గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 436-మధురవాణి (17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

436-మధురవాణి (17వ శతాబ్దికి పూర్వం )

17వ శతాబ్ది హరికవి రాసిన ‘’సుభాషిత హారావళి ‘’లో మధురవాణి శ్లోకం ఉదాహరి౦ప బడింది .కనుక ఆమెకాలం 17 వ శతాబ్దం పూర్వం అయిఉండాలి .1614లో త౦జావూరుపాలకుడు రఘునాధనాయకుని ఆస్థానకవి ,ఆయన రాసిన ‘’ఆంద్ర రామాయణం ‘’ను సంస్క్రుతీకరించిన  మధురవాణి ఈమె అవునో కాదో తెలీదు.సంస్కృత సాహిత్యం లో అన్ని శాఖలపై ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తుంది .కాలిదాస కుమార సంభవం హర్షుని నైషధం లను సంస్కృతం లో రాయటమేకాక స్వయంగా చంపు రాసిన ప్రతిభ మధురవాణి ది..ఉదాహరింపబడిన శ్లోకం లో భర్తను ఆరాదించని భార్య తర్వాత తప్పు తెలుసుకొని పశ్చాత్తాపత్తపపడటం ఉంది .స్త్రీ సహజ మనోభావాలను  అర్ధవంతమైన కవిత్వం లో బంధించింది .

కులటోక్తి-‘’ఆకా రేణ శశీ గిరా పరభ్రుతః పారావత శ్చుం వనే –హంసక్షం క్రమనణే సమం దయితయా రత్యాం విమర్డే గజః

ఇత్యం భర్తరి మే సస్తయువాని శ్లాఘ్యై ర్గుణైః కించన –న్యూనం నాస్తి పరం వివాహిత ఇతి స్యాన్నేక దోషో యది ‘’

437-మదిరేక్షిణి

సుభాషిత సార సముచ్చయం లో మదిరేక్షిణి ప్రకృతి వర్ణన శ్లోకం ఉటంకి౦చ బడింది  .ఇది వసంత శోభను తెలిపే శ్లోకం మిగిలిన అయిదు రుతువులపైనా రాసే ఉంటుంది .వికసిత తామరలు నీటిపైభాగానికి చేరటం సంరంభంగా భ్రమరాలు తేనెకోసం వాలటం కనిపిస్తుంది .కాలభారిణి లేక మాలభారిణి అనే అరుదైన వృత్తం లో రాసిన శ్లోకం ఇది .

వసంత సంధి –‘’అనుభూత చరేషు దీర్దికాణా ముపకంఠేషు గతగతైక తానాః

మధుపాః కథయంతి పద్మినీనా౦ సలిలే రంతరితాని కోరకాణి’’

438-మారులా (13వ శతాబ్దికి పూర్వం )

13వ శతాబ్దికి చెందిన కల్హణుని’’సూక్తి ముక్తావళి ‘’లో ఒకటి ,14వ శతాబ్దికి చెందిన ‘’సారంగధర పధ్ధతి ‘’లో మరొకటి మారులా రాసిన శ్లోకాలున్నాయి .కనుకకాలం 13శతాబ్దికి పూర్వం .ప్రేమగురించి రాసినవే ఈరెండూ .మొదటిదానిలో విరహంతో బాధపడే ప్రేయసి తలిదండ్రులకు తెలీకుండా ఒంటరిగా కూచుని ప్రియుడి ఎడబాటుకు విలపిస్తూ కడవలకొద్దీ కన్నీరు కారుస్తుంది .రాత్రివేళ పడుకున్న పక్కాంతా కన్నీటితో తడిసి ముద్ద అయిపోతుంది .కాని ఇంట్లో వాళ్ళు గుర్తించకుండా మర్నాడు ఉదయ౦ పక్కబట్టలను  ను  ఎండలో ఆరబెడుతుంది .రెండవ శ్లోకం లో ప్రేయసీ ప్రియులు మళ్ళీ కలిశాక ,ఆమె బక్క చిక్కి శాల్యావసిస్తాయై ,నీరసపడి అతనిపై శ్రద్ధ చూపలేకపోతుంది అతడు గమనించి ,అర్ధం చేసుకోగా ఆమె అతడి ఎదపై వాలి మళ్ళీ ఆనంద బాష్పాలు రాల్చి అతడి వస్త్రాలను తడిపేస్తుంది .కనుక మారులా గొప్ప భావుకత ఉన్న కవయిత్రి అనిపిస్తుంది .ధనద దేవ కవి ఈమె కవిత్వాన్ని మనసార మెచ్చుకున్నాడు .సంస్కృతం లో ఈ రెండు ప్రేమ శ్లోకాలను  అత్యున్నత విలువకలవిగా విశ్లేషకులు భావించారు .విషాదాన్ని అద్భుతంగా పలికించే మందాక్రాంత వృత్తం లో వీటిని రాసి తన కవితా పటిమ చాటింది .

విరహిణీంప్రతి సఖ్యు క్తిః-‘’గోపయంతీ విరహ జనిత దుఖమగ్రేగురూణాం-కిం త్వం ముగ్ధే నయన విస్తృతం  బాష్పపూరం రుణతాసి

నక్తం నక్తం నయన సలిలేరేషఆర్డ్రీ కృతస్తే-శయ్యోపాన్తః కథయంతి దశామాతపే శోష్యమాణః’’

విహరిణా౦ ప్రలాపః –‘’కృశా కేనాసి త్వం ప్రకృతిరియమంగస్య  ననుమే-మలాధూమ్రా కస్మత్ గురుజన గృహే పాచకతయా

స్మరస్యస్మాన్   కంచిన్నహి నహి నహీ త్యేవమగమత్ –స్మరోత్కంపాం బాల మమ హృది నిపత్య ప్రరూదితా ‘’

439-మోరిక

మోరిక రాసిన నాలుగు శ్లోకాలు సూక్తి ముక్తావళి, సారంగధర పధ్ధతి సుభాషితావలి మొదలైనవాటిలో దొరికాయి .ఇవికూడా ఎడబాటు ,సందేశం,ప్రేమను చెప్పుకోవటం , కలయికలో ఆనందం  అనే నాలుగు దశలలో ఉన్న ప్రేమగీతాలే . మారులా లాగా మోరిక కూడా అత్యున్నత ప్రమాణ కవిత్వమే రాసింది .ఈమెనూ ధనద దేవుడు మెచ్చుకున్నాడు .

వియోగిని అవస్త –‘’లిఖతిన గణయతి రేఖాం నిర్భార బాష్పా౦బు ధౌత గండతటా

అవధి దివసావసాన0 మా భూదితిశంకితా బాలా ‘’

శృంగార పధ్ధతి –‘’యామీత్యాధ్యవసాయ ఏవ హృదయేబంధాతునామాస్పదం –వక్తుం ప్రాణసమా సమాక్షమ ఘ్రుణేత్ధం కధంపార్యతే

ఉక్తం నామ తథాపి నిర్భర గలద్ బాష్పం ప్రియాయా ముఖం – హృస్ట్వాపి ప్రవ సంత్యహో ధనలవ ప్రాప్తి స్పృహా మాద్రుశం ‘’

440-నాగమ్మ

దక్షిణభారత దేశానికి చెందిన నాగమ్మ  సూర్య స్తుతిశ్లోకం సారంగధర పద్ధతిలో ఉన్నది .అంతకు మించి వివరాలు తెలీవు .,

‘’శుక తుండచ్ఛవి సవిత్రు శ్చండరుచః పుండరీక వన బంధోః-మండల ముదితం వందే కుండల మాఖండ లాశాయాః’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-19-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కుమార ధూర్జటి చమత్కారపద్యం -జూన్ తెలుగువెలుగు

కుమార ధూర్జటి చమత్కారపద్యం -జూన్ తెలుగువెలుగు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 429-ఇందులేఖ (14వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

429-ఇందులేఖ (14వ శతాబ్దం )

15వ శతాబ్దికి చెందిన వల్లభ దేవుడు తన ‘’శుభాషితావలి ‘’లో ఇందులేఖ రాసిన ఒకే ఒక్క శ్లోకాన్నిమాత్రమే ఉదాహరించాడు .మంచికళాత్మకంగా ఉన్న శ్లోకం ఇది .విభావన అలంకారాన్ని తగినట్లుగా వాడింది .సూర్యాస్తమయాన్ని చూసి సూర్యుడురాత్రివేళ  ఎక్కడ దాక్కుంటాడు అనే సమస్య  వస్తుంది .దీనికి చాలామంది చాలారకాలుగా సమాధానాలు చెబుతారు .కానీ ఇందులేఖ మాత్రం ‘’సూర్యుడు ప్రేమతో తపించే వారి హృదయాలలో ఉండి,రాత్రింతా ఇంకా జ్వలిస్తూ ఉంటాడని ‘’చమత్కారంగా సమాధానం చెప్పింది .

‘’ఏకవారీనిధౌ ప్రవేశమపరే లోకాన్తరాలోకనం –కేచిత్ పావక యోగితాం నిజ గదృఃక్షీణోహ్ని చండార్చిషః

మిధ్యాచై తద సాక్షికం ప్రియ –సఖి ప్రత్యక్ష తీవ్రాతపం

మన్యేహం పునరధ్వనీన రమణీ చేతో ధీ శోతే రవిః’’

430-జఘన చపాల

భర్త దూరంగా ఉన్న భార్య కృతఘ్నత ను గురించి జఘన చపాల తనపేరుకూడా కలిసివచ్చేట్లు చెప్పిన శ్లోకం ‘’కవీన్ద్రవచన సముచ్చయ ‘’లో చోటు చేసుకొన్నది .

‘’దుర్దిన నిశీధ పవనే నిః సంచారాసు నగర వీధీషు

పాత్యౌ విదేశయాతే పరం సుఖం జఘన చపాలాయాః’’

431-కేరళి

వాణీ దత్తుని పద్యవాణిలో కేరళి ఆర్యా వృత్తం లో రాసిన శ్లోకం ఒకటి ఉంది .ఈ శ్లోకంలో సరస్వతీ దేవికి ఉన్న రెండురకాల స్వభావాలను వర్ణించింది .ఆమె బాగా చదువుకున్నవారికి ,కవులకు సమీపంగా ఉంటుంది  వారి ప్రతిభకు ప్రేరకురాలౌతుంది .

1-‘’యస్యాఃస్వరూప మఖిలం జ్ఞాతుం బ్రహ్మాదయోపి న స్పస్టాః

కామగావీ సుకవీనాం స జయతి సరస్వతీ దేవీ ‘’

432-కుటల (17శతాబ్దికి పూర్వం )

ఆర్యా వృత్తం లో ‘’కులటోక్తి’’గా కుటల రాసిన ఒక శ్లోకం 17వ శతాబ్దిలో హరికవి రాసిన ‘’శుభాషిత హారావళి ‘’లో కనిపించింది .అపవిత్రురాలి పై రాసిన శ్లోకం ఇది .

‘’సుఖ శయ్యా తాంబూలం విశ్రబ్ధాశ్లేష చు౦బనాదీని – తుల్యంతి న లక్షాంశంత్వరిత క్షణా చౌర్య సురతస్య ‘’

433-లక్ష్మి(14వ శతాబ్దికి పూర్వం )

14వ శతాబ్దిలోని సారంగధరపద్దతి లో లక్ష్మి శ్లోకం కనిపిస్తుంది .లయ,మధురశబ్ద , శృతి సుభగంగా ఉంటు౦ది కవిత్వం .భగద్విలాసమే సృష్టిలో మానవులలో ఉంటుంది.

‘’భ్రమన్ వనాంతే నవమంజరీషు  న షట్పదో గంధ ఫలీ మజిఘ్రత్

సా కిం న రమ్య స చ కిం న గంతా –బలీయసీ కేవలమీశ్వరేచ్ఛ’’

434-లక్ష్మీ దేవీ ఠాకూరాణి(15వ శతాబ్ది )

15వ శతాబ్ది మిధిలానగర రాజు శివ సి౦హుని భార్య రాణి లక్ష్మీదేవి .తోటక వృత్తం లో ఆమె రాసినకవితలో నాటి సామాజిక వర్ణన ,ఆమె సోదరిలు వివాహసమయం లో అమ్ముడుపోవటం ఇదంతా రాణికి నచ్చకపోవటం బాగా వర్ణించింది .

-ధనలోభి –‘’చపలం తురగం పరిణర్తయతః-పథి పౌర జనాన్ పరిమర్దయతః

నహి తే భుజ భాగ్యభవో విభావో –భగినీ భగ భాగ్యభావో  విభవః ‘’

435-మదాలస (14వ శతాబ్దం )

14వ శతాబ్దికి చెందిన మదాలస రాసిన రెండు శ్లోకాలు  సారంగధర పద్ధతిలో చోటు చేసుకొన్నాయి .వీటిలో ఒకదానిలో భక్తీ రెండవదానిలో ప్రకృతివర్ణన ఉన్నాయి .మొదటిదానిలో విత్తును బట్టే ఫలితం అని  మనం చేసే మంచీ చెడు మన జీవితాలను ప్రభావితం చేస్తాయని  చెప్పింది .రెండవదానిలో జోరుగా కురిసే వర్షం వియోగంలో ఉన్న వారిని ఎలా బాధిస్తాయో తెలియ జేసింది .మానవ ఆలోచనలను భగవంతునిపైకి మరల్చటానికి మదాలస బాగా ప్రయత్నించింది .

1-‘’ధర్మ వివృతి –‘’పరలోక హితం తాతప్రాత రుత్దాయ చిన్తయ –ఇహ తేకర్మణాభేవ విపాకశ్చింతార్యప్యతి’’

2-మేఘ గర్జన –‘’సాంద్ర చంద్ర విరూతైఃస్థిత వాణౌ నర్జితం జగదిదం మదనేన

అ౦బుదో దిశదిశ ప్రధమానో గర్జితైరితి నివేదయతీవ ‘’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలా రచయిత్రి హార్రియట్ బీచెర్ స్టవ్-గబ్బిట దుర్గా ప్రసాద్-జూన్ విహంగ

హార్రియట్ ఎలిసబెత్ బీచెర్ 14-6-1811 న అమెరికాలోని కనెక్టికట్ లో 13మంది సంతానం లో ఏడవ పిల్లగా జన్మించింది .తండ్రిలిమాన్ బీచేర్ కాల్వేనిస్ట్ ప్రీచర్ .తల్లి రొక్సానా .తల్లి తండ్రి అమెరికన్ రివల్యూషనరీ యుద్ధం లో జనరల్ ఆండ్రూవార్డ్ .ఒకసోదరి కేధరిన్ విద్యావేత్త ,రచయిత్రి .సోదరులు మినిస్టర్ లుగా ప్రీచర్ లుగా ప్రసిద్ధి చెందారు .పెద్దక్క నడిపే బడిలో చదివింది హార్రియట్ .మగపిల్లలకు మాత్రమే ప్రవేశమున్న స్కూల్ లో క్లాసిక్స్ ,భాషలు నేర్చింది . 1832లో21 ఏళ్ళ వయసులో ఒహాయ్ లోని సిన్సినాటి కి లేన్ థియోలాజికల్ సేమెటరి ప్రెసిడెంట్ అయిన తండ్రి దగ్గరకు చేరింది .అక్కడ సోషల్ క్లబ్ లో కూడా చేరి క్రియా శీలంగా పని చేసింది .ఒహాయో నదిపై ఉన్న సిన్సిన్నాటి నగరం ఓడలపై వ్యాపారానికి కేంద్రమై దేశం లోని అన్ని ప్రాంతాల నల్లజాతివారు ,ఐరిష్ ప్రవాసీయులు అక్కడికొచ్చి స్థిరపడ్డారు .1829లో అల్లర్ల వలన రోడ్లు భవనాలు దెబ్బతిన్నాయి .ఐరిష్ ప్రజలు నల్లవారిపై దాడులు చేశారు. పోటీతత్వం పెరిగింది .గాయపడిన నల్లజాతి వారికి హార్రియట్ అన్ని విధాల సాయం

.1836,1841లో కూడా ఇలాంటి దాడులు పునరా వృత్తయ్యాయి .దీనిపై స్పందించి బానిస విధానికి వ్యతిరేకంగా రచనలు చేసింది .కోపమొచ్చిన ప్రజలు ఆమెను తరిమికోట్టారుకూడా . ఇక్కడే ఆమెకు కాల్విన్ ఎల్లిస్ స్టవ్ అనే ప్రొఫెసర్ తో పరిచయమేర్పడి 1-6-1836న పెళ్ళాడింది .ఈయనకూడా బానిసత్వ వ్యతిరేకి .పారిపోయే బానిసలకు తమ ఇంట్లో ఈ దంపతులు ఆశ్రయమిచ్చేవారు .చాలామంది బానిసలు కెనడాలో స్వాతంత్ర్యం కోసం ఉత్తరాదికి వెళ్ళేవారు .ఈ దంపతులకు ఏడుగురు సంతానం. అందులో కవల ఆడ పిల్లలున్నారు .1850లో అమెరికా కాంగ్రెస్ ‘’ఫ్యుజిటివ్ స్లేవ్ లా ‘’ఆమోదించింది .దీనివలన బానిసలకు ఆశ్రయమిచ్చినవారికి తీవ్ర శిక్ష ఉండేది .ఈ పరిస్థితులలో బీచర్ కుటుంబం మైన్ లోని బ్రన్స్ విక్స్ కు చేరింది .భర్త కాలేజి లెక్చరర్ గా పని చేశాడు .ఇప్పుడు వీరి గృహం ‘’నేషనల్ హిస్టారిక్ లాండ్ మార్క్ ‘’గా గౌరవం, గుర్తింపు పొందింది .ఒకసారి ప్రార్ధన సమావేశం లో చనిపోతున్న ఒక బానిస దయనీయ స్థితి చూసి చలించి ,అతని కథ రాయాలనే గాఢమైన కోరికకలిగింది .అదే సమయం లో 18నెలల కొడుకు సామ్యుల్ చార్లెస్ చనిపోయాడు .ఈ సందర్భంగా ఆమె ‘’నాకు అత్యంత ఆప్తుడైన కొడుకు మరణించటం తో బానిసల అక్రమ విక్రయాలతో అన్యాయంగా ,దౌష్ట్యానికి చనిపోయిన బానిసల పై నాకు సానుభూతి పెరిగింది ‘’అని రాసుకొన్నది . 9-3-1850న నేషనల్ ఎరా అనే పత్రిక సంపాదకుడికి ‘’బానిసల కస్టాలు కన్నీటి గాధలు,సమస్యలు స్వేచ్చ ,మానవత్వం గురించి రాయటానికి పూనుకోన్నాను .ప్రతి తల్లీ నిశ్శబ్దంగా ఇంట్లో కూర్చోకుండా బానిస సమస్యలపై నాలాగే స్పందించాలని కోరుతున్నాను ‘’అని ఉత్తరం రాసింది .అదే ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలగా ఆమె 40వ ఏట నేషనల్ ఎరా ప్రచురించింది .ఆమె పెట్టినపేరు ‘’ది మాన్ దట్ వజ్ ఎ థింగ్’’.ఈ వీక్లీలో5 జూన్1851నుంచి ధారావాహికగా 1-4-1852వరకు నడిచి ,నవలగా వెలువడింది .5వేల కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడై ఆతర్వాత 3లక్షలకాపీలు అమ్ముడయ్యాయి .ఆమెకు 400 డాలర్లు పారితోషికంగా పత్రిక అందజేసింది .దక్షిణ రాష్ట్రాలలో బానిసలపై జరుగున్న దారుణాలు ఉత్తర రాస్ట్రాలవారికి తెలియ జెప్పటమే ఆమె ధ్యేయం . ఈ నవలలో వ్యక్తులపై బానిసత్వ విధానం ఎంతటి దారుణంగా ఉంటుందో అమెరికా దేశప్రజలకు చాలా ఎమోషనల్ గా చెప్పింది రచయిత్రి .బానిసత్వం బానిసల ,యజమానుల, బానిస వ్యాపారులనందర్నీ ప్రభావితం చేసింది .దేశమంతా దీనిపై చర్చోప చర్చలు జరిగాయి బానిసత్వ నిర్మూలన జరగాల్సిందే అనే అభిప్రాయం బలపడింది దక్షణ రాష్ట్రాలలో .ఒక్క ఏడాదిలో బోస్టన్ లో 300మంది పిల్లలకు ఆమె నవలలోని ఒకపాత్ర’’ ఈవా’’పేరు పెట్టుకొన్నారు ప్రజలు .తర్వాత చాలామంది రచయితలు బానిసత్వ సమస్యలపై రాసినా ఈమె నవలకొచ్చిన ప్రాచుర్యం రాలేదు .దక్షిణ రాష్ట్రాల సమాజాన్ని అత్యంత సహజంగా చిత్రించింది . సివిల్ వార్ అయ్యాక ఆమె వాషింగ్టన్ వెళ్లి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ను 25-11-1862న కలిసి మాట్లాడింది .లింకన్ ‘’అయితే ఇంత పెద్ద యుద్ధం రావటానికి కారణ మైన చిన్న స్త్రీవి నువ్వేనన్నమాట ‘’అని అభినందించాడు .యుద్ధం అయ్యాక ఫ్లారిడా కు వెళ్లి ఇల్లు స్థలం కొనుక్కొన్నది.అక్కడ తనకు ఎవరూ హక్కులభంగం కలిగించలేదని చెప్పింది .కాని తర్వాత కొన్ని చిక్కుల్లోపడి కొ౦పా గోడూ వదిలేసి కెనడా చేరింది .స్కాట్లాండ్ లోని దురాగతాలను ఎదిరించింది .1868లో ‘’హార్త్ అండ్ హోమ్’’మేగజైన్ కు మొదటి ఎడిటర్ అయింది .పెళ్లి అయిన స్త్రీలహక్కులకోసం పోరాటం చేసింది .1870లో ఆమె సోదరుడు హెన్రి వార్డ్ బీచెర్ వ్యభిచారం కేసులో జాతీయ అభియోగాన్ని ఎదుర్కున్నాడు .జనాలు దాడి చేయటం తో ఆమె అక్కడినుంచి మళ్ళీ ఫ్లారిడా వెళ్ళిపోయింది .సోదరుని తప్పులేదని నమ్మింది సమర్ధించింది . మళ్ళీ కనెక్టికట్ చేరి ‘’హార్ట్ ఫోర్డ్ ఆర్ట్ స్కూల్ ‘’స్థాపించి౦ది ఇది తర్వాత యూనివర్సిటి ఆఫ్ హార్ట్ ఫోర్డ్ గా మారింది .1886లో భర్త కాల్విన్ స్టవ్ మరణం తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించటం మొదలైంది.1888లో 77 ఏళ్ళ వయసులో ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలను మళ్ళీ రాయటం మొదలుపెట్టిందని ,రోజూ ఎన్నో గంటలు రాసేదని ,ఇదంతా ఆమెకు తెలియకుండానే చేసేదని దీనినే ‘’డేమెన్షియా’’అంటారని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసింది .ఈ జబ్బునే ఇప్పుడు ‘’ఆల్జిమీర్స్ వ్యాధి ‘’అంటున్నారు వాజ్ పాయ్ , ఫెర్నాండెజ్ వంటి వాళ్ళు కూడా ఈ వ్యాధి బారినపడ్డారు .దెబ్బతిన్న ఆమె మెదడుకు ఇప్పుడు ఆమె రాసేదంతా కొత్తగా అనిపించేది అదొక భ్రమ .హార్ట్ ఫోర్డ్ లో ఆమె నివాసానికి దగ్గరలౌన్న అమెరికా ప్రముఖ నవలాకారుడు మార్క్ ట్వేన్ తన స్వీయ చరిత్రలో ‘’ఆమె మెదడు క్షీణించి ,దయనీయంగా ఉండేది .రోజంతా ఐరిష్ అమ్మాయి వొళ్ళు అంతా మర్దన చేసేది .ఇంటి తలుపులు ఎప్పుడూ తెరచే ఉండేవి .డ్రాయింగ్ రూమ్ నుండి వచ్చే సుగమ సంగీత౦ విషాద గీతాలు ఆస్వాదించేది .’’ ప్రపంచ ప్రసిద్ధ ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలా రచయిత్రి హార్రియట్ బీచేర్ స్టవ్ 1-7-1896న 85వ ఏట కనెక్టికట్ లోని హార్ట్ ఫోర్డ్ లో మరణించింది .మాసాచూసేట్స్ లోని ఫిలిప్స్ అకాడెమి సెమిటరిలో ఆమెను ఖననం చేశారు. ఒహాయు ,మైన్ ,ఫ్లారిడా కనెక్టికట్ లలో ఆమెస్మారక చిహ్నాలు నెలకొల్పారు .జులై1న అమెరికాలో ఎపిస్కోపల్ చర్చ్ఆమె గౌరవార్ధం విందు ఇస్తుంది. 1986లో ‘’నేషనల్ ఉమెన్స్ హాల్ ‘’లో ఆమె పేరు రాసి గౌరవించారు 13-6-2007న అమెరికా ప్రభుత్వం 75 సెంట్ల పోస్టల్ స్టాంప్ ప్రచురించి గౌరవించింది .సెయింట్ లూయీ లోని ‘’హార్రిస్ స్టవ్ స్టేట్ యూని వర్సిటి ‘’పేరును ‘’స్టవ్ అండ్ విలియం టోర్రీ హార్రిస్ ‘’గా మార్చారు .ఒహాయు హిస్టారికల్ సొసైటీ ఆమె పేరును అమెరికా రాజధాని లోని స్టాట్యూటరి హాల్ లో చేర్చమని సిఫార్స్ చేసింది . అంకుల్ టామ్స్ నవల అనేకభాషలలో వెలువడింది .,ఇదికాక ‘’ Dred’’ ఏ టేల్ఆఫ్ దిగ్రేట్ డిస్మల్ స్వా౦ప్ ,అవర్ చార్లీ వాట్ టుడు విత్ హిం ,లిటిల్ పుస్సి విల్లో ,సిక్స్ ఆఫ్ వన్బై హాఫ్ ఏ డజన్ ఆఫ్ ది ఆదర్,ఉయ్అండ్ అవర్ నైబర్స్ మొదలైన నవలలలు,’’ది క్రిస్టియన్ స్లేవ్ ‘’డ్రామా ,రెలిజియస్ పోయెమ్స్ ,రాసింది. నాన్ ఫిక్షన్ గా ‘’న్యు ఇంగ్లాండ్ స్కెచ్ బుక్ ,ఎర్త్లి కేర్ ,ఎ హెవేన్లి డిసిప్లిన్ ,ఏ కీ టు అంకుల్ టామ్స్ కాబిన్ ,లైవ్స్ అండ్ డీడ్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మేడ్ మెన్ ,ఎ డాగ్స్ మిషన్ వగైరా చాలారాసింది .కధలు వ్యాసాలుగా –కజిన్ విలియం ,ఓల్డ్ ఫాదర్ మారిస్ ఒలి౦పియాన ది డ్రంకర్డ్ రిక్లైమ్డ్ ,మోరలిస్ట్ అండ్ మిస్సునలిస్ట్ ,విచ్ ఈజ్ ది లిబరల్ మాన్ ,ది టుఆల్టార్స్ మొదలైనవి చాలాఉన్నాయి .                                                                                                                      -గబ్బిట దుర్గాప్రసాద్~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

image.png
Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 426-చిన్నమ్మ (10వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

426-చిన్నమ్మ (10వ శతాబ్దికి పూర్వం )

భోజుని ‘’సరస్వతీ కంఠా భరణం ‘’లో చిన్నమ్మ  శార్దూల విక్రీడితం లో రాసిన ఒక్క శ్లోకం ఉదాహరి౦ప బడింది .10వ శతాబ్దికి ముందున్న కవయిత్రి ఆమె  .సారంగధర పద్ధతిలోనూ ఇదే శ్లోకం ఉంది .శివుడు తన మనోభావాన్ని దేబ్బతీశాడని నింద చేసే శ్లోకం .ఆయన తీవ్రస్వభావంకలవాడని అహంకారి అనీ ,మహాభైరవాకృతిలో ఆయన అయిదు అవతారాలెత్తిన విష్ణువును  తిరస్కరించాడని,మించిపోయాడని  చెప్పింది .గంభీరమైన శైలీ విన్యాసం ,సమ్మేళన పదార్భాటం ఆమె విధానం .ఆమెకు స్మృతి,శ్రుతులపై లోతన అవగాహన ఉన్నట్లు అర్ధమౌతుంది .

‘’కల్పాన్తే శమిత త్రివిక్రమ మహాకంకాళ దండో స్ఫురచ్-ఛేషస్యత్  నృసింహ పాణి నఖర ప్రోతాది కోలామిషః

విశ్వైకార్ణవతా  నితాంత ముదితౌ తౌ మాతృస్య కర్మా బుభౌ –కర్షన్ ధీవరతాం గాతోస్యతు మహా మోహం మహా భైరవః ‘’

427-గంధ దీపిక

సారంగధరపద్ధతిలో గంధ దీపిక ఆర్యా వృత్తం లో రాసిన ఒకే ఒక శ్లోకం ఉదాహరి౦ప బడింది .ఇందులో ఆమె గృహిణి ధర్మాలను విధులను  వస్త్రాలునేసే పద్ధతిని ,ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటాన్నీ తెలిపింది .

‘’శశి నరవ గిరిమదమా౦సీ జాతు భాగో మలయలోహమో ర్భాగ్యౌ –మిలితైర్గుణపరి మృదితై వస్త్ర ర్గుహాదీని ధూపయే శ్చతురః’’

428-గౌరి (17వ శతాబ్ది )

సుందరదేవుని సూక్తి సుందర లో గౌరీ షాజహాన్ ను పొగుడుతూ రాసిన శ్లోకం ఉదాహరించాడు .పంచతత్వ ప్రకాశిక రాసిన వేణీ దత్తకూడా తన పద్య వేణి లో గౌరీ రాసినశ్లోకాలు పేర్కొన్నాడు .శివుడు కల్ప వృక్షం ,రాజు ,స్త్రీ,ప్రకృతి రాజకీయం శృంగారం మొదలైన వాటిపై ఆమె కవనం  ధారతో అమృతతుల్యంగా ఉంటుంది  .శివుడిని భయంకరంగా లయకారుడుగా కాక ,అభయ దాతగా సంరక్షకునిగా వర్ణించింది .శివపార్వతులు లోకకల్యాణ కారకులని చెప్పింది .తనరాజుపౌరుషపరాక్రమాలను ఆరు శ్లోకాలలో వర్ణించింది  భ్రస్టుపట్టిన సనాతన ధర్మాన్ని రాజుమాత్రమే పునరుజ్జీవి౦ప చేయగలడలని చెప్పింది .భుశండి ఆయుధ వర్ణన  చేసింది .యుద్ధాన్ని బాగా చిత్రించింది .చివరి శ్లోకం లో లొంగిపోయిన వీరుని భార్యపడే కస్టాలు ఆశ్రయం ఆదరణ  దొరకకపోవటం ,విజేతరాజును ఆశ్రయం కొరలేని దైన్యస్థితి బాగా వర్ణించింది గౌరి .స్త్రీసౌన్దర్యాన్ని అద్భుతంగా వర్ణించింది .నీటిలో స్నానం చేసి బయటకు వచ్చిన స్త్రీ రతీ దేవిని మించిన సౌందర్యం తో కనిపించింది ఆమెకు .స్త్రీ సర్వాంగ సౌందర్యం ఆమె కవిత్వం లో పోతపోసుకోన్నది .ఆమె కోరికల కల్పవృక్షంగా కనిపిస్తుంది .సృజన ,భావుకత మేధావితనం ఆమె సొమ్ము .కృత్రిమతకు దూరం సహజత్వానికి అతి సమీపం ఆమె కవిత్వం .అలంకార శోభతో కవిత్వాన్ని మైమరపించే నేర్పు గౌరికి ఉన్నది .

శివుడు-‘’అనుఫుల్ల  గల్ల పరిఫుల్ల  ముఖారవింద –సౌగంధ్యలుబ్ధమధుపాకులయ రతాం

భుగ్న పీనకుచ చూచుకాయాతిగాఢ-మాలింగితౌగిరిజయా గిరిశః పునాతు ‘’

రాజు – ‘’ప్రభ్రశ్స౦గ తిమస్తకః ప్రవిగలత్ సద్వర్ణ విప్రస్థితి –ర్నశ్యత్ స్వాన్గబలః  ప్రణస్టవచన ప్రాగ్భార పూర్ణ స్మృతిః

వృద్ధో త్సంతమయం స్వయం కాలి మహా మ్లేచ్చేన నిర్మాలితౌ –ధర్మః సంప్రతి చాల్యతే తవ కరాలంబేన భూమీపతే’’

భుశండి –‘’మహా చండీయ సంభాతి భుజండీ భవతఃకరే –ప్రతాపజ్వర సంభ్రాంత గోలికా జీవ హారిణీ’’

అరినారి –‘’చంద్రాననా చంద్రక చారు గాయత్రీ –సా కోప విత్రస్తచకోర నేత్రా

శైలే య మృగాభిః స్మరభావ వద్భిః-సంసేవ్యతే ద్రావారి భామినీ తే ‘’

నేత్రం –‘’ముఖే శృంగార సరసి లావణ్యామృత పూరితే –కామక్రీడా హితం భాతి నయనం శఫరీ యుగం ‘’

కల్పతరు – సంత్యేవ నందనవనే శతశః సువృక్షాః-కాలేన పుష్ప ఫలతర్పిత నాకి దక్షాః

తేత్వేక ఏవ సురరాజ మనోభిలాష –తాత్కాల దాన పటురస్తి స కల్ప వృక్షీ’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

12 Questions For Arun Shourie That We Wish He Answers

12 Questions For Arun Shourie That We Wish He Answers

Posted in రాజకీయం | Tagged | Leave a comment

గారుడీ మంత్రం ”తో పాముకాటు నుంచి ప్రాణాలు రక్షించిన ప్రాణదాత పాములనరసయ్య-రామకృష్ణ ప్రభ -జూన్

గారుడీ మంత్రం ”తో పాముకాటు నుంచి ప్రాణాలు రక్షించిన ప్రాణదాత పాములనరసయ్య-రామకృష్ణ ప్రభ -జూన్ 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 422-అజ్ఞాత కవయిత్రి –(17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

422-అజ్ఞాత కవయిత్రి –(17వ శతాబ్దికి పూర్వం )

పేరు ఊరు తెలియని 17వ శతాబ్దికి ముందున్నట్లుగా భావింపబడే ఒక అజ్ఞాత కవయిత్రి ఒకే ఒక్క శ్లోకం ఒకటి ‘’శుభాషిత హారావళి ‘’లో బయటపడింది .ఇది ప్రేమ సందేశం .కాని చాలకవితాపరంగా అల్లింది .క్షోభించిన హృదయం పడే వేదనకు ఈ శ్లోకం ప్రతిబింబం .-

‘’పురుష వదోషి తోషి కవీ భవేయుః  -సంస్కారో హృగత్మని సమవైతి న స్త్రైరపం పౌరుషం వా విభాగ మపేక్షతే –శ్రూయంతే హృశ్యంతే చ రాజ పుణ్యో మహామాత్య దుహితరో గణికాః కైతుకి భార్యంచ శస్త్ర ప్రహత బుద్ధయః కవయంచ ‘’

423-భావదేవి (10వ శతాబ్దం )

 భావదేవి లేక భావకాదేవి కి చెందిన మూడు  శ్లోకాలు  మాత్రమే దొరికాయి.అందులో ఒకటి  హారావళి లో మరోటి   ‘’కవీంద్ర వచన సముచ్చయం ‘’లో  మిగిలినది ‘’సదుక్తి కర్ణామృతం ‘’లో ఉన్నాయి.వీటికాలాన్నిబట్టి భావదేవి 10వ శతాబ్దికి  చెంది ఉండవచ్చు.కవీన్ద్రవచన సముచ్చయం లోని శ్లోకం స్త్రీ వక్షోజం పై శ్లేషగా చెప్పబడింది .రెండవది ప్రియునితో జరిగిన ఎడబాటు ,మళ్ళీ కలయిక వర్ణించబడింది .ఒకరకంగా జీవేశ్వరుల ఎడబాటు కలయిక గా అన్వయించుకోవచ్చు .మూడవది భార్యదగ్గరకు భర్తవచ్చి కాళ్ళపై పడటం ,కానీ ఆమెలో మార్పురాకపోవటం ,చివరకు భర్తమంచితనాన్ని అర్ధం చేసుకొని తనను క్షమించమని భార్యకోరటం.

  కవయిత్రి స్త్రీ సహజమైన మనోభావాలను అద్భుతంగా ఆవిష్కరించింది .మంచి శైలి ,మధుర అర్ధవంతమైన  సందర్భోచిత శబ్దాలతో కవిత్వం పరిమళించింది .శృంగార రసాన్ని అద్భుతంగా పోషించగలనేర్పు కనిపిస్తుంది  .మొదటిశ్లోకం లో శ్లిస్ట సమాసోక్తి, రెండవదానిలో అతిశయోక్తి మూడవశ్లోకం లో అర్ధాంతరన్యాసం ,ఆక్షేపం రంగరించింది ‘

1-రాజన్మానౌ తుల్యా విభజన భువా జన్మ చ సహ – ప్రవృద్ధౌనామ్నా చ స్తన్ఇతిసమానా వుదాయినౌ

మిధః సీమామాత్రే యదిదమనయో ర్మండల వతౌ-రపి స్పర్దాయుద్ధం తదిహహి నమస్యః కఠినిం.

424-చండాల విద్యా (4వ శతాబ్దం )

మహాకవి కాళిదాసుకు సమకాలికురాలైన చండాలవిద్యా విక్రమార్క మహారాజు కు అత్యంత  ఇష్టమైన ఆస్థానకవయిత్రి  .విక్రమాదిత్య చండాలవిద్యా కాళిదాసు కవిత్రయ శ్లోకం ‘’సదుక్తి కర్ణామృతం ‘’లో ఉంది.పున్నమి నాటిరాత్రి చంద్ర కాంతి పాలలాగా భూమిపై చేరి జనులకు అలసట తీరుస్తున్నట్లువర్ణించబడిన శ్లోకం అది

‘’శ్రీ రంభోసి మిజ్జతీవ దివాసవ్యాపార ఖిన్నం జగ-తత్ క్షోభా జ జల  బుద్ధబుద్ధా ఇవ భావన్యాలో హితాస్తారకాః

చంద్రం క్షీరమివ క్షరత్యవిరతం ధారా సహస్రోతు కరై-రుద్వగ్నీ వై స్త్రుతిశితై రివాద్య కుముదై ర్జోతుస్మాపాయః పీయతే

చండాల విద్యా-విక్రమాదిత్య –కాళిదాసానాం ‘’(శార్దూల విక్రీడితం )

425-చంద్రకాంత భిక్షూని(–)

బౌద్ధభిక్షుకి చంద్రకాంత భిక్షూని నేపాల్ కు చెంది ఉంటుంది .ఆమె రాసిన 8 శ్లోకాల అవలోకితేశ్వర స్తోత్రం మాత్రమె దొరికింది .దీనిలో అవలోకితెశ్వరుని శారీరక బౌద్ధికమానసిక పరిణతి వర్ణించింది .ఆయన పూర్ణ చంద్ర నిభాననుడు .తామరరేకులలాంటి కనులు .చేతులు కాళ్ళు తామర తూడులు .రాయ౦చనడక .విజ్ఞాన పయోనిధి .బాధితుల ఆర్తి తీర్చే కరుణామయుడు .గురువు మార్గదర్శి .

  చంద్రకాంత కవిత్వం హృదయపు లోతుల్లోంచి భక్తిభావంతో మహాయాన బోధిసత్వ అవలోకితేశ్వరునిపై పెల్లుబికి ప్రవహించింది .స్తోత్రం తోటక వృత్తం లో రాయబడింది –

‘’భువనత్రయ వందితలోక గురుం –అమరాధిపతి స్తుతి బ్రహ్మవరం –మునిరాజవరం యుతిసిద్ధకరం –ప్రణమాణ్యవలోకిత నామ ధరం ‘’

‘’సుగతాత్మజరూప సురూపధరం –బహులక్షణ భూషిత దేహధరం –అమితాత్మ తథాగత మౌలిదరం-కనకాబ్జ విభూషిత వామకరం ‘’

‘’కుటిలామల పింగల ధూమ్రజటం-శశి బింబ సముజ్జ్వల పూర్ణముఖం –కమలాయత లోచన చారుకరం –హిమఖండ విమండల పుండ పుటం ‘’

చివరి శ్లోకం –

‘’పరిపూర్ణ మహామృత లబ్ధ ధృతిం –క్షీరోద జలార్ణవ నిత్యగతిం –శ్రీ పోతలకాభి నివాస రతిం –కరుణా కరుణామయ నిర్మల చారు భ్రుశం ‘’

‘’ఇతి శ్రీ మదార్యావలోకితేశ్వర భట్టారకస్య చంద్రకాంతా –భిక్షుణీ స్తవ స్తోత్రం సమాప్తం ‘’

    ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 421-చమత్కార తరంగిణి వ్యాఖ్యాన కర్తలు -సుందరి ,కమల (1705)

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

421-చమత్కార తరంగిణి  వ్యాఖ్యాన కర్తలు -సుందరి ,కమల (1705)

ఉత్తర రామ చరిత వ్యాఖ్యానకర్త ఘనశ్యామ క్రీ.శ. 1700 లలో జన్మించి, తంజావూర్ పాలకుడు మొదటి తుక్కోజి వద్ద మంత్రిగా ఉన్నాడు .నీలకంఠ చంపు సంజీవనికూడా రాశాడు .18వ ఏటనుంచే రచనావ్యాసంగం సాగించాడు .మహారాష్ట్రకు చెందినవడైనా తంజావూర్ లోనే ఉండిపోయాడు .తండ్రి మహాదేవ .తల్లి కాశీ .పెద్దన్న ఈశా ‘’చిదంబర బ్రహ్మచారి ‘’గా గుర్తింపు పొందాడు .ఘనశ్యామా మొదటి భార్య సుందరి .కమలను రెండవ భార్యగా చేసుకోనేదాకా ,.తనరచనలలో ఆమెను సుందరిగానే పేర్కొన్నాడు .ఈ ఇద్దరితో ఆనుకూల్య దాంపత్యమే నెరిపాడు .ఈ ఇద్దరి పేర్లను తన రచనలలో తరచుగా పేర్కొని , తన అభిమానాన్ని చాటుకొన్నాడు .తన అభిజ్ఞాన శాకుంతల సంజీవనిలో వారిద్దరి మేధో విలసనాన్ని తెలిపాడు .ఘనశ్యామ ఇద్దరుకోడుకులు చంద్ర శేఖర ,గోవర్ధన .చంద్ర శేఖర తన తండ్రిరాసిన ‘’డమరుక ‘’కావ్యానికి వ్యాఖ్యానం రాశాడు .గుడ్డివాడైన గోవర్ధన తండ్రి రచన ‘’ఘట కర్పక ‘’కు వ్యాఖ్య రాశాడు .ఘనశ్యామ ‘’పంచాయతన దేవత’’కు పరమభక్తుడు .

  ఘనశ్యామ సంస్కృత ,ప్రాకృతాలలో అనేక రచనలు చేశాడు .తను 64రచనలు చేసినట్లు నీలకంఠ చంపులో చెప్పుకొన్నాడు .రచనలో తనవాటినే ఎక్కువగా ఉదాహరణలిచ్చేవాడు .సుందరీ కమలలు కూడా అలాగే చేశారు .రాజశేఖరుని విద్ధ సాలభంజికపై ‘’చమత్కార తరంగిణి వ్యాఖ్య’’ రాశారు ఇద్దరూ .ఘనశ్యామ రచనలలో చాలాభాగం శిధిలమయ్యాయి .ఘనశ్యామ ‘’ధాతు కోశం ‘’రాశాడు .అందులో అమరా సి౦హు ని రచనపై తీవ్రంగా విమర్శలు చేసిన ధీమంతుడు .18వ ఏటనే రామాయణ చంపు ,20వ ఏట మదన సంజీవన ,కుమార విజయ నాటకం రాసిన ప్రతిభావంతుడు ఘన శ్యామ .22వ ఏట డమరుక ను 8వ రచనగా రాశాడు .ఏడాదికి కనీసం మూడు లేక నాలుగు పుస్తకాలు రాసినఘనుడు ఘనశ్యామ .మొదట్లో సృజనాత్మక రచనలు చేసి ,తర్వాత ఇతరకావ్యాలపై వ్యాఖ్యానాలు చేశాడు .క్లిస్టభాషలో రాసినా రచనలో ఆకర్షణ ఉంటుంది .మేధావే కాని ఇతరకవులను మెచ్చుకొనే సహృదయతదయలేని వాడుగా గుర్తి౦పు పొందాడు .అనేక’’ కోశాలు’’ నిర్మించాడు కనుక ‘’కోశావలీ వల్లభ ‘’బిరుదు సార్ధకమే .

   ఘనశ్యామ సుందరిని పిన్నవయసులోనే పెళ్ళాడాడు .పెళ్ళికి ఇద్దరివయసు 16లోపే .సుందరి 1705లో పుట్టింది .అతనికి 30 కమలకు 13వయసులో కమలా ఘనశ్యామా వివాహం జరిగింది అప్పుడు అతడు తుక్కోజి రాజ్యం లో మంత్రి .అప్పటికే చాలా రచనలు చేశాడు .ఈ ఇద్దరి పెళ్ళాల ముద్దులమొగుడు తనరచనలలో వారిపై ప్రేమను వారి ఆరాధనాభావనను వీలైనప్పుడల్లా వర్ణించి సంబరపడ్డాడు .ఇద్దరు భర్తను పుంభావ సరస్వతి అని భావించి సేవించారు .చమత్కార మంజరిలో తమభర్త ఘనశ్యామ రచనలద్వారా అమరత్వం పొందాడని ఆనందించారు .రాజశేఖరుడు మూడు రచనలు మాత్రమే చేస్తే తమనాధుడు చాలారచనలను అనేకభాషలలోచేశాడని చెప్పుకొన్నారు .రాజశేఖరుడు ఉదయం మాత్రమే రచన చేస్తే, తమ భర్త రోజులో ఇరవైనాలుగు గంటలు  అదే దీక్షతో రచన చేసే  సామర్ధ్య మున్నవాడని చెప్పారు .ఘనశ్యాముని’’ ప్రచండ రాహూదయ’’ వంటి కావ్యం కాని ఆయన ఇతర రచనలతో సరిసమానమైన రచనకాని వేరెవ్వరూ చేయలేదని సవాలు విసిరారు .భర్త శేముషీ వైభవాన్ని చాటే అనేక శ్లోకాలను డమరుక, జాతి గుణోల్లాస ,భారత చంపు ,హరిశ్చంద్ర చంపు ,భోజచంపు ఉత్తరరామ చరిత వ్యాఖ్యానం,అభిజ్ఞాన శాకుంతలం ,యుద్ధకాండ చంపు ప్రబోధ చంద్రోదయ ,ఆనంద సుందరి  మొదలైన  వివిధ రచనలనుండి ఉదహరించారు.

  దీనిని బట్టి సుందరి కమలలు తమ భర్త ఘనశ్యామారచనలన్నిటిపై లోతైన పరిశీలన  సాధికారమైన అవగాహన ఉందని అర్ధమౌతోంది  .తమ మేధకు తామే అబ్బురపడే వారిద్దరూ .ప్రతి శబ్దానికి వంద అర్ధాలను చెప్పగల సామర్ధ్యం తమకు ఉందని నిర్భయంగా ప్రకటించిన ధీ శక్తి వారిది .తమ బావగారు అంటే ఘనశ్యాముని అన్నగారైన ‘’కల్పతరు ‘’కర్త చిదంబర స్వామి అంటే ఈ ఇద్దరికీ విపరీతమైన గౌరవం భక్తీ,ఆరాధనా. చమత్కార తరంగిణిలో ఈయన గురించి రెండుసార్లు చెప్పారు .కాని కల్పతరు కనిపించటంలేదు .

    ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 420-రాజేశ్వర విలాస మహాకావ్యకర్త –పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి (16వశతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

420-రాజేశ్వర విలాస మహాకావ్యకర్త –పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి (16వశతాబ్దం )

పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి రచించిన రాజేశ్వర విలాస మహాకావ్యం లో ఆచార్య బిరుదురాజు రామరాజుగారికి కేవలం 12తాళపత్రాలు మాత్రమె లభించాయని ,అందులో రెండువందల శ్లోకాలున్నాయని ,ఇది సాహిత్య శాస్త్ర గ్రంథంఅని ,ప్రతాపరుద్రీయం లాగా పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరికవి రాజేశ్వర భూపాలుని పేరుతొ రాసిన సాహిత్య శాస్త్ర గ్రంథంఅన్నారు .

  కౌశిక గోత్రజుడైనకవి తండ్రి నాగలింగ సోమయాజి .కవికాలం నివాసం తెలీదు .కృతి భర్త మహాజని నాగమాంబా ,లక్ష్మీ నారాయణ అనే బ్రాహ్మణ దంపతులకు వేములవాడ రాజరాజేశ్వరుని అనుగ్రహంతో జన్మించాడు .భాగాపురవాసి .గొప్ప వంశం .గౌతమస గోత్రం .మూల పురుషుడు కీర్తిమన్నృపాలుడు బదరికాశ్రమం లో శ్రీ లక్ష్మీ నారాయణుని సేవించి వరప్రసాదంగా పుత్రుని పొందాడు .ఈయన మునిమనవడు’’ఆసాకేతము ఆకాశి’’వరకున్న రాజ్యాన్ని పాలించాడు .ఈ వంశంలో ఆరవతరం వారైన కాశీనాధ ,జగన్నాధ ,ఉమానాద సోదరత్రయం సాకేతం పాలిస్తూ ,నిజాముల్క్ తో యుద్ధం చేసి గెలిచారు .ఉమానాధుని మనవడు లక్ష్మీనారాయణ ధిల్లీ పాలకుని చేత బెంగాల్ సుబేదారుగా నియమింపబడ్డాడు ఈయనమనవాడు చంద్ర చూడుడు పాండురంగని వరప్రసాదం తో విఠల,కృష్ణ దోడారాములు అనే ముగ్గురుకోడుకులను కన్నాడు .వీరికి ఢిల్లీ రాజు మహాజనీ ,దేశముఖీ ఇచ్చాడు .బహుశా అప్పటినుంచి ఇంటిపేరులో మహాజని  చేరి ఉంటుంది .విఠలుని మునిమనవడు గోపాలరాయుడు మత్సపురిఅంటే మచిలీపట్నం  పాలకుడయ్యాడు .ఇతని 8మంది సంతానం లో రెండవాడు లక్ష్మీనారాయణ స్తంభాద్రి అంటే ఖమ్మం మెట్టు అనగా ఖమ్మం ను జయించాడు .ఇతనికి నాగాంబ వెంకమాంబ ,రాజేశ్వరుడు సంతానం .ఈ రాజేశ్వరుడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి వరప్రసాది .ఈయన పేరుతోనే ‘’రాజేశ్వర విలాస కావ్యం ‘’రాశాడు కవి పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి .రాజేశ్వరుడు భాగాపురం అంటే భాగ్యనగర నివాసి .కృతి కర్త, భర్త ఇద్దరూ సమకాలికులేకనుక కాలం 16వ శతాబ్దం అయి ఉంటుంది .

  వంశావళి చివరలో కవి –

‘’బాలన్యగ్రోధ వంశోత్తమ విమలయో రాశిరాకాశశాం కః-సంపూర్ణ బ్రహ్మ తేజః స్పుట ముఖ కములోల్లాస విద్యా మరందః

నాగార్యో యన్య సాక్షా త్కృత నగతనయా కాంత మూర్తిఃపితాసీ –దేనం శ్రీ వేంకటార్యం ప్రమదయతుముదా సాదు కారుణ్యవాదః ‘’

‘’ఇతి కౌశిక గోత్ర బాలన్యగ్రోధ కుల కలశాబ్ది సుధాకర శ్రీనాగలింగ సోమయాజి తనూభవ ‘’శ్రీ  వేంకటపతి సూరి విరచితే రాజేశ్వర విలాసే మహాకావ్యే వంశావాళీప్రకరణం నామ ప్రధమోమ్కః ‘’నాటకం లోని అంకంలాగా  మొదటి అంకం అనటం ఆశ్చర్యం .మిగత రెండిటిని నాయక ప్రకరణం అని ,అలంకార ప్రకరణం అనీ అన్నాడు .

  నిజాముల్కును ఓడించిన సోదరత్రయం పై శ్లోకం –

‘’శూరాస్సాహసికా స్త్రయస్సమధిక ప్రావీణ్యవంతో ధను –ర్విద్యాయాంగజవాజి రాజి రథసంపత్తి ప్రసేనాశతాః

సాకేతే నగరే వినోదనకదాలాపై నిశాయాపనం –కుర్వంతః పరిపాలయంతి విషయానర్ధ్యా దితేయద్రుమః ‘’

‘’తదన్తరే తన్న్రుపవీర దేశానాక్రామ్య దోర్దండ జితారి వర్గాః –మ్లేచ్ఛానిజాముల్కు మఖా ప్రసైన్య యుతాబబందు ర్నగరం చ తేషాం’’

ఢిల్లీ శ్వరుడిచ్చిన ‘’దేశముఖి గురించిన శ్లోకం –

‘’నృపాస్త్రుయంతే బహుభాగ్యవంతః  అనేకమాతంగ రాదాశ్వవంతః –తత్రైవ ఢిల్లీనగరాదినాదాత్ మహాజనీ ,దేశముఖత్వ  మాపుః

మచిలీ బందరును పాలించిన గోపాల రాయని పై శ్లోకం –

‘’శ్రీ గోపాల మహేపతిః  కులకరోదాంత స్తపస్వీ వరం –ధర్మాత్మామిత విక్రమో ద్విజకులాలంకార రూపోపి సః

శ్రీమాన్ మత్స్యపురేవారిచ నివసన్ తద్రాజ్య కార్యస్యవై –తత్రస్థాన్విషయా న్వశాద్రఘుపతీ రంయానివాలాపయత్ .

ఉపమాలంకారం –

‘’శ్రీ రాజరాజేశ్వర భూపతి కంఠీరవమంగ జోపమాత్మానన్ – సంరక్షిత భూపాలం రక్షతు లక్ష్మీపతిః పరగ్హ్నం  తమ్ ‘’

అపహ్నుతి అలంకారం-

‘’శుద్దాపహ్నుతి రాన్యారపార్దో ధర్మ నిహ్నవో యత్ర –నామీ సురాజ నృపతే స్సుగుణాః కిం తర్హి రత్నజాలాని ‘’

సయుక్తికో యత్ర కా ధర్మ నిహ్నవో బుధా స్తమాహుః కిల హేత్వవహ్నవం –

అయం న చేందుఃకమలనుమోదకో హరి –ర్నసౌమ్య స్సహి చక్రపాలకః ‘’

ధీరోదాత్త నాయక లక్షణాలు చెప్పే శ్లోకాలలో చాలా శిధిలాలని ,9శ్లోకాలు ఒక దీర్ఘగద్యం మాత్రమె ఉన్నాయని రాజుగారువాచ

(బిరుదురాజువారి ఈ వ్యాసం వేములవాడ రాజరాజేశ్వర సంస్కృత కళాశాల వార్షిక సంచిక -1981-82లో ప్రచురితం )

ఆధారం –ఆచార్య బిరుదురాజు గారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు

ఇంతటితో ఆచార్య బిరుడదురాజురామరాజు వారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’లో సంస్కృత కవులు సమాప్తం .

సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -3-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జూన్ తెలుగు వెలుగు మాసపత్రికలో పుచ్చా వారి పుస్తక పరిచయం ”కొండ అద్దంలో ‘

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 419-ఏక దిన ప్రబంధకర్త –ఆలూరి సూర్యనారాయణ వాజపేయ యాజీ

  • గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

419-ఏక దిన ప్రబంధకర్త –ఆలూరి సూర్యనారాయణ వాజపేయ యాజీ

విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ వేంకటపతి రాయలు పాలిస్తున్నకాలం (1586-1614)లో రాయవేలూరుకు సామంతరాజు లింగమనాయకుడు .తండ్రి చిన్నబొమ్మ నృపాలుడు (1549-1579)గొప్పకవి, గాయకుడు, కవిపండిత పోషకుడు .జయదేవుని గీత గోవిందం లాగా ఆరు కాండల రామాయణాన్నివివిధరాగ ,తాళాలతో, గేయాలతో, శ్లోకాలతో ‘’సంగీత రాఘవం ‘’కృతి రచించాడు .అప్పయ్యదీక్షితులవారికి చాలాకాలం పోషకరాజుకూడా.బొమ్మనాయకునికొడుకు లింగమనాయకుడు కూడా పరాక్రమశాలి, కవిపండిత పోషకుడు .విజయనగరరాజు రెండవ వేంకటపతి రాయలతో యుద్ధం చేసిన మేటి వీరుడు .రాయవేలూరుకోట రాయల వశంకాకపోతే దామెర్ల కరి చన్నమనాయకుడు అనే విజయనగర సామంత సైన్యాధికారి మోసం చేసి కోటను పట్టుకొన్నాడు .ఇంతటితో వేలూరులో ఈ నాయకులపాలన అంతమొందింది .

  లింగమనాయకుని ఆస్థానం లో కవిపండిత గాయక నర్తక,విద్యా గోస్టులు , ప్రదర్శనలు , చర్చలు ఎక్కువగా జరిగేవి .విద్యా గోష్టికి ఆలూరి సూర్యనారాయణ యజ్వ మూలస్థంభం .ఒకరోజు రాజాస్థానం లో కవులమధ్య పోటీవస్తే యజ్వగారు ఒక్క రోజులో ఒక ప్రబంథం  రాస్తానని సవాలు చేసి ‘’ఉలూచీ చిత్రాంగద సుభద్రాపరిణయం ‘’ రాసి మాట నిలబెట్టుకొని రాజును సంతోష పరచాడు  .ఇది అముద్రితం .

 మొదటిసర్గలో ఇంద్రప్రస్థ వర్ణన ,ధర్మరాజు ధర్మపాలన ,సమయభంగం చేసిన అర్జునుడు తీర్ధయాత్రలకు వెళ్ళటం ,గంగానదినుండి పాతాళానికి పోయి ఉలూచిని పెళ్ళాడి బభ్రువాహనుడికి జన్మనివ్వటం ,అక్కడినుంచి కావేరీ తీరం చేరటం ,పాండ్యరాజ వర్ణన కూతురు చిత్రంగదతో పరిణయం ,పంచహ్రద సేవనం ,ద్వారకకు చేరటం ఉన్నాయి .రెండవసర్గలో కృష్ణుని ప్రసన్నం చేసుకొని ద్వారక చేరి ,రైవతకాద్రిపై మాయా యతిగా  ఉంటూ సుభద్ర సేవలు అందుకొనటం ఇద్దరి విరహవేదన ఉంటాయి .మూడులో సుభద్ర చెలికత్తె ద్వారా మాయ యతి సుభాద్రమనో వేదన అర్ధం చేసుకోవటం ,సుభద్రతో తనగుట్టు చెప్పుకొని రహస్యక్రీడలాడటం ఉన్నాయి .నాలుగవ సర్గలో బలరాముడు యతిని సేవించి సముద్ర ద్వీపం లో జరిగే శివుని ఉత్సవాలకు వెళ్ళటం ,కృష్ణుడు సుభద్రార్జునుల వివాహ ప్రయత్నం చేయటం ,బలరాముడికి కోపంవస్తే తమ్ముడు శాం౦పచేయటం,నూతనదంపతులు ఇంద్రప్రస్థం చేరటం ,ధర్మరాజు సుభద్రార్జున వివాహాన్ని ఘనంగా జరిపించటం తో ప్రబంథం ముగుస్తుంది .

  ప్రార్ధన శ్లోకం –

‘’స్పురతుమే గురువరంఘ్రి నఖ ప్రభా దళిత సంతమసే హృదయా౦ తరే

ఆది కథా కరకంకణ కుండలీ క్వణిత శంకిత శంకర సంస్తుతః  ‘’

ధర్మరాజు ప్రాభవం –

‘’పుమభిలాష ఫలైర్ధ్రుత మూర్తి భిశ్చతనృణా౦ చ దిశాంవిజయైరివ

సహి చతుర్భిరశోభి సహోదరైర్హరిరివో చ్చ భుజై రాతి దుస్సహై ‘’

చిత్రాంగద –

‘’ముఖ రుచి ప్రవల్లహరీ స్తన క్షితి ధర ప్రతిఘాత వివర్తితా –ఝఠయుగీ పరిత స్పురతిధృవం

 భుజ యు గీతి భుజంగ శిశుభ్రువః ‘’

విజయుని విరహవేదనలోవసంతరుతు  శ్లేషరామణీయకత –

‘’స్వకామ భా జ్మాధవబద్ధ సఖ్య మప్యర్జునం హంతి ముహుర్వసంతః

పలాశ వర్గస్య వికాశ హేతోః క్వజాతి హీనస్య భవేద్వివేకః ‘’

  ఈశ్లోకం పండితరాజు చెప్పిన ‘’జాత్యావిహీనో నవివేక్తుమేస్టి’’శ్లోకాన్ని గుర్తుకు తెస్తు౦దన్నారు  రాజుగారు

సుభద్రార్జున రహః క్రీడ –

‘’వాతాహృత నవామ్భోజ సౌరభ్యేనసహార్జునః –సుభద్రా ముఖ సౌంగంధ్య తారతమ్యం పరీక్షితే ‘’లాక్షా లక్ష్మీం దదౌ పాదే కుంతలే  కుంకుమ శ్రియం –బాలతపః సుభాద్రాయాఃకర్ణే కమలపురాతం  ‘’

కావ్యం చివరలో తలిదంద్రులగురించి,రాజసభలో ప్రతిజ్ఞా గురించి చెప్పుకొన్నాడు –

‘’శ్రీ యజ్ఞేశ్వర యజ్వ న స్సితకరాదాలూరి వంశాంబుధే-జ్ఞానామ్బా సుషువేయమధ్వరివరం శ్రీ సూర్య నారాయణం

తస్య శ్రీమతి లింగయ ప్రభు సభా మధ్యే ప్రతిజ్ఞా కృత –శ్రీమానేక దిన ప్రబంద సుకృతౌ సర్గశ్చ   తుర్దోజని

నాడీభిర్దివసస్య నవ్యమచిరాదవ్యాహతో హాస్పదైః- శబ్డార్ధైఃప్రభు సత్య సమ్మత కదా వృత్త క్రమైర్యంత్రితం

యత్కావ్యం నిరమాయి సంప్రతి మయాతస్మిన్ హఠాత్కారతః –ప్రాప్తం దోషముపేక్ష్యకేవల గుణగ్రాహీ బుధస్తుష్యతు

స్వస్య గుణావిష్కరణ ప్రయోజనాత్స గౌరవాదపి వా-త్రింశద్ఘటిక నిబంధన సాహసతో వా సతాం ముదేస్తు మే కావ్యం ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -2-6-19-ఉయ్యూరు

‘’

— 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 418-‘’బాలసరస్వతి ‘’తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసా చార్యులు(1869)

  • గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

418-‘’బాలసరస్వతి ‘’తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసా చార్యులు(1869)

వీరి వంశ మూలపురుషుడు శ్రీశైలపూర్ణులు .ఇందులో బుచ్చి వెంకటాచార్యులకుమారుడే మన బాలసరస్వతి బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు .వీరిది కడప మండలం  లోని బుక్కపట్టణం .సురపుర సంస్థానాధీశుడైన స్వామి నాయకుని (1752-1773)ఆహ్వానం మేరకు అణ్ణయాచార్యుల మూడవ కుమారుడు శ్రీనివాసాచార్యులు బుక్కపట్టణం వదలి సురవరం లోరాజగురువులై  స్థిర నివాసమున్నారు .శ్రీనాథునిలాగా ఈ వంశం లోని కిరీటి వెంకటాచార్యుల సాహితీ జైత్రయాత్ర విలువైనది .

 మన శ్రీనివాసాచార్యులు తండ్రి వద్దనే11వ ఏట  సాహిత్య ,అలంకార గ్రంథాలు గ్రహించారు .సంస్కృత ఆంధ్రాలలో కవనం అల్లటమూ ప్రారంభించారు .16వ ఏట మైసూరుకు వెళ్లి రాజగురు పరకాల స్వామి వద్ద తర్కం నేర్చి, మహారాజు చామరాజు ఒడియార్ ను మెప్పించి ‘’బాలసరస్వతి ‘’బిరుదుపొండాడరు .రాజుగారిచ్చిన ఉపకార వేతనం తో కాశీ వెళ్లి అద్వైత వేదాంతాన్ని స్వామి శాస్త్రిగారి వద్ద ,న్యాయశాస్త్ర క్రోడంను జగాధీశుని కైలాస చంద్ర శిరోమణి భట్టాచార్యులవద్దా ఆపోసనపట్టి ,నవద్వీపానికి వెళ్లి మీమాంసను అధ్యయనం చేసి ,అక్కడి పండితులు 1889లో అందజేసిన ‘’తర్క తీర్ధ ‘’బిరుదు నందుకొన్నాడు .సాహితీ ఉత్తర జైత్రయాత్ర దిగ్విజయంగా ముగించుకొని ,స్వరాస్ట్రానికి బయల్దేరి మార్గ మద్యం లో ఉత్తరాది సంస్థానాలు దర్భంగా ,జోధ్పూర్ ,బుందీ దత్తియా ,గ్వాలియర్ ,కోటా౦ జరీ ,ఇందూర్ ,దారానగరం ,జమ్మూ-కాశ్మీర్ లను  ,దర్శించి అక్కడిపండితులను వాదం లో జయించి ,వారు నతమస్తా కులై అభినందించగా ,ఆరాజులు విశేష గౌరవం తో సత్కరించిపంపగా స్వరాష్ట్రం చేరారు .

 గంటకు వంద శ్లోకాలు అవలీలగా  చెప్పగల నేర్పు మన శ్రీనివాసాచార్యులది .అందుకే వారికి ‘’ఘంటా శతశ్లోక కవి ‘’అనే బిరుదు సార్ధకమైనది .ఆంద్ర దేశం లో బళ్ళారి ,కడప ,పెనుగొండ తాడిపత్రి ,మద్రాసు ,బనగానపల్లి ,మొదలైన చోట్ల అవదానాలు చేసి పండిత శాస్త్రవేత్తల మెప్పు పొందారు .కీర్తి,కనకాలు ఆయన వె౦టపడ్డాయి .తర్వాత దేశమంతా సాహిత్య జైత్రయాత్ర దిగ్విజయంగా ముగించి అరుదైన సన్మానాలు అందుకొని చివరికి తన జన్మస్థలమైన  ఆత్మకూరులో సంస్థానాధీశుల ప్రధాన విద్వాంసులుగా స్థిరపడ్డారు.రాజు అనేక అగ్రహారాలు వారికి ఈనాముగా అందించి గౌరవించాడు .తాను సత్కారాలు అందుకోవటమే కాదు ,స్వయంగా ‘’బ్రహ్మామృత వర్షిణి’’అనే సంస్థ నేర్పాటు చేసి ,ప్రతిఏడాది ఘనంగా వేద సభలు నిర్వహించి  వేద, శాస్త్ర పండితులను సత్కరించారు .ఈ ఆస్థానానికి వచ్చిన తిరుపతి వేంకటకవులు శ్రీనివాసాచార్యులవారి చేతిలోశాస్త్ర  వాదం లో ఓడిపోయారు  .ఈ విషయాలు బాలసరస్వతిగారి మనవడు శ్రీమాన్ తార్కిక సిమ్హాచార్యులు ,తిరుపతి కవులకు గద్వాలలో ఆతిధ్యమిచ్చిన మహా పండితుడు గుండేరావు హర్కార్ తెలియజేశారని బిరుదురాజువారు రాశారు .

  ఆచార్యులవారి ముద్రితాముద్రితగ్ర౦థాలు చాలాఉన్నాయి .ఇందులో నంజరాజ చంపూః,దుర్మద నిర్మధనం ,జాంబవతీ పరిణయం ,తత్వ మార్తాండ ప్రభామండలం ,రాజశేఖర చరితం ,సురపుర వెంకట గురు చరితం ,శత ఘంటావధానం ,శ్రీనివాస విలాసః ,వీరశైవ శిరస్తాడనం ,దుర్విగ్రహ నిగ్రహ౦ ,కిరీటి వేంకటాచార్య విజయ వైజయంతి ,రాజవంశరత్నావళీ,లక్ష్మీ సరస్వతీ దండకం ,విష్ణుస్తుతి వ్యాఖ్యా ,రహస్య త్రయ సారార్ధః ,గంగాస్తుతిః,ఆంగ్లేయ ,జర్మనీ యుద్ధ వివరణం,ప్రపత్తి పదవీ , హయగ్రీవ పంచాశత్ నరకేసరి స్తుతిః ,దశావతార స్తోత్రం ,విజయ దశమీ నిర్ణయః అనే 22ఉద్గ్రందాలున్నాయి .

 ఇందులో శతఘంటావధానం లో కడప పోద్దుటూరు బళ్ళారి  మద్రాస్ లలో ఆచార్యులవారు చేసిన అవధాన శ్లోకాలున్నాయి .దీన్ని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు పండిత డి.గోపాలాచార్యులు ప్రచురించారు .దీనిలో ఏడవ ఎడ్వర్డ్  రాజు పట్టాభిషేక సమయం లో చెప్పిన 23శ్లోకాలు ,శివునిపై స్తోత్రం చెప్పమని కోరితే చెప్పిన ‘’భవానీ సంగమేశ్వర స్తుతి ‘’ వివిధ ప్రాకృత భాషలలో ఆశువుగా చెప్పిన శ్లోకాలు కూడా ఉన్నాయి .హయగ్రీవ పంచాశత్ ,నరకేసరి స్తుతి కూడా ప్రాకృతం లో చెప్పినవే.

సంగమేశ్వర స్తుతిలోని  మూడు శ్లోకాలు –

‘’స్రవ౦తీమాభ్యాం వలయిత నిశాంతం కిమపిత –త్ప్రశాంతంజ్యోతిర్నఃప్రథయతు శశాన్కార్ధ మకుటం ‘’

‘’నిదానం లోకానాం నిరవధి చిదానంద హరీం –దధానం భక్తానాం శమధన హృదానందనచణం’’

‘’సురాసుర శిరస్తటీ మకుట చుంబి పాదాంబుజం –చరాచర కుటుంబినం,శమధ నాశయా లంబనం

ధరాధర కుమారికా ,స్మరవిలాస లోలాశయం –జనాస్తుహిన భాస్వరం ,భజత సంగమాధీశ్వరం ‘’ఆరాళచలకున్తలం పరమరాళయనా౦ చితం – ప్రవాళ మృదులాధర౦ ,సితకరాధికాస్య ప్రభం

స్మరామి పురవైరిణః కమపి నిత్య నేత్రోత్సవం ‘’.

ఆచార్యులవారి రచనలలో ;;కిరీటి వేంకటాచార్య వైజయన్తినాటకం  ‘’అముద్రితం అన్నారు రాజుగారు .దీనిప్రతి తమవద్ద ఉందని ఇది 8అ౦కాలనాటకమని చెప్పారు .ఇందులో మూడవ అణ్ణ  యాచార్యుల కుమారుడు కిరీటి వెంకటాచార్యుల సాహిత్య జీవితం ఉన్నది .ఈయన సురపుర సంస్థానాదీశుడు వెంకటప్పయ్యనాయకుని రాజగురువైన ఆస్థానకవి .

నా౦దీ శ్లోకం –‘’-

‘’కారుణ్యేన  కిరీటినే ప్రవితరన్నధ్యాత్మ విద్యామృతం-ద్వారానేనవిరొధినోవిదళయన్  శాస్త్రేషుసాదధీయసా

తస్యై తస్య యశ శ్శశాంక  ధవళం తన్వన్ధరామండలే-శ్రీమాన్ శ్రీనిధి రచ్యుతః ప్రదిశతుశ్రేయాంసి భూయంసినః  ‘’

8వ చివరి అంకం లో తిరుమల తిరుపతి ధర్మాధికారి మహంతు హాథీరాం బాబా  వేంకటాచార్య గురువు పిత్రువ్యులు అయిన శ్రీనివాస దేశికుల మహత్వం తెలుసుకొని ఆచార్యులవారిని స్వయంగా సత్కరించటం తో నాటకం పూర్తి .భరతవాక్యం –

‘’నిర్దోష నిత్య మధురాణి నిరామయాని –శాస్త్రాణి నిత్య శుభగాని జయంతు లోకే

నిత్యాద్రుతా నృపతి భి స్సదృశా౦  సభాశ్చ-వాక్సౌరభీ చ సుభగా సతతం కవీనాం ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 417-భద్రగిరి చంపు కర్త –భారద్వాజ రామా చార్య (17-18శతాబ్ది )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

417-భద్రగిరి చంపు కర్త –భారద్వాజ రామా చార్య (17-18శతాబ్ది )

భద్రాచల క్షేత్రమహిమను, అక్కడ జరిగే చైత్రోత్సవాన్నీ విపులంగా ‘’భద్రగిరి చంపు ‘’కావ్యం లో  వర్ణించిన కవి భారద్వాజ రామాచార్య ..ఇతని ఇంటిపేరు ఊరు కాలమూ తెలియదు .కాని బిరుదురాజు వారు ఈ కవి 17-18శతాబ్దుల కాలం వాడై ఉంటాడని ,పాల్వంచ జమీన్ దారులైన ఆశ్వారావుల ఆస్థానం లో ఉండి ఉంటాడని ఊహించారు .కావ్యం లో తండ్రి తాతలగురించి తనగురించి చెప్పుకొన్నాడు –

‘’భారద్వాజస కులార్ణవామృతకర శ్రీరామ వర్యస్య యః-పౌత్రో వెంకట దేశికస్య మహాతః పుత్రస్య తే నాదరాత్

రామాఖ్యేన మనీషిణావిరచితే చంపూ ప్రబంథే మహాన్ – భద్రాదీశ మహోత్సవా మృతయుతే భాగో ద్వితీయో భవత్ ‘’.కావ్యం లో మొదటిభాగానికి ‘’ధ్వజారోహణం ‘’అని పేరు పెట్టాడు . రెండవ భాగానికి ఏ పేరు పెట్టాడో ఆభాగం శిధిలం అవటం వలన తెలియలేదు .ప్రారంభ శ్లోకం –‘’శ్రీమద్భద్ర  నగాధిరాజ విలసత్సౌధాగ్ర భాగోజ్వల –జ్జ్వాలాభీల మవక్ర విక్రమ మహం చక్రేశ్వరం నశ్వరం

ఛేత్తుం బంధ మలి౦ధనాగ్ని శమదం,దుర్వార గర్వాధిక –క్రవ్యద క్షరితా క్షతక్షత రుహైస్స్యః ప్రశస్యం స్తువే ‘’.మొదటిభాగం లో భద్రాచల మహాత్మ్యం అక్కడి ఉత్సవాలు వర్ణించబడ్డాయి .రెండవభాగంలో మర్నాడు అక్కడ జరిగే తిరునాళ్ళు వీధులు యాత్రికులు వగైరాలున్నాయి .కావ్యం లో’’ వీథీ’’ లక్షణాలు కూడా జోడించాడు  .పద్మాక్షుడు అనేవాడు ప్రియురాలు  బిబ్బోకవతికి వివరించి చెబుతాడు . ఈ రెండు పాత్రలగురించిన శ్లోకం –

‘’చైత్రోత్సవం దాశరధేర్విలోకితం –భద్రాద్రి నామ్నస్తరుణీ సమాగతౌ

పద్మాక్ష బిబ్బోకవతీ సమాఖ్యయా –ప్రఖ్యాం గతౌ కౌచన రంగ వాసినో ‘’

ఈ చంపు కాకతీయ కాలం నాటి’’ క్రీడాభిరామం ‘’ను గుర్తుకు తెస్తుంది .ఆలయ గోపురం దూరానికి ఎలాకనపడిందో చూడండి –

‘’కనక కలశరాజ శ్రీ పరీక్షాంవిధాతుం-విపులగగన శాణోల్లేఖనే నోన్న తేభ్యః

సతత తరతి సహానాం సాదు పారావతానాం –విహరణ శరణేభ్యో నమోస్తు ‘’

గోదావరి నది వర్ణన –

‘’పులిన జఘన రమ్యా చక్రవాక స్తనీయం-తరళతర తరంగ ప్రోచ్చలసన్మమధ్య రేఖా

సరిదిహ చపలాక్షీ స్వచ్ఛ డిండీర హాసా –విహగకుల  నినారైర్నౌ శుభం పృచ్ఛతీవ ‘’

భద్రగిరి వర్ణన –

‘’శ్రీ భద్ర శైలం సుకృతైకమూలం –భజేను వేలం ,జలదౌఘనీలం

శ్రేయో విశాలం విలసద్రసాలం –శ్రితానుకూలం శ్రిత దేవజాలం ‘’

శ్రీరామభద్ర వర్ణన –

‘’నమోస్త్వసుర వైరిణీ,జనక భూ మనో హారిణే-హృద౦తర విహారిణే,మతిమతాంసుధా హారిణే  శ్రితావన చారిణే ,శ్రుతి వనాంత సంచారిణే-సదా సుకృత కారిణే,దశరధాత్మజా కారిణే’’.

కల్యాణం ముందు అమ్మవారి, అయ్యవారి వర్ణన –

‘’కలశ జలధి కన్యాం,సర్వ లోకైక మాన్యాం-జనకయజన జన్యాం,వాంచఛితానాం వదాన్యం

హృతనతజనదైన్యాం,రాఘవే౦దోరనన్యా-మలమకురుత ధన్యా ,మాళివర్గౌఘ శూన్యాం’’

‘’కాంచీ గుణేన కలకి౦కిణి కేన సింధు –కాంచీనుతా కటి తటీ గ్రధితా కయాచిత్

పంచాస్త్ర కార్ముకగుణ ప్రవరేణ రామ –పంచాననన్య విజయోద్యమ శాలి నేవ ‘’

కళ్యాణ ఘట్టం లో పాల్వంచ జమీన్ దారులైన అశ్వారావు లవర్ణన ఉండటంతో ఈకవి ,వారి ఆస్థానకవి అయి ఉండాలి అని రాజుగారి నిర్ణయం –

‘’ఆశ్వినోజ్వలో హ్యశ్వరాయ ప్రభు –శ్శాశ్వతీ౦ సంపదం విశ్వతః పృస్టతః

ఆశ్వ వాప్తుం తదా విశ్వసన్ భూ సుతా –ధీశ్వరం చామరం శాశ్వదా దూనతే’’

తల౦బ్రాలఘట్టాన్నీ కమనీయంగా వర్ణించాడు –

‘’సువర్ణ శోభనాక్షతా ని మౌ నఖేల మక్షతాం-కరా౦బుజ ద్వయేన తౌ సదా శ్రితా వన్నోన్నతౌ

వధూ వరౌ  ప్రవర్షత స్తదా ముదా నమర్షతః –పరస్పరస్య మూర్ధని ప్రసూన గంధ వర్దినీ ‘’

‘’ముక్తా విదేహ తనయా౦జలి శుక్తి కాంత –ర్ముక్తా రఘు క్షితి వర్స్య తదుత్తమా౦గే

నక్తా సమస్త తనుషు ప్రబభుర్వికాసో –ద్యుక్తాఃప్రసూన నికరా ఇవ పారిజాతే’’

మనం చెప్పుకొనే ‘’జానక్యాః కమలాంజలి పుటే ‘’శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది .రధోత్సవ వర్ణన లో వివిధ ఛందస్సులను పపేర్కొంటాడుకవి –

‘’సోయం రాఘవ నందనో ఖిలజనా నాన౦దయన్ స్యన్దనే –భక్తైర్భాగవతతైర్నిషేవితతనుః క్ష్మాజానుజాభ్యాం యుతః

ఆస్తే నిస్తుల నూత్నరత్న రుచిర శ్రీమాలికా౦ డోలికాం-యశ్చక్రే సమరే పురాసుర మృగాన్ శార్దూల విక్రీడితం ‘’

‘’అనుపమ మణి భూషణా౦చితా భా –న్మనుకుల నాథ వధూ రధోపరిస్దా

దనుజ రిపుసుతా ను తాప కృఛ్ర-స్తనుతర కల్ప లతేవ పుష్పితాగ్రా  ‘’

ఇంతటి చక్కని కావ్యాన్ని,అందులోని కమ్మని శ్లోకాలను , భద్రాద్రి సీతారామకల్యాణం ప్రత్యక్ష ప్రసారం లోనిలయ విద్వాంసులైన  ఏ విశ్లేషక కవి అయినా భద్రాద్రి రామాచార్యకవి శ్లోకాలను ఉదహరిస్తున్నారోలేదో !రామరాజుగారు శ్రమపడి వెలికి తీయకపోతే ఈ కవీ, కావ్యమూ కాలగర్భం లో కలిసి పోవటం జరిగేది .

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 416-పార్వతీ పరిణయ చంపూ కావ్యకర్త –చంద్ర భట్ట ఈశ్వరప్ప (16వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

416-పార్వతీ పరిణయ చంపూ కావ్యకర్త –చంద్ర భట్ట ఈశ్వరప్ప (16వ శతాబ్దం )

16వ శతాబ్దికి చెందినాచంద్రభట్ట ఈశ్వరప్ప ‘’పార్వతీపరిణయం ‘’అనే చంపూకావ్యం రాశాడు .దీని వ్రాయసకాడు కూడా చంద్ర భట్ట వంశం వాడే .గురు స్తుతి –

‘’సదా శివగురుం భజే సకల ధీర నిత్యస్తుతం –ద్విజాధిపతి సేవితం వివిధ వేద వక్త్రా౦ బుజం

స్పుట స్పటిక మాలికా స్పురిత కంబుకంఠంసదా –శ్రిత ప్రకార వాంఛిత ప్రబల దివ్య వస్తు ప్రదర్శితం ‘’

తర్వాత వంశ చరిత్ర చెప్పాడు .కథలో హిమవంతుడు మేనకను పెళ్ళాడటం ,మైనాక ,పార్వతీ జననాలు ,నారదుడు రావటం ,శివుని గుణగణాలు పార్వతి విని పరవశం చెందటం శివుడి తపస్సు ,శివుని సేవకు పార్వతి వెళ్ళటం ,దేవతలు తారకాసురునిఆగడాలుఇంద్రునికి  వివరించటం ,అతడు మన్మధ సాయంకోరటం,అంగీకరించి శివునిమనసును పార్వతిపై లగ్నం చేయటానికి వెళ్ళటం ,ముక్కంటికంటిమంటకు మాడి మసి అవటం ,రతీ విలాపం ,శివుని అనుగ్రహం పార్వతి తపస్సు ,చివరికి  పార్వతీ పరమేశ్వరుల వివాహం .

ఈశ్వరప్ప కాళిదాసమహాకవిరాసిన కుమారసంభవం ప్రేరణతో దీన్ని రాశాడు .కొన్ని చోట్ల వ్యాకరణ విరుద్ధాలు ,యతి భంగాలున్నాయి .ఇవి వ్రాయసకాని దోషాలు కూడాకావచ్చు అంటారు ఆచర్యశ్రీ .పార్వతీ దేవి పాదాల వర్ణన –

‘’రాత్రౌ సుధాంశు రిపు రేత్యవిజ్రు౦భణ౦ మే- హన్తీతిపర్వత సుతాంప్రతి సాదు జప్త్వా

పద్మ౦ తదీయ చరణావతర౦ ప్రపద్య –తత్సంజ్ఞయా విజయతే కిము నిత్య భ్రుంగం ‘’

మాయావటువు వేషం లో వచ్చిన శివుడు  పార్వతి మనసు శివునిపైనుండి మరల్చే యత్నం –‘’జానామి జానామి తవానుభావం –జాగర్తి జాగర్తి తదస్టమూర్తౌ-భావంతదాపి ప్రచురాన్ గుణా౦ స్తాం-తత్సాన్ని విస్టాన్వికృతాన్ ప్రపద్యే ‘’.-కాలకూటాశనోవాయు భుగ్భూషణః-క్రూర శుండాల చర్మా౦శుకో యాచకః –ప్రేతకా౦తార  సంచారణే తత్పరః –కిం వృతస్సత్వయా భీకర శ్చే స్టయా ‘’

పెళ్లి కొడుకైన శివుని వర్ణన –

‘’జటాజూట శ్శంభో స్సపది హరితోష్ణీష వసనం –సుధాంశు స్తత్రతః ప్రభవతి మహా భాషికమపి

గలాలంబా ముక్తావళి శ్శిరురగరాజస్స మణిః-కరాద్దిస్సాసర్పాఃకటక ముఖ భూషామహితః  ‘’

చివరగా పార్వతీ  పరమేశ్వర రహః కేళి వర్ణ న –

‘’ కళ్యాణ ప్రదస్తయోస్త్రిజగతా మాస్వాదితా మూల్యత –త్తాంబూలాది పదార్ధయోః కృత బహిర్జాతవ్య వాయాస్ధయోః

పర్యాయాత్కుసుమేషు వస్య మనసో రంతర్వ్యయా స్ధయో –రాచ్ఛి  న్నాత్మ మదృశ్యత త్రిభువనం మోదం ప్రపేదే తదా ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

 

 

 

 

 



Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 415-హనుమద్రామాయణ కావ్యకర్త –దిట్టకవి లక్ష్మణ కవి (16వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

415-హనుమద్రామాయణ కావ్యకర్త –దిట్టకవి లక్ష్మణ కవి (16వ శతాబ్దం )

ఏక సర్గ హనుమద్రామాయణ కావ్యం రాసిన దిట్టకవి లక్ష్మణ 16వ శతాబ్దికవి .18వ శతాబ్దికి చెందిన ఇంకొక దిట్టకవి ఇంటిపేరున్న నారాయణకవి తెలుగులో రంగరాయ చరిత్ర రాశాడు .వీరిద్దరికీ బంధుత్వం ఉందొ లేదో తెలీదు .వీరికి దిట్టకవి అనేది ఇంటిపేరు లేక బిరుదుకూడా కావచ్చు .మనలక్ష్మణకవి  తన ఇంటి పేరును ‘’మండల వేముల ‘’అని కూడా తెలిపాడు .తండ్రికాలం లో ఉన్న ఇంటిపేరు ‘’మండలవేముల’’ ,కొడుకుకాలం లో కవిత్వం లోసాధించిన దిట్టతనం వల్ల’’ దిట్టకవి’’గా మారి ఉండచ్చు .కౌండిన్య గోత్రం .నియోగి బ్రాహ్మణుడు .

  దిట్టకవి లక్ష్మణకవి ‘’హనుమద్రామాయణం ‘’ను వ్యాఖ్యాన సమేతంగా రాశాడు .కవి తనగురించి వచనం లో –‘’ఇహ ఖలు సంస్కృతాంధ్ర భాషాకవన చాతుర్య దుర్యో దిట్టకవి లక్ష్మణార్యః ‘’’’కావ్యం యశసే ర్దకృతే—‘’అని మాత్రం ఉన్నది .కావ్యం చివర రెండు శ్లోకాలలో మళ్ళీ చెప్పుకొన్నాడు –

1-‘’శ్రీమద్రామ వరప్రసాద కలనా సంప్రాప్త సారస్వత –శ్రీ మద్దిట్ట కవీంద్ర లక్ష్మణ సుధీ వరేణ్య సంపూరితే

షట్కా౦డేరిత ,యావదర్ధ కలితే సంక్షిప్త రామాయణే-శ్రోతృశ్రోత్ర సుఖావహే సర్గో ద్వితీయ సర్గః ‘’

2-మండల వేముల కులజః కౌ౦డిన్యస గోత్ర కృష్ణ కవిపుత్రః –లక్ష్మణ సుకవిః కృతవాన్ సర్గే ణై  కేన రఘుపతేశ్చరితం ‘’

అనేక పరిశోధనల అనంతరం రామరాజుగారు దిట్టకవి లక్ష్మణ కాలం 16వ శతాబ్దం అని తేల్చి చెప్పారు .

ఆరుకాడల వాల్మీకి రామాయణాన్ని ఈ కవి ఒకే కాండలో 118శ్లోకాలో ఇమిడ్చాడు .ప్రారంభ శ్లోకాల సౌరు  చూద్దాం –

‘’వరదం భజామి శరదంబుద ప్రభం ,ద్విరదం ముఖే శుభరదం తనౌ నరం –గణనాథ మాత్మ గణనా పరేస్టదం శశి ఖండ మండిత శిఖండ మీశ్వరం ‘’

‘’ప్రమితాక్షరోక్తి మమితా సురా౦తకం ,స్మిత భూషణం ,వితత భాను తేజసం –

కలయామి చాపవలయాన్వితం ముదాశర ధారిణం దశరథాత్మజం భజే ‘’

మొదటిశ్లోకానికి విస్తృత వ్యాఖ్య రాశాడు కవి .మిగిలినవాటికి సంక్షిప్తంగా రాశాడు .కవి శైలీ విన్యాసానికి కొన్ని ఉదాహరణ శ్లోకాలు –

‘’దశ కన్ధరేణభ్రుశ కంపితైస్సురైరభి యాచితోధిక భియా సమన్వితైః

మిహిరాన్వయే జనిహి రామనామతః కమలాపతిస్స విమలాంబు జేక్షణః  ‘’

‘’నవనావనాయ పవనాస్త్ర మోజసా దధతా సుబాహురధ తటకాసుతః

జ్వలనాశుగం చ బలనాశనేన తౌ కృశతాం గతౌ దశ శతాంగసూనునా ‘’

వర్ష ,శరత్తులను ఒకే శ్లోకం లో వర్ణించి తనకవితా ప్రతిభ చాటుకొని ‘’ దిట్టమైన కవి ‘’అనిపించాడు –

‘’సతతా నవగ్రహతటాభ్రమ౦డలా భ్రుత  నీలకంఠ కృత నృత్తకా జగత్

స్వకులాయ యుక్ఖగ కులాధవార్షుకీ సమయాత్ ప్రదోష సమయో యధోర్గతిః’’

మరో శ్లోకం లో ‘’ఆగ్రహ ‘’శబ్దాన్ని తెలుగులో ప్రచారంగా ఉన్న కోపం అనే అర్ధం తో ప్రయోగించాడు .’’వ్యాఖ్యాన౦ లోకూడా ‘’తెలుగు సంస్కృతం ‘’తొంగి చూస్తూ కనిపిస్తుందని వ్యాఖ్యానించారు రాజుగారు .

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 414-సీతా విజయ చంపు కర్త –పరశురామపంతుల అనంత రామ పండితుడు (19వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

414-సీతా విజయ చంపు కర్త –పరశురామపంతుల అనంత రామ పండితుడు (19వ శతాబ్దం )

19వ శతాబ్ది మధ్యకాలంవాడు పరశురామ పంతుల లింగమూర్తిగారికి అయిదవతరం వాడు సీతావిజయ చంపూ కావ్యకర్త పరశురామపంతుల అనంతమూర్తి పండితుడు .తండ్రి రామకృష్ణ సోమయాజులు .తల్లి వేణా౦బిక .ఈ అముద్రిత కావ్యం కాకినాడ ఆంద్ర సాహిత్యపరిషత్ కార్యాలయం ఉందని బిరుదురాజువారన్నారు .మూడు స్తబకాలు మాత్రమే లభ్యం కనుక అసమగ్రం .ప్రధమ స్తబకం చివర –‘’ఇతి శ్రీమత్సమస్త భువన ప్రసిద్ధ మేధ్యతర ,భరద్వాజస గోత్రా భరణాయ ,మాన పరశురామాన్వయ దుగ్దాబ్ది సుధా దీదితినా  ,శ్రీ లక్ష్మీ నారాయణ పాదారవింద మరందా స్వాదానంద తున్దిరే౦దిరాయ మాన నిజస్వాంతేన శ్రీరామకృష్ణ సోమయాజి కుటుంబినీ వేణా౦బికా శుక్తి ముక్తా ఫలాయితేన,అన౦తరామ పండితేన ,ప్రణీతే శ్రీ సీతా విజయాభిదాన  చంబూ  ప్రబంథే ప్రధమ స్తబక సమాప్తః’’.చంపూ ‘’ను ‘’చంబూ ‘’అని కూడా కవులు వాడారని తెలుస్తోంది .పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు జైమిని భారతం లో ఈపదాన్ని ప్రాస స్థానం లో వాడినట్లు రాజుగారు చెప్పారు .

   సీతావిజయం అంటే ‘’శత కంఠ రామాయణం ‘’.ఈపేర్లతో యక్షగానాలు చాలావచ్చాయి  .దీనికి ఆధారం ‘’వాసిష్ట రామాయణం ‘’అని ఆచార్య ఎస్వి జోగారావు గారు చెప్పారట .శతకంఠ రామాయణాల  గురించి శ్రీ సాళ్వ కృష్ణమూర్తి విపులంగా రాశారట.

 శ్రీరామ చంద్ర స్తోత్రంతో ప్రారంభించాడు కవి కావ్యాన్ని –

‘’శ్రీరామం సుర రాణ్ముఖామరవరై రారాధితాంఘ్రిద్వయం –రాకారాజ ముఖం ,సరోజ నయనం ,రాజాధిరాజం ముదా

శూరం శూర కులా౦బు  రాశి శశినం ,దైత్యాంధకారారుణం-ధీరం ,విరమరం  స్మరామి సుఖదం స్వాంతే ససీతం సదా ‘’.

తర్వాత దేవతా ,గురు స్తుతి ఉంది .ఇందులో వచ్చిన ‘’అంబాల ‘’గ్రామం వరంగల్ దగ్గరు౦దన్నారు రాజుగారు .ఇది కాకతి రుద్రా౦బ పేర నిర్మితం .అంబాల శ్రీ రామునికి అంకితంగా ఉద్దిమర్రి పాపయ్యకవి ‘’రాఘవాస్టకం’’రాశాడు .

   ఈ చంపూ కావ్యం లో కథను శంకరుడు పార్వతికి చెప్పాడని సూతుడు మునులకు వివరిస్తాడు .రాముడు అయోధ్యకు వచ్చి పట్టాభి షిక్తుడై రాజ్యపాలన చేయటాన్ని 20శ్లోకాలలో కమ్మగా వర్ణించాడు .అందులో శ్రీరామప్రాభవ శ్లోకం –

ధైర్యే నమ్రీకృతో మేరుర్జాడ్యవాన్ తుహి నాచలః-మందరాద్రి రపి భ్రాంతః కథ౦ సుర్యేనతేసమాః

శతముఖుడికి రక్తబి౦దుడుఅనే పేరుకూడా ఉంది .రెండవ స్తబకం లో 68గద్య, శ్లోకాలున్నాయి .శబ్దాలంకార ముక్తపద గ్రస్తాలతో కావ్యానికి ఇంపు సోంపు తెచ్చి చంపు కు విశేషాదరణ కలిగించాడు .వర్షర్తు వర్ణణ-

‘’నమకిర దసమం దిగంగనానాం-ధృట పటతుల్య పయోముచాం రజస్స్వం

సులలిత నవనీప వృక్షాలేఖా –పురు పటవాన  మివాభిరామ గంధం’’

శబ్దాలంకార మాధుర్య శ్లోకం-

‘’నీల తమాల కదంబ విలీనం ,నీల తమాలక శోభన వక్త్రే-మానవతీమణి వేత్సి నవాముం,మానవ తీర్ధ భవేక్షణ భాంతేన’’

మూడవ స్తబకంలో 67గద్యపద్యాలున్నాయి .ఇదంతా సీతారామ శృంగారానికే పరిమితం .మన్మధసామ్రాజ్య ప్రాభవాన్ని చెప్పే శ్లోకం –

‘’సీత్కారాణి కరాబ్జాత దూననం చాపి యోషితాం-నయమోర్ధనిమేషాస్తు ,మన్మధస్యాస్త్ర తాం యయుః’’

సాధారణంగా సంస్కృత చంపూ కావ్యాలలో ఒక్కో సర్గకు ఒకే రకమైన ఛందస్సు వాడతారు.కాని పరశురామపంతుల  అనతరామ పండిత కవి తెలుగు ప్రబంధాలలో  వాడినట్లు ,ఈ సంస్కృత చంపూ కావ్యం లో ప్రతి స్తబకం లోనూ వివిధ ఛందస్సులువాడి, తెలుగు వాడి ముద్రవేశాడని రామరాజుగారువాచ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-19-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 413-హరి భక్తి సుదోదయ వ్యాఖ్య కర్త –సారంగు తమ్మయ (1580)

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

413-హరి భక్తి సుదోదయ వ్యాఖ్య కర్త –సారంగు తమ్మయ (1580)

తెలుగులో ‘’వైజయంతీ విలాసం ‘’కావ్యం రాసిన సారంగు తమ్మయ విశిస్టాద్వైత మతస్తుడు .’’వరిచిత భగవద్భాగావత కైంకర్య విధానుడు ‘’అని పించుకొన్నాడు .సంస్కృతం లో’’ హరి భక్తి సుధోదయ వ్యాఖ్య’’రాశాడు .దీనికే’’ భక్తిసంజీవని ‘’పేరున్నది .20 అధ్యాయాల గ్రంథం.

’’ఇతి సారంగ తమ్మప్రభునా విరచితాయాం హరిభక్తి సుదోదయ టీకాయాం భక్తి సంజీవనీ వ్యాఖ్యాయాంప్రథమోధ్యాయః ‘’అని చెప్ప్పుకొన్నాడు .వైజయంతీ విలాసం తర్వాతే దీన్ని రాశాడు .ఇలవేల్పు శ్రీరామ చంద్రునికి విలాసం అంకితం చేశాడు .సంజీవనిలోనూ ఆయనను ఇలాస్మరించాడు –

‘’శ్రీరామచంద్ర స్స తనోతు లక్ష్మీం  -శ్రీ లక్ష్మణాలంకృత  దివ్య మోర్తిః

యద్దర్శనాద్దుఃఖ మపాన్య సర్వం –సద్యః పరానంద ముపైతి లోకః ‘’

తర్వాత రెండు శ్లోకాలలో తనగురించి రచనగూర్చి చెప్పాడు –

యస్యౌదార్య మివాకలయ్య సతతం కుర్వన్తి వాసం దివి –స్వర్ధే ను ప్రముఖా వదాన్య మణయో ప్యద్యోపి నేహాగతా

శ్శ్లాఘ్య సాధు గుణాన్వితో బుధజనై ర్భాగీరథీ పట్టణే-సోయం మంత్రి దురంధరో  విజయతే సారంగు తమ్మప్రభో ‘’.

‘’తేనేయం క్రియతే టీకా హరిభక్తి సుధోదయే –భక్తీ సంజీవనీ నామ్నా విద్వాత్సంతోష కారిణీ’’

వీటిలో తమ్మయ మంత్రి దురంధరుడని ,  ప్రభువు అనీ తెలుస్తోంది .పట్టణం లోని పెద్దకరణాన్ని అలాపిలుస్తారనీ మన ‘’మేయర్’’లాంటి పదవి అనీ ఆచార్య బిరుదురాజు రామరాజుగారన్నారు .తమ్మయ గోల్కొండ పట్టణానికిపెద్దకరణం .అంటే మేయర్ లాంటివాడు

  తమ్మయ -కులీ కుతుబ్ షా కాలం 1580-1612 వాడు .భాగీరధీపట్టణం భాగ్యనగరమే  అయి ఉండచ్చు నని వారి ఊహ .కవి తన తండ్రి తాతలగూర్చి చెప్పుకోలేదు .సుల్తానుతో బాగా చనువు ఉన్నట్లు ఆయన ఈయనను ‘’రమ్ము ,పొమ్ము’’అని చనువుగా అనే వాడని తెలుస్తోంది ..ప్రజలు కవి వైభవానికి ‘’జయ జయ ధ్వానాలు చేసేవారు  .తెలుగువారికి సారంగు తమ్మయ అంటే తెలుగులో  వైజయంతీ విలాస కర్త అని మాత్రమే తెలుసు .సంస్కృత రచన చేశాడని రాజు గారు చరిత్ర ముసుగు తీసి చూపేదాక తెలియదు .

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో29-5-19 బుధవారం హనుమజ్జయంతి నాడు సాయంత్రం కాలనీ మహిళామండలి చే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,అందులో ఒకరికి సత్కారం ,,,స్వామికి 30 వేలరూపాయలు నగదును తమ కుటుంబం తరఫున సమర్పించిన శ్రీమతి కొండేటి వెంకటేశ్శ్వరమ్మ(22ఏళ్ళక్రితం మేడూరు హైస్కూల్ హెడ్మాస్టర్ గా ఉన్నప్పటి శిష్యురాలు ) గారికి అభిమానంగా చీర ,సారె సరసభారతి తరఫున అంద జేసినచిత్రాలు

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో29-5-19 బుధవారం హనుమజ్జయంతి నాడు సాయంత్రం కాలనీ మహిళామండలి చే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,అందులో ఒకరికి సత్కారం ,,,స్వామికి 30 వేలరూపాయలు నగదును తమ కుటుంబం తరఫున సమర్పించిన శ్రీమతి కొండేటి  వెంకటేశ్శ్వరమ్మ(22ఏళ్ళక్రితం మేడూరు హైస్కూల్ హెడ్మాస్టర్ గా ఉన్నప్పటి  శిష్యురాలు ) గారికి అభిమానంగా  చీర ,సారె సరసభారతి తరఫున అంద  జేసినచిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి 29-5-19బుధవారం ఉదయం స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి 29-5-19బుధవారం ఉదయం స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో 29-5-19హనుమజ్జయంతి నాడు ఉదయం తమలపాకులతో విశేష పూజ

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో 29-5-19హనుమజ్జయంతి నాడు ఉదయం తమలపాకులతో విశేష పూజ

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ఉయ్యూరుశ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా 28-5-19 మంగళవారం సాయంత్రం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్యగారిచే ”హనుమ గానమహిమ ”ప్రసంగం ,శ్రీమతి టేకుమళ్ళ చిద0బరీ ,శ్యామలాదేవి విజయ ,ఐ స్పెషలిస్ట్ డా జయశ్రీగారి అబ్బాయి అక్కకూతురు లచే ”భక్తి సంగీత విభావరి ” చి కూచిభొట్ల పవన్ కుమార్ చే వేద పఠనం ,అందరికి ఉచితరీతిన సత్కారం చిత్రాలు

ఉయ్యూరుశ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా 28-5-19 మంగళవారం సాయంత్రం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్యగారిచే ”హనుమ గానమహిమ ”ప్రసంగం ,శ్రీమతి టేకుమళ్ళ చిద0బరీ ,శ్యామలాదేవి విజయ ,ఐ స్పెషలిస్ట్ డా జయశ్రీగారి అబ్బాయి అక్కకూతురు లచే ”భక్తి సంగీత విభావరి ” చి కూచిభొట్ల పవన్ కుమార్ చే వేద పఠనం ,అందరికి ఉచితరీతిన సత్కారం చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రేపటి కార్యక్రమాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భం గా రెండవరోజు 28-5-18మంగళ వారం ఉదయం 500 చిన్నరసాలు 4 గెలల అరటిపళ్ళతో విశేష పూజ

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భం గా రెండవరోజు 28-5-18మంగళ వారం ఉదయం 500 చిన్నరసాలు 4 గెలల  అరటిపళ్ళతో విశేష పూజ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్బ్హం గా 27-5-19సోమవారం సాయంత్రం డా .వేదాంతం శ్రీధరాచార్యుల ధార్మిక ప్రసంగం ,అనంతరం గుడివాడకు చెందిన 92ఏళ్ళ పౌరాణిక నాటక నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం చిత్రాలు

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్బ్హం గా 27-5-19సోమవారం సాయంత్రం డా .వేదాంతం శ్రీధరాచార్యుల ధార్మిక ప్రసంగం ,అనంతరం గుడివాడకు చెందిన 92ఏళ్ళ పౌరాణిక నాటక నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం చిత్రాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా మొదటిరోజు 27-5-19 సోమవారం ఉదయం స్వామివార్లకు అభిషేకం తర్వాత మల్లెపూలు మొదలైన పుష్పాలతో విశేష అర్చన

ఉయ్యూరు శ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా మొదటిరోజు 27-5-19 సోమవారం ఉదయం స్వామివార్లకు అభిషేకం తర్వాత మల్లెపూలు మొదలైన పుష్పాలతో విశేష అర్చన

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

22-శివరామ లింగరాజు (చివరిభాగం )

22-శివరామ లింగరాజు (చివరిభాగం )

మూడు ఆశ్వాసాల ‘’శైవాచార సంగ్రహం ‘’రాసిన శివరామలింగరాజు భారద్వాజ గోత్రీకుడైన క్షత్రియకవి .తండ్ర్రి హరిరాజు తల్లిసీతమ్మ  .గురువు గోకర్ణ మటాధిపతి సోమశేఖరుడు ..కాకతి ,చాళుక్య సీమలలో క్షత్రియ వీర శైవులులేరని,తెలంగాణా లేక  రాయలసీమవాడు అయి ఉంటాడని రాజుగారన్నారు .వంశక్రమంలో బర్బర దేశాదీశ్వరుడు శంఖాన్వయుడు మూలపురుషుడు అతడికి అయిదవతర౦ వాడు మనకవి .ఇతనికావ్యం స్కాందపురాణం లోని’’ శంకర సంహిత’’కు ఆంధ్రానువాదం .ధారాశుద్ధిఉన్నకవిత్వ౦ రాశాడు .ఇది చదివితే 18వ శతాబ్దికి కావ్యభాష ఎలా రూపు దాల్చిందో తెలుస్తుందన్నారు బిరుడురాజువారు .కల్హారపుష్పం -కలుహార పుష్పం , -అరహము –అర్హము ,సుదర్శన -సుదరిసేన – ,పిత్రుతోషణము –పితరు తోషణము,శ్రీ రుద్రీయము –శ్రీ రుద్రియము గా మారాయి ‘

 మొదటి ఆశ్వాసం లో  శివుడు కుమారస్వామికి చెప్పినదాన్ని సూతుడు మునులకు చెప్పాడు .ఒక సారి శివలోకం లో కుమారస్వామి అందరి  సమక్షం లో సంశయాలు తీర్చమని అడిగితె శివుడు చెప్పినవిషయాలివి .మొదటి ఆశ్వాసం లో లింగార్చన ,లింగాదారణ వగైరాలున్నాయి. రెండవ ఆశ్వాసం లో  షట్ స్థలాల నిర్ణయం ,స్థలధర్మాలు ,త్ర్రివిధ ఉపాసనలు భక్తిమార్గాలు ,మహేశ్వరుల ప్రవర్తన మొదలైనవి ఉన్నాయి .మూడులో శివయోగులకు  చేసే దానాలు ,గోప్యార్పణం ,తండ్రీకోడుకులైన శ్వేత ,పింగళ కథ,శ్రీశైలమహాత్య్మం,స్వధర్మ నిష్ట వగైరాలున్నాయి .ప్రారంభ కందపద్యం-

‘’శ్రీ పార్వతీ వదూధవ –తాపస హృదయాబ్జ  భ్రుంగ  భగ ధనదార్చిత వి

ద్యోపాయనిలయ నిర్మల –శ్రీపతి చి౦తా౦గ తరంగ శ్రీ గురులింగా ‘’

తర్వాత గ్రంధ ప్రాముఖ్యాన్ని చెప్పాడు .వీరశైవులకు కుల వివక్ష  ఉండదుకనుక వంశ చరిత్ర చెప్పుకోలేదు’’అంగ త్రివిధ విలక్షణ –లింగా౦గికి నొక్క కులము లేదని మదిలో

నంగాభిమాని కేర్పడ-పొ౦గుచు నెరిగింతు తనువు పుట్టిన కులమున్ ‘’

గ్రంథంచివరలో కూడా దాని ప్రాశస్త్యాన్ని మళ్ళీ చెప్పాడు .రచనాకాలం గురించిపద్యం –

‘’చనినట్టి శాలివాహన శాతాబ్దంబులు పాటింప వేయు నూర్నూటిమీద –నిరవదగా నేబదేను ప్రమాదీచ విమల వత్సరము నాశ్వీజమందు

బహుళ తృతీయలో భానువాసరమున రచియి౦చి నట్టి నిర్ణయ చరిత్ర  ‘’అన్నాడు .ఇది 14-10-1733కు సరిపోయిందని రాజుగారువాచ .

కృతి సమర్పణపద్యం –

‘’కరణములు మూటి సాక్షగా-గని విలక్ష భావమున నిష్ట లింగ ౦బు, ప్రాణ లింగ,

భావలింగ౦బులై యున్న బ్రహ్మమునకు –భక్తి  తోడుత కృతి  సమర్పణము చేతు ‘’.

మూడవ ఆశ్వాసం చివరి గద్య రాశాడు .దీని ప్రతి రాసిన విధానం –‘’పరీధావి సంవత్సర ఆశ్వీజ బహుళ దశమి శెనివారం మూడు ఝాములవరకు వీరశైవాచార సంగ్రహం ప్రెతి లో ఉన్న ప్రకారం సున్నపు సోమయ్యకు పాటోజు బైరాగి వ్రాశి ఇచ్చెను .’’ఇది 6-11-1852కు సరిపోతుందని ,వ్రాయసకాని వాక్యాలు గతశతాబ్దం తెలుగు వ్యావహారిక భాషకూ ,లేఖన సంప్రదాయానికి ఉదాహరణ గా ఉన్నాయని ఆచార్య బిరుదురాజు రామరాజు గారు చెప్పారు .

సమాప్తం

ఆధారం-ఆచార్య బిరుదురాజు రామరాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’.

మనవి –‘’చరిత్రకెక్కని చరితార్దు’’లైన 22మంది తెలుగు కవులను ,వారి రచనలను, విశేషాలను రాసే అదృష్టం దక్కిందని ,ఈ వ్యాసాలు  రాజుగారు’’ గోలకొండ  ‘’మొదలైన పత్రికలలో 1960-నుంచి 1971వరకు రాసిన పరిశోధనా వ్యాసాలని ,వీటిని పై శీర్షికతో 1985లో ముద్రించారని ,ఇందులో రెండవవిభాగం లో 12మంది చరిత్రకెక్కని ‘’సంస్కృత కవులు ‘’ఉన్నారని ,వారి గురించి నేను రాసిన’’ గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ ‘’మూడుభాగాలలో చోటు పొందకపోతే వారి గురించికూడా ‘’గీర్వాణకవులు’’లో త్వరలో రాస్తానని మనవి చేస్తున్నాను .ఈ పుస్తకం వచ్చాక అనేకమంది పైకవులపై పరిశోధన చేసి ఉంటారని,  వారు మరిన్ని నూతన విషయాలు ఆవిష్కరించి ఉంటారని భావిస్తున్నాను . సరసభారతి బ్లాగ్ అభిమానులైన సాహితీ బంధువులకు  ఈ కవులను పరిచయం చేయటమే నా ముఖ్యోద్దేశం .

  ఈ ధారావాహికను చక్కగా  చదువుతూ , తెలియని విషయాలు తెలియజేస్తూ నన్ను ప్రోత్సహించిన డా .శ్రీ టి.శ్రీరంగ స్వామి (వరంగల్ ),డా శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర (చెన్నై )గార్లకు ,అభిమానించిన సాహితీ బంధువులకు ధన్యవాదాలు .

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

-21 కుందావఝల గోపాలసూరి

21-కుందావఝల గోపాలసూరి

కరీం నగర్ జిల్లా ములకనూరుకి చెందిన కుందావఝల గోపాలసూరి ‘’సంవరణ చరిత్రము ‘’రాశాడు .సుమారు 1850కాలం .బ్రహ్మ వైవర్తపురాణ౦ లోని ‘’శ్రీక్రష్ణజన్మఖండం ‘’కావ్యం కూడారాశాడు కాని  అముద్రితం  .ములకనూరు హనుమకొండకు దగ్గర .అక్కడ మోతుకూరివారి౦టశ్రీక్రష్ణజన్మఖండం కావ్యాన్ని తానూ చూశానని బిరుదురాజువారువాచ .గోపాలసూరి పండరినాధుడు అనేకవికి సమకాలికుడు .

సంవరణ చరిత్ర అంటే తపతీ –సంవరుణుల ‘’కథ .అద్దంకి గంగాధరకవి ‘’తపతీ సంవరణఉపాఖ్యానం ‘’ప్రబంధవిధానం లో రాశాడు .రాజుగారివద్ద 233పద్యాల  ప్రధమ ఆశ్వాసం మాత్రమె ఉందట .కవి కౌండిన్య గోత్రీకుడు   .తాత నాగశాస్త్రి .తండ్రి వెంకటశాస్త్రి .పెద్ద ప్రబంధంగా రచించే ప్రణాళిక తో ఉన్నట్లు కనిపిస్తుంది .ఇష్టదేవతాస్తుతి ,పూర్వకవి స్తుతి కుకవినింద ,శ్రీ వెంకటేశ్వరునికి అంకితముగా షష్ట్యంతాలు ,సూతర్షి మహర్షులకు ఈ కథ వివరించటం ,హస్తినాపురం అక్కడి విశేషాలు హస్తినరాజైన సంవరుణుడి కీర్తిప్రాభవాలు, తపతీ సౌందర్యమ  .ఇద్దరిమధ్యప్రేమ ,నారద రాయబారం ,తల్లి చాయాదేవి దగ్గర తపతి భజన. వేటకై వచ్చిన సంవరుణుడు  చూడటం ,ఆమె సఖి కీరవాణి భూలోకపు వింతలు  తల్లికి చెప్పటం ,విరహం ,సంవరుణుడిని తెచ్చి తపతికి అప్పగిస్తానని కీరవాణి చెప్పటం మొదటి ఆశ్వాసం కథ.

  విష్ణుస్తుతి –

‘’శ్రీ రంజిల్లమనోజ్ఞ సౌధమున లక్ష్మీ భూవదూటుల్ ప్రియో-దార స్వానురతానురాగగరిమల్ తర్కి౦పగా గూఢసం

చారు౦డై  చని ,భూమి దేవి నాయనాబ్జాతంబులన్ మూసి శ్రీ –నారిన్ చుంబన కేళి దేల్చు విభునిన్ భావింతు భావంబునన్ ‘’

శివపార్వతుల వర్ణన –

‘’యెక్క కోడెలమిన్న మెక్కగా విసమెన్న జడముడిపై పాలకడలి వెన్న –యొడలునిండ విభూతి ,ఎడమ దిక్కున నాతి,కడకంట నమృతంబు వెడలు రీతి

మెడను పాములజోడు ,మేటి గుబ్బలవీడు మొనసి కరంబున  ముద్దు లేడు-ఎదను పున్కల చెన్ను ,నుదుట చిచ్చులకన్ను ,సరిలేని కేశపు౦జములు మిన్ను

సకల దేశస్దు ,డఖిల యోగీంద్ర హృదయ –జలజమదధుపాయ మానుండు శ౦కరు౦డు

భూరికారుణ్య రస ఝరీ పూర్ణ దృష్టి-మించి మత్కావ్య మరసి పోషించుగాత’’

‘’తొడలపై నిషణ్ణు డయితోరపు వేడ్క మనంబు నిండ చ –న్గుడుచుచు కుమారు నాస్యమున కోమలనీల నిజేక్షణ౦బులన్

బొడగని కప్పు కాటుకను ,బుద్ధి కరంబున మాటిమాటికిన్ –దుడుచు గిరీ౦ద్ర కన్య దయతోడుత మత్క్కృతి పెంపు జేయుతన్’’

ఇతర కవుల సానుభూతికోసం –‘’కడుపుని౦డా కాన్పు కన్నవారికి ఇతరులకాన్పు పై కరుణ కలిగినట్లు ,తానూ కావ్యకర్త ఐనవాడు ఇతరకవులకావ్యాలపై సానుభూతి చూపిస్తాడు ‘’అన్నాడు .

తపతిపై మనసుపారేసుకొన్న సంవరుణుడు –

‘’   ప్రణుతింప లోకేశ్వరత్వ మాత్రమెకాదు ,కమలాసనత్వము కలిగి యుండు –శ్రీ మోహనత్వ సంసిద్ధి మాత్రమె కాదు,ఘనసంభవ దశత్వ మెనయు చుండు

సరవి రాజావతంసత్వ మాత్రమెకాదు,ధవళ దేహత్వంబు దనరు చుండు –కనుగొన జైవాతృత్వమెకాదు ,రామాతను ప్రీతి ప్రబలియుండు

నహహ రాజన్యవరుడు దుస్సహవియోగ –భారపరిభూతుడై ,బ్రహ్మ శౌరి శర్వ

కైరవాప్తుల కెనయయ్యె చారులీల –ధూర్జటికిని క౦ఠ నైర్మల్యంబు తొడవుగాదె’’

సరస్సు వర్ణన –

‘’నిఖిల యువజన జనకలా నిరత సరసి –జాశుగా దీర్ణసింహనాదానుకారి

బర్హి నినదంబు  తత్సరః పరిసరంబు –జగధదీశుండు సూచి యుత్సవము బొందె’’

మంఛి కావ్య  రచన చేసిన కుందా వఝల గోపాలసూరి కావ్యమంతా లభించి ఉంటె బాగుండేది .మొదటి ఆశ్వాసపు మెతుకును బట్టి మిగిలినకావ్యాన్నపచనం గురించి చెప్పాల్సి వచ్చింది .

ఆధారం –ఆచార్య బిరుదురాజు రామరాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హనుమజ్జయంతి సందర్భంగా వేద,శాస్త్ర విద్యార్థికి పురస్కార ప్రదానం

వేద,శాస్త్ర విద్యార్థికి పురస్కార ప్రదానం

 శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సరసభారతి 141వ కార్యక్రంగా 28-5-19 మంగళవారం సాయంత్రం 6-30గం లకు శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య (విజయవాడ )గారిచే ”హనుమ గానమహిమ ”ధార్మిక ప్రసంగం(అరగంట ) ,తర్వాత శ్రీమతి వీటూరి భాస్కరమ్మ (చెన్నై )రచించి,పంపిన” శ్రీ హనుమవైభవ0 ”పద్యాలపఠనం ,అనంతరం శ్రీమతి టేకుమళ్ళ చిద0బరి ( రేడియో టివి ఆర్టిస్ట్ విజయవాడ)మరియు శ్రీమతి గూఢమాధవి ,కుమారుడు మొదలైన స్థానిక గాయనీ గాయకులచే ”భక్తి సంగీత విభావరి ”జరుగును
  తదనంతరం వేద ,శాస్త్ర విద్యార్థి చి . కూచి భొట్ల పవన్ కుమార్ (ఉయ్యూరు )కు నగదు  పురస్కారం  తో సత్కారం జరుగును .
 అందరూపాల్గొని జయప్రదం చేయప్రార్ధన
        గబ్బిట  దుర్గాప్రసాద్ -26-5-19
Posted in సమయం - సందర్భం | Leave a comment

29-5-19బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ హనుమపై స్తుతి పద్యం

పద్యాన్నిపింగళి సూరన తరువాతికాలంవాడైన ” ఏదుట్ల  శేషాచాలుడు” అనేకవి ”జగన్నాటకం ”అనే కావ్యం లో రాశాడు –

సీ-‘’ఏ మహాసత్వుండు రామకార్యంబున గిరులెల్ల నచ్చన గిల్ల లాడె-ఏ బలప్రఖ్యాతు డేడు వారాసులు  కాల్వల రీతి లంఘనము జేసె

ఏ సింహ విక్రము౦ డెలమి రక్షః కు౦జరాలి నీగల రీతి  నణచి పుచ్చె-

ఏమహా సమకాయు డింద్రారి ఖండించు వేళతారలు కటి వ్రేల బెరగె

దారగిరి చాలన క్రియా దక్ష శక్తి –పాత సౌమిత్రి జీవమే ప్రభుడొసంగె

నట్టి గుణవంతు ధీమంతు ,నదిక శాంతు –ప్రకట జయవంతు హనుమంతు బ్రస్తుతింతు’’

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు

  1. — go
Posted in సమయం - సందర్భం | Leave a comment

29-5-19బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శుభాకాంక్షలు

29-5-19బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శుభాకాంక్షలు 

సీ-‘’ఏ మహాసత్వుండు రామకార్యంబున గిరులెల్ల నచ్చన గిల్ల లాడె-ఏ బలప్రఖ్యాతు డేడు వారాసులు  కాల్వల రీతి లంఘనము జేసె

ఏ సింహ విక్రము౦ డెలమి రక్షః కు౦జరాలి నీగల రీతి  నణచి పుచ్చె-

ఏమహా సమకాయు డింద్రారి ఖండించు వేళతారలు కటి వ్రేల బెరగె

దారగిరి చాలన క్రియా దక్ష శక్తి –పాత సౌమిత్రి జీవమే ప్రభుడొసంగె

నట్టి గుణవంతు ధీమంతు ,నదిక శాంతు –ప్రకట జయవంతు హనుమంతు బ్రస్తుతింతు’’

ఈ పద్యాన్నిపింగళి సూరన తరువాతికాలంవాడైన ” ఏదుట్ల  శేషాచాలుడు” అనేకవి ”జగన్నాటకం ”అనే కావ్యం లో రాశాడు –

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

20-వేముల రామభట్టు

0-వేముల రామభట్టు

మహబూబ్ నగర్ మండలం ‘’మానవతీపురం ‘’అనే మానాజీ పేట ను ‘’తూము ‘’వంశపు రెడ్లు పాలించారు .వీరు స్వయంగా కవులు కావ్యకర్తలేకాక కవి పండితులకు ఆశ్రయమిచ్చారు తూము రామ చంద్రా రెడ్డి  మహీపాలుడు ‘’అలమేలు మంగా పరిణయం ‘’కావ్యం రాశాడు .ఇతనికొడుకు పరాశురామ రెడ్ది ‘ఆస్థానంలోని వేముల రామభట్టు ’గౌరీ విలాస ‘’కావ్యం రాశాడు .19వ శతాబ్ది వారు .ఇది దళసరి కాగితాలపై రాయబడి ఆంద్ర సారస్వత పరిషత్తులో ఉన్నది .మొదటి రెండుకాగితాలుపోయాయి మూడవదానిలో కృతికి ప్రోత్సహించిన పరశురామ రెడ్డి అతని వంశ వర్ణన ఉన్నది .అతడు భూరి మేధాధరుడని ,శివాచారుడు సత్య సంకల్పుడు ,అనేక ధర్మశాస్స్త్ర కోవిదుడు ‘’అని  వర్ణించాడు కవి .ఒకసారి ఆయనకవిని పిలిపించాడు –

‘’శ్రీ లక్ష్మీ నరసింహ మంత్ర ఫలసంసిద్ధి ప్రకాశుండు స –చ్చీలు౦ డాశ్రిత చందనుండు విలసత్ క్షేపాల గోత్రా౦బుధి

ప్రాలేయా౦శు౦డురుప్రతాప  పరిజిత్ప్రౌఢుండు సత్కీర్తి –కళా యుక్తుడు ,రామ చంద్ర ధరణీ పాలాత్మజుమ్దోగి౦ డొగిన్ ‘’

అతని కొలువులో ఒకప్రక్క సకల కళా ప్రఘటికులు ,మరోప్రక్క నిఖిల శాస్త్రిక చయము ,ఇంకొకవైపు సుకవీంద్ర నికరం ,మరోవైపు సిద్ధాంత ,జాతక విదులు ,వేరోకవైపు మకరాంక శశాంక సుకుమార మహీపాలుడు  వేరేవైపున పురాణక సమూహము ,గాయక జనము ,సకల సైనికగణము  ,చతురోపాయ విషయ శక్తి యుక్తులైన అమాత్యగణ౦,,వారితో ఆదికావ్య చర్చ చేస్తున్న రాజు కనిపించారు కవికి .కవి కౌండిన్య గోత్రుడు ,లక్షీనరసింహ వెంకమాబల పుత్రుడు .కవిని రాజు –

‘’క్షేపాల గోత్ర జలధి ,ని –శాపతి మా తండ్రి రామ చంద్ర కవీ౦ ద్ర

క్ష్మాపాలు౦ డలమేల్మం-గా పరిణయ మనగ విష్ణు కథ రచియి౦చెన్’’

అని చెప్పి కవిని శైవ ప్రబంధం ఒకటి రాసి కీర్తి పొందమని కోరాడు .సరే అని రాశాడు ‘’గౌరీ విలాస ‘’కావ్యాన్ని .  పరశురామ రెడ్డి  వంశ వర్ణన చేశాడు ముందుగా –

‘’ఆచలేశ్వరులుగాని ,యచలేశ్వరులుగారు భూరి దర్పోద్య  ద్విభూతి  గతుల –గోప గాని సింహులుగాని ,గోపసి౦హులుగారు చటులబాహాబల  శౌర్యగతుల

నారా బిడౌజులుగాని ,నారా బిడౌజులుగారు వినతారి జయ దశా విభవ గతుల –రాజా౦గ జులు గాని రాజాంగజులుగారు తగ కళారూప సౌ౦దర్యగతుల ‘’అంటూ జనం జయ ధ్వానాలు చేసే వంశం తూము వంశం అన్నాడు .అయ్యపురెడ్డి కి నాలుగవతరం లో రామ చంద్రా రెడ్డి రంగమ్మలకు పరశురామ రెడ్డి జన్మించాడు .స్వప్నం లో శివుడుకన్పించి కావ్యాన్ని తనకు అ౦కితమివ్వమన్నాడు –ఆ శివుని వర్ణన –

‘’వలనొప్ప నెమ్మేని నలడిన పలుబూది కనుగొన చలువ చందనముగాగ-కుడి దెస జారంగ విడిచిన పల్ పాపగమి  పైడి తీవె జ౦దెములుగాగ

జిముక వాల్ నాగ బెత్తేము  డమరుకము  ముమ్మొననవాలు కై యాయుధములుగాగా-చలిమిరి కొండ ముద్దులకూతు రెల్లపు డర మేనవదలని యతుకుగాగ

నొక్క తెలియాలబోతు బాల్ జిక్కినెక్కి-కనులపండువుగా నొద్ద గానబడుచు

తొలి మెయిళ్ల రొదోయ దోచ బిలిచి –గట్టు విలుకాడు కలలోన నిట్టులనియె’’

దీనితార్వత శివ స్తోత్రం దండకం రాశాడు .తర్వాత తాను కోనయార్యుని,కొండమా౦బల కు జన్మించిన రామయ్యకు పుట్టిన లక్ష్మీ బృసింహ వెంకమ్మల పుత్రుడనని చెప్పాడు గోత్రం కౌండిన్య .

 గౌరీ విలాసం 6ఆశ్వాసాల ప్రౌఢప్రబంధం .పార్వతీ శివుల ప్రణయకలహం ,శివుడుఅలకతో  వెండికొండ విడిచి  రామచంద్రా రెడ్డి కట్టిన శివాలయం లో ఉండటం ,పార్వతీ,శివ  విరహం ,చిలుకరాయబారం  మళ్ళీ ఇద్దరూ కలుసుకొని మానవతీపుర దేవాలయం లో ఉండిపోవటం కధ.ఆరవ ఆశ్వాసం లో పరశురామ రెడ్డి తండ్రి అతనికి రాజ్యం అప్పగించటం రాజ్యపాలన వేట ఉంటాయి .పూర్వ ప్రబంధాలలోని భావాలు ,పద్యాల అనుకరణ బాగా ఉంటుంది .మేడలమీద హంసల వర్ణన బాగుంది –

‘’ఒంటిపాదమూని యొక్కచిత్తము నిల్పి –యూపిరదిమి పట్టి ,చూపు దాచి

గోపురములమీద కొన్ని రాయ౦చలు –తపము సేయు మునుల తాల్మి బూని ‘’

తెలంగాణలో భోజనాలకు కూర్చునే విధానాన్ని ‘’చకిలం మొకిలం ‘’అంటారని రాజుగారు చెప్పారు .వీణ వాయించే స్త్రీ వర్ణనలో కవి ఈమాటను ప్రయోగించాడు –

‘’కనులరమోడ్పు చేసియు ,’’చకల్ మొకలంబుగ’’ గోరుచుండి’అని చెప్పాడు .

పట్టణ స్త్రీలు కవిగారికి దశావతారాలుగా దర్శనమిచ్చారట –

‘’ఝషకనేత్ర ,కమఠ చరణాబ్జగోల హ –ర్యక్ష మధ్యబాల రామరాజ

వదన కృష్ణవేణి ,వర బుద్ధి కల్కి నా-తరుణులలదిరి పది యవతార గతుల ‘’

ఇంతభావ స్పోరకంగా రాసిన తెలుగు కవి ఉన్నాడా ?అనిపిస్తుంది. తటాక వర్ణన  శ్రీనాధుని నైషధం లోని  ‘’శేష పుచ్చచ్చాయ చెలువారు బిసములు ‘’పద్యాన్ని పోలి రాశాడు –

‘’అహిరాజ పుచ్చ ప్రభానల ద్విసపాళి య౦తరస్థాభ్రము పద౦తములు గ-సంఫుల్ల సితపద్మ సత్ప్రభల్  యామినీ హస్తి రాడ్గమన రేఖా౦కురములుగ

ప్రతి ఫలితోపాంత వితత భూజాతముల్ కుక్షి నిక్షిప్త సత్కుధరములుగ-కమలినీ మకరంద కాంక్షా చలద్భ్రుంగజాలముల్ గరళాతి కీలలును గ

లలితశైవా జాలికా లతికలరయ –  భీమ బడబానలోద్భవ దూమములుగ

క్షీర కలశధిబోలె గంభీరమైన –యత్తటాకంబు గాంచె దైవోత్తముండు’’

శివుని వెతకటానికి పార్వతి సఖులతో బయల్దేరిన సందర్భంలో చెలులమాటలు –

‘’ఘనసారమా శరద్ఘన సారవర్ణుని ,ఘనసార గ౦ధితో గలవు మనవె-మదన భూజాతమా మదనాపకారు నీ మదనాగ గతి వెతల్ మాన్పమనవె

కాంచన దుగ్ధమా కాంచనాచల ధర్ముకా౦చననాసరక్షించుమనవె-కాదంబమా   భూత కాదంబపతి నీలి కాదంబికా దేవి ,గల్వుమనవె

కల్ప భూజమ భక్త సంకల్ప దువిద-గల్ప గదెమోహవారధి గల్పకయును

ఏలకీ భూజమా సద్దయాలవాలు – నీ లతా౦గిని దయతోడ నేలు మనవె’’

మన్మధుని జైత్రయాత్రావర్ణన తమాషాగా చేశాడు –

‘’పచ్చపిట్ట పఠాన్ సిపాయీల్ సవారి ,భేష్షాబాషు వహవా పసందనంగ-మొకము లెత్తుకొని శారిక వంది మాగధుల్ బహుపరాగ్పొర  భళాభళి యనంగ

రభసంపు నెమ్మివీర భటాళిఝళిపించు ఉక్కు కత్తులును తళుక్కనంగ-శీతువు పిట్ట బంట్రోతు తుపాకి చప్పుళ్ళు ఢెమి ల్లుఢెమిల్లుమనగ

అంచలిరువంక చోపుదార్లై గడంగి –జరగకుడు ఖబడ్దార్బరాబరి యన౦గ

మారుడవ్వేళ ననికై స్వారి వెడల –తనబల౦బుతో శృంగారవనము జేరె’’

 వసుచరిత్ర అనుకరణ పద్యాలు ఎక్కువగా ఉన్నాయి. అంతమాత్రం చేత కవి ప్రతిభ తక్కువ ఏమీ కాదనిపిస్తుంది .పరశురామ రెడ్డికి  దాక్షాయణి కలలో అద్భుతంగా కనిపించింది –

‘’వర నీల కంధర స్ఫురదాభ లిరుప్రక్క కమలభాసుర కరంబు –ఘన పుండరీక శోభన చేల మిరువంక నిరువంక ననల బంధుర దృశంబు

నవ సుధా ధరబింబ సవిభవం బిరుఠేవసిత పయోధర విభాతి –తారకాస్థిర సత్ప్రదానంబు లిరుదెస నిరుదెస నాహీనకాభరణ కాంతి

పలుకు భేదంబుగా బల్కు వలవకయును –వలచి ఇచ్చిన నరమేనగలసి శౌరి

చెలువుడు ను దాను గలియుట దెలుపవచ్చి –కలను భూపాలకునిమ్రోల నిలువబడియె’’

ఆరవ ఆశ్వాసం లోని శివునిపై చెప్పినపద్యం –

‘’అమితాహి కులేశ్వర హారధరా –హిమభాను జితా రేణ కరా

కమలా౦బక చేత సగర్వహరా –విమలాభ్ర ధునీ దృత విష్ణుశరా ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రామరాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’

’చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’’

తోడికోడళ్ళు సినిమాలో ఆత్రేయ ‘’కారులో షికారుకెళ్ళేపాలబుగ్గలపసిడీ చాన ‘’పాట చివర్లో  ‘’చాకిరొకరిది ,సౌఖ్య మొకరిది సాగదింకా తెలుసుకో ‘’అని రాశాడు . కాని ఇది రివర్స్ అయి చంద్రబాబు విషయం లో  ‘’చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’’గా మారిందేమో అనిపిస్తోంది .నిజమే ఉమ్మడిరాష్ట్రంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ నగరాన్ని’’ హైటెక్ సిటీ ‘’గా మార్చటానికి ఎన్నేళ్ళు ఎంతకస్ట పడ్డాడో శత్రువులుకూడా ఘనంగా మెచ్చుకొన్నారు .ఆంద్ర యువకులకు ఐటి రంగం లో క్రేజ్ క లిగించాడు .ఎన్నో కంపెనీలు విదేశీ ఉద్యోగాలతో ఆంద్ర యువత ఆడర్శప్రాయులయ్యేట్లు చేశాడు .ఎన్నో ఫారిన్ కంపెనీలు భాగ్యనగరం లో కొలువుతీరి వేలాది ఉద్యోగాలకు ఆస్కారం కలిపించాయి .ఇదంతా బాబు ఆలోచన ,ఆచరణ, మొండి ధైర్యం . అప్పుడు రైతులను ,వ్యవసాయాన్ని మర్చిపొయాడని ఊదరకొట్టి దించేశారు .వైఎస్ అధికారం లోకి వచ్చి చంద్రబాబు చేసిన చాకిరీ ఫలితాలను సౌఖ్యాలను హాయిగా అనుభవించి తండ్రి  కొడుకులు  లక్షకోట్లు మూటకట్టారని జనం గగ్గోలు పెట్టారు  .దాదాపు పదేళ్ళు అధికారం కోల్పోయినా ,మామను ముంచాడు అనే అభియోగాన్ని భారంగా మోస్తూ పార్టీ కి ప్రజలకు సన్నిహితమై మళ్ళీ శ్రమించి ,పార్టీ స్థాయి కాపాడి వెన్నుదన్నుగా ఉండి ప్రజాభిమానం పొందాడు .

    రాష్ట్ర విభజన జరిగి ఎన్నికలలో కొత్త రాష్ట్రారనికి చంద్రబాబే బెటర్ అని నమ్మి ప్రజలు గెలిపించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిని చేశారు .చేతిలో చిల్లిగవ్వలేని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ,కొత్తరాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం కలిగింది .ఈ ఆలోచన లేకుండా హైదరాబాద్ లోనే నోరూ వాయి మూసుకొని ఉండిపోవచ్చు అవమానాలు భరిస్తూ .కాని ఆంధ్రుల సంకల్పం బలమైనదని  వాళ్ళు ప్రపంచం లో కాలరెత్తుకు స్వాభిమానం తో  తిరగాలని భావించి రాజధాని అమరావతి నిర్మాణం ,అనేక మైన ప్రభుత్వభవననిర్మాణ౦ పరిశ్రమల రూపకల్పన అవసరం వాటి ఏర్పాట్లకోసం దేశదేశాల చుట్టూ తిరిగి సాధించటం దీనికి తోడూ పోలవరం నీళ్ళు రాకపోతే కోస్తా జిల్లాలు అన్నమో రామ చంద్రా అని నీరు లేక సాగులేక అల్లాడిపోతారని సంకల్పించి పూనుకోవటం ,పట్టిసీమ నుంచి ఈలోపు గోదావరి  నీరు వచ్చే ఏర్పాట్లు చేసి అపరాభగీరదుడుగా సాధించటం ,సస్య శ్యామల ఆంద్ర దేశాన్ని తయారు చేయటం అలుపులేని కృషి చేశాడు. విశ్రాంతి లేని జీవితం బాబుది. సునామీలు తుఫాన్లలో అతలాకుతలమైన రాష్ట్రం .దానికి సాయంకోసం కేంద్రం సాయం కోరటం పైసా కూడా చేపకపోవటం ,పోలవరం అమరావతి మిధ్య అని తీవ్రప్రచారాలు ,కియా మోటారుకారు కంచికే పోయిందని  బూటకమని ప్రచారం .సెల్ ఫోన్ ల తయారీలో ఆంద్ర అగ్రగామికావటం కిట్టనివాళ్ళు ఆడిపోసుకోవటం ,ఆదినుంచీ ఎవరూ సహకరించకపోవటం చివరికి విసుగెత్తి యెన్ డి ఏ కు గుడ్ బై చెప్పి ,సాధనలో తీవ్రంగా అలసిపోయాడు .మళ్ళీ కథమొదటికే వచ్చింది .అయిదేళ్ళ తర్వాత 2019ఎన్నికలలో ఘోరంగా పార్టీ ఓడిపోవటం బాబు ను కలచి వేసే సమస్య .సినిమానటులు, రామారావు కుటుంబం నుంచి సహకారం కరువు .లేక తీసుకోలేకపోయాడో అదొక సమస్య అయింది .

 ద్వాక్రాగ్రూపులకు ఇతోధికంగా సాయం ,ముస్లిం లకు పెద్దపీట,బిసిలకు కాపులకు కాపు కాసినా ,విద్యార్ధులకు చేరువైనా ,రైతులకు దగ్గరైనా ,’’ఎన్నారైలు’’  వందలసంఖ్యలో వాలి ప్రచారం చేసినా ,ఎన్నికలకమిషన్ ఉచ్చుబిగించి ,ఐఎస్ ఐపిఎస్ లు ముసుగులో మోసంచేసి ,పైనున్నద్వయం బాబు సర్వనాశనమే ధ్యేయంగా పని చేయటం తో అంతా ఉల్టా అయింది .అధికారం జగన్ చేతిలో పెట్టి ,సౌఖ్యమా నుబహ్విన్చాతానికి రాచబాట వేశాడు .జయలలితగతి పట్తిస్తారేమో ననే భయమూ వేసింది .జైల్లో పెట్టిస్తారేమోనని ఆంధ్రజనం కలవరపడ్డారు .అందరూ నమ్మి ఓట్లు వేస్తారనుకొంటే అంతా నమ్మించి మోసమే చేశారని అర్ధమయింది .కనుక పాపం బాబు విషయం లో  ‘’చాకిరొకరిదీ,సౌఖ్యమొకరిదీ సాగునెప్పుడు తెలిసికో ‘’అన్నది మళ్ళీ నిజమైందికదా .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-19-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆంధ్రా లో త్వరలో బిజెపి ప్రభుత్వం వస్తుందా ?

ఆంధ్రా లో త్వరలో బిజెపి ప్రభుత్వం వస్తుందా ?

అవును వస్తుందనే అనిపిస్తోంది .కర్ణాటకలో బిజెపి చేయని మాయప్రయత్నాలు లేవు అప్పుడు .అప్పుడే నేను చెప్పాను చంద్రబాబుపై పడతారని అస్థిరతకల్గించి పరాజయానికి పావులు కలుపుతారని .కాషాయం’’ కషాయం’’ ఆంధ్రాలో పని చేయదని పూర్తిగా అర్ధమైన షా మోడీలు జగన్ ను దువ్వి ,పవన్ ను ప్రేరేపించి బాబుపై దాడి చేయించారు .వేలాది కోట్లరూపాయలు మంచినీళ్ళుగా ప్రవహించాయని చేతులు మారాయని  మీడియా కొడైకూసింది .  ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది .జగన్ పై    ఉన్న కేసులు బాగా కలిసివచ్చాయి ద్వయానికి .కాళ్ళమీద పడేట్లు చేసుకొన్నారు .అభయ హస్తమిచ్చారు .       ప్రత్యేకహోదాఇస్తామని శపథం చేసి ఎన్నో సార్లు దేవుడిగుడి వద్ద చెప్పి చివరికి పాకేజీ ఇస్తాం తీసుకో లేకపోతె మానుకో మని భీష్మించి దొంగ దెబ్బతీశారు .బాబు ఒప్పుకోక ఎదురుతిరిగితే ‘’యు టర్న్ ‘’అని పేరుపెట్టి గేలి చేశారు .వీధిపోరాటం శరణ్యమైంది బాబుకు .దీనితో సంస్థాగత వ్యవహారాలపై శ్రద్ధపెట్ట నీకుండా చేయగలిగారు .జగన్ తో లోక సభ సభ్యులతో రాజీనామా చేయించి  సానుభూతి పొందేట్లు చేశారు . బాబు పోలవరం నిర్మించటం కంటగింపుగా మారింది గుజరాత్ లో సాధ్యంకానిది ఆంధ్రాలో బాబు ఎలా చేశాడా అని అసూయపడ్డారు .అన్నిరకాల ఆర్దిక సాయాన్ని  బంద్చేశారు  లేకపొతే ఏదో విదిల్చినట్లు రాల్చారు .ఇదికాక ‘’సన్ స్ట్రోక్ ‘’అని కొడుకు గురించి ఎద్దీవా ఒకటి .ఇన్ని తట్టుకొని తన 25 ఏళ్ళ విజన్ సార్ధకం చేయటానికి అవిశ్రాంత కృషి చేశాడు .కానీ కాలమూ కలిసిరాలేదు .

  బాబు మంచోడే మంత్రులుఅవినీతిపరులు ,బడుద్ధాయిలు అనే అభియోగామూ పెరిగింది .పార్లమెంట్ లలో అరచినా గొంతు చి౦చుకొన్నా ,కనికారమే లేకపోయింది ఆంధ్రాపై .ఒంటరిపోరాటమే అయింది .ప్రతిపక్షాలు ఏదో మద్దతు ఇచ్చినా ,ఎప్పుడు ఎవరు ఎవరికి జైకోడతారో తెలీని  వింతస్థితి. పాపం రాహుల్ సోనియా పాతవైరాలకు స్వస్తి చెప్పి బాసటగా నిలిచారు .ఇదికొంత ఊరట .కానీ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తుఅసలుకే మోసం అని తెలిసి ,పవన్ ని కోరినా చెయ్యిచ్చాడు .కమ్మీలు ఆత్మార్పణ లో పడి బెంగాల్ను కమలానికి ధారాదత్తం చేశారు .దాక్షిణాన తమిళనాడులో స్టాలిన్ ముందు పప్పులుడకలేదు .కేరళలో పినరాయ్ ముందూ అదే పరిస్థితి .ఆంధ్రాలో కన్నా అండ్ పార్టీలు స్వాహా స్వాములేకానీ వోట్ కాచర్స్ కాదు అని తెలిసినా  వాళ్ళనే నమ్మాల్సి వచ్చింది కమల దళం .

  ఆంధ్రాలో బాబు ఉండగా ఏమీ చేయలేము కనుక జగన్ ను కేసుల విషయం లో బెరిరించి అదలించి అంటకాగేట్లు చేసుకొన్నారు .బలహీనమైన  కాండి డేట్లను పెట్టి జగన్ కు సాయపడ్డారు .జగన్ తప్ప ఆంధ్రాలో వేరెవరికీ అవకాశం లేదని తేల్చుకొన్నారు .కనుక పదేళ్ళ జగన్ కోరిక తీర్చటానికి తెరవెనుక చెయ్యాల్సింది అంతా పకడ్బందీ గా చేశారు .తెలుగు దేశం నాయకులపై ఐటి ,ఇడిదాడులు చేయించి డబ్బు ఆడని పరి స్థితి కల్పించి గిలగిలా గిజగిజా కొట్టుకోనేట్లుచేశారు .ఆంద్ర దేశ చరిత్రలో జగన్ కు చారిత్రాత్మక విజయం చేకూర్చిపెట్టారు .ఇందులో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు పవన్ ఉడతసాయం చేశాడు .ఓట్లు చీల్చి జగన్ గెలుపుకు కారణమయ్యాడు .జగన్ పార్టీ కొచ్చిన మెజారిటి కంటే పవన్ కొచ్చిన వోట్లు ఎక్కువని ఇవాళ పేపర్లు రాశాయి .ఇలా కసితీర్చుకొన్నాడు గడ్డమాయన  బాబుపై .

  నాలుగు రోజుల్లో జగన్ ప్రభుత్వం ఏర్పడుతుంది .హామీ ఇచ్చిన నవ రత్నాలకు నిధులు కేంద్రం ఇస్తుందా ?కేసులున్న జగన్ ధైర్యంగా అడిగి సాధించగాలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న .బాబును అప్పుడు ఊరిన్చినట్లే ఇప్పుడు జగన్ నుకూడా ఊపుతారు .బాబు మొండివాడుకనుక లొంగలేదు .ఇక్కడ అన్నీ లొసుగులే .అడగలేడు అడక్కుండా ఉండనూ లేడు.ఎన్నికలము౦దు లాగా లొంగి ఉండాల్సిందే .తప్పదు .లేదంటే ‘’కేసులబూచి ‘’చూపి అడక్కుండా చేస్తారు ద్వయం .చివరికి శాసన సభ్యులను ప్రలోభాలతో ,ప్రమోదాలతో భారీసంఖ్యలో చీల్చి ,ఆంధ్రాలో బిజెపి ప్రభుత్వం ఏర్పరచి పంతం నేరవేర్చుకొంటారు .ఆంధ్రా వశమైతే హార్ట్ ఆఫ్ దిలాండ్ చేతికిచిక్కినట్లే .ఇప్పటికే భారత దేశం లో కేరళ ఆంధ్రా తమిళనాడులో తప్ప అన్ని చోట్లా కాషాయం రెపరెపలాడుతోంది .ఆంధ్రాలో నూ ఎగరేస్తే ఇక ఎదురుండదు . ఆ మజాయే వేరు .దీనికి జగన్ సాయమూ చేయచ్చు లేకపోతె సామ దాన భేద దండోపాయాలు ఉండనే ఉన్నాయికదా మారాజా . షా తలచుకొంటే అపర చణక్యుడౌతాడు .ఎదిరించినవాడిని మట్టి కరిపిస్తాడు .అప్పుడు జగన్ కు అండగా ఉన్న’’ పీకే ‘’కూడా ఏమీ పీకలేడు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-19-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’

19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’

పాల్కురికి సోమనాధుడు ‘’ఉదాహరణ యుగ్మం ‘’రచించాడని పిడుపర్తి సోమనాథుడు చెప్పాడు .సోమన ఉదాహరణ కావ్యం అంటే ‘’బసవ ఉదాహరణ కావ్యమే’’ అని అందరికి తెలుసు .కానీ బిరుదురాజు వారికి కరీం నగర మండలం లో ఒక తాళపత్ర గ్రంథం లభించిందని ,దానిలో సోమనాథ భాష్యం తోపాటు చాలా లఘు కృతులున్నాయని అందులో పండితా రాధ్య ఉదాహరణం ఒకటని రాజు గారు చెప్పారు .రాజుగారు చెప్పేదాకా అలంటి ఉదాహరణ కావ్యం ఉందని ఎవరూ చెప్పలేదట .వ్రాయసకాడు రాసిన తేది 3-5-532అని తేల్చారు .

శ్లోకం –అద్వైతోద్ధత కుంభి  కుంభ దళనోద్యద్రౌద్ర పంచాననో –గర్వోదంచిత పాంచరాత్ర నిబిడ ప్రాలేయ చండ ద్యుతిః

పాషండాబ్జ మహాగజో విజయతే బౌద్ధాద్రి ఘొరాశనిః-శ్రీమత్పండిత మల్లికార్జున గురుర్వి ద్వాత్సదాపూజితః’’

‘’పండితారాధ్య నామేతి పంచాక్షర సముద్భవం –సకృత్ స్మర౦తి ఏ భక్తా స్తేజనాః పుణ్య కారిణాః’’

మాలిని –‘’శివకర శివ సౌఖ్యా శిష్ట భక్త్యైక ముఖ్యాః-వివిధ పరమ శీలా ,వేద శాస్త్రానుపాలాః

ప్రవిమల పరభావా ,పండితారాధ్య దేవా –తవిలి మిము భజింతున్ దద్దయు౦ బ్రస్తుతింతు ‘’

ప్రధమా విభక్తి పద్యం –శా –శ్రీమత్పండిత మల్లికార్జునుడు వైశిస్ట్యోల్ల సచ్చర్యుడు –డుద్దామ ప్రోద్ధత వీరభక్తి నిధి ,నిత్యశ్లోకు డుద్యన్ముని

స్తోమ స్తోత్రుడ గణ్యపుణ్యుడతి తేజో రాశి ,సంయగ్దయా –దాముం డీవుతమాకు భక్తియు ,ప్రసాదార్ధక్రియా సక్తియున్ .

కళిక – ‘’మరి శుద్ధమార్గమందు ,శైవమార్గ మండనుండు –తురువణి౦చు భవ దుర్గ ఖండనుండు

చిరతర ప్రణవసిద్ధమా౦త్రికుండు –పరమభక్తివిని బద్ధ తా౦త్రి కుండు-మునిగణప్రచయ ముఖ్య వందితుడు

జనిత చిన్మయ సుసౌఖ్య వందితుడు –అలఘు సంచిత శివైక్య భావనుండు –ఎలమి సర్వ జగదేకపావనుడు .’’

ఉత్కళిక –‘’తనవిభుత్వమును –ఘనమహత్వమును –ధరణి ని౦పుమని –హరుడు పంప బని

వడసి చెన్నమఠ-నొడలు గొన్న పర –మము దయా తనుడు –దమిత యాతనుడు

ఇలాగేసప్తమీ విభక్తిదాకా పద్యాలు చెప్పి సంబోధన ప్రధామావిభక్తిలోనూ చెప్పాడు చివరగా రాసిన ,సార్వవిభక్తికం లోని  రెండు శార్దూల పద్యాలు-

, — 

ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

18-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు

8-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు

రెండు అముద్రిత శతకాలు రాసిన పరశురామపంతుల లింగమూర్తి ‘’ శ్రీ సీతారామాంజ నేయం ‘’అనే అద్భుత ఆధ్యాత్మిక గ్రంధం రాసిన తెలంగాణా కవి .శేషాద్రి రమణకవులు కూడా పై రెండు శతకాలను ప్రస్తావించలేదు .వంగూరి సుబ్బారాగారు ‘’మనశ్శతకం ‘’గురించి చెప్పారు .బిరుదురాజు రామరాజుగారు మాత్రం అముద్రితాలైన లింగమూర్తి గారి ‘’ఆత్మారామ శతకం ‘’,,గోవింద శతకం’’ గురించి త్రవ్వితీసి లోకానికి చాటారు .నియోగి బ్రాహ్మణుడైనఈ కవి వంశంవారు మహారాష్ట్ర నుండి వలసవచ్చారు .ఈ ఇంటిపేరు వాళ్ళు  అంబాల , ఈదులవాయ  మట్టేవాడలలో ఉన్నారట .కవికాలం 18శతాబ్ది .సీతారామాన్జనేయం 1760లో రచింపబడి ఉంటుందిఅని శేషాద్రి రమణ కవులూహి౦చారు .రతి మన్మధ విలాసం ,  జీవన్ముక్తిప్రకరణం ,బ్రహ్మనారద సంవాదం, తారకయోగం, మానస శతకం ,సీతారామా౦జనేయం లింగమూర్తిగారి కృతులని వారు చెప్పారు .తర్వాత ‘’సీతపాట ‘’అనే అద్భుత గేయకావ్యం వచ్చిందని రాజుగారన్నారు .కవి పోతన్న, రామదాసు వంటి భక్తకవి వేదాంత వేత్తకూడా .భక్తీ వైరాగ్యాల కూడలి లింగామూర్తికవి అన్నారు బిరుదు రాజువారు .ఓరుగల్లులో మట్టేవాడ ఒకభాగం అక్కడ కవి గారి గృహం ఇప్పటికీ దర్శనీయమే .దీన్ని ప్రభుత్వం భద్రపరచాలని కోరారు .ఈ రెండు శతకాలు మరికొన్ని పంచరత్నాలు రెండు’’ బెత్తెలపొడవున్న’’ 34తాటాకులపై వ్రాయబడ్డాయి.

ఇందులో ఆత్మారామ శతకం లో 108కందపద్యాలున్నాయి .100పద్యాల తర్వాత’’ శ్రీ రామార్పణమస్తు’’ అని ముగించి ,తర్వాత ఆరు పద్యాలలో గురు స్తుతి ,కృతి ప్రశంస ,ఫలశ్రుతి చెప్పాడు .రుచికి కొన్ని కందాలు –

‘’నరనారాయణము మన –మిరువురము నవిద్యవలన నేకాత్ముల ,

మక్షర పురుష ,పరమపురుషుల –మరయంగా విద్యవలన నాత్మారామా ‘’.

‘’నిమ్నోన్నతములుగాని సు-షుమ్నామార్గమున నిన్ను జూచి జిత ప్ర

ద్యుమ్నులగు యోగిపు౦గవు –లామ్నాయ విధిం భజింతు రాత్మారామా ‘’

‘’గురుడనగా నీశ్వరుడగు –స్థిరమతి శిష్యు౦డ౦న  జీవాత్ము౦డ

య్యిరువుర కైక్యస్థానం –బరయంగా పరమపదము నాత్మారామా ‘’

‘’ఇల పరశురామ పంతుల –కులజ శ్రీ లింగమూర్తి గురుడవు నీవై

పలికితివి గాక నితరుల –కలవడునే యిట్లుబలుక నాత్మారామా ‘’

  ఈ శతకాన్ని నక్కా నరస౦భట్లు అనే వ్రాయసగాడు  27-4-1798న రాసినట్లు రాజుగారు ధృవీకరించారు .

  15వ కమ్మ రెండవ వైపు ‘’గోవింద శతకం ‘’ప్రారంభమైంది .111కంద పద్యాలు .ఇందులోకూడా వందవ పద్యం తర్వాత ‘’శ్రీరామా ‘’అని ముగించి మిగిలిన 11పద్యాలలో మిగిలిన విషయాలురాశాడు .ఈ శతకం లో భక్తీ, వేదాంతం రెండూ ఉన్నాయి-

‘’శ్రీ లక్ష్మీ నారాయణ –నీలాంబుద నిభ శరీర ,నిగామాధారా

లీలావిహార ,నిర్మల –శీల, చిదానందకంద శ్రీ గోవిందా ‘’

‘’యోగకర ,యోగవిద్వర – యోగాభ్యాస ప్రవీణ,యోగాధారా

యోగైశ్వర్య పరాయణ –యోగానందానుభూతి యుత గోవిందా ‘’

‘’క్షరతత్వము నంటక న –క్షర పురుషుని మించి సర్వ సాక్షి యనంగా

పురుషోత్తముడని వెలసిన –పరాత్ముని నిను భజింతు వర గోవిందా ‘’

83వ పద్యం నుంచి  వివిధ అవతార  స్తోత్రాలురాశాడు –

‘’ధరణీ సురవరద మహా –పరశు ధర ,నృపాల  జలధి బడబానల ,భా

సుర సు తపోధనఘన సు౦ –దర  ,భార్గవ రామ రూపధర గోవిందా ‘’

‘’ఈ స్తోత్ర రత్నరాజము –కౌస్తుభ మణి తుల్యముగను,గని ,కానుకగా

హస్తాబ్జ౦బుల  గైకొని –విస్తరముగ మై ధరి౦పవే గోవిందా ‘’

తర్వాత ఒకపద్యంలో తనను గురించి చెప్పాడు .

వ్రాయసకాడు నక్కా నరసంభట్లు  ‘’శ్రీసీతారామ పరబ్రహ్మణేనమః ,శ్రీ లింగమూర్తి పరబ్రహ్మణే నమః ‘’అని రాసి తానొక పద్యం రాశాడు .వ్రాతకాలం 28-4-1798అన్నారు రాజుగారు

‘’దయ నాదరింపు భక్త హృ –దయ,నా ఫణిశయన వికసితాంబుజ నయనా

నయనామయ  నామయ నా-భయ నాశము చేసి మమ్ముపాలింపు హరీ ‘’

  ఈ రెండు శతకాల తర్వాత పంచరత్నాలున్నాయి –ఒకపద్యం –

సీ-‘’మొదలు ప్రాణాపానములను,తద్రేచక పూరక కు౦భకంబులను నవి మెల౦గు,నిడా ,పింగళా సుషుమ్నల హంసత్వమునే సాక్షి తానె తెలియు

వికచహృత్కమల  కర్ణిక యందు ఘోషించు ప్రణవనాదంబు  నే ప్రభు డెరుగు  -భ్రూ మ, ద్యమమును చూపులను ,నానావిధ కళలను మనము నే ఘనుడు గాంచు

నతడె ప్రత్యగాత్ము డతడెపో పరమాత్ము –డతడె వాసుదేవు డతడె శివుడు

అతడెస్వప్రకాశకుడైన శ్రీమన్మహా –దేవ లింగమూర్తి దివ్యకీర్తి ‘’

ఇలా నాలుగుపద్యాలురాసి తర్వాత అయిదవ సీసపద్యానికి ‘’సాంఖ్యం’’ అని ,ఆరవదానికి ‘’అమనస్కం’’ అని శీర్షికలుపెట్టాడు .వీటి తరవాత ‘’శ్రీరామరామేతి రమే రామే మనోరమే ‘’మొదలైన పంచరత్న శ్లోకాలున్నాయి .వీటి తర్వాత వీటి తెలుగుఅనువాద గీతపద్యాలున్నాయి –

‘’శ్రీమనోరమ శ్రీరామ రామరామ –యనుచు రమియించు రాముని యందు రామ

నామము వరానన సహస్రనామ తుల్య –మట్లు గావున దీని నీ వవధరింపు ‘’

మందారమకరంద తు౦దితాలైన వేదాంత పద్యాలు రాయటం పరశురామపంతుల లింగమూర్తిగారికి ఎన్నతో పుట్టిన విద్య అనిపిస్తుంది వారి ‘’శ్రీ సీతారామాంజేయం ‘’చదివి పులకించని తెలుగువాడు లేడు అని నా అభిప్రాయం .ఈ శతకాలు అలాంటివే .

వీటిని కూడా వ్రాయసకాడు నక్కా నరసంభోట్లు 29-4-1798న రాసినట్లున్నది .యితడు లింగమూర్తికవిని దర్శించి తరించినట్లు చెప్పుకొన్నాడు

ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

17-నేబతి కృష్ణయామాత్యుడు

17-నేబతి కృష్ణయామాత్యుడు

అమాత్యుడు, కవీశ్వరుడు అయిన నేబతి కృష్ణయామాత్యుడు కవిపోషకుడు ,మహమ్మదీయ సుల్తానుల సభకు అల౦కార మైనవాడు .కాని చరిత్ర మరుగునపడటం విధి వైపరీత్యం .కౌండిన్య గోత్రీకుడు .తండ్రి కమలయామాత్యుడు తల్లి కొండాంబ .గోల్కొందదగ్గర సిద్ధలూరు పుట్టినవూరు .దీనికి దగ్గరున్న అనంతగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పు .మహమ్మద్ ఖులీ కుతుబ్ షా అనే మహమ్మద్ షాహి ప్రదానమందలిలో ,కవులలో ఒకడు గా ఉన్నవాడు .’’రాజనీతి రత్నాకరం ‘’అనే ఆరు ఆశ్వాసాల కావ్యం రాసిన ఘనుడు .

పీఠిక లో సమకాలీన రాజకీయ ,సాహిత్య చరిత్ర రాశాడు ..గురువు కందాళ రంగా చార్యుడు .తర్వాత వైజయంతీ విలాసకర్త అయిన సారంగు తమ్మయ గురువు కందాళ అప్పు గారిని ,తర్వాత ముడుంబ సాదు భట్టాచార్యులను స్మరించాడు .చరిత్ర కెక్కని గురు మూర్దన్యుడు ,శతావధాని ,ద్రావిడ ఆమ్నాయ తత్వ రసజ్ఞుడు ,కర్నాటక్షమాభ్రుత్సభాంతర పూజ్యుడు  మరి౦ గంటివెంకట జగన్నాధా చార్యులను కూడా స్మరించటం విశేషం  .ఇంతటిమహాకవి కృతులకూ చిరునామాలేదు .తనకవితావైభావాన్ని గురువు నోట పలికించాడు కవి –

‘’స్వర్దునీ వీచికా సంఘాత ఘమఘమ న్నిర్ఘోషములమించి  నీటు గెల్చి –వాగ్భామినీ పాద వనజాత కంచనా౦గదఝాళంఝాళ రావగతుల దెగడి

నిర్ఝర ద్రుమ జాల నిస్సర న్మకరందధమధమన్నద సంతతుల గేరి –కాంచీ నితంబినీ కాంచీ లతా ఘంటికా ఘణంఘణరావక్రమము మించి

వెలసే భవదీయ సరసోక్తి విరచితాననవద్య గద్య సుపద్య కావ్య ప్రబంధ

దండకోదాహరణ కవితా నిగు౦భనములు కృష్ణ ప్రధానీంద్ర నవరతీంద్ర ‘’

‘’కోనమ దేవీవల్లభ గానకళాలోల సకలకవి బాంధవ ర-క్షా నిధి వైష్ణవ కల్పక దీనిది కమళేంద్రు నేబతి ప్రభు కృష్ణా ‘’

కవిభార్య పేరు కొనమ .84దుర్గాల ఏలిక అయిన కుతుబ్ షా సుల్తాను కవికోటిలోనివాడు మంత్రికూడామనకవి  .కుతుబ్ షాను మనకవులు మల్కిభరాముడు అని,ఇభరాముడని  స్తుతించారు .కవి తండ్రికమలయామాత్యుడు  మల్కిభరాముడు మెచ్చగా ,పానుగంటి పట్టణాధ్యక్షుడై,ఏకాదశీ వల్లభుడై ,ద్వాదశీ చూఠ కారుడై ,సత్యవాక్యపాలకుడై ,సరస సంగీతమహిమలతో ఆది కవుల వలే విరాజిల్లాడు .వంశమూలపురుషుడు అన్నమరాజు .ఏడవ తరం వాడు కృష్ణయామాత్యుడు .ఇంటి పేరైన నేబతి –నియాబత్ పదానికి తెలుగు .అర్ధం రాయబారి లేక స్థానాపతి .ఇందులో రెండవతరానికి చెందిన  నాగరాజు బెదందకోట సుల్తాను శహాకు నేబతి అంటే స్థానాపతిలేక రాయబారి .

కవి విశిస్టాద్వైత మతానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు .ఈకవికి 300 ఏళ్ళ ముందుదూబగుంట నారాయణకవి’’ పంచతంత్రం ‘’రాశాడు  ..కృష్ణయామాత్యుడు తనకావ్యం లో 20పద్యాలలో శ్రీరంగపురవైభావం వర్ణించాడు .తర్వాత సుదర్శన చక్రవర్తి వర్ణన చేశాడు .ఆశ్వాసా౦తపద్యాలలో అందులోని విశేషాలు తెలిపాడు .కావ్యాన్ని 6-12-1838న బోనాల అప్పన్న కుమారుడు వెంకటాద్రి వ్రాతప్రతి రాశాడు .’’నేతటికాలమున నీ తాటియాకుల గొడవ యేరికిని పట్టిరాక వెట్టికి బుట్టిన బిడ్డ వలె నున్నది’’అని ఆచార్య బిరుదురాజు రామరాజుగారు వ్యధ చెందారు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-19-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

16 -గోపతి లింగకవి

16-గోపతి లింగకవి

తెలంగాణలో వీర శైవాన్ని వ్యాప్తి చేసిన వారిలో మధ్యయుగానికి చెందిన గోపతి లింగకవి కూడా ఒకడు .కృతిభర్త మెదకు మండలం వాడు కనుక కవి కూడా ఆ ప్రాంతం వాడే అయి ఉంటాడని బిరుదరాజువారూహించారు .అనేక రచనలు చేసినా రెండు మాత్రమే లభ్యం 1-చెన్నబసవపురాణ౦ 2-అసమగ్రంగా ఉన్న’’అఖండజ్ఞాన మనఃప్రబోధ వచన కావ్యం .ఈ కవి అంగడిమఠం వీర శైవాచార్యులకు  శిష్యుడు .ఇంటిపేరు తుమ్మా. తాత  శివరామ లింగం . శివరామ లింగం ,మల్లమాంబా దంపతులకు జన్మించిన పాపయ లింగం ,మల్లమా౦బా దంపతులకు గోపతి లింగకవి జన్మించాడు =

‘’శివ దేవియు మజ్జననియు –శివ దేవుడు తండ్రి సుప్రసిద్ధముగాగన్

శివభక్తులు బంధువులును –శివ కుల జనితుండ నిరత శివ గోత్రుడన్’’

చెన్నబసవ పురాణానికి విపులంగా పీఠిక రాశాడు .శివ ,గురు,ప్రమధగణ  పాల్కురికి సోమన స్తుతి చేశాడు  .పిడపర్తి బసవన్న ,కొడుకు సోమలింగం గార్లపాటి లక్ష్మయ్య లను స్మరించటం చేత కవి 16వలేక 17 శతాబ్ది వాడై ఉంటాడని రాజుగారన్నారు .గురుపరంపర తర్వాత ప్రబంథరచన ఉద్దేశ్యం చెప్పాడు .శ్రీ గిరీశ్వరుడు జ౦గమాకృతి ధరించి కవితో –

‘’సురుచిర గ్రంథము లారును –వర సుస్తవ మొకటి ,బెక్కు వచనంబులు

స్థిర శతకము లైదును శ్రీ –కర కేదారీశు నోము కథయునుమరియున్’’

మరియు మంగళాస్ట కాలు ,విఘ్నేశ్వర వీరేశ్వర మల్లేశ్వర రామేశ్వరాస్టకాలు ,శారద పదాలు జాజర పదాలు రాశాడని  ,ఇప్పుడు ఈ కృతిరాసి అంకితమివ్వమని కోరాడు .అలాగే చేద్దామని అనుకోగా తండ్రి కలలో కనిపించి అలాగే కోరాడు .అప్పుడు తమ్మడిపల్లె సిద్దయ్య అనే మాహేశ్వరుడు వచ్చి కృతిభర్త ఐన కాసాల పరబణ్ణ వీర మహేశ్వర ఆచార సంపద గుణగణాలు,వంశావళి వివరించాడు .పరబణ్ణ చిరు తొండనంబి కులం వాడట .అతని తమ్ముడు గర్రెపల్లి బసవలింగం .పీఠికలో పూర్వకవుల, స్మ్రుతి శృతి పురాణ ఇతిహాసాల వాక్యాలు  అధర్వణవేదం జాబాలిక ముండక ఉపపనిషత్ బ్రహ్మాండ స్కాంద విష్ణు పురాణ ,వీరాగమ విశ్వాగమ రహస్యం ,ప్రభులింగలీల  వేమన పద్యాలనుండి కూడా ఉదాహరణలున్నాయి .కనుక కవి వేమన తరవాతవాడు ఐ ఉంటాడు .తాళపత్ర ప్రతి రాసినవాడు కవికొడుకు మల్లయ్య .

  గోపతి లింగాని రెండవ కృతి ‘’అఖండజ్ఞామనః ప్రబోధ వచన కావ్య ప్రబంథము .పీఠిక అసమగ్రం .శివ స్తోత్రం ‘ అంగ డీశ్వరు డైన గురు స్తుతి ,తలిదండ్రుల ,పురాతన అధునాతన భక్తగణ౦వివరాల తర్వాత తోటక మఠంకు చెందిన గురువు స్తుతి ,కొలనుపాక సోమేశ్వరస్వామి స్తుతి  చేశాడు  .‘’అమరున్ పాదపములున్,ఖగంబులు నిత్యానంద సింధుల్ పురిన్ –అమరున్ గోవులు కామధేనువులు పుణ్య క్షేత్ర సద్వర్ణన౦-

బమరేంద్రాబ్జభవాచ్యుతాదుల కవశ్యం  బన్నపూర్ణా౦బకున్-భ్రమరా దీశునికున్ సుఖావహము సామ్రాజ్యైక తత్పీఠమున్’’

‘’కమలహితుండు ,తారలును సుదాకరుడున్ గ్రహంబులున్-అమరులు ,తాపసే౦ ద్రులు మహా భయమంద పురంబు  చుట్టునన్

గమిగొని భైరవుల్ ప్రహరి గాచుచు దా విహరింపు చుందుర –  క్కమల విరోధి మౌళిపద కంజములున్ మదిలో దలంపుచున్ ‘’

 ఈ కవి ఇతర కృతులేమయ్యాయో ఆశివునికే ఎరుక .

– ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-19-ఉయ్యూరు


— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కూడేరులో శ్రీ హనుమజ్జయంతి

కూడేరులో శ్రీ హనుమజ్జయంతి

కృష్ణాజిల్లా  మేడూరు దగ్గరున్న కూడేరులో మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయశాస్త్రిగారి ఆంజనేయస్వామి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమ ఆహ్వానం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

15-త్రిలోక భేది

15-త్రిలోక భేది

‘’సకల ధర్మ సారం ‘’కర్త త్రిలోక భేది .ఇది అసలుపపేరో బిరుదో తెలీదు .పీఠిక లేని 4ఆశ్వాసాల గ్రంధం .మధ్యలో కృతిపేరు ‘’సకలధర్మ సారాయ౦ ‘’అయింది .ఆశ్వాసాంత గద్య లో కవి తనను గురించి చెప్పాడు –‘’నవరసానుబంధ బంధుర ప్రబంధ నిబంధ చాతురీ ధురీణ ,సకల విద్యా ప్రవీణ గౌతమగోత్ర పవిత్ర గౌరనామాత్య పౌత్ర ,,రామయమంత్రి పుత్ర,సకల జన స్తోత్ర సంభావిత త్రిలోకభేది ప్రణీతంబైన హరి వంశము నందు ‘’సకలధర్మ సారాయంబు నందు ‘’కవి గౌరనమంత్రికి మనుమడు అయి ఉండచ్చునని బిరుదరాజు వారూహి౦చారు  .కాలం 1485 అయి ఉండచ్చు .శిదిలభాగం తర్వాత ఉన్న కందపద్యం ,పంచ చామరం  లలో శివ్వనమంత్రి శివపూజా దురంధరత్వం చెప్పాడు –

‘కం-శివపూజా పరిపూర్ణా-స్తవ జంగమ పాదపద్మసంసేవక ,స

ద్వివర  విహార ,మహామహ  –  కవి జన సన్మిత్ర తాపఘన సత్పుత్రా ‘’

పంచచామరం –‘’సదా సదాశివార్చనాది సారసాప్త తేజ ,దుర్మదా,మదాదినాగసింహ మానతస్దుర స్థిరా

న్వదాన్వదాను దానకర్ణ  పారిజాత జాత స౦-పదా  పదాభిరాన లోకపావనాంగ సంహృదా’’

రెండవ ఆశ్వాసం లో కృతి పతి గురించి –

‘’శ్రీ మల్లికార్జునార్పిత –ప్రేమాతిశయాను రాగ పృధ్వీజన సు –

త్రామ ,కరుణాపయోనిధి సీమాంతర  జయవిహార శివ్వగ భీరా ‘’

తృతీయాశ్వాసం చివర చెప్పినపద్యం బట్టి శివ్వ మంత్రి అసాధారణ ప్రతిభ కలవాడని  తెలుస్తుంది .అందులోని మాలిని పద్యంలో శివ్వన తల్లి మల్లమా౦బ అని తెలుస్తుంది .కవికీ శివ్వనమంత్రికి ఎలాటి సంబంధముందో తెలీదు .నాలుగవ ఆశ్వాసం లో ‘’పాండవులకు సకల ధర్మంబులు దెలుపుటయు ,వారి సన్నిధికి దూత  ఏ తెంచుటయు,కృష్ణుడు ద్వారక కేగుటయు అను కథలు గలవు ‘’అని చెప్పాడు కవి .

  వ్రాయసకాడు తన ఊరి పేర్లు కూడా చేర్చాడని ,తప్పులుంటే క్షమించమని విన్నపం కూడా చేశాడని రాజుగారన్నారు –

పెద్దలయివారు ప్రేమతో జూచియు –దిద్దరయ్య మీరు తిట్టబోక

సద్దు శాయకురయ్య జాగేలరా మొగిలి –గిద్దె రంగధామ  కీర్తి ధామా ‘’

‘’కాళిదాసుకవిత్వం కొంత, తనపైత్యం కొంత’’అన్నట్లు తయారు చేశాడు వ్రాయసకాడు .అతడు వెంకటేశం అనే వైష్ణవ నియోగి బ్రాహ్మణుడు .మెహబూబ్ నగర మండలం షాద్ నగరం తాలూకాలో మొగిలి గిద్దె గ్రామం ఉన్నదని,వ్రాసిన తేదీ 3-1-1646.అంటే గ్రంథంపుట్టాక 200 ఏళ్ళ తర్వాత వ్రాయసగాడు ఈ ప్రతిని రాశాడని ఆచార్య రాజుగారు చెప్పారు .

ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

14-పొత్తపి వెంకటామాత్యుడు

14-పొత్తపి వెంకటామాత్యుడు

‘’నూట ఎనిమిది దివ్య తిరుపతుల సుబ్బరాయ శతకం ‘’రాసిన పొత్తపి వెంకటామాత్యుడు రాయలసీమకవి .అన్నీ సీసాలే .మొదటిపద్యం చివర –మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ ‘’అని ఉంది .ప్రారంభం లో అశ్వత్ధ నారాయణుడు .పెన్న జూటురి చేన్నరాయలను ,వజగిరి నృసిమ్హుని ,కోన రంగేశుని ,హోన్నూరి రాయని స్తుతించటం చేత  ఈ క్షేత్రాలన్నీ అన౦తపుర మండలం లో ఉండటం వల్లా కవి రాయలసీమ లోని అనంతపురం మండలం వాడై ఉంటాడని రాజుగారి అభిప్రాయం .2నుండి 108పద్యంవరకు 108 దివ్య తిరుపతుల   వర్ణన చేశాడు .109పద్యం లో తనగురించి చెప్పుకొన్నాడు –

‘’ముదితాత్ముడగు పెదముల్కి వెంగనకేను పౌత్రుండ ,హరితస గోత్రజుండ-అనఘ పొత్తపి చెన్నయామాత్య సూనుండ ,మహిత చారిత్రుడ,మానధనుడ

కామక్షమా౦బను  ఘనసాద్వి గర్భ జలధి చంద్రుడ ,మహా సరసి గుణుడ-సిరిమించు రాయల చెర్వు యబ్బారుడ?,ఘనుడ వెంకట నామకవి వరుడ

ధర్మ చరితుండ నిరతాన్న దాతవనుచు –నీకు మ్రొక్కెద నను బ్రోవు లోక వంద్య

మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ ‘’.

కవి వంశంవారు పొత్తపి నుంచి వచ్చి అనంతపురం లో స్థిరపడ్డారు కనుక ఇంటిపేరు ‘’పొత్తపి ‘’అయింది .తాతపేరుకు ముందు పెదముల్కి ,తండ్రి పేరుముండు పొత్తపి, తన పేరుకు ముందు రాయల చెరవు ఊళ్ళ  పేర్లున్నాయి కనుక ‘’మూడుతరాలలో మూడు ఊళ్ళ చెరువు నీరు త్రాగి ఉంటారు ‘’అని చమత్కరించారు ఆచార్య రాజుగారు .110వ పద్యం లో ఈ కృతికి తనను ప్రోత్సహించిన వారి గురించిరాశాడుకవి .కవి శైలీ రమ్యతకు  ఒక పద్యం-

‘’వినయ భక్తి స్థానమున భుక్తినొసగెడు దేవుని నెదనెంచి దిగులు బూని –సారంగముల రెంటి సారంగమున గూర్చి సారంగధరు జూచి సరసుడనుచు

పండు వెన్నెలలోనిపండు వెన్నెలగాంచి పండు వెన్నెలగల బయలు బట్టి

పరితాపమందక  పరితాపమును దీర్చి పరితాపహరు గురు ప్రస్తుతించి

జ్ఞానమార్గంబు దెలిసిన మానవుండు –అధికుడన మించి సత్పథ మందకున్నె

మహితరోపాయ ధూర్జటి మత విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ’’.

‘’తత్వావతార దశకం ‘’అనే పద్యం సౌరు గమనిద్దాం –

‘’శ్రీమద్వరంబున చెన్నొందుగుణనాథు నేవేళ నాత్మలో నెన్నికొనుచు –అల మచ్చెమై నీటి కెదురెక్కవలెగాని,మూపున పెనుగొండ మోవరాదు

ఘోణియై ముస్తెను గోరాడవలె గాని ,దిగు లొ౦దగా నోరు దెరువరాదు-దీనత నొక్కరి తిరియ గావలె గాని తెంపున నృపతుల  ద్రుంపరాదు

కట్టవలెగాని రోకట   గొట్టరాదు – ఉండవలెగాని కత్తి మెండొడ్డ రాదు

మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ’’

ఇందులో చక్కని వ్యాజస్తుతి కనిపిస్తోంది కృష్ణాజిల్లా కాసులపురుషోత్తమకవి గుర్తుకొస్తాడు .

ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

13-ఏదుట్ల శేషాచలుడు

Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇజ్రాయిల్ ఏకైక మహిళా ప్రధాని గోల్డా మీర్ –

బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు:

1898 మే నెల 3వ తేదీ న జన్మించిన’’ గోల్డా మాబో విచ్ ‘’ఆనాటి రష్యా సామ్రాజ్యం లో, నేటి యుక్రెయిన్ లో బ్లూమ్ నీడిచ్ ,మాషే మాటోవిచ్ దంపతులకు జన్మించింది .కార్పెంటర్ అయిన తండ్రి ఉద్యోగాన్వేషణలో 1903లో అమెరికాలోని న్యూయార్క్ సిటీ కి , తర్వాత మిల్ వాకీ సిటీ కి చేరి రెండేళ్ళు బాగా కస్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని తెచ్చుకొన్నాడు తల్లి గ్రోసరి దుకాణాన్ని చూసుకొనేది .గోల్డా ఆమెకు సాయం చేసేది .1906నుండి 1912 వరకు ఫోర్త్ స్ట్రీట్ గ్రేడ్ స్కూల్ లో చదివింది .స్టూడెంట్ లీడర్ గా ఉంటూ తోటి విద్యార్ధులు పుస్తకాలు కొనుక్కోవటానికి నిధి సేకరించి అందజేసింది .’’అమెరికన్ య౦గ్ సిస్టర్స్ అసోసియేషన్ ‘’స్థాపించి ,ఒక హాలు అద్దెకు తీసుకొని సభలు సమావేశాలు జరిపింది .తన క్లాస్ కు ‘’వాలడి క్టేరియన్’’గా గ్రాడ్యుయేట్ అయింది .

చదువుతోపాటు ఉద్యోగం –సామాజిక దృక్పధం:

14 వ ఏట గోల్డా ‘’నార్త్ డివిజన్ హైస్కూల్’’ లో చేరి చదువుతూ ,మిల్ వాకీ పబ్లిక్ లైబ్రరీ వంటి ప్రసిద్ధ సంస్థలలో పార్ట్ టైం ఉద్యోగమూ చేసింది .తల్లికి గోల్డా ను చదువు మానిపించి పెళ్లి చేయాలని ఉండేది .కాని ఇష్టం లేని గోల్డా పెళ్లి అయిన అక్క షెనా కార్న్ గోల్డ్ తో కలిసి డెన్వర్ కొలరెడో లో ఉండటానికి ట్రెయిన్ టికెట్లు కొని వెళ్లి పోయింది . అక్కా, చెల్లెలు తమ మేధస్సును ఇతరులతో పంచుకొంటూ సాయంకాలాలు గడిపేవారు .జియోనిజం ,సాహిత్యం, స్త్రీ ల వోటు హక్కు ,ట్రేడ్ యూనియన్ వంటి సమస్యలపై మీర్ నిస్సంకోచంగా తన స్థిర అభిప్రాయాలు తెలియబర చేది .ఆమె అభిప్రాయాలను అందరూ మన్ని౦చేవారు .తనజీవితాన్ని తీర్చి దిద్దింది డెన్వర్ లో గడిపిన రోజులే అని గోల్డా చెప్పింది .

లేబర్ జియోనిజం పై ఆసక్తి –వివాహం:

1913లో మళ్ళీ నార్త్ డివిజన్ హైస్కూల్ కు వచ్చి 1915లో గ్రాడ్యుయేట్ అయింది గోల్దామీర్ .య౦గ్ పావోల్ జియాన్ లో క్రియా శీలకపాత్ర పోషిస్తూ చివరికి సోషలిస్ట్ జియోనిజం లో చేరింది .మిల్వాకీ లోని స్టేట్ నార్మల్ స్కూల్ లో చేరి ‘’ఇద్ధిష్ స్పీకింగ్ ఫోక్స్ స్కూల్ లో లేబర్ జియోనిజం లో ముఖ్య పాత్ర పోషించింది .మోరిస్ డేయార్సన్ తో సన్నిహిత౦ గా మెలగి లేబర్ జియానిస్ట్ కు అంకితభావంతో పని చేస్తూ మిల్వాకీ పబ్లిక్ లైబ్రరీ లో పార్ట్ టైం ఉద్యోగం చేసింది . మేరిస్ ను తామిద్దరం ఇజ్రాయిల్ లో స్థిరపడటానికి ఒప్పించి గోల్డా అతనిని 1917లో పెళ్లి చేసుకొన్నది .అమెరికా మొదటి ప్రపంచయుద్ధం లో చేరటంవలన ఇజ్రాయిల్ వెళ్ళే అవకాశం ఆగిపోయి ,అమెరికాలోనే ఉంటూ దేశమంతా తిరుగుతూ పోల్ జియాన్ యాక్టి విటీస్ నిధి కోసం తీవ్రంగా కృషి చేసి విజయం సాధించింది .

పాలస్తీనా రాజకీయం –ఉద్యోగ సోపానం:

గోల్డా మీర్ దంపతులు 1921లో పాలెస్తీనా లో స్థిరపడ్డారు. వీరిద్దరితోపాటు ఆమె సోదరి శయనా కూడా వచ్చింది . బ్రిటిష్ మాండేట్ పాలస్టైన్ లో గోల్డా దంపతులు కిబ్బూజ్ లో చేరారు .అక్కడ వాళ్ళపని ఆల్మండ్ లను కోయటం ,మొక్కలు నాటటం ,వంటపని ,గుడ్ల పని చేయటం .ఆమె శక్తి సామర్ధ్యాలు గుర్తించి ఆమెను హిస్ట్రా డట్ అనే జనరల్ ఫెడరేషన్ లేబర్ కు ప్రతినిధిని చేశారు .1924లో దీన్ని వదిలి టెల్ అవైవ్ కు దంపతులు చేరి ఒకకొడుకు ఒక కూతురు లకు జన్మనిచ్చారు .1928లో గోల్డా వర్కింగ్ వుమెన్ కౌన్సిల్ సెక్రెటరి అయింది .దీనివలన 1932-34వరకు రెండేళ్ళు సంతానం తో అమెరికాలో ఆమె ఉండాల్సి వచ్చింది .భర్త జెరూసలెం లో ఉండి పోయాడు .ఇలా విడిపోయిన ఆ భార్యా భర్తలు తిరిగి కలుసుకోలేదు. కానీ విడాకులు తీసుకోనూ లేదు.1951లో మోరిస్ చనిపోయాడు .

రాజకీయ సోపానం:

1934లో అమెరికా నుంచి తిరిగి వచ్చాక గోల్డా మీర్ ‘’హిస్ట్రా డట్’’ఎక్జి క్యూటివ్ కమిటీలో చేరి క్రమంగా ఎదుగుతూ పొలిటికల్ డిపార్ట్ మెంట్ హెడ్ అయింది .ఇందులో పొందిన శిక్షణ ఆమె భవిష్యత్ నాయకత్వానికి గొప్ప ఆసరా అయింది.1938లో అమెరికా ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ 32దేశాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఈవియన్ కాన్ఫరెన్స్ కు పాలస్తీనా తరఫున జ్యూయిష్ పరిశీలకు రాలిగా హాజరై, ఐరోపా యూదుల దయనీయ స్థితి గతులను వివరించి , ఆ దేశాలు యూదు శరణార్ధులను ఎందుకు అనుమతించటం లేదని తీవ్రమైన ఆవేశంతో ప్రశ్నించింది .డొమెనికన్ రిపబ్లిక్ మాత్రం ఒక లక్షమంది శరణార్ధులకు అనుమతించింది .ఆ సమావేశ ఫలితం సంతృప్తి గా లేదని విలేఖరులతో చెబుతూ గోల్డా ‘’నేను బతికి ఉన్నంతకాలం నా పాలస్తీనా ప్రజలకు ఇక సానుభూతి వచనాలు సహించను ‘’అని మొండి ధైర్యం తో తెగేసి చెప్పింది .

యూదుల వాణి:

1946లో బ్రిటిష్ ప్రభుత్వం పాలస్తీనాలో జియోనిస్ట్ ఉద్యమం పై తీవ్రంగా విరుచుకు పడింది ఈషువ్ అంటే బ్లాక్ షబ్బాత్ సభ్యులను మోషే షెర్రత్ తో సహా వందలాది మందిని అరెస్ట్ చేసింది .గోల్డా మీర్ జ్యూయిష్ ఏజెన్సీ కి చెందిన పొలిటికల్ డిపార్ట్ మెంట్ క్రియా శీలక హెడ్ గా బాధ్యతలు తీసుకొని యూదుల సమస్యలను ప్రపంచం దృష్టికి తెచ్చింది .పాలస్తీనా యూదులకు ,బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగటానికి ముఖ్య ప్రాతినిధ్యం వహించింది .షర్రాత్ విడుదలైనతర్వాత గొల్డాను పొలిటికల్ హెడ్ గా ఉంచి ,అమెరికా వెళ్లి ‘’యు యెన్ పార్టిషన్ ప్లాన్ ‘’తో చర్చలు జరిపాడు .

1948 జనవరిలో జ్యూయిష్ ఏజెన్సీ ట్రెజరర్ కు ఇజ్రాయిల్ కు అమెరికన్ జ్యూయిష్ కమ్యూనిటి నుంచి ఏడు లేక ఎనిమిది మిలియన్ల డాలర్ల ఆర్ధిక సాయం మాత్రమే అందే వీలుంటుంది అని తెలియజేశారు .గోల్డా మీర్ అమెరికా వెళ్లి విస్తృతంగా పర్యటించి, అందరినీ భాగస్వాములను చేసి 50,000,000, డాలర్లు సాధించి ,ఆడబ్బుతో యూరప్ యువకులకు ఆయుధాలు కొనుగోలు చేయించింది ఇది ఆమె సాధించిన చారిత్రాత్మక విజయం అని పత్రికలు పతాక శీర్షికలతో రాశాయి .1948 మే 10న ఇజ్రాయిల్ సాధికారంగా ఏర్పడటానికి నాలుగు రోజులముందు గోల్డామీర్ ఆరబ్ మహిళా వేషం లో అమ్మాన్ లో జోర్డాన్ రాజు అబ్దుల్లాతో సమావేశమై యూదులపై దాడి చేయటానికి ఇతర ఆరబ్బు దేశాలతో చేతులు కలపవద్దని కోరింది .ఆయన ఇజ్రాయిల్ దేశం ఏర్పాటుపై ప్రకటనకోసం తొందరపడ వద్దని సలహా ఇచ్చాడు .దీనికి ఆమె ‘’ఇప్పటికి 2 వేల సంవత్సరాలనుంచి ఇజ్రాయిల్ దేశం కోసం ఎదురు చూస్తున్నాం .ఇది తొందరపాటా ?’’అని ఎదురు ప్రశ్న వేసింది .ఇజ్రాయిల్ స్వాతంత్ర యుద్ధం మొదలవటానికి ముందు ఆరబ్బులంతా దేశం విడిచి వెళ్లి పోవాలని అల్టిమేటం ఇచ్చింది .

ఇజ్రాయిల్  ప్రకటన:

1948మే14 న ‘’ఇజ్రేలి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ‘’పత్రం పై గోల్డా మీర్ తోపాటు 24 మంది ప్రముఖులు సంతకాలు చేసి విడుదల చేశారు .ఈ సందర్భంగా ‘’నిజమైన నా ప్రజలు నిజంగా ఈపని చేస్తున్నారా అని ఆశ్చర్య పడుతున్నాను ‘’అన్నది గోల్డా . ఆ మర్నాడే సరిహద్దు దేశాల సైన్యాలు ఇజ్రాయిల్ పై దాడి ప్రారంభించాయి .ఇదే ‘’1948 ఆరబ్ –ఇజ్రాయిల్ యుద్ధం ‘’గా చరిత్రకెక్కింది .ఆసైన్యాన్ని దీటుగా ఎదుర్కొని ,ఇజ్రాయిల్ ప్రజలను సంఘటితపరచి యుద్ధానికి పరి సమాప్తి పలికింది .

మంత్రి పదవి –రష్యా ప్రజల అపూర్వ స్వాగతం –కరెన్సీ నోటు పై గోల్డా బొమ్మ:

మొదటి ‘’ఇజ్రాయిలి పాస్ పోర్ట్ ‘’పొంది గోల్డా మీర్ ఇజ్రాయిల్ మంత్రిగా బాధ్యతలు చేబట్టి1948 సెప్టెంబర్ 2నుంచి 1949మార్చి వరకు ఉన్నది .ఆయుధ సేకరణకు రష్యాతో సంబందాలు అవసరం అని భావించి స్నేహ హస్తం చాచింది .రష్యా నియంత స్టాలిన్ కూడా అనుకూలంగా స్పందించాడు .తర్వాత హిబ్రూ భాష నిషేధం ,యూదుల సంస్థలపై నిషేధం పెట్టిన రష్యాతో మైత్రి తెగ తె౦పులయింది .ఈ కొద్దికాలం లోనే గోల్డా మాస్కో వెళ్లి రోష్ హసన్నా ,యాం కిప్పూర్ సమావేశాలలో పాల్గొన్నది .వేలాది రష్యన్ యూదులు ఆమె పేరు స్మరిస్తూ వీధులలో స్వాగతం పలికారు .ఇజ్రాయిల్ దేశం 10,000ల షెకెల్ బాంక్ నోటు పై ఒకవైపు ఆమె బొమ్మ ,రెండవ వైపు ఆమెకు స్వాగతం పలికిన రష్యా ప్రజల బొమ్మతో ముద్రించి 1984నవంబర్ లో విడుదల చేసి ఆమెకు అత్యధిక గౌరవం కలిగించింది .

ప్రజా సేవలో పునీతం:

1949లో KNESETకు మపాల్ ప్రతినిధిగా ఎన్నికై 1974వరకు 25ఏళ్ళు గొల్డామీర్ సేవలందించింది .1949నుంచి 1965వరకు లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేబట్టి విజయవంతంగా పూర్తి చేసింది .శరణార్ధులను జాతీయ పౌరులుగా తీర్చి దిద్దింది .రోడ్డు గృహ నిర్మాణాలకు భారీ ప్రాజెక్ట్ లను నిర్వహించింది .ఆ కాలం లో 2లక్షల అపార్ట్ మెంట్ లు ,30వేల గృహాలను నిర్మించి ఇచ్చింది .అనేక వ్యవసాయ ,కర్మాగార అభి వృద్ధి కార్యక్రమాలు స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ రోడ్లనిర్మాణ౦ చేసింది .1954లో నేషనల్ ఇన్స్యూ రెన్స్ చట్టం తెచ్చి ప్రజలకు సాంఘిక భద్రత కల్పించింది .1955లో బెన్ గున్యాన్ ప్రోద్బలంతో టెల్ అవైవ్ కు మేయర్ గా పోటీచేసి ఆడవారికి పదవేమిటి అనుకొన్న మఠాధిపతుల ఆహ౦కారానికి బలై, రెండే రెండు వోట్ల తేడాతో ఓడిపోయింది .

సమర్ధ విదేశాంగమంత్రి:

1956లో ప్రధాని డేవిడ్ బెన్ గున్యాన్ మంత్రివర్గం లో విదేశీ వ్యవహారాలమంత్రిగా గోల్డా మీర్ సమర్ధవంతంగా పని చేసింది .ఆమెకు ము౦దు పనిచేసిన మోషే షెరాట్ ఆదేశం ప్రకారం విదేశే వ్యవహార శాఖలో పని చేసే వారంతా హిబ్రూ ఇంటి పేరు తప్పక పెట్టుకోవాలనే నియమం తో గోల్డా తన మేయర్సన్ ఇంటిపేరు ను’’ సంక్షిప్తం చేసి ‘’మీర్ ‘’గా మార్చుకొన్నది .దేశాన్ని తీర్చి దిద్దుకొనే నేర్పు ఇజ్రాయిల్స్ కు ఉన్నదని ఆఫ్రికన్ లకు ఇజ్రాయిల్ ఒక రోల్ మోడల్ గా ఉంటుందని తన చర్యలద్వారా చాటి చెప్పింది .విదేశ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేబట్ట గానే సూయజ్ కాలువ సమస్య తీవ్రమై౦ది .ఇదే రెండవ ఆరబ్ –ఇజ్రాయిల్ యుద్ధంగా మారింది .1956ఇజ్రాయిల్ ఈజిప్ట్ పై దాడి చేసింది .త్రైపాక్షిక సమావేశాలలో అంతర్జాతీయంగానూ సమస్య పరిష్కారానికి ఇజ్రాయిల్ తరఫున నిలిచి తనవాణి వినిపించింది .

ఇజ్రాయిల్ తొలి ప్రధాని గోల్డా మీర్:

1957అక్టోబర్ 29న సమావేశ మందిరంలో ఉండగా శత్రువులు వేసిన మిల్స్ బాంబ్ కు మీర్ పాదానికి కొద్దిగా దెబ్బతగిలింది .గున్యాన్, మోషే కార్మెల్ లు తీవ్రంగా గాయపడ్డారు . యూదులకు అండగా నిలిచినందుకు 1958లో 12వపోప్ పయస్ పాల్ కు కృతజ్ఞతలు తెలియజేసింది .1960లో లి౦ఫామా వ్యాధి సోకింది .లేవి ఎష్కోల్ అకస్మాత్తుగా మరణించగా పార్టీ గోల్డా మీర్ ను ప్రధానమంత్రిగా ఉండమని ఆదేశించగా ఇజ్రాయిల్ దేశానికి తొలి ప్రధానిగా గోల్డా మీర్ 17-3-1969 బాధ్యతలు చేబట్టి,1974వరకు అయిదేళ్ళు సమర్ధవంతంగా పాలించింది .జనరల్ ఎన్నికలలో తనపార్టీకి అఖండ విజయం చేకూర్చి రికార్డ్ సృష్టించింది .1969-70కాలం లో రిచర్డ్ నిక్సన్ ,6వ పోప్ పాల్ విల్లీబ్రాంట్ వంటి ప్రపంచ ప్రసిద్ధ నాయకులతో సమావేశాలు జరిపింది .అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ఆమోదించి యుద్ధానికి స్వస్తిపలికింది . 1973ఫిబ్రవరి 28 వాషింగ్టన్ లో హెన్రి కిసింజర్ చేసిన శాంతి ప్రపోజల్ ‘’సెక్యూరిటీ వర్సెస్ సావేరినిటి ‘’ ని అంగీకరించింది

1972లో మూనిచ్ ఒలింపిక్స్ లో జరిగిన దారుణ హత్యాకాండ కు బాధ్యులైనవారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని మీర్ కోరింది .1970లో 2లక్షల రష్యన్ యూదులను ఇజ్రాయిల్ కు వెళ్ళిపొమ్మని ఆదేశించగా వారు ఆస్ట్రియా నుండి ఇజ్రాయిల్ కు బయల్దేరగా కొందరిపై ఆంక్ష విధిస్తే , వారి విడుదలకై పోరాడింది .1973లో గోలన్ హైట్స్ పై సిరియన్ సైన్యాలు దాడి చేస్తాయని తెలిసి యుద్ధ ప్రమాదం ముంచుకొస్తుందని భయపడే తరుణంలో6రోజుల యాం కిప్పూర్ వార్ తర్వాత చాకచక్యంగా వ్యవహరించి యుద్ధ ప్రమాదం తప్పించింది .అప్పుడు ఆమెకు అండగా నిలిచింది ఒంటి కన్నున్న ఇజ్రాయిల్ రక్షణ మంత్రి మోషే డయాన్ . పదవీ కాంక్ష లేని ప్రధాని.

1973 డిసెంబర్ ఎన్నికలలో మీర్ పార్టీ ఘనవిజయం సాధించింది .కాని గోల్డామీర్ 1974ఏప్రిల్ 11న ‘’ అయిదేళ్ళు సుదీర్ఘ కాలం ప్రధానిగా ఉన్నాను .ప్రజాసేవలో సంతృప్తి చెందాను .ఇక చాలు ‘’అని చెప్పి రాజీనామా చేసింది .ఆమె స్థానం లో రాబిన్ ప్రధాని అయ్యాడు .1975లో మీర్ తన స్వీయ జీవిత చరిత్ర ‘’మైలైఫ్ ‘’రాసి ప్రచురించింది .1977లో ఈజిప్ట్ ప్రధాని అన్వర్ సాదత్ ఇజ్రాయిల్ ను మొట్ట మొదటిసారి సందర్శింఛి చరిత్ర సృష్టించాడు .

గోల్డా మీర్ శక సమాప్తి:

8-12-1979న 80 ఏళ్ళ వయసులో లి౦ఫటిక్ కేన్సర్ వ్యాధితో ఇజ్రాయిల్ తొలి, చివరి మహిళా ప్రధాని , ‘’యూదుల స్వరపేటిక’’,,’’ఐరన్ లేడీ ఆఫ్ ఇజ్రాయిల్ పాలిటిక్స్ ‘’ప్రపంచం లోనే మొట్టమొదటి మహిళా ప్రధాని గోల్డా మీర్ మరణించింది .ఈమె తర్వాత బ్రిటన్ కు మార్గరెట్ థాచర్ ,శ్రీలంకకు సిరిమావో బండారు నాయకే ,ఇండియాకు ఇందిరాగాంధీ ప్రధానులయ్యారు .వీరికి మార్గ దర్శకురాలు గోల్డా మీర్ .

1974లో అమెరికన్ మదర్స్ గోల్డా మీర్ కు ‘వరల్డ్ మదర్ ‘’అవార్డ్ ఇచ్చి సత్కరించారు .ప్రిన్స్టన్ యూనివర్సిటి 1974లో జేమ్స్ మాడిసన్ అవార్డ్ ఇచ్చి గౌరవించింది .1975లో ఇజ్రాయిల్ ప్రభుత్వం ఆమె దేశానికి ,సమాజానికి చేసిన సేవలకు గాను అత్యుత్తమమైన ‘’ఇజ్రాయిల్ అవార్డ్ ‘’అందజేసి సన్మానించింది .ఆమె సేవలను ‘’ది బెస్ట్ మాన్ ఇన్ ది గవర్న్ మెంట్ ‘’అని గొప్పగా చెప్పుకొంటారు . ‘’గ్రాండ్ మదర్ ఆఫ్ ఇజ్రాయిల్ జ్యూయిష్ పీపుల్ ‘’అని గోల్డా మీర్ ను సంస్మరిస్తారు .ఇజ్రాయిల్ ప్రజల మనసులలో ఆమె చిరస్థాయిగా నిలిచి పోయింది .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయావారి సాంఘిక మాయాబజార్ -గుండమ్మకథ

విజయావారి సాంఘిక మాయాబజార్ -గుండమ్మకథ

Continue reading

Posted in సమీక్ష | Leave a comment

12-సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు

12-సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు

అత్తాను రామానుజా చార్యుని ;;శ్రీ రుక్మిణి కురవంజి ‘’తాళపత్ర గ్రంధం లోనే సర్వజ్ఞ పద్మనాయక భూపాలుని ‘’సారంగధర చరిత్ర –యక్షగానం ‘’కూడా ఉందట .కులం ,పదవులు , బిరుదాలు మాత్రమె కావ్యం లో ఉన్నాయి.సర్వజ్న బిరుదు ఇద్దరు ముగ్గురులకు ఉంది .చాలాశిధిలంగా ఉన్న గ్రంధం చదవటానికి ఇబ్బంది గా ఉందని బిరుదరాజు గారువాచ .కంట్లో వత్తులు వేసుకొని ప్రతి అక్షరాన్నీ కొన్ని వారాలు చదివారట రాజుగారు .ఇక్కడ మనకు వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాధసూరి పడిన కస్టాలు గుర్తుకొస్తాయి .ఆయన కంటి రెప్పలకు దారాలు వాటికి చివర రాళ్ళు కట్టుకొని సంస్కృతకావ్య వ్యాఖ్యానం రాశాడు చివరి రోజుల్లో.

ఆటతాలం లో –శ్రీ విభుని బూజించి వాక్పతి ——యెపుడు-నవని పార్వతీశ్వరు ప్రస్తుతి౦తున్

విఘ్న రాజుకు మొక్కి —-వాగ్వితతి నిర్విఘ్నముగ శ్రీ యక్ష —వేడుకొందున్’’

వ్యాసభట్టార్యు  వాల్మీకి మదిని గొలిచి –ఆశుగ బ్రహ్మాది మునులకు నా౦జనేయు

పూని దత్తిలచరన కోహల క్రుంగవాజి ల –గాన శాస్త్ర ప్రబంధ  కర్తల కరుణ వడసి

తివిరి బాణమయూరుల చిత్తమున నిలిపి తక్కిన కవి వరేణ్యుల కెల్ల’’

తర్వాత ద్విపదల పేరిటఉన్న పంక్తులున్నాయి .తర్వాత వచనం ఉన్నది –ధనకనక వస్తు వాహన సమృద్ధి వడసి —నిత్యమై విజయలక్ష్మి గలిగి —-లక్ష్మి పరిపూర్ణమై ‘’

కవి తాను ‘’కాచమ దేవి గారాల సుతుడను ‘’అని చెప్పుకొన్నాడు .గురువుఆచార్య మణి భట్టరు ,కోరుకొండకు చెందిన పరాశరభాట్టరే  మణిభట్టరు అంటారు రాజుగారు .శ్రీశైలానికి ఉత్తరానున్న ఉమామహేశ్వరమే కవి చెప్పిన ఉమాచలం అన్నారు .

తలవరులమాటలను ఉత్కళికలో రాశాడు –‘’ఉభయకుల పావనుడగా ఉద్భవించి –పరగిన శుభ గుణోజ్వల సజ్జనుడ రాసుతుడ—అయ్య ఇదిగోరాజు  మనసు లరసి చూసి –పోయిరి చయ్యనను పయనంబుగావలె సజ్జనుడా ‘’

ఇది యక్షగానం అవునోకాదో, కవి  సర్వజ్ఞుడు రేచర్ల వంశంవాడో కాదో ఇంకా తేలాల్సిన విషయం అన్నారు బిరుదరాజు వారు .ఇంత శ్రమపడి ఈ కృతి విషయాన్ని లోకానికి అందించిన  ఆచార్య బిరుదరాజువారికి తెలుగుజాతి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు ?

ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-19-ఉయ్యూరు

 

 

 

 

 

 


 

I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment