వీక్షకులు
- 1,134,435 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.11 వ భాగం .12.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.170 వ భాగం.12.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.
- మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.
- నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,909)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
మనకు తెలియని మహాయోగులు—
మనకు తెలియని మహాయోగులు—7
13-కడప అవదూతే౦ద్రులు -1890-1978
కర్నూలు జిల్లా త్యాగి గ్రామం లో ఎంకి ,ఈరిగాడు అనే పేద హరిజన దంపతులకు ఎనిమిదవ సంతానంగా 1890లో పుట్టిన ఈరన్న అవదూతగా ఎదిగాడు.త్యాగి స్వామివద్ద ఉపదేశం పొంది ,యాగంటి గుహలో తపస్సు చేసి పరిణామం చెందాడు .ఎన్నో మహిమలు చూపాడు .రాబోయే అరిస్టాలనువింత విపరీత చేష్టలతో చూపించేవాడు .1978ఏప్రిల్ 10న 87వ ఏట కాళయుక్తి చైత్ర శుద్ధ తదియ సోమవారం ఉదయం 11.23గంటలకు కడప ఆస్పత్రిలో అవతారం చాలించారు అవధూత .దీన్ సాహెబ్ హోటల్ వంటగది యే ఆయన సమాధి స్థలంగా ఉండేది .దానిపై మందిరం నిర్మించారు .
14-చివటం అచ్చమ్మ అవధూత -1911-1981
పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి గ్రామంలో కాపుకులానికి చెందిన మా యిష్టి భద్రయ్య కుమార్తె గా అచ్చమ్మ 1910లో జన్మించింది .బాల్యం నుంచే దైవభక్తి తో ఉండేది .భర్త గరగఅంజయ్య జూదం ఆడుతూ భార్యను హింసించేవాడు .భరించలేక అత్తగారికి చెప్పి బంధాలన్నీ తెంచుకొని చిన్నాయగూడెం లో ఒక భక్తుని ఇంట్లో భజనలు చేస్తూ గడిపి మళ్ళీ రేలంగి వెళ్లి ,చివరికి చివటం వచ్చినా ఆమె తోటలు స్మశానాలలోనే ఉండేది .కొద్దికాలం రాజమండ్రి స్త్రీల మఠంలో ఉండి సాధన చేసి ,మళ్ళీ చివటం వెళ్లి ఏకాంత ప్రదేశం లో ధ్యానం లో గడిపేది .సాదూరాం బావాజీ ని గురువుగాఎంచుకొని ,దిగంబరియై అవధూతగా మారింది .
రేలంగి ప్రజలు ఆమెను సిద్దురాలుగా భావించి గౌరవించారు .అవధూత పిచ్చమ్మ 12ఏళ్ళు మౌనవ్రతం పాటించింది .జ్ఞానులలో జ్ఞానిగా భక్తులలో పరమ భక్తురాలిగా ఉంటూ మహిమలు చూపేది .ఆమెను ఆశ్రయిచినవారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగేవి .1981జూన్ 8 న 70వ ఏట రాత్రి 12.52గంటలకు కపాలం చేదించుకొని అవధూత పిచ్చమ్మ శరీరంచాలించారు .మర్నాడు జ్యేష్ట శుద్ధ నవమినాడు మహాసమాధి జరిగింది .సమాధిపై మందిరం నిర్మించారు సమాధినుంచే భక్తులను అనుగ్రహిస్తారనే నమ్మకం బాగా ఉన్నది .
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -2-9-20-ఉయ్యూరు
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -2
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -2
మరియానాకు టిం తన కథ ఇలా చెప్పాడు-‘’మా నాన్న సముద్ర కెప్టెన్,ఆయనకు చిన్న స్వంత కార్గోబోట్ఉంది .సియాటిల్ నున్చి కెనడాలోని వాన్కోవర్ దాకా దానిలో తిరిగేవాడు .నన్నుకూడా మా అమ్మకూ నాకూ ఇష్టం లేకపోయినా సైలర్ గానే పెంచాడు .మా అమ్మ స్వీడిష్, మానాన్న బ్రిటిష్ .కనుక నాకు రెండుభాషలూ వచ్చాయి .20వశతాబ్ది మధ్యలో వారిద్దరికీ సముద్రయానంలో పరిచయమైంది .ఒకసారి షిప్ రెక్ లోనేను మాత్రమె బతికా. మా సోదరులు అక్క చనిపోయారు .అప్పటినుంచి సముద్రం అంటే భయం పట్టుకొని మా అమ్మ నన్ను సముద్రానికి వెళ్ళనివ్వలేదు. కాని మానాన్న లెక్కపెట్టకుండా సైలర్ ను చేశాడు .ఒకసారి విపరీతమైన తుఫాను వచ్చి సముద్ర౦ అలలు పెద్ద ఇంటి అంతఎత్తుకు ఎగసిపడ్డాయి .ఇలాంటివి మా బోటు చాలాచూసింది కాని ఇది అగ్నిపర్వతం లా ఉంది .తీరం దగ్గరకు దాదాపువచ్చాం .అది చిన్నచిన్న రాళ్లమయం గా చేర టానికి వీలు లేకుండా ఉంది .తీరానికి అతి దగ్గరలో లంగరు వేయాలని నాన్న ప్రయత్నం .మాది బరువైన టింబర్ బోట్.సుడిగుండం లో చిక్కుకున్నది .అది మా షిప్ ను అమాంతం లేపి ఒక కొ౦డఅంచుకేసి కొట్టింది .మా నాన్న తీవ్రంగా గాయపడి కన్నీరు పెడుతూ ‘’ఈ గండం గడిస్తే ,మళ్ళీ నిన్ను సముద్రం లోకి తీసుకు వెళ్ళను.ఐ లవ్ యు మై బాయ్ ‘’అని చివరిమాటలు పలికాడు .షిప్ ముక్కలైంది .నాన్నతోపాటు మాతో ఉన్న నలుగురూ నీటిలో మునిగి అదృశ్యమయ్యారు .
అకస్మాత్తుగా ఒక చిన్నబోటులో ఒకతను వచ్చి నన్నుతీసుకు వెడుతున్నాడు .చావు తీసుకొని పోతోందా ?బోటు అడుగున పడుకున్నాను. లేద్దామనే ప్రయత్నం చేస్తూ పడిపోతున్నాను .అందమైన ముఖం ఒకటి చిరునవ్వుతో నా పై వాలింది .మొదట్లో ఆడో మగో తెలీలేదు .తర్వాత మగాడని తెలిసింది .ఆబోటుఒక పెయింటింగులు ఉన్న నూతి సొరంగం ద్వారా వెళ్ళింది .యితడు ,ఇంకో నల్లజుట్టు అయన నన్నుఎత్తుకొని ఒడ్డుకు చేర్చారు .’నేనెక్కడున్నాను ?మా నాన్న ఏడీ మా క్రూ ఏమైంది ?అని అరిచాను. ‘’మీనాన్నను మీ క్రూను,నీకార్గో ను కాపాడలేకపోయాం .నిన్నుఒక దుంగ మోసుకొచ్చి మాదగ్గరకు చేర్చింది.అదే నిన్ను రక్షించింది .తుఫానువలన పగిలే షిప్ లను రక్షించే వాళ్ళం మేము .నువ్వు ఇప్పుడు భూమికి లోపల ఉన్నావు. మాతో రా’’అని మంచి ఇంగ్లీష్ లో మాట్లాడాడు .’’నా పేరు మన్నుల్ జర్పా .నీకు విశ్రాంతికోసం మా లోకం లోకి తీసుకు వెడుతున్నాం ‘’అన్నాడు .
నా యవ్వనం లో ఒక ముసలి నావికుడు ఎన్నోకథలు చెబుతూ ,భూగర్భం లో అనేకలోకాలున్నాయని చెబితే ఆశ్చర్యమేసి చూస్తె బాగుండు ననిపించింది .అది నావికుల కట్టుకథలనుకొనే వాడిని .ఒకసారి గట్టిగా గిల్లుకొని నొప్పి అనిపించాక కల కాదు నిజమే చూస్తున్నాను ఇప్పుడు అనుకొన్నాను .’’మా సియాటిల్ ఎప్పుడు తిరిగి వెళ్ళాలి ?’’అని అడిగా .’’దానికి సమయం పడుతుంది .మరొకరు తీసుకు వెడతారు .చుట్టూ చూడు .నువ్వు గట్టినేలమీదే నడుస్తున్నావు ‘’అన్నాడు .టన్నెల్ లోనుంచి బయటికి వచ్చాక వింత కాంతి సమ్మరి లాండ్ స్కేప్ కనిపించాయి .సియాటిల్ ను నవంబర్ చీకటి రాత్రి వేళగాలి,చినుకులు పడుతుండగా ,నేలమీద ఆకులు పడుతూ ,ఆకాశం బూడిద రంగులో ఉ౦డగా వదిలాను .కాని ఇప్పుడు ఇక్కడ చాలా స్వచ్చంగా ,సూర్యుని మిత్రకిరణాల స్వాగతంలా ఉంది .దారి అంతా వి౦త వింత పుష్పసోయగం .చెట్లు పొదలు అందంగా ఉన్నాయి .కెనడా అరణ్యంలో అందమైన ఉదయం లాగా ఉంది .అలాంటివి మానాన్న, మేనమామలతో తిరిగినప్పుడు చలా చూశాను .’’నువ్వు ఉండాల్సిన ఊరిలోకి చేరుతున్నాం’’అన్నాడు చిరునవ్వుతో నారక్షకుడైన అందమైన జుట్టుఆయన అన్నాడు .’’నా ప్రాణం కాపాడినందుకు ధన్యవాదాలు .నాకు కంగారుగా ఉంది భూమిలోపల భూమిపైన ఉన్నట్లే పంటపోలాలున్న పల్లెటూరిలో ఉన్నానా ?ఆశ్చర్యంగా ఉందే ‘’అన్నాను .’’మనం అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా తెలుస్తాయి .నేను చాలామందిని మునిగిపోకుండా కాపాడాను .ఆపర్వతాలలో నీ ఒక్కడి షిప్ మాత్రమె కాదు చాలా షిప్పులు మునిగాయి .అది పెద్ద నమ్మకద్రోహైన ప్రదేశం .భూమికిఅవతలున్న సముద్రం అది ‘’అన్నాడు మున్నుల్.
అలా నడుస్తుంటే దారిలో అనేక రమ్యహర్మ్యాలు అందమైన ప్రదేశాలు ,ప్రకృతి దృశ్యాలు సినిమా లాగా చాలా పెర్ఫెక్ట్ గా కనిపించాయి .మార్కెట్ దాని చుట్టూ ఇళ్ళు,మధ్యలో బావి ఉన్న ఒక ఇంట్లోకి ప్రవేశించాం .ఒకహాలు దానికి అనుబంధంగా పైకప్పు ,ఒక అర్ధచంద్రాకార గది మంచి ఫ్లోరింగ్ గాలికి వెలుతురుకు కిటికీలు ఉన్నాయి ఆ ఇంటిలో .ఇంటిలోని ఫర్నిచర్ అదునాతన౦గా,సౌకర్యంగా ఉంది .అందంగా డిజైన్ చేయబడిన కుర్చీలు టేబుళ్లు భూమిపై ఉండేవాటికంటే భిన్నంగా ఉన్నాయి .అన్నీ కాంతితో మెరుస్తు,అన్నీ సజీవంగా ఉన్నట్లనిపించాయి .టాప్ లేదు ఓపెన్ గా ఉంది .సూర్యకా౦తి చెట్లమీద ఆకులమీడా మీదా పడి లోనికి వస్తోంది .ఒక కిటికీదగ్గర నన్ను కూర్చోమని సౌ౦జ్ఞ చేస్తే సోఫాలో అక్కడ కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నా .నా ముందు ఒకకప్పులో ద్రవం ఏదో పెట్టి తాను మళ్ళీ వస్తానని వచ్చేలోపు తాగేయ్యమని చెప్పి అదృశ్యమయ్యాడు .అది పేల్ వైన్ లా తేనే రుచిలో చాలామదురంగా ఉంది .అది తాగితే మత్తు లో పడిపోతానేమో అని భయం వేసినా ,మొత్తం తాగేశాను .తాగాక అంతా స్పష్టంగా గోచరించింది .
మాన్యుల్ ఇంకెవరినో ఆరున్నర అడుగుల మనిషిని వెంట బెట్టుకొని వచ్చాడు .మంచి జుట్టు ,అందమైనముఖం తో ఉన్న యువకుడు ఆతను .అతడు కాలాతీతమైన వయస్సున్నవాడుగా నాకు అనిపించాడు .నేను గౌరవంగా లేచి నిలబడగా అతడు నవ్వుతూ నన్ను హత్తుకొని ‘’అద్భుత మైన ఈ క్రిందిలోకానికి స్వాగతం .నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో నాకు తెలుసు .ఇప్పుడు నీకు నువ్వు ఎక్కడున్నావో చెబుతాను ‘’అన్నాడు .’’మీరు వైజ్ మాస్టారా !భూమిలోపల ఇలాంటి వారు౦టారని విన్నాను ‘’అన్నాను .అతడు హృదయపూర్వకంగా నవ్వాడు .అతడు ‘’విజ్డం అన్ని చోట్లా ఉంటుంది .తనను తాను మేధావి అనుకొనే వాడు స్టుపిడ్..మూర్ఖత్వం జ్ఞానాన్ని తప్పుదారి పట్టిస్తు౦ది మిత్రమా .నీకు జ్ఞానం కావాలంటే అంతటినీ పరిశీలనగాజాగ్రత్తగా చూడాలి .ప్రకృతి జ్ఞాన భండాగారం .ఐతే భూమిపై ఉన్నజనం దాన్ని సర్వ నాశనంచేస్తున్నారు .’’సరే ఇంతకీ మీరెవరు ?’’అన్నాను ఆపుకోలేక ‘’.నా పేరు డేరియల్.ఇంతకంటే నా గురించి తెలుసుకోవాల్సింది లేదు .ఇక్కడి తొమ్మిదిమంది కమిటీ సభ్యులలో నేనొకడిని .నీకు స్వాగతం .ఇక్కడ కొన్ని రోజులు మా గౌరవ అతిధిగా ఉండి,అన్నీ సాకల్యంగా తెలుసుకోమని కోరుతున్నాను ‘’,అన్నాడు .నేను మళ్ళీ వంగి నమస్కరించి అంగీకారం తెలిపాను .’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-9-20-ఉయ్యూరు
బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్స ఆహ్వానం
బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్స ఆహ్వానం
-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-20 శనివారం సాయంత్రం 6-30 గంటలకు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి వార్ల దేవాలయం లో సరసభారతి 154 వ కార్యక్రమంగా, నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ఆత్మీయ అతిధులు – శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట రామ కృష్ణ గారు ,శ్రీ కోట సీతారామాంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )
కార్యక్రమ వివరం
స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణశాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం ,పుష్ప సమర్పణ
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు
1-శ్రీ వేమూరు సదాశివరావు –గణిత ఉపాధ్యాయులు –విశ్వశాంతి స్కూల్ –ఉయ్యూరు
2-శ్రీ ఆదిరాజు హనుమంతరావు –ప్రిన్సిపాల్ ,ఫ్లోరా స్కూల్ –ఉయ్యూరు
3-శ్రీమతి ఆదిరాజు కనకదుర్గ –ప్రిన్సిపాల్ ,శ్రీ భారతీ విద్యానిలయం –ఉయ్యూరు
ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం
–2020 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన పేద ,ప్రతిభగల విద్యార్ధినీ విద్యార్ధులకు
1- స్థానిక జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థిని-కుమారి . కె శ్రీకన్య –కు 2,000 రూపాయలు,2-విద్యార్ధి చి.చొప్పరపు నాగ ఫణికుమార్ కు – 2,000 రూపాయలు
2-..అమరవాణి పాఠశాల 1- విద్యార్ధి –ఛి.జిత్తు నిఖిల్ బాబు కు – 2,000 రూపాయలు 2-విద్యార్ధిని –కుమారి .బుద్ద జయలక్ష్మి కు 2,000 రూపాయలు
3–వి.ఆర్ .కె.ఎం విద్యార్ధిని –కుమారి వై .మాధవి కు -2,000 రూపాయలు
4-పబ్లిక్ స్కూల్ విద్యార్ధిని- కుమారి పామర్తి జ్ఞాన శరణ్య కు -2,000 రూపాయలు
.
.-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు శ్రీమతి సీతమ్మ దంపతుల పేరిట ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధిని ,విద్యార్ధికి ఒక్కొక్కరికి 10,,000 గా ఏర్పాటు చేసిన స్మారక ప్రోత్సాహక నగదు పురస్కారప్రదానం – ఈ సంవత్సరం బాలుడు ఎవరూ లేనందున ఇద్దరు బాలికలకు అందజేయబడినది .
5–2020 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో స్థానిక నారాయణ స్కూల్ లో ఉత్తీర్ణత సాధించి అక్కడి జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న -కుమారి-మద్దాలి అలేఖ్యకు -10 వేలరూపాయలు
6- స్థానిక ఫ్లోరా స్కూల్ లో ఉత్తీర్ణత సాధించి ఏ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారి-గండూరి ఉమాశైలజ కు -10 వేలరూపాయలు-
శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .
7-సరసభారతి ప్రత్యేక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం
విజయవాడ శారదా కాలేజి హైస్కూల్ లో పదవతరగతి ఉత్తీర్ణత సాధించి ,శారదా కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పేద ,ప్రతిభగల విద్యార్ధిని –కుమారి గరిమెళ్ళ షణ్ముఖలలితా శ్రీ బాల కు – 5వేలరూపాయలు అంద జేయబడుతుంది .
సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
–
ఆహ్వాని౦చు వారు
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివలక్ష్మి గబ్బిటవెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్- సరసభారతి అధ్యక్షులు
గౌరవాధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి సరసభారతి అధ్యక్షులు
ఉయ్యూరు -2-9-20- ఉయ్యూరు
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు భూగర్భ లోక జీవులు రక్షించిన విధం
అగర్తా అనే భూగర్భలోక విశేషాలు
1-భూగర్భ లోక జీవులు రక్షించిన విధం
‘’అనంతత్వంలోకి పారిపోయానా ,లేక అనంతత్వం నుంచా ?’’ఈ ఆలోచనతో ఒక్కసారి గా మేలుకొన్నాను .నేను నిద్రిస్తున్నానో మేల్కొన్నానో స్పస్టంగా చెప్పలేను .కొన్నిసార్లు కలకు నిజానికి తేడా తెలియదు నిద్రలోనూ వాస్తవాన్ని చూస్తాం .అస్పష్ట వస్తువులు స్పష్టంగా స్పష్టంగా ఉన్నవి అస్పష్టంగా కనిపిస్తాయి .నాకు మాత్రం అది వింత ప్రయాణమే .కానీ నా విషయ౦ లో అదే నిజం అయింది.నా కథ మీకు అనుమానం కలిగించవచ్చు .నిరూపించేదాకా అలానే ఉంటుంది .ఐతే నాదగ్గర రుజువు లేదు .
పొడవైన అందమైనజుట్టు నీలి కళ్ళతో ఒక అందగాడు మామూలు కవళికలతో,తీర్చి దిద్దినట్లున్న మూతితో నేను ధ్యానంలో ఉండగా కనిపించాడు .అతడు నాతొ మాట్లాడాడు .నా మెదడులో అతడుమట్లాడిన ప్రతిమాటా వినిపించింది .నాకు అమితాశ్చర్యం కలిగింది .’’ఓ మరియానా !నా పేరు తిమోతి.అందరూ టిం అంటారు .నా ఇంటిపేరు బ్రూక్ .అసలు నేను అమెరికాలో సియాటిల్ వాడిని .ప్రస్తుతం నేను వలసపోయి భూగర్భలోకం లో ఉన్నాను .నీను మొదట్లో నమ్మకం కలగకపోవచ్చు .కాని నిన్ను నమ్మి౦చగలనననే నమ్మకం నాకుంది .ఇదే నా మిషన్ –ప్రయత్నం .మా లాంటి వారున్నారని భూమిపైనున్న వారికి తెలుసుకొనే సమయం వచ్చింది .ఇప్పుడు నా కథ నీకు తెలియజేస్తాను .
ఆధారం – మేరియానా సెజెర్నా రాసిన ఇంగ్లీష్ పుస్తకం – AGARTHA – THE EARTH’S INNER WORLD
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-9-20-ఉయ్యూరు
మనకు తెలియని మహాయోగులు—6 11-చిప్పగిరి భంభం స్వామి -1833-1911
మనకు తెలియని మహాయోగులు—6
11-చిప్పగిరి భంభం స్వామి -1833-1911
హిందూ సన్యాసి వేషం లో కనిపించే ముస్లిం యోగి ‘’సయ్యద్ సుల్తాన్ మొహియుద్దీన్ ఖాదిరీ ‘’నే ‘’భంభం’’ స్వామి అంటారు . ఆయన వంశీకులు చాలాకాలంగా కర్నూలుజిల్లా ఆలూరు తాలూకా చిప్పగిరి లో ఉంటున్నారు .ఈయన చాలాప్రదేశాలు తిరిగి ఎన్నో మహిమలు ప్రదర్శించాడు .దేవుడు ఒక్కడే అన్నాడు .’’శరీరం అనే మసీదులో ఆవాజ్ అంటే ధ్వని లేకుండా నమాజు అంటే ప్రార్ధన చేయటం శ్రేష్టం ‘’అని బోధించాడు .తన అవతార సమాప్తి గ్రహిచి ఆలూరులో ఉన్న శిష్యుడు భం షేక్అబ్దుల్ దాసు దగ్గరకు వెళ్లి సందేశం ఇచ్చి,అక్కడే యోగనిద్రలో తన వంశ మూలపురుషుడు సత్తార్ హాని మహాత్ముడు,దర్శనమిచ్చి ఆదేశించగా ,మళ్ళీ చిప్పగిరి చేరి 11-10-1911 న 78 వ ఏట బుధవారం సజీవ సమాధి అయ్యాడు .
12- కుంభక యోగి -సచ్చిదానంద పరమహంస -1865-1957
తమిళనాడుకంచి దగ్గర తిరుప్పనం కాడ గ్రామంలో సోమసుందరం ,విశాలాక్షీ అనే శివభక్త దంపతులకు 16-2-1865 రక్తాక్షి సంవత్సర మాఘబహళ పంచమి ఉత్తరానక్షత్ర సింహలగ్నం లో ఏకా౦బరేశ్వరస్వామి వరప్రసాదంగా కుప్పుస్వామి జన్మించాడు .లోయర్ ఫోర్త్ ఫారం చదువుమానేసి 12వ ఏట కంచిలోని వివిధదేవాలయాల్ను సందర్శించి అర్చామూర్తులను పూజించాడు .ఇంటివద్ద శుచిగా పీటపై జింక చర్మం వేసి దానిపై తెల్లని బట్ట పరచి దానిపై కూర్చుని ,చిన్ముద్రతో ,భ్రుకుటి మధ్య చూపు నిల్పి ,,షోడషోప చారాలతో మానసిక పూజ త్రికరణ శుద్ధిగా చేసి ఏకా౦బరేశ్వరునికి అంకితమిచ్చాడు
13వ ఏట 46వ రోజున ఏకాంబరేశ్వరుడు నిత్యానందుడు అనే ముసలి బ్రాహ్మణ వేషం లో వచ్చిరేచక పూరక కు౦భకాలు నేర్పి ,సాధన చేయమని మానసిక పూజ చాలించమని చెప్పి కుప్పుస్వామికి ‘’పరమహంస సచ్చిదానంద యోగి ‘’జ్ఞాననామం ప్రసాదించాడు .17వ ఏట పెరు౦దేవితో వివాహమైంది .సంసారంచేస్తూ రాజయోగిగా ఉన్నాడు సచ్చిదానంద .ఇంట్లోనే ఒక చిన్న గుహ నిర్మించుకొని నెలల కొలదీ ధ్యాన నిష్టలో గడిపాడు .సంతానం లేదన్న దిగులుతో బార్య చనిపోయింది .
సత్యానంద సర్వం త్యజించి మద్రాస్ దగ్గర విద్యానర్సరి తోటలో కొన్ని నెలలు గడిపి ఆంధ్రప్రదేశ్ కడపకు చేరాడు .అక్కడే ‘’జీవబ్రహ్మైక్యవేదాంత రహస్యం ‘’ముందు తమిళం ,తర్వవాత తెలుగు లో రాసి ప్రచురించాడు .తపస్సుకు ధ్యానానికి గడికోట ను ఎంచుకొని ,మద్రాస్ దగ్గర పన్ చెట్టలో మఠం నిర్మించారు .ఆంద్ర తమిళ రాష్ట్రాలలోనేకాక ఆఫ్రికా శ్రీలంక సింగపూర్ బర్మా ,మలేషియాలలో కూడా తన యోగశాక్తులు ప్రదర్శించి ,యోగ కేంద్రాలు ఏర్పరచి వేలాది శిష్యులను తయారు చేశారు .చివరకు బెంగుళూరు కె౦పాపురం అగ్రహారం లో 9-1-1957సాయంత్రం 92వయేటపరమహంస జీవ సమాధి చెందారు .హంస పరమహంసలో ఐక్యమైంది. ప్రతియేటా జనవరి 9ఆరాధనోత్సవం, ఫిబ్రవరి 16జయంతి ఉత్సవం ఘనం గా నిర్వహిస్తారు .మఠంలో మూడుపూటలాపూజ జరుగుతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-9-20-ఉయ్యూరు
మనకు తెలియని మహాయోగులు—5
మనకు తెలియని మహాయోగులు—5
9-దాస సాహిత్య మార్గదర్శి మహాయోగి –చిరుమామిళ్ళ సుబ్బదాసు -1802-1882
చిరుమామిళ్ళ సుబ్బదాసు అన౦తపురం జిల్లా ధర్మవరం లో చిరు మామిళ్ళనరసయ్య ,తిరుమలమ్మ అనే సదాచార కమ్మదంపతులకు 1802లో పుట్టాడు .అసలు పేరు సుబ్రహ్మణ్యం .వాడుకనామం సుబ్బయ్య .వీధిబడిలో చదువుతూ 8వ ఏట నే కృష్ణ, దాశరథి ,నరసింహ శతక పద్యాలు భాగవత పద్యాలు నేర్చేసుకొని అర్ధరాత్రి దీపం ముందుకూర్చుని నిశ్చల ధ్యాన సమాధి మగ్నుడై ,భక్తిజ్ఞాన వైరాగ్యపద్యాలు కీర్తనలు రాస్తూ పాడేవాడు .10వ ఏట రెండు మూడురోజులు సమాధి లో ఉండిపోయేవాడు .అప్పుడే 108 కందపద్యాల ‘’కేశవ మకుట శతకం ‘’రాసి అందర్నీ ఆశ్చర్యపరిచి వేణుగోపాలస్వామి భక్తుడుగా ప్రసిద్ధి చెందాడు .
ఒక సాధువుకనిపించి నాలుకపై బీజాక్షరాలురాయాగా ఆయన సూచనమేరకు ఒకరోజు రాత్రి సద్గురువు అన్వేషణకు బయల్దేరాడు .ఆకాశం లో ఒక కాంతి పుంజం కనిపించగా ,దాన్ని చూస్తూ నడిచి దుర్గి గ్రామం చేరాడు.ఆ గ్రామం లోనే కాంతి పుంజం వేణుగోపాలస్వామి గుడిపై ఆకాశం లో నక్షత్రంగా మారిపోయింది .గర్భాలయం చేరగా స్వామి కన్నులనుండి కారుణ్య తరంగాలు బయల్దేరి వచ్ఛి సుబ్బదాసు లో ప్రవేశించగా ,ఆశువుగా తనకే ఆశ్చర్యం కలిగేట్లు పద్యాలు వచ్చాయి . దుర్గిలోని పండిత కవి ,త్రికాలజ్ఞుడు జ్ఞానపూర్ణుడు ,దైవ సాక్షాత్కారం పొందిన తాతాచార్యుల వారు సుబ్బయ్యను వివాహం చేసుకోమని నచ్చ చెప్పగా 20వ ఏట 10ఏళ్ళ మేనమామ కూతురు వేణమ్మ ను పెళ్ళాడి ,16రోజులపండుగాతర్వాత తాతాచార్యుల ఆశ్రమం లో చేరి ,పంచకావ్యాలు ,భారత భాగవతాలు ,ప్రస్థాన త్రయం ,వేదాంత యోగశాస్త్రాలు వాటిలోని మర్మాలు సాకల్యంగా గ్రహించాడు .ఆచార్యులు అనుగ్రహించి సుబ్బదాసు దీక్షానామం తో దీక్ష ఇచ్చారు .
తర్వాత అయిదేళ్ళు దీక్షగా తీవ్ర సాధన చేసిన సుబ్బదాసు కు గొప్ప ఆధ్యాత్మిక శక్తులు అలవడినాయి .తాను రచించిన రచన రచనా సర్వస్వాన్ని శిష్యులకు అప్పగించి జాగ్రత్తగా ఆతాటాకు గ్రంథాలను కాపాడమని చెప్పారు .12-1-1882 వృషనామ సంవత్సర పుష్యబహుళ అష్టమి గురువారం ఉదయం యోగసమాధి లో కపాల చేదనం చేసుకొని 80వయేట సుబ్బదాసు వేణుగోపాలస్వామిలో ఐక్యమయ్యారు .చిన్నతనంలో ఆయన నాలుకపై బీజాక్షరాలు రాసిన చోటనే సుబ్బదాసు సమాధి స్థితుడయ్యారు.ధర్మవరం లోని ఆయన సమాధి పవిత్ర యాత్రాస్థలమైంది .ప్రతియేటా పుష్యబహుళ అష్టమినాడు ఆరాధనోత్సవం, నవమినాడు ప్రభలతో స్వామి ఊరేగింపు చేసి గురుపూజోత్సవం నిర్వహిస్తారు .దాస సాహిత్యం లో సుబ్బదాసు రాసిన శతకాలు, అష్టకాలు ,యక్షగానాలు నక్షత్రమాలికలు తత్వాలు కీర్తనలు పాటలు కృతులు ఆణిముత్యాలుగా వెలిగిపోతున్నాయి .
10-సిద్ధ సంకల్ప శివయోగి,అవధూత –చేళ్ళ గురికి ఎర్రి స్వాములు -1822-1922
తెలంగాణా లోపుట్టి ,మైసూరులో విద్యనేర్చి ,ఉన్నతోద్యోగం చేస్తూ ,తీవ్రవైరాగ్యం పొంది ,భార్యాపిల్లల్ని వదిలేసి ,అవదూతగా మారిన ఆరాధ్య బ్రాహ్మణుడు నంజుండయ్య ఎర్రితాత,ఎర్రిస్వామిగా పిలువబడ్డాడు .ఆయనను సేవించినవారు చెప్పినవిషయాలే తప్ప చరిత్ర తెలియదు .ఏది దొరికితే అది తిని వాడు .ఆయన తింటుంటే కాకులు, కుక్కలు మూగేవి వాటికి తినిపిస్తూ ,తానూ తినేవాడు .
ఉద్యోగం వదిలి నిద్రాహారాలుమాని ,కొబ్బరి చెట్టుపై శివయోగిగా ఉన్న ఈయనను ప్రజలు గుర్తించారు.లింగనహళ్లి లో లింగాయతుల నాగప్ప శుశ్రూష చేసి యోగ రహస్యాలు తెలుసుకొన్న నంజు౦డప్ప దొడ్డ బళ్లాపురం గగనాచారి దగ్గరకు చేరి ,దేహాభిమాన శూన్యత ,నిర్గంధిముని తత్త్వం నిరూపించి ఉపదేశం పొందాడు .నిరంజన దీక్షానామంఇచ్చి నంజు౦డ ప్పకు సన్యాసం ఇచ్చాడు గగనాచారి .
అనుకుంటే చాలు వందల మైళ్ళు వెళ్ళగలిగే సంకల్ప సిద్ధుడు అయ్యాడు నిరంజనస్వామి .చెన్నరాయకొండ చేరి గుహలో కొంతకాలం ,కల్యాణదుర్గం, ముష్టూరు,ఉరవకొండ లలో కొంతకాలం గడిపి చేళ్ళగురి చేరాడు .అక్కడ గోచీమాత్రమే ధరించి ఎండా వానలలో అంతర్ముఖుడై నిశ్చల సమాధిలో గడుపుతూ ఉన్న ఎర్రి స్వామికి భక్తులు ఆశ్రయమిచ్చారు .కొత్త ఇల్లు కట్టించి అందులో ఉంచారు .అప్పటినుంచి చేళ్ళ గురి ఎర్రి స్వాములుగా సుప్రసిద్దుడయ్యాడు .1907లో మఠనిర్మాణం మొదలుపెట్టి ఏడాదిలో పూర్తి చేశారు .1922వరకు అక్కడే ఉంటూ, మహిమలెన్నో ప్రదర్శించారు .సమకాలీన యోగులు, సిద్ధులు ఆయన్ను సందర్శించి పునీతులయ్యారు . శిష్యుడు తిక్కయ్యకట్టించిన ఆ మఠంలోనే ఎర్రి స్వామి 14ఏళ్ళు భక్తులకు జ్ఞానవైరాగ్యభక్తిమార్గాలు ఉపదేశిస్తూ గడిపారు .నూరేళ్ళు సార్ధకం గా జీవించి 30-5-1922దుందుభి సంవత్సర జ్యేష్ట శుద్ధ చవితి మంగళవారం ఉదయం శివయోగి ఎర్రిస్వాములు శివైక్యం చెందారు .శిష్యుడు తిక్కయ్య కట్టించిన సమాధిలోనే ఆయన పార్ధివ శరీరాన్ని ఉంచి సమాధి చేశారు .ప్రతియేడు జ్యేష్ట శుద్ధ షష్టి ,అమావాస్య ,శివరాత్రి రోజులలో ఆయన ఆరాధనోత్సవాలు జాతరలతో వైభవంగా జరుపుతారు .ఆయనను ఆరాధించే భక్తుల పూజా ప్రతిమలలో ,పటాలలో దర్శనమిస్తూ ,సమాధి నుంచి మాట్లాడుతూ ,స్వప్న సాక్షాత్కారం కలిగిస్తూ అనుగ్రహిస్తూనే ఉన్నారు ఎర్రి స్వాములు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-20-ఉయ్యూరు
రేపటినుంచే ”శ్రీలలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం
రేపటినుంచే ”శ్రీలలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం
సాహితీ బంధువులకు శుభకామనలు –రేపు సెప్టెంబర్ 1మంగళవారం ఉదయం 10గంటలనుంచే సరసభారతి ఫేస్ లో ‘’శ్రీ లలితా సహస్రనామస్తోత్ర వైభవం ‘’ప్రత్యక్ష ప్రసారం అవుతుంది .వీక్షించగలరు –మీ –గబ్బిట దుర్గాప్రసాద్
భూమి లోపల ఉన్న మనకుతెలియని అనంత లోకాలు ,వేలాది సంవత్సరాల వయసున్న యోగులు
భూమి లోపల ఉన్న మనకుతెలియని అనంత లోకాలు ,వేలాది సంవత్సరాల వయసున్న యోగులు
ఆధారం –మా అమ్మాయి శ్రీమతి విలయలక్ష్మి అమెరికా నుంచిపంపిన కుర్తాళం పీఠాదిపతి శ్రీ ప్రసాద రాయకులపతి వారి వీడియో –యుట్యూబ్
‘’భూమిలో ఇప్పటికీ లోకాలున్నాయని ,పట్టణాలున్నాయని అనేకమంది నమ్ముతున్నారు ఇప్పటికీ .హిమాలయ సిద్దాయోగులు భూమిగుండా వెళ్లి ఆలోకాలను దర్శిస్తారని నమ్మకం .1947ప్రాంతం లో అమెరికాయుద్ధ విమాన అధికారి అడ్మిరల్ బర్డ్ ఆర్కిటిక్ పర్వతప్రాంతం దగ్గరకు ఒక రౌండ్ తిరిగి మళ్ళీతిరిగి వచ్చేద్దామని చిన్న విమానం లో బయల్దేరి వెళ్ళాడు .ఒక చోట కాసేపు ఆగాడు .ఇంజన్ చెడిపోయింది. బాగు చేయటానికి చలాప్రయత్నించాడుకాని బాగు కాలేదు .ఆహరం లేదు అలసిపోయాడు .ఏం చేయటానికి తోచలేదు .ఇంతలో ఒకపెద్ద మంచు పెళ్ల ను పైకి లేపుకొని ఒకమనిషి బయటికి వచ్చి ‘’బర్డ్ !రా నాతొ రా ‘’అని పిలిచాడు ఆశ్చర్యపోయి చూశాడు అడ్మిరల్ బర్డ్ .సరే అని దగ్గరకు వెళ్ళాడు .ఆ మనిషి ‘’నీ విమానం చెడిపోయింది . బాగు కాలేదు చాలా ఆకలి, దాహంతో బాధ పడుతున్నావని నాకు తెలుసు నాతో రా .ఆహరం తీసుకొని కాసేపు విశ్రాంతిపొందుదువుగాని రా ‘’అని తనతో పాటు పెద్ద భూ గృహం లోకి తీసుకు వెళ్ళాడు .అక్కడినుంచి మరికొంచెం లోపలి వెడితే ,అక్కడ చాలామంది మనుషులులు కనిపించారు .అక్కడ ఆగి ‘’నువ్వు ముందు గా ఆహారం తీసుకో ‘’అన్నాడు ఆ కొత్తాయన ‘’’అసలు మీ రెవరు బాబూ ‘’?అని బ్రహ్మానందం లాగా ప్రశ్నించాడు .’’అవన్నీ తర్వాత చెబుతాను’’అని చెప్పి ఒక ఆకుపచ్చటి ద్రవం తాగటానికి ఇచ్చాడు .దాన్ని తాగాడు ఆకలి పూర్తిగా తీరిపోయింది .’’అసలు మీ రెవరు స్వామీ !భూమిలో ఇలాంటి ప్రదేశాలున్నాయని నేను వినలేదు కనలేదు ఆశ్చర్యంగా ఉంది ఎవరు మీరు ఇదేమిటి అంతా’’?అని మళ్ళీ అడిగాడు .
అప్పుడు ఆ ఆగంతకుడు బర్డ్ తో ‘’ఇది భూలోకలోకం .ఇక్కడ అనేక వందల ,వేల సంవత్సరాల వయసున్న మనుషులున్నారు . భారత దేశం లో హిమాలయ ప్రాంతం లో ‘’శంబల ‘’అనే గ్రామంలో పరమేశ్వరుడైన నారాయణ దేవుడు ఉంటాడు .ఆయన అధీనం లో మేమందరం ఉంటాం .భూమిలో అనేక ప్రదేశాలలో ఇలాంటి పట్టణాలున్నాయి .లోపల కొన్ని వేలనుంచి లక్షలమందిదాకా జనం ఉంటారు .మేమందరం భూ ప్రపంచం లో ఉన్న సకల మానవాళి సుఖ సంతోష శాంతం తో ఉండాలని ఎప్పుడూ కోరుకొంటాం .కానీ మీరేమో హైడ్రోజన్ ఆటం బాంబులు వేసి మానవుల్ని చంపేస్తున్నారు .అలాంటి మానవ హననం చేయవద్దని నీకు చెప్పటానికే ఇక్కడికి మేము నిన్ను పిలిపించాం .నువ్వు వెళ్లి మీ వాళ్లకు నచ్చ చెప్పు ‘’అన్నాడు .’’నేను చెబితే ఎవరు వింటారు ?నేనొక చిన్న అధికారిని .నా మాటకు విలువ యిస్తారనుకోను ‘’అన్నాడు బర్డ్ సౌమ్యంగా .’’కాదు .నువ్వు ఇక్కడ చూసింది,విన్నదీ పూర్తిగా వివరించి మీ వాళ్లకు మా మాటగా చెప్పు.నీ విమానం బాగైంది .నువ్వు నిక్షేపంలా నీ ప్రయాణ౦ సాగించవచ్చు వెళ్లిరా ‘’అని చెప్పి పంపించారు .
విమానం ఎక్కి ఆర్మీ అధికారులను చూడటానికి వెడితే వాళ్ళు ‘’ఏమిటి ఎక్కడున్నావ్ ఇంతాలస్యం చేశావేమిటి ‘’అని ప్రశ్నల వర్షం కురిపించారు .అప్పుడు బర్డ్ వారికి తాను చూసిన, విన్న విశేషాలన్నీ వివరించాడు .వాళ్ళు విపరీతంగా నవ్వి ‘’లైట్ తీసుకొని ‘’ట్రాష్ .ఈమాటలు ఎక్కడైనా చెబితే నువ్వు వెర్రి బాగులవాడివని తాటాకులు కడతారు. నిన్నెవ్వరూ నమ్మరు ‘’అన్నారు ఆర్మీ ఆఫీసర్ .అతడు ‘’నమ్మినా నమ్మకపోయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ విశేషాలన్నీలోకానికి వెల్లడిస్తాను ‘’అన్నాడు బర్డ్ . ‘’ఇది ఆర్మీ డిసిప్లిన్ కు చెందిన విషయం .నీకు అనుమతినివ్వం ‘’అన్నారు ఆఫీసర్లు .తనమనసులోనే ఇవన్నీ భద్రంగా దాచుకొని బర్డ్ తాను రిటైర్ అయ్యాక ఈ కథనం అంతా లోకానికి ఎలు గెత్తి చాటాడు . ఇంగ్లీష్ లో గోప్పరచయిత అయినయునేస్కేల్ తో కలిసి తన అనుభావాలన్నిటినీ రాసి ఒకపుస్తకం గా ప్రచురించాడు బర్డ్ .అది ఇంటర్నెట్ లో ‘’అగర్తా ‘’అనే పేరుతో అందరికీ లభ్యంగా ఉంది .అందులో ఫోటోలు విశేషాలు అన్నీ చాలా వివరంగా ఉన్నాయి .
పాతాళంలోకి వెళ్ళే మార్గాలున్నాయి ప్రపంచం లో చాలా చోట్ల . పాతాళం లో చాలామంది మహానుభావులున్నారు .వారు భూమిపైకి వచ్చి లోకోద్ధారణ చేస్తుంటారు .ఇలాంటి వారితో సన్నిహిత సంబంధమున్న మనుషులున్నారు భూమిపైన .రష్యాలో కూడా ఇలాంటి కాంటాక్ట్ లున్న వ్యక్తులున్నారు .ఇతర చోట్లకూడా ఉన్నారు .అమెరికాలోని కొలరాడో లో డెన్వర్ దగ్గర ఉన్న గుహలలో నుంచి ఆలోకాలకు వెళ్ళటానికి మార్గాలున్నాయి .అక్కడ జ్వాలా కూల్ అనే సిద్ధపురుషుడు న్నాడు . ఆయనకు సుమారు అయిదు వేలసంవత్సరాలవయసు ఉంటుంది .హిమాలయప్రాంతాలలో చాలాచోట్ల పాతాళం లోకి వెళ్ళే మార్గాలున్నాయి. కాశీలో,శ్రీశైలం లో కూడా ఉన్నాయి .
కొద్దికాలం క్రితం ఫ్రాన్స్ లో సోఫియా అనే అమ్మాయి కి ఒక హిందూ యోగి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు .ఆమంత్రాన్ని దీక్షగా జపం చేసింది .ఒక రోజు ఆమె మనో భూమిక అంటే మెంటల్ ప్లేన్ లో ఆమెకు ఒక మెసేజ్ వినిపించింది . .అందులో ‘’కం టు హిమాలయాస్ –హిమాలయాలకు రా ,సిద్దాశ్రమానికి రా ‘’అని వినిపిచింది.వెంటనే ఇండియాకు బయల్దేరి వచ్చి గంగోత్రి యమునోత్రి వగైరాలను ఒక గైడ్ సాయంతో సందర్శించింది .పదిరోజుల తర్వాత మళ్ళీ ఆమెకు ‘’నీతోఎవరూ రాకూడదు వచ్చినవారిని వెనక్కి పంపించు ‘’అనే మెసేజ్ వచ్చింది.తనతో ఉన్నవారిని వెనక్కి ప౦పేసి ఒక్కతే ముందుకు సాగింది . మంచు విపరీతంగా కురుస్తోంది. దారి కనపడటం లేదు .వచ్చినదోవకూడా కనిపించలేదు .బాగా అలసిపోయి ‘’నేను చాలాలసిపోయాను .నన్ను ఇక్కడికి పిలిపించిన సిద్ధయోగులు, మహానుభావులు నాకు సహాయం చేయకపోతే ఇక్కడే కుప్పకూలిపోతాను ‘’అన్నది సోఫియా .
ఇంతలో ఆవులమందలు దూడలతో మెడలో చిరుగంటల నాదం తో అక్కడికి వచ్చాయి .వాటితో సుమారు పన్నెండేళ్ళ బాలుడు మురళి చేతిలో పట్టుకొని వస్తున్నట్లు చూసింది .అతడితో ‘’నాయనా !నేను సిద్దాశ్రమానికి వెళ్ళాలి .దారి తెలియటం లేదు .నాకు సహాయంచేసి దారి చూపిచేర్పిస్తావా ?’’అని అడిగింది .ఆ గోపకుమారుడు ‘’నేను అందుకే వచ్చాను నా చెయ్యి పట్టుకొని భయం లేకుండా రా ‘’అన్నాడు .అతడి చెయ్యిపట్టుకోని నడిచింది .ఆమె కళ్ళు మూసుకుపోతున్నాయి. గాలిలో తేలిపోతున్నట్లని పించింది .ఎంతదూరం వెళ్లిందో తెలీదు .ఆకుర్రాడు ‘’ఇంక కళ్ళు తెరువు .’’అన్నాడు.కళ్ళు తెరిచి చూస్తే చిన్న దేవాలయ గోపురం కనిపించింది ‘’అది నీ ఇస్ట దేవత లలితా దేవి ఆలయం .వెళ్ళు ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు .
సోఫియా నెమ్మదిగా ఆ దేవాలయంలోకి వెళ్ళింది .అక్కడ ఆరు అడుగుల ఎత్తున స్పటిక మేరువు అంటే అమ్మవారి విగ్రహాలు పెట్టే పీఠం నుంచి శక్తి తరంగాలు రావటం గమని౦చింది .కళ్ళుమూసుకొని ధ్యానం చేసింది .ఇంతలో ఎవరో వచ్చి ‘’అమ్మా !ఒక సమావేశం జరుగుతోంది ‘’అని చెప్పి తీసుకు వెళ్ళాడు .అక్కడ ఒక వేదికపై ఒక యోగి కూర్చుని యోగ శాస్త్ర రహస్యాలు బోధిస్తున్నాడు .కాసేపటికి సమావేశం పూర్తయింది .ఆమెను తన కుటీరానికి తీసుకు వెళ్ళాడు .అతడిని ఆమె ‘’యోగ శాస్త్ర రహస్యాలు చెప్పిన ఆయోగి ఎవరు .పాతిక ఏళ్ళు దాటి వయసు ఉన్నట్లు కనిపించదు ‘’అని అడిగింది .అప్పుడతడు ‘’అమ్మా ఆయనవయసు 112సంవత్సరాలు .ఆయనకు ముసలితనం రాదు .ఎప్పుడూ ఇలాగే కనిపిస్తాడు. ఎక్కడివాడో ఎవరికీ తెలియదు .ఆయన్ను జనకమహారాజు అని పిలుస్తాం . .ఆయన కుర్తాలం నుంచి వచ్చాడు. అదెక్కడో మాకు తెలీదు .’’అన్నాడు .మూడు రోజుల ఆతర్వాత ఆమెను పంపిస్తూ ‘’అమ్మా ఇక్కడ వందల వేల సంవత్సరాలవయసున్నయోగులు ఎందరో సిద్ధాశ్రమం లో ఉన్నారు .మళ్ళీ నీకు సమాచారం-మెసేజ్ వచ్చినప్పుడు ఇక్కడికి రా ‘’అని వీడ్కోలు పలికాడు .
సోఫియా తనదేశం వెళ్లి ఈ అనుభవాలన్నీ ఒక గ్రంథంగా రాసిప్రచురించింది .నేను (కులపతిగారు )అమెరికాలోని బోస్టన్ లో ఉన్నప్పుడు ఒకతను నాదగ్గరకొచ్చి ‘’కుర్తాలం ఎక్కడుంది ?’’అని అడిగితే నేను ‘’నీకెందుకు ?’’అన్నాను .దానికతడు ‘’నేనొక పుస్తకం లో కుర్తాలం స్వామి హిమాలయాలలో ఉండగా తానూ చూసినట్లు రచయిత్రి రాసింది .దాన్ని నేను ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాను .కనుక కుర్తాలం విషయాలు పూర్తిగా తెలుసుకోవటానికి మీ దగ్గరకొచ్చాను ‘’అన్నాడు .అప్పుడునేను ‘1879లో ఆయన కుర్తాలం అనే చిన్న గ్రామం లో ఒక జమీందారుకు పుట్టాడు .అతడిజాతకం వేసిన పురోహితుడు అకుర్రాడు సన్యాసి అవుతాడు అని చెప్పాడు.ఆజమీ౦దారు ‘’మాకు సన్యాసి ఎందుకు? .మాకు వేలఎకరాల భూమి .అంతులేని సంపద ,ధనం ఉన్నాయి వాటిని చూసుకోనేవాడుకావాలికానీ’’ అన్నాడు .’’నేను జాతకం లో ఉన్నది చెప్పా అంతకంటే నాకు తెలీదు ‘’అన్నాడు పురోహితుడు . ఆబాలుడు క్రమ౦గా పెరిగి స్కూలు కాలేజీ చదువులు పూర్తి చేసి ఒకసారి అరవిందాశ్రమం వెళ్ళాడు .అక్కడి మదర్ బాగా ఆదరించి’’,చదువుమానేసి హిమాలయాలకు వెళ్ళిపో ‘’ అని హితవు చెప్పింది .అలాగే వెళ్లి తపోధ్యానాలు చేసి సిద్దుడై హిమాలయాల్లో గుహలో ఉన్నాడు .ఆయననే ఆ ఫ్రెంచ్ రచయిత్రి సోఫియా హిమాలయాల్లో చూసింది ‘’అని చెప్పారు కుర్తాలం స్వామి ప్రసాదరాయ కులపతి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-8-20-ఉయ్యూరు
మనకు తెలియనిమహాయోగులు—47-రాజయోగిబ్రహ్మానంద తీర్థులు-1879-1918
మహారాష్ట్ర కొల్హాపూర్ దగ్గర బ్రాహ్మణాగ్రహారం లో దత్త ఉపాసకుడు విష్ణుభట్టు అనే ఋక్ శాఖ పురోహితుడికి బ్రహ్మానంద తీర్ధులు 1879లో జన్మించాడు చిన్నప్పటి పేరు గణపతి .అయిదవఏట అక్షరాభ్యాసం చేసినది మొదలు ఆధ్యాత్మిక భావనతో తల్లితో పాటు దత్తస్మరణ చేస్తూ ,సద్గుణాలు అలవరచుకొన్నాడు .ఉపనయనం తర్వాత దగ్గరున్న నదీతీరం లో ఏకాంతం గా భగవధ్యానం చేసేవాడు .12వ ఏట ప్లేగు వ్యాపించి సోదరులిద్దరూ చనిపోగా ,వైరాగ్యం తో ఇల్లువిడిచి దత్తక్షేత్రం నరసోబావాడి చేరాడు .అక్కడి హరికథలు విని తన్మయుడయ్యాడు .తండ్రివచ్చి ఇంటికి తీసుకు వెళ్ళాడు .
1833లో తపస్సుకోసం హిమాలయాలకు బయల్దేరాడు .1897లో బదరి క్షేత్రం చేరి ,యోగులవద్ద లంబికాయోగం నేర్చాడు.తర్వాత నర్మదాతీరం గరుడేశ్వార్ చేరి,అక్కడ అపర దత్తాత్రేయుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతిని దర్శించి ,సేవ చేయగా గణపతి కి దత్తమహామంత్రం ,యోగం, అనుష్టానం బోధించారు .రేయింబవళ్ళు వీటిని సాధన చేసి ,స్వామి అనుమతితో శృంగేరి శ్రీ నృసి౦హ భారతీస్వామి ని ఆశ్రయించగా భాష్య ప్రవచనం చేయింఛి సంస్కృతం నేర్పారు . అక్కడి మహారాష్ట్ర సన్యాసి ఆనందానంద తీర్ధ స్వామిచే సన్యాసం బ్రహ్మానందదీక్షనామం ఇప్పించి ఆశీర్వదించారు .
బ్రహ్మానందులు యాత్రలు చేస్తూ తిరుపతి దర్శించి నెల్లూరు చేరి ,అక్కడ జీవన్ముక్తులైన నిత్యానందస్వామి తో పరిచయమేర్పడింది .అక్కడే ‘’శ్రీ నిత్యానంద వేద సంస్కృత పాఠశాల ‘’ను బ్రహ్మానందులు స్థాపించి,ఇద్దరూ కలిసి పర్యటన చేస్తూ భక్తులకు యోగరహస్యాలు బోధిస్తూ మంత్రోపదేశం చేశారు .బాపట్ల చేరి సనాతన ధర్మప్రచారానికి పూనుకొన్నారు .లీలలు అద్భుతాలు మహిమలు ప్రదర్శించారు .ఎన్నో జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు.బాపట్లలో దత్తాత్రేయ మందిరం ,లైబ్రరీలను నిర్మిచి సమృద్ధిగా మూలధం చేకూర్ఛి పాలకమండలి నియమించారు.బాపట్ల బ్రహ్మానంద తీర్థులు గా ప్రసిద్ధిపొందారు .
కాశీ వెళ్లి ‘’మాండూక్యోపనిషత్ తారకమంత్ర మఠం’’లో భాష్య ప్రవచనం చేశారు ,కాళయుక్తిసంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి గురువారం 15-8-1918 న 39వఏట సమాధి నిష్టలో ఉదయం 9-30గంటలకు బ్రహ్మానంద తీర్థులు బ్రహ్మ రంధ్రం చేదించుకొని బ్రహ్మైక్యం పొందారు .భక్తులలో మహాభక్తుడు,జ్ఞానులలో శ్రేష్ఠుడు,కర్మయోగుల్లో వీరుడు ,యోగులలో రాజయోగి సనాతన ధర్మానికి సారధి, ఆధ్యాత్మిక వికాసానికి ఎత్తిన జయపతాక శ్రీ బ్రహ్మానంద తీర్థులు .
8-ఆటవిక కుటుంబాలకు ఆరాధ్యదైవం –బ్రహ్మ సాక్షాత్కారం పొందిన చిద్గగనానంద స్వామి-1885-1969
రాయలసీమకడపజిల్లా ప్రొద్దుటూరు తాలూకా చినరాజుపల్లెలో రుక్కు గురవారెడ్డి నాగమ్మదంపతులకు శ్రీ వెంకటేశ్వర వరప్రసాది గా వెంకటరెడ్డి 30-3-1885 పార్ధివ సంవత్సర చైత్ర పౌర్ణమి సోమవారం రాత్రి 12గంటలకు హస్తా నక్షత్ర ధనుర్లగ్నం లో పుట్టాడు .ఏడవఏట ప్రాణాయామం నేర్చాడు .పూనాలో హఠ యోగాశ్రమం లో చేరి ఒక ఏడాది యోగాభ్యాసం నేర్చి,తర్వాత పండరి, రాయచూర్ ,అనంతపురం,యాదికి లు చూసి చీమలకుర్తివాగుపల్లెకు చేరాడు .అక్కడ ఒక వేదా౦తివద్ద సీతారామా౦జనేయం ఒంటబట్టించుకొని ,11వ ఏట బొమ్మేపల్లి సుబ్బదాసు అనే సిద్ధ పురుషుని ఆశ్రయించాడు .ఆయన తారక సంఖ్య,అమనస్క యోగాలు నేర్చుకొని వస్తే ,అచల పూర్ణ యోగం బోధిస్తానని చెప్పాడు .
12వ ఏటనే ‘’లంకమల పర్వతం ‘’పై ధ్యాన సాధన చేసి స్వరశాస్త్రం నేర్చి ,15వ ఏట కమలాపురం తాలూకా నాగేశ్వర పర్వతాగ్రం పై ఏడాది తపస్సు చేసి ,18వ ఏట తిరుమల బావాజీ మఠంలో రెండేళ్ళు మతత్రయ సారం గ్రహించాడు .తర్వాత వీరాంజనేయ క్షేత్రాలు సందర్శించి,28వ ఏట చిన్నరావిపల్లెకు చేరి ,బ్రహ్మానంద మహర్షిని సందర్శించి శిష్యుడయ్యాడు .అనేక విధాలుగా పరీక్షించి దీక్షను ,’’చిద్గగనానంద’’ దీక్షానామం అనుగ్రహించారు బ్రహ్మనందులు .12ఏళ్ళు అనంతపురం జిల్లా పోతులకుంట లో గురువుగారి ప్రస్థానత్రయ ఆశ్రమ భూములను స్వయంగా దున్నుతూ, పంటలు పండిస్తూ గురుసేవచేశాడు.
మళ్ళీ దేశ సంచారం చేసి ,హిందూపురం తాలూకా గోరంట్లలో గురువు స్థాపించిన ఆద్వైతాశ్రమానికి తిరిగి వచ్చి ,ఆయుర్వేదం నేర్చి ,ఔషధాలు తయారు చేసి,రోగులకు ఉచితంగా వైద్యం అందించి ఆరోగ్యవంతుల్నిచేశారు .నాలుగేళ్ళతర్వాత కదిరి తాలూకా తుమ్మలాపుర దుర్గం వెళ్లి ,ఆరునెలలు నిహారంగా తపస్సు ఘోరంగా చేశారు .అక్కడ భవనాశి ఆశ్రమం స్థాపించి ,రాయలసీమ తీవ్ర కరువు కాలం లో ఆరునెలలు విరివిరిగా అన్నదానాలు చేయించారు .కొత్త చెరువు దగ్గర నాగులకనుమలో ఆనందశ్రమం స్థాపించి ,52వ ఏట బలిఘట్టం చేరి ,త్రిశూలపర్వత౦ పై 12రోజులు లోక శాంతికోసం దీక్ష పూనారు .మన్యం లోని జనులకుఆధ్యాత్మిక చైతన్యం కలిగించటానికి బ్రహ్మానందాశ్రమం స్థాపించారు .ఇలా 10 ఆశ్రమాలు స్థాపించి ,మళ్ళీ బలిఘట్టం చేరి బలిఘట్ట౦ చిద్గగనానంద స్వామి గా ప్రసిద్ధి చెందారు .సౌమ్య సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి చాతుర్మాస్యదీక్ష వహించి భక్తులకు ప్రస్థాన త్రయం బోధించారు .27-7-1969 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఉదయం 8గంటలకు శ్రీ చిద్గగనానంద స్వామి 84వ ఏట జీవ సమాధి చెందారు .దాదాపు అయిదు వేల ఆటవిక కుటుంబాలకు చిద్గగనానందులు ఆరాధ్య గురువు, దైవం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-20-ఉయ్యూరు
కీ శే బ్రహ్మశ్రీ . కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురు పూజోత్సవం
సాహితీ బంధువులకు శుభకామనలు –
సరసభారతి 154వ కార్యక్రమంగా ఉపాధ్యాదినోత్సవం 5-9-20శనివారం నాడు సాయంత్రం 6-30గంటలకు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ కీ శే .కోట సూర్యనారాయణ ,కీ.శే.శ్రీమతి సీతమ్మ దంపతుల గార్ల గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది .
1- 2020 మార్చి పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన పేద,ప్రతిభగల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన శ్రీ కోట సూర్యనారాయణ ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం అందజేయబడుతుంది .
2- శ్రీ కోటగురుపుత్రులు శ్రీ కోట చంద్ర శేఖరశాస్త్రి ,శ్రీ రామకృష్ణ ,శ్రీ గాయత్రి ప్రసాద్ ,శ్రీ సీతారామాంజనేయులు గార్లు తమ తలి దండ్రులు కీ. శే .కోట సూర్యనారాయణ శాస్త్రి కీ.శే. శ్రీమతి సీతమ్మ దంపతుల గార్ల పేరిట ఏర్పాటు చేసిన స్మారక నగదు పురస్కారం 2020 మార్చి పబ్లిక్ పరీక్షలో పదవతరగతి ఉత్తీర్ణత సాధించి ,ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి ,విద్యార్ధినికి శ్రీ గురుపుత్రుల చేతులమీదుగా అందజేయ బడుతుంది .
3- డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 1-శ్రీ వేమూరు సదాశివరావు –గణిత ,ఆంగ్ల ఉపాధ్యాయుడు 2-శ్రీమతి కనకదుర్గ –ప్రిన్సిపాల్ ,భారతీయ విద్యాకేంద్రం-ఉయ్యూరు లకు పురస్కార ప్రదాన సన్మానం జరుగుతుంది .
గమనిక –పురస్కారానికి ఎంపికైన విద్యార్ధినీ విద్యార్ధులు ,ఉపాధ్యాయినీ ,ఉపాధ్యాయులు,అతిధులు తప్పక మాస్కులు ధరించి హాజరు కావలసినదిగా కోరుతున్నాము .
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిత వెంకట రమణ గబ్బిత దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి అధ్యక్షులు –సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
పూర్తీ వివరాలతో 3వ తేదీ న ఆహ్వానం అంద జేస్తాము
గుడివాడ తెలుగు భాషా వికాస సమితి వారి గిడుగు రామమూర్తి గారి స్మారక పురస్కార ప్రదానం
గుడివాడ తెలుగు భాషా వికాస సమితి వారి గిడుగు రామమూర్తి గారి స్మారక పురస్కార ప్రదానం
నేపధ్యం – ఈ నెల 21 సోమవారం రాత్రి 9-30కి ఆంధ్రప్రదేశ రచయితలసంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ చలపాక ప్రకాష్ ఫోన్ చేసి ‘’సార్!మన సంఘ అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు నాకు ఫోన్ చేసి ,గుడివాడలో ఏదో సాహిత్య సంస్థ వారు గిడుగు వారి జయంతి చేస్తున్నారనీ ఆ సంస్థ అధ్యక్షుడు తనకు ఫోన్ చేసి ఎవరైనా రచయిపేరు సూచిస్తే ఆయనకు గిడుగు పురస్కారం అందిస్తామని చెప్పారట .సుబ్బయ్యగారు వెంటనే మీ పేరు సూచించారట .అక్కడ వాళ్ళవద్ద ఫండ్స్ ఏమీ లేవు .నగదు పురస్కారం ఉండదు .శాలువాకప్పి జ్ఞాపిక మాత్రం ఇస్తారట .మీరు అంగీకరిస్తే తానే గుడివాడ వారికి తెలియ జేస్తామని ,అందుకోసం నన్ను మీకు ఫోన్ చేసి మీ అభిప్రాయం తెలుసుకోమని చెప్పారు సుబ్బయ్యగారు .మీ అంగీకారం నాకు చెబితే నేను సుబ్బయ్యగారికి ఫోన్ చేసి చెబుతానన్నారు అప్పుడు గుడివాడ వారు రేపు మీకు ఫోన్ చేసి వివరాలు చెబుతారట అన్నారు ప్రకాష్ . .నేను పెద్దగా ఆలోచించకుండానే ‘’ప్రకాష్ గారూ !డబ్బు విషయం ముఖ్యం కాదు మనకు .ఏదో ఉడతాభక్తిగా చేస్తున్నదానికి మనం అంగీకరించటమే సాయం .సరే అని చెప్పండి సుబ్బయ్యగారికి .నన్ను సూచించినందుకు ఆ విషయం మీద్వారా తెలియ బర్చినందుకు వారికీ మీకు ధన్యవాదాలు ‘’అన్నాను .’’సరే ఇప్పుడే సుబ్బయ్య్గ గారికి మీ అంగీకారం చెబుతా ‘’అన్నారు చలపాక .
మర్నాడు మంగళవారం ప్రకాష్ ఫోన్ గుడివాడ వారు ఫోన్ చేశారా అని అడిగితె లేదన్నాను .మళ్ళీ 9-45కు ఫోన్ చేసి అడిగారు నేను ‘’ఇంకాలేదు .ఆయన పేరేమిటి ?’’అన్నాను .ఆయన ‘’నాకూ తెలీదు .ఆయనే ఫోన్ చేస్తారని సుబ్బయ్యగారు చెపారు ‘’అన్నారు.నేను ‘’సార్!10నుంచి 11వరకు ఫేస్ బుక్ లో లైవ్ ప్రోగ్రా౦ చేస్తున్నాను .అఆర్వాత ఫోన్ చేయమని చెప్పండి .’’అన్నాను .నా లైవ్ కార్యక్రమమ 11-15దాకా సాగింది .11-30కి గుడివాడ నుండి ఒకాయన ఫోన్ చేసి ‘’నా పేరు ప్రసాద్ .ఇక్కడ తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షుడిని .ప్రతిఏడూ గిడుగు వారి జయంతి నిర్వహించి వారి స్మారక సాహితీ పురస్కారం ప్రసిద్ధులైన రచయితలకు అందిస్తున్నాము .ఈ సారి మీ పేరును వెంకట సుబ్బయ్య గారుసూచించారు .ఆయన గుడివాడ ఆర్ డి వో గా పని చేసినప్పటినుంచీ నాకు బాగా పరిచయం .మీరు అంగీకరించినట్లు సుబ్బయ్యగారు ఫోన్ చేసి చెప్పారు .దన్యవాదాలు .కరోనా హడావిడికనుక చాలా సింపుల్ గా. చేస్తున్నాం .మీతో పాటు ఇద్దరు అతిధులు వేదికపై ఉంటారు .శరత్ టాకీస్ ఎదురురోడ్డులో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న జిల్లా గ్రంధాలయం లో29 శనివారం ఉదయం కార్యక్రమం ..పై అంతస్తు కూలిపోయింది .కనుక కిందనే లైబ్రేరియన్ రూమ్ లోనే జరుపుతాం .ఉదయం 10-30కు రండి .11గంటలకు ప్రారంభించి ఒక అరగంట లో పూర్తి చేస్తాం ‘’అన్నారు .’’సరే గిడుగువారిని స్మరించుకోవటం మన విధి ‘’అన్నాను .వెంటనే ప్రకాష్ గారికి ఫోన్ చేసి ప్రసాద్ గారు నాతో మాట్లాదడినసంగతి చెప్పాను సరే నన్నారు .
ఒక్కసారి నామనసు చక్రాలు గుండ్రాలు లోకి అదేనండి ఫ్లాష్ బాక్ లోకివెళ్లి పాతిక ,ముప్పై క్రితం మినికవిత్వ సారధి వసుధ బసవేశ్వరరావు ‘ గుడివాడలో రెగ్యులర్ గా నిర్వహించే సాహిత్యకార్యక్రమాలు , నేను ఉయ్యూరు నుంచి తప్పకుండా వెళ్లి చూడటం అప్పుడు ఒకకుర్రాడు బానర్లు కడుతూ కుర్చీలు మైకు ఏర్పాట్లు చూస్తూ వసుధకు చేదోడుగా ఉండే లాయర్ ప్రసాద్ జ్ఞాపకం వచ్చి ‘’ఆ ప్రసాదేనా మీరు ?’’అని అడిగితె ఔనన్నారు .ఆ కార్యకరమాలు సాయంత్రం 5గంటలకు ప్రారంభం అవ్వాల్సి ఉన్నవి అతిధులు రాకపోవటం తో రాత్రి 7-30దాటితే కానీ మొదలయ్యేవి కావు .ఒక గంట చూసి ఇంటికి ఉయ్యూరు వచ్చేసే వాడిని .ఆ సభలపై నా స్పందన వసుధగారికి కార్డు పై రాసి తెలియ జేసేవాడిని నిర్మొహమాటంగా .ఆయనా చాలా స్పోర్టివ్ గా తీసుకొనేవారు .ఉయ్యూరులో మేము నిర్వహించే సాహితీ మండలి, ససరస భారతి కార్యక్రమాలకు తప్పక వచ్చేవారు .శ్రీమతి నాగలక్ష్మి,శ్రీ వంగిపూడి ,శ్రీ మాల్యాద్రి వగైరా లను కూడా తీసుకొచ్చేవారు తనతో పాటు .మా పురస్కారాలు వసుధకు అందించాం .కవి సమ్మేళనాలు ఆయనతో నిర్వహింప జేశాం .నాకు మంచి సాహితీమిత్రుడు వసుధ .ఆంధ్రాబాంక్ మేనజర్ . .ఆయన కైకలూరు బందరు ఎలమర్రు ,గుడివాడ ఎక్కడ పని చేసినా యువకవులకు ఆకర్షణ,స్పూర్తి .ఆ యన బృందం సాహితీ మిత్రులు .మా ఉగాది కవిసమ్మేళ కవితలు కవితా సంకలనాలు ‘’మా అక్కయ్య ‘’వసుధైక కుటుంబం ‘’కు ఆయనే మార్గదర్శి ,ఆయన ఆధ్వర్యం లోనే ముద్రి౦ప జేశాం .ఇన్ని విషయాలు ఒక్కసారిగా గుండ్రాలలో గుప్పుమని బయటికొచ్చాయి .
గుడివాడ విషయం ఎవరికీ చెప్పలేదు .మా అబ్బాయి రమణ కు మాత్రం అప్పుడే చెప్పా.అమెరికాలో ఉన్న మా అమ్మాయికి తెలిసింది .ప్రసాద్ గారు నా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో బయోడేటా వాట్సాప్ లో పంపమంటే వెంటనే పంపాను .గురువారం నుంచీ రోజూ ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు .నిన్న 28-శుక్రవారం రాత్రి 8గంటలకు మా రమణ కు మిత్రుడుశ్రీతుమ్మోజు రామలక్ష్మణాచార్యులు గారు పంపిన గుడివాడ సభ వార్తను ఫేస్ బుక్ లో పెట్టగా, ఆతర్వాత అరగంటతర్వాత నేను చూసి , ఈమెయిలు , ఫేస్ బుక్ వాట్సాప్ లో అందరికీ పంపాను .అగ్గి రాజుకున్నట్లు క్షణాలమీద వైరల్ అయి వెంటనే నాకు అభినందన సందేశాలు కుప్పలుగా వచ్చాయి .వచ్చినవాటికి వచ్చినట్లు ధన్యవాదాలు తెలిపాను .ఇవాళ ఉదయం నేను పురస్కారం అందిస్తున్న ప్రసాద్ గారికీ వారి బృందానికీ ,,నన్ను అభినందించిన సాహితీ బంధువులు సాహిత్యాభిమానులు బంధుమిత్రులందరికీ కృతజ్ఞత మూడు మాధ్యమాలలలోనూ తెలియజేశాను.
పురస్కార సభ
29 శనివారం ఉదయం స్నానసంధ్యపూజాదికాలు పూర్తి చేసుకొని ఉదయం 10గంటలకు నేనూ మారమణ ,తానూ వస్తానని రమణతో చెప్పిన మాన్నయ్యగారి అబ్బాయి రాం బాబు కారులో బయల్దేరి గుడివాడకు 10-45కు చేరాం.అప్పటికే ఒకసారి ప్రసాద్ గారు ఫోన్ చేసి ఎక్కుడున్నామో తెలుసుకొన్నారు .వెంకటసుబ్బయ్య గారూ రోజూ తనకు ఫోన్ చేసి ఎంక్వైర్ చేస్తున్నన్నట్లు చెప్పారు. అంతటి నిబద్ధత సుబ్బయ్యగారిది .లైబ్రేరియన్ శ్రీమతి రమాదేవి గారు .ప్రసాద్ గారు ఆహ్వానించారు .సభ 11-45 కు ప్రారంభమైంది .సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, రెవిన్యు అధికారి ,ఒక గుడి ఆచార్యులగారు ఇంకొరు అతిధులు .ప్రసాద్ అందర్నీ పరిచయం చేసి ఈ కార్యక్రమముద్దేశ్య౦ తెలిపారు .సి ఐ గారు గిడుగు వారి చిత్ర పటానికి పుష్పహారం వేయగా, మేమంతా భక్తిగా పూలు సమర్పించాం.క్లుప్తంగా సియిగారు ఆచార్యలు గారు మాట్లాడాక నాకు సెంటర్ లో కుర్చీవేసి కూర్చోబెట్టి ,సర్కిల్ గారి చేత శాలువా కప్పించి అందరూ కలిసి పుష్పగుచ్చం , జ్ఞాపిక అందజేశారు .కుర్చీలున్నా అందరూ వెళ్లిపోవాలనే తొందరలో కాళ్ళలో చక్రాలు పెట్టుకొని నుంచునే ఉన్నారు .నన్ను మాట్లాడమన్నారు .
.నేను ‘’ఇవాళ వ్యావహారిక భాషోద్యమనాయకుడు మార్గదర్శి శ్రీ గిడుగు వెంకట రామ మూర్తి గారి 158వ జయంతి .తెలుగు భాషకు వారు చేసిన విశిష్టమైన సేవలను పురస్కరించుకొని వారి జన్మ దినమైన ఆగస్ట్ 29 న గౌరవంగా తెలుగు భాషాదినోత్సవంగా దేశమంతటా నిర్వహిస్తున్నారు .సాహిత్యం లో కృషి చేసిన వారిని గుర్తించి గిడుగువారి స్మారక సాహితీ పురస్కారం అందిస్తున్నారు .ఆయన 29-8-1863 న జన్మించి ,22-1-1940న చనిపోయారు .కరోనా హడావిడి వలన ఎక్కడా బహిరంగసభలు సమావేశాలు అట్టహాసంగా పురస్కార ప్రదానాలు జరగటం లేదు ఈ సారి .అయినా గత రెండు దశాబ్దాలుగా గుడివాడ తెలుగుభాషా వికాస సమితి గిడుగు వారిజయంతి చేస్తూ సాహితీ పురస్కారం అందించటం హర్షదాయకం .ప్రసాద్ గారితో నాకు సుమారు ముప్పై ఏళ్ళకు పూర్వం నుంచీ పరిచయం ఉంది. ఉయ్యూరులో మా సమా వేశాలకూ వచ్చేవారాయన .శ్రీ వెంకటసుబ్బయ్య గారు నా పేరు సూచిస్తే ,నన్ను పిలిచి ఈ పురస్కారం, ఇందరు అధికారుల సమక్షంలో సరస్వతీ నిలయమైన గ్రంథాలయం లో అందించటం నాకు ఆనందం గా ఉంది .సుబ్బయ్యగారు మహా సౌమ్యులు సాహితీ పిపాసి.కధైకలను కవిత్వాన్నీ ప్రోత్సహిస్తూ తనపేరు మీద తండ్రిగారి పెరుమీడా పురస్కారాలు ప్రతిఏడాది అందిస్తారు వాటిని పుస్తకరూపం లో ముద్రిస్తారు . ఎవరు ఏమిటో ఎస్టిమేట్ చేసే గొప్ప నేర్పున్న అధికారి .ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులుగా గత పదేళ్ళ నుంచి వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు .మా సరసభారతి కార్యక్రమాలకు అతిధులుగా తప్పక వచ్చి,చివరిదాకా ఉండే ఓపికవారిది .నిరుడు ఆ సంఘం తరఫున మొదటిసారిగా ‘’జ్ఞాన జ్యోతి ‘’పురస్కారం ఏర్పరచి ,మొదటి అవార్డ్ ను నాకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భం గా బెజవాడ టాగూర్ లైబ్రరీలో 15-11-19 న అందజేసిన సౌజన్య సాహితీ మూర్తి .వారు సూచించారని తెలిసి అంగీకరించి వచ్చాను .మా మనవడు చరణ్ ‘’తాతా!గుడివాడ కరోనాతో పుచ్చి పోయింది .నువ్వు వెళ్ళద్దు ‘’అన్నాడు .అయినా మాట నిలబెట్టుకోవాలి కనుక వచ్చాను .రాష్ట్రం లో బహుశా ఎవరూ ఇవాళ గిడుగు వారి జయంతిని బహిరంగం గా జరిపి పురస్కారం అందిస్తున్నట్లుగా నాకు కనపడలేదు .ఒకవేళ ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల జరిగాయేమో తెలీదు . కానీ ’’ ఏక వ్యక్తి సైనికుడైన’’ శ్రీ ప్రసాద్ గారుధైర్యంగా స్వంతఖర్చుతో ఇలా సమావేశం జరిపి పురస్కారం అందించినందుకు ఆంధ్రదేశం ఆయన సాహితీ సేవను తప్పక గుర్తిస్తుంది .ఇలా అరుదుగా జరిగిన ఈ సభలో నాకు మహామహులు గిడుగు వారి స్మారక సాహితీ పురస్కారం లభించినందుకు మహదానందంగా ఉంది ..ఈ పురస్కారం నాకు గొప్ప గౌరవాన్ని కలిగించింది .ఈపురస్కారం ‘మా ‘’సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘’కు వినమ్రంగా అంకితమిస్తున్నాను . సరసభారతి సాహితీ సేవ గురించి నా రచనా ప్రస్తానం గురించీ టూకీగా చెప్పాను సారాదుదుకాణాలకు జనం బాగానే వెడుతున్నారు గుంపులు గుంపులుగా .సాహిత్యసమావేశాలపై ఆంక్షలు ఎందుకో అర్ధం కాదు . ఏమైనా సాహసంగా గిడుగు వారి జయంతిని ప్రసాద్ గారు నిర్వహించినందుకు మనస్పూర్తిగా ,అభినందిస్తూ,ఆయన బుజాలను ,ఆప్యాయంగా తడుతూ, శ్రీ వెంకటసుబ్బయ్యగారికి,శ్రీ చలపాక ప్రకాష్ గారికీ కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను ‘’అని ముగించాను .తర్వాత అందరికి’’వేడి రుచికర ,శుచికర ,ఆరోగ్యకర లెమన్ టీ’’ మినీ కప్పులలో అందించారు .సుమారు 12-30కు బయల్దేరి ఇంటికి 1-15కు చేరి భోజనం చేసి కాసేపు విశ్రమిచి ,ఈ ఆర్టికల్ రాశాను .
గిడుగువారి జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-8-20-ఉయ్యూరు
మనకు తెలియని మహాయోగులు—3
మనకు తెలియని మహాయోగులు—3
5-గోదావరి నదిపై నడచిన గొంగడి స్వామి అనే గోవింద స్వామి -1855-1927
కేరళలోని మలబారు ప్రాంతంలో ఆలపాడ గ్రామం లో 13-1-1885 రాక్షస నామ సంవత్సర పుష్యబహుళ దశమి శనివారం నారాయణస్వామి బ్రాహ్మణ వంశం లో జన్మించాడు .పసితనం నుంచే ‘’గోవింద రా౦ రాం గోపాలహరి హరి’’అంటూ నిరంతరం పాడుకొంటూ ఉండటం వలన ‘’గోవింద స్వామి ‘’ అని అందరూ పిలిచేవారు .ఎప్పుడూ గొంగడి( ళి)మీద కప్పుకోటం చేత గొంగడి స్వామి అనీ ,వరిగడ్డిలో కూర్చుని ధ్యానం చేయట౦తో వరి గడ్డి స్వామి అనీ ,పెద్దపెద్ద గోళ్ళు ఉండటం వలన గోళ్ళ స్వామి అనికూడా పిలిచేవారు .బ్రహ్మచారికనుక బ్రహ్మచారి స్వామి ,సంగీతం నేర్చి వేణువుతో అద్భుతంగా గానం చేసే నేర్పున్నందున ‘’గోపాలస్వామీ ‘’అని కూడా పిలిచేవారు .
చిన్నతనం లోనే తలిదండ్రులు చనిపోవటం చేత దేశదిమ్మరిగా తిరుగుతూ యోగులను జ్ఞానులను ఆశ్రయించి సన్యాసం పొంది గురువు ఆదేశం తో భక్తిజ్ఞానాలు బోధిస్తూ వేణుగానం తో శారీరక మానసిక వ్యాధులు నివారిస్తూ ,దేశమంతా తిరిగాడు .ఉత్తరభారతం లో శిష్యగణం బాగా ఎక్కువ .1887లో మహారాష్ట్రలోని పాండురంగని పండరి క్షేత్రం లో ఉండగా ఆయనకు ఒక తెల్లవారు ఝామున భద్రాచల సీతారాముల దర్శనమైంది .
18మంది శిష్యులతో భద్రాచలం బయల్దేరాడు .1892లో కర్ణాటకలో బీదరు ,బళ్ళారి,శృంగేరి,ఉడిపి క్షేత్రాలలో ఆశ్రమాలు స్థాపించాడు .నాలుగేళ్ళు కన్నడ దేశమంతా తిరిగి ,17మంది శిష్యులనుస్వస్థలాలకు పంపించి ఒకే ఒక్క శిష్యునితో 1896లో ఆంద్ర దేశం లో ప్రవేశించి ,ముందుగా తిరుమలలో శ్రీవారిని దర్శించి ,వేదనారాయణ పురం లో కొన్నాళ్ళు గడిపి ,ఉన్న ఒక్క శిష్యుడిని తనను 1927ప్రభవ సంవత్సర శ్రీ రామ నవమి నాడు భద్రాచలం లో కలుసుకోమని ఆదేశించాడు .అక్కడి నుంచి కాలినడకన ఒంటరిగా నడుస్తూ పల్లెలు పట్టణాలు,అడవులూ దాటుతూ సత్రాలలో ఉంటూ తింటూ మౌనంగా గడిపాడు .కడప దాటాక’’ చిన్నమాచు పల్లె’’ లో శ్రీ ఆంజనేయ ప్రతిష్ట చేసి, ఆర్తుల బాధ తొలగించాడు.ఎన్నో మహిమలు లీలలు చూపాడు .
1904లో వల్లూరులో కొన్ని నెలలు ఉండి,గోపూజ చేస్తూ ,దాని పాలు పితికి అక్కడే ఉన్న బావిలో పోస్తూ ఆ నీటినే ఔషధంగా ఇచ్చేవాడు. సకల రోగాలు నయమయ్యేవి.1916లో భద్రాచలం చేరి ,ప్రతిరోజూ గోదావరి నీటిపై నడుస్తూ,నది మధ్యకు చేరి ,శ్రీరామాలయ శిఖరం దర్శించి స్నానం చేసి ,గట్టుకు వచ్చి ,తపస్సు ధ్యానం చేసి ఆలయం లో సీతారాములను దర్శించేవాడు .భద్రాచల మఠం లో లింగ ప్రతిష్ట చేసి ,తపస్సుకోసం భూగృహం ఏర్పాటు చేసుకొని ,అందులో పదేళ్ళు ఏకాంతంగా తపస్సు చేశాడు భద్రాచలం గోవింద స్వామిగా ఇక్కడ ప్రసిద్ధుడు ..6-5-1927ప్రభవ సంవత్సర వైశాఖ శుద్ధ చవితి గురువారం 72వ ఏట బ్రహ్మ రంధ్రం చేదించుకొని పరమాత్మలో లీనమయ్యాడు గోవిందస్వామి .పంచమి నాడు సమాధి చేశారు .ఏటా ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు సమాదినుంచే మహిమలు చూపుటాడని విశ్వాసం .
6-సంఘ సంస్కర్త- హంసానంద స్వామి -1859-1980
బహుభాషా కోవిదుడు ,పండితుడు ,స్వాత౦త్ర్య సమరయోధుడు , రాజకీయ వేత్త ,ఆయుర్వేద వైద్యుడు ,ప్రకృతి చికిత్సా నిపుణుడు,సంఘసంస్కర్త ,120ఏళ్ళు సార్ధకంగా జీవించిన వాడు హంసానంద స్వామి .ఉత్తర ప్రదేశ్ లో 1859 సిద్ధార్ధి నామ సంవత్సర శ్రావణ బహుళ పాడ్యమి ఆదివారం జన్మించాడు .తలిదండ్రులు పెట్టిన పేరు నిత్యగోపాల్ .బాల్యం లోనే శ్రీ రామ కృష్ణ పరమహంసను దర్శించి ,కొంతకాలానికి సన్యసించి ,’’జ్ఞానాన౦ద అవధూత’’ అయ్యాడు.
తర్వాత శ్రీ బ్రహ్మానంద’’ సరస్వతీ స్వామి వద్ద సన్యాసం స్వీకరించి ‘’హంసానంద సరస్వతి ‘’అనే దీక్షానామం పొందారు .ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ జ్ఞానబోధ చేస్తూ ,ఆరోగ్యబోధకూడా చేసేవారు .శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులతో కలిసి సామాజిక ,ఆధ్యాత్మిక ప్రచారాల్లో పాల్గొనే వారు .జాతీయోద్యమం లో స్వామి శ్రద్ధానంద ,మహాత్మాగాంధీ,వీర సావర్కార్ ,టంగుటూరి ప్రకాశం ,అరవింద యోగి ,మదనమోహన మాలవ్యా ,రాజగోపాలా చారి వంటి ది గ్దంతులతో కలిసి హంసానంద స్వామి పని చేశారు .సంస్కృత తెలుగు ఇంగ్లీష్ బెంగాలీ ,హిందీ రష్యన్ జర్మనీ భాషలలో నిష్ణాతులయ్యారు .
కర్నూలు జిల్లా బనగానపల్లి దగ్గర యాగంటి గుహలో ‘’వేపాకు మాత్రమే తింటూ’’ ,కఠోర తపస్సు చేసి ,అనేక యోగసిద్ధులు సాధించారు.ఎనిమిదేళ్ళు ఇలా తపస్సు చేసి ,1930లో బనగానపల్లి చేరి ,శిధిల దేవాలయానికి పడమరగా ఉన్న స్థలం లో ‘’స్వస్తి ఆశ్రమం ‘’నిర్మించుకొని ,క్రమంగా అభి వృద్ధి చేసి ప్రజల శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆనందం కలిగించారు .మానసిక రోగులను ఉపదేశాలతో ,వ్యాధి గ్రస్తులకు మందులతో వైద్యం చేసేవారు .ఆయుర్వేద వైద్య వ్యాప్తికి ‘’దయానంద ఫార్మసి ‘’ఏర్పరచి వనమూలికలతో ఆయుర్వేద ఔషధాలు తయారు చేశారు. మందులతో నయంకాకపోతే మట్టిస్నానం తొట్టి స్నానం తైలమర్దనం వంటి ప్రకృతి చికిత్స లతో నయం చేసేవారు .బనగానపల్లి స్వామి అని అందరూ పిలుచుకోనేవారు .1932లో ‘’హంసానంద ప్రకృతి ఆశ్రమం ‘’రూపు దాల్చింది .దీనికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు .హైదరాబాద్ నాగార్జున ఆయుర్వేద పీఠానికి,విజయవాడ రామమోహన ఆయుర్వేద కళాశాలకు,విజయవాడ ప్రకృతి ఆరోగ్య కేంద్రానికి హంసానంద సరస్వతి అధ్యక్షులుగా కేంద్ర,రాష్ట్ర ఆయుర్వేద నిపుణుల సంఘం సభ్యులుగా ఉంటూ గొప్ప సేవ చేశారు .ఎందరికో వైద్య విద్య నేర్పారు .అనేక సిద్ధులు సాధించినా, కేవలం వశీకరణ శక్తిని మాత్రమే ప్రదర్శించేవారు .
13-1-1980 సిద్ధార్ధి నామ సంవత్సర పుష్య శుద్ధ చతుర్దశి మంగళవారం 120 ఏళ్ళ సార్ధక జీవితాన్ని చాలించారు హంసానంద స్వామి .ఆయన హంస పరమహంసలో లీనమైంది .ఆయనముందే సూచించిన స్థలం లో భక్తులు శిష్యులు సమాధి చేశారు ..ప్రతియేటా పుష్యబహుళ ఏకాదశినాడు హంసానందుల ఆరాధనోత్సవాలు బనగానపల్లి లో నిర్వహిస్తూ పేదలకు అన్నదానం వస్త్ర దానం చేస్తూ సార్ధకత కల్పిస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-8-20-ఉయ్యూరు
గిడుకు పురస్కారం రేపు గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం అందజేస్తున్న గుడివాడ తెలుగు భాషా వికాస సమితి
వ్యావహారిక భాషోద్యమ మార్గదర్శి శ్రీ గిడుగు వెంకట రామమూర్తిగారి 158వ జయంతి 29-8-20 శనివారం ఉదయం 10గంటలకు .గుడివాడలో, గుడివాడ తెలుగు భాషా వికాస సమితి వారు నాకు శ్రీ గిడుగు రామమూర్తి గారి స్మారక సాహితీ పురస్కారం అంద జేస్తున్నందున ,ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ ప్రసాద్ గారికీ , ,కార్యవర్గానికి ,,ఈ విషయం తెలుసుకొని అభినందనహర్ష వర్షంకురిపించిన సాహితీబందువులు, మిత్రులు ,బంధువులు, హితైషులు ,సాహిత్యాభిమానులకు ,సాహిత్య సంస్థలకు వినమ్రంగా ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను -మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -29-8-20-ఉయ్యూరు
మనకు తెలియని మహాయోగులు—2
మనకు తెలియని మహాయోగులు—2
3-మహా విష్ణు సాక్షాత్కారం పొందిన జ్ఞానయోగి –రామయోగి -1895-1962
నెల్లూరుజిల్లా వేదాద్రి దగ్గర మోపూరులో చేవూరి రావమ్మ ,పిచ్చి రెడ్డి దంపతులకు 29-7-1895 మన్మథ నామసంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం రామి రెడ్డి జన్మించాడు .పసితనం లోనే తండ్రి చనిపోతే మేనమామ దగ్గర అన్నారెడ్డి పాలెం లో పెరిగి చదువు నేర్చాడు .భాగవత రామాయణాలలోని సత్య ధర్మ దృష్టి వంట బట్టించ చుకున్నాడు .వాల్మీకి కబీరు లాగా తపోధనుడు కావాలని గంటలతరబడి ధ్యాన నిమగ్నమయ్యేవాడు .భగవత్ సాక్షాత్కారం కోసం పరితపించేవాడు .దీనికోసం రామనామ జపం తీవ్రంగా చేస్తూమనసును ఏకాగ్ర చిత్తం చేశాడు .
బాపట్ల బ్రహ్మానంద తీర్ధులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో ప్రేరణ కలిగించటం విని ,రామి రెడ్డి ఆయన్ను ఆశ్రయించి రామ తారక మంత్రోప దేశం పొందాడు .గురువు ఆదేశం తో రోజుకు అయిదు వేలసార్లు రామతారక మంత్రం జపిస్తూ జ్ఞానపిపాస ఆత్మ జిజ్ఞాసా బలీయమై మనసు వైరాగ్య పూర్ణమైంది .సర్వం త్యజించి హిమాలయాలలో ఒంటరిగా తపస్సుకు బయల్దేరితో దారిలో గుర్వాజ్ఞమేరకు వెళ్ళకుండా స్వగ్రామం వెళ్లి పచ్చని తోటలో చిన్న కుటీరం నిర్మించుకొని ఏకాంతజప ధ్యానాలను తీవ్రతరం చేశాడు .రోజూ రాత్రి ఆరుమైళ్ల దూరం లో ఉన్ననరసింహులు కొండకు వెళ్లి తపస్సు చేసి ,తెల్లారే సరికి ఆశ్రమమం చేరేవాడు
ప్రాణాయామం ,మౌనం ,యోగాసనాలు ,దుఖానుభవాలు తప్పించుకోటానికి ప్రతీకార వాంఛ లేకుండా శాంతంగా ,సహనంగా అనుభవించే తితిక్ష ,నిష్కామం సమభావం మొదలైన అష్టాంగా లతో కూడిన అష్టాంగ యోగం(అహింస ,సత్యం, అస్తేయం –అంటే ఇతరుల ద్రవ్యం పై కోరిక లేకపోవటం ,దొంగతనం లేకపోవటం ,బ్రహ్మ చర్యం ,దయ ,ఆర్జవం –అంటే అన్ని జీవరాసులపై సమభావం ,క్షమ) సాధించాడు .నిర్వికల్ప సమాధిలో ఏకం ,నిత్యం అయిన స్వస్వరూపమే మనసులో ప్రకాశించింది .కొంతకాలం రమణ మహర్షి ని గురువుగా భావించాడు .మామిడి గుహలో తపస్సు చేసి ,అన్నారెడ్డిపాలెం లో ఆశ్రమం నిర్మించుకొని,12ఏళ్ళు మౌనవ్రతం పాటించాడు .1936ఫిబ్రవరిలో రామయోగికి పల్లెపాడు ఆశ్రమం లో ‘’చతుర్భుజ శ్రీ మహా విష్ణువు సాక్షాత్కారం ‘’అనుగ్రహించి దర్శనమిచ్చాడు .రమణమహర్షి భావవ్యాప్తిని రామయోగి పల్లెపల్లెకూ తిరిగి ప్రచారం చేశాడు 12-2-1962ప్లవ సంవత్సర మాఘ శుద్ధ అష్టమి సోమవారం 67వ ఏట రామయోగి విష్ణు సాయుజ్యం పొందాడు .ఒక భక్తురాలు కట్టించిన మందిరం లో సమాధి చేశారు రామయోగి జీవిత చరిత్రను తెలుగు ,ఇంగ్లీష్ లలో ఆయన భక్తురాలు తెలుగులో మొదటికవయిత్రి అయిన శ్రీమతి పొనకా కనకమ్మగారు రాశారు .
.
4-బాల్యం లోనే పార్వతీ పరమేశ్వరుల చే రామ తారక మంత్రోప దేశం పొందిన- బ్రహ్మర్షి అబ్బూరు నారాయణ స్వామి -1907-1989
గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకా ఆదర్శ గ్రామం అబ్బూరులో కొమ్మూరు గుణకయ్య,మాణిక్యమ్మ దంపతులకు నారాయణ స్వామి 18-11-1907ప్లవంగ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్దశి గురువారం జన్మించాడు .చిన్నతనం నుంచే భాగవత రామాయణ సారాన్ని గ్రహించే నేర్పు అలవడింది .ఎనిమిదవ ఏట నిశ్చలధ్యాన మగ్నుడై ఉండగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై రామ తారకమంత్రం ఉపదేశి౦చి ,జీవితాంతం జపి౦చమని ,అవసానకాలం లో మాత్రమే అర్హుడైన భక్తుడికి ఉపదేశించమని చెప్పి ,మళ్ళీ తాను 15వ ఏట యోగి రూపం లో వచ్చి అష్టాక్షరీ మహా మంత్రోప దేశం చేస్తానని పరమ శివుడు అనుగ్రహించాడు .బడిలో చదువు గుడిలో తారకనామ జపం ఇంట్లో భగవధ్యానం నారాయణకు నిత్య కృత్యాలయ్యాయి .
తల్లి చనిపోయాక ఆధ్యాత్మిక సాధన చేస్తూనే కుల వృత్తి అయిన సన్నాయివాద్యం నేర్చి నాదోపాసనతో పరమేశ్వర సాక్షాత్కారం పొందే సాధనగా చేసుకొన్నాడు .గురువు జొన్నలగడ్డ వెంకటరామయ్య వద్ద భాగవతాది పురాణప్రవచనం చేస్తూ,పతంజలి యోగసూత్రాలనూ ఆకళింపు చేసుకొని యోగాసాధనగా ప్రయోగించుకొన్నాడు .మాదిగల ఇళ్ళకు వెళ్లి చెప్పులు కుట్టటం ,వడ్రంగుల ఇళ్ళలో కర్రపనులు నేరుస్తూ కులమతాలకు అతీతంగా మసలాడు .ఒక బ్రాహ్మణ యువకుడితో ఏర్పడిన స్నేహంతో అతని తలిదంద్రులనే గురు దంపతులుగా భావించి సేవించి వేదవేదాంగ రహస్యాలు మంత్రాలు నేర్చాడు .15వ ఏట శివుడు యోగానంద మహర్షి రూపం లో వచ్చి అష్టాక్షరీ మహామంత్రం ,యోగాసనాలు ,పంచముద్రాది సాధనాలు నేర్పి ఇచ్చినమాట నిలబెట్టుకొన్నాడు పరమేశ్వరుడు .
సకలయోగ రహస్యాల ఆకళింపు తో వైకుంఠ పర్వతం పై కఠిన తపస్సు చేయగా మొదట మార్కండేయ , తర్వాత ఆదిశేష దర్శనం లభించింది .’’గురుదత్త బ్రహ్మర్షి’’ గా అబ్బూరుకు తిరిగి వచ్చాడు నారాయణ స్వామి యోగీంద్రుడు .కపిల గిరిలో గురువుగారు బ్రహ్మర్షి నారాయణ స్వామికి సుదర్శన మంత్రోపదేశం చేశారు .నిర్జన అరణ్యాలలో ఈ మంత్రాన్ని మూడు నెలలపాటు అహోరాత్రాలు జపించి ,అబ్బూరు తిరిగి వచ్చాడు .అప్పటినుంచి అబ్బూరు ఒక తీర్ధ క్షేత్రమే అయింది .1936లో 36వ ఏట తండ్రి నిర్మించిన లక్ష్మీ నారాయణ మందిరాన్ని చక్కగా అభివృద్ధి చేశారు .గురువు సిద్ధిపొందినతర్వాత గుర్వాజ్ఞ మేరకు కపిల గిరి పీఠాధిపతి గా అభిషిక్తులయ్యారు .తర్వాత వైకుంఠ పురం శేషాద్రిపై వెలసిన శ్రీ ,భూ సహిత వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కొంతకాలం తపస్సు చేసి మహిమలెన్నో చూపారు .దీనులను హీనులను ఉద్ధరించారు .నాస్తికులను ఆస్తికులుగా మార్చారు .ఆదర్శప్రాయ ఆదర్శ జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక భావ జ్యోతి ప్రకాశాన్ని అందిస్తూ విభవనామ సంవత్సర పుష్య భీష్మ ఏకాదశి నాడు 18-1-1989న 82వ ఏటఇహలోక యాత్ర చాలించి నారాయణ సాన్నిధ్యం పొందారు బ్రహ్మర్షి నారాయణ స్వామి .అబ్బూరులో ఆయన సమాధి స్థలం లో ఏటా ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-20-ఉయ్యూరు
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -18
ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -18
20వ శతాబ్ది సాహిత్యం -10
01914నుంచి 1945వరకు
నవల, చిన్న కధ-రియలిజం,మెటా ఫిక్షన్ -2
ధామస్ పించాన్అబ్సర్డిస్ట్ విధానం లో రాసిన అమెరికన్ రచయితలలో ముఖ్యుడు .అతడి నవలు కధలు చారిత్రిక విషయాలు ,కామిక్ ఫాంటసి ,కౌంటర్ కల్చర్ ల కలగలుపు తో రాసినవి .మృత్యుభయం ఆధారంగా ,మానసిక స్థితులను ‘’కాన్స్పిరసీస్ ఇన్ v-1963,ది క్రైయింగ్ ఆఫ్ లాట్ 49-1966,గ్రావిటీస్ రైన్ బో- 1973 లలో దట్టించి రాశాడు .అతని రచనలలో అంతస్సూత్రం ‘’ఇనెవభిలిటి ఆఫ్ ఎంట్రోపి’’అంటే శారీరక ,నైతిక శక్తుల విచ్చిన్నత .పించాన్ టెక్నిక్ తో ప్రభావితమై డాన్ లేలిలో ,పాల్ ఆస్టర్ లు రాశారు .విలియం ఎస్ బర్రోస్-ది నేకేడ్ లంచ్-1959 మొదలైన నవలల లో ప్లాట్ ,పాత్ర చిత్రీకరణ వదిలేసి తాగినవాడి అవ్యక్తప్రేలాపన తో వికారమైన ఆధునిక ప్రకృతిని వర్ణించాడు .వాన్ గట్,టెర్రీ సదరన్ జాన్ హాక్స్ వగైరా లు బ్లాక్ హ్యూమర్ ,అబ్సర్డిక్ ఫేబుల్ విధానాన్ని కొనసాగించారు .
జాక్ కేరౌక్ –ఆన్ దిరోడ్-1957,ధర్మా బమ్స్-1958,డేసో లేషన్ ఏంజెల్స్ -1965,విజన్స్ ఆఫ్ కోడీ-1972 నవలలో బీట్ కేరక్టర్లను సృష్టించాడు .జాన్ అప్ డైక్ రాసిన రాబిట్ ,రన్-1960 లో యువ ఆరం స్ట్రాంగ్ ,రాబిట్ రిదక్స్ ,హాల్డేన్ కాల్ ఫీల్డ్ ,జెడి సాలింజర్ నవలలలో –దికాచార్ ఇన్ ది రై ,రిచార్డ్ యేట్స్ నవల –రివల్యూషనరి రోడ్ లో ట్రబ్లింగ్ మాడం ,ఈ తరహా వాళ్ళే.
బార్త్ ,పించాన్ వగైరాలు నవల సమాజానికి దర్పణంగా కాదని భావిస్తే ,ఎక్కువమంది రచయితలు దర్పణమేననీ , సాంఘిక యదార్ధాన్ని కాదనలేమని అని సమర్ధించారు .మరికొన్ని స్వీయ పదాలు సృష్టించారు .ఆధునిక రచయిత .సాల్ బెల్లో తననవలలు- ది విక్టి౦-1947,దిఅడ్వెంచర్స్ ఆఫ్ ఆగీ మార్చ్ -1953,హెర్జోగ్ -1964,మిస్టర్ సామ్లేట్స్ ప్లానెట్-1970,హంబోల్డ్స్ గిఫ్ట్ -1975లలో అనేక శక్తుల ,బ్లాక్ హ్యూమర్ ల మిశ్రమం తో మానవుడిగా మసలుకోవాలని హెచ్చరిస్తూ రాశాడు .నగర వికార జీవితాన్ని సమకాలికులు కొందరు సాన్ బెల్లో కంటే ఇంకా బాగా చూసినా ,అతడి ముఖ్య పాత్రలు ‘’వేస్ట్ లాండ్ అవుట్ లుక్ ‘’ను తిరస్కరించి ,ఆధునికతతో కలిసి నడిచాయి .బెల్లో రాసిన తర్వాత నవలలలో జూడాయిజం ’ట్రాన్సెన్ డేషలిజం ,రుడాల్ఫ్ స్టీనర్ యొక్క కల్టిష్ థియాసఫీ వగైరా వైరుధ్యభావాలన్నీ వచ్చిచేరాయి .అయినా డార్కర్ ఫిక్షన్ గా –సీజ్ ది డే-1956లో నావెల్లాగా రాశాడు .ఇది అతడి బెస్ట్ వర్క్ .అల్లాన్ బ్లూమ్ –రెవిలిస్టీన్-2000, కలక్టేడ్స స్టోరీస్-2001 లో తన ఫిక్షనల్ కారక్టర్ ను రాసుకొన్నాడు .సాన్ బెల్లో మాత్రం పోర్త్రైటిస్టిక్ గా ,పోయేట్ ఆఫ్ మెమరిగా నిలిచాడు .
నలుగురు ఇతర జ్యూయిష్ రచయితలు –బెర్నార్డ్ ఆలమడ్,గ్రేస్ పేలీ ,ఫిలిప్ రోత్ ,ఐజాక్ బాషెవిస్ సింగర్ లు మానవ పరిస్థితులను హాస్యంతో ,క్షమా గుణం తో చూశారు .మలమడ్ రాసిన కథా సంపుటులు –మాజిక్ బార్రెల్ ,-1958,ఇడియట్స్ ఫస్ట్-1963లో డార్క్ కామెడీ తోపాటు హథోర్నియన్ ఫేబుల్ బాగా కనిపిస్తుంది .నవలలు –నాచురల్ -1952,ది అసిస్టెంట్ -1957,ఎ న్యు లైఫ్ -1961 ఆకర్షించే మంచి ఫిక్షన్ .ది అసిస్టెంట్ లో నైతికత తొంగి చూస్తుంది బాగా ప్రసిద్ధమైంది .పోలే కథలలో ఆఫ్ బీట్ ,కవితాత్మకత ,కుటుంబ జీవన వ్యంగ్యం ,అభి వృద్ది ధ్యేయ రాజకీయం ఉంటాయి.రోత్ రచనలలో క్రూర సెటైర్ సెక్సువల్ హై జింక్స్ కు ఉదాహరణలు .ఇతడి –పోర్ట్ నాయ్స్ కంప్లైంట్ -1969 వీటికి అద్దం.దిఘోస్ట్ రైటర్ ,-1979,దిఅనాటమీ లెసన్ -1983లలోబెడిసిన సాహసం కనిపిస్తుంది .తరువాత రచనలు –మై లైఫ్ ఆజ్ ఎ మాన్ -1974,ఆపరేషన్ షైలాక్ -1993,దికౌంటర్ లైఫ్ లలో ఆటో బయాగ్రఫికి ఫిక్షన్ కి ఉన్న సంబంధం వివరిస్తాడు .అతడి ‘’శబ్బత్ దియేటర్ -1995లో స్వయంగా జీవితాన్ని విచ్చిన్నం చేసుకొన్నా ఆర్టిస్ట్ గురించి ఉంది .అతడి అమెరికన్ ట్రయాలజి అమెరికన్ పాస్టోరల్,ఐ మారీడ్ ఎ కమ్యూనిస్ట్ ,ది హ్యూమన్ స్టెయిన్ లో 20వ శతాబ్ది అమెరికన్ చరిత్ర వర్ణన ఉన్నది.2004లో రాసిన –దిప్లాట్ అగైనెస్ట్ అమెరికా రెండవ ప్రపంచయుద్ధకాలం లో అమెరికాలో ప్రవేసించిన ఫాసిజం గరించి ఉన్నది .పోలాండ్ లో పుట్టిన రచయిత సింగర్ -1978లో కథాసాహిత్య నోబెల్ ప్రైజ్ విన్నర్ .వీటిని ఇద్ధిష్ భాషలో రాశాడు .న్యూయార్క్ సిటీ లోని అప్పర్ వెస్ట్ సైడ్ లో హోలోకాస్ట్ సర్వైవర్స్ అంటే జర్మనీలో యూదుల మారణ హోమం లో బతికినవారిని వేధించే అద్భుతకథనాల సమాహారం .ఈ కథలతో ఆధునిక ప్రపంచ కథా రచయితలలో అత్యంత ప్రభావ శీలకథానికా రచయితలలో ఒకడుగా నిలిచాడు సింగర్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ 27-8-20-ఉయ్యూరు
మనకు తెలియని మహాయోగులు 1
మనకు తెలియని మహాయోగులు-
1-ఖండయోగి మహామౌని -ఆదోని తిక్క లక్ష్మమ్మ -1815-1933
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని లో తిక్కలక్ష్మమ్మ మహా సమాధి తెలుగు కర్నాటక ప్రజలకు తీర్ధ యాత్రాస్థలం .ఆదోని దగ్గర మూసానపల్లె లో మాదిగ మంగమ్మ ,బండెప్పా దంపతులకు 1815లో జన్మించింది .బాల్యం నుంచే అన్నపానాదులు ఆటలు పై ఆసక్తిలేకుండా మౌనంగా ఉండేది .పెళ్లి చేస్తే దారిలోకి వస్తుందనే ఆశతో పెళ్లి చేసినా మార్పు రాలేదు .ఇరవై ఏళ్ళకే ఆదోనిపట్టణం వీధుల లో అన్నం నిద్ర లేకుండా ఎండా వానా లేక చేయకుండా ఏదో వెతుకు తున్నట్లు మౌనంగా కూనిరాగాలు తీస్తూ తిరిగేది .ఒక సత్పురుషుడు ఆమెను గుర్తించి మంత్రోప దేశం చేశాడు .
అప్పటి నుంచి గంటలతరబడి సమాధి స్థితిలోనే ఉండి పోయేది .సమాధి నుంచి లేచి వీధుల్లో తిరిగుతూ చెత్త వేసే తొట్టెలదగ్గర కూర్చోటం, పడుకోవటం చేసేది. అందరూ తొట్టి లక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ అనేవారు .ఆమె త్రికాలజ్ఞాని అనీ ,నిగ్రహానుగ్రహ సమర్దురాలని తెలిసినవారు మాత్రం ప్రేమతో భక్తితో ఆదరించేవారు .ఖండయోగం తో సహా చాలా మహిమలు చూపేది .దూర దృష్టి,దూర శ్రవణం ,పరచిత్తజ్ఞానం తో భక్తుల ఆర్తుల దీనుల సమస్యలను పరిష్కరించి మేలు చేకూర్చేది .ఆరుబయట పడుకున్నప్పుడు వర్షం పడితే, ఆమె మీద చినుకుకూడా పడేదే కాదు .రెండుమూడు రోజులు నిర్వికల్ప సమాధిలో బ్రహ్మానందాన్ని అనుభవించేది .శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి మంగళవారం 16-5-1933 ఉదయం 118వ ఏట దేహాన్ని చాలించింది .తర్వాత ఆమె పేరిట మఠం నిర్మించి ,ప్రతిశుక్రవారం విశేషపూజలు ,అభిషేకాలు చేస్తున్నారు .ప్రతియేటా ఆదోనిలో కర్ణాటకలోని రాయచూరుజిల్లా ఎలుబు గిరి లోనూ ఆరాధనోత్సవాలు వైభవం గా నిర్వ హిస్తారు .
2-ప్రవక్త నాయబ్ రసూల్ -1720-1780
సయ్యద్ హాజీ రహ్మ తుల్లా నాయబ్ రసూల్ 1720లో కర్ణాటక బీజాపూర్ జిల్లా బెల్గాం లో జుమ్మా మసీదు పాలన పోషణ ,పరిశుభ్రతల బాధ్యతలు చూసే ఇరాన్ దేశీయుడు హజ్రత్ ఖాజా ఆలం దంపతులకు జన్మించాడు .ఖాజా రహ్మతుల్లా అని పేరు పెట్టారు .ఏడేళ్ళకే ఖురాన్ కంఠస్టం గా వచ్చేసింది .8వ ఏట అరబ్బీ ,ఉర్దూ ,పార్శీ సాహిత్యాధ్యయనం చేసిన బాలమేధావి .తల్లి చనిపోతే సవతి తల్లి బాధ భరించలేక 15వ ఏట ఇల్లు వదిలి పవిత్ర ముస్లిం క్షేత్ర సందర్శనం చేస్తూ ,కర్నూలు జిల్లా నంద్యాల చేరాడు .అక్కడ హబీబా అనే పేదింటి పిల్లను పెళ్ళాడి ,ఆమె హఠాత్తుగా చనిపోవటం తో విరక్తితో కర్నూలు నవాబు సైన్యం లో సిపాయిగా చేరాడు .అప్పుడే మారిఫత్ ,తసవ్యుఫ్ అనే ఇస్లాం మత విషయాలు తెలుసుకోవాలనే కాంక్ష పెరిగింది .
అరేబియాకు చెందిన’’ హజ్రత్ అలవిబ్రుం రహమతుల్లా అల్లె’’కర్నూలు రాగా ఆయన్ను 12ఏళ్ళు దీక్షతో సేవి౦చి ఆధ్యాత్మ విజ్ఞానం ఆకళింపు చేసుకొన్నాడు .తర్వాత మక్కా చేరి ,’’అబ్బే కు౦బిన్’’కొండపై ఉన్నమక్కీ రహ్మతుల్లాను సందర్శించి ,దీవెనలుపొంది ,41రోజులు దీక్ష చేసి మహ్మద్ రసూలిల్లా సమాధి నుండి దివ్య సందేశం అందుకొనగా ప్రజలు ఆయనను ‘’నాయబ్ రసూల్ ‘’అంటే ప్రవక్త ప్రతినిధిగా పిల్చారు .ఎన్నో అద్భుతాలు మహిమలు చూపాడు .శిష్యులు చాలామంది చేరారు .
రహ్మతాబాద్ లో 1763లో ఒక మసీదు నిర్మించి ,దాని దగ్గర ఒక యోగాశ్రమ౦ నిర్మిచుకొన్నాడు .1780లో మెడమీద కంతి పెరగాగా మందుకై ,ఉదయగిరి కొండపైకి వనమూలికలకోసం వెళ్లి ,అక్కడే దేహం చాలించాడు .నెల్లూరు జిల్లా అనా సముద్రంపేట ప్రజలు ఆయన దేహాన్ని 1-4-1780న వికారి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు అనాసముద్ర౦పేటలొ సమాధి చేశారు .అప్పటినుంచి ప్రతియేటా అనాసముద్రం పేటలో నాయబ్ రసూల్ ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు .
ఆధారం –శ్రీ కొత్తపల్లి హుమంతరావు గారి ‘’మహాయోగులు ‘’పుస్తకం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-20-ఉయ్యూరు
ఫోన్ లో శ్రీ మైలవరపు రామ శేషుగారి సహృదయ స్పందన
ఫోన్ లో శ్రీ మైలవరపు రామ శేషుగారి సహృదయ స్పందన
ఈ సాయంత్రం ఒక అరగంట క్రితం గుంటూరు బ్రాడీ పేటనుంచి డా శ్రీమతి మైలవరపు లలితకుమారి భర్తగారు శ్రీ మైలవరపు రామ శేషుగారు ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా పావుగంట సేపు మాట్లాడారు .వారికి పంపిన సరసభారతి శ్రీ శార్వరి ఉగాది ఆవిష్కరణ మూడు పుస్తకాలు అందాయని ,పుస్తకాలు అంటే ఇష్టపడే తాను వీటినీ చాలా శ్రద్ధగా చదివి ఇప్పుడు ఫోన్ చేస్తున్నానన్నారు .వారి ఆనందం వర్ణనాతీతం అనిపించింది ‘’ఆనందం అంబరమైతే ‘’అన్నట్లు గాధ్వనించింది .ముందుగా’’ ఊసుల్లో ఉయ్యూరు’’ గురించి ప్రస్తావించారు .చిలకమర్తి వారి రచనతో సరితూగే ట్లుగా ఉందన్నారు .నేను ‘అంతపెద్ద వారితో నాకు పోలిక ఏమిట౦డీ?వారు మహానుభావులు సాహిత్య దిశా నిర్దేశం చేసినవారు ‘’అన్నాను .ఏమైనా తాను చెప్పింది కరెక్టే అన్నారు నవ్వాను .’’ఆ నాటి బ్రాహ్మణ కుటుంబాలలో ఉన్న సకల విషయాలు కళ్ళముందు ప్రత్యక్షం చేశారు .సూక్ష్మ పరిశోధన ,పరిశీలన అంతటా కనిపించింది పుస్తకం చేత్తో పట్టుకొంటే చివరిదాకా చదివే దాకా వదిలి పెట్ట బుద్ధికాలేదు .మంచి అనుభవాలు మాకు పంచినందుకు ధన్యవాదాలు ‘’అన్నారు.
.రెండవ పుస్తకం ‘’సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా ‘’యాత్రా పుస్తకాన్ని మెచ్చుకొంటూ ‘’మేమూ దేశం లో చాలా ప్రదేశాలను మా లీవ్ ట్రావెల్ కన్సెషన్ లో తిరిగి చూశాం .ఒంటి మిట్ట చూడలేదు .అది ప్రత్యక్షం చేశారు .నవ్యాంధ్ర రాకపోతే దాన్ని పట్టించుకొనే వారు ఉండేవారు కాదు ఆ చుట్టుప్రక్కల ప్రదేశాల విషయాలూ ఎవరికీ పెద్దగా తెలీవు వాటి వివరాలు బాగా చెప్పారు. చూడాలనే ఉత్సాహం కలిగించారు అక్కడ డాక్టర్ శివ ,శ్రీమతి పద్మజ దంపతుల గురించి ప్రత్యేకించి బాగా రాశారు ‘’అన్నారు ‘’అవునండీ .వారు చాలా సహృదయులు ఎవరిననైనా అలాగే ఆదరిస్తారు వెళ్ళాలను కొంటె మంచి సహకారం ఇస్తారు. దగ్గరుండి అన్నీ చూపిస్తారు ‘’ తప్పక వెళ్లి చూడండి ‘’అన్నాను .
మూడవ పుస్తకం ‘’ఆధునిక ఆంద్ర శాస్త్ర మణి రత్నాలు ‘’గురించి చెప్పారు .’’వీరిలో చాలామంది తెలుగు మీడియం లో చదివి ఉన్నత స్థానాలు పొందినవారే .ప్రతిభ ఉంటే తెలుగు మీడియం అడ్డు కాదు అనిరుజువు చేసినవారే .ఈతరం వారికి వీరిలో చాలామంది తెలియని వారే .వారందర్నీ ఏరికోరి బాగా పరిచయం చేశారు .వారి పరిశోధనా ఫలితాలు మనం అనుభవిస్తున్నాం .మీ మూడు పుస్తకాలు మూడు ఆణి ముత్యాలవంటివే ‘’అని మహా సంతోష పడ్డారు .
తర్వాత బంధుత్వం గురించి మాట్లాడుతూ ‘ మా అమ్మాయిని గుడివాడ దగ్గర కూరాడ అగ్రహారం గబ్బిట వారబ్బాయికి ఇచ్చి వివాహం చేశాం . అల్లుడు రైల్వే లో పెద్ద హోదా ఉన్న ఉద్యోగి .హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు .మాకు ములగలేటి వారుకూడా బంధువులే ‘’అన్నారు .నేను ‘’ములగలేటి వారమ్మాయే మా పెద్దకోడలు .వాళ్ళది నూజి వీడు దగ్గర ఈదులగూడెం ‘’అన్నాను .అయన మరీ సంతోషించారు .’’ఈ సారి గుంటూరు వస్తే మా ఇంటికి తప్పకుండా రావాలి .మీదంపతులతో పర్సనల్ గా మాట్లాడాలని మా దంపతులకోరిక .’’అన్నారు .గుంటూరు వస్తే తప్పక అలానే చేస్తామన్నాను .ఆయన ‘’మీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి ఉడతా భక్తి గా ఏదో ఇవ్వాలని ఉంది .అకౌంట్ నంబర్ వగైరా ఇవ్వండి ‘’అన్నారు .నేను ‘’మా దేవాలయానికి ప్రత్యేకంగా బాంక్ అకౌంట్ లేదు .రసీదు పుస్తకాలు లేవు. ఎవరైనా తోచింది పంపాలనుకొంటే నా బాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాను .దానికే పంపిస్తారు .మేము పుస్తకాలు ప్రచురించినప్పుడు అందులో వారిపేరు ఇచ్చిన డబ్బు రాసి కృతజ్ఞతలు తెలియజేస్తాం ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’పుస్తకం లో తెలియబర్చి నట్లు .అభ్యంతరం లేకపోతె అకౌంట్ నంబర్ ఇస్తాను ‘’అన్నాను .’’అయ్యయ్యో !ఇవ్వండి .పంపిస్తాను ‘’అన్నారు .వెంటనే ఇచ్చాను .
చివరగా మళ్ళీ వారు గుంటూరు పని లేకపోయినా తమకోసమైనా వారింటికి రావాలని కోరారు ‘’తప్పని సరిగా వస్తాము మీరూ ఉయ్యూరు వచ్చి మాఆతిధ్యం పొంది మా శ్రీ సువర్చలాన్జనేయస్వామిని దర్శించండి ‘’అన్నాను .సహృదయ స్పందన ఎంతో ప్రోత్సాహమిస్తుంది .వారికి ధన్యవాదాలు.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-20-ఉయ్యూరు
యోగి ఖాదర్షాబాబా
యోగి ఖాదర్షాబాబా
విజయనగరం జిల్లాలో వికారి సంవత్సర కార్తీక శుద్ధ చవితి బుధవారం హజరత్ ఖాజా ఖాదర్షావలీ బాబా పాదాలలో శుభాలక్షణాలైన శంఖు చక్రాలతో జన్మించారు .వీరి పూర్వీకులు తిరుచినాపల్లి రాజవంశానికి చెందినవారు .అక్కడినుంచి విజయనగరం వచ్చి స్థిరపడ్డారు .కైలాసపతి శివుడే జన్మించాడని అందరూ భావించారు .బాల్యం లోనే సాదు సత్పురుషుల బోధలు విని జ్ఞానం పొందేవారు .స్థానిక హైస్కూల్ లో చదివారు .ఒక రోజు తండ్రి నాగపూరులో లోఉన్న అయిదుగురు సాధువులకు తలా ఒక రాగికానీ ఇస్తానని మొక్కుకొన్నానని, ఇప్పటిదాకా ఇవ్వ లేకపోయానానని ,వెళ్లి వారిని గుర్తించి అందజేయమని పంపించారు .నాగపూరు చేరినరోజే ఇక్కడ తండ్రి చనిపోయాడు .నాగపూర్లో వేలాది శిష్యులున్న తాజుద్దీన్ బాబాను దర్శించారు .ఈ బాబా ఖదర్షా బాబా ను లోకొద్ధరణకోసం ప్రేరేపించి ఉపదేశించారు .మూడు రోజులు జ్ఞానబోధ చేశారు .’’ఖాదర్ అంటే నేనే ‘’అని ఆయన్ను ముఖ్య శిష్యుడిగా స్వీకరించాడు .తిరిగి విజయనగరం వచ్చి స్థానిక నల్ల చెరువు గుట్ట మీద 15ఏళ్ళు నిద్రాహారాలు మాని మౌనంగా దీక్షగా తపస్సు చేశారు .తర్వాత స్థానికుల కోరికపై మైదానప్రాంతానికి వచ్చారు .అక్కడ విశాలమైన ప్రాంతం లో ఒక ప్రార్ధనామందిరం దర్గా ఏర్పడింది. వసుధైక కుటుంబం ధ్యేయంగా బోధనలు చేశారు .చేతి స్పర్శతో ఎంతటి రోగామైనా తగ్గించే వారు .ఇక్కడ రాజు సామాన్యుడు ఒకటే .కులమతజాతి భేదం లేదు గులాబిరేకులు చిటికెడు విభూతి మాత్రమే బాబా ఇచ్చే మందు .రమణమహర్షి సత్యసాయిబాబా వంటి మహానుభావులు బాబా దర్శనం చేసి ఆశీస్సులు పొందారు .విజయనగరం జైపూర్ మహా రాజాలుకూడా బాబా ఆశీస్సులు అందుకొంటూ తరచూ దర్శనం చేసుకొనేవారు .బాబాపాదాలలో ఉన్న శంఖు చక్రాలే సర్వ జన రక్ష . కనుక బాబా పాదరక్షలకు భక్తిగా జనం మొక్కుతారు .అప్పటి నుంచి అక్కడ ఉన్న ఎనిమిది వృక్షాలను అ స్టదిక్పాలకులుగా భావిస్తారు .ఇక్కడి దాక తెలిపిన వృత్తాంతం అంతా యు ట్యూబ్ వీడియో కథనం. శాంతి సర్వమత సమానత్వం ,సకలజీవులపట్లమమకారం ప్రేమ ఆలంబనగా ,మానవాళి జాగృతికోసం జ్ఞానయోగ మార్గంగా సూచిన్చిందే సూఫీ మతం .ఈ సూఫీ మతాన్ని ఆదర్శంగా ఖాదర్షాబాబా ప్రచారం చేశారు
ఇక పై రాసింది అంతా శ్రీ భోగరాజు వెంకటరామయ్య కవి గారు రాసిన ‘’ఖాదర్షా బాబా శతకం ‘’ ఆధారం గా రాసింది .
బాబా చిన్నతనం లో పాలిచ్చే దాది ఇంట్లో నిద్రిస్తుంటే ,ఆ వీధిలోని ఇళ్ళన్నీ అగ్నికి ఆహుతికాగా ఈ ఒక్క ఇల్లు మాత్రమె కాలకుండా ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది .ఎప్పుడైనా ఈ పిల్లాడిపై తల్లికి కోపం వచ్చి కొడితే ,వెంటనే ఆమెకు జ్వరం వచ్చేది .ఒకసారి గుర్రపు స్వారీ చేస్తూ వెడుతుంటే ఐదు తలల నాగుబాము కన్పించి ,ఆ రోజు రాత్రి కలలోకూడా కన్పించి ‘’నువ్వు గంధర్వుడివి .అందుకే కనిపించాను ‘’అని చెప్పింది .చుట్టుప్రక్కలవారు ఇవన్నీ విని ఆయనను భక్త ధృవ ,భక్త ప్రహ్లాదునితో పోల్చేవారు.అంతటి భక్తీ తాదాత్మ్యం అలవడ్డాయి .
గురువు ఆజ్ఞ పొంది ఒక కొండపై తీవ్ర తపస్సు చేశారు బాబా .అప్పటినుంచి ఆకొండ ప్రపంచంలో గొప్ప క్షేత్రమైంది .సింహాచలం ,రామతీర్ధం మొదలైన వాటికి ఎంతటి ఖ్యాతి వచ్చిందో ఖాదర్షా బాబా తపస్సు చేసిన కొండకు అంతటి పేరు వచ్చింది .జనాలకు తత్వజ్ఞాన బోధ చేసే సంకల్పం ,ఐహిక సుఖాలన్నీ త్యాగం చేసి ‘’ ఖాదిరీ పదివి ‘’స్వీకరించారు బాబా .భద్రుడు తపస్సు చేసిన కొండ భద్రాద్రి అయినట్లు, బాబా తపస్సు చేసిన ‘’నల్ల చెరువు గుట్ట ‘’ ‘’ఖాద్రీ నగరం ‘’అనే మహా క్షేత్రం గా వర్దిల్లింది .గురూప దేశ మంత్రాన్ని దీక్షగా నిశ్చలమనసుతో జపించి తపస్సు చేసినందుననే మహాత్ముడయ్యారు .ఎండా వానా లెక్కచేయక ,క్రూరసర్పాలు మృగాలకు ఆలవాలమైన ఆ కొండపై దీక్షగా తపస్సు చేశారు బాబా .చుట్టూంతా గుట్టలు రాళ్ళు ముళ్ళపొదలు తో ఉండే ఆప్రదేశం బాబా వలన మంచి దారులు ఏర్పడి ,కార్లతో హాయిగా రోజుకు పది వేలమంది భక్తులు దర్శించే మహా క్షేత్రంగా అభి వృద్ధి చెందింది .జతిమతాలు లేకుండగా అన్ని జాతులవారేకాక అక్కడి జంతువులూ పక్షులు కూడా పరస్పర వైరాలు మాని సఖ్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది .బాబా ఒకసారి తీవ్ర తపస్సు చేస్తుంటే పెద్ద తుఫాను విరుచుకు పడినా చలించక కదలక తదేకంగా తపస్సు కొనసాగించారు .అప్పుడు ఒక త్రాచు పాము వచ్చి ఆయన రెండు పాదాలను పట్టుకొన్నది శరణు వేడినట్లుగా .వడగళ్ళ వాన వచ్చినా చలించని దీక్షతో తపస్సు చేశారు .వంటవారు వంటలు భోజనాలకు చాలా ఇబ్బందికలిగిస్తోంది వాన దయచూడుబాబా అని ప్రార్ధిస్తే వర్షపు హోరు లేకుండా చేశారుబాబా .
ఒకనాడుఒక వేశ్య బాబా సేవకై వస్తుంటే ,ఆతన తపస్సు మహాత్మ్యం వలన ఒక పాము ఆమె రెండు కాళ్ళను చుట్టేసింది .భయపడ్డ ఆమెకు సద్బుద్ధి ప్రసాదించి కాపాడారు .అర్ధరాత్రులలో రెండుప్రక్కలా రెండు పులులతో బాబా ‘’షైరు’’ చేసేవారు .డాక్టర్లు కూడా తగ్గించలేని జబ్బులతో బాధపడే వారు బాబా ను దర్శిస్తే రోగాలు యిట్టె మాయమయేవి . .హస్తవాసి మంచిదని వాసుదేవుని వంటి చల్లని స్వామి అని ప్రజల నమ్మకం .
బాబా పై ఈ శతకం రాసిన కవి శ్రీ భోగరాజు వెంకటరామయ్య గారు 24ఏళ్ళనుంచి కడుపు శూల తో బాధపడుతూ ఎందరు డాక్టర్లకు చూపించినా తగ్గకపోతే బాబా దగ్గరకు వచ్చారు .ఇష్టం వచ్చినవన్నీ హాయిగా తినమని ,పద్యం గిత్యం జాన్తా నై అని చెప్పి చిటికలో నయం చేశారు బాబా .కవిగారు తనకు ఏ పదార్ధాలు కూరలు పడవని చెప్పారో వాటినే తినమని చెప్పి తినిపించి శూల బాధ నివారించారు .
బాబా దర్బారులో గానా బజానా జరుగుతున్నా వినీ విననట్లు చూసీ చూడనట్లు ఉంటూ విజ్ఞాన మౌనంతో తదేక దృష్టి తో దీక్ష కొనసాగించటం బాబా ప్రత్యేకత .బాబా అనుగ్రహం తో ఇచ్చే ఫలమైనా విభూతి అయనా గడ్డిపరకైనా రోగాలు, హాహాకారాలు మానిపోయేట్లు చేస్తాయి .అన్నిరకాల రోగులు మానసిక రోగులు మూర్చరోగులు కూడా వచ్చి బాబా అనుగ్రహంతో వ్యాధులనుపోగోట్టుకొని హాయిగానవ్వుకొంటూ వెళ్తారు..మహా వేదాంతులు ,బహు శాస్త్ర పారంగతులు ,శాస్త్రవేత్తలు దైవజ్ఞులు ఐశ్వర్య సంపన్నులు బాబా పాదాలకు మ్రొక్కి భక్తితో సేవించటం మహాదాశ్చర్య విషయం .కలియుగ ప్రత్యక్ష దైవం గా ఖాదర్షా బాబాను విశ్వసిస్తారు .అని కవిగారు చాలా భక్తిగా ఆర్తిగా బాబా చరిత్ర రాశారు .వీరు ఆంద్ర దేశ అక్షరాస్యులకు చిరపరిచితులైన కవి శేఖరులు , విజయనగర ఆస్థాన కవీశ్వరులు శ్రీ భోగరాజు నారాయణ మూర్తిగారి తమ్ములు.దీనికి ముందుమాట ను విజయనగరం మహారాజాకాలేజి రిటైర్డ్ సీనియర్ తెలుగుపండితులు శ్రీ అడిదం రామారావు గారు రాశారు .ప్రముఖకవి శ్రీ విశ్వనాథ కవిరాజు ఆశీస్సుల౦ది౦చారు .పుస్తకముద్రణకు ధనసాయం చేసినవారు శ్రీ రామ చంద్రుని రామారావు పంతులుగారు .వీరంతా ఖాదర్షా బాబా భక్తులే ..ఈ శతకం 1946లో ముద్రింపబడింది .కవిగారి కొన్నిపద్యాలురుచి చూద్దాం
‘’మద క్రోధద్వయ నాశాకారి వగుటన్ ,మత్తేభ శార్దూలముల్ –ముదమారంగాను సూటినిం గలిపి నే ముత్తెంబులున్ వజ్రముల్ -గదియం గల్పుచు మాల గూర్చి ఇడితోఖాదర్ష బాబా ,భవ-త్పద భక్తిన్నిది కంఠమందు ధరియింపం గోరి మన్ని౦పుమా ‘’
‘’బ్రహ్మయో విష్ణువో శివుడో తాజుద్దీన్ రూపంబు తో –గరుణంబెట్టెననంగజాలు ఘనుడౌఖాదర్షబాబాగురూ’’
‘’బుధు లొందుంగలశంఖ చక్రములు నీ పూజ్యంబు పాదంబులన్’’
‘’నిన్నుం బోల్చగావచ్చు నాధృ వునితోనిక్కంబు ప్రహ్లాదుతో ‘’
‘’సకలైశ్వర్య సమున్నతి౦ గలిగి ,తత్సౌఖ్యంబు లాసి౦చ కే -సకలో త్కృష్టఖాడిరీపదవికి సంకల్ప మున్ బూని ‘’
‘’ఈ రీతిన్ పరమాత్ము తోసముడవైయీ పర్వతారణ్యముల్ ఘోర౦బయ్యెడి క్రూర జంతుభయముల్ ఖూనీలు చోరీల౦గల హత్యలున్ గలస్థాలిన్,సుక్షేత్రమున్ జేయు నీ –కౌరాసాటియేలోకమందు కనగా ఖాదర్ష బాబా గురూ ‘’
‘’అహాహా నీ ఇరు ప్రక్కల౦ బులులు రెండౌ యర్ధరాత్రంబు నన్-బహు భక్తి౦ నడువ’’
‘’ఏ రూపంబును నెట్టి రోగి యయినన్ నీక్షించాగా నంతనే యా రోగంపు బలంబు తగ్గి మనమానంద ధైర్యంబు లవ్వారినింబొందునోయట్టిరూపయుతుడౌస్వామిసదానంద వే మారుల్ మ్రొక్కెద’’
‘’ప్రత్యక్షంబగు దైవమీవ యనుచున్ భక్తాళి నేవ్వళలన్ –సత్యాసత్యవివేక జ్ఞాన మిడుచున్ సన్మార్గులు౦ జేయుచున్ ‘’
‘’జాలంబింతకు జేయకయ్య సతతమున్ సద్భక్తితో గొల్చెదన్ –కాలంబింతయు వ్యర్ధ పుచ్చకయనే ఖాదర్ష బాబా గురున్ –బోలెం జాలెడు వారు లేరనుచు నిబ్భూమి౦ దగన్ జాటెదన్ –పాలించంగను జాగు సేయకుము యో బాబా నమస్కారముల్ ‘’
అంటూ శతకం ముగించారు కవి ధారాశుద్ధి భక్తీ అంకితభావం అవగాహన ,బాబా మహిమా నిరూపణం తో కవిత్వం చిందులు త్రోక్కింది .ఆదర్శ పురుషుడు ఖాదర్షా బాబా చరిత్రను లోకానికి తెలియ జేసిన కవి శ్రీ భోగరాజు వెంకటరామయ్య ధన్యులు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-20-ఉయ్యూరు
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -17
ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -17
20వ శతాబ్ది సాహిత్యం -9
01914నుంచి 1945వరకు
నవల, చిన్న కధ-రియలిజం,మెటా ఫిక్షన్
సాంస్కృతిక ప్రభావం కలిగించి ప్రపంచయుద్ధ టెక్నలాజికల్ హారర్ నుంచి మళ్లించిన ఇద్దరు రచయితలు నార్మన్ ,మైలర్-ది నేకేడ్ అండ్ ది డెడ్-1948,ఇర్విన్ షా –ది యంగ్ లయన్స్ -1948 నవలలలు యుద్ధ సంబంధ రియలిస్టిక్ నవలలు .మైలర్ నవలలో కొన్ని భావాలు ఫాసిస్ట్ ధోరణి ,అధికారం పై దాడి మిలిటరీ మైండ్ కనిపిస్తాయి .జేమ్స్ జోన్స్ రాసిన ట్రయాలజి -ఫ్రం హియర్ టు ఎటర్నిటి,ది ధిన్ రెడ్ లైన్ ,విజిల్ నవలలలో యుద్ధ భీభత్సాన్ని అత్యంత దగ్గర గా నిశితంగా ప్రత్యక్షంగా ,చూసిన అనుభూతి ,మంటగలిసిన మానవత్వం ,మిలిటరీ డిసిప్లిన్ పై ఏహ్యభావం కనిపిస్తాయి .యువ రచయితలను హీరోషీమాపై బాంబు దాడి మానవ హనననం కలచి వేసింది. వాస్తవం బోధపడి ,ఆ పీడకలను మర్చిపోకుండా చేసింది .జోసెఫ్ హేల్లర్ –కాచ్ -22లో మిలిటరీ మనస్తత్వాన్ని సర్రియల్ బ్లాక్ కామెడి ను ‘’కాఫ్కా హారర్’’ తో జోడించి రాశాడు .దీనికికొనసాగింపుగా క్లోజింగ్ టైం-1994 ను యుద్దకాల తరం ఎలిజీ –శోక కావ్యం గా మలిచాడు .కర్ట్ వానెట్ జూనియర్ –స్లాటర్ హౌస్ ఫైవ్ -1969నవలలో మిత్ర దేశాలు జర్మన్ సిటి డ్రెస్ డైన్ పై బాంబు దాడిని డార్క్ ఫాంటసి ,తిమ్మిరి సిల్లీ హాస్యం కలగలుపుగా రాశాడు .తర్వాత ఇదే విధానం వియత్నాం యుద్ధం పై సర్రియలిస్టిక్ గా టింఓ బారెల్ –గోయింగ్ ఆఫ్టర్ కోసియాటో-1978 నవలలో ,కథా సంపుటి-దిధింగ్స్ దే కారీడ్-1990లో వాడాడు .
ఆటం బాంబ్ వలన అమెరికన్ రచయితలు బ్లాక్ కామెడీ,అబ్షర్డ్ ఫాంటసి కే బాగా జైకోట్టారు .దీనికి నేచురలిస్టిక్ విధానం చాలదని ,ఆనదని , ,సమకాలీన జీవిత వర్ణనకు స్పీడ్ కు అది ఇమడదని భావించారు .విపరీతమైన స్వీయ చేతన తోతనకు తగిన ఏర్పాట్లతో ఫిక్షన్ వచ్చింది .ప్రాతినిధ్యవిధానం ను ప్రశ్నిస్తూ ,అప్పుడప్పుడు పాత ఫిక్షన్ ను ఇమిటేషన్, పేరడీ కలుపుతూ సాంఘిక యదార్ధాన్ని కాదని రచనలు చేయటం మొదలైంది .రష్యన్ రచయిత నేబకోవ్ ,అర్జెంటీన రచయిత జార్జ్ లూయిస్ బెర్జర్ లు ఈ కొత్త తరహా ‘’మెటా ఫిక్షన్ ‘’కు అమెరికన్ రచయితలకు ప్రేరకులై నిలిచారు .నబకోవ్ 1945లో అమెరికా పౌరుడయ్యాడు . ననెబకోవ్ అద్భుతం గా పోత ఫిక్షన్ ను భాషా శాస్త్ర ౦ గా అధికారిక ఆవిష్కరణగా సాహిత్య సృష్టి చేశాడు.కొంత కృత్రిమత ఉన్నా అతడి నవలలు –లోలిత ,-1955,PNIN -1957,పేల్ ఫైర్-1962 నవలలు పూర్తిగా స్వీయ రచనలే పెర్సనల్ ఫిక్షన్ అన్నమాట .వాటిలో బలీయమమైన ఎమోషన్ అంతస్సూత్రంగా కొనసాగుతుంది .
1967లో జాన్ బార్త్-‘’ది లిటరేచర్ ఆఫ్ EXHAUSTION’’లో నెబకోవిక్ ,బోర్జెక్ అమెరికన్ సాహిత్యం సృష్టిస్తున్నట్లు తెలిపాడు .రియలిజం ను పాతబడిన విధానం అని చెప్పి ,బార్త్ తననవలలు నవల పద్ధతిని అనుకరిస్తూ అంటే రచయిత –రచయిత పాత్ర పోషించినట్లు ఉంటాయన్నాడు .నిజానికి అతడి పూర్వ ఫిక్షన్ –ది ఫ్లోటింగ్ ఓపెరా ,-1956,ది ఎండ్ ఆఫ్ ది రోడ్-1958లలో రియలిస్టిక్ ట్రడిషన్ కొద్దోగొప్పో ఉన్నవే .తర్వాత రచనలలో సంప్రదాయ పద్ధతులను పారడీ చేయటం అనుకరించటంచేశాడు .అతడి చారిత్రాత్మక నవల –ది సాట్ వీడ్ ఫాక్టర్-1960,గైల్స్ గోట్ బాయ్ -1966లో గ్రీకండ్ క్రిస్టియన్ మిత్స్ ఉన్నాయి .అతడి ఎపిస్టోలరి-నైరూప్య సంబంధ నవల ‘’లెటర్స్ ‘’-1979.ఇలాగే డోనాల్డ్ బార్త్ ల్మ్ –షో వైట్ -1967లో ఫైరీ టేల్ ను హేళన చేశాడు .ది డెడ్ ఫాదర్ లో ఫ్రాయిడ్ ఫిక్షన్ ను మాక్ చేశాడు .చిన్న కథారచానలోనూ,పారడీలలో కారి కేచర్ లలో గొప్ప విజయమే సాధించాడు .అతడి అన్ స్పీకబుల్ ప్రాక్టిసేస్,అన్ నేచురల్ యాక్ట్స్-1968,సిటీ లైఫ్ -1970,,గిల్టీ ప్లజర్స్ -1974లలో సమకాలీన శైలికి ప్రాణం పోశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-20-ఉయ్యూరు.
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం )
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం )
మొహ౦జ దారో- హరప్పా-2
హరప్పా-
లాహోర్ –ముల్తాన్ రైలు మార్గం లో ముల్తాన్ కు ఈశాన్యంగా షాహీ వాల్-చించి వాట్మీరాల్ స్టేషన్ల మధ్య హరప్పా ఉన్నది .హరప్పా రోడ్ రైల్వే స్టేషన్ లో దిగి రెండు మైళ్ళ దూరం లో ఉన్న శిధిలాలను చూడాలి .ఇది పాకిస్తాన్ పంజాబ్ లో మాంట్ గోమరి జిల్లాలో ,రావీ నదిఎడమగట్టు మీద ఉంది .ఊరంతా దిబ్బలే .స్థానికులు ‘’హడప్పా’’అంటారు .హడ్ నా అంటే ము౦చి వేయటం .రావీ నది ముంచటం లేక మింగటం వలన ఈ పేరే స్థిరపడింది .ఇది చాలా విచిత్రంగా వెలుగులోకి వచ్చింది .
లాహోర్ –ముల్తాన్ రైలు మార్గం కోసం కూలీలు త్రవ్వుతుంటే ప్రాచీన నగర శిధిలాలు కనిపిస్తే ,పురాతత్వ శాఖ త్రవ్వకాలు జరిపించింది .1921-34వరకు 13ఏళ్ళు ఏం ఎస్ వాట్స్ ,సర్ మార్టి మర్ వీలర్ అనే పురాతత్వశాఖ అధికారులు త్రవ్వకాలు జరిపించారు .మొహంజదారో ,హరప్పాలు పాకిస్తాన్ లో ఉండటం వలన ,భారత పురాతత్వ శాఖ అధికారులు గుజరాత్ లోని లోథాల్,రాజస్తాన్ లోని కాళీ బంగాన్ లో త్రవ్వకాలు జరిపించి ,ఇక్కడ కూడా అదే సంస్కృతి ని కనిపెట్టారు .ఈ సంస్కృతీ ఒకప్పుడు పశ్చిమ పంజాబ్ ,రాజస్తాన్ గుజరాత్ లవరకు వ్యాపించి ఉందనే నిర్ణయానికి వచ్చారు .ఈ త్రవ్వకాలలో డాక్టర్ ఇంగువ కార్తికేయ శర్మ సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ గా ఉన్నారు .ఇక్కడి త్రవ్వకాలలో చాలా విషయాలు ఆయన కనుగొన్నారు .
ఈ రెండు మహానగరాలల త్రవ్వకాలను బట్టి మనకు తెలిసిన విషయాలేమిటో రామ చంద్ర తెలియజేశారు .మాహాయన బౌద్ధుల మొదటి బుద్ధ చరిత్ర అయిన ‘’లలిత విస్తరం’’ లో బుద్ధుడికి వచ్చిన లిపులలో పాదలిఖిత లిపి,ద్విరుక్త పద సంధి లిపిఉన్నాయి .ఇవి ఒకపదం లో ఒకభాగమైన లిపి .అంటే పదాల చేరికవలన ఏర్పడిన లిపి .ఈజిప్ట్ చిత్ర లిపిలాగా మొహంజో దారో-హరప్పా చిత్ర లిపి కూడా మొదట్లో వస్తురూప బొమ్మలతో తర్వాత ,వస్తువును సూచించే పడభాగం ,పదం మొదటి అక్షరంగా అయి ఉంటుంది .దీనినుంచే బ్రాహ్మీ లిపి పుట్టి ఉంటుంది .ఈజిప్ట్ లిపి , ,బ్రాహ్మీ లిపి , ప్రపంచం లో మరెన్నో లిపులు ‘’ద్విభాషా శాసనం ‘’వల్లనే సాధ్యమౌతాయని తన నమ్మకంగా రామచంద్ర ఉవాచ .అంతేకాక ఒక చెట్టుకొమ్మ ,దానిమీద కొంతఎడంగా రెండుపిట్టలు కిందు మీదులుగా కూర్చున్నట్లు ఉన్న ముద్రిక ను చూస్తే ఋగ్వేద రుక్కు –
‘’ద్వా సుపర్ణా సయుజా సఖాయా –సమాన వృక్షం పరిషస్వజాతే-తయో రన్యః పిప్పలం సాద్వత్తి-అన్నశ్నన్ననోఅభిజా కపీతి’’
భావం -స్నేహంతో కలిసి తిరిగే రెండు పక్షులు ,సమంగా ఒక చెట్టును అంటిపెట్టుకొని ఉన్నాయి .అందులో ఒకటి తియ్యని రావిపండు తింటోంది .ఎండోది పండు తినకుండా సాక్షిగా చూస్తోంది .
అలాగే యోగి ముద్రబొమ్మ ,గంగడోలు నేలమీదకు వ్రేలాడే ఆవులో ఎద్దులో బొమ్మలు ,దేవతా విగ్రహాలు వగైరాలన్నీ ఆర్య సంస్కృతికి ,ఋగ్వేద సంస్కృతికి చిహ్నాలే అన్నారు రామ చంద్ర .డాక్టర్ సునీత్ కుమార్ చటర్జీ చెప్పినట్లు మన సంస్కృతి ఆర్య ,ఆర్యేతర సంస్కృతీ సమ్మేళనం .అది స్నేహంతో జరిగిందేకాని యుద్ధం వల్ల వచ్చి౦ది కాదు .
‘’సా రమ్యా నగరీమహాన్ స నృపతిః-సామ౦త చక్రం చ తత్ –పార్శ్వేతత్ర చ సా విదగ్ధ పరిషత్ –తాః చంద్ర బింబాననాః-ఉద్వృత్త స్స చ రాజపుత్ర నివహః –తే వందినః తాఃకథాః-సర్వం యస్య వశా దగాత్ స్మృతి పథం-కాలాయ తస్మై నమః ‘’
భావం –ఆ అందమైన నగరం ఆగొప్ప రాజు ,అతని సామంతరాజుల బృందం ,,అతని ప్రక్కన ఉండే పండిత పరిషత్తు ,,అ చంద్రముఖులైన సుందర నారీమణులు ,బలిష్టులైన ఆ రాజకుమారుల సమూహం ,ఆ వంది మాగధులు ,ఆ కథలూ, కమా మీషూ అంతా ఎవరివలన స్మరించ దగింది ఐనదో ,అలాంటి కాలపురుషుడికి నమస్కారం .
క్రీ పూ .3300 సంవత్సరాల క్రితం హరప్పానగరం లో 23,500మంది ప్రజలు నివాసాలు ఏర్పరచుకొని ఉన్నారు .ఇది సింధులోయ నాగరకత ఉన్న కంచుయుగం .వ్యవసాయం వాణిజ్యం బాగా జరిగాయి .ఎడ్లబళ్ళు ,పడవలమీద రవాణా జరిగేది .హరప్పానుంచి ఈజిప్ట్ లోని మెసపొటేమియా వరకు సముద్ర వ్యాపారం బాగా జరిగేది .దుంగలతో చేసిన తెరచాప పడవలే రవాణా సాధనాలు .గోధుమ బార్లీ ముఖ్యపంటలు .తర్వాత ఎప్పుడో 2వేల ఏళ్ళ తర్వాత గోధుమ పండించటం ఐరోపా దేశాలలో వచ్చింది . రాగి కంచు వాడారు .ఇనుము అప్పటికి వాడుకం లోకి రాలేదు .కోడిపందాలు జరిగేవి .శక్తిని ,పశుపతిని ఆరాధించేవారు ఇక్కడ కుష్టు ,క్షయ వ్యాధులు ఉండేవి .అనారోగ్యం గాయాలు వలన ఈ నగర నాగరకత నాశనం అయినట్లు కనుగొన్నారు.
క్రీ పూ 1800నాటికీఈ నాగరకత బలహీన పడటం ప్రారంభమై క్రీపూ 1700 కుమహానగారాలన్నీ పూర్తిగా పాడు పడిపోయాయి .ఈ నాగరకత ఒక్కసారిగా మాయమవలేదు .హరప్పా నాగరకత క్రీ.పూ.1000-900 దాకా కొనసాగింది .ఈ నాగరకత క్షీణించ టానికి ముఖ్య కారణం వాతావరణ మార్పు అన్నారు .క్రీ.పూ.1800 వచ్చేసరికి ఈప్రాంతం బాగా చల్లబడి ,తేమ రహితమైనది ,ఋతుపవనాలు రాలేదు .షుగ్గర్ హక్రా నదీ వ్యవస్థ అదృశ్యమై పోవటం భూమి అంతర్భాగ నిర్మాణం లో మార్పు కూడాకారణం కావచ్చు నని ఊహాగానాలు .నిజం నిర్ధారించబడలేదు .ఏమైనా ఒక గొప్పనాగారకత కాలగర్భం లో కలిసిపోవటం బాధాకరం .
సమాప్తం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-8-20-ఉయ్యూరు
సెప్టెంబర్ 1మంగళవారం నుంచి” శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం
సాహితీ బంధువులకు శుభ కామనలు.గత నెలరోజులుగా సరసభారతి ఫేస్ బుక్ ద్వారా 1-అనంతకాలం లో నేనూ 2-భారతీయ విజ్ఞాన సర్వస్వం- భారతం 3-శ్రీ హనుమత్ కథానిది 4-శ్రీ ఆంజనేయస్వామి మహాత్మ్యం ప్రత్యక్ష ప్రసారం వీక్షించినందుకు ధన్యవాదాలు .నిన్నటితో ఈ కార్యక్రమాలు పూర్తయ్యాయి .ఒక వారం విశ్రాంతి ఇచ్చాము .
మళ్ళీ సెప్టెంబర్ 1 మంగళవారం భాద్రపద పౌర్ణమి ఉదయం 10గంటలనుంచి ప్రత్యక్ష ప్రసారంగా ‘’శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర వైభవం ‘’ధారా వాహికం గా అంద జేస్తున్నాము . సెప్టెంబర్ 2బుధవారం భాద్రపద బహుళ పాడ్యమి నుంచి’’ ‘’మహళాయ పక్షాలు ‘’ప్రారంభం కనుక, పుణ్య శ్రవణ,వీక్షణం గా శ్రీ లలితా పరాభట్టారికా నామ విశేషాలు ప్రత్యక్ష ప్రసారంగా అందిస్తున్నాము .వీక్షించ వలసిందిగా మనవి . మీ –గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -25-8-20 –ఉయ్యూరు ,
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-23
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-23
మొహ౦జ దారో- హరప్పా
1922లో మొహంజదారో హరప్పా ల త్రవ్వకాలను గురించిచదివిన రామచంద్ర వాటిని చూడాలని లాహోర్ నుంచి స్నేహితుడితో రైలులో రోహ్రీ లో దిగి అక్కడ సి౦ధు నదిపై ఉన్న రైలు వంతెన బెజవాడ కృష్ణ రాజమండ్రి గోదారి రైలు వంతెనలకన్నా పెద్దదిగా ఉన్నా ,భయంకరంగా కనిపించింది హైదరాబాద్ లోని సింద్ దగ్గర స్నానఘట్టం లో స్నానం చేశారు .ఎవరైనా ఇక్కడే స్నానం చేయాలట .అక్కడ ‘’ముష్టిగ్రాహ్య స్తనులు ,వ్యామగ్రాహ్య స్తనుల’’వరకు ఆడవాళ్ళు తువ్వాళ్ళు కట్టుకొని స్నానం చేయటం చూసి ఆశ్చర్యపోయారు .ఇక్కడ అంతే కంగారు పడక పవిత్ర సింధు స్నానం చేయమని చెప్పాడు మిత్రుడు
స్నానం తర్వాత మొహ౦జొ దారో బస్సులో బయల్దేరారు కరాచీ తర్వాత హైదరాబాద్ సింద్ పెద్ద పట్నం .రోహ్రీజంక్షన్ దగ్గరే సుక్కూరు జలపాతం .కనిపించింది .ఇక్కడ మొహంజొదారోశిధిలాలను వీళ్ళు’’ మొ-ఎన్-జో-దడో ‘’అంటారు .అంటే ‘’మృతుల దిబ్బ’’ అని అర్ధం ఇప్పటి పాకిస్తాన్ సింధు రాష్ట్రంలో లార్ కానా జిల్లా లార్ కానా పట్టణానికి పది మైళ్ళ దక్షిణాన ,దాదాపు యాభై మైళ్ళు పశ్చిమాన సింధు నది గట్టున ఉన్నది .ఇది సింధు రాష్ట్ర రాజధాని కరాచీకి 320 మైళ్ళ ఉత్తరాన ఉంది . సింధు నది గట్టు న కొన్ని శిధిలాలున్నాయి .వీటిని పాత దిబ్బలు అనుకోని పురాతత్వ డైరెక్టర్ సర్ జాన్ మార్షల్1921-27కాలం లో మూడుమైళ్ళ వైశాల్యం లో త్రవ్వించాడు .వరుసగా ఏడెనిమిది దిబ్బలు .వీటిలో పెద్దవి దాదాపు ఏడు ఫర్లాంగులు ,చిన్నవి సుమారు రెండు ఫర్లాంగులు పొడవు ఉన్నాయి.సర్ జాన్ ఈ త్రవ్వకాల విశేషాలు వస్తువుల చిత్రాలతో సహా మూడు గ్రంధాలలో నిక్షిప్తం చేశారు .1927-31కాలం లో జే హెచ్ మాక్యే మరికొన్ని త్రవ్వకాలు జరిపించి పరిశోధనలు చేయించాడు .ఈ త్రవ్వకాలలో పెద్దపెద్ద ఇటుకలతో కట్టిన గోడలు వాటికి ఆసరగాఉన్న గోడలు యజ్ఞ శాలలు కలప ,ధాన్యం భద్రపరచే కొట్లు,తీర్చి దిద్దిన వీధులు ,ఇళ్ళల్లోకి గాలీ వెలుతురూ బాగా వచ్చే ఏర్పాట్లు ,స్నానాగారాలు మరుగు దొడ్లు ,డ్రైనేజ్ కాలువలు బయట పడ్డాయి. సింధునది వరదలనుంచి పట్టణాన్ని కాపాడుకోవటానికి కోటలాంటి గోడ కట్టి ఉంటారు .వ్యవస్థిత నాగరకత కల ప్రజలు ఇక్కడ నివసించేవారని అర్ధమౌతోంది
ఇక్కడ 2వేల మట్టి ముద్రికలు ,వాటిపై మేకలు ,ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఏనుగులు మొసళ్ళు ,దుప్పులు ,పెద్దపులులు జంతు రూపాలున్నాయి .ఒక ముద్రిక మీద ఎద్దు కొమ్ము లకిరీటం పెట్టుకొని ,సింహాసనం మీద కూర్చున్న యోగి,ఆయన చుట్టూ క్రూర జంతువులు మూగిన రూపం ఉంది .ఈముద్రికలనే నాణాలుగా వాడే వారని భావిస్తున్నారు.రకరకాల నగలతో మట్టి స్త్రీల విగ్రహాలు ,గొడ్డళ్ళు కత్తులు మొదలైన పదునైన కత్తులవంటి రేకులు ,స్పటి కాలు నీలాలు వంటి పూసల దండలు బంగారు గొలుసులు మొదలైన వెన్నో లభించాయి .ఇంటి సామగ్రి ,చిత్రాలున్న కొమ్ములు ,నల్లసిరా చిత్రాలు ,ఒక కొమ్మకింద వ్యక్తీ ,కొమ్మపై వేరొక పక్షి రూపాలు దొరికాయి .ఇవన్నీ మ్యూజియం లో భద్రపరచారు .రేపు హరప్పా దర్శిద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-8-20-ఉయ్యూరు
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5
శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ కొందరు దివ్య పురుషుల ,నదీమతల్లుల దివ్యాత్మల దర్శన౦ .
నిర్మల –ఒకసారి స్వామి గృహస్తాశ్రమం లో ఉండగా వాడీ నుండి ఇంటికి తిరిగి వస్తుంటే ఒక దివ్యలోక మహిళ కనిపించి,’’స్వామీ నాకు పేరు పెట్టకుండా ,ముందుకు వెళ్ళకండి ‘’అని కోరింది .ఆమె తనగ్రామం మంగోన్ ద్వారా ప్రవహించే నదీమతల్లి అని గ్రహించి , ఆ నదికి ‘నిర్మల ‘’అని నామకరణ౦ చేశారు . ఆ దివ్య స్త్రీ సంతోషించి అదృశ్యమైంది .అప్పటినుంచి ఆనది ‘’నిర్మలానది ‘’గా ప్రసిద్ధి చెందింది.
కృష్ణ –కలియుగం లో శ్రీ దత్తాత్రేయస్వామి రెండు అవతారాలలో కృష్ణానది తో సంబంధం ఉన్నది .శ్రీ పాద వల్లభ అవతారం లో కృష్ణానది రెండుపాయలమధ్య ఉన్న ద్వీపం లో చాలాకాలం గడిపారు .రెండవది అయిన శ్రీ నరసింహ సరస్వతి అవతారం లో నరసోబా వాడిలో కృష్ణా ,పంచనదీ సంగమ క్షేత్రం లో 12 ఏళ్ళు, కృష్ణ ఉపనది భీష్మ నది,అమరరాజ నదితో కలిసే తీరం గాణగాపుర౦ లో 36సంవత్సరాలు గడిపారు .ఇలా దత్తాత్రేయ అవతారాలతో కృష్ణా నదికి ప్రత్యేక అనుబంధం ఉన్నది .చాలాకాలం గా భక్తులు వాసు దేవ స్వామిని కృష్ణానదిపై శిఖరిణీ వృత్తంలో ఒక స్తోత్రాని శంకరాచార్య ,జగన్నాథ ప౦డితుడు గంగానదిపై రాసిన ‘’ గంగా లహరి ‘’లాగా రాయమని కోరుతున్నారు .అంతకు ముందే నర్మదాలహరి రాసి ఉన్నారు స్వామి .గాణగాపురం వెడుతూ౦డగా స్వామి కి కృష్ణానదీ మాత కనిపించి తనపై కృష్ణాలహరి రాయమని సూచించింది .అప్పటికప్పుడు అప్రయత్నంగా ఆశువుగా 51 శ్లోకాలు చెప్పారు స్వామి .విని పరవశించి కృష్ణామాత’’ఇక చాలు ‘’అని చెప్పి అదృశ్యమైంది .
తంజావూరు లో చాతుర్మాస్యదీక్ష చేసి ,కృష్ణా నది మీదనుంచి వస్తుండగా ఫాల్గుణ శుద్ధ చతుర్దశి వచ్చింది .మర్నాడు పౌర్ణమి నాడు యతీంద్రుల నియమమ ప్రకారం క్షవరం చేయించుకోవాలి .ఆకలి బాగా వేసి సమీప గ్రామం లో తగిన ప్రదేశం కోసం వెదికితే ,గ్రామస్తులు సహకరించకపోగా యెగతాళి చేశారు . కృష్ణ వేణి తో ‘’అమ్మా !నీపై నేను చూపించిన గౌరవానికి ఇది ఫలితమా .నాకు కించిత్తు అయినా ప్రత్యుపకారం చేయలేవా ?రేపు నాకు ముండనం కుదరకపోతే ,ఇక ఎన్నడూ చాతుర్మాస్య దీక్ష చేయను. సన్యాసాన్ని విసర్జిస్తాను .ఇక భవిష్యత్తులో నీ మాట వినను . ‘’.అన్నారు.నదీమాత ఆ రోజు రాత్రి స్వామి కలలో కనిపించి ‘’ రేపు నీ దీక్షా విరమణకు తగిన ఏర్పాట్లుచేసి నేను ప్రత్యుపకారం చేస్తున్నాను’’అని అభయ మిచ్చింది . .అదే రాత్రి ఊరి పెద్దల కు కలలో భయంకర రూపం లో నదీ మాత కనిపించి ‘’స్వామిని అవమాన పరచటం గొప్పనేరం ఆయనకు మీరు క్షమాపణ చెప్పండి .ఆయన దీక్షా విరమణకు పూర్తిగా సహకరించండి .లేకపోతే నాకు ఆగ్రహం వచ్చి మిమ్మలని అందర్నీ సర్వ నాశనం చేస్తాను జాగ్రత్త ‘’అని తీవ్రంగా మందలించి మార్గ దర్శనం చేసింది .మర్నాడు వారంతా నిద్రలేచి తమకలను గురించి ఒకరికొకరు చెప్పుకొని ,అమాంతం స్వామీజీ ని చేరి కాళ్ళపై పడి క్షమించమని ప్రార్ధించి ,చెంపలేసుకొన్నారు .వెంటనే శిరో ముండనానికి తగిన ఏర్పాట్లు చకచకా చేసి దీక్షా విరమణకు పూర్తిగా సహకరించారు .ఆ రోజే వెళ్లి పోవాల్సిన స్వామి వారి అభ్యర్ధనపై పది హేను రోజులు అక్కడే ఉండిపోయారు .
నర్మద-రెండేళ్ళు హిమాలయాలలో గడిపి స్వామి గంగానదీ తీరం బ్రహ్మావర్తం లో ఉన్నారు .ఒకరోజు స్వప్నం లో నర్మదానది దర్శనమిచ్చి మరికొంతకాలం తన సన్నిధిలో ఉ౦డమని కోరింది.ఆయన పెద్దగాపట్టించుకో లేదు .ఒక బ్రాహ్మణుడు చర్మ వ్యాధితో బాధపడుతుంటే స్వామీజీ పాదతీర్ధాన్ని తీసుకొంటే తగ్గిపోతుందని సలహా ఇచ్చాడుఒకాయన . స్వామి ఎప్పుదూఎవరికీ పాదతీర్ధం ఇవ్వటానికి అంగీకరించలేదు .ఒకసారి స్వామి ఏమరుపాటుగా ఉంటూ రాసుకొంటు౦ టే ఆ బాపడు అమాంతం పాదాలపై నీరుపోసి కడిగి పాద తీర్ధం తాగి ఒళ్ళంతా పూసుకొన్నాడు .ఎందుకు అలా చేశావని స్వామి ప్రశ్నిస్తే జరిగింది చెప్పి క్షమాపణ కోరాడు . ఆ వ్యాధి స్వామీజీకి అంటుకొన్నది .రోజూ గంగాస్నానం చేస్తున్నా దురదలు ,పుళ్ళు బాధ తగ్గటం లేదు .దత్తాత్రేయస్వామి కలలో దర్శనమిచ్చి మూడురోజులునర్మదా నదిలో స్నానిస్తే నివారణ అవుతుందని సూచించాడు .వెంటనే స్వామి నర్మదానది నాభి అయిన నామవార్ వెళ్లి నర్మదా నదీ మాతను ప్రార్ధించి స్తోత్రం రాశారు .చాలా చాతుర్మాస్యాలు నర్మదా తీరం లోనే చేసి, తన అంతిమ యాత్ర కూడా నర్మదా తీరం లోనే చేయాలని సంకల్పించారు . అంతటి అనుబంధం,సాన్నిహిత్యం పవిత్ర నర్మదా నదీ మాతతో యేర్పడింది . నర్మద స్వామీజీ ని కన్నకొడుకుగా చూసింది .ఆయన భిక్ష చేస్తున్నప్పుడు బెణుకు మంత్రాన్నిచెబితే ఆయన దాన్ని వృద్ధి చేశారు .దక్షిణాది భోజనం దొరికే ఇళ్ళు చూపించింది .నదిలో పొరబాటున జారిపోయిన వంట పాత్రను మళ్ళీ అందించింది .నదీమతల్లులను ఆయన ప్రాణం ఉన్న వారిగా భావించి పూజించారు .ఆ నదులపై స్తోత్రాలు రాసి భక్తి చాటుకొన్నారు .
పినాకిని -1907 నడి వేసవిలో తమిళనాడులోని పినాకిని నది తీరం పై వెడుతుంటే అధిక చైత్ర పౌర్ణమి వచ్చింది . ముండనం చేయించుకొని స్నానం చేదామని అనుకొంటే నదిలో చుక్క నీరు కూడా లేదు .అక్కడి బ్రాహ్మణుడు నదీ గర్భం లోతుగా త్రవ్వుతామని ,ఆ చలమ నీటిలో లో స్నానించమని కోరారు .అలానే అని స్వామి చెలమను చేరగానే అందులోని నీరు ఉత్తుంగం గా పెరిగింది .క్రమంగా పెరిగి గుండె లోతు జల ఏర్పడింది .అందులో దిగి హాయిగా అఘమర్షణ స్నానం చేశారు సంతృప్తిగా .పినాకిని పై కృతజ్ఞతతో ఆయన నోటినుండి అకస్మాత్తుగా ఆశువుగా కవిత వెలువడింది –దాని భావం
‘’అధిక చైత్రమాసం పౌర్ణమి నాడు కుంగి కృశించిన పినాకిని మాత ,క్షణం లో క్రమంగా వృద్ధి చెంది ,నా పవిత్ర ముండన స్నానానికి తోడ్పడింది. అందరూ ఆమెను అర్చించి తరించాలి .
నర నారాయణ మునుల దర్శనం –నాల్గవ చాతుర్మాస్య దీక్ష లో స్వామి బదరీ నారాయణ క్షేత్రానికి నడిచి వెడుతున్నారు .దారిలో ఒక పెద్ద అగాధాన్ని కప్పివేస్తూ పర్వత శిఖరం పెరిగి దారికి అడ్డు నిలిచింది .ముందుకు వెళ్ళాలా వద్దా అనే సందేహం లో స్వామి ఉండగా ,ఇద్దరు మనుషులు శిఖరం దిగుతూ కనిపించారు .వారు ‘’స్వామీ !ఈ దారి చాలా ప్రమాదకరం .వెడితే చావు కొని తెచ్చుకొన్నట్లే .’’అని హెచ్చరించారు ఆ జంట .’’స్వాములూ !నేను నర నారాయణమునులను దర్శింఛి ,పూజించటానికి వచ్చాను .నా ప్రాణం పోయినా ఫరవాలేదు వారిద్దర్నీ చూసి పూజ చేయకుండా మాత్రం వెనక్కి వెళ్ళనే వెళ్ళను ‘’అన్నారు స్వామి .అనగానే వారిద్దరూ అదృశ్యమయ్యారు .అలా స్వామి నరనారాయణ మునుల దర్శనం తో తరించారు బదరీ క్షేత్రం లో .
అశ్వత్థామ-చివరి చాతుర్మాస్య దీక్షకోసం స్వామి చికలాడ నుంచి గరుడేశ్వర్ వెడుతూ ,ఒకదట్టమైన భయంకరం ప్రమాద భరితమైన అరణ్యం గుండా నడిచి వెడుతున్నారు .శూల పానేశ్వరం(త్రిశూల పాణి ఈశ్వరుడు ) దాటాక ,గుర్తించదగిన అడుగులున్న బాట ఎక్కడా కనిపించలేదు .అంటే ఇది వరకెవ్వరూ ఈదారిలో నడిచిన గుర్తులు లేవు దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళటానికి .ఏ అడవి మనిషీ కనిపించలేదు వెంట ఉండి ఆ కీకారణ్యం దాటి౦చ టానికి .ఇంతలో ఒక ఆటవికుడు అకస్మాత్తుగా కనిపించి ‘’స్వామీ !ఈ అడవి దాటి౦చ టానికి నన్ను సాయం చేయమంటారా ?’’అని అడిగాడు. సరే అన్నారు స్వామి ‘’అయితే స్వామీ ! నా వెనకాలే నడవండి .లేకపోతే దారి తప్పే ప్రమాదం ఉంది ‘’అని జాగ్రత్తలు చెప్పి దారి చూపిస్తూ మార్గదర్శనం చేస్తూ ,గరుడేశ్వర దేవాలయం కనిపించగానే దాన్ని చూపించి, క్రమంగావెళ్లి పోయే ప్రయత్నం చేశాడు ఆ ఆగ౦తకుడు .అతడి ప్రవర్తన అనుమానం కలిగి స్వామి వెంటనే’’బాబూ! నువ్వెవరు ?నీ కథాకమామీషు చెప్పు ‘’అని అడిగారు ‘’నేను అశ్వత్థామను ‘’అని ఒకే ఒక్కమాట చెప్పి అత్యంతవేగం గా కదిలి అదృశ్యమయ్యాడు అశ్వత్థామ’’.సప్త చిరంజీవులలో అశ్వత్థామ ఒకడు. మిగతా ఆరుగురు- బలిచక్రవర్తి, హనుమంతుడు ,విభీషణుడు ,కృపుడు,పరశురాముడు ,వ్యాసుడు .
కొన్ని ఆలయాలలో స్వామీజీ లనుకూడా మూల విరాట్ లను ముట్టుకొని అర్చి౦చ టానికి అంగీకరించరు. అలాంటివాటిలో బడరీనారాయన ,తిరుమల బాలాజీ దేవాలయాలున్నాయి .తిరుపతి వెంకటేశ్వర దేవాలయంలో ఒకసారి అర్చకులు స్వయంగా స్వామీజీని గర్భాలయం లోకి ఆహ్వానించి ఆయన బాలాజీ విగ్రహాన్ని తాకి అర్చి౦చే దాకా గౌరవం గా నిలబడే ఉన్నారు .అనునిత్యంస్వామి వాసు దేవానంద మహారాజ్ తన ఇష్టదైవం శ్రీ దత్తాత్రేయ స్వామితో సంభాషిస్తూనే ఉంటారు. అనుమతులు సలహాలు పొందుతూనే ఉంటారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-8-20-ఉయ్యూరు
మచిలీ బందరు యోగి శ్రీ రామావదూత (శ్రీ రంగావధూత)
మచిలీ బందరు యోగి శ్రీ రామావదూత (శ్రీ రంగావధూత)
మచిలీ పట్నం అనే బందరులో శ్రీ వామ గోత్రం లో సుబ్బయ్య గారు మహాపుణ్యుడు బుద్ధిమంతుడు .ఆయనకు 1870లో జూన్ నెల ఏకాదశి జయవారం నాడు రంగ అనే శిశువు జన్మించాడు .పుట్టుకతోనే భక్తి అలవడింది .సత్యాహింసలు శాంతి అహింసలు మహామతిత్వం వంటి సుగుణాలు అబ్బాయి .క్రమంగా జ్ఞానవికాసమూ కలిగింది .ఎనిమిదవ ఏట బడికి పంపారు .శ్రద్ధగా విద్య నేర్చాడు .సాయంకాలం బడి వదిలి ఇంటికి వచ్చి స్నేహితులతో కలిసి భక్తితో ఇంట్లోభజనాలు చేసేవాడు .ఇంటిలోని దేవతా విగ్రహాలను అత్యంత అందంగా అల౦క రించే వాడు .చుట్టుప్రక్కలవారు ఆతని భక్తి భజలకు ముచ్చటపడేవారు .తోటిపిల్లలతో ఆటలు ఆడే వాడు కాదు ఇదే అతడిలోకం .జీతం కట్టమని డబ్బు ఇచ్చి పంపిస్తే దారిలో బీద సాదలను చూసి జాలితో ఆడబ్బు వారికిచ్చేవాడు .బడికి వెళ్ళకుండా తిరిగి వచ్చేవాడు .షావుకారు కొట్లో సరుకులు తెమ్మనమని డబ్బు ఇచ్చి పంపినా ఇలాగే దాన ధర్మాలు చేసేవాడు.స్నేహితులను ‘’ఒరే ‘’అని పిలవకుండా ‘’అయ్యా ‘’అని మర్యాదగా పిలిచే సంస్కారం అతడిది .ఒకపూట మాత్రమె బడికి వెడుతూ మధ్యాహ్నమంతా మనసంతా పరమాత్మపై లగ్నం చేస్తూ గడిపేవాడు .కొంతకాలానికే బడిలో చెప్పే విద్యలు ఆస్థిరాలు అనే భావం మనసు నిండా పెరిగిపోయి ఆసక్తి పూర్తిగా తగ్గింది .
బందరులోని పెద్దవారిళ్ళ వెళ్లి అక్కడ జరిగే సద్గోష్టి లో పాలుపంచుకొంటూ ,తనకు తోచిన ఆముష్మిక విషయాలు వారికి చెబుతూ ,పు ణ్యాత్ముడు గా కీర్తి గడించాడు .క్షమ శాంతం మొదలైన స్సద్గుణాలతో శోభిల్లాడు రంగడు .దైవపూజ చేస్తూ స్త్రీలను తల్లులుగా భావిస్తూ ,సర్వభూత దయతో ,ప్రాపంచిక భావన లేక కామక్రోధాదులకు దూరమై ,ఘన భవ్యమూర్తి అయ్యాడు .వీరింటికి కొంచెం దూరం లో చందమ్మ అనే ఒక పుణ్య స్త్రీ ఉండేది .ఊరివారందరికీ సోదరిలా ఉంటూ శాంతమూర్తిగా , సద్గుణ రాశిగా,భక్తి ప్రపత్తులతో గడిపేది .ఆమెసుచరిత్ర అందర్నీ ఆకర్షించేది .ఐదో ఏడునుంచేదైవ భక్తి అబ్బింది .దేవతాబొమ్మలను చేసి చుట్టుప్రక్కల పిల్లలను పిలిచి పూజలు చేస్తూ ,సత్యాహింసలు శమ దమాలతో ఈర్ష్య అసూయలు లేకుండా సాధ్వీ మణిగా ప్రసిద్ధి చెందింది .ఆమె భక్తికి రంగడు ఆకర్షిప బడి చందమ్మగారే తన గురువు అని మనసులో నిశ్చయంగా భావించాడు .వారి౦ట్లోనే భజలలు పూజలు చేస్తూ ప్రసంగాలు వింటూ చేస్తూ చందమ్మ, రంగ తల్లీకోడుకుల్లాగా ప్రవర్తి౦ చారు .రంగని జ్ఞానభక్తి వైరాగ్యాలకు చందమ్మఅతడే తన గురువుగా భావించింది .ఇలా వైరాగ్యభావం తో ప్రవర్తిస్తున్న రంగనికి పెళ్లి చేయాలని తలిదండ్రులు భావిచారు .
నిర్మలమనసు తో ఉంటున్న తనకు వివాహ బంధం వద్దని గట్టిగా చెప్పాడు రంగ .చాలా మందిపెద్దలతో చెప్పించారు కానే అతడి మనసు మారలేదు.రంగడు పరమ పావనుడు అని అందరూ తలిదంద్రులకే చెప్పారు .ప్రయత్నాలు విరమించి మనసుకు సమాధాన పడి,ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు .క్రమక్రమగా రంగని వైరాగ్య దృష్టిపెరిగి ఇహలోకసంబ౦ దాలు దూరమై జ్ఞానిగా మారి .మౌనం పాటిస్తూ ,తన సత్ప్రవర్తనతో తలిదండ్రుల మనసుమార్చి మౌనం తోనే జ్ఞానబోధ చేస్తూ మహావిరాగియై భాసిల్లాడు .ఇంట్లో వారికి బయటివారికి తేలిక మాటలతో జ్ఞానం బోధించి వివేకం కలిగించే జీవితానికి అర్ధం ,పరమార్ధం బోధించాడు .తలిదండ్రులు తీర్ధయాత్రలు చేసి పుణ్యం మూటకట్టుకోవాలని భావిస్తే వారితో ‘’తీర్ధయాత్రల వలన లాభం లేదు .ధన౦ శ్రమఖర్చే .దానిబదులు దాన ధర్మాలు చేయండి ‘’అని మాన్పించి,బీద సాదలను ఆడదుకోనేట్లు చేశాడు .గురువు చందమ్మ దేహం చాలించింది .ఆమెకు చాలాభక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరిపించాడు రంగ .ఆమె భక్తి జ్ఞాన వైరాగ్యబోధలను లోకంలో ప్రచారం చేశాడు .నిస్స౦గ౦గా జీవిస్తూ ,ఐహికాలకు దూరమై మనసంతా దైవమె గా జీవిస్తూ నియమనిష్టలతో గడుపు పరమ విరాగియై ,అవదూతత్వం పొంది రంగ’’ శ్రీ రంగావదూత’’ గా పరిపర్తనం చెంది బందరు పురజలనకు జ్ఞాన మార్గదర్శి అయ్యారు .
ఇంతవరకే ఉంది ఆయన ఎప్పుడు సమాధి చెందారో వివరాలు రాయలేదు .ఎవరికైనా తెలిస్తే తెలియ జేయండి .
శ్రీ రంగావదూత జ్ఞానబోధ –కన్నులు లేనివారికి సూర్యుడు కనిపించానట్లే అజ్ఞానికి భగవంతుడు కనిపించడు.ముత్యాలకోసం సముద్రం లోదిగే వాడు చాలా కస్టపడి వాటిని సాధించినట్లే దేవుడిగురించి అంతకస్టపడి సాధన చేస్తేనే ఆతత్వం తెలుస్తుంది.బంగారాన్ని యెంత జాగ్రత్తగా కాపాడుతారో దేవుడినీ అంటే జాగ్రత్తగా కొలవాలి .పరిపూర్ణ శుద్ధమనసే శాంతి కలిగిస్తుంది .మనసే దైవం అనే భావం రావాలి .సాటిమనుషుల కష్టసుఖాలలో పాలు పంచుకోనేనే దైవం మెచ్చుకొంటాడు .ధ్యానసమయం లో మనసు అత్యంత పరిశుద్ధంగా ఉండాలి .ప్రపంచ సుఖాలు శాశ్వతం కాదు .శరీరం అశాశ్వతం ఆత్మమాత్రమే శాశ్వతం బంధాలను తొలగించుకోవాలి సాధనద్వారా .
ఆధారం –బెజవాడ పురవాసిని జ్ఞాని,యోగిని శ్రీమతి జ్ఞానమాంబ గారు పద్యాలలో రచించిన ‘’శ్రీ రంగావదూత ల వారి దివ్య జీవితము ,జ్ఞానబోధ’’ . ఈ పుస్తకం 1909 లో బందరుకు చెందిన భైరవ ముద్రాక్షర శాల ప్రచురించింది .జ్ఞానమాబ గారి వివిధ ఛందస్సులలో పద్యాలు ద్రాక్షాపాకం తో లలితలలిత పదాలతో సకలజనులకు కూడా వేదాంత విషయాలు సుబోధకమయ్యే ట్లు రాశారు .అవధూత గారిదివ్య చరిత్రను లోకానికిఅందించారు .ఈపుస్తకం లేకపోతె రంగావదూత గురించి ఎవరికీ తెలిసి ఉండేదికాదేమో .జ్ఞానమాంబ గారి రసగుళికలవంటి కొన్ని పద్యాలు చూద్దాం –
అవధూత జీవిత చరిత్ర -78పద్యాలు
‘’ధరలో సాగర తీరమందు శుచియై ధారాళమై యొప్పుచున్ –చిర రూఢిన్ మచిలీ పురంబనగా
‘’గోత్రంబొండు వీకాసమై ‘’శ్రీ వామమ్మున వెల్గు ‘’
‘’ఆ వంశంబున నుద్భవించె ఘనుడౌ సుబ్బయార్యుండు ‘’
‘’అవతరించే విమల సచ్చరితుడు తమమనియెడు అంధకార మడప నర్కుండు ధరలోని దివ్యమూర్తి జగదతీతుడరయ
‘’రంగ యను నామంబున’’
‘’చ౦దమ్మను నభిదానము-నం ధాత్రిని విదితమైన నవ గుణములతో ‘’
‘’రుతమున హి౦సయున్ దయాయు రోషము లేనటు వంటి మానసం బతులిత భక్తిశ్రద్ధలును ‘’
‘’ఘనమై సద్గుణ ఖనియై మెలగ నా కా౦తా లలామప్రావ-ర్తనముల్ గాంచి మహాత్మా యంచు దనలో దా ‘’ర౦గ యార్యుండు’’ఎం-ఛి నయంబౌ గణవార్థి నా విమలియే శ్రీ మద్గురు శ్రేష్టమం-చును నీ ధీమతియందు భక్తీ గలుగన్ స్తుత్యుండు బాగొప్పగా ‘’
‘’జననీ పుత్రుల మాడ్కి నీ మహితునిన్ చందమ్మ యత్యంత ప్రేమను జూచున్ ‘’
‘’నాకు వివాహమే వలదు నైర్మల మానసు తోడ నుందు’’
పరోపకార బుద్ధితోడ బాగు మీర నీతడున్ -సరళలమొప్పగాను తాను చక్కగాను’’
‘’అనఘు డీ మహనీయుడజ్ఞానమును బాపు జ్ఞాన బోధనంబులు పెక్కు లీ ధరిత్రి ‘’
అవధూత జ్ఞానబోధామృతం-135పద్యాలు
‘’కన్నులు లేనివారు దివి గాంచగ లేక దివాకరుండు లేడన్న విధంబుగా ‘’
‘’అగణిత భక్తి చే భగవదర్చన జేయుచునిర్మలాత్ములై ‘’
‘’అ౦గా రమ్ముల నేగతి- బంగారము నే విధముగా భావి౦తురోయా -భంగిని లోకము పైనను –మంగళ కరుడగు దేవు నెదను మది ను౦చ వలెన్ ‘’
‘’తనమనసే దేవు నెడ౦గ భక్తిం గలిగి యుండు గాంచగా నా దే దేవుని నేల్లవేళ నారాధానము జేయుచు నుండవలయు ‘’
‘’అర్ధము పర సౌఖ్యంబును –వ్యర్ధము గావించి ‘’
‘’సంసారంబే శత్రువు –సంసారంబదికమైన సంతాపంబు ‘’
‘’ధర నెలతల మాతల వలె-విరివిగా పురుషుల జనకుల విధి దలచి మదిన్ ‘’
‘’స్వాంతము మాయయే మాయయే స్వాంతము ‘’
‘’శ౦క రహిత సుఖ మొదవున్ ‘’
‘’వేదాన్తులరము మాకే బాధలును లభించ వెటులవర్తి౦చిన గా –నీ ధాత్రి ననెడు దుష్టులు-వేధనలే పొందగలరు వేగిరమే మదిన్ ‘’
‘’దర్పణ౦బున దేహ మమెల్లయు ధాత్రి గన్పడు రీతి ‘’
‘’ఎన్నటికిని ఆకాశము –పన్నుగ బ్రహ్మంబు గాదు-చిన్నెలు లేనిదే బ్రహ్మము ‘’
‘’పరము కరతామలకమే ‘’
‘’దేవుం డగు తానె మది-జీవుడుగా దోచు చుండు శీత కరుడు –మబ్బే విడిపోయిన ఎదలన్ –భావింపగా చంద్రు డనగ బయలు పడునుగా ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-20-ఉయ్యూరు
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-22
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-22
లాహోర్ లావణ్యం
లాహోర్ ను సిటీ ఆఫ్ గార్డెన్స్ అంటారు ఉద్యాన నగరం అన్నమాట .లక్నో ను సిటీ ఆఫ్ పార్క్స్ లఘు ఉద్యాననగరం అంటారు .లాహోర్ ప్రజలుకూడా ఆ నగర లావణ్యాన్ని కళ్ళకు రెప్పలా కాపాడుకొంటారు .అక్కడ లారెన్స్ గార్డెన్స్ విశాలమైనది . .మోఘలాయిలకాలం నాటి శివార్లలో ఉన్న షాలిమార్ గార్డెన్స్ మనోహరాతి మనోహరం .ఇక్కడి స్త్రీలు వసంతపంచమి రంగురంగుల దుస్తులతో కను విందు చేస్తారు. శ్రీరాముడికుమారుడు’’ లవుడు ‘’రాజ్యమేలిన చోటుకనుక లవరాజ్యం అయి లాహోర్ గా కాలక్రమలో మారింది .స్నేహప్రియులైన పంచాబీలు ‘’కీహుయా ‘’అంటే ఏముందిలే అనే’’ లైట్ ‘’తీసుకొనే రకం .ఋతువులకు అనుగుణంగా పచ్చికూరలు తినటం ప్రత్యేకత .
రామచ్నద్ర లాహోర్ కు వచ్చారు. రాగానే పోస్టాఫీస్ కు వెళ్లి అణా కవరు కొని వేటూరివారికి ఉత్తరం రాస్తూ ‘’తరుణం వర్ష పకాశం ‘’అంటే ఆయన అనుకొన్నట్లు ఆవ వేసిన లేతకూరకాదనీ ,’’లేత ఆవకూర ‘’అని ,మొదటిముద్దలో ఇక్కడ దాన్ని అన్నం లో తింటారని ఆకవర్ లో రెండు ఆవకూర పోచలు పెట్టి అంటించి పోస్ట్ చేసిబరువు ది౦చు కొన్నారు అక్కడ చివరి అంతస్తులో లెట్రిన్ పెట్టటం అలవాటు .మురికి గాలిపైకి పోతుందనే వాస్తు వాళ్ళది .రామచంద్ర అక్కడ పంజాబ్ యూని వర్సిటిలో తాళపత్ర గ్రంథ విభాగం లో పని చేయటానికి వచ్చారు .అక్కడరెండు వేల తాళపత్ర గ్రంథాలు తెలుగు కన్నడ గ్రంథ,మళయాళ,నందినగరి లిపులలో ఉన్నాయి .ఒకటి రెండు కాశ్మీర్ పండితులువాడే శారదాలిపిలో ఉన్నాయి .సగానికిపైగా శ్రుతి స్మృతి గ్రంథాలే .కావ్యాలు చాలాతక్కువ .శ్రీనాథుని సమకాలికుడు ఆదివన్ శఠకోపజియ్యర్ రాసిన ‘’వాసంతికా పరిణయం ‘’నిర్దుష్ట ప్రతి ఉన్నది ‘’ఘన జటాన్యాయ పంచాశత్ ‘’అనే కర్త పేరు లేని ఘన జటస్వరాలకు చెందిన యాభై శ్లోకాల లక్షణ గ్రంధం ,దాశరథి తంత్రం అనే తంత్రశాస్త్రం అపూర్వ రచనలున్నాయి .దాశరథి లో ఆకుల వెడల్పు రెండే రెండు అంగుళాలు .ఒక ఆకులో 20పంక్తుల ముత్యాలవరుస చూసి ఆశ్చర్యపోయారు రామ చంద్ర .
అక్కడి యూనివర్సిటి ఓరియెంటల్ కాలేజి ప్రిన్సిపాల్ –హిందీ ప్రాకృత సంస్కృత శాఖ మహామహోపాధ్యాయ మాధవ శాస్త్రి భండార్ జీ ,వైదికాను సంధాన సంస్థ అధ్యక్షుడు విశ్వబందు శాస్త్రి డాక్టర్ సూర్యకాంత్ ,ప్రభుత్వ కాలేజీ సంస్కృతాచార్యుడు గౌరీ శంకర శాస్త్రి ,విశ్వవిద్యాలయ ఆచార్యుడు డాక్టర్ బనారసీ దాస్ జైన్ ,(అర్ధమాగాది)డాక్టర్ లక్ష్మస్వరూప్ –సంస్కృతం ,డాక్టర్ మోహన్ సింగ్ –పంజాబీ ,స్థానిక రచయితలు ఉదయ శంకర్ భట్ సంత్ రాం ,వేద విజ్ఞానఖని పండిత భగవద్దత్ లు పరిచయమయారు .లాహోర్ లో రైల్వే మిలిటరీ ప్రైవేట్ వ్యాపార సంస్థల్లో తెలుగు వారు చాలాందే ఉన్నారు .అందరూ పరిచయమయ్యారు .డిప్యుటీ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మిలిటరీ అకౌంట్స్ జమ్మలమడక లక్ష్మీనారాయణ ,DACMA జనమంచి కామేశ్వరస్వామి,అసెంబ్లీ రిపోర్టర్ వెంకటరమణయ్య ,అసెంబ్లీ చీఫ్ రిపోర్టర్ పార్ధసారథి అయ్యంగార్,కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సత్యపాల్,గోపీ చ౦ద్ భార్గవ ,అకాలీనాయకులు తారాసింగ్ ,ఆహరత్ పార్టీనాయకులు, ఖాక్ పార్ పార్టీవారు అల్లామా మర్శీన్ లు పరిచయమయ్యారు .తలుగు విద్యార్ధులలో చీమకుర్తి సీతారామయ్య ,హిందీ వక్కలగడ్డ వెంకటేశ్వర్లు –సంగం జాగర్లమూడివాడు మంచి విమర్శకుడు .లాహోర్ కోటీశ్వరుడు లాల్ బిందా శరణ్ లుకూడా దోస్తులయ్యారు .
తాళపత్ర గ్రంథ ప్రదర్శన పెడితే బాగుంటుందని రామ చంద్ర లైబ్రేరియన్ మొదలైనవారికి సూచించారు .గన్నవరపు సుబ్బరామయ్యగారికి జాబురాసి గంటం తోరాయటం, పత్రాలను రాతకు అనుకూలం గా సిద్ధం చేయటం ,గంటాల ఒరలు ,తిక్కన గంటం వగైరాలఫోటోలు తెప్పించారు తిరుమల .వీటన్నిటితో తాళపత్ర గ్రంథ ప్రదర్శన గొప్పగా నిర్వహించారు .అన్నిభాషల విలేకరులు చూసి అద్భుతమైన కవరేజ్ ఇచ్చారు .అందులో రెండు అంగుళాల ఆకుమీద 20పంక్తుల తెలుగు అక్షరాలున్న దాశరథి తంత్రం అందర్నీ విశేషంగా ఆకట్టుకొంది విద్వన్మండలిలో తిరుమల ప్రతిభ ఏడు కొండ లంత ఎత్తుకు పెరిగింది .వివిధ సంస్కృత పరిశోధనసంస్థలు ఆహ్వానించి సలహాలు అడగటం ప్రారంభించారు .ఆయనమాత్రం నిగర్వంగా ‘’ చెట్లు లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం కదా’’ అన్నారు .
సశేషం
వినాయక చవితి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-8-20-ఉయ్యూరు
22-8-20శనివారం మా ఇంట్లో శ్రీ వినాయక చవితిపూజ మనవడు చరణ్, మనవరాలు రమ్య లతో మేమిద్దరం
22-8-20శనివారం మా ఇంట్లో శ్రీ వినాయక చవితిపూజ మనవడు చరణ్, మనవరాలు రమ్య లతో మేమిద్దరం
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-4
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-4
మహా జ్ఞానులతో శ్రీ వాసుదేవానంద సరస్వతి
శ్రీ రాజరాజేశ్వర ,శ్రీ అక్కల్ కోట్ మహా రాజ్ వంటి మహాజ్ఞానులతో మనస్వామికి గొప్ప పరిచయమే ఉండేది .
శ్రీ రాజరాజేశ్వర శంకర స్వామి
అప్పడు శ్రీ శృంగేరి పీతాదఠాపతులైన శ్రీ రాజరాజేశ్వర శంకరాచార్య స్వామి తో కలిసి హరిద్వారంలోచాతుర్మాస దీక్ష చేశారు .పీఠాధిపతి కోరికపై స్వామి శ్రీ ఆది శంకరులు ఉపనిషత్ భాష్యం పై ప్రవచనం చేశారు .తర్వాత 17వ చాతుర్మాస్య దీక్షను తంజావూర్ లో పూర్తి చేసి ,,కావేరి మీదుగా వెడుతుంటే శృంగేరి స్వామి శ్రీ రంగం లో ఉన్నారని తనకు స్వాగతం చెప్పే ప్రయత్నం లో ఉన్నారని తెలిసి అక్కడికి వెడితే పీఠాధిపతి గారు గౌరవంగా ఆహ్వానించారు .స్వామి శారదాంబ శ్రీ శంకరాచార్య లపై స్తోత్రం రాశారు .ఆచార్య కూడా స్వామిని ప్రస్తుతిస్తూస్తోత్రం రాశారు .స్వామికి తమ ఆశ్రమలో భిక్ష ఏర్పాటు చేసి ,ఘన సన్మానం జరిపారు .స్వామి గురించి ఆచార్య ‘’ఇవాళ మన ఆశ్రమానికి విచ్చేసిన స్వామి మహారాజ్ ను మీరు గుర్తించి ఉండరు .వారు సాక్షాత్తు దత్తప్రభువులే .తలిదండ్రుల పుణ్యం చేత జన్మించి ధ్యాన తపస్సులతో వెలిగిపోతున్నారు .వైదిక మతాన్ని కొనసాగించటానికి ఆది శ౦కరాచార్యుల వారితో సమానంగా కృషి చేస్తున్న ధన్యజీవులు .వర్ణాశ్రమ ధర్మాలను వైదిక విధానం లో తూచా తప్పక పాటిస్తున్న శ్రేస్టులు.వేలాది ప్రజలను తమ ప్రవర్తన ప్రవచనాలతో ఉద్ధరిస్తున్నారు .ఆ సేతు హిమాచలం కాలినడకన సందర్శిస్తున్న తపోధనులు .సాధకులకు కర్మజ్ఞాన భక్తీ మార్గాలను బోధిస్తూ పరిణామ కలిగిస్తున్నారు .వైదిక ధర్మ పునరుద్ధరణ కోసం శ్రీ వాసు దేవానంద సరస్వతి మహారాజ్ కు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుతున్నాను ‘’అని భక్తులకు పరిచయం చేశారు .స్వామి దానికి సమాధానం గా ‘’అంతటి పొగడ్తలకు నేను అర్హుడనుకాను .శృంగేరి పీఠాన్ని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఉన్నత స్థితి కి తెచ్చారు ‘’అని వినయంగా చెప్పారు.తర్వాత శంకరాచార్య కోరికపై తాము రాసినగ్రంథాలు శృంగేరి మఠానికి పంపారు .
శ్రీ శాంతారాం స్వామి
ఆ కాలం లో బెనారస్ లో మహారాష్ట్ర కరడ్ కు చెందిన శ్రీ శాంతారాం స్వామి అనే మహాజ్ఞాని ఉండేవారు .40ఏళ్ళు కాశీలో వరుసగా భాగవత సప్తాహం నిర్వహించిన దీక్షా పరులాయన .భాగవత పరిపక్వతతో భగవంతునితో అనుసంధానం ఆయనకు ఏర్పడింది ఉదయం 4కు లేచే ఆయన ఒక్కోసారి ఆలస్యంగా లేచేవారు . .కాశీ విశ్వనాథుడే ఆయన తలుపు తట్టి నిద్ర లేపే వాడు అని జనం నమ్మేవారు .సంస్కృతం వేదం వేదాంగాలు పెద్దగా చదవనప్పటికీ ఆయన్ను కాశీలోని మహా విద్యావేత్తలు భాగవత పురాణం లో తమకు కలిగిన సందేహాలను ఆయనవద్దకు వచ్చి తీర్చుకొనేవారు .1913 బ్రహ్మావర్తనం లో వాసు దేవానంద స్వామిమూడేళ్ళుగా ఉన్నారని తెలిసి ఆయనను కాశీకి ఆహ్వానించాలని అనుకొన్నారు .కానీ స్వామి రాలేదు చివరికి శాంతారాం స్వామి బ్రహ్మావర్తం వెళ్లి కలుసుకోగా ఇద్దరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ధారాపాతం గా వర్షించాయి .ఇక్కడి ప్రశాంత వాతావరం పవిత్రత , జరిగే ప్రవచనాలుఆధ్యాత్మిక కార్యక్రమాలు శాంతారాం చూసి పరమానంద భరితులయ్యారు
శ్రీ వైద్యనాథ అవధూత
అత్యున్నత జ్ఞానం సాధించినా కొందరు మహామహులువింత ప్రవర్తనలతో జనాలకు దూరంగా ఉండేవారు .పసిబాలుడులాగాఉన్మత్తునిలా,పిశాచం లా ప్రవర్తింఛి జనాలను దూరం చేసి తన దీక్షకు భ౦గం కాకుండా కాపాడుకొనేవారు .అలాంటివారిలో నరసోబా స్వామి వైద్యనాథ ఒకరు .సూటిగా బాలునిలా మాట్లాడేవారు .ఎప్పుడు మతవిదాన చర్యలేవీ చేసేవారుకాదు .ఉదయం చేతిలో ఒక లోటా పట్టుకొని తిరిగేవారు .నదికి స్నానానికి వెళ్లి ఒళ్లంతా మట్టి పట్టించి గంటలకొద్దీ గజస్నానం చేసేవారు .ఆలయాలకు వెళ్ళటం కాని పాదుకలను పూజించటం కాని ఉండేదికాదు .ఎవరైనా ఇదేమిటిఅని అడిగితే తనను దయ్యం పట్టి ఆపనులు చేయనివ్వటం లేదనే వారు .ఎవరైనా ఇంటికి భోజనానికిఆహ్వానిస్తే దక్షిణగా రెండే రెండు పైసలు తీసుకొనేవారు .ఇలా వచ్చిన డబ్బును ఒకనమ్మకస్తునికి అప్పగించి ,తానే లెక్కలు రాసేవారు .ఒకసారి వాసుదేవ స్వామి వాడిలో మకాం గా ఉంటె ముఖ్య శిష్యుడు గండా మహారాజ్ వైద్యనాథ తో ఆయన దగ్గరున్న డబ్బుతో విశేష పూజ చేయమని సలహా ఇచ్చాడు .అందరికీ ఎప్పుడూ చెప్పెసమాదానమే ‘’ఆ డబ్బు మా తమ్ముడిని చూడటానికి వెళ్ళట కోసం జాగ్రత్త చేసుకొన్నాను ఖర్చుపెట్టను ‘’అన్నాడు .అక్కడి వారు గండా తో ‘’ఆయన వేళాకోళానికి చెప్పేమాట అది .ఇక్కడినుంచి ఆయన ఎప్పుడూ కదిలి వెళ్ళటం చూడలేదు ‘’అన్నారు. చివరికి వాసు దేవ స్వామి చెవిన ఈవిషయం వేశారు అందరూ కలిససి . ఆయన .’’ఆయన్ను మీరెవరూ సరిగా అర్ధం చేసుకోలేదు .దెయ్యం పట్టింది అని ఆయన అన్నదానికి అర్ధం భగవంతుడు తన్ను బంధించి ఉంచుతున్నాడు అని అర్ధం .సోదరుడి దగ్గరకు వెడతాను అంటే తన భౌతిక శరీరం రద్దు అవటం అని భావం .ఆయన మహాజ్ఞాని ఆయనమాటలు సామాన్యులకు అర్ధం కావు .ఆడబ్బు తన ఉత్తరక్రియలకోసం అని అర్ధం ‘’అని వివరించారు .వైద్యనాథని పిలిచి ‘’నీ దగ్గరున్న డబ్బులో 7రూపాయలు ఖర్చుపెట్టి ,మిగిలిన ఒక్కరూపాయి నీ సోదరుడిని చూడటానికి వెళ్ళేదానికి ఖర్చు పెట్టు ‘’అన్నారు వైద్యనాథ ఒప్పుకున్నాడుకానీ మాహాపూజ చేయటానికి ‘’ఆ దెయ్యం అంగీకరించలేదు ‘’అన్నాడు .స్వామి ‘’ఐతే ఆ దెయ్యాన్నో ఒక్క రోజుమాత్రం నిన్ను వదిలిపెట్టమని అడుగు ‘’అన్నారు .సరే అన్నాడు ఆయన .పూజ బ్రహ్మాండంగా జరిగింది ఊరివారందరినీ వైద్యనాథ పూజా ప్రసాదం తీసుకోవటానికి రమ్మని స్వామి కబురు చేయించారు .ఆయన దగ్గరున్న ఏడురూపాయలు అంతమందికి ప్రసాదం పెట్టటానికి ఎలా సరిపోతాయని అందరికీ సందేహం ఆశ్చర్యం కలిగాయి .ఎవరికి తోచినట్లు వారు ఆహారపదార్ధాలు వగైరా పంపించి,వేలాది భక్తజనం పాల్గొని మహాపూజ చూసి తరించి వైద్యనాథ ప్రసాదం కడుపారా ఆరగించారు .ఏర్పాట్లను స్వామితో కలిసి వైద్యనాథ పర్యవేక్షిస్తూ అందరినీ పలకరించారు .జనం కళ్ళల్లో ఆనందం తాండవ మాడింది .
