భారతీ నీరుక్తి.37వ భాగం

భారతీ నీరుక్తి.37వ భాగం

Video link

Posted in రచనలు | Leave a comment

సంప్రదాయం ,ఆధునికత కలిపి చేసిన షష్టి పూర్తి

సంప్రదాయం ,ఆధునికత కలిపి చేసిన షష్టి పూర్తి

 నేపధ్యం –మే 22 న మామనవడు చి. చరణ్ ఉపనయనం ఉయ్యూరులో చేయగా ,మా మేనకోడలు శ్రీమతి పద్మ ,భర్త చి రామకృష్ణ  హైదరాబాద్ నుంచి వచ్చిఆత్మీయంగా పాల్గొని ఆశీర్వదించి ,వెడుతూ రామకృష్ణ మా దంపతులతో ‘’బాబాయి గారు ,పిన్ని గారూ! నా షష్టిపూర్తి ఆగస్ట్ లో చేసుకొంటాం ,మా ఇరువైపులా పెద్దలు మీరే .తప్పక వచ్చి ఆశీర్వదించాలి ‘’ అని కోరారు .’’సరే ‘’అన్నాం మామూలుగా .

  ఆతర్వాత తిధులప్రకారం జ్యేష్టబహుళ సప్తమి సోమవారం నాడు నాకు 82వెళ్లి 83 వచ్చిన సందర్భం గా ఉదయం మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారి దేవాలయం లో ,నవ గ్రహ పూజ  అత్యంత వైభవంగా ప్రతి గ్రహానికి ఆవాహన ,ఆ గ్రహం ఉండే కిలో రంగు పూల తో పూజ ,నైవేద్యం ,ఆ గ్రహానికి ఇష్టమైన ధూపం సమర్పణ ,విసర్జన ,తర్వతా   ఆయుస్సు హోమం  చాలా శాస్త్రోక్తంగా విజయవాడ నుంచి పిలిపించి ఇద్దరు వైష్ణవ పండితులతో చేయించాడు మా అబ్బాయి రమణ .ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నూతన వస్త్ర ధారణా ,ప్రసాదం నైవేద్యంజరిపించాం పూజారి చేత .ఆతర్వాత మా దంపతులకు అందరి దంపతుల చేత ఒక పళ్ళెం లో పాదాలను కడిగించి  ఆపాద జలం అందరికి చల్లించి ,పాద పూజ అనేక  రంగుల పుష్పాలతో  చేయించారు .తర్వాత దంపతులు వచ్చి మా దంపతులకు నూతన వస్త్రాలు అందించగా  మేమూ వారికి అప్పటికప్పుడే వస్త్రాలు అందించాం .చేయించిన వారిని నగదుతో సత్కరించాం .ఆతర్వాత ,వచ్చిన వారందరికీ  విందు ఇచ్చాం .దీనికి మంత్రాంగం అమెరికాలో ఉన్న మా అమ్మాయి శ్రీమతి విజ్జి ,ఇండియాలోని మా అబ్బాయిలు శాస్త్రి,శర్మ .ఆ రోజు ఉదయం మా ఇంటినుంచి మమ్మల్ని కారులో ఊరేగింపుగా మా గుడిదాకా సన్నాయి మేళం తో తీసుకు వెళ్ళటం ,గుడికి వంద మీటర్లదూరం కారు  ది౦పించి అక్కడినుంచి వేదమంత్ర ఆశీస్సులతో పూర్ణ కుంభం తో పూజారి మురళి ము౦దునడువగా ,బాలిక చేత రెండువైపులా నుంచి పుష్పాలు చల్లించటం ,దారిలో పుష్పాలను చల్లిస్తూ మమ్మల్ని గుడికి తీసుకు వెళ్ళటం ఒక హైలైట్ గా నిలిచి చిరస్మరణీయమైంది .

   తేదీల ప్రకారం నా పుట్టిన రోజైన 27-6-22 సోమవారం సాయంత్రం ఏసీ లైబ్రరీలో సరసభారతి ఏర్పడి 12 సంవత్సరాలు అయినందున ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’నా సహస్ర చంద్ర మాసోత్సవం’ కూడా కలిపి సాహితీ మిత్రుల సమక్షం లో జరుపుకొని ,బందరు సంగీత విద్వాంసురాలు శ్రీమతి రాధికా సుబ్రహ్మణ్యం చేత సంగీత కచేరి ,మూడవ తరగతి చదువుతున్న చి.శ్రీవల్లిక చేత నాట్య ప్రదర్శన ఇప్పించి కవి సమ్మేళనం జరిపించి , బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ,మహా అవధాని శ్రీ ఆముదాల మురళి ,యువ అవధాని చి ఉప్పలధడియం భరత శర్మ ,శ్రీమతి చిల్లర భవానీదేవి.శ్రీ గుడిమెట్ల చెన్నయ్య   గారితో తో సహా ‘’ 12మంది లబ్ధ ప్రతిష్టితులైనసాహితీ వేత్తలకు ‘’విశిష్ట సాహితీ పురస్కారం ‘’మరో 12అంది యువ సాహితీవేత్తలకు ‘’విశేష సాహితీ పురస్కారం ‘’అంద జేశాం .అందరికి నగదు ,నూతనవస్త్రాలు శాలువా ,జ్ఞాపిక అందించాం .కవులకు నగదు ఉత్తరీయం ,జ్ఞాపికలు అంద జేశాం .ఇక్కడా మాకు నూతన వస్త్రాలు సమర్పించిన వారున్నారు .కార్యక్రమ ప్రారంభం లో అందరికి ఫలహారం టీ ,చివర్లో  బొబ్బట్టు వగైరాలతో కమ్మని విందు అంద జేశాం .దీని నిర్వహణా మా అబ్బాయి రమణ ఆధ్వర్యం ,అమెరికానుంచి మా అమ్మాయి మంత్రాంగం లో జరిపింది ,మా అబ్బాయి శర్మ మనవడు హర్ష హైదరాబాద్ నుంచి వచ్చి పాల్గొన్నారు .ఆ మధ్యాహ్నం ఇందులో కొందరు పురస్కార గ్రహీతలు మా ఇంట్లో నే భోజనం చెయ్యటం ,మా కోడళ్ళు సహకరించటం హై లైట్ .ఇదంతా నేపధ్యమే .

  పద్మా ,రామ కృష్ణ ఆహ్వానం పంపటం ,ఫోన్ లోమాట్లాడటం జరిగాక తప్పక వెళ్లాలని నిర్ణయించుకొని ,నా పూజాదికాలు అయ్యాక మేమిద్దరం మా అబ్బాయి రమణ కోడలు మహేశ్వరి మూడవ కోడలు రాణీ లతో 18-8-22 గురువారం ఉదయం 7 కు కారులో బయల్దేరి ,మధ్యలో సూర్యాపేట లో ప్రసాద్ గారి హోటల్ లో టిఫిన్ కాఫీలు లాగించి ,మధ్యాహ్నం హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువు గేట్ దగ్గరున్న ‘’ఫార్ట్యూన్ ప్రైం’’ క్లబ్ హౌస్ కు చేరాం .అప్పటికే అందరి భోజనాలు అయ్యాయి .పద్మ దంపతులు కొడుకు అల్లుడు కోడలు కూతురు ఆప్యాయంగా ఆహ్వానించి మాకు పైన రెండు రూమ్స్ కేటాయించగా అందులో చేరి,కిందకు వచ్చి భోజనాలు చేశాం .అప్పటికే మా పెద్దమేనల్లు అశోక్ సంధ్య దంపతులు ,అమెరికా నుంచి వచ్చిన చిన్నమేనల్లుడు శాస్త్రి కొడుకు కృష్ణ కూడా మహాదానందపడ్డారు .అందరం పాతకబుర్లు చెప్పుకొంటూ నవ్వుకొంటూ సరదాగా మాట్లాడుకొంటూ భోజనాలుచేశాం .ఫోటోలు తీసి పంపుకున్నాం .కీరు పరవాన్నం ,పులిహోర పప్పు కూర ,చట్నీ సాంబారు ,రసం పెరుగు వగైరా లతో భోజనం .తృప్తిగా తిన్నాం .’’ఎట్ హోం  అట్మాస్స్ ఫియర్ ‘’అనుభవించాం .ఇప్పటి నుంచి రెండు  పూట్ల ఒకపూట చేయని పప్పు కూర స్వీట్ హాట్ రిపీట్ కాకుండా వెరైటీ ని చక్కగా మెయింటేన్ చేయించారు పొద్దున్న టిఫిన్ లలో మధ్యాహ్న ,రాత్రి భోజనాలలోకూడా .ఇంతగా ఆలోచించి చేయించటం బహు అరుదు .రసమలై ,పాలకోవా ,రసగుల్లా ,గులాబ్ జాం,జిలేబి ,లడ్డు,బొబ్బట్లు  వగైరా స్వీట్లు ,వాంగీ బాత్ ,గోంగూర పులిహోర, బిర్యాని ,ఆకుకూరల చపాతీ ,పూరీ కూర గారే దోసె,ఊతప్పం ,పుల్కామొదలైన వేరైటీ లతో కమ్మని విందు హాయిగా చేయించి ,అడిగి అడిగి వడ్డించి తినిపించారు .బెండు అప్పారావు సినిమాలో రఘుబాబు ఆహుతి ప్రసాద్ తో ‘’అందరూ కత్తులు కఠార్లతో చంపుతుంటే ,మీరు కమ్మటి భోజనాలు పెట్టి చంపుతున్నారండీ ‘’అన్నట్లుగా ఉంది వాతావరణం .ఇంతకీ తి౦ డికోసమే వచ్చావా బాబూ పొద్దున్న జరిగిన విషయాలు చెప్పవా అంటారుకదా –ఉదయంఒక వేదికపై  అంకురార్పణ ,60కళాశాల ఆవాహన ,గణపతి పూజ వగైరా లు జరిగాయి మేము వచ్చే లోపే .

   సాయంత్రం కల్చరల్ ప్రోగ్రాం .నవ్విస్తూ కవ్విస్తూ ఒకాయన  ఈవెంట్ బాగా నిర్వహించాడు .మాజిక్ చేశాడు అందరూ ఫిదా అయ్యారు పోటీలు పెట్టి బహుమతులిప్పించాడు ఒకదానిలో మా కోడలు రాణి ప్రైజ్ కొట్టేసింది కదలకుండా మెదలకుండా సైలెంట్ కిల్లర్ లా .రాత్రి భోజనం చేసి రూమ్ కు వెళ్లి పడుకోన్నాం .

   19-8-22 శుక్రవారం తెల్లవారగానే లేచి నేను స్నానం సంధ్య , శ్రీ కృష్ణ జన్మాష్టమి కనుక విష్ణు సహస్రనామం ,కృష్ణ అష్టోత్తరం  తో స్పెషల్ గా పూజ నైవేద్యం చేసి ,మా కోడళ్ళు తెచ్చిచ్చిన కాఫీలు తాగి ,కిందికి దిగి  టిఫిన్ తిని కాఫీ తాగి పక్కనే ఉన్న పద్మా వాళ్ళ అపార్ట్ మెంట్ లో వాళ్ళింటికి వెళ్లి అక్కడ జరుగుతున్న ఆయుస్ హోమం చూశాం .నాకు ఒక రూమ్ ఇవ్వగా నేను ఒకగంట ‘’భారతీ నిరుక్తి ‘’ప్రత్యక్ష ప్రసారం ఫేస్ బుక్ లో చేశా .తర్వాత పూర్ణాహుతి చూశాం .ఒకప్రక్క సూర్యనమస్కారాలు ,వేరోకప్రక్క మహాన్యాసంతో రుద్రాభిషేకాలు జరిపించారు .ఇది పూర్తయ్యాక మళ్ళీ క్లబ్ హౌస్ కు వచ్చి ,కలశాలకు ఉద్వాసన చెప్పించి,మళ్ళీ పద్మా వాళ్ళ ఇంట్లో అవబ్రుధ స్నానాలు చేయించి మళ్ళీ క్లబ్ హౌస్ కు చేరి  ,దశ షోడస దానాలు ఇప్పించి వేదపండిత ఆశీర్వచనం చేయించారు .అందరూ ఘనులైన పండితులే నిష్ణాతులే .తర్వాత భోజనాలు .

  సాయంత్రం గానా బజానా  యువ బృందం  కిరాక్ తెప్పించారు .పద్మ దంపతులు ,కొడుకు కోడలు కూతురు అల్లుడు వాళ్ళతో కలిసి  స్టెప్పులకే అందాలు తెప్పించారు ఆడారు పాడారు .పద్మ మనవడు ‘’ఇరగదీశాడు ‘’ఇదంతా యువ బృంద గానం ,ఆట పాట,మజాకా .రామకృష్ణ స్నేహితులు బంధుజనం కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు .భీమ సేన్ నిర్మల్ గారి అమ్మాయి కూడా వచ్చి పాల్గొని నిండుదనం తెచ్చారు .తర్వాత భోజనాలు చేసి మేము రూ౦కు  వెళ్లి నిద్రపోయాం .మా అమ్మాయి విజ్జితో ఫోన లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తాజాసమాచారం తెలియ జేస్తూ ,ఫోటోలు పంపించాము .ఈ రోజు నేను పంచ లాల్చీ ధరించాను .పొద్దున్నే చూసిన పద్మా వాళ్ళ డ్రైవర్ సంజీవ ‘’అద్భుతం తాతగారు ‘’అని సంతోషిస్తే బాగుంది తాతగారు అన్నాడు చిరునవ్వుతో తేజ .అంతటా ఆత్మీయత ,అనురాగం గౌరవం దర్శనమిచ్చాయి .ఆ రాత్రి సంజీవ మా రూమ్ కు వచ్చి నాతొ ఎన్నో ఫోటోలు తీసుకోగా అతనికి సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక ఇచ్చాను .అందరూ అభినందనీయులే .

 సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-22-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

భారతీ నిరుక్తి 36వ భాగం.20.8.22

భారతీ నిరుక్తి 36వ భాగం.20.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భారతీ నిరుక్తి 35వ భాగం.19.8.22

భారతీ నిరుక్తి 35వ భాగం.19.8.22

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.4వ భాగం.17.8.22

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.4వ భాగం.17.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీమద్ధయ వదన (శ్రీమత్ హయ వదన )సంస్కృత శతకం

శ్రీమద్ధయ వదన (శ్రీమత్ హయ వదన )సంస్కృత శతకం

అంటే శ్రీ హయగ్రీవ శతకం .శతకకర్త శ్రీ బెల్లం కొండ రామరాయకవి ..రామరాయకవి గా ప్రసిద్ధులు .శతకానికి సంస్కృత వ్యాఖ్యానం కూడా ఆయనే రాశారు .నరసరావు పేట డిస్ట్రిక్ట్ మునసబ్ కోర్ట్ ప్లీడర్ శ్రీ నడింపల్లి జగన్నాధ రావు గారిచేత భారతీ ముద్రాక్షర శాలలో ప్రచుతితం వేల కేవలం అర్ధరూపాయి .

మొదటి శ్లోకం –స్వతస్వేతంమందస్మిత రుచిరపరీ వాహ సుభగం –సముద్యడ్డి౦డీరచ్చవి పరివృత౦ కేసర భరం –స్రజాప్తం ,మల్లీనాం కటి విలసిత క్షౌమ రుచిరం –తత శ్రీ ఖండాంబుం,హయవదనt5 మిందు స్థిత మయే ‘’

దీనికి సంస్కృత వ్యాఖ్యానం కూడా రాశారు హయవదనం తో .మందస్మిత ముఖారవి౦ద౦ తో ,కాంతి ఛటలతో ,ధీరోదాత్త౦గా ,షడ్గుణ5 పరిపూర్ణుడై,నురుగు వం6555 హయగ్రీవుడు .చివరిదైన 100వ శ్లోకం –

‘’భవల్లీలా పా౦గ స్రుతత నవసుధాప్లావవివశ –త్వదీయాస్య భ్రష్టం ప్రలపిత శతం కేవలమయ –శబర్యా ఉచ్ఛిష్టంఫలమివ కియంతంరసమిద౦ –ప్రదత్తేవా తే త్వాంహయవదన మిందుస్థితమయే’’

శబరీ ఎంగిలి పండ్లను ఆస్వాదించి ఆనందం పొంది ,కరుణతో మోక్షం ప్రసాదించిన హయవదనుడు శ్రీ హయగ్రీవుడు ,నేను రాసిన రసభ్రష్ట శతకాన్ని ఆయనలాగా రసమయంగా భావించి స్వీకరించి ,కటాక్షించు .హయవదన మిందుస్థితమయే’’ అనేది శతక మకుటం .

‘’ఇతి బెల్లంకొండోప నామక –రామకవి కృతి షు హయ వదన శతకం సంపూర్ణం

శ్రీ హయగ్రీవార్పణ మస్తు .

బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, ప్రముఖ పండితులు, కవి శిఖామణి. ఇతడు గుంటూరు జిల్లా నరసారావుపేట సమీపంలోని పమిడిపాడు గ్రామంలో యువ నామ సంవత్సరం మార్గశిర అమావాస్య నాడు (డిసెంబరు 28, 1875) జన్మించారు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 148 గ్రంథములను రచించారు. వానిలో అష్టకములు, స్తుతులు, అష్టోత్తర శతనామ స్తోత్రములు, సహస్రనామ స్తోత్రములు, గద్య స్తోత్రములు, దండకాలు, శతకములు, కావ్యములు, వ్యాఖ్యాన, వ్యాకరణ, వేదాంత గ్రంథములు మొదలైన అనేక వాజ్మయ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి.

జీవిత విశేషాలు
వీరి తండ్రి మోహన్ రావు, తల్లి హనుమాంబ. వీరిది నియోగి బ్రాహ్మణ కుటుంబం. వీరి పూర్వులు దొండపాడు, గుంటగర్లపాడు అను రెండు అగ్రహారములకేకాక 84 గ్రామములకు ఆధిపత్యము కలిగియుండిరి. వీరందరును దాతలు, శ్రోత్రియులు, నిత్యాన్నదాతలు, విద్యాదాతలు. ఈ వంశములో స్త్రీలు సంస్కృత పాండిత్యము కలిగియుండిరి.శ్రీ రామరాయకవికి ఐదవ సంవత్సరము వచ్చునాటికే తండ్రి దివంగతుడు అయినారు. వీరి పినతండ్రి కేశవరావుగారు శ్రీరామరావు కుపనయనము గావించి కొంత ప్రాధమిక విద్యనేర్పించి తరువాత ఆంగ్ల విద్యాభ్యాసము కొరకు గుంటూరులో ఒక ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టెను.సంస్కృత సాహిత్యమునకు అద్వైత సాహిత్యమునకు అపారమైన సేవ చేయవలసి యుండిన శ్రీ రామరావుకు ఆంగ్లవిద్య వలదని తలచెను కాబోలు ఆయనకు నిత్యము శరీరావస్థత కలుగుచుండెను.విసిగిపోయిన కేశవరావు శ్రీ రామరావును పమిడిపాడులో బెల్లంకొండ సీతారామయ్యగారి వద్ద సంస్కృత విద్యనభ్యసించుటకు ప్రవేశపెట్టెను.అందరికి ఆశ్చర్యపరుచునట్లు సంస్కృత విద్యాభ్యాసముతో శ్రీ రామరావుకు స్వస్థత చేకూరెను.బాల్యము నుండి శ్రీ రామరావు అసమాన ప్రజ్ఞాశాలి. తమ పురోహితులవద్ద కొంత వైదిక విద్యను నేర్చుకొని ఉత్తమ విద్యాప్రాప్తికొరకు తమ ఇంటివద్దనున్న ప్రాచీన హయగ్రీవ సాలగ్రామమునకు భక్తి శ్రద్ధలతో నిత్యము అర్చించుచుండెను.ఒకనాడు హయగ్రీవుడు ఒక వృద్ధబ్రాహ్మణ రూపమున స్వప్నములో శ్రీ రామరావుకు సాక్షాత్కరించి హయగ్రీవమంత్ర ముపదేసించి ఆ మంత్రమునకు అవసరమగు కవచము, మాల, పంజరము, యంత్రము మొదలగువాటిని సమీపమునున్న దమ్మాలపాడు గ్రామములో వైభానస రత్నమాచార్యులవద్ద లభించునని చెప్పి అంతర్ధానమాయెనట.శ్రీ రామరావు గారు దమ్మాలపాటికేగి రత్నమాచార్యుల నుండి హయగ్రీవ మంత్రాంగములగు కవచ, పంజరాదులను సంపాదించుకొని శాస్త్ర విధి అనుసరించి అక్సరలక్షలు జపించి మంత్రమునకు పునశ్చహ్రణము గావించుకొనిరి.తత్ఫలితముగా వారికసాధారణ మేధ, ధారణశక్తి, కవిత్వము లభించెను.తనయొందు పొగి పొరలు భక్తి భవమునకు కవిత్వము తోడుగా రమావల్లభరాయ స్తోత్రము, రమావల్లభరాయ శతకము మొదలగు స్తోత్రములను తమ 16వ యేట రచించిరి. తమ పదునారువ సంవత్సరమునకే “రుక్మిణీపరిణయ చంపూ” “రమాపరిణయ చంపూ” కందర్పదర్ప విలాస భాణము” మొదలగు కావ్యములను రచించిరి. అటుపై తన 19వ సం.న నెల్లూరు వాస్తవ్యులు సింగరాజు వేంకటరమణయ్యగారి ద్వితీయ పుత్రిక ఆదిలక్ష్మమ్మతో వివాహము జరిగెను.వీరికి సంతానము కలుగలేదు.చాలామంది విద్యార్ధులకు అన్నము పెట్టి చదువు చెప్పించి విద్యాసేవ చేసిరి.

గోదావరి మండలము నుండి పురిఘల్లు రామశాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి అను సోదరులు గద్వాల సంస్థానమునకు వెళ్ళుచు పమిడిపాటు చేరి శ్రీరామారావు గారి కోరికపై వ్యాకరణ తర్కశాస్త్రములను బోధించిరి.గురు దక్షిణగా చంపూ భాగవతమునకు “మంధర” అను వ్యాఖ్యను వ్రాసి ఇచ్చిరి.భయంకర రంగాచార్యుల అను శ్రీవైష్ణవ గురువులు తో విభేధము వలన ఆయన వైష్ణవ సంప్రదాయమును తిరస్కరించి స్మార్త బ్రాహ్మణ సాంప్రదాయమును అనిసరించి విభూతి, రుద్రాక్షలు ధరించుచు అప్పటినుంచి విశిష్టాద్వైతమును విభేదించుచు శంకర అద్వైతమును పోషించిచు అనేక విధమైన గ్రంధములను రచించిరి. తమ శిష్యుడగు రాళ్ళభండి నరశింహశాస్త్రి కోరికపై శ్రీ శంకరరామానుజాచార్యుల గీతభాష్యములను రెంటిని చదివి శ్రీరామానుజ గీతాభాష్యము శృతి, స్మృతి ప్రమాణ విరుద్ధమని నిరూపించుచు మూడు మాసములు పాఠప్రవచనము గావించిరి. ఇదే “భగవద్గీతాభాష్యార్క ప్రకాశిక” అను గ్రంధముగా వెలయించిరి.

నిరంతర గ్రంధ రచనానిరతులు, బ్రహ్మచింతా నిమగ్నుడునగు శ్రీరామారావు బాల్యమునందుండి అజీర్ణవ్యాధితో బాధపడుచుండిరి. దానికితోడు మధుమేహ వ్యాధి మరింత పీడించసాగెను. తమ కిష్టములేకున్నను బంధు మిత్ర, శిష్యగణ నిర్బంధముచే చికిత్స కొరకు మద్రాసులోని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులగు పండిత డి.గోపాలాచార్యుల వారి కడగేగిరి. కొంతకాలము మానసిక పరిశ్రమకు తావిచ్చు గ్రంధ రచనము మానుకొనినచో వ్యాధి చికిత్స చేయగలమని చెప్పగా శ్రీరామారావు గారు దానికి అంగీకరింపక చికిత్సను తిరస్కరించి స్వగ్రామమునకు మరలిరి.దినదినమునకు వ్యాధి ముదురుటచే తనకు అంత్యకాలము ఆపన్నమైనదని గ్రహించిరి.బంధు మిత్రాదులు, భార్య బలవంత పెట్టుటచే దత్తపుత్రుని స్వీకరించిరి. చివరకు మధుమేహ వ్యాధి ముదరగా ఆనంద సంవత్సర కార్తీక శుద్ధ నవమి (27-10-1974) నాడు శ్రీరామారావుగారు అస్తమించిరి.

వారి మరణానంతరము బంధువుల నిరాదారణము, శిష్యుల అజాగ్రత వలన వారి ఆముద్రిత గ్రంధములలో కొన్ని నష్టము కాగా కొన్ని అన్యాక్రాంతములయినవి. మిగిలినవి విజయవాడలోని అడ్వొకేటు శ్రీ పాటిబండ సుందరరావుగారు అధీనములోని కొంతకాలమున్నవి. శ్రీరామారావు జీవితాకాలములో కొన్ని మాత్రమే ముద్రింపబడి ప్రకటింపబడినవి.అటుపై ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు నరసారావుపేట వాసి అగు శ్రీ కంతా వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి పలు విరాళములు సీకరించి కొన్ని సంస్కృత లిపిలోను మరికొన్ని తెలుగులోను ముద్రించిరి.

రచనలు[మార్చు]
· చంపూ భాగవతం

· శ్రీ హయగ్రీవ నవరత్న స్తుతి

· వివర్ణాది విష్ణు సహస్రనామ స్తోత్రము

· సిద్ధాంత సింధువు

· భాష్యార్క ప్రకాశిక

· శరీరక చతుస్సూత్రీ విచారము

· వేదాంత ముక్తావళి

· శంకరాశంకర భాష్య విమర్శనము

· శరద్రాత్రి

· శ్రీ రమావల్లభరాయ శతకము

· వేదాంత కౌస్తుభం (1918)

· రుక్మిణీ పరిణయము

· గరుడ సందేశము

· హయగ్రీవ శతకము

· కందర్ప విలాసము

· కృష్ణలీలా తరంగిణి

· కరిభూషణమ్

· కామ మీమాంస

· ధన వర్ణనమ్

· ధర్మ ప్రశంసా

· విద్యార్ధ విద్యోత:

· శూద్ర ధర్మ దర్పణమ్

· అద్వైతాన్యమత ఖండనమ్

· అద్వైతామృతమ్

· అద్వైత విజయః

· వేదాంత నిశ్చయః

· శంకరా శంకర భాష్య విమర్సః

· సిద్ధాంత సిందుః (శ్రీ మధుసూదన సరస్వతి విరచిత సిద్దాంత బిందువునకు విపుల వ్యాఖ్య)

· భగవద్గీతా భాష్యార్క ప్రకాశిక (శ్రీ శంకరవిరచిత గీతాభాష్యమునకు విపుల వ్యాఖ్య)

· చిత్ర ప్రభోపోద్ఘాతః

· త్రిమత సమ్మతమ్

· సుమనో మనోరంజనమ్

· రామాయణాభ్యుదయ హరికధా

· శ్రీ వీరరాఘవస్తోత్రమ్

· శివభుజంగ ప్రయాతమ్

· శరద్రాత్రి (వ్యాకరణ గంధము-సిద్ధాంత కౌముదీ వ్యాఖ్యానము)

· గుంజు గర్వ భంజనం (తిరుపతి వెంకట కవులతో విమర్సనా వ్యాసములు)

· పంచానన పలాయనమ్

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హైదర్ జంగ్ ,యయాతి,విశ్వామిత్ర నాటక తులసీ జలంధర ,మయసభ ఏక పాత్రాభినయంఫేం ,’’చిల్డ్రన్ నటశిక్షణాలయ’’స్థాపకుడు,హంస అవార్డీ –ఆచంట వెంకటరత్నం నాయుడు

హైదర్ జంగ్ ,యయాతి ,విశ్వామిత్ర నాటక తులసీ జలంధర ,మయసభ ఏక పాత్రాభినయంఫేం ,’’చిల్డ్రన్ నటశిక్షణాలయ’’ స్థాపకుడు,హంస అవార్డీ –ఆచంట వెంకటరత్నం నాయుడు

ఆచంట వెంకటరత్నం నాయుడు (1935 మే 28 – 2015 నవంబర్ 25) ఒక రంగస్థల నటుడు.

జీవిత విశేషాలు
ఈయన 1935, జూన్ 28 వ తేదీన కృష్ణాజిల్లా, కొండపల్లిలో జన్మించాడు. వెంకటరత్నం నాయుడు తండ్రి ఆచంట వెంకటేశ్వర్లు నాయుడు, తల్లి వెంకట నరసమ్మ. తండ్రి రంగస్థల కళాకారుడు. అదే వారసత్వంగా ఈయనకు అబ్బింది. గుంటూరు హిందూ స్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి. పాసైన ఆచంట కొంతకాలం ఆయుర్వేద మందులకి రిప్రెజెంటేటివ్‌గా పనిచేసి, వృత్తికీ, ప్రవృత్తికీ సమన్వయం కుదరక వృత్తిని వదులుకొని నాటకాలలో ప్రవేశించాడు.

తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే నీతిశాస్త్రంలో శ్లోకాలు, పద్యాలు కంఠస్థం చేసి, స్పష్టమైన వాచికంతో, చక్కటి గాత్రంతో పాడుతుంటే స్కూల్లో ఉపాధ్యాయులు ప్రశసించేవారు. కేవలం పద్యనాటకమేకాక అనేక సాంఘిక నాటకాల్లో కూడా ఆచంట తమ ప్రతిభా పాటవాలను తెలుగు దేశ ప్రజలకి తెలియజేశాడు. గుంటూరు నాట్యసమితి ప్రదర్శించిన రామరాజు, నాయకురాలు, అపరాధి వంటి నాటకాలతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తనకంటూ ఓ ముద్ర నేర్పరుచుకున్న నాయుడి ప్రతిభ చూసిన పలు నాటక సంస్థలు ఆయనకి పౌరాణిక చారిత్రక నాటకాల్లో కూడా ప్రధాన పాత్రలను ఇచ్చి ప్రోత్సహించాయి.

ఆంధ్ర లలిత కళాపరిషత్ ప్రదర్శించిన బొబ్బిలి నాటకంలో హైదర్‌జంగ్, తులాభారం నాటకంలో వసంతకుడు, సక్కుబాయి నాటకంలో కాశీపతి, రామాంజనేయ యుద్ధం లో యయాతి, హరిశ్చంద్ర లో విశ్వామిత్ర మొదలైన పాత్రలతో విజయదుందుభి మోగించాడు.

మయసభ ఏకపాత్రాభినయం నాయుడి నట జీవితంలో ఒక మైలురాయి. సాత్విక పాత్రలకంటే తామస పాత్రలు ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనప్రతిభకు మెచ్చిన అనేక సంస్థలే కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సన్మానాలు, సత్కారాలతో ఆయనని అభినందించింది. ఈలపాట రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయ రాజు, ఎ.వి. సుబ్బారావు, మాధవపెద్ది సత్యం, పీసపాటి నరసింహమూర్తి మొదలైన ఉద్ధండులైన 40 మంది నటులంతా ఒక బృందంగా ఏర్పడి తులసీజలంధర నాటకం ప్రదర్శించారు.

డి.వి. సుబ్బారావు (హరిశ్చంద్ర పాత్రధారి) నెలకి 4 నాటకాలు ప్రదర్శించి, కళాకారులకు నెలకి కచ్చితంగా జీతాలిచ్చేవారట. దేనికైనా క్రమశిక్షణ, పట్టుదల, శ్రద్ధ ముఖ్యం అంటారు ఆచంట. బురదనాయుడు సతీసావిత్రిలో ఒరిజినల్ దున్నపోతుమీద వచ్చేవారట. విజయవాడకి సుమారు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘నున్న’ ప్రాంతంలో ఒక చిల్డ్రన్ నటశిక్షణాలయం స్థాపించి భావితరాలకు పద్యనాటక కళాకారులను తీర్చిదిద్దారు.

నటించిన నాటకాలు

  1. శ్రీకృష్ణ రాయబారం
  2. శ్రీకృష్ణ తులాభారం
  3. బొబ్బిలి యుద్ధం
  4. రామరాజు
  5. నాయకురాలు
  6. అపరాధి
  7. రామాంజనేయ యుద్ధం
  8. సక్కుబాయి
  9. హరిశ్చంద్ర
  10. తులసీ జలంధర

నటించిన పాత్రలు

  1. కరండకుడు
  2. దుర్యోధనుడు
  3. జలంధర
  4. జరాసంధ
  5. ద్రోణుడు
  6. అశ్వత్థామ
  7. గయుడు
  8. హైదర్‌జంగ్
  9. వసంతకుడు
  10. కాశీపతి
  11. యయాతి
  12. విశ్వామిత్ర
  13. తాండ్రపాపారాయుడు మొదలైనవి

పురస్కారాలు
· ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే హంస అవార్డు (2000)

· తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు (2002)

· సి.హెచ్‌.సాంబయ్య స్మారక పురస్కారం (2009)

· ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కారం (2001)

మరణం
తెలుగు పౌరాణిక నాటక రంగానికి విశేషమైన సేవలను అందించిన ఆచంట వెంకటరత్నం నాయుడు తన 81వ యేట 2015, నవంబర్ 25, బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో కుమార్తె గృహంలో మరణించాడు.[1]

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

అకళ౦క దేశభక్తుడు గాంధేయవాది ,మహోన్నత మానవతావాది ,ఆంధ్రా ఏకైక గదర్ వీరుడు ,కధకుడు చిత్రకారుడు,నేనూ నాదేశం రచయిత –దరిశి చెంచయ్య

అకళ౦క దేశభక్తుడు గాంధేయవాది ,మహోన్నత మానవతావాది ,ఆంధ్రా ఏకైక గదర్ వీరుడు ,కధకుడు చిత్రకారుడు,నేనూ నాదేశం రచయిత –దరిశి చెంచయ్య

దరిశి చెంచయ్య తెలుగులో మొదటి అరాచకవాది.  అకళంక దేశభక్తుడు, నిరాడంబర గాంధేయవాది, కాంగ్రెస్ వాది, , వామపక్ష వాది. వీటన్నింటికీ మించి మహోన్నతమైన మానవతావాది!

దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ డిటెన్యూ. తెలుగులో ఏకైక గదర్ వీరుడు. మొదటి తెలుగు దేశ అనార్కిస్టు యోధుడు. కథకుడు, చరిత్ర కారుడు, అద్భుతమైన రచయిత!

లాలా హర్ దయాళ్, జితేంధ్ర నాధ్ లాహరీ, శ్యాంజీ కృష్ణవర్మ, బిపిన్ బిహారీ గంగూలీ వంటి దేశీయ యోధులతో పాటు ప్రిన్స్ క్రోప్టకిన్, బకూనిన్, సన్ యెట్ సేన్ వంటి విదేశీ విప్లవకారుల్ని సైతం తన స్వీయచరిత్ర లో పరిచయం చేశారాయన!

చెంచయ్య మిత్రుడు సర్దార్ బలవంత సింగ్ కి అంకితం ఇవ్వబడ్డ ఈ గ్రంథం లో మొదటి మార్క్సిస్టు ఇండాలజిస్టు, తెలుగు వారు మరిచిన విస్మృత మహా మేధావి డా. కె. బి. కృష్ణ గారి గురించి కూడా ఉంది!

తీవ్ర జాతీయవాద స్పూర్తితో మొదలై, అంతర్జా తీయ అరాజకవాద రాజకీయాల స్పూర్తితో తీవ్రవాదిగా ఆరితేరి, జాతీయోద్యమంలో గాంధేయవాదిగా మారి, కమ్యూనిస్టు గా చివరాఖరకు సాంస్కృతికోద్యమకారునిగా మిగిలిన ఆయన కథ అద్వితీయం!

వైశ్యులలో  మొట్టమొదటి కులాంతర వివాహ నిర్వహణ మొదలుకొని , కాంగ్రెస్ పార్టీ సభలు, అభ్యుదయ రచయితల మహాసభ, ప్రజా నాట్యమండలి , కందుకూరి వీరేశలింగం గారి శతవార్షికోత్సవం..ఇలా ఎన్నో చారిత్రక సంఘటనల ఖజానా ఆయన ఆత్మకథ!

“ఒక మహత్తర సంస్కృతీ ఉద్యమం” అవస రమనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పిన చెంచయ్య, తన చిట్ట చివరి శ్వాస వరకూ సమాజం కోసమే తపించారు. అందు కోసం సర్వం త్యజించారు!

ద్భుతమైన ఆయన ఆత్మకథ “నేనూ – నా దేశం ప్రచురించబడి 70 సంవత్సరాలు అవుతోంది. 1952 లో ముద్రణ పొందిన ఆ గ్రంథం తర్వాత ఎన్నోసార్లు ప్రచురించ బడిన  తెలుగులోనే గొప్ప స్వీయచరిత్ర అది!

విచిత్రం ఏమంటే అన్ని పక్షాలలోని మంచిని స్వీకరించినప్పటికీ ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాసే పని చెంచయ్య చేయకపోవడంతో ఈ రోజు ఆయన్ని ఏ సంఘాలు పట్టించుకున్నది లేదు!

స్వీయచరిత్ర తో పాటు చెంచయ్య కొన్ని కథలు కూడా రాసారు. “మీరూ నేనూ” పేరుతో అవి ప్రచురించబడినాయ్. 1990 లో నల్లూరి వెంకటేశ్వర్లు గారు పూనుకుని దర్శి చెంచయ్య గారి శతజయంతి సభలు వైభవంగా నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక సావనీర్ కూడా ప్రచురించి పంచారు!

తెలుగు సాంస్కృతిక వికాసానికి ఎనలేని కృషి చేసిన దరిశి చెంచయ్య గురించి ఈ రోజు తెల్సింది తక్కువ. ఆయన జీవితం, కృషికి సంబంధించిన స్పూర్తిని భావితరాలకి తెలియజేయడం ఈనాటి అవసరం!

మహనీయుడు దర్శి చెంచయ్య గారి స్వీయ చరిత్ర, ఒక రకంగా తెలుగు వారి రాజకీయ, సామాజిక సాంస్కృతిక చరిత్ర. కావున 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ‘నేనూ, నా దేశం’  సమా వేశాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం వర్తమాన సాహిత్య సాంస్కృతికోద్యమ అవసరమని నా అభిప్రాయం! అందులో భాగంగా గతంలో రెండేళ్ళ క్రితం ఆయన ఆత్మకథ ని పరిచయం చేస్తూ రాసిన రైటప్, ఆత్మకథ సాఫ్ట్ కాపీ ,మీరూ, నేనూ కథా సంపుటి సాఫ్ట్ కాపీ ఈ మెసేజ్ తో పాటు పంపుతున్నాను. ఔత్సాహికులు ఎవరైనా స్పందిస్తే సంతోషం!

నేనూ నా దేశం : మహోన్నత సందేశం!!

తెలుగులో ఆత్మకథలు, స్వీయచరిత్రల  అంతగా లేదు. రాసే ధైర్యం ఉన్నవారు కూడా అరుదే. కానీ, వచ్చిన వాటిలో తప్పనిసరిగా చదవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో చెంచయ్యగారిది ఒకటి. తన ఆత్మకథని “బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉరికొయ్య కెరయైన అమరజీవి సర్దార్ బలవంత సింగుకు, ఆయన భార్య కు ” అంకితమిచ్చిన చెంచయ్య ‘నేనూ – నా దేశాన్ని ‘ చారిత్రక డాక్యుమెంట్ గా మలిచారు.

“తాను రచయితను కాదన్న సంకోచం శ్రీ చెంచయ్య గారికి వున్నట్టుంది. కాని, ఆయన సూటిగా ఆలోచిస్తారు. సూటిగా బ్రతుకుతారు. అందువల్ల సూటిగానే వ్రాయగలరు. రచయిత కావడానికి దీన్ని మించిన అర్హత నా మట్టుకు నాకు తెలియదు.” అంటారు పీఠిక లో నార్ల వెంకటేశ్వరరావు గారు. లాలాహర్ దయాళ్ అనార్కిజంతో మొదలై గదర్ వీరోచిత పోరాట నుండి స్వాతంత్రోద్యమం వరకూ పరుగులు చేస్తూ సాగిపోతుందీ రచన.

నెల్లూరు జిల్లా కనిగిరిలో (ప్రస్తుతం ప్రకాశం) పుట్టి, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి అక్కడ గదర్ పార్టీలో చేరి క్రియాశీల కార్యకర్తగా చారిత్రక పాత్ర నిర్వహించిన ఏకైక ఆంధ్రుడాయన. ఢిల్లీ, కన్ననూర్, లాహోరు, కలకత్తా, నెల్లూరు, కోయంబత్తూరు, సింగపూరు, బేంకాక్ జైళ్ళలో ఉన్నారు. ఎనిమిదేళ్ళ జీవితం చెరశాలలో గడిచిపోయింది.

స్వాతంత్ర్య పూర్వ భారతదేశపు ముఖచిత్రం మొదలుకొని స్వాతంత్ర్యానంతరం స్వాతంత్ర్యానంతరం సమాజ మార్పు కోసం వెల్లువెత్తిన వివిధ ఉద్యమాల వరకూ అనేక విషయాలు, విశేషాల సమాగమం దర్శి చెంచయ్య గారి ‘నేనూ నా దేశం’.

“నా చేతిలో మిగిలివున్న కొద్ది ధనాన్ని నేనెంతో పొదుపుగా వాడాల్సిన స్థితి ఏర్పడింది. అందువల్ల రోజూ హారిసన్ కంపెనీలో రొట్టెను కొనుక్కుతిని, కొళాయి నీళ్ళు తాగుతూ కొన్ని వారాలు గడిపాను.” (పేజి 171)

“అసలు ఇతరుల ఆర్దిక సహాయాన్నర్ధించి జీవించడం ఆత్మగౌరవాన్ని చంపుకోవటమేనని నా అభిప్రాయం. కాబట్టి జట్కా బండి తోలుకొని స్వతంత్రంగా జీవించినా గౌరవప్రదమేనని నిశ్చయించుకున్నాను.” (పేజి 172) అంటారు.

“వైశ్యులు ఎంతో ధనం సంపాదించుకున్నారు. ప్రజల సొమ్ము వారి హస్తగతమవుతోంది. వారేమో అధిక భాగ్యవంతులవుతూంటే ప్రజలు మరీ బీదలవుచున్నారు. ధనార్జనయందు తాపత్రయమేకాని సంస్కారమందు కోరికే కనబడదు వైశ్యుల్లో.”(పేజి 258) కంచె ఐలయ్య మీద పడేడ్చే కోమట్లు, వైశ్యుడిగా పుట్టి విశ్వనరునిగా ఎదిగి దశాబ్దాల క్రితం మొహం పగిలేలా చీవాట్లు పెట్టిన చెంచయ్య గారు జీవితాంతం కులాన్ని అసహ్యించుకున్నారని గ్రహించాలి. వైశ్యుల్లో మొదటి వితంతు వివాహం ప్రోత్సాహకర్తగా ఉన్నాయిన, ” ఇండియాలో అన్ని కులాల్లాగే వైశ్య కులం కూడా వైదిక బ్రాహ్మణుల ఆధిపత్యం కింద అణిగిమణిగి ఉంది …(పేజి 190) అన్నారు.

కాంగ్రెస్ , సోషలిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ల నేపధ్యంతోపాటూ ఆర్.ఎస్.ఎస్. క్రూరత్వాన్ని కూడా దగ్గర్నుంచి చూసారాయిన. ” గాంధీ గారి హత్యతో కొందరు సంతోషపడుతున్నారనే విషయం నాకెంత విషాదాన్ని కలిగించిందో వ్రాయలేదు”( పేజి 358) వీరేశలింగం శతవార్షికోత్సవాన్ని మద్రాసు లో జరిపించడంలో చెంచయ్య గారి పాత్ర ఉంది.

“విద్యాధికులైన సభ్యులలో పెద్ద మార్పు రాసాగింది. అదేమంటే పదవీ వ్యామోహం (కెరియరిజము) ఈ దుర్గుణం ఇండియాలో ప్రతి రాజకీయ పార్టీలోను ప్రవేశించి ఆ పార్టీ లను నాశనం చేస్తున్నది. కమ్యూనిస్టు పార్టీలో పొడచూపిన ఈ దుర్గుణాన్ని వెంటనే అణచివేయకపోతే పార్టీ నైతిక దృష్టి క్షీణించిపోతుంది.(పేజి 365) అన్నాయన

 “నేను కమ్యూనిస్టు పార్టీ లో సుమారు పది సంవత్సరాలున్నా వాస్తవంగా కమ్యూనిస్టు కాలేకపోతిని….” (పేజి 366-67) లో నిజాయితీగా రాసుకున్నారు.”

వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరమైన ఆయన,”సంపాదించడమనేది కష్టజీవులను దోచుకోవడమేననే భావం నాలో కలిగినందుననే సంపాదన మానేసాను. …‌‌భోజనం ఖర్చు తగ్గించుకొంటూ వచ్చాము. పాలు, నెయ్యి, నూనె, కూరగాయలు, పండ్లు వగైరా తగ్గించాము. ఇంతచేసినా ఆర్ధికంగా సవరించుకోలేకపోయాము…….ఆర్థికంగా తీరని కష్టాలు కూడా రాజకీయ జీవితాన్ని మానుకొనుటకు ఒక కారణం”(పేజి 368)

తదనంతరం సాహిత్య సేవ చేయడానికి నిర్ణయించుకున్న వారు జీవితాంతం సమాజం హితం కోసమే మసిలారు. మొట్టమొదటి భారతీయ అనార్కిస్టు (?) లాలా హర్ దయాల్ అసాధారణ జీవితసంగతులు మొదలుకొని

మొట్ట మొదటి మార్స్కిస్టు ఇండాలజిస్టు కాట్రగడ్డ బాలకృష్ణ అసామాన్య పాండిత్యం వరకూ ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ప్రాధాన్యత కలిగిన సంగతుల విలువైన గ్రంధం దర్శి చెంచయ్య గారి “నేనూ, నా దేశం”. అంతా తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -3(చివరిభాగం)

త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -3(చివరిభాగం )

 సీతానగర ఆశ్రమం గోదావరి గట్టున ఉండటం చేత వరదలకు పాములు వగైరాలు వచ్చి ఇబ్బంది పెట్టేవి .ఆశ్రమ వాసులలో మామిడి లక్ష్మీ పతి అనే సంపన్న వైశ్య కుర్రాడు ఇక్కడ ఉండగలడా అనుకొన్నారు .అతడు విలాస జీవితం వదిలేసి ఇక్కడ అతి నిరాడంబర జీవితం గడుపుతూ నిర్మాణ కార్యక్రమాలలో చాలాసహాయం చేశాడు .ఒక రోజు రాత్రి రక్త పెంజెరు కరఛి పొడలులు వస్తే ఒక కోయదోరను పిలిపించి తురాయికట్టిస్తే  కొంచెం తగ్గింది .ఇంతకంటే మేలైన వైద్యం చేయిద్దామని తురాయి తీసేస్తే విషం ప్రాకి చనిపోయాడు .అందరూ విచారం లో మునిగారు. క్రమంగా కోలుకొని యదా స్థితికి వచ్చారు .

  ఆశ్రమం ఉచ్చ స్థితిలో ఉండగా గాంధీ 1930 లో మళ్ళీ ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టాడు .సుబ్రహ్మణ్యం గారు రెండవ సారి అరెస్ట్ అయ్యారు .రాజమండ్రి కడలూరు జైళ్లలోలో ఏడాది శిక్ష పూర్తీ చేసి ,మళ్ళీ ఆశ్రమానికి వచ్చారు.1932లో గాంధీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లి ,తిరిగి రాగానే అరెస్ట్ చేయబడి ,కాంగ్రెస్ ప్రచారకులపై కసితో వ్యవహరించారుపోలీసులు  .గోదావరిజిల్లాలో ఈ దౌష్ట్యం పరాకాష్టకు చేరింది .పెద్దాపురం లో తోట విందులో లాఠీచార్జి జరిగి కోడేటి రంగారావు చేయి విరిగింది .సర్జరీ చేసినా చెయ్యి అతుక్కోలేదు .1937లోచనిపోయాడు .బులుసు సాంబమూర్తి గారిని కాకినాడలో తీవ్రంగా కొట్టారు పోలీసులు .గాయాలు మానటానికి పదిహేను రోజులు పట్టింది .

  రాజమండ్రి డిప్యూటీ పోలీస్ సూప రింటే౦డెంట్ ముస్తాఫాలీ ఖాన్ సుబ్రహ్మణ్యంగారి పై పగబట్టాడు .అహంకారి .అన్ని అధికారాలు ఉన్నాయి .రాజమండ్రి సత్యాగ్రహ ఉద్యమం సుబ్రహ్మణ్యంగారి ఆధ్వర్యం లో మహోత్సవంగా జరుగుతోంది   .నాళ౦  సుబ్బరాజు గారింట్లో డాక్టర్ గారు ఉండటం గమనించి సిబ్బంది తో వచ్చి ,బయటికి పిలిపించి విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టించాడు .ఎందుకో, ఎవర్ని కొడుతున్నారో పోలీసులకే తెలీదు .మోకాళ్ళు తొడలు నడుము పై కొట్టిన దెబ్బలకు  పిడి గుద్దులకు లెక్కే లేదు .పాతికమంది తో కొట్టించాడు బండ బూతులు తిట్టించాడు .గాంధీని నీచంగా మాట్లాడి౦చాడు .డాక్టర్ గారిపై  నేరం లేదు ఆయన దోషం లేదు .పగ ప్రతీకారం పైశాచికానందం తో పెట్రేగిపోయాడు ఖాన్ .ఒక్క లాఠీపోటు చర్మం లోనుంచి ఎముకలోకి అక్కడి నుంచి ఊపిరి తిత్తులలోకి దూసుకు పోయింది .ఎందరివో  ప్రాణాలను కాపాడిన డాక్టర్  గారి ప్రాణాల   పాలిటిఆశనిపాతమే అయింది . ఆ రోజు 23-12-1936వైకుంఠ ఏకాదశి .స్వాతంత్ర్య దీక్షా పరతంత్రులైన డాక్టర్ జోశ్యుల సుబ్రహ్మణ్యం గారు వైకుంఠధామం చేరారు .స్వరాజ్యం రాకపోయినాస్వారాజ్యం పొందగాలిగారు ఆ మహా త్యాగి .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .34వ భాగం.17.8.22

భారతీ నిరుక్తి .34వ భాగం.17.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరోజినీ నాయుడు భర్త ,,నిజాం సైన్య వైద్యాధికారి ,వైద్య సంఘ ఉపాధ్యక్షుడు –డా.ముత్యాల గోవింద రాజులు నాయుడు

సరోజినీ నాయుడు భర్త ,,నిజాం సైన్య వైద్యాధికారి ,వైద్య సంఘ ఉపాధ్యక్షుడు –డా.ముత్యాల గోవింద రాజులు నాయుడు

ముత్యాల గోవిందరాజులు నాయుడు గారి పూర్వీకులు మద్రాసుకు చెందిన బలిజనాయుడు సైనిక కుటుంబీకులు. నాయుడు గారు హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ వైద్యుడు, సరోజిని నాయుడు భర్త. గోవిందరాజులు నాయుడు 1868లో హైదరాబాదులో జన్మించాడు. మద్రాసు క్రైస్తవ కళాశాల, మద్రాసు వైద్య కళాశాలల్లో చదువుకుని ఉన్నత చదువులకై ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. హైదరాబాదుకు తిరిగివచ్చి 1892లో నిజాం సైన్యంలో వైద్యాధికారిగా నియమితుడయ్యాడు. హైదరాబాదు వైద్య కళాశాలలో ఉపన్యాకుడిగానూ, హైదరాబాదు వైద్య సంఘానికి ఉపాధ్యక్షుడిగాను పనిచేశాడు. లాన్సెట్ వంటి పత్రికలో అనేక వ్యాసాలు వ్రాశాడు.[1]

2-త్రిభాషా నటుడు ,,న్యాయవాది నాటక సంగీత కళాపరిషత్ సభ్యుడు –దాడి గోవిందరాజులు నాయుడు

దాడి గోవిందరాజులు నాయుడు (ఆగష్టు 27, 1909 – డిసెంబర్ 25, 1970) ఈయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి, న్యాయవాది, ఆంధ్ర నాటక కళా పరిషత్తు, ఆంధ్ర నాటక సంగీత అకాడమి సభ్యులు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం 3వ భాగం

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం 3వ భాగం

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -2

త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -2

1924నుంచి సుబ్రహ్మణ్యంగారు తీవ్రవాదులై ,నిర్మాణ కార్యక్రమాలలో పాల్గోన్నారుకానీ శాసనసభ ప్రవేశానికి మొగ్గు చూపలేదు .చిత్తరంజన్ దాస్ ,మోతీలాల్ నెహ్రూ లు శానసభలో ప్రవేశించి బ్రిటిష్ ప్రభుత్వానికి అడ్డు తగలానని భావించారు .ఇదే స్వరాజ్యోద్యమం .ఇది మణ్యం గారికి నచ్చలేదు .

       సీతానగర ఆశ్రమం

రాజకీయాలు చాలా విధాలుగా నడుస్తున్నాయని తెలిసి ,గాంధీ మార్గాన్నే అనుసరించారు సుబ్రహ్మణ్యం గారు .రాజమండ్రి దగ్గర గోదావరి ఒడ్డున ప్రశాంత వాతావరణం లోసీతానగరం లో  ఒక ఆశ్రమం నిర్మించి శిష్యవర్గంతో పని చేస్తూ గాంధీగారి నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించారు .దీనికోసం 14ఎకరాలు మూడు వేలరూపాయలు పోగుచేసి కొని ఆశ్రమ నిర్మాణం ప్రారంభించి భవనాలు నిర్మించారు. దీనికి చాలాకస్టపడ్డారు .ఇటుకలు ,పెంకులు కలప కు చాలాడబ్బు కావాల్సి వచ్చింది .నిర్మాణ వ్యయం 20వేలు అయింది .ఇందులో 13ఎకరాలు వ్యవసాయానికి ,మిగిలిన ఎకరం లో భవనాలు నిర్మించారు .వివిధ శాఖలకు వేర్వేరు భవనాలు ,నివాసానికి వేరుగా భవనాలుమొత్తం 12 భవనాలు అన్నీ ఆ ఎకరం లోనే కట్టారు .ప్రజాసేవ ప్రారంభించారు .ఇదంతా గాంధీగారి నిర్మాణ కార్యక్రమం ను అనుసరించే జరిపారు .

  గాంధీ గారి దృష్టిలో నిర్మాణ కార్యక్రమాలు అంటే –సత్య ,అహింస పద్ధతులలో సంపూర్ణ స్వరాజ్య సాధన .అంటే జాతి మత కులాలకు అతీతంగా స్వేచ్చా స్వాతంత్ర్యాలు కలిగి ఉండటం .అంటే అన్యోన్య ఆశ్రయంగా కలిసి పని చేయటం .కృషిని బట్టి ఫలితం ఉంటుంది .ఇది సక్రమంగా అమలు జరిపితే ,మనం కోరుకున్న స్వతంత్రం వస్తుంది .ఈ నిర్మాణ కార్యక్రమానికి 13 విషయాలున్నాయి .అవి-వివిధ జాతి సమీకరణ ,అస్పృశ్యతా నివారణ ,త్రాగుడు ,ఖద్దరు పల్లెటూరి పరిశ్రమలు ,గ్రామ పారిశుధ్యం ,నూతన విద్యావిధానం ,వయోజన విద్య ,స్త్రీ జనోద్దరణ ,ఆరోగ్యబోధ ,రాష్ట్ర భాషా ప్రచారం ,స్వభాష ,ఆర్ధిక సమానత్వం .వీటిని ఈ ఆశ్రమం లో ఎలా తీసుకువచ్చి సఫలీకృతం చేశారో చూద్దాం –హిందూ ముస్లిం క్రైస్తవులు పరస్పర అవగాహనతో మిత్రత్వం తో కలిసి ఉండటం .అంటరానితనాన్ని ఆశ్రమం లో పాటింపక పోవటం,కల్లు సారాయి దుకాణాలవద్ద పికెటింగ్ చేసి త్రాగుడు మాన్పించటం , నూలు అందరూ వడికి ఆదాయం పెంపొందించటం .దీనికి ప్రత్తి చెట్లు పెంచి ప్రత్తి తీయించి రాట్నాలు సప్లై చేసి నూలువడికించి వస్త్రాలు నేయించి అమ్మకానికి పెట్టారు .ఇతర పరిశ్రమలు ఇక్కడ పెట్టలేదు. వ్యవసాయమే ముఖ్యంగా చేశారు .గ్రామాలకు వెళ్లి పారిశుధ్యాన్ని బోధించి అమలు అయెట్లు చేశారు .వవైద్యాలయం ఏర్పాటు చేసి రోగులకు సాయపడ్డారు .చిన్న చిన్న బడులు పెట్టి గ్రామస్తులకు విద్య నేర్పించారు .కాంగ్రెస్ అనే పత్రిక స్థాపించి వయోజన విద్యా ప్రచారం చేశారు .మద్దూరి అన్నపూర్ణయ్య ,గాడిచర్ల వారు పత్రికాధిపతులుగా ఉంటూ ప్రేరణాత్మకంగా రాస్తూ  ప్రయోజనం కలిగించారు .స్త్రీ జనోద్ధరణకు ప్రత్యెక కృషి చేయలేదు .సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ కనుక గ్రామస్తుల ఆరోగ్యాన్ని చక్కగా కాపాడారు .కొందరుమాత్రమే హిందీ నేర్చారు నేర్పించారు ,కాంగ్రెస్ పత్రిక తెలుగులోనే ప్రచురించి స్వభాషకు గౌరవం ప్రోత్సాహం కలిగించారు .దీనికి అన్నపూర్ణయ్యగారి కృషి అద్వితీయం ,ఆశ్రమనిర్వహణకు ఇతరులపై ఆధార పడాల్సి వచ్చినందున ఆర్ధిక సమానం కు కృషి చేయలేకపోయారు .ఈ ఆశ్రమం ఖద్దరుకు ప్రఖ్యాతి చెందింది .రాట్నాలు కదుళ్ళు చేయించి మంచి దూది తో యేకులు చేయించి ఆశ్రమం లోనూ ,గ్రామస్తులకు ఇచ్చి ఖద్దరు ఉత్పత్తి చేయించారు .ఒకరిద్దరు ఆశ్రమవాసులు ఖద్దరుకోసమే వినియోగి౦పబడ్డారు .సీతానగరం ఖద్దరు అంటే ఆంధ్రదేశం లో మంచి నాణ్యమైనది అనే పేరు పొందారు .మంచి వారపత్రిక ‘’కాంగ్రెస్ ‘’నడపటానికి ముద్రణా యంత్రం కొన్నారు .మద్దూరి అన్నపూర్ణయ్య గారే వీటికి బాధ్యత వహించారు .సుమారు మూడు వేలమంది చందాదారులు ఉండేవారు .ముట్నూరి వారి కృష్ణా పత్రికకు దీటుగా మద్దూరి వారు కాంగ్రెస్ పత్రిక ను ఆకర్షణీయంగా ,విజ్ఞాన దాయకంగా ,ప్రబోధ దాయకంగా నడిపారు .ఒక భవనంలో  వైద్యాలయం పెట్టి,రోగులకు ఉచితంగా మందులిచ్చేవారు .డా.సుబ్రహ్మణ్యం గారికి లొంగని రోగం ఉండేదికాదు .కావాల్సిన డబ్బును ప్రజలనుంచి ప్రోగు చేసి ఎలాంటి లోపం లేకుండా వసతులతో వైద్యాలయం ఆదర్శంగా నడిపారు .వ్యవసాయానికి ఎడ్లు బండీ,నాగళ్ళు సంపాదించి వ్యవసాయం చేయిస్తూ కావలసిన కూరగాయలు ,జొన్న చోళ్ళు మిర్చి మొదలైన మెరకపంటలు పండించారు .ఆదాయం బాగా ఉండేది .ఆ ఆదాయం ఆశ్రమవాసుల భోజనాదులకుసరిపోయేది .ఆశ్రమం మాంచి ఉచ్చస్థితిలో ఉండగా గాంధీజీ వచ్చి రెండు రోజులు ఉండి,చూసి  మెచ్చి ఆశీర్వదించి వెళ్ళారు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-8-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .33వ భాగం.16.8.22

భారతీ నిరుక్తి .33వ భాగం.16.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

 త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం

 త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం

వైదీక తెలగాణ్య  శాఖకు చెందిన బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం కొండ వీడుసీమలోని ఫిరంగి పురం లో 12-10-1891న జన్మించారు .కొద్దికాలం అక్కడే చదివి బెజవాడలో చదివారు .మెట్రిక్ తప్పటం వలన చదువు ముందుకు సాగలేదు .నిరాశ చెందక కలకత్తా వెళ్లి నాలుగేళ్ళు వైద్య విద్య నేర్చారు .1915-16లో రాజమండ్రి వచ్చి వైద్య వృత్తిలోచేరి గొప్ప పేరు ప్రఖ్యాతులు,డబ్బు సంపాదించారు .నెలకు సుమారు వెయ్యి రూపాయలు సంపాదించేవారు .బీద విద్యార్ధులకు విద్య చెప్పించేవారు .1916-17లో వచ్చిన హో౦ రూల్ వైపు ఆకర్షితులై ,సేవా భావంతో కార్యదర్శియై ,ప్రజలను జాతీయోద్యమం వైపు మళ్లి౦చ గలిగారు.

  1920లో గాంధీగారి సత్యాగ్రహోద్యమం లో పని చేసి ,శాసన సభా బహిష్కారాన్ని ప్రచారం చేసి ,వైద్యం మానేసి ప్రజాసేవలో మునిగిపోయారు .అప్పటికి ఆయనకు వైద్యం కింద అయిదు వేలు రోగులు ఇవ్వాల్సి ఉంది .ఆయన అడగలేదు .కానీ ఇల్లు గడవటం కష్టంగా ఉంటె ఇంట్లోని వారు ఒత్తిడి చేసి వసూలు చేస్తున్నారని తెలిసి ,బాకీ బిల్లుల్ని చింపి పారేశారు .గొప్ప ఉపన్యాసాలివ్వగల వక్త అవటంతో .గోదావరి జిల్లాలోని ప్రతిగ్రామం ప్రతి సభలో మాట్లాడి ఉత్తేజ పరచారు .హాస్యం చతురత తో ఆకర్షించేవారు .ప్రజలు నడుం కట్టి కార్యరంగం లోకి దూకేవారు .ఈయన ప్రభావం మద్దూరి అన్నపూర్ణయ్య ,ధరణిప్రగడ శేషగిరిరావు ,రామ చంద్రుని వెంకటప్ప ,మామిడి లక్ష్మీపతి ,మాచిరాజు రామచంద్ర మూర్తి ,డా.వంగవీటి దీక్షితులు మొదలైన వారిపై పడికర్తవ్య పరాయణులను చేసింది   .

1920-21లో తీవ్రంగాసత్యాగ్రహోద్యమం నడపటం చేత 21డిసెంబర్ లో ఈయనను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు లో తర్వాత కడలూరు జైలులో ఉంచారు .శిక్షాకాలం సంవత్సరం లో ఆరోగ్యంగా ఉంటూ తోటఖైదీలకు సాయం చేసేవారు .22నవంబర్ లో విడుదలై ,ప్రజాసేవ చేస్తూ ఉద్యమాలు నిర్వహించారు .1923కాకినాడ కాంగ్రెస్ సభలలో సుబ్రహ్మణ్యం గారి సేవలు  నిరుపమానం .నూలు వడుకుతూ వడి కించేవారు .రాజమండ్రిలోని ఆచంట పరబ్రహ్మం అనే డాక్టర్ ,ఈయనపై దురాగ్రహం తో చెంపమీద కొట్ట గా ,ప్రజలంతా  మణ్య౦ గారి వెనక నిలబడి ప్రతీకారం తీర్చుకోమని కోరినా అహింసా వ్రతం అవలంబించి ,వారించారు .కొంతకాలానికి పరబ్రహ్మానికి పక్షవాతం వచ్చి బుద్ధి తెచ్చుకొని క్షమాపణ పత్రం రాసి కాళ్ళమీద పడ్డాడు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారత ప్రథమ స్వాతంత్ర్య దినోత్సవం 15.8.1947 నాటిడా.కే.ఎన్. కేసరి గారి గృహ లక్ష్మి పత్రిక విశేషాలు.15.8.22

భారత ప్రథమ స్వాతంత్ర్య దినోత్సవం 15.8.1947 నాటిడా.కే.ఎన్. కేసరి గారి గృహ లక్ష్మి పత్రిక విశేషాలు.15.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

తొలిఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -4(చివరిభాగం )

తొలిఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -4(చివరిభాగం )

 జైలు నుంచి విడుదలకాగేనే మళ్ళీ వైద్య వృత్తి అవలంభించాడు జగ్గన్న శాస్త్రి .అయిదేళ్ళు బాగానే నిలకడగా ఉన్నాడు .ఇంతలో హోమ రూల్  హడావిడి మొదలైంది .కాంగ్రెస్ పునరుద్ధరణ జరిగింది. అల్లూరి సీతారామరాజు గడబిడ .ఈయనతో శాస్త్రికి సంబంధం ఉందని ప్రభుత్వానికి అనుమానం .మూడేళ్ళు ఇద్దరి ఇళ్ళపై కదలికలపై తీవ్ర నిఘా కొనసాగింది .శాసన సభా బహిష్కార ఉద్యమ లో ‘’నో వోట్ కాంపైన్ ‘’ప్రారంభించినపుడు శాస్త్రిని ఉప్పలగుప్తం పోలింగ్ ఏరియాకి పంపితే ,వెళ్లి ఒక్కవోటు కూడా పోల్ కాకుండా చేసి ఖాళీ బాలట్ బాక్స్ లను తిరగొట్టించాడు .1930లో నాయకులంతా జైలులో ఉండగా  ,బిక్కిన వెంకటరత్నం గారు జిల్లా నాయకుడు గా నియమింప బడినప్పుడు  అయన ఉప్పుసత్యాగ్రహ స్థానమైన కాకినాడ వదలి చోడవరం వెళ్లి ఆయన ఇంటి నుంచే సత్యాగ్రహం నడపాలనుకొన్నారు .శాస్త్రి కాకినాడలో ఉండి సత్యాగ్రహం జయప్రదంగా నిర్వహించాడు .మళ్ళీ ఉద్యమమ దిగ్విజయంగా సాగుతోంది .ప్రభుత్వం గుర్తించి జైలులో పెట్టింది ,అక్కడే ‘’జాతీయ నాయకులు ‘’అనే పుస్తకం రాసిన కోటమర్తి చిన రఘుపతి కూడా ఉన్నారు .వీళ్లిద్దరితోపాటు 59మందిని మొదటి బాచ్ గా రాయవెల్లూరు జైలుకు పంపారు .శాస్త్రి ని మద్రాస్ కు, అక్కడినుంచి అల్లీపూర్ జైలుకు మార్చగా రఘుపతి మాత్రం అక్కడే శిక్ష పూర్తీ చేశారు .

’హిందూ దేశ స్వాతంత్ర్య యుద్ధం

  1930ఉద్యమ౦  ,అంతకు ముందు బెంగాల్ విభజన ఉద్యమంలో పాల్గొన్న వినాయక దామోదర సావర్కార్ రాసిన ‘’హిందూ దేశ స్వాతంత్ర్య యుద్ధం ‘’పుస్తకం బాగా ప్రచారమైంది .ఇది మొదట 1906,07లలో మహారాష్ట్ర భాషలో రాయబడి,1907లో ఇంగ్లీష్ లో  అనువాదంచేయబడి 1908లో జర్మనీలో ముద్రింపబడింది .బొంబాయిలో దామోదర కంపెనీకి పాలడబ్బాల వ్యాపారం ఉండేది .జర్మనీ నుంచి ద పాలడబ్బాలుదిగుమతి అయ్యేవి  .ఒకసారి ఆపాల డబ్బాలతోపాటు ఆ పుస్తకాలు కూడా దిగుమతి అయ్యాయి .జగ్గన్న శాస్త్రి బొ౦బాయి  కొన్ని పుస్తకాలు కొని తెచ్ఛి, ఆంధ్రదేశం లో పంచిపెట్టాడు .

  గాంధీ సత్యాగ్రహ ఉద్యమం వదిలి శాసన సభా ప్రవేశ ఉద్యమం లో ఉన్నప్పుడు నచ్చక శాస్త్రి దూరమయ్యాడు .సావర్కారు నాయకత్వం లో ‘’హిందూ మహా సభ ‘’లో చేరి పని చేశాడు .సావర్కార్ రాసిన ‘’హిందూ పద శాహి’’గ్రంథాన్ని మృదు మధుర శైలిలో అనువాదం చేశాడు శాస్త్రి .హిందూ మత ధర్మాలు పాటిస్తూ ,మహాసభకు వీర విధేయుడుగా ఉన్నాడు .అనేక గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు .ఒక రోజు కోటమర్తి కి ‘’గాంధీ ముస్లిం కాన్స్పిరసి’’అనే పుస్తకం ఇచ్ఛి ఆపుస్తకం తనలో కలిగి౦చిన మార్పును గురించి చెప్పాడు .ముస్లిం లకు గాంధీ దేశాన్ని కట్టబెట్ట బోతున్నట్లు శాస్త్రి భావించాడు .అందులో కొన్ని ముఖ్యవిషయాలు –‘’బ్రిటిష్ ప్రభుత్వం తో సంధి చేసుకో కూడదని కాబూల్ లోని సుల్తాన్ కు టెలిగ్రాం ఇచ్చానని రాజకీయ నాయకులంతా నాపై కక్ష కట్టారు .నేను కూడా అది మంచిపనికాదని చెప్పాను .కాని బ్రదర్ మహమ్మదాలీ నన్ను పక్కకు తీసుకు వెళ్లి తన చేతి సంచిలోని వ్రాతప్రతి అయిన టెలిగ్రాం ను నాకు ఇచ్చి చదవమన్నాడు .అది అహింసాయుత సహాయ నిరాకరణ ఉద్యమ నాయకుడి దస్తూరిగా ఉండటం నన్ను ఆశ్చర్య పరచింది .’’అని స్వామి శ్రద్ధానంద రాయగా ,గాంధీ తన హరిజన పత్రికలో 10-2-1940న ‘’నేను ఆఫ్ఘనిస్తాన్ అమీర్ కు ఏరకమైన టెలిగ్రాం పంపినట్లు గుర్తు లేదు .ఆ ఆరోపణ నిజంకాదు .స్వర్గీయ స్వామి శ్రద్ధానంద నాతొ ఎప్పుడూ ఈ విషయం ప్రస్తావించ లేదు ‘అని సమాధానం గా రాశాడు గాంధీ .23-3-40న హరిజన్ పత్రికలో గాంధీ –‘’బ్రిటిష్ వారి సాయంతో ముస్లిం లు హిందూ దేశం పై తమశక్తిని ప్రయోగిస్తారు .కాంగ్రెస్ నా వెంట ఉంటె ,వాళ్లకు ఆశ్రమ ఇవ్వను .వారి చేత పరిపాలి౦ప బడటం నాకు ఇష్టమే .కారణం వారిది హిందూ పాలనమే కనుక ‘’అని రాశాడు .ఇవన్నీ చదివి శాస్త్రి ‘’హిందూ దేశం లో గాంధీ మహమ్మదీయుల చేతిలోబందీగా  ఉన్నాడు .అది నాకు ఇష్టం లేదు .బయటి బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఇంటిలోని మహమ్మదీయ సమస్య పరిష్కరించాలని నేను హిందూ మహా సభ సభ్యుడిగా చేరాను ‘’అని తాన రాజకీయ దృక్పధాన్ని మార్చుకొన్నట్లు శాస్త్రి స్పష్టంగా చెప్పాడు .తాను ‘’హిందూ మహా సామ్రాజ్యం ‘’పుస్తకాన్ని అనువదించటానికి ముఖ్యకారణం హిందూ ఉత్క్రుష్టత ను స్పష్టం చేయటానికే అని చెప్పాడు .ఎర్రమిల్లి జగ్గన్న శాస్త్రి మంచి ఆవేశ పరుడైన విప్లవకారుడు గొప్ప ఉపన్యాసకుడు ,దేశాభిమాన౦ , హిందూ మతాభిమాన మున్న మహోన్నత వ్యక్తీ ‘’అని కీర్తించాడు  శాస్త్రి కో డిటేన్యు కోటమర్తి చిన రఘుపతి .

   ఆధారం

శ్రీ కోటమర్తి చిన రఘుపతి రచించిన ‘’  జాతీయ నాయకులు –మొదటి భాగం .ఇందులో జగ్గన్న శాస్త్రి తోపాటు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ,డా.పట్టాభి సీతారామయ్య , ,అయ్యదేవర కాళేశ్వరరావు గార్ల జీవిత చరిత్రలూ సంగ్రహంగా ఉన్నాయి .దీన్ని రాజమండ్రిలోని కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్ 1955లో ముద్రించారు .వెల-రూపాయిన్నర .

 వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తొలిఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -3

తొలిఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -3

              రోడ్డా కంపెని

జగ్గన్న శాస్త్రి కలకత్తా లో మెడిసిన్ చదివేటప్పుడు అక్కడ ఒక రోడ్డా అండ్ కంపెనీ ఉండేది అందులో తుపాకులు పిస్తోళ్లు మందు గుండు సామాను అమ్మేవారు .విప్లవానికి చెందిన ఒక చోరీ ఈ కంపెనీలో4-8- 1914న  జరిగింది.ఆ రోజే బ్రటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచయుద్ధానికి ప్రకటన చేసి౦ది కూడా .ఆగస్ట్ 14 న ఈ కంపెనీకి విదేశాలనుంచి 202పాకేజీలలో పిస్తోళ్లు మందుగుండు సామాను దిగుమతి అయ్యాయి .నమ్మకమైన అధికారిని కస్టమ్స్ శాఖకు పంపి వాటిని తెమ్మన్నారు .అతడు వెళ్లి 192 పాకేజీలు మాత్రమె దిగుమతి చేసుకొని ,ఆమాట అక్కడి అధికారులకు చెప్పి ఇంటికి వెళ్ళాడు .కాని అతడు ఆ రోజునుంచి మళ్ళీ కంపెనీ ముఖం చూడలేదు .మిగిలిన 10పాకేజీలుకూడా కంపెనీకి చేరనే లేదు .మూడురోజులు చూసి కంపెనీ పోలీసులకు తెలియ జేసింది .ఈ 10 కేసులలో 50పిస్తోళ్లు ,46వేల రౌండు లకు ఉపయోగపడే మందు గుండు సామాను ఉంది .ఇందులో 44పిస్తోళ్లు మొదటిరోజు రాత్రే 9విప్లవ సంఘాలకు చేరిపోయాయని ,మిగిలిన 6 ఏమయ్యాయో తెలీదని ప్రభుత్వం చెప్పింది .1914తర్వాత ఈ పిస్తోళ్ళతో  54 బందిపోటు హత్యలు జరిగినట్లు పోలీసు లెక్కల్లో తేలింది .కొంత కాలానికి 31పిస్తోళ్లు చాకచక్యంగా పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు .అప్పుడు కలకత్తాలో ఒకే సారి 150 ఇళ్ళను సోదా చేయగా అందులో జగ్గన్న శాస్త్రి ఉన్న బస కూడా ఉంది .అప్పటికే ఆయన రాస్ బిహారీ బోస్ తోస్నేహంగా ఉంటున్నాడు .  రాస్ బిహారీ బోస్ డెహ్రాడూన్ లో ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ లో హెడ్ క్లార్క్ .బెంగాలీ విప్లవ నాయకుడు .ప్రభుత్వాన్ని పడకొట్టే అనేక ఉపాయాలు ఆలోచిస్తున్నాడు .వ్యాసాలద్వారా, విప్లవ సంఘాలు స్థాపించి ఉద్యమిస్తున్నాడు .1912 డిసెంబర్ లో ఢిల్లీ లో వైస్రాయ్ హార్డింజ్ పై బాంబు వేశాడని అభియోగం ఉంది .అతడిని పట్టిస్తే పెద్ద బహుమతి ఇస్తామని ప్రకటన చేసింది ప్రభుత్వం .ఢిల్లీ ,లాహోర్ కుట్ర కేసులు ఇతనిపై బనాయించినా ఫలితం కనిపించలేదు .కాశీకి వెళ్లి అక్కడ రహస్యంగా విప్లవ సంఘాలు స్థాపించి పని చేస్తున్నాడు .1914లో కాశీలోనే ఉన్నాడు .ఒక బెంగాలీ కుటుంబానికి చెందిన తోట బంగళాలో ఉండటం చేత ఆచూకి దొరకలేదు .రాత్రులలో బయటికి వచ్చి చేయాల్సిన పని చేసేవాడు .పిస్తోళ్లు బాంబులు పేల్చే విధానాన్ని శిక్షణ ఇచ్చేవాడు .ఒక సారిరాత్రి  అలా ఇస్తుంటే రెండు బాంబు మూతలు చేతిలో పేలి అతనికి సచ్చీంద్రుడు కి గాయాలయ్యాయి .నివాసం మార్చేశాడు .పూనా నుంచి వచ్చిన గణేశ పింగలే ఇతడిని కలిశాడు .1915లో పింగలే సచ్చీన్ద్రులు రాస్ బిహారీ నికలిశారు .ముగ్గురు కలిసి పంజాబు వెళ్లి ,ఆనెల 21న విప్లవానికి గొప్పప్లాన్ వేశాడు .పోలీసులకు ఈ రహస్యం తెలిసిందని పసిగట్టి ప్లాన్ అమలు చేయలేదు .పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు .రాస్ బిహారీ లాహోర్ వెళ్లి అక్కడినుంచి కాశీ చేరి ,అక్కడినుంచి కలకత్తా చేరి ,మిత్రులను కలిసి హిమాలయాలకు వెడుతున్నానని  చెప్పి వెళ్ళిపోయాడు .1915లో టిబెట్ దాటి చైనాలో ప్రవేశించాడు .అక్కడ సన్యట్ సేన్ కు శిష్యుడై ,చాగ్ కై షేక్ తో కలిసిఉన్నాడు .కొన్ని నెలల తర్వాత జపాన్ వెళ్లి జపాన్ ప్రభుత్వ సాయం తో అక్కడ’’హిందూ దేశ  విప్లవ సంఘం’’ స్థాపించాడు .ఆసంవత్సరే జపాన్ లో చనిపోయాడువిప్లవ వీరుడు  రాస్ బిహారీ బోస్ .

    శాస్త్రి నిర్బంధం

కలకత్తాలో జగ్గన్న శాస్త్రిని అన్నం తిననీయకుండా అరెస్ట్ చేసి బొంబాయి కి తీసుకువెళ్ళారు .అప్పటికే అయిదుగురు అరెస్ట్ అయ్యారు ఆరో వాడుశాస్త్రి .అక్కడి పోలీసులు అతిధి పూజా దురంధరులు .సున్నీల స్వాగతం బూతుల దఅష్టోత్తరపారాయణ ,లాఠీ పూజ చంపదెబ్బల ,అర్ధ చంద్ర ప్రహారాల విందు తన్నుల తాంబూలం ,పిడికిట దక్షిణ లతో నిరంతర సత్కారం చేశారు .కొట్టిన  దెబ్బలతో పొడిచిన పోట్లతో కట్టిన బొబ్బలతో కమలిన గాయాలతో కారే రక్తంతో కన్నీళ్ళతో ,చెదరని గుండెతో ,కదలని నాలుకతో కదలలేక కూర్చోలేక నిలబడ లేక పడుకోలేక పగలే రాత్రిగా రాత్రే పగలుగా దినం ఒక యుగంగా గడపిన దీక్షా వ్రతం లో ఆత్మ సాక్షియే దైవంగా సత్యమే దిక్కుగా ,బడలి ఒడలు తెలియని ఆబక్క బాపడు జగ్గన్న శాస్త్రి ని చూసి బాధపడే వారెవరూ లేరు .ఆరునెలలు ఇదే తీరున బాధ పెట్టారు .శాస్త్రితోపాటు ఒక గుజరాతీ ఒక మహారాష్ట్ర వేరొక ఆంధ్రయువకుడు ఉన్నారు ఈబాధాలు భరించిన వారిలో .వీరందరిపై కుట్ర నేరం మోపాలనుకొన్న ప్రభుత్వం ఆటలు సాగలేదు .అప్పుడే దేశోద్ధారక కాశీ నాథుని నాగేశ్వర రావు పంతులుగారు బొంబాయి వెళ్లి వీరందర్నిజైలులో కలుసుకొని మూడు వందల రూపాయలు ఇచ్చి గ్రామపెద్దలకు జాబులు రాసి ,వారి సానుభూతి పొందేట్లు చేయగా ,దాని ఫలితంగా శిక్ష పడకుండా వీరు విడుదలయ్యారు .

    సశేషం

 భారత స్వాతంత్ర్య అమృతోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-8-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .32వ భాగం.15.8.22

భారతీ నిరుక్తి .32వ భాగం.15.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -2

ఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -2
కాకినాడ కలెక్టర్ ఆషి ని తిరునల్వేలి జిల్లాకు మార్చారు .అక్కడ విప్లవాగ్ని జ్వాలలు విపరీతంగా వ్యాపించాయి .రైల్ లో ఉండగానే విప్లవకారులు అతడిని కాల్చి చంపారు .జగ్గన్న శాస్త్రి పై వారంట్ పుట్టించి అరెస్ట్ చేసే ప్రయత్నం లో ప్రభుత్వం ఉంది .ఈ విషయం తెలిసిన మిత్రులు గున్నేశ్వరరావు వగైరా డబ్బులు వసూలు చేసి అర్ధరాత్రి రహస్యంగా శాస్త్రిని బొంబాయి రైల్ ఎక్కించి పంపించే ఏర్పాటు చేశారు పడవలో గోదావరి దాటి ,నడిచి నిడదవోలు వెళ్లి ,అక్కడినుంచి రైల్ లో బెజవాడ చేరి ,స్వరాజ్య పత్రిక ఆఫీస్ కు వెళ్ళే సరికి అక్కడ పత్రికాధిపతిని అరెస్ట్ చేయటానికి వారంట్ తో సిద్ధం గా ఉండటం చూశాడు .ఆయనకు తన సంగతి చెప్పి ,రాత్రి రైల్ ఎక్కి బొంబాయి వెళ్లి,మహీం లో ఉన్న జే ఎం పోధార్ ఇంటికి వెళ్ళాడు శాస్త్రి .ఇతడు జపాన్ లో వంగల వెంకట నారాయణ కు సహాధ్యాయి.పోధార్ బాంబులు తయారు చేసి నూతిలో దాచినట్లు పోలీసుల అనుమానం .అతడిని ఎప్పుడైనా అరెస్ట్ చేయచ్చు .అందుకని శాస్త్రిని కాల్ పత్రికాధిపతి పరంజపేయి దగ్గరకు తీసుకు వెళ్ళాడు .ఇతడిపైనా బొంబాయిలో కేసు ఉంది .తానె కోర్టులో వాదించు కొంటున్నాడు .ఇద్దరు ఒకరి సంగతి ఒకరు చెప్పుకొన్నారు .రెండు నిమిషాలలో శాస్త్రికి కావాల్సిన బస భోజనం డబ్బు పుస్తకాలు సమకూర్చాడు .ఇలా అజ్ఞాతం లో రెండు నెలలు గడిపాడు శాస్త్రి .శాస్త్రికోసం వెదకి వెదకి నిరాశ చెంది వారంట్ రద్దు చేసుకొన్నారు పోలీసులు .మరో మూడు నెలలతర్వాత రాజమండ్రి చేరాడు .పోలీసువారు ఇతనిపై రహస్యంగా విచారిస్తున్నారేకానీ కేసు పెట్టలేదు .కనుక ఆంధ్రులలో మొట్టమొదటి విప్లవకారుడు యర్రమిల్లి జగ్గన్న శాస్త్రిగా రికార్డ్ కు ఎక్కాడు .మారు వేషాలతో తిరిగేవాడు .తురక వేషం లో బాగా రాణించే వాడని అతని మిత్రులు చెప్పారు .1910చివరివరకు ఆంధ్రలో ప్రచారం చేసి ,1911లో డాక్టరీ చదవటానికి జగ్గన్న శాస్త్రి కలకత్తా వెళ్ళాడు .
నాలుగేళ్ళు కలకత్తాలో మెడిసిన్ చదువుతూ శ్యామ సుందర చక్రవర్తి తో స్నేహం సంపాదించి ,1914లో డాక్టర్ డిగ్రీ పాసయ్యాడు జగ్గన్న శాస్త్రి .ఈయనతోపాటు కలకత్తాలో చదివి డాక్టరీ పాసయిన ఆంధ్రులు డాక్టర్ బ్రహ్మా జోశ్యుల సుబ్రహ్మణ్యం, వేదాంతం వెంకట కృష్ణయ్య మొదలైనవారున్నారు .కానీ కలకత్తా నుంచి ఇంటికి రాగానే శాస్త్రిని అరెస్ట్ చేసి మద్రాస్ పంపారు .దీనికి కారణం రోడ్డా కంపెని కేసు.
సశేషం
75వభారత స్వాతంత్ర్య దినోత్సవం శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవిత చరిత్ర.2,వ భాగం.14.8.22

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-24(చివరిభాగం )

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-24(చివరిభాగం )

మోతీలాల్ ఘోష్ చివరి రోజులు

చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడే మోతీలాల్ మితభోజనం ,వేళప్రకారం భౌతికావసరాలు తీర్చుకోవటం వల్లనే బరువు బాధ్యతలు సక్రమంగా నేరవేర్చగలిగాడు .ప్రజాజీవితం లో అలుపెరుగని వ్యక్తీ ,దాపరికం లేని మనిషి .పోరాటశీలి అయిన జర్నలిస్ట్ .ఉమ్మడికుటుంబం లోందరికి ప్రీతిపాత్రమైనవాడు నిరాడంబరుడు పొగతాగటం మద్యం సేవించటం లేనే లేవు .చిన్న ధోవతీ ,చొక్కా మాత్రమె ధరించే వాడు .రాజునైనా ,పేదనైనా అదే దుస్తులతో కలిసేవాడు .ఆయనవి నిక్కచ్చి విమర్శలు .ప్రత్యర్ధులపై అభాండాలు ఎన్నడూ రాయని పెద్దమనిషి .అందరితో అవగాహనతో మెలిగేవాడు .ప్రత్యర్ధులను ఎందరినో మిత్రులుగా గెలుచుకొన్నాడు .బ్రిటిష్ అధికారులకూ ఆయన మిత్రుడే .ఇల్లే ఆఫీసు గా చేసుకొని ఎవరు ఏసమయం లో వచ్చినా ఆత్మీయంగా స్వాగతి౦ చేవాడు .అమృతబజార్ పత్రిక, జాతీయ రాజకీయాలే ఆయన వ్యాపకాలు .సంగీతం వైష్ణవ సాహిత్య అధ్యయనం ఆయన అభిరుచులు .జాతీయోద్యమ సిద్ధాంత కర్త కాకపోయినా ,,సామాన్య మానవులకోసం ముఖ్యంగా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పరితపించాడు .

 1917 ఆయనకు ఎన్నో బరువు బాధ్యతలు తెచ్చింది .30లక్షల డయరాన్ రియల్ ఎస్టేట్ సివిల్ కేసు లో కమీషన్ ముందు సాక్ష్యం ఇవ్వటానికి నోటీసులు వచ్చాయి .వీటితో అలసట చెందిన ఆయన శరీరం విశ్రాంతి కోరింది .బీహార్ లోని సోనే నది ఒడ్డున కోయిల్ వార్ అనే ప్రశాంత వాతావరణం లో గడపటానికి వెళ్ళాడు .ఆధ్యాత్మిక గ్రంథాలు తనవెంట తీసుకు వెళ్ళాడు .అక్కడా పత్రికా వ్యవహారాలూ చూస్తూ ఆదేశాలిస్తూ గడిపాడు .అక్కడి ప్రశాంతత నిస్తేజం కలిగించగా 1918ప్రారంభం లో కాశీ వెళ్ళాడు .అక్కడ పక్షవాతం వచ్చి ఎడమభాగం చచ్చు పడి పోయింది .ప్రాణం పోయేదాకా ఇది వదలలేదు .

  1918మధ్యలో మళ్ళీ కలకత్తా చేరాడు .మళ్ళీ జబ్బు చేసింది .గాంధీ ప్రతిపాదించిన ఆహి౦సాత్మక సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదం పొందిన సభకు వెళ్ళలేక పోయాడు .శరీరం కృశిస్తున్నా ,గుండె దిటవు తగ్గలేదు .1919లో అల్లుడు నృత్యగోపాల్ మరణం తట్టుకోగలిగాడు .కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఆయన బ్రహ్మానందం ప్రాప్తించే ఊర్ధ్వ లోకాలకు వెళ్ళినందుకు సంతోషించాలికానీ శోకం పనికి రాదు అని తాత్విక బోధ చేశాడు .

  1921మధ్యలో మోతీలాల్ ఆరోగ్యం పట్ల ప్రజలు ఆందోళన చెందటం ప్రారంభించారు .ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య విషయాలు పత్రికలో ప్రచురించేవారు .జులైలో స్టేట్స్ మాన్ పత్రిక –‘’చాలామంది యూరోపియన్ లతో పాటు ,అశేష అభిమానులున్న అమృతబజార్ పత్రిక పాఠకులకు సంతోష వార్త .మోతీలాల్ ఘోష్ క్రమంగా కోలుకొంటున్నారు .ఆయనకు వచ్చిన పక్షవాతం చాలా వరకు నయమైంది .ఆయనవయసు 75.’’అని రాసింది .

  ఆయన రాయటం మానలేదు ఉదయం తన ఇంటి దగ్గరున్న నదీ తీరానికి గుర్రం బండీలో వెళ్లి స్వచ్చమైన గాలి పీలుస్తూ ,వార్తాపత్రికలు చదివించి విషయాలు తెలుసుకోనేవాడు .కర్ర ఆధారంగా కాసేపు నడిచేవాడు .మధ్యాహ్నం రాసుకోనేవాడు .ఐర్లాండ్ పరిస్థితులు తెలుసుకోవటానికి బ్రిటన్ నుంచి వచ్చిన వార్తా పత్రికలూ చదివే వాడు .మృత్యువు మీద పడుతోంది అన్న వాస్తవం గ్రహించి ,దానితో రాజీకి వచ్చాడు .మృత్యువు రాకకోసం నిశ్చింతగా ఎదురు చూశాడు .మరణం మానవ జీవితం లో ఒక ఘట్టం మాత్రమె అని నమ్మాడు .మరణం తర్వాత మంచి లోక ప్రాప్తి కలుగుతుందని తెలుసుకొన్నాడు .అతీత శక్తిగల భగవంతుడు మనకు మంచి మిత్రుడు అనేవాడు .శ్రీ కృష్ణ ,గౌరాంగ ల లాగా మానవుడిలో ఉండేవాడే దేవుడు అని నమ్మాడు .భారత ప్రజానీకానికి తమ ఇల్లు తాము సరిదిద్దుకొనే సామర్ధ్యం ఉన్నవారని భావించాడు .మానవునిపై అచంచల విశ్వాసం ఆయనది .

  1922మధ్యలో మళ్ళీ కోలుకొన్నాడు మోతీలాల్ .తన ఆరోగ్యం గురించి పత్రికలో –‘’రాజైనా రైతైనా సన్యాసి అయినా ,పామరుడైనా మృత్యువును తప్పించుకోలేడు .వంటికి నీరుపట్టటం ,ఊపిరి ఆడని ఆయాసం ,వెన్ను నొప్పులు భరించరానివే .ఈ మధ్య వచ్చిన స్ట్రోక్ వంటిది మళ్ళీ నాకు వస్తే భరించే శక్తి నాకు లేదు .ఆరోజున ఎలాగో భరించగలిగాను .మృత్యువు సమీపిస్తుంటే ,శారీరకబాధలేవీ లేకుండా ,ఆనందం ఆవరిస్తుందని శాస్త్రీయంగా రుజువైంది .అంటే శరీరం నుంచి ఆత్మ వేరై ,ఊర్ధ్వ లోకాలలో తన శాశ్వత గమ్యస్థానానికి వెళ్ళే సమయం లో శరీరానికి బ్రహ్మానందం ప్రాప్తిస్తు౦దన్నమాట .ఆ ఆనందాన్ని అతి త్వరలో అనుభవి౦చ బోతున్నానని  ఆశిస్తున్నాను .మానవాళికి ఆ ఆనందం ఇదిగో ఇలాంటిది అని వ్యక్తం చేసే అవకాశం చిక్కదని మాత్రం విచారిస్తున్నాను ‘’అని రాశాడు మోతీలాల్ పక్వ హృదయం తో .

 మళ్ళీ వ్యాధి తిరగబెట్టి బాగా నీరసించాడు. గాస్ ట్రబుల్ ఎక్కువైంది జలోదరం తోపాటు న్యుమోనియా వచ్చింది .కొంతకాలానికి తగ్గి ,4-9-1922కి ఆరోగ్యం ప్రమాద స్థాయికి చేరి,ఆ మర్నాడే మోతీలాల్ ఈ బాధామయ ప్రపంచం నుంచి శాశ్వత ఆనందం కోసం వెళ్ళిపోయాడు .కుటుంబ సభ్యులు చుట్టూ చేరిహరినామ స్మరణ చేశారు .మరణానికి కొన్ని రోజులముందు తన్ను చూడటానికి వచ్చిన బంధువుతో మోతీలాల్ –‘’నాకు తీరనిది అంటూ ఎమీ లేదు .మృత్యువుకు కొన్ని అంగుళాల దూరం లో మాత్రమె ఉన్నాను .దేనినైనా తట్టుకొనే వయసు ఉంది .ప్రపంచం లో ఆనందాన్ని పూర్తిగా అనుభవించాను .తెలిసి ఏ పాపమూ చేయలేదు .ఇహాన్ని వదిలి వెళ్లి పోతున్న నాకు బ్రహ్మానందం లభిస్తుంది .ఎందుకు ఆనందంగా ఉండకూడదో చెప్పు ‘’అన్నాడు .

  వేలాదిమంది మోతీలాల్ మృతికి సంతాపాలు పంపారు .వచ్చి చూసి చివరి దర్శనం చేసుకొన్నారు .బిన్న రాజకీయ సిద్దా౦తా లున్న మూడు పత్రికలు  వ్రాసిన సందేశాలు ఇలా ఉన్నాయి –గాంధీజీ జైలులో ఉన్నప్పుడు రాజాజీ ,జైరాం దాస్ దౌలత్ రాయ్ ,జార్జ్ జోసెఫ్ ల సంపాదకత్వం లో ఉన్న యాంగ్ ఇండియా పత్రిక –‘’శిదిలపేటికను ఒక మహోన్నత ఆత్మ విడిచి పెట్టి వెళ్ళిపోయింది .మనరాజకీయచి౦తన లో సత్యం ధర్యం అనే గుణాలు ప్రవేశపెట్టి ,దాన్ని ప్రజాస్వామ్యానికి అనుగుణంగా తీర్చి దిద్దినవాడు మోతీలాల్ ఘోష్ .భారత స్వాతంత్ర్య చరిత్రలో ఆయనది గౌరవ స్థానం .ఆత్మ సౌన్దార్యం ,దానికి సామర్ధ్యం కలిగిన ప్రజల అభిమానాన్నే కాక ప్రేమను కూడా నోచుకొన్న అరుదైన వ్యక్తీ .గాంధీ ,మోతీలాల్ లను మహానీయులనుంచి వేరు చేసింది వారిలోని ‘’కృష్ణ చైతన్యమే ‘’అని శ్లాఘించింది .ఒకప్పటి స్టేట్స్ మన్ పత్రిక సంపాదకుడు ,తర్వాత లండన్ నుంచి వెలువడే ‘’ది న్యు స్టేట్స్ మన్’’సంపాదకుడు ఎస్.కే రాట్లిఫ్ –‘’తమ వ్యక్తిత్వం రచనలు ,విద్యావంతులకు ,విద్యా లేనివారికి కూడా పరిచయున్న వారు ఎంతమంది ఉన్నారు ?ఇంగ్లాండ్ లో అలాంటి వారు ఒక్కరు కూడా లేరని చెప్పవచ్చు .మొత్తం పాశ్చాత్య ప్రపంచం లో ప్రజలందరికీ తెలిసిన రచయితా లేనే లేడు .అది భారత దేశం లోనే సంభవం .భారత్ మొత్తం మీద ఒక విలక్షణ మేధావి ఉన్నాడు .ఆయనే కలకత్తాలో అమృత బజార్ పత్రిక నడిపే బాబూ మోతీలాల్ ఘోష్ .ఆయన 77వ ఏట కన్ను మూశాడు .ఆయన నిష్క్రమణలో భారతీయ జర్నలిజం లో ఒక శకం అంతరించింది .ఆయన తనకు తానె మహాశక్తిగా ఎదిగిన మహా వ్యక్తీ .భారతీయులకు ఆయన సుపరిచిత వ్యక్తీ .కలకత్తానగరం ఉత్తరభాగాన పెద్ద హిందూ కుటుంబం  తో ఉన్న ఇంట్లోనే ఆయన ఎడిటోరియల్ ఆఫీస్ ఉంది .ఆ ఆఫీసులోనే పుష్కరం క్రితం మెక్డోనాల్డ్ అనే ఇటాలియన్ రాజభవనాన్ని తలపించే చోట ఆయన్ను కలుసుకొన్నాం ..అక్కడి ప్రతి రాయి  శిధిల గాథ చెబుతుంది .ప్రక్కనే ముద్రణాలయం లో లినో టైప్ యంత్రాలు పని చేస్తున్నాయి .బెంగాల్ లో ఇంగ్లీష్ వారు పత్రికలకు లినో టైప్ యంత్రాలు వాడకముందే ఈయన తనపత్రికకు వాడారు ‘’అన్నది .మూడవ పత్రిక ‘’దిఇంగ్లీష్ మాన్ ‘’మోతీలాల్ దివ్య స్మృతికి నీరాజనాలిస్తూ –‘’భారత రాజకీయ రంగం నుంచి ఒక మహోన్నత వ్యక్తీ నిష్క్ర మించాడు .ఆయన బ్రిటిష్ వారికి ప్రమాదకర వ్యక్తిగా భారతీయులకు ఆరాధనీయుడుగా కనిపించాడు .ఆయన అద్భుతమైన వ్యక్తీ అని శత్రువులు కూడా అంగీకరిస్తారు .కేవలం ఒక చోట భైఠా యించి ప్రభుత్వం మీద ,వ్యవహారాలమీద నిప్పులు చెరిగాడు .అంతకీర్తి ఆయనకు రావటానికి  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శించిన సాహసం మాత్రమె కారణం కాదు .భారత రాజకీయ నాయకులు తప్పుదోవ పడితే వారికి వ్యతిరేకంగా ఆయన చూపిన సాహసమే ముఖ్య కారణం .వ్యంగ్యవైభవంతో కూడిన ఆయన శైలి కూడా కారణమే .ఆయన రచనలు చదివి స్వదేశీయులే భయపడే వారు .యూరోపియన్లు కూడా మోతీలాల్ చిత్త శుద్ధిని ,నిజాయితీని గౌరవించారు ‘’అని మెచ్చింది .ఇంగ్లీష్ కవి టెన్నిసన్ కవిత మోతీలాల్ ఘోష్ కు పూర్తిగా సరిపోతుంది –

‘’అతడొక సాహస హృదయుడు –శ్రమించి శోధించి అంతు కనుక్కోవటమేకానీ –తలవంచి లొంగి పోయి ఎరుగడు ‘’.

  ఇంతటి మహోన్నత వ్యక్తి మోతీలాల్ ఘోష్ ను ని  స్వాతంత్ర్య అమృతోత్సవసందర్భంగా పరిచయం చేసే అదృష్టం నాకు దక్కినందుకు గర్వంగా ఉంది .

  ఆధారం –ఎస్.ఎల్ ఘోష్ రాసినదానికి  శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ అనువాదం చేసనపుస్తకం  ‘’మోతీలాల్ ఘోష్ ‘’

  రేపు 75వ భారత స్వాతంత్రోత్సవ శుభా కాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంధ్రవిప్లవ వీరుడుడా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి

ఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి

ఉపన్యాసాలు ఇవ్వటం లోనే కాదు ఆచరణలో పెఅట్టటం లోనూ ఘనుడు డా యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి .ఒంటరివాడు .ప్రోత్సాహం లేకపోయింది .కాని ఆకర్యదీక్ష సాహసం ఇంకొరికి లేనే లేదు .’’యుద్ధ విరామ సైనికులే నేటి కాంగ్రెస్ నాయకులు ‘’అనే వాడు .రాజనీతి రాజకీయ పరిజ్ఞానం ఉంటేనే శత్రు సంహారం చేయగలం అనే వాడు .పట్టాభి లాగా ఈతడూ డాక్టరు,రాజకీయ పండితుడు .నెలకు సుమారు వెయ్యి రూపాయల జీతం .రాజకీయం దేశ స్వాతంత్ర్యం కోసం దాన్ని వదిలేశాడు .నాడీ పరీక్షలో మేటి .సిద్ధహస్తుడు అమృత హస్తుడు అని పేరు పొందాడు .హస్తవాసిమంచిదని కళ్ళకు అద్దుకోనేవారు .

  తూర్పు గోదావరిజిల్లా మండపేటలో వైదీక తెలగాణ్య కుటుంబం లో 16-2-1886న జన్మించాడు తండ్రి రామస్వామి .కౌశిక గోత్రీకుడు .విశ్వామిత్రుని లోని అన్ని లక్షణాలు ఉన్న వాడు .తండ్రి ఏక సంథాగ్రాహి, మంచికవి .కుటుంబభారం అంతా శాస్త్రి దే .విరక్తుడై కాడి పారేయలేదు .వివాహం అయ్యాక ,విద్య మానేసి కుటుంబ భారం మోశాడు .అప్పుడే బెంగాల్ విభజన జరిగి రాజకీయాందోళనలు మిన్ను ముట్టాయి .

  ప్రభుత్వం బెంగాల్ రహదారుల విషయం లో నిర్లక్ష్యం చేసింది .తరచూ నదులకు వరదలు వచ్చి ప్రజాజీవితం అస్త వ్యస్తమయ్యేది .జనపనార ముఖ్య పంట.రైతులకు రాబడి బాగా ఉండేది .నదీ పరివాహక  ప్రాంతాలు ఎక్కువ .అక్కడి ఇళ్ళు వెదురు బద్దలతో కట్టుకొనేవారు .వరదలలో గ్రామాలుదిబ్బలమీద ఇళ్ళు లాగా ఉండేవి .పడవలమీదే ప్రయాణం .బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ ఏకాభి ప్రాయం .ఇది రాజకీయంగా నష్టం అని ప్రజాభిప్రాయం .పత్రికలుకూడా ఎలుగెత్తి చాటాయి .బెంగాల్ పశ్చిమ భాగం ,బీహార్ ఒరిస్సా ఒకభాగం ,తూర్పు బెంగాల్ అస్సాం ఒక భాగంగా విభజించాడు కర్జన్ దుర్జన్ అని పించుకొన్నాడు .విప్లవ జ్వాలలు పశ్చిమ బెంగాల్ లో ఎక్కువ .అందుకే తూర్పు పశ్చిమ భాగాలను వేరుచేశాడని ప్రజల ఘోష .పశ్చిమ బెంగాల్ లో విద్యాధికులు రాజకీయ నాయకులు ఎక్కువ .తూర్పున విద్య లో వెనకబడింది .ముస్లిం లు ఎక్కువ .రెండు ప్రాంతాలవారు కలిస్తే ప్రభుత్వానికి ముప్పు అని చేసిన విభజన అని ప్రజాభిప్రాయం .విభజించి పాలించటం బెంగాల్ తోనే మొదలైంది .

  బంకిం చంద్ర చటర్జీ ఆనంద మఠం నవలలో ‘’వందే మాతరం’’గీతం రాయగా ఆది ప్రజల నోళ్ళలో నాని జాతీయ గీత గౌరవం పొందింది .తిలక్ కలకత్తా వచ్చి ప్రచారం చేస్తే ,అరవిందుని సోదరుడు బరీంద్రుడు బరోడానుంచి కలకత్తా వచ్చాడు .స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్ర నాథ దత్తు ,మిత్రుడు అవినేష్ భట్టాచార్జీ లతోకలిసి ‘’యుగంధర్ ‘’పత్రిక స్థాపించి ప్రచురించాడు.వీరి విప్లవోద్యమానికి 11రివాల్వర్లు ,4రైఫిల్స్ ,ఒక తుపాకీ రహస్యంగా సంపాదించారు .ఈ సంఘం లో ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా 15మంది యువకులున్నారు .వీరంతా పులిన్ బిహారీ దాస్ నాయకత్వం లోఢక్కాలో ‘’అను శీలన సమితి ‘ఏర్పరచి ,రెండవ శాఖ కలకత్తా లో ఏర్పరచారు .ఢక్కా సంఘానికి 500 శాఖలేర్పడ్డాయి .సంధ్య అనే వారపత్రికను కూడా పెట్టి’’ సంపూర్ణ స్వరాజ్యం కావాలి ‘’ అని ప్రకటించారు .వీరంతా భగవద్గీత ,వివేకానందుని ఉపన్యాసాలు మాజిని, గారిబాల్డీ ల జీవిత చరిత్రలు చదువుతూ చదివిస్తూ ప్రేరణ పొంది పొందించారు .వీరి ముఖ్య గ్రంథం ‘’ముక్తికాన్ పథే’’.వీరంతా బెంగాల్ లో ఉత్తమ కులీనులు అంటే భద్రజాతి వారు .డబ్బు కోసం దోపిడీలు చేసేవారు .కొన్ని విఫలమయ్యాయి .మిడ్నపూర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ వెళ్ళే రైలుకింద బాంబు పెట్టారు .ఢక్కాలోని నౌతాయి గంజి లో డబ్బు సంచులు మోసుకు వెడుతున్న వాడిని పొడిచి డబ్బు దోచుకు వెళ్ళారు .23-7-1907న జిల్లా కలెక్టర్ అలెన్ ను పిస్టల్ తో కాల్చారు .సిబిపూర్ లో ఒక ఇంట్లో నాలుగు వందలు దోచారు .30-4-1908న కేనడిభార్య కూతురుప్రయాణం చేసే రైలు పై బాంబులు విసిరితే  ,ఆడవాళ్ళు ఇద్దరూ చనిపోయారు .కలకత్తాలోని గార్డెన్ రీచ్ లో కింగ్స్ ఫోర్డ్ ను చంపే ప్రయత్నం చేశారు .చావకపోతే పార్సెల్ లో బాంబు పంపారు వాడు విప్పలేదు కనక చావలేదు .1908 ఏప్రిల్ 30న బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఇద్దరు స్త్రీలను ఒకపురుషుడిని చంపారు .

  24పరగణా జిల్లా అల్లీ పూర్ కుట్ర జరిగి యావజ్జీవ ,ద్వీపాంతర వాస శిక్షలు పడ్డాయి .దాకా బారాబజార్ లో 25వేలు నగదు అపహరించారు .కొన్ని చోట్ల కొబ్బరికాయలలో బాంబులు పెట్టి పేల్చారు .పడవలలో దొంగతనాలు హత్యలుచేశారు .కలకత్తాలో నందార్ లాల్ బెనర్జీ అనే సబ్ ఇన్స్పెక్టర్ ను చంపారు .ఇలా లెక్కలేనన్ని దోపిడీలు దొంగతనాలు హత్యలు బాంబు ప్రేలుళ్ళతో  బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాదించారు విప్లవ వీరులు .దేశం అట్టుడికి పోయింది .అప్పుడే బిపిన్ చంద్రపాల్ ఆంద్ర దేశ పర్యటనకు వచ్చి బెంగాల్ విభజనపై తీవ్ర ప్రచారం చేసి విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తు ప్రోత్సాహం కలిగించాడు .ఆరోజుల్లో పోలీసు అంటే హడల్ .జగ్గన్న శాస్త్రి బిపిన్ చంద్ర పాల్ తో పల్లెపల్లెకూ తిరిగి ప్రచారం చేశాడు ధైర్యంగా .పాల్ 24-4-1907న రాజమండ్రి వస్తే జగ్గన్న శాస్త్రి ,గాడిచర్ల హరి పురుషోత్తమ రావు,బోడి నారాయణ రావు  గార్లు ఆయన్ను కలిసి ప్రచారం చేశారు .

  రాజమండ్రి ట్రెయినింగ్  కాలేజి విద్యార్ధులను బయటికి రాకుండా మార్క్ హంటర్ ప్రయత్నిస్తే జగ్గన్న శాస్త్రి విద్యార్ధులతో సమ్మె చేయించి ఒక్క విద్యార్దికూడా కాలేజికి వెళ్ళకుండా చేయగలిగాడు .అప్పటినుంచే శాస్త్రి బహిరంగ రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నాడు .బిపిన్ పాల్ తో గ్రామగ్రామానా ప్రచారం చేసి ,ప్రజలలో స్వదేశీ అభిమానం కలిగించాడు  జగ్గన్న శాస్త్రి .వందే మాతరం న్యూస్ పేపర్ రి  పోర్ట్ ప్రకారం జగ్గన్న శాస్త్రి బిపిన్ పాల్ వెంట వుండి ప్రచారం చేస్తూ ,తాము  విదేశాలకు వెళ్లి బాంబులు తయారు చేయటం బాంబుల్ని నిర్వీర్యం చేయటం నేర్చుకొని తిరిగి వచ్చి ,ప్రతిఅమావాస్య రాత్రి తమకు శత్రువులైన 108 మంది తెల్ల దొరలను బాంబులతో చంపేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు ఉంది .

  26-3-1908 న చిదంబరం పిళ్ళై ను అరెస్ట్ చేసినప్పుడు స్వరాజ్య పత్రికలో ‘అరే.ఫరంగీ .క్రూర వ్యాఘ్రమా నిష్కారణంగా ముగ్గురు హిందువులను అరెస్ట్ చేసి నీతినీ చట్టాన్నీ పొట్టన పెట్టుకోన్నావు .మీ రోజులు దగ్గర పడ్డాయి అని తెలుసుకో ‘’అని రాశారు .ఎడిటర్ ను, ప్రింటర్ ను అరెస్ట్ చేసి శిక్ష వేయగా పత్రిక అంతటితో ఆగిపోయింది .జగ్గన్న శాస్త్రి తన మొదటి బహిరంగ ఉపన్యాసాన్ని 1907లో సామర్లకోటలో ఇచ్చాడు .అక్కడినుంచి చాలాగ్రామాలు తిరిగి ఉపన్యాసాలిచ్చాడు .ప్రజల్లో గొప్ప రాజకీయ చైతన్యం కలిగించాడు .బెంగాల్ లో వందలకొలది విప్లవ కారులు చేసిన ప్రచారం ఆంధ్రాలో ఒక్క జగ్గన్న శాస్త్రి మాత్రమె చేసి అబ్బుర పరచాడు.బందరు మొదలైన చోట్ల విప్లవ సంఘాలు పెట్టాడుకానీ అవేవీ సరిగా పని చేయలేదు .అయినా అధైర్యపడ లేదు శాస్త్రి .

  1908లో గోదావరి పుష్కరాల సమయం లో  జగ్గన్న శాస్త్రి ,మరొక దేశ ప్రేమికుడు వంగల వెంకట నారాయణ గారు కలిసి ఒక బోర్డు పెట్టి , పుష్కర యాత్రికులకు సకల సౌకర్యాలు కలిగించారు .ఇది పోలీస్ సూపరిం టే౦న్డెంట్  కు కంటి మంటగా ఉండి బోర్డు తీయమన్నాడు .ఇద్దరూ కలిసి తియ్యము పొమ్మన్నారు .కలెక్టర్ కు తెలిసి శాస్త్రిని వచ్చి కలవమనితాసీల్దార్ దావులూరి ఉమామహేశ్వర రావు తో కబురుపంపాడు .ఆయనమండపేటవచ్చి శాస్త్రిని కలిసి కలెక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు .కలెక్టర్ శాస్త్రి తో ఆయన్ను అరెస్ట్ చేయటానికి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందనీ ,శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని అరెస్ట్ చేయటం లేదని ,విప్లవసంఘాలతో సంబంధం పెట్టుకోవద్దని హితవు చెప్పి పంపించాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-22-ఉయ్యూరు 

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి .31వ భాగం.14.8.22

భారతీ నిరుక్తి .31వ భాగం.14.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గాడిచెర్ల సర్వోత్తమ జీవితం 1వ భాగం.13.8.22

గాడిచెర్ల సర్వోత్తమ జీవితం 1వ భాగం.13.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-23

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-23

మహాత్మా –మోతీలాల్ ఘోష్

గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ను విశ్వసించే జాతీయవాదులకు ,ప్రతిఘటన ఉద్యమంగా భావించే వారికి మధ్య అభిప్రాయ భేదాలు బయట పడ్డాయి .దేశబంధు దాస్ నాయకత్వం లో బెంగాల్ లోని వర్గం స్థానిక సంస్థలకు కూడా ప్రతిఘటన ఉద్యమం వ్యాపింప జేయాలని కోరింది .విదేశీ వస్త్రాలు మద్యం షాపులవద్ద పికెటింగ్ లు నిర్వహించారు .విదేశీ వస్త్ర దహన భోగి మంటలు నిత్య దృశ్యమైంది .మొదటి వాలంటీర్ దళానికి సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించాడు .చిత్తరంజన్ భార్య బసంతీదేవి నాయకత్వం లో స్త్రీలుకూడా శాంతియుత పోరాటం చేశారు .1921లో వేల్స్ యువరాజు పర్యటనకు ముందు ఇవి పతాకస్థాయికి చేరాయి .యువరాజు పర్యటనకు ప్రాముఖ్యం ఇవ్వరాదని హర్తాల్ పాటించాలని’ కాంగ్రెస్ ఖిలాఫత్ కమిటీ ‘’నిర్ణయించింది .యువరాజుకు ఆహ్వానం పలకటానికి అధికారులతో విదేయులతో ఒక కమిటీ ఏర్పాటైంది .’’పిడికెడు కాసులకోసం కోటులో దర్జాగా ఒక రిబ్బన్ తగిలించుకొనే గొప్పకోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన నాయకుడు ‘’గా అమృత బజార్ పత్రిక చేత వర్ణింపబడిన సురెంద్రనాద్ బెనర్జీ కూడా ఈ కమిటీ లో ఉన్నాడు .అప్పటికి ఆయనకు ‘’సర్’’బిరుదు ఉంది .మోతీలాల్ ఘోష్ అనుమతిని పొందకుండానే ఆయన పేరు ఆకమిటీలో చేర్చారు .ఆతర్వాత ఆయన తన వైఖరిని స్పష్టంగా పత్రికా ముఖంగా తెలియజేశాడు .దీనిపై ఆయన పత్రికలో రాస్తూ ‘’యువరాజు ఆహ్వాన సంఘం లో మీరుకూడా చేరారా ?అని ఎందఱో ఉత్తరాలురాశారు .ఆయనకు తెలియకుండా సంప్రదించకుండా పేరు చేర్చారు అని అందరికి జాబులు రాశాం .వివాదం సమసిపోయింది .కానీ మోతీలాల్ ను దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో సురెంద్రనాథ్ తనపేపర్ లో మోతీలాల్ వైఖరి మారినట్లు రాశాడు .దీన్ని తిప్పికొడుతూ పత్రికలో –భారత దేశ భవిష్యత్ రాజకుమారుడి ముందు మోకరిల్లాడు అంటే స్వార్ధం కోసమా దేశ ప్రయోజనాలకోసమా ,తెల్లదొరలనుంచి బిరుదులూ పొందటానికా ,ఏడాదికి 64వేల రూపాయలమంత్రిపదవి కోసమా ?ఇలాంటి కక్కుర్తి పడ్డ బడా నాయకుల్ని చూస్తూనే ఉన్నాం. మోతీలాల్ అలాంటి కక్కుర్తి పడే నాయకుడు కాదు ‘’అని ఘాటుగా నషాళం అన్టేట్లు చివాట్లు పెట్టాడు .

  యువరాజు బొంబాయిలో అడుగుపెట్టిన నవంబర్ 17న బెంగాల్ అంతటా హర్తాల్ పాటించారు .ప్రభుత్వం గంగ వెర్రు లెత్తింది .ఆయన కలకత్తా  వచ్చినపుడు ఇలాగే జరిగితే పరువు బంగాళాఖాతం లో పడి కొట్టుకు పోవటం ఖాయం అని ప్రభుత్వం భావించింది .స్త్రీ పురుష విచక్షణ లేకుండా వాలంటీర్ లందర్నీ అరెస్ట్ చేయమని ‘’రోనాల్డ్ షీ’’ఉత్తర్వులిచ్చాడు .ఎక్కడ చూసినా అరెస్ట్ లే అరెస్ట్ లు .దాసు గారు ఆయన సహచరులు కూడా జైలుపాలయ్యారు.ప్రజలు మరింత ఉత్సాహంగా ముందుకు వచ్చి జైలుపాలయ్యారు .జైలు అంటే భయం లేకుండా ఒక ప్రహసనంగా మారింది .మితవాదులూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు .రాజీకోసం వైస్రాయ్ పిలిస్తే గాంధీ వెళ్ళాడు .రాజీషరతులేవో చెప్పి అరెస్ట్ చేసిన వారందర్నీ విడుదల చేయాలని గాంధీ షరతు పెట్టాడు .ప్రభుత్వం తిరస్కరించి ఆయన్ను 1922మార్చిలో అరెస్ట్ చేసి ఆరేళ్ళు శిక్ష విధించింది .నేషనలిస్ట్ లు శాసనమండలి సభ్యత్వం పొంది ,ప్రభుత్వ సంస్కరణలకు సభనుంచే అడ్డంకులు కలిపిస్తే మంచిది అని ప్రజలు భావించారు .దాస్ జైలులో ఉన్నా ఉద్యమం బలంగానే జరుగుతోంది .శాసన సభలో మెజార్టీ వోటుద్వారా ప్రభుత్వ చర్యలను తిరస్కరించటం మంచిదని మోతీలాల్ నెహ్రు ,టంగుటూరి ప్రకాశం విఠల్ భాయ్ పటేల్ కూడా మద్దతు ప్రకటించారు .

  23-4-1922న విఠల్భాయ్ ,,ప్రకాశం గార్లు మోతీలాల్ ఘోష్ ను ఆయన ఇంట్లో కలిశారు .అప్పటికే ఆరునెలలనుంచి జబ్బుతో ఆయన మంచం మీద ఉన్నాడు .మోతీలాల్ తో జరిపిన సంభాషణ ను ప్రకాశంగారు స్వరాజ్య పత్రికలో రిపోర్ట్ ఇచ్చారు –‘కొత్తగా కౌన్సిల్ ఏర్పడినప్పుడల్లా దానిలో ప్రవేశానికి నేను వ్యతిరేకిస్తూనే ఉన్నాను .గాంధీజీ వచ్చి ఇక్కడ నన్ను కలిసినప్పుడు  ఆయనకు ఒక  మాట చెప్పాను. అప్పుడు విఠల్ భాయ్ కూడా ఉన్నారు.కౌన్సిల్ కు ఎవరు వెళ్ళినా అక్కడి దుష్టవాతావరణం లో చెడిపోవటం ఖాయం .మనవాళ్ళే కొందరు కౌన్సిల్ ప్రవేశం కోరటం దురదృష్టకరం .దీనివలన మన శిబిరం లో చీలిక రాకూడదు ‘’అన్నాడు. దీనికి విఠల్ భాయ్ పటేల్ ‘ స్త్రీలతోసహా 25వేలమంది దేశ భక్తులను మనం జైళ్లకుకు పంపి ఇప్పుడు ఇలా అనటం భావ్యం కాదు .చీలిక రాకుండా చూస్తాం .డిసెంబర్ కాంగ్రెస్ లో పరిష్కార౦  సాదిస్తాం ‘’అన్నాడు  .నాయకుల దేశ భక్తుల త్యాగంతో మొతీలాల్ కళ్ళు చెమర్చాయి ,’’ఇంతటి త్యాగం దేశభక్తి నేను బతికి ఉండగా చూస్తానని అనుకోలేదు .జీవించి ఉండిఇవన్నీ చూస్తున్నందుకు ఆనందంగా ఉంది ‘.అన్నాడు సంతృప్తిగా .ఆఇద్దరు మహా నాయకులు ఆవృద్ధ నాయకుని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు .వారితో మాట్లాడినంత సేపు మోతీలాల్ పడుకోలేదు .మంచం మీద ముడుచుకొని కూర్చుని , వణుకుతున్న కఠం తో మంత్రించినట్లు మాట్లాడి ఆనాయకులపట్ల పూర్తీ మర్యాద గౌరవాలను చూపాడు .అధికారం చేతికి వస్తే దిగజారుతారని ఆయన భయం .ఎన్నికలు నిష్పాక్ష పాతంగా జరగవని ఆందోళన .వస్తే సర్వ స్వేచ్చాయుతమైన పార్లమెంట్ రావాలి లేకపోతె ఏదీ వద్దు అని మోతీలాల్ భావించాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-8-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రజాకార్ల పాలిటి సింహస్వప్నం ,గిరిజనజాగృతి,సిపిఎం శాసనసభ్యురాలు,’’నా మాటే తుపాకి తూటా’’గా ఆత్మకధ రాసుకొన్న –శ్రీ మతి మల్లు స్వరాజ్యం

రజాకార్ల పాలిటి సింహస్వప్నం ,గిరిజనజాగృతి,సిపిఎం శాసనసభ్యురాలు,’’నా మాటే తుపాకి తూటా’’గా ఆత్మకధ రాసుకొన్న –శ్రీ మతి మల్లు స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం (1931 – 2022 మార్చి 19[1])[2] తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. మల్లు వెంకట నరసింహారెడ్డి సతీమణి. మల్లు స్వరాజ్యం ఆత్మకథ “నా మాటే తుపాకీ తూటా” అన్న పేరుతో 2019లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా పుస్తకంగా వచ్చింది.

కుటుంబం
స్వరాజ్యం 1954లో మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు గౌతమ్, నాగార్జున, కుమార్తె కరుణ ఉన్నారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యానికి సోదరుడు.

జివిత విశేషాలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించింది. ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. మల్లు స్వరాజ్యం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొల్పింది.

ఈమె జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేది. ఈమె ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1978-1983[3], 1983-1984[4] సంవత్సరాలలో రెండు పర్యాయాలు సి.పి.ఐ.(ఎం) పార్టీ తరఫున ఎన్నికైంది. నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఈమెకు సోదరుడు. వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ‘చైతన్య మానవి’ సంపాదకవర్గంలో ఈమె ఒకరు.

ఈమె పాటల్లో ఒక ఉయ్యాలపాటలో[5] కొంత భాగం:

వీరమరణం చెందిన ‘మట్టారెడ్డి’, ‘అనంతరెడ్డి’లను స్మరిస్తూ బతకమ్మ పాటశైలిలో ఇలా వివరించింది.

వీరిమట్టారెడ్డి ఉయ్యాలో
ధీర అనంతారెడ్డి ఉయ్యాలో
మీవంటి వీరులు ఉయ్యాలో
మా మధ్య నిలబడి ఉయ్యాలో
మాకు వెలుగులు చూపి ఉయ్యాలో
ఓర్వదీ ప్రభుత్వంబు ఉయ్యాలో
పాత సూర్యాపేట ఉయ్యాలో
పోరాటమును చూడు ఉయ్యాలో
ప్రజల బలమును జూసి ఉయ్యాలో
పారిపోయిరి వాళ్ళు ఉయ్యాలో
మన ప్రజల రాజ్యమును
పొంది తీరాలమ్మ ఉయ్యాలో

మరణం
మల్లు స్వరాజ్యం వయో భారంతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతున్న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2022 మార్చి 19న -92వ ఏట మరణించింది.[6][7]

2-తెలంగాణా పోరాట సమితి తొలియోధుడు ,గెరిల్లా నాయకుడు ,,హరిజన సేవా సంఘం స్థాపించి 100పాఠశాలశాలలు నిర్మించిన సంఘ సంస్కర్త ,ఆంధ్రమహాసభ స్థాపకుడు ,నల్గొండ లోక్ సభాస్థానాన్ని నెహ్రూ కంటే భారీ మెజారిటీ తో గెలిచిన ‘వీర తెలంగాణ వాది’’-శ్రీ రావి నారాయణ రెడ్డి

రావి నారాయణరెడ్డి, (జూన్ 5, 1908 – సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు[1]. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొనవచ్చు.

జననం
యాదాద్రి – భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908, జూన్ 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు.

రాజకీయ రంగం
విద్యార్థి దశలో
రావి నారాయణరెడ్డి తొలిదశలో ఆంధ్రమహాసభ, ఆంధ్రజనసంఘం ఏర్పరిచిన సాంస్కృతిక చైతన్యం వల్ల ప్రభావితమైనాడు నిజాం పరిపాలనలో తెలంగాణాలో రాజకీయ చైతన్యం లేని స్థితిలోనే ఆయన పోరాటాన్ని ప్రారంభించాడు రెడ్డి హాస్టల్ విద్యార్థిగా ఉండగానే అప్పటి నిజాం కళాశాల విద్యార్థి అయిన బద్దం యెల్లారెడ్డితో కలసి 1930 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కాకినాడ వెళ్లి మరీ పాల్గొన్నాడు.[2] 1931లో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్యదర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించాడు రెండు వసతి గృహాలను నిర్వహించాడు. 1930లో బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్టు చేయగా, దానికి నిరసనగా హైదరాబాద్‌లోని హస్మద్ గంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించాడు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడాడు. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ అధికారిగా వ్యవహరించే బ్రిటిష్ రెసిడెంట్, తన గూఢచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని, కొత్వాల్ రాజబహదూర్ వెంకట రామారెడ్డిని ఇంటికి పిలిపించి రావి నారాయణరెడ్డిని హెచ్చరించవలసిందిగా సూచించాడు. పాతికేళ్ళ ప్రాయంలోపుగానే దేశభక్తి, రాజకీయ పోరాటం పట్ల దృఢచిత్తాన్ని ఏర్పరుచుకున్నాడు. 1931లో దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభలకు తన తోటి విద్యార్థులను పోగుచేసి పాదయాత్రగా ఆంధ్రోద్యమాన్ని ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుంచి దేవరకొండ చేరుకున్నాడు. మహాసభల్లో చురుకైన పాత్ర వహించాడు.

నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ విశిష్టమైనది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామికవాది ‘రావి’. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి, పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది[3].

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజాపోరాటానికి చూపునిచ్చిన జననేతగా ప్రసిద్ధుడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పనిచేశాడు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐ లో చాలాకాలం పనిచేశాడు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించాడు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకాన్ని, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలనూ అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసాడు.[4]

జాతీయోద్యమం బలంగా వేళ్లూనుకున్న ప్రాంతాల్లో మాత్రమే కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటుందని, అందుకు కారణం ఉద్యమంలో పాల్గొన్న అనుభవం వలన వాళ్లు కేవలం విడివిడి వృక్షాలను కాక, మొత్తం అరణ్యాన్ని చూడగలరన్నది ఆయన విశ్వాసం. ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాలుపంచుకొన్న అనుభవంతో రాటుదేలడం వల్లే తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు గణనీయమైన విజయాలను కైవసం చేసుకోవడం సాధ్యమైందని ఆయన తరచు అంటుండేవాడు. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షత వహించాడు. భువనగిరి సమావేశాల్లోనే ఆంధ్రమహాసభ అతివాద, మితవాద శిబిరాలుగా చీలిపోయింది.

దేశ స్వాతంత్య్రానికి ముందు సాగిన సాయుధ పోరాటాన్ని వ్యూహాత్మకంగా సమర్థించిన రావి నారాయణరెడ్డి 1947 తరువాతి కాలంలో పోరాటాన్ని కొనసాగించాలనే ‘మెజారిటీ’ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, సమ సమాజ ఆకాంక్షలతో కలగాపులగం చేయడం వల్లే పార్టీ, 1948 ఫిబ్రవరిలో పోరాటం కొనసాగించాలనే తప్పుడు నిర్ణయం తీసుకుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. చరిత్ర ఆయన మార్గమే సరైనదని తీర్పు చెప్పడం విశేషం. కాళోజీ నారాయణరావు ప్రవచించిన ‘వేరు తెలంగాణ’ను తాత్వికంగా వ్యతిరేకించడంతో ఆగక, తాను ఎన్నటికీ ‘వీరతెలంగాణ’ వాదిగానే ఉంటానని చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణరెడ్డి. తన స్వంత భూమిని 200 ఎకరాలు దానం చేశాడు

విశేష ఘట్టాలు

  1. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసాడు.
  2. 1941, 1943 సంవత్సరాల్లో భువనగిరిలో జరిగిన పదకొండవ, పన్నెండవ ఆంధ్ర మహాసభలకు వీరు అధ్యక్షత వహించి,ఆ సభను విజయవంతం చేశాడు.
  3. మహాత్మాగాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తన భార్య సీతాదేవితో వెళ్ళి కలిసి తన భార్య ఒంటిపై ఉన్న నగలన్నింటినీ తీసి గాంధీ చేతిలో పెట్టి, హరిజన సేవక సంఘానికి ఇవ్వమని గాంధీజీని అభ్యర్థించాడు.
  4. హైదరబాదు సాయుధ పోరాట సమయంలో తన స్వంత భూమి వందల ఎకరాల భూమిని రైతులకు పంచిన ఉదారవాది.
  5. నారాయణ రెడ్డి గారు తన 23 ఏళ్ల వయసులో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించాడు రెండు వసతి గృహాలను నిర్వహించాడు.
  6. 1952లో భారతదేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించాడు.
  7. 1932లో తక్కర్ బాబా అఖిల భారత హరిజన సేవక్ సంఘ్‌ను స్థాపించాడు. హైదరాబాద్ విభాగానికి సరోజినీనాయుడును అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా రావి నారాయణరెడ్డిని నియమించాడు.
  8. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించిన వారిలో రావి ముఖ్యులు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై విధించిన నిషేధం ఎత్తేయాలని అక్టోబరు 24న తొలిబ్యాచ్ సభ్యుడిగా సత్యాగ్రహం చేశాడు.
  9. 1928లో ఆంధ్రమహాసభ ఏర్పడింది. 1941-44-45ల్లో మూడుసార్లు రావి అధ్యక్షునిగా పనిచేశాడు. వితంతు వివాహాలు, అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఆంధ్రమహాసభను క్రియాశీల రాజకీయ సంస్థగా మలిచాడు. 20 ఎకరాల భూమిని మించి కలిగి ఉండరాదు అని కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానించింది. ఆ స్ఫూర్తిని గాంధేయవాది అయిన రావినారాయణరెడ్డి స్వీకరించాడు తనకు సంక్రమించిన భూమిలో 20 ఎకరాలను మాత్రమే ఉంచుకుని 500 ఎకరాలను రైతుకూలీలకు పంచిపెట్టాడు.
  10. రావి నారాయణరెడ్డి నాస్తికుడు . కుటుంబసభ్యులు మందిరానికి వెళ్తే కాదనని ప్రజాస్వామ్యవాది. రావి తన వివాహానంతరం ఒక విల్లు రాశాడు. తాను మరణిస్తే తన భార్య వైధవ్య ప్రతీకలను ఆమోదించరాదని, కట్టూబొట్టులతో సలక్షణంగా ఉండాలని కోరాడు. ఆమె తన అభీష్టానుసారం జీవించవచ్చనీ రాసాడు. భార్య మరణించిన అరవై ఏళ్లకు 1991 సెప్టెంబర్ 7న రావి 83వ ఏట మరణించాడు. తన అస్థికలను గంగానదిలో కలపవద్దని, పొలంలో చల్లితే చాలనీ అన్నాడు. ఆ మేరకు వారసులు పచ్చని పొలాల్లో రావి ‘విభూది’ని చల్లారు.

స్మారకాలు
హైదరాబాదు లోని బంజారా హిల్స్ నందలి ఒక ఆడిటోరియంకు “రావి నారాయణరెడ్డి స్మారక ఆడిటోరియం కాంప్లెక్స్” గా 2006 లో నామకరణం చేసారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి “రావినారాయణ రెడ్డి మెమోరియల్ నేషనల్ ఫౌండేషన్ పురస్కారం” ను కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఎ.బి.బర్థన్ కు అందజేసాడు.[5]

మరణం
1991, సెప్టెంబర్ 7 న ఆయన తుదిశ్వాస విడిచాడు.

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

సహాయ నిరాకరణ ,ఉప్పు సత్యాగ్రహనాయకుడు ,గోదావరిజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ,,కేంద్ర అసెంబ్లీ , స్టేట్ కౌన్సిల్ కి ,కాకినాడ లోక్ సభ స్థానానికి ఎన్నికై న ,కేంద్ర ఆహారశాకః ఉపమంత్రి -మొసలికంటి తిరుమలరావు

సహాయ నిరాకరణ ,ఉప్పు సత్యాగ్రహనాయకుడు ,గోదావరిజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ,,కేంద్ర అసెంబ్లీ , స్టేట్ కౌన్సిల్ కి ,కాకినాడ లోక్ సభ స్థానానికి ఎన్నికై న ,కేంద్ర ఆహారశాకః ఉపమంత్రి -మొసలికంటి తిరుమలరావు

–మొసలికంటి తిరుమలరావు (జనవరి 29, 1901 – 1970) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు.
దస్త్రం:Mosalikanti tirumala rao.gif
మొసలికంటి తిరుమలరావు
జననం
వీరు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1901, జనవరి 29[1] న శాయన్న పంతులు దంపతులకు జన్మించారు.

వీరు 1921 లో మహాత్మా గాంధీ పిలుపు నందుకొని కాలేజీ చదువులకు వదలి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఏడాది కఠినశిక్ష విధించారు. రాజమండ్రి, చెన్నై, వెల్లూరు జైల్లలో ఆ శిక్ష అనుభవించారు. 1931లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని మరొక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1940 వ్యక్తి సత్యాగ్రహంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని కఠిన శిక్షలను అనుభవించారు.

వీరు తూర్పు గోదావరి కాంగ్రెసు అధ్యక్షలుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1937 నుండి 1940 వరకు కేంద్ర అసెంబ్లీ సభ్యులుగాను, 1945-1947 లో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగాను, 1948-1950 లలో రాజ్యాంగ సభ సభ్యులుగాను, 1950-1952లో తాత్కాలిక ప్రభుత్వం సభ్యులుగా ఉన్నారు.

వీరు 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలలో 2వ, 3వ, 4వ లోక్‌సభలకు కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం[2] నుండి ఎన్నికై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ ఉపమంత్రిగా పనిచేశారు.

మరణం
వీరు 1970 సంవత్సరంలో 70వ ఏట పరమపదించారు.

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

భారతీ నిరుక్తి .30 వ భాగం.13.8.22

భారతీ నిరుక్తి .30 వ భాగం.13.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా ఆత్మ కథ.27వ చివరి భాగం.,12.8.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా ఆత్మ కథ.27వ చివరి భాగం.,12.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-22

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-22

    తుఫాన్

మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జర్మనీ వలస సామ్రాజ్యం ,యూరప్ లో ఆఫ్ట్రో  హంగేరియన్ సామ్రాజ్యం ,పశ్చిమాసియాలో టర్కిష్ సామ్రాజ్యం చీలిపోయి చిన్న చిన్న దేశాలుగా మారాయి .రష్యాలో బోల్షెవిక్ తిరుగు బాటు దార్లు గెలిచారు .జార్ ప్రభువును అతని కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు .ఆఫ్ఘనిస్తాన్ విదేశీ వ్యవహారాలలో స్వతంత్రంగా వ్యవహరించింది .ఇవన్నీ భారత దేశం పై ప్రభావంచూపాయి .రౌలట్ బిల్లు లో రెండు సిఫార్సులు చేర్చి బ్రిటిష్ ప్రభుత్వం అందుకే బిల్లు ప్రవేశపెట్టింది .ఏ వ్యక్తినైనా ప్రభుత్వం నిర్బందించవచ్చు దీన్ని వైస్రాయ్ కౌన్సిల్ లో ఎన్నికైన ప్రతినిదు లంతా తిరస్కరించారు .అయినా 1919మార్చిలో బిల్లు చట్టం అయింది .మహమ్మదాలీ బృందం శాసనమండలికి రాజీనామా చేసింది .దేశమంతా నిరసనలు పెరిగాయి .దీన్ని ప్రభుత్వ విద్రోహంగా అందరూ భావించారు .బిల్లు ఆమోదం పొందటానికి ముందు బెంగాలీ నేషనలిస్ట్ లు ఫిబ్రవరి3 న టౌన్ హాల్ లో సమావేశమయ్యారు .అసంఖ్యాక జనం రావటంతో బహిరంగ సభ జరిపారు .72ఏళ్ళ మోతీలాల్ ఆరోగ్యం క్షీణించినా హాజరయ్యాడు ఆయన్ను బుజాలమీద ఎక్కించుకొని వేదికపైకి తీసుకు వెళ్ళారు .మితవాదులు చాలామంది వచ్చారు .స్పష్టమైన నిరసన తీర్మానం మోతీలాల్ ప్రతిపాదించాడు –‘’ఈ బిల్లు ప్రభుత్వానికి నిరంకుశ అధికారాలు కట్టబెడుతుంది .చట్టబద్ధమైన న్యాయబద్ధమైన పాలన ఇక కనిపించవు .బాధ్యతాయుత ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి .శాసన సభ్యుల పునర్వ్యస్థీకరణ జరిగేదాకా బిల్లు ప్రవేశ పెట్టకూడదు ‘’అని ఎలుగెత్తి చెప్పాడు మోతీలాల్ . 

  ఈ బిల్లులను సవాలుగా తీసుకొని గాంధీ సత్యాగ్రహోద్యమం చేయాలను కొన్నాడు .సత్యాగ్రహ దళం ఏర్పాటు చేశాడు .దేశమంతా హర్తాల్ చేయమని పిలుపు నిచ్చాడు .అందరూ తనమాట మన్నిస్తారనే ఆశాభావం కనపరచాడు .బెంగాల్ మహారాష్ట్ర ,పంజాబ్ లలో విప్లవవాదులు ఉండటం వలన తనమాటకు విలువ ఇవ్వరు అనుకొన్నాడు .హర్తాల్ మార్చి 13 కు బదులు ఏప్రిల్ 16కు మార్చాడు .దేశం లోని ప్రతిపల్లె పట్టణం గాంధీ మాట మన్నించి సంపూర్ణ హర్తాల్ చేసి ఆయనపట్ల అపూర్వ విశ్వాసం కనపరిచింది ప్రజ .అది  ఆయన వ్యూహం ఫలించిన అద్భుతమైన రోజు.అపోహవలన ఢిల్లీలో మాత్రం మార్చి 13 హర్తాల్ జరిగింది .హిందూ ముస్లిం ఊరేగింపు దార్లపై పోలీసులు కాల్పులు జరిపారు .ప్రజలలో నిరసన ప్రబలి స్వామి శ్రద్దానంద్ నాయకత్వాన పెద్ద ఊరేగింపు జరిపి హిందూ ముస్లిం ఐక్యత చాటారు .గాంధీ వెంటనే శాసనోల్లంఘనం తాత్కాలికంగా నిలిపి  వేశాడు .అసంతృప్తితో ఉన్న పంజాబు ప్రజలు ఏప్రిల్ 10న ప్రదర్శన నిర్వహిస్తే ,హింసా దౌర్జన్యాలకు దారితీసి ,10మంది యూరోపియన్లను చంపేయటం తో సైనికపాలన విధించి అన్ని ప్రదర్శనలు నిషేధించారు .ఏప్రిల్ 13న అమృతసర్ లో పౌరులు నిషేధాన్ని ధిక్కరించి సమావేశం జరపగా ,జలియన్ వాలాబాగ్ లో ఒకేఒక దారి ఉండటం వలన జనరల్ డయ్యర్ 90సైనికులతో వచ్చి ప్రజలపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపించాడు .కొరడాలతో కొట్టించాడు .రోడ్లమీదదేకించారు .బ్రిటిష్ పతాకానికి సెల్యూట్ చేయటానికి ప్రజలను మైళ్ళ  కొద్దీ దూరం నడిపించారు .ఈ అమానుష కాండను  పంజాబ్ గవర్నర్ సమర్ధించాడు .ఆయన చెప్పినవన్నీ కట్టు కధలే అని తర్వాత బ్రిటిష్ గూఢ చారి విభాగం తేల్చేసింది .

  డయ్యర్ బుల్లెట్లు భారత ప్రజలని అపూర్వంగా సంఘటిత పరచాయి .పత్రికాసేన్సార్ షిప్ ను ధిక్కరించి పత్రికలు ఆవార్తలు ప్రముఖంగా ప్రచురించి ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్ళాయి .యావత్ భారత దేశం సభ్య ప్రపంచం జలియన్ వాలాబాగ్ ఉదంతానికి చలించి పోయింది . నిరసనగా రవీంద్రనాధ టాగూర్ ప్రభుత్వం తనకిచ్చిన ‘సేనాని ‘’విశిష్ట గౌరవాన్ని తిరస్కరించగా ,దేశ ప్రజలు కార్యోన్ముఖులయ్యారు .ఇద్దరు భారతీయులతో వైస్రాయి ఒక కమిటీ వేసినా అది కంటి తుడుపు చర్య అని  నిరసనలు కట్టలు తె౦చు కొన్నాయి .కలకత్తా టౌన్ హాల్ లో మళ్ళీ జరిగిన సభకు మోతీలాల్ ఘోష్ ను చైర్మన్ గా నామినేట్ చేశారు .ఆయన మాట్లాడ లేనంత నీరసంగా ఉండటం తో ఆయన ప్రసంగా పాఠం ఐ. బి .సేన్ చదివి వినిపించారు –‘’ఇటీవలి సంఘటనలో ఏమాత్రం తప్పులేని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు .గౌరవ ప్రద జీవితం గడుపుతున్నవారు అవమానాల,వేదనల  పాలయ్యారు .దీనిపై ఘనత వహించిన వైస్రాయి ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం భారత ప్రజలను అవమానించటమే .అధికారులకు భయ౦పట్టుకొన్నట్లుంది .పరిస్థితులు చేతులు దాటిపోయినట్లు భావిస్తున్నారు .పంజాబ్ దురంతం ప్రీవీ కౌన్సిల్ లో బట్టబయలు కాకతప్పదు అని వారు శంకిస్తున్నారు .నష్టం భర్తీ అంటూ హడావిడిగా ప్రత్యెక బిల్లు తెస్తున్నారు .దర్యాప్తు కమిటీరిపోర్ట్ వచ్చేదాకా ఆగలేక పోతున్నారు ‘’అని చెప్పాడు .

 ఈ దుర్ఘటన  దర్యాప్తుకుగా ఒక అనధికార కమిటీ కాంగ్రెస్ వేసింది .చిత్తరంజన్ దాస్ ,గాంధీలు మొదటిసారిగా కలుసుకొన్నారు .లోతుగా చర్చించారు ఆసమావేశం మంచి ఫలితాలకు దారి తీసింది .పంజాబ్ అనాగరక అణచి వెతచర్యలను అమృత బజార్ పత్రిక ప్రముఖంగా విమర్శించింది ‘’బ్రిటిష్ అధికారులు ము౦దుగాతమ స్వంత సేవ చేసుకొని తర్వాతే ఇండియా సేవ గురించి ఆలోచిస్తారు ‘’అని కడిగేసింది .’’చట్టబద్ధమైన పాలన ఇక లేదని ప్రజలు భావిస్తున్నారు .ప్రజల్ని పిట్టల్నికాల్చినట్లు కాలుస్తారని భయపడి పోతున్నారు .రౌలట్ చట్టం ప్రాధమిక హక్కులకు మరీ భంగం కలిగిస్తుంది అని గ్రహించి హిందూ ముస్లిం లు ఏకమయ్యారు .జీవితాలు బాగుపడటం దేవునికి ఎరుక ఇంతకన్నా అద్వాన్నం కాకుండా ఉండాలని ప్రజలు కోరుతున్నారు .రౌలట్ చట్టాన్ని ఆమోదించటం తప్పే అని బ్రిటిష్ యంత్రాంగానికి అర్ధమయింది ‘’అని రాశాడు మోతీలాల్ .

  1913నుంచి ప్రభుత్వ ఖజానాలో ఉన్న పత్రిక ధరావత్తు 5వేలరూపాయలు ప్రభుత్వం  నాకేసి ,మరో 10వేలు కట్టమని తాఖీదు పంపారు .మే 15న పంజాబ్ లో ఈ పత్రిక ను నిషేధించారు .కొద్దికాలం లోనే పత్రిక శ్రేయోభిలాషులు డబ్బు కట్టేశారు .పత్రికను ఆర్ధిక ఇబ్బందుల్లో పెట్టాలన్న ప్రభుత్వం ఎత్తుగడ ఫలించకుండా ప్రజలు సహకరించారు .పట్టువదలని విక్రమార్కుడు మోతీలాల్ ‘’బొందిలో ప్రాణం ఉన్నంతవరకు ,మా స్వేచ్చను గుంజుకోనంతకాలం మా విధి మేము నేరవేరుస్తూనే ఉంటాం .ఈ పత్రికా చట్టం నిబంధనలను బట్టి పత్రికను ఆదర్శవంతంగా నడపటం అంటే నిత్య రాజకీయాలు గాలికి వదిలేసి ,బంగాళా దు౦పల మీద అరటి పళ్ళ మీద రాయాలి ‘’అని ఘాటుగా చేరిగేశాడు .భారతీయుల క్రోధాగ్ని ఎంతగా ప్రబలి ఉందొ  డిసెంబర్ 19సంపాదకీయం లో మోతీలాల్ –‘’ఫౌంటెన్ మార్చకుండా నీటి గొట్టాలు మారిస్తే మురికి నీరు వస్తు౦ దేతప్పశుద్ధ  త్రాగు నీరు రాదు .’’అన్నాడు .

  23-12-1919న ఆమోదించిన చట్టం జాతీయవాదులకు అసంతృప్తే మిగిల్చింది .స్వయం పాలన మృగ్యం .దీనివలన ‘’బ్యార్టీ’’అనే పాలన వచ్చింది .విద్య ప్రజారోగ్యం పబ్లిక్ వర్క్స్ మంత్రుల అధీనం లో ఉంటాయి .మంత్రులు శాసనసభలకు బాధ్యులు .మంత్రిజీతం ఏడాదికి 64వేలు .పోలీస్ ,న్యాయశాఖ భూమి శిస్తు లు గవర్నర్ ,ఆయన కౌన్సిలర్ల పరిధిలో ఉంటాయి .కేంద్ర  ప్రభుత్వం  భారతీయ శాసన మండలితో సంబంధం కలిగి ఉండదు .ముస్లిం సిక్కులు ,క్రిస్టియన్లు వేరువేరుగా వోటర్లు .పదేళ్ళ పరిస్థితిని బట్టి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొంటే చేయచ్చు .ఈ చట్టాన్ని ఆమోదయోగ్యం చేయటానికి రాజకీయ ఖైదీలతో సహా డిటిన్యూ ల నందరికి పంచమ జార్జి క్షమాభిక్ష పెట్టి విడుదల చేయించాడు .

 బ్రిటిష్ అధికార వృక్షం వ్రేళ్ళు అవినీతి తో కుళ్లిపోవటాన్ని గాంధీ సహించలేకపోయాడు .సహాయ నిరాకరణే మంత్రం అని భావించి కలకత్తా కాంగ్రెస్ సభలో దాన్ని ఆమోదింప జేశాడు .చరఖాతో నూలువడకటం సర్వ రోగ నివారిణి కాదని బెంగాలీ తత్వ సూత్రధారులు చిత్తరంజన్ దాస్ ,బిపిన్ చంద్రపాల్ నిరసించారు .గ్రామీణ పరిశ్రమలద్వారా దేశ ఆర్ధిక పుష్టి కలిగించాలన్న గాంధీ వాదం తో రైతాంగం బలపరచింది 1920చివరలో బెంగాలీ విప్లవకారుల౦దర్నీ విడుదల చేశారు .భారీగా ప్రజలు సహాయనిరాకరణలో పాల్గొనాలని చిత్తరంజన్ పట్టుబట్టాడు .1920డిసెంబర్లో జరిగిన నాగపూర్ కాంగ్రెస్ అభలో అత్యధిక మెజారిటీతో సహాయనిరాకరణ ఉద్యమ ప్రతిపాదన ఆమోదించారు. దాస్ ,మోతీలాల్ నెహ్రు , కొడుకు జవహర్ లాల్ లు కొత్తగాధీతత్వాన్ని ఆమోదింఛి ప్రజల మనుషులయ్యారు .జాతీయ ఉద్యమం లో అసలు సిసలైన శక్తి ప్రజా బాహుళ్యం నుంచే వెల్లువై ప్రవహించింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .29వ భాగం.12.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా ఆచంట లక్ష్మీ పతి,శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ దంపతులు

డా ఆచంట లక్ష్మీ పతి,శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ దంపతులు

ఆచంట లక్ష్మీపతి (మార్చి 3, 1880 – ఆగస్టు 6, 1962) ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. ఈయన నాటి మద్రాసు ( నేటి చెన్నయ్) లోని ఆయుర్వేద వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయులుగా (1920-1928) సేవలు అందించారు.

బాల్యం-విద్యాభ్యాసం

ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవవరంలో శ్రీ రామయ్య, శ్రీమతి జానకమ్మ లకు 1880, మార్చి 3 న జన్మించారు. ఈయన తాతగారు సుబ్బారాయుడు గారు సంస్కృత పండితులు. ఈయన తండ్రి అతను వైద్య పాటు వ్యవసాయం నేర్చుకోవడం కలలు కన్నారు. అటు వైద్య శాస్త్రం, ఇటు వ్యవసాయం రెండింటిలోనూ మక్కువ గల లక్ష్మీపతి మెట్రిక్యులేషన్, ఎఫ్.ఏ. పూర్తి చేసి స్థానికంగా తహశీల్దారు కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసారు. ఆపైన బి.ఎ. చేసి స్కాలర్‌షిప్పుతో యం.బి.సి.యం (ఆయుర్వేదం) కోర్సు చేసారు. ప్రముఖ వైద్యనిపుణులు పండిత దీవి గోపాలాచార్యులు వద్ద శిష్యరికం చేసారు[1].

సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు వీరికి ఉన్నత పాఠశాల లోని గురువు. ఎఫ్.ఎ పూర్తి చేసిన పిదప ఆయన దవులూరి ఉమామహేశ్వరవావు వద్ద కొంతకాలం క్లార్క్ బాధ్యతలు నిర్వహించాడు. ఉమామహేశ్వరరావు మద్రాసుకు బదిలీఅయిన పిదప ఆయనతో పాటు వెళ్లాడు. ఆ సమయంలో మద్రాసు రాష్ట్రం బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. తరువాత ఆయన 1904 లో బి.ఎ పూర్తి చేసాడు[1]..

రచనలు

వులూరి ఉమామహేశ్వరరావు గారి సహాయము వలన ఈయనకు స్కాలర్‌షిప్ వచ్చుటచే ఈయన మెడిసన్, ఎం.బి.బి.యస్ డిగ్రీలను 1909 లో పూర్తి చేశారు. అల్లోపతీ వైద్యవిద్యను పూర్తి చేసిన తర్వాత ఆయుర్వేదం (పురాతన భారత వైద్య విధానం) ను పండిట్ గోపాలాచార్యులు దీవి వారి అధ్వర్యములో అభ్యసించారు. దీవి గోపాలాచార్యులు 1920 లో మద్రాసునందు ఆయుర్వేద మెడికల్ కాలేజీని నడిపేవారు. ఆ ఆయుర్వేద కళాశాలలో లక్ష్మీపతి ప్రిన్సిపాల్ గా ఎదిగారు.

రచనలు

ఆంగ్ల భాషతో పాటు తెలుగు లోనూ తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించిన డా. ఆచంట లక్ష్మీ పతి1922-27 కాలంలో తెలుగులో “ధన్వంతరి” పత్రికనూ ఆంగ్లంలో ‘ఆంధ్రా మెడికల్ జర్నల్ ‘ ను ప్రచురించారు. ఈయన 63 పుస్తకాలను భారతీయ వైద్యం పై అనగా దర్శనములు, ఆయుర్వేద విజ్ఞానం, ఆయుర్వేద శిక్ష, వనౌషథ విజ్ఞానము, భారతీయ విజ్ఞానము వంటివి వ్రాశారు.ఆయుర్వేదంపై అనేక ఆంగ్ల పుస్తకాలను వ్రాశారు. చలిజ్వరము రోగ లక్షణాలు, దానికి ఆయుర్వేద వైద్యము గురించి చలిజ్వరము[2] పుస్తకాన్ని రాశారు.

జీవిత విశేషాలు

అతని మొదటి భార్య సీతమ్మ యౌవనంలోనే మరణించడంతో ఆచంట లక్ష్మీపతి రుక్మిణమ్మను రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తర్వాతి కాలంలో అవిభక్త మద్రాసు రాష్ట్రానికి ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసింది. లక్ష్మీపతి ఆయుర్వేద వైద్య రంగానికి ఎంతో సేవ చేశాడు. అఖిల భారత ఆయుర్వేద వైద్య సమాజం, ఆంధ్రా ఆయుర్వేద బోర్డు వంటి సంస్థలకు అధ్యక్షునిగానూ వ్యవహరించాడు. మద్రాసులో ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేశాడు.

ఆయుర్వేద వైద్య రంగానికి అతను చేసిన సేవలకు గుర్తింపుగా ఆచంట లక్ష్మీపతి యూనిట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎట్ వాలంటరీ హెల్త్ సర్వీసెస్, చెన్నై, ఆచంట లక్ష్మీపతి న్యూరోసర్జికల్ సెంటర్, వీహెచ్ఎస్, చెన్నై వంటి సంస్థలకు లక్ష్మీపతి పేరును పెట్టారు.

అస్తమయం

వైద్యునిగానే కాక సంఘ సేవకునిగా, రచయితగా, జాతీయవాదిగా సేవలందించిన డా.ఆచంట లక్ష్మీ పతి 1962, ఆగస్టు 6 న 88వ ఏట పరమప

జమీందారీ కుటుంబం నుంచి వచ్చి పట్టభద్రురాలై ,పారిస్ లో అంతర్జాతీయ మహిళా సభ జరిపి ,ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని ,ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ

ఆయుర్వేద ఘన వైద్యులు శ్రీ ఆచంట లక్ష్మీ పాటి గారి ధర్మపత్ని శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ .6-12-1892 జన్మించి 6-8-1951న 59వ ఏట మరణించారు

 జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన రుక్మిణమ్మ కు  ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహం లేదు. అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రురాలైంది. డిగ్రీ తీసుకుంది. తర్వాత మద్రాసులో ఖద్దరు ప్రచారము చేసింది.

1926 వ సంవత్సరం లో పారిస్ లో అంతర్జాతీయ మహిళా సభ జరిగింది. స్త్రీల హక్కుల గురించి చర్చించే ఆ సభకు మనదేశ ప్రతినిధిగా ఆమె వెళ్ళింది. తర్వాత జిల్లా బోర్డు సభ్యురాలిగా, కార్పొరేషన్ మెంబరుగా, విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా పనిచేసింది. 1930 వ సంవత్సరం మే నెలలో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొనింది. వేదారణ్యంలో మరో సత్యాగ్రహం సత్యాగ్రహం లో పాల్గొనింది. ఆనాడు జైలుకు వెళ్ళిన తొలి మహిళల జట్టులో నిలిచింది. ఆ తర్వాత 1940 వరకు ఇన్నో సార్లు జైలుకు వెళ్ళింది. తమిళనాడు ప్రాంతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసింది. 1946 లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేసింది. ఈ విధంగా అవకాశం యిస్తే ఆడవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు అని నిరూపించిన మహిళా రత్నం ఆచంట రుక్మిణమ్మ గారు.

సమాచార రంగ ప్రముఖులు ఆచంట జానకిరాం వీరి కుమారుడు.

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

Ranjan das

బెంగాల్ న్యాయవాది స్వాతంత్రోద్యమనేత ,స్వదేశీ ఉద్యమనేత కలకత్తా మొదటి మేయర్ దేశబంధు –చిత్త రంజన్ దాస్

చిత్తరంజన్ దాస్ ,జమ్నాలాల్ బజాజ్

దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ (C.R.Das) (బెంగాళీ:চিত্তরঞ্জন দাস) (నవంబరు 5, 1870 – జూన్ 16, 1925) బెంగాల్ కు చెందిన న్యాయవాది, స్వాతంత్ర్యోద్యమ నేత.

ఇంగ్లాండులో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని, 1909లో అంతకు ముందు సంవత్సరములో జరిగిన అలీపూరు బాంబు కేసులో, అభియోగము మోపబడిన అరబిందో ఘోష్ను విజయవంతముగా గెలిపించడముతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు. ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యములో బెంగాల్ ప్రాంతములో ప్రముఖపాత్ర వహించి బ్రిటీష్ దుస్తులను బహిస్కరించడానికి నాంది పలికి ఐరోపా దేశ వస్త్రాలను తగుల బెట్టి స్వదేశ ఖాదీని కట్టి అందరికి ఆదర్శప్రాయుడయ్యాడు. తన మితవాదేతర అభిప్రాయాలు వ్యక్తపరచడానికి మోతీలాల్ నెహ్రూతో కలసి స్వరాజ్ పార్టీ స్థాపించాడు.

బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన “ఫార్వర్డ్” అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరును “లిబర్టీ”గా మార్చారు. కలకత్తా కార్పోరేషన్ ఏర్పడ్డాకా దానికి ఆయన మొదటి మేయర్గా పనిచేసారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, గయ సెషన్స్ కు అధ్యక్షత వహించారు. ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యంతో బాధ పడినప్పటిక్, మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటిష్ వారి పై పోరాడారు.

ఆయన అహింసా విధానాన్ని నమ్ముతారు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగ బద్ధమైన విధానాలను అనుసరించాలని భావించేవారు. సమాజ సామరస్యానికి పాటు పడిన, జాతీయ విద్యాప్రగతి వాది. ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు. వారిలో సుభాష్ చంద్ర బోస్ పేరెన్నికగన్నారు.

ఆయన ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్న ఢాకాలో బిక్రంపూర్ కి చెందిన తెలిర్బాగ్‌లోని దాస్ కుటుంబానికి చెందిన వారు. ఆయన భువన్ మోహన్ దాస్ యొక్క కుమారుడు, సంఘ సంస్కర్త అయిన దుర్గ మోహన్ దాస్‌కు మేనల్లుడు. ఈయన బంధు వర్గంలో ప్రసిద్ధులైన ఇతరులు ఎస్.ఆర్.దాస్, సరళా రాయ్, లేడీ ఆబాల బోస్. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు బసంతీ దేవి ఆయన భార్య.

కాంగ్రెస్ కోశాధికారి ,స్వాతంత్ర్య సమరయోధుడు -జమ్నాలాల్ బజాజ్

జమ్నాలాల్‌ బజాజ్‌ (నవంబర్ 4, 1889 – ఫిబ్రవరి 11, 1942) ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు.

జననం
నేటి రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో నవంబర్ 4, 1889 వ సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని జైలు కెళ్ళారు. ఒక సందర్భంలో మహాత్మాగాంధీ బజాజ్‌ను తన ఐదవ కుమారుడిగా ప్రకటించారు. వార్ధాలో లక్ష్మీనారా యణ ఆలయం నిర్మించి దళితులకు ప్రవేశం కల్పించారు. మరణించేవరకు కాంగ్రెస్‌ కోశాధికారిగా పనిచేశారు. 1921 నుండి జీవితాంతం అఖిల భారత చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పరిజ్ఞానాన్ని పెంపొందించేవారికి ఈయన పేరు మీద ప్రతి మూడేళ్ళకొకసారి జమ్నాలాల్‌ బజాజ్‌ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద లక్షరూపాయల నగదు ఇస్తారు.

మరణం
ఫిబ్రవరి 11, 1942లో మరణించాడు

—
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

ప్రముఖ కవి రచయిత, అనువాదకుడు, రేడియో ప్రయోక్త ,’’కవితల్లజ ‘’ –కందుకూరి రామ చంద్రరావు

ప్రముఖ కవి రచయిత, అనువాదకుడు, రేడియో ప్రయోక్త ,’’కవితల్లజ ‘’ –కందుకూరి రామ చంద్రరావు
కందుకూరి రామభద్రరావు ( 1905 జనవరి 31, – 1976 అక్టోబరు 8, ) ప్రముఖ తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. వీరు గోదావరీ నది తీరంలో రాజవరం గ్రామంలో జన్మించారు.వారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని రాజవరం. వీరు పిఠాపురం మహారాజా కళాశాలలో పట్టభద్రులై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆత్రేయపురంలో మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో సంస్థాపక ప్రధానోపాధ్యాయులుగా ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పారు. వీరు రాజవరం పంచాయితీకి మొదటి అధ్యక్షులు. వీరు కవిగా తరంగిని, వేదన, జయపతాక, కవితాలహరి మొదలైన గేయాలను, గేయమంజరి అనే గేయ కావ్యాన్ని, ఎందరో మహానుభావులు అనే వచన గ్రంథాన్ని రచించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చిత్ర నాటికను తెలుగు భాషలోకి అనువదించారు. వీరి స్వీయ కవితలను “Searching Strains”గా ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు “Leaves from a diary” అనే ఆంగ్ల గ్రంథం రచించారు.
జీవితం
రామభద్రరావుగారి తండ్రి కందుకూరి సూర్యనారాయణ ఉత్తమ సంస్కారం గల సంపన్న గృహస్థు. ఆ గ్రామానికి కరణం కూడా. అతనే రాజవరంలో శివ, కేశవులకు ఆలయాలను కట్టించిన ధర్మకర్త. తల్లి నాంచారమ్మ. సౌజన్యం, సౌందర్యం, మూర్తీభవించిన పురంధ్రి. రామభద్రరావు ప్రాథమిక విద్య రాజవరంలోనే గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన గురువు వద్ద జరిగింది. ఆ రోజుల్లో అక్కడ ప్రాథమిక పాఠశాల కూడా లేదు.ఉన్నత పాఠశాల తరగతులు రాజమహేంద్రవరంలో సుప్రసిద్ధ వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాల.జయంతి గంగన్నపంతులు ప్రధానోపాధ్యాయుడుగా ఉండేవాడుు.ఆదర్శ ప్రధానోపాధ్యాయులుగా ప్రసిద్ధి పొందారు. రామభద్రరావు తగిన వయసులోనే వివాహం జరిగింది. భార్య పేరు రామలక్ష్మి. F.A., B.A.లు కాకినాడ పిఠాపురం మహారాజా కళాశాలలో చదివారు. ఆ రోజులలో వేమూరి రామకృష్ణారావు ప్రిన్సిపాల్ గా ఉండేవాడు. అతను ఆంగ్లంలో గొప్ప పండితుడు. క్రమ శిక్షణకు పెట్టింది పేరు. పెద్దాడ రామస్వామి. కాళ్ళకూరి సత్యనారాయణ ప్రభ్రుతులు అధ్యాపకులుగా ఉండేవారు. గాంధీ మహాత్ముని సారథ్యంలో స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజులు. సాంఘికంగా రఘుపతి వెంకటరత్నం నాయుడి బ్రహ్మసమాజ ప్రభావం కాకినాడలోను తత్రాపి కళాశాలలోను వ్యాపించిన రోజులు. కాలేజీ విద్యార్థిగా రామభద్రరావు ఆంగ్ల ఆంధ్రభాషలలో వక్తృత్వపు పోటీలలో బహుమతులు సంపాదించాడు. విద్యార్థులలో ప్రసిద్ధి పొందారు. ప్రిన్సిపాల్ రామకృష్ణారావు, పెద్దాడ రామస్వామి గార్లకు ప్రియతమ విద్యార్థి. F.A. పరీక్షలో తెలుగులో ప్రథమంగా నిలిచి ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకాన్ని పొందాడు. B.A. పరీక్ష ఉత్తీర్ణులవటానికి అంతరాయం కలగటం వలన కొన్నాళ్ళు స్వగ్రామం రాజవరంలో ఉన్నాడు. ఆ గ్రామానికి పంచాయతీ ఏర్పాటు చేసి సంస్థాపక అధ్యక్షులు అయ్యాడు. ప్రాథమిక పాఠశాల భవనం ఏర్పాటు చేశాడు. చిత్తరంజన్ దాసు పేరిట ఒక గ్రంథాలయాన్ని కూడా ప్రారంభించాడు.
B.A. పాసయిన తరువాత కాకినాడ కళాశాల తెలుగు డిపార్ట్ మెంటులో ట్యూటరుగా పనిచేశాడు. పెద్దాడ రామస్వామి ప్రిన్సిపల్ గా ఉండేవాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి పి.యల్.యన్. శర్మ, సి. సీతారామమూర్తి, బులుసు వెంకటేశ్వర్లు, జనమంచి కామేశ్వరరావు ప్రభృతులు లు కూడా రాజావారి కళాశాలలో పని చేసే వారు. కళాశాల యాజమాన్యం వాడుక భాషలో రచనలు చేసినందుకు కొంతమందికి ఉద్వానం చెప్పారట. అందులో రామభద్రరావు గారొకడు.
తరువాత రాజమండ్రి ప్రభుత్వ ట్రయినింగ్ కాలేజీలో బి.ఇ.డి. ట్రయినింగ్ పొందాడు. అంతర కళాశాల వక్తృత్వపు పోటీలలో ట్రయినింగు కాలేజీ జట్టులకు నాయకత్వం వహించి ఇంగ్లీష్ తెలుగులోను ప్రథమ బహుమతులు సాధించాడు. కాలేజీ సెక్రటరీగా, మేగజైన్ ఎడిటరుగా ప్రిన్సిపాల్ ప్రభ్రుతుల మన్ననలు పొందాడు. ట్రయినింగ్ అయిన తర్వాత వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. జయంతి గంగన్న పంతులు ప్రధానోపాధ్యాయులుగా ఉండేవాడు. ఉపాధ్యాయుడిగా చాలా మంది విద్యార్థులను ఉత్తేజపరిచాడు. మల్లెపుడి పళ్లంరాజు రామభద్రరావుపై ఉండే సదభిప్రాయం వల్ల అతనని సమ్మతపరిచి జిల్లా బోర్డు సర్వీసులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగానే గొల్లపాలెం అనే చిన్న గ్రామంలో హయ్యరు ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేశాడు. ఆ ఊరి ప్రజలలో కలిగించిన చైతన్యం కారణంగా, వారు ‘వేదన’ అనే ఖండకావ్య సంపుటిని ప్రచురించి, కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సన్నిధిలో సన్మానం పొంది,ఆ సన్మానంలో ‘కవితల్లజ’ అనే బిరుదు ఇచ్చారు.
తరువాత పేరూరు మిడిల్ పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించినపుడు అతనిని హెడ్మాస్టారుగా తీసుకున్నారు. పేరూరు ఉన్నత పాఠశాల హెడ్మాస్టారుగా నాలుగైదుళ్ళు పనిచేశారు. శ్రీ వేదుల వారిని కూడా పెద్దాపురం నుంచి పేరూరు పాఠశాలకు తెలుగు పండితులుగా తీసుకువచ్చాడు. ప్రఖ్యాత చిత్రకారుడు పిలకా నరసింహమూర్తి కూడా పేరూరు ఉన్నత పాఠశాలలో కొంత కాలం పనిచేశారు. పేరూరు ఉన్నత పాఠశాల జిల్లా బోర్డుకి అప్పగించటంతో రామభద్రరావు రాజోలు, అమలాపురం హైస్కూళ్ళలో ప్రధానోపాధ్యాయులుగా చేరారు. మధ్యలో స్వస్థలమైన ఆత్రేయపురం ఉన్నత పాఠశాల సంస్థాపక హెడ్మాస్టారుగా పనిచేశాడు. 1960 సం.లో అమలాపురం ఉన్నత పాఠశాల హెడ్మాస్టారుగా రిటైర్డు అయిన సందర్భంగా విద్యాశాఖామంత్రి పట్టాభిరామారావు అధ్యక్షతన సన్మానం పొందారు. పింగళి, వేదుల, కాటూరి, కోలవెన్ను రామకోటేశ్వరరావు, మధునాపంతుల ప్రభృతులు పాల్గొన్నారు.
పదవీ విరమణ అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రయోక్తగా ఒక దశాబ్ది కాలం పనిచేసి ఎన్నో గేయాలు, ప్రసంగాలు, కవితలు, సంగీత నాటికలు ప్రసారం చేశాడు.హెడ్మాస్టారుగా రిటైర్డు అయిన కొద్ది నెలలకే, విజయవాడ ఆకాశవాణికి విద్యావిషయిక ప్రయోక్తగా ఎంపికయ్యాడు. ఆకాశవాణిలో సుమారు పది సంవత్సరాలు విధులు నిర్వహించాడు. స్టాఫ్ ఆర్టిస్టులు అసోసియేషన్ కి అధ్యక్షులుగా పనిచేశాడు. అనేక గేయాలు, సంగీత రూపకాలు, విద్యావిషయనాటికలు రచించారు. కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఆంగ్లంలో ప్రసంగాలు చేశారు. 1970లో విజయవాడ కేంద్రం నుంచి రిటైరు అయ్యారు.రామభద్రరావు తన జీవితాన్ని గాంధీమహాత్ముడు, సాహితీ రచనలను రవీంద్ర కవీంద్రుడు ప్రభావితం చేశావని చెపుతూ ఉండేవారు.
తర్వాత అనారోగ్య కారణంగా కొన్నాళ్ళు స్వగ్రామం రాజవరంలో ఉన్నారు. ఇంతలో ఆత్మీయుడు, అల్లుడు శశాంక ఆకస్మిక మరణం వలన హైదరాబాదులో శేష జీవితాన్ని గడిపి 1976 అక్టోబరు 8న తేదిన కన్నుమూశారు.
రామభద్రరావు రచనలు
• పద్య కవితలు: లేమొగ్గ, తరంగిణి, వేదన, జయపతాక, నివేదనము, కవితాలహరి
• గేయ కవిత: గేయమంజరి, గేయ నాటికలు
• ఆంగ్ల రచనలు: Searching strains (Rendering of his poems into English), Leaves from a diary.
• అనువాదం: చిత్ర (రవీంద్రుని రచన)
• వచనం: ఎందరో మహానుభావులు
కందుకూరి రామభద్రరావు సమగ్ర సాహిత్యం
2005 సంవత్సరంలో ప్రచురించబడిన తెలుగు పుస్తకం రచయిత శతజయంతి సందర్భంగా ఉత్సవ కమిటీ వారి విశేష ప్రచురణ.[1]
• చిత్ర (1932) (విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చిత్ర నాటికకు తెలుగు అనువాదం)
• తరంగిణి (1935)
• వేదన (1942)
• జయపతాక (1953)
• గేయమంజరి (1955, 1986)
• నివేదనము (1958)
• ఎందరో మహానుభావులు (1964)
• దేశభక్తి గేయాలు (1986)
• కవితాలహరి (1989)
• ఆకాశవాణి సంగీత రూపకాలు (2005)
  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.25వ భాగం.10.8.22

Video link

Part -2

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

  గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-21

  గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-21

ఖైదీలను చిత్ర హింస పాలు చేస్తున్న ప్రభుత్వాన్ని కార్మిచెల్ తీవ్రంగా వ్యతిరేకించినందుకు 1917మార్చి లో ఇండియా వదిలి పెట్టి వెళ్ళాల్సి వచ్చింది .పోలీస్ రాజ్ ను నిరంతరం వ్యతిరేకించే మోతీలాల్ ఆయనతో కలిసి అరెస్ట్ అయిన యువకుల విడుదలకు మధ్యవర్తిత్వం నడిపాడు .అతడు వెళ్ళిపోయే సమయానికి 800మంది ఇంకా జైలులో మగ్గి ఉన్నారు .అతని స్థానం లో రోనాల్డ్ షీ వచ్చాడు .విప్లవోద్యమాన్ని అణచి వేయటం తప్ప గత్యంతరం లేదని భావించాడు .

  పరిణామాల సంవత్సరం

1917 మాంటేగ్ సంస్కరణలతో పాటు ఎన్నెన్నో పరిణామాలు తెచ్చిన సంవత్సరంగా గుర్తుండిపోయింది .ఇండియాలో కుట్రలు తిరుగుబాట్లు గురించి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వటానికి బ్రిటన్ నుంచి వచ్చిన జస్టిస్ వాలార్ట్ కమిటీ ఏర్పాటైంది .ఈ రెండు భారత స్వాతంత్ర్య పోరాటం నిర్దుష్టమైన రూపం దాల్చాటానికి తోడ్పడ్డాయి.మోతీలాల్ కు పత్రికకు ఇవి కొత్త కష్టాలను తెచ్చాయి .1917మే 22 న ఆయనపై కోర్టు ధిక్కరణ నేరం మోపారు .కోర్టే ప్రాసిక్యూటర్ అయిఅనప్పుడు ఆరోపణమీద విచారణ కు ఆకోర్టు కు అధికారం లేదని ప్రముఖ న్యాయవాదులు ఆరోపించారు .చివరికి సాక్షాధారాలు లేకపోవటం తో కేసు వెనక్కి తీసుకొన్నది ప్రభుత్వం .ఇది మోతీలాల్ కు డైరెక్టర్ లకు లభించిన ఘన విజయం . 1915మొదట్లో గాంధీ తనగురువు గోఖలే మరణానికి ముందు రెండేళ్ళు దక్షిణాఫ్రికాలో ఉండి, ఇండియా వచ్చాడు .దక్షిణాఫ్రికాలో తాను  విజయం సాధించిన అహింసా యుత పోరాటం ఇండియాలోనూ విజయాన్ని సాధిస్తుందని గాంధీ భావించాడు .1917ఏప్రిల్ లో బీహార్ లోని చంపరాన్ జిల్లా ముఖ్యపట్టణం మొతీహారి కి గాంధీ వచ్చాడు .నీలి రైతుల పక్షాన నిలిచి ధైర్యం చెప్పాడు ఆయన్ను అక్కడి నుండి వెళ్ళిపోవాలని పోలీసులు వత్తిడి చేసినా వెళ్ళలేదు .ఆయనపై కేసుపెట్టి విచారించగా ,తన తప్పు ఏమీలేదని ,కావాలంటే తనను శిక్షించవచ్చునని కోర్టు ను సవాల్ చేశాడు .అంతరాత్మ ప్రబోధం అనే అత్యున్నత న్యాయ సూత్రానికి అది విరుద్ధం అన్నాడు .మేజిష్ట్రేట్ కంగుతిని వాయిదా వేసి గవర్నర్ ను సలహా ఇవ్వమని కోరాడు .గాంధీ నిర్భీకతను ఆయన్ను హీరోగా ప్రజలముందు నిలబెట్టింది .గవర్నర్ ఎందుకైనా మంచిదని కేసు ఉపసంహరించాడు .గాంధీ మాత్రం రైతులతో బుజం కలిపి సమస్యలు అధ్యయనం చేసి ,ప్రభుత్వం తో దర్యాప్తు కమీషన్ వేయించి ,నీలిపె౦పకం దార్ల ఇష్టా రాజ్యానికి స్వస్తి పలికించాడు .

  సత్యాగ్రహ శక్తి జనసామాన్యానికి బాగా అర్ధమైంది .అహింసా మార్గం లోనే దేనినైనా సాధించాలని మోతీలాల్ మొదటి నుంచి నమ్మాడు .గాంధీ విజయం ఆయనకు మరింత హుషారిచ్చింది .బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి సారి గాంధీజీ ఇక్కడే చంపారాన్ లో కలిశారు .చంపారాన్ పొత్తిళ్ళలో స్వాతంత్ర్య పోరాట బిడ్డ ఎదుగుతూ ఉంటె ,మాంటేగు తర్వాతి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు .ప్రభుత్వం శాలాట్ కమిటీని వేసింది .ప్రపంచ మంతటా విప్లవ బీజాలు వ్యాప్తి చెందాయని గ్రహించారు .భారత సైన్యం లో సిక్కులు పంజాబ్ పేదరైతాంగం కూడా విప్లవం లో పాలుపంచుకొనే ధోరణి ప్రబలమైంది .

  ఎన్నో ఏళ్ళ క్రితం అమెరికా కెనడాలకు వలసపోయిన భారతీయులు ముఖ్యంగా సిక్కులు ‘’గదర్ పార్టీ ‘’స్థాపించారు .బెంగాల్ లోని ‘’యుగంతర్ పార్టీ’’ తో సంబంధాలు పెట్టుకొన్నారు .మొదటి ప్రపంచయుద్ధం మొదలవగానే ఈ సిక్కులు బ్రిటిష్ ప్రభుత్వం పై సాయుధ పోరాటం చేయటానికి ఇండియా వచ్చారు .కానీ ఈ భారీ పధకం నీరు కారిపోయింది .అయినా వారి ప్రయత్నాలు ఆగలేదు .1916చివరకు ఈశక్తులు పూర్తిగా క్షీణించి పోయాయి .యుద్ధం లో మిత్రరాజ్యకూటమి గెలుపు గ్యారంటీఅని తేలింది .సంస్కరణలు ప్రకటించే వరకు ప్రభుత్వానికి సహనం నశించింది .అణచి వేస్తె ప్రజలు కుక్కిన పేనులుగా ఉంటారన్న  గర్వం పెరిగింది .రౌలట్ నివేదిక ప్రభుత్వాన్ని సంతృప్తి పరచేట్లుగా తయారైంది .రీఅప్పీల్ కు అవకాశం ఇవ్వలేదు .మాంటేగు సంస్కరణలకు ము౦దేరౌలట్ సంస్కరణలు వచ్చి సంస్కరణలకు గండి కొట్టింది .తెల్ల ప్రభుత్వ కుత్సితఉ ద్దేశ్యాలు ప్రజలకు బాగా తెలిసిపోయాయి .1918ఆగస్ట్ బొంబాయి కాంగ్రెస్ ప్రత్యెక సభలో గాంధీతో సహా మితవాదులు విడిపోయి ‘’జాతీయ విమోచనా సమాఖ్య ‘స్థాపించారు .మరో 15ఏళ్ళలోపు పూర్తిస్వరాజ్యం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది .మా౦టేగు సంస్కరణలను మోతీలాల్ సమర్ధించి ,జాతీయవాదులను విశేషంగా ఆకర్షించాడు .అనిబి సెంట్ కూడా మద్దతు పలికింది .కొందరు అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులతో కలిసి మోతీలాల్ బొంబాయి నుంచి పూనా వెళ్లి తిలక్ ను కలిశారు హో౦ రూల్  విషయం పై  చర్చించటానికి .తీవ్ర ఆస్వస్థత వలన మోతీలాల్ మొదటి రోజు సమావేశానికి వెళ్ళలేదు .రెండవ రోజు నీరసం తోనే కొన్న మాటలు మాట్లాడాడు .ఏడేళ్ళు జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన చిదంబరం పిళ్ళై కనిపించగానే ఆయనకు ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకు వచ్చింది .’’మిత్రమా ‘’అంటూ ఆప్యాయంగా కౌగలించాడు .1918 తుఫాను ముందు ప్రశా౦త౦ గా  గడచి పోయింది .

  సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వెట్టి చాకిరివిముక్తికి  నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన,గెరిల్లా పోరాటం చేసిన శాసన సభ్యురాలు  ఆరుట్ల కమలాదేవి

వెట్టి చాకిరివిముక్తికి  నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన,గెరిల్లా పోరాటం చేసిన శాసన సభ్యురాలు  ఆరుట్ల కమలాదేవి

ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు, మాజీ ఎమ్మెల్యే.[1]

జీవిత విశేషాలు

ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో పూర్వపు నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది.[2] వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించడమే కాకుండా ఉద్యమాలలో కూడా భర్తతో పాటు పాల్గొంది. ఆంధ్రమహాసభలకు కూడా హాజరై ఉత్తేజాన్ని పొందింది. నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి జైలుకు వెళ్ళిది. 1946-48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటుచేసింది.[3] 1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆలేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికైనది. శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా, పుచ్చలపల్లి సుందరయ్య చికిత్సకోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది.

విరోచిత తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం జాతీయోద్యమ చరిత్రలో నూతనాధ్యాయాన్ని తెరచింది. ఈ పోరాటానికి నాయకత్వ పాత్ర వహించింది కమ్యూనిస్టుపార్టీ. అందులో మహిళల పాత్ర అపూర్వం, అనిర్వచనీయం. దానికి ప్రత్యక్ష నిదర్శనం వీరవనిత ఆరుట్ల కమలాదేవి. తన తరం మహిళలు గృహిణులుగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో పెళ్ళికి ముందు “రుక్మిణి”గా వుండి ఆ తరువాత కమలాదేవిగా మారి కమ్యూనిస్టు ఉద్యమ వీరనారీమణులలో ఒకరిగా 2001 జనవరి 1 న కన్నుమూశారు. ఎ.ఆర్ గా అంతా పిలుచుకునే సాయుధపోరాట సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్యగా, రాజకీయరంగంలో కూడా భర్తతోపాటు కొంగుబిగించి తుపాకీ చేబూని గెరిల్లాపోరాటం సాగించిన పోరాట వీరగాథలు నేటికీ యువతరానికి ఒక ఉత్తేజం.

పోరాట జీవితం

చలూరు గ్రామం గెరిల్లా దళాలకు ఆనాడు ఒక ముఖ్యకేంద్రం. చల్లూరు-వెంకటాపురం గుట్టలను చుట్టుముట్టి రిజర్వు పోలీసులు సాగించిన తుపాకీగుళ్ళ దెబ్బలకు ఎదురుకాల్పులు జరుపుతూ దళాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా విప్లవ దంపతులు కమలాదేవి, ఎ.ఆర్. శత్రు మూకలను అమెరికన్ రైఫిల్ తో తిప్పికొట్టిన తీరు నాటి పోరాట యోధుల స్మృతి పథంలో చెరగని ముద్రలు వేశాయి. పురిటిబిడ్డను వదిలి ఉద్యమకార్యకర్తగా ఆమె సాగించిన గెరిల్లా పోరాటం, కొనసాగించిన అజ్ఞాతవాసం, ఆ తరువాత వరంగల్, ఔరంగాబాద్, హైదరాబాద్లలో మూడు సంవత్సరాలకుపైగా ఆరుట్ల కమలాదేవి అనుభవించిన జైలుజీవితం – పోరాట వటివులో ధైర్యసాహసాలలో ఆమెను మరో రూన్సీలక్ష్మిగా నిలబెట్టింది. జైలునుండి విడుదల కాగానే 1952లో ఆలేరు నియోజకవర్గం నుండి శాసనసభకు ఆమె ఘనవిజయం సాధించారు. ఆ తరువాత రెండు పర్యాయాలు అదే నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు ఆభ్యర్ధిగా ఎన్నికై పార్టీ శాసనసభాపక్షం ఉపనాయకులుగా (కామేడ్ పుచ్చలపల్లిసుందరయ్య నాయకులు) ఎన్నిక కావడం కమలాదేవి విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనం. కమ్యూనిసు పార్టీలో చీలిక అనంతరం సిపిఐ శాసన సభాపక్షం నాయకురాలిగా కొనసాగారు. శాసనసభాపక్ష నాయకత్వం ఒక మహిళకు దక్కడం అదే మొదటిసారి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అదే ఆఖరిసారి కూడా, తన జీవిత కాలంలోనే స్త్రీ శక్తికి, విప్లవస్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన వ్యక్తిత్వం కమలాదేవిది. కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ అందజేసినపుడు ప్రశంసాపత్రంలో ఆమెను అపరరుద్రమదేవిగా కీర్తించడంలో అతిశయోక్తి లేశమాత్రం కూడా లేదు. తెలంగాణా సాయుధ సమరం రోజులలో ఆమెచూపిన చొరవ, ధైర్యసాహసాలు ఆశ్చర్యం గొలిపేవి. విన్గవదీక్షలోను, కార్యాచరణలోనూ ఆమె కున్న-విశ్వాసం అనన్యసామాన్యమైనవి. పోరాట రంగంలో వీరవనితగాను, శాసనసభలో ప్రజాపాణిగా ప్రతిబింబించడంలోనూ, ఆ తరువాత మహిళా సమాఖ్య నాయకురాలిగా స్త్రీల సమస్యలపై కొనసాగించి పోరాటంలోనూ, ఆమె కనబరచిన దీక్షాదక్షతలు నేటితరానినే గాక భవిష్యత్ తరాలకు మార్గదర్శకం

 జనవరి 2001లో 81వ  ఏట విప్లవ మహిళాసింహం ఆరుట్ల కమలాదేవి మరణించింది .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి .28వ భాగం.11.8.22

భారతీ నిరుక్తి .28వ భాగం.11.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా ఆర్ధిక నిపుణులు ,ప్రనుఖ గాంధేయవాది ,ఆంధ్రరాష్ట్రం కోసంమొట్టమొదట నిరాహార దీక్ష పూనిన ,స్వాతంత్ర్య సమర యోధులు వినయాశ్రమ స్వామిసీతారాం –శ్రీగొల్లపూడి సీతారామ శాస్త్రి గారు

మహా ఆర్ధిక నిపుణులు ,ప్రనుఖ గాంధేయవాది ,ఆంధ్రరాష్ట్రం కోసం మొట్టమొదట నిరాహార దీక్ష పూనిన ,స్వాతంత్ర్య సమర యోధులు వినయాశ్రమ స్వామిసీతారాం –శ్రీ గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు

గొల్లపూడి సీతారామశాస్త్రి లేదా స్వామి సీతారాం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది.

జీవిత విశేషాలు

గొల్లపూడి సీతారామశాస్త్రి గుంటూరుకు చెందినవారు.మొదట న్యాయవాద వృత్తిని చేపట్టి, మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. జమీందారీ లావాదేవీల మొదలుకొని పలు కేసుల్లో పనిచేసిన ఆయన, వృత్తిలో గట్టివాడిగా పేరు సంపాదించుకున్నారు.[1]

గొల్లపూడి సీతారామశాస్త్రి గాంధేయవాదిగా జీవితాన్ని సాగించారు. ఆయన మంచి ఉపన్యాసకులు. వేలమంది ముందు నిలబడి ఉపన్యసిస్తున్నా ఆర్థిక అవసరాలు, వరుమానాలూ, ఖర్చులు వంటి అంశాలపై ప్రసంగించాల్సివస్తే కాగితం, కలం అవసరం లేకుండా నోటిలెక్కలపై ఆర్థికవేత్తలను మించి మాట్లాడగల దిట్ట.

స్వాతంత్ర సమరం

1921లో మహాత్మాగాంధీ పూర్ణస్వరాజ్యం పిలుపునిచ్చి ప్రభుత్వ సేవలు, కోర్టులు, కళాశాలలు విడిచిరమ్మని పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకుని లాభదాయకంగా ఉన్న తన ప్లీడరు వృత్తిని విడిచిపెట్టి జాతీయ సమరంలోకి చేరారు.

మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం 1930 లో మొదలుపెట్టినపుడు, ఆంధ్రలో జాతీయోద్యమ స్ఫూర్తిని రగుల్కొలిపేందుకు శిబిరాలను నెలకొల్పదలచారు. దానిలో భాగంగా సీతారామశాస్త్రి గారు తుమ్మల బసవయ్య, దుర్గాంబ దంపతులు సహకారంతో గుంటూరు జిల్లాలో కావూరులో వినయాశ్రమం ఏర్పాటు చేసారు. తుమ్మల బసవయ్య దంపతులు తమ యావదాస్థినీ ఈ ఆశ్రమానికి అర్పించారు.సీతారామ శాస్త్రి గారు తనకున్న ఒక ఎకరం భూమిని, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు 26 ఎకరాల భూమిని ఈ ఆశ్రమానికి దానం ఇచ్చారు. 65 ఎకరాల స్థలంలో ఈ ఆశ్రమం నెలకొని ఉంది. ఈ ఆశ్రమవాసిగా మారి సీతారామ శాస్త్రి గారు స్వామి సీతారాం గా పిలవబడ్డారు, జాతీయోద్యమంలో వీరి నిర్వహణలో వినయాశ్రమం నిర్వహించిన పాత్ర ప్రశస్థమైనది.

ఈ ఆశ్రమాన్ని గాంధీజీ చేతులమీదుగా 1933 డిసెంబరు 23 తేదీన ప్రారంబించబడింది. గాంధీజీ వినయాశ్రమంలో రెండురోజులు ఉండి ప్రజలలో స్వాతంత్ర్య ఉద్యమం గురించి ప్రేరణ కలిగించారు.

వినయాశ్రమంలో 1934 ఆయుర్వేద వైద్యశాల స్థాపించారు. పిల్లలకోసం గురుకుల పాఠశాల స్థాపించారు.1935లో మీరా బెన్ చేత స్వరాజ్య స్థూపం ఆవిష్కరింపజేశారు.

హరిజన సేవాయాత్రలో భాగంగా గాంధీజీ 1937 జనవరి 23 న రెండవసారి వినయాశ్రమం సందర్శించి తుపాను బాధితుల కోసం విరాళాలు సేకరించాడు. గ్రామ పారిశుద్ధ్యం, హరిజన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు సీతారాం గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. దీంతో ఆంధ్రాలో ఉద్రిక్త భరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తరువాత, 1951 సెప్టెంబరు 20న ఆచార్య వినోబా భావే అభ్యర్ధనపై ఆయన తన దీక్షను విరమించాడు.

మరణం

స్వామి సీతారాం గారు 1960 ఏప్రియల్ 9న వినయాశ్రమం లో పరమపదించారు[2].

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.25వ భాగం.10.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-20

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-20

1913లోబెంగాల్ విద్యా శాఖకు ఇంగ్లాండ్ నుంచి కొత్త డైరెక్టర్ ను దిగుమతి చేశారు .అబ్దుల్ రసూల్ ,అబ్దుల్లా అల్మామున్ ఘరావర్తి ,కేపి జమాస్వాల్ అనే ముగ్గురు మేధావుల్ని యూని వర్సిటి లెక్చరర్స్ గా ప్రభుత్వ సమ్మతి తో తిరస్కరించారు .దీనిపై అమృత బజార్ పత్రిక ‘’యూనివర్సిటి పై బ్రిటిష్ అధికారుల పెత్తనం పెంచుతున్నారు .దీనివలన మన పిల్లల విద్యకు విఘాతం కలుగుతుంది .’’అని ప్రజాభిప్రాయాన్ని మన్నించి రాశాడు మోతీలాల్ .టౌన్ హాల్ లో జరిగిన పెద్ద సభకు అన్ని వర్గాల మేధావులు ,ప్రజలు హాజరై ప్రభుత్వ విధానం పై దుమ్మెత్తి పోశారు .బెంగాల్ ను విభజించాలనే ఇంకా పట్టుదలతో ఉండటం సిగ్గు చేటు ‘అన్నారు .మోతీ లాల్ ఈ సభలో చాలా ఘాటుగా విమర్శించినా ,ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు .ఆయన తన ప్రసంగం లో ‘’బిడ్డ తల్లిపై కాకుండా బిడ్డపై ఎక్కువ ప్రేమ కనబరచే స్త్రీని మంత్రగత్తె అంటారు .మనపిల్లలకు మన జాతీయతే సంరక్షణ .విదేశీయులకు ప్రేమాదరాలు ఉండవు ‘’అన్నాడు. కార్ని చెల్ అన్నిటికీ అడ్డు పడి వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు .

  1913లో బెంగాల్ దుఖదాయిని దామోదర్ నదికి విపరీతంగా వరదలు వచ్చాయి .హుగ్లీ ,మిడ్నాపూర్ జిల్లాలు పూర్తిగా మునిగిపోయాయి .ప్రజలు సహాయార్ధం ముందుకు దూకారు .భారీగా నిధులు సేకరించి అందించారు .కార్మిచెల్,ప్రధాన న్యాయ మూర్తి అధ్యక్షతన ఒక సహాయ సంఘం ఏర్పడింది .దీనిలో మెంబర్ అయిన మోతీలాల్ హృదయాలు కరిగెట్లు ప్రజలకు విజ్ఞప్తి చేశాడు –‘’ప్రజలు లక్ష రూపాయన నిధి సేకరిస్తే ,ప్రభుత్వం మరో తొమ్మిది లక్షలు అందిస్తుందని ఆశించ వచ్చా?ప్రజాభిప్రాయం సేకరించి ముందుకు కదలండి .అందరూ ఒప్పుకొంటారు ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు’’అన్నాడు .దేశం నలుమూలల నుంచి భారీగా ఆర్ధిక ఆర్దికేతర సాయం లభించింది .రామకృష్ణా మిషన్ ,అజ్ఞాత ఉద్యమ నాయకులు ప్రజలకు విశిష్టమైన సేవలందించి అభినందనలు పొందారు .అజ్ఞాత వాలంటీర్లు గా చాలామంది యువకులు చేరారు .ఈ వరద బాధితులను ఒడ్డున పడేసిన ఘనత అంతా యువతదే .

  మోతీలాల్ ను అనేక సాంస్కృతిక రంగాలు కూడా ఆహ్వానించాయి .చిన్నప్పటి నుంచీ సంగీతం పై మక్కువ ఉండటం వలన సంగీత కచేరీలకు హాజరయ్యేవాడు .శాస్త్రీయ ద్రుపద ,ఖయాల్ ,వైష్ణవ పదావళి కీర్తనలంటే ఆయనకు మహా ఇష్టం .భారతీయ ఆట కబాడీ ఇష్టం .

 మొదటి ప్రపంచ యుద్ధం

మహా యుద్ధం అని పిలువబడిన మొదటి ప్రపంచ యుద్ధం 4-8-1914న ప్రారంభమవగా భారత్ బ్రిటిష్ పక్షాన నిలిచింది .ఈ కష్ట సమయంలో ప్రభుత్వానికి సాయం చేస్తే తర్వాత అది మనకు మేలు చేస్తుందని ‘’యోజేరేట్లు’’అంటే అతివాదులు ,మితవాదులు కాని వారు భావించారు .బెంగాల్ ఉన్నత వర్గ ముస్లిం లు పూర్తిగా ప్రభుత్వాన్ని సమర్ధించారు .మధ్యతరగతి ముస్లిం లు నమ్మలేదు .అబ్దుల్ కలాం ఆజాద్ ,మహమ్మదాలీ ,షిబ్లినో మొనీలు కాంగ్రెస్ వైపు వచ్చారు .1913లండన్ ఒడంబడికతో ముస్లిం లు ప్రభుత్వానికి దూరమయ్యారు .జాతీయోద్యమం పట్ల మరింత విధేయత కనపరచాలని మహామ్మాదాలీ జిన్నా ప్రకటించాడు .

  ఇరకాటం లో ఉన్న పరప్రభుత్వానికి మరింత ఇబ్బందులు కలిగించాలని విప్లవ వర్గం భావించింది .విదేశీ ప్రభుత్వాన్ని పడగొట్టి తిరుగుబాటుచేయటానికి ఆయుధాలు డబ్బూ సమకూర్చటానికి జర్మన్ ప్రభుత్వంతో ,యూరప్ ,అమెరికాలలోని ఆవర్గ ప్రతినిధులు ఒప్పందాలు కుదుర్చుకొన్నారు .ఈ తిరుగుబాటులో భారతీయ సైన్యానికి కూడా కొంత ప్రమేయం కల్పించాలని భావించారు .బెంగాలీలను ఎక్కువ సంఖ్యలో సైన్యం లో చేర్చాలని భారతీయ రాజకీయ తీవ్రవాద  వర్గం భావించింది .అజ్ఞాత నాయకులు సమర్ధించారు కూడా .దీనికి మోతీలాల్ కీలక పాత్ర పోషించాడు .గాంధీలాగానే మోతీలాల్ కూడా నమ్మాడని మోతీలాల్ జీవితచరిత్ర రాసిన ఆయనమనవడు పి.దత్తా చెప్పాడు .పరిస్థితి గ్రహించిన బిపిన్ చంద్రపాల్ ‘’బ్రిటిష్ ప్రభుత్వానికి ,ప్రజాహక్కుల కు మధ్య రాజీ కుదిరే అవకాశమే లేదు ‘అని తేల్చి చెప్పాడు .

  1915మార్చిలో కొత్త రక్షణ చట్టం తెచ్చింది ప్రభుత్వం .దీన్నిబట్టి ప్రభుత్వం ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు .దీనిపై దేశం లో నిరసనలు తీవ్రమయ్యాయి .అమెరికాలో పని చేస్తున్న జెక్ విప్లవకారులని అక్కడి భారతీయ విప్లవకారులు తరిమేశారు .ఆయుధాలతో వస్తున్న రెండు నౌకలను అటకాయించటం ,ప్రభుత్వం పంజాబు బెంగాల్ లలో భయాన్దోలనలుసృష్టించటం జరిగింది .విప్లవకారుల సానుభూతి పరులు అనే నెపం తో వేలాది మందిని అరెస్ట్ చేశారు .మహాయుద్ధం తీవ్రమైన కొద్దీ సైన్యం ఎక్కువ కావాల్సి వచ్చింది .మొదట బెంగాలీ అంబులెన్స్ దళం తర్వాత ,బెంగాలీ రెజిమెంట్ ఏర్పాటయ్యాయి .అధిక సంఖ్యలో బెంగాలీ యువకులు సైన్యం లో చేరటానికి మోతీలాల్ తీవ్ర కృషి చేశాడు . సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం 

శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం 

బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం 5-9-22సోమవారం  ఉపాధ్యాయ దినోత్సవం నాడు సరసభారతి 167వ కార్యక్రమ౦గా నిర్వహింపబడుతుంది .శ్రీ గురుపుత్రులు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి శ్రీ కోట సీతారామాంజనేయులు శ్రీ కోట రామ కృష్ణ ,శ్రీ కోట గాయత్రి ప్రసాద్  గార్లు తమ తలిదండ్రులు కీ శే .కోట సూర్యనారాయణ శాస్స్త్రి శ్రీమతి సీతమ్మ గారల పేరిట ఏర్పాటు చేయబడిన స్మారక నగదు పురస్కారం -ఉయ్యూరులో ని హై స్కూల్స్ లో చదివి 2022మార్చి s.s.c . పరీక్షలలో  అత్యధిక మార్కులు సాధించి కాలేజీ లో  చేరి ఇంటర్ చచదువుతున్న పేద బ్రాహ్మణ విద్యార్ధినికి ,,విద్యార్ధికి గురుపుత్రుల చేత అంద జేయబడును .

  అలాగే అత్యధిక మార్కులు సాధించిన ఒక బిసి విద్యార్ధికి లేక విద్యార్ధినికి ,ఒక sc విద్యార్ధిని లేక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన కోట గురు వరేణ్యుల స్మారక నగదు పురస్కారం సరసభారతి ద్వారా అందజేయబడును .

 మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇద్దరు ఉపాధ్యాయులకు సన్మానం చేయబడును .

  వేదిక ,సమయం ,విద్యార్ధినీ విద్యార్దులపెర్లు వగైరా తర్వాత తెలియ జేయబడుతాయి .అందరూ ఆహ్వానితులే .  -గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -10-8-22-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 

 శ్రావణ బహుళ అష్టమి -నవమి లలో రోహిణీనక్షత్ర యుక్త  శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సరసభారతి 166 వ కార్యక్రమ౦గా 20-8-22 శనివారం  శ్రీ సువర్చలాన్జనేయస్వామి ఆలయం లో జరుగుతాయి .ఉదయం ,సాయంత్రం ,శ్రీ కృష్ణ విష్ణు సహస్రనామ పూజ ,ముగ్గులతో బాల కృష్ణ పదాల కు ఆహ్వానం ,కట్టే పొంగలి నైవేద్యం ఉంటాయి .సాయంత్రం ,బాలబాలికలకు శ్రీ కృష్ణ గోపీకా  రాధా  వేషధారణ పోటీ లు నిర్వహి౦ప బడతాయి .,  బహుమతి ప్రదానం జరుగుతుంది . .తలిదండ్రులు తమ పిల్లలకు చక్కని తర్ఫీదు ఇచ్చి పాల్గోనేట్లు చేయమని మనవి -గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త ,మరియు భక్త బృందం -9-8-22-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-19

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-19
కార్మి చెల్ కోరికపై మోతీలాల్ ఆయనకు 1-పోలీసులను అదుపు చేయటం 2-గ్రామీణ ప్రజలలో పారిశుధ్యం పెంచటం అనే  రెండు విజ్ఞప్తులు చేశాడు .మోతీలాల్ కు పోలీసులకు ఎప్పుడూ పడేదికాదు ..1902లో పోలీస్ కమీషన్ ఆయన మెమొరాండం చదివి ఆదరాబాదరాగా ఆయన్ను ముఖ్య సాక్షిగా పిలవాలన్న దాన్ని మానుకోవటం విషయమై మోతీ లాల్ ప్రచారం లో ఉన్న ఒకజోక్ తన పత్రికలో రాశాడు –‘’కలకత్తాలో ఒక రోజు పొద్దున్నే రోడ్డుపక్క తూము దగ్గర తాగుబోతు పోర్లుతున్నాడు .డ్యూటీలో ఉన్న పోలీసు అతడిని నిలవేసి ‘ఇక్కడ ఏం చేస్తున్నావు ?’’అని అడిగితె ‘అమృత బజార్ పత్రిక నడుపుతున్నాను ‘’అని జవాబిచ్చాడు తాగుబోతు. అంతేపోలీస్ అక్కడి నుంచి ఉడాయించాడు ‘’.
  1911లో బొంబాయిలో జరిగిన మొదటి అఖిలభారత పారిశుధ్య మహా సభకు అనధికార ప్రతినిధిగా మోతీలాల్ హాజరై పారిశుధ్యం పై ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ తీసుకోవటం లేదని విమర్శించాడు .ప్రభుత్వ సహాయం లేకపోతె పల్లె ప్రజలు కీటకాల్లా మారిపోయి నశిస్తారు ‘’అని చెప్పాడు ..శుభ్రమైన మంచి నీటి సరఫరా ,మలేరియా మొదలైన వ్యాదుల్ని అరికట్టటం ,,మురికి నీటి పారుదల అన్నిటికన్నా ముఖ్యం అని ఉద్హోషించాడు .ఆయన చేసిన సూచనలనుబట్టి మరుసటి సంవత్సరం బ్రిటీష్ ఇంపీరియల్ ,ప్రోవిన్షియల్ బడ్జెట్ లలో కొన్ని నిధులు కేటాయించి ,పన్నులద్వారా వచ్చే ఆదాయాన్ని జిల్లా బోర్డు లకు అందేట్లు చేశారు .రాజ్యాంగ సవరణలు దృష్టిలో పెట్టుకొని 1912లో మళ్ళీ రాయల్ కమీషన్ ను నియమించారు. మోతీలాల్ అనారోగ్యంగా ఉండటం వలన వెళ్ళలేకపోయాడు .తన లిఖిత పూర్వక విజ్ఞప్తిని కమీషన్ కు పంపి దాన్ని అమృత బజార్ పత్రికలో ప్రచురించాడు .’’1858 విక్టోరియా రాణి ప్రకటనకు భిన్నంగా దేశీయ రాష్ట్రీయ సర్వీసులలో ఇండియన్స్ ను దూరం గా పెడుతున్నారు ప్రభుత్వ సర్వీస్ పరిక్షలు ఏకకాలం లో జరగాలి  .జిల్లా మేజిష్ట్రేట్ పదవులలో యాభై శాతం ,,జిల్లా జడ్జిపదవులలో నాలుగింట మూడవవంతు భారతీయులకు ప్రత్యేకంగా కేటాయించాలి .ప్రొవిన్షియల్ప్రభుత్వ కార్యదర్శి పదవులు రెండూ ,అండర్ సెక్రెటరీ పదవులన్నీ భారతీయులకే ఇవ్వాలి .పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ లలో ఒకరు తప్పక భారతీయుడై ఉండాలి .జిల్లా పోలీస్ సూపరిం టే౦డెంట్ లలో సగం మంది ఇండియన్లు ఉండాలి .సాధారణ ప్రభుత్వ సిబ్బంది జీతాలు తగ్గించాలి. బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే ప్రజ్ఞావంతుల సంఖ్య బాగా తగ్గించాలి ‘’అని రాశాడు ఈలేఖ దానిపై వచ్చిన వ్యాఖ్యలు అన్నీ కలిసి ఒక పుస్తకంగా తర్వాత ప్రచురించాడు మోతీలాల్ .హాట్ కేకుల్లా పుస్తకాలు అమ్ముడయ్యాయి .అయితే ఈ సిఫార్సులు సుమారు ఎనిమిదేళ్ళు చీకటిలోనే మగ్గి పోయాయి .1920లో మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలలో ఇవి వెలుగు చూశాయి .
  కొండను తవ్వి ఎలుకను పట్టటం
  1912కు అజ్ఞాత విప్లవకారుల కార్యకలాపాలు ప్రభుత్వానికి జటిలంగా మారాయి .ఏమాత్రం ఆధారం దొరక్కుండా బాంబు దాడులు చేశారు .సీక్రెట్ పోలీసులకు వారి ఆచూకీ పట్టుకోవటానికి రెండేళ్ళు పట్టింది .రాజకీయ దోపిడీలు గుట్టు చప్పుడుకాకుండా జరిగిపోతున్నాయి .ప్రతి బెంగాలీనీ ప్రభుత్వం అనుమానించే పరిస్థితి ఏర్పడింది .సురెంద్రనాద్ బెనర్జీ కూడా  విప్లవకారులకు వత్తాసు పలుకుతున్నట్లు భ్రమపడింది ప్రభుత్వం .ఇవన్నీ నిరుద్యోగులపనులని కతఠినంగా వ్యవహరిస్తే అణగిపోతాయని కాడ్రాక్ భావించాడు .యువజన సంఘాలను నిషేధించారు .దానితో ఆసంస్థలు అజ్ఞాతం లోకి వెళ్లి విజ్రుమ్భించాయి .ఇదంతా సిద్ధాంతపరంగా జరుగుతోందని కార్నీ చెల్ వాదించినా ఆయనమాట వినిపించుకోలేదు .పోలీస్ గూఢచారి శాఖను రంగం లో దింపి,అపరిమితంగా అరెస్ట్ చేసే  విశేష అధికారాలిచ్చి౦ది ప్రభుత్వం .సరైన సాక్ష్యాలు  లేకపోయినా ,అనుమానితులను దీర్ఘకాలం విచారించి ఖైదీలుగా ఉంచటం అలవాటైంది .తన క్లయింట్ లు నిర్దోషులని న్యాయవాదులు తేలికగా రుజువు చేసి విడిపించటం సర్వ సాధారణం అయిపొయింది .1910 హీరాకుట్ర కేసు అలాంటిదే .ఉత్తర బెంగాల్ ,పశ్చిమ బెంగాల్ లోని అనుమానితులను అరెస్ట్ చేసి ఒక చోటే ఉంచటంతో జతిన్ ముఖర్జీ నాయకత్వాన విప్లవకార సంస్థ దృఢంగా  పాదుకొన్నది .ఈ జతిన్ ఆతర్వాత మొదటి ప్రపంచ యుద్ధకాలం లో జర్మనీ ఆయుదాలరూపంగా ,డబ్బురూపంగా ఇచ్చిన సాయంతో తిరుగుబాటుకు ప్రయత్నించాడు .
  1913మే లో బెంగాల్ సి ఐ డి గూఢచారి విభాగం  ఒక పెద్ద కుట్ర బయట పెట్టినట్లు గొప్పలు చెప్పుకొన్నది .బారిసాల్ లో బందిపోటు సంఘటనలు ,,తర్వాత చక్రవర్తిపై దాడికి కుట్ర చేస్తుంటే పట్టుకోన్నామని బీరాలు పలికింది .కేసుకూడా నమోదు చేసింది .ఈకేసుకింద సుమారు యాభై మందిని అరెస్ట్ చేశారు .మారుమూల పట్టణం లో కేసు విచారణ జరిగింది .ఆరోపణలను రుజువు చేయలేకపోయింది .అందులో యువ విద్యార్దులుకూడా ఉన్నారు .వారికి ఆరోపణ కాపీలివ్వలేదు వాళ్ళను తాళ్ళతో కట్టి చేతులకు బేడీలు వేసి వీధుల్లో ఊరేగించారు .న్యాయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరించిన ఈ విషయాన్ని అమృత బజార్ పత్రిక ఘాటుగా విమర్శిస్తూ ‘’దేశప్రజలన్దర్నీ ఇలానే కుట్రలొఇరికిస్తారా అనే అనుమానం కలుగు తోంది .వారిపై విచారణకు ప్రాధమిక సాక్ష్యాలున్నాయో లేదో ముందు విచారించి తర్వాత కేసులు పెట్టాలని కార్నీ చెల్ కు విజ్ఞప్తి చేసింది పత్రిక .బ్రిటిష్ న్యాయసూత్రాన్ని ఆధారం గా చేసుకొని మోతీలాల్ రాశాడు భారతీయులంతా ఆయన పక్షాన నిలిస్తే ,ఆంగ్లో ఇండియన్ పత్రికలూ ప్రభుత్వానికి వంతపాడాయి .మోతీలాల్ పై కోర్టు ధిక్కారణ నేరం మోపారు .జెంకేంస్ ,స్టేఫెంస్ ,అసుతోష్ ముఖర్జీ లతో కలకత్తా హైకోర్టు ప్రత్యెక ధర్మాసనంగా విచారించింది .ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కెన్సీ వాదించగా ,ని౦దితులపక్షాన ప్రముఖ న్యాయవాదులు వాదించారు .మోతీలాల్ పై సారిన ఆధారాలు చూపించమని చీఫ్ జస్టిస్ డిమాండ్ చేశాడు .ఆధారాలు సమర్పించలేక పోయింది ప్రభుత్వం. కేసు కొట్టేశాడు చీఫ్ జస్టిస్ .కోర్టు ధిక్కరణ నేరం జరగనే లేదని న్యాయమూర్తి ముఖర్జీ వాదించాడు .ఆతర్వాతే ప్రభుత్వం కోర్టు ధిక్కరణ బిల్లు ప్రవేశపెట్టింది .ఇది ఆమోదం పొందటానికి 12ఏళ్ళు పట్టింది .కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది అని ఈ కేసును ప్రజలు పత్రికలూ ఆక్షేపించారు .
   సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment