ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కార్తీక చివరి మంగళవారం 8-12-20 ఓంకారాది దీపాలంకరణ

https://photos.google.com/share/AF1QipOsEmdTRSAGtFWBDcBEA5iZjzHY2ZcaDFeIS7dngwhkgOZ375MrpluYuEge4LiHkA/photo/AF1QipOr4jiY1dlZmercGxG8c2yiWkU1ro53gqHS32mw?key=djFzZjEyeGpZQkFZQ2JpcEdpQVp0Qy1UbWJsRWxB

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

కిరాతార్జునీయం-.22      పన్నెండవ సర్గ -1

కిరాతార్జునీయం-.22

పన్నెండవ సర్గ -1

ఇంద్రుడు అంతర్ధానమయ్యాక,ఇంద్ర తనయుడు సంతోషం తో అలసట లేకుండా శంకరుడిని మెప్పించటానికి తపస్సు ప్రారంభించాడు .సూర్యునికి ఎదురుగా ఒంటికాలిపై నిలిచి ,బాహ్యాభ్యంతర శుచితో జయమే లక్ష్యంగా ,నిరాహారుడై ఎన్నో రోజులు దీక్షగా తపస్సు చేశాడు –‘’అభి రశ్మి మాలి విమలస్య ,ధృత జయ ధృతేరానాషు షః-తస్య భువి బహు తిథాస్తిథయః.ప్రతి జగ్మురేక చరణం నిషీదతః .శరీరం ,ఇంద్రియాలను తపి౦ప జేస్తూ,దుఖాలు సహిస్తూ ,పర్వతం లాగా నిశ్చేష్టుడై స్థిరంగా ఉన్నాడు.గొప్ప వారి ధైర్యం ఊహించనలవి కానిది-‘’వ్యాప నగపతి రివ స్థిరతాం,మహతాం హి ధైర్య మవిభావ్య వైభవం ‘’.పండి పరిమళాలు వెదజల్లే ఫలాల మీద , చల్లని నీటిపై ఆకర్షితుడు కాలేదు .పుణ్యాత్ములకు తపస్సు అమృతమవుతుంది .-‘’న పపాత సన్నిహిత పక్తిసురభిషు ఫలేషు మానసం –తస్య శుచిని,శిశిరే చ పయస్యమృతాయతే హి సుతపః సుకర్మణా౦.అంత గొప్ప తపస్సు చేశానని ఆశ్చర్యపోలేదు .ఫలితం ఆలస్యమౌతుందని విషాదమూ లేదు .అలసటా లేదు .శక్తి తగ్గినా ,రజస్తమో గుణాలు అతని సత్వ గుణాన్ని తగ్గించ లేకపోయాయి .పరాక్రమం ఏ మాత్రం సడలలేదు .-‘’న విసిస్మియే న విషాద ముహురలసాం న చాదదే-సత్వ మురు ధృతి రజస్తమసీ,నహతః స్మతస్య హత శక్తి పేలవే .’’.శరీరం కృశించింది.అయినా ముల్లోకాలు జయించాడు .అతని శరీరాన్ని చూసి తత్వజ్ఞులు కూడా భయపడతారు .మాన ధనులకు సాధ్యం కానిది లేదు లోకం లో .-‘’త్రాస జననమపి తత్వ విదా౦ కిమి వాస్తి యన్న సుకరం    ,మనస్విభిః’’.అర్ధరాత్రి మండే అగ్నికంటే తేజస్సుగా ,సముద్రం కంటే గంభీరంగా ,పర్వతం కంటే ఔన్నత్యంగా భాసిం చాడు .-‘’జ్వలతో నలాదను నిశీథ మదిక రుచిర మంభసాంనిధేః-ధైర్య గుణ మవజయ న్విజయీ దదృశే సమున్నతరః స శైలతః ‘’.ఏకాంతంగా జపిస్తుంటే ,ముఖం సూర్య మండల ప్రకాశం పొందింది. దంతకాంతి చుట్టూ ప్రసరించి పరి వేషంగా సూర్య శోభ పొందింది .కవచం ధరించి ,యజ్ఞోపవీతం ఉన్న భుజం పై ధనుస్సు ఎక్కు పెట్టి ,ఇంద్రతనయుడు ,ఇంద్ర ధనుస్సు ఆవరించిన మహారణ్యహిమాలయం లా ఉన్నాడు .-కవచ స భిభ్ర దుపవీత పదనిహిత సజయ కార్ముకః –శైల పతిరివ మహేంద్ర ధనుః పరివీత భీమ గహనో విదిద్యుతే.’’.చిక్కిన శరీరంతో స్నానానికి వెడుతుంటే అతడి ప్రతి అడుగు భారానికీ హిమవత్పర్వతం కుంగి పోతోంది .శరీరభారం తగ్గినా అర్జునుని అంతః సారం ప్రాధాన్యం వహించిందని భావం .

   ఊర్ధ్వబాహుడై ,తపస్సు చేస్తుంటే విస్తృతమైన తేజస్సు అతని శిరస్సు చుట్టూ నేకాక ,భూ నభో౦త రాలలో కూడా వ్యాపించి,మునులకు ,దేవతలకు దుర్ధర్షమై ఇబ్బంది పెట్టింది –‘’పరికీర్ణ ముద్యుత భుజస్య భువన వివరే దురాసదం –జ్యోతి రుపరి శిరసో వితతం జగృహే నిజాన్ముని దివౌకసాం పథః’’.తపస్సు తేజస్సుకు  కృష్ణ పక్షం లోని రాత్రులలో కూడా చీకటి లేనేలేదు అందుకని చంద్రకాంతి ఆకాశాన్ని వదలలేదు –‘’రజనీషు రాజ తనయస్య బహుల సమయే పిదామభిః-భిన్న తిమిర నికరం న జహే శిశిరస్మి సంగమ యూజ నభఃశ్రియా ‘’.శిరస్సు నుంచి వెలువడిన తపస్సు యొక్క తేజో కిరణాలవిపరీత కాంతి వలన ,ఆకాశ సూర్యుడు సిగ్గుతో మ్లానుడై ప్రకాశించటం లేదు –‘’మహతా మయూఖా నిచ యేన శమిత రుచి జిష్ణు జన్మనా –హ్రీతమివ నభసి వీత మలే న విరాజతే స్మవపు రంశు మాలినః ‘’

  ఎర్రని జటల తేజో కిరణాలు వెలువడ్డాయి .ధనుస్సు ఎక్కు పెట్టాడు .ఇది చూసి అసురనగరాలను కాల్చటానికి సిద్ధపడిన రుద్రుడేమో అనుకొన్నారు జనం . పరీక్షించి చూసి ,కంటి మంట లేదుకనుక రుద్రుడు కాదను కొన్నారు-‘’తముదీరితా రుణ జటాంశుమధి గుణ శరాసనం జనాః –రుద్ర మనుదిత లలాట దృశ్యం  దదృశుర్మిమ౦థిషు మివా సురీః పురీః’’.అర్జునుడు సాధారణ మానవుడు కాదు దేవేంద్రుడో ,సూర్యుడో  ,మంటల అగ్ని దేవుడో అనుకొన్నారు జనం .ఇంతటి ఘోర తపస్సు మామూలు మనిషి చేయలేడు అని భావించారు .-‘’మారుతం పతిః స్విదహిమాంశు రుత పృథుశిఖః శిఖీ తపః –తప్తు మసుకర ముపక్ర మతే న జనో య మిత్యవయయే న తాపసైః’’.అర్జున తపో తేజం అంతటా వ్యాపించినా ,అగ్నిలాగా చెట్లను కాల్చటం లేదు ,సూర్యునిలా నీటిని ఆవిరి చేయటం లేదు కాని సిద్ధ చారణ గణాల తపస్వులకు సహించటం కష్టం గా ఉంది .అంటే అతడి తపస్సు అలౌకికం అని భావం .ఔదార్యం మొదలైన గుణాలు వినయాన్ని ఆశ్రయించినట్లు ,నీతి దుర్నీతినితొలగించి వివేకాన్ని ఆశ్రయించినట్లు, నిర్దిష్ట సమయాలు ప్రమాణాన్ని చేరినట్లు ,శరణు లేని మహర్షులు శివంకరుడైన శివుడిని శరణు కోరటానికి ఆయన వద్దకు వెళ్లారు –‘’వినయం గుణా ఇవ వివేక మపనయభిదం నయా ఇవ –న్యాయ మవదయ ఇవా శరణాఃశరణం యయుః శివ మథో మహర్షయః ‘’.అరుణ తపో తేజస్సనేకిరణాలతో కండ్లు మూసుకు పోతున్న మహర్షులు వెంటనే శివుడిని చేరలేకపోయారు .కాసేపాగి చేరి శివ స్తోత్రాలు చేశారు .అందమైన శరీరం త్రినేత్రాలతో ఉన్న శంకర దర్శనం చేశారు .అంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు అని భావం .మొదటి శ్లోకం లో విశాలమైన నందీశ్వరుని మూపు పై చేతులు  ఉంచి ,పార్వతీ దేవి కుఛ సౌభాగ్యాన్ని స్పర్శ సుఖాన్ని అనుభవిస్తున్నట్లు  శివుడు ఉన్నాడని వర్ణించారు .-‘’కకుదే వృషస్యకృత బాహు మకృశ పరిణాహ శాలినీ –స్పర్శ సుఖ మనుభవం తముమా కుఛ యుగ్మ మండల ఇవార్ద్రచందనే ‘’.

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-20-ఉయ్యూరు

 .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.21      పదకొండవ సర్గ -4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.21

పదకొండవ సర్గ -4(చివరి భాగం )

అర్జునుడు ముసలి తాపసి వేషంలో ఉన్న ఇంద్రునితో ఇంకా చెబుతున్నాడు ‘’మనిషి అభిమానం తో ఉన్నంతకాలం సంపద నిలుస్తుంది .కీర్తికూడా స్థిరంగా ఉంటుంది .మానహీనుడు యశోహీనుడు ,సంపత్ హీనుడౌతాడు.వాడికి లోకం లో ఇంకేమీమిగలదు .—తావదాశ్రీ యతే లక్ష్మ్యా –తావదస్య స్థిరం యశః -పురుష స్తావదేవాసౌ యావన్మానాన్నహీయతే ‘’  .దట్టమైన అడవులున్న బాగా ఎత్తైన పర్వతాలనైనాచేర వచ్చు కాని పరాక్రమ శీలి ,అభిమానవంతుడు మాత్రం ఎవరికీ సాధ్యమయ్యే వాడు మాత్రం కాదు.-‘’దురాసదన వన జ్యాయాన్ గంయస్తు౦గోపి భూధరః –నజహాతి మహౌజస్కం మాన ప్రాంశు మలంఘ్యతా ‘’.వంశానికి ప్రతిష్ట తెచ్చే వారి వల్లనే భూమికి ‘’వసుంధరా ‘’అనే పేరు సార్ధకమైంది వారునిష్కలంక కీర్తితో చంద్రమండలాన్ని సిగ్గుపడేట్లు చేస్తారు.’’గురూం కుర్వ౦తి తే వంశ్యానన్వర్దా తిర్వసు౦ధరా-యేషాం యశాంసి శుభ్రాణి హరిప యంతీ౦దు మండలం .’’ఎండిన కర్రను పిడుగుపడి కాల్చినట్లు ,కోపాన్ని శత్రు సంహారం లో ప్రదర్శించే వారు వారే అంతటి వారుకావాలని ఆశీర్వచానాలలో ఉదహరిస్తారు .అంటే మనస్విత వదలకూడదు అని భావం –‘’ఉదాహరణ మాశీః షు ప్రథమే తే మనస్వినాం శుష్కేఆశని రివా మర్షోయైరారాతి షుపాత్యతే ‘’.నేను చంచల సుఖాలకోసం తపస్సు చేయటం లేదు .ధనసంపాదనకోసం కాదు .అస్త్రాలకు భయపడి మోక్షం కోరటం లేదు .శత్రువుల కపటంవలన అంటిన బురద అనే అపకీర్తి ని  ,విధవలైన శత్రు స్త్రీల కన్నీటితో కడిగి తొలగించాలన్నదే నా కోరిక –‘’పరమార్ష్టుమయశః పంక మి చ్ఛేయంచద్మనాకృతం-వైధవ్య తాపితారాతివనితా లోచనా౦బుభిః’’.లోకం లో సజ్జనులు నన్ను పరిహాసం చేయచ్చు లేక భ్రాంతిలో ఉన్నాననవచ్చు .కానీ నువ్వు చేసిన మోక్షరూప ఉపదేశం నిష్ఫలమై౦దని సిగ్గు పడకు.శత్రు నిర్మూలనం చేసి వంశ పరంగా వస్తున్న రాజ్య లక్ష్మిని ఉద్ధరించకుండా వచ్చే మోక్షం కూడా విజయశ్రీకి  అడ్డుగానే భావిస్తాను .’’వంశ లక్ష్మీ మనుధృత్య సాము చ్ఛేదేనవిద్విషాం-నిర్వాణ మపిమన్యేహమంతరాయ౦ జయశ్రియం ‘’.శత్రువులు అపహరించిన కీర్తిని బాణం తో మళ్ళీ సాధించాలి .అలా చేయకపోతే పుటక వ్యర్ధమే .చచ్చినవాడితో సమానం .గడ్డిపోచ విలువకూడా పొందలేడు-‘’ఆజన్మా పురుష స్తావ ద్గతాసు స్తృణమేవ వా  -యావన్నేషుభిరా దత్తేవిలుప్త మరిభి ర్యశః ‘’.

  శత్రువుపై తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి .అలా చేయకపోతే దోషమే .ముసలి మునీ !నువ్వే చెప్పు- శత్రు సంహారం లేకుండా మనిషి కోపం శాంతిస్తుందా ?శత్రు సంహారం చేయని వాడిని పురుషుడు అనవచ్చా ?’’అని ప్రశ్నించాడు –‘’అనిర్జయేన ద్విషతాం యస్యామర్షః ప్రశామ్యతి-పురుషోక్తిః కథం తస్మిన్ బ్రూహి త్వం హి తపోధన ‘’.పురష జన్మతో చెప్పబడే పురుష శబ్దం తో ఏమీ కాదు .పశు ,పక్ష్యాదుల్లోనూ పురుష జాతి ఉంది .గుణ గ్రహణపారీణులు ప్రశంసించి ,వెంటనే ఆదర్శం గా తీసుకోబడే వాడే  పురుషుడు .-‘’కృతం పురుష శబ్దేన జాతి మాత్రావలంబినా –యో౦గీకృత గుణైః శ్లాఘ్యః సవిస్మ యముదా హృతః ‘’.సభలలో సంభాషణలలో గౌరవంగా తీసుకోనబడే వాడు వినే వాళ్ళ తేజస్సు ను కూడా మింగేసే వాడూ ,శత్రువుల చేతకూడాఅభినందింపబడే వాడూ అతడే అభిమాన వంతులలో గణనీయుడైన పురుషుడు అవుతాడు .-‘’గ్రసమాన మివా౦ జసి సాదసా గౌర వేరిత౦ –నామ యస్యాభి న౦ద౦తి ద్విషోపిస పుమాన్పుమాన్ ‘’.మారాజైన ధర్మ రాజు మా శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవటానికి నన్నేకోరాడు .దాహం వేసిన వాడు దోసెడు నీళ్ళుకోరినట్లు నన్ను కోరాడు .-‘’యథా ప్రతిజ్ఞంద్విషతాంయుధి ప్రతి చికీర్షయా –మమైవా ధ్యేతి నృపతిస్తృష్యన్నివ  జలాంజలె

జలా౦జలేః’’.యజమాని ఆపదలో ఉంటె అతడిఆజ్ఞ పాలి౦చని వాడుతన నిర్మల వంశానికి చంద్రునిలో మచ్చ లాగా  కుల ఘాతకు డౌతాడు.అంటే ధర్మరాజు ఆజ్ఞ నాకు శిరో దార్యం ..-‘’స వంశస్యావ దాత స్య శశాంక స్యేవ లాంఛనం-కృఛ్చ్రేషువ్యర్ధయా యత్ర భూయతే భర్తు రాజ్ఞయా’’.సరేకానీ గృహస్థాశ్రమానికి ముందే ధర్మానికి విరుద్ధమైన ముని వృత్తి నాకు ఎందుకు ఉప దేశిస్తున్నావు సామీ ? బ్రహ్మ చర్య ,గృహస్థాశ్రమ, వానప్రస్థ,సన్యాసం కదా వరుస .నేనింకా  గృహస్థుడినే అని భావం .శత్రు ప్రతీకార భారం ఇంకా నామీద ఉంది మా అమ్మగారు కుంతీదేవి కూడా మాదగ్గరలేదు .అన్న ధర్మరాజు గారే మాకు అన్నిటికీ పెద్ద ఆయన ఆచార నిష్ఠ ఉన్నవాడు .ఈ మూడు కారణాలవలన నేను స్వతంత్రంగా ఏమీ చేయకూడదు .అందుకే గృహస్థాశ్రమ ధర్మాలు ఎన్నోఆచరించ లేకపోతున్నాను .అభిమానవంతులు తమపని ధర్మాన్ని తాము చేస్తారు .దాన్ని ఉల్లంఘించరు.శత్రువుతో అపకారం పొందినవాడు యుద్ధం నుంచి దూరం కాడు. ప్రతీకారం తీర్చుకోనేదాకా శ్రమిస్తాడు-‘’స్వధర్మ మను రుంధంతే నాతిక్రమ మరాతిభిః-పలాయంతేకృతద్వంసా నాహవా న్మాన శాలినః ‘’.సుడిగాలితో చెల్లా చెదరైన మేఘం లాగా ,ఇంద్రకీలాద్రి పై నేనూ విలీనమౌతాను లేదా ఇంద్రుడిని మెప్పించి అపకీర్తి ముల్లుతొలగిస్తాను .ఇదే నా నిశ్చిభిప్రాయం’’ అని  ఇంద్రతనయుడు అర్జునుడు ,ముసలి ముని వేషం లో వచ్చిన ఇంద్రుడికి చెప్పాడు –‘’విచ్చిన్నాభ్రవిలాయం వా విలీయే నాగ మూర్ధని –ఆరాధ్య వా సహస్రాక్షమ యశః  శల్య ముద్ధరే ‘’.

  తన మనో నిశ్చయాన్ని నిర్భయంగా చెప్పిన అర్జునుడికి ఇంద్రుడు తన నిజరూపం తో ప్రత్యక్షమై ,రెండు చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకొని,అతడి అభీష్ట సిద్దికీ ,సంసారం లో సరిగమలు సరిదిద్దుకోవటానికీ ,పాపాలను తొలగించే పరమేశ్వరుని గురించి తపస్సు చేయమని ఉపదేశించాడు .-‘’ఇత్యుక్త వంతం పరి రభ్యదోర్భ్యాం తనూజ మా విష్కృత దివ్య మూర్తిః-అఘోపఘాత౦ మఘవా విభూత్యై  భవోద్భావా రాదన మాది దేశ ‘’.అర్జునుడి తో ఇంద్రుడు ‘’శివుడు నీ తపస్సుకు ప్రసన్నుడవగానే, లోక పాలకుల౦దరి తో కూడా నేను గొప్ప శక్తిని ప్రసాదిస్తాను .దాని ప్రభావం తో నువ్వు శత్రు రాజ్య లక్ష్మిని నీకు అనురాగవతిగా చేసుకోగలవు ‘’అనిచెప్పి , అంతర్ధానమయ్యాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  సార్ధకమైన ఆదివారం

   సార్ధకమైన ఆదివారం

సాహితీ బంధువులకు శుభకామనలు .నిన్న 6-12- 20 కార్తీక బహుళ షష్ఠి ఆదివారం మా ఇంటి పెరటిలో ఉన్న ఉసిరి వృక్షం క్రింద ఉదయం 9గంటల నుండి 11 గంటల వరకు నేనూ మా అబ్బాయి మూర్తి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, దశ శాంతులు సామ్రాజ్య పట్టాభి షేకంతో తో సహా చేసి, శివ  అస్టోత్తర   శతనామపూజ,  బిల్వార్చన చేశాం .తర్వాత 11గం నుండి నేనూ మా శ్రీమతి, మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి   నవగ్రహాలకూ అష్టోత్తర పూజ ,శ్రీ సత్యనారాయణ స్వామికి అష్టోత్తర సహస్రనామపూజ ,,అభిషేకం సత్యనారాయణస్వామి  వ్రతం ,అయిదు కథలు తోనూ తర్వాత శ్రీ వేంక టేశ్వర దీపారాధన అష్టోత్తరపూజ, తులసి అష్టోత్తర పూజ చేసేసరికి మధ్యాహ్నం 1.45గం అయింది . బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు అందజేశాం .అప్పుడు బంధుమిత్రులతో    మామిడికాయపప్పు,అరటిఊచ  ఆవపెట్టి కూర ,బెండకాయ వేపుడు ,నేతిబీరకాయ పచ్చడి ,దోసావకాయ ,కాలీఫ్లవర్ ఊరగాయ ,పరవాన్నం,చక్రపొంగలి పులిహోర, పులుసు ,అప్పడం ,పెరుగు లతో ఉసిరి చెట్టు కింద కార్తీక వనభోజనం చేశాం .అందరి భోజనాలు ఆయే సరికి మధ్యాహ్నం 3 అయింది .  వంట అంతా మా కోడలు, ప్రక్కనున్న మామ్మగారు ,మా శ్రీమతి చేశారు .వడ్డన మల్లికా౦బగారు ,మూర్తి, రాణి ,చరణ్ ,రమ్య చేశారు .మా దేవాలయ అర్చక దంపతులు మా అన్నగారబ్బాయి రాంబాబు,దంపతులు , మా వదిన గారు ,అద్దెకున్న గోపాలకృష్ణమూర్తి గారు,, భార్య గారు ,అద్దెకుంటున్న సుబ్రహ్మణ్యంగారు అతిధులు.

   మధ్యాహ్నం 3-30కు కారులో నేనూ మామనవడు చరణ్ ,మనవరాలు రమ్య బయల్దేరి కృష్ణకట్ట మీదుగా నడకుదురు శ్రీ పృధ్వీశ్వర దేవాలయ సందర్శన చేసి అక్కడ మాత్రమే పెరుగుతున్న అపురూప మైన  పాటలీ పుష్ప వృక్షాలు చూసి అక్కడే నరకాసుర వధ జరిగిందన్న ఐతిహ్యం మా వాళ్లకు చెప్పాను ..అక్కడి నుంచి చల్లపల్లి మీదుగా కప్తానుపాలెం వెళ్లి  అక్కడ ఉంటున్న 57 ఏళ్ళక్రితం మోపిదేవి హైస్కూల్ శిష్యుడు అడవి శ్రీరామ మూర్తి ఇంటికి వెళ్లి ,వాళ్ళమ్మ గారిని, భార్యను చూసి సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇచ్చాం .అక్కడి నుంచి శ్రీరామమూర్తిని తీసుకొని అందరం చల్లపల్లి మీదుగా  అమరగాయకులు శ్రీ ఘంటసాల జన్మించిన టేకుపల్లి గ్రామం చేరి అక్కడ ఎలిమెంటరి స్కూలు ఆవరణలో గానగంధర్వ బాలసుబ్రహ్మణ్యం గారి చేత ప్రతిష్టింప బడిన ఘంటసాలమాస్టారి  విగ్రహాన్నిచీకట్లోనే చూశాం .అక్కడే కంచి కామకోటి పీఠం ఆధ్వర్యం లో నిర్వహింపబడుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసి , అక్కడినుండి పెదకళ్ళేపల్లి చేరి అక్కడి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి దర్శనం చేసి ,సత్యస్తంభం  చూశాం ..ఇక్కడే ప్రముఖ సాహితీ వేత్త  శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు,సినీ గేయరచయిత శ్రీ  వేటూరి సుందరరామమూర్తిగారు ,మహా సంగీత విద్వాంసులు శ్రీ సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రిగారు,,ఆయన మనవడు  సినీ సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి జన్మించారు .కృష్ణా నదీతీరంలో ఉన్న కదళీవనాలు అంటే అరటి చెట్లు విశేషంగా ఉన్న కదళీ పల్లి అనే కళ్ళే పల్లి దక్షిణ కాశిగా పేరుపొందిన  సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం .ఇక్కడ ఓరియెంటల్ హై స్కూల్ ఉంది . 1999లో వేటూరి ఇక్కడే తమ ఇంట్లో రెండు రోజుల సాహిత్య కార్యక్రమం అన్ని ఖర్చులూతానే భరించి నభూతో గా నిర్వహించారు .మొదటి రోజున మా దంపతులం కూడా వెళ్లి వేటూరి సుందరరామ మూర్తిగారి కమ్మని షడ్రసోపేత భోజనాన్ని ఆతిధ్యాన్నిఆదరణ ను  దర్శకుడు  విశ్వనాద్ దేవదాస్ కనకాల దంపతులు, జంధ్యాల, నటి ,,నాట్య మయూరి సబిత  ల తోపాటు అనుభవించి అనుభూతి పొందాం .ఆడిటోరియం లో జరిగిన సభలో శ్రీ బుద్ధప్రసాద్ వగైరా పాల్గొన్నారు .

 

https://photos.google.com/share/AF1QipMoVYFdhQjxDS0LiBza_5dGEl_dkA6iQymxSSnd3f0KrnFzm1DPhMYjezqCPnZ18Q?pli=1&key=bEtfOXl2M3kyTURvU20tNFNQTEhkTnNBeWcwNDNn

 

  కళ్ళేపల్లి నుంచి నేను 33ఏళ్ళ క్రితం అంటే 1987లో హెడ్ మాస్టర్ గా పనిచేసిన మంగళాపురం మీదుగా లక్ష్మీ పురం చేరి,  అక్కడ నా దగ్గర మంగళాపురం లో ,అంతకు ముందు వత్సవాయి హైస్కూల్ లో అటెండర్ గా పనిచేసిన మేమంతా’’ బాణం’’అని పిలిచిన ప్రస్తుతం చల్లపల్లి మండల పరిషత్ లో S.O.గా పనిచేస్తున్న పోతుమూడి వెంకటేశ్వరరావు కుమారుడు వెంకట రఘు ,హరిచందన  వివాహానికి హాజరయ్యాం.అతడు 15రోజులక్రితం కుమారుడితో ఉయ్యూరు వచ్చిశుభలేఖ ఇచ్చి తప్పక రమ్మని కోరితే వెళ్లాం . వత్సవాయిలో పని చేసినప్పుడు అతడు ట్రాన్స్ ఫర్ అయి వెడుతూ ,‘’సార్ మళ్ళీ మీ దగ్గరే పని చేయాలని ఉంది ‘’అన్నమాట ఉయ్యూరు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొన్నాడు .అలాగే మళ్ళీ మంగళాపురం లో నా దగ్గరే పని చేశాడు  . నేను రోజూ ఉయ్యూరు నుంచే వచ్చేవాడిని .చాలా ఇబ్బందిగా ఉండేది ప్రయాణం చల్లపల్లి లక్ష్మీ పురం చేరటం తేలికగానే ఉండేది. అక్కడి నుంచి మంగళాపురానికి బస్ సరిగ్గా ఉండేది కాదు .రిక్షాలో వెళ్ళాల్సి వచ్చేది .నేను  ముందే వెళ్లి ,బాణం ఇంట్లో కాసేపు కూర్చుని అతనిభార్య ఇచ్చిన కాఫీ లేక మజ్జిగ తాగి ,అతడి సైకిల్ పై  స్కూలుకు వెళ్ళేవాడిని అదీ మా అనుబంధం .తర్వాత మూడు నెలలో నాలుగు నెలలో మంగళాపురం లో స్కూలుకు దగ్గరలోనే ఉన్న  మాలెం పాటి వేణు గారింట్లో ఒకగదిలో అద్దె కున్నాను. వేణుభార్య విజయ ను ‘’అమ్మాయీ ‘’అని పిలిచే వాడిని .ఆమె మామగారు ఉండేవారు .అందరూ ఆత్మీయంగా చూసేవారు .అమ్మాయి మాత్రం నన్ను కన్న తండ్రి లాగా చూసుకొనేది. ఉదయం కాఫీ,, మధ్యాహ్నం టీ సాయంత్రం టీ, వీలైనప్పుడల్లా ఇడ్లీ గారే చేసి పెట్టేది..పెరుగు, పాలు, మజ్జిగ ఫ్రీ .ట్యూషన్ కూడా చెప్పా  టెన్త్  పిల్లలకు .మా వివాహ౦ జరిగి 25ఏళ్ళు అయిన సందర్భంగా స్కూల్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చాము. ఉయ్యూరునుంచి మా శ్రీమతి మా అమ్మాయి విజ్జి  మా అబ్బాయిలు కూడా వచ్చారు .నన్ను చూసి తర్వాత పాండురంగా చారి  అనే డ్రాయింగ్ మాస్టారు అలాంటి పార్టీ ఇస్తే ,తర్వాత అందరూ ఏదో ఒకకారణంగా పార్టీలిచ్చారు    .అమ్మాయి ,వేణు ఆ తర్వాత మూడు నాలుగు సార్లు ఉయ్యూరు వచ్చారు . ఫోన్ లో మాట్లాడేవారు  .వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కూడా నేను వెళ్లాను . అమ్మాయిని చూడాలనుకొని బాణం కు మెసేజ్ పెడితే అతడు చదివి ఫోన్ చేసి రెండేళ్ళక్రితం విజయ చనిపోయిన విషాద వార్త చెప్పాడు .లేకపోతె వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి ఉండేవాళ్ళం . నేను వచ్చినందుకు బాణం దంపతులు ఎంతో సంతోషించారు .చాలా గ్రాండ్ గా జరిగింది వివాహం .మాజీ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర కూడా వివాహానికి హాజరయ్యారు .ఆయనకు సరసభారతి ఉగాది ఆవిష్కరణ పుస్తకాలు మూడు ఇస్తే ,చాలా ఆప్యాయంగా అందుకొని   ఫోటో తీయి౦చు కొన్నారు . చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావీన్ద్రగారిని చాలా సాహిత్యసభాలలో చూశాను .ప్రభుత్వ సాహితీ పురస్కారం కూడా బెజవాడ సంగీత కాలేజిలో ఆయన ,ఇతర మంత్రుల సమక్షం లో అందుకొన్నాను .ఇవన్నీ జ్ఞాపకమోచ్చాయి .ముహూర్తం రాత్రి 7.50కి చూసి, దంపతులను ఆశీర్వదించి ,కానుక కవర్ పెళ్లి కొడుకు చేతిలోపెట్టి ,బయల్దేరగా బాణం వచ్చి చాలాసంతోషంగా ఉందని చెప్పి భోజనం చేయమని కోరితే కార్తీకమాసమని చెప్పి  రాత్రి 8గం.లకు బయల్దేరి 9.కి ఉయ్యూరు చేరాం .మా కారు డ్రైవర్ కం ఓనర్ శుశీల్ బాగా,జాగ్రత్తగా  డ్రైవ్ చేశాడు .

  కార్తీకమాసం ఆదివారం అభిషేకం ,సత్యనారాయణస్వామి వ్రతం ,వనభోజనం ,మూడు శివ క్షేత్రాల దర్శనం ,వివాహ వేడుక కు హాగారు ల తో ధన్యమయ్యాం  .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-12-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కార్తీక బహుళ షష్ఠి 6-12-20ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టుక్రింద మహాన్యాసపూర్వక అభిషేకం,బిల్వదళపూజ ,శ్రీ సత్యనారాయణ వ్రతం, శ్రీ వేంకటేశ్వర దీపారాధన, బంధు మిత్రులతో కార్తీక వనభోజనం

కార్తీక బహుళ షష్ఠి 6-12-20ఆదివారం మా ఇంటి ఉసిరి చెట్టుక్రింద మహాన్యాసపూర్వక అభిషేకం,బిల్వదళపూజ ,శ్రీ సత్యనారాయణ వ్రతం, శ్రీ వేంకటేశ్వర దీపారాధన, బంధు మిత్రులతో కార్తీక వనభోజనం

https://photos.google.com/share/AF1QipOZK-YDfb09Tj3Ha24fPGPzx-wteFFXqQVyhHoYQeh03mKScTC0jiKnhwB_CKacPg/photo/AF1QipNNT5-8YyueCmJLyByHk_hWH7iKVz81UjWvno6a?key=MTQyNU5lbjdTcUlJNmtUTWhaalRHOVB3ZlprRU1R

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం !

సంస్కృత పండితులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు అస్తమయం !
ప్రముఖసంస్కృతాంధ్రవిద్వత్కవి, మహామహోపాధ్యాయ శ్రీ దోర్బల విశ్వనాథశర్మ గారు అనారోగ్యంతో నిన్న రాత్రి 1.30 గంటలకు హైదరాబాదులో పరమపదించారు. వారి వయస్సు 90 సంవత్సరాలు. వీరు ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి సహోదరులు. 1931 లో అప్పటి మెదక్ జిల్లా రామాయంపేటలో జన్మించిన శర్మ గారు సంస్కృతాంధ్రభాషలలో అపారపాండిత్యాన్ని సంపాదించి లబ్ధప్రతిష్ఠులయ్యారు. ఆయన రచించిన ‘శ్రీలాలిత్యం’ అశేషపాఠకాభిమానులను అలరించింది.సంస్కృతాంధ్రభాషలలో శతకాలూ,కావ్యాలూ,వ్యాఖ్యానాలూ శతాధికంగా రచించి ఉభయభాషలలోనూ అపారకీర్తిని గడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున విశిష్ట సేవాపురస్కారంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకున్నారు. అనేక జాతీయ స్థాయి రాష్ట్రస్థాయి పురస్కారాలను, సత్కారాలను పొందారు—-అప్పల శ్యాం ప్రణీత శర్మ గారు ఫేస్ బుక్ లో పెట్టిన వార్త
Posted in సమయం - సందర్భం | Leave a comment

కిరాతార్జునీయం-.20    పదకొండవ సర్గ -3.

కిరాతార్జునీయం-.20         పదకొండవ సర్గ -3.

అర్జునుడు ఇంద్రుడితో’’ఇలాంటి ప్రియవచానాలు ఎవరు చెబుతారు .నీలాంటి బుద్ధి మంతులకు  తప్ప మరొకరికి సాధ్యం కాదు ‘’-‘’వ్యాకుర్యాత్కః ప్రియం వాక్యం యో వక్తా నేదృగాశయః .నేను ఎందుకు తపస్సు చేస్తున్నానో దాని నేపధ్యం మీకు తెలియదు .సాధారణ ముని అనుకొని,మోక్ష ధర్మం ఉపదేశించావు .-‘’శాసితం యేన మాం ధర్మం మునిభి స్తుల్య  మిచ్ఛసి’’.పూర్వాపరాలు తెలీకుండా చేసే ఉపదేశం బృహస్పతి చెప్పినా వృధా అవుతుంది .నీతివిరుద్ధ ప్రయత్నం విఫలమైనట్లే ఇదీ నిష్ఫలమౌతుంది –వాచస్పతే రపి -‘’అవిజ్ఞాత ప్రబంధస్య ‘’వ్రజత్యఫలతామేవ నయద్రుహ ఇవే హితం ‘’         .నక్షత్రాలు ప్రకాశించే ఆకాశానికి పగలు పనికి రానట్లు ,మీ ఉపదేశానికినేను పాత్రుడిని కాను -.’’శ్రేయసో ప్యస్య తే తాత వచసోనాస్మి భాజనం –నభసః స్ఫుట తారస్య రాత్రే రివవిపర్యయఃనేను పాండు రాజ  కుంతీ దేవి దంపతుల కుమారుడిని .ఆర్జునుడిని . దాయాది కౌరవులు రాజ్య బహిష్కారం చేయగా అరణ్యవాసం చేస్తున్నఅన్నగారు ధర్మరాజు ఆజ్ఞతో ఇక్కడ తపస్సు చేయటానికి వచ్చాను .-‘’క్షత్రియస్తనయః పా౦డో రహం పార్థోధనంజయః –స్థితః.ప్రాంతస్య దాయాదైర్భ్రాతుర్జ్యేష్టస్య శాసనే ‘’..పూజ్య కృష్ణ ద్వైపాయన మహర్షి ఆజ్ఞాపించగా ఈ రకంగా తపో నిష్ఠ లో ఉన్నాను .ఇంద్రుని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం లో ఉన్నాను .ఇంద్రుడు క్షత్రియ దేవుడు కనుక సుఖారాధ్యుడు అని భావం .-‘’కృష్ణ ద్వైపాయ నాదేశాత్ విభిర్ని వ్రత మీద్రుశం .-భ్రుశమారాదనే యత్తః స్వారాధ్యస్య ‘’.మరుత్వతః.కపట పాచికలతో ఆడి, ధర్మరాజు రాజ్యం,సోదరులు నల్గురు భార్య ద్రౌపదిని స్వయంగా పణంగా ఒడ్డి ఓడిపోయాడు .ఏదో జరగాల్సిందేదో అలా జరిగిపోయింది ‘’భవితవ్యతాఖలు బలవతీ ‘’ సూక్తి నిజమైంది .’’దురక్షాం దీవ్యతా రాజ్ఞా రాజ్యమాత్మావయం వధూః-నీతాని ణతాం నూను నమీదృశీభావితవ్యయా ‘’.నేను లేకుండా మిగతా సోదరులతో ఉన్న యుధిస్టిరుడుద్రౌపదీ దీర్ఘ రాత్రులు గడపలేక ఇబ్బంది పడ్డారు .నాకోసం వాళ్ళు, వారికోసం నేను బాధ పడుతుంటే వైరాగ్య భావన కలుగదు కదా –‘’తేనానుజ సహాయేన ద్రౌపది వినా   –భ్రుశ మా యామి యామాసు యామినీ ష్వభితప్యతే ‘’.కౌరవ సభలో మా ధర్మపత్ని ద్రౌపది కొంగు లాగి సిగ్గు పడేట్లుచేశారు .నీచమైన మాటలశూలాలతో మా ననస్సులకు గాయాలు చేశారు –‘’హృతోత్తరీయాం ప్రసభం సభాయామాగత హ్రియః –మర్మచ్ఛిదానో వచసా నిరతకక్ష న్నరాయతః ‘’.కాలపురుష మృత్యువు భీష్మాదులున్న సభలో ద్రోపదిని ఈడ్చుకురావటం మమ్మల్ని కూడా అలాగే ఈడ్చాలనే ప్రయత్నం లో ఉన్నట్లు అర్ధమైంది .’’వినాశకాలే విపరీత బుద్ధిః’’లోకోక్తికి ఉదాహరణగా నిలిచారు’’ –‘’ఉపాధత్త సపత్నేషు కృష్ణాయా గురు సన్నిధౌ –భావమాన యనే సత్యాః సత్యం కార మివా౦ తకః ‘’

   దుశ్శాసనుడు సభలోకి ఆమెను ఈడ్చుకొని వచ్చినప్పుడు ,సభాజనం క్షణ కాలం చూశారు .తర్వాత తలలు తిప్పుకొన్నారు అది సాయం వేళసూర్యుని కెదురుగా ఉన్న చెట్టు నీడ క్షణ కాలం ఉన్నట్లుగా అనిపించింది –‘’అభి సాయార్క మా వృత్తాం.చాయా మివ మహా తరోః.’’ఏ పనీ చేయలేని నీ భర్తలను చూసి మాత్రం ప్రయోజనం ఏముంది అన్నట్లు ద్రౌపది కళ్ళను కన్నీరు కప్పేసింది – ‘’ఆయథార్ధ క్రియా రంభైః పతిభిఃకిం తవైక్షి తైః-అరుధ్యేతామితీ వాస్యా నయనే బాష్ప వారిణా  ‘’.మా దుర్దశకు  మా పెద్దన్న ధర్మరాజు గారే సహించాడు శత్రునాశనం ఎప్పుడైనా సులభమే .ఇవాళకాకపోతే రేపైనా తప్పదు..కాని సజ్జనులమధ్య అపవాదు మంచిది కాదు కదా .ఆది తప్పిన వాడు అనే పేరు రాకూడదని అన్నగారి ఉపేక్ష .-‘’సోఢవాన్నో దశా మంత్యాం జ్యాయేనేవ గుణప్రియః –సులభో హి ద్విషాం భంగోదుర్లభా సత్స్వ్య వాచ్యతా ‘’.సముద్రజలం చెలియలికట్ట దాటరాదు అనే మర్యాద తో అతలాకుతలమౌతుంది అయినా స్వచ్చంగానే ఉంటుంది .అలాగే అభిమాన వంతుడైన ధర్మరాజు మనస్సు కూడా ప్రతిజ్ఞాభంగం కాకూడదని వ్యాకులమైంది అయినా మనస్సుమాత్రం .స్వచ్చంగా సంయమనం పాటిస్తోంది –‘’స్థిత్యతి క్రాంతి భీరూణిస్వచ్ఛాన్యాకులితాన్యపి-తోయాని తోయరాశీనాం మనాంసి  చ మనస్వినాం .ధృత రాష్ట్ర కుమారులతో మా మైత్రి మా శత్రుత్వానికి కారణమయింది .నీడ కోసం కూలిపోయే నది గట్టు ను ఆశ్రయిస్తే అదికూలి ప్రాణం తీసినట్లు ,దుర్జన స్నేహం అనర్ధ దాయకమే .మిత్ర ద్రోహమే దీనికి కారణం .—దార్త రాష్ట్రైః సహప్రీతి ర్వైర మస్మాస్వ సూయతః –అసన్మైత్రీ హి దోషాయ కూల చ్ఛాయేవసేవితా ‘’.