శ్రీ అక్కల్ కోట్ మహారాజ్
1905లో పండరిపురం నుండి వాడీ వెడుతుండగా కమలాపురందగ్గర చేతులు మోకాళ్ళవరకు ఉన్న బలిస్టు డైనఒకస్వామి మహారాజ్ వాసుదేవ స్వామి కలలో కనిపించి ‘’దేశమంతా తిరుగుతున్నావు కవిత్వం రాస్తున్నావు .నా మీద నీకు దృష్టిపడలేదా ?’’అని ప్రశ్నించాడు .నిద్రలేచి తనకు కలలో కనిపించిన ఆస్వామి ఎవరు అని దత్తప్రభువును అడిగాడు ‘’ఆయనే అక్కల్ కోట్ మహారాజ స్వామి .ఆయన్ను నువ్వు దర్శించి ఆయన జీవిత చరిత్ర నువ్వు రాయాలని ఆయన కోరిక ‘’అని తెలిపాడు .వాసుదేవ స్వామి ‘’నా చేతి కలం దత్తస్వామిపాదాలకే కే అంకితం.మీరుఆజ్ఞాపించి ఆయన గురించి సమగ్రసమాచారం అందిస్తే వారి చరిత్ర రాస్తాను ‘’అన్నారు .’’అయితే అక్కల్ కోట్ వెళ్లి ఆయన్ను దర్శించు ‘’అని హితవు చెప్పగా అక్కల్ కోట్ వెళ్లి స్వామి సమర్థ ను దర్శించారు స్వామి సమర్థ అక్కల్ కోట్ సమర్ధస్వామిమహారాజ్ అంటారు .ఈయనకూడా దత్తాత్రేయ అవతారమే .వీరికి కర్నాటక మహారాష్ట్రలలో వేలాదిమంది అనుచరులున్నారు .అలాగే అక్కల్కోట్ మహారాజ్ చరిత్ర రాశారు
వాసుదేవానందస్వామి ఇలా ప్రముఖ జ్ఞానులతో సత్సంబంధాలు కలిగిఉన్నారు షిర్డీ సాయిబాబా వాసుదేవ స్వామిని తన సోదరులు అని చెప్పేవారు. ఈయనా దత్తాత్రేయ అవతారమే కదా .శ్రీ బ్రహ్మ చైతన్య గొడ్వా లేకర్ మహారాజ్ ,శ్రీ గులాబ్ రావు మహారాజ్ లకుకూడా వాసుదేవ స్వామి అంటే పరమ గౌరవం .
సశేషం
వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-8-20-ఉయ్యూరు
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-3
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-3
దుష్ట శక్తులు –
పిశాచ దెయ్యాలవంటి దుష్ట శక్తులు మానవ బాధలకు కారణాలౌతాయి .ఇవి తమబందువులను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి .వాటికున్న అతీంద్రియ శక్తులతో బాధలు కలిగిస్తాయి .వాటిని గుర్తించటం కష్టం .మహిమాన్విత మహిళలు పురుషులుమాత్రమే వాటిని గుర్తించి బాధపడే వారికి ఉపశమనం కలిగించగలరు .మొదట శారీరక ఇబ్బంది , ఆతర్వాత మానసిక క్షోభ కలిగించి బాధ పెడతాయి .హవానూర్ లో ఒక యువతి కీళ్ళ బాధలు చూపు కనపడక పోవటం తో ఇబ్బందిపడుతుంటే ఆమె సోదరుడు ఆమెను శ్రీ వాసుదేవానంద స్వామి దగ్గరకు స్ట్రెచర్ లో తీసుకొచ్చాడు . కమండలం లోని పవిత్రజలాన్ని ఆమె పై చల్లి స్వామి ఆమె సోదరుడిని ఆజలాన్ని ఆమె తలకు పాదాలకు రాయమని చెప్పారు .రాయటం మొదలవ్వగానే ఆమెను ఆవహించిన దుష్ట శక్తి తానూ వదిలి వెళ్ళిపోతానని గగ్గోలు పెట్టి స్వామి సరేఅనగా వదిలి పారిపోయింది .అది వదలగానే ఆ యువతి లేచి నిలబడి తన ఇంటికి హాయిగా నడిచే వెళ్ళింది .మరోసారి ఒక ధనికుడి భార్య ఇలాగే ఇబ్బంది పడుతుంటే అతడిని తానూ సంపాదించిన దాన్లో కొంత బ్రాహ్మణుల అన్నవస్త్రాలకు ఖర్చు చేయమని సలహా ఇస్తే ఆయన అలాచేయగానే భార్య ఆరోగ్యం కుదుట పడింది ,.
కర్నాటక బనవాసి నివాసి ఒకాయన స్వామి తో తానూ కొత్త ఇల్లు కడుతుంటే అకారణంగా కూలి పోతోందని మొరపెట్టుకొన్నాడు .దైవ సంబంధ కార్యాలు చేయమని చెప్పగా అలా చేయటం తో ఇల్లు ఇబ్బంది లేకుండా పూర్తయింది .శ్రీపాద శాస్త్రి అనే ఆయన తన సోదరి తరచూ మూర్చలతో బాధ పడుతోందని చెబితే అది పిశాచ బాధ అని గ్రహించి చెప్పగా తానూ నమ్మలేనన్నాడు శాస్త్రి .స్వామి ఒక ఇటుక మీద మంత్రం రాసి ఆయనకిచ్చి రోజూ 21సార్లు జపించమని ధూపం వేయమని ,చెప్పారు .21రోజులు తర్వాత ఆపిశాచం ఆమెతో మాట్లాడింది .తానూ ఎందుకు బాధించానో వివరించి ఇక స్వామి శక్తిముందు తాను నిలబడ లేనని చెప్పి ఆమెను వదిలి వెళ్ళిపోయింది .
దుష్టశక్తులు గర్భ విచ్చిత్తికి ,శిశువు పుట్టకుండా చేయటానికి కారణం అవుతాయి .మండలమహాపూర్ కు చెందిన భైరవ ప్రసాద్ కు పుట్టిన అయిదుగురకొడుకులు వరుసగా చనిపోతే ,స్వామిని శరణు వేడాడు .నారాయణ బలి ఇస్తూ రోజూ విష్ణు సహస్రనామ పారాయణ చేయని సలహా ఇచ్చారు .
హేతుబద్ధత
మనిషి కిఉన్న విపరీత కోరికలే అనర్ధాలకు కారణమని స్వామీ బోధన.తాను చేసేపనులవలన భక్తజనం లో విశ్వాసం కలిగిస్తాయని .భౌతిక సుఖాలు మరిగినవారు అన్ని రకాల పతనం చెందుతారని వాళ్ళు అందుకే తనవద్దకు వచ్చి మార్గదర్శనం పొందుతారని వారిబాధలు నివారిస్తాయని చెప్పేవారు .వారి ఆత్మలను పరిశుద్ధి చేయటమే తను చేసేపని దానివల్లనే వారి ఇబ్బందులు తొలగి ధర్మమార్గాన నడుస్తున్నారని చెప్పారు .
సత్య దర్శనులు
నిజాయితీకల సత్యదర్శనులు ఆత్మజ్ఞానులు లోకం లో చాలా తక్కువమంది ఉన్నారు .కొందరికి ఒకజన్మలోనే సాధ్యమైతే మరికొందరికి ఎన్నో జన్మలు అవసరం రావచ్చు .
స్వామీజీ శినోర్ లో ఉండగా ఒకసారి జాబాల అనే ఒక జాలరి స్వామిని ఆపేశాడు .అతడు పెళ్లి అయిన కొద్దికాలానికే ఇల్లు వదిలి వచ్చేశాడు .ఇక్కడ భౌతిక సుఖాలకు దూరంగా జీవిస్తున్నాడు .అతడిని చూసి స్వామి ‘’మీరు ఇక్కడున్నారన్నమాట ‘’అన్నారు .రాత్రి మార్కండేయ దేవాలయనికి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు .ఆ రోజునుంచి తానూ గీతా ప్రవచనం చేస్తానని ప్రకటించి మార్కండేయ దేవాలయం రాత్రిపూట ప్రవచనం ప్రారంభించారు స్వామి రోజూ జాబాలకూడా వచ్చి ఒక మూల కూర్చుని వినేవాడు .17వ అధ్యాయం ప్రవచనం అవగానే జాబాల స్వామితో ‘’ఇకనేను వినాల్సిన అవసరం లేదు ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు .తర్వాత రెండు నెలలకు చనిపోయాడు జాబాల.
సరస్వతి బాయి అనే వేశ్య కొంతకాలానికి పశ్చాత్తాపం చెంది నర్సోబ వాడి ఆశ్రమం కి వచ్చిదత్త పాదుకలముందు దీక్షిత్ స్వామి ఎదుట కరుణా త్రిపాది పాడేది . ఒకసారి స్వామీజీ ఎదుట పాడుతుంటే ఆమె అనన్యభక్తికి మెచ్చి ఆమెకోసం గురు స్తోత్రం రాసిరోజూ పారాయణ చేయమన్నారు .ధ్యానం కూడా నేర్పారు .కొద్దికాలానికే ఆమె వాటిని పాటించి పరమ పవిత్రురాలైంది ‘.
సశేషం
రేపు శ్రీ వినాయకచావితిశుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-20-ఉయ్యూరు
శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం –లక్కవరం
శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం –లక్కవరం
తూర్పు గోదావరి జిల్లా తాటిపాక సీమ అనబడే రాజోలు మండలం లో లక్కవరం గ్రామం లో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .చుట్టూ ప్రాకారం ,మంచి ధ్వజస్తంభం ,వైభావాత్మక కళలతో అందంగా ఉన్న గర్భాలయం ,కళ్ళను ఆకర్షించే చిత్రాలు ఉంటాయి .ముందు భాగం లో ముఖమంటపం కళ్యాణ మండపం ఉంటాయి .ఆలయ గోపురం రమ్యంగా చూడముచ్చటగా ఉంటుంది .ఆలయం లో జయ ఘంట నాదం ఓంకారధ్వనితో వీనులకు విందు చేస్తుంది .మనసుకు హత్తుకొనే శిఖరాలు న్నాయి .స్వామి పూజకు పెంచిన పూలతోట వివిధరకాల పుష్పాలతో అలరారుతుంది .
ఆలయ ద్వార బంధం దాటీ గా ఉంటుంది .దానికున్న తలుపులలో చిరు ఘంటల రవళి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది .స్వామి ఊరేగింపుకు ఉపయోగపడే అనేక వాహనాల వరుస నయనమనోహరం .స్వామి ఉత్సవ విగ్రహాలు వెలలేని శోభతో ఆగమ రీతిలో ఉంటాయి .స్వాములకు పట్టేతెల్లగొడుగుల కాంతి శరత్కాల పౌర్ణమి చంద్రకాంతి తో ధగధగ మెరుస్తాయి .వెండి వింజామరలు స్వామి కి మలయా నిలం అందిస్తాయి .మంగళ తోరణాలు శుభప్రదమై కాంతు లీనుతూ కనిపిస్తాయి .
గర్భ గృహం లో సకల సౌభాగ్య శృంగార సంయుతమైన ఎత్తైన పీఠంపై ముద్దులొలికే శ్రీ రుక్మిణీ సత్యభామల మధ్య శ్రీ వేణుగోపాలస్వామి నయనా నందకరం గా ముద్దులు మూటకట్టుతూ ,భక్తులకు కొంగు బంగారం గా భక్త వరదుడుగా దర్శన మిస్తాడు .వేణు గోపాల స్వామి ఆలయానికి శంఖు చక్రాలు ధరించిన జయవిజయ అనే ద్వార పాలకులు ఇరువైపులా ఉంటారు .వేణుగోపాల స్వామికి తూర్పు దిశలో పరమ భక్తాగ్రగాన్యుడు స్వామి వాహనం అయిన వైనతేయుడు పరమ భక్త తో వందనం చేస్తూ దర్శన మిస్తాడు .నంద దీపాలు స్వామికి భక్తజనులకు ఆనంద సంధాయకం గా ఉంటాయి.
శ్రీ కృష్ణాష్టమి నాడు అశేష భక్తజన సందోహం స్వామి వార్లను దర్శించి పూజించి తరిస్తారు .ఆలయం లో నిత్య అస్టోత్తర ,సహస్రనామ పూజ ధూప దీప నైవేద్యాలు , భోగాలు వైభవంగా రెండు పూటలా జరుగుతాయి.స్వామి వారల ఏకాంత సేవ చూసి తరించాల్సిందే .ధనుర్మాసం లో నిత్య ప్రాతః పూదికాలు ,అత్యంత వైభవంగా గోదా దేవి కల్యాణం నిర్వహిస్తారు .సంక్రాంతి పర్వదినాన ఆలయ ధర్మకర్త వంశ స్త్రీలంతా ఆలయానికి విచ్చేసి స్వామిని మనసారా అర్చిస్తారు .ఆలయం నిత్యపూజలు నిత్యభోగాలు ,చక్రపొ౦గలిలి వేణు పొంగలి పులిహోర వంటి ప్రసాదాలతో కలియుగ వైకుంఠం లాగా కనిపిస్తుంది ,వైశాఖ శుద్ధ ఏకాదశినాడు ఉభయ దేవేరులతో శ్రీ వేణు గోపాలస్వామి కల్యాణం రంగరంగ వైభవం గా నిర్వహిస్తారు .
ఈ ఆలయానికి ఇరువైపులా రెండు చిన్న దేవాలయాలున్నాయి .ఒకదేవాలయం శ్రీ లక్ష్మీ దేవి ,మరియొకదానిలో శ్రీ జానకీ రామ లక్ష్మణుల దివ్య విగ్రహాలు భక్తానుగ్రహం గా ఉంటారు ..ఆలయ ధర్మకర్తలు మంగెన వంశం వారు.1921దుర్మతి నామ సంవత్సర వైశాఖ బహుళ దశమి బుధవారం ఉదయం 8-04 గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున లగ్నం లో వీరు నిర్మించిన లక్కవరం అనే బ్రాహ్మణ అగ్రహారం లో శ్రీ వేణుగోపాల స్వామిని ప్రతిష్టించి సర్వాంగ సుందరంగా వైభవోపేతం గా సకల సౌకర్యాలతో ఆలయనిర్మాణం చేశారు .ఆ వంశం లో గంగయగారు ఉత్తముడు వేణుగోపాల భక్తుడు భార్య సుబ్బాంబ . ఈ దంపతులకు పంచ పాండవుల వంటి బుద్దిమంతులైన అయిదుగురు కొడుకులు .సర్వారాయుడు,వెంకటస్వామి ,ముత్యాలు మొదలైనవారు .
మంగెన వంశం వారు పరమభక్తితో భద్రాద్రి రామదాసులాగా శ్రీ వేణుగోపాల స్వామి కి గోపురప్రాకార మంటప వాహనాలు చక్కగా అమర్చారు .చక్కని కోనేరు త్రవ్వించారు .పేదలకు అన్నోదకాలు కల్పించారు. వివాహాదులకు ధన సహాయం అందించారు . బ్రాహ్మణులను ఆదరించి సకల సౌకర్యాలు కల్పించారు .భూతదయతో జాతిమత భేదం లేకుండా అందరి మనసులను రంజింప జేసి కీర్తి పొందారు .ప్రజల క్షేమమే పరమావధిగా జీవించారు.
ఆధారం – లక్కవర శ్రీ వేణుగోపాల శతకం –కవి –భగవత్కవి శ్రీ లక్కాకుల వేంకట రత్న దాసు గారు –నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా కుల్లూరు పురం లో జన్మించారు .తండ్రి రామ చంద్రార్య .తల్లి యరుకలాంబ .కవిగారికి స్వప్నం లో ఈ స్వామి దర్శనమివ్వగా భక్తితో 180 సీస పద్యాలతో భక్తిజ్ఞాన వైరాగ్య బోధకాలుగా లక్కవర శ్రీ వేణుగోపాల శతకం 1937లో రాసి ధన్యులవగా , మంగెన వంశీకులు దాన్ని ముద్రించి లోకానికి అందించారు .. సంక్షిప్తంగా ఆలయ చరిత్ర ధర్మకర్త వంశావళి కూడా రాసి తెలియని విషయాలెన్నో లోకానికి తెలియ జేశారు .’’లక్కవర పురపాల హిరణ్య చేల –వేణు గోపాల రుక్మిణీ ప్రాణ లోల ‘’అనేది మకుటం .ఒకటి రెండు పద్యాలు మచ్చుకు చూద్దాం –
‘’రాధామనోహర మాధవ పరమాత్మ –పరమ పదనివాస శరణు శరణు –పార్ధ సారధి దేవభక్త సంరక్షకా –మురళీధరా శౌరి శరణు శరణు –నారాయణా ,భక్త కల్పద్రుమా –సర్వేశ శ్రీ కృష్ణ శరణు శరణు –మందరోద్ధార ,గోవింద హరే కృష్ణ –పరమార్ధ గోవింద శరణు శరణు –శరణు నీకిదే నిక్కంబు సారసాక్ష –భక్త హృత్పద్మసంవాస ధర్మవాస –లక్కవర పురపాల హిరణ్య చేల –వేణుగోపాల రుక్మిణీ ప్రాణ లోల ‘’
‘’శారద చంద్రికా సమరుచి హైయంగ -వీణ౦బు నొక చేత వేడ్క నమర –అమృ తోపమానమై
యలరారు పాయస –భక్తంబు నొక చేత పరిఢవిల్ల –పుండరీక నఖంబు ,నిండు చందురు గేరు –కాంతులు మెడక్రింద గంతులిడగ-కనక సూత్ర స్ఫీత ఘంటా వితానంబు –దిసమొల మ్రోగుచు తేజరిల్ల –తల్లి వెను వెంట ముద్దుగా తప్పటడుగు –లలర దిరిగెడుదివ్య దిగంబరుండు –పద్మ పత్రాక్ష నీవె శ్రీపతి ముకుంద –‘’
‘’సద్గురు పాద కంజాతముల్ సేవింప –కనులేదు వైరాగ్య ఘనసుపదవి –దేశికు నపాదతీర్ధంబు గ్రోలక –గానరాదట్టి విజ్ఞాన మహిమ –దేశి వర్యుని దివ్య ప్రసాదంబు- గొనక కల్గునె భక్త మనన దీక్ష –సద్గురు బోదార్ధ సారంబు దెలియక –కలుగునే ముక్తి యు ఘనతగాను –అట్టి సద్గురు మూర్తి వై యమరు దీవె-నీ గురూప దేశమే నాకు నిత్య సుఖము ––
‘’గోపాల శ్రీ కృష్ణ గోపరిపాలకా –మందర నగధీర మంగళంబు –నీరజ దళ నేత్ర ,నీల తోయద గాత్ర –మౌని సన్నుత పాత్ర మంగళంబు –పాండవ పాలనా ,భక్త జనోద్ధార-మధుసూదనా శౌరి మంగళంబు –కమలామనః ఖేల కాంచనమయ చేల –మహనీయ గుణ శీల మంగళంబు –మన్మధాకార ,యదు వీర మంగళంబు –మాధవాననంత గోవింద మంగళంబు –లక్కవర పుర పాల ,హిరణ్య చేల –వేణు గోపాల రుక్మిణీ ప్రాణ లోల ‘’
అంటూ శతకం పూర్తి చేశారు దాసుకవి .మందార మకరంద మాధుర్యంగా భక్తి తత్వ సుబోధకం గా పద్యాలున్నాయి .ఈ కవి మనమహాకవుల దృష్టిలో పడక పోవటం ఆశ్చర్యం .భక్తకవిగా పేరు పొందాల్సిన కవి వరేణ్యులు ఈ కవి .వారు ఈదేవాలయ శతకం రాయకపోతే దాని చరిత్ర తెలిసేదికాదు. వారికి ఆంద్ర సాహితీ లోకం, భక్తజనం రుణ పడి ఉంటారు .
రేపు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-20-ఉయ్యూరు
డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-21
-
డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-21
మద్రాస్ లో సుభాష్ చంద్ర బోస్
రామచంద్రగారు మద్రాస్ లో గన్నవరపుసుబ్బరామయ్య ‘’రంగనాథ రామాయణం ‘’పరిష్కరణలో తోడుగా ఉన్నారు ..ఎగ్మూర్ లో గదిలో ఉంటున్నారు .అక్కడ హరి హర విలాస్ లో భోంచేసి పదిన్నరకు చి౦తాద్రిపేట శ్రీనివాస పెరుమాళ్ వీధిలో ఉన్న సుబ్బరామయ్యగారింటికి చేరేవారు .సాయంత్రం అయిదున్నారదాకా డ్యూటీ చేసి ఇంటికి తిరిగి వచ్చేవారు .
అప్పుడు అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి పట్టాభి కీ సుబాస్ బోస్ కు జరిగిన పోటీలో పట్టాభిఓడి బోసు బాబు గెలిచాడు. పట్టాభి ఓటమి తన ఓటమి అని గాంధీ తెగబాద పడ్డాడు .బోసు దేశమంతా తిరుగుతూ మద్రాస్ వచ్చాడు .మెరీనా బీచ్ లో సభ .ఆ సభకు మద్రాస్ మద్రాస్ కదిలి వచ్చింది .వేటూరి వారు గాంధీ అభిమాని .ఆయనా బాధ పడుతున్నాడు .’’బోసు తీవ్రవాది అతని సభకు ఎవరూ వెళ్ళద్దు ‘’అని అనుచరులకు ఆర్డర్ వేశారు .ఈ సంగతి రామ చంద్రకు తెలీదు. శాస్త్రిగారి భార్య మహాలక్షమ్మగారు తన ఇద్దరు పిల్లలు వేటూరి ఆనంద మూర్తి-9 ,చెల్లెలు సుజాత , వినీత -6ను తీసుకొని బోసు ను చూపించి రమ్మని చెప్పారు .’’ఆయన తెలుగు ఎంయే పరీక్షల సంఘం అధ్యక్షులుకనుక గంటలకు విశాఖ రైలుకు వెడతారు .ఆ లోపల వచ్చేయండి ‘’అన్నారు .’’శాస్త్రిగారికి కోపం వస్తుందేమో నండీ ‘’అని నీళ్ళు నవిలారు ,’’ నేనేదో నచ్చ చెబుతా .పిల్లలు బోసును చూడాలని ముచ్చట పడుతున్నారు త్వరగా రండి ‘’అన్నారు .
మెరీనా బీచ్ అందమైన ప్రపంచ బీచ్ లలో ఒకటి .అక్కడ ‘’లవర్స్ పాత్’’ ‘’మిథునపథం’’రమణీయంగాపరిశుభ్రంగా ప్రేమోద్దీపకం గాఉండేది .ఆ రోజు మధ్యాహ్నం నుంచే జనాలు తండోప తండాలుగా బోస్ స్పీచ్ కు వస్తున్నారు .సాయంత్రం ఆరుగంటలకు బోసు బాబు వచ్చాడు .అయన మీటింగ్ ముగించుకొని శాస్త్రిగారు వెళ్ళే రైలులోనే నెల్లూరు వెళ్ళాలి కనుక సాయంత్రం 7గంటలకే సభ ముగించారు .సుభాష్ తన ప్రసంగం లో రెండవ ప్రపంచ యుద్ధం రా బోతోందని ,బ్రిటిష్ వారికి భారతీయులు సహకరించరాదని ,త్వరలో స్వరాజ్యం సిద్ధిస్తుందని గంభీరం గా మాట్లాడాడు .మద్రాస్ అంతా వినబడేంత కరతాళ ధ్వనులతో సభ ముగిసింది .
‘’తమ్ కిం పిసాహసం పా-హసేణసాహంతి సమస సహానా –జం భావి ఊణ దివ్యో –పరం ముహో దుణి ని అసానం ‘’
భావం –సాహసులు సాహసం తో కార్యం సాధిస్తారు.దాన్ని తలచుకొని దైవం ముఖం తిప్పుకొని చూస్తుంది ‘’గడుసు వాడే ‘’అనే మెచ్చికోలు భావం తో .
రామచంద్ర ఆడపిల్లను చంకన ఎత్తుకొని ఆనందమూర్తి సుజాతచేరో చేయిపట్టుకోగా చేయిపట్టుకొని ఆ జన సముద్రం దాటు కుంటూ బయటపడే ప్రయత్నం చేశారు సభ జరిగిన చోటు నుంచి కన్నగి విగ్రహం దాకా దూరం వంద గజాలేఅక్కడి నుంచి పిల్లే రోడ్డు ఫర్లాన్గున్నర అంటే 320గజాల దూరం నడవటానికి గంటన్నర పట్టింది ఆమహా జన సమ్మర్దం లో .పిల్లలు బిక్కమోహాలేసుకొన్నారు .చేతులు పట్టుకున్న పిల్లలు ఎక్కడ తప్పిపోయి అబహాసు పాలోతానో అని అతిజాగ్రత్తగా నడుస్తున్నారు వాళ్ళతో రామ చంద్ర .ఎట్టాగో 4వనమ్బార్ శాస్త్రి గారింటికి చేరారు పిల్లలు తుర్రుమని లోపలి దూరారు
శాస్త్రి గారి హాలు సాయం ప్రార్ధనకోసం వచ్చే జనం తో నిండిపోయింది .ఆ రోజు మద్రాస్ లో ఒక్క వాహనం కూడా కదలలేదు .ప్రళయ పూర్వ గంభీరంగా ఉంది అక్కడి స్థితి .శాస్త్రి గారు కోపం తో పచార్లు చేస్తున్నారు .భయం ఎరుగని రామ చంద్ర భయపడ లేదుకానీ ,ఆయన విసురుగా వచ్చి ‘’ఎవరయ్యా నువ్వు బుద్ధి ఉందా నాకు గాంధీకి ఇష్టంలేని మనిషిని చూడటానికి నా అనుమతి లేకుండా వెళ్ళటమే కాకుండా మాపిల్లల్నీ తీసుకేదతావ .నీ ఏడ్పు నువ్వేడు నాపిల్లల క్రమశిక్షణ చెడగొట్టే హక్కు నీకెవరిచ్చారు ?’’అని మీద మీదకు వస్తుంటే నోతమాతరాక నిలబడితే ఆయన వెనకున్న భార్య ఏమీ మాట్లాడాడని సౌజన చేతున్నారు .ఎవరూ మాట్లాడలేదు .మళ్ళీ అందుకొని ‘’నీ వాళ్ళ నా మర్యాద మంతగాలిసింది రేపు సాయంత్రం విశాఖ చేరేవాడిని పిల్లల్ని చూసి వెడదామని ప్రయాణం మానేశా .నా ప్రోగ్రాం అంటా బూడిదపాలు చేశావ్ .పేనుకు పెత్తనమిస్తే తేలుకు పెత్తనమిస్తే ఒళ్ళంతా కుట్టినట్లుచేశావ్ .నేను ఇంట అరుస్తున్నా మాట్లాడకుండా కిమిన్నాస్తి గా ఉంటావేమిటి ?/అని ఎడా పెదా సుత్తి వీరభద్రరావు లాగా గంటసేపు నాన్ స్టాప్ గా వాయించేశారు శాత్రి గారు .ఇక ఆగలేక గేటు తీసుకొని ఏ వాహనం తిరగానందున నడిచి రౌండ్ ఠానా,హారిస్ రోడ్ గుండా ఎగ్మూర్ రోడ్డు నడుచుకొంటూ చేరి ,హోటల్ లో ఇడ్లీలు తిని రూమ్ కు చేరుకొన్నారు
మర్నాడు ఉదయం ఆలస్యం లేచి శాస్త్రి గారి రాగద్వేషాలు అర్ధం చేసుకొని పూర్వం ఒకసారి బరోడా గాయక్వాడ్ ఒరిఎంతల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరీ వారు దక్షిణాది భాషలు తెలిసిన పండితులు కావాలని ప్రకటన ఇస్తే ,దరఖాస్తు పెట్టి శాస్త్రి గారికి చెప్పి మద్రాస్ నుంచి బరోడాకు రైలు చార్జీలు 8రూపాయలే అయినా నెలాఖరు కనుక డబ్బుల్లేక శాస్త్రి గారిని అడిగితె ‘’నీకు రాదు వెళ్ళద్దు నాదగ్గర డబ్బు లేదు ‘’అని పొడి మాటలు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది .రామచంద్రగారి అర్హత బట్టి ఆఉద్యోగం ఆయనకు తప్పక వచ్చేది .ఒకసారి బరోడా లైబ్రరీ నుంచి మద్రాస్ కు ఒక విద్వాంసుడు వస్తే ప్రసంగావశాట్టు ఆయనతో తన అప్లికేషన్ సంగతి చెబితే ‘’మీది మొదటి స్థానం లో ఉండేది మీకే సాంక్షన్ చేశారు మీరురకపోవటం వలన రెండవస్థానం లో వారిని నియమించారు ‘’అని చెబితే నీరుకారి పోయారు రామ చంద్ర ఇది 1937 నాటి సంగతి
మర్నాడు ఉదయమే స్నానాదులు పూర్తీ చేసి సుబ్బరామయ్యగారింటికి సరైన సమయం లోనే వెళ్ళారు రామ చంద్ర .ఇద్దరూ పాతాంతరం చర్చల్లో ఉండగా బయట ఏదో అలికిడి ఐతే సుబ్బరామయ్యగారు అమాంతం లేచి నుంచోగానే ఎవరుఅని ఈయన చూస్తె వేతూరు వారు .ప్రభాకరశాస్త్రిగారు అమాంతం పరిగెత్తుకొచ్చి రామచంద్రను గట్టిగా కావలించుకొని ,ఏదో మాట్లాడబోయి మాటలురాక తడబడుతూ కన్నీరు కారుస్తూ పది నిమిషాలు నిలబడి అలాగే ఉండిపోయి తేరుకొని ‘’నాయనా !ఎంతో నొప్పించాను నిన్ను ‘’అనంరు .తలకోట్టేసినంత పని అయి ఈయన్ ‘’తప్పు నాదంది ‘’అన్నారు శాస్త్రిగారు ‘’నీదికాదు .మద్రాసుకు మద్రాసే విరగబడి వెడితే నువ్వు వేదితెతప్పా ?పిల్లలకు ప్రసిద్ధనాయకుల్ని చూసే ఉబలాటం ఉండటం సహజం .ఆ మీటింగ్ కు వచ్చిన వారందర్నీ ఆపగాలిగానానేను ?’’అని రుద్ధ కాంతం తో అని పశ్చాత్తాప పడ్డారు .నిప్పులో కాని నిర్మలమైన ఔదార్యం శాస్త్రి గారిది అంటారు తిరుమల రామ చంద్ర .ఒక ప్రాకృత శ్లోకం ఉదాహరించి దాని భావం చెప్పారు –‘’సజ్జనుడు కోపపడదు కోపం వస్తే చేడుఆలోచించాడు చెడు తలపోస్తే నోటితో అనడు ,వాగాడు ఒక వేల పొరబాటున నోరుజారితే సిగ్గుపడి పోతాడు చీచీ నేనేనా నోరు జారింది అని అతడికి సిగ్గుమున్చుకొస్తుంది .ఇది శాస్త్రిగారి వ్యక్తిత్వానికి గొప్ప ఉదాహరణ
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-20-ఉయ్యూరు
అశ్వత్ధామ వంటిదివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-2
స్వామి సూచింఛి పరిష్కరించిన సమస్యలు
శ్రీ వాసు దేవానంద స్వామి చిఖలాడ దీక్షలో ఉండగా ,ఒకాయనవచ్చి తాను ఏది తిన్నా జీర్ణించుకోలేకపోతున్నానని ,దానితో నీరసం ఎక్కువైందని విన్నవించాడు .స్వామీజీ ఆయన ఇంటి కులదేవత పట్ల శ్రద్ధ చూపక ,పూజ మానేయటమే దీనికి కారణం అని చెప్పి ,కులదేవతను పూజ చేస్తూ తానూ ఉపదేశించే దత్తమంత్రం,దేవీ మంత్రం చదువుతూ మందులు కూడా ఇచ్చి పంపారు .అతని ఆరోగ్యం కుదుటబడింది .
1910లో నర్సోబా వాడి లో ఉండగా ఆప్రాంతం లో కలరా విపరీతంగా బాధిస్తుంటే ,పూజారులను దత్త పాదుకలకు అభి షేకం చేయమని చెప్పారు .అభి షేకం చేస్తే ఈ అంటు వ్యాధి ఎలా తగ్గుతుంది అని వాళ్ళు అడిగారు .దానికి ‘’చావుకూడా దేవుని అభి వ్యక్తీయే అని,ఈ వ్యాధులు కూడా ఆయన శక్తులే అని ,ఆశక్తుల్ని అభిషేకం లాంటి వాటితో వేదాలలో చెప్పినట్లు శాంత పరిస్తే అవి ప్రసన్నమై ,వ్యాధులను ఉపసంహరిస్తాయి ‘’అని చెప్పారు .ఆప్రకారం పూజార్లు చేయటం కలరా తగ్గటం జరిగింది .వాసుదేవ ఠాకూర్ అనే ఆయన ఇండోర్ నుంచి వచ్చి ,తన భార్య ఆరోగ్య౦ బాగాలేదని చెప్పాడు .స్వామీ జీ దానికి కారణం ఆయన వంశం లోని పవిత్ర మూర్తి సమాధికి జరిగిన ఉపేక్ష కారణం అని,కుజ వ్రతం చేయమని చెప్పారు .వెంటనే వాళ్ళ ఊరికి వెళ్లి ఆ సమాధిని శుభ్రం చేయించి బాగా అలంకరింఛి పూజ చేసి కుజవ్రతం శ్రద్ధగా చేయగా ,అతడి భార్య ఆరోగ్యం వెంటనే కుదుట బడింది .ఇప్పుడు చెప్పిన అవన్నీ దేవతా సంబంధ విషయాలు .
ఆది భౌతిక వ్యాధులు –భూకంపాలు వరదలు అగ్నిప్రమాదాలు తుఫాన్లు మెరుపులు ఉరుములు పంచ భూతాల వలన కలుగుతాయి .స్వామీజీ భక్తురాలు ఒకామెను భర్త వదిలేశాడు .చిన్న గుడి సెవేసుకొని కొద్దిపాటి పొలాన్ని చూసుకొంటూ బతుకు తోంది .ఒక సారి ఆమె పొలంలో పంటబాగా పండి ,కోతలు నూర్పిళ్ళు కూడా జరిగి ,ధాన్యం రాసి పోశారు .అనుకోకుండా తుఫాను పట్టుకొన్నది .ఆమెకు ఆధారం ఆ తిండి గింజలే .అవి తడిసిపోతే బతుకు గడవదు .ఆమె అ ధైర్యకుండా స్వామి జీ పాద ధూళి తీసుకొని రాశి చుట్టూ చల్లి స్వామి మహారాజ్ ను కాపాడమని నిండుమనసుతో ప్రార్ధించింది .తుఫాను వచ్చింది కాని ఒక్క చినుకు కూడా ఆమె ధాన్యపు రాసిపై పడలేదు అందరూ ఆశ్చర్యపోయారు .
స్వామీజీ నర్మదా తీరం గరుడేశ్వార్ లో చివరి చాతుర్మాస్స్య దీక్ష గడుపుతూ గోకులాష్టమి జరుపుతున్నారు వేలాది మంది భక్తులతో .అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై విపరీతంగా వర్షం కురవసాగింది నది అవతలి ఒడ్డున .తుఫానుకు భయపడకుండా కీర్తనలు భజనలు కొనసాగించమని స్వామీజీ ఉద్బోధించారు .అర్ధరాత్రిదాకా వారు అలానే కొనసాగించారు .కార్యక్రమం పూర్తి అయి ,అందరూ లోపలి వెళ్ళగానే తుఫాను పగతీర్చుకోన్నదా అన్నట్లు విజ్రుమ్భించింది .
స్వామిస్వగ్రామం మాన్ గోన్ లో గృహస్తాశ్రమ౦లో ఉండగా ,ఒక గరుడ ద్వాదశి నాడు ,వందలాది భక్తులు వచ్చి కూర్చున్నారు . ప్రసాదం పంచి పెట్టె సమయానికి పెద్ద వర్షం భయపెట్టింది .ఏర్పాట్లన్నీ దెబ్బతి౦టా యేమో అనిపించింది .కంగారు పడవద్దనీ వరుణ దేవుడు కూడా ప్రసాదం తీసుకోవటానికి వచ్చాడని చెప్పి ,పెద్దపాత్రలో ఆయనకు ప్రసాదం నైవేద్యం పెట్టించారు .పెద్ద వర్షం కురిసి చుట్టుప్రక్కల ప్రాంతాన్ని భీభత్సం చేసి౦ది కాని ఇక్కడ ఒక్క చినుకు కూడా పడలేదు .ఇలాంటి అనుభవాలు స్వామి జీవితం లో చాలా జరిగాయి .
ఒక సారి గరుడేశ్వర్ లో ఒకపెద్ద అన్నం పాత్రను నర్మదా నదిలో పని చేసే స్త్రీలు కడిగి శుభ్రం చేస్తుంటే , నదిలోకి పట్టు తప్పి జారిపోయి,ప్రవాహానికి కొట్టుకు పోయింది .పని వాళ్ళు స్వామీజీ దగ్గరకు వచ్చి చెప్పుకోగా వెంటనే నది దగ్గరకు వెళ్లి ,నదీజలాన్ని తన దండం తో స్పృశింఛి ‘’తల్లీ నర్మదా ! ఈ పాత్రతో నీకేమిటి పని ?నీ పిల్లలకు అన్నం పెట్టకుండా అడ్డు తగులుతావా ?’’అన్నారు .వెంటనే అద్భుతంగా నది లో వాలుకు కొట్టుకుపోతున్న ఆపాత్ర ,ప్రవాహానికి ఎదురుగా వస్తూ ఒడ్డుకు చేరి అందరి కంగారు తీర్చేసింది .
ఈ విషయాల వలన మనకు తెలిసిదేమిటి ?ఆత్మజ్ఞాని కి ప్రకృతి సహకరిస్తుంది ,ఆయనతో సహజీవనం చేస్తుంది అన్న వేద సూక్తి రుజువైనట్లేకదా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-20-ఉయ్యూరు
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -16
ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -16
20వ శతాబ్ది సాహిత్యం -8
01914నుంచి 1945వరకు
సాహిత్య విమర్శ -2
నైతిక –సౌ౦దర్యా రాధక విమర్శకులు
విల్సన్ ,బర్క్ లు కౌలీ లాగా మోర్టాన్ డిజేబెల్ ,న్యూటన్ అర్విన్ ,ఎఫ్ ఓమత్తీసన్ లు నైతిక సౌన్దర్యవాదుల ,సాంఘిక విమర్శకుల మధ్య సమతుల్యం సాధించే ప్రయత్నం చేశారు .విశ్లేషణ తోపాటు సృజనను అంచనాకట్టే ఉద్దేశ్యం ఉన్నవారు .రచయిత ఎలారాశాడు రచనను సాంఘిక నైతిక చట్రాలలో దేనిలో పెట్టచ్చు అనిఆలోచించారు .వీరిపై ఇలియర్ ప్రభావం కనిపిస్తుంది .దిసేక్రేడ్ వుడ్ -1920,దియూజ్ ఆఫ్ పోయెట్రి అండ్ దియూజ్ ఆఫ్ క్రిటిసిజం -1933లలో ఇలియట్ సాహిత్య భాషను గురించి చెప్పినా , సంస్కృతీ సాధారణీకరణ పై విస్తృతంగా విమర్శించాడు,నిర్ణయాలు ప్రకటించాడు .ఆయన ఎక్కువగా కవిత్వం చదివే వారిపై గొప్ప ప్రభావం చూపాడు .అలా ప్రభావితులైనవారిలోఇంగ్లాండ్ కు చెందిన ఐ.ఎ.రిచర్డ్స్ ,విలియం ఏమ్ప్సన్ ,ఎఫ్ ఆర్ లీవిస్ ,అమెరికాలోని న్యు క్రిటిసిజం సమర్ధించే వారు ఉన్నారు .వీరు కవులేకాక కల్చరల్ కన్జర్వేటివ్స్ గా ముద్ర ఉన్నవారు .ఇలియట్ తోపాటు సాహిత్య చరిత్రను తిరగరాసి ,రొమాంటిక్ శైలినీ ,అర్ధం కాని ఆధునికకవిత్వాన్నీ ,సాహిత్య నిర్మాణాన్నీ తీవ్రంగా విమర్శించారు.ఆర్ పి బ్లాక్ మూర్ ‘’దిడబుల్ ఏజెంట్ -1935,అల్లెన్ టాటే-రియాక్షనరి ఎస్సేస్ ఆన్ పోయెట్రి అండ్ ఐడియాస్ – 1936,ఆన్ కౌవే రామ్సన్ –ది వరల్డ్స్ బాడీ -1938,యోవార్ వింటర్ –మాలేస్ కర్స్ -1938,క్లీనత్ బ్రూక్స్ –ది వెల్ wrought అర్ లలో ఈ ధోరణి కన్పిస్తుంది .తర్వాత వీళ్ళు సాంఘిక విషయాలను వదిలి రాసినందుకూ విమర్శకు గుఅరైయ్యారు .ఐతే సాహిత్యాన్ని అర్ధం చేసుకొని అభినందించటానికి ఈ న్యు క్రిటిక్స్ బాగానే తోడ్పడ్డారు .
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత
రెండుప్రపంచ యుద్దాలమధ్యకాలాన్ని విలియం కౌలీ ‘’అమెరికన్ రెండవ వికాస రచనాకాలం –సెకండ్ ఫ్లవరింగ్ ‘’అన్నాడు .నిజంగా అమెరికన్ సాహిత్యం కొత్త పరిపూర్ణత్వం 1920లోనూ 1930లోనూ పొందింది .మహామహా గొప్పరచయితల రచనలన్నీ 1945తర్వాత ముద్రణ పొందాయి .ఫాక్నర్ హెమింగ్వే అన్నేపోర్టర్ చిర్మస్మరణీయ ఫిక్షన్ సృష్టించారు .ఇవి వారి యుద్ధ పూర్వక రచనల స్థాయి నాణ్యతలతో సరితూగక పోయినా .ఇలియట్ వాలెస్ ,మూర్ ,కమ్మింగ్స్ ,కార్లోస్ ,గ్వెండోలిన్ బ్రూక్స్ ముఖ్యమైన కవిత్వాలను రాశారు .నాటక రచయిత యూజీన్ ఓ నీల్ –లాంగ్ దేశ జర్నీ ఇంటూ నైట్ ‘’నాటక౦ 1956లో ఆయన చనిపోయాక ప్రచురితమైంది .రెండవ ప్రపంచయుద్ధం ముందూ తర్వాత కూడా రాబర్ట్ పెన్ వారన్ ప్రభావ శీలా ఫిక్షన్ ,పోయెట్రి విమర్శ ప్రచురించాడు .ఇతడి ‘’ఆల్ ది కింగ్స్ మెన్ ‘’అమెరికన్ గోప్పనవలలలో ఒకటిగా గుర్తి౦పు పొంది 1947లో పులిట్జర్ ప్రైజ్ పొందింది .మేరీ మెకార్దే సోషల్ సెటైర్ తో బాగా పాప్యులర్ అయింది .1960లో మొదటి సారిగా మెరిసిన హెన్రి మిల్లర్ ఫిక్షన్ సూటిగా సెక్సువాలిటీ ని చూపి ఆకర్షించింది .యుద్ధం తర్వాతే ముఖ్యులంతా బాగా రాశారు .కాపలాకాసే తత్త్వం లో మార్పు కనబడింది .యుద్దాన౦తరకాలం కన్జర్వేటివ్ లదే అయినా,బాగా చర్చలలో నలిగిన రచయితలలో టెన్నెసీ విలియమ్స్ ,ట్రూమన్ కాపోట్ ,పాల్ బౌల్స్ జేమ్స్ బాల్డ్విన్ లున్నారు .హోమో సెక్సువల్స్ ,బై ససెక్సువల్స్ వీరిలో ఉన్నారు .డార్క్ ధీమ్స్ ,ప్రయోగాత్మక విధానాలతో అల్లెన్ గీన్స్ బెర్గ్ ,విలియం బర్రోస్ ,జాక్ కేరౌక్ వంటి ‘’బీట్ రైటర్స్ ‘’ కు దారి చూపించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-20-ఉయ్యూరు
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసు దేవానంద సరస్వతి 1854శ్రావణ కృష్ణ పంచమినాడు మహారాష్ట్ర,సామంతవాడి దగ్గర మాన్గోన్ గ్రామం లో జన్మించారు .వీరిని తెమ్బేస్వామి అని అంటారు .దత్తాత్రేయస్వామి అవతారంగా భావిస్తారు . చిన్నతనం లో వాసుదేవ అని పిలువబడేవారు విధివిధానంగా అన్నీ చేసేవారు .రెండుపూటలా సంధ్యావందనం ,వెయ్యి సార్లు గాయత్రీ జపం,గురు చరిత్ర పఠనం నిత్యకృత్యం .రెండులక్షల నలభై సార్లు గాయత్రి జపం చేశారు .తర్వాత వేదాధ్యయనం టాటా భట్టాజీ ఉక్తి దేవ వద్ద చేశారు .సాత్వికాహారం తినేవారు .ముందుగా వైశ్వదేవ ఆహుతి ఇచ్చి తర్వాత తినేవారు .ప్రతి ఏకాదశినాడు ఉపవాసం చేసేవారు .మంచి నీరుకూడా త్రాగకుండా పగలు,రాత్రీ నిద్రపోకుండా ప్రణవం జపిస్తూ గడిపేవారు .మంత్రసిద్ధికి అర్హత సాధించారు .వందేళ్ళనాటి దత్త్రేయ యంత్రాన్ని స్వహస్తాలతో రాసిన దత్త స్తవ౦ ఆయన ఆస్తి . . సరస్వతీ దేవిపై రాసిన శ్లోకాలను 1913లో నీలకంఠశాస్త్రి తండ్రికి అందజేశారు .ఒకశ్లోకం –నమస్తేశారదాదేవీ –సరస్వతి మతిప్రదే –వాసత్వ మమ జిహ్వాగ్రే –సర్వ విద్యా ప్రదా భవ ‘’
వాసుదేవ స్వామి తానుపొందిన సిద్ధులు, శక్తులు ఎన్నడూ డబ్బు కోసం ప్రదర్శించలేదు దీనులకు, అవసరమున్నవారికి సాయం చేసేవారు.
కుర్గుడ్డా ,పిఠాపురం వంటి చోట్ల ఆశ్రమాలను అభి వృద్ధి చేశారు .’’దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర’’మంత్రం తో దత్త విగ్రహాలు స్థాపించారు .ఈ మహామంత్రాన్ని కోట్లాది సార్లు జపించి అద్భుత సాహిత్యం సృష్టించి జ్ఞానబోధ చేశారు .1914లో గుజరాత్ లోనిగరుడేశ్వర్ లో పద్మాసనం లో దత్త విగ్రహం ఎదుట కూర్చుని ఓంకారం జపిస్తూ60వ ఏట ప్రాణాలు వదిలి సిద్ధిపొందారు .భక్తులు ఎప్పుడు భక్తిగా తలచితే అప్పుడు వచ్చి కోరికలు తీరుస్తానని చెప్పి దేహం చాలించారు ‘
వీరికి 8వ ఏట ఉపనయం అయింది .బాబాజీ పంత్ కూతురు రమాబాయి తో 21వ ఏట వివాహమైంది .నిత్యస్మార్తాగ్ని చేసేవారు .గాయత్రీ మంత్రం పునశ్చరణ చేసేవారు .వైశాఖ శుక్ల పంచమినాడు తనస్వగ్రామం మంగోం లో శ్రీ దత్తాత్రేయ విగ్రహం ప్రతిష్టించారు .జ్యేష్ట శుద్ధ ద్వాదశినాడు సన్యాసాశ్రమ స్వీకారం విధి విధానంగా స్వీకరించారు .ఉజ్జైన్ లో శ్రీ నారాణా నంద సరస్వతి నుంచి దండం స్వీకరించారు .1891క్షిప్రా నది ఒడ్డున ఉజ్జైన్ లో మొదటి చాతుర్మాస్య దీక్ష చేశారు .1892లో ఉత్తరప్రదేశ్ బ్రహ్మావర్తం లో రెండవ చాతుర్మాస్యం గడిపారు.ఈ సమయం లో శ్రీ దత్తపురాణ౦ సంస్కృతంలో రచించారు .మూడవ చాతుర్మాస్యం హరిద్వారం లో గంగానదీ తీరం లో 1893 లో పూర్తి చేశారు .మూడు నాలుగు చాతుర్మాస్యాలు బద్రీ ,కేదార్ నాద లలో 1894,95లలో చేశారు .1896ఆరవ చాతుర్మాస్యం హరిద్వార గంగాతీరం లో పూర్తి చేశారు .1896 ‘’నర్మదా లహరి ‘’అద్భుత రచన చేశారు .ఏడవ చాతుర్మాస్యం మహానదీ తీరాన 1897లోమధ్యప్రదేశ్ పెట్లాడ్ లో చేశారు ,ఇక్కడే ‘’దత్త లీలామృత సింధు ‘’ వెయ్యి పదబంధాలతో రాశారు .1898లో గుజరాత్ లోని తిలక్ వాడా లో ఎనిమదవ చాతుర్మాస్యం చేసి ,తెలుగులోని ‘’కుమార పురాణం ‘’ను మరాఠీ లోకి అనువదించారు .
గుజరాత్ లోని ద్వారకలో తొమ్మిదవ చాతుర్మాస్యం 1899లోనూ ,పదవదాన్ని 1900లో మధ్యప్రదేశ్ చికలాడ లో నర్మదా నదీ తీరం లో చేస్తూ ‘’కృష్ణ వేణి –పంచగంగ యుధిస్టం’’అనే నర్సోబా వాడి గొప్పతనాన్ని ఇంగ్లీష్ లో రాశారు .మధ్యప్రదేశ్ మహాత్ పూర్ లో క్షిప్రా తీరం లో 1901లో పదకొండవ చాతుర్మాస్యం గడిపి ,దత్తపురాణ౦ లోని కథలను సంకలనం చేసి ,’’త్రిశతి గురు చరిత్ర ‘’ను 300శ్లోకాలలో రచించారు . గురు చరిత్ర ఇక్కడే మొదటి సారి ముద్రించి అందరికీ అందజేశారు .ఉత్తర ప్రదేశ్ బ్రహ్మావర్తం లో 1902 లో12చాతుర్మాస్యం గడుపుతూ సంశ్లోకి గురు చరితను లఘుమనన సార వేదాంతంగా కూర్చారు ఇక్కడే 1903లో చాతుర్మాస్యం గడిపి ‘’సప్తశతి గురు చరిత్ర ‘’ను 700శ్లోకాలో మహిళలు పఠించ టానికి వీలుగారాశారు .ఇక్కడే 1904లో 14వ చాతుర్మాస్యం చేసి ,గంగాపూర్ వెడుతూ కృష్ణానదిపై కృష్ణ లహరి రాశారు .మహారాష్ట్ర నర్సిలో కాయధు నదీతీరాన 15వ చాతుర్మాస్యం1905లో పూర్తి చేసి ,ఇక్కడే ’’దత్త చంపు ‘’సంతరించారు .కరుణా త్రిపది కూడా ఇక్కడే రాశారు .ఇది దత్తఉపాసకులకు నిత్య పారాయణ గ్రంథం అయింది
1906లో మధ్యప్రదేశ్ బర్వా లో 16వ చాతుర్మాస్య దీక్ష చేశారు .1907లో తమిళనాడు తంజావూర్ లో కావేరి నదీ తీరాన 17వది చేస్తూ సమశ్లోకి గురు చరిత్ర రాశారు 1908లో 18వ చాతుర్మాస్యం కృష్ణా జిల్లా ముక్త్యాలలో కృష్ణా తీరాన నిర్వహిస్తూ యువ శిక్ష, వృద్ధ శిక్ష, స్త్రీ శిక్షా రచించారు .మహారాష్ట్ర వైన్ గంగా తీరం పావని లో 19వ చాతుర్మాస్యం1909లో చేస్తూ ‘’వైన గంగా ‘’స్తవం రాశారు .కర్నాటక హౌనూర్ లో తుంగభద్రా తీరాన 20వ దీక్ష1910లో చేసి ,జైన్ పూర్ లో ‘’దత్తాత్రేయం మహామనం వరదం భక్తవత్సలం ‘’రాశారు .21వ దీక్ష1911లో కర్నాటక కురవ్ పూర్ లో చేసి వెంకటరమణ ,అఘోర కష్టోద్ధరణ స్తోత్రం రాశారు .1912లో చికల్వాదాలో 22వ చాతుర్మాస్యంగడిపి ,చివరిది అయిన 23 వ చాతుర్మాస్య దీక్షను1913లో గుజరాత్ నర్మదా తీరం లో చేస్తూ సమాధి చెందారు .
శ్రీ విమలానంద భారతీ స్వామీజీ భక్తవత్సల దత్తాత్రేయ స్వామిని ,పాదుకలను రాజమండ్రి గోదావరీ తీరం లో నెలకొల్పారు .ఆశాఢ శుద్ధపాడ్యామి గరుడేశ్వార్ లో స్థాపించారు
స్వామి చరిత్రను తెలుగులో గుంటూరు వాసి సాధకులు శ్రీ జివిఎల్ విద్యాసాగరరచించారు .మూడు ముద్రణలు పొందింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-20-ఉయ్యూరు
శ్రీ వేంకటేశ్వరదేవాలయం –చిత్రాడ
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం లో చిత్రాడ గ్రామ౦ ఉన్నది అక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .ఈ చిత్రాడ వెంకటేశ్వర స్వామిపై సంస్కృతం లో ‘’చిత్రాడ వెంకటేశ్వర శతకం ‘’రాశారు శ్రీ అనంతా చార్యులు .కృష్ణాచార్య గురువు వలన వేదం వేదాంగాలు శాస్త్రాలు కావ్యాలంకారాలు,శ్రౌత స్మార్త కర్మల నిర్వహణ నేర్పు పొంది ,వైఖానస పాంచరాత్ర శ్రీ విష్ణు దివ్య ఆగమాలలో పరిణతి సాధించిన సుదీమణి శ్రీ పద్మనాభాచార్యులు .తైత్తిరీయ శాఖ .వైఖానస సూత్రులు .గౌతమ గోత్రీకులు .యజ్ఞయాగాదులు నిర్వహించటం లో చేయటం లో ప్రసిద్ధి చెందినవారు .నిగమాగమ ప్రవచనంలో వరిష్టులు తాతగారైన శ్రీ పద్మనాభాచార్యులు .ఆ గౌతమస గోత్రం లో జన్మించిన నరసింహా చార్య కవికి మూడవ సోదరుడు అనంతాచార్యుడు అనే కవి ఈ చిత్రాడ వెంకటేశ్వర శతకం రాశారు .వృష శైల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన చిత్రాడ నివాసి .దక్షిణ తిరుమలగా ,దక్షిణకాశిగా,పాద గయగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం .ఉత్తరాన పాదగయ అయిన పిఠాపురం ,తూర్పున సముద్రం ,పశ్చిమాన అఖండ గోదావరి ఉన్న పవిత్ర క్షేత్రం చిత్రాడ .రావు వంశం లో పుట్టి శ్రీ వెంకటేశ్వరస్వామి నిజభక్తుడైన వెంకటాద్రి సద్గుణ గరిష్టుడు .సచ్చీలుడు .ఆశ్రితులపాలిటి కల్పతరువు .ఈయన ఆదేశం తోకవిగారు చిత్రాడ శతకం సంస్కృతం లో రాశారు ..’’చిత్రాడ వాస కృపయాపరిపాహి దీనం ‘’అనీ ‘’’’చిత్రాడ వాస మురసా శ్రియ మా దధానం ‘’అనీ ‘’చిత్రాడవాస శరణాగత వత్సలత్వా ‘’అనీ పరిపరి విధాల సంబోధిస్తూ అత్యంత భక్తీ తాత్పర్యాలతో అత్యంత సులభ శైలిలో శతకం రాశారు
‘’సనకాది యోగి వర్యైరనవరతా సేవ్యమాన పద పద్మః –చిత్రాడ వేంకటేశ క్షిప్రం మే ప్రదిశ పాద భక్తిం తే’’
‘’కలిదోషహరం కరుణా జలధిం –కమనీయ వపుః కలితం పరమం – కమలాలయ వక్ష సమాదిగురుం –కలయే సతతం వృష శైల పతిం’’
‘’చిత్రాడ గ్రామ వాసీ ఘనరుచి రతనుః పార్శ్వర్యోర్విద్యువిద్యుదాభ –శ్రీ భూ దేవీ సమేత స్తరణి శ్శిశిల చ్చక్ర శ౦ఖొర్ధ్వపాణిః –భక్తేభ్యో వేంకటేశోవిలసతి చరణప్రస్రురోరుస్తితాభ్యాం-హస్తాభ్యా మాశ్రితేభ్యః ప్రపిత విరజా గాధ ముక్తి ప్రదేశః ‘’
‘’శ్రీ భూదేవీ సమేతాయ భక్తాభీష్ట ప్రదాయినే –చిత్రాడాఖ్య పురీశాయ వేంకటేశాయ’’అంటూ శతకం పూర్తీ చేశారు .
చిత్రాడ లని శ్రీ వెంకటేశ్వరస్వామికి రంగరంగ వైభ౦వగా జరిగే రధోత్సవం చూడటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వేలాదిగా తరలివస్తారు .ఆ వైభవం చూడటానికి రెండు కళ్ళూ చాలవు .స్వామి తన దేవేరులు శ్రీ దేవీ భూదేవీ లతో కలిసి ఊరేగుతాడు .భక్తుల అభీష్టాలను తీర్చే కొంగు బంగారం చిత్రాడ శ్రీ వేంకటేశ్వర స్వామి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-20-ఉయ్యూరు
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -15
ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -15
20వ శతాబ్ది సాహిత్యం -7
01914నుంచి 1945వరకు
సాహిత్య విమర్శ
20వ శతాబ్ద౦ను ఒకసారి వెనక్కి తిరిగి చూసిన కొందరు చరిత్రకారులు దానిపై సద్విమర్శ రాస్తే బాగుంటుందని భావించారు .అంతకు ముందు నామమాత్రపు విమర్శ ఉన్నా ,సాహిత్య విమర్శ రూపుదాల్చలేదు .నూతనభావాలు అర్ధం చేసుకోవటానికి తప్పనిసరిగా అవసరం అని భావించారు .
ఈవిమర్శకాలం రెండు సాహిత్య గ్రూపుల ఉద్యమాల మధ్య ఏర్పడింది .ఒక గ్రూపు కొత్త మానవతావాదం ,పూర్వ సాహిత్య విలువల ఆధారంగా ఉండాలని భావిస్తే మరొక గ్రూపు పాత ప్రమాణాలను తుడిచేసి కొత్త వాటితో ఆహ్వానించాలని కోరింది .న్యు హ్యూమనలిస్ట్ లైన హార్వర్డ్ యూని వర్సిటి ప్రోఫెసర్ ఇర్వింగ్ బాబ్బిట్ ,రెండవ ఆయన పాల్ ఎల్మర్ మోర్లు మొరలిస్ట్ లు .నేచురలిజం రోమా౦టిజం , లిబరల్ ఫైత్ లనుకాదని నియో ట్రడిషనలిస్ట్ లైన టిఎస్ ఇలియట్ వంటివారిని సమర్ధించారు .వీరి ప్రత్యర్ది నాయకుడు తగాదాకోరు ,లిబరల్ కాని వాడు హెచ్ ఎల్ మెంకేన్ .ఇతడు’’ జీవిత సత్యాలను మెరుగులు దిద్దకుండా ‘’ రాయటమే రచయితల కర్తవ్యమ్ అన్నాడు .మాగజైన్లలో ఇతరరత్రా రాసిన తన వ్యాసాలను ‘’ఎ బుక్ ఆఫ్ ప్రిఫేసేస్’’గా 1917లో ప్రచురించాడు .ఇది సింక్లైర్ లేవిస్ వంటి సెటైరికల్ రచయితలకు భూమిక అయింది .కాన్రాడ్, ధియోడర్ వంటి మోడర్నిస్ట్ ల్పి మెకెన్ కి మక్కువ ఎక్కువ బాగా సమర్ధించాడు .ఇతడి సాహసం తో అమెరికన్ సాహిత్యం మోరలిస్టిక్ ఫ్రేం వర్క్ నుంచి బయటపడింది.
సాంఘిక -సాహిత్య విమర్శకులు
సాంఘిక మార్పు చోటు చేసుకొన్న ఈ కాలం లో ,విమర్శకులు సమాజాన్ని,రాజాకీయలను దృష్టిలో పెట్టుకొని ,19వ శతాబ్ది విమర్శకులు లాగా విమర్శించటం తప్పని సరి అయింది.వాన్ విక్ బ్రూక్స్ , వెర్నాన్ ఎల్ .పారింగ్టన్ లు రెండు ముఖ్య విధానాలు అనుసరించారు ..’’అమెరికాస్ కమింగ్ ఏజ్-1917,లెటర్స్ అండ్ లీడర్షిప్ -1918,దిఆర్డీల్ ఆఫ్ మార్క్ ట్వేన్-1920వచ్చాయి. బ్రూక్స్ అమెరికన్ పబ్లిక్ ను వారి మెటీరియలిజం ,విలువల బేఖాతరుతనం ,స్థానికతల పైమెరుగులపై దాడి చేశాడు .ఈస్థితి నుంచి ప్రక్కకు తొలగి ‘’మేకర్స్ అండ్ ఫై౦డర్స్’’సిరీస్ లో అంటే –దిఫ్లవరింగ్ ఆఫ్ న్యు ఇంగ్లాండ్ -1936,న్యు ఇంగ్లాండ్ అండ్ ఇండియన్ సమ్మర్ -1940,ది వరల్డ్ ఆఫ్ వాషింగ్టన్ ఇర్వింగ్ -1944,దిటైమ్స్ మేల్విల్లీ అండ్ విట్మన్ -1947,ది కాన్ఫిడెంట్ ఇయర్స్-1952 లలో అమెరికన్ సంస్కృతీ ,సాహిత్య నిర్మాణ సారదుల గురించి ఉన్నది .పారింగ్టన్ రాసిన ‘’మెయిన్ కరెంట్స్ ఇన్ అమెరికన్ లిటరేచర్-1927- 30లలో ప్రగతి శీల ,పునః పరిశీలనాత్మక (ప్రోగ్రెసివ్ రీ వాల్యుయేటేడ్ )అమెరికన్ సాహిత్యాన్ని జాక్సన్ డెమోక్రసీ కట్టుబడి ఉండటం అనే కోణంలో ఆవిష్కరించాడు ‘
ఆలోచనలపై మార్క్సిజం ప్రభావం వలన 1920-30కాలం విఎఫ్ కాల్వర్టెన్,గ్రాన్ విల్లీ హిక్స్ మాల్కం కౌలీ ,బెర్నార్డ్ స్మిత్ ల విమర్శనాత్మక రచనలలో నూ ,మోడరన్ క్వార్టర్లి,న్యు మాసేస్ ,పార్టిసాన్ రివ్యు ,న్యు రిపబ్లిక్ వంటి పత్రికలలో ఉన్న వ్యాసాలలో కనిపించాయి కమ్యూనిజం పై క్రమ౦గా మోజు ,తగ్గినా, మార్క్సిజం మాత్రం హిస్టారికల్ విధానం లో విశిష్ట విమర్శకులు ఎడ్మండ్ విల్సన్ ,కెన్నెత్ బర్క్ లు ,న్యూయార్క్ మేధావులైన లియోనిల్ ట్రిల్లింగ్,ఫిలిప్ రాహ్వ్ లు రాశారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-20-ఉయ్యూరు
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -14
ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -14
20వ శతాబ్ది సాహిత్యం -6
01914నుంచి 1945వరకు
లిరిక్ ఫిక్షనలిస్ట్ లు
ఆధునికత తో వర్ధిల్లిన ఫిక్షన్ లో మరో తమాషా జరిగి కవిత్వం నేచురలిస్టిక్ నుంచి అసలైన కవిత్వం లోకి దారి మళ్ళింది .వివరాలు ఎంచుకొని ,సింబాలిక్ ఎలిమెంట్ జోడించి ,ఆలోచన ,పాత్రల భావోద్రేకాలతో లయాత్మక వచనం లో రాశారుకవులు.వీరిలోస్టీఫెన్ క్రేన్ ,ఫ్రాంక్ నార్రిస్ ,కేబెల్, పాస్సోస్ ,హెమింగ్వే స్టెయిన్ బెక్ ,ఫాక్నర్ లున్నారు .చిన్న పేరాలలో చిన్న కథలలో ,మొత్తం నవలలో కూడా ఈ విధానం తో రాశారు .ఫాక్నర్ 1954లోఐరానికల్ గా రాసిన ‘’ఎ ఫేబుల్ ‘’,పులిట్జర్ ప్రైజ్ కొట్టింది .విల్లా కేధర్స్ ,ఓపయనీర్స్ -1913,దిసాంగ్ ఆఫ్ దిలార్క్ -1915,మై ఆంటోనియ-1918లలో కవితాత్మక పాసేజస్ ఉన్నాయి .అందులో సరిహద్దుల అదృశ్యం అక్కడి జానపదుల సృజన వర్ణన ఉంటుంది .ఎ lost లేడీ-1923,ది ప్రొఫెసర్స్ హౌస్ -1925లలో చారిత్రాత్మక సాంఘిక పరివర్తన ,’’డెత్ కమ్స్ ఫర్ ది ఆర్చి బిషప్ -1927లో గతవైభవం ,ఆధ్యాత్మిక మార్గ దర్శనం కనిపిస్తుంది .కేధరీన్ అన్నే పోర్టర్ చిన్ననవలల కధలు తో మొదలుపెట్టి ,క్రమంగా మెటాఫిజికల్ కవులలాగా రాసి ,పెద్ద ఉత్తేజకర నవల ‘’ఎ షిప్ ఆఫ్ ఫూల్స్ ‘’-1962లో రాసి౦ది ఆమె చైతన్య స్రవంతి టెక్నిక్ బాగా వశం చేసుకొని –ఫ్లవరింగ్ జూడాస్ -1930,పేల్ హార్స్ ,పేల్ రైడర్-1939లలో ఐరనీ, సింబాలిక్ ఆడంబరం తో రాసింది ఈకవులంతా అదే ధోరణి వారే .మోడర్నిస్ట్ లుగా ఫాషన్ తెచ్చారు వీటిలో .
1930కాలపు కవితాత్మక రచనలలో న్యూయార్క్ నగరం లో లోవర్ ఈస్ట్ సైడ్ జ్యూయిష్ కాలనీ లో మొదటి ప్రపంచ యుద్ధం ముందున్న పరిస్థితుల వర్ణన ఉన్నది .మైకేల్ గోల్డ్ రాసిన ‘’హార్ష్ జ్యూస్ వితౌట్ మనీ -1930,హెన్రి రోత్ ప్రౌస్టియన్ స్టైల్ లో రాసిన ‘’కాల్ ఇట్ స్లీప్ ‘’-1934 ఆ ద శాబ్దపు అతి గొప్పనవల .అన్జిరియా ఎజిరిస్కా 1920లో ఇమ్మిగ్రంట్ జ్యూ ల పై రాసిన ‘’బ్రెడ్ గివర్స్ ‘’ప్రభావంతో సమకాలీన మహిళా రచయితలూ రాసిన నవలలు అవి .
మరొక లిరికల్ ఆటో బయోగ్రాఫర్ ధామస్ ఉల్ఫ్ రాసిన ‘’లుక్ హోం వర్డ్ ,ఏంజెల్-1929,’’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’1935లు తన కస్టాలు కలహాలు ఆలోచనలు భావాలు కలగలుపుగా 1938లో చనిపోకముందు రాసినవి .విట్మన్ ధోరణిలో రాసిన ‘’వెబ్ అండ్ రాక్-1939,యు కాంట్ గో హోమ అగైన్ —1940 చనిపోయాక ముద్రి౦పబడినవే .సౌత్ లో తన యవ్వనం ,తర్వాత నార్త్ లో జీవనం ,మనసులోని కోరికలను ,కలలను నెరవేర్చుకోవటానికి నిరంతర పరిశ్రమ లకు అద్దం పట్టాయిఈ రచనలప్రభావం యువరచయితలైన జాక్ కేరౌక్ వంటి వారిపై ఉన్నది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-8-20-ఉయ్యూరు
వీరి రుండ పెరుమాళ్దేవాలయం –తొండమన్నాడు
వీరి రుండ పెరుమాళ్దేవాలయం –తొండమన్నాడు
ఆంధ్రప్రదేశ్ కాళహస్తి దగ్గర తొండమన్నాడ గ్రామం లో చిన్న చోళ వీరిరుండపెరుమాళ్ దేవాలయం ఉన్నది .ఇక్కడి శాసనాలలో ఒక దానిలో చోళరాజు రాజరాజ దేవుడు తన 5వ ఏట పరిపాలనాకాలం లో వేయించిన శాసనం ప్రకారం ఈ గ్రామాన్ని తిరు మేర్కోయిల్ స్వామికి చెట్టి దేవయాదవ రాయ సమర్పించాడు .చోళరాజు మదురైకొండ కొప్పర కేసరి తన 34వ ఏడు పాలన కాలం లో 105కలంజుల బంగారం స్వామి సమర్పించాడు .అనేక రికార్డులను బట్టిస్వామికి అనేక ఉత్సవాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది .
మట్టి కోటలో తూర్పుముఖంగా ఉన్న ఆలయం ఇది .గర్భ, అంతరాలయ, ముఖ మంటప విమానాలున్నాయి .తూర్పున చిన్న ముఖ ద్వారం ఉంటుంది .లోపల పెద్దగా అలంకార శోభ కనిపించదు .గర్భాలయం లో సోమసూత్రం పై శివలింగం ఉంటుంది.అమ్మవారు పద్మాసనం లో పైచేతుల్లో శంఖు చక్రాలతో తలపై వంగిన వస్తువు ను పట్టుకొని కనిపిస్తుంది .ఒక స్త్రీపద్మాసనం లో కూర్చుని ఎడమ చేతితో తలపట్టుకొని ,కుడి చేతితో దాన్ని ఖడ్గం తో ఖండిస్తున్నట్లు ఉంటుంది .నిలుచున్న స్త్రీ కుడి చేతిలో ఖడ్గం ,ఎడమ చేయి కటి పై ఉంచుకొని కనిపిస్తుంది .గ్రామ దేవత పద్మాసనం లో నూ చిన్నగణపతి ఉంటారు .
ఆదిత్యేశ్వర దేవాలయం-
తొందరమన్నాడు శివారు గ్రామ౦ బొక్కిసం పాలెం లో శ్రీ ఆదిత్యేశ్వర దేవాలయం ఉంది .గర్భాలయం లో ఆదిత్యేశ్వరశివలింగం అన్ని విశేషాలతో ఉంటాడు ,కూర్చున్న భంగిమలో అమ్మవారు ప్రక్కనున్న దేవాలయం లో ఉంటారు .ఆమె కుడి చేత ఉత్పలం ,ఎడమ చేయి కిందికి వాలి కనిపిస్తుంది .ద్వారం వద్ద భైరవుడు కుడి చేతిలో త్రిశూలం తో కుక్క ప్రక్కన నిలబడి ఉంటాడు .ఎడమ పై చేతిలో డమరుకం కింది చేతిలో కపాలం ఉంటాడు . నిలబడిన సూర్యుడు రెండు చేతులతో పద్మాలతో ఉంటాడు.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-20-ఉయ్యూరు
మా బామ్మర్ది ‘’మా౦డూక్యోపనిషత్ ‘’
మా బామ్మర్ది ‘’మా౦డూక్యోపనిషత్ ‘’
పది రోజుల క్రితం మా బామ్మర్ది బ్రాహ్మి ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చి ‘’బావా !మా ఊళ్ళో ఎక్కడా వర్షాలు పడటం లేదు .పొలాలుదున్ని పంటలు వేసేసమయం మించిపోతోంది మా రైతులు ఫోన్లమీద ఫోన్లు చేసి గోల చేస్తున్నారు .ఏదైనా ఉపాయం చెప్పుబావా ?అని గోల చేశాడు .
‘’ఒరేయ్ మీది పల్లెటూరు కదా .అక్కడ ఎరుకలు ఏనాదులు అనాది నుంచి కప్పలకు పెళ్ళిళ్ళు చేసి ఊరేగిస్తారుకడా .ఇప్పుడు ఫాషనై పోయి, వాళ్ళూ ఆపని చెయ్యట్లేదేమో నువ్వు వెళ్లి అక్కడ కప్పల పెళ్లి జరిపించిరా. వర్షాలు కురుస్తాయి ‘’అన్నాను
ఇవాళే వెడతా ఆపని చేసి నీకు ఫోన్ చేస్తాబా ‘’అని వెళ్ళాడు
మూడు రోజులతర్వాత ఫోన్ చేసి కప్పలపెళ్లి చేయించాను .రెండో రోజునే బ్రహ్మాండంగా వర్షం పడింది నాట్లు మొదలు పెట్టారు బా ‘ధాంక్స్ బా ‘’అన్నాడు .మంచే జరిగింది కదా అని సంతోషించా .
ఈ మధ్య వాడి విశేషాలేమీ తెలియలేదు .ఏమయ్యాడో అని కంగారు పడ్డాం నేనూ వాళ్ళ అ క్కయ్య .
ఇవాళ పొద్దున్న మళ్ళీ ఊడి పడ్డాడు బ్రాహ్మి బామ్మర్ది .విశేషాలేమిటి అని అడిగా .తాపీ గా చెప్తా బావా అని లోపలికెళ్ళి వాళ్ళక్కయ్య పెట్టిన టిఫిన్ కాఫీ పుచ్చుకొని త్రేనుస్తూ వచ్చి నాదగ్గర కుర్చీలో కూర్చున్నాడు .చెప్పరా విశేషాలేమిటో అన్నాను .
‘’నువ్వు నవ్వను అంటే చెబుతా బావా ‘’అన్నాడు. నవ్వనులే చెప్పమన్నాను
‘’బావా ఈ మధ్య పిచ్చ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ దేశమంతా అల్లకల్లోలం చేయటమే కాక మా ప్రాంతమ౦తా ముల్లోతు నీళ్ళల్లో మునిగిపోయింది .రైతులకుకాళ్ళూ చేతులూ ఆడలేదు .నాకు అర్జంట్ గా రమ్మని ఫోన్ చేశారు తప్పుతుందా. వెంటనే వెళ్లాను .గోడు మని ఏడుస్తూ రైతాంగం బిక్కు బిక్కుమంటూ నా కాళ్ళ పై పడి ‘’బాబుగారూ !అప్పుడు మీరు చెప్పినట్లే కప్పల పెళ్లి చేసి ఊరేగి౦చా౦ మంచి వర్షాలే పడ్డాయని సంతోషించాం .ఇప్పుడు ఈ కుంభ వృష్టి చేలన్నీ మునిగిపోయి కుళ్ళిపోయాయి .మీరేదే యెదైనాఉపాయ౦ చెప్పాలి ‘’అన్నారు కన్నీరు మున్నీరుగా .ధైర్యం చెప్పాను .నీకు ఫోన్ చేసి సలహా తీసుకొనే టైము లేదు .అందుకని నేనే ఉపాయం ఆలోచించి పరిష్కారం చేయించాను మా రైతులతో .
‘’ఏం చేయించావు అఘోరించు ‘’అన్నాను .
వాడు ‘’ఊళ్ళో చెరువులన్నీ నిండాయి కనుక ఒక వెయ్యిఆడ, వెయ్యి మగ కప్పల్ని పట్టి తెమ్మన్నాను .నిమిషాల్లో తెచ్చారు .’’మాండూక్య’’ స్వామి ఆలయం లో వాటిని ఆడామగా వేరుచేసి దంపతులుగా వ్రేలాడ దీయించాను .’’కప్పగంతుల’’ శాస్త్రి గారిని పిలిపించా .ఆయనతో ఆ ‘’తోయ సర్పిత ‘’దంపతులకు శాస్త్రోక్తంగా ‘’చలికాపు’’ ,’’తోయసర్పిక ‘’ దంపతులను పీటలమీద కూర్చోబెట్టి వాటికి ‘’రాతి బుట్టువు ‘’దర్దుర ‘’ముత్తైదువులతో మంగళసూత్రాలు పేనించి ,’’మరూక ‘’ రసరం ‘’దంపతులతో తలంబ్రాలు కలిపించాను .’’అజంభం’’ మద్దెల ,’’అజిరం ‘’డోలు ,’’అజిహ్వం ‘’సన్నాయి వాయించగా ‘’అనిమకం’’ ,’’అనూపం ‘’ల చేత తాళాలు వాయి౦చే ట్లు సామూహికంగా 500కప్పడంపతులకు వైభవంగా వివాహాలు జరిపించాను .
‘’అదేమిట్రా వర్షాలతోజనం చస్తుంటే మళ్ళీ ఈ పెళ్ళిళ్ళు ఏమిటి ?విరోచనాలవాడికి భేదిమందు వేసినట్లు .ఆకాశం మళ్ళీ చిల్లి పడదా ?’’అన్నాను
‘’తొందర పదమాకు బా .అంత తెలివితక్కువగా చేస్తానా .వెంటనే మళ్ళీ ఆ దంపతులను పెళ్లి చేసిన దంపతులతో ఊళ్లోకి ఊరేగింపుగా తీసుకొని వెళ్లి సెంటర్ లో అందరూ చూస్తుండగా ఒక్కో మగకప్ప తో దాని జంట ఆడకప్ప మెడలో కట్టిన తాళి వరుసప్రకారం విప్పించేసి ,మా ‘’దాటరి’’రావు ను జడ్జీ గా ,’’ప్లవంగమ ‘’పంతులును మా తరఫు లాయర్ గా ,’’భేక ‘’శర్మ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పెట్టి ,తాళి ఎందుకు విప్పించామో వాదోపవాదాలు జరిపించి ఆ కప్పదంపతులకు పరస్పర అంగీకారంతో విడాకులు ఇవ్వమని కోరుతూ అర్జీపెట్టించి ,జడ్జీ గారు సావధానంగా అంతా క్షుణ్ణంగా విని ఆదంపతులకు విడాకులు సామూహికంగా ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి అందరికి ఉపశమనం కలిగించారు .గ్రామ సర్పంచ్ ‘’వరుణ దంతావల ‘’రావు ,మునసబు ‘’వృష్టిభువు’’ చౌదరి ,కరణం ‘’శాలూర ‘’పంతులు సాక్షులుగా సంతకాలు చేశారు .విశేషంగా జనం పోగై ఈ విడాకుల సంరంభ మహోత్సవాన్ని కనులారా చూసి మహదానంద భరితులయ్యారు .కాలువలు చెరువులు దరువులలోని’’హరి ‘’లన్నీ బెకబెక మని అంగీకారాన్ని ధ్వనిపూర్వకంగా సామూహికంగా తెలియజేశాయి .మా వూళ్ళో దేవుడి ఊరేగింపుకు కూదాఎప్పుడూ బయటకు రాని వాళ్ళు ఆ రోజు ఊరి జనమంతా అక్కడే ఉన్నట్లుగా అత్యుత్సాహంగా వచ్చి చూసి ఆశీర్వదించారు విడాకుల ‘’పుండరీక ‘’దంపతులను .తమ జన్మలు చరితార్ధమైనట్లు భావించారు జీవితం ధన్యమైన భావన పొందారు .పదిరోజులక్రితం గుడిలో కప్ప పెళ్లి చేస్తే ఇంటింటికీ వెళ్లి పిలిచినా ఆవైపు కన్నేయని జనం ఆరోజు మాత్రం మూగిపోయారు .పెల్లికంటే విదాకులంటే అంత మోజు అనిపించిన్దేమోబావా ‘’అన్నాడుబామ్మర్ది
‘’సరే ఫలితం ఏమిటి “’అడిగాను
‘’కప్పల పెళ్ళికి ఎంతబాగా వర్షాలు కురిశాయో ,కప్పల విడాకుల వలన ఒక్కసారిగా వర్షాలు ఆగిపోయిజనం ఊపిరి పీల్చుకున్నారు .ఒకచిన్న ఐడియా మా ఊరి వాళ్ళ జీవితాలనే మార్చింది బా ‘
‘’బాగుందిరా నీ ‘’మాండూక్యోపనిషత్’’అన్నాను .ఎప్పుడు వచ్చిందో వాళ్ళ అక్కయ్య కూడా వచ్చి మాతోకలిసి పగలబడి నవ్వింది తమ్ముడితెలివి తేటలకు .
మనవి-ఇందులో కప్పకు ఉన్న నానార్ధాలు సరదాగా వాడాను గ్రహించగలరు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-8-20-ఉయ్యూరు
—
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -13
ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -13
20వ శతాబ్ది సాహిత్యం -5
01914నుంచి 1945వరకు
సామాజిక విమర్శకులు-2
హెమింగ్వే ,ఫాక్నర్ ,స్టెయిన్ బెక్
నిరాశనుంచి దూరమై రాసిన ముగ్గురు రచయితలలో ఎర్నెస్ట్ హెమింగ్వే ,విలియం ఫాక్నర్ ,జాన్ స్టెయిన్ బెక్ ఉన్నారు .హెమింగ్వే మొదటి కథలు తర్వాత రాసిన నవలలు ‘’ది సన్ ఆల్సో రైజేస్ ‘’-1926,ఎ ఫేర్వెల్ టు అర్మ్స్-1929లలో అస్తిత్వ వాద భ్రమ (ఎక్సేస్టెన్షియల్ డిజల్యూజన్ మెంట్ ) కోల్పోయిన తరం బహిష్కృతులు కనిపిస్తారు .స్పానిష్ సివిల్ వార్ ఆయనలో సాంఘిక సమస్యలకు సమీకృత చర్య చేబట్ట టానికి తోడ్పడింది .అంతగా ప్రభావ శీలం కాని నవలలు ‘’టు హావ్ అండ్ హావ్ నాట్ ‘’1937,’’ఫర్ హూం ది బెల్ టాల్స్’’1940 ఈ కొత్త నమ్మకానికి అధారాలు .మళ్ళీ పూర్వపు ఔన్నత్యాన్ని సాధించి ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ’’-1952నవలరాసి 1953లో పులిట్జర్ ప్రైజ్ ,1954లో నోబెల్ ప్రైజ్ పొందాడు .ఆయన మరణానంతరం ముద్రింపబడిన రెండు యుద్దామమధ్య పారిస్ జ్ఞాపకాలు ‘’ఎ మువబుల్ ఫీస్ట్ ‘’గా 1964లో విడుదలైంది .హెమింగ్వే రచనలకు అతడి జర్నలిజం అనుభవం తో పాటు ,అతడి పారిస్ ఫ్రెండ్ మోడర్నిస్ట్ మార్గదర్శి గేస్ట్రూడ్ స్టెయిన్ అనే ఆమె విడివిడి వాక్యాలు ,ఫ్లాట్ సెంటెన్స్ లు గొప్పగా తోడ్పడి,ప్రభావం చూపాయి .ఇలాంటి రచన 1909లో ఆమె ‘’త్రీ లైవ్స్ ‘’నవల లో చూపించింది .తనకాలం తర్వాతకాలం రచయితలను హెమింగ్వే మోసపూరిత చిన్నవాక్యాలు ,అలంకారం లేని వాక్యాలతో గొప్ప ఆకర్షించాడు ప్రేరణ కలిగించాడు .వాచ్యం కాని చిక్కుముడులతో ,తన బలీయమైన గాయపరచే పురుషత్వం తో ఒక మిత్ ను సృష్టించి రెండవ ప్రపంచయుద్దానంతర తరాన్ని వెంటాడాడు .
the world breaks everyone and afterward many are strong in the broken places. But those that will not break it kills. It kills the very good and the very gentle and the very brave impartially. If you are none of these you can be sure it will kill you too but there will be no special hurry.
—Ernest Hemingway in A Farewell to Arms[197]
స్టైల్ లో మిత్ మేకింగ్ లో హెమింగ్వే ప్రత్యర్ధి విలియం ఫాక్నర్ .మహా శిల్పకళా వైభవంతో షేర్ వుడ్ ఆండర్సన్ ,హెర్మన్ మేల్విల్లీ ,ముఖ్యంగా జేమ్స్ జాయిస్ ల ప్రభావం పుష్కలంగా పొంది చైతన్య స్రవంతి టెక్నిక్ తో సోషల్ హిస్టరీని ముంచెత్తాడు .దిసౌండ్ అండ్ ది ఫ్యూరీ -1929,ఆజ్ ఐ లే డైయింగ్-1930,లైట్ ఇన్ ఆగస్ట్ -1932,అబ్సలాం అబ్సలాం -1936,ది హామ్లెట్ -1940లలో దక్షిణాది యోక్నపటాహా కౌంటీలోని మిదికల్ మిసిసిపి కమ్యూనిటి యొక్క మార్పు పరివర్తన ,,క్షీణతలకు అద్భుతంగా చూపాడు .అమెరికన్ సివిల్ వార్ నేపధ్యం ,అక్కడి ఆదిమసంతతికి ఇండియన్ లకు భూములను కేటాయించటం (అప్రాప్రి ఏషన్) .తరచుగా కామిక్ గా ఉన్నా అతని రచనలలో ప్రముఖ కుటుంబాల విచ్చిన్నాన్నిఆవిష్కరించాడు .తర్వాత ‘’గో డౌన్ మోసెస్ ‘’1942,ఇంట్రూడర్ ఇన్ ది డస్ట్-1948లలో దక్షిణ రాష్ట్రాలలో జీవితాలపై జాతి ప్రాముఖ్యం పై ఆందోళన చెందాడు .ఆధునిక అమెరికన్ సాహిత్యానికి నవలద్వారా సేవచేసినందుకు 1949లో నోబెల్ ప్రైజ్ పొందాడు ఫాక్నర్ .మిసిసిపిలో పుట్టి మొదటి నోబెలన్డుకోన్నవాడు అప్పటికి ఫాక్నర్ ఒక్కడే .
“Never be afraid to raise your voice for honesty and truth and compassion against injustice and lying and greed. If people all over the world…would do this, it would change the earth.”
― William Faulkner
“You cannot swim for new horizons until you have courage to lose sight of the shore.”
― William Faulkner
Read, read, read. Read everything — trash, classics, good and bad, and see how they do it. Just like a carpenter who works as an apprentice and studies the master. Read! You’ll absorb it.
Then write. If it’s good, you’ll find out. If it’s not, throw it out of the window.”
― William Faulkner
స్టెయిన్ బెక్ రచనా ప్రస్థానం చారిత్రకనవల –కప్ ఆఫ్ గోల్డ్ -1929లో ప్రారంభమై అందులో సమాజ అపనమ్మకాన్ని ఎలుగెత్తి చాటి ,1920నాటి అరాచక వ్యక్తుల తిరుగుబాటు తనాన్ని చూపాడు .జాతి అస్పృస్యులపై అనుబంధం ఆప్యాయత చూపాడు .చిన్న నవల –టోర్టిల్లా ఫ్లాట్ -1935,ఆఫ్ మైస్ అండ్ మెన్-1937,కానరీ రో-1945నవలలో ఇవన్నీ చిత్రించాడు .అతడి ప్రసిద్ధ రచనలు ‘’గ్రేట్ డిప్రషన్ కాలం ‘’లో వలసఫారం వర్కర్లకు ప్రేరణకలిగి సాంఘిక తిరుగుబాటుకు దోహదపడినాయి.అస్పష్టంగా సందిగ్ధంగా ఉన్ననవల ‘’ఇన్ డూబియస్ బాటిల్ -1936,అతడిమాస్టర్ పీస్ నవల ‘’ది గ్రేప్స్ ఆఫ్ రాత్ ‘’-1939.ఈ గ్రేప్స్ నవల ప్రొటెస్ట్ నవల .ఇందులో ప్రోజ్ –పోయెం వినోదం (ఇంటర్ లూడ్ )ఉంటాయి .ఇది ఒక ఓక్లహామా డస్ట్ బౌల్ కుటుంబం కాలిఫోర్నియాకు వలసరావటం విషయం .వీరి బిబ్లికల్ జర్నీ లో బీద అదోగతిలోని జనం తమను కొత్త ప్రదేశం లో వ్యక్తిగతంగా ఇతరులెవ్వరూ దోపిడీ చేయకుండా ,నాశనం చేయకుండా ఉండటానికి సామూహికంగా ఆలోచించటం ,స్పందించటం తోడ్పడటం చర్య ల అవసరం ను నేర్చుకోవటం వగైరాలను అత్యద్భుతంగా వర్ణిస్తాడు స్టెయిన్ బెక్ . రియలిస్టిక్ ,ఇమాజినేటివ్ రచనలకు,మానవత్వంపై మమకార రచనకు స్టెయిన్ బెక్ కు 1962లో నోబెల్ పురస్కారం లభించింది .
the writer is delegated to declare and to celebrate man’s proven capacity for greatness of heart and spirit—for gallantry in defeat, for courage, compassion and love. In the endless war against weakness and despair, these are the bright rally flags of hope and of emulation.
–John Steinbeck, Nobel Prize Acceptance Speech
John Steinbeck is no mere virtuoso in the art of story telling; but he is one. Whether he writes about the amiable outcasts of Tortilla Flat or about the grim strikers of In Dubious Battle, he tells a story. Of Mice and Men is a thriller, a gripping tale running to novelette length that you will not set down until it is finished. It is more than that; but it is that.
Cannery Row is an epic of little things and little lives. It has a strange, shimmering beauty filled with the quiet joy and dumb, haunting sorrow that is the heritage of those who, by accident of birth, temperament, or circumstance, live on the outer edge of a social organization to which they can never belong.”
–John O. Chappell Jr., The Cincinnati Enquirer, January 20, 1
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-8-20-ఉయ్యూరు
పరాశర మహర్షి ప్రతిష్టించిన శ్రీ పరాశరేశ్వర దేవాలయం –జోగిమల్లవరం
పరాశర మహర్షి ప్రతిష్టించిన శ్రీ పరాశరేశ్వర దేవాలయం –జోగిమల్లవరం
చిత్తూరు జిల్లా తిరుచానూర్ కు రెండుకిలో మీటర్ల దూరం లో జోగిమల్లవరం అనే చిన్న గ్రామం ఉన్నది .ఇదిఒకప్పుడు తిరుచనూరు లో భాగమే .దీనికి తిరుచుకానూర్ అనీ ,తిరు చోగినూర్ ,శుకగ్రామం అనే పేర్లు కూడా ఉండేవి .శుకమహర్షి పేరు మీద ఏర్పడిన గ్రామం అని అర్ధం యోగి చివరికి జోగి అయింది .ఇక్కడే అద్భుత శ్రీ పరశారేశ్వర చోళ దేవాలయం ఉంది .ఈగ్రామానికి పరశారేశ్వరం అనే పేరు స్వామి వలన కలిగింది .వశిష్ట మహర్షి మనవడు పరాశర మహర్షి ఈ లింగాన్ని ప్రతిస్టించాడు .ఈయన శక్తి మహర్షికు కుమారుడు .శక్తిమహర్శిని ఒకరాక్షసుడు సంహరిస్తే ,తండ్రిలేని పరాశరుడిని తాత వషిస్టుడే పోషించి పెంచాడు .తండ్రిని చూడాలని తాతను అడిగితె తాత శివుడికోసం తపస్సు చేయమని చెప్పగా పరశారుడు శివునికోసం ఇక్కడే తపస్సు చేశాడు.శివుడు ప్రత్యక్షమై స్వర్గం లో తండ్రిని దర్శించగలవని చెప్పాడు .అందుకే పరాశరమహర్షి ఇక్కడ శివలింగం ప్రతిస్టించాడు .కనుక పరాషరేశ్వర లింగం గాపేరు వచ్చింది .
అర్జునుడు యోగి గా దేశాలు తిరుగుతూ ఇక్కడే పాశుపతాస్త్రం కోసం తపస్సు చేయగా శివుడు వేటగాడి రూపం అంటే మల్ల రూపం లో ప్రత్యక్షమై పాశుపతాస్త్రం అనుగ్రహించాడు .యోగి అయిన అర్జునుడు మల్లుడైన శివుడు పవిత్రం చేసిన ప్రదేశం కనుక యోగిమల్లేశ్వరం అయి ఇప్పుడు జోగి మల్లవరం అని పిలువబడుతోంది .
ఆలయం లోచాలా శాసనాలున్నాయి .మొదటి రాజరాజ చోళుడు తన 23వయేట పాలనలో 1 008 లో వేసిన శాసనం బట్టి ఆలయం 11వ శతాబ్దికి ము౦దుదని తెలుస్తోంది .9వ శతాబ్దం చివర చోళరాజులు తిరుపతిని జయించారు .కనుక ఇది 10వ శతాబ్ది మధ్యకాలం నాటి ఆలయం అని అందరూ భావిస్తారు .చోళరాజచక్రవర్తి వీర రాజేంద్ర దేవుడు ఈ ఆలయాన్ని ‘’పిప్లాధీశ్వర ముదైయ మహాదేవాలయం ‘’గా పేర్కొన్నాడు .కులోత్తుంగ చోళ చక్రవర్తి దేవాలయానికి కానుకలు సమర్పించాడు .అలాగే త్రిభువన చక్రవర్తి రాజరాజ దేవుడుకూడా స్వామికి కానుక సమర్పించిన శాసనం ఉన్నది .మరొక శాసనం లో ఇక్కడి కోనేరు ను తిరుప్పత్తి ఉదై యార్ త్రవ్వించి నట్లున్నది .స్వామికి సమర్పించిన భూములు బంగారం తెలియజేసే రికార్డ్ లున్నాయి .
ఆలయం ఒకేఒక దక్షిణ ముఖద్వారమున్న ఆలయం .గర్భాలయం లోస్వామి లింగం ,అమ్మవారు ,ముఖమండపం ఉన్నాయి .గర్భాలయ, అంతరాలయాలు అధిష్టాన, ఉపానాలు కలిగిఉంటాయి.కొష్టాలు,తోరణాలు భూతమాలలు ఉంటాయి .ముఖమంటపం ఉంది .గర్భాలయం పై విమానం ఇటుకలతో కట్టారు .అంతరాలయ ప్రవేశం దగ్గర కుడివైపు గణపతి విగ్రహం అంకుశ,పాశ , దంత ,మోదుక,కర్ణ దామకూటం,యజ్ఞోపవీతం కలిగి ఉంటాడు .గర్భాలయం దక్షిణాన వీరాసన దక్షిణామూర్తి అక్షమాల కమండలం చిన్ముద్ర ,ప్రభామండలం ,చక్రకుండల గ్రైవేయక ,యజ్ఞోపవీత ఉదర బంధనాలతో జటాజూటం తోదర్శనంస్తాడు .కింద ఇరువైపులా ఇద్దరు మహర్షులుంటారు .గర్భాలయం పడమటి గోడపై విష్ణుమూర్తి సామభ౦గ౦ తో నిలబడి శంఖు చక్ర అభయ ముద్రతో ఉంటాడు .వాయవ్యభాగం లో కుమారస్వామి ఇద్దరు దేవేరులతో వీరాసనం లో ఆరు ముఖాలతో ,12చేతులతో ,వజ్ర బాణ ఖడ్గ చక్ర త్రిశూల ధనుస్సు శక్తి ,కుక్కుట,పాశాలతో అభయ ,వరద హస్తాలతో ఉంటాడు .చక్రకు౦డలం గ్రైవేయకం ,చన్నవీర ,ఉదర బంధనాలుంటాయి .కుడిప్రక్కా అమ్మవారు ఉత్పలం తో ఎడమవైపు అమ్మవారు కూడా చేతిలో ఉత్పలం తోకనిపిస్తారు .
బ్రహ్మ సమభంగం లో నిలబడి మూడు తలలు నాలుగు చేతులతో అక్షమాల కమండలం అభయముద్ర కటి హస్తం ,జటామకుట ,మకరకుండల గ్రైవేయక యజ్ఞోపవీత సింహలలాటాలతో ఉంటాడు .బ్రహ్మకు ఎడురుగా చండీశ్వరుడు ఎడమకాలు మడిచి కుడికాలు వేలాడుతూ ఎడమచేతిలోపద్మం ,కుడి తొడపై కుడిచేతితో శివ బంటుగా ఉంటాడు .కామాక్షి అమ్మవారి ప్రవేశ ద్వారం ఎడమవైపు సమభంగం లో నిలబడి బాల సుబ్రహ్మణ్యస్వామి కుడి అభయహస్తం ఎడమ కటిహస్తం తో యజ్ఞోపవీత ,ఉదరబంధన,గ్రైవేయక ,సింహ లలాట ,మెడహారం మోకాళ్ళవరకు వ్రేలాడుతూ కనిపిస్తాడు .
ముఖమండప ప్రదక్షిణ మార్గంలో కామాక్షీ అమ్మవారి చిన్న విగ్రహం సమభంగం లో నిలబడి ఉన్న ఆలయం ఉంటుంది .కుడిపై చేతిలో అంకుశం ,ఎడమ పై చేతిలో పాశం ,కింది చేతులలో అభయ వరముద్రలతో దర్శనమిస్తుంది
పార్వతీ పరిణయ దృశ్యం నృత్యగణపతి సోమస్క౦ద ,కంకాళమూర్తిలు కూడా చూడ ముచ్చటగా ఉంటారు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-8-20-ఉయ్యూరు
ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -12
ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం -12
20వ శతాబ్ది సాహిత్యం -4
01914నుంచి 1945వరకు
సామాజిక విమర్శకులు
స్కాట్ ఫిట్జరాల్డ్ 1920లో రాసిన ‘’దిస్ సైడాఫ్ పారడైజ్ ‘’లో మొదటిప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో అనేకులలో పెరిగిన నిరాశా నిస్పృహ ,నైతిక పతనం వర్ణించాడు .1925లో రాసిన ‘’ది గ్రేట్ గాస్బి’’నవలలో అమెరికా ప్రజలకిచ్చిన వాగ్దానాలు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేసిన వైనం ,అమెరికన్ల కలలను నెరవేర్చటం లో పాలకుల వైఫల్యం చక్కగా వివరించాడు .తాగుడుకు బానిసలవటం వివాహాలువిచ్చిత్తి చెందటం వివరించాడు .1930లో ఆ భావాలతో రాసిన నేకకథలు వ్యాసాలూ ,1934లో రాసిన తన ప్రతిస్టాత్మకనవల ‘’టెండర్ ఇన్ ది నైట్ ‘’లలో ఇవన్నీ ప్రత్యక్షం చేశాడు .సింక్లైర్ లేవిస్ అలాకాకుండా మంచి సాంఘిక విమర్శకుడైనకవిగా 1920లో రాసిన ‘’మెయిన్ స్ట్రీట్ ‘’లో ‘’విలేజ్ వైరస్ ‘’పై తీవ్రంగా దాడి చేశాడు .సాధారణ వ్యాపారస్తులవిషయం ‘’బాబ్బిట్ -1922,మెటీరియలిస్టిక్ సైంటిస్ట్ లపై ‘యారో స్మిత్ -1925,జాతి విద్వేషం పై ‘’కింగ్స్ బ్లడ్ రాయల్ ‘’-1947 లలో వాడివ్యంగ్య వైభవంతో దులిపిపారేశాడు .వీటిలో బాబ్బిట్ నవల మహా గొప్పదిగా ,21వ శతాబ్దానికి ప్రేరణగా నిలిచింది .ఇలాంటి డాక్యు మెంటేషన్ నే సెటైర్ తో దట్టించి జేమ్స్ టి.ఫార్రెల్ నేచురలిస్టిక్ భావజాలంతో ‘’స్టడ్స్ లో,అమెరికన్ ట్రయాలజి’’1932-35లో రాశాడు .దీనిలో 1920 లో చికాగో పరిసరాలలో దిగువ మధ్యతరగతి కుటుంబాల పెరుగుదల చక్కగా వర్ణించాడు.
హార్లెం రినైసేన్స్ కాలం లో కధలు నవలలో రాడికల్ ఐడెంటిటిలోని ఐరనీ, మధ్యతరగతి నల్లజాతి వారి దయనీయగాధలను ‘’నెల్లా లార్సన్ ‘’క్విక్లాండ్ -1928,పాసింగ్ -1929లో ,ఇన్ ది వేస్ ఆఫ్ వైట్ ఫోక్స్-1934 లో లాంగ్ స్టన్ హగ్స్ అద్భుతంగా చిత్రించారు .జీన్ టూమర్ రా సిన’’క్రేన్ ‘’-1923,రాచార్డ్ రైట్ రాసిన ‘’అంకుల్ టామ్స్ చిల్డ్రె న్ ‘’-1938,నేటివ్ సన్-1940,బ్లాక్ బాయ్ -1945లో వర్ణించాడు .ఇవన్నీ నిప్పులతో మండే కణకణలాడే సాంఘిక నిరసనలే .వీరి రచనలలో డాస్టో వ్ స్కియన్ తీవ్రత ఉంది అమెరికన్ బ్లాక్స్ ల దయనీయ స్థితి ఉంది .ఆంధ్రో పాలజిలో జానపదాల్లో శిక్షణపొందిన జోరా నీలే హర్స్ట్ సన్’’దెయిర్ ఐస్ వర్ వాచింగ్ గాడ్ ‘’1937 తన బలీయైన ఫెమినిస్టిక్ నవల రాసి ,తాను పుట్టి పెరిగిన బ్లాక్ ఫ్లారిడా టౌన్ గురించి సంపూర్ణంగా కళ్ళకు కట్టినట్లు చూపించింది .
చాలామందిరచయితలు ప్రోలెటేరేనియన్ అంటే పేద శ్రామిక వర్గ నవలలలో ధనిక వర్గాల పీడనం పై రాశారు .ముఖ్యంగా నార్త్ కరోలినాలో గాస్టోనియలో టెక్స్ టైల్ వర్కర్ల స్ట్రైక్ పా విపరీతంగా రాశారు .ఫీల్డింగ్ బర్క్స్ ‘’కాల్ హోం ది హార్ట్ ‘’గ్రేస్ లంప్కిన్ ‘’టు మేక్ మై బ్రెడ్ ‘’1932,రాశారు .శ్రామిక నవలలుగా జాక్ కాన్రాయ్ ‘’ది డిసెన్ హెరిటేడ్’’-1933,రాబర్ట్ కాంట్ వెల్’’ది లాండ్ ఆఫ్ ప్లెంటి’’-1934,ఆల్బర్ట్ హాల్పర్’’యూనియన్ స్వేర్ ‘’—1933,ది ఫౌండ్రి-1934,ది చూట్-1937,లు పైవానికి అద్దంపట్టేవి .డిప్రెషన్ కాలం నాటి ‘’బాటం డాగ్స్’’ అంటే దిగువ స్థాయి వారి గురించి కొందరురాశారు .వీరిలో ఎడ్వర్డ్ ఆండర్సన్’’హంగ్రీ మెన్’’ టాం క్రోమర్స్-వైటింగ్ ఫర్ నధింగ్-1935రాసినవిఉన్నాయి . అప్పుడే పుట్టిన ఫెమినిజం రాడికల్ ఉద్యమం రాజకీయ భావాలున్న మహిళలకు ప్రేరణగా నిలిచి టిల్లర్ ఓస్లెం ,మెరిడలే స్క్వెయిర్,జోసెఫైన్ హీర్బెస్ట్ మొదలైనవారు రాశారు .
నిరసన రచయితగా ప్రఖ్యాతి పొందిన డాన్ డోస్ పాస్సోస్ ప్రపంచయుద్ధానికి వ్యతిరేకంగా మొట్టమొదటి నవల ‘’త్రీ సోల్జర్స్ ‘’-1921లో రాశాడు .ఆధునిక సాంఘిక ,ఆర్ధిక విధానాలపై ‘’మాన్ హట్టన్ ట్రాన్స్ ఫర్’’-1925,యు.ఎస్.ఎ.ట్రయాలజి-ది42న్డ్అండ్ పారలల్ -1919,దిబిగ్ మనీ -1930-36,రాశాడు .కెమెరా ఐ ,న్యూస్ రీల్ ,మొదలైన వర్ణనాత్మక సృజనాలు అనేక వింత పాత్రలతో సంఘ౦పై దాడి చేశాడు .నథానియాల్ వెస్ట్-మిస్ లోన్లీ హార్ట్స్ 1933,కూల్ మిలియన్ ‘’-1934, ది డే ఆఫ్ ది లోకస్ట్ ,-1939,లో బ్లాక్ కామెడితో అదో జగత్ సహోదరుల దయనీయ ,అమానుష క్రూర దీన గాధలను చిత్రించారు .మాస్ కల్చర్ ,పాప్యులర్ ఫాంటసి తో రచయిత వెస్ట్ అమెరికా కలలుకన్నవన్నీ కల్లలైన అత్యంత విషాదాన్నిడిప్రెషన్ కాలం లో సంఘం పై దాడిగా రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-8-20-ఉయ్యూరు
రు౦గోళేశ్వర దేవాలయం –లద్దిగం
రు౦గోళేశ్వర దేవాలయం –లద్దిగం
చిత్తూరు జిల్లా పుంగనూరు కు నాలుగు కిలో మీటర్ల దూరం లో లద్దిగం గ్రామం లో ఒకే ఒక ప్రాకారం తో ఒకే ఒక ముఖ్యమైన ద్వారం ,చిన్న గోపురం తో ఇరుంగోళేశ్వర స్వామి దేవాలయం ఉన్నది .గర్భాగుడి లో లింగం ,దానికినైరుతిలో ఒకటి , ఆగ్నేయంలో మరొకటి మంటపాలున్నాయి .తూర్పుముఖ ద్వారం .
గుడి వివరాలు తెలిపే శాసనాలున్నాయి .ఒకశాసనం చోళ రాజు రాజరాజ దేవుడి 9వ ఏడు పాలనలో వేయించిందని భూరి దానం స్వామికి సమర్పించాడని ,వాడ పులినాదుకు చెందిన కోయరూర్ లోని ఇరున్గులేశ్వర ముదైయ నయనార్ దని తెలియ జేయబడింది .రెండవ శాసనం 14వ శతాబ్ది ఉత్తమ చోళ రాజు స్వామికి సమర్పించిన నిధి వివరాలు ఉన్నాయి మూడవ శాసనం విక్రమ చోళరాజు 9వ ఏటి పరిపాలనలో వేసిన దానిప్రకారం దేవాలయం ఉత్తమ చోళపురం లో ఉన్నది .నాలుగవ శాసనం రాజకేసరివర్మరాజు అనే కులోత్తుంగ చోళ దేవుడు తన 16వ ఏడుపాలనలో వేయించింది .దానిలో రణపతికొండ చోలమండలం లో పాలినాడు గ్రామాన్ని స్వామికి దానం చేసినట్లుంది .ఉత్తమ చోళపురం అనే కోరయ్యూర్ లో అరవాలన్ గంగైకొండ చోళుడు అనే ఇరున్గోలన్ నిర్మించినట్లు ఉంది .అయిదవ శాసనం కులోత్తుంగ చోళ దేవ రాజు 20వ ఏడు పాలనలో వేసింది .దనిలో దీపారాధనకు వలసిన ద్రవ్యం స్వామికి ఇచ్చిన వివరాలున్నాయి .
దేవాలయ ద్వారం పై పద్మాలు లతలు,గజలక్ష్మి చెక్కబడినాయి .ద్వారం పై భూతమాల ,దానిపై ముడుచుకొన్న కపోతం నాలుగు సింహలలాటాలు ఉంటాయి .విమానం పై గల దానిపై ఇంద్రుడు .ఉత్తరాన వీరాసనం లో కూర్చున్న బ్రహ్మ ,దక్షిణాన వీరాసనం లో మౌన వ్యాఖ్యాన దక్షిణా మూర్తి ఒకపాదం అపస్మార పురుష రూపంగా ఉంటాడు .మంటపాలు స్తంభాలపై ఉంటాయి .మంటపానికి పడమర అమ్మవారి విగ్రహం నిలబడి పై చేతులలో పద్మాలతో ,కింది చేతులు అభయ ,వర ముద్ర లతో ఉంటుంది . గర్భాలయం లో స్వామి ఉంటాడు .ఎదురుగా నంది మండపం లో నంది ఉంటాడు .గర్భాలయ౦ పై భూతమాల దానిపై కపాలం సింహ లలాటాలతో చెక్కబడి ఉంటాయి .కప్పు చుట్టూ చిన్న చిన్న సింహాలు ఉన్నాయి .బ్రహ్మ దేవుడు కిరీట మకుటం తో ,మకరకుండలాలు రెండు గ్రైవేయకాలతో ,చేన్నవీర ఉదరబంధ ,యన్జోపవీత౦లతో పెద్ద గుండ్రని వలయం లో హారం మోకాళ్ళ దాకా తాకుతూ ఉంటాడు .పడమర ద్వారా కొస్టం పై విష్ణుమూర్తి నిలబడి శంఖ చక్ర గద కిరీట మకుట ,మకర కుండలాలు ,మూడు గ్రైవేయకాలు ,యజ్ఞోపవీతం ,ఉదరబంధం,సింహలలాటాది హార అలంకార శోభతో కనిపిస్తాడు .దక్షిణ గోడ కొస్టం పై ఇరువైపులా జడలతో దక్షిణామూర్తి అక్షమాల తో పైరెండు చేతులలో అగ్నితో ,కింద చేతులలో అక్షమాలతో దర్శనమిస్తాడు .మకర చక్ర కుండలాలు ఉంటాయి .ఈయనకు ఇరువైపులా కిందవైపు గడ్డాలు పెరిగిన మహర్షులు ఇద్దరు ఉంటారు .దీనిపై కొస్టం వింతగా ఉంటుంది .
అంతరాలయం ఉత్తర గోడపై గణపతి ఉంటాడు .ఉత్తరాగోడ ఖాళీ గా ఉంటుంది .దీనికి దగ్గరలో చిన్న దక్షిణామూర్తి ఉంటాడు .గర్భాలయ విమానంపై గల శిఖర రాతికలశం మాత్రమె ఉంటాయి .దక్షిణాన దక్షిణామూర్తి పడమర యోగ నరసింహమూర్తి ,ఉత్తరాన బ్రహ్మ ,విష్ణువులు ఉంటారు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-16-8-20-ఉయ్యూరు
ప్రపంచ దేశాల సారస్వతం203-అమెరికాదేశసాహిత్యం శతాబ్ది సాహిత్యం -3
0వ శతాబ్ది సాహిత్యం -3
01914నుంచి 1945వరకు
కొత్త కవిత్వం -2
ఎజ్రా పౌండ్ రెండవ ప్రపంచయుద్ధం తర్వాత వాషింగ్టన్ డి.సి.లో సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్ లో బందీ గా ఉన్న కాలం తప్ప ,1908తర్వాత స్వదేశం అమెరికాలోకాక ఇతర దేశాల్లోనే ఉన్నాడు .20వ శతాబ్దం ఇంగ్లీష్ రచనపై పౌండ్ ప్రభావం అత్యధికం కవిత్వం లోనేకాక ,సంగీత నాటక ప్రసారాలపై పట్టు ఉన్నవాడుగా ,ఇతర రచయితలను ప్రేరణ చెందించే వాడుగా ఉన్నాడు .అతడి వివాదాస్పద ‘’కాంటోస్’’మొదటిసారిగా 1926లో వెలువడింది .చివరిదైన త్రోన్స్ 1959లో ప్రకటించాడు .అనుబంధాన్ని డ్రాఫ్ట్స్ అండ్ ఫ్రాగ్ మెంట్స్ ఆఫ్ కాంటోస్-CXCXV111గా 1969లో విడుదల చేశాడు .
పౌండ్ శిష్యుడైన టి ఎస్ ఇలియట్ కూడా ఆయనలాగానే అమెరికాలో పుట్టినా ,విదేశాలలోనే గడిపి 1927లో బ్రిటిష్ పౌరుడయ్యాడు .1917మొదటి రచన ఫ్రఫ్రాక్ అండ్ అదర్ అబ్జర్వేషన్స్ గా రాసి ప్రచురించాడు అయిదేళ్ళ తర్వాత 1922’’వేస్ట్ లాండ్ ‘’అద్భుత కవితా సంపుటి రాశాడు .ఇందులోని మొదటికవిత తోనే ప్రపంచ ప్రసిద్ధిపొందాడు .విభాగాలుగా ,పోటీ స్వరాలుగా (కంపీటింగ్ వాయిసెస్ )పండిన పరోక్ష కవిత్వం అల్యూజన్స్ గా రాసి కొత్త ప్రయోగం తో ఆధునిక ఆంగ్ల సాహిత్యానికి మార్గదర్శియ్యాడు .దీనిలో పూర్తిగా నిరాశపడిన యుగాన్నీ ,ఆధునికప్రపంచాన్నీ వర్ణించాడు .రెండు ప్రపంచ యుద్దాలమధ్య కాలం లో కవిగా విమర్శకుడుగా శక్తివంతమైన ప్రభావం చూపించాడు .అయన రచనలలో దిబెస్ట్ అని విమర్శకులు మెచ్చిన ‘’ది ఫోర్ క్వార్టర్స్ ‘’ను 1943లో రాశాడు .అందమైన ఇమేజరీ సృష్టించటం ఇలియట్ ప్రతిభకు నిదర్శనం .గతకాల మానవ వైభవం ఆయన్ను వెంటాడింది .మానవ చరిత్ర అంటే ఏమిటో లోకానికి చాటి చెప్పాడు .
17వ శతాబ్దికి చెందిన వైవిధ్య మెటాఫిజికల్ కవుల అందులో ముఖ్యంగా జాన్ డోన్నెప్రభావం ఇలియట్ పై బాగా ఉంది. ఆర్కిబాల్ద్ మాక్ లీష్ తొలినాటి కవిత్వ ప్రభావం వేస్ట్ లాండ్ లో బాగాకనిపిస్తుంది. ఇలియట్ కవిత్వ, విమర్శ ల ప్రభావం అనేకమంది దక్షిణ దేశకవులైన జాన్ క్రౌ రామ్సన్ ,డోనాల్డ్ దేవిడ్సన్,అల్లెన్ టాటే లు ఎక్కువగా కనిపిస్తుంది .సాహిత్య నోబెల్ ప్రైజ్ పొందాడు ఇలియట్ .అమెరికా యువ మెటాఫిజికల్ కవులు లూయిస్ బోగాన్ ,లియోనీ ఆడమ్స్ ,మూరియాల్ రుకేసర్,డేల్మోర్ స్క్వార్జ్ ఇలియట్ ప్రభావితులే .కొందరు మేజర్ కవులు ఇలియట్ ప్రభావాన్ని వ్యతిరేకించారు .వీరికి రొమాంటిక్ విజనరీ కవిత్వం పై మోజు ఎక్కువ .వీరిలో హార్ట్ క్రేన్ దీర్ఘకవిత –ది బ్రిడ్జ్’’-1930లో విట్మానిక్ అమెరికన్ ఎపిక్ గా రాశాడు .వాలేస్ స్టీవెన్స్ కళకళ లాడే ఐంద్రియ (లష్ అండ్ సెన్సువస్ )కవిత్వం గుప్పింఛి ‘’హార్మోనియం ‘’-1923కవితలో ఆశ్చర్యకరకవిత్వం రాసి ఆకర్షించి అమెరికా రుణపడి ఉండేట్లు చేశాడు .మరొక ఇలియట్ భావ ప్రత్యర్ధి విలియం కార్లోస్ విలియమ్స్ ప్రయోగాత్మక వచనంతో ఆకర్షించి ‘’స్ప్రింగ్ అండ్ ఆల్ ‘’కవితా సంపుటి 1923లోనే రాశాడు . అమెరికా లౌకిక వివరాలు (మండేన్ డిటైల్స్’’)ఆ దేశ పౌరాణిక (మిత్ ),సాంస్కృతిక చరిత్ర వర్ణన లన్నీస్వీప్ గా 1925లో రాసిన ‘’ఇన్ ది అమెరికన్ గ్రైన్స్ ‘’లో చూపాడు .
ఫిక్షన్
లిటిల్ మాగజైన్ లు కవిత్వనికే కాక ఫిక్షన్ కు గొప్ప ప్రోత్సాహం కలిగించాయి .సంప్రదాయ బద్ధం కాని ధైర్యంగా రాసిన కధలను ముద్రించాయి .బాగా పాతుకుపోయిన రచయితలపై దాడినీ బాగానే ఆదరించి ప్రచురించారు .ది డయల్ – 1880-1929,లిటిల్ రివ్యు -1914-29,సెవెన్ ఆర్ట్స్ -1916-17 మొదలైన పత్రికలు ఆధునిక సృజన ను బాగా ప్రోత్సహించాయి .భయంకర ఫన్నీ జర్నలిస్ట్ క్రిటిక్ హెచ్ ఎల్ మెంకేన్ తన స్మార్ట్ సెట్ -1914-33లో ,అమెరికన్ మెర్క్యురి 1924-33 లలో ఇలాంటి రచనలు పెద్ద పీట వేసి ప్రచురించి రచయితలను ప్రోత్సహించాడు .మూసలో నుండి నూతన ఫిక్షన్ ఆవిర్భవానికి ,ప్యూరిటజం పై కటువైన విమర్శకుడైనఈ ఎడిటర్ మెకెన్సన్ ప్రభావం బాగా తోడ్పడింది .
ఈ ఉత్సాహం తో జోసెఫ్ కాన్రాడ్,ధియోడర్ డ్రీజర్ లు దూకుడుగా రాశారు .ఆభిజాత్యం (జెంటిలిటి)పై దాడి చేస్తున్న,గ్రామీణ జనాల అసహాయ నిరాశా జీవితాలపై ప్రశ్నిస్తున్న , చిన్న చిన్న యువ రచయితలనూ ఆయన ప్రోత్సహించాడు .వీరిలో జేమ్స్ బ్రాంచ్ కాబెల్,జానా గేల్రూత్ సక్కో వంటివారున్నారు .వీరిలో గణనీయుడు షేర్ వుడ్ ఆండర్సన్ .అతడి ‘’వైన్స్ బర్గ్ ఒహాయో 1919,ది ,ది ట్రయంఫ్ ఆఫ్ ది ఎగ్’’ 1921కధా సంపుటులలో గ్రామీణులు అనుభవిస్తున్న అన్నిరకాల భయాలు ,బాధలు ,అణచి వేతలు ఇతి వృత్తంగా రాశాడు .చాలా నవలలూ రాశాడు .వాటిలో ది బెస్ట్ ‘’పూర్ వైట్ ‘’-1920.
విమర్శకులు 1920లోకొత్తతరహా ఫిక్షన్ ఆవిర్భావి౦చినట్లు గమనించారు .దీనిలో ఎఫ్ స్కాట్ ఫిట్జ రాల్డ్ రాసిన- ది సైడ్ ఆఫ్ పారడైజ్ ,సిన్క్లేర్ లేవిస్ రచన –మెయిన్ స్ట్రీట్ లు సమకాలీన జీవితాన్ని చిత్రించిన రచనలు .1920నవలలు లిరికల్ గా పర్సనల్ గా ,మొదటిప్రపంచయుద్ధం తో నిరాశాజనకం గా ఉన్నా అవి యుద్ధానంతర జనరేషన్ యొక్క అసంతృప్తి ,భ్రమప్రమాదాలను అద్దం పట్టాయి .1930తర్వాత వచ్చిన నవలలుఅప్పుడు వచ్చిన ‘’ది గ్రేట్ డిప్రెషన్’’వలన వచ్చిన బాధలు కన్నీరు కష్టాలతో రాడికల్ సోషల్ క్రిటిసిజం వైపుకు మొగ్గాయి . ఫిట్జరాల్డ్,విలియం ఫాక్నర్ ,హెన్రి రోత్,నధానియల్ వెస్ట్ లు పూర్వ యుగ ఆధునిక పంధాలో రాశారు .
సశేషం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -15-8-20-ఉయ్యూరు .







