యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -8

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -8

ఇందులోని 7వ భాగాన్ని 25-9-18న రాశాను . యాజ్ఞ వల్క్య మహర్షి మేనమామ శాకల్యుడు మేనల్లుడిపై అభాండాలు వేయటం బహిష్కరించటం ఆయన సంతరించిన స్మృతి పనికి రాదనటం ,దానిపై శాకల్యునితో వచ్చిన ఋషులు  తమలో తాము చాలా సేపు వితర్కి౦చు కొని యాజ్ఞ వల్క్యుని పక్షాన నిలవటం ఇప్పటి వరకూ జరిగిన కథ.ఇక తర్వాత ఏమి జరిగిందో తెలుసుకొందాం .

అందులో చూడభాగుడు ‘’ఐతే ఆయనతో కలిసి ఉండాల్సి౦దేనా ?ఆయనకు శాపం ఉందని కల్పించితే ఏమౌతుంది ?’’అని ప్రశ్నించాడు .దానికి ఋషులు ‘’అది తుచ్చ మైన పని అవుతుంది .ఆ శాపం శ్రుతి రూపమైనదా,స్మృతి రూపమైనదా లేక పురాణ రూపమైందా?అని ఆయన శిష్యులు మనల్ని ప్రశ్నిస్తే మనదగ్గర సమాధానం లేక దిక్కులు చూడాల్సి వస్తుంది .వాళ్ళ చెవిన ఈ మాట పడితే మన నోళ్ళు మూయి౦చేవారు .అప్పుడు మేము అంగీకరించవలసి వచ్చేదికదా.అయినా అద్దం చేతిలో నే ఉంటె దిక్కులు చూడటం దేనికి ?ఆయన్నే ప్రశ్నించి విషయం సాకల్యంగా తెలుసుకొందాం ‘’అన్నారు .

రుషులంతా యాజ్న వల్క్యుని చేరి ‘’ఆశన ,అనశన వ్రతం గురించిమాట్లాడుకొందాం ‘’అనగా   ‘’సానయసుడాషా హ్లూడుడు’’ అనశనుడై  వ్రతం చేయాలి .కారణం దేవతలు మానవ హృదయాన్ని గ్రహించగల నేర్పరులు .అనశన వ్రతం ఆచరించే వాడు తమను యజి౦పగలడని వాడి ఇంటికి వస్తారు .అప్పుడు వాడి ఇల్లు ‘’ఉపవసధం ‘’అవుతుంది .కనుక ఇంటికి అతిధులుగా వచ్చిన దేవతలకు పెట్టకుండా భోజనం చేయటం పాపమే అవుతుంది .కనుక వాడు రాత్రి భుజి౦పకూడదు .’’అన్నాడు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’అది సరికాదు .భోజనం చేయకపోతే పితృ కార్యం చేసే అర్హత కలవాడౌతాడు .తింటే ఉపవాసమున్న దేవతలకు పెట్టకుండా తిన్నవాడౌతాడు .కనుక దీవతలకు నివేది౦చాల్సిన పని లేకుండా తినదగిన పదార్ధాలు తింటే దోషం రాదు .అంటే వృక్షాల ఫలాలు తింటే ఏ దోషం అంటదు .పితరులను యజించేటప్పుడు ఫలాలూ తినరాదు .’’అన్నాడు .వార్ష్ణు డు,బర్కువు ‘’మినపరొట్టె (గారెలు )వండి తినచ్చు ‘’అన్నారు .మహర్షి ‘’తినకూడదు మినప రొట్టెలో  కలిపే బియ్యం పిండి మూడు నాలుగు యామాలలో అధికమౌతుంది కనుక తిల ,మాషాదులతో (గారెలు )కలిసిన వ్రీహి (బియ్యం పిండి )అసలు తినకూడదు .అలాతింటే వాడు ఇచ్చే హవిస్సులు దేవతలు గ్రహించరు ‘’అన్నాడు .

ఋషులు అగ్రాయణ ఇష్టి గురించి మాట్లాడుదామన్నారు .కహోళ కౌషీతకి’’ఓషధుల రసం భూమ్యాకాశాలకు చెందినవే .కనుక ఈ రసాన్ని దేవతలకిచ్చి ఆగ్రయణత్వం చేత  భోజనం చేయచ్చు’’అన్నాడు .దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’ఆగ్రయణం చేయటం గురించి ఒక ఆఖ్యాయిక ఉంది .ఒకప్పుడు ఆధిక్యం కోసం దేవ రాక్షస యుద్ధం జరిగింది. రాక్షసులు మనుషులకు మృగాలకు ఆహారమైన ఓషధులను విషతుల్యం చేస్తే తిండి లేక మాడిపోతారు .అప్పుడు దేవతలకు మించిన వాళ్ళమౌతాము అనుకొని అలాగే చేశారు  .పశువులు మానవులు ఆహారం లేక కుంగి కృశించారు .అప్పుడు దేవతలు యజ్ఞ౦  చేసి రాక్షసకృత్యాన్ని తొలగించారు .అప్పుడే ఋషులు కూడా యజ్ఞం చేశారు .ఆయజ్ఞ౦ ఎవరిది ఔతుందని  దేవతలు తగూలాడి పందెం వేసుకొని పరిగెత్తారు .చివరికి గెలుపు అగ్ని ఇంద్రులదే అయింది . కనుక ఆగ్రయణం ఇంద్రాగ్ని సంబంధమైనది .వారికి ద్వాదశ కపాలము పురోడాశం ఇవ్వాలి .ఆగ్రయణ ఇష్టి చేతనే దేవతలు రాక్షస కృత్యాలను మాన్పగాలిగారు .దీనికి పూర్వం దర్శ పూర్ణ  మాసలు చేయకపోయి ఉంటె ,వాటిని చేశాకే ఆగ్రయణ౦ చేయాలి  .కుదరకపోతే ’’జాతుస్ట్రాశ్యౌదనం ‘’(అంటే నలుగురు బ్రాహ్మణులు భుజించటానికి తగిన వంట ) వండి బ్రాహ్మణులకు పెట్టాలి .దీనికి కారణం ఉంది .దేవతలు మనుష్య దేవతలని ,దేవతలని రెండు రకాలు .వేదాదులుచదివి చదివించే బ్రాహ్మణులు మనుష్య  దేవులు . అగ్ని మొదలైనవారు దేవతలు .’’అని వివరించాడు .

కొందరు ఋషులు అధ్వర్యుడే యాజ్యాన్ని చూడాలి అంటే  మరికొందరు ఋషులు యజమానే చూడాలి అన్నారు .దీనికి ‘’యజమాని అధ్వర్యుడుగా ఎందుకు ఉండరాదు ?గొప్ప వరాలు పొందాలనుకొనే యజమాని మంత్రాలను ఎందుకు చదువకూడదు ?.అధ్వర్యుడు ఏది కోరితే అది యజమానికోసమే అవుతుంది అందుకని అధ్వర్యుడికి శ్రద్ధ కలుగకపోవచ్చు .కనుక యజమాని అధ్వర్యుడై చూడాలి ‘’అన్నాడు యాజ్ఞ్య వల్క్యుడు .

ఋషులు ‘’అంతర్వేది లో హవిస్సు ఉంచితే దేవులను,  దేవ భార్యలను విడదీసి నట్లు ఔతుంది . వారికి యజమానిపై ప్రీతి ఉండదు .కనుక అంతర్వేదిలో హవిస్సు ఉంచరాదు’’అన్నారు .దీనికి సమాధానంగా యాజ్ఞవల్క్యుడు ‘’యజమాని భార్య తన విధి తానూ చేయాలి .అంతర్వేదిలో హవిస్సు ఉంచినంత మాత్రాన తనభార్య అన్య పురుషునితో కలిసింది అనే మాట ఎవరూ ఆదరించరు.ఇలాంటి పిచ్చి పిచ్చి అభిప్రాయాలు వదిలిపెట్టి యజ్ఞమే వేది గా ,యజ్ఞమే యాజ్యంగా భావించి యజ్ఞాన్ని చేస్తున్నాను అంటూ అంతర్వేది లో హవిస్సు ఉంచాలి ‘’అన్నాడు

.ప్రవీణుడైన యాజ్ఞికుడు అయిన౦దువలననే  ఋషులు చాలామంది ఉన్నా వ్యాసుడు బ్రహ్మిష్టి ఐన యాజ్ఞావల్క్యుడి నే ధర్మరాజు చేసే రాజసూయయాగానికి అధ్వర్యుడిగా నియమించాడు .ఆయనే చేసిన అశ్వమేధ యాగం లో అశ్వం వెంట అర్జునునితో పాటు యజ్ఞ కర్మ కుశలుడైన యాజ్ఞవల్క్య శిష్యుని శాంత్యర్ధం పంపబడ్డాడు .జనకమహారాజు తండ్రి చేసిన యాగం లో కూడా వేద దక్షిణకోసం యాజ్ఞవల్క్యుడు మేనమామ వైశంపాయనునితో తగాదా పడి దేవలుని సమక్షం లో సగం దక్షిణ పొందాడని మహాభారతం లో ఉన్నది . జనమేజయుడు దర్శ  పూర్ణిమాసేస్టి చేయ సంకల్పి౦చి బ్రాహ్మణులను చేయించమంటే వారంతా తిరస్కరించారు .అప్పుడు యాజ్ఞవల్క్యడు నిలబడి చేయి౦చా డని మత్స్య పురాణం లో ఉన్నది .కనుక యాజ్ఞవల్క్య మహర్షి ఉత్తమోత్తమ ఆధ్వర్యుడు అని మనకు తెలుస్తోంది.

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-19-ఉయ్యూరు  .

 

.

.

 

 

 


 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -42 56-యమ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -42

56-యమ తీర్ధం

పితరులకు ప్రీతి ,దృస్ట,అదృష్ట,ఇష్టఫలితాలనిచ్చేది యమ తీర్ధం .పూర్వం ‘’అనుహ్లాదుడు ‘’అనే మగ పావురం ఉండేది .భార్య ‘’హేతి ‘’.అనుహ్లాడుడు మృతువు కొడుకు కొడుకు .  .హేతి మృత్యువు కూతురి కూతురు .వీరిద్దరికీ కొడుకులు మనుమలు పుట్టారు .ఉలూకుడు అనే పక్షిరాజు అనుహ్లాదుని శత్రువు .గ౦గానది ఉత్తరా తీరాన  కపోతజంట ఉంటె ,దక్షిణ తీరం లో ఉలూకుడు పుత్ర పౌత్రులతో ఉన్నాడు .వీరిద్దరికి చాలాకాలం యుద్ధాలు జరిగాయి .ఎవరికీ జయం కలగలేదు .అనుహ్లాడుడు తన తాత మృత్యు స్వరూపుడైన యమ ధర్మరాజు నాశ్రయించి ‘’యామాస్త్రం ‘’పొంది విశేష బలసంపన్ను డైనాడు .ఉలూకుడు అగ్ని దేవుని అనుగ్రహం తో ఆగ్నేయాస్త్రం పొంది మంచి బలం పొందాడు .మళ్ళీ ఇద్దరి మధ్యా యుద్ధం భయంకరంగా జరిగింది .

ఉలూకుడు పావురం పై ఆగ్నేయాస్త్రం వేస్తె ,కపోతం యామాస్త్రం వేశాడు .హేతి భయ విహ్వాలయై  అగ్నిని-‘’తమ్ దేవం శరణం యామి ఆది దేవం విభావసుం –అంతస్ధిత ప్రాణ రూపో బహిశ్చాన్న ప్రదో హాయ్ యః –యో యజ్ఞ సాధనం యామి  శరణం  త౦ ధనున్జయం ‘’     అని స్తుతించి మెప్పించింది  .అగ్ని ప్రత్యక్షమై తన అస్త్రాన్ని ఉపసంహరిస్తానని ,కాని దాన్ని ఎక్కడ వేయాలో చెప్పమని ఆమెను కోరాడు  .ఆమె ఏమాత్రం ఆలోచించకుండా భర్త సంతానం క్షేమమే ఆలోచించి ఆ అస్త్రాన్ని తన మీదే  వేయమని కోరింది .ఆమె పతిభక్తికి మెచ్చి వీతి హోత్రుడు  ఆమె భర్త సంతానానికి కూడా క్షేమం ప్రసాదించాడు .

యమపాశాలకు చిక్కుకున్న ఉలూకుని భార్య ఉలూకి సరాసరి యముడి దగ్గరకు వెళ్లి స్తోత్రం చేసి మెప్పించి తనబాధ చెప్పుకొన్నది .సంతృప్తి చెందిన యముడు ఆమె భర్తకు ప్రాణహాని తప్పిస్తాను కాని అస్త్రాన్ని ఎక్కడ విసర్జి౦చాలో చెప్పమన్నాడు .ఆమె క్షణం కూడా ఆలో చి౦చ కుండా భర్త క్షేమం  కోసం ఆ యమ దండాన్ని తనపైనే వదలమని కోరింది .యముడు ఆమెకూ భర్తకు సంతానానికీ క్షేమం కలిగించాడు .యముడు యమపాశాన్నీ అగ్ని ఆగ్నేయాస్త్రాన్నీ ఉపసంహరించగా  ఉలూక కపోతాదులు దేవతలా కరుణకు కృతజ్ఞతలు చెప్పారు .

వరాలు కోరుకోమనగా పక్షులు ‘’పాపాత్ములమైన మాకు మా ఇద్దరి మధ్యా ఉన్న వైరం వలన మీదర్శనం లభించింది .గంగానది రెండు వైపులా ఉన్న ఆశ్రమాలలోలోక క్షేమం కోసం  మీ రిద్దరూ ఉండి పోవాలి ‘’అనికోరాయి అలాగే అన్నారు  అగ్ని యమ దేవతలు .యముడు గౌతమీ ఉత్తర తీరం లో యమ స్తోత్రం పఠించినవారికి అకాల మృత్యువు కలుగదని,ఈతీర్ధం లో స్నానం చేసిన స్త్రీ మూడు నెలలో గర్భవతి అవుతుందని ,వీరుడైన పుత్రునికి జన్మ నిస్తుందని ,వాడు శతాయుష్కుడౌతాడనీ  పుత్రపౌత్రాభి వృద్ధితో వర్దిల్లుతాడనీ  వరమిచ్చాడు .అగ్ని దేవుడు గౌతమి దక్షిణ తీరం లో తన స్తోత్రాన్ని పఠించే వారు  ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ,పవిత్రులై స్వర్గ ప్రాప్తి పొందుతారని వరం అనుగ్రహించాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-19-ఉయ్యూరు

 

.

 

 

 

 

 

 

 

 

 



Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

400 ఏళ్ల ఆచారం.. మాఘ పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ-సమయం పత్రిక

400 ఏళ్ల ఆచారం.. మాఘ పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ

మాఘ పౌర్ణమి రోజున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మొత్తం ఖాళీ అయింది. గ్రామంలో కుల, మత భేదం లేకుండా గ్రామస్థులందరూ హాజివలి దర్గాకు తెల్లవారుజామునే తరలివెళ్లారు.

అన్ని పౌర్ణమిల్లో కల్లా మాఘ పౌర్ణమిని విశిష్టమైనదిగా భావిస్తుంటారు హిందువులు. మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారని, అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పదని చెబుతుంటారు. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాలు వల్ల వ్యాధులు, చికాకుల నుంచి విముక్తి కలుగుతాయని, మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఇంతటి విశిష్టమైన మాఘ పౌర్ణమి రోజున ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో 400 ఏళ్లుగా విచిత్ర ఆచారం కొనసాగుతోంది.

మాఘ పౌర్ణమి రోజున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మొత్తం ఖాళీ అయింది. గ్రామంలో కుల, మత భేదం లేకుండా గ్రామస్థులందరూ హాజివలి దర్గాకు తెల్లవారుజామునే తరలివెళ్లారు. దీంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. తాడిపత్రికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. దీని ప్రకారం గ్రామంలోని చిన్నా పెద్దా అంతా సూర్యుడు ఉదయించక ముందే ఇళ్లకు తాళాలు వేసి హాజివలి దర్గాకు చేరుకున్నారు. పశువులను కూడా తమతో తీసుకెళ్లారు.

గ్రామస్థులంతా కలిసి అక్కడే వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. పిల్లలు దర్గా సమీపంలో కబడ్డీ, క్రికెట్‌ తదితర ఆటలతో ఎంతో సంతోషంగా గడిపారు. సూర్యాస్తమయం తర్వాతే గ్రామానికి తిరిగివెళ్లారు. అయినప్పటికీ రాత్రి 12 గంటల వరకు గ్రామస్థులంతా చీకట్లోనే గడిపారు. ప్రతి ఒక్కరూ గడప గడపకు కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే ఇంట్లోకి వెళ్లి లైట్లు వేశారు. ఆ తర్వాత ఇళ్లను శుభ్రం చేసి పొయ్యి వెలిగించారు.

400 ఏళ్లుగా పెద్దల నుంచి వస్తున్న ఆచారాన్ని తామంతా క్రమం తప్పకుండా పాటిస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. దీనివల్ల గ్రామానికి మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. గతంలో ఈ ఆచారాన్ని అతిక్రమించిన కొందరు కష్టాలు కొనితెచ్చుకోవడంతో పాటు, అకాల మరణం పొందారని చెబుతున్నారు. అందువల్ల గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ ఆచారాన్ని నమ్మి ప్రతి సంవత్సరం మాఘ మాస పౌర్ణమిరోజు ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నామని తెలిపారు.

image.png
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -4 55-పుత్ర తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -41

55-పుత్ర తీర్ధం

దితి పుత్రులు దనుజులు క్రమ౦గా నశిస్తూ ఉంటె అదితి పుత్రులు దేవతలు వృద్ధి పొందుతున్నారు .పుత్ర శోకం భరించలేక దితి తనభర్త దనువు ను చేరి గోడు వెళ్ళబోసి అదితి అంటే తనకున్న ద్వేషాన్ని ప్రకటించగా దనువు ఆమెను ఓదార్చి ఆమె భర్త కశ్యపునికి నివేది౦చ మన్నాడు .వెళ్లి కశ్యపప్రజాప్రతికి చెప్పగా ,సమస్త లోక విజేతను కొడుకుగా ఇమ్మని కోరింది .ఆయన 12ఏళ్ళు చేసే వ్రతాన్ని ఆచరించమని చెప్పగా భర్తనుద్దేశించి వ్రతం చక్కగా ఆచరించగా కశ్యపునివలన ఆమె గర్భం దాల్చగా ఆయన కొన్ని నియమాలు పాటించమని బోధించాడు –ఇరు సంధ్యలలో నిందనీయమైన పనులు చేయరాదు, నిద్రపోకూడదు ,వెంట్రుకలు విరబోసుకోరాదు భోజనం చేయరాదు ,నోటికి ఏదైనా అడ్డం పెట్టుకొని నవ్వాలి ,ఇంటి మధ్యప్రదేశం లో ఉండరాదు ,తుమ్మటం ఆవలించటం చేయరాదు .రోలు ,రోకలి ,చీపురు చేటలను ఎప్పుడూ దాటి  వెళ్ళరాదు.ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు ,అసత్యమాడరాదు,ఇతరుల ఇంటికి పెత్తనాలు పనికి రాదు ,పరపురుషుని చూడకూడదు .మొదలైన నియమాలను పాటిస్తే త్రిలోకాలలో పెరుపొందే కొడుకు పుడతాడు ‘’అని చెప్పి దేవతల నివాసానికి వెళ్ళిపోయాడు .

   దితి గర్భం బాగా వృద్ధి చెందింది .ఈ విషయం మయుడు గ్రహించి మిత్రుడైన ఇంద్రుని చేరాడు .నముచి హంతకుడైనఇంద్రునితో  మయుని స్నేహం విచిత్రమైంది .ఒకప్పుడు నముచి దైత్య సేనాపతి .అప్పుడు ఇంద్రునితో భయంకర యుద్ధం జరిగింది .యుద్ధం లో ఇంద్రుని బలం తగ్గి వెళ్లిపోతుంటే నముచి అతడిని వెంబడించాడు .భయపడి సురపతి ఐరావతం వదిలేసి నురుగులో దాక్కున్నాడు .అదే నురుగుతో నముచిని సంహరించాడు ఇంద్రుడు .నముచి తమ్ముడే మయుడు .అన్న హంతక చావుకోసం విష్ణువుకై ఘోర తపస్సు చేసి వరాలతోపాటు దేవతలకు అతి భీషణమైన మాయ ను కూడా పొందాడు  .త్రేతాగ్నులను బ్రాహ్మణులను పూజిస్తూ ఇంద్రునిపై విజయం కోసం ఎదురు చూస్తున్నాడు .వాయువు ద్వారా ఈ విషయం తెలుసుకొన్న ఇంద్రుడు  బ్రాహ్మణ రూపంతో శత్రువైన మయుడి దగ్గరకు వచ్చాడు .బ్రాహ్మణుడే అని భావించి చాలా దానాలిచ్చాడు .సంతోషపదకుండా ఒక వరం ఇమ్మని అడిగాడు .ఏ వరం కావాలని మయుడు అడిగితే మయుడితో స్నేహం కావాలని కోరాడు దేవేంద్రుడు .తమ మధ్య వైరమే లేదుకదా స్నేహం కావాలని ఎందుకు కోరావని అడిగాడు మయుడు .అప్పుడు ఇంద్రుడు నిజరూపం చూపించి అసలు విషయం చెప్పగా ఇచ్చిన మాటప్రకారం వారిద్దరి మధ్య స్నేహమేర్పడింది .

  ఈ స్నేహంతోనే ఇంద్రుడికి మాయా విద్య నేర్పాడు మయుడు .దీనికి ప్రత్యుపకారంగా ఏం కావాలో కోరుకోమన్నాడు ఇంద్రుడు .అప్పుడు మయుడు’’ అగస్త్యాశ్రమానికి వెళ్ళు .అక్కడ దితి గర్భిణిగా ఉన్నది .ఆమెకు  సేవ చేస్తూ అక్కడ ఉండు .సమయం చూసి ఆమె గర్భం లో ప్రవేశించి పిండాన్ని వజ్రాయుధం తో  చేదించు  .ఇక నీకు శత్రువులు ఉండరు ‘’అని చెప్పాడు .దితిని చేరి సేవ చేస్తూ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు .దితి కి ఈ వంచన విషయం తెలియదు .

  ఒక రోజు సంధ్యాకాలం లో దితి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతుండగా అదే అదను అనుకోని ,ఆమె గర్భం లో ప్రవేశించి గర్భస్త శిశువును సంహరించే ప్రయత్నం చేశాడు. ఆ శిశువు ఇంద్రునితో ‘’సోదరా !నన్ను చంపుతావా ?ఇది మహాపాపం కాదా .నేను శత్రువును అనిభావిస్తే మాతల్లి గర్భం లో నుంచి నేను బయట పడే మార్గం చెప్పి నేను బయటకు రాగానే యుద్ధం చేసి చంపి పౌరుషవంతుడవని  చాటుకో’’అని పరిపరి విధాల చెప్పాడు .దయా దాక్షిణ్యాలు లేకుండా గర్భస్త పిండాన్ని ఇంద్రుడు వజ్రాయుధం తో ఖండించాడు .ఖండి౦చిన 7ముక్కలను ను మళ్ళీ మళ్ళీ ఖండించగా 49పిండాలేర్పడ్డాయి .అవిశరీరభాగాలేర్పడి  రోదించటం ప్రారంభించగా ఇంద్రుడు ‘’మా రుత ‘’అంటే రోదించ వద్దు అన్నాడు .వారందరూ తేజో బలవంతులైన’’ మరుత్తు’’లయ్యారు.జరిగిన దాన్ని అగస్త్యమహర్షికి విన్నవించారు .ఆయనకు విపరీతమైన కోపమొచ్చి ‘’ఇంద్రా !ఎప్పుడూ నీ శత్రువులు నీ పృష్ట భాగాన్నే చూస్తారు ‘’అని శపించాడు .దితి కూడా ఇంద్రుని స్త్రీవలన అవమానం పొంది రాజ్య భ్రస్టత కలుగుతుందని శపించింది   .

  కశ్యపప్రజాపతి అక్కడికి వచ్చి దితి గర్భం లో ఉన్న ఇంద్రుని చేస్ట  అతనికి తగిలిన శాపాలూ తెలిసి  బయటికి రావటానికి భయాపడుతుంటే ధైర్యం చెప్పి రమ్మన్నాడు .తలదించుకొని నిలబడ్డాడు .కశ్యపుడు లోకపాలకులతో పాటు బ్రహ్మ లోకం వెళ్లి ఆయనను ప్రార్దిచారు .ఆయన ఇంద్రునితో సహా కశ్యపుని గంగా నదీ తీరం చేరి స్నానం చేసి శివుని ఆరాధించ మనగా అలాగే చేశాడు .మహేశ్వరుడు ప్రత్యక్షమై  ‘’మరుత్తులు మహా సౌభాగ్యం కలవారై ,యజ్ఞభాగులై ,ఇంద్రునితో కలిసి నిత్య సంతోషంగా ఉంటారు .ఇంద్రునికంటే ముందే యజ్ఞ హవిర్భాగం దక్కుతుంది .మరుత్తులతో కలిసిఉన్న ఇంద్రుని జయించటం అసాధ్యం .ఇకపై సోదర వంశ నాశనానికి ప్రయత్నించే   వారు వంశనాశనం పొందుతారు .మరుత్తులు అమరుఅలయ్యారు ‘’అనీ ,.దితి తో ‘’నువ్వుకోరినట్లే ధీర శూర పుత్రులు నీకు జన్మించారు నీ కోరిక తీరింది ‘’  అన్నాడు .దితి కృతజ్ఞతలు చెప్పింది .శివుడు ఈ తీర్ధం లో చేసినస్నానాదులు గొప్పఫలితాలనిస్తాయని ,పుత్ర తీర్ధంగా ప్రసిద్ధి పొందుతుందని చెప్పాడని నారదునికి బ్రహ్మ వివరించాడు .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-19-ఉయ్యూరు     .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -40 54-రామ తీర్ధం -2(చివరిభాగం )

గౌతమీ మాహాత్మ్యం -40

54-రామ తీర్ధం -2(చివరిభాగం )

యమలోకం లో దశరదునితో యమదూత ‘’మీ కుమారుడు శ్రీరాముడు గౌతమీ తీరం లో ఉండటంవలన  ఆ పుణ్య ఫలితంగా నువ్వు  నరకం నుండి ఉద్ధరి౦ప  బడ్డావు .అతను లక్ష్మణ సమేతంగా గంగాస్నానం చేసి  నీకు పిండ ప్రదానం చేస్తే నీ సమస్తపాపాలు హరి౦చి స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది ‘’అన్నాడు రాజు ‘’నేనే వెళ్లి వారిద్దరికీ ఆ మాట చెబుతాను అనుజ్న ఇవ్వండి ‘’అని వేడుకొన్నాడు .వారు అనుమతించగా  గంగాతీరం చేరి సీతా రామలక్ష్మణులను చూడ గలిగాడు..రామాదులు పవిత్ర స్నానం చేశారు కాని అక్కడ తినటానికి ఏమీ దొరకలేదు .బాధతో రామునితో తమ్ముడు ‘’ బలపరాక్రమాలున్న మనకు అందులో దశరధ పుత్రులకే తినటానికి ఏమీ లేదు ‘’అనగా అన్న ‘’మనం బ్రాహ్మణుడికి భోజనం పెట్టలేదు .భూసుర తృప్తి చేయని వారికి అన్నం దొరకదు ‘’అన్నాడు .

   అదే సమయం లో దశరధుడు అక్కడికి చేరాడు .అతడు రాక్షసుడో భూతప్రేతమో అనుకోని విల్లు ఎక్కు పెట్టిబాణం వదిలాడు లక్ష్మణుడు   .రాజు దుఖంతో తన తీరుకు విలపిస్తూ ఆ ముగ్గురితో ‘’నేను దశరధ మహారాజును .బ్రహ్మ హత్యా దోషం వలన నరకం లో యమ యాతనలు అనుభవించాను ‘’అనగా నిట్టూరుస్తూ రాముడు ‘’ఎందుకు అలా జరిగింది ?’’అని ప్రశ్నించగా తాను  చేసిన మూడు బ్రహ్మ హత్యా పాతకాలవలను  సవివరంగా చెప్పాడు .విన్న ముగ్గురూ మూర్చ పోయారు .కాసేపటికి తేరుకొన్న సీతాదేవి ‘’దుఖిస్తే ప్రయోజనం లేదు .ఒక దోషాన్ని మీరూ మరో దాన్ని లక్ష్మణుడు పంచుకోండి ‘’అనగా సోదరులు ఆనందంగా అంగీకరించారు .కోడలు సీత మాటలకు మామగారు పొంగిపోయి’’బ్రహ్మజ్నుడైన జనకమహారాజు కుమార్తెవు   కనుక నీ నోటి నుండి ఇంత మంచి మాట వచ్చింది ‘’అని మెచ్చి ఎవరూ తన దోషాలను పంచుకోవలసిన అవసరం లేదనీ గంగలో స్నానించి పిండ ప్రదానం చేస్తే ,తన దోష నివృత్తి అవుతుందన్నాడు .

  సరే అని అందరూ పవిత్ర గంగా స్నానం చేసి ,పిండప్రదాన౦ కోసం ప్రయత్నిస్తే ఏదీ దొరక్కపోతే ,లక్ష్మణుడు ఇంగుదీ మొదలైన పళ్ళు తెచ్చి వాటిని పిండి చేసి పిండాలు చేసే ఏర్పాటు చేశాడు .అంతటి దశరధ మహారాజుకు ఇంతటి  అల్ప పిండాలా అని దుఖం ముంచుకొచ్చింది రాముడికి .ఆశరీరవాణి’’యదన్నః పురుషో రాజ౦ స్తదన్నాస్తస్య దేవతాః ‘’అన్నది అంటే మానవుడు దేన్నీ ఆహారంగా తింటాడో  అతని దేవతలుకూడా అదే ఆహారాన్ని తింటారు ‘’.అత్యంత శ్రద్ధాభక్తులతో రాముడు తండ్రికి ఇందుగ పిండి పిండాలను సమర్పించాడు .ఆ క్షణం లో దశరధుడు కనిపించలేదు అతని శవం మాత్రం భూమిపై పడి ఉంది .ఈ ప్రదేశం ‘’శవ తీర్ధం ‘’గా ప్రసిద్ధి పొందింది . లోక పాలకులంతా అక్కడికి విచ్చేశారు .వారిని తన తండ్రి ఎక్కడ అని అడిగాడు రాముడు ‘’ఆయన బ్రహ్మహత్యా దోషాలు పోయాయి .స్వర్గ లోకం చేరాడు చూడు ‘’అనగా దివ్య తేజస్సుతో దశరధుడు వారికి దర్శనమిచ్చాడు .’’కుమారా !నాకు ఉత్తమ లోకాలు కలిగింఛి నన్ను తరి౦పజేశావు .పితృ దేవతలను  తరి౦పజేసిన పుత్రుడు ధన్యుడు’’అని ప్రశంసించి దివ్య రధమెక్కిస్వర్గం చేరాడు

  అక్కడున్న దేవతలతో రాముడు తన తండ్రి కి  నిర్వర్తి౦చా ల్సినవి ఇంకా ఏమైనా ఉంటె చెప్పమని అడిగాడు .అప్పుడు వారు –

‘’నదీ న గంగయా తుల్యా న త్వయా సదృశః సుతం –న శివేన సమో దేవో న తారేణ సమో మంత్రః ‘’-గంగతో సమానమైనది ఏదీ లేదు .నీతో సమానమైన పుత్రుడు లేడు.శివునితో సమానమైన  దేవుడు లేడు.ఓంకార  మంత్రం తో సమానమైన మంత్రం లేదు ‘’అన్నారు.రాముడు చేసిన పితృకర్మవలన అతని పిత్రుదేవతలంతా తరించారనీ ఇంకా ఏమీ చెయ్యక్కరలేదని యధేచ్చగా తన వన ప్రయాణం సాగించమని ఆనతిచ్చారు .రాముడు అక్కడే శివలింగం ప్రతిష్టించి ,పూజించి అభిషేకించి ,స్తుతించాడు –‘

‘’నమామి శంభుం పురుషం పురాణం ,నమామి సర్వజ్ఞ మపర భవం –నమామి రుద్రం ,ప్రభు మక్షయం తమ్,నమామి శర్వం శిరసా నమామి ‘’రామ స్తుతికి పరమేశ్వరుడు పరమ సంతోషించి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ‘’నేను చేసిన స్తోత్రం తో నిన్ను తృప్తి పరచే భక్తులకు కార్య సిద్ధి కలిగించు .పితరులకు కొడుకు పిందప్రదానామ్ చేస్తే  వారు పవిత్రులై స్వర్గం చేరాలి .ఈ తీర్ధం లో చేసిన స్నానాదులన్నీశారీరక మానసిక పాపాలు తొలగించాలి .ఇక్కడ చేసిన స్వల్పదానమైనా అక్షయ దానం కావాలి ‘’అనికోరాడు .శివుడు రాముని మనసు గ్రహించి ‘’ఏవమస్తు ‘’అన్నాడు .ఇదే రామ తీర్ధం .లక్షణుడు వదిలిన బాణం పడిన చోటు  బాణ తీర్ధం ‘’.సీతా స్నానఘట్టం ‘’సీతా తీర్ధం ‘’అయ్యాయి అని బ్రహ్మ నారదుడికి వివరించాడు .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

17-2-19ఆదివారం ఉదయం విజయవాడ మొగల్రాజపురం మధుమాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శ్రీ అడిగోపుల వెంకటరత్నం గారి 24వ కవితా సంపుటి ”పదండి ముందుకు ”ఆవిష్కరణ

17-2-19ఆదివారం ఉదయం విజయవాడ మొగల్రాజపురం మధుమాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శ్రీ అడిగోపుల వెంకటరత్నం గారి 24వ కవితా సంపుటి ”పదండి ముందుకు ”ఆవిష్కరణ

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి ఉయ్యూరు, రోటరీ క్లబ్ వారి శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుక

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉయ్యూరు ,మరియు స్థానిక రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలతో  సంయుక్తంగా శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి ముందువచ్చే ఆదివారం 31-3-19 సాయంత్రం 3గంటలకు కే.సి .పి.షుగర్ ఫాక్టరీ దగ్గరున్న  రోటరీక్లబ్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నాము .సాహిత్యాభిమానులూ, కవిమిత్రులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానిస్తున్నాము .

              కార్యక్రమము

మధ్యాహ్నం -3-30గం-లకు అల్పాహారం

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల  శ్యామలాదేవి-సరసభారతి గౌరవాధ్యక్షులు

సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి

ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకటబాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు

గౌరవ అతిధి-శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ౦ అధ్యక్షులు

ఆత్మీయ అతిధులు  – శ్రీమతి గుళ్ళపల్లి రామమూర్తి రాధిక –ప్రముఖ పర్వతారోహకురాలు ,ఆంధ్రప్రదేశ్ సూపరి౦టె౦డ్ ఆఫ్ పోలిస్ ,ఆక్టోపస్  -విజయవాడ

 శ్రీ విద్యానంద ,శ్రీ చక్రార్చన పరాయణ ,ఆధ్యాత్మిక గ్రంథకర్త , నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి M.E..(హైదరాబాద్ )

శ్రీ ప్రాస మణి-కావలి

  డా.ఉప్పలధడియం వెంకటేశ్వర- తెలుగు ,హిందీ భాషాకవి ,గ్రంథకర్త ,జనని సాహిత్య సంస్థ నిర్వాహకులు –చె న్నై

 –శ్రీ జి.వెంకటేశ్వరరావు –సియివో- .కె.సి.పి .

                        శ్రీ కొలుసు పార్ధసారధి –మాజీ మంత్రి వరేణ్యులు

                        శ్రీ పులి శ్రీనివాసరావు –రోటరీ క్లబ్ అధ్యక్షులు

శ్రీచలపాక ప్రకాష్ –రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి

శ్రీ అల్లూరు శివ కోటేశ్వరరావు –వ్యాస బృందం –ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు –కారం చేడు

ప్రత్యేక ఆహ్వానితులు –శ్రీమతి వేగరాజు సీత –డా.రామయ్యగారి సోదరి (హైదరాబాద్ )

-‘’ శ్రీమతి గోవి౦దరాజు ఇందుమతి    –అమెరికా లోని నాష్ విల్ లో 40ఏళ్ళక్రితం  డా రామయ్య గారి  కుటుంబ ఆత్మీయురాలు –విజయవాడ

    ఆహ్వాని౦చు వారు

శ్రేమతి జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –అధ్యక్షులు శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –కార్య దర్శి శ్రీ గబ్బిట వెంకటరమణ –కోశాధికారి ,శ్రీ విబిజి రావు –సాంకేతిక నిపుణులు

మరియు రోటరీ క్లబ్  –ఉయ్యూరు

సాయంత్రం -4గంనుండి -5-30గం వరకు కవి సమ్మేళనం

అంశం –‘’స్త్రీ శక్తి ‘’(ప్రబోదాత్మక , ,ప్రమోద ,ప్రణయాత్మక  ,ప్రమాదా౦తక స్త్రీశక్తి )

 కవి సమ్మేళన నిర్వహణ –శ్రీమతి కోనేరు కల్పన,శ్రీమతిపద్మావతి శర్మ (విజయవాడ )

  శ్రీమతి కె .కనక దుర్గా మహలక్ష్మి,శ్రీమతి గుడిపూడి రాధికారాణి –మచిలీపట్నం

సాయంత్రం -5-30 గం .నుండి 5-45గం.వరకు  పుస్తకావిష్కరణ

4.శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి(19,20,21 ) ,సరసభారతి ప్రచురించిన (31,32,33)మూడు పుస్తకాలు 1- ‘’అణు శాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకటరామయ్య’’( 117వ మూలకం ‘’టెన్నిస్సిన్’’కనిపెట్టిన ఆంధ్ర శాస్త్రవేత్త –అమెరికా )-స్పాన్సర్ శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు –అమెరికా ‘’

  ఆవిష్కరణ –శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్  , శ్రీ జి. వెంకటేశ్వరరావు 

2 –‘’ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత కీ.శే.డా.పుచ్చా వెంకటేశ్వర్లు’’ ( లేజర్ కిరణాలపై నూతన ఆవిష్కరణలు చేసి  ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ .ఐ .టి .,,అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటి ల నిర్మాణానికి కారకులైన తెలుగు శాస్త్ర వేత్త )-అంకితం –అణుశాస్త్రవేత్త డా ఆకునూరి వెంకటరామయ్య గారికి (అమెరికా )

  ఆవిష్కరణ –శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య- ,డా.ఉప్పలధడియం వెంకటేశ్వర

 3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 –రెండవభాగం (254 శ్రీ ఆంజనేయ దేవాలయ విశేషాలు )

ఆవిష్కరణ –బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీమతి గుళ్ళపల్లి రామమూర్తి రాధిక

సాయంత్రం -5-45గం.నుండి 6-45గం .వరకు శ్రీ వికారి ఉగాది పురస్కార ప్రదానం,స్వీకర్తల స్పందన

1-కీ.శే.గబ్బిట మృత్యుంజయ  శాస్త్రి  శ్రీమతి భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు

స్వీకర్తలు – 1-  బ్రహ్మశ్రీ. నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి

2- డా ఉప్పలధడియం వెంకటేశ్వర –

3-శ్రీప్రాసమణి-

4- శ్రీ గీతా సుబ్బారావు –ప్రముఖ కార్టూనిస్ట్ ,కవి ,హాస్య రచయిత-హైదరాబాద్

5- శ్రీ మల్లంపల్లి విజయనీ మహా కాళేశ్వరావు- రిటైర్డ్ జూనియర్ తెలుగు  లెక్చరర్ – కాకినాడ

2- ‘’స్వయం సిద్ధ ఉగాది పురస్కారం ‘’

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీమతి ప్రభావతి

స్వీకర్తలు -1-శ్రీమతి గుళ్ళపల్లి రామమూర్తి రాధిక –

 2- శ్రీమతి కమలాకర్ భారతి –కమలాకర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ,శ్రీ వికాస భారతి స్కూల్ ,,ఓల్డేజి హోమ్ స్థాపక నిర్వాహకురాలు ,ప్రముఖ సామాజిక  సేవా కర్త  –హైదరాబాద్

3- డా.కోనేరు లక్ష్మీ ప్రమీల –‘’పేరంటాలు ‘’పరిశోధక గ్రంథ రచయిత్రి –విజయవాడ

4-కుమారి చలమల శెట్టి నిఖిల –మహిళా వ్యక్తిత్వ వికాస రచయత్రి –విజయవాడ

5-శ్రీ దాసు అచ్యుతరావు -మహాకవి దాసు శ్రీరాములుగారి మునిమనవడు,దాసు   శ్రీరాములుస్మారక సమితి నిర్వాహకులు  -హైదరాబాద్

6- శ్రీ కొల్లూరి వెంకట  రమణ –తెలుగు విద్యార్ధి మాసపత్రిక నిర్వాహకులు –హైదరాబాద్

7- శ్రీ కడలి వెంకట రమణా రావు –విజయలక్ష్మీ ప్రెస్ –ఉయ్యూరు

8-శ్రీ  ప్రకాష్ –జర్నలిస్ట్ –ఉయ్యూరు

సాయంత్రం 6-45నుండి రాత్రి 7-30 వరకు – శ్రీ ‘’ప్రాస మణి’’ గారి ప్రత్యేక ప్రసంగం

సభ నిర్వహణ సహకారం –డా.. గుంటక వేణు గోపాలరెడ్డి ,,డా దీవి చిన్మయ ,,గబ్బిట రామనాథబాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతంరాజు మల్లిక ,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ,,చౌడాడ అప్పలనాయుడు

 కవి సమ్మేళనం లో పాల్గొను కవి మిత్రులు శ్రీ చలపాక ప్రకాష్ , శ్రీ బండా వెంకటరామారావు ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,శ్రీ మునగంటి వేంకట రామాచార్యులు శ్రీ పంతుల వెంకటేశ్వరరావు,శ్రీ దండిభొట్ల దత్తాత్రేయ శర్మ  శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ శ్రీటేకుమళ్ళ వెంకటప్పయ్య, శ్రీ విష్ణుభొట్ల రామకృష్ణ ,శ్రీమతి మందరపు హైమవతి ,,శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,శ్రీమతి వి. ఉమామహేశ్వరి , ,శ్రీ మతి లక్కరాజు వాణీ సరోజినీ  ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి ఎస్.అన్నపూర్ణ  .శ్రీమతి కొమాండూరికృష్ణ శ్రీమతి మద్దాళి నిర్మల,శ్రీమతి సామినేని శైలజ ,శ్రీమతి డి.స్వాతి ,శ్రీమతి వి.విజయశ్రీ దుర్గ   (విజయవాడ ) శ్రీ జి విజయకుమార్ (నందిగామ ) ,, శ్రీ వసుధ బసవేశ్వరరావు ,శ్రీ వి.రాఘవాచారి ,శ్రీమతి పుట్టి నాగ లక్ష్మి (గుడివాడ) శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లె ) ,శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం(ఆకునూరు)శ్రీమతి వారణాసి సూర్యకుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల , ,శ్రీమతి కందాళ జానకి  శ్రీ మహమ్మద్ సిలార్ , (మచిలీ పట్నం)మాదిరాజు శ్రీనివాసశర్మ ,శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు)

సభ నిర్వహణ సహకారం –డా.. గుంటక వేణు గోపాలరెడ్డి ,,డా దీవి చిన్మయ ,,గబ్బిట రామనాథబాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతంరాజు మల్లిక ,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ,,చౌడాడ అప్పలనాయుడు

అన్ని వివరాలతో ముద్రించిన ఆహ్వానం  మార్చి  రెండవవారం లో అందజేస్తాం .  

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

                                      శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో                                 

                          గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -17-2-19-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -39 54-రామ తీర్ధం -1

గౌతమీ మాహాత్మ్యం -39

54-రామ తీర్ధం -1

భ్రూణ హత్యా పాతక౦  నుండి విముక్తి చేసే రామ తీర్ధం గురించి నలువ నారదునికి తెలియజేశాడు .ఇక్ష్వాకు వంశరాజు దశరధమహారాజు శౌర్య బల వంతుడు వివేకి .అతని రాణులు కౌసల్య సుమిత్ర కైకేయి .వసిస్ట  మహర్షి వంశపారంపర్య పురోహితుడు .ప్రజలను కన్నతండ్రిలాగా ధర్మ రక్షణగా పాలించాడు .కానీ దేవదానవులకు తరచుగా యుద్ధాలు జరిగేవి .విజయం ఇద్దరివైపు దోబూచులాడేది .ఒక సారి దేవతలతో బ్రహ్మ యుద్ధం మానమని బోధించాడు .ఆయన మాట వినకుండా మళ్ళీ దైత్యులతో భీకర యుద్ధం చేశారు .తర్వాత దేవతలు రాక్షసులు  విష్ణు మూర్తిని, శివునిచేరి యుద్ధ విషయం చెప్పారు .ఆ ఇద్దరూ దేవదానవులు ముందుగా తపస్సులో బలవంతులైనతర్వాత యుద్ధం చేయమని చెప్పారు .

  దేవాసురులు తపస్సు ప్రారంభించారు .కాని మనసులో ద్వేషాగ్ని రగులుతూనే ఉంది .తపస్సు మానేసి మళ్ళీ  ఘోరంగా యుద్ధం చేశారు  .దేవతలు అపజయం పాలయ్యారు.అప్పుడు ఆకాశవాణి ‘’ఎవరి పక్షాన దశరధ మహారాజు ఉంటాడో వారికే విజయం కలుగుతుంది ‘’అని చెప్పింది .వాయుదేవుడు ము౦దుగా దశరధుని దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెవిలో వేసి ఆయనను తమపక్షాన ఉండమని వేడుకొన్నాడు .సరేనని ఒప్పుకొన్నాడు .వాయువు వెళ్ళగానే రాక్షసులు కూడా వచ్చి తమపక్షాన నిలిచి విజయం అందించమని వేడుకొన్నారు .

  దశరధుడు రాక్షసులతో అంతకు ముందే వాయువు వచ్చి తన సాయం దేవతలకు కావాలని కోరగా సరే అని ప్రతిజ్ఞ చేశానని చెప్పాడు .ఇచ్చిన మాట ప్రకారం స్వర్గానికి వెళ్లి దేవతలా తరఫున నిలిచి ,రాక్షసులతో యుద్ధం చేశాడు .ఆ యుద్ధం లో నముచి సోదరులైన రాక్షసులు ఆయన రధ చక్ర సీలను తీక్ష్ణ బాణాలతో విరగ్గొట్టారు .యుద్ధ తీవ్రతత లో ఉన్న రాజు దీన్ని గమనించలేదు. కాని ఆయనతో యుద్ధానికి వచ్చిన రాణి కైక గమనించి ,రధ గమనం ఆగకుండా చేయటానికి తన వ్రేలు సీలగా పెట్టింది ..దశరధుడు భీకర సంగ్రామం చేసి దైత్యులను ఓడించి సురలకు విజయం చేకూర్చి పెట్టాడు .తమకు చేసిన సాయానికి మిక్కిలి సంతసించి దేవతలు ఆయనకు అనేక వరాలు ప్రసాదించారు .విజయం తో అయోధ్యకు తిరిగి వస్తున్న రాజు కైక చేసిన సాహసాన్ని , త్యాగాన్నివిస్మయంతో మెచ్చుకొని మూడు వరాలు ఇస్తానని వాగ్దానం చేశాడు .ఆమె’’ మీవరాలు మీదగ్గరే ఉండనివ్వండి ‘’  అని వినయం గా చెప్పింది .అనేక ధనకనక వస్తు వాహనాలతో ఆమెకు సంతోషం కలిగించాడు .

  ఒకసారి దశరధుడు వేటకు వెళ్లి ,పల్లపు ప్రాంతాలలో దాక్కొని  నీళ్ళు తాగే మృగాలను వేటాడాడు .అదే సమయం లో అక్కడున్న  గ్రుడ్డి వాడు చెవిటి వాడు అతి వృద్ధుడు  వైశ్రవణుడు ,భార్య తమ ఒక్కగానొక్క కొడుకుతో దాహంగా ఉంది నీళ్ళు తెచ్చిపెట్టమని అడిగారు .తలిదండ్రులపై అత్యంత భక్తీ శ్రద్ధలతో సేవిస్తున్న ఆకొడుకు వారిద్దరినీ చెట్టుకొమ్మ మీదకు జాగ్రత్తగా ఎక్కించి ,నీళ్ళు తీసుకు రావటానికి వెళ్ళాడు .నీటి మడుగులో కలశం ముంచి నీరు తీసుకొంటుండగా వచ్చిన శబ్దం యేనుగుది అనుకోని రాజు నిశిత బాణాలు వేశాడు .వనగజాలు సంహార యోగ్యాలుకావని తెలిసినా ఆపని చేశాడు విధి వక్రించి .ఆ కుర్రాడు  గాయం తో ‘’సద్బ్రాహ్మణుడైన నన్ను అనవసరంగా నా దోషం ఏమీ లేకుండా గాయపరచినవారేవ్వరు ‘’అన్నాడు బాధతో .రాజు నిస్చేస్టుడై ఆ శబ్దం వచ్చిన చోటుకు వెళ్లి చూసి ,పశ్చాత్తాపం తో కూలిపోయాడు  .నెమ్మదిగా తేరుకొని అతని గురించి వివరాలు అడిగి తెలుసుకొని ,ఆతడు కోరినట్లుగా కలశం లోని మంచి నీటిని తీసుకొని అతని తలిదంద్రులదగ్గరకు వచ్చాడు .ఆ కుర్రాడి ప్రాణం పోయింది ..

  కొడుకు యెంత సేపటికీ రానందున వృద్ధ దంపతులు ఎదురు చూస్తూ దుఖిస్తున్నారు .రాజు నీళ్ళు అందించాడు .వచ్చింది తమ కుమారుడు కాదని గ్రహించి అతడేవ్వరో చెప్పమన్నారు .విషయమంతా వివరించగా తమ కొడుకు దగ్గరకు తీసుకు వెళ్ళమని కోరగా తీసుకు వెళ్ళాడు .కొడుకు శవం పై పడి విపరీతంగా దుఃఖించి ,దశ రదునికి కూడా వార్ధక్యం లో పుత్ర వియోగం కలిగి ఆబాధతో మరణిస్తాడని శాపం పెట్టి ,చనిపోయారు .

   రాజు దుఖభారం తో అయోధ్యకు వెళ్లి వసిష్ట మహర్షికి సర్వం నివేదించాడు .ఆయన ఆలోచించి అశ్వమేధ యాగం చేయమని చెప్పాడు. గాలవ ,జాబాలి ,వామదేవ, కశ్యపాది మునిశ్రేస్టుల  సాయంతో అశ్వమేధ యాగం చేశాడు .యాగం సమాప్తమవుతున్న సమయం లో ఆశరీరవాణి రాజుకు పుత్రులు కలుగుతారని,  జ్యేష్ట పుత్రుని పుణ్య ప్రభావం తో  రాజు నిష్పాపుడు అవుతాడని ప్రకటించింది .దశరధుని రాణులు కౌసల్యకు రాముడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కైకకు భరతుడు పుత్రులుగా జన్మించారు .ఈనలుగురుకుమారులు విద్యా వినయ సంపన్నులైనారు .ఒకరోజు విశ్వామిత్ర మహర్షి తన యాగ రక్షణకు రాముని పంపమని రాజునుకోరగా ,కుదరదనగా వసిస్టుడు నచ్చ చెప్పగా రామ  లక్ష్మణులను పంపాడు .వారిద్దరికీ మహర్షి మహేశ్వర సంబంధమహా విద్య ,ధనుర్విద్య మొదలైన శస్త్రాస్త్ర విద్యనూ ,లౌకిక విద్య ,రధ గజ  తురగ గదాది   విద్యలనన్నిటినీ ప్రయోగ ఉపసంహారాలతో సహా ఉపదేశించాడు .తాపసుల రక్షణార్ధం రాముడు తాటక రాక్షసిని చంపాడు .అహల్య శాప విమోచనం చేశాడు .యాజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి వచ్చిన రాక్షసులను సంహరించారు సోదరులు .విశ్వామిత్ర యాగ సంరక్షణ చేసి ముని ప్రశంసలు పొందారు .

  విశ్వామిత్ర మహర్షి శిష్యులను మిధిలకు తీసుకు వెళ్లగా  సీతా స్వయం వరం లోరాముడు  శివ చాపం ఎక్కుపెట్టగాఅది విరిగి పోయింది దశరధాదులను సగౌరవ౦గా ఆహ్వాని౦చి   కూతురు సీతను రామునికిచ్చి వివాహం చేశాడు  మిగిలిన సోదరులకు తన తమ్ముల కూతుర్లనిచ్చి వైభవంగా వివాహం జరిపించారు .రాజు రామునికి పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకోనాలని భావించగా కైక దాసీ మంధర రాజు  పూర్వమిచ్చిన వరాలు జ్ఞాపకం చేయగా ఆమె రామ వనవాసం కోరగా తట్టుకోలేక పోయాడు .తండ్రికిచ్చిన మాటనిలబెట్టుకోవటానికి రాముడు సీతతో  లక్ష్మణుడితో వనవాసానికి వెళ్ళాడు  .రాజు రామ వియోగంతో చనిపోయాడు భరతుడు వచ్చి బాధపడ్డాడు  . ,

  దాశరధ మహారాజును యమభటులు యమలోకానికి తీసుకు వెళ్లి అనేక నరకాలలో అనేక శిక్షలు వేశారు –శరీరాన్ని వండారు ,ముక్కలుగా కోశారు ,ముద్ద చేశారు,ఎండగట్టారు .పాములతోకాటు వేయించారు ,దాహం ఇవ్వకుండా బాధించారు  .రాముడు చిత్రకూటం చేరి మూడేళ్ళు ఉండి,దండకారణ్యం ప్రవేశించి ,అక్కడ మునులను బాధపెడుతూ యజ్ఞయాగాదులను పాడు చేస్తున్న రాక్ష సమూహాలను మునులకోరికపై సంహరించాడు .అక్కడి నుండి గంగా తీరం చేరుకొన్నాడు భార్యా సోదరు లతో .రాముడు గౌతమీ తీరం చేరాడని తెలుసుకొన్న యముడు దశరధునికి నరకం నుండి విముక్తి కలిగించమని ,గౌతమీ నదికి అయిదు యోజనాల పర్యంతం రాముడున్నంత వరకు అతని తండ్రికి నరకబాధ ఉండరాదని   ఆదేశించాడు .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

16-2-19శనివారం ఉదయం మా ఇంట్లో మా శిష్యుడు చి చిలుకూరి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దక్షిణ భారత దేశం లోనవ దంపతులకు  అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించటం లో అంతరార్ధం –

దక్షిణ భారత దేశం లోనవ దంపతులకు  అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించటం లో అంతరార్ధం

–డా,ఏ.వి రామయ్య మరియు షెర్రీ థాంప్సన్–డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ -వాండర్ బిల్ట్ యూని వర్సిటీ  -నాష్ విల్ -టెన్నెస్సీ -యు ఎస్ ఏ .

 

దక్షిణ భారత దేశం లో కొత్తగా పెళ్ళైన దంపతులకు పురోహితుడు దగ్గరుండి రాత్రివేళ అరుంధతీ నక్షత్రాన్ని చూపించటం అనూచానంగా వస్తున్న సంప్రదాయం .మినుకు మంటున్న ఈ తార ను దర్శిస్తూ ,కొత్త పెళ్లి కూతురూ పెళ్ళికొడుకు తాము అరుంధతీ వసిష్ట దంపతులలాగా అన్యోన్యంగా కలకాలం జీవిస్తామని ప్రమాణం   చేస్తారు .ఈనాటికీ వివాహాలలో పాటిస్తున్న ఈ పురాతన సాంప్రదాయానికి ఉన్న ప్రాముఖ్యత, అంతరార్ధం ఏమిటి ?.ఖగోళ విషయంగా అరుంధతీ నక్షత్ర  అవగాహన కలగటం ఉపయోగకరమైన విషయం .

రాత్రి వేళ ఆకాశం లో సప్తరుషి నక్షత్రాల ఆకారం  స్పష్టంగా గుర్తింపుగా కనిపిస్తుంది .  వివిధ సంస్కృతులు ఈ ఆకారాన్ని పొట్టి తోక ఉన్న పాడే పిట్ట డిప్పర్ గా ,గరిటె గా ,నాగలిగా ,పొడవైన పార గా గుర్తిస్తే ,ఈజిప్ట్ దేశంవారు హిప్పో పొటామస్ జంతువుగా ,ఎద్దు  వెనుక కాళ్ళు గా భావించారు .

నక్షత్ర సముదాయాలు  ,నక్షత్ర రాశులకంటే కంటే భిన్నమైనవి .ఆకాశం 88అధీకృత రాశులుగా విభజింపబడింది .అలాగే భారత దేశమూ 29 రాష్ట్రాలుగా విభజింపబడింది .నక్షత్ర సముదాయాలు కొన్ని నక్షత్రాలకూడలిగా మనకు బాగా తెలిసిన ఆకారాలుగా అంటే కుండ ఆకారం గా  ధనుస్సు ఆకారంగా కనిపిస్తాయి .నక్షత్ర సముదాయాలు ఒక్కోసారి నక్షత్ర రాశుల అంచులను  కూడా  దాటిపోవచ్చు .కానీ సప్తర్షి మండలం మాత్రం ఉర్సా మేజర్ నక్షత్ర రాశి పరిధిలోనే ఉంది .నక్షత్రాలు  హైడ్రోజెన్ హీలియం వాయువుల ,మరికొన్ని తక్కువ ప్రమాణమున్న మూలకాల  సమాహారంగా గురుత్వాకర్షణతో కలిసి ఉంటాయి .వీటి లోతైన మధ్యభాగం కోర్ లోహైడ్రోజెన్ న్యుక్లియస్ ల ఘర్షణ వలన  నక్షత్రాలు హీలియం ,రేడియేషన్ ల ఉత్పత్తి చేసి శక్తిజనకాలౌతాయి .మన సూర్య నక్షత్రం లోని కోర్ లో     ఈ రేడియేషన్ ఏర్పడి కోర్ పరిధి దాటితప్పించుకొని   ,అంచులకు చేరటానికి అనేక మిలియన్ సంవత్సరాల కాలం పడుతుంది .ఇలా తప్పించుకొన్న  రేడియేషన్ 8 నిమిషాలకాలం లో భూమిని చేరి వెలుతురూ వేడిఅందిస్తుంది .సూర్య నక్షత్రం లో జరిగే ఈ న్యూక్లియర్ చర్యలు  అనేక వందల బిలియన్ల నక్షత్ర సముదాయాలున్న పాలపుంత లలో లోనూజరిగి , మనకు కనిపించే  వందల బిలియన్ల గెలాక్సీ లలోనూ  నిరంతరం జరుగుతూనే ఉంటుంది .

 

ఒకప్పుడు సూర్య నక్షత్రాన్ని 109భూగోళాలు పట్టేఆకారం ,మన సౌర వ్యవస్థ ద్రవ్యరాశిలో 99.86 శాతం ద్రవ్య రాశి ,ఉపరితల ఉష్ణోగ్రత 5,500 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న సరాసరి నక్షత్రంగా భావించారు .కాని ఇటీవలికాలం లో చిన్నా చితకా పేలవంగా ఉన్న  వస్తువులను కూడా గుర్తించ గలిగిన సామర్ధ్యం  ఖగోళ శాస్త్ర వేత్తల కు కలిగింది .ఇప్పుడు  సూర్యనక్షత్రం  అక్కడున్న నక్షత్రాల  కంటే కనీసం  ముప్పాతిక ఎక్కువ ప్రకాశవంతం వంతమైనదని  తేల్చారు  .రాత్రివేళ ఆకాశం లో కనిపించే చిన్నగా ,పేలవంగా కనిపించే  నక్షత్రాలు ,సప్తర్షి మండల నక్షత్రాలు సూర్యునికన్నా చాలా పెద్దవి ,ఎక్కువ ప్రకాశం కలవి అని తెలియ జేశారు .

సప్తర్షి మండల నక్షత్రాలను భారతీయులు ప్రత్యేక పేర్లతోనూ ,పాశ్చాత్యులు వేరొక పేర్లతోనూ పిలిచారు కానీ ఖగోళ వేత్తలు  మాత్రం ఈ నక్షత్రాలకు ‘’బేయర్’’పేర్లు పెట్టారు .బేయర్ పేరు లేక హోదా ఉన్న నక్షత్రం గ్రీకు అక్షరం తోనూ దానితర్వాత దాని మాతృకూటమి పేరున్న లాటిన్ అక్షరం తోనూ  గుర్తింపు పొందుతుంది .ఉదాహరణకు ‘’ఉర్సే  మేజర్ ‘’లోని అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ‘’క్రతు ’’ .దీన్ని ‘’ఉర్సే మేజారిస్ ‘’(Uma)గా గుర్తిస్తారు .ఆ నక్షత్ర కూటమిలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాన్ని ఆల్ఫా ,అంతకంటే తక్కువ కాంతి కలదాన్నిబీటా అనీ అలాగే మిగిలినవి కూడా .గ్రీకు అక్షరాలు పైనుంచి కిందకు వచ్చేకొద్దీ నక్షత్ర కాంతి తగ్గిపోతుందని భావం .

భారతీయ పురాణాలలో ఉన్న సప్త ఋషుల  పేర్లలో  కొన్ని మార్పులు కనిపిస్తాయి .అత్రి ,వసిష్ట పేర్లు అందరిజాబితాలలో ఉన్నాయి .కాలక్రమ౦లో మిగిలిన అయిదుగురి పేర్లు మారాయి .మధ్యయుగం లో కలికాల మహాత్మ్యం వలన అసలైన జాబితా కనుమరుగైంది .ఇప్పుడు మనం సప్త రుషులపేర్లు, వాటి బేయర్ పేర్లూ  తెలుసుకొందాం .

 

భారతీయ పేరు బేయర్ గుర్తింపు పాశ్చాత్య దేశాలలో పేరు
క్రతు α Uma దుభే
పులహ β UMa మెరాక్
పులస్త్య g Uma ఫెక్డా
అత్రి d Uma మెర్గ్రెజ్
అంగీరస e Uma అలియోత్
వసిష్ట z Uma మీజర్
భ్రుగు h Uma అలియోత్

 

మానవ జాతి చరిత్రలో సప్తర్షి మండల ఆకారం  దాదాపు ఒకే రకంగా ఉంది .అయితే అత్యంత దీర్ఘకాలాలలో మార్పులు పొందుతుంది .సప్తరుషి నక్షత్రాలలో అయిదు నక్షత్రాలు ‘’ఉర్సే మేజర్  మూవింగ్ క్లస్టర్ ‘’  కు సన్నిహితమైన నక్షత్ర సంబంధమైన వాటిలో సభ్యత్వమున్నవే .ఇవన్నీకలిసే విశ్వమంతా ప్రయాణం చేస్తాయి .ఈ అయిదు నక్షత్రాలు సప్తర్షి మండల ఆకారానికి దోహదంచేస్తాయి .

క్రతు, భ్రుగు నక్షత్రాలు డిప్పర్  ఆకార వినాశానికి ఎక్కువ దోహదం  చేస్తాయి .ఈ రెండు నక్షత్రాలు ఆకూటమికి  ఎదురెదురు దిశలలో ఉంటాయి .కానీ రెండూకలిసి   ఉర్సా మేజర్ మూవింగ్ క్లస్టర్  ప్రయాణ దిశకు వ్యతిరేక దిశలో అంతరిక్షం లో కదుల్తాయి .అదే పరిధిలో ఉన్నట్లు కనిపించినా క్రతు ,భ్రుగు నక్షత్రాలు అంతరిక్షం లో భూమికి  చాలా దూరం లో ఉంటాయి .కాని అత్యంత ప్రకాశ వంతమైన నక్షత్రాలుకనుక ఆకాశం లో మిగిలిన అయిదు నక్షత్రాల కు దగ్గర గా ఉన్నట్లు కనిపిస్తాయి .

 క్రతు,భ్రుగు లమధ్య ఉన్న భేదాన్ని మిగిలిన అయిదు నక్షత్రాల విషయాలను  కాలమే తెలియజేయాలి .అంతరిక్షం లో నక్షత్రాల గమనాన్ని ‘’ప్రాపర్ మోషన్ ‘’అంటారు .ఒక స్థిర నక్షత్రం అంతరిక్షం లో సూర్యుని అసలు గమనానికి సంబంధమైన స్పష్టమైన గమనం లో కొంతభాగాన్నేప్రాపర్ మోషన్ అంటారు .ఎట్టకేలకు క్రతు భ్రుగు ల ప్రాపర్ మోషన్ సప్ర ఋషుల కాలమానాన్నీ ,ఆకారాన్నీసాగదీస్తాయి .ఈవిషయం క్రీ పూ.లక్ష సంవత్సరాలనుంచి క్రీ.శ లక్ష సంవత్సరాలవరకు ఉన్న రెండు లక్షల  సంవత్సరాలకాలం లో ఆ నక్షత్రాల స్థానాలను ఈ క్రింది చిత్రం చక్కగా తెలియ జేస్తుంది .
సంవత్సరాలకాలం లో ఆ నక్షత్రాల స్థానాలను ఈ క్రింది చిత్రం చక్కగా తెలియ జేస్తుంది .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కాని   నూతన వధూవరులు ఆకాశం లో  సప్తర్షి మండలం లోని ప్రాపర్ మోషన్ ను చూడటానికి ఉద్దేశించరు.1869లో ఆంగ్ల ఖగోళ వేత్త ఆర్ .ఏ. ప్రోక్టార్ సప్త ఋషుల ప్రాపర్ మోషన్ ను కనిపెట్టటానికి  ,చాలాకాలానికిపూర్వమే ఈ ఆచారం అమలులో ఉంది .  కాని నక్షత్రాల దూరంగా వెడలె నడక సామాన్య మానవ కంటికి గుర్తించటం అసాధ్యం ,సప్తర్షులలో మరో రహస్యం దాగి ఉంది .జపనీయులలాగే ప్రాచీన ఆరబ్బులూ ఈ రహస్యాన్ని కనిపెట్టారు .అందుకే దక్షిణ భారత వివాహాలలో లాగే వారూ అరుంధతీ నక్షత్రం చూపించటం ఆచారంగా పెట్టుకొన్నారు .రాత్రి వేళ నిర్మలాకాశం లో సప్తర్షి మండలం లో ఒక జంట నక్షత్రాలు కనిపిస్తాయి .వసిష్ట నక్షత్రానికి తోడుగా తక్కువ కాంతి కల నక్షత్రం అరుంధతి  కనిపిస్తుంది.ఈ జంట నక్షత్రాలలో ఒకటి అశ్వ రూపం లో ఉన్న వసిష్ట ,రౌతు రూపం లో ఉన్న అరుంధతి నక్షత్రాలు .

నక్షత్రాల లో సూర్యుడు చాలా అల్పసంఖ్యాకవర్గం అంటే మైనారిటీ వాడు .ఒంటరిగా అత్యంత వేగం గా సూర్య నక్షత్రం ప్రయాణిస్తుంది .మిగిలిన మెజారిటీ నక్షత్రాలు జంటగానో ఇంకా ఎక్కువ వాటితోనో కలిసి ప్రయాణిస్తాయి.  ఇవి అతిదగ్గరగా కదలటం,అతి కాంతి హీనంగా ఉండటం  వలన సామాన్య మానవ నేత్రం వీటిని  స్పష్టంగా చూడలేదు .

అరుంధతి ,వసిష్ట నక్షత్రాలు ఉర్సే మేజర్ మూవింగ్ క్లస్టర్ లో సభ్యులే కనుక అంతరిక్షం లో ఈ రెండూ కలిసే ప్రయాణిస్తాయి .ఈ అద్వితీయ జంట నక్షత్రాలు పూర్వకాలం వారికి ఆప్టికల్ డబుల్ స్టార్స్ అంటే దృశ్య సంబంధమైన జంట నక్షత్రాలుగా కనిపించాయి .చూసేవారికి   ఆ రెండూ ఒకే దృష్టి మార్గం లోఉన్నట్లు కనిపించటం వలన కలిసి ఉన్నట్లు అనిపిస్తాయి .సుదూరం లో ఉన్న ఇద్దరు  వ్యక్తులు  మనవైపుకు వస్తున్నప్పుడు వారు ఒకరికొకరు దూరం లో ఉన్నా ,ఇద్దరూ అతి దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తారు .

ఖగోళ శాస్త్ర వేత్తలు ఇటీవలికాలం లో అరుంధతి వసిష్ట నక్షత్రాలు గురుత్వాకర్షణ  వలన ఒకరితో ఒకరు కలిసి బైనరి స్టార్ సిస్టం గా ఉన్నట్లు గుర్తించారు .కాని ఇదిపూర్తిగా నిర్డుస్టమైనదని  చెప్పలేము .బైనరి స్టార్స్ అంటే జంట నక్షత్రాలు ,ఆప్టికల్ డబుల్ స్టార్స్ అంటే దృశ్య సంబంధమైన ద్వంద్వ నక్షత్రాలకంటే భిన్నమైనవి .మొదటివి గురుత్వాకర్షణ శక్తితో కలిసిపోయినవి .రెండోవి అయిన దృశ్య సంబంద ద్వంద్వ నక్షత్రాలమధ్య బాంధవ్యమే లేదు .ఇదేకాక ఉల్సామేజర్ మువింగ్  క్లస్టర్ తో కలిసే ప్రయాణిస్తాయి .అంతేకాదు వసిష్ట ,అరుంధతీ నక్షత్రాలు  ఒకదాని వెంబడి జంట నక్షత్రాలుగా వాటి మధ్య ఉన్న కేంద్రం ఆధారంగా తిరుగాయి .

నక్షత్రాలు గురుత్వాకర్షణ శక్తితో కలిసి ఉన్నట్లు కనిపించినా అవి ఒకదానికొకటి చాలా దూరం లో ఉంటాయి .వీటి మధ్య దూరాన్నిసెకనుకు 300,000,000 మీటర్ల వేగం ఉన్న   కాంతి తో కొలుస్తారు . మనకు అతి దగ్గర గా ఉన్న నక్షత్ర౦ ‘’ప్రాక్సిమా సెంచురీ ‘’నుంచి భూమికి కాంతి ప్రయాణం చేయటానికి 4.2సంవత్సరాలు పడుతుంది .అరుంధతి నక్షత్రం నుంచి వసిష్ట నక్షత్రానికి కాంతి ప్రయాణం చేయటానికి 3 సంవత్సరాలు పడుతుంది .వసిష్ట నక్షత్రం నుంచి భూమికి కాంతి చేరటానికి 78 ఏళ్ళు పడుతుంది .అరుంధతి నక్షత్రం నుంచి భూమికి కాంతి చేరటానికి 81సంవత్సరాలు పడుతుంది .వసిష్ట ,అరుంధతి నక్షత్రాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరగటానికి ఎంతకాలం పడుతుందో ఇంకా తెలియదు .కొన్ని జంట నక్షత్ర కూటములు ఒకదాని చుట్టూ ఒకటి తిరగటానికి కొన్ని రోజులు మాత్రమె పడితే ,మరికొన్నిటికి లక్షలాది సంవత్సరాల కాలం పడుతుంది .ఒక్క వసిష్ట ,అరుంధతీ నక్షత్రాలకే సరైన పెర్లున్నాయికాని మిగిలిన జంట నక్షత్రాలకు పేర్లు లేనేలేవు .

 

 

 

 

 

 

 

 

 

 

అరుంధతి వసిష్ట నక్షత్రాల గురించి మరిన్ని రహస్యాలున్నాయి .చాలాకాలగా వసిష్ట నక్షత్రం ఒకే ఒక నక్షత్రం అని భావించబడింది .కాని ఆధునిక టెలిస్కోప్ లు వసిష్ట నక్షత్రం రెండు  జంట నక్షత్ర సముదాయమని అంటే నాలుగు నక్షత్రాలు ఒకదాని చుట్ట్టూ ఒకటి పరిభ్రమిస్తాయనితెలియ జేశాయి .ఈ నక్షత్రాలు అతి సమీపంగా ఉంటాయి ,స్పెక్ట్రో  స్కోప్ తోనే వాటిని వేరు చేయగలం .ఇటీవలి పరిశోధనలలో అరుంధతి కూడా రెండు నక్షత్రాల సముదాయమని తెలిసింది .కనుక వసిష్ట అరుంధతి నక్షత్రాలు కేవలం రెండు నక్షత్రాలు కాదు .ఆరు నక్షత్రాల సముదాయం అని తేలింది . కాలగమనం లో వసిష్ట ఒకే ఒక ప్రకశమానమైన సామాన్య నేత్రానికి కనిపించే నక్షత్రం అనే భావననుంచి పూర్వ ఖగోళ వేత్తలు దర్శించిన  ,అసాధారణ దృశ్యమానమైన జంట నక్షత్ర౦ అనే ప్రాచీనమైన భావన నుంచి ,కలిసిఉన్న సంక్లిష్ట నక్షత్ర కుటుంబం  అనే ఆధునిక భావానికి ,వచ్చాం .

వసిష్ఠ ,అరుంధతి నక్షత్రాలు జంట నక్షత్ర సముదాయం .. మన విశ్వం లో అనేక జంట నక్షత్ర సముదాయాలు ఉన్నా కూడా ,ఈ జంట నక్షత్రాలు అనంత  కాలం నుండీ విడిపోకుండా కలిసే ఉండటమే కాక, .సామాన్య మానవ నేత్రాలకు చూడటానికి కనిపిస్తు0డటం విశేషం .అందుకే వివాహాలలో నవ దంపతులకు అరుంధతీ వసిష్ఠ నక్షత్ర దర్శనం చేయించి ,ఆ  అన్యోన్య దాంపత్య  స్ఫూర్తిని కలిగిస్తారు ”.

అనువాదం –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-2-19-ఉయ్యూరు

Posted in సైన్స్ | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -38 53-పూర్ణాది తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -38

53-పూర్ణాది తీర్ధం

గంగకు ఉత్తరాన పూర్ణ తీర్ధముంది .దీనిలో హరి హరులుంటారు .పూర్వం కల్పం మొదట్లో ఆయువు కుమారుడు ధన్వంతరి ఉండేవాడు .ఆశ్వమేధాది అనేక యజ్ఞాలు చేసి ,ఎన్నో దానాలు ఇచ్చి పుష్కలంగా భోగభాగ్యాలతో వర్ధిల్లి ,చివరికి వైరాగ్యం కలిగి ,గంగా తీరం చేరి తీవ్ర తపస్సు చేశాడు .ఒకప్పుడు ధన్వంతరి రాజు చే ఓడి౦ప బడిన’’ తమాసురుడు’’ అనే రాక్షసుడు భయం తో వెయ్యేళ్ళు సముద్రం లో దాక్కొన్నాడు .ధన్వనతరి వైరాగ్యం ,అతనికొడుకు రాజ్యానికి రావటం తెలిసి వాడు సముద్రం నుంచి బయటికి వచ్చి, తపస్సులో ఉన్న ధన్వంతరిని చంపాలనుకొన్నాడు .

  తమాసురుడు స్త్రీ వేషం లో ,రాజు దగ్గరకొచ్చి వివిధ భంగిమలతో ,గాన నాట్యాలతో ఆకర్షించే ప్రయత్నం చేసింది .చాలాకాలం గమనించి ఆమెపై దయకలిగి,ఆమె ఎవరో ఎందుకు ఒంటరిగా అడవిలో ఆనందంగా ఎవరికోసం ఎదురు చూస్తున్నదో అడిగాడు .ఆమె తెలివిగాఅతనికోసమే తన తపన అంతా అన్నది .కరిగిపోయి రాజు ఆమెకు వశమయ్యాడు .అదే అదను అనుకోని తమాసురుడు ధన్వంతరి తపస్సు నాశనం చేసి వెళ్ళిపోగా, బ్రహ్మ తపో భ్రస్టు డైన  అతన్ని చేరి ,మనస్తాపం పోగొట్టే మాటలతో ఓదార్చి ,ఇంతటి పనికి పూనుకొన్నవాడు అతని పూర్వ శత్రువైన తముడు అనీ ,అతని దుఖం తీరాలంటే విష్ణు మూర్తి గురించి  తపస్సు చేయమని బోధించాడు .

  ధన్వంతరి విష్ణుమూర్తి ని ‘’జయ భూతపతే నాద ,జయ పన్నగ శాయినే ,-జయ సర్వగ ,గోవింద జయ విశ్వ కృతేనమః ‘’ ,’’జయ జన్మద జన్మిస్థపరమాత్మన్నమో స్తుతే –జయ ముక్తిద ముక్తిస్త్వం ,జయ భుక్తిజ కేశవ’’-త్వమేవ లోక త్రయ వర్తి జీవన నికాయ సంక్లేశ వినాశన దక్ష –శ్రీ పుండరీకాక్ష కృపానిధే త్వం ,నిధేహి ,పాణిం మమ మూర్ధ్ని విష్ణో’’అంటూ స్తుతించాడు .మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమికావాలని అడిగాడు .’’నాకు స్వర్గ రాజ్యం కావాలి ‘’అన్నాడు .తధాస్తు అని విష్ణువు అంతర్ధానమయ్యాడు .ధన్వ౦తరి  స్వర్గ లోకాధిపతి అయ్యాడు .ఇంద్రుడు అప్పటికే మూడు సార్లు పదవి కోల్పోయాడు .మొదటి సారి వృత్రాసుర సంహారం లో నహుషుని చేత ,రెండవసారి సింధు సేనుని వధ కారణంగా  ,మూడో సారి అహల్యా జారత్వం వల్ల ఇంద్రపదవి పోగొట్టుకొన్నాడు ..

 పదవిలేక ,వ్యాపకం లేక దిగులుతోదేవ గురువు బృహస్పతిని చేరి మొర పెట్టుకొన్నాడు.బ్రహ్మ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చాడు ఆయన .ఇద్దరూకలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్లి ప్రార్ధింఛి,బ్రహ్మను ఎందుకు శచీపతికి ఇలా జరుగుతోందని ప్రశ్నించాడు .బ్రహ్మ అంతర్ దృష్టితో చూసి ఇంద్రుడు ‘’ఖండ ధర్మం ‘’అనే దోషం తో పదవి పోగొట్టుకొన్నాడు అన్నాడు .నివారణ ఉపాయం అడిగారు .అన్నిటినీ పరిష్కరించేది గంగానది కనుక అక్కడికి వెళ్లి హరి,హర ధ్యానం చేయమని చెప్పాడు .  అల్లాగే చేశారు –

‘’నమో మత్చ్యాయ కూర్మాయ వరాహాయ నమో నమః –నారసింహాయ దేవాయ వామనాయ నమోనమః-నమోస్తు హరరూపాయ ,త్రివిక్రమ నమోస్తుతే –నమోస్తు బుద్ధరూపాయ ,రామ రూపాయ కల్కినే –తావన్నిః శ్రీకతా పుంసాం మాలిన్య౦ దైన్య మేవమే –యాపన్న యాన్తిశరణం హరే త్వాం కరుణార్ణవం’’అని ఇంద్రుడూ –

‘’సూక్ష్మం పరంజ్యోతి రన౦త రూప మోంకార మాత్ర౦ ప్రకృతేఃపరం యత్ –చిద్రూప మానంద మయం సమస్త మేవ౦ వదంతీశ ముముక్ష్వవస్త్వాం –ఆరాధ యంత్యత్ర భవంత మీశం ,మహా మఖైః పంచభి రప్య కామాః-సంసార సింధోః పరమాప్త కామా ,విశన్తి దివ్యం భువనం వపుస్తే ‘’

‘’స్థూలం చ సూక్షం త్వమనాది నిత్యం ,పితా చ మాతా యదసచ్చ సచ్చ-ఏవం స్త్వతో యః శ్రుతిభిః పురాణై ర్నమామి సోమేశ్వర మీశితారం ‘’అంటూ బృహస్పతీ ఇద్దరూ ఒకరి తర్వాత గుక్క తిప్పుకోకుండా స్తుతించారు.ప్రసన్నులైన హరి హరులు  వరం కోరుకోమన్నారు .ఇంద్రుడు ‘’శివా !నా రాజ్యం మాటిమాటికీ వస్తో౦ది ,పోతోంది .దీనికి నేను చేసిన పాపం ఏదైనా ఉంటె ఉపశమింప జేసి ,నా సంపద రాజ్యం సుస్థిరంగా ఉండేట్లు అనుగ్రహించు .సరే నని వారిద్దరూ ముగ్గురు దేవతలుకల గౌతమీనది వా౦ఛితాలు తీర్చటానికి సమర్ధురాలు .అందులో

‘’త్రి దైవత్యం మహా తీర్ధం గౌతమీ వాంచిత ప్రదా-తస్యామనేన మంత్రేణ కురుతాం స్నాన మాదరాత్ ‘’-‘’అభిషేకం మహేన్ద్రస్య మంగళాయ బృహస్పతిః –కరోతు సంస్మరన్నాహం సంపదాం స్థైర్య సిద్ధయే ‘’-‘’ఇహ జన్మని పూర్వస్మిన్ యత్కించి త్సు కృతం కృతం –తత్సర్వం పూర్ణతా మేతు గోదావరి నమోస్తుతే ‘’అనే మంత్రాలు చదువుతూ పవిత్ర స్నానాలు చేయామని చెప్పగా వాళ్ళిద్దరూ అలాగే చేశారు .

  దేవ గురుడైన బృహస్పతి ఇంద్రునికి మహాభి షేకం చేశాడు .ఇంద్రుని అభిషేక జలం తో పుట్టిన నది ‘’మంగళా ‘’అనే పేరుతొ పిలువబడింది .దానితో కలిసిన గంగా సంగమం పవిత్రమైనది .ఇంద్రుని స్తోత్రానికి శ్రీహరి ప్రత్యక్షమై ఇంద్రుని కోరిక తీర్చగా  త్రిలోక సంమితమైన భూమిని పొందాడు .ఈ తీర్ధమే ‘’గోవింద తీర్ధం ‘’.దేవేంద్రుడు సుస్థిరమైన ఇంద్ర పదవికోసం మహేశ్వరుని స్తుతించి ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి అభిషేకించాడు  .దీన్ని దేవతలంతా పూజించి అభిషేకించారు  .ఇదే పూర్ణ తీర్ధం గా ప్రసిద్ధి చెందింది అని నారదునికి బ్రహ్మ వివరించాడు .

  సశేషం

  ఉయ్యూరు వీరమ్మతల్లి -తిరునాళ ప్రారంభ శుభాకాంక్షలతో

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా రామయ్యగారి సహృదయత

13-2-19బుధవారం సాయంత్రం అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య గారి తరఫున మా ఇంటికి వచ్చిన 40ఏళ్ళక్రితం అమెరికాలో రామయ్యగారి నాష్ విల్ లో వారికుటుంబం తో ముఖ్యంగా రామయ్యగారి అర్ధాంగి శ్రీమతి కృష్ణ మయి గారితో అత్యంత సాన్నిహిత్యం తో కుటుంబ స్నేహితురాలుగా ఉన్న మా మేనకోడలు శ్రీమతి ఇందుమతి అంటే మా కజిన్ సిస్టర్ శ్రీమతి శారదక్కయ్య కుమార్తె  మరియు ఆమె వదిన  (ఛి లక్షణ భార్య )మా దంపతులకు నూతన వస్త్రాలు ,సరసభారతికి 116 డాలర్ల నగదు కానుక అందజేసిన చిత్రాలు

This slideshow requires JavaScript.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీదాసు శ్రీరాములుగారి గ్రంధాలు ఉయ్యూరు లైబ్రరీకి బహూకరణ

మహాకవి స్వర్గీయ దాసు శ్రీరాములు గారి మునిమనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారు దాసుగారి సాహిత్యగ్రంథాలు కొన్ని నాకు పంపగా వాటిని ఉయ్యూరు  శాఖాగ్రంథాలయానికి  అధికారిణి శ్రీమతి స్రవంతికి  13-2-19 బుధ వారం సాయంత్రం అందజేసిన చిత్రాలు -దుర్గాప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని” అవధూత చక్రవర్తి -కురుమద్దాలి పిచ్చమ్మ”వ్యాసం ఫిబ్రవరి ”గురు సాయి స్థాన్ ”లో పునర్ముద్రితం

నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని” అవధూత చక్రవర్తి -కురుమద్దాలి పిచ్చమ్మ”వ్యాసం ఫిబ్రవరి ”గురు సాయి స్థాన్ ”లో పునర్ముద్రితం

 

image.png

image.png
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -37 51-ధాన్య తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -37

51-ధాన్య  తీర్ధం

ఓషధులు సోమరాజు చంద్రుని పతిగా పొంది లోకాలకు,  గంగకు ఇష్టమైన మాటలు పలుకుతూ ఇలా చెప్పాయి –‘’వేదవేత్తలకు  తెలిసిన  పురాగాథ ఒకటి ఉంది .మాతృసమానమైన ,సస్య సంపన్న మైన భూమాతను గంగా తీరం లో దానమిస్తే సకల కోరికలు నెరవేరుతాయి .భూమి, గోవు ,ఓషధులను దానం చేస్తే సకలకార్య సిద్ధి కలుగుతుంది .ఆ దానం అక్షయమవుతుంది .ఓషధులకు సోముడు పతి అనితెలిసి దానం చేసిన బ్రహ్మవేత్త బ్రహ్మలోకం లో గౌరవం పొందుతాడు .గంగలో మా ఓషధులను దానం చేస్తే సంసార సాగరం తరిస్తాడు .మేము బ్రహ్మ స్వరూపులం ,ప్రాణ రూపిణులం.మమ్మల్ని జితవ్రతుడు దానం చేస్తే తరిస్తాడు .మేము జగత్తు అంతా వ్యాపించి ఉన్నాం .హవ్య ,కవ్య రూపమైన అమృతం ,సర్వ శ్రేష్ట భోజన పదార్ధం దానం చేస్తే వారిని మేము తరి౦ప జేస్తాం .ఈ వైదిక గాథ విన్నవాడు కూడా తరింప బడుతాడు .’’ఈ ధాన్య తీర్ధ స్నాన జప దానాలు సర్వ స౦పదలనిస్తాయని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .

51-విదర్భా సంగమ రేవతీ సంగమాది తీర్ధం

    భారద్వాజమహర్షి సోదరి రేవతి కురూపి .ఈమెను చూస్తూ కలతమనస్సుతో మాహర్షి గంగాతీరం లో విచార గ్రస్తుడై ఉన్నాడు .ఆపిల్లను ఎవరు పెళ్లి చేసుకొంటారనే దుగ్ధ ఆయన్ను బాధించింది .ఒక రోజు ఒక ముని ఆయన సందర్శనం కోసం వచ్చాడు .ఆయన అందమైన వాడు .వయసు 16.శాంత దా౦తాలలో మేటి .పేరు ‘’కఠుడు’’.ఆ ముని కుమారుని భరద్వాజమహర్షి ఆహ్వానించి ,పూజించి ,ఆతిధ్యమిచ్చాడు .

  వచ్చినవాడిని అతని రాకకు కారణం అడిగాడు మహర్షి .విద్య నేర్వటానికి వచ్చిన విద్యార్ధిని అని పరిచయం చేసుకొన్నాడు .కులీనుడు,సత్యవాది అయిన తనకు విద్య నేర్పమని ప్రార్ధించాడు .భరద్వాజుడు అతడిని శిష్యునిగా స్వీకరించి సకల విద్యలు నేర్పాడు .శిష్యుని విద్యాభ్యాసం పూర్తవగానే గురువు ను ‘’ఇచ్ఛేయం  దక్షిణా౦ దాత౦ గురో తవ మనః ప్రియాం –వదస్వ దుర్లభం వాపి గురో తుభ్యం నమోస్తుతే-విద్యా ప్రాప్యాపి యే మోహాత్స్వగురోః పారితోషికం –న ప్రయచ్ఛంతి నిరయం తేయంత్యాచంద్ర తారకం ‘’అన్నాడు అంటే –మనస్సుకు  ప్రియమైన దక్షిణ ఇవ్వాలను కొంటున్నాను .దుర్లభమైనదైనా సంకోచం వద్దు .విద్య నేర్పిన గురువుకు తగిన పారితోషికం ఇవ్వని వాడు ఆచంద్ర తారార్కంగా నరకం పొందుతాడు’’ .

 భరద్వాజుడు తన సోదరి రేవతిని వివాహమాడి సుఖంగా అన్యోన్యంగా దాంపత్యం చేయటమే తను కోరే గురు దక్షిణ అన్నాడు. శిష్యుడు గురువు తండ్రి వంటివాడు కదా అలాంటప్పుడు ఈ సంబంధం ఏవిధంగా ధర్మం అవుతుంది అని అడిగాడు .దానికి మహర్షి –

‘’మద్వాక్యం కురు సత్యం త్వం మమాజ్ఞా తవ దక్షిణా –సర్వం స్మృత్వా కఠాద్యత్వం రేవతీం భర తన్మనాః’’-నామాట నిజం చేయి నా ఆజ్ఞాపాలన మే నీ గురు దక్షిణ .అన్నీ స్మరించుకో .రేవతిపై ప్రేమ చూపి భార్యగా గ్రహించు .అన్నాడు .గుర్వాజ్ఞ శిరసావహించి కఠుడు రేవతిని పెళ్ళాడి  ,పరమేశ్వరుని పూజించి అభిషేకించాడు .వెంటనే రేవతి సర్వాంగ సుందరిగా మారిపోయింది.అభిషేక జలం  ప్రవహించి గంగానదిలో కలిసింది .రేవతికి పుణ్య రూపం కోసం భర్త అనేక రకాల పవిత్ర  దర్భలతో  అభిషేకించాడు .అది విడర్భా నది అయింది .రేవతీ –గంగా సంగమం, విదర్భా –గౌతమీ సంగమం లలో స్నానిస్తే భుక్తి ,ముక్తి పొందుతారని బ్రహ్మ నారదునికి తెలిపాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నధస్వామివారి ఆలయం-వడాలి 

శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నధస్వామివారి ఆలయం-వడాలి 

కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర వడాలి గ్రామంలో  శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నాధస్వామివారి ఆలయం:- పురాతన చరిత్రగల అన్నాచెల్లెళ్ళకు ఉన్న ఏకైక ఆలయం ఇది. అన్న బలరామ, జగన్నాధులతో కలిసి, చెల్లెలు సుభద్ర దర్శనమిచ్చే ఏకైక దేవాలయంగా ఇది ప్రసిద్ధికెక్కినది. ఈ ఆలయాన్ని 1765 లో నిర్మాణంచేసి స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి, గ్రామానికి వ్యాధాళి గా నామకరణం చేసినట్లు చరిత్ర ఆధారంగా చెప్పుచున్నారు. అప్పటి నుండి ఈ క్షేత్రం చిన్న పూరీ గా ప్రసిద్ధి చెంది భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. అప్పటి ఆలయం శిథిలావస్థకు చేరుకొనడంతో, 2011 లో ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించి, 2009, మార్చి-5వ తేదీనాడు నూతన ఆలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలు

ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి మొదలు వైశాఖ బహుళ విదియ వరకు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించెదరు. త్రయోదశినాడు ఉదయం స్వామివారిని పెళ్ళికుమారునిగా చేసెదరు. చతుర్దశినాడు సాయంత్రం ఎదురుకోలు ఉత్సవం, స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించెదరు. వైఆఖ పౌర్ణమి నాడు రాత్రి ఏడు గంటలకు స్వామివారి రథోత్సవం, పాడ్యమినాడు చక్రస్నానం, పూర్ణాహుతి, విదియనాడు పవళింపుసేవ, విశేష పూజలు నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-19- ఉయ్యూరు

image.png


Posted in సమీక్ష | Tagged | Leave a comment

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత -2(చివరిభాగం ) శివ -వేంకట కవులు

                శివ -వేంకట కవులు

వీరు జంటకవులు .వీరిలో బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు మొదటివారు .రెండవవారు మధ్వశ్రీ నందగిరి  వేంకటప్పారావు పంతులుగారు .ఇద్దరి పేర్లు కలిసి వచ్చేట్లుగా ‘’శివ వేంకట కవులు ‘’అనే పేరు పెట్టుకొని జంటగా కవిత్వం చెప్పారు .

   బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు

కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా బొమ్మినంపాడు గ్రామానికి చెందినవారు బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు .నియోగి బ్రాహ్మణులు .సా౦ఖ్యాయనస గోత్రీకులు .ఆంద్ర మత్చ్య పురాణం ,బిల్వనాథీయం ,సాత్రాజితీయం మొదలైన ఉద్గ్రంథాలు 25రచించిన పండితకవి .

    మధ్వశ్రీ నందగిరి  వేంకటప్పారావు పంతులుగారు

కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా అంగలూరు వాస్తవ్యులు మధ్వశ్రీ నందగిరి  వేంకటప్పారావు పంతులుగారు. మధ్వబ్రాహ్మణులు .విశ్వామిత్ర సగోత్రీకులు .శ్రీ రామాయణోద్భూత ఉత్తరకాండ ,శుద్ధాంధ్ర భీమసేన విజయం మొదలైన పంచ వింశతి గ్రంథ కర్తలు .16ఏళ్ళ వయసులోనే ‘’అష్టావధానం ‘’చేసిన సాహస మేధావి కవి .అంగలూరులో స్వంత ఖర్చులతో,అనేక కస్ట నష్టాలను భరించి ‘’ బాలికా పాఠశాల’’ స్థాపించి  ,నిర్వహించి, సర్వతోముఖాభి వృద్ధి చేసిన మహోదారులు ,స్వార్ధ త్యాగి .

  సాంబశివరావు గారు , అప్పారాగారు చిరకాల మిత్రులు .సమవయస్కులుకూడా .యాభై ఏళ్ళ వయసు వారు .సహజ పా౦డిత్యులు .ఉభయభాషా కోవిదులు . తమమిత్రత్వాన్ని కాపాడుకోన్నట్లే  తమ పేర్లకూ మిత్రత్వం చేకూరుస్తూ ‘’శివ వెంకట కవులు ‘’అనే మిశ్రమ నామం తో 1912నుండి కనక దుర్గా స్తోత్ర రత్నమాల ,బ్రహ్మపత్రాభ్యుదయం ,జగన్నాథీయంమొదలైన ఆరు గ్రంథాలు రచించారు .వడాలిలో ఉన్న జగన్నాథదేవాలయం పాలకులు ఈ జంటకవులకు ‘’ప్రబంథ కవి పంచానన ‘’బిరుదునిచ్చి గౌరవించి సత్కరించారు .

ఈ విషయాలన్నీ ‘’పామర్రు కారోనేషన్’’ కమిటీ మెంబర్ శ్రీ బొమ్మారెడ్డి నాగి రెడ్డి 15-5-1914న ‘’పామఱ్ఱు( స్తూప )జయధ్వజ చరిత్ర ‘’పుస్తకం  పీఠికలో తెలియ జేశారు .

  ఈ జంటకవుల కవిత్వాన్నికొద్దిగా  ఆస్వాదిద్దాం

1-‘’శ్రీ విద్యోత సమస్త లోకపటలీ సృష్టి స్థితి క్షేపణ-ప్రావీణ్యోల్ల సదాత్మక శక్తి మహిమోపన్యస్తసర్వేశ్వర

త్వావిర్భూత దయామయా కృతితియుతుం డై,సర్వగుండౌమహా –దేవుండీయుత జార్జి భూమి పతికిన్ దీర్ఘాయు రారోగ్యముల్ ‘’

2-భూషణమై పామర్తికి –శేషుడు ధర మోచి ,యుల్లసిలునంతకు సం

 తోషమున జార్జికారో-నేషన్ కమిటీ దృఢముగ నెగడెడు గాతన్ ‘’

3-పరమోత్సాహంము తోడ హైందవ జన ప్రాంచన్మనోభీస్టముల్-చరితార్ధంబు లొనర్ప,బంచమ మహా జార్జి ప్రభుం డంచితా

దరుడై,ఢిల్లి  మహాభి షేక పదవిన్ దాల్పంగ,దన్మంగళా-కరమౌ పుణ్య దినంబు శాశ్వతముగా గన్ దెల్పబామర్తిలో

స్థిరమౌ స్తంభము నాటి ,మాకు గరమర్ధిన్ మేలుగాంచి తీ-వురు తేజో నిధివై మహామ్మదుహుమాయూన్ సాయెబు గ్రామణీ’’

4-‘’అసమాన రాజభక్తి సమేతులై ప్రజా సామాన్యమునకు రాజన్యభక్తి –స్థిరముగ నెలకొల్పి పరమోపకారంబు గావించు శ్లాఘ్య సంకల్పమొప్ప

బ్రతి సమంబును ,రాజ పట్టాభి షేకమహోత్సవ స్మరణ ప్రయోగ సరణి –నతి బీదలగువారి కన్న వస్త్రములిచ్చి తత్సుకృతంబు భూధవునకంచి

తాయురారోగ్య ములొసంగు నట్లు వేడి –కొనెడు సత్కార్య శూరులై మనెడు నట్టి

సాదు’’పామర్తి కారోనేషన్’’సమాజ –సభికులను బ్రోవు గావుత జక్రధరుడు ‘’

ఈ కమిటీ రెండవ సంవత్సరోత్సవం 12-12-1912న అప్పటి తాసిల్దారు శ్రీ తాయి సుబ్బారావు నాయుడు గారి యాజమాన్యం కింద జరుపబడింది .నిధి వసూలు చేసి హుమాయూన్ గారిలాగానే పేదలకుమృష్టాన్నభోజనం పెట్టించి నూతనవస్త్రాలిచ్చారు .12-12-1913న మూడవ వార్షికోత్సవం డిప్యూటీ  తాసిల్దార్ శ్రీ వక్కలంక లక్ష్మీ నరసింహారావు పంతులుగారు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా మన జంటకవులు మంచి పద్యాలవి౦దు కూర్చారు –‘’కరుణన్ బీదల కన్నవస్త్ర ములొసంగన్ ,నీ మహోత్సాహ ని-ర్భరతన్ గన్గొని లేమి లేమి యగుచున్ వైధాత్ర  సంకల్పమున్

జరితార్ధం బొనరించు నీదగు క్రియా చాతుర్యమార్యాళిప-ల్మరు వర్ణి౦చు ను వక్కలంక కులాజాలక్ష్మి నృసి౦హాన్వయా ‘’

రూపకం –బ్యాండు మెట్టు

‘’జార్జి చక్రవర్తికిన్ –జనని మేరి రాణికిన్ –ఊర్జిత జయమంగళంబు –లొసగు నీశు డెప్పుడున్

తనదు ప్రజల సాటిగా –దలచి మనల సూటిగా –ఘనుడు జార్జి చక్రవర్తి –కాచుచుండు గావుతన్ ‘’

చివరి కందపద్యం –‘’శివ వే౦కటీయ కృతియై –చవులిడు పామఱ్ఱు స్తంభ చారిత్రంబీ

భువి నార వితారకమై –కవి హృదయాహ్లాద కరముగా విలసిల్లున్ ‘’

  శివ, వేంకట కవులు రాసి ప్రచురించిన గ్రంథాలు

1-శ్రీ రామాయణోద్భు దోత్తరకాండం 2-జగన్నాదీయం అనే వడాలి మాహాత్మ్యం 3-శుద్ధాంధ్ర మేఘ సందేశం 4-ఆంధ్రీకృత మేఘ సందేశం 5-చంద్రిక –నవలాప్రబంధం 6-బాలాశతకం 7-సీతారామ శతకం 8-రామ శతకం 9-ఆది కేశవ శతకం 10-శ్రుత శైల హనుమత్సతకం 11-బ్రహ్మ పత్రాభ్యుదయం అనే పొగాకు మహిమ 12-గంగిరెద్దు –హాస్యరచన 13-స్త్రీ విద్యా సార సంగ్రహం-వచనం  14-దొంగసామి చరిత్ర –యదార్ధకథ 15-శ్రీకృష్ణ మానస పూజ-సంస్కృతం  16-హరిహర స్తోత్ర తారావళి –సంస్కృతం 17-కనకదుర్గా స్తోత్ర రత్నమాల-సంస్కృతం 18-అంగలూరు విలేజి భూగోళం 19-పామర్రు జయధ్వజ చరిత్ర 20-బాలతొడవు (అమూల్యం )21-నేత్రావధాన చంద్రిక

ఇవన్నీ- శివ వే౦క టీయ  గ్రంథాలయం-అంగలూరు –కృష్ణా జిల్లా లో దొరుకుతాయని ప్రకటించారు జంటకవులు .

 రధ సప్తమి శుభాకాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-19-ఉయ్యూరు

image.png

 

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -36 50-సోమ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -36

50-సోమ తీర్ధం

పూర్వం ఓషధులు ప్రాణం కంటే విలువైనవానిగా ,తల్లులులాగా పూజి౦పబడ్డాయి .వాటిలో ధర్మం ,స్వాధ్యాయనం,యజ్ఞకర్మ  ప్రతి స్టింప బడ్డాయి .చరాచర జగత్తును ధరించేవి .ప్రాణుల రక్షణకు అతి ముఖ్యమైనవి .ఒకసారి ఓషధులు  బ్రహ్మను సోముని తమకు పతిగా చేయమని కోరగా ‘’ప్రీతి వర్ధనుడైన’’ రాజు ‘’ను పతిగా ఇస్తాననగా ,రాజుకోసం తాము ఎక్కడికి వెళ్ళాలి అని అడగగా ,గౌతమీతీరం చేరితే ఆమె చంద్రుని పతిగా ప్రసాదిస్తు౦దన్నాడు  .బ్రహ్మ చెప్పినట్లే అక్కడికి చేరి –‘’కో వేత్తి భాగ్యం నరదేహ భాజాం ,మహీగతానం,సరితామధీశే –యేషాం మహాపాతకం సంఘ హన్త్రీ త్వమ౦బ  గంగే సులభా సదైవ ‘’

‘’నమోస్తు తే మాతరభీస్ట దాయిని ,నమోస్తుతే బ్రహ్మమయే అఘనాశిని –నమోస్తుతే విష్ణు పదాబ్జ నిః సృతే,నమోస్తు తేశంభు జతావినిః సృతే’’అని ప్రార్ధించాయి .గంగాదేవి సంతృప్తి చెంది ఏం కావాలని అడిగితె తేజో వంతుడైన రాజును భర్తగా ప్రసాదించమని కోరగా’’ గంగామాయి’’ –

‘’అహం చామృత రూపాస్మి ఓషధ్యోమాతరోమృతాః-తాదృశం చామృతాత్మానం పతిం సోమం దదామివః ‘’అన్నది అంటే –నేనూ ,మీరూ అమృత రూపులం .అలాగే అమృతాత్మకుడై న చంద్రుని మీకు పతిగా ఇస్తాను ‘’అనగా ఓషధులు పరమానంద పడి,కృతజ్ఞతలు తెలిపి తమ స్థానాలకు వెళ్ళిపోయాయి .అమృతాత్మకుడు,సమస్త సంతాప నివారకుడు  రాజు అయిన సోముని ఓషధులు పతిగా పొందిన చోటు సోమతీర్ధంగా విరాజిల్లింది .భుక్తి ముక్తి తోపాటు సోమపాన ఫలాన్ని ఇస్తుంది అని నలువ నారదునికి తెలియ జేశాడు .

   సశేషం

   రధ సప్తమి శుభాకాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

12-2-19 మంగళవారం ఉదయం మా ఇంట్లో రధ సప్తమి ,అరుణ పారాయణం

12-2-19 మంగళవారం ఉదయం మా ఇంట్లో రధ సప్తమి ,అరుణ పారాయణం

 

https://plus.google.com/photos/115752370674452071762/album/6656990979741736897/6656990980106632306?authkey=CJKv6M2yo7TvggE

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత

కృష్ణా జిల్లాలో పామర్రు గొప్ప వ్యాపార కేంద్రం .విజయవాడ –మచిలీ పట్నం రోడ్డులో ఉయ్యూరు దాటాక పామర్రు వస్తుంది .పామర్రు నుండి ఉత్తరాన గుడివాడ మండలం ,దక్షిణాన దివి సీమ మండలం ఉన్నాయి .పామర్రు దగ్గర పూర్వం నాగులేరు ప్రవహించేది ..దానిమధ్యలో ఒక తామర కొలను ,దానిపై దివ్య ప్రతిష్టితమైన శివ లింగం ఉండేవి .కొలనులో నీరు ఎప్పుడూ ‘’ఏనుగు లోతు’’ ఉండేది .శివలింగం కొలను నీటికి పైన దర్శనమిస్తూ ఉండేది .లింగం పాదం ఎంతలోతులో ఉందొ ఎవరికీ అంతు పట్టేదికాదు .ఈ శివ లింగాన్నిఎప్పుడో నాగులు ప్రతిస్టించాయనీ ,నిత్యాభి షేకానికి ఒకనదిని కూడా అక్కడ కల్పించాయని ,నాగులు తెచ్చిన నదికనుక ‘’నాగులేరు ‘’అనే పేరొచ్చిందని పూర్వులు చెప్పుకొనేవారు .ఆవరణం లేని ఆ శివలింగం మహా ప్రభావ సంపన్నంగా ఉండేది .దివ్యులు వచ్చి అర్చించి వెళ్ళేవారు .ఆశివ లింగం శిరసుపై ఒకపద్మం వికసించి దివ్య పరిమళాలను వెదజల్లేది.ఆ కొలను గట్టున అనేక శాఖలతో విస్తరించిన వట (మర్రి )వృక్షం ఉండేది .ఆ వటవృక్షం తొర్రలో మహా నాగం ఒకటి నివసించేది .అది రోజూ చెట్టుదిగి ఆమహా శివ లింగాన్ని చుట్టుకొని నాగాభరణంగా  భాసించేది .

   చాలా ఏళ్ళు గడిచాక ఆ చెరువు కొంత పూడిపోయి ,చిన్న గ్రామం ఏర్పడింది .తర్వాత ఎశం లో మహమ్మదీయ ప్రభుత్వమేర్పడి ,హిందూ దేవాలయ ధ్వంసం చేసి ,విగ్రహాల పీఠభాగం నిక్షిప్తమై ఉన్న  ఉన్న అమూల్య సంపదను  దోచుకోవటం ప్రారంభమైంది .అలాంటి సంక్షోభ కాలం లో ఒకమహమ్మదీయ సైన్యం  ఈ గ్రామానికి వచ్చి ఇక్కడి శివలింగ వైభవానికి ఆశ్చర్యపోయి ,ఆ శివలింగ మూలాన్ని ధ్వంసం చేస్తే అన్నతమైన ధన కనక వస్తురాసి లభిస్తుందని ఆశపడి ,తటాకం లోకి చేరి చాలాలోతుగా ఉన్న నీటిలో ఉన్న లింగాన్ని  పీకటానికి విశ్వ ప్రయత్నం చేశారు .మానవ సాధ్యం కాదని అర్ధమై ఒక ఏనుగును  దింపి ప్రయత్నించారు.అది తామర తూడు ఆశతో లింగం పైఉన్న తామర పువ్వును పెకలించింది .దాని  మూరెడు పొడవున్న తూడు బయటికి వచ్చింది .అప్పుడు శివలింగం శిరసుపై రంధ్రం ఏర్పడి రక్తం కారటం మొదలు పెట్టింది .కొలను నీరంతా రక్త ప్రవాహమైంది .ఈ హఠాత్సంఘటనకు  తురక సైన్యం భయపడి ,ప్రయత్నాన్ని వదిలేసి బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించింది .ఇప్పటికీ ఆ శివలింగం శిరోభాగం లో మూరెడు లోతు గుంట కనిపిస్తుంది .ప్రతి రోజూ శివలింగ౦పై ఉన్న గుంటను   శుభ్రంగా  కడిగి, వస్త్రం జొనిపి ,తుడిచి శుభ్రం చేస్తారు .లేకపోతె రక్తపు వాసన వస్తుంది .

  గ్రామస్తులకు ఈ విశేష శివలింగం పై అశేషభక్తి ఏర్పడి  నిత్యపూజలుచేయటం ప్రారంభించారు .క్రమ౦గా కొలను పూడిపోయి గ్రామం వృద్ధి చెందింది .గ్రామస్తులు ఆ మహా మహిమాన్విత శివ లింగానికి ప్రాకారం ,ఆలయం కట్టించి ‘’సోమేశ్వర స్వామి ‘’గా అర్చిస్తూ నిత్యోత్సవాలు నిర్వహించారు .కొలను గట్టున ఉన్న వటవృక్షం అంటే మర్రి చెట్టు ఇప్పుడు లేదు .చాలాకాలం మర్రి చెట్టు, అందులో పాము ఉండటం  యదార్ధం కనుక ఆగ్రామానికి ‘’పాము మర్రి ‘’అనే పేరొచ్చింది .కొంతకాలానికి ‘’పామ్మర్రి ‘’గా మారి ,చివరికి’’ పామర్రు ‘’అయింది .

‘’పాము వసియించు మఱ్ఱికి  –గ్రామము కుఱగటనుగలుగ గా గాంచి, జన

స్తోమమ్ము ‘’పాము మఱ్ఱన’’-‘’బామఱ్ఱ’’ని యదియ పిదప వాడుక పడియెన్’’

  పామర్రు క్రమాభి వృద్ధి పొంది ,చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా మారి ,1910లో గుడివాడ , తాలూకాలో పామర్రు డివిజన్ అయింది .ఈ డివిజన్ లో 65 గ్రామాలు ఉండేవి .ఈ డివిజన్ డిప్యూటీ తాసిల్దార్ కార్యాలయం పామర్రులో ఉంది .1-1-1910న డిప్యూటీ తాసిల్దార్ గా శ్రీ నండూరి రామ చంద్రరావు పంతులుగారు ఉద్యోగం లో చేరి ,సుపరిపాలనతో ప్రజామన్నన పొందారు .తర్వాత శ్రీ మహమ్మద్ హుమాయూన్ సాహెబ్ గారు  డిప్యూటీ  తాసిల్దారయ్యారు .అదే సమయం లో భారత దేశాన్ని పాలించే అయిదవ జార్జి చక్రవర్తి కి ఢిల్లీ లో పట్టాభి షేక మహోత్సవం జరిగింది .దేశమంతా ఆ పట్టాభి షేకాన్ని ఘనంగా నిర్వహించారు .

  పామర్రు లోనూ అత్యుత్సాహంగా రాజుగారి పట్టాభి షేక మహోత్సవం జరపాలని భావించి ప్రజలు స్వచ్చందంగా చందాలు వేసుకొని 5 వేల రూపాయల నిధి ప్రోగు చేసి ,బీదలకు అన్నదానం ఏర్పాటు చేసి ,ఆ మహోత్సవానికి జ్ఞాపక చిహ్నంగా పామర్రులో ‘’జయ స్తంభం ‘’నిర్మించారు .ఈ జయ స్తంభం  బందరు-హైదరాబాద్ రోడ్డులో ,పుల్లేరు కాలువ వంతెన ప్రక్కన నిర్మించారు .పద్నాలుగున్నర అడుగుల ఎత్తులో ,ఆరడుగుల లోతున ఏర్పాటు చేశారు .స్తంభం మధ్యలో నాలుగు పలకలు ,దానికి పైన కిందా ఎనిమిది పలకలుగా ఉండేట్లు నిర్మించారు .మధ్యలో ఉన్న తూర్పు వైపు పలకపై ‘’శ్రీ శ్రీ పంచమ జార్జి చక్రవర్తి .మేరీ చక్రవర్తినీ గార్లకు ఢిల్లీలో 12-12-1911న పట్టాభి షేక మహోత్సవము జరిగినదని జ్ఞాపకార్ధ మీ స్తంభం ప్రతిస్తించబడి,14-12-1911తేదీన కృష్ణా కలెక్టర్ హెచ్ ఎల్ బ్రైడ్ వుడ్ దొరవలన ప్రసిద్ధ పర్చబడినది ‘’అనే అర్ధం వచ్చేట్లు ఇంగ్లీష్ లో చెక్కించారు .

In commomoration  of The Imperial  Coronation on 12-12-19 11At Delhi

Of The Most Gracious Majesties KING=EMPEROR GEORGE V And QUEEN=EMPRESS MARY.

Un weiled on 14-12-1911By H.L. BRAID WOOD Esq.-Collector Krishna

‘’భూషణమైన మైన పామర్తికి –శేషుడు ధర మోచి యుల్లసిలు నంతకు ,సం

తోషమునజార్జి కారో-నేషన్ కమిటీ దృఢముగ నెగడెడు గాతన్ ‘’

  ఇలాంటి శాశ్వత నిర్మాణ జయస్తంభం ఈ తాలూకాలోనే మొట్టమొదటిది .దీని నిర్మాణ బాధ్యత అంతా మహమ్మద్ హుమాయూన్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది  ఖర్చులు పోను మిగిలిన ధనాన్ని బాంక్ లో వేసి నిర్మాణకమిటీకి అప్పగించారు .

నాకు ఇన్నేళ్ళుగా పామర్రు లోని ఈ జయస్తంభం గురించికాని శివాలయ విశేషం గురించికాని పామర్రు అనే పేరు ఎలావచ్చిందనికాని తెలియని లేదు . అగ్రిగోల్డ్ వారు భక్తి సుధ మేగజైన్ తీస్తున్నప్పుడు దాని ఇంఛార్జిగా ఉన్న శర్మగారు నన్ను పామర్రు శివాలయానికో ప్రత్యేకత ఉందని దాన్ని గురించి తెలుసుకొని ఆర్టికల్ రాయమని పదే  పదే చెప్పేవారు . నాకు తీరికా ఓపికా లేక అప్రయత్నం చేయలేదు .పామర్రు లో మూడు సార్లు సైన్స్ మాస్టర్ గా ,అద్దాడలో ఏడేళ్లు  హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు పామర్రు వాస్తవ్యులు,తెలుగుపండిట్  స్వర్గీయ శ్రీ హేమాద్రి తిమ్మరుసు గారు కాని  లెక్కలమేస్తారు హెడ్ ఆస్టార్ అయినా స్వర్గీయ శ్రీ  గుండ్రం వెంకటేశ్వరరావు గారు కానీ పై విషయాలగురించి నాతో ఎప్పుడూ ముచ్చటించనే లేదు . ఇలా పామర్రు చరిత్ర నాకు అజ్ఞాతం  గానే ఉండి పోయింది ఇంతకాలం గా . 

  మనవి-నాలుగు రోజులక్రితం మా అబ్బాయి శర్మ పై జంటకవుల పుస్తకం మెయిల్ లో పంపాడు అది చదివి ఆశ్చర్యపోయి రాసిన వ్యాసం ఇది .దీని తర్వాత ఆ జంటకవుల చరిత్ర  సూక్ష్మ0గా  రాస్తాను . నెట్ లో వెదికితే ఆ స్తంభం చరిత్ర ,ఫోటో కూడా కనపడలేదు .నాకూ ఎప్పుడూ అక్కడ కనిపించలేదు లేక నా దృష్టి  దానిపై పడక పోయి ఉండచ్చు కూడా -. దుర్గాప్రసాద్ 

  సశేషం

ఆధారం –శివ- వేంకట కవులు అనే జంటకవులైన ‘’ప్రబంధ పంచానన ‘’బిరుదాంకితులు బ్రహ్మశ్రీ అడవి సాంబశివ రావు పంతులు ,మధ్వశ్రీ నందగిరి వేంకటప్పారావు పంతులు గార్లు రచించిన ‘’పామఱ్ఱు (స్తూప )జయధ్వజ చరిత్ర ‘’

 రేపు రధ సప్తమి శుభాకాంక్షలతో

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-2-19-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

గౌతమీ మాహాత్మ్యం -35 48- ఆత్మతీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -35

48- ఆత్మతీర్ధం

భుక్తిముక్తిప్రదాయకమైన ఆత్మ తీర్ధ విశేషాలు నారదుడికి బ్రహ్మచెప్పాడు ,అత్రి మహర్షి కొడుకు ,దత్తుడు శివభక్తుడు ,దుర్వాసునికి ప్రియ సోదరుడు .ఒకరోజు తండ్రిని బ్రహ్మ జ్ఞానం పొందటానికి ఎవరివద్దకు వెళ్ళాలో చెప్పమని అడిగాడు .గౌతమీనదికి వెళ్లి పరమేశ్వర ధ్యానం చేయమన్నాడు తండ్రి .గంగానదికి వెళ్లి పవిత్ర స్నానం తో శుచియై తాను  సంసారతాపత్రయం లో కూరుకుపోయానని ,కామ కోపాలతో లోపలి శత్రువులను జయి౦చ లేకపోతున్నాననీ దీనినుండి విముక్తిపొంది తనమనసులో ‘’సోమ ‘’అనే పదం శాశ్వతంగా ప్రతిష్ట చేయమని,తనకే పదవులు  అక్కరలేదని ‘’శివ ‘’పదం ఉన్న చోట తన ఉనికి  ఉండేట్లు చేయమని –‘’గౌరీపతే శంకరసోమనాథ,విశ్వేశ ,కారుణ్య నిధేఖిలాత్మకం –సంస్తూయతే యత్ర నదేతి తత్ర కేషామపి  స్యాత్క్రుతి నాం నివాసః ‘’అంటూ ఆర్తిగా వేడుకొన్నాడు .

  దత్తుని స్తుతి కి పరవశించిన పరమేశ్వరుడు అలాగే అని చెప్పి వరమిచ్చాడు .అత్రి మహర్షి కోరిక అయిన ఆత్మజ్ఞానం కలిగిన చోటుకనుక ఆత్మ తీర్ధం గా ప్రసిద్ధి చెందింది.

    49-ఆశ్వత్దాది  తీర్ధం

బ్రహ్మ నారదునికి అశ్వత్ధ ,పిప్పల ,మంద అనే మూడు తీర్దాల విశేషాలు చెప్పాడు .ఒకప్పుడు వింధ్యపర్వతానికి   గురువైవైన అగస్త్య ముని  దేవకార్య నిమిత్తమ ,భార్య లోపాముద్రతో ,వెయ్యి మంది మునిగణ౦ తో విన్ధ్యను సమీపించాడు .అది అత్యంత ఉన్నతమై ఆకాశాన్ని  అంటుతోందా  అన్నట్లు పెరిగి పోయి ఉన్నది .శిష్యుడైన విన్ధ్యరాజు గురువు అగస్త్యమౌనిని అర్ధాంగి లోపాముద్రను వెంటవచ్చిన ముని బృందాన్ని సకల సపరి చర్యలతో స్వాగత సత్కారాలతో మెప్పించాడు .అగస్త్యముని శిష్యుడితో ‘’నేను వీరందరితోకలిసి దక్షిణ దేశ యాత్ర చేయటానికి వెడుతున్నాను .కనుక మాకు దారి ఇచ్చి ,మేము తిరిగి వచ్చేదాకా అలాగే ఉండమని,మాటతప్పవద్దని  కోరుతున్నాను ‘’అన్నాడు మహాభాగ్యం అంటూ వింధ్యుడు తలవొగ్గి మార్గం కలిపించగా దక్షిణానికి అగస్త్యముని బృందం వెళ్ళింది .అగస్త్యముని గౌతమీ తీరం చేరి ,సత్ర యాగం చేయటానికి దీక్ష పూని ముని బృందం సాయం తో ఏడాదికాలం చేసి నిర్విఘ్నంగా పూర్తి చేశాడు .

  కైటభాసురునికి ఆశ్వత్ధుడు ,పిప్పలుడు అనే ఇద్దరు కొడుకులున్నారు .వీరిద్దరూ యజ్ఞ ధ్వంస కార్యక్రమాన్ని చేయాలనుకొని మొదటివాడురావి చెట్టు రూపం లో ,రెండవవాడు బ్రాహ్మణ రూపం లో ముని యాగ శాలకు చేరి ,కామ రూప విద్య లో నిష్ణాతులుకనుక రోజూ సత్ర యాగం వద్ద బ్రాహ్మణులను బాధించేవారు ఆశ్వత్ధుడు రావి చెట్టు వద్దకు వచ్చిన బ్రాహ్మణులను ,చంపేసి తినేసేవాడు .పిప్పలుడు బ్రాహ్మణవేషం లో సామగానం చేస్తూ నేర్చుకోవటానికి వచ్చే వారిని నాకిపారేసేవాడు .అప్పటినుంచి లోకం లో సామగానం చేసే బ్రాహ్మణులు  కరుణ లేని వారయ్యారు –‘’తస్మదద్యాపి విప్రేషు సామగో తీవ నిష్క్రుపః ‘’’

రోజు రోజుకీ  బ్రాహ్మణులు క్షయం అవటం గమనించి ,మునులు దక్షిణ తీరం లో తీవ్ర తపస్సు చేస్తున్న శనైశ్చరుని చేరి జరిగింది చెప్పగా తన తపస్సు పూర్తికాగానే వాళ్ళను చంపుతానన్నాడు .మునులు అప్పటిదాకా ఆగితే కొంప కొల్లేరు అయిపోతున్దని అతనికి కావాల్సిన తపస్సు అంతా తామే ఇస్తామని చెప్పగా ‘’ఐతేమీ పనైపోతుంది ‘’ అన్నాడు శని .

  సూర్యపుత్రుడైన శని  బ్రాహ్మణ రూపం లో ఆశ్వత్ధుని చేరి ,రావి చెట్టు రూపం లో ఉన్నవాడి చుట్టూ ప్రదక్షిణ చేయగా  మామూలు బాపడే అనుకోని తినేశాడు .వాడి శరీరం లోకి ప్రవేశించిన శని మనవాళ్ళ సినీమా డైలాగ్ లాగా  ‘’కంటి చూపుతో ‘’ భస్మం చేశాడు   ఆశ్వత్దుడిని .తర్వాత పిప్పలుని చేరగా వాడు వెర్రి బాపడనుకొని మింగేశాడు .పొట్టలో చేరిన శని తన తీవ్ర దృష్టి తో వాడినీ భస్మం చేశాడు .మహర్షులు ప్రీతమానసులై మందుడు అంటే శనికి కోరిన కోర్కెలన్నీ తీర్చారు .పూర్తిగా సంతృప్తి పొంది శని ‘’శనివారం అశ్వత్ధ వృక్షాన్ని  కి ప్రదక్షిణ చేసేవారు స్పృశించే  వారి పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి .అశ్వత్ధ తీర్ధం లో స్నానం చేస్తే సర్వ కార్య సిద్ధి కలుగుతుంది .గ్రహపీడలు తొలగిపోతాయి ‘’అని ప్రకటించాడు .అప్పటినుండి ఇది అశ్వత్ధ ,పిప్పల ,మంద ,అగస్త్య ,సాత్రిక ,యాజ్ఞిక ,సామగ తీర్ధమని పేరు పొందింది .

   సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

10-2-19ఆదివారం మాఘ శుద్ధపంచమి-శ్రీపంచమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయా దేవాలయం లో ఆవు పిదకలపై సామూహికంగా ఆవుపాలు పొంగించి ,పొంగలి వండటం చిత్రాలు

10-2-19ఆదివారం మాఘ శుద్ధపంచమి-శ్రీపంచమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయా దేవాలయం లో ఆవు పిదకలపై సామూహికంగా ఆవుపాలు పొంగించి ,పొంగలి వండటం చిత్రాలు

 

https://plus.google.com/photos/115752370674452071762/album/6656343671508355121/6656343675649995666?authkey=COj0787t4dWZ7wE

 

10-2-19ఆదివారం మాఘశుద్ధ పంచమి శ్రీపంచమి ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక సత్యనారాయణ వ్రతం -మరియు 18సార్లు సైకిల్ పై అయ్యప్పదీక్షతో శబరిమలై యాత్ర ,5 సార్లు శివ దీక్షతో నడకతో శ్రీశైల యాత్ర చేసిన శ్రీ బిరుదుగడ్డ వెంకటేశ్వరరావు కు ,25 సార్లు దీక్షతో శబరిమలై యాత్ర చేసిన మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం కాపలాదారు శ్రీ చౌడాడ అప్పలనాయుడు కు చిరుసత్కారం చిత్రమాలిక

 

https://plus.google.com/photos/115752370674452071762/album/6656348639693451921/6656348644545239762?authkey=COOWxtj69vX9cA

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘విహంగ ”హేమలత -జ్యోతి-11-2-19

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి 137 వ కార్యక్రమంగా 10-2-19 సామూహిక సత్యనారాయణ వ్రతం

రసభారతి-సాహిత్య సాంస్కృతిక సంస్థ   10-2-19 సామూహిక సత్యనారాయణ వ్రతం
10-2-19 మాఘ శుద్ధ పంచమి శ్రీ పంచమి(సరస్వతీ దేవి జన్మదినోత్సవం ) నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లోసరసభారతి 137 వ కార్యక్రమంగా  ఉదయం 9 గం లకు ఆవుపాలు పొంగించి పొంగలి వండటం ,ఆతర్వాత ఉదయం 10గం లకు సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహింపబడుతుంది .
 వ్రతం అనంతరం   శ్రీ అయ్యప్పదీక్షతో 18సార్లు సైకిల్ పై శబరిమల యాత్ర ,5సార్లు  శ్రీ శివ దీక్షతో కాలినడకన శ్రీశైల యాత్ర చేసిన స్థానిక సుధీర్ టింబర్ డిపో ఉద్యోగి శ్రీ  బిరుదుగడ్డ వెంకటేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం ,వారి అనుభవ ప్రసంగం ఉంటాయి . భక్తులు ,,సాహితీ బంధువులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన –
                                       గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త
                                         9-2-19 -ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విహంగ మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత అకాలమరణం

విహంగ మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత అకాలమరణం
 విహంగ మహిళా వెబ్ మాసపత్రికను  అత్యంత సమర్ధ వంతంగా ,విభిన్నశైలిలో నిర్వహిస్తూ ,నన్ను కూడా విహంగాకు రాయమని 2012 ఏప్రిల్ లో మెయిల్ ద్వారా శ్రీ మతి పుట్లహేమలత గారు కోరగా అప్పటినుంచి అవిచ్చిన్నంగా ఇంతవరకు ప్రతినెలా దేశ విదేశాలలోని మహిళా మూర్తులను గురించి రాస్తూనే ఉన్నాను విహంగాలో ఎంతోఆధరంగా ప్రచురిస్తూనేఉన్నారు .దాదాపు ఆరు సంవత్సరాల సాహితీ బాంధవ్యం . సరసభారతి ప్రచురించిన పుస్తకాలు ఆమెకు కనీసం మూడు  ప్రతులు  ఒకటి ఆమెకు మరొకటి రాజమండ్రి తెలుగు విశ్వ విద్యాలయానికి  ఇంకొకమరచి   ఎవరైనా సాహితీ మూర్తికి మూడు ప్రతులు పంపటం ఆమె అలాగే స్వీ  కరించి అందజేయటం జరుగుతోంది .  మూడేళ్ళక్రితం జనవరిలో జరిపిన విహంగ పత్రిక వేడుకలలో నన్ను ఆహ్వానించి విహంగ ఆత్మీయ పురస్కారం అందించిన సౌజన్యమూర్తి హేమలత గారు . ఇప్పుడే వారి అకాల మరణ వార్త విని   దిగ్భ్రా0తి   చెందాను . శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారు స్వాస్థ్య చిత్తం తో  విషాదాన్ని క్రమంగా మరచిపోవాలి కోరుతూ ,వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసిస్తూ ఆమె ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -9-2-19 -సాయంత్రం 6-40 -ఉయ్యూరు 

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -34 46-శేష తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -34

46-శేష తీర్ధం

శేషుడు రసాతలానికి అధిపతి .సమస్త ఫణి రాజులు అతని అధీనం లో ఉండేవారు .అంతకు పూర్వమే దేవతలు రాక్షలకు అది ఆవాసభూమి .నాగరాజును అడ్డుకొనగా అతడు బ్రహ్మకు ‘’స్వామీ !నువ్వే నన్ను పాతాళాకి పంపావు .కాని దేవదానవులు నన్ను రానివ్వటం లేదు .నువ్వే దిక్కు ‘’అని శరణువేడాడు . బ్రహ్మ గౌతమీనదికి వెళ్లి ,మహాదేవుని అర్చించి శరణు పొందమని హితవు చెప్పాడు .అలాగే గంగానది చేరి పవిత్ర స్నానం చేసి , త్రిదశాధిపతి పరమేశ్వరుని  ధ్యానం చేశాడు –

‘’నమః సహస్ర శిరసే నమః సంహారకారిణే-సోమ సూర్యాగ్ని రూపాయ జలరూపాయతే నమః ‘’

‘’సర్వదా సర్వ రూపాయ కాలరూపాయ తేనమః –పాహి శంకర సర్వేశ పాహి సోమేశ సర్వగ –జగన్నాథ నమస్తుభ్యం దేహి మే మనసేప్సితం ‘’అని బహువిధాల స్తుతించాడు .ప్రీతిమానసుడై శివుడు నాగుని కోరికలన్నీ తీర్చాడు .దేవ రాక్షస వినాశానికి శూలం ఆయుధంగా ఇచ్చి శత్రు సంహారం చేయమన్నాడు .

  శేషుడు పాములనందర్నీ వెంటబెట్టుకొని రసాతలం చేరి శూలంతో దేవ రాక్షాస సంహారం చేసేసి ,బిలం ద్వారా పైకి వచ్చిశివుని   దర్శించాడు .ఆ బిల తలం నుండి పవిత్ర జలం ఉత్పన్నమై గంగానదిలో కలిసింది .శివుడి దగ్గర ఉన్న విశాలమైన కుండం వద్ద శేషుడు నిత్యహోమం చేశాడు .కనుక ఆనీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది .ఈ జలం గంగా సంగమ౦ అయి ,పవిత్ర తీర్ధ స్థలమైంది .చాలాకాలం అక్కడే శివ ధ్యానం తో గడిపి శివ వరప్రసాదం తో సకల అభీష్టాలు నెరవేర్చుకొని మళ్ళీ పాతాళం చేరాడు .అప్పటి నుంచి ఇది నాగతీర్ధంగా పిలువబడింది.ఇది సకల కోరికలను తీరుస్తూ ,ఆయుస్సు సంపద కలిగిస్తుంది ఇక్కడి స్నానదానాలు ముక్తినిస్తాయి అని బ్రహ్మ దేవుడు నారదునికి చెప్పాడు .

              47-వడవాది సహస్ర తీర్ధం

మహానలం  ,వడ వానలం అని పిలువబడే ప్రసిద్ధ క్షేత్రం గూర్చి నారదునికి బ్రహ్మ వివరించాడు .వడవా అనే నది అక్కడ ఉన్నది జరా మృత్యునివారకం .నైమిషం లో ఋషులు ఒకప్పుడు యజ్ఞం చేసి మృత్యువును ‘’శాంత చిత్తు’’ని చేశారు .మృత్యు నాశనం జరగటం లేదుకనుక ప్రాణులు మరణించటం లేదు .స్వర్గం శూన్యమైంది .మానవ లోకం జనం తో నిండిపోయింది .అప్పుడు దేవతలు రాక్షసులని  మునుల సత్రయాగాన్ని భగ్నం చేయమన్నారు .అలా చేస్తే తమకేమిటి లాభం అని వాళ్ళు ప్రశ్నించారు .యజ్ఞార్ధ ఫలం దక్కుతుంది అని  చెప్పారు  దేవతలు . .

   రాక్షసులు దేవతలమాట విని ఋషుల సత్రయాగానికి రాగా ,వారు మృత్యువును  ప్రార్ధించారు .అందరూ ఆలోచించి నైమిశం వదిలి ,శమితతో అగ్నిని మాత్రం తీసుకొని అత్యంత వేగంగా గౌతమీ తీరం చేరి స్నానించి మహేశ్వరుని రక్ష చేయమని-‘’మహానలం ,మహాకాయం ,మహానగ విభూషణ౦ -మహా మూర్తి ధరం దేవం శరణం యామి శంకరం ‘’అని

 మృత్యువుకూడా ‘’రాక్షసేభ్యో భయం ఘోరమాపన్నం త్రిదశేశ్వర – యజ్ఞ  మాస్మా౦ శ్చ రక్షస్వ యావత్సత్రం సమాప్యతే ‘’అనీ ప్రార్ధించారు .సంతుష్టి చెందిన సదాశివుడు మృత్యువుకు ఇష్టమైంది కోరుకోమన్నాడు .ఆయన రాక్షసులవలన మహర్షుల సత్రయాగం విచ్చిన్నమైంది ,కనుక యజ్ఞం పరిసమాప్తి వరకు తమందర్నీ రక్షించమని వేడుకొన్నాడు .శివుడు అలాగే అని చెప్పి వారి కోరిక తీర్చాడు .శమితమైన మృత్యువుతో  ఋషుల యజ్ఞం పూర్తయింది .దేవతలు హవిర్భాగం కోసం వచ్చారు .

   మహర్షులకు తీవ్రమైన కోపం వచ్చి యజ్ఞ వినాశానికి రాక్షసులను పురికొల్పి  పంపినందుకు ,ఇకనుండి రాక్షసులతో నిత్యం శత్రుత్వమే కలుగుతుంది అని శపించారు .అప్పటినుండి దేవతలకు రాక్షసులు శత్రువులైపోయారు .అక్కడ ఉన్న వడవ ను మృత్యువు భార్యగా చేసి అభిషేకించారు ఋషులు .ఆ అభిషేక జలమే నదీ రూపం పొంది వడవా నది అయింది .మృత్యువు స్థాపించి పూజించిన శివలింగం ‘’మహానల లింగం ‘’గా ప్రసిద్ధి చెందింది .ఆస్థానం వడవా సంగమం గా ప్రసిద్ధమైంది .స్పర్శ మాత్రం చేత ముక్తి నిస్తుంది .సర్వాభీష్ట సిద్ధి నిచ్చే వెయ్యి తీర్దాలు ఆ నదికి రెండువైపులా వర్ధిల్లాయి .

   సశేషం

 రేపు 10-2-19 ఆదివారం సరస్వతీదేవి జన్మదినమైన శ్రీ పంచమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాసు అచ్యుత రావు పంపిన శ్రీ దాసు శ్రీరాములు విశేషాలు

 

 

శ్రీ దుర్గా ప్రసాద్ గారికి నమస్కారములు
మీతో పరిచయమవటం చాలా సంతోషం.
I am attaching some articles o the Mahakavi.
I hope they would interest you.
భవదీయుడు
దాసు అచ్యుత రావు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ దాసు శ్రీరాములుగారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారి ఫోన్

శ్రీ దాసు శ్రీరాములుగారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారి ఫోన్
స్వర్గీయ శ్రీ దాసు శ్రీరాములు గారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారు ఇవాళ ఉదయం 9గంటలకు ఫోన్ చేసి  మన సరసభారతి బ్లాగ్ లో దాసు శ్రీరాముల గారి గురించి రాసిన విషయం చదివి ఫోన్ చేస్తున్నాననీ ,తానూ 60 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నానని ,తాతగారిది కృష్ణా జిల్లా ముదినేపల్లిదగ్గర ఉన్న ఊరని దాన్ని దాసువారి అగ్రహారం అంటారనీ ,దాసువారి గ్రంధాలు నాకు రెండు సెట్లు పంపుతానని ఒకటి నన్ను తీసుకోమని రెండవది ఉయ్యూరు లైబ్రరీకి ఇవ్వమని ,దాసుగారి కుమార్తె కూడా గొప్ప రచయిత్రి అనీ  ఆమె పుస్తకాలు కూడా పంపుతానని,ఇకనుండి నాతో తరచుగా టచ్ లో ఉంటానని అన్నారు చాలా సంతోషమేసింది -దుర్గాప్రసాద్  

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నాటక రంగానికి మొదలు ,తుదీ శ్రీ మొదలి నాగభూషణ శర్మ -మూసి -ఫిబ్రవరి

నాటక రంగానికి మొదలు ,తుదీ శ్రీ మొదలి నాగభూషణ శర్మ -మూసి -ఫిబ్రవరి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -33 45-అవిఘ్న త్తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -33

45-అవిఘ్న త్తీర్ధం

అవిఘ్న తీర్ధ మహాత్మ్యాన్ని నారదునికి బ్రహ్మ తెలిపాడు .పూర్వం .గౌతమీనది ఉత్తరతీరాన దేవ యజ్ఞం ప్రారంభమై ,విఘ్న దోషం వలన పూర్తి కాలేదు..దేవతలు విచారం తో బ్రహ్మ విష్ణువులకు మొరపెట్టుకొన్నారు .బ్రహ్మ ధ్యానంచేసి విఘ్నానికి కారణం విఘ్నేశ్వరుడు అని,కనుక ముందు ఆయనను ప్రసన్నం చేసుకోమని సలహా ఇచ్చాడు . వారంతా గౌతమీ నదిలోస్నానం చేసి ,తీరం లో ఆదిదేవుడైన వినాయకుని భక్తితో-

‘’న విఘ్న రాజెన నమోస్తికశ్చిద్దేవో మనో వాంఛిత సంప్రదాతా –నిశ్చిత్య చైత త్రిపురా౦తకో పి తమ్ పూజయామాస వదే పురాణం ‘’

‘’కరోతు సో స్మాకమవిఘ్న మస్మిన్మహా క్రతౌ  సత్వర మా౦బికేయః –ధ్యాతేన యేనాఖిల దేహభాజాం పూర్ణా భవిష్యంతి మనోభి లాషాః’’-అంటే విఘ్నరాజుకు సాటి కోరికలు తీర్చే దేవుడు లేడుఅని భావించి త్రిపురాంత సంహారానికి శివుడు  కూడా పూజించాడు .ఎవరిని ధ్యానిస్తే జీవుల మనోవా౦ఛితాలు , నెరవేరుతాయో ,అలాంటి అంబికా తనయుడు విఘ్నరాజు మా క్రతువు నిర్విఘ్నంగా పూర్తయేట్లు చేయాలి .పార్వతీదేవికి పుత్రుడు పుట్టాడని లోకాలన్నీ మహోత్సవాలు చేసి విఘ్నరాజు అనే పేరు పెట్టాయి .తల్లి ఒడిలో ఆడుకొంటూ ,తల్లి వద్దంటున్నా ,సరదాగా చంద్రుని తండ్రి శివుడి జటలో దాచాడు  .తల్లి పాలన్నీ తానే తాగేస్తూ  తమ్ముడు కార్తికేయుడికి పాలు లేకుండాచేసి పొట్ట పెంచుకొన్నందున తండ్రి లంబోదరుడు అనే పేరు పెట్టాడు .దేవగణాలతో ఉన్నప్పుడు ఒకసారి తండ్రి కొడుకును నృత్యం చేయమనగా ,నూపుర రావం తో నే సంతోష పరచగా తండ్రి గణేశ్వరుడు గా అభిషేకం చేశాడు .చేతిలో విఘ్నపాశం ,భుజం పై కుఠారం ధరించి దేవతలచే పూజింపబడుతూ కూడా తల్లికి కూడా విఘ్నం కలిస్తాడో ,దేవాసురులచేత పూర్వ పూజ్యుడు అంటే మొదట పూజింపబడే వాడు ఐన విఘ్నపతికి సరి లేరు ఎవరూ .’’అని అనేక స్తోత్రాలతో స్తుతించారు .

  గణేశుడు సుప్రసన్నుడై ఇకపై దేవ క్రతువుకు విఘ్నాలు ఉండవన్నాడు .అలాగే నిర్విఘ్నంగా క్రతువు పూర్తయి దేవతలు తృప్తి చెందారు .దేవతలతో గణపతి తన స్తోత్రాన్ని భక్తీ శ్రద్ధలతో పఠించినవారికి .దరిద్రం ,దుఖం కలగదని ,ఆస్థానం లో అలసత్వం లేకుండా స్నాన దానాలు చేసినవారి సకలకార్యాలు సిద్ధిస్తాయని చెప్పగా సురలు సరే అని కృతజ్ఞతలు చెప్పి ,స్వర్గానికి వెళ్ళిపోయారు .ఈ తీర్ధమే అవిఘ్న తీర్ధం .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలలో ప్రత్యేక అతిధి -శ్రీ ”ప్రాస”మణి గారు

పద్యాలలో ప్రాస గురించి మనకు తెలుసు .ప్రసంగం లోనూ ప్రాస తో  మైమరపించే  కావలికి చెందిన  రిటైర్డ్  తెలుగు పండిట్ శ్రీ” ప్రాస” మణి  గారిని సరసభారతి శ్రీ వికారి  ఉగాది  వేడుకలకు ప్రత్యేక అతిధిగా ఇప్పుడే ఆహ్వానించాము . వారు తప్పకవచ్చి పాల్గొని మనలను ప్రాస డోలికలో ఉర్రూత లూగించటానికి వస్తున్నామని అంగీకారం తెలిపారని తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్

image.png
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -32 44-బ్రహ్మ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -32

44-బ్రహ్మ తీర్ధం

భక్తిని ముక్తినీ ఇచ్చే బ్రహ్మ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .రాక్షసులు రసాతలం లో దాక్కున్నప్పుడు మాతృకలు కూడా వెళ్ళగా దేవతలు మాత్రం అక్కడే ఉండిపోయారు .గాడిద ఆకారం కల బ్రహ్మగారి అయిదవ ముఖం అసురులను పారిపోవద్దనీ,  తాను క్షణం లో దేవతలనందర్నీ చంపుతానని అన్నది .సురలు ఒణుకుతూ విష్ణువుకు విన్నవించగా ,ఆయన ‘’నా చక్రం తో  బ్రహ్మ గార్ధభ ముఖాన్ని తెంచి వేయగలను  కాని ఖండి౦పబడిన ఆ శిరస్సు సకల ప్రపంచాన్నీ నాశనం చేస్తుంది .మీకు ఒక విరుగుడు చెబుతా .జాగ్రత్తగా విన౦డి.  శంకరుని శరణు వేడండి’’అని ఉపాయం   చెప్పాడు .

 .బ్రహ్మాది దేవతలు శివునిస్తుతి౦చగా  స౦తసి౦చి ఏమికావాలని అడిగితె,దేవతలు  విషయం వివరించగా ఆయన బ్రహ్మ యొక్క భయంకర గాడిద తలను చేతి గోళ్ళతో తు౦చి వేయగలనని ,  ,కాని దాన్ని ఎక్కడ పడెయ్యాలో ఆలోచించమని అన్నాడు   .భూదేవి తాను  ఆ శిరస్సు భ౦చ లేనని ,అది తనపై పడితే తాను  పాతాళానికి కు౦గి పోతానని చెప్పింది .సముద్రాన్ని అడిగితె   ఆ తల  పడిన తక్షణమేతాను ఎండి పోతానన్నది .గత్యంతరం లేక దేవతలు ‘’ముక్కు కారుతోంది అంటే నువ్వే తుడువు ‘’అన్న చందంగా ఆశిరస్సును శివుడే ధరించాలని కోరారు . ‘’కానుపు చేయటానికి వచ్చినమ్మ ఏది బయటపడినా తానె తీయాల్సి వస్తుంది ‘’అన్నట్లుగా తనకు తప్పదని శివుడు బ్రహ్మ గాడిత తలను గోటితో త్రుంచి ,తానె దాన్ని ధరించి లోకోపకారం చేశాడు .గరళం మింగినాయనకు ఇదో లెక్కా ?.ఇక బ్రహ్మ  గాడిద తల భయం లేదని శివునికి ప్రార్ధనలతో కృతజ్ఞతలు చెప్పి దేవతలు గౌతమీ తీరం చేరి నదినీ శివుని భక్తితో అర్చించారు .అప్పటినుంచి అది బ్రహ్మ తీర్ధంగా ప్రసిద్ధమైంది .దీనికే సూర్య తీర్ధం అనే పేరుకూడా ఉంది .మహా దేవుని చే ఖండి౦ప బడిన బ్రహ్మ  గార్ధభ శిరస్సును అవిముక్త క్షేత్రం లో స్థాపించటంవలన దేవతలకు  హితం  చేకూరింది అనినారడునికి బ్రహ్మ చెప్పాడు .బ్రహ్మ తీర్ధం లో గౌతమీ తీరం లో ఆ  శిరస్సును దర్శించి ,అవిముక్త క్షేత్రం లో ఉంచబడిన బ్రహ్మ కపాలం ను సందర్శిస్తే బ్రహ్మ హత్యా పాతకం తొలగి పోతుంది .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-19-ఉయ్యూరు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా ఇళ్లకు ఏడాదికో మాటు వచ్చే పిట్టలదొర -ఈరోజు

మా ఇళ్లకు ఏడాదికో మాటు వచ్చే పిట్టలదొర -ఈరోజు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -31 43-మాతృ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -31

43-మాతృ  తీర్ధం

నారదునికి బ్రహ్మ మాతృ తీర్ధ విశేషాలు తెలియజేస్తూ మనోవ్యధలను తీర్చే గొప్ప తీర్ధం అన్నాడు .అనేక దేవదానవ యుద్ధాలలో దేవతలు దాయాదులైన అసురులను జయి౦చ లేకపోయారు .  దేవతలను వెంటబెట్టుకొని బ్రహ్మ కైలాసం వెళ్లి శివ దర్శనం చేసి ‘’విమధ్యవారీ శమన౦గ శత్రో  యదుత్తమం తత్తు దివౌక సేభ్యః –తతశ్చ తుస్టోదాత్వా విషం సంహార నీలకంఠః!కోవా ధర్తుం త్వామృతే వై సమర్దః –తతశ్చ తుస్టోభగవానాది కర్తా  త్రిలోచనః  ‘’మొదలైన స్తోత్రాలతో స్తుతించగా ,సంతోషించి వచ్చినపనేమిటి అని అడిగితె దేవతలు ముక్త క౦ఠం తో’’దానవులవల్ల మా భయం పెరుగుతో౦దేకాని తగ్గటం లేదు దుఖార్తులను కాపాడే బాధ్యత తీసుకొని దైత్య సంహారం చేయి ‘’అని విన్నవించారు .అదే తన తక్షణ కర్తవ్యమని భావించి వెంటనే రాక్షసులున్న చోటికి వెళ్లి యుద్ధం చేశాడు .కానీ జయించటం అసాధ్యమయి అలసిపోయాడు .నొసటి నుండి స్వేదబిందువులు కారుతుండగా ,తామసమూర్తి అవతారమెత్తి దైత్య సంహారం చేయటం ప్రారంభించాడు .ఈ రుద్రావతారానికి భయపడ్డ దేవతలు పారి పోయి మేరు పర్వతం వెనక నుండి వెళ్లి భూదేవి ని ఆశ్రయించారు .

భూమికి దిగి దానవ సంహారం ఆపకుండా చేశాడు రుద్రుడు .రుద్రుని నుంచి చెమట కారి బిందువులుగా భూమి పై పడ్డాయి .ఆ బిందువులు పడిన చోట్లలో శివాకారపు మాతలు’’ ఉద్భవించారు .వాళ్ళంతా రాక్షసులని మింగేస్తామని బయల్దేరారు .రాక్షసులు రసాతాలం లో దాక్కోన్నారని అక్కడికి వెళ్లి చంపమని శివుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు.మాతలు భూమిని చీల్చుకొని ,పాతాళం చేరి  దానవులను సంపూర్ణంగా సంహరించారు .మాతల  రాక కోసం దేవతలు గౌతమీ తీరం లో నిరీక్షిస్తున్నారు  .దేవతలు ఎక్కడి నుండి బయల్దేరి మళ్ళీ ఎక్కడికి చేరారో ఈ ప్రదేశం దేవతల స్పర్శతో పునీతమై ప్రతిస్థాపన క్షేత్రమైంది .మాతలుఎక్కడెక్కడ పుట్టారో ,అక్కడ వారి పేరు మీద మాతృ  తీర్ధం గా ప్రసిద్ధమైంది .శివుని పూజించినట్లే మాతృ కలనూ పూజించాలని చెప్పి దేవతలు అంతర్ధానమయ్యారు . మాతృ కలు అక్కడే ఉండి పోయారు .ఈ ఆఖ్యానం విన్నవారికీ ,చదివిన వారికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని బ్రహ్మ నారదమునికి చెప్పాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-2-19-ఉయ్యూరు

 

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -30 42- నాగ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -30

42- నాగ తీర్ధం

బ్రహ్మ నాగ తీర్ధ మహాత్మ్యాన్ని నారదునికి వివరిస్తున్నాడు .ప్రతిష్టాపన పురం లో శూర సేనరాజు గుణవంతుడు సోమవంశం వాడు .చాలాకాలం వరకు సంతానం లేదు .పుత్రుడు కావాలని ఆశించాడు కాని ఒక సర్పం పుత్రుడుగా పుట్టింది .ఈ విషయం అత్యంత గోప్యంగా ఉంచాడు .రోజూ ఆపామును చూసి దంపతులు బాధపడేవారు .ఆ పాము మాట్లాడేది .తనకు ఉపనయనం చేయమని కోరింది .సరే అని చెవులు కుట్టించి ఉపనయనం చేసి వేద విద్య నేర్పించాడు .ఒకరోజు తనకు పెళ్లి చేయమని కోరాడు .పాముకు పిల్లనెవరిస్తారనే సందేహం బాధించింది .రాజులు ఏ రకంగానైన పెళ్లి చేసుకోవచ్చు కనుక కన్యను దొంగిలించి అయినా పెళ్లి చేయమని లేకపోతే గంగలో దూకి చస్తానని చెప్పింది ఆ సర్పపుత్రరత్నం . మంత్రులతో ఆలోచించి తనకొడుకు గొప్ప వీరుడని విద్యా వేత్త అని మాత్రమె చెప్పాడు కాని అసలు రహస్యం చెప్పలేదు .మంచి కన్యను చూడమని మాత్రం బలవంత పెట్టాడు .

ఒక ముసలి మంత్రి మాత్రం పూర్వ దేశం లో విజయుడు అనే రాజు ఉన్నాడని ,అతడికి ఎనిమిది మంది పుత్రులున్నారని ,భోగవతి అనేగుణశ్రే స్టురాలైన   కూతురు ఉందని  ,ఆమె తగినదని చెప్పాడు .ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేయమని ఆ మంత్రికి ధనకనక వస్తు వాహనాలిచ్చి ఆపిల్ల తండ్రి వద్దకు పంపాడు .ఉబ్బిపోయిన విజయ రాజు కూతుర్నిస్తానని ఒప్పుకొన్నాడు .మళ్ళీ రాజు దగ్గరకు వెళ్లి చెప్పి ఈ సారి మిగిలిన మంత్రులతో వచ్చి విజయుని కట్నకానుకలతో మెప్పించి రాకుమారుడు అక్కడికి రావటానికి ఇష్టపడటం లేదని శస్త్రానికిచ్చి  పెళ్లి చేయవచ్చునని శాస్త్రాలలో ఉందని నచ్చచెప్పి భోగవతీ కన్య వివాహాన్నిఅత్యంత వైభవంగా  జరిపించారు .మామగారు అల్లుడికి తగిన రీతిలో కట్నకానుకలు భారీగా పంపుతూ కుమార్తెను అత్తవారింటికి పంపాడు .

సర్పం తనభార్య తన దగ్గరకు ఎందుకు రావటంలేదని తల్లి దండ్రులను నిత్యం అడిగేవాడు .భోగవతికి తనభర్త సర్పం అని తెలియ జేశారు .ఆమె అధైర్యపడకుండా ,దైవ నిర్ణయమని భావించి భర్త దర్శనం చేయించమని కోరింది .పట్టె మంచం పై పవళించినభర్త  సర్పాన్నిచూసి చేతులు జోడించి తాను  ధన్యురాలుకనుకనే దైవం అయిన పతి లభించాడని చెప్పి ,పక్కపై పాము పక్కన కూర్చుని అనునయిస్తూ సపర్యలు చేసింది .ఆ పాముకు అప్పుడు పూర్వ స్మృతి కలిగి తనను చూసి భయపడనందుకు భార్య ను మెచ్చుకొనగా పతియే దైవం అని పెద్దలమాట తనకు శిరోధార్యం అన్నది .

భార్య మంచితనాన్ని ,పతిభక్తికి మెచ్చి ఆతడు ఆమెస్పర్శ చేత తనకు పూర్వ జన్మజ్ఞానం కలిగిందని ,తాను పూర్వం శివుని చేత శాపి౦ప బడి శివుని చేతికి ఆభరణంగా ఉన్న శేషుని పుత్రుడైన పాముకు తాను  భర్త అని ,పూర్వం భోగవతి తనభార్య అనీ , ఏకాంతం  లో  శివపార్వతులు  ఉండగా శివుడు ఒకరోజు పార్వతి మాటలకు పగలబడి నవ్వాడనీ, అప్పుడు తాను కూడా నవ్వానని ,శివుడు కోపించి ‘’మానవ గర్భం లో జ్ఞానం కల పాముగా పుడతావని  శపించాడని’’ చెప్పాడు  తానూ పశ్చాత్తాపంతో శంకరుని ప్రార్ధించగా గౌతమీనదిలో స్నాని౦చి తన్ను పూజిస్తే జ్ఞానం కలిగి భోగవతి అనుగ్రహం తో శాప విముక్తి కలుగుతుందని శివుడు చెప్పాడని ఆమెకు తెలియ జేశాడు .

భర్తను వెంటబెట్టుకొని భోగవతి గౌతమీ నదిలో స్నానం చేయించి శివ పూజచేయించింది .ప్రసన్న శివుడు వారికి దివ్యరూపం ప్రసాదించాడు .భార్యతో కైలాసానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అతని తలిదండ్రులు అతన్ని వారించగా భార్యతో నాగరాజు ఆరాజ్యాన్ని పాలించి  సంతానం పొంది ,గౌతమీ తీరం లో శివలింగ ప్రతిష్టచేసి నిత్యం అర్చించి చివరికి భార్యతో శివ పురి చేరాడు  .అదే నాగతీర్ధం గా ప్రసిద్ధి చెందింది .

సశేషం

అఘం అంటే పాపం .దాన్ని పోగొట్టే మాసం మాఘమాసం కనుక మళ్ళీ గౌతమీ మాహాత్మ్యం ఈ రోజు నుంచి కొనసాగిస్తున్నాను

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-19-ఉయ్యూరు

 



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మార్గశిరం లో హరి-హర కైంకర్యం

మార్గశిరం లో హరి-హర  కైంకర్యం

మధురకవి శ్రీమతిముదిగొండ  సీతారామమ్మగారు మదినిండా భక్తి నింపుకున్న విదుషీమణి .వినయం ఆమె ఆభరణం .ఆమె తలిస్తే ,పిలిస్తే పద్యం వరదలై ప్రవహిస్తుంది .అతి సహజ సుందర పదాలతో క్లిస్ట విషయాన్ని సైతం సుందర పద్యంగా చెక్కగల నైపుణ్యమున్నవారు .ఇప్పటికే చాలా పద్య కావ్యాలు రాసి ప్రచురించిన అనుభవమున్నవారు .ఈ మార్గ శిరమాసం లో ఆమె దృష్టి గోదాదేవి ‘’తిరుప్పావై ‘’పాశురాలపై ,మాణిక్కవచకర్’’ తిరు వె౦బావై’’పడి, ఆ మాసంలోనే రెండిటినీ తన స్వంత బాణీలో సీసపద్యాలలోకి అనువదించి అటు ‘’ఆ౦డాళ్ళు’’ లాగా, ఇటు’’ శివబాల’’ లాగా తన భక్తిప్రపత్తులను చాటి, తానూ ఆ వ్రతాలలో అక్షర అర్చనతో భాగస్వామి అయి ధన్యమయ్యారు .అంటే హరిహరాద్వైతం సాధించారన్నమాట .తెలుగు సాహితీ లోకానికి వాటిలోని ఉదాత్తభావనలను సరళ సుందరంగా అందించి మన్ననలు అందుకొన్నారు .

              తిరుప్పావై

  తిరుప్పావై గురించి తెలుగునాట ఈ నాడు తెలియని వారు లేరు .ప్రతి వైష్ణవాలయం లో ధనుర్మాసం లో తిరుప్పావై గానం ,వాటిపై ప్రవచనం సర్వ సాధారణమే .అందులో శరణాగతి అందరినీ తన్మయులను చేస్తుంది .పేరుకు ‘’మేలి నోము ‘’కాని ,అంతరార్ధం చాలా వేదా౦త విషయ సమగ్రం .ముక్తికి మార్గం .సామీప్య సారూప్య సాయుజ్యానికి దగ్గరి దారి .శ్రీ కృష్ణావతారం లో శ్రీకృష్ణ పరమాత్మ అతిమానుష చేష్టలు ,సౌందర్యానికి వశులైన గోపకన్యలు ధూర్త గోపాలునిపై మనసు పారేసుకొని సర్వ సమర్పణ బుద్ధితో ఉంటె ,గోప వృద్ధులు ,తమ ఇంటి కన్యకలను వేణుమాధవునికి కనిపించకుండా నేల భోషాణం లో దాచారు .దీనివలన ప్రకృతి కన్నెర్ర జేయగా ,వర్షాభావం ఏర్పడింది .దీనికి పరిష్కారంగా వృద్ధులు రాజీపడి గోపకన్యలు వర్షం కోసం శ్రీ కృష్ణుని గురించి వ్రతం చేయమని ,వారికి , కృష్ణుడిచెప్పి  ఉభయుల అంగీకారం తో ఆయనకు వీరిని అప్పగించి వెళ్ళారు..ఇక ఆలస్యంచేయరాదని ఆ రాత్రిని కొనియాడి ,అర్ధ రాత్రి నోముకై స్నానం చేయటానికి తనను లేపమని ఆనతిచ్చి ,తాను’’నప్పిన్న పిరాట్టి ‘’అయిన నీళా దేవి గృహ ప్రవేశం చేశాడుకొంటె కిట్టయ్య .  .ఆయన చెప్పినట్లే శ్రీ కృష్ణ గుణ చేస్టితులైన గోపకన్యలు స్మరణానందం తో  నిద్రరాక ,లేచీ లేవక ,లేవనివారిని మేల్కొలపటానికి నందగోపుని ఇంటికి వెళ్లి ,శ్రీ కృష్ణుని మేల్కొల్పి ,తమ ప్రార్ధనలు విన్నవించి నోము అనే పేర భగవత్ సంశ్లేషానందం పొందినట్లు గోదాదేవి పారవశ్యం తో రాసిన పాశురాలు ఇవి .అన్నిటికీ భావ గంభీరంగా పద్యాలలోకి మధుమదురంగా మలచి తమ ‘’మధురకవి ‘’బిరుదు సార్ధకం చేసుకొన్నారు ‘’సరసభారతి ఆస్థాన కవయిత్రి’’ శ్రీమతి ముదిగొండ సీతారామమ్మగారు .

                      తిరు వె౦బావై

   9వశతాబ్ది శైవకవి మాణిక్క వచకర్ పాండ్య రాజు రెండవ వరగుణ వర్మ మంత్రి .అనునిత్యం శివభక్తి తన్మయత్వం లో తేలియాడే వాడు .గొప్ప కావ్యాలు రాశాడు .కాని ఆయనపేరు 63నాయనార్ల పేర్లలో చేరకపోవటం ఆశ్చర్యం .తమిళనాడులోని మదురై జిల్లా వైగై నదీ(విశ్వనాథ వారి ‘’ఏక వీర’’నవల  కథ జరిగిన చోటు)  తీరం వాధవూర్ లో  జన్మించి,శివాలయం పూజారిగా జీవిస్తూ ,రాజు విశ్వాసం పొందాడు .అతనిలోని సైనిక పటుత్వం గమనించి రాజు ,తన సైన్యం కోసం మేలు జాతి గుర్రాలను కొనమని చాలాడబ్బు ఇచ్చాడు.సరే నని బయలేరి వస్తూంటే దారిలో శివుడే ఒక శివముని  రూపం లో కనిపించి,ఆత్మజ్ఞానం కలిగించగా  రాజు ఇచ్చిన ధనం తో ‘’తిరు పెరునత్తురై  ‘’లో గొప్ప శివాలయం నిర్మించి ,మన భక్త రామ దాసు అనిపించాడు .రాజునూ శివ భక్త శిఖామణిగా మార్చి ముక్తి పొందేట్లు చేసిన పరమ శివభక్తుడు మాణిక్య వచకర్ .ఈయన దేహం చాలించినప్పుడు ఆయన ఆత్మ దివ్యజ్యోతిగా మారి, పరమజ్యోతిలో కలిసి ,ఆయన శవం కనిపించకుండా పోయిందని భగవాన్ రమణ మహర్షి చెప్పారు .  చిదంబరం లో శ్రీ లంక బౌద్దులతో వాదం చేసి ఓడించిన ప్రతిభ ఆయనది .ఆయన ఆరాధనోత్సవం తమిళనాడు అంతటా జూన్ –జులై లో వచ్చే ‘’ఆణి’’నాడు ఘనంగా నిర్వహిస్తారు .

  ఆయన రాసిన 20 పాశురాల ‘’తిరువె౦బావై ‘’తానేఒక మహిళగా భావించి ‘’పావై నొ౦బు’’ను అనుసరిస్తూ పరమ శివుని కీర్తిస్తాడు .ఆయన విగ్రహం ఆంద్ర ప్రదేశ్ ఆర్కేలాజికల్ మ్యూజియం లో త్రిభంగ భంగిమలో ఒక చేతిలోఓం నమః శివాయ అని రాయబడిన  తాళపత్రం తో ఉన్నది .కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామి మాణిక్య వచకర్ గురించి ,తిరువె౦బావై ఘనత గురించి తరచుగా చెప్పేవారు .ఇందులోని 9వ పాశురం కావ్యానికి ఆత్మ,ఫలశృతిగా ఉందని సీతారామమ్మగారు చెప్పిన మాటలు యదార్ధం –ఒక సారి ఆపద్య వైభోగం చూద్దాం –

‘’చిన్మయ రూపుడాచిత్త చిదంబర –నటరాజ గిరివాస నందివాహ –కామేశ్వరీ పతి ,కామ సంహారుడా –కనికరించుము స్వామి కరుణ చూపు —-

‘’భస్మధారుల కిల భవబంధ వితతి –త్రెంపి బాస టగుడదువయ్య దీనబంధు –మార్గ శిర మాస తానముల్ మార్గ మిచ్చు –శివుని దరి చేర్చు వ్రతమిది శివము గూర్చు ‘’

  ఈపద్యం శ్రీనాధుని భీమఖండం లోని ‘’చంద్ర బింబానన -,చంద్ర రేఖా మౌళి, నీలకుంతల ఫాల, నీల గళుడు ‘’పద్యాన్ని స్ఫురణకు తెచ్చింది .

  ఈ పాశురాలలో  ‘’ శివుని దరి చేర్చు వ్రతమిది శివము గూర్చు ‘’మకుటం ‘’మకుటాయమానం’’గా ఉన్నది .పద్యాలు జలపాత సౌరుతో మానసిక విందు కూర్చింది .పూర్వం మన మగువలు చదివే ‘’ఆధ్యాత్మ రామాయణ  కీర్తన ‘’ల తన్మయత్వం కలిగిస్తుంది.అలా పాడుకోవటానికి అనువుగా కూడా  ఉన్నది . .అవును .తనువూ మనసు భగవంకితమైనప్పుడు వచ్చే శబ్దం ,అర్ధం అత్యంత ఉన్నతంగా నే ఉంటాయి .

   ఇలా శివ- కేశవుల అభేదాన్ని భక్తిభావ బంధురంగా రెండు రకాల పాశుర పద్యాలలో నిబద్ద౦  చేసి  తమ కలం కత్తికి రెండు వైపులా సునిశిత ’’ ధార’’ ఉందని నిరూపించారు శ్రీమతి సీతారామమ్మగారు .అభిన౦దనలు .

          గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-19-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉయ్యూరు ,మరియు స్థానిక రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలతో  సంయుక్తంగా శ్రీ వికారి నామసంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి ముందువచ్చే ఆదివారం 31-3-19 సాయంత్రం 3గంటలకు కే.సి .పి.షుగర్ ఫాక్టరీ దగ్గరున్న  రోటరీక్లబ్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నాము .సాహిత్యాభిమానులూ, కవిమిత్రులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానిస్తున్నాము .

  ఈ వేడుకలలో1- ‘’స్త్రీ శక్తి ‘’అనే అంశం పై జిల్లాలోని  ప్రముఖ కవి మిత్రుల చేత ‘’కవి సమ్మేళనం నిర్వహింపబడుతుంది

 2-,కొందరు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ,

3-స్వయం శక్తితో ఎదిగిన వారికి ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాలు అంద జేయబడుతాయి

4.శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి ,సరసభారతి ప్రచురించిన మూడు పుస్తకాలు 1-117వ మూలకం ‘’టెన్నిస్సిన్’’కనిపెట్టిన ఆంధ్ర శాస్త్రవేత్త ‘’అణు శాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకటరామయ్య’’( 117వ మూలకం ‘’టెన్నిస్సిన్’’కనిపెట్టిన ఆంధ్ర శాస్త్రవేత్త –అమెరికా )‘’ 2 –‘’ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత కీ.శే.డా.పుచ్చా వెంకటేశ్వర్లు’’ ( లేజర్ కిరణాలపై నూతన ఆవిష్కరణలు చేసి  ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ .ఐ .టి .,,అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సిటి ల నిర్మాణానికి కారకులైన తెలుగు శాస్త్ర వేత్త ) 3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 –రెండవభాగం (254 శ్రీ ఆంజనేయ దేవాలయ విశేషాలు )ఆవిష్కరణ జరుగుతుంది .

  కార్యక్రమ౦లో పాల్గొను అతిధులు-1-శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు 2-శ్రీమతి గుళ్ళపల్లి రామమూర్తి రాధిక –ప్రముఖ పర్వతారోహకురాలు ,ఆంధ్రప్రదేశ్ సూపరి౦టె౦డ్ ఆఫ్ పోలిస్ ,ఆక్టోపస్  -విజయవాడ , శ్రీ 3-జి.వెంకటేశ్వరావు – సి .ఇ.ఒ-కెసీపి  4-శ్రీ పులి శ్రీనివాసరావు-రోటరీక్లబ్ అధ్యక్షులు –5 శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు 6-శ్రీ చలపాక ప్రకాష్ –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి, రమ్యభారతి సంపాదకులు,7-శ్రీ విద్యానంద ,శ్రీ చక్రార్చన పరాయణ ,ఆధ్యాత్మిక గ్రంథకర్త , నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి M.E..(హైదరాబాద్ ) 8డా ఉప్పలధడియం వెంకటేశ్వర –తెలుగు ,హిందీ భాషాకవి ,గ్రంథకర్త ,జనని సాహిత్య సంస్థ నిర్వాహకులు –చె న్నై 9-శ్రీ గీతా సుబ్బారావు –ప్రముఖ కార్టూనిస్ట్ ,కవి ,హాస్య రచయిత-హైదరాబాద్ 10-శ్రీ కొల్లూరి రమణ –తెలుగు విద్యార్ధి మాసపత్రిక నిర్వాహకులు 11-శ్రీ అల్లూరు శివ కోటేశ్వరరావు –వ్యాస బృందం –ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు –కారం చేడు 12-శ్రీమతి కమలాకర్ భారతి –కమలాకర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ,శ్రీ వికాస భారతి స్కూల్ ,,ఓల్డేజి హోమ్ స్థాపక నిర్వాహకురాలు ,ప్రముఖ సామాజిక  సేవా కర్త  –హైదరాబాద్ -13కుమారి చలమల శెట్టి నిఖిల –మహిళా వ్యక్తిత్వ వికాస రచయత్రి –విజయవాడ 14- శ్రీ మల్లంపల్లి విజయనీ మహా కాళేశ్వరావు-రిటైర్డ్ తెలుగు జూనియర్ లెక్చరర్ – కాకినాడ 15-డా.కోనేరు లక్ష్మీ ప్రమీల మొదలగువారు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం )

నారాయణ కుమారుడైన చక్రపాణి దత్త 11వ శతాబ్ది సంస్కృతకవి .నరదత్త శిష్యుడు .లోధ్రవలీ కులీన బ్రాహ్మణ కుటుంబీకుడు .పశ్చిమబెంగాల్ భీర్భం నివాసి .ఇతని మాగ్నం ఓపస్ రచన ‘’శిక్షా సార సంగ్రహ ‘’లేక శిక్షా సమగ్రః అనే ఆయుర్వేదం పై ఒరిజినల్ గ్రంథం.శబ్ద చంద్రిక,ద్రవ్యగుణ సంగ్రహ ,చికిత్సాసార లేక గూఢ వాక్య బోధక ,సర్వ సార సంగ్రహ ఇతర రచనలు .చరక సుశ్రుతుల గ్రంథాలపై వరుసగా ఆయుర్వేద దీపిక ,భానుమతి అనే వ్యాఖ్యానాలు రాశాడు .

400-చంద్ర వ్యాకరణ కర్త -చంద్ర గోమిన్ (7వ శతాబ్ది )

7వ శతాబ్ది బెంగాల్ కవి చంద్ర గోమిన్ చంద్ర వ్యాకరణం రాశాడు .లోకానంద అనే నాటకం ,న్యాయ సిద్ధ్యాలోకం ,ఆర్య తారాదేవి స్తోత్ర మౌక్తికమాల ,కూడా ఇతని రచనలే .

401 –నిబంధ సంగ్రహ కర్త –దల్లాన (13వ శతాబ్ది )

దళ్బన ,దళ్హన అని కూడా పేర్లున్న దల్లాన 13వ శతాబ్ది ప్రముఖ వ్యాఖ్యాత .సూత్ర సంహితకు అమోఘమైన ‘’నిబంధ సంగ్రహ ‘’వ్యాఖ్యానం రాశాడు .అంకోల కు చెందిన బ్రాహ్మణుడు .తండ్రి భరుపాల .

402-కుట్టానిమత కర్త –దామోదరగుప్త (8-9శతాబ్దం )

కామ కళాకేళీ గ్రంథమైన ‘’కుట్టాని మత ‘’ రాసినవాడు దామోదరగుప్త .క్రీ.శ.779-813కాలం కాశ్మీర రాజు జయాపీడుని మంత్రి అని కల్హణుడు రాజతరంగణిలో చెప్పాడు .

403-అవలోక వ్యాఖ్యాన కర్త –ధనిక (10వ శతాబ్దం )

ధను౦జయుని దశరూపకం పై ‘’అవలోక ‘’వ్యాఖ్యానం రాసిన ధనిక కవి  విష్ణు కుమారుడు. .10వ శతాబ్ది ఉత్పల దేవ రాజు  మంత్రి .కావ్య నిర్ణయం కూడా ఇతని రచనే అంటారు .ధనుంజయుని సోదరుడు అని కొందరంటారు .మరికొందరు ధనిక యే ధనుంజయుడు అన్నారు .

405-వాదగ్ధ ముఖ మండన కర్త –ధర్మ దాససూరి (13వ శతాబ్ది )

13వ శతాబ్దికి  చెందిన బౌద్ధకవి ధర్మ దాస సూరి .వాదగ్ధ ముఖ మండన అనే  ఛందో గ్రంథం  రాశాడు

406-పవన దూత కర్త –ధోయి (12-13శతాబ్ది )

12లేక 13వ శతాబ్ది బెంగాల్ రాజు లక్ష్మణ సేన ఆస్థానకవి ధోయి.ఇతనికే ధోయికా అనే పేరుకూడా ఉంది .బ్రాహ్మణుడని ,వైద్యుడని కొందరు అంటే చేనేత వాడని కొందరన్నారు .పవన దూత కావ్యం రాశాడని సదుక్తి కర్ణామృతం ,సుభాషిత ముక్తావళి ,సారంగధర పద్ధతిలో చెప్పబడినా అందులోని శ్లోకాలు అలభ్యం .

407-రసేంద్ర  చింతామణి కర్త –ధుందూక దత్త (15వ శతాబ్ది )

15వ శతాబ్దికి చెందిన ధుందూక దత్త ఆయుర్వేద వ్యాఖ్యానం ‘’రసేంద్ర చింతామణి ‘’రాశాడు

408-చందోమంజరి కర్త –గంగాదాస (12వ శతాబ్ది )

12వ శతాబ్దికి చెందిన ఒరిస్సా కవి గంగాదాస చందోమంజరి అనే అలంకార గ్రంథంరచించాడు వైద్యగోపాలదాస ,సంతోష కుమారుడను అని కవే చెప్పుకొన్నాడు .తాను అచ్యుత చరిత ,కంసారి శతకం ,దినేశ శతకం కూడా రాశానని చెప్పాడు .

409-ఘట కర్పర కావ్య కర్త –ఘట కర్పర (105 బి.సి.)

క్రీపూ 105కు చెందిన విక్రమాదిత్య మహారాజు ఆస్థాన కవులైన నవరత్న కవులలో ఘట కర్పర ఒకరు.ఘటకర్పర అనే కావ్యం రాశాడు .ఇది 22శ్లోకాల సందేశ కావ్యం కొత్తగా  పెళ్ళైనవాడు భార్యకు పంపిన సందేశమే ఇతి వృత్తం .యమకాలతో కావ్యమంతా నింపేశాడు .

410-హరిభక్తి విలాస కావ్యకర్త –గోపాల భట్ట (1503-1578)

బెంగాల్ లోప్రముఖ  వైష్ణవ మత ప్రచారకులైన ఆరుగురు బృందావన గోస్వాములలో ఒకరైన గోపాలభట్ట బెంగాల్ కుచెందినవాడు .1503లో జన్మించి 75ఏళ్ళు జీవించి 1578లో మరణించాడు ,చైతన్య స్వామి శిష్యుడు .హరిభక్తివిలాసం  అనే ప్రముఖ రచన చేశాడు దీనిలో వైష్ణవులు  సామాజిక మత ధర్మాలను ఎలా నిర్వహించాలోసాధికారంగా రచించాడు వారికి ఇది కరదీపిక .సత్క్రియా సార దీపిక కూడా ఈయన రచనే అని అంటారు  .

మనవి – ఇప్పటివరకు నేను రాసి ,సరసభారతి ప్రచురించిన ‘’గీర్వాణకవుల కవితాగీర్వాణ౦   మూడు భాగాలలో 146+482+462=1090మంది సంస్కృత కవుల గురించి రాశాను .అంతర్జాలం లో రాస్తున్న ఈ నాలుగవ భాగం లో ఇప్పటికి 410మంది గీర్వాణ కవుల పై రాశాను .అంటే మొత్తం 1500మంది గీర్వాణ కవులపై రాసే అదృష్టం దక్కింది .కానీ ఇంకా చాలామంది ఉన్నారు .కనుక ప్రస్తుతం గీర్వాణం-4 కు విరామం మాత్రమే ప్రకటిస్తూ ,మళ్ళీ వీలువెంట రాసేఅవకాశం తీసుకొంటానని సాహితీ బంధువులకు సవినయంగా తెలియ జేస్తున్నాను .

సశేషం

రేపు ప్రారంభమయ్యే  పవిత్ర మాఘమాసం  శుభాకాంక్షలు

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 



Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం )

సంపాదకుడు రచయిత,అనువాదకుడు కే .రామచంద్ర శర్మజనన వివరాలు తెలియదు .ఆయన ముఖ్య రచనలు 1-రామపనివాద వ్యాఖ్యానం తో వరరుచి రాసిన ప్రాకృత ప్రకాశ 2-పౌస్కరాగమ 3-విరాట పర్వ మణిప్రవాళ మంజరి 4-యాజ్ఞికోపనిషద్వివరణం  5-సర్వజ్ఞోత్తమ రామః 6-అలంకార సంగ్రహః 7-డిస్క్రిప్టివ్ కేటలాగ్ ఆఫ్ తమిల్ మాన్యు స్క్రిప్ట్స్ 8-ది మెసేజ్ ఆఫ్ సెయింట్ తయామన్వార్  .

398-అర్వాచీన సంస్కృతం కర్త –రమాకాంత శుక్లా (1940)

1940లో ఉత్తరప్రదేశ్ ఖుర్జా లో జన్మించిన రమాకాంత శుక్లా తలిదంద్రులు సాహిత్యాచార్య పండిత బ్రహ్మానంద  శుక్లా శ్రీమతి ప్రియంవద శుక్లా లనుంచి  సంస్కృతం నేర్చాడు .సాహిత్య ఆచార్య ,సాంఖ్యయోగ  ఆచార్య డిగ్రీలు పొంది ,ఆగ్రా యూని వర్సిటిలో చేరి హిందీ ఎం.ఏ.గోల్డ్ మెడల్ తో  పాసై ,సంపూర్ణానంద యూనివర్సిటి నుంచి సంస్కృత ఎం.ఏ.పొందాడు .జైనా చార్య రవి సేన రచించిన పద్మపురాణం -తులసీ దాసు రాసిన రామచరిత మానసం ల తులనాత్మక పరిశోధన చేసి 1967లో పిహెచ్ డి సాధించాడు .

  మోడీ నగర్ లోని ముల్తానిమల్ మోడీ పిజి  కాలేజి లో 1962లో హిందీ లెక్చరర్ గా చేరి ,తర్వాత  ఢిల్లీ యూనివర్సిటిలోని రాజధాని కాలేజి లో హిందీ ఫాకల్టి  మెంబరయ్యాడు  .1986లో రీడర్ అయి ,2006లో రిటైరయ్యాడు .ప్రపంచ సంస్కృత సమ్మేళనం తో సహా చాలా సెమినార్ లకు  కాన్ఫరెన్స్ లకు హాజరయ్యాడు .’’ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ ఈస్తెటిక్స్ అండ్ పోయెట్రి ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’కు అధ్యక్షత వహించాడు .’’అర్వాచీన సంస్కృతం ‘’అనే త్రైమాస పత్రిఅకు ముఖ్య స౦పాదకుడు గా ఉన్నాడు.ఈ పత్రిక ఆయనే ఢిల్లీ లో స్థాపించిన ‘’దేవవాణి’’పరిషత్ ఆధ్వర్యం లో వెలువడేది .రేడియోలో సర్వభాషా కవిసమ్మేళన లో సంస్కృత కవిగా పాల్గొన్నాడు .

  దూర దర్శన్ ప్రసారం చేసిన ‘’భాటీ మే భారతం ‘’అనే సంస్కృత సీరియల్ రాశాడు శుక్లా ఆయన జీవితం సంస్కృత సేవ పై  ‘’దేవవాణి సుయశః ‘’అనే ప్రత్యేకక సంచిక వెలువడింది . అర్వాచీన సంస్కృతం ,సారస్వత సంగమ౦,భారత జ్ఞానతాహం అనే రచనలు చేశాడు .ప్రస్తుతం ఢిల్లీ లోని రాష్ట్రీయ  సంస్కృత సంస్థాన్ ‘’లో ‘’శాస్త్ర చూడామణి విద్వాన్ ‘’గా సేవలందిస్తున్నాడు .

   శుక్లా సంస్కృత ,హిందీ భాషా పాండిత్యం కు తగిన సంస్కృత రాష్ట్ర (జాతీయ )కవి ,కవి రత్న ,కవి శిరోమణి ,హిందీ –సంస్కృత సేతు బిరుదులు  పొందాడు .కాళిదాస సమ్మాన్ ,సంస్కృత సాహిత్య సేవా సమ్మాన్ అందుకొన్నాడు .ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారం అందజేసింది .ఢిల్లీ సంస్కృత అకాడెమి  ‘’అఖిల భారతీయ మౌలిక సంస్కృత రచనా పురస్కారం ‘’అందించి గౌరవించి సత్కరించింది .2009లో భారత రాష్ట్ర పతి’’సంస్కృత విద్వాంస ‘’పురస్కారం ఇచ్చారు .2013 భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారమిచ్చి గౌరవించింది .’’ భారతీయ ప్రకార సంఘం ‘’కు శుక్లా వ్యవస్థాపక అధ్యక్షుడు .2018లో శుక్లా రచించిన ‘’మమ జనని ‘’పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ లభించింది .

image.png

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’

డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’

 కృష్ణా జిల్లా జగ్గయ్య పేట లో ఆంధ్రోపన్యాసకులుగా చేసి రిటైరైన  డా.శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి ,జాతీయ ,అంతర్జాతీయ సదస్సులలో 65దాకా విశ్లేషణాత్మక పత్రాలు రాసి సమర్పించిన విద్వన్మణి.’’రమణాయన కావ్య రమణీయం ‘’పై పరిశోధన చేసి పిహెచ్ డిఅందుకొన్నారు .శ్రీ ఆంజనేయ శతకం ,శ్రీ గాయత్రి మాతృ ద్విశతి ,దేశభాష లందు తెలుగు లెస్స సంకలనం తో సాహితీలోకం లో  సుప్రసిద్ధులు .ఇప్పుడు తాజాగా2018 డిసెంబర్ లో  ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’వచన రచన చేసి ఆ మాతపై తమకున్న భక్తిప్రపత్తులను చాటుకొని ,.చాలాకాలంగా సాహితీ మిత్రులైన శాస్త్రి గారు నాకు సుమారు 20 రోజులక్రితం దానిని పంపారు .చదవటానికి ఇప్పటికి కుదిరి చదివి ఆనందించాను .వీరి జ్ఞాన సంపత్తికి డా .రామడుకు వేంకటేశ్వర శర్మగారు ‘’జ్ఞానాభి షేకం ‘’చేస్తే ,మహాకవి శేఖరులు శ్రీ భారత శ్రీమన్నారాయణ ‘’చిదంబర ప్రశస్తి ‘’చేసి చిదంబర విజ్ఞాన రహస్యం బయట పెట్టారు .శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల తిరుమలాచార్యులు అభినందన కంఠహారం-గ్రైవేయకం సమర్పించారు .స్మార్త క్రమాంత విశిష్ట స్వాధ్యాయి శ్రీ జగర్ల పూడి వీరభద్ర శర్మ ‘’జ్ఞాన యజ్ఞం ‘’గా శాస్త్రి గారి కృషిని అభివర్ణించారు .శాస్త్రి గారు’’ ఒక్క మాట ‘’లో సూర్యుడున్న చోట చీకటి ఉండనట్లే సనాతన ధర్మమున్న చోట దుఖ౦ ఉండదని  ,బ్రహ్మ సమానమైన దేవుడు ,బ్రహ్మ సమానమైన గురువు , బ్రహ్మ సమానమైన తపం లేదని భావిష్యపురాణ౦ చెప్పిందనీ కనుక గాయత్రీ మంత్రం బ్రహ్మ సమానమైనదని చెప్పారు .ఇప్పుడు గ్రంథంలోని కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుంచుతున్నాను .

  ‘’సూర్యుడు ,నక్షత్రాలు లేని ఆహోరాత్రాలమధ్య సందికాలాన్ని సంధ్య అంటారు ఇదికాలవాచకమే అయినా ,ఉపాస్య దేవత గా ఆరాధించాలి .అని చెప్పి గాయత్రి ఆవిర్భావ కథ తెలిపి ,’’యా వసేత్ ప్రాణి జిహ్వాసు సదా వాగుపవర్తనాత్-సరస్వతీతి నామ్నేయం సమాఖ్యాతా మహర్షి భిః’’అంటే జీవరాసులలో వాక్కు ఉన్నవారి నాలుక కొనపై నర్తించేది సరస్వతి అని ఋషులు చెప్పారని తెలియజేశారు .తర్వాత గాయత్రి విశిష్టతను చెబుతూ ముక్తినిచ్చే 6 గయలలో గాయత్రి కూడా ఒకటన్నారు .పరమేశ్వరుని ముఖం నుండి వెలువడిన మొదటి ఛందస్సు గాయత్రి .గానం చేస్తే రక్షించేదీ,గయ అనబడే ప్రాణాల్ని కాపాడేదీ,ఆరాధిస్తే మనస్సుకు ప్రశా౦తినిచ్చేదీ గాయత్రి అన్నారు .ఋగ్వేద ,అధర్వ వేద ,శతపథ బ్రాహ్మణ ,సూత సంహిత ,బృహదారణ్య  ఛాందోగ్య  నారాయణ ,నృసింహ పూర్వతాపి ,మైత్రాయణి, ఉపనిషత్ లలో నిర్వచి౦ప బడిన గాయత్రిని బహు శ్రమ కోర్చి వెలికి తీసి ముందుంచారు .బృహద్యోగి యాజ్ఞవల్క్యం ,విశ్వామిత్ర స్మృతి ,మను స్మృతి,స౦వర్త  ,యాజ్ఞవల్క్య ,హరీత, పరాశర,శంఖ ,స్మృతులలో ఉన్నగాయత్రినీ ,పద్మ ,కూర్మ అగ్ని ,మత్స్య,భవిష్య ,నారద పురాణాలలో  చెప్పబడిన గాయత్రిని ,సంధ్యా భాష్యం,మహాభారతం భగవద్గీత ,భాగవత గాయత్రినీ వివారించారు .శ్రీ వాసా సూర్యనారాయణ ,శ్రీ శేషావతారం గార్లు  చేసిన గాయత్రీ స్తుతి ,శ్రీనాథుని కాశీఖండ గాయత్రి ని వివరించి ,బ్రాహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్యగారు శ్రీనాథుని  సీసానికి చెప్పిన వివరణ ఇచ్చారు –‘’గాయత్రీ దేవికి మూడు వేదాలు మూడుపాదాలు,భూమి ఆకాశం నాలుగు దిక్కులు కలిసి ఆరు కుక్షులు ,సమస్త భవనం శరీరం ,స్వర్గమే పొట్ట ,ధర్మశాస్త్రం హృదయకోశం .ఛందస్సమితి స్తనద్వయం .ఈశ్వర నిరీశ్వర సాంఖ్యాలు రెండూ రెండు చెవులు .అగ్ని ముఖం .శిక్షా, వ్యాకరణ, నిరుక్త,జ్యోతిష ,కల్పాలు అయిదూ అయిదు తలలు  ,అధర్వణ వేదం చేస్ట,శిఖ శివుడు.  బ్రహ్మ శిరస్సు .విష్ణువు ఆత్మ ,.భావ లక్షణం తటస్థ లక్షణం .  పూర్వ మీమాంస స్థూల శరీరం ,వేదాంత శాస్త్రం సూక్ష్మ శరీరం .

   ఇలామనకు తెలిసినా, తెలీని అనేక విషయాలు తరచి రాసిన పుస్తకం .తర్వాత గాయత్రీ మంత్రాని శబ్దగత అర్ధం మంత్రాధి దేవతలు ,మంత్రాక్షర వర్ణాలు ,ఛందస్సులు బీజాక్షరాలు  ,తత్వాలు ,ఋషులు , కళలు ,,దేవీశక్తులు ,మంత్రాక్షర అవతారాలు ,సత్ ప్రవృత్తులు ,సిద్ధులు ,విద్యలు ,మాతృకలు ,కూడా సవివరంగా తెలిపారు .గాయత్రీ మంత్రం లో 24అక్షరాలకు 24 స్త్రీ ,పురుష దైవీ శక్తులున్నాయని వాటినీ వివరించారు .గాయత్రీ మంత్ర జపాన్ని  పది సార్లు ,28సార్లు ,108సార్లు ,వెయ్యిన్నూట ఎనిమిది సార్లు శక్తి ననుసరించి చేయాలి .

   పిమ్మట గాయత్రి మంత్ర హోమ విధానం ,గాయత్రీ మంత్ర మహిమ తెలిపే వృత్తాంత గాధలు చెప్పి గాయత్రీ మాహాత్మ్యాన్ని గురించి వేదవ్యాసుని దగ్గరనుంచి ,మహర్షులు ,జగద్గురు శంకరాచార్య ,రమణమహర్షి ,స్వామి శివానంద ,రామకృష్ణ పరమహంస ,స్వామి వివేకానంద ,అరవి౦దయోగి, గాంధీజీ ,  రవీంద్ర, తిలక్ ,మాలవ్యా దయానంద సరస్వతి,సర్ మోనియర్ విలియం దాకా ప్రస్తుతి౦చిన విషయాలు చెప్పి  చివరికి ఫలశ్రుతి చెబుతూ గాయత్రీ మంత్ర జపం చేసిన చోట అగ్ని జల,వాయు  పిశాచ సర్ప  భయం ఉండదని భరోసా తో ముగించారు .

  ఒక రకంగా డా సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారి ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’ఆల్ ఇన్ వన్ లేక ‘’గాయత్రీ విజ్ఞాన సర్వస్వం ‘’అని  ఢంకాపథంగా చెప్పవచ్చు .దీన్ని వారి గురు పాదులు స్వర్గీయ బ్రహ్మశ్రీ భాగవతుల సంజీవ శాస్త్రి గారికి అ౦కితమివ్వటం శాస్త్రిగారి గురుభక్తికి తార్కాణ.ఇంత విలువైన గ్రంథాన్నికీ.శే.శ్రీమతివేముల రాజ్యలక్ష్మి ,శ్రీ రాఘవరావు దంపతుల స్మృత్యర్ధం వారికుమారులు  ,కోడళ్ళు కీ.శే .వేముల సాంబశివరావు శ్రీమతి పద్మావతి దంపతులు ,శ్రీ వేముల నగేష్ ,శ్రీమతి స్వాతి దంపతులు ఆర్దికసాయమందించి ప్రచురించినందుకు అభినందనలు  .కీర్తి శేషులను అక్షరాలతో నిజంగా కీర్తి శేషుల్ని చేశారు .శ్రీ గాయత్రి మాత ఆ కుటుంబాలకు సర్వదా రక్షగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను  

     ‘’చిదంబర రహస్యం’’గా ఉన్న గాయత్రీ మాహాత్మ్యాన్ని శ్రీ చిదంబర శాస్త్రి గారు కరతలామలకం చేసినందుకు అభినదిస్తూ మరిన్ని ఆర్ష విద్యా గ్రంథాలు వారి నుండి వెలువడాలని ఆశిస్తున్నాను .

   ‘’త్వమేవ సంధ్యా గాయత్రీ సావిత్రీచ సరస్వతీ –బ్రాహ్మీచ వైష్ణవీ రౌద్రీ రక్తాశ్వేతా సితే తరా’’

‘’కమలా విష్ణు లోకే చ , గాయత్రీ బ్రహ్మలోక దా-రుద్ర లోక స్థితా గౌరీ హరార్ధాంగ నివాసినీ ‘’

గాయత్రీం చి౦తయేద్యస్తు హృత్పద్మేసముపస్థితం –ధర్మా ధర్మ వినిర్ముక్తః తయాతి పరమా౦  గతిం ‘’

‘’కర కమలంబుల యందున –వర వేద కమండలములు భాసిలు చుండన్ –శిరమున ఖండేందునితో –వరలెడి గాయత్రి !నీకు వందన శతముల్ ‘’

సుందరమైన ముఖ చిత్రాలతో ,పాల నురగవంటి తెల్లకాగితాలపై  207పేజీల అత్యంత విలువైన సమాచారం తో ఉన్న   ఈ గ్రంథాన్ని పొందటానికి మూల్యం –కేవలం శ్రీ గాయత్రీ ధ్యానమే .అంటే ఉచితంగా పొందవచ్చు .కావలసినవారు శాస్త్రి గారి ఈ క్రింది చిరునామాకు సంప్రదించండి –

 డా.సర్వా సీతారామ చిదంబర శాస్త్రి –అక్షర భారతి కాన్సెప్ట్ స్కూల్ –పాత కోర్టు భవనం –వినాయకుడి గుడి దగ్గర –జగ్గయ్య పేట 521175 –కృష్ణా జిల్లా

సెల్ –9885383741

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-19-ఉయ్యూరు .

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949)

15-2-1949న రాధా వల్లభ త్రిపాఠీ జన్మించి ,1970 సంస్కృత ఎం.ఏ.లో గోల్డ్ మెడల్ సాధించి ,పి.హె.డి. పొంది,1981లో డి. లిట్ .అయ్యాడు  .మధ్య ప్రదేశ్ సాగర్ లోని డా.హరి సింగ్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా చేరి 1983-2014వరకు పని చేసి ,2008-2013లో ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా పని చేసి ,సిమ్లాలోని ఇండియన్  ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్   అడ్వాన్స్ డ్ స్టడి ఫెలో అయ్యాడు .త్రిపాఠీ అభిమాన విషయాలు నాట్య శాస్త్రం ,సాహిత్య శాస్త్రం .

38 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యు ఏట్ క్లాసులు బోధించిన ,25ఏళ్ళు పిజి యూనివర్సిటి   సంస్కృత డిపార్ట్ మెంట్  హెడ్ గా ,6ఏళ్ళు డీన్ గా ,5ఏళ్ళకు పైగా వైస్ చాన్సలర్ ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా మరొక అయిదేళ్లకు పైన పని చేసిన అనుభవం త్రిపాఠీ ది.38ఏళ్ళు రిసెర్చ్ గైడ్ గా 50మందికి పిహెచ్ డిలు రావటానికి తోడ్పడిన మార్గదర్శి .

నాట్య శాస్త్ర   విజ్ఞాన సర్వస్వం 4భాగాలు ప్రచురించిన శేముషీ సంపన్నుడు త్రిపాఠీ.కోల్పోయిన నాట్య శాస్త్ర విషయాలను క్రోడీకరించి మోనోగ్రాఫ్ లు గా ప్రచురించిన ప్రతిభా సంపన్నుడు .సంస్కృత నాటకం ,జానపద నాటకరంగం లపై అనేక ప్రాజెక్ట్ లు నిర్వహించి ప్రచురించిన కళాభిమాని .

త్రిపాఠీ కి ఉన్న అపార అనుభవం వలన ఆయనను ఎన్నో ప్రధాన ప్రసిద్ధ పదవులు వరించాయి .1-డీన్ ఆఫ్ ఫాకల్టి ఆఫ్ ఆర్ట్స్ ,2-మద్యప్రదేశ యూని వర్సిటి రిసెర్చ్ జర్నల్ ఎడిటర్ 3-సాగర్ యూనివర్సిటి ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ మెంబర్ 4-సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ సాంస్క్రిట్ కు చైర్మన్ 5-ఇంటర్నల్ క్వాలిటి అస్స్యూరెన్స్ చైర్మన్ ,6-సంస్కృత పాఠ్య     పుస్తకాల కమిటీ ముఖ్య సలహాదారు 7-కేంద్ర సాహిత్య అకాడెమీ ఎక్సి క్యూటివ్ మెంబర్ 8-N.C.E.R.T. సంస్కృత కర్రిక్యులం చైర్మన్ ,9-అనేక యూని వర్సిటీల ‘’నాక్ ‘’పీర్ టీం చైర్మన్ .

త్రిపాఠీ  విజ్ఞాన  సంపన్నతకు తగిన బిరుదులూ ,పురస్కారాలు అందుకొన్నాడు

1-సంస్కృత సాహిత్య అవార్డ్ 2-బెస్ట్ రిసెర్చ్ పేపర్ అవార్డ్ 3-రాజ శేఖర అవార్డ్ 4-నాటక రచనకు సాహిత్య కళా పరిషత్ అవార్డ్ 5-బెస్ట్ రిసెర్చ్ పబ్లికేషన్ అవార్డ్ 6-వ్యాస పురస్కారం 7-వి వి .కాణే స్మారక పురస్కారం 8-భోజ పురస్కారం 9-కంబన్ సమ్మాన్ హిందీ అకాడెమి అవార్డ్ 10-వాగీశ్వరి అవార్డ్ 11-కాళిదాస సమ్మాన్  రెండు సార్లు 12-కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ 13-రామ కృష్ణ సంస్కృత పురస్కారం 14-కేకే బిర్లా శంకర్ అవార్డ్ 15-సంస్కృత మహామహోపాధ్యాయ బిరుదు 16-నాట్యాయన సంస్థ చే భవభూతి అవార్డ్ 17-సంస్కృత గౌరవ సమ్మాన్ 18-జాతీయ వేదం వ్యాస పురస్కారం 19-5వమహా కవి  కాళి దాస సంస్కృత జీవన్ వ్రతి అవార్డ్ 20-5వ జయదేవ సరస్వతి అవార్డ్ 21-సంస్కృత శిరోమణి సమ్మాన్ 22-మహా రాష్ట్ర ప్రభుత్వం చేత జీవన్ వ్రతి సంస్కృత సమ్మాన్ 23-పూనా యూని వర్సిటి నుంచి గౌరవ డాక్టరేట్ 24-రాజప్రభ పురస్కార 25-పండితరాజ జగన్నాథ పురస్కార 26-ఆచార్య సుమతీ సాగర్ స్మృతి అవార్డ్ 27-మీరా సమ్మాన్ 28-సమంతర్ సమ్మాన్ 29-అఖిలభారత అంబికా దత్త వ్యాస పురస్కార 30-శ్రీమతి చంద్రావతి జోషి సంస్కృత భాషా పురస్కార్31-నాట్య శాస్త్ర కళానిధి పురస్కారం .

ఈ మహా మహోపాధ్యాయ రచనలపై ఏడుగురు పరిశోధన చేసి గ్రంధాలు వెలువరించి ఆయన కీర్తిని మరింత పెంచారు .

రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సలర్ గా ఉంటూ ఖాళీ పోస్ట్ లను రిక్రూట్ మెంట్ ద్వారాభర్తీ చేశి ,అనేకమందికి ప్రమోషన్లు ఇచ్చి ,సంస్థను ఏ గ్రేడ్ స్థాయి సాధించాడు .ముక్త అధ్యాయ అంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ విధానం ప్రవేశ పెట్టి ,23కాంపస్ లు ,23సంస్కృత మహా విద్యాలయాలు స్థాపించాడు .మూడు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు, పది జాతీయ సమావేశాలు  నిర్వహించాడు . అనేక జాతీయ ,అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు సెమినార్ లకు స్పాన్సర్ గా ఉన్నాడు .15 వ అంతర్జాతీయ సమావేశం న్యు ఢిల్లీ లోని విజ్ఞాన భవన్ లో2012లో 6రోజులు  జనవరి 6నుంచి 10వరకు  జరిపి ,పారిస్ లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ ఏర్పాటు చేయించాడు .

లక్నోలో పాళీ భాషకు రిసెర్చ్ సెంటర్ ,జైపూర్ లో ప్రాకృతభాషకు రిసెర్చ్ సెంటర్ ,సంస్కృత పాళీ ,ప్రాకృత భాషల తులనాత్మక అధ్యయనానికి’’ వాజ్మయి ‘’ సెంటర్ ,హిమాచల్ ప్రదేశ్ బలహార్ లో వుమెన్స్ స్టడీ సెంటర్ ,ముంబై లో సెంటర్ ఫర్ వొకేషనల్ స్టడీస్ ,భోపాల్ లో నాట్య శాస్త్రానికి స్టడీస్ సెంటర్ , శృంగేరిలో ఇండీజినస్ నాలెడ్జి సెంటర్ ఏర్పాటు అయ్యాయాయంటే అదంతా డా రాధా వల్లభ త్రిపాఠీ అకుంఠిత దీక్షా ,శ్రమ ఫలితమే .

ఇంతటి విద్యా వినయ సంపన్నుడు ,నిత్య కృషీవలుడు ,నాట్య, సాహిత్య  శేముషీ దురంధరుడు , అయిన డా .రాధా వల్లభ త్రిపాఠీ సాధించిన విజయ పరంపర భారత సంస్కృత క్షేత్రం లో శాశ్వత కీర్తి నార్జించి పెట్టాయి .లాంగ్ లివ్ త్రిపాఠీ.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 



Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 392-స్ఫోట వ్యాకరణ  కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

392-స్ఫోట వ్యాకరణ  కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది )

స్ఫోటాయనేన యోగాత్తు తధా స్ఫోతాయనం కృతం. ఇది ఒక సంస్కృత వ్యాకరణము. దీనిని స్ఫోటాయనుడు రచించాడు.

అవజ్ స్ఫోటాయనస్య (6- 1-123) అను పాణిని సూత్రముచే స్ఫోటాయనమత తెలియుచున్నది. తపర స్తత్కాలస్య (1-1-70) అను సూత్రముపై భాష్యమున పతంజలి స్ఫోటాయనశ్లోకము నుద్ధరించి యుండవచ్చును. స్ఫోటమనగా శబ్దార్ధ ప్రకాశక మగు స్వయం ప్రభవశక్తి విశేషము. మహాభాష్యాది తాత్పర్యానుసారముగా మనియర్ విలియంస్ అను మహాశయుడు స్ఫోటసందర్భమున నిట్లు వ్రాసినాడు

” The eternal and imperceptible element of sound or words and the real vehicle of idea which bursts or flashes on the mind when a sound is uttered”.

కక్షీరపర్వతముపై ఓశిజ నామము గల ఒక యోగి నిజగ్రంథమున శబ్దమున కుండెడి అర్ధప్రకాశకశక్తి విశేషమును ప్రపంచించి, దానికి స్ఫోటమని పేరిడినాడు. ఈనుతన నామము వలన అతనికి స్ఫోటాయనుడను పేరు ప్రసిద్ధమయినది. అతడు పాణిని కెంత ముదరివాడో తెలియదు. వ్యాసభగవానునకు తరువాతి వాడు మాత్రము అగును. మహాభారతము న స్ఫోట శబ్దము కనబడదు. కాని వ్యాసభాష్యమున స్ఫోటతాత్పర్యము విహితమగుటచే స్ఫోటాయనుడు వ్యాసుడు తరువాతివాడని చెప్పవచ్చును.

వ్యాసభాష్యము వేదవ్యాస ప్రణీతము (వ్రాయబడిన) కాదనియు, మహాభాష్యప్రవర్తి అనియు చాలమంది అంటారు.

“Yoga system of Patanjali” అను గ్రంథ భూమికలో Haughton Woods, “There is little room to doubt that Varshaganya was an older contemporary of Vasubandhu”. అని వ్రాసినాడు. Professor Takakusu అను జపనీసు విద్వాంసుడు వసుబంధు క్రీ.శ. 5,6శతాబ్దములలోని వాడని నిర్ద్ధారణచేసాడు. కావున వ్యాసభాష్యము 5 వ శతాబ్దానికి ముందులేదని చెప్పవచ్చును.

స్ఫోట వాదము

స్ఫోట వాదము చాలా సనాతనమైనది. వాగ్దేవిని గూర్చిన స్తోత్రాలు ఋగ్వేదంలోనే కనిపిస్తాయి. అయినా వ్యాకరణ సాంప్రదాయం ప్రకారం స్ఫోట వాదానికి మూలపురుషుడు స్ఫోటాయనమహర్షి. భర్తృహరి, నాగేశభట్టు, మండవ మిశ్రుడు మొదలైనవారు ఈవాదాన్ని ప్రపంచించినవారు.

నిత్యమైన స్ఫోట, లేక శబ్దబ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి, చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 1.పరా, 2. పశ్యంతీ, 3.మధ్యమా, 4. వైఖరీ. పరా పశ్యంతీదశలలోని శబ్దాన్ని ఎవరో యోగులు తప్ప మన సాధరణ ఇంద్రియజ్ఞానంతో మనం గ్రహించలేమన్నారు. జపాదులవల్ల మధ్యమాదశలోని వాక్కును గుర్తించవచ్చట. ఇక వైఖరీవాక్కు ఒక్కటే మనకందరికీ తెలిసింది.

పరావాక్కు నిత్యతత్త్వం; శబ్దబ్రహ్మ మూలాధార చక్రంలోని కుండలిని దానిస్థానం. దీనినే ‘నాదం’ అనికూడా అన్నారు. పశ్యంతీ వాక్కు బొడ్డుదగ్గర ఉండే స్వాధిస్థాన చక్రంలో ఉంటుంది. ఈ పరా, పశ్యంతీ వాక్కులు రెండూ సూక్ష్మస్ఫోట. హృదయ ప్రదేశంలోని అవాహత చక్రం మధ్యమా వాక్కు నెలవు. ఇది అంతర స్ఫోట. కంఠప్రాంతంలోని విశుద్ధ చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరీవాక్కు బాహ్యస్ఫోట.

సర్వదర్శన సంగ్రహంలో పాణినీయదర్శనాన్ని వివరిస్తూ మాధవాచార్యస్వామి అంటాడు: “స్ఫోట అనబడే ఈ శబ్దం విభాగాలులేనిది; నిరవయవం; నిత్యమైంది; జగత్తు పుట్టుకకు కారణమైంది. నిజానికి ఇది బ్రహ్మపదార్ధమే!”. భర్తృహరీ బ్రహ్మకాండలో ఇదేమాట అన్నాడు.

”’ఆకాశం”’ అనగానే ఎత్తుగా నీలంగా, భూమిమీద బోర్లించిన కోళ్ళగంపలాగా కనిపించేదీ, మబ్బులకూ సూర్యచంద్రులకూ ఆధారంగా ఉన్నట్టు అనిపించేదీ మనకు స్ఫురిస్తేనే ఆమాట అర్ధమయినట్టు అనుకుంటున్నాము. ఇలా ఏశబ్దం తీసుకున్నా ఆశబ్దార్ధం వాక్యరూపంగానే మనకు స్ఫురిస్తున్నట్లు తేలుతుంది.

ఒకభాషలోని ఒకమాట ఆభాషతెలిసిన వ్యక్తి మనస్సులో ఒక అర్ధాన్ని, తెలియనివ్యక్తి మనస్సులో మరోఅర్ధాన్ని స్ఫురింపజేయగలదు.ఉదాహరణకి ”’కాఫీ”’ అనేమాట దక్షిణాదివారి మనస్సులో కఫీపానీయాన్ని స్ఫురింపజేస్తే హిందీ మాతృభాషగా గల ఉత్తరాదివారికి చాలు అనే అర్ధాన్ని బోధించవచ్చును.

ఇలాఒకేమాట వేరువేరుభాషల్లో వేరువేరు అర్ధాలని బోధించగల్గినట్లు, మానవులందరిలోనూ స్వతసిద్ధంగా ఒండే స్ఫోట ఏకరూపమే! ఒకేవ్యక్తికి తెలుగు, ఇంగ్లీషు, హిందీ వచ్చుననుకోండీ అప్పుడు ”’మనిషి”’ అన్నా man, అన్నా ఆద్మీ అన్నా అతనిమనస్సులో అభివ్యక్తమయ్యే స్ఫోటఏకరూపమే.

దీనినిబట్టి, మానవైంద్రియాదిశక్తులచేత పరిమితమై మానవుడి జననంతోపాటే అతడు గ్రహించదగిన జ్ఞానరాశిఅంతా సూక్ష్మరూపంలో అతడిలో సన్నద్దమై ఉంటుందనీ, అదే స్ఫోట అనీ తేలుతుంది. అందుకే స్ఫోట నిత్యం అన్నారు. అలా సన్నద్ధమై ఉన్న జ్ఞానాన్ని అభివ్యక్తం చేసే పరికరాలే భాషలోని శబ్దాలన్నీ. ఒక చీకటికొట్లో ఎన్నోవస్తువులండవచ్చును టార్చిలైటు దేనిమీద వేస్తే ఆవస్తువునే కనిపిస్తుంది. ఆసంగతి బాగా తెలుస్తుంది. స్ఫోటని మనం సంపూర్ణంగా నిర్వచించలేకపోయినా అది మనందరి నిత్యానుభవంలోనూ ఉన్నదే! ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మరొకడు అర్ధం చేసుకొన్న ప్రతిసందర్భం లోను స్ఫోట పనిచేస్తూనే ఉంది. ఈస్ఫోట లోపించడం మూలానే మరమనిషికి ఏదిపడితే అదిమాట్లాడగలదు ఏదిమాట్లాడినా బోధపరచుకోగలగడం సాధ్యంకాలేదు.

వైయా కరణాంగీ కృతమగు వాదమునకే స్ఫోట వాదము ని పేరు. ఈ స్ఫోట వాదము పాణినికి ముందున్నదో లేదో చెప్పటము కష్టము.స్ఫోటాయనుడను పేరు పాణినీయమున ఉంది.ఈతడే స్ఫోట వాదమునకు కర్త. స్ఫుటత్యర్ధో స్మాదితి స్ఫోటః దీని వలన అర్ధము స్ఫుటమగును కావున స్ఫోటమనియు తెలియును.వాక్కును పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కును విభజించిరి.పరావాక్కు మూల చక్రస్థము, పశ్యంతి నాభి సంస్థితము.ఈరెండును యోగులకే అనుభవనీయము.హృదయ దేశమందలి వాక్కు మధ్యమ అనబడును.కంఠదేశమందలి వాక్కు వైఖరీ వాక్కు.ఈ మధ్యమ వాక్కునకే స్ఫోట శబ్దమని వ్యవహారము.ఇది నిత్యము, అఖండము, అవికారము, అచలము ఇదే బ్రహ్మ స్వరూపము.ఈ సిద్ధాంతులకే స్ఫోట బ్రహ్మవాదులని లేదా శబ్ద బ్రహ్మ వాదులని పేరు. వీరు శబ్దమునే బ్రహ్మముగా భావింతురు.మనము శ్రవణేంద్రియముచే గ్రహించు శబ్దముకాక, దానిచే అభివ్యక్తమై బుద్ధినిష్టమగు శబ్దమే స్ఫోటము.అదియే అర్ధమును ప్రకాశింపజేయును.అది నిత్యము.అది పదరూపమున కాని, వాక్య రూపమునకాని యుండును.వాక్యస్ఫోటమె ముఖ్య సిద్ధాంతము.

భర్తృహరి ముఖ్యముగా ప్రతిపాదించిన వాక్యజాతి స్ఫోట. అయినను తరువాతి వైయాకరణుల అష్ట విధములగు స్ఫోటల నీరీతిగా నిరూపించిరి. వర్ణములను మాత్రలుగను, పదములను ప్రకృతి ప్రత్యయములనుగాను, వాక్యమును పదములుగాను విభజించి అర్ధములేర్పరుచుట వ్యాకరణ శాస్త్రమునకు సంబంధించిన విషయము.వ్యవహారము ఉపయుక్తములగు పదములకు అఖండ పదస్ఫోటను కొందరు పేర్కొనిరి.ఏమైనను నవ్యులు అఖండ స్ఫోటమే ముఖ్యమందురు.ప్రాచీనులు వాక్యజాతి స్ఫోట ముఖ్యమని భావింతురు.వ్యక్తిస్ఫోట, జాతిస్ఫోటయను విభేదమును గూర్చి చాల వివాదము ఉంది. ప్రాచీన వైయాకరణులు జాతి స్ఫోట వాదులని, నవీన వైయాకరణులు వ్యక్తి స్ఫోట వాదులని ప్రసిద్ధి. భర్తృహరి జాతి స్ఫోటనే ప్రతిపాదించి బలపరిచెను.జాతి స్ఫోట తాత్వికముగా ఉన్నా ఆచరణయోగ్యము కాదని నవీనుల అభిప్రాయము.వ్యక్తి మూలముననే జాతి గ్రహింపబడును.వ్యక్తులన్నింటి యందుండు సమాన ధర్మమే జాతి.అందువలన చివరకు ఆధునిక విమర్సకులు వ్యక్తి జాతి స్ఫోటలు రెండును అవినాభావములని నిర్ణయించిరి.

పాశ్చాత్యదర్శన మనశాస్త్రాలలో స్ఫోటవాదంతో పోలికలు ఉన్నటు అనిపించే కొన్ని భావాలను మనం గుర్తించవచ్చును. గ్రీకుల ”’లాగాస్”’ (logos) కాంట్ ప్రతిపాదించిన కారణాత్పూర్వజ్ఞాన సిద్ధాంతం (apriori) మనశాస్త్రంలోని-స్ఫురణ (intuition) వంటివి. ప్లేటొ లాగాస్ ప్రంచానికి మూలరూపం అన్నాడు.అంటే లాగాస్ నుంచే ప్రపంచం అంతా వచ్చిందని. ఫైలో (philo) దేవుడికీ, ప్రపంచానికీ మధ్య అనుసంధానం కలిగించేది లాగాస్ అన్నాడు.హొరక్లైటస్ (Heraclitus) భౌతిక జగత్తునంతటనీ లాగాస్ ద్వారానే మనం గ్రహిస్తున్నామన్నాడు.

                         ఆధారం -1948భారతి మాసపత్రికలో శ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారు ,1963భారతి లో శ్రీ బొడ్డుపల్లి పురుషోత్తం గారు రాసిన   ‘’స్ఫోట వాదం ‘’ ఆధారంగా వీకీ పీడియాలో వచ్చిన వ్యాసం .

393-కాశ కృత్స్న వ్యాకరణ కర్త –కాశ క్రుత్స్నుడు –(4వ శతాబ్దికి పూర్వం )

కాశకృత్స్న వ్యాకరణము అనునది సంస్కృత వ్యాకరణం.[1].

దానిని రచించినది కాశకృత్స్నుడో, కాశకృత్స్నియో. కవి కల్పద్రువ కాలము నందు బోపదేవగోస్వామి కాశకృత్స్నుడు ఆదిశాబ్దికుడని వ్రాసినాడు. కాశకృత్స్నుడు మీమాంసకుడని ప్రసిద్ధి. కాతీయసూత్రమునందు యాజ్నవల్క్య పుత్రుడు కాత్యాయనుడును, మహాభాష్యమున (4-1-14) పతంజలి డు ఇతనిని మీమాంసకుడని అన్నారు. కాశకృత్స్నుడే వ్యాకరణకర్త అని చెప్పవచును[2]అష్టాధ్యాయి యందు ఇతని నామము కనబడకున్నను ఈతడు పాణిని కి తరువాతి వాడు కాడు. పారాశర్యశిలాలిభ్యాం భిక్షునటసూత్రయోః అను సూత్రమున పాణిని వ్యాసుడు నామము,వేదాంతసూత్రమును స్మరించినాడు. అవస్థితేరితి కాశకృత్స్న అను వేదాంతసూత్రమున వ్యాసభగవానుడు ఇతనిని స్మరించినాడు[3]శ్రీభాష్యము న రామానుజాచార్యుడు పరశర్యుడే వ్యాసుడని సంబోధించినాడు. పాణిని వ్యాసుని పేర్కొన్నాడు, వ్యాసుడు కాశకృత్స్నుడుని పేర్కొన్నాడు. కావున ఇతడు వ్యాపాణినులకు పూర్వుడు అని అనుకొందురు. శతాచ్చ ఠన్యతావశతే అను సూత్రమును గూర్చి ప్రదీపమున కైయటాచార్యుడు ఆపిశల కాశకృత్స్నయో స్త్వగ్రంథ ఇతివచనా ద్ ప్యత్ర ప్రతిషేధాభావో నియతకాలాశ్చ స్మృతయో వ్యవస్థాహేతవ ఇతిమునిత్రయమతే నాద్యత్వే సాధ్వసాధుప్రవిభాగః అన్నాడు. ఇలా పలుచోట్ల ఈతని గూర్చి పలువురు పూర్వకవులు తెలిపినారు. అయినను పాణినీయ వ్యాకరణము పూర్వులగ్రంథములకంటే బలవత్తరమయిన దని పలువురు గ్రంథ కారుల అభిప్రాయము. పతంజలి కాశకృత్స్నవ్యాకరణమును జూచియుండవచ్చును; కాని భర్తృహరి చూచినాడో, లేదో తెలుపుట కష్టము. ఒకచోట తదర్హం ఇతి నారబ్ధం సూత్రం వ్యాకరణాంతరే అన్నాడు భర్తృహరి. దీనిపై వ్యాఖ్యవ్రాసిన హేలరాజు వ్యాకరణాంతరే కాశకృత్స్నే చాపిశలె అని వివరించినాడు.

ఈవ్యాకరణము మూడు అధ్యాయములగ్రంథము.ఈ వ్యాకరణమున మూడు,నాలుగు సూత్రములు మాత్రమే నేడు లభించుచున్నవి.

ఆధారం –భారతి మాసపత్రిక మరియు ఈ క్రింది వాటి ఆధారంగా వీకీపీదియాలోని వ్యాసం

  1.  काशकृत्स्न व्याकरणम्: Kashkritsna Vyakaran
  2.  हिंदी व्याकरण का संक्षिप्त इतिहास
  3.  अवस्थितेरिति काशकृत्स्नः।।1.4.22।।

 

394-కర్మంది వ్యాకరణ కర్త –కర్మందుడు (4వ శతాబ్ది పూర్వం )

కర్మంది వివరణము

 

కర్మంది ఒక  వ్యాకరణగ్రంథము. దీనిని కర్మందుడు వ్రాసినట్లు తెలియుచున్నది. అవైయాకరణులయిన శిష్యుల కొరకు వ్యక్తావధూత, క్రాంతదర్సియగు భగవాన్ కర్మందుడు తన భిక్షుసూత్రమునకు పూర్వవృత్తమయిన వ్యాకరణ సూత్రములు కొన్ని రచించినట్లు సన్యాసి సంప్రదాయమున ఉంది. ఇందు భిక్షుసూత్రాంసములు పెక్కు ఉన్నాయి. ఇది కేవలము జనశ్రుతికాదు. కవీంద్రాచార్య సూచీపత్రమున వ్యాకరణ ప్రస్తావనలో కర్మంది వివరణనామకగ్రంధోల్లేఖనము ఉంది. కవీంద్రాచార్యుడు సన్యాసి అని, గ్రంథముఈ గ్రంథముమూలముగా తెలిసింది. కర్మందప్రోక్తవ్యాకరణ సంబంధిసూత్రములు భిక్షుసూత్రముకంటె భిన్నముగా భావించువారు ఈగ్రంథమును కార్మందవివరణ అని అంటారు.

సరస్వతీదేవి ప్రథమమున కర్మందునికి ఈ సూత్రములు ఇచ్చెనని, అనుభూతిస్వరూపాచార్యునికి పూర్వుడగు పరివ్రాజకనరేంద్రాచార్యుడు ఈ సూత్రము లన్నింటికిని కూర్చి, స్వకీయవృత్తివార్తికాదులతో కలిపి సారస్వతవ్యాకరణమను పేరిట వేరగుది రచించినని కొందరౌ అంటారు. దీనికి పూర్వము ఈగ్రంథముసన్యాసుల దగ్గెర ఉండేది.

“కర్మందకృశాశ్వాదినిః” (అష్టా-4-3-111) సూత్రమువలన కర్మందమస్కరి పాణినికి పూర్వుడని తెలియుచున్నది. కర్మందుని భిక్షుసూత్రము వ్యాసుని భిక్షుసూత్రముకంటె పూర్వమని కొందరందురు. వ్యాసుని భిక్షుసూత్రమునకు తరువాత మరియొక భిక్షుసూత్రము ప్రకటిత కాలేదు.

ఆధారం –వీకీ పీడియా

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అప్పు చేసి పప్పు కూడు కు యాభై -భూమి

Posted in సినిమా | Tagged | Leave a comment

సరసభారతి 137 వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం 

సరసభారతి 137 వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం

 మాఘ శుద్ధ పంచమి శ్రీపంచమి 10-2-19 ఆదివారం ఉదయం 9 గం లకు సరసభారతి 137 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజ నేయ  స్వామి దేవాలయం లో సామూహికంగా పాలుపొంగించి పొంగలి తయారు చేయటం ,అనంతరం సామూహిక సత్య నారాయణ వ్రతం నిర్వ హింపబడుతోంది . దీనికి రుసుము చెల్లించ వలసినఅవసరం లేదు . పూజా ద్రవ్యాలు ,దేవతా విగ్రహాలు వగైరా ఎవరి పూజాసామగ్రి వారే తెచ్చుకొని  సాధ్యమైనంతవరకు దంపద్యుక్తంగా కూర్చుని చేసుకోవచ్చు .
   వ్రతం పూర్తయ్యాక 11-30గం లకు శ్రీ అయ్యప్ప దీక్షతో ఉయ్యూరు నుండి శబరిమలై కు సైకిల్ పై 18 సార్లు వెళ్లి వచ్చిన వారు ,శ్రీ  శివ దీక్షతో ఉయ్యూరు నుంచి శ్రీశైలం కు  నడకతో 5 సార్లు వెళ్ళివచ్చినవారు ,స్థానిక సుధీర్ టింబర్ డిపోలో గుమాస్తాగా ఉన్న శ్రీ బిరుదుగడ్డ వేంకటేశ్వరరావు (స్వామి )గారికి సన్మానం ,అనంతరం ”స్వామి”గారి  అనుభవ విశేషాల ప్రసంగం ఉంటుంది .
   అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన  .  వ్రతం లో పాల్గొని వారు అర్చక స్వామిని సంప్రదించి పేరు నమోదు చేసుకోవలసినది ,
               గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -ఆలయ ధర్మకర్త  -2-2-19 -ఉయ్యూరు 

image.png

image.png
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము గ్రంథ కర్త పరిచయం

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2-రెండవభాగము

             గ్రంథ కర్త పరిచయం

పేరు-గబ్బిట దుర్గా ప్రసాద్

జననం -27-06-1940-ఉయ్యూరు

తల్లి దండ్రులు –గబ్బిట భవానమ్మ,,మృత్యుంజయ శాస్త్రి

విద్య –ఎం .ఏ .(తెలుగు ),బి.ఎస్.సి .,బి .ఇ.డి.

వివాహం –ప్రభావతి తో(21-02-1964)

ఉద్యోగం –ఉపాధ్యాయ వృత్తి (ఫిజికల్ సైన్స్),ప్రధానోపాధ్యాయుడు

           కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు(1963-1998)

సంతానం -1-గబ్బిట  మృత్యుంజయ శాస్త్రి ,సమత (హైదరాబాద్ )

                  (సంకల్ప్,భువన సాయి తేజ )

             2-లక్ష్మీ నరసింహ శర్మ ,ఇందిర(హైదరాబాద్ )

                    (శ్రీహర్ష సాయి ,హర్షితాంజని)

            3-నాగ గోపాల కృష్ణ మూర్తి ,రాణి (ఉయ్యూరు )

                   ( గౌతమ్ శ్రీ చరణ్ ,రమ్య )

            4-వెంకట రమణ ,మహేశ్వరి (ఉయ్యూరు )

            5-కోమలి  విజయ లక్ష్మి , సాంబావధాని(షార్లెట్-అమెరికా )

                    ( శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్ )

సాహితీ వ్యాసంగం –రచనలు ,సరసభారతి అధ్యక్షులు

స్వీయరచనలు -1-ఆంధ్ర  వేద శాస్త్ర విద్యాలంకారులు 2-జనవేమన 3-దర్శనీయ దేవాలయాలు 4-శ్రీ హనుమత్ కథానిధి 5-శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం 6-సిద్ధ యోగి పుంగవులు 7-మహిళా మాణిక్యాలు 8-పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు 9-దర్శనీయ దైవ క్షేత్రాలు 10-గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1 – 11-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1 12-కెమోటాలజి పిత  కొలచల సీతారామయ్య 13-దైవ చిత్తం 14-గీర్వాణకవుల కవితా గీర్వాణం-2 ,15-బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శత జయంతి కరదీపిక 16-ఆధునిక ప్రపంచ నిర్మాతలు ,జీవితాలలో చీకటి వెలుగులు 17-గీర్వాణ కవుల  కవితా గీర్వాణం-3 ,18-షార్లెట్ సాహితీ మైత్రీ బంధం 19-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య 20-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత డా పుచ్చా వెంకటేశ్వర్లు 21-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2.

స్వీయ సంపాదకత్వం లో సరసభారతి ప్రచురణలు -1-జ్యోతిస్సంశ్లేషణం 2-ఉయ్యూరు ఊసులు 3-నవకవితా వసంతం 4-మా అక్కయ్య 5-ఆదిత్య హృదయం 6-త్యాగి పే’’రెడీలు 7-శ్రీరామ వాణి 8-మా అన్నయ్య 9-శ్రీసువర్చలా వాయు నందన శతకం 10-శ్రీ సువర్చలా మారుతి శతకం 11-శ్రీ సువర్చలేశ్వర శతకం 12-వసుధైక కుటుంబం 13-సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున )

  సరసభారతి ,శ్రీ సువర్చలలాంజనేయ స్వామి  బ్లాగుల నిర్వహణ ,

   శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త –స్వామి సేవలో ధన్యత ,అనునిత్య సాహితీ వ్యాసంగం .

———————————————————————————

                 శ్రీ హనుమతే నమః

              రెండవ భాగం రచనకు నేపధ్యం

  దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1మొదటిభాగం  దేశ ,విదేశాలలోని 201 శ్రీ ఆంజనేయ దేవాలయాల  గురించి నేను  రాసి, సరసభారతి ప్రచురించి 18-5-2015  శ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో శ్రీ స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆవిష్కరణ జరిపాం .దీనిని  మా చిన్నక్కయ్య,  బావగార్లు శ్రీమతి వేలూరి దుర్గ శ్రీ వేలూరి వివేకానంద్ లకు వారి వివాహ వజ్రోత్సవ కానుకగా అ౦కిత మిచ్చాం  .దీని కి స్పాన్సర్ –మా మేనల్లుడు చి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (జయ్ వేలూరి ) శ్రీమతి విజయలక్ష్మి దంపతులు. (అమెరికా ).

   అప్పటి కి కొద్దికాలం ముందు నుంచే రెండవభాగం దేవాలయాలను అంతర్జాలం లో రాయటం మొదలు పెట్టాను .మధ్యమధ్య రాస్తూ ఆపేస్తూ  మరి కొన్ని పుస్తకాలు రాస్తూ ప్రచురిస్తూ 2018 అక్టోబర్ కు  మూడేళ్ళలో 100 దేవాలయాల గురించి మాత్రమే రాసి ,ఇక ఉండవులే అనుకొన్నాను .

  కాని మా రెండవ అబ్బాయి శర్మ ఇంకా చాలాఉన్నాయని ,వాటి వివరాలు వీకీపీడియా ,యు ట్యూబ్ ,ఇతర చోట్ల నుండి లింక్ లు పుంఖాను పు౦ఖంగా పంపటం ప్రారంభించాడు .వెంట వెంటనే వాటిని అదే వేగంతో ఇంటర్ నెట్ లో రాసేసేవాడిని .నవంబర్ కు రెండవభాగం లో దేవాలయాల సంఖ్య 254 అయింది .ఇందులో ఒక్కటి మాత్రమే అమెరికా దేవాలయం .మిగిలినవన్నీ మన దేశం లో వివిధ రాష్ట్రాలకు చెందినవే .ఇందులో కొన్ని దేవాలయ చరిత్రలు హిందీ , కన్నడం ,మలయాళం ,తమిళం మొదలైన వివిధ భాషలలో ఉన్నాయి .ఏదో రకంగా తంటాలు పడి విషయ సేకరణ చేసి రాశాను .కొన్నిటిని యు ట్యూబ్ లో చూస్తూ ,వింటూ రాయల్సివచ్చేది . హనుమ దయ వలన అన్నీ సక్రమంగా సాధ్యమైన౦త వరకు పూర్తి వివరాలతోనే రాశాను .కొన్ని దేవాలయాల చరిత్ర  అసమగ్రంగా నే దొరికింది .దొరికింది దొరికినట్లు రాసి సంతృప్తి చెందాను .

  మరీ అసలేమీ వివరాలు లేని దేవాలయాలను ఆయా రాష్ట్రాలలో చివర ‘’దర్శించదగిన ఇతర ఆంజనేయ దేవాలయాలు ‘’అనే శీర్షిక లో పొందు పరచాను .ఇవి సుమారు 50 దాకా ఉంటాయి.అంటే రెండు భాగాల లో కలిపి 201+254+50=555ఆంజనేయ దేవాలయాలను స్పృశించిన  అదృష్టవంతుడనయ్యాను .ఇంకా మా  దృష్టి లోకి రాని ఆంజనేయ దేవాలయాలు ఎన్నో ఉండే ఉంటాయి . కనుక ఇదే పరిపూర్ణం అని మేము భావించటం లేదని సవినయంగా మనవి చేస్తున్నాము .వివరంగా రాసిన అన్ని దేవాలయాల ఆంజనేయ స్వామి వారల విగ్రహాల  ఫోటోలు  పెట్టాము .ఒక వేళ విగ్రహం ఫోటో దొరకక పోతే, దేవాలయం ఫోటో అయినా పెట్టాం  .ఈ ఫోటోల సేకరణ ,ఫైల్ గా పెట్టటం ,రాష్ట్రాలవారీగా వరుసక్రమంలో  లిస్టు తయారు చేయటం ,కవర్ పేజీలలో ఏయే ఫోటోలు ఉండాలో నేను చెబితే వాటిని అలా ఎంపిక చేసి ,తయారు చేసే పని  అంతా మా అబ్బాయి శర్మ   తన డ్యూటీ తానూ చేసుకొంటూ,ఈపనులు  చేసినందుకు  అభినందనలు .దీనివలన నా శ్రమ, కళాసాగర్,  ,ప్రకాష్ గార్ల శ్రమ చాలా తగ్గింది .

          ఎందరో మహానుభావులు

  సరసభారతికి ఆప్తుడు ,రమ్యభారతి సంపాదకుడు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి శ్రీ చలపాక ప్రకాష్ ఇదివరకు లాగానే ఈ పుస్తకం ,డి.టి.పి .నిర్దుష్టంగా చేసి ,ముద్రణ చేయించి , సకాలం లో అందజేసినందుకు , మేము ‘’సరసభారతి స్టాఫ్ కళాకారుడు’’గా భావించే  శ్రీ కళాసాగర్ కోరిన డిజైన్ లోఅందమైన  ముఖ చిత్ర రచన చేసి గ్రంథానికి అదనపు ఆకర్షణ కలిగించినందుకు ధన్యవాదాలు .

             సరసభారతి ప్రగతి

   ఇది సరసభారతి ప్రచురించిన 33వ గ్రంథం,నేను రాసిన 21వ పుస్తకం అని విన్న  విస్తున్నాను .సరసభారతి స్థాపించి(2009-నవంబర్ 24 )9సంవత్సరాలు దాటి 10వ సంవత్సరం లో ప్రవేశించిందని తెలియజేయటానికి ఆనందంగా, సంతృప్తిగా ఉన్నది . .2019 జనవరి 31 నాటికి సరసభారతి  136  వైవిధ్యభరిత  కార్యక్రమాలు నిర్వహింఛి’’అక్షరం లోక రక్షకం ‘’అన్న మా లక్ష్యానికి అనువుగా నడుస్తోంది   . సరసభారతి సాధించిన ,సాధిస్తున్నప్రగతి , విజయాలన్నిటికీ సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి , కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి,  కోశాధికారి  గబ్బిట వెంకట రమణ కార్యవర్గ సభ్యులు,  మా కుటుంబ సభ్యులు ,ముఖ్యంగా మా శ్రీమతి ప్రభావతి అందిస్తున్న సహాయ , సహకారాలకు  ధన్యవాదాలు .సాహితీ బంధువుల ,వదాన్యులైన వితరణ శీలురైన దాతల ప్రోత్సాహక సహాయాలకు  కృతజ్ఞతలు .

                  హనుమలకు అంకితం  

  దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం ను కృష్ణాజిల్లా ఉయ్యూరు లోని మా శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారికీ ,పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒకప్పటి గబ్బిటవారి అగ్రహారమైన  రామారావు గూడెం లో వెలసిన  గబ్బిట, చందోలు వారి శ్రీ భక్తాంజనేయ స్వామివారికీ ,ఉయ్యూరు లో మా మేనమామ  శ్రీ గుండు గంగయ్యగారి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారితో సహా అన్ని దేవాలయాల శ్రీ ఆంజనేయ స్వామి వారలకు అంకితమిస్తూ ధన్యులమవుతున్నాము .ఏదో మన భ్రమ కాని హనుమ లేని చోటున్నదా?శ్రీ హనుమ కృపా కటాక్షా  వీక్షణాలే  ఇంతటి బృహత్  రచన,ప్రచురణ మాతో  చేయించాయి .

                   శ్రీ ఆంజనేయ వైభవం

ఇంతటి వైభవం గా దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవ భాగం  వస్తున్న సందర్భం గా, నామదిలో ఇందులో’’ శ్రీ ఆంజనేయ వైభవం’’ పై పద్యాలు రాయింఛి, చేర్చాలనే  కోరిక లీలగా మెదిలి ,సరసభారతి అభిమానకవులను కొందరికి చెప్పి, తలొక 11 వృత్త పద్యాలు రాసి పంపమని   తెలియ జేయగా ,వెంటనే స్పందించి , అది తమ అదృష్టంగా ,శ్రీ హనుమ ప్రసాదంగా, కర్తవ్యంగా భావిస్తున్నామని, సరసభారతి పై తమకున్నఆదరాభిమానాలను చాటి చెప్పి ,అతి తక్కువ వ్యవధిలోనే  రచించి పంపిన కవి మిత్రులు 1-డా.రామడుగు వేంకటేశ్వర శర్మ (గుంటూరు )2-శ్రీ మంకు శ్రీను (కొప్పర్రు )3-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ )  4-శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య(విజయవాడ )5-శ్రీ పంతుల వెంకటేశ్వరరావు (విజయవాడ )6-మధుర కవి శ్రీమతి ముదిగొండ  సీతారామమ్మ(విజయవాడ )7-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని (విజయవాడ )8-శ్రీమతి వారణాసి సూర్యకుమారి (మచిలీ పట్నం )గార్లకు  కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను. ఈ ‘’వైభవ పద్య రాశి ‘’ గ్రంథానికి అదనపు ఆకర్షణ కాగలదు .శ్రీ హనుమ బహుముఖీన ప్రతిభావైభావానికి దర్పణంగా భాసించ గలదని భావిస్తున్నాను ..

              సరసభారతి శ్రీ వికారి ఉగాది వేడుకలు

 సరసభారతి  శ్రీ వికారి నామ  సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహిస్తున్న 31-3-19 ఆదివారం నాడు ప్రముఖులకు ఉగాది పురస్కారం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,కవి సమ్మేళనం తో పాటు  నేను రచించిన మూడు సరసభారతి ప్రచురణలు 1-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య(స్పాన్సర్ శ్రీ మైనేని గోపాలకృష్ణ  శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) 2-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర  పరిశోధన పిత డా.పుచ్చా వెంకటేశ్వర్లు (అంకితం అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య గారికి(అమెరికా ) 3-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం  ఆవిష్కరణ జరగటం  సరసభారతి ప్రగతికి నిదర్శనమని సవినయంగా మనవి చేస్తున్నాను . ఈ కార్యక్రమ౦లో పాల్గొంటున్నఅతిధులకు,పుస్తకావిష్కరణ చేస్తున్న ప్రముఖులకు, కవి  సమ్మేళనంలో పాల్గొంటున్న కవి మిత్రులకు ,ఉగాది ,స్వయం సిద్ధ పురస్కారాలు అందుకొంటున్న  ఆత్మీయులకు శ్రీ వికారి ఉగాది శుభా కాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాం .

‘’పూజ్యాయ వాయు పుత్రాయ వాగ్దోష వినాశన –సకల విద్యాం కురు మే దేవ రామ దూత నమోస్తుతే .

‘’ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీ శ్రద్ధా పుత్రాస్శుశీలతా –ఆరోగ్యం దేహ సౌఖ్యం చ కపినాథ నమోస్తుతే ‘’

‘’సర్వ కళ్యాణ దాతరం  సర్వాపత్ నివారకం –అపార కరుణా మూర్తిం  ఆంజనేయం నమామ్యహం ‘’

‘’ఆంజనేయం మహా వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం –తరుణార్క ప్రభం శాంతం రామదూతం భజే ‘’

                                                         గబ్బిట దుర్గా ప్రసాద్

———————————————————————————————

శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి సేవకు ,సరసభారతి పుస్తక ప్రచురణకు విరాళాలు అందజేసిన వదాన్యులకు కృతజ్ఞతలు

1-శ్రీ  .వేలూరి మృత్యుంజయ శాస్త్రి (జయ్ వేలూరి ),శ్రీమతి విజయలక్ష్మి దంపతులు –ఫ్రీమాంట్ (అమెరికా ) –రూ-25,000

2-శ్రీ వేలూరి వివేకానంద్ –హైదరాబాద్ –రూ-15,000

3-శ్రీ మద్దాల జగదీశ్ ,శ్రీమతి లక్ష్మిదంపతులు –షార్లెట్ (అమెరికా )రూ-10,240

4-శ్రీ సుంకర కోటేశ్వరరావు ,శ్రీమతి సరోజినీ దంపతులు –హైదరాబాద్- రూ-10,000

5-శ్రీ గబ్బిట రామనాథ బాబు శ్రీమతి జయలక్ష్మి దంపతులు –ఉయ్యూరు –రూ-10,000

6-శ్రీ పువ్వుల సారధి ,శ్రీమతి రేణుక దంపతులు –హైదరాబాద్ రూ–5,120

7-శ్రీమతి చతుర్వేదుల జానకి –విజయవాడ –రూ-2,000

8-శ్రీ .టి.వి.ఎస్. బి .శాస్త్రి (ఆనంద్ ) శ్రీమతి రుక్మిణి దంపతులు-హైదరాబాద్  –రూ 1,116

9--శ్రీ చతుర్వేదుల మధుసూదనమూర్తి శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు –విజయవాడ –రూ-1,100

10--శ్రీ గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ ,శ్రీమతి ఇందిర దంపతులు –హైదరాబాద్-రూ-1,100

11-శ్రీ శంభుని శ్రీ రామ చంద్ర మూర్తి శ్రీమతి మహాలక్ష్మి దంపతులు –ఖమ్మం –రూ-1,000

12-శ్రీమతి కొల్లి భారతి –మచిలీపట్నం –రూ-1,000

13-శ్రీ కడవకొల్లు కృష్ణ దంపతులు –కడవకొల్లు -రూ-500

14– శ్రీ కూచిభొట్ల రాజ గోపాల కృష్ణ మూర్తి ,శ్రీమతి సీతారామమ్మ దంపతులు –ఉయ్యూరు –రూ-500  

                                  గబ్బిట దుర్గా ప్రసాద్  

  ———————————————————————————



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment