మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శన౦-2

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-2

డా.శివగారింట్లో మేడపై గదిలో మగాళ్ళం డ్రైవర్ తో సహా పడుకొన్నాం .నేను మ౦చంపైనా చరణ్ ,రాం బాబు కిందపరుపులపైనా ,డ్రైవర్ వసారాలో మంచం మీదా పడుకున్నాం .శివగారిల్లు నిత్య కల్యాణం పచ్చతోరణం లా ఎప్పుడూ బంధువులు స్నేహితులతో రద్దీ గానే ఉంటుంది .కనుక పది మంది వచ్చినా హాయిగా పడుకొనే ఏర్పాట్లున్నాయి .ఆడవాళ్ళను  ముగ్గుర్ని కింద మంచాలపై పడుకోబెట్టి ,శివ దంపతులు నేలమీద పడుకొన్నారు .నాకు,మా ఆవిడకు  గురు వారం రాత్రి అంతా పెద్దగా నిద్రలేదు .ఆవిడ వంట హడావిడి, నాకు యేహడావిడి లేకున్నా నిద్రలేదు .శుక్రవారం రాత్రి ఒంటిగంటకే మెలకువ రాగా మూడు న్నర దాకా అటూ ఇటూ దొర్లి ,లేచి పండ్లుతోమి  కాలకృత్యాలు కానిచ్చి , ,రాం బాబు తో గీజర్ ఆన్ చేయించి ,హాయిగా వేడి నీటితో స్నానం చేశాను .సంధ్యావందనం ,పూజ పుస్తక పఠనం తో పూర్తి చేశా .అప్పటికే పద్మగారు కాఫీ కలిపి గ్లాస్ నాకు పైకి పంపిస్తే త్రాగాను .మిగిలినవారూ సిద్దమయ్యారు .

,అందరం 14వ తేదీ శనివారం ఉదయం 5కు సిద్ధమై ,గుడి ఇంటికి దగ్గరే అయినా కారులో శివగారితో సహా బయల్దేరి 5-30కి చేరి మెట్లు ఎక్కి ఆలయ ప్రవేశం చేశాం .5-45కు అంతరాలయం లో మా అభిషేకం టికెట్లు వెరిఫై చేసి ,మమ్మల్ని స్వామికి అతి సమీపం లో కూర్చోబెట్టారు .అందరి గోత్రనామాలు చదివి పూలున్న పళ్ళెం మాతో తాకించి  ,మేమంతా అభిషేకం లో పాల్గొనే అర్హత కలిగించారు .ఆ రోజు 30మంది అభిషేకం టికెట్లు కొన్నారు .సరిగ్గా ఉదయం 6గంటలకు ఆలయం ఆఫీసర్ కు సంప్రదాయ తలపాగా చుట్టి చేతుల్లో పూలు పండ్లు మేమిచ్చిన నూతనవస్త్రాలతో పూల దండలతో పండ్ల తో  స్వాములపాదలవడ్డ ఉంచమని ఇచ్చిన దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండుభాగాలు ,సహా  నూతన వస్త్రాలున్న పళ్ళెం ఇచ్చి  తెల్ల గొడుగు  పట్టించి ,అర్చకస్వాములు మాతో సహా అందర్నీ ఆలయ ప్రదక్షిణ మూడు సార్లు మంత్ర పూత౦గా మంగళ వాద్యాలు మ్రోగుతుండగా చేయించి ,మళ్ళీ అంతరాలయం లోకి తీసుకు వెళ్ళారు .

అభిషేకం

అప్పటికే శ్రీరామ ,లక్ష్మణ ,సీతా మాతల తో ఉన్న కోదండరామ స్వామికి  అభి షేక వస్త్రాలు ,పూలమాలలు ధరింపజేసి మంత్రాలతో అభిషేకం మొదలు పెట్టారు .తర్వాత హారతి ఇచ్చి ,రెండో సారి పసుపు ,ఆవుపాలు ,పంచామృతాలతో అభిషేకం చేసి శిరసులపై రంధ్రాల పళ్ళెం తో జల్లు స్నానం లాగా చేసి మళ్ళీ హారతిచ్చారు .మూడవ సారి పవిత్ర జలాలతో జల్లుస్నానం తో అభి షేకం పూర్తి చేసి హారతిచ్చారు .ఇదంతా అయ్యేసరికి ఉదయం 7-30 అయింది .నాకేమని పించింది అంటే మంత్రాలకన్నా తంత్రాలే ఎక్కువయ్యాయని ..అందరం జ౦ప ఖానాలపై కూర్చున్నాం .మా శ్రీమతికి ,వియ్యపురాలికి అంతరాలయం వెలుపల శివ గారు కుర్చీలు  వేయించి  స్పష్టంగా కనబడేట్లు కూర్చో పెట్టించారు .అందర్నీ బయటకు పంపించి స్వామి వారికి నూతన వస్త్ర ధారణా అలంకరణ ,నిత్యపూజా చేసేసరికి 8-45 అయింది .నేను అభిషేకమవగానే బయట మెట్లపై కూర్చుని తెచ్చుకొన్న శ్రీరామ  అష్టోత్తర , సహస్రనామాలు ,సీతా అస్టోత్తర  సహస్రనామాలు చదువుతూ కాలాన్ని సద్వినియోగం చేసి ,మళ్ళీ అందరం అంతరాలయం లోకి వెళ్లాం .శ్రీ కోదండ రాములకు హారతిచ్చి ,మాకు అభిషేకజలం శిరసుపై జల్లి ,తీర్ధం ఇచ్చారు .మేమిచ్చిన వస్త్రాలు అయ్యవార్లకు అమ్మవారికి అలంకరించి మేమిచ్చిన పూలదండలు స్వామివార్లకు వేసి కనులపండువ చేశారు. మా శ్రీమతి ఆనందం వర్ణనాతీతం పరవశించి౦ది    నాకు అర్చకస్వామి చేత మెడలో స్వాముల శేషవస్త్రం ఖండువా కప్పించి స్వామి కి వేసిన పుష్పమాల వేయి౦చారు శివ .మేమందరం ఈ రెండున్నర గంటలలో దివ్యానుభూతిని పొందాం .దీన్ని ఇలా ఏర్పాటు చేయించిన శివ గారిని యెంత మెచ్చుకున్నా చాలదు .అందరం బయటకు వచ్చి ,అక్కడ ప్రసాదాలు పెట్టె మందిరం దగ్గరకు వెళ్లి దొప్పలలో అందజేసిన  వేడి వేడి పొంగలి ,పరవాన్నం తిన్నాం .మహా రుచికరంగా ఉన్నాయి .ఒక్కొక్కరం రెండేసి దొప్పలప్రసాదం లాగించాం .శుక్రవారం రాత్రి శ్రీ సౌమ్య వేంకటేశ్వరాలయం లో ‘’మలిహోర ‘’అనే ప్రసాదం పెట్టిన సంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది .మహా రుచిగా ఉంది .అడిగి మళ్ళీ పెట్టించుకొని తిన్నాం .

ఆలయ లోపల, ముఖ మడపం లోనూ ,బయటి గోపురం బయటా లోపల శిల్పకళ అత్యద్భుతం గా ఉన్నది .వాటిని మాకు దగ్గరుండి చూపిస్తూ ,వివరించారు డాశివ .ఒక శిల్పం లో గుర్రం ఏనుగు తలలు కలసి ఉండటం ఆశ్చర్య౦ .బయటి మెట్లకు కుడిప్రక్కన ఆవరణలో కడప నవాబు ప్రతినిధి ‘’ఇమాం బేగ్’’ త్రవ్వించిన బావి ఉన్నది .దీని జలమేస్వాములకు అభిషేకజలం గా వాడుతారు .ఇలా శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వాముల దర్శనం ,అభిషేకం కనులపండువుగా చూడగలిగిన అదృష్ట వంతులమయ్యాం .ఆలయం లో ఒక ప్రక్క చిన్న మందిరం లో చిన్నశ్రీ  ఆంజనేయస్వామి విగ్రహం ఉంది .బయట చిన్నగూడులో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది జా౦బవంతుడిలాగా అనిపిస్తాడు .జాంబ వంతుడే విగ్రహ ప్రతిష్ట చేశాడని అతిహ్యం . కనుక జాంబ వంత క్షేత్రం గా భావిస్తారు బయట చిన్నగూడులో  పొతనామాత్యుల విగ్రహం ,దానికింద పద్యం ఉన్నాయి .పోతనగారి జన్మస్థలం ఒంటిమిట్ట అనే ఏకశిలా నగరం .ఇక్కడ ఆయన జయంతి ప్రతిఏడాది ఘనంగా నిర్వహిస్తారు .పోతన మడి(పొలం ),శ్రీనాధుడు గాలిలో పల్లకీ నిలిపిన చోటు ఇక్కడే ఉన్నాయి . పోతన తెలంగాణాలో పుట్టినట్లు అక్కడివారు భావిస్తారు.మార్కండేయుని తండ్రి మృకండ మహర్షి ఈక్షేత్రం లో తపస్సు చేశాడనీ కనుక మృకండ క్షేత్రం అనే పేరు కూడా ఉందని అంటారు .ఈ వివరాలు ఆలయ చరిత్రలోతర్వాత  రాస్తాను .

శ్రీ సంజీవ రాయ హనుమ

శుక్రవారం రాత్రే కోదండరామ దర్శనానికి ముందు సంజీవరాయ దర్శనం చేశాం .కోదండ రామునికి ఎదురుగా  ఆలయం మెట్లకు ఎదురుగా ఈ స్వామి ఆలయం ఉంది .సుమారు 5అడుగుల భారీవిగ్రహం .మహా వర్చస్వంత౦ గా దర్శనమిస్తాడు హనుమ ఈ క్షేత్రపాలకుడు సంజీవరాయహనుమ  .మేము ఉయ్యూరు నుంచి తెచ్చిన ,మా దొడ్లోని తమలపాకులు,కట్టి తెచ్చిన చేమంతిపూల దండ నూతన వస్త్రాలు ,దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండుభాగాలు , కొబ్బరికాయ వగైరా పళ్ళెంలో పెట్టి అర్చకస్వామికి అంద జేశాం .ఆయన మా అందరి గోత్రనామాలు అడిగి చెప్పి అష్టోత్తర పూజ చేస్తుండగా నేను అష్టోత్తర సహస్ర నామాలు తృప్తిగా చదివి స్వామికి వినిపించా .దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండు భాగాల పుస్తకాలు స్వామి చరణాల వద్ద అర్చక స్వామితో పెట్టించాను .మేమిచ్చిన వస్త్రాలు స్వామిపై వేసి ఆనందం కలిగించారు .నైవేద్యం హారతి ఇచ్చారు .నాకు అర్చకస్వామితో ప్రసాదం ఇప్పించి స్వామి శేషవస్త్రం కప్పించి పుష్పహారం వేయించారు శివ.శనివారం నాడు మా ఇలవేల్పు హనుమ సంజీవరాయ రూపం తో దివ్య దర్శనం చేశాం .మధురానుభూతి పొందా౦ అందరం .

శివగారితో ముందే చెప్పి ప్రతి శనివారం ఇక్కడ అమ్మే తిరుమల స్వామి లడ్డూలు 10 కొన్నాం .ఒక్కోటి 50 రూపాయలు.ప్రసాదంతిని ,కారులో శివగారింటికి 9-30కు చేరాం .అందరికి వేడి వేడి మినపట్లు తిన్నవారికి తిన్నంత గా రెండుచట్నీలతో  చేసి పెట్టారు శ్రీమతి పద్మ .మహారుచికరంగా ఉన్నాయి .ఆమెకు ధన్యవాదాలు చెప్పాం .ఆమె సన్నగా పీలగా ఉన్నా మహా చలాకీ మనిషి .నిమిషాలలో అన్నీ సిద్ధం చేస్తారు .మనిషికాదు మానవత్వం ,ఆపేక్ష ,ఆత్మీయత రంగరించిన యత్రం అనిపిస్తు౦ది ఆమె స్పీడ్ చూస్తే.

పుష్పగిరి సందర్శనం

శనివారం ఉదయం 10-30కి శివగారింటి నుంచి అందరం కారులో బయల్దేరి ,దారిలో సీతాదేవికి దప్పిక అయితే శ్రీరాముడు వేసిన బాణం తో భూగర్భాగంగ ఉబికి పైకి వచ్చిన రామతీర్ధం ,లక్ష్మణుడు వేసిన బాణంతో  భూగర్భ జలం గా వచ్చిన లక్ష్మణ తీర్ధం చూశాం .ఈ రెండు నీళ్ళ రుచి భిన్నంగా ఉంటాయట .రామతెర్ధం కొబ్బరినీళ్ళులాగా ,లక్ష్మణతీర్ధజలం ,కొంచెం తక్కువ తీయగా ఉంటాయట .ఒకదానికొకటి 10అడుగుల దూరం లో ఉన్నప్పటికీ’ .సరాసరి పుష్పగిరి చేరాం 11గంటలకు .ఆ వూళ్ళో ఎవరో చనిపోతే ఆలయం మూసి పూజారి వెళ్ళాడట .ఊళ్ళో శవం ఉండగా ఇక్కడ ఆలయాలు తీయరట.ఒకమ్మాయి తాను  చెప్పి పిలుచుకోస్తానని చెప్పి వెళ్లి వెంట ఉండి తీసుకొచ్చింది అర్చకుడు యువకుడే .ఒక్కో ఆలయం తలుపు తీసి దీపం వెలిగించి దర్శనం చేయించాడు .ఇక్కడ శివుడు ‘’వైద్యనాథేశ్వరుడు .అమ్మవారు కామాక్షి దేవి విడిగా చిన్న గుడిలో ఉంటుంది. అమ్మవారి ఎదురుగా శ్రీ చక్రం ఉంది ఈ ఆలయం శక్తి పీఠం.  అస్టమాతృకల విగ్రహాలున్నాయి .సిద్దేశ్వరాలయమూ ,శ్రీ లక్ష్మీ చేన్నకేశవాలయమూ ఉంది .అన్నీ చక్కగా చూసి ఇక్కడి పుష్పగిరి పీఠం చూద్దామని ఆశపడితే ,పీఠాధిపతి  ఇక్కడ ఉండటం లేదని చెప్పాడు పూజారి .కాని గో సంరక్షణ ఉన్నది  సరే అని అది ఉన్న చోటు చూసి ఫోటోలు దిగాం .పుష్పగిరి పీఠం ఆంధ్రుల ముఖ్య పీఠం.కంచిది తమిళులది ,శృంగేరి కన్నడిగులది .ఒకప్పుడు మహా వైభవంగా ఉండేది పుష్పగిరి పీఠాదిపతి మందీ మార్బలంతో దేశమంతా పాదయాత్ర చేసి శ్రీచాక్రార్చన చేసేవారు .ఇప్పుడు అంతా వెలవెల బోతోంది ఇక్కడి వాతావరణం .పూల తో శోభిల్లేగిరి పుష్పగిరి .ఇప్పుడాశోభ లేకపోయే సరికి ఉసూరు మనిపించింది .పీఠ విశేషాలు తర్వాత రాస్తాను .పుష్పగిరి లో పెన్నానదికి అవతల ఎత్తైన కొండపై శ్రీ చెన్నకేశవ ఆలయం దూరానికే ముచ్చటగా అనిపిస్తుంది .వెళ్లి చూసే టైం లేక వెళ్ళలేదు .కానీ చూడాల్సిన దేవాలయం .

కడప ప్రాంతం అంటే బాంబులతో దద్దరిల్లు తుందనే భయం ఉండేది .15ఏళ్ళనుంచి ఫాక్షనిజం లేదని శివ చెప్పారు .రోడ్డుకు ఇరువైపులా వరి చేలు కంటికింపుగా ఎక్కడ చూసినా కనిపించటం మరో విశేషం .పొట్టి వంగడం ‘’జిలకర మసోరి ‘’ఈ ప్రాంతపు ప్రత్యేక వరిపంట .ఇది ఎక్స్ పోర్ట్ వెరైటీ .నాణ్యమైన సన్నబియ్యం బియ్యం జిలకర మసూరి.

దేవుని గడప

పుష్పగిరి నుంచి సరాసరి దేవుని గడపకు వెళ్లాం .ఇది కడప కు బయట 5కిలో మీటర్లలో ఉంటుంది .పాతకడప అనీ అంటారు .ఇక్కడ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయం సుప్రసిద్ధం .తిరుమల వెళ్ళే యాత్రికులకు ఇది గడప వంటిది అందుకే దేవుని గడప అని అంటారు .ఈ స్వామి దర్శనం చేస్తే తిరుమల బాలాజీని దర్శించినట్లే అవ్వాలని ఒక భక్తుని కోరికపై ఇక్కడ స్వామి వెలిశాడని అతిహ్యం .ఇక్కడ కూడా డా.శివ గారు తన బంధువుకు ముందే ఫోన్ చేసి చెప్పి మాకు శీఘ్రదర్శనం కలిపించి స్వామివారి కై౦కర్యం మాకు లభించేట్లు చేశారు .అంతటి నెట్ వర్క్ శివ గారిది .

కడప బ్రౌన్ మెమోరియల్ లైబ్రరి

దేవుని గడపనుంచి సరాసరి కడప వెళ్లి సి.పి.బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీకి వెళ్లాం .అప్పటికే ఒంటిగంట అయింది .మూసేశారు .అక్కడి లేడీ అటెండర్ తలుపులు తీసి మాకు లోపల అంతా చూపించింది .సరసభారతి ప్రచురణలు 14 లైబ్రరీలో లైబ్రేరియన్ కు ఇవ్వాలని తెచ్చాను .కనుక  గీర్వాణం- 3,ఆధునిక ప్రపంచ నిర్మాతలు పుస్తకాలు ఆ అటెండర్ కిచ్చి ఫోటోలు తీసుకొన్నాం ,మిగిలిన పుస్తకాలను ప్రస్తుతం తిరుపతి లో ఉన్న లైబ్రరి ట్రస్ట్ సెక్రెటరి శ్రీ తట్టా నరసింహా చారి గారి కి ఫోన్ చేసి ఆయన రాగానే తాను  అందజేస్తాననని శివ గారు అంటే వారికి అప్పగించాను .కడప కలెక్టర్ గా చేసిన బ్రౌన్ ఆంధ్రభాషకు చేసిన సేవ అమూల్యం అనితర సాధ్యం .ఎన్నో అపూర్వ గ్రంథాలు సేకరించి పండితులను తనస్వంత ఖర్చుతో నియమించి పరిష్కరి౦ప జేసి ప్రచురించాడు .తానూ స్వయంగా తెలుగు –ఇంగ్లీష్ ,ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులు ‘’బ్రౌణ్యం ‘’కూర్చిన అంద్రులకు ప్రాతస్మరణీయుడు బ్రౌన్ .ఇంగ్లాండ్ లో పుట్టి ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చి తెలుగు భాషాభి వృద్ధికి యెనలేని సేవచేశాడు .వేమనగారి శతకపద్యాలు సేకరించి మొదటగా ప్రచురించాడు బ్రౌన్ .ఇక్కడ బ్రౌన్ లైబ్రరి,రిసెర్చ్ కేంద్రం  ఏర్పడటానికి ముఖ్య కారకులు మహా పండితులు ,విమర్శకులు విశ్లేషకులు స్వర్గీయ శ్రీ జానుమద్ది హనుమత్సాస్త్రి గారు .ఎన్నో ఉపయుక్త గ్రంథ రచన చేశారు .సరసభారతి పుస్తకాలు వారికి పంపిస్తే ,చదివి బాగున్నాయని ఫోన్ చేసి,లేక ఉత్తరం రాసి వాటిని బ్రౌన్ లైబ్రరీకి అందజేస్తున్నట్లు తెలిపిన సౌజన్య శీలి శాస్త్రిగారు .ఆయనతో మాట్లాడటం అంటే పుంభావ సరస్వతి తో మాట్లాడినట్లు ఉండేది .ఇక్కడి నుంచి బయల్దేరి సరాసరి ఒంటిమిట్ట శివ గారి ఇంటికి మధ్యాహ్నం 2-30కు చేరాం .శ్రీమతి పద్మ రెడీ చేసిన భోజనం తిని కాసేపు విశ్రమించాం .

సాయంకాలం 5గంటలకు డా శివ దంపతులకు మా దంపతులం మాకోడలు నూతనవస్త్రాలు పసుపుకు౦కుమ  పండ్లు అందజేసి ,ఇద్దరికీ చెరొక శాలువా కప్పి సరసభారతి ఆత్మీయ సత్కారం జరిపాం .అందరం కాఫీ త్రాగి సిద్ధవటం కు రెడీ అయ్యాం .

సిద్ధ వట సందర్శనం

శ్రీశైలానికి దక్షిణద్వారం సిద్ధవటం .ప్రక్కనే గలగలా పారే పెన్నానది .అందులోకి సోమశిలనుంచి లిఫ్టి ఇరిగేషన్ తో కలిసే కృష్ణాజలాలు కను విందు చేస్తుంది .సిద్ధవట౦లొ వటవృక్షం క్రింద పూర్వం సిద్ధులు తపస్సు చేసి సిద్ధిపొందేవారు అందుకే ఆపేరు .నది ప్రక్కనే వట వృక్షం ఉన్నది .ప్రశాంత వాతావరణం  .సిద్ధవటం లో రాజులకోట ఉంది .దూరంనుంచే చూసి తిరుగుప్రయాణం లో ఫోటోలు తీసుకొన్నాం

జ్యోతి గ్రామ ప్రత్యేకత

సిద్ధవటానికి సుమారు 10కిలోమీటర్లలో జ్యోతి గ్రామం ఉంది .ఎన్నో వందల ఏళ్ళక్రితం ఇక్కడి సిద్దేశ్వరాలయం  కామాక్షీ ఆలయం గోపురం వగైరా వరదనీటిలో మునిగి ఇసుకలో కూరుకు పోయాయని ,15ఏళ్ళ క్రితం  పురాతత్వ శాఖవారి త్రవ్వకాలలో ఆలయ గోపుర పైభాగం కనిపిస్తే కి౦దిదాకాత్రవ్వితే 50 అడుగులగోపురం దానికెదురుగా శిధిలావస్థలో కొంచెం ఎత్తుమీద ఉన్న శ్రీ సిద్దేశ్వరాలయం ,దానికి కుడిప్రక్క శ్రీ కామాక్షీ ఆలయం బయట పడ్డాయని ,ఆవరణ చుట్టూ గోడ కూడా ఉండేదని ఒకభాగం గోడకనిపి౦చి౦దని ,గోడలమధ్య ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయని కుమారస్వామి విగ్రహం కూడా బయటే మట్టిలో సగం కూరుకు పోయి ఉందని ,ప్రాంగణం సుమారు 5 ఎకరాల విస్తీర్ణం లో ఉందని చెప్పి స్వామి,అమ్మవార్ల  దర్శన౦ , లింగాల దర్శనం చేయిస్తూ వివరించారు శివ .

జ్యోతి గ్రామం నుంచి సిద్ధవటం చేరి అక్కడి గుడిలో ఉన్న శ్రీ సిద్ద వటేశ్వర స్వామిని ,కామాక్షి అమ్మవారినీ దర్శించాం పూజారి ఉన్నాడు శ్రీశైలం నుంచి నెలకొక పూజారి ఇక్కడికి వచ్చి స్వామివారి నైవేద్యం పూజాదికాలు నిర్వహిస్తారట .ఈ ప్రాంతపు ఆలయాలన్నిటిని శ్రీశైల దేవస్థానం  దత్తత తీసుకొని సంరక్షిస్తూ భక్తులకు అందుబాటులో ఉంచటం విశేషం .,అభినందనీయం .శివగారింటికి రాత్రి 7-30కు చేరాం .అప్పటికే పద్మగారు మా అందరికి కావలసినన్ని మిరపకాయ బజ్జీలు వేడి వేడిగా తయారుచేసి తినటానికి పెట్టారు హాయిగా తిన్నాం .కాసేపు టివి చూసి ఇక రాత్రి భోజనం అక్కరలేదని పించి పైకి వెళ్లి పడుకొన్నాను .రాత్రి 9గంటలకు సేమ్యా ఉప్మా ప్లేట్ లో పెట్టి ,మజ్జిగ గ్లాసుతో చరణ్ కిచ్చి పంపారు పద్మ .నాకు సేమ్యా పెద్దగా ఇష్టం ఉండదు ,కొద్దిగా తిని మజ్జిగతాగి హాయిగా నిద్ర పోయా .మాంచి నిద్ర పట్టింది .ఆదివారం ఉదయం 7-30కు తిరుగు ప్రయాణం అనుకొన్నాం .ఆదివారం విశేషాలు రేపు రాస్తాను.

ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శన౦-1

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-1

   నేపధ్యం

ఈ దసరాలలలో ఒంటి మిట్టనుండి డా.జి.శివకుమార్ ,ఆయన మిత్రులైన ఆర్.ఎం.పి.డాక్టర్ల బృందం మా మూడవ అబ్బాయి డా .నాగగోపాలకృష్ణమూర్తి ఆహ్వానం పై ఉయ్యూరులో ఏర్పాటు చేయబడిన రెండు రోజుల సదస్సుకు వచ్చి మా ఇంటిలో , మా దంపతులకు తిరుమల నుంచి తెప్పిచిన శాలువా లడ్డు ప్రసాదం ,శ్రీ ఒంటి మిట్ట శ్రీ కోదండ రామ స్వామి వ ఫోటో అందజేసి మమ్మల్ని అక్కడికి రమ్మని కోరారు .సరే అని సరసభారతి 14ప్రచురణలు మొత్తం సుమారు 350పుస్తకాలు ఇచ్చి  ఆప్రాంతం లో సాహిత్య సాంస్కృతికాభిమానులకు అందజేయమని కోరాను .మహా ప్రసాదంగా  తీసుకు వెళ్ళారు .అన్నీ సద్వినియోగం చేశారనే భావించాను .అప్పటినుంచి ఒంటిమిట్ట  ప్రయాణం ఆలోచన తీవ్రమైనది .పిల్లలకు సెలవులు కలిసొస్తాయని ఈనెల 13శుక్రవారం బయల్దేరి ,14,15తేదీలలో అక్కడ చూడాల్సినవి చూసి 15 మధ్యాహ్నం తిరుగు ప్రయాణం చేయాలని భావించాం .శివ దంపతుల ఇంట్లోనే బస భోజనాదులు అని మా మూర్తి చెప్పాడు .మనవరాలు రమ్య కు అనుకోకుండా ‘’పారాయణ ‘’వారు పరీక్ష పెట్టటం తో ,మా అన్నయ్యగారి అబ్బాయి రామనాథ బాబు వస్తానంటే సరే అని ‘’సెవెన్ సీటర్’’గా నేనూ మా శ్రీమతి ప్రభావతి ,మా మూడవకోడలు శ్రీమతి రాణి , వాళ్ళ అమ్మగారు ,మా వియ్యపురాలు శ్రీమతి దేవి గారు,మనవడు చరణ్ ,అన్నగారబ్బాయి రామనాథ  బాబు ,డ్రైవర్ ఈసా తో ఇన్నోవాలో  వెళ్లాలని తయారయ్యా౦.

              ప్రయాణం

   13వ తేదీశుక్రవారం ఉదయం 4కే లేచి ,స్నాన సంధ్యావందన పూజాదికాలు పూర్తి చేసి ,టిఫిన్ కాఫీలు లాగించి మేమిద్దరం  8 కి సిద్ధమయ్యాము  .మిగతావాళ్ళు అందరూ రెడీ అయ్యేసరికి 8-30దాటింది .దారిలోభోజనానికి ఇంట్లోనే అన్నం, కూర కొబ్బరి చట్నీ ,పులిహోరా మెంతిమజ్జిగ తయారు చేశారు అత్తా కోడళ్ళు .అన్నీసర్దుకొన్నాం  ,అక్కడి శ్రీరామ ,సీతా  లక్ష్మణులకు ,సంజీవరాయ హనుకు నూతన వస్త్రాలుకొన్నాము  ,కిలోన్నర చేమంతిపూలతో దండలు కట్టింది మాశ్రీమతి .దొడ్లోని కనకాంబరాలు  డిసెంబర్ పూలు కోసి పూజకు తీసుకు వెళ్లాం .మా వాటర్ ప్లాంట్ వాటర్ రెండు పెద్దకాన్ లలో పెట్టుకొని ప్లేట్లు గ్లాసులు,పెరుగు  కమలాపండ్లు చక్రకేళిలతో  బిస్కెట్ పాకెట్ లతో 9గంటలకు బయల్దేరాం .గుంటూరు  హైవే మీదుగా చిలకలూరి పేట ,అద్దంకి ,దరిశి ,పొదిలి మీదుగా కనిగిరి దగ్గరలో  అక్కడి గిరి సముదాయం ,అ౦దమైన ప్రకృతికి’’ ఫిదా’’ అయి ,కొండపై ఉన్న శ్రీ బాలార్క విశ్వేశ్వరస్వామి కోవెల ఉందని తెలిసి క్రిందనే అరుగులు ఉంటె భోజనానికి అనువుగా ఉంటుందని అక్కడ చేరి తెచ్చుకొన్నవి కడుపారగా ఆరగించాం డ్రైవర్తో సహా.చక్రకేళీలు తిన్నాం  .కొండపైకి వెళ్లి అక్కడ జరుగుతున్న చండీయాగం ,చూశాం .మమ్మల్ని భోజనానికి ఉండమని చేసేవారు చేయించే వారుకోరినా కుదరదని వినయంగా చెప్పి ,కిందకు దిగి బయల్దేరి ,కనిగిరి మీదుగా బద్వేల్ చేరి ,అక్కడి నుంచి ,సిద్ధవటం ,మాధవవరం ,మీదుగా ఒంటిమిట్ట డా. శివ గారింటికి సాయంత్రం 4 కు చేరాం . ఆయన, అర్ధాంగి శ్రీమతి పద్మ(జ)  దంపతులు మాకోసం ఎదురు చూసి ఆహ్వానించారు.కమ్మని  కాఫీ ఇస్తే తాగాం .మగవాళ్ళం పై అంతస్తులో ఉన్నగదిలో’’గాస్   సిలిండర్  ద్వారా గీజర్  ఏర్పాటు ఉన్న వేడి నీటి స్నానాలు చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని ,కిందికి దిగి ఈలోపు పద్మ సిద్ధం చేసిన కమ్మటి బజ్జీలు తిని   రెడీ అయ్యాం  .

   సాయంత్రం 5-30కు శివ మమ్మల్ని అందర్నీ తాళ్ళపాక తీసుకు వెళ్ళారు .దారిలోచేయ్యేరు ప్రాజెక్ట్ దానికి  చేరువలో ఒక శివాలయం ఉందని ఆ శివాలయం లోప్రతికార్తీక మాస మూడవ సోమవారం నాడు శివలింగం లోకి నీరు వస్తుందని  ఈమిస్టరి  ఎవరూ ఇంతవరకు చేధించలేదని చెప్పారు .తాళ్ళపాక లో అన్నమాచార్య జన్మించారు .ఊరి బయట 108అడుగులున్న అన్నమయ్య భారీ విగ్రహం ఉంది. అన్నమాచార్య విద్యాకేంద్రం ఉన్నది .అన్నమయ్య తండ్రి ఇక్కడి సిద్దేశ్వర స్వామి దేవాలయం లో పూజారి .శైవులు .అన్నమయ్య తిరుమల వెళ్లి అక్కడ వైష్ణవం స్వీకరించి అడ్డ బొట్టును నిలువు బొట్టుగా మార్చుకోన్నాడట .ఆయన జన్మించిన ఇల్లు, కూర్చుని రాసుకొన్న చోటు ,ద్యానమందిరం చూశాం .ప్రక్కనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం చూశాం .ఈఆలయం లో శ్రీఏకా తాతయ్య అనే మహాభక్తుడు నిరంతరం తలకాయ నొప్పి తో బాధపడుతూ ఇక్కడిఈ స్వామిని దర్శించి   నొప్పి మాయమవగా ,దేవుని ఎదురుగా స్వయంగా శిలారూపం పొంది ,తనలాగే ఎవరైనా శరీర బాధలు పడేవారు తమ శిరసును తన శిరసుపై మూడు సార్లు ఉంచితే నివారణ ఆయే వరం పొందాడు .అందుకని భక్తులు మూడు సార్లు ఆయన శిరసుకు తమ శిరసుఆనించి మొక్కు కొంటారు అని శివ చెప్పారు .

 తిరిగి వెడుతూ దాములూరు గ్రామం లో శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం చూశాం .ఉగ్ర నారసింహుడు తన ఉగ్రాన్ని తగ్గి౦చు కొని శా౦తమూర్తిగా ఇక్కడ అవతరించి సౌమ్యనాథస్వామిగా మారాడు . భారీ విగ్రహం .స్వామి  వెనుక అంతేఎత్తులో శ్రీ ఆంజనేయస్వామి ఉండటం మరో విశేషం స్వామి తోకకూడా బాగా కనిపిస్తుంది రెండు విగ్రహాలు కలిసిపోయినట్లే ఉండటం మరో వింత  .వివాహాలు కానివారు సంతానం లేనివారు మరేదైనా కోరిక ఉన్నవారు ఆలయం చుట్టూ 8ప్రదక్షిణాలు చేసి కోరిక తెలియబరచాలి .కోరిక తప్పక తీరుతుంది. తీరినతర్వాత 108ప్రదక్షిణాలు చేయాలి .చాలామహిమ గలస్వామి అని శివ చెప్పారు .ఇక్కడి మూడు దేవాలయాలలో అర్చకస్వాఉ లంతా శివ గారికి బాగా పరిచయస్తులు .ఈమూడు గుడులలో పూజారి గార్లచేత నాకు స్వామి పుష్పమాలలను తీసి నా మెడలో వేయించారు .అంతటి పలుకుబడి డా.శివ గారిది .ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఒంటిమిట్ట శివగారింటికి చేరేసరికి రాత్రి 8.అయింది అప్పటికే పద్మగారు వంట చేసి సిద్ధంగా ఉంచి మాకు వడ్డించారు. పప్పు ,కాబేజికూర ,చట్నీ ,సాంబారు ,పెరుగు ,అప్పడం లతో కమకమ్మని వేడి వేడి భోజనం మా ‘’సెవెన్ సీటర్స్ ‘’వడ్డించి కొసరి కొసరి తినిపించారు .అన్నీ మహా రుచికరంగా ఉన్నాయి. ఈ దంపతుల ఆత్మీయత ,ఆదరణ ,అతిధి సేవ అమోఘం అద్భుతం .

   రాత్రి 8-30కు శ్రీ కోదండరామ స్వాములకు ఏకాంత సేవ .అంటే పవళింపు సేవ .దానికోసం మాకు ఏర్పాట్లు చేసి మమ్మల్ని తీసుకు వెళ్ళారు శివ .ఒక అరగంట సేపు జరిగింది చాలా దగ్గరగా చూడగలిగాం శివ గారి వలన .ఇక్కడఒకే రాతిపై శ్రీరామ,సీతా  లక్ష్మణ స్వాముల విగ్రహాలు కొలువై ఉండటం అరుదైన .ప్రపంచం లో ఎక్కడా లేని విశేషం .,నేను కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు లో  సైన్స్మాస్టర్ గా పని చేసినప్పుడు అక్కడి పురాతన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి కోవెలలో ప్రతి శుక్రవారంరాత్రి సుమారు రెండుగంటలు పవళింపు సేవ వృద్ధ పూజారి గారు భార్య భక్తులు అతి శ్రద్ధగా చేయటం పాటలు పడటం భజనలు చేయటం చూశాను.మళ్ళీ ఇన్నేళ్ళకు ఇక్కడ .చూశా .మా ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి ఆలయం లో ఒకసారి అర్చకస్వామి శ్రీవేదాంతం దీక్షితులు ఇలా ఏకాంత సేవ చేయించి పాటలు పాడించి గొప్ప వైభవం కలిగించాడు .కాని ఇక్కడ అంత గొప్పగా జరిగినట్లు నాకు అనిపించలేదు .తంత్రం ఎక్కువ మంత్రం తక్కువ  అన్నట్లు జరిగింది .

ప్రతి శనివారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం లో  ఉదయం  6గంటలకు స్వామి వారలకు అభిషేకం నిర్వహిస్తారు .దీనికి టికెట్ 150రూపాయలు .ఇద్దర్ని అనుమతిస్తారు మూడు టికెట్లు కొనిపించి  ఉదయానికి రిజర్వ్ చేయించారు శివ .ఇక్కడి పూజార్లు ఆయన అంటే మహా గౌరవం. అందరినీ చనువుగా ‘’మామా మామా ‘’అని ఆప్యాయంగా పిలుస్తారు శివ . ఆయనకు ఇక్కడ అడ్డు ఏమీ ఉండదు .డైరెక్ట్ ఎంట్రన్సే .నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆలయం పై ప్రత్యేక దృష్టి పెట్టి సౌకర్యాలు కలిగించి తిరుమల తిరుపతి దేవస్థానానికి దీని నిర్వహణ బాద్య అప్పగించారు .అప్పటి నుంచే ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి .సౌకర్యాలు సేవలూ పెరిగాయి .కళ్యాణమండప నిర్మాణానికి 100 కోట్లు శాంక్షన్ చేశాడు బాబు .ప్రభుత్వం మారటం తో పనులు మందంగా జరుగుతున్నాయి .మా రెండవ రోజు యాత్ర విశేషాలు రేపు తెలియ జేస్తాను .

                        విజ్ఞప్తి

కడప జిల్లాలో అతి ప్రాచీన ప్రసిద్ధ కోదండరామ క్షేత్రం ఒంటిమిట్ట మీదుగాదేశం లో చాలారాస్ట్రాలనుంచి  తిరుపతికి 65 ట్రెయిన్స్ నడుస్తున్నా ,ఇక్కడ రైల్వే స్టాప్ లేదని ,అందువలన యాత్రికులకు చాలా అసౌకర్యంగా ఉందని ,రైల్వే హాల్ట్ ఉంటె సామాన్యుఅకు ఈ రూటు బాగా అందుబాటులో ఉంటుందని ,ఈ విషయం పై ప్రజలు ప్రజా ప్రతినిధులు రైల్వే బోర్డ్ కేంద్ర ప్రభుత్వం చాలా ఉదా సీనంగా ఉన్నాయని ఎంతో బాధతోనాకు  తెలియ జేశారు డా శివ      .ఒకవిజ్ఞప్తి తయారు చేసి రైవే హాల్ట్ ఉండాల్సిన అవసరం తెలియజేస్తూ  వేయిమంది ప్రముఖులతో సంతకాలు పెట్టించి ,స్థానిక ప్రజాప్రతినిధులకు పార్లమెంట్ మెంబర్లకు రాష్ట్ర కేంద్ర మంత్రులకు ,వెంకయ్యనాయుడు గారికి జివిఎల్ నరసింహారావు గారికీ ,రాష్ట్ర పతికి రైల్వే మినిస్టర్ కు ,రైల్వే బోర్డ్ కు పంపి ,వెంబడిస్తే పని జరగచ్చునని చెప్పాను .కనుక ఈ విజ్ఞప్తిని అందరూ ముఖ్యమైనదిగా భావించి ,ఎవరి పరిధిలో వారు ప్రయత్నిస్తే త్వరలో ఫలితం కలిగి ఇక్కడి ప్రజల ,దూర యాత్రీకుల కల నిజమౌతుందని ,ఇక్కడి శ్రీ కోదండ రామ శ్రీ సంజీవరాయ హనుమ ల కృపాకటాక్షం తో  . అతి తత్వరలో  ఒంటిమిట్ట లో ఎక్స్ ప్రెస్ రైళ్ళ రైల్వే హాల్ట్ ఏర్పడుతుందని క్షేత్రం మరింతగా మూడు పూలు ఆరుకాయలుగా విలసిస్తుందని  నమ్ముతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-19ఉయ్యూరు

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మినీ మూడు రోజులయాత్ర

13-12-19 శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరి ఆదివారం రాత్రి 10గంటలకు 61 గంటలకు మినీ మూడు రోజులయాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం లో ఒంటిమిట్ట మృకండమహర్షి తపస్సు చేసిన ఆశ్రమం ,బ్రహ్మగారు సమాధి అయిన కందిమల్లయ్యపల్లి అనే బ్రహ్మంగారి మఠం గ్రామం చూసి ,త్లిసిన వారింట్లో భోజనం చేసి,పోరు మామిలళ్ళ,  ,బేస్తవారి పేట ,,గుంట,మీదుగా త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారిని శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శించి ,వినుకొండ ,నరసరావు పేట ,మీదుగా గుంటూరు చేరి టిఫిన్ చేసి రాత్రి 10తలకు ఉయ్యూరు సుఖంగా చేరాం

 

 

మా వొంటిమిట్ట ట్రిప్ -13-12-19 శుక్రవారం ఉయ్యూరునుంచి కనిగిరిమీదుగా వొంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాయం ,డా.శివ,శ్రీమతి పద్మ దంపతుల ఆతిధ్యం ,తాళ్ళపాక అన్నమాచర్య జన్మస్థలం ,ఆయన తండ్రి శివార్చకుదుగాఉన్న శివాలయం ,లక్ష్మీ చెన్నకేశవ ఆలయం ,108 అడుగుల అన్నమయ్య విగ్రహం ,14వ తేదీ వొంటిమిట్ట ఆలయ శిల్ప సౌందర్యం ,రామ ,లక్ష్మణ తీర్దాలు ,పుష్పగిరి పీఠం,శ్రీ వైద్యనాధ ,కామాక్షీ అమ్మవారు శక్తి పీఠం,,దేవుని గడప లక్ష్మీ వేంకటేశ్వరాలయం ,కడప బ్రౌన్ లైబ్రరి,,శివ దంపతులకు మా చిరు సత్కారం ,,సిద్ధవటం లో పెన్నానది సొయగాలు ,సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ నీరు ,పెన్నవరదలలో జ్యోతిగ్రామంలో 60అడుగుల ఇసుకలో కూరుకు పోయి 15ఏళ్ళ క్రితం బయటపడ్డ 50అడుగులగోపురం ,సిద్దేశ్వర కామాక్షీ దేవాలయాలు , సిద్ధవటం లో సిద్ధవటేశ్వరస్వామి,15వ తేదీ ,వొంటిమిట్ట లో మార్కండేయుల తండ్రి మ్రుకండమహర్షి ఆశ్రమ౦ ,బ్రహ్మంగారి మఠం(కందిమల్లయ్యపల్లి ),ఆయనతవ్విన బావి వగైరా ,శివగారి బంధువులింట్లో ఆతిధ్యం ,త్రిపురాంతక౦ లో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు శక్తిపీఠం,శ్రీ త్రిపురంతకేశ్వర సందర్శన చిత్రమాలిక ,

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

గొల్లపూడి పై వచ్చిన వార్తా పత్రికలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

   ఆస్ట్రేలియన్ సారస్వతం

   ఆస్ట్రేలియన్ సారస్వతం

క్రీ.శ .1788లో ఆంగ్లేయులు వలస వెళ్లి ఆస్ట్రేలియా ఖండం లో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు కనుక అక్కడ వచ్చిన సాహిత్యమంతా ఇంగ్లీష్ లోనే ఉండేది .మొదటి రచనలలో స్థానికచరిత్రకు ప్రాధాన్యం ఇచ్చినా ,వాటికి సాహిత్య గౌరవం రాలేదు.మొదటికవులు బేరయన్ ఫీల్డ్ ,విలియం వెంట్ వర్త్ లలో కూడా ఈ లోపమే ఉండేది .

  చార్లెస్ హార్పర్ (1817-68)కవితలలో ఆస్త్రేలియన్ వాతావరణాన్ని ప్రతిఫలించే ప్రయత్నం చేసి కొంతవరకు నెరవేర్చగాలిగాడు .అదే బాటలో హెన్రి క్లారెంస్ ,కేండాల్ (1841-82)అక్కడి ప్రకృతి దృశ్యాలను మనోహరంగా వర్ణించారు .1833-70 వాడైన ఎ..ఎల్ .గార్డన్ అశ్వధాటి లయతో కొన్ని గేయాలను ఆనాటి ఆశ్వికుల వీరోచిత పోరాటాలపై రాశాడు .అప్పటినుంచి పాడుకోవటానికి అనువైన గీత రచనలు బాగా వచ్చాయి .ఈ గేయకర్తలలలో ఎబి పాటర్సన్ హెన్రి లాసేన్ ,సి.జె.డెవిస్ ముఖ్యులు .

  క్రమంగా కవిత్వం లో ఉద్వేగం తగ్గి ,20వ శతాబ్ది నాటికి కవిత లో కొత్త సొగసులు చేరాయి .’’నవ ప్రజాస్వామ్యకవి ‘’అని పేరు పొందిన జేర్నార్డ్ ఓ డౌడ్ దీర్ఘ కవితల్లో ఆస్ట్రేలియన్ లజీవితాలను ,ప్రణయ విషయాలను రసవత్తరంగా చిత్రించాడు .క్రిస్టఫర్ బ్రెన్నాన్’’ది వా౦డరర్ ‘’కావ్యం లో  తాత్విక చింతన బాగా చేసి మంచి ఆకర్షణ కలిగించాడు .మేరీ గిల్మోర్ ,జూడిత్ రైట్ కవయిత్రులు సుకుమార ప్రణయం పండింఛి జనరంజనం చేశారు .హ్యూమక్ క్రే కవిత్వం లో అక్షర రమ్యత ,సా నెయిల్సన్ కవిత్వం లో మధుర భావనలు పఠితలను.విశేషంగా ఆకట్టుకొన్నాయి .

    తర్వాత కాలపు కవులలో ఆర్.డి ఫిట్జెరాల్డ్ ,,కెన్నెత్ స్లెసర్ బాగా ప్రసిద్ధులు .నవ యువకవులు కొందరు సాంప్రదాయ కవిత్వం రాస్తుంటే, మరి కొందరు  విశ్రు౦ఖల మైన కవిత్వం తో చెలరేగుతున్నారు .కవిత్వం లో ఉపమానాలు ,వస్తువు ఆస్ట్రేలియా కే చెందినవి ఉండాలన్న ఉద్యమంకూడా వచ్చింది .నవలా రచనకు మార్గదర్శి హెన్రి కింగ్స్లీ .తర్వాత మార్కస్ క్లార్క్ ,రాల్ఫ్ బోల్డర్ వుడ్ .అక్కడ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ల జీవితాలను మార్కస్  క్లార్క్ ‘’ఫర్ ది టర్మ్ ఆఫ్ హిజ్ నేచురల్ లైఫ్ ‘’అనే నవలలో,అనేక ఎపిసోడ్ లుగా అత్యంత సహజం గా రాశాడు .ఆ దేశపు సాహసికుల కార్యకలాపాలను రాల్ఫ్ బోల్దర్ వుడ్ నవలలలో కళ్ళకు కట్టించాడు .జోసెఫ్ ఫర్ఫీ రాసిన ‘’సచ్ ఈజ్ లైఫ్ ‘’నవల ఆస్ట్రేలియా దేశీయ వాతావరణాన్ని వాస్తవంగా మహోహరంగా చిత్రించాడు. బ్రేంట్ ఆఫ్ లిన్ బిన్,మైల్స్ ఫ్రాన్క్లిన్ ,యీనియన్ గన్అనే నవలారచయిత్రులు కూడా అదే లక్ష్యంతో రాశారు .

 హెన్రి హామ్డేల్ రిచర్డ్స్ సన్ అనే మారుపేరుతో హెన్రి ఎట్ రిచర్డ్సన్ అనే రచయిత్రి రాసిన ‘మారిస్ గెస్ట్ ‘’’’,డి ఫార్త్యూన్స్ ఆఫ్ రిచర్డ్ మెహోని ‘’నవలలు ఆస్ట్రేలియా సాహిత్యం లో ఉత్తమోత్తమమైనవిగా కీర్తి పొందాయి .ఈమె 1939లో ‘’యంగ్ కోసిమా ‘’నవలకూడా రాసింది వాన్స్ పామర్ నవల ‘’ది స్పెయిన్ ఫామిలి ‘’నగర జీవిత వర్ణనకు పెట్టింది పేరుగా నిలిచింది .అతని మనస్తత్వ చిత్రణ అమోఘం .కైలీ కేన్నెంట్ ‘’లాస్ట్ హావెన్ ‘’నవల గ్రామీణ జీవన చిత్రణ కు పట్టం కడితే ,’’రైడాన్ స్ట్రేంజర్’’నవల లో నాగరక జీవిత చిత్రణ ఉంటుంది .క్వీన్స్ లాండ్ ప్రాంతపు పశువులకాపరుల నిరాడంబర జీవితాలను ఫ్రాంక్ డేవిసన్’’మాన్ –షై’’లో కథా వస్తువుగా తీసుకొన్నాడు .అత్యధిక ప్రజాదరనపొందిన నవలాకారులు –ఎలినార్ డార్క్,కేధరిన్ ప్రిచర్డ్ ,జేవియర్ హెర్బర్ట్ మొదలైనవారు .మానవుడికి ప్రకృతికి మధ్య సంఘర్షణ ను లియనర్డ్ మన్  ’’మౌంటేన్ ప్లాట్ ‘’నవలలో మంచి సమర్ధవంతంగా చిత్రించాడు .

      ఆస్ట్రేలియా పత్రిలు కొన్ని  చిన్నకథలకు ఎక్కువ ప్రోత్సాహమివ్వటం వలన సృజన ,కల్పన మూడు పువ్వులు ఆరుకాయల్లా కథా వాజ్మాయాన్ని సుసంపన్నం చేశారు కవులు నవలాకారులు .వీరిలో హెచ్ లాసన్ ,బార్బారా బెయిన్ టన్ ,స్టీల్ రడ్,డీ.స్టువర్ట్ ,ఏ .మార్షల్ .జి.కేసీ లు ముఖ్యులు .ఆస్ట్రేలియాలో సాహిత్య గౌరవం అందుకొన్న గొప్ప నాటకాల సృష్టికి అనుకూల వాతావరణం లేదు .అక్కడ నాటక  ప్రదర్శనలపై ప్రజలకు అభి రుచి కలిగే లోపే సినిమాలు వచ్చేసి ,రంగస్థలానికి ప్రోత్సాహం లభించలేదు .లూయీ ఎస్సన్ ,డగ్లస్ స్టువర్ట్ ఔత్సాహిక ప్రదర్శనలకోసం కొన్ని ఏకాంకికలు మాత్రం రాశారు .వ్యాసరచన ,సాహిత్య విమర్శకు విశేష గౌరవం ,ఉత్తమ ప్రమాణం తమ రచనలద్వారా కల్పించినవారు వాల్టర్ మర్డక్,నార్మన్ లిండ్సే .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”సామాజిక యోగి శ్రీ జగ్గీ వాసుదేవ్ ”వ్యాసం డిసెంబర్ గురు సాయి స్థాన్ లో

నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”సామాజిక యోగి శ్రీ జగ్గీ  వాసుదేవ్ ”వ్యాసం డిసెంబర్ గురు సాయి స్థాన్  లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు(చివరిభాగం ) 20-రుయి దాస స్వామి

మహా భక్త శిఖామణులు(చివరిభాగం )

20-రుయి దాస స్వామి

రామానంద స్వామి ని సేవించే ఒక యువకుడు కఠిన బ్రహ్మ చర్యం పాటించేవాడు .ఊరిలో బిచ్చమెత్తి వచ్చిన బియ్యం తో అన్నం వండితే ,గురువు ఇస్టదేవతకు నైవేద్యం పెట్టేవాడు .వడ్డీ వ్యాపారం తో ‘’డబ్బు చేసిన ‘’ఒక ధనికుడు ఈ యువకుడికి బిక్షం వెయ్యాలనుకొనగా గురువు అనుమతి లేనిదే స్వీకరించనన్నాడు .ఒక రోజు విపరీతమైన గాలి వాన వచ్చి బయటకు వెళ్ళలేక పోయాడు యువకుడు .ధనికుని ఇంటినుంచి బియ్యం తెప్పించి నైవేద్యానికి అన్నం వండాడు .గురువు మనసు నిశ్చలంగా ఉండలేకపోయి శిష్యుడిని బియ్యంఎక్కడినుంచి తెప్పించావని అడగగా, వడ్డీ వ్యాపారి నుంచి అని చెప్పగా అక్రమ ధనార్జన చేసే అతని నుంచి ఎందుకు తెప్పించావని కేకలేసి తన ఆజ్ఞ ధిక్కరించినందుకు మరుసటి జన్మలో నీచ కులం లో పుడతాడని శపించాడు .

కొద్దికాలానికే  ఆ శిష్యుడు చనిపోయి  మాదిగ కులం లో పుట్టాడు .కాని పూర్వజన్మ జ్ఞానం ఉండేది .హృదయం హరి భక్తితో పొంగిపోయేది .కాని గురునికి దూరమయ్యాననే బాధ ఉండేది.అందువలన తలిదండ్రులు ఎంతలాలన చేసినా ఏడుపు మానే వాడుకాదు.తండ్రి  చేసేదిలేక రామానంద స్వామికి విన్నవించాడు .విషయం గ్రహించిన స్వామి శిష్యుడు తనకు దూరమయ్యాననే బాధతోనే శిశు రూపం లో ఏడుస్తున్నాడని గ్రహింఛి ‘’నన్ను మీ ఇంటికి తీసుకు వెళ్ళండి .అన్నీ చక్కబరుస్తాను’’అనగా ‘’మేము నీచకులం వాళ్ళం .మా ఇంటికి మీరెలా వస్తారు స్వామీ ‘’అన్నారు అమాయకంగా .’’సేవా ధర్మం   లో అంటరానితనం అనేది లేదు  .పరోపకారమే నిజమైన హరి సేవ .నేను నీతో వస్తానుపద  ‘’అన్నాడు

  మాదిగవానితో కలసి రామానందస్వామి వాళ్ళ ఇంటికి వెళ్లగా బిడ్డను చంకలో పెట్టుకొనితల్లి   ఎదురు చూస్తోంది .బాలుడు చాతకపక్షిలాగా గురు చంద్రునికోసం అలమటిస్తున్నాడు .తన దుఖాన్ని కన్నీటి దారలతో చెప్పాడు ఆ పూర్వ శిష్యుడు ,ఇప్పటి మాదిగ శిశువు .ఆచార్యుని  హృదయం కారుణ్య రసమైప్రవహించి శిశువు శిరసు తాకుతూ ‘’బిడ్డా !ఏడవకు .భక్తరక్షకుడుశ్రీరామ చంద్రుడు నిన్ను కాపాడుతాడు .ధన్యుడవు అవుతావు ‘’అని ఆశీర్వ దింఛి చెవిలో రామనామ మంత్రం ఉపదేశించి వెళ్లి పోయాడు .ఈ బాలుడు క్రమగా పెరిగి రుయీ(ఏడుపు ) దాసు అనే పేరు పొంది పెద్దవాడై శ్రీరామ భక్తిలో మునిగిపోయాడు.రామనామ స్మరణ చేస్తూ,కులవృత్తి నిర్వహించేవాడు .రెండు జతల చెప్పులుకుట్టి ఒక జత కనిపించిన రామభక్తుడికిచ్చి రెండవ జత అమ్మి, ఆడబ్బుతో జీవనం సాగించాడు .డబ్బు తీసుకోకుండా హరిభక్తుల జోళ్ళు బాగు చేసేవాడు  .

  బంధు మిత్రులను వదిలి గంగాతీరం లో కుటీరం ఏర్పాటు చేసుకొని ,శ్రీరామ విగ్రహం పెట్టి ,పూజిస్తూ కులవృత్తీ చేస్తూ కాలం గడిపాడు .జోళ్ళు అమ్మలేని రోజు ఉపవాసం ఉండేవాడు .ఆకలి దప్పులు లేకుండా నిత్య హరినామ స్మరణ చేసేవాడు .ఒకరోజు  రాముడేస్వయంగా మారు వేషం లో వచ్చి  ఒకస్పర్శమణి చూపి  దాన్ని తాకిస్తే ఇనుము బంగారం అవుతుందని చెప్పి  ఇవ్వబోతే ‘’స్వామీ !ఎవరు నువ్వు నాపై ఇంతటి కరుణ ఎందుకు  ?’’అని ప్రశ్నించాడు ..’’నీ కస్టాలు పోగొట్టటానికే పరుసవేది ఇస్తున్నా తీసుకో ‘’అనగా రుయీ ‘’నిజంగా నువ్వు నా ఇష్టదైవం శ్రీ రాముడివే ఐతే, నీ నిజ రూప దర్శనభాగ్యం కలిగించు ‘’అన్నాడు .మర్నాడుకూడా వచ్చి  ఆపరుసవేదిని తీసుకోమని చెప్పి మూలనున్న కత్తికి దానిని అ౦ టించగానే అది బంగారుకత్తి గామారింది .దాసు ‘’నువ్వు ఎవరివో గారడీ వాడిలాగా ఉన్నావు బంగారం లాంటి నాకత్తిని నిజంగా బంగారం చేసి నా కడుపుకొట్టావు .నీ రాయీఅక్కర్లేదు నువ్వూ అక్కర్లేదు తీసుకొని పో ‘’అన్నాడు ..’’బంగారు కత్తి వలన బోలెడు డబ్బు వస్తుంది ‘’అని ఆశపెట్టాడు .’’నాకు బంగారం పై మోజులేదు.ధనం  కూడా బెట్టాలన్నతాపత్రయమూ లేదు.నీ రాయి నాకు ముక్తినివ్వదు. కస్టాలు తెస్తుంది .దయతో తీసికెళ్ళు ‘’అన్నాడు .పరుసవేదిని  రుయీ దాసు చేతిలొపెట్టి వెళ్ళాడు లీలామానుష రూపుడు.

  బంగారు కత్తినీ ,తానూ మామూలుగా వాడే కత్తినీ మూలపారేసి ,కొత్తకత్తికొని వృత్తికొనసాగించాడు .ఉపవాసాలు చేస్తూ వృత్తికొనసాగిస్తూ , రామనామ స్మరణ చేస్తూనే ఉన్నాడు .కరుణామయుడు భరించలేక మళ్ళీ వచ్చి పరుస వేది ఏమైంది అని అడిగితె మూల పారేశాను  కావాలంటే ఎవరికైనా ఇచ్చుకో అనగా , పరుసవేది తాను  తీసు కొంటాకాని , నేనిచ్చేది ఏ దైనా కానీ నువ్వు తీసుకోవాలి ,ప్రతిరోజూ నీ దేవుడి పీఠం మీద అయిదు బంగారు నాణాలు ఉంటాయి .అవి తప్పక తీసుకో .ఇప్పుడు చూడు అక్కడ నాణాలు ఉంటాయి అని బలవంత పెట్టగా ‘’అసలు నువ్వెవరవయ్యా స్వామీ . ఈ బలవంతం ఏమిటి ?అనగా ‘’నేను నీవాడిని .నీ భక్తికి మెచ్చి ఈ ఏర్పాటు చేశాను ‘’అన్నాడు .’’నీ కరుణకు ధన్యవాదాలు కానీ నేను తీసుకోలేను .మన్నించు .నీ దర్శనం ఇప్పించు చాలు ‘’అన్నాడు .   వెంటనే  నిజరూప దర్శనం కలిగించి సంతృప్తి పరచి శ్రీరామ చంద్ర మూర్తి అదృశ్యమయ్యాడు ,దాసుమనసులో అద్భుత జ్యోతి ఏర్పడిన భావం కలిగింది .ఏం జరిగిందో అర్ధంకాక ఉన్మాదిలాగా ‘’రామా రామా ‘’అంటూ అటూ ,ఇటూ పరుగులు తీశాడు .తర్వాత రామనామం కలవరిస్తూ మూర్చపోయాడు .తేరుకొని లేచి రాముడు అడిగిన దాన్ని తీర్చటం తన విధి అనుకోని రోజూ వచ్చే నాణాలను రామభక్త పూజకు వినియోగించటానికి నిర్ణయించాడు .

   ఆరోజు నుంచి భక్తుల రాక పెరిగి కుటీరం రామనామం తో ప్రతిధ్వనించింది .దిక్కు లేనివారంతా  రూయీ దాసు దాసులయ్యారు .దాసు పెట్టే భోగాన్నం తీసుకోవటానికి ప్రతిరోజూ రాముడు ఏదో ఒక వేషం లో వచ్చేవాడు .కొంతకాలం తర్వాత ఆశ్రమం భక్తులకు అప్పగించి చిత్రకూటం వెళ్లి  దగ్గరలో ఉన్న గాయత్రి ,పయస్విని మందాకినీ నదులలో  మందాకినీ చెంత ఆశ్రమం నిర్మించుకొని ,రామ భజన స్మరణ చేశాడు .ఈ మూడు నదులు కలిసే చోటు ఒక త్రివేణీ క్షేత్రమైంది .దీనికి దగ్గరలో హనుమాన్ ధారా ,భరత కూపం ,భరద్వాజాశ్రమం ఉన్నాయి .సీతా ఝాలీ అనే రాణి రుయీదాసు శిష్యురాలై మంత్రోపదేశం పొందాలనుకొంటే కొందరు పండితులు క్షత్రియరాణి చండాలుని వద్ద మంత్రోప దేశమా అని ఆక్షేపిస్తే రాణి ‘’అతడు నిస్వార్ధ భక్తుడు .’’అని చెప్పి తారక మంత్రోప దేశం పొంది ,ధ్యాన ,మంత్రజప ,దీనజన పోషణలో జీవితం గడిపి,రామ సాక్షాత్కారం పొందిన ధన్యురాలు .

 ఒక శ్రీరామనవమి నాడు గొప్ప సంతర్పణ చేసింది రాణి .అన్నికులాలవారినీ ఆహ్వానించి ,రుయీ దాస స్వామికి ప్రత్యేక ఆసనం వేసి చేయి పట్టుకొని తీసుకు వచ్చి కూర్చోబెట్టింది .బ్రాహ్మణులకు నచ్చక  ,దూరంగా వెళ్లి కూర్చున్నారు .వడ్డన పూర్తయి నివేదన అయ్యాక ప్రతి బాపడి కుడిపక్కన దాసు కనిపించాడు .కిక్కురుమనకుండా తిన్నారు .భోజనాలతర్వాత దాస స్వామిని బంగారు సింహాసనం పై కూర్చోబెట్టి ,రాణి వి౦జామరతో విసిరింది .బ్రాహ్మలు అతన్ని చూడగా అతనికి బంగారు జందెం ఉన్నట్లు గమనించారు .కాని అహం చావక వెళ్ళిపోయారు .రాణి కొంతకాల౦ తర్వాత దాసు తో  తీర్ధ యాత్రలు చేసి , ఆతడు ముందూ తర్వాత ఆమె  సాయుజ్యం పొందారు

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

మహా భక్త శిఖామణులు ఈ 20వ ఎపిసోడ్ తో ముగిస్తున్నాను

 శ్రీ హనుమద్ వ్రత శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-19-ఉయ్యూరు

జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి… ప్రముఖ నవలా రచయిత, నాటకకర్త. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా సెట్టిపేటలో 1906 సంవత్సరంలో మృత్యుంజయుడు, వేంకమాంబ దంపతులకు జన్మించారు. ఉన్నత విద్యాభాసం చేసి తత్త్వశాస్త్రం, చరిత్రలలో ఎం.ఏ. పట్టా పొందారు. ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శిష్యుడు. ఆయన కొంతకాలం స్వరాజ్య పత్రికలో పనిచేశారు.

1926లో లా పట్టా పొందారు. కొన్నాళ్లు రాజమండ్రి, విశాఖపట్నంలలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఈయన సంస్కృతాంధ్ర భాషలనే కాక, బెంగాలీ, హిందీ, పార్సీ, ఇంగ్లీషు, జర్మన్ మొదలైన నేర్చుకొని ఆయా భాషల సాహిత్యం గురించి పరిచయం చేసుకున్నారు. ముఖ్యంగా బెంగాలీ భాష ప్రభావం ఈయన రచనలపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈయన భార్య శారదాంబ కూడా విదుషీమణి, రచయిత్రి.

ఈయన 1965 డిసెంబర్ 14న పరమపదించారు. చంద్రగుప్త, మేవాడు పతనము వంటి నాటకాలు, శ్యామల (1920), కాలసర్పి (1922), భిన్నహస్తము (1920), నూర్జహాన్ (1925), దుర్గాదాసు, ఆటీన్ మణెలా (1920), ఒథెల్లో (1960), నాలుగు కథలు (1932) పాంచకడీ దేవ్ రాసిన బెంగాలీ కథలకు తెలుగు అనువాదం,  ఆంధ్ర మహా పురుషులు (1936), సాహిత్య తత్త్వ విమర్శనము (1936), విద్యార్థి ప్రకాశిక, ప్రణయ ప్రతిమ (1920) వంటి నవలలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి.

ఈయన 1950ల్లో తాను చేసిన మహారాష్ట్ర యాత్రను ఈ గ్రంథంలో యాత్రా సాహిత్యరూపంలో రచించారు. ఈ యాత్రలో భాగంగా శివాజీ, బాజీరావు వంటి మహావీరులకు సంబంధించిన చారిత్రిక ప్రదేశాలు, కోటలు, మహానగరాలు, వివిధ పుణ్యక్షేత్రాలు వంటివి దర్శించి వాటి గురించి గ్రంథంలో పొందుపరిచారు. కాగా ఈ పుస్తకంలో అత్యంత విలువైన భాగం మాత్రం పీఠికలో ఉన్న యాత్రా సాహిత్య వివరాలు.

క్రీస్తుకు పూర్వమున్న వివిధ నాగరికతల్లో యాత్రా సాహిత్యం నుంచి మొదలుకొని నిన్నమొన్నటి వరకూ యాత్రా సాహిత్యం రచించిన భ్రమణ కాంక్షాపరుల గురించి ఇందులో వివరించారు. ఈ సమాచారం విజ్ఞానసర్వస్వ దృక్కోణంలో యాత్రా సాహిత్యం తరహా వ్యాసాలకు చాలా విలువైనది. దీని రెండవకూర్పును వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారు చెన్నపురిలోని వావిళ్ల ప్రెస్‌లో 1951 సంవత్సరంలో ముద్రించారు. సంపూర్ణ భక్త విజయం గ్రంథాన్ని భక్తుల చరిత్రల విషయంలో విజ్ఞాన సర్వస్వమనే చెప్పాలి.

మద్రాసులో న్యాయవాది సత్యనారాయణమూర్తి ఎన్నో ఏళ్ళపాటు శ్రమకోర్చి ఈ గ్రంథాన్ని రూపొందించారు. భీష్ముడు, ప్రహ్లాదుడు, కుచేలుడు మొదలైన పౌరాణిక యుగపు భక్తుల నుంచి గత శతాబ్దాలకు చెందిన దయానంద సరస్వతి, భక్త రామదాసు వంటి వారి వరకూ వివరాలతో గ్రంథాన్ని తయారుచేశారు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ త్రయోదశి సోమవారం ఉదయం తమలపాకుల పూజ ,పంపాకలశపూజ , శ్రీ హనుమద్ వ్రతం ,13ముడుల తోరపూజ ,ధారణా చిత్ర శోభ


ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ త్రయోదశి సోమవారం ఉదయం తమలపాకుల పూజ ,పంపాకలశపూజ , శ్రీ హనుమద్ వ్రతం ,13ముడుల తోరపూజ ,ధారణా చిత్ర శోభ

https://photos.google.com/share/AF1QipPZ0Q9ghNz9Tk8KnS2Kmwyromd_koykQeHI1ek4rh8beGr9apAZ6hE8JoJoTh3zWA/photo/AF1QipNcwl3W4v5a9sX3SvGpVGK7A28OoSFmRVas-9kk?key=Smx1ZHlhdFNyajNrSnF1SjVPX1dwaW1LX3BXQUZn

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమద్ వ్రత సందర్భంగా రెండవరోజు 8-12-19ఆదివారం ఉదయం 11గెలల అరటిపండ్లతో విశేష అష్టోత్తర సహస్రనామార్చన

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమద్ వ్రత సందర్భంగా రెండవరోజు 8-12-19ఆదివారం ఉదయం 11గెలల అరటిపండ్లతో విశేష అష్టోత్తర సహస్రనామార్చన

https://photos.google.com/share/AF1QipNJaokogHnsHqgaVIlqu0z-FTqoYQ6fWZzW2Itpl4UFPStT5-BpSF-OqFoKseh3iA?key=cDlnVGhDVTNxQTZzUXp3V196RkNVU2JOV3B1eXF3

Posted in దేవాలయం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 17- రవి దాసు

మహా భక్త శిఖామణులు

17- రవి దాసు

చెప్పులుకుట్టే కులం లో ఉత్తర హిబ్డూ దేశం లో 15లేక 16శతాబ్దిలోవారణాసి దగ్గర గోవర్ధనపురం లో  పుట్టిన రవి దాసు ,తల్లి  ఝర్  బినియా తండ్రి రఘురామ్ తన వృత్తి చేస్తున్నా నిరంతర హరినామస్మరణ చేసేవాడు .సంపాదించిన డబ్బుకొంత పేదలకు ఖర్చుపెట్టే వాడు .తోలుతో విగ్రహాలను చేసి పూజించేవాడు కొందరు దీన్ని ఆక్షేపిచేవారు  .అనుకోకుండా కరువు వచ్చింది .తినటానికి కూడు లేకపోయినా కడుపులో కళ్ళు పెట్టుకొని  హరినామజపం చేసేవాడు .గుండెకరిగి శ్రీహరి బైరాగి రూపం లో వచ్చి ,సకలైశ్వర్యాలిచ్చే దివ్య శిల చేతిలోపెట్టాడు .’’నీనామమే దివ్య ధనం.ఇంకా నాకీ ఐశ్వర్యం ఎందుకు ?’’అన్నాడు .ఎంతోబతిమాలినా ససేమిరాఅనగా చివరికి అతి బలవంతం మీద ఇంట్లో ఒక మూల విసిరేసి పొమ్మన్నాడు బైరాగితో .మళ్ళీ ఒక సారి వచ్చి శిలను ఉపయోగించావా లేదా అని అడిగాడు .దాని మొహ౦ కూడా  చూడలేదన్నాడు దాసు  .పరాత్పరుడు సంతోషించి అమూల్య ధనరాసులు ఇవ్వగా వాటినీ తాకనైనా తాకలేదు .ఆశరీరవాణి ఆ  ఆలయ నిర్మాణ  చేయి  చెప్పింది .

    రవిదాసు చక్కని దేవాలయం నిర్మించి ,తానె అర్చకుడై నిత్యపూజాదికాలు  చేశాడు కాని బైరాగి ఇచ్చిన డబ్బు ముట్టుకో లేదు.ఒక రోజు పూజాద్రవ్యాల బుట్టలో మిలమిల లాడుతూ అయిదు బంగారు నాణాలు కనిపించాయి .దేవుడు పరీక్షిస్తున్నాడని బాధపడగా ‘’ఈశ్వరాజ్ఞ పాలించక తప్పదు ‘’అన్నాడు కలలో .ఆ నాణాలతో ఒక విశ్రాంతి భవనం కట్టించాడు .భక్త రవి దాసు పేరు నలువైపులా మారు మ్రోగి ,కొందరికి అసూయ తెప్పించింది .వారు రాజుదగ్గరకు వెళ్లి ‘’ఒక చండాలుడు పూజారియై విష్ణు  ప్రసాదం అందరికీ పెట్టి ,ఆలయాన్ని మైలపరుస్తున్నాడు. వెంటనే ఆలయం నుంచి తరిమి వేయండి ‘’అని కోరారు .రాజు దాసును పిలిపించి విగ్రహాన్ని ఆలయాన్ని బ్రాహ్మణులకు వశం చేయమని ఆజ్ఞాపించగాసరే అన్నాడు  .ఆ రోజు రాత్రి రాజుకు కలలో శ్రీ హరి కనిపించి దాసును తొలగించవద్దని గట్టిగా చెప్పాడు .రవి దాసు భక్తీ, మహత్యం గుర్తించి రాజు అతన్ని ఆలయ సేవలోనే ఉండమని చెప్పి ,అనేక విధాల సన్మానం చేశాడు .

   చిత్తూరు రాణి’’ ఝాలీ ‘’రవి దాసు శిష్యురాలైనది .క్షత్రియ కులం లో పుట్టిన ఆమె చండాలునికి దాసురాలవటం అగ్రకులజులు జీర్ణించుకోలేకపోయి గందరగోళం సృస్టించారు .ఒకరోజు రాణి బ్రాహ్మణుల౦దర్నీ పిలిచి, సంతర్పణ చేసింది .అందరూ వచ్చారు .ఆసనాలపై కూర్చున్నారు .ఇద్దరి బ్రాహ్మణుల మధ్య ఒక హరిదాసుకూర్చున్నట్లు కనిపించి విప్రులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు .కాని ఆప్రాంగణమంతా రవిదాసు తో  నిండిపోవటంతో అమితా శ్చర్య పోయి కిక్కురుమనకుండా కడుపునిండా మెక్కి బొర్రలు తడుముకొన్నారు .రవిదాసు మహత్వం అర్ధమై అందరూ అతనిపాదాలపై పడి క్షమాపణ కోరారు .రవి దాసు తన చర్మం చీల్చి లోపలి యజ్ఞోపవీతం చూపించి పూర్వ జన్మలో తాను బ్రాహ్మణుడను అని చెప్పాడు .

  రవి దాసు మహాజ్ఞాని అని పేరుపొందాడు .అతడు రాసినవి ‘’ఆది గ్రంథం లో చేర్చారు .అవి సర్వ జనామోదం,ఆదరణ పొందాయి .అతడు రాసిన శ్లోకాలు కాశీ లో మహా పండితులుకూడా మహా ఆవేశం తో గానం చేస్తారు .రవిదాసు తనవారికోసం వైష్ణవ మతం లో ఒక శాఖ ఏర్పరిచాడు .అతని మహత్వం తెలిసి అన్ని జాతులవారు ఆరాధించారు .’’.భక్తిమాల ‘’లో రవి దాసుకు మహోన్నత స్థానం ఉన్నది .కుష్టువ్యాధులకు సేవ చేసేవాడు.అగ్రకులస్తులు కూడా దాసును సేవించి వ్యాదులనుండి విముక్తులయ్యేవారు .120ఏళ్ళు జీవించి రవిదాసు పరమపదించి బ్రహ్మపదం చేరాడని అందరి విశ్వాసం .ఆయన స్థాపించిన మతం ఇప్పటికీ సజీవమై అతన్ని నిరంతరం స్మరించేట్లు చేస్తోంది .

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

This gallery contains 19 photos.

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా మొదటి రోజు 7-12-19 శనివారం ఉదయం స్వామివార్లకు అష్టకల స్నపన ,మన్యుసూక్తాభిషేకం ,అనంతరం రెండున్నర గంటలు చామంతిపూలతో నాలుగు సార్లు అష్టోత్తర, సహస్రనామ విశేష అర్చన చిత్రాలు-2 ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా మొదటి రోజు … Continue reading

More Galleries | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు16-నాగ మహాశయుడు -2(చివరిభాగం

amaheరోగులపాలటిదైవం

18 నెలలు మెడికల్ కాలేజీలో చదివి నాగామహాశయుడు,ప్రసిద్ధ హోమియో డాక్టర్ బీహారిలాల్ భాదురి వద్ద  శిక్షణపొంది రోగులను పరీక్షించటం లో నిపుణుడయ్యాడు ,భార్య ప్రసన్నకుమారి పుట్టింట్లోనే ఉండేది .సెలవల్లో ఇంటికి వచ్చినప్పుడు భార్య వచ్చేది.చిన్నారి అయిన ఆమెను చూసి కంపరం వచ్చి  చెట్టెక్కి  కూర్చుని కనుమరుగయ్యాక దిగేవాడు .మేనల్లుడిలో మార్పు వస్తుందని మేనత్త అనుకొన్నా నిరాశే అయింది .ఆయన కలకత్తాలో ఉండగా భార్యకు రక్తగ్రహణి వ్యాదివచ్చి పుట్టింటే మరణించింది .మరో పెళ్లి చేయాలని తండ్రిభావి౦చినా  ,వైద్యం మీదే దృష్టి ఉన్నకోడుక్కి ఇష్టం లేదు .రోగాలను శీఘ్రంగా గుర్తించి ఉచితంగా మందులిచ్చి హస్తవాసి మంచిదని ,వైద్యో నారాయణోహరిః అనిపించుకొన్నాడు .ఇల్లంతా రోగులతో నిండేది .వారి సేవయే పరమధర్మగా భావించాడు .విసుగు విరామం లేనేలేదు .అభాగ్యులను నిరుపేదలకు అతడుప్రత్యక్ష దైవమె .

          సేవా ధర్మ మహాశయుడు

  ప్రేమ చంద్ర మున్షి అనే ధనికుడు కలకత్తాలో హాట్ ఖోలాలో ఉండేవాడు .ఇంటి పనులకు మనిషులను పెట్టక ,ఒక పేద బంధువుతో అన్ని పనులు చేయించుకొనేవాడు .రోజూ గంగాస్నానానికి వెడుతూ నాగమహాశాయుని ఇంటికి వచ్చి హుక్కాపీల్చి వెళ్ళేవాడు .కొంతకాలానికి ఆయనింట్లో పని చేస్తున్నబంధువు చనిపోయాడు .పిసినారి ఐన అతనికి సాటివారెవ్వరూ సాయం చేయటానికి రాలేదు. నాగమహాశయుడు వెళ్లి తాను  శవాన్ని తీసుకు వెడతానానని చెప్పి ,తండ్రికూడా సాయంరాగా స్మశానానికి తీసుకు వెళ్లి దహన సంస్కారాలు చేశాడు .

           శాస్త్ర జిజ్ఞాస ,మళ్ళీ పెళ్లి

  నాగామహాష్యుని స్నేహితుడు సురేశ చంద్ర దత్తు బ్రహ్మ సమాజీకుడు విగ్రహారాధనకు వ్యతిరేకి ఇద్దరూ తరచూ వాదించుకొన్నా స్నేహం బాగా ఉండేది .కేశవ చంద్ర సేన్ స్థాపించిన బ్రహ్మ సమాజమందిరానికి నాగ ను తీసుకు వెళ్ళేవాడు .కేశవ చంద్రుని ఉపన్యాసాలకు ముగ్ధుడయ్యేవాడు .సచ్చరిత్రుడు పవిత్రుడు ఐన నాగమహాశాయుని చూసి చాలామంది తమ అభిప్రాయాలు మార్చుకొని వైదికాచార విధానాలు అవలంబించేవారు .నాస్తికులుఆస్తికులయ్యారు .ఏకాదశీ వ్రతం శ్రద్ధగా చేసేవాడు. గంగాస్నానం తప్పని సరి .సాధకులను సన్యాసులను దర్శించి శాస్త్రాలలో సందేహాలు తీర్చుకోనేవాడు .ఒక వృద్ధ బ్రాహ్మణుడి వలన షట్ చక్ర రహస్యం తెలుసుకొన్నాడు .తండ్రి ఎన్నిసార్లు వివాహప్రసక్తి తెచ్చినా వద్దనే చెప్పేవాడు .ఒకరోజు తండ్రి గదిలో వెక్కి వెక్కి ఏడవటం చూసి కారణం అడిగాడు .ఆయన మాట విని పెళ్లి చేసుకొంటానన్నాడు .తండ్రి వెతికి తగిన అమ్మాయితో పెళ్లి చేశాడు .

         వైద్యో నాగమహాశయో హరిః

  కలకత్తా వెళ్లి వైద్య వృత్తి సాగించాడు .ఎవరినీ ఏదీ అడిగేవాడుకాడు .ఇస్తే పుచ్చుకోవటమే తప్ప అడగటం రాదు .మేనత్తకు జబ్బు చేసిందని తెలిసి స్వగ్రామం వెళ్లి ,ఆమెను రక్షించాలని విశ్వప్రయత్నం చేసి విఫలంకాగా ఆమె ఆశీర్వదిస్తూ దైవ స్మరణతోచనిపోయింది .తీవ్ర దుఖంతో ఏడ్చేశాడు .పిచ్చిపట్టినవాడిలాగా ఉండేవాడు చెల్లెలు శారద వచ్చి సాయం చేసింది ఊరడించినది .కొంతకాలానికి మామూలు అయ్యాడు .మరణం గురించి మళ్ళీ జన్మ గురించి ఆలోచించేవాడు .రోగుల సేవలోనే సమయమంతా గడిపి అంతకు మించి ఆనందం లేదనుకోనేవాడు .ఒకరోజు నిరుపేద కు నాలుగుగంటలు సేవచేసి మందులిచ్చి ,వేసి ,రాత్రి ఎలాఉందో చూడటానికి వెళ్ళాడు. పూరి గుడిసెలో ఒంటిపై వస్త్రం కూడా లేని స్థితి లో చూసి ,తానుకప్పుకొన్న శాలువాకప్పి చలిను౦చి కాపాడాడు .మరోకరోగి నేలపైనే పడుకోవటం చూసి ,ఇంటికెళ్ళి తనమంచం ,దిండు తెచ్చి ,వేసి ,పడుకోబెట్టి సేవ చేశాడు .ఒకకుటుంబంలో పసిపిల్లకు కలరా సోకితే వెంటనే వెళ్లి  అక్కడే ఉండి ,మందులిస్తూ సేవ చేశాడు. కాని బ్రతకలేదు .నాగ చాలాడబ్బు పిండి ఉంటాడని స్నేహితుడు సురేష్ ఊహించాడు .శిశువు చనిపోయిందనే మహాశయుని బాధ చూసి తల్లడిల్లాడు .అన్నం కాని నీళ్ళుకానీ తాగలేదు

  నాగమహాసహాయుడు  వాడే మందులు గొప్ప గుణాన్ని కలిగి ఉండేవని రోగులు నమ్మారు పాల్ సోదరులు ఆయనను తమ ఇంటి డాక్టర్ గా  నియమించుకొన్నారు .పాల్ చుట్టాలవిడకు కలరా సోకితే ఈయనగురువును పిలిపించారుకాని నాగమహాశయుడు చేస్తున్న వైద్యమే సరైనదని గురువు శిష్యుని మెచ్చుకొన్నాడు .ఆమె బ్రతికింది .సంతోషం తో పాల్ బ్రదర్స్ ఒక వెండి పెట్టెనిండా రూపాయలు నింపి ఆయనకివ్వగా, కనీసం ముట్టుకోను కూడా ముట్టుకోలేదు .తండ్రికి తెలిసి బాధపడ్డాడు .ఒకధనికుడు అందగత్తె ఐన వితంతువును చూపించి ఆమె గర్భాన్ని తీసెయ్యాలని కోరి పళ్ళెం నిండా రూపాయలు పెట్టాడు నాగమహాశయుడు ‘’వితంతువుకు కడుపు చేసి ఒకపాపం చేసి ,భ్రూణహత్యకోసం మరో పాపం చేస్తున్నావు ‘’అని చెప్పి మాన్పించటానికి  బ్రహ్మ  సమాజీకుడు,సేవాతత్పరుడు సంస్కారి   శివనాధ శాస్త్రికి చెప్పగా ఇద్దరూ కలిసి వచ్చేసరికి ధనికుడు ఆ విధావరాలితోకాశీకిపారిపోయాడని తెలిసింది .

   శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సన్నిధిలో

  వైద్యం వలన కొన్త  రాబడి కొంత బాగానే ఉన్నా , తండ్రి స్వయంగానే వంట చేసేవాడు చూడలేక బాధపడేవాడు నాగ .జడభరతుడి కథ బాగానచ్చి అలా ప్రవర్తించేవాడు .ఒకసారి గంగ ఒడ్డున పరవశంతో నృత్యం చేస్తూ నదిలోపడిపోతే ,స్నేహితులు కాపాడారు .ఒక బైరాగి గురు కటాక్షం లేనిది ఏదీ సాధించలేవని చెప్పాడు అనుకో కుండా ఒక గురువువచ్చి మంత్రోపదేశం చేశాడు .దీక్షగా జపం చేశాడు .తండ్రి ఆరోగ్యం క్షీణించింది .భార్య అతనికి బగా సహకరించింది .ఒకసారి  సురేష్ తో  కలిసి దక్షిణేశ్వరం వెళ్లి శ్రీ రామకృష్ణ పరమహంసను దర్శింఛి మంచంపై పడుకొన్న ఆయన పదాలను తాకాలని ప్రయత్నిస్తే ,చటుక్కున వెనక్కి లాగుకోగా ,బాధపడుతుంటే పరమహంస ‘’ఒక రకం చేప బురదలో ఉన్నా , దానికి బురద అంటుకోనట్లే, సంసారంలో ఉన్నా నీకు  సంసారం మాలిన్యం అంటుకోదు ‘’అని చెప్పాడు .దగ్గరలోని పంచవటి లో కాసేపు ధ్యానం చేసిరమ్మని పంపాడు .అలాచేసి పరమహంస  ఆశీస్సులు పొంది ఇంటికి చేరాడు పరమానందంగా .మరో సారి వెడితే రామకృష్ణ ‘’ఉన్నతస్థితి పొందావు ‘’అన్నారు .ఇక్కడే వివేకానంద స్వామితో పరిచయభాగ్యం కలిగింది .పరమహంస స్వామితో నాగమహాశయుని చూపిస్తూ ‘’యితడు నిజంగా స్వార్ధ రహితుడు ‘’అనగా స్వామి ‘’అచార్యులన్నమాటకాదనగలవారెవరు?“’అన్నాడు .నాగ క్రమంగా వైద్యం మానేశాడు. తండ్రికి తెలిసి పాల్ బ్రదర్స్ కు చెప్పి సంస్థలో పని కుదిర్చాడు .కాని బలవంతం మీద వెళ్ళేవాడు .తండ్రి చనిపోయాడు. దినవారాలు అప్పు చేసి చేశాడు .

     సంసారంలో సన్యాసి

 కలకత్తాలో ప్లేగు విజ్రుమ్భించింది .మందులిస్తారుకాని రోగులకు సేవ చేయటానికి ఎవరూ ముదుకు రాకపోతే నాగమహాశయుడే దీక్షగా సేవలో పాల్గొన్నాడు . వీలైనప్పుడల్లా పరమహంస దర్శనం చేసి, సద్గొస్టి లో పాల్గొనేవాడు .తనవూరిలో   కుటీరం లో ఉందామనుకొంటే భార్య ఆయనదారికి అడ్డురానని చెప్పగా ఇంట్లోనే ఉన్నాడు .ఒకసారి ఒకభక్తుడు వచ్చి బ్రహ్మ చర్యం బాగానే ఉందికాని సంతానం కోసం ప్రయత్నించమని చెబితే ,ఇటుక రాయితో తలబాదుకొని అలాఅనటం భావ్యం కాదనగా ఆయన తన తప్పు తెలుసుకొని క్షమించమన్నాడు .

పరమదయామయుడు మహాశయుడు

  పాల్ సోదరులకోరికపై భోజేశ్వరానికి పడవపై వెళ్ళాడు .తిరిగివచ్చేటప్పుడు పాల్ బ్రదర్స్ 8రూపాయలు చలికి ఆగే శాలువా ఇచ్చారు .ఓడరేవు ఆరు మైళ్ళ దూరంలో ఉంది .రేవు చేరగా బీదరాలు పసిపిల్లలతో చలికి ఆగలేక దీనంగా కనిపిస్తే డబ్బులు, శాలువా ఇచ్చేసి పడవ ఎక్కి ఇంటికి చేరాడు .పాల్ సోదరుల దుకాణంలో నాగ బదులు రణజిత్ పని చేస్తూ సగం డబ్బు మహాశాయుడికిచ్చేవాడు. అతనికి ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకోనేవాడు .చెరువులలో బియ్యం, పప్పులు  చేపలకుఆహారంగా వేసేవాడు .అన్నిప్రాణులనూ సమాదరించే గొప్ప లక్షణం ఆయనది .హింసకు వ్యతిరేకి .ఎప్పుడూ చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లే కనిపించేవాడు .ఎవరికి నమస్కారం అంటే ‘’జగదీశ్వరునికి’’ అనేవాడు .నాగమహశయుని దర్శన౦ తోనే దీర్ఘ  వ్యాధులు  కూడా నయమయ్యేవని విశ్వాసం .

 ఇంటి ముందు ఉప్పొంగిన గంగ

  యాభై ఎల్లఏళ్ళకు ఒక సారి వచ్చే ‘’అర్ధోదయం ‘’గంగాతీరంలో గొప్పగా జరుగుతుంది .మూడు రోజులముందే మహాశయుడు కలకత్తా వదిలి స్వగ్రామం వచ్చాడు .గంగ ఉన్న  చోటు వదిలి ఇంటికొచ్చావేమితని తండ్రి అడిగాడు .నమ్మకమైన భక్తిఉంటె పావనగంగ తనంతట తానే ఇక్కడికి రాదా ?’’అన్నాడు .సరిగ్గా అర్ధోదయం రోజు శుభుహూర్తం లోఆయన పూజామందిరంలో పూజ చేసుకొంటూ ఉండగా , మహాశయునిఇంటికి ఈశాన్యభాగం లో భూమి నుంచి జలధార తటాలున పైకి ఉబికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరచింది .’’అమ్మా పతితపావని పావన గంగా ‘’ అంటూ బయటికి  వచ్చి ఆ గంగకు నమస్కరించి ,పవిత్ర గంగాజలం తీర్ధంగా తీసుకొని అక్కడే తను , తండ్రీ భార్య అందరూ అర్ధోదయ పవిత్రస్నానాలు చేశారు .భక్తిపారవశ్యంతో ‘’జయజయగంగే ‘’అంటూ నాట్యం చేశాడు మహాశయుడు .ఈఅద్భుత ఘట్టం తెలిసిన వివేకానదస్వామి ‘నాగమహాశాయుని వంటి మహాత్మునకు అసాధ్యమైనదేదీలేదు .ఆయన ఇచ్చాశక్తి  అమోఘం .ఆశక్తివలన ముక్తిపొండటం అతి తేలిక ‘’అన్నాడు .ఈ అద్భుతాన్ని గొప్పగా మహాశయుడు ఎన్నడూ ఎవరితోనూ ప్రస్తావించలేదు .

    గురుభక్తి ,శిష్యవాత్సల్యం

  నాగ మహాష్యుడిని చూడటానికి శిశ్యుడొకడుఒకసారి ఢాకా ను౦చి బయల్దేరి దారిలో విపరీతైన వర్షం గాలి కారు చీకటిలో ఎలాగగో  ఇంటికి వచ్చి గడ్డకట్టుకు పొతే భార్యాభర్త సపర్యలు చేసి స్వాస్త్యం కలిగించి ఎందుకు ఇంతసాహసం చేశావని అడిగితె ‘’ఈ మహాత్ముని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేక పోయాను ‘’అన్నాడు ఆనంద బాష్పలతో .అతిధికి వండిపెతట్ట టా నికి ఇంట్లో కట్టెలు లేవు .ఇంటివాసాలు పీకి వాటితో వంట చేయి౦చి భోజనం పెట్టాడు . కలకత్తా విద్యాసాగర కాలేజీలో చిదివే యువకుడొకడు నాగమహాశయుని చూడాలనే కోరిక తీవ్రంగా కలిగి భావోద్రేకం తో ఉండి,సాధ్యంకాక ఆత్మహత్యకు హాస్టలు పై అంతస్తు నుంచి దూకి సిద్ధమవగా ఎవరో వెనకనుంచి ‘’దూకడద్దు  నాగమహాశయుని దర్శనం రేపు పోద్దునకలుగుతుంది ‘’అని వినిపించి ఆగిపోగా మర్నాడు ఉదయం మహాశయుడు అతని తలుపుతట్టి లోపలి రాగా పాదాలపై వాలిపోగా ఆప్యాయంగా కౌగిలించి పైకి లేపి ధైర్యం కలిగించి ఆత్మహత్య పాపం నేరం అని చెప్పి బేలూరు తీసుకు వెళ్లి ఆశ్రమ యోగులకు అప్పగించాడు  నాటవర ముఖోపాధ్యాయ అనే కుర్రాడు శీలరహితుడై పోగా ,మహాశయుడు అతన్ని మంచిమార్గం లోకి మళ్ళించాడు .’’నాగ మహాశయుని సమక్షం లో అయిదు నిమిషాలు ఉంటె చాలు అత్యద్భుత ఆధ్యాత్మిక పరిణతి లభిస్తుంది అన్నారు హరకామి,నీ కైలాస చంద్ర దంపతులు .  స్వామి వివేకానంద కూడా ఇలాగే అన్నాడు ‘.

             మహా నిర్యాణం

 వంగశకం 1306లో దుర్గా ఉత్సవాలకోసం కలకత్తా వెళ్లి సంబారాలకోసం జ్వరం తో  కలకత్తా వెళ్ళలేకపోతే భార్య చక్రవర్తి అనే శిష్యుడికి టెలిగ్రాం ఇస్తే ,అతడు మఠం లో వేదమతం గురించి ఉపన్యాసం ఇవ్వాల్సి వస్తే , ఎటూ పాలుపోక అద్భుతానందస్వామి గ్రహించి  ఉపన్యాస౦ ఎప్పుడైనా ఇవ్వచ్చు . ముందు నాగమహశయుని చూసిరామ్మని చెప్పగా, కాళీఘాట్ నుంచి వెంటనే బయల్దేరి మర్నాడు ఉదయం రాగా ఇంటివసారాలో మంచం పై పడుకొని ఉన్న గురువుగారిని చూసి గగ్గోలు పెట్టి గురుపత్నిని అడిగితతే వ్యాధి పెరగ్గానే  ఆయనే అక్కడికి వెళ్లి పడుకొన్నారు తానేమీ చేయ లేకపోయాను అని వలవలా ఏడ్చింది. మహాశయుడు శూలవ్యాది గ్రహణి లతో బాధపడుతున్నాడు .పగలు నాలుగుమెతుకులే తిండి .తనబాద ఎవరికీ చెప్పనేలేదు .సుశ్రూషకు అనుమతి అడిగితె చక్రవర్తి ,గురువు అంగీకరించకపోతే ,మంచం దగ్గరే కూర్చుని డుర్గాస్తవం భాగవతం భగవద్గీత ఉపనిషత్తులు చదివి వినిపించి గురువు ముఖంలో ఆనందం చూసి సంతృప్తి పొందాడు .మహాశయుడు గంటలకొద్దీ సమాధిలో ఉండేవాడు .సమాధి నుంచి బయటికి వచ్చి ‘’అమ్మా అమ్మా, అని సచ్చిదానంద్ ,అఖండ చైతన్య ‘’అని  పలవరించేవాడు  .

 ఈయనమంచంలో ఉన్నా ఇంటికి అతిధి అభ్యాగతుల రాక మామూలే .వారికి కావలసినవన్నీ చేకూర్చమని భార్యకు చెప్పేవాడు .తనకై దుఃఖించే వారితో ‘’ఈతుచ్చశరీరం పై మక్కువ ఎందుకు? .ఇది ఎంతోకాలం ఉండదు.ఈశ్వరుడు కారుణ్య నిధి ఆయన ప్రేమ అనంతం  ‘’అనేవాడు  .కళ్ళనుండి నీరు కారేది. ప్రక్కలకు ఒత్తిగిలటమూ చాలాకష్టంగా ఉండేది .దుర్గామాత దుర్గామాత అనే మాటలే తప్ప వేరొక మాట వచ్చేదికాదు .’’మాకుదిక్కెవ్వరు ?’’అని అక్కడివారు అడిగితె ‘’పరమహంస పదద్వయమే దిక్కు. రామకృష్ణుడే అందరికీ దిక్కు ‘’అనేవాడు .

ఢాకాలో ఉండే శారదానందస్వామి మఠం బాధ్యతలు చూసేవాడు .అప్పుడప్పుడు  వచ్చి నాగమహాశయుని సేవ చేసి వెళ్ళేవాడు.ఆయనద్వారా మందులు తీసుకోమని భర్తకు చెప్పించినా ‘’పరమహంస ,జగన్మాతల నామాలే నాకు మందులు ‘’అన్నాడు .తండ్రి దినవారాలకు చేసిన అప్పు తీర్చలేకపోయానని బాధపడేవాడు .అప్పు ఇచ్చినాయన  ఒక రోజు చూడటానికి రాగా ‘’నాయనా !అప్పు తీర్చజాలని అపరాధిని నేను .నేను చనిపోయాక నా ఇల్లు తీసేసుకుని నన్ను రుణ విముక్తుడిని చేయండి .నాభార్య పుట్టింట్లో ఉంటుంది ‘’అన్నాడు .అతడు ఏడుస్తూ ‘’డబ్బుకోసం రాలేదు మహాత్మా మీ దర్శనం కోసమే వచ్చాను ‘’అని కాళ్ళమీద పడి బావురుమన్నాడు .చలించిన మహాశయుడు ‘’ఈశ్వర కటాక్షం .మీ హృదయం మహోన్నతం .జగదీశుని కటాక్షం వలన మీకు సర్వ సుఖాలు కలుగుతాయి ‘’అన్నాడు .మధ్యాహ్నం 3గంటలైంది వ్యాధి తీవ్రమైనది .సంధి లక్షణాలు వచ్చి తాపం భరించలేక ,అకస్మాత్తుగా లేచికూర్చుని విసనకర్రతో విసిర్తే కొంచెం ఉపశమనం కలిగి ,చక్రవర్తితో ‘’పంచాంగం చూసి ప్రయాణానికి ముహూర్తం పెట్టు ‘’అన్నాడు .అంతరార్ధం గ్రహించి అతడు ‘’పుష్య శుద్ధ త్రయోదశి పగలు పది గంటలకు దివ్యమైన ముహూర్తం ‘’అన్నాడు .’’నువ్వు అనుమతిస్తే ఆముహూర్తానికే తిరిగిరానిలోకాలకు బయల్దేరుతాను ‘’అన్నాడు .భార్యతో సహా అంతా  గొల్లుమన్నారు .

   రెండు రోజులకు ప్రాణం విడుస్తాడు అనగా మంచం చుట్టూ చేరిన భక్తులందరూ వింటూ ఉండగా చక్రవర్తితో ‘’గురు దేవులు వచ్చారు నాకు అన్ని తీర్దాలు చూపిస్తారు .నువ్వు ఒక్కోదాని పేరు చెప్పు ‘’అన్నాడు .హరిద్వారం అనగానే త్రివేణీ సంగమం చూసి ఉప్పొంగిపోయినట్లు స్నానిన్చినట్లు తన్మయం లో అన్నాడు సమాదినుంచి లేచాక చూస్తే ‘’సురదుని’’లోస్నానం చేసినవాడుగా కనిపించాడు  .తెల్లవారు జామున నాలుగు గంటలకు కొద్దిగా నిద్రపట్టి ఉదయం ఆలస్యంగా లేచాడు .తెల్లారి పుష్య శుద్ధ త్రయోదశిఉదయం 8గంటలకు అకస్మాత్తుగా లేవగా ఆయాసం ఎక్కువకాగా చక్రవర్తి మహాశయుని చెవులలో ‘’శ్రీ రామకృష్ణ శ్రీ రామ కృష్ణ ‘’అని ఉచ్చరించాడు .పరమహంస ఫోటో ఒకటి దగ్గర ఉంచి ‘’ఏనామం స్మరించటానికి సర్వం త్యజించారో  ఆయన స్వరూపం చూడండి ‘’అన్నాడు .కళ్ళు తెరచి ‘’కృపానిదీ జోహార్ జోహార్ ‘’అని చివరిపలుకులు పలికాడు నాగమహాశయుడు .9గంటలకు ఆయాసం బాగా ఎక్కువై ,అరగంట తర్వాత దృష్టి నాసాగ్రం పై ఉన్నట్లు కన్పించింది .శరీరరోమాలు నిక్క బొడుచుకున్నాయి .పులకి౦త కనుదోయినుంచి ప్రేమధార కురిసింది .ప్రాణవాయువు మూలాధారం నుంచి క్రమ౦గా పైకి వెడుతోంది .నాభికి చేరగానే గుండె వేగంగా కొట్టుకొన్నది .పావు గంటకు మహాసమాదిలోకి వెళ్ళాడు .భార్య ‘’వారు గృహస్తాశ్రమంలోనే ఉన్నారుకనుక ఆప్రకారమే కార్యక్రమాలు జరగాలి ‘’అని చెప్పింది .ఆయనను జాగ్రత్తగా పట్టుకొని ఒకబల్లపై మెత్తని శయ్య ఏర్పాటు చేసి పడుకోబెట్టారు .అయిదారు నిమిషాలతర్వాత ప్రాణవాయువు ఆగిపోయింది .వదనం జ్యోతిర్మయంగా కనిపించి కళ్ళనుండి ప్రేమామృతం వర్షిస్తున్నట్లుగా ఉంది .భార్య భర్తమరణానికి తీవ్రంగా రోదించింది .

  గ్రామ పెద్దలు వచ్చి శవాన్ని పరీక్షించగా శరీరం వేడిగానే ఉండటం వలన మరో 12గంటలు అలానే ఉంచి తర్వాత అగ్ని సంస్కారం చేయాలని నిర్ణయించారు .రాత్రిపదిగంటలకు చందన కర్రల పేర్పుతో ,శిష్యులే పుత్రులై దహన సంస్కారం శాస్త్రోక్తంగా చేశారు .నాగమహాశయుడు 53ఏళ్ళ 4నెలల 7రోజులు మాత్రమె జీవింఛి పుట్టిన చోటనే మట్టిలో కలిసిపోయిన పుణ్యాత్ముడు. ఆయన జన్మించిన దేవభోగాగ్రమం ,ఆయనవలన పవిత్ర క్షేత్రం అయింది .జ్ఞాన,భక్తి యోగి గా నాగమహాశయుడు చరిత్ర ప్రసిద్ధి పొందాడు .

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

 

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత  కార్యక్రమం 

 ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో 9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్వృతం త్రయాహ్నికంగా  7వతేదీనుండి నిర్వహింపబడును .భక్తులు విశేషంగా స్వామివార్ల పూజాకార్యక్రమం లో పాల్గొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించి  స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము . 

     కార్యక్రమ వివరాలు
7-12-19 శనివారం  ఉదయం 5గం .లకు సుప్రభాతం అనంతరం  అష్ట కలశ స్నపన ,మ న్యుసూక్తముతో స్వామి వార్లకు అభిషేకం  ,నూతనవస్త్ర ధారణ
    ఉదయం 8 గం  లకు -గంధ సిందూరం ,చేమంతి పూలు ,వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర సహస్రనామ పూజ ,అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
8-12-19 ఆదివారం -ఉదయం 9 గం  లకు అరటిపండ్లు వివిధ ,ఫలాలతో విశేష అర్చన  అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి  -శ్రీ హనుమద్వ్రతం
  ఉదయం 9 గం కు పంపా కలశ పూజ,13ముడుల తోర పూజ  ,మంత్రం తో తోర ధారణ, తమలపాకులతో అష్టోత్తర సహస్రనామ పూజ
  అనంతరం శ్రీ హనుమద్వ్రత0 ,అయిదు కథల వివరణ – అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
                గబ్బిట  దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మకర్త -30-11-19
                                   మరియు భక్త బృందం

Posted in దేవాలయం | Tagged | Leave a comment

శ్రీ రమణీయ రామాయణం

శ్రీ రమణీయ రామాయణం

బాపు రమణ లో రమణగారి అర్ధాంగి శ్రీమతి శ్రీదేవి గారు ‘’రమణీయ శ్రీ రామాయణం ‘’రాసి ,ఆత్మీయంగా తనసంతకం చేయగా , వియ్యంకుడు ,బాపుగారితమ్ముడు ,పెన్సిల్ ఆర్ట్ నిపుణులు ,మద్రాస్ రెడియోకేంద్ర మాజీ డైరెక్టర్ ,సరసభారతి ఆత్మీయులు శ్రీ శంకరనారాయణ (శ్రీ సత్తిరాజు శంకరనారాయణ )గారు ,ఆపుస్తకాన్ని తన చేతి వ్రాత ఉత్తరంతో సహా నాకు నవంబర్ 27పంపగా,మర్నాడే అంది,అందిందని ఫోన్ లో ధన్యవాదాలు తెలిపాను .శంకర్ గారి ఉత్తరం లోశ్రీ మైనేని  గోపాలకృష్ణగారికి కూడా పుస్తకం పంపినట్లు తెలిపి నన్ను పుస్తకం చదివి అభిప్రాయం తప్పకుండా రాయమని కోరటం వారి సౌజన్యమే .వీరు ఈ నెల 15న బాపు గారి జన్మ దినోత్సవంనాడు ‘’బాపు గారి పురస్కారం ‘’అందుకో కోబోతున్నందుకు హృదయపూర్వక అభినందనలు .నూటికి వెయ్యి శాతం వారు అర్హులు .రమణీయ రామాయణాన్ని మా శ్రీమతి పుస్తకం వచ్చిన దగ్గర్నుంచి ,విడువకుండా పట్టుదలగా ప్రత్యక్షరం చదివి ,మధ్యమధ్యలో’’ ఎంతబాగా రాశారండీ ఆవిడ !’’అంటూ పులకించి నిన్నటితో పూర్తి చేసింది .ఇవాళ  మూడుగంటలలో నేనూ  ఏకబిగిన చదివాను .స్పందన రాయటానికి ఆశక్తుడనేమో అని సందేహించి ,అయినా శ్రీరామ సంకల్పం గా భావించి మొదలు పెడుతున్నాను .

  త్రేతాయుగం లో వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని సంస్కృతంలో బహుజన రంజకంగా ,మనోల్లాసంగా ,ఉపమాలంకార సుశోభిత౦గా రచించి తాను  ఆదికవి అయి ,కావ్యం ఆదికావ్యం అనే ఘనత సాధించాడు .కాలక్రమంలో ఎన్నో రామాయణాలు వెలువడినా వాల్మీకం కు సాటి లేదని బహుజనాభిప్రాయం .తెలుగులో అనువాద రామాయణాలు చాలావచ్చినా ,విశ్వనాథ వారి కల్ప వృక్ష రామాయణానికి సరి సాటి లేదన్నదీ యదార్ధమే . శ్రీనివాస శిరోమణి గారి వచన రామాయణం బహుజనాభిమానం పొందింది .ప్రవచన రామాయణంగా ఉషశ్రీ రేడియో రామాయణం ‘’నభూతో’’గా సాగింది .విశ్వనాథకు వచ్చినట్లే శ్రీదేవిగారికీ ‘’మరలనిదేమి రామాయణం ‘’అనే వికిత్సకలిగినా ,ఆయనలాగే సమాధానపడి నట్లు ఈమె ‘’పలికెడిది రామకథ,పలికి౦చెడి  వాడు రామభద్రు౦డట’’అని తనూ భక్తపోతనగారిలా నమ్మి, రమణీయ రామాయణ రచనకు’’కవి ‘’అనే వాల్మీకి నీ  ,శిరోమణి గారిని స్మరించి, నమస్కరించి ఉపక్రమించారు .నాకు యేమని పించిందంటే ‘’వాల్మీకి మహర్షి శ్రీదేవి గారి అవతారం దాల్చి,ఆధునికకాలం లో ఉన్న ఆంధ్రులకు ,తానే తెలుగువారికోస౦ అచ్ఛ స్వచ్చమైన తెలుగులో, తెలుగు ఇంతమధురంగా ,జు౦టితేనె ,పనసతొనల రుచితో ఉంటుందా అని ఇతరులు అసూయ పడేంత  మనోహరం గా భక్తి విశ్వాస బంధురంగా  రాశాడేమో?’’అనిపించింది .అంతే కాక,రచయిత్రి  రమణీయ శ్రీ రామాయణం ‘’అనటంలో కూడా రమణీయ అంటే ముళ్ళపూడి వెంకటరమణగారినీ,శ్రీ అన్నా  శ్రీదేవి అన్నాఒకరే కనుక తనపేరుకూడా కలిసి వచ్చినట్లు పెట్టారేమో అనికూడా అనిపించింది .రచనకు మూలకారణం రమణ గారే అని ఆమె అన్నారు .బాపురమణల  సీతాకల్యాణం ,సంపూర్ణ రామాయణ చలన చిత్రాలలో మాట రమణ గారిది, చేత బాపుగారిదీ  .ఈ రెండు చేతులూ కలిసి అద్భుత భక్తి రసాన్ని ప్రవహింపజేసి ,రసికజన మనసులను రసప్లావితం చేశారు .బాపు ‘’బామ్మ శ్రీ ‘’మాత్రమే కాదు ‘’శ్రీరమణ అన్నట్లు ‘’బొమ్మర్షి ‘’కూడా .రమణగారు యవ్వనదశనుంచీ రామాయణ పరిమళాన్ని అంటించుకొన్న ధన్యులు .ఆయన రచనలో వాల్మీకి శైలి ప్రవహిస్తు౦దనటం యదార్ధం .భర్త రాత కోతల్లో శ్రే దేవిగారికీ మొదటినుంచీ ప్రమేయం ఉండటంతో, ఆసౌరభం ఆమె  హృదయాంత రాళాల లో జీర్ణించుకు పోయింది  .ఇంతకంటే రామాయణం రాయటానికి ఇంకే అర్హత కావాలి ?శ్రీరమణ అన్నట్లు యిది ‘’రామ చక్కని కలనేత ‘’.

  శ్రీదేవిగారు ప్రతికాండ ను ‘’శుద్ధ బ్రహ్మ పరాత్పరరామ –కాలాత్మక పరమేశ్వరామ ‘’’’సీతా ముఖా౦భోరుహ చంచరీకః ‘’,’’దండకవన జనపావన రామ –శూర్పణఖార్తివిధాయకరామ –ఖర దూషణ ముఖ సూదక రామ ‘’,’’విరచిత నిజపితృకర్మకరామ –భరతార్చిత నిజపాదుకరామ ‘’,’’హనుమత్సేవితనిజపద రామ –నత సుగ్రీవా భీస్టద రామ ‘’,’’భీత భాను తనూ భవార్తి నివారణ జాతి విశారద౦ ‘’,సుందరే సుందరో రామః –సుందరం కిం న సుందరం “,’’ఉల్లంఘ్య సింధోస్సలిలం స లీలం –యశ్శోక వహ్నిం జనకాత్మజాయా – ఆదాయ తే నైవ దదాహ లంకాం –నమామి త౦ ప్రాంజలి రా౦జ నేయం ‘’,  ‘’అన్జనానందనం వీరం-జానకీ శోక నాశనం –కపీశ మక్ష హ౦తా రం –వందే లంకా భయంకరం ‘’‘,’’ఆమిషీకృత మార్తాండం –గోష్పదీ కృత సాగరం -తృణీకృత’ దశగ్రీవం –ఆంజనేయం నమామ్యహం ‘’,శ్రీరామరామ రణ కర్కశ రామ రామ –శ్రీరామ రామ శరణం భవ రామ ‘’శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ‘’మొదలైన జనం నాలుకలపై నర్తించిన పదాలు, శ్లోకాలు ,వీలైన చోట్ల అధ్యాయాలలో కూడా చేర్చి రావణ సంహారం ముందు ఆదిత్య హృదయ స్తోత్రశ్లోకాలు ఉటంకించి ,అందులో జరిగే కథలను చెప్పీ చెప్పకుండా చెప్పటం ప్రత్యేకత .వీటికి మించి వాల్మీకి మహర్షి ప్రయోగించిన ఆమ్రేడిత ఉపమాల౦కారాల  సౌందర్యాన్ని తెలుగులోకి కమ్మగా అనువాదం చేసి వాటిని’’ బోల్డ్ లెటర్స్ ‘’లో ముద్రించటం మరో ప్రత్యేకత.ఇలాంటి రచనతో ‘’గంగానది ఒక చోట అతివేగంగా ,ఒక చోట నెమ్మదిగా ,ఒక చోట తిన్నగా ,ఒకచోట వంకరలు తిరిగినట్లు ,ఒక చోట కిందికి దూకుతూ ,అతి దర్శనీయంగా ‘’ఉన్నట్లు శైలికూడా అలానే ఉండటం ఇంకో ప్రత్యేకత .అందుకే పుస్తకం చేతిలో పట్టుకొంటే ఆ రచనా ప్రవాహం లో కొట్టుకు పోవటమే తప్ప, ఇహ లోక ధ్యానం ఉండదు .అదృష్టవంతురాలు శ్రీదేవిగారు .వారితోపాటు మనమూ .

   కొన్ని ఉపమాలంకార ఉదాహరణలు .శిశువు రాముడి అరచేతిలో వజ్రరేఖ ఉండి,వజ్రపాణి ని కన్న అదితిలాగా కౌసల్య ఉన్నది .రాముడికి  సీతాదేవిపై అనురాగానికి కారణం ,ఆమె సౌజన్య ,సౌందర్య ,సౌశీల్య సద్గుణాల తో తనను సంతోష పెట్టటం వల్లనేకాదు ,తనతండ్రి దశరధ మహారాజు  చూసి ,ఆలోచించి ,సమ్మతించి చేసిన భార్య యిందువల్ల కూడా అన్న వాక్యాలు పవిత్రాలు .అరేంజ్డ్ మారేజేస్ లో ఉన్న గొప్పతనానికి నిదర్శనం .రాముడికి సీతమీద కన్నా, సీతకు రాముడి మీద అనురాగం ఎక్కువ అనటమూ వాల్మీకమే .మారీచునితో రాయుడు యుద్ధం చేసేటప్పుడు ‘’మదపు టేనుగులా ,ఉన్నాడు .పరిశుద్ధ వంశంలో జన్మించటమే ఆఏనుగు తొండం .మహాబాహువులు పొడుగాటి దంతాలు .ప్రతాపమే మదజలం .అ రాముడు నృసింహ స్వరూపుడు ,కొపొద్రేకాలతో చెలరేగే సింహం వాడి బాణాలు గోళ్ళుఖడ్గాదులు కోరలు .సింహం మృగాలను చంపినట్లు రాక్షసులని చంపాడు .వర్షాకాల నల్లటి మేఘాలు తెల్లటి వానధారలు హోరు గాలి పోసుకొన్న గుహ లతో పర్వతాలు కృష్ణాజినం కప్పుకొని ,తెల్లటి జంధ్యాలు ధరించి వేదాధ్యయనం చేస్తున్న బ్రహ్మ చారుల్లా ఉన్నాయి .శరత్కాలం లో  ‘’చేపలనే ఒడ్డాణాలు పెట్టుకొని ,నదులనే స్త్రీలు రాత్రంతా రతికేళి లో ఓలలాడి ,ప్రాతఃకాలం లో మందమందంగా తమ ఇళ్ళకు నడిచిపోయేట్లు మెల్లమెల్లగా పారుతున్నాయి .లంకాపట్టణం ‘’ప్రాకారానికి అండగా ఉన్న ఇసుక తిన్నెలు జఘనాలవలె ,అగడ్తలలో శుద్దోదకాలు కట్టుకొన్న చీరల్లాగా ,శతఘ్నులు ,శూలాలు తల వెంట్రుకలతో పెట్టుకొన్న కొప్పు లాగా ,కోటబురుజులు కర్ణాభరణాలలాగా సుందరా౦గనలాగా  కనిపిస్తోంది హనుమకు .సీతా దేవికి హనుమ విశ్వ రూపం చూపించినపుడు ‘’వందే వానర నారసింహ ఖగారాట్ క్రోడాశ్వ వక్త్రా౦ చితం ‘’శ్లోకం ఉదాహరించటం  ఎంతో సముచితంగా ఉంది .సీతాదేవి లంకలో ఎలాబ్రదికింది అంటే ‘’  నీళ్లున్నపొలం లో తేమవల్ల ,నీళ్ళు లేని ప్రక్కపొలం లో పైరు బ్రతికి ఉన్నట్లు ‘’.

  మొదటి రోజు అలసిపోయి ,రాముడు విశ్రాంతి తీసుకొని రమ్మని పంపిస్తే రెండవ రోజు రాముడితో యుద్ధానికి వచ్చిన రావణుడు ఒకసారి గతంలో జరిగినవన్నీ చక్రాల్లా కనిపించాయి .అరణ్యుడు అనే ఇక్ష్వాకు రాజును యుద్ధంలో ఓడించి చిత్రవధ చేసి చంపగా ,అతడు చనిపోతూ తనవంశం లో ఒక పుణ్యపురుషుడు జన్మించి ,రావణుని బంధుమిత్ర సపరివారంగా సంహరిస్తాడని శపించాడు .ఆపుణ్య పురుషుడు రాముడే అని రూఢిగా ఇప్పుడు నమ్మాడు .నందిశాపం ,మానవుని వల్ల చావు గురించి బ్రహ్మను అడగకపోవటం ,వేదవతి శాపం గుర్తుకొచ్చాయి .తపస్సు ద్వారా సాధించిన పుణ్యఫలం క్షయమై ,శాపబలం అనుభవం లోకి వచ్చిందని గ్రహించాడు .లక్ష్మణ ,ఇంద్ర జిత్తులు మహా యుద్ధం చేసి ‘’దేహాలనిండా గాయాలతో ఆకులన్నీ  రాలిపోయి పూలు మాత్రమే మిగిలిన బూరుగ, మోదుగ చెట్ల లాగా ఉన్నారు ‘’.తనను దెప్పిన ఇంద్రజిత్ తో పినతండ్రి విభీషణుడు ‘’ధర్మాన్ని వదలి పాపం చేయాలనుకొన్నవాడిని ,చేతికి చుట్టుకున్న పాములాగా వదిలించుకోవాలి .పరద్రవ్యం ,పరకాంత లను అపహరణ చేసినవాడిని తగలబదడిపోయే ఇంటిని వదిలేసినట్లు వదిలెయ్యాలి ‘అందుకే అన్నను వదిలాను ‘’అని చెప్పాడు .రావణుడు యుద్ధభూమిలో పళ్ళు కొరికితే ‘’రాక్షసులు త్రిప్పే  నూనె గానుగ ధ్వనిలా ఉంది ‘’

  భీషణ యుద్ధం చేస్తున్న రాముడు రాక్షసులకు ‘’పెద్దగాలికి వనంలో చెట్లు కూలిపోవటం కనిపించి గాలిమాత్రం కనిపించనట్లు ,మహా రథాలు చెక్కముక్కలై కనిపించాయికాని రాముడు కనిపించలేదు .’’శబ్ద స్పర్శ రూప రస గంధాలను   హే౦ద్రియాలు అనుభవిస్తున్నా ,కారణభూతమైన పరమాత్మ దేహికి కనిపించనట్లు ,ఒళ్ళంతా కొట్టిన దెబ్బలు కనిపించాయికాని రామ దర్శనం కాలేదు .’’చక్రం లాగా మండలాకారంగా తిప్పే రాముడు వింటి కొననే చూశారుకాని రాక్షసులు రాముడిని చూడలేదు. తన శరీరమే నాభిగా ,బలమే జ్వాలలుగా ,బాణాలే ఆకులుగా ,,కార్ముకమే అంచుగా ,జ్యారవం మహా ఘోషగా ,పరాక్రమమమే అక్ష ప్రదేశంగా ,దివ్యాస్త్రాలే ధారలుగా శత్రు సంహారం చేస్తున్న వీర ధీర సుందరరామ చక్రం రాక్షసులకు కాల చక్రం లాగా కనిపించి భయపెట్టింది  .అందుకే మహర్షి ‘’గగనం గగనాకారం –సాగరం సాగారోపమః –రామ రావణయో  ర్యుద్ధం –రామరావణ యోరివ –ఏవం బృవంతో దదృశః తద్యుద్ధం రామరావణ౦ ‘’అని చేతులెత్తేశాడు .

   రావణవదానంతరం  అయోధ్య చేరి పట్టాభి షిక్తుడైన రాముడు –

‘’వామే భూమి సుతా ,పురశ్చ హనుమాన్ ,పాశ్చాత్ సుమిత్రానందనః –శత్రుఘ్నో భరతశ్చపార్శ్వ దళయోః,వాయ్వాది కోణేషుచ-సుగ్రీవశ్చ ,విభీషణశ్చయువరాట్  తారా సుతో జా౦బవాన్ –మధ్యే నీల సరోజ కొమలరుచిం రామం భజే  శ్యామలం ‘’లా దర్శనమిచ్చాడు .

  సీతా రామ కళ్యాణ మహోత్సవం లో ‘’జానక్యాః కమలాంజలి పుటే — ముక్తాస్తా శ్సుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః’’ జన హృదయాలలో స్థిరంగాఉన్న ప్రసిద్ధ శ్లోకం ఉదహరించటం శుభదాయకం కాలానికి తగినట్లుగానూ ఉన్నది .

  కథా ప్రపంచం అనే తిరుపతి లోని ప్రసిద్ధ సంస్థ ముద్రించిన అందమైన దోషరహితమైన ,పాలనురుగు వంటి తెల్లటికాగితాలపై ముద్రించిన అమూల్యగ్రంథం ఇది .అందమైన శ్రీ సీతారాముల ముఖ చిత్రం , వెనుక ముకుళిత హస్తాలతో  రామభక్త హనుమాన్ ఉండటం జయం ,శుభం .సుందరకాండ పారాయణ కు ,రామాయణ పారాయణకు తగినట్లుగా 28అద్యాయాలతో,217పేజీల తో ఉన్న ఈ రమణీయ రామాయణం చదివి అందరూ అందులోని మంచిని గ్రహిస్తే అందరికి క్షేమం ,లాభం విజయం ‘.వాల్మీకి ఉపమానాలకు అద్దం పట్టే రచన శ్రీదేవిగారు చేసి ధన్యులయ్యారు .అభినందనలు .

‘’స్వస్తి ప్రజాభ్యఃపరిపాలయంతాం –న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః-గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం –లోకా స్సమస్తా సుఖినో భవంతు ‘’

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-12-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 16-నాగ మహాశయుడు -1

మహా భక్త శిఖామణులు

16-నాగ మహాశయుడు -1

గృహస్తుడైన నాగమహాశయుడు ఆదర్శ పురుషునిగా కీర్తి గడించాడు..’’నేను భూమి మీద చాలా ప్రదేశాలు తిరిగానుకాని నాగమహాశాయుడి వంటి వారెక్కడా కనిపించలేదు ‘’అని స్వామి వివేకానంద తరచుగా చెప్పేవారు .తూర్పు బెంగాల్ లో నారాయణ గంజ్ రేవుకు దగ్గరలో దేవ భోగ్ అనే పల్లెటూరిలో నాగమహాశయుడు1846ఆగస్ట్ 21 న జన్మించాడు .పూర్తిపేరు ‘’దుర్గా చరణ నాగ్ ‘’.తండ్రి దీనదయాళు. తల్లి త్రిపురసుందరి .తాత ప్రాణ కృష్ణ ,నాయనమ్మ రుక్మిణి ..వీరి పూర్వ నివాసం ‘’తిలారది’’.కాని మూడు తరాలనుంచి దేవ భోగ్ లోనే ఉంటున్నారు .దీనదయాళ్ కు ఇద్దరు చెల్లెళ్ళు .పెద్దావిడ భగవతి తొమ్మిదేళ్ళకే భర్తను కోల్పోయి ,విధవరాలై అన్న ఇంట్లోనే ఉంది .రెండవ చెల్లెలు భారతి సంసారం చేసుకొంటూ ,అప్పుడప్పడు అన్నగారింటికి వచ్చి వెళ్ళేది .దీన దయాళ్ కు దుర్గా చరణ్ ,మరో కొడుకు ,ఇద్దరు కూతుళ్ళు .నాగమహాశాయుడనే దుర్గా చరణ్ తర్వాత శారదామణిపుట్టింది .ఈమె తప్ప మిగిలిన అనుజన్ములు అందరూ చనిపోయారు .చివరిపిల్ల పుట్టుకలో పురిటిజబ్బు  సోకి తల్లికూడా మరణించగా బాధ్యత అంతా ఆడబడుచే చూసింది.

  తల్లి పోయే నాటికి  నాగ్ వయసు 8.శారదకు 4ఏళ్ళు .తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు పిల్లల పెంపకం మేనత్త చూసింది ..’’నా మేనత్త పూర్వజన్మలో నాకు తల్లి యై ఉంటుంది ‘’అని నాగమహాశయుడు ఆమెఎడ అవ్యాజానురాగంతో చెప్పేవాడు .తండ్రి దైవభక్తి తో నిష్టగా ఉండేవాడు .కలకత్తాలో  ‘’కుమారటులి’’ అనే చోట రాజకుమార పాల్, హరిచరణపాల్ అనే సోదరుల  వ్యాపారసంస్థలో పనిచేసేవాడు .జీతం తక్కువైనా ఆకుటు౦బ౦ తో అన్యోన్యంగా ఉండేవాడు  .వేలకొద్దీ డబ్బు అతని చేతులమీదనుంచే నడిచేది .స్వార్ధం లేని నిజాయితీ అతనిది .ఒకసారి కొన్ని వేలరూపాయలు లెక్కతేలకపోయినా దీనదయాళ్ ను అడగనైనా అడగలేదు .అతని ప్రవర్తనపై అంతటి నమ్మకం ఆసోదరులకు .కొన్నేళ్ళకు ఆడబ్బు లెక్క తేలి దీనదయాళ్ పై నమ్మకం విపరీతంగా పెరిగిందివారికి .

  పాల్ సోదరులది ఉప్పువ్యాపారం  .నారాయణ గంజ్ కు పడవలద్వారా ఉప్పు సరఫరా చేసేవారు .ఆ రేవు పట్నానికి వెళ్ళే కాలువ దట్టమైన అరణ్యం గుండా ప్రవహిస్తుంది .కనుక బందిపోటుదొంగలు పడవలపై దాడి చేసి సరుకు దోచేసేవారు .నమ్మకస్తులనే ఉప్పు పడవలలో పంపేవారు .ఒకసారి దీనదయాళ్ ను అలా పంపారు .పడవ ‘’సుందర్ బన్’’అడవి చేరేసరికి చీకటిపడింది .ముందుకు వెళ్ళే సాహసం చేయకుండా అక్కడే లంగరు వేసి ,దగ్గరలో శిధిలమైన ఇల్లు  ,ప్రక్కన రెండు గుడిసెలు కనిపిస్తే అక్కడికి చేరారు .నావికులు రాత్రి భోజనం చేసి నిద్రపోయారు .దీనదాయాల్ దుడ్డుకర్రపట్టుకొని రామనామస్మరణ చేస్తూ హుక్కాపీలుస్తూపడవలోనే ఉండికాపలా కాశాడు .

   తెల్లారగానే పడవ దిగి ,కంచెం దూరం నడవగానే కాలి వ్రేలి తాకిడికి ఏదో తళుక్కున మెరవగా ,బంగారునాణాల తోపాతి పెట్ట బడిన  బిందేకనిపించింది.కొన్ని నాణాలు పరీక్షించి చూడగా అవి పూర్వకాలం నాణాలుఅంటే మొహర్లు  అని అర్ధమై మళ్ళీ అన్నీ బిందెలో పోసి కనపడకుండా మట్టి కప్పేసి ,పడవవ వాళ్లను  తొందర పెట్టి ప్రయాణం సాగించాడు ,.ధనం మీద వ్యామోహం, పరుల సొత్తుపై ఆపేక్ష లేని సోశీల్యం అతనిది. ఆసద్గుణాలే కొడుకు నాగమహాశయుడికి సంక్రమించాయి  .

  నాగ మహాశయునికి ఒక జత వెండి మురుగులుతప్ప ఏ ఆభరణాలు లేని కడుపేద .సహజ సౌందర్య దీప్తి అతనిది .నవ్వుతూ హాయిగా నామకీర్తన గానం చేస్తూ ఉండేవాడు .ముచ్చటపడి ఏదైనా ఇస్తే తీసుకోనేవాడుకాదు.మేనత్త  ఆప్యాయంగా  దగ్గర కూర్చోబెట్టుకొని పురాణకథలు చెప్పేది .ఆటలపై ఆసక్తి తక్కువే .ఒకసారి తోటిపిల్లలు అబద్ధం చెప్పమని బలవంతం చేస్తే ససేమిరా చెప్పను అంటే విపరీంగా కొట్టగా,రక్తం కారుతూ  గాయాలతో ఇంటికి రాగా మేనత్త విషయం తెలుసుకోవటానికి అనేకరకాలప్రశ్నలు వేసినా తన స్నేహితులు  దండింప బడుతారని అసలు విషయం ఏమీ చెప్పనేలేదు .ఆబాధ అణచుకొన్నాడు .నారాయణ గంజ్ లో బడిలో చేరి కొంత చదువుకొన్నాడు .పై చదువు కలకత్తాలోనే చదవాలి తండ్రితో కలకత్తావెళ్లి   చదువు కొంటానని చెప్పగా తనకు పంపి చదివించే స్తోమత లేదన్నాడు తండ్రి .పోనీ  ఢక్కాలో చదువు దామనుకొంటే 10క్రోశులదూరం .అందరూ వద్దన్నా వినక ,ఎవరికీ చెప్పకుండా కొన్ని అటుకులు మూటకట్టుకొని ఢాకా  బయల్దేరి వెళ్లి అక్కడతనకు నచ్చిన స్కూలును ఎన్నుకొని రాత్రికి ఇంటికి చేరాడు .మేనత్త తల్లడిల్లి అడిగితె చెప్పి మర్నాడు ఉదయమే అక్కడ బడిలో చేరాలికనుక అన్నం సిద్ధం చేసి ఉంచమని చెప్పాడు .చదువుపై అతనికున్న ఆసక్తికిఆమెమారు మాట చెప్పకుండా ‘’శ్రీరామ రక్ష’’అని దీవించింది .

  మర్నాడుమేనత్త వండిన అన్నం తిని ,చేతిలో కొంచెం డబ్బు తీసుకొని ఢక్కావెళ్లి నార్మల్ స్కూల్ లో చేరి ,స్కూలుకాగానే రాత్రికి ఇల్లు చేరాడు .ఇలా 15నెలలు అక్కడ చదివాడు  అతి నడక వలన ఆరోగ్యం కొంత దెబ్బతిన్నది. అయినా దీక్ష వదలలేదు .దారిలో ఒకసారి పిశాచం కనిపించిందని ,భయపడకుండా అలాగే ఉండిపోయాననీ, అదీ ఏమీ చేయలేదనీ, తర్వాత నాలుగడుగులు వేశాక అది పకపకా నవ్విందని,మూడు సార్లుఅది కనిపించినా తనకే అపకారమూ చేయలేదని  తన అనుభవం చెప్పాడు .ఒక ఉపాధ్యాయుడు నాగ్ శ్రమ గుర్తించి పితృవాత్సల్యంతో  తమ ఇంటనే  ఉండి చదువుకోమని చెప్పగా ,కృతజ్ఞత చెప్పి అదే వాత్సల్యం సదా తనపై చూపనికోరి మళ్ళీ యధాప్రకారం ఇంటినుంచే వచ్చి చదివాడు .

  ఒకరోజు బడి నుంచి తిరిగివస్తుంటే ‘’ఫతుల్లా ‘’అనే పల్లెటూరిలో గాలివాన చిమ్మచీకటి కమ్మేసి అడుగు వేయటం కష్టమైంది  .ఏ ఇంటివారు రమ్మని పిలవలేదు .ఎవరినీఅతడు ఆశ్రయమివ్వమని కోరనూలేదు .ఆజడివాన ,హోరుగాలి మెరుపులు, ఉరుములమధ్య అలాగే ఇంటికి నడుస్తూనే ఉన్నాడు .కొంతదూరం పోయాక దారిప్రక్కన ఉన్న  చెరువులో పడిపోయాడు .లేవటానికి విశ్వ ప్రయత్నం  చేశాడు .ఒక  రెల్లు దుబ్బుపట్టుకొని గట్టు చేరదామని ప్రయత్నిస్తే అది తెగిపోయి, మరింత లోతుకు కూరుకు పోయాడు. వర్షం గాలీ ఏమాత్రమూ తగ్గలేదు. మేనత్త  గుర్తు కొచ్చి దుఃఖించాడు .రామనామ స్మరణ చేస్తూ ధైర్యంగా అనేకప్రయత్నాలు చేసి చివరికి ఒడ్డుకు చేరి ఆలస్యం చేయకుండా ఇంటికి బయల్దేరాడు .పొలిమేర చేరేసరికి చేతిలో లాంతరుతో మేనత్త ఎదురు చూస్తూ ‘’నాయనా దుర్గా చరణా ‘’అని గద్గదస్వరంతో పిలిచి ,దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకొని ‘’నీకే అపాయం జరిగిందో అని గుండె తల్లడిల్లి పోయాను .దేవుడి దయవలన సుఖంగా చేరావు ‘’అని తలనిమిరి ముద్దుపెట్టింది. నాగమహాశయుడు ‘’అత్తా !నాకేమీకాలేదు ఎందుకు బాధపడతావు .కొంచెం తడిశాను అంతే’’అని ధైర్యం చెప్పాడు ,

  ఢక్కాలో చదివింది కొద్దికాలమే అయినా వంగ వాజ్మయం లో గొప్ప పట్టు సాధించాడు .అతని దస్తూరి ముత్యాలప్రోవు .రచన సర్వాంగ సుందరం .రాసింది ఎవరికీ చూపించేవాడుకాదు .తర్వాత కలకత్తాలో వైద్య విద్య నేర్వటానికి వెళ్లేముందు తనరచనలను ‘’ఉపన్యాసమంజరి ‘’పేరుతొ ప్రచురించాడు .బాలబాలకులకోసం రాసి౦ది కనుక వారికి ఉచితంగా పంచిపెట్టేవాడు .వివాహవయసురాగానే మేనత్త అన్నగారితో ఆలోచి౦చి విక్రమపురికి దగ్గరలో ఉన్న ‘’రాయి జదియా’’గ్రామానికి చెందిన ధనికుని 11ఏళ్ళ  కూతురుతో వివాహం చేశారు .అదే రోజు మరో ముహూర్తంలో చెల్లెలు శారద వివాహం కూడా జరిపించారు .అయిదు నెలల తర్వాత నాగమహాశయుడు కలకత్తాలోని కేమ్బెల్ మెడికల్ కాలేజీ లో చేరాడు .

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డిసెంబర్ తెలుగు వెలుగు లో దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 పై సమీక్ష

డిసెంబర్ తెలుగు వెలుగు లో దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 పై సమీక్ష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు14-అర్జున మిశ్రస్వామి

మహా భక్త శిఖామణులు14-అర్జున మిశ్రస్వామి

 

అర్జునమిశ్రపండితుడు పురుషోత్తమ ధామం లో బిచ్చమెత్తి జీవించే పరమ సాదు , ఉదార ,శాంత ,భక్తిస్వభావుడు .సదా భగవద్గీత పారాయణ చేసేవాడు .గీతార్ధసారం గ్రహించి టీక రాశాడు .ఇప్పటికీ ఉత్తరదేశం లో దీనికి విశేష ఆదరణ ఉంది .గీత 9వ అధ్యాయం 22వ శ్లోకానికి టీకరాస్తూ ‘’యోగ క్షేమ్యం వహామ్యహం ‘’అనేదానిపై సందేహం వచ్చి ‘’ప్రత్యక్ష భావం పూని ఉంటాను ‘’అని చెప్పిన గీతాచార్యుని వాక్యం సత్యం కాదని భావించికొట్టేసి  ‘’పరోక్షభావం లో ఉంటాను అనే అర్ధం వచ్చే శబ్దాన్ని’’ ఇరికి౦చాడు .భగవద్గీత భగవానుని శరీరంకనుక ,ఈ కొట్టివేత పరమాత్మకు దెబ్బగా తగిలి ,మిశ్రాకు జ్ఞానోదయం కలిగించటానికి మొదట్లో గాలివాన కల్పించాడు .భిక్షాటనం చేస్తేనే కుటుంబపోషణ జరిగేదికనుక ,గాలివానకు బయటికి వెళ్ళలేక దంపతులు పస్తు ఉన్నారు .మర్నాడు భిక్షకోసం బయల్దేరితే విపరీతమైన వర్షం లో దూరం పోలేక కూలిపోబోతున్న గుడిసెలో తలదాచుకొన్నాడు .ఇంతలో ఇద్దరు బ్రాహ్మణబాలురు శరీరమంతా రక్తం కారుతూ మిశ్ర ఇంటికి వెళ్లి మిశ్రా ఆహారపదార్ధాలు పంపాడని చెప్పి ఒక రెండు మూటలు  భార్యకిచ్చారు .ఆమె ఆశ్చర్యపోయి వాళ్ళ శరీరం రక్తమయం అవటానికి కారణం అడిగి అలాంటి కోమల శరీరులను తనభర్త ఎలా అంత  పెద్ద బరువుగల మూటలు  ,ఇచ్చి పంపాడు అని  బాధపడి వాళ్ళ వృత్తాంతం అడిగింది. వాళ్ళు తమ తల్లిదండ్రులు బీదవారని తామిద్దరం మూటలు మోసి సంపాదించి కుటుంబ పోషణకు సాయపడుతున్నామని ,ఆ మూటలిచ్చి రమ్మంటే వచ్చామని  ఆయనకు ఆకలి బాధతో మతి స్తిమితం తప్పి  పిచ్చకోపంతో తమను ఒక ఇనుపకడ్డీతో  కొట్టడని ఆయనింటికి రాగానే అడిగితె నిజం తెలుస్తు౦దని  చెప్పి  మూటలు దించి వెళ్ళిపోయారు .భర్తకే ప్రమాదం జరిగిందో అని కంగారుతో తన ఇద్దరు పిల్లల్ని వొళ్ళో నేసుకొని ఏడుస్తుంటే పిల్లలిద్దరూ యెగిరి పోయారు  .ఇంతలో మిశ్రా వచ్చి విషయం తెలుసుకొని ,వాల్లరోపురెఖలెలాఉన్నాయని అడగ్గా ,పెద్దవాడు బంగారం రంగులో చిన్నవాడు నలుపురంగులో ఉన్నారని ,ముఖాలలో దివ్య తేజస్సుకనిపించిందని  చెవులకు బంగారు కుండలాలున్నాయని చెప్పింది .’’అయ్యో భగవానుల నుకొట్టింది నేనే ‘’అని మూర్చపోయాడు దురంత వేదనతో .ఆమె కూడా మూర్చితురాలైంది .కాసేపటికి ఇద్దరూ తేరుకోన్నాక అతడు ‘’వచ్చిన వారు శ్రీకృష్ణబలరాములే .వారి దర్శనభాగ్యం పొందిన అదృష్టవంతురాలవు ‘’అని చెప్పాడు.కలం తో గీతలో తాను  వహామ్యహం ‘’మాటకోట్టేసి వేరేమాట రాసినందుకు జగదీశుడికి తీవ్రమైన దెబ్బ కొట్టిందని  ,పశ్చాత్తాప పడి ,తను చేర్చినమాట తీసేసి  మళ్ళీ యధా ప్రకారమే ఉంచాడు .ఇంకా ఎక్కువ శ్రద్ధాసక్తులతో హరి సేవనం చేశాడు .ఇద్దరి భక్తికీ మెచ్చి కృష్ణుడు సాక్షాత్కరించి ధన్యులనుచేశాడు .

   దారిద్ర్యం కఠోర దీక్షకు కారణం కావాలి. సేవాధర్మం ,పశ్చాత్తాపం విశ్వాసం ,అనుకూల దాంపత్యం  జీవన్ముక్తికి హేతువులు .

15-మహంతజీ

భక్త మహంత జీ ఒరియా దేశాస్తు డైన నిరుపేద కృష్ణ భక్తుడు .భార్య మహా సాధ్వి .ఒకమగపిల్లాడు ఇద్దరాడపిల్లలు.ఒరిస్సాలో కాటకం వచ్చి తిండిదొరకటం కష్టమైంది .దరిద్రబాద భరించలేక కుటుంబం పోషించలేక మహంత్ కృష్ణుడే దిక్కు అని కటిక ఉపవాసాలతో ఉన్నారు .వీరిని చూడలేక ‘’కృష్ణా ,కృష్ణా ‘’అని మూర్చపోయేవాడు .భార్యకూడా అతనిబాధ గ్రహించి అతనికి స్నేహితులెవరైనా ఉంటె వెళ్లి ఆశ్రయిద్దామని సలహా చెప్పింది .’’దీనబంధు’ అనే స్నేహితుడు ఉన్నాడని   ,అతడు ‘’నీలాచలం ‘’లో ఉంటాడని, అంతదూరం ఈ పరిస్థితిలో వెళ్ళలేమని చెప్పాడు .ఎలాగైనా వెళ్లి పిల్లలకైనా ఎంతో కొంత ఆహారం సంపాదించాలి అని చెప్పగా అందరూ కలిసి బయల్దేరారు .

   చాలాప్రయాణ౦  కష్టనస్టాలుపడి చేసి పూరీ జగన్నాథంచేరారు .ఆలయంలో ఘంటా శంఖానాదాలు మిన్ను ముట్టుతున్నాయి .సింహద్వారం దగ్గర వీరంతా నిలబడ్డారు .జనంబాగా ఉన్నారు తోసుకు వెళ్ళటం కష్టం అనిపించింది .ద్వారం బయటనుంచే జగన్నాథ దర్శనం చేసి పులకి౦చి గంజికాలువదగ్గర చతికిలపడ్డారు .’’ఇంకా ఆలస్యం ఎందుకు మీ స్నేహితుడిదగ్గరకు వెళ్లి అడిగి ఏదైనా తీసుకు రండి ‘’అంది భార్య .అతడు ‘’మిత్రుడు ఎంతో మంది జనసమూహం లో ఉన్నాడు .కాసేపు ఓపికపట్టు .అప్పుడు వెళ్లి కలుద్దాం .దూరంగానైనా చూశాం కదా ఆతృప్తి చాలు .చావు గురించి దిగులెందుకు ?.ఇది మిత్రుని ప్రేమపూరిత నివేదన మైన అమృతతుల్యమైన గంజి. దీన్నే అందరం తాగుదాం ‘’అనగా అందరూ దోసిళ్ళతో ఆగంజే పంచభక్ష్య పరమాన్నంగా భావించి కళ్ళకు అడ్డుకొని కడుపు నిండా తాగారు .ఆయాసం తో ఆ గట్టుపైనే విశ్రమింఛి నిద్రలోకి జారారు .

  కడుపాకలి తీరక మెలకువవచ్చి ‘’జగన్నాధా జగన్నాధా ‘’అని దిక్కులు పిక్కటిల్లేట్లు ఆర్తిగా అరిచాడు మహంత్ .రాతి గోడలలోపల బందీ అయిన జగన్నాథుని హృదయం కరిగిపోయింది .క్షణం ఆలస్యం చేయకుండా బ్రాహ్మణబాలుని వేషం లో ఒక బంగారుపళ్లెం నిండా మధురపదార్ధాలతో చరచరా నడిచి మహంత్ దగ్గరనిలించి ‘’నెచ్చెలీ !లేవండి .మీకోసమే మంచి మిఠాయిలు తెచ్చాను .తీసుకొని తృప్తిగా తినండి ‘’ అన్నాడు .మూర్చనుంచి లేచిన మహంత్ కు ఆమాటలు వినిపించాయికాని ,కళ్ళు తెరవలేదు .అలా మూడు సార్లు లేపాడు దేవాది దేవుడు .భార్యకు మెలకువవచ్చి ‘’మీ స్నేహితుడు అనుకొంటా ద్వారం దగ్గర నిలబడి పిలుస్తున్నాడు లేవండి ‘’అన్నది .అతని అనుమానాలు పటాపంచలై లేచి పిచ్చివాడిలాగా ఆసుందర బ్రాహ్మణ బాలుడిని చూశాడు .పళ్ళెం బరువుతో బాలుడి చేతులు వణుకుతున్నాయి .మహంత్ చెయ్యి చాపగా బాలుడు ఈతని నెత్తిపై పళ్ళెం పెట్టాడు .శరీరం గగుర్పొడిచింది .ఏదో మాట్లాడాలనుకొంటున్నాడుకాని మాటలు రావటం లేదు .బాలుడి పాదాలపై పడి ఏదో చెప్పాలనుకోన్నా,ఏదీ స్పృహకు రావటం లేదు. బాలుడు అదృశ్యమయ్యాడు .

  మిఠాయి పళ్ళెం పిల్లల ముందు పెట్టాడు .ఆనందంగా ,సంతృప్తిగా అందరూ భుజించారు .ప్రాసాదమంతా తినేశారు .భార్య పళ్ళెం కడిగి శుభ్రం చేసి మిత్రునికి ఇచ్చిరమ్మని చెప్పగా,ఆలయంలోకి వెళ్లి ఎన్నో సార్లు పిలిచినా జవాబు రాలేదు. తలుపులన్నీ మూసి ఉన్నాయి .నిస్పృహతో బయటికి వచ్చి  గుడ్డలో మూటకట్టి తలక్రిందజాగ్రత్తగా  పెట్టుకొని,అందరూ గాఢ నిద్రపోయారు .తెల్లవారినా మెలకువ రాలేదు .ఆలయం లో ఏదో కలకలం వినిపించింది  .గర్భాలయం లో ఉండే బంగారు పళ్ళెం కనిపించటం లేదని గగ్గోలు పెడుతున్నారు .అన్నిచోట్లా భటులు వెతుకుతుండగా మహంత్ తలకి౦ద ఉన్న  పళ్ళెం పై సూర్యకిరణాలు పడి ,అందరికీకనిపించింది మహంత్ దొంగ తనం చేశాడని  ,అనుమానించి అతనికుటు౦ బాన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టారు తిట్టారు .తాను  నిరపరాదినని మొరపెట్టినాఎవరూ వినిపించుకోలేదు .రాత్రిజరిగినకథ అంతా చెప్పాడు .పిచ్చోడన్నారు  .జగన్నాథస్వామినే ఆర్తిగా అర్ది౦ చాడు ప్రార్ధనలతో .జైలులోపెట్టారు .అతని ఆర్తనాదాలు ప్రజలకు వినిపించకపోయినా జగత్ప్రభువుకు వినిపించాయి .

  మర్నాడు సూర్యోదయానికి  ముందే  ప్రతాపరుద్ర మహారాజు కలలో జగన్నాథుడు కనిపించి జరిగినదంతా వివరించి అదృశ్యమయ్యాడు .రాజు  వెంటనే మహంత్ దగ్గరకురాగా అతడు గీత గోవిందం మధుమదురంగా గానం చేస్తూ పరవశంలో కనిపించాడు .లోపలి వెళ్లి తానే సంకెళ్ళు తెంపేశాడురాజు .మహంత్ స్పృహలోకి వచ్చిచూడగా మహారాజు అతని పాదాలపై వ్రాలి క్షమించమని కోరుతూ కనిపించాడు .ఇదంతా తన’’ నెచ్చెలి ‘’  లీల అని మహంత్ మురిసిపోతూ చెప్పాడు .అతని భార్యాపిల్లలను పిలిపించి రాజు మహంత్ భార్యపాదాలపై వ్రాలి క్షమించమన్నాడు .బంగారు పల్లకీలో మహంత్ కుటుంబాన్ని కూర్చోబెట్టి ,జగన్నాథాలయానికి సాదరంగా మర్యాదగా తీసుకు వెళ్లి తీర్ధస్నానాలు చేయించి నూతనవస్త్రాలు కట్టబెట్టి చందనం అగరు పూలమాలలతో,పుష్పాలతో పూజించి  సత్కరించాడు..అష్టైశ్వర్యాలు మహంత్ కుటుంబానికి ప్రతాపరుద్ర గజపతి మహారాజు ఏర్పాటు చేశాడు  .భూమి రాసిచ్చాడు .దేవాలయం లెక్కలు రాసేఉద్యోగం లో నియమించి వంశపారంపర్యహక్కు కల్పించాడు .దైవ విశ్వాసం ఎంతటి కస్టాలు పెడుతుందో, అంతకు వెయ్యి రెట్లు మేలు కూడాచేస్తుంది .కృష్ణుడు కుచేలునిపట్ల చూపిన మిత్రధర్మం ,తనను నెచ్చెలిగా భావించిన మహంత్ పట్ల జగన్నాథుడు చూపి స్తవనీయుడయ్యాడు .

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-12-19-ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 12-దీపా౦కుర స్వామి

మహా భక్త శిఖామణులు

12-దీపా౦కుర స్వామి

బౌద్ధరాజు గోవి౦దపాలుడు విక్రమపురం రాజధానిగా పాలించేకాలం లో ,దానికి దగ్గరగాఉన్న వజ్ర యోగిని అనే పల్లెలో క్రీ.శ980లో దీపాంకురుడు పుట్టాడు .ఇతడిని ఆదినాథుడు అనిపిలిచేవారు. గొప్ప గురువు వద్ద చేరి మహా విద్వా౦సుడయ్యాడు .పెళ్లి చేసుకొని కొంతకాలం సంసార సుఖం పొంది ,ఇల్లువదిలి విశేష శ్రమ చేసి హిందూ బౌద్ధ శాస్త్రాలలో గోప్పపా౦డిత్యం సాధించాడు .ధర్మ రక్షితుని వద్ద బౌద్ధ దీక్ష తీసుకొన్నాడు .ఆకాలం లో బర్మాలో బౌద్ధం బాగా వ్యాపించిఉంది .కొంతమంది వర్తకులు ఏనుగులు ఎక్కి బర్మా వెడుతుంటే వాళ్ళతోకలిసి 13నెలలు ప్రయాణం చేసి  ఆదేశం చేరాడు .

   చంద్ర కీర్తి అనే మహనీయుని చేరి యోగ శిక్షపొంది ,12ఏళ్ళు గడిపి సిద్దుడై భారత దేశం తిరిగి వచ్చాడు .మగధ బౌద్దులాతడిని’’ధర్మపాలుడు ‘’గా స్వీకరించగా అతనికీర్తి దశదిశలా వ్యాపించింది .రాజా న్యాయపాల్ అతని ప్రతిభను గుర్తించి ప్రధాన యాజకుని గా (ఋత్విక్కు) నియమిస్తానని అంటే ఒప్పుకోలేదు .ఆకాలం లో టిబెట్ దేశాన్ని హ్లాలామల్ అనే రాజు దోరింగ్ నగరాన్ని రాజధానిగా పాలిస్తున్నాడు .ఆదేశంనుంచి కొందరు బౌద్ధ సాధకులను భారత దేశానికి బౌద్ధ ధర్మం విశేషంగా నేర్చుకోవటానికి పంపాడు .వారు చాలా చోట్ల తిరిగి చివరికి మగధ చేరి దీపాకురిని ప్రజ్ఞా విశేషాలు తెలుసుకొని ,అతని సేవించి విజ్ఞానం గడించి తమతో టిబెట్టుకు రమ్మని ఆహ్వానించారు .దీపా౦కురుని ఎలాగైనా తీసుకురమ్మని వారికీ రాజు లక్షలాది బంగారునాణాలు   పంపాడు .కాని యితడు అంగీకరించలేదు .

   టిబెట్ రాజు  చనిపోయాక అతని కొడుకులు దీపా౦కురుని ప్రార్ధించి ,ఒప్పుకోకపోతే  నిర్బంధించి బలవంతంగా టిబెట్ తీసుకు వెళ్ళారు .అక్కడ 15ఏళ్ళు బౌద్ధధర్మాన్ని బోధింఛి విశేషకీర్తి సాధించాడు . 1035లో 55వ ఏట దీపాంకురుడు లాసా నగరం లో నిర్యాణం చెందాడు .ఇప్పటికీ టిబెట్ ,చైనా బౌద్ధులు దీపా౦కురుని  స్మరిస్తారు .

13-కమలాకాంత స్వామి

వంగ దేశం బర్ద్వాన్ ఇల్లా అ౦బికాకాల్నా గ్రామంలో వంగశకం 1179లో కమలాకా౦త స్వామి పుట్టాడు .తండ్రిది వైదిక వృత్తి.చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ,తల్లి ఊరిబడిలో చదివించింది .మాతృభాషతోపాటు , సంస్కృతంకూడా పట్టుదలగానేర్చి గొప్పవాడయ్యాడు .చిన్నతనలోనే గ్రంథ రచనలు చేయటం ప్రారంభించాడు .కవిత్వంలో దిట్ట అనిపించాడు రసబందురకవిత్వం రాసేవాడు .సంగీతంలోనూ నిష్ణాతుడయ్యాడు .కంఠ స్వరం మహా మాధుర్యంగా ఉండటం తో వినేవారు పరవశి౦చే వారు .గాన్ధర్వగానాన్ని మరిపించేవాడు .శాంతదయా ప్రేమ పరిపూర్ణుడు .ఇతని గుణ గరిస్టతకు మెచ్చి బర్ద్వాన్ రాజు తేజచంద్ర బహదూర్ ఆస్థాన పండితునిగా 1216న నియమించి గౌరవించాడు .

    రాజ ధర్మం నిర్వర్తించి మిగిలినకాలం దుర్గా దేవి ఆరాధనలో గడిపేవాడు .రసరమ్య గీతాలు అమ్మవారిపై రచించిపాడేవాడు  .ఆ గానానికి జడపదార్ధాలు సైతం చైతన్యం అయ్యేవని చెప్పేవారు .రాజు ఇతనిని తన ఆచార్యుని చేశాడు .కోటం హాట్ లో అన్నివసతులతో సుందరభవనం కట్టించి అందులో ఉంచాడు .పూజలకు భజనలకు రాజు మరొక ప్రత్యేక  మందిరం  నిర్మించి ఇచ్చాడు .పూజలకు భజనలు దసరాలలో ప్రాత్యేకంగా చేసే దుర్గాపూజకు ఖర్చు అంతా రాజే  భరించే వాడు .భార్య గుణవతి .సదా పతిసేవలోదుర్గా  మాత సేవలో గడిపేది .భర్త సేవలో పగలూ రాత్రి సేవ చేసేది భార్య అని తలచి అతడు భావోద్రేకానికి గురయ్యేవాడు  అప్పుడామె శాంతంగా ప్రేమతో అనునయించేది .

  ఒక రోజు రాజోద్యోగి వచ్చి ‘’మహాశయా !పవిత్ర జీవితానికి కామినీ కాంచనాలు బంధనాలు కావటం లేదా ??’’అని అడిగాడు కమలాకా౦తు డు ‘’స్త్రీలు భగవతి స్వరూపులు ‘’స్త్రియః సమస్తః సకల జగత్ ‘’.స్త్రీ రత్నం .అలాంటిది సాధనాలకు అడ్డంకీ కాదు ‘’నాస్తి భార్యా సమో బన్ధుఃనాస్తి భార్యా సమాగతిః-నాస్తి భార్యా సమో లోకే సహయో ధర్మ సంగ్రహే ‘’ .ఆమె శక్తి స్వరూపిణి ‘’అన్నాడు .మనసు తృప్తి చెంది శిష్యుడయ్యాడు .

   కొంతకాలానికి భార్య మరణించింది .చితిపై ఆమెను చేర్చి మృదు మధురంగా గీతాలాపన చేస్తూ నృత్యం చేశాడు .తన్మయత్వంలో నృత్యం చేసి ఆమె అంత్యక్రియలు నిర్వర్తింఛి మహదానందంతో ఇంటికి చేరాడు .ఒకసారి వేరే ఊరికి వెడుతుంటే ‘’ఓడగాయ ‘’అనే గ్రామం దగ్గర బందిపోటు దొంగలు కత్తులూ బల్లాలతో మీదకు ఉరికారు .ఏమాత్రం భయం లేకుండా మృత్యువు సమీపిస్తోంది అన్న పరమానందంతో గానం చేస్తూ నాట్యమాడాడు .ఆమధురమంజుల గానానికి బందిపోట్ల హృదయాలుకరిగి  సాష్టాంగ నమస్కారాలు చేసి వెళ్ళిపోయారు .భయరహితుడు  భగవతిని స్థిరంగా మనసులో కొలువు చేసుకొన్నవాడు కమలాకా౦తుడు తనమరణం దగ్గర పడిందని గ్రహించి రాజును తనదగ్గరకు పిలిపించి ధర్మోపదేశం చేసి ,పారమార్ధిక విషయాలు బోధించి రాజు మనసుకు   ప్రశాంతత చేకూర్చాడు .తనను కి౦దపడుకోబెట్టమని చెప్పి, పడుకోబెట్టగానే  ప్రాణాలు విడిచాడు .అదే సమయంలో దగ్గరున్న భోగవతీ నది బాగా ఉబికి అందరికీ  ఆశ్చర్యం కలిగించిందని ఇప్పటికీ బెంగాల్ లో చెప్పుకొంటారు .సార్ధకజన్ముడు కమలాకాంత స్వామి .

ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి)

మహా భక్త శిఖామణులు

9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి)

ఉత్తరప్రదేశ్ జోన్ పూర్ జిల్లా ప్రేమపురం లో అయోధ్యానాథ తివారి అనే వైష్ణవ బ్రాహ్మణుడు రామానుజమతస్తుడు విశుద్ధ వర్తనుడు .అన్న లక్ష్మీనారాయణ సంసారం వదిలి కుర్ధాలో భాగీరధీ నది ఒడ్డున వటవృక్షం కింద కుటీరం ఏర్పాటు చేసుకొని యోగాభ్యాసం, హరికీర్తనం తో గడిపేవాడు .అయోధ్యనాథుని ముగ్గురుకొడుకులు గంగారాం , హరిభజన దాస్,బలరాం .రెండవవాడికి చిన్నతనంలో మశూచి సోకి  కుడికన్ను పోయింది .అందరూ శుక్రాచార్య అని పిలిచేవారు .హరిభజనుడు 1840 లో ప్రేమపురం లో పుట్టాడు .పెదనాన్న లక్ష్మీనారాయణకు అంతుచిక్కని వ్యాధి రాగా ఇతడిని సేవకోసం తండ్రికుర్ధాకు పంపాడు .

శుక్రాచార్యుడు అందరి చేత పిలువబడే హరిభజన దాస్ పెత్తండ్రి ఆశ్రమంలో సేవ చేస్తూ చదువు నేర్చాడు .చీకటితోలేచి గంగాస్నానం చేసి అధ్యయనం పూర్తి చేసి ,వంట మొదలుపెట్టేవాడు .పెదతండ్రికి అతని శిష్యులకు ముందు భోజనం పెట్టి తర్వాత తాను  తినేవాడు .ఇలా ఒక ఏడాది గడిచాక ,హుసేనుపురం లో ఉన్న శివరత్న శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకోవటానికి రోజూ వెళ్లి వచ్చేవాడు .శంకర గ్రామం లో ఉన్న నంద పండితునివద్ద ‘’బాలబోధం ‘’,శీఘ్రబోధం ‘’అనే జ్యోతిష గ్రంథాలు కూడా అభ్యసించాడు .13ఏళ్ళ ఈకుర్రాడు వ్యాకరణం పై మోజు పడి గాజీపురం లోని వేచన పండితునివద్ద’’సారస్వత ‘’,చంద్రిక’’గ్రంథాలు చదివి ,ఏడాది తర్వాత గోపాలపండితుని దగ్గర’’వేదాంత పంచదశి ‘’నేర్చాడు .అసాధారణ మేధావికనుక కొద్దికాలం లోనే ఇవన్నీ నేర్ఛి,స్వగ్రామం వెళ్లి మాతృమూర్తిని దర్శించాడు .

1856లో పెదనాన్న లక్ష్మీ నారాయణ యోగి మరణించాక ,అంత్యక్రియలు యధావిధిగా నిర్వహించి ఆశ్రమం లోనే ఉన్నాడు శుక్రాచార్య హరిభజనుడు  .ఆశ్రమంలో అనేక దేవతవిగ్రహాలు స్థాపించి నిత్య పూజ చేసేవాడు .ఇన్ని సాధించినా మనశ్శాంతి ఉండేదికాదు .ఆహరం తినకు౦డా కొద్దిగాపాలు తాగేవాడు .పాలుకూడా మానేసి కటిక ఉపవాసాలున్న రోజులెన్నో ఉన్నాయి .

1857లో ఆశ్రమాన్ని శిష్యులకు అప్పగించి తీర్ధ యాత్రలకు బయల్దేరాడు హరిభజనుడు .ఆసేతు హిమాచల పర్యంతం పాదచారిగా పర్యటించి చివరికి ‘’గిర్నాడ్’’పర్వతం చేరి ,ఒకమహా పురుషునివలన యోగ సాధన నేర్చి ,నిష్ణాతుడై ,మళ్ళీ తీర్ధయాత్రలు చేసి మూడేళ్ళ తర్వాత ఇక్కడికే చేరాడు .పెదతండ్రి అస్తికలు గంగలోకలిపి ,కొత్త సమాధి నిర్మింఛి దానిపై నల్లరాతి పాంకోళ్ళను చెక్కించి స్థాపించాడు .అక్కడ ఇంటివద్ద తండ్రి చనిపోయాడు  .గిర్నాడ్ వదలి ‘’నేను ‘’పదాన్ని కూడా విసర్జించి తనను ‘’తాను ‘’అని ఇతరులను ‘’బాబు ‘’అని ,స్త్రీలను ‘’తల్లి ‘’అని పిలవటం మొదలుపెట్టాడు .ఉదయం పదిగంటలవరకు గంగాస్నానం జపతపాలు ,పూజ చేసేవాడు .గంగానది మధ్యలో నిలబడి శ్రీ కృష్ణ స్తవం చేసేవాడు .పూజతర్వాత నాలుగుగంటలు  యోగాభ్యాసం చేసి ,కాసేపు బయటికి వెళ్లి తిరిగివచ్చి వంట చేసుకొని తిని కాసేపు విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం ఆశ్రమానికి వచ్చినవారితో సత్కాలక్షేపం చేసి ,మళ్ళీ యోగసాదనలో మునిగిపోయేవాడు .రొట్టెలుకాల్చటం వలన సమయం వృధా అవుతోందని పాలు, మారేడాకులరసం మాత్రమే తీసుకొనేవాడు .కొన్నేళ్ళతర్వాత స్వగ్రామం వెళ్లి తల్లిని వెంటపెట్టుకొని మాఘ కుంభ మేళా కు ప్రయాగ వెళ్ళాడు .అక్కడినుంచి గంగ ఒడ్డునఉన్న   తనపూర్వ కుటీరం చేరి ,యోగసాదనకుఒక గుహ తయారు చేసుకొని ,వారాలతరబడి యోగం లో గడిపాడు .అతడు ఏ ఆహారం తీసుకోకుండా గాలిమాత్రమే పీల్చి జీవిస్తున్నందున ప్రజలు ‘’పవుహారీ బాబా ‘’ పవనం అంటే గాలి ఆహారంగా కలబాబా అని పిలిచేవారు .

విభూతి పూసుకోవటం కాని జడలు పెంచుకోవటం కాని చేసేవాడుకాడు .జుట్టు ముడి వేసుకొనేవాడు .గోచీ ధరించి పాదాలదాకా లుంగీ తో ఉండేవాడు .కొంతకాలం తర్వాత తనగురువును చూడాలని గిర్నార్ బయల్దేరగా అయోధ్యలో ఉండగానే గురువు హిమాలయాలలో ప్రాణత్యాగం చేశాడని తెలిసి ,అయోధ్యలో ఒక  వైష్ణవయోగి వద్ద నూతన విజ్ఞానం పొంది, తనకుటీరం లో ఉన్నాడు .రథోత్సవం నాడు బయటికివచ్చి రథాన్ని కొంతదూరం లాగి, ఆశ్రమం చేరేవాడు .ప్రతి ఏకాదశికి భక్తులకు అనుగ్రహభాషణం చేసి విజ్ఞాన వంతుల్ని చేసేవాడు .మిగాతకాలమంతా తపస్సులోనే .

తర్వాత వచ్చిన త్రివేణీ పుష్కరాలకు రైల్ లోప్రయాగ  వెళ్లి త్రివేణి ఒడ్డున చిన్న కుటీరం లో ఉం,వేడి చలికి బాగా ఇబ్బందిపడి ,దగ్గు  జ్వరం బాగా వచ్చిబాధపడగా జనం మందులు తీసుకోమంటే వద్దని చెప్పి నా వినక ఖరీదైనమందులు రుచికరమైన పదార్ధాలు తెచ్చిపెట్టి పరీక్షించేవారు కొందరు బ్రాహ్మణులు .వాటిని తీసి నదిలోపారేసి వెళ్ళిపోయేవాడు .వాళ్ళు వచ్చి తమకు ద్రోహం  చేశాడని ఆరోపిస్తే ‘’ఈ దాసుడు ఏ తప్పూ చేయలేదు .మీరిచ్చిన మందులు రోగానికే సమర్పించాను .కావాలంటే పరీక్షించండి ‘’అన్నాడు. పరీక్షిస్తే వ్యాధి నయమైపోయిందని తెలుసుకొన్నారు .ఇదంతా ఆశ్చర్యంగా ఉండేది వారికి .

ప్రయాగలో ఉండటం ఇష్టం లేక త్రివేణీ సంగమ స్నానం చేసి ,తల్లిఉన్న చోటికి వెళ్లి ఇంట్లో ఉండకుండా బయట ఉద్యానవనంలో ఒకరోజు గడిపి మళ్ళీఆశ్రమానికి చేరాడు .పెదతండ్రి ఉన్నరోజుల్లో ధనికులు డబ్బు ధాన్యం   ఆశ్రమానికి ఇచ్చేవారు .వాటిని ఆయన పేదలకు అతిధి అభ్యాగాతులకు , శిష్యుఅలు ఖర్చుపెట్టేవాడు .ఈయనా అలానే చేసేవాడు .ఒకరోజు ఒకపిచ్చివాడు దుడ్డుకర్రతో వచ్చి బాబాను కొట్టే ప్రయత్నం చేస్తే శిష్యులు అడ్డుపడగా అప్పుడు హోమం చేస్తున్న స్వామి  పూర్తయ్యాక కుటీరం బయటికి వచ్చి వాడిపై తీవ్ర౦గా దృష్టి పెడితే  వాడు ఆగిపోయి పిచ్చికుదిరి  అతడిని  వాడు పరమభక్తుడై స్వామి సేవలో ధన్యుడయ్యాడు  . .మరో సారి ఒక మాయావి సన్యాసి వేషంలో వచ్చి ఇన్ని విగ్రహాలెందుకు  వీటి అలంకారానికి డబ్బు తగలేస్తున్నావు  అనగా అక్కర్లేదనికావాలంటే తీసుకోమని ఆశ్రమం తాళం చెవి ఇచ్చి వెళ్ళిపోయాడు .మర్నాడు భక్తులువచ్చి విషయం తెలుసుకొని  దొంగసన్యాసి  స్వామికి ద్రోహం చేశాడని తన్నబోగా పారిపోయాడు .

పహారీబాబా ఆశ్రమం వదిలి దేశాటనం చేస్తుంటే  పూరీజగన్నాథంలో ఒక భక్తుడు చూసి రమ్మని ప్రాధేయపడినా రాకుండా ,తీర్ధయాత్రలుచేస్తూ గోగగ్రస్తుడై .ముర్షిదాబాద్ జిల్లా బ్రహ్మపురం లో  గంగా నదిఒద్దున ధ్యానంలో గడుపుతుంటే ఒక వంగ దేశీయుడు ఆశ్రమ౦  నిర్మించగా , అందులో యోగసాధన చేశాడు .1888ఆషాఢ పౌర్ణమి నాడు బాబా గొప్ప యజ్ఞం నెలరోజులు చేయగా  అందరినుంచి విపరీతంగా అన్నిరకాల సహాయ సహకారాలు లభించి దిగ్విజయమైంది .

ఒకరోజు అర్ధరాత్రి గంగా స్నానం చేసి ఒడ్డున యోగాభ్యాసం లో ఉంటె  విఘ్నాలుకలిగి యోగ దృష్టికి ఆటంకం కలిగి ,ఏదో తెలీనిబాద జీర్ణకోశం లో ఇబ్బంది పెట్టి ,క్షీణించటం మొదలుపెట్టగా ,ఏం జరిగిందని అందరూ ప్రశ్నిస్తుంటే జవాబివ్వలేదు .1898లో స్వామి సోదరుడు, ఆయనకొడుకు బదరీనారాణ, వారణాసికాలేజి ఆచార్య  భగవంతచారి , జనార్దన పండితుడు ,కొందరు పెద్దమనుషులు వచ్చి స్వామి ఆశ్రమందగ్గర పర్ణశాలలో విడిది చేశారు. బాబాకుటీరం లోనే ఉన్నాడు  .కుటీరం నుంచి పొగ బయటికి వచ్చింది .హోమథూమం అనుకొన్నారు అందరూ .స్వచ్చమైన ధూమం గమనించి బదరీనారాయణ తలుపు లోపల వేయబడటం గమనించి ,కుటీరం పైకెక్కి చూడగా అగ్ని జ్వాలలు గమనించాడు.కెవ్వునకేకవేసి ‘’మహాత్మా అగ్నినార్పటానికి అనుమతివ్వండి ‘’అని ప్రార్ధించాడు .స్వామి పైకి చూసి ఏదో సౌజ్ఞచేశాడు అర్ధంకాలేదు బదరికి .స్వామి శిష్యుడు    భ్రుగునాథుడు పెకెక్కి చూడగా, స్వామి అప్పుడే స్నానం చేసినట్లు వెంట్రుకలు తడిసి శరీరం బంగారు రంగులో ఉన్నట్లు,శరీరమంతా  నెయ్యి పూసి ఉన్నట్లు , ‘’దర్భగడ్డి గోచి’’ తడిగా ఉన్నట్లు గమనించాడు .స్వామి పద్మాసనం లో యోగ ముద్రలో ఉన్నాడు .శరీరం నుంచి మంటలు వస్తున్నాయి ,యోగదండం కింద పడి ఉంది . కొద్ది కాలానికే మంటలు శరీరమంతా వ్యాపించాయి.కదలక నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు బాబా .మరి కొంతసేపులో బ్రహ్మ రంధ్రం బ్రద్దలై స్వామి ప్రాణవాయువు అన౦త వాయువులో కలిసిపోయింది .అంటే  సరైన  ముహూర్తం చూసుకొని పవుహరీ బాబా  ఆత్మ త్యాగం చేసుకొన్నాడన్నమాట .

1890స్వామి వివేకానంద బాబాను ఘాజీపూర్ లో సందర్శించాడు .కానీ బాబాతో మాట్లాడటానికి ఇంటర్వ్యు చేయటానికి  కుదరలేదని,21-1-1890లో ఒక ఉత్తరం ,అదేనెల 31న మరో ఉత్తరంలో బాబా ఎవరినీ చూడటానికి ఇష్టపడటం లేదని ,నాలుగురోజులత్రవాట ఫిబ్రవరి 4 న ఇంకో ఉత్తరం లో .through supreme good fortune, I have obtained an interview with Babaji. A great sage indeed! — It is all very wonderful, and in this atheistic age, a towering representation of marvellous power born of Bhakti and Yoga!’’అని ఉత్తరం రాశాడు ఇంటర్వ్యు దొరికిమాట్లాడి నందుకు పరమ సంతోషంతో  .తీవ్రమైన నడుం నేప్పితో బాధపడుతూ కూర్చోలేక ,కదలలేక ,యోగాసనాలు వేయలేక బాధపడుతూ బాబాను చూశాక శిష్యుడిగా స్వీకరించమని కోరితే సరే అన్నాడు బాబా  ఈ విషయం తెలియజేస్తూ వివేకానంద ‘’ I have sought refuge in his grace; and he has given me hope — a thing very few may be fortunate enough to obtain. It is Babaji’s wish that I stay on for some days here, and he would do me some good. So following this saint’s bidding I shall remain here for some time.  ‘’అని ఫిబ్రవరి 4 న మరో ఉత్తరం రాశాడు . మర్నాడు దీక్షా స్వీకారం అనగా ముందు రోజు రాత్రి స్వామి వివేకానందకు  రామకృష్ణ పరమహంస కలలో విషాద వదనం తో కన్పించగా ,తనను గురువు  పరమహంసమాత్రమే అని నిశ్చయంగా భావించి పవహారీ బాబా శిష్యరికం   వద్దనుకొన్నాడు  పరమహంస శిష్యుదయ్యాకకూడా పహారీ బాబా ప్రభావం వివేకానడునిపై పోలేదని పరమహంస తర్వాత పహారీ బాబా మాత్రమె గొప్పవాడని చెప్పేవాడని సిస్టర్ నివేదిత చెప్పేది .బాబాపై ఒక పెద్దవ్యాసం రాసి స్వామి ప్రచురి౦చాడుకూడా .ఒకసారి స్వామి బాబా ను ‘’బోధనలతో సామాజిక సేవ చేయవచ్చుకదా ‘’అని అడిగితె ‘’’’భౌతిక సేవ మాత్రమె సేవ అనుకొన్నావా ?శారీరక క్రియలు లేకుండానే మనసులను బుద్ధిని ప్రభావితం చేయవచ్చు ‘’అని బదులిచ్చాడు బాబా Do you think that physical help is the only help possible? Is it not possible that one mind can help other minds even without the activity of the body?

Pavhari Baba to Vivekananda[1’’

Quotation

‘’Remain lying at the door of your Guru like a dog.’’అని వివేకానందకు బాబా బోధించాడు .అంటే గురువుపై అచంచల భక్తీ విశ్వాసాలు ఉంచాలన్న అర్ధం  అందులో ఉన్నట్లు  వివేకానంద వివరించాడు .

బాబా 1898లో ప్రాణత్యాగం చేసినట్లు సిస్టర్ నివేదిత తెలియజేసింది .స్వామి నిశ్చలానంద ‘’ the saint, having come to realize the approaching end of his earthly life, had offered his body as the last oblation to the Lord, in an act of supreme sacrifice.’’అని అంజలి ఘటించారు . .పహారీబాబా మరణవార్త స్వామి వివేకానందకు ఆల్మోరాలో ఉండగా చేరింది .

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’మరియు వికీపీడియా

సశేషం

శ్రీ సుబ్రహ్మణ్యషష్టి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 10-ఖోజేజీ స్వామి

మహా భక్త శిఖామణులు

10-ఖోజేజీ స్వామి

జీవితమంతా హరినామ సంకీర్తనతో గడిపిన ఖోజేజీ స్వామి ఉత్తరభారతానికి చెందినవాడు .తన అవసాన దశ దగ్గరకు వచ్చిందని గ్రహించి ఒకరోజు శిష్యులను దగ్గరకు పిలిచి ‘’నేను ఈలోకం వదిలి వైకు౦ఠానికి వెళ్ళే సమయమొచ్చింది .నేను వైకుంఠం చేరగానే ఆశ్రమం లోని శంఖం ఘంట ,ఇతరవాయిద్యాలు వాటంతటికి అవే మ్రోగుతాయి .ఆ శుభ ధ్వని విని ,నా దేహానికి అంత్యక్రియలు చేయండి ‘’అని చెప్పాడు .కొద్ది నిమిషాలలోనే స్వామీజీ ప్రాణాలు వదిలాడు .కాని శుభానాదం వినిపించలేదు .ఆశ్రమంలోని వాయిద్యాలన్నీ ఎక్కడపెట్టినవి అక్కడే ఉన్నాయికాని వాటిలోంచి నాదం రానేలేదు .శిష్యులదుఖానికి అంతం లేదు విశుద్ధవర్తనుడు నిర్మలమనస్కుడు ఐన స్వామి వైకుంఠం తప్పక చేరతాడని వారి విశ్వాసం కాని ఇప్పుడా సూచన కనిపించలేదు .ఈ స్వామితో సమానుడైన శిష్యుడు యోగానంద సరస్వతి ప్రక్క ఊరిలోనే ఉంటె వెళ్లి తెలియ జేయగా ఆయన హుటాహుటిన వచ్చాడు .స్వామి పార్ధివ దేహానికి నమస్కరించి శిష్యులు చెప్పిందంతావిని ,ఆశ్రమం నాలుగు మూలలా పరికించి చూశాడు .అక్కడ ఉన్న మామిడి చెట్టు,దానికి పండిన పండు  చూసి ‘’’’మన గురూజీ వైకుంఠం చేరలేక పోయారు .అందుకే శంఖధ్వని వినబడలేదు .దీనికి ఒక కారణం కనిపిస్తోంది .దేహ త్యాగ సమయం లో ప్రాణికి దేనిపైన అయిన భోగేచ్చ కలిగితే  వెంటనే దానికి అనుకూలమైన చోట శరీరం ప్రవేశిస్తుంది .మనసు పూర్తిగా స్వాధీనమై కోరికలు పూర్తిగా నశిస్తేనే పునర్జన్మ ఉండదు .లేకపోతె పునరపి జననం పునరపి మరణం తప్పదు.ఈ మామిడి చెట్టుకున్న పండుమీద స్వామి  వాంఛ ఉండటం చేత ,అది ఆపండుమీదే వాలి ఉంది .ఆయన పునర్జన్మ కూడా అందులోనే ఉన్నది .ఆపండుకోసి తెచ్చి ,రెండు ముక్కలు చేసి చూడండి .అందులో మనస్వామి పురుగుగా ఉండటం గమనిస్తారు ‘’అన్నాడు .

  యోగానందుడు చెప్పినట్లే శిష్యుడు మామిడి పండు కోసి తెచ్చాడు .యోగానంద జాగ్రత్తగా పండును రెండుముక్కలు చేయగా ఆయన చెప్పినట్లే ఒక పురుగు అందులో కనిపించింది .వెంటనే ఆపురుగు చచ్చిపోయింది .ఆ వెనువెంటనే వైకు౦ఠపతి శ్రీ మహా విష్ణువు దివ్య రధం లో కూర్చుని క్షణకాలం దివ్య దర్శనమిచ్చి అంతర్ధానమయ్యాడు  .ఆ వెంటనే ఆశ్రమం లోని స్వామి శంఖం,ఘంటం  మొదలైన వాయిద్యాలు దివ్య నాదం చేశాయి .ఆచార్య శేఖరుడు వైకు౦ఠం చేరాడని చాలా సంతోషించారు శిష్యబృందం .తర్వాత స్వామి పార్ధివ దేహానికి అంత్యక్రియలు చేశారు .

మరణ సమయం లో ఎకోరిక ఉంటె ఆకోరిక తీరేదాకా మరో జన్మ ఎత్తుతారని మన శాస్త్రాలు భగవద్గీత చెప్పాయి .కనుక  అంత్య సమయంలో  చిత్తం ఈశ్వరా౦కితం గా ఉంచుకోవాలని ఒక సూచన ఇందులో ఉన్నది .

11-లాలాచార్య స్వామి

 భగవద్రామానుచార్యుల వారి ముఖ్య శిష్యుడు , అల్లుడే లాలాచార్యస్వామి .గురువే దైవం అని సంపూర్ణంగా నమ్మినవాడు .పరమభాక్తాగ్రేసరుడు .ఒకరోజు నది ఒడ్డున తిరుగుంటే ఒక శవం కొట్టుకు రావటం చూసి ,దానికి అంత్యక్రియలు చేయాలనుకొన్నాడు .నదిలో దిగి శవాన్ని వీపుమీద మోసుకొని వచ్చి తన ఇంటికి తీసుకువెళ్ళి  పుష్పాలతో శయ్య తయారు చేసి దానిపై పడుకోబెట్టి వైష్ణవ సంప్రదాయం లో అంత్యేష్టి  చేశాడు .స్నానం చేసి ఇంటికి వెళ్లి ఆ అపరిచితునికి  శ్రాద్ధం  కూడా పెట్టి ,బంధు మిత్రులను  భోజనాలకు పిలిచాడు లాలా .ఎవడో కోన్ కిస్కా కు ఈ పనులు చేయటమేమిటి అని ఎవ్వరూ వెళ్ళలేదు .మనసులో మిక్కిలి బాధపడి గురువు రామానుజులకు నివేదించాడు.’’నువ్వు చేసింది మహత్తర కార్యం .మూర్ఖులు నీ గొప్పతనం గుర్తించలేరు విచారించక ,ఇంటికి వెళ్ళు ‘’అని ఊరడించాడు .

  లాలాచార్య ఇంటికి వచ్చి ఒక అద్భుత దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు .ఇంట్లో ఎందరో అతిధులు దివ్యకాంతి శరీరులై  ఊర్ధ్వపుండ్రా లతో పరమ వైష్ణవ శిఖామణులుగా గోచరించారు .వారంతా పరవశంతో విష్ణునామ సంకీర్తనం చేస్తూ ఆనందంతోనృత్యాలు చేస్తున్నారు .ఇంట్లో వండి న భక్ష్య భోజ్య  లేహ్య  చోష్యాలను కడుపారా వారంతా భుజించారు .ఇదంతా తన గురుమహిమాకటాక్షంగా భావించాడు లాలా చార్య .ఈ కోలాహలం చూసి ,ఇరుగు పొరుగు వారు వచ్చి చూసి దివ్య సుందర విగ్రహాకారులు భోజనం చేయటం గమనించి అమితాశ్చర్య పడ్డారు .లాలాచార్య తమను ఎంతో మర్యాదగా భోజనాలకు ఆహ్వానిస్తే తూలనాడి తిరస్కరించి వెళ్లకపోవటం తప్పు అని గ్రహించి ఆయన పాదాలపై వ్రాలి క్షమాపణ కోరారు .అప్పుడు లాలా ‘’దుఖి౦చకండి .ఆమహాత్ములు తిని వదిలేసిన ఉచ్చిస్టం భుజించి అన్ని దుఖాలను చింతలను పోగొట్టుకొని పరమానంద విభూతి పొందండి ‘’అన్నాడు .వారంతా మహా ప్రసాదం అని అలాగే తిన్నారు .

  ‘’అనాధ ప్రేత సంస్కారం కోటి యజ్ఞఫలం ‘’అని మనం సూక్తి వల్లిస్తాంకాని ఆచరణ లో అవలంబించం .శవాన్ని చూస్తేనే పాపం అన్నట్లు ,ముట్టుకొంటే ఏదో మునిగిపోయినట్లు భావిస్తాం .శవంతో స్మశానానికి వెళ్ళటం నేరం ఘోరం అనుకొంటాం .ముస్లిం సోదరులు ఇందులో గొప్ప ఆదర్శంగా ఉంటారు .శవ పేటిక మోయటం పవిత్ర కార్యంగా భావిస్తారు .మన దక్షిణ దేశంలోకంటే ఉత్తర హిందూ దేశం లో శవాలను మోయటానికి ఏ పట్టింపూ ఉండదు .పిల్లా జెల్లా పిన్నా పెద్దాఅందరూ  ఆపని చేసి ఎంతో సంతోషిస్తారు.అది తమ విధిగా ఎంచుకొంటారు  . ఆ విశాల  హృదయం అందరికీ ఉండాలని కోరుకొందాం .

శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 8-మౌనీ బాబా

మహా భక్త శిఖామణులు

8-మౌనీ బాబా

బెంగాల్ నదియా జిల్లా  అజుదియా గ్రామంలో 1856లో శివనాథ ఘోష్ కు మౌనీ బాబా జన్మించాడు .తండ్రి హరి భక్తుడే కాని పోలంపుట్రా నగలు నట్రా లేని బీదసంసారి .కుటుంబ పోషణకోసం సాబ్నా పట్టణం చేరి కొంతదబ్బు సంపాదించాడు .పెద్దకొడుకు ప్యారేలాల్,చిన్నవాడు కున్జులాల్ ప్రభుత్వబడిలో చదివారు  .అందులో ఒక బ్రహ్మసమాజీయ ఉపాధ్యాయుడు ప్యారేలాల్ తెలివి తేటలు గుర్తించి’’కోపం పనికి రాదనీ సత్వగుణం మంచిదని పరస్త్రీని తల్లిలాగా చూడాలనీ  .ధర్మం మాత్రమె చనిపోయాక వెంటవస్తుందని  .ధర్మమే అన్నిటినీ కాపాడుతుంది ‘’‘’అనీ తత్వ బోధ చేసేవాడు  .ఇలా జ్ఞానామృతం పొందిన ప్యారేలాల్ ,తమ్ముడితోకలిసి మనో వికాసం పొందాడు .బ్రహ్మసమాజ ప్రార్ధనలలో పాల్గొని జ్ఞాన విజ్ఞానాలు పెంచుకొన్నారు .ఈ సోదరులను హిందూ మతం వెలి వేసింది .

  తమ్ముడిని చదివించాలని అన్న ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు .జల్పాయి గురి లో కొంతకాలం పని చేసి ,తర్వాత రంగాపురం లో ఇంగ్లీష్ పాఠ శాల హెడ్ మాస్టర్ అయి చాలాకాలం పని చేశాడు .పెళ్లి చేసుకొని కాపురం రంగాపురం లో పెట్టాడు .సోదరికూడా వీరితో ఉండేది .సంసారం చేస్తున్నా , జ్ఞాన వికాసం కోసం అర్ధరాత్రి లేచి ధ్యాన సమాధి లోకి వెళ్ళిపోయేవాడు .రోజుకు మూడు నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోయేవాడు కాదు .సామాన్య ఆహారమే తినేవాడు .ఉపవాసాలెక్కువగా ఉంటూ ,తర్వాత జీవితంపై చింతనతో గడిపేవాడు .12ఏళ్ళతర్వాత భార్య చనిపోయింది .వైరాగ్యభావం ప్రవేశించింది .మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు ఒత్తిడి చేస్తే ,తనను మళ్ళీ సంసారకూపం లోకి లాగవద్దని చెప్పేవాడు .తమ్ముడు ప్రయోజకుడై ధనం తగినంత సంపాదించాడు .ఇంటిబాధ్యత అతనికి అప్పగించి యోగ సాధనకోసం ప్యారేలాల్ చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు .

  మూడేళ్ళు చిత్రకూట్ లో గడిపి తర్వాత రమ్యమైన ప్రకృతికి ఆలవాలమైన ఓంకార్ నాథ్ పర్వతం  చేరి  ,అనువైన ప్రదేశం లో తపస్సు ప్రారంభించి ఎండ వానల్లో నిద్ర ఉండీ లేక ,తినీ తినక  తీవ్ర తపస్సు చేశాడు .యోగాసనం నుంచి అతడు లేవటం ఎవరూ చూడలేదు .ఇతని కఠోర సాధన, తపస్సు గమనించి లక్ష్మీ నారాయణ్ అనే మార్వాడీ ,ఆపర్వత౦  పైనే ఒక గుహను వసతులతో ఏర్పాటు చేసి అందులో ఉంచాడు .తపస్సు కు ఎట్టి ఆటంకమూ లేకపోవటంతో ,మరింతఘోర తపస్సు చేయగలిగాడు .ఎవ్వరితోనూ మాట్లాడకుండా నిరంతరం మౌనంగానే గడిపాడు .ప్రజలలోకి వెడితే భంగం కలిగిస్తారని  గుహ వదిలి  వెళ్ళేవాడుకాదు.ఆరునెలలు గడిచాక అతని గొప్పతనం గుర్తించి అందరూ ‘’మౌనీ బాబా ‘’  అని పిలవటం మొదలు పెట్టారు .అతని ఆస్తి మూడు ఇత్తడి చెంబులు,ఒక చర్మపు ముక్క ,ఒక రాతిపలక .తోలుముక్కపై పడుకొని రాతిముక్కను దిండుగా వాడుకొనేవాడు .

   అతన్ని చూడాలని జన ప్రవాహం వచ్చి గుహ ద్వారం వద్ద నిలబడేవారు .రోగవిముక్తికి తత్వజ్ఞానానికి ,సిద్ధికి,జ్ఞానోపదేశానికి  జనం వచ్చేవారు .ఆ మార్వాడీ ‘’నేను నిరుపేదను బాబా కృప వలన మహా ధనవంతుడనయ్యాను .నా ఐశ్వర్యం అంతా నౌనీ బాబా యే’’అనేవాడు .ఓంకారనాథ దేవాలయ అర్చకుడు మౌనీబాబా వంటి తపస్సంపన్నుడిని తాను  అంతవరకూ చూడలేదని చెప్పేవాడు .కొద్దిగాపాలు కొంచెం, మారేడు ఆకులపసరే ఆయన ఆహారం .ఇలా చాలాకాలం గడిచాక శరీరం శుష్కించి ఎముకల పోగుగా మారాడు .1896లో 40 ఏళ్ళ చిన్నవయసులోనే సిద్ధిపొందాడుమౌనీబాబా ‘.

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

శ్రీ సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 7-అప్పాస్వామి

మహా భక్త శిఖామణులు

7-అప్పాస్వామి

తమిళనాడుకు చెందిన అప్పాస్వామి అసలుపేరు ‘’మరుల్ నీకియార్ ‘’.తండ్రి పులగానార్ .తల్లి మతినియార్ .అప్పా అక్క తిలాతవధియార్ ను కలిప్ప హయ్యార్ అనే పల్లవరాజు సైన్యాదికారికిచ్చి  పెళ్లి  చేయాలనుకోగా ,అతడు ఉత్తర దేశం నుంచి వచ్చిన ఒక వీరుడిని ఎదుర్కొని పోరాడుతూ చనిపోయాడు .ఈలోపే ఈపిల్ల తలిదండ్రులూ చనిపోయారు .బాలిక సతీ సహగమనం చేద్దామని ప్రయత్నించింది ,కాని ఉన్న ఒక్కగానోక్కతమ్ముడు  దిక్కులేని వాడైపోటాడని ప్రయత్నం విరమించుకోన్నది .అప్పాఆలోచనలు వయసు వచ్చినకొద్దీ తత్వ జిజ్ఞాసపై మరలింది .అప్పటికి మంచి ఊపులో ఉన్న జైనమతం ఆకర్షించి ,జైనతీర్ధం  పుచ్చుకొని గ్రంథాలు బాగా పఠింఛి ,అనంత జ్ఞాన సంపన్నుడయ్యాడు .తర్వాత పాటలీ పుత్రం వెళ్లి ,తనప్రతిభ చూపి జైనసంఘానికి ఆధ్యాత్మిక నాయకుడయ్యాడని ఒక కథ ప్రచారం లో ఉంది .

  తమ్ముడిలా మత  భ్రస్టుడయ్యాడని అక్క చాలా విచారించి ,స్వగ్రామం లో ఉండలేక కేటిలాం నదీ తీరాన ఉన్న ‘’తిరుఅతి కై ‘’అనే శైవ క్షేత్రం చేరి ,పరమ శివారదనలో గడిపింది .కాని తమ్ముడు తిరిగి వస్తాడన్ననమ్మకం ఆమె మనస్సులో గాఢంగా ఉంది .ఆమె ప్రార్ధన పాలించి నట్లుగా ,పాట్నాలో సుఖ జీవితం గడుపుతున్న తమ్ముడికి ఒక రోజు కడుపులో భరింపరాని బాధకలుగగా,జైన సన్యాసులు ఎన్నో మంత్రాలు మందులతో తగ్గించే  ప్రయత్నాలు చేసినా బాధ పెరిగిందేకాని తగ్గక ,మరణబాద అనుభవించి ,దూరాన ఉన్న  దిక్కులేని అక్క గుర్తుకు వచ్చి ,కన్నీరు జలజలా ఏరులా ప్రవహించగా ,చివరికి అక్కకు ఒక పరిచితుడిద్వారా కబురు చేశాడు  .

    ఆ కబురు విన్న అక్క తాను  అన్యమతం వాడి ముఖం చూడనని ,ఆప్రదేశానికి రాన నీ ఖచ్చితంగా ప్రత్యుత్తరం పంపింది .అతనిలో మార్పు వచ్చి మతాన్ని వదిలేసి ,అక్క అనురాగం పొందాలని తపించి ,ఆలస్యం చేయకుండా ,అక్క ఉన్న చోటుకు వెళ్లాలని నిశ్చయించి ఒక అర్ధరాత్రి జైన దుస్తులు తీసిపారేసి ,భిక్షాపాత్ర, నెమలికన్నులు ఆశ్రమంలో వదిలేసి అక్క ఉన్న చోటికి ఎవరికీ తెలియకుండా బయల్దేరి వెళ్ళాడు .దారిలో కడుపులో బాధ మరింత పెరిగి,చివరికి తిరు అతి కై చేరి అక్కపాదాలపై పడి’’నీకు ద్రోహం చేసిన పాపిని క్షమించు అక్కా ‘’అని ఏడ్చేశాడు .అక్క మనసుకరికి అక్కున చేర్చుకొని తమ్ముడిని ఊర డించి ధైర్యం చెప్పి,లేవదీసి ముఖాన భస్మం రాసి దేవాలయ గర్భాలయ౦లోకి తీసుకువెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయించి,శివ ప్రార్ధన చేయించింది .ప్రార్ధన పూర్తికాగానే అతడి ఉదర వ్యాధి తగ్గిపోయింది .ఇది శివమహిమ అని నమ్మకం కలిగి ఆనంద పారవశ్యంపొందాడు  .అకస్మాత్తుగా అతని నోటినుంచి మధుమదురమైన శివ భక్తి గీతాలు వెలువడినాయి .అతని రచనలో ఇవే చాలా ఉత్కృష్టమైనవిగా భావిస్తారు .

    ఆకాలం లో దక్షిణ దేశంలో కొలేరూన్ నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలన్నీబలసంపంనులైన  పల్లవరాజుల ఆధీనం లో ఉన్నాయి . అప్పటి రాజు ‘’కదవ ‘’జైనమతావలంబి .కనుక యువ శివస్వామి అప్పాస్వామిని అన్ని రకాలబాధాలకు గురి చేయమని ఆజ్ఞ జారీ చేశాడు .కాని వినకపోతే తనదగ్గరకు తెప్పించుకొవాలని భావించి భటుడికి చెబితే తనవల్లకాదని అంటే మంత్రినే పంపగా రాజు మనసు మార్చాలని స్వామి వెంట వెళ్ళాడు .యువ స్వామిని కొట్టించాడు సున్నపు బట్టీలలో దొర్లించాడు ,సముద్రంలోకి విసిరేయి౦ చాడుకాని అతనికి ఏమీకాలేదు యోగికనుక నీటిపైతేలి ,భక్త ప్రహ్లాదునిలాగానే శివభక్తి మహిమతో ‘’తిరుప్ప తిరి పులియూర్ ‘’తీరం చేరాడు  .పై సంఘటనలో ఆతడు శివమహిమలను కీర్తిస్తూ రాసినవన్నీ బహుళ ప్రచారమయ్యాయి .చివరికి కేతిలాం నది దాటి ఉన్న చోటుకు చేరాడు .పల్లవ కదవ రాజు స్వామి మహిమ గ్రహించి జైనం వదిలి శైవం స్వీకరించి స్వామి శిష్యుడయ్యాడు .జైనమందిరాలు పడగొట్టించి శివాలయాలు కట్టించాడు .తిరు అతి కై లో గొప్ప శివాలయం  నిర్మించాడు పల్లవరాజు .

   అక్క దగ్గర కొంతకాలం గడిపి తీర్ధ యాత్రలు చేస్తూ ,చిదంబరం వెళ్లి ,నటరాజ స్వామి సన్నిధిలో భక్తిభావబందురపద్యాలు , గేయాలన్నో రచించాడు .అవి ఇప్పటికీ ప్రజలనాలుకలమీద నర్తిస్తున్నాయి .తర్వాత కావేరి నదీ తీరశైవాలయాలన్నీ ,తంజావూరులోని ‘’శియాలీ ‘’తో సహా సందర్శించాడు  .తి౦గలూరులో’’అప్పుధి’’అనే బ్రాహ్మణ సాధువు ను దర్శించగా స్వామి వెల్లాల కులం వాడని తెలిసినా ఆదరంగా ఆదరింఛి ఆతిధ్యమిచ్చాడు .ఈ ఇద్దరి కలయిక తమాషాగా జరిగింది .సాదువుకొడుకుకు పాము కరిస్తే అప్పాస్వామి మంత్రం తో నయం చేసి బ్రతికించాడు .అక్కడి నుంచి అప్పాస్వామి కీర్తి దశదిశలా బాగా వ్యాప్తి చెందింది .

   తర్వాత తంజావూర్ జిల్లా తిరుఆరూర్ చేరి ,అక్కడినుంచి పంప కాలూర్ వెళ్లి స్థిరంగా ఉన్నాడు .చాలామంది సాధువులతో పరిచయమేర్పడింది .సంబంధర స్వామి తో కలిసి అప్పాస్వామి తిరు ఆరూరు కు దక్షిణాన వున్న క్షేత్రాలన్నీ దర్శించాడు .పురాతనమైన వేదారణ్యం వెళ్ళగా  అక్కడి దేవాలయం తలుపులు చాలాకాలం నుంచి మూసే ఉంచారని తెలిసి౦ది .వేదాలు స్వయంగా వచ్చి ఇక్కడి శివుడిని దర్శించి పూజించేవి .అలాంటి ఆలయం మూయబడి ఉండటం బాధకలిగింది .వేదాలుకూడా వచ్చి పూజించటం మానేశాయట. సంబందార్ అప్పాస్వాములిద్దరూ ఆలయం బయటద్వారం వద్దే నిలబడి భక్తిగా శివస్తోత్రాలు పరవశంగా గానం చేశారు .అప్పాస్వామి మధుర మంజుల స్వరంతో మహేశ్వరుని కీర్తించాడు .అప్పాస్వామి పదవ గేయం ముగించగానే ఆలయం ద్వారాలు వాటంతటికి అవే తెరుచుకొని ఆశ్చర్యం కలిగించాయి .సంబంధస్వామికూడా ఆర్తిగా ఒక గేయం రచించి గానం చేశాడు  .ఒకొక్క  గేయానికి ఒక్కొక్క తలుపు తెరచుకొని మూసుకున్నాయట .స్వాములగానం జరుగుతున్నంతవరకూ ఇలా తలుపులు తెరుచుకొంటూ మళ్ళీ మూసుకోవటం మహా వింతగా ఉన్నది .ఇదంతా వేదం మహిమ ,భక్తిగరిమ తెలిపే విషయం .ఆలయ ప్రవేశం చేసి స్వామి దర్శనం తో పులకించి బయల్దేరారు ఈస్వాములిద్దరూ .

  అప్పాస్వామి తంజావూర్ జిల్లా ‘’తిరుప్పన్ తిరుతి ‘’ లో ఉంటుండగా ఒకరోజు సంబంధస్వామి పల్లకీలో వచ్చాడు .అప్పాస్వామి ఎదురువెళ్ళి తానూ శిష్యులతోపాటు పల్లకీ మోశాడు . ,ఇది తెలియని సంబంధస్వామి ‘’అప్పాస్వామి ఎక్కడ ?’’అని ప్రశ్నించాడు ..’’స్వామీ ఇక్కడే మీ పల్లకి మోస్తున్నాను ‘’అన్నాడు .కంగారుగా పల్లకి దిగి సంబంధస్వామి ,ఆనంద బాష్పాలు కారుస్తూ అప్పాస్వామిని కౌగలించుకొన్నాడు .మహాత్ములు యెంత వినమ్రంగా ఉంటారో తెలియేసే సంఘటన ఇది.

  అప్పాస్వామి శైవ విజ్ఞానం ఆకళింపు చేసుకోవాలని దేశపర్యటన చేశాడు .కైలాసపర్వతం ఎక్కాడు .కొంత దూరం వెళ్లేసరికి ఆశరీరవాణి’’మహాత్మా !నువ్వు శిఖరం ఎక్కనక్కరలేదు .కావేరి తీరం లోని ‘’తిరు యియూరు ‘’చేరి ,శివుని తపస్సులో ధన్యుడవై చరితార్డుడవు  కావలసినది ‘’అని చెప్పింది .ఆమాటప్రకారం మళ్ళీ ఆప్రదేశానికే చేరి తపస్సు చేశాడు పరమా శివుడు పార్వతీ  సహితంగా పరమ సంతోషంతో ప్రత్యక్షమవగా  పరవశంతో ఇద్దరిపై అనేక కీర్తనలు అలవోకగా చెప్పాడు .అవన్నీ గొప్ప ప్రాచుర్యం పొందాయి .

  అప్పస్వామి భక్తీ పరీక్షకు అనేక సందర్భాలు ఏర్పడ్డాయి .పంపకాలూరులో శివ సేవకు వెడుతుంటే దారిలో బంగారు రాసులు వజ్రాల రాసులు కనిపించాయి .వాటిపై పై దృష్టిపెట్టక శివధ్యానంతో ఆలయం చేరాడు .మరోసారి గ౦ధర్వ స్త్రీలు అతని దగ్గరకొచ్చి ప్రలోభ పెట్టారు .కన్నెత్తి చూడక పశుపతి స్మరణే చేశాడు .ఆలయ ప్రాంతం లోని కలుపు మొక్కలను పీకేసేవాడు ,మట్టిని చదును చేసి పూలమొక్కలు నాటి నీరు పోసి పెంచేవాడు .శివభక్తిలో అతడు తరించాడు .అంతాశివమయంగా భావించాడు .

  అప్పాస్వామి రచించిన పద్యాలు గేయాలు మూడువందలున్నాయి .ఇవి మూడుగ్రంథాలుగా ప్రచురణ పొందాయి .తమిళ శైవ వాజ్మయం లో’’తిరుమురై’’అని ప్రసిద్ధిచెందిన 12గ్రంథాల సంపుటిలో అప్పాస్వామి రచించిన పైమూడు గ్రంథాలు ఉన్నాయి అంటే అతడు ఎంతగొప్ప శివభక్తుడో ఎంతై మహాకవియో అర్ధమౌతుంది .

  ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అన్నపూర్ణమ్మకు అక్షరాంజలి* పంచ ప్రక్రియ మీద వ్రాసిన సమీక్ష

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు గోరసం మూడవ పరస్పర సహకార సంకలనం శ్రీమతి డొక్కా శీతమ్మ గారికి *అన్నపూర్ణమ్మకు అక్షరాంజలి* పంచ ప్రక్రియ మీద వ్రాసిన సమీక్ష, రాజమహేంద్రవరంలోని సరికొత్త సమాచరం వారపత్రికలో…

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 5-కుపరాబాయి

మహా భక్త శిఖామణులు

5-కుపరాబాయి

పురోహితుడి కూతురు కుపరాబాయి .ఈ పిల్ల పుట్టకముందు సంతానం కోసం తల్లి తండ్రులు చాలానోములు వ్రతాలు చేశారు .ద్వారకానగరానికి వెళ్లి శ్రీ కృష్ణ  సేవ చేశారు .కృష్ణ కృపవలన కుపరాబాయి పుట్టింది .తల్లి పురుటినొప్పులతో బాధ పడుతుంటే, కృష్ణుడే మంత్ర సానిగా వచ్చి సేవ చేశాడని జనంలో నమ్మకం ఉంది .పుట్టిన పిల్లకు ఆయనే శ్రీ కృష్ణ మంత్రం ఉపదేశించాడనీ అంటారు .తలిదండ్రుల భక్తీ ఆమెకూ అబ్బి నిరంతరం భగవధ్యానంలో గడిపేది .ద్వారక నుంచి తలిదండ్రులు స్వగ్రామం చేరారు .

  దినదిన ప్రవర్ధమాన అయిన కూతురు కుపరాబాయికి యుక్తవయసు రాగానే తగిన వరునితో పెళ్లి చేశారు ,కాపురానికి అత్తవారింటికి పంపే ప్రయత్నం చేస్తుంటే ,సంసార జీవనం ఇష్టం లేక ,ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పెట్టి వెళ్లి, అనేక తీర్ధ యాత్రలు చేసి,ద్వారక చేరింది .అక్కడ శ్రీ కృష్ణ నామ సంకీర్తనతో కాలం గడిపింది .కొంతకాలం తర్వాత ఆమెను వెతుక్కుంటూ తండ్రి ద్వారకవచ్చి కూతుర్ని చూసి ఆనందించి తల్లి బెంగతో ఉందని ఇంటికి రమ్మని కోరాడు .కాదనలేక  వెళ్ళింది కాని మనసంతా కృష్ణుడే నిండి ఉన్నాడు .

  కూతురి ప్రభావం తలిదంద్రులమీద పడి వాళ్ళిద్దరూ కూడా హరినామస్మరణతో రోజంతా గడిపేవారు .ప్రజలలో కుపరాబాయి భక్తీ విశేషం బాగా వ్యాపించి ఆమె దర్శనం కోసం రోజూ వందలాది మంది వచ్చి ప్రభావితులయ్యేవారు .పాలనా చేసేవారూ ఆమెకు భక్తులయ్యారు .భక్తి మహాత్మ్యం వాలన వాళ్ళ కష్టాలు బాధలు తొలగి పోయేవి .ఆమె సాన్నిధ్యం లో అందరికీ పవిత్రత చేకూరింది .అంతటి ప్రభావం ప్రజలపై కలిగించింది కుపరాబాయి .

6-గుణవతిబాయి

ఉత్తర హిందూస్థాన్  లో ఒక చిన్నరాజ్యం పాలించే క్షత్రియరాజుభార్య గుణవతి బాయి .ఈమె దాసీలలో పరమభక్తురాలు ఒకామె ఉండేది .సేవచేస్తూనే మనసులో నిరంతరం భగవధ్యానం చేసేది .దాసీ భక్తికి ఆశ్చర్యపోయి రాణి తానుకూడా భక్తిలో గడపాలను కొంటున్నానని దాసికి తెలిపింది .ఆమె సంతోషంతో శ్రీకృష్ణమంత్రం రాణికి ఉపదేశించింది .మంత్రోప దేశ ప్రభావంతో రాణి నిరంతరం హరినామ స్మరణలోనే గడిపేది .సంసారం పై వ్యామోహం కలగలేదు .రాజుకు ఈమె ధోరణి నచ్చలేదు .ఆమె భక్తితో పాటు ,ఈతని కోపం కూడా హెచ్చింది .అయినా తనపూజాదికాలు మానలేదు .

   బైరాగులు వచ్చి ఆమె మనసు  చెడ గొడుతున్నారేమో అనే అనుమానంతో ఎవరినీ కోటలోకి రాకుండా రాజు కట్టడి చేశాడు .జాగ్రత్తగా చూస్తూ ఉండమని మంత్రికి చెప్పి ఒకరోజు రాజు వేటకు వెళ్ళాడు .రాణి గుణవతిబాయి యధాప్రకారం భజన పూజలు చేస్తూనే ఉంది .మంత్రి అడవికి వెళ్లి రాజుకు నివేదించాడు .తోక తొక్కినపామే అయిన రాజు తనమాటను ధిక్కరించినందుకు రాణి పై అసహనంతో ఆమె పీడవదిలి౦చుకొందామని నలుగురు భటులను ఆమెను చంపటానికి పురమాయించాడు .అడవినుంచి కోటకు వచ్చిన ఆ నలుగురు రాణి తీవ్ర ధ్యానమగ్నమై ఉండినందువల్ల దగ్గరకు వెళ్ళే సాహసం చేయలేకపోయారు .ఇంతలో వాళ్ళ హృదయాలలో ఏదో బాధకలిగి ,నలుగురూ కుప్ప గూలారు .ధ్యానం నుంచి బయటికి వచ్చిన రాణి వాళ్ళ దీనస్థితి చూసి ప్రేమతో వారికి సేవ చేసి  కారణం అడిగింది .ఆమె మాటలు వారికి అమృతం గా అనిపించాయి .ఆమె కన్నులనుండి దివ్య తేజస్సు ప్రసారమౌతున్నట్లు గ్రహించారు .వెంటనే ఆమె పాదాలపై వ్రాలి క్షమించమని కోరి, రాజు పంపిన విషయం చెప్పారు .

  కోటలో జరిగిన  వృత్తాంతం మంత్రి రాజుకు తెలియ జేయగా, రాజు తన చేస్టకుసిగ్గుపడి ,పశ్చాత్తాపం తో కోటకు వచ్చి,రాణి గుణవతి బాయి చేతులు పట్టుకొని తనతప్పు మన్నించమని కోరాడు .ఆమె ‘’మీరు ఇలా అనకూడదు .మీ మనసుమార్చినవాడు ఆ కృష్ణపరమాత్మ .ఆకృష్ణమంత్రం నాకు ఉపదేశించిమనదాసి పుణ్యం కట్టుకొన్నది ‘’అనగా తనకు కూడా మంత్రోపదేశం కావాలని కోరాడు .దాసిని పిలిపించి రాజుకు మంత్రోప దేశం చేయమని చెప్పింది. ఆ దాసీ వినయంగా ‘’మహా రాజా !మీకు మంత్రోపదేశం చేసే అంతటి దాన్నికాను .రాణీగారు కోరినప్పుడు కూడా ఈమాటే చెప్పాను .చివరికి రాణీగాఋ పట్టుబడితే ఉపదేశి౦చాను  మన్నించండి ‘’అన్నది .

 మంత్రోప దేశ ప్రభావం తెలుసుకొన్న రాజు దాసీని తనకు తప్పక శ్రీ కృష్ణ మంత్రం ఉపదేశించమని అర్ధించాడు .కాదనలేక ఉపదేశించింది .ఆమెను  పరిచారిక వృత్తి నుంచి విముక్తి చేసి కోటలోనే ఒక మందిరం ఏర్పాటు చేసి ధ్యానం చేసుకొనే వసతి కల్పించాడు .రాజు కూడా రాజకార్యాలతర్వాత కుటుంబంతో అక్కడే కృష్ణస్వామి పూజ భక్తీ శ్రద్ధలతో రోజూ చేసేవాడు  .దాసీకి  గురు పీఠంఏర్పాటు చేసి ఆమెకు తామంతా సేవకులుగా వర్తిల్లారు .రాణి గుణవతిబాయి అమితానందం పొందింది. ఇదివరకటికంటే ఎక్కువగా అతిధి అభ్యాగతులను ఆదరించేది .యోగులను దీనులను పూజించి సేవ చేసేది .ప్రజలుకూడా రాజు ,రాణీ లను అనుసరిస్తూ సత్కార్యాలు చేస్తూ  కృష్ణ ష్ణభక్తిలో తరించారు .

    పవిత్ర దా౦పత్యాన్ని కొన్నేళ్ళు అనుభవించి గుణవతీబాయి దేహం చాలించింది .గురుపీఠంలో ఉన్న దాసికూడా సిద్ధిపొందింది .రాజు కుమారుడికి రాజ్యమప్పగించి కోటలోని మఠంలోనే భగవధ్యానం లో రేయిం బవళ్ళు ఇహలోక ధ్యానం లేకుండా గడిపి సాయుజ్యం పొందాడు .కులం వృత్తి  ముఖ్యంకాదు గుణమే గరీయసి అని దాసీ నిరూపించి, గురుపీఠ అర్హత పొందింది .దీన్ని గుర్తించిన రాజు రాణీ గార్లుకూడా తదనుగుణంగా ప్రవర్తించారు .

. ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-19-ఉయ్యూరు

 .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 4-ఆవుల్ చాంద్ స్వామి

మహా భక్త శిఖామణులు

4-ఆవుల్ చాంద్ స్వామి

బెంగాల్ లో ‘’కర్తాభజ ‘’సంప్రదాయ స్థాపకుడు ఆవుల్ చాంద్ స్వామి .పార్శీ భాషలో దేవుడిని ‘’ఆవూలియా అంటారు .అందులోని పుట్టినపేరే స్వామి ది.ఆయన పుట్టుపూర్వోత్తరాలు తెలీవు .బెంగాల్ లో సుమారు 400ఏళ్ళక్రితం నదియా జిల్లా  ఉలా అనే గ్రామం లో మహాదేవ దాసు అనే శూద్రుడు ఉండేవాడు .తనకున్న తమలపాకు తోటలోని ఆకులను కోసి అమ్మి,కొద్దిపాటి వ్యవసాయమూ చేస్తూ  జీవనం చేస్తున్నాడు .ఒక రోజు మధ్యాహ్నం తోటలోలో పొదలదగ్గర  పసి పిల్లాడి ఏడ్పు వినిపించి ,చూడగా ,తోటమధ్య ఒక బాలుడు కూర్చుని ఏడుస్తున్నాడు .అతడిని ఊరు పేరు అడిగితె తనకేమీ తెలీదన్నాడు .పిల్లలు లేరుకనుక వాడిని ఇంటికి తీసుకు వెళ్ళాడు .అందమైన ఆపిల్లాడిని చూసి భార్యకూడా సంతోషించి పూర్ణ చ౦ద్ అనే పేరుబెట్టి పెంచారు .కుర్రాడికి అన్ని పనులు పురమాయించి చేయిస్తున్నాడు దాసు .ఏదైనా నాతేడావస్తే తిట్టటం కొట్టటం కూడా చేసేవాడు .ఓర్చుకొంటూ భగవధ్యానం చేసేవాడు బాలుడు .  ఆ ఇంటి ప్రక్క హరి భక్తుడైన హరిహరుడు అనే ఆయన ఇంట్లో సంకీర్తన జరిగేది .పూర్ణచంద్రుడు రోజూ వెళ్లి వినేవాడు .బుద్ధి చురుకైనదికనుక అక్కడ జరిగే వేదాంత చర్చలన్నీ అవగతం చేసుకొనేవాడు .కొద్దికాలం లోనే సంస్కృతమూ బాగా అబ్బింది .అందరు ఆకుర్రాడి తెలివి తేటలకు ,భక్తికి ఆశ్చర్యపోయేవారు .కాని పెంచిన హరిదాసు గుర్తించలేక పోయాడు .అతడి సతాయింపు వేధింపులతో ప్రక్కింటికి వెళ్ళే సమయం దొరికేదికాదు .కాని హరికీర్తనమాత్రం మానలేదు .ఇంటినుంచి వెళ్ళిపోదామని అనుకొన్నాడు. యజమాని గ్రహించి ఆపేశాడు .హరిహర ,పూర్ణ చంద్రులు నిర్విరామంగా హరి కీర్తన చేశారు .పెళ్లి చేసుకోమని గురువు చెప్పగా ,ఇష్టం లేక ఆఊరు వదిలి ‘’పులియా ‘’గ్రామం చేరాడు .అది బ్రాహ్మణ అగ్రహారం. విద్వాంసులకు నిలయం .వైష్ణవులకు ఆటపట్టు.మహా భక్తుడు  గౌరా౦గుని ప్రియ శిష్యుడు హరిదాసు ఒకప్పుడున్న   చోటు.ఆయనకట్టించిన మఠం ఇప్పటికీ ఉంది .బలరాం దాసు అనే భక్తుడు అక్కడ ఉండేవాడు .ఈయనవద్దకు చేరి తనప్రవర్తనతో మెప్పించి వైష్ణవాన్ని స్వీకరింఛి ‘’ఆవుల్ చాంద్’’పేరుతొ ప్రసిద్ధుడయ్యాడు .

  సంవత్సరన్నర కాలం అక్కడే ఉండి,బలరామ దాసు శిష్యులతో తూర్పు బెంగాలు కు వెడుతుంటే వెంట వెళ్ళాడు .కొంతకాలం అలాగడిపి, మళ్ళీ పులియా గ్రామం రాకుండా తీర్ధయాత్రలు చేశాడు .భారత దేశ పుణ్య క్షేత్రాలన్నీ సందర్శించి చివరికి వజ్రా అనే గ్రామంలో స్థిరంగా ఉండిపోయాడు .రోజూ భిక్షాటన చేసి వచ్చినదానిలో పేదలకు పంచి తానూ తినేవాడు .రోగార్తులను అన్నార్తులను ఆదరి౦చేవాడు ,జ్ఞానబోధలతో అందరినీ ఆకర్షించేవాడు .అతని హరినామ సంకీర్తన వినటానికి భక్తులు బాగావచ్చేవారు .అతని దైవబలం గొప్పది అవటం తో రోగుల బాధలు తీరేవి ,కంటి చూపు నోటిమాటకూడా వచ్చేవి .ఏ జబ్బైనా అతని సమక్షం లో నయమౌతుందనే నమ్మకం బాగా పెరిగింది .శిష్యబృందమూ పెరిగింది .అందులో హుటూ ఘోష్ ,బెబూ ఘోష్ లు ముఖ్యులు .

  రామశరణుడు అనే అతనికి శూలవ్యాదివస్తే ,ఆవుల్ చాంద్ నయం చేయాగా శిష్యుడైపోయాడు .సామాన్య గృహస్తు ఐన యితడు పెద్ద జమీందార్ దగ్గర మంచి ఉద్యోగం లో చేరి అభిమానం పొంది   ‘’ఉఖరా ‘’అనే పరగణాలో పెద్ద ఉద్యోగం పొందాడు  .ఈ ఉద్యోగం లో ఉండగానే శూలవ్యాది వచ్చింది మూర్చలుకూడా వచ్చేవి .ఆవుల్ చాంద్ ను శరణు వెడితే కమండల జలం ముఖం పై చల్లి  నయం చేశాడు .స్వామి శిష్యుడై అతని భావవ్యాప్తికి దోహదపడ్డాడు రామ శరణుడు.

  వంగశకం 1651వైశాఖ శుద్ధ పంచమినాడు సాయంత్రం సిద్ధిపొండాడు ఆవుల్ చ౦ద్ .సిద్ధి పొందేముందు బోయాలియా అనే గ్రామం లో శిష్యుడు కృష్ణదాసు వ్యాధితో బాధపడుతున్నాడని ,తనరాకకోసమే ప్రాణాలతో ఉన్నాడని తెలిసి ,అతన్ని చూడటానికి వెడుతూ అక్కడున్నవారిలో కొందరిని తనతో రమ్మనీ ఇక తాను అక్కడికి రానని పరలోకం వెడుతున్నానని చెప్పి కమండలం కాషాయం మాత్రమె తీసుకొని బయల్దేరాడు .కృష్ణదాసు మరణించాడు. స్వామికి జ్వరం వచ్చి చాలా రోజులుంది .తనకు అంత్యకాలం దగ్గరైందని గ్రహించి తనను ‘’తులసీ తలం ‘’తీసుకు వెళ్లి అక్కడ హరినామ కీర్తన చేయమన్నాడు .నామస్మరణ వింటూ, తానూ ఉచ్చరిస్తూ తన్మయం పొంది తన తుది శ్వాస వదిలాడు

   శిష్యులు స్వామి పార్ధివ దేహాన్ని ‘’పరారీ ‘’అనే పల్లెకు తీసుకు వెళ్లి సమాధి చేశారు .ఆయన దగ్గరున్న కాషాయ వస్త్రాన్ని బోయాలియా గ్రామానికి పంపారు .బ్రతికి ఉండగానే చిరిగిన శాటీని రామశరణుడికిచ్చాడు స్వామి.అది ఇప్పటికీ భద్రంగా అక్కడే ఉంది.స్వామికి ఉత్తరాదికారి గా రామశరణుడు ఆశ్రమ బాధ్యతలు చేబట్టాడు .కొద్దికాలమే బ్రతికి మరణించాడు అందరూకలిసి అతని వంశీయుడు ఈశ్వర చంద్రుని మఠాధిపతినిచేశారు  .తర్వాత ఇతనికొడుకు హరిదాసు ఆతర్వాత అన్నకొడుకు రసిక్ చంద్రుడు అయ్యారు .

  పతివ్రత అయిన రామ శరణుడి భార్యను ఆవుల్ స్వామి ‘’అమ్మా అని సంబోధి౦చేవాడు .ఆమె కీర్తి ఇప్పటికీ ప్రజలకు జ్ఞాపకం ఉంది .

   ఆవుల్ చాంద్ స్వామి బోధన సారాంశం –‘’ఏకమాత్ర పరమ స్వరూపుడైన శ్రీ కృష్ణుని ధ్యానించండి .ఇతర దేవతా దూషణ చేయవద్దు .ఆచార్యుని యెడ భక్తీ మనసులో ఆచరణలో చూపండి .ఉదయం ,సాయంత్రం ఉతికినబట్ట లే కట్టుకోండి .అతిధులను సేవించండి .హరినామ స్మరణ సత్కర్మా చరణ వదలకండి .అందర్నీ సోదరభావంతో చూడండి .అన్ని వేళల అన్ని చోట్లాసత్కాలక్షేపమే చేయండి .వైష్ణవ ధర్మాన్ని పాటిస్తూ,అందులోని మహాత్తునుప్రజలకు తెలియ జేయండి .మనసు నిర్మలంగా ఉంచుకోండి .ఉచితాహారమే తినండి .ఆత్మ సత్యం అని నమ్మండి .ధర్మ విషయాలను చర్చించండి ‘’

  స్వామీజీ నిషేధించిన క్రియలు –ఇతరుల సొత్తు అపహరి౦చ టం హత్య ,పరస్త్రీ పొందు .అబద్దాలాడటం ,కఠినవాక్కు వ్యర్ధ ప్రసంగాలు ,దురాలోచన .

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఈ శనివారం ఉదయం గారెల దండ స్వామి కి గారెల దండ

Posted in దేవాలయం | Tagged | Leave a comment

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత  కార్యక్రమం

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో 9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్వృతం త్రయాహ్నికంగా  7వతేదీనుండి నిర్వహింపబడును .భక్తులు విశేషంగా స్వామివార్ల పూజాకార్యక్రమం లో పాల్గొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించి  స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము .

     కార్యక్రమ వివరాలు
7-12-19 శనివారం  ఉదయం 5గం .లకు సుప్రభాతం అనంతరం  అష్ట కలశ స్నపన ,మ న్యుసూక్తముతో స్వామి వార్లకు అభిషేకం  ,నూతనవస్త్ర ధారణ
    ఉదయం 8 గం  లకు -గంధ సిందూరం ,చేమంతి పూలు ,వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర సహస్రనామ పూజ ,అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
8-12-19 ఆదివారం -ఉదయం 9 గం  లకు అరటిపండ్లు వివిధ ,ఫలాలతో విశేష అర్చన  అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి  -శ్రీ హనుమద్వ్రతం
  ఉదయం 9 గం కు పంపా కలశ పూజ,13ముడుల తోర పూజ  ,మంత్రం తో తోర ధారణ, తమలపాకులతో అష్టోత్తర సహస్రనామ పూజ
  అనంతరం శ్రీ హనుమద్వ్రత0 ,అయిదు కథల వివరణ – అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం  ,తీర్ధ ప్రసాద విని యోగం
                గబ్బిట  దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మకర్త -30-11-19
                                   మరియు భక్త బృందం
Posted in దేవాలయం | Tagged | Leave a comment

తెలుగుకు బదులు (నవ్వుతాలకి )

తెలుగుకు బదులు (నవ్వుతాలకి )

‘’ప్రాధమిక స్థాయిలో ప్రభుత్వం తెలుగు రద్దు చేసిందని గగ్గోలు పెట్టగా ,ప్రభుత్వం నా   ఆధ్వర్యం లో  ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించమని వారం గడువిచ్చి ,గంటకు లక్ష జీతం నాతం లలో నన్ను డైరెక్టర్ గా మరో పదిమంది ని రోజుకు లక్షజీతం తో ఏర్పాటు చేసింది .విషయాలన్నీ సాకల్యంగా పరిశీలించి మాతృభాష స్థానం లో తల్లిభాష అంటే బూతు భాష ప్రవేశ పెడితే అందరికీ నచ్చుతుందని  నిర్ణయించి  కొన్ని సూచనలు చేశాం .వీటిని ఈరోజునుంచే అమలు చేస్తే ఇక ఎవ్వరూ గొడవ చేయరు ఈ భాష అందరికీ అందుబాటు లోనే ఉంటుంది .సభ్యత పాటించి కొందరు ఆభాష మాట్లాడరు కానీ వారి నరనరానా ఉంటుంది .కోపం వస్తే కట్టలు తెంచుకొని ఉరుకు లేస్తుంది .ఇంతకంటే ఆల్టర్నేటివ్ మాకు కనిపించలేదు .ప్రజలంతా తప్పక పాటించి విజయం చేకూర్చమని కోరుతున్నాం .మా నివేదికలో ముఖ్యాంశాలు మీముందు పెడుతున్నాను .’’అన్నాడు కమీషనర్ .సభ్యులు చప్పట్లు కొట్టారు .

ఇక ముఖ్య విషయాలు చూద్దాం .1-ఇంట్లో ,బయటా అందరూ బూతులతోనే పలకరించుకోవాలి .బూతు అపవిత్రం కానేకాదు .తల్లీచేల్లీ అమ్మా నాన్న అందర్నీ తెగబూతులు తిట్టాలి .2-బడిలో రెచ్చిపోయి బూతులు మాట్లాడాలి .పంతుళ్ళు అడ్డం వస్తే పంచలు లాగేయ్యాలి .ఆడ మేస్టార్లు అడ్డం చెప్పినా అదే పని 3-కాలేజీలలో ఆడా మగా సెకండరీ స్థాయి దాటి బూతులతో చెలరేగాలి .4-యూని వర్సిటీ స్థాయిలో కాలేజీ స్థాయికంటే పై స్థాయి బూతుల దండకం వాడాలి .ప్రిన్సిపాల్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవ్వరైనా కేరే ఝాట్ గా ఉండాలి .కొత్తబూతులు కనిపెట్టి వాడాలి .సంస్కారం ఏ కోశానా అడ్డం రాకూడదు .’’తల్లి అక్క ,అమ్మా ఆలి ‘’భాషను గౌరవి౦చటమే మన విధి ,విధానం .దీనికి భిన్నంగా నడిస్తే తెలంగాణ శకుంతల అన్నట్లు ‘’పిసికి  చంపేయాలి .5-ఉద్యోగాల్లో మనం చెప్పిందే వేదం .కాదంటే శాల్తీలు లేస్తాయని చెప్పాలి .గౌరవం అనేమాట మన డిక్షనరీలో ఉండరాదు .అందర్నీ ఏరా ,ఒరేయ్ , ఏమే, ఒసే అనే పిలవాలి .దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నవారినైనా నిస్సంకోచంగా నిస్సిగ్గుగా ఏకవచనంతో సంబోధించాలి .ఇలామాట్లాడనివాళ్ళ నాలుకలు కోసెయ్యాలి .6-‘’ఏ రకమైన దీక్షల్లో’’ ఉన్న వాళ్ళయినా ,దీనికేమీ ఢోకాలేదు.అన్నీ ‘’ఆయనే ‘’చూసుకొంటాడు .12వ నంబర్  13వ నంబర్  భాషతప్ప ఇక ఏదీ వాడరాదు .

  6- ఈ భాషా ప్రోత్సాహానికి ఓరిఎంటేషన్ క్లా సులు తరచుగా జరపాలి.ట్రెయినింగ్ ఇప్పించాలి .ఇతర రాష్ట్రాల దేశాలవారిని పిలిచి గెస్ట్  లెక్చర్లు ఇప్పించాలి .మన వాళ్ళనూ  ఇతర దేశాలకు పంపి నేర్చుకోనేట్లు చేయాలి. దీనికి వీసా ఫీఉలూ అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది .దీనికొక ప్రత్యెక శాఖ మంత్రి వగైరా ఉండాలి  7-అసెంబ్లీ లో ఈ వాడకం తగ్గితే వెంటనే బర్త్ రఫ్ చేయాలి .8.మంత్రులు వాడకుంటే మహా నేరంగా భావించి సభాపతి సస్పెండ్ చేయాలి మార్షల్స్ తో బయటికి   ఈడ్పించాలి .సభాపతి అసలు ఆభాషలేకుండా సభాలోకాని బయట  ఎక్కడా కాని మాట్లాడితే సిఎం వెంటనే పీకి పారెయ్యాలి .ఇప్పటికే ఈ ఆరు నెలల్లో దీని వాడకం ‘’పీక్ లెవెల్ ‘’లో ఉంది .ఇంకా ఇంకా ఎదిగిపోవాలి .9-చీఫ్ సెక్రెటరి అయినా సేక్రటరీలైనా బూతు భయం తో వణికి పోవాలి. అప్పుడే అమలు బాగా జరుగుతున్నట్లు లెక్క .ప్రతిస్థాయిలోనూ ప్రోత్సాహకాలు అందించాలి .అవార్డ్ లు రివార్డ్ లు ఇవ్వాలి బిరుదులూ అందించాలి .ఎలిమెంటరీ లో ‘ బూతు ’కిశోర ‘’ సేకండరీలో ‘’బూతుబాల ‘’కాలేజీలో ‘’బూతుయువ ‘’డిగ్రీ ఆపైన ‘’బూతు మహా ‘’వంటి బిరుదులివ్వాలి ’10-ఉద్యోగులకు ‘’బూతు నవ రత్న’’ ‘’బూతేశ్వర్’’ బూతు మహాశయా ‘’వంటివి ఇవ్వచ్చు ఇంకా కావాలంటే ఇన్నో వేటివ్   గా ఆలోచించి  లేక మన ‘’పెద్దలను’’ సంప్రదించి జనసమక్షం లో పది వేలకు తక్కువ లేకుండా నగదు బహుమతులతో ఇచ్చి సత్కరించాలి .

  11-పాఠ్య గ్రంధాలలో బూతుకే ప్రాధాన్యత ,అశ్లీలతకే పట్టాభిషేకం గా ఉండాలి .ప్రత్యేక బూతు పుస్తకాలు రాయించి రచయితలను ప్రోత్సహించాలి .పాత పుస్తకాలు తగలెయ్యాలి .ఆ నీడ వాసనా ఇక పనికి రాదు .అంతా ఫ్రెష్ .ఎక్కడా ఇందులో అవినీతి ఉండరాదు 12-బూతు విద్యాకేంద్రాలు విరివిగా స్థాపించాలి .ఎంతఖర్చుకైనా వెనకాడ రాదు .13-సమాజం లో పెద్దలు బూతులతో చెలరేగి పోతుంటే వారికి బూతు పిత ,బూతు పితామహ ,బూతు ప్రపితామ బూతుమాత బూతు బామ్మ ,బూతు అమ్మమ్మ ,బూతక్క ,బూతుపిన్ని ,బూతు అత్తా వంటి పేర్లతో ఘనంగా సత్కరించాలి .ఇదే తిరుగులేని మంత్రం .నాలుగు రోజుల్లో గొప్ప ఫలితాలు కనిపించి ప్రభుత్వం మాపై పెట్టిన  ఖర్చు  దండగ కాదని రుజువు చేయాలి .దీని అమలు బాధ్యతా ప్రతి పిల్లాడిదీ, పెద్దాడిడీ పెద్దాయనదీ ,పెద్దావిడదీ అందరిదీ అని అనుక్షణం గుర్తుంచుకోవాలి .ప్రసూతి వార్డులలో బూతు కేసెట్లు  సిడిలు పెట్టించి వినిపించి పుట్టిన ప్రతివారూ జన్మతః బూతులు మాట్లాడేట్లు చేయాలి  ప్రహ్లాదుడికి నారద భక్తీ సూత్రాలు తల్లికడుపులో ఉండగా వచ్చినట్లు  మనమూ చేయాలి. ఇక దిగులు ఉండదు .చానళ్ళన్నీ బూతుకు తప్ప దేనికీ ప్రాముఖ్యం ఇవ్వరాదు పత్రిఅకూ విరివిగాసహకరించాలి .బూతు సాహిత్య  సంస్థలు అవసరమైతే ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి తెల్లవారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే దాకా ‘’బూతే బూతుగా ‘’అదే చివరికి’’ పూతు ‘’అంటే పవిత్రంగా తినగతినగ వేము తియ్యగా ఉన్నట్లు మారుతుంది .బూతూ జిందాబాద్ .నీయమ్మ విసుగొచ్చింది .సెలవ్ ‘’అన్నాడు

  ‘’ఏమండీ తెల్లారింది లేవండి ‘’అన్నకేక విని ‘’నీ యమ్మ .పొద్దున్నే లేపాలా “’అన్నా . ఆవిడ కంగారుగా ‘’ఎమైనాపైత్యం ప్రకోపించిందా ?నోరు పారేసుకొంటే,పిసికి  కోసి కూర వండుతా ఫు౦డాకోర్ ‘’అంది అవాక్కయ్యా .దాని నోటి నుంచి ఇలాంటిమాట ఎప్పుడూ వినలేదు .టివి ఆన్ అయి ‘’బండబూతులు మాట్లాడుతున్న వారితో దుశ్చర్యలపై  ఇంటర్వ్యు  వస్తోంది .ఓహో ఇదంతా కలా అని సమాధాన పడ్డాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-19-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ

మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ

పరిపక్వ పవిత్ర స్వాధీన మనసుగల కర్మాబాయి మహారాష్ట్ర  స్త్రీ  .20-1-1615న నాగూర్ జిల్లా కల్వాగ్రామంలో జివాన్జీ దూది వంశం లో జన్మించింది .మహా కృష్ణ భక్తురాలు జగన్నాథ స్వామి భక్తురాలు .జగన్నాథ క్షేత్రం లోనే జీవితం గడిపింది .ఆచార వ్యవహారాలేమీ తెలీవు .కాలకృత్యాలు స్నానం పూర్తికాగానే జగన్నాథుని ప్రసాదం చేసే పనిలో ఉండేది .స్వామి నైవేద్యానికి అల్లం ,ఇంగువ నెయ్యి మసాలావస్తువులుకలిపి’’ కిచిడీ అన్నం ‘’తయారు చేసేది .ఇది హిందూస్తానీయులకు అత్యంత ఇష్టమైనది .దీనినే స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో నివేదన చేసేది .

 కర్మాబాయి కీర్తి బాగా వ్యాపించగా ఒక రోజు ఒక బైరాగి ఆమె ఇంటికి భిక్షకు వచ్చాడు. సర్వ సద్గుణ  శీలి యైన ఆమెను చూసి మహాదానందపడ్డాడు .కాని ఆమె ఏ ఆచారాన్ని పాటించకుండా స్వామి ప్రాసాదం తయారు చేయటం చూసి బాధ, కోపం వచ్చి ,సదాచార విధానం బోధించి ఇకనుండి తాను చెప్పినట్లే చేయమని హితవు చెప్పాడు .మర్నాడు బైరాగి చెప్పిన ఆచార విధానం అంతాపాటించి ప్రసాదం తయారు చేసే సరికి రెండుజాములయింది .కర్మాబాయి ఇంటికి జగన్నథ స్వామి వచ్చి ప్రసాదం తింటాడని ప్రజలలో ఒక గొప్ప నమ్మకం ఉండేది .ఆ రోజుకూడా అలానే వచ్చాడు స్వామి .ఆలస్యమైందని కంగారు పడుతూ బాధపడుతూ స్వామికి ప్రసాదం వడ్డించింది .ఆయనా ఆలస్యమైందని ఆఘమేఘాలమీద తిని  ప్రక్షాళనం అంటే నోరు కడుక్కోకుండా   మందిరానికి వెళ్ళాడు.

 జగన్నాథ మందిర అర్చకస్వాములు స్వామి నోటికి కిచిడీ అన్నం మెతుకులు అంటి ఉండటం గమనించి ‘’పరాత్పరా !ఏ పవిత్ర గృహం పావనం చేసి విందు ఆరగించి జీవితం ధన్యం చేశావు స్వామీ ,మూడులోకాల్లోనూ  ఆ పుణ్యమూర్తి ధన్య మూర్తి ‘’అన్నారు.

  భక్త సులభుడు జగన్నాథుడు ‘’భక్తులారా !నన్ను సేవించింది పుణ్య చరిత కర్మాబాయీజీ .ప్రతిరోజూ మధ్యాహ్నం కాకుండానే నాకు కిచిడీ ప్రసాదం చేసి  వడ్డిస్తుంది .ఈ రోజు ఒక సన్యాసి చెప్పిన మాటలు విని ఆచారం తో ప్రాసాదం చేయటానికి మధ్యాహ్న సమయం దాటింది .ఆమె చేతి ప్రసాదం  తింటేకాని నేను వేరే ప్రసాదం స్వీకరించను .ఇవాళకూడా ఆమె ఇంట అన్నప్రసాదం తిని ఆలస్యమైందని, ‘’దేవి’’ నాకోసం ఎదురు చూస్తుందని  పరుగుపరుగున వచ్చేశాను .మీరు ఆమె ఇంటికి వెళ్లి, రేపటి నుంచి ఆమె ఇదివరకు ఎలా ప్రసాదం చేసేదో అలానే తయారు చేయమని చెప్పండి ‘’అన్నాడు జగత్ప్రభువు స్వామి .

   ఈవిషయం వారు కర్మాబాయీజికి ఇంటికి వెళ్లి తెలియజేశారు .ఆమె చాలా సంతోషించి అటుపై పూర్వంలాగానే ఆచారం  పాటించ కుండా స్వామికి కిచిడీ అన్నం ప్రసాదం చేసి వడ్డించింది .ఈ విషయం తెలిసిన బైరాగి స్వామి ఒక రోజు ఆమె ఇంటికి వచ్చి ‘’అమ్మా !నీ మహత్తు తెలియకుండా నీకు సుద్దులు చెప్పాను .ఆచారాలతో స్వామికి కష్టం కలిగించేట్లు చేశాను .నువ్వూ ,స్వామీ నన్ను మన్నించాలి ‘’అని ప్రాధేయపడ్డాడు .నిష్కల్మష భక్తిమహిమ వెళ్ళ డించటానికి జగన్నాథుడు చేసిన లీల ఇది .కర్మాబాయీజీ కర్మ పరిపక్వమై 25-7-1634 న 29ఏళ్ళ వయసులోనే జగన్నాథ సన్నిధి చేరింది . భక్త శిఖామణి అయిన కర్మాబాయిజీ పై ఒక జానపద గీతం ప్రచారం లో ఉంది .’’ Thali bhar’r lyayi khichado upar ghee ki batki !

Jeemo mhara syam dhani jeemavai beti Jat ki !!

  కర్మాబాయి స్మరణార్ధం ఇప్పటికీ జగన్నాథ దేవాలయం లో కిచిడీ (ఖేచరాన్నం )తయారు చేసి బంగారు పళ్ళెం లో పెట్టి స్వామికి భోగం  చేస్తుంటారు .ఎంగిలి ,అంటూ పూరీ జగన్నాథ మందిరం లో ప్రసాదాన్ని అంటుకోవు .అంతా పవిత్రమే అందుకే ‘’సర్వం అగన్నాథం ‘’అంటారు .కర్మాబాయి అంతకరణ విశుద్ధమైనది .అనురాగ భక్తిభావ రంజితమైంది .అక్కడ ఇక దేనికీ స్థానం లేదు .శుభ్రమైన హృదయం లో భక్తి పరిమళిస్తుంది .అందులోంచి పొ౦గి పొరలే అనురాగం పై ,క్షీర సాగర శయనుడు డోలలాడుతాడు.

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు

 మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు

క్రీ.శ. 1314లో బెంగాల్ లోని నదియ జిల్లా బుడాన్ గ్రామంలో గౌరీ సుమతీ ఠాకూర్ లకు యవన హరి దాసు జన్మించాడు .ఆరేళ్ళ కే  తండ్రి గతించాడు .తల్లి సహగమనం చేసింది .దిక్కులేని వాడై తురకలకు దొరికాడు .మతం లో చేర్చారు. మహమ్మదీయ మతఃగ్రందాలన్నీ బాగా చదివాడు .ధర్మం పై శ్రద్ధ ఏర్పడింది .అద్వైతుడు అనే మహాయోగి ని దర్శించాలని శాంతిపురానికి వెళ్ళగా స్వామీజీ మొదట అంగీకరించక పోయినా  తర్వాత అతని భక్తీ విశ్వాసాలు చూసి,అనుగ్రహింఛి హరినామం ఉపదేశించాడు . ‘’కునియా ‘’అనే పల్లెకు దగ్గరలో ఉన్న అరణ్యం లో నివాసమేర్పరచుకొని హరినామ స్మరణం తో గడిపాడు .తురక విష్ణు భక్తుడవటం సహించలేక ఆమతస్తులు నేరం మోపి నవాబు దగ్గరకు తీసుకు వెళ్ళగా భటులతో తీవ్రంగా కొట్టించాడు .రక్తం ప్రవాహంలా కారి స్పృహ తప్పి పడిపోయాడు .చనిపోయాడని భావించి గోతిలో పాతిపెట్ట మన్నారు  .అప్పుడు స్పృహ రాగా సేవకులు గురువుకు చెప్పారు .బ్రతికి ఉండగా పాతిపెట్టటం మంచిదికాదని నవాబు నదిలోకి తోసేయించాడు .చాలా దూరం కొట్టుకుపోయి చివరికి  ఒడ్డు చేరాడు .

  తినటానికి ,ఉండటానికి ఏమీ లేక అల్లాడుతుండగా సప్తగ్రామానికి చెందిన బలరామాచార్యులు ఇంటికి తీసుకు వెళ్లి ఆశ్రయమిచ్చాడు .హరి భక్తుడైన ఆచార్యులు పరమత సహనం తో జనం నినదించినా లెక్క చేయకుండా  ఈతురకను కాపాడి,ఇంట్లో ఉంచుకొన్నాడు .హరి దాసు నామ సంకీర్తనం తో ఎక్కడోకాలిన మహమ్మదీయులు  ఆచార్యులను దూషించారు .అతడు తన్మయత్వంలో హరినామ స్మరణ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు .పిచ్చివాడని గోల చేశారు .సప్తగ్రామ జమీందార్ కొడుకు రఘునాధుడు ఆచార్యుల వద్ద విద్య నేరుస్తున్నాడు .కాని హరిదాసు భక్తికి ఆకర్షితుడై చదువు సంధ్యలు మానేసి తానూ అదే ధోరణిలో హరి కీర్తన చేస్తుండగా తురక సన్యాసి దగ్గర ఇలా చేయటం తండ్రికి నచ్చక ,కేకలేసి వినకపోతే గురువునే దూషించాడు .తనవలన గురువు నిందపడాల్సి వస్తోందని గ్రహించి ,గురువుకు కృతజ్ఞత చెప్పి శాంతిపురం చేరి ,గంగానది ఒడ్డున ప్రశాంతంగా గడిపాడు .

  రోజుకు లక్ష సార్లు తక్కువ లేకుండా హరి నామ స్మరణ చేసి మాత్రమె మంచి నీరు త్రాగేవాడు .అతని తారకమంత్రం ”హరే కృష్ణ హరే కృష్ణ -కృష్ణకృష్ణ హరే హరే -హరేరామ హరేరామ రామరామ హరే హరే ” ఈ పవిత్రాత్ముని చూసి జనం శిష్యులుగా చేరారు .ఆ వూరి జమీందార్ కు ఇది ఇష్టం లేక ,అతని ఏకాగ్రత మరల్చాలని ఒక భోగం స్త్రీని ప్రేరేపించి ఒకార్ధ రాత్రి అతని కుటీరం లోకి పంపాడు .దేహ స్పృహ లేని దాసు హరినామస్మరణతో పరవశమై ఇదేదీ గమనిచ లేదు  .ఆమె అనేక ప్రయత్నాలు చేసి౦ది కాని అతనికి బాహ్య స్పృహ ఉంటేగా ?రాత్రి తెల్లవార్లూ బతిమాలుతూ బామాలుతూ తిడుతూ ,కోప్పడుతూ  విశ్వ ప్రయత్నం చేసి విఫలమై తెల్లవారగానే వెళ్లి పోయింది . మళ్ళీరాత్రి వచ్చి రెచ్చ గొట్టే మాటలతో ప్రయత్నించి చివరకు తానుకూడా దొంగ భజన చేస్తున్నట్లు నటించింది కాని దాసు ప్రవర్తనలో మార్పు లేక,ఏకాగ్రతకు భంగం కలగక పోవటంతో నిరాశతో  ఇంటికి వెళ్ళింది .ఎలాగైనా అతన్ని లొంగ దీయాలన్న జమీందార్ ప్రేరణతో ఎక్కువ డబ్బు ఆశకు మూడో రోజూ వచ్చింది  .సకలప్రయత్నాలు చేస్తూ చివరికి ‘’భ్రమర కీటక న్యాయం’’లాగా ఆ వేశ్య కూడా భక్తి పారవశ్యంలో తన్మయురాలైంది.ఇప్పుడు కళ్ళు తెరిచిన హరిదాసు ఆమెపై జాలిపడి మంత్రోప దేశం చేశాడు ఆమె కూడా నిరంతర హరినామ స్మరణతో జన్మ చరితార్ధం చేసుకొన్నది  ..

      కొంతకాలం తర్వాత హరిదాస ఠాకూర్  నవద్వీపం వెళ్లి అక్కడి వైష్ణవులతో కలిసి తిరిగాడు .అతని భక్తి,ప్రేమలను గుర్తించి అనేక సేవలు చేశారు .చైతన్య మహాప్రభువు ‘’నీలాచలం ‘’అంటే పూరీ జగన్నాధం లో ఉన్నారని తెలిసి భక్త బృందం తో వెళ్లి ,చైతన్య సమక్షంలో జీవనం గడిపాడు  .’’యవన హరిదాసు ‘’గా గుర్తింపు పొందిన యితడు చైతన్యుడు తనువు చాలించక పూర్వమే పరమ పదించాడు .అంత్య సమయంలో చైతన్య ప్రభువు శిష్యులతో వచ్చి హరిదాసు దగ్గర కూర్చుని హరినామ స్మరణ చేశాడు .ఆ హరినామ సంకీర్తన చేస్తూ ,వింటూ తనవు పులకంకురాలు పొందగా యవన హరిదాసు దేహం చాలించాడు ఆ  మహా భక్త శిఖామణి  .చైతన్యుడు అతని పార్ధివ దేహాన్ని సింధు నది తీరానికి చేర్చి,దిక్కులన్నీ హరినామ స్మరణతో పిక్కటిల్లుతుండగా  సమాధి చేయించి బృందావనం నిర్మించాడు .

 ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’మహా భక్త విజయం ‘’

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు1-చోక మేల

మహా భక్త శిఖామణులు1-చోక మేల

మహా రాష్ట్ర ధ్యాన దేవుడు తనకులం నుంచి బహిష్కరిప బడినతర్వాత పన్ధర్పురానికి వెళ్లి మతోద్యమ విప్లవం విస్తృతం చేశాడు .బ్రాహ్మణుల అధికారాన్ని ఎదిరించాడు .జనసామాన్యానికి భగవద్గీత అర్ధమయేట్లు  మరాటీ భాషలో రాసి జన వ్యాప్తికలిగించాడు .జంతు హి౦స మాన్పించి ,విశ్వాసం తోనే భగవంతుని చేరవచ్చునని బోధించాడు .జనంలో మంచి పేరు వచ్చి భక్తజనం కవులు బాగా ఆయనకు దగ్గరయ్యారు .దీనితో ప్రజలకు సాంఘిక స్వాతంత్ర్యం ఏర్పడి నూతన రూపు దాల్చింది మహారాష్ట్ర సమాజం .ఆయన భక్తులలో ప్రముఖుడు చండాల వంశానపుట్టిన ‘’చోక మేల’’.

 

image.png

image.png

  ఈ మతోద్యమం భీమ నదీ తీరాన ఉన్న ముఖ్య స్థలం అక్కడ ఒక ప్రాచీన దేవాలయం ఉంది.కాని 13వ శతాబ్ది వరకు దానికి ప్రచారమే లేదు .అదే పన్ధర్ పుర దేవాలయం .ఈ దేవాలయం లోని ఇటుక వేదికపై నిలిచి  విఠోబా ను ఆరాధించాలని ,భక్తులు ,సామాన్య జనం ఉవ్విళ్ళూరే వారు .స్వామి దర్శనంతో పులకించిపోయి జన్మ ధన్యమైనదని భావించేవారు .దీని గురించి కధలు,గాధలు తరతరాలుగా ప్రచారంలో ఉన్నాయి .ఒక కుంటి యోగి పైథాన్ నుంచి ,పండరీ పురానికి దేక్కుంటూ పాక్కుంటూ చేరి స్వామి దివ్య దర్శనం చేశాడట .ఆలయం పెద్ద గోప్పదేమీకాడు శిల్ప సౌందర్యమూ పెద్దగా లేదు .కాని అదొక గొప్ప ఆకర్షణ .ఆలయం లోని ప్రతిభాగం లో భక్తీ చిప్పిలుతుందని భక్తులు భావించి దర్శించి మురిసిపోయేవారు .

  విఠల దేవుని ప్రదానసేవకులలో చోక మేల ఒకడు .తండ్రి సుదాముడు .తల్లి ముక్తాబాయి .వీరిది పండరికి దగ్గరలోని అనాగడ్ అనే పల్లె.మంచి స్థితిపరులే కాని సంతానం లేదు .సుదాముడు తరచూ పండరినాధుని దర్శించి పుత్రభిక్ష ప్రసాదించమని వేడుకొనేవాడు .భర్త  ఊరిలో లేనప్పుడు భార్య ముక్తాబాయి తమ తోటలోని 200మామిడి పండ్లను కోసి బీదర్ లోని ముసల్మాన్ గవర్నర్ కు అందజేయటానికి తీసుకు వెళ్ళేది .ఒక రోజు పేద బ్రాహ్మణుడు దారిలో కనిపించి ఆకలిగా ఉంది కొన్ని పళ్ళు ఇస్తే తిని ఆకలి తీర్చుకొంటానని ప్రాధేయపడ్డాడు .సంతోషం తో పండిన పండ్లు అయిదు ఆయన చేతిలో పెట్టింది .వాటిని తీసుకొంటూ ‘’అమ్మా !నీ సౌజన్యం ఎనలేనిది .మీకు పండంటి అయిదుగురు సంతానం కలుగుతారు .నాకు మామిడిపళ్ళు ఇచ్చావు కనుక  నీ పెద్ద కొడుకుకు ‘’చోక’’(చోక్ సేన్ అంటే మరాటీలో మామిడి పండు అని అర్ధం )అని పేరు పెట్టు అని చెప్పి వెళ్లి పోయాడు .

  కొంతకాలానికి ముక్తాబాయి దంపతులకు పుత్రుడు జన్మించగా ‘’చోక ‘’లేక చోక మేల అని పేరు పెట్టుకొన్నారు .తల్లీ తండ్రీ భక్తులే కనుక చిన్నప్పటి నుంచి బాలుడికి కూడా ఆభక్తి సహజంగా అబ్బింది .చండాల వంశజుడు కనుక ఊళ్ళో ఏ పశువు చనిపోయినా ఈడ్చుకు వెళ్లి బయట పారేయటం అతని పని అయింది .ఒక సారి ఊరి పెద్దలతో సహా తండ్రి ఊర్లో లేనప్పుడు ఒక పెద్ద ఆవు చచ్చిపోతే ,దాన్ని కళేబరాన్ని ఈడ్చి పారేయాల్సి వచ్చింది చోక మేల కు .యితడు చిన్నారి బాలుడు .దాన్ని లాగేసే శక్తి లేనివాడు. విఠోబాతన శక్తినిచ్చి  సాయం చేశాడు .ఒక సారి పండరి ఆలయం లో స్వామి దర్శనానికి వచ్చి దర్శించి జన సమూహం లో ఉండిపోయిన ఒక సుందరి,అయిన బాలిక  చోక మేల ను చూసి ,అకస్మాత్తుగా పాదాలపి వ్రాలి తనను భార్యగా చేసుకోమని కోరింది .సరే నని తల్లిదండ్రుల అనుమతితో వివాహమాడాడు .

  కొన్ని రోజుల తర్వాత తన హృదయేశుడు పందడరినాథుని సమీపాన నివసించాలని కాపురం పండరిపురానికి మార్చాడు .అనుకూలవతి భార్య సకల విధాలా సాయపడుతోంది .పండరి వెళ్ళాడే కాని,నీచ కులజుడవటం వలన, ఆలయ ప్రవేశం నిషిద్ధం కనుక  విఠలుని సేవ చేయటానికి కుదరటం లేదు .బయట గుమ్మం దగ్గర కూర్చునే కనిపించీ కనుపించకుండా స్వామిని దర్శిస్తూ తన్మయుడయేవాడు .ఇలా రోజూ కూర్చుంటూ తర్వాత చీపురుతో గుడి చుట్టూ బాగు చేస్తూ ఉండేవాడు .గుడిలో జరిగే ప్రార్ధనలు భజనలు అన్నీ బయటినుంచే వింటూ కనిపిస్తే చూస్తూ కాలక్షేపం చేసేవాడు .మాదిగవాడు సన్యాసి కావటం ధ్యాన దేవుడి శిష్యులకు కూడా ఇష్టం గా ఉండేదికాదు .అతని భక్తిని అపహాస్యం చేసేవారు .

  ఇలా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అసూయతో చోకమేలతో ‘’ఎందుకు వృధాగా రోజంతా ఆలయం బయటే కూర్చుంటావు .బ్రాహ్మణుడి దగ్గర కూర్చుని అతని కుక్క కంచంలోని ఆ పెరుగన్నం తినాలనే  ఆశ ఎలా నెరవేరదో, నీకు విఠల దర్శనం అలా నెరవేరదు .బిచ్చగాడు రాజవాటం యెంత అసంభవమో,  నువ్వు వైకుంఠం చేరటం అంతే అసంభవం ‘’అన్నాడు .ఆమాటలు ములుకులుగా గుచ్చుకొన్నా, చోక మేల వినయంతో నమస్కరించి ‘’అయ్యా !కోట్ల మైళ్ళలో ఆకాశం లో ఉన్న సూర్యభగవానుడు నేలమీదనీటిలో ఉన్న పద్మాలకు కిరణ శోభకలిగించి వికసింప జేయటంలేదా ?దూరంగా ఉన్నా, నా విఠలదేవుడు నామొర ఆలకించి నన్ను కనికరించక పోడు.మనుషుని హృదయం లో ఆ స్వామిని ప్రతి స్టి౦చు కొన్న ప్రతివాడూ ఆయనకు దగ్గరగా ఉన్నట్లే ‘’అన్నాడు .

 అదే రోజు రాత్రి విఠలుడు చోకమేల ను తానే దేవాలంలోకి తీసుకు వెళ్లి,గర్భాలయం లో కూర్చోబెట్టి , అతని భక్తిని ప్రశంసించాడు .ఇ౦తలొ ఆలయ౦ లోని పూజారులు మేలుకొని ,ఘోరం జరిగి పోయిందని గగ్గోలు పెట్టి మిగిలిన పూజారులను పిలిచి రప్పించారు  .తలుపులన్నీ వేసి ఉంటె ఎలా ప్రవేశించాడనే ఆశ్చర్యంతో పాటు మాదిగావాడివలన ఆలయం అపవిత్ర మైనదని ఆక్రోశం కలిగింది వారికి ,కోపోద్రేకాలను ఆపుకోలేక అతడిని కొట్టి బరబరా గొడ్డును లాగినట్లు లాగించి బయటపడేశారు  .అతడు నిశ్చల నిర్మల మనసుతో ‘’పెద్దలారా !గంగానదిలో మాదిగవాడు స్నానం చేస్తే అది మైలపడుతుందా ?వీచేగాలి చండాలుని సోకితే మైలపడుతుండా ,అతని ఊపిరి వాయువును మైలపరుస్తుందా ?చండాలకులం లో పుట్టిననేను ఏ అపరాధమూ చేయలేదు ‘’అనగా  వాళ్లకోపం తారాస్థాయి చేరి ‘’నీచకులం లో పుట్టి ,మాకు నీతులు నేర్పుతున్నావా ?’’అని మండిపడి రాజు దగ్గర నివేదించారు .

  రాజు మహమ్మదీయుడు  చోకమేల ను పిలిపించి విచారించాడు .అతడు ‘’ఆ విఠోబా దేవుడే నేను అంటరాని వాడిని అని మొరపెట్టినా ,వినక తానె తీసుకువెళ్ళి గర్భాలయం లో కూర్చోబెట్టాడు నేనేమి  చేయగలను ?’’అన్నాడు .ఎన్ని విధాలా చెప్పినా వినక ముస్లిం నవాబు అతడి మెడకు బండపలుపు కట్టించి వీధుల్లోకి   ఈడ్పించాడు .గట్టి ప్రాణం కనుక తట్టుకు నిలబడ్డాడు .పండరి నుంచి బహిష్కరింఛి భీమనదికి అవతల పదేయించి మళ్ళీ రావద్దని శాసించాడు ‘.

  హరి లోన కొలువై యున్న భక్తునికి భయమెందుకు ?చోకమేల భీమనది ఒడ్డున ‘’దీపమాల ‘’కట్టించి ,తనగుడిసె లో కూర్చునేవాడు  .ఒకరోజు నిమ్మ చెట్టుకింద భోజనం చేస్తుంటే పండరి విఠలుడు ప్రత్యక్షమవగా ,ఆయనకూ విస్తరి వేసి భార్య వడ్డించింది .వడ్డనలో కుండలోని పెరుగు స్వామి వస్త్రాలపై పొరబాటున పడింది .’’దేవాది దేవుడు మనింటికి వస్తే ఇలా అపచారం చేస్తావా ?’’అని భార్యను కసిరాడు .అదే సమయంలో ఆలయ పూజారి అటు వస్తూ చోక మేల విఠలుని దూషిస్తున్నాడని భ్రమపడి ముందూ వెనుకలు చూడకుండా చెంపలు వాయించి నీచుని ముట్టుకొన్నందున భీమనదిలో స్నానించి దేవాలయం చేరి  పూజ చేస్తుండగా దేవుని వస్త్రం పై పెరుగు కనిపించి,దేవుడి చెంప వాఛి  ఉండటం ,  కళ్ళ నుండి కన్నీరు  కారటం గమనించాడు .జరిగినది అర్ధమై మహాయోగి అయిన చోకమేల కు తాను  చేసిన పరాభవానికి చింతించి దానిప్రభావం స్వామి మీద పడటం గుర్తించి అతడు మహా యోగి అని భక్త శిఖామణి అని తెలుసుకొన్నాడు .క్షణం ఆలస్యం చేయకుండా ఆ చండాల భక్త యోగీశ్వరుని పాదాలపై వ్రాలి క్షమించమని అర్ధించాడు .సగౌరవంగా అతడిని తనతో ఆలయానికి తీసుకు వెళ్ళగా స్వామి బుగ్గ వాపుతగ్గి అశ్రుధార మాయమై,మందస్మిత ముఖారవి౦ద౦ తో  విఠోబా దర్శనమిచ్చాడు .చోకమేల పవిత్ర భక్తి అందరికీ తెలిసి ,అతని చరిత్ర మహా రాష్ట్రం అంతా వ్యాపించింది .

  బీదరునవాబు  మంగళ మేఖల అనే పట్టణం చుట్టూ ఎత్తైన రాతి గోడ కట్టాలని నిర్ణయించి ,మాదిగలందర్నీ ఆపనిలో నియమించాడు .ప్రభువు ఆజ్ఞ కనుక చోకమేలకూడా పనిలో చేరాడు .ఒకప్రక్కకట్టిన గోడ పూర్తికాకుండానే అకస్మాత్తుగా కూలి,చోక మేల తో సహా కూలీలు దానికి౦దపడి చచ్చిపోయారు .అతని అస్థికలు గోడకింద కూరుకుపోయినా కీర్తి చంద్రికలు దశ దిశలా వ్యాపించాయి .విఠలుడు తనభక్తుడు నామదేవుని చోకమేల అస్తికలను తెచ్చి పండరిపురం  చేర్చమని ఆజ్ఞాపించాడు .ఆయన వెళ్ళగా అక్కడ అందరి ఎముకలు కలిసిపోయి గుర్తించటం కష్టమైంది .ఏం చేయలాని తెగ ఆలోచించి చెవి నేల మీద ఆనించాడు  ‘’విఠోబా విఠోబా ‘’అనే శబ్దం వినిపించి ,అవి చోకమేల అస్తికలే అని రూఢిగాభావించి పోగు చేసి తీసుకు వెళ్లి పండరి పురంలో భూగర్భం లో పాతిపెట్టింఛి ఒక శిలా స్థాపించాడు .అక్కడ మహారాష్ట్ర మాదిగలు నిత్యం భజనలు చేస్తారు .

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’మహా భక్త విజయం ‘’

  మరో భక్తుని తో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మరో’’ జొన్నలగడ్డ

 జొన్నలగడ్డ అంటే విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఇంగ్లీష్ లెక్చరర్,బహుభాషా వేత్త గొప్ప ఆరేటర్,  అనేకగ్రందకర్త ,అనువాదం చేయించటానికి రష్యాకు ఆహ్వానిపబడిన తత్వ వేత్త రష్యా వెడుతూ ‘’ఆమంచు గడ్డలో ఈ జొన్నలగడ్డ ఏమౌతాడో’’అని వీడ్కోలు సమావేశం లో మాతో చమత్కరించిన జొన్నలగడ్డ సత్యనా రాయణ మూర్తిగారు గుర్తుకు వస్తారు .ఇదే పేరుతొ మరొక ప్రసిద్దులున్నారని చాలామందికి తెలీదు .వారిని పరిచయం చేసే భాగ్యం పొందుతున్నాను .

శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తిగారు  రాజమండ్రికి చెందిన ఆరువేల నియోగులు .తండ్రి మృత్యుంజయులు .హరితస గోత్రం .ఇలవేలుపు కామేశ్వరమ్మ .తల్లి వేంకమాంబ.తల్లిగారు పెమ్మరాజు నరసింహం గారి కుమార్తె .మూర్తిగారు స్వయం కృషితో అభివృద్ధి సాధించిన ఆదర్శమూర్తులు .ఎం.ఏ .బి ఎల్ పాసై మద్రాస్ హైకోర్ట్  న్యాయవాదిగా ఉన్నారు .కలకత్తా యూని వర్సిటీ లో ఇంగ్లిష్ ,ఫిలాసఫీ ,హిస్టరీ ,ఎకనామిక్స్ ,పాలిటిక్స్ ,లాజిక్ ,లా లలో డిగ్రీలు పొందిన బహు విషయవేత్త .బెంగాలీ ,పాళీ భాషలలో లోతైన అవగాహన ఉన్నవారు .1926 కలకత్తాలో ‘’టాగూర్ ప్రైజ్’’పొందిన ప్రతిభా శాలి .గిడుగు వెంకట నరసింహ మూర్తి గారి పుత్రిక ,విదుషీమణి శ్రీమతి శారదాంబ గారు మూర్తి గారి ధర్మపత్ని .వీరిది ఆదర్శ దాంపత్యం .  మూర్తిగారు తెలుగులో చాలా గ్రంథాలు రాశారు .ఆంద్ర ప్రచారిణీ గ్రంధమాలకు ,అద్దేపల్లి లక్ష్మణస్వామిగారి  సరస్వతీ గ్రంథ మండలి ఎన్నో విలువైన పుస్తకాలు రాశారు .ఆంద్ర మహాపురుషుల జీవితాలపై గ్రంథం రచించి ,ఆంద్ర రిసెర్చ్ యూని వర్సిటీలో ‘’సాహిత్య భూషణ ‘’బిరుదు ,విజయనగరం లో ‘’భారతీ తీర్ధ ‘’బిరుదు అందుకొన్న విద్వద్వరేణ్యులు .ఋషుల చరిత్రపై అమితా సక్తి ఉన్నవారు .దేశం లో ఏ కొత్త వింత విషయం చెవిన పడినా స్వయంగా అక్కడికి వెళ్లి విషయసేకరణ చేసి రాసి ప్రచురించటం మూర్తిగారి ముఖ్య హాబి .

  కాశీ రామేశ్వరాది అనేక పుణ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యమూర్తి .కవి ,పండిత పక్షపాతి .వీరి గ్రంథాలు విశ్వ విద్యాలయాలలో   పాఠ్యగ్రంథాలుగా విరాజిల్లాయి .’’సంపూర్ణ భక్త విజయం ‘’పేరిట రెండు బృహద్ రచనలు చేశారు .క్లిష్టత లేకుండా సరళభాషలో  అందరికీ అర్ధమయేట్లు రాయటం వీరి ప్రత్యేకత .ఇందులోని మొదటి భాగం లో 65మంది భక్త శిఖామణుల చరిత్ర ఉన్నది .840 పేజీల బృహత్ గ్రంథం.వీరిలో అతి ప్రాచీన ,ప్రాచీన ,మధ్యమ నవీన భక్తులందరూ ఉన్నారు .దీనికి శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రిగారు  విలువైన ముందుమాటలు రాశారు .ఇది 1943లో ముద్రితం .ఇంతకంటే మూర్తిగారి వివరాలు తెలియలేదు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కార్తీక మాసం ఆఖరి 5వ మంగళ వారం రాత్రి ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో అఖండ దీపోత్సవ శోభ

కార్తీక మాసం ఆఖరి 5వ మంగళ వారం రాత్రి ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో అఖండ దీపోత్సవ శోభ

Posted in దేవాలయం | Tagged | Leave a comment

అదొక్కటే మందు అన్నిటికి  

అదొక్కటే మందు అన్నిటికి

వార్ రూమ్ లో పార్టీ అగ్ర నేతలు భేటీ అయ్యారు .ఎజెండా ఏమిటో ఎవరికీ తెలీదు ఆ ఇద్దరికీ తప్ప .టీ సరఫరా నిరంతరంగా జరుగుతోంది. తాగి శీతాకాలపు చలికి కొంచెం ఉపశమనం కలిగించుకొంటున్నారు .ఇంతలో ‘’జోడీ ‘’వస్తే ,లేచి నిలబడి అభివాదం చేశారు .నంబర్ 2మొదలు పెట్టాడు ‘’మనం ఏది చేసినా జనం లో అసంతృప్తే కనిపిస్తోందని రిపోర్ట్ లు తెగవస్తున్నాయి .స్థానిక కోర్టులు ,పై కోర్టులు ఇచ్చిన తీర్పులుకూడా మనమే ఇప్పించినట్లు ముద్ర వేస్తున్నారు .ప్రజాస్వామ్యం కాపాడటానికి తెల్లవారు ఝామున గవర్నర్ ను లేపి ,రాష్ట్ర పతి పాలన తీసేయించి ,గంటలోపే మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాం ఆఫ్ కోర్స్ అటువైపున్న బలమైన నాయకుడి బంధువును దువ్వి ,పెద్ద కు౦భ కోణం కేసును  మాఫీ చేయిస్తామని  నోటిమాట ఇచ్చి,  బాబాయిని ఎడం కాలితో తన్ను తన్నించి,అతడి వెంట బలమున్నట్లు నమ్మించి ,మనవాడే కనుక రాజభవన్ ‘’నాయనను’’రాజ్యాంగ అతిక్రమణ అయినా ఫర్లేదని ,ప్రమాణ స్వీకారాలు చేయి౦చేశాం .మొత్తం పవర్ అంతా మా చేతిలో ఉ౦ది కనుక నిమిషాలమీద ఇదంతా జరిపింఛాం.ఇదేదో పెద్ద కుట్ర అని,ప్రజాస్వామ్య విఘాతం అనీ పత్రికలూ ,పార్టీలు ,పెద్దలు గగ్గోలు పెడుతున్నారు .కోర్టుకూ  వెళ్ళారు .నిన్నరాత్రి హోటల్ లో మీడియా ముందు వాళ్ళ బల ప్రదర్శనతో  ,కంగారు పెట్టేశారు .సుప్రీం రేపే బల నిరూపణ చేయమని ఆదేశించటం తో కక్కుర్తి పడి ముఖ్య ,అముఖ్య అయిన  మనవాళ్లిద్దరూ ఆఘమేఘాలమీద రాజీనామా చేసి ప్రజాస్వామ్య వీర గౌరవం కాపాడి శివాజీ ఆదర్శాన్నిఅక్షరాలా పాటించారు .అదీ మన పార్టీ ఘన చరిత్ర .ఇందులో ఏదో మేమిద్దరమే అంతా చేశామని మాకు మకిలి అంటించటం బాగుందా ‘’? గుక్కతిప్పుకోకుండా మాట్లాడి గ్లాసెడు నీళ్ళు తాగి .చప్పట్లు వీర మోతమోగించారు .

  తర్వాత నంబర్ వన్ లేచి ‘’ భారత శిరోరత్నమైన రాష్ట్రాన్ని ,మూడు ముక్కలు చేశాం సారీ రెండు ముక్కలు చేశాం ,370 రద్దు చేశాం .తలాక్ కు తలాక్ ఇప్పించాం .అయోధ్యలో రాము లోరిగుడికి లైన్ క్లియర్ చేయించాం .నెలానెల వెన్నెల లాగా  రేడియోలో వాయిస్తూనే ఉన్నా .నేషనల్ మీడియా అంతా మన వెంటే ఉండేట్లు ‘’నొక్కి పెడుతున్నాం ‘’.స్వచ్చ భారత్ స్లోగన్ వీక్ కాకు౦ డాబాగానే ఊదిస్తున్నాం .అయినా దేశం లో వీధులు నగరాలు అన్నీ మహా చెత్తగా ఉన్నాయని సోషల్ మీడియా శోష పడి చెబుతోంది .గంగ కాలుష్య౦ తగ్గలేదని సామాజిక నాయకులు దూషిస్తున్నారు . అది ఒకపట్టాన తగ్గేదా ?తల్లి భాష ను ప్రోత్సహించమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాం నేనూ ,తెలుగు పెద్దాయనా .కాదని ఇంగ్లీష్ మీడియం అని చట్టం తెస్తున్నారు వీళ్ళని  ఏమీ చేయలేక పోతున్నాం. వాళ్ళ అవసరం ఎప్పుడైనా ఉండచ్చు .కుజనా ,రామేశులనుదువ్వి కాషాయం కప్పి వాళ్ళతో ఆపార్టీనుఛి పాతికా ఈపార్టీనుంచి సగం వస్తున్నారని ఊదర కొట్టిస్తున్నాం .వీళ్ళకు ఎన్నికలలో గెలిచే సత్తాలేదని తెలుసుకాని అవసరం అలాంటిది .అసలు తెలుగు రాష్ట్రాలలో మనకు గట్టి నాయకులు  లేరు .అక్కడి సిఎం లను ఎదుర్కొనే మగాడు మనకు లేరు .మనవాళ్ళు  గిరీశం చెప్పినట్లు ‘’వట్టి —-లోయ్ ‘’లా గా ఉన్నారు .మా ఇద్దరికీ జుట్టు లేకపోయినా ఏం చేయాలో తోచక తెగ పీక్కు౦ టున్నాం.వీటన్నిటికి ఒకే ఒక పరిష్కారం కావాలి .మీలో ఎవరైనా చెప్ప వచ్చు ‘’అని వాగ్ధోరణి ఆపి తనకిష్టమైన చాయ్ తాగి కూర్చున్నాడు .అంతామొహామొహాలు చూసుకొన్నారు .ఏ ఒక్కరూ లేచి నిలబడటం లేదు .నోరు మెదపటానికీ భయ పడుతున్నారు .

  ఇదంతా ఆఇద్దరికీ తెలుసు .ఎవరూ మాట్లాడరనీ  మాట్లాడితే ఏం జరుగుతోందో బాగా వాళ్లకి తెలుసనీ ఈ ఇద్దరికీ ఇంకాబాగా తెలుసు .మళ్ళీ నంబర్ 2 లేచి ‘’వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం .అందరి నోళ్ళు మూయించటం .చానళ్ళలో వ్యతిరేక వార్తలు రాకుండా కట్టడి చేయటం .నోట్ల రద్దు బూమేరాంగ్ అయి౦ది కనుక గోల్డ్ పై కట్టడి చేయటం ,ఏ కోర్టు అయినా మన కను సన్నల్లో ఉండేట్లు చేయటం .ఇవన్నీ కలిపి ఒకే రాజ్యాంగ సవరణలో పొందుపరచి చట్టం తేవటం .మీరేమంటారు ?’’అనగా అంతా బాగుంది బాగుందని చప్పట్లు కొట్టారు .నంబర్ 1 లేచి ‘’నంబర్2 చెప్పింది చాలా బాగుంది .అదే మన తక్షణ కర్తవ్య౦ .అయితే దీనికో తిరకాసు ఉంది .ఎప్పుడైనా ఖర్మకాలి మనం మన పార్టీ ఓడి పోతే ఇదే చట్టాన్నికొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మనమీద అంటే  పాత ప్రభుత్వం మీద మనలాగే ప్రయోగింఛి కక్ష సాధించుకో వచ్చు .కనుక మనం తెచ్చే  ఈ కొత్త సవరణ చట్టం లో ‘’ఈ ప్రభుత్వం అధికారం లో  ఉన్నంత వరకే నని ,అధికారం కోల్పోతే ,చట్టం కొత్తప్రభుత్వానికి వర్తించదని’’ చేర్చాలి .అప్పుడు ఉభయ తారకంగా ఉంటుంది .’’అని తన నంబర్ 1 తెలివిని ప్రదర్శించాడు .బల్లలు పగిలే చప్పట్లు చరిచి మళ్ళీ టీలు తాగి వార్ రూమ్ లోంచి బయటికి వచ్చారు అగ్రనేతలు .

 వస్తూ వారిలో వారు ‘’ఒకప్పుడు చెయ్యి పార్టీ అధికారం లో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను దుర్విని యోగం చేశారని ఎన్నో కేసులు పెట్టాం .ఎమర్జన్సీ పెట్టారని వీధుల్లో జిల్లాల్లో పడ్డాం .ఇప్పడు అంతకుమించిన షాడో యెఅర్జెన్సేలొ బతుకు తున్నాం .వోటింగ్ మెషీన్లు ఫ్రాడ్ అని గగ్గోలు పెట్టాం .మన ‘’తెలుగు మేధావి’ ఒకాయన ఉద్గ్రంథమే  రాసిపారేశాడప్పుడు . .ఇప్పడు మెషీన్లు అచ్చా బాలట్ పేపర్లు బురా అని తందానా అంటున్నాం .చానళ్ళ పై నియంత్రణ వద్దని వీధి పోరాటాలు చేశాం .ఆయారాం గయారాం లతో ఇబ్బందని  కోర్టులకెక్కాం ,పేపర్ల నిండా ఏకి పారేశాం .ఎక్కడ ప్రాజాస్వామ్యానికి  విఘాతం కలిగినా చట్ట సభల్లో నిలువరించాం .అన్యాయంగా చేసే రాష్ట్ర విభజనలను కట్టడి చేయమని ఒత్తిడి తెచ్చాం .ఎనభై దాటినా మన పెద్దాయనకు రాష్ట్రపతి పదవి ఇస్తున్నట్లు జ్యోతిర్లిన్గాలయం లో ప్రమాణం చేసి ఆంధ్రులకు కొత్తరాజదానికత్తించాతానికి అన్ని రకాల ఆర్ధిక సాయం చేస్తామని తిరుపతి బాలాజీ సమక్షంలో ,పార్లమెంట్ లో వాగ్దానం చేసి ,నిలబెట్టు కాకపోతే నోరు మెదపలేక పోయాం .తిలాపాపం తలాపిడికెడు అయింది మనబతుకు .నోటుకు వోటుచేటు అని వాదించాం.ఎమ్మెల్యేలను బందీ చేయటాన్ని నిరోధించాం.అన్యమతస్తులను గౌరవించాం.కానీ  ఈ ఐదేళ్ళుగా ఇవన్నీ  మనమే చేసి ,ప్రజాస్వామ్యఘాతకులమని అనిపించుకొంటూ ప్రజలకు మొహాలు చూపించలేక పోతున్నాం .కక్కా లేక మి౦గాలేని పరిస్థిలో ,శేష్మం లో పడ్డ ఈగల్లాగా ఉన్నాం .ఎలాంటి ఆదర్శనాయకులు పార్టీనీ ,ప్రభుత్వాన్నీ నడిపి అపోజిషన్ తోనూ , శెభాష్ అని పించుకొన్నారు ?ఇవాళ నాయకత్వానికి గెలుపు మీదేదృష్టి తప్ప రాజ్యాంగ వ్యవస్థ ,ప్రజాస్వామ్యం ,చట్ట సభలపై  ,వ్యవస్థలపై గౌరవమే లేదు .అన్నీ నిర్వీర్యం చేస్తున్నారు .చెప్పాలని ఉన్నా,మన లోని ‘’మన్ కీ బాత్ ‘’ చెప్పలేక దిగమింగుకొంటున్నాం .ఆ మధ్య కర్ణాటకలో కక్కుర్తి గా ‘’ఎడ్డీ ‘’ని గద్దేనెక్కించి కోర్టు తీర్పుతో బిత్తరపోయి ,తెరవెనుక బేరసారాలు కూడా ఫెయిలయి, రికార్డ్ లు బయటికి వచ్చి ,బలనిరూపణముందే రాజీ నామా చేయించి కూడా ,మళ్ళీ ఇప్పుడు మహా లో మహా డ్రామా ఆడి తల బొప్పి కట్టించుకొన్నారు .అంటే అసలు వీళ్ళకు వ్యవస్థలమీద నమ్మకం ఉందా అని అనుమానం కలుగుతోంది .నిఘా నేత్రాల నీడలో బతుకు తున్నాం .ఇప్పుడు మన అగ్రనాయకులిద్దరూ తెచ్చే చట్టం తో ప్రజాస్వామ్యం ‘’హరీ’’ అనక తప్పదు .శాంతం  పాపం .దేవుడే రక్షించాలి ఈ దేశాన్ని ‘’అంటూ గుడ్ల నీరు కుక్కుకొంటూ కార్లెక్కి  వెళ్ళిపోయారు ,

  మీ- గబ్బిటదుర్గాప్రసాద్ -26-11-19-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

    అంతేగా,అంతేమరి  

అంతేగా,అంతేమరి

”ఏమండీ !కాకినాడ నుంచి వనజాక్షి గారు వారానికోసారిఫోన్ చేసి ,మనబ్బాయి ఫోటో వాళ్లమ్మాయికి ,అందరికి  నచ్చిందని, జాతకాలుకూడా భేషుగ్గా కలిశాయనివాళ్ళ పురోహితుడు చెప్పాడని  ,ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మాయిని పెళ్లి చూపులు చూపిస్తామని   చెబుతోంది .ఒకసారి వెళ్లి చూసొద్దామండీ ‘’అంది మా ఆవిడ కామం అదేకామాక్షి ,’’మనవాడికి సెలవలు దొరకటం లేదంటున్నాడు ఈఆదివారం బాగుంది వాణ్ని కదిలించి, వస్తానంటే చూసొద్దాం ‘’అన్నాను .ఆ మాట కామం వనం కి చెప్పే ఉంటుంది .రెండ్రోజులక్రితం మళ్ళీ రికార్డ్ పెట్టింది కామం .’’అబ్బాయి కి రేపు ఆదివారం వీలేనట.మీరుకూడా   ఊ అంటే ఆవిడకు  చెబుతా ‘’అంది.’’సరే .ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాల్సిందే గా కానీ ‘’అన్నాను .కాసేపటికే కామం ‘’వనం గారు ఒకే అన్నారు .ఆదివారం సాయంత్రం దుర్ముహూర్తం వెళ్ళాక చూపులు అని చెప్పమంది ‘’అన్నది .సరే అంటే సరే అనుకొన్నాం .

ఆదివారం సాయంత్రం  రైల్ లో మాఅబ్బాయి విస్సు ,నేనూ, మా ఆవిడా ,మా అమ్మాయి బయల్దేరి విశాఖ నుంచి కాకినాడ వెళ్లాం .స్టేషన్ కు ముగ్గురు ఆడలేడీలు వచ్చి రిసీవ్ చేసుకొన్నారు .గొంతును  బట్టి గుర్తించి అదిగోనండి వనజాక్షి గారు అంది .వాళ్ళు మాదగ్గరకొచ్చి నమస్కారాలు చేశారు .కుశలప్రశ్నలయ్యాక  వాళ్ళ జుంబో కారులో ఇంటికి తీసికెళ్లారు .చెట్టంత మగాడిని నన్ను ఏదో ఒకపలకరింపు పలకరించి అబ్బాయి తో చనువుగా మాట్లాడుతున్నారు .అరగంట జర్నీలో ప్రపంచామంతా చుట్టేశారు కబుర్లతో. నాకూ మా వాడికీ ‘’ఎంబరాసింగ్’’గా  ఉంది .ఏం చేస్తాం ?ఇల్లు రాగానే అందరం దిగాం .ఒక పంచకట్టు బుర్ర మీసాలపెద్దాయన ,మరో నడి వయస్కుడు ,  ఇంకో ఆతను నమస్కారాలు చేసి లోపలికిఆహ్వానించారు .లంకంత కొంప .వైభవం దర్జా ఉట్టిపడే ఫర్నిచర్ ,అధునాతన సామగ్రి  తో  ఇళ్ళుకళకళ లాడింది .మంచిసోఫాలపై కూర్చోపెట్టి చల్లని పానీయాలు అందించి ,తర్వాత  కారప్పొడి  అల్లం చెట్నీ తో పొగలు కక్కుతున్న ఇడ్లీలు పెట్టారు .తిన్నాం ,కాసేపటికి అల్లం పెసరతో ఉప్మా వచ్చింది .వద్దంటూనే లాగించాం . తర్వాత కమ్మని నురుగులు పొంగుతున్న కాఫీ ఇచ్చారు .పుచ్చుకున్నాం .’’అమ్మాయి రెడీ అవుతోంది వదినా ‘’అని మా కామానికి చెప్పింది వనం .అప్పుడే ఈ బంధుత్వం ఏమిటా అని   ఒకళ్ళవైపు ఒకరం చూసుకోన్నా౦  నలుగురం .కబుర్లలో దిగాం .నడి వయస్సాయన ‘’నేనుఅమ్మాయి తండ్రిని .ఆపెద్దాయన మానాన్నగారు మీతో వచ్చింది మా అమ్మగారు ,ఆతను  మాల్లుడు .మరదలి పెళ్ళిచూపులకోసం వచ్చారు’’అని పరిచయంచేశాడు .నేను ఆయన్ను ‘’మీస్వగ్రామం ఎక్కడ ఏసర్వీస్ చేశారు ?’’అని అడిగితే వనం ‘’ అన్నయ్యగారు !కాకినాడ మున్సిపాలిటీ ఆఫీసర్ అండీ .’’అన్నది ‘’అవునండీ ‘’అన్నాడాయన .’’మీనాన్నగారేం చేసేవారు ?అని అడిగితె  ,ఆయనకు బదులు ముసలావిడ ‘’ ‘’ పక్క ఊరి మునసబుగిరీ చేశారు .జిల్లాలో బాగా పేరు ప్రఖ్యాతులున్నవారండీ ‘’అన్నది బుర్రమీసాలు దువ్వుకొంటూ ఆయన ‘’మరంతే నండి’’ అన్నాడు .ఓరినాయనో అనుకొన్నాం ముఖాల చూపులతోనే .ఇంకో ఆతను అని చెప్పానే  ఆయన్ను ఏం చేస్తుంటారని అడిగా .యువతి ‘’మా మావారే నండి.డాక్టరీ చదివి ప్రాక్టీస్ చేస్తున్నారు వైజాగ్ లో .మాకు ఇద్దరు మగ పిల్లలు .చెల్లి పెళ్ళిచూపులుకదా అని అందరం వచ్చీసీమండి’’అన్నది .ఆకుర్రాడు  ‘’మరేనండి అంతేనండి ‘’అన్నాడు .’’ఇదేం తేడా’’అని మళ్ళీ అనుకొన్నాం .

మళ్ళీ రెండు రౌండ్లు కాఫీ లయ్యాక మంచి అలంకరణతో అమ్మాయి వచ్చి ,ఆందరికీ నమస్కారాలు చేసి తన ఉచిత సముచిత ఆసనం లో ఆసీను రాలైంది .కళ్ళతోనే అందరినీ పలకరిస్తూ నవ్వుతూ చలాకీగా ఉంది .అందమైన ముఖం .మంచి రంగు .స్పురద్రూపం .చక్కని జడ ,పూల అమరిక ,చేతులనిండా గాజులు  నుదుట కుంకుమ బొట్టు .చూడంగానే ఆకర్షణీయం గా అని పించించింది .మిగిలిన వారంతా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు .మా కామానికి ఏదైనా అడగటానికి సంకోచం గా ఉంది .సరే నేనే మొదలు పెట్టి ,ఎక్కడెక్కడ చదివి ప్రస్తుతం ఏం చేస్తోందో అడిగాను .క్షణం ఆలస్యంచెయ్యకుండా పిల్లా, పిల్లతల్లీ టకటకా చెప్పేశారు .మగాళ్లు  ‘’మూగాళ్ళు’’ గా నే ఉండిపోయారు .అప్పుడప్పుడు వాళ్ళు చెప్పినదానికి ‘’అంతేగా .అంతే మరి’’ అంటున్నారు .వనజాక్షి మా విస్సు చదువు ఉద్యోగాలగురించి అడిగింది మా కామాన్ని .చెప్పబోయింది కాని నా చూపు కట్టడికి ఆగిపోయింది .నేనే వాడి  చదువు ,ఉద్యోగం ,జీత ,యా౦బిషన్ అన్నీ చెప్పేశాను .ఈలోగా వచ్చిన వేడి  వేడి పకోడీలు ,పల్లీలు మధ్యమధ్యలో కొబ్బరి నీళ్ళు తాగుతూనే ఉన్నాం .మర్యాద,గౌరవాలకేం  లోటు లేదు .  పిల్ల కూడా టెక్ పాసై ఇక్కడే ఉద్యోగం .ఈడూ జోడూ బాగుంది .నేనే జాతకాలు చూశానుకనుక అదీ తృప్తి గానే ఉంది .మా వాడిని అమ్మాయిని ఏదైనా అడగమంటే ‘’అక్కర్లేదు మీరు అడిగారుగా ‘’అన్నాడు .ఆఅమ్మాయి మాత్రం ‘’ఒకసారి ప్రక్కగదిలో మాట్లాడుడుకొందాం రండి ‘’అన్నది .అందరం పర్మిషనిచ్చాం ఉభయులవైపునుంచి.వెళ్లి పావుగంటలో తిరిగి వచ్చారు నవ్వు ముఖాలతో .దృశ్యం మాక౦దరికీ అర్ధమై పోయింది .మా కామం వనం తో చెప్పి పెద్ద ప్లేటు తెప్పించి అందులో మేము తెచ్చిన పళ్ళూ ,పూలు పెట్టి అమ్మాయి చేతిలో పెట్టింది వనం,అత్తగారు,కూతురు   తోడుగా .మళ్ళీ కూల్ డ్రింకులు త్రాగాం.’’వదినగారూ !ఎప్పుడు మీఅభిప్రాయం చెబుతారు ?’’అని అడిగింది .నావైపు చూసింది కామం .’’ఇంటికి వెళ్లి మావాడితో సంప్రదించి రెండు మూడు రోజుల్లో చెబుతామమ్మా ‘’అన్నాను.ఆడాళ్ళు మగాళ్ళు ఒకరిమోహాలొకరు చూసుకొని ఆశ్చర్యపోయారు .మాఅమ్మాయికి మా వాడికు మంచి జాకెట్ పీసులు,తలలోకి  పూలు ,సంచీ నిండా పళ్ళు పెట్టి ఇచ్చింది .అందరికీ ధన్యవాదాలు తెలియ జేశాం  ట్రెయిన్ ఎక్కించటానికి ఈ సారి కారులో  మాతోపాటు వారింటి ఆడామగా కూడా రావటంతో   మేము అవాక్కయ్యాం .

ఇంటికి చేరుకొని  మర్నాడు  మా విస్సుగాడిని  అభిప్రాయం అడిగాము ‘’మీరు ఒకే అంటే నేనూ ఓకే’’అన్నాడు ‘’.బాగానే ఉందిరా విస్సూ .అక్కడ మగాళ్ళు ఎఫ్-2సినిమా లో ప్రదీప్ లా  ‘’అంతేగా అంతేమరి ‘’టైప్ .నువ్వూ ‘’ అంతేగా’’ గామారితే ఇబ్బందే లేదు ‘’అన్నాము కామం నేనూ మా అమ్మాయీ .’’నాన్నా !వెళ్ళే టప్పటి’’ సీన్’’ కు వచ్చేటప్పటి’’ దృశ్యా’’నికి యెంత తేడా ఉందొ చూశారుగా  మేమిద్దరం మాట్లాడుకొన్నప్పుడు ఈవిషయం  ఆ అమ్మాయికి  తెలియ జేస్తే ‘’అయ్యో !ఇది మాకు అలవాటై ఏమీ తేడా గా లేదండీ .ఇకపై మీమగవాళ్ళ,గౌరవ మర్యాదలకు భంగం రాకుండా మా వాళ్ళు ప్రయత్నిస్తారు నాది హామీ’’అన్నది  . తన వాళ్లను  కంటిచూపుతో శాసించి అమలు చేసి౦ది .’’అన్నాడు .కుటుంబ గౌరవాన్ని కాపాడే పిల్ల కోడలు గా వస్తోందని  అందరం సంతోషించి నేనే పిల్ల తండ్రి కి ఫోన్ చేసి చెప్పా .వాళ్ళు తెగ మురిసిపోయినట్లు వనం కామానికి తర్వాత ఫోన్ చేసి చెప్పిందట .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-11-19-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మాతృశ్రీ జిల్లెళ్ళమూడి ‘’అమ్మ’’తనం

దువ్వూరి వారికి రెండవ సారి అకస్మాత్తుగా  మాట నోట రానందున ,విషయంతెలిసిన ఆచార్య బిరుదు రాజు రామరాజు గారు శాస్త్రి గారికి జాబు రాసి ‘’మీరొకసారి జిల్లెళ్ల మూడి వెళ్లి అమ్మను చూసివస్తే మంచిది ‘’అని సలహా ఇచ్చారు.ఈవిషయం చాలాకాలం మనసులో ఉన్నా వెళ్లలేకపోయారు అప్పటి వరకు .గుంటూరు వెళ్లి శిష్యుడు ఆచార్య ఎస్వీ. జోగారావు గారింట బసచేసి కోరికచెప్పగా, ఆయనకూడా ఆమధ్యే వెళ్లి వచ్చానని అనటం తో, కోరిక  బలపడి,నరసిహాచార్యులగారితో అనగా, తానూ వెళ్ళాలనే అనుకొన్నానని కుదరలేదని  తనకారులో కలిసి వెడదామనీ,  బలమిచ్చి మరో ముగ్గురు  ఆప్తులతో తో కలిసి జిల్లెళ్ళమూడి కి రాత్రి 7 గంటలకు కారులో చేరుకొన్నారు .వాకబు చేస్తే అమ్మ డాబా పైన ఉన్నదని తెలిసి డాబాపైకి అమ్మ సన్నిధికి చేరి ,దూరాన్నుంచే నమస్కరించి కూర్చున్నారుఅంతా .ఆమెకు ఒక వైపు మగవారు, మరో వైపు ఆడవారు భక్తి తో కూర్చుని ఉన్నారు  .ఆమె యెవరితొనూ మాట్లాడలేదు  .అలా ఒక అరగంట గడిచాక, వీరందరికీ అమ్మను చూస్తుంటే దుఖం పొర్లుకొచ్చింది .కళ్ళ వెంట ఒకటే ధారాపాతం.ఆమె వీళ్ళ వైపు చూస్తూనే ఉంది .ఏదో ఒక గంట మోగింది .ఒక్కొక్కరే అమ్మను చేరి పాదనమస్కారాలు చేసి వెడుతున్నారు .వీరు కూడా వెళ్ళారు. దువ్వూరివారు అమ్మ పాదాలు పట్టుకొని నమస్కరించారు .

 అప్పుడు అమ్మ ‘’కూర్చో నాన్నా !’’అన్నది. అందర్నీ కూర్చోమన్నది .ఎవరూ ఏమీమాట్లాడలేదు. కొంతసేపటికి ప్రక్కకు చెయ్యి జాపింది .మాతృశ్రీ సన్ని ధాన భాగ్యశాలి   డా.పన్నాల రామకృష్ణగారు అమ్మ చేతిలో నాలుగు చక్రకేళి పళ్ళు పెట్టారు .వాటిని దువ్వూరివారి  చేతుల్లో ఉంచింది అమ్మ .అందరికీఅలాగే ఇచ్చింది .మౌనమే రాజ్యం చేస్తోంది .కాసేపు తర్వాత శాస్త్రి గారి చేతిలో పండు తీసుకొని ,వొలిచి ఒక ముక్క ఇవ్వ బోయింది .మళ్ళీరెండుచేతులు సాచారు శాస్త్రిగారు .చేతుల్లో ఉంచకుండా నోటిదగ్గర చెయ్యి జాచింది .నోరు తెరిచారు. నోట్లో పెట్టింది  .నమిలి మింగటం కనిపెట్టి ,మరో ముక్క అందించింది .అన్నిపళ్ళు తానే ఒలిచి ముక్కలు చేసి నోటిలో పెట్టి తిని పించింది .ఊహించని ఇషయం ఇది .’’చిన్నప్పుడు ఏడాది ,రెండేళ్ళ వయసులో అన్నప్రాసన అయిన కొత్తలో మా అమ్మ తినిపించిన గోరు ముద్దలు జ్ఞాపకం లేవుకాని ,అప్పుడు ఎలాంటి అనుభవం కలిగి ఉంటుందో  ఇప్పుడు అలాంటి అనుభూతి కలిగి ,ఎంతతృప్తి కలిగిందోచేప్పలేను ‘’అన్నారు దువ్వూరి వారు ‘’నన్నుగన్న తల్లో,నా పాలిదైవమో ఇట్లా మాహా వాత్సల్యం తో తినిపిస్తోంది అన్న తృప్తి మనసులో ఒక మూల ఉన్నా ,అరే,ఈ పళ్ళు జానెడు పొడవున ‘’పొతకల్లా’’ ఉన్నాయే !ఒక్కొక్కటి వరుస పెట్టి తిని పిస్తోందే.అమ్మ అనుగ్రహానికి ఆన౦దిస్తున్నాం  కాని అజీర్ణం పట్టుకొంటుందేమో అని సంకోచం .అన్నిటికీ అమ్మే ఉందని ధైర్యంగా పళ్లన్నీ తినేశాను ‘’అని అనుభూతి పొందారు .

   అమ్మ చనువిచ్చింది కదా అని శాస్త్రిగారు ‘’అమ్మా !అమ్మ దగ్గరకు పనిమీద రాలేదు .లోకంలో తల్లి దగ్గరకు పిల్లలు ఎందుకు వస్తారో అందు కోసమేవచ్చాం ‘’అన్నారు .అమ్మ ‘’అవున్నాన్నా !అమ్మదగ్గరకు పిల్లలు రాకపోవటానికి ఏదైనా కారణం ఉండవచ్చు కాని ,రావటానికి కారణం  ఎందుకు “”?అనగానే ‘’ఆమె లోతైన భావానికి ,ఆముచ్చటైన మాటకు తబ్బిబ్బయ్యారు .అమ్మ ‘’నాన్నా  !చాలాసేపటి నుంచి కూర్చున్నావు శ్రమగా ఉందా ?’’అని అడిగితె ‘’అమ్మ సన్నిధిలోకూర్చోవటం కనుక యెంత సేపైనా శ్రమగా లేదు ‘’అన్నారు .అక్కడి వారి వైపుచూసి ‘’నాన్నకు శ్రమలేకుండా ఖాళీమంచం ,పక్కాదిండు అన్నీ చూడు ‘’అన్నది .వీరంతా లేచినిలబడి వ౦దనం చేసి  బయటికి వచ్చి వారికి అప్పటికే ఏర్పాటు చేసిన వాటిపై విశ్రమించారు .సాపాటు చేశారు ఆచార్యులవారు .’’ఇక్కడికి వచ్చే వారు, వచ్చి స్థిరపడిన వారు అంతా అమ్మ బిడ్డలే .జిల్లెళ్ళమూడిఓరియెంటల్ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మగారు ,కాలేజీ పండితులు వచ్చి ఎంతో ఆదరాభిమానాలు ప్రదర్శించారు .పన్నాల వారు అమ్మపై ఎన్నో గ్రంథాలు సుప్రభాతం రాశారు .సంస్కృతం లో .అమ్మపై ‘’పావకప్రభ ‘’గొప్ప సంస్కృత కావ్యం రాశారు .దీన్నిఒకామే ఆంగ్లం లోకి అనువదించింది ,అ౦బికాకాసహస్రనామస్తోత్రం ,అంబికా కరావలంబం ,అంబికా నవరత్నమాల మొదలైన 20 గీర్వాణ రచనలు చేశారు .కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని రాసిన సంస్కృత ‘’ఉమాసహస్రం ‘’కు తెలుగు అనువాదం చేశారు  .పొన్నూరు సంస్కృత కాలేజి మాజీ ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు నాపై ఆదరం తో పన్నాలవారి సెల్ నంబర్ ఇవ్వగా హైదారాబాద్ లో వారింటికి వెళ్లి ఇంటర్వ్యు చేసి వారిచ్చిన పుస్తకాలు చదివి వారిపై గీర్వాణ౦ -2లో పన్నాలవారిపై రాసే భాగ్యం నాకు కలిగింది .

  మర్నాడు ఉదయమూ ‘’ప్రేమస్వరూపిణీ,ప్రత్యక్ష దేవతామూర్తి అమ్మ దర్శనం చేసి ‘’ సంతృప్తిచెంది ‘’అమ్మ చూపు ‘’కు తన్మయులయ్యారు ‘’ఆమెను చూస్తున్నంత సేపూ బాహ్య దృష్టికి కాని  ,మనో నేత్రానికి కాని మరేదీ గోచరించలేదు .అదో ఆకర్షణ ,అదో రీతి తన్మయత్వం ‘’అని మహా అను భూతిపొందారు దువ్వూరివారు .ఉన్న విశేషమంతా అమ్మ చూపులోనే ఉంది .మనతో మాట్లాడదేమిటి అనే భావం రాదు .మాటాడుతున్నట్లే ఉంది ,ఆదరిస్తున్నట్లే ఉంది ,జాలి పడుతున్నట్లే ఉంది ,బుజ్జగిస్తున్నట్లు ధైర్యం చెబుతున్నట్లు ఉంది .ఇవన్నీ కంటి చూపులలోనే ఉన్నాయి .ఆ చూపు మహిమే మాతృశ్రీ జిల్లెళ్ళ మూడి అమ్మ చూపు .ఉదయం పాద నమస్కారం అయ్యాక ,గదిలోకి వెళ్లి పోయింది .లేద్దామనుకొంటు౦డగా,సన్నిధానులు కాసేపు ఆగమన్నారు .అందర్నీ పంపేసి ,ప్రత్యేక దర్శన అనుగ్రహం ఇవ్వగా,ఆమె మంచాన్ని ఆనుకొని కూర్చున్నారు .అమ్మ ‘’నా చేయి పట్టుకొని తిరగ ,బోర్లాతిప్పి ,తన వ్రేళ్ళతో నిమురుతూ ,ఎన్నో కుశలప్రశ్నలు వేసి మాట్లాడుతోంది .ఇలా చేయటం తో నా కంఠ దోషాలను ,నాలుక దోషాలను  వ్రేళ్ళద్వారా బయటికి లాగేస్తోంది ‘’అని పించింది శాస్త్రి గారికి .’’అదొక భావన ,నమ్మిక ,.నమ్మిక లేకపోతె ప్రపంచం లేదు .సృష్టి అంతా మన నమ్మకం పైనే ఉంది .’’యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ’’’’అను కొన్నారు .’’బ్రహ్మ తన సృష్టిలోఅక్కడొక బొట్టూ అక్కడొక బొట్టూ గా ఉన్న వాత్సల్య రసాన్ని అంతనూ పోగు చేసి ,ఒక్క ‘’అమ్మ ‘’హృదయం లో ఉంచి నట్టున్నాడే అని తోచింది .అమ్మసన్నిధికి వెళ్ళే టప్పటికి నా వయసు 74.అమ్మ దగ్గర నా వయస్సు 7+4=11 ఏళ్ళ పసివాడిని అని నేను అనుకొన్నాను .ఆమె కూడా అలాగే అను కొని ఉంటుంది .వదల్లేక వదల్లేక అమ్మను వదిలి వదిలి వచ్చాము ‘’అని దివ్యానుభూతితో అన్నారు దువ్వూరివారు .

  తర్వాత ఎప్పుడో ప్రముఖ లింగ్విస్ట్ ఆచార్య భద్రి రాజు కృష్ణమూర్తి గారు కనిపించి ‘’అమ్మను చూసి వచ్చారట కదా ‘’అనగా ‘’నీకు ఎలాతెలిసి౦దోయ్ .ఎట్టాతెలిసింది?’’ అని అడిగారు .’’ఈ మధ్యే కుటుంబం తో వెళ్లి వచ్చాం మాస్టారూ .మీరు వచ్చినట్లు అమ్మ చెప్పింది ‘’అన్నారు .అమ్మ చెప్పింది అంటేఆశ్చర్య పడ్డారు దువ్వూరి వారు .’’నా మీద అమకు  యెంత ప్రేమకలిగిందో ?ఎట్టా కలిగిందో ?అని లోపల పొంగిపోయాను ‘’అన్నారు శాస్త్రీజీ .

ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఈ నాటి అనుబంధ మేనాటిదో ?

ఈ నాటి అనుబంధ మేనాటిదో ?

దువ్వూరి వారు విశాఖయూనివర్సిటీ లో తెలుగు లెక్చరర్ గా 1941 లో చేరాక ,రెండవ ప్రపంచ యుద్ధకాల౦ లో బాంబుల భయం వలన యూని వర్సిటీని గుంటూరుకు  మార్చారు .అంత పెద్ద కాంపస్ దొరక్క  అక్కడా అక్కడా  సర్దుకొన్నారు .లెక్చరర్లు ఇక్కడ పెంచిన అద్దె ఇళ్ళల్లో ఉండలేక సతమతమయ్యారు .ఒకసారి వైజాగ్ లో పరిచయమైన గుంటూరు హైస్కూల్ తెలుగు పండిట్ సూర్యనారాయణ  కు తనకు ఇల్లు చూచి పెట్టమని రాస్తే ‘’ అదెంతభాగ్యం సామానుతో వచ్చెయ్యండి ‘’అని జవాబిస్తే ,రేపు కాలేజీ తెరుస్తారనగా కుటుంబం తో ఆయన ఇంటికి చేరారు .ఆ ఇల్లు జూటు మిల్లుకు దగ్గర ఆ చివర్లో ఉంది .అక్కడ ఏడెనిమిది ఇళ్ళు మాత్రమె ఉన్నాయి . వెళ్ళిన రోజు వారి౦ ట్లోనే  భోజనాలు కానిచ్చి వసారాలో సామాను ఇరికించి అక్కడే పడుకొన్నారు .సూర్యనారాయణ గారు దగ్గరలో ఒక ఇల్లు చూశానని ఇంకా పనులు పూర్తీ కాలేదని అవగానే వీరికే ఇస్తానని చెప్పాడని చెప్పి లాగించాడు .యూని వర్సిటి స్టడీస్ బోర్డ్ మీటింగ్ కూడా గుంటూరు లోనే కనుక కొందరు పెద్దలు దువ్వూరి వారి౦టివసారాలోనే  మకాం .వారికి వీరిపై ఉన్న వాత్సల్యం అది .వీరేకాక వారి స్నేహితులూ అంతే.విశాఖలో  ఉన్నా అలాగే .వీరింటే ఉండటం వారికిష్టం .ఇరుకు ఇల్లు బాధ భరించలేక మారుదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘’ఓనరుడు ‘’పడనివ్వలేదు .అద్దె తీసుకోమంటే మనలో మనకు అద్దె మాట లెందుకు అని నంగనాచి కబుర్లు చెప్పేవాడు .

‘’వానరుడు’’ చెప్పిన ఇల్లు మాచర్ల వెంకటప్పయ్యగారిది .క్లాసులు ఉదయం 8నుంచి 11వరకే కనుక మధ్యాహ్నం ఇంటి వేట చేస్తూ ఆ ఇంటికి వెళ్ళగా ఆయనే ‘’నమస్కారం మేస్టారూ!’’అని దారిలో కనిపించి పలకరిస్తే ‘’మీ ఇంట్లో ఉందామని అనుకొంటే మేరు ఎవరికో అద్దేకిచ్చినట్లు మాస్టారు చెప్పారు ‘’అనగా ‘’అదేమిటి మాస్టారు .మీరొస్తారని అంతా సిద్ధం చేసి చాలాకాలమైంది .మిమ్మల్ని అద్దెకు పంపమని ఆయనకు చెప్పి కూడా చాలాకాలమైంది .ఒకసారి ఆయన కోమట్ల ఇళ్ళలో శాస్త్రి గారు ఉండనన్నారు ఇంకెవరికైనా ఇచ్చేయండి అని నాతొ చెప్పారు కూడా అనగా  ‘’ ఆశ్చర్యపోయారు దువ్వూరివారు..ఆయనకు డబ్బు అంటే మహా కక్కుర్తి .అద్దె తనకే వస్తుందని మీకు మాయమాటలు చెప్పి చాలా ఇబ్బంది పెట్టాడు ‘’అన్నారు శాస్త్రిగారికి సీన్ అర్ధమైంది .’’మేమొచ్చేస్తాం.మీరు ఇస్తారా ?’’అని అడిగారు .’’మీరు వస్తే మాకు మహా భాగ్యం .ఇప్పుడే ఇస్తాం .పైన ఉన్న రెండు గదుల్లో మేముంటాం కిందనాలుగు పెద్ద గదులు  మీరు వాడుకోండి .మీకు అనవసరమనిపిస్తే మీరే ఎవరికైనా రెండు గదులు అద్దెకిచ్చుకోవచ్చు  పెత్తనమంతా మీదే’’అనగా అద్దె యెంత అని అడిగితె ‘’అద్దేకోసం కట్టలేదు మీవంటి విద్యా స్వరూపులు ఉంటె చాలు .రాచకొండవారికి ఎంతిస్తే మాకు అంతే ఇవ్వండి .ఈ మారుమూల అద్దెలకు ఎవరూ రారు .మీరు  చేరండి  చాలు .సెలవులకు వెళ్లేముందు సామానంతా ఇక్కడకు చేర్చి తాళం వేసుకొని  నిశ్చింతగా వెళ్ళండి .’’అన్నాడు .

రెండురోజులయ్యాక రాచకొండాయనతో ‘’షావుకారు కనిపించాడు . వాళ్ళ బందువులెవరూ రారట .కావాల్సివస్తే మాకు ఇస్తామన్నారు ‘’అని చావుకబురు చల్లగా చెప్పారు .ఓనరుడికితన  పన్నాగం బయట పడిందని తెలిసి కిక్కురుమనలేదు .అద్దెకూడా పది రూపాయలే అని చెప్పారు .’’మీకు విశాలంగా ఉంటుంది అదే మనకు కావాల్సింది ‘’అని కలర్ పూశాడు .సెలవలకు వెళ్ళే ముందు సామాను కొత్తింట్లో చేర్చి సెలవలతర్వాత తిరిగొచ్చి ఆ ఇంట్లో చేరారు దువ్వూరివారు .ఈకొత్త యజమాని సౌజన్యం చాలా గొప్పది అనిపించింది .ఒక రోజు ఉదయం ఆయన సుత్తీ మేకులతో వచ్చి ‘’మేడగదిలో చొక్కాలు తగిలించుకోటానికి  రెండు మేకులు  కొట్టబోతుంటే మా ఆవిదవచ్చి ‘’కింద బాబుగారు ఉంటె ఈ శబ్దాలేమిటి ‘’అన్నది నాకు ఆలోచన తట్టలేదు .మీ అనుమతి తో మేకులు కొడుతాను .అన్నారు .అంతేకాదు ఆమె ‘’బాబుగారు వారానికో పదిరోజులకో మేడ మీదకు వస్తారు .గోడలనిండా మేకులు చూసి అసహ్యి౦చుకోరా “’అన్న ఆమె విజ్ఞతకు దువ్వూరి వారి కుటుంబం అమితాశ్చర్యపోయింది .

శాస్త్రిగారి ప్రియమిత్రులు పింగళి లక్ష్మీ  కాంతంగారు రోజూ  సాయంత్రం 4గంటలకు వీరింటికి రావటం ,ఇద్దరూకలిసి మాచెర్ల రైలుకట్ట మీద షికారు చేయటం రివాజు .చాలాసార్లు   పింగళి ‘’ఊళ్ళో ఇంటి అద్దెలు పెట్రేగి పోతున్నాయి.మూడు నెలల కోసారి ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తోంది .ఇప్పటికి మూడిళ్లు మారాను. మీ ఇంటి ఓనర్లు మిమ్మల్ని   వెళ్ళమనరు సరికదా ,మీరెక్కడ   వెళ్ళిపోతారో నని భయపడుతూ దాసులుగా ఉన్నారు. ఏమి మాయ ,మంత్రం వేశారో మీరు .మాక్కూడా ఆమంత్ర  చెప్పండి ‘’అని  నవ్వుతూ  అనేవారు .

1946లో యూని వర్సిటి తో పాటు దువ్వూరి వారి కుటుంబం కూడా మళ్ళీ విశాఖ పట్నం చేరింది .బయల్దేరేరోజున యజమాని ఒక అందమైన చేతికర్ర కొని తెచ్చి బహుమతిగా ఇచ్చి కుటుంబం అంతా రైలుదాకా వచ్చి ఆప్యాయంగా వీడ్కోలు పలికారు .ఆకర్రను అత్యంత ప్రేమగా వాడుకొన్నారు శాస్త్రిజీ .’’విలువ వస్తువుది కాదు ప్రేమది ‘’అన్నారాయన .’’న వసంతి హిప్రేమ్ణి గుణాః,న వస్తుని ‘’ వస్తువుకున్న విలుకకాదు అందులోని ప్రేమను చూసి ఆన౦దించాలి  .

మళ్ళీ విశాఖ వెళ్ళాక గుంటూరు హిందూకాలేజీ వారు వార్షికోత్సవానికి పిలిస్తే రెండు సార్లు కుదరక మూడో పిలుపుకి పదేళ్ళ తర్వాత వెళ్ళారు  .వస్తున్నట్లు వెంకటప్పయ్యగారికి ముందే కార్డ్ రాశారు .ఓరుగంటి నీలకంఠ శాస్త్రి గారింట బస చేద్దామనుకొన్నారు  .అప్పటికే వెంకటప్పయ్య గారు అక్కడికి వచ్చిఉంనారు ‘’రేపు మీటింగు కనుక వీలు కుదురుతుందో లేదో ఈ రోజే ,ఇప్పుడే మా ఇంటికి దయచేయాలి ‘’అని మర్యాదగా ఆహ్వానించారు మాజీ ఓనరు గారు .దువ్వూరివారితో శాస్త్రిగారు కూడా వెళ్ళారు .

వెళ్లేసరికి ఇంటిల్లి పాదీ దువ్వూరి వారికోసం వెయ్యి  కళ్ళలతో ఎదురు చూస్తున్నారు .ఇంట్లో అద్దెకున్న ప్లీడరు గారి తల్లిగారు కూడా ఉన్నారు .హాలులో కుర్చీలు బల్లలలూ అన్నీ  సిద్దంగా గా ఉన్నాయి .’’మీరు స్నానం కూడా చెయ్యలేదు సరాసరి వచ్చేశాం . వెడదాం ‘’అన్నారు శాస్త్రిగారు కబుర్లు అయ్యాక .వెంకటప్పయ్యగారి భార్య ‘’ వెళ్ళటం ఏమిటి ? బాబుగారు ఈ రాత్రికి ఇక్కడే ఉంటారని మేమంతా సంబర పడుతున్నాం ‘’అనగా  ముసలమ్మగారు ‘’మీరీపూట ఉంటారని వంట కూడా చేశాను ‘’అనగా శాస్త్రిగారు ‘’అమ్మా !ఆయన ఉండే రెండు పూటలు మా ఇంట్లోనే భోజనం మీరాప్రయత్నంచేయద్దు ‘’అన్నారు .ముసలమ్మగారు ‘’బాబుగారూ !మీరు వెళ్లి పదేళ్ళు అయింది మేమొచ్చి అయిదారేళ్ళు అయింది .ఈ కుటుంబం అంతా ఎప్పుడూ మీ కుటుంబం గురించే ముచ్చటగా చెప్పుకొంటారు .ఎప్పుడో అద్దెకు ఉండి వెళ్లి పోయిన వారిమీదింత అభిమానం ఏమిటి అని ఆశ్చర్యపోతాం .వీరిపెద్దమ్మాయి మాణిక్యం  కాపురానికి వెళ్ళినా ,మీరోస్తున్నారని వారినడిగి ముగ్గురు పిల్లలతో సహా తీసుకొచ్చారు .ఆ అమ్మాయి మీ మీద ఒకనేరం నాతొ చాలా సార్లు చెప్పింది .మీరు వస్తున్నారుగా అడుగుదామని కాచుక్కూచున్నాను .అసలు విషయం ఏమిటంటే .తనూ ,తండ్రీ మీ పెరటి పూలమొక్కలను జాగ్రత్తగా పెంచుతున్నా ఆమ్మాయిని ఆ పూలు కోసుకో నివ్వలేదట. ఇదే అభియోగం .నిజమేనా .కొన్ని రోజులతర్వాత ఒక రోజు మీరే రోజుకు ఒక్క పువ్వు మాత్రం  కోసుకోమన్నారట.నిజమేనా బాబుగారూ !’’అనగానిజమే జ్ఞాపకమొచ్చింది అన్నారు దువ్వూరిజీ .అప్పుడా పిల్లవయసు 11-12మధ్య .ఇప్పుడు ముగ్గురు బిడ్డల తల్లి .వెంకటప్పయ్యగారి భార్య సుబ్బప్ప లోపలి వెళ్లి రెండు గ్లాసులతో ఏదో పానీయం తెచ్చి ఇద్దర్నీ పుచ్చుకోమన్నది .అది సంధ్యాసమయం ఏదీ తీసుకొను అన్నారు . కళ్ళ నీళ్ళతో  వారమ్మాయి  ‘’ఇదికాఫీ కాదు టీ నాన్నా .నీకోసం నేనే లోపలి వెళ్లి తయారు చేశాను పుచ్చుకోవా నాన్నా ‘’అనగానే గుండె ద్రవీభవించింది దువ్వూరివారికి .పదేళ్ళ క్రితం అలవాటు గుర్తుపెట్టుకొని ఆప్యాయం గాచేసి ఇచ్చిన ఆపిల్ల తండ్రిపై ఉన్న ప్రేమకు కళ్ళు చెమర్చాయి .అది గ్లాసు అంటే చిన్న గ్లాసుకాదు,10 అంగుళాల పొడవున్న ఆప్కోరా చె౦బు .సమయంకాని సమయమైనా ఆప్రేమకు పులకించి గడగడా తాగే శారు .సంతృప్తి ,కళ్ళనీళ్ళతో  వంగి దువ్వూరివారి కాళ్ళు పట్టుకొంది ఆపిల్ల .దువ్వూరి వారికీ కంటి నిండా నీరే .’’లేమ్మా ‘’అని,అక్కడ మరోకుర్చీ లేకపోవటంతో ఆ పిల్లలతల్లిని తన కుర్చీలోనే కూర్చోపెట్టుకొని తలనిమిరి ఆశీర్వదించారు .నీలకంఠ శాస్త్రిగారు వెంకటప్పయ్య గారి  కుటుంబం ,ప్లీడరుగారి తల్లిగారు అందరూ యెంతో సంతోషం, ఆనందం, ఆశ్చర్యం పొందారు .దీనిపై దువ్వూరివారు ‘’ఈ ప్రేమలు ఇప్పటివికవు. జన్మాన్తరీయలై ఉండాలి ‘’వ్యక్తిజన్మాంతర ప్రీతిం మనస్స్ని హృద కారణం ‘’అంటారు .ఎప్పుడో అద్దెకున్న వ్యక్తిపై అందునా తమకులం వాడు కూడా కాని వారిపై జన్మా౦తర౦  వరకు నిలిచిపోవటం ఏమిటి ‘’అని ఆర్ద్రంగా అన్నారు దువ్వూరి శాస్త్రిగారు .తనవాడే అయిన పాత ఇంటి యజమాని చేసిన ద్రోహానికీ దీనికీ ఎంతతేడా ?కులంకాడు గుణమే గౌరవం .ఈ   దృశ్యం కళాతపస్వి విశ్వనాథ్ తీసే సినిమా సీన్ లాగా ఉందని పించింది కదా .ఆర్ద్రత అంటే ఇదే .దీనిలో నిష్ణాతుడు విశ్వనాథ్.అందుకే ఆయనసినిమాలు మనసులో స్థిరంగా నిలిచిపోతాయి కళ్ళవెంట ఆనంద బాష్పాలు ధారా పాత౦గా కారిపోతాయి .అదీ ఆన౦దానికి పరాకాష్ట .

ఆధారం –దువ్వూరివారి స్వీయ చరిత్ర

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-19-ఉయ్యూరు


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి

బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి  

విజయనగరం అంటే శ్రీ మదజ్జాడఆదిభట్ల నారాయణ దాసు  గారే ముందు గుర్తుకొస్తారు .తాతా రాయుడు శాస్త్రిగారు విజయనగరం రాజావారిసంస్కృత కాలేజిలో వ్యాకరణ  అధ్యాపకులు .ఈ ఇద్దరికీ ఆబాల్య మైత్రి ఉంది .శాస్త్రిగారు రోజూ కాలేజీకి కానుకుర్తి వారి వీధిలో ఉన్న దాసు గారింటి మీదనుంచే వెళ్ళేవారు .మేడపై నుంచి దాసు గారు చూసి గబగబా దిగి వచ్చి ‘’శాస్త్రీ !అని కేకవేసి ఆపి ‘’సిద్ధాంత కౌముది లోను ,మనోరమ ,మాహా  భాష్యం లోనూ ఈ పంక్తులకు సమన్వయము ఇట్టా చేసుకొన్నాను .అవునోకాదో చూడు .శంఖం లో పోస్తే కాని తీర్ధం కాదు కదా ‘’అనేవారు అప్పుడు శాస్త్రిగారు ‘’అదేనయ్యా !సమన్వయ౦.నీ బుద్ధికి తప్పు దారి తోచదు ‘’అనేవారు .ఆలాగే పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారిని దాసు గారు పలకరించి ‘’అయ్యా !ముక్తావళి లో ఈ పంక్తికి ఇదే కదూ అర్ధం ?’’అని అడిగితె ‘’అవునండీ ‘’అనే వారు అలాకాదు ఇలా అనాల్సిన అవసరం ఉండేదికాదు .

‘’ కౌముది అన్నా ,మనోరమ అన్నా ,మహా భాష్యం అన్నా ,ముక్తావళి అన్నా సామాన్య గ్రంథాలు కావు .శాస్త్ర సంస్కారం ఉన్నవాళ్ళు గురువు వద్ద సావధానంగా చెప్పు కుంటే కాని  బోధ పడవలసినవి కావు .కానీ నారాయణ దాసుకు దేనికీ గురువు అక్కర లేదు .ఆయన ‘’స్వయం గురుః,స్వయం శిష్యః’’.ప్రతిభా సంపత్తి విషయంలో రాయుడు శాస్త్రి గారి ప్రతిభ గురువుల ఉపదేశం వలన ఉద్యుద్భుదమైంది .అదీ ఈ రెండు ప్రతిభలకు ఉన్న తేడా ‘’అంటారు కళాప్రపూర్ణ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు .విజయనగరానికి ‘’విద్యానగరం’’అని పేరురావటానికి తండ్రీ కొడుకులైన  విజయరామ గజపతి ,ఆనంద గజపతి మాహారాజుల సంస్థానానికి విజయనగరం ముఖ్య పట్టణం అవటం ఒకటి అయితే ,తాతా రాయుడు శాస్త్రిగారు  ,ఆదిభట్ల  నారాయణ దాసు గార్లు ఆ పట్టణం లో ఉండటం రెండో కారణం అన్నారు దువ్వూరి .అదీ వారి ప్రతిభ .ఆ రెండూ అసాధారణ ప్రతిభా జ్యోతులు .రాయుడు శాస్త్రిగారి ప్రతిభకు ఆకర్షితులై చిట్టి గూడూరు నుంచి వచ్చిన  శ్రీ మత్తిరుమల గుడిమెట్ల వరదా చార్యులవారు  అపూర్వ మిత్రులయ్యారు .దువ్వూరివారిపై రాయుడు శాస్త్రిగారి వాత్సల్యమూ అపూర్వమైందే .

  రాయుడు శాస్త్రిగారు ఎప్పుడు వచ్చినా వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారింట్లోనే బస .రాయడు శాస్త్రిగారి ప్రధాన వ్యాకరణ శిష్యులలో వేదులవారు ప్రప్రధములు మాత్రమేకాదు పినతల్లి కుమారులు కూడా .కనుక ఎప్పుడూ బస ఇక్కడే .’’సాధారణ పండితుల్లో తాము చదువుకొన్న శాస్త్రం లో బ్రహ్మాండమైన కృషి చేసి పాఠాలుబోధించి అనుభవ౦తో ఆ శాస్త్రం లో వారొక్కరే’’ అధారిటీ’’ అని పేరు పొందినవారున్నారు .తమ ప్రధాన శాస్త్రం తో పాటు ,ఇతర శాస్త్రాల సంప్రదాయాలు తెలిసినవారూ ఎందరో పండితులున్నారు .ఎందరున్నా ,రాయుడు శాస్త్రి గారి ప్రతిభ ఇంకెక్కడా లేదు .శాస్త్ర విషయాన్ని సూక్షంగా తెలుసుకొనే గ్రహణ శక్తి వేరు .విన్న విషయాలను మరుపు లేకుండా జ్ఞప్తి లో ఉంచుకొనే ధారణా శక్తి వేరు .తెలిసిన విషయాలను తేలికగా శిష్యులకు చెప్పే బోధనా శక్తి వేరు .సభలలో శాస్త్ర విషయాలపై జరిగే చర్చలలో జరిపే వాద శక్తి వేరు .కొత్త విషయాలు ఆకళింపు చేసుకొని వాటిపై పుస్తకాలు రాసే రచనా శక్తి వేరు .వీటిలో ఏ కొన్ని శక్తులున్నవారికైనా పేరు,ప్రసిద్ధి  వస్తుంది.రాయుడు శాస్త్రిగారిలో ఈ శక్తులన్నీ ఉండి,వాటిపైన మెరుస్తూ ఉండే అసాధారణ ప్రతిభా సంపద ఉంది .కనుక కావ్య ,నాటకా,లంకారాది సాహిత్య  ప్రపంచం లో కాని ,వారి ప్రధాన శాస్త్రమైన వ్యాకరణం లోకాని ,అతి పరిచయమున్న ధర్మ శాస్త్రం లో కాని ,పఠన ,పాఠనాల  తో సంబంధం లేని న్యాయ ,వేదాంత శాస్త్రాలలో ఏ ప్రకరణం లో ఏ సందర్భం ఉన్న పంక్తి అయినా ,ఆయన చూశారంటే చక్కగా అర్ధమై పోవాల్సిందే .అన్వయించని క్లిస్టపంక్తి  అనేది ఏ శాస్త్రం లోనూ ,ఏ గ్రంథం లోనూ రాయుడు శాస్త్రిగారికి ఉండేది కాదు .ప్రతిభ అంటే అదే ప్రతిభ ‘’అని శాస్త్రిగారింట్లోనే చాలాకాలమున్న దువ్వూరి వారు ఎస్టిమేట్ చేసి చెప్పారు .ఈ ప్రతిభ ఎలా ఒక ముఖ్య సందర్భం లో బయట పడిందో  ఇప్పుడు తెలుసుకొందాం .

 ‘’ వేదార్ధం చెప్పటం ఆషామాషీ వ్యవహారం కాదు .దీనికి వేదం లోని82 ప్రశ్నలు క్షుణ్ణంగా వల్లించి ఉండాలి ,సంస్కృత భాషలో గట్టి పాండిత్యం ఉండాలి ,వ్యాకరణ ,పూర్వ మీమా౦సాలలొ మాంచి స్వతంత్రత ఉండాలి .న్యాయ ధర్మాది శాస్త్రాలతో బాగా పరిచయమూ ఉండాలి ,ఇన్ని ఉన్నా ‘’విద్యారణ్యం ‘’ఎన్నో సార్లు చదివి విషయం అంతా ఆకళిం పై    గుర్తు ఉంచుకొంటే కాని  సభలలో వేదార్ధం చెప్పటం కుదరదు.ఇంత క్లేశం ఉండబట్టే వేదం లో సంహిత ,పదము ,క్రమము వల్లించేవారు చాలామంది ఉన్నా వేదార్ధం చెప్పేవారు నూటికి ఒకరో ఇద్దరో ఉంటారు .

  ఒక సారి పిఠాపురం సంస్థానం లో విద్యారణ్య ప్రకటన ఇచ్చేనాటికి వేదవేదాంగ పరిచయం ఉండి,ఎక్కడపడితే అక్కడ వేదార్ధం చెప్పే’’ నువ్వా నేనా’’ అని పోటీ పడే విద్యారణ్య పండితులుగోదావరి జిల్లాలో ఇద్దరే ఉండేవారు .ఒకరు వడలి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు .రెండవవారు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు .ఈ ఇద్దరూ పరీక్షకు దరఖాస్తు పెట్టారు .ఈ ఇద్దరిలో ఎవరు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైతే వారు పిఠాపుర సంస్థాన ఆస్థాన పండితులౌతారు .ఇద్దరూ ఇద్దరే దిగ్దంతులు .ఎవరు ఫస్ట్,ఎవరు సెకండ్ ?అని టెన్షన్ గా ఉంది పండితులలో .ఐతే  దురదృష్ట వశాత్తు ఉప్పులూరివారి ఆరోగ్యం బాగులేక పరిక్షకు వెళ్ళలేక పోయారు .వడలి వారొక్కరే పరీక్ష ఇచ్చారు .ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులై ఆస్థాన విద్వాసులయ్యారు .

  మరు సటి సంవత్సరం విద్యారణ్య పరీక్షకు దరఖాస్తు సమయం వచ్చింది .గణపతి శాస్త్రిగారికి పరీక్ష కు వెళ్ళాలా వద్దా అనే అనుమానం, తన సమ ఉజ్జీ వడలి వారు పరీక్షకులు కనుక తాను పరీక్ష్యకుడుగా వెళ్ళటం ఉచితమా అనే సందేహం కూడాకలిగింది .కొందరు వెళ్ళమని కొందరు వద్దని సలహా ఇచ్చారు .దువ్వూరివారినీ అడిగితే ‘’పరీక్షకులు ఎవరైతే ఏమిటి సమర్ధత ఉ౦ది కనుక  మీరు వెళ్లి తీరాలి ‘’   అని చెప్పారు ఉప్పులూరివారికి .చివరకు దరఖాస్తుపెట్టి పరీక్షకు వెళ్లి రాస్తే సెకండ్ క్లాస్ వచ్చింది .అయ్యో ఫస్ట్ క్లాస్ రాలేదా అని కొందరు విస్తుపోయారు సాయంతం సభ ,సన్మానం అయ్యాయి .ఇంటి దారిలో వడలి,వారు ఉప్పులూరివారు కలుసుకొని ఓహో అంటే ఓహో అనుకోని  వడలి వారు ‘’శాస్త్రిగారూ !మీకు ఫస్ట్ క్లాస్ రావటం నాకు ఇష్టం .వస్తుందనే అనుకొన్నా .అన్నిపేపర్లూ బాగానే రాశారుకాని ఒక దానిలో 40మార్కుల ప్రశ్న చెడిపోయింది .ఒక్క మార్కు కూడా ఇవ్వటానికి వీల్లేక పోయింది .అందుకే ఫస్ట్ క్లాస్ రాలేదు .నొచ్చుకోన్నాను .నొచ్చుకొని ఏం లాభం ?’’అన్నారు సానుభూతిగా .’’ఏ ప్రశ్న చెడగోట్టానో జ్ఞాపకం ఉందా ?అని అడిగారు ఉప్పు లూరి.  ‘’ఫలాని  ప్రశ్న  అని ఆయన అంటే ‘’అన్నిటికంటే దానినే బాగా రాశానే .ఎక్కువ మార్కులు దానికే వస్తాయని ఆశి చానే .ఏమిటి చిత్రం ‘’అన్నారు వడలి’’మీ సమాధానం పెడదారిన నడిచింది అందుకే మార్కులు వెయ్యలేదు .మీ పేపరు చూపిస్తా రండి ‘’అని ఇంటికి తీసుకు వెళ్లి చూపించారు .రెండుగంటలు దానిపై ఇద్దరిమధ్యా వాదోపవాదాలు జరిగాయి .చివరికి వడలి వారే ‘’ఇది ఇప్పుడు తేలేదికాదు .భోజనాలు చేద్దాం .రాయుడు శాస్త్రి గారు ఊళ్లోకి వచ్చారట .భోంచేసి విద్యారణ్యం పట్టుకొని ఆయనదగ్గర కూర్చుని అక్కడే వారి తీర్పు తెలుసుకొందాం ‘’అన్నారు .ఇదీ నేపధ్యం .

 భోజనాలు పూర్తి చేసుకొని వేదులవారింటికి వెళ్లి రాయుడు శాస్త్రిగారి సమక్షం లో విషయం వివరించారు.ఆయన ‘’అయ్యా !ఇది వ్యాకరణం కాదు ధర్మ శాస్త్రం కాదు అందులోనూ నాకు పరిచయం లేని విద్యారణ్య  మాయే .నేనా తేల్చటం ?”’అన్నారు .’’మాకు  తేల్చుకోవటం కుదర కనే మీ దగ్గరకు వచ్చాం మీ తీర్పు శిరో దార్యం ‘’అన్నారు వడలి,ఉప్పులూరి ఉభయులూ .ఇద్దరి వాదనలు పూర్తిగా విన్నాక రాయుడు శాస్త్రి గారు ‘’మీ ఇద్దరు చెప్పింది కూడా గ్రంథకర్తకు ఇష్టమైన మార్గం కానట్టుంది .విద్యారణ్య స్వామి అభిప్రాయం నాకు వేరే విధంగా గోచరిస్తోంది .పంక్తులు చదువుతూ ఉండండి  చెబుతాను ‘’అని వారు చదువుతూ ఉంటె  సమన్వయ మార్గాన్ని వివరించి విద్యారణ్య అభిప్రాయం ఇదే అని తనకు తోచి౦దని తాను  గ్రంథం చూడలేదుకనుక పూర్వాపరాలు ఎలా ఉన్నాయో తెలీదు కనుక తాను   చెప్పిన  సమన్వయము సరిపోతుందేమో చూడమని కోరారు .ఇద్దరు శాస్త్రులవార్లు అవాక్కై తెల్లబోయి ఒకరి ముఖా లొకరు చూసుకొని రాయుడు శాస్త్రిగారితో ‘’అయ్యా !తమరు సెలవిచ్చిందే  విద్యారణ్యుల వారి  ఆంతర్యం.ఆయనొకమార్గం లో నేనొక దారిలో సమన్వయము చేసుకొని చిక్కుల్ని సర్దుకొంటూ భ్రాంతిలో పడి పోయాం .విద్యారణ్య హృదయం మాకు విప్పి చూపారు చాలా సంతృప్తిగా ఉంది .నమస్కారం సెలవు ‘’అన్నారు వడలిలక్ష్మీనారాయణ శాస్త్రిగారు ,ఉప్పులూరి గణపతి శాస్త్రిగారు . అదీ రాయుడు శాస్త్రులవారి ప్రతిభా సంపద .ఆ బుద్ధికి ఉండే తళుకే వేరు ‘’అంటారు దువ్వూరివారు

   ఆధారం

దువ్వూరివారి  స్వీయ చరిత్ర

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

డజనున్నర కథల్లో మణుగున్నర హాస్యం’’ పన్’’డించిన మాడుగుల

డజనున్నర కథల్లో  మణుగున్నర హాస్యం’’ పన్’’డించిన  మాడుగుల

చక్కని వాచికం ,స్వరం లో అన్ని భేదాలు ,రసాలు పండించే చాతుర్యం ,సుమనస్కత ,మూర్తీభవించిన సౌజన్యం ,సంస్కారం ,సకలకళా రహస్య వేతృత్వం ,నిష్పక్షపాత నిర్ణయ సాహసత్వం ,నిజాయితీ ,భేషజం లేని నడవడి,చిరునవ్వుకు చిరునామా అయిన  ముఖం ,కలుపుకోలు తనం ,సోషియాలజీ ,జర్నలిజ౦ లో స్నాతకోత్తర పాండిత్యం ,విజయవాడ ఆకాశ వాణి లో వివిధ హోదాలలో 36ఏళ్ళ విధి నిర్వహణ లో తనదైనముద్ర ,సృజనాత్మక రూపక నాటకాల నిర్వహణలో జాతీయ పురస్కార విజేత , రంగస్థలం పై సులలిత వ్యాఖ్యానత్వం ,మునిమాణిక్యం ,గురజాడ ,కందుకూరి, పుచ్చా ,ముళ్ళపూడి, శ్రీరమణ ల ప్రేరణ ,’’హాస్య కస్తూరి’’ ,వంగర ,రేలంగి రమణారెడ్డి ,సూర్యకాంతం నటనల నిశిత పరీక్షలో ఆరి తేరిన తీరు ,సుత్తి ,రెండు చింతల ,’’’’చిన్న’’ కోట’’ ,విన్నకోట ల హాస్య నాటికలలో నటించిన అనుభవం తో రాసి, మురిపించిన హాస్య నాటికల, కథల విహార౦  వెరసి శ్రీ మాడుగుల రామ కృష్ణ . ఈ కళా మూర్తి  ప్రతిభ గుర్తించి సుమారు ఆరేళ్ళ క్రితమే ఆయనకు  సరసభారతి పురస్కారం అందించి గౌరవించి సత్కరించి ఆత్మీయుడిని చేసుకొన్నది సరసభారతి .నవంబర్ 15 విజయవాడ టాగూర్ లైబ్రరీ లో జరిగిన కవి సమ్మేళనం లో పాల్గొనటానికివచ్చి, నాకు  ఏడాది క్రితం ముద్రించిన ,తన ‘’డజనున్నర హాస్య కథలు ‘’పుస్తకం ఇచ్చి ‘’చదివి అభి ప్రాయం తెలియ జేయండి ‘’అని కోరటం ,నేనేదో పనుల్లో ఉండి చదవకపోవటం ,నిన్న ఉదయం ఫోన్ చేసి ‘’పుస్తకం చదివారా గురువుగారూ !’’అని సుతిమెత్తగా అంటే ‘’ఇవాళ చదువుతానండి ‘’అనటం జరిగింది .మాట నిలబెట్టుకోవటానికి నిన్నమధ్యాహ్నం ,సాయంత్రం రాత్రి చదివి పూర్తి చేశాను  .ఐతే ఏం రాయాలి ,ఎలా రాయాలనే దుగ్ధ పట్టుకొన్నది .’’హాస్య మధ్యాహ్న రవి ‘’తేజస్సుకు దివిటీ పట్టినట్లుగా ,చల్లని హాస్య చంద్రునికి నూలు పోగు వేసినట్లుగా ఉంటుందేమో అని సందేహం లో పడి, శీర్షిక కోసం బుర్ర పగలకొట్టుకొని  అది తటాలున స్పురిస్తే   ఇప్పుడే రాయటం మొదలు పెట్టాను .

    ఇందులోని కథలు డజనున్నర అంటే 18.అన్నీ చదివాక 18పర్వాల’’ హాస్య తెలుగింటి భారతం ‘’అని పించింది .దేనికదే సాటి .సునిసిత హాస్యం తొణికిసలాడింది.మధ్యతరగతి మందహాసానికి ప్రతి రూపమై౦ది .వికృతత్వం ,పైత్యం లేని సరదా జరదా హాస్యం .ప్రతి కథలో అండర్ కరెంట్ గా నీతి ఉంది .భేషజాలకు పోయి నడుం విరక్కొట్టుకున్నవాళ్ళు ,’’ఆఫీసర్ కుక్క’’కు మొహపాటపడి’’ ఏదో’’ చేయించుకొన్నవాడు ,మూడు లక్షలు కట్నం తీసుకొన్న అల్లుడికి బుద్ధి చెప్పటానికి అమ్మాయి గారింట్లో తరచూ అత్తమామలు తిష్టవేసి ,దాన్ని ఖర్చురూపం లో రాబట్టిన మామ ,అర్ధరాత్రి వచ్చే కలలను ఆపుతానని డబ్బు గుంజి చివరికి చేతులెత్తేసిన డాక్టర్ ,ఎనిమిదో వ్యసనమైన సన్మాన భాగవతం ,నవ్వితే బతుకులు బండలౌతాయని స్వానుభవంతో ఎలుగెత్తి చాటిన హాస్యానంద స్వామి ,గరిటేగతి అయిన సీతాపతి  ,డబ్బుకోసం కోటి మోసాలు చేసి బాధపెట్టిన  భర్తను’’కనపడక్కరలేదు ‘’అని పేపర్ ప్రకటన ఇచ్చిన భార్య ,కీర్తి కోసం ,’’గిన్నెల రికార్డ్ ‘’ లో చోటు చేసుకోవటానికి ఆరాటపడి చేతి చమురు వదిలి౦చు కొన్న’’కీ,కా.లు ‘’అంటే కీర్తి కాంక్ష కలవారు. ఆఫీసుకు జీతనస్టం  సెలవుపెట్టి గోదారి పుష్కరాల్లో పుష్కలంగా డబ్బు పీక్కోవచ్చని పురోహితుడి వేషం వేసి ,పుష్కరం పెట్టించుకొనే వారు లేక ,ఇంటికి బంధు జనం పుష్కలంగా వచ్చి లక్షలు అప్పు చేసిన అత్యాస ఉద్యోగి ,అతి ప్రవర్తనకు  విరుగుడు మంత్రాలు వేసి ఆదుకొన్న స్నేహిత బంధుగణం   ,దేవుడిని  ఏ వరం కోరుకోవాలో తెలీక పనికి మాలినవి కోరి, కొరివి నెత్తి కెత్తుకొన్న  బడుద్ధాయి ,చివరాఖరికి ముసలి బామ్మ కోటి రామకోటి రాసి ,వెయ్యి సమూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించి ,ఏటి కేదడాది నోములు వ్రతాలు గుళ్ళల్లో జరిపించి,తనకెందుకు డాక్టర్ ఇవ్వరని పోట్లాడి ప్రయత్నించిన  బామ్మ  కూడా డాక్టరేట్ కోసం ఆరాట పడి,భంగపడి ,ఆ బాధలు పడలేక’’ వంటింటి ,పెరటి వైద్యం ‘’తో అందరికీ దగ్గరై ‘’డాక్టర్ బామ్మ ‘’అని పించుకున్న  ముసలావిడ ,చండిక తత్త్వం తో సంసారం చిద్రం చేసుకొని బుద్ధి వచ్చి ఆ  ,వారసత్వం కూతురుకు కూడా రావటం తో అవాక్కైన మహిళ,కాశీలో చద్దామని విశ్వ ప్రయత్నం చేసి ,ఆఖరికి ఖాజీ పేట లో యాక్సిడెంట్ లో చచ్చిన వాడు ,విమానం ఎక్కితే గండం అని  ఇంటివాళ్ళు, జ్యోతిష్యుల హెచ్చరికతో రైలు ప్రయాణం చేసి ప్రమాదం లో చావు తప్పి కన్ను లొట్టబోయి విమానం లో పంపగా ఇంటికి చేరిన వాడు –ఇలా వెరైటీ కేరక్టర్లతో పుస్తకం అంతా హాస్య రస స్పోరకం గా ఉంది .గోదారి వరద లాగా హాస్యం పొంగి పారింది .హాట్సాఫ్ రామ కృష్ణగారు .హాస్యం ఆయన వంటిలో  జీర్ణించి పోయి ,స్నిగ్ధమై ,ముగ్ధ మనోహరంగా వెలువడింది .ఇది ప్రయత్నపూర్వక హాస్యం కాదు  .స్పాంటేనియస్ హ్యూమర్ .ఇది అందరికీ అబ్బదు .ఇలాంటివారికి, కేఆర్కే మోహన్ గారికి ,హాస్యబ్రహ్మ  భమిడిపాటి వారికి జంధ్యాల వంటి కొద్దిమందికి మాత్రమె అబ్బినకళ.మాడుగులవారు సార్ధకం చేసి రుచి చూపించారు .

  మాడుగుల వారు పాత్రలకు పెట్టిన పేర్లు బహు విచిత్రంగా ,పాత్రల స్వభాలను తెలియ జేసేవి లా ఉన్నాయి .కథా శీర్షి కలూ వింతగా విడ్డూరంగా ఆకర్షణీయం గా ఉండటం ప్రత్యేకత .’’మాడుగుల మార్కు’’ప్రస్పుటంగా  కనిపిస్తుంది .నామకరణ మహోత్సవం చూద్దాం –మన్మధం,శనీశ్వర్,సన్మానాల్రావ్,మీన లోచనం ,గండాలమ్మ , పాప నాశనం తాతయ్య ,మత్శ్యావతారం బాబాయి ,వెరైటీ సుబ్రహ్మణ్యం వంటివి .భమిడి పాటి  వారి సార్ధక నామదేయాలు గుర్తుకొస్తాయి .ఆఫీసరు గారి కుక్కకు షార్ట్ నేం ఆఫీసరు కుక్క.జోగిలో మార్పు వస్తే జోగి అడుగుతూ తిరుపతికి వెళ్ళటం ,’’సరస శృంగార రచయిత’’అని సంబోదించి నిరసనలు ఎదుర్కొన్న కాకారాయుడు .నవ్వండికాని ,నవ్వులపాలు కాకండి అన్న నీతి.’’మా ఆవిడ కాలు జారింది ‘’అని నోరుజారి దెబ్బతిన్నవాడు  .ఇలా ఎన్నని చెప్పను ?నూజి వీడు రసం మామిడి పండు టేస్టు ,అదేదో కథలో నవాబు గారి పీచుగడ్డానికి పంచదార బెల్లం తేనే ,చింతపండు కలిపి పేస్టు చేసి పూసి ఇంకోడెవడి నో నాకి, రుచి  చూసి చెప్పమంటే ఎలా ఉంటుందో ,ఈ హాస్య రస మాధుర్యం  ఆస్వాదించాలంటే  అంతే, అందరు చదివి అనుభూతి పొందాల్సిందే .మాటలకు అందని హాస్య మాధుర్యం మాడుగుల వారి కథల్లోఉంది .

వారి సెల్ నంబర్ -93,47,16,40,10

E-mail –madugulark@gmail.com

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-11-19-ఉయ్యూరు

   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం—74(చివరి భాగం ) 106-తీర్దానాం చతుర్విధాది నిరూపణం

గౌతమీ మహాత్మ్యం—74(చివరి భాగం )

106-తీర్దానాం చతుర్విధాది నిరూపణం

నారద మహర్షి బ్రహ్మ దేవుని పావన గౌతమీ నది గురించి సంక్షిప్తంగా మళ్ళీ చెప్పమని కోరాడు .పూర్వం కమండలం లో ఉన్న గంగ ,తర్వాత విష్ణుమూర్తి పాదాలనుంచి ఉద్భవించి ,మహేశ్వరుని జటాజూటం చేరి ,గౌతమమహర్షి తపో ఫలం చేత బ్రహ్మగిరి చేరి,అక్కడి నుంచి పూర్వ సముద్రం చేరింది .సముద్రునితో సంగమమై సర్వ తీర్ధ స్వరూపంగా ,మానవుల సకల కోరికలను ఈడేర్చేదానిగా ఉన్నది .ముల్లోకాలలో దీనికి మించిన తీర్ధం లేదు .నిజంగా గంగానది పరబ్రహ్మ స్వరూపమే .భక్తి తోనే ఇదంతా చెప్పాను’’ అని చెప్పాడు .నారదుడు ‘’తండ్రీ !నీవు సకల శాస్త్ర వేద,పురాణ  పారంగతుడవు .ఛందో రహస్య వేత్తవు.తీర్దాలు ,దానాలు ,యజ్ఞాలు తపస్సులు దేవతలు ,మంత్రాలు ,ఉపాసనలలో ఏది సర్వ శ్రేష్టం ? ‘’అని ప్రశ్నించగా బ్రహ్మ ‘’ఉత్తమమైన పవిత్రమైన రహస్యమైన ధర్మం చెబుతా విను .తీర్దాలు నాలుగు ,యుగాలు నాలుగు ,గుణాలు మూడు ,సనాతన దేవ పురుషులు ముగ్గురు ,స్మృతులతో కలిపి వేదాలు నాలుగు .ధర్మార్ధ కామ మోక్షాలు అనే పురుషార్ధాలు నాలుగు .వాణి నాలుగు రకాలు .సమత్వంతో గుణాలు నాలుగు .ధర్మం సర్వత్రా సామాన్యమైనదీ సనాతనమైనది. సాధ్య సాధన భావాల చే ధర్మం అనేక రూపాలు .ధర్మానికి దేశం ,కాలం ఆశ్రయాలు .కాలాశ్రయ ధర్మం ఒక్కో సారి క్షీణించి ,మళ్ళీ వృద్ధి చెందుతుంది .యుగాలను బట్టి ధర్మం ఒకో పాదం లోపిస్తుంది .దేశాశ్రయ ధర్మం క్షయం ,వృద్ధి అని రెండురకాలు .కాలాశ్రయ ధర్మం నిత్యం దేశం లో ప్రతిష్టితమై ఉంటుంది .యుగాలు క్షీణించినా  క్షీణి౦ చదు. .రెండు చోట్లా ధర్మానికి హ్రాసం ఏర్పడితే దానికి అవభం కలుగుతుంది .కనుక దేశాశ్రిత ధర్మం నాలుగు పాదాలతో స్థిరంగా ఉంటుంది .

  దేశాశ్రయ ధర్మం తీర్ధాలలో నిలిచి ఉంటుంది .కృత యుగ ధర్మం దేశ ,కాలాలలో వ్యాపించి ఉంటుంది .త్రేతాయుగం లో ఆ ధర్మం  ఒక్క పాదం కోల్పోయి దేశం లో ఉంటుంది. ద్వాపర యుగం లో రెండు పాదాలు క్షీణించి ,రెండుపాదాలతో ఉంటుంది .కలి యుగం లో  ఒక్క పాదమే మిగిలి సంకటం అవుతుంది .ధర్మ స్థితి తెలిసినవాడిలో ధర్మం క్షీణి౦చదు.యుగాలను బట్టి గుణాలు ,గుణ కర్తలవలన జాతి భేదాలు కలిగి ధర్మ స్థితి అనేక రూపాలో ఉంటుంది..గుణాలను బట్టే సృష్టి లయాలు ఏర్పడుతాయి .తీర్దాలు వేదాలు ,వర్ణాలు ,స్వర్గ మోక్షాల ప్రవృత్తి కూడా  అదే రూపం లో ఉంటుంది .అదే విశేషం గా ఉంటుంది .కాలం ప్రకాశకం .దేశం ప్రకాశ్యం .కాలం ప్రకాశ రూపం ధరించినపుడు కాలమే ప్రకాశిస్తుంది .

   యుగాలను బట్టి కర్మల తీర్దాల ,జాతుల ఆశ్రమాల  యొక్క వైదిక దేవతలమూర్తులు ఏర్పడుతాయి .సత్యయుగం లో  తీర్ధం త్రి దైవతంగా పూజింప బడుతుంది .త్రేతాయుగం లో ద్విదేవ మయ పూజ ,ద్వాపరం లో ఏకదైవ పూజ ,కలియుగం లో ఏదైనా రూపంగా పూజింపబడుతుంది .కృతయుగం లో దైవ తీర్ధం ,త్రేతాయుగం లోఅసుర తీర్ధం ,ద్వాపరం లో ఆర్ష తీర్ధం ,కలియుగం లో మానుష తీర్ధం పూజ నీయాలు .గంగానది శివుని శిరసున చేరి ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైంది .మహాదేవుని ఇష్టం ప్రకారం మూడు లోకాలకు అధినాయకి ,జగన్మాత ,లోక హితంకరి ,శాంత ,శ్రుతి గా ఖ్యాతి చెందింది .ఒకసారి గజాననుడు తల్లి పార్వతి తో ‘’నేను ఏమి చెయాలొఆదేశిస్తే దాన్ని చేస్తాను ‘’అనగా తల్లి ‘’మీతండ్రి జటాజూటంలో పవిత్ర గంగ ఉంది .నువ్వు ఆమెను దింపాలి. కానీ మీతండ్రికి ఆమె పై అనురాగం ఎక్కువ జాగ్రత్త ‘’అన్నది వినాయకుడు మళ్ళీ ‘’అది నాకు అసాధ్యం .గంగను వేరు చేయకుండా దేవతలను మరల్చటం కుదరదు .పూర్వం గౌతామహర్షి గంగను భూమిపైకి తెచ్చాడుకదా .అప్పుడు శివుడు సంతోషించి వరం కోరుకోమన్నాడు .ఆయన జటాజూటం తోసహా  గంగను  తనకిమ్మని కోరగా ,తనకోసం కాక లోకోపకారం కోసం కోరినందున మరో వరం కోరుకొమ్మన్నాడు. శివ దర్శనమే జనాలకు దుష్కరం .నీ కృప చే నీ దర్శనం ఇవాళ నాకు సిద్ధించింది .లోకం కోసమే అడిగావు నీకేం కావాలో అడుగు అనగా ‘’గంగానది బ్రహ్మగిరి నుండి బయల్దేరినది మొదలు సాగరం చేరేవరకు నువ్వు గంగలో ఉండాలి ‘’అనికోరగా శివుడు సంతోషం తో ‘’ఎవరు గౌతమిలో ఏదో ఒక చోట ,ఏదో ఒక యాత్ర కాని ,స్నానం దానం పితృతర్పణం ,స్మరణం,పఠనం చేస్తాడో అతనికి సప్తద్వీపాలతో ఓషధులు సముద్రాలు రత్నాలు పర్వతాలతో సహా భూమిని దానం చేసినంత ఫలం,  ధర్మం  లభిస్తుంది .ఈ ఫలితం గౌతమి ధ్యానం వలన కూడా కలుగుతుంది .గంగా సాగర సంగమం లో సూర్య ,చంద్ర గ్రహకాలం లో భక్తితో విష్ణు ధ్యానం చేస్తే ,దూడతో గోదానం చేస్తే అతని పుణ్యం చెప్పనలవి కాదు .కనుక లోక శ్రేయస్సుకోసం గంగను తీసుకు వెళ్ళు ‘’అన్నాడు గౌతమునితో  శివుడు  అన్నాడని ఈ విషయం తానూ విన్నానని ,శివుని మరల్చటం ఎవరికీ సాధ్యం కాదని ,ఒకపని మాత్రం చేస్తాను గోదావరి దగ్గరలో ఉన్నా అక్కడికి వెళ్లరు  శివునికిమస్కరించరు అని తల్లికి చెప్పాడు గజాననుడు  .అప్పటినుంచి మానవులకు ఏదో ఒక విఘ్నం కలిగిస్తున్నాడు .ఆయన్ను పూజిస్తే విఘ్నాలు కలగకుండా చూస్తాడు , గంగ  ప్రభావాన్ని సాక్షాత్తు శివుడే చెప్పలేడు.నాకు సాధ్యమా ?ఏదో సంక్షిప్త్తం గా చెప్పాను .బ్రహ్మాండ పురాణం లో ఒక శ్లోకం ,ఒకపదం చదివినా ముక్తి కలుగుతుంది .’’గంగా గంగా’’ అని ఉచ్చరిస్తే చాలు యెంత దూరం లో ఉన్నా ఫలితమిస్తుంది .వెయ్యి అశ్వమేధాలు ,వంద వాజపేయాలు చేస్తే కలిగే ఫలితం ‘’గౌతమీ మహాత్మ్యం ‘’ వింటే కలుగుతుంది .ఈ పురాణం ఉన్న ఇంట్లో  కలి భయం  ఉండదు .శ్రద్ధా శక్తులకు శాంతులకు ,విష్ణు భక్తులకు ,మహాత్ములకు మాత్రమే  దీన్ని చెప్పాలి .’’లిఖిత్వా పుస్తక మిదం బ్రాహ్మణాయ ప్రయచ్చతి –సర్వ పాప వినిర్ముక్తః ,పునర్గర్భం న సంచి శేత్ ‘’.ఈ పురాణం రాయించి బ్రాహ్మణుడికి దానమిస్తే సర్వపాప విముక్తికలిగి ,జన్మరాహిత్యమై ముక్తి పొందుతాడు ‘’అని బ్రహ్మ నారదునికి ఉపదేశించాడు .

గౌతమీ మహాత్మ్యం సంపూర్ణం

ఆధారం –వేద వ్యాస కృత బ్రహ్మాండ పురాణా౦తర్గత ‘’గౌతమీ మహాత్మ్యం ‘’ను డా. వెల్మకన్నెహనుమాన్ శర్మ ,గారు బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథ శర్మగారు అనువదించగా,విశ్వనాథ శర్మగారు అభిమానం తో మేము  ధర్మపురిసందర్శించినపుడు నాకు విలువైన కానుకగా 28-10-2018న వారింట ఆతిధ్యమిచ్చి అందజేసిన అపురూప గ్రంథం. రాసిన వారికీ ,అందజేసిన కొరిడే వారికి ధన్యవాదాలు .

మనవి- గౌతమీ మహాత్య్మం ను 2018కార్తీకమాసం లో అంతర్జాలంలో తేలిక భాషలో ముఖ్య విషయాలు మాత్రమే తెలియ జేస్తూ రాయటం ప్రారంభించి కొంత వరకు రాసి, మాఘమాసం లో కొనసాగించాను .మళ్ళీ ఈ 2019 కార్తీక మాసం లో ప్రారంభించి ఈ రోజుతో పూర్తి చేశాను .ఇది నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను .ఇందులోని దోషాలన్నీ నా అవగాహనా రాహిత్యం వలన ఏర్పడినవే అనీ ,గుణాలన్నీ శర్మ ద్వయం వారివే నని, సవినయంగా మనవి చేస్తున్నాను .చదివి ఆదరించినవారందరికీ పుణ్య ఫలప్రాప్తి కలగాలని కోరుకొంటున్నాను  .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

షార్లెట్ సాహితీ మైత్రీ బంధం 

నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన ”షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ”పుస్తకం దేశం లో ప్రముఖమైన మూడు లైబ్రరీలు 1-కన్నెమెరా లైబ్రరి -చెన్నై 2-సెంట్రల్ లైబ్రరి -ముంబాయ్ 3-ఢిల్లీ పబ్లిక్ లైబ్రరి -ఢిల్లీ లకు అందాయని  కొలకత్తా లోని ప్రభుత్వ సంస్థ నేషనల్ లైబరీ వారి నుంచి ఈ రోజు లెటర్ వచ్చిందని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది -దుర్గాప్రసాద్ -21-11-19 

Posted in సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం—73-104-భీమేశ్వరతీర్ధం

ఋషి సత్రం అని ప్రసిద్ధి చెందిన భీమేశ్వర తీర్ధం గురించి నారదుని బ్రహ్మ వివరించాడు .గంగను సప్తరుషులు ఏడుపాయలుగా విభజించారు.దక్షిణ దిక్కులో వాషిస్టీ,ఉత్తరాన వైశ్వా మిత్రీ , దీనికి ఉత్తరాన కామ దేవీ ,మధ్యలో శుభప్రద గౌతమీ ఏర్పడ్డాయి .తర్వాత భరద్వాజీ ,ఇంకోటి ఆత్రేయి ఏర్పడ్డాయి .చివరది జామదగ్ని ..త్రికాల దర్శులైన ఆ సప్తర్షులు మహా సత్రయాగం ప్రారంభించగా ,దేవతల శత్రువు విశ్వరూపుడు అక్కడికి వచ్చి ఋషులను పూజించి ‘’దేవతలను జయించే అజేయుడైనపుత్రుడు నాకు ఎలాకలుగు తాడో చెప్పండి ‘’అని అడిగాడు .విశ్వామిత్రుడు ‘’కర్మ వలన ఫలితాలు కలుగుతాయి .మూడు కారణాలలో కర్మ మొదటిది .తర్వాత కర్త .కారణాలు ఎక్కువకాగా కర్మలకు కారణత్వం చెప్పారు .కర్మకు రెండు ఫలాలు .ఒకటి భావం రెండు అభావం .కర్మ ఫలం కర్మా దీనం .కర్మ రెండు విధాలు .ఒకటి చేయబడు తున్నది ,రెండు చేయబడినది .విచక్షణ కలవాడు కర్మ చేస్తూ దేన్ని భావిస్తాడో దానికనుకూలమైన ఫలితం పొందుతాడు .భావన లేని కర్మ విరుద్ధ ఫలితాలనిస్తుంది .కనుక తపస్సు ,వ్రతం ,దానం ,జపం ,యజ్ఞం మొదలైన క్రియలు భావాన్ని బట్టి కర్మాను సారంగా ఫలితాలనిస్తాయి .కనుక భావాను రూప కర్మ ఫలమిస్తుంది ‘’

   ‘’భావం మూడు రకాలు .సాత్వికం రాజసం తామసం .కర్మల స్థితి విచిత్రంగా ఉంటుంది .భావనతో కర్మ చేయాలి .యజమాని ఫలం ప్రకారం ప్రవర్తిస్తే ,ఫలదాతకూడా అలాగే స్పందిస్తాడు .నిజంగా అక్కడ కర్మ చేసే వాడు లేడు.అంటే స్వాతంత్ర్యం లేదు .అతని స్వభావాన్ని బట్టి కర్మ చేస్తాడు .అదే ఉపాదానం మొదలైన కారణాల చేత ,సత్వాది గుణ భేదం వలన కర్మ చేస్తాడు .భావాన్ని బట్టి కర్మ చేయటం జరుగు తుంది .ధర్మార్ధ కామ మోక్షాలకు కర్మమే కారణం .భావ స్థిత కర్మ ముక్తి నివ్వచ్చు ,బంధాలను కలిగించవచ్చు .ఒక పదార్ధం భావ భేదాలవలన వేర్వేరుగా కనిపిస్తుంది .కనుక భావం చాలా విశిష్ట మైనది .’’అని వివరించాడు .

  అంతా విని విశ్వ రూపుడు తామస భావాన్ని ఆశ్రయించి తపస్సు చేశాడు .మునులు వారించినా వినకుండా ఘోర తపస్సు చేశాడు .భీషణ అగ్ని గుండం లో భీషణ అగ్నిహోత్రం లో హవనం చేశాడు .హృదయం లో దారుణమైన పురుషుని ధ్యానించి తపస్సు చేశాడు .అప్పుడు అశరీరవాణి ‘’శివుడు లేకుండా వృత్రుడు ఆత్మను జయించలేదు .విశ్వరూపుడు వ్యర్ధంగా ఆత్మను అగ్ని హోత్రం లో సమర్పిస్తాడు .అతడే ఇంద్ర వరుణ,అతడే సర్వం అవుగాక వృజునుని కొడుకు ఆత్మను వదిలి జటనుఆత్రమే ఆహుతిచ్చాడు వృత్రుడే వృజినుడు అన్నది వేదం .జగదీశ్వరుడైన భీముని మహిమలు ఎన్నలేము ‘’అన్నది .మహర్షులు భీమేశ్వరస్వామికి నమస్కరించి తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు .భీమ రూపుడు ,మహాభీముడు ,భీమకర్త ,భీమ భావుడు అయిన విశ్వ రూపుడు భీమతనువును ధ్యానించి ఆత్మను హవనం చేశాడు .కనుకనే పురాణాలలో భీమేశ్వరుడు దేవుడుగా చెప్పబడ్డాడు .ఈ తీర్ధం లో చేసే సకలం మహా ఫలవంతమైనది .గోదావరీ –సముద్ర సంగమ స్థాన స్నానం విశేష పుణ్యప్రదం .పరబ్రహ్మ స్వరూపుడైన భీమేశ్వర దర్శనం పునరావృత్తి జన్మరహితం అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

105-గంగా సాగర సంగమ తీర్ధం

దేవతలకు వంద్యురాలు .మునులు మరుద్గణాలచేత స్తుతి౦పబడిన  గోదావరి పూర్వ సముద్రం లో సంగమించింది .జాబాలి యాజ్ఞవల్క్యుడు క్రతువు అంగీరసుడు ,దక్షుడు ,మరీచుడు వైష్ణవుడు ,శాతా తపుడు,శౌనకుడు దేవారతుడు   భ్రుగువు,అగ్ని వేశుడు,అత్రి మరీచి ,మనువు గౌతముడు కౌశిక తుంబుర పర్వత అగస్త్య ,మార్కండేయ పిప్పల ,గాలవ వామదేవ ,భార్గవ మొదలైన మహామహులంతా గౌతమిని స్తుతిస్తారు .శివ కేశవులు వీరికి దర్శనమిచ్చారు .ద్వాదశాదిత్యులు ,అష్టవసువులు ,సప్త మరుత్తులు ,లోకపాలురు హరిహరులను  స్తుతిస్తారు .మహేశ్వరుడు ఉన్న చోట మాధవుడు రమాదేవితో ఉంటాడు .బ్రహ్మేశ్వరుడు అనే శివుని బ్రహ్మ స్థాపించాడు .చక్రపాణి కూడా బ్రహ్మ స్థాపించినవాడే .సోమేశ్వరుడున్న చోటు సోమ తీర్ధం .ఇదికాక ఇంద్రతీర్ధం ,హయ మూర్ధక తీర్ధం ఉన్నాయి హయ శిరసుతో విష్ణు మూర్తి ఉంటాడు .సకల దేవతలు ఇక్కడే ఉంటారు .

  సోమశ్రవం అనే ఇంద్రుని యజ్ఞం లో దేవతలు ,ఋషులు ‘’సోమా !ఇంద్రుని రక్షించు .సప్త దిక్కులు బహు ఆదిత్యులతో కలిసి మాకు రక్షణ నివ్వు .నీ హవిస్సు మాకు రక్ష .శత్రువు మమ్మల్ని మించకుండా చేయి .చంద్రా ఇంద్ర రక్షణ చేయి ‘’అనగా యజ్ఞం పూర్తయింది .ఇదే సోమ తీర్ధం. దీనికిముందున్నది  ఆగ్నేయ తీర్ధం .అగ్ని మహా యజ్ఞం చేశాడుకనుక ఆపేరు .వేదిమయుడైన ఆదిత్యుడు హరిహర బ్రహ్మలను నిత్యం వచ్చి దర్శిస్తాడు  .ఇక్కడ మధ్యాహ్న నమస్కారం శ్రేష్టం .దీని తర్వాతది బార్హత్పత్య తీర్ధం .బృహస్పతి ఇక్కడ యజ్ఞం చేశాడు .ఇంద్ర గోప పర్వతం పై మహాలింగం ప్రతిస్టితమైంది .దీనికి హిమాలయసంబంధం ఉండటం వలన  అద్రి తీర్ధం అంటారు .గౌతమి తీరాన ఉన్న సకల తీర్దాలు మహిమాన్వితమైనవే .గౌతమీనది సర్వకాలాలలో పుణ్యప్రదం ,కీర్తనీయం అన్నాడు నారద మహర్షి తో బ్రహ్మ దేవుడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

లైబ్రరీ వారోత్సవాల రెండవ రోజు15-11-19 బెజవాడ లో ‘జ్ఞానజ్యోతి ”అవార్డ్ ఇచ్చి సత్కరిస్తే ,చివరి రోజు 20-11-19నఉయ్యూరు లైబ్రరీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లో లైబ్రేరియన్ మొదలైనవారు సత్కరించారు

 

లైబ్రరీ వారోత్సవాల రెండవ రోజు15-11-19 బెజవాడ లో ‘జ్ఞానజ్యోతి ”అవార్డ్ ఇచ్చి సత్కరిస్తే ,చివరి రోజు 20-11-19నఉయ్యూరు లైబ్రరీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లో లైబ్రేరియన్ మొదలైనవారు సత్కరించారు

 

https://photos.google.com/share/AF1QipPvMCKDQwMPZhs053erx4TAr9hdurSm7guWNeHMNGTdm4fquO8mO_x87VeM5v08Xg/photo/AF1QipOowrb9lKlZmj2Jcthc7IP5UVRtE1Q5K3vaRWgK?key=VVo4YkFmY011d2N5QzNmVUJkZnNHc3F2LTFmVS1R

 

గ్రంధాలయ వారోత్సవాల రెండవరోజు15-11-19 శుక్రవారం  విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ”జ్ఞానజ్యోతి ”అవార్డు  కృష్ణాజిల్లాజాయింట్ కలెక్టర్ గారి చేత ప్రదానం చేయించి సన్మానిస్తే ,వారోత్సవాల చివరి రోజు 20-11-19బుధవారం ఉయ్యూరు లైబ్రరీలో గ్రంధాలయాధికారిగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి చేత సత్కారం చేయించారు .శ్రీ విజయ సారధి శ్రీ రాజుగారు మొదలైన వారు పాల్గొన్నారు -దుర్గాప్రసాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నిరతాన్న దాత అపరఅన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మకు కు పంచప్రక్రియ కవితామృత నైవేద్యం

నిరతాన్న దాత అపరఅన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మకు కు పంచప్రక్రియ కవితామృత నైవేద్యం

గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు చి శిస్టుసత్యరాజేష్ పని రాక్షసుడు .ఆలోచనాపరుడు .భిన్నత్వం నవీనత్వం కోరేవాడు .అందుకే డొక్కా సీతమ్మ గారిపై గజల్ ,మణిపూసలు ,ఇస్ట  పదులు , కైతికాలు ,వచనకవిత్వం అనే పంచ ప్రక్రియలతో 80మంది వివిధ ప్రాంతకవులతో రాయించి ముద్రించి విజయవాడ లో ఈ నెల 9న ఆవిష్కరణ జరిపించిన పట్టుదల అతనిది .ఆసభలో అధ్యక్షస్థానం నాకు గౌరవంగా ఇచ్చినా ,నేను హైదారాబాద్ లో ఉండటం వల్ల ఆ అదృష్టం నాకు దక్కలేదు .ఆవిష్కరణ ఘనంగా జరిగి పుస్తకాలు నాకు పంపగా నిన్ననే అందాయి .ఇప్పుడే చదివే సమయం దొరికి ,చదివి ,,నా స్పందన రాస్తున్నాను .

‘’బువ్వన్న’’గారమ్మాయి, ‘’డొక్కావారి’’ కోడలు సీతమ్మతల్లి అలుపు సొలుపు లేకుండా ,డొక్క మాడే ,జనాలకు పిలిచి బువ్వ వండి పెట్టి ఆ రెండు పేర్లకు సార్ధకత చేకూర్చిన అమ్మ  సాధ్విసీతమ్మ.ఆ చరిత్ర ఇంటింటా సుమారు వందేళ్ళ క్రితం మారు మోగి,ఇప్పుడు అదృశ్యమైంది కాలవైపరీత్యం వలన ..ఆకలికి కులం గోత్రం ఏమీ లేవు అని నమ్మి ఆచరణలో చూపిన సాధ్వీమతల్లి . సీతమ్మ దంపతులు ఎన్నో పెళ్ళిళ్ళు చేయించారు .భర్త జోగన్నగారు పశువులకు వచ్చే గాళ్ళ వ్యాదుఅకు చికిత్స చేసేవారు .నయం కాగానే తమ పచ్చిక  బీళ్ళలో మేపే ఏర్పాటు చేసేవారు  నయంయ్యాక పంపించేవారు ..ఆ దంపతులకు మనుషులలోనేకాదుపశు పక్ష్యాదులలోనూ దైవం కనిపించేవాడు .మొదటిసారిగా పొలాలలో  మినుము ,పెసర పండించిన కర్షకులువారు .కొబ్బరి మామిడి చెట్లు కూడా మొదట వారే వేసి పెంఛి కోనసీమ అందాలకు మార్గ దర్శులయ్యారు .మంచినీటి బావులు అనేక౦  త్రవ్వించి త్రాగునీటి వసతి కలిపించిన అపర భగీరదులు .సీతమ్మగారు త్రవ్వించిన మంచి నీటి బావి ‘’పేరూరు ‘’అగ్రహారం లో ఇప్పటికీ సాక్షిగా ఉన్నది .ఎన్ని రహదారి సౌకర్యాలు ఏర్పడినా 1909లో సీతమ్మగారు మరణించేదాకా ఆ ఇంట అన్నదానం అక్షయంగా నిరతాన్నదానంగా కొనసాగింది  మళ్ళీ సీతమ్మ చరితను నేటి తరానినికి అందించేతలపుతో నవ యువ కవులచేత కవిత్వం రాయించి ప్రచురించటం అమృతోపమానమే .రాజేష్ కృషికి ,రాసిన కవులకు అభినందనలు  .

లాంతరుపట్టుకొని అర్ధరాత్రి ఎవరైనా బాటసారులు రేవులో దిగారేమో అని వెళ్లి చూసి ఇంటికి వచ్చి అప్పుడు పట్టెడన్నం తిన్న అమ్మ .కడుపు ఆకలి అమ్మకే తెలుస్తుంది .’’అమ్మా !సీతమ్మ తల్లీ ఇక్కడ వరదలో చిక్కుకు పోయానమ్మా ‘’అని హరిజనుడు పొలికేక పెడితేత,ఆగొంతు ‘’వెంకట్రాముడిది ‘’అని గుర్తించి భర్తకు అన్నం కూరలు ,ఆవకాయ మూటకట్టించి,పొగాకు కాడ కూడా ఇచ్చి భర్తను గోదావరిలో ఈదుకు వెళ్లి ఇచ్చిరమ్మంటే ఇచ్చి వచ్చిన పుణ్య దాంపత్యం వారిది .తర్వాతెప్పుడో ఊర్లోకి వచ్చి ‘’అమ్మా !నువ్వు చేసిన ఉపకారానికి నా చర్మం చెప్పులు కుట్టి ఇచ్చినా మీఋణం తీరదు ‘’అని కన్నీటితో అమ్మ పాదాలకు అభి షేకం చేశాడతడు ..ఇలాంటి కథలు గాధలు కోకొల్లలు .ఉప్పొంగి పోయారు జనం గోదారి వరదలాగా  .ఆ అమ్మ సన్నిధిలో అందరూ అమృతం తిని ధన్యులయ్యారు .ఈ సంకలనం లో  నాకు నచ్చిన కొన్ని లైన్లు మీ ముందుంచుతాను .

‘’గాజుల చేతికి గరిటయె అందం,ఆన౦దమంది –ఆస్తులు వద్దని ఆకలి తీర్చెను సీతమ్మతల్లి ‘’అన్నది గజల్ లో రాదికారాణి .కైతికాలలో రాజేష్ ‘’ఆకలి తీర్చి తల్లిలా –తూర్పు దిక్కుకే దీపానివై –తెలుగు నేల వెలిగావు ‘’అని ప్రస్తుతించాడు .’’బ్రిటిష్ చక్రవర్తి నాడు –దేవతగా తలచినాడు –పాదాలకు (చిత్రపటానికి )ప్రణమిల్లి –సి౦హాసన మెక్కినాడు ‘’అని మణిపూసలతో కవితాహారమల్లింది .’’భారతీయత ఆత్మరూపం ఆ ఇల్లాలు నమ్మకం ‘’అంది గజల్ లో ఉమాదేవి .’’గోదావరి ప్రవాహ ఝరిఅతలాకుతలం చేసినా ,-వరద గోదావరి ఉధృతి లో ఎదురీదినా  -అమ్మ చేతి భోజనానికి కొదవలేదు .ఆమె కీర్తి ఇంగ్లాండ్ కు గోదావరి వరద లా పయనించింది ‘’అని వందనం చేసింది పుట్టి నాగలక్ష్మి వచనకవిత్వం లో . శేర్ భారతీ మూర్తి ‘’తనను తాను మలచుకొన్న తరుణీమణి-విశ్వమానవతకు అద్దంపట్టింది’’అన్నది .’’ఉభయ గోదావరి జిల్లాప్రజల గుండెల్లో –నిండుగా అభిమానం పొంగించిన అన్నపూర్ణ ‘’అంటుంది కొలచన విజయభారతి .అనితర సాధ్యమైన సీతమ్మ ఆతిధ్యాన్న్ని ‘’యెంత మందికైనా సరిపోదు అనేది లేదు –యెంత శ్రమకైనా వెనుకాడేది లేదు ‘’అని కీర్తించింది .’’కోనసీమ బియ్యపు గింజ దేదీప్యమానమై పరిమళించింది ‘’అని సేవకు చిరునామాగా  ఆమెను వర్ణించి సేవాపరిమళ వ్యాప్తి కలిగించాడు బివివి సత్యనారాయణ .మల్లే విజయలక్ష్మి మరింత అందంగా ,’’చిరునవ్వు చెదరదు –చేయి ఖాళీగాదు-జారే నుదుటి  చెమట బిందువులను –భక్తిగా దాచుకొంటు౦ది  ఆమె చీరకొంగు –సిరికీ సీతమ్మకూ చెలిమేగా కొదువెక్కడిది  ‘’అని సహజ సుందరం గా తెలుగింటి ఇల్లాలుగా ‘’ ‘’అవతరించింది అంటుంది .’’వండనలయదు వేవురు వచ్చి రేని అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి ‘’ ‘అని ప్రవరుని ఇల్లాలును  ప్రస్తుతించిన   పెద్దన మను చరిత్ర పద్యం గుర్తుకు తెచ్చింది .’’సంస్కారవంతమైన పనికి చదువు సంధ్యలు ఏమాత్రం అడ్డురావు ‘’అని అమ్మ నిరూపించినట్లు వరాహగిరి కృష్ణమోహన్ అభిప్రాయం.

‘’అన్నార్తులాకలి మంటలార్పగ –ముంజేతి కంకణమై ‘’భాసించింది అన్నాడు ఆకుల మల్లికార్జున.’’లక్ష్మీ పార్వతుల కలయిక సీతమ్మ ‘’అంటుంది ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి .’’శుభకార్యాలాకు విరాళాలిచ్చిన మాతృ మూర్తిగా’’చెప్పాడు జక్కు కృష్ణమూర్తి గౌడ్ .’’అన్నం కోరుకొనే ప్రతి మనిషి –ఆమెకు నారాయణుడు ,అల్లా ,జీసెస్ ‘’అని ఆమె ఎల్లలులేని మానవత్వానికి నీరాజనం పట్టాడు కొంపెల్ల కామేశ్వరరావు .వి రాజ్య లక్ష్మి ‘’నిత్యాన్న దానాల గన్నవరం లంకనే –‘’అన్న’’వరం  గా మార్చిన దయామయి అంటుంది .సీతమ్మ చేయి ‘’అక్షయ పాత్ర ‘’అంటాడు పవిత్రంగా కొల్లాబత్తుల చక్రపాణి .చెరుకు పల్లి గాంగేయ శాస్త్రీ కి. ‘’అమ్మ చేతి గరిటయెనలేని ఆభరణం ‘’గా ఉందని పించింది .’’గోదావరి ఘోష తెలుగు నేలలో వినిపించినతకాలం ‘’సీతమ్మ పేరు తెలుగు గుండెల్లో శాశ్వతం అంటాడు బత్తులూరి నాగబ్రహ్మా చారి .నిర్మలా౦త రంగ సీతమ్మ’’అన్నపూర్ణ –రామదాసు కీర్తనల సీతమ్మ –త్యాగయ్య కృతుల సీతమ్మగా ‘’దృశ్యమానమైంది .’’భారతీయ ఉదారతకు చలువ పందిరి సీతమ్మ ‘’గా కనిపించింది వడలి రాధాకృష్ణకు .’’రామాయణం లో రమణీయం సీతమ్మ ‘’అని ఆమె ఆతిధ్య రామణీయకానికి మురిసిపోయాడు   జి.నాగరాజు .ఇలా అందరూ తమ బావాలను తేటతెల్లం గా తమదైన రీతిగా వర్ణించి సీతమ్మగారి వదాన్యతకు అక్షర నీరాజనమిచ్చారు .అయితే పద్యాలు కూడా ఉండి ఉంటె నిండుగా ఉండేదనిపించింది .కావాలనే వదిలేసి ఉండచ్చుకూడా .ముఖ చిత్రంగా సీతమ్మ తల్లి తెల్లటి శుభ్రవస్త్రాలతో దర్శనమిస్తే ,చివరికవర్ పేజీలో  సీతమ్మగారి నుంచి అయిదు తరాల వంశ వృక్షం  చూపటం నిండుగా ఉంది .లోపలి పేజీలలో ఆమె నివసించిన ఆనాటి  ఇల్లు ,దాన్ని బాగు చేయించి మార్పు తెచ్చిన ఇల్లు, ఈమార్పుకు కారణమైన ఇనిమనవడు కీ శే డొక్కా సత్యనారాయణ గారి చిత్రాలతో పుస్తకం శోభిల్లింది .రాజేష్ కృషి ఫలించి మంచి రూపు దాల్చింది .దీనికి కారకులైన  వారందరికీ రాజేష్ తో పాటు అభినందనలు .మరిన్ని మంచి పుస్తకాలు’’ గోరసం ‘’వెలువరించి కవితా గోక్షీరం తో తనియి౦ప జేయాలని కోరుతున్నాను

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం—72-102- ఊర్వశీ తీర్ధం

గౌతమీ మహాత్మ్యం—72-102- ఊర్వశీ తీర్ధం

శార్గ్జ్న ధారుడైన హరి కొలువై ఉన్నదే ఊర్వశీ తీర్ధం .ప్రమతి సార్వభౌముడు శత్రుజయం చేసిసురలతో ఇంద్రలోకం చేరి,పాశుహస్తుడైన ఇంద్రుని చూసి నవ్వగా సురలోకం లో మరుద్గణాలతో క్రీడిస్తే చాలు .నాతొ అనుభవించు’’అన్నాడు  .ప్రమతి ‘’దేన్నీ పణంగా పెడతావు ‘’ని అడిగితె ‘’సకల యాగ ఫలం, ఊర్వశిని ‘’అన్నాడు .గర్వంతో ఉన్న రాజు అంగీకరించగా ‘’నీపణ౦ ఏమిటి ?’’ప్రశ్నించాడు సురప్రభువు ‘’దేనికైనా సిద్ధమనగా ఇంద్రుడు ‘’నీకవచం ,బాణాలు ,ధనుసుతో ఉన్న కుడి చేయి పణంగా కోరుతున్నాను ‘’అన్నాడు .జూదం లో ఇంద్రుడు ఓడిపోయి ఊర్వశిని పోగొట్టుకోగా ,రెండవ సారి పణం గా ఏమిటి అని అడిగితె ‘’వజ్రాయుధం, రధం ‘’అన్నాడు ఇంద్రుడు .ఈ సారికూడా పాచికలాట లో ప్రమతి జయి౦చ గా ఇంద్రుడు వాటిని ధారాదత్తం చేశాడు .ఇంతలోఅక్కడికి గందర్వాధిపతి అక్షజ్ఞుడైన విశ్వావసు వచ్చి తన గాంధర్వ విద్య పణంగా పెట్టాడు .మళ్ళీ రాజే గెలిసి గాంధర్వ విద్యనూ కైవశం చేసుకొన్నాడు .గర్వబలంతో ప్రమతి ‘’ఇంద్రా !నా చేతిలో ఓడిపోయావు .ఇక నువ్వు నన్నే ఆరాధించాలి .అసలు నీకు దేవేంద్రత్వం ఎలావచ్చిందో చెప్పు ‘’అన్నాడు .

  ప్రమతి ఊర్వశిని తనకు సేవలు చేసుకో మన్నాడు .అలాగే అని దేవతలకు సేవ చేసినట్లే అతనికీ సేవలు చేస్తానన్నది ‘’.నన్ను మాత్రం నిందించకూడదు’’అన్నది  .సేవ చేస్తాను ‘’  ‘’అనగా  విశ్వావశు కొడుకు చిత్ర సేనుడు రాజుతో పాచికలకు సిద్ధమై ‘’జీవితం, రాజ్యం ‘’పణంగా ఇద్దరూ పెట్టి ఆడాడు .చిత్రసేనుడు జయి౦ఛి గా౦ధర్వాలైన పహా పాశాలతో రాజును బంధించాడు .ఇంతకు ముందు  రాజు జయి౦చినవన్నీ చిత్ర సేనుని వశమయ్యాయి .ప్రమతి కొడుకు సుమతి పురోహితుడైన విశ్వామిత్రుని పుత్రుడు మధుచ్చందుని  తన తండ్రి జాడ గురించి అడుగగా,దివ్య దృష్టితో విషయం తెలుసుకొని చెప్పి , జూదం వలన కలిగే అనర్ధాలు వివరించాడు జూదం ధర్మ భ్రస్టని చేస్తుంది .సుఖం పోగొడుతుంది .విధి విధానం తప్పించలేమని ఊరడించాడు ‘.

 తన తండ్రి రాజ్యం దక్కాలంటే ఏమేమి చేయాలని అడిగితే ‘’గౌతమికి వెళ్లి శంకరుని ఆదిత్యుని ,వరుణ,విష్ణువు లను పూజించు.’’అనగా ,వెంటనే గౌతమీ తీరం చేరి పవిత్ర స్నానం చేసి ,ముని చెప్పినట్లే చేసి దీక్షతో శివుని గురించి తపస్సు చేశాడు  .నూట ఒక్క సంవత్సరాలు దేవలోకం లో బంధింపడిన తండ్రి ప్రమతికి విముక్తి కలిగించాడు సుపుత్రుడు సుమతి .రాజ్యం తోపాటు గాంధర్వ విద్య కూడా పొంది దేవేంద్రుని మిత్రుడయ్యాడు  ప్రమతి  .ఈ తీర్ధమే ఊర్వశీ ,శాంభవం,,వైష్ణవం ,కైతవ తీర్ధంగా ప్రసిద్ధి పొందిందని నారదునికి బ్రహ్మ తెలియజేశాడు

103-సాముద్ర తీర్ధం

గౌతముని చే వదలబడిన గంగ లోకోపకారం కోసం పూర్వ సముద్ర తీరం వెళ్ళింది .దానిని బ్రహ్మ కమండలం లో బంధించాడు .తర్వాత శివ జటాజూటం చేరింది .విష్ణు పాదోద్భవ గంగ ను గౌతముడు భూలోకానికి తెచ్చాడు .సముద్రుడు చూసి చేతులు జోడించి ,ఎదురేగి స్వాగతమిచ్చి ‘’రసాతల ,భూమి ఆకాశం ,లో ఉన్న జలమంతా నన్నే చేరుగాక .నాలో రత్నాలు అమృతం పర్వతాలు రాక్షసులు ,దేవతలు ఉన్నారు .ఈ చరాచరం లో నాకు అసాధ్యం లేదు .నువ్వు పరమ పావనివి లోకోత్తర చరితవు కనుక నాతో సంగమించు ‘’అని కోరాడు .అప్పుడు గంగాదేవి సప్తర్షుల భార్యలను భర్తలతో సహా ఇక్కడికి తీసుకువస్తే ,అప్పుడు తాను  అల్ప రూపిణి అవుతానని  ,అప్పుడు సంగమానికి అభ్యంతరం లేదని చెప్పింది .నదీ ప్రభువు సముద్రుడు అఆగే వారిని వినయంగా ఆహ్వానించి తెచ్చాడు .అప్పుడు గంగ ఏడు పాయలు అయింది .గౌతమి ఏడుపాయలయ్యాక సముద్రం లో చేరింది .సప్తర్షుల పేర్లతో సప్త గంగ  అయింది.ఈ చరిత్ర విన్నా, చదివినా అ౦దులో స్నాని౦చినా ఉత్తమోత్తమ ఫలితాలు కలుగు తాయని బ్రహ్మ నారదుని బోధించాడు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-11-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment