హాం రేడియో విజ్ఞాన సర్వస్వం

 

హాం రేడియో విజ్ఞాన  సర్వస్వం

ఉయ్యూరు హైస్కూల్ లో నా జూనియర్ ,నా ప్రాణ స్నేహితుడు సూరి నరసింహం తమ్ముడు సూరి శ్రీరామ మూర్తి ,ఢిల్లీ లో టెక్నీషియన్ గా పని చేస్తూ ,వారానికో సారి నాకు చాలా వివరంగా ఇన్లాండ్ లెటర్స్ రాస్తూ ఉండేవాడు .ఆతర్వాత  ఎమెచ్యూర్ రేడియో అనే హాం రేడియో ను ఇండియాలో వ్యాప్తి చేసే సంకల్పం తో చాలా శ్రమ పడి,స్వయం కృషితో ,తీవ్రమైన అధ్యయనం తో,అధికారులవివిధ దేశాల పెద్దల , పరిచయాలతో దాన్ని సాధించి పయనీర్ అనిపించుకొన్నాడు .అతడు ఉయ్యూరు వచ్చినప్పుడల్లా నన్ను కలిసి తన హాం రేడియో ప్రగతిని వివరించే వాడు. నాకు అది గ్రీక్ అండ్ లాటిన్ గా, కోతలు గా అనిపించేవి .క్రమంగా అతని గురించి పేపర్లు రేడియో టివి ఇంటర్వ్యులతో అతడి గొప్ప తనం ఏమిటో అర్ధమైంది ఆరేడియో సభ్యులు యెంత విశ్వ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలను ముందే కనిపెట్టి ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ముందు చూపుతోసమన్వయము చేస్తూ బాధితులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తూ ,ప్రభుత్వాల ,ప్రజల ,ప్రజా సంస్థల అభిమానం పొందుతున్నారో అర్ధమైంది అతడిపై ఆరాధనా భావం ఏర్పడి అంతటివాడు నాకు ఆప్తమిత్రుడైనందుకు గర్వమూ కలిగింది .అతడు రాసిన ఆర్టికల్స్ నాకు పంపేవాడు వచ్చినప్పుడు హాం సమాచార విషయాలు తెలియ జేసేవాడు ఫోటోలతో సహా .కృష్ణా  జిల్లా హైస్కూల్స్ ,కాలేజీ లలో దాన్ని పరిచయం చేయటానికి చాలా తంటాలు పడ్డాడు కానీ పెద్దగా ఎవరికీ ఎక్కిన దాఖలా లేదని పించింది అంతా ‘’లైట్ తీసుకొన్నారు ‘’అయినా పట్టు వదలని విక్రమార్కుడుగా ఈ ‘’పొట్టిసూరి’’ అనే  శ్రీరామమూర్తి త్రివిక్రముడై విశ్వ హృదయం లో చిరస్థానం సంపాదించి ,చిర యశస్సు నార్జించాడు .మా ఉయ్యూరు కు ’’ హాం చిత్ర పటం’’ లో ముఖ్య స్థానం కల్పించాడు .ఉయ్యూరు కు చెందిన ‘’కేమోటాలజీ పిత డా కొలచల సీతారామయ్య ‘’ గారిపై నేను పుస్తకం రాసి సరసభారతి ద్వారా ప్రచురించి ఉయ్యూరు కాలేజి లో ఆవిష్కరింప జేసినప్పుడు సూరి అతని భార్య ,సీతారామయ్య గారి బంధువులు కూడా పాల్గొని విజయవంతం చేశారు .మేమిద్దరం ఫోన్ ద్వారా మెయిల్ ద్వారా టచ్ లోనే ఉంటున్నాం .

  నిన్న సాయంత్రం అకస్మాత్తుగా మా ఇంటికి వచ్చి  సూరి తాను రాసిన ‘’ALL ABOUT AMETEUR RADIO –HAAM RADIYO ‘’ అనే430 పేజీల  ఉద్గ్రంధం నాకు అందజేసి ,నేను ఇచ్చిన సరసభారతి శ్రీ శార్వరి ఉగాది ఆవిష్కరణ పుస్తకాలు మూడూ తీసుకొని సంతోషించాడు ఒకగంట సేపు తన అనుభవాలు గుది గుచ్చి మాట్లాడాడు .ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడెక్కడో శాఖా చంక్రమణం చేసి ముగించటం సూరి ప్రత్యేకత .చెప్పిన దాంట్లో సార్వకాలిక సత్యాలు అనుభవాలు అనుభూతులే ఉంటాయి .ఈ మధ్య నేను రాసిన ‘’మహాత్యాగి మద్దూరి అన్న పూర్ణయ్య’’ధారా వాహిక నెట్ లో చదివి బెస్ట్ కాంప్లిమెంట్ కూడా చేసిన సహృదయుడు సూరి .

  ఇప్పుడే అతడిచ్చిన పుస్తకం తిరగేశా .అద్భుతం అని పించింది .అందులో ఆపుస్తకం గురి౦చి, అతని గురించి విలువైన అభిప్రాయాలు రాసిన మాటలలో సూరిని మీకు ఆవిష్కరించి చూపుతున్నాను .పాప్యులర్ హాం ప్రమోటర్ అమెరికా కు చెందిన-  మిస్టర్ గార్డెన్  వెస్ట్’’ఇది అద్భుతమైన పుస్తకం  ,హాం గురించిన విజ్ఞాన సర్వస్వం .ఇండియాలో, ప్రపంచం లోనూ హాం రేడియో గురించి తెలుసుకొనే వారికి గొప్ప’’ కర దీపిక ‘’  అన్నాడు .డాక్టర్ ఫేజెల్ యు.ఆర్.రెహ్మాన్ –చైర్మన్ NIAR ‘’రచయితకు రాజీవ్ గాంధీ రాజకీయ నాయకుడు కాకముందు నుంచి పరిచయం ఉండటం ,హాం రేడియో విస్తరణపైవారిద్దరూ  సుదీర్ఘంగా ఆలోచనలు చేయటం ,ప్రణాళికకలు రచించటం గురించి అత్యంత విస్తృతంగా రాశాడు .దేశ ప్రణాలికా రచయితలూ ,సిద్ధాంత కర్తలు హాం రేడియో చేసిన అద్భుత కృషిని గుర్తించారు ‘’అన్నాడు .జర్మని కి చెందిన ఫ్రాంజ్ బెర్నేట్ ‘’ఈ పుస్తకం ఆసా౦త౦ చదివాను .ఇది ప్రత్యేక పుస్తకం .ఇండియన్ అమెచ్యూర్ రేడియో గురించి సాధికారమైన వివరణ ఉంది .అంకిత భావం తో యువ హామ్స్ఇండియాలో ,ముఖ్యంగా విపత్తుల సమయం లో చేసిన నిస్వార్ధ సేవను ప్రతి బి౦బి౦చి౦ది ‘’అంటాడు .మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు ‘’చాలాకాలంగా సూరి నాకు పరిచయం .నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో –NIAR స్థాపించటం లో అతడు ప్రవక్త –ప్రోటాగనిస్ట్.దీనిద్వారా అతడు ప్రజలకు అందించిన సేవ నిరుపమానం .ఎందరో ప్రజల ధన,మాన ప్రాణ జీవితాలను కాపాడిన నిస్వార్ధ సేవ అతడిది .అతడి సేవలను ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రపంచ వ్యాప్తం గా బాగా గుర్తించాయి .మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్-‘’సూరి అత్యద్భుత గుణాలు మూర్తీభవించిన నాయకుడు .ప్రపంచ ప్రసిద్ధ NIARస్థాపించటం లో ఆయన దూర దృష్టి, విజ్ఞత కనిపిస్తుంది . సూరి ,ఆ సంస్థ ప్రకృతి సిద్ధమైన విపత్తులలో చూపినచచొరవ ,వేలాది మనుష్యుల జంతువుల ప్రాణాలను,ఆస్తులను  కాపాడటం లో చూపిన నైపుణ్యం చిరస్మరణీయం ‘’అన్నారు .’’సాంకేతిక విషయ వివరణలో ఈ గ్రంథం ఒక మహా విజ్ఞాన సర్వస్వమే .క్రిస్టల్ లాడర్ ఫిల్టర్  నుంచి పి.ఎ.ట్రాన్సిస్టర్ దాకా నిర్మాణం ఇందులో వివరంగా ఉన్నది ,సరదాగాఇండియాలో హాం రేడియో గురించి తెలుసుకోవాలన్నా ,ప్రపంచ వ్యాప్త హాం రేడియో గురించి అంతరిక్షం లో హాం సీలు తెలుసుకొని అర్ధం చేసుకోవాలన్న వారందరికీ  ఈ పుస్తక౦ గొప్ప మార్గదర్శి ‘’ అని  గార్డన్ వెస్ట్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు .ఇంతటి విలువైన గ్రంధాన్ని ఎంతో పరిశోధనతో ,పరిశీలనతో రాసిన ఆప్తమిత్రుడు సూరి శ్రీరామ మూర్తి నా దృష్టిలో ‘’హాం సూర్యుడు అంటే హాం సూరి ‘’

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కార్తీక,  మార్గశిర మాసాలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు

 

కార్తీక,  మార్గశిర మాసాలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు

సాహితీ బంధువులకు ఆధ్యాత్మిక భావుకులకు దీపావళి శుభాకాంక్షలు –

1-పరమ శివునికి ఇష్టమైన పవిత్ర కార్తీక మాస సందర్భంగా సరసభారతి ఫేస్ బుక్ ద్వారా 16-11-20 కార్తీక శుద్ధ పాడ్యమి సోమవారం ఉదయం 10గంటలనుండి –విజయనగర సామ్రాజ్య సంస్థాపనా చార్య , శ్రీ శ్రీ మాధవ  విద్యారణ్య స్వామి సంస్కృతం లో రచించిన ‘’శ్రీ శంకర విజయం ‘’-జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య చరిత్ర- ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది .

2-మాధవునికి అత్యంత ప్రీతి పాత్రమైన  మార్గశిర మాసం లో  15-12-20 మార్గశిర శుద్ధ పాడ్యమి మంగళ వారం ఉదయం 10 గంటలనుంచి’’ శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం ‘’ డా .ఇలపావులూరి పాండు రంగారావు గారి ‘’సహస్ర ధార’’ఆధారంగా ప్రత్యక్ష ప్రసారం

3-కార్తీక మాసం లో 16-11-20 సోమవారం నుండి అంతర్జాలం లో మహాకవి భారవి రచించిన ‘’కిరాతార్జునీయం ‘’ 4 వ సర్గ నుండి దారావాహికగా రాసి అందిస్తున్నానని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది –

             మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

మా ఇంట్లో ఇవాళ 6-11-20 శుక్రవారం సాయంత్రం ” హాం రేడియో అధినేత ”సూరి శ్రీరామమూర్తి

మా ఇంట్లో ఇవాళ 6-11-20 శుక్రవారం సాయంత్రం ” హాం రేడియో అధినేత ”సూరి శ్రీరామమూర్తి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -14 11-మనోహరమైన ట్రిప్

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -14

11-మనోహరమైన ట్రిప్

హోవర్ క్రాఫ్ట్ లో నేనూ అమ్మమ్మ,లెక్స్ ము౦దుసీట్లలో ,వెనక ఏమీ పట్టనట్లు నాన్సీ,ప్రక్కన కూతురు  ప్రక్కన చిన్నపిల్ల వెండీ కూర్చున్నాం .టిక్ నాకు,అమ్మమ్మకు మధ్య కూర్చుంది .టెలోస్ ను దాటి హార్బర్ కు చేరేలోపు ఎల్లీ ఆవలిస్తోంది .హార్బర్ లోపడవలు మహా బాగా అనేకరంగుల్లో ఆకర్షణగా,అనేకరూపాలలో  ఉన్నాయి భూమి మీద వాటి కంటే .అందులోకొన్ని ఈదుతున్న ఏనుగుల్లాగా ,పులుల్లాగా ,సింహాలు తాబేళ్లు ,డాల్ఫిన్స్ కుక్కలు  పిల్లుల ఆకారంలో ముచ్చటగా ఉన్నాయి .దీన్ని ఇదివరకు చూశానునేను. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారని లెక్స్ ను అడిగాను .అంతులేని సముద్రంలో రీఫ్స్అంటే దిబ్బల  మధ్యగా చొచ్చుకు పోతున్నాం అంతటా నీల౦ రంగే .ఆనందంపట్టలేక పిల్లలు కేరింతలు కొడుతుంటే ఆపుతోంది నాన్సీ .నా చెవిలో ‘’బాగున్నాడుకదా’’అంది అమ్మమ్మ ప్రశ్నార్ధకంగా .ఆమె అన్నీ తెలిసింది .ఆలోచించి నిర్ణయాలు తీసుకొనేది కనుక నేను ముభావంగానే ఉన్నాను .ముసలితనంలోనూ అమ్మమ్మ  అందంగానే కనిపిస్తుంది .

క్రమంగా మా క్రాఫ్ట్ దిగటం మొదలుపెట్టి  మధ్యలో ఉన్న  ఒక అడవిలోని పచ్చగడ్డిపై నెమ్మదిగా లాండ్ అయింది .ప్రక్కన ఒక పూల్, స్ప్రింగ్ ఉన్నాయి .సముద్రం నుంచి పొగ అనంతాకాశాన్ని కప్పేస్తూ ప్రశాంతత కల్పిస్తోంది ..’’హాట్ స్ప్రింగ్స్ అరుదుగా ఉంటాయి.మనకూ నార్త్ అమెరికాలో ఉన్నాయి అక్కడినుంచే ప్రవహించి ఇక్కడికి వచ్చాయేమో ?’’అంది నాన్సీ .’’ఇలాంటిది మనకెక్కడా లేవు ?ఈ స్ప్రింగ్స్ దగ్గర అసాధారణ పుష్పాలున్నాయి ఎక్కడైనా చూశావా .ఇలాంటి మనోహర వాతావరణం ఎక్కడా లేదు అందుకే దీన్ని ‘’భూమి ఒడి’’దిలాప్ ఆఫ్ దిఎర్త్ అంటారు ‘’అన్నాడు లెక్స్  .’’భలే పేరు ‘’అంది అతడివైపు అభినందన చూపుతో అమ్మమ్మ .’’నిజమే .మీరుప్రపంచం  చివర ఉన్నట్లు అనుభూతి పొందుతారు .దానికి ఈ స్ట్రీం మాజికల్ ఎంట్రన్స్ అనిపిస్తుంది ‘’అన్నాడు చిరునవ్వుతో .ఇంతలో ఒక జెట్ ఆ స్ప్రింగ్ ను చీల్చుకొంటూ బయటి రాగా అందరం హాయిగా నవ్వాం .’’మనం అంతా కళ్ళుమూసుకొని ఏదైనా అనుకొంటే వెంటనే తీరుతుంది స్ప్రింగ్ లో నుంచి నీరు చిమ్మినప్పుడు కోరాలి ఇక్కడ ఆచారం అది  ‘’అన్నాడు లెక్స్.నాన్సీ కూడా కళ్ళు మూసుకొన్నది .మళ్ళీ మేము హోవర్ క్రాఫ్ట్ ఎక్కాం.నేను లెక్స్ పక్కనే  కూర్చున్నా అతడిని బాగా గమనించటానికి ..నెమ్మదిగా పైకి లేచి౦ది క్రాఫ్ట్ .నాగురించి తెలుసుకోవాల్సింది ఏముంది అని తన విషయం చెప్పాడు –‘’నేను పెరు లో తెల్లవాళ్ళు నిరంతరం నల్లవారిని బాధపెట్టే ఇండియన్ లు ఉండే చోట ఉంటాను .మానాన్న ఓల్డ్ ఆర్డర్ కు చెందిన చీఫ్టేన్.నాకు గుర్రపుస్వారీ వచ్చుకనుక ఆయన చేసే సుదూర ప్రయాణాలలో నేనూ వెంట వెళ్ళేవాడిని .ఆగుర్రం నాదైపోయింది .స్వారి నా ఇష్టమైంది .ఇక్కడ దాన్ని కోల్పోయాను .మా నాన్న దారుణంగా చంపబడ్డాడు తెల్లగవర్నర్లే ఆ దారుణం చేసి ఉంటారు .ఆయన వాళ్ళు చెప్పినట్లు చేసేమనిషి కాదు . ముక్కు సూటి వ్యక్తీ .అమ్మా నేను ఆయన లేకపోవటాన్ని జీర్ణిం చు కోలేకపోయాం .మావాళ్ళు నన్ను  చీఫ్టేన్ గా ఉండమని బలవంతపెడితే సరే నన్నాను .నేనొక అందమైన తెలివిగల అమ్మాయిని పెళ్ళాడా .మాకు ముగ్గురు పిల్లలు .మా అమ్మాయి పెళ్ళయ్యాక నా భార్య చనిపోయింది .ఆడుఖం ఇంకా నన్ను వదలలేదు .ఆశోకమే ననిక్కడికి తెచ్చింది .మాపిల్లలు పెరిగిపెద్దవారై ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు .ఇక్కడి మనిషి ఒకాయనపరిచయమై నన్నుఇక్కడికి తెచ్చాడు ‘’అన్నాడు లెక్స్.

‘’ఒకప్పుడిక్కడ మనుషులు  ఉండేవారు .ఈ స్వర్గాన్ని వదిలి వాళ్ళు ఎందుకు వెళ్ళారో నాకు అర్ధం కాదు ‘’అన్నాను .’’కొందరు భూమి క్రస్ట్ లోకి పనిమీద వెడతారు .ఎక్కువకాలం ఉండరు .టెలోస్ లో   సరైన సెటిలర్స్ ను వెతకటానికి వెల్తారేమో మానవ  గూఢచారుల్లా ఉంటారు  ?’’అన్నాడు లెక్స్.నేనుకూడా ఇక్కడికి ఎలా వచ్చానో అతడికి చెప్పాను .మళ్ళీ మేము ఒక ఐలాండ్ మీద దిగాం .ఇక్కడ పాం ట్రీస్,ట్రాపికల్ ట్రీస్ బాగా  ఉన్నాయి .ఒక దుప్పి మాదగ్గరకు దూసుకొచ్చింది .’’వాటికి మనుషులు అలవాటే .ఇది ‘’జు’  ’పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది .ఇక్కడి జంతువులు అడవి రాజు సింహం ఏనుగులతో సహా  మచ్చిక చేయబడి ప్రమాద రహితంగా ఉంటాయి .డ్రాగన్స్ కూడా చూడచ్చు .ద్రాగన్స్ పేరు చెప్పగానే పిల్లల్లో ఉత్సాహం ఉబికింది .డ్రాగన్స్ కధల్లో ఉంటాయి కానీ నిజంగా ఉంటాయా “’అని అడిగారు .’’అవి రక్తం తాగే మనుషులదగ్గర ఉండవు ప్రశాంతంగా ఉండే చోట్లలోనే ఉంటాయి .అద్భుత జంతువులవి .మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడుచూశాను వాటిని .అవి మిత్ కాని లెజెండ్ కానీ కావు నిజమైన జంతువులే .ఒకప్పుడు వేలాది సంవత్సరాలక్రితం ఉండేవి భూమిపైన.వాటిపై స్వారీ చేసే మనుషులుకూడా ఉండేవారు .కుర్రకారు దాన్ని ఎంచుకోనేవారు .దానికి ట్రెయినింగ్ చాలాకాలం కస్టపడి నేర్చుకోవాలి .భూమిపై వాటిని వేటాడి చంపుతుంటే భయపడి అగర్తాలోకి చేరిసురక్షిత౦గా ఉన్నాయి డ్రాగన్స్ .కొన్నిటిని మచ్చిక చేసి ట్రాన్స్ పోర్ట్ కు వాడుతున్నారు .అవి అందంగా అనేక రంగుల్లో ఉంటాయి కానీ మౌలికంగా అవి అడవి అంత ఆకు పచ్చరంగులో ఉంటాయి .ఇక్కడ వాటిపై సురక్షితమైన  జీన్స్ వేసి ,రైడింగ్ క్లాసులు కూడ   నిర్వహిస్తున్నారు .వాటికి గుర్రాలకున్న తెలివి తేటలన్నీ ఉన్నాయనీ ,ఇక్కడి టెలోస్ మనుషులతో స్నేహంగా ఉంటాయని ‘’అన్నాను .

పిల్లలిద్దరూ ఉత్సాహంగా ఉల్లాసంగా విన్నారు .నాన్సీ కూడా విన్నదికానీ నమ్మటం లేదని అనిపించింది .డ్రాగన్స్ తో తన అనుభవాన్ని  ఒకసారి ఒక డ్రాగన్ పై స్వారీ చేసిన సంగతిని లెక్స్ చెప్పాడు .డ్రాగన్స్ తోపాటు మానవ హింసను భరించలేని మరికొన్ని అరుదైన జంతువులు భూమిని వదిలి ఇక్కడేఆగర్తాలొ క్షేమంగా ఉన్నాయని కూడా చెప్పాడు .

‘’ఎంత మంచి సువాసన వస్తోందో ఇక్కడ చూశారా ‘’అంది అమ్మమ్మ .నాకేమీ కొత్తగాలేదు .’’ఇక్కడ అనేక దేశాల స్పైసెస్ పండిస్తారు .విత్తనాలు చల్లుతారు అవే మొలకెత్తి చెట్లు అవుతాయి .వీటికి కాపలాదార్లు  రూఫ్ లెస్ ఇళ్ళలో చుట్టూ ఉంటారు .ప్రతి ఇంటికీ ఫెన్సింగ్ ఉంటుంది .మేము ఒక ఇంటి ము౦దు ఆగాం .అక్కడ ఓనర్లు బ్రేక్ తీసుకొంటున్నారు .మమ్మల్ని ఆహ్వానించి కాఫీ కాకుండా టీలాంటి డ్రింక్ ఇచ్చారు .తినటానికి కేక్స్ కాకుండా బ్రెడ్ పెట్టారు.అవి స్వీకరించి ప్లాంటేషన్ చూశాం ఎక్కడా కలుపు మొక్కలు లేవు .రైతులు చేతిలో మ్యూజికల్  ఇన్స్ట్రు మెంట్స్ పుచ్చుకొని ,చుట్టూ తిరుగుతూ పాడుతూ వాయిస్తూ వాటికి ప్రేరణ కలిగిస్తున్నారు .పిల్లలు ఫ్లూట్ ,ఆయన గిటార్ వాయిస్తున్నారు .నాన్సీ చెవులు మూసుకొని ఇక ఆపండి అన్నట్లు చూసింది .అమ్మమ్మ కోపంగా చూసింది .

‘’నువ్వు సరిగా ప్రవర్తించలేకపోతే ,హాయిగా ఇంటికి వెళ్లిపోవచ్చు .సంగీతం హృదయాహ్లాదంగా ఉ౦దిమాకు .ఆపిల్లల్తో సహా అంతా ఎంజాయ్ చేస్తున్నారు ,డాన్స్ చేస్తున్నారు .పాడుతున్నారు నవ్వుతున్నారు ఆనంద బాష్పాలు కారుస్తున్నారు చూడు’’అని సివియర్ గానే అంది అమ్మమ్మ .ఎలుగుబంటి తో సహా అడవి మృగాలు చూశాం .ఎలుగు వీపుతట్టాడు లెక్స్ ఆప్యాయంగా. టిక్ పిల్లలతో పాటే ఆన౦దిస్తోంది ‘’వెళ్దామా ?’’అన్నాడు లెక్స్

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-11-20-ఉయ్యూరు  .

 

.

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి(వ్యాసం ) -గబ్బిట దుర్గా ప్రసాద్

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి(వ్యాసం ) -గబ్బిట దుర్గా ప్రసాద్

 

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి -గబ్బిట దుర్గా ప్రసాద్  విహంగ మహిళా వెబ్ మాస పత్రిక -నవంబర్  

1938మార్చి నెల 25న ప్రమీలా నిసర్గి కర్ణాటకలోని మైసూర్ లో పుట్టింది .తల్లి స్వాతంత్ర్య సరయోధురాలు .తండ్రి స్వయం వ్యక్తిత్వమున్న వాడు .ఆకుటుంబం లో కాలేజీకి వెళ్లి చదివిన మొదటి వ్యక్తి  ప్రమీల .1958లో బి.ఎస్. సి .చదివి పాసై ,1960లో ‘’బాచిలర్ ఆఫ్ లాస్’’ చదివి డిగ్రీ పొందింది .’’లా ‘’లో గ్రాడ్యుయేట్ డిగ్రీ 1963లో అందుకొన్నది .’’మాస్టర్ ఆఫ్ లాస్ ‘’ అంటే న్యాయశాస్త్ర సిద్ధాంత అధ్యయనం కు (జూరిస్ ప్రుడెన్స్ )అర్హత సాధించిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది .

  ప్రమీల తన న్యాయ వాద జీవితాన్ని ఎం.ఎల్.చేస్తూనే ,అండర్ గ్రాడ్యుయేట్-ఎల్.ఎల్ .బి.  అయిన తన లెక్చరర్, గ్రాడ్యుయేట్ క్లాసులు బోధించటం పై ధైర్యంగా రిట్ పిటీషన్ వేయటం తో  ప్రారంభంచి౦ది .ఆ తర్వాత అనేక  సంచలనాత్మక ,సున్నితమైన కేసులు చేబట్టి, సమర్ధంగా వాదించి మంచి లాయర్ గా పేరు పొందింది .మహిళలకు వెన్ను దన్ను గా నిలిచి ,వారికి జరుగుతున్న అన్యాయాల నుండి విముక్తి చేయటమే జీవిత ధ్యేయంగా భావించింది .అంతకు కొన్ని దశాబ్దాల ముందు లాయర్ వృత్తి అంటే మగవారికి మాత్రమే అన్నట్లు ఉండేది .ఆ అపప్రధను తొలగించి మహిళా న్యాయ వాదులు కూడాసర్వ సమర్దులే అని చాలెంజి చేసితన వాదనలద్వారా  నిరూపించి,ప్రముఖ లాయర్ గా కీర్తి గడించింది ప్రమీల .అనేక వివాదాస్పదమైన కేసుల్లో మంత్రులకు వ్యతిరేకంగా వాదించి ,అభాగ్యులకు న్యాయం చేకూర్చింది .నాయకుల అన్యాయం ,అవనీతి పై తీవ్ర పోరాటమే చేసి విజయం సాధించిన  మహిళా యోధురాలు లాయర్ ప్రమీల .

   1978లో ప్రమీలా నిసర్గి రాజకీయ అరంగేట్రం చేసింది .మొదటి మహిళా సెనేట్ మెంబర్ అంటే ఎం.ఎల్ .ఏ.గా కర్ణాటక అసెంబ్లీ కి జనతా పార్టీ తరఫున పోటీ చేసి,  ఎన్నికై,చరిత్ర సృష్టించి,1978నుంచి అయిదేళ్ళు 83వరకు ఉన్నది .బెంగుళూరు లో చామరాజపేట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచింది .1991లో నార్త్ బెంగుళూరు నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి సి.కె.జాఫర్ షరీఫ్ చేతిలో ఓడిపోయింది .మళ్ళీ 1991లో బెంగుళూరు చామరాజు పేటనుంచి  శాసన సభకు ఎన్నికై 1994వరకు ప్రజా వాణి వినిపించింది .2007లో ప్రమీల రాష్ట్ర మహిళా సంఘానికి అధ్యక్షురాలు –చైర్ పర్సన్ అయింది .2007నుంచి 2014వరకు ‘’ఇండియన్ వుమెన్ లాయర్ ‘’కు ప్రెసిడెంట్ గా పని చేసింది .

  బాల కార్మికులు ,హౌస్ అండ్ రెంట్ కంట్రోల్ ,పని చేసే చోట సెక్సువల్ హింస ,గృహ హింస ,ఖైదీల దుస్థితి మొదలైన సున్నితమైన అంశాలపై రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలకు అనేక రిపోర్ట్ లను అందజేసింది .అసంఘటిత వర్గాల హక్కులకోసం నిలబడి పని చేసింది .హిందూ ,మహమ్మదీయ చట్టాల వలన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వాలకు తెలియ జెప్పుతూ వాటిలో రావాల్సిన సంస్కరణలను సూచించింది .క్రిమినల్ ప్రొసీజర్ లా ,ఎవిడెన్స్ యాక్ట్ ,సైబెర్ యాక్ట్ ,సమాచార హక్కు చట్టం లలో పునర్విమర్శ –రివిజన్ కు  సిఫార్సు చేసింది .విద్యా కమిటీలో సభ్యురాలై, ఆమె సూచించినవిషయాలు విధానాలను అందరూ అంగీకరించి మెడికల్ ,టెక్నికల్ ,సాధారణ విద్యలలోఅమలు జరిపి ప్రభుత్వం గొప్ప మేలు చేకూర్చింది .విద్యా కమిటీలో ఉండగా, అనేక యూని వర్సిటీలు సందర్శించి ,అక్కడి ఉత్సవాలలో పాల్గొన్నది .శాసన సభ్యురాలిగా ఉంటూ ,ప్రభుత్వం లో చాలా విషయాలలో సామర్ధ్యంగా పని చేసి, తన శక్తి నిరూపించింది నేగి .’’సామ్రాగ్నిస్వ ఉద్యోగ్ ట్రస్ట్’’ కు అధ్యక్షురాలై స్త్రీజన నైపుణ్యాభి వృద్ధికీ ,స్పెషల్ చిల్డ్రన్ ల నైపుణ్యాభి వృద్ధికీ గొప్ప కృషి చేసింది..

  ప్రమీలా నిసర్గి కి సాహిత్య రంగం కూడా చాలాఅభిమాన విషయమే . ’’కామెంటరి అండ్ హౌస్ అండ్ సెంట్రల్ యాక్ట్ ఆఫ్ కర్ణాటక ‘’అనే అత్యంత విలువైన గ్రంథం రచించింది ప్రమీల. కన్నడ సాహిత్య పరిషత్ తో ఆమెకు విడదీయరాని ప్రత్యేక అనుబంధం ఉన్నది.కర్ణాటక సాహిత్య ప్రముఖులకు ఎందరికో తన చేతులమీదుగా ఘనసన్మానం చేసింది .2018ఆగస్ట్ లో ప్రమీల కు’’ పవర్ బ్రాండ్స్ సంస్థ— ‘’భారతీయ మానవతా వికాస్ పురస్కార్’’అందించి గౌరవించి సత్కరించింది .భారత దేశం లో ప్రమీలా నిసర్గి గౌరవ ప్రదమైన ప్రముఖ ‘’ ఆడ్వొ కేట్ యాక్టి విస్ట్’’గా నూ ,చట్టం ,న్యాయాల సంస్కరణల సంధానకర్త గా చిర కీర్తి నార్జించింది .అసాధారణ రాజకీయ నేతృత్వం ,నిశిత దృష్టి,చాతుర్యం ,సామాన్యమానవుల అభివృద్ధికై అసాధారణ కృషి ,రేపటి పచ్చదనం పై అవిశ్రాంత కృషి ,ఎవరూ అందుకోలేనంత సర్వ సమర్ధత కు చిరునామా ప్రమీల నిసర్గి .

  -గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతికి 15వేల రూపాయలు అందజేత

సాహితీ బంధువులకు శుభ కామనలు -ప్రఖ్యాత అణు శాస్త్ర వేత్త 117వ మూలకం” టేన్నిస్సిన్  ”కనిపెట్టిన ఆంద్ర శాస్త్రజ్ఞులు డా ఆకునూరి వెంకటరామయ్య గారు ,వారి శ్రీమతి కృష్ణ మయి గారు  నాలుగు రోజుల క్రితం అమెరికా నుంచి ఫోన్ చేసి, రెగ్యులర్ గా సరసభారతి బ్లాగ్ చదువుతున్నామనీ ,ఎన్నో అమూల్య విషయాలు తెలుస్తున్నాయని అభినందించి సరసభారతి సాహిత్య కృషికి దీపావళి కానుకగా 15 వేల రూపాయలు అందజేయాలను కొన్నామని చెప్పి ,విజయవాడలో ఉన్న మా మేనకోడలు,వారికి అమెరికాలో కుటుంబ స్నేహితురాలు శ్రీమతి ఇందుమతి ద్వారా నా బాంక్ అకౌంట్ కు  ఆడబ్బు ప౦పారని తెలియజేయటానికి సంతోషంగా ఉంది .వారి సౌజన్యానికి ధన్యవాదాలు .వారికెల్లప్పుడూ శుభం జరగాలని,ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనీ  నేనూ ,సరసభారతి కోరుతున్నాం ..అందరికి దీపావళి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ 3-11-20

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి నవంబరు 1.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి నవంబరు1.
దేవులపల్లి తన మొదటి రచన ‘కృష్ణపక్షం ‘, లోతన కవిత్వంలోని మెళుకువలు చెప్పడం కోసం బరంపురం నుంచి బళ్ళారి వరకూ ప్రచారం చేసారు,
1921 లో ఉపాధ్యాయుడిగా  వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. (పిఠాపురం స్కూల్లో జీతం 70 రూ., పెద్దాపురంలో 60 రూ.కాకినాడ మెక్లారన్ లో 50 రూ.
తన కవితా ప్రచారం లోఅన్నీ పోగొట్టుకుని మునిగిపోయిన ఆయన్ని రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు పిలిచి  తక్కువ జీతం అయినా 40 రూ.  మీద ఉద్యోగంలో చేరమని కోరారు, ‘జీతం తక్కువ అని అనుకోవడం లేదు, ఇంతకు ముందు నేను పనిచేసినప్పుడు సంవత్సరానికి పది రూపాయలు తగ్గుతూ వచ్చింది, కాబట్టి నేనే మీకు డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకే చేరను’ అని ఛలోక్తి గా జవాబిచ్చారు.  స్వేచ్చాప్రవ్రుత్తి గల ఆయన  ఏ ఉద్యోగంలోనూ  కొనసాగలేక పోయారు
ఆయన మంచి వక్త, వేల మంది వచ్చినా ఆయన ౩ గం. పాటుచేసే   ప్రసంగం  కదలకుండా వినేవారు. తన  కొడుకు బుజ్జాయి ని  ఒక్క క్షణం వదలకుండా తన సభలకు తిప్పుకుపోతుండడం వలన, బుజ్జాయి చదువుకోలేకపోయారు. తనని ఒళ్లో కూర్చోబెట్టుకొని బొమ్మలు వేసిన అడవి బాపిరాజును చూసి  బుజ్జాయి చదువుకోలేకపోయారు. తనని ఒళ్లో కూర్చోబెట్టుకొని బొమ్మలు వేసిన అడవి బాపిరాజు ను చూసి  బుజ్జాయి ప్రముఖ చిత్రకారుడు అయారు.
‘పల్లకీ’ అనే భావ కవిత వారి కవితల్లో  తలమానికం. ప్రియురాలి మనస్సులోని ఉద్వేగానికి ‘పల్లకీ’ప్రతీక. బోయీల అరుపుల్లో, పల్లకీ నడకల్లోని  భావమూ, ధ్వనీ కలిసిపోయి, మృదు మధురమైన చిత్రం ఈ కవితలో మన కళ్ళ ముందు నిలుస్తుంది.

1937 లో మద్రాసు ‘ఆకాశవాణి’ వారి ప్రసంగంతో నే మొదలైంది.  ఎన్నో పాటలు, సంగీత రూపకాలు వారివి  ప్రసారం అయాయి.
సినిమా కవి గా గుర్తింపు పొందిన వారు ఐదు వందల పై చిలుకు పాటలు రాసారు. ‘అలలు కొలనులో గల గల మనినా..’ అన్న పాట –  లలిత లలిత లతాంతాలవంటి పద చిత్రాల కూర్పుతో శబ్దమూ భావమూ కలిసి పోయి –  మనల్ని  సమ్మోహితుల్ని చేస్తుంది
‘అసలే ఆనదు చూపు..ఆపై కన్నీరు’ అంటూ శబరి ఆవేదనను వ్యక్తం చేయటంలో ఆయనకు ఆయనే సాటి
1964 లో తన గొంతు బొంగురు పోవడాన్ని గుర్తించారు. అప్పుడు తను రాసిన ఉపన్యాసాన్ని తిరుపతిలో బాలాంత్రకపు రజనీ కాంత రావు చేత చదివించారు. తన 6 7 వ ఏట గొంతు కాన్సర్ ఆపరేషన్ జరగటంతో మూగతనం వచ్చింది, ఉపన్యాసాలను పాలగుమ్మి పద్మరాజు చేత చదివింప జేసేవారు.   చేతిలో కాగితం, పెన్నూ వుంచుకొని 16 ఏళ్ల పాటు తను మాట్లాడ దలచుకున్నది అంతా రాసి చూపించేవారు.  భావకవితా భాస్కరుడు దేవులపల్లి  తను ఎప్పుడూ ‘మహాకవి’ అని అనిపించుకోవడానికి తాపత్రయపడలేదు.
మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…
ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…
కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా…
తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా…
అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది.
సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళించేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా..
పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…
పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..
అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని…గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…
గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో
అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…
ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. .
“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు…
ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..
అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు.
“నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం…త్రోవలో కారడవిలో తోత్తోడ న…
నడిపే రామచరణం… నావ అయితే రామచరణం…త్రోవ అయితే రామచరణం…మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం.”
అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…
కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…
అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి…
“ఈ గంగాకెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు…
సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది.
చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగాలిగాం…
తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..
మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి…
చిత్ర పరిశ్రమకు సంభందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు..
గొల్లపూడి మారుతీ రావు గారు కూడా మద్రాసులోనే వుండేవారు..
ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలో మారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..
“పొద్దున్నేఎవరో హానుభావులు..” అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు
ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..
అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు.
కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి..
మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ…లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు గారు.
“మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తే ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా
తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్న అక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు..
అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన..
ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…మీరే చదవండి .
శాస్త్రిగారికి స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయినందున ఎక్కడి కెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు…ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు…
మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చి అలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు…
ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు…
ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు…
అందులో ఏముందో చదివి మారుతీ రావు గారు లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికిచాలా టైం పట్టింది. ఏం సమాధానం చెవెంటనే అర్థం కాలేదు…అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు…
అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తలఎత్తి శాస్త్రిగారే వేపు కాసేపలా చూస్తూ ఉండి పోయారు..
“పెరిగి విరిగితి విరిగి పెరిగితి…కష్ట సుఖముల సార మెరిగితి…పండుచున్నవి ఆశ లెన్నొ…ఎండి రాలగ పోగిలితిన్…” అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి..
ఎప్పుడూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు…
చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు…
దుఃఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు…
“మారుతీ రావూ…నా పరిస్థితులేమి బాగా లేవయ్యా…చాలా ఇబ్బందుల్లో వున్నాను…ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి…అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను…
నీ ఎరకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు…అమ్మేద్దాం…నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని…కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది…
నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు…గొప్పసాయం చేసిన వాదివవుతావ్…”
తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారిపడి మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..
ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని
“..మాస్టారు…మీ పరిస్థితి నాకర్ధమయ్యిందండీ..కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి…మీరు  అన్యధా భావించనంటే ఒక్క మాట…చెప్పమంటారా..” అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు గారు…
అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాడించారు శాస్త్రిగారు…
“..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను…ఆహా…అప్పుగానే లెండి…మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని…నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు…దయచేసి నా మాట కాదనకండి …”
వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు…
“..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..”.. ఇదీ శాస్త్రిగారు రాసింది..
“….అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి…తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి…అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి…ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి…”
దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు..
దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు..
“..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు…బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను…పర్వాలేదు కదా…”
“.. ఏమీ పర్వాలేదు ” అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు…
ఆ తర్వాత ఇంక బయలు దేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..
వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు…
కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు…
“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..
గుండె  పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..
“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “
“..సరే…అట్లాగే  రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…’” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించూపించారు శాస్త్రిగారు
……“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..
గుండె  పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..
“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “
“..సరే…అట్లాగే  రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…’” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు..
వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు గారు…
అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు…
వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు…
“..మాస్టారు…మరీ చనువు తీసుకుంటున్నాననునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా..”
అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు..
“..వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా….నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట…దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటు న్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను…మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి…ఏం చెప్పమంటారు…”
“..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి..”..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు…
ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది….మన శాస్త్రీ గారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి..
సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది..
ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది ..
ఆ పాటే…
అమెరికా అమ్మాయి లోని “…పాడనా తెలుగు పాట…పరవశమై మీ ఎదుట మీ పాట..”
ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు…
వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి…
“..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..”,(కార్తీక దీపం)
“.. గొరింటా పూసింది కొమ్మా లేకుండా…”,(గోరింటాకు)
“..ఈ గంగకెంత దిగులు…ఈ గాలి కెంత గుబులు..”,(శ్రీరామ పట్టాభిషేకం)
“..ఆకులో ఆకునై పూవు లో పూవునై..” (మేఘసందేశం)
మొదలైనవి…
ఆ తరువాత వయోభారం వలన శాస్త్రిగారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు..
“..నారాయణ నారాయణ అల్లా అల్లా…నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా..” అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను  మాత్రం నింపాదిగా మనదరినీ వదిలేసి “..నీ పదములే చాలూ…  రామా…నీ పద ధూళియే పదివేలూ ..” అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు..
“…అంత లజ్జా విషాద దురంత భార…సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు…మూగవోయిన నా గళమ్మునను గూడ…నిదుర వోయిన సెలయేటి రొదలు గలవు…ఇక నేమాయె…” –కృష్ణపక్షం. పార్వతీశం వేపగారి  సౌజన్యముతో

Posted in సమయం - సందర్భం | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -13 10-మళ్ళీకలయికమాదుర్యం కొత్తపరిచయాలు

 అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -13

10-మళ్ళీకలయికమాదుర్యం కొత్తపరిచయాలు

పగలైనా రాత్రైనా నాన్సీ నాన్ స్టాప్ గా ఆవలిస్తూనే ఉంది .మాన్యుల్ ఒడిలో ఎల్లీ హాయిగా నిద్రపోయింది .ఇంటికి తిరిగొచ్చాక నేను మాన్యుల్, అమ్మమ్మ కలిసి ఎక్కడైనా తిరిగి వద్దామని అనుకొన్నాం .మాన్యుల్ ఎక్కడ ఉంటాడో నాకు తెలీదు .అయితే మనం ఎప్పుడు ఏది అనుకొన్నా సిద్ధంగా ఉంటాడు .నిద్ర మొహంతో పిల్లను ఎత్తుకొని నాన్సీ నిద్రకు వెళ్ళింది .రోడ్లు ఉండవుకనుక మనమే దారి చేసుకోవాలి .టెలోస్ లో  ఎక్కడికైనా వెళ్లి రాగలనునేను.హోవర్ క్రాఫ్ట్ లోనూ వెళ్ళవచ్చు .ఇంకా అలవాటుకాలేడదుకనుక చేతులు పట్టుకొని గడ్డిలో నడిచాం .సడన్ గా ఆగాం మంచి మ్యూజిక్ వినిపిస్తే .జంటలు ఆనందంగా డాన్స్ చేస్తున్నారు .మహాద్భుతం అంది అమ్మమ్మ .వాళ్ళ స్టెప్స్ మరీ ముచ్చటగా ఉన్నాయి ఆవిడకు .’’సరదాగా ఉంటే మీరూ వెళ్లి కలిసి డాన్స్ చేయచ్చు.అలసిపోతే ఆ చెట్టుదగ్గర కలుద్దాం ‘’ ‘’అన్నాడు మాన్యుల్ .

  మాన్యుల్ ఆ  బృందం లో కలిసిపోయాడు నేను,అమ్మమ్మ  అతడిని అనుసరించా౦ .ఆ డాన్స్ ను మాటల్లో చెప్పలేం .మ్యూజిక్ ని   బట్టి ప్రతివాడూ డాన్స్ చేస్తున్నట్లు అనిపించింది .కాని మొత్తం మీద హార్మని అంటే ఐక్యతకూడా ఉంది .నా వెనకనించి ‘’హలో మళ్ళీ ‘’అనే మాట వినిపిస్తే వెనక్కి తిరిగి చూస్తే నా స్నేహితురాలు  సిసిల్లా అని గుర్తుపట్టి .ఇద్దరం కలిసి డాన్స్ చేశాం  ‘’’’చాలా కాలమైంది ‘’అన్నాను .’’ఇక్కడ కాలం ఉండదు.ఇక్కడ ఎప్పుడూ ‘’ఇప్పటికిప్పుడే ‘’గా ఉంటుంది.అందరం పాజిటివ్ గా ఆలోచిస్తాం .ఈ క్షణాన్నే ప్రేమి౦చి ఆన౦దిస్తాం కనుక .భూమ్మీద ప్రేమ కపటం .అశ్లీలం .మేము పని చేయటం రిలాక్స్ అవటం లో సంతోషపడతాం ఒకరికొకరుసాయపడతాం.అందమైన అరణ్యాలలో విహరించటం ,మేము ప్రేమించే వారితో మనసు విప్పి మాట్లాడుకోవటం ఇక్కడ ముఖ్యం ‘’   అన్నది నవ్వుతూ .నా భుజం వదిలేసి కనిపించకుండా వెళ్ళిపోయింది సిసిల్లా .ఆమె వెంట వెళ్ళా కాని కనిపించలేదు .ఇంతలో మాన్యుల్ వచ్చి నన్ను దూరంగా ఉన్న చెట్టు దగ్గరకు తీసుకు వెళ్ళాడు .అక్కడ అమ్మమ్మ ఎవరో మా కంటే పెద్దాయన తో  మాట్లాడుతోంది .

  ‘’ఈయన ఈమధ్యే వచ్చాడు .వచ్చి రెండు నెలలే అయింది .మీలాగా ‘’అన్నాడు మాన్యుల్ .కొత్తగా వచ్చిన వారితో సమావేశాలు మేము ఏర్పాటు చేస్తాం ‘’నేనూ వస్తా నన్నాను .’’వద్దు నువ్వు వచ్చిన విధానం వేరు .నువ్వు ఆర్నియాల్ , నా పర్య వేక్షణలో ఉంటావు .నీకోసం ప్రత్యేకమైన ప్లాన్లున్నాయి ‘’అన్నాడు మాన్యుల్ .’’సిసిల్ల కూడా అందులో ఉందా?’నేను మళ్ళీ ఆమెను కలుసుకో గలనా ?అని నసుగుతూ అడిగా.చిరునవ్వు నవ్వాడేకాని జవాబివ్వలేదు.చెట్టుకింద అమ్మమ్మ తో మాట్లాడే ఆయన పేరు ‘’లెక్స్ ‘’అసలు అలేగ్జాండర్ ‘’  అని అమ్మమ్మ పరిచయం చేయగానే ,కొద్దిగా వంగి గ్రీట్ చేశాడు .పొడుగ్గా లావుగా తెల్లజుట్టు తో 60ఏళ్ళ వాడనిపించాడు .తెల్లని పళ్ళు బ్రౌన్ కలర్ శరీరం తో ఇండియన్ లేక నేటివ్ అమెరికన్ అనిపిస్తాడు .పొడవైన ముక్కు చూస్తే గ్యారంటీగా నేటివ్ అమెరికన్ అని చెప్పవచ్చు .’’నువ్వు ప్రయాణం చేసినంత దూరం నేను చేయకుండానే ఇక్కడకొచ్చాను ‘’ఆన్నాడు లెక్స్ మంచి ఇంగ్లీష్ లో .’’పేపరులో అగర్తా పేరు వినగానే ఇక్కడికి రావలనిపించి౦ది రావటం అంత తేలికకాదు .వచ్చాను.క్వార౦ టైన్ లో ఉన్నట్లు అనిపించింది .కాని అందమైన ప్రదేశం ఇది ‘’అన్నాడు .’’మనం లోగడ కలిశాం .ఈ కొత్తవాళ్ళు నీతో గడపటానికి ఇష్టపడతారు ‘’అన్నాడు మాన్యుల్ .’’ఇక్కడికి ఈమధ్యే ఒక య౦గ్ విడో ,ఆమెపిల్లా వచ్చారని తెలిసింది .ఎక్కడ వాళ్ళు ?’’అడిగాడు లెక్స్ .ప్రాచీన ఇండియన్ విధానం లో అతడికి అభివాదం చేశాను అతడూ అలాగే చేశాడు .చేతులు కలిపాం .’’వాళ్ళను రేపు చూస్తారు వాళ్ళు సంధించే ప్రశ్నలకు సిద్ధంగా ఉండండి ‘’అన్నాను నవ్వుతూ .’’ప్రశ్నలంటే నాకు మహా సరదా .నేను ప్రాచీన సంప్రదాయాలున్న చిన్న పెరూవియాన్ విలేజి లో మోడరన్ ఇండియన్ చీఫ్ గా ఉన్నాను ‘’అన్నాడు .’’మీ వూరుగురించి మరిన్ని విషయాలు చెప్పండి .మీరు మా ఇంటికి వచ్చి ఆతిధ్యం పొంది భోజనాలు, నిద్ర అయ్యాక ఆ విషయాలు చెప్పవచ్చు ‘’అన్నాను సరే నని తలూపాడు ..మర్నాడుకలుద్దామని మాన్యుల్ కి చెప్పి వెళ్లాను  .

  అతని ప్లాన్ తో మేము  చూడని  మంచి దర్శనీయ ప్రదేశాల టూర్ చేద్దామను కొన్నాం నాన్సీ సంతోషిస్తు౦దనుకొంటే .ఆమె కుంగిపోయి సోఫాలో కూర్చుని నన్ను ప్రక్కన కూర్చో మన్నది ఎల్లీగార్డేన్ లో ఆడుతోంది .’’పిల్లను స్కూల్లో చేర్చాలి రోజంతా దానితో గడపటంవలన పని చేసుకొనే టైం దొరకటం లేదు.  నాకు ఇబ్బందిగా ఉంది ‘’అంది .’’నువ్వేమీ పెద్దగా పని చెయ్యక్కర్లేదు  .దగ్గరలో స్కూల్ లేదు .చదువుకోవాలంటే లైబ్రరీ ఉంది .అక్కడే చదవటం రాయటం ఉపయోగించే పనులు నేర్చుకొంటారు .ఇది భూమిపైన చదువు లాంటిది కాదు .పిల్లలకు చదువుపై ఆసక్తి లేకపోతె పేరెంట్స్ తో మాట్లాడి టీచర్స్  పెయింటింగ్  క్రాఫ్ట్ సింగింగ్ కధలు వగైరా బోధిస్తారు .మొదట నువ్వు మీ అమ్మాయిని లైబ్రరీ టీచర్ కు పరిచయం చేయాలి ‘’అన్నాను .ఆమె ఏడవటం మొదలుపెట్టి నా ఒడిలో ఒదిగిపోయి,తర్వాత అడ్వాన్స్ అయ్యానని గ్రహించి లేచి నిలబడింది .’’నేనంటే నీకు ఇష్టం అనుకొంటాను ఈ కొత్త దేశం లో మనమిద్దరం కలిసి ఉంటె—‘’అంటూండగా ఎల్లీ రాకతో ఆపేసింది అదృష్టవశాత్తు .’అమ్మా నాకో ఫ్రెండ్ దొరికింది ఇంగ్లీష్ బాగా మాటాడుతుంది .ఆఅమ్మాయి పీటర్ పాన్ అంటే నాకిష్టం .ఆమె ఫెయిరీలతో మాట్లాడుతుంది కూడా .మేమిద్దరం చాలా సరదాగా గడిపాం ‘’అంటూ వరద ప్రవాహంగా చెప్పేసింది ఎల్లీ .’’ఎల్లీ !ఇక్కడ మనం ఉండటం లేదు .నీకు తగ్గ స్కూల్ లేదు .నేను చాలా పోగొట్టుకున్నాను ఇక్కడికి రావటం మూలంగా .ఇక్కడ నాకేం నచ్చలేదు మళ్ళీ మనం సియాటిల్  వెళ్లిపోదాం .అక్కడ మన ఇల్లు అలాగే ఉంది .దాన్ని అమ్మకానికి పెట్టలేదు’’అంది కటువుగా.

‘’  అయితే అమ్మా మన కొత్త అంకుల్ టిం నా డాడీ కాదా  .ఆయనిక్కడే ఉంటాడుగా .’’అంటూ కన్నీటి పర్య౦తమై  అన్నది .ఆమెను దగ్గరకు తీసుకొని ..’’పైన భూమి మీద ఉన్న టైం ఇక్కడ ఉండదు .నువ్వు ఇక్కడికొచ్చి ఏడాది అయింది తెలుసా ‘’?అన్నాను  .’’మాన్యుల్ తో మాట్లాడాలి ‘’అంది నాన్సీ కోపంగా .ఆమెపై నాకు ప్రేమ లేదు .ఆమె నా మంచి స్నేహితుడి భార్య .నేనామెకు సాయం చేస్తున్నాననే అనుకొంటున్నాను .కుక్కను తోడుగా తీసుకు వెడదామంటే సరే అన్నానుఅంతే తప్ప ప్రేమ లేదామెపై ‘’.మన అతిధి లెక్స్ తో చిన్న ట్రిప్ ప్లాన్ చేశా౦ .అయ్యాక మాన్యుల్ తో మాట్లాడు ‘’అన్నాను .’’చూసింది చాలు ఇక్కడ ఇంకేమీ చూడాలని లేదు ‘’అంది నిష్టూరంగా .ఎల్లీతో పాటు వచ్చిన చిన్నపిల్ల బయట డోర్ దగ్గరే ఉండిపోయింది .’’పోనీ నేను రానా ??’అందా పిల్ల ఆమె వైపు వంగాను ఆప్యాయంగా  .’’తప్పకుండా మరి నీ పేరు “’?అన్నాను.’’వెండీ .ఇంగ్లాండ్ నుంచి వచ్చాను ‘’అంది.నల్ల జుట్టుతో అందంగా ముద్దులు మూటగట్టుతూ ,నవ్వితే రెండుబుగ్గలు సొట్టలు పడి చక్కని ఆపిల్ల ఆకర్షణీయంగా ఉన్నది .’’అమ్మ చనిపోయాక డాడీ తో ఇక్కడికొచ్చాను .వచ్చి యెంత కాలమైఁ౦దో తెలీదు ఇక్కడ టైం ఉండదుకదా.బహుశా ఎక్కువ కాలం అయి ఉండదు .’’అన్నది .

  నాన్సీ అక్కడినుంచి లోపలి వెళ్ళి ఒక ట్రేలో నాలుగు కప్పుల డ్రింక్ తో వచ్చింది .ఆమె కొంత ఊరట చెంది౦ద నిపించింది ..’’నాకూ రావాలనే ఉంది. ఎల్లీ బాగా ఇష్టపడుతోంది టూర్ కి .చేసే పనేం లేదుకనుక నేనూ వస్తే బాగుండు నని పిస్తోంది ‘’అన్నది వాతావరణాన్ని తేలిక పరుస్తూ .చిరస్మరణీయమైన జర్నీకి ఇది బోణీ అని పించింది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-20-ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -12

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -12

               9-టెలోస్ ,పరిసరాల టూరు -2

‘’ఫాక్టరీలు ఉండి ఉంటాయి .అక్కడ పని విసుగ్గా ఉంటుంది ‘’అంది నాన్సి .ఇంతలో ఎల్లి ‘’నేను  ఇసుక, నీళ్ళతో తో పేపర్ చేయగలను  ‘’అంది .’’మేము హెంప్ వాడుతాం దానితో మంచి పేపర్ తయారౌతుంది ‘’అన్నాను నేను .’’సూర్యకాంతి నామొహం పై పడి బలే హాయిగా ఉంది కానీ చర్మం నల్లబడుతుందేమో ‘’అంది అమ్మమ్మ .అలా జరగదని చెప్పాను .ఇక్కడి సూర్యుడు ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఆధారం గాఉంటాడు అందులోనుంచి ప్రమాదకర కిరణాలు వెలువడవు ‘’అన్నాను .’’టెలోస్ ఇంతపెద్దదా ??’’అని చేతులు రెండూ బారుగా చాచింది ఎల్లీ .సరిగ్గా కూర్చోమనిచేప్పి ‘’టెలోస్ యెంత పెద్దదో చెబుతా విను .టెలోస్ ఒక దేశం కాదుఅగర్తా రాజ్యంలో   ఒక ముఖ్యనగరం.భూమికింద అంతటా వ్యాపించి ఉంటుంది .ఇక్కడా అనేక దేశాలు ,రాష్ట్రాలు భూమిపైన ఉన్నట్లే ఉంటాయి .’’అద్భుతం ‘’అని అమ్మమ్మ .ఒక క్షణం యంత్రం గాలిలో ఆగి భూమికి దగ్గరలో దిగింది .మావాళ్ళు అనుసరించారు .మేము ఆగిన చోట నీరు మిలమిల మెరుస్తోంది .తీరాన పచ్చగడ్డి భూమి నుంచి ఉన్న చిన్న బ్రిడ్జి  ఒక ఐలాండ్ కు కలిపింది .అది ఆకాశ ,సరస్సులను కలిపినట్లున్నది .పైన నీలిరంగు నుంచి ఎమరాల్డ్ గ్రీన్ షేడ్ లోకిమారి౦ది . అది అరుదైన వజ్రంలా తరంగాలపై భాసించింది .నిజంగా అంతే.కాళ్ళకు చెప్పులులేకుండా బ్రిడ్జిపై20అడుగులు  నడిచాను  .పచ్చగడ్డి మరోవైపుకూడా  మెరుస్తోంది .ఇకడికి ఇదివరకు చాలాసార్లువచ్చాను కనుక అద్భుత పాలెస్ కు దారి నాకు తెలుసు .చిన్న పెవిలియన్ అంతా పూల సముద్రంగా ఉంది .పైన ఒక ఆర్చి ఉంది .దానిపై ‘’పోర్ధో లోగస్ ‘’అని పేరుంది .ఇది లైబ్రరీకి  వెళ్ళే అతిపెద్ద దారుల్లో ఒకటి .పెవిలియన్ బహు సుందరంగా ఉంది .గోడలు విలువైన రాళ్ళతో అల౦క రింపబడ్డాయి .లోపలున్న స్టెయిర్ కేస్ కింద ఇంటికి దారి చూపిస్తుంది . లోపల చర్చి లాగా ఉంది .అమ్మమ్మా, ఎమిలీ ఆగి చప్పట్లు కొట్టారు .నాన్సీ మాత్రం టూరిస్ట్ లా నిశ్చేస్టు రాలై’’కింద హేడ్స్ కు దారా ?’’అంది నవ్వుతూవ్యంగ్యంగా . నేను ఆనవ్వును ఒప్పుకోలేదు .హేడ్స్ అంటే ఎమిలీకి తెలీదు .అక్కడి జెం స్టోన్ ను తాకుతూ ఆనందం అనుభవిస్తోంది .నాతోపాటే టేక్ కూడా దిగింది కిందికి నా కంటే ముందుగా .దానికి నెమ్మదిగా నడవటం ఇష్టం ఉండదు .అమ్మమ్మ చేయిపట్టుకున్నా కాని ఆవిడా 20ఏళ్ళ పిల్లలాగా ఉత్సాహంగా ఉంది .ఎల్లీ నిపట్టుకొని నాన్సీ నెమ్మదిగా వస్తోంది . పిల్లభయపడుతు౦దనుకొందికాని ఆమే భయపడుతోంది .

  కింద మంచి వెలుతుఋ  నులి వెచ్చగా ఉంది .అందమైన ద్వారం దగ్గర మాన్యుల్ స్వాగతం చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు .అందర్నీ ఆప్యాయంగా ఆహ్వానించాడు .ఎల్లీని గట్టిగా హత్తుకొని గాల్లోకి ఎగరేసి పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ డాన్స్ చేశాడు  ఆప్యాయంగా .కిందికి దింపే టప్పుడు ఆపిల్ల అతని మెడను గట్టిగా కావలించి,’’నువ్వూ ,టిక్ నాకుమంచి స్నేహితులు  బాగా ఇష్టం ‘’అంది .మాన్యుల్ ‘’ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ లో ఉన్నాం మనం ఇప్పుడు’’అన్నాడు ఇంగ్లీష్ లో .అమ్మమ్మకూ ఇంగ్లీష్ పై అభిమానం ఎక్కువే స్పానిష్ అయినా ,’’ఇక్కడ  విశ్వం  లోని అన్ని  కాలాల అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి .పుస్తకాల బదులు యాక్టర్స్ మన ప్రశ్నలకు జవాబు చెబుతారిక్కడ  .దృశ్యాలు ప్రదర్శించి సమాధానాలు చెబుతారు మనం అడిగిన వాటికి .కాస్త ఆగండి ‘’అన్నాడు నాన్సీకి కోపం వచ్చి ‘’అసలు పుస్తకాలే ఉండవా .ఐతే లైబ్రరీ పేరు ఎందుకట’’?అంది .’’పుస్తకాలూ ఉంటాయి కాని ఇక్కడ నటన ముఖ్యం .ఏదైనా అడుగు ?’’అన్నాడు .’’మెర్లిన్ అనే వాడున్నాడా అసలు “?లేక పుక్కిటి పురాణమా ?’’అని వెంటనే ప్రశ్నించింది .’’నాతో రండి  ‘’అన్నాడు మాన్యుల్ .పైకి కొన్ని మెట్లు ఎక్కించి రెండువైపులా ద్వారాలున్న విశాల కారిడార్ లోకి తీసుకు వెళ్ళాడు .అదొక ప్రత్యేక లైబ్రరి. ఒకప్పుడు నిజమైన గుహ.. అక్కడ చాలా చిన్నచిన్న స్టేజెస్,వాస్తవాన్నీ ఫిలిం లను కలుపుతూ అంతులేని జ్ఞాన ఖనిలా అనిపించింది .దారులు నెట్ వర్క్ ,గదులు ఉన్నాయి .ఇవన్నీ చెప్పటానికి గైడ్ అవసరం .ఇక్కడ చాలా మంది గైడ్ లున్నారు కొందరు మౌలికంగా ,కొందరు హోలోగ్రామ్స్ గా ఉంటారు .

  ‘’మా వాళ్ళు ఏదో తెలుసుకోవాలని తహతహపడుతారు. మా వాళ్ళు సింబాలిక్ బాంధవ్యం కోరుతారు .సామూహిక జ్ఞానం పొందాలని భావిస్తారు .దీనికి ప్రశ్నలు అవసరమే .అదేఇక్కడ లైబ్రరీ అంటే ‘’అని వాళ్లకు తెలియ జెప్పాను ముఖ్యంగా నాన్సీకి .కిందికి దిగి ఒక దియేటర్ లాంటి దానిలోకి వెళ్లి సీట్లలో కూర్చున్నాం .స్టేజి పైనుంచి మెర్లిన్ మాకు అభివాదం చేశాడు .మెర్లిన్ తాను  నిజంగా మనిషినే ననీ ,చాలా ముఖ్యమైన వాడిననీ ,అందరి గౌరవం పొందిన వాడిననీ ,మంత్రగాడ౦టే  అసూయ అనీ చెప్పాడు .కొన్ని ట్రిక్కులు ప్రదర్శించాడు .ఎల్లీ మురిసిపోయింది .క్షణం లో ఆమె ఒళ్లోఅకస్మాత్తుగా  ఒక తెల్ల కుందేలు పిల్ల వచ్చి కూర్చుని వెంటనే వెళ్ళిపోయింది .

  మెర్లిన్ నాన్సీకి తనజీవిత కధ వివరించి చెప్పాడు.ఆశ్చర్యపోయింది ఆమె. కొన్ని సీన్లు నటించి చూపాడు ,కొన్ని ఫిలిం బిట్లు ప్రదర్శింఛి తన ప్రదర్శన పూర్తి చేశాడు ప్రపంచ ప్రసిద్ధ మెజీషియన్ మెర్లిన్ .’’నేను ఇన్వెన్షన్ కాని ,ఇ౦పోస్టర్ ని కాని కాను .భూలోకవాసులు తెలిసో తెలీకో జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు .కాని కొత్త శకం వస్తోంది .కనుక భూలోకం  శుద్ధి చేయబడాలి శుద్ధి చెందాలి .ప్రేమ ,సత్యం తో అక్కడ పునర్నిర్మాణ౦ జరగాలి తప్పదు.అది కాంతివంతమైన భూమిగా మారాలి చీకటి పారద్రోలాలి .మెర్లిన్ అనే నేను శాశ్వత భూమి పై  ప్రతిజ్ఞ చేసి  ఈ మాట చెబుతున్నాను ‘’అనగానే స్టేజ్ పై చీకటి ఆవరించి ప్రదర్శన పూర్తయింది .మేమ౦దరం ఆశ్చర్య చకితులమయ్యాం .నాన్సీ లేచిను౦చొని’’ఇది నాటకంలాగా ఉంది కానీ వాస్తవంగా లేదు.ఇక్కదేమైనా పుస్తకాలున్నాయా ’’అని గట్టిగా అరచింది .నేనూ అమ్మమ్మా ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపడ్డాం.అమ్మమ్మ నా చేయిపట్టి లాగి షాకైంది. ఎల్లీ ఏడుపు లంకి౦చుకొంది. ‘’అంతా నిజమే అమ్మా .నువ్వే చెప్పు నిజ౦ కాదా ?’’అన్నదిపాపం .మాన్యుల్ వచ్చి ఆపైల్లనుపైకెత్తుకొని చెవిలో ఏదో చెప్పాడు  .ఆపిల్ల ఏడుపు ఆపి నవ్వింది .ఆపిల్లకు ఏం చెప్పాడో తెలీదుకాని,ఏడ్చేపిల్ల హాయిగా నవ్వింది .

  లైబ్రరీలో కొంత భాగం చూశాం .కొన్ని చోట్ల విశాలమైన గాలరీలు పెయింటింగ్ లతో  హాయిగా కూర్చునే కుర్చీలు టేబుళ్లు ,కౌచేస్ అంటే మంచాలతో  ముచ్చటగా ఉన్నాయి .ఆకలేస్తే ఒక చోట ఆగాం .వెంటనే తాగటానికి డ్రింక్స్ వచ్చాయి .సర్వర్లు ఎవరూలేరు .తానే ఏర్పాటు చేశానన్నాడు మాన్యుల్ .అక్కడ ఉన్నవేవో తిని ఆకలి తీర్చుకొన్నది  పేచీపెట్ట కుండా ఎల్లీ .వాటిల్లో విషం ఉ౦దేమోననే భయంతో నాన్సీ ఏదో తిన్నట్లు నటించింది .ఆమెను చూసి జాలేచి ‘అనుమానముంటే మనకుక్కకు పెట్టి టెస్ట్ చేయి ‘’అన్నాను  .అమ్మమ్మ నావైపు వార్నింగ్ ఇస్తున్నట్లు చూసింది .ఒక బ్రెడ్ ముక్క తీసి టెక్ కు పెట్టింది నాన్సీ .ఒక్కసారిగా మింగేసి  ఇంకాకావాలన్నట్లు చూసి౦ది కుక్క .అలసిన ఎల్లీ విశ్రాంతి తీసుకోవాలని అంది అక్కడ ఆగటానికి వీలుందా అని మాన్యుల్ ను అడిగాను .ఒక లిఫ్ట్ లోనుంచి మమ్మల్ని బయటికి తీసుకు వెళ్ళాడు .అక్కడ పట్టపగలు గా ఉంది .ఇక్కడ ఉండటం లో ఇబ్బంది ఏమిటి అంటే పగలుకు రాత్రికి తేడా తెలుసుకోవటం కష్టం .ఇక్కడి ‘’ఫ్రెండ్లీ  సన్షైన్’’అంతమనోహరంగా ఉంటుంది .మొదట్లో ఇబ్బందిగా ఉన్నా, క్రమేపీ అన్నీ తెలుస్తాయి .

సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మద్దూరి  అన్నపూర్ణయ్య-12(చివరి భాగం )

  • మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-12(చివరి భాగం )

    1948లో సోషలిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు అన్న పూర్ణయ్య గారు ప్రధానకార్య దర్శిగా పార్టీ విస్తరణకు నిర్విరామ కృషి చేశారు .1952లో సోషలిస్ట్ లంతా కలిసి ప్రజా సోషలిస్ట్ పార్టీ పెట్టినప్పుడు బొంబాయిలో జరిగిన జనరల్ కౌన్సిల్ కు మద్దూరి హాజరైనా ,ఆ  విలీనం ఆనయనకు నచ్చలేదు .ఆంధ్ర పార్టీలో ఆయనకు గౌరవస్థానం ఇవ్వలేదు.ఆయన క్రమ౦గా రాజకీయాలకు దూరమౌతున్నారు .ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించి అవతార్ మెహర్ బాబా వైపు ఆకర్షి౦ప బడి 1953జులై10న  ‘’వెలుగు ‘’వారపత్రిక ప్రారంభించి  మొదటి సంచికలో ‘’అబద్ధం రాజ్యమేలుతోంది. ప్రేమ సత్యం దూరమయ్యాయి ‘’స్వతంత్ర భారత బానిసల్లారా లేవండోయ్ ‘’అని ప్రజల్ని మేల్కొల్పాల్సిన సమయం వచ్చింది .భుక్తి ముక్తి చూపిస్తుంది వెలుగు పత్రిక .సోషలిజంద్వారా భుక్తినీ నీలోని వెలుగు చూపించి మేల్కొల్పి ముక్తినీ కల్పిస్తుంది ‘’అని రాశారు జయప్రకాష ,ఆంధ్రకేసరి ఆశీర్వదించారు .ప్రజా సేవలో 33ఏళ్ళు గడిపి 1953డిసెంబర్ 2నుంచి తాను  ఏ పార్టీకీ చెందని ప్రజా సేవకుడుగా మిగిలారు .మెహర్ బాబా కీర్తి వ్యాపించటానికి మద్దూరి చేసిన కృషి అద్వితీయం .1954ఫిబ్రవరి 20నుంచి 11రోజులు మెహర్ బాబా ఆంధ్రలో పర్యటించినప్పుడు మద్దూరి వెన్నంటి ఉండేవారు .ఆయనపై ప్రత్యేక సంచిక తెచ్చారు .సభలలో అప్పటికప్పుడు ఆంగ్లకవితలు రాసి  చదివి బాబాకు సమర్పించేవారు .

      ఏలూరులో బాబా అన్నపూర్ణయ్య గారి అల్లుడు ఇంట్లో కుటుంబం వారందర్నీ ఆశీర్వదించి పూర్ణయ్య గారితో అయిదు నిమిషాలు ప్రత్యేక ఏకాంత దర్శనమిచ్చారు .ఆంధ్రలో ఇలాంటి అవకాశం ఎవ్వరికీ దక్కలేదు .ఒక్క మద్దూరికే దక్కింది ఆ అదృష్టం .కళా వెంకటరావు ,పాలకొడేటి సూర్య ప్రకాశరావు మద్దూరిబుచ్చి వెంకయ్య ,మద్దూరి కృష్ణమూర్తి ,నరసింహ దేవర సత్యనారాయణ లను బాబా ఆశీర్వదించారు మద్దూరివారి ప్రత్యేక ఆహ్వానం తో వచ్చిన మహర్షి బులుసు సాంబమూర్తి గారిని బాబా ఆలింగనం చేసుకొని ప్రత్యేక ఆసనం పై కూర్చోబెట్టారు.

      1954 వేసవి ఎండలకు మద్దూరి ఆరోగ్యం దెబ్బతిన్నది .రాజమండ్రిలో బావమరది కొల్లూరి కృష్ణ శాస్త్రి ఇంట్లో భోజనం చేస్తూ కాలం గడిపారు ఒక హోటల్ యజమాని మద్దూరికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేశాడు .సెప్టెంబర్ లో ఏలూరు వెళ్ళారు అక్కడే సెరిబ్రల్ మలేరియా వచ్చి 1954 సెప్టెంబర్ 11న మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్యగారు 65వ ఏట మరణించారు మరణవార్త టెలిగ్రాం ద్వారా తెలుసుకొన్న మెహర్ బాబా ఆయన తనలో లీనమయ్యారని తెలియ జేశారు ఏలూరులోనే అంత్యక్రియలు నిర్వహించి చితాభస్మాన్ని రాజమండ్రి లో గోదావరిలో నిమజ్జనం చేశారు .

     అన్న పూర్ణయ్య గారికి నివాళులర్పించిన నేతలు ఆయన త్యాగనిరతిని బహుదా ప్రశంసించారు .మధు దండావతే -,’’విలువలు పునరుద్ధరించిన నేత మద్దూరి .ఆయనజీవితం యువతకు స్పూర్తి ‘’వావిలాల-‘’వేలూరు జైలులో ఆయనతో గడిపి ఎన్నో విషయాలు నేర్చుకొన్నాను .సర్దార్ గౌతు లచ్చన్న-న్యాయానికి నిలబడే శక్తి ప్రజల్లో కల్గించాడు ‘’.నండూరి ప్రసాదరావు ‘’నిస్వార్ధ సేవకుడు కూతురు స్కూలుఫీజు  కూడా చెల్లించలేని స్థితిలో ఉండేవాడు ‘’.నార్ల-‘’ఆయన నాగురువు .నా మొదటి రచన ను కాంగ్రెస్ పత్రికలో ప్రచురించి ప్రోత్సహించారు .’తులసి గంగాధరరావు –‘’క్వారీ వర్కర్స్ సభకు ఆహ్వానించి రమ్మంటే యెంత సేపు చూసినా రాకపోతే నేను అడిగితే ‘’రావటానికి రిక్షా బాడుగ డబ్బులు లేవు .’’అన్నారు మీ డబ్బు ఏం చేశారు అని అడిగితె ‘’భూపతి కోటేశ్వరరావు కు కొంత ,ప్రెస్ కు కొంత,ఎవరెవరో వచ్చి అడిగితె వారికీ ఇచ్చి భోజనం లేకుండా ఉండిపోయాను ‘’అని చెప్పిన మహాత్యాగి ‘’శ్రీమతి రాజ్యం సిన్హా ‘’కృష్ణాజిల్లా ముడునూరులో ఉండే మా నాన్న అన్నే అంజయ్య గారు వీరూ ,నేతాజీ శిష్యులు .వక్త రచయితా ఉద్యమనిర్మాత మద్దూరి ‘’,  ‘భాట్టం శ్రీరామమూర్తి –‘’ఆయన నా గురువు అనిచెప్పి గర్వపడుతున్నాను .మా వర్ణాంతర  వివాహం దగ్గరుండి జరిపించిన విశాల హృదయుడు ‘’,మద్దూరి జయరాం ‘’మా తండ్రిగారికి స్థిర చరాస్తులు లేవు .ప్రభుత్వం ఇచ్చే ఐదు ఎకరాల  భూమికంటే అభిమానులు సన్మానించి  ఇచ్చిన రెండు రూపాయలే గొప్ప గా భావించేవారు .చనిపోవటానికి ఏడాదిముందు నన్ను యూనివర్సిటీలో చేర్పించారు నాన్న ‘’

    అన్నపూర్ణయ్యగారు నడిపిన పత్రికలు -ననవ శక్తి, జయ భారత్ ,వెలుగు ,

    సమాప్తం

    ఆధారం –శ్రీ రావినూతల శ్రీరాములు రాసిన ‘’మహాత్యాగి మద్దూరి అన్న పూర్ణయ్య జీవిత చరిత్ర ‘’

    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-11

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-11

1945జూన్ లో జైలు నుండి విడుదలయ్యాక  మద్దూరి అన్న పూర్ణయ్యగారు ఏకాకి అయ్యారు .రెండేళ్లక్రితమే భార్య చనిపోవటం కూతురు అత్తారింట్లో ఉండటం కొడుకు విద్యాబుద్ధులను మేనమామలే చూస్తూండటం వలన ఆయన దగ్గర ఎవరూ లేరు .రాజమండ్రిలో బావమరది ఇంట భోజనం చేస్తూ మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు .అప్పటికే ఫార్వార్డ్ బ్లాక్ తో సంబంధాలు వదిలేశారు .కాంగ్రెస్ తో సంబంధం కొనసాగించారు .1945కి కాంగ్రెస్ లో గ్రూపులు ముఠాలు ఎక్కువయ్యాయి .ఈయన వాటికి అతీతులు .రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పూర్ణయ్య గారు నామినేషన్  వేశారు .కా౦గ్రెస్ లో  బలమైన వర్గామున్న డా ఎబి నాగేశ్వరరావు ప్రత్యర్ధి .అందులోని ఇద్దరు మద్దతు ఇవ్వటం తో దువ్వూరి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికై ,,1948జనవరి 25వరకు ఉండి,ప్రత్యేక సోషలిస్ట్ పార్టీ ఏర్పడటం తో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు .1946శాసన సభ స్థానం నుంచి మద్రాస్ శాసన సభకు కాంగ్రెస్ అభ్యర్ధిగా రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ప్రతిపాదించినా ,కొందరు హైకమాండ్ తో అన్నపూర్ణయ్య నేతాజీ అనుచరుడనీ ,ఆయనకు టికెట్ ఇవ్వద్దని ఒత్తిడి చేశారు .క్రొవ్విడి లింగరాజుకు టికెట్ వచ్చింది .ప్రజలు సహించలేక లి౦గరాజుకు ప్రచారం చేయమని నిరశన తెలిపారు .వారికి నచ్చ చెప్పి లింగరాజు పక్షాన నిలిచి గెలిపించారు పూర్ణయ్య .

  తన తొలి ప్రేయసి పత్రికా రచన అని దువ్వూరి ఎప్పుడూ చెప్పేవారు .రాజమండ్రిలో మొదటి స్వాతంత్ర్య దినోత్సవం 1947ఆగస్ట్ 15న పట్టణం లో 60చోట్ల గొప్పగా వేడుకలు జరిగాయి .మొదట పంజా రోడ్డులోని పార్కు వద్ద  దువ్వూరి గాంధీ విగ్రహం ఆవిష్కరించారు అప్పటినుంచి ఆ పార్కు మద్దూరి వారి  పేరుమీదుగా పిలువబడింది.1997లో శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి అన్న పూర్ణయ్యగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు .లాంచీ రేవులో నేతాజీ విగ్రహాన్నీ , ఈయనే ఆవిష్కరించారు .గౌతమీ వ్యాయామ శాల ,ప్రభుత్వ బాలికా విద్యాలయం  సభల్లో ప్రసంగించారు .సాయంత్రం 50 వేలమంది ఉన్న సభలో దువ్వూరి గంభీరోపన్యాసం చేశారు .

   శ్రీ పివిజి  రాజు ఆర్ధిక సాయంతో దువ్వూరి ‘’జయ భారత్ ‘’పత్రిక స్థాపించారు .యర్రమిల్లి నరసింహారావు, భాట్టం సహాయ సంపాదకులు 1947నవంబర్ 1న మొదటి సంచిక వెలువరించి ‘’సోషలిస్ట్ వారపత్రిక ‘’అన్నారు .సంపాదకీయం తోపాటు అమృతారావు కలం పేరుతొ ‘’కలం చిందులు ‘’రాసేవారు మద్దూరి .చిన్న కదా కవిత జనవాక్యం శీర్షికలు ఉండేవి .ఒక్కోసారి ప్రముఖ దేశభక్తుని ముఖ చిత్రం వేసేవారు .1947ఆగస్ట్ 27సంచిక ప్రకాశంగారి చిత్రం తో వచ్చింది .ఆయన గురించి రాస్తూ ‘’ఆంధ్రులకు ఏ సమస్యమీదా ఏకాభిప్రాయం లేదు కానీ ,ప్రకాశంగారిని పూజించటం లో మాత్రం ఏకీ భావం ఉంది కారణం ఆయన ధైర్య సాహసాలు త్యాగం .ఈ సుగుణాలున్న వారు చాలామంది ఉన్నా ఆపద ఎక్కడ ఉంటె ప్రకాశం అక్కడ ప్రత్యక్షమౌతాడు .వరదలు తుఫాన్లు వచ్చి ప్రజలు నిలువ నీడ లేక అల్లాడుతుంటే ఆంధ్ర కేసరి వాలిపోవాల్సిందే.’’

  సోషలిస్ట్ నాయకులు అచ్యుత్ పట్వర్ధన్ ,లోహియా ,కమలాదేవి ,అశోక్ మెహతా ,పివిజి రాజుగార్లను పత్రికలో ఘనంగా పరిచయం చేశారు దువ్వూరి .

1-అచ్యుత్ పట్వర్ధన్ –విఖ్యాత సోషలిస్ట్ నాయకుడు.కాశే విశ్వవిద్యాలయంలోప్రోఫేసర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలలో చేరి లక్నో ఫైజా పూర్ ఎఐసి సి సభ్యుడై ,తర్వాత నిరాకరించి 1942ఆగస్ట్ విప్లవం లో 3ఏళ్ళు అజ్ఞాతం లో ఉంటూ అరుణా ఆసఫాలీ సహాయంతో ఆగస్ట్ విప్లవం నడిపాడు సతారాలో బ్రిటిష్ ప్రభుత్వం బదులు స్వదేశీ ప్రభుత్వం నడిపిన ఘనుడు .అన్న రావుసాహెబ్ కూడా దీటైనవాడు .వారి కుటుంబం  మహారాష్ట్రలో చాలా ప్రభావమైనది .అచ్యుత్ అనర్గళవాగ్ధాటికి ముగ్ధులు కావాల్సిందే .

  రామ మనోహర్ లోహియా-విజ్ఞాని.ఎఐసిసి విదేశాంగ శాఖ కార్యదర్శి గా పేరు పొందాడు సోషలిస్ట్ పార్టీ జాతీయకార్యవర్గ ప్రముఖుడు ఆగస్ట్ విప్లవాన్ని తేజో వంతంగా నడిపిన ధీరుడు .ఎర్రకోటలో జయప్రకాష్ తో పాటు జైలు జీవితం గడిపిన యోధుడు .

శ్రీమతి కమలాదేవి-అఖిలభారత మహిళామండలి అధ్యక్షురాలు .భారత నారీరత్నం .ఏఐసిసిసి సభ్యురాలు .సామ్యవాద భారత్ కోసం తీవ్ర కృషి చేసిన నారీమణి

శ్రీ అశోక్ మెహతా –సోషలిస్ట్ పార్టీ నిర్మాతలలో ఒకడు .హింద్ మజ్దూర్ సభ నిర్మాత కూడా మేధావి వక్త విద్యా సంపన్నుడు అరుదైన వ్యక్తిత్వమున్నవాడు ప్రజలను నడిపించే అమోఘ శక్తి ఉన్నవాడు. ప్రజాసోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి .మధ్యప్రదేశ్ నున్చిపార్లమేంట్ కు నిలబడ్డాడు ఆయన్ను గెలిపించిన గౌరవం పొందాలి .చిన్నవయస్సు దేశభక్తుడు .కార్మిక కర్షకనాయకుడు .బహుళ గ్రంధకర్త మహా మేధావి .నిర్మాణ శక్తి సంపన్నుడు నిష్కళంక సేవామూర్తి.

శ్రీ పివిజి రాజు –‘’భూమి నంతటినీ జాతీయం చేసే బిల్లు రావాలి దీనితో పాతపద్ధతులు ఆచారాలు తొలగిపోయి భూమి అంతాప్రభుత్వ పరమౌతుంది .సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులోత్తే జమీందారీ వ్యవస్థ రద్దు త్వరగా జరగాలి .జయప్రకాష్ అడిగిన వెంటనే సోషలిస్ట్ పార్టీకి 10వేల రూపాయల విరాలమందించిన వదాన్యుడు పివిజ్ రాజు  ‘’

  ఇంతటి మహత్తర వారపత్రిక కొన్ని సంవత్సరాలే నడిచి మూలపడింది .

కేంద్ర సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఆచార్య నరేంద్రదేవ్ .ప్రధానకార్యదర్శి జయప్రకాష నారాయణ్ ఆంధ్రలో సోషలిస్ట్ పార్టీ ఆడ హాక్ కమిటీ ఏం బాలకృష్ణ కార్యదర్శిగా ,మద్దూరి చక్రధర్ వగైరా సభ్యులతో 1950మే నెలలో ఏర్పడింది .జయప్రకాష్ ఆంధ్రలో పర్యటించినప్పుడు మద్దూరి ఆయన వెంట ఉంటూ ప్రసంగాలకు తెలుగులో అనువాదం చేసేవారు .బహిరంగ సభలకు జనం బాగా వచ్చేవారు .తనపర్యటన లో వసూలైన లక్షరూపాయలు ఆంద్ర రాష్ట్ర పార్టీకి ఇచ్చాడు జెపి .

  1952 జనరల్ ఎన్నికలలో మద్రాస్ శాసనసభకు ఆంధ్రనుంచి ఆరుగురు సభ్యులు సోషలిస్ట్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు .ఈ పార్టీకి విశాఖజిల్లా బలమైన కేంద్రం .మద్దూరిని శాసన సభ్యుడిగా చూడాలని పివిజి రాజు ఆశపడ్డాడు .ఏదోఒక నియోజకవర్గం నుంచి పోటీచేయమని వొత్తిడి చేశాడు .రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని మృదువుగా తిరస్కరించారు మద్దూరి .1952లో ఆంధ్రరాజకీయం డోలాయమానంగా ఉంది .ప్రకాశం కాంగ్రెస్ ను వదిలి ప్రజాపార్టీ పెట్టటం అండర్ గ్రౌండ్లో అప్పటిదాకా ఉన్న కమ్యూనిస్ట్ లు బయటికొచ్చి ఎన్నికలలో నిలబడటం తో రాజమండ్రి స్థానానికి నాలుగుపార్టీలు పోటీ పడ్డాయి .కాంగ్రెస్ తరఫున డా కే ఎల్ నరసింహారావు  ,ప్రజాపార్టీ నుంచి క్రొవ్విడి లింగరాజు ,సోషలిస్ట్ పార్టీ నుంచి అన్నపూర్ణయ్యగారు కమ్యూనిస్ట్ అభ్యర్ధిగా చిత్తూరి ప్రభాకర చౌదరి  పోటీ చేశారు .ఆంధ్రాయూని వర్సిటి సోషలిస్ట్ విద్యార్దినాయకుడు ఎవికే చైతన్య రాజమండ్రి లో ఉండి మద్దూరికి తీవ్ర ప్రచారం చేశాడు .మైకుకట్టిన కారులో మద్దూరి ప్రచారం చేస్తూ తన రాజకీయం వివరిస్తూ ,14ఏళ్ళు జైలులో ఉన్నానని తెలియజేస్తూ ,గెలిచినా ఓడినా రాజమండ్రిలోనే ఉంటూ ప్రజాసేవ చేస్తానని వాగ్దానం చేస్తూ ప్రచారం చేశారు .ప్రచారం ఉధృతంగా ఉన్న సమయం లో కాంగ్రెస్ ను దుయ్యబడుతూ ప్రచారం చేసి ఒకరోజు అర్ధరాత్రి 12గంటలకు కాంగ్రెస్ అభ్యర్ధి నరసింహారావు ఇంటి తలుపుతట్టారు మద్దూరి .ఆయనకొడుకు తలుపు తీసి ఆశ్చర్యపోగా ‘’మీ నాన్న ఉన్నాడా ??’’అంటూ లోపలి వెళ్ళగా ఆయన దువ్వూరి వారిని భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసి దగ్గరుండి తినిపించాక  గంటసేపు ప్రత్యర్దులిద్దరూ కులాసా కబుర్లు చెప్పుకొన్నాక పూర్ణయ్యగారిని రిక్షా ఎక్కించి గౌరవంగా పంపారు రావుగారు .కానీ విజయం కమ్యూనిస్ట్ లదేఅయింది .ఓడినా విచారపడ లేదు మద్దూరి ‘’స్వాతంత్ర్యం నాగురించికాదు. భావి తరాలకోసం .కాంగ్రెస్ కు రిజైన్ చేసిన నరేంద్ర దేవ్ వంటినాయకులు బై ఎలెక్షన్ లో ఓడిపోలేదా? గెలుపు వోటములు ముఖ్యం కాదు .ఇక భవిష్యత్తు అంతామనదే ‘’అని కార్య కర్తలను ఊరడించిన స్థిత ప్రజ్ఞుడు మద్దూరి అన్నపూర్ణయ్యగారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-10

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-10

అన్నపూర్ణయ్యగారు నాలుగు అంకాల అసంపూర్ణ నాటకం రాసి పేరు పెట్టలేదు .అనాధ విద్యా  వంతుడికి బ్రాహ్మణ కన్యకు  పెళ్లి జరిగి ,ఇద్దరూ స్వతంత్ర సమరంలో జైలుకు వెళ్ళటం ఇందులో కధ.స్వాతంత్ర్య పోరాటగాధను ‘’అక్క ‘’నవలగా రాశారు కాని అలభ్యం .భార్యమరణం పై ‘’వీరపత్ని ‘’గేయం రాశారు .అది గొప్ప ఎలిజీగా నిలబడింది .

 శ్రీమతి వెంకట రమణమ్మ –అన్నపూర్ణయ్యగారి భార్య వెంకట రమణమ్మ .2-3-1906న పెద్దాపురం లో పుట్టారు7-6-1919న అన్నపూర్నయ్యగారితో పెద్దాపురం లో పెళ్లి జరిగింది .ఆమెకు 14,ఆయనకు 20 వయసు .కట్నకానుకల విషయం లో తేడావచ్చి వేరొక సంబంధం చేయాలని తండ్రి భావిస్తే ఆమె ఈయన్నే పెళ్లి చేసుకొంటానని భీష్మించి పెళ్ళాడింది .ఉద్యమం కోసం చదువు మానవద్దని ఆమె ఆయనకు ఉత్తరం రాసింది .కానీ ఆయన వినలేదు. కానీ ఆమె సాహచర్యంతో ఆయనలో గొప్ప మార్పు వచ్చింది .1925లో ఈ దంపతులు గౌతమీ ఆశ్రమం లో చేరారు .1927లో పుట్టిన కూతురికి  రాజేశ్వరి పేరు పెట్టారు .1932లో సీతానగర ఆశ్రమ౦ చట్ట విరుద్ధమని ప్రభుత్వం ప్రకటిస్తే ,ముందుగా ఆడవారిని బయటికి పంపిస్తుంటే  రమణమ్మ గారు మాత్రం ‘’మగవారితో పాటే మేము ‘’అని అక్కడే ఉన్నారు .తర్వాత పెద్దలు నచ్చ చెప్పి పంపించారు .

  రాజమండ్రిలో విదేశీ వస్త్రాల దుకాణాలవద్ద పికెటింగ్ చేయగా రమణమ్మ గారిని  గారిని అరెస్ట్ చేసి ఆరు నెలలు జైలులో ఉంచారు .1934 అక్టోబర్2 గాంధీ జయంతి నాడు ఆమె రాజమండ్రిలో ఖద్దరు వస్త్రాలు  అమ్మారు.7-7-1935న దంపతులు గౌతమీ ఆశ్రమ౦  వదలి రాజమండ్రి చేరారు .1937లో వీరికిపుట్టిన కొడుకు తాతగారిపేరు జయరాం అనిపెట్టారు .1935లో ఆమెకు తీవ్రంగా జబ్బు చేసింది .కాంగ్రెస్ స్వర్ణోత్సవాల బాధ్యత దువ్వూరిపై పడింది .తన ఆరోగ్యం గురించి  బాధ పడవద్దనియధా ప్రకారం కార్యక్రమాలు చేయమని కోరిన ఉత్తమా ఇల్లాలు .6-4-1940న అన్నపూర్ణయ్యగారిని ఖైదు చేసే నాటికి కుమార్తెకు 13,కొడుక్కి 3ఏళ్ళు .స్థిరాస్థి శూన్యం .1945జూన్ లో ఆయన విడుదల అవటానికి రెండేళ్ళ ముందే ఆమె చనిపోయారు .1940-43మధ్యకాలం ఆమెకు  గడ్డుకాలం .పిల్లల్ని ఎలాపోషించిందో ఊహకు అందని విషయం .పుట్టి౦టి కొల్లూరి వారే కొంత అండగా నిలిచారు .

 దువ్వూరి ఎక్కువకాలం వెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు .ఆయననుంచి భార్యకు ఉత్తరాలు వచ్చేవికావు .ఎప్పుడైనా ఈమె కార్డు రాసేది .1942లో భర్తను బేషరతుగా విడుదల చేయమని లేకపోతే కుటుంబ పోషణకు డబ్బు మంజూరు చేయమని రమణమ్మగారు ప్రభుత్వానికి అర్జీపెట్టారు .ప్రభుత్వం నెలకు 15రూపాయలు మంజూరు చేసింది .తర్వాత అది చాలదనిపెంచమని , కూతురి పెళ్లి చేయటానికి ధనం సాయం చేయమని ప్రభుత్వాన్ని కోరారు .1942జులై నుంచి జీవన భ్రుతి 25రూపాయలు చేశారు .పుట్టింటి అండకోసం కాపురం ఏలూరు కు మార్చారు .1942ఆగస్ట్ లో కూతురుపెళ్లి  అనీ 200రూపాయలు మంజూరు చేయమని లేకపోతె 13రోజులు పెరోల్ పై విడుదల చేయమని పూర్ణయ్యగారు ప్రభుత్వాన్ని కోరితే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది .తనతమ్ముడు సూర్యనారాయణ శాస్త్రికి కూతురు రాజేశ్వరి నిచ్చి వెంకటరమణమ్మగారు 1942ఆగస్ట్ 28న తండ్రి జైలులో ఉండగానే వివాహం జరిపించారు .పెళ్లి ఖర్చులు 512రూపాయలు అందులో 200రూపాయలు రమణమ్మగారు అప్పుగా తెచ్చినవే .

  6-12-1943 వెంకటరమణమ్మగారు37వ ఏటనే  తుదిశ్వాస విడిచారు .చివరిరోజులలో  భర్తను చూడాలని ఆరాట పడిన ఆమె తపన అర్ధం చేసుకుని ,దువ్వూరి పెరోల్ కోసం అప్ప్లై చేశారు. ఆర్డర్ వచ్చేలోపే ఆమె మరణ వార్త టెలిగ్రాం చేరింది .ముందుగా లింగరాజుగారు చూసి ఎలా చెప్పాలో అర్ధంకాక దిగాలుగా ఉంటే ,దువ్వూరి ‘’ఏమిటీ రమణమ్మ పోయిందా ?””అని అడిగారట .టెలిగ్రాం చేతికివ్వగా చదివి మౌనంగా ఒక మూల కెళ్ళి కూర్చున్నారు .1947స్వాతంత్ర్య దినోత్సవం నాడు కొవ్వూరులోని వీర స్మరణ మందిరం లో రమణమ్మ గారి చిత్రపటాన్ని శ్రీమతి చుండూరు వెంకటరత్నమ్మగారు ఆవిష్కరించి అంజలి ఘటించారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్ -3(చివరి భాగం )

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్ -3(చివరి భాగం )

నాలుగేళ్ళు అజ్ఞాత వాసం లో గడిపి ఆగస్ట్ ఉద్యమవీరుడు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకుడు అచ్యుత్ పట్వర్ధన్  బొంబాయి రాగా అఖండ ప్రజావాహిని వీరోచిత స్వాగతం పలికింది .కాంగ్రెస్ నాయకులుమాత్రం రాలేదు మొహం చెల్లక  .తర్వాత పూనాలో కూడా అఖండ స్వాగతమిచ్చారు ప్రజలు .అక్కడ ప్రసంగిస్తూ ‘’అ౦తిమస్వాతంత్ర్యంకోసం పోరాడాలి .కాంగ్రెస్ విధానాల్లో పెద్ద మార్పురావాలి సంపూర్ణ స్వాతంత్ర్యమే మన ధ్యేయం .బ్రిటిష్ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలి .ఆత్మ బలిదానానికి సంసిద్ధులై మనం పనిచేయాలి .పెద్ద విప్లవ సైన్యం నిర్మించాలి.కార్మిక సంఘాలలో కమ్యూనిస్ట్ ల ప్రాధాన్యత తొలగించటానికి కాంగ్రెస్ సోషలిస్ట్ లు నడుం కట్టాలి ’అని గర్జించాడు .వల్లభాయి ,విఠ లుభాయి సోదరుల్లా రావు భాయ్, అచ్యుత్ సోదరులు భారత స్వాతంత్రోద్యమం లో కలిసిపని చేశారు .పటేల్ బార్డోలీ వీరుడైతే ,పట్వర్ధన్ సతారా వీరుడు .

 పట్వర్ధన్ విజ్ఞాన సముద్రుడు .ఆయన ఇంటి లైబ్రరీలో దేశం లో ప్రచురితమైన ప్రతిరాజకీయ పుస్తకం దొరుకుతుంది .ఆయన చదవని రాజకీయ పుస్తకం లేదు .అన్ని విషయాలపై ఉత్తమ గ్రంధాలన్నీ ఆ ఇంట్లో ఉంటాయి .అజ్ఞాతవాసం లో ఉంటూ రైళ్ళరాకపోకల్ని తెలుసుకొంటూ వాటికి ఆటంకం కలిగించేవాడు .రైల్వే అధికారులకు సింహ స్వప్నంగా ఉండేవాడు .ఎంత విప్లవవాది అయినా గాంధీ పేరు చెబితే వినమ్రుడయ్యెవాడు .లోహియాలాగా’’ గాంధియన్  సోషలిస్ట్’’ . తుది నిర్ణయ౦ లో కాంగ్రెస్నే అనుసరిస్తారిద్దరూ .కాంగ్రెస్ ను విప్లవాత్మకం చేసే ప్రయత్నం చేశారు .పోరాటం పెరిగినకొద్దీ అతి వాదం పెరిగి దాన్నే అనుసరించాల్సి వచ్చింది .అతివాద చైతన్యం పెరిగింది .రాజకీయ చైతన్యానికి మహాత్ముడే కారణమని పట్వర్ధన్ ప్రగాఢ విశ్వాసం .అప్పటికి పాతికేళ్ళ క్రితం ‘’స్వరాజ్యం నా జన్మ హక్కు ‘’అన్నందుకు తిలక్ మహాశయుడిని తెల్లప్రభుత్వం ఆరేళ్ళు ఖైదులో ఉంచింది .గాంధీ వల్లనే వాక్ స్వాతంత్రం వచ్చి,’’మా దేశం విడిచిపొండి’’అని ఆజ్ఞాపించగలుగుతున్నాం .స్వతంత్ర వృక్షాన్ని పెంచి పెద్దదాన్ని చేసింది కాంగ్రెస్ .కాంగ్రేసే మహాత్ముడు మహాత్ముడే కాంగ్రెస్ .ఆయన సాధించేది సత్య సామ్రాజ్యం అని అభిప్రాయ పడ్డాడు పట్వర్ధన్ .గాంధీని చూస్తే పూనకమే వస్తుంది ఆరాధనాభావం తో పులకి౦చి పోయేవాడు .పెద్దల మితవాదం మాత్రం నచ్చలేదు కుండబద్దలుకొట్టినట్లుగా నిష్కర్షగా దాన్ని ఖండించాడు .స్వతంత్ర పోరాటం లో గాంధీ మితవాదం అతివాదులకు ఏమీ అడ్డు రాదు అని కాంగ్రెస్ సోషలిస్ట్ ల మనోభావం .అతివాద కార్యక్రమాలు చేబట్టినప్పుడే అతి వాదం వస్తుంది మాటలతో రాదు .దీనికి విరుద్ధంగా ‘’ప్రజా విప్లవమే మార్కిస్ట్ ల పంధా ‘’గా ఉండేది .స్వతంత్ర ఉద్యమలో ఎన్నో తప్పటడుగులు వేశారు కమ్మీలు .ఒక నిర్దుష్ట కార్యక్రమం ఇచ్చి నడపగలిగినవారిలో పట్వర్ధన్ ఒకడు .

  1942స్వతంత్ర భారత రేడియో కేంద్రం గురించి ఉషా మెహతా చెప్పిన విషయాలు –1942‘’ఆగస్ట్ ఉద్యమ కాంగ్రెస్ ఉద్దేశ్యాన్ని ప్రజలకు తెలియజేయాలని దీన్నినేనూ నా సహచరులు కలిసి  ఏర్పాటు చేశాం  ఆగస్ట్ 20న మొదటి ప్రసారం చేశాం .అప్పుడులోహియా బాంబేలో అజ్ఞాతంలో ఉన్నారు .డిసెంబర్ లో ప్రసారాలు నిలిపేశాం .ప్రచారప్రసారాలు లోహియా రాసేవారు .కొన్ని నేనూ పట్వర్ధన్ రాశాం .వేటిని రేడియోలో చదవటానికి మాజీ ప్రొఫెసర్ కుందస్తూర్ ఉన్నారుకాని ఆమె అరెస్ట్ కాలేదు  .అందుకని గ్రామఫోన్ రికార్డులుగా ప్రసంగాలు తయారు చేసి వాటితో ప్రసారం చేసేవాళ్ళం .కాంగ్రెస్ కమిటీ చేసిన ఉపన్యాసాలు రికార్డ్ చేసి రేడియోలో ప్రసారం చేశాం .మొదట్లో రోజుకొక్కసారి తర్వాత రెండుసార్లు ప్రసారం చేశాం .రేడియో యంత్రాగం బొంబాయిలో ఒక ప్రసిద్ధ న్యాయవాది అల్లుడి ఇంట్లో ఉండేది.పోలీసులు ఆచూకీ చేసి నన్ను అరెస్ట్ చేస్తారని తెలిసి ,ఆరోజు నేనే రేడియో ప్రసారం చేసి చివర్లో వందేమాతరం రికార్డ్  వేస్తుంటే ,పోలీసులువచ్చి నన్ను అరెస్ట్ చేశారు .వాళ్ళు నాలుగుగదులు దాటిరావాలి. తాళాలు పగలకొట్టి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు .’’అని వివరించారు .

 ఉషా, ఆసఫాలీ ,పట్వర్ధన్ ,ఆజాద్ ,జయప్రకాష్ వంటి నిస్వార్ధ త్యాగధనులు ‘’స్వాతంత్ర్యం మా జన్మ హక్కు ‘’అని చాటి చెప్పటానికి ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు .1946జూన్ 8న కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకులు పట్వర్ధన్ లోహియా జయప్రకాష్ అరుణా ఆసఫాలీ లు ఒక ప్రకటన చేస్తూ ‘’భారత్ లో బ్రిటిష్ పెట్టుబడిదార్లు దొడ్డిదారిన ప్రవేశించారు. వారినుండి మనదేశాన్ని మనం కాపాడుకోవాలి .ఇదే సోషలిస్ట్ పార్టీ ఆదర్శం ‘’.అని చెప్పారు .

  కాంగ్రెస్ లో ఉంటూ సోషలిజాన్ని సాధించలేమని గ్రహించి ఈ సోషలిస్ట్ లు 1947లో పట్వర్ధన్ నాయకత్వం లో ‘’సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ‘’స్థాపించారు .1950లో అచ్యుత్ పట్వర్ధన్ రాజకీయాలనుంచి విరమించాడు .మళ్ళీ సెంట్రల్ హిందూకాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేసి 1966లో రిటైరయ్యాడు .తర్వాత పూనా లో ఎవరికీ అందుబాటులో ఉండకుండా ,ఉత్తర ప్రత్యుత్తరాలుకూడా జరపకుండా ఒంటరిజీవితం గడిపాడు పట్వర్ధన్ రెండు గ్రంధాలు రాశాడు -1.  Ideologies and the perspective of social change in India 2- The communal triangle in India.

 ఆగస్ట్ ఉద్యమమమహానాయకుడు సోషలిస్ట్ పార్టీ స్థాపకుడు అచ్యుత్ పట్వర్ధన్ 1992 ఆగస్ట్ 5న 87వ ఏట వారణాసి లో మరణించాడు .త్యాగమూర్తి అచ్యుత్ పట్వర్ధన్ .

ఆధారం –శ్రీ గోపరాజు వెంకటానందం 1946లో  రచించిన  ‘’ఆగస్ట్ ఉద్యమవీరుడు అచ్యుత పట్వర్ధన్ ‘’

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత పట్వర్ధన్ -2

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్ -2

వ్యష్టి సత్యాగ్రహం రోజుల్లో పట్వర్ధన్ ,అశోక్ మెహతా జైలు జీవితం గడుపుతూకలిసి ‘’కమ్యూనల్ ట్రయాంగిల్ ఇన్ ఇండియా ‘’అనే ఉద్గ్రంధం రాశారు .మహాదేవ దేశాయ్ దీన్ని మెచ్చారు  క్రిప్స్ రాయబారం విఫలమయ్యాక గాంధీ ‘’క్విట్ ఇండియా ‘’ఉద్యమం మొదలు పెట్టాడు .1942ఆగస్ట్ 7 న బొంబాయి కాంగ్రెస్ మహా సభలలో అంతిమ స్వాతంత్ర్య సమరం చేయాలని నిర్ణయించారు.చివరి హెచ్చరిక ఇవ్వటానికి గాంధీకి సర్వాధికారాలు ఇస్తూ కాంగ్రెస్ తీర్మానించింది .ఆయన ఉద్రేకం తో ఊగిపోయి ప్రసంగింఛి ‘’డు ఆర్ డై’’నినాదం ఇచ్చాడు .తొమ్మిదో తారీకున జరిగే కాంగ్రెస్ కమిటీలో తీర్మానం ఆమోదించాలి . 8రాత్రికే తెల్లప్రభుత్వం భయపడి గాంధీని కార్యవర్గ సభ్యులను అరెస్ట్ చేసి కనిపించని చోటికితీసుకు వెళ్ళింది .

  దిశా నిర్దేశం చేసే వారు లేక ప్రజలు వెతకసాగారు .విషవాయువు లాఠీచార్జి ,కాల్పులతో ప్రభుత్వం భీభత్సం సృష్టించింది .గాంధీ ఆదేశాన్ని అనుసరించి ప్రభుత్వం  తో పోరాటానికి ప్రజలు సిద్ధపడ్డారు .అరెస్ట్ కు ముందు గాంధీ దగ్గరకు  బాలకృష్ణ శర్మ వెళ్లి ‘’మాకిచ్చిన కార్యక్రమం ఏమిటి ??’’అని అడిగాడు .గాంధీ కోపం తో ‘’నా ఉపన్యాసం అంతా కార్యక్రమమే .దాన్ని అర్ధం చేసుకోలేని వాళ్ళను నమ్మి యుద్ధం ఎలా చెయ్యను ?’’అన్నాడు .దీనినే శిరోధార్యంగా భావించి ప్రజలు ఉద్యమించారు .దేశమంతా విప్లవజ్వాలలు ఎగసి పడ్డాయి .ఎక్కడ చూసినా స్వాతంత్ర్య వీరుల రక్త ప్రవాహాలే .బొంబాయిలో ఏడు రోజులు ప్రభుత్వమే లేదని పించారు .మధ్య రాష్ట్రాలలో ఆరుజిల్లాలు ఉత్త్రరాష్ట్రాలలో 13జిల్లాలు ,ఆంధ్రా అస్సాం బెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు బ్రిటిష్ ప్రభుత్వ అధికారానికి ప్రజలు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు .

   ఆగస్ట్ 9నుంచి 1942డిసెంబర్ చివరి వరకు ప్రభుత్వ దౌర్జన్యకాండల ఫలితాలు సెంట్రల్ అసెంబ్లీలో హో౦ మెంబర్ వివరాలు ప్రకటించాడు .అరెస్ట్ అయినవారు -66,229,జిల్లాలో మగ్గుతున్నవారు -18,000.మిలిటరీ పోలీస్ కాల్పుల్లో చనిపోయినవారు -940,తుపాకీ గాయాలైనవారు -1630.మిలిటరీ సాయంకోరిన చోట్లు -60,తుపాకీ కాల్చవచ్చిన సంఘటనలు -538,విమానాలద్వారా ప్రేల్చిన ప్రదేశాలు -5.

  జయప్రకాశనారాయణ ,అచ్యుత పట్వర్ధన్ ,రామమనోహర్ లోహియా ,అరుణా ఆసఫాలీ మొదలైన వారు రహస్య మార్గాలద్వారా విప్లవాన్ని సాగిస్తూ ,ప్రజల ఉద్రేకాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపారు .ప్రభుత్వం కంటపడకుండా పట్వర్ధన్ నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం .పట్వర్ధన్ నాయకత్వం లో మహారాష్ట్ర సతారా జిల్లాలో ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తొలగించి ప్రజలే ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టించారు .రహస్యంగా అచ్యుత్ ‘’క్విట్ ఇండియా ‘’పత్రిక లను రాసిదేశామంతా వెదజల్లాడు .అచ్యుత్ లోహియా ,ఉషా మెహతా రహస్య రేడియో ద్వారా దేశమంతా ప్రచారం చేశారు .చివరికి ప్రభుత్వం కనిపెట్టి పట్టేసింది .జయప్రకాష్ లోహియాలను అరెస్ట్ చేసింది .పట్వర్ధన్ ఉషాలిద్దరూ ప్రభుత్వం కన్ను గప్పుతూ ,రహస్య కార్యకలాపాలు చేస్తూ ప్రజా మార్గదర్శకత్వం చేశారు .విసిగి వేసారిన ప్రభుత్వం వీరిపై ఉన్న అరెస్ట్ వారెంటు ఉపసంహరించుకొన్నది .

  అజ్ఞాతవాసం లో పట్వర్ధన్ చేసిన మహాకార్యం సతారా జిల్లాలో బ్రిటిష్ ప్రభుత్వ కూకటి వ్రేళ్ళను పెకలించిపారేసి ప్రజాప్రభుత్వం అనే ప్రతి సర్కార్ లేక పారలల్ గవర్నమెంట్ నిర్మించి పాలించటమే .చత్రపతిశివాజీ స్పూర్తితో ఆయన అలా నిర్వహించాడు . రెండేళ్ళు అయ్యాక అకస్మాత్తుగా మిలిటరీ గుంపులు సతారా చేరి భీభత్సం సృష్టించి ప్రజలను భయభ్రాంతులను చేసి సతారా  జిల్లా వశపరచుకొన్నారు .కామ్రేడ్ సోలీ బాట్లే వాలా  ఆజాద్ హింద్ ఫౌజు న్యాయ విచారణకు కావలసిన భోగట్టా సేకరించటానికి వచ్చి ,అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన హి౦సా దౌర్జన్యాలు తెలుసుకొని పత్రికా ముఖంగా  ప్రకటించాడు .ఇన్ని చేసినా ప్రజల స్వాతంత్ర్య కాంక్ష పెరిగిందేకాని తగ్గనే లేదు .గొప్ప సంచలనం ఆగస్ట్ ఉద్యమం కలిగించింది .దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ తప్ప అన్ని పార్టీలు హర్షించాయి .

అచ్యుత్ అజ్ఞాతం లో ఉన్నప్పుడు ఒక వింత సంఘటన జరిగింది .ఆయన్ను పట్టిస్తే 5వేలరూపాయలు బహుమానంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది .ఆబహుమతి పొందాలనే తహతహతో ఒక పోలీస్ ఆఫీసర్ పోలీసులతో సతారాజిల్లలో అనుమానమున్న గ్రామాలన్నీ వెతికి వెతికినిరాశ తో వెనక్కి వెళ్లిపోతుంటే ,అతడు ఎక్కిన రైలులోనే పట్వర్ధన్ ప్రయాణించాడు .ఆ రాత్రి ఆపోలీసాఫీసర్ పక్కనే కూర్చున్నాడుకూడా .కానీ గుర్తించలేక దిగులుమొహం తో పూనాలో దిగి వెళ్ళిపోయాడు .ఇలాంటి సంఘటనలు కధలుగాధలుగా ఆనాడు చాలా చెప్పుకొనేవారు .

  వైస్రాయి వేవెల్ సిమ్లా సమావేశ సన్నాహం లో ఉంటె ,పట్వర్ధన్ సతారలో ఒక బహిరంగ సభలో ఉపన్యాసం చేశాడు .అజ్ఞాతం లో ఉంటూ బొంబాయి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యాడు .1945డిసెంబర్ 11న కాంగ్రెస్ కార్యవర్గం సమావేశమై ఆగస్ట్ ఉద్యమం ఆజాద్ హింద్ ఫోజు యడల అవలంబించైనా వైఖరి వలన వైఖరి కాంగ్రెస్ అహింసా సిద్ధాంతంపై అపోహలు కలిగాయని తెలుసుకొని నివారించేప్రయత్నం లో ఒక తీర్మానం చేసింది .సమావేశం లో పట్వర్ధన్ కాంగ్రెస్ పెద్దల వైఖరిని తీవ్రంగా విమర్శించి అచ్యుత్, అరుణా కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడుమౌలానా ఆజాద్ కు  ఒక పెద్ద లేఖ రాసి అంద జేశారు .దీనికి కాంగ్రెస్ చరిత్రలో గొప్ప ప్రాధాన్యత లభించింది .ఆ లేఖలోని ముఖ్య విషయాలు ‘’కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ తర్వాత ప్రజలకు నాయకత్వం లేక ఎవరికి తోచినట్లు వారు నడిచారు .మేము అజ్ఞాతంలో ఉంటూ సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసి మూడేళ్ళుపాలించాం .ప్రజలు మాకు మద్దతునిచ్చారు .మాదీ అహింసా విధానమే .పోలీసులు యెంత దౌర్జన్యం చేసినా మేము పోరాడామేకాని లొంగి పోలేదు .ప్రజా సంఘటన శక్తి అపారం కాగా ,మేము మోతాదు లను బుద్ధిపూర్వకంగా ప్రయోగించాం .లేకపోతే శిక్షణ లేని ఆగస్ట్ ఉద్యమ మహా సంరంభం కొన్ని వారాల్లోనే దిగజారి పోయేది .మా అమోఘ నిశ్చయానికి మా అంతరాత్మ సాక్షి .దూర ప్రాంతాలవారికీ వార్తలు అందించగలిగాం .కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఒక రాష్ట్రంలో సహాయనిరాకరణ ఉద్యమం జయప్రదంగా చేశాం .కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అనే తోక కాంగ్రెస్ శరీరాన్ని ఆడిస్తోందని గ్రహించండి .కాంగ్రెస్ ప్రజా భిమానం ఉప్పెనలో ఉంది .దీనికి మీ దగ్గర నివారణ లేదు పరిపాలనా విధానం గురించి ప్రనణాళికలేదు మీకు .సత్యాగ్రహం విఫలమైనా ఎన్నికల విజయం పంచుకొన్నాం .శాసన సభలు రాజీమార్గానికి విఫలమైనప్పుడు ,నిర్మాణకార్యక్రమం ఆదర్శంగా మిగిలిపోయినప్పుడు ,ముఖ్య వ్యవస్థ నిరోధక శక్తి తగ్గుతున్నప్పుడు ,జైలుకు పోవటం నామమాత్రం  అయినప్పుడు ,కాంగ్రెస్ విషమ పరిస్థితి ఎదుర్కోక తప్పదు.ఈ ప్రశ్నలన్నీ  మమ్మల్ని బాధించాయి  గాంధీ అభిప్రాయానికి భిన్నంగా  కాంగ్రెస్ చాలా సార్లు అహింసా తీర్మానం చేసింది .1940జులై 7న కాంగ్రెస్ అధ్యక్షుడు ‘’కాంగ్రెస్ ప్రపంచ శాంతి స్థాపించే సంస్థకాదు రాజకీయ సంస్థ .అహింస విషయంలో గాంధీతో నడవలేదు .అరాచకం ,విదేశ దాడి పెరిగితే హింసా విధానం పూర్తిగా విడవగలమని మాలో చాలా మంది అనుకోము ‘’అన్న విషయం గుర్తుందా ?గత సంఘర్షణల్లో పాల్గొన్న వారనేకులు ఇపుడు నోరు విప్పలేకపోతున్నారు .మేమేదో తప్పుచేశామనే తీర్మానం మాకు బాధ కలిగిచింది .మేము దోషం చేశామని అనుకోవటం లేదు .మేముకోరేది ఆత్మగౌరవ సంర్ధనం కాదు .మా దృక్పద గణ్యతను   సమర్ధించమని కోరుతున్నాం .మాకోరికను మీరు హర్షించగలరని భావిస్తున్నాం.’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత పట్వర్ధన్

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్

5-2-1905 న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో అచ్యుత పట్వర్ధన్ జన్మించాడు .తల్లి తండ్రీ వైపు వారంతా సాంప్రదాయ కుటుంబీకులే.తండ్రి గొప్ప ప్లీడర్ మహాదాత .తల్లి వీరమాత .వీరి సంతానమంతా స్వాతంత్రోద్యంలో పాల్గొన్న వాళ్ళే ,తల్లి కూడా తన 60వ ఏట ఉద్యమం లో పాల్గొని జైలు కెళ్ళింది .అచ్యత్ అన్న రావు చాలాసార్లు జైలు కు వెళ్ళాడు. సోదరి విజయ 1942ఉద్యమం లో కాలేజీ మానేసి ఉద్యమం లో చేరి అన్నకు ,జయప్రకాష్ నారాయణ కు కార్యదర్శిగా పని చేసింది .ఈ రహస్యోద్యమం లో  ఆమెకు తెలిసిన రహస్యాలు ఇంకెవ్వరికీ తెలియవు .గాంధీ గారి ‘’డు ఆర్ డై’’అనుసరిచి సోదరుడు ,సోదరి పని చేశారు .

  అచ్యుత్ మంచి సంగీత గాయకుడు .అన్ని వాయిద్యాలు వాయించేవాడు .చిన్నప్పటినుంచి దేశభక్తి గీతాలు పాడేవాడు .లెక్కలు వచ్చేవికావు . సంపన్న కుటుంబం కనుక ఇల్లు నిత్యాన్నదానాలు అతిధులతో కళకళ లాడేది .బాగా ధనవంతుడైన పినతండ్రికి పిల్లల్లేక అచ్యుత్ ను దత్తత తీసుకొన్నాడు .అచ్యూత్ , రావు అహ్మద్ నగర్ లో మెట్రిక్ పూర్తి చేసి ,బెనారస్ కాశీ విశ్వవిద్యాలయం లో చేరారు .1893నవంబర్ 16 అనీబిసెంట్ ఇండియారాగా జనం బ్రహ్మ రధం పట్టారు .ఆమె భారత్ నే మాతృభూమిగా భావించి దాస్య విముక్తికి సంకల్పించింది .ఇక్కడే దివ్యజ్ఞాన సమాజం స్థాపించి ప్రపంచమంతా వ్యాపింప జేసింది .మానవ సేవ పరమావధిగా ఉన్న ఆ సమాజం వైపు అచ్యుత్ తండ్రి ఆకర్షితు డయ్యాడు .

  1898జూన్ 6న లో బీసెంట్,  కొందరుకలిసి  ‘’సెంట్రల్ హిందూ కాలేజి ‘’స్థాపించారు.దీనికి ప్రిన్సిపాల్ గొప్ప విద్యావేత్త  డా జి ఎస్ అరండేల్ .ఇందులో పని చేసేవారంతా సేవాభావం తో చేసేవారే .ఒకరినిమించి మరొక ప్రజ్ఞా దురీణులు .భగవాన్ దాస్, గోవిందదాస్ ,గుర్తు, లాంగ్ వంటి మేదావులున్నారు .కొంతకాలం గడిచాక పండిత మదన మోహన మాలవ్యా దీన్ని తీసుకొని హిందూ విశ్వ విద్యాలయం గా మార్చాడు .ఇక్కడ చదివిన అచ్యుత్ సోదరులు పీకే తెలంగ్ ,జ్ఞాన్ చంద్ ల శిష్యులై వారి అడుగుజాడల్లో నడిచారు .రావు వక్తృత్వం లో దిట్ట ఎన్నో బహుమతులు పొందాడు .ఒకసారి విశ్వ విద్యాలయ పార్లమెంట్ కు  అచ్యుత్ ప్రధానిగా ఉన్నాడు .ఎం.ఎ.పాసై అచ్యుత్  యూరప్ వెళ్లి వచ్చి ఇక్కడే ఆర్ధిక శాస్త్ర లెక్చరర్ గా చేరి పని చేశాడు .

   దేశం లో శాసనోల్లంఘన ఉద్యమం మహాఊపుగా సాగుతోంది .రావు అప్పటికే ఉద్యమంలో చేరి జైలు కెళ్ళాడు .బొంబాయ్ ఉద్యమానికి గొప్ప కేంద్రమైంది .ప్రచారం కోసం ఉమాశ౦కర దీక్షిత్ ఒక రహస్య పత్రిక స్థాపించి నడిపాడు .పట్వర్ధన్ వెంటనే తానూ రహస్య ఉద్యమం లో చేరి  జైలుకెళ్లాడు .ప్రభుత్వ జైళ్ళు అన్నీ సత్యాగ్రహులతో నిండిపోయాయి .ఉద్యమం చల్లబడింది .యువకుల్లో ఉద్రేకం ఉప్పొంగింది .గాంధీ రాజకీయాన్ని సా౦ఘి కోద్యమం గా మార్చాడు .రష్యాలో లెనిన్ నాయకత్వం లో సామ్యవాద రాజ్యం స్థాపించటం ఇక్కడి యువకులకు అర్ధమై ,ఇక్కడ ఉద్యమానికి ‘’స్వరాజ్యం ‘’అన్నదానికి నిర్దిస్టరూపం ఇవ్వలేక పోవటం గమనించి తామే నడు౦కట్టాలని యువత భావించింది .సామ్యవాదమే పరిష్కారం అని నిర్ణయించారు .

   ఈ సామ్య వాద సిద్ధాంతానికి  నాసిక్ జైలు ప్రధాన కేంద్రమైంది .జయప్రకాష్ ,అచ్యుత పట్వ ర్ధన్, అశోక్ మెహతా, మీనూ మసానీ మొదలైనవారు కలిసి సిద్ధాంత రూప కల్పన చేశారు .1934 మేనెలలో పాట్నా అఖిలభారత కాంగ్రెస్ సమావేశం లో శాసనోల్లంఘన విరమిస్తూ ,శాసన సభా ప్రవేశానికి వీలుకలిగిస్తూ తీర్మానం చేశారు .అప్పుడే జయప్రకాష్ పట్వర్ధన్లు ,ఆచార్య నరేంద్ర దేవ్ అధ్యక్షత న సమావేశమే కాంగ్రెస్ మితవాద మార్గాన్నితీవ్రంగా విమర్శించి ,కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించి ,యువకులకు భాగస్వామ్య౦  కల్పించారు .

  యువకిశోరం అచ్యుత్  పట్వర్ధన్ పాట్నాలో కాంగ్రెస్ పై నిప్పులు కక్కుతూ రాట్నం –ఖద్దరు తో స్వరాజ్యం రాదనీ ఉపన్యసించాడు .కాంగ్రెస్ నాయకులీ ప్రసంగానికి ఆశ్చర్యపోయారు .1936లక్నో కాంగ్రెస్ కమిటీ సభలో కూడా పట్వర్ధన్ కాంగ్రెస్ ను తీవ్రగా విమర్శించాడు .యువకుల మనోభావం అర్ధం చేసుకొన్న నెహ్రు  నిర్మించిన అఖిలభారత కాంగ్రెస్ కార్యవర్గం లో సామ్యవాద యువకులైన  ముగ్గురు-జయప్రకాష్ ,నరేంద్ర దేవ్ ,పట్వర్ధన్ లకు  అవకాశం కల్పించాడు.మర్యాదగా తిరస్కరించాడు పట్వర్ధన్ .అప్పటికి అతని వయసు 30మాత్రమే .పదవీ వ్యామోహం ఆయనకు లేదన్నదానికి ఇదే నిదర్శనం  .

   1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యాక .ఇండియాను యుద్ధంలోకి ది౦చ వద్దని వాక్ స్వాతంత్ర హక్కు ఇవ్వమని గాంధీ వైస్రాయి లిన్ లిత్ గో తో మాట్లాడి విఫలుడయ్యాడు.రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రివర్గాల చేత రాజీ నామా చేయించాడు గాంధీ .వేరే మార్గం లేక గాంధీ  వైస్రాయియికి లేఖరాసి ,వినోబా భావేతో వ్యష్టి సత్యాగ్రహం ప్రారంభింప జేశాడు .యుద్ధ వ్యతిరేక నినాదాలు చేస్తూ సత్యాగ్రహం లో జనం పాల్గొని జనం స్వచ్చందంగా జైలుకు వెళ్ళారు .వ్యష్టి సత్యాగ్రహం ప్రజాపోరాటం కాజాలదు అని కమ్యూనిస్ట్ లు  భావించినా ప్రపంచామంతావ్యష్టి సత్యాగ్రహం తో  మారు మోగింది .ప్రతిపోరాటం లోనూ ఏదో ఒక సాకుతో కమ్మీలు తప్పించుకోనేవారు .ఉప్పు సత్యాగ్రహాన్నికూడా ‘’ప్రజల పోరాట శక్తి తగ్గించే మత్తు మందు ‘’అని పెదవి విరిచారు .వ్యష్టి సత్యాగ్రహాన్ని ‘’పూలదండల సత్యాగ్రహం ‘’అని హేళన చేశారు ,1942ఆగస్ట్ ఉద్యమాన్ని ‘’ఆగస్టు అల్లర్లు ‘’అనీ జపాన్ ఏజెంట్లు ,పంచమాంగ దళం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యా చర్యలనీ ప్రచారం చేసిన ప్రబుద్ధులు కమ్యూనిస్ట్ లు .ఊరందరిదీ ఒకదారి ఉలిపి కట్టేది మరో దారి అనే సామెత వీరిది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -4(చివరి భాగం ) 

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -4(చివరి భాగం )

ఆజాద్ హింద్ ఫౌజ్ విచారణ

భూలాభాయ్ జీవితం లో మహత్తర ఘట్టం ఆజాద్ హింద్ ఫౌజ్ విచారణ .భారత్ నుండి రహస్యంగా జపాను వెళ్ళిన నేతాజీ సుభాశ్ చంద్ర  బోస్ నాయకత్వం లో శత్రువులకు భారత ప్రభుత్వ సైన్యం స్వతంత్ర జాతీయ సైన్యం అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ గా ఏర్పాడి భారత స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాటం మొదలుపెట్టింది .భారత్ నుంచి బ్రిటిష్ వారిని వెడల గోట్టటమే వీరి ధ్యేయం .రెండవ ప్రపంచయుద్ధం పూర్తయి జర్మనీ ఇటలి పరాజయం పొందటం ,జపాన్ మిత్రమండలికి లొంగిపోవటం జరిగాయి .ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా లొంగిపోవాల్సి వచ్చింది .ఈ సైనికులలో చాలామందిని  బ్రిటిష్ ప్రభుత్వం బంధించింది .కొందరిని ఢిల్లీ లోని ఎర్రకోటలో బంధించి  హింసించింది .భారత ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ విషయం విచారించింది .ముందుగా విచారి౦ప బడిన నాయకులు కెప్టెన్ షా నవాజ్ ,లెఫ్టినెంట్ సైగల్ ,లెఫ్టినెంట్ ధిల్లాన్ . ఈ విచారణపై ప్రపంచం అంతా దృష్టి కేంద్రీకరించింది . ఫౌజుతరఫున వాదించటానికి భూలా భాయ్ దేశాయ్ ,నెహ్రు, ఆసఫాలీ లను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది .ఎక్కువ శ్రమ తీసుకొని నేతాజీ విడుదలకు కారణమైనవాడు  భూలాభాయ్ .బోసు సర్వ సైన్యాధిపతిగా స్వతంత్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ,మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన బోసువీరులను భారత ప్రభుత్వం రాజద్రోహులుగా పరిగణించటం ప్రపంచ స్వతంత్ర దేశాలన్నీ విని ముక్కు మీద వేలేసుకొన్నాయి .స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటేరోజుల్లో ,బ్రిటన్ పై యుద్ధం చేయటం నేరంగా భావించి విచారిస్తున్నదుకు సభ్య ప్రపంచం నివ్వెర పోయింది .లాల్ ఖిల్లా తీర్పుకోసం ఉత్కం తో ఎదురు చూసింది .

  భూలాభాయ్ వాదిస్తూ ‘’పరప్రభుత్వం పై యుద్ధ ప్రకటన ప్రతి పరతంత్ర జాతి జన్మ హక్కు ‘’అని గట్టిగా గంభీరంగా ప్రకటించాడు .తన యావత్ శక్తియుక్తులన్నీ ధారపోసి వాదించాడు భాయ్ .ఆయనవాదనను విని మెచ్చి సంతోషించని వాడే లేడు ఆనాడు .112మంది సాక్షులతో వాజ్మూలాలు చెప్పించాలనుకొని ,కాని ప్రాసిక్యూషన్ వారి 28సాక్షుల మాటలూ విన్నతర్వాత ,అందులో పసలేదని గ్రహించి ,,కేవలం 11మంది సాక్షులతోనే సరిపుచ్చి రెండు రోజులు ఫౌజుచర్యను సమర్ధిస్తూ దీర్ఘ ఉపన్యాసాలు చేశాడు .ఆయన సంది౦చిననమౌలిక ప్రశ్నలు –1-పరాధీన జాతికి స్వాతంత్రం కోసం యుద్ధం చేసే హక్కు ఉందా లేదా ?ఉన్నదనటానికి అనేక ప్రమాణాలున్నాయి 2-సువ్యవస్థమైన స్వతంత్ర భారత తాత్కాలిక సైన్యానికి మలయాలో 2లక్షల 50వేలమంది ,తూర్పు ఆసియాలో 2లక్షలమంది ప్రజలు భక్తీ విశ్వాసాలు చాటారు .అక్షరాజ్యాల ఆమోదం కూడా పొందింది ఈసైన్యం .ఇవన్నీ యదార్ధ విషయాలే కల్పనలుకావు .3-ఆజాద్ హింద్ ఫౌజ్ సువ్యవస్థిత సైన్యం ,దానికి చట్టముందనీ నేనేమీ శ్రమపడి వాది౦చ క్కరలేదు .దస్తావేజులపై దస్తావేజులు ప్రాసిక్యూషన్ వారే సమర్పింఛి రుజువు చేసినందుకు ధన్యవాదాలు .అయితే ఆ చట్టం లో కొరడాలతో కొట్టే నిబంధనను మాత్రమే అడ్వకేట్ జనరల్ అధిక్షేపించారు 4-1911 ఇండియన్ ఆర్మీ చట్టం లో 45వ అధికరణాన్ని ఆయన మర్చి పోయినట్లున్నాడు .అందులో బ్రిటిష్ ఇండియన్ చట్టం కింద దండనార్హం అయిన ఏ సివిల్ నేరానికైనా వారంట్ ఆఫీసర్ హోదా కంటే తక్కువ హోదా ఉన్నవారి ని 30కొరడా దెబ్బలు కొట్టాలని ఉంది .యుద్ధకాలానికి మాత్రం దాన్ని తొలగించారు ,కనుక స్టాట్యూ ట్ లో లేదని చెప్పటానికి వీల్లేదుకదా .కొరడా దెబ్బలను ఆమోదించిన సందర్భాలు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ లో చాలా ఉన్నాయి .5-ఫౌజ్ యుద్ధం ప్రకటించటానికి రెండు కారణాలున్నాయి .ఒకటి ఇండియాకు స్వాతంత్రం. రెండు తూర్పు ఆసియా ప్రజల ధనమాన ప్రాణ రక్షణ 6-నూతన ప్రభుత్వానికి జపాన్ ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవులను ధారా దత్తం చేసింది .ఈ ప్రభుత్వం స్వయంగా 50చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్న ‘’జయవాడే ‘’అనే భూభాగాన్ని సంపాదించింది .సుమారు 1500చదరపు మైళ్ళ విస్తీర్ణమున్న మణిపూరు ,విష్ణు పూరు ప్రాంతాలను అయిదారు నెలలు పాలించింది కూడా .అండమాన్ దీవులను కర్నల్ లోకనాధం రెండు శాఖలు మాత్రమే నిర్వహించాడు .అందులో ఒకటి చిన్నదైన విద్యాశాఖ. స్కూళ్ళు ఎక్కువ లేవు ఖర్చు తక్కువ అని అధిక్షేపించక్కరలేదు .15శాతం అక్షరాస్యతున్న మనదేశం లో కంటే అక్కడే ఎక్కువ స్కూళ్ళు న్నాయి .ఈ దీవులకు ‘’షాహిద్ ‘’,’’స్వరాజ్’’ అనే పేర్లు కూడా పెట్టారు .జయవాడిలో 15వేలమంది ప్రజలున్నారు . వారంతా భారతీయులే ,ఆజాద్ హింద్ ప్రతినిధే వీటిని  పాలించాడు 7-ఫౌజు ఇండియా-బర్మా సరిహద్దు దాటినప్పుడు రెండు ఫర్మానాలు జారీ అయ్యాయి .ఒకటి స్వతంత్ర భారత ప్రభుత్వ అధ్యక్షుని  చేత ,రెండవది జనరల్ కావేబే చేత .జపాన్ జయించే భారత్ భూ భాగమంతా ఫౌజు కే అప్పగించబడుతుందనీ ,వారే దాన్ని పాలిస్తారని ఫర్మానాల సారాంశం .8’’స్టాంప్ కలె క్టింగ్’’ అనే వారపత్రికలో టి.యే .బ్రో హెడ్ అనే విలేకరి ఇ౦ఫాలులో  ఉపయోగానికి ముక్కాణీ,అణా స్టాంపుల ప్రూఫ్ కాపీలు తానూ చూశానని’’ ఢిల్లీ కోట’’ బొమ్మ ,’’ఢిల్లీ చలో’’ అనే నినాదం వాటిపై ముద్రించబడి ఉందనీ  రెండు భాషలలోనూ  ‘’తాత్కాలిక భారత ప్రభుత్వం ‘’అని ఉందనీ ,తర్వాత వీటి అవసరంలేక ఆ అచ్చులు భగ్నం చేయబడి స్టాంపులు తగలబెట్ట బడినాయని.కనుక తాత్కాలికప్రభుత్వం ఏర్పడి పరిపాలించటం జరిగింది కనుక దానికి యుద్ధం చేసే హక్కుకూడా ఉన్నదని  ఒప్పుకోక తప్పదు.యుద్ధకాలంలో జరిగే పనులు సాధారణ ‘’లా ‘’క్రిందకు రావు .యుద్ధకాలం లో ఒక జర్మన్ పౌరుడు బ్రిటిష్ వాడి నెవరినైనా కాల్చిచంపితే హత్యాద్రోహం కింద శిక్షిస్తారా ?9-అంతర్జాతీయ న్యాయ శాస్త్రం ప్రకారం పరదాస్యం నుంచి విముక్తికావటానికి ఏ దేశమైనా చేసే యుద్ధం ధర్మ సమ్మతమే అవుతుంది .యుద్ధం చేసే ఆ రెండు పక్షాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉండనక్కర లేదు .బోయర్ యుద్ధం దీనికి ఉదాహరణ  మొదటి చార్లెస్ ను ఉరితీయటాన్ని మీరు ఏమంటారు ?రెండవ జేమ్స్ కధఏమిటి ?’’10-ఫౌజు సైనికులు తిరుగుబాటు దార్లే కావచ్చు ,కాని 1870లో అమెరికన్ సభాపతి గ్రాంట్ ‘’తిరుగుబాటు దార్ల పోరాటం అంతర్జాతీయ ధర్మం ప్రకారం యుద్ధం కిందకే వస్తుంది ‘’అని బల్ల గుద్ది చెప్పలేదా  ? రెండవ పక్షం ఓడిపోయిన వ్యక్తులపై దోషా రోపణ చేయరాదని అమెరికన్ ఫెడరల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పుల్లర్  తీర్పు ఇవ్వలేదా ?11-స్పానిష్ –అమెరికన్ కాలనీలు స్వతంత్రంకోసం స్పెయిన్ దేశం పై తిరుగుబాటు చేస్తే  ఆ పోరాటాన్ని సక్రమ యుద్ధం అనే బ్రిటన్ చెప్పలేదా .ప్రభుభక్తి శాశ్వత ధర్మం కాదు .అలా అయితే ఏ పరాధీన జాతీ స్వతంత్రాన్ని పొందనే లేదు 12-ప్రభుభక్తికీ దేశభక్తికీ సంఘర్షణ వస్తే దేశ భక్తినే ఎంచుకోవాలని 1776 అమెరికా స్వాతంత్ర ప్రకటనే గొప్ప నిదర్శనం .ఇదే న్యాయం కాకపొతే ప్రపంచం లో న్యాయాని చోటే ఉండదు 13-‘’లా ఆఫ్ నేషన్స్ ‘’అనే  వాటిల్ ప్రామాణిక ప్రాచీన ఆంగ్ల ధర్మ శాస్త్రం లో ‘’ప్రజల రాజ్య సంరక్షణ కింద ఉన్న ఒక దుర్బల రాజ్యాన్ని ,ఆ ప్రజల రాజ్యం రక్షించలేక పొతే ,ఆ దుర్బల రాజ్యం వెంటనే స్వతంత్రాన్ని మళ్ళీ పొందుతుంది ‘’అని ఉన్నదాన్ని బట్టి ఆజాద్ హింద్ ఫౌజు నిర్మాణ సందర్భం లో కూడా ఇలాంటిపరిస్థితు లే ఏర్పడ్డాయి 14.చివరగా క్రూరకృత్యాలు హత్యలుజరిపారు అన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ సాక్షులే క్రాస్ పరీక్షలో చెప్పలేక పోయారు .ఇక్కడ హింసలు అంటే నియమ ఉల్లంఘన  చేసినందుకు శిక్షే కానీ వేరేదీ కాదు అని గ్రహించాలి 15-హత్యల విషయం రుజువే కాలేదు .మహమ్మద్ హుస్సేన్ ను తుపాకీ తో కాల్చినట్లు చేసిన అభియోగం లో ని ముగ్గురు సిపాయిలలో జాగీరాం కు అంతకు ముందు ఎప్పుడూ తుపాకి పట్టనే లేదని చెప్పాడు ,ముగ్గురి గుళ్ళూ అతని గుండెలో దిగాయన్న ప్రాసిక్యూషన్ ఆరోపణలో పస లేదనిరుజువైంది కదా .ఇలాంటి మేధో విలసిత అత్యంత అనుభవ పూర్వక భూలా భాయ్ డిఫెన్స్ వాదన కు ప్రభుత్వ మైండ్ బ్లాకై పోయింది .ముద్దాయిలను బేషరతుగా విడిచిపెట్టింది .

  బోసు వీరుల విడుదలవగానే భూలా భాయ్ ని అభినందిస్తూ దేశం నలు మూలాలనుంచి అభినందన టెలిగ్రాములు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .బోసువీరులూ భాయ్ ని అభినదించారు .  బొంబాయి ప్రోగ్రెసివ్ గ్రూప్ సమావేశం లో భాయ్ ప్రసంగిస్తూ ‘’షా నవాజ్ ,సైగాల్ ,ధిల్లాన్ లను విచారిస్తున్నప్పుడు భారతజాతీయ సేనకు చెందిన 40వేల మంది ఆఫీసర్లు సామాన్య సైనికులు లాల్ ఖిలాలో విచారి౦పబడ్డారు .ఈ ముగ్గురు ఆఫీసర్లు భారతీయ యువకులకు ప్రతినిధులు .స్వాతంత్ర్యం తదితర సమస్యల కంటే ఎక్కువ గుణ పాఠం ఫౌజు విచారణలో భారతీయులకు నేర్పింది ‘’అన్నాడు .ఈ విచారణ తర్వాత భాయి రాజకీయాలనుండి విర మించాడు .

  భూలాభాయ్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది .దీనికి కారణం ఫౌజు కేసు విచారణలో ఆయన నిద్రాహారాలు మానేసి కృషి చేయటమే అని పెద్దలంతా భావించారు .తీవ్రమైన జబ్బులోకూడా మౌలానా అబ్దుల్ కలాం కోసం’’ ఆజాద్ ,ఆజాద్’’ అని కలవరించాడు .అంతటి మమైక్యం పార్టీతో వ్యక్తులతో ఆయనకు ఉండేది .నాలుగు నెలలు బాధపడి చివరకు 5-5-1946 న స్వాతంత్రం రాకుండానే భూలాభాయ్ దేశాయ్ 68వ ఏట బొంబాయి స్వగృహం లో మరణించాడు . పెద్ద ఊరేగింపుగా ఆయనను స్మశానానికి వేలాది అభిమానులు పౌరులు పెద్దలతో తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు .ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక లాంచనాలతో తమ నివాళి అర్పించింది .

.గాంధీ ‘’మహా నాయకుడు దేశాయ్ .ఆయన బాధ కు పరి సమాప్తి లభించింది .అందరికి ఆయన ఆదర్శనీయుడు ‘అన్నాడు .ప్రకాశం పంతులు ‘’క్రాస్ పరీక్షలో మేటి .న్యాయ శాస్త్ర మేధావి ‘’అన్నారు .ఆజాద్ ‘’అసెంబ్లీలో నాయకుడుగా గొప్ప దేశ సేవ చేశాడు ఈ కేసు ద్వారా అంతర్జాతీయ న్యాయ శాస్త్రం లో ఒక నూతన అధ్యాయం ఆవిర్భవించింది ‘’.నెహ్రూ ‘’బోసు వీరుల విచారణలో ఆయన ప్రసంగం చిరస్మరణీయం ‘’.జిన్నా ‘’నాతో ఏకీభవించలేదు కాని మాస్నేహం భంగం కాలేదు ‘’.ఆలీఖాన్ ‘’ఆయన ప్రసంగాలు శ్రోత్ర పేయాలు ‘’.కెప్టెన్ షా నవాజ్ ‘’మా దేశ ప్రజలే మమ్మల్ని జపాను చేతిలో కీలు బొమ్మలు అంటారని భయపడ్డాం .దేశాయ్ ధైర్యంగా ముందుకొచ్చి నేతాజీ గౌరవాన్ని ,దేశ గౌరవాన్ని కాపాడాడు ‘’.సరోజినీ నాయుడు ‘’దయ ఉదారహృదయం ఉన్నవాడు ఆయన చేసిన దానాలకు  లెక్కే లేదు .స్వాతంత్రం కోసం త్యాగం చేశాడు ‘’. కెప్టెన్ సెఘాల్ ‘’జీవించి ఉంటె స్వతంత్ర భారతానికి ఇంకా ఎక్కువ తోడ్పడి ఉండేవాడు ‘’.రాజాజీ ‘’కుశాగ్ర బుద్ధి కుసుమకోమల హృదయుడు .ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు ‘’.అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ‘’దేశానికి స్వతంత్రం రాకముందే మరణించటం విచారకరం ‘’.కేఎం మున్షి ‘’నేను దేశాయ్ శిష్యుడిని .ఆయన లేని లోటు తీర్చలేనిది ‘’.జెవి మౌలంకర్ ‘’భారత దేశ యోగ క్షేమాలకోసం న్యాయశాస్త్రాన్ని ఉపయోగించిన ఉత్తమ వ్యక్తీ ‘’.సర్దార్ పటేల్ ‘’ఆయన సేవలకు దేశం ఎంతో రుణపడి ఉంది ‘’.డా.రాజేంద్ర ప్రసాద్ ‘’ఆయనమరణం నన్ను కలచి వేసింది ‘’.డా.లతీఫ్ ‘’రాజీ పద్ధతిలో సిద్ధహస్తుడు దేశాయ్ ‘’.కే భాష్యం’’నాయకులకు ఆయన సలహాలు అత్యంత అవసరమైన తరుణ౦ లో మరణించాడు ‘’.వివి గిరి ‘’రాజనీతిజ్ఞుడైన న్యాయవాది ‘’.రామస్వామి అయ్యర్ ‘’అనేక సంస్థానాలు ఆయన సలహా కోరేవి. ఆరోగ్యం బాగాలేకపోయినా ఫౌజు కేసు చేబట్టిన ధీమూర్తి ‘’. హరేకృష్ణ మెహతాబ్ ‘’దేశాయ్ విశదీకరణ విప్లవకారులకు శిలాశాసనం ‘’.గోపీనాధ బార్డో లాయ్’’దేశ స్వాతంత్రంకోసం వాదించిన అత్యుత్తమన్యాయవాది దేశాయ్ ‘ఒక ఉజ్వల తార అస్తమించింది ‘’అంటూ ప్రముఖులు నివాళి అర్పించారు . మద్రాస్ లో సానుభూతి తీర్మానం చేశారు .పెక్కు చోట్ల హర్తాల్ జరిగింది .పత్రికలూ ప్రత్యేక వ్యాసాలు రాశాయి .ధన్యజీవిగా అభి వర్ణించాయి .

  బ్రిటన్ లో చర్చిల్ ప్రభుత్వం పోయి, లేబరు ప్రభుత్వం రాగానే పార్లమెంటరీ రాయబారులు ఇండియా వచ్చి ఇక్కడి దుస్థితిని  ప్రభుత్వానికి తెలియజేశారు .ప్రతిస్టంభన పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులను పంపింది .వారొచ్చి,గాంధీ జిన్నా మొదలైనవారితో సిమ్లాలో  సంప్రదింపులు జరుపుతుండగా భూలాభాయ్ మరణ వార్త తెలిసింది  .భూలాభాయి ఆత్మకు శాంతికలగాలని అందరూ కోరారు .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్-28-10-20-ఉయ్యూరు ’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -3      

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -3

1-స్వతంత్ర రాజ్యాలతో అఖండ భారత్ ఉండాలి .2-కేంద్ర ప్రభుత్వమే దేశ రక్షణ విదేశీ వ్యవహారాలూ ,నాణాలముద్రణ వగైరాది అధికారాలు కలిగి ఉండాలి 3-హిందువులు అధికసంఖ్యాకులుగా ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం లకు సంపూర్ణ మత స్వేచ్చ ,అందరితో సమానావకాశాలు ,గౌరవ రాజకీయ ప్రతి పత్తితో రాజ్యపద్దతి ఉండాలని ,పాకిస్తాన్ ఏర్పాటు తమకిస్టం లేదని,ఐకమత్యమే బలమని ,ఐకమత్యంలేకపోతే మరో ‘’బాల్కని రాజ్య ‘’అవుతుందని హెచ్చరించారు .కనుక భూలాభాయ్ ,ఆలీఖాన్ కలిసి కల్సి ఉండే ప్రణాళిక తయారు చేసి వైశ్రాయికి అందజేశారు .ఇందులో ముఖ్యసూత్రాలు -1-కేంద్రంలో తాత్కాలికంగా హిందూ ముస్లిం ల ప్రభుత్వం ఏర్పరచి ,అల్పసంఖ్యాకులకు తిన ప్రాతినిధ్యమివ్వటం .2.ఈప్రభుత్వం ఇండియాచట్టానికి లోబడి పని చేయటం .తర్వాత ,కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను  విడుదల చేయటం మెజార్టీ సభ్యుల నిర్ణయాన్ని బట్టి వైస్రాయి నడుచుకోవటం .1945జూన్ 10న పంచగనిలో విశ్రాంతిలో ఉన్న  గాంధీజీ ని ఈ ఇద్దరు కలిసి ప్రణాళికకు ఆయన ఆశీస్సులు పొందారు.

      వైస్రాయి వేవెల్ లండన్ వెళ్లి ,అక్కడి బ్రిటిష్ మంత్రులతో సంప్రదించి ,తిరిగివచ్చి ,1945జూన్ 15వర్కింగ్ కమిటీ సభ్యులను విడుదల చేశాడు .ప్రణాళికపై చర్చించటానికి సిమ్లాలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ మొదలైనపార్టీ ల సభ జరిగింది  .అన్నిపార్టీల వారూ వేవెల్ నే నాయకుడుగా అంగీకరించారు .వేవెల్ జూన్ 29నుంచి జులై 14వరకు సమావేశం సాగించి సాగించి చివరికి సంప్రదింపులు భగ్నమయ్యాయనే ఆశ్చర్యవార్త ఆశగా ఎదురు చూస్తున్న వారికి తెలియ జేసి వైఫల్యానికి కారణం తానే అంటూ  వేవెల్ ప్రకటించాడు .సిమ్లా సభ విఫలమయ్యాకు భూలాభాయ్ ని జాతీయ వాదులు  నిందించారు.వర్కింగ్ కమిటీ సభ్యులంతా జైల్లో ఉంటె స్వతంత్రించి ప్రతిపక్షాలతో ఒడంబడిక చేసుకోవటం ఏమిటని దూషించారు  .దేశాయ్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ కార్య దర్శి శ్రీప్రకాశ’’నిర్బంధంలో ఉన్న కమిటీ సభ్యులను విడుదల చేయించటానికే భూలాభాయ్ చొరవ తీసుకొన్నాడు .ఆయన చేసింది నూటికి నూరుపాళ్ళు చట్టబద్ధమే .కమిటీ సభ్యులను విడుదల చేయటానికి వైస్రాయి విముఖత చూపటం వలననే ఈ ఆలోచన చేశాడు భాయ్ లేకపోతె మనవాళ్ళ విడుదలకు ఆశలే ఉండేవికావు .విడుదలైనవారికి జరుగుతున్న స్వాగతాలు ,వాక్ స్వాతంత్రం ,వ్రాసే స్వాతంత్రం వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ ఆజంట సాధించిన విజయాలే .సిమ్లాసభ వైఫల్యానికి వైస్రాయేకారణం  .జిన్నా వైఖరి మంకుపట్టుకూడా కలిశాయి .జిన్నా ముసల్మానులకు లు ద్రోహం చేశాడు,అతనిలో ముస్లిం అంశ,సంస్కృతీ లేవు  ఇన్నాళ్ళూ బూకరిస్తున్న జిన్నాను వైస్రాయి నొక్కాల్సిన చోట నొక్కాడు .’’అని డాక్టర్ సయ్యద్ యార్జంగ్ ఒక  ప్రకటన చేశాడు .కనుక భూలాభాయ్ తప్పేమీలేదు .అతడు ప్రశంస నీయుడే ‘’అని ప్రకటించాడుశ్రీప్రకాశ.

   స్వాతంత్రం కోసం కృషి  చేసే యువకులను చూస్తే భూలాభాయ్ కి ఎంతో సరదా .కాంగ్రెస్ వాళ్ళు జైళ్లలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ లు ఉద్యమ చేయటం చూసి వారిపై సానుభూతికలిగింది భాయ్ కి .సామ్రాజ్యవాదుల మధ్య జరిగిన యుద్ధం ప్రజాయుద్ధమన్నారని ఆగస్ట్ విప్లవాన్ని వెన్నుపోటు పొడిచారని కమ్మీలపై ప్రజలకు కోపం .గాంధీ విడుదలయ్యాక ,కమ్యూనిస్ట్ కార్యదర్శి పిసి జోషి ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .గాంధీ వారికి అయిదు ప్రశ్నలు వేశాడు –ప్రజాయుద్ధం అన్న మాటలో ప్రజ అంటే ఎవరు 2-మీ పార్టీ   ఆడిట్ కు ఎవరైనా ఒప్పుకుంటారా?3-రెండేళ్లుగా కార్మికులతో సమ్మె చేయించి వారి నాయకుల అరెస్ట్ కు మీరుతోడ్డారని అంటారు నిజమేనా ?4-కాంగ్రెస్ లో  చొరబడటం ఒక విధంగా మీ కుటిల నీతి కాదా  5-మీపార్టీ పై ఇతర దేశాల పెత్తనం ఉందికదా ?

  తనపై ఆరోపణలను భూలాభాయి సరోజినీ నాయుడు ,రాజాజీ వంటి వారి తో కమిటీ వేసి విచారించమని జోషి గాంధీని కోరాడు .తాను  చెప్పాల్సిందంతా గాంధీకి చెప్పానని రాజాజీ అన్నాడు .అనారోగ్యం వలన  భాయ్ వెంటనే చెప్పలేకపోయినా తర్వాత పరిశీలించి గాంధీకి తన అభిప్రాయం తెలిపాడు .రెండుపార్టీలుభాయ్ ని మధ్యవర్తి గా ఉండ మనటం మాయన నిష్పక్షపాతానికి నిదర్శనం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -2

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -2

   కేంద్ర అసెంబ్లీ లో భూలాభాయ్ మాట్లాడిన విషయాలు ఒక తీవ్రవాది మాట్లాడినంత పరుషంగా ఉండేవి .ఇండో బ్రిటిష్ వ్యాపార వొడంబడిక ,జాయంట్ పార్లమెంటరి కమిటీ నివేదిక క్రిమినల్ లా సవరణ బిల్లు ,ఆర్మీ రిక్రూట్ మెంట్ బిల్లు ,ఆర్దికబిల్లు మొదలైన విషయాలలో భాయ్ చేసిన ఉపన్యాసాలు చాలా విలువైనవి .బ్రిటిష్ పాలకులుయుద్ధ సమయం లో  భారత దేశం లో ప్రజా ప్రభుత్వమే నిర్వహిస్తోందని ఆర్భాటంగా ప్రచారం చేసుకొంటుంటే ,ఇండియాకు స్వాతంత్రం ఇవ్వటానికి హిందూ ముస్లిం సఖ్యత లేదన్న అసత్య ప్రచార సమయం లో ,భారత శాసన సభలో భూలాభాయ్ నాయకత్వం లో అసెంబ్లీ సభ్యులైన కాంగ్రెస్ వారు ,ముస్లిం లీగు సభ్యులు కూడా ఏకమై ,ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లు ను అనేక సార్లు ఓడించారు .శాసన సభ్యుల ఐక్యత చూసి తెల్ల ప్రభుత్వం  తెల్ల బోయింది .హిదూ ముస్లిం ఐక్యత ఏర్పడు తుందేమోనని కంగారు పడింది కూడా .ఫైనాన్స్ బిల్లును ఓడించి భారత్ లో ప్రజా స్వామిక ప్రభుత్వం లేదని ప్రపంచానికి నిర్దంద్వంగా తెలియ జేశారు భూలాభాయి  నాయకత్వంలోని సభ్యులు .ప్రభుత్వం చెప్పేదాంట్లో సత్యం లేదని నిరూపించారు .సభలో ఓడిన బిల్లును వైస్రాయి వీటో అధికారం ప్రయోగించి బలవంతంగా రుద్దే దురుద్దేశాన్ని లోకానికి చాటగలిగారు .1935నుంచి 45వరకు ఉన్న దశకం లో దేశం రాజకీయంగా అట్టుడికి పోతున్న తరుణం లో ,సెంట్రల్ అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడుగా భూలాభాయి ఉంటూ, యెనలేని కీర్తి నార్జించాడు దేశ విదేశాలలో .

  1939సెప్టెంబర్ లో ప్రారంభమైన రెండవప్రపంచ యుద్ధం లో  భాగస్వామిగా ఇండియాను చేయాలని ప్రభుత్వం కోరగా భారతీయులు అంగీకరించక అసమ్మతి తెలిపారు .బ్రిటిష్ వారి స్వంతయుద్ధాలలో ఇండియా 1927నుంచీ పాల్గోన్నదనీ ,కాంగ్రెస్ గుర్తు చేస్తూనే ఉంది .యుద్ధం ప్రారంభం కాగానే గాంధీ ,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యుద్ధం ఉద్దేశ్యం ఏమిటి అని నిలదీశారు .దానికి ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని రూపుమాపి ,ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడటమే అని ప్రభుత్వం సమాధానం చెప్పింది .’’మీతో కలిసి సమానంగా యుద్ధం చేసి శత్రు సంహారం చేయటానికి మాకుకూడా మీతో పాటు సమాన ప్రతిపత్తి ఇవ్వండి ‘’అని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కోరింది .కానీ కుటిల తెల్ల ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా ,ఇండియాను యుద్ధంలోకి దించి ,ఇండియా అంగీకరించే యుద్ధం చేస్తోందని ప్రభుత్వం ప్రచారం చేసింది .ఈ అసత్య ప్రచారాన్ని త్రిప్పికొట్ట టానికే కాంగ్రెస్ వ్యష్టి శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించింది .

 అప్పటికే అధికారం లో ఉన్న ఆరు రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రి వర్గాలు ,ఇండియా యుద్ధం లో పాల్గొనటానికి అసమ్మతిగా మంత్రిపదవులను త్యజించి వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొన్నారు .1940 డిసెంబర్ 1 న భూలాభాయ్ ని అరెస్ట్ చేసి ,ఎరవాడ సెంట్రల్ జైలులో డిటిన్యుగా   తీసుకు వెళ్ళింది .జైలులో ఆయన జబ్బు పడ్డాడు .1941సెప్టెంబర్ 17న విడుదల చేసింది .

  భూలాభాయ్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడుగా ,బొంబాయి రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండేవాడు .1942లో కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశాడు  .1942ఏప్రిల్ లో క్రిప్స్ రాయబారం విఫలమయ్యాక,ఆగస్ట్ 7న బొంబాయి కాంగ్రెస్ సమావేశం లో ‘’బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశం నుంచి పూర్తిగా వైదొలగాలి ‘’అనే తీర్మానం చేయటానికి సమావేశమైంది .ఆగస్ట్ 8న జాతీయ నాయకులను అరెస్ట్ చేసి అహ్మద్ నగర్ కోటలో బ్రిటిష్ ప్రభుత్వం బంధించింది .దేశంలో ఉవ్వెత్తున విప్లవం చెలరేగింది .అణచటానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసి ,విఫలమై మారణ యంత్రాలను కూడా ప్రయోగించింది .మహాత్ముని అర్ధాంగి కస్తూరిబాయ్ మాత  ,ఆయన కుడిభుజం మహ దేవ దేశాయ్ మరణించారు .ఈ మరణాలు ప్రజల్ని మరింత ఉద్రేక పరచాయి .గాంధీ ఆగాఖాన్ భవనం లో ఉపవాసం చేసి ,ఆగస్ట్ ఉద్యమానికి కాంగ్రెస్ కారణం కాదనీ ప్రభుత్వానినిదే బాధ్యత అని నిరూపించాడు .అనారోగ్య రీత్యా ఆతర్వాత గాంధీని విడుదల చేశారు .

  దేశంలో జరుగుతన్న ఈ పరిణామాలన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాడు ఎంతోవ్యధ చెందుతున్నాడు  భూలాభాయ్  .గాంధీ   నెహ్రు అజాట్ వంటి అగ్రనాయకులు జైల్లో ఉండటం ఆయన్ను కలచి వేసింది .వారి విడుదలకు ,ప్రతిష్టంభన తొలగటానికి మార్గాలు  అన్వేషించాడు.శాసన సభా ప్రతిపక్ష నాయకూడుగా  ,ముస్లిం  పక్ష ఉపనాయకుడునవాబ్ జాదా లియాఖత్ ఆలీఖాన్ తో సంప్రదించి ఇద్దరూకలిసి అన్యోన్యంగా కేంద్రం లో జాతీయ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా నైనా ఏర్పాటు చేస్తే సంక్షోభాన్ని కొంత వరకు తగ్గించవచ్చు అని అలోచించి లియాఖత్ నుఒప్పించి ఒక ప్రణాళిక తయారు చేశాడు భూలాభాయ్ . రెండవ ప్రపంచం మొదలైన నాటి నుంచీ జనాబ్ జిన్నా నాయకత్వం లోని ముస్లిం లీగు ఈశాన్య వాయవ్య రాష్ట్రాలతో ముస్లిం మేజారిటీరాష్ట్రాలను పాకిస్తాన్ పేరుతొ నిర్మించాలని కోరింది .జిన్నా వాదం ప్రమాదమైనదని జాతీయ ముస్లిం లు వాదించారు .దేశాన్ని రెండుముక్కలు చేయాల్సిందే అని పట్టుబట్టాడు జిన్నా .భారత దేశం అవిభాజ్యం అన్నది కాంగ్రెస్ .పాకిస్తాన్ వాదాన్ని ఖండిస్తూ జాతీయ ముస్లిం లు భావి భారత ప్రజలంతా సంపూర్ణ స్వాతంత్ర్యం తో తులతూగాలని ప్రచారం చేశారు .రాజ్యపద్దతి ముఖ్యంగా మూడు అంశాలపై ఆధార పడి ఉండాలని వా౦ఛి౦చారు . అ వివరాలు తర్వాత తెలుసుకొందాం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -1

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -1

భూలా భాయి జీవంజీభాయి దేశాయ్ 13-10-1877 న గుజరాత్ లోని సూరత్ జిల్లా చారిత్రాత్మక బార్డోలికి దగ్గరున్న బల్సూరులో   అనవిల్ బ్రాహ్మణ న్యాయవాద  కుటుంబ లో పుట్టాడు .తండ్రి ప్రభుత్వ ప్లీడర్ .స్వగ్రామ౦ లో చదువు ముగించి బొంబాయి ఎలిఫిన్ స్టన్ కాలేజిలో చేరి ప్రధమ శ్రేణిలో పట్టా పొంది ,ఎం ఏ పాసై ,అహ్మదాబాద్ కాలేజిలో  హిస్టరీ ప్రొఫెసర్ అయ్యాడు . రెండేళ్ళు పని చేసి ,ఎల్.ఎల్ .బి.చేసి ,బాంబే హైకోర్ట్ లో న్యాయవాదిగా చేరాడు .అక్కడ అందరూ బారిస్టర్లే.స్వదేశీ న్యాయవాదిగానే ఉంటూ భూలాభాయ్ ,వాదనా సామర్ధ్యం తో త్వరలోనే అద్వితీయ న్యాయవాది యై ,ప్రభుత్వం దృష్టిలోపడి ,1923లో వైస్రాయ్ కార్యవర్గ పదవి ని స్వీకరించమని కోరినా నిరాకరించి, అనేకసార్లు ,హై కోర్ట్ న్యాయమూర్తి పదవికిఆహ్వాని౦చినా తిరస్కరించి ,1926లో తాత్కాలికంగా అడ్వొకేట్ జనరల్ పదవి మాత్రం స్వీకరించాడు .

  మితవాదిగా రాజకీయం లోకి ప్రవేశించి,అనిబిసెంట్ హోం రూల్ ఉద్యమం లో  భూలాభాయ్  పని చేసి విస్తృత ప్రచారం తెచ్చాడు .అప్పుడే గాంధీజీ వల్లభభాయ్ పటేల్ లతో పరిచయం కలిగింది .1928 బార్డోలీ సత్యాగ్రహం  చరిత్రాత్మకమై సైమన్ కమీషన్ బహిష్కరణ లో దేశం ఊగిపోయింది .ప్రజలు అనేక కస్టనష్టాలు  ఎదుర్కొంటూ అత్యంత ధైర్య సాహసాలతో ‘’సైమన్ గోబాక్ ‘’నినాదాలతో దేశాన్ని అట్టుడికి౦చారు .అప్పుడే బార్దోలీలో రీ సెటిల్ మెంట్ విషయంలో పన్నుల నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది .ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరించింది .1930లో గాంధీ –ఇర్విన్ ఒడంబడిక జరిగి ,లండన్ లో రెండవ రౌండ్ టేబుల్ సభకు గాంధీకి ఆహ్వానం వచ్చింది .గాంధీ నిరాకరించాడు .బార్డోలీ పన్నుల విషయం లో ఒక ప్రత్యేకకోర్టు పెట్టి విచారిస్తామని ప్రభుత్వం తెలియజేయగా గాంధీ లండన్ వెళ్ళటానికి ఒప్పుకున్నాడు .1931లో బార్డోలీ విచారణ సంఘం ఏర్పడింది .

 1928లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రూం ఫీల్డ్ కమిటీ ముందు  రైతులపక్షాన భూలాభాయ్ వాదింఛి,1931 బార్డోలీ విచారణ సంఘం  ఎదుట కూడా వాదించాడు  1932సత్యాగ్రహ ఉద్యమం లో గాంధీతో పాటు పాల్గొన్నాడు .ఈ మహోద్యమానికి ముఖ్యకారణం లార్డ్ విల్లింగ్టన్ వైఖరే .గాంధీ లండన్ నుంచి రాగానే నెహ్రూను అలహాబాద్ లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ను పెషావర్ లోనూ దేశవ్యాప్తంగా వేలాది సత్యాగ్రహులను  అరెస్ట్ చేసి౦ది ప్రభుత్వం .కలకత్తాలో ఆర్డినెన్స్ పెట్టారు .దేశమంతా నానా భీభత్సంగా ఉన్నది .గాంధీ వైశ్రాయికి ఒక టెలిగ్రాం పంపిస్తూ ఆయనతో మాట్లాడాలని ఉందని తెలిపాడు .రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విషయాలుతప్ప ,ఇంకేమీ మాట్లాడటానికి వీల్లేదని జవాబు రాగా, గత్యంతరం లేక కాంగ్రెస్ స్వాతంత్ర్య పోరాటానికి దిగాల్సి వచ్చింది .

 ఉద్యమం జయప్రదంగా సాగుతుంటే వైస్రాయ్ ఆరు వారాలలో అణచి వేస్తానని  ప్రగల్భాలు పలుకగా ,,ఉద్యమం ఉవ్వెత్తున రెండేళ్ళు నడిచింది .1921ఉద్యమం లో 30వేల మంది 1930ఉద్యమం లో 60వేలమంది ,1932లో లక్ష ఇరవై వేలమంది  ప్రజలు స్వచ్చందంగా జైలుకు వెళ్ళారు  ,1932లో సత్యాగ్రహ ఉద్యమంలో భూలాభాయ్ పాల్గొని ఒక ఏడాదిజైలు శిక్ష  అనుభవించి ,10వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాడు .విడుదలై 1933లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సభలో కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరయ్యాడు .

  వ్యూహం మార్చి కాంగ్రెస్ శాసనసభ ఆక్రమణకు దిగింది .శాసనసభా బహిష్కరణ కు వత్తాసు పలికిన పార్టీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటానికి ముఖ్యకారకుడు భూలాభాయ్ .గుజరాత్ నుంచి కేంద్ర శాసన సభ సభ్యుడుగా భాయ్ ఎన్నికయ్యాడు .కాంగ్రెస్ పక్ష నాయకుడయ్యాడు .శ్రీ ఎస్ సత్యమూర్తి ఉపనాయకుడు .పండిత మోతీలాల్ నెహ్రూ చనిపోయాక అంతటి ప్రతిభాశాలి శాసన సభలో కరువయ్యారు .ఆకొరత తీర్చటానికి భూలాభాయ్ ని పార్టీ ఎంపిక చేసింది .అప్పటికి ఈయనకు  అందులో  అనుభవం లేదు..స్వయం కృషితో అనుభవం సాధించి 1936లో ప్రభుత్వ విధానాలకు అసమ్మతి తెలుపుతూ  అసెంబ్లీ నుంచి పార్టీ సభ్యులతో మొదటి సారిగా వాకౌట్ చేసి భూలాభాయ్ చరిత్రసృస్టించాడు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-9

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-9

ఆంద్ర జయప్రకాష్ –జయప్రకాష్ నారాయణ జీవితానికి అన్నపూర్ణయ్య గారి జీవితానికీ చాలా సామ్యం ఉన్నది .ఇద్దరూ యువజనాకర్షణలో సిద్ధ హస్తులు .జాతీయ ఉద్యమం లో వామపంధా అనుసరించిన త్యాగమూర్తులు .మొదట్లో కాంగ్రెస్ తర్వాత మార్క్సిజం అధ్యయన శీలురు  .’’వెలుగు ‘’పత్రికలో మద్దూరి ‘’ 1953 వేసవి శిక్షణలో జెపి పూనాలో 21రోజులు ఉపవాసం చేసి ,నాస్తికత్వం నుంచి   ఆస్తికత్వానికి మారాడు .1953సెప్టెంబర్ లో ‘’బొంబాయి సోషలిస్ట్ జనరల్ కౌన్సిల్  ఆధిభౌతిక వాదం నా సమస్యలను పరిష్కరించలేకపోయింది .నేను ఇవాళ మార్క్సిస్ట్ ను కాను ‘’అని చెప్పాడు అంటూ రాశారు .మానవులమధ్య ప్రేమ బంధం గాఢ౦ గా ఉండాలి .జయప్రకాష్ నిర్ణయం దివ్యమైనది .కేవల నాస్తికుడు పరమ ఆస్తికుడై ప్రేమ తత్వాన్ని శరణు జొచ్చాడు .మహా పురుషుల గమ్యం ఇదే..ఆ గమ్యాన్ని  చేరిన జెపి కి ఇవే జోహార్లు అని రాసినమాటలు అక్షరాలా అన్నపూర్ణయ్యగారికీ వర్తిస్తాయి .ప్రజా సేవలో 33ఏండ్లు పండిపోయి 1953డిసెంబర్ 2న అన్నపూర్ణయ్య గారు తాను ఏ పార్టీకీ చెందను అని ప్రకటించారు .ఆత్మ విచారణ మార్గం లో గురువును వెతుక్కొంటూ మెహర్బాబా శిష్యుడయ్యారు మద్దూరి .

   యువజన శిక్షణా శిబిరాలు –గాంధీ ఆశీస్సులతో 1934లో జయప్రకాశ్ మొదలైన వారు కాంగ్రెస్ లో అంతర్భాగం గా ‘’కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ‘’స్థాపించారు .1937లో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం ఉంది .బలం పు౦జు కోవచ్చునని వాళ్ళు ఈ పార్టీలో చొచ్చుకుపోయారు .ఆంద్ర యువకులకు మూతన రాజకీయ దృక్పధం అలవాటు చేయటానికి కొత్తపట్నం లో వాలంటీర్ల శిక్షణా శిబిరం నిర్వహించారు .ఇది ఒంగోలుకు తూర్పున పది మైళ్ళ దూరం లో సముద్రం ఒడ్డున శిబిరం . 170మంది వాలంటీర్లు చేరారు .వీరిలో పుచ్చలపల్లి సుందరయ్య ,కొల్లా వెంకయ్య ,మాకినేని బసవపున్నయ్య ,జొన్నలగడ్డ రామలింగయ్య ,పిడతల రంగా రెడ్డి మొదలైన వారున్నారు .ఇందూలాల్ యాజ్ఞిక్ ,జహీర్ ,జోరాబేగం ,స్వామి సహజానంద సరస్వతి ,ఆచార్య రంగా ,జయప్రకాష్ నారాయణ ,అచ్యుత పట్వర్ధన్ ,బాట్లివాలా ,సిపి అల్లం గో ఉపన్యాసాలిచ్చి  అవగాహన కల్పించారు .

   ఆంధ్రరత్న దుగ్గిరాలవారి ముఖ్య శిష్యుడు జనాబ్ గౌసు బేగం వాలంటీర్ దళాధిపతి  .చండ్ర రాజేశ్వరరావు డ్రిల్లు ,అన్నాప్రగడ కామేశ్వరావు గెరిల్లా పద్ధతులు నేర్పేవారు .అల్లూరి సత్యనారాయణ రాజు ,ఆయన భార్య ,అన్నా ప్రగాడ, ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు .శిబిర నిర్వహణ బాధ్యతా అన్నాప్రగడ ,మద్దూరి,అల్లూరి నేతి చలపతిసాగి విజయ రామరాజు వహించారు .స్థానికుల తోడ్పాటుతో జయప్రదంగా జరుగున్న ఈ శిబిరాన్ని ప్రభుత్వం నిషేధించింది.1937మే 21న గుంటూరు  జిల్లా కలెక్టర్ వెల్లోడి రెండు వాన్ల రిజర్వ్ తో వచ్చి ,వాలంటీర్లపై లాఠీ చార్జి చేశాడు .అన్నా ప్రగడ,అన్న పూర్ణయ్య గార్లకు బాగా దెబ్బలు తగిలాయి .భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం గురించి అన్నపూర్ణయ్య గంభీర ఉపన్యాసం చేశారు .1942లో దువ్వూరికి ఇచ్చిన చార్జి షీటు లో శిబిరం లోనిషేధిత  కమ్యూనిజం గూర్చిబోధించారని ఆరోపణ ఉన్నది .తాను  ఆపని చేయనే లేదు అని దువ్వూరివారు తీవ్రంగా ఖండించారు .

 1938 మే 4న ఆంద్రా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యం లో గుంటూరుజిల్లా మంతెన వారిపాలెం లో  అన్నాప్రగడ యువజన శిక్షణా శిబిరం నిర్వహించాడు .దీన్ని ప్రభుత్వం నిషేధించలేదు .అన్న పూర్ణయ్య ఇక్కడా జాతీయోద్యమం సోషలిజం గూర్చి మాట్లాడారు .మాడభూషి వెంకటా చారి,  చండ్ర , సివికే రావు ,కంభం పాటి సత్యనారాయణ పివి శివయ్య ,జొన్నలగడ్డ ,అధ్యాపకులుగా ఉన్నారు ఎస్ ఏ డాంగే,పిసి జోషి, అధికారి  మొదలైన పెద్దలు ప్రేరణ కలిగించారు  .మాదల వీరభద్రయ్య రాసిన గేయాని అన్న పూర్ణయ్య గారు పాడి స్పూర్తి క లిగించారు .

   1936,37లో మద్దూరి విస్తృతంగా గోదావరి జిల్లాలో పర్యటన చేసి యువకులను సోషలిం వైపు ఆకర్షించారు.బట్ట గుండులో జరిగిన తమిళనాడు సోషలిస్ట్ సభకు అధ్యక్షత వహించారు ఏలూరు లో జరిగిన పగోజి సభకు  అధ్యక్షత వహించగా శ్రీమతి కమలకుమారి ప్రారంభించారు .అదేకాలం లో రాజమండ్రి అల్యూమినం ,ప్రెస్ వర్కర్లను సంఘటితం చేసి వారి యూనియన్ లకు అధ్యక్షుడై కార్మిక సంక్షేమానికి యెనలేని కృషి చేశారు అన్నపూర్ణయ్య .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కచేరి వైరల్ సీన్ సితారా-1

కచేరి వైరల్

  సీన్ సితారా-1

‘’ఒరే భడవాకానా !పెళ్ళయి ఏడాదిన్నర అయింది .మీ ఆవిడ కడుపులో కాయ ఏమైనా కాయి౦చేది ఉందా లేదా .మునిమనవణ్ణి చూసిహరీ అందామని ఆగాను ‘’మనవడికి బామ్మ ఫోన్

‘’నసపెట్ట కే బామ్మా .చూస్తావులే .’’మనవడు రిప్లై

‘’నీకూ మీతాతలాగే బద్ధకం  ఎక్కువ .కచేరీ చేస్తున్నావా క్రమం తప్పకుండా .ఏమో నాకు డౌటే.ఆయనా అంతే నేను కచేరీకి పిలిచేదాకా తొందరే ఉండేదికాదు .అందుకే పెళ్ళైన కొత్తలోనే  మీనాన్న నా కడుపులో పడ్డాడు ‘’బామ్మ

‘’కచేరీ ఏమిటే ?’’అది నీదాకా పాకిందా?’’

‘’నా దాకా ఏమిట్రా ప్రపంచమంతా పాకి ప్రతి ఇంట్లోనూ కచేరీయే.సరే మాటలేనా త్వరలో శుభవార్త చెవిన వేస్తావా లేదా?లేకపోతె నేనే వచ్చి దగ్గిరుంది కచేరీ చేయించాల్సి వస్తుంది ఆతర్వాత నీ ఇష్టం ‘’

ఓసి బామ్మో !మాకు రెండు తరాల వెనకున్నా నీ స్పీడ్ అందుకోటం కష్టమే .నీ మనవరాలితో ఒక సారి మాట్లాడు ఇస్తాను ఫోను ‘’

ఏమే!మా వాడు లైన్ లోనే ఉన్నాడట .నువ్వు సహకరిస్తున్నావా .అమ్మా ఇదే కచేరీకి తగినకాలం .కచేరీఎచేస్తారో కష్టమే పడతారో ,రెండునెలల్లో నాకు శుభవార్త చెప్పాలి .మా వాడు కాస్త  మందం వాళ్ళ తాత లాగా .నా లాగా నువ్వే విజ్రు౦భి౦చు .వాడు ఇంట్లో నుంచేగా పని చేస్తా .సిస్టం ఆఫ్ చేసినప్పుడల్లా నీ సిస్టం స్టార్ట్ చేయించు .మొహమాట పడితే కష్టమే తల్లీ .రెండునెలలోపు నాకు శుభవార్త రాకపోతే క్షణాలమీద వచ్చి వాలి నేనే దగ్గరుండి సాపాసాలతో కచేరీ చేయిస్తాను .అంత శ్రమ నాకివ్వవని నాకు తెలుసు .ఏమిటి మాట్లాడవు ?’’

‘’సరే అమ్మమ్మగారూ .డెఫినిట్ గా కచేరీ ఫలం చెవినేస్తా౦  త్వరలో ఫికర్ మత్ కేజియే .అయినా ఇంత కచేరీ పాండిత్యం మీ పల్లెటూరిలో ఎలా వ్యాపించిందో .మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది ‘’అంది ముసిముసి నవ్వులతో మనవరాలు .

  సీన్ సితారా-2

నేను ‘’ఏరా బ్రాహ్మీ !ఈమధ్య కనిపించటమేకాదు , వినిపించటం కూడా లేదే ?’’

బామ్మర్ది బ్రాహ్మి ‘’ఏం చెప్ప మంటావ్ బావా ‘’అంటూ ఏడ్పు లంకించుకొన్నాడు

నేను ‘’ఏడుపు ఆపి సంగతి అఘోరించు ‘’

బ్రాహ్మీ –‘’-సరే బా ! .పగలూ లేదు రాత్రీ లేదు కచేరీ చేయమంటుంది అరగంటకో సారి మా ఆవిడ .’’

నేను –‘’నీకూ మీ ఆవిడకూ సంగీత౦  రాదు కదరా .ఎట్లా చేస్తారు ?’’

బ్రాహ్మీ –‘’నువ్వో ఇక్ష్వాకుల కాలం వాడివి .టివి ఉన్నా ఏదీ చూడరు మీ ఇద్దరూ.  గంతకుతగ్గ   బొంత మాఅక్క .అదేదో సుబ్బు సీరియల్ ట మా ఆవిడ చూసి కచేరీ పాట లంకి౦చు కొంది బా. ఇంట్లోనుంచే పని అయినా అరగ౦టకోసారి కచేరీ అనిపిలవటం నేను వెళ్ళటం నా ఒళ్ళు హూనం అవటం పులుసు కారిపోవటం జరుగుతోంది .’’

నేను –‘’మరీ అంత అర్జెంట్ ఏమిట్రా ?’’

బ్రాహ్మీ –‘’మా అమ్మ వార్నింగ్ ఇచ్చిందిట నాలుగు నెలలలోపు కడుపు తెచ్చుకోకపోతే నాకు రెండో పెళ్లి చేస్తానని బెదిరించిందట .అందుకే నా పులుసు కార్పిస్తోంది .చెప్పుకోటానికి సిగ్గుగా ఉంది బా .

నేను –‘’అది మీ ఫామిలీమాటర్ .నన్ను ఇన్వాల్వ్ చేయకు .మీ తంటా లేవో మీరు పడి మీఅమ్మ  మనసుకు శాంతి చేకూర్చండి .’’

  సీన్ సితారా-3

‘’ఒరే అల్లుడూ !బయట కచేరీలుబాగా  చేసే వాడివని పేరు .ఇంట్లో కూడా చేస్తున్నావా ?లేక అలసిపోయి మూడంకె వేసి ముసుగు తన్ని పడుకు౦టు న్నావా ?’’

మేనల్లుడు ‘’ఇంట్లో కచేరీ ఏమిటి మామయ్యా !నాకేం అర్ధం కావటం లేదు ‘’

మామ ‘’ఓరి సత్తెకాలపు సత్తయ్యా! నీ వల్లకాదు కాని  అమ్మాయినిపిలు ‘’

      ‘’అమ్మాయ్! అమ్మా మామేనల్లుడేమైనా కచేరీలు  చేస్తున్నాడా ఇంట్లో  ?బయటి మోతేనా?’’

‘’బాబాయి గారూ !అదో ముద్దపప్పు వ్యవహారం .అంతా నేనే కలగ జేసుకోవాల్సి వస్తోంది .మీరే ఒక సారి చెప్పండి .

‘’ఇప్పటి దాకా వాయి౦చానమ్మా.మాకున్నది మీరే .శీఘ్రంగా మమ్మల్ని ఉద్ధరించండి .అమ్మా కచేరీ  బాధ్యతా మొత్తం నువ్వే తీసుకొని రిజల్ట్ త్వరలో చెప్పాలి చెవులకు. దానికోసం ఎదురు చూస్తుంటాం నేనూ మీ పిన్నీ ‘’

‘’సరే బాబాయ్ !ఇక చూడండి. తడాకా చూపి కచేరీపై కచేరీ చేయించి బయటికి వెళ్ళకుండా శుభవార్త మీ చెవిన వేస్తాం .నాకొదిలేయ్యండి బాబాయ్ ‘’

  సీన్ సితారా-4

‘’ఏమే పిల్లా !ఎంతో సేపు నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తటం లేదు అప్పుడే నిద్రా ?ఇంకా మీకు రాత్రి ఎనిమిది కూడా అయి ఉండదు .ఇక్కడ మాకు ఉదయం పదిన్నర .

‘’నిద్రా లేదు పాడూ లేదు అత్తా !ఆయన ఆ గదిలో కంపుకోట్టుడు .ఈ గదిలో నేను సీరియల్స్ తో కాలక్షేపం .

‘’అదేంటే !వర్క్ ఫ్రం హోం కదా .నీ వర్క్ వదిలి వేరే వర్క్ ఏంటే వాడి బొంద .అసలు కచేరీ చేసుకొంటున్నారా ?

‘ఈ మధ్య కచేరీ అంటే ఆమడ దూరం జరుగు తున్నాడు అత్తా .నాకు ఏదో ఇదిగా ఉంది .నువ్వు చెప్పిచూడు ఘాటుగా .

‘’ఒరే ఏబ్రాసీ ! పిచ్చ వేషాలెయ్యమాక .అది చెప్పినట్లు అడిగినప్పుడల్లా కచేరీ చేసి కడుపు నో కాయకాయించు .లేకపోతే మా ఆస్తి అంతా మీకు దక్కదు .కచేరీ చేస్తారో  కిందా మీదా పడతారో నాకు తెలీదు .రెండు నెలలలే గడువు నాకు శుభవార్త అందించాలి .విన్నావా ?’’

‘’సరే పిన్నీ .అయినా అమెరికాలో ఉంటూ ఈ కచేరీ సాహిత్యం నీ చెవిన ఎలా పడిందీ ?’’

‘’ఒరే !ప్రపంచం కుగ్రామంఅయి ,కరోనాలో ఒక ఇల్లే అయిపొయింది .వైరస్ లా వార్తలు క్షణాలమీద పాకుతున్నాయి .అమెరికాలోనేకాదు ఈమధ్య ఆఫ్రికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా మొదలైన అన్ని దేశాలవాళ్ళ నోళ్ళలో కచేరీ పద౦ నానుతోంది .నువ్వు ఇండియాలోఉన్నా నీ చెవికి సోకలేదా ఆశ్చర్యం గా ఉందే.అమ్మాయికివ్వు ‘’

‘’అమ్మాయ్ !మా వాడి చెవుల తుప్పు వదిలించా .ఇక నీదే భారం .కచేరీ సామ్రాజ్యం లో విహరించి మాంచి రిజల్ట్ ఇవ్వండి త్వరగా ‘’

‘’సరే పిన్నీ !ఫికర్ వద్దు నేనే దున్నేస్తా .దారికి తెచ్చి కచేరీలో కచేరీలనిపిస్తా మీ వాడితో .నువ్వన్నట్లు ఆన్ లైన్ రిజల్ట్ అందిస్తా అత్య౦త త్వరగా .అయినా పిన్నీ’’ కచేరీ’’ కాయిన్ చేసి ‘’వైరల్’’ లా వ్యాపింపజేసి కర్తవ్య బోధ చేసిన  సుబ్బు అభినందనీయుడు  పిన్నీ .ఉంటా కచేరీ టైమయింది .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

యలమంద కోటీశ్వర శతకం

యలమంద కోటీశ్వర శతకం

నరసరావుపేట  తాలూకా శ్రీ కోటీశ్వర క్షేత్ర నివాసి ,అచల గురుసంప్రదాయకుడు శ్రీ బెల్లం కొండ కోటి నాగయ్యకవి  ‘’శ్రీ యలమంద కోటీశ్వర శతకం ‘’రాశాడు .వృషభ గోత్రజుడు .తల్లి సొమా౦బ,తండ్రి పిచ్చయ్య .కవి పాశుపతం మొదలైన అనేక ఉపాసనా సిద్ధుడు ,పరమహంస స్వరూప నిత్యానంద రాజయోగి.కోటి నాగార్యుడుగా సుప్రసిద్ధుడు . రేపల్లె తాలూకా మాచవరం వాస్తవ్యులు శ్రీ అలపర్తి వెంకయ్య చౌదరి ధర్మపత్ని శ్రీమతి  వేంకాయమ్మ ద్రవ్య సహాయం తో ,నిడుబ్రోలు తాతాముద్రాక్షర శాలలో 1934లో ప్రచురింపబడి౦ది .వెలలేదు .

  సీస పద్యం లో  యలమంద గొప్పతనం వర్ణించాడు కవి .యలమంద అంటే కోటప్పకొండ .అక్కడి స్వామి త్రికోటీశ్వరుడు .కైలాసానికి మించిందీ , సమస్త ఓషధులకు నిలయమైనదీ ,తిరుమలకు సాటియైనదీ ,అణిమాది అష్ట సిద్ధులను అందించేది ,’’వసుధ యాదవ మణి యొప్పుగా నందున్న మహిలో ఉన్నదీ ,రుష్యాదుల బిలాలున్నదీ,అందానికి సాటి ,మంచుకొండలున్నదీ , శ్రీకోటీశ్వరునికి నెలవై ఉన్నదీ ,కోటి లింగాని జ్ఞాన కొండ యలమంద కొండ .ఆ కొండపై వెలసిన వాడే శ్రీ యలమంద కోటీశ్వర స్వామి .

  జన్మ సార్ధకం చేసే చతుర్విధ ఉపాయాలు ,జనన రాహిత్యానికి వివిధ సూచనలు ,గర్భం లోని పిండ వృద్ధిక్రమం ,పంచీకరణం ,హంస గమనాగమనం ,జ్ఞానే౦ద్రియాది నిర్మాణం ,సాంఖ్య తారక అమనస్క యోగ విషయాలు ముముక్షు తత్వ మార్గానికి సోపానాలుగా,పండిత పామర  రంజకం గా ఈ శతకం కోటి లింగకవి రాశాడని బాపట్ల తాలూకా మాట్లూరు వాసి శ్రీ ఆకుల కోటి లింగయ్య మెచ్చుకున్నాడు .కవిగారు తన శతకాన్ని నారాయణ శతకం లాగా చదు వుకోవాలని సూచించాడు .

  ‘’శ్రీ భక్త హృదయవాసా –మౌనిజన- సేవ్యత్రికూట వాసా –శోభితామల వికాసా –మమ్మేలు –శుభ దృష్టి కొటీశ్వరా ‘’అని శతకం ప్రారంభించాడు కవి .’’గొప్పదనమునకు గాదు భక్తిగా జెప్పితి –ప్రాపు నీవని వేడితి –నన్ను తమ దాపునకు జేర్పమంటి –క్రూరుండు వీడ౦చు నను-నీవు వేరు శాయకు  -కర్మ చే నిలబుట్టియు  జీవులు –కర్మములు చేయు చుండి –కర్మ చేతను గిట్టుచు మరు జన్మ గా౦చు దురు  -ఋతు వేళ కమలమందు –సతి శుక్ల శోణితములు నండమగు కోటీశ్వరా !

‘’తల్లి పొత్తిలి  యందున బెరుగుచును –తగమూత్ర మలము లందు –తల్లడిలి పొర్లాడుచుజరపితిని –సోయంచు పూరకంబు –లోపలి పోయి కు౦భ కమగుచును –హం యంచు రేచకంబు  వెలికొచ్చు-హర నామ కోటీశ్వరా-ముందు పరమాత్మ యందు నవ్యక్త-మందున మహత్తత్వము –అ౦దునను హంకారము –నను గల్గె-నతిమాయ కోటీశ్వరా-వాయువులో సగ భాగము వ్యానమై –వరుస మిగిలిన భాగము –తోయమాకాశాగ్ని భూమిలో –తోడ్పడియె కోటీశ్వరా-తోయమున నర్దాంశము రస మయ్యె-రూప శబ్ద స్పర్శ ము –గంధరస –రూపింప జలపంచకం బని యొప్పె-రూఢిగా కోటీశ్వరా-తన్ను డా జూచుకొనుటె యమనస్కము కోటీశ్వరా’’

చాలా గహన వేదాంత విషయాలు అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు శతకం లో రాసి నిజంగానే ముముక్షులకు మోక్ష మార్గ దర్శనం చేసిన శ్రీకోటి నాగార్య కవి ధన్యుడు .

 కోటప్పకొండగుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి[1] చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.ఇక్కడ కాకులు వాలవు .అదొక విచిత్రం . మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-20-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విజయదశమి 25-10-20 శుభాకాంక్షలు

విజయదశమి శుభాకాంక్షలు 25-10-20

 

https://photos.google.com/share/AF1QipMvejhzYk7FBCN2o7qrWN5t67vKBpH768jRTpYZLy4NHu7LbPEVBPxAJUsuVVLZhw/photo/AF1QipPqPbZoV9ntmpkt8CG13bKeFCQCpT4GuAC5fwSv?key=aUdsVDVodjhWemhTMGZDZE1aWnl2TUJMYzN1N1pn

Posted in దేవాలయం | Tagged | Leave a comment

పెద వేగి దేవాలయం  -2చివరి భాగం )

పెద వేగి దేవాలయం  -2చివరి భాగం )

4-ఏకాదశ రుద్రులు –ఛాతి మధ్యలో దండలకూర్పు గా చేసిన ఆభరణం తాబేలు  లేక సాలీడు ను పోలిఉండటం జుగుప్సాకరం .రుద్రునికి ఇష్టమైంది మర్కటం .శివుడిని కచ్ఛ పేశ్వరుడు అనీ అంటారు.జందెం ఉదరబంధంపూర్ణ ఘట ఖచిత మణులతో పొదగబడిఉన్నాయి  .ఆకర్నా౦తాలై   కుడి ఎడమ మకర వ్యాఘ్ర కుండలాలు భుజ స్కంధాలై పడి ఉంటాయి .పైన వస్త్రం లేదు. కుడి చేయి పైకెత్తి విపత్కర స్థితిలో రుద్రాక్షమాల పట్టుకొని ఉంటాడు .ఎడమ చేయి కంటికి పైన ,చేతుల నాగ భుజ కీర్తులు ,వలయ కంకణాలు ఉన్నాయి .పాదాల సర్ప నూపురాలు కింద గజ్జల పట్టెడ గొలుసులు ,ధోవతి బదులు చర్మాలు౦ టాయి.పట్టికలు రెండూ పైకి లాగి ముక్త ,రత్న మేఖల హారాలతో బంధి౦ బడి ఉంటాయి .మొలత్రాడు అంటే మేఖలానికి  చిరుగంటలున్నాయి .పూర్తిగా నిలుచున్నరుద్రప్పురుషుని మనోహర రూపం ఇది .శతరుద్రీయం ,రుగ్వేదాలలో వర్ణించిన అగ్ని రుద్రరూపుడుగా కనిపిస్తాడు.పది శిరసులపై ఉన్న జటలన్నీ మధ్యపురుష శిరోజాలతో కలుపబడి ,పైన ఒకే చోట ముడి వేయబడింది .ప్రతి ముఖం విలక్షణం .మూడవ నేత్రంలేదు .ఈశానుడు గాభావించవచ్చు .

మధ్య పురుషుని రెండు చేతులు కాక, ఇరువైపులా 11భుజాలవంతున మొత్తం 22భుజాలు ముంజేతి నుండి ఉద్భవించాయి .భుజతరు అంటే చేతుల వృక్షం అన్నమాట .ముంజేతులకు గుండ్రని కంకణాలున్నాయి  .అన్ని చేతులలో ఆయుధాలు ఉండటం మరో విశేషం .కనుక ఇది రుద్ర రూపం .అదో వస్త్రం చర్మ౦మోకాళ్ళ వరకే ఉంది .పట్టికలతో బంధింపబడి మేఖలతో ముడి వేయబడింది .రెండుకాళ్ళ ఆమధ్య వ్రేలాడేది రుద్రుని మేఢ్రం.అధో రేతం  స్ఖలన రుద్రుని సూచిస్తోంది .ఇతడు శశ్ని దేవుడు .గుడిమల్లం లో నూ ఇలాగే ఉంటాడు .మొత్తం మీద మధ్య పురుషుడు మహా దేవుడుగా ,తక్కిన రూపాలు శివ,శంకర నీలలోహిత ఈశాన విజయ ,భీమ దేవదేవ, భవోద్భవ, రుద్ర రుద్రా కపాలీ గా చెప్పబడుతున్నాడు .మధురలో 4వ శతాబ్ది ఏకాదశ రుద్ర శిల్పం శ్రీ శ్రీరామమూర్తిగారు కనిపెట్టారు . మధుర  రుద్రమూర్తులు వరుసగా ఒకదాని ప్రక్క ఒకటి నాభి వరకు విడివిడిగా అర్ధ శిల్పం లో కనిపిస్తాయి. కాని పెదవేగి రుద్రరూపం లో ఒకే మూర్తిలో కుదించి వేర్వేరు శీర్షాలు భుజాలు ద్వారా వేర్వేరు రుద్ర రూపులు కనిపిస్తారు .ఈ శిల్పం క్రీశ 6-7శతాబ్దికి చెందింది కావచ్చు .శాలంకాయనులు ,పూర్వ చాళుక్యులు వైదికాకాచారాలను పాటిస్తూ బ్రాహ్మణులను గౌరవించినట్లు శాసనాలు చెబుతున్నాయి .పెదవేగి రుద్ర రూపం లాంటి శిల్పం దేశంలో ఇంకెక్కడా లేదు అనేది నిర్వివాదం .

5-కాల భైరవుడు –పెదవేగి చుట్టూ కిలో మీటరు పరిధిలో కోట గోడలు ఉండేవి .వేంగీనగర స్థాపన శాలంకాయనరాజులు లు చేశారు .నగరాధి దేవత దుర్గ లేక అంబ .కోటరక్షకురాలు .క్షేత్ర నాయకుడు కాలభైరవుడు .కోట ఈశాన్యాన ఒకటి ,పశ్చిమ ద్వారం వద్ద రెండోది కాలభైరవ విగ్రహాలున్నాయి .నాలుగు చేతులు .విరబోసిన జట,కుడి చేతిలో త్రిశూలం ,కింది చేయి నడుముపై ,ఎడమ చేత కపాలం ,చురిక ఉన్న విగ్రహమూర్తి కాలభైరవుడు .ఒకమీటరు ఎత్తు,,70 సెంటీమీటర్ల వెడల్పు ,18 సెంటీ మీటర్ల మ౦ద౦  ఉన్న విగ్రహం .శంకరాచార్యులవారు కాశీ కాలభైరవుని ఈశ్వరునిగా భావించి అష్టకం రాశారు .

విజయదశమి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలు- సాదర ఆహ్వానం.

మిత్రులారా,

నమస్కారం.

 అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో 32 గంటలునిర్విరామంగా న్యూ జీలండ్  నుంచి అమెరికా దాకా జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషాసాహిత్యాభిమానుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. యూ ట్యూబ్ఫేస్ బుక్ మాధ్యమాల ద్వారా సుమారు 25 వేల మంది 200 కి పైగా సాహితీ ప్రసంగాలు విని ఆనందించారు. ఆ సదస్సుని విజయవంతం చేసిన ఐదు ఖండాల వక్తలకు, వేదిక నిర్వాహకులకు, సాంకేతిక నిపుణులకూ, వీక్షించి, ఆనందించి మాకు అభినందన సందేశాలను అందజేస్తున్న  తెలుగు భాషా, సాహిత్యాభిమానులకు మా అభివాదాలు.

ఆ సదస్సు సాధించిన విజయాలకి పరాకాష్టగా అక్టోబర్ 31, 2020 (శనివారం) నాడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా విజయోత్సవాలు” నిర్వహించాలని 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వావర్గం నిర్ణయించారు. భారత కాలమానం ప్రకారం ఆ నాడు మధ్యాహ్నం 1:00 pm కి ప్రారంభం అయి సుమారు ఐదు గంటలు సాగే ఆ విజయోత్సవాలలో ప్రముఖ సినీ నటులు, సాహితీవేత్త శ్రీ కె. బ్రహ్మానందం గారు ప్రారంభోపన్యాసం చేస్తారు. 30 మందికి పైగా వక్తలు సాహిత్య ప్రసంగాలు చేస్తారు. 

ఈ విజయోత్సవాల సమగ్ర ప్రకటన ఇందుతో జతపరిచాం.  అన్ని ప్రసంగాలూ ప్రపంచవ్యాప్తంగా యూ ట్యూబ్ లోనూ , ఫేస్ బుక్ లోనూ ప్రత్యక్ష ప్రసారం లో ఈ క్రింది లింక్ లలో చూసి ఆనందించమని కోరుతున్నాం.

You Tube Link:

https://youtu.be/OXLoVspTnOM

Face Book Link: 

https://www.facebook.com/permalink.php?story_fbid=132931561907857&id=100332915167722

Hope to meet you on October 31, 2020  from 1:00 pm- 6:00 Pm (India Time)  on the internet.  

భవదీయులు,

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సస్), కవుటూరు రత్న కుమార్ (సింగపూర్);

రావు కొంచాడ (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా), డా. జొన్నలగెడ్డ మూర్తి (లివర్ పూల్, ఇంగ్లండ్);

రాపోలు సీతారామ రాజు (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా), వంశీ రామరాజు (భారత దేశం),

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పెద వేగి దేవాలయం

 

పెద వేగి దేవాలయం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు 12కిలో మీటర్ల దూరం లో పాడుపడి ఉన్న ఊరే పెదవేగి.ఒకప్పుడు వేంగీ రాజ్యానికి ముఖ్య పట్టణంగా వర్ధిల్లిన వేంగీ నగరమే ఇది .పురాతత్వ సర్వేక్షణ తరఫున డా కార్తికేయ శర్మ చేసిన పరిశోధనలలో అపురూప శైవ విగ్రహాలు కనిపించాయి .ఇవి క్రీ .శ. 4-6శతాబ్దాల నాటివి .ఇవే కాక తూర్పు చాళుక్యరాజుల పాలన నాటి ఆలయ శిల్పాలు ,ప్రతిష్టా మూర్తులు దొరికాయి .వాటి వివరాలు తెలుసు కుందాం

1-సోమాయ ఫలకం –ఇది దాచేపల్లి తెల్లరాయి తో చేయబడింది .12,9,2సెంటిమీటర్ల కొలతలు కలిగింది .పార్వతీ పరమేశ్వరులు ఒకే ‘’మంచక ‘’అధిష్టానం పై కూర్చుని ఉంటారు శివుని జటలు చక్కగా బంధింపబడి ఉంటాయి .త్రినేత్రుడు . యజ్ఞోపవీతం మూడు పాయలు స్పష్టంగా కనిపిస్తుంది. శివుని వామభాగం లో అర్ధ పర్యంకం పై అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది .పరమేశుడు ఎడమ చేతితో అమ్మవారిని దగ్గరకు తీసుకోవటం చూడగలం .నూతన దంపతులైన ఈ ఆది మిధునం విలక్షణముఖ వర్చస్సుతో  వేంగీ పురవాసులకు అర్చా దేవతలయ్యారు .చిన్న ఫలకమే కనుక ఇది ఒక శివ భక్తుని పూజా మందిరం లో అర్చనకు స్థాపింపబడి ఉండవచ్చు .ఈ సోమాయ ఫలకం అత్యంత ప్రాచీనమైనది .తర్వాత పాలించిన పల్లవ,విష్ణు కుండిన రాజుల కాలం లో దేవాలయ ఫలకాలపై శివ పార్వతి, చిన్న పిల్లాడుగా స్కందుడు ,వినాయకుడు చేరారు .శివ పార్వతి అర్చా ఫలకం మాత్రం ‘’పెద్దమడియం ‘’ వాటికన్నా చాల పురాతనమైనది .

2-పంచలింగ ఫలకం -7,7,2 సెంటీ మీటర్ల ఫలకం పై అర్ధశిల్పంగా పంచలింగాలు ఒకే అధిష్టానం పై ప్రతిష్టించి న ఫలకం .పద్మ బంధం గా అధిష్టానం ఉంటుంది .పంచలింగాలు ఒకే వరుసలో ఉన్న శిల్పం ఇంకెక్కడా లేదు .ఇవి రుద్రుని పంచ భూతాలూ లేక ముఖాలకు ప్రతి రూపాలు కావచ్చు .ఈ మూర్తులుకూడా ఆకాలం లో చక్కగా అర్చనలు అందుకొన్నారు .శివుడిని పంచ శర(బాణ)ఆననుడిగా అంటే ముఖాలు ఉన్నవాడిగా చాలా ఆగమ గ్రంథాలు పేర్కొన్నాయి .

3-నాగ దేవత –ఇది కాల్చిన మట్టి ఫలకం .అండా కారం గా 11,9,2  సెంటి మీటర్ల ఫలకం విచిత్రమైన స్త్రీ రూపం ఇందులో కనిపిస్తుంది .ఆమె సింహాక్షి ,సింహ ముఖి ,లంబ స్తని , సన్నని నడుము, చక్కని నాభి ,పూర్ణ వక్షోభాలతో ఉంటుంది .సర్ప శిరస్సుపై యోని నుంచి మోకాళ్ళవరకు వంగి కూర్చుని ఉంటుంది .పాములే భూషణాలు కుండలాలు కంఠమాల ,కేయూరాలు  ,మేఖల శిరోజాలు అన్నీ సర్పాలే .రెండు చేతులలో ముకుళించిన కమలాల కాండాలు ఎత్తి పట్టుకొని ఉంటుంది .కనుక ఈ దేవత కుమారి అని చెప్పటానికి ఇదే నిదర్శనం .ఏ సంప్రదాయానికి చెందిందో చెప్పలేక పోయారు. బహుశా అదితి కాని ,పృధ్వీ దేవత కాని అయి ఉండవచ్చునని అభిప్రాయం .

4-ఏకాదశ రుద్రులు –ఈ శిల్పం పెదవేగి కి దగ్గరలో దొరికింది .ఎరుపు రంగు ఇసుక రాయి శిల్పం .11తలలు ,24చేతులు ఉన్న  ఈ శిల్పం ఒకమీటరు ఎత్తు,85 సెంటీ మీటర్ల వెడల్పు ,32 సెంటీ మీటర్లమందం కొలతలు కలది .ఇది ప్రతిష్ట చేయబడిన విగ్రహమే అని కిందున్న బుడుపు ను బట్టి చెప్పవచ్చు .ఈ ఆలయం ఎక్కడ ఉండేదో తెలియటం లేదు .ఊరికి మధ్యలో ఉన్న శివాలయం లో ఉండి ఉండవచ్చు .మొదటగా ఈ శిల్పాన్ని మరికొన్నిటిని  శ్రీ రాళ్ళబండి సుబ్బారావుఒక ప్రత్యేక సంచికలో తెలియజేశారు .ఈ శిల్పాన్ని శిల్పించిన తీరు యావత్ భారత మూర్తి కళా చరిత్రలో లేనే లేదు .రుద్రుని ‘’అరుణాయ ,తామ్రాయ ‘’అంటారు .కానీ సదా శివ లక్షణాలు ఈ శిల్పం లో లేవని అసలు శివ శిల్పం కాదని కార్తికేయ శర్మ అభి ప్రాయ పడ్డారు .మధ్యరూపం నిల్చుని ఉన్న పూర్తి మానవ రూపం .కుడివైపుకు వంగినట్లు ఎత్తుగా ఉన్న పిరుదును బట్టి చెప్పవచ్చు .జట తురాయిలాగా నిలువుగా ఉన్నా ,ముఖాగ్రం లో మకుటం ఉంది .మకుటం మీదరత్న ఖచిత  వైదిక పతకాలు లేక మాడలు న్నాయి .ఫాలమున నిటారుగా త్రినేత్రం ఉన్నది .నాసిక ,పెదిమలు కొంతవరకు చిద్ర౦ (రంధ్రం  )మైంది .కంఠం పై మూడు రేఖలున్నాయి .మెడలో హారాలు మూడు దళసరిగా ముత్యాలు రత్నాలు పొదిగి ఉంటాయి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

23-10-20 శుక్రవారం నవరాత్రి 7వ రోజు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ మహా లక్ష్మి అలంకరణ

23-10-20 శుక్రవారం నవరాత్రి 7వ రోజు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ మహా లక్ష్మి అలంకరణ

https://photos.google.com/share/AF1QipOIuz4MTG9Ss5AoCAcoES2JU01-WXV6eDl6iyBH8W3sT_BTScDb1qQQIh6AlxgnoQ?pli=1&key=eWVUT1B3WURPN2dGVmliWHF5UjdmZ1o1TFdOZi1B

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి

ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి

శ్రీ వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యం వేదాంత కవిగా సుప్రసిద్ధుడు .మహాకవి పేరున్నవాడు .’’ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ఆస్థానకవి ఆయే అన్ని అర్హతలున్నవాడు ‘’అని శ్రీగుమ్మిడిదల వెంకట సుబ్బారావు గారన్నారు .’’ఈకవిలో ఈశత్వం ,ఇంద్రత్వం ,చంద్రత్వం ,చక్రవర్తిత్వం ఉన్నాయి కనుక ఆయన కవీశ్వర,కవీంద్ర ,కవి చంద్ర ,కవి చక్రవర్తి బిరుదులకు అన్నివిధాలా అర్హుడు .కవిగారి కవితా సంస్థానం లో విందు వసిస్టమహర్షి విశ్వామిత్ర పరివారానికీ ,,భరద్వాజ మహర్షి ససైన్యంగా వచ్చిన భరతుడు ఆతర్వాత వానర రాక్షసుల అశేష జనాలతో వచ్చిన శ్రీరామాదులకు ఇచ్చిన విందు లాగా ఉండేది .కవిగారుమాత్రం పడకకుర్చీలో మందహాసంతో మహావేగంగా కవితాగానం చేసేవారు .అయినా ఎవరికి తగ్గ గౌరవ మర్యాదలు జరిగి పోయేవి .ప్రతినెలా ఒకటవ తేదీ ఒక మహా కవికి ఒక మహా పండితునికి అక్కడ మహా సత్కారం .ఏ రాజాస్థానం లోనూ జరగనంత వైభవంగా జరిపించేవాడు వేదా౦త కవి .దైన్యం నైరాశ్యం లేని రాజకవిత ఆయనది ‘’ అన్నారు సరస్వతీ కంఠా భరణ శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ .’’పట్టాభి గారి వలన ఈ కవి కావ్యభావాలు విన్న నెహ్రు పండితుడు ‘’ఆంద్ర బెర్నార్డ్ షా ‘’బిరుదు అందించాడు .కవితా రాజ్య పట్టాభి షిక్తుడు వేదా౦తకవి .’’అనికీర్తించారు ఉభయ భాషా ప్రవీణ శ్రీ జాస్తి వెంకట నరసయ్య .’’మహతీ నాదా౦చిత వాణి,ఆంధ్రనాటక కావ్య ప్రాదుర్భూతి నిదాన విభాదీపిత మతి ‘’అన్నారు తెనుగు లెంక శ్రీ తుమ్మల .’’జగజ్జననీ వరప్రసాద కవితా ప్రపంచ సామ్రాట్ ‘’అని మెచ్చారు కిరణ్ కవులు .’’దారాళ వాగ్గు౦ఫి తారమ్య రచనా ,ప్రవచనాతిచాతుర్య పాటవుడు ‘’అన్నారు రాళ్ళభండిసుబ్బయ్య .ఇంతమంది చేత కీర్తింపబడిన వేదాంత కవి గారికి విజయవాడలో గజారోహణ ,సువర్ణాభి షేకం జరిగితే కవిమాత్రం ‘’చదివిన వాడ గాను ,మిము సన్నుతి జేసిన వాడనుగాను ,సంపదలు గడించినట్టి ధనవంతుడను గాను –సమస్త విశ్వముల్ బ్రతికెడి తల్లి చల్వ తమపై వెద జల్లెడివాడ నేను ‘’అని అత్య౦త వినయంగా చెప్పుకొన్నారు .తన గురువు తిరుపతి కవి గురించి గర్వంగా ‘’తిరుపతి వేంకటేశ్వరుడు –పరపతి గల గురు దేవుడు –ధరలో అతనికన్న మొనగాడూ –తరువాత ధాత వ్రాతకు లేడూ’’.’’అతడు వడ్డికాసులవాడూ –ప్రతిభ కేడు కొండలవాడూ ‘’అని చెప్పుకొన్నాడు జగజ్జనని ,ఆంద్ర బెర్నార్డ్ షా ,మహాకవి ,మహావక్త ,మనోహర్ ,వేదా౦త కవి . అన్నారు రాయప్రోలు .

అనిమెచ్చారు శ్రీమతి కాంచనపల్లి కనకాంబ

అంటూ కీర్తించారు జాషువా .

అంటారు శ్రీ మందరపు సత్యాచార్య కవి .

వేదా౦త కవికి ఘన సన్మానం విజయవాడ రామనగర్ ఈశ్వర మహల్ లో 26-10-1955 విజయ దశమి పండుగనాడు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది .సభాధ్యక్షత వహించాల్సినరెవిన్యు మంత్రి శ్రీ కల్లూరి చంద్ర మౌళి అని వార్యకారణాల వల్ల రాలేకపోతే ,జాతీయనాయకులు,శాసన సభ్యులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరావు పంతులుగారు అధ్యక్షత వహించారు .శ్రీ నార్లబదులు తెనాలి పురపాలక సంఘా ధ్యక్షులు శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తి సభా ప్రారంభం చేయగా ,జనాబ్ షేక్ చిన పీర్ సాహెబ్ ,షేక్ ఆదం సాహెబ్ గార్లు మంగళవాద్యం వాయించగా వేద శీర్వచనం జరిగింది .ఆంద్ర భోజ ,శాసన సభ సభ్యులు శ్రీ సి హెచ్ వి మూర్తి రాజు ,అధ్యక్ష ,ప్రారంభకుల ప్రసంగాల తర్వాత శ్రీ వేదాంత కవికి ఆహ్వాన సంఘం స్వాగతం పలికి 16నవరసులతో కనకాభి షేకం చేసి ,వెయ్యిన్నూట పదహార్లు నగదుకానుక అందించి , ‘’వేదా౦త కవి కాంతులు ‘’ప్రత్యేక సంచిక ఆవిష్కరింఛి ఈ విలువైన గ్రంథం ,పట్టు పీతాంబరాలు ,చందన తా౦బూలాదులు బహూకరించి పుష్పమాలా౦ కృతులను చేసి ఘన సన్మానం చేశారు .

సాహిత్యాచార్య శ్రీ జమ్మలమడక మాధవరాయ శర్మ ,కవిసామ్రాట్ శ్రీ వేదాంతం లక్ష్మీ కా౦త కవి ,సరస్వతీ కంఠాభరణ శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ ,ఉభయ భాషా ప్రవీణ శ్రీ జాస్తి వెంకట నరసయ్య ,మాట్లాడారు .కవిగారి ‘’తెలుగు తల్లి ‘’నాటకం అంకితం పొందిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ,కవి గారు ప్రసంగించారు .పెద్దలు పంపిన అభిమాన ఆశీర్వచనాలు ,అభినందనలు శ్రీ శ్రీ రాయని రాములు చదువగా ,శ్రీ బిఏ రాజు మనోహర శైలిలో తాము రాసిన పద్యాలు ‘’మనోహరాలు ‘’గానం చేసి కరతాళధ్వనులు అందుకొన్నారు .

మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రా బిస్మిల్లాఖాన్ జనాబ్ షేక్ ఆదం సాహెబ్ గారి నాదస్వర వాద్యం బాండు మేళం తో ,పౌరుల ఆన౦దాతి రేక పుష్ప వృష్టితో గజారోహణ మహోత్సవం శ్రీ వేదా౦త కవి గారికి జగన్మోహనంగా పురవీధుల గుండా జరిగింది .

మరునాడు సభకు సహకారమంత్రి శ్రీడి సంజీవయ్య రాలేకపోగా ,ఆంధ్రప్రభుత్వ ఆస్థానకవి కవి సార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి అధ్యక్షతన, మహాదాత శ్రీ చుండూరి వెంకట రెడ్డి సభా ప్రారంభోపన్యాసాలు చేశారు .తరువాత అభినవ తిక్కన శ్రీ తుమ్మల ,శ్రీ వేదుల ,నవయుగ కవి చక్రవర్తి శ్రీ జాషువా ,కుమారుడు శ్రీ వలరాజు ప్రసంగించారు అందరికి శాలువాలతో సత్కారం చేశారు ‘.

జీవిత విశేషాలు

వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి “వేదాంతకవి”గా ప్రసిద్ధుడు. ఈయన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి శిష్యుడు. తండ్రి శంభుశాస్త్రి, అన్న లక్ష్మీకాంతం జాతీయోద్యమాలలో పాల్గొని ఉద్యమగీతాలను గొంతెత్తి పాడేవారు[1]. వారి ప్రభావంతో ఈయన దేశసేవ, కవిత్వసేవ విడదీయలేని అనుబంధంగా ఏర్పరచుకుని కవితావేశానికి గురిఅయ్యారు . భార్య పార్వతీ దేవి .1928-1931ల మధ్య వివిధ జైళ్ళలో శిక్ష అనుభవించిన దేశభక్తుడు . 1928లో జైలుకు వెళ్లినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్యతో కలిసి ఒకే గదిలో ఉన్నారు. ఆ శిక్షాకాలంలో పోలీసుల లాఠీదెబ్బలవల్ల కుడిచేతి ఉంగరం వేలు విరిగింది. తలకు బలమైన దెబ్బలు తగలడం వల్ల ఎడమకన్నుకు అంధత్వం ఏర్పడింది. కవిగారి రచనలు శాంతి సంగ్రామం, స్వతంత్ర గర్జన, జమీన్ రైతు, రాజకోట ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వంచే నిషేధానికి గురి అయ్యాయి. రాజకోట నాటకాన్ని పేరుమార్చి కాంగ్రెస్ భారతం పేరుతో ముద్రింప బడినాయి .

రచనలు –

1. ఆకలిమంట (నాటకం)

2. తెనుఁగుతల్లి (నాటకం)

3. ఛలో హైదరాబాద్ (నాటకం)

4. విశ్వస్వరాజ్యం (నాటకం)

5. జమీన్ రైతు (నాటకం)

6. పంజాదెబ్బ

7. కవితా సంస్థానము (విమర్శ)

8. కష్టకాలం (నాటకం)

9. గడుగ్గాయి

10. కెరటాలు

11. దండయాత్ర

12. భగవన్మతభాష్యం

13. వీర భారతము

14. మహారథి కర్ణ (నాటకం)

15. కల్పతరువు

16. పట్టాభిషేకం

17. బ్రిటీష్ గయోపాఖ్యానం (నాటకం)

18. రాజకోట (నాటకం)

19. శాంతి సంగ్రామము

20. స్వతంత్ర గర్జన

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

అమరావతి — విశ్వనగరం

అమరావతి

అమరావతి బిడ్డ పుట్టి 5 ఏళ్ళు
బిడ్డ మారి(పారి)పోయి 325 రోజులు
పుట్టించిన తండ్రి రాడు గాజులు ఇచ్చి మళ్ళి … చూడడు
తిడుతున్నారని పెంచుతున్న తండ్రి మాట్లాడాడు
ఎవర్ని అడగాలో తెలియదు. న్యాయస్థానాలు ఎప్పుడు చెబుతాయో తెలియదు
ఎంచేద్దాం . బాలసార నామకరణం చేయించిన పంతులుని(మోడీ) నిలదీద్దాం అంటారు. సమన్యాయం అని ఆంధ్రా నీ: ఏమి కావాలో అడక్కుండా రైతులను నోట్లో మట్టి కొట్టి
వచ్చే సంవత్సరం మళ్లీ ఏళ్ళు / రోజులు పెరుగుతాయి కానీ చివరకు బిడ్డ కు జాతి అంటించి …
దీన … అమ్మ రా(వ)తే ….

 

విశ్వనగరం

మురుగు మూసి మూసేస్తే చాలు ..అసలు మురికి కనబడదు అన్నా
ఒక్క మురికి కాల్వ లేకుండా మంచి నీరు ఇస్తానన్నా
నీళ్లు లేని చోట .. మురికి నీరు ఊరుతున్నా
ఆక్రమిస్తే చాలు LRS ఇళ్ళుకడితే చాలు BRS అన్నా
900 కోట్లతో మురికి కాల్వ లేకుండా కొత్త పరిపాలన భవనం వస్తుంది కానీ అన్నా
వందేళ్లకు పడే వానకు పది రోజులు ఆగితే … సరిపోతుంది …. అన్నా
తప్పు మాదీ కాదు … మీది కూడా అన్నా
‘O’ నగరం అన్నా ఇది విశ్వనగరం అన్నా

 

7 నెంలాలు దాటినా రెండు నగరాల మధ్య ఒక్క బస్సు కూడా తిప్పలేని విశ్వ నగరాలు మనవి

Posted in రచనలు | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -6(చివరి భాగం )

కేనోపనిషత్ విశేషాలు -6(చివరి భాగం )

   చతుర్ధ ఖండం

మొదటి మంత్రం –‘’సా బ్రహ్మేతి హో వాచ బ్రాహ్మణో వా ఏతద్విజయతే మహీ యధ్వమితి తతో హైవ విదా౦చకార బ్రహ్మేతి ‘’

భావం –ఉమా దేవి ఇంద్రునితో ‘’ఆ యక్షుడు పరమేశ్వరుడు .పరమేశ్వరుడే మీ విజయానికి కారణం ‘’అని చెప్పగా ఇంద్రుడు ఆ వచ్చింది పరమేశ్వరుడైన బ్రహ్మ స్వరూపం అని గ్రహించాడు .

రెండవ మంత్రం –‘’తస్మా ద్వా ఏతే దేవా అతితరా మి వాన్యాన్ దేవాన్ ,యదగ్నిర్వాయు రింద్ర స్తే హ్యేన  న్నేదిస్టం పస్పర్శు స్తే హ్యేన ప్రథమా విదా౦ చకార బ్రహ్మేతి ‘’

భావం –అగ్ని ,వాయువు ,ఇంద్రుడు ఈ ముగ్గురే యక్షరూపంలో ఉన్న పరబ్రహ్మ ను చూసి విషయం తెలుసుకొన్నారు కనుక  ఈముగ్గురు దేవతలు మిగిలిన దేవతలకంటే అధికులయ్యారు .

మూడవ మంత్రం –‘’తస్మాద్వా ఇంద్రోతితరా మి వాన్యాన్ దేవాన్  స హ్యేన న్నేదిష్టం పస్పర్శ  న హ్యేన ప్రథమో విదా౦  చకార బ్రహ్మేతి ‘’

భావం –అగ్ని ,వాయువు, ఇంద్రులలో ఇంద్రుడు యక్ష బ్రహ్మ తో మాట్లాడి ఆయన స్వభావం స్వయంగా విని తెలుసుకొన్నాడు కనుక ఇంద్రుడు అగ్ని వాయువులకంటే గొప్ప వాడయ్యాడు .నాలుగవ మంత్రం –త స్యైష ఆదేశో య దేత ద్విద్యుతో వ్యద్యుత దా ఇతీ న్యమీష దా ఇత్యధి దైవత౦ ’’

భావం –బ్రహ్మ తత్త్వం మెరుపులాగా ప్రకాశ మానమైనదనీ ,మెరుపులాగా అంతలోనే అదృశ్య మౌతుందనీ  దేవతా విషయకమైన విషయక మైన ఉపదేశం .

ఐదవ మంత్రం –‘’అధాధ్యాత్మం య దేత ద్గచ్ఛతీవ చ మనోనేన చైత ముపస్మరో త్య భీక్ష్ణ౦ సంకల్పః ‘’

భావం –ఇంకా అధ్యాత్మ ఉపదేశం చెప్పబడుతోంది .ఈ బ్రహ్మ తత్వాన్ని మనస్సు పొండుతున్నట్లున్నది .మనసు చేత బ్రహ్మ తత్వాన్ని స్మరించాలి అని జీవుడి సంకల్పం .

ఆరవ మంత్రం –త ద్ధ తద్వనం నామ  తద్వన మిత్యుపాసి తవ్యం  స య ఏత .దేవం వేదాభి  హైనం సర్వాణి  భూతాని సంవా౦ఛంతి’’

భావం –బ్రహ్మ తత్వాన్నే ఉపాసించాలి .ఎవడు బ్రహ్మ తత్వాన్ని ఉపాసిస్తాడో ,అతడిని సర్వ భూతాలూ కోరుకొంటాయి .వనం అంటే ఉపాస్య వస్తువు అని అర్ధం .

ఏడవ మంత్రం –‘’ఉపనిషదం  భో బ్రూ హీ త్యుక్తా య ఉపనిషద్బ్రాహ్మీం  వావ త ఉపనిషదమబ్రూ మేతి’’

భావం –శిష్యుడు గురువును బ్రహ్మ విషయం ఉపదేశించమని కోరితే  గురువు బ్రహ్మకు సంబంధించిన ఉపనిషత్తు ను ఉపదేశి౦చాను  అని చెప్పాడు .

ఎనిమిదవ మంత్రం –‘’’తస్యై తపో దమః కర్మేతి ప్రతిష్టా వేదాః  సర్వా౦గాని  సత్య మాయతనం ‘’

భావం –బ్రహ్మ సంబంధమైన ఉపనిషత్తు కోసం క్రుచ్ఛ ,చా౦ద్రాయణాది కర్మలు, బహిర ఇంద్రియ నిగ్రహం ,సంధ్యావందనాది విహిత కృత్యాలు ,రుక్ మొదలైన సంహితల .శిక్షా మొదలైన షట్ శాస్త్రాల అధ్యయనం ముముక్షువులకు అవసరమైన ముఖ్య విషయాలు .

తొమ్మిదవ మ౦త్రం –‘’యోవా ఏతా మేవ౦  వే  దాపహత్య పాప్మాన మనంతో స్వర్గే లోకే జ్యేయే ప్రతి తిష్టతి ప్రతి తిష్టతి’’

భావం –ఈ ఉపనిషత్తు ను గురు ముఖతా అధ్యయనం చేసి ,అందులోని విషయాలను మననం చేసే ముముక్షువు కర్మ బంధనాలు విడిపోయి బ్రహ్మలోకం లో శాశ్వత స్థితి పొందుతాడు .

ఓం ఆప్యాయంతు మమా౦గాని వాక్ప్రాణశ్చక్షుః,శ్రోత్ర మథో బాల మింద్రియాణి చ సర్వాణిసర్వం  బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరో దానిరాకరణ మస్త్వనిరాకరణం మేస్తు తదాత్మాని నిరతే య ఉపనిషత్సుధర్మాస్తే మయి సంతుతే మయి సంతు-ఓం శాంతిః శాంతిః శాంతిః

  సమాప్తం

దుర్గాష్టమి శుభాకాంక్షలతో

మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -23-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నవరాత్రి ఆరవ రోజు 22-10-20గురువారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ లలితా పరమేశ్వరి అలంకారం

నవరాత్రి ఆరవ రోజు 22-10-20గురువారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ లలితా పరమేశ్వరి అలంకారం

https://photos.google.com/share/AF1QipOxlfKBRu7rxJcUsyPyNH1iINcw-EMf4m-jGg5PFgHumyr9Y9il4BRGs9rfQdVq0Q/photo/AF1QipMeXRt-LUrKzoFw5W2Lp1QRCNoph6R5iOvh86oC?key=ZTV6T2FTTWtzNWVhU3J2RTF1dkpSNGVjVFN0S0Fn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికాలోనే అతి

అమెరికాలోనే అతి

‘’సీతా !ఇవాళ పండగరోజు ఏ చీర కడుతున్నావు ?ప్రసాదం ఏం చేస్తున్నావ్ ?ఫోన్ లో అవతలి నుంచి

సీత ‘’నువ్వేం చేస్తున్నావో చెప్పు .?’

అవతలి ‘’ఏ చానల్ లో ఎంకయ్యసామి ఇవాళ ఎరుపు చీరకట్టాలని ,ఎర్రన్నం నైవేద్యం పెట్టాలని చెప్పారు ‘’.మరి నువ్వో ?’’

సీత ‘’నీతర్వాత డజను మంది వెయిటింగ్ లో ఉన్నారు ఫోన్లో అందరి మాటలు విన్నాక చివరికి చెబుతాలే వెయిట్ చెయ్యి

‘’అక్కా !బి చానల్ లో బొజ్జా శర్మ గారు ఇవాళ బెండకాయ రంగు చీరకట్టాలనీ ,బెండకాయ పులుసు నైవేద్యం పెట్టాలనీ చెప్పారు .’’

వదినా !సి చానల్ లో  చాదస్తం శీను గారు చల్లపులుసు రంగు చీరకట్టి చల్లన్నం నైవేద్యం చెప్పారు

పిన్నీ !డి చానల్ దానయ్య గారు దేవగంధారం రంగు చీర కట్టి ,సెనగలు వండి పెట్టాలన్నారు

సీతా !ఇ చానల్ లో ఇంగువ మల్లయ్య శాస్త్రి గారు ఇటుక రంగు శారీ కట్టి ,ఇప్పపువ్వు పులిహోర నైవేద్యం పెట్టమన్నారు

ఏమే అమ్మాయ్ !ఎఫ్ చానల్ లో ఉఫ్ఫు ఊళయ్య గారు ఉప్పులా మెరిసే చీరకట్టి ఉప్పుడు బియ్యం అన్నం వండి పెట్టాన్నారు

ఒసే పిల్లా !జడ్ చానల్ లో జిడ్డు జానయ్య గారు జింక కలర్ శారీ కట్టి చిత్రాన్నం నైవేద్యం చెప్పారే

కోడలుపిల్లా !హెచ్ చానల్ లో హయగ్రీవమూర్తి హయ కలర్ చీర కట్టి గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టమన్నారే ‘ఇంతకీ హయం అంటే ఏమిటే తెలీక బుర్ర బద్దలౌతోంది

మరదలా !జె చానల్ లో జంబులింగం గారు జాంపండు రంగు చీర కట్టి ,జాంపండు పాయసం వండి పెట్టమన్నారే

సిస్టర్ !కె చానల్ లో కంపు కొండయ్య కనకాంబరం చీర కట్టి ,కాకరకాయ పుల్సు లేకపోతె కీర పాయసం పెట్టమన్నారు

అత్తా !ఎల్ చానల్ ఎల్లయ్య గారు ఎల్లో శారీ కట్టి ,ఏలక్కాయ పప్పులేకపోతె రవ్వకేసరి  పెట్టమన్నారు

పిన్నీ !ఎం చానల్ ఏబ్రాసి పంతులు ఎలగపండు చీర కట్టి ఎలక్కాయ పులిహోరలేకపోతె చక్రపొంగలి  శ్రేష్టం అన్నారు

మొదట ఫోన్ చేసినావిడ ‘’సీతా  ! బలేగా కాన్ఫరెన్స్ కాల్ లో అందర్నీ కలిపి ,అందరూ అంతా వినేట్లు చేశావ్ ధాంక్స్ .ఇంతకీ నువ్వేం చేస్తావో చెప్పనే లేదు

సీత ‘’ఏమీ కట్టనే ‘’

అవతలి ‘’యు మీన్ నూడ్?

సీతా –నూడూ లేదు పాడూ లేదు నైటీ కట్టి బెల్లం నైవేద్యం పెడతా సింపుల్ గా .

ఆధారం –మాఅమ్మాయి విజ్జి ఇచ్చిన ‘’చిన్న హింటు ‘’తో అల్లిన అల్లరి వల్లరి ఇది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-20-ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-8

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-8

మహాత్ముడు పరవశించే అన్ని రంగాలలో అగ్రగామిగా ఉన్న సీతానగరం ఆశ్రమాన్ని విచ్చిన్నం చేయాలనే కుట్రతో ,దాన్ని చట్ట విరుద్ధంగా ప్రభుత్వం ప్రకటించగా , ,1932జనవరి 18న పోలీస్ సూపరింటే౦డెంట్ 400మంది రిజర్వు పోలీసులతో ఆశ్రమాన్ని ముట్టడించగా ,డిప్యూటీ ముస్తఫా ఆలీ సత్యాగ్రులపై క్రూరంగా వ్యవరించాడని ప్రతీతి .వచ్చీ రాగానే  అలీ ఆశ్రమ వాసుల౦దర్నీన  ఒకచోటకు చేర్చి ‘’This Ashram is declared as an un-law ful body by the government .You are therefore all requested to disperse immediatlely ‘’అన్నాడు .అన్నపూర్ణయ్య గారు గంభీరం గా ‘’The Ashram is our home .We live or die here .Therefore we cannot disperse ‘’అన్నారు .పోలీసులు అయిదు నిముషాల సేపు వారి తలలలపై నాట్యమాడారు .పూర్ణయ్య దీక్షితులు కృష్ణమూర్తి వెంకటప్పయ్య గార్ల తలలు పగిలి రక్తం కారింది .కృష్ణమూర్తి అన్నగారిని కాపాడేందుకు అన్నయ్య ను ఆలింగనం చేసుకొన్నాడు  ఫలితంగా లాఠీ దెబ్బలతో స్పృహ కోల్పోయి ,ఆస్పత్రిలో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది .

 క్షతగాత్రులపై కన్నెత్తి కూడా చూడకుండా ఖాన్ ఆశ్రమ ఆస్తి ధ్వంసం చేయటం లో మునిగి పోయాడు .ఆశ్రమ వాసులతో పాటు అన్నపూర్ణయ్య గారికీ నాలుగేళ్ళు శిక్ష పడింది .1932ఫిబ్రవరి 1నుండి 1936ఫిబ్రవరి వరకు కడలూరు, వేలూరు ,రాజమండ్రి బళ్ళారి చిరుచినాపల్లి జిల్లాలో దువ్వూరి శిక్ష అనుభవించారు .పదేళ్ళు దేదీప్యమానం గా వెలిగిన ఆశ్రమం 1933చివరలో ముగింపు దశకు రాగా ,ఒక్కొక్కరే ఆశ్రమం వదలి వెళ్ళిపోయారు .

  విడుదల కాగానే ముందు రాజమండ్రికే  వచ్చి,లింగరాజు గారితో కలిసి మద్రాస్ లో ప్రకాశంగారి ‘స్వరాజ్య ‘’పత్రికలో చేరారు .ఉద్యమమ విరమించిన 10నెలలతర్వాత తాపీగా దువ్వూరి ని విడుదల చేశారు .ఆయన అరెస్ట్ కు హింసా వాదం కారణం కాకపోయినా అతి ప్రమాదకరమైన దేశ ద్రోహి అనే కారణం మోపారు .

  జైలు జీవితం లో అన్నపూర్ణయ్య గారికి చిత్ర విచిత్రానుభావాలు కలిగాయి .రష్యా సోషలిం,మార్క్సిజం గురించి అవగాహన కలిగింది .1936  సెప్టెంబర్ 26,27తేదీలలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ రెండవ మహాసభలు రాజమండ్రి లో జరిగాయి .దువ్వూరి ప్రధాన కార్య దర్శి ,పుచ్చలపల్లిసు౦దరయ్య గారు సహాయ కార్య దర్శిగా ఎన్నికయ్యారు .జాతీయ కార్య దర్శి జయప్రకాష్ నారాయణ మద్దూరికి బాగా సన్నిహితులయ్యారు .ఆంద్ర పర్యటనలో ఆయన వెంట నే ఉన్నారు మద్దూరి .’’భారత దేశం లో సొషలిజాన్నిపూర్తిగా అర్ధం చేసుకొని భాష్యం చెప్పగల ఏకైక వ్యక్తి జయప్రకాష్ ‘’అని గాంధీ చేత ప్రశంసలు పొందారు జయప్రకాష్ .ఆయన రాసిన ‘’వై సోషలిజం ‘’పుస్తకాన్ని మద్దూరి సూచనపై మహీధర జగన్మోహనరావు ‘’సోషలిజం ఎందుకు “”పేరుతొ అనువాదం చేశాడు .దీనికి మద్దూరి వివరణాత్మక ముందు మాటలు రాశారు .జమీందారీల రద్దు,ప్రభుత్వానికీ రైతుకు మధ్య దళారీ లు పోవాలని వీరి ముఖ్యసిద్ధాంతం .గాంధీ అదేమీ కుదరదు అలా౦టి స్థితేవస్తే తానుకూడా పోరాటం చేస్తాను జమీందార్లు ధర్మకర్తలు అన్నాడు .ఈ విషయాలన్నీ పుస్తకం లో వివరం గా చర్చించారు లోక నాయక జయప్రకాష్ .దువ్వూరికి రష్యానేత లెనిన్ పై చాలా గౌరవం .’’జోహారు లందుకో మా జోదు లెనిన్ ‘’అనే గేయం కూడా రాశారు .జయప్రకాష్ ను ‘’ భారత లెనిన్’’అని కీర్తించారు దువ్వూరి .

  కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ  ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణయ్య గారు పార్టీ నియమావళి1937మార్చిలో ప్రకటించారు .అందులో ముఖ్యమైనవి –కాంగ్రెస్ సభ్యులే సోషలిస్ట్ పార్టీ సభ్యులు ,మార్క్స్ సిద్ధాంతాలను అంగీకరించాలి .వర్గపోరాట శాస్త్రాన్నీ ,అభ్యాస విదుల్నీ తెలుసుకోవాలి.

  అఖిలభారత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కార్యక్రమ ఆదర్శాలు –1-ఉత్పత్తి దారులైన జన సామాన్యానికి రాజ్యాధికారం అప్పగించాలి . 2-దేశ ఆర్దికాన్ని నియమిత పద్ధతుల్లో ప్రభుత్వమే నడుపుతూ అభి వృద్ధి  చేయాలి 3 –ఉత్పతి,పంపకం, మారకం క్రమేణా సంఘపరం చేయాలి 4-ప్రభుత్వమే విదేశీ వ్యాపారం చేయాలి 5-సంస్థానాలు, జమీందారీ విధానం షరతులు లేకుండా రద్దు చేయాలి .6-సహకార పరపతి సంఘాలు నెలకొల్పాలి 7-రైతులకు మళ్ళీ భూమి పంచాలి .8-సహకార వ్యవసాయం ప్రోత్సహించాలి 9-కార్మిక కర్షకుల అప్పు రద్దు చెయ్యాలి 10-పని చేసే హక్కు గుర్తించాలి 11-శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ ప్రతిఫలం సూత్రం అంగీకరించాలి 12-మేజర్లు అందరికీ వోటింగ్ హక్కు ఇవ్వాలి 13-కులమత పక్షపాత౦ లేకుండా ప్రభుత్వ పాలన సాగాలి 14-స్త్రీ ,పురుష భేదం ప్రభుత్వం పాటించ కూడదు 15-పబ్లిక్ డెట్ ఆఫ్ ఇండియా ను ఎగ వెయ్యాలి  .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -5 తృతీయ ఖండం

కేనోపనిషత్ విశేషాలు -5 తృతీయ ఖండం

 

మొదటి మంత్రం-‘’ఓం బ్రహ్మ హ దేవేభ్యో విజిగ్యే-తస్య హ బ్రాహ్మణోవిజయే దేవా ఆమహీయంత,త ఐక్ష్యం తాస్మాక మే వాయం విజయోస్మాక మే వాయం మహి మేతి’’

భావం –సర్వ జగాలకు శాసకు డైనపరమేశ్వరుని అనుగ్రహం వలన దేవాసుర యుద్ధం లో దేవతలు జయించారు .కాని తమ విజయానికి కారకుడైన మహేశ్వరుడిని మరచిపోయి ,ఆ విజయమంతా తమ శక్తి సామర్ధ్యాల వలననే ,సామర్ధ్యం తోనే సాధించామని విర్రవీగారు .

రెండవ మంత్రం –‘’త ద్ధైషాం విజ ఞౌ తేభ్యో హ ఞౌప్రాతర్బభూవ –తన్న వ్య జానంత కి మిదం యక్ష మితి ‘’

తేగ్ని మబ్రువన్ జాత వేద! ఏత ద్విజా నీహి కి మేత ద్యక్ష మితి’’

భావం-సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడు వాళ్ళ గర్వాన్ని గమనించి ,యక్ష రూపం లో దేవతల ఎదుట సాక్షాత్కరించాడు .గర్వోన్మత్త మనస్కులైన దేవతలు  ఆవచ్చిన ఆయన ఎవరో తెలుసుకో లేకపోయారు .

మూడవ మంత్రం –‘’తేగ్ని మబ్రువన్ జాత వేద! ఏత ద్విజా నీహి కి మేత ద్యక్ష మితి’’

భావం –దేవతలు తర్వాత అగ్ని తో ‘’ఆ వచ్చిన యక్షుని వివరాలేమిటో తెలుసుకొని రా ‘’అని పంపారు .

నాలుగవ మంత్రం –‘’త థేతి త దభ్రద్రవ త్త మభ్యవద త్కో సీతి-అగ్నిర్వా అహ మస్మి త్యబ్రవీజ్జాత వేదా  వా హ మస్మీతి’’

భావం –అగ్ని సరే అని చెప్పి యక్షుడి దగ్గరకు వచ్చాడు .యక్షుడు అగ్నిని ‘’నువ్వు ఎవరు ?’’అని అడిగాడు. అగ్ని ‘’నేను అగ్నిని .సర్వ వ్యాపకుడిని .వేదోత్పత్తి స్థానాన్ని’’అని బదులిచ్చాడు

ఐదవ మంత్రం –‘’తస్మిం స్త్వయి కిం వీర్య మిత్య షీదగ్౦-సర్వం దహేయం  య దదిదం పృథివ్యా మితి’’

భావం –యక్షుడు ‘’నీ సామర్ధ్యం ఏమిటి ?’’అని అడుగగా ‘’ప్రపంచం లో సర్వాన్నీ దహిస్తాను ‘’అన్నాడు అగ్ని .

ఆరవ మంత్రం –‘’తస్మై తృణం నిదధావేత ద్దహేతి త-దుపప్రేయాయ సర్వ జవేన త న్నశశాక –దగ్ధుం స తత ఏవ వివ వృతే నైత –దశకం విజ్ఞాతుం య దేత ద్యక్ష మితి’’

భావం –యక్షుడు అగ్ని ముందు ఒక గడ్డిపరక పడేసి దాన్నికాల్చ మన్నాడు .తన సర్వ శక్తులు ఉపయోగించి దాన్ని దహనం చేయటానికి ప్రయత్నించి విఫలుడై ,దేవతల దగ్గరకు వెళ్లి ఆ యక్షుడు ఎవరో తెలుసుకోలేక పోయానని చెప్పాడు .

ఏడవ మంత్రం –‘’అధ వాయు మబ్రువన్  వయా వేత –ద్విజానీహి కిమేత ద్యక్షమితి’’

భావం –దేవతలు వాయువుతో ‘’ఆ యక్షుని విషయమేమిటో తెలుసుకొని వచ్చి చెప్పు ‘’అని పంపారు .

ఎనిమిదవ మంత్రం –‘’తథేతి త దభ్యద్రవ త్త మభ్యవద త్కో సీతి వాయుర్వా  అహమస్మీత్యబ్రవీ న్మాతరిశ్వా వా అహ మస్మీతి ‘’

భావం –వాయువు  సరే అని వేగంగా యక్షుని చేరగా ‘’నువ్వు ఎవరు ‘’?అని అడిగితే ‘’నేను వాయువు .ఆకాశం లో వృద్ధిపొందే మాత రిశ్వుడను ‘’అన్నాడు

తొమ్మిదవ మంత్రం –‘’తస్మిం స్త్వయి కిం వీర్య మిత్య పీదగ్౦ సర్వ మాదదీయం  య దిదం పృథివ్యామితి’’

భావం –‘’నీ సత్తా ఏమిటి ?”’అని అడిగిన యక్షుని ప్రశ్నకు వాయువు ‘’భూమి మీద ఉన్న అన్ని పదార్ధాలను గ్రహించ గలను ‘’అన్నాడు .

పదవ మంత్రం –‘’తస్మై తృణం నిదధా వేత దాదత్స్వేతి-త దుప ప్రేయా య సర్వ జవేన త న్న శశా

కాదాతుం స తత ఏవ నివ వృతేనైత –దశకం విజ్ఞాతుం య దేత ద్యక్ష మితి’’

భావం –వాయువు ముందు ఒక గడ్డిపరక పడేసి ‘’దీన్ని గ్రహించు ‘’అన్నాడు వాయువుతో .శక్తులన్నీ ఉపయోగించినా వాయువు దాన్ని గ్రహించలేక పోయాడు .దేవతలను చేరి తానూ యక్షుని విషయం లో ఆశక్తుడను అయ్యానని చెప్పుకొన్నాడు .

పదకొండవ మంత్రం –‘’అ ధే౦ద్ర మబ్రువన్ మఘవన్నేత ద్విజానీహి కి మేతద్యక్ష మితి తథేతి దభ్యద్రవ త్తస్మాత్తిరోదధే’’

భావం –దేవతలు ఇంద్రునితో ‘’నువ్వే వెళ్లి ఆ యక్ష వివరం కనుక్కొని రా ‘’అని చెప్పి ప౦పారు ..అలాగే అని ఇంద్రుడు వెళ్ళగా యక్షుడు కనపడకుండా అంతర్ధానమయ్యాడు .

పన్నెండవ మంత్రం –‘’స తస్మి న్నాకాశే స్త్రియ మా జగామ  బహు శోభామానా ముమాం హైమవతీం తాగ్౦ హో వాచ కి మేతద్యక్షమితి’’

భావం –ఇంద్రుడు ఆకాశం లో బ్రహ్మ విద్యా రూపిణి అయిన ఉమాహైమవతీ స్వరూపమైన పార్వతీదేవిని చూసి ‘’ఆ యక్షుడు ఎవరు తల్లీ ‘’అని అడిగాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

“నవరాత్రి 5వ రోజు 21-10-20 బుధవారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ సరస్వతీ దేవి అల౦కరణ,పూజలో పాల్గొన్న బాలభక్తులు వారికి పెన్నులు పెన్సిళ్ళు బహుమతి ప్రదానం

“నవరాత్రి 5వ రోజు 21-10-20 బుధవారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ సరస్వతీ దేవి అల౦కరణ,పూజలో పాల్గొన్న బాలభక్తులు వారికి పెన్నులు పెన్సిళ్ళు బహుమతి ప్రదానం

 

https://photos.google.com/share/AF1QipPjoIsDcpBmVnCPsOjfM7kaqUwaNqCZXGg31IXr4tT13BXTKjtg_kiv4WSKOi1Y6w?pli=1&key=WWVvOXdTWktDYXVVX2pxbWRPcG9hYWw0enVyNHdB

Posted in దేవాలయం | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -4

కేనోపనిషత్ విశేషాలు -4

  ద్వితీయ ఖండం –

మొదటిమంత్రం-‘’యది మన్యసే నువే దేతి దభ్ర-నూనం త్వం వేత్ద  బ్రహ్మణో రూపం

య దస్య త్వం య దస్యత చ దేవే ష్వధను –మీమా౦స్య మేవతే మన్యే విది-తం ‘’

భావం-పరమేశ్వరతత్వాన్ని బాగా తెలుసుకొన్నాను అనుకుంటే ,నీకు తెలిసింది చాలా తక్కువ .నీ రూపాన్నీ ,దేవతల రూపాన్నీ చూసి తెలుసుకొన్నది పూర్తిగా బ్రహ్మ రూపం కాదు .బ్రహ్మ రూపాన్ని అంతటినీ చక్కగా విచారించి మాత్రమేతెలుసుకోవాలి .

 రెండవ మంత్రం –నాహం మన్యేనువే దేతి నో న  వేదేతి వేద చ –యోనస్తద్వేద తద్వేదనో న వే దేతి వేదచ

భావం –నాకు బాగా తెలిసిందని అనుకోను .నాకు తెలియదు అనే విషయం కూడా తెలియదు .మాలో తెలిసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది .ఇప్పటికీ నాకేమీ తెలియదనే విషయం కూడా నాకు తెలియదు .

మూడవ మంత్రం –‘’యస్యా మతం తస్య మతం మతం యస్య చ న వేద సః-అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవజానతాం ‘’

భావం –తెలియ బడని బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలను కొని ,తెలిసిన జగత్తును మరుస్తున్న వారిలో  ఎవరికీ తెలియ బడని తత్త్వం ఉన్నది అనే భావం ఉన్నవాడికి కొంతవరకు తెలిసిందని అర్ధం .తెలిసింది అనే గర్వం ఉన్నవాడికి, ఏ మాత్రం తెలియదు అని గ్రహించాలి .

నాలుగవ మంత్రం –‘’ప్రతిబోధ విదితం మత మమృతత్వం హి విందతే-ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం’’’

భావం –గురువు ఉపదేశంపొంది , విషయ పరిజ్ఞానం పొంది ఆ కలిగిన జ్ఞానం తో మననం చేస్తూ మరణం లేని స్థితిని సాధకుడు పొందుతున్నాడు .శరీర కర్మలచే కర్మాచరణ పాటవం అనే వీర్యాన్ని ,ఉపాసనతో బ్రహ్మాన్ని పొందుతాడు .మతం అంటే మననం చేయబడిన అని అర్ధం .

ఐదవ మంత్రం –‘’ఇహ చే ద వేదీ దధ సత్య మస్తి-న చే ది హా వేదీ న్మహతీ వినష్టిః

భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మా ల్లోకా దమృతా భవంతి ‘’

భావం –ఈ జన్మ ఉండగానే బాగా విచారించి చూస్తే ,పరమేశ్వర అస్తిత్వం గోచరిస్తుంది .ఇలా గమనించకపోతే నాశనం తప్పదు.కనుక ముముక్షువులు భూతముల ,ప్రాణముల విషయం లో బాగా ఆలోచించి తెలుసుకొని ,ఇహలోక సంబంధాన్ని వదిలి ప్రకృష్టస్థితి ఐన  అమృతత్వం పొందుతున్నారు  .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నవరాత్రి 4వ రోజు మంగళవారం శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం

https://photos.google.com/share/AF1QipNTG0cP8AF5dqTTTLiR4yd4bg4wxzUcruF82NDi_B4IUv7T3rSx7ki6JKVDTTbx0g?key=ZmdIMWpYS1JkQ3lBaFlwYUlqS0lSUmRqSlJheXB3&pli=1

Posted in దేవాలయం | Tagged | Leave a comment

నవరాత్రి దసరా శుభాకాంక్షలు మరియు విజయదశమి నుంచి ప్రత్యక్ష ప్రసారం 

నవరాత్రి దసరా శుభాకాంక్షలు మరియు విజయదశమి నుంచి మళ్ళీ ప్రత్యక్ష ప్రసారం

సాహితీ బంధువులకు నవరాత్రి దసరా సందర్భంగా
ఇవాళ 21-10-20 బుధవారం మూలాల నక్షత్రయుక్త సరస్వతి  పూజ
   24-10-20 శనివారం -దుర్గాష్టమి ,మహర్నవమి
   25-10-20 -ఆదివారం -విజయదశమి  శుభాకాంక్షలు
 సరసభారతి పేస్  బుక్ లో రెండువారాల విరామ0  తరువాత 25-10-20 విజయదశమి ఆదివారం ఉదయం 10గంటలనుండి మళ్ళీ ప్రత్యక్షప్రసారం ఈ క్రింది విధంగా ఒకటి పూర్తయ్యాక మరొకటి జరుగుతుందని తెలియ జేయటానికి సంతోషంగా ఉన్నది –

1-పో”తనలో” తాను-అనే పోతన భాగవత మకరందామృతం
 2-మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ”కృష్ణాతీరం ”నవల పరిచయం
 3-మధు మధురాంతకం రాజారా0 గారి కథలు
4-ఉత్తర రామాయణం విశేషాలు -శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి రచన ఆధారంగా
5-డా .కేతు విశ్వనాథ  రెడ్డి గారి కథలు
6-విశ్వనాథ  జాన్సన్ కు బాస్వెల్ బ్రహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్యగారి ”సహృదయాభి సరణం ”పరిచయం
7-మంజుశ్రీ గారి ”వింత నిజాలు ”
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -3

మూడవ మంత్రం-‘’నతత్ర చక్షుర్గచ్ఛతి-నో మనో న విద్మో న విజానీమో –యథైదనుశిష్యాత్ –అన్యదేవత ద్విదితాదధో అవిదితా దధి –ఇతి శుశ్రుమ పూర్వేషాం యేన స్తద్వాచ చక్షురే ‘’

భావం –అక్కడికి దృష్టి ప్రసరించదు.వాక్కు చేరలేదు ,మనస్సు అందలేదు .దాన్ని ఎలా అర్ధ మయేట్లు  చెప్పాలో మాకు తెలియదు .అసలు ఆలోచించలేము కూడా .కారణం ,అది తెలిసిన దానికంటే వేరుగా ఉంటుంది .తెలియని దానికి అవతల చాలా దూరం లో ఉంటుంది .గురువు వివరించినా ,తెలుసుకోవటం కష్టం .మాకు తెలియబరచిన బుద్ధి జీవులవలన ఆ విధంగా ఉంటుందని మాత్రం విన్నాము .

నాలుగవ మంత్రం –‘’యద్వాచా నభ్యుదితం –యేన వాగభ్యుద్యతే-తదేవ బ్రహ్మత్వం విద్ధి-నేదం యయిద ముపాసతే ‘’

భావం –వాక్కు దేనిని చెప్పలేదో ,దేని చేత వాక్కు చెప్పబడుతుందో అదే బ్రహ్మ అని తెలుసుకో .ఇక్కడ మనుషులు ఉపాసించేది మాత్రం బ్రహ్మ కాదని గ్రహించు .

అయిదవమంత్ర –‘’యన్మనసా నను మనుతే –ఏనాహుర్మనో మతం –తదేవ బ్రహ్మత్వం విద్ధి-నేదం యదిద ముపాసతే ‘’

భావం – ఏ తత్వాన్ని మననం చేయటానికి  వీలులేదో ,ఏ తత్త్వం  మనసుకు మనన సామర్ధ్యాన్ని కలిగిస్తుందో ,ఆ తత్వమే బ్రహ్మ తత్త్వం అని గ్రహించు .భక్తులు ఉపాసించే ప్రతీక బ్రహ్మ తత్త్వం కాదు .

ఆరవ మంత్రం –యచ్చక్షుషా న పశ్యతి –ఏన చక్షూ౦సి పశ్యతి –తదేవ బ్రహ్మత్వం విద్ధి- నేదం యదిద ముపాసతే ‘’

భావం –ఏ తత్వాన్ని కంటితో చూడటానికి వీలులేదో ,ఏ తత్త్వం యొక్క ప్రేరణ చే కన్ను చూస్తోందో అదే బ్రహ్మ తత్త్వం గా భావించు .లోకం ఉపాసించే ప్రతీక బ్రహ్మ కాదు .

ఏడవ మంత్రం-‘’యచ్ఛోత్రేణ న శృణోతి-ఏన శ్రోత్ర మిదం శ్రుత౦-తదేవ బ్రహ్మత్వం విద్ధి- నేదం యదిద ముపాసతే ‘’

భావం –ఏ తత్వాన్ని చెవిద్వారా వినటానికి వీలు లేదో ,ఏ తత్వ ప్రేరణ తో చెవి విన గలుగుతోందో ,ఆతత్వమే బ్రహ్మతత్వం అని తెలుసుకో .ఇక్కడ ఉపాసించే ప్రతీక బ్రహ్మం కాదు .

ఎనిమిదవ మంత్రం –‘’యత్ప్రాణే న ప్రాణితి-యేన  ప్రాణః ప్రణీయతే-తదేవ బ్రహ్మత్వం విద్ధి- నేదం యదిద ముపాసతే’’

భావం –ఏ తత్త్వం  ప్రాణవాయువు చేత జీవించటం లేదో ,ఏ తత్త్వం చేత ప్రాణవాయువు నడపబడుతోందో ,అదే బ్రహ్మ తత్త్వం గా గ్రహించు .ఉపాసించే ప్రతీక బ్రహ్మకాదు.

  ఈ మంత్రాలలో ‘’ తదేవ బ్రహ్మత్వం విద్ధి- నేదం యదిద ముపాసతే’’ అనేది మకుటం గా భావించవచ్చు .

  మొదటిఖండం సమాప్తం .

రేపు 21-10-20-బుధవారం మూలానక్షత్రం ,సరస్వతీ పూజ శుభాకాంక్షలు

 సశేషం –

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -2(చివరిభాగం )

ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -2(చివరిభాగం )

             నా ప్రసంగవిశేషాలు

అందరికీ నమస్కారం .నవరాత్రి దసరా శుభాకాంక్షలు .ఇంతటి మంచి అర్ధవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న కృష్ణా జిల్లా రచయితలసంఘాన్నీ ,పాల్గొంటున్న రచయితలను మనసారా అభినందిస్తున్నాను .కరోనా కాలం లో మరణించిన భారత రత్న మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ ,పోర్ట్రైట్ చిత్రకారుడు బాపుగారి తమ్ముడు శ్రీ శంకరనారాయణ ,గాంధర్వ గాన శ్రీ బాల సుబ్రహ్మణ్యం ,హాస్యనటుడునాటక  రచయిత,శ్రీ రావికొండలరావు ,పౌరాణిక నటుడు శ్రీ లవకుశ నాగరాజు ,విలక్షణ వాచికాభినయ నటుడు శ్రీ జయప్రకాష్ రెడ్డి ,నాట్యకలహంస శ్రీమతి శోభానాయుడు ,ఉత్తరాంధ్ర వాయిస్ కవి ,గాయకుడు శ్రీ వంగపండు ప్రసాదరావు,కరోనా వైద్య సేవలో అసువులుబాసిన డాక్టర్లు నర్సులు పోలీస్ సిబ్బంది ,కవులు కళాకారులు అధికారులు ఉపాధిలేక మరణించిన ఉద్యోగులు కార్మికులు , వేలాది మైళ్ళ దూరం నడుచుకొంటూ స్వగ్రామాలకు కుటుంబాలతో తరలి వెడుతూ మరణించిన వలసకార్మికులనే  ‘’జాతీయ కార్మికులు ‘’వారి కుటుంబాలు ,దేశ విదేశాలలో  కరోనా బారిపడి చనిపోయిన లక్షలాది ప్రజలకు  అశ్రు నివాళి అర్పిస్తున్నాను .మానవత్వం తోఆదుకున్న వారిని ,ముఖ్యంగా బాలీ వుడ్ నటుడు సోను సూద్ ను అభినందిస్తున్నాను .కరోనా మనుషుల మధ్య దూరాన్ని పెంచింది .వైరాగ్యం నేర్పింది .తోటి వారు స్వంత ఆత్మీయులు చనిపోయినా పలుకరించే ధైర్యాన్ని లాగేసింది ,ఇంతటి ఘోర విపత్తు మనం ఎప్పుడూ చూడనిదే .ప్రపంచం కుగ్రామం అయి కుటుంబమే అయిపోయి౦ది .అంతటి వైపరీత్యం కలిగించింది .శోకభీకర లోకైక తిమిరమే ఆవహించి భయ భ్రాంతులను చేసింది .ఉద్యోగులు,ఉపాధ్యాయులు విద్యార్ధులు  ఇళ్లకే పరిమితమయ్యారు .దేవాలయ అర్చనలు ఉత్సవాలు  నామమాత్రమయ్యాయి .ఇలాంటి సమయం లో మెదడుకు పదును పెట్టి కవులు రచయితలూ కళాకారులు కాలాన్ని సద్వినియోగం చేసుకొని సృజనను సుసంపన్నం చేసుకొన్నారు .లోకానికి మేలైన అనుభూతి పూర్వక సాహిత్యం అందించారు .అందరూ అభినందనీయులే .

   నేను కరోనాలాక్ డౌన్ ప్రారంభమైన మార్చి 21 నుండి జూన్ 15వరకు చేసిన సాహిత్యకృషిని జూన్ 25న ‘’లాకౌట్ లోనూ అంతర్జాలం లో అవిచ్చిన్నంగా సాగిన నా సాహిత్య ప్రస్దానం ‘’అని రోజువారీ గా చేసిన సాహిత్య కృషి రాశాను .శ్రీ పూర్ణ చ౦ద్ వారం క్రితం ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నామని, నన్నూ పాల్గొనమని కోరినప్పుడు  జూన్ 26నుండి అక్టోబర్ 16వరకు నా సాహిత్య కృషిని క్రోడీకరించి సిద్ధం చేసుకొన్నాను .ఈ రెండూ కలిపి ఐటెం వారీగా వివరాలతో మీకు అందిస్తున్నాను .

  1-సరసభారతి తరఫున కృషి –శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో ఆవిష్కరించాలనుకొన్ననేను రాసి(20,21,22 ),సరసభారతి ప్రచురించిన(31,32,33) 1-ఊసుల్లో ఉయ్యూరు 2-సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా 3-ఆధునిక ఆంద్ర శాస్త్ర మణిరత్నాలు అనే మూడు పుస్తకాలు మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి పాదాలవద్ద 21శనివారం సాయంత్రం పూజ తర్వాత ఉంచి స్వామి ఆవిష్కరించినట్లుగా భావించాం .మర్నాడు 22ఆదివారం  అప్పటికే వచ్చిన అతిధులకు మా ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేసి  శాలువా, జ్ఞాపిక నగదు పురస్కారం ,పుస్తకాల సెట్ అందించాం .శ్రీ హనుమజ్జయంతి నాడు దేవాలయం లో 150 సెట్ల పుస్తకాలు స్వామి వారల కళ్యాణ సమయంలో భక్తులకు  అందజేశాం .అమెరికాకు 50సెట్లు ఒంటిమిట్ట  డాక్టర్ శివ గారితో అక్కడి మిత్రులకు సెట్లు పంపాం.జూన్ 6నుంచి పోస్ట్ కొరియర్  ద్వారా కనీసం 150సెట్లు కవులకు సాహిత్యాభిమానులకు బంధువులకు పంపాం.కరోనా కాలం ఇళ్ళల్లో వంట  కూడా వండుకోలేని అత్యంత నిరుపేదలైన ఎరుకల యానాది వగైరా కుటుంబాలకు మా అబ్బాయి రమణ, ఆంజనేయులు, కోటేశ్వరావు మొదలైన మిత్రులు కేటరింగ్ ద్వారా అన్నం కూర పప్పు చట్నీ సాంబారు పెరుగు మొదలైన పాకెట్స్ తయారు చేయించి ఆహార పొట్లాలను కనీసం రోజుకు వందమందికి ఇళ్ళకు వెళ్లి అందించే కార్యక్రమంలో సరసభారతి కూడా భాగస్వామి అయి రెండు సార్లు ,మా అమెరికా మేనల్లుడు శాస్త్రి మా   బావగారు పంపిన డబ్బుతో మా అక్కయ్య దుర్గ గారి తిధినాడు ఆతర్వాత మరో రోజుమొత్తం నాలుగుసార్లు ఆహార వితరణలో పాల్గొని ధన్యమైంది . జూన్ 27శనివారం నా పుట్టిన రోజు సాయంత్రం మా ఆలయం లో శాసనమండలి సభ్యులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత సభజరిపి  పేదల అన్నదానానికి సహకరించిన కోటేశ్వరావు,ఆజనేయులు ,తో సహా స్వయం సిద్ధ ,శ్రమశక్తి పురస్కారాలు నగదు శాలువా జ్ఞాపిక పుస్తకాలతో అంద జేశాం . 28ఆదివారం నిడద వోలు కారులో వెళ్లి అక్కడ వారు ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాలులోడా.  శ్రీ చర్ల విదుల డా చర్ల మృదుల అనే చర్ల సిస్టర్స్ కు మా తలిదండ్రులు కీశే .గబ్బిట మృత్యుంజయ శాస్త్రి భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలు అందజేశాం .చర్ల సుశీల వృద్ధాశ్రమానికి సరసభారతితరఫున 15 వేలు మా బావగారుశ్రీ వేలూరి వివేకానంద  మా అక్కయ్య స్వర్గీయ దుర్గ పేరిట అందించిన 5వేలు ,అమెరికాలో ఉంటున్న మా బావగారి అన్నగారబ్బాయి శ్రీ వేలూరి పవన్ తన తండ్రిగారు స్వర్గీయ ముకుందం గారి పేరిట అందజేసిన 10వేలరూపాయలు మొత్తం 35వేలరూపాయలు నగదుగాచర్ల సిస్టర్స్ కు వేదికపైనే అందజేశాం .గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ శిష్టు సత్యరాజేష్ కు ,తణుకు కవయిత్రి గాయని అనేక అవార్డ్ ల  గ్రహీత శ్రీమతి వాణీ ప్రభాకరి గార్లకు నగదు శాలువా పుస్తకాలు జ్ఞాపికలు తో స్వయం సిద్ధ పురస్కారం అందించాం .అక్కడి సాహితీ మిత్రులకు 30 సెట్ల పుస్తకాలు జ్ఞాపికలు శాలువ అందజేశాం .శ్రీకృష్ణాస్టమి  వేడుకలు మా ఆలయం లో నిర్వహించి శ్రీకృష్ణ గోపీ రాధ వేష ధారులైన బాలబాలికలకు నగదు ,పుస్తకాలు అందించాం .గుడివాడ తెలుగు భాషా వికాస సమితి శ్రీ ప్రసాద్ ఆధ్వర్యం లో ఆగస్ట్ 29న గుడివాడ లైబ్రరీలో అందించిన గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారం అక్కడికి వెళ్లి  అందుకొన్నాను .సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని మా గురువులు బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవంగా మా గుడిలో జరిపి శ్రీ రాజేంద్ర ప్రసాద్ చేత  ఈసంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద ప్రతిభగల విద్యార్ధులకు 2వేలరూపాయలు 7గురికి ,శ్రీ కోట సోదరులు తమతలిదండ్రులు సూర్యనారాయణ సీతమ్మ స్మారకం గా ఏర్పాటు చేసిన 20 వేలరూపాయలు ఇద్దరు పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధులకు ,సరసభారతి 5వేల రూపాయలు పుస్తకాలతో సహా అందజేశాం .ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా నగదు పుస్తకాలతో సత్కరించాం .

  నా రచన –దాదాపు 10సంవత్సరాలుగా నా రచనా వ్యాసంగం అంతా అంతర్జాలం లోనే జరుగుతోందని మీకు తెలుసు .1090మంది సంస్కృతకవులపై ‘’గీర్వాణ కవుకకవితా గీర్వాణ౦ ‘’గా మూడు పుస్తకాలు రాసి ఆవిష్కరించిఅందజేశాం .నాలుగవ గీర్వాణ౦ నెట్ లో రాస్తూ 500 గీర్వాణ కవులను పరిచయం చేశాను ఇదంతా కరోనాకు ముందే .కరోనాలో సుమారు 100మంది సంస్కృత కవులపై రాశాను .

‘’ ప్రపంచ దేశాల సారస్వతం ‘’ అని మొదలుపెట్టి కరోనాము౦దు వరకు 30దేశాల సాహిత్యం రాశాను .ఆతర్వాత విజ్రు౦భి౦చి రోజుకు కనీసం మూడు ఆర్టికల్స్ గా రాసి 203దేశాలు అంటే 6ఖండలలో ఉన్న దేశాల సాహిత్యం గురించి సమగ్రంగా రాశాను అంటే లిపి లేనికాలం నుంచి 21వ శాతాబ్దివరకు నవల నాటకం కవిత్వం మొదలైన అన్ని ప్రక్రియలో రచయితల గురించి వారుపొందిన పులిట్జర్ నోబెల్ బహుమానాలగురించీ రాశాను .అమెరికా సాహిత్యం పై 20ఎపిసోడ్ లు రాశాను ఇంకారాయాలి .ఇది నాకు చాలా సంతృప్తి నిచ్చింది .

‘’సుందరకాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం ‘’పేరుతొ వాల్మీకం ఆధారంగా నాకు తోచిన విధంగా 70 ఎపిసోడ్ లలో రాశాను .’’బకదాల్భ్యుడు ‘’అనే వేద,ఉపనిషత్ పురాణాలలో వచ్చే ఆయన గురించి మనకు పెద్ద గా తెలీదు .ఆయనపై ఆంగ్ల రచన ఆధారంగా సమగ్రంగా 21 ఎపిసోడులు రాశాను .’’ఆరామ ద్రావిడుల ఆరామం –కాకరపర్రు ‘’పేరిట అక్కడి సుప్రసిద్ధులైన వేదవేత్తలు కవులు దానశీలురు మొదలైన వారిపై 9 ఎపిసోడ్ లు రాశాను .’’మనకు తెలియని మహా యోగులు ‘’గా 70మందియోగుల జీవిత చరిత్రలు రాశాను .డా తిరుమల రామ చంద్ర గారి ‘’హంపీ నుండి హరప్పా దాకా ‘’ఆధారంగా ‘’తిరుమల రామ చా౦ ద్రాయణమే-హంపీ నుంచి హరప్పాదాకా ‘’పేరిట ముఖ్యమైన విషయాలను 24ఎపిసోడ్ లుగా రాశాను .’’అగర్తా ‘’అనే భూగర్భ లోక విశేషాలను ఆంగ్ల గ్రంథం ఆధారంగా -11ఎపిసోడ్ లు రాశాను .ఇంకారాయాలి .మహాత్యాగి శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య అనే దేశభక్తుని జీవిత చరిత్ర ఆధారంగా 8ఎపిసోడ్ లు రాశాను ఇంకారాయాలి .,పద్మ భూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం ఉర్డుకవితలు ఆంగ్ల అనువాదం ఆధారంగా 15కవితలకు తెలుగు అనువాదం చేశాను .అలనాటి ‘’రేడియో బావగారి కబుర్లు ‘’చెప్పిన శ్రీ గాడేపల్లి సూర్యనారాయణ శాస్త్రి శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గార్ల ముచ్చట జ్ఞాపకం వచ్చి అదే పేరుతొ శంకరజయంతి అన్నమయ్య జయంతి నృసింహ జయంతి బుద్ధజయంతి లపై 4 ఎపిసోడ్ లు రేడియో బావగారి కబుర్లుగాడైలాగుల రూపంగా  రాశాను .విహంగ మహిళా వెబ్ మాసపత్రికకు నెలకొక ఆర్టికల్ వంతున 6 ఆర్టికల్స్ ప్రపంచ ప్రముఖ మహిళలపై రాసి ఆపత్రికకు ఇప్పటికి సెంచరి రచనలు అంటే 100 రచనలు పంపి సంతోషించాను .వారునాకు మూడేళ్లక్రితం విహంగ సాహితీఅవార్డ్ ను రాజమండ్రి నన్నయ యూని వర్సిటీలో అందజేశారు .

పుస్తక సమీక్షలు –హోసూరు తెలుగు సంఘం వారు ఉగాదికి తెచ్చిన కవిత సంకలనం ,డా అగరం వసంత రాసిన ‘’అంజనప్ప స్వామి ‘’పుస్తకాల సమీక్ష రాశాను .శ్రీ చలపాక ‘’కాలం కథలు’’సమీక్ష ,ట్రాన్స్ జ౦డర్స్ కథలు శ్రీమతి కోపూరి పుష్పాదేవి గారి కథలపైనా ,శ్రీ యక్కలూరి శ్రీరాములు గారి సాహిత్యంపై డా మక్కెన శ్రీను గారి పరిశోధన పుస్తకం పైనా సమీక్షలు రాశాను ‘.

 కరోనా పై కవితలు,హాస్య రచనలు  -నిజం ,కరోనాభాష్య౦ ,ప్రపంచ కుగ్రామం కునారిల్లుతోంది ,గిరీశ భాష్యం ,కరోనా కల్యాణం ,కరోనాలో జంతువుల కళకళ ,మానవుల విలవిల ,రక్తబీజుని రక్త సంబంధివా?ఆర్ధికంగా క్యా కరోనా ?కరోనాకు కరోనా చెప్పు ,లాక్ డౌన్ బ్రూస్లీలు ,కరోనా-కామాక్షీ మీనాక్షీ కబుర్లు ,స్టేహోం జీరోలు ,కరోనా భువన విజయం ,నోనోనో .జనం రావాలంటే .

ప్రత్యేక వ్యాసాలు  – పోర్ట్రైట్ చిత్రకారుడు శ్రీ శంకరనారాయణ గారి మరణం పై –‘’శాంత సౌజన్య మూర్తి ‘’ప్రఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం మరణం పై –బాలూతో మాటా –మంచీ ,పౌరాణిక చిత్రనటుడు శ్రీ లవకుశ నాగరాజు పై ‘’నాగరాజుతో నా పరిచయం ‘’నటుడు జయప్రకాష్ రెడ్డి మృతిపై ‘’విలక్షణ వచికాభినయ నటుడు ‘’ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధికవేత్త శ్రీ ఆరిగపూడి ప్రేం చంద్ గారి మరణంపై ‘’ఉయ్యూరుకు చెందిన ప్రముఖ ఆర్ధిక వేత్త శ్రీ ప్రేం చ౦ద్ ప్రత్యేక వ్యాసాలు రాశాను .

  శ్రీ వాసుదేవానంద సరస్వతిపై ‘’అశ్వ త్దామ వంటి మహాపురుషులను దర్శించిన వాసుదేవానంద స్వామి -5ఎపిసోడ్ లుగా ,మచిలీ బందరుయోగి రామావదూత ,ఆత్రేయపై ‘’మన ‘’సుకవి’’ఆత్రేయ 3 భాగాలు రాశాను .కార్త వీర్యార్జునుడు ,దధి క్షీర సముద్రాలు సృష్టించిన ఉపమన్యువు వ్యాసాలు రాశాను .

శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారికుమారుడు మహా పరిశోధకుడు శ్రీ ఆనందమూర్తిగారిపై ‘’పరిశోధన  ఆనంద మూర్తి  వేటూరి  ,పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారిపై సవివరమైన  వ్యాసం రాశాను .

దేవాలయాలు శతకాలు –అల్లాడు ,చిత్రాడ ,ఝ౦గోళ,పరాశరేశ్వర ,సర్పవరం ధర్మవరం ,,లక్కవరం ,మర్రిగుంట, నువ్వుకొండ నడిగడ్డ  దేవాలయాలు ,,తిరునారాయణ క్షేత్రం,కొమర్పురి శతకం ,ముఖలి౦ గేశ్వర శతకం .

ఫేస్ బుక్ లో సరసభారతి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు –మార్చి 25 సాయంత్రం సాయంత్రం 5నుండి 6-30వరకు శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం లైవ్ ,బ్రహ్మ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి జీవితం పై కరదీపికలైవ్ ,సరసభారతి పుస్తక పరిచయం -5భాగాలు లైవ్ ,కథాసుధ –రోజూ ఉదయం 10గంటలకు ,15రోజులు లైవ్ ,శ్రీ హనుమత్కథా నిధి  , శ్రీ ఆంజనేయస్వామి మహాత్మ్యం -15భాగాలు లైవ్ ,’’అనంతకాలం లో నేనూ ‘’నా చిన్నప్పటినుంచి ఇంటర్ చదువు పూర్తయ్యేదాకా విశేషాలు -12భాగాలు లైవ్ ,భారతీయ విజ్ఞాన సర్వస్వం భారతం –‘’తిక్కన భారతం పై -10ఎపిసోడ్ లు లైవ్ ,శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవం –సెప్టెంబర్ 1నుంచి అక్టోబర్ 11 వరకు 41భాగాలు ప్రత్యక్ష ప్రసారం .

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -1

ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -1

కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో కల్చరల్ చానల్ సహకారం తో అక్టోబర్ 17,18తేదీలలో సాయంత్రం 5-30గం.లకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వినూత్న ప్రయోగంగా ‘’ ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం ‘’అనే సాహిత్య కార్యక్రమం వివిధ రచయితలతో నిర్వహించింది .17వ తేదీ సాయంత్రం సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ ప్రారంభోపన్యాసం చేసి కార్యక్రమ నిర్వహణ ఉద్దేశ్యం వివరిస్తూ ,కరోనా కాలం లోనూ కవులు రచయితలూ అవిచ్చిన్నంగా రచనలు చేసి సాహితీ ఫలాలు అందించారానీ ,వారందరినీ ఇలా కలుపుతూ చేబట్టిన ఈ ప్రక్రియ ఫలప్రదం కావాలని కోరారు .సంఘ ప్రధాన కార్య దర్శి శ్రీ పూర్ణ చ౦ద్ లక్ష్య ప్రస్తావన చేస్తూ ,అందరూ తమకిచ్చిన 10నిమిషాల వ్యవధిలో తమ సాహితీ కృషి వివరించాలని ,ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించి జయప్రదం చేయమని కోరారు .ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘’సాధారణం గా నాకు ఖాళీ గా ఉండే సమయం దొరకదు .ఈ కరోనా కాలం లో పుష్కలంగా సమయం తీరక  దొరికి ఆరు పుస్తకాలు రాసి ముద్రించాను  ,మరికొన్నిటికి కావలసిన ముడి పదార్ధం సేకరి౦చు కొన్నాను .’వలస కార్మికుల దయనీయగాథ ప్రభుత్వాల నిర్లక్షం నన్ను బాగా కలచి వేసింది .వాటిపై సుదీర్ఘ నవల రాస్తున్నాను ‘’’అన్నారు .శ్రీ విహారి ‘’ఎన్నెన్నో కవితలకు, కవితా, కథా సంకలన సంపుటాలు సమీక్షించా. ముందు మాటలు రాశాను .ఎప్పటినుంచో రాయాలనుకొంటున్న  ‘’జగన్నాథ పండిత రాయల జీవితం ‘’పై ఎవరూ రాయని విశేషాలతో నవల రాశాను .ఇది నాకు చాలా సంతృప్తి నిచ్చింది .’’అన్నారు .శ్రీ దీర్ఘాసి విజయభాస్కర్ ‘’నేను శ్రీకాకుళం జిల్లా వాడిని .అక్కడి కొన్ని కులాల పేర్లు,ఇంటి పేర్లు  ఎవరికీ తెలియవు .వలస కార్మికులు అనే పదం నాకు నచ్చలేదు .అలాయితే కలెక్టర్లు జడ్జీలు  మొదలైన వారంతా దేశం లో ఏదో ప్రాంత౦ లో జన్మించి వివిధ రాష్ట్రాలలో విధి నిర్వహణ చేస్తున్నారు. మరి వారికి వలస పదం వర్తింప చేయగలమా ?వలస కార్మికులు దేశ కార్మికులు. దేశాని కంతటికీ చెందినవారు .కనుక గౌరవంగా ‘’జాతీయ కార్మికులు ‘’అందా౦ .నేను కూడా మా ప్రాంత విషయాలపై సమగ్ర నవల రాస్తున్నాను ‘’అన్నారు . ప్రాచార్య శలాక రఘునాథ శర్మ ‘’భారతం అనువాదం తో రోజూ కనీసం ఆరు గంటలు శ్రమిస్తున్నాను .ఆర్ష విజ్ఞానం అందరికీ  వెన్నముద్ద ల్లాగా అందించాలని నా తలపు .’’అన్నారు .శ్రీ రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి ‘’కడప బ్రౌన్ లైబ్రరీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ,ఎందరో రచయితలను వెన్నుతట్టుతూ వారి రచనలు ప్రోత్సహిస్తున్నాను .నిరంతరం సాహిత్య జీవనం లోనే గడుపుతున్నాను ‘’అన్నారు .శ్రీ రసరాజు తాను  రాసిన ఘజల్స్ గానం చేశారు .శ్రీ రావి రంగారావు అమరావతీ సాహితీ మిత్రుల సమావేశాలు వివరిస్తే ,ఆచార్య మాడభూషి సంపత్కుమార్ ‘’చెన్నై లో తమ విశ్వవిద్యాలయం లోని తెలుగు శాఖ పని తీరును ,తన పదవీ విరమణ విశేషాలు అప్పుడు తమ విద్యార్ధి బృందం నిర్వహించిన జూమ్ అభినందన సభ విశేషాలు కళ్ళకు కట్టించారు .శ్రీ ఈమని శివనాగిరెడ్డి ‘’కరోనా బారి పడి,ఆయుర్దాయం దక్కించుకొన్న అదృష్టవంతుడిని .ప్రక్కమీద ఉంటూనే చాలాపుస్తకాలు చదివాను .మూడుపుస్తకాలు రాసి ప్రచురించాను ‘’అన్నారు  .శ్రీ నటరాజ రామకృష్ణ గారి ముఖ్యశిష్యులు డా.సప్పా అప్పారావుతమ ఆంధ్రనాట్య రచనలు సవివరంగా తెలియజేశారు  శ్రీ పివి సివి ప్రసాదరావు, డా సాధనాల వెంకటస్వామి నాయుడు, శ్రీ యలవర్తి రమణయ్య శ్రీ ఈతకోట సుబ్బారావు ,శ్రీ కిలవర్తి దాలి నాయుడు కూడా తమ రచనా ప్రక్రియలు వివరించారు .నాకు గుర్తున్న౦త వరకు పై రచయితలు చెప్పినదాని సారాంశమే చెప్పాను అంతకు మించి కూడా వారు చెప్పారు .అందరితో పాటు నేను కూడా 10 నిమిషాల వ్యవధిలో నా సాహితీ కృషి తెలియ జేశాను .కాని నేను చెప్పాల్సింది చాలా ఉ౦దికనుక పూర్తిగా దాన్ని మీకు ప్రత్యేకంగా వివరిస్తాను .అందరూ చక్కగా సమయపాలన పాటించి జయప్రదం చేశారు . ఒక నావెల్ ప్రోగ్రాం నిర్వహించి జయప్రదం చేసినందుకు అందరూ అభినందనీయులే .సరిగ్గా సాయంత్రం 5-30కి ప్రారంభమైన కార్యక్రమం రాత్రి 9గంటలకు అంటే మూడున్నర గంటలు సాగింది .ఒకరికొకరు పరిచయమయ్యారు .ఎవరి కృషి ఏమిటో తెలుసుకొన్నారు . వీరిలో ఒకరిద్దరు తప్ప అందరూ కరోనా కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని సాహితీ వ్యవసాయం చేసి ,పుష్కలంగా పంట పండించిన వారే .అందరూ అభినందీయులే .

  రెండవ రోజు 18వ తేదీ ఆదివారం కార్యక్రమ౦లో  శ్రీ భువన చంద్ర ,డా ఆర్ అనంత పద్మనాభరావు ,డా తుర్లపాటి రాజేశ్వరి ,డా శిఖామణి ,ఆచార్య బూదటి వెంకటేశ్వర్లు శ్రీ అట్టాడ అప్పలనాయుడు ,శ్రీ యక్కలూరి శ్రీనివాసులు ,శ్రీమతి తేళ్ళ అరుణ ,శ్రీ అంబళ్ళ  ,  జనార్దన్ ,శ్రీ కరీముల్లా ,శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ సరికొండ నరసింహరాజు ,శ్రీమతి గుడిపూడి రాదికారాణి,శ్రీ విజయ చంద్ర ,శ్రీ కలిమిశ్రీ ,డా ,నూనె అంకమ్మారావు లు పాల్గొన్నారు .మొత్తం మీద పాతతరం ,మధ్యతరం ,కొత్తతరం కవులు రచయితలు ,కవయిత్రులు  అందరికీ సరైన స్థానమే లభించి అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు .ఈ రెండోరోజు కార్యక్రమం నేను మా శ్రీ సువర్చాలాన్జనేయస్వామి దేవాలయం లో శరన్నవ రాత్రుల ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొనటం వలన, వీక్షించలేక పోయాను .ఇందరు మహానుభావుల దర్శనం, వారి అమృతవాక్కులు వింటూ , చూసే అదృష్టం కోల్పోయానని బాధగా ఉన్నది .

  రెండవ భాగం లో’’ కరోనా కాలం లో నా సాహిత్య కృషి ‘’సమగ్రంగా తెలియ జేస్తాను .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-20-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -2

కేనోపనిషత్ విశేషాలు -2

శాంతి పాఠం-ఓం ఆప్యాయంతు మమా౦గాని వాక్ప్రాణశ్చక్షుః,శ్రోత్ర మథో బాల మింద్రియాణి చ సర్వాణిసర్వం  బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరో దానిరాకరణ మస్త్వనిరాకరణం మేస్తు తదాత్మాని నిరతే య ఉపనిషత్సుధర్మాస్తే మయి సంతుతే మయి సంతు-ఓం శాంతిః శాంతిః శాంతిః

భావం –నా శరీర అంగాలు దృఢంగా ,వాక్కు ప్రాణం కన్ను చెవి బలం పొందుగాక .సర్వేంద్రియాలు శక్తి పొందాలి .అంతా ఉపనిషత్ బ్రహ్మమే . నేను బ్రహ్మాన్ని నిరాకరించ రాదు .బ్రహ్మ నన్ను నిరాకరించకూడదు ..అనిరాకరణం ఉండాలి ,అనిరాకరణం ఉండాలి .ఉపనిషత్ ధర్మాలు నాలో ఉండాలి ,నాలో ఉండాలి .

  అన్ని ఇంద్రియాల పని సామర్ధ్యం ఇచ్చేది బ్రహ్మమే .బ్రహ్మ ప్రాప్తికి ఇంద్రియాలే సాధనం .ఇవి బ్రహ్మజ్ఞానానికి ద్వారాలు .అన్ని ఇంద్రియాలు వాటిపనిఅవి చేసుకొనే సామర్ధ్యం బలం ఇవ్వమని ప్రార్ధన .కావలసింది ఆత్మబలం కదా .ఇంద్రియ బలం దేనికి ?’’నాయమాత్మా బలహీనేన లభ్యః ‘’అని ముండక ఉపనిషత్ చెప్పింది .అంటే కండబలం లేకపోతే ఆత్మబలం ఉండదు .శరీరం బలంగా ఆరోగ్యంగా లేక పొతే ఆత్మసాధనకు సహకరించదు.ధర్మ అర్ధ కామాలు సాధించటానికే కాదు మోక్షసాధనకుకూడా శరీరం కావాలి .అందుకే అన్ని ఇంద్రియాలు శక్తిపొందాలి అని ప్రార్ధన

 ఇంద్రియాలు మనల్ని నడిపించకూడదు .మనమే వాటిని నడిపించాలి .దీనికి ఆత్మబలం కావాలి .అంగాలకు  లొంగ రాదు.ఆత్మవల్లనే బలం పొందాలి ‘’ఆత్మనా విందతే వీర్యం ‘’అంది కేనోపనిషత్ .అంటే ఈ దేహమే నేను అనే దేహ భావం వదిలేసి ,ఈ దేహం కూడా నేనే అనే సర్వాత్మ భావం పొందాలి .బ్రహ్మం నేనే .ఆత్మనే .’’ఆత్మై వేదం సర్వం ‘’.అంతా ఆత్మా అయినప్పుడు వేరే ఏదీ లేదు కనుక ఈ దేహమూ నేనే .అంతా ఉపనిషత్ బ్రహ్మమే

  నేను బ్రహ్మను నిరాకరించకూడదు బ్రహ్మ నన్ను నిరాకరించరాదు .కంటితో చూసేదే బ్రహ్మం .కన్ను ఉన్నా చూపు ఉంటేనే చూడగలం .ఆచూపు నిచ్చేదే బ్రహ్మం –‘’చక్షుషశ్చక్షుః—అంది కేన .బ్రహ్మాన్ని తెలియకపోవటమే నిరాకరణం .అన్నిటినీ నడిపించేది బ్రహ్మ మాత్రమే అని తెలుసుకోవటమే బ్రహ్మాన్ని తెలుసుకోవటం లో మొదటి మెట్టు .బ్రహ్మం ఉన్నది అనే తెలివి కలిగితే ,అనిరాకరణం బ్రహ్మ జిజ్ఞాసకు ప్రారంభం అవుతుంది .

             ప్రథమ ఖండం

మొదటి మంత్రం –‘’కేనేషితం పతతి ప్రేషితం మనః –కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః

                      కేనేషితాంవాచ మిమాం వదంతి –చక్షుఃశ్రోత్రం క ఉ దేవో యునక్తి ‘’

భావం –ఏ దేవుని చేత ప్రేరేరి౦పబడి  మనసు కోరే విషయాలగురించి ప్రసరిస్తోందో ,ఏ దేవుడి తోకలిసి ప్రాణవాయువు మొదటగా చలిస్తోందో ,ఏ దేవునిప్రేరణ చే వాక్కు పలుకుతోందో ,ఏ దేవుడు కన్ను చెవి ఇంద్రియాలను ప్రేరేపిస్తున్నాడో

రెండవమంత్రం –‘’శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో య-ద్వాచో  హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః

                  చ్చక్షుష శ్చక్షు రతిముచ్య దీరాః –ప్రేత్యాస్మా ల్లోకా దమృతా భవంతి ‘’

భావం –ఏ దేవుడు చెవికి చెవి ,మనసుకు మనసు ,వాక్కు కు వాక్కు  అయి ఉన్నాడో ,ఆదేవుడే ప్రాణవాయువుకు ప్రాణవాయువుగా నేత్రానికి  నేత్రమూ అవుతున్నాడు  .ఈలోకాన్ని విడిచి ధీరులు ప్రకృష్ట దశ పొంది,మరణ రహితులు అంటే అమృతులు ఔ తున్నారు .

మనసు ప్రేరణ ఉంటేనే ప్రసరిస్తు౦ది.ఆప్రేరకుడు ఎవరు ?జీవుడు ఇష్టమున్నా ఏ అవయవాన్నీ కదిలించలేడు కనుక మనస్సుకు ప్రేరకుడు జీవుడు కాదు.ప్రాణవాయువు మహావాయువులో భాగమే .వాయువు జడపదార్ధం .జీవుడు ఈశ్వరుడు తప్పమిగిలిన తత్వాలన్నీ జడాలే .వాయువు కదుల్తున్నట్లు మనకు అనిపిస్తుందికదామరి జడం ఎలావుతుంది ?ఒక్కోసారి వాయువు వీచక ఉక్క అనుభవిస్తూ విసినకర్రతో విసురుకొంటూ అనుభవిస్తాం .కనుక వాయువుకు చలనం సహజం కాదు .శ్వాస క్రియలో మన ప్రాణం ప్రయత్నం ఏమీ ఉండదు .కనుక వాయువుకు చలనం సహజగుణం కాదు . కనుక ఇవన్నీ ఇతరములలైన వాటి ప్రేరణచే శక్తి పొందుతున్నాయని మొత్తం మీద అర్ధం .

 శ్రోత్రం అంటే వినటానికి సాధనమైనది .ఏది శ్రోత్రానికి శ్రోత్రమో మనసుకు మనస్సో వాక్కుకు వాక్కోదాన్ని వివరించాలి .శ్రోత్ర వాక్ మనసులు జడాలు కనుక కర్తృత్వం లేదు .కనుక చెవికి వినే సామర్ధ్యం మనసుకుప్రతిఫలన సామర్ధ్యం ,వాక్కుకు ధ్వని ఉత్పాదక సామర్ధ్యం తత్త్వం ఏదో బయట ఉన్నది .మనసో మనః అంటే మనసుకు మనసైనవాడు ఎవడు ?అది తెలియాలి .మనసు జడం కాని అది శరీర కర్తవ్యాలను చేయిస్తోంది .దీనికిశక్తి ఎక్కడి నుంచి వచ్చింది ?బయటినున్చేవచ్చి ఉండాలి అంటే పరమేశ్వరుని వలననే .వాచోహ వాచం అంటే వాగింద్రయానికి వాక్కు అయినవాడు .ఇలా ఇంద్రియాల పనులను చేయించేవాడు దేవుడు .ఆయనే మనసుకు మనసు వాక్కుకు నేత్రానికి నేత్రం వాక్కు శ్రోత్రానికిశ్రోత్రం అయిఉన్నాడని భావం .మోక్ష విషయం లో గొప్ప బుద్ధిగల ధీరులైన వారు ఈ లోకం వదిలి ఉత్కృష్ట స్థితి పొంది అమృతులౌతున్నారు .

ఆధారం –శ్రీ ప౦డితారాధ్యుల శరభారాధ్య వ్యాఖ్యానం .

సశేషం

మీ-గబ్బిట-దుర్గాప్రసాద్ -19-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

“శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నవరాత్రి18-10-20 రెండవరోజు ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకార వైభవం

“శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నవరాత్రి18-10-20 రెండవరోజు ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకార వైభవం

 

https://photos.google.com/share/AF1QipPoFx4xUfXS4iyIliDcSO_z30ooSZ1FAAzVIHbP9BQhVGsFzIpOei9cfS6B6tdCqQ?key=NGt4Q01MMmZUMjFSY1FfX0VnRTE4VkxXMDJGUnV3&pli=1

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -1

‘’ఇహ కేన వేదీ దధ  సత్యమస్తి-న చేదిదహా వేదిన్మహతీ వినష్టిః’’ అంటుంది కేన ఉపనిషత్ .అంటే ఈ జన్మలో బ్రహ్మం గూర్చి తెలుసుకొంటే అదే నిజమైన జన్మ  .లేకపోతే పెద్ద నష్టమే .

 వేదం లో కర్మకాండ విషయాలు చెప్పాక ,బ్రహ్మ విద్యను  చెప్పేజ్ఞానకాండ ను ఉపనిషత్తులు అంటారు .అంటే వేద విద్య నేర్చి, విధివిధానంగా కర్మలు ఆచరిస్తే ఫలితంగా పొందే భార్య ,సంతానం వగైరాలన్నీ అనిత్యాలు అని తెలుసుకొని,నిత్య సత్యమైన బ్రహ్మను  తెలుసు కోవాలనే వారికి ఉపనిషత్తులు సాయం చేస్తాయి .ఏదో కోరిక లోపలపెట్టుకొన్నవారికి స్వర్గం చేరి ,ఆ ఫలం ఖర్చుకాగానే మళ్ళీ భూమిపై పుడతారు  .దీన్ని పునరావృత్తి  ,దూమమార్గం ,కృష్ణ గతి దక్షిణాయనం అంటారు .ఇవే కర్మకాండలు వేదజ్ఞానం తో చేసేవాడు మళ్ళీ తిరిగి పుట్టడు..దీన్ని అపునరా వృత్తి,అర్చిరాది మార్గం ,శుక్లగతి ,ఉత్తరాయణం అంటారు .వీరుబ్రాహ్మలోకం చేరి బ్రహ్మ ఉన్నంతకాలం అక్కడే ఉండి,ప్రళయం లో ఆ లోకం లేకుండాపోతే ముక్తి పొందుతారు .దీన్ని క్రమముక్తి అంటారు .బ్రహ్మలోకం చేరినా ముక్తి పొందలేని వారు కూడా ఉంటారు .వీరిగురించి భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ‘’ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావృత్తినోర్జున ‘’అంటే బ్రహ్మలోకం మొదలైన లోకాలన్నీ తిరిగి రావాల్సిందే      .కనుక మనసు నిర్మలం విశుద్ధం అయితే జ్ఞాన నిష్టకు  మార్గం సులభమౌతుంది .ఇలాంటి చిత్తశుద్ధి ఉన్న ముముక్షువులు అంటే మోక్షం కోరేవారికే ఉపనిషత్తులు ఉద్దేశింప బడ్డాయి  .

   సమస్త కోరికలు అంటే ఈషణాలు త్యాగం చేసినవారికి ,మోక్షం కోరేవారికి మాత్రమె ఉపనిషత్తులు .ఆదిశంకరాచార్య ‘’సన్యాసికే తప్ప ,భార్యాపిల్లలున్నవాడికి జ్ఞాననిష్టకు ,ఉపనిషత్ విద్యకు యోగ్యత లేదు ‘’అన్నారు .అందులో ఎన్నో కష్టాలుంటాయి కనుకనే ఆమాట అన్నారు ..కోర్కెలు లేకుండా సంసారం లో ఉంటె సన్యాసి కిందే లెక్క .అందరూ ఉండగలరా .శంకరాచార్య అపరిమితంగా అభిమానించే యాజ్ఞవల్క్య మహర్షికి  మైత్రేయి ,కాత్యాయని ఇద్దరు భార్యలు . ఒంటి మీద బట్టల్ని ,భిక్షా పాత్రనూ వదిలేసి,హాయిగా చెట్టుకింద పడుకొనే వాడికీ ఆశాపాశం పోదు అన్నారు శంకరుడు భజగోవిందం లో ‘’అగ్రే వహ్నిఃపృష్టే భానూ ,రాత్రౌ చిబుక సమర్పిత జానుః-కరతలభిక్షా తరుతలవాసః తదపి న ముంత్యత్యాశాపాశః ‘’.మరి సంసారి సన్యాసి అవటం ఎలా ?భార్యాపుత్రులు దేవుడు మనకిచ్చిన వరంగా ,వారి పోషణ భగవంతుడిచ్చిన  బాధ్యతగా ,వారి సేవ కూడా భగవదారాధనగా భావిస్తే సంసారం’’ బంధం కాని సంబంధం ‘’అవుతుంది .ఇదే సన్యాసం.ఇదే సంసారం అనే కొలనులో తామరాకు.అంటే నీటిలో ఉంటూ నీటిని అంటనట్టుఉండటం .తామరాకు మీద నీటి బొట్టు ఎక్కి కూచోవాలను కొంటుంది ,కానీ నిలవలేక నీళ్ళల్లోకి జారి కనిపించదు .కనుక నీటి బొట్టుగా కాకుండా తామరాకుగా అంటనట్లు ఉండాలన్నమాట .

  కోరికలు త్యాగం చేసి మోక్షానికి ప్రయత్నించే వాడు దారి చూపే గురువును వెతుక్కుంటూ వెడతాడు .బ్రహ్మజ్ఞానానికి గురువు తప్పని సరిగా కావాలి .జ్ఞానం కలిగితే బంధం తెగి పోతుంది .బంధం తెగితే మోక్షమేగా .బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి వచ్చిన శిష్యుడికి ,ఆచార్యుడైన గురువుకు మధ్య జరిగే సంభాషణా రూపమే ‘’కేన ఉపనిషత్ ‘’.కేన అంటే దేనిచేత లేక ఎవని చే అని అర్ధం .ఎవరి ప్రేరణతో కన్ను చూస్తుంది చెవి వింటుంది .సృష్టి చేయబడుతుంది ?అంతటినీ చైతన్యం చేసే ప్రత్యగాత్మ ఎవరు లేక ఏది ?ఇదే కేనోపనిషత్ చెప్పే విషయం .ఇందులో శాంతి పాఠం తో పాటు నాలుగు  ఖండాలున్నాయి .మొదటి ఖండం లో ప్రాణులను ప్రేరేపించిశక్తి ఏది ?,అన్నిటినీ నియమించేది ఆత్మ.ఆత్మ తెలియ రానిది,,చెప్పలేనిది ,బ్రహ్మ  అనుపాస్యంఅంటే ఉపాశించ లేనిది .ఈ లోకం ఉపాసించేది బ్రహ్మం కాదు .రెండవఖండం లో బ్రహ్మజ్ఞానం గురించిన భ్రమ ,బ్రహ్మ౦ తెలియంది కాదు తెలిసింది కూడా ,తెలియని వాడు జ్ఞాని ,ప్రతిబోధలోనూ బ్రహ్మాను భూతి ,ఆత్మ జ్ఞానం పొందినదే నిజమైన జన్మ  .మూడవ ఖండం  ఉపాసన లో –దేవతలగర్వభంగం ,పరమేశ్వరుడు యక్షరూపం లో రావటం ,అగ్ని పరీక్ష ,యక్ష ప్రశ్న ,గడ్డిపోచ ,వాయువు బలం ,ఇంద్రుని ఎన్నిక ,ఉమా రూపం లో బ్రహ్మ విద్యావిర్భావం .నాల్గవ ఖండం లో బ్రహ్మోపదేశం ,బ్రహ్మ స్పృహ ,ఇంద్రుడే మొదటిజ్ఞాని ,ఉపాసనా విధానం –అధి దైవత౦,అధ్యాత్మం ,వన భజన ,చిత్త శుద్ధి సాధనాలు ,సత్వ శుద్ధి సాధనాలు ,ఫలశ్రుతి విషయాలవివరణ ఉంటాయి  .

   ఆధారం –కేన ఉపనిషత్ -శ్రీ సూరపరాజు రాధా కృష్ణమూర్తి గారి వ్యాఖ్యానం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నవరాత్రి మొదటి రోజు 17-10-20 శనివారం శ్రీ సువర్చల అలంకారం

శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నవరాత్రి మొదటి రోజు 17-10-20 శనివారం శ్రీ సువర్చల అలంకారం

 

https://photos.google.com/share/AF1QipMYpsBAkStVVVCPbIzQLv1NyNFMwS6jXEb9QPITSpA_aZv8bQXF_gJbIdHasP6lCA/photo/AF1QipODvfEpYgtVYUZ9CX-ThWATNQllL0GlFS8pYMCY?key=SmU2TXBucHBBTlFEYmJKWndQdXFqSE5sVTJkTThB

 

 

Posted in దేవాలయం | Tagged | Leave a comment