మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -5

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -5
13-మున్సిపల్ వైస్ చైర్మన్ సెనేట్ సభ్యుడు ,,కవి సార్వ భౌమ ,కావ్యకళానిధి,అవధాన పంచానన ,రాణాప్రతాప చరిత్ర కావ్యకర్త –శ్రీ దుర్భాక రాజ శేఖర శతావధాని
దుర్భాక రాజశేఖర శతావధాని (నవంబర్ 18, 1888 – ఏప్రిల్ 30, 1957) [1] వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించాడు. గడియారం వేంకట శేషశాస్త్రితో కలిసి “వేంకట – రాజశేఖర కవులు” అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.
విద్యాభ్యాసము
• 1904-1907ల మధ్య కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రిశర్మ ల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటకాలంకార శాస్త్రాలు చదివాడు.
• 1907లో కడప ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైనాడు.
• మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఎ.చదువుతూ మధ్యలో ఆపివేశాడు.
ఉద్యోగాలు
• 1908 నుండి ప్రొద్దుటూరు లోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా పనిచేసి గాంధీ ఉద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగం మానివేశాడు.
• ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1928లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నాడు.
• 1927- 1932ల మధ్య ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.
• మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేదపాఠశాల కార్యదర్శిగా సేవలను అందించాడు.
రచనలు
• రాణాప్రతాపసింహచరిత్ర[2]
• అమరసింహచరిత్ర
• వీరమతీ చరిత్రము
• చండనృపాల చరిత్రము
• పుష్పావతి
• సీతాకల్యాణము (నాటకము)
• సీతాపహరణము (నాటకము)
• వృద్ధిమూల సంవాదము (నాటకము)
• పద్మావతీ పరిణయము (నాటకము)
• విలయమాధుర్యము
• స్వయంవరము
• అనఘుడు
• గోదానము
• శరన్నవరాత్రులు
• అవధానసారము
• రాణీసంయుక్త (హరికథ)
• తారాబాయి (నవల)
• టాడ్ చరిత్రము
• రాజసింహ
• ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లంలో)
• కామేశ్వరీ స్తోత్రమాలా (సంస్కృతంలో)
బిరుదులు
కవిసార్వభౌమ, కావ్యకళానిధి, కళాసింహ, అవధానిపంచానన, వరచారిత్ర కవిత్వభారతి, కవిబ్రహ్మర్షి మూర్ధన్య అన్నవి వీరి బిరుదులు
14-  రామావతార తత్త్వం ,బ్రహ్మావతార కర్త ,నిత్యకర్మానుష్టానజీవి ,,శతావధాని,ఆంద్ర వ్యాస ,కళాప్రపూర్ణ –శ్రీ  జనమంచి శేషాద్రి శర్మ
జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) ( జూలై 4, 1882 – జూలై, 1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు.
జీవిత సంగ్రహం
వీరు 1882 సంవత్సరంలో జూలై 4వ తేదీన వైదిక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్యావధాని, కామాక్షమ్మ దంపతులకు జన్మించారు. వీరి ప్రపితామహులు సూర్యనారాయణ సోమయాజి, పితామహులు వేంకటావధాని. వీరి పెద్దల నివాసస్థానం వైఎస్ఆర్ జిల్లా బద్వేలు తాలూకా వెంకటరాయపురం అగ్రహారం.శర్మగారికి బాల్యంలోనే మాతృ వియోగం కలిగింది.తండ్రి సుబ్రహ్మణ్య శర్మగారు మనోవైక్లయముతో కాశీ నగరమునకు వెళ్ళిపోయారు.బావగారైన గౌరిపెద్ది రామయ్యగారు శేషాద్రి శర్మ గారిని చేరదీసి చదువు చెప్పించారు.రెండేళ్ళ తరువాత శర్మగారి తండ్రి కాశినుండి తిరిగివచ్చి తమ కుమారిని తిరిగి చేరదీసిరి.అప్పటికే అవధాన విద్యానిధులై ప్రశస్తినార్జించి యుండిరి.కాని కందుకూరి వీరేశలింగం పంతులుగారి సూచన మేరకు అవధాన వుద్యమమునుండి తొలగి కావ్య రచనకు ఉపక్రమించినారు. కడపలో కొంతకాలం ఉద్యోగం చేసి తరువాతి కాలంలో కాశీ కాలినడకన వెళ్ళి అక్కడ నాలుగు సంవత్సరాలు విద్యా వ్యాసంగం చేశారు. తరువాత విజయనగరంలోను, కసింకోట మొదలైన ప్రాంతాలలో విద్యా తపస్విగా నివసించారు. వీరు చాలా శాస్త్రాలను పఠించారు. వీరు మొదట సి.ఎస్.బి. హైస్కూలులో తెలుగు పండితునిగా పనిచేసి, అక్కడ నుండి కర్నూలు కోల్స్ మెమోరియల్ హైస్కూలులో పనిచేసి, చివరిగా మునిసిపల్ ఉన్నత పాఠశాల, కడపలో 1901 నుండి దీర్ఘకాలం ప్రధానాంధ్ర పండితునిగా పనిచేసి 1937లో గజోత్సవంతో పదవీ విరమణ చేశారు.
శర్మగారి జీవిత విధానమత్యంత క్రమబద్ధమైనది.బ్రాహ్మీముహూర్తమున లేచి స్నాన సంధ్యాది అనుష్టానములను పూర్తి చేసుకొని, కావ్యరచన, తర్వాత అధ్యాపకత్వము, కొంతకాలము సాంసారిక కృత్యములు, మరల పురాణ పరిశోధనము సాయంకాలమున సద్గోష్ఠి ఇవి వారి నిత్య కృత్యములు.ప్రతి లేఖకు స్వయముగా వెంటనే బదులు ఇచ్చేవారు. ఎనిమిది గంటలపాటు పాఠశాలలో ఉద్యోగము, నాలుగు గంటల పాటు విశ్రాంతి తప్ప తక్కిన కాలమంతటిని కావ్యరచనకై వినియోగించిన మేధావులు శర్మగారు.

వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి అవధానాలు చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్థిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆయుర్వేదంలో చక్కని నాడీజ్ఞానం పొందారు. వీరికి సాహిత్య గురువు రఘుపతి శాస్త్రి, వ్యాకరణ గురువు దాసాచార్యులు, జోతిశ్శాస్త్ర గురువు తోపల్లి చయనులు. వీరు విద్యా తపోనిధిగా ఎంతో మంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు.
శర్మగారి గ్రంధములన్నింటిని వావిళ్ళవారు ప్రచురించి మహోపకారమొనరించిరి.శర్మగారి షష్ఠిపూర్తి సందర్భముగా సన్మానోత్సవ ప్రత్యేక సంచికను వెలువరించి గౌరవించారు కూడా. వీరికి ‘బాలసరస్వతి’, ‘అభనవ ఆంధ్ర వాల్మీకి’,’అభినవ నన్నయభట్టు’, ‘ఆంధ్ర వ్యాస’, ‘కావ్యస్మృతితీర్థ’, ‘కళాప్రపూర్ణ’, ‘మహాకవి’, ‘సంస్కృతసూరి’, ‘కైజర్ హింద్’ మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరు చాలా సన్మానాలు పొందారు.[1][2] [3]
పోతనామాత్యులవలె సహజ పండితులైన శర్మగారు భాగవత దశమస్కందమును మాత్రమే 610 పుటలు 5200 పద్యములలో రచించిరి.మహాపండితులైన నాగపూడి కుప్పుస్వామయ్య, వేదం వేంకటరాయ శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి మున్నగు వారలు శర్మగారినెంతగానో కొనియాడేవారు.కట్టమంచి రామలింగారెడ్డి గారు శర్మగారిని గురుంచి ప్రసంగిస్తూ వీరికవిత్వమునకు వీరి వినయాతిశయము శోభన కలిగించుచున్నది కవిత్వ పాండిత్యములకును, సౌజన్యమునకును నిత్యసంధి లేదనుట మనము ఎరింగిన విషయమే. వీరెవ్వరిని అధిక్షేపించినట్లు, ఎవ్వరితో గాని వాదమునకు పూనినట్లు కానరాదు. సౌజన్యము వీరి అలంకారము.ప్రఖ్యాతికై ప్రాకులాడువారు కారు. పండిత ప్రకాండులై, నిత్యసాహిత్యపరులై, పరోపకార పరాయణ చిత్తులై, పరదేవీ పదారవింద ధ్యానా సక్తులై మహాకావ్యములనెన్నింటినో రచించిన శ్రీ శేషాద్రిశర్మగారు 1950 జులైలో దివంగతులైనారు.
రచనలు
అనువాదాలు
శేషాద్రి శర్మ ఈ క్రింది సంస్కృత కావ్యాలను తెలుగు లోకి అనువదించారు.[4]
• హలాస్య మహాత్మ్యం
• బ్రహ్మాండ పురాణం
• బ్రహ్మ పురాణం
• వాల్మీకి రామాయణం (ఆంధ్ర శ్రీమద్రామాయణం) [5]
• శ్రీమద్భాగవతంలోని 10 వ అధ్యాయం (తాండవకృష్ణ భాగవతం)
• స్కంద పురాణం నుండి కౌమారికా ఖండం, అరుణాచల ఖండం.
• పాండవాజ్ఞాతవాసం
స్వతంత్ర రచనలు
• శ్రీమదాంధ్ర లలితోపాఖ్యానము
• హనుమద్విజయము
• సర్వమంగళా పరిణయం
• ధర్మసార రామాయణం[6]
• కలివిలాసం
• సత్ప్రవర్తనము
• శ్రీ రామావతార తత్త్వము
• శ్రీ కృష్ణావతార తత్త్వము
• శ్రీకృష్ణ రాయబార చరిత్రము
• శ్రీ శంకరాచార్య చరిత్రము
• తండ్లత
• వనజాక్షి
• హృదయానందం
• దుష్ ప్రభుత్వము
• నవరత్ర హారము
• నీటుకత్తె
• గిరీశవిజయము
• విచిత్ర పాదుకాపట్టాభిషేకం
• నీతిసింధువు
• నీతిరత్నాకరము
• మనుచరిత్ర పరిశోధనము
• భగవద్గీత (వచనము)
• ఉత్తమమార్గము
• విచిత్రరామాయణము
• ఉదయగిరిముట్టడి
• కడపమండలచరిత్ర
• శ్రీరామవనవాసము
• విహంగవిజయము
• స్వప్నయాత్ర
• నీతికథావళి
15- ఆంద్ర పాండవ గీతాలు ,భామినీ విలాస కర్త ,విద్వత్కవి విభూషణ –శ్రీ వేదము వెంకటకృష్ణశర్మ
తెలుగు కవి, పండితుడు, అనువాదకుడు.
జీవిత విశేషాలు
వేదము వేంకటకృష్ణశర్మ చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో శ్రీరామయ్య, సుబ్బనరసమ్మ దంపతులకు జన్మించాడు. స్మార్త బ్రాహ్మణుడు. కౌశిక గోత్రజుడు. ఇతని పూర్వీకులు కార్వేటి నగర సంస్థానంలో పేరుగడించి రాజాదరణ పొందిన పండితప్రకాండులు. ఇతడు తన 15 ఏటనే కార్వేటి నగరంలో ‘ఆమ్నాయ నిలయం’ అనే గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. పొట్టకూటి కోసం ఇతడు కడప జిల్లా కోడూరులోని క్రైస్తవ మిషనరీలో క్రైస్తవ గ్రంథాలను తెలుగులోనికి అనువదించే ఉద్యోగంలో చేరాడు. తరువాత మద్రాసు చేరుకుని అక్కడి కన్యకాపరమేశ్వరీ దేవస్థానం వారి హైస్కూలులో ఆంధ్ర ఉపాధ్యాయుడిగా పనిచేసి 1950లో రిటైర్ అయ్యాడు.
సాహిత్యసేవ
ఇతనిది ప్రౌఢ గంభీర శైలి. భావసంపద కలిగి పదలాలిత్యముతో కవిత్వం అల్లగలడు. ఇతని గ్రంథాలు కొన్ని విశ్వవిద్యాలయ పాఠ్యాంశాలుగా ఉన్నాయి.
రచనలు
1. సద్ధర్మ ప్రబోధిని
2. కలి నిగర్హణము
3. ఆంధ్ర పాండవ గీతలు
4. శిష్య నీతిబోధినీ శతకము
5. తోడేటి దొరతనము
6. భక్తకల్ప శతకము
7. ధర్మవిమర్శనము
8. కుందమాల
9. భామినీ విలాసము
10. ఊరు భంగము
11. తేనెసోనలు (నాలుగు సంపుటాలు)
12. భక్తవత్సల శతకము
13. శ్రీరామ(లక్ష్మీ)స్వభావము
14. శ్రీసోమశేఖరీయము (సభారంజన శతకము)
15. శ్రీకృష్ణశాస్త్రీయము (కలివిడంబన శతకము)
16. నెహ్రూ కావ్యము
17. అభినవాంధ్ర కాదంబరి
18. శతక వాజ్మయ సర్వస్వము (రెండు సంపుటాలు)
19. శ్రీ ఆంజనేయ కవీయము (చారుచర్య)
20. అమెరికా మహాపురష చరితము
21. పద్మ ప్రాభృతకము
22. బాలభారతము
23. మహాపురుష శతకము
24. ఝాన్సీ మహారాణి
25. భక్తియోగము
26. ఆరణ్యకజాతులు
27. మహేశమాల (సంస్కృత శ్లోకాలు)
28. విష్ణుమహామాయావిలాసము
29. బౌద్ధ ధర్మదీక్ష
30. సుభాషిత రత్నమాల
బిరుదులు/సన్మానాలు
• పండితోపాధ్యాయ పరిషత్ వారు ఇతనికి విద్వత్కవిభూషణ అనే బిరుదు ఇచ్చారు.
• 1961లో కడప జిల్లా రాజంపేట లో మాడభూషి అనంతశయనం అయ్యంగార్ ఆధ్వర్యంలో పౌరసన్మానం జరిగింది.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-9-22-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -4

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -4

11- పంచాంగకర్త ,జ్యోతిష్ శాస్త్రవేత్త ,కాశీ వ్యాకరణ పండితుడు ,దేవీభాగవత కర్త ,కావ్యతీర్ధ –శ్రీ జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ
జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ (నవంబరు 11, 1899 – నవంబరు 18, 1972) [1] సంపన్న వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1899, నవంబరు 11 న అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా గాండ్లపాడు గ్రామంలో జన్మించాడు. కాశ్యపస గోత్రోద్భవుడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కడపలో నివసిస్తున్న మాతామహుడు మామిళ్లపల్లి సీతారామయ్య పంచన చేరాడు. అనుముల వేంకట సుబ్బావధానుల వద్ద వేదవిద్య, ఋగ్యజుర్వేదాలలోని స్మార్తకర్మల పాఠాలను నేర్చుకున్నాడు. జనమంచి శేషాద్రిశర్మ వద్ద కావ్యపాఠములు చదివాడు. 1915లో కాశీలో వ్యాకరణశాస్త్రం అభ్యసించి 1916లో విజయనగరం సంస్కృతకళాశాలలో చదివాడు. 1918లో జనమంచి శేషాద్రిశర్మ దగ్గర జ్యోతిష్యశాస్త్రం నేర్చుకున్నాడు. 1923లో కలకత్తా సంస్కృత విద్యాపీఠం నిర్వహించిన కావ్యతీర్థ పరీక్షలోను, 1924లో పురాణతీర్థ పరీక్షలోను ఉత్తీర్ణుడయ్యాడు.1927లో మద్రాసు యూనివర్సిటీ నుండి విద్వాన్ పట్టాను పొందాడు. 1918లో కడప పురపాలక ఉన్నత పాఠశాలలో సహాయ ఉపాధ్యాయుడిగా చేరి 1960లో ప్రధాన ఆంధ్రోపాధ్యాయుడిగా పదవీవిరమణ చేశాడు. 1920 నుండి పంచాగం వ్రాసి ముద్రించడం ప్రారంభించాడు. సుమారు 40 సంవత్సరాలు ప్రతి యేటా పంచాంగాన్ని ప్రచురించాడు. త్రిస్కంద జ్యోతిషము, వ్యాకరణము, ధర్మశాస్త్ర కృషి జాతక ముహూర్త భాగాలలో ఇతనికి మంచి ప్రవేశం ఉంది.

రచనలు

  1. దేవీభాగవతము
  2. లలితాంబా శతకము (1926 వావిళ్ల ప్రెస్‌లో ప్రచురితం)
  3. సమాసాలంకార ఛందోదర్పణం
  4. ఆంధ్రవ్యాకరణ సుగ్రహము
  5. దశావతారములు
  6. అద్భుతోత్తర రామాయణము
  7. బ్రహ్మఖండము (ఆంధ్రీకరణం 2000 పద్యాలు)
  8. పుష్పగిరి మాహాత్మ్యము
  9. పురాణ కథాసాగరము
  10. సీమంతిని
  11. కాత్యాయిని[2]
  12. వనజాక్షి

ఇవి కాకుండా ఇంకా 10 శతకాలు, ఎన్నో దండకాలు వ్రాశాడు. ఎన్నో శతకాలను, గ్రంథాలను పరిష్కరించాడు.

12- కవిత్వ వేది ,జిల్లా విద్యాశాఖాధికారి ,ఆంధ్ర వాజ్మయ ,అశోకచరిత్రకర్త ఆనందాశ్రమ ,రాఘవేంద్ర బృందావన నిర్మాత,అంతరార్ధ కళా ప్రపూర్ణ –శ్రీ కల్లూరు వేంకట నా రాయణరావు

కవిత్వవేదిగా ప్రముఖుడైన రాయలసీమ రచయిత కల్లూరి వెంకటనారాయణరావు. ఈయన తన పేరుతో కాక గుప్తనామాలతో అనేక రచనలు చేసాడు. ఆయన రచనలను పాఠ్యాంశాలుగానూ బోధించేవారు.

బాల్యం
కల్లూరు వేంకటనారాయణరావు[1]1902 మార్చినెల 6వతేదీ అనంతపురంజిల్లా రాప్తాడు మండలంలోని బండమీదపల్లెలో జన్మించాడు. బడగనాడు నియోగి శాఖకు చెందినవాడు. వశిష్టగోత్రుడు. స్మార్తభాగవత సంప్రదాయస్తుడు. ద్వైతమార్గనిష్ఠుడు. తండ్రి యజమాన సుబ్బారావు. తల్లి లక్ష్మమ్మ. ఇతని పూర్వీకులు అనంతపురం జిల్లా లేపాక్షిమండలంలోని కల్లూరు గ్రామవాస్తవ్యులు. ఇతడు బాలమేధావిగా పేరొందాడు. విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు.

విద్యాభ్యాసం, ఉద్యోగం
ఇంగ్లీషు, తెలుగు, కన్నడ భాషలలో ఎం.ఎ.చేశాడు. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, ప్రయాగ వెంకటరామశాస్త్రి, గరిమెళ్ల సోమన్న మొదలైన వారివద్ద శిష్యరికం చేశాడు. పుట్టపర్తి నరసింహాచార్యుల వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. 1925లో ఎల్.టి.ఉపాధ్యాయుడిగా అనంతపురం టీచర్ ట్రైనింగ్ స్కూలులో ఉద్యోగం ప్రారంభించాడు. 1934లో డిప్యుటీ ఇన్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పదోన్నతిని పొంది కంభం, డోన్, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ,ఆలూరు,కర్నూలు,పులివెందుల, తాడిపత్రి,పెనుకొండ,రాయదుర్గం మొదలైన చోట్ల పనిచేశాడు. హొస్పేట, రాయచోటి ట్రైనింగ్ స్కూళ్లలో హెడ్‌మాస్టర్‌గా పనిచేశాడు. 1948 నుండి 1956 వరకు జిల్లావిద్యాశాఖాధికారిగా దక్షిణ కన్నడ, బళ్ళారి, అనంతపురం, నెల్లూరు, కృష్ణా, కడప జిల్లాలలో పనిచేసి 1956లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. ఇతడు క్షణకోపి.ఖండితవాది. ముఖస్తుతి, ఆత్మవంచన ఇతనికి గిట్టవు. ఎంతటివారినైనా నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం ఇతని స్వభావం.

సాహిత్యసేవ
చిన్నతనంలోనే సత్యనారాయణమహాత్మ్యము, ఆంజనేయ స్తవకళామాలిక, మానసబోధ, కృష్ణార్జునీయము మొదలైన కావ్యాలను రచించాడు. అహల్యాసంక్రందనము అనే నాటకాన్ని 19 యేళ్ళ వయసులోనే రచించాడు. శ్రీరాఘవేంద్రస్త్రోతానికి తెలుగులో వ్యాఖ్యనం వ్రాశాడు. ఆంధ్రపత్రిక ఉగాది సంచికలలో కొన్ని వ్యాసాలు ప్రకటించాడు. బి.ఎ. పరీక్షకోసం వ్రాసుకున్న తెలుగు నోట్స్‌ను కొన్ని మార్పులతో ఆంధ్రవాజ్మయచరిత్ర సంగ్రహముగా రూపొందించి చిలుకూరు నారాయణరావు ప్రోత్సాహముతో వావిళ్ళవారి ద్వారా 1928లో ప్రకటించాడు. ఇది సుప్రసిద్ధ విమర్శగ్రంథముగా ఇతనికి పేరు తెచ్చిపెట్టింది. ఈ గ్రంథం 30 సంవత్సరాలపాటు విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. ఇంకా ఇతడు పాతికకు పైగా రచనలు చేశాడు. ఇతడు పద్యంకాని, గద్యంకాని తడుముకోకుండా సహజధారలో అప్పటికప్పుడే చెప్పగల సద్యస్ఫూర్తి కలవాడు. చెప్పింది, వ్రాసినది సాధారణంగా సవరణకు ఇష్టపడేవాడు కాదు. ఇతడు తన తొలి గ్రంథాలను తన జన్మనామమైన ‘భోజరాజు’ అనే పేరుతోనూ,ఆంధ్రవాజ్మయచరిత్రసంగ్రహాన్ని ‘కవిత్వవేది’ పేరుతోనూ, అశోకచరిత్ర కావ్యాన్ని ‘బోధార్షేందు’ అనే గుప్తనామంతోనూ,ఆంగ్లరచనలను స్వామినారాయణ అనే పేరుతోనూ రచించాడు. ఇతడు రచించిన చారిత్రకకావ్యం శ్రీమదశోక చరిత్రము (శాంతి సామ్రాట్టు – అశోక చరిత్రము) జాతీయోద్యమ నేపథ్యంలో వెలువడింది. దీనిని విశ్వనాథ సత్యనారాయణ, జమ్మలమడక మాధవరామశర్మ, దివాకర్ల వేంకటావధాని,కురుగంటి సీతారామయ్య, మల్లంపల్లి సోమశేఖరశర్మ,నిడుదవోలు వేంకటరావు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి మొదలైన వారు ప్రశంసించారు.

సామాజిక, ఆధ్యాత్మిక సేవలు
ఇతడు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక చింతన కలవాడు. ఇతనికి జ్యోతిశ్శాస్త్రములోనూ, మంత్రశాస్త్రములోనూ ప్రవేశం ఉంది. బాల్యం నుండి భవిష్యద్విజ్ఞానవాణి ఉండుటచే అనేకులు ఇతనిని ఆశ్రయించి తమతమ సాంసారిక క్లేశాలను తగ్గించుకునేవారు. ఇతడు గాయత్రీమంత్ర తత్పరుడై కలరా మొదలైన ఎన్నో వ్యాధులచే బాధపడేవారిని బాగుచేసినాడని, ఇతని సలహాను అనుసరించిన గుడ్డివాడికి చూపు వచ్చిందని, అనేకులకు సంతానమును, ఋణవిముక్తి మార్గమును, సుఖజీవిత యోగమును కలిగించినాడని చెప్పుకుంటారు. దేవాలయ పునరుద్ధరణ పట్ల నూతన ఆశ్రమ నిర్మాణము పట్ల ఇతనికి మక్కువ ఎక్కువ. ఉద్యోగ ప్రస్థానములోనే ఇతడు ఇసురాళ్ళపల్లెలోనూ, రైల్వేకొండాపురం లోను, అనంతపురం వద్ద గుత్తిరోడ్డులో ఉన్న తడకలేరు తీరంలో ఆనంద ఆశ్రమమును, శ్రీరాఘవేంద్రస్వామి బృందావనాశ్రమాలను స్థాపించాడు. ఈయన 1979లో అస్తమించాడు.

ఇతర విశేషాలు
నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కల్లూరు వేంకట నారాయణరావుని సన్మానించాలని భావించి ఆహ్వానం పంపగా ఆయన తిరస్కరించారు. కల్లూరు వేంకట నారాయణరావు వంశీకులు సమీప బంధువులైన కల్లూరు అహోబల రావు, శ్రీకృష్ణ దేవరాయ గ్రంథమాల స్థాపించి రాయలసీమ రచయితల చరిత్రను నాలుగు సంపుటాలుగా రచించి ముద్రించారు.

రచనల జాబితా

  1. అహల్యాసహస్రాక్షీయము (నాటకం)
  2. ఆంధ్రవాజ్మయచరిత్ర సంగ్రహం (విమర్శ)
  3. పుష్పాంజలి (పద్యకావ్యం)
  4. సత్యలీలాలహరి-తులసీవనమాలిక
  5. శ్రీకృష్ణార్జునీయము (నాటకం)
  6. శ్రీ విద్యారణ్యచరితము (పద్యకావ్యము)
  7. షాజహాన్ (పద్యకావ్యము)
  8. సాధనామృతము
  9. శ్రీమదశోకచరిత్రము(పద్యకావ్యము)
  10. శ్రీవీరేశలింగయుగము (19వశతాబ్దపు ఆంధ్రవాజ్మయచరిత్ర)
  11. The Message of Past and India
  12. శ్రీగీతోత్తర భాగవతము
  13. శ్రీవేదవ్యాస(ఆధ్యాత్మిక)రామాయణము
  14. విశ్వబోధాంజలి (వచనము)
  15. Bodhanjali
  16. శ్రీ ఆంజనేయస్తవకళామాలిక, మానసబోధ , భజనలు
  17. షడ్దర్శనములు(అముద్రితము)
  18. ఇస్లాం తత్త్వమంజూష(అముద్రితము)
  19. అవిధేయతనయ చరిత్రము(అముద్రితము)
  20. ద్రావిడభాషామూలము(అముద్రితము)
  21. పంపాభారతము(ఆదిపర్వము)
  22. పంపాభారత (ఆదిపర్వ) (కన్నడ పద్యకావ్యము)

బిరుదములు
· అంతరార్థకళాప్రపూర్ణ

· కవితాతపస్వి

· కవితానందమనోదధి

· కవిత్వవేది

· కవిరాజశేఖర

· మహాకవి

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలిశ్రీ అడివి బాపిరాజు గారు.7వ భాగం.17.9.22

బహుముఖ ప్రజ్ఞాశాలిశ్రీ అడివి బాపిరాజు గారు.7వ భాగం.17.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-4(చివరిభాగం )

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-4(చివరిభాగం )

 వేదాంత గ్రంథాలను సులభమైన భాషలో రచించి దేవేంద్రుడు అందరికి అందుబాటులోకి తెచ్చాడు .దినపత్రికలో మాసపత్రికలలో బ్రహ్మ ధర్మాల గురించి వ్రాస్తూ జనాలకు అందుబాటులోకి తెచ్చాడు .వేద వేదాంతాలలోని కఠిన మంత్రాలకు సులభ శైలిలో వ్యాఖ్యలు వంగభాషలో రాశాడు   .వేదం ఉపనిషత్తులను ఏయే ఛందస్సులతో చదవాలో ఎలా ఉచ్చరించాలో ఆ నిబంధనలన్నీ స్వయంగా నేర్పేవాడు .అందరు నిత్యపూజతో భగవంతుని ఆరాధన చేయాలని చెప్పి తానూ ఆచరించి అందరిచేతా చేయించాడు .బ్రహ్మ విద్యా వ్యాప్తికి అహరహం తపిస్తూ కృషిచేసి ఫలితాలు సాధించాడు .కేశవ చంద్ర సేన్ దేవేంద్రుని ప్రధాన శిష్యుడయ్యాడు .

 మహర్షి దేవేంద్రనాథ ఠాకూర్

బ్రహ్మ సమాజాలు అన్ని చోట్లా వెలశాయి .అన్నిటికి ఆదిమ బ్రహ్మ సమాజమే ఆదర్శంగా చేశాడు. పరమజ్ఞాని ,మానవ హృదయవేది ,విశ్వ ప్రకృతి తెలిసిన దేవేంద్రుడు  అందరి మనసులను గెలిచాడు .అందరూ ఆయనను గురుతుల్యునిగా భావించి గౌరవించారు .మహర్షి అని గౌరవంగా సంబోధించేవారు అన్ని సంఘాలచేత ధర్మప్రచారం పెద్ద ఎత్తున నిర్వహింప జేశాడు .వేదాధికారం అందరికీ వర్తింప జేశాడు .దీనికి సనాతన హిందువులు అడ్డు పడ్డారు .ఇంట్లోనే కాదు తీర్ధ యాత్రా స్థలాల లోనూ సంసారం చేస్తూ సాధన చేశాడు .బాల్యం నుండి ప్రకృతి ఆరాధకుడు .వివిధ ప్రదేశాలలో ప్రకృతి సౌ౦దర్యాలలో లీనమై తన సాధన కొనసాగించాడు .

 శాంతి నికేతన్

దేవేంద్రుని శిష్యులలో శ్రేష్టుడైన కేశవచంద్రుడు మహాపండితుడు జ్ఞాని మహావక్త .అతనిని ఆది బ్రహ్మ సమాజానికి ఆచార్యుని చేసి వానప్రస్థ  ఆశ్రమం స్వీకరించాడు .ఇదే శాంతినికేత ఆశ్రమం లేక శాంతి నికేతన్ ..ఇక్కడ ప్రశాంత జీవితం గడుపుతూ ‘’ధర్మ పిత ‘’గా భాసి౦చాడు .ఏడాదికొక సారి బ్రహ్మ  సమ్మేళన సభ జరిపేవాడు. 1874నవంబర్ లో ‘’సమదర్శి ‘’మాస పత్రిక ఏర్పరచి నిర్వహించాడు .అవసరమున్న వారికి లెక్కలేనన్ని దాన ధర్మాలు చేసి వదాన్యుడని పించుకొన్నాడు .శాంతి నికేతన్ ను ఆర్యరుషి సంప్రదాయ బద్ధంగా నిర్వహించాడు .సర్వ శాస్త్రాలు ఇక్కడ బోధించాడు .చక్కని భవనాలు నిర్మించాడు .ప్రకృతి శోభతో శాంతినికేతన్ అందర్నీ ఆకర్షించేది .

  దేవేంద్రుని పెద్దకుమారుడు ద్విజేంద్రనాథుడు తండ్రి ధర్మకార్యాలన్నీ నిర్వహించేవాడు .రెండవ ఆయన విశ్వకవి రవీంద్రుడు సరస్వతి పుత్రుడై ఆసియా కవి సార్వభౌముడైనాడు .మహర్షి దేవేంద్రనాథ ఠాకూర్ 87వ ఏట 19-1-1905న బ్రహ్మ ప్రాప్తి పొందాడు .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

క్లాస్ ప్రేక్షకుల క్లాసిక్ కమనీయ రమణీయ అమర ప్రేమత్యాగమయ  రామచక్కని దృశ్య కావ్యం –సీతారామం


క్లాస్ ప్రేక్షకుల క్లాసిక్ కమనీయ రమణీయ అమర ప్రేమత్యాగమయ  రామచక్కని దృశ్య కావ్యం –సీతారామం

 మా అబ్బాయి శర్మ రెండు రోజుల్నించి సేతారామం చూశారా,చూసి సమీక్ష రాయమని  చెవిలో రొదపెడుతుంటే ,నిన్న మధ్యాహ్నం మూడు వంతులు ,రాత్రి పూర్తిగా ప్రైం వీడియో లో చూశాం .చూశాక నా పరిస్థితి కాళిదాస శాకుంతలం నాటకం చదివి ,ఎగిరి గంతులేసి నాట్యం చేసిన జర్మన్ పండితకవి ,విమర్శకుడు గోధే పరిస్థితే నాది అయింది .ఆసినిమాను వర్ణించటానికి మాటలు చాలవు అనిపించింది .అదొక ‘’సాగా’’ .కృష్ణశాస్త్రి, తిలక్ కవిత్వాలు చదివాక పొందే ఆనందం ,విశ్వనాథ్ సినిమాలు చూశాక పొందే ఆనుభూతి ,నాకు నచ్చిన క్లాసిక్ ‘’చివరకు మిగిలేది ‘’సినిమా కు కొనసాగి౦పుఅనిపించింది .ఏం రాద్దామన్నా సూపర్లేటివ్ లు తప్ప మామూలు మాటలు దొర్లటం లేదు .క్రికెట్ చరిత్రను తిరగరాసిన గవాస్కర్ సచిన్, ధోనీ ,కోహ్లీ లు ఎలా ఆరాధనీయులయ్యారో ఈ సినిమా దర్శకుడు హను అలా అయ్యాడు .పవిత్ర సీతా రామ ప్రేమ మయ జీవితానికి హనుమ సాయం చేసినట్లుఈ  రావిపూడి’’ హను’’ సహాయం చేశాడని పించింది .అత్యద్భుత సినిమాలకు ఒరవడి పెట్టి పెద్ద బాలశిక్ష రాశాడని పించింది .వెయ్యిబాహుబలులు ,,వంద ఆర్ ఆర్ ఆర్ లు దీనిముంది బలాదూరేమో అనిపిస్తుంది .ఒక సినిమా చూసినట్లు ఉండదు .పాత్రలతో కలిసి ప్రయాణం సాగిస్తున్నట్లు ఉంటుంది .సినిమా పాటలంటే హీరో పక్క ఒక పాతిక హీరోయిన్ పక్క మరోపాటికి కృత్రిమ వేషాలతో చిందు లేయటంకాదు. వారి మనసులోని భావాలు సలలిత రాగ సుధగా సాగిపోవటం అని చూపిన వైనం మెచ్చతగింది. ట్రెండ్ సెట్టర్ అనిపించింది .నటీ నటవర్గం తమ ప్రతిభ మేరకు నటించలేదు జీవించి సినిమాకు జీవం పోశారు .కిషోర్ హాస్యం వెన్నెల కురిపించక ,సునీల్ పాత్ర పండక దిష్టిపిడతలు గా నిలిచిపోయారు .మంచి పంట పండిన పొలానికి అవీ అవసరమేగా ?

 ప్రతి సన్ని వేశం పండింది .క౦టికి ఇంపుగా మెరిసింది .మొదట్లో పదినిమిషాలు చీకట్లో దారి తెలీని స్థితి ఏర్పడినా ఆతర్వాత మనల్నిమనమే మర్చిపోతాం .వెన్నెల విహారమే చేస్తాం .భారీ డైలాగులు ఉండవు .హావభావాల వికృత చేష్టలు లేవు .అంతా ఒరిజినల్ ఒరిజినల్ .మానసిక విశ్లేషణ .పాత్రల ఉదాత్తత . యుద్ధభూమి’’ ఉత్తర’’ కాండ లో విరిసిన శతపత్ర సుందరి ఈ చిత్రం .ముడులు గట్టిగా బిగించి క్రమంగా విప్పుతూ కథాగమనాన్ని ఉత్కంఠ భరితంగా తీర్చి దిద్దిన విధానం భేష్ .ఇరవై ఏళ్ళకాలం లో విరిసిన ప్రేమ పారిజాతమే ఇది .త్యాగాలకు పరాకాష్ట . స్వార్ధ రహిత ప్రేమమూర్తుల దర్శనం ముగ్ధుల్ని చేస్తుంది .ఎక్కడో మంచు ప్రాంతాలలో దేశం కోసం అహరహం పాటు పడుతున్న ఒంటరి వాడికి జీవితం లోఎవరూ లేరనే బాధను తప్పించటానికి దేశం యావత్తూ అతనికిఅన్న  దమ్ముల్లా, అక్క చెల్లెళ్ళు గా ఉత్తరాలు రాసి అండగా నిలబడితే,ఒకామె ఆతని ప్రేయసిగా భార్యగా ఉత్తరాలు రాసి దగ్గరవటం అపూర్వం .వీరి ప్రేమకు ఆటంకాలు ఎదురైనా అదిగమించి కలయికలు చిరు అలకలు ,విడదీయరాని బంధాలు .కాలం దూరం వేరుచేసినా అలనాటి సీతారాముల్లా వారిద్దరి మనస్సులు అనుక్షణం సన్నిహిటాలే .

  హీరో పాత్రను ధీరోదాత్తంగా మలిచారు .పాత్రధారి దుల్కర్ సల్మాన్ నటించలేదు .జీవించి సినిమాకు జీవం పోశాడు అతడి చిరునవ్వు హీరోయిన్ నే కాదు మనల్నీహాంట్ చేస్తూ ఉంటుంది .ఒరిజినల్ నవ్వు. నవ్వినట్లు కనిపించదు ఇంతకంటే గొప్ప తనం ఏమి ఉంటుంది ?నూటికి వెయ్యిమార్కులు కొట్టేస్తాడు .మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తనపరిధిలో జీవించి జీవంపోసింది .రామం లేలేత పాలబుగ్గల బంగారు నాయనగా ఉంటె సీత, ముదురు గా ఉన్నట్లు అనిపించింది .రామాయణం లో సీత రాముడికంటే పెద్దదే అనే మాట కూడా ఉందనుకోండి సుమంత్ కి ఈమధ్య పండిన సినిమాలు తక్కువే .ఇందులో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర .వాళ్ళ తాత అక్కినేనిలాగా డిప్ప ఎగరేయటం కృత్రిమంగా ఉంది. నటించాడుకానీ జీవి౦చ లేదేమో అనిపిస్తుంది .అతడి సిగరెట్ వెగటు పుట్టిస్తుంది .సంగీతం విశాల్ చంద్ర శేఖర్ చిత్రానికి సీన్లకు తగినట్లు అందించి సంగీతం త్రివేణీ సంగమం లో అంతర్వాహిని సరస్వతిగా ఉండేట్లు చేసి మెప్పించాడు .కెమెరా ద్వయం విజువల్ ఫీస్ట్ ఇచ్చారు .సినిమా పరిపక్వంగా పండటానికి కారణమయ్యారు .ప్రతి అంగుళం రమణీయంగా హృద్య౦ గా తీర్చి దిద్దారు .ఊహకు  యదార్ధానికి మధ్య పల్చని తెర ఉన్నట్లు సినిమా శాంతారాం ‘’నవ ర౦గ్ ‘’ పోకడకనిపిస్తుంది .

కృష్ణకాంత్ రాసిన పాటలకు సంగీతం  నేపధ్యసంగీతం కూర్చిన విశాల్ చంద్ర శేఖర్ సంగీత దృష్టి అతి విశాలం అనిపిస్తుంది బాలుగారబ్బాయి చరణ్ అద్భుతంగా పాడి మెప్పించి తండ్రి స్థానం సాధించాడు .అతడి ప్రతిభ రామదాసు మొదలైన సినిమాలలో చూసి అనుభవించాం .’’ఇంతందం దారి మళ్ళి౦దా-భూమిపైకే చేరుకున్నదా –లేకుంటే చెక్కి ఉంటారా –అచ్చు నీలా శిల్ప సంపదా ?జగత్తు చూడనీ –మహత్తు నీదేలే –నీనవ్వుతాకి –తరించే తపస్సిలా –నిశీధులన్నీ తలొంచే –తుషా రానివా ?అంటూ సాగి ‘’వీడేవీలులేని –ఏదో మాయలోకి –లాగే పిల్ల తె౦పరీ –చిలకే కోక కట్టి –నిన్నే చుట్టుముట్టి సీతాకోకలా యేలనా’’ అని ఆమె అంటే ‘’విల్లె ఎక్కుపెట్టి –మెళ్ళో తాళికట్టి మరలా రాముడవ్వనా ‘’అంటాడు అతడు .’’దాసోహమంది ఈ ప్రపంచమే అదంతా నీదయే ‘’.

మరోపాటలో ‘ఓ సీతా వదలని తోడౌతా –రోజంతా వెలుగులిడు నీడౌతా ‘’అంటాడు రాం పరమ భావుకతతో ఆమె ‘’ఓ రామా ఒకరికొకరమౌతామా .కాలంతో కలిసి అడుగేస్తామా ?అని సంశయిస్తుంది .’తీరం తెలిపెనే నుదుటి రాత –నుదుట తిలకమై వాలుతా .ఈపాట ఎస్పి చరణ్ రమ్య గానం చేసి మధువులొలికించారు .సిరివెన్నెల రాసిన మూడవపాట ‘’కానున్న కళ్యాణ మేమన్నది ??ను అనురాగ్ కులకర్ణి సింధూరి పాడి కళ్యాణ వైభోగం తెచ్చారు ‘’తరములపాటుగా తరగని పాటగా ప్రతిజత సాక్షిగా –ప్రణయము నేలగా సదా ‘’మూడు పాటలుముత్యాలే రత్న మాణిక్యాలే. సందర్భా శుద్ధికి అద్దాలే .సంగీత జలపాతాలే  మాటల తేనే సోనలే .కధలో ఇమిడి పోతూ హృదయాలను ఆవిష్కరించు కొనే భావ గీతికలే .ఎంకిపాటలే .కిన్నెరసాని గీతాలే ,బాపిబావచిల్ప చిత్రాలే  .కధనం లో ఇలా పాటలు మమైకం అవటం చాలా గొప్ప విషయం .దర్శకుని ప్రతిభకు నిదర్శనం .

  సీతా మహాలక్ష్మికి ఉత్తరం బట్వాడా చేయాల్సిన పాత్రలో రష్మిక పాక్ అనుకూలమైనా ,ఆ ఉత్తరం చేరిస్తేనే తనకు తాత ఆస్తి వస్తుందనే ఆశతో కష్టపడి తెగించి ఇండియావచ్చి అందజేసి క్రుతకృత్యురాలైంది .ఆమెకు తాత ఆస్తి దక్కే ఉంటుందని అనుకోవాలి .ఇది చలసాని అశ్వినీదత్ సినిమా .ఆయన బానర్ లాగే సినిమా కూడా క్లాసిక్ చిత్ర వైజయింతిక అనిపించింది .ధన్యుడు దత్ .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-9-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged , | Leave a comment

బ్రహ్మ వైవర్తపురాణం.ప్రకృతి ఖండం.4వ భాగం.17.9.22

బ్రహ్మ వైవర్తపురాణం.ప్రకృతి ఖండం.4వ భాగం.17.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -3

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -3
9-న్యాయవాది ,నాడీ వేత్త ,సరస వినోదిని స్థాపకుడు ,బహునాటకకర్త, నటుడు ,చిత్రనళీయ నాటక ఫేం ,ఆంద్ర నాటక పితామహ –శ్రీ ధర్మవరం రామ కృష్ణ మాచార్యులు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు (Dharmavaram Ramakrishnamacharyulu) (1853 – 1912) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు. ఇతడు “ఆంధ్ర నాటక పితామహుడు”గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. ధర్మవరం గోపాలాచార్యులు ఇతని పెద్దతమ్ముడు
జననం, విద్యాభ్యాసం
వీరు పరీధావి నామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి దినమున కృష్ణమాచార్యులు, లక్ష్మమ్మ దంపతులకు ధర్మపురి అగ్రహారమున జన్మించారు. తండ్రివద్దనే ఆంధ్ర, సంస్కృత, కన్నడ భాషలు నేర్చుకున్నాడు.1870లో మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. తాతగారి వద్ద రఘువంశము, చంపూరామాయణము, ప్రతాపరుద్రీయము చదివాడు. 1874లో ఎఫ్.ఏ. పరీక్షలోను, సెకండరీగ్రేడ్ ప్లీడర్‌షిప్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు.
కృష్ణమాచార్యులవారి తండ్రిగారు మంచి పండితులు. తాత ముత్తాతలుకూడ విఖ్యాత విద్వాంసులు. తండ్రిగారు బళ్ళారి “వార్థ లా కాలేజి లో నాంధ్ర పండితపద మలంకరించిరి. జనకుని సన్నిధినే కృష్ణమాచార్యుడు సంస్కృతాంధ్రములు కఱచెను. మేధాశక్తి గొప్పది యగుట నిట్టే చక్కని సాహిత్వమలవడుట తటస్థించినది. దానివలన బహుగ్రంథపరిశీళనము గావించి పాండిత్యమునకు స్వయముగా మెఱుగు పెట్టుకొనెను. అష్టశతావధాన ప్రదర్శనము గావించి కొక్కొండ వేంకటరత్న మహా మహోపాధ్యాయుని వంటి వారిచే మెప్పుల గాంచెను. అదియటుండ, నీయన కాంగ్ల భాషాభ్యాసము చేయవలయునని అభినివేశము కలిగినది. పట్టుదల గలవారగుట ఎవ్.ఏ పరీక్షలో నుత్తీర్ణత నందిరి. తరువాత అదవాని ‘తాలూకాకచేరీ’ లో గొన్నాళ్ళు లేఖకులుగా గుదరవలసి వచ్చినది. కవికి దౌర్గత్యముకూడ నొకకళ యైనదిగదా ! పాపము నాటికి వీరిది పేదకుటుంబము. ఆదవానిలో సంసారము సరిగ జరుగక బళ్ళారికి వచ్చి కంటోన్‌మెంటు మేజస్ట్రేటు కోర్టు లో ప్రైవేటు వకీలు ‘ గా పనిచేయ మొదలిడిరి. ఆయుద్యోగము వీరి దరిద్ర దేవతను దఱిమివైచినది. వకీలు వృత్తి యందు వీరికి లభించిన యుత్తేజనము ఫస్ట్ గ్రేడ్ ప్లీడరుషిప్ పరీక్షకు బురికొల్పి యందుత్తీర్ణుని గావించెను. నాటినుండి వీరి న్యాయవాదవృత్తి నిరాఘాటముగ సాగి న్యాయస్థానమున కెక్కు నభియోగము లన్నిటను వీరి దొక పక్ష ముండి తీరునంత యున్నతికి గొంపోయెను. ప్రతిపక్షులను సాక్షులను ప్రశ్నించుటలో వీరినేర్పు గొప్పది. వీరి వాదము వినుటకు బ్రజలు గుమిగూడి యుండువారట. బళ్ళారి ప్రాంతీయు లిప్పటికిని వీరి న్యాయవాద దక్షత వేనోళ్ళ జెప్పుకొందురు.
ఈయాచార్యకవి యద్భుత మేధాశక్తి యెన్నో కళలను గ్రహించినది. ఆయుర్వేదము వీరు లెస్సగ నెఱుంగుదురు. అది వీరి వంశపారంపర్యముగ వచ్చు విద్య. నాడీపరీక్షలో నీయన సిద్ధహస్తులట. జ్యోతిశ్శాస్త్రమునను వీరి ప్రవేశము చాల గొప్పది. వారి నాటకములలో నిందులకు నిదర్శనములు పెక్కుగలవు. చదరంగము మాడుట యన్న వీరికి చెప్పరాని మక్కువ. నెలల తరబడి యనన్య మనస్కులై యాడుచుండువారని ప్రతీతి. అభినయశాస్త్రము వీరికి బరిచితము. డిబేటింగు సొసైటీ నొకటి స్థాపించి పలువురు పురప్రముఖులనందు సభ్యులుగా జేర్పించి ‘షేక్సుపియరు ‘ నాటకములలో ముఖ్యపాత్రల నభినయించెడి వారు. ఆ సరసవినోదినీ సభ కు నాడు పెద్ద ప్రఖ్యాతి వచ్చినది. నాటకబృందముపై గల దొల్లిటి హేయభావము తొలగించిన దీసభయే. ఈ సభామూలమున నొకసారి ‘ఆంధ్రకవిపండిత సంఘ సమ్మేళ ‘ మాచార్యులవా రతి విజృంభణముగా జరిపిరి. మఱొకసారి ఒంటిమిట్టలో వావిలికొలను సుబ్బారావుగారి ‘ఆంధ్ర వాల్మీకి రామాయణ ‘ కృతిసమర్పణోత్సవమునకు వీరి నధ్యక్షులుగా నెన్నుకొనిరి. అప్పుడు వీరి ‘పాదుకా పట్టాభిషేకము ప్రదర్శింపగా రూ. 1500 వచ్చినవి. అవి కోదండ రాముని కైంకర్యమునకే యర్పింప బడినవి. వీరి నాటకములకు బ్రజాసామాన్యములో గల గౌరవమునకిది మంచి తారకాణ. అంకములలోని కథ రంగములుగా విభజించుట వీరి నాటకములలోని క్రొత్తపద్ధతి. ఇది పాశ్చాత్య సంప్రదాయము. నాటకము విషాదాంతము చేయుట వీరి కనభీష్టము కాదు. ‘సారంగధర ‘ ను జూచిన మనకది యవగతము. కాళ్ళు చేతులు విఱుగ గొట్టబడి సారంగధరుడు చనిపోయెను. అంతతో నాటకము సమాప్తము. మఱియొక సంప్రదాయముగల కవియైనచో నిది యిట్లు వ్రాసి యుండడు. ఇదియు నాంగ్లేయమే. సారంగధరునిపై నిందమోపిన చిత్రాంగిని విచారించుటకు రాజనరేంద్రుడొక న్యాయస్థానసభ చేసెను. అది సరిగ నినర్గసుందరముగ నుండి కృష్ణమాచార్యులు గారు గొప్ప న్యావాదియని సాక్ష్యమిచ్చు చున్నది.
ఉద్యోగం
కొంతకాలం ఆదోని తాలూకా కచేరిలో గుమాస్తాగా పనిచేశాడు. తరువాత బళ్లారి కంటోన్మెంట్ మెజిస్ట్రీట్ కోర్టులో వకీలుగా ప్రాక్టీసు పెట్టాడు.
అభిరుచులు
ఇతనికి సంగీతంలో, ఆయుర్వేదంలో, నాడీశాస్త్రంలో,జ్యోతిశ్శాస్త్రంలో,చదరంగంలో ప్రావీణ్యం ఉంది. కవితాశక్తిని అలవరచుకుని అష్టావధానాలు, శతావధానాలు చేశాడు.
రచనలు
• గాధినందను చరిత్రము (పద్యకావ్యము) (అసంపూర్ణము)
• ఉన్మాదరాహు ప్రేక్షణికము
• మదనవిలాసము
• చిత్రనళీయము[1] (1916)
• పాదుకా పట్టాభిషేకము
• భక్త ప్రహ్లాద
• సావిత్రీ చిత్రాశ్వము
• మోహినీ రుక్మాంగద[2] (1920)
• విషాదసారంగధర
• బృహన్నల
• ప్రమీళార్జునీయము
• పాంచాలీస్వయంవరము
• చిరకారి[3]
• ముక్తావళి[4] (1915)
• రోషనారా శివాజీ
• వరూధినీ నాటకము
• అభిజ్ఞానమణిమంతము(చంద్రహాస)[5]
• ఉషాపరిణయము
• సుశీలాజయపాలీయము
• అజామిళ
• యుధిష్ఠిర యౌవరాజ్యము
• సీతాస్వయంవరము
• ఘోషయాత్ర
• రాజ్యాభిషేకము
• సుగ్రీవపట్టాభిషేకము
• విభీషణపట్టాభిషేకము
• హరిశ్చంద్ర
• గిరిజాకళ్యాణము
• ఉదాస కళ్యాణము
• ఉపేంద్ర విజయ (కన్నడ)
• స్వప్నానిరుద్ధ (కన్నడ)
• హరిశ్చంద్ర (ఇంగ్లీష్)
• ఆంధ్రనాటకములలోని యుత్తరరంగములు[6] (1906)
పై రచనలలో మొదటిది మినహా మిగిలినవన్నీ నాటకరచనలే.
నాటకరంగం
1886లో బళ్లారిలో సరసవినోదిని సభ అనే నాటకసభను నెలకొల్పాడు. మొదట స్వప్నానిరుద్ధ అనే కన్నడ నాటకాన్ని ప్రదర్శించాడు. 1887లో చిత్రనళీయము అనే తెలుగునాటకాన్ని బళ్లారి పట్టణంలో మొదటిసారిగా ప్రదర్శించాడు. ఇతడు నాటకకర్తనే కాదు. నటుడు, దర్శకుడు కూడా. ఇతనికి సంగీతంలో ప్రవేశం ఉంది. పాటలు, పద్యాలకు రాగాలు తనే నిర్ణయించేవాడు. మోహన, జంఝాటి, కేదారగౌళ, కమాజు రాగాలంటే ధర్మవరం రామకృష్ణమాచార్యులకు ప్రీతి. రంగస్థలం మీద రాగయుక్తంగా పద్యాలను పాడే ఒరవడి రామకృష్ణమాచార్యులు తెచ్చిపెట్టిందే. ఇతడు దశరథ, బాహుళ, రాజరాజనరేంద్రుడు, చిరకారి, అజామిళ పాత్రలు అభినయించుటలో దిట్ట.
శ్రీమత్కృష్ణమాచార్యకవికి బూర్వము తెలుగులో స్వతంత్రనంవిధానము గలనాటకములు లేవు. ఉన్న నాటకములు సంస్కృతమున కనువాదములు. ఆ కారణమున నాంధ్రరంగస్థలములు విస్తరించి వెలయలేదు. పాశ్చాత్య సంప్రదాయము, ప్రాచీన సంప్రదాయము నెఱిగి యొకరకమగు క్రొత్తత్రోవదీసి నాటకములు రచించి స్వతంత్ర నాటకరచయితలకు మార్గదర్శి యనిపించుకొనిన మహాశయు డీయన. వీరి కృషిని గుర్తించి గద్వాల మహారాజవరుడు 1910 లో నీయాచార్యకవిని, రత్నస్థగితమగు పతకముతో ‘ఆంధ్రనాటక కవితా పితామహు ‘డని బిరుదమొసగి గౌరవించెను. విచిత్రసమ్మేళనము గావించి నాటకపాత్రములకు గేవ లాంధ్ర త్వము నాపాదించి తొలుదొల్త స్వతంత్రనాటకములు రచించినావాడగుటచే నీ కవివరున కీబిరుద మన్వర్థ మని నాడు పెక్కుపండితు లగ్గించిరి. పురప్రముఖులు ముగ్దులై యొక కిరీటమర్పించిరి. ఆచార్యుల వారు నాటక కర్తలేకాక నటకులు కూడాను. చిత్రనళీయములో బాహుకుడు, విషాదసారంగధరములో రాజనరేంద్రుడు, పాదుకాపట్టాభిషేకములో దశరథుడు, అభిజ్ఞానమణిమంతములో దుష్టబుద్ధి, ఈ పాత్రములు ప్రత్యేక ప్రశంసాపాత్రములుగా నటించెడివారు. దశరధ పాత్రధారిత్వమున కృష్ణమాచార్యులవారికి సాటి కృష్ణమాచార్యులవారే యని పలువురు చెప్పుకొందురు. ఆచార్యులవారు తమ మరణము నాటక రంగముననో న్యాయస్థానముననో యుండునని యప్పు డప్పు డనుచుండువారు. అది తధ్యముగ వారు 1912 లో నొక యభియోగము నడపుటకు వెళ్ళి ‘ఆలూరు ‘ లో న్యాయస్థానమున నాకస్మికముగ గాలు జారిపడి ‘రామచంద్రా’ యనుచు నసువులు బాసిరి. వారి మృతకళేబరము నాలూరునుండి బళ్ళారికి దెచ్చి యంత్యక్రియ నడవు సందర్భమున జరిగిన యూరేగింపుటుత్సవము పలువు రిప్పటికి చెప్పుకొందురు. నాటకాచార్యుడై గడించిన కీర్తియు, న్యాయవాదియై సంపాదించిన పేరును నాడు ప్రకటితమైనవి. స్త్రీలు పురుషులు వృద్ధులు యువకులు నొక రననేమి, వేలకొలది పుష్పమాలికాదులచే నాచార్యకవి కంత్యసమ్మాన మొసంగిరి. ఇట్టి మహాశయుని శక్తి యుక్తులు ముచ్చటించు కొందముగాక !
చిత్రనళీయము
వీరి నాటక చక్రములో ‘చిత్రనళీయము ‘ మిన్నందిన ప్రఖ్యాతి గొన్నది. అందలి పద్య గద్యములు ప్రబంధములకు దీటు వచ్చినవి. అది ప్రదర్శించుట కొక పాటినటకుడు పనికిరాడు. సంపూర్ణమైన యర్థజ్ఞానము కలిగిన మరల నిట్టి కవిత్వము వ్రాయ గలనన్నవాడు వీరి నాటకములు నోట బట్టగలడు. తెలుగులో ననువాదములు రెండుమూడు తప్ప స్వతంత్ర నాటకములు రచించు నలవాటు నాటికి లేకుండుటచే బ్రాబంధిక వాసన వీరి నాటకములలో నననేల, ఆనాడు వ్రాసిన నలుగురైదుగురు కవుల నాటకములలో గూడ వెల్లి విరిసినది.
ఆచార్యులు గారి చిత్రనళీయము చూడుడు. ప్రథమాంకములో స్వయంవరరంగమున భారతిచేత దమయంతికి భుజంగ ప్రయతాదులైన యెన్ని ప్రాబంధిక వృత్తములతో జెప్పించెనో ! ఇప్పుడు బొత్తిగా నాట కములలో బద్యములను బరిహరింపవలయు ననుచున్నారు, అది యౌచితీపోషక మని – అటువంటి యిప్పుడు పృధ్వీవృత్తములు – మత్తకోకిలములు దృశ్యకావ్యములలో నుపయోగించుట యొకరకముగానుండును. నాటినటకులుకూడ సర్వసమర్ధులు ఇప్పు డిట్టివి యాడువారు నూటికి గోటికిని – ఇంచుమించుగా శ్రీనివాసరావుగారివి, కృష్ణమాచార్యులు గారివి కూడ బద్యనాటకప్రాయములు. అడుగడుగునకు బద్యము. తిరుపతి వేంకటకవులుల పాండవనాటకములలోను పద్యములపా లెక్కువయే. కానివారు కొంతశైలి తేలికపఱిచిరి.
చిత్రవళీయము చతుర్థాంకములో “శరద్రాత్రి” ని వారివారి యుపాలంభనములు యిరువదియైదు పద్యములలో నాచార్యులవారు వర్ణించి వైచిరి. నిజముగా నాపద్యము లే వసుచరిత్రాది ప్రబంధములకునందని యుదాత్తభావములు కలవి. భాషయు నట్టిదే. విరహ వ్యధావిధురుడైన బాహుకభూమికాధారి యొక్క పెట్టున నాపద్యములు చదువవలయునన్న డొక్క బ్రద్దలగును. నాటి నటకులు కాబట్టి చిత్రవళీయాదుల కంత ప్రఖ్యాతి ప్రజాసామాన్యములో గూడదీసికొని రాగలిగిరి. నటకులై ఖండాంతర ప్రసిద్ధిగాంచిన తాడిపర్తి రాఘవాచార్యులుగారికి మనఆచార్యులుగారు మేనమామ. వీరి నాటకపద్యములు చాలమందికి నోటికి వచ్చినవే యై యుండును. అయినను రెండుమచ్చు:
అతిమాత్రంబుగ దు:ఖమున్ సుఖము దైవాతీనతం గర్మ సం
గతిమై బ్రాణికిగల్గుగా యిపుడు దు:ఖప్రాప్తి మల్లాడె శ్రీ
యుతుడాభూభూరమణుండు వెండియును నేడోఱేపో యాకాల దు
స్థితి దీఱంగను సర్వసౌఖ్యముల నిశ్చింతాత్మీతం జెందడే?

బళి రే కంటినిగంటి సప్తజలధి ప్రావేష్టితాఖండ భూ
లలనాధీశ కిరీట వారిరుహరోలంబాయమాస ప్రభో
జ్జ్వలితారిందమనూపురాత్త సదసేవాప్రీతగోత్రాధవున్
నళభూమీధవు నాశ్రితౌ ఘ కరుణా నవ్య ప్రభామాధవు
సన్మానాలు
• 1891లో మధ్రాసులో సంస్కృత పండితుడు ఓపర్ట్ ఇతని నాటకాన్ని చూసి మెచ్చి రత్నఖచిత బంగారు పతకం బహూకరించాడు.
• 1910లో గద్వాల మహారాజు ఇతడిని ఆంధ్రనాటకపితామహుడు అనే బిరుదుతో సత్కరించాడు.
• బళ్లారి పురప్రముఖులు ఇతడిని రత్నఖచిత కిరీటంతో సన్మానించారు.
10-మల్లినాధసూరి వంశీయుడు ,సుమనోరమ సభ స్థాపకుడు ,ప్రముఖ న్యాయవాది ,ఆంగ్లం లో ప్రపంచానాతకచరిత్ర రాసిన మొదటి చారిత్రిక నాటకకర్త,ఆంద్ర చారిత్రకనాటక పితామహ  –శ్రీ కోలాచలం శ్రీనివాసరావు
శ్రీనివాసరావు మల్లినాథ సూరి వంశీయుడు. ఇతడి పూర్వీకులు విజయనగర సంస్థాన పండితులు. నాటక సాహిత్యాన్ని స్వాధ్యయనం చేశాడు. జ్యోతిష్యము తెలుసుకున్నాడు. వీరు మార్చి 13, 1854 సంవత్సరంలో బళ్ళారి జిల్లాలోని హంపి వద్ద కామలాపురం గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే తెలుగు, కన్నడ, సంస్కృత, ఆంగ్ల భాషలలో పట్టు సాధించాడు. 1876లో ఎఫ్.ఏ పరీక్ష రాసి నెగ్గాడు. తరువాత కొన్ని సంవత్సరాలు అనంతపురం జిల్లా గుత్తిలో రెవిన్యూ ఇన్స్పెక్టరుగా పనిచేశాడు. 1881లో అనంతపుర మండలం డిప్యూటికలెక్టరు దగ్గర దివానుగా ఉద్యోగం చేశాడు. 1888లో జాతీయోద్యమ పిలుపునందుకొని ముందు చేస్తున్న ఉద్యోగం మానేసి రెండవతరగతి ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణుడై బళ్ళారిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.[1] అప్పటినుండి వారి సాహితీ వ్యాసంగం ఊపందుకుంది. ఇతను వృత్తిరీత్యా న్యాయవాది అయినా నాటక కళ అంటే అత్యంత అభిమానం. అప్పటి నాటక రచయితలలో కోలాచలం, ధర్మవరం రామకృష్ణమాచార్యులు ప్రముఖులు. బళ్లారిలో సుమనోరమసభ అనే నాటకసమాజాన్ని స్ధాపించాడు.
1917లో కడపలో జరిగిన ఆంధ్రసాహిత్య పరిషత్ సభకు శ్రీనివాసరావు అధ్యక్షత వహించాడు. మండపాక పార్వతీశ్వరశాస్త్రి లాంటి వారు ఆయన కవిత్వాన్ని ప్రశంసించారు.
శైలి
ఈయన వ్యవహారిక భాషోద్యమానికి వ్యతిరేకుడు. నాటకములను విషాదాంతం చేయడం ఇష్టం ఉండేది కాదు. చారిత్రక రచనలు, సంఘానికి సంబంధించిన రచనలు సమాజానికి అత్యావశ్యకములని ఆయన భావన.
తెలుగుకు ఆయనిచ్చిన సందేశ సారాంశం
భాషను జెఱచుట తప్పు. అశ్లీలములుంట తప్పు. దుర్నీతికర ములుగ నుంట తప్పు. బండుబూతుమాటల నీతి జెప్పుట తప్పు. పేరు పెట్టి దూషించి యెత్తి వేయుట తప్పు. గ్రంథమునందు ఇత్యాదులు తప్పులగును కాని మిగతావి తప్పులుగావు. విషయవైశద్యము కొంతవఱకు నుండినజాలు. లోహములన్నియు స్వర్ణమయములు కాకపోయినను బనికిమాలినవి యెవ్వియుగావు. పూర్వకాలమునుండియు బుద్ధకుశలులని పేరొందిన పండితుల గ్రంథముల చదివి తమ బుద్ధిబలిమిని వానికిచేర్చి ఇప్పటివారు వ్రాయు గ్రంథములు చెడెనని చెప్పుట యసమంజసంబు.
ఆయన రచించిన ప్రతాపాక్బరీయం నుంచి ఒక పద్యం
మూరెడు మీసముల్బెనిచి ముప్పిరిగా బలుమారుదువ్వుచున్
నీరుపుమీఱ దుస్తులను నీటుగగట్టుచు వాలు బట్టుచున్
ధీరులమంచు నోటికసిదీఱగ బ్రల్లదమాడునట్టి యీ
భీరుల బోలకీవి రణభీకరవైతివి తక్కెగీర్తియున్
రచనలు
ఆయన రాసిన రామరాజుచరిత్ర చారిత్రక రచన. తళ్ళికోట యుద్ధంలో కీర్తిశేషుడైన రామరాజు కథ ఇందులో వర్ణించబడుతుంది. అలాగే మైసూరు రాజ్యము, ప్రతాపాక్బరీయము కూడా చారిత్రక రచనలే. ఆయన భారతదేశంలోనే కాక ప్రపంచంలోని ఇతర దేశాల నాటకాల చరిత్రలను పరిశోధించి ప్రపంచ నాటక చరిత్ర (ది డ్రమాటిక్ హిస్టరీ ఆఫ్ ది వల్డ్) అనే గ్రంథాన్ని ఆంగ్ల భాషలో రాశారు. తెలుగులో వీరు సునందినీ పరిణయము, సుఖమంజరీ పరిణయము మొదలైన నాటకాలు రాశాడు. తెలుగులో మొదటి చారిత్రక నాటకం రాసింది కూడా ఆయనే. భగవద్గీత 18 అధ్యాయాలు సవిమర్శగా పఠించి ప్రతి అధ్యాయాన్ని వచనంగా ప్రకటించారు.
• సునందినీపరిణయము
• మదాలసాపరిణయము
• శ్రీరామజననము
• పాదుకాపట్టాభిషేకము
• లంకాదహనము
• ద్రౌపదీవస్త్రాపహరణము
• కీచకవధ
• బభ్రువాహన
• హరిశ్చంద్ర
• రుక్మాంగద
• చంద్రహాస
• శిలాదిత్య
• ప్రతాపాగ్బరీయము
• కాళిదాసు
• ప్రహ్లాద
• రామరాజుచరిత్ర
• మైసూరు రాజ్యము
• చాందుబీబీ
• కుశలవ
• హాస్యమంజూష
• బాలభారత శతకము
• ఆంధ్రీకృతాగస్త్య బాలభారతము
• సీమంతిని
• సుఖమంజరీ పరిణయము
• యువతీ వివాహం
• మానవ పిశాచం
• రాక్షసీమహత్వాకాంక్షి
• మానావమాన
• అన్యాయ ధర్మపురి మహిమ
• నాచిపార్టి
• ఆచారమ్మ కథే (కన్నడ)
• సమయమునకు భార్య
• మైసూరు రాజ్యం
• చంద్రగిర్యభ్యుదయము
• సీతాకళ్యాణం
• భారతధర్మయుద్ధం
• శిరోమణి
• గిరికాకళ్యాణం
• వేదము చరిత్రయా?[2] (1928)
బిరుదు
ఆంధ్రచరిత్రనాటకపితామహుడు
మరణం
వీరు 23 జూన్, 1919 సంవత్సరంలో పరమపదించాడు.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బహుముఖప్రజ్ఞా శాలిశ్రీ అడివిబాపి రాజు గారు.6వ భాగం.169.22

బహుముఖప్రజ్ఞా శాలిశ్రీ అడివిబాపి రాజు గారు.6వ భాగం.169.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-3

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-3

దేవేంద్ర సంసారం

దేవేంద్రుని తత్వ బోధినీ సభ క్రమ౦గా ఎందఱో మహనీయులను ఆకర్షించి సభ్యులుగా చేర్చి బహుళ వ్యాప్తమైంది .అందులో అప్పటి రాజు మహతాబ్ చ౦ద్ బహదూర్ ,ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజెంద్రలాల్ మిత్ర ,రాం గోపాల్ ఘోష్ ,శంభూనాథ పండిట్ ,శ్రీశ చంద్ర రాయ్ మొదలైన మహానీయులెందరో సభ్యులైనారు .నూనూగు మీసాల నూత్న యవ్వన వయసులో దేవేంద్రుడు ఈ అద్భుతం సాధించి లోక ప్రశస్తి పొందాడు .తండ్రి ద్వారకా నాథుడు రాజకీయాలు వదిలేసి వాణిజ్యం లో దిగాడు .’’కార్ ఠాకూర్’’అనే సంస్థ నెలకొల్పాడు .

  దేవేంద్రుడువివాహమాడి  చదువుతో పాటు సంసారం ,జమీందారీ కార్యక్రమాలు నిర్వహించటం ప్రారంభించాడు .అన్నిటా నైపుణ్యం పొంది తండ్రికి తగిన కుమారుడు అనిపించాడు .అయితే సంసార జీవితం మాత్రం తామరాకు పై నీటి బొట్టుగా చూశాడు .తత్వ బోధిని సంస్థ చేత కలకత్తా లో ఒక కొత్త విద్యాలయం నెలకొల్పాడు .ఇందులో ఉపనిషత్తులు శాస్త్రాలు స్వధర్మ విద్య నేర్పారు .పాఠ్య గ్రంధాలు ఆంగ్లేయ వాసన తో ఉండటం గ్రహించి ,అక్షయకుమార దత్తు మొదలైన పండిత ప్రకా౦డులతో వాటిని రాయించి తేలికగా బోధించే వీలు కల్పించాడు .దీని వలన వంగ సాహిత్యం యొక్క గొప్పతనం యువత తెలుసుకోవటానికి వీలు కలిగింది .ప్రజాబాహుళ్యం లో భాషా వ్యాప్తికి ‘’తత్వ బోధిని మాస పత్రిక  ‘’కూడా స్థాపించి నిర్వహించాడు  .ఇది గొప్ప మార్గ దర్శనం చేసి బహుళ ప్రచారమైంది .ఇందులో వేద, వేదాంతాలు సకల హిందూ ధర్మ శాస్త్రాలలోని మర్మాలను సూక్ష్మగా గ్రహించే వీలు కల్పించాడు .పుస్తకాలు దొరకటం కష్టమైన ఆకాలం లో తత్వ బోధిని సభ చేత ఒక గ్రంథసభ ,పుస్తకాలయం కూడా ఏర్పాటు చేయించి అందుబాటు లోకి తెచ్చాడు .ఇది ఏషియాటిక్ సోసిటీకి అనుబంధంగానడుస్తుంది .తర్వాత దీన్ని ‘’ఆది బ్రాహ్మసమాజ పుస్తకాలయం ‘’గా మార్చారు .ఇక్కడ దొరికినట్లుగా అతి ప్రాచీన గ్రంథాలు ఇంకెక్కడా దొరికేవి కావు .

  విద్యావంతులైన పెద్దలతో తరచూ సమావేశాలు జరుపుతూ దేశీయులకు ఉపయోగపడే మహా విద్యాలయం ఒకటి స్థాపించాలని చెప్పేవాడు .దీనికోసం కలకత్తా లోని సిమ్లా భవనం లో ఒక సభ ఏర్పాటు చేశాడు .దీనికి పండితులు విద్యావంతులు గృహస్తులు చాలామంది వచ్చారు .వీరందరిఏకాభిప్రాయంతో 1845లో ‘హిందూ హితార్ధి విద్యాలయం ‘స్థాపించాడు .వెంటనే దీనికి 40వేల రూపాయల మూల దనం ఏర్పడింది .సుప్రసిద్ధ కర్మవీరుడు ,మహా పండితుడు భూదేవ ముఖోపాధ్యాయుడిని దీనికి అధ్యక్షునిగా  ఎన్నుకొన్నారు .తండ్రి ద్వారకా నాథుడు రెండు సార్లు ఇంగ్లాండ్ వెళ్లి విక్టోరియా రాణి ,పోప్,ప్రష్యా ప్రిన్స్ ,ఫ్రాన్స్ బెల్జియం ప్రభుత్వాల చేత సత్కరి౦పబడ్డాడు .1845లో రెండోసారి వెళ్లి ,అక్కడే 1846ఆగస్ట్ 1 న 51వ ఏట మరణించాడు .అంతకుముందు రామమోహన రాయ్ కూడా అక్కడే చనిపోయాడు .

  సంసారభారం జ్యేష్ట పుత్రుడైన దేవేంద్రునిపై పడింది . ధర్మ వీరుడు కర్మవీరుడు కనుకఏమాత్రం కలత చెందకుండా  మునిలాగా మహర్షిలాగా తనకార్యకలాపాలు నిర్వహించాడు  .ద్వారకానాథుడు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసేవాడు .అందువలన అప్పులు చేయాల్సి వచ్చేది .ఆ అప్పులతో తనకు సంబంధం లేదని బాకీదార్లకు చెప్పమని బంధువులు స్నేహితులు దేవేంద్రునిపై ఒత్తిడి తెచ్చారు .కానీ దేవేంద్రుడు ధర్మ బద్ధుడు కనుక తండ్రి చేసిన రునణాలన్నిటికి తానే  బాధ్యత వహిస్తానని తెలియజేయగా మూర్ఖుడు పిచ్చివాడు ఆర్ధిక న్యాయం తెలియని వాడు అని ఆక్షేపించారు .ఆ రోజు నుండి దేవేంద్రుడు బీద దరిద్ర వేషంతో గడుపుతూ అతి తక్కువవ్యయంతో సంసారం గడుపుతూ ,కొద్దికాలం లోనే తండ్రి రుణాలన్నీ అణాపైసలతో సహా తీర్చి సెభాష్ బేటా అని పించుకొన్నాడు .ఆయన సత్య ధర్మ నిష్టను మెచ్చిన భగవంతుడు ఆయనకు క్రమంగా మళ్ళీ అష్టైశ్వర్యాలను అందించాడు .

  ఈసారి ధర్మ సంస్కారం ,సంఘ ఉన్నతి కార్యక్రమాలపై దేవేంద్రుడు దృష్టి పెట్టాడు .బ్రహ్మ సమాజానికి రామమోహన రాయ్ ఏర్పరచిన నియమాలు చాలాకఠినంగా ఉన్నాయని గ్రహించి దేవేంద్రుడు ,ఆయన ఆశయ ప్రచారానికి నడుం కట్టి అనేక చోట్ల బ్రహ్మ సమాజ శాఖలు స్థాపించాడు .బ్రహ్మ సామాజికులకు నియమాలను సులభంగా ఆచరించే ప్రణాళిక రూపొందించి ఎక్కువ మంది ఆకర్షితులయేట్లు చేశాడు .హిందువులతో బ్రహ్మ సమాజీయులకు భేదాలు ఏర్పడినప్పుడు తీర్చటానికి సమర్ధులైన బ్రహ్మ పండితులు లేకపోవటంతో వంగ దేశం నుంచి నలుగురు మహా పండితులను కాశీకి  వేద వేదాంతాలు క్షుణ్ణంగా నేర్చుకొని రావటానికి పంపించాడు .ఒక ఏడాది వారు అక్కడ గడిపివచ్చి దేవేంద్రుడు చెప్పిన విషయాలన్నీ ధర్మ వేద  సమ్మతాలే అని సప్రమాణంగా తెలియ జేశారు .దీనితో మతభేదాలు సమసిపోయాయి .ఆ నలుగురు పండితులలో ‘’వేదాంత వాగీశ ‘పట్టాన్ని పొందిన ఆనంద చంద్రుడిని దేవేంద్రనాధ ఠాకూర్ బ్రహ్మ సమాజ ఆచార్యుని చేశాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -2

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -2

5-శతావధాని,ఘంటా శతక ,సాంబ లక్షణ కర్త శ్రీ గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి

గాడేపల్లి వీరరాఘవశాస్త్రి గొప్ప కవి. శతావధాని.

జీవిత విశేషాలు
ఇతను తన 11వ యేట బ్రహ్మోపదేశమైన తరువాత తండ్రివద్దనే షోడశకర్మలు, యజుర్వేద సంహిత, అరుణపంచకము, ఉపనిషత్పంచకము మొదలైనవి అభ్యసించాడు. మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద కావ్యపఠనము చేశాడు. నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు. అష్టావధానాలు, శతావధానాలు అటు గద్వాల మొదలుకొని ఇటు మద్రాసు వరకు లెక్కకు మించి చేశాడు. ఇతడు గద్వాల సంస్థానంలో చాలా కాలం ఆస్థాన పండితుడిగా ఉన్నాడు. అంతకు ముందు మార్కాపురంలో ఆంధ్రపండితుడిగా కొంతకాలం పనిచేశాడు. ఇతడు వ్రాసిన వ్యాసాలు త్రిలిఙ్గ,దివ్యవాణి(పత్రిక), కల్పవల్లి, గోలకొండ పత్రిక మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

అవధానాలు
ఇతడు మొదటిసారి 1913లో తన విద్యాగురువు రాళ్ళభండి నృసింహశాస్త్రి అధ్యక్షతన ఎఱ్ఱగొండపాలెంలో అష్టావధానం నిర్వహించాడు. తరువాత 1938 వరకు 25 సంవత్సరాలు సుమారు 200 అవధానాలు చేశాడు. ఇతడు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, గుంటూరు, బళ్లారి, చిత్తూరు జిల్లాలలోను, తెలంగాణా జిల్లాలలోనూ, మైసూరు రాష్ట్రంలోను అష్టావధానాలు, శతావధానాలు ప్రదర్శించాడు. ఇతడు ఘంటాశతము అనే అవధానాన్ని అంటే ఒక గంటలో ఒక శతకాన్ని ఆశువుగా చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించి మంచి పేరు గడించాడు[1].

రచనలు

  1. త్రిపురాంతక స్థల మహాత్మ్యము (3 ఆశ్వాశముల కావ్యము)
  2. సత్యవరలక్ష్మీ ధృవచరిత్రము (1947)
  3. అహోబల మహాత్మ్యము (1919)
  4. మార్కండేయ చరిత్రము (హరికథ)
  5. రామభూపతి శతకము (1914)
  6. దీనకల్పద్రుమ శతకము (1916)
  7. విశ్వేశ్వర శతకము (1916)
  8. సోమేశ్వర శతకము (1916)
  9. చెన్నకేశవ శతకము (1916)
  10. ఆర్యవిద్యా ప్రబోధిని
  11. ద్విపద భగవద్గీత
  12. ముకుందమాల(ఆంధ్రీకరణం)
  13. పింగళ హరికథ
  14. సాంబలక్షణ(శృంగారకావ్యము)
  15. హైమవతీ పరిణయము
  16. భూగంగాస్తుతి
  17. మార్కండేయ నాటకము
  18. సీతారామ కళ్యాణము(ద్విపద)
  19. సీతారామ కల్పద్రుమ శతకము
  20. వెంకటేశ్వర శతకము
  21. కుమార సుబ్రహ్మణ్య చరిత్ర
  22. మెదకు సంస్థానాధీశుల చరిత్ర
  23. హరివంశము (అసంపూర్ణము)
  24. ఐరావత వ్రతకథ
  25. చమత్కార కవిత్వము-1949[2]

రచనలనుండి ఉదాహరణలు
1.ధర మధురాధర ధర సుధారస ధారలన్ ద్వజించి యే

యిరవుననో సుధల్ దొరకు నెంతయునంచు దలంచు టెంచగా

దొరికిన పెన్ని ధానమును దొంగల కిచ్చుచు రిత్త నేల యం

దరయ ధానాప్తికై వెదకునట్టి తెరంగగుగాదె ధీమణి!

2.అన్నా!విద్దెల నెల్ల నేర్చితివె, నెయ్యం బార నీ యొజ్జలున్

సన్నాహంబున నేర్పిరే,యిపుడికే సందేహమున్ లేక నీ

విన్నాళ్ళున్ బఠియించు శాస్త్రమున నేదే నొక్క పద్యంబు సం

పన్నార్థంబుగ నీ సుధా మధుర వాక్ప్రావీణ్యతన్ చెప్పుమా!

(అహోబల మహాత్మ్యము నుండి)

3.సకల జీవులలోని చైతన్యమును గన్న

నానంద పారవశ్యంబు గాంచు

నలుసంత బాధ యేనా డెవ్వడందిన

దా బాధపడి దాని దలగ జూచు

పరుషోక్తులే పసిపాపలు పల్కిన

హరిహర యని చెవుల్ దరియ మూయు

రాజసంబన్న దొఱల జేరగా నీక

బీద సాదల మైత్రి బెం పొనర్చు

అక్షరాభ్యాస మపుడె పంచాబ్ద మాత్ర

బాలుడై కూడ నిటువంటి లీల బొదలె

నద్దిరే ధృవు విజ్ఞాన మడుగవలనె

పూవునకు తావి సహజమై పొసగుటరుదె!

(శ్రీ సత్యవరలక్ష్మీ ధృవచరిత్రము నుండి)

అవధానాల నుండి ఉదాహరణలు
· సమస్య: పతి తల గోసి వండె నొక పాంథుని నాతి మనోహరంబుగన్

పూరణ:

కుతకము మీఱ కకుంఠిత భక్తిని బోవుచుండి వి
స్తృత నవపల్లవావృత దిదృక్షుముదావహ తింత్రిణీకుజా
ప్రతిమపు నీడలో విడిసి, పప్పుడుకెత్తెడునంత నాకురు
ట్పతి తలగోసి వండె నొక పాంథుని నాతి మనోహరంబుగన్

· సమస్య: భీష్ముని పెండ్లికి ఏగిరట పిన్నలు పెద్దలు బంధులందఱున్

పూరణ:

గ్రీష్మములోన లగ్న మరిగెన్ – సమకూర్చెద నన్న బార్గవా
ర్చిష్మ దనూన కోపమతిశీతలమయ్యె బ్రతిజ్ఞ చూడగా
భీష్మముగాగ మాఱె; దలపెట్టని వన్నియు దాపురించె నా
భీష్ముని పెండ్లికి; ఏగిరట పిన్నలు పెద్దలు బంధులందరున్

పండిత ప్రశంసలు
పటుతరధారణా పటిమ పండిత మోద మెసంగు వాణి, రా

ట్చటుల సభాంతరాళ కవి సంఘ పరిస్తుత, కీర్తి, సర్వది

క్తటముల దాండవింపగను గౌరవమున్, బ్రతివాది దుర్థమ

తృటనము నిర్వహించు కొనుతోరపు శక్తియు నీకె రాఘవా!

-బుక్కపట్టణము శ్రీనివాసాచార్యులు

6- పంచభాషా పండితుడు ,మా హంపి కావ్యకర్త -భాస్కరాచార్య రామచంద్రస్వామి
కుటుంబ చరిత్ర
భాస్కరాచార్య రామచంద్రస్వామి[1] 1905లో జన్మించాడు. భాస్కరాచార్య పరంపరా పీఠానికి అధ్యక్షుడైన పట్టాభిరామస్వామికి ఇతడు దత్తపుత్రుడు. తల్లి పేరు నాగలక్ష్మమ్మ. భార్య అంబమ్మ. ఇతడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. కుమారుడి పేరు టి.బి.రామమూర్తి. కుమార్తెలు కమలమ్మ, స్వర్ణమ్మ.

విద్యాభ్యాసము
ఇతడు బళ్ళారిలో సంస్కృతాంధ్రములు అధ్యయనం చేశాడు. తరువాత విజయనగరంలోని సంస్కృత కళాశాలలో చేరి కావ్యనాటక సాహిత్యములు చదువుకున్నాడు. స్వయం కృషితో కన్నడ, మలయాళ, హిందీ, తమిళ, బెంగాలీ మొదలైన అనేక భాషలలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. వీటితో పాటు జ్యోతిషశాస్త్రము, తంత్రశాస్త్రములలో నిష్ణాతుడైనాడు.

రచనలు
· అభిజ్ఞాన శాకుంతలము ఆంధ్రీకరణము

· బాటసారి

· మా హంపి

· యాత్రికుడు[2]

రచనల నుండి ఉదాహరణ
యాత్రికుడు కావ్యం నుండి మచ్చుకు రెండు పద్యాలు

గీ. ఎన్నఁడీ యాత్రకు మొదలొ, ఎప్పుడు తుదియొ?
బ్రతుకు నాల్గు దినమ్ముల – పాంథశాల
రస మిగిరి పోవ, శక్తి నీరసత నొందు
బాత్ర మున్నంత నింపుము ప్రాత మధువు

గీ. విందు వలదు – కపూరంపు – విడెము వలదు
వలదు కనకాభిషేక సంభావనలును
అంద అనుభవమునకు, నానందమొకఁడె
పంచిపెట్టుము – త్రావుము – ప్రాత మధువు

7-కవి ,కధకుడు,నిర్వచన వెంకట రామాయణ కర్త శారదాపుత్ర, పి.వెంకటరెడ్డి
పి.వెంకటరెడ్డి తెలుగు కథా రచయిత.[1
జీవిత విశేషాలు
ఆయన కడప జిల్లా, ప్రొద్దుటూరు తాలూకా, పర్లపాడు గ్రామంలో బాలిరెడ్డి, రామాంబ దంపతులకు జూలై 1 1922లో జన్మించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగోతరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. వీరి గ్రామస్థులు, గురువు అయిన జీరెడ్డి చెన్నారెడ్డి కవితాభ్యసనమునకు మార్గదర్శనము చేసిరి. ఆయన తెలుగు భాషలో విధ్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు. ఆయనకు “శారదా పుత్ర” అనే బిరుదము ఉంది. వీరికి గోవిందరెద్డి, వెంకట రెడ్డి అనే సోదరులు, ఇద్దరు సోదరీమణులున్నారు. ఆయన తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర శాఖలో పనిచేసిరి.

సాహిత్య ప్రవేశం
ఆయన స్వగ్రామంలో కవిరత్న బిరుదాంకితులైన కశిరెడ్డి వెంకటరెడ్డి “బాల రామాయణము” రచించిరి. దానిని ఆదర్శంగా తీసుకొని వెంకటరెడ్డి “శ్రీమాన్ నిర్వచన వెంకట రామాయణం” పేరుతో మూడువేల పద్యములతో “రామాయణము” వ్రాసిరి. అది అముద్రితము.[1]

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు

1-కన్నడం లోనూ కవిత్వం చెప్పి ,వేదాంగ నిష్ణాతుడైన కవి సవ్య సాచి –శ్రీ కిరికెర రెడ్డి భీమరావు
కిరికెర రెడ్డి భీమరావు[1] (జూన్ 13, 1896 – మార్చి 9, 1964) తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు.

జీవిత చరిత్ర
బడగనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో 1896, జూన్ 13 వ తేదీన రెడ్డి అప్పూరావు, వేంకటలక్ష్మమ్మ దంపతులకు అనంతపురం జిల్లా, హిందూపురం తాలూకా, కిరికెర గ్రామంలో జన్మించాడు. గౌతమస గోత్రుడు. మాధ్యమిక విద్య వరకు హిందూపురంలోని ఎడ్వర్డ్ కారనేషన్ స్కూలులో చదివాడు. తర్వాత బెంగళూరులో మిషన్ స్కూలులో కొంతకాలం చదివి మైసూరులో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. మైసూరులో స్వయంకృషితో కన్నడ భాషలో ఛందోవ్యాకరణాలలో నిష్ణాతుడయ్యాడు. ఆ భాషలో కవిత్వం చెప్పనేర్చాడు. మైసూరు సంస్కృత కళాశాలలోని పలువురు విద్వాంసుల సహకారంతో సంస్కృతం నేర్చి వ్యాకరణాది అలంకార సూత్రాలను, ఆయుర్వేదము, జ్యోతిశ్శాస్త్రము, సాముద్రికము, వేదాంతము మొదలైన వేదాంగాలను నేర్చుకున్నాడు. పెనుకొండలోని అసిస్టెంట్ ఇంజనీయరు ఆఫీసులో క్లర్క్‌గా చేరి ఒక సంవత్సరం పనిచేశాడు. తరువాత తండ్రి మరణంతో వంశపారంపర్యంగా వచ్చిన మునసబు ఉద్యోగంలో చేరాడు. ఇతనికి 22వ యేడు వివాహమైంది. ఒక కొడుకు ఒక కూతురు జన్మించిన తర్వాత 32వ యేడు భార్య మరణించింది. ఇతడు తన 68వ యేట 1964, మార్చి 9 న మరణించాడు.

రచనలు
తెలుగు భాషలో

  1. వాయునందన శతకము
  2. భీమేశ్వర శతకము
  3. భక్తి పంచకము (ఐదు శతకములు)
  4. తిరుమలాంబ (నవల)
  5. శత్రునిగ్రహము (నవల)
  6. దశావతారములు
  7. మహేంద్రవిజయము (నాటకం)
  8. చంద్రమౌళి (నాటకం)
  9. గరుడ గర్వభంగము (హరికథ)
  10. సీతాకళ్యాణము (హరికథ)
  11. కృష్ణరాయబారము (హరికథ)
  12. కృష్ణగారడి (హరికథ)
  13. జాతక సుధానిధి (2 భాగములు)
  14. యోగాయుర్దాయ దర్పణము
  15. భీముని సాముద్రికము
  16. జ్ఞానవాశిష్టరత్నములు
  17. విజయనగర కళావిలాసము
  18. పితృభక్తి
  19. జగన్నాయక తారావళి
  20. యోగవాశిష్ఠము
  21. ఆధ్యాత్మ రామాయణము

కన్నడ గ్రంథాలు

  1. ಭಗವದ್ಗೀತ
  2. ಉತ್ತರಗೀತ
  3. ಗೀತಾಂಜಲಿ
  4. ವಿಜಯ ಗೌತಮ
  5. ಭೀಮೇಶ್ವರೀಯಂ
  6. ಪಾಂಡವಾಜ್ಞಾತವಾಸ
  7. ಕೃಷ್ಣ ಮಾಯಾವಿಲಾಸ
  8. ಯುಗಂಧರ ಪ್ರಜ್ಞೆ

బిరుదులు సత్కారాలు
· బాలసరస్వతి మండలి, పెనుకొండ బాలకవి బిరుదుతో సత్కరించింది.

· 1946లో బెంగళూరులోని విశ్వకళాపరిషత్ ఆంధ్ర కర్ణాటక కవికేసరి బిరుదును ప్రదానం చేసింది.

· బళ్ళారి ప్రముఖులు 1956లో కవిసవ్యసాచి అనే బిరుదును ప్రదానం చేసి సన్మానించారు.

2-వేదవేత్త ,శతకకర్త ,కవిచంద్ర –శ్రీ యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ
యమ్మనూరుసుబ్రహ్మణ్యశర్మ[1] అనంతపురంజిల్లా హిందూపురం తాలూకా కొండాపురం గ్రామంలో 1886, జనవరి 25కు సరియైన పార్థివ నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి నాడు శేషశాస్త్రి, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. బ్రాహ్మణకులంలో ములకనాడు శాఖకు చెందిన శర్మ శౌనకస గోత్రుడు. ఇతడు చిన్నతనంలో పల్లెటూరి బడిపంతుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఉపనయనమైన తరువాత చిత్తూరు జిల్లా, మదనపల్లె తాలూకా చదుము గ్రామంలో శంకరావధాని వద్ద వేద విద్య చదువుకున్నాడు. కుందలగురికి వేంకటనారాయణకవి ఇతనికి ఛందో వ్యాకరణాలు నేర్పించాడు.

రచనలు

  1. శ్రీ పులివెందల రంగనాయకశతకము
  2. శ్రీరుక్మిణీ కళ్యాణము
  3. వామన చరితము
  4. అనసూయ
  5. సావిత్రోపాఖ్యానము
  6. కర్ణాభ్యుదయము
  7. శ్రీ భక్తజన మనోభిరామము

బిరుదము
గోరంట్ల గ్రామంలో జరిగిన పండితమండలి మహాసభలో చిలుకూరు నారాయణరావు ఇతనికి కవిచంద్ర అనే బిరుదును ప్రదానం చేసి సత్కరించాడు.

రచనల నుండి ఉదాహరణలు
1.శ్రీకర్ణాభ్యుదయము కావ్యములోని పుత్రునికై కుంతీదేవి విలపించే ఘట్టం

హా!యను;ముద్దుగుల్కు తనయా!యను నిర్జితసుందరాస్య చం
ద్రా! యనుఁ దాపదుఃఖ రహితా!యను నిందిత శంబరారి రూ
పా! యను దివ్యధామ దినపా!యను బంధుర భర్మవర్మ దీ
ప్తా! యనుఁగార్యమింక గలదా!యనుఁదానెనలేని వంతచేన్

తదనంతరంబ నలుదెసలం బరికించి

పుత్రుఁడా!జితకాంతి మిత్రుడా! సౌవర్ణ
గాత్రుఁడా!నీకునే శత్రునైతిఁ
జూతునా! నిన్నింక నేతీరుగానైన
బ్రీతిచేఁగనులార భూతలమున
నందనా! నినుఁబాసి యుందునా మహియందు
మందునా! నేనింక గుందువదలి
కొమరుఁడా! నాపాలి యమరుఁడా! మాముద్దు
కొమరుఁడా! యనఁదగు కొమరువాఁడ

చేతులారంగఁజేసితి పాతకంబు
నీతిదప్పితి నే పుత్ర ఘాతినైతి
భూతలంబున సత్కీర్తి వొందనైతి
వేయు నేటికి నీకునే దాయనైతి

2.శ్రీ భక్త జన మనోభిరామము కావ్యం నుండి

మోకులం బిగగట్టి మోకరించుచు లాగి
వీకతోగేకలు వేయువారు,
గోవింద!గోవింద!గోవింద! యనుచును
తేరీడ్చుటకు ముందు దెరలువారు
తేరు చక్కియలందు జేరి బారులుదీరి
బూర గొమ్ములనూది పొనరువారు
జయ వేంకటాద్రీశ! జయ శేషశైలేశ!
జయదేవ సర్వేశ! జయతు యనుచు

సొరిది కరతాళములదట్టి తిరుగువారు
చెలఁగి హరినామకీర్తనల్ సేయువారు
గ్రక్కునను శౌరినటగాంచి మ్రొక్కువారు
మొట్ట మొదలున ముడుపులు గట్టువారు

వేత్ర హస్తుల పంక్తి వేంకటేశుని మ్రోల
వ్రాలి మున్నిడి బరాబరులు సలుప
భూమీసురోత్తముల్ వేమరుస్వామికి
వింజామరమ్ములు వేయుచుండ
సాధ్వీమణులు గూడి సాగు యరదముపై
మల్లియల్ మొల్లలు జల్లువారు
వేల్పు బానిసలెల్ల చాల్పుగా నిలుచుండి
నతులొనర్చుచు నర్తనములు సలుప

వేద నాదంబుచే ద్విజుల్ విల్లసిలగ
తూర్యనినదంబులమిత సంతోషమొసగ
హారతులనెత్తి రహిజెంది యబలలలర
వేంకటేశుండు రథమున వెలుగుచుండె

3-కవిసార్వభౌమ ,కావ్యతీర్ధ ,కవితా సామ్రాజ్య స్థాపకులు ,మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ
సంస్కృతాంధ్ర కవితాసామ్రాజ్యాన్ని ఏకఛత్రంగా ఏలిన కవిసార్వభౌముడు మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ (ఆగష్టు 23, 1900 – అక్టోబరు 2, 1974) [1].

జీవిత విశేషాలు
మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ నెల్లూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశంజిల్లా) కు చెందిన పట్టాభిరామపురం అగ్రహారం లో స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో 1900 ఆగష్టు 23వ సంవత్సరంలో జన్మించాడు. తండ్రి నృసింహ సిద్ధాంతి జ్యోతిష పండితుడు. ఇతడిది పండితవంశము. ముత్తాత, తాత, పినతండ్రి అందరూ పండితులే. సింగరబొట్లపాలెం అగ్రహారంలోని వేదపాఠశాలలో కృష్ణయజుర్వేదం చదువుకున్నాడు. కడపలో జనమంచి శేషాద్రిశర్మ వద్ద నాటకాలంకారము, సాహిత్యము నేర్చుకున్నాడు. 1923లో కలకత్తా నుండి కావ్యతీర్ధ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. 1930లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉభయభాషాప్రవీణ ఉత్తీర్ణుడయ్యాడు. 1937లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పొందాడు. 1924లో మద్రాసులోని వావిళ్ల ప్రెస్‌లో ఆంధ్రపండితునిగా, 1925-1959ల మధ్య కాలంలో నంద్యాల మునిసిపల్ హైస్కూలులో అధ్యాపకుడిగా, 1960-1961ల మధ్య కర్నూలు సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హైస్కూలులోను, సాంస్క్రిట్ ఓరియెంటల్ హైస్కూలులోను తెలుగు పండితునిగా పనిచేశాడు.

…

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.3వభాగం.16.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.3వభాగం.16.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మరికొన్ని మంచి పుస్తకాలు 

మరికొన్ని మంచి పుస్తకాలు 
–నిరతాన్నదాత శ్రీమతిడొక్కా సీతమ్మగారి ఇనిమనవడు శ్రీడొక్కా రాం గారు తండ్రిగారి అంత్య క్రియల కోసం  అమెరికాలోని ఆస్టిన్ నుంచి ఇండియావచ్చి రాజమండ్రిలో కార్యక్రమాలు పూర్తీ చేసి మొన్న ఉదయం ఫోన్ చేసి తాను రాసిన పుస్తకాలు కొరియర్ లో పంపిస్తున్నానని చెప్పి అభిప్రాయం రాయమని కోరారు అలాగే ఆయన పంపగా నిన్న సాయంత్రం అందాయి .వీరితో దాదాపు 9ఏళ్ళ పరిచయం ఉంది .2017లో మేము ఐదవసారి అమెరికా లో మా అమ్మాయి వాళ్ళు ఉండే షార్లెట్ కు వెళ్ళినప్పుడు సాహిత్య సాన్నిహిత్యం బాగా పెరిగి వారి ,మా పుస్తకాల పరస్పర బట్వాడా జరగటం వారి పుస్తకాలపై నేను నా అభిప్రాయాలు రాయటం జరిగింది .నిరుడు వ్యాస జయంతికి వారు ఆస్టిన్ లో జరిపే మా బడి కార్యక్రమాలు చేయలేక పోవటం వలన సరస భారతి  ద్వారా చేయించి 80 వేలరూపాయలు పంపగా కరోనాలో ఉద్యోగాలుకోల్పోయినా తెలుగు బోధిస్తున్న అయిదుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఆ డబ్బు సమానంగా అందిస్తూ సరసభారతి ద్వారాకూడా మరింత ఆర్ధిక సాయం ఇచ్చి ఒక్కొక్కరికి సుమారు 25 వేల రూపాయలు అంద జేశాం .

  రాం గారు మంచి పద్యకవి విమర్శకులు హాస్య చతురులు .వారి పుస్తకాలలో ఇవన్నీ దర్శనమిస్తాయి .వారు పంపిన పుస్తకాలు -అవ్యక్తం -2కాపీలు ,తటిల్లతలు ,చిత్రపది ,ప్రవాసి ,పాట వెలది ,పలకరించే పద్యం ,ఆకు చుట్టిన ప్రకృతి, మా ఆఫ్రికా యాత్ర అనే పద్య సఫారి ,అమెరిక వాసి 

రాం గారు ఏదో కవిత్వంతో రచనలతో కాలక్షేపం చేసే వారు మాత్రమేకాదు బహు సాహితీ సాహిత్య కార్యక్రమాలు నిర్వహించటమేకాక సాఫ్ట్ వేర్ అధిపతి కూడా .ఆయన సోదరులూ మాంచి సరస్వతీ పుత్రులే .అమెరికాలో సాహితీ దండ యాత్ర చేసే సాహితీ మూర్తులే .

  రాం గారికి ధన్యవాదాలు .పుస్తకాలు చదివి అభిప్రాయం రాశాక వాటిని ఉయ్యూరు లైబ్రరీకి అందజేస్తాను 

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-22-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Leave a comment

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.5వ భాగం.15.9.22

11

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గాంధీ (యే)సర్వస్వం అనే గాంధీ త్రివేణిశ్రీ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో –గాంధీయే మార్గం

గాంధీ (యే)సర్వస్వం అనే గాంధీ త్రివేణి
శ్రీ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో –గాంధీయే మార్గం (సిద్ధాంతాలు –ప్రభావాలు –పరిష్కారాలు )పేరిట రెండు భాగాలు ,అసలైన విప్లవవాది సిద్ధాంత కర్త గాంధీజీ అనే మూడు పుస్తకాలపై నా స్పందన .ఇవి వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాల సంకలనాలు .మొదటి పుస్తకం లో28,రెండవభాగం లో 27,మూడవపుస్తకం లో 26 వ్యాసాలున్నాయి .రచయితలలో సర్వశ్రీ నాగసూరి ,మండలి ,రామచంద్రమూర్తి ,నాగులపల్లి ,దాశరధి బాపిరాజు ,తిలక్ ,సోమసుందర్ వంటి మహామహులున్నారు .ఈ మూడు పుస్తకాలను కలిపే నేను రాస్తున్నాను .నేటికీ గాంధీయే మార్గం అన్న ఒకే ఒక విషయం వీటిలో  కనిపిస్తుంది .కానీ ‘’బాపు బాట కాన రాదిచట ‘అని బాధపడ్డారు డా .నాగులపల్లి భాస్కర రావు .ఈ పుస్తకాలు విజ్ఞానవని ,వజ్రాలగని అన్నారు నాగసూరి .నేడు అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపరిస్కారం ,సహన౦ ,చర్చలతో సాధ్యం అని ఆనాడే విశ్వం మెచ్చిన మార్గదర్శి ,మహానాయకుడు గాంధీ అన్నారు శ్రీమతి శేషమ్మ .గాంధీమార్గం భగవద్గీతే అన్నారు మాణిక్యవరప్రసాద్. ధనమే మూలంగా మారి,విలువలు పతనమై ,ప్రకృతి సంపద ధ్వ౦సమౌతున్న వేళప్రపంచ శాంతికి విఘాతం అవుతోందని టన్ను సిద్ధాంతాలకన్నా  ఒక ఔన్స్ ఆచరణ మిన్న అన్న మహాత్ముని మాట బాట బంగారం అన్నారు మండలి బుద్ధప్రసాద్ .ప్రకృతి శూన్యాన్నే కోరుతుందని గాంధీ ఉవాచ అన్నారు సలీం భాయ్ .ప్రకృతిపై మానవ మేధఅనే దృష్టి వదిలి కృషి చేస్తే మనపై వట్టిడితగ్గి  మనసులు కుదుటబడి కరోనా బారిన పడకుండా తప్పించుకోవచ్చునని నాగసూరి ,గాంధీకి తోడుగా నిలచిన అక్క అనసూయాబెన్ ,తమ్ముడు ,మిల్లుయజమానుల నాయకుడు అంబాలాల్ అని సవివరంగా వివరించారు చంద్రహాస్  .ఫాదర్ రెవరెండ్ జాన్ హేనస్ హోమ్స్ మహాత్ముని ఆరాధకుడు .గాంధీ మాటల్లోనిసత్యాన్ని అన్వేషించిన సాహసి ధర్మపాల్ అన్నారు అవధానం .’’నరుడవై స్థిత ప్రజ్ఞుడవైన వేళ-హరుడవై నేలను శత్రు శూన్యం చేసిన వేళ-దరహాసంతో దర్సన మిచ్చిన వేళ-నీవు బోధి సత్వుడవు ‘’అని కీర్తించి ‘’రష్యా స్వేచ్ఛా రాగం అతడు –భారతముక్తికి పల్లవి అతడు ‘’అని నిండుమనసుతో మహాత్ముని ఆరాధించాడు బాపి బావ అని తెలిపారు శ్యామల .అహింసావాది ,అమెరికా వ్యవసాయ కూలీల నాయకుడు సీజర్ చావెజ్ కు గాంధీయే స్పూర్తి అని మండలి అంటే ,మేకింగ్ ఆఫ్ మహాత్మా సినిమా ను  శ్యాం బెనెగల్ ఉత్తేజజకరంగా చిత్రించాడని ,దక్షిణాఫ్రికాలో ఉండగా గాంధీస్వయం గా తయారు చేసిన చెప్పుల జతను  జైలు నుంచి విడుదలయ్యాక అప్పటి అక్కడి హో౦ మంత్రి స్మట్ కు బహూకరిస్తే ‘’వాటిని చాలాయేళ్ళు వాడి ‘’ఈవెన్ దోఐ మే ఫీల్ దట్ ఐ యాం నాట్ వర్దీ టు స్టాండ్ ఆన్ దిషూస్ ఆఫ్ సో గ్రేట్ ఎ మాన్ ‘’అని అత్యంత వినయంగా అన్న విషయం చెప్పారు తాడి .ఇందులోనే గాంధీ బెనారస్ హిందూ యూనివర్సిటిలో ఇప్పుడున్న రుగ్మతలు నశించాలని ,గీతాధ్యయనం తో తాను  పొందిన స్పూర్తితో –మనసు కట్టడి చేసుకో –తీరు మార్చుకో అనే వ్యాసాలున్నాయి .కనుపర్తి వరలక్ష్మమ్మగారు ‘’శస్త్రం ధరించకుండా ,ధర్మం మీర కుండా మహాత్ముడు అన్నీ సాధించాడని అంటే ,సమానత్వం అనేది గాంధీ సిద్ధాంతాలలో కీలకం అనికీర్తించారు పుచ్చలపల్లి సుందరయ్య .వ్యక్తినీ ,సంపూర్ణ సమాజాన్నీ ప్రేమించే విషయం లో గాంధీ రెండవతధాగతుడు అన్నాడు రాహుల్ సాంకృత్యాయన్.గాంధీ జీవితం ఒక మహాకావ్యంగా భాసించింది అనుభూతికవి తిలక్ కు .మహాత్ముడే తనకు మహా కవి అన్నాడు మరో అడుగు ముందుకు వెళ్లి దాశరధి .’’గోమాత నాకు కరుణారస భరిత కావ్యం ‘’అని గాంధీ అన్నాడని గుర్తు చేశాడు .
  రెండవ భాగం లో గాంధీ తెచ్చిన స్వాతంత్ర్యాన్ని పరి రక్షించుకోవటం ఇవాళ చాలా ముఖ్యం ,అవసరం అన్నారు రామ చంద్ర మూర్తి .ఈ 75ఏళ్ళలో గాంధీ మార్గం ఏమైంది అని ప్రశ్నించారు వేణుగోపాల్ . గాంధీ నితాను చూడకపోయినా ఆయన మరణ వార్త తమ కుటుంబాన్ని కలచి వేసింది దుఖంతో అన్నది ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి పెరల్ ఎస్ బక్.త్రిపురనేని గోపీ చ౦ద్ ‘’గాంధీ ది మన పూర్వ సంస్కారం పునాదిగాఉన్న దృష్టి .మానవుడు దైవాంశ సంభూతుడు .అతనిలో మంచితనం ఉంది అది ఎప్పుడూ ఉంటుంది అని భావించాడు ‘’అన్నాడు .భావకవితా మేస్త్రి దేవులపల్లి ‘’దేశం అంత జలాశయం గాంధీ –గాంధీ గంగానది ‘’అంటూ సామాన్యుని కట్టూ బట్ట తో ఉండే ఆయన, నలభై కోట్ల మందికి నాయకుడై ‘’రాజమాన్య రాజ పూజితుడైనపుడు ‘’అందులో ప్రతి దరిద్రుడు తానుకూడా నాయకుడైనట్లు గర్వించాడు.గాంధీ నేటి భారతానికి బాపూ ‘’అని కీర్తించారు  .మాజీ ప్రధాని పి.వి .‘’గాంధీ మరణించి నలభై ఏళ్ళు దాటినా ఇండియాముందు ,ప్రపంచం ముందు ఆయన ఉంచిన భావాలు ,లక్ష్యాలు నేటికీ బలీయమైన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తున్నాయి ‘’అన్నారు .’’అసంఖ్యాక భారతీయులకు నేను ప్రతినిదినయ్యానంటే ,ఆ అధికారాన్ని నేను కష్ట పడి సాధించుకొన్నాను ‘’అన్నాడు కొల్లాయి గట్టిన వాడు అని చెప్పాడు కొ.కు .మహాత్ముని సత్య స్మృతి ఈదేశస్తులందరికి సత్య మార్గ సందర్శనం కావించాలని  ఆకాంక్షించారు  సోమసుందర్ .గాంధీ అంటే స్వీయ పరివర్తనే అన్నాడు విన్సెంట్ షీన్ . ఇందులో భార్య కస్తూర్బా గురించి గాంధీ చెప్పిన వ్యాసమూ ఉంది .యాభై రెండేళ్ళ వయసులో గాంధీ కొల్లాయి కట్టటం మొదలు పెట్టాడని ,అది దరిద్రనారాయణులకు ప్రతీక అని చెప్పారు నాగసూరి .మనో బలాఢ్యుడు అని పద్మనాభస్వామి ,సిసలైన న్యాయవాది అని జస్టిస్ రామలింగేశ్వరరావు శ్లాఘించారు .హింద్ స్వరాజ్ అంటే ఏమిటో వివరించారు పభాకర్ .మహాదేవ దేశాయ్ పింగళి వెంకయ్య,మీరాబెన్ ,డెస్మండ్ టూటూ గార్లగురించి విలువైన వ్యాసాలున్నాయి .దీర్ఘాసి ‘’గాంధీ మళ్ళీ వస్తే రాబోయే తరాలవారిలో చైతన్యాన్ని సత్య ప్రియత్వాన్నీ నింపటానికి ఆత్మ స్వరూపి గా వస్తాడుకాని భౌతిక రూపం లో రాడు.అన్నారు.
  గాంధీ ధర్మకర్త్రుత్వ భావన పై ఆచార్య బాలమోహన దాస్ రాస్తే, కార్టూనిస్ట్ జయదేవ్ ఐన్స్టీన్ సూత్రాన్ని తమాషాగా గాంధీకి అనుకూలంగా ‘’G=HL^2 అనిమార్చి gఅంటే గాంధి ,హెచ్ అంటే హ్యూమర్ ,ఎల్ అంటే లాఫ్టర్ అంటూ గాంధీ ఒక అపూర్వమైన మైన మనిషి అన్నాడు .నాగసూరి  గాంధీ ని ’’అహి౦సాత్మక రాడికల్ సైన్స్ వాది’’అని ఎస్టిమేట్ చేశారు .
చివరిదైన మూడవ పుస్తకం లో సింహభాగం నాగసూరి దే .మానవ చరిత్ర పటలానికి ధ్రువతార ,వివేకం గల విజ్ఞాని ,గాంధీ అని అంతర౦గ  నుంచి  అంతర్జాతీయం దాకా  విస్తరించాడని ,శ్రమజీవిగా బహురూపాలలో దర్శనమిస్తాడని చెప్పి ఆయన్ను అనుసరించిన వారి వివరాలు పొందుపరచి ,కస్తూర్బా –గాంధీ ది అపురూప సాంగత్యం అని గ్రామీణాభి వృద్ధికి ఆయన చెప్పిన సిద్ధాంతాలు వివరించారు .పర్యావరణ ఉద్యమకారుడు జేసి కుమారప్ప ను పరిచయం చేసి ,అమరజీవి పొట్టి శ్రీరాములుగారు అపర గాంధేయవాది అని గుర్తుకు తెచ్చి ,సోషలిస్ట్ నాయకుడు లోహియతో గాంధీ మైత్రి విలక్షణమైనదని వివరించి ,గాంధీ గారి ‘’సైన్స్ ఆఫ్ బ్రహ్మ చర్య ‘’గురించి ,ఆయన కున్న శ్రేయస్సుమరువని సైన్స్ దృష్టిని ,గాంధీ దృష్టిలో టెక్నాలజీ ని ,గాంధీ అవసరం నేడు ఎక్కడెక్కడ? వ్యాసాలు విజ్ఞాన దాయకాలు. చివరలో గాంధీ జీవనగమనం కూడా చేర్చారు .ఈ పుస్తకాన్ని నాగసూరి తన తలిదండ్రులు శ్రీసంజీవయ్య ,శ్రీమతి గౌరమ్మ దంపతులకు సజల నేత్రాలతో అంకితమిచ్చి మాతా  పితృ ఋణం తీర్చుకొన్నారు .
  ఈమూడు పుస్తకాలు విజ్ఞాన గనులే .మహాత్ముని హృదయావిష్కరణలే .ఎంతోశ్రమతో తెచ్చిన పుస్తకాలు . గాంధీ ఫౌండేషన్ లాంటి పెద్ద సంస్థలు చేబట్టాల్సిన భారీకార్యక్రమం .ఇంకా మరికొన్ని ఇలాంటి పుస్తకాలు తెస్తారట కూడా అభినందనీయం. ఇవన్నీ   ఇటీవల వెలువడిన పుస్తకాలే .నాకు ‘’అన్నీ వేదాలలోనే ఉన్నాయిష ‘’అనేనానుడి ‘’అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ‘’అన్న అన్నమయ్య పదం గుర్తుకొచ్చాయి .
ఇవి చదివాక నేను 2019లో అంతర్జాలం లో రాసిన ‘’గాంధీ మహాత్ముడైన విధం ‘’అనే 6 వ్యాసాలు గుర్తుకొస్తున్నాయి .ఇవేకాక ‘’రిలేవెంస్ ఆఫ్ గాంధి ఇన్ ట్వెంటిఫస్ట్ సెంచరి ‘’అనే వ్యాసాల ఆధారంగా నేను నెట్ లో రాసిన మరి కొన్ని ఆర్టికల్స్ జ్ఞాపకం వస్తున్నాయి
మంచి విలువైన అర్ధవంతమైన పుస్తకాలు పంపి ,నా స్పందన కోరిన శ్రీ నాగసూరి వేణు గోపాల్ ను మనసారా అభినందిస్తున్నాను .
  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

న్యాయవాది, చిత్తూరు జిల్లా బోర్డ్ అధ్యక్షుడు ,మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి ,జస్టిస్ పార్టీ నాయకుడు మునుస్వామి నాయుడు

1-న్యాయవాది, చిత్తూరు జిల్లా బోర్డ్ అధ్యక్షుడు ,మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి ,జస్టిస్ పార్టీ నాయకుడు ,నిజాయితీకిమారుపేరు ,జమీందారీ వ్యతిరేకి ,రావు బహద్దర్ ,దివాన్ బహద్దర్- బొల్లిన మునుస్వామి నాయుడు

బొల్లిన మునుస్వామి నాయుడు చిత్తూరు జిల్లా తిరుత్తని దగ్గర వేలాంజరి గ్రామమందు 1885లో జన్మించాడు. తండ్రి బొజ్జా నాయుడు. తల్లి అక్కమాంబ. వీరి పూర్వీకులు కార్వేటి నగర సంస్థానంలో ఉన్నత పదవులలో ఉన్నారు. మునుస్వామి రైతు కుటుంబంలో జన్మించి న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి. ప్రధానమంత్రి పదవి పొందేందుకు ముందు ఆయన ప్రభుత్వం నియమించిన అగ్రికల్చర్ కమిషన్, బ్యాంకింగ్ ఎంక్వయిరీ కమిటీ, బ్యాంకింగ్ ఎకోకొరియర్ కమిషన్ వంటి కమిటీలు, కమిషన్లలో సభ్యునిగా పనిచేశారు.

1908లో మద్రాసు విశ్వవిద్యాలయము నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా రాణించాడు. జస్టిస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ రంగంలో అడుగు పెట్టాడు. చిత్తూరు మునిసిపల్ కౌన్చిల్ సభ్యునిగా, చిత్తూరు జిల్లా బోర్డు ఉపాధ్యక్షునిగా, అనంతరం అధ్యక్షునిగా, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా అంచలంచెలుగా ఎదిగాడు. అవిభక్త మద్రాసు రాష్ట్ర ప్రధాన మంత్రి (బ్రిటీషు వారి పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రధాన మంత్రిగా పిలచేవారు) గా 1930-1934 వరకు పదవిని అత్యున్నతంగా నిర్వహించాడు.[1]

1930ల్లో జస్టిస్ పార్టీలో నాయకునిగా ఎదిగిన మునుస్వామి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేసే జస్టిస్ పార్టీ తీరుమార్చే ప్రయత్నాలు చేశారు. స్వయంగా బ్రాహ్మణేతరుడైనా, తాను బ్రాహ్మణులను ద్వేషించడం ప్రధానాంశంగా అభివృద్ధి చెందిన జస్టిస్ పార్టీలో నాయకుడైనా ద్వేషం తగదని, బ్రాహ్మణులతో సఖ్యతగా, ప్రేమతోనే అభివృద్ధి సాధించాలని వాదులాడేవారు. బ్రాహ్మణులను కూడా జస్టిస్ పార్టీలో చేర్చుకోవచ్చన్న ప్రతిపాదనను చేసినవారు ఆయన.

మద్రాసు శాసనసభలో వివిధ కమిటీలలో సభ్యునిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. ఆచార్య ఎన్.జి.రంగా గారితో కలిసి జమీందారులకు వ్యతిరేకంగా, ఎస్టేట్ లెవల్ చట్ట సవరణకు పూనుకున్నాడు. ప్రధాన మంత్రిగా ఎన్నో ప్రజాహిత, అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టాడు. జమీందారులంతా కలిసి నాయుడుకు వ్యతిరేకులై గవర్నర్ పై ఒత్తిడి తెచ్చారు. అదే సమయములో తన వద్ద పనిచేసే బంట్రోతు పావలా లంచం తీసుకున్న విషయం తెలియడంతో నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ వాహనాన్ని వదలి గుర్రపు బగ్గీలో ఇంటికెళ్ళిన నిజాయితీపరుడు.

నాయుడు సేవలు గుర్తించిన బ్రిటీషు ప్రభుత్వం 1926లో రావు బహద్దర్, 1930లో దివాన్ బహద్దర్ బిరుదులను ప్రదానం చేసింది.

వీరు 8వతేదీ నుండి అస్వస్థతకు గురియై, జనవరి 13, 1935 తేదీన ఉత్తరాయణం ప్రవేశించిన పుణ్యతిథిన 50వ ఏట వైకుంఠప్రాప్తిని పొందారు.[2]

ఈయన జీవిత చరిత్ర “శ్రీయుత దివాన్ బహదూర్ మునుస్వామి నాయుడు గారియొక్క జీవిత చరిత్రము”ను ఆయన వద్ద ఆంతరంగిక సహాకుడుగా పనిచేసిన ఉమాపతి వ్రాశాడు.

2-క్విట్ ఇండియా ఉద్యమ నేత ,మద్రాస్ శాసన సభ్యుడు,27ఏళ్ళు నంద్యాలలోక్ సభ సభ్యుడు,కేంద్ర పార్లమెంటరి వ్యవహారాలమంత్రి ,వాసవీ విద్యా సంస్థ స్థాపకుడు ,వక్త ,సంజీవరెడ్డి శిష్యుడు – పెండేకంటి వెంకటసుబ్బయ్య
పెండేకంటి వెంకటసుబ్బయ్య (జ: జూన్ 18, 1921 – అక్టోబర్ 12, 1993), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. వీరు నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నియోజకవర్గం నుండి లోక్‌సభకు నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. వెంకటసుబ్బయ్య 1980 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వములో గృహ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రిగా పనిచేశాడు. ఈయన బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.[1]

బాల్యం, విద్య
వెంకటసుబ్బయ్య కర్నూలు జిల్లా, బనగానపల్లె సంస్థానంలోని సంజామల గ్రామంలోని ఒక సంపన్న రైతు కుటుంబంలో, 1921 జూన్ 18న జన్మించాడు. నంద్యాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే జాతీయోద్యమ కార్యక్రమాల్లో జైలు శిక్షను లెక్కచేయకుండా క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఈయన కనకమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[2]

వెంకటసుబ్బయ్య మదనపల్లె బీటీ కళాశాలలో చదువుతున్న రోజుల్లో క్విట్ ఇండియా, హోం రూల్ ఉద్యమంలో భాగంగా ఇప్పటి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీటీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పట్లో ధర్నాలంటే ఆషామాషీ కాదు. చాలా పెద్ద నేరం కింద జమకడతారు. ఆందోళన చేసే వారిపై బ్రిటీష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారు. వెంకటసుబ్బయ్యతో పాటు సహ విద్యార్థులైన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, సి.దాస్, నూతి రాధా కృష్ణయ్య తదితర 40మంది విద్యార్థులను అరెస్టు చేశారు.

బనగానపల్లె సంస్థానంలో కాంగ్రేసును స్థాపించి, స్వాతంత్ర్యం తర్వాత 1948లో బనగానపల్లె సంస్థానం భారతదేశంలో విలీనం కావటానికి దోహదపడ్డాడు. 1948లో మద్రాసు శాసనసభ సభ్యుడయ్యాడు.[2] ఆ తరువాతి కాలంలో నంద్యాల లోకసభ సభ్యునిగా 27 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాడు.

ఇతర విశేషాలు
గాంధేయవాది అయిన వెంకటసుబ్బయ్య వాసవీ విద్యాసంస్థలను స్థాపించి, వాసవీ ఇంజనీరింగ్ కళాశాల[3], పెండేకంటి న్యాయ కళాశాల, పెండేకంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్[4], వాసవీ సంగీత, నాట్య కళాశాల[5] మొదలైన అనేక విద్యాసంస్థల స్థాపనకు దోహదపడ్డాడు.72వ ఏట 12-10-1993న మరణించాడు

బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నప్పుడు గురువు సంజీవరెడ్డి తో పాటు ఉయ్యూరు ఎన్నికల ప్రచారానికి వస్తే ,ట్రావెలర్స్ బంగ్లా లో ఇద్దర్నీ చూశాను .నాలుగు రోజులతర్వాత ఢిల్లీ వెళ్లి ఇందిరా కాంగ్రెస్ లో చేరి జంప్ జిలానీ అనిపించుకొన్నాడు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతిఖండం.2వ భాగం.15.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతిఖండం.2వ భాగం.15.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు ,మంత్రి ,ఆంధ్రోద్యమకారుడు ,కాఫీ బోర్డ్ అధ్యక్షుడు- హాల హర్వి సీతా రామ రెడ్డి

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు ,మంత్రి ,ఆంధ్రోద్యమకారుడు ,కాఫీ బోర్డ్ అధ్యక్షుడు- హాల హర్వి సీతా రామ రెడ్డి

హాలహర్వి సీతారామరెడ్డి, రాయలసీమకు చెందిన రాజకీయనాయకుడు, స్వాతంత్ర్యసమరయోధుడు. బళ్ళారి నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికై 1947 నుండి 1952 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ, పరిశ్రమలు, శ్రామిక శాఖల మంత్రిగా పనిచేశాడు.

సీతారామరెడ్డి, 1900, మే 14న అప్పటి బళ్ళారి జిల్లాలోని హాలహర్విలో జన్మించాడు. ఈయన తండ్రి బొజ్జి రెడ్డి. సీతారామరెడ్డి మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో బీ.ఏ పట్టభద్రుడై, లా కళాశాల నుండి బీ.ఎల్ పట్టా పుచ్చుకున్నాడు. 1930లో మద్రాసులో న్యాయవాదిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన సీతారామరెడ్డికి గోవిందమ్మతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు.[1] 1937లోనూ, తిరిగి 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు.

రాయలసీమ అభివృద్ధి సంఘం అధ్యక్షునిగా ఉన్నాడు. ఆంధ్రోధ్యమంలో చురుకుగా పనిచేసిన సీతారామరెడ్డి 1937లో కడప కోటిరెడ్డి అధ్యక్షతన విజయవాడలో జరిగిన రజతోత్సవ ఆంధ్ర మహాసభలను ప్రారంభించాడు.[2] రాయలసీమ నేతగా శ్రీబాగ్‌ ఒడంబడికలో కూడా పాల్గొన్నాడు. 1960 నుండి బెంగుళూరు కాఫీ బోర్డు అధ్యక్షునిగా పనిచేశాడు.[3] 1962లో ఆదోని నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

కాంగ్రెస్ అధ్యక్షుడు ,,పీపుల్స్ మాగజైన్ సంపాదకుడు ,,న్యాయవాది, రావు బహదూర్ శ్రీ వనప్పాకం అనంతా చార్యులు

కాంగ్రెస్ అధ్యక్షుడు ,,పీపుల్స్ మాగజైన్ సంపాదకుడు ,,న్యాయవాది, రావు బహదూర్ శ్రీ వనప్పాకం అనంతా చార్యులు

పనప్పాకం అనంతాచార్యులు (పనప్పాకం ఆనందాచార్యులు) (1843 – 1907) అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు.[1] ఈయన ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశేష స్థానం కలిగినవారు. 1884 సంవత్సరములో స్థాపించబడ్డ మద్రాసు మహాజనసభ అను కార్యాలోచన సభ వ్యవస్థాపకుడు, పీపుల్స్ మాగజీన్ అను మాసపత్రికకు సంపాదకుడుగానూ ఉన్నాడు. “ఆయన పేరు పి. ఆనందాచార్యులని ప్రసిద్దిచెందిననూ ఆయన ఎప్పుడూ పి. అనంతాచార్లు అని సంతకం చేస్తూ తనను తెలుగు వాడిగా ప్రకటించుకుంటూ ఉండిరి” అని 1948 మే 5వ తేది ఆంధ్రపత్రికలో మద్రాసు మహాజన సభ అనే వ్యాసములో దిగవల్లి వేంకటశివరావు వ్రాశాడు.[2]

జీవిత విశేషాలు
అనంతాచార్యుల వారి పూర్వులు చంగల్ పట్టు జిల్లా పొన్నేరు తాలూకా లోని గ్రామం పనప్పాకం వాస్తవ్యులు. వీరి తండ్రిగారు శ్రీనివాసా చార్యులు గారు ఇప్పటి చిత్తూరు జిల్లా (అదివరకటి నార్త్ ఆర్కాట్ జిల్లాలో కడమంచి అను తెలుగు గ్రామంలో ఇల్లు కట్టుకుని స్థిర పడ్డారు. అనంతాచార్యులు కడమంచి గ్రామంలోనే 1843లో జన్మించారు. వారి 12 ఏటనే తండ్రి శ్రీనివాసాచారి మరణించాడు.

ఈయనచిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863 లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. వీరు 1889లో మద్రాసు అడ్వొకేట్ల సంఘాన్ని స్థాపించారు.[3] లండనులో ఇంపీర్యల్ కౌన్సిల్లో ఇద్దరే ఇద్దరు భారతీయ (నేటివ్) సభ్యులోలో వీరు 1895 నుండి 8 ఏండ్లు సభ్యలుగా వుండి భారతీయుల దీనస్థితిగతులను వైస్రాయి సమక్షంలో కూడా ధైర్యముగా వెల్లడించేవారు. 1885 డిసెంబరు 28 న జాతీయ కాంగ్రెస్ మహాసభ స్దాపించుటకు బొంబాయి నగరములో జరిగిన ప్రప్రథము సభలో పాల్గోన్న 72 మందిలో అనంతాచార్యులు గారు తెలుగువారవటం గర్వించతగిన విషయం. అటు తరువాత 1891 డిసెంబరులో నాగపూరులో జరిగిన 7 వ కాంగెస్ మహాసభకు అధ్యక్షుడైనారు. 1878 లో స్దాపించబడ్డ హిందూ మహాజన సభలో సభ్యులు గానున్న సర్ టి. మాధవరావు, దివాన్ బహదూర్ ఆర్ రఘునందన రావు, న్యాపతి సుబ్బారావు గార్లతోపాటు గావీరు గూడా సభ్యులు, వీరందరూ తిరునల్ వేలి లటరరీ సదస్సులోకూడా ప్రముఖ సభ్యులు. హిందూ పత్రికలో 1878 నుండి వారి వ్యాసములు ప్రచురితమైనవి.1882 లో “How to reform the Courts” అను గ్రంథమును 1883లో“The Legal Profession, how to reform it” అను గ్రంథముప్రచురించారు. Madras Native Public Opinion అను ఇంగ్లీషు పత్రికలో వ్యాసములు వ్యాసేవారు వారు న్యాయవాదిగా చేసిన కేసులలో వారి వాదనలు Indian Law Report లో తరచు రిపోర్టు అవబడుతూవుండేవి.

అనంతాచార్యులు గారిని గురించి ఆదిభట్ల నారాయణదాసు కవి, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసి యున్నారు. ఆంతటి విశేష మైనవ్యక్తి జీవితచరిత్ర లేకపోవటం, వేరెవరూ కూడా వ్రయకపోవటం అంతేకాక వారిని గురించి 1966 తరువాత వచ్చిన మూలాధారములు వారి పేరు “ఆనందాచార్యులు” అని ఉండటం చాల నొచ్చుకోతగ్గవిషయం. దీనికి కారణం వారిని గూర్చిన మూలాధారము ఒకటి మద్రాసులోని వారి మిత్రులొకరు అరవభాషలో వ్రాసియుండటం తదుపరి మూలాధారాలైన కాంగ్రెస్ చరిత్ర పుస్తకంలో వారి పేరు “ఆనందాచార్యులు” అయిపోవటం మరీ దురదృష్టకరమని వాపోయారు చరిత్రకారులు.[4]

న్యాయవాది వృత్తి, రావుబహదూర్ బిరుదు
1870లో మద్రాసు హేకోర్టులో న్యాయవాదిగా చేరారు.కావలి వెంకటపతిరావుగారి జూనియర్ గా కేసులు చేయటం ప్రారంభించిన కొద్దిరోజులలోనే వీరికి ప్రతిపక్షంగా బారిస్టర్ H.D Mayne అనుఆఖండన్యాయది (హిందూధర్మశాస్త్రాన్ని గూర్చి రచించిన ఉద్ఘ్రంధ కర్త ) తో భేటి పడిన ఒక కేసులో వీరు కేసు నడిపించి వాదాన చేయటం ఆ వాదనను హైకోర్టు ప్రధానన్యాయమూర్తి స్వయముగా ప్రసన్నించటము వీరి న్యాయవారి వృత్తిలో ఒక మైలు రాయి లాగ అయి అప్పటినుండి వీరి సీనియర్ కావలి వెంకటపతిగారు వీరిని జూనియర్ గా కాక తన భాగస్వామిగా స్వీకరించటం జరిగింది. త్వరలోనే వీరు చన్నపట్ణంలో అప్పటిలోనున్న అగ్రశ్రేణి న్యాయవాదులైన భాష్యం అయ్యంగార్, సర్ సుబ్రమణ్య అయర్ కోవకి చేరుకునటం జరిగింది. వీరి గొప్ప సమర్ధత ప్రావీణతకు హైకోర్టు ప్రధాన్యాయమూర్తి సిఫారసుపై రావుబహదూర్ బిరుదును విక్టోరియా రాణీ జాబిలీ సందర్భమున వీరికి ఇవ్వబడింది. వీరు గొప్ప ధైర్యసహాసములు గలవారు. ఆరోజులలోని ఇండియన్ పీనల్ కోడ్ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడులోని నిషేధనలోని లోటుపాటులను నీరు తీవ్రముగా విమర్శించి ఖండించారు. అప్పటి ప్రభుత్వము ఆయా శాసనములను సవరించుటకు నియమించబడ్డ ఉపసంఘములో ఇద్దరే ఇద్దరు నేటివ్ సభ్యులగల ఉపసభలో వీరొకరు, దర్భాంగ మహారాజ గారిని సభ్యులుగా నియమించారు. మిగతావారందరు ఆంగ్లేయదొరలగుట వారి అధిక సంఖ్యతో వీరి ప్రతిపాదనలు తిరస్కరించటం వీరు తీవ్రంగా డిసెంట్ ప్రకటించారు. వీరి ధైర్యసాహసాలు గణనీయము. నిర్మొహమాటంగా అన్యాయమును ఖండించగల ధైర్యసాహసి. 1881-1886 మధ్యకాలంలో మద్రాసు గవర్నరుగా నుండి అతి కఠినముగా భారతీయలపై పక్షపాతముగా నిర్దయుడైన గ్రాంటు దొర గారి వీడ్కోలుకు ప్రభు భక్తులు సంసిద్ధులగుతుండగా అనంతాచార్యులుగారొక బహిరంగసభలో నిర్మొహమాటంగా ఆప్రతిపాదనను తిర్కరించి ప్రసంగించటంతో ఆ వీడ్కోలు సన్నాహం ఆపటం జరిగింది.

రచయితగా
మొదట్లో ఆనందాచార్యులు జర్నలిజం, రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. ఆయన ‘నేటివ్ పబ్లిక్ ఒపీనియన్, మద్రాసి’ అనే మ్యాగజైన్లకు వ్యాసాలు రాసేవారు. ఆ తర్వాత హిందూ పత్రిక స్థాపనకు సహాయం చేసి, వ్యాసాలు రాశారు. రాజకీయాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా సేవలందించారు.[5]

రాజకీయ నేతగా
వీరు 1885లో బొంబాయిలో సమావేశమైన నాటి నుండి భారత జాతీయ కాంగ్రెసు సభా సమావేశాలలో పాల్గొని గణనీయమైన సేవచేశారు. 1891 నాగపూర్లో జరిగిన 7వ జాతీయ సభకు వీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు వీరు. వీరు కాంగ్రెసు కార్యనిర్వహక సంఘంలో సభ్యులుగాను, అలహాబాదు కాంగ్రెసు కార్యదర్శులలో ఒకరుగా ఎన్నికయ్యారు. 1896లో భారతీయ సామ్రాజ్య శాసనసభకు చెన్నై నుండి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. ఆ సభలో నిర్భయంగా ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి 1903లో రాజీనామా చేశారు. వీరు నవంబరు 28 1907 న పరమపదించారు.

సత్కారాలు
ఈయన ప్రతిభకు మెచ్చి 1887లో ఆనాటి ప్రభుత్వం రాజబహుదూర్ బిరుదుతో సత్కరించారు. ఆంధ్ర భాషా సారస్వత పోషకుడిగా కీర్తి గడించడమే కాకుండా ‘పద్యావినోద’అనే బిరుదుతో ఆనాటి సాంస్కృతిక సమాజాలు సత్కరించి గౌరవించాయి.

అనంతాచార్లుగారా? ఆనందాచార్లుగారా?
ఈయన పేరు వివిధ పుస్తకాలు, అంతర్జాల వనరులలో రెండు విధాలుగా ఉంటుంది. ఈయన పేరు అనంతాచార్యులైనా అనేక గ్రంథములలో ఆనందాచార్యులుగా ప్రచురితమైనది. అది తేలేవరకూ నేలటూరి వెంకట రమణయ్య విజ్ఞాన సర్వస్వం లో వ్రాసినట్లు అనంత(ఆనందా)చార్యులు గారే.[6] ఇది తమిళ- ఆంగ్ల తర్జుమాల గడబిడ. మద్రాసు హైకోర్టు సెంటినెరీ సంకలన పుస్తకములో కూడా ” ఆనందాచార్యులు ” అని వుండటం.[7]. అంతకన్నాముందే ఇంకో మూలాధారము ఒకటి మద్రాసులోని వారి మిత్రులొకరు, కె సుందర రాఘవన్ అను వారు తమిళం లో వ్రాసిన గ్రంథము”Rao Bhadur P.Anandacharyulu” మూలాధారముచేసి 1965 Freedom Struggle in Andhra Pradesh Volume I Document No.86 pp235–245 అను ప్రభుత్వ ప్రచురితమైన గ్రంథములో ఇంగ్లీషు తర్జుమాల లోను వచ్చిన గడబిడ. ప్రభుత్వప్రచురణ గీటురాయి యై తదుపరి ప్రచురణలకు కారణభూతమైనది . 19 వశతాబ్దమునాటి ఆంధ్రమహాపురుషుని గూర్చిన విషయ సేకరణ ఇప్పుడు 21వ శతాబ్దములో విషయ స్పష్టతకి మార్గం తిరిగి మరోమారు

మూలాధార సేకరణ

  1. ఆయన స్వయంగా రచించిన వ్యాసములు, వారు 1890 -1895 మధ్య నడిపించి న పత్రిక “వైజయంతి “ అను పత్రిక, న్యాయవాదిగా వారి వాదనలు రిపోర్టు చేసిన I L R reports [Indian Law Reports back issues ]
  2. హరికథా పితామహుడుగా బిరుదు పొందిన అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (1864- 1945) గారి ఆత్మకథలో అనంతాచార్యులుగారిని గురించి వ్రాశారు[8]
  3. 1891 నాగాపూరులో జరిగి న అఖిలజాతీయ కాంగ్రెస్ మహాసభ రిపోర్టు (2) ఉద్ధండులైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 05/03/1944ఆంధ్రపత్రికలో వీరిని గురించి వ్రాసిన వ్యాసం.[9]
  4. ఆంధ్ర విజ్ఞాన సర్వసంలో డా నేలటూరి వెంకటరమణయ్య గారి వ్యాసం.
  5. మద్రాసు మహాజనసభ లోఅనంతాచార్యులుగారి కృషి.[10]
  6. 1924 నుండి అనేక చారిత్రక విశేషాలు రచించిచి అనేక మన్ననలందుకుని నిర్మహొమాటంగా నిజం చప్పగలిగినవారని పేరుపొంది,19వ శతాబ్దమునాటి అనేక ప్రముఖులతో (వేటూరి ప్రభాకరశాస్త్రి, వడ్డాదిసుబ్బారాయడు, న్యాపతి సుబ్బారావు మొదలగు ఇంకా ఎందరి తోనో) స్వయంగా పరిచయముకలిగి అనేక చారిత్రకవిషయనులు త్రవ్విపోసినట్టి చరిత్రకారుడు 1966 లోనే ఈ లోపమును బయటపెట్టిన చారిత్రాత్మక ప్రచురణ.[11].
  7. దిగవల్లి వేంకట శివరావు గారు 1988 లో సమాలోచనలో వ్రాసిన వ్యాసములో అనంతాచార్యులు గారిని గూర్చిచాల అమూల్యవిశేషాలు వ్రాస్తూ స్వాతంత్ర్యపోరాటములో 1930 -1933 మధ్య వారితో పాటు ఒకసహగ్రంధకర్తగా నుండిన డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా స్వతంత్రోద్యమచరిత్రలో అనంతాచారిగారి పేరును’ఆనందాచారి’గా చరిత్రలోకెక్కించారని చెప్పక తప్పదని వాపోయారు.

ఛాయాచిత్రములో “పి. ఆనందాచార్యులు”

1944 లో వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వ్యాసంలో మొత్తం అంతా అనంతాచార్యులు గారనే అనేక సార్లు సంబోధించి యుండగా ఆవ్యాసములో ప్రచురించిన ఛాయాచిత్రము క్రింద ఆనందార్యులు అని వుండటం ఆశ్చర్యమైన విషయం. కానీ ఆంధ్ర విజ్ఞానసర్వస్యం లోనేలటూరి వెంకటరమణయ్యగారి వ్యాసంలో మాత్రం ఛాయాచిత్రము క్రింద “చిత్రము 128 పనస్పాకము అనంతాచార్యులు” అని వుండటం గమనీయం.[12]

సాహిత్యకృషి
సర్ టి మాధవరావు, మరియూ దివాన్ బహదూర్ ఆర్ రఘునాధ రావు గారు నిర్వహించిన The Madras Native Public Opinion అను ఇంగ్లీషు పత్రికలో అనంతాచార్లుగారు వ్యాసాలు వ్యాశారు. ఆ పత్రిక కొన్నాళకు ఆగిపోయినతరువాత దాని స్ధానంలో మద్రాసీ అను తెలుగు పత్రికలో వ్యాసాలు వ్రాశారు. 1878 లో స్దాపించ బడ్డ హిందూ పత్రికలో అనేక వ్యాసాలు వ్రాశారు. అనేక బహిరంగ సభలలో ఉపన్యాసాలుచ్చారు. 1890-1899 మధ్యన వారు వైజయంతి అను తెలుగు పత్రిక నడిపించారు. ఆ పత్రికలోకొక్కొండ వెంకటరత్నం గారు రచించిన మహాశ్వేత అను నవలను ప్రకటించారు. శబ్దరత్నాకరం రచించిన బహుజనపల్లి సీతారామాచార్యులు గారు గూడా ఆ వైజయంతి పత్రికలో వ్యాసాలు వ్రాసేవారు. అనంతాచార్లుగారు మంజువాణీవిజయము అనే నాటకమును రచించి తన పత్రిక వైజయంతిలో ప్రచురించారు. ఆ వైజయంతి పత్రికలో అనేక గొప్ప గొప్ప పూర్వప్రబంధములను ప్రచురించారు అందులో ఎర్రాప్రగడ విరచితమైన నృసింహపురాణము, మాడభూషి వెంకటనరసిహాచారి గారు రచించిన పల్లవీపల్లవోల్లాసమను శకుంతలా పరిణయము (కృష్ణకవిరచించిన) మొదలగునవి ప్రచురించారు. అనంతాచారి గారి చరమదశలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు స్నేహితులైనారు. అనంతాచారిగారిని స్వయంగా ఎరిగి వారిని గూర్చి 5-3-1944 లో ఆంధ్రపత్రికలో వ్యాసము వ్రాశారు.

మరణం
పనప్పాకం అనంతా చార్యులు గారు 28/11/1907 న 64 వ ఏట దివంగతులైనారు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-22-ఉయ్యూరు

image.png

Posted in మహానుభావులు | Leave a comment

మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్

మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్

— పాకాల వెంకటరమణారావు రాజమన్నార్ (మే 1, 1901 – అక్టోబర్ 1, 1979) న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. 1948 నుండి 1961 వరకు మద్రాసు రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[1] అప్పటి మద్రాసు రాష్ట్ర గవర్నరు ఏ.జె. జాన్ మరణించడంతో హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా ఉన్న రాజమన్నారు 1957 నుండి 1958 వరకు మద్రాసు రాష్ట్ర ఆపద్ధర్మ గవర్నరుగా పనిచేశాడు[2][3]

జననం
రాజమన్నార్ 1901లో మద్రాసులో జన్మించాడు. ఈయన తండ్రి వెంకట రమణారావు నాయుడు అప్పటికే ప్రముఖ న్యాయవాది. ఆ తర్వాత మద్రాసు హైకోర్టులో న్యాయధిపతిగానూ, ప్రధానన్యాయాధిపతిగానూ పనిచేశాడు. రాజమన్నార్ కూడా తండ్రిబాటలోనే న్యాయవాదిగా 1924లో బార్ లో చేరాడు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ 1944లో అత్యున్నత పదవైన అడ్వకేటు జనరల్ అయ్యాడు.[4]

రాజమన్నార్ తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, ఫ్రెంచి భాషలలో పాండిత్యం సంపాదించాడు. తెలుగులో విప్లవాత్మక నాటకాలెన్నో వ్రాశాడు. సమకాలీన నాటకరంగాన్ని, సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విమర్శకునిగా కూడా పేరుతెచ్చుకున్నాడు. కొంతకాలం లలితకళకు సంబంధించిన తమిళ మాసపత్రిక “కళ”కు సంపాదకత్వం వహించాడు.[5] ఈయన ఫోటోగ్రఫీ ఒక హాబీ. రాజమన్నార్ వ్రాసిన నాటకాలెన్నో రేడియోలో ప్రసారమయ్యాయి. వాటిలో చాలా అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ఈయన బళ్ళారి రాఘవతో కలిసి “తెగని సమస్య” అనే నాటకాన్ని రచించాడు. తెలుగులో ఏకాంకికలు వ్రాసిన ఆద్యులలో ముద్దుకృష్ణ, చలంలతో పాటు రాజమన్నారు కూడా ఒకడు.[6] ఈయన వ్రాసిన నాటకాలలో తప్పెవరిది?,[7] ఏమి మగవాళ్లు, నిష్ఫలం, విముక్తి, వైకుంఠాచార్యులు, దెయ్యాలలంక, నాగుపాము, వృథాయానం, సంకల్పం, కఠినమార్గం, పరకీయ, నందిని, వెర్రిముండ, బంధాలు, భార్యాభర్తలు ముఖ్యమైనవి. “శృతితప్పిన సజీవన రాగం” అనే నవలను కూడా రచించాడు. నీడలేని ఆడది అనే సినిమాకు కథను అందించాడు[8]. ఇతడు ఈయన కళలకు, సాహిత్యానికి చేసిన సేవకు తగ్గట్టుగా భారతీయ సంగీత నాటక అకాడెమీకి అధ్యక్షునిగా నియమితుడయ్యాడు.

రాజ్‌మన్నార్ కమిటీ
1969లో అప్పటి తమిళనాడు డి.ఎం.కె ప్రభుత్వం కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై సమీక్షకు పి.వి.రాజమన్నార్ అధ్యక్షతన ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. ఇది రాజ్‌మన్నార్ కమిటీగా ప్రసిద్ధిచెందినది. రాజ్‌మన్నార్‌తో పాటు మద్రాసు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఏ.లక్ష్మణస్వామి ముదలియార్, ఆంధ్రరాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రారెడ్డిలు ఈ కమిటీలో సభ్యులు.[9] సమాఖ్య ప్రభుత్వంలో కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై సమీక్షించి విలువైన సూచనలిచ్చింది. ఈ కమిటీ ఇచ్చిన సూచనలలో ముఖ్యమైనది “అంతర్రాష్ట్ర మండలి”ని ఏర్పాటుచేయడం.i

మరణం
రాజమన్నారు 1979, అక్టోబర్ 1 న 78 వ ఏట మద్రాసులో మరణించాడు.

మీ గబ్బిట దుర్గాప్రసాద్-14-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

భాషా కోవిదుడు ,స్వయంగా సంస్కృతం నేర్చివచన గ్రంధాలు నవలలు, బాలసాహిత్యం ,డిటెక్టివ్ నవలలు రాసిన -గుంటి సుబ్రహ్మణ్య శర్మ

జీవిత విశేషాలు
సంస్కృత, ఆంగ్ల. ఆంధ్ర భాషలలో విద్యావంతుడు. సంస్కృతము గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. అనంతపురంజిల్లా లోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.కాం పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండి 18 నవలలు, 18 బాలసాహిత్య కథాసంపుటాలు,18 వచనప్రబంధాలు, 20 జాతీయనాయకుల జీవితచరిత్రలు, 8 పద్యకావ్యాలు, ఇంకా ఎన్నో ఇతర గ్రంథాలు వెలువడినవి. ఇతని అపరాధపరిశోధక నవల ‘భూతగృహము’ ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల కాకినాడచే 116/-రూ.ల బహుమతి గెలుచుకుంది.

రచనలు
భూతగృహము (అపరాధపరిశోధక నవల)
రహస్యశోధనము (అపరాధపరిశోధక నవల) [2]
విశ్వజ్యోతి (గౌతమ బుద్ధుని చరిత్ర కావ్యము)
మాధవాశ్రమము (నవల)
విశ్వప్రేమ (బసవేశ్వరుని చరతము కావ్యము)
శ్రీరామకృష్ణ భాగవతము (5000 పద్యాలున్న ఉద్గ్రంథము)
జయాపజయములు
కాసులదండ
కాలభ్రమణం
కన్నీటికాపురం
ఆత్మతత్త్వవిచారము
రచనల నుండి ఉదాహరణలు
ఎన్నఁటికైన నన్ను నిను నేర్పడఁజేయును మిత్తి; సంపదల్
మిన్నలు కావు; నేను మిడిమేలపు జీవితమొంది భూమిపై
గ్రన్నన జచ్చుకంటె, బలకాయ సముత్థిత శక్తివెల్, నా
పన్నుల సేవఁజేతు; నిదిపాడియ; మద్భవసార మిద్ధరణన్
ఏమి సేతు నకట! ఎనలేని నీరూప
కాంతి, రెంట దీన కష్టజనుల
యోజ, చేరి మనసు నుఱ్ఱూత లూగించు
సుదతి నిన్ను విడుతు సుకృతమెంచి
తనయుడనై నీయొడిలో
దనరారుచు నుందు నింక తలఁకక,నాపై
మనసుంచక, యేలోటును
గనుపించక సుతునితోడ గడుపుము దినముల్
(విశ్వజ్యోతి నుండి)
మృత్యుముఖమున దరిజేరి మేధినీశు
లొక్కటౌదురు,భువిలోన సుక్కి పిదప
నెవర లేమౌదురో దేవు డెఱుగు? నకట!
మురిసిపోదురు మూన్నాళ్ళ ముచ్చటలకు
(విశ్వప్రేమ నుండి)
బిరుదులు/సత్కారాలు
అనంతపురము రాయలకళాగోష్ఠి ఇతడికి మహాకవి అనే బిరుదును ప్రదానం చేసింది.
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -14-9-22-ఉయ్యూరు

Posted in సమీక్ష | Leave a comment

బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ అడివి బాపిరాజు గారు.3వ భాగం.14.9.22

బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ అడివి బాపిరాజు గారు.3వ భాగం.14.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

శ్రీవారు అరవదేశంలో సంచారం చేస్తున్నారు. వేసవిసెలవులలో వారి సన్నిధికి వెళ్లటం నాకు అలవాటు. ఒకనాటి సాయంత్రం వారు తమిళంలో ఉపన్యాసం ప్రారంభించారు.

”జీవులకు పుట్టుట, గిట్టుట స్వభావ ధర్మాలు.. పుట్టుకకు కారణం కాముడు, అంటే మన్మథుడు. గిట్టుటకు కారణం కాలుడు, అంటే యముడు. ఈ ఇద్దరి బాధా లేకపోతే జనన మరణాలు లేకుండా పోతాయి. జననం లేకుండా చేసుకోవాలంటే మన్మథుణ్ణి నిగ్రహించినవాని నాశ్రయించాలి. మరణం లేకుండా చేసుకోవాలంటే మరణకారకుడైన కాలుని శిక్షించిన వాని దగ్గరకు పోవాలి. ఈ రెండు పనులూ చేసిన పెద్దమనిషి ఒకరే. ఆయనే స్మరహరుడు, మృత్యుంజయుడు అయిన శివుడు. శ్రీకాంతుడంత సులభంగా దొరకడుగాని శివుడుమాత్రం సులభసాధ్యుడు. ఆయనను ఆశ్రయిద్దాం…నమః పార్వతీ పతయే హరహర మహాదేవ!” అందరితోపాటే నేనూ గొంతు కలిపాను. శ్రీవారు మరో ఘట్టం ఎత్తుకున్నారు.

ఉపన్యాసం ముగిసిన తర్వాత రాత్రి ఒక ఇంట్లో డాబామీద విశ్రమించాను. క్రింద పారా ఇస్తున్నారు. అర్థరాత్రి పన్నెండు గంటలు దాటింది. నాక నిద్రపట్టలేదు. ఆ యింటి అరుగుమీద కూర్చొని శ్రీవారి దర్శనంకోసం తహతహలాడుతున్నాను. ధైర్యంచేసి లోనికి వెళ్ళబోయాను. పారా ఇస్తున్న బ్రాహ్మణుడు ”పెరియవాళ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పైకి పోవద్దు” అన్నాడు. నిరాశతో తిరిగి వెళ్ళి, గోపికలు కృష్ణపరమాత్మను గురించి విరహంతో అన్నమాటలు- పోతనగారి పద్యాలు చదువుకుంటూ కూర్చున్నాను. అంతలో ఏదో ప్రేరణచేత మళ్ళీలేచి డాబామెట్లు సమీపించి చటాలున అయిదుమెట్లు ఎక్కేశాను. పారాయిచ్చే బ్రాహ్మణుడు పరధ్యానంలో ఉన్నాడు. పైకిరమ్మని ఎవరో పిలిచినట్లయింది. పైకి దూకాను.

అక్కడ శ్రీవారు చేతిమీద తల ఆనించి ఓప్రక్కకు ఒదిగి పడుకొన్నారు. సడిచేయకుండా అడుగులు వేసి దూరంగా నిలిచాను. సంస్కృతంలో ‘కః?’ (ఎవరు) అని ప్రశ్నించారు.

”నేను, కల్లూరిని” అన్నాను.

వెంటనే-

”నిద్రా నాయాతా కిం? నైదాఘస్తాపో బాధతేవా?” (నిద్ర పట్టలేదా? ఎండ ఉడుకు బాధవల్లనా?) అని మళ్ళీ ప్రశ్నించారు.

”న నైదాఘస్తాపః – ఎండ ఉడుకు కాదు. నేటి ఉదయం మొదలు అయిదు నిముషాలైనా శ్రీవారి సన్నిధానం, దర్శనభాగ్యం దొరకలేదు. అందుకు తపిస్తున్నాను. శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు అయిదు నిముషాలైనా నాకు ఏకాంత దర్శనం అనుగ్రహించాలి” అన్నాను.

”త్వయి గోపికాత్వ మతి దిశ్య మయి కృష్ణత్వం సంభావ్య కిమపి సంభావితం ఖలు-” నీయందు గోపికాభావం, నాయందు కృష్ణత్వం భావించి ఏదో అనుకొంటున్నావా? – అని అడిగారు శ్రీవారు. ఎలా తెలిసిందో!

ఆ తర్వాత, ”అద్య అస్మాభి స్తమిళ భాషాయాం ప్రసంగః కృతః. త్వం భాషానభిజ్ఞః. కిం జానాసి మదుక్తం” – మేము తమిళంలో మాట్లాడాము. నీకు అర్థమైందా? అని ప్రశ్నించారు.

”శ్రీవారు నా కర్థం కావాలని సంకల్పించారు. అందుచేత అర్థమైంది” అన్నాను. శ్రీవారి నిమిత్తం కొన్ని సంవత్సరాలుగా అరవదేశం వెడుతూ వస్తున్నా. నాకు అరవభాష కొంచెంకూడా పట్టుబడలేదు. ఆరోజు… అత్యాశ్చర్యం, శ్రీవారి తమిళ ప్రసంగం బాగా అర్థమైంది. అది వారి సంకల్పం. ఉపన్యాస సారాంశం చెప్పమన్నారు. చెప్పాను. దానిని ఈ చిన్ని శ్లోకంలో ఇమిడ్చాను.

జనిమృతి విరతిర్భవేదితిత్వాం రతిపతి శాసకమీశ కాలకాలమ్‌

హిమగిరి తనయా ద్వితీయ మీడే పరమ దయారస మీశ మద్వితీయమ్‌.

తెలుగు వివరణం-

జనన కారణం మన్మథుడు. మరణకారణం కాలుడు. ఆ యిద్దరిని నిగ్రహించిన ప్రభువు ఒక్కడే. కామవైరి మృత్యుంజయుడు. చంద్రశేఖరుడు శివుడు. ఆయన హిమగిరి, మంచుకొండ కూతురికి సగము శరీర మిచ్చిన వాడు, చల్లనివాడు, దయామూర్తి. ఆయనను ఒక్కని ఆశ్రయిస్తే రెండు లాభాలు కలుగుతాయి అనివారి ఉపన్యాస సారాంశం ఈ శ్లోకంలో ఇమిడించికొన్నాను.

శ్రీవారు చిరునవ్వుతో విన్నారు. ఆ మందహాసం నాకు వెన్నెలై తోచింది.

”నా సన్నిధి రోజు మొత్తం మీద అయిదు నిముషాలైనా కావాలన్నావు కదా! ఇప్పుడెన్ని నిముషాలైంది? ప్రశ్నించారు శ్రీవారు.

”పదిహేను నిముషాలు అయుంటుం”దన్నాను.

అటుపైన, ప్రాకృతదృష్టితో వారిపై జాలితోను, శ్రీవారు కటికనేల మీద పడుకొన్నారు. హృదయం ద్రవించిపోతోంది” అన్నాను.

వెంటనే, ”కిం నశ్రుతమ్‌” – వినలేదా?

‘క్షితితల శయనం తరుతలవాసః

కరతలభిక్షా, కౌపీనవంతః ఖలు భాగ్యవంతః‘

కౌపీన ధారులు, పరివ్రాజకులు భాగ్యవంతులు. కటికనేలపై పడక, చెట్టుక్రింద నివాసము, అరచేతిలోఅన్నపుముద్ద- అంతకంటె భాగ్యవంతులెవ్వరు? అన్నీ ఉన్న సంసారుల దేమి భాగ్యం – అని నన్ను ఊరడించి విశ్రమించమని పంపించారు.

పద్యపాద స్ఫురణ

నావల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరుపు కలుగుతుంటాయి అన్నాడు. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు, అర్జునుడితో. కృష్ణావతారం తరువాత జ్ఞానావతారంగా వచ్చిన ఆదిశంకరుల అనంతరం, వారి సంపూర్ణాంశంతో వచ్చిన అవతారం శ్రీవారు అన్నది నాకు స్పష్టంగా రుజువైంది. అదొక అద్భుత ఘట్టం.

శ్రీధరవారు ఆంధ్రులు. పశ్చిమ గోదావరిజిల్లా కానూరు అగ్రహారీకులు. ఆ కుటుంబం తంజావూరు జిల్లాకు వలసపోయింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన వెంకటాధ్వరి అనే మహానుభావుడు యజ్ఞాలు చేసినవారు, బ్రహ్మణ్యులు, గొప్ప అనుష్ఠాతలు, శివభక్తులు. మహా పండితుడు, మహాకవీ కూడా. ‘అయ్యవాళ్‌’ అనేది వారి గౌరవనామం. ఆయన మహిమల గురించి ఆ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. శ్రీవారే కొన్ని కథలు నాకు చెప్పారు.

వారు సిద్ధిపొందిన తర్వాత వారి గృహం శంకరమఠంగా మారింది. శ్రీవారు ఆ ఇంటిలో మకాం చేసినప్పుడు వారి దర్శనానికి వెళ్ళాను. ఓ రోజు సాయం సమయంలో ఆ గ్రామంలోని దేవాలయాలను సందర్శించడానికి శ్రీవారు బయలుదేరారు. వారివెంట నేనూ ఉన్నాను.

ప్రదక్షిణం చేస్తూ, ‘ఇది శివాలయం. శివుని మీద నీవు చెప్పిన పద్యం చదువు’ అన్నారు. అప్పుడొక శ్లోకం చదివాను. మందస్మితంతో అనుగ్రహించి శ్రీవారు, అదే ప్రాకారంలో ఉన్న విష్ణ్వాలయానికి దారి తీశారు. అక్కడ, విష్ణువుమీద పద్యమొకటి చదవ మన్నారు. మా ఊరిలోని మా కులదైవంపై వ్రాసిన పద్యం ఒకటి చదవడం ప్రారంభించాను. మొదటి మూడు పాదాలు చదివానుగానీ నాలుగవ పాదం ఎంతకూ జ్ఞాపకం రాలేదు. గిలగిల లాడాను.

శ్రీవారు వెంటనే ”అస్య పద్యస్య కతిపాదాః” – ఈ పద్యానికి ఎన్ని పాదాలు? అని అడిగారు.

”చత్వారః” – నాలుగు పాదాలు అన్నాను. ”అయం మదనగోపాలః – ఉత వేణుగోపాలః?” అని అడిగారు మళ్ళీ.

”వేణు గోపాలః”

”వేణుః కుత్ర?” – వేణువేదీ?

”దానికోసమే వెతుకుతున్నాను. మరచి పోయాను” – అన్నాను. వెంటనే స్మృతికి తగిలింది. ఆ పిల్లనగ్రోవి –

”మధుర బింబాధర సుధ దోగి తోగి యింపొలసి వేణువు దివ్యకళలు గురియ” ఇదీ ఆ పద్యపాదం. చదివాను. మొన్నమొన్న ద్వాపరంలో అవతారం చేసిన పరబ్రహ్మ వస్తువు ఆ గీతాచార్యుడు, ఇప్పుడు అవతారం చేసిన ఈ జగదాచార్యుడు ఒక్కరే అన్న అనుభూతి నాకు కలిగింది. ఆ మీద నా ‘గురుకృపాలహరి’లో శ్రీవారిని శివుడుగా శివలీలా తరంగంలోనూ, కృష్ణుడుగా హరిలీలాతరంగంలోనూ – వట్టి కవిత్వంతో గాదు – ప్రత్యక్షంగా పొందిన అనుభూతితో పెక్కు శ్లోకాలలో కీర్తించుకొన్నాను.

ప్రారబ్ధశేషం

అది నా జాతకంలో క్లిష్టమైన ఘట్టం. జీవన్మరణ సమస్య. మహాప్రస్థాన సమయం. కాలదర్శనం అయింది. దక్షిణాధీశుడు నాకై వచ్చాడు. శ్రీవారు ప్రత్యక్షమై ‘ఇప్పుడే పంపము’ అన్నారు. ఇద్దరూ ఏమో మాట్లాడుకొన్నారు. యమవాహనం గోడదూకి వెళ్ళిపోయింది. ధర్మప్రభువు నిటలాక్షుని చూసి వెనుకడుగు వేసుకొంటూ తన దిశగా వెళ్ళిపోయారు. శ్రీగురుదేవులు ఈ ఘట్టంలో మృత్యుంజయులుగా సాక్షాత్కరించి నాకు మార్కండేయునితో సామ్యం అనుగ్రహించారు. ఈ ఘట్టం నా ‘గురుకృపాలహరి’లో ఉంది. అందులో లేని తరువాతి ఘట్టాన్ని ఇప్పుడు వివరిస్తాను.

చిదంబరానికి అవతలి మజిలీ అయిన ఆనందతాండవపురంలో శ్రీవారు బసచేసి ఉన్నారు. మృత్యుముఖం నుంచి బయటపడిన నేను అక్కడకు ధర్మపత్నితో శ్రీవారి దర్శనానికి పరుగెత్తాను. పూర్తిగా కోలుకోకుండానే రైలులో దక్షిణాదికి దీర్ఘప్రయాణం చేశాను. స్నానం చేసి మడిగా శ్రీవారి దర్శనం చేద్దామని ఒక బసకు వెడుతున్నాను. శ్రీవారు స్వయంగా నాకు ఎదురు వచ్చారు. రైలు బట్టలు, స్నానంలేదు. రాత్రి నిద్రలేదు. ఈ స్థితిలో శ్రీవారికి ఎదురవడ మెట్లా అనుకొంటూ ఒక ఇంట్లోకి వెళ్ళాను. నా వెంటే వారూ అక్కడకు చొచ్చుకొని వచ్చారు. ఇక చేసేదిలేక వెనుదిరిగి సాష్టాంగ పడ్డాను.

తర్వాత కోనేటికి స్నానార్థం బయలుదేరారు. నేనూ వెంట నడిచాను. అది వేసవికాలం. నా శరీరంలో రక్తంలేదు. కాళ్ళు అంటుకుపోతున్నాయి. శ్రీవారు ఏమేమో ప్రసంగం చేస్తూ చెరువుకు తీసుకొని వెళ్ళారు. వారు నీటిలో దిగారు. నేను మెట్లమీద నిలబడ్డాను. కాళ్ళు అంటుకుపోతున్నాయి. వెళ్ళిపోదామా అంటే శ్రీవారు ఏవో మాటలు ప్రారంభించారు. ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక కాలు ఆనించి ఇంకో కాలు ఎత్తుతూ, అతికష్టంమీద ఆ వేడిని తట్టుకొంటూ వారికి జవాబులు చెబుతున్నాను.

స్నానమై వారు మఠానికి దారితీశారు. నేనూ వెంట నడుస్తున్నాను. నేను బసచేసిన ఇంటివద్ద వారు ఆగారు.

”శ్రాంతోసి. విశ్రమస్య. స్నానాదికం కురు” – చాలా అలసిపోయావు. ప్రయాణం బడలిక..విశ్రమించు. స్నానాదికం చేసుకో – అన్నారు.

బ్రతుకుజీవుడా అని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాను. అంతవరకు ఉడికిపోయిన నా పాదాలు హఠాత్తుగా పన్నీటిలో ముంచెత్తినంత చలువదనం పొందాయి. ఆ వేడి అంతా ఏమైందో! హాయి అనిపించింది.

అప్పుడు నాకు అర్థమైంది. రోగరూపంలో నేను అనుభవించవలసిన ప్రారబ్థశేషం క్షణం ముందు వరకు మిగిలిందన్నమాట. ఆ సంగతి శ్రీ గురుదేవులకు తెలుసు. ఆ కర్మ శేషాన్ని నైదాఘతాపం చేత పోగొట్టి సుఖానుభూతికి పాత్రంచేశారు. ఈ అనుభవం ద్వారా అనేక శాస్త్ర తాత్పర్యం అవగాహన చేశారు.

”లీలా తాండవ పండితః”

ఆనందతాండవపురంలోనే మరో అద్భుత ఘట్టం. శ్రీవారు సంధ్యా వందనానంతరం ఒక దేవాలయ ప్రాంగణంలో పండితులతో పేరోలగం చేశారు.

శ్రీవారు ధార్మిక విషయాలుగాని, వేదాంత విషయాలుగాని బహిరంగ సభలలో ముచ్చటించడం ఎన్నడూ నేను ఎరుగను. కాని ఆనాడు అద్వైతం మీద, దాని గురించిన భిన్నభిన్న ప్రస్థానములు, వాటిలోని సామరస్యం మీద వాదోపవాద సిద్ధాంత సమ్మర్ధంతో శ్రీవారు సంస్కృతభాషలో చేసిన ప్రసంగం కేవలం చిదంబరనాధుడు, నటరాజమూర్తి చేసిన ప్రదోష తాండవమే నని నాకు అనిపించింది. మైమరచి నాలో నేను,

”లీలా తాండవ పండితః”

అని శ్రీవారిని చిదంబరేశ్వరునితో పోల్చుకొని మురిసిపోతున్నాను. వేయిమందిలో నేనుండి, నాలో నేను అనుకొంటున్న మాట ఇది. కానీ, శ్రీవారు ఆలయం గోడకు జేర్లబడి, అటూ ఇటూ ఊగుతూ ”లీలా తాండవ పండితః” అని మూడుసార్లు అన్నారు. దానితో నాకు మతిపోయింది. పరుగు పరుగున వారి సన్నిధి చేరి, ఆనందబాష్పాలు కురుస్తుండగా సాష్టాంగపడ్డాను. శ్రీవారు గంభీరంగా నవ్వారు. ”ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం” అన్న గీతాశ్లోకం స్ఫురణకు వచ్చింది.

ఆ మరునాడు సోమవారం, ప్రదోష సమయంలో శివాలయంలో సభ ఏర్పాటైంది. శ్రీవారు ఆ సభకు నడిచి వెడుతున్నారు. వెనుక నేను ఉన్నాను. వారు నాకేసి తిరిగి ”అస్మిన్‌ దినే సంస్కృత భాషాయాం త్వయా ప్రసంగః కర్తవ్యః” (ఈరోజు నీవు సంస్కృత భాషలో మాట్లాడాలి) అన్నారు. ముందురోజే దాక్షిణాత్యపండితులు సంస్కృతభాషలో వీరవిహారం చేశారు. వారి ముందు ఈ శిశువు నాడించాలని శ్రీవారి కోరిక కాబోలు. ”మీ అనుగ్రహంతో లభించిన వాక్కుతో, మీ ఆజ్ఞానుసారం అలాగే ప్రసంగిస్తాను” అని వారితో అన్నాను.

సభలో దిగ్దంతులైన పండితులున్నారు. శ్రీవారు అగ్రాసనం అలంకరించారు. ఒకరిద్దరు మాట్లాడిని తర్వాత నన్ను పిలిచారు.

అప్పుడు నేను, ”ఏ బ్రహ్మవస్తువు నుండి వాక్కులు (శ్రుతులు) మరలునో, వాచామ గోచరమైన ఆ వస్తువును నిరూపించలేక వెనుదిరుగునో, అలాంటి ఒకానొక సచ్చిదానందాత్మకమైన చంద్రిక (జ్ఞాన ప్రకాశము), మౌళిగాగల (తలమానికముగా గల) పరబ్రహ్మకు, తద్రూపులైన శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం” అనే అర్థం కలిగిన శ్లోకంతో నా ప్రసంగం ప్రారంభించాను.

ఆ మీదట,

”అభయం దత్త మేవాస్తి మృత్యుంజయ కుతో భయమ్‌

తాండవే స్థలనం క్వాపి శిశోస్తదపి మండనమ్‌”

శ్రీవారు యముని తరిమినప్పుడే ”మృత్యుంజయులు”గా ఈ శిశువుకి అభయ మిచ్చారు. ఇప్పుడు సంస్కృతభాషలో మాట్లాడటమనే ఈ గెంతులలో స్థలనం (తప్పటడుగు) పడితీరుతుంది. ఇది శిశువుచేసే తప్పటడుగు గనుక లయానుగుణంగా ఉంటే అందమే లేదు. తప్పటడుగు పడితేనే అందం” – అన్నాను.

తదుపరి ”నటరాజౌ స్థితే సాక్షాద్గురు వానంద తాండవే, తండుర్యది భ##వేయంమే లీలా తాండవ మస్తుతత్‌” అనే శ్లోకం చదివాను. దీని భావం – సాక్షాద్గురుమూర్తి ఇప్పుడు నటరాజై ఆనందతాండవంలో ఉండగా, నేను శివపరివారంలోని తండువు అనే పరిచారకుడనైతే, నా యీ ఉపన్యాస రూపమైన లీల నిజంగా తాండవమే అవుగాక!

వెంటనే శ్రీవారు ”సుబ్బు శాస్త్రి! శ్రుతంవా అనేన తాండవ శబ్దస్య పరిష్కారః కృతః” – తాండవశబ్దం వ్యుత్పత్తి ఇచ్చాడు, విన్నావా?! — అన్నారు. సుబ్బుశాస్త్రిగారు సర్వశాస్త్ర పారంగతులు. ఆనందంతో తలవూపారు.

ఆపైన సుబ్బుశాస్త్రిగారు ”మీరు వ్రాసి చదివిన శ్లోకంలో మీకు తెలియకుండానే ఒక అద్భుతఘట్టం స్ఫురిస్తోంది. మీ కవిత్వం సార్థకం” అంటూ, అదే ఊళ్ళో అంతకు పదిరోజుల క్రితమే ఒక మూగ కుర్రవానికి స్వామి వాక్కును ప్రసాదించిన ఉదంతాన్ని వినిపించాను.

శ్రీవారు చిరునవ్వుతో అనుగ్రహించారు. సభ్యులు ఆనంద భరితులయ్యారు.

ఇలాంటి వినోదాల ప్రదర్శనలో శ్రీవారికి కుతూహలం ఉందా అనేది ప్రధానప్రశ్న. ఉండదు. అక్కడసలు సంకల్పమే ఉండదు. నిస్సంకల్పస్థితి వారిది. అయితే ఇవి మనకెందుకు కనిపించాయి? ఇది మన మనోవిలాసమే. దృశ్యమంతా మనస్సే. ఈ విషయాన్ని నా ”గురు కృపాలహరి”లో ”నసంకల్ప వేశోభ##వేద్వా వికల్పః” అనే శ్లోకంలో పేర్కొన్నాను.

మనకు చరిత్ర లేదా?

మనదేశానికి లిఖితపూర్వకమైన చరిత్రలేదని సామాన్యంగా అందరూ అనేమాటలు. మన పురాణాలు చరిత్ర కాదని వీరి అభిప్రాయం. క్రీస్తుశకం అనంతరం జరిగిన సంఘటనలను మాత్రమే ఆధునిక విద్యావంతులు చరిత్రగా పరిగణిస్తారు. అంతకు పూర్వం జరిగినదంతా వారి దృష్టిలో చరిత్రకాదు! ఒకవేళ పూర్వ వృత్తాంతాన్ని చరిత్రకింద అంగీకరించవలసివచ్చినా, తమ చారిత్రక పరిశోధనల ప్రకారం పురాణగాధలలో గల సత్యం అత్యల్పం. తమకు నచ్చిన సిద్ధాంతాలకు, తాము నమ్మిన సూత్రాలకు అనుగుణమైన విషయాలు మాత్రమే వారికి విశ్వసనీయాలు.

అప్రాకృతిక సంఘటన లేవైనా వారి దృష్టిలో కేవలం కట్టుకథలు. సాధారణ మానవుని అనుభవానికి, గ్రహణశక్తికి మించినదంతావారు అసత్యంగా కొట్టివేస్తారు. పురాణాల్లో మహిమలూ, అణిమాది సిద్దులూ ఉండడంచేత వాటిని ‘చరిత్ర’గా అంగీకరించరు.

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-9-22

Posted in సేకరణలు | Leave a comment

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-2

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-2

      దేవేంద్ర జననం,విద్యాభ్యాస౦

 ద్వారకానాథుడు తన  కుటుంబం లోనిస్త్రీలను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు .అందరిలో ఒకకొత్త వెలుగు ఆశాజ్యోతి కలిగించాడు రామమోహనుడు తన సకలకళా పా౦డిత్యాలచేత .ఈ కుటుంబం లోని  వారంతా అన్నిటా అద్వితీయ పండితులయ్యారు .ద్వారకానథుని భార్య గర్భం దాల్చింది .ఆమెకు పుట్టేబిడ్డ మహా మహిమాన్వితుడు అవుతాడని రాయ్ చెప్పేవాడు .1818 మే నెలలో ఆమెకు దేవెంద్రనాథుడు జన్మించాడు .అతడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు ముఖం లో దివ్య తేజస్సు ఉట్టి పడేది .రాయ్ కు ఈ బాలుడు దైవాంశ సంభూతుడు అనిపించాడు. ఆయన దృష్టి అంతా దేవేంద్రునిపైనే ఉండేది.ఇంట్లో వారంతా ఆయన్ను ఎందుకు ఈబాలుడిపై అంత ఆపేక్ష అని అడిగితె ‘’యితడు అపూర్వ శిశువు .నాకార్యక్రమాలన్నిటికి తోడ్పడే మహానుభావుడు అవుతాడు ‘’అని చెప్పాడు .’

 దేవేంద్రనాథ ఠాకూర్ బాల్యం నుంచి శాంతచిత్తుడే .ప్రసన్న స్వభావుడే .అతనిది స్థిర చిత్తం .దేనినీ కోరేవాడుకాడు .దేన్నీ నిర్లక్ష్యం చేసేవాడు కాదు .పూజలో కూర్చుంటే ఐహిక స్మృతి ఉండేదికాదు .విద్యలలో నేర్పరి .రాయ్ గారి విద్యాలయం లో చేర్పించారు .14వ ఏట అన్ని విద్యలలో ఆరితేరి హిందూ కాలేజిలో చేరాడు .రామమోహనుడు విదేశాలకు వెడుతూ దేవేంద్రుని దగ్గరకు పిలిచి అతని చెవిలో యేవో కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయాడు .ఆమాటలతో అతడు ధర్మ పిపాసి అయి నడవటం ప్రారంభించాడు .బ్రహ్మ సమాజ వ్యాప్తికోసమే తహతహలాడేవాడు .తనకు కనిపించిన వారందరి బ్రహ్మజ్ఞానం బోధించేవాడు .ఎక్కడైనా అశాంతి ,కల్లోలాలు ఏర్పడితే వెంటనే వెళ్లి శాంతి నెలకొల్పేవాడు .ఏవిషయం లోనైనా అనుమానం వస్తే బ్రహ్మ సమాజ ఆచార్యుడుపండిత రామచంద్ర విద్యా వాగీశుని దగ్గరకు వెళ్లి సందేహ నివృత్తి చేసుకొనే వాడు .ఆనాటి దార్మికపండితులు కూడా ఆయన ప్రజ్ఞా పాటవాలకు అబ్బురపడుతూ ఆశ్చర్యపొయెవారు .ఎంతజటిల మీమాంసా విషయమైనా యిట్టె పరిష్కరించేవాడు .పండితుల వాచాలత కు అడ్డు కట్ట వేసేవాడు. సూక్ష్మ దృష్టి అతని ప్రత్యేకత .గడ్డాలు మీసాలు పెంచి ఘోరతపస్సు చేసే మహర్షులకు లభించే విజ్ఞానం కంటే దేవేంద్రుని విజ్ఞానం సహస్ర రెట్లు ఎక్కువ అనే వారు .అతని ఆచార్యులు ప్రకృతి దేవి ,అనంత విశ్వ క్షేత్రాలే .

 ఉపనిషత్తులు అధ్యయనం చేసేటప్పుడు సర్వభూతాతీత పరమాత్మను లోపల జ్వాజ్వల్యమానంగా దర్శించేవాడు .అప్పుడు పిచ్చివాడులాగా పరిగేట్టేవాడు .ధర్మశాస్త్రాలు తర్కమీమా౦సలు చెవి ఒగ్గి వినేవాడు .తాను అజ్ఞాని అని తనకేమీ తెలియదని అనేవాడు .చీకటిలో తిరిగేవాడు .భేదభావం అతనికి లేనేలేదు పరమహంస ప్రవర్తన లాగా ఉండేది అతిని తీరు .అనుకోకుండా ఆయనకు ఒక ఉపనిషత్ గ్రంథం లోని ఒక చికి కాగితం కంట పడింది .అది చదివి అర్ధం చేసుకొన్నాడు .వెంటనే ఆయన హృదయం లో ఒక అపూర్వ తేజస్సు ప్రాడుర్భవించింది .మధుర రస తరంగిణి గట్లను ఒరుసుకొంటూ ప్రవహించింది .ఆకాగితాన్ని తీసుకొని వెళ్లి తనగురువు వాగీశుని అందులోని భావతాత్పర్యాలు పూర్తిగా తెలియజేయమని కోరాడు .అప్పటి నుండి ఆయన బ్రహ్మ విద్యోపాసకుడు అయ్యాడు .

  హిందూ కాలేజిలో చేరిన దేవేంద్రుడు విద్యలో అఖండుడు అయ్యాడు .అధ్యాపకులు అతడు మహా పండితుడు అవుతాడని భావించి దీవించారు .ఎంత చదివినా తృప్తి తీరటం లేదు .కొత్త విషయాలు తెలుసుకోవాలనే తహ తహ ఎక్కువైంది .కాలేజిలోధర్మ విషయ చర్చకు అధికారులు అంగీకరించకపోవటం ఆయన్ను బాధించింది .తోటి విద్యార్ధులతో ఈవిషయం పైన మాట్లాడుతుంటే వారిలోకూడా ధర్మ జిజ్ఞాస ఉన్నట్లు తెలిసింది .కాలేజి విద్యార్ధులు 200మంది కలిసి ‘’సాధారణ జ్ఞానోపార్జని ‘’సభ ఏర్పరిస్తే , అందులో దేవేంద్రుడు కూడా చేరాడు .కానీ వీరుదార్మిక విషయాలు చర్చించరాదని యాజమాన్యం షరతు పెట్టింది .కాలేజిలో ఏదో ఒక రూమ్ లో సభజరిపి ఎవరికీ అభిమాన విషయం పై వారు మాట్లాడేవారు .కానీ దేవేంద్రునికి ఇది నచ్చలేదు .లోకజ్ఞానం వారికి లేదని బాధ పడ్డాడు .పుస్తక జ్ఞానం తో పురోభి వృద్ధి ఉండదని భావించాడు .తీవ్ర  అసం తృప్తిలోనే కాలేజి జీవితం గడిపాడు .

  హిందూకాలేజీ చదువు పూర్తీ చెసి ,ఇంటికి వచ్చి తమ జోరా సంకో గృహం లో ఖాళీ ఉన్న ఏకాంతమైన చోట కొంతమంది సాధారణ వ్యక్తులతో కలిసి ‘’తత్వ బోధినీ ‘’సభ స్థాపించాడు .దీనిలో విద్యావంతులు పట్టభద్రులు ఎవరూ లేరు .నిరాశ పడక ప్రతినెలా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ ,ఎవరో ఒకరు  తనకు తెలిసిన తత్వ విషయం పై రాసిన వ్యాసం చదివటం దానిపై మిగిలినవారు చర్చాప చర్చలు  జరిపేవారు  .సంఘం పేరు సార్ధకం చేసేవారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.1వ భాగం.14.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.1వ భాగం.14.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

చేతిలో 5 మహత్తర గ్రంధాలు

చేతిలో 5 మహత్తర గ్రంధాలు

 కిందటివారం  సికందరాబాద్ లో తిరుమలగిరి లో నాగార్జున యూని వర్సిటి రిటైర్డ్ లైబ్రేరియన్ ,సరస భారతి కి అత్యంత ఆత్మీయులు శ్రీ సుంకర కోటేశ్వర రావు గారిని కలిసినప్పుడు వారు ఎంతో ఆత్మీయంగా శ్రీ కొత్త వెంకటేశ్వర రావు గారు అత్యంత శ్రద్ధా నిష్టలతో రచించిన -ఆముక్తమాల్యద -సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష అనే 330పేజీల ఉద్గ్రంధాన్ని బహూకరించారు .ఉయ్యూరు వచ్చి ఒకసారి దాన్ని త్రిప్పి చూస్తె కొత్త కోణం లో రాయల వారి హృదయాన్ని ఆవిష్కరించారు రచయిత అని పించింది .దీన్ని సరసభారతి సాహితీబందువులకు ప్రత్యక్ష ప్రసారంగా అందించాలనే ఊహ ఇప్పుడే కలిగింది .

 అలాగే ఆకాశవాణి మాజీ సంచాలకులు శ్రీ నాగసూరి వేణు గోపాల్ ‘నాగ సూరి అకాడెమి ఆఫ్ మీడియా అండ్ సైన్స్ ”ద్వారా ఆయన సంపాదకత్వం లోప్రచురించిన  లబ్ధ ప్రతిష్టితులైన వివిధ రంగాలకు చెందిన వ్తక్తులు రాసిన వ్యాసాల సంకలనం  ”గాంధీయే మార్గం ”అనే రెండు భాగాల పుస్తకాలు , వేణుగోపాల్   స్వయంగా రాసిన -అసలైన విప్లవవాది ,సిసలైన సిద్ధాంత కర్త -గాంధీజీ ,తోపాటు ఆయనే   చలన చిత్ర పోకడలను విశ్లేషిస్తూ  రాసిన -అల్లాఉద్దీన్ సినిమాద్భుతం పుస్తకం  నాకు ఆదరంగా పోస్ట్ లో పంపారు .అన్నీ విలువైనవే .ఓపికగా ఎప్పుడో చదివి అభిప్రాయం రాయాలి -దుర్గా ప్రసాద్ -14-9-22,

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బహు ముఖ ప్రజ్ఞా శాలి శ్రీ అడివి బాపిరాజు గారు.2వ భాగం.13.9.22

బహు ముఖ ప్రజ్ఞా శాలి శ్రీ అడివి బాపిరాజు గారు.2వ భాగం.13.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్

మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్

ఆధారం -దేవేంద్ర నాద భట్టాచార్య రచి౦చిన వంగమాతృకకు శ్రీ ఆకురాతి చలమయ్య గారు ఆంధ్రీకరణ పుస్తకం ‘’మహర్షి దేవేంద్ర నాద ఠాకూర్ చరిత్రము ‘’.పిఠాపురం శాంతికుటీరం .ప్రచురణ .శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాల చేత ముద్రితం   .1937 తృతీయ ముద్రణం .బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడు గారికి అంకితం .

  పరిచయం

పశ్చిమ బెంగాల్ లో కలకత్తా లో ని జోరా సంకో –అంటే కలకత్తా లోని అప్పర్ చిత్ పూర్ రోడ్డులో ఉన్న ఒక ప్రదేశం లోని ఠాకూర్ వంశం లో  మహా పుణ్యపురుషులు నిత్య ప్రాతః స్మరణీయులైన వారెందరో జన్మించారు .ఈ వంశంలో లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ నిత్యం కొలువై ఉండటం మరొక విశేషం .సదాచారాలు సద్ధర్మా చరణ వలన వీరి వంశం వారెప్పుడూ ధనం, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలతో   విరాజిల్లారు .అన్ని విధాల ఉన్నత గుణ ,ఉత్తమ ప్రవర్తనలతో ఈ వంశీయులు బెంగాల్ లోనే కాక యావద్భారతం లోనూ విదేశాలలోనూ ప్రఖ్యాతులయ్యారు .ఈ వంశ స్త్రీలు కూడా మహా యశస్సు సాధించారు .కవిసమ్రాట్ రవీంద్ర నాథుడు ,ద్విజేంద్ర నాథ టాగూర్ , సత్యేంద్రనాథ ఠాకూర్ లు ఆణిముత్యాలుగా గుర్తింపు పొందారు .మహిళలలో స్వర్ణకుమారీదేవి ,సరళాదేవి వంటి వారు ఆవంశం లో పురుషులతో సమానంగా అన్నిటా రాణించారు .

  ఈ వంశం లో ద్వారకా నాథ ఠాకూర్ ‘’ప్రిన్స్ ‘’బిరుదు పొంది ,మొట్టమొదటి సారిగా ఆవంశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాడు .ద్వారకా నాథుని జ్యేష్ట  కుమారుడే మహర్షి ద్దేవెంద్రనాథ ఠాకూర్ .

  పరిస్థితులు

వంగ దేశ కీర్తి ప్రతిష్టలను వృద్ధి చేసినవారిలో విద్యాసాగర్ ,రామమోహన రాయ్ బంకిం చంద్ర చటర్జీ ,కృష్ణ దాసు, రమేష్ చంద్ర వంటి ప్రముఖులున్నారు .ఆంగ్లేయుల పాలనాకాలం లో క్రిస్టియన్ స్కూళ్ళు ఉండేవి అక్కడే అందరూ ఆంగ్ల విద్యనేర్చేవారు .దీనితో అక్కడ చదివిన వారికి భారతీయ సంస్కృతీ పై అభిలాష గౌరవాలు బాగా తగ్గిపోయాయి .నీతి నియమాలు దూరమయ్యాయి .కాలక్రమేణా పెద్దలు ఈ వైపరీత్యాన్ని గమనించి ,మేల్కొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు .హిందూ ధర్మం నీతినిజాయితీడైవభక్తి భారతీయ విద్య నేర్పటానికి,నాస్తికత నశింప చేయటానికి  ప్రత్యెక హిందూ విద్యాలయాలు స్థాపించాలనే సంకల్పం కలిగి ,కార్యరంగం లోకి దూకారు .ఆంగ్లేయ విద్యతోపాటు ధార్మిక  విప్లవం కూడా తీసుకురావాలని రాజా రామ మోహన రాయ్ సంకల్పింఛి ‘’బ్రహ్మ సమాజం ‘’స్థాపించాడు. కానీ ఆయననుధర్మద్రోహి అనీ ,సంఘద్రోహి అని పెద్దలు నిరాకరించారు .ఆయన చిత్తశుద్ధిని అర్ధం చేసుకోలేకపోయారు ఆయన బోధించిన ఏకేశ్వరోపాసన ఆనాడు పెద్దగా ఫలించలేదు .కానీ కొత్త ఆలోచనలకు దారి చూపిన మహాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు .

  ద్వారకా నాథఠాకూర్  కు రామమోహన రాయ్ దగ్గర బంధువే .ఆయన హృదయాన్ని అర్ధం చేసుకొని భావాలకు ఆకర్షితుడై నాడు.,రాయ్ కలకత్తా హిందూ కళాశాల స్థాపించి ,సాధారణ విద్యతోపాటు ,నీతి,ధర్మాలపై శిక్షణ ఇస్తూ విద్యార్ధుల భవిష్యత్తును తీర్చి దిద్దారు .కొంతకాలం తర్వాత హిందూకాలేజీ అధికారులు రామమోహన రాయ్ ను తమ సంఘం నుంచి ,బాధ్యతనుంచి దూరం చేసి ,కాలేజి ని నడపటం ప్రారంభించారు .దీనివలన యువక విద్యార్ధులు హిందువులు కాక ,క్రైస్తవులూ కాకుండా తమాషా వ్యక్తులయ్యారు .దీన్ని గుర్తించిన రాయ్ సాధారణ విద్యతోపాటు ,ధర్మ విద్య కూడా నేర్పటానికి స్వంత ఖర్చు తో అనేక విద్యాలయాలు నెలకొల్పాడు .

  దేవేంద్ర జననం

  రామమోహన రాయ్ ని లోకం దూరం చేసినా ఆయనపై అనేక ముద్రలు వేసినా  ప్రిన్స్ ద్వారకా నాథ ఠాకూర్ మాత్రం ఆయనకు అన్ని విధాలా సహకరించి ఆయన ఆశయాలను ప్రచారం చేయటానికి తోడ్పడ్డాడు .తనకున్న విశాల స్థలం లో బ్రహ్మసమాజ ప్రచారానికి మొట్టమొదటిసారిగా ఒక మందిరం కట్టించి ‘’ఆది బ్రహ్మ సమాజం ‘’అని పేరు పెట్టాడు .ఈ మందిరం నుంచే రామమోహనుడు తన ధర్మ ప్రచారాన్ని విజయవంతంగా సాగించాడు .ద్వారకానాథుడు రోజూ తానూ వచ్చి పాల్గొంటూ తన పరివారాన్ని కూడా పాల్గోనేట్లుచేసేవాడు .దీనితో జోరాసంకో ఠాకూర్ వంశం బ్రహ్మసమాజ ధర్మాలను ఆచరిస్తూ’’బ్రహ్మ ధర్మ అవలంబులు ‘’అనే ఖ్యాతి పొందారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.10వ చివరి భాగం.

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.10వ చివరి భాగం.

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అడివి బాపిరాజు గారి బహు ముఖీన వ్యక్తిత్వం.1వ భాగం.12.9.22

అడివి బాపిరాజు గారి బహు ముఖీన వ్యక్తిత్వం.1వ భాగం.12.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.9వ భాగం.12.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.గణపతి ఖండం.9వ భాగం.12.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఆంధ్ర భీష్మ ,సాహితీవేత్త ,స్వాతంత్ర్య ఉద్యమనాయకులు ,సంస్కరణవాది ,కోస్తాజిల్లాల తొలిన్యాయవాది ,హిందూ పత్రిక స్థాపకులు ,రాజమండ్రి తొలి అనధికార ఛైర్మన్ ,రాజమండ్రికి కరెంట్ తెచ్చినవారు ,వివేకానందుని ఆహ్వానించి సభకు అధ్యక్షత వహించిన బహుముఖ ప్రజ్ణాశాలి -శ్రీ న్యాపతి సుబ్బారావు

ఆంధ్ర భీష్మ ,సాహితీవేత్త ,స్వాతంత్ర్య ఉద్యమనాయకులు ,సంస్కరణవాది ,కోస్తాజిల్లాల తొలిన్యాయవాది ,హిందూ పత్రిక స్థాపకులు ,రాజమండ్రి తొలి అనధికార ఛైర్మన్ ,రాజమండ్రికి కరెంట్ తెచ్చినవారు ,వివేకానందుని ఆహ్వానించి సభకు అధ్యక్షత వహించిన బహుముఖ ప్రజ్ణాశాలి -శ్రీ న్యాపతి సుబ్బారావు

ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు (జనవరి 14, 1856 – జనవరి 15, 1941) స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త,హిందూ పత్రిక స్థాపకులు ,రాజమండ్రి అనధికార ఛైర్మన్,రాజమండ్రి కి కరెంట్ తెప్పించిన రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశీలి.

బాల్యం, విద్యాభ్యాసం

సుబ్బారావు 1856వ సంవత్సరం జనవరి 14 వ తేదీ మకర సంక్రాంతి రోజున నెల్లూరులో రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆ తరువాత కుటుంబం రాజమండ్రికి మారింది.[1] బాల్యం నుండే సుబ్బరావు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి పేదరికం కారణంగా వీధిలాంతర్ల మసక వెలుతులో చదువు కొనసాగించాడు. మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్‌షిప్‌ సహాయంతో చదువుకుని 1876లో బిఎ డిగ్రీ పొందాడు. అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879లో లా పట్టాను పొందాడు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందటం అప్పట్లో అరుదైన విషయం. ఈ ఖ్యాతిని సాధించిన దక్షిణ భారతదేశంలోని అతి కొద్దిమందిలో ఒకరిగా కోస్తా జిల్లాల్లో తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.

న్యాయవిద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ళ ప్రాయంలో ఆయన ట్రిప్లికేన్‌ సిక్స్‌గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు సభ్యుల మిత్ర బృందంతో కలసి, జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో, ది హిందూ జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించాడు. అప్పట్లో భారతదేశంలో ప్రచుతరిమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటీష్‌ ప్రభుత్వం కనుసన్నలలోనే ఉండేవి.

రాజమండ్రిలో

ఉమ్మడి మద్రాసు రాష్టంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తిగాను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. 1880లో న్యాపతి సుబ్బారావు మద్రాసు నుంచి రాజమండ్రి తిరిగివచ్చి అక్కడే స్థిరపడ్డాడు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోషియేషన్ స్థాపించాడు. రాజమండ్రిలో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగంతో సన్నిహితంగా మెలగేవాడు. వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగానికి సుబ్బారావు పంతులు ఎంతగానో సహకరించాడు. 1881లో స్థాపితమైన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి నిర్వహణలో, కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలందించాడు.

1885లో రాజమండ్రి పురపాలకసంఘానికి తొలి అనధికార ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 1888 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలోనే రాజమండ్రి ప్రజలకు తొలిసారి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. 1893లో ఆయన మద్రాసు ఇంపీరియల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కు సభ్యునిగా ఎన్నికై సర్కారు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పదవిలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై 1899 వరకు కొనసాగాడు. 1896లో ఆయన రాజమండ్రిలోని టౌన్‌ హాల్‌ ట్రస్టుబోర్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కలకత్తాలోని టౌన్‌ హాలు తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్‌ హాల్‌కు ఉంది. దీనిని కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించటం వెనుక న్యాపతి వారి సహకారం ఎంతో ఉంది.

సుబ్బారావు పంతులు రాజమండ్రి ఎలక్ట్రిక్‌ సప్లై కార్పొరేషన్‌ను స్థాపించి, విద్యుదుత్పాదన చేయడమే కాక తొలిసారిగా రాజమండ్రికి ఆ విద్యుత్‌ను సరఫరా చేసి వెలుగులు నింపాడు. 1893లో ఆయన రాజమండ్రిలో చింతామణి పత్రికను పునరుద్ధరించి ప్రజలకు ఆందుబాటులోకి తెచ్చాడు. ఈ పత్రికకు కందుకూరి వీరేశలింగం పంతులు ఎడిటర్‌గా వ్యవహరించాడు. రచయితల్ని ఆర్థికంగా ప్రోత్సహించటం లక్ష్యంగా సుబ్బారావు పంతులు నవలారచన అంశంగా వివిధ పోటీలు నిర్వహించేవాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనా వ్యాసంగానికి సుబ్బారావు నైతికంగా, ఆర్థికంగా ఎంతో సహకరించాడు. అదేవిధంగా హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసును రాజమండ్రి, పరిసర ప్రాంతాలకు పరిచయం చేసినది కూడా ఈయనే. 1922 ప్రాంతంలో రాజమండ్రిలో ఆంధ్ర చారిత్రక పరిశోధనా సంస్థ (ఇప్పుడు రాళ్ళబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలగా ఉన్నది) ఏర్పాటును న్యాపతి సుబ్బారావు పంతులు ఎంతగానో ప్రోత్సహించాడు.

1897, ఫిబ్రవరి11న స్వామి వివేకానంద అంతర్జాతీయ మతాల సమావేశంలో ప్రసంగించి భారతదేశం తిరిగివస్తున్న సందర్భంలో ట్రిప్లికేన్ సిక్స్ మిత్రబృందం ఆయన్ను ఆహ్వానించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పురజనులు హాజరైన ఆ సమావేశంలో వివేకానందుని ఆహ్వాన సంఘానికి న్యాపతి సుబ్బారావును అధ్యక్షునిగా నియమించారు. వివేకానందుడు మద్రాసు రేవులో దిగగానే పూలమాల వేసి ఆహ్వానించిన తొలివ్యక్తి సుబ్బారావే. ఆ మరుసటి రోజు విక్టోరియా హాల్లో వివేకానందునికి ఆహ్వాన సభ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి14న మెరీనా బీచ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వివేకానందునితో పాటు సుబ్బారావు పంతులు వేదికను అలంకరించాడు. అలా ప్రారంభమైన వీరి స్నేహం సుబ్బారావుపై గాఢమైన ప్రభావాన్ని వేసింది. 1903లో వివేకానందుని స్ఫూర్తితో, సుబ్బారావు రాజమండ్రిలో భగవద్గీత, సనాతన హిందూధర్మ ప్రచారానికై, హిందూ సమాజం అనే సంస్థను స్థాపించాడు.[1]

1898 నుంచి 1917 వరకూ భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆయన కీలకమైన భూమికను పోషించాడు. 1907లో వందేమాతర ఉద్యమ సందర్భంగా బిపిన్ చంద్రపాల్‌ను రాజమండ్రి ఆహ్వానించి అక్కడ ఉపన్యాసాలు ఇప్పించాడు. విజయవాడలో 1914 ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహిస్తూ, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం చారిత్రాత్మకమైన పిలుపునిచ్చాడు. 1918 జనవరి 1వ తేదీన సుబ్బారావు పంతులు డిమాండ్‌ మేరకు ఆంధ్రప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కాంగ్రెస్‌ కౌన్సిల్‌ను అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ మండలికి న్యాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షుడయ్యాడు. అంతేగాక ఆయన అఖిలభారత కాంగ్రేసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు ఎన్నికై సేవలందించాడు.

సుబ్బారావు పంతులు 1941, జనవరి 15వ తేదీన 85వ యేట మరణించాడు.[2]

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -10-9-22-కాంప్ -మల్లాపూర్-హైదారాబాద్

Posted in రచనలు | Leave a comment

నీలకంఠేశ్వర శతకం

నీలకంఠేశ్వర శతకం
తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా పుల్లేటి కుఱ్ఱు వాస్తవ్య దివ్యాంగ శ్రీ బళ్ళకనకయ్య గారి ప్రధమ పుత్రుడు మల్లయ్య చే రచించబడి ,దివ్యాంగ శ్రీ చింతా వీరభద్రయ్యగారి చే పరిష్కరింపబడి న శ్రీ నీల కంఠేశ్వర శతకం పాలకొల్లు రాజరత్న ముద్రాక్షరశాలలో 1936లో ప్రచురింపబడింది .దీని ప్రోత్సాహకులు శ్రీ దగ్గులూరి శ్రీనివాసులగుశ్రీ విశ్వనాధం కోటయ్య ,శ్రీ సోమన బసవ రాజు గార్లు .వెల-రెండు అణాలు.పుస్తక ముద్రణకు ద్రవ్యసాయం చేసిన వారు శ్రీ దగ్గులూరి వాస్తవ్యులు సామంత పూడి పెద వెంకట నృపాలుని ప్రియ సుతుడు శ్రీమతి బంగారాయాంబ దంపతుల ప్రియపుత్రుడు శ్రీ సత్యనారాయణ .పీఠిక లో కవి గారు తాను అప్పుడప్పుడు భక్తి గ్రంధాలను చదివి వినిపిస్తున్నప్పుడు తనమిత్రుడు దగ్గులూరి వాస్తవ్యుడు కర్ణ వంశానికి చెందిన శ్రీ వాసా సూర్య సోమ లింగం గారు ,ఆగ్రామ పాలకుడైన శ్రీ నీలకంఠేశ్వరస్వామి పై ఒక శతకం రాయమని కోరితే,రాసి, తనగురువు శ్రీ చింతా వీరభద్రయ్య కవికి చూపించగా తప్పులు సరిచేసి ,శుద్ధ ప్రతి తయారు చేసి ఇచ్చారు .ఈ శతకం పై పెన్నాడ అగ్ర్హహార వాసి శ్రీ మల్లిపూడి వీరయ్య సిద్ధాంతి తన అభిప్రాయం రాస్తూ -కవి మృదుమధుర లలితా పదజాలంతో శతక రచన చేశాడని అన్నారు .పాలకొల్లు వాస్తవ్యులు ఉభయ భాషాప్రవీణ శ్రీ ధర్మపురి తిరుమల లక్ష్మీ కుమార వేదాంత తిరుమలాచార్యులు అభిప్రాయం తెలియజేస్తూ -సుధీ జన చిత్త రంజకంగా ,శబ్దాలంకార శోభితంగా కవిత్వం ఉందని మెచ్చారు .దగ్గులూరి వాస్తవ్యుడు శ్రీ పూడి భోగ లింగకవి ‘’సుధారసం తో ,మృదూక్తులతో ,గంగాలహరీ ప్రవాహంగా శతకం ఉన్నది ‘’అన్నారు .పాలకొల్లుకవి శ్రీ కడియం తమ్మన్న ‘’నీతి దాయకం భక్తి ముక్తి ప్రద౦గా ప్రాచీనకవుల ధోరణిలో శతకం నడిచింది .సర్వపాప సంహారకంగా ఉంది ‘’అని శ్లాఘించారు . లంకల కోడేరు వాసి పండిత బొండాడ లక్ష్మణ కవి ‘’బాలకవి బిరుదున్న ఈకవి రాసిన శతకం చదివి ముక్తిపొందాలి ‘’అని అభిప్రాయం రాశారు .వీరందరికి కవి కృతజ్నతలు తెలిపారు .ఇది సీస పద్య శతకం .’’దగ్గులూరి నివేశ ,పాతక వినాశ – నీలకంఠేశ నన్నేలు నిరతమీశ’’అనేది శతక మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీమన్మహేశ్వరా శ్రీతాజన మందార -శంకర పాహిమాం -పాహి శరణు-భోగీశా వరాభూష ,ముని మనోంబుజ పూషా -సర్వేషా పాహిమాం పాహి శరణు శరణు
గజచర్మ పరీధాన కైవల్య సంధాన -సర్వజ్న పాహిమాం పాహి శరణు -లింగ ,సుచారిత్ర ,లేఖర్షభ స్తోత్ర -పరశివ పాహిమాం పాహి శరణు
గరీమతో సీసా శతకమను కమలములను -మాలగా గూర్చి యర్పింతు మది నుతింతు- దగ్గులూరి నివేశ పాతక వినాశ -నీలకంఠేశ-నన్నెలు నిరతమీశ’’. తర్వాత పద్యంలో శ్రీ వీరభద్రదేశికునికి నమస్కరించాడు .తనది దేవల బ్రహ్మ వంశమని ,ఇంటిపేరు బళ్ళ ఆశ్వాలాయన సూత్రులమని ,గౌరమాంబ మల్లికార్జునుల తనయుడు ,అచ్చమాంబ కు భర్త అయినకనకయ్య తన తండ్రి అని వారి ప్రధమకుమారుడైన తనపేరు మల్లయ అని తెలిపాడు.తనతలిదండ్రులు తన్ను ‘’శివ దత్తకుమారుడు ‘’అని పిలిచేవారని ,కనుక శివుడు తనకు అన్నయ్య ,అంబికా గంగలు అమ్మలు .గణపతి కుమారస్వామి వీరభద్రుడు అన్నలు .వాళ్ళ అర్ధ శరీరులు తనకు వదినెలు అని చమత్కరించాడు .ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్రం లోని మొదటి అక్షరాలతో మరో సీసం అల్లాడు .అక్షరాలకు ఆద్యుడు ,బిందుయుత ప్రణవం , వర్ణత్రయంలో వాక్ సతీ,మా ఉమాకాంత లై పతులు నై శోభించాడు .పంచభూతాలు ,పగలు రాత్రి ,లోపల బయటివాడై ,సకల చరాచరమ్బై సర్వం శూన్యమై ,ఎంచటానికి అశక్తమై ,ఆది మధ్యాంతరహితుడవు నువ్వు అన్నాడు ,ఊపిరి వదిలేలోపు నిన్ను ఎన్నగలనో లేనో అని సందేహపడ్డాడు .
పౌలస్త్యుడు ఆర్టీతో ఆర్ధిస్తే నవనిధులు ,ఆగరాజసుత ఆర్చిస్తే అరమేను ,ఫల్గుణుడు తపిస్తే పాశుపతం ,ఇచ్చిన భక్త సులభుడవు అన్నాడు .మైదున రాముడిని కోర్కె తీర్చాడు .సంధ్యా నృత్యం చేసి అందర్నీ అలరిస్తావు .’’అత్యంత భారమౌ యవనీ తలంబొక శేషు౦డు శిరమున జెర్చి యుండే-నా భోగి కులనాధు నవలీలగా నొక కమతంబు వెన్నున గదలకుంచే -నా కచ్ఛపాంబును నతి సూక్ష్మముగా-నొక క్రోడంబు మునిపంట కూర్మి నుంచె-నా వరాహంబును అణుమాత్రముగనెంచి-జలధి మోయుచు నుండే గలత లేక – యోగ్యులగు ధీరులోరులకు నోపినంత -సాయమొనరింతురది వారి సఃజ గుణము ‘’అని చాలా చమత్కారంగా పద్యం అల్లి సూక్తి తో ముక్తాయింపు ఇచ్చాడు కవి .కోపం వదలటం ఘనం .శక్తిలేక వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులను కాపాడాలి .డబ్బుమదం గర్వం పతన హేతువు అని సూక్తి ముక్తావళి కూర్చాడు .’’ఏరననుబ్రోవ విదినీకు మేర యటర ‘’అని ఆర్తిగా ప్రార్థించాడు .శ్రీ ధాత్రు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు ఈశతకాన్ని స్వామికి ఆర్పణం చేసి ముగించాడు 101వ సీసం లో .తర్వాత గద్యంలో –‘’ఇది శ్రీ మదుమా రమణ పాదారవింద మకరంద పానేందిందిర,బాలపరమేశ్వరీకరుణా కటాక్ష వీక్షణ సమాలబ్ధ ,సరస కవిత వైభవ ,మన్మహారుషిగోత్ర పవిత్ర ,అశ్వలాయన సూత్ర ,బళ్ళవంశపయఃపారావార కైరవ మిత్ర ,కనకాభి దేయ సత్పుత్ర ,మల్లయ నామ ధేయ ప్రణీతంబగు నీలకంఠేశ్వరశతకము సర్వ౦బును సంపూర్ణము ‘’అని ముగించాడుకవి .
భక్తి ముక్తి దాయకమైన శతకం కవి ప్రతిభ ప్రతిపద్యం లోనూ కనిపిస్తుంది .లోకరీతి, జన ప్రవృత్తి,ధర్మ సూక్షాలు ,నీతులు,నిష్టూరాలు కలబోసి రచించిన శతకం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారి జీవితం.18వ భాగం

గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారి జీవితం.18వ భాగం

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -4(చివరిభాగం )

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -4(చివరిభాగం )

అనువాదకుల అవస్థలు

అనువాదకుడు కవి ఆత్మను నూటికి నూరు శాతం ఆవిష్కరించటం అసాధ్యం.అందుకే అనువాదకుడు కుందుర్తి ఆ యదార్ధాన్ని చెప్పి బెంగాలీ కవి అయిన జీవనానంద దాస్ కవితలను బెత్తెడు ఎడంగా అనువాదం చేసి తెలుగు దనం తేవటానికి కృషి చేశానని చెప్పాడు .బెంగాలీనుంచి ఇంగ్లీష్ అనువాదం పొందిన కవితలను ఆధారంగా తెలుగు అనువాదం చేశాడు .ఆధునిక భాషకు దగ్గరగా ఉండేట్లు జాగ్రత్త పడ్డాడు .కానీ బెంగాలీలో ఉన్న ఛందస్సౌన్దర్యం శబ్దలయ తూగు ఊపు భావాలపోహలింపు ఇంగ్లీష్ లోనూ ,అలానే తెలుగులోనూ  వచ్చి ఉండక పొవచ్చు  అని నిజాయితీగా చెప్పాడు కుందుర్తి .

‘’సముద్రపు తీరాన ఉప్పు కుప్పలమీద –కోరికల కన్నీళ్లు దళసరి మంచు కార్చటం ‘’,’’చెట్లకు వ్రేలాడుతున్న అరుణ ఫలజాతుల ప్రతిబింబాలు –ఏటి నీటిలో చూసుకొంటూ పొలాలు మురిసిపోవటం ‘’-‘రుత్వంతాల లో నదుల నీటిప్రవాహాల గుసగుసల సాంకేతికాలు –పుడమితల్లి పంట కూతురు పెరగటం ‘’. ఇలాటివి అనువాదాలకు లోన్గానివే  అయినా ,మాతృకకు దగ్గర గా ఉండేట్లు తెలిగీకరించాడు .’’దేశ దేశాల సరిహద్దు రేఖలు కలిసే చోట –రాబందులు రాజ్యం చేస్తూ ఎగురు తున్నాయి ‘’-‘మృత్యువంటే బెదిరి పారిపోయే అల్పజాతి పక్షులు  -తెల్లమొగాలతో దిగాలుగా ఉంటె –ఎత్తైన గుడి గోపురాలమీద రాబందులు ప్రదక్షిణాలు చేస్తూ –మృత్యువుతో రెక్కల కరచాలనం చేస్తూ ఆకాశమంతా ఆవరించాయి .’’’’మరణ శయ్య ప్రక్క టేబుల్ మీద –సగం తిని శల్యావశిష్టమైన –నారింజ పండులా నన్ను మళ్ళీ భూమ్మీదకు రానివ్వండి ‘’,’’పగలల్లా రైళ్ళు కార్లుట్రాములు సరీ సృపాల్లా జరజరా పాకి –అలసిపోయి బడలిపోయి నిద్రాలోక నిశీధంలో కలిసిపోతాయి ‘’,’’చంద్రబింబం రాలిపడి నీటిలో మునిగి పోయి౦దిక్కడే ‘’,

‘’పంచమిచంద్రుడు అస్తమించగానే –నిశ్శబ్దకాంత పరిగెత్తుకొచ్చి –ఒంటెలాపొడుగ్గా కిటికీలోంచి తలదూర్చి –ఒంటరిగా ఉన్న తాతగారిని ‘’మళ్ళీ లేవద్దు జీవితాన్ని తెలుసుకొనే బాధ తీరిపోయింది ‘’అని మెల్లగా చెవిలో ఊదింది ‘’,’’జీవితం ఒక పొడుగాటి వస్త్రం –మధ్యలో అతుకుల్లేవు –కాలం మాత్రం పందెంలో పరిగెత్తుకొంటూ వచ్చి –తేనే తుట్టేపట్టిన చోటే వాలింది-దారిద్ర్యబాధకు లొంగని దేహం పై వాలింది –ఆ ఏనుగు బతికినా చచ్చినా పది వేలే ‘’

  తిలక్ అమృతం కురిసిన రాత్రికవిత రాస్తే దాస్ ‘’వానకురిసిన రాత్రి ‘’కవిత రాశాడు .కుందుర్తి నగరంలో వానకవిత రాసినట్లు నాకు గుర్తు .నింగిలో ఎగిరే గాలిపటం సందడి కవికి ‘’ఆమెకండ్లు గుర్తుకు వస్తాయట ‘’.’’ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఈ వంగ దేశానికి వస్తాను –నదీతీరాల విశ్రమిస్తూ ,వరిపోలాలుపర్యటిస్తూ పక్షిగా వస్తానేమో –మనిషిగా రాకపోవచ్చు ‘’అని ఆశాభావం వ్యక్తం చేశాడు జీవనానంద దాస్ .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణంగణపతిఖండం.8వ భాగం.8.9.22

బ్రహ్మ వైవర్త పురాణంగణపతిఖండం.8వ భాగం.8.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -312

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -312

312-మధ్యే వాద సినిమా మార్గదర్శి ,అంకూర్ సినీ ఫేం,పద్మభూషణ్  –శ్యాం బెనెగల్

1934లో డిసెంబర్ 14 న సికందరాబాద్ లో ప్రముఖ సిని ఫోటోగ్రాఫర్ బి.శ్రీధర్ దంపతులకు పుట్టిన శ్యాం బెనెగల్ ,చిత్రరచయిత ,దూరదర్శన్ సీరియల్స్ దర్శకుడు .నిజాం కాలేజిలోచదివి డిగ్రీ పాసయ్యాడు .ఉస్మానియా యూనివర్సిటి లో ఫిలిం సొసైటీ స్థాపించాడు .నీరా బెనెగల్ ను వివాహమాడాడు .అనేక పురస్కారాలు అందుకొన్న సృజన శీలి .అంకుర్ సినిమాతో సినీ వినీలాకాశంలో ధ్రువ నక్షత్రంగా మెరిశాడు .నిశాంత్ ,మంథన్,భూమిక చిత్రాలకు దర్శకత్వం వహించాడు .ఈ సినిమాలతో భారతీయ సినీ రంగం లో ‘మధ్యే వాద౦ ‘’ప్రవేశపెట్టిన మార్గదర్శి అంటే ‘పారలల్ సినీ పయనీర్ ‘’1940 తారవాత వచ్చిన ఫిలిం డైరెక్టర్ లలో అత్యుత్తమ దర్శకుడుగా పేరుపొందాడు .ఈ పేరు పెట్టింది సత్యజిత్ రే .1960-70లమధ్య వచ్చిన తన సినిమాలను ,తన సమకాలీనుల సినిమాలను పారలల్ సినిమాలు అని పేరు పెట్టాడు రే.మృణాల్ సేన్ డైరెక్ట్ చేసిన ‘’భువన్ షో౦,బెనెగల్ డైరెక్ట్ చేసిన అంకుర్ ఆ కోవ సినిమాలు . భారత్ ఏక్ ఖోజ్ అనే ఆయన తీసిన సీరియల్ విపరీతంగా పేరుపొందింది .

  ప్రముఖ నిర్మాతదర్శకుడు గురు దత్ కు శ్యాం బెనెగల్ కజిన్ .ప్రముఖ బెంగాలీ సినీ దర్శకుడు సత్యజిత్ రే కు వీరాభిమాని .సత్యజిత్ రే,రిత్విక్ ఘటక్ ,బిమల్ రాయ్ ,మృణాల్ సేన్ ,తపన్ సిన్హా,క్వాజా అహ్మద్ అబ్బాస్ ,బుద్దదేవ దాస్ గుప్త ,,చేతనానంద్ ,గురుదత్,శాంతారాం లు పారలల్ సినిమా  పయనీర్స్ .ఈకాలాన్ని భారతీయ సినీ యుగంలో స్వర్ణయుగం అంటారు .

  శ్యాం బెనెగల్ 18 జాతీయ ఫిలిం అవార్డ్ లు ,ఒక ఫిలింఫేర్ అవార్డ్ ,ఒక నంది అవార్డ్ పొందాడు .2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకొన్నాడు .1976లో పద్మశ్రీ గ్రహీత. 1991లో పద్మభూషణ్ పొందాడు . ,

  బంగ్లా దేశ్ ప్రభుత్వం బంగ్లా పిత షేక్ ముజిబుల్ రెహ్మాన్ జీవిత చరిత్ర- ముజీబ్ బయోపిక్ తీయటానికి శ్యాం బెనెగల్ కు అప్పగించింది . ఈఏడాది అది విడుదల అవుతుంది .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

కాంగ్రెస్ పులి ,జైలు పట్టభద్రుడు ,లోకమాన్య పత్రిక సంపాదకుడు ,అనంతపురం  స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ డిప్యూటీ స్పీకర్ ,పద్మశ్రీ –కల్లూరు సుబ్బారావు

కాంగ్రెస్ పులి ,జైలు పట్టభద్రుడు ,లోకమాన్య పత్రిక సంపాదకుడు ,అనంతపురం  స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ డిప్యూటీ స్పీకర్ ,పద్మశ్రీ –కల్లూరు సుబ్బారావు

కల్లూరు సుబ్బారావు (1897 – 1973), అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త, కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు.

సుబ్బారావు, అనంతపురం జిల్లా, హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897, మే 25న సూరప్ప, పుట్టమ్మ దంపతులకు జన్మించాడు. మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగాన్ని విని, ఉత్తేజితుడై, జాతీయోద్యమంలో పాల్గొనటం ప్రారంభించాడు. 1920లో జరిగిన ఆంధ్రమహాసభలో పాల్గొని, అయ్యదేవర కాళేశ్వరరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య లతో స్నేహం పెంపొందించుకున్నాడు. 1921లో విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు సమావేశాల్లో స్వచ్ఛందసేవకునిగా పనిచేశాడు. అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళి, మొత్తం ఏడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు. ఆంగ్లేయులు ఈయన్ను కాంగ్రెస్ పులి అని అభివర్ణించారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈయన్ను జైలుపట్టభద్రుడుఅని కొనియాడాడు. సుబ్బారావు లోకమాన్య అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు.

స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర శాసనసభకు, 1965లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. 1955లో శాసనసభ డిప్యూటీ స్పీకరుగా కూడా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 1967లో భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సుబ్బారావు 1973, డిసెంబరు 21న[1] మరణించాడు.

 మా నాన్న గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు హిందూపురం లో తెలుగు పండిట్ గా పని చేసినపుడు కల్లూరి వారు తరచుగా కలిసేవారు సాహిత్యసభలకు నాన్నగారు వెళ్ళేవారు .ఆయన రాసిన పుస్తకాలపై సమీక్ష చేసేవారు .కానీ ఆయన్ను ఎప్పుడూ నేను చూడలేదు .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధులు ,శ్రీబాగ్ ఒడంబడికలో కీలకపాత్రదారి ,వడ్డాది వారి శిష్యులు ,సంజీవరెడ్డికి గురువు ,’’వదరుబోతు ‘’వ్యాసకర్త ,గ్రందాలయోద్యమనాయకులు ,’’పినాకిని’’పత్రిక ,భువనవిజయం భవన స్థాపకులు ,శాసన సభ్యులు –శ్రీ పప్పూరు రామాచార్యులు

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధులు ,శ్రీబాగ్ ఒడంబడికలో కీలకపాత్రదారి ,వడ్డాది వారి శిష్యులు ,సంజీవరెడ్డికి గురువు ,’’వదరుబోతు ‘’వ్యాసకర్త ,గ్రందాలయోద్యమనాయకులు ,’’పినాకిని’’పత్రిక ,భువనవిజయం భవన స్థాపకులు ,శాసన సభ్యులు –శ్రీ పప్పూరు రామాచార్యులు

పప్పూరు రామాచార్యులు (నవంబర్ 8, 1896 – మార్చి 21, 1972) [1]రాయలసీమ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో రామాచార్యులు కూడా ఒకరు .

2022 మార్చి 21న పప్పూరు రామాచార్యులు 50వ వర్ధంతి జరుపుకోనున్నారు.[2]

జీవిత విశేషాలు
నరసింహాచార్యులు, కొండమ్మ దంపతులకు 1896 నవంబర్ 8వ తేదీనఅనంతపురంలో పప్పూరు రామాచార్యులు జన్మించారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన బ్రాహ్మణ కుటుంబీకుడు. ఇతని పూర్వీకులు పప్పూరు నుండి అనంతపురానికి వచ్చి స్థిరపడినవారు కాబట్టి ఇతని కుటుంబాన్ని పప్పూరువారని అనటం ఆనవాయితీ అయింది. ఇతని తండ్రి నరసింహాచార్యులు పేరు మోసిన పౌరాణికుడు. హరికథలు చెప్పడంలో సిద్ధహస్తుడు. అతడి పురాణప్రసంగాలలో హాస్యధోరణి అధికం. ఆ లక్షణాలే కుమారునిలో కూడా పొడచూపాయి. పప్పూరు రామాచార్యులు తండ్రివద్దే సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నాడు. ప్రాథమిక విద్య అనంతపురం మునిసిపల్ హైస్కూలులో సాగింది. రాజమండ్రిలో అతని బావ కుంటిమద్ది రంగాచార్యుల వద్ద చేరి స్కూలు ఫైనల్ పాసయ్యాడు.[3] రాజమండ్రి పాఠశాలలో వడ్డాది సుబ్బారాయుడు ఇతనికి ఆంధ్రభాషను బోధించే గురువు. అక్కడే కందుకూరి వీరేశలింగంతో పరిచయం ఏర్పడింది. 1914-16లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఆ సమయంలోనే రాజకీయాలంటే మక్కువ ఏర్పడింది. 1917లో అనంతపురం లోని దత్తమండల కళాశాలలో బి.ఏ.చేరారు. రామాచార్యులు 1917-1918లలో బి.ఏ. చదువుకుంటున్న సమయంలో సహాధ్యాయి కర్నమడకల గోపాలకృష్ణమాచార్యులతో కలిసి పదిహేను రోజులకొకసారి ‘వదరుబోతు’ పేరున వ్యాసాలను ప్రచురించి కరపత్రాలుగా పంచేవారు. అప్పటి సమకాలీన సమాజ పరిస్థితులు, సాంఘిక దురాచారాల ఖండన, జాతీయోద్యమం మొదలైన అంశాలపై హాస్య, వ్యంగ్యాత్మక ధోరణిలో, సులభమైన భాషాశైలిలో రెండు సంవత్సరాల పాటు యాభైకి పైగా వ్యాసాలను వెలువరించారు. వీటిలో ఒక వ్యాసం మాత్రం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. వీటిని అనాటి అనంతపురంలోని స్వామి విలాస ప్రెస్సు లో ముద్రించారు. ఆంగ్ల సాహిత్యంలో టాట్లర్ పేరుతో వ్యాసాలు రాసిన స్టీలు ప్రేరణతో వీరు ఈ వ్యాసాలు రాశారు[4]. యాబై వ్యాసాలలో ఇరవై రెండు వ్యాసాలను వ్యాసపాఠకుడైన హిందూపురానికి చెందిన పక్కా గురురాయాచార్యుల నుండి సేకరించి, 1932న పుస్తకరూపంలో ముద్రించారు. ఈ పుస్తకానికి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ముందుమాట రాశాడు. 1920లో బి.ఏ. పూర్తికాగానే కలెక్టర్ ఆఫీసులో చిన్న ఉద్యోగంలో చేరారు.

స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో 1921లో ఆ ఉద్యోగాన్ని మానివేశారు. ఆ సమయంలో కైప సుబ్రహ్మణ్యశర్మతో పరిచయం ఏర్పడింది. అతని సహకారంతో ఇల్లూరులో నీలం సంజీవరెడ్డికి మరికొందరు పిల్లలకు ప్రైవేటు పాఠాలు చెప్పేవారు. కైప సుబ్రహ్మణ్యశర్మ, అతని సోదరుడు మహానందయ్య, ఐతరాజు నరసప్ప, పాలకొండ రామచంధ్ర శర్మ, ఆత్మారామప్ప మొదలైన వారితో కలిసి 1922లో పినాకిని అనే వారపత్రికను ప్రారంభించారు. 1925 వరకు ఈ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఆ పత్రిక భాగస్వాములతో భేదాభిప్రాయాలు ఏర్పడి బయటకు వచ్చి 1926లో శ్రీ సాధన అనే పత్రికను స్థాపించి, స్వంత ప్రెస్సు సాధన ముద్రణాలయంలో ప్రచురించారు. ఈ పత్రికను 1972 మార్చిలో మరణించే వరకూ ఒక్క చేతితో నిరాఘాటంగా నడిపారు.

గ్రంథాలయోద్యమంలో పాత్ర
అనంతపురం జిల్లాలో గ్రంథాలయోద్యమంతో పాటు సాహిత్య సాంన్కృతిక రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో పప్పూరు రామాచార్యులు ఒకరు. నిరంతరం గ్రంథపఠన చేస్తూ అనేక విషయాలను ఆకళింపు చేసుకునేవారు. ఆయన సంస్కృతాంధ్ర పాండిత్యాలు భారతదేశ సంస్కృతి మూలసూత్రాలను చక్కగా అర్ధం చేసుకోవ డానికి దోహదం చేసింది. వ్యక్తిత్వ వికాసానికి గ్రంథపఠన ఆవశ్యకతను తొలుతనే గుర్తించినారాయణ. గ్రంథాలయాలు లేని రోజుల్లో రామాచార్యులు స్వయంగా పుస్తకాలు సేకరించి చిన్న పుస్తక భాండాగారం నెలకొల్పి కొంతకాలం నిర్వహించారు.

అనంతపురం చుట్టుప్రక్కలున్న తాలూకా, గ్రామస్థాయి గ్రంథాలయాలకు సైతం చేర్చేవారు. 1947-52 వరకు అనంతపురం పట్టణ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పడు ఆ మునిసిపాలిటి ఆదాయం పెరిగి 3వ గ్రేడ్ నుండి 2వ గ్రేడ్ స్థాయికి చేరుకుంది. ఇందులో గ్రంథాలయా లకు గ్రంథాలయ పన్నులు సక్రమంగా చెల్లించి నూతనంగా గ్రంథాలయాలను నెలకొల్పి కొత్త పుస్తకాలను సమకూర్చారు. అనంతపురం మునిసిపాలిటీలో నిరంతర విద్యా విజ్ఞాన భాండా గారాన్ని నెలకొల్పడం అనేది ప్రశంసనీయమైన నిర్ణయమని మద్రాస్ మెయిల్ అనే పత్రిక 4.11.1950 తేదీన సంపాదకీయంలో పేర్కొంది. ఆ సంపాదకీయం చదివిన నాటి జిల్లా కలెక్టర్ జేమ్స్ రామాచార్యులను ప్రత్యేకంగా అభినందించారు.

1952లో అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఏర్పడినప్పడు తొలి అధ్యక్షులుగా పనిచేసే అవకాశం కల్గింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సరైన భవనం దొరకలేదు. తన ఇంటిలోని మూడు గదులను గ్రంథాలయ అవసరాలకు ఇచ్చివేశారు. సొంత పత్రిక శ్రీసాధనను జిల్లాలోని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణి చేశారు. వీరు జిల్లాలోని గ్రంథాలయాలకు చేసిన కృషి మరువరానిది. అనంతవురం జిల్లా కేంద్ర గ్రంథా లయానికి భవనం కావల్సి వచ్చింది. స్థానిక మ్యూజియం వారిని ఒప్పించి ఆ భవనాన్ని రూ.46,000/- లకు గ్రంథాలయ సంస్థకు విక్రయింపచేశారు. రాయలసీమలోని అన్ని జిల్లాలో కంటే ముందుగా అనంతపురంలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సొంత భవనం సమకూర్చుకుంది. ముందుచూపుతో కేంద్ర గ్రంథాలయ భవన సమీపంలో దాతలతో 30వేలకు పైగా నిధిని, 50 సెంట్ల స్థలాన్ని సేకరించి మహిళా, బాలల గ్రంథాలయాలను ఏర్పరచారు. వీటి ప్రారంభోత్సవానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు విచ్చేయడం విశేషం. జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన ప్రాంగణంలో 1969లో ఆరుబైలు రంగస్థలం భువనవిజయం మంటపం నిర్మాణంలో కీలకపాత్ర వహించి దీని ప్రారంభించడానికి వావిలాల గోపాలకృష్ణయ్య, నీలం సంజీవరెడ్డి, పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు మొదలైన ప్రముఖులు విచ్చేశారు. ఇలా అన్ని సదుపాయాలు చేకూరడంతో 1969లో ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథా లయోద్యమ ప్రముఖులు డా.ఎస్.ఆర్.రంగనాథన్ ప్రశంసలకు పాత్రమైనది. జిల్లా గ్రంథాలయ సంస్థ రావూచార్యులను ఘనంగా సన్మానించింది. 1970లో ఆయన ఛాయాచిత్రాన్ని గ్రంథాలయంలో ఆవిష్కరించారు. 1930లో జరిగిన ఒక సంఘటన పప్పూరి వారికి గ్రంథాలయోద్యమం పట్ల గల అభిమానానికి సేవానిరతికి మచ్చుతునక.

స్వాతంత్రోద్యమంలో పాత్ర
ఈయనా , కల్లూరు సుబ్బారావు కలిసి గ్రామగ్రామాలకూ తిరిగి అక్కడి ప్రజలలో స్వాతంత్ర్య సమూపార్జనా కాంక్షను రేకెత్తించారు. మద్యపాన నిషేధము, ఖద్దరు వస్త్రధారణ, హరిజనోద్ధరణ, గ్రామ పరిశుభ్రత మొదలైన కార్యక్రమాలను చేపట్టారు. 1921లో గాంధీని తాడిపత్రిలో సందర్శించారు. ఆ సమయంలో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించారు. 1928 నవంబరులో నంద్యాలలో జరిగిన ఆంధ్రమహాసభలలో పాల్గొని దత్తమండలాలకు బదులు రాయలసీమ అని వ్యవహరించాలని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప జేశారు. 1932లో ఒక సంవత్సరం పాటు సహాయనిరాకరణోద్యమంలో భాగంగా జైలుశిక్షను అనుభవించారు.1937 నవంబర్ 17న శ్రీబాగ్‌ ఒడంబడికలో క్రియాశీలక పాత్రవహించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈయన అరెస్టయ్యి తంజావూరు, వేలూరు జైళ్ళలో రెండేళ్ళు జైలుశిక్ష అనుభవించారు. ఆ సమయంలో ఇతడు తనకున్న సహజ పౌరాణిక ప్రవచనాలతో తోటి డిటెన్యూలకు భారత, కాళిదాస కావ్యములలోని రమ్యభావాలను వినిపిస్తూ, సత్కాలక్షేపం చేసేవారు. వీరి ప్రవచనాపాండిత్యానికి రాజకీయఖైదీలు సంతోషించి జైలులోనే ఇతనికి పండిత సత్కారాలను నెరవేర్చేవారు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా పురాణ కాలక్షేపాన్ని కొనసాగించారు. బళ్ళారిలో చేసిన పురాణ పఠనాన్ని విని బళ్ళారి రాఘవ బంగారుపతకంతో సత్కరించాడు. 1947నుండి 1952 వరకు అనంతపురం పట్టణ మున్సిపల్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1952 నుండి 1955 వరకు జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 1955 నుండి1962 వరకు ధర్మవరం నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.[5] వీరి రచనా సామర్థ్యానికి వదరుబోతు వ్యాసాలు మచ్చుతునకలు. కల్లుపెంట అనే నాటకం వ్రాశాడు. రామయ్య పదాలుపేరుతో ‘విశ్వవినుత నామ వినుము రామ’ అనే మకుటంతో 40 పద్యాలు వ్రాశారు. పినాకిని, సాధన పత్రికలతో పాటుగా సహకార పత్రికకు కుడా సంపాదకత్వం నెరపారు. దక్షిణభారత హిందీ ప్రచారసభ వారి స్రవంతి పత్రిక సంపాదకవర్గంలో సభ్యుడిగా ఉన్నారు. 1972 మార్చి21 వతేదీ తన 76వ యేట మరణించారు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మనవెండి తెరమహానుభావులు -311311-’కుదిరితే ఒక కప్పు కాఫీ ‘’డైలాగ్ ఫేం ,ఎయిర్లైన్స్ ఉద్యోగి సినీనటుడు –రాజా

రాజా ఒక తెలుగు సినీ నటుడు. రాజా స్వస్థలం విశాఖపట్నం.[1] తల్లి క్రిష్టియన్, తండ్రి హిందూ మతానికి చెందిన వారు. ఇరువైపులా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే పెళ్ళి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళింటికి బంధువులు ఎవరూ వచ్చే వాళ్ళు కాదు. ఆయనకు ఇద్దరు అక్కలు. రాజాకు ఎనిమిదేళ్ళ వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో అమ్మ చనిపోయింది. ఆ సంఘటన వారి జీవితంలో పెద్ద విషాధాన్ని నింపింది. తరువాత వాళ్ళు హైదరాబాదుకి వచ్చేశారు. వ్యాపార రీత్యా వాళ్ళ నాన్న విదేశానికి వెళ్ళాడు. కొద్ది కాలం అక్కడ గడిపిన తర్వాత ఆయన స్వదేశానికి వచ్చేశారు. అయితే వారికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. స్వదేశానికి వచ్చిన ఏడాదికే ఆయన గుండెపోటుతో చనిపోయాడు.

వాళ్ళ నాన్న చనిపోయేటప్పటికి రాజాకు పద్నాలుగేళ్ళు. రాజాతో పాటు వారి అక్క వాళ్ళు కూడా పెద్ద దిక్కులేకుండా ఉండడాన్ని భరించలేక పోయారు. ఒకానొక దశలో బాగా డిప్రెషన్ కు లోనై ఆత్మ హత్య చేసుకుందామని నిర్ణయించుకుని పురుగుల మందు తాగేశారు. అయితే కొద్ది సేపటి తర్వాత వాళ్ళ స్నేహితులు కొంతమంది వచ్చి ఆసుపత్రిలో చేర్చడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతేకాక వాళ్ళు శ్రేయోభిలాషులు కొంతమంది కౌన్సెలింగ్ చేశారు. అన్నింటికీ చావే పరిష్కారం కాదని ధైర్యం చెప్పారు.

తర్వాత రాజా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ అయిపోయాక లుఫ్థాన్సా ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి 3500 మంది పోటీ పడగా ఎంపికైన నలుగురిలో రాజా ఒకడు. ఉద్యోగం రావడంతో వారి కుటుంబ కష్టాలు దాదాపు తీరిపోయాయి. శిక్షణలో ఉండగానే దాదాపు 40,000 జీతం వచ్చేది. తరువాత అది 60000 కి పెరిగింది. అక్కకి పెళ్ళి చేశాడు.

చదువైపోయి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. డబ్బు కూడా వెనుకేసుకున్నాడు. అప్పుడు రాజా మనసులో ఏ మూలనో ఉన్న నటుడు కావాలనే కోరిక బయటపడింది. రెండున్నరేళ్ళుగా చేస్తున్న ఉద్యోగం వదిలేసి అమెరికా వెళ్ళి థియేటర్ యాక్టింగ్ కోర్సులో చేరాడు. అది పూర్తి చేసుకుని స్వదేశానికి చాలా ఆత్మవిశ్వాసంతో తిరిగివచ్చాడు. ఫోటోలను, సర్టిఫికేట్లను చేతపట్టుకుని నిర్మాతల చుట్టూ తిరిగాడు. రకరకాల అనుభవాలను ఎదుర్కొన్నాడు. అవకాశాలు మాత్రం రాలేదు. కొద్ది కాలం తర్వాత విసిగిపోయి ముంబై వెళ్ళి మోడలింగ్ అవకాశాల కోసం అన్వేషించాడు. వీడియో ఆల్బమ్స్ లోనూ, నాటకాల్లోనూ నటించాడు.

అలా ఒకసారి సికింద్రాబాద్ క్లబ్‌లో నాటకం వేయడానికి వచ్చి పాత్రికేయుల కళ్ళలో పడ్డాడు. వారు తమ సమీక్షల్లో రాజా గురించి ప్రత్యేకంగా రాశారు. ఆ రివ్యూలు చూసిన దగ్గుబాటి రామానాయుడు నుంచి అందుకున్న ఫోన్‌కాల్ సినీ పరిశ్రమలో రాజా తొలివిజయం అని చెప్పవచ్చు. నటుడిగా రాజా మొదటి సినిమా ఓ చినదానా. ముంబైలో ఉన్నప్పుడు ఇతడికి ఇ.వి.వి. సత్యనారాయణ కొడుకులతో సంబంధాలుండేవి. వారి ద్వారా ఈ సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ (సినిమా) రాజాకు పేరు తెచ్చిపెట్టింది.

సినిమాలు
· ఓ చినదాన

· విజయం

· ఆనంద్

· అప్పుడప్పుడు

· కల

· మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు

· మిష్టర్ మేథావి

· జగన్మోహిని

· టాస్

· ఆ నలుగురు

· కోకిల

· కేక

· కలియుగ

·

Posted in సినిమా | Tagged | Leave a comment

త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు

త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు

ఆత్మకూరి గోవిందాచార్యులు (1895-1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల కోవిదుడు, పలు గ్రంథకర్త, పత్రికాధిపతి, సంపాదకుడు, శాసన సభ్యుడు.

బాల్యం, విద్యాభ్యాసం
ఆత్మకూర గోవిందాచార్యులు 1895లో పశ్చిమగోదావరి జిల్లాలోని అగ్రహారగోపవరం గ్రామంలో పుట్టారు. సంపన్నులైన వైష్ణవ బ్రాహ్మణుల కుటుంబంలో, వేంకట కృష్ణమాచార్యులు, సుభద్ర దంపతులకు కుమారునిగా జన్మించారు. ఆయన తెలుగు, ఆంగ్లం, సంస్కృతం అభ్యసించారు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి శిక్షణ కోర్సును చదవడం ప్రారంభించారు.

స్వాతంత్ర సమరంలోకి
ప్రభుత్వోపాధ్యాయ కోర్సు చదవడం ప్రారంభించిన ఆత్మకూరి గోవిందాచార్యులు 1920 అక్టోబర్ 13న గాంధీజీ ఇచ్చిన పిలుపును అందుకుని విద్యాభ్యాసం వదలిపెట్టారు. 1920లో కలకత్తా, నాగపూర్ లలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు హాజరై పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున గాంధీ సహాయ నిరాకరణను సమర్థిస్తూ మాట్లాడారు. 1921లో ఏలూరులో గాంధీ ప్రబోధించిన జాతీయ విద్యాలయం స్థాపించినవారిలో ఆయన ఆత్మకూరి కూడా ఉన్నారు.

పత్రికా సంపాదకునిగా
వీరు ఏలూరు నుండి 1924లో సత్యాగ్రాహి అనే పేరుతో ఒక రాజకీయ వారపత్రికను స్థాపించి దానికి సంపాదకులుగా ఉన్నారు[1].

రచనలు
· గోవింద రామాయణము[2]

· మహాత్మా గాంధీ చరిత్ర

· భారతదేశ ఆర్థికచరిత్ర

· భారతీయ రాజ్యాంగ చరిత్ర

· పాహిమాం శతకము

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి జీవితం.17వ భాగం.7.9.22

శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి జీవితం.17వ భాగం.7.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -3

ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -3
కవిగా జీవనానంద
జీవనాన౦ద దాస్ కవిత్వం లో ప్రత్యేకత అతని భావ చిత్రాలలో నవ్యత .ఇందులో సంప్రదాయం సమకాలీన భావ సమైక్యతా ఉంటాయి .అతని భావ చిత్రాలు టాగూర్ వాటికంటే ప్రత్యేకంగా ఉంటాయి .టాగూర్ భావ చిత్రాలు అనువాదం లో తేలిపోతాయి అంటే పేలవమై పోతాయి .ఈయనవి స్పష్టంగా నిలుస్తాయి.ఇతనికవిత్వం లో పదాలు సందర్భ శుద్ధి దాటి ఎక్కడో ఉండి అధివాస్తవిక భావనాబలం తో కొత్తగా కనిపిస్తాయి ఇతని ‘’మృత్యు పరిష్వంగానికి ముందు ‘’కవిత విశిష్ట మార్గం లో ఉంటుంది .దీని నిండా కళ్ళకు కనిపించే ,చెవులకు వినిపించే చిత్ర ,క్లిష్ట సంకేతాలు౦టాయి .ఆయన అనుభూతుల్లోంచి రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నట్లు ఉంటాయి .అలంకారాల అందం బలంగా మనసులోకి చొచ్చుకుపోతుంది .ఉదాహరణ –‘’నది ఒడ్డున మంచుపూలు వెదజల్లుతున్న –నారీరత్నాలను చూసిన మేం –నీటిలో ఏకాంతంగా ఈదే –చేపకన్నెల నేత్రాలలోకి –అలల ద్వారా చొచ్చుకు పోయిన –ధాన్యపు సుగంధాలు దర్శించాం-ఇంతకూ మించి నేర్చే దీమిటి ? మృత్యు పరిష్వంగానికి ముందు కు ?ఎర్రగా ఎత్తుగా పెరిగిన ప్రతికోర్కేకు పక్కన గోడలా –నల్లటి మృత్యు ముఖం దాక్కుందని నరులైన మనకు తెలీదా ?మనిషి మనసులో పండే కలలూ ,ఐహిక భోగాల బంగారు చాయలూ –ఒక మహా ప్రశాంత నిశ్చలయోగ స్థితిలో –సమతూకం లో ఉంటాయని ప్రజలకు తెలీదా ?’’
ఇలా ఒకదాని వెంట మరో భావచిత్రం పరుగులు తీసి పరాకాష్టకు చేరతాయి .
ఇదే కృష్ణ శాస్త్రి గారి ‘’ఆకులో ఆకునై ,పూవులో పూవునై ‘’కవితలా మనల్ని మెరిపిస్తుంది .కళ్ళను పేము చెట్టు పళ్ళతో పోలుస్తాడు .ముగ్గురు ముష్టివాళ్ళు కవితలో పట్టణవాతావరణం హాస్యం గా పోషించాడు .’’ఎముకముక్క తిన్న కోతి నీటిలో ప్రతిఫలిస్తుంది’’ అంటాడు
‘’ సరోజినీ సమాధి ‘’కవితలో –‘’ఇదుగో ఇక్కడే నిద్రిస్తోంది మన సరోజినీదేవి –ఇంకా ఇక్కడే ఉందేమో నాకు తెలీదు –ఇక్కడే శాశ్వతంగా ఉండేట్లు –సంగీతాన్ని దాచిపెట్టారు ‘ఈ వర్ణనలో శ్మశానం కనిపించదు.సజీవ స్త్రీ ప్రక్కమీద పడుకొన్న భావం కలుగుతుంది .వర్ణన హఠాత్తుగా ఊహా స్థాయి నుంచి ,విశ్వభావన స్థాయికి ఉవ్వెత్తున ఎగిరిపోతుంది —‘’ఆకాశం లో కాషాయ వర్ణ కిరణ శకలం ఒకటి – పరివేషం తో మిలమిల మెరుస్తోంది-నీహారం కప్పిన నిప్పు కన్నెలా –బూడిదలో దాక్కుని కనిపించని పిల్లిలా –కనిపించీ కనిపించని ముఖం మీద చిరునవ్వు చిందులతో –చూపరుల కనువిందు తో ‘’సరోజినీ సమాధిని వర్ణించాడు .
‘’వనలతా సేన్ ‘’అనే ప్రసిద్ధ గీత౦ ప్రారంభం లో –
‘’శతానేక బ్రహ్మకల్పాలు గతం లో కలిసిపోకముందే –ఈ భూమ్మీద కాలం పరచిన గులకరాళ్ళ రాస్తా వెంబడి –ఓపికతోఒంటరిగా ఒక్కడినే ఆనాడు తిరుగుతూ-కోప ఘూర్ణిత సముద్ర ఘోషలు విన్నాను –అవి ప్రళయంగా నాలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి –సింహళ సముద్ర తీరం నుంచి –చీకటి రాత్రులలో జీవకళలు విరుగుతూ –మలయా జలసంధిదాకా –మత్తుగా నడుస్త్తూoడేవాడిని –వనలతా సేన్ నన్ను ఆలింగనం చేసుకొన్న చోటు లోమాత్రమే –నాకు కలిగింది మనశ్శాంతి ‘’.కాలం వీధుల్లో ఆత్మ చేస్తున్న అనంత ప్రయాణం ఇక్కడ చూపాడుకవి .చివరగా ‘’శతాబ్దాలక్రిందట తెలిసిన దాని కంటే –ఎక్కువ ఏం తెలిసింది నాకు?’’అంటాడు .మన అనుభూతికవి తిలక్ కూడా ఇలానే రాశాడు .అనేక చారిత్రిక అంశాలు కవితలలో మెలి తిప్పేస్తాడు దాస్ .ఈజిప్ట్ దేశాల పురాతన నాగరకత పై కవి ప్రత్యెక మోజు ఉన్నట్లు కనిపిస్తుంది. పతంజలి ,ఆమ్రపాలి ,నాగార్జున, శ్రావస్తి కంఫ్యూషియస్,అత్తిలి వంటిచారిత్రక పాత్రల ,ప్రదేశాల పేర్లు ఆయనకవిత్వంలో చాలాసార్లు ప్రత్యక్షమౌతాయి .’’మకరమాసం చివరి రోజు ‘’కవితలో కాలప్రవాహ చారిత్రిక చైతన్యాన్ని పరిగెత్తే పక్షితో పోలుస్తాడు .ఎడిత్ సిట్ వెల్ కవితలలో ఉన్నట్లే దాస్ కవితలలో జంతు ప్రపంచమూ దర్శన మిస్తుంది –‘’పుండుమీద నెత్తురూ చీమూ బాగా తాగేసి –తళత్తళల రెక్క లాడిస్తూ ఈగ ఎండలో ఎగురుతోంది ‘’అని వర్ణిస్తాడు .అసహ్యంగా కనిపించేదాన్ని అర్ధవంతంగా భాసి౦ప జేస్తాడు .ఆయనకవిత బుద్ధి సూక్ష్మతను కూడా నిద్ర లేపుతుంది .వీరసావర్కార్ ,నారీమన్ వంటి మహాపురుషులు అత్తిలి వంటి పాత్రలతో కలిసి నడుస్తారు .ఆయనది పలాయన వాదం మాత్రం కాదు –‘ఎక్కడో ఉషస్సు మనకోసం వేచి ఉంది ‘’అని ఆశకలిగిస్తాడు.చరిత్ర కొట్టిన కొరడా దెబ్బలకు తట్టుకోలేక ఆత్మఎక్కడి నుంచి వచ్చిందో ,అక్కడికి అంటే మృత్యు గహ్వరం లోకి ,అంధకార గర్భం లోకి వెళ్ళిపోవాలనే ఆకాంక్ష కనిపిస్తుంది .’’బల్లెపు పోట్లకు బలియిన వరాహం లా-భూదేవి వెర్రికేకలు వేస్తోంది ‘’అన్నాడు .’’ఏనాటికీ మెలకువరాని –ఈఅనంత నిద్రా దీర్ఘ సముద్రం లోకి వెళ్ళ దలుచుకున్న నన్ను –ఎందుకులేపుతారు ?ఎందుకు పిలుస్తారు ?’’అంటాడు .’’యుగయుగాలుగా మనిషి తన శవాన్ని తానె మోస్తున్నాడు-రక్తదాహం దాహం తీర్చుకొన్న మానవాత్మ –దుర్వాసనతో దూరంగా ఉన్న ఆకాశాన్ని చూస్తోంది-రక్షించమని నక్షత్రాలను అర్ధిస్తోంది-ప్రేమకోసం పరితపిస్తోంది –విజ్ఞాన రోచిస్సులను పిలిచి నెత్తురు మచ్చ తుడిచేయమ౦టో౦ది -అసలు అడిగేవాడా ఆత్మ అనేది లేకపోతె “”?అని ప్రశ్నించాడు .
భాషలోని పలుకుబడితో రవీంద్రుని కంటే , భిన్నమైన పలుకుబడిసాధించినా శబ్దార్ధ సామ్యభావనలో టాగూర్ కు చాలా దగ్గరగా వచ్చాడు దాస్ అనిపిస్తాడు .ఆయన్ను ‘’ ఏకాంతకవి ‘’మహాకవి ,యుగకవి ,అన్నారుకానీ ఏ ఇజానికీ చెందిన వాడుగా ముద్ర పడలేదు ..’’ఈ ప్రపంచభీకరారవ౦ ద్వారా వచ్చిన –నాశనం లేని అనాది నాద శక్తి –వెలుగుకు లొంగి ,ఆన౦దానికి పొంగి మూగ పోయిన దానిలా –అనంత కరుణా సముద్రం మీద అలలలతో గుసగుసలాడుతోంది ‘’అని ముగిస్తాడు కవితను .సంప్రదాయంలో మునిగి తేలుతూ ,తామరాకుపై నీటి బిందువుగా తప్పించుకొనే నేర్పరి కవి జీవనానంద దాస్ . హృదయస్పర్శి.భావనా తీవ్రత తో ,కవితా భాగీరధీ పావిత్ర్యాన్ని వివిధ కోణాలలో దర్శించి ,ప్రదర్శించటం ఏ కవికైనా అసాధ్యం కానీ దాన్ని సుసాధ్యం చేశాడు దాస్ .సమకాలీన బెంగాలీ కవులలో ఇంతటి ప్రతిభా వ్యుత్పత్తులను చూపిన కవి లేడు.’’దటీజ్ ‘’జీవనా నంద దాస్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-9-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మ వైవర్త పురాణం.7వ భాగం.7.9.22

బ్రహ్మ వైవర్త పురాణం.7వ భాగం.7.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ గాడి చర్ల హరి సర్వో త్తమరావుగారి జీవితం.16వ భాగం.6.9.22

శ్రీ గాడి చర్ల హరి సర్వో త్తమరావుగారి జీవితం.16వ భాగం.6.9.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment