మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -2(చివరి భాగం )

మహా భక్త శిఖామణులు

22-కూర్మ దాసు -2(చివరి భాగం )

కడప,  వేమవరం,నరసరావు పేట  సప్తాహాలు

కడప సప్తాహం లో ఒక రోజు గజోతోవం జరుగుతుంటే ,భక్తుల హారతులతో చలువ పందిళ్ళు ఒక్క సారిగా అంటుకొని మండగా ,ఒక కొత్త యువకుడు గజవాహనం నుంచి అవతరించి ,మంటలను ఆర్పేసి అదృశ్యమయ్యాడు .భగవదనుగ్రహం గా భావి౦చారందరూ .

  వేమ వరం సప్తాహం లో సప్తాహం చివర జరిగే అవభ్రుద స్నాన సమయం లో ,కూర్మ దాసు కు దగ్గరగా ఉన్న తాడేపల్లి రత్తయ్య మనవడు తటాకం లో పడి చని పోబోతుంటే ,ఆయనకు ఆ జన్మ విరోధి అయిన ఒకాయన వచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడి రత్తయ్యకు ఆనందం కలిగించాడు .తను ఒక నూతన పురుషుని ప్రోద్బలం తో ఈపని చేశానని అతడు చెప్పాడు .నరసరావు పేట సప్తాహం నియోగి వైదీకి తగాదాలు లేకుండా సవ్యం గా సాగిపోయింది .అన్నదమ్ముల్లా అంతా కలిసి క్రతు విజయానికి తోడ్పడ్డారు .

        రామకోటి సమర్పణ

 రామకోటి ని భద్రాద్రి రాముడికి సమర్పించటానికి బయల్దేరితే ,చాప రాళ్ళ పల్లి ,మొలకలపల్లి మధ్యలో భక్తులు ఒళ్లుమరచి భజనలు చేస్తుంటే మృదంగ ధ్వనులు మిన్ను ముట్టాయి .రామ ప్రభువు దాసు గారికి సాక్షాత్కరించగా ఆయన స్తుతి తో సాయంకాలం దాటింది క్షుత్పిపాసలు మరచిపోయి భక్త యాత్రికులు పరమానందం పొందారు .మర్నాడు ఉదయం భద్రాద్రి చేరి సంరంభంగా శ్రీరామకోటి సమర్పించి కృతార్దులయ్యారు .

   ఇతర సత్ర యాగాలు

 సికందరాబాద్ సప్తాహం లో గుండా మహారాజు దగ్గర శ్రీ పాండురంగ మంత్రోప దేశం పొంది ,ఆప్రభావం తో లింగ గూడ,గొసవీడు లలో సప్తాహాలు చేసి ధన్యుఅలయ్యారు దాసు .గొసవీడు సత్ర సమయం లో యాత్రికులకు దాసు గారు ఒక్కొక్క లడ్డు మాత్రమె వడ్డించే ఏర్పాటు చేశారు .మారు అడిగితె ఎవరూ మాట్లాడటం లేదు ఇంతలో ఒక తేజో మూర్తి వచ్చి దాసుగారితో ‘’లడ్డూలు చాలవని అను కొంటున్నావా ?దైవానుగ్రహం తో కావలసినన్ని వస్తాయి .అడిగినవారందరికీ ఎన్నికావాలంటే అన్ని వడ్డించమని చెప్పు ‘’అని చెప్పి అంతర్హితుడయ్యాడు .ఇది శ్రీరామ మహిమాప్రభావమే .ఎన్ని లడ్డూలు వేసినా రాసి తరగటం లేదట .గొప్ప వింతగా చెప్పుకొన్నారు .

        దాసుగారి ఇతర సేవాకార్యాలు

  లింగ గూడసత్రం లో మగవాళ్లు వెంక బడగా ముందు వచ్చిన ఆడవారు ఆకలికి ఆగలేక భోజనాలు చేస్తుంటే ,కమ్మగా వంటవారు వండి వడ్డిస్తుంటే ఒక లావు పాటి ఆయన వచ్చి ఆకలి అని గోల చేస్తే దాసుగారు ప్రత్యేకంగా కూర్చోపెట్టి వడ్డింప జేయగా ,అతుడు భోజనం చేస్తూ –‘’పరులు ని౦ది౦చు పట్ల గోపంబు గొనక –శాంతమును బూని వినయపుష్కలత నూని –విహిత సంభాష ణంబుల వెలువరించి –స్వా౦తమున వారి సంతస పరపు సతము ‘’అనే పద్యం చాలాసార్లు పాడి గోవింద గోవింద అని భోజనం చేసి అంతర్ధానమయ్యాడు .దాసు గారు ఆయన సాక్షాత్తు భగవంతుడే అని ,తనకోపాన్ని తగ్గించుకొన్నారు .జీవితకాలం లో దాసుగారు 20 సప్తాహాలు నిర్వహించి ,యాత్రిక సౌకర్యార్ధం నాలుగేళ్ళు గోసవీడులో ఒక ఏడాది బూర్గం పహాడ్ అనే బూరగొమ్మలపాడు ,కొత్తగూడెం లో నాలుగేళ్ళు ,పండరి క్షేత్రం లో తొమ్మిదేళ్ళు అన్నసత్రాలు నిర్వహించారు .చీరాలలో పాండురంగాపురం లో పాండు రంగ ప్రతిష్ట చేసి ,దీనికి అనుబంధంగా నిరతాన్న సత్రం నిర్వహించారు .

   భక్తి ప్రచార కార్యక్రమం లో గుంటూరు నుంచి బయల్దేరి మధ్యలో మజిలీలు చేసి షోలాపూర్ స్టేషన్ లోమకాము చేయగా ,అమావాస్య చీకటి లో ,అర్ధరాత్రి ఇద్దరు దొంగలు దాసుగారి రెండుమూటలు ఎత్తుకుపోగా ఇద్దరు యువకులు వారిని అడ్డగించి సొమ్ము వారి నుంచి తీసుకొని పోలీసు డ్రెస్ లో వచ్చి అప్పగించి చోరీ విషయం అందరికీ చెప్పి అదృశ్యమయ్యారు .పండరి చేరి రంగని దర్శించి గుంటూరు చేరారు .చీరాల పాండురంగాపుర పాండురంగ దేవాలయం లో నిష్కామ సౌభాగ్య దురంధర ,సమయోద్దండ ,కోలాహల మొదలైన బిరుదులున్న  శ్రీమదద్దంకి తిరు వేంకటాచార్య దేశికోత్తముల ఆధ్వర్యం లో ప్రతిష్టి౦ప బడిన స్వామికి కైంకర్యం మహా వైభవంగా జరుపుతున్నారు.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

40ఏళ్ళు గా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ

 

 

 

40 ఏళ్ళుగా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ

 

అతధునిక 21 వ శతాబ్దం లో భారత దేశం లో న్యాయవాదులంతా ఇంగ్లీష్, హిందీ లేక వారి ప్రాంతీయ భాష లో మాత్రమే కేసులు వాదిస్తుంటే, వారికి భిన్నంగా సంస్కృతం లోనే కేసులు వాదించే ఏకైక లాయర్ వారణాసి లోని  ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ .ఇప్పటికి సుమారు 40 సంవత్సరాలనుంచీ ఆచార్య ఉపాధ్యాయ సంస్కృతం లోనే కేసులు వాదిస్తూ రికార్డ్ సృష్టించారు .

  ఆచార్య ఉపాధ్యాయ అఫిడవిట్ లు ,లీగల్ డాక్యుమెంట్ లు అన్నీ సంస్కృతం లోనే రాస్తారు .ఆయన సంస్కృత బి.యే. బి .ఎల్ .మరియు ఆచార్య .ఈయన తండ్రి భారతదేశం లోని కోర్టులలో సంస్కృతం వాడకం లేదని చెప్పినప్పుడు అవాక్కయ్యారు .అందుకే తనతో అది ప్రారంభం కావాలని దీక్ష బూని అనుసరిస్తున్నారు .వీరికుమారుడికీ దీనిపై అభిలాష బాగా ఉన్నది .సంప్రదాయ బద్ధమైన నల్లకోటు ధరించిదట్టమైన విభూతి రేఖలతో ,తిలకం తో కోర్టుకు హాజరౌతారు ఆచార్య .సంస్కృతంలో ఉపాధ్యాయ వాదం ప్రారంభించగానే కోర్టు హాలు లో నిశ్శబ్దం తాండవించి ఆయన  గంగా ప్రవాహ సదృశ వాగ్దోరణినికి ముగ్దులౌతారు  .అయన మాట్లాడే సంస్కృతం అత్యంత సరళంగా ఉండి,అందరికీ అతి తేలికగా అర్ధమౌతుంది  .తన క్లెయింట్ లకు కూడా కేసు వివరాలు సంస్కృతం లోనే వివరిస్తారాయన  .న్యాయమూర్తులు కూడా ఆయన  సంస్కృత దీక్షను  అభినందించి ,ప్రోత్సహిస్తున్నారు  .ఆయన ప్రభావం వారిపైనా పడటం తో,తీర్పులు కూడా హిందీలో కాని  ,సంస్కృతం లో కాని ఇస్తున్నారు .  ఆయన సంస్కృత భాషకు 1978నుంచి అంకితభావంతో చేస్తున్న విలువైన కృషిని,సేవ  గుర్తించి 2003లో ఆచార్య ఉపాధ్యాయకు ‘’సంస్కృత మిత్ర ‘’బిరుదు ప్రదానం చేసి కేంద్ర మానవ వనరుల శాఖ  గౌరవించి సత్కరించింది .సంస్కృతం లో కేసులు వాదించటమే కాదు సుమారు 60కి పైగా నవలలు సంస్కృతం లో రాసి ఆదర్శంగా నిలిచారు శ్యాం ఉపాధ్యాయ ఆచార్య .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-21-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

55ఏళ్లనాటి ఉయ్యూరు హైస్కూల్ ఇంటివద్ద ట్యూషన్ శిష్యురాలు నన్నుమామయ్యాఅంటూ పరవశించి పిలిచే మేన కోడలు లాంటి గోసు కొండభ్రమరాంబా ఇవాళ సాయంత్రం మాఇంట్లో తమ్ముడు వాసు దేవ శాస్త్రి తో

55ఏళ్లనాటి ఉయ్యూరు హైస్కూల్ ఇంటివద్ద ట్యూషన్ శిష్యురాలు నన్నుమామయ్యాఅంటూ పరవశించి పిలిచే మేన కోడలు లాంటి గోసు కొండభ్రమరాంబా ఇవాళ సాయంత్రం మాఇంట్లో తమ్ముడు వాసు దేవ శాస్త్రి తో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -1   పంగుం లంఘ యతే

మహా భక్త శిఖామణులు

22-కూర్మ దాసు -1

  పంగుం లంఘ యతే గిరీం

ఇలపావులూరి  వెంకట సుబ్బయ్య అనే కూర్మ దాసు బాగా  బీద వాడు విద్యా శూన్యుడు ,సుందర దేహుడు .తండ్రి శ్రీనివాసులు ,తల్లి ఆదెమాంబ . సోదరులు వెంకట కృష్ణయ్య ,సీతారామయ్య .19వ శతాబ్దం లో దాసు జననం .జన్మతోనే కుంటి వాడు .నివాసం కందుకూరు తాలూకా సింగమనేని పల్లె ..అక్షరాభ్యాసం తోనే భక్తి బీజం మొలకెత్తి,క్రమంగా పూలు పళ్ళూ కాసి స్థిరపడింది .ఉపనయన వేడుకా జరిగింది .భజన మండలి స్థాపించి నిత్య భజనలు చేస్తూ రామ, కృష్ణ ,నరసింహ జయంతులు జరిపేవాడు .

 వెంకట కృష్ణయ్య కూర్మదాసు అవటం

ఆకాలం లో మహాద్భుత తరంగ గానం చేసేవాడు ఏలేశ్వరపు సీతారామాంజనేయులు .ఈయన్ను కలవాలని కోరిక ఎక్కువగా ఉండేది.డబ్బు లేదు కాళ్ళూ లేవు .దేవుడిపై భారం వేసి చంకకర్రల సాయం తో ,నడిచి మజిలీలు చేస్తూ ,ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఒక ఉదారుని సహాయం తో వెల్లటూరు చేరి ,అక్కడ మల్లాది సుబ్బావదానులుచేసే సప్తాహం లో పాల్గొనటానికి వెడుతున్న సీతారామాంజనేయులు గారిని కలిసి ఆయనతో వల్లభాపురం వెళ్లి సుబ్బదాసు గారినిదర్శించి ఆయన అభిమానం పొందభక్తి ,ఇతడి తత్పరతకు సుబ్బదాసు గారు ఆశ్చర్యపడి హస్తమస్తక న్యాయంగా   ఆశీర్వ దించి ,అలనాటి పాండురంగని భక్తుడైన కూర్మ దాసు లాగా ప్రసిద్ధి చెందమని    ‘’కూర్మ  దాసు ‘’అనే పేరు పెట్టి పిలవటం ప్రారంభి౦చగా లోకం అంతా కూర్మదాసు అనే పిలవటం మొదలెట్టారు . సుబ్బదాసు గారు బాలకృష్ణ లీలా తరంగాలతో మైమరపించారు పొద్దు గుంకి చాలా సేపయింది ఎవరికీ బాహ్య జ్ఞానం లేదు అందరూ అంతర్ముఖులై దివ్య గాన లీలలో తన్మయు లయ్యారు .అందరి చేత స్నానాలు చేయించి కొత్త బట్టలు ఇచ్చి షడ్రసోపేత భోజనం పెట్టి చందన తాంబూలాలతో సత్కరించి ,సుఖా సీనుల్ని చేసి సుబ్బదాసు గారు కూర్మ దాసుతో ‘’’నాయనా !నా లాంటి కుటుంబీకుడు ఇలాంటి సప్తాహాలు నిర్వహించటం కష్టం .నువ్వు కుంటి అని దిగులు పడకు . అది దేహానికే కాని మనసుకు కాదు నువ్వు ఈ సప్తాహ కాలక్షేపం నిర్వహిస్తూ దేశం లో పేరు పొందాలి ఇదిగో నిరతాన్న దాన శిరోమణి వరంగల్లు వరమ్మ గారు .వారి ఆశీస్సులు పొందు శుభం జరుగుతుంది ‘’అనగా ఆమెకు నమస్కరింఛి ఆశీస్సులు పొందాడు కూర్మ దాసు .

  పాండురంగ సప్తాహం

పాండురంగ సప్తాహం జరపాలని కూర్మ దాసుకు అనిపించగా వరమ్మగారి సహాయంతో పండరీపురం వెళ్లి పాండురంగ స్వామిని దర్శించి ,సప్తాహ దీక్షలు నిర్విఘ్నంగా జరిగేట్లుదీవించమని ప్రార్ధించి ,కొన్ని రోజులుండి,అక్కడి నుంచి తెనాలి చేరి ,తురగా కృష్ణయ్య  గారింట్లో జరిగిన భజనలో పాల్గొని ,ఈమని చేరి నేలనూతుల సుబ్బావధానులు గారింట బస చేసి,ఉపవాస దీక్ష చేసి బ్రహ్మ సత్రం చేయటానికి సిద్ధార్ధి సంవత్సర ఆషాఢశుద్ధ పంచమి శుభ ముహూర్తంగా ఏర్పాటు చేసుకొని ఊరివారికి తెలియ జేయాలను కొంటె అక్కడ వైదిక ,నియోగి తగాదాలు తీవ్రంగా ఉండటం తో,చందాలు ఇచ్చేవారెవరూ ముందుకు రాకపోతే ఇక మూడే మూడు రోజులు గడువు ఉందనగా ,ప్రజలేకాక వాతావరణమూ అనుకూలంగా లేకపోగా ఆ రోజు స్వప్నం లో శ్రీరామ లక్ష్మణులు వైష్ణవ వేషం లో సాక్షాత్కరించి ,ముహూర్తాన్ని నవమికి మార్చి కరపత్రాలు పంచిపెట్టమని ,మిగిలిన పనులు తామే చూసుకొంటామని అభయమిచ్చారు .

 ప్రోగ్రాం పేపర్లు ముద్రించటం ,పందిళ్ళు వేయించటం సుబ్బావదానులుగారు ఖర్చుతో పూర్తి చేశారు .పెద్దిరాజు మహాలక్ష్మమ గారిని మొదటి రోజు కు ఉభయం ఇమ్మని కోరితే బదులు చెప్పకుండా తలూపి వెళ్ళింది .నిరాశ పడిన దాసు గారు ,మండపం నిర్మించి అర్చా మూర్తులను ఏర్పాటు చేశారు .అర్ధరాత్రి దాటాక వరలక్ష్మమ్మ గారు అయిదు వందల రూపాయల పళ్ళెం తో వచ్చి అంద జేసి ,రామాజ్ఞతో మిగులు తరుగు బాధ్యతలన్నీ తనవే అని చెప్పి వెళ్లి పోయింది .మర్నాడు నుంచి బ్రహ్మ సత్రం మొదలై రోజూ ఎవరో ఒకరు ఉభయ౦   ఇవ్వటానికి ముదు కురాగా కొత్తపల్లి ,నిడమానూరు ,మైనం పాడు నుంచి వచ్చిన భక్త బృందాలకు ఘన సత్కారాలతో బ్రహ్మ సత్రం దిగ్విజయంగా ముగిసింది .దాసుగారి సప్తాహాలలో జాతి కులమత విచక్షణ లేదు అన్ని క్రతువులలో పాళీ భక్త బృందమే పాల్గొనేది

  ఒంగోలు సప్తాహం

ఒంగోలు సప్తాహం లో మూడవరోజు నృసింహో పాసకురాలైన కైవారం బాలాంబ గారిని శా౦తపరచటానికి 108బిందెల పానకం ,బస్తా వడ పప్పు నైవేద్యం పెట్టగా యాత్రికుడికి ఒక గిద్దెడు మాత్రమే పానకం లభించింది అంటే ఎంతమంది వచ్చారో ఊహించ లేము లక్షలాది జనం వచ్చారని భావించారు .ఆరోజుల్లో ఉచ్చిష్ట పాత్రలను తొలగించటానికి రెండు రెండెడ్ల బళ్ళు అనుక్షణం పని చేసేవి .రెండవ రోజు తరంగ గాన భజనలో ఒళ్ళు మరచిబ్రహ్మానంద  పరవశంతో నృత్యాలు చేశారు.దాసు గారు అక్కడికి రాగానే కోటి సూర్య ప్రకాశమైన ఆత్మజ్యోతి కూర్మ దాసుగారిని ముంచేసి ,ప్రేక్షకులు చూస్తుండగా అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసింది .ఈ అద్భుత సంఘటన చూసిన నీలంరాజు  బాలాంబ గారు ,చలపతి రావు దంపతులు మిగిలిన నాలుగు రోజుల ఉభయానికి 6 వేల రూపాయలు దాసుగారికి సమర్పించి కృతతకృత్యులై క్రతు సమాప్తికి గొప్పగా తోడ్పడ్డారు .బ్రహ్మ సత్రం లో రోజుకు రెండు నీలిమందు కళాయీల నెయ్యి ఖర్చయ్యేది  .దాసుగారు ఎక్కడ సత్రం నిర్వహించినా ఇంతభారీగా జరిగేవి .ప్రజల స్పందనా తోడ్పాటు కూడా  వర్ణించ నలవికానిదిగా ఉండేది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-3( చివరి భాగం )

మహా భక్త శిఖామణులు

21-తూము లక్ష్మీ నృసింహ దాసు-3( చివరి భాగం )

అప్పుడు హైదరాబాద్ లో నాజరు ద్దౌలా నవాబ్ ఉండేవాడు .అతనికి మహా రాష్ట్ర బ్రాహ్మణుడు ధర్మాత్ముడు చండ శాసనుడు ,సన్మార్గ ప్రవర్తకుడు  ,సమర్ధుడు ,భక్తుడు అయిన చందూలాల్ ప్రధాన మంత్రి గా ఉండేవాడు .ఒకరోజు ఈయకలలో శ్రీరాముడు కనిపించి ‘’నీ దగ్గరకు నరసింహ దాసు వస్తున్నాడు .వాడు నా ప్రియ భక్తుడు సుమా ‘’అని చెప్పాడు .నిద్ర మేల్కొని నరసింహ దాసు దయవలన తనకు రామ దర్శనం కలిగిందని అబ్బురపడి  నమస్కరించి ,దాసు గారికోసం కన్నులు కాయలు కాసెట్లు ఎదురు చూస్తున్నాడు .కొన్ని రోజులకు దాసు గారు హైదరాబాద్ చేరి చందూలాల్ మందిరానికి వెళ్లి ,’’రాజాధిరాజా సలాం ‘’అని మ్రొక్కగా ,ఊర్ధ్వ పు౦డ్రాలతో ,తులసిపేరులతో ,విశాల నేత్రాలు ,నీర్కావి ధోవతిలో నవ్వు ముఖంతో దాసు గారు తనను ‘’మీ రాజ్యం లోని భద్రాద్రి వాసిని.నరసింహ దాసు డను ‘’ అని పరిచయం చేసుకోగా గద్దె మీదనుంచి అమాంతం లేచి వచ్చి కౌగిలించుకొని ‘’శ్రీరామ చంద్ర పరమాత్మ అనుగ్రహం పొందిన మహాత్మా !భక్త పుంగవా !మీరాకతో నన్ను పవిత్రుని చేశారు .నేను మీ బంటును ఎమికావాలో  సెలవిస్తే  క్షణాలమీద నిర్వహిస్తాను ‘’మా ఇల్లు పావనం చేయండి రండి ‘’అని అత్య౦త వినయంగా నమస్కరించి చేతులొగ్గి చెప్పాడు లాల్ .దాసుగారు కూడా లాల్ గారిని ఆప్యాయంగా కౌగలించుకొని ‘’అంభోజ గర్భాదులరయంగ రానిశ్రీరామ చంద్రు నీక్షించ  గలిగితివే .యెంత ధన్యుడవు తండ్రీ !’’అంటూ కొంత సేపు ఇద్దరూ మాట్లాడుకొన్నారు .లాల్ ఇంట్లో కొన్ని రోజులుండి రామ తారక మంత్రోప దేశం చేయగా పరమానందం పొందదాడు

    రాజా నృసింహ దాసు

 కొన్ని రోజులతర్వాత వచ్చిన పని ఏమిటో చెప్పమని అడిగాడు .అప్పుడు దాసుగారు భద్రాద్రిలో జరుగుతున్న అకృత్యాలన్నీ పూసగుచ్చినట్లు  అక్కడ అన్ని కార్యక్రమాలు యధా విధిగా జరిగేట్లు చూడమని చెప్పాడు .చందూలాల్ వెంటనే ‘’మీరే ఆఅధికార౦  తీసుకోండి ‘’అనగా వేరే విధంగా భావి౦చవద్దన్న దాసు గారి మాటలకు మంత్రి అడ్డుపడి –‘’భద్రాద్రి పాల్వంచ  పరగణా లెల్ల –భద్రంబు గా నీవు పాలి0పదగుడు –వాయుర్వికెల్లనీ వధికారము మూని  -చేయుము న్యాయ స౦సిద్ధి బాలనము –రాజితమైనట్టి రాజా బిరుదము –నే జెల్వగా నీకిదె నొసగితిని – చెలగి నిన్ ‘’రాజా నృసిహ దాసంచు’’-బిలుతు రింతటి నుండి ‘’అంటూ దాసుగారు వద్దు మహా ప్రభో అంటున్నా వినకుండా శాసనం తయారు చేయించి దాసు గారి చేతికిచ్చాడు లాల్ .దీనితోపాటు రెండు ఒంటెలు రెండు ఏనుగులు ,నాలుగు గుర్రాలు ‘’సరిఫేష్తురాయి ,సరిగంచు సెల్వ’’ప్రదానం చేసి ,కనకాభి షేకం చేసి ,కొద్ది దూరం ఆయన వెంట నడిచి వీడ్కోలు చెప్పాడు .ఖరనామ సంవత్సర ఆషాఢకృష్ణ చతుర్దశికి రాజా నరసింహ దాసు భద్రాద్రి చేరాడు.ఆరోజు నుండి తాలూకా అధికారిగా గజ౦తైశ్వర్యం  లభించి ,అదంతా రామార్పణం చేసి,శ్రీరామ కైంకర్యం వేళ త్రప్పకుండా జరిగేట్లు చేశారు దాసు గారు .అప్పటినుంచి భద్రాద్రి నిత్యకళ్యాణం పచ్చతోరణం అయింది .కలియుగ వైకుంఠమే అయింది –‘’రాముడు దయాది రాజిలదగిన –శ్రీమద్విధులకొప్పు చెల్వంపు గృతులు –గద్య పద్యాదులు కాదు హృద్యములుగ-విద్యా రస ప్రౌఢి వెలయ గావించి – శ్రీరమ సత్పదా౦చిత పూజ లందు –గోరికలార నెక్కొనగ స్థాపించె-బాడు చుంద్రెల్ల ప్పటికినీ నా కృతులు-వేడుక నా రఘు వీరు సన్నిధిని ‘’అని  రాసి తన  చరిత్రలో చెప్పారు దాసుగారు .అధికారం భోగం లభించినా సాదా సీదాగానే ఉంటూ జనకుడు రాజ్యం చేసినట్లు కుచేలుడు ఐశ్వర్యాన్ని అనుభావిచ నట్లు ఆదర్శంగా జీవించారు .

  నందన కరువు దాసుగారి సేవ

  అప్పుడు ఆప్రాంతం లో భయంకరమైన క్షామం వచ్చింది .అదే నందన కరువు .ఆసమయంలో దాసు గారు చేసిన సేవ అపారం .పెద్ద అన్న సత్రం ఏర్పాటు చేసి ఎన్నో కుటుంబాలకు  భరోసా కల్పించారు –‘’ఎందరు వచ్చిన నేమి పోయంచు –నందరకొనరించె నాన్న దాన౦బు –శిశువులకు బాలు చేరి ఇప్పించే-బశు సమితికి మేత బాటించి కూర్చె-మాలమాదిగల కేమరక అన్నంబు –జాలుజాలన లెస్సగా సమకూర్చె-ముమ్మారు తిను విధంబున నమరించె—ఆనాడు కట్టినట్టి కుండంబు –లీనాటికిని నిల్చిఎసగు భద్రాద్రి ‘’అని రాశారు .కొంతకాలానికి సమృద్ధిగా వర్షాలు పడి కరువు మాయమైంది .

     మహాప్రస్థానం

 నాగండ్ల వరద రాజు గారికి క్షయవ్యాధి వచ్చి బాగా కృశించిపోయారు .ఆయనకు ధైర్యం చెబుతూ నరసింహ దాసుగారు ‘’నిన్ను చెన్నపురి నుంచి భాద్రగిరికి శ్రీ రామసేవకోసం తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి వైకుంఠానికి నిన్ను వెంట తీసుకు వెడతాను ఇది రామాజ్ఞ’’  అని ఊరడించేవారు .రాజుగారి భార్య తల్లీ  మేమూ మీతో వస్తాం తీసుకు వెళ్ళండి అంటే వల్లె అని ,దాసుగారిభార్య లక్ష్మీ బాయంమగారు ‘’మీరు లేకపోతె నేను బతకలేను మీతో నేనూ వస్తాను ‘’అని వేడుకున్నా ‘’నీకు దేవుడి ఆజ్ఞ లేదు ఇక్కడే కొంతకాలం ఉండాలి ‘’అని నచ్చ చెప్పారు.తన ఇంటిలోని  బంగారు వెండి వస్తువుల జాబితా రాయించి ,రామాలయానికి చేర్చి కావలసినవారికి మిగతా సామాను ఇచ్చేశారు  .-‘’ఏమియు లేకుండనిల్ చూరు విడిచి –ఆ మీద రాజకీయ ప్రసంగములు  -దేశ పాండ్యాలకు తెలియ బోధించి –‘’రామాలయం లో ఉన్న స్థిర చరాస్తుల జాబితాలు తయారు చేయించి  శాసనాలపై చెక్కించి –సరిగా గోవెల యందు స్థాపన చెసె. వరద రాజు గారి ఆరు నెలల పసి బాలుడిని దాసికిచ్చి చక్కగా సాకమని చెప్పి ,తనతో ఉన్న తమ్ముడి కొడుకు రాము ని దీవించి మహా ప్రస్దాన ప్రయత్నం చేస్తూఉండగా వరద రాజు రామభజన చేస్తూనే ప్రాణాలు వదిలాడు .ఆయన శవాన్ని వెంటతీసుకొని కాళ్ళకు గజ్జలు భుజాన తంబురా చేతుల్లో పలకలు పట్టుకొని గొంతెత్తి రామభజన –‘’పోయదమయ్యా వైకుంఠమునకు బోవు చున్నాము ‘’అని పరవశించి పాదుతుండగా ఆకాశ౦ లో   ’’ కోదండరాముడు కనిపించగా –‘’అడుగో కోదండ పాణి అడుగో భాద్రాచలేశుండు ‘’అంటూ శ్రీరాముని ఆపాద మస్తకం గా వర్ణిస్తూ 1833-34విజయ వత్సర భాద్రపద కృష్ణ చవితి సోమవారం సూర్యుడు పశ్చిమాద్రికి చేరే సమయం లో ,ఊరిజనమంతా పూలు చల్లుతూ దండలు వేస్తూ మహా కోలాహలం చేస్తుండగా ,పూర్వం పాండవులు మహా ప్రస్థానం చేసినట్లు,గోదావరీ నదికి వెళ్లి ,వెనక్కి తిరిగి రామాలయ శిఖర దర్శనం చేసి నమస్కరించగా అది అంగీకార సూచకంగా ఊగిందట .అందరూ పడవలు ఎక్కి కూర్చుని రామ భజన లో పులకితులై నది మధ్యలోకి వెళ్లి ‘’జయ రమారమణ గోవింద హరే ‘’అనే నాదంతో భూ నభోన్తరాలు దద్దరిల్లేట్లుగా పలికి ,వరదరాజ శరీరాన్ని గోదాట్లో కలిపారు దాసుగారు .ఒక్కసారిగా గోదారి పొంగగా నరసింహ దాసుగారు’’ రామా రామా’’ అంటూ  ఆ ప్రవాహం లో మునిగి కనిపించలేదు .రాజుగారికిచ్చిన మాటను ఇలా నిలబెట్టుకున్నారు దాసుగారు ఆయనతోపాటు 17మంది భక్తులు ఆయన భార్య,లక్ష్మీ బాయమ్మ గారు గోదాట్లోకి దూకేశారు .అప్పుడు –‘’వింతగా నొక దివ్య తేజంబు –ఘనతర సూర్య ప్రకాశంబు మించి –జనములు సూడంగ జనె-వియద్గతిని ‘’.అందరికి ఆ దివ్య తేజస్సు కనిపించగా ఆశ్చర్య పోయారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-2

మహా భక్త శిఖామణులు

21-తూము లక్ష్మీ నృసింహ దాసు-2

 అపర కైలాసంగా కనిపించే రామేశ్వరం లో శ్రీరామ ప్రతిష్టిత సైకత రామ లింగేశ్వర  దర్శనం చేసి ‘’కాశీ పురమునుండి గంగ దెచ్చితిని  ఈశ –దీని గ్రహియిపవయ్య’’అనిప్రార్ధించి ఆ గంగతో నమక చమకాలతో అభిషేకించి బిల్వపుష్పాదులు సమర్పించి ,కోరిన కోరిక తీరి పెన్నిధి లభించి భావించి –‘’అన్యమేరుగాను దేవ అహర్నిశములు- దైన్యమున నీ పసుజన –దంబుల దలచిసుజన –మాన్యమౌ పరమార్ధ సంపద లభించి –ధన్యమతి నైతి నీదగు దర్శనమున ‘’—అంగములో సగమంగన-కు౦గడ మసగంబు భక్తకోటి కోసగితె ,-బ్భంగి నిను గానవచ్చు భు –జంగ చయ విభూష దోష సంగ విదూషా’’మొదలైన పద్యాలతో  స్తుతించాడు  నరసింహ దాసు అక్కడి 24తీర్ధాలలో స్నానించి,,గంధమాదన పర్వతం అధిరోహించి ,సేతుమాధవ దర్శనం చేసి,ఉభయ సాగర సంగమం లో తీర్ధ విధులు యధోక్తంగా నిర్వహించి ,మూడు రోజులుగాడిపి ఏకాంత రాముని సేవించి ,అక్కడి చింతలపాటి లక్ష్మీ నారాయణ గారి అభ్యర్ధనపై వారింట్లో కొన్ని రోజులుండి,రామాయణ పురాణం చెప్పి సన్మానితుడై ,మళ్ళీ సేతుమాధవ దర్శనభాగ్యం పొంది -‘’తగ ప్రయాగ పూరి మాధవుడు నీ క్షేమంబు –నడిగినాడని దెల్పు మనియె బ్రీతి —‘’’కోరిక దీరె నీ చరణకోమల యుగ్మమునాశ్రయి౦చుటన్ ‘’అని పద్య స్తుతి చేసి ,కోటి తీర్ధాన్ని తీసుకొని,సముద్రుడు ఎంతసేపటికీరాకపోతే దర్భలపై పడుకొని నిరశన తెలియ జేసిన  ,దర్భశయనం లో శ్రీ రామ దర్శనం చేసి ,శ్రీరంగం చేరి రంగనికి తన అనుభవాన్ని –‘’ప్రాకార సప్తక ప్రకరంబు కనుగొంటి –యదియెవైకుంఠమంచలరు చుంటి  ‘’అంటూ పద్య నివేదనం చేశాడు .అక్కడినుండి జంబుకేశ్వరం వెళ్లి జలలింగదర్శనం చేసి ,కంచి చేరి –‘’ఆకలి గొన్న యట్టి జను –డన్నము గైకొను మాడ్కి ‘’అని స్తుతించి డబ్బులివ్వనిదే దర్శనం లేదంటే సొమ్మసిలిపొతేఒక వైష్ణవ భక్తుడు అంతరాలయ దర్శనం చేయించాడు .వరద రాజ స్వామిని దర్శించి పరవశంతో సాష్టాంగం చేసి ఆనంద బాష్పాలు రాల్చాడు .తిరుపతి వెళ్లి శ్రీనివాస దర్శనం చేయాలని కొండ ఎక్కుతుంటే ‘’నీ తాత తండ్రుల మొక్కు బడులన్నీ తీర్చగలిగితేనే కొండ ఎక్కు ‘’అనే మాటలు వినిపిస్తే ఎవరా అని వెతికితే ఎవరూ లేకపోవటం తో అది వైష్ణవ మాయ అని గ్రహించి ‘’ఈయనే కంచిలో దర్శనం చేయించిన వైష్ణవరూప వెంకటేశ్వరస్వామి  ‘’అని మనసులో భావించి ,అడుగడుగుకూ ఆపద మొక్కులవాడిని స్మరిస్తూ –‘’తాతనాటి ఋణము దలచి లెక్కలు తీసి –ప్రీతిమాని బిరుదు ఖ్యతిమాని –కఠిన వృత్తి దాల్చి కదలరా వలదంటి –విట్టు లాడ నీక దెట్టులొప్పె’’అని ఎడా పెడా పద్యాలతో వాయించి ,చేతిలో చిల్లిగవ్వ లేని తాను  ఎలా మొక్కులు తీర్చుకోగలను అని నిర్వేదం చెండి మెట్లమీదనే ఉత్తరీయం పరచి నిద్రపోయాడు .స్వప్నంలో ‘’రజతాద్రి కాంతి నిరాకరించెడుమేని –చంద౦బు గల్గు నశ్వంబు నెక్కి ‘’శ్రీవారు కనిపించి అక్కడి విశేషాలన్నీ దగ్గరుండి చూపించగా    –‘’మేలు కొంటి నంత జాల వేడ్క ‘’అని అనుభవం వివరించాడు .వేంకటేశ్వరుని పాద చిహ్నాలు అక్కడ ఆనవాలుగా కనపడితే ఆశ్చర్యపోయి భక్తులందరికీ చూపి పరవశించాడు నరసింహ దాసు .కొండ ఎక్కి శ్రీవారి దర్శనం చేసి ఆనందంతో నృత్యం చేసి అలుమేలు మంగను గోవిందరాజస్వామిని దర్శించి –శ్రీపాద రేణువు చిన్నం వరా యంచుబల్కు –వైష్ణవ పరి భాష వింటి ‘’అని వేడికోలు చెప్పుకొని,శ్రీకాళ హస్తిచేరి శ్రీ కాల హస్తీశ్వర  దర్శనం తో చరితార్దుడై ,మళ్ళీ పొన్నూరునుంచి గుంటూరుకు  చేరాడు .కోటితీర్ధజలాలతో తల్లికి అభిషేకం చేసి అందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని తన యాత్రా విశేషాలను సవివరంగా అందరికీ తెలియ జెప్పి వారు కూడా యాత్రాఫలితం పొందేట్లుచేశాడు నరసింహదాసు ..వృషభ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పాద్యమికి దక్షిణ దేశ యాత్ర పూర్తయింది .మళ్ళీ భద్రాచలం వెళ్లి శ్రీరామ దర్శనం చేసి ఇంటికి వచ్చాడు .నిరంతర ప్రయాణాలతో ఆరోగ్యం దెబ్బతిని ,వ్యాధి పీడితుడయ్యాడు .

    ఉత్తర దేశ యాత్ర

1827-28వ్యయనామ సంవత్సర పుష్య శుద్ధ విదియనాడు ఉత్తర దేశ యాత్రకు బయల్దేరాడు తూము నరసింహ దాసు .నడిచి ముందుగా అయోధ్య చేరి శ్రీరాముడు పుట్టిన చోటు ,పెరిగిన చోటు ,ఆడిపాడిన చోట్లు ,వల్కలాలు కట్టిన చోటు ,దశరధుడు  చనిపోయిన చోటు ,భరతుడు రామపాదుకలు పూజించిన చోటు ,అక్కడి స్థానికులు వివరంగా చెప్పి చూపిస్తే చూసి ధన్యమయ్యానని భావించాడు .సరయు నదీ స్నానం చేసి పితృ తర్పణాలిచ్చి ,వంశాన్ని పవిత్రం చేసే ఒక్కడు చాలడా అంటూ’’జాలడా ఏడు తరములకు నొక్క మహాత్ముడు ‘’అని శ్రీరామ స్తుతి చేసి అక్కడే కొన్ని రోజులు గడిపి ,అక్కడి నుంచి హరిద్వారం బదరికా వనం చేరి నరనారాయణ సందర్శనం భాగ్యం పొంది సర్వజిత్ సంవత్సర శ్రావణ శుద్ధ ఏకాదశి కి గుంటూరు చేరాడు .ఎక్కడి గుంటూరు ?ఎక్కడి బదరి?ఇంతదూరం కాలినడకన తిరిగి రావటం అంటే మాటలుకాదు .సంకల్పబలం రామానుగ్రహం ,కుటుంబ జన ప్రోత్సాహం ఉంటేనే జరుగుతుంది .మళ్ళీ భద్రాద్రి వెళ్లి దర్శనం చేసి వచ్చాడు .ఎన్నియాత్రాలు చేసినా అలుపూ సోలుపూలేదు రోగం రోష్టూ లేదు .కాలికి ముళ్ళు కూడా ఎక్కడా గుచ్చుకొని బాధ పెట్టలేదు దొంగలభయం పాము వంటి జంతు భయం కూడా ఆయనకు ఎదురు కాలేదు .

   కంచి గరుడ సేవ

కంచిలో డోల సేవ చూడాలని ఎన్నాళ్ళనుంచో దాసు మనసులో ఉంది అది నెరవేర్చుకోవటానికి విరోధి సంవత్సర వైశాఖ మాసం లోకోద్దిమంది భక్తులతో  కాంచీ పురానికి వెళ్లి గరుడ సేవ ఉయ్యాలసేవ తనివి తీరా చూసి తరించాడు

          మద్రాస్ అనుభవం కొత్త శిష్యుడు

మద్రాస్ వెళ్లగా అక్కడ భక్తుడు సంపన్నుడు వైదిక బ్రాహ్మణుడు మురికి నాడు శాఖీయుడు నాగండ్ల వరద రాజస్వామి ఆహ్వానించి ,తగిన రీతిగా సేవలు చేసి ,దాసు గారివలన తారక మంత్రోప దేశం పొందాడు ,మూడు నెలలు వారిట్లో,రామాయణ ప్రవచనం తో అందరినీ సంతృప్తి పరచగా సంతుష్టాంతరంగు డైన  వరద రాజస్వామి, దాసు గారికి పాద పూజ చేసి 4వేల రూపాయలు కానుకగా సమర్పించి ‘’స్వామీ !మళ్ళీ ఒక సారి వచ్చి నన్ను భద్రాద్రి రామ దర్శనం చేయించి పుణ్యం కట్టు కొండి ‘’అని ప్రార్ధించాడు .అతని వినయం భక్తీ లకు సంతోషించి దాసుగారు  అదంతా శ్రీరామానుగ్రహం అని చెప్పి మళ్ళీ గుంటూరు చేరి ,మూడు తరాలనుండి పెరిగిన అప్పు అంతా ఆ నాలుగు వేల రూపాయలతో తీర్చేశాడు-‘’అప్పు దీరుపనైన హరియింప నైనను దలచు మానిసికి బత్రంబు వలదు ‘’అని అడిదం సూరకవి చెప్పినట్లు నోటూ పత్రం లేకుండా తన కుటుంబానికి  అప్పులిచ్చిన వారి గుణ శ్రేష్టతకు కృతజ్ఞత చెప్పుకొన్నాడు ‘

  మళ్ళీ మద్రాస్ వెళ్లి వరద రాజు తో కలిసి వికృతి సంవత్సర చైత్రమాసం ప్రారంభం లో భద్రాద్రి చేరి శ్రీరామనవమి కల్యాణం చూసి ఆయనకు చూపించి మాట నిలబెట్టుకొని గుంటూరు చేరాడు .నరసింహదాసు బుద్ధి గరిమ భక్తీ ప్రపత్తులు శీల విశిష్టత  లను గుర్తించి గౌరవించి వరదరాజు ఈ దంపతులను మద్రాస్ తీసుకొని వెళ్లి ఆరు నెలలు తన ఇంట్లో ఉ౦చి సకల సౌకర్యాలు కలిపించి ధన్యుడయ్యాడు .

            భద్రాద్రి వాసం

భక్తీ జ్ఞాన  సంపత్తి దాసుగారి వలన కలిగి వైరాగ్యభావం అంకురించి ,తనకున్న సకల సంపాదనను గుర్రబ్బళ్ళపై ఎక్కించి దాసు దంపతులతో తమ దంపతులుకూడా కలిసి వికృతి కార్తీకం లో భద్రాద్రి చేరి అక్కడే కాపురం పెట్టాడు వరదరాజు .రోజూ దాసు దంపతులతో సత్కాల క్షేపం .భద్రాద్రి రామ దర్శనం తో ఆన౦దంగా రోజులు గడిచి పోతున్నాయి .రామాలయ పూజారులలో స్వార్ధం పెరిగి స్వామి కై౦కర్యాలు సరిగ్గా చేయక తమ కైంకర్యం కోసమే డబ్బు వాడుతూ అప్రతిష్ట తెచ్చారు .తన డబ్బే పోయినట్లుగా దాసుగారు బాధపడ్డారు –రామా !నీ సేవలు సరిగ్గా జరగటం లేదు .నేను ఎలా సహి౦చ గలను ?మొన్న కలలో ఒక  వైష్ణవుడు కనిపించి విచారించకు చందూలాల్ ను కలిస్తే అంతా చక్కబడుతుంది ‘’అని చెప్పాడు .మెలకువరాగానే ఈవిషయం శిష్యుడు వరద రాజుకు చెప్పాడు .రామాజ్ఞగా భావించి ఒక్కడే హైదరాబాద్ వెళ్ళాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-1-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )

25-1-1862న కుర్లేకర్ కుటుంబంలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా దేవ్రస్ట్రే గ్రామం లో రమాబాయ్ రానడే జన్మించింది .బాలికా విద్య నిషిద్ధమైన ఆకాలం లో తండ్రి ఆమె ను చదివించలేదు .భారత సా౦ఘికసంస్కరణోద్యమ మార్గ దర్శకుడు,మహా విద్యావేత్త ,ఆదర్శవాది , జస్టిస్ మహాదేవ గోవింద రానడే కు ఈమెనిచ్చి 11ఏటనే తండ్రి పెళ్లి చేశాడు . అత్తవారింటిలోనూ స్త్రీ విద్యకు ఆదరణ లేకపోయినా, భర్త రానడే మాత్రం భార్య రమాబాయ్ విద్యకు సర్వవిధాలా సాయం చేసి తనకు సాంఘిక ,విద్యా సంస్కరణలకు తోడ్పడేట్లు ఆదర్శంగా తీర్చి దిద్దాడు .భర్త ప్రేరణతో రమాబాయ్ మహిళా విద్యకు స్వావలంబనకు ,ఆర్ధిక స్వాతంత్ర్యానికి జీవితం అంకితం చేసింది.

రానడే బొంబాయి ఎలిఫిన్ స్టన్ కాలేజి లో ఇంగ్లిష్ ,ఎకానమిక్స్ ప్రొఫెసర్. ‘’ప్రిన్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్’’అని గౌరవంగా అనిదరి చేతా పిలువబడేవాడు .అలాంటివాడు చదవటం రాయటం కూడాతెలీని నిరక్షరాస్యురాలు రమబాయ్ ని పెళ్లి చేసుకొని అక్షరాలతో సహా అన్నీ నేర్పి విద్యావంతురాలినీ మహిళా సంస్కరణోద్యమ నాయకురాలినిగా తీర్చి దిద్దాడు .సమాజంలోని చెడును సహించే వాడు కాదు .అస్పృశ్యత ,బాల్యవివాహం ,సతీ సహగమనాలకు వ్యతిరేకి .తన ఆదర్శాల ప్రచారం ,అనుసరణకోసం ‘’సర్వ జనిక్ సభ ‘’స్థాపించి సా౦ఘికాభి వృద్ధికి ఎన్నో ఉద్యమాలు నడిపాడు .ముప్పై ఏళ్ళ వయసులోనే రానడే మహారాష్ట్ర౦ లో గొప్పపేరు ప్రఖ్యాతులు పొందాడు .అత్యధిక ఆలోచనాతత్వం ,క్రియాశీలమైన దృష్టి,సంఘం పట్ల అంకితభావం భార్య రమాబాయ్ ని ఉత్తేజితం చేసి ,భావి సాంఘిక కార్యక్రమాలకు బాట వేసింది .

సంస్కరణ ముందు తనతో ప్రారభం కావాలని తానూ విద్యనేర్చి భర్తతో సమాన స్థాయి సాదిస్తేనే సమాజం తన మాటవిని విలువనిస్తుందని గ్రహించింది.దీనికి ఆమె కుటుంబం అత్తవారిల్లు ఎన్నో అడ్డంకులు కలిపించినా ,మొక్క వోని ధైర్యం తో ముందుకే మును ముందుకే సాగింది .భర్త రానడే ఆమెకు ముందు మరాఠీ భాష చదవటం రాయటం నేర్పాడు .తర్వాత చరిత్ర భూగోళం లెక్కలు ఇంగ్లిష్ నేర్పాడు .వార్తా పత్రికలన్నీ చదివించి ,వాటిలో ఉన్న ఆనాటి విషయాలపై తనతో చర్చించటం నేర్పాడు .క్రమ౦గాఉత్తమ విద్యార్ధినిఅయి తర్వాత కార్యదర్శి గామారి,నమ్మకమైన స్నేహితురాలు అయింది .1882లో పండిత రమాబాయ్ విధవరాలుగా పూనా వచ్చినప్పుడు,రానడే దంపతులు ఆమెకు అన్నిరకాల సహాయం చేసి ,తమ ఇంట్లోనే పండిట్ రమాబాయ్ కి క్రిస్టియన్ మిషనరీ లేడీ తో ఇంగ్లిష్ పాఠాలు బోధి౦ప జేశారు .

మొదటి సారిగా రమాబాయ్ నాసిక్ హైస్కూల్ లో ముఖ్య అతిధిగా ప్రజలలో కనిపించింది .ఆమె ఉపన్యాసాన్ని భర్త రానడే రాసిచ్చాడు .తర్వాత ఆమె స్వయంగా బహిరంగ సభలలో బాగా మాట్లాడటం ప్రారంభించి మరాఠీ ,ఇంగ్లీష్ లలో అద్భుత ప్రసంగాలు చేసి అందరి హృదయాలను ఆకర్షించింది .ఆమె ప్రసంగాలు స్పష్టంగా మనసుకు హత్తుకోనేట్లు ఆకర్షణీయంగా ఉండేవి .తర్వాత బొంబాయి లోని ప్రార్ధన సమాజ్ లో పని చేసింది .ఆర్య మహిళా సమాజం సంస్థను స్థాపించింది .1883నుంచి 1901వరకు ఎనిమిదేళ్ళు సాంఘిక సేవా కార్యక్రమాలలో ఉద్ధృతంగా పాల్గొని , బహుళ ప్రచారం పొందింది .’బొంబాయ్ లో ’హిందూ లేడీస్ సోషల్ అండ్ లిటరరి క్లబ్ ‘’స్థాపించి భాషలలో ,జనరల్ నాలెడ్జి లో ,టైలరింగ్ ,చేతి పనులలో అనేక తరగతులు నిర్వహించి శిక్షణ నిచ్చింది .

1901లో భర్త రానడే మరణించాక రమాబాయ్ బొంబాయి నుంచి పూనా కు మకాం మార్ఛి ,పూనా మార్కెట్ దగ్గరున్న పాత వారసత్వ ఇంట్లో ఉంటూ ఒక ఏడాది ఒంటరి జీవితం గడిపింది .తర్వాత జనజీవన స్రవంతి లో కలిసి ,మొదటి సారిగా బొంబాయి లో ‘’భారత్ మహిళా పరిషత్ ‘’స్థాపించింది .భర్త చనిపోయాక 23ఏళ్ళు జీవించి కాలమంతా సాంఘిక జాగృతికోసం ,బాధితుల ఓదార్పు సాయం లో బాదితుల పునరావాసం కోసం, సేవ సదన్ నిర్మాణం లో క్షణం తీరిక లేకండా అంకిత భావంతో పని చేసింది .భర్త ఉండగానే 1878లోనే సేవారంగం లో కాలుపెట్టిన రమాదేవి, భర్త 1901లో చనిపోయాక పూర్తిగా మహిళాసేవా కార్యక్రమాలలో మునిగి పోయింది .తరచుగా సెంట్రల్ జైలు సందర్శిస్తూ ,అందులో ముఖ్యంగా మహిళా విభాగం లో జరిగే విషయాలు స్వయంగా తెలుసుకొనేది .బాలుర సంస్కరణ స్కూల్ కు కూడా వెళ్లి ,బాలురతోమాట్లాడుతూ యోగక్షేమాలు కనుక్కొంటూ ముఖ్యమైన పండుగ రోజులలో స్వీట్స్ పంచి పెట్టేది .స్థానిక ఆస్పత్రులను సందర్శించి రోగుల వైద్య సదుపాయాల విషయం అడిగి తెలుసుకొంటూ వారికి పండ్లూ ,పుష్పాలు ,పుస్తకాలు అందించేది .

1913లో గుజరాత్ కధియవాడి లకు వెళ్లి ,క్షామ బాధితులకు పునరావాస సౌకర్యాలు కల్పించింది .చివరి రోజుల్లో కూడా ఆనందికి వెళ్లి ఆషాఢి,కార్తీక ఉత్సవాలలో పాల్గొన్నది .తనతో పాటు సేవాసదన్ కార్యకర్తలను తీసుకు వెళ్లి సంత్ జ్ఞానేశ్వర్ దేవాలయం సందర్శించే మహిళా యాత్రికులకు సహాయం చేయించింది .అనేక కొత్త తరహా మహిళా సాంఘిక సేవాకార్యక్రమాలు ప్రారంభించింది .రామ కృష్ణ గోపాల భండార్కర్ ,భజేకర్ ల అభ్యర్ధన మేరకు రమాబాయ్1904లో బొంబాయి లో జరిగిన అఖిలభారతీయ మహిళా సదస్సుకు అధ్యక్షత వహించింది .

పార్సి సాంఘిక సంస్కర్త బి.ఎం .మల్బరీ ,దయారాం గిడుమాల్ లకు మహిళలకు నర్స్ ట్రెయినింగ్ సెంటర్ ప్రారంభిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచన వచ్చి రమాబాయ్ ను కలిసి మార్గదర్శనం చేయమని కోరగా బొంబాయి లో సేవాసదనం ప్రారంభించింది .1915లో పూనా సేవాసదన్ ను ఆమె ఆధ్వర్యం లో సొసైటీగా రిజిస్టర్ చేయించింది .ఈ సొసైటీ పాత విద్యా విధానం తోపాటు అనేక కొత్త పద్ధతులు కూడా ఉండేట్లు విద్యా శాఖలు ,ఏర్పాటు చేసింది .తర్వాత వుమెన్స్ ట్రెయినింగ్ కాలేజి,మూడు హాస్టళ్ళు ఏర్పరచింది .అందులో ఒక హాస్టల్ మెడికల్ విద్యార్ధులకు ,మరొకటి ప్రోబేషనరి నర్సులకు ఉపయోగకరంగా చేసింది .1924నాటికి పూనా సేవాసదనం వివిధ శాఖలలో వెయ్యిమందికి పైగా మహిళలకు శిక్షణ నిచ్చింది .ఇంత అభివృద్ధి జరగటానికి రమాబాయి దూర దృష్టి, నిరంతర పర్యవేక్షణలే కారణం .ఉచిత నిర్బంధ ప్రాధమిక విద్య బాలికలందరికి అందజేయటం ఆమె సంకల్పం .బొంబాయి ప్రెసిడెన్సి లో మహిళలకు ఓటు హక్కు కోసం పెద్ద ఉద్యమాలు 1921-22లలో నిర్వహించింది .

మహాత్మా గాంధీ రమాబాయిమరణించినపుడు ఆమె సేవాతత్పరతను ప్రశంసిస్తూ ‘’ The death of Ramabai Ranade is a great national loss. She was the embodiment of all that a Hindu widow could be. She was a true friend and helpmate of her illustrious husband in his lifetime..’’ After his death she chose her husband’s reform activities as her life’s aim. Justice Ranade was a reformer and deeply concerned about the uplifting of Indian womanhood. Ramabai put her heart and soul into Seva Sadan. She devoted her whole energy to it. The result is that Seva Sadan has become an institution with no second of its kind throughout India.”అన్నాడు.

సేవాసదన్ లో మొదట చేరిన విద్యార్దినులంతా విధవరాళ్ళే.ఒకసారి సేవాసదన్ వార్షిక సమావేశం జరిగినప్పుడు బహుమతి ప్రదాన ఉత్సవానికి రమాబాయ్ ఆ నాటి సంప్రదాయ భారతీయ విధవరాలు ఎలా ఉంటుందో అదే విధంగా బోడిగుండుతో ,ఎర్రచీరతో ,కొంగు నెత్తి మీద పూర్తిగా కప్పుకొని హాజరైంది .వేదిక ఎక్కుతున్నప్పుడు విద్యార్ధులంతా పిల్లికూతలు అరుపులు చప్పట్లు తో గేలి చేశారు .ఆమె ఒక్కసారిగా ‘’మీరు కాలేజి విద్యార్ధులు. ఈ గందరగోళం చూస్తె విద్యార్దులేనా అని అనుమానం గా ఉంది .సమాజపు కట్టుబాట్లలో నలిగి పోతున్నమీ సోదరీమణులకు మీరిచ్చే మర్యాద ఇదేనా ?ఇదేనా మీ సంస్కారం ?వారి దయనీయ స్థితికి మీరు జాలిపడరా ?మీ ఇళ్ళల్లో ఇలాంటి విధవ ఆడపడుచులు, తల్లులూ లేరా ?కనీస గౌరవ మర్యాదలు వారికి చూపలేరా ?”’అని తీవ్రస్వరం తో మాట్లాడగా అందరు సిగ్గుతో తలదించుకొని మౌనం వహించారు ఆమె మాటలు వాళ్లకు హంటర్ కొరడా దెబ్బలే అయినాయి .

రమాబాయి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తీవ్రంగా కృషి చేసింది .ఆమె స్థాపించిన సేవాసదన్ లు ఎందరెందరో నిర్భాగ్య మహిళలకు ఆసరాగా ఉన్నాయి .పూనా సదన్ ను తన పూర్వ స్వగృహం లోనే ప్రారంభించింది .ట్రెయినింగ్ కాలేజీలు ,వృత్తి విద్యా కేంద్రాలు ,అమ్మకాల సెంటర్లు మొదలైనవన్నీ ఏర్పరచింది .రమాబాయ్ అంటే సేవా సదన్ కు మారుపేరు అయి ప్రఖ్యాతి చెందింది .మధ్యతరగతి స్త్రీలసంక్షేమమమే ఆమె ధ్యేయం .గవర్నర్ ఏర్పాటు చేసిన వార్ కాన్ఫరెన్స్ లో పాల్గొని భారతీయ స్త్రీల గురించి వివరించింది .ఫిజి ,కెన్యా దేశాలలో భారతీయ కూలీల సంక్షేమం కోసం కృషి చేసింది .స్త్రీల వోటు హక్కుకోసం నిరంతర పోరాటం చేసింది .అలుపు లేకుండా ఇన్ని సేవాకార్యక్రమాలు చేసిన రమాదేవి తాను తనభర్త మహాదేవ గోవింద రానడే గారి నీడ నే అని వినయంగా చెప్పేది .నిరంతర సేవా కార్యకర్త,చిరస్మరణీయురాలు,మహిళా మాణిక్యం రమాబాయ్ రానడే 62వ ఏట 25-1-1924న మరణించింది.

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~adu~~

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు

మహా భక్త శిఖామణులు

21-తూము లక్ష్మీ నృసింహ దాసు

  జననాది విశేషాలు

భక్తీ సంగీత సాహిత్యాలకు ఆలవాలమైన సద్వంశం లో క్రీ శ 1790ప్రాంతం లో తూము లక్ష్మీ నరసింహదాసు అప్పయ్య ,వెంకమాంబ దంపతులకు జన్మించాడు .గోల్కొండ వ్యాపారులు ఆపసంభ సూత్రులు యజుశ్శా ఖాధ్యాయులు .వశిష్ట ,శక్తి,పరాశర త్రయార్షేయ  పరాశర గోత్రీకులు ,తాత వెంకట కృష్ణయ్య గుంటూరుజిల్లా  బాపట్లతాలూకాపొన్నూరులో ఉంటూ శ్రీ భావనారాయణ స్వామి సేవలో తరించాడు .ఈయన కుమారుడైన అప్పయ బుద్ధి ,దేహబలం తో రాజగౌరవం పొంది,వెంకమా౦బ ను పెళ్లి చేసుకొని ,గుంటూరులో స్వంతఇల్లు కట్టుకొని కాపురం పెట్టాడు .ఈ దంపతులకు నరసింహదాసు ,కృష్ణ దాసు, రుక్మాబాయి సంతానం .రుక్మాబాయిని జఘాలరావు  వంశం వారికిచ్చి పెళ్లి చేశారు .దాసు ద్వయం తెలుగు సంస్కృతాలు నేర్చి రామభక్తులుగా ఉన్నారు .సంబ్రాజు వంశానికి చెందిన లక్ష్మీ బాయమ్మను నరసింహదాసుకు ,సీతమ్మను కృష్ణదాసుకు ఇచ్చి వివాహం చేశారు .

  నరసింహ దాసు దంపతులకు సంతానం కలగలేదు .దాసు గారు చనిపోయాక భార్య మరిదికొడుకు రామదాసు ను పెంచి ,వైదేహి అనే అమ్మాయితో పెళ్లి చేసింది .వీరికీ పిల్లలు పుట్టలేదు .భర్త చనిపోయాక వైదేహమ్మ కూడా లక్షణ రాయడు ను పెంచుకొని పెళ్లి చేసింది వీరి సంతానం ఇప్పటికీ భద్రాద్రిలో ఉన్నారు .

   భద్రాద్రి రామభక్త దాసు

రామభక్త నరసింహ దాసు బాల్యం నుండి మాట్లాడే ప్రతిమాటకు వేసే ప్రతిఅడుగుకు రామ రామ అనటం అలవాటు చేసుకొన్నాడు .దాసు ఇరవై వ ఏట తండ్రి చనిపోవటం తో కుటుంబ భారం మీద పడి,పొన్నూరులో పేష్కారు జీతం తో జీవనం సాగించాడు .రామభజన అతిధి సత్కారం, కవితా రాధన నిత్యకృత్యం . భక్తికి ఉద్యోగానికి లంకె కుదరక ఉద్యోగం మానేసి ,ఇంట్లోనే రామ మందిరం నిర్మించి ,భద్రాద్రి సీతారామ విగ్రహాలు పెట్టుకొని నిత్య భజన చేస్తూ ,గద్య పద్యాలు రాస్తూ ,భక్తిశతకాలు గేయాలు రాశాడు .

  శ్రీ రంగ క్షేత్ర దర్శనం

నరసింహ దాసు క్రీ శ 1818-19 బహుధాన్య సంవత్సర కార్తీక మాసం లో శ్రీరంగ క్షేత్రానికి వెళ్లి ,పరవశంతో రంగ శాయిని దర్శించి ‘’శ్రీరంగ శాయి తారహారం’’ మకుటం తో27 సీస పద్యాలు రాసి స్వామికి సమర్పించి ,ఇంటికి తిరిగి వచ్చాడు .

 భద్రాద్రి రామ దర్శనం ,కాశీయాత్ర

1820-21లో తల్లీ, భార్య ,తమ్ముడు లను సమాధాన పరచి ఒప్పించి ,విక్రమ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి శనివారం రేవతీ నక్షత్రం లో  ఆప్త మిత్రులతో కలిసి గుంటూరు నుంచి నడిచి అమరావతి వెళ్లి, కృష్ణా స్నానం చేసి అమరలింగేశ్వర దర్శన భాగ్యం పొంది ,అక్కడినుండి కాలినడకన భద్రాద్రి చేరి సీతారామ దర్శనం తో పులకించి –‘’అర్దికిచ్చిన ధన౦ బపుడెమరచెదట-పదిలమోహో రామ బహు పరాకు ‘’అనే అనేక సీస పద్యాలతో పరాకు పల్కి ,మళ్ళీ ప్రయాణం సాగించి అశ్వారావు పేట ,కొవ్వూరు ,రాజమండ్రి ,మీదుగా పిఠాపురం చేరి కుంతీ మాధవ స్వామిని దర్శించి ,సింహాచలం వెళ్లి వరాహ  నృసింహ స్వామికి పూజ చేసి ,శ్రీకూర్మం చేరి కూర్మావతార విష్ణు సేవ చేసి ,పూరీ జగన్నాధం వెళ్లి బలరామ సుభద్రా సహిత జగన్నాధ స్వామి ని సేవించి మార్కండేయాది పుణ్య తీర్ధ స్నానాలు చేసి ,పంచ చామర వృత్తంలో –‘’పరాకు శ్రీ రమా౦గ నాస్య  పద్మ పద్మ బాంధవా –పరాకనంత పద్మజాండవారపూరి తోదరా ‘’  అంటూ పొగడి అయిదు రాత్రులు గడిపి ,చాలా కష్టమైన ప్రయాణం చేసి జాజిపురం వెళ్లి అక్కడి నదిలో పితృ కార్యం నిర్వహించాడు .అప్పటికే బాగా అలసి పోవటం తో కాశీ యాత్ర చేయగలనో లేనో అనే సదేహం కలిగింది .కల కన్నాడు దాన్ని పద్యాలలో బంధించాడు –‘’బ్రహ్మాదులకు నైన బడయ సాధ్యముకాని-అప్రత హత శక్తుడైన నీవు –దురితాత్ముడంచునం ద్రోయగా జూడక –యతి దీను డీతడ౦ చాత్మ నెరిగి —- దాశరధ కుమార రామ భద్రాద్రి ధామ ‘’అని  స్తుతిస్తే స్వామి అభయమివ్వగా భయం పోయిందని స్వయంగా దాసు గారే చెప్పాడు .

   శ్రీరామ దయతో అభయం తో నూతనోత్సాహం కలిగి ,మర్నాడే బయల్దేరి బుద్ధ గయ వెళ్లి ,ఫల్గూ నదిలో పవిత్ర స్నానం చేసి ,విష్ణు స్వామిని దర్శించి గయా శ్రాద్ధం తో పితృదేవతలకు తృప్తి కలిగించి ,పుణ్య రాశి కాశీ  చేరి పవిత్ర గంగాస్నానం  విశ్వనాథ దర్శనం తో పులకించి  నరసింహదాస మహోదయుడు –‘’రజతాద్రి ఇచటికి రాబోలు నేమొకొ-కాదు కాశీ సౌద కా౦తిగాని –‘’అని భక్తిగా ఆర్తిగా వర్ణించి నృత్యం చేసి ,-‘’తారక బ్రహ్మ మంత్రంబు దయ నొసంగు –హరుని కాపురమగు కాశి నరయగంటి ‘’అని తన జన్మ ధన్యమైందని ,అనుకొన్నట్లుగా రామానుగ్రహం తో  కాశీ దర్శించగలిగాననీ పరమానంద పడ్డాడు .అక్కడి బిందుమాధవ ,డుంఠి గణపతి దండాయుధ కాలభైరవ అన్నపూర్ణ విశాలాక్షి దేవులను దర్శిస్తూ నిత్యగంగాస్నానం,పితృ తర్పణం  తో పులకించాడు

  అగస్త్య మహర్షిలాగా కాశీని విడువలేక విడువలేక  విడిచి పడమరగా బయల్దేరి ,ప్రయాగ త్రివేణీ సంగమ పవిత్ర స్నానం చేసి ,విధులు నిర్వహించి మళ్ళీ కాళ్ళకు పని చెప్పి గుంటూరు అనే గర్తపురి చేరి ,తల్లి వెంకమాంబ పాద పద్మాలకు నమస్కారం చేసి గంగాజలంతో అభిషేకం చేసి ఆశీస్సులుపొంది తనరాకకోసం ఎదురు చూస్తున్న పురజనుల క్షేమం  అడిగి తెలుసుకొని కొన్ని రోజులు గుంటూరులో  ఉన్నాడు .

   ప్రతి చైత్రం లో భద్రాద్రి రామ దర్శనం

 ప్రతి చైత్రమాసం శ్రీరామనవమికి లో భద్రాద్రి వెళ్లి తన కులదైవం శ్రీ సీతారామ దర్శనం,చేసి కళ్యాణ శోభ చూసేవాడు .వృష నామ సంవత్సరం లో తమ్ముడు కృష్ణ దాసుతో కలిసి చైత్ర శుద్ధనవమికి భద్రాచలం చేరి,గోదావరీ స్నాన పులకితగాత్రుడై శ్రీరాముడికి హృదయం సీతమ్మకు కాన్కలు హనుమయ్యకు మ్రొక్కులు సమర్పించి-‘’గాయయందు నిప్పాసి  కనులకు భవదంఘ్రి నీక్షింప జేసినదీవ కావె—గంగాది యాత్రలీ కలుషాత్ము జేతజే-యించి రక్షించిన దీవ కావె’’అంటూ అనేక పద్యాలతో భద్రాద్రి రామ స్తుతి చేసి మళ్ళీ గుంటూరు చేరాడు .

     దక్షిణ దేశ యాత్ర

  సంపదలు శరీరం బుద్బుదాలని ,సత్కార్యాచారణం చేయాలని ,తీర్ధ యాత్రలతో జ్ఞాన సౌద  నిర్మాణం చేయాలనీ తల్లికీ తమ్ముడికి ధైర్యం చెప్పి మళ్ళీ దక్షిణ దేశ యాత్రకు1821-22 వృష సంవత్సర ఆషాఢ శుద్ధ విదియనాడు  గుంటూరులో బయల్దేరి పొన్నూరు చేరి. భావనారాయణ స్వామిని దర్శించి పొన్నూరు వెళ్లి అక్కడి భావనారాయణ స్వామి ఆశీర్వచనం పొంది  నరసింహ దాసు నెల్లూరు చేరి రంగనాథ స్వాముల దర్శనం పూజ చేసి , తిరువలిక్కేలి వెళ్లి పార్ధసారధి  దర్శనం  తో తృప్తి చెంది ,మద్రాస్ మీదుగా మధ్యలో ఉన్న  తీర్దాలుక్షేత్రాలు  చూస్తూవానకు తడుస్తూ ఎండకు ఎండుతూ చలికి వణకుతూ చిదంబర క్షేత్రానికి వెళ్లి చిదంబరేశ్వరుని దర్శనం తో ఆనందం పొంది ఆకాశలింగ దర్శనం ,నమక చమకాలతో అభిషేకం ,బిల్వదళ పూజ చేసి ,శియాళి వెళ్లి శివదర్శనం చేసి ,గౌరీ మయూరం దర్శించి ,పంచవటం చూసి, కావేరీ తీరం చేరిపుణ్యస్నానం చేసి   ,మహేశునర్చించి ,కుంభకోణం లో ద్వాదశ తీర్ధాలలో స్నానించి ‘’కు౦భేశ హరహరా  శంభో ‘’అని పులకితగాత్రుడై ,పంచ నాథ శివ దర్శనం చేశాడు .

  నాదబ్రహ్మ త్యాగరాజస్వామి దర్శనం

 ,నాద బ్రహ్మ త్యాగయ్యగారి మహిమలు తెలుసుకొని దర్శన౦ తో  జన్మ ధన్యమైందని భావించి ఆయన ఆదరణ పొంది ,త్యాగబ్రహ్మ తాము రచించిన కృతులను స్వయంగా గానం చేయగా పరవశింఛి , తూము నరసింహ దాస భక్తాగ్రణిఆనంద పారవశ్యంతో ‘’చేతుల దాళము పట్టుక  -చేతో మోద౦బు తోడ సిగముడి వీడన్-బాతర  లాడుచు మింటను –గీతము నారదుడు వాడె గృష్ణా యనుచున్ ‘’   అని పోతన గారు భాగవతం లో రాసినట్లు నారద మహర్షిలాగా నృత్యం చేశాడట నరసింహ దాసు .పాముకాళ్ళు పామే ఎరుగున్ అనే సామెత లాగ దాసు గారు త్యాగయ్యగారిని నిజంగా చూశాడా అని అనుమాన పడే వారికి ఆయనే ‘’కేవలానంద సంకీర్తనావళి వింటి –భావ సిద్ధియు శుద్ధ భక్తి గంటి –భక్తులు శిష్యులు బలసి కొల్వగ గంటి-వాజ్మాధురీ  వైభవంబు గంటి –వినయ సత్సం పద్వివేకమున్ కనుగొంటి –శ్రీరామ పద భక్తి  చెల్వు గంటి-యజున కందగరాని యనుభవంబును గంటి-దన్మయత్వ౦ బాత్మ దనరగ గంటి –నరసి కనుగొంటి ద్యాగరారార్యునందు-నీల సద్గుణ పుంజమి౦ కెన్నియైన –దివ్య మహిమాతి శయములు దేజరిలుట –గంటి హర్షాబ్ధినోలాడు చుంటి మదిని ‘’..త్యాగయ్య గారి సన్నిధానం లో కొన్ని రోజులు గడిపి త్యాగరాజ భక్తికి పరవశుడైనాడు –‘’‘’     .  .’’రామ పదభక్తి కీ త్యాగరాయ వరుని –సమముగా నేర నెవ్వారీ క్ష్మాతలమున –బ్రేమ నా ఘను డొకసారి పిలిచె నేని –రాము డోహో యటంచు మార్పలుకునంట’-అట్టి ఘనుని యాజ్ఞనంది యచ్చోటు వాసి –కడు రయంబుతోడ గదలి సాగి – పరగ రాజిలు నవ పాషాణ  మహిమంబు –నాలకించి ముదుకరిగి యరిగి ‘’ అని తన త్యాగరాజ దర్శనాన్ని చక్కగా చిత్రించాడు రికార్డ్ చేశాడు చరిత్రలో శాశ్వతంగా. భక్తులమనసు భక్తులకే తెలుస్తుంది .నరసింహదాసు త్యాగయ్యగారి చే సత్కారం పొంది దక్షిణ సముద్రం ,నవ గ్రహ శిలలు ,చక్ర తీర్ధం ,స్వేతా రంభ స్థలం ,భైరవాది తీర్ధ సందర్శనం చేసి రామేశ్వరం చేరాడు  .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-21-ఉయ్యూరు  ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

జారిపోయిన  జ్ఞాపక శకలాలు -1. మల్లయ్య గారి మిల్లు

జారిపోయిన  జ్ఞాపక శకలాలు -1.

మల్లయ్య గారి మిల్లు

‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’అనే నా జ్ఞాపకాల తేగలపాతర లోనుంచి కొన్ని జ్ఞాపకాలు జారిపోయాయి .ఇప్పుడిప్పుడే అవి మళ్ళీ స్మృతి పథ౦ లో మెదుల్తున్నాయి .వాటిని తవ్వి తీయటమే ఇప్పుడు నేను చేస్తున్నపని .అందులో మొదటి శకలమే ‘’మల్లయ్య గారి మిల్లు ‘’.

   ఉయ్యూరు రావి చెట్టు బజారులో ,మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి ఎదురుగా ,సూరి వారి బజారునానుకొని మేము హిందూపురం నుంచి 1950లో ఉయ్యూరు వచ్చే నాటికే ‘’వెంట్ర ప్రగడ మల్లయ్య’’ గారి వడ్ల మిల్లు ఉన్నది .మల్లయ్య గారిని నేను చూసిన దాఖలా లేదు .కానీ వారి పెద్దబ్బాయి వెంకటేశ్వరరావు ,ఆయన ఇద్దరు తమ్ములు మిల్లు ను నడపటం బాగా గుర్తు .అది అప్పటికే చాలా పెద్ద మిల్లు .వందలకొద్దీ వడ్ల బస్తాలు రావటం వాటిని బియ్యం ఆడటం లారీలలో ఎగుమతి చేయటం బాగా జ్ఞాపకం .వెంకటేశ్వర రావు గారు నల్లగా హుందాగా తెల్లని మల్లు పంచె తెల్ల షర్ట్ తో ,నుదుట యెర్రని నిలువు బొట్టుతో అనుక్షణం నవ్వుతూ ఉండేవారు .మాంచి యాజమాన్యం లో మిల్లు నడిచేది .కనీసం పది మంది వర్కర్లైనా ఉండేవారు .మిల్లుకు దక్షిణాన ఊక రాసి  చిన్న కొండంత పెరిగి ఉండేది .మిల్లులో బియ్యం అమ్మే వారో లేదో నాకు గుర్తులేదు. చిట్టూ,తౌడు మాత్రం  అమ్మేవారు .ఊక కావాలంటే అడిగితే ఫ్రీగానే ఇచ్చేవారని గుర్తు .ఆయన ఇద్దరు తమ్ముళ్ళు ఆయనకంటే నలుపు రంగు .వ్యవహార దక్షులు కూడా .ఈ ఇద్దరూ పాంట్ షర్ట్ తో ఉండేవారు .మల్లయ్య గారి ఇల్లు అంటే అప్పటికే డాబా రావి చెట్టు ఎదురు సందులో విశ్వ బ్రాహ్మణ బజారు మొదట్లో కుడివైపున సత్రానికి అవతల ఉండేది చాలా క్లాస్ గా ఉండేది .

 వెంకటేశ్వరరావు గారికి మా నాన్న గారు బాగా పరిచయం .నేను ఎప్పుడు వెళ్ళినా పంతులు గారు అనో మేష్టారు గారనో పలకరించేవారు .ఆయన కొడుకు ఉయ్యూరు హైస్కూల్లో నా శిష్యుడు .పేరు గుర్తులేదు పొట్టిగా నల్లగా ఉండేవాడు .మాశ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం పునః ప్రతిష్ట నాటికే వెంకటేశ్వరరావు గారి అన్నదమ్ములు ఎవరి భాగం వారు తీసుకొని విడిగా రావి చెట్టుకు ఉత్తరాన కోమటి బజారు అని పిలువబడే మెయిన్ రోడ్ కు కలుపబడే దారి వీధిలో ఉండేవారని జ్ఞాపకం  .మా ఆలయ ప్రతిష్ట తర్వాత వెంకటేశ్వరావు గారబ్బాయి ,కోడలూ ప్రతి రోజూ గుడికి వచ్చేవారు .చాల భక్తీ శ్రద్ధలున్నవారు ఆ దంపతులు .ఒక పిల్లాడో,పిల్లో పుట్టారు కూడా ..తర్వాత ఏమైందో తెలీదు కాని కోడలు చనిపోయింది .ఆ ఇంటి వైభవం మసకబారింది .కొడుకు ఒంటరిగా కొంతకాలం అందులో ఉండేవాడు తర్వాత అతడు ఆ భవనం అమ్మేశాడని తెలిసింది ఎక్కడి కి వెళ్ళాడో తెలీదు .ఆ చాప్టర్ అక్కడితో క్లోజ్ . వెంకటేశ్వరరావు గారి తమ్ములు మాత్రం అప్పుడప్పుడు కనబడే వారు .

  మల్లయ్యగారి మిల్లులో లెక్కలు, డబ్బు వ్యవహారాలూ చూసే కనుపూరి శర్మ  గారు ఉండేవారు .పూర్తి పేరు హనుమంత శర్మ అని గుర్తు .అందరూ శర్మ గారూ అనే పిలిచే వారు .నిలువెత్తు మనిషి .హుందాగా  తెల్లటి ఖద్దరు అంచుల పంచ తెల్ల చొక్కాతో ఉండేవారు సంస్కారం ఉట్టి పడేది .ఆయన ఉయ్యూరు కాలేజీ దాటాక వచ్చే గరుగు మీద కాపురం .వ్యవసాయం కూడా ఉండేదేమో  ? ఆయన మా ఇంటికి దక్షిణాన ఉన్న బెల్లం కొండ సుబ్బయ్యగారి పెద్ద కుమారుడు లక్ష్మీ నారాయణ గారి భార్య రాజమ్మ గారికి స్వయానా తమ్ముడు .మిల్లు లెక్కా డొక్కా అంతాపకడ్బందీ గా ఉండేది ఆయన చేతిలో .సైకిలు మీద వచ్చేవాడు  గరుగు మీద నుంచి మల్లయ్య గారి మిల్లుకు .ఈయన దగ్గర  బంధువే బహుశా మేనమామ కావచ్చు బెజవాడ లో జైహింద్ టాకీస్ కు వెళ్ళే దారిలో ఉన్న వివేకానంద హోమియో స్టోర్స్ .ఇక్కడ నిఖార్సైన హోమియో మందులు దొరుకుతాయని అందరికి మంచి నమ్మకం .వన్ టౌన్ లో రాదా కృష్ణా సైకిల్ షాప్ రోడ్డులో రామ కృష్ణా హోమియో స్టోర్స్ కు గొప్ప పేరుంది. దాని తర్వాత దీనికి పేరు .వివేకానంద స్టోర్స్ లోనే నేనెప్పుడు హోమియో మందులు కావాల్సి వచ్చినా కొనేవాడిని .శర్మగారు ఈ షాప్ ను నాకు పరిచయం చేశారు .ఆషాప్ ఓనర్ పేరు కూడా శర్మగారు అని గుర్తు .వెడల్పు ముఖం నవ్వుతూ చక్కగా పలకరించేవారు  ఉయ్యూరు పరిచయం ఉన్దికనుక చాలా గౌరవం చూపేవారు ఆయన చనిపోయాక భార్యా పిల్లలు స్టోర్స్ నిర్వహణ చూసేవారు .

గరుగు మీదే ఉండే ఇంకో కనుపూరు అయన ఉయ్యూరులో  చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసేవాడు .లావుగా బొద్దుగా ఉండేవాడు .రోడ్లు వేయటం మరమ్మత్తులు చేయటం చేసేవాడు శర్మగారికీ ,ఈయనకూ బంధుత్వం ఉందేమో నాకు తెలీదు .ఈయన కూతురు ఉయ్యూరు హైస్కూల్ లో నా శిష్యురాలు .పేరు గుర్తు లేదు .

 మేము ధాన్యాన్ని బందరు రోడ్డులో ఉన్న   ,ఆదిరాజు చంద్ర మౌలీశ్వరరావు గారి మిల్లు ,లేక కంతేటి విశ్వనాథం మిల్లు లేక కాటూరు రోడ్డులో ఉన్న పొగాకు ముసలయ్య మిల్లు లో మర పట్టించే వాళ్ళం .మల్లయ్యగారి మిల్లు ధాన్యం చిల్లరగా అడే వారు కాదేమో ?కానీ చివర్లో మల్లయ్యగారిమిల్లులో కూడా మరపట్టించిన గుర్తు కొద్దిగా ఉంది .ఇదీ జారిపోయిన మల్లయ్యగారి మిల్లు జ్ఞాపక శకలం .

ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి నాకంటే ఎక్కువగా మల్లయ్యగారి మిల్లు గురించి తెలిసి ఉండవచ్చు వారి జ్ఞాపకాలు దీనికి  జోడిస్తే సంతోషిస్తానని వారికి ఇందుమూలంగా తెలియ జేస్తున్నాను

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-21-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

సోమగిరి కోదండరామ శతకం

సోమగిరి కోదండరామ శతకం

చిత్తూరు జిల్లా శశిగిరి పుర నివాసి శ్రీ గండ్లూరి చంగల్వ రాయ కవి రాసిన ‘’సోమగిరి కోదండ రామ శతకం ‘’ను శ్రీ చేగు నారాయణ శెట్టి ,శ్రీ పార్లపల్లి పాపి రెడ్డి గార్ల ఆర్ధిక సాయం తో చిత్తూరులోని శ్రీ వెంకట శివారెడ్డి గారి శ్రీ శారదా ముద్రాలయం  లో 1914న ప్రచురింపబడింది .వెల అణన్నర –(0-1-6).

  పీఠిక లో ఆలయ చరిత్ర వచనంగా రాశాడు .విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలకాలం లో చంద్రగిరి పురం లో విశ్వామిత్ర  మహర్షి చే ప్రతిష్టితమైన అతి ప్రాచీన శ్రీ కోదండ రామ దేవాలయం ఉండేది .అందులో శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలు మహా సుందరమైనవి .చాలా కాలం మహా వైభవంగా స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ కళ్యాణాలు దిగ్విజయంగా జరిగాయి కొంతకాలానికి  లక్ష్మణ స్వామి  విగ్రహం చోరీ కి గురైంది .క్రమంగా ఆలయమూ శిదిలమైంది .స్థానిక భక్తులలో కదలిక వచ్చి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలనే సంకల్పం కలిగి 1912 డిసెంబర్ లో నూతనాలయ నిర్మాణం చేసి ,నారాయణ శెట్టి ,పర్లే పాపిరెడ్డి గారు పూనుకొని లక్ష్మణ స్వామి విగ్రహాన్ని విశ్వకర్మతో చేయించి యధా విధిగా మూర్తులను పునః ప్రతిష్టించి  ఎన్నేళ్ళు గానో జన హృదయాలలో ఉన్న కోరిక తీర్చారు .ఈ చరిత్రను మన కవి గారు పద్య కావ్యంగా రాయాలని మనసులో అనుకోగానే ,మిత్రులు ప్రోత్సహించి ,ప్రతిపద్య పాదం మొదట్లో రామచరితం ఉండేట్లు108 కంద పద్యాలతో శతకం రాయమని  సలహా ఇవ్వగా ,అది తన శక్తికి మించినది అని కవి భావించి భారమ౦తా కోదండరాముని పై వేసి ,భక్తి తత్పరతతోరాసి పూర్తి చేశాడు చంగల్వ రాయ కవి .ఇందులోని తప్పొప్పులను మన్నించమని సుజన విధేయుడైన కవి మనవి చేశాడు .దీన్ని ‘’ప్రతి పద్య పాద పాదాది కవి యిచ్ఛావాక్య ఘటిత అష్టోత్తర శత కంద  రామాయణ సంగ్రహ శ్రీ సోమగిరి కోదండ రామ శతకం ‘’అని సార్ధక నామ ధేయం గావించాడు కవి .కోదండరామునికే అంకితమిచ్చి ధన్యుడయ్యాడు కవి .

  ప్రార్ధన పద్యాలలో మొదటిది శ్రీ రాముని గురించే –‘’శ్రీభూ సుత కుచయుగమృగ-నాభం .బెద నంటి యు౦డు నలినాక్షుం డై-శోబిల్లెడి వరసారస-నాభుడు శ్రీరాము డేలు నను దినమునన్’’.తర్వాతనే కరి వక్త్రుడైన వినాయక ప్రార్ధనచేసి తన ప్రణాళిక తెలియ జేశాడు .రామ చరిత్రను ఎలా రాశాడో చూద్దాం –సిరులకు నునికియయి ‘’అంటూ రామకధను అయోధ్యాపురి దశరథ మహా రాజు కథ తో ప్రారంభించాడు – ఇప్పుడు పద్య నడక ఎలా సాగిందో చూద్దాం –‘’సిరి కరి తురగాదుల చా –రు రమణులన్ భ్రుత్య దేనుభోగము చే జా –ల రసో జ్వలుడై రిక్తుల-కురు కల్ప ద్రుమము భంగి గోర్కెల నిడుచున్ ‘’ఇలా మొదటి కంద పద్యం చెప్పాడు .ఇందులో ప్రతిపాదం మొదటి అక్షరం లో కథ పైన చెప్పినట్లు నడుస్తుంది .ఒకరకంగా సర్కసు ఫీట్ లా ఉంటుంది .

  మధ్యలోకి వెడితే –చెలగగ లక్ష్మణ విగ్రహము ‘’అనే కధాంశం లోని కడాలరుచి చూద్దాం –‘’చెలియేమొఎడురాదుకొ-లల నిటు నా మీద నలిగి లావణ్యము నున్ –గల తనువును సూపింపక –గలుషము బూమి నట్లు నాకు కష్టము నిడెనో’’’’బుధ వరులయిన తమకు సతతము నతు లొనరిచెద’’అన్న భావంతో 100వ పద్యం నుంచి 105వరకు రాసి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకొన్నాడు కవి .-‘’నలినాక్షు డయోధ్యపు-రి లలిత మాధుర్యమైన మృదు భాషణులన్ –చెలియతొబలుకుచు వానర –దళముజేరి రపుడు తద్దయ నుండన్ ‘’అంటూ మళ్ళీ అయోధ్యకు చేర్చాడు రామ కథను .ఈ మధ్యలో రామాయణ ముఖ్య ఘట్టాలన్నీ అందంగా  కందాలలో రాశాడు.

 శ్రీ రామ పట్టాభి షేకాన్ని ఈ నియమం లేకుండా రాశాడు –‘’భరతుడు శత్రుఘ్ను౦డును  -నిరు పార్శ్వముల౦దు  మెరయ నినజుండును యా –దొరయ౦గజుండును రాక్షస –వరుడువిభీషణుడు జాబవంతుండు వరుసన్ ‘’,’’కరువలి దిశ మెరయగవర –సరదభ్రసురుచుల దేహ శ్యామలకాంతి- సరసిజ ముఖుడై రాముడు –ధర విలసితుడయ్యియుండె తా మధ్యమునన్ ‘’-‘’ఘనమగు ప్రభువై ధరణిని-జనపాలన చేయు మంచు జితురత రామున్ –ముని చంద్రుడగు వసిష్టుడు –తిన పట్టాభిషిక్తు జేసి దీవెన లోసగెన్ ‘’-‘’సోమ గిరి పురంబున –బాసిలు కోదండరామ భవ్యునకు నే –వాసిగ నంకిత మొసగితి – భాసురముగ వ్రాసి దీని పల్వురు మెచ్చన్ ‘’-‘’మంగళ మా రామునకున్-మంగళమా సోమ శైల మందిరునకుస – న్మంగళముధీనిధి శుభ-మంగళమా వనిజ పతికి మహానియ్యునకున్ ‘’.

అంటూ శతకం పూర్తి చేశాడు చెంగల్వ రాయ కవి .కవుల చరిత్ర లో ఈ శతకం చోటు సంపాదించు కొన్నదో లేదో తెలియదు కాని కొత్తపోకడతో రాసిన శతకం.మెచ్చదగిన శతకం .ఆదరించాల్సిన శతకం.

   నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-21-ఉయ్యూరు     

 

ttps://ia800709.us.archive.org/6/items/shriisoomagiriko036171mbp/shriisoomagiriko036171mbp.pdf

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చర్లవారి పురస్కారం

చర్లవారి పురస్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హేలాపురి (ఏలూరు )శతకం

హేలాపురి (ఏలూరు )శతకం Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.41(చివరి భాగం )

 

కిరాతార్జునీయం-.41(చివరి భాగం )

18 వ చివరి సర్గ -2(చివరి భాగం )

అర్జునుని సఫలత చూసిన ప్రమథగణం అతని తపస్సును ఫలితం మహా గొప్పదని కీర్తించారు –‘’తపసికృత ఫలే ఫలజ్యాయసీ –స్తుతిరివ జగదే హరేఃసూనునా ‘’.అర్జునుడు ప్రత్యక్ష మహా దేవుని స్తుతించటం మొదలుపెట్టాడు –‘’ఓ శంకరా !పరమ దయామతివి ,భక్తసులభుడవు ,,శరణమిచ్చే వాడివి .నిన్ను పొందిన వారు మృత్యువును జయిస్తారు .దేవదానవ లొకం  లో భయం కలిగితే ,నిన్నే శరణు కోరతారు ‘’-‘’శరణం భవ౦త మతి కారుణికం –భవభక్తి గమ్యధిగమ్యజనః –జిత మృత్యవో  జిత !భవంతి భయే –ససురాసురస్య జగతః శరణం ‘’.నీకు నమస్కరించనంతవరకు మనిషి మృత్యు ఆపదలో ఉంటాడు. కోరికలు సఫలం కావు .ఇతరులూ అలాగే .-‘’విపదేతి తావదవ సాదకరీ –న చ కామ సంపదభికామయతే –న నమంతి చైక పురుషం పురుషా –స్తవ యావదీశ !న నతిఃక్రియతే ‘’..దానాది పుణ్య కార్యాల స్వభావమున్న వారు జన్మ మృత్యు మొదలైన్ కస్టాలను చూసి ,ముక్తి కోరుతూ నిన్ను ఆరాధించటం లో చిత్రమేమీ లేదు .అయినా తమకోసమే నిన్ను ఆరాధించే వాళ్ళను నిస్పృహ పొందికూడా ఫలాన్నివ్వటం నీకారుణ్య ఫలితమే .ఇందులో నీ ప్రయోజనం  ఏదీ లేకపోవటమే చిత్రాచి చిత్రం –‘’సంసేవంతో దానశీలా విముక్త్యై-సంపశ్యంతో జన్మ దుఖం పుమా౦సః-యన్నిఃసంగస్త్వం ఫలస్యాన తేభ్య-స్తత్కా.రుణ్యం కేవలం న స్వకార్యం ‘’.ఏ తీర్ధం దూరం వెళ్ళకుండా ప్రాప్తిస్తుందో ,పరలోకం వెళ్ళకుండానే ఫలమిస్తుందో ,మోక్షప్రదమో ,అన్ని కోరికలూ తీర్చెదో ఆ తీర్ధం నువ్వు కాక మరొకటి కానే కాదు –‘’ప్రాప్యతే  యదిహ  దూర మగత్వా-యత్ఫలస్య పరలోక గతాయ –తీర్థమస్తి న భావార్ణవ బాహ్యం –సార్వ కామిక మృతే భవత స్తత్  ‘’.నీ భక్తీ తో కైవల్యంపొందుతాడు .వ్యతిరేకి ఘోర నరకం అనుభవిస్తాడు.నిష్కళంక మూర్తీ !ఇది చాలా దుస్తరమైనది .కార్యకారణ భావ శక్తి మహిమ .నీకు భక్త ,అభక్త భేదమే లేదు –‘’వ్రజతి శుచి పదం త్వయి ప్రీతిమాన్ –ప్రతిహత మతి రేతిఘోరాం గతిం-ఇయ మనఘ నిమిత్త శక్తిః పరా –తవ వరద న చిత్త భేదః క్వచిత్ ‘’.హే దయాళూ!భక్త వశాను వర్తిని ,కల్యాణాన్నీ చేకూర్చే  నీ మూర్తిని గుర్తించలేక పోయినా రాగద్వేషాలతో ఉండే ప్రాణి భక్తితో నీ స్మరణ చేస్తే చాలు సంసారసాగరం దాటగలడు.’-‘’దక్షిణా౦ ప్రణత దక్షిణ మూర్తిం –తత్వతః శివ కరీ మవిదిత్వా –రాగిణా మపివిహితా తవ భక్త్యా –సంస్మృతిర్భవ భవత్య భవాయ ‘’.జ్ఞాన దృష్టితో తత్వాన్ని గ్రహించి అనుకూలమైన ఆచరణ చేస్తూ విఘ్నాలు బాధలు లేకుండా మోక్షం పొందుతారు .పరమాత్మగా నిన్ను దర్శించి సమ్యక్ జ్ఞానం తో ఆరాధించేవాడు కర్తవ్య పాలకుడు ఔతాడు –‘’దృష్ట్యా దృశ్యా న్యాచర ణీయాని విధాయ –ప్రేక్షాకరీ యాతి పదం ముక్త మపాయైః-సమ్యగ్దృష్టిస్తస్య పరం పశ్యతి యస్త్వాం –యశ్చోపాస్తే సాదు విధేయం స విధత్తే’’.వ్యాస వాల్మీకాది మునులు యోగ మహిమతో ప్రజలకు విధి ,నిషేధ రూప ఉపదేశాలు చేసి ఉపకారం చేశారు. నీ మహిమ ఊహింప వీలు లేనిది .నిన్ను శరణు పొందిన వారి పుణ్య పాపకర్మలన్నీనాశనం చేయగలవు –‘’యుక్తాః స్వ శక్త్యా మునయః ప్రజానాం –హితోప దేశై రుపకార వంతః –సముచ్ఛినత్సి త్వమచిన్త్య ధామా –కర్మాణ్యు పేతస్య దురుత్తరాణి’’

   ‘’నీ మాయను జయించి పుణ్య  పాపాలతో బంధింప బడి ,ఇతరులు చేధించటానికి వీల్లేని భయంకర నరక యాతనను  దూరం చేయటానికి అద్భుత లీలా రూపం ధరించావు – ‘’స౦ నిబద్ద  మపహర్తు మహార్యం –భూరి దుర్గతి భయం భువనానాం –అద్భుతా కృతిమిమా మతిమాయ –స్త్వంభిభర్షి కరుణామయ మాయాం’’.నీ చిత్తం విరాగ మైనదే .నీశరీరం లో అర్ధ భాగం లో స్త్రీ ఉన్నా,మన్మథవికారం  లేని వాడివి .ఉదయ సంధ్యలో బ్రహ్మను ఆరాదిస్తావు .నీ చేష్టలు జటిలమైనవి ,అర్ధం కానివి –‘’న రాగి చేతః పరమా విలాసితా –వధూః శరీరే స్తినచాస్తి మన్మథః-నమస్క్రియా చోషసి ధాతు రిత్యహో –నిసర్గ దుర్బోధ మిదం తవేహితం ‘’.వెంట్రుకలతో ఉన్న గజ చర్మాన్ని కప్పుకొన్నావు.మణితో ఉన్న సర్పం నీ మొలతాడు .కపాలమాల అలంకార దండ .చితా భస్మం చందనం అయినా ఈ అలంకారాలు శిరసుపై ఉన్న చంద్ర రేఖతో సమానంగా ప్రకాశిస్తున్నాయి –‘’తవోత్తరీయం కరి చర్మ సా౦గజం –జ్వలన్మణిః సారసనం మహానహిః-స్రగాస్య పంక్తిఃశవ భస్మ చందనం –కలాహిమాంశోశ్చసమం చకాసతి ‘’.నువ్వు ఆశరీరుడివే.అసాధారణ అర్ధ నారీశ్వర రూపం నీకే ఉంది .విరుద్ధ వేష ,అలకారాలున్నా ,మహా అందంగా ఉంది .లోకం లో ఇంకెవరికీ ఇలా లేనేలేదు .నీ మహిమ అవర్ణ్యం.-‘’అవిగ్రహస్యాప్యతులేన హేతునా –సమేత  భిన్నద్వయ మూర్తి తిష్టతః –తవైవ నాన్యస్య జగత్సు దృశ్యతే –విరుద్ధ వేషాభరణ్య కా౦తతా ‘’.జనన మరణ రహితుడవు నీకు ఉపమానమే లేదు  ఉపమేయమూ లేదు.అంటే వర్ణించలేము  –‘’ఆత్మ లాభ పరిణామ నిరోధై-ర్భూత సంఘ ఇవ న త్వముపేతః –తేన సర్వ భువనాతిగలోకే –నోపమానమసి నాప్యుపమేయః ‘’

‘’చరా చర ప్రపంచ సంహారకుడివి. నీవల్లనే విశ్వం సృష్టింపబడి ,జీవిస్తుంది .యోగులకే కర్మ ఫలాన్నిస్తావు .సమస్త జగత్తు కారణానికే కారణం నువ్వే –‘’త్వమంతకః –స్థావర జంగమానాం –త్వయా జగత్ప్రాణి దేవ విశ్వం –త్వం యోగినాం హేతు ఫలే రుణత్సి-త్వం కారణం కారణ కారణానాం ‘’..ఈ సంసారం లో రాక్షసులు ,దేవ ,మనుష్యులు,దైత్యులు ఏయే సామ్రాజ్యాలు పొందారో ,వాటన్నిటికీ శరణాగతుల దుఖాన్ని పోగొట్టే నీకు చేసిన నమస్కార మహిమే కారణం ‘’-‘’రక్షోభిః సురమనుజైర్దితేః సుతైర్వా-యల్లోకే ష్వవికల మాప్త మాధిపత్యం –పావిన్యాఃశరణాగతార్తి హారిణే త-న్మాహాత్మ్య౦ భవ భవతేనమస్క్రియాయాః’’.శంకరుని అష్ట మూర్తుల్లో వాయు మూర్తి ఒకటి .దాన్నిఅర్జునుడు ‘’  వాయు బలం తో లోకాన్ని ప్రాణవంతం చేస్తుంది .వాయువు ప్రేరణ తో అక్షరరూప బ్రహ్మ పలుక బడుతుంది .అదే అన్ని పాపాలు పోగొట్టి శుద్ధిచేస్తుంది .అలాంటి వాయు రూప శివా !’’అని స్తోత్రం చేశాడు –‘’తరసా భువనాని యో భిభర్తి –ధ్వనతి బ్రహ్మ యతః పరం పవిత్రం –పరితో దురాని యః పునీతే –శవ తస్మైపవనాత్మనే నమస్తే ‘’

  తర్వాత అగ్నిరూప శివ స్తోత్రం చేశాడు పార్ధుడు –యోగ సాధన కోసం యోగాసనం లో కూర్చుని నిన్ను స్మరించే యోగుల సంసార దుఖాలకు కారణమైన కర్మలను దహిస్తుంది .అనేక జ్వాలలతో ప్రకాశించే నీ అగ్ని మూర్తికి నమస్కారం –‘’భవతః స్మరతా౦సదాసనే –జయిని బ్రహ్మ మయే నిషేదుషాం –దహతే భవ బీజ సంతతిం –శిఖినే నేక శిఖాయ తే నమః ‘’.జలమూర్తి శివ స్తోత్రం –సంసార బీజానికి కారణమైన శివా !ఆధ్యాత్మిక ,ఆది భౌతిక ,ఆది దైవిక ,ఆది భౌతిక రూప తాపత్రయాలలు మరణం మొదలైన వాటి వలన కలిగే భయరూప మంటలను ఉన్న సంసారాగ్ని లో చాలాకాలంగా బాధ పడే వారు  నిన్నాశ్రయిస్తే చాలు వారికి జీవదానం చేయగల జలమూర్తి వైన నీకు నమస్కారం –‘’అబాధా మరణ భయార్చిషా చిరాయ –ప్లుష్టేభ్యోభవ మహతా భవానలేన-నిర్వాణం సముపగమేన యచ్ఛతే తే-బీజానాం ప్రభవ నమోస్తు జీవనాయ ‘’నభో మూర్తి శివ స్తోత్రం –భవా! విభువు ,సంపూర్ణ జగత్తూ ఆవరించిన వాడూ ,ఎవరి చేతా ఆచ్చాదనం లేనివాడు ,ఆది అంతం లేని వాడు ,ఇంద్రియాతీతుడు తెలియబడని నీ ఆకాశ మూర్తికి నమస్కారం –‘’యః సర్వేషా మావరీతా వరీయాన్ –సర్వైర్భావైర్నావృతోనాది నిష్టః-మార్గాతీతా ఏంద్రియాయాణా౦ నమస్తే –విజ్ఞేయాయ వ్యోమ రూపాయ తస్మై ‘’.దేవా !సూక్ష్మాతి రూపం తో విశ్వాన్ని ధరిస్తూ ,అంతర్యామిగా అందరికీదగ్గరౌతావు .మాట మనసుకూ అతీతుడవైనా వాటికి అధిపతి వైన నీకు నమస్కారం ‘’.-అణీయసేవిశ్వ విధారిణేనమో –నమో౦తిక స్థాయ నమో దవీయసే –అతీత్య వాచాం మనసాం చ గోచర౦ –స్థితాయ తే తత్పతయే నమో నమః ‘’అన్ని విద్యలకు స్వామివి .అజ్ఞానంగా శస్త్ర సంధాన దుశ్చర్యకు పాల్పడిన నన్ను క్షమించు .అజ్ఞానం తో విరోధించి ,మళ్ళీ నిన్ను చేరిన దుర్మార్గు డికి  కూడా నువ్వే  శరణ మయ్యావు ‘’-అసం విదానస్య మమేశ సంవిదాం –తితిక్షితుం దుశ్చరితం త్వమర్హసి –విరోధ్య మొహాత్పునరభ్యుపేయుషాం-గతిర్భవానేవ దురాత్మనాపి ‘’.

  స్తోత్రాలన్నీ చేసి చివరకు అర్జుండు శివుడిని వర౦  కోరుతున్నాడు-‘’ధర్మపాలకా !ఆస్తి బుద్ధితో వైదిక ధర్మాన్ని ఆచరిస్తున్న మా అన్న ధర్మరాజు గారికి .అపకారులైన శత్రువులపై మేము ఏ విధంగా శస్త్రాస్త్ర సమృద్ధిగా విజయం పొందుతామో దాన్ని మాకు ప్రసాదించు –ఇదే నా ప్రార్ధన –‘’ఆస్తిక్య శుద్ధమవతః ప్రియ మార్గ ధర్మం –ధర్మాత్మజస్య విహితాగసి శత్రు వర్గే –సంప్రాప్నుయా౦ విజయ మీశ యయా సమృధ్యా –తాం భూతనాథ  విభుతాంవితరాహవేషు ‘’అని కోరి శివుని పాదాలపై పడిన ఆర్జునుడిని శంకరుడు ఓదార్పు మాటలు పలికి అగ్నిజ్వాలావృతమై, రుద్రదేవకాత్మమైన పాశుపతాస్త్రాన్ని,దానికి సంబంధించిన ధనుర్వేదాన్నీ అనుగ్రహించాడు –‘’ఇతి నిగదిత వంతం సూను ముచ్చైర్మ ఘోనః –ప్రణత శిర సమీశః సాదరం సాంత్వ యిత్వా –జ్వలదనల పరీతం రౌద్ర మస్త్రం దధానం –ధనురుప పద మస్మైవేదమఖ్యాదిదేశ’’.

   ఆధనుర్వేదం శివుని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తూ,దేవతలు స్తోత్రాలు చేస్తుండగా అర్జునుడి ఎదుటకు వచ్చింది .ఎర్రని నేత్రాలతో అందం గా ఉంది సర్వ లోక పూజనీయం ప్రకాశమైన ధనుస్సుభయంకర శరీరం ధరించింది .మూడు శిఖల త్రిశూలంతో సంబంధం కలిగి ఉన్నది పచ్చని రంగుతో సూర్యుడు మేఘాన్ని చేరినట్లు ఆర్జునుడిని చేరింది –‘’స పి౦గాక్షః శ్రీమాన్ భువన మహనీయేన మహసా – తను౦ భీమాం భిభ్ర త్రిగుణ పరివార ప్రహరణః-పరీత్యేశానం త్రిః స్తుతిభి రూప గీతః సుర గణైః-సుతం పాండోర్వీరం జలదమివ భాస్వాన భియయౌ ‘’.తర్వాత ఇంద్రాది దేవతలు ఈశ్వరుని అనుమతి పొంది పూర్ణ కాముడైన అర్జునుడికి ఫలదాయకాలైన ఆశీస్సులు పలికారు .విజయ ప్రదాలైన అనేక అస్త్రాలు అర్జునుడికి ప్రదానం చేశారు –‘’అథశశధర మౌలే రభ్యనుజ్ఞా మవాప్య –త్రిదశ పతి పురోగాఃపూర్ణ కామాయ తస్మై –అవిథతఫలమాశీర్వాదమారోపయంతో-విజయి వివిధ మస్త్రం లోక పాలా వితేరుః-‘’

జయశీలుడైన అర్జునుడు పాశుపతాస్త్ర లాభం తో అభ్యుదయం పొంది దురాత్ముల వినాశానానికీ ,లోక రక్షణకు తపస్సు వలన కలిగిన శోభతో ప్రత్యేక తేజస్సుతో అద్వితీయ సూర్య ప్రకాశంగా ప్రకాశించాడు  .దేవతలు అర్జున యశోగానం చేసి ఉత్సాహ పరచారు –‘’అసంహార్యోత్సాహం జాయిన ముదయంప్రాప్య తరసా –దురం గుర్వీ౦ వోఢుం స్థితమనవ సాదాయ జగతః –స్వధామ్నా లోకానాం తముపరి కృతస్థానమమరా –స్తపో లక్ష్మ్యా దీప్తం దిన కృతమివో చ్చైరుప జగుః’’

  శివ భగవానుడు అర్జును డితో’’వెళ్ళు శత్రువులను జయించు ‘’అని ఆజ్ఞ ఇవ్వగా పాదాలకు నమస్కరించి బయల్దేరాడు పార్ధుడు .దేవతలు కొని యాడగా విజయలక్ష్మితో ఇంటికి చేరి ,ప్రేమాదరాలతో ఎదురు చూసున్న అన్న  ధర్మరాజుకు నమస్కరించాడు –‘’వ్రజ జయ రిపులోకం పాద పద్మానతః సన్-గదిత ఇతిశివేన శ్లాఘి తో దేవా సంఘైః-నిజ గృహమథగత్వా సాదరం పాండు పుత్రో –ధృతగురు జయలక్ష్మీ ర్ధర్మసూనుం ననామ ‘’.

 భారవి మహాకవి మహాకావ్యం ‘’కిరాతార్జునీయం’’ సమాప్తం .

ఆధారం –భారవి మహా కవి కిరాతార్జునీయం సంస్కృత కావ్యానికి శ్రీ శ్రీపాద వేంకట రమణ దైవజ్ఞ గారు రాసిన తెలుగు వ్యాఖ్యానం ఆధారంగా అంతర్జాలం లో కిరాతార్జునీయాన్నిమాఘమాసం  25-1-20 న ప్రారంభించి ,7-2-20నాటికి14 ఎపిసోడ్ లతో  3 సర్గలు వారి వ్యాఖ్యానం మూడు సర్గలకే ఉండటం వలన  అంతవరకే రాసి ,ఆపేశాను .తర్వాత సర్గల వ్యాఖ్యానం కోసం ఈలోపు గాలించి ,గాలించి మా అబ్బాయి శర్మ ఎమెస్కో వారు ప్రచురించిన డా. సుందరాచార్య సంపూర్ణ కిరాతార్జున వ్యాఖ్యానం కొని పంపించగా దసరాలలో సరిగ్గా సరస్వతీ పూజ రోజున నాకు 21-10-20న అందింది . .మళ్ళీ కార్తీకమాసం 16-11-20న 4వ సర్గ నుంచీ  డా .కె.వి.సుందరాచార్యులు  వారి సుందర  తెలుగు వ్యాఖ్యానం ఆధారంగా ప్రారంభించి ఈరోజు మార్గశిర బహుళ పాడ్యమి 30-12-20నాటికి 41ఎపిసోడ్ లతో సుమారు నెలన్నర కాలం లో ,18వ సర్గ వరకు మొత్తం కావ్యాన్ని పూర్తి చేయగలిగాను .మొత్తం 55ఎపిసోడ్ లు గా ,కిరాతార్జునీయ౦ పూర్తయింది.ఇది నాకు సంతృప్తినీ ఆనందాన్నీ కల్గి౦చికావ్యం  .నాజన్మ చరితార్ధం –

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -30-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం -40 18 వ చివరి సర్గ -1

కిరాతార్జునీయం -40

18 వ చివరి సర్గ -1

తన భుజబలం శివునిపై ప్రదర్శించాలనుకొన్న అర్జునుడిని  శివుడు ముద్గరం అనే ఇనుప ఆయుధం  వంటి పిడికిలితో పొడిచాడు –‘’ధనురపాస్య సబాణధిశంకరః –ప్రతి జఘాన ఘనైరివ ముష్టిభిః’’ .కిరాతార్జునులు  ముష్టి యుద్ధం చేస్తూ వ్రేళ్ళతో చేతులు చరఛి పట్టుకొ౦టే కలిగిన బండరాళ్ల వంటి ధ్వని పర్వత గుహలలో ప్రతిధ్వనించింది –‘’స్ఫుట దనల్ప శిలారవ దారుణః-ప్రతి నినాద దరీషు దారీ భ్రుతః’’.శ౦కర ముష్టిఘాతాలు,కి౦కరునికి చమ్మగానే ఉన్నాయి .పరాక్రమ శీలురు తేజస్వంతుల అనుకరణలో  కూడా విశిష్టంగా నే ఉంటారు. అర్జున మనస్వి ఆవేశం తో రౌద్రం పొందినా ,సుఖ దుఖాల భేదం గుర్తించలేదు అని భావం –‘’క ఇవ నామ బృహన్మనసాం భవే-దను కృతే రపి సత్వవతాం క్షమః ‘’.శంకర వక్షస్థలం పర్వత తట ప్రాంతం లా విశాలమైనది .అర్జునుడి దెబ్బలతో గాయమై రక్తం కారుతూ సంధ్యాకాల ఎరుపు రంగు మేఘం లా ఉన్నాడు ‘’ –‘’అభిన వౌష సరాగభ్రుతా బభౌ –జలధరేణ సమాన ముమాపతిః ’ఉరసి శూల భ్రుతఃప్రహితా ముహుః-ప్రతిహతం’’

అర్జున ముష్టి ఘాతాలు సహ్యపర్వత తీరాన్ని సముద్ర కెరటాలు మాటి మాటికీ కొట్టు కొంటు న్నట్లుగా ఉంది .పర్వతాన్ని కెరటాలేమీ చేయలేనట్లే అర్జునుని పిడి గుద్దులు స్థాణశివుడిని ఏమీ చేయలేకపోయాయి –‘’ఉరసి శూల భ్రుతఃప్రహితా ముహుః-ప్రతిహతం యయు రర్జున ముష్టయః –భ్రు శరయా ఇవ సహ్య మహీ భ్రుతః –పృథుని  రోథసి సింధు మహో ర్మయః’’

   శివుడు రెండు చేతులతో పిడికిలి బిగించి అర్జున భుజాలపై కొట్ట గా ,కళ్ళు తిరిగి తడబడి తూలి పడ్డాడు –‘’త్రి చతురేషు పదేషు కిరీటినా –లులిత దృష్టిమదాదివ చస్థలే’’.అవమాన కోపాలతో మండిపడి దగ్గరకెళ్ళి శివుడి రెండు భుజాలు వేరు చేసి గట్టిగా పట్టుకొన్నాడు పార్ధుడు –‘’భుజ యుగేన విభజ్య సమాదదే –శశి కళా భరణస్య భుజ ద్వయం ‘’.కిరాతార్జున మల్లయుద్ధం హిమాలయాన్ని కంపింప జేసింది .తమ భుజబలాన్ని వారిద్దరూ గర్వంగా భావించారు .ఒకరి భుజాలు మరొకరు పట్టుకొని శృ౦ఖలాలు కూర్చినట్లు పోరాడారు –‘’కరణ శృ౦ఖల సంకలనాగురు –ర్గురు భుజాయుధ గర్విత యోస్తయోః’’.ముష్టి యుద్ధ లో  ఇద్దరూ కిందపడ్డారు .ఎవరు కిందపడ్డారు,  ఎవరు పైన ఉన్నారో తెలియక తికమక పడ్డారు ప్రమథులు .శివార్జునుల బరువును సహించలేని ఇంద్రకీల పర్వతం  వారితో పాటు కదులుతూ ,వాళ్ళు కదలకుండా ఉంటే స్థిరంగా ఉంటూ ,వంగినపుడు వంగి నుల్చుంటే నిటారుగా నిలబడి ,ఎక్కడ తాను  నశి౦చి పోతానో అనే భయం పొందింది –‘’ప్రచాలితే చలితం స్థిత మాస్థితే-వినమితే నతమున్నత మున్నతౌ –వృష కపిధ్వజయో రస హిష్ణునా –ముహురభావ భయాదివ భూ భ్రుతే’’

  కళ్ళు చేతుల కలయిక ఆపేసి జబ్బలు చరవటం మొదలెట్టారిద్దరూ .ఆ ధ్వనికి పర్వత  నదులు ఎల్లలుదాటి ప్రవహించాయి –‘’చరణపాత నిపాతిత రోధనః –ప్రససృపుఃసరితః పరితః స్థలీః’’.ఆకాశం లోకి వేగం గా ఎగిరిన శివపాదాలు అర్జునుడు యెగిరి లాఘవంగా పట్టుకొన్నాడు –‘’చరణయోశ్చరణానమితక్షితి –రనిజ గృహేతిస్రుణాం జయినం పురాం’’.తను కళ్ళు పట్టి నేలకేసి కొట్ట దలచిన అర్జున పరాక్రమానికిశివుడు ఆశ్చర్యపోయి ,తన వక్షస్థలం తో గట్టిగా ఆలింగనం చేసి నలిపేశాడు –‘’’’విస్మితః సపది తేన కర్మణా –కర్మణాంక్షయకరః పురః పుమాన్ –క్లేప్తుకామ మవనౌ తమక్లమం –నిష్పిపేష పరిరభ్య వక్షసా ‘’.అర్జునుడి పరాక్రమానికి సంతోషించినంతగా అతడి తపస్సుకు సంతోషించ లేదు శివుడు. సత్పురుషుల కు తపస్సు మొదలైన గుణాలకు మించి ,సహజ పరాక్రమమే ఉపకారమై వన్నె తెస్తుంది –‘’’’గుణ స౦హతేః సమతిరిక్త మహో –నిజ మేవ సత్వముపకారి సతాం ‘’

  శంకరుడు తెల్లని భస్మంతోఅల౦కారుడై చంద్ర రేఖ తో మనసును ఆకర్షించే రూపం తో ప్రత్యక్షం కాగా అర్జునుడు వెంటనే నమస్కరించాడు –‘’అథహిమ శుచి భస్మ భూషితం –శిరశి విరాజమిత మిందు లేఖయా – స్వవపురతిమనోహరం హరం –దదత ముదీక్ష్య ననామ పాణ్డవః ‘’.అనుకుకుండా  బాణాలు అమ్ములపొదులు గాండీవం ఖడ్గం కవచం తో ప్రకాశిస్తున్న తన శరీరం చూసుకొని అర్జునుడు ఆశ్చర్య పోయాడు –‘’సహా శరధి నిజం తథా కార్ముకం –వపురతను సంవర్మితం –నిహిత మపి తథైవ పస్యన్నసిం-వృషభగతి రూపాయ యౌవిస్మయం ‘’.అప్పుడు మేఘాలు తు౦పురులతో నేలను తడిపి చల్ల బరిచాయి. చిత్రంగా మందార పుష్ప పరిమళం వ్యాపించి ,స్వచ్ఛకాంతి ఆకాశాన్ని ఆవరించి భేరీ వాదన లేకుండానే ధ్వనించింది .-‘’విమల రుచి భ్రుశంనభో దు౦దుభే-ర్ధ్వని రఖిల మనాహత స్యానతే ‘’.ఇంద్రునితో  సహా దేవతలంతా విమానాలలో వచ్చి ఆకాశాన్ని ఆవరించారు .ఆ విమానాల కాంతులతో ఆకాశం లో నక్షత్రాలు పొడమినట్లు తోచింది .-‘’రోచిష్ణురత్నావలిభిర్వి మానైః-ద్యౌరా చితా తారకితేవ రేజే ‘’.దేవ విమానాలు మోసే హంసలు మెడలలోధ్వనించే గంటలతో ,ఎగురుతూ  రెక్కలు నాడించి  ఆకాశాన్ని కౌగలించు కునేట్లు చేరాయి .మేఘం లాంటి వృషభం పై కూర్చున్న మహేశ్వరునికి వాయుదేవుడు ,తుమ్మెదలు మందార మాలలను పైన వెన్నెల లాగా  వ్యాపింప జేసి ఆహ్లాదం కలిగించాయి –‘’ముదిత మధులిహో వితానీ కృతాః-స్రజ ఉపరి  వితత్య సంతానికీః-జలద ఇవ నిషేది వా౦స౦ వృషే-మరుదుప సుఖయాం బ భూవేశ్వరం ‘’

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.39 17వ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.39

17వ సర్గ -3(చివరి భాగం )

ప్రతీకార  సమర్ధుడైన పార్ధుని చేయి ఆ సమయం లో  సాయ పడకపోయినా ,పూర్వపు ఉపకారం తలచుకొని అమ్ములపొది నుంచి అతి కష్టంగా వేరు పడింది .కృతజ్ఞుడైన సత్పురుషుడు మొదట ఉపకారం చేసిన వాడైనా ,తత్కాలం లో ఉపయోగపడని మిత్రుడిని వదలటం సహజమే .-‘’పరాన్ముఖత్వేపి కృతోపకారా—త్తూణీ ముఖాన్మిత్ర కులాది వార్యః ‘’.గత్య౦తరం లేక ఆ రెండు పొదులను దూరం చేయటం ఉపకారమే అయింది .యోగ్యత లేని సేవకుడు వ్యర్ధం ,అనుచితం ,సాహసమే అవుతుంది .-‘’సంభావనా యామ ధరీ కృతాయం-పత్యుః పురః సాహస మాసి తత్త్వం ‘’.ఇది గమనించిన కిరాత శంకరుడు రెచ్చి పోయి ,ఉక్కు బాణాలతో అర్జున మర్మావయవాలకు తీవ్ర బాధ కలిగించాడు .తత్వ చర్చమధ్యలో  ప్రతివాది నిరుత్తరుడైతే , అతడి పెద్దపెద్ద లోపాలను చూసి బాగా బాధ పెట్టినట్లుంది అర్జునుడి స్థితి.-‘’త౦ శంభు రాక్షిప్త మహేషు జాలం –లోహైఃశరైర్మర్మశునిస్తు తోడ-హృతోత్తరం .తత్వ విచార మధ్యేవక్తేవ దోషై ర్గురు భిర్విపక్షం ‘’.శంకర బాణాలు మణులు కూర్చిన అర్జున కవచాన్నిపగల కొట్టాయి.ప్రచండ వాయువు విద్యుత్తు తో ప్రకాశించే మేఘ శకలాలు తొలగించి సూర్యుడిని ప్రకాశింప జేసినట్లు గా ఉంది –‘’చండఃపతంగాన్మురుదేక నీలం –తడి త్వతః ఖండ మివా౦బుదస్య ‘’. కవచం లేని క్రీడి శోభ ఒరనుండి లాగిన సానబెట్టిన ఖడ్గం లాగా,కుబుసం విడిచిన పాములాగా ,శత్రు ఏనుగును చూసి ముఖావరణం తొలగించిన ఏనుగు లాగా ,పర్వత గుహ నుంచి బయటికొచ్చిన సింహ౦లా,రాత్రి ప్రకాశించే పొగలేని అగ్నిలా అయింది .-‘’విబోధితస్య ధ్వనినా ఘనానాం –హరేరపేతస్య చ శైల రంద్రాత్ –నిరస్త దూమస్య చ రాత్రి వహ్నే –ర్వినాతను త్రేణ రుచిం స భేజే ‘’.కవచం పడిపోయి ,రెండు తూణీరాలు నేలపై పడికూడా ఆపదలో ఉన్న యజమానికి ఏమీ సహాయం చేయలేకపోతున్నామే అన్నట్లు అచేతనమైనాయి –‘’అచిత్త తాయామపి నామ యుక్తా –మనూర్ధ్వతాం ప్రాప్య తదీయ కృచ్ఛ్రే-మహీం గతౌ  తా విషుధీతదానీం  విన వ్రతు శ్చేతన ఏవ యోగం ‘’..పులిమీద పుట్ర లాగా అర్జునుడిపై శివుడు  ఆకాశం లో విశ్వకర్మ సూర్యుడిని చిత్రికపట్టినట్లు శాస్త్రాలతో గాయపరచాడు –‘’స్థితం విశుద్ధే నభసీవ సత్వే –దామ్నా తపోవీర్య మయేన యుక్తం –శస్త్రాభి ఘాతై స్తమజస్రమీశ –స్త్వస్టావివస్వంత మివోల్లి లేఖ ‘’.కోపావేశామున్నా అర్జునుడు వేదన పొందలేదు .శంకరబాణాలను పడగొట్టలేదు .క్రోధమే అతడి ఉక్కు కవచంగా మారింది –‘’సంరంభ వేగో జ్ఘిత వేదనేషు –గాత్రేషు బాధిర్య ముపాగతేషు-మునేర్బభూ వాగణితేషు రాశే-ర్లౌహస్తిరస్కార ఇవాత్మ మన్యుః’’.

   తర్వాత గో పుచ్ఛాకారం లో పొడవైన గుండ్రటి భుజాలున్న అర్జునుడు ,శరీరం రక్తం తో తడిసిపోతున్నా ,పాదాలు నేలకేసి కొడుతూ ,గంభీరంగా అరుస్తూ ,శంకరుని వైపుకు పరిగెత్తాడు .ఇంద్రుని వజ్రాయుధం లాంటి ,చంద్ర రేఖలాగా తెల్లనైన ధనుస్సుతో,ఏనుగు దంతం తో స్తంభాన్ని కూల్చినట్లు, శంకరుడిని  కొట్టి  పడెయ్యాలనుకొన్నాడు .-‘’మహా వేగంగా పడుతున్న ఆ వింటి బద్దను శివుడు తనలోనే వేగంగా దూసుకొస్తున్న గంగానదిని జహ్ను మహర్షి తనలో ఇముడ్చుకున్నట్లు కలుపుకొన్నాడు  -‘’రయేణ సా స౦  నిదధతే పతంతీ-భావోద్భవేనాత్మని చాప యష్టిః-సముద్ధతా సింధు రనేక మార్గా-పరే స్థితే నౌజాసి జహ్నునేన ‘’.చేతిలోచాపం లేని కిరీటి దానం చేయని వాడి సత్కారం లా ,యుద్ధం చేయలేక పోయాడు .శంకర కిరాతకుడు బాగా తగిలే బాణాలతో క్రీడిని దూరంగా నెట్టేశాడు –‘’ విచిక్షిపే శూల భ్రుతాసలీలం –స పత్రిభిర్దూర మాదూర పాతైః’’.అస్త్రలాభం మొదలైన శుభాలు కనపడే తపస్వి అర్జునుడు  తపసు ఉపవాసం మొదలైన నియమాలు పాటించి నట్లుగా యుద్ధం అనే ఆశ్రమ ధర్మాలను ధైర్యం తో పాటిస్తూ ,శివ బాణ బాధ సహించాడు –‘’ఉపోఢ కల్యాణ ఫలోభిరక్షన్ –వీర వ్రతం పుణ్య రణాశ్రమస్థః-జపోపవాసై రివసంయతాత్మా –తేపే మునిస్తైరిషుభిః శివస్య ‘’.ఆపదలో రక్షణ స్థలాన్ని వెదుక్కున్నట్లు ,ప్రతాపానికి ఆశ్రయమైన ఖడ్గాన్ని యుద్ధానికి రూపు దాల్చిన ఆహ౦కార౦ గా వాడాడు .ఖడ్గం తో శివ బాణాలు ముక్కలు చేస్తూ సూర్య కిరణాలతో ఉద్దీప్త తరంగాలు కల సముద్రం లాగా భాసి౦చాడు – ‘’హస్తేన నిస్త్రింశ భ్రుతా సదీప్తః –సార్కా౦శునా  వారిధి రూర్మి ణేవ’’.సూర్యుడు తన మార్గం లో ఉంటూనే నీటిలో ప్రతి బింబ రూపంగా కనిపించినట్లు ,అర్జునుడు ఖడ్గయుద్ధ గతి భేదాలతో ఆకాశం లో, నేలపైనా ప్రకాశించాడు –‘’తథా నభస్యాశు రణస్థలీషు –స్పష్ట ద్విమూర్తి ర్దదృశే స భూతైః’’.శివబాణ౦  తో తెగిపడ్డ అర్జున ఖడ్గం మేఘం నుంచి జారిన మెరుపు యొక్క అగ్నిలా ప్రకాశించింది –‘’జ్వలన్నసి స్తస్య పపాత పాణే-ర్ఘనస్య వప్రాదివ వైద్యుతోగ్నిః’’.కవచం ధనువు బాణాలు ఖడ్గం కూడా విరిగి పోవటం తో అవమానం పొందిన అర్జునుడు ఉద్యానవనం లో చెట్లు నరికేస్తే శూన్యం అయినట్లున్నాడు –‘’రిక్తః ప్రకాశ శ్చబభూవ భూమే –రుత్సాది తోద్యాన ఇవ ప్రదేశః ‘’

     వెనకడుగువేయని ఫల్గుణుడు తన భుజమే సహాయంగా చేసుకొని వడగళ్ళ వాన కురిసినట్లు రాళ్ళ వర్షం కురిపించాడు స్థాణుడిపై.శివుడు తన బాణాలతో వాటికి బదులు చెప్పాడు .క్రీడి చెట్లు విరిచి భూనభో౦తరాలు నిండేట్లు విసిరాడు .శివుడు వాటిని ముక్కలు ముక్కలు చేసేశాడు .భయపడని భీభత్సుడు బంగారు శిల వంటి శివుని వక్షస్థలాన్నితన భుజాలతో గట్టిగా దెబ్బ కొట్టాడు –‘’గాండీవి కనక శిలానిభం భుజాభ్యా –మాజఘ్నే విషమ విలోచనస్య వక్షః ‘’.కీర్తికి ,లక్ష్మి కి సాధనమైనదీ శత్రు సేనకు పొందరాని పరాక్ర౦  కోర్తున్న అర్జునుడిని,తన తొడమీద కూర్చున్న శిశువు  మంచి వస్తువు కావాలని మారాం చేస్తే ఎలా సహిస్తాడో  శివుడు అలా సహించాడు –‘’  అభిలషత ఉపాయం విక్రమం కీర్తి లక్ష్యో-రసుగమమరి సైన్యైర౦క మభ్యాగతస్య –జనక ఇవ శిశుత్వేసుప్రియస్త్యిక సూనో –రవినయనమపి సేహే పాండవస్య స్మరారిః’’ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.38 17వ సర్గ -2

కిరాతార్జునీయం-.38

17వ సర్గ -2

అత్యంత లాఘవంగా సునాయాసంగా బాణాలు వదులుతున్న అర్జునుడు ప్రమథులకు ,కంటి దోషమున్నవారికి ఒకే చంద్రుడు అనేక బింబాలుగా కనిపించినట్లు ,అనేకంగా కనిపించాడు –‘’శశీవ దోషావృతలోచనానం –విభిద్యమానః ప్రుథ గా బభాసే ‘’.సేన దయనీయం చూసి శివుడుకూడా క్షోభ చెందాడు .పెద్ద చెరువే అయినా తరంగాలవలన సూర్యబింబం వణుకుతున్నట్లు – శివుడి పరిస్థితీ అలానే అయింది –‘’తరంగ కంపేన మహా హ్రదానాం –ఛాయా మయస్యేవ దినస్య కర్తుః’’.అర్జునుడిపై   నిర్వికార పరమాత్మ కనుక శివుడికి  ఆగ్రహం రాలేదు .కానీ ఆకారం లో వికారం చూపాడు మహాత్ముల చేష్టలు ఎవరూ తెలుసుకోలేనివి –‘’ప్రసే దివామ్సం న తమాప కోపః –కుతః పరస్మిన్పురుషే వికారః అకార వైషమ్యమిదం చ భేజే –దుర్లక్ష్య చిహ్నా మహతాం హి వృత్తిః.’’తర్వాత శివుడు రెండు భుజాలతో అల్లెత్రాడు లాగగా ,అది కదులుతూ రెండు గా కనిపించింది .అది తక్షకుని నాలుకేమో అనుకొన్నారు చూసే వాళ్ళు .’’’విస్ఫార్య మాణస్య తతో భుజాభ్యాం –భూతాని భర్త్రా ధను రంతకస్య –భిన్నా కృతిం జ్యా౦ దదృశుః స్ఫురంతీం-  కృద్ధస్యజిహ్వామివ తక్షకస్య ‘’.అర్జునుడు సవ్యాపసవ్యం గా ధనువును ధ్వని౦ప జేస్తూ కిరాతపతిని చూసి ‘’ఎప్పుడూ కుడి ఎడమల చెవులను ఒకటి తర్వాత ఒకటి కదిలిస్తూ ధ్వని చేసే ఏనుగుపై మావటి వాడు ఉన్మత్తంగా అనుమానిఛినట్లు చూశాడు .శివుని బాణాలు సముద్రం లో తిమింగలాదులు నదులద్వారా వచ్చే చిన్న జలచరాలను మింగినట్లుగా.అర్జున బాణాలను వ్యర్ధం చేశాయి-‘’ఊర్జస్విభిః సింధు ముఖాగతాని యాదాంసి యాదో భిరివా౦బు రాశేః ‘’.. శంకర బాణాలు కనిపించకుండానే, మధ్యలోనే తు౦చేయటం ,అడ్డుకోవటం ,ధ్వంసం చేయటం అనే మూడు విధాల అర్జునుడు-జయాభిలాష ఉన్నవాడు  శత్రువు ఏ ఉపాయాలు ఉపయోగిస్తాడో అవే ఉపాయాల ప్రయోగంతో  నిర్వీర్యం చేశాడు  ,శివుడు వేసే వాటికి రెట్టింపు బాణాలు ప్రయోగించి అర్జునుడు శివ సేనను భయపెట్టి సాఫల్యం సాధించాడు .ఐతే ద్రోణాది గురువులద్వారా అస్త్ర విద్య నేర్చి ఆ లాఘవం ప్రయోగించిన అర్జునుడికి శివుని బాణాలతో భంగపాటు కలగటం ధైర్యాన్ని కుంగదీసి రుజుమార్గం లో ధర్మ శాస్త్రాదులు నేర్చిన నిర్దేశించిన ఆచార వ్యవహారాలను అనుష్టించే వారికీ సైతం ఆపదల లో ధైర్యం తగ్గినట్లు తగ్గింది –‘’సతామివాప ర్వణిమార్గ ణానాం-భంగః స జిష్ణొర్ధ్రుతిమున్ము మాద’’.అర్జున బాణాలను ఖండించిన శివ బాణాలు నేలకొరిగి అర్జునునికి వెంటనే ప్రతిఫలం దక్కింది .

 హస్తలాఘవం తో అర్జునుడు ఆశ్చర్య౦గా శివ బాణాలను ఖండించేబాణాలను శివసేన గుండెల్లో సూటిగా నాటాడు .అర్జున పరాక్రమం చూసి శివుడు  ,ఎండాకాలపు మేఘం నీటిని కురిపించినట్లు,అతి తీవ్ర  బాణ వృష్టి కురిపించాడు.అంటే ఎండాకాల వర్షం చాలా ఎక్కువ అని భావం ..అర్జును డికి మేలు చేకూర్చే శివ బాణాలు మర్మ స్థానాలు తాకకుండా ,మిత్రులు చెప్పే పరిహాసపు మాటల్లాగా అర్జునుడికి ఆనందాన్ని కలిగించాయి –‘’’’అనామృశంతః క్వచి దేవ మర్మ-ప్రియైషిణా ను ప్రహితాః శివేన –సు హృత్పయుక్తా ఇవ నర్మ వాదాః-షరా మునేః ప్రీతికరా బభూవః ‘’.ఒకసారి తన బాణాలతో సమానంగా, మరోసారి చాలా హెచ్చుగా ప్రయోగించే అర్జున బాణ శక్తి చూసి వివశం  నిందా పొందే సేనతో కలిసి శివుడుమళ్ళీ తన తడాఖా చూపించాలను కొన్నాడు .-‘’విషాద వక్తవ్య బలహ ప్రమాథీ-స్వమాల లంబే బలమిందు మౌలిః’’.

  తర్వాత శివుడు శక్తి పరాక్రమాలతోసూర్యుడు నీటిని ఇంకింప జేసినట్లు అర్జున తీవ్ర బాణాలను నాశనం చేసి ప్రతాపం చూపాడు –‘’మహేషు జాలా న్యఖిలాని జిష్ణో-రర్కః పయం సీవ సమాచచామ’’.అర్జునుడు మరో బాణం తీయటానికి బాణాలు లేని అమ్ముల పొదిలో చేయి పెట్టాడు .పర్వతంలో మరో ఏనుగు చెలమలోని నీరంతా తాగి ఖాళీ చేయగా, ఆ ఏనుగు దాహంతో అలమటించి తొండం సాచినట్లుఅయింది .-‘’అన్యద్విపా పీత జలేసతర్షం-మత౦గ జస్యేవ నాగా శ్మరంధ్రే’’ ‘’.ధనం లేని స్నేహితుడిని తాను  పూర్వం చేసిన ఉపకారాల జ్ఞాపకం తో కృతజ్ఞత చెప్పటానికా అన్నట్లు అర్జున చెయ్యి అమ్ములపొది చేరింది –.-‘’తాత్కాల మోఘ ప్రణయః ప్రపేదే –నిర్వాచ్యతా కామ ఇవాభి ముఖ్యం ‘’.కర్తవ్యం లో ఉత్సాహం, జయేచ్ఛ ఉన్న నాయకుడి బుద్ధి ఏవిధంగా ,నీతి-ఉపాయం అనే రెండిటిని సహాయంగా చేసుకొంటాడో అలాగే అర్జునుడి చెయ్యి రెండు అమ్ముల పొదుల లోకి  పోయింది .ఖాళీ గా ఉన్న అమ్ములలపొదులను ప్రళయం లో నీరు లేని పూర్వా పర సముద్రాలను లోకం భరించినట్లు   భరించాడు –‘’యుగాంత సంశుష్క జలౌ విజిహ్మః –పూర్వా పరౌ లోక ఇవా౦బు  రాశీ ‘’.అమ్ములపొది శూన్యం అయినందుకు బాధ పడినంతగా బాణాలు వ్యర్దమైనందుకు  అర్జునుడు బాధ పడలేదు .ఆపదలలో ఉన్న సత్పురుషులు ,తమకు ఉపకారం చేసిన వారి దుఖాన్ని గురించే ఎక్కువ తపిస్తారు  .–‘’ తేనా నిమిత్తేన తథా వ పార్థ-స్తయోర్యథా రిక్తతయా నుతెపే –స్వామాపదంప్రోజ్ఘ్య విపత్తి మగ్నం –శోచంతి సంతో హ్యుపకారి పక్షం ‘’.

 శ్రీ హనుమత్ వ్రత౦ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.37 17వ సర్గ -1

కిరాతార్జునీయం-.37

17వ సర్గ -1

ప్రయోగించిన అస్త్రాలన్నీ వ్యర్ధం కాగా ,తనప్రియ గాండీవం ద్వారా ధైర్యాన్ని పెంచుకొన్న అర్జునుడిపౌరుషం  బాగా అతిశయించింది –‘’ధృతం గురు శ్రీర్గురుణాభి పుష్యన్ –స్వపౌరు షేణేవ శరాసనేన ‘’.గొప్ప పరాక్రమ శీలితో తాను  యుద్ధం చేస్తున్నందుకు సంతోషించాడు కాని శత్రువు వృద్ధి బాధించింది .పర్వతం పై మండే అగ్నిలా కనిపించాడు .పొగ బాగా వ్యాపించి ఉండటం తో కిరాత శివుని రూపం స్పస్టాస్పస్టంగా కనిపించింది .-‘’స్పస్టోప్యవి స్పష్టవపుః ప్రకాశః –సర్పన్మహాదూమ ఇవాద్రి వహ్నిః’’.శత్రువులచే తిరస్కరి౦పబడని తన ధైర్యాన్నే అర్జునుడు కరావలంబనమే  చేసుకొన్నాడు .’’అసాదయన్న స్ఖలిత స్వభావం –భీమే భు జాలంబ మివారి దుర్గే ‘’.కులశీలాదులచేత  తనయందు అనురాగ వతి అభిమాన వతి అయిన కారణంగా ప్రాణాలకంటే ఎక్కువైన కీర్తి తన యెదుటనే శత్రువు అపహరించాలి అనుకొన్నప్పుడు అర్జునుడు అలాంటి గుణాలే కలిగిన కాంత ను గురించి బాధ వంటి బాధ అనుభవించాడు –‘’వంశోచిత త్వాదభిమాన వత్యా-సంప్రాప్తయా సంప్రియతా మనుభ్యః –సమక్షమాది త్సితయా పరేణ-వధ్వేన కీర్త్యా పరితప్య మానః ‘’.హిమాలయాన్ని బద్దలు కొట్టే వేగంతో వచ్చే గంగానదిని శివుడు పూర్వం నిగ్రహించినట్లు ,ఇప్పుడు అర్జున  పరాక్రమాన్ని నిష్ఫలం చేశాడు –‘’పతిం నగానామివ బద్ధ మూల –మున్మూలయిష్య౦ స్తరసా విపక్షం –లఘు ప్రయత్నం నిగృహీత వీర్య –స్త్రిమార్గగా వేగ ఇవేశ్వ రేణ’’.విజయం కోసం మళ్ళీ తన శరాలనే ఆశ్రయించాడు విజయుడు .శరప్రయోగం లో అభ్యాసమూ ,దానికి సంబంధిన అనేక  గుణాలు ఉన్నందున హృదయాన్ని ఆనందింప జేసే శబ్దాలలాగా ఆనందించాడు –‘’జయం యదార్దేషు శరేషు పార్దః –శబ్దేషు భావార్ధ మివా శశంసే’’.కోపంగా ఉన్న విషసర్పం కళ్ళనుంచి విషాన్ని చిమ్మి నట్లు అర్జునుడు యుద్ధం లోనే శత్రువుకు సమాధానం చెప్పాలని ,మొదటి సారి ఓటమి వలన కలిగిన బాధతో క్రోధోద్రిక్తుడై ,కన్నీరు కార్చాడు అధిక సంతోషం లోనూ కోపం లోను ,కన్నీరు కారటం సహజమే .-‘’భూయః సమాధాన వివృద్ధ తేజా-నైనం పురా యుద్ధమితి వ్యథావాన్-స నిర్వ వామాస్ర మమర్షనున్నం –విషం మహా నాగ ఇవేక్షణాభ్యాం’’.యుద్దాయాసం లో క్రీడి జడలు విడిపోయాయి .కళ్ళు రాగిలాగా ఎర్రబడ్డాయి క్రోధం వలనముఖం పై చెమట ,వేడిని చల్లారుస్తున్నట్లు కమ్మి౦ది.-‘’నిర్వాప యిష్యన్నివ రోష తప్తం –ప్రస్నాపయామాస ముఖం నిదాఘః .’’మేఘ మండలం లో చిక్కుకున్న మూడు సూర్యుని ఊర్ధ్వ కాంతి రేఖలు వర్షానికి సూచన అయినట్లు ,అర్జునుడు కనుబొమలు చిట్లించిన ముఖం లో మూడు రేఖలు పైకి వ్యాపించాయి –‘’క్రోధాంధ కారాంతరితో రణాయ – భ్రూ భేద రేఖాః స బభార తిస్రః –ఘనోప రుద్ధః ప్రభావాయ వృష్టే-రూర్ధ్వా౦శు రాజీరివ తిగ్మ రశ్మిః.’’దిగ్గజం తొండం తో పర్వత శిఖరాన్ని చరచి ధ్వనింప జేసినట్లు ,అర్జునుడు మేఘం లాగా ధ్వని చేసే ధనువు ను చేతితో లాగి ,శంకర కి౦కరులపై బాణాలు ప్రయోగించాడు .

  అర్జున బాణాలు  శాస్త్ర నిష్ఠ గల బుద్ధి విషయం లో హితోప దేశం లాగా,వైరాగ్యం ఉన్నవాడిలో గుణాలు ,వాజ్మానస అగోచరమైన బ్రహ్మ విషయం లో వేద వాక్కు వ్యర్ధమైనట్లు ,  శివుని శరీరం లో కలిసిపోయాయి.అంటే శివుడిని ఏమీ చేయ లేకపోయాయని భావం –‘’సద్వాదివాతేభిని విష్ట బుద్ధౌ –గుణాభ్యసూయేవ విపక్ష పాతే-అగోచరే వాగివ చోప రేమే –శక్తిఃశరాణాం శితికంఠకాయే ‘’.అర్జునబాణాలు ఆయన్నమీ బాధించలేదు .హేమంతం లో సూర్య కిరణాలు హిమవంత ప్రదేశాన్ని తాకనట్లే ఆబాణాలు శివుడిని బాధించలేదు –‘’అభ్యుత్థిత స్యాద్రి పతేర్నితంబ –మర్కస్య పాదా ఇవ హైమనస్య ‘’.అర్జున పరాక్రమాన్ని శివుడు దిగ్గజం పోట్లను హిమవత్పర్వతం సహి౦ఛినట్లు ఆనందిస్తూనే, సహించాడు.’’విషాణ భేదం హిమవాన సహ్యం – వప్రానతస్యేవ సురద్విపస్య .బ్రహ్మాడులకే కారణ భూతుడైన శివుడు శివుడు తన పరాభవాన్ని చాలాకాలం సహించాడు.-‘’చిరంవిషేహే భిభ వస్తదానీం –సకారణానా మపి కారణేన’’.శత్రువుతో ఓడినా ,ఏ వ్యక్తి ఉత్సాహం తో తనకంటే పరాక్రమ వంతునితో పోరాడుతాడో  వాని కీర్తి సూర్యకాంతి లా ప్రకాశిస్తుంది –‘’తేజా౦సి భానోరివ నిష్పతంతి-యశా౦సి వీర్యజ్వలితాని తస్య ‘’.ఒక వ్యక్తి మహత్కార్యం ప్రత్యక్షంగా చూసి ,అతడి శత్రువర్గం భయ పడుతుంది .భయపడితే తేజస్సు నశిస్తుంది తేజస్సు లేని వాడిని ఉత్సాహం వదిలేస్తుంది .అది ఆరిన దీపం లాగా ప్రకాశ హీనమౌతుంది –‘’దృష్టావదానాత్ వ్యథతే రిలోకః-ప్రధ్వంస మేతి వ్యథితాచ్చ తేజః –తేజో విహీనం విజహాతి దర్పః –శాంతార్చిషం దీపమివ ప్రకాశః ‘’.ఉత్సాహం మదం ఆత్మాభిమానం దెబ్బతిన్న వాడు తనను జయించిన వాడిని ఓడించటానికే ప్రయత్నిస్తాడు .తనకిష్ట మైన ఏనుగు ,మదవాసనలతో ఆకర్షింప బడిన ఏనుగు తనకు ఎదురుగా వచ్చే ఏనుగుల సమూహాన్ని ఎదుర్కొని ఓడించినట్లు ,శత్రు పరాజయం కోసమే యత్నిస్తాడు .-‘’తతః ప్రయాత్యస్త మదావలేపః –స జయ్య తాయాః పదవీం జిగిషోః-గంధేన జేతుః ప్రముఖాగతస్-ప్రతి ద్విపస్యేవ మతంగా జౌఘః ‘’శివుడు తలలోని చంద్ర రేఖలాగా గొప్ప కీర్తి అర్జునుడికి ఇవ్వాలనుకొని జయాపజయాలు పర్యాయంగా కలిగే యుద్ధం ప్రారంభించాడు .ప్రాణులు జన్మతః వచ్చే స్వభావాలను వదులుకోలేక వాటికి వశులౌతారో అదే విధంగా ప్రమథ గణం అర్జున విచిత్ర బాణాలకు వశమైంది –‘’సహాత్మ లాభేన సముత్ప తద్భి-ర్జాతిస్వభా వైరివ  జీవ లోకః .’’.భయంతో వణుకుతున్న శివ సేన అర్జున బాణవర్ష౦ తో  ఏర్పడిన చీకటి బాణ ధ్వనినీ ,విన్నారు రాత్రికురిసే వర్షంలోని మేఘగర్జనలా ఉంది .శబ్దాన్ని మాత్రమే విన్నారు .అంటే చూడటం కానీ ఏమీ చేయటం చేయ  లేకపోయారు అని భావం .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

54ఏళ్ళ క్రిందటి ఉయ్యూరు హైస్కూల్ శిష్యురాలుశ్రీమతి కరుణానిధి ఇవాళ మాఇంట్లో మాకు చేసిన సత్కారం

54ఏళ్ళ క్రిందటి ఉయ్యూరు హైస్కూల్ శిష్యురాలుశ్రీమతి కరుణానిధి ఇవాళ మాఇంట్లో మాకు చేసిన సత్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.36 16 వ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.36

16 వ సర్గ -3(చివరి భాగం )

అర్జున సర్పబాణ సముదాయం వలన సిద్ధులు ,పక్షులు సంచరించే మార్గం ఆగిపోయి ,అగ్ని అన్ని వైపులకు వ్యాపించటం చేత దిక్కులు పొగతో నిండిపోయాయి .శత్రువులు ముట్టడించిన నగరం లాగా ఆకాశం కనిపించింది .-’’’వృతం నభో భోగి కులైరవస్థా౦-పరోపరుద్ధస్య పురస్య భేజే ‘’.శివుడు వెంటనే గారుడాస్త్రాన్నిసర్పాల బాధ ను ,న్యాయ రీతిగా శత్రువ్యూహం విఫలం చేసినట్లు ప్రయోగించాడు ‘’నేతా నయనేవ పరోపజాతం –నివారయామాస పతిః పశూనాం ‘’.అనిమేషులైన స్వర్గలోక వాసుల నేత్రాలకు కల్గిన అవరోధాన్ని గారుడ పక్షుల సమూహం మెరుపు వేగం తో ప్రకాశం కలిగించి౦ది.-‘’ప్రతిఘ్న తీభిఃక్రుతమీలితాని –ద్యులోక భాజామపి లోచనాని –గరుత్మతాం సంహతి భిర్వి హాయః –క్షణ ప్రకాశాభి రివావతేన ‘’  .గరుడ పక్షుల రెక్కల విచిత్ర కదలిక తో గాలి ,అడవి చెట్ల ఆకులు రాలుస్తూ ,వాటిని ఆకాశం లో అల౦క రించటానికా అన్నట్లు మోసుకెళ్ళింది.మనః శిలల ముక్కలకాంతి తో వెనకాల విశాల వక్షస్థలం తో అడ్డు కాబడిన ఆకాశ మండలం గరుడ పక్షుల ముందు పరిగెత్తుతున్నట్లుగా ఉంది .వేడిగా వీస్తున్న గాలులవలన కదులుతున్న శిఖరాల హిమవత్పర్వతం ,మదిర లాగా ఎర్రగా ప్రకాశిస్తున్న గరుడ పక్షి రెక్కల కాంతిని, గుహాముఖాలతో తాగి ,మత్తుగా కదలింది –‘’దరీ ముఖారాసవ రాగ తామ్రం-వికాసి రుక్మచ్ఛదధామ పీత్వా –జ్వనలా ఘూర్జిత సాను జాలో –హిమాచలః క్షీణ ఇవాచ కంపే ‘’ .రాత్రి,పగలు కలిసిన సంధ్యాకాలం లాగా ప్రకాశిస్తూ  భూమ్యాకాశాలను పసుపు రంగుగా   మారుస్తూ,,సూర్యుని కప్పేసే ఆ గరుడ పక్షులు ,నాలుగు వైపులా అడవులలోని నీడను లేకుండా చేశాయి . .-‘’ప్రవృత్త నక్తం దివా సంధి దీప్తై-ర్నభస్థలం గాం చ పిశంగ యద్భిః-అంతర్హితార్కైఃపరితః ,పతద్భి-చ్ఛాయాఃసమాచి ,క్షిపిరే వనానా౦’’.సర్ప సమూహం గరుడ సమూహం తో,మహా యజ్ఞం లో కర్మలోపం జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం తో  శాంతించినట్లు శాంతించింది –‘’మహాధ్వరే విధ్యపచార దోషః –కర్మాంత రే ణేవ మహోదయేన’’.

  సర్పాస్త్రం సమాప్తికాగా అర్జునుడు ఇంధనం లేకుండా ప్రజ్వలించే ఆగ్నేయాస్త్రం  సంధించాడు –‘’అనిన్ధనస్య ప్రసభం సమన్యుః-సమాదేస్త్రం జ్వలనస్య జిష్ణుః’’.అన్నివైపులకు వ్యాపిస్తూ ,మంటలతో మేఘాలను దాటి,వేట కోసం సింహం దూకినట్లు ప్రాణ సంహార కాంక్షతో అగ్నిపైకి ఎగసింది –‘’ఆయస్త సింహాకృతి  రుత్పపాత-  ప్రాణ్యంత మిచ్ఛన్నివ జాత వేదాః’’.తన తేజస్సుతో సూర్యకాంతిని ఛేదిస్తూ ,నిప్పురవ్వలు రాలుస్తూ బండరాళ్ళు బద్దలయ్యే ధ్వనితో అగ్ని మండింది .అగ్నికి గాలి తోడై బంగారు ప్రాకారాల్లా , ఎత్తైన శిఖరాల పర్వతాల్లాగా ,సువర్నమయమైన పురంవెల, మోదుగు చెట్లు వనాల్లా అన్ని చోట్లా వ్యాపించింది .కాటుక లాంటి నల్ల మేఘాలు కదిలే చిగురాకులు లాగా యెర్రని అగ్ని మంటలలో మాడి,ముత్యాల్లా శుభ్రంగా కనిపిస్తున్నాయి .ప్రళయాగ్ని లా లోకాన్ని మింగటానికి చాచిన నాలుకలలాగా,కదిలే అగ్ని సమూహాన్ని చూసి ,మేఘాలను పిలిచినట్లు శివుడు వారుణాస్త్రం వేశాడు –పినాకినా హుత మహా౦బు వాహ మస్త్రం పునః పాశ భ్రుతః ప్రణిన్యే’’.వారుణాస్త్రం పెద్దపర్వతాకార౦ తో ,మెరుపులతో ఉన్న మేఘాలు నేలకు జారే ఆకాశ గంగలాగా ఎడతెరిపి లేని ధారలు కురిపించాయి –‘’అధోముఖాకాశసరిన్నిపాతినీ-రసః ప్రసక్తం ముముచుః పయోముచః ‘’

  జల వృష్టి తో అగ్ని జ్వాలలు చల్లబడి ,ప్రచండ తేజస్సు నశి౦చగా అగ్ని శరీరం పై ,జలధారలు వేడి చేసిన ఇనుము పై పడి ధ్వని చేసినట్లు ధ్వనించాయి –‘’కృతాస్పదా స్తప్త ఇవా యసి ధ్వనిం –పయోనిపాతాః ప్రథమే వితేనిరే’’.త్వరలోనే ఆ జలధారలు పాకం పొంది నురగలై ,తడికట్టె మండి,పొగ వ్యాపించినట్లు వ్యాపించాయి –‘’వ్రజద్భిరార్ద్రే౦ధన వత్పరిక్షయం జలై ర్వితేనేదివి ధూమ స౦తతిః’’.ఎరుపు నీలం తెలుపు రంగులు కలిగిన తమ జెండాలతో ,ఇంద్ర ధనుస్సు కాంతిని మించిన అగ్ని కాంతులు కలిసి విచిత్రమైన అస్థిరమైన పట్టు బట్ట అందాన్ని పొందాయి –‘’  స్వకేతుభిః పాండు రనీల పాటలైః-సమాగతాః శక్ర ధనుః ప్రభా భిదః-అసః స్థితా మాదధిరే విభావసో –ర్విచిత్ర చీనా౦శుక చారుతాం త్విషః’’.మండుతున్న అగ్ని వర్ష ధారలకు మరంత గంభీర ధ్వని చేస్తోంది .మెరుపులతో కలిసి కాంతి పెరిగింది .అంటే శాంతిస్తున్న అగ్ని అంతకు ముందున్న దానికంటే ఎక్కువై కనిపించింది .

  సముద్ర అలల్లాంటి జలరాశులతో చీలి ,అగ్ని కణాలు సాయంసంధ్యాకాంతిపొందిన మేఘ శకలలలాగా కనిపించాయి –‘’ఉపాత్త సంధ్యారుచిభిః సరూపతాం –పయోద విచ్ఛేదలవైః కృశానవః ‘’.గొప్ప పరాక్రమ వంతుడైనా ,సమూలంగా నష్టపోతే మళ్ళీ కోలుకోవటం జరిగే పని కాదు. అగ్ని కూడా ఆ నీటితో అలాగే కుప్పకూలిందని భావం –ఉపైత్యనంత ద్యుతిరప్య సంశయం –విభిన్న మూలో నుదయాయ సంక్షయం –తథా హి తోయౌఘ విభిన్న సంహతిః-న హవ్య వాహః ప్రయయౌ పరాభవం’’.ఆకాశం లో నల్లని కాంతి సమూహంకలమేఘాలు విడిపోగా అగ్ని దహనం చెందిన ఆకాశం  వికసించిన నల్లకలువ కాంతి తో శోభించింది –‘’వికసడమల ధామ్నాంప్రాపు నీలోత్పలానాం-శ్రియ మధిక విశుద్దాం వహ్ని దాహాదివ ద్యౌః.

    అనేక ఉపాయాలతో అర్జునుడు కిరాత శివుని ఓడించాలని వేసిన అన్ని రకాల అస్త్రాలను శివుడు నీతి నిష్టుడైన వాడి పరాక్రమానికి ప్రతికూల దైవం నష్టం కలిగించినట్లు నస్ట పరచాడు.-‘’ఇతి వివిధ ముదాసే సవ్య సాచీ యదస్త్రం –బహు సమయ రనయజ్ఞః  సాదయిష్యన్నరాతిం –విధిరివ విపరీతః పౌరుషం న్యాయ వృత్తేః-సపది తదుపనిన్యేరిక్తతాం నీల కంఠః’’.శివుడి చేత తన అస్త్రాలన్నీ నిరుపయోగం కాగా ,శక్తి తగ్గినా మళ్ళీ బలం పుంజుకొని అర్జునుడు ,అధిక వర్షం కురవటంకోసం,నదీ తటాకాలలోని నీటిని సూర్యుడు గ్రహించినప్పుడు  జనం నీటికోసం బావులు చలమలు త్రవ్వి సహాయం తీసుకొన్నట్లు అర్జునుడు తన భుజ బలాన్నే సహాయంగా  భావించాడు –‘’వీత ప్రభావ తనురప్య తను ప్రభావః –ప్రత్యాచ కాంక్ష జయినీం  భుజ వీర్య లక్ష్మీం –అస్త్రేషు భూతపతి నాప హృతేషు జిష్ణుః-వర్షిష్యతాదిన కృతేవ  జలేషు లోకః ‘’

  సశేషం

  ముక్కోటి ఏకాదశి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-20-ఉయ్యూరు .  ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.35 16 వ సర్గ -2

కిరాతార్జునీయం-.35

16 వ సర్గ -2

అర్జునుడు ఆలోచించి, ఆలోచించి చివరకు తెగించి కిరాత శివునిపై గణాధిపతి పౌరుషం పోగొట్టే ‘’ప్రస్వాపనాస్త్రం ‘’అంటే గాఢ నిద్ర నిచ్చే అస్త్రం ప్రయోగించగా అర్ధ రాత్రి చీకటి దట్టంగా అంతటా వ్యాపించింది .-‘’స సంప్రధార్యైవ మహార్య సారః –సారం వినేష్యన్ సగణస్యశత్రోః-‘’.ప్రస్వాపనాస్త్రం ద్రుతమాజహార –ధ్వాంతం ఘనానద్ధ ఇవార్ధ రాత్రః’’ .దావానలం పొగలాగా ,ధూసర వర్ణం సూర్యకాంతిని కప్పేసినట్లు శివ గణాలను ఆవరించింది .అది దట్టమైన చీకటి అడవుల్ని ఆవరించి నట్లుగా ఉంది .దీనికి ప్రమథ గణాలకు నిద్ర ఆవహించింది .సభలో ప్రగల్భాలు పలికేవాడు ,పండితుడు ప్రవేశించగానే కిక్కురు మనకుండా ఉన్నట్లు అయింది –‘’సభేవ భీమా విదధే గణానాం-నిద్రా నిరాసం ప్రతిభా గుణస్య’’.బలాఢ్యులైన కొందరు ధనువులసాయం తో నిలబడిపోయారు .ఆపదలో మంచి మిత్రుల సాయం పొందినట్లుంది వారిపని –‘’కేచిత్సమాశ్రిత్య గుణాన్వితాని –సుహృత్కులా నీవ ధనూ౦షి తస్థుః’’.అర్జున ప్రస్వాపనాస్త్రం ముందు దైవ ప్రతికూలంగా శత్రు అస్త్రాలు నేలపడి పోయాయి .దైవానుకూల్యంలేకపోతే వ్యవసాయ ఫలం నస్టమైనట్లుగా ఉంది –‘’అతర్కితం పాణి తలాన్నిపేతుః-క్రియా ఫలానీవ తదాయుధాని ‘’.ఈ విషమ సమయం లోనూ కొందరు ధైర్యం తో చెట్ల మొదళ్లను ఆనుకొని మదం తో కళ్ళు మూతపడుతున్న ఏనుగులు తొండాలను జార విడిచి నేలపై కూర్చున్నట్లు కూర్చున్నారు –‘’మాదేన మీలన్నయనాః సలీలం –నాగా ఇవ స్రస్తకరా నిషేదుః’’.

  కిరాత శంకరుని నుదుటి నుంచి పిశంగవర్ణ-ఎరుపు ,తెలుపు ,పసుపు రంగు మిశ్రమ రంగు . ప్రకాశం చంద్రాస్తమయం తర్వాతసుమేరు పర్వత శిఖరం నుంచి ఋషులు ప్రణామ౦ చేసే సూర్య బి౦బంలా ఉదయించింది – ‘’తిరోహితేందో శంభు మూర్ధ్నః-ప్రణమ్యమానం తపసాం నివాసైః-సుమేరు శృంగాదివ బి౦బమార్కం-పిశంగ మచ్చైరుదియాయ తేజః ‘’ .శివుని నుదుటి ఆ కాంతి ,గణాల నిద్ర పోగొట్టి చూపునిచ్చి౦ది.తత్వజ్ఞానం అజ్ఞానాన్ని తొలగించి నట్లుగా శివ తేజస్సు గణాలను తెప్పరిల్లేట్లు చేసిందని భావం .-‘’యయౌ వికాసం ద్యుతి రిందు మౌలే –రాలోక మభ్యాది శతీ గణేభ్యః ‘’ఆ ప్రకాశం నాలుగు వైపులా విస్తరించి మేఘమండలాన్ని ఎర్రగా మారుస్తూ ఉదయ సంధ్యలాగా వ్యాపించి ప్రమథ గణముఖపద్మాలను వికసింప జేసింది –‘’నినాయ తేషాం ద్రుతముల్లసంతీ-వినిద్రతాం లోచన పంకజాని ‘’.ప్రస్వాపనాస్త్ర ప్రభావం తగ్గాక తెలివిలోకి వచ్చిన శివ సేన ,మేఘాలుపోయి ,దిక్కులు నక్షత్రాలతో ప్రకాశించినట్లు వివిధ శస్త్రాలు ధరించారు .-‘’ముక్తా వితానేవ బలాహకానాం –జ్యోతీ౦షి రమ్యాఇవ దిగ్విభాగాః’’.

   రాత్రి పోయి ,అంతరిక్షం పైకి లేచినట్లుగా ఉంది .దిక్కులు ప్రసన్నాలై ,సూర్య కిరణాలు స్పష్టత పొంది విస్తరించగా ,పగటి శోభ రోజును ఆశ్రయించింది .మహాదుర్గం లాంటి ప్రస్వాపనాస్త్రాన్ని శత్రువైన శివుడు వ్యర్ధం చేయగా ,వెంటనే సైనికులను బంధించే సర్పరూప పాశాలు వదిలాడు పార్ధుడు –‘’భుజంగ పాశాన్ భుజ వీర్య శాలీ –ప్రబంధ నాయ ప్రజిఘాయ జిష్ణుః’’.మెరుపులతో సమానమైన విషాగ్ని కల వందలాది నాలుకలను ఎప్పుడూ ఆడించే సర్పరాజుల సేన తమ భయంతో ఆకాశంలో తిరిగే సిద్ధ చారణాది దేవమార్గాన్ని ఆవరించి అడ్డుకొన్నాయి –‘’జిహ్వా శతా న్యుల్లస యంత్య జస్ర౦ –లసత్తడి ల్లోల విషానలాని –త్రాసాన్నిరస్తా భుజగేంద్ర సేనా –నభశ్చ రైస్తత్పదవీం వివవ్రే ‘’.దిగ్గజాల తొండాలవంటి ,ఇంద్ర నీల మణుల లాంటి శరీరాలతో ఆపాముల వరుస ఆకాశం అనే సముద్రం లోని తరంగమాలిక లాగా ప్రకాశించింది –‘’దిజ్నాగ హస్తాకృతిమూడవ హద్భిః-భోగైః ప్రశాస్తా సితరత్న నీలైః-రారాజ సర్పావలి రుల్లసంతీ-తరంగ మాలేవ నభోర్ణవస్య ‘’.పడగెత్తిన సర్పాల ఫూత్కారాల్లోని పొగ, సూర్య కిరణాలను కప్పి వేయగా, చూసే వాళ్లకు యోగ్యమైన శరీరాన్ని సూర్యుడు ధరించాడు –‘’నిఃశ్వాస ధూమైః స్థగితాంశుజాలం-ఫణావతాముత్ఫణ  మండలానాం –గచ్ఛన్నివాస్తం వపురభ్యువాహ-విలోచనానాం సుఖ ముష్ణ రశ్మిః’’.విష దృష్టి ఉన్న సర్పాల కళ్ళల్లోనుంచి కాసిన బంగారు ప్రకాశం తో ,దిక్కుల్ని పసుపురంగుగామారుస్తున్నమంటలు పెద్ద తోక చుక్కల్లాగా బయటికి వచ్చాయి .-‘’ప్రతప్త చామీకర భాసు రేణ-దిశః ప్రకాశేన పిశంగ యంత్యః –నిశ్చక్రముః ప్రాణ హరేక్షణానాం-జ్వాలామహోల్క ఇవ లోచనేభ్యః ‘’

  సశేషం

రేపు ముక్కోటి పర్వ దిన  శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  కిరాతార్జునీయం-.34 16 వ సర్గ -1

  కిరాతార్జునీయం-.34

16 వ సర్గ -1

కిరాత వేష శివుని అసాధారణ రణనైపుణ్యాన్ని చూసిన అర్జునుడికి కోపం వచ్చి,తాను  యుద్ధం లో గెలవక పోవటానికి కారణాలు ఊహించటం మొదలు పెట్టాడు -ఇలా అనుకొన్నాడు ‘’ఈ యుద్ధంలో మదజలం కారే పర్వతాలవంటి,యుద్ధ కష్టం తెలిసిన  ఏనుగులు కనిపించటం లేదు .ఎత్తైన పతాకాలతో రంగులతో సూర్యకాంతిని నానా రంగులుగా మార్చే గంభీర ధ్వని ఉన్న రథ సమూహాలు లేవు .ప్రాసకుంతం వంటి యుద్ధ ఆయుధాల అలల్లాగా చామరాలు అనే నురగ వంటివి అయిన అశ్వరాశి సముద్ర జలరాశి లా మర్యాద దాటి చెలియలికట్టను కప్పివేయటం లేదు .,’’చంపండి నరకండి ‘’అంటూ భీకరంగా అరచే యోధులు శత్రువులపై వదిలే శస్త్రాస్త్రాలు  సూర్యకిరణాలతో కలిసి  ప్రతిఫలించి మెరుపుల్లా ఆకాశం లో వదలటం లేదు .వీరుల్ని చంపటానికి వచ్చే యముడి ఎడతెగని పొగ లాగా ,అంతటా వ్యాపించిన కాంతి సమూహంతో ధూళి గుర్రాల ,రథాలవేగం తో యెగిరి ఆకాశం లో చేరటం లేదు .గాడిద రంగు భూ ధూళి కంటి చూపును అడ్డుకోగా ,పరాక్రమ వీరుల్ని వరి౦చాలనే ఉత్సాహమున్న దేవాగనలకు పగలే రేయి అనే భ్రాంతి కలగటం లేదు .రథ చక్ర ఘురఘుర ధ్వని ,గుర్రాల సకిలింపులు ,మదగజ ఘీంకారం , ధ్వని చేస్తున్నభయంకరంగా లేదు .భేరీ వాద్యాల ధ్వని కూడా ప్రతిధ్వని ఇవ్వటం లేదు .యుద్ధం లో కీర్తి ,పౌరుష లోభమున్నవారు శత్రువులచే ఛాతీపై గాయపడిన వారికి యుద్ధ విఘ్నం కలుగ కుండా వర్ష ధారల్లాంటి చల్లదనాన్ని ఏనుగులు తొండం తో చిమ్మే తుపుర్లు పోగొట్టటం లేదు .అంటే అవి మాటికీ చిమ్మటం వలన వారికి స్వస్థత కలిగిందని భావం .రక్తపుటేరులు పారుతూ సేన మార్గానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి .కొన్ని ఎండిన బురద గుంటల్లాగారక్త ప్రవాహం పైకి కనపడటం లేదు –‘’ఆసృఞదీనా ముపచీయ మానై-ర్విచార యద్భిఃపదవీ౦ ధ్వజిన్యాః-ఉచ్ఛ్రాయ మా యాంతి న శోణితౌఘైః-పంకైరివాశ్యానఘనైస్తటాని’’.ఏనుగు దంతాలతో గాయపడిన సాహస వీరులకు ప్రియురాలి ఒడిలాగా చల్లగా ,ఉండే ఆకాశం నుంచి వక్షస్థలం లో పడిన మందార మాల శాంతి కలిగించటం లేదు –నేహ ప్రమోహం ప్రియ సాహసానాం –మందార మాలా విరలీ కరోతి’’ఏనుగు తొండాలనుంచి పడిన నీటి తుంపర్లు మావటి వాళ్ళ కవచాలలోని  మణికాంతులతో కలిసి ఇంద్ర ధనుస్సు ఏర్పడటం లేదు –‘’అర్క ద్విషో న్మీలిత మభ్య్యు దేతి,- న ఖండ మాఖండల కార్ముకస్య ‘’. ,  ,

రెక్కలున్న మైనాక పర్వతం లాగా శత్రువుల ఏనుగు మధ్యలో ప్రవేశిస్తే ,అటూ ఇటూ పారిపోయే సేన ,సముద్రం తో సమానంగా తరంగాలుగా విడిపోయి కోలాహలం కలిగించటం లేదు .గజ సైన్యం పైకి వేగం గా దూసుకొస్తున్న రథికుల మార్గాన్ని సమూలంగా నరకబడిన ఏనుగుల తొండాలు అడ్డు పెట్టటం లేదు –‘’అమూల లూనై రతి మన్యు నేవ –మాతంగ హస్తైర్వియతే న పంథాః.’’.తోమర వాద్యానికి కట్టిన నెమలి ఈకల కట్ట ,పద్మ మాలాలంకారమైన ప్రియురాలి కేశాలంకారంగా ఉండి,మావటి వాళ్ళ వక్షస్థలాన్ని కప్పేయటం లేదు .ప్రళయం లో లెక్కలేని వీరులు చనిపోతే ,నాలుక ఆడిస్తూ ముల్లోకాలను కబళించే మృత్యు దేవత నోరు తెరవటం లేదు –‘’’’ఉజ్ఘత్సుసంహార ఇవాస్త సంఖ్య-మహ్నాయ తేజస్విషు జీవితాని –లోక త్రయాస్వాదన లోల జిహ్వాం – న వ్యాద దాత్యాననమత్ర మృత్యుః’’.’’నా శక్తి ఎంతటి పరాక్రమ వంతుడి నైనా ధ్వస్తం చేసేది .మరి హీనకిరాత యుద్ధం లో చంద్రుని కాంతి లో సూర్య ప్రభ లాగా ఎందుకు క్షీణించింది ?’’-శక్తిర్మమా వస్యతి హీన యుద్ధే –సౌరీవ తారా దిపధామ్నిదీప్తిః’’.’’లేకపోతే ఇదేమైనా మాయా ?నా భ్రమా ?నా పరాక్రమం నశించిందా ?నేను నేనేనా ?గాండీవ బాణాలు ఇదివరకటిలా పరాక్రమం చూపట్లేదేమిటి ?-‘’మయా స్విదేషామతి విభ్రమోవా –ధ్వస్తం ను మే వీర్య ముతాహమన్యః –గాండీవ ముక్తా హియథా పురా మే పరాక్రమంతే న శరాః కిరాతే’’.’’ఈ కిరాతుడు ధనుష్ఠంకారం తో ఆకాశాన్ని రెండుగా చీలుస్తున్నాడు .ఇతడుకిరాతుడు అయి ఉండడు.వేషభాషలు మాత్రం అలానే ఉన్నాయి చేష్ట మనిషి రూపం దాల్చినవాడిదిగా ఉంది .’’నూనం తథా నైష యథాస్య వేషః –ప్రచ్ఛన్య మాప్యూహతే హిచేస్టా’’

  అతడి ధనువు తో రోషం ధ్వనించింది .అల్లెత్రాడు ఒక్కసారి మాత్రమే లాగి నట్లుంది అమ్ములపోదిలోంచి బాణం తీయటం, సంధించటం ఏకకాలం లో జరిగినట్లుది .పిడికిలి పట్టి ప్రయోగించినట్లు కూడా లేదే ?-‘’ధనుః ప్రబంధ ధ్వనితం రుషేవ-సకృద్వికృష్టావితతేవ మౌర్వీ –సంధాన ముత్కర్షమివ వ్యుదస్య –ముష్టేరసంభేద ఇవాప వర్గే ‘’.అతడి భుజాలు కిందికి వంగినా మెడ ఏమాత్రం కదలటం లేదు, ప్రయాస లేదు .ముఖ వికారాలు లేకుండా చంద్రకాంతి లా ఉన్నాడు –‘’అమ్సావ వష్ట బ్ధనతౌ సమాధిః-శిరోధరాయా రహిత ప్రయాసః –ధృతా వికారా స్త్యజతా ముఖేన –ప్రసాద లక్ష్మీఃశ్శ లాంఛ నస్య ‘’.యుద్ధం లో కాళ్ళు అటూ ఇటూ మార్చినా శరీరం చలనం పొందటం లేదు .చలనమున్నా లేకపోయినా బాణాల లక్ష్యం ఒకే రకంగా ఉంది .శత్రువు లోటుపాట్లు తెలుసుకోవటం ,తన లొసుగులు గుర్తించి వెంటనే సరి దిద్దుకోవటం అనే రెండు గొప్ప గుణాలు భీష్మ పితామహునిలో ,గురు ద్రోణాచార్యునిలో కూడా లేవే !అలాంటప్పుడు ఒక కిరాతుని విషయం లో ఎలా సంభవించింది ?’’-‘’పరస్య భూయాన్వివరే భియోగః –ప్రసహ్య సంకర్షణ మాత్మ రంధ్రే-భీష్మేప్యసంభావ్య మిదం గురౌ వా –న సంభవత్యేవ వనే చరేషు ‘’.ఈ రకంగా అసాధారణ పరాక్రమ శీలి ,యుద్ధమదోన్మత్తుడుఅయిన కిరాతుని పరాక్రమాన్ని దివ్యాస్త్రసంధానంతోనే నివారించాలి .చిన్న శత్రువైనా ,రోగం లాగా అపకారమే కలుగుతుంది .ఇతడు గొప్ప శత్రువు కనుక ఉపేక్ష పనికి రాదు అని భావం .అర్జునుడికి మైండ్ బ్లాంక్ అయి ఇన్ని రకాలుగా ఆలోచించాడు . తర్వాత ఎలాంటి ప్రత్యేక అస్త్రం  ప్రయోగించాడో పార్ధుడు రేపు తెలుసుకొందాం .-‘’ అప్రాకృత స్యాహవ దుర్మదస్య –నివార్య మస్యాస్త్ర బలేన వీర్యం-అల్పీయసో ప్యామయ తుల్య వృత్తే-ర్మహాపకారాయ రిపోర్వి వృద్ధిః. ‘’

  సశేషం ‘

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-20—ఉయ్యూరు  .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.33 15వ  సర్గ – 4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.33

15వ  సర్గ – 4(చివరి భాగం )

శివుడు అర్జున బాణ మేఘాన్నితన బాణాలతో తొలగించాడు .అర్జునుడికి దీటుగా బాణ ప్రయోగం చేశాడు శివుడు .శివుడి బాణాలు తీక్షణాలై,భయోత్పాతం కలిగిస్తాయి –‘’తేన వ్యాతే నిరా భీమా-భీమార్జున ఫలాననాః-న నాను కంప్య విశిఖాః-శిఖా ధరజ వాససః ‘’ఇది శృ౦ఖలా  యమక శ్లోకం .శివ బాణాలు స్వర్గ ,అంతరిక్షాలలో సంచరి౦చ గలిగేవి .చెవులు చిల్లులు పడే శబ్దం చేయగలవి .విద్యుత్ సమూహం తో సమానమైనవి .-‘’దయు వియద్గామినీ -తార సంరావ విహత శ్రుతిః-హైమీషు మాల శుశుభే -విద్యుతా మివ సంహతిః’’.నాలుగవ పాదం లోని విద్యుతామివ సంహతి ‘’అనే అక్షరాలూ మొదటి ,రెండుపాదాల్లో కూర్చబడ్డాయి దీన్ని గూఢ చతుర్ధ పాదశ్లోకం అంటారు .శివబాణ ప్రయోగానికి అర్జునుడు ఏమాత్రమూ చలించలేదు .తర్వాత శ్లోకం కు మూడు అర్ధాలున్నాయి ఆవైభోగం చూద్దాం -.  ‘’జగతీ శరణో యుక్తో హరికాతః-సుధా సితః –దాన వర్షీ కృతా శంసో నాగరాజ ఇవా బభౌ ‘’

మొదటి భావం-అర్జునుడు హిమవంతుని శోభతో .ఉన్నాడు శివుడితో యుద్ధం చేయగల తత్పరుడు .ప్రజాపాలన సక్రమంగా చేసేవాడు .నల్లని వాడు .దాత .యుద్ధ విజయం కోరుతున్నాడు .భూపాలనకోసం బ్రహ్మ సృష్టించిన వాడు. నివాస ,స్థానాలు ఇవ్వటం తో సింహాలకు ప్రియమైనవాడు .హిమవంతుడు .మంచు ఆవరించి తెల్లగా ఉన్నాడు. దానవ రుషి మన్మథులచే కీర్తింప బడినవాడు .

రెండవ భావం –భూమికి శరణ్య మైనవాడు .ఇంద్రునికిష్టుడు ,అమృతం లాగా శీల స్వచ్చత ఉన్నవాడు. దానాన్ని జలరూపం లో ఇచ్చేవాడు .భూమిని బాధపెట్టే రాక్షసులతో పోట్లాడే వాడు ..అంటే ఇంద్రుని ఐరావతం  తో పోలిక .

మూడవ భావం-ఆది శేషుని తో పోలిక –భూ రక్షణ కోసం విధాత ఏర్పాటు చేశాడు .కృష్ణుడికి ఇస్టమైనవాడు.అమృత స్వచ్చ శరీరి .దానవ ,రుషి ,లక్ష్మీ దేవులచే పూజింప బడే వాడు .

  శివుడు బాణాలతో అర్జున పరాక్రమం తగ్గించ లేకపోయాడు .అర్జున ఇంద్రియాలనుంచి కోపకారణంగా అగ్ని బయల్దేరింది . పిశంగవర్ణ తేజస్సుతో అర్జునుడు తన తేజస్సును విస్తరించాడు .అడవి చెట్ల వలన పుట్టే దావాగ్నిలా చెలరేగాడు .తన అమోఘ పరాక్రమం చూపిస్తూ శివుడు అర్జునుని పై గాయ పరిచి ప్రాణం తీయని బాణం వేశాడు .దాన్ని అర్జునుడు నివారించి ,తనబాణాల నీడలో భూమిని కప్పేశాడు .శంకరబాణ౦  సూర్యకిరణమే .ఆబాణం.మహా వేగంగా వచ్చి ,అసంఖ్యాక అర్జున బాణాలను ఖండించింది .అన్నిటినీ చీలుస్తూ,అర్జునుని బాణం లోకి కూడా ప్రవేశించింది .శివుని బాణాలను కూలుస్తూ ,అనేక విధాలుగా కదుల్తూ ,అన్ని చోట్లా అర్జునుడే ఉన్నట్లు గా మహర్షులకు కనిపించాడు .క్షణం తీరికలేక అంతా తానే అయి పోరాడాడు .అర్జున బాణ విజ్రు౦భణ పెరిగి ,శంకర బాణాలు భంగపడుతున్నాయి .దేవ రుషి గణం ఆకాశం లో ఈ మహా యుద్ధం చూడటానికి చేరారు .శంకర బాణ విస్తృతి ,విజయలక్ష్మీ సమేతుడైన విజయుని పరాక్రమం చూసి తత్వజ్ఞులైన మునుల ఒళ్ళు గగుర్పొడిచింది .తత్వజ్ఞులు అన్నమాటవలన అర్జునుడు నారాయణ అంశ ఉన్నవాడు అని తెలుసుకొన్నారు అని భావం లక్ష్మీ వతః అనే మాట కూడా దీన్నే తెలియ జేస్తుంది .-‘’సంశ్యతామివ శివేన వితాయమానం –లక్ష్మీ వతఃక్షితి పతేస్తనయస్య వీర్యం –అ౦గా న్యభిన్న మపి తత్వవిదాంమునీనాం –రోమాంచ మంచిత తర౦భిభారాం బభూవుః’’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 49-విదేశాలలో సంస్కృతాధ్యయనం (చివరి భాగం )

← Back

Thank you for your response. ✨

Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.32 15వ  సర్గ – 3

కిరాతార్జునీయం-.32

15వ  సర్గ – 3

కుమాస్వామి సైన్యంతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’దేవతల్నీ మనుషుల్నీ గడ్డిపరకగా చూసే మీరు ఉత్తమ  పరాక్రమ వంతులు .ఆపరాక్రమ శ్రీ ని ఎందుకు వదిలారు ?మనశత్రువు తీవ్ర ఖడ్గంధరించాడు .నిర్భయుడు తేజస్వి ,అందగాడు .యుద్ధభారం వహించగల దిట్ట ఎంతటి శత్రువుకూ జంకే వాడు కాదు .కనుక భయపడాల్సిన పని లేదు –‘’ నిశితా సిరతో భీకో న్యేజతే  మరణా రుచా –సారతో న విరోధీ నః స్వభాసో భరవానుత’’.  -పరాక్రమం ఉత్తమకవచ ధారీ అయినా అధీరుడు .అతని బాణ శబ్దం విని సమస్తజీవరాశి ప్రాణం వదిలేస్తాయి –‘’ తనువా రభసో భాస్వాన ధీరో వినతోరసా –చారుణా రమతే జన్యే కో భీతో రసితా శిని’’ఈ శ్లోకమూ ప్రతిలోమానులోమంగా రాసిందే .అతడి బాణాలకు చచ్చిన ఏనుగుల నుంచి కారిన రక్తం పర్వతజలపాతం లా ఉంది .మద ధారలున్నఏనుగులున్నవాడు ,శత్రువుల్ని ‘’కాకా ‘’అని కాకుల్ని పిలచినట్లు పిల్చేవాడు ,ఉత్సాహవంతులని నిరుత్సాహ పరిచేవాడు అతడు –‘’దేవకానిని కావాదే వాహికా స్వస్వ కాహివా –కాకారే భభరే కాకా నిస్వభవ్యవ్యభస్వని ‘’ఇది సర్వతో భద్ర కవిత్వంగా రాసింది .’’భయపడిన గుర్రాలు రౌతుల్నే కిందపడేశాయి .ఖడ్గాలు లేని వొరలు గాలి చేరి ఆధ్వని రౌతుల చెవుల్లో దూరి భయంతో చచ్చారు .యుద్ధం లో వీరులలో ఉత్సాహం పెరిగితే ,భయపడే వారి కోపాన్ని నశింపజేస్తుంది .శత్రువులు యుద్ధ కౌశలాన్ని చూసి ఆన౦దిస్తారు .ఈ శ్లోకం లో అర్దభ్రమక బంధం ఉంది..దేవతలతో మీరు భయంకర యుద్ధం చేశారు నిజమే .కాని ఇప్పుడు పౌరుష నష్టం పొందారు ‘’అని సైన్యాన్ని కుమారుడు అనునయిస్తుండగా శివుడు చిరు నవ్వుతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు .

  అర్జున బాణాగ్ని బాధ పడిన గణాలతో శివుడు ‘’పరిగెత్తకండి ‘’’అనే చల్లని మాటతోసంతోషం కలిగించాడు .ప్రమద గణ౦ బలహీనమై ’నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శంకరుని సాంత్వన వాక్యం నచ్చి ఆయన అభిప్రాయం తెలుసుకొన్నారు –‘’దూనాస్తే రిబలా దూనా -నిరేభా బహు మేనిరే -–భీతాఃసహిత శరా భీతాః-శంకరం తత్ర శంకం ‘’   శ్లోకం మొదటిపాదం లో మొదటిపాదం అ౦దులొ చివరి పదంగా కూడా ఉండటం ఇక్కడి ప్రత్యేకత .అంటే దూనా –దూనా ,భీతాః- భీతాః,శంకరం –శంకరం .దాటటానికి వీల్లేని శత్రు బాణ సముద్రం లో ఉన్న సేన ఈశ్వర రూపమైన తీరాన్ని చూసి ఊరట చెందింది .ఓడిన సేనను ముందుపెట్టుకొని ,సూర్యుని నుంచి తొలగిన నీడను మహా వృక్షం ధరించినట్లు సేనకు బాసట అయ్యాడు .అంటే శివుడు సేనను వదలలేదు చెట్టు తన నీడను వదలనట్లు ..

  శంకరుడు అర్జునునిపై బాణం సంధించగా ఆ ధనుష్టంకారానికి ఇంద్రకీల పర్వతం బద్దలవు తోందా అన్నట్లు దిక్కులు పిక్కటిల్లాయి .-‘’ముంచ తీశే శరాజ్ఞిష్టౌపినాకస్వన పూరితః –దధ్వాన ధ్వనయన్నాశాః స్ఫుట న్నివధరాధరః ‘’.శివార్జున యుద్ధాన్ని నిశ్చేష్టులై చిత్రం లోని బొమ్మల్లాగా కదలకుండా ఆశ్చర్యంగా చూశారు .నైపుణ్యంతో అర్జునుడు వేసే బాణాలను శివుడు అంతే నైపుణ్యంగా నేలకూల్చాడు -.అర్జునుడూ శివుని బాణాలను అలాగే కూల్చేశాడు –‘’అవద్యన్పత్రిణః శంభోః సాయకైరవ సాయకైః-పాణ్డవః పరి చక్రామ శిక్షయా రణ శిక్షయా ‘’.ఈ శ్లోకం లో ఆద్యంత యమకం ఉంది .వల్కల శోభతో అందగాడైన అర్జునుడు మనోహర తీరులతో యుద్ధం చేశాడు –‘’చార చుంచు శ్చిరా రేచీచంచ చ్చీరుచా రుచః –చచార రుచిర శ్చారు చారైరాచార చంచురః ‘’ఈ శ్లోకం లో చ ,ర అనే రెండు అక్షరాలనే ఉపయోగించి మెస్మరిజం చేశాడు కవి భారవి .గా౦డీవానికి అల్లెత్రాడు బిగించి పిడుగుల్లాంటి నిప్పులు సూర్యునిలా వెదజల్లాడు భీభత్సుడు  .అర్జునబాణాలు శివబాణాలను మేఘాలు సూర్యుని కప్పినట్లు కప్పేశాయి-‘’పార్థబాణాః పశుపతేరావ వ్రర్విశిఖా వలీం –పయోముచ ఇవా రంధ్రాః  సావిత్రీ మంశు సంహతిం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా పసాద్ -21-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

 

విదేశీ సంస్కృత విద్వాంసులు

48-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

20- రుమేనియా దేశం

ఈ దేశం లోని బోఖా రెస్ట్ యూనివర్సిటిలో ప్రొఫెసర్ అమితా భోస్ సంస్కృతం బోధించాడు .బెంగాలీ హిందీ విద్యార్ధులకు ఇది రెండేళ్ళ కోర్సు .ప్రఫెసర్ సూరజ్ భాన్ సింగ్  బోస్ కు సహకరించాడు .మాన్యుయల్ ఆఫ్ హిందీ ,ఇండియా –రుమేనియా సంస్కృతీ పుస్తకాలు సింగ్ రాశాడు .భోస్ –గోథే-భారతీయ మేధావులు ఆర్టికల్ రాసి ప్రచురించాడు .రవీంద్రుని ,రాబిన్సన్ క్రూసో ను తులనాత్మక పరిశోధన చేశాడు డా.డి.భట్టాచార్య .

21-స్పెయిన్ దేశం

స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్ ,సలమాంకా యూని వర్సిటీలలో సంస్కృత అధ్యయనం జరుగుతోంది .మాడ్రిడ్ లో ప్రొఫెసర్ విల్లార్ 1978-79లో ,సలమా౦కా లో 80-81లో బోధించాడు .ఆత్మ –బ్రహ్మ ను,మేఘ దూతం ను  విల్లార్ ,భగవద్గీతను, మాండూక్య ఉపనిషత్ పై గౌడపాదుని కారికను, డా అడ్ర డోస్, మార్టిన్ కాన్స్యులో –వివేకం ను ,డా జొసీ గోమేజ్ –భారతీయ వేదాంత గ్రంథాలను అనువదించి ప్రచురించారు .

22-శ్రీ లంక దేశం

శ్రీలంకలో కేల నీయ ,జానా యూని వర్సిటీలో అండర్ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సంస్కృత బోధన జరుగుతోంది .స్కూలు స్థాయిలో అమలు సరిగా లేక నిరాశగా ఉంది ,కొన్ని దశాబ్దాలక్రితం గ్రీక్ లాటిన్ తో పాటు సంస్కృతం కూడా ఒక వెలుగు వెలిగింది .పాలీకూడా అదే స్థాయి పొందింది .పుస్తకప్రచురణ చాలా అరుదు .ప్రస్తుతం కేలననీయ యూనివర్సిటిలో  సంస్కృతం లో 8మంది ఆనర్స్ డిగ్రీవిద్యార్ధులు  ,15మంది మగిలిన సబ్జెక్ట్ లు నేరుస్తున్నారు .నానాటికీ చేరే విద్యార్ధుల సంఖ్య తగ్గి పోతోంది .ఉపయోగకరమైన లైబ్రరీ లేకపోవటం ,రిసెర్చ్ సౌకర్యం లేకపోవటంకారణాలు .జాఫ్నా యూని వర్సిటి -1974లో స్థాపన జరిగిన నాటి నుంచి సంస్కృత బోధన జరుగుతోంది .జనరల్ స్పెషల్ డిగ్రీ కోర్సులున్నాయి .భరతనాట్యం స౦గీతం లలో డిప్లొమా కోర్సులు దీనికి అనుబంధంగా ఉన్న రామనాధన్ అకాడెమీలో నేర్పుతున్నారు .ఏం ఏ ,పిహెచ్ డికోర్సులు పెట్టె యోచనా ఉంది .పెరడీనియా యూనివర్సిటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు సంస్కృతం ఉంది .డిగ్రీ లెవెల్ లో యాన్సిలరి సబ్జేక్ట్ గా  బోధిస్తారు.హిస్టరీ విద్యార్ధులకు సంస్కృతం ఉంటుంది .శాసన పరిశోధన మనుస్మృతి అధ్యయనానికి తోడ్పడుతుంది

23-స్వీడెన్ దేశం

నాలుగవ ప్రపంచ సంస్కృత  సమ్మేళనం ఈ  దేశం లోని  వీమార్ లో జరిగి ,ఇండలాజికల్ రిపోర్ట్ ప్రచురించారు .స్టాక్ హోం లో అనేక కాన్ఫరెన్స్ లు జరిపారు .భారత దేశంనుండి నిష్ణాతులు ఇక్కడికి విజిటింగ్ ప్రొఫెసర్స్ గా వచ్చారు .సామవేదానికి చెందిన ఉప్సల  ఉపనిషత్ ను  జెన్ ఎక్లుండ్ ,విష్ణుపురాణం ను జి లీబర్ట్ ,కావ్య నిర్మాణం ను లీన్ హార్డ్ ,మానస మంగళ అధ్యయనం ను డబ్ల్యు స్మిత్ లు వారిభాషలోకి అనువదించి ప్రచురించారు .

24-సోవియెట్ రిపబ్లిక్ ఆఫ్ రష్యాదేశం –

పుస్తకప్రచురణ –ప్రాచీన భారతీయ సంస్కృతీ –బొంగార్డో  లెవిన్ ,పి.గ్రీన్స్టర్-భాసుడు ,సేరేబ్రియకోవ్ –భర్తృహరి శతకత్రయం,వేదం వాజ్మయ చరిత్రను ఏర్మాన్ ఓ కెర్క్ ,బౌద్ధవేదాన్తంను క్రితికా మిరోవోజ్ ,మధ్యయుగ భారతీయ కవిత్వం లో అమరప్రేమ ను సేరేబ్రేయిని ,భారతీయ యాత్రా స్థలాలు ను రుద్నేవ్ పో లు అనువదించారు .హరివంశపురాణ౦,రాజశేఖరుడు,,అర్ధ శాస్త్రం ,లోకాయత ,భారతంలో మహిళలు ,జైన బౌద్ధాలు మొదలైన వాటిపై పరిశోధనా వ్యాసాలూ రాసిప్రచురించారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  పూలదండకు మరణ శిక్షా ? 

      పూలదండకు మరణ శిక్షా ? 

కలలు కనమని చెప్పి యువతను తీర్చిదిద్దిన

భారత రత్న అబుల్ కలాం పై నీ ఆరాధనా భావం

అసూయకు దారితీసిందా శివదాసన్ !

కొచ్చీ మెరైన్ డ్రైవ్  వీధిలోనే పడుకుంటూ

నిత్యం కలా౦భాయ్ విగ్రహానికి ఏమీ ఆశించక

నీఖర్చుతో పూలమాల వేసి సంతృప్తి చెందే

నీపైనే అసూయా ? ఎంత దారుణం ?

మనుషులున్న సమాజం లోనే జీవిస్తున్నామా  ?

నువ్వేదో కీర్తి సంపాదిస్తున్నావన్న అసూయ

గూడుకట్టుకొని నిన్నే హత్య చేశాడా ఆ కిరాతకుడు ?

మాటు వేసిదారి కాచి చంపేశాడా?

‘’సమసమాజం వల్లించే’’ పాలనలోనే జరిగిందంటే  

తల్లడిల్లిన మనసుతో తలవంచుకొంటున్నాను

శివ దాసన్ ! నీకు నా  కన్నీటి కైమోడ్పు.

ఆధారం -ఇవాల్టి జ్యోతిలో వార్త చదివాక కలిగిన స్పందన

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-20-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.31 15వ  సర్గ – 2

కిరాతార్జునీయం-.31

15వ  సర్గ – 2

కుమార స్వామి శివ సేన పారిపోవటాన్ని చూసి మందలిస్తూ’’ఎంతోకీర్తి గడించిన మీరు ఏ ఆపద వచ్చి మీద పడిందని పారిపోయి వచ్చారు ?మీపలాయనం పాపం తప్ప మరేమీ కాదు .ఆ తాపసి దానవుడో ,నాగరాజో ,రాక్షసుడో కాదు .జయించ వీలుఉన్న ఉత్సాహ పురుషుడు .రజోగుణమున్న కేవల మానవ మాత్రుడు.-‘’‘నా సురో యమ న వా నాగో- ధర సంస్థోన రాక్షసః –నా సుఖో యం నవాభాగో –ధరణిస్థోహి రాజసః ‘’.ఈ శ్లోకం ‘’గోమూత్రికా బంధం ‘’తో ఉంది .16అరలు ఉండే రేఖలకు పై భాగం లో ముందుభాగం ,కిందిభాగం చివరి భాగం కలిపితే శ్లోకం పూర్తవుతుంది .’’ఈ ముని దయతో నెమ్మదిగా బాణ వదులుతూ ,మిమ్మల్ని దారితప్పిన పశువుల్ని రైతు కర్రతో అదిలించినట్లు అదిలిస్తున్నాడు .అంతే.-‘’ప్రణుదత్యాగ తావజ్ఞం జఘనేషు పశూనివ ‘’.నీచులచే పరాజితుడైనవాడు మనిషే కాదు నీచుల్ని ఓడించినవాడూ మనిషి కాడు.మీరు నీచునిచే ఓడి భయంతో పరిగెత్తుతున్నారు .మిమ్మల్ని ఏమనాలో మరి ?స్వామి పరాజితుడు కాకపొతే ఆ సైన్యం పరాజితం కాదు .బాధ పడే వారిని ఇంకా బాధ పెట్టె వాడు నిర్దోషీ కాడు,నీచుడుకూడా –‘’న నోన నున్నో నున్నోనో నానా నా  నాననా  నను –నన్నో నున్నో ననున్నేనో నానేనా నున్న నున్ననుత్ ‘’.ఒకే ఒక నకారంతో రాసిన ఏకాక్షర శ్లోకం .అర్ధం తెలుసుకొందాం-నానాననా =అనేక ముఖాలున్న సైనికులారా ,ఊన నున్నః =నీచునితో ఓడిన ,నానా=మనిషికాదు,నున్నోనః నా అనా = నీచుడిని ఓడించినవాడు మనిషికాదు ,న నున్నేనః =న నున్న ఇనః –ఎవరి రాజు పరాజితుడు కాడో,నున్నః =పరాజితుడు ,అనున్నః =పరాజితుడు కాని వాడు ,నున్న నున్న నుత్ =బాధితుడిని పీడించేవాడు ,నా అనేనాః న =మనిషి నిర్దోషికాడు.

‘’ మొదట్లో మంచి గుణాలుకలిగి తర్వాత గుణ హీనుడైతే వాడి కంటే గుణం లేని వాడు గొప్పవాడు .మణి లేని అలంకారం సహజంగా మంచిదే మణిజారిపోయిన నగ మంచిదికాదు విలువలేనిదే .అంటే పారిపోవట కంటే,అసలు యుద్ధానికి వెళ్లకపోవటమే మంచిది అని భావం –‘’ప్రకృత్యా హ్యామణిః శ్రేయాన్నలంకార శ్చ్యుతోపలః’’.అతడి వద్ద వేగంగా వెళ్ళే రథాలు ,మంచి గుర్రాలు దేవ గజాలు , భయపడని పదాతి దళాలు లేవు కనుక భయపడాల్సిన పని లేదు .ఇప్పుడు మన శత్రువు పౌరుషం లేక ,సూర్యుడిచే ఎండించబడిన మడుగులా ఉన్నాడు .అందులో దాటగల బురద ఉండగా ,మీకు రాకూడని అపకీర్తి వచ్చింది –‘’హ్రదైరివార్క నిష్పీతైః ప్రాప్తః పంకోదురుత్తరః ‘’.వెదురు తుమ్మలు ముళ్ళచెట్లతో భీకరంగా ఉండే వనాన్ని వదిలేసి,ఏ దిక్కులు విదిక్కులు జయించటానికి మీరు వెడుతున్నారు ?-‘’వేత్ర శాకకుజే శైలే లేశైజేకుక శాత్రవే –యాత కిం విదితోజేతుం తు౦జేశో దివి కి౦తయా’’ఈ శ్లోకం లో రెండు పాదాలు అనులోమ ,ప్రతిలోమ పద్దతిగా రాయబడింది .ముందునుంచి చివరిదాకా ,చివరుంచి ము౦దాకా ఒకటే రకంగా ఉంటుంది .చదివి చూస్తే తెలుస్తుంది .మనస్వామి శివుడు నపుంసకత్వం పొంది ,శత్రువుకు వీపు చూపి పారి వచ్చిన మిమ్మల్ని పతివ్రతా ధర్మాన్ని వదిలేసిన భార్య లనులాగా ,తన మహిమతో మీ తప్పుల్ని కప్పిపుచ్చుతాడు భయం అక్కర్లేదు –‘’అయం వః క్లైబ్య మాపన్నాన్ దృస్ట పృష్టానరాతినా –ఇచ్ఛతీశశ్చుతాచారాన్ దారానివ నిగోపితుం’’.భయంకర శత్రువును భయపెట్టే మీరు సమర్ధులు శత్రువు విషయం లో మీరు క్రూరులు .ప్రభుభక్తి ఉన్న భక్తులు రక్షకులు .సదాచారులు .వక్తలూ శరణాగత రక్షకులు మీ పరి శుద్ధి అందరికీ తెలుసు –‘’నను హో మథనా రాఘో,ఘోరా నాథ మహో నున –తయదాత వదా  హీమా ,మా భీదా బత దాయత’’.ఈ శ్లోకమూప్రతిలోమం లోనే ఉంది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

 

విదేశీ సంస్కృత విద్వాంసులు

47-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

12-ఆస్ట్రేలియా దేశం

1979-81 మధ్యకాలం లో ఆస్ట్రేలియాలో ని నేషనల్ యూని వర్సిటిలో సంస్కృత అధ్యయనానికి అంతరాయం కలిగింది .1979లో ప్రొఫెసర్ ఏ.ఎల్.బషాం రిటైరయ్యాక పోస్ట్ ఖాళీ గా ఉంది .సౌత్ ఏషియన్ బుద్ధిష్ట్ స్టడీస్ ప్రొఫెసర్ ,రీడర్ ,సీనియర్ లెక్చరర్ సంస్కృతం బోధించారు .పార్ట్ టైం రిసెర్చ్ అసిస్టంట్ పదేళ్ళు కస్టపడి పని చేసిన ,సంస్కృత టిబెటన్ గ్రందాథాలనువాదం చేసిన ఆమెను తొలగించేశారు .ఆతర్వాత సంస్కృత బోధనకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు .పై నాలుగేళ్ళలో జరిగిన రిసెర్చ్ పని మాత్రమమే చెప్పుకోవాలి .హారిసన్ పాల్ మాక్స్వెల్ –ప్రత్యుత్పాతన బుద్ధ సమ్ముఖావనిత సమాధి సూత్రను ఇంగ్లీష్ లోకి  అనువదించాడు .మట్సు మూరా హిస్సాషి –నాలుగు అవదానాలు ,రాహులా టేల్వెట్టే-రసవాహిని ,కపూర్ ఇంద్రాణి –బౌద్ధ సింబాలిజం ,ప్రిసియాడో బెంజమన్ –పురాణాలలో కృష్ణుడు ,జిస్క్ కెన్ –ఋగ్వేద అధర్వణ వేదాలలో జబ్బులు నివారణోపాయాలురాశారు  .

13-ఆస్ట్రియా దేశం –

విశిష్టాద్వైత మతచరిత్ర ,పరాశరభట్టు రాసిన తత్వరత్నకార ,నాథముని రాసిన న్యాయ తత్త్వం అనువాదాలు జరిగాయి .రత్నకీర్తి రాసిన సర్వజ్ఞ సిద్ధి ,చంద్రకీర్తి రాసిన మధ్యమాకావతార లపై పరిశోధన జరిగింది .వియన్నాలో సంస్కృత జర్నల్స్ సంస్కృత వ్యాప్తికి దోహదం చేశాయి .ఫ్రాన్సిస్ డి.సా – కుమారిల ,శంకరర రచనలలో శబ్దప్రామాణ్యం రాశాడు .

14-బెల్జియం దేశం –

1841నుండి బెల్జియం లో సంస్కృత అధ్యాయనం సాగుతోంది .లూవెన్ లోని కేధలిక్ యూని వర్సిటి లో సంస్కృత బోధన జరిగింది .ప్రొఫెసర్ ఏ షర్పే-కాళిదాస నిఘంటు ‘’నిర్మాణం చేశాడు.కే యు లూవెన్ –వేద, రామాయణ, భారత పురాణాలలో నైసర్గిక –నామాలు –టోపోగ్రాఫికల్ నేమ్స్ పై పరిశోధన చేశాడు .

15-చైనా దేశం

 బీజింగ్ యూని వర్సిటిలో రెండేళ్ళనుంచి భారతీయ ప్రాచీన తత్వశాస్త్ర అధ్యయనం జరుగుతోంది .చాలా గ్రంథాలు చైనీస్ భాషానువాదం పొందాయి .ప్రొఫెసర్ జి .జియన్లిన్ –ప్రిలిమినారి స్టడీ ఆన్ రామాయణ ,అభిజ్ఞాన శాకుంతలం ,రాశాడు ప్రొఫెసర్ జిన్ కేము –ప్రాచీన భారతం లో కథలు గాథలు ,ప్రొఫెసర్ హుయాంగ్ జిన్ చువాన్ –రామాయణం 2,7కాండల అనువాదం ,పాణినిసూత్రాలు ,పంచతంత్రం ,ప్రొఫెసర్ జు ఫ్రాన్చేన్ -50 ఉపనిషత్తులు ,బోయేషింగ్ –భగవద్గీత ,లెక్చరర్ ఝావో గువో హువా –నలోపాఖ్యానం పై వ్యాసం ,ఏ జున్ –విశుద్ధిమాగ్గా లురాశారు .కాళిదాస,జాతకలధ,మహా వంశ ,మను స్మ్రుతి లపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి .

16-డెన్మార్క్ దేశం

కోపెంహాన్ యూని వర్సిటిలో ఇండియన్ ఫిలాసఫీ నేరుస్తున్నారు .ఐవో ఫీజర్-ది వేదిక్ ఆర్యన్స్యాజ్జ్ సీన్ బై దెం సెల్వ్స్ ,పాలీ త్రిపిటక అనువాదం.బౌద్ధ ఫిలాసఫీ పై పరిశోధన ,బుద్ధపాలితలేక శూన్యవాదం , మాతృ సేనుని ‘’ప్రణిధాన సప్తతి ‘’,ఆచార్య నాగార్జున వేదాంతం ,కంబోలుని అలోకమాల ,శాంత రాక్షసుని తత్వ శుద్ధి ,పై పరిశోధనలు జరిగాయి  పాలి నిఘంటు ను హీర్మాన్ ,కొప్ నార్మన్  లు తయారు చేశారు .ఈ యూని వర్సిటి క్విన్ శతాబ్ది ఉత్సవ సందర్భంగా  ఈ విద్యాలయం పై 14భాగాల యూని వర్సిటీ చరిత్ర అభివృద్ధి ,ఓరియెంటల్ వ్రాతప్రతులు తో ప్రచురించారు .

17-ఫిన్లాండ్  దేశం

10-12-1980న హేల్సిన్కిలో నార్డిక్ సౌత్ ఏషియా సమావేశం జరిగింది .డెన్మార్క్ ఫిన్లాండ్ నార్వే ,స్వీడెన్ మొదలైన 80దేశాల ప్రతినిధులు పాల్గొనగా ,లీడెన్ యూని వర్సిటి ప్రొఫెసర్ జే

హెచ్ హీస్టార్ ‘’వేదం -సమాజం ‘’ పై ప్రారంభోపన్యాసం చేశాడు .50మంది వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు రాసి సమర్పించారు .ఏప్రిల్ 17నుండి జూన్ నెలాఖరు వరకు బౌద్ధ విషయక వస్తు ప్రదర్శన జరిగింది .1981ఆగస్ట్ 10నుంచి 18వరకు నార్డిక్ రిసెర్చ్ వర్క్ షాప్ నిర్వహించారు .30మంది ప్రతినిధులు చురుకుగా హాజరయ్యారు .1958నుంచి హెల్సింకి యూని వర్సిటిలో సంస్కృతం బోధిస్తున్న ప్రొఫెసర్ పెనిట్టీ ఆల్టో1980లో  రిటైరయ్యాడు . ,బెర్టిల్ తిక్కనేన్ ఋగ్వేద ,అధర్వ వేద్దాలలో అబ్సల్యూటివ్స్ అంటే పూర్ణత్వ పై దిసీస్ సమర్పించాడు .జైమినీయ శ్రౌత  సూత్రాలకు భావత్రాత రాసిన వ్యాఖ్యానం ను డోసేంట్ ఆస్కో పర్పోలా ప్రచురించాడు .ఇండస్ లిపి లోని పుస్తకాలకు  డాక్యుమెంటేషన్ జరిగింది .పర్పోలా వేదకాలం వరకు ఇండస్ మతం రాసి ప్రచురించాడు .

18-ఫ్రాన్స్ దేశం

లుడ్విక్  స్టెన్ బాచ్ –ఘోరకుని అశుధార ,వ్యాస సుభాషిత సంగ్రహం ప్రచురిస్తే ,డేనియల్ డోన్నేట్ట్-నలోపాఖ్యానం ,సిల్వేనియా ఫిల్జోట్ –రత్నావళి కొటేషన్స్ ,మేరీ క్లాడీ పోర్చేర్- ప్రహేళిక,ఫిల్జోట్- వేదాలపైనా,కొందరు వైష్ణవ శైవ ఆగమాలపై రిసెర్చ్ చేశారు .బ్రూనో డేజేన్స్-శైవాగమ పరిభాషా మంజరి ప్రచురించాడు .మైకేల్ హూలిన్ –మృగేంద్రగమ,భట్ట నారాయణ కంఠ,  అఘోర శివాచార్య ప్రచురించాడు .ఆండ్రేపడాక్స్-జప విధానం పై ,అభినవ గుప్తుని పరమార్ధసరం పై  మరికొందరు జైన బౌద్ధాలపై ,మతగ్రంథాలపై కృషి చేశారు .ఫిల్జోత్-మహాభాష్యం పై, కమలేశ్వర భట్టాచార్య –సిద్ధాంత లక్షణ ప్రకరణం పై సిద్ధాంత వ్యసాలురాశారు ఆయుర్వేదం ఆర్కియాలజీ లనూ వెలుగులోకి తెచ్చారు .

19-జపాన్ దేశం

సంస్కృత ,ఇండాలజీ పండితుడు ప్రొఫెసర్ యెన్ .త్సూజీ టోక్యో యూని వర్సిటి ఎమిరిటస్ ప్రొఫెసర్ 1979లో చనిపోయాక ,ఆయనస్థానం లో ప్రొఫెసర్ జె.తకకూసు  వచ్చి సంస్కృత ,ఇండియన్ స్టడీస్ వ్యాప్తికి విశేష కృషి చేశాడు .చైనా నుంచి సంస్కృత విద్వాంసుల బృందం పెకింగ్ యూనివర్సిటి ప్రొఫెసర్ ,వైస్ ప్రెసిడెంట్ ఛీ హీసిన్ లిం నాయకత్వం లో వచ్చి ఇక్కడి పరిస్థితులు అధ్యనం చేసి సంస్కృత విద్యార్ధులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు .తర్వాత ప్రొఫెసర్ నకమూరా నాయకత్వం లో ఒకబృంద చైనా వెళ్లి ,రెండు వారాలుండి,అక్కడి విద్యావేత్తలతో చర్చించారు .1979లో టోక్యోలో 1980లో క్యోటో లో జపాన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అండ్ బుద్ధిష్ట్ స్టడీస్ సమావేశాలు జరగగా 400 రిసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించారు . ప్రొఫెసర్ యెన్ .ట్సూజీ –అధర్వ వేద సూక్తాలలో వంద సూక్తాలకు జపనీస్ అనువాదం చేశాడు .వై.కనకూర బ్రహ్మసూత్రాలకు శంకరాచార్య రాసిన భాష్యాను వాదం చేశాడు .ఎస్.మయేదా-శంకరుల ఉపదేశ సహస్రికి ఇంగ్లీష్ అనువాదం చేశాడు ,వేదాంత్ ఫిలాసఫీ ని జపనీస్ భాషలో అనువదించాడు .జపాన్ విద్యా వేత్తలకు  సాంఖ్యం  పై మోజు ఎక్కువ .ఎస్ మురకాని సాంఖ్య సిద్ధాంతాన్ని అనువదించాడు .నాకుమార –వైదేశిక సూత్రా ,పదార్ధ ధర్మ సూత్రాలనుతర్క సంగ్రహంను దీపికతో సహా  అనువదించాడు ,ఒ.తనక ,కె.కమిమూర కలిసి పంచతంత్రం అనువాదం చేశారు .కమిమూర కథా సరిత్సాగరం ,బేతాళల పంచ వి౦శతి లను కూడా అనువదించాడు .వై .ఇవామోకో వాల్మీకి రామాయణం ను ఇంగ్లీష్ అనువాదం ఆధారం గా  అనువదించాడు సద్ధర్మ పుండరీకం ,కామసూత్ర ,మృచ్చకటికం ,ఉపనిషత్ లను కూడా అనువాదం చేశాడు .ఆర్యభటీయం, లీలావతి, ఆపస్త౦భ  సూత్రాలను యానో, హయాషి ,ఇకారి లు  తమభాషలోకి మార్చారు .ప్రాకృతం జైనిజం పై మక్కువ ఉన్న కుర్రాడు ఎస్.సుచిహాసి గొప్ప కృషి చేసి 1981లో 30ఏళ్ళ చిన్నవయసులోనే మరణించాడు .ప్రొఫెసర్ఏం ఎల్ మెహతా ,ప్రొఫెసర్ హెచ్ సి బయానీ బెనారస్ ,అహ్మదాబాద్ వర్సిటీలనుంచి ఇక్కడికొచ్చి టోకాయ్ యూని వర్సిటిలో విద్యాబోధన చేస్తున్నారు .ఉత్తర జిఘాయ ,పద్మలేష్య ,లపై పరిశోధనలు జరిగి ప్రచురితమయ్యాయి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.30 చతుర్దశ సర్గ -4(చివరి భాగం )

కిరాతార్జునీయం-.30

చతుర్దశ సర్గ -4(చివరి భాగం )

‘’అర్జున తపస్వి శాంతం మొదలైన గుణాలతో వశీకృతమైన దేవతలుఅతడికి భయపడి , మనకు కనిపించకుండా మనపై బాణాలు వేస్తున్నారా ?లేకపోతే సముద్రతరంగాల్లా యెడ తెరిపి లేకుండా బాణాలు వచ్చి ఎలా మన మీద పడుతున్నాయి ?’’అని ఆశ్చర్యపోతోంది శివ సైన్యం –‘’హృతా గుణైరస్య భయేన వా మునే –స్తిరోహితాః స్విత్ప్రహరంతిదేవతాః –కథంన్వమీ సంతతస్య సాయకా –భవత్యనేకే జలధేరివోర్మయః ‘’.ఈయన యుద్ధం లో జయించి విరమిస్తే ,చరాచర లోకాలకు మేలు జరుగుతుంది ‘’అంటూ బాణం దెబ్బలకు భయపడుతున్న సేన నీరుకారి అంటోంది .చివరికి చేతు లేత్తేసి నిస్తేజమై బదులు చెప్పలేక శాంతి మార్గమే మేలు అనే ఆలోచనలోకి వచ్చారు .పురుషార్ధం కూడా బలీయమైన దైవం ముందు వ్యర్ధమౌతుంది –‘’బలీయసా తద్విధి నేవ  పౌరుషం –బలం నిరస్తం న రరాజ జిష్ణునా’’.అర్జున బాణ క్షత గాత్రులైన శివ సైనికులు సూర్య కిరణాలతో శోషింప బడిన నీరు మండలాకారం గా తిరిగినట్లు నిశ్చేష్టులై మండలాకారం లో గుమి కూడారు .-‘’రవి కర గ్లపితైరివ వారిభిః-శివ బలైః పరిమ౦డలతా దధే’’.అర్జున బాణాలు బ్రహ్మాండాన్నికప్పేయగా ,మాటిమాటికీ ధనుస్ఫాలనం చేయటం తో భయపడ్డవిజయ లక్ష్మి అతి కష్టంగా శివ సేనపై ఉన్న అనురాగాన్ని వదిలించుకోవటానికి సిద్ధపడింది .అంటే కిరాత సేన పరాజయాన్ని ఒప్పుకొన్నదని భావం – ‘’’ప్రవితత శరజాల చ్ఛన్న విశ్వాంత రాలే-విధువతి ధనురావిర్మండలం పాండు సూనౌ –కథమాపి జయ లక్ష్మీ ర్భీత భీతా విహాతుం –విషమనయన సేనా పక్ష పాతం విషేహే’’.

      పంచదశ  సర్గ -1

వ్యాకులత చెందిన జీవజాలం ఊపిరి పీల్చుకోగా ,శివ సేన ఆయుధాలు అక్కడే పారేసి తలో దిక్కుకూ పారిపోయారు .ప్రమథ గణం శివుడిని చూడకుండానే పారిపోయింది సంకటసమయం లో మనసు ఏదీ ఆలొచి౦చ లెదు కదా –‘’అపశ్యద్భిరి వేశానం రణన్నివవృతే గణైః-ముహ్యత్యేవ హాయ్ కృచ్ఛ్రేషుసంభ్రమ జ్వలితం మనః ‘’.  జయించే ఆశవదిలి  పారిపోతున్న కిరాత సేనపై కపిధ్వజ విజయునికి దయ కలిగింది .అనేక ప్రయత్న విధానాల్లో శత్రువును వశం చేసుకొన్న మహాత్ములకు వారి విషయం లో దయకలగటంగొప్ప వారి మాహాత్మ్యాన్ని చాటుతుంది –‘’వ్యక్తిమాయాతి మహతాంమాహాత్మ్య మను కంపయా ‘’ఖడ్గ బాణ ధనుస్సులు కలిగి వాహనం తో, వాహనం లేకుండానూ శత్రు నిర్జనం చేసి స్వర్ణ గజాదులు స్వాధీనం చేసుకొన్నఅందమైన భాగ్యశాలి ,శివ పుత్రుడు, దేవ సేనాని అయిన కుమారస్వామినే యుద్ధం లో పరి గెత్తించ గల ధీశాలి అర్జునుడు యుద్ధ భూమిలో విచిత్ర శోభ పొందాడు .-‘’స సాసిః సాసుసూః సాసోయేయా యేయా యయాయః-లలౌ లీలాం లలో లోలః శశీ శశి శుశీః శశ౦ ‘’ఇది చిత్ర కవిత్వ శ్లోకం .సాసిః అంటే ఖడ్గమున్నవాడు,సాసుసూః అంటే ప్రాణాలు హరించే బాణం ఉన్నవాడు ,సాసః అంటే ధనుస్సున్నవాడు ,యేయ అయేయ అయయ,అయయః అంటే వాహనం తో నూ ,అది లేకున్నా ,శత్రువును చేరేవారి వాహనాలు స్వాధీనం చేసుకొనే వాడు ,లలః అంటే అందమైన వాడు ,అలోలః అంటే చాంచల్యం లేనివాడు ,శశి ఈశ ,శిశు శీః అంటే చంద్ర ధరుని  కుమారుడైన దేవసేనానిని పరి గెత్తించిన వాడు ,శశన్ అంటే పిక్కబలం చూపించగలవాడు  ,లీలా అంటే శోభను లలౌ అంటే ధరించాడు అని అర్ధం .శబ్దం, ఏకాక్షర నిఘంటువు వ్యాకరణాలపై పూర్తి అధికారం ఉన్న కవి మాత్రమే రాయ గలిగిన శ్లోకాలివి .

  భయంతో పరిగెత్తే శివ సైన్యాన్ని నెమ్మదిగా అనుసరించి వెళ్ళాడు .బాధలో ఉన్నవారిని మరీ బాధపెట్ట టానికి మహానుభావులు ఇష్ట పడరు.-‘’నాతిపీడ యితుం  భగ్నా నిచ్ఛ౦తి  హిమహౌజసః ‘’.పారిపోయి వస్తున్న తమ సైన్యాన్ని చూసి, వాళ్లకు ఎదురుగా ముందుభాగాన ఉండికార్తికేయుడు ఖిన్నులైన కిరాతులతో ఇలా అన్నాడు –‘’అథాగ్రే హసతా సాచి స్థితేన స్థిర కీర్తినా –సేనాన్యేతే జగదిరే కించి దాయస్త చేతసా ‘’ఈ శ్లోకాన్ని నిర్యోష్ఠ్యం’’అంటారు.అంటే  పెదవులు కలవకుండా పలికే అక్షరాలతో కూర్చింది .ఇదీచిత్రకవిత్వమే .కుమారస్వామి వాళ్ళతో ‘’యుద్ధం ,ఆట మీకు సమానమే .రాక్షసులని జయించి కీర్తిపొందారు సామాన్యుల్లా పారిపోతే మీ కీర్తికి మచ్చ .మీలాటి మహాశూరులకు ఇది తగని పని .-క్షతంక్షుణ్ణాసుర గణై రగణైరివ కిం యశః’’ఈపాదం యమకం తో రాయబడింది .’’సూర్యకిరణాలు సోకి మీ ఖడ్గాలు మిమ్మల్ని పరిహాసం చేస్తున్నాయా?అంటే పారిపోయేవారికి కత్తులతో పనేమిటి అని భావం .ఆడవి మృగాలు తిరిగే చోట తలదాచుకోవటానికి పరిగెత్తే మీ దుఖం ఎలా శాంతిస్తుందో అని నా విచారం ‘’అన్నాడు –‘’వనే వనే వన సదా౦ ,మార్గం ,మార్గ ముపేయుషా౦-బాణై ర్బాణైఃసమాసక్తం శ౦కేశంకే న శామ్యతి ‘’ఈ శ్లోకం లోనూ యమక శోభ ఉన్నది .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 46-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

విదేశీ సంస్కృత విద్వాంసులు

46-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

9-పోలాండ్ దేశం

ప్రొఫెసర్ ఇ.స్టుడ్ కీ విజ్ పోలాండ్ లోని అతిపెద్దదైన వార్సా యూని వర్సిటిలో సంస్కృత బోధన పుస్తకం రాశాడు .ఎ.లోగోవి స్కి ఇప్పటికీ బోధిస్తున్నాడు .ఆర్టూర్ కార్ప్ సంస్క్రుతపాలీ భాషల ను నేర్పుతున్నాడు .ప్రొఫెసర్ ఎం కె.బిరిస్కి,తాను  ఇండియాలోని బెనారస్ యూని వర్సిటిలో చదివి నేర్చిన  సంస్కృత నాటకాలు భగవద్గీత సంప్రదాయ విధానం లో బోధిస్తున్నాడు .క్రాకౌ లో సంస్కృత అధ్యయనం ఆగిపోతే ,పారిస్ లో సంస్కృత శిక్షణ పొందిన విలియం గ్రా బౌస్కా శతపద బ్రాహ్మణం అధ్యయనం చేసింది .కొన్నళ్ళ అంతరాయం తర్వాత 1973లో ఇండియన్ స్టడీస్ శాఖ ఏర్పడి ప్రోఫెసర్ పోబో గ్నైక్ ,ఆయన శిష్యుడు జేఎల్ జాక్ కలిసి సంస్క్రుతతరగతులు నిర్వహించారు .బ్రేస్లావ్ అనే వ్రోక్లా లో రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం ఇండియన్ స్టడీస్ ప్రొఫెసర్ ఎల్ స్కుర్జుక్ అనే  జర్మని  స్కాలర్ ఆధ్వర్యం లో బాగానే జరిగాయి .తర్వాత వోల్కొవ్ స్కా  భారతీయ వివాహ వ్యవస్థలో సంస్కరణలు రాసిప్రసిద్ధి చెంది ,ప్రొఫెసర్ జే .సాక్సే కు సంస్కృతం నేర్పి ,గురువు రిటైర్ అయ్యాక సంస్కృత టీచర్  అయింది .ఆతర్వాత వార్స్లా, క్రాకౌ యూనివర్సిటీలలో సంస్కృత ప్రొఫెసర్లు లేరు .కాని వియన్నా నుండి ఒబెర్ హామార్ క్రకౌ కు వచ్చి వెడుతూ సంస్కృతం నేర్పాడు .

  వార్సాలో యువ విద్యార్ధి,  బౌద్ధం పై స్పెషలిస్ట్ ఎం. మేజర్ సౌత్ ఏషియన్ డిపార్ట్ మెంట్  హెడ్ అయ్యాడు .ఇతడు వసుబంధుని ’’ ప్రతిత్య సంపుత్పాద ‘’ ను వెలుగులోకి తెచ్చాడు .క్షేమేంద్రుని ‘’బోధి సత్వ వధాన కల్పలత ‘’అభి ధర్మ కోశ లకు పోలిష్ అనువాదం తెచ్చాడు .బాల్సేరోవిజ్ ,వేజ్లేర్ లుకలిసి మాగజైన్ నడిపారు .ట్రై కోస్కా –శిశుపాలవధ మీద సాధికారత సాధించి ప్రసంగాలు చేశాడు .బిరిస్కి సంప్రదాయ విధానం లో గీత బోధించింది .భారతం లోని మోక్షధర్మ పర్వం ,మనుస్మృతి బాగా అధ్యయనం చేసింది .ఋగ్వేదం లోని కాస్మాలజిని వివరించింది .ప్రపంచం అగ్నియొక్క  రూప విక్రియవలన ఏర్పడిందని చెప్పింది .క్రాకౌ యూని వర్సిటిలో డా.ఎల్ సుడిక సంస్కృత సాహిత్యం నేర్చింది .యూరోపియన్ సంస్కృతిపై భారతీయ సంస్కృతీ ప్రభావం పై రాసింది .డా మార్లేవిజ్ సంస్కృత వ్యాకరణం బోధించింది .వేదాంతం పై రిసెర్చ్ చేయించింది .డా ఏం జెర్నేయిక్  జాతకర్మపై ,గృహ్య సూత్రాలపై పరిశోధన చేసింది .డా గలేవిజ్ ,రుక్, అధర్వణ వేద మంత్రాలకు పోలిష్ అనువాదం చేసింది .ఫిలాసఫీ శాఖకు చెందిన డా కుడేల్ స్కా- గీత, ఉపనిషత్తులను పోలిష్ లోకి అనువాదం చేశారు .ఐ.కానియ భర్తృహరి శతకత్రయానికి పోలిష్ అనువాదం చేశాడు .వార్స్లా వర్సిటిలో జే సాచ్ సే సాంస్క్రిట్ భాష ,చరిత్ర గీత ,భారతం ల  పై పరిశోధన చేసింది పంచతంత్రం పై పరిశోధించింది .పోజ్ఞాల్ యూని వర్సిటి లో బి .కోయి సంస్కృతం బోధిస్తున్నాడు .పురాణాలపై శోదిస్తున్నాడు . ఈ దేశం లో గురు పరంపరను  గౌరవిస్తున్నారు .పోలిష్ పిల్లలు తండ్రిని’’తాత’’అంటూ ఆప్యాయంగా సంస్కృత విధానం లో పలకరిస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్నారు ..

10-ధాయ్ లాండ్ దేశం

చాలా  ఏళ్ళ క్రిందటి నుంచి ధాయ్ లాండ్ లో సంస్కృత అధ్యయనం జరుగుతోంది .రాజకుటుంబాలు సంస్కృతాన్ని బాగా పోషించి ప్రోత్సహించాయి .శిల్ప కోరం యూని వర్సిటి ,చూల లోన్గో కార్న యూని వర్సిటి ,మహాచూల లోంగ కొరాన్ రాజ విద్యాలయ లలావుసంస్కృత బోధనా జరుగుతోంది .శిల్పకోరం వర్సిటీలో దాదాపు యాభై ఏళ్ళనుండి సంస్కృత బోధన జరుగుతోంది .ఆర్కియాలజిలో బాచిలర్ డిగ్రీవరకు సంస్కృతం ఉంటుంది .ఇక్కడ 1974లో ఓరియ౦టల్ లాంగ్వేజెస్ డిపార్ట్ మెంట్ ఏర్పడి ఎపిగ్రఫీ ,ఓరియ౦టల్ లాంగ్వేజెస్ లోనూ లో మాస్టర్ డిగ్రీలో సంస్కృతం ప్రవేశ పెట్టారు .1976నుంచి ఇప్పటికి 180మంది సంస్కృతం లో ఎం .ఏ .సాధించారు .1997 స్టడీ సెంటర్ ఏర్పడి రిసెర్చ్ కి అవకాశం కలిగింది .దీని డైరెక్టర్ డా .చిరాపట్ ప్రపంద్వీయ  .లైబ్రరి కంప్యూటర్ ఆఫీస్ వగైరా సౌకర్యాలు కల్పించారు .2001 మే లో అ౦తర్జాతీయ సంస్కృత సదస్సు నిర్వహించారు . భారత దేశం ఇక్కడ విజిటింగ్ ప్రొఫెసర్ పోస్ట్ ఏర్పాటు చేసి బాగా ప్రోత్సహించింది .డా సత్యవ్రత శాస్త్రి మొదటి విజిటింగ్ ప్రొఫెసర్ .సంస్కృత బోధనా స్థాయి పెంచాడు .ధాయ్ దేశ విలాసం ,రామకీర్తి మహాకావ్యాలు రాశాడు .డా హరిదత్త కాలంలో బాగా అభి వృద్ధిజరిగి , ధాయ్ భూమీరియం ,సంస్క్రుతాతనం మహాకావ్యం రాశాడు ,శిలాశాసనాలు మనుధర్మ శాస్త్రం ,సంస్కృతంలోకి చేరిన పదాలు,సుత్తానుపాతంలో బ్రహ్మ ,కర్మ –పునర్జన్మ,ఉపనిషత్తులలో మోక్షం బౌద్ధం లో నిర్వాణం   వగైరాలపై పరిశోధనలు జరిగాయి .

  బాంకాక్ లోని చూలలోన్కారాన్ యూనివర్సిటి లో –ఎపిక్ సంస్కృతం లో కారకాలు ,భారతీయ వివాహ వ్త్యవస్థ ,కాళిదాస నాటకాల నాయికలు ,విదూషకులు ,అప్సరసలు ,సంస్క్రుతసాహిత్యం లో సతి ,స్త్రీలహక్కులు బాధ్యతలు ,బుద్ధ చరితలో శబ్దాలంకారాలు ,సంస్కృత ,పాలీ,ధాయ్ భాషలలో ఇంద్రుడు ,సంస్కృత నాటకాలలో ఉపమాలంకారం,నాంది  వగైరాలపై విస్తృత పరిశోధనలు జరిపి పరిశోధనపత్రాలు రాసి ప్రచురించారు .విద్యార్ధులకు ఉపయుక్తంగా –ఇంటర్ సంస్కృత వ్యాకరణం ,సంస్కృతపాఠ౦,సంక్షిప్త వేద వ్యాకరణం ,సంస్కృతబోధ ,సంస్కృత ప్రవేశన ,కారక ప్రకరణ ,అభ్యాస వ్యాకరణం,సంస్కృత రచనావిది ,అనువాద విధి ,సుభాషితాలు ,పద ప్రయోగం ,ప్రజానీతిమొదలైన 30పుస్తకాలు ప్రచురించారు.

  కుసుమ రాసా మణి-ప్రహేళిక ,సురసిత్ ధాయ్ రత్న –వ్యాస శతకం ,పెన్గ్ పొంగ్సా -సంస్కృతం లో గరుడ, నాగ ,లపై రాస్తే ,ప్రాణీ లఫానిత్ –సువృత్తి తిలక ,చారు చర్య , మొదలైన దాదాపు 25మంది సంస్కృత రచనలకు అనువాదాలు రాసిప్రచురించారు .త్రిభాష –సంస్కృత ధాయ్ ,ఇంగ్లిష్ ,నిఘంటు ను కెప్టెన్ లువాంగ్ బౌవన్న బర్నాక్ ,చతుర్భాషా-పాళీ సంస్కృత ధాయ్ ఇంగ్లిష్   నిఘంటును ప్రిన్స్ కితియకార కొమ్మాన్ ఫ్రా చందబూరి నరున్నాథ నిర్మాణం  సమర్ధ వంతంగా చేశారు  .ఈదేశం లో అనేకానేక కాన్ఫరెన్సులు సెమినార్లు 1986నుంచి 2000వరకు జరిపారు.ఈవిధ౦గా ఆధునిక సంస్కృత బోధన, అధ్యయనాలలో ధాయ్ లాండ్  మార్గదర్శకం గా ఉంది .

11-ఇటలీ దేశం

1998నుంచి 2001వరకు మూడేళ్ళ కాలం లొఇటలీలొ విక్టర్ అగోస్టిని,ఫబ్రీసియా బల్డీ సిర్రా ,గియులాంకో బోకాలి ,కార్మెన్ బొట్టో,ఆస్కార్ బొట్టో,ఆల్బర్టో చియాంత రెట్టో,రోసా మేరియా సిమినో, కార్లో డేల్లా కాసా ,క్రిస్టియానో డోగ్నిని,డీ ఒంజా చివోడా,గుస్సేప్పి ఫిలిప్పి ,రెనాటో ఫ్రాన్సి మొదలైనవారు చాణక్య రాక్షస సిద్దార్ధ ,ప్రతీకవాదం .క్షేమేంద్రుని నర్మమాల ,వర్ష ఋతు కవిత్వం ,శ౦కరాద్వైతం ,కావ్యాలలో అలంకారాలు ,భభ్రవ్య పంచాల ,శత సహస్రిక , స్వబోధోదయ మంజరి ,మొదలైన విషయాలపై పరిశోధనలు చేశారు .

మనవి-‘’ విదేశాలలో సంస్కృత అధ్యయనం ‘’శీర్షిక తో 43నుండి 46వరకు రాసిన 4 ఎపిసోడ్ లకు ఆధారం –ఢిల్లీ లోని లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం  ప్రొఫెసర్ వాచస్పతి ఉపాధ్యాయ సంపాదకత్వం లో 2001ప్రచురించిన ‘’Sanskrit Studies Abroad’’.ఈ  విద్యా పీఠం సలహాదారుల బోర్డ్ మెంబర్ గా  సంస్కృత విశ్వ విద్యాలయ మాజీవైస్ చాన్సలర్ , మన తెలుగు వారు ,కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరున్న టేకుపల్లి గ్రామ వాస్తవ్యులు ,బహు సంస్కృత గ్రంథకర్త ,దేశ విదేశాలలో సంస్కృత వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న వారైన  డా.బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు అవటం మనకు గర్వ కారణం .

 మనవి-‘’ విదేశాలలో సంస్కృత అధ్యయనం ‘’శీర్షిక తో 43నుండి 46వరకు రాసిన 4 ఎపిసోడ్ లకు ఆధారం –ఢిల్లీ లోని లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం  ప్రొఫెసర్ వాచస్పతి ఉపాధ్యాయ సంపాదకత్వం లో 2001ప్రచురించిన ‘’Sanskrit Studies Abroad’’.ఈ  విద్యా పీఠం సలహాదారుల బోర్డ్ మెంబర్ గా  సంస్కృత విశ్వ విద్యాలయ మాజీవైస్ చాన్సలర్ , మన తెలుగు వారు ,కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరున్న టేకుపల్లి గ్రామ వాస్తవ్యులు ,బహు సంస్కృత గ్రంథకర్త ,దేశ విదేశాలలో సంస్కృత వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న వారైన  డా.బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు అవటం మనకు గర్వ కారణం .  నిన్నరాత్రి శాస్త్రిగారికి 45వ ఎపిసోడ్ పంపిస్తే ,చదివి స్పందించి

kutumba sastry vempaty 10:16 AM (7 hours ago)
చాలా విలువైన వివరాలనందించి ఉపకరించారు. ధన్యవాదాలు.అని –జవాబిచ్చితమ సహృదయత చాటారు తమ సహృదయత చాటారు

   సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హితం పలికే శ్రీధర్ ఈశ్వరమ్మ సుతుడు హితము పలుకు

హితం పలికే శ్రీధర్

 శ్రీ శ్రీధర్ ఎర్రోజు ఎవరో నాకు తెలియదు కాని ఆయన రాసిన ‘’ఈశ్వరమ్మ శతకం ‘’మాత్రం నాకు ఆయనే ఈ నెల 8న పంపగా బహుశా నాలుగైదు రోజుల క్రిందట నాకు అందింది కాని నేను చూడలేదు .నిన్ననే చూసి ఆయనకు ధన్యవాదాలుచేప్పాను .నాస్పందన తెలియజేయమని చిన్న నోట్ కూడా పుస్తకం లో పెట్టారు .ఇప్పుడే శతకం చదివి నా మనోభావం తెలియజేస్తున్నాను .

 లెక్కలలో ఎం .ఎస్ .సి.చేసి లెక్కలమాస్టారుగా సమర్ధత చూపి,ప్రస్తుతం ,తెలంగాణా లక్సెట్టిపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాల గజిటెడ్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారు పగోజి మల్లవరం లో పుట్టిన శ్రీధర్ .తన మాతృమూర్తి  ఈశ్వరమ్మ గారికి ఈ పద్య శతకం అంకితం చేసి ఋణం తీర్చుకొన్నారు .లెక్కల మేష్టారు పద్యాలు రాయటం ఎయిత్  వండర్ అనిపిస్తుంది .పద్యం లో ఛందస్సు అంతా అక్షరాల లెక్కే కనుక అది వచ్చినవారికి ఇది అత్యంత సులువు .అందుకే చక్కగా సాగింది శతక రచన .సమకాలీన విషయాలన్నీ చోటు చేసుకొన్నాయి ‘’ఈశ్వరమ్మ సుతుడు హితము పలుకు ‘’అన్న ‘’మకుటాయ’’మానమైన శతకమిది . ఈశ్వర సుతుడుంటే వినాయకుడు ,కుమారస్వామి అందులో అమ్మకొడుకు గణపతి అయ్యకొడుకు శరవణుడు .ఈయన ఈశ్వరమ్మ సుతుడుకనుక సిద్ధి బుద్ధి లకుఅధిపతి ఐన విఘ్నేశ్వరుని పలుకు లోక హితమేకాక,లోకైకహితమూ ఔతు౦దనటం లో సందేహం లేదు .అందుకే 80పేజీల పుస్తక౦ లో సగానికి పైనే 48పేజీలలో ఆంధ్రదేశం లో లబ్ధ ప్రతిష్టు లైన కవీశ్వరుల,హితైషుల  అవధాన సరస్వతుల అభినందన ఆశీః వర్షం కరిసింది .ధన్యజీవి ఈ కవి .

‘’పదము పదములోన పటిక బెల్లము నిండి-పచ్చకప్పురంపు పసను కలిగి –కాజు ,పిస్త,చెర్రి కలయిక కవనమ్ము కవనమ్ము-ఈశ్వరమ్మ సుతుడు హితము పలుకు ‘’అని కవిత్వ రహస్యం చెప్పగలిగాడుకవి .ఐతే ఇందులో ఆధునికంగా కాజు పిస్తా,చెర్రి కలిపి మాధుర్యం పె౦చాడు .ముందుగా  తలిదండ్రులు, బంధువులన౦దరికీ పద్య నీరాజనం పట్టాడు .గత౦ మార్చటానికి ఘటన ఒక్కటి చాలు ,మనమే ముక్కలమైతే మతం ఎలా బతుకుతుంది ,ఆడవారి పై అలుసుభావం వద్దు ,ఒక్కపల్కరింత ,పట్టెడన్నం తో ప్రేమ పంచాలి ,పాల్తీన్ సెల్లు సొల్లు ల వ్యామోహం పై మెత్తని చివాట్లు ,గూడు మారితే గుణ౦ మారదు ,రైతన్న అన్నదాత ,గద్దె నెక్కి జనుల గతులు మరవటం ,జలం గరళమైతే జనుల మనుగడ ఎలా సాధ్యం ,అనే జవాబులేని ప్రశ్నా సంధానం చేశాడు .శక్తి పొదుపు అంటే శక్తి సృష్టి ,అడవి సంపద లేకపోతె తే అభ్రం ఎలా కురుస్తుంది అన్న మౌలిక పర్యావరణ సంబంధ ప్రశ్న , ,పరువు లేనివాడి బతుకు నరకం ,మత సహనం కన్నా మతమే లేదు దేశామాతకంటే దేవత లేదు అనే సుద్దులు చెప్పాడు .ఆలికన్నా ఆత్మీయులు లేరు ,పసుపు ముద్దకన్న పసయున్న వనరు లేదు ,ఆడవారు లేకపోతే సృష్టి ఆగే పోతుంది ,అనే నీతులూ బోధించాడు .’’కలలు కనే వేళ ,కష్టకాలం లో తల్లిభాషలోనే తల్లడిల్లే మనిషి మాతృ భాష మరువరాదని ,గాడ్జెట్ వలలో పడవద్దనీ ,ఉల్లి ధర విని ఉల్లం ఆగిపోతుందనే చమత్కారం ,అన్నిమతాలు చెప్పేది సత్యధర్మ శాంతి సహనాలే అనే విశాలభావం ,రాగి జావ చేసే చలువ రంగు నీళ్ళు చేయవనే ఎరుక ,వనాలు లేని భూమి వసుధ ఎలా అవుతుందనే ఘాటైన ప్రశ్నా ,’’నీటి పూరీ ‘’అదేనండీ పానీ పూరీ మురికి వాడల్లో తింటుంటే వ్యాధులు రాకేం చేస్తాయని ఆరోగ్యసూత్రం ,ఉచ్చ నీచాలుమరచి వెండితెర వేల్పుల ఆరాధన ,పై విసుర్లు ,ఇందులో పుష్కలం .కవిత్వానికి మరోనిర్వచనంగా ‘’రసము లెన్నొజూపు  రసధార కవనమ్ము’’ఇచ్చాడు కవి .గురువు సుద్దులు నేర్పే చుక్కాని .’’వాట్సపు గురువులు’’వాస్తుతో సహా అన్నీ చెబుతుంటే అసలు గుగ్గురువులు అటకెక్కినారని ‘’మందలింపు ,కుత్సితాలు నిండి కుళ్ళిన ‘’మనసు కడుగు టెట్లుమలినమ్ము తొలగించ ‘’అనే నిర్వేదం ,సూర్యుడికి రాత్రి చంద్రుడికి పగలు అచ్చిరావు కనుక’’ వేళకాని వేళ  విలువలు అలామారుతాయి అంటాడు అనువుగాని చోట అధికులమనరాదు అన్నదాన్ని గుర్తుకు తెస్తాడు .మళ్ళీ మరో సారి మాతృ వందనం  ‘’అమ్మ యనిన దైవ మమ్మయె గురువురా –అమ్మలేక జీవమవని లేదు –ఆమ్మ నెట్లువిడుతు వాశ్రమముల యందు –ఈశ్వరమ్మ సుతుడు హితము పలుకు ‘’చేశాడు .122పద్యాల శతకానికి కవి చిత్రాలకు తాను  రాసిన అయిదు పద్యాలను కూడా చేర్చి, కానుక చేశాడు ..ఈశ్వరమ్మ ,తల్లీ పిల్లా ,వెలుగుతున్న కొవ్వొత్తి ,సిరా బుడ్డి నెమలి ఈక కలం? తో అందమైన  ముఖ చిత్రం శతకానికి  మరింత  వన్నె చేకూర్చింది  .ధారాశుద్ధి ,,సరళ మంజుల పదజాలంతో శతకం రాణించింది మరిన్ని కవితా సంపుటాలు శ్రీధర్ వెలువరిస్తాడని ఆశిద్దాం .  

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-12-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 45-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం 6-ఇండోనేషియా దేశం

విదేశీ సంస్కృత విద్వాంసులు

45-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

6-ఇండోనేషియా దేశం

క్రీశ 1 -4శతాబ్దాలమధ్య ఇండోనేషియాలో భారతీయ రాజుల  పాలన జరిగింది .కంబూజ  అని నేడు పిలువబడుతున్న కా౦భోజలో శ్రీమార ,కౌండిన్య ,సుమత్రలో శ్రీ విజయ ,జావా ,బాలీ లలో శైలేంద్ర వంశాలు  పాలించాయి .రామాయణ భారతాలలో బౌద్ధ గ్రంధాలలో దీవులమధ్య సాహస కృత్యాల వర్ణన కనిపిస్తుంది .నౌకా వాణిజ్యం చేసేవారిని సార్ధ వాహులన్నారు .వేణు పథ,అజపథ,మేష పథ మార్గాలలో వీరు ప్రయాణించారు .గుణాఢ్యుని బృహత్కథలోనూ ఈ విశేషాలున్నాయి .ఇక్కడి వాల్మీకి రామాయణం లో సీత జాడకోసం వినత అనే సైన్యాధికారి ఇక్కడికి వచ్చింది .సుగ్రీవుడు ఫసిఫిక్ దీవులగురించి బాగా వర్ణించి చెప్పాడు –

ఫసిఫిక్ సముద్రంలో చెల్లాచెదరైన దీవులు ఇండియా గ్రీక్ చైనా అరేబియా దేశాలవారివే .పురాణవర్మ 4వ శతాబ్దిలో జావాను  పాలించిన శాసనం ఉంది .మధ్యజావాలో బుకీర్ హిల్స్ పైన ఉన్న పూతికేశ్వర శివాలయం లో ని 12సంస్కృత శ్లోకాల శిలాశాసనంపై జావా –హిందూ సామ్రాజ్య వివరాలున్నాయి .కథ ద్వీపం అనే మలేషియాలో సన్నాహ రాజు పాలన ఉండేది .మతారం కదిరి ,సింహసారి ,మజాపహిత్ వంశాల పాలన క్రీశ 732నుంచి 1486వరకు జరిగింది .

  ఇవాల్టి ఇండోనేషియా అంటే 3200 కిలోమీటర్లు తూర్పు పడమరలలో ,1800 కిలోమీటర్లు ఉత్తర దక్షిణాలలో వ్యాపించిన 13677దీవుల సముదాయం .16శతాబ్దాల హిందూపాలన తరవాత జావా ముస్లి౦ రాజ్య౦, ఆ తర్వాత డచ్ రాజ్యమైంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఆపిమ్మట జపనీయుల కిందకు వచ్చింది .సుకర్నో నాయకత్వాన .హత్తా తోడ్పాటుతో 17-8-1945 స్వతంత్ర దేశమైంది .అయితే సాంస్కృతికంగా పూర్వవిదానాన్నే అవలంబించి అభివృద్ధి చేశాడు సుకర్నో .జావారాజులు పొడవైన సంస్కృత బిరుదులే ఇష్టపడ్డారు .శాసనాలు సంస్కృతం లోనేరాయించారు .హరిసేంది సముద్రగుప్త ప్రశస్తి కి విశేష ఆదరణ ఉండేది .వందలాది సంస్కృత శాసనాలున్నాయి .జావా హిందూ రాజులు సంస్కృతం స్థానిక మలయన్ అనే జావి కలిసిన భాష ‘’కివి ‘’భాష ను ప్రోత్సహించారు .

  ఇండోనేషియా సాహిత్యం కాకవీన్ అంటే సంస్కృత కావ్య సాహిత్యం ,కిడుంగ అంటే అపభ్రంశ సంస్కృతం  జేగూరితాన్ అంటే స్థానిక జానపద సాహిత్యం గా కనిపిస్తుంది .సంస్కృత కావ్యాలన్నీ రామాయణ భారత ఇతిహాసాలు  జావా భాష లోకి అనువాదం పొందాయి సంస్కృత నీతి శాస్త్రం ,రాజనీతి శాస్త్రాలుకూడా అనువాదం పొందాయి ,కామశాస్త్రం స్మరతంత్రంగా అనువాదమైంది .సంస్కృత బాలినీస్ అనుబంధం పెరిగింది .కాళిదాస కావ్యాలన్నీ అనువాదం పొందాయి .తత్వ శాస్త్రం ‘’తుతూర్’’గా అనువాదమైంది ..హిందూ పండుగలు వైభవంగా నిర్వహిస్తారు .విమాన యాన సంస్థ లో గరుడ విమానాలున్నాయి .శివుడిని దాలెం ,విష్ణువును పూసే ,బ్రహ్మ ను దేశే, పితర ను దద్యా ,దేవాలయం పుర గా పిలుస్తారు .బాలిలో సంస్కృత విద్యాలయాలు రిసెర్చ్ కేంద్రాలున్నాయి .ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ హిందూ ధర్మ ఏర్పడింది .సింగరాజ లో వ్రాతప్రతుల లైబ్రరి ఉంది  బాలి రాష్ట్రప్రభుత్వం ఉదయన యూని వర్సిటి  నెలకొల్పింది .మహాసరస్వతి యూని వర్సిటి సిటీ మధ్యలో ఉంది . వైస్ చాన్సలర్ సంస్కృత పండితుడైన మిస్టర్ తాంబ .

7-మెక్సికో దేశం

మెక్సికో లో సంస్కృత అధ్యయన ప్రారంభానికి నాంది పలికినవాడు అస్సాం కు చెందిన ప్రొఫెసర్ హేరంబ లాల్ గుప్త .ఈయన ఇంగ్లాండ్ లో ఉండి భారత స్వాతంత్ర్య సమరం నడిపాడు .జర్మని అమెరికాలలో సీక్రెట్ స్పై సర్వీస్ లో పని చేశాడు .1927లో అమెరికాలో అరెస్టయి విచారణ ఎదుర్కొని ,అక్కడినుంచి తప్పించుకొని మెక్సికో సరిహద్దు చేరగా అక్కడి రైతులు అతడు చాలా నీరసంగా ఉండటం గమనించి ,కాపాడారు .అత్య౦త పేదరికం తో మెక్సికో సిటీ చేరి ,మెక్సికో యూని వర్సిటి లో సంస్కృత బోధనకు కుదిరి 17ఏళ్ళు1930-47 పని చేశాడు .ఆన్త్రోపాలజిస్ట్ అయిన గుప్త మెక్సికో సంస్కృతం పై అభిరుచి కలిగించి సంస్కృత జ్యోతి వెలిగించాడు .మెక్సికోలో రాజకీయ శరణార్ధిగా ఉంటూ అక్కడి అమ్మాయినే పెళ్ళాడి,చనిపోయేనాటికి 3లక్షల మెక్సికన్ పిసోస్ ధనంతో  బాగా సంపన్నుడయ్యాడు.ఇదంతా విడాకులు పొందిన భార్యకు దక్కింది .ఆయన అస్తికలు మాత్రం ఇండియాకు పంపారు .

  1963లో ప్రొఫెసర్ లేసిడిరో లాంగ్ గుప్తా స్థానంలో సంస్కృతం బోధించి 1968లో చనిపోయాడు .తర్వాత నేషనల్ యూని వర్సిటి ప్రొఫెసర్ మిగుల్ కోరోజో మూడి సంస్కృతం నేర్పాడు .ఇతడు గుప్తాగారి శిష్యుడే .సంస్కృత అధ్యయనం , యూని వర్సిటిలో బాగా వేర్లు  పాతుకున్నది .సంస్కృత గ్రీక్ లాటిన్ అవెస్తా తులనాత్మక అధ్యయనం ఇక్కడ బాగా జరిగింది .తర్వాత ఇదే పోస్ట్ గ్రాడ్యుయేట్  రిసెర్చ్ సెంటర్-‘’ఎల్ కోలీజియి డి మెక్సికో ‘’గా 1940 లో   మారి ,ఫ్రాన్స్ లోని పారిస్ లో’’  కాలేజ్ డిఫ్రాన్స్’’ ఏర్పడటానికి మార్గదర్శి అయింది .ప్రొఫెసర్లను తయారు చేసింది .డేమోగ్రఫీ ఇంటర్ నేషనల్ రిలేషన్స్ ,ఎకనామిక్స్ ,ఓరియంటాలజి లపై రిసెర్చ్ జరిగింది .ఎల్ కాలేజి మొదటి ప్రొఫెసర్ డాన్ డేనియల్ కోసియో విల్లెగాస్ ,సిల్వియో జావాల లు సంస్కృత శాస్త్రీయ అధ్యయనానికి తెర దీశారు.

  ప్రొఫెసర్ సిల్వెన్ లెవి ,లూయిస్ రెనౌ అనే ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ లు 12ఏళ్ళలో అద్భుత కృషి చేశారు 1934లో శ్రీహర్షుని రత్నావళి ప్రియదర్శిక ,,రుతుసంహార కావ్యం ,లాటిన్ వ్యాకరణ చరిత్ర ముద్రించారు .ప్రొఫెసర్ గ్రేషిలా డీ లా లామా సెంటర్ ఆఫ్ ఒరియంటల్ స్టడీస్ డైరెక్టర్ అయి ,సంస్కృత ప్రొఫెసర్ కూడా అయి , .భారతీయ న్యాయ వేదాంత అధ్యయనం చేయించి అద్వైత వేదాంతానికి స్కాలర్షిప్ కూడా ఏర్పాటు చేసింది .గౌడపాద కారిక ,మాండుక్య ఉపనిషత్ లకు భాష్యం రాసింది .వేదాంత పరిభాష,కేశవ మిశ్రుని తర్కభాష లను స్పానిష్ అనువాదం చేసి ప్రచురించింది .ప్రొఫెసర్ గోండా రాసిన సంస్కృత గ్రామర్ ను స్పానిష్ లోకి అనువదించింది .

  మొరోనాన్ డీ పెరు విద్యార్ధిగా  లామా వద్ద సంస్కృత వ్యాకరణం వేదాంతం ,సాంఖ్యం అభ్యసించాడు .ఇప్పుడు ఇండియన్ ఇండాలజీ పై అక్కడ అభిరుచి పెరిగింది .ప్రొఫెసర్ జోషి సంస్కృత కృషికి బిర్లా అవార్డ్ శ్రీవాని అవార్డ్ సాహిత్యకాడేమి అవార్డ్  వంటి ఎన్నెన్నో అవార్డులు పొందాడు  . ఆర్ వి జోషి మోహ భగ్నం  మహాకావ్యం ,శ్రీకృష్ణ కర్ణామృతం ,వేంకటాధ్వరి లక్ష్మీ సహస్రనామం ,రస పంచాధ్యాయి ,ప్రజ్ఞాపారిజాతం ,శివలింగ రహస్యం ,భక్తి మీమాంస ,స్పర్శాస్పర్శ వివేకం ,ఉపదేశ వల్లి ,రామప్రతాప చరితం సువర్ణమాల ,పతంజలి యోగ సూత్ర మొదలైన 20గ్రంధాలు జోషి ఆధ్వర్యాన ప్రచురి౦ప బడ్డాయి .ప్రోఫెసర్ రసిక్  విహారి జోషి నేషనల్ యూనివర్సిటిలో సంస్కృతం ,ఇండియన్ ఫిలాసఫీ అండ్ రెలిజియన్ బోధించాడు .ప్రొఫెసర్ జువాన్ మైగుల్  డీ మోరా ఫైలాలజి శాఖలో పని చేస్తూ భార్య లుడ్వికా      తో కలిసి ఋగ్వేదం, ఉత్తరరామ చరితం స్పానిష్ భాషలో ప్రచురించారు

  1970నుంచి ప్రొఫెసర్ డేవిడ్ లోరెంజాన్  ఎల్ కోల్లెజియం లో పనిచేస్తూ శైవ శాఖలు ,కాపాలికా ,కాలముఖా లపై అద్భుత పరిశోధనలు చేశాడు .1980లోడా. బెంజమిన్ ప్రిసియాడో చేరి  పురాణాలు కృష్ణ కథలుపై రిసెర్చ్ చేశాడు .అతదూర,సన్యాస బౌద్ధ ,తాంత్రికం  మొదలైన పుస్తక ప్రచురణ చేశాడు .ఇప్పుడు భగవద్గీత భారతం లకు స్పానిష్ అనువాదం చేస్తున్నాడు  .

8-నేపాల్ దేశం

హిమవత్ఖండం అనే నేపాల్ మహాత్మ్యం అతి పవిత్రమైన నేపాల్ గ్రంధం .నేపాల్ జనకమహారాజు కుమార్తె సీతాదేవికి గౌతమబుద్దునికి  జన్మస్థానం .ఇక్కడే మహర్షి వాల్మీకి రామాయణ మహాకావ్యం రాశాడు .మహర్షి యాజ్ఞవల్క్యుడు జనకమహారాజుతో  నిత్యం వేదాంత చర్చ చేసేవాడు .జడభరత ,పులస్య ఋష్యశృంగ మహర్షులు పుట్టిన చోటుకూడా పాణిని వ్యాకరణ ప్రచారం చేశాడు .కనుక అనాదికాలం నుంచి సంస్క్రుతకేంద్రంగా ఉంది నేపాల్ .లిచ్చవి రాజులు భారతీయ ఇతిహాస,పురాణాలను బాగా ఆదరించారు .కిరాత రాజులపా లనలో సంస్కృత బోధన అత్యున్నతస్థాయి లో వెలిగింది .సంస్కృత విద్వాంసులకు కవులకు రాజాదరణఎక్కువ  సంస్కృతం లో అనేక గ్రంథాలు ఇక్కడ రచింప బడినాయి .టిబెటన్లు నేపాల్ వచ్చి తంత్ర శాస్త్రం నేర్చేవారు .బౌద్ధ సిద్ధాంతం కూడా ఇక్కడ బాగా వ్యాపించింది .12వ శతాబ్దిను౦చి 18వ శతాబ్దం వరకు మల్లరాజులపాలన సాగింది .సంస్కృతం మాతృభాషకాకపోయినా మాధ్యమంగా చెలామణి అయింది .వ్యాకరణ ,జ్యోతిష ఆయుర్వేద తంత్ర లపై అనేక ప్రసిద్ధ గ్రంథాలు రచి౦ప బడినాయి  .వేదాలు ధర్మశాస్త్రాలపై వ్యాఖ్యానాలు వెలువడినాయి .ఆయుర్వేద బోధనా జరిగింది.

  నేపాల్ ను మల్లరాజులు పాలిస్తున్న  ప్పుడు ఇండియాలో విక్రమ సింహ వవిశ్వ విద్యాలయ౦  మహా ప్రాభవం లో ఉండేది .నేపాల్ చరిత్రకారుడు సూర్య విక్రం జ్యావలి రాసినదాన్ని బట్టి రత్నకీర్తి వైరోచన ,కనకశ్రీ వంటి మహా విద్వాంసులు ఈ విశ్వవిద్యాలయం లో చదివారు ,నేపాలీలు ఖాట్మండు కనుమ దాటి టిబెట్ గుండా  ఇండియావచ్చినలంద విక్రమశింహ యూని వర్సిటీలలో  తంత్రవిద్య నేర్చేవారు .పడమటి నేపాల్ ను ఖాస్ రాజులు పాలిస్తున్నప్పుడు సంస్కృతం గొప్ప వెలుగు వెలిగింది .రాజులందరూ సంస్కృతం లో నిష్ణాతులే కావ్యాలూ రాశారు .సిమ్హాగ్రద్ రాజు హిందూమత వ్యాప్తికి కృషి చేశాడు .12-14శాతాబ్దాలమధ్య ఇక్కడ  సంస్కృతం ఓ వెలుగు వెలిగింది .భారతీయ సంస్కృత విద్వాంసులు నేపాల్ వచ్చి తంత్రం,బౌద్ధం నేర్చేవారు .నేపాల్ ఐక్యత జరిగి సంస్కృతానికి వికసనం జరిగింది .విద్యాలయాలలో సంస్కృతం తప్పక ఒక ముఖ్య సబ్జెక్ట్ గా ఉండేది .రాణా వంశపాలన వరకు ఇలా కొనసాగింది .న్యాయస్థానాలలోనూ , అత్యున్నత ప్రభుత్వ పదవులలో సంస్కృతం లో నిష్ణాతులకే ఉద్యోగాలు ఇచ్చేవారు .సంస్కృత  తాంత్రిక  పుస్తకాలైన ‘’పురసే హర్యానవ ‘’,’’పునశ్చరణ దీపిక ,నాటకాలు జయరాహుకర్ ,సత్కర్మ రత్నావళి మొదలైనవి రాణా బహదూర్ షా ,గీర్వాణషా ల పరిపాలనా కాలం లో రచిప బడినాయి .

   1931తర్వాత సంస్కృత పాఠశాలలు ఏర్పడ్డాయి .జనక పూర్ ,మతిహని లలో సంస్కృత విశ్వ విద్యాలయాలు1955,1968లలో  నెలకొల్పారు .మాస్టర్ డిగ్రీ అయిన  ఆచార్య స్థాయి వరకు సంసృత బోధన జరిగింది .జంగ్ బహదూర్ రాజు బ్రిటన్ వెళ్లి తిరిగొచ్చాక నీల్ దేవ్ పంత్ ,వాచస్పతి పంత్ అనే విద్వాంసులు1915లో ఖాట్మండు లో  సంస్కృత విద్యాలయాలు స్థాపించారుకాని వెంటనే మూతపడ్డాయి .రాజుకొడుకు జిత్ జంగ్ 1931 రాజరాజేశ్వరి, ఖాత్మాండ్ లలో రెండు సంస్కృత స్కూళ్ళు ఏర్పాటు చేశాడు .తర్వాత దింగ్లా, భోజ్పూర్ లలోనూ సదానంద బ్రహ్మచారి ఆధ్వర్యం లో ప్రారంభించాడు.1934లో రాణీ కొఠారిలో సంస్కృత హైస్కూల్ స్థాపించాడు .రాణా బీర్ షంషేర్ 1984లో పశ్చిమమూల ఉన్న రాణి పోఖారిలో వేదం ,పురాణ వ్యాకరణ ,జ్యోతిషాలు నేర్పటానికి ప్రారంభించాడు

  2004లో   ‘జయతు సంస్కృతం ‘’అనే విద్యార్ధి ఉద్యమం తీవ్రంగా జరిగి సంస్కృత సెకండరీ ,హయ్యర్ స్థాయి బోదనలో హిస్టరీ జాగ్రఫీ కూడా చేర్చాలని డిమాండ్ చేయగా విజయవంతమై ప్రభుత్వం అంగీకరించి 2007లో ప్రజాప్రభుత్వం ఏర్పడినతర్వాత అమలు చేసింది . 2009లో రాజా త్రిభువన ప్రభుత్వ సంస్కృత కాలేజి ఆవిష్కరించాడు .మరి రెండుచోట్ల ధరన్,డాంగ్ లలో కూడా ఏర్పాటయ్యాయి .ఇవి 2016లో ఏర్పాటైన త్రిభువన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పని చేస్తున్నాయి .ఇప్పుడు 50సంస్కృత సెకండరి స్కూళ్ళు ,వేదం వ్యాకరణ జ్యోతిష న్యాయ ,సాహిత్యాలు  బోధిస్తున్నాయి .కర్మకాండ ఆయుర్వేదం యోగాలనూ బోధిస్తున్నారు .సంస్కృతం లో మార్కులకు పరిగణన ఎక్కువే .

  సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -18-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

17.12.2020 గోరసం వారు బాలుపై తెచ్చిన 88మందికవుల కవితల నీరాజనం జూమ్ ద్వారా సాతంత్రం 6గంటలకు ఆవిష్కరణ జరిగింది

 

 

“గోదావరి రచయితల సంఘం(గోరసం)”చే ఈరోజు అనగా 17 డిసంబర్ 2020 నాడు జూమ్ వేదికగా ప్రముఖ గాయకుడు కీ.శే. శ్రీ ఎస్.పి.బాలు గారికి కవితార్చన సంకలనాన్ని ఈరోజు గోరసం సంస్థ ఆవిష్కరణ చేసింది. దీనిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జానపద అకాడమీ పూర్వాధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, ప్రముఖ మాటల పాటల రచయిత శ్రీ వెన్నెలకంటి గారు, ప్రముఖ కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు, ఆంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ చలపాక ప్రకాష్ గారు, గురువులు సరసభారతి సాహిత్య సేవాసంస్థ ఉయ్యూరుకు చెందిన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు, తెలంగాణా సాహిత్య కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి దాసరి శాంతాకుమారి గారు, అక్షరకౌముది సాహిత్య సాంస్కృతిక అధ్యక్షులు శ్రీ తులసి వెంకటరమణాచార్యులు గారు, తెలుగు భాషాచైతన్య సమితి అధ్యక్షులు శ్రీ బడేసాబ్ గారు, తెలుగుభారతి అధ్యక్షులు శ్రీ పక్కిరవి శేఖర సత్యనారాయణమూర్తి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో గంధ్ర సమీక్షను ప్రముఖ బాలసాహిత్య రచయిత్రి-విభిన్న ప్రక్రియల రచయిత్రి అయిన శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోరసం అధ్యక్షులు శ్రీ శిష్టు సత్య రాజేష్ గారు అధ్యక్షత వహించారు. గోరసం కార్యవర్గం పాల్గొన్నారు. 

 

శిష్టు సత్య రాజేష్

.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 44-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

విదేశీ సంస్కృత విద్వాంసులు

44-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

4-జర్మని దేశం

జర్మనీ దేశం లో సంస్కృతం పై అభిమానం 19వ శతాబ్ది ప్రారంభం లో క్లాసిక్ రచయిత జే .డబ్ల్యు .వాన్ గోథే తో ప్రారంభమై,జే బి హెర్డర్ తో స్థిరపడింది  .వాన్ షెలేగల్ ,అనే హంబోల్ట్ ఇండియన్ స్టడీస్ కు పీఠాలను 1818లో బాన్ ,1821లో బెర్లిన్,1826లో కీన్స్ బెర్గ్  యూని  వర్సిటీలలో నెలకొల్పటం తో గొప్ప ప్రోత్సాహం లభించింది .యూని వర్సిటీలలో సంస్కృత విద్యాబోధన 2001లో ప్రారంభమైంది .రాజకీయాలు ,ప్రోత్సాహం లేకపోవటం నిధులు సమకూరక పోవటం ఇబ్బందులు కల్పించాయి .తర్వాత కొన్ని పీఠాల తొలగింపు కూడా జరిగింది .

  బెర్లిన్ లో ‘’వశిష్ట ధర్మ సూత్ర’’  రూపు దాల్చుతోంది .లేఖా పధ్ధతి తయారౌతోంది .జైమినీయ బ్రాహ్మణం ముద్రి౦ప బడింది.హిదూ దేవతారాధన పై పరిశోధనలు జరిగాయి .బోఖం లో శ్రౌత సూత్రాలు పై పరిశోధన జరిగింది .బాన్ లో భారతీయ పంచాంగ గణనం పై పరిశోధన జరిగింది .చాళుక్యులకాలం నాటి బ్రాహ్మణాలు,కంబోడియా శాసనలలో సంస్కృతం ,బౌద్ధసంస్కృతం లపై పరిశోధనలు జరిగాయి . ఫ్రాంక్ ఫర్ట్ లో సంస్కృత రచనలన్నీ డిజిటలైజ్ చేయటం జరిగింది .ఫ్రీ బర్గ్ లో పాకిస్తాన్ శిలాశాసనాలపై ,కావ్యాలలో,త్రిపిటకాలపై సంస్కృతం పై ,అనర్ఘ రాహ్జవం అనువాదం ,గిలిగిత్ వ్రాతప్రతులు పై పరిశోధన జరుగుతోంది .గోట్టేన్ బెర్గ్ లో శ్రీలంకలో సంస్కృతం ,సర్వాస్తి వాదం ,మహా పరి నిర్వాణ సూత్రంప్రచురణ , బౌద్ధ గ్రంధాలపై సంస్కృత నిఘంటువు ,ఉత్పత్తి ప్రకరణ ప్రచురణ జరిగాయి .హాం బర్గ్ లో గ్రందాల పరిరక్షణ జరిగింది రఘు వంశం ,న్యాయ వైశేషిక పై పరిశోధన జరిగింది .హీడేల్ బెర్గ్ లో ఒరిస్సాలో మహిమా ధర్మం ఉద్యమం ,సంస్కృత సింటాక్స్,పశుపతి నాథ దేవాలయం లో పూజారుల సంఘర్షణ లపై అధ్యయనం చేశారు .కీల్ లో హరి వంశం పై ,భట్టికావ్యం లో పదవ సర్గ ,,ప్రాచీన భారత ,గ్రీక్ ఫిలాసఫీ లలో విభేదాలు ,.లేప్జిగ్ లో ప్రాకృత కావ్యాలు ఖాట్మండు లోని స్వయంభూ చైత్య వేదసూక్తులు,కౌటిల్య అర్ధ శాస్త్రం పై గొప్ప పరిశోధనలు జరిగాయి .మైంజ్ లో ఋగ్వేదం శాకుంతలం పైనా ,పంచతంత్ర అధ్యయనం చదరంగ చరిత్ర ,కాళిదాస కవిత్వం లో రూపక శోభ .మార్బర్గ్ లో టిబెట్ లోని సంస్కృత గ్రంధాలు ,ఆర్యసూర జాతకమాల లో వేదాంత విషయాలు ,కావ్యాదర్శం ,మహాసంవరతుని కథలపై రిసెర్చ్ జరిగింది .మ్యూన్ చెన్ లో సంస్కృత నాటకాలు ,జైనం భారతీయ క్రీడలు ,కాలచక్రం ,మృత్యువనాన లపై పరిశోధనలు జరిగాయి .మ్యూన్ స్టర్ లో సర్వాస్తివాదం ,శంకర ,వేదసాహిత్యం ట్యూ బింగెన్ లో సంస్కృత నాటక శాలలుపై ,వ్యూర్జ్ బర్గ్ లో వేద వచన గ్రంథాలు పై విశిష్ట పరిశోధనలు జరిగాయి . ,,

5-హంగేరి దేశం

బుడాపెస్ట్ లోని  రొట్వోస్  లోరాండ్ యూనివర్సిటి  ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్స్ డిపార్ట్ మెంట్ లో సంస్కృతం లోనాలుగేళ్ళ  ఎం .ఏ. క్లాసులు ప్రారంభించారు .1995లో బోధనకు అంతరాయం కలిగింది .రీడర్ పోస్ట్ తీసేశారు .యూని వర్సిటి ఆఫ్ స్వేజ్డ్ లో ప్రాచీన హిస్టరీ శాఖలో అడ్వాన్సేడ్ సంస్కృత ప్రాధమిక క్లాసులు నిర్వహించారు .మతగ్రంధాల అధ్యయనం చేయించారు .బుడాపెస్ట్ లోని టాన్ కపూజా అంటే ధర్మద్వారం కాలేజిలో సంస్కృత కోర్సుల బోధన జరిగింది .బుద్ధిష్ట్ కాలేజి సంస్కృత ఉపాధ్యాయుడు టైబార్ కోర్ట్ వెలేసి పైకాలేజిలో ప్రాక్టికల్ సంస్కృత గ్రామర్ బోధించాడు .ప్రపంచ సంస్కృత సమ్మేళనాలు నిర్వహించారు .ప్రొఫెసర్ జోజేఫ్ వెక్రేడి వాల్మీకి రామాయణంకు అశ్వ ఘోషుని బుద్ధచారితం కు  హంగేరియన్ భాషానువాదం చేశాడు .బౌద్ధ గ్రంథాలు జాతక,ధమ్మపద లకు అనువాదం జరిపాడు .మానవ ధర్మ శాస్త్ర ,దశకుమార చారిత్ర లకు జూడిత్ ఫీయర్ అనువాదాలు రాశాడు.నాగార్జునుని రత్నావళి కి మూలమధ్యమకారిక కు ఫెరెంక్ రుజ్సా అనువాదాలు రాశాడు  బ్రహ్మసూత్ర శంకరభాష్యానికి అనువాదం జరిగింది .ప్రొఫెసర్ గూలా వోజ్టిల్లామనుధర్మశాస్త్రం లోని ఏడవఅధ్యాయం పై పరిశోధన పత్రం రాశాడు .కృషి శాస్త్ర ను ప్రచురించాడు .కృషి సమయనిర్ణయం రాశాడు ఇండో ఆర్యన్  భాషలపై పరిశోధనలు జరిగాయి .’’గోధూమ’’ అనేమాట అనేక  ఇండో యూరోపియన్ భాషలలోకి చేరింది .ప్రస్తుతం కామశాస్త్రం ,దామోదర గుప్తుని కుట్టానీమాటం లపై పరిశోధనలు జరుగుతున్నాయి .అనేక జర్నల్స్ కూడా సంస్కృత వ్యాప్తికి సహకరిస్తున్నాయి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-12-20-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ చర్ల గణపతి శాస్త్రి, శ్రీమతి చర్ల సుశీల దంపతుల సాహిత్య ,సేవా పురస్కార ప్రదానం

శ్రీ చర్ల గణపతి శాస్త్రి, శ్రీమతి చర్ల సుశీల దంపతుల సాహిత్య ,సేవా పురస్కార ప్రదానం

సాహితీ బంధువులకు శుభకామనలు –2021నూతన ఆంగ్లసంవత్సరం ,సంక్రాంతి శుభాకాంక్షలు –

శ్రీ చర్ల సుశీల వృద్ధాశ్రమ నిర్వాహకులు డా చర్ల మృదుల గారు  నాలుగు రోజులక్రితం నిడదవోలు నుంచి ఫోన్ చేసి 10-1-2021 ఆదివారం ఉదయం 10గంటలకు నిడద వోలు దగ్గర మల్లవరం లోని తమ తలిదండ్రుల పేర వున్న వృద్ధాశ్రమ ప్రాంగణం లో తమ పితృదేవులు బహు గ్రంథ కర్త , కళాప్రపూర్ణ, బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి స్మారక సాహిత్య పురస్కారం నాకూ ,తమ మాతృమూర్తి  సాంఘిక సేవా తత్పరురాలు శ్రీమతి చర్ల సుశీల గారి స్మారక సేవా పురస్కారాన్ని  మా శ్రీమతి శ్రీమతి ప్రభావతికి అందజేయటానికి చర్ల సిస్టర్స్ మరియు వృద్ధాశ్రమ నిర్వాహకులు నిర్ణయించామని తెలియజేయగా ,వినమ్రంగా అంగీకరించామని సంతోషంగా మీకు తెలియ జేస్తున్నాను .మిగిలిన వివరాలు ఆహ్వానపత్రం ద్వారా తెలియ జేస్తాము .మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-12-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.29 చతుర్దశ సర్గ -3

కిరాతార్జునీయం Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విదేశీ సంస్కృత విద్వాంసులు 43-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

విదేశీ సంస్కృత విద్వాంసులు

43-విదేశాలలో సంస్క్రుతాధ్యయనం

1-కెనడా దేశం –1996-2001

అశోక్ అక్లుజ్ కర్- వాన్కూవర్ లోని  యూని వర్సిటి ఆఫ్ బ్రిటిష్ కొలంబియా లో ఏషియన్ స్టడీస్ డిపార్ట్ మెంట్ లో రిసెర్చ్ స్కాలర్ .భర్తృహరి ,ఆయన వ్యాఖ్యాతలపై పరిశోధన చేశాడు .కకెనడలో సంస్కృతం పై పరిశోధన చేశాడు .ముక్తాక్ అక్లుజ్ కర్ –భర్తృహరి పునరావృత్తులు పై పరిశోధన చేశాడు .విద్యుత్ అక్లుజ్ కర్ –సంత్ సంప్రదాయం పై నా ,లియోనా ఆండర్సన్ –హిందూమతం పండుగలు ,ఎ. డబ్ల్యు. బార్బర్ –దక్షిణ తూర్పు ఆసియా బౌద్ధం పైనా ,మందాక్రాంత బోస్ –సంస్కృతసాహిత్యం లో నృత్యం , జాన్ బ్రెజినిస్కి –కృష్ణభక్తి ,విత్ బుబెనిక్ –సంస్కృతం –అపభ్రంశ సంబంధాలు ,వి.కృష్ణ చారి –సంస్కృత విమర్శ, ఆండ్రే కొట్యూర్-హరివంశ౦  భారతం లో భాగం ,గిల్లెన్ బ్రెండాన్ –  సంస్కృత భాషా శాస్త్రం –ఫిలాసఫీ ,రిచర్డ్ హేయస్-ధర్మాకృతి రాసిన ప్రమాణ వార్తిక స్వ వృత్తి,క్లాస్ క్లోస్టర్మీర్ –మాధవాచార్య కృత శంకర దర్శనం ,రోజేర్ మార్కో రేల్లీ –అద్వైత వేదాంత ,టిఎస్ రుక్మణి-అద్వైత వేదాన్త,,భక్తి ,యోగ ,అరవింద్ శర్మ –శంకర ఆన్ స్థిత ప్రజ్ఞ,బ్రజ్ మోహన్ సిన్హా –హిందూమతం- గీత ,శ్రీనివాస్ తిలక్ –మహాభారతం ,-వ్యాకరణం ,నాటకీయత ,అలంకార శాస్త్రం,ఎ.కే. వార్డర్ –కావ్య ,పాళీ ,బౌద్ధం .లపై పరిహోధనలు చేసి పుస్తకాలు ప్రచురించారు .

2-క్రోషియా దేశం

    18వ శతాబ్దం లో పాలినాస్ ఆన్ పిలువబడే ఫిలిప్ వేస్డిన్-1748-1806మొదటి సంస్కృత గ్రామర్ ‘’సిధారుబం  సేయు గ్రమాటికా సాంస్కర్డమికా ‘’1790లో రాసి రోమ్ లో  ప్రచురించాడు.19వ శతాబ్దిలో క్రోషియన్ ఫైలాలజిస్ట్ లు ఓల్డ్ స్లావోనిక్ మరియు సంస్క్రుతాలను రిసెర్చ్ కోసం ఎన్నుకున్నారు .జాగ్రెబ్ యూని వర్సిటిలోమొదటి బోధనాంశంగా సంస్కృత౦ ఉండేది .  .1959లో ఇండాలజీ పీఠంఏర్పడి , స్వెటోజర్ పెట్రోవిక్ కంపారటివ్ లిటరేచర్ ప్రొఫెసర్  అయ్యాడు .మొదటి ఇండాలజీ ప్రొఫెసర్ రాడోస్లావ్ కాటికిక్ తో కలిసి ఇండియన్ స్టడీస్ కర్రిక్యులం తయారు చేశాడు .తర్వాత ఫిలాసఫీలో ఇండియన్ ఫిలాసఫీ శాఖ ఏర్పడి,కంపల్సరి చేశారు .ఇండియన్ ఫిలాసఫీకి మొదటిప్రోఫేసర్ సేదోమిన్ వేల్జాకిక్ .తర్వాత శ్రీలంక వెళ్లి బౌద్ధ సన్యాసి అయి చాలా రాశాడు .ఆయన శిష్యురాళ్ళు డా.రాదా ఇవేకోవిక్ ,ఇండియన్ ఫిలాసఫిపై చాలా రాసింది .కాటికిక్ తర్వాత ఆయన శిష్యురాలు డా.మిల్కా జాక్ పింహాక్ ప్రోఫెసర్ అయి ,  వేదిక్ గ్రామర్ పై పరిశోధనలు చేయించింది .కాటికిక్ శిష్యురాలు ప్రొఫెసర్ డ్వార్కా మాటిసిక్ సంస్కృత ఇతిహాసాలు కావ్యాలపై అభిరుచి చూపింది .చాలా విలువైన రిసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించింది.తంత్రాఖ్యాయిక,ఉభయాభిసారిక లకు కు  క్రోషియన్ భాషాను వాదం చేసింది.ప్రస్తుత ప్రొఫెసర్ మిస్లావ్ జేజిక్ భగవద్గీత,ఋగ్వేద మంత్రాలపై పరిశోధన చేశాడు .ఇటీవలే ఉపనిషత్ లకు అనువాదం రాసి ప్రచురించాడు .సారా గోంక్ మొకానిన్ భారతీయ సాహిత్యం పై ఎన్నో వ్యాసాలూ రాసింది .నాట్యం పై రిసెర్చ్ చేసింది మృచ్చకటిక నాటకం అనువాదం చేసి ప్రదర్శించింది .జేరాన్ మిసురాక్ ఈమధ్యే మేఘదూత కావ్యాన్ని భగవద్గీతనూ అనువాదం చేసింది .

1874నుంచి క్రోషియాలో సంస్కృత బోధన జరుగుతోంది .యూనివర్సిటి ఆఫ్ జాగ్రెబ్ ,లో అతిముఖ్యమైన సంస్కృత గ్రంథాల అనువాదం జరిగింది.పెరో బుడామిని –కాళిదాస శాకుంతలం  ,భేతాళపంచ వింశతిక లనుక్రోషియన్ భాషలొకిఅనువది౦చాడు .దియేటర్ లలో సంస్కృత నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నారు .1895లో మృచ్చకటిక నాటకాన్ని వసంత సేన పేరుతొ జాగ్రెబ్ లో ప్రదర్శించారు .1897లో శాకుంతలం ప్రదర్శించారు.

3-ఫ్రాన్స్ దేశం

ఫ్రెంచ్ జెసూట్ మిషనరీ జీన్ ఫ్రాన్కోసిస్ పాన్స్ 1698నుండి ఇండియాలోబెంగాల్ లో  ఉండి బోపదేవ్ వ్యాకరణం ద్వారా సంస్కృతం అధ్యయనం చేశాడు .సంస్కృత గ్రామర్ ను సగం లాటిన్ సగం ఫ్రెంచ్ భాషలో రాశాడు .అమరకోశం లాటినీకరించాడు .సంస్కృత బెంగాలీ భాషలలో ఉన్న 250 తాళపత్ర గ్రంథాలు సేకరింఛి పారిస్ లోని కింగ్ లైబ్రరీకి పంపాడు .మరో జెసూట్ మిషనరీ ఫ్రాంకోయిస్ కోర్డాక్స్ సంస్కృత భాష కు ,యూరోపియన్ భాషలకు ఉన్న సంబంధంపై శోధించి గొప్ప వ్యాసాలూ రాశాడు .యాన్క్విటిల్ డుపెరాన్ 1731-1805 హిందూ ,పార్సీ గ్రంథాల అధ్యయనం కోసమే ఇండియా వచ్చాడు .చాలా ఏళ్ళు ఉండి జెండ్ అవస్తా , ,ఉపనిషత్తులను లాటిన్ అనువాదం చేశాడు .తర్వాత దారా షికో రాసిన  పర్షియన్ కావ్యాన్ని కూడా అనువాదం చేసి 1802-03లో ప్రచురించాడు .ఇతడి ప్రభావం చాలా ఎక్కువ .

  కాలేజ్ డీ ఫ్రాన్స్ లో సంస్కృత పీఠం1814లో ఏర్పడిన  తర్వాత ఫ్రాన్స్ లో  సంస్క్రుతాభిరుచి పెరిగింది .యూరప్ లో ఏర్పడిన మొదటి పీఠం ఇదే .ఏ ఎల్ చేజి పోన్స్ గ్రామర్ ద్వారా సంస్కృతం నేర్చి ,1830లో బెంగాలి భాషలో ఉన్న కాళిదాసు శాకుంతలం ను అనువదించి ప్రచురించాడు .ఇతడితర్వాత యూజీన్ బర్నౌఫ్ 1801-1852 శాస్త్రీయంగా సంస్కృత అధ్యయనం  పై దృష్టిపెట్టాడు .హిందూ బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేయించాడు .భాగవత పురాణం కు ఫ్రెంచ్ అనువాదం చేసి ప్రచురించాడు సంస్కృత బౌద్ధ గ్రంథం’’సద్ధర్మ పుండరీక సూత్రా ‘’ను అనువదించాడు .రెండు శతాబ్దాలకాలం లో సంస్కృత వాజ్మయం అంతా ఫ్రాన్స్ వారు అధ్యయనం చేసి తమభాషలోకి అనువది౦చుకొన్నారు .

 1663లో స్థాపించబడిన మరో విద్యాకేంద్రం అకాడెమి ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ హ్యుమానిటీస్ లో 55మంది పరిశోధనలు చేశారు ప్రాథమిక స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు సంస్కృత బోధన జరిగింది .ఋగ్వేదం పై కూలంకషంగా పరిశోధన జరిగింది .లియాన్ యూనివర్సిటి లో మహాభారతం పై విస్తృత పరిశోధనలు చేశారు .మూడవ విద్యాకేంద్రం ఈకోల్ లో1868లో  ఏర్పడిన ‘’ప్రాక్టికల్ స్కూల్  ఫర్ హయ్యర్ స్టడీస్’’సార్వత్రిక విద్యకు ద్వారాలు తెరిచి మహోపకారం చేసింది .హిస్టరీ, ఫైలాలజి, రిలీజియన్ లకు అధికప్రాధాన్య మిచ్చింది .తాంత్రికం శైవం ,వ్యాకరణ మీమాంస ,న్యాయ అలంకార శాస్త్ర సాంఖ్య యోగ ఆయుర్వేదాలకు విశేఖ ప్రాముఖ్యత నిచ్చింది .సంస్కృత గణితాధ్యయనం పై అభి రుచి కల్పించింది .పతంజలి మహాభాష్యానికి వ్యాఖ్యానం రాసిన సాంప్రదాయ మహా విద్యావేత్త ఎం.ఎస్. నరసింహా చార్య వద్ద సిల్వేనియాన్ ఫిల్లిజోట్ వ్యాకరణం అభ్యసించాడు .మహాభాష్య౦  లోని ప్రదీప, ఉద్దోత అనే రెండు భాగాలకు అనువాదం రాసి ప్రచురించాడు .శైవ ఆగమాలకూ అనువాదాలు చేశారు .మధ్యయుగానికి చెందిన ‘’సోమ శంభు పధ్ధతి ‘’ని హెలెన్ బ్రన్నార్ లాకక్స్ కృషితో వెలువడిం ది.మరోముఖ్యమైన సంస్థ –నేషనల్  సెంటర్ ఫర్ సైంటిఫిక్ రిసెర్చ్ ‘’ఏర్పడి అన్ని సైన్స్ విషయాలపై రిసెర్చ్ కు అవకాశం కల్పించింది .సంస్కృత అధ్యయనానికీ అవకాశం కల్పించింది .ఈవిధంగా ఫ్రాన్స్ దేశం సంస్కృత అధ్యయనానికి అన్ని విధాలా తోడ్పడి అగ్రభాగాన నిలిచింది .

 సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-20-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.28 చతుర్దశ సర్గ -2

కిరాతార్జునీయం-.28

చతుర్దశ సర్గ -2

కిరాతునితో కిరీటి ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’మీ రాజు నా స్నేహానికి యోగ్యుడు అని ఎలాచచెప్పగలవు ?అతడికి మునులంటే ఈర్ష్య .గుణోన్నతులైన వారిని ద్వేషించే విరోధులు సజ్జనులకు ఎప్పుడూ శత్రువులే –‘’సఖా న యుక్తః కథితఃకథం త్వయా –యదృచ్ఛయా సూయతి యస్తపస్యతే –గుణార్జనోచ్ఛ్రాయ విరుద్ధ బుద్ధయః –ప్రకృత్యమిత్రా హి సతామసాధనః .మేము వర్ణాశ్రమ ధర్మ సంరక్షుకులమైన క్షత్రియులం .హీనజాతి హి౦సామార్గగామి మీ రాజుతో స్నేహం ఎలా చేస్తాం ?ఏనుగులు నక్కలతో స్నేహం చేస్తాయా ?మీరాజుతో అందుకే స్నేహం కుదరదు .-‘’వయం కృవర్ణాశ్రమ రక్షణోచితాః-క్వ జాతిహీనా మృగ జీవితచ్ఛిదః-సహాప కృష్టైర్మహతాం న సంగత౦ –భవంతి గోమాయు సఖా న దంతినః’’ .మూర్ఖుడు  సజ్జనులను అవమాని౦చినంత మాత్రాన వాళ్ళ ధీరత్వానికి లోటు ఏమీరాదు.సమాన పరాక్రమ౦,  వంశం, ,పౌరుషం ఉన్నవారు అతిక్రమిస్తేనే అది అవమానమౌతుంది –‘’పరోవ జానాతి యదజ్ఞతా జడ-స్తదున్నతాం న విహంతిధీరతాం-సమాన వీర్యా న్వయ పౌరు షేషు యః-కరోత్యతి క్రాంతి మాసౌ తిరస్క్రియా’’ .సజ్జనులు నీచులతో వైరం పెంచుకొంటే వారి కీర్తికే చెడ్డ పేరొస్తుంది.వారి తో స్నేహం చేస్తే గుణాలు  చెడిపోతాయి .అందుకే నీచులతో సజ్జనులు ఉపేక్షా భావం తో ఉంటారు .ఈ రెండు కారణాలవలన మీరాజు పలికిన తిరస్కార వాక్యాలు సహించాను .కాదూ కూడదూ అంటూ ,బాణాన్ని తీసుకోవటానికే ఇక్కడికి వస్తే ,భయంకర సర్పం పడగపై శిరోమణి గ్రహించటానికి వచ్చిన వాడి గతేపడుతుంది –‘’మయా మృగాన్ హంతు రనేన హేతునా –య విరుద్ధ మాక్షేప వచస్తి తిక్షితం –శరార్థమే ష్యత్యథ లప్స్యతే గతిం –శిరోమణిం దృష్టివిషాజ్జి ఘ్రుక్షతః ‘’.’

   ఇలా అర్జునుడు తన అభిప్రాయం చెప్పగా కిరాతుడు సైన్య సమేతంగా ఉన్న శివుడి దగ్గరకు విషయం చెప్పటానికి వెళ్ళాడు .తర్వాత కిరాత సేనాపతి ఆజ్ఞతో సేన భయంకర శబ్దాలు చేస్తూ బయల్దేరింది .ప్రళయం లో సుడిగాలితో సముద్ర తరంగాలు ఎగసి పడుతున్నట్లుగా ఉంది .అప్పుడే అనుకూలవాయువు వీచింది .సుగంధ తు౦పురులతోసేన పతాకాలు రెపరెప లాడుతూ యుద్ధానికి తొందర చేస్తున్నట్లు ఆగాలి సేనకు ముందే వీచింది .జయజయ ధ్వానాలు అల్లతాడు ధ్వనులు పర్వత గుహలనుంచి భూమిని కంపింప జేస్తూ దిక్కులన్నిటా వ్యాపించింది .తీక్ష్ణమైన కిరాతుల శస్త్రాలపై పడిన సూర్య కిరణాలు అధికకా౦తితో అని దిక్కుల్నీ కాల్చి వేస్తున్నట్లు ప్రకాశించాయి –‘వనే సదాం హేతిషుభిన్న విగ్రహై –ర్విపు స్పురే రశ్మి మతో మరీచిభిః’’.  శివుడు విశాల వక్షస్థలం తో ఒక వైపు ఆచ్ఛాదించి ,అల్లెత్రాడు లాగి ,ధనుస్సును మండలాకారం గా చేసి భయంకర ధ్వని కల్పిస్తూ ,తన ప్రభావం తో రెండుప్రక్కలా భూమిని వ్యాపించాడు .ప్రమథ గణాలుమధ్యలో ఉన్నా ,వారందరికీ పైనే ఉన్నట్లు ప్రకాశించాడు –‘’వితత్య పక్షద్వయ మాయత౦ బభౌ –విభుర్గణానాముపరీవ మధ్యగః ‘’.

  గణాలు సమాన వేగంగా పోటీ పడుతూ ముందుకు సాగుతోంది .వనాలు శ్వాస పీల్చుకోవటానికి కూడా వీలు లేనట్లు అతలాకుతలమయ్యాయి –‘’గణైరవి చ్చేదనిరుద్ధ మాబభౌ –వనం నిరు చ్ఛ్వాస మివాకులాకులం .సేన పర్వతాలు ఎక్కుతూ దిగుతూ పోతుంటే ,క్షణం లో ఎత్తుపెరిగి ,మరుక్షణం లో లోతుగా మారినట్లు కనిపించాయి –‘’కిరాత సైన్యే రపిధాయ  రేచితా –భువః క్షణం నిమ్నత యేవ భేజిరే ‘’.సైన్యం పెద్దపెద్ద అ౦గ లేస్తూ వెడుతుంటే తీగలు తొక్కిడికి గురై ,సైన్యవేగంవలన ఏర్పడిన గాలితో మద్ది ,చందన వృక్షాలు అటూ ఇటూ ఊగి వనాలు గణాలకు తలవాల్చాయా అని పించింది .

 ఇక్కడ  మద జలం కారి చిక్కిపోయిన ఏనుగులా ఘోర తపస్సు తో చిక్కి బక్క అయిన అర్జునుడు ఉన్నాడు .దిక్కులను కాల్చే అగ్ని తేజస్సుతో ఉన్నాడు  -‘’పరిజ్వలంతం నిధనాయ భూ భ్రుతాం-దహంత మాశాఇవ జాత వేదసం ‘’.  ,అనుకూల మిత్రుని పొందే కోరికగా ,జయం పొందే కాంక్షగా అమ్ములపొది నుంచి అలవోకగా ఒక బాణం తీయటం లో –విఫలమై ,ప్రతీకారం తీర్చుకోవాలనే సముద్రం లాంటి కిరాత సేన ను నిర్లక్షంగా చూశాడు .-‘’అనాదరోపాత్త  ధృతైక సాయకం –జయేనుకూలే సుహృదీవస స్పృహం-శనై రపూర్ణప్రతీకార పెలవే-నివేశయంతంనయనే బలో  దధౌ ‘’

  ఆపదలను దూరం చేసే గా౦డీవాన్ని ధరించి ,సహజ సిద్ధ స్థితి లో కూర్చుని దాటరాని మహా సముద్రంలా భాసి౦చాడు. అర్జునముని –‘’నిషణ్ణ మాప త్ప్రతి కారకార ణే-శరాసనే ధైర్య ఇవానపాయినీ –అల౦ఘనీయం ప్రకృతావపి స్థితం –నివాత నిష్కంప మివాపగాపతిం .’’ఎదురుగా చచ్చి పడిఉన్న పందివధ కారణంగా అర్జునుడు మృత్యు భయంకర రూపం గా ఉన్నాడు .యజ్ఞం లో బ్రాహ్మణ ఆహ్వానం పై వచ్చిన సాక్షాత్ రుద్రునిలా తపోరుద్రుడు అర్జునుడు ఉన్నాడు –‘’ఉపే యుషీం బిభ్రత మంతక ద్యుతిం – వధాదదూరే పతితస్య దంష్ష్ట్రిణః-పురః సమావేశిత సత్పశుం ద్విజైః-పతిం పశూనా మివ హూతమధ్వరే’’.ధైర్యంతో ఇతరుల గౌరవాన్ని జయి౦చేట్లు గంభీరంగా ఉన్నాడు .నాలుగు వైపులా దట్టమైన చెట్లు పెరిగి వ్యాపించి అంధకారం కలిగించే మహాపర్వతంలా ఉన్నాడు –‘’విజేన నీతంవిజితాన్య గౌరవం –గాభీరతాం ధైర్య గుణేన భూయసా -వనోదయేన ఘనోరు వీరుధా-సమంధ కారీకృత ముత్త మాచలం ‘’.మహా వృషభ మూపురం వంటి ఎగు బుజాలు ,లావైన బలమైన మెడ,కోట గోడ లా విశాలమైన  వక్షస్థలం కలిగి ఉన్న అర్జునుడు మహాభారమైన భూమిని సముద్రం నుంచి ఉద్ధరించే మహా ఆది వరాహ మైన  విష్ణుమూర్తిలా లా భాసి౦చాడు-‘’మహార్షభస్కంధమనూన కంధరం –బృహచ్ఛిలా వప్ర ఘనేన వక్షసా –సముజ్జి హీర్షు౦ జగతీంమహా భరాం-మహా వరాహం మహాతోర్ణ వాదివ ‘’

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-12-20-ఉయ్యూరు

 .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కార్తీక బహుళ శనివారం 12-12-20 రాత్రి లక్ష దీపారధన అనే అయ్యప్పేశ్వర చక్రరూప దీప మహోత్సవం

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కార్తీక బహుళ శనివారం 12-12-20 రాత్రి లక్ష దీపారధన అనే అయ్యప్పేశ్వర చక్రరూప దీప మహోత్సవం

 

https://photos.google.com/album/AF1QipM-O2q4FAVv21i-tdl0U1eyxSuTu5W5hxDbySXk

Posted in దేవాలయం | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.26 త్రయోదశ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.26

త్రయోదశ సర్గ -3(చివరి భాగం )

 శివుడు పంపిన భిల్లుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు ‘’సూర్య తేజస్సు ను మించిన నువ్వు వరాహాన్ని చంపిన మా నాయకుడి బాణాన్ని అపహరించటం తగిన పనికాదు.మనువు మొదలైన వారు ఉత్తమ మార్గాలను బోధించారు. నువ్వే అధర్మగా ప్రవర్తిస్తే మిగతావారి సంగతేమిటి ?ఆత్మజ్ఞానులైన యతులు జనన మరణాలు జయించి విపత్తులకు కారణమైన అపమార్గం లో ప్రవేశించకుండా సన్మార్గం బోధిస్తున్నారు .అంటే నువ్వు సన్మార్గం, సచ్చీలం ఎప్పుడూ వదలకూడదని సూచన .తపస్సులో నిరతులైనవారికి వినయం పుణ్యాన్నిస్తుంది .సుఖం కోరితే సంపదలిస్తుంది. యోగులకు ముక్తి నిస్తుంది .అంటే వినయశీలం చతుర్విధ అర్ధాలను ఇస్తుందని భావం –‘’తిష్టతాం తపసి పుణ్య మానజన్ –సంపదో సుగుణయన్ సుఖైషితాం –యోగినాం పరిణమన్విముక్తయే –కేన నాస్తు వినయః సతాం ప్రియః .నీబాణం మా యజమాని  బాణం లాగానే ఉండి ఉండచ్చు .ఐతే ఇతరులబాణాన్నితీసుకోవటానికి అపసవ్యమార్గం లో ప్రయత్నిస్తున్నావు .అభిమాని, సజ్జనుడు అయిన నువ్వు    నిస్పృహతో ఈ పని చేయటం తప్పు .ఇతరులు చంపిన మృగాన్ని మళ్ళీ కొట్టటం కూడా తప్పే .,సిగ్గు మాలిన పనే –‘’అన్యదీయ విశిఖే న కేవలం –నిస్పృహస్య భవితవ్య మాహృతే –వ్రీడి తవ్యమపి తే సచేతసః ‘’.మా యజమాని కిరాతపతి నీపని ఉత్కంఠ తో విని  సంతోషిస్తారో ,లజ్జితులౌతారోతెలీదు .ఎవరైనా మాస్వామిని కీర్తిస్తారు .స్వామి పేరు పరిహాసంగా చెప్పటానికి సిగ్గు పడతారు అనగా మహాత్ములు తమకీర్తిని గురించి గొప్పగా వినటానికి ఇష్టపడరు అని భావం .ఆత్మ ప్రశంస నచ్చని మా స్వామి ఇతరుల దోషాలను గుణాలు అని ఎలాచేప్తారు ?అయినా అవసరం వచ్చినప్పుడు చెప్పక తప్పదు .ఒకవేళ మా స్వామి పందిని చంపక పోయి ఉన్నట్లయితే ,ఏమయ్యేదో అనే భయవార్త చెప్పరాదు .దేవుడు నీకు అలాంటి ఆపద కల్పించరాదు-‘’దుర్వచనం తదథ మాస్మభూనృగ-స్తయ్యసౌ యదకరిస్య దోజసా –నైవ మాశు యది వాహినీ పతిః-ప్రత్యపత్స్వ త శితేన పత్రిణా’’.ఇద్రుని వజ్రాయుధం లా బలీయమైన ఈ వరాహాన్ని  మాస్వామి కిరాతపతి తప్ప ఎవరూ చంపలేరు-‘’కోన్విమం హరి తురంగ మాయుధ స్థేయసీం దధత మంగ సంహతిం –వేగవత్తర మృతే చమూ పతే –ర్హంతు మార్హృతి శరేణ దంష్ట్రిణ౦’’

  మా కిరాత ప్రభువు ప్రాణ సంకటం లో కూడా ఉపకారం చేస్తాడు .అసలు ఆయన నీ మిత్రుడే అన్న సంగతి నీకు తెలుసా ?అతనితో విరోధం పెట్టుకోవటం సజ్జనులకు ఆశ్రయమైన కృతజ్ఞత ను కాదనటమే . కృతఘ్నుడివి కావద్దు –‘’మిత్ర మిష్ట ముపకారి సంశయే –మేదినీ పతిరయం తథా చతే-త౦ విరోధ్యభవతా నిరాసి మా-సజ్జనైక పతిః-కృతజ్ఞతా ‘’.విజయం కోరేవారికి మిత్రలాభం అన్ని సంపదలకంటే గొప్పది .సంపదలు కష్ట సాధ్యాలు .సాధించినా నిలవవు .మిత్రలాభం ఉపకారం తో తేలికౌతు౦ది.రక్షించటం కష్టం కాదు .అది మనల్ని రక్షిస్తుంది .చివర్లో సుఖమిస్తుంది –‘’లభ్య మేక సుకృతేన దుర్లభా –రక్షితార మను రక్ష్య భూతయః –స్వంతమంత విరసా జిగీషతాం –మిత్ర లాభ మను లాభ సంపదః ‘’.దన  సంపదలు చంచలాలు.నశి౦చేవికూడా .భూమి బలవంతులకే స్వాధీనం .స్థిరమైనవాడు ఐన మాస్వామి స్వయంగా వస్తే అవమాని౦చ వద్దు .అంతమంచి స్నేహితుడు దొరకటం నీ అదృష్టమే –‘’చంచలం వసు నితాన్తమున్నతా –మేదినీ మపి హరంత్యరాతయః –భూధర స్థిరము పెయ మాగత౦-మావ మంస్తసుహృదం మహీపతిం ‘’.

 నువ్వు శత్రు సంహారానికే తపస్సు చేస్తున్నావు .మోక్షం కోరేవారికి ఆయుధాల అవసరం లేదు కదా .మా కిరాత రాజు స్నేహం చేస్తే ,నీ తపస్సు ఫలిస్తుంది .మా రాజు  వద్ద గుర్రాలు పుట్టే చోటు ,ఏనుగుల ఉత్పత్తి స్థానమైన అడవి ,రత్నాల గనులు చాలా ఉన్నాయి .బంగారు బాణాలు ఎందుకు ?.మా రాజు అవమానం మాత్రం సహి౦చలేడని గ్రహించు –‘’వాజి భూమి ‘’రిభారాజ కాననం -.సంతి రత్న నిచయా శ్చ భూరిశః –కా౦చనేన కిమివాస్య పత్రిణా-కేవలం న సహతే విలంఘనం ‘’.ఇతరులు గర్వంతో దుమ్ము రేపినా,మా  ఏలిక సహించలేడు .ప్రార్ధిస్తే ప్రాణాలైనా ఇస్తాడు .అతడికి ధనంతో పనేమిటి ?-‘’సావ లేప ముప లిప్సితే పరై-రభ్యుపైతివికృతిం రజస్యపి –  ఆర్థితస్తు న మహన్సమీహతే –జీవితం కిము ధనంధనాయితుం ‘’.కనుక మా రాజు బాణం అయనకిచ్చి,శ్రీరామ సుగ్రీవ మైత్రి లాగా దైవికంగా కలిగిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం .ఉభయుల మైత్రి మంచిది .-‘’తత్తదీయ విశిఖాతిసర్జనా-దస్తు వాంగురు యాదృచ్ఛ యాగతం-రాఘవ ప్లవగ రాజ యోరివ-ప్రేమ యుక్త మితరేతరాశ్రయం ‘’.నీతో అబద్ధం చెప్పటం మాకు ఇష్టం లేదు .తపస్వుల బాణాలు తీసుకొనే కోరికమాకెందుకు ?మా దగ్గర ఇలాంటి బాణాలు ఎన్నో ఉన్నాయి .అవివజ్రాయుధం కంటే గొప్పవి .నీ బాణాలంటివి ఆయన కావాలనుకొంటే కోకొల్లలు వచ్చి పడతాయి .నీ లాంటి మహానుభావులు మిత్రత్వం తో యాచిస్తే ,ఈ భూమండలాన్నే జయించి ఇవ్వగలడు.-‘’మార్గణై  రథ తవ ప్రయోజనం –నాథ సేకిము పతింన భూభ్రుతః-తద్విధం సుహృద మేత్య సోర్ధినం –కిం న యచ్ఛతివిజిత్య మేదినీం ‘’.బ్రాహ్మణ చాపల్యం తో నువ్వు చంపిన పంది మాస్వామి ఎన్నుకొన్నది .దీన్ని మా రాజు క్షమించడు .ఆలోచన లేకుండా చేసే అపరాధం అజ్ఞానాన్ని దాచేస్తుంది .ఆ౦టే తెలివి లేని వారి తప్పు తప్పు కాదు అనిభావం . బ్రాహ్మణ కులం, కాషాయ వేషం, తపస్సు విరుద్ధమైనవి. ఇలాంటి తప్పు మళ్ళీ చేయకు .చెడు దారిలో నడిచే వారి చెడు బుద్ధి ఇహపరాలకు చేటు తెస్తుంది –‘’జన్మ మేష తపసాం విరోదినీం –మా కృథాఃపూన రమూమ పక్రియాం-అపదేత్యు భయలోక దూష ణీ-వర్తమాన పథేహి దుర్మతిం’’.

  ఇప్పుడు పితృ దేవతలకు శ్రార్ధం లేదు. దేవతార్చన కూడా లేదుకదా ఎందుకు ఆపందిని కొట్టావు ?దాని మానాన దాన్ని పోనిస్తే బాగుండేది కదా .చూడటానికి సత్పురుషుడు లాగా ఉన్నావు .చాంచల్యం వదిలేయి .నీ అపకారాలు ఎప్పుడూ ఎవరు సహిస్తారు ?ప్రళయకాల వాయువులు సముద్రాలకు క్షోభ తెచ్చినట్లు ,ప్రతిసారీ చేయరాని పనులు చేస్తే, ధైర్యవంతులు కూడా క్షోభకు గురౌతారు .మా రాజు అస్త్రవిద్యలో అసామాన్యుడు .ఏదో కొండల్లో కోనల్లో ఉండేవాడు కదా అని తిరస్కరించకు .ఇంద్రుడు ఈ పర్వతాన్ని రక్షించమని స్వయంగా కోరటం వలన ఇక్కడ ఉంటున్నాడు మా రాజు .-‘’అస్త్ర వేదవిదయం మహీ పతిః-పర్వతీయ ఇతి మావా జీ గణః-గోపితుం భువ మిమాం మరుత్వతా –శైలవాస మను నీయ లంభితః ‘’.ముని విషయం లో తప్పు కాస్తాను అని మా స్వామి చెప్పాడు .కనుక నువ్వు కూడా ఆ బాణాన్ని ఇచ్చేసి స్నేహం చేసి, సకల సంపదలు పొందు .-‘’తత్తితిక్షితమిదం మయా మునే –రిత్య వోచత వచశ్చమూ పతిః-బాణ మత్రభవతే నిజం దిశ-న్నాప్నుహి త్వమపి సర్వ సంపదః ‘’.ఎవరివలన శుభాలు , సద్గుణాలు,సదాచారం  అలవడుతాయో ,ఆపదలు తొలగి పోతాయో అలాంటి అనేక గుణాలున్న సత్సా౦గత్యాన్ని కల్గించే స్నేహాన్ని ఎవడు  వదులు కొంటాడు స్వామీ .వాడియైన అస్త్రాలు ,సర్పాలతో కూడిన తరంగాలున్న సముద్రం వంటి మా కిరాత రాజు చెలియలి కట్ట ఆపి నట్లు, అదుగో ఆ చెట్ల చాటున సమయం కోసం నిలిచి ఉన్నాడు చూడు ‘’అని రాయబారి తన సేనాపతిని చేతితో చూపాడు –‘’ దృశ్యతామయ మనోకహాన్తరే-తిగ్మహేతిపృతనాభి రన్వితః –సాహి వీచిరివ సింధు రుద్ధతో –భూపతిః సమయ సేతు వారితః ‘’.ఓ దీశాలీ !అదుగో మాప్రభువు స్థిరంగా ఇంద్ర ధ్వజ శోభకంటే గొప్పగా ,ఆది శేషునిలాగా స్థూలంగా ఉన్న ధనుస్సు ఎక్కు పెట్టి సిద్ధంగా ఉన్నాడు .అతని కోరిక మన్నించి స్నేహం చేస్తే నీకోరికలన్నీ తీరుతాయి ‘’అన్నాడు కిరాత శివ దూత .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధనుర్మాసం లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం ప్రత్యక్ష ప్రసారం 

ధనుర్మాసం లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం ప్రత్యక్ష ప్రసారం 

  సాహితీ బంధువులకు శుభకామనలు .డిసెంబర్ 14 సోమవారం తో శ్రీ శంకరవిజయం ఏడవ సర్గ ప్రత్యక్ష ప్రసారం పూర్తీ చేసి ,మళ్ళీ మాఘమాసం లో మిగిలిన సర్గలు పూర్తీ చేయాలని సంకల్పం .
 ఇది వరకే ప్రకటించినట్లు ఈ డిసెంబర్ 15 మంగళవారం నుంచి మాధవమాసమైన మార్గశిరం -ధనుర్మాసం ప్రారంభామౌతుందికనుక ఆ రోజు ఉదయం 10 గంటలనుంచి ”శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం” ధారావాహికం గా ప్రత్యక్ష ప్రసారం ఫేస్ బుక్ ద్వారా జరుగుతుంది -దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.25 త్రయోదశ సర్గ -2

కిరాతార్జునీయం-.25

త్రయోదశ సర్గ -2

శంకరుని బాణం రెక్కల నుంచి వచ్చిన ధ్వని పాములపై గరుత్మంతుని  దాడి లాగా హృదయాన్ని చెవుల్ని భేదిస్తూ ప్రతిధ్వనించింది .శివుని మూడోకంటి అగ్ని జ్వాలలాగా పిశంగ(ఎరుపు ) వర్ణపు కాంతితో ప్రకాశిస్తూ అత్యంత వేగంగా వస్తూ ఆకాశం లో పిడుగులు పడినట్లు అనిపించింది .-‘’నయనాదివ శూలినః ప్రవృత్తై-ర్మనసోప్యాశుపరంయతః పిశంగైః-విదధే విలసత్తడిల్లతాభైః-కిరణైర్వ్యోమని మార్గ ణస్యమార్గః ‘’.శివబాణ౦  వెడలిన క్షణం లోనే ,శివునికి దగ్గరున్న ప్రమథ గణం,వరాహానికి దగ్గరలో ఉన్నఆకాశ సంచారు.లైన సిద్ధ చారణాదులు వరాహం శరీరం లో ప్రవేశించటం చూశారు .అంటే ప్రయోగించటం ,దానికి తగలటం ఏకకాలం లోనే జరిగిందని భావం –‘’అపయంధనుషః శివాంతికస్థై-ర్వివరే సద్భి  రభిఖ్యయా జిహానః –యుగ పద్దదృశేవిశన్వరాహం-తదుపోఢైశ్చనభశ్చరైఃపుషత్కః’’.శివబాణ౦కానుగ లాగా నల్లగా ఉన్న ఆ పంది శరీరం లో ప్రవేశించగా ఆకాశ చారులు నీటిని చీల్చుకొని భూమిలోకి ప్రవేశించే జలచరం అనుకొన్నారు –‘’స తమాల నిభే రిపౌ సురాణా౦-ఘన నీహార ఇవా విషక్త వేగః-భయ విఫ్లుత మీక్షితో నభ స్థై –ర్జగతీంగ్రాహ ఇవాపగాం జగాహే ‘’.

  శివుడు బాణం వేసిన సమయం లోనే అర్జునుడు కూడా ప్రయోగించిన బాణం ప్రాణులకు పీడకలిగిస్తూ ఆకాశంలో ప్రకాశించి ,దాని చివర ఉన్న గోరు ఆకారపు లోహపు ములికి కోపించిన యముడిచూపుడు వేలులాగా శోభించింది –‘’సపది ప్రియరూప పర్వ రేఖః –సీతా లోహానగ్ర నఖా ఖమాస సాద-కుపితా౦తకతర్జనాంగులిశ్రీ –ర్వ్యథయన్ ప్రాణ భ్రుతఃకపి ధ్వజేషుః’’.మంత్ర చోదిత అర్జున బాణం ,తోక చుక్క కాంతితో ,మహా శబ్దం తో అడవిని ప్రకాశి౦పజేస్తూ ,పక్షులను చెదరగొట్టింది..అర్జునుని ధనుస్సు నుంచి బయల్దేరటం ,ప్రయాణించటం ,లక్ష్యాన్ని భేదించటం అన్నీ ఏకకాలం లో జరిగినట్లనిపించింది.ఆలోచన ముందా తర్వాతా అనే తేడా తెలీలేదనిపించింది . –‘’అవి భావిత నిష్క్రమ ప్రయాణః-శమితాయామ ఇవాతిరంహసాసః-సహ పూర్వతరం ను చిత్తవృత్తే-రపతి త్వాను చకార లక్ష్య భేదం ‘’. పందికి రెండవవైపు అంటే శివబాణ౦ తగిలిన దానికి రెండో వైపు దూసుకుపోయి,మనుష్యప్రయత్నానికి దైవ ప్రయత్నం తోడయినట్లుగా ఉంది .’’స వృషధ్వజసాయకా వభిన్నం –జయహెతుఃప్రతికాయ మేష ణీయం-లఘు సా౦ధయితుం శరః ప్రసేసే-విధినేవార్థ ముదీరితంప్రయత్నః’’ .అవివేకం ,వృధా శ్రమ ధనాన్ని ఎలా పోగొడతాయో,అత్యాశ సంపాదన ఆశ్రయించిన వారి ప్రేమను ఎలా దూరం చేస్తాయో దుర్నీతి అనవదానత ఎలా జయం కోరిన వారిని చెడ గొడతాయో అలా శివుడు,అర్జునుడు ప్రయోగించిన బాణాలు వరాహాన్ని నిర్జీవం చేశాయి –‘’అవివేక వృధాశ్రమా వివార్ధం –క్షయ లోభా వివ సంశ్రితానురాగం -విజిగీషు  మివా నయ ప్రమాదా –వవసాదంవిశిఖౌ వివిన్యతుస్తం ‘’.ఆపంది మృత్యు వాత పడుతూ ,వేగం తగ్గి ,నాలుగు వైపులా దొర్లుతూ ,,సూర్యుడు నేలమీద పడినట్లు ,భూమి చుట్టూ చెట్లతోనిండి నట్లు భావించి ,చుట్టూ గిరగిరా తిరిగి నేలకు ఒరిగింది .పంది చావు కళ్ళకు కట్టినట్లు గా చూపించిన భారవి కవి కవిత్వానికి కైమోడ్పు .-‘’అథ దీర్ఘతమ౦ తమః ప్రవేక్ష్యన్ –సహసా రుగ్జర యః’’ స సంభ్ర మేణ-నిపతంత మివో ష్ణ రశ్మి ముర్వ్యాం-వలయీ భూత తరుం ధరాం చ మేనే’’.

  నేలమీద పడి వేడి రక్తం తో తడుపుతూ ,కాలిగిట్ట లతో ,నోటి కోరలతో రాళ్ళను  పొడుస్తూ ఒక్కక్షణం ఆర్జునుడిని చూసి ,కోపంతో ఘుర్ ఘుర్ మంటూ  గర్జిస్తూ ప్రాణం వదిలింది .’’అసుభిఃక్షణ మీక్షితే౦ద్రసూను –ర్విహతా మర్ష గురు ధ్వని ర్నిరాసే ‘’ .పంది చనిపోయాక అర్జునుడు తన బాణం తీసుకోవటానికి దగ్గర కొచ్చాడు .అతని దగ్గర చాలా బాణాలున్నా ,ఈ బాణమే దాన్ని చంపిందని కృతజ్ఞతా భావంతో వచ్చాడు .ఎప్పుడోచేసిన ఉపకారం కన్నా ,తత్కాలం లో చేసిన సహాయాన్ని అభినందిచటం లోక సహజం కదా .-‘’స్ఫుట పౌరుష మాపపాతపార్థ –స్తమథ ప్రాజ్య శరః జిఘ్రుక్షుః-న తథాకృత వేదినాం కరిష్యన్-ప్రియతా మేతియథా కృతావ ధానః ‘’.నీచునికి చేసిన ఉపకారం వ్యర్ధమైనట్లు ,పందిని కొట్టిన బాణం  కనిపించలేదు .తన పరాక్రమం వ్యర్ధమై౦దని సిగ్గుతో తలది౦చు కొన్నాడు ధనంజయుడు .-‘’ఉపకార ఇవా సతి ప్రయుక్తః స్థితి మప్రాప్య మృగే గతః ప్రణాశం-కృత శక్తిరథోముఖోగురుత్వాజ్జనిత వ్రీడఇవాత్మ పౌరుషః’’.ఉజ్వలకా౦తితో ఉన్నా ,తన బాణం పరాక్రమం గురించి ప్రశ్నిస్తున్నాడా అన్నట్లు మాటి మాటికీ కళ్ళతో పందిని కావలి౦చు కొంటున్నాడా అన్నట్లు చూశాడు .ఉత్తములు తమ పరాక్రమమం చూపితల ఎగరేయరు.-‘’స సముద్ధరతా విచి౦త్య తేన –స్వరుచిం కీర్తిమివోత్తమాందధానః –అనుయుక్త ఇవ స్వవార్త ముచ్చైః-పరిరేభే ను భ్రుశంవిలోచనాభ్యాం ‘’ .పందిలో గుచ్చిన తన బాణాన్ని వెతుకుతున్న అర్జునుడి దగ్గరకు శివుని సందేశం చెప్పటానికి వచ్చిన ధనుర్ధారి అయిన ఒక కిరాతుని చూశాడు.అతడు మర్యాదగా నమస్కారం చేసి ,శాంతంగా యుక్తియుక్తంగా ఇలా చెప్పాడు –‘’నీ శాంతం నీహృదయ స్వభావాన్ని,వినయాన్నీ  తెలియజేస్తోంది  .గొప్ప తేజస్సుతో చేసిన తపస్సు శుద్ధశాస్త్రజ్ఞానాన్ని తెలియ జేస్తోంది .దేవతలతో పోల్చదగిన నీ ఆకారం నీ ఆకృతికి విరుద్ధమైన వంశాన్ని ప్రకటిస్తోంది-‘’శాంతతా వినయ యోగి మానసం –భూరి ధామ విమలం తపః శ్రుతం –ప్రాహ తే ను సదృశీ దివౌకసా –మన్వవాయ మవదాతమాకృతిః’’.ముని వేషం లోనూ మహా ప్రకాశమానం గా ఉన్నావు .నీ మహత్వం ఇతర రాజులను తక్కువ చేస్తుంది .ఇంద్రకీలం లో ఉంటూ ,ఇంద్రుని ద్వారా త్రిలోకాధిపత్యం చేయిస్తున్నట్లుంది . తస్విగా ఉన్నా,సకల సంపన్నుడి లాగానే ఉన్నావు  . ఒంటరిగా ఉన్నా ,తేజస్సుతో మంత్రులతో ఉన్నట్లుగానే భాసిస్తున్నావు –‘’తాపసోపి విభూతాముపే యివా –నాస్పదం తవమసి సర్వ సంపదాం-దృశ్యతే హిభవతో వినా జనై-రన్వితస్య సచివైరివ ద్యుతిః..నీకు జయలక్ష్మి ప్రాప్తించటం ఆశ్చర్యం కలిగించేది కాదు .ముక్తిని గురించి చి౦తించాల్సిన పనీలేదు .అది నీకు దుర్లభం ఏమీకాదు .రజస్తమో గుణాలను  జయించిన వారికి సిద్ధించని కోరిక ఉండదు కదా ‘’అన్నాడు భిల్లుడు అర్జునుడితో .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.24 త్రయోదశ సర్గ -1

కిరాతార్జునీయం-.24

త్రయోదశ సర్గ -1

అర్జునుడు దగ్గరకొస్తున్న సూకరాన్ని చూశాడు .అది చీల్చటానికి వీల్లేని పర్వతంలా ,రెండు కోరలతో భయంకరం గా ఉంది .కోపం తో నిక్క బొడుచుకున్న జడలతో విజయమే ప్రధానంగా మిగతా వ్యవహారాలూ మాని వస్తున్న పందిని అర్జునుడు చూసి ,అనమాని౦చగా, మనసులో అనేక ఊహలు తోచాయి .అది ముట్టెతో బలిసిన చెట్లు కూల్చగలదు .భుజాలతో రుద్దుతూ పర్వతాల రాళ్ళను దొర్లి౦చ గలదు .ఒంటిగా వస్తూ నన్ను యుద్ధానికి పిలుస్తు నావైపుకే వస్తున్నట్లుంది .నా తపో ప్రభావంతో క్రూర జంతువులు  కూడా హి౦సమాని సహజీవనం చేస్తున్నాయి .ఇది భిన్నం గా ప్రవర్తిస్తోంది .ఇది మాయేమో?అని సందేహించాడు .పూర్వ జన్మ లో శత్రుత్వం దానిలో పోయినట్లు లేదు .విరోధి మృగాలు దగ్గరగా తిరుగుతున్నా ,వాటిని వదిలేసి ,నావైపే రావటం నా అనుమానాన్ని బలపరుస్తోంది .ఇది వరాహం కాదు .నా ప్రాణాలు హరించే ఎవడో అయి ఉంటాడు .మనిషి ప్రసన్నంగా ఉంటే ,హితైషిగా ,కలుషితమైతే శత్రువుగా  సూచిస్తుంది .నా మనసు కలుషితం చేసింది కనుక ఇది నన్ను చంపటానికి వచ్చే శత్రువు అవటం ఖాయం –‘’న మృగః ఖలు కో ప్యయం జిఘాంసుః-స్థలతి హ్యత్ర తథా  భ్రుశం  మనోమే –విమలం కలుషీ భవచ్చ చేతః –కథ యత్యేవహితైషిణం రిపుం వా ‘’.అయినా నేను మునిని .ఎవరికీ అపకారం చేసే వాడిని కాను .భయమెందుకు ?అని అభిమానం కలిగి ఉండటం మంచిది కాదు ఇతరుల వృద్ధి ని ఓర్వలేని వారు ఏ ధర్మం, నీతి,పాటిస్తారు ?కనుక ఇది శత్రువుల కుట్ర కావచ్చు .-పర వృద్ధి షుబద్ధ మత్సరాణాం-కిమివ హ్యస్తి దురాత్మనా మనులంఘ్యం ‘’.ఆ పంది దానవుడో రాక్షసుడో అయి ఉంటుంది.మామూలు అడవి జంతువులకంటే మహా బలిష్టంగా ఉంది .ఈ ప్రాంతాన్ని ఆక్రమించటానికి మాయతో వేట వాతావరణం కల్పిస్తోంది .దీనికి అడవి మృగాలు భయం తో పారిపోతున్నాయి .దుర్యోధనుడు చేసిన సత్కారాలు పొంది ,వాడికి మేలు చేయాలని ,ఇక్కడి జంతువుల్ని కలవర పరుస్తూ  ,ఈ పంది రూపం పొంది ఉండచ్చు –‘’క్షుభితం వన గోచరాభి యోగాత్ –గణమాశిశ్రియ దాకులం తిరశ్చా౦ ‘’.

   ఒక వేళ ఖాండవ దహనం లో బంధువులంతా కాలిపోగా తక్షకుని కొడుకు అశ్వ సేనుడనే నాగరాజు నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి వస్తున్నాడా ?లేక అన్నగారు భీమ సేనుని కోపానికి గురైనవాడెవడైనా వస్తున్నాడా ?ఏమైనా ఈ బలిసిన పంది నన్ను చంపటానికి వచ్చేదే అనుమానం లేదు .కనుక దీన్నితప్పక  చంపాల్సిందే .జ్ఞానులు శత్రు సంహారం గొప్ప లాభం అంటారు –‘’పరమం లాభ మరాతిభంగమాహుః’’.నేను తపస్సు చేసే ఆశ్రమం లో చిద్రాన్వేషకులైన శత్రువులు ప్రవేశించ కుండా తపస్సు చేయమని ,వ్యాసమహర్షి బోధించారు .కనుక ఈ పందిని మట్టుపెట్టాల్సిందే .దుష్ట శిక్షణ లో హింస దోషం కాదు –‘’కురుతాతతపామ్య మార్గ దాయీ –విజయా యేత్య ల మన్వశాన్ము నిర్మాం-బాలి నశ్చవధా దృతేస్యశక్యం –వ్రత సంరక్షణ మన్యథా న కర్తుం..గాండీవం ధరించి శత్రు చేదనం చేయగల వాడి బాణాన్ని మంత్రి సహాయం లాగా అందుకొన్నాడు ధనుంజయుడు .-‘’సచివః శుద్ధ ఇవా దదే చ బాణః’’.పూజ్యుడు ,సత్పరాయణుడు ,ఔదార్యాది గుణాలున్న మంచి స్నేహితుడు ధనబలం లేని సమయం లో ఎలా అనుకూలంగా నడుచు కొంటాడో ,అట్లా సారవంతం బలం కలిగిన గాండీవం తపస్సుతో క్షీణించిన క్రీడి అల్లె త్రాడు లాగి బాణం సంధించగా నమ్రభావం పొందింది –‘’అనుభావవతా గురు స్థిరత్వా –దవి సంవాదిధనుర్ధనంజయేన-స్వబల వ్యసనే పి పీడ్య మానం –గుణవన్మిత్రమివానతింప్రపేదే’’..అర్జునుడు సంధించిన అల్లెత్రాడుధ్వనికి ఏర్పడిన భీకర ధ్వని పర్వతగుహల్లో వ్యాపించి ,అతడు పాదం మోపటం తో పర్వతం స్థిరత్వం కోల్పోయింది .అదే సమయం లో శివుడు ధనుస్సు యొక్క అల్లెత్రాడు లాగిన ధ్వని త్రిపురాలను ధ్వంసం చేసినప్పటి ధ్వనిలా భయంకరాకారం తో అర్జునుడిని  చూశాడు .శత్రు సంహారం కోసం ఒకే సారి సంధించిన శివార్జునుల బాణాల మధ్య వరాహం చేరింది .ఈ ఇద్దరి మధ్యా ఆ పంది చేరటం తో ఈశ్వర పినాక ధనువు నుంచి బాణం మేఘంతో కూడిన మెరుపు ,పిడుగు లాగా వెలువడి ఏనుగులకు భయం కలిగించింది –‘’అథ దీపిత వారి వాహ వర్త్మా-రవ విత్రాసిత వారణాదవార్యః –నిపపాత జవాదిషుః పినాకా –న్మహతోభ్రాదివవైద్యుతః కృశానుః’’.

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-.23పన్నెండవ సర్గ -2(చివరి భాగం )

కిరాతార్జునీయం-.23 పన్నెండవ సర్గ -2(చివరి భాగం )

 

మహర్షులు దర్శించిన శివుడు హిమాలయం పై ఉండటం తోపర్వతాలు సముద్రాలు ఆకాశం దిక్కులు అన్నిటినీ కల్గిన ఈ విశ్వాన్ని తన ప్రకాశం తో వ్యాపించి నట్లున్నాడు .రెండు మోకాళ్ళు చేర్చి భయంకర శేషుడనే సర్పం తో చుట్టి ఉన్న శంకరుడు సూర్యకా౦తితో లోకాలోక పర్వతాల దాకా ఉన్న విశ్వంలాగా ప్రకాశిస్తున్నాడు –‘’అనుజాను మధ్య మవసక్త వితత వపుషా మహాహినా –లోకమఖిల మివ భూమి భ్రుతా రవితేజ సామవధి నాధివేష్టితం’’.మంచులాగా తెల్లగా ,శుభ్రంగా ఉన్న యజ్ఞోపవీతం గా ఉన్న  శేషుడిని తన నీల కంఠం రంగుతో సమానం చేస్తూ ఉన్న శివుడు కనిపించాడు –‘’పరిణాహినా తుహిన రాశి విశద ముపవీత సూత్రతాం –నీత మురగ మనురంజయతా శితినా గలేన విలసన్మరీచినా ‘’.మలాతీ పుష్ప సమానంగా ఉన్నశుభ్రమైన కపాలం అనే కలువను వికసింప జేసే చంద్ర కిరణాలు అనే యెర్రని జడలతోవ్యాపి౦ప జేస్తున్నాడు .నాల్గు దిక్కులా వ్యాపించే ఆ జటాసమూహం గంగాజలం లో మిగులు నీటిని శిరస్సు లో ధరించినట్టుగా శివుడు భాసి౦ చాడు .-‘’ఫ్లుతమాలతీసిత కపాల కుముద మవరుద్ధ మూర్ధజం –శేషమివ సుర సరి త్పయసాం శిరసా విసారి శశిధామ బిభ్రతం ‘’.ఋషులు శంకరునికి ఎదురుగా వెళ్లి ,ఆయన నేత్ర సంజ్ఞతోనే అర్జునతపస్సు వలన లోకాలకు కలుగబోయే ఆశుభాన్ని విన్నవించారు .’’ఓ పురుషోత్తమా శంకరా !భయం కలిగించే శరీర బలం కల వృత్రాసురుడి లా ఉన్న  ఒక  పురుషుడు తపస్సు చేస్తున్నాడు .అతని ప్రకాశం సూర్య ప్రకాశాన్ని మించింది .అతడు రెండు అమ్ములపొదులు ,ధనుస్సు కవచం ఖడ్గం జటావల్కలాలు ధరించి ఉన్నాడు .ఇవి ముని ధర్మానికి వ్యతిరేక వస్తువులు అయినా అతనికి మహా శోభ కలిగిస్తున్నాయి .అదే ఆశ్చర్యంగా ఉంది .అతడు కదిల్తే భూమి కంపిస్తోంది. సమాధి గతుడై ఇంద్రియాలను స్తంభింప జేయటం తో దిక్కులన్నిటా వాయువు ,గ్రహ ,నక్షత్రాలు తో కూడిన ఆకాశమే స్తంభించింది –‘’చాలానే వనిశ్చలతి తస్య కరణ నియమే సదిఞ్ముఖం –స్తంభ మనుభవతి శాంత మరుద్గ్రహ తారకా గణయుతం నభ స్థలం ‘’.అతడు త్వరలోనే విశ్వాన్ని జయిస్తాడు .తపస్సుతో సాధ్యం కానిది లేదుకదా –‘’విశ్వమిదమపి దధాతి పురా కిమి వాస్తి యన్న తపసా మదుష్కరం ‘’.ముల్లోకాలు ఒకేసారి జయి౦ చాలనో ,సంహరించాలనో లేక మోక్షమే కోరుతున్నాడో అర్ధం కావటం లేదు .అతని తేజస్సును మేము సహించలేక పోతున్నాం –‘’విజిగీషతే యది ,జగంతి,యుగ పదథ సామజి హీర్షతి-ప్రాప్తు మభవ మభి వా౦ఛతి వా వయమస్య నో విషహితం క్షమా రుచః ‘’

   స్వామీ శంకరా !ఇంకా ఎందుకు ఉపేక్ష చేస్తున్నారు ?కారణం ఏమిటి ?మీకు తెలీనిది ఉండదు .అభయదాతా!మమ్మల్ని రక్షించే సమర్ధులు మీరే .మీ రక్షణలో మాకు అవమానం జరుగాకుండు గాక .-‘’త్రాతు మలమ భయదార్హసి నస్త్వయి మా స్మ శాసతి భవత్పరాభవః ‘’.ఇలా మునులు ప్రార్ధించగా అ౦ధకా౦తకు డైన శివుడు నభో౦త రాళం ప్రతిధ్వని౦చేట్లు,ఉప్పొంగే సముద్ర గర్జన ధ్వనితో ఇలా అన్నాడు .’’మహర్షులారా ! బదరికాశ్రమం లో ఉంటూ లోకసృస్టి,సంహారాలు చేసే విష్ణువు అంశమే ‘’నరుడు ‘’గా పిలువబడే అర్జునుడు .సాధారణ ముని కాదు .సాక్షాత్ నారాయణా౦శ  సంభూతుడు –‘’బదరీ తపోవన నివాస నిరత మవగాత మాన్యథా-ధాతు రుదయ నిదనే జగతాం నర మంశ మాదిపురుషస్య గాం గతం ‘’అతడు లోకాలకు బాధ కలిగించే వారు ,ఇంద్రుని శక్తిని లెక్కచేయని వారు అయిన శత్రువులను జయి౦చాలనే కోరికతో నన్ను ఆరాధిస్తూ తపస్సు చేస్తున్నాడు .కనుక భయపడాల్సిన పనిలేదు –‘’ద్విషతః పరాసిషురేష సకల భువనాభి తాపినః-క్రాంత కులిశ కర వీర్య బలాన్మ దుపాసనం  విహిత వాన్మహత్తపః ‘’తపస్సంపన్ను డైన అర్జుండు , శ్రీ కృష్ణ భగవానుడు బ్రహ్మ ప్రార్ధిస్తే ,భూమి మీది సకల అసుర సంహారం కోసం మనుషులుగా కృష్ణార్జునులుగా జన్మించారు వారు సాక్షాత్తు నర నారాయణులే.ఈ విషయం తెలుసుకొన్న మూకాసురుడు అర్జునుడిని చంపటానికి వెడుతున్నాడు  .కనుక మీరుకూడా నాతో రండి అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి. అర్జున ఆశ్రమానికి వెంటనే వెళ్ళాలిమనం  .క్రూర మూకాసురుడు ఏకాంతం లో ఉన్న అర్జునుడిని ఎదుర్కోవటం చేతకాక,అనుమానం  రాకుండా ఉండటానికి  వరాహ రూపం  ధరించి ,విజయం సాధించాలని చూస్తున్నాడు –‘’వివరేపి నైన మనిగూఢ మభిభవితుమేష పారయన్-పాప నిరతి రవిశంకితయా విజయం వ్యవస్యతి వరాహ మాయయా ‘’.నేను కిరాత రాజు వేషం తో మూకాసురుడిని చంపగా ,వాడి అయిన బాణాన్ని వదిలిన అర్జునుడు వేట నియమాలను అనుసరించి నాతొ వివాద౦లొ పడతాడు –‘’నిహతే విడంబిత కిరాత నృపతివపుషా రిపౌ మయా –ముక్త నిశిత విశిఖః ప్రసభం మృగయా వివాద మయమా చరిష్యతి ‘’అర్జునుడు తపో నియమాలతో బాగా చిక్కి పోయాడు .సహాయం కూడా ఎవరూ లేని ఒంటరి వాడు .అయినా ,సహజ సిద్ధ,సాటిలేని  పరాక్రమం తో ఉన్న అతడి భుజపరాక్రమ విక్రమాన్ని చూడండి –‘’తపసా నిపీడిత కృశస్య విరహిత సహాయ సంపదః –సత్వ విహిత మతులం . భుజయోర్బలమస్య పశ్యత మృధేధికుప్యతః ‘’.ఈవిధంగా మునులకు చెప్పిన పరమేశ్వరుడు నుదుట హరిచందనం అడ్డ దిడ్డంగా పూసుకొనగా ,ఒళ్ళు పులకరించి ,ఏనుగు గండస్థల ముత్యాలు కూర్చిన హారం ధరించాడు .

   పొడవైన శిరోజాలున్న జడలలోవికసిత పుష్పాలు ధరింఛి ముడి వేశాడు .నెమలి కన్నుల కమ్మలు పెట్టుకొని కణతలకు శోభ చేకూర్చాడు . ఎర్రని కళ్ళతో భయ౦ కల్పిస్తున్నాడు .-‘’వదనేన పుష్పిత లతా౦త ఇయమిత విలంబి మౌలినా –బిభ్రదరుణ నయనేన రుచం శిఖి పిచ్ఛలా౦చిత కపోల భిత్తినా’’.  కిరాత సేనాపతి గా మారిన  శివుడు మేఘగర్జన లాగా ధ్వనించే ,బాణం తో ఉన్న ధనుస్సు ధరించి ,అందమైన మేఘంలాగా కనిపించాడు .ప్రమథ గణాలు శూల ,పరశు ,బాణం చాపం మొదలైన ఆయుధాలతో కిరాత సైన్యంగా శివుడికి సహాయంగా నిలిచారు .ఈశ్వరాజ్ఞ అనుసరించి ,వారంతా ఇంద్ర కీలాద్రి చేరి అక్కడి అడవిలో ఎవరు ఏవైపున ఉండాలో నిర్ణయించుకొని వేట నెపం తో నాలుగు వైపులా భయంకర నినాదాలిస్తూ అట్టహాసంగా బయల్దేరారు .అడవిలోని పక్షులు జంతువులూ భీతితో అరుస్తూ బయటికి రాగా , ఇంద్రకీలాద్రి గుహలు భయంతో అరుస్తున్నట్లు అనిపించింది .జాతివైరం ఉన్న మృగాలు పరస్పరం కోపం చూపలేదు .భయం తో వచ్చిన కస్టాలు సహజ శత్రుత్వాన్ని కూడాతొలగిస్తాయి .-‘’ఘ్న౦తి సహజమపి భూరి భియః సమమాగతాః సపది వైరామాపదః ‘’.వెదురు పొదల్లోని చిక్కిన చమరీ మృగాలు  అందమైన తోకలు విడిపించు కోవటం లో శివగణ౦  ఆర్భాటాన్ని కూడా లెక్కచేయకుండా ధైర్యంగా ఉన్నాయి .మదజలం స్రవిస్తున్న ఏనుగులు ,జూలు విదిలిస్తున్న సింహాలు శివ సైనికులను చూసి భయపడలేదు. నదులు భయంతో యెగిరి పడే చేపలతో నిండాయి .తీరాలు బురదగా మారాయి .ఏనుగుల రాపిడికి  విరిగిన యెర్ర చందనం చెట్ల రసంతో నీరు ఎర్రబడింది .చల్లని గాలి అలసట తీర్చింది .దున్నల ఘర్షణ వలన అగురు ,తమాల ,తుంగదుంపల పరిమళం గాలిలో కలిసింది .రాళ్ళలో మొలిచే శిలాజిత్తు చిలక రంగులో ఉండేపువ్వుల్ని  వెద జల్లుతూ అలసట తీరుస్తోందని భావం .భయంతో పరిగెత్తే సంక్షోభం తో గ్రీష్మం లో లాగా సరస్సులు దుర్దశ పొందాయి. నీటిని జంతువులు  కలచి వేశాయి .తీరం లోని అరటి చెట్లు ,నివ్వరి ధాన్యం నేలకు ఒరిగాయి .తామర తూడులు వాడాయి .ఇలా శంకరుడు ఇంద్రకీల శిఖరం పై ఉన్న వృక్ష జీవ జాలాన్ని కలచి వేస్తూ ,సంతోషంతో ఆడ లేళ్ళు కొరికిన తీగలున్న అర్జున ఆశ్రమానికి చేరాడు .తర్వాత శివుడు అర్జునునిఎదురుగా ఉన్న మూకాసురుడిని చూశాడు .వాడు మేఘంలాగా నల్లగా పంది ఆకారం లో ముట్టె తో భూమిని పెళ్లగిస్తున్నాడు .-‘’పోత్ర నికషణవిభిన్న భువం దనుజం దధాన మథ సౌకరం వపుః’’.ప్రకాశమాన శివుడు దేవనది మందాకినీ తీరం లో సైన్యాన్ని నిలిపి ,కొందరు సైనికులతో చెట్లు ,పొదలు చాటుగా మూకాసురుని అడుగు జాడలను అనుసరించి బయల్దేరాడు –కచ్చా౦తే సుర సరితో నిధాయ సేనామన్వీతః స కతిపయైః కిరాత వర్యైః-ప్రచ్చన్నస్త రుగహనైసగుల్మ జాలైః లక్ష్మీ వానను పదమస్య సంప్ర తస్థే’’.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో ధనుర్మాస ప్రత్యేక పూజలు

ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో  మార్గశిర శుద్ధ విదియ 16-12-20 తెల్లవారితే బుధవారం నుండి  13-1-2001మార్గశిర బహుళ అమావాస్య 13-1-2001 భోగి వరకు ధనుర్మాసం సందర్భంగా  ప్రతి రోజూ ఉదయం 5-30నుండి స్వామి వారలకు సుప్రభాత సేవ ,తిరుప్పావై ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలకు అష్టోత్తర  ,సహస్రనామార్చన ,శ్రీ గోదా రంగనాయక స్వాములకు  అష్టోత్తర పూజ ,,ముకుందమాల స్తోత్ర పఠనం,సుందర కాండ పారాయణ ఉదయం 6-30కు నైవేద్యం ,హారతి ,పంత్రపుష్పం,తీర్ధ ప్రసాద వినియోగం నిర్వహింప బడును .భక్తులు పాల్గొని స్వామి వారల అనుగ్రహ౦ పొందమని మనవి .

 27-12-20 ఆదివారం  శ్రీ హనుమద్ వ్రతం  25-12-20 నుండి త్రయాహ్నికంగా నిర్వహింపబడును

25-12-20 మార్గశిర శుద్ధ  ఏకాదశి శుక్రవారం- ముక్కోటి (వైకుంఠ)ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటలకే ప్రత్యేక పూజ ,పుష్పాలంకరణ ,వివిధ రకాలపుష్పాలతో పూజ ,ఉదయం 5గంటలకు ఉత్తరద్వార దర్శనం ఉంటాయి .

26-12-20 శనివారం మార్గశిర శుద్ధ ద్వాదశి -ఉదయం 9 గంటలకు గంధ సిందూరం , వివిధ పండ్లతో ప్రత్యేక  పూజ

27-12-20 మార్గశిర శుద్ధ త్రయోదశి ఆదివారం –శ్రీ హనుంద్ వ్రతం  సందర్భంగా

  ఉదయం 9గంటలకు –పంపాకలశ  ఆవాహన ,అష్టోత్తర పూజ ,13ముడులున్న తోరాలకు పూజ ,స్వామి వారలకు తమలపాకులతో అష్టోత్తర సహస్ర నామ ప్రత్యేకపూజ మంత్రం తో తోరదారణ  –అనంతరం అయిదు కథలతో,శ్రీ హనుమద్ వ్రతం ,నైవేద్యం, హారతి,మంత్రపుష్పం , తీర్ధ ప్రసాద  వినియోగం .

1-1-2021-శుక్ర వారం –నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఉదయం 5-30గంటలకు –‘’లడ్డూలతో ‘’స్వామివార్లకు ప్రత్యేక పూజ  .అనంతరం భక్తులకు లడ్డూ ప్రసాద వినియోగం .

10-1-21 -ఆదివారం ఉదయం 5-30గంటలకు స్వామివార్లకు’’ అరిసెలతో’’ ప్రత్యేక అర్చన

13-1-21-బుధవారం –భోగి పండుగ –ఉదయం 5-30గంటలకు వివిధ కూరగాయలతో స్వామివార్లకు శాకంభరీ పూజ

         ఉదయం 9-30 గంటలకు –శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి వారలకు ,శ్రీ గోదా, రంగ నాథ స్వామి వారలకు శాంతి కళ్యాణ మహోత్సవం

14-1-21-గురువారం –మకర సంక్రాంతి పండుగ –ఉదయం 7-30గంటలకు- సంక్రాంతి పురుషుని విశేషాల వివరణ

15-1-21-శుక్రవారం కనుమ పండుగ .

   గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త ,మరియు భక్త బృందం

ఉయ్యూరు -9-12-20.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment