథ పాట రూపం లో రాయబడి ,1927లో తెనాలిలోని రచిత ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల కేవలం రెండు అణాలు .

‘’శుభమమ్మ తిరుపతమ్మ మాయమ్మా తిరుపతమ్మా –అతి పుణ్యనది యైన మునియేటి దరిని తిరుపతమ్మ –పెనుగంచిప్రోలనెడిఘనపురమునందుతిరుపతమ్మ –శ్రీ కమ్మ కులజుండు శివ సోమరాజు జననమొ౦ది –రంగమా౦బా యనెడి రమణి తోగూడిసుఖముగా –అతి ధర్మ శాలులై నలరు చుండెదరు తిరుపతమ్మ –తనకు సంతతి లేక తల్లడిల్లుచును రంగమాంబ –గుళ్ళు గోపురములు జాల గట్టించె రంగమాంబ –చెరువులు భావులు చాల త్రవ్వించె రంగమాంబ-అన్నమును బీదలకు నధికముగా బెట్టెరంగమాంబ’’అని మొదలౌతుంది పాట .

‘’ఒకనాటి రేయి శ్రీ వెంకటేశ్వరులు రంగమకును –కలలోన గనిపించి ఈ రీతి బలికె స్వామివారు –‘’నీవు స౦తతికొరకు చింతింపవలదు రంగమాంబ ‘’అని చెప్పి తాను పుత్రికను ప్రసాదిస్తాననీ తనపేరు పెట్టుకోమని చెప్పాడు.

‘’తొమ్మిదవ మాసమున తొలకరి మెరుపు రీతిగాను –ఒక్క స్త్రీరత్న౦బు నుద్భవించినది రంగమకు –  బ్రాహ్మణులను పిలిపించి ‘’తిరుపతమ్మ ‘’ని పేరు బెట్టిరి బాలికకు ‘’

రోజూ రహిమాన్ ఖాన్ ఆమెకోసం పూలు తెచ్చి ఇచ్చేవాడు .ఒకరోజు రాకపోతే తానె చెలులతో అతడు ఉండే పూల దుకాణానికి  వెడుతుంటే ఎదురొచ్చి

‘’నేను రావలెనని యత్నించు చుంటి యింతలోన –నీవిచ్చటికి నిట్లు రాతగున తల్లీ తిరుపతమ్మ ‘’అని ఆమెకు కావాల్సిన పూలన్నీ  అందించాడు .ఖాన్ అంగడిలో ఒక కుర్రాడుగోవిందరాజు  కూర్చున్నాడు .చూపులు కలిశాయి .వారిద్దరి మధ్య అదేదో తెలీని అనుబంధం ఏర్పడింది .

యవ్వనవతి అయిన తిరుపతమ్మకు సంబంధాలు చూస్తున్నారు. ఆమె మనసు గోవింద రాజుపైనే ఉంది .నిద్రాహారాలు లేవు .ఒకరోజు రంగామాంబ కలలో ఈశ్వరుడు కన్పించి ‘’

‘’నీ కూతురికి తగినపతి  ‘’గోప రాజు’’ రంగమాంబ –  అతడు కొన్ని దినములలో నీ ఇంటికి రాగల౦డు ‘’అని చెప్పి అదృశ్యమయ్యాడు .ఈవిషయం భర్తకు చెబితే అతడూ చాలాసంతోషించాడు

‘’స్వప్న వృత్తాంత మంతయు దెలుప తిరుపతమ్మ –మనమున సంతోష మగ్నురాలాయె తిరుపతమ్మ –అలనాడు తను జూచినట్టి నాయకుడే నాకు గనక –భర్తకాగలడని అతిసిగ్గుపడింది తిరుపతమ్మ ‘’

‘’అతి రూపవంతుడౌ గోపయాఖ్యునకు తిరుపతమకు –మంగళ వాద్యములు మ్రోగు చుండగను పెండ్లి ‘’చేసి అందరూ సంతోషించారు .అత్తవారింటికి కాపురానికి వచ్చిన తిరుపతమ్మ-

‘’భర్తయే దైవమని భావించు చుండే తిరుపతమ్మ –‘’నిత్యం సేవలు చేస్తోంది ‘

‘’అన్నవస్త్రము లేక నల్లాడు వారలకు –శక్తి కొలదిగా నన్న అన్న వస్త్రము లిడుచు’’పతివ్రతామ తల్లిగా పేరు పొందింది .ఇ౦త లొఆమెకు

‘’కుష్టు వ్యాధి సంభవించి చాల దిగులు పడుచుండె తిరుపతమ్మ ‘’

ఒక రోజు గోపయ్య ఆవులు , పాలేళ్ళ తో బాగా పచ్చిక ఉన్న అడవులకు వెళ్లి అవి బాగా మేస్తున్నందుకు  చూసి ఆనందిస్తూ అందరితోకలిసి అన్నాలు తింటూ కధలు చెబుతూ ఉండి,సాయంత్రం ఇంటికి తోలుకు పోయే  వేళఅవటం  తో ఆవులను లెక్కిస్తుంటే ,ఒకావు తగ్గగా .మిగిలినావుల్ని ఇంటికి తోలుకు వెళ్ళమని పాలేళ్ళకు  పురమాయించి, తాను  ఆఆవుకోసం కొండాకోనా జల్లడపట్టి  వెతికాడు.చీకటి బాగా పడి దారి కనిపించటం లేదు .ఇంతలో –

‘’క్రూర వ్యాఘ్రంబొకటి గోపయను జూచి దారిలోన –కుప్పించి గోపయ్య పై నెగసినాది పెద్దపులియు –ఘోరమౌ గోళ్ళ చే గోపయ్యను బట్టి చీల్చివేసి –రక్తమంతయు పీల్చి ప్రాణములు దీసె పెద్దపులియు ‘’

భర్త ఎంత సేపటికీ రాకపోయేసరికి తిరుపతమ్మ కలత చెంది పాలేళ్ళను బంధువులను వెదకటానికి పంపితే వాళ్ళు దీపాలు పట్టుకొని వెతుకుతుంటే గోపయ్య మృత దేహం కనిపించగా ఇంటికి పరుగు పరుగున వచ్చి ఆమెతో చెప్పలేక చెప్పలేక –

‘’ఓయమ్మ నీ భర్త నొక పులి జంపినాది యని యనుచు జెప్ప’’

‘’హా ఈశ్వరా అనుచు తనువుమరచి౦ది తిరుపతమ్మ ‘’తర్వాత తెలివి తెచ్చుకొని

‘’హా ప్రాణ నాథుండగోపయాఖ్యా ప్రాణనాథ –నిన్ను నెడబాసి నేనెట్లు బ్రతుకుదును ప్రాణనాథ ‘’అని భర్తతో సహగమనం చేస్తానని అగ్ని గుండం త్రవ్వించమని ఆనతిచ్చింది .

‘’తన బంధువుల కెల్లా దండములు పెట్టి తిరుపతమ్మ –పసిడి కాయంబంత పసుపు రాసుకొని తిరుపతమ్మ –మునియేటి(మున్నేరు –మునుల ఏరు )లోన స్నానము చేసినాది తిరుపతమ్మ –అత్తమామలకు దండము పెట్టినాది తిరుపతమ్మ –పస్పుచేలములను పరగ గట్టుకొని తిరుపతమ్మ –అగ్ని గుండము చుట్టు ముమ్మారు తిరిగి తిరుపతమ్మ –తనభర్త పాదములను తన హృదయమందు నిలుపుకొని –వీతి హోత్రుని చాల వినతులొనరించి  తిరుపతమ్మ –శ్రీరామ చంద్రుని చిత్తమున నిల్పి తిరుపతమ్మ –నా భర్త సన్నిధికి నను జేర్పు మనుచు తిరుపతమ్మ –అగ్ని గుండము నందు అతి వేగ దుమికె తిరుపతమ్మ –‘’

దూకిన గుండం లో తనమహిమలను చూపించటానికి –

‘’కుచ్చెళ్ల కొంగును, కుంకుమ భరిణ తిరుపతమ్మ – మాంగల్యసూత్రపు బొందు జూపినది తిరుపతమ్మ –ఈమూడు ఆనవాళ్ళను జూపినది తిరుపతమ్మ ‘’అప్పుడు అందరూ ‘’పరమ పతివ్రత తిరుపతమ్మ ‘’అని జేజేలు పలికారు .తర్వాత దేవాలయం కట్టించి గోపయ్య తిరుపతమ్మ విగ్రహాలు స్థాపించి కొలవటం ప్రారంభించారు .

‘’మాఘ ,ఫాల్గుణ మాసముల పూర్ణిమందు తిరుపతమ్మ –సకల కులముల వారు ప్రతి వత్సరమున తిరుపతమ్మ –నీకు పూజలు చేసి నిన్ను గొల్చెదరు తిరుపతమ్మ ‘’

మున్నేటిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించి ,పొంగళ్ళు వండి నైవేద్యాలు పెడతారు .సంతానం కోసం స్త్రీలు ప్రాణాచారం పడతారు .ఆది వ్యాధి గ్రహదోషాలన్నీ తిరుపతమ్మ మాన్పిస్తుందని భక్తులకు గొప్ప విశ్వాసం .అమ్మవారి చరిత్రరాయమని వైశ్యకులానికి చెందినా నరసింహారావు కోరగా కవి ఈపాట రూపం లో రాశాడు .-

‘’అవనిలో నీ కథను చదివినాను విన్నవారలకును –కరుణ తో సిరులొసగి  కాపాడుమమ్మ తిరుపతమ్మ –మంగళము నిత్య జయమంగళము నీకు తిరుపతమ్మ ‘’అని తిరుపతమ్మ కథ పాట ముగించాడు కవి .ఆయన పేరు ఎక్కడా చెప్పుకోలేదు .రాయమన్న ఆయన పేరు చెప్పి తనపేరు మరుగున ఉంచాడు మహాభక్తకవి ..ఈ పుస్తకాన్ని కూడా పరిచయం చేయటం నా అదృష్టం .

నేను పెనుగ౦చి ప్రోలులో ఒక ఏడాది సైన్స్ టీచర్ గా పని చేశాను .అప్పుడు గుడికి వైభవం లేదు ఇప్పుడు జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతోంది .సినిమాగా కూడా తీశారు. టివి లో ధారావాహికంగా చరిత్ర ప్రసారమైంది .ఇప్పుడు ‘’శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ’’గా అమ్మవారిని పిలుస్తున్నారు .కొత్త గుడి చాలాబాగా ఉంది విగ్రహాలు నయన మనోహరంగా ఉంటాయి  .

తిరుపతమ్మ కొల్లా వారింటి ఆడపడుచు .కాకాని గోపయ్య బావ అవుతాడు .తాను  అగ్ని గుండం లో ప్రవేశించిన చోట గుడి కట్టించమని హెడ్ మాస్టర్ శ్రీశైలపతిని ఆదేశించింది .యోగాగ్నిలో ప్రవేశించిన మర్నాడే అక్కడ తిరుపతమ్మ గోపయ్య విగ్రహాలు కనిపించి ఆమె మహిమను చాటాయి .హెడ్ మాస్టర్ దేవాలయం కట్టించి ఈ విగ్రహాల ప్రతిష్ట చేశాడు భక్తితో .మూడవ రోజు అగ్ని గుండానికి ఉత్తరాన గోపయ్యను చంపిన పులి వచ్చి ప్రదక్షిణ చేసి అక్కడే చనిపోయింది .ఇక్కడే హెడ్ మాస్టార్’’ పెద్దమ్మ ఆలయం ‘’కట్టించాడు .క్రీ శ.1695లో తిరుపతమ్మ అ భర్తతో అగ్ని ప్రవేశం చేసింది .తిరుపతమ్మను శక్తిగా భక్తులు ఆరాధిస్తారు .

ఈ కథ సుమారు 300ఏళ్ల నాటిది .పెనుగంచి ప్రోలు అంటే పెద్దకంచి .చిన్న కంచి తమిళనాడులో మనం పిలిచే కంచి .పెనుగంచి ప్రోలులో 108దేవాలయాలు ఉండేవి .దాదాపు అన్నీ మునేరు వరదల్లో కాలగర్భం లో కలిసిపోయాయి .ఇప్పటికీ వరద తగ్గుముఖం పడితే ఇసుక తిన్నెలమీద శిధిల దేవాలయ స్తంభాలు కనిపిస్తాయి .ఇక్కడి ఆదినారాయణ స్వామి గోపాలస్వామి విగ్రహాలు అలా దొరికినవే .అనేక శాసనాలుకూడా బయటపడ్డాయి .ఈగ్రామం పూర్వం పేరు ‘’పాలం చెన్నూరు’’ అని,క్రీశ.1520లో గోల్కొండనవాబ్ కులీ కుతుబ్ షాకు, హిందూ రాజులకు ఇక్కడయుద్ధం జరిగి హిందూ సైన్యం ఓడిపోయిందని చరిత్ర చెబుతోంది .

ప్రస్తుతం తిరుపతమ్మ దేవాలయంకాకుండా ధర్మపురి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి పురాతన దేవాలయం ,అతి పురాతన రుక్మిణీ గోదా సహిత గోపాలస్వామి దేవాలయం ,ఆదినారాయణ ప్రాచీన దేవాలయం, అతి ప్రాచీనశంభు లింగేశ్వరాలయం ,రామాలయం ,వరలక్ష్మీ ఆలయం , కట్టమైసమ్మ ఆలయం ఉన్నాయి

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-10-21-ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 భోగేశ్వర మహాత్మ్యం

 భోగేశ్వర మహాత్మ్యం

భోగేశ్వర మహత్మ్య ప్రబంధకావ్యాన్ని కృష్ణా జిల్లా బందరు దగ్గర ఉన్న పెడన వాస్తవ్యులు మల్లంపల్లి మల్లికార్జున కవి చే రచింపబడి ,వారి ప్రియ శిష్యుడు శ్రీ దారా సూర్యప్రకాశ లింగ చంద్ర శేఖరస్వామి ద్రవ్య సహాయం తో మచిలీ బందరు భైరవ ముద్రాక్షర శాల లో ముద్రింపబడినది.వెల అర్ధ రూపాయి .సంవత్సరం లేదు ఈ కృతి శిష్యుడైనదారా వారికే అంకితమిచ్చి , వంశ వర్ణనం చేశాడుకవి .ఏలూరు వాసి కందుకూరి శ్రీశైలపతి గారు కవికి రాసిన ఉత్తరాలు కూడా పద్యాలలో ఉండటం విశేషం .ఈ జాబులు  2-4-1906,6-7-1907 న వ్రాసినట్లున్నది .కనుక పుస్తకం అదే సంవత్సరం లో1906-07లో  ప్రచురించబడింది అని భావించవచ్చు .

  ఈ మహాత్మ్యం లో పుర వర్ణనం ,శివ దేవ వర్ణనం ,సర్వ మంగళా ,వివాహ వర్ణనం ,చక్షుప్రీతి వర్ణనం మొదటి ఆశ్వాసం లో ,వసంతురుతు ,,స్త్రీ ,మనస్సంగాద్యవస్థ వర్ణనం ,శివ దేవుడు కొడుకు పుట్టలేదని చింతించటం ,ముని వర్ణనం ,ఆయన ఓదార్చటం ,దౌహృద వర్ణన రెండవ ఆశ్వాసం లో ,ఇక మూడులో గొడగూచి వర్ణన ,గొడగూచి తలి దండ్రులతో శ్రీ శైల వెళ్లాలని అనుకోవటం ,కొడుకును వద్దనటం తో బాధపడటం ,కొడుక్కి శివ పూజా రహస్యం ఉపదేశం ,సూర్యాస్తమయ వర్ణన ,భగవత్సాక్షాత్కారం  , నాలుగులో శివదేవుడు శివుడితో స్వప్న వృత్తాంతం చెప్పుకోవటం ,శివదేవుడు శైశైల మహిమలు వర్ణించటం ,శుక్రోదయ ,పాతాళగంగ శ్రీ శైల ఉత్పత్తి ,పర్వతుడు శ్రీ పర్వతుడు అవటం ,పర్వత లింగం మల్లికార్జునలింగం గా పిలువబడటం ,సూర్యాస్తమయం ,పూర్ణ సోమోసా లంభనం ,పార్వతికి  భ్రమరాంబ పేరు రావటం ,క్షీణ సోమోదయ ,సూర్యోదయ వర్ణనం ఉన్నాయి .చివరిదైన అయిదవ ఆశ్వాసం లో శివుడిని’’ గుది గొయ్య’’ అని ని౦ది౦చిన౦దుకు  శివదేవుడు కొడుకును తిట్టటం గొడగూచి పశ్చాత్తాపం ,భోగేశుడు పాలు తాగాడని చెప్పగా శివదేవుడు ఆశ్చర్యపోవటం ,ఎలా కన్పించాడని అడగటం అతడు ప్రార్ధించటం ,భోగేశ సాక్షాత్కారం తో కావ్యం సమాప్తి . ‘’శ్రీ గౌరిం దన య౦క పీఠమునబేర్మిన్నిల్పి వృక్షోధరా –భోగ౦బందున జందనం బిడి’’చెలీ !భోగ్యా వృతింజెందమిం

బౌగౌనే’’యన నవ్వు పార్వతి నభి ప్రాయజ్ఞగా నెంచు నా –యోగి ధ్యేయుడుశ్రీ గిరీశుడు జిరాయు శ్శ్రీలు మా కీవుతన్ ‘’అనే శార్దూలం తో కావ్యం ప్రారంభించాడు కవి .తర్వాత శివకుటు౦బాన్ని వర్ణించి ,నంది భ్రుంగి చండి లకు ,వాల్మీకి వ్యాస కాళిదాస,నన్నయ తిక్కన,పోతన పెద్దన రామలింగాది కవులకు నమస్కరించి ,లోకగురు బ్రహ్మయ లింగాన్ని ,ముదిగొండ రామేశ,కాశీనాధుని నాగామార్య  గురుని ,తాడేపల్లి వెంకటార్యుని ,వక్కలంక వీరభద్ర విద్వన్మణిని,అద్దేపల్లి సోమనాధకవికి ,గుమ్మలూరి సంగమేశ్వర తార్కిక సార్వ భౌముడికి ,చేగంటి మృత్యుంజయ దైవజ్ఞునికినమస్కరించి చిన్నతనం లో చదువు నేర్పిన చిన్న వియ్యన్న మనీషికి నమస్కారాలు చెప్పాడు .

 తర్వాత తనతాత వీరేశ లింగం తపోధనుడని ,తండ్రి వీర మల్లేశ్వరుడు వీరశైవమత రహస్య వేత్త అనీ  , తల్లి భ్రమరాంబ  దేవి అనీ ,తండ్రి చనిపోతే తల్లి అన్నీ తానె అయి పెంచి పోషించిందని ,అన్న రామ లింగం గొప్పకవి అనీ ,చెప్పి ఇష్ట దేవతలకు మొక్కి షట్యంతాలు గుప్పించాడు .పద్యాలన్నీ భక్తీ పారవశ్యంతో పరుగులు తీస్తాయి .చివరిదైన 5వ ఆశ్వాసం లో ‘’

‘’ఈవే దిక్కికమాకు వేరెవరు లేరెచ్చోటగాలించినన్ ‘’అంటూ ప్రార్ధిస్తాడు గొడగూచి .’’దేవా భోగ విభో ‘’అని ఎలుగెత్తి పిలుస్తాడు .స్రగ్ధర ,లయగ్రాహి ,మణిగణ నికరం లలో  చివరికి దండకం తో ప్రత్యక్ష మైన భోగేశ్వరస్వామిని గొప్పగా వర్ణింఛి సమాప్తి చేశాడు ప్రబంధ కావ్యాన్ని .ఇది భక్త గొడగూచి వృత్తాంతమే .’’

‘’భక్తి గొడగూచి కధ సత్ప్రబంధముగను –జేసి మీకు నర్పించుట చేత మాకు

 గూడ దజ్జనకాదుల వలెముక్తి –నిడక తప్పదుమీకు గృతీశులార ‘’అని గడుసుగా తనకు ముక్తి ఇవ్వటం ఆయన బాధ్యతే అన్నాడుకవి .

ప్రబంధానికి కావలసిన సకల లక్షణాలు దీనిలో ఉన్నాయి. అన్నిటినీ సరసంగా పోషించాడు కవి .కానీ మనవాళ్ళ దృష్టికి ఆనినట్లు లేదు .ఎవరూ ఈకావ్యాన్నీ, కవినీ గురించి పేర్కొన్న దాఖలా లేనట్లు అనిపిస్తోంది .వీర శైవ సాహిత్యం లో బాగా ప్రాచుర్యం పొంది ఉండాలి ఇది .దీన్ని పరిచయం చేసే మహద్భాగ్యం  నాకు దక్కింది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేపటి నుంచి” విశ్వనాధకల్ప వృక్ష శిల్పం ”ప్రారంభం -చిన్న సవరణ 

రేపటి నుంచి” విశ్వనాధకల్ప వృక్ష శిల్పం ”ప్రారంభం -చిన్న సవరణ

 సాహితీ బంధువులకు శుభ కామనలు .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ”మంత్రం మయ వాణి విశ్వనాధ ”ఇవాళ 24వ భాగం తో పూర్తీ అవుతుంది .
  రేపు 5-10-21 మంగళవారం సాయంత్రం 4గం  నుంచి ధారావాహికగా ”విశ్వనాధ కల్ప వృక్ష శిల్పం ”సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమై ఎల్లుండి 6 వ తేదీ బుధవారం నుంచి ఉదయం 10 గం లకు ప్రసారమవుతుందని  తెలియ జేయటానికి సంతోషంగా ఉంది -మీ -దుర్గాప్రసాద్ -4-10-21-ఉయ్యూరు


Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

పర్యావరణ పరిరక్షకురాలు,’’దిగాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’’ నవలా రచయిత్రి – అరుంధతీ రాయ్ -(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్.

పర్యావరణ పరిరక్షకురాలు,’’దిగాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’’ నవలా రచయిత్రి – అరుంధతీ రాయ్ -(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్.

జననం – విద్య –  వివాహం:

మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్ లో అరుంధతీ రాయ్ 24-11-1961న కేరళకు చెందిన మలయాళీ సిరియన్ క్రిష్టియన్,మహిళా హక్కుల కార్యకర్త అయిన మేరీ రాయ్ ,కలకత్తా లోని బెంగాలీ హిందూ టీ ప్లాంటేషన్ మేనేజర్ రాజీబ్ రాయ్ దంపతులకు కలకత్తా లో జన్మించింది. అరుంధతికి రెండేళ్ళ వయసులోనే ,ఆమె తల్లి భర్తనుంచి విడాకులు పొంది ,కేరళకు అరుంధతి, ఆమె తమ్ముడు తో చేరింది .కొంతకాలం తమిళనాడులోని ఊటీలో అమ్మమ్మ,తాత గారింట్లో ఆకుటుంబం ఉన్నది . అరుంధతికి అయిదవఏడు వచ్చేసరికి కుటుంబం మళ్ళీ కేరళ చేరింది ఆమె తల్లి అక్కడ ఒక స్కూల్ స్థాపించింది .

కొట్టాయం లోని కార్పస్ క్రిష్టి స్కూల్ లో అరుంధతి చేరి చదివి ,తర్వాత తమిళనాడు నీలగిరి జిల్లా లోని లవ్ డెల్ లో ఉన్న లారెన్స్ స్కూల్ లో చేరి చదివి ,ఆతర్వాత ఢిల్లీ లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఆర్కి టెక్చర్ చదివింది .అప్పుడే డా గేరార్డ్ కున్హా అనే ఆర్కిటెక్ట్ తో పరిచయమై ,1979లో అతడిని పెళ్ళాడి, దంపతులు ఢిల్లీ లో కాపురం పెట్టారు .తర్వాత గోవాకు మారి 1982 విడాకులు తీసుకొని విడిపోయింది .

ఉద్యోగాలు –సినిమా నటన రచన:

అరుంధతి రాయ్ మళ్ళీ ఢిల్లీ చేరి ,’’నేషనల్ ఇంష్టి ట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్’’ లో ఉద్యోగం పొందింది .1984లో ఫిలిం నిర్మాత ప్రదీప్ క్రిషన్ నిర్మిస్తున్నఅవార్డ్ సినిమా ‘’మాసీ సాహిబ్ ‘’సినిమాలో మేకల కాపరి గా నటించి పేరుపొందింది .తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు .ఇద్దరూ కలిసి భారత దేశ స్వాతంత్రోద్యమం పై టెలివిజన్ సిరీస్ తో పాటు అన్నే ,ఎలెక్ట్రిక్ మూన్ అనే రెండు సినిమాలు తీశారు . ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ నవల

సినిమా ప్రపంచం నచ్చక ,అరుంధతి రాయ్ అనేక విషయాలపై దృష్టి పెట్టింది .ఏరోబిక్ వ్యాయామ క్లాసులు నడిపింది .ప్రస్తుతం భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్నా ,దాంపత్యం కొనసాగుతోంది .1997లో అరుంధతి రాయ్ ‘’ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ ‘’నవలరాసి అంతర్జాతీయ ఖ్యాతి ,ఆర్ధికంగా సుస్థిర స్థానం పొందింది .ప్రముఖ మీడియా పర్సనాలిటి,NDTV మీడియా గ్రూప్ హెడ్ అయిన ప్రణయ్ రాయ్ కి అరుంధతి రాయ్ కజిన్ . ఢిల్లీ లోనే ఉంటోంది .

1992లో మొదలుపెట్టి నాలుగేళ్ళు రాసి 1996లో అరుంధతి తన మొదటి నవల ‘’ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ ‘’(చిల్లర దేవుళ్ళు )పూర్తి చేసింది .1997లో దీనికి ‘’బుకర్ ప్రైజ్’’ వచ్చి ,’’ది న్యూయార్క్ టైమ్స్ నోటబుల్ బుక్స్ ఆఫ్ ది యియర్ ‘’గా పేర్కొనబడింది .ఇండిపెండెంట్ ఫిక్షన్ లో నాల్గవ స్థానం సాధించింది .దీనికి అర్ధ మిలియన్ పౌండ్ల అడ్వాన్స్ పొంది ,ఆర్ధికంగా బలపడింది రాయ్ .మే నెలలో విడుదలైన ఆనవల జూన్ చివరికి 18దేశాలలో అమ్ముడైపోయి ఆశ్చర్యం కలిగించింది .డి న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రసిద్ధ అమెరికన్ పత్రికలూ ఆ నవలగురించి ‘’మిరుమిట్లు గొల్పే మొదటి నవల ‘’,’’అసాధారణ నవల ‘’అంటూ రాసి బ్రహ్మ రధం పట్టాయి . at once so morally strenuous and so imaginatively supple”[19]) and the Los Angeles Times (“a novel of poignancy and considerable sweep”[20]), and in Canadian publications such as the Toronto star’’ a lush, magical novel”

1997లో వచ్చిన అయిదు గోప్పనవలలో ఇదొకటి అన్నది ‘’టైమ్స్ పత్రిక ‘’ యికే నయనార్ వంటి భారతీయ విమర్శకులు అందులో సెక్స్ ను దట్టంగా దట్టించింది ‘’అని అవహేళన చేశారు .

టివి ,సినిమా:

అంతకు ముందు అరుంధతి టివి ,సినిమాలలో పని చేసింది .’’ఇన్ విచ్ అన్నీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’’అనే తన ఆర్కిటెక్చర్ స్టూడెంట్ జీవితానుభవాలు సినిమాకు,1889లో ,తర్వాత 1992లో తీసిన ‘’ఎలెక్ట్రానిక్ మూన్’’ సినిమాకు స్క్రీన్ ప్లే రాసింది ,నటించింది కూడా .ఈ రెండిటి దర్శకుడు ఆమె భర్త ప్రదీప్ క్రిషన్ .1989లో ఆమె మొదటి సినిమాకు ‘’నేషనల్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ ‘’‘’అందుకొన్నది.

ఈ నవలా విజయంతో అరుంధతికి టివి సీరియల్స్ తీసే అవకాశం వెతుక్కుంటూ రాగా ‘’ది బన్యన్ ట్రీ’’తీసింది తర్వాత ‘’డామేజ్ ‘’అనే డాక్యుమెంటరి తీసింది.’’ది మినిష్ట్రి ఆఫ్ అత్మోస్ట్ హాపినెస్ ‘’నవల రాసి, 2017’’మాన్ బుకర్ ప్రైజ్ ‘’పొందింది. సమకాలీన రాజకీయాలు ,సంస్కృతులు, గిరిజన సంస్కృతీలపై అనేక వ్యాసాలూ రాసింది .ఇవన్నీ కలిపి ‘’మై సెడిషియస్ హార్ట్ ‘’పుస్తకంగా పెంగ్విన్ ప్రచురించింది .

విమర్శకురాలు:

1994లో శేఖర్ కపూర్ చంబల్ రాణి పూలన్ దేవి జీవితం పై తీసిన ‘’బాండిట్ క్వీన్ ‘’ సినిమాను విమర్శించటం తో అరుంధతి రాయ్ అందరి దృష్టి ఆకర్షించింది. ఈ విమర్శ వ్యాసానికి ఆమె పెట్టిన పేరు ‘’ది గ్రేట్ ఇండియన్ రేప్ ట్రిక్ ‘’. బ్రతికి ఉండగానే పూలన్ దేవి అనుమతి తీసుకోకుండా, ఆమె పై రేప్ దృశ్యాలు తీయటాన్ని అరుంధతి -పూలన్ దేవి హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. పూలన్ దేవి జీవితాన్ని , దాని అర్ధాన్ని పెద్ద తప్పుగా చూపించి, ఆమెను ఎక్స్ ప్లాయిట్ చేయటం గొప్ప నేరమే అని శేఖర్ కపూర్ పై అభియోగం మోపింది రాయ్.

మానవహక్కుల ,పర్యావరణ ఉద్యమ నాయకురాలు:

అరుంధతీ రాయ్ ప్రపంచీకరణకు నిరసనగా ఉద్యమించింది .అమెరికా విదేశా౦గ విధానం ,భారత్అణ్వాయుధాల ఉత్పత్తి ,పారిశ్రామీకరణ వగైరా విషయాలను వ్యతిరేకించింది .2001లో భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడిని నిరసించి ,పోలీసుల అత్యుత్సాహాన్ని,అసత్య ఎన్కౌంటర్లను ఎండగట్టింది.2008లో శ్రీనగర్ లో జరిగిన భారీ ప్రదర్శన గురించి స్పందిస్తూ ‘’కాశ్మీరీలకు విడిపొటమేకావాలి కానీ ,కలిసి ఉండటానికి కాదు’’అని చెప్పింది. దీన్ని బిజెపి ,కాంగ్రెస్ లు తప్పుపట్టాయి .

గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మేధాపాట్కర్ తోపాటు అరుంధతి కూడా వ్యతిరేకించింది .ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడిని నిరసించింది .2008లో బొంబాయి దాడి ,శ్రీలంకలో తమిళులపై దమనకాండను వ్యతిరేకించింది .నక్సలైట్ల మావోయిస్ట్ ల తిరుగుబాటు దారులపై కాల్పులను వారిపై యుద్ధంగా నిరసించింది .2011లో అన్నా హజారే అవినీతికి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించినప్పుడు రాయ్ ‘’ప్రైవేట్ సెక్టార్ లో కరప్షన్ గుర్తుకు రాలేదా మీకు “”?అని ఆక్షేపించింది

ప్రధాని పదవికి మోడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించటం:

2013లో ప్రధాని పదవికి నరేంద్ర మోడీ అభ్యర్ధిత్వాన్ని అరుంధతి రాయ్ ‘’నేషనల్ ట్రాజెడీ’’ అంటూ he was the “most militaristic and aggressive” candidate.[92] She has argued that Modi has control over India to a degree unrecognized by most people in the Western world: “He is the system. He has the backing of the media. He has the backing of the army, the courts, a majoritarian popular vote … Every institution has fallen in line.” She has expressed deep despair for the future, calling Modi’s long-term plans for a highly centralized Hindu state “suicidal” for the multicultural subcontinent.[93అని ఈసడించింది .

అవార్డులు రివార్డులు:

అరుంధతి రాయ్ నవల ‘’ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ ‘’కు 1997లో బుకర్ ప్రైజ్ కు సుమారు 30,000 డాలర్లు లభించాయి .ఈ డబ్బును రాయల్టీలను ‘’మనవ హక్కుల పరిరక్షణ ‘’కు ఇచ్చేసింది .1989లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ పొందింది .కానీ 2015లో ఇండియాలో పెరుగుతున్న హింసా ప్రవృత్తికి నిరసనగా తన అవార్డ్ వాపసిచ్చేసింది .2002లో లన్నాన్ ఫౌండేషన్ వారి ‘’కల్చరల్ ఫ్రీడం అవార్డ్ ‘’అందుకొన్నది .2003 లో అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో లో ‘’గ్లోబల్ ఎక్స్చేంజ్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ ‘’ను 2004లో అహింసా సిద్ధాంత వ్యాప్తి చేసినందుకు సిడ్నీ పీస్ అవార్డ్ ను , ‘’నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ‘’ ఇచ్చే ‘ఆర్వెల్ అవార్డ్ ‘’ను ,2006లోఆమె రాసిన ‘’ది ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫినిట్ జస్టిస్ ‘’వ్యాసానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ ను అందజేసినా ,పెరిగిపోతున్న భారత దేశ పారిశ్రామీకరణం ,కార్మికులపై ఉపేక్ష ,అమెరికా విధానాల అనుసరనలకు నిరసనగా తిరస్కరించింది .2011లో రాయ్ ‘’నార్మన్ మైలర్స్ ప్రైజ్ ‘’ను విశిష్టరచనకు గుర్తింపుగా పొందింది .2014లో టైమ్స్ పత్రిక 100 మంది ప్రపంచ ప్రసిద్ధ విశిష్ట వ్యక్తులలో ఒకరుగా అరుంధతి రాయ్ ని పేర్కొన్నది .

రాయ్ రచనా సర్వస్వం:

1-ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ 2-ది మినిష్ట్రి ఆఫ్అట్మోస్ట్ హాపినెస్ అనే నవలలు రాసింది రాయ్ .నాన్ ఫిక్షన్ గా –ది ఎండ్ ఆఫ్ హాపినెస్ ,దికాస్ట్ ఆఫ్ లివింగ్ ,దిగ్రేట్ కామన్ గుడ్ ,దిఆల్జీబ్రా ఆఫ్ ఇంఫినిట్ జస్టిస్ ,పవర్ పాలిటిక్స్ ,వార్ టాక్ యాన్ ఆర్డినరి పర్సన్స్ గైడ్ ఫర్ ఎంపైర్ ,ఫీల్డ్ నోట్స్ ఆన్ డెమోక్రసీ ,కాశ్మీర్ ఎ కేస్ ఫర్ ఫ్రీడం ,కేపిటలిజం ఎ ఘోస్ట్ స్టోరీ ,ఎ డిబేట్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ గాంధి ఎ సెడిషస్,హార్ట్ –నాన్ ఫిక్షన్ కలెక్షన్ ,ఆజాది ,ఫ్రీడం ఫాసిజం అండ్ ఫిక్షన్ వంటి 20రచనలు.

-గబ్బిట దుర్గాప్రసాద్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

శాంతి వైపు లోతైన అన్వేషణ -3(చివరి భాగం )

శాంతి వైపు లోతైన అన్వేషణ -3(చివరి భాగం )

‘’ఆలోచించరానిదాన్ని ఆలోచించటం ‘’(థింకింగ్ అబౌట్ అన్ ధింకబుల్)అనేది భవిష్యత్ సంఘటన గురించి ఏర్పడినమాట .భవిష్యత్ సంఘటన అంటే జరగటానికి అవకాశం ఉన్నా ,అది ఊహా జనితమైనదే అని భావం .అదిమాత్రం వర్తమాన విషయంపై ఫోకస్ అయి ఉండాలి .వ్యక్తి సమష్టి తో ప్రపంచవ్యాప్తంగా కలిసిపోవటం .కనుక మైక్రో గ్లోబల్  ,మైక్రో ఇండి విడ్యువల్ గా దాన్ని ఎదుర్కోవాల్సిందే .అంటే ప్రపంచం సమాప్తికాకముందే టైం సమాప్తమవటమా ?అసలు విషయం తెలిసి మనం పరిష్కారం చేయగలమా ?దీనికి రెండురకాల అవగాహనలు కన్పిస్తున్నాయి .ఒకటి అటామిస్ట్ సేపరేటిష్ట్.మరోటి ఇంటిగ్రేటడ్ హోలిస్టిక్.అంటే అనువాద  వేర్పాటు వాది ,స౦పూర్ణ మైన సమగ్రమైన కలయిక వాది .స్తూలంగా మనం మెటాఫిజికల్ వర్ణ వ్యవస్థ వైపుకో ,లేక మొత్తం ప్రపంచానికి దూరంగా ఉండటమో నిర్ణయించుకోవాలి .లేక మనం మన ప్రత్యెక పర్యావరణం లో చెట్టు ,పుట్టా డాల్ఫిన్ ,కొండ లా ఉండిపోవటమా?

  ప్రస్తుత పారిశ్రామిక ప్రపంచం లో కాలం ఒకే రకంగా ఉంది .కొందరు కాలం సమాప్తమై పోతోంది అన్నభావనలో ,కొందరు ప్రస్తుతం అన్న భావనలో ఉన్నారు .జేనేసిస్ అపోకలిప్టిక్ టైం లైన్ తో  బంధింప బడ్డా౦  .ఈ కాలానికి మొదలు, తుదీ లేనేలేవు .ప్రపంచ ప్రసిద్ధ ఫిలాసఫర్ శ్రీ జిడ్డు కృష్ణమూర్తి జనం తో మాట్లాడుతూ ఎండింగ్గ్ ఆఫ్ టైం ను అనుభవిస్తారు .అంటే మనమనుకొనే కాలపు ఆలోచనకాక విముక్తమైన ఆలోచనలతో అని అర్ధం .ఆయన భావనలలోఒకటి  ప్రేమ శాంతి లకు కారణం ఉండదు .రెండు వ్యక్తియే ప్రపంచం .

  కాలాతీత మైన అత్యున్నత విలువలను కాపాడు కొన్నమనం కాల హననం అర్ధంచేసుకోలెం .ఈ కాల బంధ ప్రపంచంలో వాటికి ఎప్పుడూ విలువ ఉండనే ఉంటుంది .స్పినోజా ,ఫ్యూయర్ బాచ్ ఇద్దరూ ఆధ్యాత్మిక వేత్తలుగా గుర్తింపు పొందారు .16వ శతాబ్ది ఫిలాసఫర్ ,వైద్యుడు పారసేల్సాస్ ‘’కరేస్పా౦డేన్స్ ‘’ను గుర్తించాడు .దీన్నిబట్టి ప్రతి వ్యక్తీ ఒక చిన్న ప్రపంచమే .అతడు అన్నికాలాలలో మానవాళి సమస్తానికి ప్రతినిధి .అతడు ప్రపంచ ‘’సమకాలీకరణం ‘’(సింక్రానిసిటి)ని ప్రవేశ పెట్టి తన ‘’యాన్ అక్యూజల్ కనెక్టింగ్ రిన్సిపల్’’వ్యాసం రాశాడు .

  సమకాలీనికరణం  కోట్లాది జననాన్ని కలుపుతోంది .అది వ్యక్తిజీవితం లో  సమగ్రభాగం అయింది  .ఈ భావన వ్యాపిస్తే ఈస్ట్ ,వెస్ట్ భావం ,కోల్డ్ వార్ భయం తగ్గిపోతాయి .మతాన్ని గూర్చికాక కాలం గురించే విలియంజేమ్స్ ఈ శతాబ్ది ప్రారంభం లో చెప్పాడు .రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఆక్స్ఫర్డ్ యూని వర్సిటి లో అలిస్టర్ హార్డీ పాజిటివిజం వ్యాప్తికి ఒక రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అదే ఇప్పుడు ‘’అలిస్టర్ హార్డీ రిసెర్చ్ సెంటర్ ‘’గా పిలువబడుతోంది .

   ఆల్డస్ హక్స్లీ కూడా రాజకీయ సిద్ధాంతాలు ‘’శాశ్వత ఫిలాసఫీ ‘’ల నుంచే వస్తున్నాయన్నాడు .దీనివలన ఓర్పు ,అహింస పెరిగాయన్నాడు .ఇవి మెటాఫిజికల్ విముక్తి నుంచి ఏర్పడినవే .ఈనాడు మానవుడు అన్నిటినీ లోతుగా అధ్యయనంచేసి నిర్ణయం తీసుకొనే పద్ధతిలోకి వచ్చాడు ,రావాలి కూడా .కాలాతీతవిలువలు వాటి అనుభవాలు మనిషి జీవితంలో భాగాలైనాయి .అందుకే ఫ్యూయర్ బాచ్ ‘’రాజకీయం భవిష్యత్తు యొక్క మతం ‘’(పోలిటిక్స్ యీజ్ ది  రెలీజియన్ ఆఫ్ ది ఫ్యూచర్ ‘’అన్నాడు .

  పాశ్చాత్య  ప్రసిద్ధ ఫిలాసఫర్ స్పైనోజా ‘’ప్రపంచం శాశ్వతత్వం రూపు దాలుస్తోంది ‘’అన్నాడు (అండర్ ది ఫారం ఆఫ్ ఎటేర్నిటి).ఆయనే శాంతికి రెండు గొప్ప నిర్వచనాలు చెప్పాడు .ఒకటి ‘’శాంతి అంటే యుద్ధంలేక పోవటం కాదు ‘’అది గుండె లోతులలో పుట్టిన  శక్తి వంతమైన ధర్మ౦ ‘’.ఈ ప్రపంచం నిత్యమైనది ,పవిత్రమైనది అని భావించేవాడు చక్కగా  ప్రేరణ పొంది  ఈవిశ్వం బాగుకోసం అడుగులు కదుపుతాడు .అప్పుడు అతడిమనసులో క్షణంలో లక్షో వంతు కాలంకూడా వినాశనాన్ని గురించి ఆలోచించడు .

 కనుక శాశ్వత విలువలను ఆధారంగా ప్రపంచ శాంతి సాధించాలి .దీనికి అహింస ఒక్కటే శరణ్యం .వర్తమానం సమాప్తం అవుతుందని కొందరు అనుకొంటారు .వాళ్ళే తర్వాత పెరుగుతారు .ఫ్యూయర్ బాచ్ అన్నట్లు ‘’మనం సంపూర్ణ వినాశన౦ అంచున ఉన్నప్పుడు చరిత్ర మనకు బోధ గురువుగా మారుతుంది .అది మళ్ళీ సర్వ శక్తి  సమర్ధమై ఉవ్వెత్తున పైకి లేఛి నిలబడుతుంది .కొత్తది కావాలి అనుకొంటే అనతికాలం లోనే సాధించి చూపిస్తుంది ‘’.

  ఆధారం-1986జనవరి ‘’దర్శన ఇంటర్నేషనల్ క్వార్టర్లి ‘’లో జాన్ ఫ్రాన్సిస్ ఫిప్స్ రాసిన ‘’టువర్డ్స్ ఎ డీపర్ ఫిలాసఫీ ఆఫ్ పీస్ ‘’ వ్యాసం .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి 160 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం 

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

‘’అక్షరం లోక రక్షకం ‘’

సరస భారతి 160 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం

సాహితీ బంధువులకు శుభకామనలు ,నవరాత్రి దసరా శుభా కాంక్షలు

సరస భారతి 160వ కార్యక్రమంగా 2021లో ఇంటర్ పాసై ,ఎంసెట్ లో అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి  మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦  నవరాత్రులలో మూలా నక్షత్రం శ్రీ సరస్వతీ పూజ నాడు 12-10-21 మంగళ వారం సాయంత్రం 6గం లకు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయంలో  మా  గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .సాహిత్య ,విద్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

  కార్య క్రమం -12-10-21 మంగళ వారం సాయంత్రం -6గం

   సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

   సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

 ఆత్మీయ అతిధులు -పురస్కార ప్రదాతలు శ్రీ కోట గురుపుత్రులు ,శ్రీ కోట సోదరులు – శ్రీ కోట చంద్రశేఖర శాస్త్రి గారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు ,శ్రీ కోట రామకృష్ణగారు ,శ్రీకోట సీతారామాంజనేయులు గారు .

             కార్యక్రమ వివరం

 శ్రీ కోట గురువరేణ్యుల చిత్ర పటానికి పుష్పమాలాలంకరణం

        1-    శ్రీ  కోట గురువరేణ్యులు కీ .శే .శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం

ఉయ్యూరు సక్సెస్ కాలేజీ లో చదివి 2021 పబ్లిక్ పరీక్షలో ఇంటర్ 955మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఎం .సెట్ లో 62.1 మార్కులు సాధించిన –చిర౦జీవి  బేతనభొట్ల సూర్య నారాయణమూర్తి కి రూ-10,000(పది వేల రూపాయలు )

2-కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం

  ఉయ్యూరు నారాయణ కాలేజిలో 2021 పబ్లిక్ పరీక్షలో ఇంటర్ 933మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఎం .సెట్ లో 46.3 మార్కులు సాధించిన

 కుమారి గబ్బిట రమ్య కు రూ-10,000(పది వేల రూపాయలు )

సరస భారతి శ్రీ ప్లవ ఉగాది పురస్కార ప్రదానం

పురస్కార గ్రహీతలు –

1-శ్రీ గాదిరాజు రంగరాజు –ప్రముఖ కవి విశ్లేషకులు –ఉండి(ప .గో. జి. )

2-శ్రీ ‘’హాస్యదండి’’భట్ల దత్తాత్రేయ శర్మ –తెలుగుపండిట్ ,కవి, విమర్శకులు తెలుగు భాషా  సాంస్కృతిక సమాఖ్య కోశాధికారి ,హాస్యలహరి కార్యదర్శి ,ప్రముఖ కవి విమర్శకులు ,సంస్కృతాంధ్ర సాహిత్య ప్రజ్ఞానిది స్వర్గీయ శ్రీ కె. వై .ఎల్ .ఎన్.కళాపీఠం స౦స్థాపకులు –మచిలీ పట్నం

3-శ్రీ ధూళిపాళ రామ భద్ర ప్రసాద్ –తెలుగు భాషా వికాస సమితి సమన్వయ కర్త –గుడివాడ

4-శ్రీ పంతుల వెంకటేశ్వరరావు –తెలుగు పండిట్, కవి,రచయిత విమర్శకులు ,శారదా సమితి స్థాపకులు –విజయవాడ

5-శ్రీమతి కోనేరు కల్పన-ప్రముఖ కవి ,రచయిత్రి ,విశిష్ట సాహితీ సేవాకర్త –విజయవాడ

6-శ్రీ జమ్మలమడక శ్రీనివాస్ –అసిస్టెంట్ సెక్రెటరి –లాండ్ డిపార్ట్ మెంట్ –విజయవాడ

7-శ్రీ వీరమాచనేని బాల గంగాధర రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు –ఉయ్యూరు

8- శ్రీ ఉసిరిక రంగ ప్రసాద్ – బోధనా, నిర్వహణ నిపుణులు   –ఉయ్యూరు

9-శ్రీ రాపాక సురేష్ – బోధనా ,నిర్వహణ నిపుణులు   –ఉయ్యూరు

కార్య క్రమ నిర్వహణ –శ్రీ మతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్య దర్శి

 నవరాత్రి దసరా శుభా కాంక్షలతో

జోశ్యుల శ్యామలాదేవి   మాదిరాజు శివ లక్ష్మి    గబ్బిట వెంకట రమణ

గౌరవాధ్యక్షులు              కార్య దర్శి              కోశాధికారి

                             గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

                                                          2-10-21-ఉయ్యూరు

ఇదే ఆహ్వానంగా భావించి పురస్కార గ్రహీతలు ,అతిధులు విచ్చేసి  జయప్రదం చేయ ప్రార్ధన .

 తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శాంతి వైపు లోతైన అన్వేషణ -2

శాంతి వైపు లోతైన అన్వేషణ -2

నిజంగా మన సంస్కృతి భయపడి ,ఆకాలాన్ని అసహ్యించుకొని దాన్ని , ,దానితాత్కాలిక కారాగారాన్ని పేల్చి వెయ్యాలని అనిపిస్తుంది .అది ఆ జైలును ఆపరిసరాలు జీవులే నే  కాదు బయట ఉన్న ప్రపంచ ప్రదేశమంతా ద్వంస౦ చేస్తుంది .ఆ జైలులో ఉన్నబందీలు తప్పించుకొనే ఉపాయం, బయట పడేవారు లెక్కించదగిన సంఖ్యలో నే ఉంటారు .సర్వ నాశనం తెలిపేది ఏమిటి అంటే  దాని లోపల అంతరాంతరాలలో ఉన్న  కోరిక కాలాన్ని మళ్ళీ మళ్ళీ పుట్టకుండా సంహరించటం .అదే విజయం అనుకోవటం .అంతులేని మానవ హననం చేయటంలో అసహనం, అలసిపోవటం ,ఇన్సూరెన్స్ పాలిసీకి చావు దెబ్బ కొట్టటం కనిపిస్తుంది .ఆ క్రూర హేయ భయంకర జంతు ధోరణి తో ఇక లాంటి ఘోరకాలం సమాప్తి అవాలనే .ఇదిశత్రువు చచ్చాడని సైనికుడు బాయ్ నెట్ తిరగేయటం లాంటిది .ఇది అత్యంత శాడిజం మరియు  నెక్రోఫిలియా అంటే శవంతో సెక్స్ జరపటం లాంటిది .

  అసలే మనం   అడుగున ఉన్నసంస్కృతి అంచుపైన ఉన్నాం ..హీరోషీమా  దుర్ఘటన  తర్వాత ఆ అంచుమీద నుంచి జారిపడిపోయాం .మిల్లి సెకండ్ లో అతి తక్కువకాలంలో జరిగిన ఘోరం అది .మానవ చరిత్రలో సంధికాలంలో జరిగిన మహా ఘోర విపత్తు ఆటం బాంబు విస్ఫోటనం

  బెర్గ్ సన్ పండితుడు చెప్పినట్లు ఇదికాలం యొక్క ప్రాదేశీకరణ (స్పేషియలైజేషన్ ఆఫ్ టైం)సరిహద్దులు దాటేసింది .కాలక్రమానుసార లెక్కలు (క్రానలాజికల్ మెజర్ మెంట్స్ ) ఒకస్థిరమైన కదలని స్థితి పై ఆచ్చాదన (సూపర్ ఇంపోజిషన్ ).ఫొటోగ్రాఫిక్ చిత్రాలలా కదలనిదే .ఇదే కాలం ముక్కలు (బిట్స్ ఆఫ్ టైం).ఇదే  తిరస్కరింపబడిన కాలం .దాని ముక్కలే అవి .కాలం పై ఆచ్చాదింపబడిన  అనంత మైన తునకలు స్పేస్ ను బంధిస్తున్నాయి .

   అన్ని దేశాల సంస్కృతిపై ప్రభావం చూపిన సర్వనాశనం(ఓమ్నిసైడ్)ఖచ్చితంగా సాంస్కృతిక పరంగా కాలం పై ప్రత్యెక ప్రకటన చేసింది .అదే ఒకే ఒక సంస్కృతి మిగిలిన సంస్కృతులపై విజయం సాదించటం అన్నమాట .ఇది ఖచ్చితం గా నిరంకుశత్వానికి దారి తీస్తుంది .ప్రపంచ వ్యాప్త ప్రజలు చాలామందికి మృత్యు కాలం (డెడ్ టైం) గురించి అవగాహన లేదు .అసలు జీవించిన కాలానికీ, దీనికీ తేడా ఏమిటో కూడా  అర్ధం చేసుకోరు .నాన్ జూడియో క్రిస్టియన్ కాస్మాలజి (విశ్వ శాస్త్రం)కు ప్రారంభ ,సమాప్త ,సరళ రేఖాత్మక సాధారణ బంధాల (చైన్స్)అవగాహన లేదు .వాటిపురాణాలు కర్మకాండలు గొప్ప కాలపు రూపాలకే పరిమితం .

 ఈ నాటికీ ‘’హిబా కుషా’’ జనం ‘’క్రిస్టియన్ బాంబ్ ‘’అనే అంటారు.కారణం ఈ బాంబ్ ఆలోచన  జూడియో క్రిస్టియన్  ఆలోచనా సరళి విధానమే అంటారు .బాంబ్ తయారీ ,పరీక్ష ,ప్రయోగం అన్నీ క్రైస్తవ విలువలను ఉద్ధరించటానికే అని ఆపాదిస్తారు.క్రిస్టియన్ టైం హీరో షీమా ప్రేలుడు పదార్ధం పై ఆవిష్కరింప బడింది .

హిబా కుషా అయిన,హీరోషీమాకు దగ్గరలో ఉన్న  క్రిస్టియన్ ప్రీస్ట్ ఒకాయన బాంబు పేలినప్పుడు తన గోడ గడియారం ఆగిపోయిందని చెప్పాడు .ఆ మూగ నిశ్చేతన గడియారం అక్కడ జరిగిన ఘోర విపత్తును సింబలైజ్ చేస్తోంది.అంటే ప్రతీకాత్మకంగా నిలిచింది .కనుక హిబా కుషా లకు పాతటైం అప్పుడే  ఆగిపోయింది .వాళ్ళకే కాదు ప్రపంచ వ్యాప్త ప్రజానీకానికి కూడా ‘’వరల్డ్ టైం’’అప్పుడే అంటే బాంబ్ ప్రేలిన 6-8-1945 న సమాప్తి అయిందన్నమాట.హీరో షీమా చరిత్ర గర్భస్త సంఘటన గా మారింది .ఇప్పుడు మనమంతా దానికి బయట లేక పశ్చిమ చారిత్రికప్రక్రియకు  అంచనా వేయబడిన (ప్రోజేక్టేడ్) స్థితిలో ఉన్నాం .అంటే నిజంగా మనం అలౌకిక క్రియ అనంతర పరిస్థితి (పోస్ట్ అపోకలిప్టిక్  సిచుఏషన్) లో ఉన్నామన్నమాట.ఇది ప్రి అపోకోలిప్టిక్ (అలౌకిక క్రియ పూర్వం )కంటే భిన్నమైనది అని గ్రహించాలి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శాంతి వైపు లోతైన అన్వేషణ

శాంతి వైపు లోతైన అన్వేషణ

‘’చరిత్ర ప్రాచీనం ,మధ్యయుగం ,ఆధునికం అనే విభజన గణనీయం కాదు ‘’అని అనుకున్నతర్వాత,మనం అటామిక్ కాలంకు ముందు ,ఆ తర్వాత అనే మాట్లాడుకోవాలి .కొత్త చారిత్రాతమకమైనరేఖనుగీసుకోవాలి’’అని ‘’ఫిలాసఫీ ఆఫ్ పీస్’’అనే తన పుస్తకం లో ప్రారంభవాక్యాలుగా జాన్ సోమర్ విల్లీ రాశాడు .ఇది హీరోషీమా దురంతం తర్వాత నాలుగేళ్ళకు ప్రచురితమైంది.

  ఈ నాటి మన తరం 6-8-1945 తేదీని మానవ చరిత్రలో విభజన రేఖగా భావి౦చాల్సిందే .ఇక్కడ క్రీపూ క్రీస్తు తర్వాత అనే ప్రశ్న కూడా రాదు .దీనితో మానవ దృక్పధమే పూర్తిగా మారిపోతుంది .దీనికి ముందు ఆర్ధర్ కోస్ట్లర్  ఇలాంటి కేలండర్ నే ప్రతిపాది౦చాడుకానీ ,దాన్ని ఎవరూ లెక్కలోకి తీసుకోలేదు .

  1945 ఆగస్ట్ 6 విషయం ఇంకా గర్భస్తంగానే,చీకటిలోనే ఉంది.ఈ జననకాలం సాధారణమే కానీ హైటెక్ డెలివరి కాదు .హీరోషీమా లో బతికి బయటపడ్డ  వారిని సర్వే చేసిన రాబర్ట్ లిఫ్టన్ చెప్పిన దాన్ని బట్టి ‘’హిబాకుశా ‘’అనేకసార్లు జరిగి దాని స్కేల్ ఎంతో ఖచ్చితంగా చెప్పలేక పోతున్నామని అన్నాడు .హిబా కుశ అంటే చావులో కూరుకు పోయినవారు అంటే ప్రేలుడు బారిన పడిన వారన్నమాట  .ఇవాళ మనం మెటా ఫిజికల్ గా ,సైకలాజికల్ గా ,ఎమోషనల్ గా ఆ ప్రేలుడు బాదితులమే .అంటే తీవ్రంగా ఆలోచిస్తే,మనమంతాఒక రకం గా  ‘’హిబా కుశ ‘’లమే అన్నమాట .

  జూయిష్ హోలోకాస్ట్ పై 9గంటల ఎపిక్ సినిమా నిర్మించిన క్లాండి లాంజ్ మాన్ ‘’వారికి ఏదైనా న్యాయం జరిగే పని చేయాలనుకొంటే ముందుగా క్రానాలజి విచ్చిన్నం ముఖ్య విధి గా  చేబట్టాలి ‘’అన్నాడు .జూఇష్ హోలోకాస్ట్ లో జరిగిన మానవ హననం పరిణామ౦  మిలియన్  హీరోషీమాకంటే ఎక్కువ అంటాడు .అంతకు ముందు ఉన్నదానికి ,అల్ట్రా డేడ్ వెస్టర్న్ సైక్ ,అంటే వెస్టర్న్ వే ఆఫ్ ఆలోచన కు ఎంతతేడా ఉందొ అర్ధమౌతుంది .

 ఇతర సంస్కృతులతో పోల్చి  చూస్తె ,బాగా కొట్టవచ్చి నట్లు కనిపించే మన సంస్కృతి ఎంత తీవ్రమైన జబ్బుతో వణికికపోయిందో,మనం భావించే సంప్రదాయ కాలం ఎంతగా విచ్చిన్నమైపోయిందో గమనిస్తాం .ఎంతగా కాలం చేత  లొంగ దీయబడ్డామో ,ఎంతగా కిందికి కు౦గి పోబడినామో ,,అణగదొక్కబడ్డామో ,అంచులు కత్తిరింప బడ్డామో తెలిసింది .ఇదంతా మనకు ఇష్టంలేని అవసరం లేని మనపై రుద్ద బడినవే. మన ప్రమేయం లేకుండా మనల్ని బాధించినవే .వాటి నుంచి ఖచ్చితంగా బతకాలనే ,తప్పించుకొనిపారిపోవాలని భావి౦చినవే ..ఖచ్చితంగా ఏ సంస్కృతీ కూడా ఇలాగ ‘’కాల హననం ‘’అంటే ‘’ కిల్లింగ్ టైం’’గురించి ఇంతవరకు ఆలోచి౦చనే లేదు.మనకే పట్టింది ఈదుర్గతి .మన తాత్కాలిక ఆలోచనలు ,దృశ్యాలు చిత్రాలు క్షీణత ,వినాశనం ,చావు లపైనే ఉంది కానీ ,అంతకన్నాకాలం పై  సృజనాత్మకం గా ,నివారణోపాయ విధానాలపై  ఆలోచన లేక పోవటం దురదృష్టం .పాపిష్టి అస్తిపంజరపు ఆకార రూపమైన ‘’పాత తండ్రి’’(ఓల్డ్ ఫాదర్ టైం) కాలం పైనే ఆధారపడుతున్నాం .చంకలో పిల్లాడిని పెట్టుకొన్న ‘’యువ తల్లి కాలం’’(యంగ్ మదర్ టైం) పై ఆలోచన లేదు మనకు . తర్వాతికాలం కూడాకాలానికి చావుకు ఉన్న సంబంధం లాగా  అంతే యదార్ధం .

  ఆధునికకాలంలో ఉన్న సమస్యేమిటి అంటే మన౦ కొత్త మిత్ ,చిత్రాలను చిగురింప చేయలేక పోవటం .రస్సెల్ హోబాన్ అన్నట్లు మన౦ ‘’మీధో పయిక్ అవగాహన లో తప్పిపోవటమే .గతించింది వదిలి కొత్త ఆలోచన అవగహన లతో ముందుకు దూసుకు వెళ్ళక పొతే వెనుకబడి పోతాం అన్నస్పృహ అవసరం .సమస్యలను క్షుణ్ణంగా  పరిశీలించి అనువైన పరిష్కారం సాధించటం మానవ నైజం .బెంబేలు పడకూడదు. ధైర్యం కూడ దీసుకోవాలి .కొత్త చరిత్ర సృష్టించాలి .ముందుగా ఆ బాంబ్ పై అవగాహన పొందాలి .అది మనందరి శత్రువు అన్న భావన గాఢంగా మనమనసులలో నాటుకోవాలి. అప్పుడే ముందుకు అడుగు వేయగలం .     

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మధ్య పశ్చిమం లో వేదాంతం -3(చివరి భాగం )

మధ్య పశ్చిమం లో వేదాంతం -3(చివరి భాగం )

లూస్ విల్ లో 48 గంటలు

జనాలతో చక్కగా కలిసిపోయి ప్రభావితం చేసే గొప్ప వ్యక్తిత్వం స్వామి పరమానంద ది.లూస్ విల్ లో ఆయన పర్యటన షెడ్యూల్ గమనిస్తే తనకోసం ఆయన ఉంచుకొన్న సమయం అతి తక్కువ అని తెలుస్తుంది .వేదాంత ప్రవచనాలలో ఆయన ఆధ్యాత్మికత ,ఆనందం ,శ్రేయస్సు మొదలైన విషయాలను కూడా చేర్చి మాట్లాడే వారు .ఈ పర్యటనలో ఒకే ఒక అపాయింట్ మెంట్ ,మాత్రమె ఉండి,వేదాంత క్లాసులు లెక్చర్స్ లతో బిజీ బిజీగా రెండు రోజులు గడిపారు .ఒక రోజు ము౦దేవచ్చి మిగిలిన రెండు రోజుల్లో మూడు ప్రసంగాలు చేసి వెంటనే తర్వాత వేరే ప్రదేశానికి వెళ్ళేవారు .ఇంగ్లీష్ ఆయన మాతృ భాష కాకపోయినా ,కాలేజీలో చదవకపోయినా ఆయన శ్రోతలను ఆంగ్ల భాషలో పరవశింప జేసేవారు .తన డైరీలో టూర్ వివరాలను ఆయన రికార్డ్  చేసుకోనేవారు .అదే ఇప్పుడు మనకు ఆధారం .ఉదాహరణకు –గురువారం సాయంత్రంతాను  స్థాపించిన వేదాంత కేంద్రం  బోస్టన్ నుంచి  లూస్ విల్ కు వచ్చి ,శుక్రవారం రెండు ఉపన్యాసాలు ఉదయం 11గంటలకు ,మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చి శనివారం ఉదయం 11కు చివరి ప్రసంగం చేసి ,తాను  వేదాంత సెంటర్ ఏర్పాటు చేసిన లాస్ ఏంజెల్స్ కు రైలు లో వెళ్ళారు .ఉపన్యాసాల మధ్య కాలం లో ఆడియెన్స్ తో సంభాషించేవారు .చాలాసార్లు లూస్ విల్, సిన్సినాటిలలో 48 గంటలలో ప్రసంగాలు చేసి .మరిన్ని ప్రసంగాలకోసం వెస్ట్ కోస్ట్ కు వెళ్ళేవారు .ఆయన టూర్ ప్రోగ్రాం అంతా పత్రికలద్వారా ,సోషల్ క్లబ్స్ ,పోస్ట్ కార్డ్ లద్వారా ప్రచారమయ్యేది.అయన వ్యక్తిత్వానికి, కార్యక్రమాలకువేలాది ప్రజలు ఆకర్షితులై ,ప్రభావితులయ్యారు .చాలామంది ఆయనతో ప్రత్యెక సమావేశాలు జరిపి సందేహాలు తీర్చుకొనేవారు .స్వామి పరమానంద  ‘’ది మెసేజ్ ఆఫ్ ది ఈస్ట్ ‘’ అనే  ఒక ప్రత్యెక మాసపత్రిక ప్రచురించేవారు .అందులో చందాదారుల లిస్టు చూస్తె ,ఆయన ఆసిటీలోనూ  ,అమెరికాలోనూ ఎంతమందిని ప్రభావితం చేసిందీ ,అమెరికాలో ఎందరిని  వేదాంత భావాలకు దగ్గర చేసిందీ మనకు అర్ధమౌతుంది. అంతటి చక్కని నెట్ వర్క్ ఆయనది ., అయన స్థాపించిన లాస్ ఏంజెల్స్ ,కోహాసేట్ వేదాంత కేంద్రాలు ఇప్పటికీ పని చేస్తూ వివేకానందుని  భావధారను ప్రసారం, ప్రచారం చేస్తూనే ఉన్నాయి .భారత దేశం లో స్వామి వివేకానంద ప్రభావం వలన అక్కడ మరిన్ని కేంద్రాలు ఏర్పడ్డాయి .

   చివరగా

యోగ చరిత్ర ,ధ్యానం ,ఆధ్యాత్మికతలు అభి వృద్ధి ఉద్యమం తో జత చేయబడి ఇరవై దశకాలలో ప్రతిధ్వనించింది .ప్రపంచ సమ్మేళనం,స్వామీజీతో ఉన్న అనుబంధం ,చేబట్టిన నిర్మాణ కార్యక్రమాలు మిడ్ వెస్ట్ ప్రజలను అత్యంత ప్రభావితం చేసి, వేదాంత భావనా వ్యాప్తికి అద్భుతంగా పని చేశాయి .వేలాది మంది స్వామి వివేకానంద తో ,ఆయన యువ శిష్యుడు పరమానంద తో వేదాంతం యోగాభ్యాసం లతో ఇంటరాక్ట్ అవటం  వారికి గొప్ప సదవకాశమే అయింది .

  స్వామీజీని అత్యంత హృదయపూర్వకంగా ఆహ్వానించి వారి బోధనలు మనసులో నింపుకొని ఆచరణలో నిలబెట్టుకొన్నారు అమెరికా ప్రజలు .తమ జీవిత గమ్యమేమిటో వారికి అర్ధమయింది .ఆధ్యాత్మికభావ విప్లవం అమెరికాను కుదిపేసింది .అది ఇప్పటికీ విశ్వ వ్యాప్తం గా ప్రభావిత౦ చేస్తూనే ఉంది .ప్రజలు జీవితాలను మెరుగు పర్చుకొంటూనే ఉన్నారు .

  స్వామి పరమానంద తనజీవితకాలం లో చిరస్మరణీయమైన కాలం అమెరికాలో గడపటం విశేషం .స్వామి వివేకానంద తర్వాత ఆయన కార్యక్రమాలను మరొక 35 ఏళ్ళు అమెరికాలో కొనసాగేలా అంకిత భావం తో చేసిన పరిపూర్ణ వ్యక్తి స్వామి పరమానంద .సంస్కృతీ ప్రవాహం విశ్వ వ్యాప్తమై కర్మ, యోగ, గురు భావనలు ప్రజల నిత్య జీవితం లో నాలుకలపై నర్తిస్తూ ,అంతర్వాహినిగా జీవితాలలో నిలిచిపోయింది .సంస్కృతీ వినిమయం ,ఏకీకరణ ,అనుసంధానం అనేక విధాలుగా సాధ్యమవుతున్నాయి అంటే స్వామి వివేకానంద ,స్వామి పరమానంద ల అకుంఠిత ,దీక్ష ,త్యాగం కార్య దక్షత వలన మాత్రమె అని మనం గ్రహించాలి .ఆ మహితాత్ములకు మనం ఘన నివాళి సమర్పించాలి .

  ఆధారం –సెప్టెంబర్ ‘’ప్రబుద్ధ భారత్’’లో మీరా అలగరాజ రాసిన ‘’వేదాంత ఇన్ మిడ్ వెస్ట్ ‘’వ్యాసం .

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-21-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మధ్య పశ్చిమం లో వేదాంతం -2

మధ్య పశ్చిమం లో వేదాంతం -2

 స్వామీజీ అడుగు జాడలలో

వివేకానందస్వామి యువ శిష్యుడు స్వామి పరమానంద ,గురు అడుగుజాడలలో మధ్య పశ్చిమం లో వేదాంత భావ వ్యాప్తి చేశారు .లభించిన ఆధారాలను బట్టి ఆయన మధ్య పశ్చిమం లో చాలాసిటీలు సందర్శి౦చారు.20వ శతాబ్ది మొదటి దశకాలలో లూస్ విల్ ,సిన్సినాటి ,సెయింట్ లూయిస్ లు ముఖ్య సంస్కృతీ కేంద్రాలు .భావ వినిమయ౦,సంస్కృతీ అవగాహనలు జరిగాయి .ఈ మూడు సిటీలు ఈస్ట్ కోస్ట్ లోని లాస్ ఏంజెల్స్ ,సాన్ ఫ్రాన్సిస్కో లు తూర్పు తీరం లోని బోస్టన్ ,న్యు యార్క్ లతో సంబంధం కలిగి ఉన్నాయి .మధ్య పశ్చిమ సిటీలలో వేదాంత భావ అన్వేషణ ,ప్రభావాలు హెచ్చు .వీటి వలన అమెరికా అంతా వేదాంత భావ పరిమళం వ్యాపించింది .

  మిడ్వెస్ట్ లో స్వామీజీ లెక్చర్ టూర్ చేసి నట్లు ఉంది .ఈ లెక్చర్ టూర్ లో స్వామీజీకి ,శ్రోతలకు మధ్య జరిగిన ఇంటరాక్షన్ అంటే పరస్పరచర్యల గురించి సమాచారం లభించలేదు .వివేకానంద భావ వ్యాప్తి ని స్వామి పరమానంద నిరంతర కృషి తో ఎక్కువ మందికి చేరేట్లు  చేశారు. స్వామీజీ కృషి కి పరమానంద అంకురార్పణ చేశారన్నమాట .కనుక వేదాంతం ఏవో కొన్ని ముఖ్యనగారాలకు సిటీలకే పరిమితం కాలేదని అర్ధమౌతోంది.మిడ్ వెస్ట్ లో పరమానంద ప్రసంగాలను పత్రికలూ విస్తృతంగానే ప్రచారం చేశాయి .ధనాత్మకంగానే స్పందించాయి .సుమారు వందేళ్ళ నాటి ఆ స్పందనలు ఇవాళ చదువుతూ ఉంటె సంతోషం కలిగిస్తాయి .లూస్ విల్ ఆలోచనలకు ప్రతిబి౦బమైన’’ కొరియర్ జర్నల్ ‘’పత్రిక ‘’పరమానంద రాగి శరీర కాంతి ,కళ్ళు బాదం కాయ ఆకారం ఆకర్షణీయం .మధ్య వయస్కుడు అని అందరు అంటున్నా ,ఆయన వయసు 22కు మించి ఉండదు ‘’అని 14-11-1920 పత్రికలో రాసింది .ప్రజలు తమ ఆరోగ్య ,సంతోషాలకు ఆధ్యాత్మిక అనుసరణలు ముఖ్యం అని గ్రహించారు .యోగ ,వేదాంత విషయాలు ప్రకటనలుగా పత్రికలలో ప్రచురించేవారు .వయసు మీరుతున్నవారికి వేదాంతం గొప్పపరిష్కారం అన్నస్వామి పరమానంద భావానికి  అడ్వర్ టైజ్ మెంట్ కనిపించింది .యువ పరామానంద’’ చారిస్మా’’(కరిష్మా) లూస్ విల్ మొదలైనసిటీలలో విపరీతమైన ప్రభావం చూపించింది .ప్రజలలో వివేకానంద ఆయన యువ శిష్యుడు స్వామి పరమానంద గార్ల ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది .

   మధ్య పశ్చిమం లోవేదాంత వ్యాప్తి

పరమానంద లెక్చర్ టూర్ లలో విరామం లేని బిజీ షెడ్యూల్ ఉండేది .అక్కడ ఉన్న కాలం లో ఆయన అనేక సార్లు మిడ్ వెస్ట్ సిటీలు సందర్శించి వేదాంత బోధ ,ప్రచారం ,అనుసరణీయమైన క్రియా విధానం తో రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభ సమయం 1939వరకు  ఉత్తేజితులను చేశారు.1932 నాటికి ఆయన కార్యం సువ్యవస్థితమైంది .కారణంగా అనేక మధ్య పశ్చిమ సిటీలలో వేదాంత కేంద్రాలు వెలిశాయి .ఇవన్నీ స్వామి పరమానంద కృషి ,స్వామి వివేకానంద పై ఉన్న అచంచల విశ్వాసం వలన ఏర్పడినవే .స్థానిక లైబ్రరీలలో ,ముఖ్య ప్రదేశాలలో,దేవాలయాలలో ,విద్యాసంస్థలలో ,స్త్రీ ,పురుషుల క్లబ్ లలో  పరమానందస్వామిని ఆహ్వానించి ప్రసంగాలు చేయించేవి ఈ వేదాంత కేంద్రాలు .ఈ క్లబ్బులు, సొసైటీలు సాంఘిక సమావేశాలకు ,భావ వినిమయానికి ,సమాజ బంధాలకు  నూతన దృక్పధాలకు గొప్ప అవకాశాలను కల్పించాయి. ఈ సంస్థలలోపరమానంద విస్తృతమైన విషయాలతో పాటు వేదాంత ప్రసంగాలు చేసేవారు .ఈ సభలలో కనీసం 100 నుంచి 250వరకు శ్రోతలు ఉండేవారు .అమెరికా పరిస్థితులపైనా ,ప్రాచ్య భావాలపైనా ,మిడ్ వెస్ట్ లోని ప్రత్యెక విషయాలపైన ఉపన్యాస విషయాలు తప్పని సరిగా ఉండేవి .

   ఈ మీటింగ్ లు ఏర్పాటుచేయటం లో ముఖ్య ఉద్దేశ్యాలు ప్రజలలో  సామాజిక స్పృహతో పాటు ఆధ్యాత్మిక వివేచన కల్గించటమే .వివేకాన౦దస్వామివేదాంత భావనలకు పునాదులు వేసి  అనేకులను ప్రభావితం చేసిన  ఆకాలం లో అంటే 1994లో జాక్సన్ లో హిందూయిజం పై ,ఆసక్తి ఉండటం చిన్న నగరాలలో అసాధారణమే .  పరమానంద వారిలో విస్తృతమైన మానవ విలువలను ,జాతీయ సమైక్యతను పాదుకొల్పారు.వేదాంతం లోని ముఖ్య విషయాలను ,వివేకాన౦దుని ప్రవచన అమృతభావాలతో మేళవించి స్వామి పరమానంద విజయవంతంగా తన ధర్మాన్ని నెరవేర్చారు .వివేకానందుని లాగానే స్వామి పరమానంద ‘’దైవం సకల మానవాళి కి చెందిన సంపద ‘’అని ఎలుగెత్తి చాటారు .ఎవరి మత ధర్మాలను వారు పాటిస్తూనే ,ఎవరికి వారు తమ మార్గాన్ని ఏర్పాటు చేసుకొవాలనిఉద్బొధి౦చారు  .విభిన్నమతాలను అంగీకరిస్తూ ,పరస్పర విశ్వాసం ప్రాతిపదికపై అభివృద్ధి సాగాలని అభిలషించారు .వివేకానందునిలాగానే  పరమానంద కూడా జనసామాన్యం తోపాటు కవులతో, రచయితలతో ప్రచురణ కర్తలతో, జర్నలిస్ట్ లతో, రాజకీయ నాయకులతో తరచుగా సమావేశమయ్యేవారు .ఈ గురు-శిష్య సంబంధం వారి ప్రభావం వేదాంతం ,యోగా లపై మిడ్ వెస్ట్ లో ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకోవటానికి మనం లూస్ విల్ లో జరిగిన అద్భుతాన్ని గురించి తెలుసుకోవాలి .ఆ వివరాలు రేపు .

 సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 భాగవత పరమార్ధం

 భాగవత పరమార్ధం

ఆచార్య శ్రీ గంటి సోమయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొంది ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొఫెసర్ గాను ,ప్రాచ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు  ,విశ్వకవి గద్య రచనలు ,కుమారాంజలి ,సత్యం శివం సుందరం మొదలైన పద్య రచనలు ,మా నిషాదం వంటినాటికలు ,కాళిదాసకవిత వంటి విమర్శన గ్రంధాలు రచించి ,యూని వర్సిటి గ్రాంట్స్ కమీషన్చే జాతీయోపన్యాసకులుగా గౌరవి౦పబడి ,యావద్భారత దేశం పర్య టించి ఢిల్లీ బెనారస్ ,బెంగుళూర్ అన్నామలై మున్నగు విశ్వ విద్యాలయాలలో వివిధ విషయాలపై ఉపన్యాసాలిచ్చి ప్రభావితం చేసిన ఆచార్య బొడ్డు పల్లి పురుషోత్తం గారు విజయవాడ ‘’రసభారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’కోసం రాసిన పోతన భాగవత విశేషాలలో నుంచి కొన్ని విషయాలను గూర్చి తెలుసుకొందాం .

    గాంధీ మహాత్ముడు ఆంగ్ల భాష ను వాడటం చేత ఆ భాషకు ఎంతో గౌరవం కలిగింది అని విశ్వనాథ గాంధీ మరణం పై ‘’మానవ నిర్మితంబైన ఆంగ్లేయంబు శ్రీ రుషి ప్రోక్తంబు చేసినారు –కేవలము రుణ పడ్డ దాంగ్లేయ జాతి –నీకు మానవ సామాన్య నియత ధర్మ –మురలి సామ్రాజ్య ధర్మంబు నొక్కదాని –తెచ్చు కొని బాధ పడుచుండు పిచ్చి జాతి ‘’అని మనల్ని గురించి బాధ పడ్డాడు .నన్నయ తిక్కనలు చెప్పింది లౌకిక కవిత్వం .పాల్కురికి సోమన చెప్పింది మత కవిత్వం కాని కవి యోగి భక్త పోతన్న చెప్పింది భక్తి కవిత్వం అన్నారు .ఇదే విశ్వనాథ దృష్టిలో జీవుని వేదనను తీర్చి శాంతి చేకూర్చేది అన్నారు బొడ్డుపల్లి వారు .భక్తి సంకుచితమైనది కాదు జాతి మతాతీతమైనది భక్తి .

 పోతన కేవలం భక్తీ కవి కాదు .భక్తీ కవిత్వోద్యమ సారధి .యావద్భారత దేశం లోను భక్తి కవిత్యోద్యమానికి ఆద్యుడు పోతన .సూరదాసు ,తులసీదాసు తుకారాం వంటి భక్తకవులకు ప్రేరణ పోతన్నయే .వల్లభాచార్యులకు భక్తిపాదం నెలకొల్పటానికి ఆంద్ర భాగవతమే ఆధారం .

’’వర గోవింద కథా సుధారస మహా వర్షోరు ధారాపరం –పరలకు గాక ,బుదేంద్ర చంద్ర !ఇతరోపాయాను రక్తిం ప్రవి

స్తర దుర్దాంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దు –స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బారునే ‘’అన్నవాడు పోతన .సంకీర్తన భక్తికి  ప్రాణం పోసి జన తరుణోపాయానికి మార్గం చూపిన కవి పోతన .సంకీర్తన భక్తితో జన చైతన్యం కలిగిందని విమర్శకాభిప్రాయం .చైతన్య ప్రభువు ఆంధ్ర దేశం లో సంచారం చేశాడు .మంగళ గిరి పానకాల స్వామి దివ్య దర్శనం చేశాడు .అప్పుడు పోతనగారి భాగవత ప్రభావం పడే ఉంటుంది .చతుర్విధ ,పంచవిధ, నవవిధ భక్తులను గురించి ఆంద్ర భాగవతం సవిస్తరంగా తెలిపింది .నిజానికి ఆంద్ర భాగవతం వ్యాస భాగవతం కంటే మహత్తరమైనది అన్నారు ఆచార్య శ్రీ పురుషోత్తమం గారు .వ్యాస భారతం లో భక్తి శాస్త్రం గా చెప్ప బడింది .శాస్త్రం తండ్రి వంటిది .భక్తి కళ.తల్లి వంటిది .’’భక్తి జననీ భక్తార్భకం రక్షతి ‘’అన్నారు ఆది శంకరాచార్యులవారు .పోతనగారు భక్తిని కళగా పోషించారు.భక్తీ చేత శ్రీ కైవల్యం పొందటానికి కవిత్వం చెప్పాడు పోతన .భగవంతుడు ‘’భక్త పాలన కళా సంరక్షకుడు ‘’అన్నాడాయన ‘’మహానందనా డింభకుడి ‘’లాగా భాగవతం ఆనందాన్ని ప్రసాదిస్తుంది .

         అన్నీ రాసినా మనసు చికాకుగా ఉంటె నారదమహర్షి వ్యాసుని హరినామ స్తుతి చేసే భాగవతం రాయమన్నాడు .ఆయన యెంత ప్రయత్నించినా శాస్త్ర  వైదుష్యం వృద్ధి కాలేదు . అందుకే వ్యాసభాగవతం ‘’మహా మనీషికి కాని అవగాహన కాదు’’ .బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు అధ్యయనం చేస్తేకాని భాగవతాన్ని చేబట్టే సామర్ధ్యం చేకూరదు .కాని పోతన భాగవతం అలాంటిది కాదు .అడుగడుగునా హరినామ స్తుతి అలరారుతుంది .అవకాశం ఉన్నప్పుడే కాదు ,అవకాశం కల్పించుకొని హరినామ స్తుతి చేస్తాడు భక్తకవి పోతన .అంటే నారద మహర్షి ప్రబోధాన్ని ఈ ఆంద్ర వ్యాసుడు పోతన్న తూచా తప్పకుండా పాటించాడన్న మాట .అందుకే తెలుగు భాగవతం అనువాదం కాక అను సృజన అయింది .మూలానికంటే రెండు మూడు రెట్లు శ్రీధర భాష్యకారుని అభిప్రాయాలతో సమ్మిళితమై సరసంగా సమున్మేషించింది అన్నారు శ్రీ పురుషోత్తం గారు .సంస్కృతం లో 25శ్లోకాలకే పరిమితమైన గజేంద్ర మోక్షం పోతన చేతిలో 125రసగుళిక పద్య గద్యాలలో అలరారి మూలానికే వన్నె తెచ్చింది .పోతన గారి భాగవత భక్తీకళా ప్రపూర్ణమై సామాన్యులకూ ధీమాన్యులకు కూడా జీవితపాధేయం ,ఉపాధేయం అయింది .

  నిఖిల రసామృతమూర్తి అయిన భగవంతునికి అంకితమిచ్చిన పోతన భాగవతం మిగిలిన వారి కవిత్వాలకంటే ఒక మెట్టు పైనే ఉంది .’’బాల రసాలసాల నవ పల్లవ కోమల ‘’మైన ఆయన కవిత్వం ఉల్లాన్ని ఉప్పొంగ జేసే ఉదాత్త దివ్య భవ్య కవిత్వం  .ఆయన దేనికీ ఎవరికీ భయ పడాల్సిన వాడు కాదు .తన పరిమితమైన కవితాత్మను సచ్చిదానందాత్మక పరమాత్మతో ఏకం చేసి తాదాత్మ్యం చెంది ,తాను  నిమిత్త మాత్రుడుగా ఉండి భాగవతాన్ని పలికాడు పోతన .ఇంతటి విషయ తాదాత్మ్యం నన్నయ ,తిక్కనలకు లేదు .అందుకే వారిద్దరికంటే పోతన ఘనుడు అంటారు ఆచార్యులవారు .ఎప్పుడో దార్శనికుడు ప్లాటో ‘’కవులు నీతి మంతులుకారు .వాళ్ళు రాసేది,జీవించేది ఒకటికాదు ‘’అని నిరసించాడు .పోతనలాంటి నైతిక కవి ఉంటాడు అని ప్లేటో ఆనాడు ఊహించలేక పోయాడు .కవిత్వం  జీవితం రెండూ ఒకటిగా జీవించి ఆదర్శకవి అయ్యాడు పోతన. అందుకే ఆంధ్రుల ఆరాధ్యదేవత ,కవి,వ్యక్తీ  అయ్యాడు పోతన .

  పోతన సర్వతంత్రస్వతత్రుడు భగవంతునికి తప్ప ఎవరికీ భయ పడడు.ఇంద్రియాలకు దాసుడుకానేకాడు .లోపలి శత్రువులను జయించినవాడు .హాలికుడిగా పరమ సంతృప్తి తో జీవించాడు .పూర్తిగా అంతర్ముఖుడు పోతన .త్రికరణాలను ఏకం చేసుకొని రస స్వరూపుడైన భగవంతునితో ఏకోన్ముఖుడైన వాడు .ఆయన కవిత్వం కూడా అంతటి మహత్వాన్ని ,మార్దవత్వాన్ని సముపార్జించుకొని ఆంద్ర జాతిని పూర్తిగా ఆవరించు కొన్నది అని తేనే సోనల్లాంటి పదాలతో లలిత లలితంగా మధుర మధురంగా బొడ్డుపల్లి వారు పోతనను ఆయన కవిత్వాన్ని విశ్లేషించారు .

   ఆంద్ర భాగవతానికి తెలుగులో ఏ కావ్యానికీ లేని  మరొక ప్రాశస్త్యం ఉంది .ఈ ప్రశస్తి సంస్కృత భాగవతానికి లేదంటారు ఆచార్యులు .తెలుగు దేశం లో ఎవరికైనా తీవ్ర మైన ఆపద కలిగితే దానితో తీవ్ర మనోవేదనతో బాధ పడుతుంటే ‘’గజేంద్ర మోక్షం ‘’పారాయణ చేస్తారు .వెంటనే ఆర్తి నశిస్తుందని విపరీతమైన విశ్వాసం .ఈ పారాయణం అర్ధ రాత్రి అందరూ నిదురించే వేళ కంఠ మెత్తి’’లావొక్కింతయు లేదు ,ధైర్యము విలోలంబయ్యె ‘’అని బిగ్గరగా చదువుతూ పారాయణం చేస్తారు ఆంద్ర జనులు .అభీష్ట సిద్ధి పొందుతారు .మరొక విశేషం .కన్నె పిల్ల వివాహం జరగటం ఆలస్యమైతే ఆమె చేత రుక్మిణీ కల్యాణం పారాయణ చేస్తే మూడే మూడు నెలలలో వివాహం జరుగుతుందని అనుభవపూర్వక విషయమే . ఈ మహత్తు పోతన గారి కవితకు  ఎలా కలిగింది ?ఆయన’’ భక్త కవి యోగి’’ కావటం వలన.ఉదాత్త నైతిక జీవనుడు ,త్రికరణ శుద్ధి కలవాడు .అంతేకాదు .ఆయనది మాంత్రిక కవిత్వం అంటే మంత్రాల వంటి కవిత .వాటిని శ్రద్ధగా పారాయణ చేస్తే శాంతి దాంతులు కలిగి అభీష్ట౦  సిద్ధి స్తుంది .ఒక రకంగా పోతన వశ్య వాక్కు ఉన్నకవి బ్రహ్మ .

      వారణాసి రామ మూర్తి ( రేణు )తెలుగు భాగవతాన్ని హిందీ లోకి అనువదింఛి పోతన పూత కవితను ఉత్తరాది వారికి రుచి చూపించారు .శ్రీ సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సంస్కృతీకరించి గీర్వాణ భాషకు పోతన భక్తీ కవిత తో సొగసులందజేశాడు .తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆంగ్లంలోకి అనువది౦ప జేశారు .తమిళ దేశీయ హరిదాసులు  కూడా పోతన గజేంద్ర మోక్ష పద్యాలను వారి విచిత్ర యాసతో చదివే వారట .తమిళులు ఆనందంగా ఆలకి౦చేవారని శ్రీ ప్రయాగ సంగమేశ్వర భాగవతార్ చెప్పారని పురుషోత్తం గారన్నారు .

  నిజానికి తెలుగు భాగవతం కంటే భారతానికి విశేష ప్రాచుర్యం కలగాలి కారణం భారతం జీవిత సమరాన్ని నిరూపించే ఘట్టం .ధర్మ సమన్వయములో ఎవరికైనా సందేహం వస్తే భారతమే ప్రమాణం .కవిత్రయ శిల్ప హస్తం తో మూల భారత బంగారాన్ని తళుకు బెళుకులోలికే స్వర్ణాభరణం గా చేసి సరస్వతీ కంఠాభరణం చేశారు . భారతం ధర్మాన్ని చెబితే భాగవతం పరమార్ధాన్ని బోధించింది .ప్రజలలో ఎక్కువ మంది పురుషార్ధ పరాయణులేకాని ,పరమార్ధ పరాయణులు కారు .అలాంటి భారతాన్ని అధిగమించి పోతన గారి భాగవతం ఆంద్ర దేశం లో విశేష ప్రాచుర్యం పొందింది .ప్రజలకు శృంగారం పై మోజు ఎక్కువ .పోతనగారు కూడా అసలు శృంగారకవే .ఆయన రాసిన భోగినీ దండకమే సాక్షి .రాను రాను భక్తకవిగా పరిణమించాడు .అయినా శృంగారాన్ని రంగరించకుండా ఉండలేక పోయాడు .వామనావతార ఘట్టం లో వామన మూర్తి యాచనా హస్తం చూసేసరికి బలి చక్రవర్తి ఉప్పొంగిపోయాడు .ఎటు వంటి హస్తం కింద, తన హస్తం పైన ఉందొ ఆలోచించుకొని ఉప్పొంగి పోయి నోటి తో పోతన గారి పద్యం లో పలికించాడు –

‘’ఆదిన్ శ్రీసతి కొప్పు పై ,తనువుపై ,హంసోత్తరీయంబు పై –పాదాబ్జంబులపై ,కపోల తటిపై ,పాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ చెందు కరంబు క్రిందగుట ,మీదై నా కరంబౌట,మేల్ –కాదే?రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే ?-ఇందులోని శృంగార భావానికి ఆనందించని సహృదయుడు ఉండడు అంటారు శ్రీ బొడ్డుపల్లి .భాగవతం సంకీర్తన ప్రధానం దానికి తాళాలు ,మృదంగాది వాద్యాలు అవసరం .ఆ కొరత తీర్చి శబ్దాలంకారాలతో శోభ తెచ్చాడు .పోతన పద్యాలను సంకీర్తన లాగా పాడే వాళ్ళున్నారు అంటారు ఆచార్య బొడ్డుపల్లి .శబ్దాలంకారాల ప్రయోజనం గుర్తించి  సార్ధకం చేసిన వాడు పోతన కవి ఒక్కడే అంటారు .పోతన గారి అర్దాలంకారాలు కూడా రస వ్యన్జకాలై అలంకార ధ్వనిలో పర్య వసిస్తాయి అన్నారు .శ్రీ వేదాల తిరు వేంగళాచార్యుల వారు భాగవతం లో అనేక  ద్వని భేదాలున్నాయని సోపత్తికంగా నిరూపించారు .

  ఛందో వైవిద్యం లో ,ఛందఃశిల్పంలోను పూర్ణ ప్రజ్ఞఉన్నవాడు పోతన .బ్రౌన్ దొర పోతన్న ,వేమన్నలనే ప్రజా కవులు అన్నాడు .కవులందరూ మేధాశక్తి తో కవిత్వం చెబితే ‘’అతి మానసిక కవిత్వం ‘’(ఓవర్ హెడ్ పోయిట్రీ)శ్రీ అరవిందులు చెప్పారు  .తెలుగులో ఒక్క పోతన్నగారే ఇలాంటి కవిత్వం చెప్పారు. నిఖిల రసానంద మూర్తితో ఏకం కావాలని ప్రతి కవీ కోరుకొని విఫలురై విలపిస్తారు .కాని సఫలత పొందిన వాడు పోతన్నగారొక్కరే .అందుకని ఆయనకు ఆయనేసాటి .ఎంత భావోద్రేకం లో ఉన్నా రచన ప్రారంభించే సరికి కవితా శక్తి కొంత సన్నగిల్లుతుంది .దీనినే పాశ్చాత్యులు ‘’A poet;s mind in creation is a fading furnace ‘’అన్నారు .దీనికి అపవాదం పోతన్న .కారణం ఆయన కవితాత్మను అనంత భగవచ్చక్తికి లంకె వేసి తనదన్నది వేరే ఏదీ లేకుండా చేసుకొన్నకవి యోగి .

   ఈ నాలుగు వ్యాసాలకు ఆధారం నేను ముందే మనవి చేసినట్లు విజయవాడ రసభారతి వారి ప్రచురణ పీయూష లహరి అని మరొక్క సారి మనవి చేస్తున్నాను .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మధ్య పశ్చిమం లో వేదాంతం

మధ్య పశ్చిమం లో వేదాంతం

స్వామి వివేకానంద  1893 ప్రపంచ మతసమ్మేళనం లో పాల్గొని ప్రసంగించాక ,భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించాలన్న రాజకీయ భావం బలపడింది .అప్పటికే దేశం బ్రిటిష్ వారి సేవలో రెండు శతాబ్దాలు పైగా గడిపింది  .తన మూల సిద్ధాంతాలను ఆదర్శాలను మర్చే పోయింది.సుదీర్ఘ నిద్రలో జోగింది .తన దారి మర్చే పోయింది భారత దేశం . ఈ పరిస్థితిలో దేశానికి కావలసింది ముఖ్యంగా ఆత్మ గౌరవం  దాన్ని నిలబెట్టుకొనే నమ్మకం .కనుక తన సత్యమార్గాన్ని వెతుక్కున్నది .నవీన, విభిన్నమైన ప్రపంచం లో ఉండాలనుకొన్నది .చికాగోలో వివేకానందుని విజయం ,పశ్చిమ దేశాలపై ఆయన ప్రభావంతో భారత దేశం లో రాజకీయ,సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక  గమ్య స్థానాన్ని   మలుపు తిప్పింది .ఒకేఒక్క ప్రసంగం తో లక్షలాది మందిని ప్రభావితం చేసిన స్వామి ఆదర్శమూర్తిగా భాసించి ,మనదేశం లో జాతీయ ఐక్యతకు ,జాతి గర్వానికి ,జాతీయ అస్తిత్వానికినూతన ఆశల పునాదులేర్పడ్డాయి.మతాల పార్లమెంట్ లో వివేకానందుడు చేసిన ప్రసంగం ఒక్కటి చాలు కర్తవ్య పరాయణత్వానికి అని దేశీయులు భావించారు .ఇంకా ఏఇతరమైన ప్రభావం అక్కర్లేదనిపించింది  .ఈ భావం గుండెల నిండా నింపుకొని పశ్చిమంలో ఆయన విజయం సాధించి ఇండియాకు 1897లో తిరిగి వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం లక్షలాది జనులు నిండు హృదయం తో పలికి తమ ఆదర్శ మూర్తి ఆయనే అని చాటుకొన్నారు .

   పశ్చిమ దేశాలు  భారతీయ మతసామరస్యానికి ,ఓర్మికి  గొప్ప వేదికలుగా వివేకానందునికి ఉపయోగ పడ్డాయి  .సద్వినియోగం చేసుకొన్నాడాయన.ముఖ్యంగా అమెరికా ఈ భావ వ్యాప్తికి ,వాటిని రూపకల్పనకు సారవంతమైన భూమి అయింది .ఇండియాలో ఆయన అనుచరులు ,రామకృష్ణా మిషన్ ఆధ్యాత్మిక సేవలు, మానవసేవలతో మార్గ దర్శకమై ముందు నిలిచాయి .అయితే పశ్చిమ దేశాలలో ఆయన అనుచరులు ఏవిధంగా ముందుకు ఆయన  భావదారతో సాగిందీ స్పష్టమైన సమాచారం లేదు .ము౦దునిలబడిన మహితాత్ములు ఎవరు ,కార్యభారం మోసింది ఎవరు అనేది ప్రశ్నార్ధకం . .పూర్తిశక్తి సామర్ధ్యాలతో అమెరికాలోని మధ్య పశ్చిమ  –మిడ్ వెస్ట్ లో ఆ పని ప్రారంభమైంది .ఆయన అమెరికా చికాగో లో ఉంటూ ,డెస్ మోనిస్,విస్కాన్సిస్ ,మెంఫిస్ మొదలైన మధ్య పశ్చిమ సిటీలలో పర్యటించి జనాలలో ఉత్తేజం కల్గించాడు . అయన ప్రబోధం ఈ ప్రాంతాలను దాటి అమెరికా గుండె లాంటి ప్రాంతాలలో మారుమోగి సత్తా చాటింది .అమెరికా తూర్పు ప్రాంతాలైన న్యూయార్క్ ,బోస్టన్ లతోపాటు పశ్చిమ తీరం  .లూసియానా ,ఫ్రాన్సిస్కోలలో కూడా భారతీయ ఆధ్యాత్మిక ,ఆదర్శాలుకొత్త సవాళ్ళను విసిరాయి.పశ్చిమ తీరంలో మాత్రం భారతీయ వేదా౦తభావనల సంస్కృతి విస్త్రుతమైనది .మధ్య పశ్చిమం లో మాత్రం ప్రజలు వాళ్లకు ప్రీతికరమైనదీ,తెలిసిన దానికి మాత్రమె కట్టుబడి ఉంటారు .అందుకని మిడ్ వెస్ట్ లోస్వామీజీ సందేశ ప్రభావం ,కార్యక్రమాలు ఏమిటో పూర్తిగా అర్ధం చేసుకోవాలి .సెయింట్ లూయిస్ ,ఇండియానా పోలిస్ ,సిన్సినాటి ,క్లీవ్ లాండ్ ,లూ యిస్ విల్ నగరాలుస్వామీజీ వీటిని సందర్శించిన ఆధారాలు లేకపోయినా ,  ఆయన సందేశాలతో బాగా ప్రభావితమైనాయి.

   సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

    అప్పయ్య దీక్షితులు

    అప్పయ్య దీక్షితులు

పుల్లెల వారి ప్రస్తావనలు లో అప్పయ్య దీక్షితులు రాసిన ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’పై మంచి విషయాలు చెప్పారు .మహా పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు తమిళ నాడు లోని ఆర్కాట్ జిల్లాలో ‘’అడయప్పాలెం ‘’గ్రామం లో జన్మించారు .1554-1626 కాలంవాడు .మహా వైయ్యాకరణుడు అయిన భట్తోజీ దీక్షితులు వీరి వద్ద వేదాంత శాస్త్రాధ్యనం చేశాడు .గురువు ను గురించి స్తుతిస్తూ

‘’అప్పయ్య దీక్షి తేంద్ర  విద్యా గురూనమస్యామః యత్కృతి బోధా బోధౌ విద్వాదవిద్వాద్విభాజనో పాదీ ‘’అన్నాడు .అంటే ‘’ఒక వ్యక్తి పండితుడు ఔనా కాదా అని చెప్పటానికి ఎవని గ్రంధాలు అర్ధం చేసుకోవటం ,అర్ధం చేసుకోక పోవటం అనేవి నిర్ణాయక ప్రమాణా లో అలాంటి సమస్త విద్యా గురు వైన ఆప్పయ్య దీక్షితులకు నమస్కారం ‘’.

  సర్వ తంత్ర స్వతంత్రుడైన అప్పయ్య దీక్షితుల కీర్తి ఆయన జీవిత కాలం లోనే భారత దేశం అంతా వ్యాపించింది .ఈయన సోదరుని మనుమడు మహా కవి అయిన నీల కంఠ దీక్షితులు 1637లో ‘’నీల కంఠ విజయ చంపువు ‘’రాశాడని పుల్లెల వారన్నారు .తన పన్నెండవ ఏటనే అప్పయ్య దీక్షితుల ఆశీస్సులు పొందాడు. అప్పయ్య కీర్తిని గురించి ఒక శ్లోకం లో వర్ణించాడు

‘’యం విద్మఇతి యద్గ్రంథాభ్యస్యామో ఖిలానితి –యస్య శిష్యః స్మ ఇతి శ్లాఘంతే స్వం విపశ్చితః ‘’అన్నాడు అంటే ‘’మాకు అప్పయ్య దీక్షితుల వారి పరిచయం ఉందని కొందరూ ,వారి గ్రంధాలు అభ్యసిస్తున్నామని కొందరూ వారి శిష్యుల మని మరి కొందరూ పండితులలో చాలా మంది గొప్పలు చెప్పుకొంటారు ‘’అని అర్ధం .దీక్షితులకు హరి హరాదుల విషయం లో భేద బుద్ధి లేని అద్వైత వాది.సిద్ధాంత పరం గా అద్వైత వాది అయినా పరమేశ్వరుని పై ప్రగాఢ భక్తి ఉన్న వాడినని చెప్పుకొన్నాడు .

‘’మహేశ్వరే వా జగదీశ్వరే జనార్దానేవా జగదంత రాత్మని –న భేద లేశ ప్రతి పత్తి రాస్తి మే తదాపి భక్తిసృనేంద్ర శేఖరే ‘’అని చెప్పుకొన్నాడు .అప్పటికే దక్షిణ దేశం లో వైష్ణవాన్ని బౌద్ధాన్ని ఎదుర్కోవటం కోసం శివ పారమ్యాన్ని ప్రతి పాదిస్తూ అనేక గ్రంథాలు రాశాడు .శివద్వేషం లో శివుడు కూడా జీవుడే అని వైష్ణవులు అన్నారు .విష్ణువు జీవుడే అని శైవులన్నారు అదీ ఆ నాటి పరిస్తితి .తన ప్రయత్నం అంతా  ద్వేషాన్ని శమింప జేయటానికే నన్నాడు .తనకే మాత్రం విష్ణు ద్వేషం లేదని నిర్ద్వంద్వం గా తెలిపాడు .

     నీలకంఠా చార్యులు రాసిన బ్రహ్మ సూత్ర భాష్యానికి అప్పయ్య దీక్షితులు తనకు ఆశ్రయం ఇచ్చిన రాజు చిన బొమ్మ నాయకుడు కోరగా ‘’శివార్క మణి దీపిక ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .ఈ  గ్రంథాన్ని దీక్షితులు స్వయం గా అయిదు వందల మంది పండితులకు పాఠం చెప్పాడు .రాజు మెచ్చి ఆ పండితులందరికి భోజనం వసతి సౌకర్యాలు కల్పించాడు .ఈ పుస్తకం ప్రారంభం లో దీక్షితులు ‘’ఉపనిషత్తులకు శ్రుతులకు ,అన్ని పురాణాలకు స్మృతులకు మహా భారతం మొదలైన వాటికి కూడా గొప్ప తాత్పర్యం అద్వైతాన్ని  ప్రతిపాదించటం లోనే బ్రహ్మ సూత్రాల తాత్పర్యం కూడా అద్వైత౦  లోనే అనే విషయాన్ని వదిలి విమర్శించే వారికి స్పష్టం అవుతుంది శంకరాచార్యులు మొదలైన ప్రాచీనులు కూడా దీనినే గ్రహించారు .అయినా తరుణే౦ద్రుశేఖరుడైన ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటేనే కాని మానవులకు అద్వైత వాసన కలగదు ‘’అన్నాడు అందుకే ఈశ్వర పారరమ్య ప్రతి పాదిత మైన ఈ భాష్యానికికి వ్యాఖ్యానం రాస్తున్నాననిచెప్పాడు .

  అప్పయ్య దీక్షితులు నాలుగు వందలకు పైగా గ్రంథాలు రాశాడని ప్రతీతి .అందుకే ‘’చతురధిక శత గ్రంథ ప్రణేత ‘’ అనే బిరుదు పొందాడు .అన్నీ గొప్ప ప్రామాణిక గ్రంథాలే .చిన్న పుస్తకాలుగా వివిధ దేవతలపై స్తోత్రాలు రాశాడు .వీటికి విపుల వ్యాఖ్యలూ రాశాడు .అందులో ఆయా సంప్రదాయాలకు ,సిద్ధాంతాలకు సంబంధించిన ఎన్నో విషయాలు గుది గుచ్చి వివరించాడు .ఇవన్నీ చదివి అర్ధం చేసుకొనే పండితులు ఉండటం కష్టం అంటారు పుల్లెల వారు .’’దీక్షితులు సాక్షాత్ పరమ శివావతారమే ‘ అవతార పురుషులే ‘’అని శ్రీ కంచి పరమాచార్యుల వారన్నారని గుర్తు చేశారు .కువలయానందం ‘’అనే ఉద్గ్రంథాన్ని దీక్షితులు రచించాడు .

  ‘’శాస్త్ర సిద్ధాంత లేశ సంగ్రహం ‘’సాటి లేని ప్రౌఢ గ్రంథం అంటారు పుల్లెల వారు .అద్వైతానికి  చెందిన ఎన్నో గ్రంథాలను చదివి సారాన్ని గ్రహించి అప్పయ్య దీక్షితులు దీన్ని రాశాడన్నారు .41గ్రంథాల పేర్లు పది రచయితల పేర్లు పేర్కొన్నాడు ఇందులో .’’ఇలాంటి గ్రంథం  మరే శాస్త్రం లోను ఉన్నట్లు కనబడదు’’ అని ఆచార్య తేల్చి చెప్పారు .మాజీ ఐ జి..శ్రీ కే అరవింద రావు తనను దీనిని తెలుగు లో వ్యాఖ్యానం రాయమని కోరారని చెప్పారు .ఎప్పుడో తాను కృష్ణాలంకారం అనే వ్యాఖ్యతో తమ గురు దేవులు శాస్త్ర రత్నాకర శ్రీ ఎస్ ఆర్ .కృష్ణ మూర్తి శాస్త్రి గారు రాసిన టీకా టిప్పణి తో ఉన్న గ్రంధాన్ని చదివానని ఇప్పుడు  మననం చేసుకొని తెలుగు అనువాదం చేశానని వినమ్రం గా పుల్లెల వారు చెప్పారు …’’బాలానందిని ‘’గా దాన్ని అనువాదం చేశానని చెప్పుకొన్నారు .అరవింద రావు గారే  స్వయం గా ప్రూఫులు దిద్దారని గుర్తు చేసుకొన్నారు .దీనిని సద్గురు శివానంద మూర్తి గారికి అంకితమిచ్చి జన్మ ధన్యం చేసుకొన్నానన్నారు .

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-21-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ చెన్న కేశవ స్వామి –హరిజనార్చకులు

శ్రీ చెన్న కేశవ స్వామి –హరిజనార్చకులు

అనే పుస్తక౦ మొదటి భాగం  శ్రీ గంధం నాగేశ్వరరావు గారు రచించి 1986లో ప్రచురించారు .వెల అమూల్యం .ఈ రచయిత 1920లో జన్మించి ,ఉపాధ్యాయునిగా చేసి తర్వాత తెలుగు లెక్చరర్ గా  పదవీ విరమణ చేశారు పగోజి అత్తిలి లో కాపురం .వీరితో నాకు పరిచయం లేదు .ఈ పుస్తకం వారు నాకు పంపగా ఇవాళే అందింది .వెంటనే చదివాను .ఈయన ‘’ప్రధమ రధోత్సవం ‘’మొదలైన ఇరవైపుస్తకాలు రాశారు .అత్తిలికి చెందిన శ్రీ గంధం శేషేంద్ర రావు గారు మన ఊసుల్లో ఉయ్యూరు పుస్తకం పంపమని ఉత్తరం రాస్తే వెంటనే పంపాను .బహుశా ఆయన ద్వారా రచయిత నా అడ్రస్ తెలుసుకొని పంపి ఉంటారు .ఇక విషయానికి వస్తాను .

 పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు గ్రామం లో శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం గర్భ గుడిలో స్వామి వారి పాద పీఠం పై’’రాక్షస నామ సంవత్సర కార్తీక శుద్ధ దశమి వరకు యర్రా నారాయణుడుశ్రీ అప్పలస్వామి వారి ఉత్సవాలు జుజ్జూరి  ‘’అని ఉంది .ఇది రచయితలోని పరిశోధకుని బయటికి తీసి విషయ సేకరణ చేయించి  ఈ పుస్తకం రాయించింది.ఇందులోని సంవత్సరం, అప్పలస్వామి,యర్రా నారాయణుడు ,జుజ్జూరి అనే వారి విషయాలు కష్టపడి సేకరించారు .

శ్రీ అప్పలస్వామి -300ఏళ్ళు నిర్విఘ్నంగా పాలించిన  కాకతీయ సామ్రాజ్యం  1340లో పతనమైంది .మహమ్మదీయ పాలకులు హిందూదేవాలయాలను విగ్రహాలను చిన్నా భిన్నం చేశారు .ఆసమయం లో సింహాచల క్షేత్ర నివాసి శ్రీ కందాళ కృష్ణ మాచార్యులు హిందూ మత సంరక్షణ కోసం నడుం కట్టి ,ప్రజలకు వైష్ణవ దీక్షనిచ్చి ,ధైరర్యోత్సాహాలు కల్గించి భక్త బృందంతో పుణ్య క్షేత్ర సందర్శన చేస్తూ ద్రాక్షారామం  వచ్చి,తిరు వీధిఠంమ సందర్శించి ,వారిలో కొందర్ని  వెంట తీసుకొని ,అంటరాని వారు అర్చకులుగా ఉన్న కొన్ని గ్రామాలలో ఒకటైన ఉప్పులూరుకు వచ్చి ,వారు చేస్తున్న క్షుద్ర దేవతారాధన మాన్పించి ,వైష్ణవం బోధించి, చేర్చుకొని ,ఉప్పులూరులో తానూ సింహాచలం నుంచి వచ్చారు కనుక శ్రీ అప్పలస్వామిని ప్రతిష్టించి వారిలో సమర్ధులను అర్చకులను చేశారు. కొన్ని గేయాలురాసి వారికిచ్చి ద్వారకా తిరుమల ,వలనాడు గుండా వరంగల్లు వెళ్ళారు .  .అప్పల అంటే సంసార సాగరం నుంచి తరింప చేసేవాడు అని అర్ధం  .పండితులు వరాహ లక్ష్మీ నరసింహ స్వామి అంటే పామరులు అప్పన్న అని పిలిచేవారు .ఈ గ్రామం లో అప్పలస్వామి తోపాటు బలిపోలేరమ్మ, అమ్మోరమ్మ దేవతలను కూడా పూజించారు ఇలా 300ఏళ్ళు గడిచిపోయాయి .

  ఈ సంస్థాన పాలకులు జూపల్లి ఇంటి పేరిటవారు .మొదట్లో వీరిది నిజాం లోని పర్తియాల సంస్థానం ,.వీరిలో జూపల్లి రామచంద్ర ప్రభువు 1575లో రాజమహేంద్రవరం రాజు సితాబ్ ఖాన్ పై చేసిన యుద్ధం లో అతని పరాక్రమాన్ని గుర్తించిన గోల్కొండనవాబు ఇబ్రహీం కుతుబ్ షా జుజ్జూరు సంస్థానాన్ని బహుమతి గా ఇచ్చాడు .గుడివాడ దగ్గర, ఉయ్యూరు బందరు రోడ్డు పై ఉన్న జుజ్జవరం  ఇదే  .తర్వాత జుజ్జూరు అయింది.కానీ  కంచిక చెర్ల దగ్గర జుజ్జూరు గ్రామం ఉంది .జూపల్లి రామ చంద్రుని ముని మనవడు రాగన 1660లో ఉప్పులూరులో అప్పలస్వామికి ఆలయం నిర్మించి విగ్రహాలు అందించాడు .ఇతని తర్వాత వెంకటాద్రి కాలం లో సంస్థానం అన్యాక్రా౦తమై నూజి వీడుప్రభువులు  మేకావంశపాలనలోకి వచ్చింది .అప్పల స్వామి గుడి శిదిలమైతే మేకా రాజా ధర్మ అప్పారావు గారు పెద్ద గుడి కట్టింఛి ,7-11-1792న ప్రతిష్ట చేశారు  .అప్పటికి రాజా వయసు 30.

 శ్రీ యర్రా నారాయణుడు –ఈయన యర్రా వారి వంశం లో 8వ తరం వాడు .ఇతడిచిన్నతనం లోనే  తండ్రి అయ్యవారి వెంకటరామయ్య చనిపోగా బావగారు ఆకుల మల్లయ్య  నూజి వీడు సంస్థానం లో పలుకు బడి కల వాడు అవటం తో అన్నలు ఆయన దగ్గరకు పంపారు .అక్కడ కొంత చదివి ఆశ్వశాలలో  చిన్న ఉద్యోగి అయ్యాడు. 1783లో ఈస్ట్ ఇండియా కంపెని నూజి వీడుకోటను ముట్టడించగా ,పడమటి వైపునుంచి కంపెనీ సైన్యాల మేజర్ టీన్స్ ,మేజర్ మేజర్ లానేజ్ లు మొగల్రాజపురం నుంచి కోటమీదకు రాగా ఈ మల్లయ్య దండనాధుడు ఎదిరించి ,ఘోర యుద్ధం చేసి ,సైన్యాధ్యక్షుడు ఫెఫర్డ్ ను చంపి 10-12-1783న వీర స్వర్గం అలంకరించాడు .అప్పటికి నారాయణ వయస్సు 20.ఈ విషాద సంఘటనకు కలతచెంది ,నూజివీడునుంచి సోదరి తో 1784లో ఉప్పులూరు చేరాడు .

  తన బావ మల్లయ్య ఆత్మశాంతికై అప్పలస్వామి సేవలో శ్రద్ధగా పాల్గొంటూ ,న్యాయం గా మార్గదర్శనం చేశాడునారాయణ  .1788లో మేకా ధర్మ అప్పారావు మళ్ళీ నూజి వీడు ప్రభువు అయ్యాడని తెలిసి దర్శనం కోసం వెళ్లి విఫలుడై ,ఆయన బాడీగార్డ్ సర్దార్ సెట్టిపల్లి రాఘవ రాయనిం గారు మల్లయ్య గారి బంధువు అవటంవలన ఆయనద్వారా దివాన్ ను దర్శించి ,తమ దేవాలయ విషయం ప్రస్తావించాడు .రాజు, దివాను సానుకూలంగా స్పందించి ఉప్పులూరు ఆలయ పునరుద్ధరణకు అంగీకరించారు .కావలసిన సామగ్రి సేకరించి పునర్నిర్మాణం ప్రారంభించి రాక్షస నామ సంవత్సరం కార్తీక శుద్ధ దశమి 1-1-1792న పూర్తి చేయించాడు .రచయిత రాగి రేకుమీద చూసిన తేదీ ఇదీ ఒకటే .నారాయణ1784 నుంచి 1792 వరకు ఉప్పులూరు శ్రీ అప్పలస్వామిసేవలో పునీతుడయ్యాడు.  నూజి వీడు ప్రభువు ఈయనను ఆలయ ధర్మకర్తగా నియోగించాడు .శ్రీ ధర్మ అప్పారావు మందీ మార్బలం తో ఉప్పులూరు వచ్చి నూతన ఆలయ ప్రారంభోత్సవం చేశారు .విశాఖ వాసి ,వైష్ణవ తె౦గలై సంప్రదాయకులు, అనకాపల్లి గోడే సంస్థాన గురువు శ్రీ పరవస్తు శ్రీనివాసా చార్యులు కూడా వచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమ లో పాల్గొనట విశేషం .

 కొంతకాలానికి వైష్ణవులలోతె౦గలై ,ఒడగలై వర్గాలు ఏర్పడ్డాయి మొదటి వారి నామం ఇంగ్లీష్ y లాగా రెండవ వారిది uగా ఉంటాయి .వీర శైవం  ఆంధ్ర దేశం లో బాగా ప్రబలి తమ ఆరాధ్యుడైన చెన్న బసవడు పేరుగా  దేవుళ్ళపేరులో  చెన్న చేర్చి అప్పలస్వామిని చెన్న కేశవస్వామిగా 1868నుంచి మార్చారు .కానీ చెన్న అంటే అందమైన అని అర్ధం .ఉప్పులూరు మఠం చెన్నకేశవ మఠం అయింది .రాగి రేకు మీద ధర్మ అప్పారావు గారి పేరు లేదు .నూజి వీడు సంస్థానం ఉయ్యూరు వల్లూరు మైలవరం,శనివారప్పేట  వగైరా  అనేక సంస్థానాలుగా విడిపోగా ,ఆయన రెండవ సోదరుని మనవడు పార్ధ సారధి అప్పారావు వారసుడై 1899లో శనివారప్పేట ఎస్టేట్ ప్రభువయ్యాడు .ఉప్పులూరు చెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవాలలో’’ రాజా పార్ధ సారధి అప్పారావు సవాయ్ ఆశ్వారావు పేట మున్సదార్ రుస్తుంబా నగర్ సంస్థాన్ పాల్వంచ, భద్రాచలం అండ్ నిడద వోలు వగైరా దొరవారు సమర్పించిన మంత్రం పుష్పం ‘’అని చెబుతారు .

  ఇవిగాక అనేక విషయాలు పరిశోధించి శ్రీ గంధం నాగేశ్వరరావు ఈ పుస్తకం రాసి సమగ్రత తెచ్చారు .వారి పరిశోధనా శక్తికి అభినందనలు .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వింత ఆలయాలు  విచిత్ర విశేషాలు -2

వింత ఆలయాలు  విచిత్ర విశేషాలు -2

విగ్రహాలబదులు  మూడు శిరసులున్న అమ్మవారు –వైష్ణవీ దేవి

జమ్మూ కాశ్మీర్ కాత్రా త్రికూట పర్వతాలపై వైష్ణవి దేవి ఆలయం ఉంది. ఆలయం అంటే నిర్మాణం కాదు .రాతి గుహ దేవాలయం .అమ్మవారు మహా లక్ష్మీ దేవి అవతారం .ఆమెను త్రికూట అనీ మాతా రాణి అనీ భక్తులు పిల్చుకొంటారు .కాత్రా నుంచి 12 కిలో మీటర్లు ట్రెకింగ్ చేసి వెళ్ళాలి .ఆ పవిత్ర గుహలో సహజ సిద్ధమైన మూడు రాతి శిరస్సులు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తాయి .వీటిని ‘’పిండీలు ‘’అంటారు .ఈ మూడు వైష్ణవ దేవి కి ఉన్న మూడు రూపాలు అంటే మహా సరస్వతి ,మహా లక్ష్మి ,మహా కాళిరూపాలన్నమాట .వైష్ణవ దేవి తన భక్తులెవరో నిర్ణయించి ,వారిని తన సన్నిధికి రప్పించు కొంటుంది అని నమ్మకం .

  వైష్ణవ దేవి తొమ్మిదేళ్ళ వయసులో శ్రీరామ దర్శనం కోసం,ఆయననే వివాహమాడాలనే ఉదేశ్యం తో  తీవ్ర తపస్సు చేసింది .అప్పుడు ఆమె పేరు త్రికూట .రాముడు సీతా దేవిని వెతుకుతూ త్రికూట పర్వతానికి వచ్చి  ఆ బాలిక తననే భర్తగా కోరుతూ చాలాకాలం నుంచి తపస్సు చేస్తోందని గ్రహించి ఆమెతో తాను  సీతను వివాహ మాడానని  ,తాను  ఏక పత్నీ వ్రతుడను  ,మళ్ళీ కలియుగం లో కల్కి అవతారంగా మానవ రూపం లో అవతరిస్తానని ,అప్పుడు ఆమెను తప్పక పెళ్లి చేసు కొంటాననీ  నచ్చచెప్పి ఆమెకు ‘’వైష్ణవి ‘’అని పేరు పెట్టాడు .పాండవులు కూడా విజయం కోసం కురుక్షేత్ర సంగ్రామం ముందు వైష్ణవి దేవిని దర్శించి ,ఆమె ఆశీస్సులు పొందారని ఐతిహ్యం .

2-దశ మహా విద్యలకు ప్రతిరూపమైన కామాఖ్య దేవాలయ సముదాయం –అస్సాం

కమల ,మాతంగి ,బగళాముఖి ,ధూమావతి ,ఛిన్నమస్తక ,భైరవి ,భువనేశ్వరి ,షోడశి,తారా ,కాళీ అనే పది మహా విద్యలకు ప్రతిరూపమైన దేవాలయం అస్సాం లోని కామాఖ్య దేవాలయం .ఇందులో ముఖ్యమైనది 8వ శతాబ్దికి చెందినకామాఖ్య దేవాలయం .7వ శతాబ్దం వరకు ఈ దేవాలయం చాలాసార్లు పునర్నిర్మాణం పొందింది .కామాఖ్య దేవాలయం లో అమ్మవారి విగ్రహం ఉండదు దానికి బదులు స్త్రీ జననే౦ద్రియమైన యోని ఆకార రాయి ,దానిపైనుండి అనుక్షణం ప్రవహించే సహజ సిద్ధ జలధార ఉంటుంది. ఇదే అమ్మవారుగా భావించి పూజిస్తారు .అమ్మవారికి మేకలు బలి ఇస్తారు .జూన్ నెల మధ్యలో ఇక్కడ ‘’అంబు బాచి మేలా’’ఉత్సవం  కామాఖ్య అమ్మవారి ఏడాదికి ఒక సారి జరిగే ఆమె బహిష్టు రోజులలో  జరుపుతారు .ఈ ఉత్సవాన్ని తాంత్రిక ఉత్సవం లేక’’ అమేతి’’అంటారు .ఈ ఉత్సవం లో పాల్గొనటానికి దేశం నలుమూలాల నుంచి తాంత్రిక భక్తులు అశేషంగా వస్తారు .అప్పుడు ఆలయాన్ని మూడు రోజులు మూసి ఉంచుతారు .అమ్మవారికి రుతుస్నానం అయిన నాలుగవ రోజు మళ్ళీ దేవాలయతలుపులు తెరిచి దర్శనానికి అనుమతిస్తారు.ఎర్ర బట్టలు ప్రసాదంగా అంద జేస్తారు .

3-55మీటర్ల ఎత్తైన మహా బోధి దేవాలయం –బీహార్

బీహార్ రాష్ట్రం గయ జిల్లా లో ఉన్న మహా బోధి దేవాలం బౌద్ధులకు అతి ముఖ్య యాత్రాస్థలం .ఇక్కడే గౌతముడు  బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు .7వ శతాబ్దిలో నిర్మించబడిన అతి పురాతన ఇటుకరాతి  దేవాలయం ఇది .అనేక సార్లు పునర్నిర్మాణం పొందింది  బర్మా రాజు ,భారతీయ పురావస్తు శాఖ ఆలయ పునరుద్ధరణ చేశారు .ఈ దేవాలయ సముదాయం అత్యంత నాణ్యమైన ,సున్నితమైన నగిషీలతో కూడినది .మధ్యలో ఉన్న మహా బోధి ముఖ్య దేవాలయం ఎత్తు55 మీటర్లు .దీనికి చుట్టూ నాలుగు శిఖరాలున్నాయి .వీటికి ఉన్న రాతిరైలింగ్ అత్యంత సున్నితమైన చెక్కడపు పనితొఆశ్చర్య పరుస్తాయి .పాత రైలింగ్ క్రీ పూ.150 నాటివి .ఆతర్వాతవి గుప్తులకాలం లో ముతక గ్రానైట్ తో చేయబడి ఉన్నవి .

  ముఖ్య దేవాలయం లో కాలిమీద కాలు వేసుకొని ఉన్న బుద్ధ భగవానుని అతి పెద్ద నల్లరాతి విగ్రహం బంగారు రంగు పూత తో చూపరుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది.అశోకుడు నిర్మించిన స్తూపం ఆకారం లో ఈ దేవాలయం ఉండటం విశేషం .ఈ ప్రాంగణం లోనే గౌతముడు తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం ఉంటుంది .ఈ వృక్షాలు ఆనాటి బోధి వృక్ష శాఖలే అని నమ్మిక .

3-10 టన్నుల బరువున్న కలశం తో విరాజిల్లే సోమనాథ స్వామి

గుజరాత్ లో జునాగడ్ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన జ్యోతిర్లింగా క్షేత్రం శ్రీ సోమనాథ దేవాలయం .సోమనాథ జ్యోతిర్లి౦గాన్ని ద్వాపరయుగం లో శ్రీ లి౦ గేశ్వరలింగం అనీ ,త్రేతాయుం లో శ్రావణికేశ్వర లింగం అనీ ,సత్యయుగం లో భైరవేశ్వర లింగమని పిలిచేవారు. సోముడు అంటే చంద్రుడు స్థాపించిన లింగం కనుక సోమనాథలింగం ఐంది .మామగారు దక్షుడు ఇచ్చిన శాపాన్నయీ శివుడు నివారించి నందుకు చంద్రుడు భక్తితో ఈ ఆలయం నిర్మించాడు .

   శ్రీ కృష్ణుని అవతార సమాప్తి కూడా ఇక్కడే జరిగింది .ఇక్కడే ప్రసిద్ధ సరస్వతి నది సముద్రం లో కలుస్తుంది .గజనీ మహమ్మద్ అనేక దండయాత్రలు చేసి ఆలయద్వంసం చేసి అపూర్వ సంపాదనను దోచుకుపోయాడు .శిధిలమైన ప్రతిసారీ ఆలయ పునర్నిర్మాణం అరుగుతూనే ఉంది.స్వతంత్ర భారత దేశం లో సర్దార్ వల్లభ భాయిపటేల్  పూనికతో  ,అనేకుల సహకారం తో మళ్ళీ సోమనాథ దేవాలయం నిర్మించబడి చరిత్ర సృష్టించింది .ఆలయ శిఖరం 15మీటర్ల పొడవు తో 8.2మీటర్ల పొడవున్న స్తంభం పై కాషాయ పతాకతో హిందూ సంస్కృతికి ఆలవాలం గా కనిపిస్తుంది .ఈ శిఖరం కలశం 10టన్నుల బరువు ఉండటం మరో ప్రత్యేకత .ప్రాక్కనే ఉన్న సముద్రం అలలు ఆలయ గోడలను తాకుతూ ఉండటం మహాదాశ్చర్యం .

4-65 మీటర్ల ఎత్తైన పూరీ జగన్నాధ దేవాలయ

ఒరిస్సా మధ్య ప్రాంతం లో రాజధాని భువనేశ్వర్ కు దగ్గరలోనీలాచలం లో   పూరీ క్షేత్రం లో 12వ శతాబ్దిలో రాజా అనంతవర్మ చోడ దేవ నిర్మించిన శ్రీ జగన్నాథస్వామి ఆలయం ఎత్తు65మీటర్లు  అంటే అవాక్కవుతాం .ఆలయ గోడల ఎత్తు20అడుగులు అంటే ముక్కుమీద వేలేసుకొంటాం .ఇక్కడి విగ్రహాలు దారు నిర్మితం అంటే కొయ్య విగ్రహాలు అంటే మరీ ఆశ్చర్యపోతాం .శ్రీ బలరామ శ్రీ కృష్ణ స్వామి మధ్యలో సోదరి సుభద్ర ఉండి పూజలు అందు కొంటోంది అంటే అబ్బురపడతాం .ఈ దారు విగ్రహాలు ప్రతి 12ఏళ్లకోకసారి లేక 19ఏళ్లకొకసారి పవిత్ర వృక్షపు కా౦డాలతో పునర్నిర్మింప బడుతాయి అంటే మన ఆశ్చర్యానికి అంతు ఉండదు .ఈఆలయంలో అంటు,సొంటు ఉండవని సర్వం జగన్నాథం అనీ పేరోచ్చింది అంటే మరీ’’ ఇదై’’పోతాంకదా.అయ్యవారి ప్రసాదాన్ని మహా లక్ష్మీ దేవి పర్యవేక్షణలో తయారు చేయబడుతుందనీ  ,ఆలయం లో 11మీటర్ల పొడవు ,16అంచుల ఏక శిలా స్థంభం అయిన ‘’అరుణ స్తంభం ‘’ను కోణార్క సూర్య దేవాలయం నుంచి 18వ శతాబ్దిలో తీసుకొని వచ్చి ప్రతిష్టించారని ,హిందువులు కానివారికి ఆలయ ప్రవేశం లేదనీ తెలిస్తే మనకు నోట మాట రాదు .అంతేనా 45అడుగుల ఎత్తైన రథం లో ఆ షాఢ శుద్ధ తదియ నాడు  ముగ్గురు మూర్తుల రధయాత్ర వేలాది ప్రజలు రథాన్ని లాగుతూ నిర్వహించటం చూసి కోట్లాది జనం పులకించి పోతారు కదా. ప్రక్కనే ఉన్న అరేబియా సముద్ర తీరం లో కాలికి బేడీలతో ఉన్న ‘’బేడీ హనుమాన్ ‘’విగ్రహం ఉంది అంటే ఆశ్చర్యాతి ఆశ్చర్యం కలుగుతుంది  .ఇన్నిఆశ్చర్యాలకు అబ్బురాలకు నెలవు పూరీ జగన్నాథాలయం .ఇక్కడే భక్తమహాకవి జయదేవుడు ‘’గీత గోవింద కావ్యం ‘’రాసి తాను చరితార్ధుడయి, మనల్ని ధన్యులను చేశాడు అని తెలిసి పట్టరాని ఆనందం పొందుతాం .

   సశేషం

Posted in దేవాలయం | Leave a comment

వింత ఆలయాలు  విచిత్ర విశేషాలు  

వింత ఆలయాలు  విచిత్ర విశేషాలు  

1-లక్ష్మణ రేఖ ను చూపేఆలయం –నాచ్న దేవాలయం

మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో గుప్తులకాలం నాటి నాచ్నకుఠార దేవాలయ సముదాయం లో రామాయణ గాథలున్న రాతి నిర్మాణ దేవాలయం లో రావణుడు సీతాపహరణం కోసం మాయా యోగి రూపం లో రావటం ,సీతాదేవి లక్ష్మణుడు గీసిన రక్షణ రేఖ అయిన లక్ష్మణ రేఖను దాటి వచ్చి అతడికి భిక్ష వేయటం శిల్పీకరించి ఉంది .నాచ్నా కు 15కిలోమీటర్ల పరిధిలోపిపారియా ,కొహ్ భూమార మొదలైన చోట్ల  అనేక చిన్న చిన్న ఆర్కిటెక్చర్ సైట్స్ దర్శనమిస్తాయి .ఈ ప్రదేశాలలో ఇటుకనిర్మాణ దేవాలయాలన్నీ శిధిలం కాగా ,రాతి నిర్మాణ గుడులు కాలానికి తట్టుకొని నిలబడ్డాయి .శిధిల శిల్పాలలో వరాహావతారం కూడాఉంది .

2-సజీవంగా ఉన్న భిటర్గాంవ్ ఇటుక దేవాలయం –

 ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో 5వ శతాబ్ది గుప్తులకాలం నాటి ఇటుక దేవాలయం ఇప్పటికీ ఆకర్షణీయమే .శిదిలభాగాలను ఎప్పటికప్పుడు పునర్నిర్మిస్తూ ఈ ఆలయాన్ని కాపాడుతున్నారు .ఈ ఆలయం భారత్ లోని అత్యంత పెద్ద ఇటుక నిర్మాణ దేవాలయంగా రికార్డ్ సాధించింది .గర్భ గృహం పై పిరమిడ్ ఆకారపు శిఖరం ఉండటం ప్రత్యేకత .శివ ,విష్ణు మూర్తులున్నారు .అలేక్జాండర్ కన్నింగ్ హాం దీన్ని మొదటి సారిగా చూశాడు .

3-బెహ్తా బుజుర్గ్ జగన్నాథ వాన  దేవాలయం –

 భిటర్ గాంవ్ దేవాలయం కు  5కిలో మీటర్లలో  జగన్నాథ దేవాలయం బెహ్తా బుజుర్గ్ లో ఉంది  .ఇది ఎత్తైన బౌద్ధ స్తూపంగా కనిపించి ఆశ్చర్య పరుస్తుంది .దగ్గరకెళ్ళి చూస్తె హిందూ నగర  వర్తులాకార శిల్ప నిర్మాణం కల దేవాలయం అని తెలుస్తుంది .శివ విష్ణు శిల్పాలు ముచ్చట గొల్పుతాయి .విష్ణువు శేష శయనుడుగా కన్పిస్తాడు .ఇవి నల్లరాతి విగ్రహాలు .’’వాన దేవాలయం ‘’గా దీన్ని భావిస్తారు. ఈ ఆలయపు  సీలింగ్ నుంచి నీటి బొట్లు పడటం చూసి  త్వరలో వర్షం రాబోతుంది అని స్థానికులు గ్రహిస్తారు కనుక దీనికి   వాన దేవాలయం –రెయిన్ టెంపుల్ అని పేరొచ్చింది .

4-రాజు దేవుడిగా పూజింపబడే దేవాలయం –పో క్లాంగ్ యాగ్రై

పో క్లాంగ్ యాగ్రై 1151-1205 వరకు పాండురంగ లోని చంపా ప్రాంతాన్ని పాలించిన రాజు .ఆపేరు ఆయన పేరుకాదు బిరుదునామం .స్థానిక తెగలలో నుంచి జతోయ్ పేరుతొ వచ్చాడు .ఆ బిరుదుకు చంపా  భాషలో అర్ధం ‘’డ్రాగన్ రాజు ‘’.లేక డ్రాగన్ల రాజు లేక జటాయ్ ప్రజల రాజు .పో అంటే రాజు .క్లాంగ్ అంటే డ్రాగన్ .యాగ్రై అంటే డ్రాగన్ ప్రజలు అని అర్ధం .ఇతడిపాలనాకాలం లో అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కట్టాడు .బహుశా ఇతడే నాలుగవ చంపా వంశ జయఇంద్ర వర్మ రాజు కావచ్చు .చంపారాజు మూడవ జయ సింహ వర్మ ఈదేవాలయాన్ని నిర్మించాడు .పో క్లాంగ్ యాగ్రై పశువులకాపరి .క్రమంగా రాజయ్యాడు .చక్కగా ప్రజారంజకంగా ప్రజలను పాలించాడు . కంబోడియా రాజు ఖ్మేర్ దండెత్తి వచ్చినప్పుడు యుద్ధం లేకుండా శాంతిచేసుకోవాలనుకొని అతడితో ఎత్తైన గోపుర నిర్మాణం పోటీ లో ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం అని పందెం కాసి .తానె అతి ఎత్తైన గోపురనిర్మాణ విజేత గా నిలిచి రాజ్యాన్ని శత్రువులపాలుకాకుండా కాపాడుకొన్నాడు .చనిపోయే దాకా రాజ్యపాలన చేశాడు .ఆతని ధైర్య సాహసాలకు తెలివి తేటలకు ప్రజలు జేజేలు పలికి అతడే తమకు దేవుడు గా భావించారు.అందుకే ఆయన విగ్రహం స్థాపించి దేవాలయం కట్టి నిత్యం పూజించటం మొదలుపెట్టారు .అతడు నిర్మించిన శిఖరం ఇప్పటికీ అతడిపేరుమీదుగానే పిలువబడుతోంది .

5-గుడిసె ఆకారపు లక్షణ పేరుతొ దుర్గాలయం –భార్మౌర్

హిమాచల ప్రదేశ్ భార్మౌర్ లో గుప్తులకాలాన౦తర 7-12శతాబ్దాల మధ్య కాలం లోకట్టిన  దుర్గాలయం ఉంది దీనికే లక్షణ దేవి ఆలయం అని పేరు .ఆలయం గుడిసె ఆకారం గా ఉండటం ఇక్కడి ప్రత్యేకత .చెక్క సింహద్వారం ఉంది .అమ్మవారు గర్భగుడిలో లోహమూర్తిగా దర్శనమిస్తుంది .సిమ్లాకు 400కిలో మీటర్ల దూరం లో ఉన్న ఆలయం ఇది .నిరాధార ప్లాన్ తో ప్రారంభించి సంధార ప్లాన్ తో పూర్తి చేయబడింది .మహిషాసుర మర్దని గా దుర్గామాత అనే లక్షణా దేవి దర్శనమిస్తుంది .

Posted in దేవాలయం | Leave a comment

సంత్ కబీర్ సప్త శతి

సంత్ కబీర్ సప్త శతి

మాన్య మిత్రులు శ్రీ పంగులూరి హనుమంతరావు –మాజీ కులపతి ,శ్రీ యల్లా ప్రగడ ప్రభాకరరావు  -మాజీ అధ్యాపకులు జంటగా ఇప్పటికి చాణక్య నీతులు తిరువళ్ళువార్ దివ్యాకృతి -తిరుక్కురళ్ మొదలైన వాటిని చక్కని అనువాదం చేసి కౌండిన్య పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించారు .వారు ఎవరికీ వారే విడిగాకూడా రచనలు చేసి ముద్రించారు .ఈ జంటతో దాదాపు పదేళ్ళ పరిచయం నాది .వారి పుస్తకాలు నాకు ,మన సరసభారతి పుస్తకాలు వారికీ బట్వాడా అవుతూనే ఉన్నాయి .ఇప్పుడు ఈ పుస్తకం ‘’సంత్ కబీర్ సప్త శతి’’ ఈ ఏడాదే ఈమధ్యే ప్రచురితమై నాకు పంపగా  ఈనెల 6న అందింది .ఇవాళే చదివి మీకు పరిచయం చేస్తున్నాను .కబీర్ కవితలు 700హిందీలో,ప్రతి కవితకు తెలుగు పద్యం లో అనువాదం ,తాత్పర్యాలు రాసి ఒకరకంగా కబీర్ కవితా సర్వస్వంగా తీర్చి దిద్దారు. . కబీరు ఆదర్శమానవుడు,మానవతా వాది,సమాజ ప్రేమ ఉన్నవాడు .భూతకోటి సమస్తం ఆయనకు ప్రాణమే .ఆనాటి ధార్మిక సాహిత్య సాంస్కృతిక రంగాలను ప్రభావితం చేశాడు .మహోన్నత వ్యక్తిత్వంతో జ్ఞానులలో మహాజ్ఞాని ,మహా సాధకుడు కూడా .ఆయనకాలం 1397-99మధ్య .120ఏళ్ళు జీవించిన జ్ఞాన వయో వృద్ధు.1518-19మధ్య కీర్తి శేషుడయ్యాడు. కాశీలో మహమ్మదీయ చేనేత కారులైన నీరూ, నీమూ దంపతుల ఇంట పెరిగాడు .ఉత్తర భారతం అంతా తిరిగి తన జ్ఞాన జ్యోతితో ప్రజలను చైతన్య పరచి మగహర్ గ్రామం లో మరణించాడు .ఆయన దృష్టిలో దేవుడే గురువు .కబీరు రచనలు సాఖీలు ,రామైనీలు ,పదాలు అని మూడు రకాలు .సాఖీలు దోహా ఛందస్సులో రాస్తే ,మిగిలినవి కీర్తనల రూపం లో ఉంటాయి .సాధారణంగా కబీర్ దోహాలు అనే పేరుతోనే ఎక్కువ ప్రచారమయ్యాయి .ఆంద్ర దేశం లో భద్రాచల రామదాసు గారికి కబీరు గురువు అని మనకు తెలుసు ..ఇద్దరూ శ్రీరామ భక్తులే .కబీర్ గురువు రామానందుడు అంటారు …కబీర్ దాస్ గా అంటే మహాజ్ఞాని గా సుప్రసిద్ధుడు .మొదటి భార్య చనిపోతే రెండవ భార్యను చేసుకొంటే ఆమె పరమ గయ్యాళి కావటం వలన ,అసలే దుర్భర దారిద్ర్యంతో కునారిల్లుతున్న కబీర్ పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లయింది .పెద్దగా విద్య లేకపోయినా ,ఆయన ముఖతహా వెలువడిన జ్ఞానబోధను శిష్యులు ‘’కబీర్ బీజక్ ‘’గా గ్రంథస్థ౦  చేశారు .కబీర్ చనిపోతే అసలే హిందూ ముస్లిం తాదాలతో అట్టుడికి పోతున్న ఆకాలం లో ఆయన శవం కోసం ఈ వర్గాలు మాదంటే మాది అని పోట్లాడుకోగా ,ఆయన భౌతిక కాయం మాయమై ,దాని బదులు అక్కడ పుష్పాలు వెలిశాయని కథనం .ఆయన మహా మహిమాన్యత్వానికిది గొప్ప ఉదాహరణ .  ‘’రాం రహీం ఏక్ హై’’అనేది ఆయన సిద్ధాంతం .పువ్వులోని వాసనలా దేవుడున్నాడు .కస్తూరి మృగం తనదగ్గరున్న కస్తూరిని గ్రహించలేక బయట గడ్డి పై వెతుకు తుంది .అలాకాకుండా భగవంతుని నీలోనే వెతుక్కో అనేది అయన సందేశం .

   ఈ సర్వస్వం లో 7కా౦డలున్నాయి .మొదటికాండలో గురువు ,సాక్షాత్కారం ,విశ్వ రూపం ,వైరాగ్యం ,తత్వ సారం ,మధ్యేమార్గం ,విచారణ ,సంజీవని ,సరాబు ,ఉద్భవం అనే 10విభాగాలున్నాయి .రెండవ కాండ లో భక్తిరసం ,సనాతనం ,గమ్యస్థానం ,పాతివ్రత్యం ,మాయ ,మనసు ,సూక్ష్మ మార్గం ,మేలు కొలుపు ,సర్వ సమర్ధుడు అనే 9విభాగాలున్నాయి .మూడవ భాగం లో మిధ్యాజ్ఞానులు,సహజ స్వభావం ,పైపై మెరుగులు ,సాదుగరిమ ,గుణహీనులు ,విమర్శకులు ,సత్య నిష్ఠ ,పరుష భాషణ విభాగాలు ,నాలుగవ కాండ లో శబ్ద సౌందర్యం ,చెప్పేది చేసేది ఉపదేశం ,నమ్మకం ,అన్వేషణ ,శాశ్వతత్వం ,అయిదవ కాండ లో స్మరణం ,విరహం ,ఆరవ కాండలో కాలం ,సాంగత్యం ,దాంపత్యం ,జీవన్ముక్తులు ,ఏడవకాండ లో శౌర్యం వైరభావం ,కస్తూరి మృగం ,చిత్త కాపట్యం ,కాముకత్వం ,భ్రమ వినాశనం ,అనే 7విభాగాలు చివరగా తుది విన్నపం ఉన్నాయి .చాలా లోతైన విశ్లేషణతో ,అర్ధ వంతంగా చేసిన విభాగాలనిపిస్తాయి .కబీర్ జీవితానికి సంబంధించిన అనేక చిత్రాలు కూడా పొందుపరచారు .

 మొదటి దైన సద్గురు విభాగం లో గురువును మించిన బంధువు లేడు.జ్ఞానదాతకంటే గొప్ప దాత లోకం లో ఉండడు,దైవాన్ని మించిన మిత్రుడు ,భక్త సంఘం కంటే గొప్ప సంఘం ఉండవు .భక్తి విభాగం లో  లో ‘’భక్తిరసమును గ్రోలిన సక్తునకిక –అలుపురాదు సొలుపురాదు అంత సుఖమే –కొలిమి కాలిన కుండకు కొదువ ఏమి ?మరల సారె నెక్కుటనిన మాట లేదు ‘’.దాంపత్య భావన గురించి –‘’తడిపొడి మనసును పిసికి తట్టి కొట్టి –మెత్తిమెత్తినీ వొనరింపు మృదులముగను –సుఖము సొంత మందుకొనును సుందరుడపుడు –పరమ జోతియే శీర్షాన పరిఢవిల్లు ‘’.భావం -పొడి పిండిని పిసికి పిసికి తట్టుతూ మెత్తని ముద్దగా చేసి నట్లు ,సాధకుడు తనమనసును అలాగే మృదులం చేసుకోవాలి .బాహ్య ప్రభావాన్ని లోనికి రాకుండా చూసుకోవాలి అప్పుడే ఆత్మ సుందరిగొప్ప సుఖం అనుభవిస్తుంది .పరం జ్యోతి బ్రహ్మ రంధ్రం లో ప్రజ్వరిల్లుతుంది –

దీనికి కబీర్ దోహా –‘’ఇస్ మాన్ కో మైదా కరోనాన్హా కరికరి పీస్ – తబ్ సుఖ్  పావో సుందరీ ,బ్రహ్మ ఝలక్కేశీర్ష్’’..

చివరగా కబీర్ చేసిన తుది విన్నపం –‘’సాయీ ఇతనా దీజియే జా మై కుటుం సమయ్-భైంభీ భూఖా న జావూం సాధు భీ మూఖా న జాయ్’’

‘’నేను ,నా వారు బ్రతుకును నిలుపగలిగి –నంతయే యిమ్ము ,వలదింక సుంత గూడ-మేమును గడప త్రొక్కిన స్వాములైన –కడుపు మార్చుకోరాదయ్య కన్న తండ్రి ‘’

భావం –నేను నా వాళ్ళు బతకటానికి చాలిన౦త మాత్రమెఇవ్వు. ఆపైన ఆవగింజంత కూడా ఇవ్వక్కర్లేదు  .మేముకానీ ఇక్కడికి వచ్చిన సాధువులు కానీ ఆకలితో అలమటి౦చకుండా కాపాడే కన్న తండ్రివి నువ్వే ప్రభూ .

  దోహాల భావాలకు తగిన దీటైన తెలుగు అనువాద పద్యాలున్నాయి ఒక వేళఅనువాదం లో కూడా క్లిష్టత ఉంటె భావం ద్వారా హాయిగా దోహాల అనుభవాన్ని పొంది కబీర్ మనసును అర్ధం చేసుకోవచ్చు .కబీర్ హృదయావిష్కరణమే ఈ సప్త శతి .అర్ధవంతమైన ముఖ చిత్రం ,స్కాలిత్యం లేని ముద్రణ  పుస్తకానికి మరింత వన్నె చిన్నెలు కల్పించాయి ..కబీర్ దోహాలను తెలుగు సాహిత్య నందనోద్యానం లో విరబూయించినందుకు జంటకవి మిత్రులు పంగులూరి ,ఎల్లా ప్రగడ వారికి అభినందనలు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-21-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్రికోటీశ్వర  చరిత్ర -5(చివరి భాగం )        

త్రికోటీశ్వర  చరిత్ర -5(చివరి భాగం )        

బొచ్చు కోటీశ్వరాలయం

కోటప్పకొండపై పది దేవాలయాలున్నాయి .అందులో బొచ్చు కొటీశ్వరాలయం మధ్య సోపానమార్గం మొదట్లో ఉంది .ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకొని తల వెంట్రుకలు సమర్పిస్తారు కనుక ఆపేరొచ్చింది .అష్ట దిగ్బంధన౦, లో ఇది తూర్పు వైపున ఉన్నది. ఇక్కడ ఒక శిధిల శాసనం ఉంది .

  ఎల్లమంద సోపాన మార్గ మద్యం లో గుంటి మల్లయ్య లింగం ఉంది .ఈప్రాంతాన్ని హనుమంతుని లొద్ది అంటారు .శిధిల హనుమ విగ్రహం ఉంది .

 పూర్వాశ్రమం లో నరసరావు పేటకు చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి 18-2-1909న నూతన కోటీశ్వరాలయానికి నైరుతిన, తాము కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని ప్రతిష్టించారు .ఆమధ్యాహ్నమే ప్రజలలో కలతలు వచ్చి దౌర్జన్యం దోపిడీ,దహనాలు  జరిగి,తర్వాత నేరవిచారణ జరిగి దోషులకు శిక్ష పడింది .

కొండ దిగువ ఆలయాలలో ప్రసన్న కోటీశ్వర ,నీల కంఠేశ్వరదేవాలయాలున్నాయి .బొచ్చు కోటీశ్వరగుడివెనుక తొండపి కి చెందిన రాయిడి సాంబయ్య వేయించిన శిలాశాసనం ఉంది .ఇవికాక బసవ మందిరాలు మఠాలు చాలా ఉన్నాయి అన్నదాన సత్రాలు,పురాతన శాసనాలు,యంత్ర స్థాపన శాసనాలు  కూడా  ఉన్నాయి .

    అష్ట దిగ్బంధన  యంత్రం

పై యంత్రాలేకాకుండా ఈస్థలం రక్షణార్ధం అష్టదిగ్బంధనం చేశారు తూర్పు బొచ్చుకోటయ్య ,ఆగ్నేయం లో పాపులమ్మ ,దక్షిణం లో వేములమ్మ,నైరుతిలో హనుమంతుడు ,వాయవ్యం లో ముమ్ముడి దేవత ,ఉత్తరం ఉబ్బు లింగస్వామి ,ఈశాన్యం లో పాప వినాశన స్వామి .యంత్రం బలంగా ఉండటానికి బంగారు యంత్రం వేయించారు .ఇందులో నిధి నిక్షేపాలున్నాయని దొంగలు 1934 సెప్టెంబర్ 18నిశిరాత్రి కొన్ని తంతులు జరిపి తవ్వుతుంటే ,కొండపైనుంచి ఒక వృద్ధ స్త్రీ  పెద్ద వెలుగుతో శక్తితో  వచ్చినట్లు కనిపించి మూర్చపోయి తర్వాత పారిపోయారు .వాళ్లకు దారి చూపించటానికి అఖందాన్ని చేత్తో పట్టుకొన్న చాకలి యువకుడికి జ్వరం వచ్చి చచ్చిపోయాడు .ఈ యంత్రం వేసిన ఏలేశ్వరపు అయ్యవారు ఆవంశం లో అయిదవ వారు .

ఆధారం –నరసరావు పేట వాస్తవ్య్యులు   శ్రీ మద్దులపల్లి గురుబ్రహ్మ శర్మగారు 1939లో వచనం లో  రచించిన ‘’శ్రీ త్రికోటీశ్వర చరిత్రము ‘’-కోటప్పకొండ .దీనిని నరసరావు పేట శార్వాణీ ముద్రాక్షర శాలలో కోటప్పకొండ దేవస్థానం వారు ప్రచురించారు .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-21-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్రికోటీశ్వర  చరిత్ర -4 సాలంకయ్యచివరి కధ

త్రికోటీశ్వర  చరిత్ర -4

సాలంకయ్యచివరి కధ

రోజూ కూతురుకోసం వెదకటం వలనసాలంకయ్య తన సంగాతిజంగామముని చెప్పలేక పోయాడు .ఒక రోజు బ్రహ్మ శిఉకొంతున్నాను  శిఖరం ఎక్కి అక్కడ గుహలో ఆనంద వల్లి వెంట వచ్చిన యతీన్ద్రుడైన జ౦గమ  శివుడు కనిపించగా ఆయనే ‘’మీ ఇంట్లో నేను ఆతిధ్యం పొందాను .తర్వాత రుద్రా శిఖరానికి వచ్చి మీ అమ్మాయికి దర్శనమిచ్చి ఆమె వ్రతం పూర్తీ చేయించాను .నేను శివుడను ఆమె నాలో ఐక్యమైంది .నేను ఇక్కడే ఉండిపోవాలని అనుకొంటున్నాను కనుక నువ్వు ఈ గుహపై ఒక గుడికట్టి త్రికోటీశ్వర లింగం ప్రతిష్టించి,పూజిస్తూ శివరాత్రి నాడు ఓంకార నదిలో స్నానం చేసి ,నాకు అభిషేకం పూజాదులు చేసి ,ఉపవాసం జాగరణ చేసి ,ప్రభలు కట్టించి ,వీరంగాది వాద్యాలతో ఉత్సవాలు,దాన ధర్మాలు చేసి ,మర్నాడు అన్నదానం చేయి .శివైక్యం చెందుతావు ‘’అని చెప్పాడు .ముందుగా గొల్లభామ ను దర్శించి తర్వాత నా దర్శనం చేయాలి ఇదీ నియమం.గొల్లభామకు గుదికటి ఆమె విగ్రహం ప్రతిష్టించి నిత్య పూజ జరిపించు ‘’అని ఆనతిచ్చాడు .అలాగే చేస్తానని చెప్పి తనకు శివైక్య సంధాన స్థితి బోధించమని కోరగా అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు .

  సాలంకయ్య శివానుగ్రంతో త్రికోతీశ్వరస్వామికి గొల్లభామకు గుడులు కట్టించి ప్రతిష్టించి ,వారి మహిమలు బోధిస్తూ శివరాత్రి ప్రభలు కట్టించి ఆనందం గా ఉత్సవాలు జరిపిస్తూ కొండకు వెలుగు తెచ్చాడు .పూజా కాలం లో ఆయనకు సిద్ధుల దర్శనమయ్యేది .ఇంట చేసి శివుడికి కల్యాణం లేకపోవటం ఏమిటని.కొతీశ్వరాలయానికి ఒక కోవెల కట్టించి అందులో పార్వతీ దేవి ప్రతిష్టించా లని అనుకోగానే అశరీర వాణి’’ఇది బ్రాహ్మ చారి దక్షిణా మూర్తి  క్షేత్రం .కల్యాణం పనికి రాదు ‘’అని చెప్పగా  సరే అని ,మళ్ళీ పార్వతి విగ్రహం చేక్కిస్తే ,అది అకస్మాత్తుగా మాయమైంది .విరక్తుడై దేహ త్యాగం చెంది శివైక్యం చెందాడు .సాల౦కుడు ప్రతిష్టించిన శాలంకాయ లింగమే ఇప్పుడు త్రికోతీశ్వరుగా పూజల౦దు కొంటోంది.ఆయన తమ్ములు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర లింగాలుగా వెలిశారు .అందుకని ఈ క్షేత్ర పంచ బ్రహ్మ స్థానం అయింది .ఇక్కడికి త్రిమూర్తులు ,అష్ట దిక్పాలకులు సమస్త దేవతలు వచ్చి స్వామి దర్శనం చేసుకొని ,పూజించి దేవోత్సవం చేసి  వెడతారు .శ్రావణం లో రుద్రా శిఖర౦  ,కార్తీకం లో విష్ణు శిఖర౦ ,మాఘం లో బ్రహ్మ శిఖర౦ పై నిల్చి అర్చించి అన్నదానం చేస్తే మోక్షమే .

   కోటప్ప కొండ తిరునాళ్ళ ప్రభలు

మన దేశం లో ఈశ్వరార్చన లో ప్రభలు ,అమ్మవారి పూజలో కుంకుమ బండ్లు కట్టటం మొదటి నుంచీ ఉంది కారణం పెద్దగా ఎవరికీ తెలీదు . వెదురు కృష్ణుడికి ఇష్టం ,పూజనీయం కనుక దానికి వస్త్రాలతో లింగాకారం గా మార్చి సేవిస్తే మంచిది అని శివ పురాణం లో ఉంది .ఇది నిజమే అని ఆరాధ్యులు ఒప్పుకొన్నారు.తూర్పు దేశాలలో శివుడికి ప్రభ ను వాహనం గా చేసి ,దానిపై అనేక దేవతా విగ్రహాలనుపెట్టి ఊరేగించటం ఉందట .దక్షయజ్న వినాశనం లో శివుని వీరభద్రావతారం భయంకర ఆయుధాలతో ఘంటా నినాదంతో ఘోరమైన అరుపులతో వెలువడిన కారణంగా ,దానికి ప్రత్యామ్నాయంగా ప్రభలు నిర్మించి రౌద్ర రసప్రధాన వాయిద్యాలహోరుతో ఖడ్గాలు బల్లాలు ఆయుధాలతో సేవిస్తారని కొందరు అంటారు ఇందులో దేనికీ ఆధారాలు లేవు ఊహమాత్రమే .ఏది ఏమైనా కోటప్ప కొండ తిరునాళ్ళకు ప్రభలు కట్టటం సాలంకయ్య తో ప్రారంభమైంది

 ఓంకార నది

 ఓంకార నది అనే ఓగేరునరసరావు పెట్ చేజెర్ల కపోతేశ్వరాలయం ప్రక్కనుంచి ప్రవహించి ,కోటీశ్వరుని కొండ దగ్గరగా ప్రవహించి సముద్రం లో కలుస్తుంది .

  కపోతేశ్వరాలయం

శిబి చక్రవర్తి పావురం డేగ ల ఆహారం గా తన శరీరం లో మాంసాన్ని ఖండించుకొని ,చివరకు శివైక్యం చెంది కపోతెశ్వరుడుగా వెలశాడు ఆయనను అర్చిన్చాతానికి సిద్ధ సాధ్య దేవా గంధరావాదులు మునులు వచ్చి ఓంకారం తో దిక్కులు ఆరు మొగెట్లు అభిషేకం చేస్తే ఆ నీరంతాలింగం కింద భూమిలో ఇంకి ఓంకార నదిగా ప్రవహించింది .ఈ లింగం ఎవరూ ప్రాతిష్టించినట్లుకాక స్వయమా పుట్టినట్లు ఉంటుంది దేహమ్మంతా గాయాలున్నట్లు గుంటలు గుంటలుగా లింగం ఉంటుంది .లింగం పైన రెండు బిలాలున్నాయి .ఒకదానిలో బిందెడు నీళ్ళు పోస్తే కాని నిండదు అంటే అంతలోతుగా ఉంటుంది .రెండవ రంధ్రం లో ఎన్ని నీళ్ళు పోసినా నిండనే నిండదు .చిన్న రంధ్రం లోని అభిషేకజాలం తెల్లారేసరికి చెడు వాసన వస్తుంది అందుకని శుభ్రం చేసి కడుగుతారు . ఒకసారి కొందరు బ్రాహ్మణులు ఈ వింత కనిపెట్టాలని నీళ్ళు పోయిస్తే ,బిలం నుంచి పొగ మంటలు రాగా ప్రయత్నం విరమించారట .

 శిబి చక్రవర్తి కపోతేశ్వర లింగంగా మారటం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్రికోటీశ్వర చరిత్ర -2

 దక్షయాగ విధ్వంసం జరిగాక ,అతని భార్య పతి భిక్షకోసం ప్రాధేయపడగా వీరభద్రుడు  గొర్రె ఎప్పుడూ తల వంచుకొనే ఉంటుంది కనుక దక్షుడు కూడా అలాగే ఇక తలవంచుకొనే ఉండాలని గొర్రె తల తెచ్చి పెట్టి బతికించాడు .సతీ దేవి పిలువని పేరంటంగా వెళ్లి ,తండ్రియాగం లో తనకు జరిగిన పరాభవానికి కాలి బొటనవ్రేలు నేలకు రాసి ఏర్పడిన అగ్నిలో ఆహుతైంది . అప్పటి నుంచి లోకం లో ‘’పిలువని పేరంటానికి  వెళ్ళరాదు’’అనే సామెత వచ్చింది .అంతేకాక ఆడవారు కాలి బొటన వ్రేలితోనేలరాయ రాదు అనేదీ అమల్లోకి వచ్చింది .శివుని క్రోధం తగ్గి శాంతమూర్తియై ,12ఏళ్లదక్షిణా మూర్తిగా అవతరించి ,సమస్త విద్యలు నేర్చి ,కైలాసం  లో సప్తమ ఆవరణ లో సమాధి స్థితి లో ఉండిపోయాడు .

  బ్రహ్మ విష్ణు సనకాది మహర్షులు ,నారదాది దేవ ఋషులు కలిసి కైలాసం లో ఉన్న దక్షిణా మూర్తిని దర్శించి తమకు బ్రహ్మోప దేశం చేయమని కోరారు .సరే అని వారందరితో కలిసి , ఈ త్రికూట పర్వతానికి వచ్చి ,రుద్రరూపి ఆయన దక్షిణామూర్తి మధ్య శిఖరం చేరి ,బిల్వవనం లో యోగ నిష్టలో ఉండి అందరికి మౌనంగానే బ్రహ్మోపదేశం చేశాడు ;ఇది బ్రహ్మచారి అయిన దక్షిణా మూర్తి క్షేత్రం అయింది కనుక స్వామికి కళ్యాణోత్సవ౦,ధ్వజస్తంభం ఇక్కడ ఉండవు .

     గురునాథ పొంగళ్ళు

  దక్షిణా మూర్తి దేవాదులకు గురువు అవటం వలన ‘’గురునాథ స్వామి అని పిలుస్తారు .గురు నాథుడికి పొంగళ్ళు నైవేద్యం పెట్టె ఆచారం ఉంది .కూర్మ పురాణం లో లోపాముద్రకు అగస్త్యుడు గురునాథ వ్రత కల్ప విధానం బోధించినట్లున్నది .ఆ వ్రత కథప్రకారం –సముద్ర మధనం లో లభించిన అమృతాన్ని దేవాసురులకు పంచటానికి విష్ణువు మోహినీ రూపంలో రాగా శివుడు మోహించి దారుకావనం లో దీర్ఘ సంగమం జరుపగా ,మోహినికి తీవ్రంగా చెమటలు పట్టి ,గండ స్థలం నుంచి కారిపోగా ‘’గండకి’’ నది ‘’ఏర్పడింది .దీనిలోనే సాలగ్రామాలు ఉత్పత్తి అవుతాయి .మోహినికి సద్యోగర్భం వచ్చి మార్గశిరమాస పూర్ణిమనాడు ఆర్ద్రా నక్షత్రం లో మూడుకళ్ళు,నాలుగు భుజాలు ,త్రిశూలం ,ఖడ్గం లతో శివ కేశవుల సమాన రూపం తో 14 ఏళ్ల’’’శాస్తి ‘’ అనే కొడుకు పుట్టాడు .ఇతడినే గురునాథుడు ,శివుడు అనీ పిలువబడ్డాడు . ఆ బాలుడు తను చేయాల్సిన పనేమిటి అని తండ్రి శివుడిని అడిగితే ‘’ప్రమథ గణాలకు నాథుడవై ,కైలాసం లో ఉంటూ వారి కోర్కెలు తీర్చమన్నాడు .ఇతడు ఆజన్మ బ్రహ్మచారి .అప్పటి నుంచి లోకం లో గుర్నాథుడు శివుని రూపుగా పూజి౦ప బడుతున్నాడు .ఉద్యాపన, వ్రతకల్పమూ ఉన్నాయి .పొంగలి చేసే స్త్రీకి భర్త ముగ్గులుపెట్టి తోరణాలుకట్టి ,విఘ్నేశ్వరపూజ ,సంకల్పమూ చేసి ,అఖండ దీపారాధన చేసి గుర్నాథుని విగ్రహం , దానికి కుడివైపు త్రిశూలం ,ఎడమవైపు ఖడ్గం పెట్టిపూజ చేయాలి  .అగ్ని స్థాపన చేసి ,గిన్నెలో ఆవుపాలు పోసి కాచి బియ్యం బెల్లం వేసి పొంగలి వండాలి .నైవేద్యం పెట్టి అందరూ దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి .

                          భైరవుడు

శివుడికి పుట్టింది భైరవుడు కదా ,పై కమామీషు ఏమిటి అని సందేహం వస్తుంది .కాశీ ఖండం లో భైరవ వృత్తాంతం ఉంది .ఒకసారి బ్రహ్మ అహంకారంతో తానే మూల పురుషుడను అని శివుడితో వాదానికి దిగితే ,శివుడు రౌద్ర దృష్టి నుంచి ఒక భైరవుడు  పుట్టి బ్రహ్మ అయిదవ తల నరికేశాడు .బ్రహ్మ హత్యా దోషం పోగొట్టుకోవటానికి ,అనేక క్షేత్రాలు దర్శించి చివరికి బదిరికాశ్రమం దగ్గర కపాల మోక్ష తీర్ధం లో స్నానం చేసి పాప ప్రక్షాళన చేసుకొన్నాడు ఆక్షేత్రమే బ్రహ్మకపాలం .               విష్ణుశిఖరం

రుద్ర శిఖరానికి ప్రక్కన అంటే పాప వినాశన శిఖరం అంటే గద్దలబోడు పై విష్ణువు ఉంటూ ,శివుడికి తపస్సు చేయగా ,ప్రత్యక్షమై ఇంద్రాది దేవతల సమక్షం లో తాము పూర్వం దక్షుని యాగానికి వెళ్లి పొందిన అవమానాలు పోగొట్టుకోవటానికి లింగ రూపం ధరించి ఎప్పుడూ అందుబాటులో ఉండమని శివుని ప్రార్ధించగా ,శివుడు ఒక రాతిమీద త్రిశూలాన్ని పొడవగా ,నీరు ఉద్భవించి ,శివలింగం ఏర్పడింది .ఆ జలం లో స్నానించి తనను పూజించమని దేవాదులకు శివుడు చెప్పగా ,వారు అలాగే చేసి తమ పాపాలను పోగొట్టుకోవటం వలన పాప వినాశేశ్వరుడు  అనే పేరుతొ ప్రసిద్ధి చెందాడు .కనుక ఇదే ముఖ్యమైంది .భక్తులు మొదట ఇక్కడ స్నానం చేసి ,తర్వాతే కోటీశ్వర స్వామి దర్శనం చేస్తారు .ఇక్కడ దేవ,గరుడ  గ౦ధర్వ సిద్ధ సాధ్యులు ఎల్లప్పుడూ ఉంటారని ప్రతీతి .కార్తీక మాఘలలో ఇక్కడ స్నానిస్తే సరాసరి మోక్షమే అని నమ్మిక.

            బ్రహ్మ శిఖరం

రుద్ర శిఖరానికి కింద నైరుతిలో ఉన్న శిఖరమే బ్రహ్మ శిఖరం .విష్ణు రుద్రశిఖరాలపై జ్యోతిర్లింగాలు ఉండి,ఇక్కడ లేకపోవటం తో బ్రహ్మ బాధపడి శివ తపస్సు చేయగా ,ప్రత్యక్షమవగా ,అక్కడ ఒక లింగరూపం లోవెలియమని ప్రార్ధించగా వెలిసి ‘’నూతన కోటీశ్వర లింగం’’గా ప్రసిద్ధి చెందాడు .ఇక్కడ బ్రహ్మాది దేవగణ౦  అందరూ ఉంటారు.శివుడు ఇక్క తాండవం చేస్తాడు .’’ఎల్ల’’ మునులు ‘’మంద ‘’అంటే గుంపుగా ఇక్కడ ఉండటం చేత’’ ఎల్లమంద’’కొండ అనిపేరోచ్చింది దీనికి ఉత్తరానున్న ఊరు ఎల్లమంద గ్రామం అయింది .ఇలా మూడు శిఖరాలమీద దేవతా పూజలు అందుకొంటున్న జ్యోతిర్లింగాలు ఉన్నా ,మనుషులకు కనిపించవుకనుక,అనేక రాతి  శివలింగాలు ఏర్పరచుకొని పూజించటం అలవాటైంది .ఇప్పటికీ ఇక్కడ మహనీయుడైన ఒక సిద్దుడున్నాడని అ౦దరికి నమ్మకం  .సుమారు యాభై ఏళ్ల క్రితం శ్రీ భారతుల నరసింహ శాస్త్రిగారు కొత్త కొటీశ్వరాలయం లో జపం లో ఉండగా ,ఒక సిద్ధుడు కనిపించినట్లు చెప్పారట .

  శరీరానికి త్రికూటస్థానం లో ఓంకారం ప్రసిద్ధమైనట్లే ,ఈ త్రికూటాద్రి కి దగ్గరలో ‘’ఓగేరు’’అంటే ఓంకార నది ప్రవహిస్తోంది .దీనిలో స్నానించి శ్రార్ధకర్మలు చేసి పితృదేవతలకు తృప్తి కలిగిస్తారు ,స్వర్గం ,మోక్షమూ లభిస్తాయి .ఈనది పుట్టుక ఈ క్షేత్రానికి కొద్ది రూరంలో ఉన్న ‘’చేరు౦ జర్ల ‘’అనే ‘’చేజెర్ల ‘’.ఇక్కడ శిబి చక్రవర్తి శివైక్యం అయ్యాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్రికోటీశ్వర చరిత్ర

త్రికోటీశ్వర చరిత్ర

త్రికోటీశ్వరాన్ని కోటప్పకొండ అంటారు .గుంటూరుజిల్లా నరసరావు పేటకు సుమారు 10కిలోమీటర్ల దూరం లో ఎల్లమంద ,కొండ కావూరు గ్రామాల మధ్య ఉంది .దీని చుట్టుకొలత ‘’అడుగు తక్కువ ఆమడ ‘’అంటారు .కానీ మూడు క్రోసులే ఉంటుంది వైశాల్యం 15వందల ఎకరాలు .ఎత్తు1587అడుగులు .600అడుగుల ఎత్తులో శ్రీ కోటీశ్వరస్వామి దేవాలయం ఉంది .దీనీపైన  పాత కోటప్ప గుడి ఉంది ఇప్పుడు ఎవరూ అక్కడికి వెళ్ళటం లేదు .ఇక్కడ GT సర్వే స్టేషన్ ఉంది .ఇది ఫారెస్ట్ రిజర్వ్ లో ఉంది .ఇక్కడ వనమూలికలు పండ్లు వంట చెరకు దొరుకుతాయి .నీటి దొనలు,భయంకర గుహలున్నాయి .చిరుతల, దొంగల ఆటపట్టు .

   ఈ పర్వతానికి మూడు సోపాన మార్గాలున్నాయి .ఒకటి పాప వినాశన స్వామి గుడి కింద. పడక దారి అంటారు ,ఎల్లమంద సోపాన మార్గం అంటారు . .రాజుగారిఒంటెలు ఎక్కే మార్గమిది .రెండవది ఇప్పుడు అందరు నడిచేమార్గం దీన్ని రాజా నరసింహరాయని౦ గారు  సుమారు 150 ఏళ్ల క్రితం నిర్మించారు.మూడవది దీనికి కుడిప్రక్క ఉన్న రాధా కృష్ణ సోపానమార్గం . ఈ పర్వతం పై నీటి వసతికోసం దోనెలు నిర్మించారు .వీటిలో నిర్మలమైన నీరు ఉంటుంది .యాత్రికుల స్నాన ,పానాలకు ఉపయోగం .

  పాత కొటీశ్వరలయానికి  దగ్గరలో ఎద్దుఅడుగు అనే చోట బసవేశ్వరుడు తపస్సు చేసినట్లు ఐతిహ్యం .పాత కోటీశ్వర గుడికి ఉత్తరాన ఫర్లాంగు దూరం లో ‘’పుర్ర చేతి దోనే’’  ఉంది ఇందులో ఎడమ చెయ్యి తప్ప కుడి చెయ్యి పట్టదు .మంచి నీళ్లుంటాయి . .పాత గుడికి తూర్పున ‘’ఉబ్బు లింగం దోనే’’ ఉంది .దీనికి సూర్య రశ్మి తగలదు కనుక నీరు చాలా చల్లగా ఉంటుంది .ఇక్కడ రామ లింగం అనే లింగం ఉండేదట .పాప వినాశనస్వామి  గుడిదగ్గర ఒక దోనేదీనికి ఉత్తరాన గాడిద దోనే ,మారెళ్ళశల కు దగ్గరలో ఒక దోనే,ఎల్లమంద ,కొండ కావూరు పొలి మేరలో పాల దోనే బుంగ దోనేకాడి దోనే,చిన్న దోనే,హనుమంతుని లొద్దిదోనే,పాప వినశన స్వామి  గుడికింద ఒక దోనే (ఇప్పుడు మూసుకు పోయింది )అని మొత్తం 13 దోనేలున్నాయి.

  కొత్త కొటీశ్వరాలయానికి మైలున్నర దూరం లో జంగాల మఠం ఉండేది జంగాలు ఉండేవారు .దీనికి తూర్పున ‘’దొంగల దొడ్డి గుహ ‘’ఉంది .ఎద్దు అడుగుకు తూర్పున ఋషులు తపస్సు చేసుకొనే గుహ ఉంది .పాపవినాశన ,కొత్త కోటీశ్వర గుడులమధ్య మరో గుహ మొత్తం నాలుగు గుహలున్నాయి .ఈ పర్వతం ఎటుచూసినా మూడు కూటాలుగా కన్పించటం విశేషం .అందుకే త్రికూట పర్వతం,స్వామి త్రికోటీశ్వరుడు అయ్యాడు .దీని స్థల పురాణం ను  ‘’త్రికూటాచల మహాత్మ్యం ‘’అంటారు .శాసనాలలో త్రికూటాచలం అనే పేరుకనిపించదు .ఇది ఆశ్చర్యం..

   ఈ స్వామికి ‘’ఎల్లమంద కోటీశ్వరుడు ‘’అని పేరు .ఎల్లమంద కన్నా కావూరు దగ్గర కనుక ‘’కావూరు కోటీశ్వరస్వామి ‘’అనీ అంటారు .సత్తెనపల్లికి దగ్గరలో వెలంపల్లి త్రి కోటీశ్వర క్షేత్రం ఉన్నట్లు అక్కడి శాసనం వలన తెలుస్తోంది .ఇదే పాటి దిబ్బ .ఇదినందిపాడు అనే గ్రామం అనీ ,జనం లేక పాడైపోయి గురువయ్య పాలెం లో కలిసింది .ఇక్కడ శిధిల శివాలయ ఆనవాళ్ళున్నాయి .

  మరి రెండు  త్రికూటాచలాలు

ఈ పర్వతం కాక త్రికూట పర్వతం అనేది  గజేంద్ర మోక్షం జరిగినట్లు   భాగవతం లో చెప్పబడిన పర్వతం రాజస్థాన్ అజ్మీర్ దగ్గర పుష్కర క్షేత్రం .ఇక్కడ గాయత్రి సావిత్రి ,సరస్వతి అనే మూడు పర్వత శిఖరాలున్నాయి .ఇదే గజేంద్ర మోక్షణ స్థలం అని మైసూర్ వాసి ,మహా పర్యాటకుడు ,నరసరావు పేటలో 90ఏళ్ల వయసులో  1-11-1932న సిద్ధిపొందిన  బ్రాహ్మణుడు చెప్పాడు .

  రెండవ త్రికూట పర్వతం తమిళనాడు తిరునల్వేలి జిల్లా టేన్కాసి రైల్వే స్టేషన్ కు మూడు మైళ్ళ దూరం లో ‘’తిరుకుత్తాలం ‘’(కుర్తాళం)దగ్గర ఉంది .ఇక్కడ తిరుకుత్తాలేశ్వరుడు రాజరాజేశ్వరీ దేవి కొలువై ఉంటారు .ఇక్కడ అగస్త్యాశ్రమం ,వాటర్ ఫాల్స్ ఉన్నాయి ‘

                త్రికూటాచల మహాత్మ్యం

అనేక యుగాలనుంది మహిమ గల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది కోటప్పకొండ .సత్తెనపల్లి కోసూరు వాసి శ్రీ కొప్పరాజు నరసిన్గయ్య అనే నరసింహ కవి మూడు ఆశ్వాసాల ‘’త్రికూటాచల మహాత్మ్యం ‘’అనే పద్య కావ్యం రాశాడు .ఇదే దీని చరిత్రకు ఆధారం .శ్రీ రూపెన గుంట సీతారామయ్య 1905లో ‘’గుమ్మెట కథ’’అనే రగడ రాశాడు .దీనిలో ఉత్సవ వేడుకలు తెలియజేశాడు .దీన్ని ఆధారంగా శ్రీ తుళ్లూరి మాధవరాయుడు ‘’మనోకాంతా ముక్తికాంతా సంవాదం ‘’అనే 12చరణాల కీర్తన రాశాడు .

  1852విరోధి మాఘ బహుళ చతుర్దశి శివరాత్రినాడు నాడు నరసింహకవి సకుటుంబంగా ఈక్షేత్రాన్ని దర్శించి ,స్వామి సన్నిధిలో ఉపవాసం చేసి ‘’ఇంత గొప్పగా ఉత్సవాలు జరిగే క్షేత్రం ఏదైనా ఉందా “”?అని అక్కడి బ్రాహ్మణులను అడిగితె ‘’మాకు తెలిసినంతవరకూ లేదు .స్థలపురాణం ఉండే ఉంటుంది .మీరు ఆవిషయాలు రాయండి ‘’అనికోరారు .సరే అని మర్నాడు మళ్ళీ గుడికి వస్తుంటే దారిలో శ్రీశైల ప్రాంత వాసి ఉద్భటారాధ్య వంశం వాడు ముదిగొండ వీరభద్రా రాధ్యుల పౌత్రుడు కేదారలింగం అనే బ్రాహ్మణుడు కనిపిస్తే తనమనసులోని కోరిక చెబితే ఆయన ‘’ఇది పూర్వం శివునిఅవతారమోర్తి దక్షిణా  మూర్తి అవతారమైన 12ఏళ్ల వటువు సమస్త దేవ ఋషులకు బ్రహ్మోప దేశం చేసిన పుణ్యక్షేత్రం .ఈ విషయం ‘’చిదంబర నట తంత్రం ‘’లో ఉంది ‘’అని చెప్పాడు..వీటిని ఆధారంగా నరసింహకవి త్రికూటాచల మహాత్మ్యం మూడు ఆశ్వాసాల కావ్యంగా శ్రీ దక్షిణామూర్తికి అంకితమిస్తూ రాశాడు .ఈకవి 1878 బహుధాన్య మార్గ శిర బహుళ పంచమి నాడు మరణించాడు .వీరికున్న అనేకమంది శిష్యులు గురువారాధన గొప్పగా చేస్తారు .

      సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment