ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -8

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -8

19 వ శతాబ్ది సాహిత్యం -5(చివరి భాగం ))

 సివిల్ వార్ నుంచి 1914 వరకు

హెన్రి జేమ్స్ –న్యుయార్క్ లో పుట్టిన హెన్రి జేమ్స్ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి కొత్తమార్గం లో రచనలు చేశాడు .రియలిస్ట్ ,నేచరలిస్ట్ లలాగే ఫిక్షన్ వాస్తవాన్ని చెప్పాలని భావించాడు .వాస్తవం రెండువిధాలుగా అనువాదం పొందుతుందని ,ఒకటి రచయిత విశేష అనుభవం  ద్వారా ,రెండోది అతడి రచనా ప్రక్రియ ద్వారా .లోతైన అంతర్ దృష్టి,అనుభవం లకు ప్రాముఖ్యంలేదని ,రచయిత సంక్లిస్ట రచనా విధానమే మేలని చెప్పాడు .ఆయన 1884లో రాసిన ‘’ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ ‘’అనే నవలాకారులపై  వ్యాస సంపుటి ,తనరచనలకు ము౦దురాసిన ఉపోద్ఘాతం ఆయన పడుతున్న ఆవేదన కు ,సమస్యలకు దర్పణం గా ఉంటాయి .కాల్పనిక సాహిత్యకళకుఇవి కరదీపికలుగా నిలిచాయి .మంచి చిన్నకథా సృష్టికర్త జేమ్స్ నవలాకర్తగా మారి అద్భుతమైన మార్గదర్శకాలైన ‘’దిఅమెరికన్ ‘’-1877,దిపోర్ట్రైట్ ఆఫ్ ఎ లేడీ ‘’1881,దిస్పాయిల్స్ ఆఫ్ పోయ్నంటన్-1897,’’వాట్ మైసీ న్యు’’-1897,’’ది వింగ్స్ ఆఫ్ ది డవ్ ‘’1902,’’ది అంబాసిడర్స్’’1903,’’ది గోల్డెన్ బౌల్’’1904 రాశాడు .వీటిలో మొదటివి ఇంటర్నేషనల్ నవలలు .యూరోపియన్స్ ,అమెరికన్ల మధ్య రేగిన వివాదాలు చూపిస్తూ ప్రతిగ్రూపు లోనూ వారి పాత్రలస్వభావాలను బాగా విశ్లేషణాత్మకం గా రాశాడు .కాలం గడిచినకొద్దీ తక్కువ అంతర్ దృష్టి ఉన్న భావోద్రేకాలు పుష్కలంగా ఉన్న  సైకలాజికల్ పాత్రల  సృష్టి  చేశాడు .

   పూతమెరుగుల కాలం(గిల్డేడ్ ఏజ్) పై విమర్శకులు

అనేక రకాల రచనలు సివిల్ వార్ నుంచి 1914వరకు వచ్చాయి .ఇవి సాంఘిక తిరుగుబాటు(సోషల్ రివోల్ట్ ) రచనలు .వ్యాపార వాణిజ్య ధోరణుల ,పెరుగుతున్న ప్రభుత్వ అవనీతి పై దాడితో రాసిన నవలలు .కొందరు ‘’ఉటోపియా’’ఆదర్శంగా అల్లారు .హెన్రి ఆడమ్స్ నవల ‘’డెమోక్రసీ ‘’1880,ఎడ్వర్డ్ బెల్లమి ‘’లుకింగ్ బాక్ వార్డ్ ‘’-1888లో నవలలో రాజకీయ అవినీతి అసమర్ధత ప్రత్యక్షం చేశాడు .కేపిటలిజంపై నేరారోపణ ,utopia పై ఆరాధనా కనిపిస్తాయి .హోవెల్స్ రాసిన ‘’ట్రావలర్ ఫ్రం అల్ట్రూరియా ‘’1894,లో సమానత్వ దేశం కావాలని ప్రభుత్వం ప్రజలహక్కులకు కళ్ళెం వేస్తోందని వివరించాడు .1906లో అప్టాన్ సిన్లేర్’’ది జంగిల్ ‘’నవలరాసి అమెరికన్ ప్రభుత్వ ఆర్ధిక ,రాజకీయ విధానాలను దుయ్యబడుతూ వీటికి విరుగుడు సోషలిజమే అని చెప్పాడు

  కవులు పాటలతో విమర్శించారు .ఎడ్విన్ మార్ఖాం ‘’మాన్ విత్ ది హో’’1899లో దోపిడీకి గురౌతున్న లేబర్ గురించి( లేబర్ ఎక్స్ప్లాయిటేషన్)వర్ణించి పరిస్థితులు ఇలానే కొనసాగితే రివల్యూషన్ వచ్చే ప్రమాదముదని హెచ్చరించాడు .ఇది దేశవ్యాప్తంగాప్రజలలో ఉద్దీపన ,చైతన్యం కలిగించి ఆసక్తి రేపింది .ఒక ఏడాది తర్వాత విలియం వాన్ మూడీ ‘’ఓడ్ ఇన్ టైం ఆఫ్ హెజిటేషన్ ‘’రాసి, పెరుగుతున్న అమెరికాప్రభుత్వ ఇమ్పీరియలిజం –సామ్రాజ్యవాద మనస్తత్వాన్ని,  అంతరిస్తున్న  పూర్వ నైతిక సూత్రాలను   ఎండగట్టాడు .1901లో రాసిన ‘’ఆన్ ఎ సోల్జర్ ఫాలెన్ ఇన్ దిఫిలిప్పీన్స్ ‘’లో పై సిద్ధాంతాలనే మరి౦త తీవ్రంగా బలీయంగా తెలియజేశాడు .

  జర్నలిస్టిక్ మాగజైన్స్ విజ్రుమ్భిస్తున్న కాలం లోఅమెరికా విమర్శకులు దాన్ని ఆయుధంగా చక్కగా ఉపయోగించుకొన్నారు .’’ముక్రాకర్స్ ‘’ను ధియోడర్ రూజ్ వెల్ట్,ఇడాఎం టార్బెల్ లు ‘’దిహిస్టరీ ఆఫ్ స్టాండర్డ్ ఆయిల్ కంపెని-1904,లింకన్స్ స్టెఫెన్స్,దిషేం ఆఫ్ దిసిటీస్’1904 ఇద్దరు జర్నలిస్ట్ క్రుసేడర్లైన రచయితల అద్భుత విమర్శక చిత్రణలు .

  హెన్రి ఆడమ్స్

పురాతన న్యు ఇంగ్లాండ్ కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడమ్స్ ఆటోబయాగ్రఫీ లాంటి రచనలతో ఆధునిక జీవిత పతనాన్ని ఎత్తి చూపారు .హార్వర్డ్ లోనూ ఇతరదేశాల్లోనూ విద్యాభ్యాసం చేసిన హెన్రి ఆడమ్స్ గొప్ప టీచర్ చరిత్రకారుడు  .’’హిస్టరీ ఆఫ్ యునై టెడ్ స్టేట్స్-1889-91,మాంట్ సైంట్ మైఖేల్ అండ్ చార్ట్రెస్-1904రాశాడు  ‘’ది ఎడ్యుకేషన్ ఆఫ్ హెన్రి ఆడమ్స్ 1918లో ప్రపంచం లో శాంతి సుహృద్భావాలకై తన జీవితకాల పోరాటం చిత్రింది .మనిషిపై గొప్ప విశ్వాసాన్ని ,అతనికలవరపాటును చెప్పింది .వ్యంగ్యం అంతర్వాహినిగా రాసిన పెసిమిస్టిక్ పుస్తకం ఇది .

    ఈ కాలం కవులు

19వశతాబ్దం 20వ శతాబ్ది మొదలు అమెరికన్ కవిత్వం పెద్దగా వర్దిల్లలేదు .పాటలకు పల్లకీ కట్టి ఊరేగి౦చారుకానికవులను  కవిత్వాన్ని మర్చిపోయారు .దక్షిణ రాష్ట్రం లోపుట్టిన సిడ్నీ లేనియర్ ప్రతిభ కల సంగీతకారుడు .తన సంగీతం ప్రయోగించి1875లో  ‘’కార్న్ ‘’,దిసింఫనీ,1878లో ‘’మార్షేస్ ఆఫ్ గ్లిన్ ‘’పాటలను ఇతరకవులలాగా అమెరిక జీవన విదానాలలో  వచ్చిన మార్పులకు విసుగు చెంది రాశాడు .తన అద్భుతకవితలలో  అనుమానాలు భయాలు సలహాలు పొందుపరచాడు .

  న్యు ఇంగ్లాండ్ కే చెందిన ఎమిలి డికిన్సన్ ఆటకాయి తనపు సిగ్గరి. తానురాసిన అనంతసాహిత్యాన్ని బ్రతికిఉన్నకాల౦ లో ముద్రించుకోలేదు .ఆమె చనిపోయాక నాలుగేళ్ళకు 1890లో ఆమెకవితల మొదటిసంపుటి సోదరి ప్రచురించి తర్వాత వరుసగా వెలువరించింది .తరువాతికవులు ఈమె టెక్నిక్ ,ఆమె దృష్టి రైమ్స్ ,సాధారణ రిధంస్ ను విసర్జించటంనిగూఢమైన భావ పుష్టి  చిన్న స్టాంజాలో కవిత్వం చెప్పటం ఆదర్షంగాచేసుకొన్నారు .ఆమె ప్రఖ్యాతమైన కొన్నికవితలు-దిస్నేక్ ,ఐ లైక్ టు సి ఇట్ లాప్ ది మైల్స్  ,దిఛారియట్’’ఫార్దర్ ఇన్ సమ్మర్ దాన్ ది బర్డ్స్ ,దేర్ఈజ్ ఎ సర్టెన్ స్లాంట్ ఆఫ్ లైట్ ‘’లలో ఆమె అసాధారణ ప్రతిభ దర్శనమిస్తుంది .ఇక 20వ శతాబ్దిలోకి ప్రవేశిద్దాం .

    సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -8

19 వ శతాబ్ది సాహిత్యం -5  సివిల్ వార్ నుంచి 1914 వరకు-2

 సివిల్ వార్ నుంచి 1914 వరకు-2

ఒహాయో లో పుట్టి పెరిగిన విలియం డీన్ హోవెల్స్ కొత్త వాస్తవ రచనలో సిద్ధహస్తుడు .సాధారణ ప్రజల విషయాలను రియలిజం లో బాగా చెప్పొచ్చని  భావించాడు .కామెడి బదులు ట్రాజేడి ని ఎంచుకొన్నాడు .సెక్స్ లాంటి విషయాలతో తక్కువ వాచ్యంగా శక్తివంతంగా చెప్పెవిధానం చేబట్టాడు .’’దెయిర్ వెడ్డింగ్ జర్నీ –‘’1872,ఎమోడరన్ ఇన్ స్టన్స్-1882,దిరైజ్ ఆఫ్ సిలాస్ లాఫం -1885నవలలు పై విధానం లో రాశాడు .టాల్ స్టాయ్ చెప్పిన  ‘’సెట్ ఆర్ట్ ఫర్ ఎవర్ బిలో హ్యుమానిటి ‘’అనేది ప్రేరకంగా ‘’అన్నీ కిల్ బర్న్’’-1888,’’ఎ హజార్డ్ ఆఫ్ న్యు ఫార్ట్యూన్స్ ‘’ 1890లో రాశాడు .తనపత్రాలు సమాజ వ్యక్తుల,ప్రబుత్వాల ,ఆర్దికాలపై  . వ్యాఖ్యానాలు గా చేశాడు .

  నేచురలిస్ట్ రచయితలు

మిగిలిన అమెరికన్ రచయితలు  19వ శతాబ్ది చివరికి నేచురలిజ౦ కు దగ్గరయి అడ్వాన్స్ స్టేజ్ కి చేర్చారు .  హామ్లిన్ గార్లాండ్ రచనలు ఫిలసాఫికల్ గా ,సాంఘిక బోధగా ఉన్నాయి .మైన్ ట్రావెల్డ్ రోడ్స్’’1891,రోజ్ ఆఫ్ డచర్స్ కూలీ ‘’1895లో ప్రత్యెక మెళకువలు చూపాడు .కొత్త ఫిక్షన్ ‘’క్రంబ్లింగ్ ఐడల్స్ ‘’1894కు ఇవి మానిఫెస్టో అయ్యాయి .కొద్దికాలానికి  ఫ్రెంచ్ నేచురలిస్ట్  ఎమిలీ జోలా ప్రభావంతో కొందరు రాశారు .వీరిలో దియోడర్ డ్రైజర్ పాతవారికంటే డేరింగ్ సబ్జెక్ట్ లు తీసుకొని రాశాడు .పాత్రపోషణ ప్లాట్ లు బాగా చేశాడు .మనుషులపనులు ‘’కెమికల్ కంపల్సన్స్’’అని పాత్రలు తమపనులను నిర్దేశి౦చు కో లేకపోవటం చెప్పాడు .పాత్రలు బలీయమైన ,క్రూరమైన వ్యతిరేకుల చే ఓడిమ్పబడుతాయన్నట్లు చెప్పాడు .అతని ముఖ్యనవలలు ‘’సిస్టర్ కారీ ‘’1900,జెన్నీ గెర్హాడ్ట్ 1911,దిఫైనాన్షియర్-1912,దిటైటాన్1914,తర్వాత 1925లో రాసిన ‘’ది అమెరికన్ ట్రాజేడి పైభావలకు ప్రతిరూపాలే .శైలికి సున్నితత్వానికి విస్తృత సిమ్బాలిజానికి ప్రాముఖ్యమివ్వలేదు .కానీ స్టీఫెన్ క్రేన్ ,ఫ్రాంక్ నారిస్ లు మాత్రం వీటిపై దృష్టి ఎక్కువ పెట్టారు .క్రేన్ రాసిన షార్ట్ స్టోరీ లలో మగ్గీ –ఎగర్ల్ ఆఫ్ది స్ట్రీట్స్-1893,ది రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ -1895లో మరికొన్ని కథలలో ఇంప్రెషనిస్ట్ గా కనిపిస్తాడు .మనిషి ని పరిస్థితులు ,పర్యావరణ౦ హతమారుస్తాయని చెప్పాడు .ఫ్రాంక్ మారిస్ రచయిత క్రేన్  పద బంధాలను ను అభినందించి ,తానుకూడా మంఛి నేరేటివ్ లుగా ‘’మిక్ టీగ్-1899,దిపిట్-1903రాశాడు .ఈ ఇద్దరు యవ్వనం లోనే తమ ఆలోచనలకు విస్తృత రూపం ఇవ్వకుండానే చనిపోవటం దురదృష్టం .ఐతే 20వ శతాబ్దం లో అవి బాగా పుష్పించి ఫలించాయి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -7

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -7

19 వ శతాబ్ది సాహిత్యం -4

 సివిల్ వార్ నుంచి 1914 వరకు

రివల్యూషన్ ,  ప్రెసిడెంట్ గా ఆండ్రూ జాక్సన్ ఎన్నికలలాగే సివిల్ వార్ కూడా అమెరికా చరిత్రలో ఒక గొప్ప మలుపు ,కొత్త జీవితవిధానానికి భూమిక అయింది పరిశ్రమలు ప్రాముఖ్యం పొందాయి .ఫాక్టరీలు సిటీలు పెరిగాయి .వ్యవసాయం వెనకబడింది .ఆర్ధిక ప్రణాళికలో ఇప్పటిదాకా ప్రాముఖ్యం పొందిన ఫ్రాంటియర్ క్రమంగా పశ్చిమానికి ప్రాకి 19వ శతాబ్ది చివరికి సమాప్తమైంది .సహజం గా నూతన . అమెరికా రూపు దాల్చింది .సాహిత్యంలోనూ ఆ మార్పులు ప్రతి ఫలించాయి .

   సాహితీ హాస్య గాళ్ళు

పూర్వపు వాళ్ళ ధోరణి లో హాస్యం మొదట్లో రాసినా క్రమంగా తమ వ్యక్తిత్వాలను చూపిస్తూ కొత్తగా రాయటం మొదలుపెట్టారు .వీరిలో చార్లెస్ ఫరార్ బ్రౌనే,డేవిడ్  రాస్ లాకే ,చార్లెస్ హెన్రి స్మిత్ ,హెన్రి వీలర్ షా ,ఎడ్గార్ విల్సన్ నై..ఆర్టేమాస్వార్డ్ ,పెట్రోలియం వి నాస్బే బిల్ ఆర్ప్ జోష్ బిల్లింగ్స్ ,బిల్ నై ఉన్నారు .పాత్రల స్వభావం కంటే వ్యాకరణరహిత వాచ్యానికి ,సరైన ఉచ్చారణ లేకపోవటం మాండలికాలకు ప్రాధాన్యత హెచ్చింది .లాటిన్ పదాలు ,అల్ల్యూజన్స్ చొరబడ్డాయి .చాలా దారుణంగా రాసినా జనాలకు వినోద హాస్యాలు బాగా పంచారు .

  కాల్పనిక   స్థానిక రచన

కొత్త హాస్యం కోసం స్థానిక జనాన్ని వదిలేసిన వారి గురించి రాసే రచయితలూ వచ్చారు .వీరిలో మొదటి వాడు బెర్ట్ హార్టే చాలా బాగారాసి విజయం సాధించాడు .కొద్ది కాలం లోనే ఉద్యమమార్గ దర్శ రచయితలూ వచ్చారు .హారియట్ బీచార్ స్టవ్’’ఓల్డ్ టౌన్ ఫోక్స్’’-1869,సం లాసన్స్ఓల్డ్ టౌన్ ఫైర్ సైడ్ స్టోరీస్-1871,రచనలు ముచ్చటైన న్యు ఇంగ్లాండ్ దృశ్యాల పై రాశారు .హార్టే రాసిన ‘’లక్ ఆఫ్ రోరింగ్  కాంప్ ‘’అండ్ ఆదర్ స్కెచెస్-1870లు కాలిఫోర్నియా మైనిగ్ కాంప్ జీవితాల  హాస్య సెంటి మెంట్ లను పండించాయి .ఎడ్వర్డ్ ఈగిల్టన్ రాసిన ‘’హూసియర్ స్కూల్ మాస్టర్ ‘’-1871నవల ఇండియానాలో మొదటి సెటిల్ మెంట్ పై రాసినదే .20వ శతాబ్దం దాకా వీరు అడపా దడపా ఎక్కువగా చిన్న  కథలు , అతి తక్కువగా నవలలు రాశారు .ఈ కాలం లో దేశం లోని అన్ని ప్రాంతాల పై అక్కడి స్థానిక రచయితలూ కలర్ఫుల్ గా రాశారు ,వీటికి తోడూ జార్జి కేబుల్ ‘’లూసియాన క్రియోల్స్ ‘’,ధామస్ నెల్సన్ పేజ్’’ది బ్లాక్స్ ‘’ జోయెల్ చాన్డ్లేస్ హార్రిస్ ‘’జార్జియా బ్లాక్స్ ‘’,మేరీ నియోలిస్ మెర్ఫీ ‘’టేనస్సీ మౌన్టేనీర్స్’’,సారా ఓర్నె జ్యుఎట్ ‘’టైట్ లిప్డ్ ఫోక్ ఆఫ్ న్యు ఇంగ్లాండ్ ‘’,మేరీ ఇ విల్కిన్సన్ ఫ్రీమన్’’పీపుల్ ఆఫ్ న్యూయార్క్ సిటి ‘’హెన్రి కూయ్లర్  బాన్నర్ ‘’ఓ హెన్రి అనే విలియం సిడ్నీ పోర్టర్ లు చక్కని హాస్యం,సెంటిమెంట్  చిన్నకథలలో సృష్టించారు .వీరందరి ఉద్దేశ౦  ఒక్కటే –సమాజం లోని వివిధ వర్గాల ప్రజల యదార్ధ జీవితాన్ని మొత్తం సంయుక్త అమెరికా ప్రజలందరికీ తెలియకేయటమే .నిజంగానే వీరు ఆలక్ష్యాన్ని సాధించారు .సాధారతక్కువగానే ఉంటుంది కానీ మహా రచయితలూ తమమేధస్సుకు పదునుపెట్టి సెంటిమెంట్ కు హాస్యం జోడించి  తక్కువ గ్లామర్ ఉన్న జనాలను పాత్రలను చేసి అద్భుత రచనలు చేసి సుభాష్ అనిపించారు అందులో హెన్రి వి నభూతోగా ఉండటం విశేషం . రొమాన్టిజం ,నాస్టాల్జి కి  పట్టాభి షేకం చేసిన ఈరచనలు  తర్వాత రియలిజానికి మార్గం చూపాయి .కొందరు రొమా౦టిజం కు దూరమై  వాస్తవికత కే  ప్రాణం పోశారు.

  చార్లెస్ లాంగ్ హార్న్ క్లేమేన్స్ అసలు పేరైన ‘’మార్క్ ట్వేన్  స్థానిక హాస్య కమెడియన్స్.స్థానిక కలరిస్ట్ లతో సానిహిత్యం బాగా ఉన్నవాడు .ఒక ప్రి౦టర్ కు అప్రెంటిస్ గా ఉంటూ ,ప్రీ వార్ హ్యూమరిస్ట్ ల ను అధ్యయనం చేశాడు .ఆర్టేమస్ వార్డ్ , బ్రెట్ హార్టేలు అప్పటికే పబ్లిక్ లో ఆరాధ్యులు .వీరి మధ్య ఉంటూ బాగా ఎదిగాడు మార్క్ ట్వేన్ .అయన మొదటిపుస్తకం ‘’ఇన్నో  సెన్ట్స్ అబ్రాడ్ -1869,రఫింగ్ ఇట్-1872,రాసి తర్వాత ట్రావేలోగ్ కూడా రాసి పోస్ట్ వార్ ప్రొఫెషనల్ హ్యూమరిస్ట్ లతోకలిశాడు .దిఅడ్వెంచర్స్ ఆఫ్ టాం సాయర్ -1876,లైఫ్ ఆన్ ది మిసిసిపి -1883,దిఅడ్వెంచర్స్ ఆఫ్ హకిల్ బెరీఫిన్-1884 అనే మహాగోప్పనవలలో మిసిసిపి లోయ జీవితాన్ని పరమాద్భుతంగా చూపించాడు .అమెరికన్ గోప్పరచయిటలలో మార్క్ ట్వేన్ ఒకడు .తనము౦దువారి కంటే ఆయన గొప్ప నైపుణ్యం చూపాడు .ఆయన చాలా ఫన్నీమాన్ .ప్రతి సూక్ష్మవిషయాన్నీ విశదంగా వర్ణించే నేర్పు ఉన్న రచయిత.పాత్ర సృష్టి ,చిత్రణలో జీనియస్ మార్క్ ట్వేన్ .

   సశేషం

 కృష్ణాష్టమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

11-8-20మంగళవారం ఉదయం ఇంట్లోనూ , సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయదేవాలయం లో సరసభారతి 153వ కార్యక్రమంగా శ్రీ కృష్ణాష్టమి

11-8-20మంగళవారం ఉదయం ఇంట్లోనూ , సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయదేవాలయం లో సరసభారతి 153వ కార్యక్రమంగా శ్రీ కృష్ణాష్టమి

 

https://photos.google.com/share/AF1QipPiHnnLyos_B6FTVp7EEcEzGAAdnilTon6K2Sf2g0jUZM9bzthQ75-xLz4Fcqcq_g/photo/AF1QipMPr9qUG-yzCbvM09uyHZ1K2yC-1xMrSQdf8BDp?key=MUY0VXBHMG1TTTQzMVRMSENpUGY2cEVrWEJFSU9B

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16

మానవల్లి రామ కృష్ణ కవి గారు

మానవల్లి రామకృష్ణగారు మద్రాస్ నుంగం బాకం లో 1866లో జన్మించారు తండ్రి రామశాస్త్రి అష్టా దశ భాషా పండితులు .తనగురించి’’మృగావతి ‘’కావ్యం లో –

‘’చెన్నపురి చూళ నివసించు చున్న వాడ-వైదిక బ్రాహ్మణుడ,మానవల్లి కులుడ-రామ దైవజ్ఞ పుత్రుడరాజనుతుని –త్యాగరాయ పండితుని ప్రియాను జుండ’’అని మాత్రమె చెప్పుకొన్నారు .క్రిస్టియన్ కాలేజీ లో చదివే టప్పుడే  ‘’ఆంధ్రభాషను గూర్చిన ఉపన్యాసము ‘’వైజయంతి పత్రికలో రాసి విద్వాంసుల మన్నన పొందారు .పట్టభద్రులై వనపర్తి సంస్థానం లో విద్యాధికారిగా జీవితం ప్రారంభించారు .1901వరకు పని చేసి అభిప్రాయ భేదాలవలన మళ్ళీ వెళ్ళలేదు .వనపర్తిలో ఉన్నప్పుడు ‘’బ్రహ్మవిద్యా విలాస ముద్రాక్షర శాల’’లో’’విస్మృత కవుల గ్రంథమాల’’మొదలుపెట్టి మొదట వల్లభారాయుడి ‘’క్రీడాభి రామం ‘’,నన్నే చోడుని ‘’కుమార సంభవం ‘’ప్రచురించాడు నన్నె చోడుడు నన్నయ్య కంటే ముందువాడు  అన్నారు .దీనితో ఆంద్ర దేశం లో గగ్గోలు పుట్టింది .తెలుగు పండితులు ఆయన్ను శత్రువుగా భావించారు .ఇంత దుమారంరేగినా మీరేమీ మాట్లాడరేం ?’’అని మద్రాస్ లో ఒక సారి రామచంద్ర గారు అడిగితె ‘’చెప్పేదేదో ఆ గ్రంథ  పీఠిక లోనే చెప్పేశాను .మళ్ళీ మళ్ళీ చెప్పటం ఎందుకు ?’’అన్నారట .ఆయన సంస్కృత ఆంద్ర మళయాళ తమిళ కన్నడ ఇంగ్లీష్ భాషలలో నిష్ణాతులు .

 కవిగారు ఆంధ్రులకు ప్రసాదించిన మరో రచన ‘’ప్రబంధ మణి భూషణం ‘’.అనేక కావ్యాలనుంచి వివిధ భాగాలు సేకరించి కథ గా కూర్చిన కృతి.త్రిపురా౦త కోదాహరణ ,నీతి ముక్తావళి ఆంధ్రతిరువాయిమొళి,,శ్రీరంగ మహాత్మ్యం ,సకల నీతి సమ్మతం గ్రంథాలు ప్రచురించారు .తెలంగాణా అంతా తిరిగి ‘’లిథిక్ రికార్డ్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్’’ను విద్వత్ పూర్ణమైన పీఠిక,శాసనాల నకళ్ళతో సహా ప్రకటించారు.ఇలా చేస్తూనేతెలుగు సంస్కృతాలలో ఏం ఏ పాసయ్యారు .ఆయన ఏ పుస్తకం రాసినా ఆంద్ర విమర్శకులు చెలరేగేవారు .దీనితో తెలుగులో రాయటం మానుకొన్నారు .

మద్రాస్ పచ్చయప్ప కాలేజిలో మూడేళ్ళు సంస్కృత లెక్చరర్ గా పని చేశారు .మద్రాస్ ప్రభుత్వ విద్యా శాఖ వీరిని తాళపత్ర గ్రంథ సేకరణకు నియమించింది .ఈయనా ఉభయ మీమాంసాలంకార శాస్త్ర పారంగతులు ఎస్ కే రామనాధ శాస్త్రి కలిసి మద్రాస్ రాష్ట్రమంతా గాలించి అపూర్వ గ్రంథాలు సేకరించారు .కవి గారి ధారణా శక్తి అమోఘం .ఒక సారి చూస్తె చాలు మనసులో అది ముద్ర అయిపోతుంది .ఒక ఊళ్ళో పండితులు తమవద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వటానికి ఒప్పుకోలేదు .కవిగారు ఊరికే చూసి ఇస్తాను అని చెప్పి ఒక గంట పుస్తకాలు తిరగేసి ,ప్రధానఘట్టాలు మనసులో ముద్రించుకొని ,బసకు వెళ్లి వివరంగా రాసేశారట .

  కవిగారు –కుందమాల చతుర్భాణినాట్య శాస్త్రం వంటి అపూర్వ  సంస్కృత గ్రంథాలు పరిష్కరించి విపుల పీఠికలతో ప్రచురించారు .భరత కోశం అనేది భరత శాస్త్ర సర్వస్వమే .నన్నె చోడుని కుమార సంభావ ప్రతి లాహోర్ లో ఉందని తెలిసి అప్పుడు అక్కడున్న రామ చంద్రగారికి ఉత్తరం రాస్తే తెలుగు పేరుతోఉన్న ఆతాటాకు గ్రంథం దొరికింది కాని అందులో కొన్ని ఆకులే ఉన్నాయి .శూద్రకమహాకవి రాసిన ‘’వత్సరాజ  చరిత్రం  ‘’ను కవిగారు ‘’వత్సరాజు చరిత్ర ‘’నవలగా రాశారు .1916లో నిడదవోలు వెంకటరావు గారింట్లో బస చేసి భరతుడి నాట్యశాస్త్రాన్నీ ,టీకా తాత్పర్యాలతో సహా నకలు రాసుకొన్నారు .అప్పుడే ప్రాచ్యలిఖిత భండాగారానికి క్యురేటర్ గా ఉన్నారు 1940లో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థలో రీడర్ గా చేరి 1951దాకాపని చేశారు.

కవిగారి జీవిత చరమ దశ దీనంగా గడిచింది .ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి పొట్ట పోషించుకొనే వారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేరకు నెలసరి గౌరవవేతనం ఇచ్చేవారు .ఆతర్వాత డా పోణంగి శ్రీ రామ అప్పారాగారు రామచంద్రగారికి తెలియజేస్తే నెలరోజులు ఇంట్లో ఉంచుకొని ఆతిధ్యమిచ్చారు .సరదాగా మాట్లాడుతూ ‘’సెంచరీ కొట్ట లేనేమో “?అని  91వ ఏట 21-9-1957 మానవల్లి రామకృష్ణకవిగారు పరమపదించారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-10-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

203-అమెరికాదేశ సాహిత్యం -6 19 వ శతాబ్ది సాహిత్యం -3 అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1

203-అమెరికాదేశ సాహిత్యం -6

19 వ శతాబ్ది సాహిత్యం -3

అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1

1848రివల్యూషన్ ప్రపంచవ్యాప్తిగా ఆకర్షింప బడి అనేకమంది అమెరికన్లు నూ కదిలించింది .సంస్కరణ గాలిలోనే ఉంది .అమెరికన్ బ్రాహ్మిన్స్ , ట్రాన్ సేండెంట లిస్ట్ లు ముందుకొచ్చారు .విలియం లాయడ్ గారిసన్ అనే సన్యాసి ,ధనస్వామి బానిసత్వం పై పోరాటం చేశాడు .ఆయన సంపాదకుడుగా ఉన్న వారపత్రిక  ‘’లిబరేటర్ ‘’ సర్క్యు లేషన్ తక్కువే అయినా దాన్ని పూర్తి గా  సమర్ధించి ఒక ఆయుధం అయింది ఆయనకు .ఈపత్రిక చందాదారు బానిస వ్యతిరేక ఉద్యమ౦ తో సంబంధమున్న గొప్ప రచయిత జాన్ గ్రీన్ లీఫ్ విట్టియర్.ఆయన ఆపత్రికలో రాసిన చిన్నచిన్నకవితలు చాలా భావస్పోరకం గా బానిస నిర్మూలనానికి అనుకూలం గా ఉంటూ జనాలను చైతన్యవంతుల్ని చేశాయి. ఆయన కవితలన్నీ ‘’పోయెమ్స్ రిటెన్ డ్యూరింగ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ అబోలిషన్ క్వేస్చిన్ -1837,’’వాయిసెస్ ఆఫ్ ఫ్రీడం 1846,సాంగ్స్ ఆఫ్ లేబర్ అండ్ ఆదర్ పోయెమ్స్ -1850 పుస్తకాల రూపం లో వచ్చాయి .ఆఉద్యమ నవలారచయిత్రి హర్రియట్ బీచర్ స్టొవ్ ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’1852లో హాస్యం సెంటిమెంట్ తో రాసి ఉద్యమానికి మాంచి దోహదం చేసి,సివిల్ వార్ నుంచి తేరుకోనేట్లు చేసింది  .

  న్యు ఇంగ్లాండ్  మరోగ్రూప్ రచయితలు ,,నవలాకారులు చరిత్ర ఆధార రచనలు చేశారు.నాటకీయత చొప్పించి పండించారు .వీరిలో జాన్ బ్రాక్రాఫ్ట్ ‘’హిస్టరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్’’12భాగాలు 1882లో రాశాడు జాన్ లోత్రాప్ మోట్లి’’హిస్టరీ ఆఫ్ డచ్ రిపబ్లిక్ అండ్ దియునైటెడ్ నెదర్ లాండ్స్ ‘’ను 9భాగాలలో 1856-74 లో రాశాడు .ఈ గ్రూప్ ముఖ్యుడు ఫ్రాన్సిస్ పార్క్ మన్ అనే చరిత్రరచయిత ఇంగ్లాండ్ ఫ్రాన్స్ లమధ్య పోటీలను ,దానివల్ల అమెరికన్ ఫ్రాంటియర్ పురోగతిపై  ధారావాహికంగా రాశాడు.తన పడమటి దేశ యాత్రను ది ‘’ఓఒరెగాన్ ట్రయల్ ‘’గా రాశాడు

 హథారన్,మెల్విల్లి ,విట్మన్ త్రయం

నథానియల్ హతారన్ కదలు రోమాన్స్ లతో అమెర్రికన్ ఫిక్షన్ ను ముందుకు తీసుకు వెళ్ళాడు .ఇతడి ప్రముఖరచన ‘’ది స్కార్లెట్ లెటర్ ‘’-1850లో కాలనీ అమెరికా గురించి విపులంగా వర్ణించాడు .’’దిహౌస్ ఆఫ్ సెవెన్ గేబుల్స్ ,’’-1851లో భూత భావిష్యత్తుల విషయాలున్నాయి .‘’ది మార్బుల్ ఫాన్’’-1860ను దూర దేశాలలో రాశాడు .ఈకాలాన్ని అతడు ‘’దిలైట్ ఆఫ్ కామన్ డే’’అన్నాడు .లోతైన మనో విశ్లేషణాత్మకమైన ఈరచనలతో సంక్లిష్ట నైతిక సమస్యలను చర్చించాడు .

  హతారన్ స్నేహితుడు ,నైబర్ అయిన హెర్మన్ మెల్విల్లీ పెద్దగా చదువుకోకపోయినా  వేల్స్ నువేటాడే షిప్ లో ప్రయాణం చేసి దానినేతన  ‘’వేల్ కాలేజ్ అండ్ హార్వర్డ్ ‘’గా భావించి మొదటిసారిగా అనుభవాలను 1846లో ‘’టైపీ’’1847లో ‘’ఓమూ ‘’గా రాసి ప్రచురించాడు .1849లో ‘’రెడ్ బరన్’,’1850లో ‘’వైట్ జాకెట్ ‘’లు రాశాడు .1846-51కాలంలో అయిదేళ్ళు ఫిలాసఫీ సాహిత్య క్లాసిక్స్ హతారన్ అల్లిగారికల్ సింబాలిక్ రచనలు చదివి అధ్యయనం చేశాడు .దీనితో కొత్త  దృక్పధమేర్పడింది .ఈ ప్రభావంతో మొదట ‘’మోర్డి’’-1849,ను  దేశ ఆర్ధిక రాజకీయ సాహిత్య మతాల సంస్థలపై అన్యాపదేశంగాఒకరకమైన తిరుగుబాటు దోరణితో రాశాడు .1851లో రాసిన ‘’మోబీ డిక్’’లేక ది వేల్ నవల  అద్భుత సి౦బాలిజానికి ప్రతీక ప్రతిమాట వాక్యం అర్ధవంతం ఆలోచనాత్మకం గా ఉండి పేరు మారుమోగిపోయింది .సంక్లిష్టంగా ఉన్నా అఖండ మేధస్సుతో ఏకీకృతం గా ఏకముఖంగా రాశాడు  .బెనిటోసేరెనో కథ, కథా సాహిత్యం లో మాస్టర్ పీస్ .1852లో రాసిన సైకలాజికల్ నవల ‘’పియర్రె’’,1890లో రాసిన నావలేట్ ‘’బిల్లీ బడ్’’లు మోబీ డిక్ లోని మేధో లక్షణాలు తగ్గినట్లుగా ఉంటాయి .

 తనజన్మభూమి ‘’మాన్ హట్టన్ ‘’పై వీరాభిమానం తో ఉరకలు వేసే ఉత్సాహం తో గానం చేసే వాల్ట్ విట్మన్ గాయకుడు జీవితం ను మేల్విల్లీ లాగా కాక తక్కువగా చూశాడు .సామాన్యమానవుని జీవిత శోభపై ప్రెసిడెంట్ జాక్సన్ కున్న అభిమానం గ్రహించి జాక్సోనియాన్ డెమాక్రసి పై వీరాభిమాని . .ఎమర్సన్ వ్యాసాలు బోధనలు అర్ధం చేసుకొని ప్రేరణ పొందిన  విట్ మన్1855లో తనకవితాసంపుటి ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’రాసి ప్రచురించాడు .తరువాత క్రమ౦గా పెచుతూ 9ప్రచురణలు తెచ్చాడు .ఆ కవిత్వంలోనే తన చరిత్ర చెబుతూ భావావేశాలను నమ్మకాలను తెలియబర్చాడు .సామాన్యమానవుని గురించి మొదటిసారిగా పట్టించుకొన్న కవితా సంపుటి గడ్డిపరకలు .అమెరికన్ వ్యక్తివాదాని అస్తిత్వానికి ప్రతీక .రాజీలేని మనస్తత్వం ట్రాన్స్ డెంటల్ ఐడియలిజం ,అనిబద్ధ  వచనకవిత్వం తోమార్గదర్శి అయి అమెరికన్ పీపుల్ కవి అనిపించుకొన్నాడు .మొదట్లో  సంప్రదాయ బద్ధులకు రుచించకపోయినా ఎమర్సన్ రాసిన కితాబు వలన జనానికి అర్ధమై ఆరాధనా భావం పెరిగి అమెరికన్ కవులలో అగ్రేసర్ కవి అయ్యాడు ట్రెండ్ సెట్టర్ అయ్యాడు విట్మన్ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’  శ్రీ అంజనప్ప స్వాములు

మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’  శ్రీ అంజనప్ప స్వాములు

హోసూరు ప్రాంతం వరకవి శ్రీ కైవారం తాతగారు జగత్ ప్రసిద్ధులు వారి సమగ్ర చరిత్రను త్రవ్వి తీసి డా అగరం వసంత్ఒక పుస్తకాన్ని వెలువరించాడు .దాదాపు అంతటి ప్రసిద్దే ఉన్న శ్రీ అంజనప్ప స్వాములు గురించి  ఆ ప్రాంతం వారికెవరికీ  పెద్దగా తెలీదు .కాని ఆయన చరిత్ర కర్ణా కర్ణి గా విన్న వసంత్ లోని పరిశోధకుడు మేల్కొని ఆయన చరిత్ర అంతా సేకరించి పుస్తకం రాసి ఈ మార్చిలోనే ‘’హోసూరు వరకవి యోగి –శ్రీ అంజనప్ప స్వాములు’’ గా ప్రచురించి నాకు నెలక్రితమే పంపితే ఇవాళే చదివే తీరిక దొరికి చదివి అందులోని విశేషాలను మీకు తెలియజేస్తున్నాను .’’హోసూరు ఆంధ్ర పరిశోధక పరమేశ్వరుడు’’ డా.వసంత్ ను మనసారా అభినందిస్తున్నాను .

కర్నాటక కోలారుజిల్లా శ్రీనివాస తాలూకాలో గట్టుపల్లి గ్రామం లో అంజనప్ప స్వామి సమాధి ,ఆశ్రమం ఉన్నాయి .ప్రతి ఏడాది మార్చి –ఏప్రిల్ నెలలో ఆయన ఆరాధనోత్సవాలు జరుగుతాయి .అది అంజనప్ప క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది .గట్టళ్ళి అంజనప్ప అసలుపేరు .ఆయన పుట్టుకమాత్రం ప్రస్తుత తమిళనాడు లోని హోసూరు తాలూకా బేరికే ప్రక్కన ఉన్న సీకనపల్లి .ఇక్కడే 1869లో అంజనప్పకాళమాంబ,గవియప్ప దంపతులకు   పుట్టారు .చిన్నతనం లోనే తండ్రి చనిపోగా ,1876-77కాలం లో హోసూరులో విషరోగాలు వ్యాపించిచాలామంది చనిపోగా ,ఈయన తల్లి హోసూరు వదిలి కొడుకుతో కోలారుజిల్లా శ్రీనివాసపురం తాలూకా అరికేరి పల్లెకు చేరింది .అంకేరి జమీందారు వెంకటప్ప  వీరికి బంధువు అవటం తో ఆయన ఆదుకొన్నాడు .తల్లి ఇంటిపనులు చేస్తూ , కొడుకు గొడ్లను కాస్తూ బతుకు బండీ ఈడ్చారు .వెంకటప్ప తనకూతురు పాపమ్మ అన్జనప్పకిచ్చి పెళ్లి చేశాడు .వీరి దాంపత్యం రామకృష్ణ పరమహంస శారదా మాతల  దాంపత్యం లాగా సాగింది .

గొడ్లను కాస్తూ రోజూ అంజనప్ప చెట్ల నీడల్లో బండలమీద కూర్చుని ధ్యానం లో పడిపోయేవాడు.అప్పుడు ఆయన నోటినుంచి వేదాంత వాక్యాలు భక్తిపాటలు పద్యాలు అలవోకగా  వచ్చేవి .మెలమెల్లగా వాటిని రాయటం మొదలు పెట్టారు .అదే తర్వాత ‘’వేదాంత రత్నావళి ‘’అనే 494పేజీల పుస్తకం గా వెలువడి కర్నాటక ప్రాంతమంతా విస్తృత ప్రచారం పొందింది . ఇందులోని 450పేజీలు  తెలుగు మిగిలిన 50పేజీలు  కన్నడం లో ఉండి,లిపి అంతాకన్నడ లిపిలో ఉంది .ఇప్పటికి ఆపుస్తకం 7సార్లు పునర్ముద్రణ పొందింది అంటే ఎంతటి ప్రభావం కలిగించిందో అర్ధమౌతుంది .ఇందులో 474తెలుగు కీర్తనలు ,52మాత్రమె కన్నడ కీర్తనలున్నాయి .దురదృష్ట వశాత్తు ఈ పుస్తకం ఇప్పటిదాకా తెలుగు లిపి లో అచ్చు కాలేదు .మనవాళ్ళ అలసత్వానికి నిలువెత్తు నిదర్శన గా నిలిచింది .

స్వాముల ఆధ్యాత్మిక సాహిత్యం శతకాలుగా ,కందపద్యాలుగా ద్విపదలుగా తత్వాలుగా ,కీర్తనలుగా ఉన్నాయి .అంజనప్ప స్వామికి ఆంజనేయస్వామి ‘’మరుగుజ్జు ‘’రూపం లో దర్శనమిచ్చి జ్ఞానబోధ చేశాడట.అందుకే ఆయనపై ఎక్కువ కీర్తనలు రాసి ,ఆయనకే అంకితమిచ్చాడు అంజనప్ప స్వామి  .అందరు  దేవతలు దేవుళ్ళమీద కూడా కీర్తనలురాశాడు .వీటిని పండితపామరులు బాగా మెచ్చారు .వేదాన్తసారాన్నిభాక్తితో రంగరించి మహా మాధుర్యంగా రాశాడు. అలాగే అంజనప్ప స్వామి ‘’కాలజ్ఞానం ,’’శ్రీ పరమాత్మ రామ లింగ శతకం .శ్రీ కృష్ణ శతకం,శ్రీ గగనాద్రిపురి శతకం ,పిండోత్పత్తి వివరం ,శ్రీపరమాత్మకవి శతకం ,మస్తకాచల మహాత్య౦ ,ముక్తికాంతా పరిణయం శ్రీ రాజయోగానంద ద్విపద కావ్యం ,సుజ్ఞాన ద్విపద కావ్యం ,గురుశిష్య సంవాదం వంటి రచనలెన్నో రాశారు .

తత్వాలను తెలుగులోఎక్కువగా రాసినా తనుఉన్న కన్నడ సీమను మర్చిపోకుండా ఆభాషలోనూ కొన్ని రాశారు  .తనవ్యక్తిత్వాన్ని ఇలా చెప్పుకొన్నారు –‘’ఒకరి సొమ్ముకు నేను ఆశపడలేదు ఆంజనేయ –చెయ్యెత్తి ఇస్తేను చేతులొడ్డినాను ఆంజనేయ –కడుపుకు కూడు లేక కట్టు గుడ్డ లేక ఆంజనేయ –జోలి కట్టలేదు ,ఇండ్లు తిరగలేదు ఆంజనేయ –కడుపు సాకుట కొరకు కష్టమెంతో పడితి ఆంజనేయ ‘’

తత్వ బోధ చేస్తూ –‘’జగములోన జాతిభేదం  లలెంచబోకండి –స్త్రీపురుష జాతులు రెండు సృష్టిలో నిర్మించే బ్రహ్మ ‘’

గురువుగురించి –గురువు బోధా మరువ లేదమ్మా –సద్గురుని బోధ ఆత్మలో నా నెరనమ్మి నానమ్మా

‘’రామ నామ గురు తారక మంత్రము –కోరి పఠించర ఓరన్నా ‘’

మానవ జన్మ గురించి –స్థిరముకాదు ఈమానవ జన్మము –పరమాత్ముని భజియించు .

‘’వావి వరుసలు పోయే వసుధ లోన –మాయ తెలియక పోయె,మమకార మెచ్చాయె-చెడిపోయే రాజ్యంబు చేటు వచ్చె-రాజ్యంబు రంకాయ రమ్యంబు లేదాయె’’

‘’సతిపతు లిరువురుల్ సమగుణమైవుంటే –సత్యంబు సమమౌను నిత్యముగాను’

కృష్ణుడి పై –‘’గోపాల శ్రీ కృష్ణా గోపీ నందనా –పతితపావనలోల పంకజాక్షా –శ్రీపతి నిన్ను నే చింత చేసితి ఆత్మలో –తప్పాక నిన్నునే  ఒప్పుగా  పూజింతు ‘’

‘’మూల బ్రహ్మ౦బెవరు ముమ్మూల గృహములో వెదకి చూసినవాడు యోగశాలి’’అంటే ఆత్మలో వెదికితే మూలబ్రహ్మతత్వం తెలుస్తుంది  .

పిండోత్పత్తి విధం –సతిపతులిద్దరూ సంతసంబున రతి చేయగా రమణి గర్భము నందు

ఒక్క మాసములోపల పంచభూతములు –రెండవ మాసమందు చర్మము కలుగును –మూడు మాసము ల లోపల నరములు కలుగును-ఏడోమాసములుఆడమగ శిశు రూపము   — ఎనిమిది మాసములందు సకల వాయువులు కలుగును ‘’

మానవ శరీరం లో తెలుగు అక్షరాలు-స్థూల శరీరం లో గుద స్థానం లో ఆధార కమలం లో శష సహ,దానికి రెండు అంగుళాల పైన –సప్తతి అనే స్వాదిస్టానకమలం లో బ భ మా యరల ఉంటూ సృష్టికర్త బ్రహ్మ ఉంటాడు .దీనికి ఎనిమిది  అంగుళాలపైన –డఢణతథదధనపఫఅనే పది రేకులతో ఉంటుంది అక్కడ విష్ణువు ఉంటాడు .దీనికి పది అంగుళాలపైన హృదయస్థానం లో క ఖ గఘ ఙచఛజఝఞటఠఅనే పన్నెండు రేకులతో ఉంటుంది ఇక్కడ లయకర్త రుద్రుడు ఉంటాడు .దీనికి 12అంగులాళపైనకంఠంలో అ,ఆ ఇఈఉఊ ఋఋా,ఎఏఐఒఓఔఅంఱఅనే 16దళాలతో విశుద్ధ చక్రం ఉంటుంది .

కైవారం తాతగారు 1726లో కర్నాటక చిక్క  బళ్ళాపురం జిల్లా చింతామణి తాలూకాలో పుట్టారు .పోతులూరి వీరబ్రహ్మ౦గారిలా గా మఠం లో పూజలు అందుకొన్నారు తాతగారు 90శాతం తెలుగులో 10శాతమే కన్నడంలో రాశారు .వీరి రచనలన్నీ కన్నడీకరించ బడి బాగా ప్రచారం పొందాయి .అంజనప్ప ఆశ్రమం కైవారం వారి ఆశ్రమానికి 30కిలో మీటర్ల దూరం లో ఉన్నది .అంజనప్ప పై నారాయణ తాతగారి ప్రభావం కనిపిస్తుంది

‘’తొమ్మిది వాకిండ్లు కొంప దుఖముల కిది  మూలదుంప ‘’అని తాతగారు అంటే అంజనప్ప ‘’తొమ్మిది వాకిండ్ల తనువిది నేమ్మదేమియు లేకున్నది ‘’అన్నారు .’’ఎందుండి వస్తీవి తుమ్మెదా ‘’అని ఆయన అంటే ‘’నీ ఊరిపేరేమి జీవయ్యా నీవు ఎందుకు వస్తివి జీవయ్యా ‘’అని ఈయన అన్నారు .

శ్రీ అంజనప్ప స్వామి గుట్టుపల్లి లో 1971ఏప్రిల్ 30న102వ ఏట  సమాధిపొందారు .

బహు శ్రమపడి డా వసంత్ ఈ పుస్తకం రాసి అంజనప్ప స్వామిని మనకు అందుబాటులో తెచ్చినదుకు అభినందనలు .ఈ పుస్తకం లో స్వాముల 50 రచనలు చేర్చి నిండుదనం తెచ్చాడు వసంత్.అంజనప్ప స్వాముల ముఖ చిత్రం తో పుస్తకం మేలు భళా గా ఉంది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-20-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | 5 Comments

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16ప్రముఖ ఆయుర్వేద విద్వాన్ దీవిగోపాచార్యులు

ఆయుర్వేదం అంటే పిచ్చివాళ్ళ పంచాయతి అని దాన్ని నిషేధించాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించి అది అశాస్త్రీయం అని నిరూపించటానికి కి ఒక సంఘం ఏర్పరచి ,దానితో అశ్వ గంధ బలాతిబల మొదలైన మహా మూలికలను  నిష్ప్రయోజనం  అని నిరూపి౦ప జేసి ఆయుర్వేదాన్ని  భూ స్థాపితం చేసే తీవ్ర ప్రయత్నం చేసింది .అప్పుడు ప్రమాదం పసిగట్టి భారత వైద్య ప్రతినిధిగా ‘’ఏకాంగ వీరుడిగా’’ ఎదిరించి నిలిచి ‘’ఆయుర్వేద కాంగ్రెస్ ‘’స్థాపించి ఆసేతు హిమనగం బర్మా ,కాబూల్ లలో పర్యటించి ,మహా పండితులను ఏకం చేసి ఉద్యమానికి బాసటగా మద్రాస్ లో ఆయుర్వేద కళాశాల స్థాపించి ,అనేక ఆయుర్వేద గ్రంథాలకు సులభ వ్యాఖ్యలు రాసి ప్రచురించి ఆయుర్వేదం మహోన్నత వైద్య విధానం అని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తీ పండిత దీవి గోపాలాచార్యులు

  మద్రాస్ లోని  కన్యకాపరమేశ్వరి ఆయుర్వేద కాలేజి లో వైద్యులుగా పని చేస్తూ గుర్రబ్బండీ మీద మాత్రమె ప్రయాణం చేసేవారు .అప్పుడు ఆంగ్లేయ సివిల్ సర్జన్ల ఫీజు అయిదు రూపాయలు . వీరుకూడా   అదే ఫీజు తీసుకొనే వారు సమానంగా .ఆ ఆయుర్వేద కాలేజిలో దేశం లోని అన్ని ప్రాంతాల విద్యార్ధులు ఉండేవారు .ఆయన చనిపోవటానికి ముందు రామ చంద్ర వారిని సందర్శించి ధన్యులయారు .తలపాగా ఊర్ధ్వ పు౦డ్రాలతో మహా వర్చస్సుతో వెలిగి పోయే వారట .గాంభీర్యం కరుణ ముఖంలో కనిపించేవి .ఆధునిక ధన్వంతరి దీవి గోపాలాచార్యులవారు .

  కృష్ణా జిల్లా నాగాయలంక దగ్గర భావ దేవరపల్లి లో 10-10-1872న జన్మించారు.ఆయుర్వేద మార్తాండ ,భిషజ్మణి’’ వైద్య రత్న బిరుదాంకితులు ,ఆయుర్వేదం లో విస్తృత పరిశోధనలు చేసి ప్లేగు ,కలరాలకు ‘’శత ధౌత ఘ్రుతం ‘’హైమాది పంక్రం –అంటే పానకం మందులు తయారు చేసి వాడి ఆ జబ్బులు నయం చేసిన ప్రయోగ శీలి  .29-9-19-20న 48వ ఏటనే చనిపోయారు .

  హాధీ రాం జీ నమిలిన అల్యాకు

    రామచంద్ర గారి ఆయుర్వేదా చార్యులు చింతపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారు దీవి వారికి మొదటితరం శిష్యులు .ఒకరోజు సుమారు పదిహేను మంది విద్యార్ధులను వెంట తీసుకొని ఓషధీ విజ్ఞాన యాత్రకోసం కపిల తీర్ధం కొండ ఎక్కించారు .అక్కడ ఒక చోట తన చేతిలో ఉన్న బాణాకర్ర తో పొదలాగా ఉన్న చిన్న పొన్నగంటి ఆకుల్లాగా ఉన్న పొదను చూపించారు .ఆఆకులు తినమన్నారు అలాగే తిన్నారు అవి పిచ్చ తియ్యగా ఉన్నాయి .అతిమధురం కన్నా తీపి .రసం మి౦గ గానే  కొత్త బలం శక్తి వచ్చి నట్లు అందరికీ అనిపించింది .అందర్నీ కూర్చోబెట్టి దానికథచెప్పారు శాస్త్రిగారు .

‘’దీనిపేరు అల్లి ఆకు .అల్యాకు అంటారు.తిరుపతిలోని హాథీరాం మఠం లో’’ హథీ రాంజీ’’ మహంతు గారు సుందర బాలాఢ్యుడు.తిరుపతికి పడమరగా రెండుమైళ్ళ దూరం లో ఒక రింగు తోట ఉండేది .అక్కడ రాతి గుండ్లు ఉంటాయి మీరు చూసేఉంటారు వాటిని బంతి లాగా ఎగరేస్తూ వ్యాయామం చేసేవాడు .ఈ అల్యాకు గుప్పెడు నోట్లో వేసుకొని ,నమిలి రసం మింగి నెలరోజులు ఆహారం లేకుండా తపస్సు చేసేవాడు .తర్వాత మరో గుప్పెడు నమిలి రసం మింగి యోగ సమాధిలో నెలల తరబడి ఉండేవాడు .రెండుమూడాకులు తింటే ఆకలే వెయ్యదు.ఇక్కడే తిరుపతి (యాత్రీకులు ఆచిన్న చిన్న రాళ్ళతో ఇల్లు కడితే త్వరలోనే స్వంత ఇల్లు నిర్మిస్తారు అనే నమ్మకం ఉంది .నేనూ మాఅమ్మాయి అలాగే రాళ్ళు పపేర్చాం తర్వాత ఇల్లు కట్టుకోన్నాం –ఇది స్వవిషయం ).

  అంతటి యోగీ ఒక యోగిని చేతిలో మోసపోయాడు .ఆమె తిరుపతికి వచ్చి ఈయనతో వాదానికి దిగి ,ఓడిపోయింది .తనను పురుష శక్తితో గెలవమని అప్పుడే ఓటమి అంగీకరిస్తానని సవాలు విసిరింది .నమ్మి ఓడిపోయాడు ఆయన్ను భ్రస్టుడిని చేసి పారి పోయింది .యోగ భ్రస్టుడై  స్త్రీ వ్యామోహం లో పడి కొంతకాలానికి తెలుసుకొని మళ్ళీ దార్లో పడ్డాడు ‘’అని శాస్త్రీజీచేప్పాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -5

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -5

 19వ శతాబ్ది సాహిత్యం -2

అమెరికన్ రినైసేన్స్

క్లాసిక్ న్యు ఇంగ్లాండ్ రచయితలలో హెర్మన్ మెల్ విల్లీ ,వాల్ట్ విట్మన్ మొదలైనవారు కొత్త ఆత్మ ,మనసు తో రాసి నవశకానికి దారి చూపించారు .అమెరికా మొదటి ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ ప్రమాణ స్వీకారం నాడు చేసిన ప్రసంగానికి ప్రాజాస్వామ్య విలువలకు ఆకర్షింప బడి రాచనా వ్యాసంగం కొనసాగించారు .ఈ కాలం లో స్థానికత చాలా ప్రాచుర్యం వహించింది .అప్పటిదాకా రచనలలో,పాత్రలలో  బ్రిటిష్ వాసన తప్ప స్వంత భాష స్వంత దేశానికి చెందిన పాత్రలు రాలేదు. ఈ లోపాన్ని వీరిద్దరూ గ్రహించి కొత్త మార్గం లో నడిచి మార్గదర్శులు ,వైతాళికులయ్యారు.

  1830నుంచి 67వరకు హాస్యరచయిలలో రెండు గ్రూపులు ఏర్పడి రాశారు.కొందరు అత్యంత నిమ్న యాంకీ పాత్ర సృష్టి చేసి రాజకీయ సాంఘిక విషయాలపై  వ్యాఖ్యలు కామిక్ గా రాశారు .వీరిలో సేబా స్మిత్ ,జేమ్స్ రస్సెల్ లోవెల్,బెంజమిన్ పి.షిల్లబెర్  ఉన్నారు .ఆనాటి అమెరికా భాష పాత్రలను బాగా అర్ధం చేసుకొని ,అంతకు ముందు ఎవరూ చేయని విధంగా రాసి కొత్త వొరవడి సృష్టించారు .పూర్వపు సౌత్ ఈస్ట్ లో ఉన్న రచయితలూ డేవీ  క్రాకేట్ట్,ఆగస్టస్ బాల్డ్విన్ లాంగ్ స్ట్రీట్ జాన్సన్ జే.హూపర్ ,ధామస్బాన్గ్స్ ధోర్పే,జోసెఫ్ జి.గాల్ద్విన్ ,జార్జి  వాషింగ్టన్  హార్రిస్ లు ఉరుకులు వేసే ఉత్సాహపరచే సరిహద్దుసామాన్య  ప్రజల విషయాలను ,జాక్సోనియన్ డెమోక్రసీ లోని విషయాలను గొప్పగా చిత్రించారు .

    న్యు ఇంగ్లాండ్ బ్రాహ్మణులు

  అప్పటికే ఆగ్రూపులోని లోవెల్ మట్టి వాసన అంటే దేశీవాసనున్న హాస్యం సృష్టించాడు .న్యు ఇంగ్లాండ్ లోని హార్వర్డ్ ,కేంబ్రిడ్జ్,మాసాచూట్స్ లోని ‘’బ్రాహ్మిన్స్ ‘’గా పిలువబడిన రచయితలతో జీవి తాంతం స్నేహ ధర్మం పాటించాడు . ఇది రెండవ గ్రూప్ .ఇందులో హెన్రి వార్డ్స్ వర్త్ లాంగ్ ఫెలో ,ఆలివర్ వెండల్స్ హోమ్స్ ,లోవెల్ మొదలైనవారంతా అరిస్టోక్రాట్స్. వీరందరూ విదేశీ సంస్కృతీ ఒంటబట్టించుకొన్న హార్వర్డ్ ప్రొఫెసర్స్ .లాంగ్ ఫెలో యూరోపియన్ పద్ధతులైన కథా సంవిధానం వర్ణనాత్మక కవిత్వం ను అమెరికన్ చరిత్రతో అనుసంధానం చేసి  అనుసరించాడు .కొన్ని సందేశాత్మక లిరిక్స్ టెక్నిక్ తో ,విషయ సౌభాగ్యంతో రాశాడు .హోమ్స్ -1858-91కాలం లో ‘’బ్రేక్ ఫాస్ట్ టేబుల్ సిరీస్ ‘’లో నగరీకరణ లను చిరుహాస్యం  తెలివిగా మర్యాదాత్మక సాహిత్య౦గా  రాశాడు .లోవెల్ మాత్రం అమెరికా లోనిఆరు బయటి విషయాలను తన దేశీ అమెరికన్ విషయాలను మనోహరంగా కవిత్వీకరించాడు .1865లో రాసిన ‘’హార్వర్డ్  కమెమో రేషన్ ఓడ్ ‘’నోబుల్ సెంటి మెంట్ కు మనోహర రూపం ఇలాంటి ఓడ్స్ చాలారాశాడు .

    ట్రాన్ సేండెంట లిస్ట్ లు

మాసాచూసేట్స్ లో కేంబ్రిడ్జ్ కి దగ్గరలో ఉన్న కాన్కార్డ్  గ్రామం లో మరొక న్యు ఇంగ్లాండ్ రచయితల గ్రూప్ ఏర్పడింది .వీరికి ఆలోచనాత్మక విధానం ,కాల్వనిజం బదులు కొత్తగా వచ్చిన యుని టేరియనిజం ముఖ్య అంశాలు .కాంకర్డ్ ఫిలాసఫర్స్ లో రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ కొత్త యునిటేరియనిజం మినిస్టర్ అయి ,తన విశాల దృక్పధాలకు,విశ్వాసాలకు  భూమిక ఏర్పాటు చేసుకొన్నాడు .ఆయనే పూర్వపు ప్లేటో లాగా ఇప్పుడు ఆధునిక ప్లేటో గా పేరుపొంది ట్రాన్స్ సెండ లిస్ట్ అయ్యాడు .లోతైన సత్యాన్వేషణకు అంతరాత్మ సాక్షి,దానికి అనుకూలమైన  తర్కం ,ఏదైనా వెలువరించటానికి అనుభవం ఉండాలి అన్నది ఈయన సిద్ధాంతం .అతి సామాన్య విషయాలనుంచి అత్యున్నతఆలోచనాత్మక ,అనుభూతి లో నమ్మిన  విషయాలవరకు ఆయన దృష్టి సారించి ప్రబోధించి వ్యాప్తి చెందించాడు  .1841-44వరకు ఎమర్సన్ రాసిన ‘’ఎస్సేస్ ‘’చాలా విలువైనవి అందులో –రిప్రేజెటటివ్ మెన్ -1850,ఇంగ్లీష్ ట్రైట్స్-1856లు అద్భుత ఆలోచనాత్మక కవితారూప వివరణలు .అతని పాటలు కూడా ఆలచన ,భావ గర్భితాలైన ఆణిముత్యాలు .ఇవి 17వ శతాబ్ది మెటాఫిజికల్ కవితలు లాగా ఉంటాయి .ఎమర్సన్ భావాలను భారతీయ తత్వవేత్తలేందరో ఉటంకించి శిరోధార్యంగా భావించారు .అవన్నీ నిర్మలమైన అంతకరణ నుంచి వచ్చిన రుషి వాక్యాలు గా ఉంటాయి .

 ఎమర్సన్ తోడు గా మట్టిమనిషిగా ఉన్న హెన్రి డేవిడ్ థోరోఒకప్పటి సర్వేయర్ లేబరర్ నేచురలిస్ట్  .ఎమర్సన్ కంటే అత్యంత ప్రాక్టికల్ మాన్ ,హ్యూమరిస్ట్ డ్రై యాంకీ .పరస్పర విరుద్ధమైన –para doxical ఫ్రేజులు వాక్యాలతో సరదా హాస్యం సృష్టించాడు .మహా ప్రజ్ఞాని .అతని రచనలు దేశ విదేశాలమేదావులు చదివి తెలకేత్తుకొన్నారు .గాంధీ కూడా ఆయన అభిమానే.అవి ఒరిఎంటల్ క్లాసిక్స్ స్థాయి పొందాయి  .ఎ వీక్ ఆన్ దికంకర్డ్,మేర్రిమాక్ రివర్స్ ,-1849’’ది వాల్డన్ ‘’-1854 తానూ వాల్డన్ పాండ్ లో ఒక గుడిసెలో అతిసాధారణ జీవితం గడుపుతూ పొందిన అనుభవాల సారాంశమే వాల్డేన్ .ఆధునిక మానవుడు కోరికలు తగ్గించుకొని సుఖమైన ఆనంద  జీవితం గడపాలని,అన్ని సంకుచితభావాలను విడనాడాలని ఆయన సందేశం.1849లో రాసిన ‘’సివిల్ దిజ్ ఒబీడిఎన్స్’’ గాంధీకి సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రేరణ కలిగించింది .ప్రభుత్వ దమన నీతికి అధికారదౌస్ట్యా నికి వ్యతిరేకం గా నిరసనగా  హక్కులకోసం ఆయన చేసిన పోరాటం అది ‘’of such a nature that it requires injustice to another [you should] break the law [and] let your life be a counter friction to stop the machine.”

అనిఆదేశానికే కాదు ప్రపంచ దేశాలన్నిటికీ గొప్ప సందేశమిచ్చాడు థోరో తాత. ఎమర్సన్ ధోరోలతోపాటు బ్రాన్సన్ ఆల్కాట్ ,జార్జి రిప్లీ ,ఒరిస్టేస్ బ్రౌనిన్సన్ మార్గరెట్ ఫుల్లర్ ,జోన్స్ వెరికూడా    ట్రాన్ సేండెంట లిస్ట్ లు గా గుర్తింపు పొందారు .ఫుల్లర్ ‘’ది డయల్’’ అనే ఆ భావ మాసపత్రిక ఎడిటర్ మాత్రమె  కాక ఫెమినిస్ట్ ఉద్యమకారిణి కూడా .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సార స్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -4

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -4

 19వ శతాబ్ది సాహిత్యం -1

19వ శతాబ్ద ప్రారంభం లో అమెరికన్ రివల్యూషన్ ,ఆతర్వాత 1812యుద్ధం తర్వాత అమెరికన్ రచయితలు తమదైన దేశీ అంటే నేటివ్ సాహిత్యాన్ని రాసి పరిపుష్టికల్గించాలని నిశ్చయించారు .నలుగురు విశిష్ట వ్యక్తులైన రచయితలు  విల్లియం కల్లేన్  బ్రియాంట్,వాషింగ్టన్ ఇర్వింగ్ ,జేమ్స్ ఫెనిమోర్ కూపర్ ,ఎడ్గార్ అల్లెన్ పో లు మొదటి అర్ధభాగాన్ని తమ రచనలతో ము౦చేత్తేశారు  .

  న్యు ఇంగ్లాండ్  అంటే అమెరికాలోనే పుట్టిన బ్రియాంట్ 23వ ఏట మొదటికవిత ‘’తనటాప్సిస్ ‘’ వంటి కవితలు ఇంకా 18వ శతాబ్దికవుల ఆంగ్లవాసనలతో నే 1817లో రాశాడు .తర్వాత వర్డ్స్ వర్త్ మొదలైన రొమాంటిక్ కవుల ప్రభావంతో న్యు ఇంగ్లాండ్ ప్రకృతిపై నేచురల్ కవిత్వం రాశాడు .దిఈవెనింగ్ పోస్ట్ అనే పత్రిక నడిపాడు కాని .ఈయన్ను వాషింగ్టన్ ఇర్వి౦గ్ వెనక్కి నెట్టేశాడు .

  సంపన్న మర్చంట్ ఫామిలి కి చెందిన ఇర్వి౦గ్’’సాల్మన్ గుడి పేపర్స్ ‘’1807-08 లో రాసి మాన్ హాటన్ నగరజీవితం వర్ణించాడు .1809లో ది హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ ను డీడ్రిచ్ నికేర్ బోకర్ డచ్ కుటుంబాల ఆడంబర పాండిత్య ప్రకర్ష ను పరిహాస భరితంగా రాశాడు .ఇతనికి ప్రేరణ నియోక్లాసికల్ ఇంగ్లిష్ సేటైరిస్ట్ లు .మంచి నగిషీతో చక్కని శైలీ భరితంగా రాశాడు ఇర్వింగ్ .తర్వాత ఇంగ్లీష్ నవలారచయిత సర్ వాల్టర్ ష్కాట్ తో పరిచయం కలిగి ,ఆలోచనాత్మక జర్మన్ సాహిత్యం పై అభిమాన మేర్పడి కొత్త రొమాంటిక్ నోట్’’ది స్కెచ్ బుక్ ‘’1819-20లలో  ‘’బేస్ బ్రిడ్జ్ హాల్ మొదలైనవి –‘’-1822లో రాశాడు , బ్రిటిష్ విమర్శకులు తేరిపార జూసే  గౌరవించిన మొదటి అమెరికన్ రచయిత ఇర్వింగ్ .

  జేమ్స్ ఫెని మోర్ కూపర్ ఇంతకంటే గొప్ప కీర్తి సాధించాడు .స్కాట్ రాసిన ‘’వేవేల్రి ‘’నవలలులాగా ‘’లెదర్ స్టాకింగ్ టేల్స్’’1823-41మధ్య రాశాడు .ఇవి  ఫ్రాంటియర్ మాన్ అయిన నాట్టీ బంపో’’పై అయిదుభాగల గొప్పరచన.చరిత్రను సృజనాత్మక  భాగాలుగా మలచటం లో పాత్రల వ్యక్తీకరణలో  గొప్ప నేర్పు చూఫై అమెరికన్ ఇంగ్లాండ్,యూరప్  సాహితీ వేత్తల ప్రశంసలు పొందాడు .

  ఎడ్గార్ అల్లెన్ పో-దక్షిణానపెరిగి బాల్టిమోర్  ఫిలడెల్ఫియా రిచ్ మాండ్ న్యూయార్క్ లలో రచయితగా ఎడిటర్ గా ప్రసిద్ధి చెందాడు .అతని విశ్లేషణాత్మక శక్తి అందర్నీ ఆకర్షించింది .చదువరుల నాడిగ్రహించి తగిన రచనలు అందిస్తూ పత్రికల సర్క్యులేషన్ బాగా పెంచాడు .గోధిక్ కధలను తన భావ వైశద్యంతో తీర్చిదిద్ది లబ్ధప్రసిద్దుడయ్యాడు. మంచి విమర్శ తో  రాసే ప్రతిదీ కళాత్మకం గా ఔన్నత్యం పొందేవి .అతడి మాస్టర్ పీసేస్ఆఫ్  టెర్రర్ –దిఫాల్ ఆఫ్ ది ఉషర్ 1839,ది మాస్క్ ఆఫ్ ది రెడ్ డెత్ 1842దికాస్క్ ఆఫ్ అమోన్ టిల్లడో,1846,మొదలైనవి అతిజాగ్రత్తగా సైకలాజికల్ గా  రాసినవి .రాసిన డిటెక్టివ్ స్టోరీస్ లో ‘’దిమర్డర్స్ ఇన్ ది రు మోర్గ్ 1841 .’’అమెరికన్ డిటెక్టివ్ సాహిత్యానికి పిత’’ అలాన్ పో .1845లో రాసిన ‘’ది రావెన్ ‘’కవిత్వంతో కవిగాకూడా ఎత్తుకు ఎదిగిపోయాడు .విమర్శకాత్మక రచనలు ,నగిషీచెక్కిన కవిత్వం అమెరికాలో కంటే ఫ్రాన్స్ లో గొప్ప ప్రభావం చూపాయి .చార్లెస్  బాడర్లేర్ వీటినిఫ్రెంచ్ లోకి అనువాదం చేసిమరీదగ్గర చేశాడు .

  జాన్ పెండ్లేటాన్ కేన్నేడి,విలియం గిల్ మోర్ సిమ్స్ లు తర్వాత చెప్పుకోదగినవారు .కేన్నేడి’’స్వాలో బారన్ ‘’1832ప్లాంటేషన్ జీవితాన్ని ఆహ్లాదంగా వర్ణించాడు .సిమ్స్ చారిత్రాత్మక నవలలు స్కాట్ లాగా రాశాడు .వీటిలో హరిహద్దు ప్రజల జీవిత చరిత్ర ,తన నార్త్ కరోలినా చరిత్ర ఉన్నాయి .1835లో రాసిన ‘’ది యమస్సీ ‘’ రివల్యూషనరి రొమాన్సెస్ లలో ప్రతిభా వికాసం కనిపిస్తుంది .

   సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 తిరుమల రామచంద్ర గారి శారీరకలోపాలు

 తిరుమల రామ చంద్రగారి శారీరకలోపాలు

రామచంద్రగారికి నత్తి ఉండేది .ఆందోళన కలిగితే త్వరగా మాట్లాడ బోతే ,భావోద్వేగం పెరిగితే మాటలు తడబడి నత్తి మాటలు వచ్చేవి .వాళ్ళ ఊర్లో ముక్కుతోమాట్లాడే నరసింహాచారి ని ఈయన ఈయన స్నేహబృందం ‘’అనునాశికా చారి ‘’అని ఎక్కిరించేవారు. అందుకే దానిఫలితమ్గా తనకు నత్తి వచ్చి ఉంటుందని రామచంద్ర పశ్చాత్తాప పడ్డారు .ఇదివరకు ఈయనకు చెవిలో పోటూ,అరచేతిలో పండూ డూ , నిద్రలో నడకజబ్బులు ఉంటె గురువుగారు  శ్రీనివాస రాఘవాచార్యులు చిట్కా వైద్యం చెప్పి పోగొట్టారు .చెవిలో పోటుకు ‘’నిర్గు౦డ్యాది తైలం ‘’నిర్గుండఅంటే వావిలి  ,అరచేతిపుండుకు ‘’గంధకాది లేహ్యం ‘’,నిద్రలో నడకకు ‘’నారికేళా౦జనం’’వాడమని చెప్పారు .ఈ అంజనం ఎలా తయారో వివరించారు .వందకొబ్బరికాయలు కొట్టి ,ఆ కొబ్బరినీటిని  కళాయి  ఉన్న గంగాళం లో పట్టి, కాచి వడపోసి ముద్ద చేసి ,పచ్చకర్పూరం కుంకుమపువ్వు గోరోచనం కొద్దిగా లవంగాలు బాగాకలిపి నూరి ఆముద్దకు కలిపి మళ్ళీ నూరి తే పది ఔన్సుల నారికేళ అంజనం తయారయింది .ఈ మూడు చికిత్సలు ఏక కాలం లో చేయించారు . పొన్నగంటికూర ,అవిసె కూర ,చిర్రికూర ,అవిసేపువ్వులు ,ఉస్తికాయలు ,కాకరకాయలు పధ్యం గా ఐదారు నెలలు ఆ మందులు వాడించారు .గురువుగారే అన్ని ఉపచారాలు చేశారు, చేయిచారు .దీనితో నిద్రలో నడిచే జబ్బుకూడా  మాయమైంది

 తిరుపతి కళాశాలలో చేరాక నత్తి ఆయన్ను నవ్వులపాలుచేసి ఇబ్బందిపెట్టింది .ప్రవేశం కోసం రఘువంశం లో నాలుగవసర్గ మొదటి శ్లోకం చదివి అర్ధ తాత్పర్యాలుచెప్పమన్నారు పరీక్షకులు .అదంతా కొట్టినపిండే ఐయినా  కాలేజీలో చేరబోతున్నాననే భావా వేశం లో నత్తి ముంచుకొచ్చి అలానే చదివారు .అర్ధతాత్పర్యాలు బాగానే చెప్పినా స్పష్టత లేకపోయిందే అని బాధపడ్డారు.. ‘’శ్శ్లో శ్లోశ్లో కం లో ఆఆఆఆఅ అలంకారాలు చేచేచేప్పలేదండి .త్తుత్తుత్తుల్య యోగిత అల౦కార మండి.ద్దీద్దీద్దీపకాలంకారం కూడా చ్చేచేప్పోప్పో చ్చండి ‘’అన్నారు .ప్రిన్సిపాల్ గారు ‘’నాయనా ! నీ సంగీతం చాలు .అడ్మిషన్ ఇస్తున్నాము మమ్మల్ని చంపకు ‘’అన్నారు నవ్వుతూ .దీన్ని అలుసుగా తీసుకొని సహచరులు ‘’ఒరేనత్తోడా ,నత్వా చార్య ,నత్తిస్వామీ ‘’   అని గేలిచేసి ఆటపట్టిచేవారుకోపం .వచ్చినా,దిగ మింగుకొనే వారు రామ చంద్ర .ఎవరైనా ఇలా అంటే నవ్వేయటం అలవాటు చేసుకొన్నారు .పత్రికాఫీసులో పై వాళ్ళు అధికారం చెలాయించినా నవ్వేసే వారు .వాళ్లకు ఒళ్ళు మండి’’ఎందుకా వెకిలి నవ్వు ‘’అనేవారు .ఈయన వెంటనే ‘’చేయని తప్పుకు ఆక్షేపణ అర్హమైనప్పుడునవ్వ కుండా యేడిస్తే మీకు మరీ ఇది అవుతున్దండీ ‘’అనేవారు .నవ్వు అందరికీ నాలుగు విధాల చేటు అయితే తనకు నలభై విధాల మేలు చేసింది అంటారు రామ చంద్ర .చదువులో ముందు  ఉండటం ,నిజం చెప్పటం హనుమారాధన మాటతప్పకపోవటం పరోపకారం వంటి సుగుణాలకు మిత్రులు ఫిదా అయి ‘’నత్తోడా అనటం మానేశారు కాలేజీలో .

   ఆసమయం లో వాసుదాసు అనే ఆంధ్రవాల్మీకి ఒంటిమిట్ట కోదండరామాలయ పునర్మించిన శ్రీ వావికోలనుసుబ్బారావు గారు తిరుపతి రాగా, ఆయన్ను చూద్దామని వెడితే భక్త శిష్యబృందవలయం లో ఉన్న ఆయన ఈయన్ను పట్టించుకోలేదు .తర్వాత రామచంద్రగారు ఆయనకు జాబురాస్తూ అందులో తాను  ఆయన భక్తుడనని ఆర్యకదానిది వరుసగాచదివానని తనకు  నత్తిబాగా ఉండి ఇబ్బంది పెడుతోందని రాశారు .ఆ లేఖ అందుకొన్న వాసుదాసు గారు స్వదస్తూరితో రెండు ఠావుల ఉత్తరం రాశారు వీరికి .ఆఉత్త రానని  ఒంటరిగా మూడునాల్గు సార్లు తనివితీరా చదివారు అందులో సాహిత్య వైద్య చరిత్రాది వివరాలున్న  అమూల్య  లేఖ అని పించింది .

ఆ ఉత్తరం సారాంశం –‘’శారీరకమైన నత్తిఉందని బాధ పడవద్దు .ప్రపంచం లో నత్తివారు చాలామందే ఉన్నారు .వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకున్నారు .గ్రీసు దీశం లో గొప్ప వక్తలలో ఒకరికి  నత్తి బాగా ఉండేది .మహామేధావి  ఏదిమాట్లడదామన్నా, నోరు పెగిలేదికాదు .పిచ్చివాడు మూర్ఖుడు అని యెగతాళి చేశారు .తనలో తానూ కుమిలిపోయేవాడు ఒకసారి సముద్రానికి ఎదురుగా నిల్చుని గొంతెత్తి ‘’భగవంతుడా నా జీవితమంతా ఇంతేనా అవమానం పాలవటమేనా ??’అంటూ ఆవేదనతో అరిచాడు .అలా యెంత సేపు అరిచాడో తెలీదు కళ్ళు మూసుకొనీ అరిచాడు .అలాఅరుస్తూ అరుస్తూ వెనక్కి తిరిగాడు .అనర్గళంగా భగవంతులు స్తుతులు ఆ అరుపులూ  వినిపించాయి .రెండు మూడు రోజులు గడిచాయి .కళ్ళు తెరిచాడు ఎదుట కను చూపు మేరవరకు పెద్ద గుంపు.తన్ను వెక్కిరించి చంపటానికి వచ్చారేమో అని భయపడ్డాడు .పారిపోయే ప్రయత్నం చేసి పారిపోయాడు జనం వెంటపరిగెత్తి పట్టుకున్నారు ‘’నన్ను చంపకండి నా వేదన భగవంతునికి మొరపెట్టుకొన్నాను .మిమ్మల్ని ఎవర్నీపల్లెత్తు మాటకూడా నేను అనలేదు ‘’అని గి౦జు కొన్నాడు .జనం ఆయనను సమాధానపరచి ‘’మహాను భావా !నువ్వు ఇంతగొప్ప వక్తవని అమూల్యమైన సూక్తులు  కురిపిస్తావని మాకు తెలీదు .నువ్వు మహా తత్వ వేత్తవు ,మహావక్తవు క్షమించు మా అజ్ఞానానికి ‘’అన్నారు.

 ‘’ కనుక  కంఠ౦ లో ధ్వనికి సంబంధించిన కండరాలలో లోపాలవలన నత్తి వస్తుంది .ఉప్పుగాలితగిలినా నీటి వాలు గాలి తగిలినా బాగు పడే అవకాశం ఉంది .కనుక చెరువుగట్టుమీదో కలువగట్టుమీదో నీటికి ఎదురుగా నిలబడి నీపుస్తకాలలో ఉన్న పద్యాలో శ్లోకాలో గట్టిగా అరుస్తూ చదువు .చిన్న కణిక  రాళ్ళముక్కలను నోట్లోపెట్టుకొని చదివితే నరాల కదలికకుకండరాలలో మార్పు వస్తుంది .దీనితోపాటుసరస్వతీ ఘ్రుతం, సరస్వతీలేహ్యం తీసుకో. జానకీ వల్లభుడు మహావ్యాకరణ వేత్త బహుభాషాకోవిదుడు ఆంజనేయ స్వామి నీకు  రక్షకులౌతారు ‘’అని చక్కని సలహా రాశారు వాసుదాసుగారు .

 వెంటనే ఆచరణలో పెట్టారు రామ చంద్ర .తిరుచానూరు –రేణి గుంట మధ్య ఉన్న పెద్ద పుష్కరిణి దగ్గరకురోజూసాయంత్రం వెళ్లి  కణిక రాళ్ళ ముక్కలునోట్లో పెట్టుకొని గట్టుమీద నీటికి ఎదురుగా నిలబడి వచ్చిన శ్లోకాలన్నీ నాన్ స్టాప్ గా బిగ్గరగా చదివే వారు .అయిదారు నెలల తర్వాత  విశ్వాసం పెరిగి, క్రమంగా నత్తి మటుమాయమైంది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం

18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -2చివరి భాగం )

               నూతన దేశం

యుద్ధం తర్వాత కాలం లో పైన చెప్పిన మహామహులు పైన్ ,ఆడమ్స్ లు దేశ నిర్మాణానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వలేక పోయారు .కొత్తవారి సలహాలు అవసరమయ్యాయి .బెంజమిన్ రాజ్యా౦గ సమావేశం ఏర్పాటుకు దోహదం చేశాడు .కాని వీరికి భిన్నమైన రచయితలు ధామస్ జెఫర్సన్ ,ఫెడరలిస్ట్ పేపర్స్ లో రచయితలూ నాయకులయ్యారు .1787నుంచి ఒక సంవత్సరకాలం లో 85 ఆర్టికల్స్ ప్రచురింపబడ్డాయి .వీటిని అలేక్జాండర్ హామిల్టన్,జేమ్స్ మాడిసన్ ,జాన్ జే రాశారు .ప్రభుత్వం నడపటానికి దేశం బలపడటానికి మంచి పరిపాలనకు వారి వ్యాసాలూ బాగా తోడ్పడ్డాయి . శాసన సభ్యులను ప్రభావితం చేసి కొత్తరాజ్యా౦గానికి  వోట్లు ఎక్కువగా పడేట్లు కృషి చేశాయి . హామిల్టన్ 51 ఫెడరలిస్ట్ పేపర్స్ రాసి ఫెడరలిస్ట్ పార్టీ మొదటి సెక్రెటరి ఆఫ్ దిట్రెజరీ -1789-95 అయ్యాడు .తన వ్యాసాలతో  జాతీయ ప్రభుత్వం శక్తి సామర్ధ్యాలు రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులతో పెంచాడు .

  జఫర్సన్ చాలా ప్రభావ శీల రాజకీయ రచయితగా యుద్ధకాలం లోనూ ఆతర్వాత గుర్తింపు పొందాడు .ఆయన రాసిన ‘’ది మెరిట్స్ ఆఫ్  డిక్లరేషన్  ఆఫ్ ఇండి పెండేన్స్’’గురించి మాడిసన్ చెప్పినట్లు ‘’తేలికగా అర్ధమయ్యే మానవ హక్కుల గొప్ప ప్రసార సాధనం.అమెరికా ప్రజలకు ఆసందర్భానికి తగిన శైలీ అభివ్యక్తి ఉన్న అద్భుత రచన ‘’.యుద్ధం తర్వాత ఆయన సరైన సిద్ధాంతాలను ,రాజ్యాంగం పై ఉన్న విశ్వాసాలను పేపర్లలో రాస్తూ ,తన ఉత్తరాలలో ,ప్రారంభ ఉపన్యాసాలలో వ్యక్తీ స్వేచ్చను ,స్థానిక స్వయం ప్రతిపత్తినీ ఎలుగెత్తి చాటాడు.హామిల్టన్ భావాలకు నమ్మకాలకు  విభిన్నమైన  పాలనా వికేంద్రీకరణ ,శక్తివంతమైన ఫెడరల్ ప్రభుత్వం అవసరాలను వివరించాడు .మనుషులంతా సమానమే అని నినదించినా, ప్రభుత్వ యంత్రాంగం లో సద్గుణాలు, ప్రతిభ ఉన్న వారికే ఉన్నతపదవులు ఉండే ‘’నేచురల్ అరిస్టాక్రసి ‘’ ఆంటే సహాజ ఉన్నత వర్గపాలన ఉండాలన్నాడు  .

   ఈకాలం లోని గుర్తింపుపొందిన కవులు ,కవిత్వం  గురించి తెలుసుకొందాం .అమెరికన్ రివల్యూషన్ కాలం లో కవిత్వం విదేయులకు ,కాంటి నెంట లిస్టులకు కూడా తమభావ ప్రకటనకోసం ఒక గొప్ప ఆయుధం అయింది.తమవాదాలు తెలియజేయటానికి తమహీరోలను పొగడటానికి పాటలు రాయటానికి సాధనమైంది.అలా వచ్చినవే ‘’యాంకీ డూడిల్’’,నాధన్ హీల్,ది ఎపిలాగ్ ‘’.ఇవన్నీ పాప్యులర్ బ్రిటిష్ మెలడీలలో లో కూర్చి ,ఆనాటి బ్రిటిష్ కవితల్లాగా రాసి సమ్మోహనం కల్గించారు  .ఆకాలపు విఖ్యాత అమెరికన్ కవి ఫిలిప్ ఫ్రెన్యుమొదటి రివల్యూషనరి యుద్ధ గాథలను గొప్ప ప్రచార సాధనాలుగా ఉపయోగించాడు .ఆ తర్వాత ఆయన అనేక విషయాలలో చొరవ చూపాడు .నియో క్లాసిక్ శైలిలో రాసినా, రాసిన కవితలలో ‘’ది ఇండియన్బరీయింగ్ గ్రౌండ్ ‘’,ది వైల్డ్ హనీ సకిల్ ,’’టు ఎ కేటి-డిడ్,’’ఆన్ హనీ బీ ‘’కవితలు రొమాంటిక్ లిరిక్స్ గా వైభవం పొంది 19 వ శతాబ్దం కవిత్వానికి నాంది పలికాయి .

  18వశతాబ్ది చివరి ఏడాదిలో చారిత్రాత్మక  నాటకాలు  నవలలు వచ్చాయి .అమెరికాలో చాలాకాలం నుంచి నాటక శాలలు క్రియా శీలంగా ఉన్నా ,నిజమైన మొదటి అమెరికన్ కామెడీ’’కాంట్రాస్ట్’’ను  రాయల్ టేలర్ 1787లో రాశాడు .ఇందులో బ్రిటన్ కుచెందిన గోల్డ్ స్మిత్ ,షెరిడాన్ ల అనుకరణ బాగా ఎక్కువే  అయినా’’ మొదటి యాంకీ ‘’పాత్ర కల్పన చేసి తర్వాత రాబోయే అలాంటి పాత్రలకు భూమిక గా చేశాడు . దీనితో మొదటిసారిగా అమెరికన్ నేటివిటి ఉన్న పాత్ర సృష్టి చేసి , మార్గ దర్శి అయ్యాడు .

  విలియం హిల్ బ్రౌన్ మొదటి అమెరికన్ నవల ‘’ది పవర్ ఆఫ్ సింపతి’’1789 లో రాసినవలారచనపై అప్పటిదాకా ఉన్న పాత పక్షపాత,ఉపేక్షా దృష్టిని  అధిగమించి, సెంటిమెంట్ దట్టించి ,ఎలా  కొత్తమార్గంలో  పయని౦చాలో  చూపాడు .దీనితో సెంటిమెంటల్ నవలా  వెల్లువ 19వ శతాబ్దం చివరిదాకా అవిచ్చిన్నంగా సాగింది హాగ్ హెన్రి బ్రాకెన్ రిడ్జ్  రచయిత సేర్వాన్టేస్ రాసిన ‘’డాన్ క్విక్సోట్’’,హెన్రి ఫీల్డింగ్ రచనలకు దీటుగా ‘’మోడరన్ షివల్రి’’ 1792-1815 రాసికొంత విజయం సాధించాడు .ఇందులో ప్రజాస్వామ్యంపై హాస్యాత్మక సెటైర్ తోపాటు ఆసక్తి గా  సరిహద్దు ప్రజాజీవనం  ను  వర్ణించాడు .చార్లెస్ బ్రాక్ డెన్ బ్రౌన్ రాసిన ‘’వీలాండ్ -1798,ఆర్ధర్ మెర్విన్ -1799-1800 హెడ్గార్ హన్తి 1799లు  జాతీయ గోథిక్ ధ్రిల్లర్ లుగా అనిపిస్తాయి .తర్వాత 19వ శతాబ్ది సాహిత్యంగురించి తెలుసుకొందాం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం 18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం

18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -1

18వ శతాబ్దం మొదట్లోకాటన్ మాదర్  వంటి కొందరు అత్యంత పురాతన సంప్రదాయం లో రచనలు చేశారు .జోనాధన్ ఎడ్వర్డ్స్ ప్యూరిటన్  చరిత్ర,తన జీవిత చరిత్రకలిపి1702లో  రాసిన ‘’న్యు ఇంగ్లాండ్ మగ్నాలియా క్రిస్టిఅమెరికానా,1726లో రాసిన తన తీవ్రమైన ‘’మనుగక్టికో అండ్ మినిస్టీరియం’’పుస్తకాలలో ప్యూరిటన్ భావాల,విశ్వాసాల  సమర్ధన ఉంది .గ్రేట్ అవేకెనింగ్ తో జోనాథన్ ఎడ్వర్డ్స్ తూర్పు సముద్ర తీరమంతా తన కాల్వనిస్టిక్ డాక్ట్రి న్ తో   కల్లోలం చేశాడు చాలా ఏళ్ళు .మానవుడు దేవుని దయతోనే జన్మించి సుగుణాలతో మోక్షం పొందుతాడని విశ్వసించాడు .ఈభావాలు 1754లో రాసిన ‘’ఫ్రీడం ఆఫ్ విల్ ‘’లో వివరించాడు .తనభావాలను  మెటాఫిజికల్  సిద్ధాంతాలతో అద్భుతమైన వచన రచనతో సమర్ధించుకొన్నాడు .

  ఐతే మాదర్ ,ఎడ్వర్డ్ లు ఇద్దరు వైఫల్యకారణాలనే(డూమ్డ్ కాజ్ )‘’’’నే సమర్దిచారు .ఉదార న్యు ఇంగ్లాండ్ మినిస్టర్స్ జాన్ వైజ్ ,జొనాధన్ మే హ్యు లు మాత్రం సరళమైన మతం గురించి ఆలోచించారు .సామ్యుల్ సేవాల్ 1673-1729రాసిన ‘’డైరీ ‘’లో ఇంకొన్ని మార్పులు సూచించాడు .న్యు ఇంగ్లాండ్ అనే అమెరికాలో దినవారీ కార్యక్రమాలలో కఠిన ప్రోటే స్టంట్ విదానా లకు బదులు ప్రాపంచిక దృక్పధం తో లాభార్జన జీవితం ఎలా ప్రవేశించిందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు .జర్నల్ ఆఫ్ Mmeసారా కేమ్బుల్ నైట్  1704లో తన న్యూయార్క్ యాత్రనుచాల హాస్యవంత౦గా వర్ణించింది .సంప్రదాయం పై పూర్తీ నమ్మకమున్న ఆమె తానుచూసిన విషయాలను చాలా జోక్యులర్ గా వివరించింది .దక్షిణాన వర్జీనియాలో విలియం బైర్డ్ అనే అరిస్టాక్రటిక్ ప్లాంటేషన్ ఓనర్ తన పూర్వీకుల చీకటి జీవితాన్ని విభేదించాడు .1728లో చేసిన సర్వేయింగ్ ట్రిప్ విషయాలను ‘’ది హిస్టరీ ఆఫ్ ది డివైడింగ్ లైన్ ‘’1733లో తన ఫ్రాంటియర్ ప్రాపర్టీ స్ గురించి ‘’ఎ జర్నీ టు దిలాండ్ ఆఫ్ ఈడెన్ ‘’పుస్తకాలో ఆంగ్లికన్ విశ్వాసాలున్నవాడైనా చాలా సరదాగా ,రెస్టోరేషన్  విట్స్ తో  రాశాడు

  తప్పని సరి అయిన అమెరికా రివల్యూషన్ బ్రిటిష్ ,అమెరికన్ రాజకీయ దృక్పధాలలో పెరుగుతున్న మార్పులను  విభేదాలను  బయట పడేసింది .కాలనీ వారు విప్లవం తప్పదని యుద్ధానికి దిగారు .కొత్త జాతీయ ప్రభుత్వానికి మార్గం సుగం చేసుకొన్నారు .వీరికి మేదావులైన సామ్యుల్ ఆడమ్స్ జాన్ డికిన్సన్ వంటి  రచయితల మద్దతు లభించింది  .లాయలిస్ట్ జోసెఫ్ గాలోవే బ్రిటిష్ రాజరికానికి కొమ్ముకాశాడు .వీరికి అతీతంగా బెంజమిన్ ఫ్రా౦క్ లిన్ ,,ధామస్ పైన లు వ్యవహరించారు .

   1706లో పుట్టిన  బెంజమిన్ ఫ్రాన్క్లిన్ తన రచనలను సోదరుడి పత్రిక ‘’న్యు ఇంగ్లాండ్ కోర౦ట్ ‘’లో 1722నుంచే రాయటం మొదలుపెట్టాడు .’’లెదర్ ఆప్రన్ మాన్’’ గా పిలువబడే ఫ్రాన్క్లిన్ అందరికిఅర్ధమయే భాషలో ,ఆచరణాత్మక చర్చలతో రాసి మన్ననలు పొందాడు .అందరికి ఉపయోగపడే ‘’పూర్ రిచార్డ్స్ ఆల్మనాక్ ‘’ను 1732-57కాలం లో 22 ఏళ్ళు కస్టపడి కూర్చాడు .అందులో వివేకవంతమైన ,చమత్కారమైన ‘’సంక్షిప్త వాస్తవాలు –(అఫో రిజమ్స్ ) చదువుకోకపోయినా విశేషలోక జ్ఞానమున్న రిచార్డ్ సాండర్స్ తో రాయించాడు ప్రత్యేకంగా ..ఫ్రాన్క్లిన్ తన స్వీయ చరిత్రను 1771లో రాయటం ప్రారంభించి 1788లో 17ఏళ్ళురాసి పూర్తి చేశాడు .తనకున్నకోద్దిపాటి పరిస్థితులలోనే ఎదిగి ప్రపంచానికి మార్గదర్శకమైన విలువైన సలహాలెన్నో అందజేశాడు బెంజమిన్ ఫ్రాన్క్లిన్ .

స్వయంగా సంసృతిని అభి వృద్ధి చేసుకొన్న బెంజమిన్  అనేక వ్యాసాలతో అనేక విభిన్న విషయాలపై తన భావదీప్తి వెదజల్లుతూ రాసి ఉత్తేజితులను చేశాడు .బ్రిటన్ తో వచ్చిన విభేదాలపై కూలంకషంగా చర్చించి రచనలు చేసి కాలనీ వాసుల కోరికను గట్టిగాసమర్ధించాడు .స్వంత దేశం ఇంగ్లాండ్ నుంచి అమెరికాలోని ఫిల డెల్ఫియాకు వచ్చినవాడు ధామస్ పైన్.మొదట్లో 14నెలలు మాగజైన్ ఎడిటర్ గా ఉండి .తర్వాత కాలనీ వాసులకోర్కేకు గొప్ప మద్దతు దారు అయ్యాడు .1776జనవరిలో ఆయన రాసిన కరపత్రం ‘’కామన్ సెన్స్ ‘’కాలనీ వాసులకు వరప్రసాదమై స్వాతంత్ర్యంకోసం ఉద్యమి౦చటానికి బాగా తోడ్పడింది .1776డిసెంబర్ నుంచి 1783డిసెంబర్ వరకు ధారావాహికంగా ఏడేళ్ళు రాసి ముద్రించిన ‘’ది అమెరికన్ క్రైసిస్ ‘’విప్లవానికి గొప్ప ఊతంగా నిలిచాయి ప్రేరణ చెందించి ,స్పూర్తి  స్వాతంత్రేచ్చను రగుల్కొల్పాయి .ఈ ప్రేరణతో ఈ  చిన్నకాలనీ వాసులు ధర్మయుద్ధాన్ని మహా శక్తివతమైన అధర్మ సైన్యంతో పోరాడి విజయం సాధించారు .నల్ల తెల్లా జాతి ప్రాపగాండా బాగా క్లిక్ అయింది .కవిత్వ విధాన రచన ,బలమైఅన పదాల జోడింపు ,స్వాతంత్రేచ్చ రెచ్చగొట్టే విధానం ధామస్ పైన్ ప్రత్యేకత .ఆప్రభావం బాగా పని చేసింది రివల్యూషన్ కు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-14

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-14

  మొసలి చావుకు ముసలమ్మ చిట్కా

ఆనేగొందిలోని తుంగభద్రా నదిలో మొసళ్ళు ఎక్కువ కాని జన సంచారం ఉన్న చోట కనిపించవు .కాని ఒకసారి సుమారు ఏడు అడుగుల ఒకపెద్దమొసలి ఎక్కడి నుంచో అక్కడికి వచ్చింది .ఆనే గొంది తుంగభద్రలో దిగువ మైలు లోపు  వ్యాసరాయల మఠం.పీఠాధిపతులైన సన్యాసుల తొమ్మిది సమాధుల గుంపు. అది దాన్ని ‘’నవ బృందావనం’’ లేక ‘’నవ రిందావనం ‘’అంటారు .అక్కడే ఒకమొసలి మనిషిని చంపింది .అప్పుడు ఊళ్లోవారికి కాక కలిగి రాణీకుప్పమ్మారాణీ సాహెబా వారికి ఫిర్యాదు చేశారు .దాన్ని ఎలాగైనాపట్టి ప్రజలబాధలు తీర్చమని అధికారులను ఆదేశించారామె .

 రాజవంశానికి చెందిన వీరులు తుపాకులు  బరిసెలు ,బల్లాలతో బయల్దేరారు .చాలాచోట్ల మాటు వేసి అది నదిలోని బండ రాళ్ళపై పడుకొన్నప్పుడు కాల్పులు జరిపారు .ఆ గుళ్ళు దాని అతిగట్టి శరీరం లో ఇరుక్కు పోయాయే కాని ఏమీ చేయలేకపోయాయి .అది కళ్ళు మూసి తెరుస్తూంటే కంటి వెంట నీరు ధారగా కారుతుంది .దాన్ని చూసి అది ఏడుస్తోందని భ్రమపడతారు .కనకనే’’మొసలికన్నీరు’’ అనే పేరు లోకం లో వాడుకగా వచ్చింది. క్రమంగా ఆవుదూడలను లాక్కు వెళ్లిందని ఆవుల్ని తినేసిందని వార్తలు పెరిగాయి .మిట్టమధ్యాహ్నం నదిలో అది ఈదటం చాలా మంది చూశారుకూడా .పుట్టిలో కూచుని తుంగభద్ర దాటటానికి జనం భయపడి పోతు౦టే,వాటిని రద్దు చేశారు .

   ఈ హడావిడి అంతా ఒక 90ఏళ్ళ ముసలమ్మ విని ఒక నవ్వు నవ్వింది ‘’ఇదేమిటి ?మొసలిని చంపటానికి ఇంతమందా ?ఇన్ని ఆయుదాలా ?’’అని విస్తుపోయి,భుజాలేగారేసింది .ఆమాటలు విన్నవారికి విపరీతంగా కోపం వచ్చి ‘’రాచనగరు వాళ్ళంతా దాన్ని చంపటానికి ఇంతగా  శ్రమ పడుతుంటే నవ్వుతావా యెగతాళి చేస్తావా ముసల్దానా ?”’అన్నారు .కొందరు ‘’నువ్వు చంపు చూద్దాం .మంచం నుంచి లేవలేవు మాటలు కోటలు దాటుతున్నాయే ?’’అన్నారు .విరగబడి నవ్వుతూ అవ్వ ‘’దేనికైనా ఉపాయం కావాల్రా కొడుకుల్లారా. ఉపాయం లేని వాణ్ని ఊరినుంచి పంపెయ్యమని పెద్దలు చెప్పారు తెలీదా ‘’అన్నది ‘’ఆ ఉపాయం ఏమిటో చెప్పు “”?అన్నాడు ‘’మీకెందుకు చేబుతాన్రా భడవల్లారా !ఆ చంపే రాజుగారి సిపాయిలోస్తే చెబుతా ‘’అని నవ్వుతూనే .

   ఈమాట క్రమంగా రాణీ గారికి  చేరింది .ఆమె దూతలు ముసలమ్మ దగ్గరు వచ్చారు మర్యాద చేసింది .’’మామ్మా !నీదగ్గర మొసల్ని చంపే ఉపాయం ఉందట రాణీ గారు తెలుసుకోమని మమ్మల్ని పంపారు .నిజంగా ఉపయోగం ఉంటె నీకు రాణీ గారు గొప్ప బహుమతి ఇస్తారు లేకపోతె —‘’అని నీళ్ళు నమిలారు .ఆమె మధ్యలోనే అందుకొని ‘’ప్రయోజనం లేకపోతె ఈ ఎల్లమ్మ చెప్పదు .చెబితే జరిగి తీరాల్సిందే ‘’అంది ఖచ్చితంగా .అయితే చెప్పండి అని అడిగారు .’’ఏం లేదు నాయనా !ఒక మేకపిల్లను చంపి ,లోపలి భాగాలు తీసేసి ,పచ్చి తోలు మాత్రం ఉంచి లోపల అంతా గవ్వసున్నం కూరి, కుట్టేసి ,లోపల్నిచి తీసిన దాన్ని పై చర్మంపై బాగా దట్టంగా పూసి ,మొసలి ఎక్కువగా ఏప్రాంతంలో  తిరుగుతుందో అక్కడ నీటికి దగ్గరగా తాడుతో కట్టేయండి.పచ్చిమాంసం వాసన లేకపోతె మొసలి దగ్గరకు కూడా రాదు అని గుర్తుంచుకోండి ‘’అని చిట్కా చెప్పింది .

   చూద్దాం అనుకోని ఆమె చెప్పినట్లే తూచా పాటించి  చంపిన మేకపిల్లను  నీటి దగ్గరలో  సాయం కాలం కట్టేసి భటులు పొదల్లో దాక్కుని ఏం జరుగుతుందో చూస్తున్నారు .అర్ధరాత్రి మొసలివచ్చి గుల్లసున్నం కుక్కిన మేకపిల్లను ఈడ్చుకుపోయింది .మర్నాడుమధ్యాహ్నం నదిలో ఏదో జంతువు పొర్లాడుతూ కనిపించింది .అది శరవేగం గా నీటిలో అటూ ఇటూ తిరుగుతోంది పిచ్చి ఎక్కిన దానిలాగా .సాయంకాలానికి ఊరంతా అల్లకల్లోల౦ గా వచ్చి చూశారు .చిన్న తిమింగిలం పిల్ల  నదిలోకి వచ్చిందా అని విస్తుపోయి చూస్తున్నారు .చీకటి పడబోతుండగా నదిలో తెల్లని చారలు కనిపించాయి .అది మొసలి పుట్టి నడిపే ఘాట్ ఎక్కి ఇసుక మీదకుచేరి ,తోక ఇసుకదిబ్బలకు కొడుతూ తెల్లటి నురుగులుకక్కుతూ వెల్లకిలా పడిపోయి,కొట్టుకొంటూ ప్రాణాలు వదిలింది .మొసలికడుపు ఉబ్బి పరమభయంకరంగా కనిపించింది ‘

  ఇంతకీ ఏమైంది ?మొసలి కడుపులోకి పోయిన సున్నం కరిగి ,దానికడుపులో మంటలు మొదలయ్యాయి .వాటిని భరించలేక నదిలో అయిదారు మైళ్ళు అటూ ఇటూ తిరిగి ,చివరికి పేగులు తెగి ,చచ్చిపోయింది .రాణీగారు ముసలమ్మకు ఘన సన్మానం చేశారు .ముసలమ్మ చిన్న చిట్కా  మొసలి ప్రాణాలను సులభంగా తీసి, జనాలకు మేలు కలిగింది .

‘’అహో విచిత్రం !యద్గ్రాహః –జలస్దాః కర్షతి ద్విపం – స ఏవ తీర స్థలేనః-శునకేన నిహన్యతే ‘’

భావం –ఎంత ఆశ్చర్యం !నీటిలో ఉన్నప్పుడు మొసలి ఏనుగును కూడా లాక్కు  పోతుంది .అదే మొసలి గట్టు మీదుంటే ,దాన్ని కుక్కకూడా కరిచి చంపుతుంది .దీనినే ‘’స్థానబలిమికాని తనబలిమి కాదయా ‘’అన్నాడు వేమన .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం-1

ప్రపంచ దేశాలసారస్వతం

203-అమెరికాదేశసాహిత్యం-1

 అమెరికన్ సాహిత్యం ఆ దేశ చరిత్రతో పాటు వృద్ధి చెందింది .దాదాపు నూటయాభై ఏళ్ళు అమెరికా అంటేఉత్తర అమెరికా పశ్చిమం వైపు ధైర్యం తో వెళ్లి నిలబడిన  కొన్ని కాలనీల సముదాయాలే .మాతృదేశం కోసం జరిగిన తిరుగుబాటులో అమెరికా చివరికి యునైటెడ్ స్టేట్స్ ఆ ఫ్అమెరికా గా రూపు దాల్చింది .19వ శతాబ్ది చివరకు ఆఖండం దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు ,సమాంతరంగా ఉత్తరానికి ,పడమటి వైపు  ఫసిఫిక్ సముద్రం వరకు విస్తరించింది.ఆ  శతాబ్దానికి మంచి శక్తి సంపన్న దేశంగా అభి వృద్ధి చెందింది .దీనితో మొదటి రెండు ప్రపంచయుద్ధాలలో కీలక పాత్ర పోషించింది .సైన్స్ ,టెక్నాలజీ అభి వృద్ధి చెంది పారిశ్రామికంగా బలపడి ,ఆలోచనా విధానాలలో మార్పు వచ్చి ,ప్రజజీవితాలలో గణనీయ మార్పులు వచ్చాయి  .ఇవన్నీ అమెరికా సాహిత్యం తో ముడిపడి ఉన్నవే .

  ప్రస్తుతం 17వ శాతాబ్దినుంచి21వ శతాబ్దం వరకు  అమెరికన్ సాహిత్యం లో వచ్చిన కవిత్వం నాటకం కాల్పనిక రచన ,సాహిత్య విమర్శ విషయాలను మాత్రమె తెలుసుకొందాం .అంతకు ముందు వరకు ఉన్న స్థానిక లేక దేశీయులలో ఉన్న మౌఖిక సాహిత్యం అంతా’’నేటివ్ అమెరికన్ లిటరేచర్ ‘’లో దొరుకు తుంది .17వ శాతాబ్దినుంచి వచ్చిన సాహిత్యం లో కొందరు ఆఫ్రికన్ అమెరికన్ లసాహిత్యం కొంత ఉన్నా పూర్తిగాలోతుగా  తెలుసుకోవాలంటే ‘’ఆఫ్రికన్ అమెరికన్ లిటరేచర్ ‘’చదవాలి .అమెరికన్ సాహిత్యం లో ఉన్న సాహిత్య సంప్రదాయాలు అవగాహన చేసుకోవాలంటే ‘’ఇంగ్లిష్ లిటరేచర్ అండ్ కనడియన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లిష్ ‘’చదివి తెలుసుకోవాలి .

    17వ శతాబ్ది అమెరికన్ సాహిత్యం

 అమెరికన్ సాహిత్య చరిత్ర యూరప్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడే వారితో ప్రారంభమై అమెరికా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు దాకా నడుస్తుంది .కనుక మొట్టమొదటి అమెరికన్ సాహిత్యం అంటే కాలనీ ఇంగ్లీష్ రచయితలు  రాసిన ఆంగ్ల సాహిత్యమే .జాన్ స్మిత్ అనే సైనికుడు రాసినదానితో అమెరికన్ సాహిత్యం ప్రారంభమై ఆయనకే ఆ గౌరవం దక్కుతుంది .ఆయన రాసిన పుస్తకాలు –ట్రూ రిలేషన్ ఆఫ్ వర్జీనియా -1608 ,దిజనరల్ హిస్టరీ ఆఫ్ వర్జీనియా,న్యు ఇంగ్లాండ్ అండ్ సమ్మర్ ఐల్స్ 1624.ఇందులో రచయిత స్వంత డబ్బా అధికంగా ఉన్నా ,ఇంగ్లీష్ జాతికి ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేసే అవకాశాలను బాగా వివరించాడు .డేనియల్ డెల్టన్’’బ్రీఫ్  డిస్క్రి ప్షన్ ఆఫ్ న్యూయార్క్ -1670,విలియం పెన్ –బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ది ప్రావిన్స్ ఆఫ్ పెన్సిల్వేనియా -1682,ధామస్ ఆషే’’కారోలీనా ‘’-1682 ముఖ్యమైన పుస్తకాలు రచయితలూ .వీరంతా తమ రచనలలో అమెరికా  ఆర్ధిక వికాసానికి తోడ్పడుతుందని ఎలుగెత్తి చెప్పారు ఇంగ్లీష్ వారికి .

  ఈ రచయితలలో కొందరు బ్రిటిష్ దేశానికి సార్వభౌమాదికారానికి వీర విధేయులు .కొందరు  ప్రభుత్వం చర్చి రాజ్యం లలో జోక్యం  చేసుకోవటాన్ని  నిరశించారు .ఈ భావాలను నేధానియాల్ వార్డ్ ఆఫ్ మాసా చూ సెట్స్ బే రాసిన ‘’ది సింపుల్ కాబ్లార్ ఆఫ్ అగ్గవాం ఇన్ అమెరికా -1647లో కనిపిస్తాయి .దీనికి వ్యతిరేకంగా కన్జర్వేటివ్ భావాలు కూడా ప్రచురితమైనాయి ,జాన్ విన్త్రాప్ 1630-49లో రాసిన ‘’జర్నల్ ‘’లో మాసా చూసేట్స్ బె ధియోక్రాటిక్ వాళ్ళు  బైబిల్ ఆధారిత  ‘’గాడ్ ‘’హెడ్ గా ‘’రాష్ట్రం  ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని రాశాడు .దీన్ని బలపరచినవరిలో ఇంక్రీజ్ మాదర్ ,అతడికొడుకు కాటన్ ఉన్నారు . విలియం బ్రాడ్ ఫోర్డ్ ‘’ఎ హిస్టరీ ఆఫ్ ప్లిమౌత్ ప్లాంటేషన్ 1646లో రాశాడు .అతని పిల్గ్రిం సెపరేటిస్ట్ లు పూర్తిగా ఆంగ్లికనిజం నుంచి విడిపోయారు .ఇతడికంటే రాడికల్ రోజేర్  విలియమ్స్ అనేకవివాదాస్పద  ధారావాహిక  కరపత్రాలు రాసి చర్చి తో , ఆంగ్ల రాజ్యం తో విడిపోవటమే కాక ప్రజా బలాన్ని ,విభిన్న మతాల మధ్య సామరస్యాన్నిఉద్బోధించాడు.

  17 వ శతాబ్ది సాహిత్యం లో జీవితచరిత్రలు ,ఒడంబడికలు ,యాత్రా విశేషాలు ,మత ధర్మాలు చోటు చేసుకొన్నాయి .నాటకం ఫిక్షన్ లో రచనలు నామమాత్రమే .కారణం వీటిపై చులకన భావమే .కాని 1640లో ‘’బే సాలం బుక్ ‘’ లో నూ మైకేల్ విగ్లస్ వర్త్ రాసిన ‘డాగెరల్ వెర్స్’’లో కాల్వేనిక్ విశ్వాసం పై’’  ది డే ఆఫ్ డూమ్’’వంటి మంచి ఉత్తమ  కవిత్వం రాశారు .మాసాచూ సెట్స్ కు చెందిన  అన్నే బ్రాడ్ స్ట్రీట్ కొన్ని లిరిక్స్ ‘’ది టెన్త్ మ్యూజ్ లేట్లిస్ప్రంగ్ అప్ ఇన్ అమెరికా ‘’1650లో రాసి ముద్రించింది .ఇందులో మత౦ పై ఆమె విశ్వాసాలతో పాటు  తన కుటుంబం గురించి  కూడా రాసింది . వీరందరి కంటే ఉత్తమ ఉదాత్త కవిత్వం ఎడ్వర్డ్ టైలర్అనే ఇంగ్లాండ్ జాతీయుడు మినిస్టర్ వైద్యుడు బోస్టన్ లో,వెస్ట్ ఫీల్డ్ లలో ఉంటూ రాసి నా, 1939వరకు ఎవరూ గుర్తించలేకపోయారు .క్రైస్తవం పై తనకున్న నమ్మకాలను,అనుభవాలను  ఇందులో ప్రతిఫలింప జేశాడు కవితారూపంగా .17వ శతాబ్దం లో వచ్చిన సాహిత్యం అంతాపూర్తిగా  బ్రిటిష్ రచనలే .జాన్ స్మిత్ జగ్రాఫికల్ సాహిత్యం, జార్జి ఫోర్డ్ కింగ్ జేమ్స్ బైబిల్ ను అనుకరిస్తే ,మాదర్స్ ,రోజర్స్ లు మెరిసే వచన రచనలు చేశారు .అన్నేరాసిన కవితా శైలి బ్రిటిష్ కవులు స్పెన్సర్ ,సిడ్నీల శైలీ విధానమే .టైలర్ మాత్రం మెటాఫిజికల్ కవిత్వాన్ని జార్జి హెర్బర్ట్ ,జాన్ డోన్నెల్లాగా రాశాడు .ఈ మొదటి 17వ శతాబ్దం సాహిత్యమంతా ఒకరకంగా బ్రిటిష్ సాహిత్యమే తప్ప ‘’నేటివిటి లేనిదే’’అయింది .దీని తర్వాత 18వ శతాబ్ది సాహిత్యం గూర్చి తెలుసుకొందాం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-13

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-13

కుంటిమద్ది రామాచార్యులగారి  అసాధారణ అవధానం

సాహిత్య చక్రవర్తి కుంటిమద్ది శ్రీనివాసా చార్యులవారి తమ్ముడు కుంటిమద్ది రామాచార్యులు గారు అవధాన ప్రక్రియ స్వాయత్తం చేసుకొన్నారు .భాగవత , భగవద్గీత లలో ఏ పదం ,ఏ అక్షరం ఎన్ని సార్లు వచ్చిందో కరతలామలకం వారికి .ఒక సారి బళ్లారిలో అనంతపురం జిల్లాకలేక్టర్ ఆయన అవధానం సాహిత్యానికే పరిమితమా ఇతరత్రా కూడా ఉందా అని అడిగాడు .అప్పుడు అవధానిగారు ‘’ఏ భాషలోనైనా ,ఏ విషయం లోనైనా సరే ‘’అన్నారు .ఆయన్ను పరీక్షించటానికి ఒకవంద మంది యూరోపియన్ జంటలను సమావేశపరచి ప్రతి భార్యాభర్తలను అవధానిగారికి పేరు పేరునా పరి చయం చేశారు .మూడు నాలుగు  గంటలు  విందులూ వినోదాలతో కాలక్షేపం అయింది .తర్వాత ఆవందమంది దంపతులను చెల్లా చెదరుగా కూర్చోబెట్టి అవధాని గారిని పిలిచి ,’’మీకు మూడు గంటల క్రితం పరిచయం చేసిన దంపతులను పేరుపేరునా పిలిచి ,వారెక్కడ ఉన్నారో కనుక్కొని ఆహ్వానించండి ‘’అన్నాడు కలెక్టర్ .అవధానిగారికి తెలుగు సంస్కృతం కన్నడం తమిళం తప్ప మరే  భాషా రాదు .అవధానిగారు తడుముకోకుండా ‘’స్టోన్ గారూ  దయచేయండి ,శ్రీమతి ఎలిజబెత్ స్టోన్ గారు అమ్మా తమరూ వచ్చి మీభర్తప్రక్క నిలబడండి ‘’అంటూ రెండువందలమంది పేర్లూ ఒక్కటికూడా తప్పు లేకుండా అవ౦దమంది దంపతులను ఆహ్వానించగా కలెక్టర్  ఆన౦ దానికి అవధుల్లేకుండా పోయి అవధానికుంటిమద్ది రామాచార్యులవారి  అసాధారణ ధారణకు అమితాశ్చర్యపడి గొప్పగా ప్రశంసించి సన్మానించాడు . ..

పండిత రచయిత శ్రీ రూపనగుడి నారాయణ రావు గారు

28-10-1880 న రూపనగుడి నారాయణ రావు గారు జన్మించారు .తండ్రి నరసింగరావు శిరస్తదారు .మేనమామ హోసూరు సుబ్బారావు కడప డిప్యూటీ కలెక్టర్ .ఈయన’’ హెర్బర్ట్ స్పెన్సర్ ఆన్ ఎడ్యుకేషన్ ‘’అనే గ్రంథాన్నిసంస్కృతం లోకి’’విద్యాభ్యాస పద్ధతిః’’పేరుతొ  అనువదించారు.జే ఎస్ మిల్ రాసిన ‘’పొలిటికల్ ఎకానమీ ‘’ని ‘’అర్ధశాస్త్రం ‘’ పేరుతొ ఆంధ్రీకరించారు .మేనమామగారి ఈ విజ్ఞానం నారాయణరావు గారికి అబ్బింది .రావు గారి భార్య గౌరమ్మ .

  నారాయణరావు గారు బళ్ళారి వార్డ్లా కాలేజిలో చదివి ,తండ్రిమరణం తో డిగ్రీ చదవకుండా ఆపేశారు. స్వయంగా గ్రంధాలు చదివి సంస్కృత ఆంద్ర ఆంగ్లకవ్యాలు వ్యాఖ్యాన సహితంగా ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే పఠించారు.రాజమండ్రి  ట్రెయినింగ్ కాలేజీలో శిక్షణపొంది ,ఉపాధ్యాయులుగా చాలా చోట్ల పని చేసి మద్రాస్ సైదాపేట  ట్రెయినింగ్ కాలేజీలో 30ఏళ్ళు పని చేసి ,1940లో రిటైరై బళ్లారిలో స్థిరపడ్డారు .

విద్యార్ధులకు ఉపయోగపడే వాచకాలుకథా పుస్తకాలు మొదట రాసి ,తర్వాత కావ్యాలు నాటకాలు ,సిద్ధాంత గ్రంథాలు రాశారు .అరవింద సిద్ధాంత గ్రంథం రాశారు .మానవుడు కళాస్వాదనతో  సౌందర్య రసజ్ఞత ,సుష్టుతసహృదయత పొందుతాడని ,వీటి వలన తనకు తెలియకుండానే హృదయ సామరస్యం పొంది ,సౌశీల్యవంతుడై ,జీవితం పై ఆసక్తి పెరిగి అన్ని విషయాలలోకి చొచ్చుకు పోతాడని రావు గారి సిద్ధాంతం .ఉత్తమకళాను భూతిఐహిక సుఖాన్ని మాత్రమె కాక ,దివ్యజ్ఞానాన్నీ ,అఖండ ప్రేమను అఖండ ఆనందాన్నీ అందిస్తుందని ఆయన సిద్ధాంతం .

  రావుగారి కావ్యనాటకాలు ఆధ్యాత్మికపరమైనవి .మొదటికావ్యం కవితా నీరాజనం ను 16ఖండికలతో క్వెట్టా భూకంపం గురించి అందులో ఒకఖండిక’’అశ్రు తర్పణం ‘’మనసును కదిలించేట్లు రాశారు .’’కృష్ణరాయ సాగర కావేరి ‘’ఖండిక సమకాలీన  కృష్ణ రాయ సాగర జలాశయ వర్ణన .రెండవ రచన ‘’ఆర్యా సుభాషితం ‘’భర్తృహరి సుభాషితం లాంటి స్వంత రచన .పరిణయ కథామంజరి ,కదామణి ,ప్రవాళ ముక్తావళి ఆంద్ర వ్యాకరణ దర్పణం,నారాయణ తెలుగు వాచకాలు,మాతృ భాషాబోధిని ,నారాయణ తెలుగు ఉపవాచకాలు ,విప్రనారాయణ నాటకం గౌతమబుద్ధనాటకం ,సౌన్దరనంద నాటకం ,,కావ్యనిదానం,పంపాపురీ శతకం ,ఆధ్యాత్మికోపాసనలు ఉన్మత్తరాఘవం –అనువాదం ,కాళిదాసు ,శ్రీ అరవిందులు జీవిత సంగ్రహం ,మాతప్రార్ధనలు ,కాకతీయ రుద్రమాంబ నాటకం ,విషాద విజయనగర నాటకం ,క్షమావతీ విజయ నాటకం , శిశు మానసిక శాస్త్రం ,మానవ విజయం ,రూపన్న కుమార భారతం మొదలైనవి సరళమైన తెలుగులో రచించారు .

  నారాయణరావుగారు అరవింద గ్రంథాలు కూడా అనువదించారు –అందులో జాతీయ విద్యా విధానం ,భారతీయప్రజ్ఞ,జాతీయావశ్యకత ,జాతీయ కళాప్రయోజనం ,యోగ భూమికలు ,మాతృశ్రీ జీవిత సమస్యలు ,ప్రాతః కాలం నాటి పలుకులు ,శ్రీ అరవిందుల యోగము ,.రవీంద్రుని గ్రంథాలుకూడా అనువదించారు. వాటిలో మాలిని ,యజ్ఞము గీతాంజలి ముఖ్యమైనవి .టాల్ స్టాయ్ రచనలలో మొదటి సారాబట్టీ ,త్రాగు బోతు ముఖ్యమైనవి స్పెన్సర్ గ్రంథాన్ని ‘’విద్య ‘’గా అనువాదం చేశారు .

తనరచనలకు ఎలాంటి సన్మానం కోరుకొని వినయసంపంన్నులు  రావుగారు .18పర్వాల కుమారభారతం మహాకావ్యాన్ని విని హిందూపురం లోని శ్రీ శారదా సమితి వారు ‘’సాహితీ శిల్పి ‘’బిరుదునిచ్చి సత్కరించారు .రావు గారు తన స్వీయ జీవిత చరిత్రకూడా రాసుకొన్నారు .అముద్రిత రచనలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం శ్రీ కైప నాగరాజు చేశారు.ఈ తరం వారికి రూపనగుడి నారాయణరావు గారి  గురించి  తెలిసి ఉండకపోవచ్చు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ  దేశాల  సారస్వతం 201-సెయింట్ పియరీ అండ్ మిక్వెలాన్ దేశ సాహిత్యం

ప్రపంచ  దేశాల  సారస్వతం

201-సెయింట్ పియరీ అండ్ మిక్వెలాన్ దేశ సాహిత్యం

కెనడియన్ ఐలాండ్ కు చెందిన ఆర్చిపిలాగో సెయింట్ పియరీ అండ్ మిక్వెలాన్ దేశం .సీ బర్డ్స్ కూ, సీల్స్ కు ఆవాస స్థానం . విసర్జింపబడిన ఫిషింగ్ విలేజ్ ఉన్న దేశం .రాజధాని –సెయింట్ పియరీ .జనాభా -5,900మాత్రమె .కరెన్సీ –యూరో .రోమన్ కేధలిక్ దేశం .ఫ్రెంచ్ భాష .99శాతం అక్షరాస్యత .ఫ్రెంచ్ మోడల్ విద్యావిధానం .ఫిషింగ్ ,ఫిషింగ్ నావల రిపేర్ ,ఫ్రాన్స్ ఇచ్చే సబ్సిడీలు ఆదాయ వనరులు .ఐలాక్స్ మారిన్స్ ,గ్రాండ్ కోలంబియర్,అర్చేమ్యూజియం దర్శనీయాలు .సురక్షితం .పోర్చుగీస్ నావికుడు పరిశోధకుడు ఐవారేస్ ఫ్రాగ౦డేస్21-10-1520 ఈ ఐలాండ్ లను కనిపెట్టి సెయింట్ పియరీ ఐలాండ్ అని పేరుపెట్టాడు ‘’ఎలెవన్ ధౌసండ్ వర్జిన్స్ ‘’అన్నాడు ‘’సెయింట్  ఉర్సులా,వర్జిన్ సంహచరులకు గుర్తుగా  ఆమె వీటిని .యితడు 1536లో రాసిన రిపోర్టే మొదటి సాహిత్యం

సెయింట్ పియరీ అండ్ మిక్వెలాన్ సాహిత్యం –జాక్వె. కార్టియర్ అనే యాత్రికురాలు రాసిన సాహిత్యమే ఉన్నది ..ప్రాగన్డే స్1536లో రిపోర్ట్ మొదటి సాహిత్యం అని ముందే చెప్పాను .అలేన్జో డీ శాంటా క్రజ్ రాస్తూ ‘’దిఐలాండ్ ఆఫ్ ఎలెవన్ దౌజండ్ వర్జిన్స్ ‘’జాలరులకు గమ్యస్థానం అన్నది .మాక్విలేన్ పేరు  Les voyages aventureux du Capitaine Martin de Hoyarsal, habitant du çubiburu a reference book for sailors known as a “navigational pilot”, written by Basque seaman Martin de Hoyarçabal in 1579. వలన వచ్చింది

 ఫ్రాన్కోస్ ఎంగుహార్డ్ ఈ దేశాస్తురాలే కెనడాలో సెటిల్ అయింది .నేషనల్ సొసైటీ ఆఫ్ అకాడియా ఏర్పాటు చేసి అధ్యక్షురాలైనది  .నవలలు రాసింది మొదటినవల  Le trésor d’Elvis Bozec (2001) and Le pilote du Roy (2007),[6] Enguehard speaks at various conferences and festivals promoting education on French language, culture and the history of the Acadians.[8][9]

  ఆమె సాహితీ సేవకు నైట్ హుడ్ గౌరవం పొందింది

  • రచనలు – 1999 Les litanies de l’Île-aux-Chiens[7] 2001 Le trésor d’Elvis Bozec[6] 2007 Le pilote du Roy[6]
  • 202-మాంట్ సెర్రట్ దేశ సాహిత్యం
  • మాంట్ సెర్రాట్ కరిబియన్ ఐలాండ్ దేశం .1990లో అగ్నిపర్వతం బ్రద్దలై చాలానస్ట౦ కలిగించింది .రాజధానులు –ప్లిమత్ ,బ్రేడ్స్.జనాభా 5,900మాత్రమె .కరెన్సీ –ఈస్ట్రన్ కరిబియన్ డాలర్ .ప్రోటేస్ట౦ట్స్ఎక్కువ శాతం ఆంగ్లికన్స్ తర్వాత స్థాయి.అధికారభాష –ఇంగ్లీష్ .97శాతం అక్షరాస్యత .5-14వయసు వారికి ఫ్రీ కంపల్సరి విద్య  .నిర్మాణం ,టూరిజం రం,టెక్స్టైల్స్,ఎలెక్ట్రానిక్ వస్తువులు ఆదాయం .సోర్ ఫ్రియరీహిల్స్ ,వుడ్ లాండ్స్ బీచ్ ,వాల్కనో అబ్జర్వేటరీ చూడాల్సినవి .అనుమతులు దొరకటం కష్టం అంతరక్షణ ప్రాదం కాదు .

మాంట్ సెర్రట్ సాహిత్యం –ఫ్రెంచ్ భాషలోనే ఉంటుంది .కొన్ని మంచిపుకాలు ,రచయితలూ

 1-Cuentos de hadas y cuentos para niños: Cuéntame un cuento (Spanish Edition) by Larisa Montserrat | Aug 1, 2020

2-Jardin Sombrio / Garden of Shadows (Dollanganger) (Spanish Edition) | by V.C. Andrews and Montserrat Solanas  |

3-Mentiras de sangre (Spanish Edition)

by Mary Higgins Clark and MONTSERRAT; ROCA COMET | Feb 18,2011

4-El Alquimista: Una Fabula Para Seguir Tus Suenos

by Paulo Coelho  | Oct 23, 2018

5-Dios emperador de Dune (Las crónicas de Dune 4) (Spanish Edition)

by Frank Herbert and MONTSERRAT; CONILL MARFA | Mar 21, 2018

6-First Confession by Montserrat Fontes  | Apr 17, 1992

7-Antes del después (Spanish Edition)

by Montserrat Martorell | Jul 1, 2018

8-El Corredor de Fondo (Spanish Edition)

by Patricia Nell Warren and Montserrat Trivino | Jan 1, ,2002

9-Anibal, el orgullo de Cartago (HISTORICA) (Spanish Edition) by David Anthony Durham and Montserrat Gurgui | Nov 1, 2006

10-Thomas el impostor (Spanish Edition)

by Saul Bellow | Sep 15, 2011

సశేషం

మనవి -దీనితో ఉత్తర అమెరికా లోని- అమెరికా ,ఆసియాలోని- ఇండియా దేశాల సాహిత్యం తప్ప అన్ని దేశాల సాహిత్యం రాయటం పూర్తయి నా జీవితం ధన్యమైంది .ఈ రెండూ చాలా విస్త్రుతమైనవి .కనుక తీరుబడిగా రాస్తాను . సరదాగా మొదలు పెట్టిన ఈ ‘’ప్రపంచ దేశాల సారస్వతం ‘’లో ఇన్ని దేశాల సాహిత్యం గురించి రాస్తాననీ, రాయగలనని అనుకోలేదు .ఒక బృహత్ కార్యక్రమాన్ని వాగ్దేవి నాతో  చేయించింది  .ఇందులో నా భ్రమప్రమాదాలు అవగాహనా లోపం ఉండవచ్చు .ఎన్నో దేశాలు విభిన్నభాషలు పలుకు బడులు కొన్ని కొరుకుడు పడనీ మాటలు ,విస్తృతంగా సాహిత్యం ఉన్న దేశాలూ ఉన్నాయి .అతి నామమాత్రంగా సాహిత్యమున్న దేశాలూ ఉన్నాయి. సమకాలీన సాహిత్యాన్నీ  వెదికి ,శోధించి పట్టుదలతో సాధించి రాయగలిగాను అన్న సంతృప్తి నాకు ఉన్నది .దాదాపు 1600 మంది సంస్కృత కవుల గురించి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’లోనూ ,ఇంగ్లాండ్ ,అమెరికా దేశాలలోని సుమారు 125మంది ఆంగ్లకవుల గురించి ‘’పూర్వా౦గ్ల కవుల ముచ్చట్లు ‘’రాశాను .అంతటి బృహత్తర రచనే ‘’ప్రపంచ దేశాల సారస్వతం ‘’.అని వినమ్రంగా తెలియ జేస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కృష్ణాష్టమి ప్రత్యేకకార్యక్రమం 

శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కృష్ణాష్టమి ప్రత్యేకకార్యక్రమం
  శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా  11-8-20 మంగళవారం సాయంత్రం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో శ్రీ సువర్చలాన్జనేయ శ్రీ శ్రీ కృష్ణ స్వాములకు ప్రత్యేక అర్చన ,వెన్నపూస కట్టెకారం నైవేద్యం ,అనంతరం సరసభారతి 153 వ కార్యక్రమంగా బాలబాలికల చేత శ్రీ కృష్ణ, రాధికా ,,గోప గోపీకల  వేష  ధారణ ప్రదర్శన నిర్వ హిస్తాము అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన -గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ఆలయ ధర్మకర్త -5-8-20
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ  దేశాల  సారస్వతం 197 బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

ప్రపంచ  దేశాల  సారస్వతం

197 బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

  వల్కానిక్ ఆర్చి పెలగోలోభాగమైన కరిబియన్ సి లోని బ్రిటిష్ ఓవర్ సీస్ టేరిటరి బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ దేశం .నాలుగు పెద్దవీ , చాలా చిన్నవి ఐన ఐలాండ్ ల సముదాయం .రీఫ్ లైండ్ బీచెస్ కు యాచింగ్ డెస్టినేషన్ కు  ప్రసిద్ధి. రాజధాని –రోడ్ టౌన్ .జనాభా 29,882.కరెన్సీ-అమెరికన్ డాలర్ .మెధడిస్ట్ క్రిస్టియన్లు మెజారిటి .అధికారభాష ఇంగ్లీష్ .99శాతం అక్షరాస్యత .5-17వయసు వారికి ఉచిత నిర్బంధ విద్య .15ప్రైమరి 4 సెకండరి పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి .టూరిజం ముఖ్య ఆదాయం .ది బాత్స్,జోస్ట్ వాన్ డైక్,పీటర్ ఐలాండ్ చూడతగినవి .సురక్షితం .

బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ సాహిత్యం –అనగార్డియాన్ నావికుడు ,ఇంజినీర్ రచయిత ఆల్ఫాస్ ఒసారియో నార్మన్ రాసిన కవిత ఇప్పటికీ నిలిచి ఉంది .అతడి స్నేహితుడు జోసెఫ్ ఓ నీల్ లైఫ్ నోట్స్ లో అతని గురించి ప్రస్తావించాడు .చేతిలో నోట్ బుక్ లేకుండా నార్మన్ ఎక్కడికీ వెళ్ళేవాడు కాదట .వచ్చిన భావాలు అందులో రాసుకొని తర్వాత పూర్తిగా కవితలు అల్లేవాడు .ఒక మెషిన్ ఆపరేట్ చేస్తుంటే ప్రమాదం లో చనిపోయాడు .అప్పటికే గొప్ప కవిగా లబ్ధ ప్రతి స్టుడు.అప్పుడు అతనికి సాటికవి  అనగార్డ రూఫస్ ఫాక్నర్ .నార్మన్ కవిత –

 Who can forbid that prayers be said,
or carols changed for the dead,
or disbelieve that they shall rise
as angels pinioned to the skies?

“Amina Negroes, November 1733”

జేడియా స్మిత్ రాసిన కవిత – I see the sun

conquering everything, and everyone.

“Dethroning Darkenss”

Jaedia Smith

రిచార్డ్ జార్జెస్ –రైటర్ ఎడిటర్ ,లెక్చరర్ .దిప్యూరిటన్ వైల్డర్ నెస్ ,వసాఫిరి ,డీ కాంప్ ,ది రస్టిటక్ మొదలైనవి రాశాడు .ఫిక్షన్ రాసినందుకు ఫార్వార్డ్ ప్రైజ్ పొందాడు ..మార్విన్ విలియం ప్రైజ్,  ది హాలిక్ ఆవన్ ప్రైజ్ విన్నర్ కూడా .మోకో పత్రిక సంపాదకుడు .క్విన్సి లేట్సం,జెన్నీ వీఫ్లి ,వెర్నా పెన్ మొల్ ,రాయ్ హాడ్జ్ పాట్రీషియ టర్న్ బుల్ మిగిలిన గొప్ప రచయితలు .

198-కరిబియన్ నెదర్ లాండ్స్ దే శ సాహిత్యం

కరిబియన్ నెదర్ లాండ్స్ కరిబియన్ సి లో ఉన్న  మూడు స్పెషల్ మునిసిపాలిటీస్  బోనైరే ,సింట్ యూస్టాటిస్,సాబా లున్న దక్షిణ అమెరికా  దేశం .జనాభా 25,990.కరెన్సీ –యూరో .కేధలిక్ మతం .అధికార భాష –డచ్ .ఇంగ్లిష్ ,పాపియా మేంటోభాషలు కూడా మాట్లాడుతారు .98శాతం అక్షరాస్యత .పబ్లిక్ స్కూల్ విధానం .టూరిజం పెట్రోలియం ఆదాయవనరులు అత్యధిక వ్యక్తిగత ఆదాయం ఉన్న దేశం .క్రెలేన్డే ల జిక్,ABC ఐలాండ్స్,క్లీన్ బోనారే ఐలెట్ ,లాక్ బే దర్శనీయాలు .యాత్రా సురక్షిత దేశం

కరిబియన్ నెదర్ లాండ్స్ సాహిత్యం –చాలా కాలం మౌఖిక సాహిత్యమే .డచ్ భాషా సాహిత్యమే ఎక్కువ .మై సిస్టర్ ది నీగ్రో మొదటి నవల .ఫ్రాంక్ మార్టినస్ఆరియన్ ఒక గొప్ప క్లాసిక్ నవల –ది హిస్టరీ ఆఫ్ యాన్ అమేజింగ్ వరల్డ్ రికార్డ్ 1998రాశాడు .ఇందులో 1775నాటి సాయుధ విప్లవ పోరాట వర్ణన ఉంటుంది. ‘లాంగ్ స్టన్ హగ్స్ –కవి మాంటేజ్ ఆఫ్ ఏ డ్రీం డేఫెర్రేడ్ వగైరా రాశాడు .డేవిడ్ డేబీ డీన్ –కవి విమర్శకుడు క్రిటిక్ .ఇమేజెస్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ ఎయిటీన్త్  సెంచరి,మవర్ లేడీ ఆఫ్ డేమరారా నవల,స్లేవ్ సాంగ్ ,డంగారూ,కూలీ ఒడిస్సీ,న్యు అండ్ సేలేక్టేడ్ పోయెమ్స్ మొదలైనవి రాశాడు .బిజిల్మా సాండ్ బ్లాస్టేడ్ నవల రాశాడు .నిడియా యూకరి  వాయిస్ ఆఫ్ బ్లడ్ నవల సాంగ్ ఫర్ మదర్ ఎర్త్ కవిత రాసింది  .మైరా రోమర్ –మై న్యు హౌస్ ,ఇన్ మై నేం,డోంట్ కాల్ మి కవితలురాసింది .ఒసేపా సిసీలియా ‘’లిబ్రమి ‘అయిదుభాగాల ’కవితరాసింది.వల్డే మార్ మర్చ – కురాకావోన్ సుబల్ట  డయాస్పోరా ఎక్స్ప్రెషన్స్ రాసింది .ముస్కాముహే అనే ఆమె కవితలలో  స్త్రీ తన స్వేచ్చకు తానె కారణం అనే భావాన్ని తెలిపింది  There is fear and bravery in you Don’t keep hiding, you must shine There is hate but also love in you Love yourself, avoid resentment

Yes. Dig. Search. There’s Freedom Wipe your face don’t cry anymore There’s lots of peace, lots of good things They are inside you, release them (p. 62)

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 195-టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం

195-టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

అంట్లాంటిక్ సముద్రం లో ‘’40 లో లైయింగ్ కోరల్ రీఫ్’’ లున్న ఆర్చిపేలగో బ్రిటిష్ ఓవర్ సీస్ దేశమే టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ .స్కూబా డైవింగ్ కు ప్రత్యేకం .2,134మీటర్ల అండర్ వాటర్ వాల్ ఉన్న గ్రాండ్ టర్క్ ఐలాండ్  గొప్ప ఆకర్షణ .రాజధాని –కాక్ బరన్ టౌన్ .జనాభా -37,670.కరెన్సీ-అమెరికన్ డాలర్ .రోమన్ కేధలిక్ ఆంగ్లికన్ క్రైస్తవ దేశం .ఇంగ్లిష్ భాష .99శాతం అక్షరాస్యత .5-15 ఏళ్ళ వయసు వారికి ఉచిత ఐచ్చిక విద్య .ప్రైమరీ 6ఏళ్ళు.తూరిజమే ముఖ్య ఆదాయం .18శాతం ప్రజలు పేదలు..గ్రేస్ బే బీచ్ ,పార్రట్ కే ,సాల్ట్ కే.

టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్ సాహిత్యం –ఈ దేశానికి చెందిన ఎనిమిది ముఖ్యపుస్తకాలు –వాటర్ అండ్ లైట్ ,ఎడైవర్స్ జర్నీ –స్టీఫెన్ హార్రిగన్,హాగస్టి రీఫ్-జాన్ డౌడ్,ఫుడ్ ప్లేన్ సూప్ –రాన్ లాక్ నికెల్ ,ఎ సమ్మర్ ఆన్ ది బార్డర్స్ఆఫ్ ది కరిబియన్ సి –డెన్నిస్ హార్రిస్ ,స్లేవ్ హిస్టరీ ఇన్ టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్-నీగెల్ సాడ్లేర్,ఎ హిస్టరీ ఆఫ్ ది టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్-కార్లటన్ మిల్స్ ,లివింగ్ ఇన్ ది టర్క్స్ అండ్ కైకాస్ ఐలాండ్స్-చార్లెస్ ఫార్మెర్.ఇంతకూ మించి వివరాలు దొరకలేదు .

196-సింట్ మార్టెన్ దేశ సాహిత్యం

నెదర్ లాండ్స్ లో కరిబియన్ ఐలాండ్ లో సింట్ మార్టెన్ దేశం ఉంది  .డచ్ వాళ్ళు సింట్ మార్టెన్  అనిపిలిస్తే ఫ్రెంచ్ వాళ్ళు సెయింట్ మార్టిన్ అని పిలుస్తారు .లగూన్ బీచెస్ కు ,సాల్ట్ పాన్స్ కు ప్రసిద్ధి .రాజధాని ఫిలిప్స్ బర్గ్ ..కరెన్సీ-నెదర్లాండ్స్ ఆ౦టీలియన్ గిల్డర్.జనాభా -40,700.రోమన్ కేధలిక్ మతం .అధికారభాష సింట్ మార్టెన్ .99శాతం అక్షరాస్యత .4-18వయసువారందరికి కంపల్సరీ. విద్య హక్కు అనే భావం ఉన్న దేశం .టూరిజమే ముఖ్య ఆదాయవనరు .మాహో బీచ్ ,లోటెరీ ఫారం ,ముల్లెట్ బే బీచ్ దర్శనీయాలు –సురక్షితం .

సింట్ మార్టిన్  సాహిత్యం –లసానా ఏం సేకు –కవి కధకుడు వ్యాసరచయిత ,జర్నలిస్ట్ పబ్లిషర్ .ది సాల్ట్ రీపర్ ,సేలక్టే డ్ పోయెమ్స్ కవితా సంపుటి రాశాడు .షేక్ కీనే –జాజ్ గాయకుడు కవి .క్లార్క్ అకార్డ్ –దిక్వీన్ ఆఫ్ పరమాబియో ,బిట్వీన్ ఒపేరా అండ్ ఒరేరా ,బింగో రాశాడు .లౌ లిచ్ వెల్డ్-మినిస్టర్ రాయబారి .ఇస్మేనే క్రిష్ణదత్-రేకేన్ మీ ,కుక్ మీ వంటి బాలసాహిత్యం,నవలలు ఆన్దాలజీ కూడా  రాసింది.ఇంతకంటే వివరాలు లేవు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-20-ఉయ్యూరు  

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆలయాలు ,బస్సులు హోటళ్లు నగలదుకాణాలు వగైరాల్లో జనం రావాలంటే ?

బ్రూ 1-గుడుల ల్లో కి ,నగల వస్త్ర దుకాణాలలోకి ,బస్సులోకి,,హోటళ్ళలోకి ఫంక్షన్ హాళ్ల లోకి డెకరేషన్ షాపుల్లోకి  తెరచి ఉంచినా జనం రావటం లేదని  పూజారులకు వగైరాలకు ఆదాయం రావటం లేదని జీతాలు చెల్లించ లేక పోతున్నామని తెగ బాధ పడుతున్నారు బ్రూ .ఏం చేస్తే బాగుంటుంది బ్రూ ?

బ్రూ 2-వెరీ సింపుల్ బ్రూ . దేవాలయాల్లో పూజారులతో లేక ఎండో  మెంట్ ఆఫీసర్లతో బస్సుల్లో కండక్టర్ల తో ,నగల ,వస్త్ర దుకాణాల్లో కౌంటర్ లలో వైన్ షాప్ ఓపెన్ చేయించి వాళ్ళతో అమ్మిస్తే ,బాటిల్ కావాలంటే దర్శనం ,నగ ,బట్టలు, బస్ టికెట్ ,టిఫిన్ కొంటె, తింటే నే వైన్ ఇస్తామంటే ,ఇప్పుడు వైన్ షాపుల దగ్గర రద్దీ తగ్గి ,పోలీసులకు శ్రమతగ్గి   వా వాళ్ళు రెగ్యులర్ duty   చేసుకొనే వీలూ కలిగి ,ప్రభుత్వాలకు ఇబ్బడి ముబ్బడిగా డబ్బే డబ్బు వచ్చి పడుతుంది ఆ సంస్థలూ కిటకిట లాడి  పోతాయ్ బ్రూ
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-12

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-12

శాడిజానికి ఫలితం

పరులను బాధించటమే శాడిజం .దానిఫలితం జీవితం లో అనుభవించాల్సిందే .రామచంద్రగారికి తెలిసిన మాష్టారు బాగా చదువు చెప్పేవాడే,కోపం, ద్వేష౦,వ్యసనాలు లేనివాడే  కాని  ఈగలను చిత్రవధ చేసేవాడు .చివరికి పక్షవాతం వచ్చి మంచం పడితే ఈయన చూడటానికి వెడితే ‘’నా జీవితమంతా మీకు తెలుసుకదా ఎందుకు ఈదుర్గతి ‘’అని వాపోయాడు .వీరు ‘’నిజమేకాని కొన్ని వేల ఈగలను చిత్రవధ చేసి ఉంటారు దాని ఫలితమే ఇది .శరణాగతి మనసంప్రదాయం. కనుక పునర్జన్మ లేదుకనుక పాపఫలితం ఈజన్మలోనే అనుభవించాలి .ధైర్యం తో భగవధ్యానం చేయండి ‘’అని ఓదార్చారు. కొంతకాలానికి ఆయన చనిపోయాడు .

 ఆనేగొందే రాకుమారులు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీరంగ దేవరాయలురామచంద్రగారి మిత్రులు .వీరి వయసువారే అప్పటికి తోమ్మిదోఏడు.’’అయ్యవారూ మూలుగు తింటావా “”అని వీరితో హాస్యమమాడేవారు వీరికి అదేమిటోతెలీదు .మూలుగు అంటే ఎముకలలోని  మజ్జ అని తర్వాత తెలిసింది .ఒకటి రెండుసార్లు వాళ్ళతో వేటకు వెళ్ళారు .చిరుతలను చంపటం ఎలుగులను పట్టుకోవటం వారికి మహా సరదా .వేటాడిన జంతువుల్ని కర్రలతో చిన్న పిరమిడ్ లాగా ,కట్టేలమోపులాగా ఉండే బోనుల్లో బంధించేవారు .దాని ఒకచివర సన్నగా రెండో చివర వెడల్పుగా ఉండేది  .సుమారు 15అడుగులపోడవు .దానికి రెండు అరలు .ఒక అరలోమేకను కట్టేసేవారు .చిరుత దానిలో దూరి అరిచే మేక పిల్లను పట్టుకొంటు౦ది,లాగుతుంది పూర్తిగా లాగకుండా అడ్డకర్రలుంటాయి .మేకను లాగగానే కర్రలు అడ్డుపడుతాయి .చిరుత గి౦జు కొంటుంది ఇదో సరదా వాళ్లకు . కదిలే వీలుండదు దానికి .మనిషి, పిల్లి అయితే కావాల్సింది తీసుకొని  బయట పడగలవు. కాని పులులు చిరుతలుఅలాచేయలేవు .ఇంకోరకం బోనులు ఎలుక బోనులా బండలతో కట్టేవారు  .పులిలోపలికి దూరి మేకను లాగగానే బోనుమూత బండకింద ఢాం శబ్దంతో పడిపోతుంది .పులి బిత్తర పోతుంది .

 తర్వాతే అసలు నరకం మొదలౌతుంది .కర్రలబోనులోని చిరుతను ఊళ్లోకిమోసుకొచ్చి పులి ము౦దు కాళ్లలో ఒకదాన్ని బలవంతాన బయటికి లాగి, మడమదగ్గర కత్తితో గాట్లు పెట్టి ,గట్టి నూలుపగ్గం కాలికి కట్టి ముడిగట్టిగా వేసేవారు . అది నొప్పితో బొబ్బలు పెట్టేది .తర్వాత రాచనగరు సెంటర్లో పెద్ద స్తంభం పాతి ‘’చిరుతను ఆడిస్తాం ‘’అని దండోరా వేసేవారు .వినోదం చూడటానికి జనం తండోప తండాలుగా వచ్చే వారు .నూలుపగ్గం మరో కొనను పాతిన స్తంభానికి కట్టి బోను తలుపులకు  అడ్డంగా ఉన్న కర్రల్ని తీసేసేవారు .చిరుత బయటపడి బాధతో తప్పించుకొనే ప్రయత్నం చేస్త్తుంది .కుంటుతూ నడుస్తూ జనంపై దూకి పగ్గం తో కిందపడుతుంది .20గజాల ఆపగ్గం తో స్తంభం చుట్టూ తిరుగుతుంది .అది బాధతో అరచినప్పుడల్లా జనం చప్పట్లతో హుషారు చేస్తారు .దానికి ప్రాణ సంకటం వాళ్లకు వినోదం .నాలుగు వైపులనుంచి నలుగురు దాన్ని బల్లాలతో పొడుస్తారు. గింజుకొని వాళ్ళపై దూకే ప్రయత్నం చేస్తుంది .ఇకచాలు మహాప్రభోఅని  దొరగారో ఆయన ప్రతినిదో అనే దాకా ఈ చిత్ర హింస ,అమానుష వినోదం సాగుతుంది .చిరుత పరాక్రమాన్ని వర్ణించే శ్లోకం –

‘’లాంగూలే నాభి హత్య క్షితితల మసకృత్ –దారయన్నగ్ర పద్బ్యాం –ఆత్మన్యేనావలేయ ద్రుత సుధ గమనం – ప్రోత్సతన్ విక్రమేణ-స్ఫూర్ణద్దుమ్కారఘోషః ప్రతిది శ మఖిలాన్ –ద్రావయన్నేష జంతూన్-కోపావిష్టః ప్రతివన మరుణోచ్ఛూన చక్షుః తరక్షుః’’

భావం –తోకను తరచుగా నేలకేసికొడుతూ ,పరిగెత్తే వేగం లో కాళ్ళను కడుపు లోకి నొక్కు కొంటూ,పరాక్రమావేశంతో ఎగురుతూ ,పెడబొబ్బల ధ్వనితో సకల దిక్కుల జంతువుల్నీ భయపెడుతూ  ,కోపంతో ఉబికిన ఎర్రటి కళ్ళతోనిప్పులు కురిపిస్తూ చిరుత అరణ్య౦ లోకి  ప్రవేశించింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ సారస్వతం 193-కేమన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

ప్రపంచ సారస్వతం

193-కేమన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

కేమన్ఐలాండ్స్  బ్రిటిష్ ఓవర్ సీస్ లోని దేశం .పశ్చిమ కరిబియన్ సముద్రం లో మూడు ఐలాండ్ ల సముదాయం .వీటిలో గ్రాండ్ కేమన్ పెద్దది .బీచ్ రిసార్ట్ ,క్యూబా డైవింగ్ ఆకర్షణలు .డీప్ సి ఫిషింగ్ కు అనుకూలం .లిటిల్ కేమన్ వివిధ అరణ్య జంతుజాతికి నిలయం .రెడ్ ఫూటేడ్ బూబీ పక్షులు పెద్ద ఆకర్షణ .రాజధాని జార్జి టౌన్ .కేమన్ ఐలాండ్స్ డాలర్ .ప్రేస్బెటేరియన్ మతం .జనాభా -65,722.అక్షరాస్యత -98శాతం .4-16వయసువారందరికి ఉచిత నిర్బంధ విద్య .10ప్రైమరీ అందులో ఒకటి స్పెషల్ విద్యకు ,మూడు హైస్కూళ్ళున్నాయి .టూరిజం ఫైనాన్షియల్ సెక్టార్ ఆదాయవనరులు .సంపన్న దేశం .కేమన్ తాబేళ్ల సెంటర్ ,సెవెన్ మైల్ బీచ్ ,స్టార్ ఫిష్ పాయింట్ దర్శనీయాలు .యాత్రా సురక్షిత దేశం .

కేమన్ ఐలాండ్స్ సాహిత్యం –మంజోరి లోవీ-బియాండ్ ది లగూన్ ,డేవి డీ గూడా-ది కేమన్ హజిల్ ,జెయే.బొద్దేన్ –దికేమన్ ఐలాండ్స్ ,పాల్ కార్ర్ –ది కేమన్ స్విచ్ ,క్రిస్ నోఫిప్ –క్రైస్ ఆఫ్ ది lost,జేడేన్ స్కై –డెత్ బై జెలసి ,అన్నే హాంప్ సన్-ఎంచాంట్ మెంట్  రాశారు .

ఈమధ్యనే జార్జి టౌన్ లైబ్రరీ లో 13మంది ప్రసిద్ధ రచయితలకు అవార్డ్ లిచ్చి  సన్మానించారు .వారు –మిస్టర్ స్కోఫీల్డ్ –స్టారం రైసింగ్ నవల , జేనేట్ డాష్ హారిస్ –ఫాన్కీ స్పీకింగ్ కథాసంపుటి , – డెబొరా వెబ్ సిబ్బీస్ –లివింగ్ విత్ ఏ సెకండ్ చాన్స్ విత్  ఎ గ్రేట్ఫుల్ హార్ట్ ,కేధరిన్ టైసన్ –ఐ యాం సంబడీస్  మామ  వీరికి వరుసగా మొదటి రెండు మూడు ప్రైజులు మిగిలినవారికి కన్సొలేషన్ ప్రైజ్ లు దక్కాయి

తొమ్మిది మంచిపుస్తకాలు – సో యు వాంట్ టులివ్ ఇన్ అం ఐలాండ్ –గే మోర్స్ ,దికేమన్ ఐలాండ్ బీచ్ అండ్ బియాండ్-మార్తా కే స్మిత్ .,కేమన్ సమ్మర్ –అంజెలా మారిసన్ ,ఎట్ దిఫుట్ ఆఫ్ ది సదరన్ క్రాస్ –డిక్ జెంట్రి,బటరాఫ్ డెడ్ –జాన్ పాల్ కోరిన్సి ,కేమన్ క్రాస్ –జాక్ స్కాట్ ,కేమన్ గోల్డ్ –రిచర్డ్ ట్రౌట్,కేమన్ స్ట్రైక్ –జెర్రీ వాన్ కుక్ ,ఫౌండెడ్ అపాన్ దిసీస్-మైఖేల్ క్రాటన్,రియాలిటి ఆఫ్ యు –విక్టోరియా విన్ స్లో, rumపాయింట్ నవల –రిక్ విల్బర్ ,గ్రాండ్ కేమన్ స్లాం –రాండీ స్ట్రైకర్,కేమన్ కౌ బాయ్స్ –ఎరిక్ డగ్లాస్ .

194-సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ సాహిత్యం

అట్లాంటిక్ కరిబియన్ సముద్రాలమధ్య ఉన్న ద్వి ద్వీప దేశమే సెయింట్ కిట్ అండ్ నెవిస్.మబ్బులు మూసిన పర్వతాలు  బీచెస్ ఉంటాయి .ఒకప్పటి షుగర్ ప్లాంటేషన్ ఇప్పుడు వాతావరణ శిదిలాలుగా మిగిలాయి ,వల్కనోస్ ,గ్రీన్ వేర్వేట్ మంకీస్ రైన్ ఫారెస్ట్ లకేంద్రం .రాజధానులు –బెసె టెర్రీ ,చార్లెస్ టౌన్ .కరెన్సీ –ఈస్టర్న్ కరిబియన్ డాలర్ .జనాభా -52,450 .ఆంగ్లికన్ మెధాడిస్ట్ లు ఎక్కువ .ఇంగ్లీష్ భాష .97శాతం అక్షరాస్యత . 5-12-7విధానం .12ఏళ్ళు ఉచిత నిర్బంధ విద్య .చెరుకుపంట ఆదాయవనరు .రేటు లేక ఇప్పుడు కునారిల్లింది .టూరిజం కొంత ఊరట.బ్రిం స్టోన్ హిల్ ఫారెస్ట్ ,ఫ్రైగేట్ బే,మౌంట్ లయముగా చూడతగినవి .అంత సురక్షితం కాదు .

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సాహిత్యం –సిరిల్ బ్రిగ్స్ –ది క్రుసేడర్ పత్రిక సంపాదకుడు.ఆఫ్ర్రికన్ బ్రదర్ బ్లడ్ ఫౌండర్ .యూనివర్సల్ నీగ్రో ఇంప్రూవ్ మెంట్ అసోసియేషన్ స్థాపకుడు కమ్యూనిస్ట్ మేధావి .ఆడం లో – కవి నాటక ఫిక్షన్ ,పాటల రచయిత .పోఎట్ లారియాట్ అయ్యాడు. బెస్ట్ రైటర్ అవార్డ్ యార్క్ షైర్ పోయేట్ అవార్డ్ పొందాడు .బెస్ట్ బ్రిటిష్ పోయెట్రిన్యు క్వీర్ వాయిసెస్ ,బ్లాక్ అండ్ గే ,బెస్ట్ న్యు రైటింగ్ వగైరా రాశాడు ,కారిల్ ఫిలిప్స్-నాటకాలు రాసి డైరెక్ట్ చేశాడు .వేర్ దేర్ ఈజ్ డార్క్ నెస్,షెల్టర్ ప్రసిద్ధ నాటకాలు .స్లేవ్ ట్రేడ్ పైన  చాలారాశాడు .లూధర్ కింగ్ అవార్డ్ ,బ్లాక్ మెమోరియల్ ప్రైజ్ ,పెన్ బియాండ్ మార్గ్రిన్స్ అవార్డ్  గ్రహీత .దిఫైనల్ పాసేజ్ ,ఎ స్టేట్ ఆఫ్ ఇండి పెండేన్స్ ,ఇన్ దిఫాలింగ్ షోవంటి 12నవలలు ,దియూరోపియన్ ట్రైబ్ ,ఎ న్యు వరల్డ్ ఆర్డర్, కలర్ మి ఇంగ్లిష్ వంటి 4వ్యాస సంపుటులు ,ప్లేయింగ్ అవే ,లాంగ్ వె ఫ్రం హోంమొదలైన 5నాటకాలు రాశాడు .ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ,కామన్ వెల్త్ రైటర్స్ ప్రైజ్ ,లన్నాన్ లిటరరీ అవార్డ్ ,గుగ్గెన్ హీం ఫెలోషిప్ వంటివి ఎన్నో పొందాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-20-ఉయ్యూరు

 

 

 

 
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 191-డొమీనికా దేశ సాహిత్యం

    ప్రపంచ దేశాల సారస్వతం

191-డొమీనికా దేశ సాహిత్యం

పర్వతమయ కెరిబియన్ దేశం డోమీనికా ,నేచురల్  హాట్ స్ప్రింగ్స్ కు నిలయం .వల్కానిక్ పొగతో ఉన్న బాయిలింగ్ లేక్ విశిష్టం .సల్ఫర్ గనులమయం .ట్రఫాల్గర్ ఫాల్స్ ఆకర్షణ .రాజధాని- రోసువా .కరెన్సీ-ఈస్ట్రన్ కరిబియన్ డాలర్.జనాభా -72లక్షలు .రోమన్ కేధలిక్ మతం .అధికారభాష ఇంగ్లీష్ .93.78శాతం అక్షరాస్యత .5-16వయసులవారికి కంపల్సరీ విద్య .పాఠశాలలలో సౌకర్యాలు తక్కువ కనుక ఆసక్తి తక్కువే .అతి పేద దేశం .వ్యవసాయమే ఆదాయవనరు. బనానా పంట ఎక్కువ .బాయిలింగ్ లేక్,నోర్నే వాటర్ ఫాల్స్ అండ్ పార్క్ ,కాబ్రిట్స్ నేషనల్ పార్క్ ,ఓట్టేన్ వేవెన్ హాట్ స్ప్రింగ్స్ చూడతగ్గవి .సురక్షితం .

డొమీనికన్ సాహిత్యం –ధామస్ అట్వుడ్-డోమీనికదేశ చరిత్ర ‘’ఎ హిస్టరీ ఆఫ్ ది ఐలాండ్ ‘’సమగ్రంగా రాశాడు Observations on the True Methods of Treatment & Usage of the Negro Slaves in the British West-India Islands.  కూడా రాశాడు .

 లేనక్స్ హోలీ చర్చ్-ది దోమేనికన్ స్టోరీ తో ప్రసిద్ధుడు .ది కరిబియన్ పీపుల్ ,డొమినికా ఐల్ ఆఫ్ అడ్వెంచర్ ,కర్రిబియాన్ కెమెరా ,దోమినికాస్ కాబ్రిట్ అండ్ ప్రిన్స్ రూపర్త్స్ బే ,ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ ఫ్రీడం –ది ఫైటింగ్ మరూన్స్ ఆఫ్ డొమినిక రాశాడు .ఆన్దోని సబ్కా కర్రిబియన్ అవార్డ్ ,ఆనరరి డాక్టరేట్ ,గోల్డెన్ డ్రం అవార్డ్ గ్రహీత .ఎడ్వర్డ్ స్కోబీ –జర్నలిస్ట్  హిస్టోరియన్ .చేకర్స్ ,దిహిస్టరీ ఆఫ్ బ్లాక్స్ ఇన్ బ్రిటన్ ,గ్లోబల్ ఆఫ్రికన్ ప్రేసేన్స్ రాశాడు

  కాసీ కాడీరన్-జానపద కళాకారిణి .కిరి ఆర్టిస్టిక్ ట్రూప్ ఏర్పాటు చేసింది .ఎల్మా నేపియర్ –మేజర్ సర్ అలేక్జాండర్ పెన్ రోజ్ ,రౌలియాన్ , మైఖేల్ విల్ గుభి,సిసిలి ,నాన్ ఫిక్షన్ గా –నధింగ్ సో బ్లూ ,యూత్ ఈజ్ ఎ బ్లండర్ , వింటర్ ఈజ్  ఇన్ జులై ,బ్లాక్ అండ్ వైట్ సాన్డ్స్ ,కార్నివాల్ ఇన్ మార్టినిక్ .నవలలు డ్యుయేట్ ఇన్ దిస్కార్డ్ ,ఎ ఫ్లైయింగ్ ఫిష్ విస్పెర్డ్.రాసింది .జీన్ రైస్-వైడ్ సర్గాసో సి నవలతో పేరుపొందింది .వాయెజ్ ఇన్ ది డార్క్ ,నవలలు,ది లెఫ్ట్ బాంక్ అండ్ ఆదర్ స్టోరీస్రాసిండ్ న్యూయార్క్ టైమ్స్ బుక్ రివ్యు “quite simply, the best living English novelist”.[1   అని మెచ్చింది .ఆఫ్టర్ మిసెస్ రోచెస్టర్ నాటకం బిబిసికి  ధర్టి మినిట్స్ దియేటర్ కు రచనలు రాసింది .పోస్త్యురాస్  గుడ్ మార్నింగ్ గుడ్నైట్ ,నవలలు చాలారాసింది

192-బెర్ముడా యు.కె,దేశ సాహిత్యం

బెర్ముడా ఉత్తర అట్లాంటిక్ లో  బ్రిటిష్ ఐలాండ్ దేశం .రాయల్ నావల్ డాక్ యార్డ్ కు నిలయం బ్రిటిష్ –అమెరికన్ మిశ్రమ కల్చర్ ఉన్న దేశం .రాజధాని –హామిల్టన్.కరెన్సీ-బెర్ముడియన్ డాలర్ .  జనాభా -64వేలు .అన్నిరకాల క్రిస్టియన్లు ఉంటారు.ఇంగ్లీస్ భాష .98శాతం అక్షరాస్యత .పబ్లిక్ స్కూల్ విధానం .5-16వయసు వారికి కంపల్సారి విద్య  .19వ ఏడు వరకు ఉచిత విద్య .వ్యవసాయం ఆదాయం బీన్స్ బీట్స్ క్రోకల్లీ ,కాబెజ్ కారట్కాలిఫ్లవర్ కుకుంబర్ ఓక్రా పెప్పర్  స్వీట్ పొటాటో,పుచ్చ బాగా పండిస్తారు .హార్స్ షో బేక్రిస్టల్ అండ్ ఫాంటసి కేవ్స్ ,టొబాకో బె చూడదగ్గవి .సురక్షితం

బెర్ముడా సాహిత్యం –నాన్ బెర్మూడియన్లు రాసిందే ఎక్కువ .20శతాబ్దం లో దేశీయ సాహిత్యం వచ్చింది

స్త్రీ రచయితలు  –అన్గేలా బారీ –యాన్ ఐల్ సో లాంగ్ అన్ నోన్  షార్ట్ స్టోరీస్  రాసి బ్రియాన్ బర్లాండ్ అవార్డ్ పొందింది ఎండేన్జర్డ్ స్పెసీస్ ,ఎ బాలడ్ ఆఫ్ ఆరంజ్ వాలీ ,న్యు డాటర్స్ ఆఫ్ ఆఫ్రికా ,గోరీ పాయింట్ ఆఫ్ డిపార్చర్,సాంగ్ ఫర్ మాన్ ,  బ్లాక్ మైదాలజీస్ ,వేర్ ది రిమోట్ బెర్ముడాస్ రైడ్,పై జింక్ 2,ఎక్స్ట్రాక్ట్ ఫ్రం గోరీ వగైరాచాలారాసింది .జేమ్స్ మైకేనర్ క్రియేటివ్ రైటింగ్ అవార్డ్ ,కరిబియన రైటర్స్ ప్రైజ్ ,లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అందుకొన్నది

విక్టోరియన్ హి వార్డ్ –జర్నలిస్ట్ .రోమా౦ టిక్ కెనడా రాసింది

మేరీ ప్రిన్స్ –ఆటోబయాగ్రఫీ దిహిస్టరీ ఆఫ్ మేరీ ప్రిన్స్ రాసుకొన్నది

జాన్ మెక్ గ్రేగార్ –నావలిస్ట్ .మొదటి నవలకు రెండు నాలుగు నవలలకు  బుకర్ ప్రైజ్ ,మూడవనవల ఈవెన్ ది డాగ్స్ కు ఇంటర్నేషనల్ డబ్లిన్ లిటరరీ అవార్డ్ వచ్చాయి .ఈఫ్ నో బడి స్పీక్స్ ఆఫ్ రిమార్కబుల్ ధింగ్స్ ,సో మెని వేస్ టు బిగిన్ ,రిజర్వాయర్ నవలలు ,దిస్ ఈజ్ నాట్ దిసార్ట్ ఆఫ్ ధింగ్ తట్ హాపెన్స్ టు సామ్ వన్ లైక్ యు ,ది రిజర్వాయర్ టేల్స్ కథా సంపుటులు రాశాడు .అవార్డ్ లు –సందీ టైమ్స్ ,కామన్ వెళ్త బ్రిటిష్ బుక్ ,సోమర్సెట్ మాం ,బెట్టీ టాస్క్ ,బిబిసి ,నాటిన్గ్ హామ్ యూనివర్సిటి ,కోస్టా బుక్ ,గోల్డ్ స్మిత్ ,బుకర్ ప్రైజ్ లు ఎన్నోపొండాడు

కొమిన్ హామిల్టన్ బెన్లో –అసెంబ్లీ మెంబర్ –ఎసెంచరి ఆఫ్ ప్రోగ్రెస్ ,బోయర్ ప్రిజనర్ ఆఫ్ వార్ ,గ్లాడీ మొరేల్లీ ,హామిల్టన్ బెర్ముడా ,దిటీచర్స్ అసోసియేషన్ ఇన్ బెర్మూడా రాసిన టీచర్

చార్లెస్ స్టువార్ట్-ఎబాలిషనిస్ట్ –దిఏమిగ్రంట్స్ గైడ్ ,ఈజ్   స్లేవరి డిఫెన్సిబుల్ ఇన్ స్క్రిప్చర్స్ ?ఏ మేమాయిర్ ఆఫ్   గ్రాన్విల్ షార్ప్ ,ఎ షార్ట్ హిస్టరీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఒజ్జిబివే ఇండియన్స్ వగైరా రాశాడు .

జార్జ్ టక్కర్ –రాజకీయ నాయకుడు .మొదటి మేయర్ .ది వాలీ ఆఫ్ షెనండో,దిలైఫ్ ఆఫ్ ధామస్ జఫర్సన్ .లెటర్స్ ఆన్ ది కాన్స్పిరసి ఆఫ్ స్లేవ్స్ ,టేస్ట్,మోరల్స్ అండ్ నేషనల్ పాలిసి మొదలైన రచనలు చేశాడు

పాటల రచయితలు  –హీదర్ నోవా –గ్లో స్టార్స్ ఆయిస్టర్స్ ,మొదలైన ఆల్బమ్స్ చేసింది

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అనాథలపాలిటి అన్నపూర్ణ మమతా మయి శ్రీమతి చర్ల సుశీల (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్ 01/08/2020 విహంగ మహిళా పత్రిక

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు బోర్డ్ హైస్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయుడు .వీరి రెండవ కుమార్తె సుశీలాంబ 1-1-1911 న జన్మించారు .చలాకీ ఉత్సాహం ఉన్న పిల్ల .మగ పిల్లవాడు లేని తండ్రి ఆమెను కొడుకుగా పెంచారు .ఆమె సైకిల్ తొక్కేది, కాలవలో స్నానం చేసి ఈత కొట్టేది .బంగారు నగలపై మోజు ఎక్కువ .తండ్రి గారు తాను రాసిన కథ’బంగారం ‘’చదివి వినిపించి బంగారం పై వ్యామోహం ఎంతటి అనర్ధమో తెలియ జేశారు. అప్పటి నుంచి ఆమెకు నగలపై విరక్తి కలిగింది .తండ్రి గొప్ప సంఘ సంస్కర్త .క్విట్ ఇండియా ఉద్యమలో ఆయనతో పాటు సుశీలకూడా పాల్గొన్నది .పెద్దగా చదువు లేకపోయినా జ్ఞాన వంతురాలు .వక్తగా, విదుషీమణి గా పేరు పొందారు .శ్రావ్యమైన కంఠం తో మధురంగా పాడేవారు .తల్లి గయ్యాళి. ఎప్పుడూ తగాదాలే భర్త తో.అన్నం కూడా వందేదికాదు .శాస్త్రిగారు ఊరి చివర కాలువ గట్టునపాకవేసుకొనిపండ్ల తోటలు పెంచుతూ పళ్ళు, మరమరాలు సెనగపప్పు, తిని, బడికి వెళ్ళేవారు కాని భార్యను పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు .అంతటి ఉత్తములు .

వివాహం:

కాకర పర్రు లోనే శ్రీచర్ల నారాయణ శాస్త్రి గారనే బహు భాషా కోవిదులున్నారు .వ్యాకరణ నిఘంటు కర్త .నారాయణా౦ద్రీ వ్యాకరణ౦ రాశారు .మహిష శతకం ,మహా భారత మీమాంస రచించారు. భారత మీమాంస గ్రంథాలు సీరియల్ గా అయిదురాశారు .. అద్భుతమైన పరిశోధనాత్మకమైన గ్రంథాలు అవి . .పిఠాపుర ఆస్థానం లో కొద్దికాలం ఉండి రాజు కోరికపై ‘’ఆంద్ర నిఘంటువు ‘’కూర్చి బయటి కొచ్చారు .సుశీల గుణ గణాలు తెలిసిన వీరు ఆమెను తమ కుమారుడు శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి తో వివాహం 1921 లో ఆమె 10 వ ఏట జరి పించారు .ఉభయుల అంగీకారం తో కట్న కానుకలు లేవు .గణపతి శాస్త్రి గారు ఉపనయన ,వివాహకార్యాలు చేయించటం లో నిధి .,సులభ సంస్కృతచంద్రిక ,బ్రహ్మ మీమాంసా దర్శనం రాశారు. బౌద్ధం మీద అనురక్తికలిగి బుద్ధుని కథలు రాశారు .శాస్త్రి గారు చెవులకు బంగారు పోగులు ధరించేవారు .దొంగలభయం తో ఆరు బయట పడుకున్నప్పుడు చెవులకు గుడ్డ కట్టుకొనే .వారు చివరికి దానిపై మోహం పోయి ఆయనా నగలకు వ్యతిరేకు లయ్యారు .భార్య పేరును సుశీలగా మార్చేశారు .ఈ దంపతులకు ఒక కొడుకు, నలుగురు విమల ,కమల ,విదుల ,మృదుల అనే కూతుళ్ళు .తల్లి పేరు లోని ‘’ల’’కారం వీరిలో ప్రతిధ్వని౦చేట్లు పేర్లు పెట్టారు .కొడుకు పేరు బుద్ధ నారాయణ శాస్త్రి .

చారు శీల సుశీల – ఇంట సాత్వికాహారం:

మాతృమూర్తి సుశీల కరుణామయి. ఆకలితో ఉన్నవారికి ఇంత అన్నం పెడితేకాని తినేదికాదు .ఆర్ధికం గా పుష్టి లేని వారి ఇళ్ళకు వెళ్లి వారికి తెలియకుండా కూరగాయలు, బియ్యం గుమ్మాల వద్ద పెట్టి వచ్చేది .రహదారి పడవలు నడిపే వారి శ్రమ గుర్తించి ,వారి కి పెరుగు అన్నం పెట్టి చెట్టు కింద విశ్రాంతి తీసుకోమని చెప్పేది .గణపతి శాస్త్రిగారు గాంధీ అనుయాయులు .ధర్మ పత్నిగా ఆమె ఆయన్ను అనుసరించింది .భర్త రాసిన తెలుగు భగవద్గీత గీతాలను ఉదయం 5 గంటలకే లేచి పారాయణ చేసేది .బ్రహ్మ సమాజం పాటలు భక్తి గీతాలు రాట్నం మీద నూలు వడుకుతూ ఆలపించేది .ఇంటిలో సత్సంగం జరిపేది .కుటుంబం అంతా ఆవుదగ్గర గుమ్మ పాలు త్రాగే వారు .అల్పాహారం లో పెసలు అరటి పళ్ళు ,మధ్యాహ్న భోజనం లో పుచ్చకాయ ముక్కలు ,సీతాఫలాలు ,జామ పళ్ళు పెరుగు .పచ్చి దొండ బెండ సొరకాయ ,టమేటా, బీరకాయ ముక్కలు తినేవారు .సాయంత్రం నూకల జావలో కారం లేని ఆవకాయ ,పెరుగు కలిపి తీసుకొనేవారు .వారు పెట్టిన కారం లేని ఆవకాయ సంవత్సరం నిలవ ఉన్నా చెడి పోయేది కాదు. కారం లేని ధనియాల ఆవకాయ వారింట్లో స్పెషల్ .రాత్రి 6 గంటలకే భోజనం గా జావ తాగి ఆరుబయట మంచాలు వేసుకొని పడుకొనే వారు .సుశీల పిల్లలకు చద్దన్నం లో పెరుగు పోసి బ్రేక్ ఫాస్ట్ గా మడి బట్టలు కట్టించి మొదట్లో ఇచ్చేది.భర్త మాట విని ఆ పధ్ధతి మార్చుకొని చద్ది కూడు , మడి బట్టలకు స్వస్తి చెప్పింది .చాదస్తంగా ఎప్పుడూ మడి బట్టలతోనే ఉండేది .మాలవాళ్ళను చూసేదికాదు . ఇతర కులస్తులను ఇంటికి రానిచ్చేదికాదు.భర్త అనునయంగా నచ్చ చెప్పి అన్నీమానిపించాడు .శాస్త్రి గారు కాపు వాడితో ఇంట్లోకి నీళ్ళు తెప్పించి ,పిల్లలతో మొక్కలకు నీళ్ళు పోయి౦చే వారు .పెరడు ప్రకృతి నిలయంగా అన్ని రకాల కాయ గూరలు ,పండ్ల చెట్లు, పూల చెట్ల తో కళకళ లాడేది .తేనె టీగలను పెంచి తేనే తీసేవారు .ఆవులు, గేదెలు ఉండేవి .పాలు పెరుగు అనాథలకు, బీదలకు పోసేవారు .

శాస్త్రి గారిల్లు పూరి గుడిసె మాత్రమే .తర్వాత పెంకుటిల్లు .నుయ్యి ,కొబ్బరి చెట్లు ధాన్యం నిలువకు’’ గాదె’’తో చూడ ముచ్చటగా ఉండేది .నూలు వడికి అందరూ ఖద్దరు బట్టలే కట్టేవారు .ఎక్కడికి వెళ్ళినా’’ తకిలీ ‘’తమతో తీసుకు పోయేవారు పిల్లలతో సహా .’’సూత్ర యజ్ఞం ‘’పేరు తో ఇంటి వారు, బయటివారు రోజూ కనీసం మూడు గంటలు నూలు వాడికే వారు .సుశీల గారు రాజమండ్రి నుంచి ఖద్దరు బట్టలు కొనుక్కు వచ్చి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేవారు .ఆడా మగా అందరి చేత ఖద్దరు కట్టించేవారు .పండగలకు పిల్లలకు కొత్త బట్టలు కొనేవారు కాదు .సామాన్యులు పుట్టిన రోజు చేసుకో కూడదని ,మహాత్ముల పుట్టిన రోజులే చేయాలని పిల్లలకు నచ్చ చెప్పేవారు .దంపతులు తాము ఆచరించి తర్వాత ఇతరులకు చెప్పేవారు అంతటి ఆదర్శం వారిది .

మధుర భాషిణి సుశీల:

మధుర భాషిణి ,మధుర గాయని సుశీల గారు అనర్గళంగా ఉపన్యాసాలిచ్చేవారు .ఒక సారి దుర్గా బాయ్ దేశముఖ్ సభలో 5 నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడమంటే సుశీలగారికి మరో 10 నిమిషాల దాకా ఇచ్చి, ఆమె వాగ్ధాటికి ఆశ్చర్య పోయింది దేశ్ ముఖ్ .కోమల భావాలు, సేవా దృష్టి ఉన్నందున అన్ని రంగాలలో దూసుకు పోయింది .ఒక రైతు కొడుకు తమ ఇంట్లో దొంగతనం చేసి పట్టుబడితే ,పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్రతిమిలాడి వాడు చిన్నపిల్లాడు వదిలేయమని విడిపించుకొని వచ్చి వాళ్ళు కొట్టిన దెబ్బలకు నూనె రాసి కట్టు కట్టిన దయామయి .శాస్త్రి దంపతులు హరిజన వాడకు వెళ్లి శుభ్రత గురించి తెలియ జెప్పేవారు .తమ పిల్లలనూ తీసుకొని వెళ్లి వాళ్ళ చేత ఉత్తరాలు రాయించేవారు ,రాయటం చదవటం నేర్పించారు .రోగాలకు హోమియో మందులు ఇచ్చేవారు .’’కల్లు మాన౦డోయ్ –కళ్ళు తెరవం డోయ్ ‘’అని పాడుతూ వారి అలవాట్లను మాన్పించిన సంస్కారులు .

కస్తూరి బాయి మహిళా సమాజ స్థాపన:

శాస్త్రిగారు ‘’శ్రీ కస్తూరి బాయి మహిళా సమాజం ను 1950 లో స్థాపించారు .అనాథ ,అసహాయ ,పతితలకు , , పెళ్లి కాని యువతులకు , భర్తను కోల్పోయినవారికి ఉపాధి కల్పించటమే వీరి ఆశయం .సుశీల గారు దీని చైర్మన్ .విద్యార్ధి సంఘానికి కూతురు కమల ప్రెసిడెంట్ .తండ్రీ కూతుళ్ళు హిందీ నేర్పేవారు .భవన నిర్మాణం కోసం పిల్లలు ఇంటింటికీ తిరిగి పావలా వంతున ఒక లక్ష రూపాయలు సేకరించి భవనం నిర్మించిన దీక్ష వారిది .హిందీ తోపాటు కుట్టుపని ,ఎంబ్రాయిడరీ క్లాసులు నిర్వహించేవారు .ఖాళీ స్థలం లో కూరలు పండించి వేలం వేసి డబ్బు కూడ బెట్టేవారు .కొడుకు కూడా వీరితో పాటు కష్టపడేవాడు. అయితే అతన్ని భవనం లోకి వెళ్ళకుండా కట్టడి చేశారు శాస్త్రి గారు అదీ పధ్ధతి అంటే . బయట ఉండే సేవలు చేసేవాడు .మొదటి ఏడాది వార్షికోత్సవం 3 రోజులు ఘనం గా చేసి వక్తల నాహ్వానించి స్పూర్తి కలిగించారు .శాస్త్రిగారు రాసిన ఝాన్సి లక్ష్మి బాయి ,భారత మాత ,మీరాబాయి నాటకాలను వేయించారు .ప్రతి ఏడాది వార్షికోత్సవం జరిపి, తాము రాసిన పొట్టి శ్రీరాములు ,బాపూజీ అల్లూరి బుర్రకథలను చెప్పించేవారు .సుశీలమ్మ గారి సమాజం అంటే ఆడ పిల్లలకు భయం లేదని తలిదండ్రులు నమ్మేవారు .హిందీ పరీక్షలకు రాజమండ్రి తీసుకు వెళ్లి ఎక్కడా ఉంచకుండా బంధువు భారతమ్మ గారింట్లో ఉంచిపరీక్ష రాయించేవారు .ఆడపిల్లల రక్షణ విషయం లో అంతటి శ్రద్ధ తీసుకొనే వారు .‘

అన్యోన్య దాపత్యం:

శ్రీ చర్ల గణపతి శాస్త్రిగారు శ్రీమతి సుశీల గారు చాలా అన్యోన్యంగా కాపురం చేశారు .శాస్త్రిగారు శతాధిక గ్రంథ కర్త. 1988 లో వారికి ‘’కళాప్రపూర్ణ’’ బిరుదు నిచ్చి ఆంధ్రా యూని వర్సిటి సత్కరిస్తే ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రదానం చేసింది .అయినా ఏమాత్రం గర్వం ఆయనలో లేదు .సుశీలగారు వారి గ్రంథాలను అత్యంత శ్రద్ధాసక్తులతో చదివారు .వారామెతో ‘’బాల రామాయణం ‘’రచింప జేయించారు .అది అలభ్యం .శాస్త్రి గారి ఆకాశమంత పాండిత్యాన్ని చూసి తాము రచించటం మానేశారు .వారి సాహిత్యం పై ప్రసంగించేవారు సుశీల .తండ్రి గారి గ్రంథాలప్రచారం చేయమని కూతుళ్ళను ప్రోత్సహించారు .స్త్రీల కోసం ‘’మాతృశ్రీ స్తోత్ర రత్నాలు ‘’సంకలనం చేసి ప్రచురించారు.గాంధీ పై ఒక మంగళహారతి రాశారు .’’మంగళమని మంగళమని మంగళమనరే –మంగళమని పాడరే మహాత్మా గాంధీకి ‘’అనేది ఆపాట .’’బీదలకు నేను సేవ చేస్తే, నా పిల్లలకు భగవంతుడు సహకరిస్తాడు ‘అనే నమ్మకం ఆమెది .స్వాతంత్ర సమర యోధులైన శాస్త్రిగారు జైలు కు వెళ్ళినప్పుడు, వినోబా తో పాద యాత్ర చేసినపుడు ,ధైర్యంగా పిల్లల ఆలనా పాలనా చూసుకోనేవారు .భర్త గారికి జున్ను ఇష్టం అని బకెట్ నిండా జున్ను వండి జైలుకు తీసుకు వెళ్లి పోలీసులను కూడా తినమనే వారు .మన ‘’మామయ్యలు’’ మాయ గాళ్ళు కదా ,వారికి పెట్ట కుండా అంతా తామే ‘’జుర్ర్రేసే’’వారు .తెలిసినా ఆమె వారిని ఏమీ అనేది కాదు .పిల్లలకు ఇంగ్లీష్ నేర్పకుండా తెలుగు హిందీ నేర్పించారు .శాస్త్రి గారి పుస్తకాలను పిల్లలు అమ్మి ,కొన లేని వారికి ఉచితంగా ఇచ్చేవారు .భర్త ఆశయాలకు అనుగుణంగా మసలు కొనేవారు .నగలు లేక పోయినా ,కస్తూరిబాయిలాగా తెల్ల ఖద్దరు చీర ధరించి మెడలో నల్లపూసల దండతో అసలైన భారత నారిగా కని పించేవారు .

భూదాన ఉద్యమానికి భర్త 5 ఎకరాలు దానం చేసినప్పుడు ,ఆమె సహకరించారు . తర్వాత తర్వాత కొడుకు కూతుళ్ళు ఆంగ్ల విద్య నేర్చి ఎంతో అభి వృద్ధి సాధించారు .కుమారుడు ఆంధ్రా యూని వర్సిటి లో ఎం ఎస్ సి పాసయ్యాడు కమల అక్కడే ప్రొఫెసర్ అయింది .పెద్దమ్మాయి సంస్కృతం హిందీలలో ఎం ఏ .చేసి సంస్కృత లెక్చరర్ గా రిటైర్ అయింది రెండవ కూతురు హిందీ లో ఎం ఏ పి హెచ్ డి.. మిగిలిన ఇద్దరూ ఎం ఏ పి హెచ్ డిచేసి ఉద్యోగాలు చేసి స్వంత కాళ్ళపై నిల బడ్డారు .శాస్త్రి గారు హైదరాబాద్ మకాం మార్చి లలితా ఆర్ట్ ప్రెస్ పెట్టి నడిపారు .కస్తూరి బాయ్ సమాజం 26 ఏళ్ళు నిరాఘాటం గా నడిచింది .సుశీలగారు స్పురద్రూపి .భవిష్యత్ జ్ఞానం బాగా ఉండేది .నలుగురైదుగురను తీసుకుని తరచుగా తీర్ధ యాత్రలు చేసేవారు .సత్య సాయి పై ఆరాధన ఏర్పడింది. ఆయనకూ ఈమె సేవా విషయాలు తెలిసి నిర్వహణకు ధనం ఇచ్చేవారు .బాబాపై పద్యాలు కూడా రాశారు .1976 డిసెంబర్ లో ఒక్కగానొక్క కొడుకు హార్ట్ ఎటాక్ తో చని పోయాడు ఇది దంపతులను బాగా కుంగ దీసింది .శాస్త్రి గారి మరణం తర్వాత సుశీలగారు 1976 లో 65 ఏళ్ళ వయసులో చనిపోయారు .

శాస్త్రిగారు సుశీల దంపతులు నిడద వోలులో కస్తూరి బాయి ఆశ్రమాన్ని స్థాపించి కుట్లు అల్లికలు హిందీ నేర్పించారు .కార్తీకమాసం లో అన్నదానం తో పాటు వస్త్ర దానమూ చేసిన ఉత్తమ మహిళ.నిరాడంబర జీవి .ఉన్నత సంస్కారం ఆధ్యాత్మిక భావ సంపదా ఉన్న ఉత్తమా ఇల్లాలు .సుశీల గారు అమృత వర్షిణి అంటారు అందరు .ఆమె గారి స్పూర్తితో ఎందరో అనాథ ఆశ్రమాలు పెట్టి నిర్వహించారు .ఆమె సంతానాన్ని ఆణి ముత్యాలుగా తీర్చి దిద్దిన మహిళా మాణిక్యం .శాంత స్వరూపిణి సుశీలగారు .వారి కుమార్తె విదుల ‘’అమ్మ అంటే అమృతం .త్యాగం అనే కొవ్వొత్తి .తను కరిగిపోతూ ఇతరులకు వెలుగు నిచ్చేదేవత .మూర్తి రాజు సంస్థల అధ్యక్షులు శ్రీ మూర్తి రాజు ఆమెకు బంగారు గొలుసు కానుక గా ఇస్తాను అంటే ‘’మళ్ళీ మీరు గొలుసు ఏదీ అని అడగ వద్దు .ఎవరైనా బాగుంది అంటే ఇచ్చేస్తాను ‘’అన్నారు .విదుల ‘’చర్ల సుశీల వృద్ధాశ్రమం ‘’పెట్టి 150మందితో నడుపుతున్నారు .మనిషిలోని ప్రతిభను గుర్తించి సాయం చేసే దొడ్డ గుణం ఆమెది .ఏ కొత్తపాట విన్నా నేర్చుకొనే వారు ,నేర్పే వారు .తెల్లవారు ఝామున 4 గంటలకే లేచి ధ్యానం చేసేవారు .తర్వాత అన్నం ,మజ్జిగ ఊరగాయ తీసుకొని రైలు గేటు దగ్గర రిక్షా వాళ్లకు ,ముష్టి వాళ్ళకూ పంచి ఇచ్చేవారు .ఎందరో పేద పిల్లలకు ఫీజులు కట్టి చదివించి ,ఉద్యోగాలు ఇప్పించిన మహా ఇల్లాలు .సుశీల గారు లాంటి మనిషి ఉంటారా అని ఆశ్చర్య పోతాం .అంతటి ఉత్తమ మహిళా ఆదర్శ మూర్తి శ్రీమతి చర్ల సుశీల గారు .

–గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11

గొడుగు పాలుడి సాహస గాథ-2(చివరిభాగం )

కర్తవ్య నిష్టతో అంత సేపున్నాడు కాని  గొడుగు పాలుడు విపరీతంగా అలసిపోయాడు .రాయల అప్పణ అయ్యాక , ఒళ్ళూపై తెలియలేదు. తలదిమ్ముగా ఉంది .ఎక్కడికి వెడుతున్నాడో తెలీదు ,తూలిపోతున్నాడు .అలా మైకం లో మైలున్నరనడిచి ఆకలి అలసట వేధిస్తుండగా ,ఉగ్ర నరసింహ ప్రక్కన ఉండే బడివే లింగ దేవాలయం లో దూరి అక్కడా ప్రదోషకాల పూజ అయ్యాక వడపప్పుతిని  పానకం ,తాగాడు .తూలి  పడ్డాడు.ఆపడటం తో లింగానికి తలతగిలి రక్తం వరదలై కారి స్పృహ తప్పింది .

  గుర్రం మీద వచ్చినా రాయలూ బాగా అలసిపోయాడు. నిద్రపట్టింది అర్ధరాత్రి తర్వాత మెలకువ వచ్చి గొడుగుపాలుడు గుర్తుకొచ్చి ‘’గుర్రపు స్వారిపై వచ్చిన నాకే ఇ౦త అలసటగా ఉంటె గుర్రం కంటే ముందు పరిగెత్తిన ఆ బోయ బంటు ఎలా ఉన్నాడో ‘’అని ఆలోచించి దయ మనసులో తొంగి చూసి ,వెంటనే అతడిని వెదకటానికి బయల్దేరాడు రాయలు .ఆయనతోపాటు రాణివాసజనమూ బయల్దేరారు దివిటీలతో వెదకటానికి .రాజధాని అంతా గాలించాడు రాయలు ఇదిగో ఇక్కడ చూశాం అదుగో అక్కడ చూశాం అని ఇచ్చకపు మాటలు చెప్పారు ఎవరూ చూడకపోయినా .

  చివరికి బడివే గుడిలో స్పృహ తప్పి పడిఉన్న గొడుగుపాలుడిని చూశాడు రాయలు అమాంతం వెళ్లి తలనుంచి రక్తం కారున్న అతడిని చూసి  నిశ్చేస్టుడయ్యాడు .వైద్యుల్ని పిలిపించగా వచ్చి చూసి ఉష్ణ ఆధిక్యం వలన రక్తం తలకెక్కింది అత్యంత శ్రమతో కూడిన పని చేసిఉంటాడు .శక్తికి మించినపనితో రక్తనాళాలు ఉద్రేకం చెందాయి జలగలద్వారా చెడు రక్తం తీయి౦ చేసి శైత్యోప చారాలు చేస్తే స్పృహ వస్తుందన్నారు భిషగ్వరులు .అతడు వడపప్పు తిని పానకం తాగాడు కనుక  శైత్యోప చారం సహజంగానే జరిగింది అరగంట  సేపట్లో స్పృహలోకి వస్తాడు కనుక జలూక అనే జలగ చికిత్స అక్కర్లేదని రాజ వైద్యుడు చెప్పాడు .ఆయన మాటకు తిరుగు లేదు .అందరూ అతని స్పృహ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు .అలాగే  అరగంట లో  స్పృహలోకి వచ్చాడు గొడుగుపాలుడు .రాయలముఖం ప్రసన్నమైంది .అతడి సాహస గాథను అందరికీ వినిపించాడు ,విని వాళ్ళంతా తెల్లబోయారు .

  రెండు రోజుల తర్వాత మళ్ళీ కొలువుకు సిద్ధమయ్యాడు గొడుగుపాలుడు.నిండు సభలో రాయలు అతడిని  కర్పూర రతాంబూలం కానుకలతో సత్కరింఛి ‘’గొడుగుపాలా!నీ కిస్టమైంది కోరుకో ‘’అన్నాడు .అతడికి చాలాకాలంగా చేతినిండా దానాలు చేయాలనే కోరిక ఉంది .అది తీరాలంటే అస్తీ,అదికారం ఉండాలి ఇప్పుడు సమయం వచ్చింది ‘’మహారాజా !ఒక్క రోజు రాజ్యం ఇప్పించండి చాలు ‘’అన్నాడు .సభాజనం ‘’ఇదేం కోరిక ?రాయలవారికే ఎసరా ??’’అని గుసగుసలు పోయారు .’’ఒక రోజు రాజ్యం తో ఏం చేస్తావ్ ‘’రాయలుప్రశ్నించాడు నవ్వుతూ ‘’చేతి నిండా దానాలు చేస్తాను ప్రభూ .నా పేరు శాశ్వతం చేసుకొంటాను మీ గొడుగు నీడలో ‘’అన్నాడు వినయంగా .’’సరే ఇచ్చాను రేపే తీసుకో ‘’అన్నాడు ఉదాత్తంగా రాయలు

  మర్నాడు జరగలేదుకాని మంచి ముహూర్తం చూసి రాయలు అతన్ని’’ ఏక్ దిన్  కా సుల్తాన్ ‘’చేశాడు .ఆరోజు సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం దాకా గొడుగు పాలుడే రాజు .అంతా అతడి ఇష్టం .అడ్డు పడేవారెవరూ ఉండరు .ఆ రోజు ఉషఃకాలం  లో అతని ఇద్దరు భార్యలతో స్నానాదికాలు, పూజ ముగించి కొలువుకు వచ్చి సింహాసనానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి  అధిష్టించాడు ’’గొడుగుపాల మహారాజు’’ సింహాసనాన్ని .ఇరు పక్కలా భార్యలు కూర్చున్నారు ఏడుకోప్పెరల కరక్కాయ ,లక్కమసి (సిరా )చేయించాడు దానాలు ధారపోస్తూ దానపత్రాలపై ఆసిరాతో మొహర్లు వేయటం మొదలు పెట్టాడు .భార్యలు దానపత్రాలు సర్దుతున్నారు .నగరం లోనిబీదా బిక్కీ సింహద్వారం వద్ద బారులు తీరారు .కావలి తిమ్మన్నకు చేతి నిండాపని .ఆపగలూ రాత్రీ తిండీ తిప్పలూ లేకుండా ‘’దానేస్టి ‘’కొనసాగింది .తోలి కోడి కూసింది .గొడుగు పాలుడికి ఆదుర్దా పెరిగింది .వేగు చుక్కపొడిచి పైకెక్కే కొద్దీ ఉద్వేగం ఎక్కువైంది .దీనికి తోడూ సిద్ధం చేసుకొన్న సిరా కూడా అయిపొయింది ,కొత్త సిరా చేయించే వ్యవధి లేదు .అరుణోదయం అయింది .భార్యలను నోరు తెరవమన్నాడు వారి వక్కాకు తమ్మపై మొహరు అద్ది దానపత్రాలపై వేయటం మొదలుపెట్టాడు. చివరికి అదీ అయిపోయింది .సూర్యుడు గొడుగుపాలుడు ఏం చేస్తున్నాడో చూద్దామని క్షితిజం నుంచి తొంగి చూశాడు .తనజన్మ తరించిందని గొడుగుపాలుడు సంతోషించాడు .సింహాసనం దిగి భార్యలతోపాటు దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ,మళ్ళీ తెల్లగొడుగు పట్టుకొని రాయల కొలువుకు బయల్దేరాడు .అప్పుడే రాయలు సపరివారంగా ప్రవేశించాడు .గొడుగు పట్టుకొని నిలుచున్నట్లుఉన్న రాతి శిల్పాలు అతడు దానం చేసిన భూముల్లో ఇప్పటికీ బళ్ళారి అనంతపురం జిల్లాలలో కనిపిస్తాయి .కవిలకట్టేలలో  కూడా అవి గొడుగుపాలుడు దానంగా ఇచ్చిన భూములు అని రికార్డ్ అయ్యాయి .

‘’అరై స్సందార్యతేనాభిః-నాభౌ చ ఆరాఃప్రతిస్టితాః-స్వామి సేవకయో రేవం –వృత్తి చక్రం ప్రవర్తతే’’

భావం –మనైన్తిలోని పెట్టె బండీఒంటెద్దు ,రెండెడ్ల బండీల చక్రాలు  ఉంటాయి రోజూ చూస్తూనే ఉంటాం .చక్రం  గుండ్రం గా ఉండి,మధ్యలో లావుపాటి తూము ఉంటుంది .దాన్ని బండి కంటి తూము అనీ లేక కుంభి అనీ అంటారు .దీని చుట్టూ కర్రలు బిగి౦చి ఉంటాయి. వీటిని ఆకులు అంటారు .సంస్కృతం లో’’ అర’’ అంటారు .చక్రం కు౦భికి  ఆకులు బిగిస్తారు .ఆకులతో కుంభి నిలబడుతుంది అనిభావం .అంటే ప్రపంచం లో ప్రతిదీ అన్యోన్య  ఆశ్రయాలు .ప్రతివాడుఇతరులతొ సామరస్యంగా మెలగాలి .ఒక్క ఉద్యోగమే కాదు అన్నీ పరస్పరాశ్రితాలే అని తాత్పర్యం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 188-సెయింట్ లూసియా దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం

188-సెయింట్ లూసియా దేశ సాహిత్యం

సెయింట్ లూసియా ఈస్ట్ కరేబియన్ ఐలాండ్ దేశం .పడమటి తీరం వల్కానిక్ బీచెస్ ,తూర్పుతీరం పర్వత శ్రేణులు ఉంటాయి .రీఫ్ డైవింగ్ సైట్స్ ,రిసార్ట్ లు ప్రత్యేకత ,రైన్ ఫారెస్ట్ లు వాటర్ ఫాల్స్ కను విందు చేస్తాయి ,రాజధాని –కాస్ట్రీస్..ఫ్రెంచ్ ,సేయిన్ట్ లూసియన్ క్రియోల్ భాష ఉన్నాయి .కరెన్సీ –ఈస్టర్న్ కరేబియన్ డాలర్ .,జనాభా -1’82లక్షలు .రోమన్ కేధలిక్ మతం .  అధికార భాష ఇంగ్లీష్ .90శాతం అక్షరాస్యత .ప్రీ స్కూల్ ఇన్ఫ౦ట్ ,జూనియర్ ప్రైమరీ సీనియర్ ప్రైమరీ ,సెకండరి పోస్ట్ సెకండరి విధాన విద్య 5-15వయసు వారందరికీ కంపల్సరి విద్య .బనానా అవకాడ్రో,మా౦గొస్,టూరిజం  ఆదాయ వనరులు .గ్రాస్ పిటాన్ ,మేర్గాట్ బే,రోడ్నీ బే దర్శనీయాలు .సురక్షితం .

సెయింట్ లూసియా సాహిత్యం –సెయింట్ లూసియన్ సాహిత్యం అంటే డెరిక్ వాల్కాట్ గుర్తుకొస్తాడు .కవిత్వం లో నోబెల్ ప్రైజ్ విన్నర్ .నాటక రచయితకూడా .ఆయన కావ్యం ‘’ఒమేరాస్ ‘’అజరామరం .నెగ్ మొరాన్, ఫ్రీడం ఫైటర్స్ , సీజన్స్ ఆఫ్ మిస్ట్ ,డెత్ బై ఫైర్ నవలు  రాసిన మోడేస్తోడౌన్స్,ఆండర్సన్ రేనాల్డ్స్ అభినందనీయులు ‘’ .సర్ ఫ్రెడరిక్ ట్రావేర్స్ –ది క్రెడిల్ ఆఫ్ ది డీప్ రాశాడు .ఏ హిస్టరీ ఆఫ్ లూసియా జోలీన్ హార్,101ధింగ్స్ టు డు ను రస్సెల్ ,డ్రీం ఆన్ మంకీ డెరెక్ వాల్కాట్ ,లూసియా సెయింట్ లైట్ ను కేధరిన్ ఎ రూమ్ ఆన్ ది హిల్ ను గార్త్ రాశారు

  ఈదేశాన్ని కొలంబస్ 1502లో కనుగోన్నాడు .ఇక్కడ ఉడుములు(ఇగూనా ) ఎక్కువగా ఉండటం వలన దీన్ని అయొనాలో  అనేవారు .ఇంతకంటే వివరాలు లేవు .

189-సెయింట్ విన్సెంట్ అండ్ గ్రనడైన్స్ దేశ సాహిత్యం

దక్షిణ కరేబియన్ దేశమే సెయింట్ విన్సెంట్ అండ్ గ్రనడైన్స్.ముఖ్య ఐలాండ్ సెయింట్ విన్సెంట్ .దీనికి అనుబంధంగా గొలుసుకట్టుగా చిన్న ఐలాండ్స్ ఉంటాయి .వైట్ శాండ్ బీచెస్ వల్కనో  బీచెస్ ఉంటాయి .రాజధాని –కింగ్ టౌన్ .కరెన్సీ –ఈస్ట్రన్ కరేబియన్ డాలర్ .జనాభా -1.1లక్షలు .విన్సే౦టినియన్ క్రియోల్ భాషాజనం .అధికార భాష –ఇంగ్లీష్ . క్రిస్టియన్ మతం .95.65శాతం అక్షరాస్యత .ఉచిత ఐచ్చిక విద్య ..యారో రూట్ ఉత్పత్తిలో ప్రపంచంలో టాప్.మిగిలిన దుంపకూరలూ బాగా పండిస్తారు .టొబాగో, కేస్,యూనియన్ ఐలాండ్ ,పెటిట్ సెయింట్ విన్సెంట్ చూడదగ్గవి . సురక్షితం

సెయింట్ విన్సెంట్ అండ్ గ్రనడైన్స్ సాహిత్యం –కొండలపైనా రాతి ఫలకాలపైనముద్రా సాహిత్యముండేది .ఈ ఐలాండ్ కు చెందిన అతి తక్కువ మంది రచయితలే ఉన్నారు .వారిలో కవిత్వానికి షెకె కీనే ,రాల్ఫ్ ఎవరార్డ్ గోన్సాల్వేస్ –ప్రధానిగా పని చేసి తన అనుభవాలు రాశాడు .సెసిల్ బ్రౌన్  షార్ట్ స్టోరీ రైటర్  .జిమ్మీ ప్రిన్స్ కవి .

190-యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ దేశ సాహిత్యం

ఆఆఆఅమెరికాలొ ఉన్న యుఎస్ వర్జిల్ ఐలాండ్స్ దేశం కరేబియన్ ఐలాండ్ దేశం .వైట్ శాండ్ బెచేస్ ,రీఫ్స్, కొండలు ఉంటాయి .రాజధాని –షార్లెట్ అమలీ .జనాభా ఒక లక్ష .కరెన్సీ-అమెరికన్ డాలర్ .ప్రోటేస్టెంట్ క్రిస్టియన్లు ఎక్కువ .అధికారభాష –ఇంగ్లీష్ .5-16వయసు వారికి కంపల్సరి విద్య .అమెరికన్ ఇంగ్లీష్ విద్యా విధానం .99శాతం అక్షరాస్యత .టూరిజం ట్రేడ్ ఆదాయవనరులు వ్యవసాయం తక్కువ .మేగేన్స్ బె బీచ్ ,ట్రంక్ బే,నేషనల్ పార్క్ చూడతగినవి .సేఫ్.

యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ సాహిత్యం –ఈ దేశ సాహిత్యం టోర్టోలా,వర్జిన్ గోర్డా ,అనేగడ,జోస్ట్ వాన్ డైక్ భాషలలో ఉన్నది .కొద్ది మంది రచయితలున్నారు వారిలో –ఆల్ఫేయస్ఒసారియో నార్మన్ -1885-1942,వెర్నా పీల్ మోర్,జెన్నీ వీట్లీ ,పాట్రీషియా టర్న్ బుల్.

  స్కాట్ ఒ డెల్-మై నేం ఈజ్ నాట్ ఎంజేలికా అనే చరిత్రాత్మకనవల 1733బానిసల పునర్జీవనం పై రాసింది .అనేక మంది అభిమానం ప్రశంసలు పొందింది .టోబియాస్ బకేల్ –రాసిన నవల హలో దికోల్ ప్రోటోకాల్  బెస్ట్ సెల్లర్ గా నిలిచింది ,క్రిస్టల్ రైన్ ,రాగ్ ముఫిన్ ,స్లై మాంగోస్ ,అపోక్లిప్సే ఓషన్ అనేక్సేనో వెల్త్ సిరీస్ ,ఆర్కిటిక్ రైజింగ్ ,హరి కేన్ ఫీవర్ హలో ఎన్వాయ్,ది ట్రోవ్ వంటి ఇతర రచనలు ,ది ఎక్సి క్యూషన్ నెస్ అనే నావేల్లా ,టైడ్స్ ఫ్రం ది న్యు వరల్డ్ ,నేసేన్స్ ,మిటిగేటేడ్ ఫ్యూచర్ సంపుటులు,పేల్,బ్లూ మెమరీస్ ,ఒయాసిస్ కథా సంపుటులు ,ది స్టోరీస్ వుయ్ టెల్-బెర్ముడా ఆన్దాలజిఆఫ్ సైన్స్ ఫిక్షన్ ,ఫాంటసి అండ్ హారర్  వగైరా రాశాడు

  కేసేన్ కాలెండర్ –బాలసాహిత్య రచయిత.స్టోన్వాల్ బుక్ అవార్డ్ ,లాంబ్డా లిటరరీ అవార్డ్.ఈమె రాసిన ‘’హరికేన్ చైల్డ్ ‘’ ఎపిక్ లవ్ స్టోరీ ..రెండవనవల కింగ్ అండ్ డ్రాగల్ ఫ్లైస్ రాసింది .దిస్ ఈజ్ కింద్ ఆఫ్ ఎపిక్ లవ్ స్టోరీ ,ఫెలిక్స్ ఎవర్ ఆఫ్టర్ లను  యువతకు  ,ఐలాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ స్ట్రారం సిరీస్ ,కింగ్ ఆఫ్ ది రైజింగ్ ఫాంటసి నవలలు ,రాసింది .

ఎరిక్ డాసన్-డౌన్ స్ట్రీట్ ,సెయింట్ ధామస్ అండ్ బియాండ్ ,ఎడైనమిక్ నైబర్ హుడ్ మొదలైనవి రాశాడు .మాలిక్ సేకౌ –లెఫ్టినెంట్ గవర్నర్ .వర్జిన్ ఐలాండ్ ,కరేబియన్ లపై చాలా వ్యాసాలూ రాశాడు .టిఫినీ యానిక్-ఫిక్షన్ రాసినమహిళ.హౌ టు ఎస్కేప్ ఫ్రం ఏ లెపర్ కాలని నావేల్లా ,వైఫ్ నవల తోపాటు కథలూ రాసింది .అద్భుతకవిత్వం జర్నల్స్ లో రాసి పేరుపొందింది .మొదటి నవల లాండ్ ఆఫ్ లవ్ అండ్ డ్రౌనింగ్ లో ఆ దేశ నాడిని వెతికి పట్టుకొన్నదని ప్రశంసలు పొందింది .అకాడెమీ   ఆఫ్ అమెరికన్ పోఎట్స్ ,ప్రైజ్ పొందింది.

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-20-ఉయ్యూరు     ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీయ విజ్ఞాన  సర్వస్వం- భారతం -రేపటి నుంచే ప్రారంభం I

భారతీయ విజ్ఞాన  సర్వస్వం- భారతం -రేపటి నుంచే ప్రారంభం  I

సాహితీ బంధువులకు రేపు3-8-20 సోమవారం  శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు . ”అనంత కాలం  లో నేనూ ” అనే నాపుట్టినప్పటి నుంచి ఇంటర్ చదువు వరకు రాసిన విషయాలన్నీ  సరసభారతి పేస్బుక్ లో రోజూ ఉదయం 10గంటలకు ప్రత్యక్ష ప్రసారమైన ధారావాహిక  ఈ రోజు 12వ ఎపిసోడ్ తో పూర్తయింది ..వీక్షించిన వారికి ధన్యవాదాలు

  రేపు శ్రావణ పౌర్ణమి పర్వదినాన ఉదయం 10గంటలనుంచి సరసభారతి ద్వారా పేస్  బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా ధారావాహికంగా  ”భారతీయ విజ్ఞాన సర్వస్వ0 -భారతం ” తిక్కన సోమయాజి గారి మహాభారతం ఆధారంగా  అందిస్తున్నాను .
  భారతం అయిపోగానే ”శ్రీ హనుమత్ కథా నిది ,దాని తర్వాత శ్రీ ఆంజనేయస్వామి మహాత్మ్యం ధారా వాహిక గా ప్రత్యక్ష ప్రసారంగా అందిస్తున్నాము
 రేపు శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలతో -మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-20
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11

గొడుగు పాలుడి సాహస గాథ

 గొడుగు పాలుడి గురించి మొదటి ఎపిసోడ్ లోనే సంక్షిప్తంగా రాశాను ఇప్పుడు పూర్తిగా తెలుసుకొందాం .గొడుగు ఎప్పుడూ పట్టుకొనే వాడు కనుక ఆపేరు. అసలు పేరు ఎవరికీ తెలీదు .కృష్ణ దేవరాయల వద్ద రాజ లా౦ఛన మైన శ్వేత చ్చత్రం పట్టే బంటు .రాజుకు అంగరక్షకులు,గొడుగుపట్టేవారు ,చామరం వీచేవారు తాంబూల-అడపం భరిణ పట్టుకొనే వారు ‘(కరండ)ఎప్పుడూ ప్రక్కన ఉండేవారు . అడపా వంశం వాళ్ళే అడపా వారయ్యారు .ప్రముఖ అడపా రామకృష్ణా రావు గారిది ఆ వంశమే .

రాజుకు ఆ౦తరింగుకులు చాలామంది ఉండేవారు  వారిలో గొడుగు పాలుడు ఒకడు .,  రాయలు గుర్రం మీదస్వారీ చేస్తుంటే ,వెంట మనిషి మోసేంత బరువున్న తెల్లగొడుగు పట్టుకొని గుర్రం వెంట నడవటం ,అవసరమైతే పరిగెత్తటం గొడుగుపాలుడి ముఖ్యమైన పని .రాయలకు నీడ వంటివాడు .

  రాయలవేసవి విడిది అనంతపురం జిల్లా పెనుగొండ .హంపీ విజయనగరం నుంచి 120 మైళ్ళు .కానీ షార్ట్ కట్ గా హంపీనుంచి ఒక సొరంగమార్గం గుండా వెడితే సుమారు 80మైళ్ళు.ఆ మార్గం ఇప్పటి గజశాల వరకు ఉండేది .తర్వాత పూడిపోయింది .రాయలు ప్రతి త్రయోదశినాడు ప్రదోషకాలం లో విరూపాక్షస్వామిని దర్శించే వాడు .అప్పటికి ఇంకా ఎనిమిది గడియల పొద్దు అంటే దాదాపు మూడుం బావు గంటలు ఉంది .హంపీ వైపు తిరిగి రాయలు ఆలోచిస్తున్నాడు .రాయల మనస్తత్వం బాగా ఆకళింపు చేసుకొన్న గొడుగుపాలుడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు .రాయలు వెనక్కి తిరిగి అతడి వైపు ప్రశ్నార్ధకం గా చూశాడు .సిద్ధంగా ఉన్నాను అన్నట్లు వెంటనే గొడుగు పైకెత్తాడు .మాటా,పలుకూ లేకుండా హంపీ ప్రయాణం క్షణాలలో నిర్ణయమైంది .పంచకల్యాణి గుర్రం జీను కదిలిస్తూ, దౌడుకు సిద్ధంగా ఉంది .రాయలను చూసి సంతోషం తో సకిలించింది .

 ఇంకా ఏడుగడియలె ఉంది .ప్రదోషసమయానికి విరూపాక్ష సన్నిధిలో ఉండాలి రాయలు .రాయలు గుర్రమెక్కి ,ఒక్క సారి కళ్ళెం లాగటం ఆలస్యం ,వాయు వేగ మనో వేగాలతో పరిగెత్తింది .గంటకు 30మైళ్ళ వేగంతో రాజలా౦ఛనమైన శ్వేత చ్ఛత్రం కూడా వెంట ఉండాలి కదా .గొడుగు మీద ఉన్న రాయలకు సాయంకాలపు ఎండ తగలకుండా గొడుగుపాలుడు గొడుగుపట్టుకొని అదే వేగంతో పరిగెత్తుతున్నాడు .రాయల మనసెరిగిన గుర్రం ప్రదోష సమయానికి హంపీ చేర్చకపోతే తన  పరువేం కావాలని ,వేగం విజ్రు౦ భించ గా గొడుగుపాలుడూ దానితో పందెం కాసినట్లు పరుగు తీస్తున్నాడు .గుర్రం కంటే రెండడుగులు ముందే ఉంటున్నాడు .

  హంపీ సమీపించి విరూపాక్షాలయం కనిపిస్తోంది .దేవాలయం గంటలు మోగుతున్నాయ్ .హేమకూట౦  దగ్గరకొచ్చేసరికి గుర్రం దమ్ము అయిపోయి ,ఇక నిలవలేకపోతే ,రాయలు అమాంతం గుర్రం మీదనుంచి కిందికి దూకి ,హేమకూట౦  ప్రక్కనుంచి ,దేవాలయం వైపు నడిచాడు .గొడుగుపాలుడు గుర్రాన్ని భటులకు అప్పగించాడు .అది ఎన్నో సార్లు పొర్లి అలసట తీర్చుకొన్నది .గొడుగుపాలుడు చత్రంతో దేవాలయ ప్రవేశం చేశాడు .చెమట ఏళ్ళయి కారుతున్నా గొడుగు పట్టు వదలలేదు .రాయలు కూడా అలసిపోయాడు .విరూపాక్ష స్వామి దర్శనం చేసుకొని ,గొడుగుపాలుడికి సెలవిచ్చాడు. మర్నాడు ఉదయం వరకు ఇక కొలువు ఉండదు .తర్వాత ఏమి జరిగిందో రేపు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  ప్రపంచ దేశాల సారస్వతం 187-ఆంటిగువా అండ్ బర్బుడా దేశ సాహిత్యం

         ప్రపంచ దేశాల సారస్వతం

187-ఆంటిగువా అండ్ బర్బుడా  దేశ సాహిత్యం

రెండు పెద్ద ,అనేక చిన్న ఐలాండ్ ల సముదాయ దేశమే అట్లాంటిక్ కరేబియన్ సముద్రం కలిసే చోట ఉన్న ఆంటిగువా అండ్ బర్బుడా .రీఫ్ లైన్డ్ బీచెస్ కు ప్రసిద్ధి .రాజధాని సెయింట్ జాన్స్.కరెన్సీ –ఈస్టర్న్ కరీబియన్ డాలర్ .ఆఫ్రికన్లతో సహా అనేక జాతులున్న దేశం .97వేల జనాభా .క్రిస్టియన్ దేశం .ఇంగ్లీష్ అధికారభాష .ఆన్టిగ్వియన్ క్రయోల్ భాష .98.95శాతం అక్షరాస్యత .5-16మధ్యవయసు వారందరికీ కంపల్సరీ విద్య .బ్రిటిష్ విద్యా విధానం .టూరిజం ఆదాయవనరు .చెరకు మామిడి కొబ్బరి  గుమ్మడి ,బనానా బాగా పండుతాయి .నేల్సన్స్ డాక్ యార్డ్ , లాంగ్ ఐలాండ్ ,డికేన్సన్స్ బే చూడదగినవి .సురక్షితం .

ఆంటిగువా అండ్ బర్బుడా  సాహిత్యం –

  జహ్రా ఎయిరాల్ -,రచయిత్రి స్త్రీ హక్కు ఉద్యమ కారిణి .షుగర్ ఆపిల్ దియేటర్ యామానురాలు .చాలా అవార్డు ల గ్రహీత .ది ఫర్గాటెన్ నాటకంరాసింది .ది లుకింగ్ గ్లాస్ వంటి కథలు రాసింది .అన్నే హార్ట్ గిల్బర్ట్-మేమాయిర్సాఫ్ జాన్ గిల్బర్ట్ ,రాసింది .జోయాన్నే సిహిల్హౌస్ –ది బాయ్ ఫ్రం విల్లో బెండ్ ,డాన్సింగ్ నూడ్ మ్యూజికల్ యూత్ , నవలలు,దికరేబియన్ రైటర్ ,పెన్ అమెరికా ,ఎస్సెన్స్ ,రైటర్స్ డైజెస్ట్,హుఫ్ఫింగ్టన్ పోస్ట్ ,కలబాష్ ,కరేబియన్ బీట్ ,మోకో మేగజైన్ వంటి నాన్ ఫిక్షన్ .వాడాలి యూత్ పెన్ అవార్డ్ పొందింది .ఆన్ బికమింగ్ కవితా సంపుటి ,ఓ గాడ్ నవల.lost ఎ కరేబియన్ సి అడ్వెంచర్ కూడా రాసి టెలివిజన్ లోనూ పని చేసింది .మేరీ ఎలీనా జాన్ –ఇంటర్నేషనల్ డబ్లిన్ లిటరరీ అవార్డ్ గ్రహీత .అన్ బర్నబుల్ నవలతో విఖ్యాతురాలైంది .ఎలిజబెత్ హార్ట్ త్వైటీస్-మొదటి ఇద్దరు కరెబియన్ మేదాడిస్ట్ రచయిత్రులలో రెండవ ఆమె .అన్నేహార్ట్ ఈమె అక్క మొదటి ఆమె  .జమైకన్ కిన్ కైడ్-ఎ స్మాల్ ప్లేస్ అనే నాన్ ఫిక్షన్ ,లైఫాండ్ debt అనే డాక్యుమెంటరి చేసింది .అన్నేజాన్ ,లూసీ ,దిఆతోగ్రఫీ ఆఫ్ మై మదర్ ,మిస్టర్ పాట్లర్ ,సి నౌ దెన్ నవలలు అవండో,దిఫినిషింగ్ లైన్ ,క్సుఎలా తోపాటు ఎట్ ది బాటం ఆఫ్ దిరివర్ ,షార్ట్ స్టోరీస్ ,ఏ స్మాల్ ప్లేస్ ,మై బ్రదర్ ,టాక్ స్టోరీస్ ,మై గార్డెన్ బుక్ ,అమాంగ్ ఫ్లవర్స్ వంటి అనేక నాన్ ఫిక్షన్ రచనలు ,అన్నే గ్వెన్ లిల్లీ ,పాం ,టులిప్ కవితలు రాసింది .మోర్టాన్ ,గుగ్గేన్హాం ,లనాన్ ,అమెరికన్ అకాడెమి వంటి అనేక అవార్డులు ,ఆనరారి డాక్టర్ ఆఫ్ హ్యుమేన్ లెటర్స్ తోపాటు డాన్ డేవిడ్,లీలా వాలెస్ రీడర్స్ డైజెస్ట్ ప్రైజ్ లు అందుకొన్న విదుషీమణి .

 మెల్విన్ కాక్స్టన్-జర్నలిస్ట్ .వర్జిన్ ఐలాండ్ క్రైం అనే సిరీస్ రాసి పులిట్జర్ ప్రైజ్ పొందాడు

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శిష్యుడు కాళీ ప్రసాద్ మరణం

శిష్యుడు కాళీ ప్రసాద్ మరణం
సుమారు 55 ఏళ్ళ క్రితం శిష్యుడు ,నాకూ మా కుటుంబానికి అత్యంత విధేయుడు ”మాస్టారూ ”అంటూ నోరారా పిలిచే అమాయక వ్యక్తీ బెజవాడలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేసి రిటైరై , బారేజ్ దాటాక ఉన్న తాడేపల్లి ”మహానాడు ”ప్రాంతం లో స్వంత ఇల్లు కట్టుకొని భార్యా పిల్లలతో పూజా పునస్కారాలతో ఇద్దరబ్బాయిలు ,ఒకకుమార్తే తో అమ్మాయి పెళ్లి బాధ్యతా కూడా తృప్తిగా నిర్వహించి ,తన షష్టి పూర్తికి మమ్మల్ని ఆహ్వానించి నూత్నవస్త్రాలు ఇచ్చిన తర్వాతే కార్యక్రమం ప్రారంభించి ,ఎప్పుడు ఉయ్యూరు వచ్చినా కొడుకులతో ఇంటికి వచ్చిపలకరించి ఆశీస్సులు అందుకొంటూ ,వాళ్లకు కూడా మేము ఆత్మీయులమనే భావన కల్పిస్తూ ,నెలకో రెండు నెలలకో ఒక సారి ఫోన్ చేసి మాట్లాడుతూ తన ఆరోగ్య విశేషాలు తెలియజేస్తూహాయిగా కాలక్షేపం చేస్తూ , ,సరిగ్గా వారం క్రితం కూడా రెండు సార్లు మాట్లాడిన ప్రియ శిష్యుడు ”వంగవీటి శ్రీరామకాళీ వరప్రసాద్”(73) ,మూడు రోజులక్రితం అకస్మాత్తుగా మెదడు నరాల ఇబ్బందితో మణిపాల్ హాస్పిటల్ లో చేరి ,వాళ్ళ పెద్దబ్బాయి ప్రతి పూటా తండ్రి ఆరోగ్య విషయాలు చెబుతూ ,నిన్న ఉదయం ”మాస్టారూ !నాన్న గారి అవయవాలు అన్నీ పని చేయటం లేదు కోమాలో ఉన్నారు”మన సువర్చలాన్జనేయస్వామి అంటే నాన్న గారికి విపరీతమైన నమ్మకం దయుంచి ఆయన పేరిట స్వామికి పూజ చేయించండి ”అని ఏడుస్తూ చెబితే, ”కంగారు వద్దు అమ్మగారికి ధైర్యం చెప్పు ”అని ఓదార్చి , వెంటనే పూజారికి ఫోన్ చేసి అప్పటినుంచే రెండు పూటలా అతడి గోత్రనామాలతో పూజ చేయమని చెప్పి నిన్న సాయంత్రం నేనే ఫోన్ చేసి తెలుసుకోగా ,ఇవాళ ఉదయం కొడుకు ఫోన్ చేసి ”ఉదయం 9-30కు నాన్నగారు వెళ్ళిపోయారు మాస్టారూ మీ కళ్ళముందు మసలిన వ్యక్తీ మాకు దూరమయ్యారు ”అని దుఖం తో చెప్పాడు ధైర్యంగా ఉండమని ఓదార్చాను అంతకంటే ప్రస్తుత పరిస్థితులలో ఏమీ చెయ్యలేక .” కాళీ ”అని మేమందరం పిలిచే కాళీ ప్రసాద్ అత్య౦త వినయ సంపన్నుడు .మా ఇంట్లో ఒకడుగా ఉండేవాడు .ఉయ్యూరులో పాలపర్తి వెంకటరామయ్య గారి మేనల్లుడే కాళీ ప్రసాద్ .చాలా బాధ్యతగా సంసారం నిర్వహించాడు తండ్రి మరణించాక . అన్నగారి కుటుంబాన్నీ ఆదుకొన్నాడు .అతని కజిన్ రాజాకామేశ్వరి కూడా నా శిష్యురాలే .
కాళీ ప్రసాద్ ఆత్మకు శాంతి ప్రసాదించమని భగవంతుని కోరుతూ ,అతని కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను-దుర్గాప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 185-ది బహమస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

  • 185-ది బహమస్ దేశ సాహిత్యం
  • ది బహమస్ దేశాన్ని ది కామన్ వెల్త్ ఆఫ్ ది బహమస్ అ౦టారు .లుకేయన్ ఆర్చిపెలాగో లో ఉంటుంది .కరేబియన్ లో లుకేయన్ ఆర్చి పెలాగోలో 97శాతం భూభాగం ,అర్చిపెలాగో జనాభాలో 80శాతం జనం ఉన్న దేశం .రాజధాని –నసావు .భాష బహామయన్ క్రయోల్ .కరీన్సీ –బహామియన్ డాలర్ .ప్రొటెస్టెంట్ మతం ఎక్కువగా మిగిలిన క్రిస్టియన్ మతాలూ ఉన్నాయి .అధికారభాష –ఇంగ్లీష్ .99శాతం అక్షరాస్యత .5-18వయసు వారందరికీ కంపల్సరీ విద్య.వ్యవసాయం ,సిమెంట్ ముఖ్య ఆదాయవనరులు .ఉల్లి ,ఆక్రా, టమాటా బాగా పండిస్తారు .అట్లాంటిస్ కాసినో ,పారడైజ్ ఐలాండ్ ,హార్బర్ ఐలాండ్ చూడ తగినవి .రేప్ ల భయం ఉన్నా యాత్రకు రక్షణ ఉంటుంది .

ది బహమస్ సాహిత్యం –  Islanders in the Stream: A History of the Bahamian People: Volume One: From Aboriginal Times to the End of Slavery”  పుస్తకాన్ని 1992లో ముద్రించారు.రచయితలు  మైకేల్ క్రేటన్,గైల్ సాండర్స్ .ఆదేశ ప్రజల సమస్త విషయాలు ఉన్నాయి .ఇదే మొదటి పుస్తకం .ఆఫ్రో-బహామియన్ జానపద సాహిత్యం 18వ శతాబ్దం వరకు పర౦పరగా వచ్చిన కథలు గాథలు పాటలు ఉంటాయి. ముఖ్యంగా బి రాబీ ,బీ బౌకీ ,బి స్పైడర్ బి ఎలిఫెంట్  లపై ఉన్నాయి .మౌఖికంగా మాత్రమె ఉన్న వాటిని  19వశతాబ్దిలో పాట్రీషియా గ్లింటన్మికోలాస్ అనే ఆయన An Evening In Guanima: A Treasury of Folktales from the Bahamas”.[ 

గా ప్రచురించి మహోపకారం చేశాడు .

అయిదుగురు ప్రముఖ రచయితలు-నటాషా రూఫిన్ – సన్ ఫ్లవర్స్ ఫీల్డ్స్ కవితా సంపుటి ప్రచురించిన యువ కవయిత్రి .ఈమె హెచ్ ఐ వి యాక్టి విస్ట్ కూడా .ఇందులో మరణం ,శోకం ,తన విషయాలు ఉంటాయి .

టోనీ ఎస్ వాంగ్ –ఎలెక్ట్రానిక్స్ చెందిన యితడు రచయిత,కవికూడా .మిస్టర్ మైఖేల్ జాక్సన్ ,టోనీస్  బాగల్డ్ వ్యూ,రాఖేల్ రే,రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ,లాంగ్వేజ్ సుపీరియర్ కంఫుట్(ఎ గ్లోబల్ లాంగ్వేజ్ )ఎలెక్ట్రికల్ ఎలెక్ట్రానిక్ వైబ్రేషన్స్ సిమ్ప్లి బీమ్స్ ఫైడ్. రాశాడు .

షాన్ టి గార్డినర్-ఫ్రీలాన్స్ రైటర్ .’’ది లైఫ్ స్టార్ ‘’ఫాంటసి నవల రాశాడు .

ఫే  లోవేల్స్ –నవలలు కథలు రాసింది .దిలేడీ మాగజైన్,ది బ్రాడ్కిల్ రివ్యు లలో   కలు రాసింది . బ్లార్ కూడా .రొమాంటిక్ నవలు రాసింది .సన్ బీమ్స్ ఫ్రం ది హార్ట్  వంటివి ప్రసిద్ధమైనవి .

అలిసన్ అల్బురి –లైఫ్ ఆన్ ఎ రాక్ నవలతో పేరుపొందింది  .

186- బెలిజే దేశ సాహిత్యం

మధ్య అమెరికా తూర్పున కరేబియన్ సముద్ర తీరాన బెలిజే దేశం ఉంది .తూర్పు పడమరలో దట్టమైన  అరణ్యాలుంటాయి .వందలాది లోతట్టు ఐలాండ్స్ ఉంటాయి .సముద్ర సంపద పుష్కలం .టవరింగ్ పిరమిడ్ కు ప్రసిద్ధి .రాజధాని –బెల్మోఫోన్.కరెన్సీ –బెలిజేన్ డాలర్ .3.8లక్షల జనాభా .క్రిస్టియన్ దేశం .ఇంగ్లిష్ అధికార భాష .బెలిజేన్ క్రయోల్ భాషాజనం ఉన్నారు .ప్రీ స్కూల్ ,ప్రైమరీ ,సెకండరి ,టేరిటరి,హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ .అక్షరాస్యత -70శాతం .వ్యవసాయం ముఖ్య ఆదాయం –చెరకు బనానా పంట ఎక్కువ టూరిజం కూడా ఆదాయమే .గ్రేట్ బ్లూ హోల్ ,కేయే కాకర్ ,బెలిజే బారియర్ రీఫ్ ,తవరింగ్ పిరమిడ్స్ .సుఖవంతమైన ప్రయాణం .

బెలిజే సాహిత్యం –బెలేజియన్ సాహిత్యం –జీ ఎద్జేల్ ,గ్లెన్ గాడ్ ఫ్రే ,ఫెలిషియా హీర్మాండే వగైరా మంచి రచయితలున్నారు .జీ ఎడ్జేల్-బెకా లాంబ్ నవల రాసింది .జాతీయ ఉద్యమవివరాలు ఇందులో ఉన్నాయి .ఫెస్టివల్స్ ఆఫ్ సాన్ జాక్విలిన్ ,,టైంఅండ్ దిరివర్ రాసింది .గ్లెన్ గాడ్ ఫ్రే-ఆ దేశ సంస్కృతిపై రచనలు చేశాడు ..దిసిన్నర్ బసనోవా ,నవల మంచి పేరు తెచ్చింది .ఫెలీషియా హీర్మా౦ డెజ్ –ఆ దేశ మహిళల గురించి రాసింది .ఐ డోంట్ నో యు బట్ ఐ లవ్ యు నవల ,,దోజ్ రెడిక్యులర్ యియర్స్ నరెంగా ,రిఫ్లెక్షన్స్ వంటి  ఫామిలీ స్టోరీస్   కథసంపుటి ప్రచురించింది ,జార్జ్ సేమూర్ గబా –ది స్లీపింగ్ జాయింట్ చిత్రం గీశాడు .ఎల్లో టైల్ నాటకం ,ది  నేకేడ్ ఐ కవితా సంపుటి రాసి అనేక ప్రైజులు పొందాడు .జేమ్స్ సల్లివాన్ మార్టినేజ్ –కరేబియన్ జన్గిల్స్ అనే అద్భుత కవితా సంపుటిప్రచురించాడు .జాన్ అలేక్జాండర్ వాట్లర్ –కవిత్వం కథలురాసిన జానపద గాయకుడు .క్రై అమాంగ్ రైన్ క్లౌడ్స్ ,బాస్ ఆఫ్ డాన్గ్రిగా రాసి ప్రచురించాడు

లియో బ్రాడ్లీ –చరిత్రకారుడైనకవి .లుకింగ్ ఎట్ అవర్ లిటరేచర్ ,అమాంగ్ మై సావనీర్స్ ,బెలిజెయన్ ఫ్లేవర్ రాశాడు .రేమాండ్ బారో –డాన్ఈజ్ ఎ ఫి షర్ మాన్ అనే ప్రముఖ కవిత రాశాడు జోయిలా ఎలిస్ బ్రూనే –హీరోస్ ,లిజార్డ్స్ అండ్ పాషన్స్, కదా సంపుటులు రాసిన లాయర్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -10

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -10

    హంపీశిథిలాల లో  రాతి తొట్ల కథా కమామీషు

విజయనగర రాజులకాలం లో సైన్యం లో గజ దళాలు పదాతి దళాలే ఎక్కువగా ఉండేవి .కృష్ణ దేవ రాయలకాలం లో బహమనీ సుల్తానులకు అశ్విక బలం ఎక్కువగా ఉండటం వలన యుద్ధాలు తేలిగ్గా గెలిచే వారు .ఈ రహస్యం గుర్తించిన రాయలు పశ్చిమ సముద్రతీర గోవాను పట్టుకొని ,విదేశాలనుంచి మంచి జాతి గుర్రాలను దిగుతి చేసుకొని ఆశ్వికదళం పెంచాడు గుర్రప్పిల్లలూ దిగుమతి అయ్యేవి .వాటికి పాలు తాపించటానికి రెండడుగుల ఎత్తు రెండడుగుల వెడల్పు సుమారు పది అడుగులపోడవు ఉండే రాతి తొట్టెలను  చెక్కించాడు  .ఇ ప్పుడున్న ముక్కలు అవే .అందులో ఒకటే భద్రంగా ఉంది .పురాతత్వ శాఖ వారు  హజార రామాలయం దగ్గర భద్రపరచారు .

  ఆంధ్రప్రభ  ఎడిటర్ నార్ల ఫతేపూర్ సిక్రీ హంపీలు  వెళ్లి చూసొచ్చి రామ చంద్ర గారితో ‘’ఫతేపూర్ శిక్రి ఇంప్రెస్ చేనట్లు నన్ను హంపీ ఇంప్రెస్ చేయలేదు ‘’అన్నాడట.బాగా కష్టం కలిగిన రామచంద్ర ‘’దానికీ దీనికీ పోలికేమిటి?అది చెక్కు చెదరకుండా ఉంది .అక్కడి ప్రజలు సహృదయులుకనుక పరరాజుల దండయాత్రలు లేవు .ఒకరాజు శత్రువులను జయి౦చాక  తనకోరిక తీరింది కనుక ఆ ప్రాంత ప్రజల్ని, కట్టడాలను ,కళాఖండాలను తనవే అనే భావనతో సంరక్షించటం సంప్రదాయం .కానీ ఇక్కడ బహమనీ సుల్తానులకు వియనగరం అనే హడలు భయం జాస్తి .జనం మళ్ళీ ఎడురుతిరుగుతారనే భయం ,అనుమానం తో విజయ నగరాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్రజల్ని చావగొట్టారు .’’పాడు పట్నం ‘’చేసేశారు .కొన్నిమాత్రమే ఆ దాడి నుంచి బయట పడ్డాయి .జపాపా ఎంక్లోజర్ లోని గజశాల ,కమలాపురం పొలిమేరల్లోని లోటస్ మహల్ ,ఉగ్ర నరసింహ ,హజార రామాలయం ,హేమకూట వినాయక విగ్రహాలు ,విఠలస్వామి గుడి ,అప్పటి వాస్తు శిల్పకళా వైభవానికి తార్కాణలుగా మిగిలిలాయి చాలదా ?’’అని క్లాస్ పీకారు .

  వేదాలకు వ్యాఖ్యలురాసిన విద్యానగరం విజయనగరం .తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమైన సరస్వతీ పీఠంకదా .అష్ట దిగ్గజకవుల ,వేదవేదాంగ పారంగతుల ,వైద్య వతంసుల ,రాజనీతి కోవిదుల గ్రంథాలయాలు ఏ మయ్యాయి ?శత్రురాజుల క్రోధాగ్నికి ఆహుతయ్యాయి .మానవల్లి రామకృష్ణ కవి గారు తరచుగా తిరుమలవారితో ‘’విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ,అక్కడి పండితులంతా అనంతపురం, కడప జిల్లాలకు కాంది శీకులై వచ్చారయ్యా .మీ అనంతపురం జిల్లాలో తాడిమర్రి  చిగుళ్ళ రేవు, దంపెట్ట,దాడికోట కొండాపురం, కుంటిమద్ది,పెనుకొండ ,మర్రిమాకులపల్లి మొదలైన ప్రాంతాలను బాగా గాలిస్తే అపూర్వ శాస్త్ర గ్రంథాలు దొరుకు తాయయ్యా ‘’అనే వారట .ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త రంగస్వామి సరస్వతి కూడా ఈమాటలే అనేవారని రామచంద్ర జ్ఞాపకం చేసుకొన్నారు .ఏమైతేనేం ?అంతాపాడుపడి పోయింది .గుర్రాలు కూలిపోయాయ్.గుర్రప్పిల్లలు పాలుతాగేతొట్లు విరిగి పోయాయి అని నిర్వేదం చెందారు రామచంద్ర ..

‘’అశ్వా యస్య జయస్తస్య –యశ్వాస్వా స్తస్య మేదినీ-ఆశ్వాయస్య యశస్తస్య –యశ్వాస్వాః తస్య కాంచనం ‘’

భావం –గుర్రాలున్నవాడిదే విజయం .గుర్రాలున్నవాడిదే భూమి .గుర్రాలున్న వాడిదే కీర్తి .గుర్రాలున్నవాడిదే బంగారం .

  సశేషం

వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 183-గుడెలోప్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం

183-గుడెలోప్ దేశ సాహిత్యం

  • ఫ్రెంచ్ ఓవర్ సీస్ దేశమైన గుడెలోప్ దక్షిణ కరోబియన్ లో ఉంది .దీన్నిలోని రెండు పెద్ద ఐలాండులు సాలీ రివర్ చేత విభజింప బడినాయి .లాంగ్ బీచెస్ కు ,చెరుకు  పొలాలకు ప్రసిద్ధి .వాటర్ ఫాల్స్ ఆకర్షణ .రాజధాని బస్సీ టెర్రె –కరెన్సీ –యూరో .జనాభా4లక్షలు .రోమన్ కేధలిక్ మతం .ఫ్రెంచ్ భాష .గుడేలోపియన్ కరోల్ భాషాజనమూ ఉన్నారు .96.5శాతం అక్షరాస్యత .ఫ్రెంచ్ విద్యా విధానం .చెరకు అరటి ఉత్పత్తులే ఆదాయ వనరులు .ఫిషింగ్ కూడా ఆదాయమే .ఎల్లేస్ డెస్ సైన్టీస్ ,లాగ్రాండే సోఫేరీ ,గుడేలోప్ జలపాతం నేషనల్ పార్క్ చూడదగినవి .ఆంక్షలున్నాయి .
  • గుడెలోప్ సాహిత్యం –మేరియాసే కొండేఅనే నల్లజాతి కవయిత్రి 2018లో న్యు ఎకాడేమి అవార్డ్ పొందింది ఇది నోబెల్ ప్రైజ్ కు ప్రత్యామ్నాయంగా 2017లో స్వీడెన్ దేశం స్టాక్ హోం లో ఏర్పాటు చేయబడింది .1960లో సెయింట్ జాన్ పెర్సే గా ప్రసిద్ధి చెందిన అలెక్స్ లేగర్ కవికి నోబెల్ ప్రైజ్ దక్కింది .అతడు గౌరవనీయమైన వైట్ క్రియోల్  ‘’బెకేస్’’కులానికి చెందినవాడు .ఇప్పుడు ఈమెకు అంతటి గౌరవంఆమెరాసిన ‘’విండ్ వార్డ్ హైట్స్’’కు  లభించింది .ఎంత తేడా ఉందొ ఆశ్చర్యమేస్తుంది .
  • డానీ బేబెల్ గిస్లార్ –సోషియాలజిస్ట్ ,ఎత్నాలజిస్ట్ లింగ్విస్ట్ ,రచయిత్రి .సం ప్రిన్సిపిల్స్ ఫర్ రైటింగ్ ఇన్ క్రియోల్ ,దిక్రియోల్ లాంగ్వేజ్ ఫోర్సేడ్ సప్రేషన్ రాసింది .యునెస్కో లో ‘’స్లేవ్ రూట్ ప్రాజెక్ట్ ‘’తో అనుబంధం ఉంది .-నవలా రచయిత .రచనలు – Sapotille et le Serein d’argile (1960), Cajou (1961) and Demain Jab-Herma (1967).
  • మానికం జాక్వేలిన్ –మిడ్వైఫ్.అబార్షను చట్టబద్ధం చేయటానికి ఉద్యమించింది .మై ఎక్సామ్స్ ఇన్ వైట్ నెస్,దిసీడ్,నవలలు దిడైరీ ఆఫ్ ఎ మిడ్వైఫ్ అనే స్వీయ చరిత్ర రాసింది .
  • సిమోన్ స్క్వేవార్జ్ బార్ట్-నాటకాలు నవలలు రాసింది.బిట్వీన్ టు వరల్డ్స్ దిబ్రిడ్జ్ ఆఫ్ బియాండ్ ,విత్ ఆండ్రీ స్క్వువార్జ్ బార్ట్ నవలు ,యువర్ హాండ్సం  కెప్టెన్ అనే దియేటర్ ప్లే ,ఇన్ ప్రైజ్ ఆఫ్ బ్లాక్ వుమెన్ అనే నాన్ ఫిక్షన్ రాసింది .గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ ను ,భర్తతో కలిసి ,ప్రిక్స్ కార్బెట్ అవార్డ్ పొందింది .
  • కొండే మార్సీ –నవల విమర్శ నాటకం రాసింది ఆమె రాసిన ‘’సేగౌ ‘’నవల బానిసత్వం ,కాలనీ దౌష్ట్యం ను కళ్ళకు కట్టించింది .గుగ్గెన్ హీం ఫెలోషిప్ ,బుకర్ ప్రైజ్ పొందింది .
  • 184-మార్టినిక్ దేశ సాహిత్యం
  • ఉత్తర అమెరికాలో మార్టినిక్ దేశం కరెబియన్ ఐలాండ్ .ఫ్రెంచ్ –వెస్ట్ ఇండియన్ మిశ్రమ సంస్కృతి ఉన్న దేశం.నెపోలియన్ మొదటిభార్య జోసేఫిన్ శిలావిగ్రహం ఇక్కడ ఉండటం ప్రత్యేకత .రాజధాని –ఫోర్ట్ డీ ఫ్రాన్స్ . కరెన్సీ –యూరో .జనాభా -3.76లక్షలు .రోమన్ కేధలిక్ మతం .అధికార భాష ఫ్రెంచ్ .ఆ౦టేలియన్ క్రియోల్ ,మారిటినిషియన్ క్రియోల్ భాషా జనం ఉన్నారు .93శాతం అక్షరాస్యత .ఫ్రెంచ్ విద్యా విధానం .మౌంట్ పీలీ ,జార్డిన్ డీ బలాటా,హాబి టేషన్ క్లెమెంట్  దర్శనీయాలు .సేఫ్ దేశం .
  • మార్టినిక్ సాహిత్యం –ఘనమైన కరేబియన్ సాహిత్యానికి ఈ దేశ సాహిత్యం చిహ్నం .ప్రేరణాత్మక రచయితలెందరో జన్మించిన దేశం .ఇంటలెక్ట్యువల్ కంట్రీ గా పేరు పొందింది .లఫ్కోడియో హీరెన్-కవి ,డిప్లోమాట్ .ఆండ్రే బ్రిటన్-సర్రియలిస్ట్ కవి .ఫ్రెంచ్ సాహిత్యాన్ని ఉత్తేజపరచిన రచయితలూ ఎందరో ఇక్కడ పుట్టారు .క్లేర్జిమన్ జీన్ బాప్టిస్ట్ లబట్ ఈ దేశ సౌభాగ్యాన్ని ముందు దర్శించాడు .పారిస్ లోపుట్టి ఇక్కడ ఉండి’’న్యుఎజ్ వాయెజ్ ఆక్స్ ‘’రాశాడు ఇది కాలనీ చరిత్రపై అభిరుచి ఉన్నవారికి బైబిల్ వంటిది .రెనే మరాన్  – వెస్ట్ ఇండీస్ లో పుట్టి ‘’బాతౌలా’’ నవలరాసి’’కాన్ కోర్ట్ ప్రైజ్ ‘’పొందాడు .ఆఫ్రికన్ బ్లాక్ ల అస్తిత్వానికి పునాది అయింది .యైమే సెసారే –కవిత్వం ‘’రిటర్న్ టు మై నేటివ్ లాండ్ ‘’-1993 ను క్లాసిక్ అంటారు .లేపోల్డ్ సెడార్ సేన్ఘార్ ‘’కేహిర్ డన్ రిటోర్ అ పస నటార్’’కవితతో ‘’పోయేట్ ఆఫ్ నేగ్రెట్యూడ్’’అన్నారు .చాలాకవితలు నాటకాలు రాశాడు .’’డిస్కోర్స్ ఆఫ్ కాలనైజేషన్’’అనే ప్రఖ్యాత గ్రంథం రాశాడు .ఎడౌర్డ్ గ్లిస్సార్డ్ రాసిన ‘’లా లిజార్డే ‘’కు రెనౌ డాట్ ప్రైజ్ 1958లో వచ్చింది .ఇతని నవలలు ఆఫ్రో-కరేబియన్ వారసత్వం పై రాసినవే .పాట్రిక్ చమసౌరచన  ‘’ఎలిజి టు క్రియోల్టి’’లో క్రియోల్ సాంస్కృతిక వారసత్వం ను విశ్లేషించాడు .దీన్ని జీన్ బెర్నేబ్ ,రాఫెల్ కన్ఫిఎంట్ లతో కలిసిరాశాడు .రాఫెల్ కంకౌర్ట్
  • ప్రైజ్ విన్నర్ కూడా .
  •    సశేషం
  •  వరలక్ష్మీ వ్రతం శుభా కాంక్షలతో
  • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం 31-7-20శుక్రవారం

మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం 31-7-20శుక్రవారం

 

 

https://photos.google.com/share/AF1QipP7C7viA45yeDtg9dIOHivn1FlVwC6tQIZKLKQZjz0LbqirOGDuKyyXbM4BB6ijAg/photo/AF1QipMt2QKfBiPcvBwPwqMNtqnE9tUjUUKMh_AqRoby?key=OW1EQ3JuWnE5cHFfT2g2SnBFUmc5S3l3aTFPRlJR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మూలకారణ శక్తి వేదవతి

మూలకారణ శక్తి వేదవతి

కృశధ్వజుడు అనే ముని భార్య మాలావతి .ఆయన ఒక రోజు  వేదం చదువుతుంటే పుట్టిన కుమార్తె వేదవతి.పుట్టినప్పుడు పురిటి గదిలో వేదం ధ్వని వినిపించింది కనుక వేదవతి అని పేరు పెట్టారు .ఆమెను విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేయాలని  తండ్రి అందరికీ చెప్పేవాడు ఒక రాక్షసుడు ఈమెను మోహించాడు పెళ్లి చేసుకొంటానని మునిని అడిగితె ఆయన తిరస్కరించాడు .కోపం వచ్చి ఆయన్ను చంపాడు దైత్యుడు .ముని పత్ని దుఖాన్ని భరించలేక వేదవతిని ఒంటరిదాన్ని చేసి మరణించింది .తల్లిదండ్రులిద్దర్నీ పోగొట్టుకొన్న ఆమె తపస్సు చేయాలని నిశ్చయించుకొని తీవ్ర తపం చేస్తుండగా , మహాభుజములు గల రావణుడు భూమి మీద సంచరిస్తూ  హిమవత్పర్వత ప్రాంతారణ్యానికి  వెళ్ళి అక్కడ దేవతాకన్యవలె ప్రకాశిస్తున్న  ఒక కన్యకను  చూశాడు . ఆమె వేదప్రోక్తములైన నియమాలు  పాటిస్తూ ,, కృష్ణాజినమును, జటలను ధరించి ఉంది . ఆ రావణుడు గొప్ప నియమమును అవలంబించి ఉన్న మంచి సౌందర్యముగల, ఆ కన్యను చూడగానే కామమోహములతో నిండిన మనస్సుతో నవ్వుతూ ”మంగళప్రదులారా! ఏమిటి? నీవు నీ యౌవనమునకు విరుద్ధముగా ప్రవర్తిస్తు న్నావు   ? నీ ఈ సౌందర్యమునకు విరుద్ధముగా ఇట్టి ప్రవర్తన యుక్తము కాదు కదా! సాటిలేని నీ రూపము పురుషులకు కామోన్మాదమును కలిగించునది. తపస్సు చేయుటకు తగినది కాదు. ఇది లోకప్రసిద్ధమైన నిర్ణయము కదా ఓ! భద్రులారా! నీవు ఎవరిదానవు. నీ భర్త ఎవరు? నిన్ను అనుభవించు పురుషుడు
లోకములో పుణ్యాత్ముడు. నీవీ తపస్సు ఎందుకు చేస్తున్నావు .  నాకు అంతా చెప్పు” అని అడిగాడు .

తపోధనురాలైన ఆ కన్య రావణుని మాటలు విని, వానికి యథాశాస్త్రముగా ఆతిథ్యమిచ్చి- ”గొప్ప తేజస్సు కలవాడు, శోభావంతుడు అయిన కుశధ్వజుడనే బ్రహ్మర్షి నా తండ్రి. నిత్యమూ వేదాభ్యాసము చేయు ఆ మహాత్మునకు వేదవాజ్ఞ్మయ స్వరూపిణినైన నేను కన్యగా పుట్టాను. నా పేరు వేదవతి. అప్పుడు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు నా తండ్రి దగ్గరకు వచ్చి తమకు నన్ను ఇమ్మని అడిగారు. నా తండ్రి నన్ను వాళ్ళకి ఇవ్వలేదు. అందుకు కారణము  చెప్తా విను . దేవతల ప్రభువు, మూడులోకాలకు అధిపతి అయిన విష్ణువు తన అల్లుడు కావలెనని నా తండ్రికి కోరిక ఉండేది . అందుచే ఆయన  నన్ను మరెవ్వరికీ ఇవ్వటానికి  అంగీకరించలేదు. శంభువు అనే దైత్యరాజు ఇందుకు కోపించాడు

ఆ పాపాత్ముడు నా తండ్రిని రాత్రి నిద్రించుచుండగా చంపివేశాడు .  మహాభాగ్యవంతురాలైన నా తల్లి దీనురాలై నా తండ్రి శరీరమును కౌగిలించుకొని అగ్నిలో ప్రవేశించి౦ది . నారాయణుణ్ణి గురించి మా తండ్రికి ఉన్న మనోరథమును సత్యమైన దానిని  చేయాలని  నిశ్చయించుకుని నేను ఆ నారాయణుడినే హృదయములో నిలుపుకుని ఉన్నాను. ఈ విధముగా ప్రతిజ్ఞ చేసి గొప్ప తపస్సు  చేస్తున్నాను . ఈ విషయమంతా నీకు చెప్పాను. నాకు నారాయణుడే భర్త. అతడు తప్ప మరొక్కడెవ్వడూ కాదు. ఆ నారాయణుణ్ణి పొందాలనుకొనే కోరికచేతనే భయంకరమైన నియమమును అవలంబించి ఉన్నాను. రావణా!   నీ గురించి నాకు  అంతాతెలుసు  . ఇంక వెళ్ళు. మూడులోకములలో ఉన్నది అంతా నాకు తపోబల౦ చేత  తెలుస్తుంది ” అని  చెప్పింది .

  . మన్మథశరీరములచేత పీడింబడిన రావణుడు విమానాగ్రభాగము నుండి దిగి, గొప్ప తపస్సు  చేస్తున్న  ఆ కన్యతోమళ్ళీ – ”ఓ! సుశ్రోణీ! ఇట్టి ఆలోచన గల నీవు గర్వముతో ఉన్నావు. ఈ విధముగా తపస్సు చేయటం ముసలివాళ్ళకు మాత్రమే తగిన పని. సమస్తసద్గుణములు ఉన్నదానివి . మూడు లోకములలో సుందరివి అయిన నువ్వు ఇలా పలకటం తగదు  . నీ యౌవనము దాటిపోతోంది. ఓ! మంగళప్రదురాలా! నేను లంకాధిపతిని. దశగ్రీవుడు అని ప్రసిద్ధిచెందిన వాడిని . అలాంటి  నాకు భార్యవై నీవు సుఖ౦ గా భోగాలు  అనుభవించు .. నీ విష్ణువు  ఎంతటివాడు! నీవు కోరుతున్న విష్ణువు వీర్యము చేతగాని, తపస్సు చేతగాని, భోగము చేతగానీ, బలముచేత గానీ నాతో సమానుడు కాదు” అన్నాడు .

 వాడి మాటలు విని వేదవతి ”అలా అనకు . అట్లానకుము”అని మళ్ళీ  – ”రాక్షసరాజా! నీవు తప్ప బుద్ధిమంతుడైన మరెవ్వడైనా మూడులోకముల అధిపతీ, సర్వలోకములచేత నమస్కరింపబడువాడూ అయిన విష్ణువును అవమానిస్తాడా ?” అన్నది. ఆ వేదవతి ఇలా అంటూండగా  రావణుడు  చేతి చివరలతో  ఆమె శిరోజాలను పట్టుకొన్నాడు. అప్పుడు వేదవతి కోపింఛి తనకత్తిలాంటి  చేతులతో  కేశాలను  ఛేధించింది . . రోషముతో మండు తోందా అన్నట్లున్న ఆమె రావణుణ్ణి కాల్చివేస్తోందా అన్నట్లుగా  చూస్తూ యోగాగ్నిని  ఏర్పరుచుకుని, మరణించేందుకు తొందరపడుచూ రావణునితో “దుష్ట రాక్షసుడా! నీ నుండి అవమానము పొందిన పిమ్మట ఈ మలిన దేహంతో  నేను జీవించటానికి ఇష్టపడను  . నీవు  చూస్తుండగానే  అగ్నిలో ప్రవేశిస్తా . పాపాత్ముడైననువ్వు  నన్ను వనములో అవమానించావు. అందువలన నిన్ను హతమార్చడానికి నేను మళ్ళీ జన్మిస్తాను. పాపనిశ్చయము గల పురుషుణ్ని స్త్రీ చంపజాలదు కదా? నీకు శాపమిస్తే  నా తపస్సు వ్యయమై పోతుంది . నేను ఏదైనా మంచిపనికాని, దానముకాని, హోమము కానీ చేసి  ఉంటె ,త్రికరణ శుద్ధిగా మహా విష్ణువునే ప్రేమిస్తూ ఉంటె  దానికి ఫలితముగా  వచ్చే జన్మలో అయోనిజమైన కుమార్తె గా  ఒక ధర్మాత్ముడికి , పతివ్రతగా పుట్టి నిన్నూ ,నీ వంశాన్నీ సర్వ నాశనం చేస్తాను ” అని పలికి ప్రజ్వలిస్తున్న  యోగాగ్ని లో  ప్రవేశింఛి  దగ్ధమైంది వేదవతి . అపుడు  దివ్యమైన పుష్పవృష్టి కురిసింది ..

పద్మ౦  వంటి కాంతిగల ఆమె మరల పద్మ౦లో లంకలో జన్మిచింది . మొదట రావణుడికే కనిపించింది  .మళ్ళీ  . పద్మమధ్యభాగము వంటి కాంతిగల ఆ కన్యను గ్రహించి ఆ రావణుడు తన ఇంటికి  తీసుకు వెళ్ళాడు .  మంత్రికి చూపించాడు . సాముద్రికా లక్షణములు తెలిసిన మంత్రి ,జ్యోతిష్యులు ఆ శిశువును చూడగానే రావణునితో ”ఈమె నీ  చావు  కోసమే  నీ గృహ౦  చేరి౦ది” అని చెప్పారు . ఆ మాట విని రావణుడు  చేసేది ఆశిశువును   ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రం లో విసిరేయించాడు  .ఆపెట్టే క్రమంగా మిధిలానగరం చేరి భూమిలో నిక్షిప్తమైంది .జనకమహారాజు పుత్రేస్టి  కోసం నాగలి దున్నుతుంటే ,ఆపెట్టే నాగలి చాలుకు తగిలితే, బయటికి తీయి౦చ గా  అందులో రూపవతి ఐన కన్య కనిపిస్తే ,ఆమెకు నాగేటి చాలులో దొరికి నందున ‘’సీత ‘’అని పేరు పెట్టి కూతురుగా గాగారాబంగా  పెంచుకొన్నాడు .కనుక సీత అయోనిజ .రావణ సంహారం కోసం ఇలా ఉద్భవించింది . కృతయుగ౦లొ  వేదవతి అనే  పేరుతో ఉన్న ఈమె త్రేతాయుగ౦ లో   రావణు సంహారానికి  మహాత్ముడైన జనకుని కి నాగేటి చాలులో దొరికి  సీత పేరుతొ పిలువబడి అల్లారు ముద్దుగా పెరిగింది తరువాత జరిగిన రామాయణ  కథ అంతా మనకు  తెలిసిందే .

కనుక మూల కారణ శక్తి  లక్ష్మీ దేవి అవతారమే  వేదవతి అనే సీతా దేవి .మహాపతివ్రత .

 ‘’అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా

పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్.’’

వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -9

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -9

  తెనాలి రామ కృష్ణ మండపం

హంపీశిదథిలాలలో భువనవిజయ మంటపానికి ఎదురుగా అరమైలు దూరం లో ఒకగు ట్టమీద నాలుగు స్తంభాల మంటపం ఒకటి ఉంది .దీన్నే తెనాలి రామలింగని మండపం లేక తెనాలి రామ మంటపం అంటారు .దీనికి రాజంతః పుర రహస్య కథ ఒకటి ఉంది .ఆరహస్యం గుప్పుమనటానికి కొంటె కోణంగి రామలింగడు ఆ మంటపం  లో చేరాడు .ఆకాలం లో ఉత్తరభారతం లో బీర్బల్ ,దక్షిణాన తెనాలి రామలింగడుహాస్య చక్రవర్తులు  .ఆస్థాన విద్వాంసుడు కాకముందు పెద్దనగారి వెంట తాతాచార్యుల వెంట రాయలకోలువుకు వెళ్ళేవాడు .రాయల చెవిలో పడేట్లు హాస్యోక్తులు అనటం ఆనవాయితీ .అతడికని  .ఓర చూపు తో రాయలు మెచ్చేవాడు .

 ఒకసారి రాయలు చిన్నా దేవితో ముచ్చటిస్తూ ముద్దుపెట్టుకోటానికిముందుకు వంగాడు .ఆవిడ ‘’చిచ్చిచ్చిచ్చో ‘’అంటూ పెద్దగా తుమ్మింది. రసాభాస అయినందుకు మనసు బాధ పడి రాయలు వెళ్ళిపోయాడు .తుమ్ము దగ్గు మొదలైన వాటిని ఆయుర్వేదం లో ‘’వేగాలు ‘’అంటారు .వాటిని ఆపలేం బలవంతంగా ఆపితే వ్యాధులొస్తాయి .పాపం రాణీ గారు ఆపుకోలేక తుమ్మేసింది. వేగ నిరోధం ఆమె తరం కాలేదు .ఈ రహస్యాన్ని పొక్కనివ్వద్దని దాసీలను ఆదేశించింది రాణి .దాసీల నోట్లో నువ్వు గింజ నానదు అనే సామెత ఉంది .ఒకదాసీ రామలింగని ఇంట్లో పని చేసే, తన కూతురికి చెబితే ఆవిడ రాజరహస్యం తెలిసినట్లు పోజు పెడితే నెమ్మదిగా రామలింగడుకూపీ లాగి తెలుసుకొన్నాడు .అందర్నీ నవ్వి౦చ టానికి అది అతడికి మంచి ఆయుధమయింది .

  సంపన్న గృహస్తు అయిన రామలి౦గడు ఒక రోజు గుర్రం బండీలో గుర్రానికిఎర్రటి  గుడ్డ తో  మూతి బిగకట్టి ,చేత్తో పెను బెత్తం పట్టుకొని ఇంటినించి రాయలు నివసించే భవనానికి  వీధులన్నీ తిరుగుతూ  గుర్రాన్ని తిడుతూ కొడుతూ  వెళ్ళాడు .గుర్రం మూతి అలాబిగించారేం అని దారిలో జనం అడిగితె ‘’అంతఃపుర రహస్యాలు అది చెబుతుందేమో నని మూతి బిగించానని చెప్పాడు .ఊళ్ళో అందరికీరాయల అంతఃపురం లో ఏదో రహస్యం జరిగిందని ,అదేదో తెలుసుకోవాలని కుతూహలం కలిగి గుసగుసలు పోతున్నారు. రాయల వేగులు గమనించి విషయం తెలుసుకోటానికి రామలింగని దగ్గరకు వచ్చారు .తాను  చెప్పేమాటలు ఖచ్చితంగా రాయలకు వీరి ద్వారా చేరతాయని గ్రహించి ‘’ఏం లేదు నిన్న రాణి చిన్నాదేవిగారి తో రాయలవారు ఏకాంతంగా ఉండగా ఆమె గబుక్కున తుమ్మారట . నా గుర్రం చాలా  చెడ్డది ఆవిషయం ఎక్కడసకిలిస్తుందో అని మూతి బిగించాను .ఏదో పద్యాలురాసి పెద్దలకు విని పించే నాకెందుకండీ ఆ రహస్యాలు  ఈ గుర్రం పెద్ద గడుగ్గాయి .ఆవిషయం బయట పెడితే మా గురువులకు  తెలిస్తే వాళ్ళు చీవాట్లు పెడతారు  ‘’అంటూ నీళ్ళు నములుతూ చెప్పాడు .వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ వెళ్ళిపోతే ,లింగడు ఇంటికి చేరాడు

  వేగులద్వారా ఈవిషయం రాయలకు తెలిసి ,అంతఃపుర రహస్యాలకు ఆయనకు చేరి ప్రచారమవటం బాధ కలిగించినా గుర్రం మూతికి గుడ్డ బిగి౦చటాన్ని నవ్వకుండా ఉండలేకపోయాడు .అయినా గట్టిగా మందలించాలని అతని ముఖం తనకు చూపవద్దని చెప్పనికి భటులద్వారా వార్త ఇంటికి పంపాడు .దీనికి విరుగుడు ఆలోచించాడు  ,రెండురోజులతర్వాత కొలువుకు రాయలు వస్తే దూరంగా మూడు పెద్దనామాలు కనిపిస్తే ఆశ్చర్యపోయి దొడ్డే నాయకుడిని విచారిస్తే కనుక్కుంటానని ఇద్దరు సైనికుల్ని లింగని ఇంటికి పంపితే ,లింగడు వీపుమీదపెద్ద పంగనామాలు పెట్టుకొని కూర్చున్న సంగతి రాయలకు చెబితే పగలబడి నవ్వాడు .

  రామలింగని పిల్చుకు రమ్మన్నాడు రాయలు .వాళ్ళు వెడితే ‘’నా ముఖం చూపద్దన్నారు కనుక వెనక్కునడుస్తూ వీపు చూపుతూ వస్తాను ఆలస్యమౌతుందని చెప్పండి ‘’అని చెప్పి వాళ్ళవెంట వెనక్కి నడుస్తూ మూతికట్టు గుర్రం తో సహా  సభాభవనానికి వెళ్ళాడు. అందరూ నవ్వారు .’’నాకు మీ వీపు చూపక్కర్లేదు ‘’అన్నాడు రాయలు .’’మహారాజా !శత్రురాజులే మీ పరాక్రమానికి వెన్ను చూపు తుంటే సామాన్యుడిని నేను ఎంతటి వాడిని ?’’అన్నాడు .రాయలు ‘’ఓడిన శత్రువు వెన్ను చూపుతాడు. ఓటమి ఎరుగని కవి వెన్ను చూపరాదు .ముందుకు తిరగండి ‘’అన్నాడు .ముందుకు తిరగగా ద్వాదశ ఊర్ధ్వ పు౦డ్రాలతో కనిపించేసరికి సభాభవనమంతా నవ్వులే నవ్వులు .అదీ తెనాలి రాముని మంటప కథ అని రామచంద్రగారి తాతగారు ఆయనకు చెప్పారట .

   సశేషం

రేపు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 182-ట్రినిడాడ్అండ్ టొబాగో దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం

182-ట్రినిడాడ్అండ్ టొబాగో దేశ సాహిత్యం

 ట్రినిడాడ్అండ్ టొబాగో కరేబియన్ లో  డ్యుయల్ ఐలాండ్ దేశం  వెనెజుల దగ్గరలో ఉంది .క్రియోల్ జాతి సంప్రదాయ జీవుల ఆవాసం .రాజధాని –పోర్ట్ ఆఫ్ స్పెయిన్ .అనేకరకాల జాతుల పక్షుల నిలయం .చిన్నదైన టొబాగో బీచెస్ కు ప్రసిద్ధి .కరెన్సీ –ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్ .ఇంగ్లీష్ భాష ,క్రియోల్ భాష .అన్నిరకాల క్రిస్టియన్లతోపాటు హిందువులు ,ముస్లిములున్నదేశం .అక్షరాస్యత 98.7శాతం .5-16వయసువారికి నిర్బంధ ఉచిత విద్య .బాగా విద్యావంతమైన దేశంగా ప్రపంచ ప్రసిద్ధి .అత్యధిక ఆదాయమున్న దేశంగా వరల్డ్ బాంక్ గుర్తించింది .పెట్రోలియం ,పెట్రో కెమికల్స్ ,ఆయిల్ నేచురల్ గాస్ గొప్ప ఆదాయవనరులు .మరకాస్ బీచ్ ,లా బ్రియా పిచ్ లేక్,ఇంగ్లిష్ మానస్ బే దర్శనీయాలు .దోపిడీలు ఎక్కువ వంటరి ప్రయాణం చేయరాదు .

ట్రినిడాడ్అండ్ టొబాగో సాహిత్యం –ఆఫ్రికన్ బానిసలు పర౦పరగా చెప్పుకొనే కథలకు ఈ దేశం మూలం .దేశీయ సాహిత్యం 20వ శతాబ్దిలోనే వచ్చింది .సి ఎల్ ఆర్ జేమ్స్ ,విఎస్ నయీపాల్, సెయింట్ లూసియన్ బారన్ డెరెక్ వాల్కాట్ లు వెస్ట్ ఇండీస్ సాహిత్యాన్ని సృష్టించారు .ఆంగ్లో ఫోన్ కరేబియన్ సాహిత్యం లో అత్యంత ప్రాచీనమైనది 1824లో జీన్ బాప్టిస్ట్ ఫైలిప్పే రాసిన ‘’ఫ్రీ ములట్టో’’.1854లో మైకేల్  మాక్స్ వెల్ ఫిలిప్’’ఇమ్మాన్యుయాల్ అప్పడోకా’’,ఎ టేల్  ఆఫ్ బుకనీర్స్ ‘’ఆ దేశమొదటి నవల

  జేమ్స్ కిస్టఫా-ర్ అబోడ్-ది స్టోన్ రోజ్ ,లగాహూ పోయెమ్స్ రాశాడు .మైఖేల్ ఆంధోని-చరిత్రకారుడు హమ్మింగ్ బర్డ్ మెడల్ పొందాడు –దిగేమ్స్ వర్ కమింగ్ ,ది యియర్ ఇన్ సాన్ ఫెర్నేండో,గ్రీన్ దేశ బై ది రివర్ ,టేల్స్ ఫర్ య౦గ్ అండ్ ఓల్డ్ ,గ్లిమ్సేస్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి 12పుస్తకాలు రాశాడు .రాబర్ట్ ఆంధోని-కామన్ వెల్త్ అవార్డ్, ఆగాఖాన్ అవార్డ్ మొదలైనవి పొందాడు .రాబిన్ క్లార్క్ ,డిబినా ట్రేస్ ,నవలలు మై గ్రాండ్ మదర్స్ ఈరోటిక్ ఫోక్ టేల్స్ నవలు ,నాన్ ఫిక్షన్ గా అనదర్ డే ఇన్ ది బ్లాక్ వాల్కనో ,బ్లాక్ బియర్డ్ డు నాట్ కం హియర్ ఎనీ మోర్,పార్టి ఇన్ దిఐలాండ్స్ రాశాడు .విలియ౦ఆర్చి బాల్డ్ –నాటక రచయిత-వన్ఫర్ ది మని,ఆన్ మై మదర్స్ సైడ్ ,వగైరాలు రాసిసినిమాలుగా కూడా తీశాడు .కెవిన్ బాల్డియో సింగ్ –దికమెడియన్ అనే వన్ యాక్ట్ ప్లే రాశాడు.ఆదేశ చరిత్ర పుస్తకరచనకు సహకరించాడు .దిఆటో బయోగ్రఫీ ఆఫ్ పరాస్ ,విర్జిన్స్ ట్రయాంగిల్ ,ది టెన్ ఇంకార్నేషన్స్ ఆఫ్ ఆడం అవతార్ –అంటే యాడం యొక్క దశావతారాలు నవలలు రాశాడు .నీల్ దేవేంద్ర బిసూదత్-సెల్లింగ్ ఇల్యూజన్స్ ,దిఇన్నోసేన్స్ ఆఫ్ ఏజ్ ,డూయింగ్ ది హార్ట్ గుడ్ ,దిసోల్ ఆఫ్ ఆల్ గ్రేట్ డిజైన్స్ వంటివి చాలారాసి రైటర్స్ ట్రస్ట్ ఆఫ్  కెనడా అవార్డ్ పొందాడు .రమాబాయి ఎస్పినేట్-ది స్వింగింగ్  బ్రిడ్జ్ నవల-దీన్ని’’కాలాపానీ పోఎటిక్స్ గా భావిస్తారు ,,కమింగ్ హోం-కథలు, ఇండియన్ కుసైన్ ,నిన్జాస్ కార్నివాల్ వగైరా రాసింది .ఇస్మిత్ ఖాన్ –ది జంబీ బర్డ్ నవలరాశాడు .దీనిలో న్యుఇండో కరోబియన్ ఐడెంటిటి కి స్థానం కల్పించాడు.దిఓబియా మాన్ ,దిక్రుసిఫిక్సేషన్ నవలలూ రాశాడు .త్రి   ట్రినిడాడియన్ మాండలీకానికి పట్టాభి షేకం చేశాడు రచనలలో .సారా లక్ష్మీ సింగ్ కూడా గొప్ప రచయిత్రి .బాలకృష్ణ నయీపాల్ కూడా ప్రసిద్ధుడే .శివ నయీపాల్ –ఫైర్ ఫ్లైస్ ,ది చిప్ చిప్ గాదరర్స్ ,ఎహాట్ కంట్రీ నవలలు,నార్త్ ఆఫ్ సౌత్ ,బ్లాక్ అండ్ వైట్ ,యాన్ అన్ ఫినిష్డ్ జర్నీ వంటి నాన్ ఫిక్షన్ ,బియాండ్ ది డ్రాగన్స్ మౌత్  ,ఏ మాన్ ఆఫ్ మిస్టరి కథలు రాశాడు

వి ఎస్ నయీపాల్ -1932-2018.ఈదేశం లో పుట్టిన బ్రిటిష్ రైటర్ .ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్ మొదటి నవల 1961లో రాశాడు .యాత్రా సాహిత్యమూ రాశాడు .1974లో గేరిల్లాస్ నవలరాశాడు .ఏ బ్లెండ్ ఇన్ ది రివర్ ,ది ఎనిగ్మాఆఫ్ అరైవల్ ,దిమాస్క్ ఆఫ్ ఆఫ్రికా ,.2001లో సాహిత్య నోబెల్ ప్రైజ్ పొందాడు .ప్రసిద్ధ రచయిత జోసెఫ్ కాన్రాడ్ ఆయనగురించి – Naipaul is Conrad’s heir as the annalist of the destinies of empires in the moral sense: what they do to human beings. His authority as a narrator is grounded in the memory of what others have forgotten, the history of the vanquished.[74]

అన్నాడు  దిమిడిల్ పాసేజ్ అనే పెద్ద వ్యాసం రాశాడు

 దిన్యూయార్క్ రేవ్యూయర్ ‘’ The actual world has for Naipaul a radiance that diminishes all ideas of it. The pink haze of the bauxite dust on the first page of Guerrillas tells us what we need to know about the history and social organization of the unnamed island on which the action takes place, tells us in one image who runs the island and for whose profit the island is run and at what cost to the life of the island this profit has historically been obtained, but all of this implicit information pales in the presence of the physical fact, the dust itself. … The world Naipaul sees is of course no void at all: it is a world dense with physical and social phenomena, brutally alive with the complications and contradictions of actual human endeavour. … This world of Naipaul’s is in fact charged with what can only be described as a romantic view of reality, an almost unbearable tension between the idea and the physical fact …అని శ్లాఘించింది .బుకర్ ప్రైజ్,  ట్రినిటిక్రాస్ అవార్డ్ కూడా పొందాడు .85వ ఏట లండన్ లో 11-8-2018 న మరణించాడు .15ఫిక్షన్ రచనలు ,17నాన్ ఫిక్షన్ రచనలు చేశాడు

లక్ష్మీ పెర్సౌద్ –ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ .గొప్పనవలలు –బట్టర్ ఫ్లై ఇన్ ది విండ్ ,శాస్త్రా ,రైజ్ ఇన్ ది లాంటర్న్స్ హై,డాటర్స్ ఆఫ్ ఎంపైర్ మొదలైనవి రాసింది .ఆమె పేరిట వార్విక్ యూని వర్సిటి ఫెలోషిప్ ఏర్పాటు చేసింది .ఆనరరి డాక్టరేట్ పొందింది .రేమాండ్ రామ చరితార్ –కవి .కామన్ వెల్త్ రైటర్స్ ప్రైజ్ పొందాడు .అమెరికన్ ఫాల్ కవితాసంపుటి వెలువరించాడు .డెరెక్ వాల్కాట్ –నోబెల్ ప్రైజ్ విన్నర్ కవి .ఎరిక్ విల్సన్ –హిస్టోరియన్ –కేపిటలిజం అండ్ స్లేవరి ,దినీగ్రోయిన్ ది కరేబియన్ ,ఫ్రం కొలంబస్ టు కాస్ట్రో,బ్రిటిష్ హిస్టోరియన్స్ అండ్ ది వెస్టిండీస్ వంటివి చాలారాశాడు .రవీన్ద్రనాద్ మహారాజ్ –హోమర్ ఇన్ ఫ్లైట్ ,ఏ పెర్ఫెక్ట్ ప్లేడ్జ్ఫాట్ బాయ్ ఫాల్ డౌన్ వంటి నవలలు ,దిరైటర్ అండ్ హిజ్ వైఫ్ కథాసంపుటి .విక్టరి మీట్ రీడింగ్ రైటర్స్ రీడింగ్ సిటి ఆఫ్ వర్డ్స్ మొదలైన నాన్ ఫిక్షన్  రేడియో నాటకాలు స్క్రీన్ ప్లేస్ రాశాడు.క్వీన్ ఎలిజబెత్ మెడల్ కామన్ వెల్త్ రైటర్స్ అవార్డ్ ,బుక్ అవార్డ్ ,లైఫ్ టైంలిటరరీ వార్డ్ వంటివి చాలాపొందాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 181-జమైకా దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం

181-జమైకా దేశ సాహిత్యం

కరోబియన్ ఐలాండ్ దేశమైన జమైకా పర్వత వర్షారణ్యాల రీఫ్ లైన్డ్ బీచుల సముదాయం .రేగ్గే మ్యూజిక్ కు కేంద్రం .జనాభా  29.3లక్షలు కరెన్సీ-జమైకన్ డాలర్ .ఇంగ్లీష్ ,జమైకన్ క్రియోల్,అల్కాన్  భాషలు .ప్రోటేస్టె౦ట్సే,సెవెంత్ డే అడ్వెన్టిస్ట్ ,పెంటే కోస్ట్ మతాలున్నాయి .88శాతం అక్షరాస్యత .యూనివర్సల్ ప్రైమరీ విద్యావిధానం .బాక్సైట్ అల్యుమినా టూరిజం ఆదాయవనరులు .డన్స్ రివర్ ఫాల్స్ ,రోజ హాల్ గ్రేట్ హౌస్ ,బాబ్ మార్లీ మ్యూజియం చూడతగినవి .గాంగ్ పోరాటాలు నేరాలు ఎక్కువ .

 జమైకా సాహిత్యం –జమైకన్ సాహిత్యం .ప్రసిద్ధ రచయితలు  పుట్టిన దేశం .స్థానిక మాండలికం ‘’పాటోయిస్ ‘’వాడుతారు .సెయింట్ లూసియాస్ నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత .డెరిక్ వాల్కాట్ హిస్టరీ రైటర్ .వాల్టర్రోడ్నీహిస్టారికల్ స్కాలర్ .మేరీ కాల్లిన్స్ కవి ,షార్ట్ స్టోరీ రైటర్ .మొదట్లో జానపదమే .

 ధామస్ మెక్ డేర్మాట్-1870-1933 జమైకా అస్థిత్వాన్ని ప్రచారం చేసిన మొదటికవి .అతడి బెక్రాస్ బక్రాబేబీ ఆధునిక కరోబియన్ సాహిత్యానికి నాంది .క్లాడ్ మెకె1898-1948 ‘’బ్లాక్ నెస్ మొవ్ మెంట్ సారధి.హెర్లెం రినైసేన్స్ కు జనకుడు .20వ ఏట అమెరికా వెళ్ళాడు .ఊనా మార్సన్ -1905-65ప్రసిద్ధ కవయిత్రి బిబిసి సాహిత్యకార్యక్ర౦ ‘’కరేబియన్ వాయిసెస్ ‘’ నిర్వాహకురాలు .లూయిస్ బెన్నెట్ కోవేర్లి- 1919-2006జానపదగాయని కవి ‘’మిస్ లౌ ‘’గా సుప్రసిద్దురాలు .తనమా౦డలికానికి సాహిత్యం లో గౌరవస్థానం కల్పించింది ,హజేల్ డోరోతి కాంప్ బెల్ ,మికీ స్మిత్ ,క్వేసి జాన్సన్, మెర్వి మారిస్ అంతర్జాతీయ ఖ్యాతి పొందినకవులు .మెర్వి మారిస్ ను పోయేట్ లారిఎట్ చేశారు .

 మరికొందరు ప్రసిద్ధ కవులు రచయితలు –ోపాల్ పాలమర్ అదిసా లిండ్సే బారెట్ ,ఎడ్వర్డ్ బాఘ్ ,జోనాధన్ బ్రాహం ,జీన్ డీ కోస్తా ,ఈస్తర్ ఫిగురోవా ,బార్బరా లల్ల ,డయానామేకాలే,హీదర్ రాయెస్ కెర్రి యంగ్ మొదలైన చాలా మంది ఉన్నారు .

మోస్ట్ మోడర్నిజం కవి డ్రెక్ వాల్కాట్  కరోబియన్ కవిత్వం ఐన ఎపిక్ పోయెం ‘’ఒమెరోస్’’రాసినందుకు 1992లో సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చింది .2011లో టి.ఎస్.ఇలియట్ అవార్డ్ పొందాడు .

 I smelt the leaves threshing at the top of the year

in green January over the orange villas

and military barracks where the Plunketts were,

that other life going in its “change for the best,”

its peace paralyzed in a postcard, a concrete

future ahead of it all, in the cinder-blocks

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -8

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -8

    బళ్లారిలో గాంధీజీ

1921లో గాంధీ బళ్ళారి వచ్చాడు తిరుమల రామచంద్రగారు వారి తాతగారు ఆయనమిత్రులు అందరూ ఒక రోజు ముందే బళ్ళారి వెళ్లి ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారింటికి పూర్వ పరిచయం తో వెళ్లారు .వీరి నివాసం ఒక పెద్ద హవేలీ బహిరంగ సభలు నాటకాలు వగైరా అన్నీ ఆ బంగ్లాచుట్టూ ఉన్న మైదానం లోనే జరిగేవి .దానిపేరు ‘’బంగ్లా కాంపౌండ్ ‘’.కొన్ని వేలమంది విశాలంగా కూర్చునే మైదానం అది .గాంధీకి స్వాగతం ఏర్పాట్లు ఈ కాంపౌండ్ లోనే జరిగాయి .అందుకని గాంధీని దగ్గర గా చూసే అవకాశం రామచంద్రగారికి దక్కటం తన అదృష్టం అన్నారాయన .కాంపౌండ్ లో ఒక పెద్ద వేదిక ,బల్లలు వేసి తెల్లటి ఖద్దరు గౌనులు ,పల్చని పరుపులు పరచి దిండ్లు పెట్టారు .మైదానం అంతటా వెదుళ్ళు నాటి తోరణాలు పూలమాలలు అలంకరించారు .ప్రవేశ ద్వారానికి రాట్నాల తోరణం కట్టి శోభ తెచ్చారు .మైకులు ఆనాటికి లేవు .ప్రతివీధిని అరటి స్తంభాలు  జెండాలు ,రంగు తోరణాలతో అలంకరించారు .ఊరంతా ఆనంద హడావిడే .

  మర్నాడు మధ్యాహ్నానికి రైలులో గాంధీ ధార్వాడ వచ్చి ,అక్కడినుంచి ఫోర్డ్ కారు లో బళ్ళారి వచ్చి ఆచార్యుల వారి కాంపౌండ్ కు చేరారు .ఆచార్యులవారి చివరి అబ్బాయి భోగీంద్ర నాథ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు .ఆయన కాశీ విశ్వ విద్యాలయం లో ఇంజనీరింగ్ చదివి వచ్చాడు .హిందీ బాగా మాట్లాడే వాడు .మైదానమంతా జనంతో క్రిక్కిరిసిపోయింది .చుట్టుప్రక్కగ్రామాలజనం కూడా బాగా వచ్చారు .’’గాంధీజీ జై ‘’నినాదాలు మిన్ను ముట్టాయ్.గాంధీ వెంట ప్రముఖులు చాలామంది వచ్చారు .రామకృష్ణమాచార్యులవారి బంగ్లాలో ఉన్న వారికి వేదిక దగ్గరగా స్థలం కేటాయించారు .కనుక రామచంద్రగారికి ఇబ్బంది కలగలేదు’  .గాంధీజీ హిందీలో అయిదే అయిదు నిమిషాలు మాట్లాడాడు  .దాన్ని భోగీంద్ర నాథ్ తెలుగులోకి అనువదించాడు .త్వరలో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనఉద్యమాలు జరుగుతాయని ,వాటికి ప్రజలు యధాశక్తి ఆర్ధికసాయం చేయాలని,వాలంటీర్లను తయారు చేసి పంపాలని ,స్త్రీపురుషులంతా ఖద్దరు కడితే నెలరోజుల్లోనే స్వరాజ్యం వస్తుందని,స్వరాజ్యం వచ్చేదాకా ఆడవారు నగలు ధరించవద్దని ,మగవారు విలాస వస్తువులు వాడరాదని ,సోదరీమణులు ,తల్లులు ఉద్యమానికి తమ నగలు దానం చేయాలని ,అవసరమైతే ఎలాంటి ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడాలని  గాంధీ ఉపన్యాస సారాంశం.

‘’మహిళలు త్యాగం చేయాలి, విరాళాలు ఇవ్వాలి ‘’అన్నమాట మహాత్ముని నోటి వెంట రావటం ఆలస్యం ,ప్రేక్షకులలో ఉన్న వందలాది స్త్రీలు వేదిక వద్దకు వచ్చేశారు .చేతుల బంగారు గాజుల మెడలోని హారాలు  చెవికమ్మలుఒలిచి  దూసి ఇచ్చారు  .ముక్కుల నత్తులు,జడబిల్లలు ,ముక్కు పుడకలు తీసిచ్చారు .ఈ అత్యాశ్చర్యకర దృశ్యం చూసి రామ చంద్ర అమితాశ్చర్య పోయారు .గాంధీ ప్రభావం ఏమిటో అర్ధమైంది .ఎర్రగుడి శ్రీనివాసాచార్యులు అనే ఈయన బంధువు గారి భార్య కమలమ్మగారు ,కొంగు నడుముకు దోపుకొని వచ్చి ,తన రెండు చేతుల బంగారు గాజులూ దూసి  గాంధీ చేతుల్లో పోసింది .ఆమెను అభినందించి అందరూ ఆమెను  ఆదర్శం గా తీసుకోవాలని గాంధీ అన్నాడు.ఒకాయన ఇచ్చిన విరాళాల వివరాలు రాసుకుంటున్నాడు .ఈ విరాళాల వెల్లువ కనీసం మూడు గంటలపాటు సాగింది .పెద్ద బియ్యంబస్తా సంచీ అంతా నగలతో నిండిపోయింది .తర్వాత 1932-33 గాంధీ మద్రాస్ లో నెలరోజులు ఉంటె ,రోజూ ఆయన ఉపన్యాసానికి వెళ్లి చూశారు  రామచంద్ర .

 సత్కార్య సాధనకు సత్యాధనాలు  ఉండాలనే గాంధీ సిద్ధాంతానికి ఆయన రాసిన వీలునామా గొప్ప దృష్టాంతం .అదేకాదు ఆయన జీవితమంతా దృష్టాంతమే అంటారు తిరుమల రామచంద్ర .సత్యశోధన గాంధీ  జీవితానికిమెరుగులు దిద్దింది.

‘’సూనృతం సర్వ శాస్త్రార్ద –నిశ్చితజ్ఞాన శోభితం –భూషణం సర్వ వచసాం –లజ్జేవ కుల యోషితాం’’

భావం –అన్ని శాస్త్ర చర్చలలో నిగ్గు దేలిన జ్ఞాన శోభగల  సత్యం –సకల వాక్కులకు ,కుల స్త్రీలకు సిగ్గరితనం లాగా భూషణం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 180-ప్యూరెటికో దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం
  • 180-ప్యూరెటికో దేశ సాహిత్యం
  • అమెరికా టేరిటరి కరోబియన్ ఐలాండ్ ప్యూరెటికో దేశం .సాన్ జువాన్ రాజధాని .జనాభా 32లక్షలు .కరెన్సీ-అమెరికన్ డాలర్ .కేధలిక్ మతం .ఇంగ్లీష్ ,స్పానిష్ భాషలు .93శాతం అక్షరాస్యత .5-18వయసు వారందరికీ విద్య కంపల్సరి.ఎలిమెంటరి హైస్కూల్ గ్రేడ్ విధాన విద్య .ఫార్మస్యూటికల్స్,కెమికల్స్ ,పెట్రో కెమికల్ ఎలెక్ట్రానిక్స్ ఆదాయవనరులు .ఎల్ యునిక్ జలపాతం పార్క్ ,కాస్టిల్లోసాన్ ఫిలిప్ డెల్మొరో ,బాహియా బయో లూమినిసెంటీ చూడదగ్గవి .యాత్రా సురక్షిత దేశం .
  • ప్యూరెటికో సాహిత్యం –మొదటినుంచి కధలు చెప్పటం వినటం అనుస్యూతంగా వచ్చింది .దీనినే కోప్లాస్ అండ్ డేసిమాస్ అంటారు ,స్పానిష్ రాజులు వారి వంశ చరిత్రలను ఆస్థాన విద్వాసు లచేత రాయించేవారు .వీరిలో ఫాదర్ డీ గో టారెస్వర్గాస్ ఆ దేశ చారిత్ర రాశాడు ,ఫ్రాన్సిస్కో అఎరా డీ సాంటామేరియా మత చారిత్రిక కవిత్వం రాశాడు .వెస్ట్ ఇండీస్ గురించి రాసినవాడు జువాన్ పోలేస్  డీ లియోన్ .ఆ దేశ మొదటి గవర్నర్ ,అక్కడే పుట్టిన జువాన్ పోలేస్  డీ లియోన్ టైనో కల్చర్ వారి మత విషయాలు,ఉత్సవాలు పండుగలు  రాశాడు .మొదటి ప్రింటింగ్ ప్రెస్ వచ్చాక1851లో  ఒసియోస్ డీ లా జువెంటుడ్ మొదటిపుస్తకం రాసి ప్రింట్ చేశాడు .రాయల్ అకాడెమి ఏర్పాటైంది .
  •   19వ శతాబ్దం లో రోమా౦టిజం ప్రవేశించి ఫ్రాన్సిస్కో గొంజేలో మారిన్,రాజరికానికి వ్యతిరేకంగా రాశాడు .కొందరు ప్రవాసాలకు వెళ్ళారు .స్పానిష్ –అమెరికా యుద్ధం లో ఈ దేశాన్ని అమెరికా స్వాధీన పరచుకుని స్వాతంత్ర్యం ఇచ్చాక దేశీ సాహిత్యం వచ్చింది .20వ శతాబ్దిలో అమెరికాకు వలసవెళ్ళారు కవులు రచయితలూ .జీసెస్ కలోన్ ను ‘’ఫాదరాఫ్ ‘’న్యుయోరికన్ మువ్ మెంట్ ‘’అంటారు .అతడు నల్లజాతివాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడటం రాదు .తన అనుభవాలు ,ఇతర వలసదారుల అనుభవాలను గురించి ఇంగ్లీష్లో  రాసి ఆదేశ ‘’మొదటి జాతీయ రచయిత’’ అనిపించుకొన్నాడు .ఎ ప్యూరోటికన్ ఇన్ న్యు యార్క్ ,మొదలైన పుస్తకాలు రాసిఆదేశ సంస్కృతీ రచనకు శ్రీకారం చుట్టాడు నికొలాస్ మొహర్ కూడా ఇలానే రాశాడు .అతని రచనా సంపుటి పేరు ఎల్ బ్రాంక్స్  నేషనల్ బుక్ అవార్డ్ పొందింది .పిరి ధామస్ –కేఫ్ అనే కవిత ,,పెడ్రో పీట్రీ,గ్రాన్నినా బ్రాషి-క్లాసిక్ స్పానిష్ నవల ‘’యోయో బోయింగ్ ‘’,ఎస్మిరియా సలాంగ్ మొదలైనవారు మంచి రచయితలు  .
  •  ముఖ్య రచనలు –రాఫెల్ కోర్డేరో బోధనలతో రచయితలపై గొప్ప ప్రభావం చూపాడు . మాన్యుల్ అలేన్సో ,’’ఎల్ గిబారో ‘’కవితా సంపుటి ,లో ఆదేశ పేదరికం వర్ణించాడు .కర్రేబియన్ అస్తిత్వం పై యుజేనియో మేరియా డీ హోస్టోస్-లా పెరేగ్రినాసినో డీ బయాన్ రాశాడు .అలేల్జాన్డ్రోతాపియా వైరివేరా ను ‘’ఫాదర్ ఆఫ్ ప్యూరోరిటికాన్ లిటరేచర్’’ అంటారు .కేయే టాకోల్ ఎ టోస్టే ఆ దేశ సమగ్ర చరిత్ర రచయిత .ఎ డ్గార్డో వేగా వాన్క్వే ,’’బ్లడ్ ఫ్యూగ స్ ,  గియాన్నియా బ్రాస్చి  ‘’యోయో బోయింగ్ ,స్పీక్స్ రచయితా సోటో ముఖ్యులు .
  •   మొదటి కవయిత్రి  నాటకరచయిత్రి మేరియా బిబ్లానా బెంటెజ్.మొదటి కవితా సంపుటి La Ninfa de Puerto Rico1832లో రాసి ప్రచురించింది .అలేజాన్డ్రినాబెనేతెజ్ Aguinaldo Puertorriqueño1843లో ప్రచురించింది ఆమె కొడుకు జోస్ గుటిఎర్బెనేటేజ్ ను ఆదేశ గొప్ప  రొమాంటిక్  కవిగా భావిస్తారు .విప్లవ గేయాలు “La Borinqueña”  . Lola Rodríguez de Tió  రాసి ఉత్తేజం కలిగించారు .దేశభక్తి కవిత్వం రాసినవారిలో జోస్ డీ డీగో  వర్జిలియో డేవిలియా ,లూయిస్ లారెన్స్ ,నేమేసియో కెనారెస్,హూగో మార్గనేటేస్ వంటి వారున్నారు
  •   యూనివర్సల్ లిరిసిజం రచయితలలో లూయిస్ పేల్స్  మాటొస్,లూయిస్ లిలోరెంస్ ,ఎవరిస్టో రెబెరో చెవ్రెమాంట్ మొదలైనవారు .నాటక రచయితలలో –ఫ్రాన్సిస్కో అవిర్రి ను ‘’ఫాదర్ ఆఫ్ పోర్టా రికన్ ధియేటర్ ‘’అంటారు .విజ్గాన్టేస్అరెయ్టో ప్రసిద్ధ నాటకాలు రాశాడు .ఇతడిని అనుసరించి రాసిన నాటక కర్తాలలో రీనె మార్క్వేస్-జోన్ బోబో నాటకం గొప్పది .గ్లానినా బాస్చి మొదలైనవారు ప్రయోగాత్మక నాటకరచయితలు .ఆదేశ  మహిళల సామాజిక  కృషి  తెలియజేస్తూ అర్రిగోశియారాసిన చారిత్రాత్మక రచన గొప్పది .ది హిస్టరీ ఆఫ్ టొబాకో కల్టి వేషన్ మొదలైన వ్యవసాయ రచనలూ వచ్చాయి .
  •   ఆధునిక సమకాలీన రచయితలలో రాఫెల్ అసవేడో,మోసెస్ అగస్టో,యోలాండా అరాయో ,జెంనేట్ బెసేర్రా వగైరా ఉన్నారు .
  •    సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 179-పనామా దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం
  • 179-పనామా  దేశ  సాహిత్యం
  • మధ్య దక్షిణ ఆమెరికాలో పసిఫిక్ ,అట్లాంటిక్ సముద్రాలాధ్య షిప్పింగ్ కోసం ఏర్పాటు చేసిన మానవాద్భుతం పనామా కాలవ  ఉన్న దేశం పనామా .రాజధాని పనామా సిటి ఆధునిక ఆకాశ హర్మ్యాలు ,కాసినోలు ,నైట్ క్లబ్  లతో  నిండి ఉంటుంది .కరెన్సీ అమెరికన్ డాలర్ ,పనమానియన్ బల్బొవా .జనాభా -42లక్షలు .రోమన్ కేధలిక్ మతం .స్పానిష్ భాష  .95.41శాతం అక్షరాస్యత .బేసిక్ సెకండరి ,టేరేటరి విద్యా విధానం .పనామాకాలువ వాణిజ్యం ,సర్వీస్ సిస్టం ముఖ్య ఆదాయ వనరులు .సాన్ బ్లాస్ ఐలాండ్స్ ,పనామ వీజో ,మీరా ఫ్లోర్ లాక్స్ వగైరా చూడచ్చు .సురక్షితం .
  • పనామా సాహిత్యం –పనామికల్ సాహిత్యం గొంజేలో ఫెర్ని నాండేజ్ ఆండ్రీ డీలారోకా పై రాసిన కథ తోప్రారంభం .క్రైయింగ్ ఫ్రం పనామా ఎట్ ది డెత్ ఆఫ్ డాన్ ఎన్రిక్ఎన్రిక్వెజ్అనే ఆన్దాలజిని 17వ శతాబ్దిలో కొందరు రచయితలు  కలిసి రాశారు .19వ శతాబ్దం లో ఆధునిక సాహిత్యావిర్భావం జరిగింది .రోడ్రిగో మిరో-పోయెట్రి ఇల్టినరి  ఇన్ పనామా ‘’ను అనేక స్పానిష్ రచయితలు రాశారు .వరల్డ్ పాలిటిక్స్ పుస్తకం ,తర్వాత ముండోరాసిన స్టేజ్ ప్లే వచ్చాయి .విక్టర్ డీ లా గార్డియాను మొదటి పనామియన్ కవి అంటారు 19వ శతాబ్దిలో రోమా౦టిజం కూడా ప్రవేశించి మాన్యుల్ మేరియా అయాల ,టోమాస్మీరో రూబిని ,జోస్ మేరియా అలేమన్ ,రోడోల్ఫో కైసేడో వగైరాలు రాశారు .మోడర్నిజం కవులలో లియాన్ ఆంటోనియో సోటో,రికార్డోమిరోఉన్నారు ,మీరో –పాట్రియా అనే అద్భుత కావ్యం రాశాడు
  •   సర్రియలిజం కవులలో రికార్డో బెర్మురేజ్ ప్రసిద్ధుడు.కథారచయిత అగస్టో రోడిగేజ్ .కవులు –స్టెల్లా సియర్రా ,రోక్ జైవార్ లక్వేరెంజా ,హోఫీలియా హూపర్ ఎల్సి రికార్డ్ మొదలైనవారు .తర్వాతకాలం లో బెంజమిన్ రామోన్ ,బెర్టాలికాపెరటాలియా,రామోన్ ఒవీరో ,పాబ్లో మినాకో .20వ శతాబ్దిలో సాల్వడార్ మెడినాబరహోనా,ఐరా హార్బర్ గోమేజ్ ,అలేక్జాందర్ జాంజేస్ గొప్పకవులు
  • మొదటి పనమానిక్ పుస్తకాలు –ఆండ్రీస్ గాస్పర్ ,రికార్డో మీరో కవులు కథాకారులు .జోస్ మేరియా నూనిజ్ మోసెస్ కాస్తిల్లో లూ గొప్పవారే .పనామా కాలువ పై అనేక రచనలు వచ్చాయి –ఏర్నేస్టో ఎండారాఎన్రిక్ క్వివేజ్ ,యోలాండాహాక్స్ షా ,డేవిడ్ రాబిన్సన్ ఒరోబియా ,ఎరికా హారిస్  పనామా పై ఆరాధనగా రాశారు .21వ శతాబ్దిలో కార్లోస్ ఫాంగ్ ,రోడ్రిగేజ్ పిట్టి,లిలి మేన్దోజాఆబెల్ ముగులేనా వర్ణనాత్మక రచనలు చేశారు ,వ్యక్తి మహత్వాన్ని చాటారు రచనల్లో .
  • కొందరు ముఖ్యరచయితలు –గ్లోరియా గువార్డియ-నావలిస్ట్ జర్నలిస్ట్ ఎస్సేయిస్ట్ .మూడునవలలు ,జ్ఞాపకాలు ,కవితలు షార్ట్ స్టోరీస్ రాసింది .లెక్కలేనన్ని అవార్డులు రివార్డులు అందుకున్న అరుదైన రచయిత్రి .రికార్డో మిరో-మోడర్నిజం కు ఆద్యుడు .8నవలలు ,దిలాస్ట్ సి గల్ వంటి అయిదు కవితా సంపుటులు రాసింది .మేరియా ఒలింపియా –కవయిత్రి .ఒర్క్విడియాస్ పనామా వంటి కవితా సంపుటులు 5వెలువరించింది .రోసా మేరియా బిట్టన్-రచయిత్రి రొమాంటిక్ కవి .రోజులో సినన్-నాటక నవలారచయిత .అమీలా డెనిస్డీ ఇకాజా –కవయిత్రి .అల్సెరోఅంకన్ వగైరా కవితా సంపుటులు రాసింది .స్టెల్లా సియర్రా –సాంగ్స్ ఆఫ్ సి అండ్ మూన్ ,జాయ్ఫుల్ సింపతి ఇన్ ట్వెల్వ్ సానేట్స్ వగైరా రాసింది .అన్నబెన్ మిగులేనా –అనామియా నాటకం రాసి నటించి ప్రదర్శించింది కవయిత్రికూడా .జస్టో అర్రోవో-కథాసంపుటులు, నవలలు రాశాడు .
  •   సశేషం
  • మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రైటానరబుల్ కోలాచల౦  వెంకట  రావు గారు బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్

రైటానరబుల్ కోలాచల౦  వెంకట  రావు గారు

బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్

బిరుదున్న కోలాచలం వెంకట రావు గారు .ప్రముఖ నాటక కర్త కోలాచలం శ్రీనివాసరావు గారి పెద్దన్నగారు .ఈ కుటుంబానికి వెంకటాపురం బుక్కపట్నం లలో పొలాలు ఉండేవి .రామ చంద్ర తాతగారు వాటిని సాగు చేసేవారు .పంట డబ్బుకోసం వెంకటరావు గారు, జ్ఞాతిషణ్ముఖ శాస్త్రిగారు వచ్చే వారు .వెంకటరావు గారు గొప్ప నాయకులు .వారిని అక్కడి వారే కాక తెలుగువారు కూడా విస్మరించారు .

  కాంగ్రెస్ వాది వెంకటరావు గారు ,భారత జాతీయ కాంగ్రెస్ స్థాపక సభ్యులలో కూడా ఒకరు   .28-2-1850న బళ్లారిలో జన్మించారు .దేశానికీ సమాజానికి వారు చేసిన సేవ నిరుపమానం .సంఘ సంస్కర్త, మహా దాత ,రాజకీయ దురంధరుడు రావు గారు .మహామహోపాధ్యాయ వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లి నాథ సూరి వంశం వారే .

  రావు గారి తాతగారు కోలాచలం సుబ్బా శాస్త్రి గారు ధార్వాడ జిల్లా గజేంద్ర ఘడ సంస్థాన౦ లో ఉండేవారు .మహారాష్ట్ర ,కన్నడ భాషలలో హరికథలు రాసి చెప్పి మంచి పేరు పొందారు .రావు గారి తండ్రి రాయచూరు జిల్లా అనే గొంది సంస్థాన దివాన్ గా చాలాకాలం ఉన్నారు .

  వెంకటరావు గారు  బళ్ళారి లోని వార్డ్లా విద్యాలయం లోని గవర్నమెంట్ ప్రోవిన్షియల్ స్కూల్ లో  చదివి ,1867లో ఎఫ్ ఏ పాసై ,,మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజిలో చదివి 19వ ఏట డిగ్రీ పొందారు. అప్పుడు ఆ కాలేజి ఒక్కటే ఫస్ట్  గ్రేడ్ కాలేజి .ప్రిన్సిపాల్ ధాంసన్.ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి 1874వరకు బోధించారు .తర్వాత జిల్లా మున్సిపల్ ఆఫీస్ లో హెడ్ గుమాస్తాగా నియమితులై ,నాలుగేళ్ళు పని చేసి ,తర్వాత రెండేళ్ళు డిప్యూటీ  తాసిల్దారుగా ,సబ్ మేజిస్ట్రేట్ గా ఉన్నారు .

  న్యాయ శాస్త్రం పై అభి రుచి ఉన్నందున చదివి 1880 లో లా పాసయ్యారు .బళ్ళారి న్యాయ స్థానాలలో సివిల్ ,క్రిమినల్ కేసులు వాదించారు .కక్షిదారులకు న్యాయం చేస్తారని న్యాయమైన కేసులే చేబడతారని గొప్ప పేరు పొందారు .దీనితో ‘’న్యాయవాద కేసరి ‘’-లయన్ ఆఫ్ ది బార్ అనే బిరుదు పొందారు .ఆతర్వాత ఆయన చిత్రపటాన్ని బళ్ళారి బార్ అసోసియేషన్ లో న్యాయమూర్తి ఇ.ఇ.మెక్.ఆవిష్కరించారు .రావు గారికి వృత్తిలో మంచి పేరుమాత్రమే కాదు కనకధార కురిసింది .మహదైశ్వర్య వంతులయ్యారు .మద్రాస్ బొంబాయి హై కోర్టు లలోనూ కేసులు వాదింఛి గొప్ప కీర్తి పొందారు .

  ఒక సారి రావు గారు బొంబాయి హైకోర్ట్ ఫుల్ బెంచ్ ముందు వాదిస్తుంటే ,ప్రధాన న్యాయమూర్తి సర్ బాసిల్ స్పాట్ అనే చిరాకు రాయుడు, రావు గారు చెప్పింది అంతా ఫుల్ బెంచ్ ఇదివరకు తీర్పులో చెప్పింది అని అడ్డు తగిలితే, రావుగారు ధైర్యంగా ‘’అది ఫుల్ బెంచ్ చెప్పిన తీర్పు కాదు .మీరు చెప్పిన తీర్పుకు మిగిలిన  వారి తల  ఊపు మిలార్డ్ ‘’అన్నారట .ఈ విషయం చీఫ్ జస్టిస్ ఒప్పుకోవాల్సి వచ్చిందట .ఈ వృత్తాంతం బొంబాయి హైకోర్ట్ శత జయంతి సంచికలో ఉన్నది .

  రావు గారు బళ్ళారి జడ్జిగా రెండేళ్ళు మద్రాస్ హైకోర్ట్ జడ్జ్ గా చేశారు .ఒకసారి ఈయన W.W.ఫిలిప్స్ తో ఘర్షణ పడ్డారు ‘’మిస్టర్ వెంకటరావు నా సమయం వృధా చేస్తున్నావ్ ‘’అన్నాడట ఫిలిప్స్. రావు గారు వెంటనే ‘’మీనెలజీతం నాకు నిముషాలకు గంటలకు జీతం. నా సమయం మీ సమయం కన్నా విలువైనది మిలార్డ్ ‘’అన్నారట .

   1893లో రావు గారు ఫిలసాఫికల్ సొసైటీస్థాపక  సభ్యులై క్రియాశీలంగా పని చేస్తూ దేశ ప్రజల సంక్షేమానికి రాజకీయ సామాజిక మతసాంస్కృతిక రాజకీయ రంగాలలో సేవ చేశారు .ఈ సొసైటీ భవననిర్మానానికి ఉదారంగా విరాళం ఇచ్చారు .ఈ భవనం ఇప్పటికీ వారిని గుర్తు చేస్తుంది. వివాహాలలో దేవాలయ ఉత్సవాలలో ఆనవాయితీగా ఉండే భోగం మేళాలకు బళ్ళారి ప్రాంతం లో స్వస్తి పలికించారు రావు గారు మిత్రుడు రావు బహదూర్ ఏ సంబంధ మొదలియార్ తో కలిసి .లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల విస్తరణ కోసం సూచనలు పంపిస్తే ,రావుగారు, సభాపతి మొదలియార్ గార్లు స్థానిక వర్తకులను ప్రోత్సహించి నిలబెట్టిఎన్నిక యేట్లుచేశారు .1885లో బొంబాయిలో మార్క్విస్ రిప్పన్ కు సన్మాన పత్రం అందజేయటానికి బళ్ళారి ప్రముఖుల తరఫున వెళ్లి అందజేశారు .అప్పుడు బొంబాయిలో జరుగుతున్న అఖిలభారత కాంగ్రెస్ ప్రధమ సమావేశానికి హాజరై,72మంది సంస్థాపక సభ్యులలో ఒకరయ్యారు .సోషల్ కాంగ్రెస్ సభల్లోనూ పాల్గొన్నారు .చాలా ఏళ్ళు  ఈ సంస్థల వార్షి  కోత్సవాలకు ఉత్సాహంగా వెళ్లి పాల్గొనే వారు .

   వివిధ దేశాల ప్రజల వ్యవహారాదులు,దేవాలయ మసీద్ చర్చి బౌద్ధ విహారాల ప్రాచీన ,నవీన శిల్ప విశేషాలు తెలుసుకోవటానికి రావు గారు 1884లోభారత్ లోని వివిధ ప్రాంతాలు ,శ్రీలంక బర్మా చైనా ఆగ్నేయ ఆసియా దేశాలలోనూ పర్యటించారు .1884లో వీరేశలింగం పంతులుగారితో బ్రహ్మ సమాజ ప్రచారకులు బుచ్చయ్య పంతులుగారితో పరిచయమై౦ది  రావు గారికి .ఆ స్పూర్తితో బళ్ళారి లో తనబంగళాలో స్వంతఖర్చుతో మూడు విధవా వివాహాలు చేయించారు .అప్పటికి నిషిద్ధమైన సముద్రప్రయానం విధవ వివాహాలు చూసి అనాతనులకు ఆగ్రహం కలిగి బహిష్కరించారు .ఉపాయం ఆలోచించి బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేసి ప్రతిఒక్కరికీ ఒక బంగారుకాసు ఇస్తానని ప్రచారం చేశారు .కుప్పలు తెప్పలుగా బ్రాహ్మణులు వచ్చి భోజనాలు చేసి దక్షిణ తీసుకొని వెళ్ళారు. ఈ వివాదం లో విరూపాక్ష మఠం తటస్థంగా ప్రేక్షకపాత్ర వహించింది .

  రావు గారు 1902 లో మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి అక్కడి నుంచి రష్యా టర్కీ లు మినహా యూరప్ దేశాలన్నీ పర్యటించి అక్కడి ప్రజల స్థితిగతులు తెలుసుకొని ,భారతదేశ విషయాలు వారికి తెలియ బర్చారు .ప్రభుత్వ ఆహ్వానం పై లండన్ లో 1902ఆగస్ట్ 9న జరిగిన ఏడవ జార్జి చక్రవర్తి  పట్టాభిషేకాన్ని చూశారు .రావు గారి సేవలకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ‘’రైటానరబుల్ ‘’బిరుదునిచ్చి గౌరవించి సత్కరించింది .విదేశీ పర్యటనుంచి తిరిగి వచ్చిన రావు గారికి కనీ విని ఎరుగని రీతిలో ప్రజలుస్వాగత౦  పలికారు

  బళ్ళారి లో ప్లేగు విజ్రుమ్భించిన కాలం లో రావు గారు బళ్ళారి మునిసిపల్ చైర్మన్గా ఉన్నారు .ఇరవైనాలుగు గంటలు పని చేసి తనస్వంత డబ్బు వేలాదిరూపాయలు ఖర్చు పెట్టి ,వ్యాధిని నిరోధించారు .ప్రభుత్వ చర్యలకు పూర్తీ సహకారం అందించారు .ఎప్పుడుప్లేగువచ్చినా బళ్ళారి లోని ఆయన బంగళా,ఆవరణ  కాందిశీక శిబిరంగా మారిపోయేది .

మహాదాత వెంకటరావు గారు 1906నుంచి తన ఆదాయం లో నాలుగో వంతు దానధర్మాలకు విని యోగించారు .వీరేశలింగం గారి విధావాశ్రమనిర్మాణానికి అయిదు వేలు విరాళం ఇచ్చారు .కాశీ విశ్వ విద్యాలయాని ఎంతో భూరి విరాళాలు అందించారు .భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన బ్రిటిష్ సంఘానికి ఏటా 500పొండ్లు విరాళం పంపేవారు .హిందూ ముస్లిం క్రైస్తవ సంఘాలకు నిరంతరం  ఏదో ఒకటి  దానం చేసేవారు. బళ్ళారి కాస్మోపాలిటన్ క్లబ్ భవన నిర్మాణానికి భూరి  విరాళమిచ్చారు.ఈ భవనం ఇప్పటికీ సజీవ సాక్షాత్కారంగా ఉంది .

తూర్పు ప్రాంతం మునిసిపాలిటి వర్గం 1903లో వెంకటరావు గారిని మద్రాస్ శాసన మండలికి ఎన్నిక చేసింది .ఆయనతో పోటీ చేసిన ఏలూరు ఆయన కృత్తి వెంటి పేర్రాజు గారు ఓడిపోయారు .1904నుంచి 07వరకు ఇంగ్లాండ్ లో న్యాయ శాస్త్రం చదివి బార్ ఎట్ లా డిగ్రీతో తిరిగి వచ్చారు .అక్కడ టంగుటూరి ప్రకాశం గారు రావు గారికి క్లాస్మేట్ .వెంకటరావు గారి ప్రముఖ మిత్రులు బాలగంగాధర తిలక్ ,పండిత మదనమోహనా మాలవ్యా ,ప్రకాశం పంతులు వీరేశ లింగం గారు ,దాదా భాయ్ నౌరోజీ ,గోపాలకృష్ణ గోఖలే ,అనీ బీసెంట్ మొదలైన హేమాహేమీలు .తిలక్ ను అరెస్ట్ చేసినందుకు నిరసనగా 1916లో రావు గారు నిరసనగా తమ రైటానరబుల్ బిరుదు త్యజించారు .ప్రకాశం గారు తన జీవిత చరిత్రలో రావు గారిని చాలా సార్లు ప్రస్తావించారు .తెలుగు దేశం లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఖాళీ వస్తే రావు గారుపోటీచేశారు .కాకినాడ ప్లీడర్ కృత్తివేంటి పేర్రాజుగారు పోటీ .ఈయన న్యాపతి సుబ్బారావు గారి కాండిడేట్ .రావుగారు గెలిచారు .

  బళ్లారిలో రావు గారు 50వేల రూపాయలతో టౌన్ హాల్ కట్టించారు .30వేల పుస్తకాలున్న  గ్రంధాలయం 70వేలరూపాయలతో నిర్మించారు .ఉచిత వైద్యశాల కట్టించారు .తమ్ముడు నాటకకర్త కోలాచలం శ్రీనివాస రావు గారి నాటకాల ప్రదర్శన కోసం ‘’సుమనోరమా సభ ‘’ నాటక శాల నిర్మించారు  .పేదహిందూ బాలికల కోసం 20వేలతో అనాథ శరణాలయం కట్టించారు .పరిశ్రమలే దేశాభి వృద్ధికి మూలం అనే ఆలోచనతో ఒక లక్ష రూపాయన పెట్టు బడితోనాలుగు జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫాక్టరీలతో ‘’సభాపతి ప్రెస్ కంపెని లిమిటెడ్ స్థాపించారు .’’రిప్పన్ ప్రెస్ అండ్ షుగర్ మిల్స్ కంపెని లిమిటెడ్ ‘’ను తనవాటా 50వేల తో ప్రారంభించారు .ఈ రెండుసంస్థలకు రావు గారే చైర్మన్ .రెండు లక్షలపెట్టు బడితో పెట్టిన దక్కన్ ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ కంపెనీకి రావు గారు కార్యదర్శి .వజ్రకరూర్ డైమండ్ ప్రాస్పెక్టింగ్ కంపెని రష్యా దక్షిణాఫ్రికా పెట్టు బడి దార్లతో కలిసి తాను  మేనేజింగ్ డైరెక్టర్ గా నెలకొల్పారు .చాలా నూలు నేత చక్కెర్ ఫాక్టరీలలో వాటాలుండేవి.దుర  దృస్ట వశాత్తు  ఇవేవీ అభి వృద్ధి చెందక  భారీగా నష్టపోయారు .అవసాన దశలో కుటుంబం వ్యాజ్యాల పాలైంది . ఆస్తి అంతా హారతి కర్పూరమైంది. 25-12-1931న81 వ ఏట  అత్యంత దయనీయస్థితిలోరైటానరబుల్ కోలాచలం వెంకటరావు గారు మరణించారు .ఆకాలం లో రావు గారు లేని  బళ్ళారి లేదు. ఇప్పుడు ఆయన్ను స్మరించేవారే లేరు .తెల్లటి ఖద్దరు దుస్తులతో బంగారు రంగు చాయతో మెరిసి పోయేవారురావు గారు .ఆయనమునిమనవాడు అనంత ప్రసాద్ న్యాయవాది .

‘’ద్వావి వౌ పురుషౌ లోకే –స్వర్గస్యోపరి తిష్ఠతః-ప్రభు శ్చక్షమయా యుక్తః –దరిద్ర శ్చ ప్రదానవాన్ ‘’

భావం –ఇద్దరు వ్యక్తులు స్వర్గం దాటి దానిపైనున్న లోకాల్లో ఉంటారు .ఒకరు ఓర్పుగల ప్రభువు .రెండవవారు దానం చేసి దరిద్రుడైన వాడు.

మనవి-సుమారు అయిదేళ్ళ క్రితం బళ్ళారి నుంచి కోలాచలం ఇంటిపేరున్న లాయర్ గారు నా బ్లాగ్ లో నేను కోలాచలం మల్లి నాథ సూరి గురించిన రాసిన వ్యాసం చదివి ,ఫోన్ చేసి అభినందించి తన దగ్గరున్న ఆవంశ విశేషాలు ,కోలాచలం వెంకటరావు గారిపై ఆంగ్లం లో ఉన్న వ్యాసాలూ నాకు పంపారు రిజిస్టర్డ్ పోస్ట్ లో .నేను వెంటనే వాటిని అనువాదం చేసి నెట్ లో రాసేశా, నేను సరసభారతి పుస్తకాలు వారికి పంపాను నాలుగైదు సార్లు ఫోన్ లో మాట్లాడుకొన్నాం. ఆతర్వాత కమ్యూనికేట్ చేయటం కుదరలేదు . ఆ వెంటనే   బెజవాడ రేడియో వారు ఒక టాక్ వచ్చి రికార్డ్ చేయమనిఫోన్ చేస్తే , బెజవాడ రేడియో స్టేషన్ కు వెళ్లి వెంకటరావు గారి పై రాసిన వ్యాసంచదివి రికార్డ్ చేశాను. అది ఒకవారం లోనే ప్రసారమైంది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-7-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం ·        177-హొండూరస్ దేశ సాహిత్యం

  • ప్రపంచ దేశాల సారస్వతం ·        177-హొండూరస్ దేశ సాహిత్యం
  • కరేబియన్ సముద్ర తీరాన మధ్య అమెరికాలో హోండూరస్ దేశం ఉంది.రాజధాని –తెగూచిపైపా .కరెన్సీ హొండూరన్ లెంపిరా .జనాభా 96లక్షలు .స్పానిష్ భాష .రోమన్ కేధలిక్ మతం .అక్షరాస్యత 87శాతం .ఉచిత విద్య .వ్యవసాయం ముఖ్య ఆదాయం .కాఫీ బనానా ,కార్న్ ,వరి,బీన్స్ పండిస్తారు .మొసళ్ళు పాములు పెద్ద బల్లులు ఉంటాయి .కీయాస్ కోచినోస్ ,లేక్ యోజ్పా ,వెస్ట్ బే బీచ్ చూడతగినవి .జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి .
  • హొండూరస్  సాహిత్యం-ఈ దేశ సాహిత్యం ఫ్రే జోస్ ట్రినిడాడ్ రేయిస్ స్థాపించిన యూనివర్సిటీ తో ప్రారంభం .రోమా౦టిజం వచ్చాక సాహిత్య వికసనం జరిగింది. మాన్యుల్ మారినా విజ్జి ,జోస్ ఆంటోనియో దొమింగేజ్,కార్లోస్ ఫ్రేడరికో గూటరేజ్ రచయితలు వచ్చారు . గూటరేజ్ ‘’ఆన్జేలీనా ‘నవల 1889లో రాశాడు .మోడర్నిజం లోనూ జువాన్ రామోన్ మోలిన,ఫ్రయోలన్  టుర్సియోస్ ప్రయోగాలు  చేశారు .కొత్తతరం సాహిత్యకారులు ఆంటోనియో జోస్ రివాస్ ,పామ్పియో వాలీ ,రాబర్టో సోసా నెల్సన్ మేర్రెన్ ,ఆస్కార్ అకోస్టామార్కోస్ క్లారియస్,అర్మందో జలాయా వగైరా .హెలెన్ ఉమానియా ,మారియా యూజీన్ మోరోస్ ,మయ్రావుయులా ,సీజర్ర్ ఇందియానోకూడా ప్రముఖులే .స్త్రీలలో –ఐడా సబొంజ్ ,అలేజాన్ద్రా ఫోర్స్బెర్ముడేస్,అమండా కాస్ట్రో మొదలైనవారు న్నారు .
  • 178-ఎల్ సాల్వడార్ దేశ సాహిత్యం
  • రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్ చిన్న  జనసా౦ద్రత ఎక్కువున్న మధ్య అమెరికా దేశం .రాజధాని –సాన్ సాల్వడార్ .కరెన్సీ-అమెరికన్ డాలర్ .జనాభా -64.2లక్షలు .స్పానిష్ భాష .రోమన్ కేధలిక్ మతం.89శాతం అక్షరాస్యత .14వ ఏడుదాకా ఉచిత విద్య .తర్వాత సెకండరి .కాఫీ గోల్డ్ షుగర్ ఇధనాల్ కెమికల్స్ వగైరా ఆదాయవనరులు .లాగో డీ కొటేపెక్,జాయా డీ సెరీన్ ,సాంటా అనా వాల్కనో దర్శనీయాలు .అత్యధిక క్రైం రేటు ఉన్న దేశం
  •  ఎల్ సాల్వడార్ సాహిత్యం –మొదట్లోఅంతా జువాన్ ఆంటోనియో ఆరియస్ రాసిన మత సాహిత్యమే .జువాన్ డియాజ్  Vida y virtudes del venerable fray Andrés del Valle. అనే జీవిత చరిత్రరాశాడు .సాహితీ విమర్శకుడు Carta de Relación,ను Pedro de Alvarado రాశాడు .స్వతంత్రం పొందాక ఫాదర్ మాన్యుల్ అగులియర్  అణగారిన జాతుల విషయమై రాశాడు .వచనం లో ట్రాజేడిమొరాజన్ 1894లో ఫ్రాన్సిస్కో డియాజ్ రాశాడు .టు దిసిటిజన్ జోస్ ను మాక్వెల్ అల్వరేజ్ కాస్ట్రో రాశాడు. రూబెన్ డారియో-1867-1916,ఫ్రాన్సిస్కో గావీడా ప్రముఖకవులు.గవీడా జాతీయ సాహిత్యకర్త .విసేంటీ అకోస్టాజువాన్ జోస్ బెర్నాల్ కాలిక్స్తో వేలడోఇత్రరచయితలు .20వ శతాబ్దిలో మాన్యుల్ ఎన్రిక్ అరజువో మేధావి వర్గ ప్రశంశలు  పొందాడు .ఇంట్రాస్పెక్షన్ యుగం లో ఆల్ఫ్రెడో ఎస్పినో ప్రసిద్ధుడు .యాంటి మోడర్నిజం లో క్లాడియా లార్స్ ,రొక్ డాల్టన్ వగైరా  ప్రసిద్ధులు పాప్యులిజం ఆధారి టేరియ నిజం కాలం లో మాన్యుల్ బరేరా అ క్టోనల్ గువేరా ముఖ్యులు.
  •    సశేషం
  • మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-7-20-ఉయ్యూరు
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శెభాష్ సప్తగిరి దూరదర్శన్,ఆకాశ వాణి

ఛానళ్లన్నీ వ్యాపార సంస్థలుగా మారి పొతే ,ఏ కాలుష్యంరాజకీయ నీడ పడకుండా సంస్కృతీ సాహిత్యాలకు  ప్రభుత్వ రంగ  సంస్థలు దూరదర్శన్ ,ఆకాశ వాణి అత్యధిక ప్రాధాన్యమిచ్చి మంచి కార్యక్రమాలు నిర్వహించింది నిర్వహిస్తోంది కూడా .ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి కొమ్ము కాస్తున్నాయి   ఎందరో తెలుగు కవులను ,రచయితలను గొప్పగా పరిచయం చేశాయి .. దృశ్యమాధ్యమం కనుక దూర దర్శన్ మరింత చేరువైంది ప్రేక్షకులకు . రాజశేఖర చరిత్ర విశ్వనాధ వేయి పడగలు విష్ణు చర్మ ఇంగిలీషు చదువు ,మునిమాణిక్యం కధలు ,,భమిడిపాటి రామగోపాళం హాస్యామృతాలు ,శంకరమంచి సత్యం అమరావతి  కధలు ,మధురాంతకం కధలు పురాణ ఐతిహాసిక సాంఘిక నాటకాలు ,ఆరోగ్యవంతమైన హాస్య నాటకాలు,ధర్మవరపు సుబ్రహ్మణయం ఆనందో బ్రహ్మ ఒకటేమిటి   ఇలా పుంఖాను పు0ఖాలుగా నిర్మి0చి,సాహిత్య పోషణ చేస్తోంది . మువ్వలరవళి  ,కవుల జీవితాలు అరుదైన సంగీత రసవాహినులు కురిపిస్తూ తన్మయులను చేస్తోంది .

 ఇంతగా సేవ చేస్తున్నా వాటికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డిలో మెల్లగా కొంత ఆదరించి పుష్కలంగా కాకపోయినా కొంతవరకైనా ఆర్ధిక పరి పుష్టి కలిగించింది .ఈ ఆరేడు సంవత్సరాలలో ఆ మెల్ల కన్నూ పొడిచేసి  తీవ్ర నష్టం చేసింది  మాటల మాయా జాలమే కానీ  వాటిని కేంద్రం అస్సలు పట్టించుకోలేదు ,వారి గోడు విని పించుకోలేదు సాయమూ విదిలించలేదు ప్రయివేట్ సంస్థలకు మొత్తలావు వారికీ వత్తాసు పలకటమే కానీ కుంగి కునారిల్లుతున్న ప్రభుత్వ రంగాన్ని గాలి కొదిలేసింది .
  ఫండ్స్ లేమి తో బాధ పడుతున్నా ఈ రెండు మాధ్యమాలు అవిశ్రాంత కృషి చేస్తూ నే ఉన్నాయి  .వారి కృషికి హాట్సాఫ్ . కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఆ సంస్థల మనుగడ కాపాడాలి .అవి మన సంస్కృతీ పరిరక్షణకు రెండు కళ్ళు .అని గుర్తించాలి -దుర్గాప్రసాద్
Posted in రేడియో లో | Tagged | Leave a comment