  లోకనిందకు భయపడని మంచి చెడు విషయం లో తారతమ్యం లేని దురాచార దుష్టుని మనసు దైవ విదిలాగా ఊహకు అందనిది .వాడి పనిని బట్టే అది బయట పడుతుంది ..-‘’అపవాద భీతస్య సమస్య గుణ దోషయోః-అసద్వ్రుత్తేరహో వృత్తం దుర్విభావం  విధేరివ’’.శత్రు అవమానం పొందిన నామనస్సు వెంటనే బ్రద్దలయ్యేట్లుంది.ప్రతీకారం తీర్చుకోవాలన్న నా కోపం దానికి సాయపడి కాపాడింది .బతికి ఉండటానికి కారణం ప్రతీకారం తీర్చుకోవటానికే –ద్వంసేత హృదయం సద్యః పరి భూతస్య మే పరైః-యద్యమర్షఃప్రతీకారం భుజా లంబం నలంభయేత్’’.శత్రువుల అవమానం తో మృగాలుగా గడుపుతున్న మేము ఒకరి కొకరం చూసుకొని సిగ్గుతో తలవంచు కుంటున్నాం .స్నేహబృందం మాట చెప్పేదేముంది ?-‘’అవదూతాయాభి ర్నీతా హిరణై స్తుల్య వృత్తి తాం-అన్యోన్యస్యాపి జిహ్రీమః కిం పునః సహవాసినాం ‘’.అభిమానం వదిలితే నమ్రత, దుర్బలత్వం గౌరవహాని కలుగుతాయి అలాటి మానహీండు గడ్డి పోచతో సమానం .ఎన్నికస్టాలొచ్చినా అభిమానం వదలరాదు కదా ‘’-శక్తి వైకల్య నమ్రస్యనిః సారత్వా ల్లఘీ యశసః-జన్మినో మాన  హీనస్య తృణస్య చ సమాగతిః’’.పర్వత శిఖరాలలో దాట శక్యం కాని శిఖరాన్ని చూసి గొప్ప అభిమానం ఏ కారణంగా నూ సతోషం పొందదు.అనుల్లంఘ నీయత్వమే గొప్పవారికి  ప్రీతి కలిగిస్తుంది –‘’అనుల్లంఘ్యం తత్త దురీక్ష్యయద్య దుచ్చైర్మహీ భ్రుతాం-ప్రియతాం జ్యాయసీ౦ మాగాన్మహతాం కేన తుంగతా ‘.’

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.19      పదకొండవ సర్గ -2

 

కిరాతార్జునీయం-.19

పదకొండవ సర్గ -2

 ఇంద్రుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ప్రాణుల్ని చంపి చంచలమైన సంపదలు పొందేవాడు నదులకు సముద్రం ఆశ్రయం అన్నట్లుగా ఆపదలకుఆశ్రయమౌతాడు .-‘’ఉదన్వానివ సి౦దూనామాపదామేతిపాత్రతాం .’’సాధన సంపత్తు ఉంటేనే సంపదలు లభిస్తాయి .దాన్ని రక్షించుకోవటానికి చాలా శ్రమపడాలి .భయాలు పెరుగుతాయి. సంపదను మించిన విపత్తు, దుఖం మరొకటి లేదు .ఆపదల భయాలే భేద౦ ,భయం .సాధన సంపత్తి తో ఆపదలు దూరమౌతాయి .-‘’యా గమ్యాఃసత్సహాయానాం యాసు భేదో  భయం యతః –తాసాం కిం యన్న దుఖాయ విపదామివ సంపదా౦’’.పొందరాని విశ్వాసం తో కలిగిన సంతోష రూప సుఖం తో క్రూరుడైన శత్రువు ధనాన్ని పాము పడగలతోసమానమైన దాన్ని పొందిన ధనవంతుడికి ఏ కష్టాలైనా దుర్లభాలు కావు .అంటే భోగ లాలసలతో మునిగిన ధనవంతుడు సులభంగా ఆపదలు పొందుతాడు .విష సర్పం ఎవడి వల్లనైనా చావాల్సింది . అలాగే డబ్బాశ ఉన్న వాడుకూడా .-దూర సదా నరీ నుగ్రాన్ ధృతే ర్విశ్వాస జన్మనః –భోగాన్భోగాని వాహే యాన ధ్యాస్యాపన్న దుర్లభా ‘’.సంపత్తుకు భేద భావం ఉండదు .దానికి ఇష్టమైన వారు అంటూ ఉండరు .మూర్ఖులు మాత్రం అనురక్తులు కాని స్త్రీల యందు అనురక్తు లైనట్లు సంపద కోరుతారు .ప్రాణులు వామశీలం కలవారవటం సహజం కదా .-‘’నాంత రజ్ఞాః శ్రియో జాతుప్రియై రాసాం న భూయతే –ఆసక్తా స్తా స్వమీ మూఢా వామశీలా హి జ౦తవః’’.చెడు స్వభావం ఉన్న వారిని  సంపదలు వదిలేస్తాయి .ఇవి చంచలమైనవి  అనటం లో తప్పే లేదు.అర్ధం పురుషార్ధం కాదు .- ’సాధు వృత్తానపిక్షుద్రా విక్షి పంత్యేవసంపదః ‘’.ప్రాణుల స్థితి కూడా చంచలమైనదే.ధర్మనాశనం చేయద్దు .సజ్జనులు న్యాయాన్నే ఆశ్రయిస్తారు .అంటే సజ్జనులు కూడా హత్యలాంటివి చేస్తే లోకం లో సజ్జనత్వం ఉండదు .-‘’భావాన్మా స్మవధీ న్న్యాయ్యంన్యాయాదారా హిసాధవః ‘’.యుద్ధ ప్రయత్నం మాను .ముక్తి నిచ్చేతపస్సును చెరపకు .జనన మరణ బంధాన్ని వదలాలంటే శాంతాన్ని ఆశ్రయించాలి .-అంటే విజయం పొందాలనే కోరిక వదిలెయ్యి అనిభావం –‘’విజహీహి రణో త్సాహం మా తపః సాధునీనశః –ఉచ్ఛేదం జన్మనః కర్తు మేధి శాంతస్తపో ధనః ‘’.

 ముందు అంతఃశత్రువులను జయించు .వాటిని జయిస్తే లోకాలన్నీ జయించి నట్లే .-‘’జీయంతా౦ దుర్జయా దేహే రిపవ శ్చక్షురాదయః –జితేషునను లోకోయం తేషు కృత్స్నస్త్వయా జితః ‘’.జితేంద్రియుడు కాని వాడు కార్య సాధకుడు కాలేడు.పరాధీనుడు నీచ ప్రవృత్తికలవాడు సిగ్గులేని వాడవుతాడు .పశువులాగా లోకుల్ని అనుసరిస్తాడు .-‘’అవిధే యే౦ద్రియః పుంసాం గౌరి వైతివిధేయతాం’’.ఇవాల్టి సుఖం రేపు గుర్తుకు తెచ్చుకోనేదే అవుతుంది. దాని అనుభవం పొందలేవు .విషయ సుఖాలు స్వప్నాల వంటివి .దానికి లొంగక పోవటం మంచిది .-‘’ఇతి స్వప్నోపమాన్ మత్వా కామాన్ మా గాస్తదంగతాం’’.కోరికలువిశ్వాస ఘాతుకాలే కాక వంచిస్తాయి .ప్రేమ చూపినా దుఖాన్నే కల్గిస్తాయి ఇంద్రియ లోలత్వం వలన స్వయంగా వదిలి పోతాయి .వదిలించుకోవాలన్నా వదలవు .ఇవి పెద్ద కష్టాన్ని తెచ్చే శత్రువులు .-‘’సుదుస్త్యజా స్త్యజంతో పికామాఃకస్టాహిశత్రవః ‘’.త్వరలోనే నీకు ఇంద్రకీలం ముక్తి నిస్తుంది .ఈ ప్రదేశం గంగానది అంతటి పవిత్రం .అయుధాలు మాత్రం వదలాలి .-వివిక్తే స్మిన్నగే భూయః ప్లావితే జహ్ను కన్యయా –ప్రత్యా సీదతి ముక్తిస్త్వాం పురా మా భూరుదాయుదః ‘’.ఇలా ఇంద్రుడు చెప్పగానే ఇంద్ర తనయుడు వినయం తో మధురంగా ఇలా అన్నాడు ‘’మహర్షీ !నీ వాక్యం సరళ సుగమం .మనోహరం .సమాస లాలిత్యం ఓజో గుణం ఉన్న శబ్దాలు పలికావు .గంభీరార్ధం కలమాటలవి .కొద్దిమాటల్లో అన౦త భావాన్నిచ్చేవి పరస్పరా కాంక్ష కల్గి౦చేవి కూడా.అధ్యాహారాదులు లేకుండా తాత్పర్యం పూర్తిగా వెలువరించాయి –‘’ప్రసాద రమ్యమోజస్విగరీయో లాఘవాన్వితం –సాకా౦క్ష మనుపస్కారం విష్వగ్గతి నిరాకులం ‘’.నీమాటలు యుక్తిసారాలు .ప్రతివాదులు కూడా ఖండించటానికి వీ  ల్లేనివి. అనుమానాదుల తో బాధించనివి .వేద వాక్య సమానాలు.-‘’న్యాయ నిర్ణేత సారత్వాన్నిరపేక్షమివాగమే –అప్రకంప్యతయా న్యేషామామ్నాయ వచనోపమం ‘’.నీమాటలు ఇతరులు కాదనటానికి వీల్లేనివి .సాగర మంత లోతైనవి. పరమ పురుషార్ధాలు.మునుల మనసులాగా పరమ శాంతమైనవి –‘’అల౦ఘ్యత్వా జ్జనైరన్యైః క్షుబితోదన్వ దూర్జితం-ఔదార్యా దర్ద సంపత్తేః శాంతం చిత్తమృషేరివ’’.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.18      పదకొండవ సర్గ -1    

కిరాతార్జునీయం-.18

పదకొండవ సర్గ -1

 ఇంద్రకీలం నుంచి జండా ఎత్తి స్వర్గం వెళ్లి ఇంద్రునితో అర్జునముని   జితేన్ద్రియత్వాన్ని చెప్పగా, ఆయన చాలా  సంతోషంపొంది ,ఆశ్రమానికి వృద్ధముని రూపం లో చేరాడు ..’’అజగామాశ్రమంజిష్ణో  ప్రతీతః పాక శాసనః ‘’ .ఇంద్రుని అర్జునుడు చూశాడు .తెల్ల వెంట్రుకలు జడలు కట్టి,అస్తమయం లో సంధ్యలాఉన్నాడు.-‘’పృక్త  ఏందు కరైరహ్నః పర్యంత ఇవ సంధ్యయా ‘’.కళ్ళను తెల్లని కనుబొమలు మూయగా మంచు కురిస్తే ,వాడిన కమలం లా కనిపిస్తున్నాయి .అతడు కమలాలున్న కొలనులా ఉన్నాడు .బాగా బరువుగా వంగిన నడుముతో ,పొట్ట కనిపిస్తూ కర్ర తో నడిచే ముసలాడి గా కనిపించాడు .మారు వేషం లో ఉన్నా ,కొద్దిపాటి మేఘాలు కప్పిన సూర్యునిలా ప్రకాశమానం గా  ఉన్నాడు.-‘అ౦శు మానివ తన్వ భ్రపటలచ్ఛన్న విగ్రహః ‘’.ముసలి ఇంద్రుడు ఆశ్రమ శోభను పెంచుతున్నాడు .ఇంద్రుని చూసి ఇంద్రతనయుడు ఆదర స్నేహాలతో చాలించాడు .బంధువు విషయం లో బంధుత్వం తెలీక పోయినా ,మనసు మాత్రం బలంగా ఆనందిస్తుంది .-‘’అవిజ్ఞాతేపి బన్ధౌ హి బలాత్ప్ర హ్లాదతే మనః ‘’.కొడుకిచ్చిన ఆతిధ్యానికి సంతృప్తి చెంది ,ఆసనంపై కూర్చుని’’ యవ్వనం లో తపస్సు మొదలుపెట్టి ,మంచి పనే చేస్తున్నావు .మా లాంటి వృద్ధులు కూడా విషయసుఖాలకు ఉవ్విళ్ళూరు తుంటాం .నీలాంటి యువకుల సంగతి ఏం చెప్పాలి .’.నీ సుందర శరీర సంపదకుతపోరూప గుణం కలిసి పోయింది .రూప సంపద చాలాచోట్ల ఉంటుంది కాని గుణ సంపద ఉండటం దుర్లభం .యవ్వనం శరత్తు మేఘాలనీడలాగా చంచలమై వెళ్లి పోతుంది .విషయ సుఖం తాత్కాలికమే చివరికి దుఖాన్నే ఇస్తుంది .ప్రాణులకు ఎప్పుడూ ఆపదలే .జనన ,జీవన మరణాలు తప్పు అని తెలుసుకొన్న వాడు మోక్షం కోసం ప్రయత్నిస్తాడు కనుక నీ పని మంచిదే .నీ మనసు మంచిది .ఈ శుభ ఆలోచన రావటం విశేషం .కానీ నీ వేష అనుమానంగా ఉంది .-‘’విరుద్ధః కేవలం వేషః సందేహ యతిమే మనః ‘’.నీ వేషం యుద్ధానికి తయారైన వాడిలా కవచం  ఉంది.మునులు సాధారణంగా జింక చర్మం నార బట్టలు కడతారు –‘’మహే షుధే ధనుర్భీమం భూతానా మనభి ద్రుహః ‘’

  మోక్షాని కోరే నువ్వు రెండు అమ్ములపొదులతో ధనుస్సు ఎందుకయ్యా ?జంతు హింస నీకు నిషిద్ధం కదా .-ప్రపి త్సోఃకిం చ తేముక్తిం నిఃస్ప్రుహస్య కలేవరే –మహేషుధీ ధనుర్భీమం భూతానామనభి ద్రుహః ‘’.నీ ఖడ్గం చావుకు మరో భుజంగా ,ప్రాణులకు భయంకలిగించేదిగా ఉంది .అది తపస్సుకు శాంతి కలిగించదు కదా .-‘భయంకరః ప్రాణ భ్రుతాంమృత్యోర్భుజ ఇవా పరః –అసిస్తవ తపస్థస్యన సమర్ధ యతేశమం ‘’.పూజ్యుడవైన నువ్వు శత్రువుపై జయం కోరుతున్నావు.శాంత పురుషులైన తపోధనులెక్కడ ? కోపానికి చిహ్నమైన ఆయుధ మెక్కడ ?కనుక నీ వాలకం పరస్పర విరుద్ధంగా ఉంది .-‘’జయమత్ర భవాన్నూన మరాతి ష్వభిలాషుకః –క్రోధ లక్శ్మక్షమా వంతః క్వాయుధం కవ తపోధనాః ‘’.మోక్షానికి ఉప యోగ పడే పనులు హింసకు ఉపయోగించిన వాడు మూర్ఖుడు .అలసటను తొలగించే తేట నీటిని బురదగా మార్చే వాడితో  సమానం –‘’యః కరోతి వధో దర్కానిః శ్రేయస కరీః క్రియాః-గ్లాని దోష చ్ఛిదః స్వ చ్ఛాః స మూఢః పంకయత్యపః ‘’.హి౦సాది దోషాలకు మూలం అర్ధ, కామాలే .వాటికి బలం చేకూర్చద్దు.ఈ రెండూ తత్వజ్ఞానానికి లొంగేవికావు.-‘’మూలందోషస్య హింసా దే రర్ధ కామౌ స్మమా వపుః-తా హితత్వావ బోధస్య దురు చ్ఛేదావుపప్లవౌ’’.

సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక 1-12-20మూడవ మంగళవారం మహా శివ లింగ దీపాలంకరణ

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక 1-12-20మూడవ మంగళవారం మహా శివ లింగ దీపాలంకరణ

 

 

https://photos.google.com/share/AF1QipMjPo4iV-V7Xjicv9NQ28T6783BQSvk5VAIsjHEbMjpGXVTXUKI_ewdJmwdISsB8w?pli=1&key=N3ZBbUVjZVh5dkhtV1Jrci1NNTd3UDlZV1pYZ3hn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తొలికంప్యూటర్ ప్రోగ్రామర్, గణిత వేత్త- అగస్టా ఆడా లవ్ లేస్(వ్యాసం )–గబ్బిట దుర్గా ప్రసాద్ 

తొలికంప్యూటర్ ప్రోగ్రామర్, గణిత వేత్త- అగస్టా ఆడా లవ్ లేస్(వ్యాసం )–గబ్బిట దుర్గా ప్రసాద్ 


1815 డిసెంబర్ 15 న ఆంగ్ల కవి లార్డ్ బైరన్ ,లేడీ బైరన్ దంపతులకు జన్మించింది అగస్టా ఆడా.ఎనిమిదవ ఏట తండ్రి బైరన్ గ్రీకు ప్రజాయుద్ధం లో చనిపోయాడు .తల్లి కూతురికి గణిత౦ ,లాజిక్ లపై ఉన్న శ్రద్ధను హర్షించలేకపోయింది .తల్లికూడా చనిపోయాక తన చదువుపై శ్రద్ధపెట్టింది ఆడా .గణితం ,సైన్స్ లలో విలియం ఫ్రెండ్ ,విలియం కింగ్ ,19వ శతాబ్ది రిసెర్చర్ ,సైంటిఫిక్ ఆధర్ మేరీ సోమర్ విల్లీ ఆమెకు ప్రత్యేకశిక్షణ ఇచ్చారు .తర్వాత ఆమెను తీర్చి దిద్దినవాడు గణిత వేత్త, లాజీషియన్ ఆగస్టస్ డీ మోర్గాన్ . 1932నుంచి అంటే ఆమె17వ ఏట నుంచే లెక్కలలో అసాధారణ శక్తి సామర్ధ్యాలు బయట పడినాయి .ఇదే జీవితాంతం ఆమె ను గణితం వైపు నడిపాయి .ఆమె తెలివి తేటలు శక్తి సామర్ధ్యాలు గమనించిన మోర్గాన్ ఆమె తల్లికి ఉత్తరం రాస్తూ ‘’మీ అమ్మాయికి గణితం లో ఉన్న నేర్పు సామర్ధ్యాలు ఆమెను’’ అసలైన మాధమాటికల్ ఇన్వెస్టి గేటర్ ‘’గా బహుశా అగ్రశ్రేణి గణితవేత్త ‘’ను చేస్తాయి ‘’అని చెప్పి ఆమె ను చక్కగా ఎస్టిమేట్ చేశాడు .డిఫరెంషియల్ కాల్క్యులస్ అభ్యసిస్తూ లవ్ లేస్ ‘’ I may remark that the curious transformations many formulae can undergo, the unsuspected and to a beginner apparently impossible identity of forms exceedingly dissimilar at first sight, is I think one of the chief difficulties in the early part of mathematical studies. I am often reminded of certain sprites and fairies one reads of, who are at one’s elbows in one shape now, and the next minute in a form most dissimilar[‘’ అని పొయెటిక్ గా డీమొరాన్ కు రాసింది .’’అంతర్ దృష్టి(ఇంట్యూషన్),ఊహ లను క్లిష్టమైన గణిత ,సైంటిఫిక్ కాన్సెప్ట్ లకు వర్తింప చేయవచ్చు ‘’అని ఆమె చెప్పేది .

1835లో విలియం కింగ్ ను వివాహం చేసుకొన్నది. అతడు 1938లో ఎరల్ గా నియమి౦ప బడగా,ఆడా’’కౌ౦టేస్ ఆఫ్ లవ్ లేస్’’అయింది .వీరికి ముగ్గురు సంతానం .ఆడా తనకున్న సాంఘిక చొరవ,ఆసక్తి తో ఆండ్రూ క్రాస్ ,రాబర్ట్ బాబ్బేజ్,మైకేల్ ఫారడే వంటి సైంటిస్ట్ లు , నవలా రచయిత చార్లెస్ డికెన్స్ తో పరిచయమేర్పడి,చదువు కొనసాగించాలని నిశ్చయించింది .తన ఆలోచన ను ఆమె ‘’పొయెటిక్ సైన్స్ అనీ ,తనను అనలిస్ట్ (మెటా ఫిజిషియన్ )అనీ చెప్పుకొంది.

టీనేజ్ లో ఉండగా ఆమె శాస్త్రీయ ధోరణి వలన ‘’ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ‘’గా ప్రసిద్ధుడైన చార్లెస్ బాబ్బేజ్ తో స్నేహం, కలిసి పని చేయటం జరిగింది .ఆయనకనిపెట్టిన ‘’అనలిటికల్ ఇంజన్ ‘’పై ఆసక్తి పెరిగింది .బాబ్బేజ్ ను 1933 జూన్ లో మొదటి సారి కలుసుకొన్నది లవ్ లేస్.1842-43 మధ్య లూగీ మెనాబ్రియా అనే మిలిటరీ ఇంజనీర్ కంప్యూటర్ పై రాసిన వ్యాసాన్ని ఈమె అనువాదం చేసి,దానికి అనుబంధంగా అనేక విషయాలు ‘’నోట్స్ ‘’గా జత చేసింది .ఈ నోట్స్ తొలి ’’కంప్యూటర్ చరిత్ర ‘’కు నాంది అనీ ,అదే’’ మొదటి కంప్యూటర్ ప్రోగ్రాం’’ అనీ ,అదే ఆ మెషీన్ చేసే ‘’ఆల్గోరిదం’’అనీ అందరూ లవ్ లేస్ ను అభినందించారు

.దీని తర్వాత లవ్ లేస్ కంప్యూటర్ కేవలం లెక్కలకు మాత్రమే పరిమితం కాకూడదని భావించి ,ఇతరమైన పనులకు ఎలా వాడవచ్చో ఊహించి రూపకల్పన చేసింది .ఆమె చెప్పిన ‘’పొయెటికల్ సైన్స్ ‘’ఆలోచనలతో ఆ యంత్రం వ్యక్తులకు, సమాజానికీ సాంకేతిక సంధాన కర్త గా ఎలా ఉపయోగించవచ్చునో అనే దానిపై తీవ్రంగా ఆలోచన చేసింది .ఇదేకాక’’ ఫ్రేనాలజి’’ అంటే పుర్రె ను అనుసరించి మనిషి స్వభావాన్ని తెలుసుకోవటం ,మెస్మరిజం అంటే ఇంద్రజాలం ల పైనా ఆసక్తి ఉండేది. బాగా అధ్యయనం చేసింది ..బాబ్బేజ్ దగ్గర పని పూర్తయ్యాక,ఇతర ప్రాజెక్ట్ వర్క్ చేసింది . ఆసంవత్సరమే ఆయన ‘’ Forget this world and all its troubles and if possible its multitudinous Charlatans—every thing in short but the Enchantress of Number’’అని ఒక లెటర్ రాశాడు .

1842-43 తొమ్మిది నెలల కాలంలో ఇటాలియన్ గణిత వేత్త’’ లూగీ మెనాబ్రియా’’రాసిన ‘’బాబ్బేజ్ కనిపెట్టిన ‘’అనలిటికల్ ఇంజన్ ‘’ఆర్టికల్ ను అనువదించింది .ఆ యంత్రంపనిని అర్ధం చేసుకోవటం కష్టమనీ , అందుకే విపులమైన నోట్స్ జత చేస్తున్నాననీ తెలిపింది .కానీ బ్రిటిష్ సంస్థలు దీనిపై పెద్దగా ఆసక్తి కనబరచలేదు .ఈ అనలిటికల్ ఇంజన్ అసలైన ‘’డిఫరెన్స్ ఇంజన్ ‘’కుఎలా భిన్నమైనదో సంపూర్ణమైన వివరాలు తెలియజేసింది .ఆమె రాసిన ఈనోట్స్ ను సైంటిఫిక్ లోకం బహుధా అభినందించింది .ముఖ్యంగాఎలెక్ట్రో మాగ్న టిజం ,మాగ్నెటిక్ఇండక్షన్ ,ఎలక్ట్రాలిసిస్ లను కనిపెట్టిన మైకేల్ ఫారడే శాస్త్రవేత్త ఆమె రైటింగ్ ను పూర్తిగా ,మనస్పూర్తిగా బలపరచాడు . ఆమె నోట్స్ అసలు ఆర్టికల్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది .బర్నౌలి నంబర్స్ సీక్వెన్స్ ను కాల్క్యు లేట్ చేయటం లో ఎలా సహాయపడుతుందో ,ఆ యంత్రాన్ని యెంత ఖచ్చితంగా పని చేయించ వచ్చనో లవ్ లేస్ తన నోట్స్ లో స్పష్టంగా తెలియజేసింది .బాబ్బేజ్ ఆలోచించిన ‘’ డిఫరెన్స్ ఇంజన్’’ను 2002లో మాత్రమే లండన్ లో నిర్మించి పూర్తి చేయటం జరిగింది .లవ్ లేస్ రాసిన నోట్స్ ను ప్రపంచం లోనే మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రాం గా ,ఆమెను తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ గా సైంటిస్ట్ లోకం గుర్తించి గౌరవించింది .ఆమె నోట్స్ ను ‘’నోట్ G’’గా పిలుస్తారు .’’ఆర్టి ఫిషియల్ ఇంటలి జెన్స్’’ను ఈ నోట్స్ఒప్పుకోలేదు .ఆమె ‘’ఈ అనలిటికల్ ఇంజన్ మనం ఇచ్చిన ఆర్డర్ లను ఎలా చేయమని చెబితే అలానే చేస్తుంది కానీ ఎలాంటి అనలిటికల్ సంబంధాలు ,లేక వాస్తవాలను ముందే ఊహించి చెప్పే శక్తి దానికి లేదు ‘’అని చెప్పింది .కాలక్రమం లో అలాన్ టూరింగ్ ఈ భావన సరికాదన్నాడు .ప్రభుత్వం పట్టించుకోక పోవటం తో బాబ్బేజ్ ఆమెను తను రాసినదాన్ని వెనక్కితీసుకోమని కోరాడు .కానీ ఆమె ఒప్పుకోలేదు .1851ఆగస్ట్ 12న ఆమె మరణ సందర్భంగా తనను మన్నించమని బాబ్బేజ్ ను కోరింది .ఆమె నోట్స్ అంతా ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో A నుంచి G వరకు వర్గీకరించి భద్ర పరచారు .ఆ ఇంజన్ పూర్తికాలేదు ,ఆమె ప్రోగ్రాం టెస్ట్ చేయబడలేదు .

1844లో స్వయంగా ‘’మెదడు ఏ విధంగా ఆలోచనల ,భావాల ను అందజేస్తుంది –అంటే’’కాల్క్యులస్ ఆఫ్ ది మెంటల్ సిస్టం’’ పై అధ్యయనం చేయాలని ఉందని మిత్రుడు ఒరోన్జో గ్రీగ్ కు రాసింది .కానీ ఈపని పూర్తి చేయలేకపోయింది . ఈ ఆలోచనలలో ఉండగానే ఆమె ఎలెక్ట్రికల్ ఇంజనీర్ ఆండ్రూ క్రాస్ ను వెళ్లి కలిసి విద్యుత్ ప్రయోగాలు ఎలాచేయాలో అడిగి తెలుసు కొంది.ఆ ఏడాదే ఆమె ‘’బేరన్ కార్ల్ రీచేన్ బాక్ ‘’రాసిన రిసేర్చేస్ ఇన్ మాగ్నటిజం పరిశోధన పత్రం పైఅద్భుతమైన సమీక్ష రాసింది కాని ప్రచురించలేక పోయింది .1951లో ఆమెకు కేన్సర్ మొదటి దశ తో బాధ పడింది .తర్వాత తాను గణితానికి ,సంగీతానికి ఉన్న సంబంధం పై కొంత పరిశోధనలు చేస్తున్నట్లు తల్లికి ఉత్తరం రాసి తెలియజేసింది .

1953లో ఆమె మరణించిన శతాబ్ద౦ తర్వాత ఆడా లవ్ లేస్ రాసిన నోట్స్ ముద్రించారు .ఆతర్వాత ఈ ఇంజన్ ప్రాధమిక కంప్యూటర్ గా ,ఆమె నోట్స్ ను కంప్యూటర్ ,సాఫ్ట్ వేర్ కు వర్ణన గా ప్రకటించారు .కంప్యూటింగ్ హిస్టరీ స్పెషలిస్ట్ డోరాన్ స్వేడ్ లవ్ లేస్ ను

1. She was a mathematical genius

2. She made an influential contribution to the analytical engine

3. She was the first computer programmer

4. She was a prophet of the computer age

అంటూ అభి వర్ణించాడు .

ఇంతటి గణిత మేధావి ,’’రైట్ ఆనరబుల్ ది కౌంటేస్ ఆఫ్ లవ్ లేస్’’27-11-1852 న 36వ ఏట యూరెటిన్ కేన్సర్ వ్యాధితో మరణించింది .నాటింగ్ హాం షైర్ లో తండ్రి లార్డ్ బైరన్ కవి సమాధి ప్రక్కనే ,ఆమె కోరికపై ఈమెనూ సమాధి చేశారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.17      దశమ సర్గ -3(చివరి భాగం )   

కిరాతార్జునీయం-.17

దశమ సర్గ -3(చివరి భాగం )

అర్జునునిపై అప్సరసలు నిల్పిన చూపులో రసభావాలు లేనేలేవు .చేతులు అభినయించలేదు .చూపు అర్జునునిపైనే నిలిచిపోయింది తప్ప మరో పక్క కి తిరగలేదు –‘’ప్రకృత మను ససార నాభి నేయం –ప్రవిక సదంగులి పాణిపల్లవం వా –ప్రథమ ముప హితం విలాసి చక్షుః-సితతురగే  న చచాల నర్తకీనాం ‘’.పాదాల లాక్షారసం నేల ముద్రలుగానే మిగిలాయి .వాటిని చూసిన తుమ్మెదలు నవవికసిత కమలం అనే భ్రాంతి తో వాటిపై మూగాయి .పాదాలలత్తు  కకు కడిమి పూల కేసరాలు  అంటుకొని ,అప్సరసల అనురాగ వేడిలో కరిగి మనసులోని ప్రేమ మూర్తీభవించినదా అని పించింది .అడుగుల గుర్తుల్లో లాక్షారసం వాళ్ళ మనోగత అనురాగమే అనే ఉత్ప్రేక్ష .ఒక అచ్చర అతడిఎదురుకు రాగానే ,చెలుల చాటు నుంచి ,తన విపరీత అనురాగాన్ని దాచే ప్రయత్నం చేసింది .దాస్తే కోరికలు పెరుగుతాయని తెలీదేమో !-‘’స్ఫుట మభిలషితం బభూవ వధ్వా –వదతి హి స౦వృతి రేవ కామితాని ‘’.బాగా వీచే గాలికి మరో ఆమె వస్త్రం నడుము నుంచి జారి సిగ్గులమొగ్గ అయింది .ఆమె తొడలను చూసి సవతులే ఆశ్చర్యపోయారంటే మిగతా వాళ్ళ సంగతి చెప్పాలా ?మరో ఆమె మన్మథ తాపం తో తామరకాడలను కంకణంగా పెట్టుకొని ,చేతుల్లో గంధం పూసుకొన్న ముఖం పెట్టుకొని  మద్యం తాగకున్నా ,మత్తెక్కే కళ్ళతో తదేకంగా అర్జునమునిని చూస్తోంది .మరో ఆవిడ తనమనసు మనసులోలేక అన్యమనస్కత అయి ‘’మనః స౦గమం ‘’అనే మన్మథావస్థ ప్రదర్శించింది .మన్మథ తాపం తో నోరు ఎండి ఏమీ చెప్పలేకపోయింది.మరో స్త్రీ .కళ్ళనుండి జాలువారే కన్నీరు చూసి చెలికత్తెల మనసులు దుఖం తో బరువెక్కాయి .ఇది మూర్ఛావస్థ.మెత్తని పూలపాన్పు వదిలేసి ,చిగురాకులనేలపై పడుకొంది.విరహం భరించలేక సుఖం చల్లదనం ఇచ్చే అతడి ఒడి చేరాలను కొన్నది .ఇది ‘’అరతి జాగరం  ‘’అనే మన్మథావస్థ.’’కృశించిన మా నాయిక కోర్కె తీర్చు .ఆమె అన్నీ వదిలి నీ పొందే కోరుతోంది’’అని ఆమె చెలికత్తె మునికి ఫిర్యాదు చేసింది .’’కాఠిన్యం వదిలి మాట్లాడు .మునుల మనసు మెత్తగా ఉంటుంది కదా .!’’అని విన్నవి౦చు కొన్నది .అదృష్ట హీనులు తమకు చేరిన మంచిని కూడా ఉపయోగించుకోలేరు .ఇవన్నీ విప్రలంభ శృంగార౦  లోని వ్యభి చారీ భావాన్ని తెలియ జేసేవే –‘’ఉపగత మవ ధీరయ౦త్య భవ్యాః-స నిపుణ మేత్యకయాచి దేవ మూచే ‘’.మరో అప్సర విలాసంగా నడుమాడిస్తూ ,ఒక చేత్తో తలవెంట్రుకలు ముడుచు కొంటూ కటాక్షం అనే మన్మథ బాణం  మునిపై ప్రయోగించింది .-‘’సురపతి తనయే పరా నిరాసే-మనసిజ జైత్ర శరం విలోచనార్ధం ‘’.

   విశాల స్తనభారం తో కొద్దిగా వంగిన ఒక అప్సర పుష్పించిన మామిడి చెట్టును పట్టు కొని విలాసంగా నిలబడింది .సగం వంగిన ఆమె శరీరం అల్లెత్రాడు లాగిన మన్మథ ధనుస్సులాగా ఉంది.అ౦గా౦గ ప్రదర్శనతో లోబరచుకొనే ప్రయత్నం చేసిందని భావం .మరో అప్సర చీర ముడిజారిన   నీలం రంగు చీర పట్టుకొని , వెళ్ళాలని లేకపోయినా  ,సిగ్గు ముంచెత్తి బయల్దేరి ,జారిన మొలనూలు అడ్డు కొన్నట్లు నటించి ముని ముందు నిలిచిపోయింది .ఒకామె ‘’నీ మనసులోశాంతి నిజంగా ఉంటే ధనుస్సు ఎందుకు ధరించావు .వంచకుడివి .విషయాభిలాష ఉన్నవాడివి. నీకు కావాల్సింది ముక్తికాదు.నీమనసులో నీ ప్రాణేశ్వరి దాగి ఉంది.ఇతరులను ఇష్టపడటానికి ఒప్పుకోవటం లేదు అందుకే మమ్మల్ని అవహేళన చేస్తున్నావు ‘’అని దెప్పింది .ఒకామె కింది పెదవి ఈర్ష్యతో కదిల్తే ,కోపంతో అర్జునమునిని చూస్తూ ,మానమర్యాదలు సిగ్గూ ఒగ్గేసి ,పెద్దలనే గౌరవం కూడా లేకండా చెవి అలంకారంగా ఉన్న కలువతో అతడి వక్షస్థలం పై కొట్టింది –‘’ఇతి విషమిత చక్షుషా భి ధాయ –స్ఫూర దధరోష్టమసూయయా కయాచిత్ –అగణిత గురు మాన లజ్జ యాసౌ –స్వయమురసి శ్రవణోత్పలేన జఘ్నే’’.ఇంకో అచ్చర వినయంతో హావభావాలు ఒలకబోస్తూ దగ్గరకొచ్చి చిరు నగవుతో తన కణతలఅందాన్ని పెంచుతూ ,చెవిదాకా వ్యాపించిన కళ్ళతో తదేకంగా ఔత్సుక్య భావం తో  చూసింది .

  ఏమీ చేయలేక చేతు లెత్తేసి, తెల్లజండా చూపిస్తున్నట్లుగా దీనం గా ,సిగ్గు వదిలి ఏడ్చారు .కోపంతో ఉన్న ప్రియుని పొందుకు ఇదే చివరి అస్త్రం .అరకన్నులతో చూడటం ,సిగ్గు ,అలసట విరహం, పాలి పోయిన దేహం, దుఖించటం అనే అలంకారాలు ధరించారు. మన్మథుడు కల్పించిన ఈ అవస్థలే  వారి అందాల్ని పెంచుతున్నాయి .మెల్లని నడక హంస నడకలను మించింది జఘన భారం తో వంపు చూపులు వ్యర్ధమైనాయి –‘’స్థిత మురు జఘన స్థలాతిభారా –దుదిత పరిశ్రమ జిహ్మి తేక్షణం వా ‘’.గాఢంగాగుచ్చుకొన్న మన్మథ బాణాల వలన పలికే మాటల్లో స్పష్టత లేదు .కళ్ళు తెరచి ,కనుబొమలు ఎగరేస్తూ చూసే చూపులు మనోహరంగానే ఉన్నాయి ‘’అధిక వితత లోచనం వధూనా –మయుగప దున్నమిత భ్రువీక్షితం చ ‘’.వారి హావ భావ చేష్టలు మనసు హరి౦చేవే అయినా ,స్థిర సమాధి గతుడైన అర్జునముని విషయం లో వ్యర్ధమయ్యాయి .రౌద్ర -శృంగాలు విరోధి రసాలు .మనస్వికి మనసులో పరిశోధన జ్వలిస్తూ ఉంటుంది .అందుకే సుఖాపేక్ష ఉండదు .’’రుచికరమపి నార్థవత్ బభూవ –స్తిమిత సమాధి శుచౌ పృథాతనూజే –జ్వలయతి మహతాం మనా౦స్య మర్షే –న హి లభతేవసరం సుఖాభి లాషః’’.అర్జున ముని తీవ్ర తపస్సుతో మహే౦ద్రుని ఆరాధించి ,శత్రు నాశనం చేసి ,రాజ్య లక్ష్మిని పొందాలనే కాంక్షతో ఉండటం చూసి ,తమ ప్రణయ ప్రార్ధన వ్యర్ధం కావటం తో ,ఉద్వేగ మనస్కులై అప్సరసలు గంధర్వులతో కలిసి మళ్ళీ తమ స్వస్థానానికి వెళ్ళారు .

‘’స్వయం సంరాధ్యైవ౦ శత మఖ మఖండేన తపసా –పరో చ్ఛిత్యా లభ్యామభి లషతి లక్ష్మీం  హరి సుతే –మనోభిః సోద్వేగైః ప్రణయ విహతి ధ్వస్త రుచయః –స గంధర్వా ధామ త్రిదశ వనితాః స్వంప్రతి యయుః’’.

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ ప్లవ ఉగాది పుస్తక ఆవిష్కరణ

  1. సరస భారతి శ్రీ ప్లవ ఉగాది పుస్తక ఆవిష్కరణ
సాహితీ బంధువులకు శుభ కామానలు –
శ్రీ ప్లవ నామసంవత్సర ఉగాది వేడుకలలో నేను అంతర్జాలం లో సుమారు నాలుగేళ్ళక్రితం  రాసిన ”వ్యాఖ్యానచక్రవర్తి కోలాచలం  మల్లినాథ సూరి మనీష ”ను సరస భారతిఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల (అమెరికా )స్పాన్సర్ షిప్ తో  సరస భారతి  తరఫున  ముద్రించి ,ఆవిష్కరింప చేయాలని భావిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .-దీనికి ముందు మాటలు రాసి, విలువ పెంచమని  డా పుట్టపర్తి నాగ పద్మిని గారిని కోరాం .అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం మీ-దుర్గాప్రసాద్ -2-12-20 -ఉయ్యూరు
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

కిరాతార్జునీయం-.16      దశమ సర్గ -2            

కిరాతార్జునీయం-.16

దశమ సర్గ -2

అన్ని దిశలా అర్జున పుష్పాలు వికసి౦చటం తో దాని పరిమళం వ్యాపించి ,అంతా కామ వికారం పొంది ,ధైర్యం సడలి కొత్త అనుభవం పొందింది .దుఖితులను కూడా సంతోష పడేట్లు పండిన నేరేడు పళ్ళను తిని ఆడకోయిల కొత్తరాగాలతో గళమెత్తిగానం చేస్తోంది –పరి భ్రుత యువతిః స్వనం వితేనే –నవనయోజిత కంఠరాగ రమ్యం ‘’.కడిమి చెట్ల గాలి ,మత్తెక్కే నెమళ్ళ క్రేంకారం సామాన్యులని  ఆకర్షించింది .మహాత్ముల సమాధిని భగ్నం చేయటం అంత  తేలికకాదనిపించింది –‘’జన ఇవ  న  ధృతేశ్చ చాల జిష్ణు –ర్నహి మహతాంసుకరః సమాధి భంగః ‘’.వధూ వరుల సమాగమం లా  వర్షర్తు, శరత్తులసంధికాలం శోభించింది. బాణం ధరించినందువల్ల క్షత్రియ స్త్రీ ధ్వనించింది .శరత్ స్త్రీ తామర తూళ్ళు అనే కంకణాలు ధరించింది.కలువ సమూహం వస్త్రాచ్ఛాదన అయింది .నీల ఝ౦టి  అనే చెట్టు పూలనే బాణాలుగా ధరించి రాగా ,వర్షర్తు అనే వరుడు తెల్ల తామర చేతులు చాపి ఆలంబన మిచ్చాడు .-‘’ధృతబిస వలయా వలిర్వహంతీ-కుముద వనైకదుకూల మాత్త బాణా-శరదమలతరే సరోజ పాణౌ-ఘన సమయేన వధూరివా ల లంబే…నెమళ్ళకేమ్కారాలు ,హంసల మనోహర స్వరాలూ కలిసిపోయాయి .కలువ పంక్తులు ,కడిమి పూల వర్షం తో కలిసి శోభ పెంచాయి అధిక గుణాల పదార్ధాలు కలిసి మరింత శోభనివ్వటం సహజమే –‘’సమద శిఖి ఋతాని హంస నాదైః –కుముద వనాని కదంబ పుష్ప వృష్ట్యా-శ్రియ మతి శయనీం నమేత్య జుగ్ము –ర్గుణ మహతాం మహాతే గుణాయ యోగః ‘’.దగ్గరలో ఉన్న కదంబ పుష్ప, రాలిన మొగలిపూల  మకరందం వదిలి తుమ్మెదలు బాగా మకరందమున్న ఇప్ప పూలపై వాలి వాటిని నల్లగా చేశాయి తొడిమ మాత్రమే నల్లగా ఉండే ఇప్పపువ్వు పూర్తి గా నలుపుగా మారిందని భావం .’’ప్రియ మధుర సనాని షట్పదాలీ-మలినయతి స్మవినీల బంధనాని ‘’.నీటి బిందువులతో ఉన్న పచ్చిక పై ఇంద్ర గోపాల అనే యెర్రని పురుగులు ముడుచుకొన్న దిరిసెన పూల యెర్రని కాంతి పొందాయి .-‘’అవిరల వపుషః సురేంద్ర గోపా –వికచ పలశచయ శ్రియం సమీయుః’’.కాలం కాని కాలం లో వచ్చిన హేమంతం వలన ప్రియంగు వృక్షాలు గుత్తులు గుత్తులుగా పూశాయి .వికషిత మల్లెల పరిమళం తో గాలి వీస్తే ,దట్టంగా మంచు బిందువులు కురిశాయి .లవంగ లతలు లొద్దుగపూలు వికసించటంతో వాటి సుగంధం మోస్తున్న గాలి అందరికీ సంతోషం కలిగిస్తోంది .కాని అర్జునుడి మనసు మాత్రం చలించలేదు .జయమే లక్ష్యం గా  ఉన్నవారి మనసు నీతిబాహ్యం కాదు కదా .-‘’వికృతి ముపయయౌ స పాండు సూను-శ్చలతినయాన్న జిగీషతాం హి చేతః ‘’.హేమంతం చివర శిశిరం ప్రారంభం సంధికాలం లో మామిడి చెట్లు కొన్ని పూశాయి .కొద్దిగా మంచు పడుతోంది .వావిలి చెట్లు వికసించాయి .వీటన్నిటి పరిమళం కామునికి సహకారిగా మారింది .

పూల వనాలు చేరాలనుకొన్న వసంత లక్ష్మి చిగురించిన మామిడి కొమ్మను పట్టుకొని తుమ్మెద రొద అందెల రవళికాగా పద్మ వనాలను వదిలింది .’’క్వణదాలికుల నూపురా నిరాసే – నలిన వనేషు పదం వసంత లక్ష్మీః’’.వికసించిన పూల పెదవి కదలిస్తున్న గోరంత చెట్లనే మధువును చూస్తూ ,కొత్తగా చిగిర్చిన అశోక చెట్టు పై బాణం ధరించిన మన్మథుడిని అప్సరసలు చూసినట్లు భావించారు .మెల్లగా వీస్తున్న మలయానిలం తో కదల్చబడిన తామర ముఖాలనే పద్మాలపై తుమ్మెదలు చేరి ముంగురుల అందాన్ని కలిగించాయి .-‘’ముహురనుపతా విధూయ మానం –విరచిత సంహతి దక్షిణా నిలేన –అలికుల మలకాకృతిం ప్రపేదే-నలిన ముఖాంత విసర్పి పంకజిన్యాః’’.సాల వృక్షం కొమ్మ అనే వధువు పుష్పమనే ముఖాన్ని ,చిగురు అనే పెదవిని ,మకరందమనే మధువును కలిగి గాలితో కదులుతూ కోపించినట్లు కనిపించింది .తుమ్మెద అనే ప్రియుడు మాటి మాటికీ దాన్ని సమీపించి కోపం తగ్గించటానికి చేరినట్లు భావన .

జితేంద్రియత్వం ఉన్నంత వరకు అతడిని శత్రువు జయించలేడు.ముల్లోకాలూ జయించినా వసంతం జితేంద్రియ ఆర్జునుడిని జయించలేకపోయింది –‘’ప్రభవతి న తదాపరో విజేతుం –భవతి జితే౦ద్రియతా యదాత్మ రక్షా –అవజిత భువన స్తథా హిలేభే-సిత తురగే విజయం న పుష్పమాసః ‘’సితతురగుడు అంటే అర్జునుడు . వసంత ,హేమంతాలలాగే గ్రీష్మఋతువూ నువ్వు  కూడా అర్జునుడి చేత తిరస్కరింపడినావుకదా .  లోకం లో  నీ గౌరవం మాత్రం ఏమి ఏడ్చింది లే .మల్లెలు వికసించాయి అని అర్ధం .బలమున్నవైనా తమలో తమకు స్పర్ధ ఉంటె ఆసైన్యం శత్రువులను జయించలేదు .లోకాలన్నీ జయించిన ఋతువులు ఆర్జునుడిని క్షణకాలమైనా జయించ లేకపోయాయి.కానీ అప్సరసలమనసుల్లో కాముని ప్రవేశ పెట్టగాలిగాయి .తమ ఆయుధం శత్రువులపై కాక తమపైనే ప్రయోగి౦చు కొన్నట్లు అయిందని భావం ..-‘’అవిహిత హరిసూను విక్రియాణి-త్రిదశ వధూషు మనోభవం  వితేనుః’’..గ౦ధర్వ వీణాగానం ,ఋతు విజ్రు౦భణ కూడా ఏమీ చేయలేక పోయాయి  .  అప్సరసల కళ్ళు అర్జునుని అంగ ప్రత్య౦గాల లోనే నిమగ్నమయ్యాయి .వికసిత మల్లెలు వారికి ఆకర్షణ కాలేదు .అంటే వారికి కలిగింది చక్షు ప్రీతి మాత్రమే .అందం తో ఆర్జునుడిని వశం చేసుకోవాలని వచ్చారు .కాని అర్జునుడే వారిలో మన్మధ వికారాలు కలిగించి ఉల్టాపల్టా చేశాడు .-‘’ముని మఖి ముఖతాం నివీషవోయాః-సముపయయుః కమనీయతా గుణేన-మదన ముప దధే సఏవ తాసాం –దురదిగమనా హి గతిః ప్రయోజనాం’’.

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మహా భక్తులు -3 2-నిరతాన్నదాత ,మహా భక్త శిఖామణి-బందా పరదేశి

మనమెరుగని మహా భక్తులు -3

2-నిరతాన్నదాత ,మహా భక్త శిఖామణి-బందా పరదేశి

17వ శతాబ్దం లో నియోగి కుటుంబం లో  గుంటూరు జిల్లా వేటపాలెం లో పుట్టిన బందా పరదేశి కరణీకం చేసేవాడు .ఎవ్వరినీ చెయ్యి చాచిన వాడు కాదు .భార్యకమలాంబ  కూడా చక్కగా సహకరించేది .నిత్య అన్నదానం తో దంపతులు తరించేవారు .ఈ వంశం వారు ఇప్పటికీ చీరాల ,వేటపాలెం లో ఉన్నారు .వీరిలో బందా వెంకట నరసయ్యగారు ఒకరు .బందాదంపతులు ఒక్క రోజు కూడా అన్న దానం చేయని రోజే లేదు .ఏకాదశి వ్రతం తప్పని సరి .ద్వాదశినాడు 12మందికి తక్కువకాకుండా ,108కి మించకుండా అన్న సంతర్పణ చేసేవారు .వ్రతం రోజు జాగరణం చేసేవారు .భోజనం చేసి వెళ్ళే వారిని పంపలేక పంపలేక పంపించే వారు .ఇలా నిత్యఖర్చుతో ఉన్న ఆస్తి అంతా హారతి కర్పూరమై హరించి చివరికి భార్య మెడలో మంగళ సూత్రం కూడా అమ్మే పరిస్థితి కలిగింది .

చేతిలో చిల్లి గవ్వ లేని నిర్భాగ్యం బందా దంపతులను ఆవహించింది .భార్యను వెంటపెట్టుకొని అర్ధరాత్రి ఇల్లు వదిలి బాపట్ల తూర్పు సత్రం చేరి జరగవలసినదాన్ని గురించి భార్యా భర్తలు ఆలోచిస్తున్నారు .ఆ రోజు ఉదయమే ఆ సత్రం లోదిగిన  నిరుపేద స్త్రీ ఆకలితోఅలమటిస్తున్నతనపిల్లలకు ‘’ఇదుగో సెనగపప్పు మాత్రమమే ఉంది తిని నీళ్ళు తాగి పడుకోండి.రేపు పొద్దున్న పదింటికి  వేటపాలెం లో  బందా పరదేశి గారింటికి వెడితేఅమృతాన్నం పెడతారు ఆ మహాదాతలైన దంపతులు ‘’అని ఊరడిస్తుండట౦  బందాగారి చెవిన పడింది .వెంటనే భార్యకు చెప్పితమింట్లో ఒక కుందీ ,రోలు ఉన్నాయికనుక వాటిని అమ్మేసి ఆ పేద స్త్రీకి పిల్లలకు భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పి ,వారు వచ్చే లోపే తాము ఇంటికి చేరాలని తొందరబెట్టి అప్పటికప్పుడు ఇద్దరు నడిచి వేటపాలెం చేరారు  .బొమ్మి శెట్టి సుందర రాజం అనే వైశ్యునికి ,రోలు రెండు రూపాయలకు అమ్మేసి,బియ్యం పప్పుఉప్పూ కూరలు తెచ్చి వంట చేసి సిద్ధంగా ఉండగా  అతిధులు రాగా వారికి ఆప్యాయంగా వడ్డించి తినిపించి  సాగనంపి ,తమ బీద స్థితి తెలియజేసి ,సంతృప్తి చెందారు బందా దంపతులు . రోలును తీసుకోనిపోమ్మని వైశ్యునికి కబురు పంపారు .అతడు వచ్చి ఆ రోలు తీసే ప్రయత్నం లో ఉండగా దానికింద మొహరీల బిందె కనిపించింది .

వైశ్యుడు ఆబిందేను చూసి దాన్ని పరదేశి గారికి ఇవ్వబోగా ,ఆయన  తన ఇంట్లో అలాంటి బిందేకాని మొహరీలు కానీ ఎప్పుడూ లేవు అని నిజం చెప్పి  రోలుతో సహా ఆ మోహరీ బిందె కూడా వైశ్యుడిదే అని నిష్కర్షగా చెప్పారు .ధర్మాత్ముడైన వైశ్యుడు రోలుమాత్రమే తనది బిందె తనదికాదని చెప్పి రోలు తీసుకు వెళ్ళాడు .శ్రీ రామచంద్ర ప్రభువే తమ నిరతాన్న దానానికి ఇలా మొహరీల బిందె ఏర్పాటు చేశాడని ఆ దేవదేవుని వేనోళ్ళ స్తుతించి మళ్ళీ సంతృప్తిగా నిరతాన్న దానం చేయటం మొదలు పెట్టారు .బందా పరదేశి దంపతుల పేరు దేశం లో  గ్రామగ్రామాన మారు మోగింది .ఇది విన్న కొందరు అసూయా పరులు ప్రభుత్వానికిఫిర్యాదు చేశారు .అమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిరతాన్న ప్రదాత కనుక ఈ ఫిర్యాదును లెక్క చేయలేదు .దీనితో బందా దంపతులకీర్తి ఆసేతు హిమాచలపర్యంతం వ్యాపించింది .

క్రీ.శ.1670లో వచ్చిన గంగానది పుష్కర స్నానానికి వాసి రెడ్డి ప్రభువు గురువుగారితో కలిసి కాశీ వెళ్ళారు .పుష్కర స్నానం చేస్తూ ప్రభువు  బ్రాహ్మణులకు విపరీతంగా దాన ధర్మాలు చేసి అందరి ప్రశంసలు పొందాడు .అక్కడి వారు  ‘’ నిరతాన్నదాత బందా పరదేశి గారు ఉండే ఆంద్ర దేశపు ప్రభువు  వెంకటాద్రి నాయుడుగారు ‘’అని చెప్పుకోవటం రాజుగారు విని ,మహా సంతోషించి ,ఆయనకు తన రాజధానిలో ఘన సత్కారం చేయాలని సంకల్పించుకొన్నాడు .యాత్ర ముగించి రాజధాని అమరావతి  చేరి బందా వారిని నోటీసు ఇచ్చి పిలిపించి ,’’నాకు  తెలియ కుండా వేట పాలెం విడిచి  వెళ్ళ వద్దు’’అని ఆంక్ష విధించాడు .రాజాజ్ఞ కనుక ఒక ఏడాది అమరావతిలోనే ఉండిపోయారు .

ఒక ద్వాదశి నాడు ఉదయం కాలినడక లో వెడుతుంటే ఒక  ఇంటిముందు వందలకొద్దీ బ్రాహ్మణులూ చేతులు కడుక్కోవటం చూశాడు .ఏమిటి విశేషం అని వారిని అడుగగా పరదేశి గారి ద్వాదశి పారాయణ భోజనం ఆహ్వానానికి వచ్చినట్లు చెప్పారు .పరమ సంతోషం వెలిబుచ్చి వేటపాలెం వెళ్ళగా పరదేశిగారి భార్య కమలాంబ గారు చేసే అన్నదానం కనులారా చూసి ,ఆ అమ్మ భిక్ష  తాను  కూడా చేయదలచినట్లు కబురుపంపి ,సపరి వారంగా వెళ్లి సంతోషంగా భోజనం చేసి ,సత్కారం పొందాడు వెంకటాద్రి ప్రభువు .ఆమెకు సంతోషంగా కృతజ్ఞతలు చెప్పగా ఆమె ‘’అన్నగారూ! తోబుట్టువును మరవ కండి ‘’అని చెప్పింది .ఉబ్బి తబ్బిబ్బై ప్రభువు అమరావతి చేరాడు .పరదేశిగారి తో ‘’మిమ్మల్నిఅనవసరంగా కష్టపెట్టాను .క్షమించండి ‘’అని విన్నపాలు చెప్పి ,అర్ధ సింహాసం మీద తనప్రక్కన కూర్చో బెట్టి విలువైన బహుమతులతో సత్కరించాడుప్రభువు .ఇంతగా అన్నదానం చేయటానికి ద్రవ్యదాత ఎవరని ప్రశ్నిస్తే అద్దేపల్లి సుబ్బయ్య శ్రేష్టి అని చెప్పగా ,ఆయన్ను పిలిపించి ‘’పరదేశిగారి అన్న సంతర్పణకు మీరు ఇచ్చిన డబ్బు యెంత ?’’అని అడుగగా ‘’ప్రభూ !పరదేశిగారికి తిరిగి తీసుకొనే ఉద్దేశ్యంతో నేను డబ్బు ఇవ్వలేదు .కనుక పద్దు రాయలేదు .కాబట్టి  యెంత ఇచ్చానోచేప్పలేను ‘’అన్నాడు .దిమ్మతిరిగి బొమ్మ కనిపించి వెంకటాద్రి నాయుడు ‘’ఔదార్యం అంటే ఇలా ఉండాలి ‘’అనుకోని ‘’నాకు తెలీకుండా ఆయనకు డబ్బు ఇచ్చే అధికారం నీకు ఎక్కడిది ?అనుమతిలేకుండా చేశావు .అయినా క్షమిస్తున్నా.ఆయనకిచ్చిన డబ్బు అంతా నేను నీకు ఇచ్చేస్తా తీసుకో’’అన్నాడు .శ్రేష్టి ‘’మీరిచ్చే శిక్షకంటే ,భగవంతుడు ఇచ్చే శిక్ష పెద్దది .సత్సంకల్పానికి పాపకూపంలో పడి పోతానేమో నని భయంగా ఉంది మన్నించండి ‘’అన్నాడు వినయంగా .’’సరే నువ్వు చెప్పింది కూడా బాగుంది .నేను పరదేశిగారికి నువ్వు ఇచ్చిన డబ్బు అంతా తిరిగి నీకు ఇచ్చేస్తా తీసుకో .ఆయనకు ఘన సన్మానం చేస్తాను. నువ్వుకూడా పాల్గొని ఆ డబ్బు ఆయన సన్మానానికి ఖర్చు చెయ్యి .ఇద్దరం ధన్యులమవుతాం ‘’అన్నాడు సెట్టి సమ్మతించాడు .

అన్నప్రకారమే వెంకటాద్రి నాయుడు బందా పరదేశి గారికి  ఘన సన్మానం చేసి ,కమలా౦బ గారిని పిలిపించి కాశీలో ఆంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్నదాన సత్రానికి పరదేశిగారిని అధికారిగా చేయటానికి ఆమెను ఒప్పింఛి వేటపాలెం సత్రానికి కమలాంబ గారిని అధికారిని చేశాడు .వారణాశిలో తన బాధ్యతలు అత్యంత సమర్ధంగా సంతృప్తిగా నిర్వహించి పరదేశిగారు ,వేటపాలెం చేరి ,క్రీ శ 1785లో ఆ విశ్వేశ్వరుని లో ఐక్యమయ్యారు  .రెండేళ్ళ తరువాత భార్య కమలాంబ గారు కూడా కైవల్యం చెందారు .

బందా పరదేశి గారి గురించి నిరతాన్నదాత అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కాసీతమ్మ గారి లాగా    ఆంద్ర దేశంలో పెద్దగా ఎవరికీ తెలియదు .సత్రం సంఘటన ఇద్దరి జీవితాలలొ చోటు చేసుకోవటం తమాషా గా ఉంది .అమరావతి ప్రభువు ఈయనను ఆదరిస్తే ,పిఠాపురం రాజా ఆమెను గుర్తించారు .ఇద్దరూ కారణ జన్ములు.ఆంధ్రులకు ప్రాతస్మరణీయులు .

ఆధారం –శ్రీ పంగులూరి వీర రాఘవుడు గారి రచన ‘’ఆంద్ర మహా భక్త విజయం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-20-ఉయ్యూరు

 

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాతార్జునీయం-.15      దశమ సర్గ -1            

రాతార్జునీయం-.15

దశమ సర్గ -1

తెల్లవారగానే అర్జునుని ప్రలోభ పెట్టటానికి అప్సరసలు అందరూ బయల్దేరారు .రాత్రి సంభోగం తో వచ్చిన కొత్త అందం తో ,మాంచి అలంకరణతో మన్మథ విలాసాలు వెదజల్లుతూ వెళ్ళారు .స్తన ,పిరుదుల భారం తో నెమ్మదిగా నడవాల్సి వచ్చింది .లత్తుక పాదాలలతో స్త్రీలు ముందు నడువగా ,నేలపై గడ్డి దర్భ వంటి నల్లని గడ్డి లాక్షారవం అంటుకొని వర్షాకాలం లో వ్యాపించే యెర్రని కీటకాలు నేలంతా వ్యాపించాయా అన్నట్లున్నది .మొలనూలు కాలి గజ్జల సందడి ఇద్రకీల గుహలలో ప్రతిధ్వనించింది .హంస, సారసాలు అరవగా మనోహర ధ్వని వ్యాపించింది .ఫలపుష్పాలతో ఉన్న చెట్లవద్ద క్రూర మృగాలైన సి౦హాలతోపాటు ,సాదువులైన లేళ్ళు  కూడా కలిసి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు .మనసు ఉద్విగ్నత చెంది,అర్జునముని స్తావరం దగ్గరే ఉందని తెలుసుకొన్నారు .-‘’అభిద దురభితో మునిం వదూభ్యః –సముదిత సాధ్వస విక్లబం  చచేతః ‘’.రాజర్షి అర్జునుడున్న చోట అప్సర గంధర్వులకు ధైర్యం సన్నగిల్లింది .పరమ ప్రభావంతో ఉన్న తాపసులకు అసాధ్యం ఉండదు కదా –‘’ఉపహిత పరమ ప్రభావ ధామ్నాం –నహి జయినాం తపసా మలంఘ్య మస్తి ‘’  .ఇసుకలో అర్జునుని కాలి గుర్తులు కనిపింఛి భయపడ్డారు .ఆ అడుగుల్లో అతిమానుష ధ్వజం ,చక్రం మొదలైన గుర్తులు కన్పించాయి .

‘’స చకిత మివ విస్మయాకులాభిహ్ –శుచి సికతా స్వతిమానుషాణితాభిహ్ –క్షితిషు దద్రుశిరే పదాని జిష్నో-రుపహిత కేతురథాంగలా౦నాని’’.అక్కడి ఋతు సమృద్ధికి అర్జునముని ప్రభావమే కారణమని గ్రహించారు .-‘’రుతురివతారు వీరుధాం సమృధ్యా-యువతి జనైర్జ గృహేముని ప్రభావః ‘’.అక్కడి అశోకం బాగా ఆదరాన్ని కల్గించింది దానికొమ్మపై నీరు కారున్న ముని వస్త్రం ఆరేయటం తో అది వంగింది .అందుకే రాపిడి వల్ల చిగురాకులు నేల వ్రాలాయి .గొప్పవారి సేవవలన గొప్పతనమే వస్తుంది..అచ్చరలు కూడా ప్రభావితులయ్యారని భావం  –‘’బహుమతి మదికాం యయావ శోకః –పరిజనతాపి గుణాయ సద్గుణానాం’’.  యమనియమాదు లతో కృశించినా,బలిష్టమైన అంగాలు ,ఆయుధాలు ఉన్న ఆర్జునుడిని చూశారు. అథర్వణ వేదం లో చెప్పిన మంత్రాలలో అభ్యుదయం కోసం శాంతాన్ని ,అభి చారిక క్రియ కోసం అంటే శత్రు సంహారం కోసం క్రీడి ఆయుధాన్ని ధరించటం వాళ్ళు చూశారు.శాంతమూర్తి అయినా ఉగ్రత్వమూ తగ్గలేదని గ్రహించారు –‘’యమనియమ కృశీకృత స్థిరా౦గః –పరి దదృశేవిధృతాయుధః స తాభిః-అనుపమశమ దీప్తితా గరీయాన్ –కృత పద పంక్తి రథర్వణేవ వేదః ‘’

  అర్జునుడు చంద్రునిలా ఆహ్లాదం కలిగించే కిరణ సముదాయం చుట్టూ కలిగి ఉన్నాడు .ఇంద్రకీల పర్వతం లో ఒక శిఖరాన్ని మాత్రమే నివాసంగా చేసుకొన్నా ,పర్వతం మొత్తం ప్రభావితం చేస్తున్నాడు –‘’శశధర ఇవ లోచనాభి రామై-ర్గగనవిసారిభి ర౦శుభిః పరీతః –శిఖర నిచయ మేక సాను సద్మా –సకల మివాపి దధన్మహీధరస్య ‘’.గంగాతీరం లో తపస్సు చేస్తూ యెర్రని జటలతో  యజ్ఞం లో హవిస్సులు వ్రేల్చినపుడు పైకి లేస్తున్న అగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తున్నాడు –‘’సురసరితి పరం తపోధిగచ్ఛన్-విధృత పిశంగ బృహజ్జటాకలాపః –హవిరివ వితతః శిఖాసమూహైః-సమభి లష న్నుపవేది జాత వేదాః’’.శరీరానికి తగిన ప్రయత్నం ,దానికి తగ్గ క్రియ ,అందుకు తగ్గతపస్సు ,దానికి విజయమే ఫలంగా శ్రద్ధా అర్జునుడు చూపిస్తున్నాడు .’’సదృశ మతను మా కృతేఃప్రయత్నం –తదనుగుణా మపరైఃక్రియ మలంఘ్యా౦ –దధత లఘు తపః క్రియాను రూపం –వియతీం చ తపః సమాం సమృద్ధిం’’.నియమాలతో క్షీణించినా ,ఇంకా పర్వత బలం తో ఉన్నాడు .శాంతం ఉన్నా ఇతరులకు లొంగని వాడు .ఏకాంతం లో ఉన్నా మంత్రులతో కల్సి ఉన్నట్లే ధైర్యంగా ఉన్న అర్జునుడు,ఇంద్ర సమాన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు –‘’చిర నియమ కృశోపిశైల సారః –శమనిరతోపిదురాసదః ప్రకృత్యా-స సచివ ఇవ నిర్జనే పి తిష్ట-న్మునిరపితుల్య రుచి స్త్రిలోక భర్తుః’’.

 లోకాలన్నిటి పరాక్రమ తేజస్సులను తిరస్కరించేది ,త్రిలోక రక్షణకు సమర్ధమైన అర్జున శరీరాన్ని చూసి అప్సరసలు ,విజయం కోసం విజయుడు చేసే తపస్సు  నిష్ఫలం అనుకొన్నారు అంటే ముల్లోకా విజేతకు ఇంకా తపస్సు ఎందుకు అని భావం .-‘’తను మవజిత లోక సారధామ్నీం –త్రిభువన గుప్తి సహాంవిలోక యంత్యః –అవయయు రమరస్త్రియోస్య యత్నం –విజయ ఫలే విఫలం తపోధికారే ‘’ .సాధారణ తాపసుల్ని ,దానవుల్నీ మాకొంగుల్లో ముడేసుకొన్నాం.ఇప్పుడు ఇంద్రుడు ముల్లోక విజేత అయిన ముని ని వశం చేసుకోమని నియమించాడు మమ్మల్ని .మా శక్తి చాటుకోవటానికి మ౦చి అవకాశం వచ్చింది అనుకొన్నారు దేవ వేశ్యలు .-‘’ముని దనుతనయాన్ విలోభ్య సద్యః –ప్రతను బలాన్యధి తిష్ట తస్త పా౦సి-అలఘుని బహుమేదిరే చ తాఃస్వం-కులిశ భ్రుశావిహితం పదేనియోగం ‘’

  అర్జునుడి ని ప్రలోభ పెట్టె కృత్రిమ ప్రయత్నం చేస్తున్న వారిలో వెంటనే మన్మథుడు ఆవేశి౦ చాడు. యవ్వన మాధుర్య శోభ  మనసుని హరిస్తుంది .వీళ్ళు యువతులు .అతడు మాంచి యవ్వనం లో ఉన్నాడు .అంటే అతన్ని చూడగానే వీళ్ళే మదన కా౦క్షలో పడ్డారని భావం .

‘’అథ కృతక విలోభనం విధిత్సౌ-యువతి జనే హరి సూను దర్శనేన –ప్రసభ మవతతార జిత్త జన్మా-హరతి మనో మధురా హి యౌవన శ్రీః’’.మన్మధుడు ఆవేశించాగానే అప్సరలు గంధర్వుల వైపు సాభిప్రాయంగా చూడగా, వాళ్ళు వీణ మృదంగాలతో మనసు హరించే ధ్వనిని ఆకాశం  నిండేట్టు పలికించగా ,అక్కడ ఋతు శోభ ఏర్పడింది .ఆకాశం నీటి మేఘాలతో ఆవృతమైంది. మెరుపులకాంతి వ్యాపించింది .ఎడబాటు లో దంపతులను ఏకం చేసేట్టు ఉరుములురిమినాయి –‘’వ్యవహిత రతి విగ్రహైర్వితేనే-జలగురుభిః స్తని తైర్దిగంత రేషు ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాకర్ విజార్డ్ జోహార్ 

 

సాకర్ విజార్డ్ జోహార్

నీ చేతిలోఉన్నది  మంత్రమా,యంత్రమా సాకర్ వీరా!

గోల్స్ కొట్టటం నీకు ఉగ్గుబాలతో అబ్బిన విద్యా మహాశయా!

సాకర్ శాసన కర్తా !పోస్ట్ పై నీ దాడి

వ్యూహాత్మకం ప్రత్యర్ధి చిత్తస్థైర్య విధ్వంసనం

కల్పితగోల్స్ నీ ప్రత్యేకతై మిరుమిట్లు గొల్పించి

విజయం నీ ముందుంఛి  ‘’ఎల్ పైబ్ దివోరో’’ను చేశాయ్ నిన్ను

నీ సాకర్ మంత్రజాల౦  ప్రత్యర్దులచే  లాల్ సలాం చేయించాయి

బార్సిలోనా ,నటోలీ,బోటేన్ హాం క్లబ్ లకు

అన్నీ నువ్వే అయి విజయ దుందుభి మోగించావ్

సాకర్ శిఖారోహణ చేసినా ,కొకైన్ కు బానిసత్వం

నీ కెరీర్ పాలిటి శాపమై వెంటాడి వేధించింది

ఎక్కడో అర్జెంటీనా వాడి వైనా నీ ఆటకౌశలం

ప్రపంచ ప్రజలందర్నీ సమ్మోహ పరచి

అందరి వాడవయ్యావు’’ఓ గోల్డెన్ బాయ్’’ మారడోనా డీగో

గోల్ ఆఫ్ ది సెంచరి చేసిన నీ హస్తం ‘’హాండ్ ఆఫ్ గాడ్ ‘’

వామన మూర్తి వైనా సాకర్ త్రివిక్రమడవై

విశ్వవిజయం సాధించిన నువ్వు చిరంజీవివే.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-20-ఉయ్యూరు

 


Posted in సమయం - సందర్భం | Leave a comment

కిరాతార్జునీయం-.14 నవమ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.14

నవమ సర్గ -3(చివరి భాగం )

ప్రియునితో కొత్త కలయికతో ఒక నాయిక ఒళ్ళు గగుర్పొడిచి,చెమట పొటమరించి ,అలాగే గుండెపై పడుకొన్నది .అలంకారం చెదిరినా అదేఅల౦కార మయింది .మద్యం మత్తు సిగ్గు పోగొట్టి ,ఆపని మన్మధుడు చేశాడా లేక మదమా అనే అనుమానం కలిగింది .రెండూ వారిని ఆపలేక పోయాయి అంటే సరి పోతుంది .ఒక దూతిక ఒక కామునితో తన నాయికచూపు  అతని కోసంగుమ్మం  లోనే ఉందనీ ,అరచేతుల్లో కణతలు చేర్చి అతడి గురి౦ చే ఆలొచిస్తోందనీ ,ఒక్క మాటలో ఆమె జీవితం అతడి పైనే ఆధార పడి ఉందనీ ,కలహాలెందుకు? అన్నది ఆమెకల హా౦తరిత అన్న మాట .మొదట ఓరగా చూసి ,ప్రియుని గుండెపై పడుకోవటాన్ని అడ్డుకొనగా సిగ్గు అందాన్ని కలిగించింది. ప్రియ సంగమం లో సిగ్గు పారిపోయింది .ప్రియుడి తప్పు ప్రియురాలికి తెలిసి కోపిస్తే ,ఆ సాకుతో వాడు వెళ్లి పోవాలని ప్రయత్నిస్తే ,వేదనతో కన్నీరు పెట్టుకొనగా ఆగిపోయాడు .ఈమె అధీర ఖండిత .విశ్వాసం లేని నాయకుడిని గూర్చి నాయిక ఏడుస్తుంది అయినా వాడిని ప్రేమించినట్లు ,పొందుకోరుతున్నట్లు ,పులకాంకిత దేహం తెలుపు తోంది .ఈమె కూడా అధీరా ఖండిత నాయికయే .

  చంచల దృష్టి తో చూస్తున్న ప్రియురాలి ముఖాన్ని అకస్మాత్తుగా ప్రియుడు ముద్దు పెట్టుకొన్నాడు .ఆమె చీరముడి వీడి చీర కూడా సిగ్గుతో జారిపోయింది .జారిన చీరను మొలనూలు వద్ద ఆగిపోగా ,ప్రియుడు ఆమాత్రం అడ్డంఎందుకని పూర్తిగా లాగేశాడు .ఆమె తన స్తూల చనుగవతో వాడిని గుండ్రంగా చుట్టుకొని  కంట పడనీయ లేదు .రతిక్రీడలో గట్టి కౌగిలింతలు ,నఖ క్షతాలు ,చుంబనాలు దంత క్షతాలు జోరుగా సాగాయి .మన్మధుడు తన సౌకర్యం కోసం సంయోగం లోనూ వియోగం లోనూ క్రూరత్వాన్నే ప్రదర్శిస్తాడు .-‘’సౌకుమార్య గుణ సంభ్రుత కీర్తి –ర్వాను ఏవ సురతేశ్వరపి కామః ‘’.సంభోగం లో అప్సరసలు డగ్గుత్తిక పొంది ,సరిగా మాటలు రావటం లేదు. చేతులు ఆడిస్తూ ,ఛీఛీ అంటూ ,కళ్ళు సగం మూస్తూ ,ఆనంద పారవశ్యం పొందారు .ప్రియులైన గంధర్వులు అచ్చరల ఆధార పానం, మద్య పానం కోరి అనుభవించారు .దీనితో రతి అడ్డూ ఆపూ లేకుండా సాగి కొత్త అనుభూతులనిచ్చింది .కలయిక లలో  అలకలు మాయమయ్యాయి  .మద్యం తో వివాదం పోయింది .అలా సంతృప్తి చెందిన జంటలపై కాముడు బాణ ప్రయోగం చేయ లేక  పోయాడు –‘’మానినీ జన ఉపాహిత సంధౌ –సందధే ధనుషి నేషు మన౦గః’’.కోపం తో ఉంటేఅనునయిస్తూ ,సపర్యలతో స్వాధీనం చేసుకొంటూ ,కలిసి మద్యం తాగుతూ హాయిగా రమించారు .సిగ్గు, బద్ధకం వదిలి చాతుర్య ప్రదర్శన చేశారు .తాముతాగి ప్రియులకు అందించారు .కలిసి పుచ్చుకొన్నారు .మాటిమాటికీ రుచిమారి అనుభవం పెరిగింది .మద్యం లోని లేత మోదుగాకులు ,కలువ పూ రేకులు కనుబొమమలకు కొత్త అందాన్ని ఇచ్చాయి. మద్యం సాకుతో ప్రియురాలి పెదవి నొక్కి హాయి పొందారు .ప్రియులు ఇచ్చిన మద్యం ప్రియు రాళ్ళకు మరీ మధురం అని పించింది .గుణం ఉన్న వస్తువు ఆశ్రయాన్ని బట్టి మరింత గుణాన్ని పొందుతుంది కదా –‘’ప్రాప్యతే గుణ వతాని గుణానాం-వ్యక్త మాశ్రయవశేన విశేషః –  ‘’తత్తధాహి దయితానన దత్తం –వ్యానశే మధు రసాతిశ యేన’’ .స్ఫటిక పాన పాత్రలలో ప్రతిబింబించిన దంతక్షతాలను చూసుకొని సంబరపడ్డారు .తెగతాగటం వలన పెదవుల లత్తుక కరగి క్షతాలు బాగా కనిపించాయి .అవి గాడ్హాను రాగానికితీపి గుర్తులు .అందుకే ‘’ఆన౦దో బ్రహ్మ’’ గా ఉన్నారు .కళ్ళకు ఎరుపుదనమిచ్చి,పదవుల ఎర్రదనం హరించి ,ముఖాలకు తమ పరిమళాలనిచ్చి ,ముఖగందాన్ని తాము తీసుకొని ఈ వారుణి ఆ స్త్రీల గుణాలను కావాలనే తీసుకోన్నదా,లేక భ్రమతో ఒకదానికొకటి తీసుకొందాతెలియటంలేదు .ఒక నాయిక కళ్ళలో సమాన అలంకారంగా ఉన్న కర్నో త్పలం వ్యర్ధమై౦దని,పనికిరాదని గ్రహించి మద్యం వలన వచ్చిన ఎరుపుదనం మిత్రునిలా తన రంగును నల్లకలువపై ప్రసరింప జేసింది  .అందుకే కలువ చెవి అల౦కార౦  గానే మిగిలిపోయింది .మందు బాగా కొట్టటం తో పెదిమల రంగు పోయి ,ప్రియుడి దంతాల నొక్కులు బాగా కనిపిస్తున్నాయి .అదీఅలంకారంగానే ఉంది .మత్తు కాంతి ఒళ్ళంతా వ్యాపించినా ,ఎరుపు కళ్ళలో ,పగడం రంగున్న కణతల్లో అద్దం లో ప్రతిఫలించినట్లు వ్యాపించింది .కోపపుస్త్రీల వికారం పురుషులకువశీకరణం గా ఉంది .మద్యం ప్రవర్తనలో మార్పు తెచ్చినా ,అదే మగాళ్ళకు మేలు చేసింది .ఇద్దరూ ఫుల్ గా మందుకొట్టటం వలన ఒకే వర్గంవారైనారు .మద్యం మత్తు లో రవిక చీర ఊడినా శారీరక బాహ్య స్పృహే లేదు .సిగ్గు విలవిల లాడింది వారి ప్రవర్తన చూసి ,వదిలి పోలేకపోయింది .మద్యంకిక్కు చెలులు ఉన్నారన్న జ్ఞానం కూడా లేకు౦డా చేసింది .మద్యపాన మత్తు అనేక కొత్త రకాల సిగ్గును అనుకరించింది .కౌగిలిలో చేష్టలు లేకపోవటం ,సిగ్గులోనూ ,మద్యం లోనూ కలిగే సమాన గుణాలు .అందుకే వీటి పోలిక అనుకరణ లాగా అనిపించింది ..అభిమానవతి అయినా ,ప్రియుడి ఒడిలో కూరుకు పోయింది .చంచలస్వభావ మద్యం గుణ దోషాల విషయం లో రహస్యాలను బయట పెడుతుంది అనేది నిజం —‘’కారయిత్య నిభ్రుతా గుణ దోషే –వారుణీ ఖలు రహస్య విభేదం ‘’.మద్యం కిక్కుతో రాతి క్రీడమహా మాధుర్యం పొందింది .ఆ ఆన౦దాతి శయం వలన మదనోదయం ఉద్రేకం తో పాటు కొత్త రూపం కూడా పొందింది .

  మద్యం మత్తులో ఉంటే ప్రియుడు ఇంకో దానితో ‘’జంప్ జిలానీ’’అవుతాడేమో అనే అనుమానం తో’’ తీర్ధం పుచ్చుకోటం’’ తగ్గించారు .ప్రేమలేకపోతే భయం ,అనుమానం కలగటం సహజమే.-‘’యోషితో న మదిరాం భ్రుశ మీషుహ్-ప్రేమ పశ్యతి భయాన్య పదేపి’’.ఏకాంతం ,మన్మధుడు ,మధుపానం మత్తు ,చంద్రుడు, సంభోగం మరో లోకానికి తీసుకు వెడతాయి .అందుకే  ఈఅప్సరసలకు హద్దు అనేదే లేదు-   ‘’చిత్త నిర్వృతి విధాయి వివిక్తం-మన్మధోమధు మదః శశి భాసః –సంగమశ్చ దయితైహ్ స్మనయ౦తి –ప్రేమ కామపి భువం ప్రమదానాం ‘’.పురుషాతనం తో సహా సకల విధ రతి క్రీడలు సిగ్గూ లజ్జా లేకుండా చేసి అనుభవించగా వాడి వత్తలైన పూల దండలు పడక అంతా పరచుకోగా మన్మదుడికే  మత్తెక్కినట్లు అనిపించింది .ఇస్టమైనవారు చేయలేని పని ఉండదు అనిపించింది –‘’మానినీ రతివిధౌ కుసుమేషు –ర్మత్తమత్తఇవ విభ్రమ మాప ‘’.

  స్త్రీలు రతి రసాస్వాదనలో మునిగి పోగా మగాళ్ళు రెచ్చిపోయి వారిస్టంవచ్చినట్లు  ప్రవర్తించి ,అన్ని చోట్లా అంటే స్థానం కాని స్థానాలలో కూడా చు౦బన  తాడనాలతో విజ్రు౦భిం చారు  .అదీ అందంగానే ఉంది .ఇలా మాంచి ఊపులో ఉండగా వైతాళికుల మంగళ ధ్వానాలు వినిపించాయి .అర్ధరాత్రి దాటిందని తెలిసింది .వాళ్లకు రాత్రి బాగా సంకోచి౦చి౦దని పించింది.మొత్తం మీద రాత్రంతా ఆగమాగ౦ చేసి ఇక లేవక తప్పదని తెలిసి ,ఎడబాటుకు కుంగుతూ ,మళ్ళీ’’ ఇన్నింగ్స్’’ప్రారంభించి,మరింత స౦తృప్తి చెంది లేవటానికి సిద్ధపడ్డారు .సంభోగ శ్రమతో అలసిన అర్ధనిమీలిత స్త్రీలకు శరీర మర్దన ద్వారా సేవ చేయటానికా అన్నట్లు ప్రాతః కాలపు మంద పవనాలు సౌదాల్లోకి ప్రవేశించాయి .అక్కడి నలిగినపూల పరిమళం , మద్యం వాసన ,చందనాదుల అంగాంగ రాగాల గంధాన్ని ఆ వాయువులు  అన్ని చోట్లా వ్యాపింప జేశాయి  .ఇంకా కొద్దిగా మత్తు ఉన్నా అందంగానే ఉన్నారు స్త్రీలు .కళ్ళు కాళ్ళు నిలవటం లేదు .ఆ స్త్రీల విరహ వ్యాకులత పోగొట్టటానికి రాత్రి సంభోగ చిహ్నామైన నఖక్షతాది లక్ష్మీ సంపద విడువని చెలికత్తెలాగా వారి శరీరాన్ని అంటుకొనే ఉంది. అ౦గ రాగాలు గోటి నొక్కుల్లో మిగిలాయి .మద్యపానం, ఆధర పానం వలన పెదవుల ఎరుపు పోయింది .వాటి శోభా లక్ష్మి యే ఆ స్త్రీలను పట్టుకొని ,చెలి కత్తెల్లాగా  సాంత్వన  చేకూర్చాయని కవి భావం –‘’గతవతి నఖ లేఖా లక్ష్యతా మంగరాగే –సమద దయిత పీతా తామ్ర బి౦బా ధరాణా౦ –విరహ విదుర మిస్టా సత్సఖీ వా౦గ నానాం  -హృదయ మవలలంబే రాత్రి సంభోగ లక్ష్మీహ్ ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.13 నవమ సర్గ -2

కిరాతార్జునీయం-.13

నవమ సర్గ -2

చంద్రుడు దగ్గరకు రావటంతో కిరణ సముదాయం వక్రత్వం పోగొట్టుకొని నిటారుగా దిగంతాలకు పాకింది .అది లోకమంతా శ్వాస పీల్చుకొన్నట్లున్నది .అంటే చంద్ర కాంతి తో లోకం ఆనంది౦చి౦దని భావం –‘’నిహ్ సృతస్తిమిరభార నిరోధా –దుచ్చ్వసన్నివ రరాజ దిగంతః ‘’.స్వచ్ఛ పగడ కాంతి కళలతో నాలుగువైపులా అంధకారాన్ని దూరం గా పైకి తరిమేశాడు .పూర్వం అది వరాహం కోరతో భూమిని సముద్రం లో నుంచి పైకితోసినట్లున్నది .చంద్ర కళ ఆది వరాహం కొమ్ము కోర గా భావించాడు కవి –‘’లేఖయా విమల విద్రుమ భాసా –సంతతం తిమిర మిందు రుదాసతే –దంష్ట్రయా కనక టంపిశంగ్యా –మండలం భువ ఇవాది వరాహః ‘’.కిరణాలతో ఆకాశాన్ని ప్రకాశింప జేస్తూ ,కు౦కుమ రాగ స్తనమండలం లాగా ప్రకాశిస్తూ ,,తూర్పు సముద్రం నుండి చంద్రుడు పైకి వచ్చాడు .బంగారు కలశం లాగా భాసించాడు –‘’హేమకుంభ ఇవ పూర్వ పయోధే –రున్మమజ్జ శనకై స్తుహాయ్ నా౦శుహ్’’.ఇంకా కొంత చీకటి ఉండి,రాత్రిని ముఖం పై కప్పుకొన్న ముసుగు తొలగించినా ,సిగ్గు తో ముడుచుకొన్న కొత్త పెళ్లి కూతుర్లా లోకం తృప్తి చెందకుండా చూస్తూనే ఉంది –‘’వ్యంశుక స్పుట ముఖీ మతి జిహ్మాం-వ్రీడయా  నవ వధూ మివ లోకః ‘’.పర్వతాలలో ఇంకా చీకటే ఉంది .దిక్కుల మొదళ్ళలో  కాంతి వ్యాపించలేదు అయినా రాత్రిమాత్రం అందంగా ఉన్నది –దిజ్ముఖేషున చ దామ వికీర్ణం –భూషితైవ రజనీ హిమ భాసా ‘’.నెమ్మదిగా ఆకాశం చేరిన చంద్రుడు విరహ స్త్రీల వేడికన్నీటి చూపులను సహిస్తూ ,భయపడినట్లు నెమ్మదిగా ప్రయాణిస్తున్నాడు –‘’మందమంద ముదితః ప్రయయౌ ఖం –భీత భీత ఇవ శీత మయూఖాః’’.కిరణాల చేతులతో నక్షత్ర నాయిక కంతాలపైప్రసరింప జేసి ,ఆలింగనం చేసుకొన్నాడు .అతని ఎరుపుదనం నక్షత్రాల చుట్టూ వ్యాపించి,అంగరాగ శోభ కలిగించింది .మొత్తం చీకటిని పోగొట్ట్టిన చంద్రుడు క్షీర సముద్రాన్ని మధించినప్పుడు అందులోని పాలు పైకి ఉబికి ఎత్తైన చెట్ల వనాలను ము౦చినట్లుంది –‘’క్షీర సింధురివమందరభిన్నః –కాననాన్య విరలోచ్చ తరూణి’’.వృక్షాల కింది భాగం లోఆకుల మధ్య నుండి  చంద్ర కిరణాలు వ్యాపించి నేలపై తెల్లని ముగ్గులతో అలంకరించిన నివాస గృహాలా అని పించాయి .పగటి ఎండలో భార్యతో కలిసి ఆడిన చక్రవాకం ,రాత్రి చంద్ర కిరణాలను సహించలేక పోయింది. దుఖం లో ఉంటె ప్రతిదీ సహి౦చరానిదే అవుతుంది.-‘’ఆతపే ధృతి మతాసహా వధ్వా –  యామినీ విరహిణావిహగేన-సేహిరే  న కిరణా హిమరశ్మే-ర్దుఖితే మనసి సర్వ మసహ్యం ‘’.

   నీటి తు౦పురులను ,కలువల గంధాన్నీ ,పరాగాన్నీ వెదజల్లుతున్నరాత్రి గాలి సుఖం గా నిద్రిస్తున్న పక్షులున్న చెట్లను కొద్దిగా కదిలిస్తోంది .కాముడు పరిమళ ద్రవ్యాలు పూసుకొన్న చేతి తో ప్రియురాల్ని తనవైపు ఆకర్షించి నట్లు ఉన్నదని భావం .-అదుధావ పరిలీన విహంగా –యమినీ మరుదపాం వనరాజిహ్ ‘’.రాత్రి అనే రమణి మన్మధుడికి పట్టాభి షేకం చేయటానికి ఎత్తిన వెండి కలశం లాగా చంద్రుడు పైకొచ్చాడు .ఆ కలశం లో మంచు కిరణాలే నీరు .చంద్రునిలోని మచ్చ నల్లకలువ పూవు .-‘’సంవిధాతు మభి షేక ముదాసే –మన్మధస్య లసదంశు జలౌఘః –యామినీ వనితయా తత చిహ్నః  -సోత్పలో రజత కుంభ ఇవేందుహ్’’.ఎంత పరాక్రమం ఉన్నాసాయం చేసే వాడు లేకపోతె రాణించ లేడు .అందుకే మన్మధుడు చంద్ర కిరణాలే బాణాలుగా సాయం తీసుకొని ధనువు వంచాడు –‘’ఓజసామపి ఖలు నూననుమనూనం –నా సహాయ ముపయాతిజయశ్రీహ్-యద్విభుహ్ శశి మయూఖః స-న్నాదదేవిజయ చాప మనంగః’’.

  సురత క్రీడకు సమయమైనదని అప్సరసలు ,మళ్ళీ మళ్ళీ అలంకారం చేసుకొంటున్నారు .ప్రియులరాకకోసం దూతికల్ని పంపటం, ఆరా తీయటం చేస్తున్నారు .ప్రియ విరహం తో వారి అలంకారాలు,క్రీడా గృహ అలంకారాలు  వారికే నచ్చటం లేదు .విరహం సహించలేక తామే బయల్దేరారు ..ఒకామె ఆ ఇంటికి వెళ్ళకు అక్కడ నీ  సవతి ఉంది అని హెచ్చరి౦చినా మద్యం మత్తు లో మాట వినక మనసు శరీరం దుర్బలం చేసుకొన్నది .అదే సహాయం ,ఆసరా అనుకొన్నది .-‘’మానినీభి రప హస్తి త ధైర్యః –సాదయన్నపి మదో వలల౦బే’’ .ప్రియులు ప్రియురాళ్ళ ఇళ్ళకు చేరారు దారి మర్చిపోలేదు .మన్మధుని వలన బుద్ధి నశించినా ,ఆ మరుపు మేలే చేస్తుంది –‘’మన్మధేన పరిలుప్త మతీనాం –ప్రాయశః స్ఖలిత మాప్యుపకారీ ‘’.త్వరగా ప్రియుడిని పొందాలని తానే  వాడి ఇంటికి వెళ్లి ఒక స్త్రీ కణతలపై పులకా౦కురాలు కలిగి ,చెమటతో పత్ర రచన తిలకం చెదరి పోయింది .కాని సహజ సౌందర్యం తో చంద్రుని జయించింది –‘’నిర్జగాయ ముఖ మిందు మఖండం-ఖండ పత్ర తిలకా కృతి కాంత్యా ‘’.నాయిక చెలి తో ‘’ఆ దూర్తుని సంగతి అంతా నాకు చెప్పు .వాడిని అనుమానం లేకుండా నిందించు ‘’అంటే చెలి ‘’భర్త విషయం లో పౌరుషం మాటలు పనికి రావు ‘’అన్నది .నాయిక ‘’ఐతే బతిమాలి ఓదార్చి తీసుకురా ‘’అంటే ‘’అపకారాలు చేసిన వాడిని బ్రతి మాలడం ఎలా?’’అంది .’’ఒసే అందాలరాసీ !  ప్రియుడి విషయం లో కోపం దేనికే ?’’అంటూండగానే ప్రియుడు వచ్చి,ఆ మాటలు విని బహురస  ధైర్యాన్నిపొందారు .అంటే నవ్వు ,దాష్ణీకం ,ప్రేమ ,మనం ఏం చేసినా ఫర్లేదు అనే ధైర్యం కలిగింది భావం . క్రీడా గృహం లో ఏయే వింతలు విశేషాలు ప్రదర్శిస్తారో తెలుసుకోవాలంటే రేపటి దాకా ఆగాలిగా మరి, అంతేగా మరి !

సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.12 నవమ సర్గ -1

 

కిరాతార్జునీయం-.12

నవమ సర్గ -1

జలక్రీడల తర్వాత ప్రియుల పొందుకోసం అప్సరసలు ఆరాట పడగా ,మనం అడ్డం ఎందుకని సూర్యుడు పడమట వాలాడు .ఒక వైపు వంగిన సూరీడు ఆకాశం ముత్యాలహారం ధరించిందా అని పించింది .అంటే సూర్య నాయక్ తనవైపు వంగగా ,ఆకాశ నాయిక మరో వైపు పొరలగ ముత్యాలహారం కదలికగా కాంతి ఆకర్షింప బడిందని భావన .సూర్యుడు దాహంతో కిరణాలనే చేతులతో పద్మం లోని మధువును అతిగా తాగగా యెర్రని దేహం తో నేల వాలాడు .అతిగా మద్యం తాగినవాడు మత్తులో ఎరుపెక్కి నేలకూలినట్లు సూర్యుడున్నాడని భావం –‘’అంశు పాణి భి రతీవ పిపాసుహ్ –పద్మజం మధ భ్రుశం రస౦  యిత్వా –క్షీబతా మివ గతః క్షితి మేష్య౦ –ల్లోహితం వపురువాహ పతంగః ‘’.ఎర్రబడి అస్తమిస్తున్న సూర్యుడు అందరికీ ఆనందం పంచాడు .భూమి వేడి తగ్గింది . ఆవేడి చక్రవాకాల హృదయాలలో ప్రవేశించి౦ది .చక్రవాకాలు రాత్రి వేళ చూడలేవు. అందుకని తమ సహచరులను చూడ లేక పోతామేమో అనే విరహ బాధ వాటి మనస్సులో చోటు చేసుకొన్నది అని భావం .సగం అస్తమించిన సూర్యుడి కిరణ తేజస్సు తూర్పు వెళ్ళలేక ,పడమటి సూర్యునీ ఆశ్రయించలేక తేజో విహీనమైంది .సేవించిన యజమాని మధ్యలో వదిలేస్తే సేవకుని పని రెండిటికీ చెడిన రేవడి లాగా అవుతుంది కదా –‘’ముక్తమాల లఘు రుజ్ఘితపూర్వహ్-పశ్చిమే నభసి సంభ్రుత సాంద్రహ్ –సామి మజ్జతి రవౌ న విరేజే –భిన్న జిహ్మ ఇవ రశ్మి సమూహః ‘’.సూర్యకాంతి కుంకుమ లాఎర్రనై మేడలోని కిటికీల గుండా ప్రసరించగా ,అప్సరసలు ప్రియుడు పంపిన దూతికలు సాయం అలంకారాలకు తొందర పెడుతున్నాయా అన్నట్లు ఆదరంగా చూశారు .సూర్యుడు పై శిఖరాలలోని చెట్లను యెర్రని కిరణాలతో ఆధారంగా పట్టుకొని ,పడమటి కొండలోని దట్టమైన అడవిలోకో ,సముద్రం లోకో ,భూమి లోకో వెళ్ళాడు .తర్వాత గమన వేగం పెరగటం తో ఎక్కడికి వెళ్లిందీ గుర్తించలేక పోయారు .-‘’’’అగ్ర సానుషు నితాంత పిశంగై –ర్భూరుహా న్మ్రుదుకరైవ లంబ్య-అస్తశైల గహనం ను వివస్వా –నావివేశ జలదిం ను మహీం ను ‘’.ఇళ్ళకు చేరుతూ పక్షులు కిలకిలారావం చేస్తున్నాయి. సంధ్యా సమయం దాటటం తో ఎరుపు దనం తగ్గింది  .సంధ్య సూర్యోదయాత్పూర్వ పరిస్థితి పొందింది .అంటే చీకట్లు క్రమంగా ఆవరిస్తున్నాయని భావం .పైన మేఘాల వరుస ,కింద సంధ్యారాగం తో పడమటి ఆకాశం తరంగాలతో అలంకరించబడిన పగడ కాంతులతో అందంగా ఉన్న సముద్ర శోభ పొందింది –‘’ఆస్థితః స్థగిత వారిద పంక్త్యా-సంధ్యయా గగన పశ్చిమ భాగః –సోర్మి విద్రుమ వితాన విభాసా –రంజితస్య జలధేహ్ శ్రియ మూహే ‘’

  దోసిలి వొగ్గి ,తలవంచి ఏకాగ్రత తో ఉపాసించే  జనాన్ని వదిలి ,వారి ప్రేమను కాదని ,సంధ్య మరో దారిలో పోవటం చాంచల్యం తో దుర్జన మైత్రిని అనుకరించింది .సంధ్యా వందనాది క్రియలతో ప్రేమించే జనాన్ని వదిలి ,సంధ్యాసమయం దాటి పోయిందని భావన –‘’ప్రాంజలా వపి జనే నతమూర్ధ్ని –సంధ్యయాను విదధే విరమంత్యా –చాపలేన సుజనేతర మైత్రీ ‘’.ఉదయపు ఎండకు ఎక్కడో దాక్కున్న చీకటి ఎండ లేకపోవటం తో పల్లాల నుండి క్రమంగా సమతలం చేరి ఆక్రమించింది .-‘’ఔషతాప భయాదప లీనం –వాసరచ్ఛవివిరామ పటీయః –స౦ నిపత్య శనకైరివ నిమ్నా –దంధకార ముద వాప సామాని ‘’.చీకటి బాగా వ్యాపించటం తో అన్నీ ఒక చోటనే చేరినట్లుంది .అంటే తారతమ్యాలు తెలీటం లేదు .చీకటి అన్నీ తనలో దాచేసుకొంది అని భావం –‘’ఏకతామివ గతస్య వివేకః –కస్య చిన్న మహతో ప్యుపలేభే –భాస్వతా నిదధిరే భువనానా –మాత్మనీవ పతికేన విశేషాహ్’’.చక్రవాకాలలో వియోగం పెరిగింది దైవ నిర్ణయానికి అడ్డు లేదుకదా .రాత్రిళ్ళు కళ్ళు కనిపించవు కనుక దైవాజ్ఞగా విరహం అనుభవిస్తున్నాయి .తన ప్రియు రాలితో మాట్లాడ గలుగుతోందే కాని చూడలేక,తాక లేక  పోతోంది  ఈ దుర్దశను చూసి పద్మ నాళంముడుచుకున్న ముఖ పద్మాన్ని కిందికి వాల్చింది .ఇతరుల దుఃఖ వియోగ బాధ చూసి స్త్రీలు ఉదాసీను లౌతారు కదా –‘’యచ్ఛతిప్రతి ముఖం దయితాయై-వాచమంతిక గతేపి శకుంతౌ-నీయతే స్మ సతి ముజ్గ్హిత హర్షం –పంకజం ముఖ మివా౦బురు హిణ్యా ‘’

  చీకటి దట్టంగా వ్యాపించి పర్వతాలకు నలుపు రంగు పూసిందా,ఆకాశం భూమిపైకి వంగిందా,నల్లటి దుప్పటి కప్పిందా,ఎత్తు ,పల్లాల భూమి చదునైనదా,దిక్కులే లేకుండా పోయాయా  అన్నట్లు చీకటి ముసిరి గుర్తించకుండా చేసింది –‘’రంజితాను వివిధా స్తరు శైలా –నామితం ను గగనం స్థగితం ను-పూరితా ను విష మేఘ ధరిత్రీ –సంహతా ను కకుభ స్తిమి రేణ’’.కాంతి పద్మాలను వదిలి నక్షత్రాలతో ప్రకాశించే ఆకాశం చేరింది .ఆపద లేకుండా ఉండటానికే ప్రతి వాడూ ప్రయత్నిస్తాడు కదా –‘’రాత్రి రాగ మలినాని వికాసం –పంకజాని రహయంతి విహాయః –స్పష్ట తార మియాయ నభఃశ్రీహ్-ర్వస్తు మిచ్ఛతినిరాపది సర్వః ‘’.

  తూర్పున చంద్రోయమై దాని కాంతి మొగలి పూ కేసరకాంతి లా ఉంది .కర్పూరపు పొడి పిడికిటితో చల్లినట్లు అంతటా వ్యాపించింది –‘’వ్యానశే శశ ధరేణ విముక్తః –కేతకీ కుసుమ కేసర పాండుహ్-చూర్ణ ముష్టి రివ లంభిత కాంతి –ర్వాసవస్య దిశా మంశు సమూహః ‘’.తూర్పు అనే నాయిక చంద్ర నాయకుడు  సమీపించటం తో చీకటి ముఖం దుఖం వదిలేసి నవ్వులాంటి కిరణాలతో ఉజ్వలంగా ప్రకాశించింది .అంటే చీకటిని దూరం చేస్తూ చంద్రోదయం అయిందని అర్ధం .ఉదయగిరి నుంచి చంద్ర కిరణ సమూహం నల్లకలువ కాంతి గల ఆకాశం లోకి వ్యాపించింది .ఆకాంతి ఆకాశం లో,సముద్రం లో చేరి తెల్లని గంగానది నీరు మరింత స్వచ్చంగా ప్రకాశించింది .-‘’నీల నీరజ నిభే హిమ గౌరం –శైల రుద్ధ వపుషః సిత రశ్మేహ్-ఖే రరాజ నిపతత్కరజాలం –వారి ధేహ్ పయసి గా౦గమివామ్భః ‘’.ఆకాశ అంధకారాన్ని చంద్రుడు ఉదయ కిరణాలతో ముందుకు తోస్తూ ,శివుడు నల్లని గజ చర్మాన్ని తీసి ముందుకు తోసినట్లుగా భాసి౦చాడు.చీకటి గజ చర్మం,చంద్రుడు సాక్షాత్తు  శివుడు అనిపించారని భావం –‘’ద్యా౦ నిరుంద దతి నీలఘ నాభం –ధ్వాంత ముద్యత కరేణ పురస్తాత్ –క్షిప్య మాణ మసితేతర భాసా –శంభు నేవ కరి చర్మ చ కాసే ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.11 అష్టమ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.11

అష్టమ సర్గ -2(చివరి భాగం )

చిగురాకులు కోయటం తో అచ్చరల చేతులు ఎర్రబడ్డాయి .పుప్పొడి అంటి పాలిండ్లు పసుపు రంగు పొందాయి. పూల వాసనతో శరీరాలు పరిమళం పొందాయి .తమ సౌందర్యం పెంపు కోసం సామగ్రి అంతా చెట్ల నుండే పొందారు .ఇంద్రకీలం లో ప్రతి అడుగులోనూ త్రుళ్ళి పడుతున్నారు. ఏనుగు తొండం లా లావైన తొడల వలన నడక లో శ్రమ పడ్డారు .కొత్త చిగుళ్ళ వంటి పాదాలు నడవ లేక తడ బడుతున్నాయి ఈ తుళ్ళింత మధుపానం వల్లనేమో అనిపిస్తోంది .(బహుశా అర్జున  మౌని ముందు కూడా ఈ తడబాటు జరుగుందేమో నని సూచన కావచ్చు నని నా ఊహ ).మొలనూలి మణి కాంతులు నితంబాలకాంతిని వెలువరిస్తున్నాయి .అవి గంగనీటి నుండి అప్పుడే బయట పడిన ఇసుక మేటల శోభను జయి౦చినట్లున్నాయి .పాదాల ముద్రలు ఇసుకలో ముద్రింప బడినాయి .నాభి ప్రదేశాలు వికసిత కమలాల మొగ్గలఅందాన్ని కలిగి ,కొకముడి దగ్గర ఆకట్టుకొనే శోభ పొందాయి .పొట్ట మధ్య భాగం లో వలి త్రయం అందం గా ఉంది .జఘనం పై ఉన్నత ,విశాల స్తనాలు బరువు తో పొట్ట పైభాగం లోపలి కి వంగింది .కళ్ళకు చెమట ఆవరించటం తో పూర్తిగా కళ్ళు తెరవ లేకపొతున్నారు .ఆకళ్ళు మంచు తో స్పష్టంగారేకులు  కనిపించని కమలాల్లా ఉన్నాయి .ముఖాలు కూడా అలానే ఉన్నాయి –‘’సమాన కాంతీని తుషార భూష నైహ్-సరోరు హైరస్ఫుట పత్ర ప౦క్తి భిహ్ –చితాని ఘర్మా౦బు కనైహ్  సమంతతో-ముఖాన్యనుత్ఫుల్ల విలోచనాని చ ‘’

  నెమ్మదిగా నడుస్తున్న అప్ససరల అంగాంగ సౌందర్య చేష్టలు చూస్తున్న గంధర్వులు అదే మొదటి సారిగా చూసిన అనుభూతి పొందారు ..పూలు కోశాక, గంగానది ని చూశారు .చేపలతో కదల్చబడి ప్రసన్నంగా ఉన్న పద్మం కలది ,బురద లేని తీరాన్ని తాకుతున్న అలలు అనే చేతులతో ,రాయంచల కలకలారావాలతో పిలుస్తోందా అని పించింది .అంటే గంగ అనే స్త్రీ స్నానానికి రమ్మని పిలుస్తున్న భావన కలిగించిందని భావం .మందమారుతం వీచింది అది తరంగాలపై వస్తూ తుమ్పురుల చల్లదనం పద్మాల పరిమళం పొంది వేడిని కూడా తగ్గించి, వారికి  ఆలింగన సౌఖ్యం కలిగించింది .విలాసమైన నడకలతోహంస నడకలను ,పిరుదుల వైశాల్యం తో ఇసుక తిన్నెలను ,విశాల నేత్రాల ముఖాలతో పద్మాలను సామ్యగుణ౦  తో అప్సరసలు నిరసించారు .వీరికున్న నేత్రాలు పద్మాలకు లేనందున గుణ నిరసన జరిగింది .

  గంధర్వులు ముందు నదిలో దిగి దారి చూపారు .తర్వాత దేవా౦గనలు భయభయంగా మొదటి సారి అన్నట్లు  గంగలోదిగారు .వారు నీటిలో దిగగానే తరంగాలు చీలి తీరం దాకా వ్యాపించాయి తీరానున్న నీటి పక్షులు భయంగా పారి పోయాయి .గట్టిగా ఉన్న గంధర్వుల వక్ష స్తలాలతో విశాల చనుల అప్సరసల తాకిడితో నీటి తరంగాలు ముక్కలై తీరమంతా వ్యాపించి అల్లకల్లోలమైంది .గంగ వీళ్ళ జలక్రీడలకు కోపించి క్షోభించినట్లు గా ఉంది –తటాభి నీతేన విభిన్న వీచినా –రుషేవ భేజే కలుషత్వ మంభసా ‘’.తల వెంట్రుకలు చెదిరి ,పూదండలు జారి ,చందనాదులు కరగి పోగా అప్సరసలకు తాము చేసిన అపరాధం వల్ల ఇలా జరిగిందా అని భయపడి నట్లు నీటి తరంగాలు మాటిమాటికీ వణకు తున్నాయి –‘’అతి ప్రసంగా ద్విహితాగసో ముహుహ్ –ప్రకంప మీయుహ్ సభయా ఇవోర్మయః ‘’

నఖక్షతాలు సవతులకు కనిపించకుండా గంధం వంటివి పూస్తే ,అవి నీటిలో కరిగి బయటపడ్డాయి .ప్రియుల ప్రేమకు చిహ్నాలైన వాటిని మిగిలిన కుంకుమ తో మధురస్మృతులు పొందారు .చెలికత్తెలు రెండు తుమ్మెదలు వాలిన పద్మపత్రాలా లేక తమ నాయకి చంచల నేత్రాలా ,చెలి కేశపాశామా లేక తుమ్మెద సమూహమా అని ఆశ్చర్యపోయారు .చిరు నవ్వు దాచుకోనందున బయట పడిన దంతాలు అనే కేసరాలున్న ముఖమా ,లేక వికసిత పద్మమా అంటూ పద్మవనం లో దాగిన తమ చెలికత్తెను మిగతా స్త్రీలు చాలా సేపటికి గుర్తించారు .నాయిక నేత్రాలు తుమ్మెదలు వ్రాలిన పద్మ పత్రాల్లా ,ముడిచిన జుట్టుతుమ్మెదల బృందం గా ,దంతకా౦తు లే కేసరాలుగా ఉన్న ముఖంగా ఉన్నది అని భావం .

  ఒక  నాయిక సవతి చూస్తుండగానే ప్రియుడు కూర్చిన పూలదండను పాలిండ్లపైధరించి  నీటిలో తడిసి వాడినా తీసి పారెయ్యలేదు . అంటే ప్రేమకున్న ప్రాధాన్యం దండకు లేదని భావం .కళ్ళ చుట్టూ ఉన్న ఎర్రదనాన్నికాటుక  అడ్డు కొంటో౦ది .నీటిలో కాటుక కరిగిపోయినా ,కనుల ఎరుపుదనం నేత్రాల తెలుపు దనాన్ని పోగొట్టిందే కాని కళ్ళ అందాన్ని పోగొట్టలేదు ఎర్రదనం కళ్ళకు అలంకారంగా మారిందని భావం .పూల మాలలు గంగానదీ వేగానికి తేలుతూ కొట్టుకుపోయాయి .ధనాది కారాల ఆశతో దుష్టులు  వెళ్ళ గొడితే మంత్రుల పరిస్థితి లా ఉంది .ఆ మంత్రులు కూడా స్థాన భ్రస్టులై చులకన కావటం లాంటిదే ఈ పూలదండలు నలిగి నీటిలో కొట్టుకొని తేలిపోవటం  కూడా –‘’ద్యుతం వహంతో వనితా వతంసకా –హృతాః ప్రలోభాదివ వేగి భి ర్జలైహ్ –ఉప ఫ్లుతా స్తత క్షణ న శోచ నీయతాం –చ్యుతాది కారాః సచివా ఇవా యయుహ్ ‘’

  శరీరాలకు అల౦కార౦ కోసం పూసుకున్నవన్నీ నీటిలో కరిగే పోయినా ,సహజ సౌందర్యం అలానే ఉంది .అప్సరసలు వస్తువులకే అలంకారం తెస్తారని వారి ప్రియులు భావించారు .నదిలో స్నానించిన సవతుల నఖ క్షతాలుల చూసి సవతులు భగ్గుమన్నారు .అప్సరసల అలంకారాలన్నీ గంగ నీటిలో ఉండటం చేత వీళ్ళ ఆదిక్యంఏమీ కనిపించలేదు .గంగార్పణం .చేతులతో నీటిని కదలిస్తుంటే మద్దెల మోతగా స్తనాలు కదుల్తున్నాయి .చలితో వణుకుతూ నృత్యం చేస్తున్నాయా అని పించాయి .—ముహుహ్ స్తనైస్తాల సమం సమాదదే-మనో రమం నృత్యమివ ప్రవేపితాం ‘’.వారి ముఖాలు నీటిలో ప్రతిబింబించాయి స్త్రీలకూ సంతోషం కలిగించేట్లు గంగానది అత్యంత స్వచ్చంగా ఉంది .నిర్మల మనస్కులు పరోపకారులౌతారు –‘’కృతాను కూల్యా సురరాజ యోషితాం-ప్రసాద సాఫల్య మవాప జాహ్నవీ ‘’.

  వారి తొడలను చేపలు తాకగా భయపడి,చేతులు అటూఇటూ కదిల్చారు .చేపతాకిన అప్సరస భయంతో ప్రియుడిని వాటేసుకొని  సంతోషం  కలిగించింది. కృతక చేస్టలకంటే సహజ ప్రేమ ను ప్రకటించే చేస్టతో స్త్రీలు ప్రియుల మనసు దోచుకొంటారు కదా –‘’అకృత్రిమ ప్రేమ రసాహి తైర్మనో –హరంతి రామాః కృతకైరపీహితైహ్’’.నీటిలో మునిగి స్నానం చేయటం వలన తలవెంట్రుకలు చెదిరి ముఖాలపై పడి,తుమ్మెదలు మూగిన పద్మాలనిపించాయి .ఒక అప్సరస నీటిలో మునిగినట్లు నటించి,  భయం లేకుండా ప్రవర్తించి, ప్రియుడినిఅల్లుకొని ఆన౦దించి ,చెలికత్తెలకు మాత్రం భయంతో ఆధారంగా అతడిని పట్టుకొన్న భావన కలిగించింది .ప్రియులు చేతులతో నీటిని ప్రేయసులమీద చల్లుతుంటే విలాసంగా నవ్వుతూ చేతులు అడ్డు పెట్టు కొన్నారు .దీనితో ఉచ్చ్వాస నిశ్వాసాలు ఎక్కువై స్తనాలు వణుకుతున్నట్లు  కదుల్తున్నాయి .తియ్యటిమాటలతో ప్రియురాళ్ళను  ప్రియులు అనున యిస్తున్నారు .కనురెప్పలు కిందకు వాల్చి నీటి బి౦దువు లున్న కనురెప్పలను మూసుకొంటున్నారు .దోసిలి నిండిన నీటితో ప్రేయసి ప్రియుడిపై చల్లబోతుంటే ,అతడు పట్టుకొని ఆమె పైనే చల్లగా,ఆమె నీవీ బంధం ఊడగా, మొలనూలుకాపాడింది .కాటుకలేనికళ్ళు,లాక్షారసం లేనిపెదవుల కంపం ,నుదుటి ముడతలు వారికి అందాన్ని కలిగించాయి .అర్ధనిమీలిత నేత్రాలతో ఒకామె ప్రియుడిని కవ్వించిన ప్రేయసి కంపం కలిగి స్తనాలు ఊగి ,మన్మధ వికారం అని పించింది .సవతిని నీటితో సరదాగా తడపటం చూసి ఒక నాయిక సహించలేక పోయింది .ఇలా ఇస్టాపూర్తిగా జలక్రీడ పూర్తి చేసి ,తీరం చేరారు .స్త్రీల విరహం తాళలేక ముందుకు నది సాగిపోతోందా అని పించింది .ఆప్తులు దూరమైపోతుంటే కొంత దూరం సాగనంపటం ఆనవాయితీ –‘’ఉత్సర్పి తోర్మియ లంఘిత తీర దేశ –మౌత్సుక్య నున్నమివ వారి పురః ప్రతస్థే ‘’.వీరు తీరం చేరగానే చక్రవాకాలు వేరే తీరానికి  వెళ్ళాయి .కమలశోభ తగ్గింది .ఆకాశ గంగా జలంతో వాళ్ళ హారాలమాలిన్యం వదిలిపోయి ప్రకాశించాయి.వాళ్ళు నక్షత్రాల వెన్నెల రాత్రుల్లా శోభించారు –‘’సంరేజిరే సురసరిజ్జల దౌత హారా –స్తారా వితాన తరలా ఇవ యామవత్యః’’.అప్సరసల అంగరాగ చందనం కలిసి గంగాజలం రంగుమారింది తొందరలో తెగిన హారాల మణుల కాంతి చేరటం తో అనేక రంగుల హ౦గు ,పొంగు పొందింది .నది దేవకాంతల పుక్కిలి౦పులతో అలలేర్పడ్డాయి .వీటన్నిటితో నది శయనీయ పడక శోభ పొందింది .-‘’సంక్రాంత చందన రసాహిత వర్ణ భేదం –విచ్చిన్న భూషణ మణి ప్రకరాంశు చిత్రం –బద్ధోర్మి  నాక వనితా పరి భుక్త ముక్తం –సింధోర్బ భార సలిలం శయనీయ లక్ష్మీం ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.10 అష్టమ సర్గ -1

కిరాతార్జునీయం-.10

అష్టమ సర్గ -1

తమకోసం నిర్మించుకొన్న గ౦ధర్వ నగరం లో అప్సరసలు వనవిహారం చేయాలని బయల్దేరారు .ఆనగరం నానా వర్ణాలతో ఇంద్ర ధనుస్సును తలపిస్తోంది .-‘’సురా౦గనా గోపతి చాప గోపురం –పురం వనానాం విజి గీర్షయా జహుహ్ ‘’తమ ప్రియులైన గంధర్వులతో వనవిహారం చేస్తుంటే వాళ్ళ కాంతి పర్వత శిఖరాలపైఉన్న వృక్షాలు,తీగలపై  ప్రసరించి విద్యుత్ కాంతులతో మెరుపు లేమో అనిపించాయి .అప్సరలు భూమిపై సంచరించటం వలన ఆకాశ గమనం కంటే ఎక్కువ సంతోషం పొందారు .నేలపై నడవటం తో ఎత్తైన పాలిండ్ల శ్రమ ,జఘన పరిశ్రమ కూడా తొలగి పోయింది .కంకణాది కాలి అందేల ధ్వని కూడా అందం పెరగటానికి కారణమైంది .చెట్లు వంగి వారిపై పుష్ప వృష్టి కురిపిస్తున్నాయి .వాళ్ళ శరీర అ౦గ రాగాల పరిమళాలకు ఆకర్షింపబడి తుమ్మెదలు వాళ్ళనే ముసరు తున్నాయి  .లత్తుక ఉన్న అరచేతులు ,చిగురాకులు  గా ఉన్న గోళ్ళకాంతులు పూల గుత్తులేమో అనుకొని తుమ్మెదలు వాళ్ళ మీద వాలుతున్నాయని భావం .అశోక వృక్ష౦ కొమ్మపై తుమ్మెదలు పూల మకరందం తాగుతుంటే చిగురాకులు అల్లాలాడు తుంటే అప్సరలు ఆనందంగా చూశారు .ఈ దృశ్యం ప్రియుడు అధరోస్టం పానం చేస్తూ కొరికితే చేతులతో దులపరించుకొనే నాయిక  లా కనిపించింది .-‘’విదంబ యంతీ దదృశే వధూ జనైహ్ –రమంద దష్ఠ కరా వధూనాననం ‘’.ఒక అచ్చర మరో అప్సరసతో ‘’చిగురాకుల్లా మనోహరంగా ఉన్న చేతుల్ని అనవసరంగా ఎందుకు విదిలిస్తావ్ ?తుమ్మెదల బారు కల్పలత అనే భ్రాంతితో నీ దగ్గరకు చేరింది భయం అక్కర్లేదు ‘’అన్నది .ప్రాణాయా కోపంతో ఉన్న నాయిక చెలి ‘’కోపం వదిలి ప్రియుని చేరు .మనసు చంచలమైనది .తర్వాత పశ్చాత్తాపం పడతావు ‘’అని చెప్పి ప్రసన్ను రాలిని చేసింది .

   ఆ వనం లోని నదులు ఎత్తుగా పెరిగిన కాశ గడ్డి అనే వస్త్రాలను చుట్టుకొన్నాయి .ధ్వనిస్తున్న బెగ్గురుపక్షుల బారు మొలనూలుగా ఉంది .ఎత్తైన తీర ప్రాంత ఇసుకతిన్నెలే పిరుదులు  .ఎత్తునుంచి పడే నీటి బిందువులు ముక్కలుగా చెదరి అన్ని వైపులకు వ్యాపింఛి ముత్యాల్లా స్వచ్చంగా ,ప్రియుని చల్లని ఒడి గా ఉన్నాయి.వనం యొక్క హాసమా అన్నట్లు తెల్లగా ప్రకాశిస్తున్నాయి –‘’ప్రియాంక శీతాః శుచి మౌక్తిక త్విషో-వన ప్రహాసా ఇవ వారి బిందవః ‘’నిశ్చలంగా ఉన్న తుమ్మెదలేకాటుకగా ఉన్న పుప్పొడి ,పుష్పాలు అనే నేత్రాలతో తమ ప్రియ చెలికత్తెలను నమ్రభావంతో చూస్తున్నాయా అన్నట్లు వంగి ఉన్న తీగలు వనానికి శోభ కూరుస్తున్నాయి .-‘’స్థిర ద్విరేఫా౦జన శారి తోదరై-ర్విసారిభిహ్ పుష్ప విలోచనై ర్లతా ‘’.

  చందన వృక్షాలను మద గజాలు గండ స్థలాలతో రాసు కొంటుంటే ,అవి శ్యామల వర్ణంపొంది పర్వత పైభాగాలకు చేర్తున్నాయా అని పించాయి .వీటికి అప్సరసలు ఆన౦దించారు .అందుబాటులో పూలున్నా ప్రియ రాళ్లకోసం గంధర్వులు తామే కోసి సంతోషం కలిగిస్తున్నారు .ఒక గంధర్వుడు పూలు కోస్తూ మరో నాయిక పేరు పలకగా నాయిక నీరు నిండిన కళ్ళతో పాదాలు నేలకేసి రాసి,కోపం ప్రకటించింది .ఒక అప్సరస ప్రియుడితో మాట్లాడుతూ చూపు అతనిపైనే లగ్నం చేసింది .కొకముడి ఊడినా గుర్తి౦చ లేదు .వేరే వస్త్రమూ కట్టుకోలేదు చేతులు వృధాగా పూలపై పడటమూ గమనించలేదు .ప్రియునిమాటలు ,రూపాలకు ఆమె మత్తెక్కి పోయి౦దన్నమాట .ప్రియుడు పూలదండకట్టి ఇస్తే తలలో తురుముకొని ఒకనాయిక అతనికి చనులతో, విశాలమైన పిరుదులతో గట్టి  ఆలింగన సౌఖ్యం కలిగించింది .ఒకావిడ లావైన పిరుదులతో లేవటం తో, కొకముడి వీడి వ్రేలాడింది .పై వస్త్రం జారిపోయి స్తనాల అందం బయట పడింది. శరీరం సాగి పొట్టపై ముడతలు మాయమై నూగారు స్పష్టంగా కన్పించింది .పైపొట్ట ను చాచ న౦దున తో పొట్టిదై౦ది .పూలుకోసే నెపంతో ప్రియుడిని అంగాంగ సౌందర్యం ప్రదర్శిస్తూ కవ్విస్తోంది ఒకామె . నాయిక కంట్లో పుప్పొడి పడగా ప్రియుడు తొలగించటానికి నానా హైరానా పడ్డాడు .ఆమె ఎత్తైన లావైన పాలిండ్లతో అతడిని కుమ్మేసింది ..అప్సరసలు వనం లోని ఆకులు పూలు అలంకరించుకొనగా వనలక్ష్మి శోభ వారినే వరించింనిపించింది .

 ఇప్పటిదాకా మనల్ని చెట్లూ చేమలూ నదులు ఇసుకతిన్నెలచుట్టూ తిప్పి అప్సరసల కామ చేష్టలను విపులంగా వర్ణిస్తూ ,అర్జునుడు ఏమయ్యాడో ఆ గోడే పట్టించుకోకుండా అతనిపై చూపాల్సిన ఈ మన్మధ వికారాల్ని ఇక్కడే ఇప్పుడే తమలో తాము చూపుకొంటూ ,చూపుతూ ‘’ట్రయల్ రన్’’ గా చూపిస్తూ  , వర్ణలతో కమ్మేసి ,కుమ్మేశాడు కవి భారవి .తర్వాతైనా కధ ఒక అర౦గుళమైనా కదుల్తుందేమో రేపు చూద్దాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

“శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ”

“శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ” with yougabbita prasad shared “శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ” with yougabbita prasad shared “శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కొత్తగా ఏర్పాటు చేసిన c.c.కెమెరాల సాక్షిగా24-11-20 కార్తీక రెండవ మంగళవారం ఓంకార ,స్వస్తిక, త్రిశూల దీపాలంకార శోభ ” with youhttps://accounts.google.com/AccountChooser?Email=gln.sarma@gmail.com&continue=https://photos.google.com/share/AF1QipMNOzJg5DoM1jj8LvmndhDolHu6cukgdqxA4xGhhRYpWZCznRLcvPYegTvr0g6i6w?key%3DZ3BQczN3VU8yLUFXNmhfNVZLa3JKOV9aVEhySUdR

Posted in దేవాలయం | Leave a comment

కిరాతార్జునీయం-.9 సప్తమ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.9

సప్తమ సర్గ -2(చివరి భాగం )

ఇంద్రకీలం పై సమతల నదీ తీర ప్రదేశం మీదఇసుకలో  గుర్రాలు దిగాయి .ఆకాశ గమనం లో ఆరితేరినవి కనుక వాటికి సమతలం చేరటం సులభమే .ఇసుకలో వాటి గిట్టల గుర్తులు స్పష్టంగా కనిపించాయి .ధ్వనిస్తూ పారే నదుల తో పర్వతం పైభాగాన ప్రతిధ్వని విన్న నెమళ్ళు మేఘ గర్జన భ్రాంతి తో తలలు పైకెత్తి ఆసక్తిగాచూస్తున్నాయి –‘’ఉద్గ్రీవై ర్ఘన రవ శంకయా మయోరైహ్ –సోత్కంత ధ్వని రుపశుశ్రు వే ర ధా నాం ‘’.పైన ఉన్న నీల మణుల నుండి నిరంతరం ప్రసరిస్తున్న కాంతులతో పైనుండి పడే జలధార బాగా నీలం రంగుపొంది ఆకాశం మధ్యలో పగిలిందా అని అచ్చరలు అచ్చెరువుతో చూశారు .-‘’విచ్ఛిన్నా మివ వనితా నభో౦తరాలే-వప్రామ్భః స్రుతి మవలోక యాంబభూవుహ్ ‘’.దిగ్గజాలు అడవిలోని మదపు టేనుగుల్ని చూసి ,కోపం తో మావటి వాడిని కూడా లెక్క చేయకుండా తమ ఆడ ఏనుగులపై మనసు పడి ముందుకు సాగాయి .రధ చక్రాల వలన ఎగసిన యెర్రని ధూళి తో దేవతా స్త్రీల సేన అడవుల్లో వ్యాపించింది .వర్షాకాలం మొదట్లో యెర్రని నీరు గల గంగానదిలా సేన కనిపిచింది .-‘’అతేనే వనగహనానివాహినీ సా –ఘర్మా౦తక్షుభిత జలేవ జహ్ను కన్యా ‘’.

  గంగా తీర అందమైన వాస యోగ్యమైన ప్రదేశం లో అందరూ బస చేశారు .మణులకాంతి లాంటి ఇసుకతిన్నెలు ,చెట్ల నుంచి రాలిన పూలతో నిండిన ,దట్టమైన పచ్చిక పరచిన ప్రదేశం అది .ఇంద్రకీల౦  పై గ౦ధర్వ సేన ,పూర్వం ఎరుగని శోభ పొందారు .మహాత్ముల సంబంధం వలన సమకూరనిది ఏముంటుంది ?-‘’సమసక్తౌ కిమ సులభం మహోదయానా-ముచ్ఛ్రాయాంనయతి యదృచ్ఛయాపి యోగః ‘’.పరిమళ భరిత పూల చెట్ల శోభ ,నిర్జన ప్రదేశం ,కొత్తగాచిగిర్చిన తీగల సంపద ఉన్న ప్రదేశమది .ఆ సౌఖ్యం అప్సరసలుఅనుభవి౦చటం తో అది సాఫల్యం పొందింది .ఇతరులకుపయోగించేదే సంపద .-‘’సాఫల్యం యయు రమరా౦గనొప భుక్తాః-సా లక్ష్మీ రుపకురుతే యయా పరేషాం’’.అలసిన ఆస్త్రీలు చందన వృక్షాలున్నా చల్లదనం పొందలేకపోయారు .ఆ చెట్ల కొమ్మల్లో ఉన్న పాముల శ్వాస తో చిగురాకులు కదులుతుండగా భయపడ్డారు .చెడ్డ వారిని చేర దీసిన రాజు కూడా దూరంగా ఉంచదగిన వాడే కదా .-‘’క్లా౦తోపి త్రిదశ వధూ జనః పురస్తా –ల్లీనా హిశ్వసి త విలోల పల్లవానాం –సేవ్యానాం హత వినయై రివా వృతానాం-సంపర్కం హత వినయై రివా వృతానాం-సంపర్కం పరి హరతి సమ చందనానాం ‘’.

మావటి వాళ్ళు ఏనుగులపై ఉన్న ధ్వజ, కవచ, గుడార సామాను నేలపై దించి ,ఏనుగుల్ని సమప్రదేశం లో వదిలారు .ప్రళయ కాలం లో వీచే గాలి చెట్టు, చేమలను కూల్చగా బోడిగా కనిపించే పర్వతాలలాగా ఆ ఏనుగులు నేలపై పడుకొని కనిపించాయి –‘ ‘’అక్షిప్తద్రుమ గహనా యుగాంత వాతైహ్ –పర్యస్తా గిరయః ఇవ ద్విపా విరేజుహ్ ‘’.ఒకగాజరాజు ప్రయాణపు బడలికతో వచ్చే నిద్రను వదిలి ,మదజలం తో బురదగా మారిన ఆచోటును వదిలేసింది .అప్పుడే మద వాసనకు ఆకర్షితమైన తుమ్మెదలు అక్కడికి చేరాయి .ఆదృశ్యం తొందరలో ఏనుగు లేచినప్పుడు తెగిన కట్టేసే త్రాడా అన్నట్లుగా తుమ్మెద పంక్తి కనిపించింది .-‘’శయ్యాంతే కులమలినా౦ క్షణం విలీనం –సంరంభ చ్యుత మివ శ్రుమ్ఖలం చకాశే ‘’

 లేచిన ఏనుగు కు గంగా ప్రవాహం అడ్డు పడింది .అంకుశంతో బలంగా తలపై మావటి పొడిచినా లెక్క చేయలేదు .గంగ నీరు తాగి,తొండం తో మావటికి భయపడుతూనే నీరు పైకి చిమ్మింది .ఆ నీరు యెర్రని మదధారలుగల గండ స్థలం నుంచి కిందికి జారుతూ గంగనీరూ ఎరుపెక్కింది .మరో ఏనుగు దాహంగా ఉన్నా ,ఏనుగు మద జలం తో కలిసిన ఆ నీటిని తాగటానికి ఇష్టపడక ,వాసన చూసి కోపం తో రెండవ తీరం వైపు కళ్ళు తిప్పి చూసి ,అది చల్లని నీరే అయినా తాగలేదు .గంగలో జలక్రీడ చేస్తున్న ఏనుగులు మదజలం తో గంగనీటిని పరిమళ భరితం చేసి ,కమలాల పచ్చని కేసరాలతో గండ స్థలం పై ఉన్న యెర్రని మద రేఖలను కప్పుకొని ,ఒడ్డుకు చేరాయి –‘’కింజల్క వ్యవహిత తామ్రదాన లేఖై-రుత్తేరుహ్ సరసిజ గన్ధిభిహ్ కపొలైహ్ ‘’.సేన ధూళి గంగనీటిపై చేరి ,తరంగాలు తీరాన్నితాకుతూ ,ఏనుగులు తు౦చేసిన తామర పూల పుప్పొడి పచ్చగా వ్యాపించి నదికి మా౦జిస్ట(Rubia cordifolia Linn)-(ఎరుపు ,పసుపు రంగుల  సమ్మేళనరంగు ) రంగు కల వస్త్రం లా శోభ కూర్చింది .మాన్జిస్ట  రక్తశుద్ధికీ ఉపయోగపడే వనౌషధ తీగ-‘’మతన్గోన్మధిత సరోజ రేణుపింగం –మాంజి స్టం వసన.మివాంబునిర్బభాసే ‘’

  ఇరుగుడు చెట్లకు కట్టబడిన ఏనుగులు వెనక పాదాలూ భుజాలూ కదిలిస్తూ ముందు వెనుకలకు ఊగుతున్నాయి. మద ధారలు కారుతున్నాయి .చూడటానికి అవి నీటి ధారలతో తడిసి పర్వత గండ శిలలు జారి పడుతున్నాయా అని పించాయి .-‘’సంప్రాప్తే నిస్తృత మదా౦ బు భిర్గజైహ్ –ప్రస్యందిప్రచలిత గండ శైల శోభా ‘’.సప్త నాడుల ద్వారా యెడ తెరిపి లేకుండా మదాన్ని వర్షిస్తుంటే నేలపై దుమ్ము అణగిపోయింది .ఆమదజల పరిమళం ఏలకు తీగల వాసన లాగా ఉంది .వాయువు ఈ సుగంధాన్ని అంతటా వ్యాపింప జేస్తోంది .దిగ్గజాల ఘీ౦కారాలను విన్న సింహాలు నిద్ర చెదిరి సంక్షోభం పొందాయి. చకోరాలు  నెమళ్లు మేఘ గర్జన అని భ్రాంతి చెందాయి –‘’అకేతను శ్చకిత చకోర ,నీలకంతాన్-కచ్చాంతా నమర హేభ  బృంహి తాని ‘’.దీవ సేన విడిది చేసిన ప్రదేశం చక్కగా అలంకరించ బడి,ఉద్యానవన శోభ పొందింది అప్సరసలు మార్గాయాసం పోగొట్టుకోవటానికి వస్త్రాలు, ఆభరణాలుతీసేసి చెట్ల కొమ్మలకు తగిలించారు .చెట్ల నీడలో సేద తీరుతూ   ఆ ఉద్యానవన శోభలో మైమరచారు .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-. సప్తమ సర్గ -1

కిరాతార్జునీయం-.

సప్తమ సర్గ -1

దేవేంద్రుడికి నమస్కరించి అప్సరసలు తమ నివాసాలకు బయల్దేరారు .ప్రభు సన్మానం తో వారి సహజ సౌందర్యం  మరింత పెరిగింది .ఆ అందం చూడటానికి సహస్రాక్షుని కళ్ళు చాలటం లేదు.

 ఇంద్రుని సహచర గంధర్వులు ,అప్సరసలకు రక్షకులుగా అలంకరించిన రధాలు ,ఏనుగులతో  బయల్దేరారు .ఆ ధ్వని విమానాల్లోంచి ప్రతిధ్వనించి మృదంగ ధ్వనిగా వ్యాపించి వారి ప్రయాణ శోభను చాటింది –‘’శ్రీ మద్భిహ్ సరధ,గజైహ్ సురా౦గ నానాం –గుప్తానా మధ సచివై స్త్రిలోక భర్త్రుహ్ –సమ్మూర్చన్నలవిమాన రంధ్రభిన్నః –ప్రస్దానం సమభి దదే మృదంగ నాదం ‘’

సూర్య మండల౦ పై నుంచి వెడుతున్న అప్సరసలకు  గొడుగుల  అవసరం లేకపోయింది .సూర్యకిరణాలే సోకనప్పుడు గొడుగు లెందుకు అని భావం –రామాణాముపరి వివస్వతః స్థితానాం –నా సేదే చరిత గుణత్వమాతపత్రైహ్’’.గాలి ప్రతికూలంగా వీచటం తో వారి కణతలలో ఎర్రదనం ఏర్పడి ,అది మదిరాపాన వలన ఏర్పడిన ఎరుపుతో సమానంగా ఉంది .ప్రతికూల వాయువు అనటం వలన వారి ప్రయత్నానికి ప్రతికూల ఫలితమే లభిస్తుంది అనే సూచన ఉన్నది. ‘దూతానా మభి ముఖ పాతిభిహ్ సమీరై –రాయాసాద విశద లోచానోత్పలానాం –అనిన్యే మదజనితాం శ్రియం వధూనా-ముష్ణా౦శుద్యుతి జనితః కపోల రాగః ‘’.దేవతలప్రభావం తో కిందపడకుండా ఆకాశం లో నిలిచి ,వేగంగా లాగే గుర్రాల రధ సమూహం ఆకాశం లో నిరాధారం గా ఉండటం తో చక్ర భ్రమణం లేక విమాన పద్ధతినే అనుసరించి నట్లని పిస్తోంది .దేవా౦గనల చమట క్రమంగా  స్తన మండలం చేరి అక్కడి గంధపు పూతను కరిగించి పులకా౦కురాలు కలిగించాయి.నుదుటి బొట్టు చెరిగి౦ది. చమట బిందువులు ముత్యాల శోభ కలిగించాయి .అందమైన వారికి వికారం కూడా అందంగా మారుతుంది –‘’సంపేదే శ్రమ సలిలోద్గమో విభూషాం—రమ్యాణా౦ విక్రుతరపిశ్రియం తనోతి ‘’

 జండాల ఎరుపు కాంతి పొడుగ్గా సాగదీసినట్లున్నది .ఆకాశపు మెరుపు కాంతి ఒరిపిడి రాయి వలన కలిగిన బంగారపు పొడి కాంతి లో ఉంది .పూలకంటే సుకుమారులైన అప్సరసలు సూర్యకిరణ వేడికి తట్టుకొనగలగటం గంధర్వులకు  ఆశ్చర్యం కలిగించి,బ్రహ్మదేవుని సృష్టి వైచిత్రికి అబ్బుర పడ్డారు –గంధర్వైరధిగత  విస్మయైహ్ ప్రతీయే-కళ్యాణీ విదిషు విచిత్రతా విధాతుహ్ ‘’’’శరీరం లోని సప్త రంధ్రాల ద్వారా మద జలం కారుస్తున్న ఏనుగులు మేఘాల్లా ఉన్నాయి .వాటి ముఖంపై ఉన్న సిందూరం సూర్యకాంతి తో ప్రకాశిస్తోంది. బంగారు శ్రు౦ఖల మెరుపులాగా ,మదదార వర్షం లా ఉంది .-‘’సిన్దూరైహ్ కృత రుచయః సహేమ కక్ష్యాః-స్రోతోభిస్త్రిదశ గజా మదం క్షరంతః –సాదృశ్యం యయురా రుణా౦ శురాగభిన్నై-ర్వర్షద్భిహ్ స్పురిత శత హ్రదైహ్-పయదైహ్’’

  దేవా౦గనల సేన పైనుంచి గంగాతీరం చేరి౦ది. గంగా నది దిక్కులనే స్త్రీలు అల్లిన జడ లాగా కనిపించింది –‘’ఆకాశాముప రచితా మివైక వేణీం –రమ్యోర్మిం త్రిదశ నదీ౦ యయుర్బలాని ‘’.పూ దేన తాగట౦ తో మత్తిల్లిన తుమ్మెదలు ఒకే చోట చేరటం తో పరాగం తో  కలిసిన గాలి కమలాలను కదిల్చి ,గంగా తరంగ చల్లదనాన్నీ పొంది అప్సరసల శ్రమ తాపాన్ని పోగొట్టింది .-‘’ఆమత్త భ్రమర కులాకులాని దున్వ –న్నుద్ధూత గ్రదిత రజాంసి పంకజాని –కా౦తానాం- గగన నదీ తరంగ శీతః –సంతాపం విరమయతి స్మ మాతరిశ్వా’’.నుదుటి తిలకాలను తడిపి పోగొట్టినా ,వారి అలసట తీరినందున మేఘాలు వాళ్లకు సన్మాన యోగ్యమయ్యాయి .చిన్నతప్పు పెద్ద మేలును తుడిచేయలేదు కదా .అశ్వాలు గజాలు నీటిలో దిగి జలక్రీడ చేస్తు౦టే,మందాకినీ తరంగాలు పైకెగసి పైనున్న విమానాలను తాకి ,వెనక్కి వస్తున్నాయి .ఇలాంటి అనుభవం అంతకు ముందు జరగలేదు .ఆకాశానికి ఒడ్డు ఉండదు. విమానాలు అడ్డుకోవటం తో మొదటి సారే జరిగిందని భావం –‘’తత్పూర్వం ప్రతి విదధే సురాపగాయాః-వప్రాంత స్ఖలిత వివర్తనం పయోభిహ్’’.సూర్యాది మండలాల ను దాటి రధ చక్రాల అంచులకు తగిలి ,దేవతలా అరుగులు కూలుస్తూ అప్సరసల రధాలు ముందుకు వెళ్ళాయి.మేఘాలను దాటుతూ అక్కడి నీటిని కలచి వేస్తూ అడ్డు లేకుండా సాగాయి ..ఏనుగు దంతాల ఒరిపిడి తో నీటి బిందువులు రాలుస్తున్న మేఘాలు ,ఎండతాకిడి పొందిన దేవలోక ఏనుగులకు మంచి ఆనందాన్నే కలిగిస్తున్నాయి .సత్పురుషులు తాము బాధ పడుతూ కూడా ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటారు .-‘’యుక్తానాం ఖలు మహతాం పరోపకారే-కళ్యాణీ భవతి రుజత్స్వపి ప్రవ్రుత్తిహ్ ‘’.వేగంగా వీస్తున్న గాలి కాముకుడు లాగా అప్సరసల అందమైన వస్త్రాలు తొలగిస్తూంటే , వారి మణి మేఖలల (మొల త్రాళ్ళ )కాంతులు ,రెండు తొడలు కనిపించకుండా ఆవరించి ,లో దుస్తుల్లా (అండర్ వేర్ ) లా మారాయి .తరంగాల గుర్తులతో అందమైన ఇసుక ప్రదేశాల లాగా కనిపించే నీరు లేని మేఘాలు చెదిరిన కారణంగా, ఇంద్ర ధనుస్సు సరిగ్గా కనిపించటం లేదు .కాని వారు ధరించిన మణుల కాంతి ప్రసారం చేత హరివిల్లుకు సంపూర్ణత్వం సిద్ధించింది ..అక్కడ పనులు ఎలా చేయాలని మాట్లాడుకొంటూ  అప్సరసల సమూహం పక్షులు సంచరించే ఆకాశ మార్గం దాటి ఇంద్రకీల సానువు చేరింది .అక్కడ నీరు లేని తెల్లని మబ్బులు మాత్రమే ఉన్నాయి .ఇంద్రకీలం చేరిన అప్సరసలు ఆకాశ గంగ లాగా ప్రకాశించారు .వారి ముఖాలు విప్పారాయి .వారి మాటలే మద్దెల మోతగాఉంది .వారు ఆకాశ గంగనే  తలపించారు –సాతూర్యధ్వని త గభీర మా పతంతీ-భూ భర్తుహ్ శిరసి నభో నదీవ రేజే ‘’.ఆకాశ మేఘాలు కప్పులాగా ఉండగా ,కిందికి దిగే రధాల,గుర్రాల ,కళ్ళాలు లాగి పట్టు కోవటం తో వాటి శరీరము౦దుభాగం  కుంచించుకు పోయినట్లు కనిపించింది. తలలు వంచి అతికష్టం మీద గుర్రాలు భూమిపైకి చేరాయి –‘’అనిన్యు ర్నియమిత రశ్మి భుగ్న ఘోణాః- కృచ్ చ్రేణ క్షితి మవనామి నస్తురంగా ‘’.ఇంద్రకీలం పై దిగుతున్న దివిజ గజాలు రెండు ప్రక్కలా మేఘాలతో సముద్రం లోని మైనాకం మొదలైన పర్వతాల్లా కనిపించాయి –‘’మహేంద్రం నగమభితః కరేణు వర్యాః-పర్యంత స్థిత జలదా దివః పత౦తః –సాదృశ్యం నిలయన నిష్ప్రకంప పక్షై-రాజ గ్ముర్జ నిధి శాయి భిర్ణ గేంద్రైహ్’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- ఆరవ సర్గ -2.

 

కిరాతార్జునీయం-

ఆరవ సర్గ -2.

పూల కోసం చిగురాకుల దోసిళ్ళతో చెట్లను వంచుతూ ,పడుకోవటానికి కొత్త మెత్తని లేబచ్చిక తో భూమిని కప్పుతూ అనుకూల వాతావరణం ఏర్పాటు జరిగింది .మేఘాలు లేని ఆకాశం నుంచి జారే నీటి బిందువులు నేలపై దుమ్మును అణచి వేశాయి .తపో నిమగ్నుడైన క్రీడికి అన్నీ ప్రశాంత వాతావరణం కలిపిస్తున్నాయి .శుభ శకున రూపంగా ఎదురుగా ఉన్న పుష్పాన్ని చూసి ఆశ్చర్యపడలేదు .జితే౦ద్రియులకు ఫలప్రాప్తి రూప అనుభవం కూడా ధైర్యాన్ని  సడల నీయదు-‘’స జగామ విస్మయ వశం వశినాం-న నిహ౦తి ధైర్య మనుభావ గుణః ‘’

ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే తపోఫలం అనుభవిస్తున్న ఆర్జునుడిని చూసి అసూయ పడిన దేవతలు ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడేమో అని భయపడి అమరావతికి  వార్త తెలియ జేయటానికి వెళ్ళారు-‘’ఉపతస్ధు రా స్థితవిషాద ధియః –శతయజ్వనో వనచరావసతిమ్’’.

  వనదేవతలు వెళ్లి నమస్కరించి తమపనిలో జరిగిన శైదిల్యం గురించి ఇంద్రునికి  చెప్పారు .’’మహేంద్రా !పవిత్ర వల్కలాలతో ఇతరులకు అసాధ్యమైన తేజస్సుతో ఒక పుణ్య పురుషుడు ఇంద్రకీలం పై తీక్ష్ణ తపస్సు చేస్తున్నాడు .ఆ తపశ్శక్తికి లోకం తల్లడిల్లు తోంది .ఏదో గొప్ప కార్య సాధనకోసమే తపస్సు చేస్తున్నట్లు తెలుస్తోంది –‘’మహాతే జయాయ మనఘన్ననఘః –పురుషస్తపస్యతి తపం జగతీం ‘’  .అతడు భయం గొలిపే సర్పాల వంటి భుజాలతో శత్రు భయంకరమైన ధనుస్సుతో ఉన్నాడు .మహాతపస్సుతో మహామునులనూ అతిశయించాడు .

‘’అమలేన తస్య ధృత సచ్చరితా –శ్చరితేన చాతశయితా మునయః ‘’

 అతనితపస్సుకు పంచభూతాలు అనుకూలమై భక్తులా అన్నట్లున్నాయి. గాలి శుభంకరంగా ,భూమిపచ్చికతో ,ఆకాశం నిర్మలంగా ఉంటూ ,నీటి తుమ్పురులతో ధూళి అణచబడింది –‘’గుణ సంపదాను గుణతాం గమితః –కురుతేస్య భక్తి మివ భూత గణః’’.అ తపస్వికి మృగాలు కూడా కలహాలు మాని గురువుకు శిష్యుల్లా మెలగు తున్నాయి .పూల చెట్లు వంగి కోసుకోవటానికి వీలు కలిగిస్తున్నాయి .నీకు ఎలా స్వాదీనమైందో ఇంద్ర కీలాద్రి, అతనికీ అలానే స్వాధీన మైంది –‘’ఇతరేతరా నభి భవేన మృగా –స్తముపాసతే గురు మివా౦త సదః –వినమంతి చాస్య తరవః ప్రచయే –పరవాన్ స తేన భవతేవ నగః ‘’

ఘోర తపస్సులో ఉన్నా అలసట చెందటం లేదు .అందం పెరిగి శరీరం విజయ సూచకంగా ఉంది .అతడిని సందర్శించే జనం ఆ తపో వైభవానికి భయపడుతున్నారు .-‘’శామినోపి తస్య నవ సంగమనే –విభు తాను షంగి భయమేతి జనః ‘’.అతడు రుషి వంశ సంజాతుడో దైత్యుడో,రాజవంశీకుడోమేము చెప్పలేము .,సమర్దులమూ కాము .నీ వనం లో అతని వాలకం ఏమిటో అర్ధం కాలేదు ..అనేక రకాలుగా ఆలోచించి మీకు చెప్పాలో చెప్పకూడదో తెలీక ,అల్పజ్ఞానులమైన మేము ,వివేక వంతులైన ఋషులతో పోల్చుకోలేము కదా –‘’అసధ ప్యదః సహితు,మర్హసి నః –క్వ వనేచరాః క్వ నిపుణా యతయః ‘’

  మహేంద్రుడు ఆ యక్షులు చెప్పిన మాటలతో తన ప్రియ పుత్రుడు అర్జునుడే తపస్సు చేస్తున్నాడని గ్రహించి సంతోషించాడు .కానీ ఆన౦దాన్ని పైకి తెలియ నీయలేదు .ప్రభువుల ఆలోచనా రీతి నీతి మార్గాను సారంగా ఉంటుంది .-‘’అధిగమ్య గుహ్యక గణాదితిత-న్మనసః ప్రియం ప్రియసుతస్య తపః –నిజగోప హర్ష ముదితం మఘవా –నాయవర్త్మగాః ప్రభవతాం హి ధియః ‘’.సమాధి స్థితిలో అర్జునుడే అని నిర్ధారణ చేసుకొని ,అతని నియమ నిస్ట లను తెలుసుకోవాలని దేవ కన్యలతో ఒక పన్నాగం పన్ని వాళ్ళతో ఇలా అన్నాడు  –‘’ఉపలబ్దు మస్య నియమ స్థిరతాం సుర సుందరీతి వచోభి దధే’’

‘’మర్మాన్ని భేదించే అస్త్రాలు మా దగ్గర లేవు .మీలా సుకుమారంగా ఎంతదూరమైనా  వెళ్ళగలిగే నిష్ప్రయోజనం కాని ,ప్రతీకారం లేని మన్మధ విజయాన్ని చేకూర్చే దీ లేదు .’’అంటే అలాంటి గుణాలన్నీ మీవద్దనే  ఉన్నాయని భావం –అవిపక్ష మస్త్ర మపరం కతమ-ద్విజయాయ యూయమివ చిత్తభువః ‘’.యోగుల రజో గుణం తొలగించే తత్వజ్ఞానమే నీరు .అలాంటి యోగులు కూడా మీ ఓర చూపుతో యోగాన్ని వదిలేస్తున్నారు .మహా వైరాగ్యులే మీకు గులాములైతే మామూలు మనుషులు లెక్కే లేదు మీకు ‘’-పరిపీడ మానమివ వో సకలై-రవసాద మేతినయనా౦జలిభిహ్ ‘’.లోకం లోని అందాలన్నీ రాశీభూతం చేసి బ్రహ్మ మిమ్మల్ని సృస్టించాడు .అందుకే మీకోసమే,మీ పొందుకోసమే  జనం స్వర్గానికి వస్తారు .గాంధర్వం మొదలైన కళలలోనేర్పరులైన మీరు ,గంధర్వాదులతో కలసి వెళ్లి ,అతడి తపస్సు భంగం చేయండి .మీకు వశం కాని వారెవరూ ఉండరు-‘’హృత వీత రాగ మ’’నసాంనను వహః –సుఖ సంగినః ప్రతి సుఖా వజితః’’ఆ తపస్వి స్త్రీ సుఖం కోసమే తపస్సు చేస్తున్నాడు తప్ప సంసార బంధన విముక్తికి కానే కాదు .కారణం ధనుస్సు ధరించి ఉండటమే .ముక్తి హింసతో రాదు కనుక అతడు ముముక్షువు కాదు.మీపని తేలికే ‘’-అవి మృష్య  మేతదఖిల ష్యతి స –ద్విషతాం  వధేన విషయాభి రతిం-భవ వీతయే న హి తధాస విధిహ్ –క్వ శరాసనం క్వ చవిముక్తి పధః’’.ఆ తేజస్వి ఇతరమునులు లాగా కోపం తో శపిస్తాడు అనే అనుమానం వద్దు.యశస్సు కాపాడాలను కొనే వారు స్త్రీల విషయం లో హి౦సా మార్గం అవలంబించరు.కనుక భయం వద్దు .-‘’స్వయం శా౦సి విక్రమవతామవతాం –న వధూ ష్వ  ఘాని విమృశంతి ధియః’’

 తమను ఎంతగానో ప్రశంసించిన ప్రభువు ఇంద్రుని ఆజ్ఞతో ఆనందంగా అప్సరస బృందం అర్జున తపోభంగానికి సమాయత్తమై బయల్దేరారు –ప్రభువు ఆదరం పొంది నియోగించిన పనిలో నిబద్ధంగా ప్రవర్తించే  సేవకులు తేజో వృద్ధి పొందటం సహజమే –

‘’లేఖే పరాం ద్యుతి మమర్త్య వధూ సమూహః –సంభావనా హృది కృతస్య తనోతి తేజః ‘’

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-11-20-ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాణం

33ఏళ్ళక్రితం వత్సవాయి ,మంగళాపురం హైస్కూల్ హెడ్ మాస్టర్ గా నేను ఉన్నప్పుడు అటెండర్ గా పని చేసిన బాణం వెంకటేశ్వరరావు ,కుమారుడి పెండ్లి పిలుపు కోసం   మాఇంట్లో

Posted in సమయం - సందర్భం | Leave a comment

కిరాతార్జునీయం- ఆరవ సర్గ -1.

కిరాతార్జునీయం-

ఆరవ సర్గ -1.

ఇంద్ర కీల పర్వతం చేరిన ఇంద్ర తనయుడు అర్జునుడు బంగారు రంగు చరియలతో ఉన్న శిఖరాన్ని చూసి ,గంగానదికి ఎదురుగా వెడుతూ విష్ణుమూర్తి గరడుని పై అధిరోహించినట్లు   అధిరోహించాడు.తుమ్మెదల ఝ౦కారమే  జయజయ ద్వానాలుగా, గాలికి వంగి ఊగుతున్న  పూల చెట్లే వంది మాగధుల్లా పూలతో అభిషేకించాయి .-‘’పవనేరి తాకుల విజిహ్మ శిఖా –జగతీరుహో వచ్చా కరుహ్ కుసుమైహ్’’.ఇంద్ర కీలంప సానుకూలంగా గాలులు వీచాయి. తుమ్మెద ఝ౦కార౦  స్వాగతం అనిపించింది. కమలాల పరాగ పరిమళం  వెద జల్లగా, సన్నని గంగాజల బిందువులు చల్లదనం కలిగించాయి .మిత్రులు తమ స్నేహితులురాగా ఎదురేగి కౌగలించి సంతోష పరచినట్లు గాలి వీచింది –‘’’’అవధూత పంకజ పరాగ కణా –స్తను  జాహ్నవీ సలిల వీచి భిదః-పరి రేఖిరే భి ముఖమేత్య సుఖాః-సుహృదః సఖాయ మివ త౦ మరుతః ‘’

పైనుండి పడే బండరాళ్లు చూర్ణం అవుతున్నప్పటి ధ్వని ,కిందికి జారుతూ పారే నీటి గలగలధ్వని అర్జునునికి శుభ మంగళ వాద్య ధ్వని గా  భాసి౦చాయి..ఎత్తైన దేవదారు వృక్షాలను కూల్చేవేగంగా పారే గంగానది లో నీటి ప్రబ్బలి చెట్ల సమూహం ప్రణామం చేస్తున్నట్లు అనిపించాయి .ప్రవాహ వేగానికి వంగి ఆచేట్లు, వేగం తగ్గగానే నిటారుగా లేస్తాయి .అవి వినయవంతుల్లా అనిపించాయి .-‘’స దదర్శ వేతసవనా చరితాం-ప్రణతిం బలీయసి సమృద్ధి కరీం ‘’.గంగానదిలోకమలాల పుప్పొడి తో ఎర్రనైన గంగా నది జాలానికి  కలహంస సమూహం నదికి పైట లాగా అనిపిచింది –‘’సరి దుత్తరీయ మివ సంహతి మ-త్స తరంగరంగి కలహంస కులం ‘’   .ఏనుగులు దంతాలతో పోట్లాడు కొంటున్నాయి వాటి మదజలానికి తుమ్మెదలు ఆకాశం లో ఝ౦కార౦   చేస్తున్నాయి .దీన్ని చూస్తూ అలా ఉండి పోయాడు పార్ధుడు .గొప్పవారి విరోధమూ గొప్ప ఆనందాన్నే కలిగిస్తుంది .ఏనుగుల విరోధం తుమ్మెదలకు ,అర్జునుడికీ వినోదం కలిగించిందని భావం –‘’అధికాం సరోధసి బబంధ ద్యుతిం –మహాతే రుజన్నపి గుణాయ మహాన్ ‘’.ఆడ చక్రవాకం తన మగ జంట కోసం గంగా నది అలలలో వెతుకుతూ దీనాలాపం చేస్తోంది. దాని ప్రేమను అభినందించాడు క్రీడి .గంగా తరంగాలలో మణుల కాంతి ప్రతి ఫలించగా ,నదిలో మణులున్నాయేమోననుకొన్నాడు .ఏనుగును వెతకటానికి వెయ్యి కళ్ళతో చూస్తోందా నది అనిపించింది .

  నదీ తీరం లోనోరు తెరచిన ఒక  ముత్యపు చిప్పనవ వధువును మేల్కొల్పి ఆవులిస్తూ ,ఆనందాశ్రువులు రాలుస్తున్నట్లు ఉంది .ఇసుక మేట పడకగా ,చిప్ప తెరచుకోవటం ఆవలింతగా  ,ముత్యాల వరుస దంత పంక్తిగా జలబిందువులు ఆనంద బాష్పాలుగా ఉండటం అర్జునుని మనసు పరవశం చెందింది .-‘’ప్రతి బోధ జ్రు౦భణ విభిన్నముఖీ –పులినే సరోరుహ దృశా దదృశే –పతదచ్ఛ మౌక్తిక మణి ప్రకరా –గలదశ్రు బిండురివ శుక్తి వధూహ్’’.నదిలోని పగడపు తీగలు కామోద్రేకం కలిగించే దంతకాంతి గల ప్రియురాలి క్రింది పెదవి లా ఉండి,ఆ అనుభవాన్ని గుర్తుకు తెస్తోంది .నదిలో ఈదే గజాల మద గంధాన్ని ఆఘ్రాణించి ,నీటిపైకి లేచిన ఏనుగులు తమపైకి వచ్చే ఏనుగులేమో అనే భ్రమపడిన దృశ్యాన్ని చూశాడు .ఆకాశామంతా ఎత్తుకు ఎగిరే జలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు .హఠాత్తుగా తనపైకి ఎగిరే బుసలు కొట్టే పాములాగా శరత్తులోని మేఘం లాగా తెల్లగా గుండ్రం గా ఉంది .-‘’ప్రహితం దివి ప్రజవిభి శ్వసితైహ్-శరదభ్ర విభ్రమ మపాం పటలం ‘’.తీరం లోని ఇసుక తిన్నెలు చేపలు నాలుగు వైపులా ఎగరటమే నేత్రాలుగా ,దేవలోక గంగ ను చేరుతున్నాయి. విశాల పిరుదులు,చంచల ఆకర్షణీయనేత్రాలు  ఉన్న సఖుల లాగా ఆ నదులను దాటి ముందుకు వెళ్ళాడు .

 ఇంద్రకీల పర్వత మధ్య వనాన్ని పార్ధుడు చేరాడు .పుష్పించిన చెట్లు వంగి ,అలంకారమైన తీగలు చుట్టూ ఉండి,అక్కడి భూమి అత్యంత పవిత్రంగా ,వనభూమి మనసు ఆకారం పొందిందా అన్నట్లు పరమ ప్రశాంతంగా ఉన్నది –‘’మనసః ప్రసత్తిమివ మూర్ధ్ని గిరేహ్-శుచి మాససాద స వనాంతం ‘’

  ఇంద్రకీల పర్వత వనం మధ్యలోకిఅర్జునుడు ప్రవేశించాడు అది నిర్జనంగా తపస్సుకు అత్యంత ఆనుకూల్యంగా ఉందని పించి,ఉత్సాహం కలిగింది .అక్కడ యోగ శాస్త్రాను సారం అర్జునుడు బుద్ధిని స్వాధీనం చేసుకొని ,దుష్కర తపస్సు చేయటం మొదలు పెట్టాడు .తపోనియమ కస్టాలు ఏవీ అనిపించలేదు  జి తేన్ద్రియులు దుఃఖ కారకం ఏదీ ఉండదు కదా !

‘’ప్రణిధాయ తత్ర విధినా ధధియం నాథ ధియం –దధతః పురాతన మునేర్ము నితాం-శ్రమ మాదదాధ సుకరం న తపః –కిమివావ సాదకర మాత్మ వతాం’’.ఇంద్రియ జయమే ముఖ్యసాధనంగా ,పవిత్ర గుణాలతో అజ్ఞానాన్ని అణచి  ప్రతిరోజూ వృద్ధి పొందే కళలున్న చంద్రుడిలా తపస్సు వృద్ధి చేశాడు .వివేకం తో తత్వాన్ని గుర్తించి ,కామక్రోధాది వికారాలు లేకుండా ,శాంతి సుఖాన్ని అనుభవిస్తూ ,విఘ్నాలు కలిగించే విషయ వాంఛలను విసర్జించి తీవ్ర తపస్సు చేశాడు –‘’ప్రతి ఘాతినీం విషయ సంగ రతిం –నిరుపప్లవః శమ సుఖాను భవః ‘’.త్రికరణ శుద్ధిగా ఇంద్రుని మెప్పించే తపస్సులో మగ్నమానసుడైన అర్జునుడు స్వభావ సిద్దాలైన వీర శాంత రసాలకు పుష్టి చేకూర్చే తేజస్సులను ఒకే సారి ధరించాడు .అంటే వీరోచిత శస్త్రాస్త్రాలు ఉన్నా ,అహింస ,శాంతి మొదలైన తాపస గుణాలను ధరించి ,ఉపాసన చేబట్టాడు .-‘’సహ జేతరౌ జయ శమౌ దధతీ-బిభారాం బభూవ యుగ ప న్మహసీ ‘

  మరకత మణి శరీర ఛాయతో ,నియమ  నిష్టలవలన ఎరుపు రంగు జడలు తలనిండా వ్యాపించి అర్జునుడు తమాల వృక్షం లాగా కనిపిస్తున్నాడు –‘’ఉపమాం యయావరణ దీదితి భిహ్ –పరి మృస్ట మూర్ధని తమాల తరౌ ‘’.ఆయుధ ధారి అయినా ,శాంతం తో సామాన్య మునిజనాన్ని మించి పోయాడు .రజో గుణం లేనందున మృగాలకూ విశ్వాస పాత్రు డైనాడు .దయా దాక్షిణ్యాలు ఎవరినైనా వశం చేసుకొంటాయి .పరిశుద్ధ ప్రవర్తనే విశ్వాసానికి కారణమౌతుంది –‘’రమయాం చకార విరజాః స మృగాన్-కమి వేశతే  రమయితాం న గుణాః’’.వాయువు మెల్లగా వీచి సుగంధం వెదజల్లుతూ సహకరిస్తూ గ్రీష్మం లోని వేడిని తగ్గించి చల్లగా స్పర్శనిస్తోంది తపస్సు చేస్తున్న అర్జునుడికి ‘’.’

‘’అనుకూల పాతిన మచండ గతిం .కిరతా సుగంధి మభితః పవనం –అవదీరితార్తవ గుణం సుఖతాం –నయతా రుచాం నిచయ మంషు మతః ‘’

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-11-20-ఉయ్యూరు

‘’-

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-3(చివరి భాగం)

కిరాతార్జునీయం-

అయిదవ సర్గ-3(చివరి భాగం) .

శంకరుడు పార్వతి పాణి గ్రహణం చేసేటప్పుడు శివుడి చేతి కంకణం వంటి సర్పం జారి పడితే , భయపడిన  శుభావహమైన ఓషధులున్నపార్వతి చేతిని గ్రహించాడు .ఆమె చూపులూ భయం పొందాయి –‘’విన్యస్త మంగళ మహౌషధరీ శ్వరాయ –స్రస్తోరగ ప్రతి సరేణ కరేణ పాణిహ్’’.పర్వత మణి కాంతులు ఆకాశం లోకి వ్యాపించగా ,పైనుండి సూర్య సహస్ర కిరణాలు కిందికి ప్రసరించి ,కలిసిపోయి సూర్యుడికి ఉన్న ‘’సహస్ర రశ్మి ‘’అనే సంఖ్యా పదం దాటి పోయింది .త్రిపురాసుర సంహారం చేసిన శివుని సంతోష పరచటానికి కుబేరుడు ఇక్కడ కైలాస పర్వతం లో అలకా పురిని ఉన్నత శిఖరాలతో  నిర్మించాడు.ఇక్కడికి రాగానే సూర్యుడు ఆకాలం లో అస్తమిస్తున్నట్లు కనిపిస్తాడు .అంటే గోపురాలు అంత ఎత్తుగా ఉన్నాయని భావం –‘’స ఏష  కైలాస ఉపా౦తసర్పిణః-కరోత్య కాలాస్తమయం  వివస్వతః ‘’  .

 పర్వత శిఖర వివిధ మణి కాంతులు శరత్తులో నీరు తగ్గటం వలన మేఘాలలో అస్పష్టంగా ఇంద్ర ధనుస్సును పూరించటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించాయి .శంకర శిరసులోని చంద్రుని కాంతి, కొత్తగా చిగిర్చిన చెట్ల చిగురాకులను తడిపేవి .అమృతం స్రవించే చంద్ర కిరణాలతో కృష్ణ పక్షం రాత్రులలో కూడా  అరణ్యాన్ని తెల్లగా చేస్తున్నాయి .కైలాస పర్వతం విశాలమైన దుప్పటి లాగా వనాన్ని బంగారు కాంతి మయం చేస్తోంది..బంగారు మయాలైన గుహలు మీ తండ్రి ఇంద్రునికి చాలా ఇష్టం అందుకే ‘’ఇంద్ర కీలాద్రి ‘’అయి౦దన్నాడు యక్షుడు అర్జునునితో .—ఆయ మానేక హిరణ్మయ కందర –స్తవ పితుర్దయితో జగతీ ధరః ‘’’ఇంద్ర కీలాద్రి నుంచి సూర్యకాంతి రెండింతలై ,దగ్గరలోని భూ ప్రదేశాలను కాంతిమంతం చేస్తోంది అది మెరుపుల కాంతిని  అనుక రిస్తో౦దని  పిస్తోంది .

 మదజలం తో తడిసిన చందన వృక్షాలు ఐరావతం వచ్చి వెళ్ళిన జాడ తెలియజేస్తోంది .దాని రాపిడికి భయపడి పాములు పారిపోయాయి .ఇంద్ర నీల మణుల కాంతితో సూర్య కాంతి కలిసిపోయి గుహ కాంతి విహీనమైంది . అది సూర్య కాంతిని చీకటి కప్పేసినట్లున్నది .ఇంద్ర నీల పర్వతం పై శాంత స్వభావం ఉన్న వాడైనా ,అప్రమత్రంగా శస్త్రం తో సిద్ధంగా ఉండాల్సిందే అని  మహర్షి వ్యాసుడు నీకు ఉపదేశించి నట్లు ఇక్కడ అర్జునా నువ్వు తపస్సు చేయాలి .మంచి పనులకు విఘ్నాలుఎదురౌతాయి .కనుక సర్వ సన్నద్ధంగా తపం చేయి –‘’భవ్యో భవన్నపి మునేరిహ శాసనేన –క్షాత్రే స్థితః పధి తపస్య హత ప్రమాదః –ప్రాయేణ సత్యపి హితార్ధ కరే విధౌ హి-శ్రేయాంసి లబ్దు మసుఖాని వినా౦త రాయైహ్’’

అర్జునా !గుర్రాల్లా చంచలమైన నీ ఇంద్రియాలు చెడు మార్గం లో పోనివ్వకు. తపస్సులో ఉన్న క్లేశాన్ని తొలగించి శంకరుడు నీ ఉత్సాహం పె౦పొ౦ది౦చు గాక .లోక పాలకులు నీ సాధన అనుస్టానాన్నిఅధికంగా ఫలవంతం చేయుగాక –‘’మా భూ న్న పధహ్రుతస్త వే౦ద్రియాశ్వాః-సంతాపే దిశతు శివాఃశివాం ప్రసక్తీం-రక్షం తస్తపసి బలం చ లోక పాలాః-కళ్యాణీ మదిక ఫలాం క్రియాం క్రియాసు ‘’

‘ఇలా యక్షుడు చెప్పాల్సిన హితోక్తులన్నీ చెప్పి ,తన స్థానానికి వెళ్ళిపోయాడు .అర్జునుడు ఉత్కంఠ పొంది ఆలోచనలో పడ్డాడు.ఇస్టు లైన సత్పురుషుల ఎడబాటు బాగా బాధ కలిగించటం సహజమే కదా –‘’ ‘’ఇత్యుక్త్వా సపది హితం ప్రియం ప్రియార్హే –ధామ స్వం గతవతి రాజరాజ భ్రుత్యే –సోత్క౦ఠం  కిమపి పృదా సుతః ప్రపద్యౌ –సంధత్తే భ్రుశ మరతిం హి సద్వియోగః ‘’

పరిపూర్ణమైన ఉత్సాహ లక్ష్మీ సమేతుడై అర్జునుడు ఆ ఇంద్ర కీలాద్రి పర్వతం చేరాడు.దాన్ని ఏ బలం తోనూ అతిక్రమించ లేం.ఇది సత్వర ఫలితాలనిచ్చేదికూడా .తానూ చాలాకాలం గా దర్శించాలనుకొన్నదీ కూడా ఈ ఇంద్ర కీలాద్రే .అందుకే ఇక్కడ తపస్సుకు ఎన్నుకొన్నాడు అర్జునుడు –‘’తమనతిశయనీం సర్వతః సార యోగాత్ –దవిరహిత మనేకానాం కభాజా ఫలేన –అకృశమకృ శ లక్ష్మీ శ్చేత సా శంసితం స –స్వమివ పురుషకారం శైల మభ్యా ససాద ‘’

ఐదవ సర్గ సంపూర్ణం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-2.

కిరాతార్జునీయం-

అయిదవ సర్గ-2.

యక్షుడు అర్జునునితో ‘’తెల్లని మంచు తో ఉన్న హిమవన్న గ శిఖరాలు ఆకాశాన్ని అనేక భాగాలుగా చేస్తున్నాయి .అంటే ఈ పర్వతాన్ని చూసిన వారి పాపాలు తొలగిస్తోంది .పర్వతం మధ్యభాగం లోని వృక్షా లెక్కిచూసి  దాన్ని కొంచెం గా నే వర్ణించ గలం.వేదాలు కూడా పరమాత్మను కొంచెమే పరిచయం చేయగలవు .బ్రహ్మ మాత్రమే దీన్ని వర్ణించ గల సమర్ధుడు –‘’ఇహ దురధిగమైహ్ కించి దావాగమైహ్ –సతత మసుతరం వర్ణ యంత్యంతరం –అము మపి విపినం  వేద దిగ్వ్యాపినం –పురుష మివ పరం పద్మయోనిహ్ పరం ‘’.ఇది భర్త్రు సంగమం తో తృప్తి చెందినా ,మానవతులైన స్త్రీలు అక్కడి చిగురాకులు ,పూల పూలదరిళ్ళు,సుందర సరోవరాలు ప్రేరేపిస్తే మళ్ళీ భర్త సమాగమాన్ని కోరుతున్నారు .నీతి గల భాగ్య శాలికి  ఇది ఎప్పుడూ సులభమైనదే నవనిదులున్న కుబేరునీ ప్రసన్నం చేస్తుంది అత్యంత ధన సంపదలతో ఇది పరిపూర్ణ మైంది .కనుకనే భూ, స్వర్గ  పాతాళాలను కూడా అధిగమించి శోభిస్తోంది –‘’సులభైహ్ సదా నయత వతా యవతా –నిధి గుహ్య కాధిపరమైహ్ వరమైహ్ –యమునా ధనైహ్ క్షితి భ్రుతాతి భ్రుతా –సమతీత్య భాతి జగతీ జగతీ ‘’.

  ‘’ముల్లోకాలూ దీనితో సరి తూగలేవు .ప్రజలు గుర్తించని వైభవం గల శివుడే ఇక్కడ సదా ఉంటున్నాడు కనుక ధర్మ క్షేత్రం కూడా ఇది .’’అధి వసతి సదా యదైనం జనై-రవిదిత విభావో భవానీ పతిహ్’’.పునర్జన్మ ,ముసలితనం భయాలు లేని బ్రహ్మజ్ఞానం అంటే ముక్తి పొందగోరే ముముక్షువులకు శాస్త్ర జ్ఞానం లాగా హిమాలయం అజ్ఞానం పోగొట్టి, తత్వజ్ఞానం కలిగిస్తుంది .కనుక భోగభూమి మాత్రమె కాదు ఇది యోగభూమీ ,ముక్తిప్రద పుణ్య క్షేత్రం కూడా .-

‘’వీత జన్మ రసం పరం శుచి –బ్రహ్మణః పద ముపైతు మిచ్ఛ తాం-ఆగమాదివ తమోపహాదితః –సంభవ౦తి మతయోభవచ్ఛిదః’’

ఇక్కడ దేవతాస్త్రీల కోసం పూలపాన్పులు వారి వివిధ సురత విధానాలను సూచిస్తున్నాయి .కాలి లత్తుక రసం అక్కడ ముద్రిత మైంది వాడిన పూలహారాలు రాలి పడ్డాయి .పొర్లటం తో ఏర్పడ్డ మడతలు వారి కామోద్రేకాన్ని ,ఆశతో జరిపిన సురత క్రియ విశేషాలను తెలియ జేస్తున్నాయి .ఈ పర్వతం లోఓషధులు నీతిగల రాజు విషయంలో రాజ్య లక్ష్మి సదా నివసించి నట్లు ,ఈ క్షేత్ర గుణాన్ని పొంది ,రాత్రిం బగళ్ళు వెలుగుతున్నాయి .-‘’నయశాలిని శ్రియ ఇవాధి పతౌ –విరమంతి న జ్వలితు మౌషధయః  ‘’.ఇక్కడి గోరువంకలు అరుస్తున్నాయి .పూల బరువుతో చెట్లు వంగాయి .సరస్సులు కమలాలతో శోభాయమానంగా ఉన్నాయి .విశాల మైన కొమ్మలతో చెట్లున్నాయి .వేడిని తగ్గించే నదులు  ఏనుగులకు ప్రీతి కల్గిస్తున్నాయి .తుమ్మెదలున్న మామిడి పూ గుత్తి గంధం తోసమానమైన మద జలం కారుస్తూ పరిమళం వెదజల్లుతున్నాయి .దేవతా గజేంద్రాలుతమ కపోలాల దురద పోగొట్టు కోవటానికి మామిడి చెట్లను రాసు కొంటుంటే వసంతం రాకపోయినా ,కాలం కాని కాలం లో కోయిలలు ఆ పరిమళానికి ఆకర్షింప బడి మదాన్ని పొందాయి –‘’సదృశ్యం గత మపనిద్ర చూత గంధై-రామోదం మదజల సేకజం దధానః –ఏతస్మి న్మదయతికోకిలా  న కాలే -లీనాలిహ్ సుర కరిణా౦ కపోల కాషః’’

‘’అప్సరసల కటి ప్రదేశాలతో అందమైనదీ ,కలకలారావం చేసే నదాలతో హిమవంతం ,పాతాళ లోక రక్షకుడైన వాసుకి కి అత్యంత ప్రీతి పాత్రమైన అమృత౦ చాలాకాలం గా ఉండటం వలన ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు .అంటే పాతాళ ,భూలోకాల్లో అమృతం లేదు,ఇక్కడే ఉంది  అని భావం –‘’మతా ఫణవతోవతో రసపరా –పరాంత వ సుధాసుధాధివసతి  ‘’.హిమాలయాలలో అందమైన పొదరిళ్ల భవనాలు ,ప్రకాశించే ఓషధులే దీపాలు .హరి చందనం అంటే కల్ప వృక్ష చిగురాకులే పడకలు ,సురత శ్రమ పోగొట్టే కమల వనాల వాయువులు దేవతా స్త్రీలకు స్వర్గాన్ని కూడా గుర్తు చేసుకో నివ్వటం లేదు .అంటే స్వర్గ సుఖాలన్నీ ఇక్కడే లభిస్తున్నాయి .ఇక్కడే పార్వతి చాలాకాలం నీళ్ళల్లో ఉండి తపస్సు చేసింది నీటిలో ఎగిరే చేపలను ఆమె చంచల నేత్రాలతో చూసింది .అలాంటి పార్వతిని చెమట బిందువులు కారుతున్న వేళ్ళున్న చేతులతో శివుడు పట్టు కొన్నాడు .చెమట సాత్విక భావం .ఇక్కడ శివ పార్వతీ కల్యాణం శోభాయమానంగా జరిగింది –

‘’ఈశార్ద మంభసి చిరాయ తపశ్చరంత్యా –యాదో విలంఘన విలోల విలోచనాయాః-ఆలంబతాగ్ర కరమత్ర భవో భవాన్యాః-శ్చోతన్నిదాఘ సలిలితాంగు లినా కరేణ’’

దేవ దానవులు అమృతం కోసం ఈ మందరాన్నే కవ్వం గా,వాసుకిని తాడుగా  చేసి సముద్రం చిలికారు .మధన సమయం లో నీరు అటూ ఇటూ నాలుగు వైపులా యెగిరి పడటం తో పాతాళలోకం స్పష్టంగా కనిపించింది .అప్పు డేర్పడిన గుర్తులు మందరానికి ఇప్పుడూ కనిపిస్తాయి. మందరం ఎత్తైన శిఖారలతో ఆకాశం చీలినట్లు కనిపిస్తుంది .ఇక్కడి సూర్య కిరణాలతో వ్యాపించి ఇంద్ర నీల మణులు ఉండటం చేత బాగా ఉత్కర్ష పొంది ,హంసలతో పోలిక ఉన్న స్పటిక వెండి గోడలు మధ్యాహ్నం కూడా వెన్నెల భ్రాంతి కలిగిస్తోంది .ఈ పర్వతం పై వ్యాపించిన అనేక రత్నాల కాంతుల వ్యాపనం వలన ప్రాకారాల మధ్య గట్టి గోడలు నిర్మించినట్లు అనిపిస్తుంది .కానీ వాయు చలనం వలన ఆ భ్రాంతి తొలగి పోతోంది .కొత్త గడ్డి ప్రదేశాలు మనోహర కాంతితో ఉన్నాయి నల్లకలువల వనాలు కొత్తగా శ్యామల వర్ణం పొందుతున్నాయి .అనేక రంగుల పుష్పాల వృక్షాలు ఆకులు పండినా రాలటం లేదు .లేళ్ళు కొరకగా మిగిలిన మొదళ్ళతో మొలిచిన లేత పచ్చిక ,సూర్య కాంతితో మరకత మణుల కాంతులు కలిసి పోయి బాగా ప్రకాశిస్తున్నాయి .ఆ లే బచ్చిక లేత చిలకల రెక్కల్లా మెత్తగా ఉంది. లేళ్ళు ఆ కాంతుల్ని  లేత పచ్చిక అనుకోని నాకి వదిలేస్తున్నాయి .మెట్టతామర వనం నుంచి ఆకాశం లోకిసుడి గాలితో  ఎగిరి,ఆకాశం లో మండలాకారంగా వ్యాపించిన కమల పుష్పాలలోని పరాగం బంగారు ఛత్రం లాగా శోభించింది –

‘’ఉత్ఫుల్ల స్థల నలినీవ నాద ముష్మా –దుద్ధూతః సరసిజసంభవః  పరాగః –వాత్యాభి ర్వియతి వివర్తితః సమంతా-దాధత్తే కనకమయాత పత్ర  లక్ష్మీం’’’-ఇక్కడి గంగాతీరం లోని పద పంక్తి పార్వతీ పరమేశ్వరుల అర్ధ శరీరాల కలయికను తెలుపుతోంది .ఆ పాద ముద్రలో ఒకటి లత్తుక ముద్ర కలిగి చిన్నది గా ఉన్నది కనుక .ఉదయ సంధ్య లో ప్రదక్షిణాల వలన పద పంక్తి పరి వర్తనం చెందింది –‘’ఇహ స నియమయోహ్సురాపగాయా –ముషసి  సయావక సవ్య పాద రేఖా –కధయతిశివయోహ్ శరీర యోగం –విషమ పదా పదవీ వివర్త నేషు’’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-20-ఉయ్యూరు ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- అయిదవ సర్గ-1

కిరాతార్జునీయం-

అయిదవ సర్గ-1 .

హిమాలయం చేరిన అర్జునుడు అది మేరు పర్వతాన్ని జయి౦చా లనే కోరికతో అంటే దిగంతాలకు వ్యపించాలనే ఉత్కంఠ తో అంతటి ఎత్తుకు ఎదిగిందా అని పించింది .దానికి మూడు కారణాలు కనిపించాయి అతనికి .ఒక వైపు సూర్య కిరణాలతో ప్రకాశిస్తూ,మరో వైపు దట్టమైన చీకటి ఆవరించి ఉంది .ముందువైపు అట్టహాసంతో ప్రకాశిస్తూ ,వెనకవైపు గజచర్మ ధారి శివునిలాగా కనిపి౦చి కను విందు చేస్తోంది . .-‘’తపన మండల దీపిత మేకతః –సతత నైశతమో వృతత మన్యతః –హసిత భిన్న తమిస్ర చయం పురః –శివ మివానుగత౦ గజ చర్మణా’’

హిమపర్వత౦ లో భూలోక వాసులు ,ఆకాశం లోని వారూ ,స్వర్గం లోనివారూ కూడానివాసమున్నారు .కనుక వారికి తన వ్యాపకత్వాన్ని తెలియ జేయటానికి తన ప్రతినిధిగా దీన్ని శివుడు ఏర్పాటు చేశాడా ?అని పించింది అంటే స్వర్గ మర్త్య ఆకాశాలను ఆవరించి ఔన్నత్యం చూపింది –‘’క్షితి నభఃసురలోక నివాసిభిహ్ –కృత నికేతన మదృస్టపరస్పరైహ్ –ప్రధయితుంవిభుతా మభి నిర్మితం –ప్రతినిదిం జగతామివ శంభూనా ‘’

హిమవత్పర్వతం శేషుని తో సమానమైన తెలుపు రంగుతో మిన్ను నంటినది .బంగారు రేఖలతో ప్రకాశించే సానువులు ఉండటం తో ఆకాశం లోని మేఘాలను తిరస్కరిస్తున్న శిఖరాలతో ఎంతో ఉన్నతం గా ఉంది .-‘’భుజగరాజ సితెన నభః శ్రితా-కనకరాజి విరాజిత సానునా –సముదితం నిచయేన తడిత్వతీం-లంఘయితా శరదంబుద సంహతిం ‘’

 హిమాలయానికి మణి కాంతులే వస్త్రాలు .దేవతాస్త్రీలు అనుభవించటానికి తగిన పొదరిళ్ళున్నాయి .ఎత్తైన బండ రాళ్ళ మధ్య ఉన్న విశాల ప్రదేశాలే పురద్వారాలుగా ఉన్నాయి .పుష్పవనాలతో అంతటా ఉండటం వలన పర్వత ప్రాంతమంతా నగరాలు నిండి ఉన్నాయా అని పించింది .వర్షాకాలం వెళ్లి పోయింది కనుక నీరు లేని మేఘాలు ,ఉరుములు లేకుండా తెల్లగా వేలాడు తున్నాయి .వజ్రాయుధం తో ఇంద్రుడు నరికిన రెక్కలు మళ్ళీ మొలిచాయా అని పించింది –‘’’’ఉదిత పక్ష మివార తనిహ్ స్వనైహ్ –పృధు నితంబ విలంబి భి రంబుదైహ్’’’’

పర్వతం లోని ఏనుగులు దంతాలతో సానువులను పొడవగా నీరు వచ్చి ఏర్పడిన చెరువులు గా ఏర్పడ్డాయి .స్నానాదులకు అనుకూలమై నిండుగా ఉన్న నీటితో నదులు వేగంగా ప్రవహిస్తున్నాయి .కడిమి చెట్లు పూలతో శోభిస్తున్నాయి .తమాల వృక్ష వనం దట్టంగా ఆవరించింది .కొంచెం మంచు బిందువులు పడుతున్నాయి .అందమైన ముఖాల మదపు టేనుగులు నిరంతర సంచారం చేస్తున్నాయి .హిమాలయం లో రత్నాలు లేని శిఖరాలు ,పొదరిళ్ళు లేని గుహలు ,అందమైన కమలాలు ఇసుక తిన్నెలు లేని నదులు ,పూలు లేని చెట్లూ లేవు .ఇసుక తిన్నెలు పిరుదులుగా,కమలాలు ముఖాలుగా నదీ స్త్రీలున్నారు వారి విహారాలకు రత్న శిఖరాలు వెలుగునిస్తే ,గుహల ముందున్న పొదరిళ్ళు సేదతీరటానికి ఉపయోగంగా ఉన్నాయి –‘’రహిత రత్న చయా న్న శిలోచ్చయా –నపలత భవనా న దరీ భువః –  విపులా౦బురుహా  న సరిద్వధూ-రకకుసుమా౦ ధతం న మహీ రుహః ‘’

హిమాలయం అందమైన మొల త్రాళ్ళతో ఉన్న దేవతా స్త్రీల పిరుదులతో అడ్డు కో బడి,నెమ్మదిగా ప్రవహించే నదులతో ,మనోహరాలైన తీగలు, పొగడలు  ఆకర్షిస్తే చేరిన పాములు అంతటా వ్యాపించి అందంగా ,మరో స్వర్గం లా భాసించింది –

‘’పృదిత సింధు మనీ రశనైహ్ శనైహ్-అమరలోక వధూ జఘనై ర్ఘనైహ్-ఫణ భ్రుతా మభితో వితతం తతం –దయిత రమ్య లతా వకులైహ్కులైహ్’’

అనేక రకాల మణుల కాంతితో శుభ్రమైన మంచు శిఖరాలు ఇంద్ర ధనుస్సు కల్గిన మేఘాల్లా ఉన్నాయి .కాని ఒక్క సారి గర్జించటం తో అవి శిఖరాలుకావు మేఘాలే అనే నిజం తెలుస్తోంది .ఎప్పుడూ వికసించే కమలాలతో రాజ హంస లతో నిర్మలజలం ఉన్న మానస సరో వరం అక్కడ ఉన్నది ఒకప్పుడు ఈర్ష్యతో కోపించిన పార్వతితో కలహించిన ప్రమధ గణ౦ కూడా అవిద్యాది దోష రహితుడైన శంకరుడు నివాసంగా ఉన్నాడు –‘’వికచ వారిరుహం దధతంసరః –సకల హంస గణం శుచి మానసం –శివ మగాత్మజయా చ కృతేర్ష్యయా –సకలహం స గణం శుచి మానసం ‘’

హిమవంతం చంద్ర సూర్యాదుల దేవయానాలను ప్రకాశింప జేస్తూ ,ఓషధుల రాపిడి వలన కలిగిన అగ్నితో దేదీప్యమానంగా ఉంది .శివ గణాలు ప్రతి రాత్రీ ఆ మంటలను చూసి ఈ శ్వరుడు చేసిన త్రిపుర దాహ వృత్తాంతాన్ని గుర్తుకు తెస్తోంది –‘’

‘’గ్రహ విమాన గణాభితో దివం –జ్వలయతౌషధి జేన కృశానునా –ముహురను స్మరయ౦తమను క్షపం –త్రిపుర దాహ ముమాపతి సేవినః ‘’

 హిమవత్పర్వత శిఖరాలలో గంగానది ఉంది .ఎత్తైన రాళ్ళు తిప్పలు అడ్డురాగా వాటిపై నుంచి పారే ప్పుడు తుపుర్లు తు౦పుర్లు గా ఎగసి పడుతోంది ఆ దృశ్యం గంగానది తెల్లని చామరం వీస్తున్నట్లు గా ఉంది –‘’దధత మున్నత సాను సముద్ధతాం-ధృత సిత వ్యజనామివ జాహ్నవీం ‘’

ఈ పర్వత వైభవం చూసి అర్జునుడు పొంగిపోయి ,యక్షుడితో ఇలా అన్నాడు (.అడగకుండా చెప్పటం వినేవాడు ఉంటే బాగానే ఉంటుంది కదా) –‘’స జగదే వచనం ప్రియమాదరా –న్ముఖరతా వసరే హాయ్ విరాజతే ‘’

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-12

వేద వ్యాసమహర్షి ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’నీ శత్రువులు అపకారం చేసినాఏమీ మాట్లాడకుండా శాంతంగా ఉండటం వలన  నీ ప్రజ్ఞా సౌశీల్యాలు లోకానికి తెలిశాయి .వాళ్ళు అట్లా అపకారం చేసి ఉండకపోతే లోకానికి నీ గొప్పతనం  తెలిసేది కాదు .కనుక వాళ్ళ అపకారం నీకు ఉపకారం అయింది అంటే శత్రువులుకూడా ఒక్కోసారి ఉపకారులౌతారన్నమాట .శత్రువులకు చిక్కిన రాజ్యం పరాక్రమం తో తిరిగిపొందటం సాధ్యంకానీ ,వేరే దానివలన సాధ్యంకాదు .ప్రబల శత్రువును చంపాలంటే అంతకంటే బలపరాక్రమ౦ , సాధన సంపత్తి కావాలి .అస్త్రబలాదిక్యత ,వీరత్వం ఉంటేనే సాధ్యం .కనుక ముందు ఈప్రయత్నం చేయాలి మీరు .

‘’ముందుగా శత్రువుల ఆదిక్యం చెబుతా విను .అక్కడ భీష్ముడున్నాడు .అంతటి యుద్ధపాటవం ఎవరికీ లేదు .అతని గురువు పరశురాముడు 21సార్లు రాజులను చంపిన వీరుడు .అస్త్ర విద్యకు మూల విరాట్టు.అతడే భీష్ముని చేతిలో ఓడిపోయాడు .శౌర్యాది గుణాలు  ఆశ్రయ పురుషుని ఆధిక్యాన్ని బట్టి వస్తుంది .అలాంటి భీష్ముని పరాక్రమాన్ని   ఎదిరించటం సాధ్యమా.ఆయన్ను ఓడిస్తేకాని నీకు రాజ్యం రాదు .ఆయన్ను ఓడించే సమర్ధుడు నీ పక్షాన ఎవరున్నారో చెప్పు .స్వచ్చంద మరణ వరం పొందిన ఆయన్ను చూసి యముడే  సంహరించేశక్తిచాలక పరాభూతుడౌతున్నాడు  . జగదేక వీరుడు రౌద్రమూర్తియై యుద్ధం లో ధనుస్టంకారం చేస్తే వీరులంతా గడగడ వణకాల్సిందే .మరి అతన్ని నిర్జించే యోదుడెవరున్నారు నీవైపున !

‘’లోకాలన్నీ కబళించే ప్రళయాగ్నిజ్వాలలుగా ,మహాఘోరాకారం తో బాణ జాలాన్ని పుంఖాను పు౦ఖ౦ గావర్షింఛి ,సైన్యాన్ని సర్వ నాశనం చేసే ద్రోణాచార్యుని ఎదుర్కొనే సత్తా ఉన్న వాడు మీలో ఎవరున్నారో చెప్పు .

‘’నిరక్ష్య  స౦రంభ నిరస్త ధైర్యం –రాధేయమారాధిత జామదగ్న్యం

అసంస్తు తేషు ప్రసభం భయేషు –జాయేత మృత్యోరపి పక్షపాతః ‘’

కోపంతో రౌద్రమూర్తియై చూడంగానే ధైర్యాన్ని పోగొట్టేవాడు , ,పరశురాముని సేవించి నిఖిలాస్త్రశస్త్రాలు పొందిన  , కర్ణుని చూసి మృత్యువే భయపడి పారిపోతుంది .అలాంటి కర్ణ పరాక్రమాన్ని అడ్డగించి ,నిర్జించే మొనగాడు మీకు ఎవరున్నారో చెప్పు .భీష్మ ద్రోణ కర్ణులు ముగ్గురూ ముగ్గురే .దివ్యాస్త్రాలున్న వారుసామాన్యులచే జయి౦ప బడరు .కనుక వారిని  జయించాలంటే  దివ్యాస్త్రాలు సంపాదించాలి .దానికి ఈశ్వరానుగ్రహం కావాలి కాబట్టి శివునికి తపస్సు చేయాలి.అందుకే అర్జునునికి మంత్రోప దేశం చేయాలని పిస్తోంది .మంత్రోపదేశం పొందకుండా తపస్సు ఫలించదు ,కనుక అర్జునునిచే శివుని తపస్సు చేయించి ,పాశుపతం మొదలైన అస్త్రాలు ,వరాలు పొందితే భీష్మాదులను చంపటం తేలిక .అలాంటి మంత్రం ఉపదేశించటానికే ఇక్కడికి వచ్చాను .ఆమంత్రం మహా ప్రభావం కలది. దాన్ని జపిస్తే అన్నీ లభిస్తాయి .ఇంద్రాది దేవతలుకూడా అనుగ్రహిస్తారు .ఆమంత్రాన్ని స్వీకరించటానికి నువ్వుతప్ప ఇతరులకు అర్హత లేదు .వీత స్ప్రుహుడవైన నువ్వే అర్హుడవని నీకుపదేశించాలని నేనే స్వయంగా వచ్చాను .ఆమంత్రం ఉపాశించి అభీష్ట సిద్ధి పొంది ,దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ చేసి రాజ్యాన్ని సాధించి సుఖభోగాలు అనుభవించు .’’అని చెప్పిన వ్యాసమహర్షి మాటలకు స్పందించి ధర్మరాజు అర్జునుని పిలిచి వ్యాసమతానుసారం ప్రవర్తిచమని కోరాడు .అర్జునుడు అన్నమాట ఔదలదాల్చి అత్యంత వినయంతో వ్యాసర్షి ని సమీపించాడు.

‘’నిర్యాయ విద్యాథ  దినాది రమ్యా –ద్బి౦బాదివార్కస్య ముఖాన్మహర్షేః

పార్థాననం వహ్ని కణావ దాతా-దీప్తిస్ఫురత్పద్మ మివాభి పేదే’’

ప్రాతః కాల సూర్య తేజం పద్మలో ప్రవేశించినట్లు ,వినయంగా దగ్గరకొచ్చిన పార్ధునికి మంత్రోప దేశం చేయటానికి వ్యాస రుషి అతనికి ఉపదేశించగా 24తత్వాలరహస్యం తెలిసి , అఖిలాజ్ఞానభంజకమై ,ఉపదేశార్హతకల యోగానికి అర్హతకల అర్జునునికి  మహాతపశ్శాలి వ్యాసమహర్షి వెంటనే తనప్రభావం చేత వశమయేట్లు చేశాడు .మహాభాగ్య సూచకం ,ఉత్సాహగుణంకార్య సమర్ధత కల అర్జునుని చూసి మహర్షి ‘’నేను ఉపదేశించిన మంత్రాన్ని యోగంతో మహాతేజశ్శాలివై ,ఒంటరిగా ఆయుధ హస్తుడవై  జప ఉపవాస స్నానాదులతో ,మహర్షులు చేసినట్లు తీవ్రంగా చేయి .ఇలాంటి తపస్సుకు ఇంద్రకీల పర్వతం శ్రేష్టం .అక్కడికి నిన్ను ఈ యక్షుడు తక్షణమే తీసుకువెడతాడు .అక్కడ ఇంద్రుని గూర్చి నేను చెప్పినట్లు తపస్సు చెయ్యి ‘’అని చెప్పి అంతర్ధానమయ్యాడు వ్యాసర్షి .వెంటనే యక్షుడు అర్జునుని సమీపించి నమస్కరించి ,మైత్రీభావం చూఫై తీసుకు వెళ్ళాడు  .

సూర్యుడు రాత్రిభాగం లో నివశించి మళ్ళీ ఉదయి౦చటానికి  మేరుపర్వతాన్ని వదిలేస్తే ,అక్కడ చీకట్లు ప్రవేశించినట్లుగా ,శ్రేయస్సాధనకోసం అర్జునుడు తమల్ని విడిచి వెళ్ళగా ,పాండవులకు నెమ్మదిగా దుఖం ప్రవేశించి అధికమైంది .తాత్కాలికంగా దుఖం పొందినా ,కార్యభారంతో పోగొట్టుకొన్న ,సోదర స్నేహంవలన మళ్ళీ దుఖావేశం వచ్చినా ,వివేకవంతులుకనుక ఆ దుఖం బాధ కలిగించలేదు .విశ్వాసపాత్రుడైన వ్యాసమహర్షి ,ఆయనకు తమశత్రువులపై తీవ్రకోపం ,అర్జునుని  అధిక ప్రతాపం  తెలిసిన సహజ ధైర్యవంతులు కనుక భ్రాతృ వాత్సల్యం చే దుఖం కలిగినా  స్థిరంగా  నిలబడలేదు .సూర్య కా౦తిచేత  పగటిపూట ప్రకాశం పొందిన చీకటి , కృష్ణ పక్షపు రాత్రిని  పొందినట్లు,పాండవులకు కలిగిన దుఖం తాత్కాలికమై ,వాళ్ళను వదిలి  మొత్తంగా ద్రౌపదిని చేరింది .ఆమె దుఖాన్ని ఎలా అనుభవి౦చి౦దో తర్వాత తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కార్తీక మాసం మొదటి మంగళ వారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో హరిహరాత్మక దీపాలంకరణ

కార్తీక మాసం మొదటి మంగళ వారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో హరిహరాత్మక దీపాలంకరణ

 

https://photos.google.com/share/AF1QipOTI_TDeOCBv72GTADzuQNPWZPh5WgQIUrkuJafLCOohXD3olgfpeNXlgGlOgadsw?pli=1&key=Y0wwOXhFVEhkZ1Yyd0NEUjdTaElmNDFDZVFCcTNR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- నాల్గవ సర్గ- 2.

కిరాతార్జునీయం-

నాల్గవ సర్గ- 2.

యక్షుడు శరదృతు వైభవాన్ని అర్జునుడికి అడగకపోయినా వివరించాడు ‘’శుభం భాగ్యం ఇచ్చే ఈ శుభ సమయం లో పనుల ఫలితం కలిగి కృతర్ధత లభిస్తుంది .నిర్మలమైన నీరు ,నీరు లేని మేఘాలున్న ఈ శరత్తు మీకు జయం చేకూరుస్తుంది అర్జునా !ఇప్పటిదాకా వర్షర్తు గొప్ప ప్రేమతో లోకాన్ని ముంచింది .ఇప్పుడు శరత్తు   ఎక్కువ కాలం ఉండక పోయినా ఆ ప్రేమను స్థిరం చేస్తుంది-‘’నవైర్గుణ్యై సంప్రతి సంస్తవ స్థిరం –తిరోహితం ప్రేమ ఘనాగమ శ్రియః ‘’

‘’వర్షాకాలం లో తెల్లని కొంగల బారులు ,ఇంద్రధనుస్సుతో ఉన్న మేఘాలు ఆకాశానికి అందం కలిగిస్తాయి ..ఇవేవీ లేకపోయినా శరత్తు నిర్మలాకాశం తో ఆకర్షణీయ శోభ పొందుతుంది.అందమైన వస్తువుకు అల౦ కారసామగ్రి అక్కర్లేదు కదా –‘’తధాపి పుష్ణాతినభః శ్రియం వరాం –న రమ్య మాహార్య మపేక్షతే గుణం’’

 ‘’ఇప్పుడు దిక్కులన్నీ తెల్లబడ్డాయి .నీరు లేకపోయినా మేఘాలు  ఆనందాన్నిస్తున్నాయి .వర్షర్తు అనే భర్త విరహాన్ని భరించలేక దిగ్వదువులు పాలిపోయి తెల్లని రంగుల్ని దుర్బలమైన పాలిండ్లు గా ,జారిన మొలత్రాళ్ళు కృశించినా అందంగానే ఉన్నాయి –‘’’’ఇదం కదంబానిల భర్తు రత్యయే –న దిగ్వధూనాం కృశతా న రాజతే ‘’

‘’ప్రజలు శరత్తు లో మాధుర్యం కోల్పోయి ,నెమళ్ళ క్రీ౦ కారాల పై ఆసక్తి లేకుండా ,మదించిన కలహంసల కూజితాల పట్ల ఆదరం చూపుతున్నారు .గుణం వలన ప్రీతి కలుగు తుందే కానీ ,పరిచయం వలన కాదు ‘’.వరిపొలాల్లో కంకులు బాగా నిండుగా ఉండి,పంటలు సమృద్ధిగా పండాయి పసుపురంగు తిరిగి చేలు పంటబరువుకు ఒంగిపోతున్నాయి .పొలం నీటిలో వికసించిన నల్ల కలువ పూల వాసన చూడటానికా అన్నట్లు వంగాయి .(నాలుగు శ్లోకాలతో ఒకే విషయాన్ని వర్ణించ టాన్ని’’ కలాపం’’ అంటారు).కొలను నీరు పద్మ పత్రాలతో ఆకుపచ్చ గా ఉంది .కమలాల ఎరుపు కాంతి శోభగా ఉంది.నివ్వరి దాన్యకేసరాలతో కలిసి  అటూ ఇటూ ఊగుతూ ఇంద్ర ధనుస్సులా ఉంది –‘’మృణాళినీ నామను రంజితం త్విషా—విభిన్న మంభోజ పలాశ శోభయా –పయః స్ఫుర చ్చాలి శిఖాపి శంగితం –ద్రుతం ధనుష్ఖండ  మివాహి విద్విషః’’

గాలికి చెట్లు ఊగుతున్నాయి వాటి పుప్పొడి పుష్పం లాగా వ్యాపించింది .పువ్వులతో శోభిస్తున్న వృక్షాలు ఆ పుప్పొడిని పట్టు కొంటున్నాయా అని పిస్తున్నాయి .కాముడు కాముని పైట లాగగా ,ఆయువతి క్రీగంట చూసి ,పైట సరి  చేసు కొన్నట్లుగా అందంగా ఉంది –‘’అనా విలోన్మీలిత బాణ చక్షుషః –స పుష్ప హాసా వనరాజీ యోషితః ‘’

‘’అగ్ని లేకుండానే కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు ,తెల్లని మబ్బు తునకలు వ్యాపించి ఎండను అడ్డు కొన్నట్లుగా ఉంది .కొద్దిగా నీటి తు౦పుర్లు కురుస్తుంటే ఆకాశం కమలాల సుగంధం తో వాయువు వ్యాపించింది ..వరిపొలాల్లోని నీటిని వనపంక్తి రూప వనితా జనాన్ని ,ఆకాశ మార్గం లక్ష్యంగా పరిగెత్తే తెల్లని రెక్కల హంసల కలకూజితాలు మేఘాలతో దిక్కులు పరస్పరం మాట్లాడు కొంటున్నట్లు గా ఉన్నది –‘’సితచ్చదానామ పదిశ్య దావతాం-రుతైరమీషా గ్రధితాః పతత్రిణా౦ –ప్రకుర్వతే  వారిద రోధ నిర్గతాః-పరస్పరాలాపమివామలా దిశః ‘’

 సాయం వేళ మేతను౦డి ఇంటికి తిరిగి వచ్చే ఆవులు ఒకదానినొకటి తప్పించు కొంటూ కొట్టాలు చేరుతుంటే  ,తమ దూడలు జ్ఞాపకం రావటం తో పొదుడుగులనుంచి అప్రయత్నంగా పాలు కారి పోతున్నాయి .ఆ పొదుగులు దూడలకు బహుమానంగా ఉన్నాయా అని పిస్తున్నాయి .కోస్టాలు చేరి పాలు, పెరుగు ,వెన్నె నెయ్యి, మొదలైన హోమ ద్రవ్యాలతో పవిత్ర మయ్యేజగత్తుకు కారణమైన ఆ ధేనువులు దూడల్ని కలుసుకొని ఆప్యాయంగా పాలిస్తున్నాయి  .నెమళ్ళ కంటే మధురంగా పాడే గోపికలు పాటలకు అడ లేళ్లు ఆకర్షింప బడి బాగా ఆకలితో ఉన్నా ,మేత మెయ్యాలనే కోరిక లేకుండా ఉన్నాయి .నివ్వరి ధాన్యం బాగా పండి నేలకు ఒరిగి తలయెత్తినిలబడ్డ కమలాలు ఉన్నాయి .పొలాలలో  నీరు ఆరిపోయింది .నివ్వరి ధాన్య నాయకుడు తలవంచి ప్రార్ధించినా, మెత్తపడని కమలం అనే నాయిక ,నాయికా విరహంతో పాలిపోయిన నాయక డి లా ఉన్నారు-‘’ఉపైతి శుష్య న్కలమః సహా౦భసా మనో భువా తప్త ఇవాభి పాండుతాం’’’.కమలాల పుప్పొడి సుగంధం వ్యాపించగా వర్షపు చినుకుల చల్లదనం తో వాయువు చేత ఆకర్షింప బడిన తుమ్మెదలకు  మరో  దారి లేకపోయింది .రాజ భయంతో ఎలా తప్పించు కోవాలో తెలియని  దొంగల్లా ,దోషుల్లా ఉన్నాయి తుమ్మెదలు –‘’ఉపాగమే దుశ్చరితా ఇవా పదా౦ –గతిం న నిశ్చేతు మలం శిలీ ముఖాః’’

‘’పగడం లాగా ఎర్రగా ఉన్న నోళ్ళతో పసుపు రంగు పండిన నివ్వరి ధాన్యం కంకులను పట్టుకొన్న శిరీష పుష్పం లాంటి పచ్చని చిలుకలవరుస అనేక రంగులతో ఇంద్ర ధనుస్సులా ఉన్నది –‘’ముఖై రసౌ విద్రుమ భంగ  లోహితైహ్-శిఖాఃపిశంగీహ్ కమలస్య విభ్రతీ-శుకావలి ర్వ్యక్త శిరీష కొమలా –ధనుహ్ శ్రియః గోత్ర భిదోను గచ్ఛతి’’’’అని యక్షుడు అర్జునునికి శరత్ శో వర్ణించి చెప్పాడు .ఇంతలో సూర్యుని కూడా కప్పి వేసేంత ఎత్తులో హిమాలయ పర్వతం చూశాడు .అది కాంతివంతమైన మేఘ సముదాయంగా ఉంది .అరణ్యాలతో నల్లని రంగు పొంది ,ఉన్న ఆ ప్రాంత భూమి ,పైన తెల్లని మంచు కప్పిన శిఖరాలతో ఉన్న అక్కడికి చేరి అర్జునుడు మదిర మత్తు వదిలిన బలరాముడిని స్మరించాడు .ఆయనా తెల్లని వాడే ఆయన ధరించిన వస్త్రం మాత్రం నల్లనిది .కనుక బలరాముడి లా పర్వతం ఉ౦దనే భావన .’’తమతను వనరాజి శ్యామితో –నగముపరి హిమానీ గౌరమాసాద్య జిష్ణుహ్-వ్యపగత మదరాగస్యాను సస్మార అక్ష్మీ –మసిత మధర వాసో బిభ్రతః సీర పాణేహ్’’

సశేషం

మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం నాల్గవ సర్గ .

కిరాతార్జునీయం నాల్గవ సర్గ .

పాశుపాతాస్ర సాధనకోసం అర్జునుడు యక్షుని తోడుగా తీసుకొని ఇంద్ర కీలాద్రి చేరాడు .అక్కడ కనిపించిన ప్రకృతి  సౌందర్య వర్ణననమే చతుర్ధ సర్గలో మహాకవి భారవి వివరించాడు.ఆ  అందాలు అనుభవిద్దాం

చెలికత్తెల సముదాయం లో యవ్వనం లో ఉన్న ప్రియురాలిని నాయకుడు చేరుకున్నట్లు ,లోకులకు ఇష్టుడైన అర్జునుడు పచ్చగా పండి వరి కంకులతో ఉన్న పంటపొలాలు, వ్యవసాయ దారులు ఉన్న చోటికి వచ్చాడు –

‘’తతః సకూజత్కలహంస మేఖలాం –సపాక సస్యాహిత పాండుతా గుణం –ఉపాస సాదోప జనం జనప్రియః –ప్రియామి వాసాధిత యౌవనాంభువం .

గ్రామ సమీపంలోని భూములు చూసి సంతోషించాడు .బాగా పండి ఒరిగి న వరికంకులతో అందమైన పొలాలు ,బురద తేరి నిర్మలమైన నీటిలో కమాలాలున్న గుంటలు ఆగ్రామ సీమలు శరదృతువు సంపదనంతా అర్జునునికి బహుమానంగా ఇస్తున్నాయా అన్నట్లున్నాయి .చూచి ఆనదించాడు ఫల్గుణుడు .నీటి కుంటలలోని చేపలు గంతు లేయటం మనసును ఆకర్షించింది .చేపలు అటూ ఇటూ తిరుగుతుంటే నీటి కమలాలే విచ్చుకొన్న కళ్ళతో ఆశ్చర్యంగా ఆర్జునుడిని చూడాలని ఆత్రం గా ఉన్నాయి .వాటి చేష్టలు ప్రియురాలి చూపులోని విలాస చేష్టలను కూడా మై మరపించేవిగా మనోహరం గా ఉన్నాయి .

‘’హృత ప్రియా దృష్టి విలాస విభ్రమా –మనోసృజహ్రు శఫరీ వివృత్తహ

నీటి మడుగులలో కమలాలు ,నివ్వరి ధాన్యం అందం బాగా ఆకర్షించాయి .అందు బాటులో ఉండని సుందర దృశ్యం ఎవర్ని ఆకర్షించదు ?’’సుదుర్లభే నార్హతి కోభి నందితుం-ప్రకర్ష లక్ష్మీ మనురూప సంగమే ?

బాగా ఎత్తుగా ఎగిరే చేపలు పొర్లటం తో కమలాలనిండా ఆవరించిన నురుగు తొలగి పోయింది .కమల కిన్జిల్కాలు స్పష్టంగా కనిపించి మెట్ట తామరలా అనుకొన్న అతని అనుమానం తీరిపోయింది .నదుల ఇసుకలు చూసి ఆనందించాడు. రోజూ తగ్గిపోతున్న నీటితో ,నీటి వేగం తగ్గి తీరం లో ఇసుక లో తరంగాల గుర్తులేర్పడ్డాయి .తెల్లని ఇసుక నదులు కట్టుకొన్న పట్టు వస్త్రాల్లాగా ఉన్నాయి.వాటిని చూసి  సముద్రుని భార్యలైన నదులు పట్టు వస్త్రాలు ధరించాయా   అనిపించాయని భావం –‘’నిరీక్ష్య రేమే స సముద్ర యోషితాం –తరంగిత క్షౌమ విపాండు సైకటం ‘’

 తర్వాత మూడు శ్లోకాలో పంట పొలాలు కాపాడే స్త్రీల వర్ణన ఉన్నది –పంటలను కాపాడే కాంత పువ్వు లోని పరాగం పొడితో ముఖం అలంకరించుకొని అందమైన ,కనుబొమల మధ్య మంకెన పువ్వు అలంకరించు కోవటం తో కింది పెదవి ఎర్రబడి చిగురాకు శోభ లా ఉంది .ఎత్తైన పాలిండ్ల చుట్టూ లేత ఎండతో ఎరుపు రంగు పొందిన ఎర్రతామర పుప్పొడి అలదుకొని పని చేస్తున్నందున చెమట తో తడిసి మరీ ఆనందాన్ని కల్గిస్తోంది .చెవులకు అలంకారంగా పెట్టుకొన్న కలువ ను తన కంటి చూపుతో అలంకరిస్తూ ఉన్న కాపు భార్యను చూసి అర్జునుడు శరదృతువు వైభవం సఫలమై౦దను కొన్నాడు .ఈ ఋతు సంపదంతా ఈ గోపికను అల౦క రించిందని భావం –

‘’కపోల సంశ్లేషి విలోచన త్విషా-విభూష యంతీ మవతంస కోత్పలం –సుతేన పా౦డో హ్కమలస్య గోపికాం –నిరీక్ష్య మేనే శరదః కృతార్ధతా

రాత్రిఅయి చాలా సేపు అవటం తో త్వరగాకోస్టాలకు వెళ్ళలేక ,దూడల్ని తలుచుకోవటం వలన పాలుకారుతున్న విశాలమైన పొదుగులున్న ఆవుల మందలు అర్జునునికి ఉత్సుకత కలిగించాయి .తనకు ప్రతి కక్షి అయిన మరో బలిసిన ఎద్దు ను జయించి , తనకు ఎరేలేదన్న విజయ గర్వం తో  అమ్భారవం చేస్తూ ఒక వృషభం కొమ్ములతో నదీతీరాన్ని పెకలిస్తోంది .గర్వం రూపు దాల్చిందా అన్నట్లు శరత్తులో మంచి పచ్చికమేసి బలిసిన ఆ ఎద్దు ఆకర్షణం గా ఉందన్న మాట –‘’పరీత ముక్షావ జయేజయశ్రియా –నాదంత ముచ్చై క్షత సింధు రోధసం-  దదర్శ పుష్టిం దధతం  సశారదీం  -స విగ్రహం దర్ప మివా ధిపం  గవాం’’

మంచు కురిసి తెల్లగాశుభ్రం గా ఉన్న ఆలమందలు మెల్లగా తమస్థావరాలకు వెడుతుంటే,శరత్కాలపు నదీ తీరం లో ఇసుక తిన్నెలు మొలనుండి జారిపోతున్నవస్త్రాలున్న పిరుదులు కల శోభగా అనిపించింది –‘’శరన్నదీనాం పులినైహ్ కుతూహలం –గళ ద్దుకూలైర్జఘనై రివాదధే’’

 ఆలకాపరులు పశువులతో తమ సోదర బందుత్వాన్నిచూపిస్తూ ,ఆడవుల్లోనూ, ,ఇళ్ళల్లో ఉండే ప్రేమ భావాన్నే కలిగిస్తున్నారు. రుజుమార్గం లో ఆవులను అనుకరిస్తున్నారా అని పిస్తోంది –‘’గతాన్పశూనాం సహజన్మ బంధుతాం-గృహాశ్రయం ప్రేమ ,వనేషు బిభ్రతః –దర్శ గోపా ను పధేను పాణ్డవః –కృతానుకారానివ గోభి రార్జవే ‘’

 తర్వాత శ్లోకాలలో గోపాలికల వర్ణన ఉంది..గోపికలు కదుల్తున్న తుమ్మెద వంటి ముంగురులతో ,చిరునవ్వు తో వెలసిన కేసరాల వంటి దంతాలతో ,కదిలే చెవి కుండలాలకాంతితో ,ఉదయపు ఎండలో వికసించిన పద్మముఖాలతో ఉన్నారు .పెరుగు చిలికే రైతు స్త్రీలు ఊపిరి పీల్చి వదులుతుంటే రెండు పెదవులు కదులుతూ ,చిగురాకుల తీగల్లా అందంగా ఉన్నారు.కవ్వపు  తాడు అటూ ఇటూ లాగుతుంటే పిరుదులు తమాషాగా కదుల్తున్నాయి –‘’వ్యపోధపార్శ్వైరపవర్తి తత్రికా –వికర్షణ్ఐ పాణి విహార హారిభిహ్’’

స్త్రీలు పెరుగు చిలుకుతుంటే ,ఇరుగు కుండలలో మద్దెల మోట వంటి ధ్వని వినిపిస్తోంది అది విని ఆడ నెమళ్ళుమేఘ గర్జన అనుకోని ఉన్మాదం తో నర్తిస్తున్నాయి –‘’వ్రజా జిరేష్వ౦బు ద నాద శంకినీహ్ –శిఖండినా మున్మదయత్సు యోషితః –ముహుహ్ ప్రణు న్నేషుమధాం వివర్తనై –ర్నదత్సు కుమ్భేషు మృదంగ మందరం’’

గోపకా౦తల ఉన్నత స్తనాలు  ఇటూ అటూ కదులుతూ శ్రమతో కళ్ళు అలసిపోయాయి చిలకటం లో వారు అప్పుడే నాట్యం ఆపిన వారకాంతల్లా కనిపించారు అర్జునుడికి .గ్రామాలు దాటి ముందుకు వెడుతున్నాడు .దారులు వర్షరుతువులోని వంకర టింకరలు పోగొట్టుకొని ,మధ్యమధ్యలో నీరు నిలవటంచేత  వంకరగామారి ,ఆరిపోయినచోట చక్కగా ఉన్నాయి. బళ్ళు నడుస్తున్నాయి కనుక రెండు చక్రాల దారి కనిపిస్తోంది. రాకపోకలెక్కువై బురద ఆరి, నేల గట్టిపడింది .ఇళ్ళముందు చక్కని అలంకారాలతో పూల చెట్ల తో అల్లుకున్న పందిళ్ళలో జనం కూర్చుని ఉన్నారు .అదవి ముని ఆశ్రమాలులా  ఉన్నాయి . పల్లె ప్రజలు కల్లాకపటాలు లేకుండా మునులు లాగా సాధారణ వేషధారణలో మనసు విప్పి మాట్లాడు కొంటున్నారు .ఇళ్ళల్లోనూ పూలు పండ్ల చెట్లు పెంచుతున్నారు. ఆదరంగా ఇవన్నీ చూస్తూ అర్జునుడు ముందుకు వెడుతున్నాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మహా భక్తులు  -2 1-కోటం రాజు నాగేశ్వర దాసు -2(చివరి భాగం )

మనమెరుగని మహా భక్తులు  -2

1-కోటం రాజు నాగేశ్వర దాసు -2(చివరి భాగం )

తగిన వధువుతో దాసుకు వివాహం చేసి కొత్త ఇల్లు కట్టించి అందులో గృహప్రవేశం చేయించారు శాస్త్రి దంపతులు .గృహ కృత్యాలమీద ఆసక్తి లేని దాసు భార్యను ఒంటరిగా వదిలి ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి చేరేవాడు .కొంతకాలానికి శాస్త్రి చనిపోయాడు .కుటుంబ భారం దాసుపై పడినా పెద్దగా పట్టించుకోలేదు .రేపల్లె ,భట్టిప్రోలు వైశ్యులు ఆకుటుంబ భారం తామే వహించారు .రాం భజన చేస్తూ దాసు కాలం  వెళ్ళ బుచ్చుతున్నాడు .దాసు భార్య గర్భవతి అయింది .ఆమెకు భట్టిప్రోలు వైశ్యులు ఆమెకు  చీని చీనా౦బరాలు సమకూర్చి ఒక బ్రాహ్మణుడికిచ్చి పంపారు. దాసుకు ఆబ్రాహ్మణుడు దారిలో కనిపిస్తే అవి తీసుకొని తానె ఇంటికి వెళ్లి భార్యకిస్తానని చెబితే నమ్మి ఇచ్చేశాడు ఆబాపడు .ఆమూట నెత్తిమీద పెట్టుకొని రామభజన చేస్తూ ఇంటికి వస్తుంటే దారిలో ఒక చెట్టు కింద నిండు చూలాలైన భిల్లస్త్రీ కనిపిస్తే ‘’అమ్మా నన్ను సోదరునిగా భావించి వీటిని తీసుకో’’అని నెత్తిపైఉన్న మూటను ఆమెకిచ్చేసి బ్రహ్మానందం పొందుతూ ఎక్కడెక్కడో తిరిగాడు .ఈ విషయం తెలిసిన భట్టిప్రోలు ప్రజలు మళ్ళీ అన్నిటినీ సమకూర్చి స్వయంగా తామే ఇంటికి వెళ్లి దాసు భార్యకు  ఇచ్చి సంతృప్తి చెందారు .కొడుకు పుట్టగా రామారాయుడు అనే పేరు పెట్టారు .

  పుత్ర జననానికి సంతోషించి ,భక్తజనాలతో కలిసి గ్రామాలు తిరుగుతూ భజనలు ఉపన్యాసాలతో ప్రజలలో ఆధ్యాత్మిక భావ వ్యాప్తి చేశాడు దాసు .గుంటూరులో శిష్యులు చాలామంది చేరారు .ఒకసారి రేపల్లె ఏడాది కాలంగా వర్షాలేలేవు .జనం బాధ పడుతుంటే అనుకోకుండా అక్కడికి వచ్చిన దాసు ‘’భయం వద్దు .ఒక మూడు గంటలలో వర్షం కోసం రామాజ్ఞ అయింది ‘’అని చెప్పి స్వగ్రామం వెళ్ళాడు .దాసు మాట నమ్మని ప్రజలు శివాలయం లో సహస్రఘటాభిషేకానికి ఏర్పాట్లు చేశారు .సరిగ్గా దాసు చెప్పిన సమయానికే బ్రహ్మాండమైన వర్షం కురిసి అందరికి ఆనందం కలిగి దాసు మాట కు విలువ పెరిగి౦ది.

  శిష్యులతో కలిసి దేశ సంచారం చేస్తూ శ్రీరామనవమికి భద్రాచలం చేరి సీతారామ కల్యాణం కనులారా చూస్తూ భజన చేద్దామనుకొంటే పందిళ్ళలో ఇసుక వేస్తె రాలనంత భక్తజనం ఉండటం చూసి ,ఆలయ ముఖమండపం చేరి తాళాలు త౦బు రాలతో ఆనంద భైరవి రాగం ఆట తాళం లో ‘’కనులకు కనపడవేమి శ్రీరామా ?రామయ తండ్రీ !ఇంత కన్నడ సేయ గ కారణమేమి ?’’

ఎక్కడనున్నావో నాస్వామి నాకి౦కెవరయా దిక్కు సర్వాంతర్యామి ‘’

గుహుడు కడిగిన పదము లేవి ?జనకకూతురు కూర్చున్న వామాంక మేది?పయిడి ముగ్గుల గొలుసు లేవీ ?చేత బట్టిన మంచి తీరు కమానులేవీ ?మంచి పచ్చల పోగులేవీ ?తళుకు మించిన నీ వ్రేళ్ళ యుంగరము లేవీ ?ఘంట మొలనూలుఏదీ ? బొజ్జ గదల తళుకు మను కౌస్తుభమేదీ ?ముద్దులు గులుకు మోమేదీ ,జగన్మోహనమైన మీచిరు నగవేదీ ?వరదుడిచ్చిన హారమేదీ ?తూము నరసింహు డర్చించు చరణము లేవీ ?శ్రీ భద్రాచల విహార ,తులసీ దళ హార ,హే సింధు గంభీర ,పరమ దయారస పూర ,నాగేశ్వర దాస మందార జగదేక వీరా ‘’అని తన్మయం లో కీర్తి౦చగానె ,కల్యాణం లోఉన్న విగ్రహాల షోడశ కళలను లేపి ,దాసు ముందు ఆవహి౦ప జేసి ఆన౦దించాడు కళ్యాణ రాముడు .అది కనులారా చూసిన దాసు కాఫీ రాగం ఆట తాళం లో –‘’నాపాలి భాగ్య మేమందు ,రఘునాధుడు కనిపించే ముందు ,పాపము లెల్ల బాపు శ్రీరాముల రూపము కనులకు రూది గా గనిపించే ‘’అని భక్తీ తన్మయం లో గానం చేశాడు .ఈ విషయం తెలిసిన తూము నరసింహ దాసు స్వయంగా వచ్చి దాసును సగౌరవంగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొని వెళ్లగా ఆవిగ్రహాలు మళ్ళీ షోడశ కళలతో విరాజిల్లాయి .నాగేశ్వర దాసు మహాత్మ్యాన్ని అక్కడి వారందరూ గ్రహించి అపూర్వం గా సత్కరించి గౌరవించారు .

 భద్రాచలనుంచి మళ్ళీ తీర్ధ యాత్రలు చేస్తూ శ్రీరంగం చేరి రంగడిపై శతకం రాసి అంకితమిచ్చాడు నాగేశ్వర దాసు .ఇల్లు వదిలిన ఎనిమిదేళ్ళకు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు .మర్నాడే దాసు గారబ్బాయి అకస్మాత్తుగా చనిపోయాడు .హరి భజన చేస్తూ పుత్ర శవాన్ని శ్మశానానికి తీసుకు వెళ్లి ఖననం చేసి ,నిర్విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు దాసు .బంధువులు ఓదారుస్తుంటే ‘’రుణాను బంధ రూపేణ పశు పత్ని సుతాలయః ‘’అన్న వాక్యం బోధించి ,రామనామం చేయించాడు .

  ఒక సారి తండ్రి తద్దినం రోజున భోక్తలను పిలవటానికి వెడుతుంటే ,ఒక బీద వర్తకుడు తనషాపులోని చెన్నూరు పుట్నాలను ఇస్తే ,తింటూ ,పురోహితుడు ధర్మ సూరి ఇంటికి వెళ్లి తద్దినానికి ఆహ్వానిస్తే వినీ విననట్లు నటించి ‘’దాసుగారు ఏదో భుజిస్తున్నారే ?”’అన్నాడు .’’తడవర్తివెంకయ్య శ్రేష్టిభక్తితో సమర్పించిన’’ తప్త చణక శకలాలు ‘’భక్షిస్తున్నా. ఇవాళ మానాన్న గారి ఆబ్దికం .భోక్తకు రమ్మని ప్రార్ధన ‘’అన్నాడు .’’తండ్రి తద్దినం రోజున కొమటిచ్చిన  సెనగపప్పు తింటూ నన్ను భోక్తకు పిలుస్తావా ?నేనే కాదు ఊళ్ళో ఏ బ్రాహ్మణుడు మీ ఇంటికి  భోక్త గా రాడు’’అని కటువుగా చెబితే బ్రతిమాలినా వినిపించుకోకపోతే ,చేసేది లేక ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పి వంట చెయ్యమన్నాడు రామాజ్ఞతో అంతా సవ్యంగా జరుగుతుందని భరోసా ఇచ్చాడు దాసు .ఆమె అలాగే అని వంట చేసింది .ఇంతలో ఇద్దరు దూరాధ్వగులైన-అంటే దూర దేశం నుంచి వచ్చిన బాటసారు లైన  బ్రాహ్మణులు వస్తే వారినే భోక్తలుగా నియమించి తద్దినం పూర్తి చేశాడు దాసు .ఇలాంటి అతి మానుష కార్యాలు చేసిన భక్త నాగేశ్వర దాసు 72వ ఏట పునరావృత్త రహిత శాశ్వత బ్రహ్మలోకం చేరారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మహాభక్తులు -1 1-కోటం రాజునాగేశ్వర దాసు -1

మనమెరుగని మహా భక్తులు  -1

1-కోటం రాజు నాగేశ్వర దాసు -1

భాస్కర మంత్రి శాయమాంబ లకు పుత్రుడు కోటం రాజు నాగేశ్వర దాసు చిన్నప్పుడే తల్లీ తండ్రీ చనిపోయారు .పోషించే వారు ఎవరూ లేకపోవటం తో సదా చార సంపన్నుడు రామభక్తుడు ఎల్లేపెద్ది పాపన్న శాస్త్రి తీసుకొని వెళ్లి పెంచాడు .పరమ సాధ్వి అయిన అతని భార్య సుబ్బ మాంబ పిల్లాడిని చాలా ప్రేమగా పెంచింది .ఒక ఏడాదికి అ దంపతులకు ఒక కొడుకు కూతురు పుట్టారు .ఇదంతా నాగేశ్వరుని  చలువే అని పొంగిపోతూ మరింత జాగ్రత్తగా నాగేశ్వరదాసును  పెంచారు .

  అయిదవ ఏట నే బడిలో వేశారు .లౌకిక విద్యలపై ఆసక్తి లేక నాగేశ్ ఒకపూటమాత్రమే బడికి వెడుతూ ,రెండో పూట ఏకాంతం గా ధ్యానం చేసేవాడు .ఎవరితోనూ ఆడుకోకుండా ముద్దుమటలతో పెంచినవారికి ఆనందం పంచకుండా నిరంతర భగవధ్యానం లో గడిపే అతడిని చూసి పాపన్న పిచ్చి పట్టిందేమో నని అనుమానం తో మందూ మాకు ఇప్పించాడు .ప్రయోజనం శూన్యం .ఎక్కడెక్కడో తిరిగే అతడిని వెదికితెచ్చి భోజనం పెట్టేది తల్లి .ఎనిమిదవయేట ఉపనయనం చేశారు .సంధ్యావందనం చేయటానికి గురువు వద్దకు పంపిస్తే ,గురువు సుబ్బావధానులు కూడా శ్రద్ధగా కూర్చోబెట్టి సంధ్యావందనం చేయించేవాడు .ఆమంత్రాల అర్ధం చెప్పమనేవాడు ఇప్పుడు కాదు అని ఆయన అంటే అర్ధం లేని చదువు వ్యర్ధం అని అంటే అర్ధ తాత్పర్యాలు బోధించేవాడు .ఒకరోజు ‘’అన్ని వేళలా దేవుడిని స్మరించేవాడు పవిత్రుడు కదా?’’అని అడిగితే ఆచారాలు పాటించకపోయినా ,తననే నమ్మితే అతడే సదా చారం కలవాడని కృష్ణ పరమాత్మ చెప్పాడని గురువు వివరించాడు .మరో సారి భగవన్నామ జప మహా భాగ్యం ఉంటె మంత్రాలతో పని లేదనీ చెప్పాడు .ఆమాటకు చిరునవ్వు తో సంధ్యావందన మంత్రాలు పూర్తిగా చెప్పమని కొరగా ఆశ్చర్యం  తో నేర్పాడు .ఆకాశాత్పతితం తోయం ‘’శ్లోకానికి తాత్పర్యం అడిగితె చక్కగా వివరించాడు గురువు .ఇక తనకు మంత్రాలతో పని లేదని చెప్పి ,అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగేశ్వరుడు .ఈ విషయమంతా వెళ్లి పాపన్న శాస్త్రికి గురువు చెప్పేశాడు

  నిత్యం సంధ్యావందన జపహోమాలు చేసే పాపన్న శాస్త్రి  రోజూ ఆధ్యాత్మ రామాయణం పారాయణం చేసేవాడు .ఒక రోజు దానికోసం వెదికితే కనపడకపోతే ‘’పిచ్చినాగన్న పనే ‘’అయి ఉంటుందని కొడుకునుపంపి వెదికింఛి నాగేశుని ఇంటికి పిలిపి౦చి ఆపుస్తకం ఏమైంది అని అడిగితే తనదగ్గరున్న సంస్కృత తాళపత్ర గ్రందాన్నీ ,దానికి తెలుగులో పద్యరూపంగా అనువాదం చేసిన కొత్త రచనను తండ్రికిచ్చాడు .రెండవదాన్ని ఎవరు రాశారని అడిగితే‘’శ్రీరామ చంద్ర మూర్తి ‘’అని బదులిచ్చాడు .అప్పుడు అతడి పరమభక్తికి సంతోషించి అతడి పద్యానువాదానికి అబ్బురపడి గట్టిగా ఆలింగనం చేసుకొని ఆనందించాడు శాస్త్రి .ఎంతకాలం నుంచి రాస్తున్నావు ?’’అని అడిగితె ‘’నిన్న రాత్రి రామాజ్ఞ అయినప్పటి నుంచి ‘’అన్నాడు దాసు .పాపన్న ఆన౦దానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది .

  ఒకరోజు నాగేశు తండ్రితో ‘’బాల అయోధ్య కాండలు పూర్తయ్యాయి .అరణ్యకాండ రాయాలి.దానికి దానికి నాలుగు రోజులు ఏకాంతం  కావాలి .మన ఇంట్లో ఒక గదిలో నేను కూర్చుని రాస్తాను .ఎవరూ వచ్చి నన్ను ఆటంక పరచవద్దు. నాకు వీలైనప్పుడు వచ్చి భోజనాదికాలు చేస్తాను. అనుజ్ఞ ఇవ్వండి ‘’అని కోరాడు .అలాగే అని ఒకగదిలో అతడిని ఏకాంతంగా ఉంచి అతనికోరికప్రకారమే గదికి బయట తాళం వేసి ముద్రకూడా వేసి రోజూ పని చేసే న్యాయస్థానికి వెళ్ళాడు పాపన్న శాస్త్రి .మూడు రోజులు గదిలోనుంచి బయటకు రాలేదు దాసు .శాస్త్రి కూడా ఏమి జరుగుతోందో అనే ఆందోళనతో మూడు రోజులూ గడిపి నాలుగవ రోజు ఉండబట్టలేక తలపు బద్దలు కొట్టాలనే ప్రయత్నం లో ఉంటే స్నేహితుడు వచ్చి వారించి ఇంకొక్క రోజు ఆగమని చెప్పాడు .సరే అన్నాడు శాస్త్రి .నాలుగవరోజు అసలు నాగేశు బతికి ఉన్నాడో లేదో అనుమానం నాలుగురోజులనుంచి భోజనం లేదని ఆరాటం తో గది తలుపులు బద్దలు కొట్ట టానికిసిద్ధమయ్యారు .ఇంతలో లోపల గొళ్ళెం తీసిన చప్పుడు వినిపించింది .నాగేశ్వరుడు కన్నీరు కారుస్తూ రెండు గ్రంధాలను చేత్తో పట్టుకొని బయటకు  వచ్చాడు .కొత్త గ్రంధాన్ని పరిశీలించి చూడగా ఆరణ్యకాండ పూర్తయినట్లు కనిపించి అందరూ అతడిని కావలించుకొని ఆనంద బాష్పాలు కార్చారు శాస్త్రి నాలుగు రోజులనుంచీ భోజనం కూడా చేయలేదు .ఆదుర్దాతో .కొడుకును గట్టిగా ఆశ్లేషించి ‘’నాయనా నాలుగు రోజులనుంచి తిండిలేకుండా ఎలా ఉన్నావు ?’’అనిఆడిగితే ‘’రామ చంద్ర మూర్తి  అరణ్యవాస విషయాలను వెల్లడిస్తూ దుఖాన్ని ఆపుకోలేక పోవటం చేత  దాన్ని రాసే నేను కూడా దుఖం ఆపుకోలేక రచన సాగక అన్నపానీయాలపై ఆసక్తే లేకుండా పోయింది ‘’అని చెప్పగా అతడి భక్తికి శ్రీరామ కరుణా కటాక్షాలకు ఆశ్చర్యపోయారు .అతడికి చక్కగా తలంటి స్నానం చేయించి ,మంచి పిండివంటలతో భోజనం తయారు చేయించి అందరూ తృప్తిగా భోజనంచేశారు .

  నాగేశ్వర దాసు రామాయణం మొత్తం తన 13 వ ఏటనే రాయటం పూర్తి చేశాడు .కృష్ణా సాగర సంగమం దగ్గర మొరుతోటలో వేంచేసిన  శ్రీ ముక్తేశ్వరస్వామి సన్నిధిలో ఉన్న శ్రీ రంగేశునికి కృతి సమర్పణ చేయాలని భావించి ,ఒక శివరాత్రి నాడు తలిదండ్రులు బంధు మిత్రులతో ఆలయం లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే ,అక్కడి పూజారులు అనుమతించలేదు .ఏమాత్రం అవమానంగా భావించకుండా ముఖమండపం చేరి ముక్తేశ్వర స్వామిపై   పద్యాలు  నిండు భక్తితో  చెప్పాడు

image.png

 –

image.png

పద్యాలు పూర్తికాగేనే ముక్తీశ్వర స్వామి లింగ రూపం లో దాసు దోసిట్లో ప్రత్యక్షమయ్యాడు .దాసు పరవశంతో పరమానందంగా నృత్యం చేశాడు .ఆలయం లో లింగం కనిపించక పూజారులు కంగారు పడుతుతూ బయటికి వచ్చి చూసి విషయం తెలిసి దాసుపాదాలపై వ్రాలి క్షమించమని  కోరి లింగాన్ని యధాస్థానం లో ఉండేట్లు చేయమని దాసును ప్రార్ధించారు

image.png

అని పద్యం చెప్పారు దాసు .ఆలయ పూజారులు సగౌరవంగా దాసును అతని తలిదండ్రులను అందరినీ  గర్భాలయం లోకి ఆహ్వానించి  ఉచితాసనాలు ఏర్పాటు చేసి గౌరవించారు .తన ఆధ్యాత్మ రామాయణ తెలుగు అనువాదాన్ని నాగేశ్వర దాసు ముక్తేశ్వర సన్నిధానం లో ఉన్న శ్రీ రంగేశునికి  సభక్తికంగా అంకిత మిచ్చాడు .

ఆధారం –శ్రీ పంగులూరి వీరరాఘవుడు గారి రచన ‘’ఆంద్ర మహా భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-20-ఉయ్యూరు  .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మల్లినాథ సూరి వ్యక్తిత్వం  

మల్లినా సూరి వ్యక్తిత్వం

మల్లినాథుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ,మహా విద్యా వేత్త .సంస్కృత భాషలోని ప్రతి శాఖ లోనూ అపార పాండిత్యజ్ఞాన సంపన్నుడు .ఆయన రాసిన వ్యాఖ్యానాలలో ఉటంకించిన అనేక రచనలు రచయితలను పరిశీలిస్తే ఎన్ని రచనలు చదివాడో ఎంతమంది కవులను అధ్యయనం చేశాడో తెలిసి ఆశ్చర్యపడతాం .ఆ రచనలు ఆకవులు మనమెప్పుడూ కనీ వినని వారే .సూరి రచనలను మనం క్రమంగా అధ్యయనం చేస్తే ,ఆయన పండిత లోకం లో సాధించిన క్రమానుగత అభి వృద్ధి ,పొందిన గుర్తింపు తెలుస్తుంది.ఆయన మొదటి వ్యాఖ్యానం సంజీవని లో సూరి తనను మల్లినాథుడు అని మాత్రమే చెప్పుకొన్నాడు యే బిరుదులూ పేర్కొనకుండా.శిశుపాల వధకు వ్యాఖ్య రచించే నాటికి సూరి మహోపాధ్యాయ ,సుధీ అయ్యాడు .భట్టి కావ్య  వ్యాఖ్యానం లో సుధీ అని చెప్పుకోన్నాడే కాని అంతకు ముందు చెప్పుకొన్న కవి అనే మాట వదిలేశాడు .తప్పుడు వ్యాఖ్యానాలు రాసిన తనకు ముందున్న వ్యాఖ్యాతలను ఆయన వదిలిపెట్ట లేదు ఉతికి ఆరేశాడు .కాని ఆయన ఆరాధ్యకవి కాళిదాసు లాగా సూరి మహా వినయసంపన్నుడు..తనకున్న ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాలను ఎప్పుడూ వదిలిపెట్టలేదు .

  మల్లినాథుడు ‘’రఘు వీర చరిత  ‘’వంటి కావ్యాలు రాశాడు .అది అలభ్యం .ఆయన రాసిన కవిత్వ మేకాక ,తానూ రాసిన వ్యాఖ్యానలన్నిటిలో రఘు వంశం లోని మొదటి సర్గలోని శ్లోకాలు ఉదాహరించాడు .ఏకావలి లో చంద్రోదయం లో తన శ్లోకాలే ఉదాహరణ గా చెప్పాడు కూడా. సూరి లోని మహా విద్వత్ వ్యాఖ్యాత తనలోని కవిత్వానికి నీడ అయ్యాడేమో ?

  మల్లినా ధనాథుడు  దురాశాపరుడు ,అత్యాశా పరుడు కానే కాదు .అత్యంత పవిత్రుడు తన నడవడిలో ,కార్యక్రమాలలో కూడా . సూరి రచనలలో ఎక్కడా మనకు ఆయన సంపన్నుడు అనికానీ ,బీదరికం లో ఉన్నట్లు కానీ సూచన కనిపించదు.మహా దైవ భక్తుడు మల్లినా థుడు  .మానవమాత్రులను స్వప్రయోజనం కోసం  స్తుతించి పబ్బం గడుపుకొనే తత్వమున్న వాడు కానే కాదు .ఏదో ఒక దైవాన్నిహరిని , కానీ హరుని కానీ  కీర్తించే వాడు కూడా కాదు .సూరి రాసిన స్తోత్రాలను పరిశీలి౦చినా ,రఘువంశం మొదలైన ఆయన ఉదాహరించిన శ్లోకాలను పరి శీలించినా ఆయనకు హరి –హర భేదం లేదని ,అర్ధనారీశ్వరం పై ఉన్న ఆసక్తి స్పష్టమౌతుంది  .

 ఆధారం –విద్యా వాచస్పతి ,పండిత రాయ ,సాహిత్య విశారద ప్రొఫెసర్ ఎన్. సి. వి .నరసింహా చార్య (ఉస్మానియా యూని వర్సిటి సంస్కృత శాఖాధ్యక్షులు )రచించిన ‘’Mallinadha –A study ‘’.లో ‘’Personality of Mallinadha ‘’వ్యాసం . ఈ పుస్తకాన్ని శ్రీ నరసింహా చార్యులవారు  మా మైనేని గోపాలకృష్ణ గారి ద్వారా పరిచయమై ,ఈ గ్రంధాన్ని నాకు 2-11-2016 న దీపావళి నాడు ఆదరంగా పంపారు .వారి రచనల నాధారంగా వారి గురించి గీర్వాణకవుల కవితా గీర్వాణం 2వ భాగం లో రాశాను .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-20 ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కౌముదీ శరదాగమన కర్త –శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి 

కౌముదీ శరదాగమన కర్త –శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి

వ్యాకరణాచార్య,వ్యాకరణాలంకార విద్యా ప్రవీణ ,శ్రీ విజయనగర మహారాజ సంస్కృత కళాశాల వ్యాకరణాలంకార శాస్త్రో పాద్యాయులు శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు  1942లో జయాపుర సంస్థానానాధీశ్వరులు ,కళా ప్రపూర్ణ ,సాహిత్య సామ్రాట్ ,డి.లిట్ శ్రీ మహారాజా విక్రమ దేవ వర్మగారి సమాదరణం తో’’ కౌముదీ శరదాగమనం ‘’రచించి ప్రచురించారు .ఈ మహాగ్రందాన్ని పరిచయం చేస్తూ మహారాజా కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ రామానుజస్వామి ‘’భట్టోజీ దీక్షితుని సిద్ధాంత కౌముది కి తెలుగు అనువాదం వ్యాఖ్యానం రాసిన జోగన్న శాస్త్రి గారి పుస్తకానికిముందు మాటలు రాసే అవాశం కల్పించారు .శాస్త్రిగారు ఈ కాలేజీలోనే చదివి ,మద్రాస్ యూని వర్సిటి నుంచి వ్యాకరణం ప్రత్యేక అంశం గా శిరోమణి పొందారు.ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి సాహిత్య, అలంకార స్పెషల్ సబ్జెక్ట్ లలో విద్యా ప్రవీణ అయ్యారు .విద్యా వ్యాసంగం పూర్తయ్యాక శాస్త్రి గారు మాతృ విద్య సంస్థలోనే వ్యాకరణ పండితులుగా నియమింపబడి ఎందరో విద్యార్ధులకు వ్యాకరణం కరతలామలకం చేశారు .వ్యాకరణం ను చాలా ఇష్టంగా దాదాపు పావు శతాబ్దం పాటు బోధించిన అనుభవం వారిది .కనుక జోగన్న శాస్త్రి గారుసిద్ధాంత కౌముది పై వ్యాఖ్య రాయటానికి  సర్వ విధాలా అర్హులే .సంస్కృత వ్యాకరణం అంటే వ్యాకరణం మాత్రమే కాక ,ఫైలాలజి, ఫిలాసఫీ కూడా కలిపి ఉండే మహాద్భుతం .పాణిని వ్యాకరణ సిద్ధాంతాలను సులభతరం చేయటానికి చాలామంది ప్రయత్నించినా ,భట్టోజీ దీక్షితుని సిద్ధాంత కౌముది అన్నిటికంటే మిన్న .దాదాపు ఒకటిన్నర శతాబ్దాలుగా వ్యాకరణం లో అనుభవం సాధించటానికి సిద్ధాంత కౌముది మాత్రమె కరదీపికగా ముందు ఉంది .కనుక దీనిపై కొత్తగా వ్యాఖ్యానం రాయాల్సిన అవసరం ఉందని గ్రహించి దానికి పూనుకొన్నారు శాస్త్రి గారు .’’I trust many scholors  will follow his foot steps  and augment in Telugu literature in various ways .His attempt is laudable ‘’ అని ఆంగ్లం లో ప్రశంసించారు .

మద్రాస్ యూని వర్సిటి తెలుగు హెడ్ శ్రీ కోరాడ రామకృష్ణయ్య ‘’తెలుగులోని వ్యాకరణ పుస్తకాలన్నీ పాణినీయం ను అనుసరించి రాసినవే .’’In order  to master the grammatical    principles of their own language shastri ‘s SHARADAgaMANA ‘’Supply a long felt  necessity ‘’ఇలాంటి సాంకేతిక పుస్తకాలు తెలుగులో రాయటం,ప్రచురించటం అత్యంత సాహసంతో కూడిన పని దాన్ని సుసాధ్యం చేసిన జగ్గన్న శాస్త్రి అభినందనీయులు ‘’అన్నారు ఆంగ్లం లో .

చిట్టి గూడూరు నారసింహ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళ వరదాచార్యులవారు (ఎస్టిజి వరదాచార్యులు )’’దుర్బోధకమైన కౌముదిని విద్యార్ధులకు కరతలామలకం గా రాసిన శాస్త్రిగారు అభినందనీయులు ‘’అన్నారు .ఆంద్ర యూనివర్సిటి తెలుగు లెక్చరర్ విద్వాన్ గంటి జోగి సోమయాజులు ‘’ఈకాలం లో ఇలాంటి గ్రంధం రావటం చాలా సంతోషంగా ఉంది .ఆంద్ర భాష అధ్యేతలకు ఇది గొప్ప సహాయకారి’’అన్నారు  .కళాప్రపూర్ణ ,శాస్త్ర రత్నాకర ,మహారాజా సంస్కృత కళాశాల హెడ్ పండిట్ బ్రహ్మశ్రీ తాతా సుబ్బారాయ శాస్త్రి ‘’దీక్షిత సిద్ధాంతాలను అవగతం చేసుకొనే వారి అరచేతిలో మాణిక్యం ఇది .విశ్వ విద్యాలయ పరీక్షలలలో సాహిత్య విద్యా ప్రవీణ ,వ్యాకరణ విద్యా ప్రవీణ కక్ష్యలవారు దీని ద్వారా కౌముదిని తేలిగ్గా వంటపట్టించు కోగలుగుతారు ‘’అని మెచ్చారు .మహామహోపాధ్యాయ ,కళాప్రపూర్ణ ,కవిరాజ, కవి సార్వభౌమ ,ఆంద్ర వ్యాస ,అభినవ శ్రీనాధ శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి ‘’ఇంతవరకు ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు ,శాస్త్రిగారుసుబోధకం గా రాశారు .మిగిలిన భాగాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తారని భావిస్తాను ‘’అని ఆశీర్వదించారు .ఆంద్ర యూని వర్సిటి విశ్రాంత ఆంద్ర ఉపన్యాసకులు శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రి ‘’ఆంద్ర భాషలో తత్సమ భాగం ఎక్కువ అవటం ,తెలుగు వ్యాకరణాలు పాణిని సంప్రదాయం లోనే ఉండటం వలన సిద్ధాంత కౌముది విషయాలను సులభతరంగా తెలియ జేయటం వలన శాస్త్రి గారి రచన పరమ ప్రామాణికం గా ఉంది ‘’అని కితాబిచ్చారు .

విజయనగర మహారాజ సంస్కృత కాలేజి సంస్కృత ఉపాధ్యాయుడు శ్రీ ఘండి కోట సుబ్రహ్మణ్య శాస్త్రి ‘’గ్రంధ నిర్మాణమే కాక శాస్త్రిగారు సౌజన్య,సౌశీల్యాది గుణ సంపన్నులు .ఈ రచన నిరుపమానం .సంస్కృత భాషలోసర్వజ్ఞ శ్రీ మాధవాచార్యుల వ్యాఖ్యాన శైలి ఇందులో ఉన్నది .మాధవాచార్యులు ఏది రాసినా గురువు అవసరం లేనట్లే శాస్త్రి గారి ఈ రచన కూడా దానికి దీటుగా ఉంది ‘’అని మనస్పూర్తిగా మెచ్చుకొన్నారు .

శ్రీ జగ్గన్న శాస్త్రి గారు తన అభిప్రయాన్ని ఇలా చెప్పారు ‘’శాబ్దిక సార్వ భౌముడు భట్టో జీ దీక్షితులు పాణినీయ వ్యాకరణ పాల సముద్రాన్నితన ‘’ప్రతిభా మందరం’’ చేత మదించి సారాన్ని ‘’వ్యాకరణ సిద్ధాంత కౌముదిగా రాశాడు  .దీనికి ముందు కాశిక మొదలైనవి లోకం లోప్రచారం లో ఉన్నాయి .వాటిలో ప్రకరణ విభాగాలు లేకపోవటం తో అర్ధం చేసుకోవటం కష్టంగా ఉండేది .వీటికి భిన్నంగా కౌముది సునాయాసంగా అర్ధమయేట్లు ఉంది .ఇది వ్యాకరణ జ్ఞానం కావాలనుకొనే వారు తప్పక చదవాలిసిన గ్రంధం .విద్యా ప్రవీణ శిరోమణి భాషా ప్రవీణ విద్వాన్ ,ఎంఏ పరీక్షలకు ,ప్రభుత్వ ఎంట్రన్స్ పరీక్షలకు పాఠ్య గ్రంథం గా ఉన్నది .అందుకని అన్నిభాషలలోకిఅనువాదం పొందింది .మహా రాజా విక్రమ దేవ వర్మగారు నన్ను దాన్ని తెలుగులో రాసి విద్యార్ధులకు ఉపయుక్తం చేయమని కోరగా రాశాను .నాగ్రంధముపై అమోల్యా భిప్రాయాలు అందించిన విద్వత్ వరేణ్యులకు ,ముద్రణ చేయించిన రాజావారికి కృతజ్ఞుడను ‘’అని వినయంగా శాస్త్రి గారు చెప్పారు .

గ్రంధాది లో సంస్కృత శ్లోకాలు శ్రీ మేధా దక్షిణా మూర్తి కి ముందుగా సమర్పించి ,తర్వాత గురువు నౌడూరు  వేంకట శాస్త్రి గారిని స్మరించారు .తర్వాత శ్రీ  తాతాసుబ్బారాయ శాస్త్రి గారిని ప్రస్తుతించారు .తర్వాత తల్లి,  తండ్రి అయిన వెంకమాంబ ,సోమేశ శాస్త్రి గార లకు వందన సమర్పణ చేశారు .’’ అప్పల్ల వంశ జలధి సోమం సోమేశ శాస్త్రిణ౦-వే౦క మార్ధాంగ రుచిం వందే మత్పితరం సదా ‘’ ఆ పిమ్మట విక్రమ దేవవర్మ మొదలైన వారికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .’’జోగన్న శాస్త్ర్యభి జ్ఞాత నామా రాజేశ్వరీ ప్రియః –పాణిన్యాది మునీన్నత్వా శబ్ద శాస్త్ర ప్రవరకాం ‘’అని తన సంగతి చెప్పి పాణిన్యాదులకు నమస్కరించారు .చివరగా –

‘’శబ్ద శాస్త్ర వివిత్సూనాం కుర్వేహ ముపకారకం –వైయాకరణ సిద్ధాంత కౌముదీ శరదాగమం ‘’

‘’పద క్లేశ మహా మేఘైశ్చన్నేయం దైక్షితీ కృతిహి- చకాస్తు కౌముదీ దానీం శరదాగమ  సంగతాః’’

ఇంతకంటే శాస్త్రిగారి జీవిత విశేషాలు అందు బాటులో లేవు .ఇందులో సంజ్ఞాప్రత్యయ ప్రకరణం నుంచి స్త్రీ ప్రత్యయ ప్రకరణం వరకు 14ప్రకరణాలు 534శ్లోకాలో ఉన్నాయి .

దీపావళి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-20-ఉయ్యూ

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంద్ర మహా భక్తవిజయ కర్త- .శ్రీ పంగులూరి వీర రాఘవుడు

సుమారు 1957లోనే   ‘’ఆంద్ర మహా భక్త విజయం ‘’అనే అమూల్య రచన చేసినవారు శ్రీ పంగులూరి వీర రాఘవుడు గారు .ఈ పు స్తక౦ పై రెడ్డిపాలెం ఆనందాశ్రమానికి చెందిన యోగి పుంగవులు  శ్రీ లక్ష్మీ కాంత యోగి  ఇలా వివరిచారు-‘’ఇండియాలో ఇతర దేశాలలో మహా బుద్ధిమంతులు అక్కడి మహా భక్తుల జీవిత విశేషాలను విశాల దృక్పధం తో రాశారు.అవి దివ్య జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి .వీటి వలన భక్తీ జ్ఞాన వైరాగ్యాలు కలుగుతున్నాయి .ఆంద్ర దేశం లో అలాంటి మహా భక్తుల చరిత్ర రాయటానికి ఎవరూ సాహసించలేదు .పంగులూరి వారు ముసలితనం లో అలాంటి రచన 80 సంవత్సరాల వయసులో చేసి ధన్యులయ్యారు ‘’.రచయిత ఈపుస్తక రచనలో తన ఉద్దేశ్యాన్ని ‘’మనశ్శక్తిని ఆత్మ శక్తిగా మార్చగలవి కర్మ భక్తీ జ్ఞానాలు .ఆత్మ శక్తిని బయటికి తీసినవాడే సమర్ధుడు .భగవంతుడు శక్తి స్వరూపుడు .భక్తుని భావాన్ని బట్టి ఆ శక్తి ఆకారం దాలుస్తుంది .భక్తుడు భగవంతునిలాగా సర్వ సమర్ధుడు .ప్రత్యక్ష భగవంతుడే భాగవతోత్తముడు .భగత్స్వరూపులైన అలాంటి వారి జీవిత విశేషాలు ,వారు చేసినమహాద్భుతాలు వివరించటానికే ఈ పుస్తకం రాశాను.ముద్రణకు ధనసాయం చేసినవారందరికీ కృతజ్ఞతలు . ‘’అని చెప్పుకొన్నారు .ఈ గ్రంథం7-5-1957 న ముద్రణ పొందింది .వెల 5 రూపాయలు మాత్రమే .

 

image.png

  కవిరచయిత అయిన వీర రాఘవుడుగారు బాపట్ల తాలూకా అప్పికట్ల గ్రామ వాసి .శ్రీమాన్ కాశీ  కృష్ణాచార్యులవారు ‘’ఆంధ్రలో అనేక వర్ణాలలో పుట్టి మహా భక్తులైన వారెందరో ఉన్నారు .వారి పేర్లు సుపరిచితం అయినా వారి గురించి పూర్తిగా ఎవరికీతెలియదు.ఈలోపాన్ని పూరించిన వారు పంగులూరి వారు .అలాగే మరి కొందరి జీవితాలను బుర్ర కధలు ‘’గా మార్చి లోకానికి అందించాలి ‘’అని ప్రశంసించారు .గుంటూరుకు చెందినశ్రీ రాగం ఆంజనేయులు-పాండిత్య ,కవిత్వాల జోలికి వెళ్ళకుండా ,అనుభవోపేతమైన వాక్యాలతో భక్తుల చరిత్ర సుబోధకం గా రాశారు .దేశాభిమానం ,ఆత్మ విశ్వాసం ,ఆత్మ గౌరవం కలిగించారు ‘’అన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన మహా విద్వాన్,పండిత  శ్రీమాన్ వేదాంతం జగన్నాధా చార్యులు  -‘’ఈపుస్తకం చదువుతుంటే ఆనా౦ద బాష్పాలు కారుతాయి ,ఆనంద పారవశ్యం కలుగు తుంది ‘’అని శ్లాఘించారు

 వీరరాఘవ శర్మగారు మహా భక్త కవి వరేణ్యులు .గుంటూరు లోని శ్రీ రామనామ క్షేత్రం లో వెలసిన శ్రీ కోదండ రామ స్వామి పై ప్రార్ధనా పద్యాలు చెప్పారు .

పోతనతో ప్రారంభించి మొత్తం 43 మహా భక్తుల విజయగాధలను శ్రీ పంగులూరి వీర రాఘవశర్మ గారు ఈ భక్త విజయం లో రాశారు .

వీరి కుమారులు డా శ్రీ పంగులూరి హనుమంతరావు రావు గారు ఈ పుస్తకాన్ని ఆధునీకరించి అందమైన రంగుల ముఖ చిత్రం తో కొంత సరళభాషతో 2014 న శ్రీ కౌండిన్య పబ్లికేషన్స్ అనే తమ స్వంత సంస్థ  ద్వారా ముద్రించి పిత్రూణ౦ తీర్చుకొన్నారు .నాకు సరస భారతికి ఆత్మీయులైన రావు గారు ఆ నూతన గ్రంధాన్ని నాకు పంపారు .

  ఇంతకంటే వివరాలు నాకు లభించలేదు .

దీపావళి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇవాళ నరక చతుర్దశి నాడు” మాడున చమురు” ముచ్చట మనుమడు, మనుమరాలితో

ఇవాళ నరక చతుర్దశి నాడు” మాడున చమురు” ముచ్చట మనుమడు, మనుమరాలితో

 

https://photos.google.com/share/AF1QipNv7UOmrkMXobfvHQzyygf5bsdV-X2Xe7SS589r5UPwP7WLEARczbfD39yL4-UjtQ/photo/AF1QipOZMhYApL8EQK7PJEf-v3hq-8OyXlVA76Rhu8UG?key=bGdYQ1Vmb1laWEJLNUxUa1ZhNDhVVlVFY25CWXJn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ధ్వన్యాలోక ఆంధ్రీకరణ కర్త -శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి

ధ్వన్యాలోక ఆంధ్రీకరణ కర్త -శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి

కొందరు కవులు, పండితులు ఎన్ని గొప్ప రచనలు చేసినా ,వారిని గుర్తించే వారు ఆకాలం లో ఉండేవారే కానీ తర్వాత కాలం లో వారి గురించి ఆలోచించే వారు కరువైపోతున్నారు .అలాంటి మహా కవి పండితులలో శ్రీ పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఒకరు .వారు అభినవ గుప్తుని ధ్వన్యాలోకాన్ని తెలుగులో ఆనువదించారు .ఈశా వాస్యోపనిషత్ ,కఠ ఉప నిషత్ లను పద్యాలుగా సులభ శైలిలో ఆంధ్రీకరించిన ప్రతిభా శాలి .వీరు కవి శేఖర ,సాహిత్య విద్యా ప్రవీణ ,ఉభయ భాషా ప్రవీణులు .వేదాంత విమర్శన విశారద బిరుదాంకితులు.విజయనగరం లో ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల లో ఆంద్ర భాష ప్రధాన ఆచార్యులు .పై మూడు గ్రంధాలు మాత్రమేకాక కావ్య కంఠముని రచించిన ఉమా సహస్రం కు పద్యానువాదం ప్రభా వ్యాఖ్యా వివరణం కూడా రాశారు .’’అంజలి ‘’అనే శ్రీ రమణ మహర్షికి అంజలి  ఘటించే పద్యాలు రాశారు .’’భామతి ‘’అనే స్వతంత్ర నవ్య కావ్యం రాశారు

  పంతుల వారి విద్యావైదుష్యాన్ని  గురించి మహా రాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల అధ్యాపకులు ,న్యాయ విశారద న్యాయ సుధానిధి ,న్యాయ మీమాంసాలంకార విద్యా ప్రవీణ శ్రీ కొల్లూరి లక్ష్మణ మూర్తి శర్మ అద్భుతం గా ,కొని యాడారు .ఆయన మాటల్లోనే ‘’పంతులు గారు బాల్యం నుంచే కవిత్వం అలవడిన అదృష్ట శాలి .సంగీతం వీరి సాహిత్యానికి మెరుగులు దిద్దింది .అతి కష్ట సాధ్యాలైన ఉపనిషత్తులను,శాస్త్ర గ్రంధాలను సులభ శైలిలో ఆంధ్రీకరించటం వీరి పాండిత్య ప్రకర్షకు ,శాస్త్ర విజ్ఞానానికి గీటు రాయిగా ఉంది .అధ్యాపక వృత్తి కొనసాగిస్తూ ,ఇంతటి ఉత్కృష్ట రచనలు చేయటం వీరి దైవోపాసనా శక్తిని చాటుతోంది .’’భారతీయ సంస్కృతియే పున రుద్ధరణమే ప్రతి భారతీయుని కర్తవ్యమ్ ‘’అని ఎలుగెత్తి చాటే మహాత్ముల మాటలను వృధా పోనీకుండా ,సంస్కృత భాషలోని అనర్ఘ రత్నాలను తెలుగు భాషలోకి తీసుకు రావాలంటే సంస్కృత పండితులకే సాధ్యం అని,ఆ సమయం ఆసన్నమైందని ఎరిగిన ‘’క్రాంత దర్శి’’   శ్రీ లక్ష్మీ నారాయణ శాస్త్రి .మహాకావ్యాలు ప్రవృత్తి,నివృత్తి దాయకాలు .సహజీవనం ,విశ్వ సౌభ్రాతృత్వం వీటిలో ఉన్నాయి ధ్వని యొక్క వాదాన్ని శంకించే వారి వాదాలన్నిటికి స్వస్తి చెప్పి ‘’ధ్వని ని కావ్యాత్మ’’ గానిరూపించిన సహృదయ విద్వ దగ్రేసరుడు శ్రీమదానంద వర్ధన అభినవ  గుప్తపాదుడు . అందుకే కావ్యాలు రాయాలన్నా ,మహా కావ్యాలు చదివి అనుభూతి చెందాలన్నా ఆయన రాసిన ‘’ధ్వన్యా లోకం ‘’ దానికి ‘’లోచనం’’ అనే వ్యాఖ్య అత్యంత ముఖ్యమైనవి . భగీరధుడు ఆకాశ గంగను హిమవత్పర్వత ద్వారంగా భారతావనిలో ప్రవేశింప జేసినట్లు శ్రీ శాస్త్రి గారు ప్రభా మతి చేత’’ ధ్వనిని’’ నాక లోకం నుంచి ‘’గుప్త లోచనోన్మీలన’’ద్వారా సహృదయ హృదయాలలో ప్రవేశింప జేశారు .పండితులకు మాత్రమె సాధ్యమయ్యే ‘’కర్కశ  గ్రంధులను’’కూడా వీరి ‘’ప్రభా మతి’’సర్వజన సువిజ్ఞేయం చేసింది .ఈ ఆంధ్రీకరణం తెలుగు వారి వాకిట బంగారు తోరణం .ప్రవేశించి నవారికి అంతా కొంగు బంగారమే .శాస్త్రి గారి పద్య ,వచనాలు రెండూ మధుర కోమల ప్రసన్న కాంతి లలితాలే ‘’

  స్వామి శివ శంకర స్వామి వేటపాలెం తీర్దాశ్రమం నుంచి శాస్త్రి గారి ఈశావాస్యోపనిషత్ ‘’ఆంధ్రీకరణం చదివి తమ అమూల్యాభిప్రాయం గా ‘’సామాన్య జ్ఞానం కలవారికి సక్రమ మార్గం లో ఉపనిషత్ సారం గ్రహించాలంటే మంచి అనువాదం తప్పని సరి .ఈ ఉపనిషత్ కు తెలుగులో చాలా అనువాదాలున్నాయి .కానీ శాస్త్రిగారు శంకర భాష్యాన్ని అనువదించటమే కాక ,ఇతర మతాచార్యుల భాష్యాలలోని ముఖ్య విషయాలను కూడా తేట తెల్లంగా చెప్పారు .టీకా కారుల వివరణ కూడా పొందు పరచారు .మూలానికి పదవిభాగ ,టీకా తాత్పర్యాలు సులభ శైలిలో రాశారు .సాహితీ సమితి సభ్యులవటం వలన స్వమతాన్ని కూడా ధైర్యంగా చెప్పారు .త్రిమతా చార్యుల తత్వాన్ని కూడా తెలియ జేశారు .గురువుల వద్ద వివిధ శాస్త్రాలు నేర్చిన శాస్త్రిగారు వేదవేదాంత అలంకార సంగీత శాస్త్రాలనూ క్షుణ్ణంగా  మధించారు .కావ్య రచన లతో పాటు ,గేయ కావ్యాలూ రాశారు .లోచనాది వ్యాఖ్యాన సమన్విత ‘’ప్రభా మతి సహితంగా ‘’ధ్వన్యాలోకాన్ని ‘’పద్య గద్యాత్మకంగా   అనితర సాధ్యంగా శాస్త్రి గారు ఆంధ్రీకరించారు .వేదాంత డిండిమం’’మొదలైన వాటిని గేయాత్మకంగా తెలుగు చేశారు.’’భామతి ‘’మొదలైన స్వతంత్ర పద్యకావ్యాలనూ మహా ప్రజ్ఞతో రాశారు ‘’అని శ్లాఘించారు .ఇది 24-9-1944లో ప్రధమ ముద్రణ ,30-6-1959లో ద్వితీయ ముద్రణ పొందింది .

  శాస్త్రి గారి ‘’ఆంద్ర కాఠకోపనిషత్ ‘’ను ప్రస్తుతిస్తూ విజయనగారసంస్కృత కాలేజి వ్యాకరణ ,అలంకార శాస్త్ర ఉపన్యాసకులు శ్రీ నౌడూరు వేంకట శాస్త్రి ‘’అర్ధ జ్ఞానం తో ఈ ఉపని షత్తును అధ్యయనం చేసి శాస్త్రి గారు ‘’అన్యూన్యాతిరిక్తం గా ఆంధ్రీకరించటం అభినందనీయం ‘’అన్నారు ‘’.The present translation has rendered the original into Telugu and it reads well ‘’అని కీర్తించారు మహారాజా కాలేజి ప్రొఫెసర్ కె.రంగా చారి .విజయనగర ప్రభుత్వ సంస్కృత కాలేజి ప్రధాన ఆంద్ర పండితులు శ్రీ ఆకొండి రామ మూర్తి ‘’శాస్త్రి గారు నాకు బంధువు చిరపరిచితులు కూడా .శాస్త్రి గారు నాకు ఈ అనువాదాన్ని మా ఇంట్లో నాకు చదివి వినిపించారు .అందులోని అమూల్య విషయాలను ఆస్వాదిస్తూ ,ఆకవితామృత రసాస్వాదనను మహా పార వశ్యంగా విన్నాను .ఎక్కడా దోషం కనిపించలేదు .మహా వృద్ధ పండితులు మాత్రమే చేయదగిన సాహస కార్యాన్ని శాస్త్రిగారు అలవోకగా ,అసాధారణంగా ,నిర్దుష్టంగా ఆంధ్రీకరింఛి నందుకు మనసారా అభి నందిస్తున్నాను .ప్రిన్సిపాల్ శ్రీ రామానుజ స్వామి ‘’shastri is proficient in Sanskrit and Telugu .The trans lation gives a good coception of the teaching of SHANKARA .This book alone serve the purpose of enrichingthe Telugu language .Lakshmi Narayana has to be congratu lated on making a real contribution to the Telugu literature and earning the gratituseof Telugu people .’’అన్నారు .ఈ పుస్తకం 1-9-1953న ప్రచురితం .

గ్రంధ కర్త శాస్త్రిగారు తమ గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారికి నిండుమనసుతో కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .అమూల్యాభిప్రాయం తెలిపిన శ్రీ కిళాంబి రంగా చార్యుల గారికి ,ముద్రణ ఖర్చును భరించిన శ్రీ జ్ఞానేద్రాశ్రమానికి ,శ్రీ జ్ఞానానంద రామానందుల వారికి సవినయం కృతజ్ఞతలు ప్రకటించారు .ఈ గ్రంధం 1-5-1935లో ప్రచురితమైనది .

ధన త్రయోదశి శుభా కాంక్షలతో

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-20

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దీపావళి శుభాకాంక్షలు 

దీపావళి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు రేపు 13-11-20శుక్రవారం ధన త్రయోదశి  శుభాకాంక్షలు
                           త్రయోదశి రేపు  సాయంత్రం 4గంటలవరకు ఉంది ఆతర్వాత చతుర్దశి వస్తుంది  తెల్ల వారుజామున చతుర్దశి ఉన్నప్పుడే తలంటి పోసుకొంటారు కనుక తెల్లవారితే శనివారం
  అంటే 14-11-శనివారం తెల్లవారుఝామునే తలంటి పోసుకోవాలి  ఈ రోజే నరకచతుర్దశి .
రాత్రి అమావాస్య ఉన్నప్పుడే దీపావళి అమావాస్య టపాసులు కాల్చాలికనుక ,చతుర్దశి శనివారం మధ్యాహ్నం 1.48 వరకే ఉండి,తర్వాతఅమావాస్య వస్తుంది  రాత్రిగల అమావాస్య ఉంటుంది కనుక 14 వ తేదీ రాత్రికే దీపావళి టపాకాయలు కాల్చుకోవాలి ‘
 మొత్తం మీద 14శనివారం తెల్ల వారుజామున తలంటి,, ఆసాయంత్రం దీపావళి చేసుకోవాలి
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక శోభ 

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక శోభ

కార్తీక మాసం లో శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో 16-11-20 కార్తీక శుద్ధపాడ్యమి సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రతిరోజూ ధ్వజస్తంభానికి కార్తీకదీపాల ఏర్పాటు ,,దీపదర్శనం
17-11-20 మంగళవారం నుంచి ప్రతిమంగళ వారం రాత్రి 7గంటలకు ప్రమిద దీపాలతో దీపాలంకరణ జరుగుతుంది భక్తులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన . -గబ్బిట దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మ కర్త

image.png
Posted in దేవాలయం | Tagged | Leave a comment

విశ్వ గాయకునికి విశిష్ట నివాళి

గాయకులలో కొందరు బహుళ ప్రజాదరణ పొందితే, అందులో కొందరు బహుముఖ ప్రజ్ఞను చాటితే ,వారిలో  అరుదుగా అతికొద్దిమందిమాత్రమే  ఫలప్రదమౌతారు .అలాంటి అరుదైన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం .కర్నాటక సంగీతం లో ఏమాత్రం ప్రవేశం లేనిస్థాయి నుంచి అత్యుత్తమ సంగీత గాయకుడుగా రూపు దాల్చాడు .సంగీత జ్యోతి కాంతులు విశ్వ వీధుల్లో ప్రజ్వరిల్ల జేశాడు .’’రాగాలన౦తాలు నీ వేయిరూపాలు –భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు ‘’అన్న శంకరాభరణం చిత్రం లోని వేటూరి పాటకు నిలువెత్తు గాన జ్యోతి గా భాసింఛి భారతీయ లౌకికవాదాన్ని విశ్వవ్యాప్తం చేశాడు .అలుపెరుగని గాన రవళితో అర్ధ శతాబ్దం తనదైన ముద్ర వేశాడు .అందులో ముప్పై ఏళ్ళు తనకు సాటి ఎవరూ లేరని 40వేల పాటలు 16భాషలలో పాడి  నిరూపించాడు  .వయసు మీదపడుతున్నా యువకోత్సాహం చల్లారలేదు .భావోద్వేగం తో నవ్వు, విషాదం .దుఖం , ప్రేమ ,శృంగారం ఒలికించిన  పాటలు చిరస్మరణీయాలు .అందులో విషాదాన్ని అత్యద్భుతంగా అతని స్వరం ఆవిష్కరించింది ..అమెరికన్ కవి లాంగ్ ఫెలో అన్నట్లు అతని మరణం  మన హృదయాలపై మరణ మృదంగ ధ్వని విన్పించి నిద్ర పుచ్చాయి .గానమే ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవించిన సార్ధకజీవి బాలు .ఘంటసాల మాస్టారి ‘’పాడుతా తీయగా ‘’ను తానూ అంతగా పాడి, ప్రపంచ దేశాల వర్ధమాన గాయనీ గాయకులచేత గానం చేయించి, భారతీయ సినీ సంగీత లహరి ని ఎల్లలు దాటించి ప్రవహింప జేసిన కారణ జన్ముడు గానగంధర్వ బాలు అనే పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం.

   ఈ విశ్వ గాయకుడు ‘’బాలు’’ కు గోదావరి జిల్లా రచయితల సంఘం (గోరసం )అధ్యక్షుడు,కవి కధకుడు, నిత్యోత్సాహి శ్రీ శిష్టు సత్య రాజేష్ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల 88 కవులచే ఘననివాళి గా కవితా కల్హారాలు పూయించి  , ‘’గాన గందర్వుడు బాలు ‘’గా చక్కని పుష్పమాల కూర్చి విశిష్ట నివాళి అందింఛి అందరికీ మార్గదర్శి అయ్యాడు .ఇక్కడ 88 సంఖ్య ను’’ దేవతా సంఖ్య’’ అంటే ఏంజెల్ నంబర్ అంటారు .కనుక ‘’సంగీతదేవత’’కూడా ప్రత్యామ్నాయం కావచ్చు .ఇందులోని కవితలు బాలుని విభిన్న కోణాలలో ఆవిష్కరి౦చి అతని బహుముఖ ప్రజ్ఞాశీలతను మనముందుంచుతాయి .’’ఆతను నడిచిన బాట౦తా పాటల పరిమళమే ‘’అని రాదికారాణి అంటే ,అతడిది రసామృతమనీ .అక్షర ప్రతిరూపమనీ ‘’స్వాతి,అతనిపేరులోని అక్షరాలకూర్పుతో రాజేష్ ‘’గమకానికి చిరునామా ,భారత స్వర సౌధం ‘’అనగా. శీనమ్మ’’సంగీతసామ్రాజ్ఞానికి మకుటం లేని మహారాజు ‘’అనీ హావభావ రాగ మనోహరగానమని ముక్కా ,శృతి లయలగతులు మార్చాడని స్వర్ణలత ,’’పాటే మంత్రం ‘’అని రాజ్యలక్ష్మీ ,’’శ్రోతకు స్వరాభిషేకం ,పాటకు పట్టాభి షేకం చేసిన గాన త్రివిక్రమ విక్రముడు ‘’అని పరిమి ,’’ప్రణవ నాదానికి ప్రాణం పోసిన భిషగ్వరు ‘’ డని  వీరమణి  వీర తాళ్ళు  వేశారు ‘’నూతన గళాలకు నడకలు నేర్పిన గానమయూరి ‘’అని శైలజ ,’’ఆగాన లహరికి వెన్నెల జలపాతం వెలవెల బోతుంది ‘’అని మాకే ,’’గాన తేజస్వీ ,పాటల తపస్వీ ‘’అని మంజీత ‘’పాటతో హాయి నింపే శాంత ముగ్ధుడు ‘’అంటూ కవిత,’’సప్తస్వరాల గుప్త నిక్షేపం ‘’అని దుర్గా ,’’ప్రేమికులను ,శ్రామికులను మెప్పించిన గానం ‘’అని ముద్దు ,’’పాటను ఇష్టపడిపాడాలికాని కస్టపడి కాదు ‘’అని సుద్దు చెప్పాడని పద్మావతి ,’’పండిత పామర హృదయనేత పండితారాధ్యుడు’’అంటూ పరాంకుశం ,’’ఒక్కడై  వచ్చి  ఒక్కడై వెళ్లి శూన్యం మిగిల్చాడు ‘’అని  బొక్కేల,,’’గాయక ,నట ,సంగీత దర్శక బాలు ‘’అని రామారావు ,’’వినమ్రతకు నిలువెత్తు నిదర్శనం ‘’అని శైలజ మొదలైన వారంతా తమ మనోభావాలకు కమ్మని కవితా మాలలల్లి  విశ్వగాయకుడు బాలు కు విశిష్ట నీరాజనం పట్టారు .ఈ కవితా కదంబం చక్కగా ఉన్నా చిక్కగా లేక, వదులొదులుగా ఉందేమో అనిపించింది .మంచి ప్రయత్నం. రాజేష్ తోపాటు కవులందరికీ అభినందనలు .

   గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment