ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ కన్ను మూత

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 95. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కులదీప్ నయ్యర్ 14 ఆగస్ట్ 1923లో పాకిస్తాన్‌లోని సియాల్కోటలో జన్మించారు. కులదీప్ ఉర్దూలో జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు. ది స్టేట్స్‌మెన్‌లో పని చేశారు. ఇందిరా గాంధీ హయాంలో 1975లో విధించిన ఎమర్జెన్సీసమయంలో ఆయన అరెస్టయ్యారు. కులదీప్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా. 1996లో యునైటెడ్ నేషన్స్ ఇండియా డెలిగేషన్ మెంబర్. 1990లలో గ్రేట్ బ్రిటన్ హై కమిషనర్‌గా అపాయింట్ అయ్యారు.
1997 ఆగస్ట్‌లో పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కులదీప్ కాలమ్ ‘బిట్వీన్ ది లైన్స్’ను దాదాపు ఎనబై న్యూస్ పేపర్స్ ప్రచురించాయి. ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడులో ఆయన శీర్షికలు వస్తుంటాయి

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు  శ్రద్ధాంజజలి   

శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు  శ్రద్ధాంజజలి

భారతరత్న భారత మాజీ ప్ర ధాని ,ప్రముఖ కవి  శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ ,ప్రసిద్ధ కథానికుడు డా . శ్రీ వేదగిరి రామ్ బాబు గార్లమృతి సందర్భంగా వారికి  శ్రద్ధాంజలి  ప్రత్యేక  కార్యక్రమాన్ని సరసభారతి 25-8-18 శనివారం సాయంత్రం 6 గం .స్థానిక శ్రీ మైనేని వెంకటనరసయ్య శ్రీ సౌభాగ్యమ్మగార్ల స్మారక గ్రంధాలయం (ఎసి లైబ్రరీ )లో నిర్వహిస్తోంది .సాహిత్యాభిమానులు   ల పాల్గొనవలసినదిగా కోరడమైనది – గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

  బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

 ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి  గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,మరియు  స్పెషల్ అసిస్టెంట్ కలెక్టర్ –పులిచింతల ప్రాజెక్ట్

 విశిష్ట అతిధి – ”కవి రాజ మౌళి ,కవి సార్వ భౌమ ,మధురకవి ,అష్టావధాని ,కనకాభి షేకి ,70 గ్రంథాల  రచయిత ,విశ్రాంత తెలుగు పండితులు ,గుంటూరు జిల్లావాసి ,93 ఏళ్ళ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారు

ఆత్మీయ అతిధులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు  ,శాసనమండలి సభ్యులు

                        శ్రీ అబ్దుల్ ఖుద్దూస్ – ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్

                                                శ్రీ చలపాక ప్రకాష్ గారు –రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి

                         శ్రీ ద్రోణవల్లి రామమోహనరావు గారు –అమెరికాలోని హ౦ట్స్ విల్ తెలుగు సంఘాధ్యక్షులు ,ప్రముఖ సమాజ సేవకులు

                        శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట సీతారామంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )

   మొదలగు ప్రముఖులు

                         కార్యక్రమ వివరం

స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం  ,పుష్ప సమర్పణ

ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు

1-విశిష్ట అతిధి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారికి

2-డా.శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి గారు –తెలుగు లెక్చరర్ ,ఏ. జి .అండ్ ఎస్. జి .సిద్ధార్ధ జూనియర్ కాలేజి

3-అమరవాణి పాఠశాల కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు

              ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం

1–2018 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1- శాంతినికేతన్  పాఠశాల విద్యార్థి-చి.కరిమి పవన్ కుమార్ కు ,-5 వేలరూపాయలు

 2- అమరవాణి పాఠశాల విద్యార్థినిలు  -కుమారి ఎం. డి.సఫూర మరియు కుమారి పి .తులసి లకుకలిపి – 5 వేల రూపాయలు .

ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు  ఏర్పాటు చేసిన  ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం –

3- ఎ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్ధినులలైన అక్కా చెల్లెళ్ళు -కుమారి చౌడాడ మౌనిక,కుమారి హేమలతలకు కలిపి  –రూ 5,వేల రూపాయలు .

-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు  శ్రీమతి సీతమ్మ దంపతుల  పేరిట    ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధికి  ఏర్పాటు చేసిన 10 ,11 6 రూపాయల స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦  –

4-2018 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 9.8 మార్కులతో  ఉత్తీర్ణత  సాధించి, స్థానిక .ఎ. జి. అండ్ ఎస్ .జి . సిద్ధార్ధ జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి గూడూరి చరిత కు

శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .

సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

                                                                        ఆహ్వాని౦చు వారు

ఉయ్యూరు -23-8-18                                            గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

                                                                     పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమరవాణి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీకృష్ణాష్టమి ప్రత్యే క కార్యక్రమం

3-9-18 సోమవారం శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి ,శ్రీ కృష్ణ జయంతి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో ఉదయం శ్రీ విష్ణు సహస్రనామ శ్రీ కృష్ణఅష్టోత్తర పూజ ,విష్ణుసహస్ర నామపారాయణ ,సాయంత్రం ఆలయం అంతా బాలకృష్ణుని పాద ముద్రలతో అలంకారం , శ్రీ కృష్ణ  అష్టోత్తర పూజ ,అనంతరం డా శ్రీ వేదాంతం శ్రీ ధరాచార్యులుగారిచే   ధార్మిక ప్రసంగం తర్వాత బాలబాలికలచే శ్రీ కృష్ణ ,గోపీకల వేషధారణ కార్యక్రమం నిర్వహింపబడును .అందరూ విచ్చేసి జయప్రదం చేయ మనవి  
గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త -21-8-18
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు

           ఆయనకు తెలుగుకథానిక ప్రాణం, తనువూ, మనసు ,ధ్యాస ,ఊపిరి   ఉచ్చ్వాస నిశ్వాసం .దాని కోసం జీవిత౦  త్యాగం చేసిన త్యాగమూర్తి .1910 లో గురజాడ రాసిన  తొలి తెలుగు కధానిక’దిద్దుబాటు ‘’  కు శతవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు కధానిక ను తానొక్కడే పల్లకీలో మోసి ,ఊరూరా తిప్పి ,సభలు సమావేశాలు ఏర్పరచి ప్రభుత్వాన్నీ సాహితీసంస్థ లను ,వ్యక్తులను, కథానికా రచయితలను, సాహిత్యాభిమానులను, సామాన్య పాఠకజనాన్నీకదిలించి ప్రేరణ ,స్పూర్తి కలిగించి కథకు శత జయంతి జరిపిన కథానికా కలం యోధుడు డా.  శ్రీ వేదగిరి రాంబాబు . అలాగే శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి శతజయంతినీ తాను ఘనంగా నిర్వహించి ,ప్రముఖ పట్టణాలను పద్మరాజుగారమ్మాయిలతో పర్యటించి ఉత్సాహపరచి జరిపించిన కార్య శీలి .ఆ తపన  అనితర సాధ్యం .అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ,మనిషి సాయం లేకుండా నడవ లేనిస్థితిలోనూ భార్యను వెంటబెట్టుకొని తెలుగు కథానికా సాహిత్యానికి జవజీవాలు చేకూర్చిన మానవతావాది .ఆ కృషి ,తపన, తపస్సు, కార్యదీక్ష అనితర సాధ్యం .పెద్దపెద్ద సాహిత్య సంస్థలు ,రాష్ట్ర ప్రభుత్వం  ,రేడియో టి.వి.  లు చేయాల్సిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఒంటి చేత్తో నిర్వహించిన పట్టువదలని కధానికా విక్రమార్కుడు ,కధానికా ప్రచురణకోసం ఒక సం స్థ’’వేదగిరి పబ్లికేషన్స్ ‘’యేర్పరచి ,ఔత్సాహికులకు ప్రోత్సాహమిస్తూ ,పాతతరం వారిని కలం ది౦చవద్దని అస్త్ర సన్యాసం చేయవద్దని  బ్రిమాలి బామాలి కధానిక రాయమని బలవంతపెట్టిమళ్ళీ కలం పట్టించి  రాయించిన సహృదయుడు శ్రీ వేదగిరి రాం బాబు .66 ఏళ్ళ వయసులోనే  మరణించటం మనకు ,తెలుగు కథ కు దురదృష్టం.

సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ (అమెరికా )గారు ‘’బాపు –రమణ ‘’లపై ఉన్న గాఢానుబంధం తో ఏర్పరచిన’’ బాపు- రమణ స్మారక నగదు పురస్కారాన్నిమొట్టమొదటి సారిగా  సరసభారతి చేతశ్రీ చలపాక ప్రకాష్ గారి రమ్యభారతి, సరసభారతి సంయుక్తంగా విజయవాడ లో నిర్వహించిన శ్రీ పాగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభలో శ్రీ వేద గిరి రాం బాబు గారికి అందజేయించారు .ఆయన ఎంతో సంతోషించి  మైనేనిగారికి నాకు ఫోన్ లో ధన్యవాదాలు తెలియజేసి  వీలైనప్పుడల్లా మాట్లాడుతూ ఉండటం మా అదృష్టం .బాపు- రమణ స్మారక నగదు పురస్కారం రెండవ సారి ప్రముఖ కథానిక రచయిత కవి , చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజుగారికి మచిలీపట్నం లో సరసభారతి, క్రష్ణాజిల్లారచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యం లో జరిపిన సభలో అందజేసిన విషయం మీకు తెలుసు .సుమారు రెండేళ్ళక్రితం మచిలీపట్నం లో ఏదో  అవార్డ్  తీసుకుంటూ  రా౦బాబుగారు, కొంపెల్ల శర్మగారు, చిత్రకారుడు శ్రీ బాలి ఉయ్యూరు వస్తున్నామని నాకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారింట ఆత్మీయ సమావేశమేర్పరచి ,పద్మరాజుగారి శతజయంతి  జరిపి రా౦బాబు గారికి, కొ౦పెల్ల , బాలి గార్లకు సన్మానం చేసి ధన్యులమయాం .పై సందర్భాలలో రాంబాబు గారి  ప్రస౦గాలు చాలా ఉత్తేజంగా ఉన్నాయి .సరస భారతికి వారు ఆప్తులు ,ఆత్మీయులు .వారు ఇప్పుడు లేరు అంటే జీర్ణించుకోవటం కష్టం గా ఉంది .

             తెనాలోలోని సుండూరు లో 1958 లో జన్మించిన శ్రీ  వేదగిరి రాంబాబు ఉన్నత విద్యాభ్యాసం చేశారు అయినా తనకిష్టమైన జర్నలిజానికి అంకితమై జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్నాడు  జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించాడు . .రేడియోలో దున్నేశారు  .ఎన్నో కథానికలు రచించారు .ఆయన రాసిన ‘’జైలు గోడల మధ్య  ‘’నవల కు గొప్ప గుర్తి౦పువచ్చింది . ‘’వయసు కథలు’’బాగా పాప్యులరయ్యాయి .దూర దర్శన్ లో ‘’పాపం పసివాళ్ళు ‘’సీరియల్ తీశారు .తాను రచించతటమే కాకుండా యువ కథానికా రచయితలను ప్రోత్సహించటానికి ‘’వేదం గిరి రాంబాబు కధానికా పురస్కారం ‘’ఏర్పరచి అర్హులకు అందించారు .విజయనగరం లోని గురజాడ నివాసాన్ని గ్రంథాలయంగా మార్చటానికి కృషి చేశారు. ఆరోగ్యం కోసం ‘’మన ఆరోగ్యం ‘’రాశారు .హెల్త్ మేగజైన్ కు గౌరవ సంపాదకులుగా ఉన్నారు .తెలుగు భాషకు వేదగిరి రాం బాబు గారు చేసిన కృషికి ప్రభుత్వం నుండి రెండు సార్లు నందిపురస్కారం అందుకున్నఘన  కీర్తి ఆయనది

  ‘’వేద గిరి రాంబాబు బహుముఖీన ప్రజ్ఞావంతుడు .సముద్రం లో అలలు తగ్గనట్లు అతని తపన తగ్గదు.ఆయన సాగించింది సాధారణ యాత్రకాదు. అదొక నిర్విరామ  విరామ మెరుగని అక్షరరమ్య యాత్ర .  తన సాహితీ ప్రక్రియల్లో కడదాకా ప్రయాణించాడు .సృజన, నిర్మాణాత్మక ,ముద్రణ రంగాలను సాహితీ త్రివేణిగా మలచిన సాహితీ తపస్వి .’’ చిరుకప్ప ‘’తో కథానికా అరంగేట్రం చేశారు .’’సముద్రం ‘’కథ ఆంద్ర సచిత్రవార పత్రిక బహుమతి పొందింది .సంఘసేవా, సాహిత్య సేవా జమిలి గా చేశాడు .సెంట్రల్ జైలు లోకి వెళ్లి అక్కడి ఖైదీలతో ముఖాముఖి జరపి,రాష్ట్రం లో మిగిలిన జిల్లాకూ వెళ్లి ఖైదీలను పరామర్శించి  , వారి కథలను,వ్యధలను , కహానీలను  కన్నీటిని వేదనను  నవలీకరించి ‘’జైలు గోడలమధ్య ‘అనే పరిశోధనాత్మకనవల  రాసి  వారికి ‘’అమ్మతనం ‘’చూపించిన మాతృహృదయం ఆయనది .ఆసాంత౦ ఆర్ద్రత ఇందులో మనసుల్ని పిండేస్తుంది .ఒక రకంగా ఇది నాలుగువందల ఏళ్ళ  హైదరాబాద్ చరిత్ర .అంత అద్భుతంగా మలిచాడు  .శ్రీ వీరాజీ అన్నట్లు చిన్నకదల పెద్ద మేస్త్రీలు గురజాడ ,శ్రీపాద నుంచి బుచ్చిబాబు ,పాలగుమ్మి వరకు జరిగిని సాహితీ కృషిని మళ్ళీ బయటికి తీసి షోకేసు లో అందంగా అమర్చాడు .శతాధిక గ్రంథాలు రచించి,ప్రచురించిన అద్వితీయ సాహితీ సవ్యసాచి .100 ప్రసిద్ధ కధలతో ‘’దీప తోరణం ‘’ప్రచురించారు . అయన రచించిన ‘’అడవిమనుషులు ‘’ధారావాహికకు రజత  నంది  పురస్కార౦ లభించింది  .’’మనలో ‘’గాడ్’’రాశారు .’’వేదగిరి రాంబాబు పరిశోధనలు ,’’గిడుగుపిడుగు ‘’’’చిరుధాన్య రుచి ‘’ రాశారు .తనకథలను ‘’వేదగిరి రాంబాబు కథలు ‘’సంకలం తెచ్చారు .

    తనది ‘’కథ కులం ‘’అని శ్లేశించిన చమత్కారి రాంబాబు .రాబోయే తరానికి తెలుగు అక్షరం అందించాలనే తపన ఉన్నవాడు .మాతృభాషను ద్వేషించినవాడు, చదవనివాడు ప్రోత్సహించనివాడు దేశ ద్రోహి అని నిర్మొహమాటంగా చెప్పారు .తాను చేసే ఈ అక్షరయజ్ఞం తనవొక్కడివల్లనే సాధ్యంకాదని, కవులు, కళాకారులు  రచయితలు , సాహితీ వేత్తలు సంస్థలు వదాన్యులు, భాషా సంఘాలు ,అన్ని మాధ్యమాలు ప్రభుత్వాలు పాలు పంచుకొంటేనే ఘన విజయం లభిస్తుందన్నారు .తాను ప్రేరణ చేసి మార్గదర్శకం చేస్తానుకాని అనుసరించేవారు ఉంటేనే ఫలప్రాప్తి లభిస్తుందని నమ్మారు .రచయితలు  సమాజాన్ని 360 డిగ్రీలలో దర్శించి రాస్తేనే ,ప్రయోజనం ఉంటుందన్నారు .తాను గత దశాబ్దన్నర కాలంగా చేస్తున్న కృషి సాహిత్యం లో ప్రతిఫలించి ఇవాళ చక్కని సాహిత్యవాతావరణం ఏర్పడిందని  దీన్ని ఇకా ముందుకు తీసుకు వెళ్ళే గురుతర బాధ్యతా అందరిపైనా ఉందని చెప్పారు .ఆయన గురించి మరో ప్రముఖ కధానికా రచయిత శ్రీ మునిపల్లె రాజుగారు చెప్పిన విషయం చిరస్మరణీయం –

మానవ జీవన వైకల్యాలు, సంక్లిష్ట మానవ సంబంధాలు అరిషడ్వార్గాల ఆటలు, అస్తిత్వ వేదనలు సెంటిమెంటల్‌లోతులు, ఏ రసమైనా మానవ స్వభావ పరిధిలోనే యిమిడ్చి రాంబాబు చెప్పడం – విమర్శకులకు నచ్చే విషయం. బహుళ ప్రమోదాన్విత రచనల ఆర్ద్రతతో తడిసిపోయినవాడు, అందుకనే అతడు నిర్నిద్రరచనా వ్యగ్రుడైనాడు. తన అభివ్యక్తీకరణలో అక్షరశక్తి కన్నా భావుక పరిణతకే పట్టాభిషేకం చేసినవాడు. ‘అర్థాంగి’, ‘తల్లి’ ‘గొప్పదానం’, ‘అస్పష్ట ప్రతిబింబాలు’ యిత్యాది కథానికల్లో సామాన్య పాఠకులకు తెలియని అవయవదానం గురించిన అవగాహన, ‘భయం’ కథలో హైద్రాబాద్‌కు Specific సమస్య – పతంగుల పండుగలో ఘోర ప్రమాదాల హెచ్చరిక, ‘అద్దంలో బింబం’లో అభద్రతకు నిర్వచనం చెబుతూ ”ఆయన పోయిన తర్వాత, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ పడిపోయినట్లయింది” అంటాడు. బూజుపట్టిన పురాతన మూఢాచారాల మీద తిరుగుబాటు కథ – ‘లక్ష్యం’. సినిమా కథల చౌర్యమూలాలను అత్యంత వ్యంగ్యంగా బయటపెట్టిన కథ – ”అనగనగా” యీ కాలపు ”యువ” సినిమాల Fans తప్పక చదవాలి. ఈ ఇరవై కథలకూ ఒక దిశానిర్దేశం విధించుకొన్న శ్రీరాంబాబు వ్యక్తంగానో అవ్యక్తంగానో, కథానిక శిల్ప ప్రాథమిక సూత్రానికి కట్టుబడినట్లు. నేననుకొంటున్నాను – “A Short Story gives less and asks more” అంటే పాఠకుడి మెదడుకు మేతనిస్తుందని. అది శిల్ప రహస్యం.

– మునిపల్లె రాజు

  కధానిక పుట్టుపూర్వోత్తరాలు త్రవ్విపోసిన శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారు వెలువరించిన అభిప్రాయాలు మాన్యమైనవి –

ఆధునిక కథానికా నిర్వచనానికి లక్ష్య ప్రాయమయిన రచనలు చేశారు రాంబాబుగారు. కథానికా శిల్ప విన్యాసాన్ని వెలిగింపజేసే కథలు అనేకం ఉన్నాయి. వాటిలో హృదయాన్ని కదిపేవి కొన్ని, కుదిపేవి కొన్ని; కళ్ళను చెమరింపజేసేవికొన్ని, మెరిపింపజేసేవి కొన్ని! వాటిలోంచి ఏర్చికూర్చిన కథానికల పూలగుత్తే మనచేతిలో ఉన్న ఈ పుస్తకం, దీనిలోని ఒక్కొక్క కథానికా పుష్పం సహజ సుందర శిల్పవికాస రూపం. ఒక్కొక్క కథానికా వస్తువు సమకాలిక సామాజిక/వైయక్తిక సంక్లిష్టతావలయంలోనుంచి లాగి మానవ జీవనశకలంగా రూపుగట్టించినది. ఈ విధంగా వస్తు శిల్పకళాకృతులను దాల్చిన ఈ కథానికలు ఈనాటి సమాజానికి అత్యంతావశ్యక మయినవి. మనచుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న మంచిచెడులను మనం గమనించకపోవచ్చు; గమనించలేకనూ పోవచ్చు. వాటి ప్రభావాలకు మనలో స్పందన లేకపోవచ్చు. కాని రాంబాబుగారి కథానికలు, వాటినన్నింటినీ మన దృష్టికి తెస్తాయి. మనలో స్పందనను కలిగిస్తాయి. ఒక వ్యక్తి మనస్తత్వంలోని వెలుగు నీడలను స్పష్టంగా చూపిస్తాయి.

– పోరంకి దక్షిణామూర్తి

చిన్న కథలకు ఇవ్వాల్సిన’’ మూడ్’’  వేదగిరి కథల్లో ఉండటం విశేషం. ఈ గొప్పతనం అమెరికన్ రచయిత  ఎడ్గార్ అల్లెన్ పో ప్రత్యేకలక్షణం అన్నారు ‘’విడీవిడని చిక్కుల’’ శ్రీ వీరాజీ  .’’కొసమెరుపు అద్భుతంతో సమాప్తి చేసే కధకుడు ఓ హెన్రీ లాంటివాడు .కధల్లో మనుషులు  సజీవంగా కనిపి౦పజేసే లక్షణం రాంబాబుది’’అన్నారు చిత్రకారుడు శ్రీ బాలి .

   అక్షర యోధుడు శ్రీ వేద గిరి రాంబాబు ఇంకా అందుకోవలసిన శిఖారాలున్న వారు . అందాలకే సమ్మోహం కలిగించే నల్లని వంకీల జుట్టు గుండ్రని నగుమోము సుందరుడు ,అంతే అందమైన స్నిగ్ధమైన మెత్తని మనసున్న పుంసామోహనుడు  శ్రీ రాంబాబు  ఇలా అర్దాంతరం గా ,అనారోగ్యం తో 66 వయసులో ఈనెల 18 న మరణించారు .ఆ అక్షర శిల్పి,కలం తో నిశ్శబ్ద విప్లవం సృష్టించిన ,”కథానికా వేదగిరి శృంగం” రాంబాబు గారికి   అక్షర నివాళి ఘటిస్తున్నాను ..

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-18 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఒక శకం సమాప్తి ,అయితే ?

ఒక శకం సమాప్తి ,అయితే ?

మచ్చ లేని ,భీతిలేని ,ప్రజాస్వామ్య విలువలున్న,మిత్రధర్మం పాటించే రాజకీయ నీతి ఉన్న ,ఎదిరిని ఎప్పుడు ఎదిరించాలో ఎప్పుడు చూసి  దెబ్బ దిమ్మ తిరిగేట్టు కొట్టాలో చాణక్యం తెలిసిన , కర్మ భూమి భారతాన్ని అన్ని విధాలా ప్రపంచపటం పై అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ,ఫెడరల్ రాజ్యాంగ ధర్మాన్ని అక్షరాలాపాటించిన ,విదేశీ దౌత్యం లో తనకు సాటి ఎవరూ లేరనిపించిన ,ప్రభుత్వాన్ని నయానో భయానో నడపటం కాదు ,అందరికి ఇష్టమైనట్లు భాగస్వామ్యపక్షాల సమ్మతితో పాలించిన ,అకలంక దేశభక్తుడు ,స్వయం శిక్షకుడు ,గురు గౌరవం గరిష్టంగా ఉన్నవాడు ,దేశ విదేశాలలో అత్యంత స్థిత ప్రజ్ఞుడనిపించుకొన్నవాడు ,అజాత శత్రువుగా వినుతి౦పబడినవాడు ,తన ప్రభుత్వం ఓడిపోయినా తను అమలు జరిపిన సంస్కరణలు  ఆగామి ప్రతిపక్ష  ప్రధాని ఆనుసరించాలని కోరినవాడు , భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తుఅద్దం గా భాసి౦చిన వాడు ,ప్రజలతో మమేకమై వారి అభి వృద్ధికోసమే  అహరహం శ్రమించినవాడు,అతులిత ధీశాలి భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ మరణం తో అందరూ’’ ఒక శకం ముగిసింది’’ అన్నారు ముక్త కంఠం తో .నిజమే ముమ్మాటికీ నిజమే .

విలువల శకం ముగిసింది .ప్రజాస్వామ్య శకం ముగిసింది .అవతలివాడి అభిప్రాయాన్ని

గౌరవించే ,మన్నించే  శకం ముగిసింది .ఫెడరల్ వ్యవస్థలో ఉండాల్సిన ఇచ్చిపుచ్చుకొనే ధోరణి గల శకం ముగిసింది .చేసిన వాగ్దానాలు నిలబెట్టుకొని సుభాష్ అనిపించుకున్న శకం ముగిసింది .శుష్కవాగ్దానాలు శూన్య హస్తాలు లేని శకం ముగిసింది .భవి ష్యత్తు పై జనం ఆశలు పెట్టుకొనే శకం ముగిసింది .బ్యా౦కుల్లో దాచుకున్న డబ్బు కు రక్షణ కల్పించిన శకం ముగిసింది .దాచుకొన్న డబ్బు తీసుకోవటానికి వరుసలో గంటలతరబడి నిలబడాల్సిన అవసరం లేని శకం ముగిసింది .సంపన్నుల కొమ్ముకాయని శకం ముగిసింది .పన్నుల భారం మోపని శకం ముగిసింది .దేశ రాజకీయాలలో వంశాపాలనకు చరమ గీత౦ పాడిన శకం ముగిసింది . ప్రపంచం లో భారత దేశ గౌరవ ప్రతిష్టలు మహోన్నతంగా వెలిగిన శకం అటల్జీ మరణం తో ముగిసింది .ఐతే ?

భారత జాతిపిత మహాత్మా గాంధీ మరణిస్తే కూడా ఇలాగే భావించాం .పాలకులైన కాంగ్రెస్ వారు ఆయన నడచిన బాటలోంచి ఎంతో దూరం బయటికి వచ్చి ఇష్టారాజ్యం చేశారు .ఆయన ఏవి వద్దన్నాడో వాటికే ప్రాణ ప్రతిస్టచేశారు .గా౦ధీయిజం అటకెక్కించి ‘’ఆటవిజం ‘’తో కదం తొక్కారు .ప్రణాళికలు ఎన్ని అమలు జరిగినా ప్రజలకు కూడు గుడ్డా అమర్చలేకపోయారు .స్వార్ధం మితిమీరి అవినీతి రాజ్యమేలింది .బంధు ప్రీతీ వారసుల ప్రభావం పెచ్చరిల్లింది .వంశపాలనకు ,అధిదేవత ఆరాధనకు నాయకులు ఆమోదించారు .ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశాయి .గాంధీ యుగ సమాప్తి ఫలితాలే ఇవన్నీ .

కేంద్రం లో  లో బిజెపి ప్రధాని ఉండటం వలన అటల్జీ అంత్యక్రియలు  అంత గొప్పగా జరిగాయి .దేశవిదేశాలనుండి ప్రభుత్వ ప్రతినిధులు ,దేశంలోని అన్నిపార్టీల నాయకులు ,కేంద్ర మంత్రివర్గం మొత్తం ,ముప్ఫై మంది గవర్నర్లు హాజరై ఆ మహామహునికి శ్రద్ధాంజలి ఘటించారు .ఏడు కిలోమీటర్లు నడిచి శవ యాత్రలో పాల్గొనటం చాలా విశేషమైన విషయం .మునుపెన్నడూ జరగనిది,ఎరగనిది  .అతి నిబద్ధతతో జరిగిన కార్యక్రమం .జనం ముక్కుమీద వేలు వేసుకొని ఆశ్చర్యంగా చూసిన కార్యక్రమం .లక్షలాది ప్రజలు చేరి తమ ప్రియతమ నాయకునికి కన్నీటితో వీడ్కోలు చెప్పిన సన్నివేశమది .మీరు గమని౦చారో లేదో కాని మోడీ, షా లు ముళ్ళమీద కూర్చున్న ఫీలింగ్ తో ఉన్నారని పించి౦ది నాకు .చెమటలు తుడుచుకోలేక సతమతంయ్యాడు మోడీ .సున్నం కొట్టిన రాయి అయ్యాడు షా .బాధ ,విషాదం వారి ముఖాలపై నాకు కనిపించలేదు .పోనీ గంభీరతా లేదు .పాపం ఎరక్కపోయి ఇరుక్కు పోయామే అన్నట్లు ఉంది .ఆజనసందోహాన్ని చూసి ఆ ఆత్మీయత ,ఆరాధనాభావం ,అకళంక దేశభక్తిపట్ల ఉన్న గౌరవం చూసి మనసులో కలవర పడినట్లు అనిపించి౦ది నాకు మాత్రం .ఇది నా దృష్టి లోపమూ కావచ్చు నెమో?

ప్రభుత్వం బిజెపి కాకపొతే  ఇంత వైభవం జరిగేదా?అని ఒక ప్రశ్న .ఈ ప్రభుత్వం ఇంకెవరైనా నాయకుడు మరణిస్తే ఇంత దీక్షగాచేస్తారా అనేదీ ప్రశ్నే.కనుక ఇప్పుడు అటల్జీని గుర్తుంచుకోవాలి   .తరతమ భేదాలు పాటించకుండా ఆయనలాగా గౌరవించాలి .అది ఏ ప్రభుత్వమైనా ఎవరు అధికారం లో ఉన్నా .ఆయన అనుసరించిన మార్గం నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా దూరం వచ్చేసింది కాంగ్రెస్ లాగా .ప్రజాస్వామ్య విలువలను కనీసం ఇప్పటినుంచైనా అమలు చేయాలి, గౌరవించాలి .అభిప్రాయ భేదం ఉన్న డి .ఏం .కే .,లెఫ్ట్ పార్టీలతో   ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నవారితోప్రజాస్వామ్యం కోసం  చేతులుకలిపి పనిచేసిన అటల్జీ స్పూర్తి  అదృశ్యం  కాకుండా చూసుకోవాలి .ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం యెంత అభి వృద్ధిచెందితే దేశం అంతగా అభి వృద్ధి చెందుతుంది .ఆయన గౌరవించినట్లు వృద్దతరం నాయకులను గౌరవిస్తూ,సలహాలు పాటిస్తూ యువకులకు అవకాశం కలిపిస్తూ, ప్రోత్సహిస్తూ భావి భారత అభ్యుదయానికి తోడ్పడాలి .సంస్కరణలు అమలు జరిపే పరిస్థితులలో ఒకటికి రెండు సార్లు ఆలోచించు ముందుకు అడుగువేయాలి .బుర్రలో ఏదో తొలిచి౦దికదా  అని అర్ధ రాత్రి నిర్ణయాలు చేసి ప్రజలను ఇక్కట్ల పాలు చేయకూడదు .నల్లదనం కుప్పలు తెప్పలుగా బయటికి తెస్తానని వ్యర్ధ ప్రసంగాలతో కాలక్షేపం చేయక ,సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి బయటికి తెచ్చి అన్నమాట నిలబెట్టుకోవాలి .శాసనసభలలో చేస్సిన వాగ్దానాలు తుచ తప్పక అమలు చేయాల్సిందే . ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిందే .విడి పోయిన రాష్ట్రం సర్వతోముఖాభి వృద్ధికి ఉదారం గా పెద్దమనసుతో నిధులు అందించాల్సిందే .మట్టి మశాన్నం లతో సరిపుచ్చి అటల్ జీ గౌరవాన్ని భంగ పరచరాదు .ఊరకుక్కల్ని ఉసికోల్పినట్లు పార్టీ కేడర్ ను ప్రతి పక్షనాయకునిపై ప్రయోగించి అటల్జీ సాధించిన స౦యమన ధర్మాన్ని నీరుగావి౦చవద్దు .ఇల్లుకాలి ఏడుస్తుంటే విదేశీ ప్రయాణాలు చేసి అక్కడి జనాలను సమ్మోహనం లో ము౦చద్దు.ఇక్కడేదో దేశం వెలిగిపోతోందనే భ్రమ వాళ్లకు కలిగించి మభ్యపెట్టవద్దు .కోర్టులపరిధికి న్యాయవ్యవస్థకు అడ్డుకట్టలు వేయరాదు.పాలకులు సవ్యంగా పాలనా సాగిస్తే న్యాయస్థానాలకు పెద్దగా పనిఉండదు .గవర్నర్ వ్యవస్థ ను అపహాస్యంపాలు కానివ్వవద్దు. నాలుగేళ్ళలో ఏనాడూ భాగస్వామ్య పక్ష సమావేశం నిర్వహించకుండా రోడ్డు రోలర్ మెజార్టీ ఉందికదా అని ప్రవర్తిస్తే వచ్చే ఫలితాలు మహా దారుణంగా ఉంటాయి .

ముఖ్యంగా రాష్ట్రాలపై ,మరీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలు మొదటికేమోసం. అటల్జీ ఆత్మ గౌరవాన్ని మంటగలిపినట్లే .గెలుపే ముఖ్యం కాదు గెలిచిన తీరు ముఖ్యమని నిరూపించిన అటల్జీ మార్గాన్నే అనుసరించాలి . ఇప్పటిదాకా జరిగిందేదో జరిగి పోయింది .ఆ చెడు సంప్రదాయం అటల్జీ చితాగ్నిలో భస్మమై పోయినట్లు భావించాలి.ఇప్పటి కేంద్ర అధినాయక వర్గం  ,పార్టీ  విశాల దృక్పదాన్ని అలవరచుకొని, ఇక వేసే ప్రతి అడుగు బహుళ జన సంక్షేమంగా వేయాలి బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నఅటల్జీ మార్గమే శరణ్యం .జన హృదయసీమల్ని గెలవాలికాని  నోట్లతో వోట్లుకాదుఅని గ్రహించాలి .చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందాలి. సుగమ సుందర మార్గం లో పయనించి ప్రజాసంక్షేమానికే అగ్రతాంబూలమివ్వాలి.ప్రజలమైన మనమూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి ,మన ప్రవర్తనతో సమాజాన్ని మార్చాలి .ఇవన్నీ  చేస్తే అదే అటల్జీ కి మనమిచ్చే ఘన నివాళి అవుతుంది .అటల్జీ శకం అయిపోయి౦దన్నమాట కు కాలం చెల్లి, అదే శకం నూతన జవసత్వాలతో మరింత ముందుకు వెడుతోందనే నమ్మకం కలుగు తుంది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-18 –ఉయ్యూరు


Posted in రాజకీయం | Tagged | Leave a comment

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం

అనగానే ఆశ్చర్యపోతున్నారా ?నిజంగానే ఉందంటే అవాక్కైపోతారా ?అవును ఉంది .ఇది బెలూచిస్తాన్ ,పాకిస్తాన్ హిందువులకు అత్యంత ముఖ్య యాత్రాస్థలి .అక్కడి ఇక్కడీ  క్షత్రియులకు కులదేవత దుర్గా మాత అనబడే హింగూలాదేవి ..కరాచీకి 250 కిలోమీటర్ల దూరం లో ఉంది .దాక్షాయణి శిరస్సు పడిన హింగోలా ప్రదేశం అవటం తో 51 శక్తిపీఠాలలో అగ్రస్థానం పొందింది .ప్రతి శక్తిపీఠం లో భైరవ ఆరాధన ఉన్నట్లే ఇక్కడా జరుగుతుంది .ఇక్కడి భైరవుని’’ భీమలోచనుడు’’ అంటారు .కచ్ లో కోటేశ్వర్ లో ఆలయం ఉంది .పురాణాలలో ‘’బ్రహ్మ ద్రేయ ‘’గా చెప్పబడింది .పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో ఈ హింగోలా దేవి ఆలయముంది .మక్రాన్ తీర పర్వత శ్రేణులలో ,హిందూమహాసముద్రానికి 120 ,అరేబియా సముద్రానికి 20 కిలోమీటర్ల దూరం లో ఉంది .ఈ క్షేత్ర యాత్రను ‘’నానీకి హజ్ ‘’అంటారు స్థానిక ముస్లిం లు .ఈ యాత్ర కరాచీకి 10 కిలోమీటర్ల దూరం లో ఉన్న’’ హావో ‘’నది నుంచి ప్రారంభమౌతుంది .

హింగోల మందిరం అతి పెద్దదైన హింగోల నదీ తీరం లో ఉంటుంది .పూర్తిగా ఎడారి ప్రదేశం లో ఉన్న భూమి కనుక దీన్ని సంస్కృతం లో ‘’మరుభూమి ‘’అని ,.క్షేత్రాన్ని’’ మరుతీర్ధ హింగోలి’’అని అన్నారు .అంటే’’ ఎడారి దేవత’’ అని భావం . కాళికానంద అవధూత హింగోల ,కోటేశ్వర క్షేత్ర సందర్శనం చేసి బెంగాలీ భాషలో ‘’మరుతీర్ధ హింగోలి ‘’నవల రాశారు .మకరాన్ కోస్టల్ హై వే కరాచీ గ్వాదర్ లనుకలుపుతూ బెలూచిస్తాన్ అరేబియన్ సీ కోస్ట్ కు సమాంతరంగా ఉంటుంది .దీన్ని ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది .అలేక్సాండర్ తన విజయయాత్రను ఇక్కడినుంచే వెనక్కి తిప్పాడు .అంటీ ‘’పీఛేమూడ్ ‘’ఇక్కడినుంచే .ప్రయాణీకులకు యాత్రీకులకు ఎంతో వీలుగా ఈ హైవే నిర్మాణం జరిగింది .

హింగోల అంటే సినబార్ అంటే మేర్క్యురిక్ సల్ఫైడ్.మనపూర్వీకులు దీన్ని పాముకాటు మొదలైన విషాలనుండి కాపాడటానికి ఔషధంగా ఉపయోగించేవారు. ఇప్పుడూ వాడుతూనే ఉన్నారు .ముస్లిం లు దీన్ని ‘’నని ‘’అంటారు .ఇది పురాతన దేవత ‘’నననియ’’ కు సంక్షిప్తం .దీనికే పర్షియన్ భాషలో ‘’అనహిత ‘’అంటారు .అరేబియా సముద్ర తీర ఓడరేవు గ్వాదర్ నుంచి నడకతోనే ప్రారంభమయ్యే యాత్ర  అ మహా శక్తి స్వరూపిణి అమ్మవారి  దర్శనానికి పవిత్ర౦ గా ఉంటుందని నమ్మకం .యాత్రీకులకు పూజారులు లేక సహాయకులు ఈ ఎడారిలో సహకరించి  దారి చూపుతారు .చేతిలో ఒక త్రిశూలం లాంటి కొయ్యకర్ర పట్టుకొని వెంట నడిపిస్తారు .త్రిశూలం శివుడికి, అమ్మవారికి ఆయుధంకదా.కనుక వీరిని ‘’చరి ధారులు ‘’అంటే కర్ర పట్టుకొనే వారు అంటారు .ఈ కర్ర త్రిశూలానికి కాషాయ ధ్వజం కట్టబడి ఉండటం విశేషం .

ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి పూజారి ఒక కాషాయ వస్త్రం ఇచ్చి ,మిగిలిన వారికి సహాయం చేస్తానని ప్రమాణం చేయిస్తారు .తాము వెంట తెచ్చుకున్న నీటిని వేరెవరికీ ఇవ్వవద్దని వారిస్తారు కూడా .కారణం పవిత్ర యాత్ర మలినం కాకూడదనే .యాత్ర మధ్యలో ‘’చంద్ర కూప్ ‘’అనే బురద అగ్నిపర్వతం వద్ద ఆగుతారు .ఆసియాలోనే ఇది అతిపెద్ద బురద అగ్నిపర్వతం .ఇది చాలాపవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు దీనికి ‘’బాబా చంద్ర కూప్ ‘’అంటే ‘’చంద్రబావిపిత ‘’అని అర్ధం .అగ్నిపర్వతాలు సాధారణంగా ‘’మాగ్మా ‘’తో  నిండి ఉంటె  ఇది బురదతో ఉండటం విశేషం .ఆసియాలో ప్రమాద అగ్నిపర్వత ప్రాంతాలలో ఇది చాలా ముఖ్యమైనది .ఒక్కోసారి వేడి బురద ఎగచిమ్మబడి తర్వాత చల్లబడి గుట్టలుగా పేరుకుపోతుంది .ఈ ప్రాంతం లో ఇలాంటి కూపాలు 18 ఉంటాయి .అండమాన్ దీవులలో ఒక బురద అగ్నిపర్వత౦ ఉంది. యాత్రికులు చంద్ర కూప్ దగ్గర ఆగి, రాత్రి  విశ్రాంతి తీసుకొంటారు రొట్టెలు వండి అగ్ని పర్వతం శాంతి౦చటానికి నైవేద్యం పెడతారు .ఇవి వండటానికి గోధుమపిండి, నెయ్యి, పంచదార ఉపయోగిస్తారు .వీటిని భూమిమీదకాక కర్రలపై పెట్టి నివేదిస్తారు .ఉదయంలేవగానే యాత్రికులు పూజారుల సహాయం తో అగ్నిపర్వతం ఏర్పరచిన గొయ్యి దగ్గరకు చేరి దాని అంచున ఒక కొయ్య త్రిశూలం పాతి ,మంత్రాలు చదువుతూ రోటీలను నైవేద్యం పెట్టి ఊదుకడ్డీలు, హారతి వెలిగించి చూపించి  రొట్టెలను ముక్కలు చేసి అగ్నిపర్వత కూపం అంటే నోటిలో పడేస్తారు .ఈ పనికాగానే ప్రతియాత్రికుడు తను చేస్సిన తప్పులు ,పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రార్ధించి మళ్ళీ పాపాలు చేయననిప్రమాణ౦  చేస్తాడు .ఎవరైనా ఒప్పుకోకపోతే ,అతడిని యాత్రిక బృందం నుంచి వెలి వేస్తారు .తర్వాత బాబా చంద్ర కూప్ వద్ద సెలవు తీసుకొని ముందుకు సాగుతారు .

నాలుగైదురోజుల ప్రయాణం తర్వాత, చెక్క ఇళ్ళున్న ఒక గ్రామం చేరుతారు .ఇక్కడే పూజారులు,,సహాయకులు నివాసం ఉంటారు .ఇక్కడి ముస్లిం లకు హింగులాదేవి అరాధ్య దైవం .దేవాలయ ప్రవేశం ముందు భక్తులు హింగూల నదిలో పవిత్ర స్నానం చేస్తారు దీనికి ‘’అఘోరానది’’ అనే పేరుకూడా ఉంది .తడి వస్త్రాలతో అమ్మవారి దర్శనం చేయటం ఇక్కడ సంప్రదాయం .హింగూల అమ్మవారు అంటే ‘’సూర్య చంద్రాకృతి’’మాత్రమే.అంటే విగ్రహం ఉండదు .కొండమీద ఎత్తైన ప్రాంతం లో ఉన్న గుహలో ఈ గుర్తు ఉంటుంది .శ్రీరాముడు ఇక్కడికి వచ్చి,తపస్సు చేసి అన౦తరం  తనబాణ౦ తో ఈ చిహ్నాన్ని ఏర్పరచాడని పురాణకధనం .ఈ గుహ దేవాలయాన్ని ‘’మహల్ ‘’అంటారు.అరబిక్ భాషలో భవనం అని అర్ధం .యక్షులు దీన్ని నిర్మించారని స్థానికుల విశ్వాసం .గుహకప్పులు, గోడలు అందమైన దృశ్యాలతో తీర్చి దిద్దబడి ఉంటాయి.నేల మిలమిల మెరుస్తూ ఉంటుంది .

‘’నాని ‘’అనిపిలువబడే అమ్మవారి గుహాలయ ముఖద్వారం 50 అడుగుల ఎత్తు ఉంటుంది,గుహా౦తర్భాగం చివరలో గర్భాలయం లో అమ్మవారి చిహ్నం దర్శనమిస్తుంది .ఎర్ర వస్త్రాలు , గంధ సిందూరం  కప్పబడి ఉంటుంది .నేలపై పాకుతూ వెళ్లి అమ్మవారి దర్శనం చేసి ,వేరొక మార్గం నుండి బయటకు రావాలి .భక్తులకు అమ్మవారి ప్రసాదం అందజేస్తారు .రాత్రి పూట ఇక్కడే గడిపి ఆకాశంలోని అద్భుతమైన ‘’పాలపుంత ‘’ను చూసి పరవశిస్తారు .

విదర్భ రాజు  నలమహారాజు  హింగూలా దేవి పరమభక్తుడు .ఒకసారి పూరీ రాజు ఆయన సహాయార్ధం వచ్చాడు .జగనాధ స్వామికి ప్రసాదం వండటానికి  అతడు హింగూల దేవిని దేవాలయ వంటగదిలో నిప్పు రాజేయమని ప్రార్ధించాడు .పూరీ దేవాలయ౦లొ జగనాద స్వామికి  ప్రసాదాలు తయారు చేసే పవిత్రాగ్ని  వెళ్ళింది .

మను చరిత్రలో పెద్దనామాత్యుడు ప్రవరాఖ్యుని చేత సిద్దుడిని ఏయే క్షేత్రాలు సందర్శించారని ప్రశ్నిస్తాడు అతడు ‘’కేదారేశు భజించితిన్ , శిరమునన్ గీలి౦చితిన్ హింగులా పాదా౦భోరుహములన్  ‘’అని మొదలు పెట్టి తన తీర్ధ యాత్రా విశేషాలన్నీ చెప్పి, అతనిలో తీర్ధ యాత్ర చేయాలనే సంకల్పం కలిగించటం  ,సిద్ధుడు పాదలేపనం  పూస్తే దానిమహిమతో హిమాలయ పర్వతం చేరి ‘అటజని కాంచె భూమిసురుడ౦బర చుంబి శిరస్సర జ్ఝరీ పటలముహుముర్లు ఠదభంగ తరంగ మృదంగ నిస్శ్వన స్ఫుట నటనాను కూల ఫరిఫుల్ల ‘’  ‘’అనే గొప్ప పద్యం రచించటం మనకు తెలిసిన విషయాలే .

ఇక్కడేకాక గుజరాత్ ,రాజస్థాన్ లలోకూడా హింగూలా దేవి దేవాలయాలున్నాయి .కులార్ణవ తంత్రం లో 18 శక్తిపీఠాలలో పాకిస్తాన్ లోని ఈ పీఠం మూడవదని ఉంటె, కుబ్జికాతంత్రం లో 42 సిద్ధి పీఠాలలో అయిదవదని చెప్పబడింది .తంత్ర చూడామణిలోని ‘’మహా పితా  నిరూపణ ‘’భాగం లో  43 గురించే ఉంది. తర్వాత 51 అయ్యాయి  పితాదేవత అంటే దేవియే. హా కొట్టారి,కొట్టవి,కొట్టారిష అనీ,భైరవుని భీమలోచనుడని చెప్పబడింది.16 వ శతాబ్దం లో ముకు౦ద రాం రాసిన  ‘’చండీ మంగళ్’’లో తొమ్మిది గురించే చెప్పాడు .

ఒక కధనం ప్రకారం త్రేతాయుగం లో విచిత్ర వీరునికుమారులుహింగూల ,సుందరులు .వీళ్ళు లోకకంటకులైతే వినాయకుడు సుందరుడిని సంహరించాడు .ప్రజలు దేవిని ప్రార్ధించి హింగూలను చంపమని ప్రార్ధించారు .వాడిని వెంబడిస్తూ దేవి ఇప్పుడున్న హి౦గూల గుహలోకి వచ్చి వాడిని సంహరించగా వాడు తనపేరిట ఆప్రదేశం పిలువబడాలని  ఆమెను అర్ధించాడు .తధాస్తు అన్నది .మరో కధనం ప్రకారం బ్రహ్మ క్షత్రియులనేవారు హింగూల దేవిని కులదేవతగా ఆరాధించేవారు .పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తున్నప్పుడు 12 మంది క్షత్రియులు పారిపోతే వారికి ఇక్కడి బ్రాహ్మణులు ఆశ్రయమిచ్చి బ్రాహ్మణ వేషాలు వేయించి  ప్రాణాపాయం తప్పించి వారినికాపాడమని హింగూలాదేవిని ప్రార్ధించారు .వీరి వంశంవారే ఆతర్వాత బ్రహ్మ  క్షత్రియులయ్యారు .ఇంకో కధనం ప్రకారం దధీచి మహర్షి రత్న సేనుడనే సింధు రాజును  తన ఆశ్రమం లో రక్ష కల్పించాడని ,కాని పొరబాటున రత్న సేనుడు  బయటికి వస్తే  , పరశురాముడు చంపాడని,కొడుకులు  ఆశ్రమం లోనే  ఉన్నారని పరశురాముడు మహర్షిని సందర్శించినపుడు వాళ్ళు బ్రాహ్మణ వేషం లో కనిపించారని కనుక ఆయన  దృష్టి వీళ్ళపై పడలేదు కనుక బ్రతికిపోయారని ,అందులో ‘’జయసేనుడు ‘’సింథ్ కు వెళ్లి  రాజ్యపాలన చేశాడని ,దధీచి ఉపదేశించిన  హింగూలమాత మంత్రం తో రాజ్యాన్ని కాపాడాడని ,హింగూలాదేవి పరశురాముడిని ఇక క్షత్రియ సంహారం చేయవద్దని శాసి౦చి౦దని  అంటారు .

ప్రతి ఏడాది హింగులామాతయాత్ర ఏప్రిల్ లో ప్రారంభమౌతుంది .మూడవ రోజు ముఖ్యమైనది .పూజారులు మంత్రోచ్చాటన చేస్తూ  యాత్రిక భక్తులు సమర్పించే  నైవేద్యాలు కానుకలు స్వీకరించి ఆశీర్వదించమని ప్రార్ధిస్తారు .అమ్మవారికి అందరూ కొబ్బరికాయలే సమర్పిస్తారు . కొందరు ఇక్కడే నాలుగు రోజులు ఉంటారు .దేశం లోని అన్ని ప్రాంతాలనుంచీ అమ్మవారి దర్శనానికి యాత్రికులు వస్తారు .ఓపిక ఉన్నవారందరూ దర్శించి తరించాల్సిన క్షేత్రం హింగూల దేవి సిద్ధ శక్తి పీఠం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-18- ఉయ్యూరు


Posted in రచనలు | Tagged | 1 Comment

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్

సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్

పవిత్ర నర్మదానది ప్రవహించే మధ్యభారతమైన మధ్యప్రదేశ్ లో జన్మించి,  ఆ నదీమతల్లి పవిత్రతను హృదయం నిండా  నింపుకొని , అక్కడి ఉజ్జయినీ మహాకాళేశ్వరుని అనుగ్రహ విభూతి పొంది ,  కవికులగురువు మహాకవి కాళిదాస కవితా సాహితీ సారాన్ని గ్రోలి ,పేరులో బిహారీ ఉండటం తో మగధ సామ్రాజ్య విధాత , మదించిన నందవంశ రాజుల మదమణగించి ,మౌర్య చంద్రగుప్తుని చక్రవర్తిగా ప్రతిష్టించి ఆ శపథం నెరవేరేదాకా సిగ ముడవని ,చాణక్యుని రాజనీతి సారాన్ని పుక్కిటబట్టి  ,అపర చాణక్యుడనిపించి  ,మధ్యప్రదేశ్ రాజ కుటుంబాల పోరాట పటిమ జీర్ణించుకొని,  ఎన్ని అడ్డంకు లెదురైనామొక్కవోని ధైర్యం తో ఎదిరించి విజయం సాధించే మనో ధైర్యాన్ని ఒంటబట్టించుకొని , ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంట్ కు మూడు సార్లు ఎన్నికై ,అక్కడి పవిత్ర గంగా నదీఝరీ సదృశ వాగ్ధాటి నలవరచుకొని ,నడుస్తున్న సంస్కృతీ ,సంప్రదాయ ,సాహితీ త్రివేణీ సంగమమై ,,దేశంలోని అన్ని తరగతులప్రజలకు ,రాజకీయ పక్షాలకు ఆదర్శ ప్రాయమై ,ఆనాటి యుధిస్టిరునిలా అజాత శత్రువై ,ఆయనలాగా ‘’మెత్తని పులి’’ అని పించుకొని ,పద్నాలుగు పార్టీల సహకారంతో దేశం లోనే మొట్టమొదటి సహకార సంకీర్ణ మంత్రివర్గానికి నాందిపలికి ,అందరి మాటలకు ,అభిప్రాయాలకు విలువనిచ్చి ,ఒడిదుడుకులు లేకుండా పాలన సాగించి ,13 రోజులకే మంత్రివర్గం ఒకే ఒక్క వోటు తేడాతో  కూలి పోయినా,బెదరక చెదరక అడ్డదారి తొక్కక,ప్రజా విశ్వాసం మళ్ళీ పొంది పూర్తీ మెజారిటి తో అధికారం లోకి వస్తామని లోక్ సభలో శపథం లాంటి ప్రతిజ్ఞ చేసి,ఆతర్వాత ఆమాట నిలబెట్టుకొని ప్రజాబలంతో గద్దెనెక్కి షంషేర్ అనిపించుకొన్న మధ్యప్రదేశ్ నుంచి భారత దేశ తొలి ప్రధాని అయినవాడు ,అతులిత సుగుణ సంపన్నుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ .

ఉత్తరప్రదేశ్ బటేశ్వర్ నుంచి  వీరిపూర్వీకులు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోని మొరీనా కు వలసవచ్చారు .తాతగారు పండిట్ శ్యాం లాల్ వాజ్ పాయి ,వాజపేయం చేసిన శ్రౌతి  .తండ్రి  కృష్ణబిహారీ వాజ్ పాయ్ స్కూల్ టీచర్ .తల్లి శ్రీమతి కృష్ణా దేవి . శ్యాం ప్రసాద్ ముఖర్జీ అంతరింగికుడై ,జనసంఘ స్థాపనలో బాధ్యత వహించి ,దానికొక స్వరూపస్వభాలు ఏర్పరచి ,ఎన్నికలలో గెలిచే సత్తా కలిగించినవాడు .దేశమంతా ఎమర్జెన్సీ దుష్టపాలన లో క్రూర హింసా దౌర్జన్యాలతో నలిగి అష్టకష్టాలు పడుతున్నప్పుడు  లోక్ నాయక్ శ్రీ జయప్రకాష్ నారాయణ్ దానికి వ్యతిరేక పోరాటం చేసే ప్రయత్నం లో ఉండగా ,పార్టీలకు అతీతంగా ఆలోచించి ,విస్తృత ప్రాతిపదికపై ‘’జనతా పార్టీ ‘’ఏర్పరచటం లో కీలక పాత్ర పోషించి , మహాత్మాగాంధీకి అసలైన వారసుడు శ్రీ మొరార్జీ దేశాయ్ ని ప్రధాని నిచేసి ,తాను విదేశా౦గ మంత్రిగా రాణించి ,యు.ఎన్. వో .లో హిందీలో మాట్లాడిన తొలి విదేశాంగ మంత్రిగా చరిత్ర సృష్టించాడు .ఆనాటి జనతా ప్రభుత్వం ప్రజలకుఎన్నో మేళ్ళు చేసింది .సమర్ధులైన మంత్రులు ఉండేవారు .కాంగ్రెస్ కు  రాం రాం కొట్టిన శ్రీ జగ్జీవన్ రాం ఉప ప్రధాని ,ఆర్ధికమంత్రి హెచ్. ఏం .పటేల్ ,హోమ్ మంత్రి చరణ్ సింగ్ .ప్రజావసర వస్తువులన్నీ అత్యంత చౌకగా ప్రజలకు అందుబాటులో ఉండేవి .ప్రజా ప్రభుత్వం ఎలా ఉండాలో జనతా ప్రభుత్వం ఆచరించి చూపింది .ఇందులోనూ వాజ్ పాయ్ చొరవ బాగా ఉంది .

క్విట్ ఇండియా ఉద్యమం లో 24 రోజులు జైలు శిక్ష అనుభవించిన అటల్జీ స్వాతంత్ర్య సమరయోధుడు .ఆపేరు చెప్పుకొని ఎన్నడూ రుబాబు చేయలేదాయన .జనతాపార్టీ ప్రభుత్వం కూలిపోయాక భారతీయ జనతా పార్టీ ఏర్పరచి అధ్యక్షులై లాల్ కృష్ణ ఆద్వానీ స్నేహ సహకారాలతో విస్తృతంగా దేశమంతా పర్యటించి ,పార్టీ పునాదులు పటిస్టం చేసి బిజెపి అధికారం లోకి రావటానికి విశేష కృషి చేశాడు .అటల్జీ అనుయాయి  భైరన్ సింగ్ షెకావత్ రాజస్థాన్ ముఖ్యమంత్రియై ఆదర్శ ప్రభుత్వాన్ని నడిపాడు .లంబాడీలకు వెన్నుదన్నుగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేసి అంతగొప్ప ముఖ్యమంత్రి లేదు అనిపించాడు .మధ్యప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం సుందర్ లాల్ పట్వా ఆధ్వర్యం లో ఏర్పడి, నానాజీ దేశ్ ముఖ్ నా యకత్వం లో ‘’అంత్యోదయ’’ కార్యక్రమం చేబట్టి ఆదివాసీ జన సౌభాగ్యానికి శ్రీకారం చుట్టారు . ఇవన్నీ పైన వాజ్ పాయి ప్రధానిగా ఉన్నప్పుడు జరిగినవే .అప్పటిదాకా ఈ రెండు రాష్ట్రాలు చాలా వెనకబడి ఉన్నాయి వాటిని అభి వృద్ధిమార్గం లో నడిపిన ఘనత ఆ ఇద్దరు ముఖ్యమంత్రులదే.

అటల్ ప్రధాని , ఆద్వానీ ఉపప్రధాని ,అటల్ పార్టీ అధ్యక్షుడు ,ఆద్వాని  కార్యదర్శి .పార్టీకి ప్రభుత్వానికి ఒకరు ఒకరు రధి అయితే మరొకరుసారధి .వీరిద్దరి స్నేహసుగంద పరిమళం దాదాపు 68 ఏళ్ళు సాగి ,ఆదర్శ ప్రాయమైనది  అందరికీ .బిజెపి కి వారు కృష్ణార్జునులు .ఒకరికొకరు గురు శిష్యులు .ఆంద్ర ప్రదేశ్ ఐటి అభి వృద్ధికి అటల్ ఎంతో సహకరించాడు .చంద్రబాబు ఆలోచనను మన్నించి స్వర్ణ చతుర్భుజి తో ఆసేతు హిమచలపర్య౦త౦  విస్తృత మైన  రోడ్ల నిర్మాణం జరిగింది .టెలికాం లో విప్లవాత్మకమైన అభివృద్ధికీ బాబు సూచనలనే అమలు పరచాడు అటల్జీ .ద్రవ్యలోటు అదుపుకు తెచ్చేందుకు ప్రధాని కృషి చేసి మదుపు ధనాన్ని పెంచగలిగాడు .ఉచిత ప్రాధమిక విద్యకోసం ‘’సర్వ శిక్షా అభియాన్ ‘’ప్రవేశ పెట్టాడు.పెట్టుబడుల ఉపసంహరణకు ఒక మంత్రిత్వ శాఖనేర్పరచి ప్రభుత్వ పాత్రను తగ్గించి ,ప్రైవేట్ పెట్టుబడులకు ఆకర్షణ కల్గించింది అటల్జీయే.

పదేపదే ఇతర దేశాలలో  పర్యటించి ఖజానాకు బొక్క పెట్టకుండా అన్ని దేశాలకు స్నేహ హస్తం చాటి ,పాకిస్తాన్ నుకూడా మిత్రుని చేసుకొన్న చాణక్యం ఆయనది .కవ్వించిన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్ధం లో బుద్దీనేర్పిన బృహస్పతి   అందుకే పాక్ మాజీప్రధాని నవాబ్ షరీఫ్ ‘’అటల్ జీ పాకిస్తాన్ ఎన్నికలలో నిలబడినా గెలుస్తారు. ఆయనకు అంతప్రజాబలం ఉంది ‘’అన్నాడు ..శత్రువైనా ప్రతిపక్షనాయకుడైనా మంచి ఉంటే మెచ్చుకొనే సహృదయత ఆయనది .బంగ్లాదేశ్ విమోచనకు విముక్తి వాహిని  ఏర్పరచి ప్రధాని ఇందిర చూపిన చొరవను మెచ్చి ఆమెను’’ అపరకాళి’’కగా అభివర్ణించిన అపరాకాళిదాసు గా  అందరి మన్ననలు పొందిన విశాల హృదయుడు .బిజెపి అంటే అమెరికా తొత్తు అని నిత్యం మొరిగే వారి నోళ్ళు మూయించి పోఖ్రాన్ అణుపరీక్ష మూడో కంటివాడుఅంటే డేగ చూపుల అమెరికా వాడికి  కూడా తెలీకుండా నిర్వహించిన దీక్షా దక్షుడు .ఇందులోకలాం గారి విశ్వసనీయపాత్రకు జేజేలు పలికినవాడు . ఆయన బహు రాజనీతిజ్ఞుడు అంటే స్టేట్స్ మన్ .

19 42లో గ్వాలియర్ విక్టోరియాకాలేజిలో చదువుతున్నప్పుడు రాజకుమారి అనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు .ప్రేమలేఖ కూడా రాసి ఆమె పుస్తకం లోపెట్టాడు ఆమెకూడా రాసి అదే పుస్తకం లో పెట్టి౦ది కాని ఎవరూ బయటికి చెప్పుకోలేదు .ఆమె ఆఆయన ఆఉత్తర౦  చూడలేకపోయాడు చివరికి తలిదండ్రులకు తెలిసి పెళ్ళికి ఒప్పుకోకుండా వేరోకనితో ఆమె పెళ్లి చేశారు .తర్వాత ఎప్పుడో ఆమ కనబడింది .భర్త చనిపోయాడు ఒక కూతురు నమిత .తల్లిని  తనింటికి ఆహ్వానించి తనవద్దే ఉంచుకొని ఆకూతురును దత్తత చేసుకొని తండ్రి అయి ఆమెకు పెళ్లి చేసి ,ఆమెకు పుట్టిన పిల్ల నీహారికతో తాతగా ఆడుతూ పాడుతూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొన్న నిండు హృదయుడు  .ఈ విషయం బయట ఎవరికీ తెలియదు .దీనికి ఆయనకుహిందీ సినిమాలో గుల్జార్ రాసిన  ‘’ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వు .దానికి ఎలాంటి పేరూ పెట్టకు ‘’పాట ఆదర్శం .ప్రియురాలుదక్కకపోయినాప్రేమ  కలకాలం నిలుస్తుందని నిరూపించిన ప్రేమమూర్తి.

ఆయనది వికాస విదేశాంగ నీతి .ఆయన సాటిలేనిసంస్కర్త .బహుముఖ ప్రజ్ఞాశీలి ,ఆద్యుడు ఆరాధ్యుడు .మార్గ దర్శి .కర్మ యోగి .ప్రపంచ వేదికమీద భారత దేశాన్ని సరికొత్తగా ఆవిష్కరించి ,భవిష్యత్ తరాలను ప్రభావితం చేసే కార్యక్రమాలెన్నో చేబట్టిన అభ్యుదయవాది, గామి .ప్రగతిపథ నిర్దేశకుడు .ఎందరెందరికో స్పూర్తి ,ప్రేరణ ఆయన .అటల్ లాంటి వారు మరోకరుండరు .మిత్ర ధర్మానికి ఎంతో విలువనిచ్చే అచ్చపు ప్రజాస్వామ్యవాది .అందుకే ఎమర్జెన్సీ ని అంతగా వ్యతి రేకించాడు ,కారాగార వాసం అనుభవించాడు.

పది సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన రాజకీయ దురంధరుడు .రాజనీతిజ్ఞుడు .ఒకసారరెప్పుడో ఢిల్లీ లో  7 సీట్లు బిజెపి గెలిచినప్పుడు పార్థిమేస్టారి అరుగానే పార్లమెంట్ లో  తెల్లవార్లూ మిత్రుడు సూరి నరసింహం ఇంట్లో రేడియో వింటూ,  గంటకో టీ తాగుతూ చప్పట్లుకోడుతూ నేనూ ,గుండురామం ,వెంట్రప్రగడ సాంబయ్య,మండా వీరభద్ర రావు  మొదలైన వాళ్ళం పొందిన అనుభూతి ఎన్నటికీ మర్చిపోలేను .,  అంటే స్టేట్స్ మన్ .పార్లమెంట్ ప్రసంగాలలో చురుక్కులు చమక్కులు కవితాదారతో ఆకట్టుకొన్న వాగ్ధాటి ఆయనది .

చిన్నప్పటి నుంచి  ఆర్ .ఎస్ .ఎస్. నీడలో ఎదిగిన అటల్జీ ,అధికారం లో ఉండగా దానినీడ పడకుండా ,దాని ప్రభావానికి లోనుకాకుండా ,దాని పెత్తనం తనమీద లేకుండా చేసుకొన్న సౌజన్య వ్యక్తిత్వం ఆయనది .రాజీలేని రాజనీతి, ముక్కుసూటి ఆయనముఖ్య  లక్షణాలు .

ఒకసారి శ్రీ జగ్జీవన్ రాం రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రైలుప్రమాదాలు జరిగి ఎందరో చనిపోతే ,ఆ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావిస్తూ ‘’మీ పరిపాలన లో జనం జగ్  జీవన్ కీ రాం రాం ‘’అని చమత్కరించాడు వాజపాయ్ .దీనర్ధం అయ్యా తమ ఏలుబడిలో జనం జగత్తుకు రాం రాం చెబుతున్నారు అని ఆయన పేరుతోనే గొప్ప చమత్కారం సృష్టించాడు .మరోసారి ఆయనే ఆహార మంత్రిగా ఉండగా ఆహారపదార్ధాల సప్ప్లై సరిగ్గా లేక ,పంటలు పండక జనం ఆలో లక్ష్మణా అని అలమటిస్తుంటే అప్పుడు అటల్జీ సభ లో ‘’జనం అన్నమో రాంరాం ‘’అని అలమటిస్తున్నారని మళ్ళీ ఆయన పేరుతోనే చమత్కరించాడు .ఆరేళ్ళు ప్రధానిగా చేసిన తర్వాత  ,20 14 లో మళ్ళీ యెన్. డి. ఏ .బిజెపి కూటమి  అఖండ విజయం సాధిస్తుందని ఆయన్ను రెస్ట్ తీసుకొని ఆద్వానీకి పగ్గాలిస్తే బాగుంటుంది అనే సణుగుడు ఆయన చెవిన పడి ‘’న టైర్డ్ న రిటైర్డ్  ఆద్వానీ జీకి నేత్రుత్వ్ మే విజయ్ కీ ఓర్ ప్రస్థాన్ ‘’ ‘’నేను అలసటా చెందలేదు, రిటైరూ అవ్వలేదు.ఆద్వానీగారి నేతృత్వం లో విజయం వైపు పయనం ‘’అని నర్మ గర్భంగా చెప్పారు  .1996 లో మొదటిసారిగా ప్రదానిపదవి చేబట్టే సందర్భం లో జర్నలిస్ట్ రాజీవ్ శుక్లా ఆయన్ను ఇంటర్వ్యు చేస్తూ’’అటల్ జీ ఇప్పటిదాకా హాయిగా ప్రజలమధ్య తిరిగారు .ఇక ఇప్పుడు భద్రతా వలయం లో బందీ అయి ,ప్రజలకుదూరమౌతారు. మిమ్మల్ని ప్రజలు దూరం నుంచే చూడాల్సి  వస్తుంది ‘’అని అంటూండగా అటల్జీ వలవల ఏడిచేసి కన్నీరు కార్చిన దయామయుడు .

హిమ శృంగ సదృశ సమున్నతుడు ,మేరునగ ధీరుడు ,సముద్రమంతలోతైన అంతఃకరణ ఉన్నవాడు,నడిచే భారతీయ మూర్తిమత్వం ,సర్వమత సమన్వయ  గంభీరుడు ,శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ 93 వ ఏట నిన్న 16- వతేదీ తిరిగి రాని లోకాలకు చేరారు  .ఆయన భారతరత్నం ,ఆయన లేనిలోటు తీరనిది .ఆయన మరణం దేశానికే తీరని నష్టం .

అశ్రునయనాలతో ఆ అభినవ భీష్మునికి అంజలి ఘటిస్తూ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-18- ఉయ్యూరు

 

.

 

 

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

గురుపూర్ణమి -జూన్ -జులై తెలుగు విద్యార్థిలో నా వ్యాసం

గురుపూర్ణమి -జూన్ -జులై తెలుగు విద్యార్థిలో నా వ్యాసం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం

కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం

      తమిళనాడు లో ఉన్న ఆరు సుప్రసిద్ధ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య దేవాలయాలలో తిరుప్పరం కుండ్రం దేవాలయమూ ప్రసిద్ధమైనదే .6 వ శతాబ్ది  పాండ్య రాజులు కట్టిన దేవాలయమిది .ఇక్కడే శూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరించి  ఇంద్రుని కుమార్తె దేవయాన ను కుమారస్వామి వివాహమాడాడు .షణ్ముఖుడు ఇక్కడే ‘’పరంగినాద శివుడి’’ని ఆరాది౦చాడని కథనం.

   మదుర నగరానికి 5 కిలోమీటర్ల దూరం లో ఈ ఆలయం ఉంది .మురుగన్ ముఖ్యదైవం .శివ ,విష్ణు వినాయక ,దుర్గాదేవి విగ్రహాలుకూడా ఉన్నాయి .నిత్యం ఆరు పూజలు సంవత్సరం లో మూడు ముఖ్య ఉత్సవాలు జరుగుతాయి .ఇందులో అక్టోబర్ –నవంబర్ నెలలో వచ్చే ‘’స్కంద షష్టి’’ఉత్సవం అత్యంత ముఖ్యమైనది .దీన్ని ఘనంగా చేస్తారు .శూరపద్మ  రాక్షస వధ వృత్తాంతం స్కంద పురాణం లో ఉన్నది .ఈ రాక్షసుడు శివుని తపస్సు చేసి మెప్పించి అద్భుత వరాలు పొంది ,లోక భీకరుడై నరకంటకుడై 108 లోకాలను గడగడ లాడించాడు .వీడు పాదుమకోమల ను వివాహమాడి చాలామంది కొడుకులను పొందాడు .వీరం కేంద్రం ను సముద్రం లో నిర్మించి రాజధానిగా చేసుకొని పాలించాడు .ఇంద్రాది దేవతలను లొంగదీసుకొని ఇంద్రాణిపై మోజు పడ్డాడు .చేసేది లేక మురుగను శరనణువేడాడు దేవేంద్రుడు .   కుమారస్వామి వాడికి నయానబుద్ధి చెప్పాలని భావించి వాడి దగ్గరకు ‘’విరవాకుటర్’’అనే దూతను పంపాడు .వాడు లొంగలేదు .తప్పని సరి పరిస్థితులలో స్కందుడు ససైన్యంగా ఆరాక్షసుని తో ‘’తిరుపరం కుండ్రం’’ వద్ద భయంకర యుద్ధం చేయాల్సి వచ్చింది .వాడి కుమారులలో ‘’ఇరణ్యు’’ డుని  తప్ప అందర్నీ సంహరించాడు .భయపడి దానవుడు సముద్ర గర్భం లో దాక్కున్నాడు .తన నెమలి వాహనం కోడిపుంజు లతో  తో సముద్ర గర్భానికి వెళ్లి  వాడిని రెండుముక్కలుగా నరికి చంపాడు .స్కందుడు శూర పద్ముడిని సంహరించిన  షష్టి రోజు ను ‘’స్కంద షష్టి’’ ఉత్సవంగా అప్పటినుంచి మురుగ దేవాలయాలలో సంప్రదాయం గా వస్తోంది .కుమారస్వామి వీర ధీర పరాక్రమాలకు సంతోషపడిన దేవేంద్రుడు తన అపురూప పుత్రిక’’ దేవ సేన’’ని స్కందునికిచ్చి ‘’తిరుపరం కూండ్రం’’లో వైభవంగా వివాహం చేసి రుణ౦ తీర్చుకొని అల్లుడిని చేసుకొన్నాడు .దేవతందరు వివాహ వేడుకకు విచ్చేసి దంపతులను ఆశీర్వ దించారు అప్పుడు కుమారస్వామి వారిని తిరిగి తమతమ లోకాలకు మనో వేగం తో వెళ్ళమని కోరాడని ఈ దైవ వివాహ విషయాన్ని గ్రంధస్థ౦  చేసిన  ‘’కాందహార అనుభూతి ‘’లో ఉంది .ఈ ప్రదేశం లోనే స్కందుడు తన తండ్రి పరమ శివుని ‘’పరం గిరి నాధుడు ‘’గా అర్చించాడు .

  ఒకప్పుడు ఈ రాక్ టెంపుల్ జైనమందిరం అని తర్వాత స్కంద దేవాలయం అయిందని కొందరు అంటే, కాదుకాదు  ఆరో శతాబ్దానికి ముందే  ముందేఇది స్కందాలయం  దీన్ని జైన మతస్తులు  పాండ్య రాజు’’ కూన పాండ్యు’’ నికాలం లో ఆక్రమి౦చారనీ అంటారు .తర్వాతకాలం లో పాలించిన  పాండ్యరాజు మంత్రి ‘’గజపతి  ‘’ఈ ఆలయాన్ని8 వశతాబ్దిలో  నిర్మించాడు .ఆతర్వాత మధురనాయకులు ఆలయాన్ని అనేకరకాలుగా విస్తరించారు .

  ఆలయం లో అందమైన శిల్పాలు ఉన్న రాతి స్తంభాలపై ఆ స్థాననమండపం అనే ఒక హాలు ,150అడుగుల ఎత్తైన 7 అంతస్తుల రాజగోపురం కను వి౦దు చేస్తాయి.ఆలయం వెనుక 10 50 అడుగుల ఎత్తైన కొండపై శ్రీ కాశీ విశ్వనాధ దేవాలయం చూపరులకు ఆకర్షణీయంగా ఉంటుంది .ఇందులోని వినాయకుని హస్తాలలో చెరుకుగడ ,పండ్లు ఉండటం విశేషం .కంభ తాడి మండపం ,అర్ధ మండప౦, మహా మండపం ఒకదానికొకటి ఎత్తుగా ఉంటాయి .ముఖ్య దేవాలయం కొండను తొలచి కట్టబడి కుమారస్వామి శివ ,విష్ణు ,వినాయక దుర్గ విగ్రహాలతో శోభిల్లుతుంది .ఇవన్నీ పరం కూండ్రం రాయితో  శిల్పీకరి౦పబడినవే .ఇక్కడి శివుడిని పరంగిరి నాదుడని అంటారు అమ్మవారు పార్వతీదేవిని ‘’అవుదై నాయకి ‘’అంటారు .బయట శివతాండవ దృశ్యాలు అద్భుతమనిపిస్తాయి .

  శివుడు విష్ణువు ఈ ఆలయం లో ఎదురెదురుగా ఉండటం మరో విశేషం .ప్రాచీన దేవాలయాలలో ఎక్కడా ఇలాంటి అరుదైన దృశ్యంకనిపించదు .ఆలయం బయట ఉన్నకోనేరు లోని చేపలు మన చూపులకు గేలాలు వేస్తాయి  .వాటికి భక్తులు ఉప్పు అటుకులు వేయటం తమాషా విషయం .ధ్వజస్తంభం, నంది, నెమలి, ఎలుక  విగ్రహాలు కూడా ఆకర్షణీయం .ఆలయానికి అనుబంధంగా వేద పాఠ శాల ఉంది . అర్ధ మండపం ముందు ఆరు మెట్లతో ‘’షహ సార పడిగ’’ఉన్నది .హాలులో మహిషాసుర మర్దిని అమ్మవారు ,కర్పగ వినాయకుడు ,అందరాబరణ ,ఉగ్గిరార్ విగ్రహాలుంటాయి .బయట శరవణ పాయిగ , లక్ష్మి తీర్ధం ,సన్యాసిబావి ,కాశి సునై ,సత్యకూపమనే జలతీర్దాలున్నాయి ,

  పరమ శివభక్తుడు ‘’సంబందార్ ‘’ ఈఆలయం దర్శించి  శివుని పై ‘’థేవరం’’ రచించి గానం చేశాడు .చేర ,చోళ ,పాండ్య రాజులను’’జ్ఞాన  సంబంధ ‘’ఇక్కడే కలిసి దీవించాడు .సుందరార్ ,సంబందార్ కవులు ఇక్కడే ‘’థేవర పతిగం ‘’రచించారు .నక్కీరన్ అనే భక్తుడు ఇక్కడే స్కందునిపై ఎన్నో పాటలు రచించి కుమారస్వామికి వినిపించాడు .తిరుప్పుగై ,కందపురాణ౦ ఈ క్షేత్రాన్ని గురించి అద్భుతంగా చెప్పాయి .

  ఆలయం లో స్కంద షష్టి మొహోత్సవం 6 రోజులు వైభవంగా చేస్తారు .’’శరవణ భవుని   వివిధ వాహనాలపై ఊరేగిస్తారు .ఫాల్గుణమాసం లో బ్రహ్మోత్సవం జరుగుతుంది .ఇక్కడి’’తమిళులు పిలుచుకొనే ‘’ పవలకానివై పెరుమాళ్ ‘’అనే ఆలయ విష్ణుమూర్తిని ,,కుమారస్వామి లను ఊరేగింపుగా మధుర మీనాక్షి అమ్మవారి కల్యాణానికి తీసుకు వెడతారు ఇదొక గొప్ప సంప్రదాయం  .కార్తీక దీప శోభ ఆలయం లో మహాద్భుతంగా నిర్వహించి అపరకైలాసం అనిపిస్తారు .వైశాఖమాసం లో తెప్పోత్సవం చూసి తీరాల్సిందే .ఆలయం లో విష్ణువు మూర్తి కూడా ఉండటం తో  వైకుంఠ ఏకాదశీ అపూర్వంగా చేసి మరో  వైకుంఠం అనిపిస్తారు . .ఒకరకంగా ఈ దేవాలయం శివకేశవ అభేదానికి  ప్రత్యక్ష నిదర్శనం .

  72వ  భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-8-18 –ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

పరమ శివుడు రాసిన పద్యం -వ్యాస బృందం -ఆగస్టు సంచిక -సదాశివ బ్రహ్మేంద్ర ఆశ్రమము ,చిల్లకల్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యోగాఢ్య బలి -కేశవస్వామి భాగా నాగర్కర్ నేను రాసిన సిద్ధ యోగిపు౦గవులు పుస్తకం లోని ”యోగాఢ్య బాలి-కేశవస్వామి భాగానార్కర్ వ్యాసం ఆగస్ట్ గురు సాయి స్థాన్ లో పునర్ముద్రితం

Posted in రచనలు | Tagged | Leave a comment

నీటి పారుదల సాంకేతిక నిపుణులు –శ్రీ కుడితిపూడి శ్రీ రామ కృష్ణయ్య,మరియు శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు

నీటి పారుదల సాంకేతిక నిపుణులు –శ్రీ కుడితిపూడి శ్రీ రామ కృష్ణయ్య,మరియు శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు

గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర బేతపూడి లో శ్రీ కుడితిపూడి శ్రీ రామకృష్ణయ్య 3-3- 1927 జన్మించారు .మద్రాస్ అన్నామలై యూని వర్సిటిలో చదివి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు .ఆంద్ర ప్రదేశ్ నీటి పారుదల శాఖలో నలభై ఏళ్ళు వివిధ హోదాలలో సేవలందించారు .రాష్ట్ర నీటిపారుదల సౌకర్యాలకు యెనలేని కృషి చేశారు .1989 లో చీఫ్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేశారు .భూ నీటి నిల్వహణ శిక్షణ పరిశోధన సంస్థ డైరెక్టర్ అయ్యారు .ముఖ్యమంత్రికి నీటి పారుదల సలహాదారుగా ,కేంద్ర ప్రభుత్వ అటవీ పర్యావరణ శాఖ అభి వృద్ధిమండలి గౌరవ సభ్యులుగా ఉన్నారు .కృష్ణా ,గోదావరి ,పెన్నా డెల్టా బోర్డ్ ల చైర్మన్ అయ్యారు ‘.

కేంద్ర ప్రభుత్వం తరఫున చాలా దేశాలలో జరిగిన సదస్సులలో పాల్గొని  భారత దేశ ఖ్యాతి ఇనుమడింప జేశారు .ఇన్ స్టి  ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థ గౌరవ సభ్యత్వమిచ్చి గౌరవించింది  ,శ్రీ కృష్ణదేవరాయ యూని వర్సిటి 1989 లో గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సన్మా నించింది .1987 లో నేషనల్ హైడ్రాలజీ అవార్డ్ అందుకున్నారు క్రష్ణయ్యగారు .

అనతపురం జిల్లా రామక్రష్ణయ్యగారికి ఎంతో రుణపడి ఉంది .అక్కడ నీటిపారుదలకు విశేష కృషి చేసి అభివృద్ధి  మార్గం లో ప్రవేశపెట్టారు .ఆయా ప్రాంతాల నైసర్గిక భోగోళిక ,వాతావరణ పరిస్థితులను అధ్యనంచేసి వాటిపై పరిశోధనలు సలిపి వీటికి అనుకూలంగా తగినట్లు నీటి పారుదల సౌకర్యాలు కల్పించటం లో ఆయన అందెవేసిన చేయి .అంకితభావం తో ఇంతశ్రమ చేసేవారు ప్రజోపయోగ కార్యాలు నిర్వహించేవారు అరుదు .శ్రీ కుడితిపూడి శ్రీ రామకృష్ణయ్యగారు హైదరాబాద్ లో 20-3- 2002 న 74 వ ఏట మృతి చెందారు.ఆయన రాసినవాటిలో ది స్టోరి ఆఫ్ పెన్నా బేసిన్ ,డ్రాట్ –రాయలసీమ ,ఎక్స్ ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇన్  రాయలసీమ ,కా౦ప్ర హెన్సివ్  మాస్టర్ ప్లాన్ ఫర్ డ్రైనేజ్ ఇన్ కోస్టల్ బెల్ట్ ఆంద్ర ,యుటిలైజేషన్ ఆఫ్గోదావరి వాటర్ బై  లిఫ్ట్ ..ఇర్రిగేషన్ ఇన్ ఏన్శేంట్ ఇండియా మొదలైనవి .

20 02 లో వీరి స్మారక ట్రస్ట్ ఏర్పడి విద్యావికాసానికి ,నీటిపారుదలకు ,పుస్తకప్రచురణకు సేవలందిస్తోంది .మార్చి 3 రామక్రిష్ణయ్యగారి జన్మదినాన్ని ఆయన గౌరవార్ధం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం’’ ఇరిగేషన్ డే’’గా నిర్వహిస్తోంది .

తైల సాంకేతిక, సాహిత్య  నిపుణులు -శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు

జననం చదువు

కర్నూలు జిల్లా జోహరా౦పుర౦ లో మాధవ బ్రాహ్మణ కుటుంబం లో 1928 నవంబర్ 28న  లో శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు జన్మించారు .తండ్రి నరసింగ రావు.తల్లి కృష్ణ వేణమ్మ. వీరి పూర్వీకుడువెంకన్న పంతులు ఆదోని నవాబు వద్ద మంత్రిగా పనిచేసి మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం స్థాపనకు సహకరించాడు   ఆదోని అనంతపురాలలో ప్రాధమిక ,ఉన్నత విద్య పూర్తి  చేసి , తర్వాత అనంతపురం దత్తమండల కళాశాలలో చదివారు. ప్రముఖ పరిశోధకులు, పరిశోధక పరమేశ్వర శ్రీ చిలుకూరి నారాయణరావు గారికి శిష్యుడయ్యాడు .19 54 లో రాజస్థాన్ లోని పిలాని లోఉన్న బిర్లా ఇన్ స్టి ట్యూట లో చదివి ఎం.ఎస్ .సి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు  .

ఉద్యోగం –సంస్థకు అవార్డుల సాధన

,ఆయిల్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో ఇంజనీర్ గా చేరారు .1962-69 కాలం లో డైరెక్టర్ ఇన్ చార్జి గా ,1974 లో డైరెక్టర్ గా ఉన్నారు .తనకిష్టమైన ఆయిల్ రిసెర్చ్ కొనసాగిస్తూనే ఉన్నారు .అనంతపురం లోనే తైల సాంకేతిక పరిశోధనా సంస్థ లో కెమిస్ట్ గా19 54 లో  చేరి ,1983 లో రిటైరయ్యారు .ఈ సంస్థ వీరి నేతృత్వం లో కేంద్ర సంస్థ ఆయిల్ టెక్నాలజీ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ నుంచి  ఏటా ఉత్తమ పరిశోధనకు అందించే  బంగారు పతాకాలను  5సార్లు ,,10 సార్లువెండి , కాంస్య పతాకాలను  అందుకొన్నది ,ఇదంతా రావు గారి అనితరసాధ్య పరిశోధనా కృషి ఫలితమే .

ఫెలోషిప్ లు

ఆయిల్ టేక్నాలజిస్ట్ అసోసియేషన్ ,ఇండియన్ మెడికల్ సొసైటీ మొదలైన వి ఫెలో షిప్ ఇచ్చి సర్దేశాయ్ ని ప్రోత్సహించాయి .ఆయిల్ టెక్నాలజీ రంగం లో విశేష కృషి చేసి జాతీయ స్థాయిలో కీర్తి పొందారు .ముప్పై ఏళ్ళు తైల సాంకేతిక పరిశోధన చేసిన ఘనత ఆయనది .50 0 కు పైగా సాధికార పరిశోధనా పత్రాలు రాసి ప్రచురించారు ..ఇవి జాతీయ అంతర్జాతీయ మేగజైన్స్ లోప్రచురింపబడి  గౌరవ స్థానం పొందాయి .

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు

తమమేధస్సుకు పదునుపెట్టి తిరుమలరావు గారు పత్తిగింజలు ,బియ్యం, తవుడు, పొగాకు గోగు విత్తనాలనుండి నూనె తీసే ప్రక్రియకు ఆద్యులై విజయం సాధించారు .ఈ ప్రక్రియను అనేక విధాల అభి వృద్ధిపరచి ఖ్యాతి చెందారు .ఆయన  కృషి ఫలితమే నేటి తవుడు నూనె ,,పత్తిగింజలనూనే .ఇవే కాక మల్లెపూలు మరువం దవనం మొదలైన వాటినుంచి పెర్ ఫ్య్యూమ్స్ తీసే పరిశాధనలోనూ అగ్రగాములయ్యారు .

పేటెంట్ ల పిత  పురస్కార గ్రహీత

వేప నూనె ,కానుగ నూనె వంటి అఖాద్య తిలాలను ఖాద్య తిలాలతో ఆవిష్కరించారు ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది .తన పరిశోధనలవలన ఆయన తైల సాంకేతిక రంగాలలో 11 పేటెంట్ లను పొందారు .

వీరి సాంకేతిక నైపుణ్యానికి అమెరికన్ ఆయిల్ కేమిస్ట్స్  సొసైటీ ,పెన్ ఆయిల్ ఇండియా  సెంటర్ ,ఇండియన్ అసోసియేషన్ ఫర్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ (ఉజ్జయిని )మొదలైన సంస్థలు గౌరవ పురస్కారాలు అందజేశాయి .1974 లో ప్రాణనారాయాణ మెమోరియల్ అవార్డ్ ,1976 లో  ఇండియన్ ప్లాంట్ అసోసియేషన్ అవార్డ్ ,1968 లో  ఇండియన్ ప్లాంట్ అసోసియేషన్ అవార్డ్ ,ఇన్ వెన్ష్షన్స్ అండ్ ప్రమోషన్ బోర్డ్  అవార్డ్ ,1977 లో ఆయిల్ టేక్నాలజిస్ట్స్ అసోసియేషన్ వారి గోల్డ్ మెడల్  అందుకున్నారు .మొత్తం మీద 3 స్వర్ణపతకాలు ,9 అవార్డ్ లు ఆయనపరిశోధనలకు దక్కాయి .సాహిత్య కృషికి ‘’డాక్టర్ ఆఫ్ లెటర్స్ ‘’గౌరవ పురస్కారం లభించింది .

సాహితీ పరిమళ తైల శోధన

సర్దేశాయ్ తిరుమలరావు గారికి తైలం పిండటమేకాదు అక్షరం పిండటం లోనూ నైపుణ్యం ఉంది .ఆయనకు తెలుగు సాహిత్యం పై అత్య౦త మమకారమే కాదు , విమర్శపై ఆదిపత్యమూ ఉంది .ఆయనకు గురజాడ కన్యాశుల్కనాటకం , ఉన్నవవారి మాలపల్లి నవల ,గడియారం వారి శివభారత చారిత్రిక కావ్యం అత్యంత ప్రీతి పాత్రమైనవి .’1-’కన్యా శుల్క నాటకకళ –సాహిత్య తత్త్వం2-శివభారత దర్శనం అనే ప్రముఖ విమర్శ గ్రంథాలు రచించారు .౩ మాలపల్లిపై విమర్శ గ్రంధం మొదలు పెట్టి ,పూర్తి చేయకుండానే మరణించారు .ఇవి విమర్శకులమన్ననలు అందుకున్నాయి పాఠకులకు కరదీపికలయ్యాయి   ఏది చెప్పినా అత్యంత సాదికారకతతో చెబుతారు కనుక వారి నిర్ణయాలు శిరోధార్యాలుగా ఉంటాయి .విమర్శమాత్రమేకాక సృజనాత్మక రచనలు కూడా చేశారు .అందులో ‘’పద్మావతీ చరణ చారణ చక్రవర్తి ‘,’’’పగ చిచ్చు’’ నాటికలు ‘’భూ సూక్తం ‘’అనే కథఉన్నాయి .అనేక చర్చా   గోస్టులలో పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను వెల్లడించారు .మచ్చుకికొన్ని –

  1. బసవేశ్వరుడు కాయకమే కైలాసమనెనా? – ఆంధ్రపత్రిక దినపత్రిక
  2. భారత,రామాయణ,భాగవతముల ఆద్యంతముల ఆంతర్యము – ఆంధ్రప్రభ దినపత్రిక
  3. తిక్కన స్త్రీపర్వములోని ఛందోవైవిధ్యములోని ఆంతర్యము – ఆంధ్రప్రభ దినపత్రిక
  4. వేదవ్యాసుడు బ్రాహ్మణేతరుడా? – భారతి
  5. కన్యాశుల్కంలో అసభ్యత ఉన్నదా? – భారతి
  6. హిమలేహ్యం – శేషేంద్రజాలం – భారతి
  7. మినీకవిత – మాక్సీవ్యాఖ్య – భారతి
  8. తెలుగు మీద కన్నడ ప్రభావమెంత? – భారతి
  9. మాలపల్లి పై ఈస్టలిన్ ప్రభావం కలదా? – భారతి

వీరి విమర్శలను ‘’విమర్శ –ప్రతి విమర్శ ‘’పేరుతొ తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ రాచపాలెం చంద్ర శేఖరరెడ్డి సంపాదకత్వం లో ప్రచురించింది .పత్రికలలో వచ్చిన లేఖలు విమర్శలు సేకరించి కొడిహళ్లి మురళీమోహన్ ,నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో ‘’జ్ఞాన సింధు సర్దేశాయ్ తిరుమలరావు ‘’పుస్తకంగా వచ్చింది .

సాహితీ పురస్కారాలు

వీరి సాహిత్య కృషికి శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటి 1969 లో గౌరవ డాక్టరేట్ ఇస్తే ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 1989 లో తిక్కవరపు రామి రెడ్డి పురస్కారమిచ్చి గౌరవించింది .వీరి సాహితీవ్యాసాలు భారతి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ,హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి .’’తి’’.,’’తిమ్మణ్ణ’’,పై,థాగరస్ మొ  దలైన కలం  పేర్లతో రాసేవారు .

.

ఆయన మనసు విజ్ఞాన శాస్త్రానికి , హృదయం సాహిత్యానికి అ౦కిత మయ్యాయి .సాంకేతిక సాహిత్య సవ్య సాచి శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు 1994 మే నెలలో 68 ఏళ్ళకే మరణించటం ఆరెండు రంగాలకు  తీవ్రమైన లోటు .

సవ్య సాచి ఆజన్మ బ్రహ్మ చారి

సర్దేశాయిగారు ఆజన్మ బ్రహ్మ చారి అని తెలిస్తే అవాక్కౌతాం .పచ్చినిజం

 

.  ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు లో పావుభాగ౦ వీకేపేడియాలొ సింహభాగం .

15-8-18 బుధవార౦   భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-18 –ఉయ్యూరు

 

.

శ్రీ రామకృష్ణయ్య

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  శ్రావణమాస విశిష్టత

  శ్రావణమాస విశిష్టత

   శ్రావణ శుక్రవార వరలక్ష్మీ పూజ

శూన్యమాస మైన తర్వాత వచ్చే శ్రావణమాసం కోసం పెళ్లీడు పిల్లలు ,పెళ్ళైన కొత్త దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చేదికనుక శ్రావణం .  మండే ఎండాకాలమైన గ్రీష్మ ఋతువు ,వెళ్లి  చల్లబరచే వర్ష ఋతువు ప్రవేశించి ఉపశమనం కలిగిస్తుంది .పంటలు వేసేకాలం .భూమి ఆకుపచ్చ చీర కట్టుకొని  ముచ్చటగా దర్శనమిచ్చి మనశ్శాంతి కల్గిస్తుంది .వర్షాలు విపరీతంగా కురిసి నదులన్నీ  నిండు గర్భిణీ స్త్రీలు లాగా నిండుగా ప్రవహిస్తాయి .  శ్రావణ మంగళవారాలలో స్త్రీలు మంగళ గౌరీ నోము నోస్తారు . .ప్రతి శుక్రవారం పవిత్రమైందే .రెండవ శుక్రవారం అంటే పౌర్ణమి ము౦దు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం .ముత్తైదువలు అత్యంత భక్తీ శ్రద్ధలతో దీర్ఘ సౌమాంగల్యం కోసం అమ్మవారిని పూజిస్తారు ..కొబ్బరి కాయకు పసుపు కు౦కుమపెట్టి  కలశంపై ఉంచి పైన రవికముక్కను అందంగా అలంకరించి అమ్మవారికి కళ్ళూ ముక్కు చెవులు నోరు ఏర్పరచి ,ఆభరణాలు తొడిగి ,పుష్పహారాలతో శోభిల్లజేసి తమ ఇంట లక్ష్మీదేవి వెలసినట్లు పరవశిస్తారు .అమ్మవారిని ఈ రకంగా చూసి మురిసిపోయి ధన్యులవుతారు . వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేస్తారు కథ చెప్పుకొని తొమ్మిది పోగుల  తోరపూజ చేసి ,మంత్రపూతంగా చేతికి కట్టుకుంటారు .అనేక భక్ష్య లేహ్య చోహ్యాలను ప్రసాదంగా చేసి నైవేద్యం పెడతారు .ముఖ్యంగా తొమ్మిది రకాల ప్రసాదాలు చేయటం పరిపాటి .వాటిలో  పూర్ణబ్బూరెలు ,పులిహార  గారెలు తప్పని సరి ముత్తైదువులకు పూర్ణబ్బూరెలు వాయనంగా ఇవ్వటం ఆనవాయితీ . అమ్మవారి కి మంగళహారతులు పాడుతారు .సెనగలు నానపెట్టి వాయనంగా తాంబూలం పళ్ళు తో ఇవ్వటం రివాజు .అయిదేళ్ళు నోములు నోచి ఉద్యాపన చేస్తారు .వరలక్ష్మీ వ్రతానికి కొత్త అల్లుళ్ళను ఆహ్వానించి వారికి నూతనవస్త్రాలు పెట్టి కోరిన కోరికలు తీరుస్తారు మామగార్లు . అందుకే కొత్త అల్లుళ్ళు మాంచి జోష్ గా వస్తారు అత్తారింటికి .కొందరు సాయం వేళ అయిదుగురు ముత్తైదువులను ఆహ్వానించి తాంబూలాలు ఇస్తారు .కొందరు ఇళ్లకే వెళ్లి ఇస్తారు ఎవరి అనుకూలం వారిది. శ్రావణ మాస పేరంటాలంటే మహిళలకు మహా క్రేజు .ఈ శ్రావణమాస మూత్తైదువులను చూస్తే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులుగా కనిపిస్తారు .కొత్తనగలు కొనుక్కొంటారు .కొత్తకోడలికి అత్తవారు కూడా అలానే చేస్తారు .రెండవ శుక్రవారం ఏ కారణం చేతనైనా వ్రతం చేయలేక పోయినవారు తర్వాత వచ్చే శుక్రవారం చేస్తారు .శ్రావణమాసం లో లక్ష్మీ దేవిని పూజిస్తే వ్రత కధలో చెప్పినట్లు అమ్మవారు నట్టింట్లో గల్లుగల్లు  గజ్జెల సవ్వడితో ప్రవేశించి సకల సౌభాగ్యాలు దీర్ఘ సౌభాగ్యం ,సత్సంతానం ,దీర్ఘాయుస్సు ప్రసాదిస్తుందని అనాదిగా అందరి విశ్వాసం .

                    మంగళ గౌరీ నోము

 పెళ్లిళ్లకు శ్రావణ మాసం శ్రేష్టమైనది .కొత్తగా పెళ్ళైన అమ్మాయి శ్రావణ మంగళ వార నోము  పట్టి అన్ని మంగళ వారాలు గౌరీ దేవికి పూజలు చేసి నానబోసిన సెనగలు పళ్ళు తాంబూలం లో పెట్టి ముత్తైదువులకు వాయనమిస్తారు .పసుపు తోరణాలు తయారు చేసుకొని వాటిని కలశం పై ఉంచి పూజ చేసి  మంత్ర విదిగా కట్టుకొంటారు .కుడుములు చేసి నైవేద్యం పెడతారు .ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి తలలో పెట్టుకోవటానికి పూలమాల తో సత్కరించి ఆశీస్సులు అందుకుంటారు .కత్తికి గంధం రాసి ,ఆవునేతితో  జ్యోతులు వెలిగించి ,పాటపాడుతూ ,ఆ కత్తి జ్యోతులపై ఉంచి మసిబారేట్లు చేసి ,కాటుక తయారు చేసి తాము కళ్ళకు  పెట్టుకొని ముత్తైదువులకూ ఇవ్వటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం .  ఏ దేశం లో ఉన్నా  ఆంద్ర మహిళలు  ఈ నోము వరలక్ష్మీ వ్రతం తప్పక పాటిస్తూనే ఉన్నారు .వారికి హాట్స్ ఆఫ్ .ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా గమనించాలి .గౌరీ దేవికి యెంత ప్రాధాన్యముందో లక్ష్మీ దేవికీ అంతే ప్రాధాన్యం ఉండటం శివ కేశవ ,లక్ష్మీ గౌరీ అభేదానికి నిదర్శనం కూడా .

                      నాగుల చవితి

  శ్రావణ మాసం పండగలతోనే ప్రారంభమౌతుందని పై విషయాలను బట్టి మనకు అర్ధమౌతోంది .ఇవి స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనవి .అందరికీ చెందిన పండగల నెల శ్రావణం .శ్రావణ శుద్ధ చవితి నాగ చతుర్ధి లేక నాగుల చవితి .ఈనెల 14మంగళవారం . .పుట్టలోపాలు పోసి నాగేంద్రుని కొలవటం మన సంప్రదాయం .పుట్టమన్ను చెవులకు పెట్టుకొంటే సర్ప దోషా లు౦డవని నమ్మకం .పుట్టలో ఆవుపాలు పోసి చలిమిడి, వడపప్పు, పళ్ళు నైవేద్యం పెడతారు .ఓపికున్నవారు నాగదేవత ఉన్న మోపిదేవి ,సింగరాయకొండ  మొదలైన  దేవాలయాలకు వెళ్లి దర్శించి పూజిస్తారు  .స్త్రీలు తప్పకుండా ఉపవాస ముంటారు .నాగేశ్వరస్వామికి అభిషేకం జరిపిస్తారు .నాగ దోష నివారణ దీనివలన  తొలగిపోతుంది .పిల్లలకు చెవికి సంబంధిన వ్యాదులుంటే తప్పక నాగుల చవితికి పూజలు చేస్తూంటారు .మోపిదేవి మొక్కులు తీర్చుకుంటారు .

                    నాగ పంచమి

శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి 15 వ తేదిబుధవారం …పాతాళం లో నాగ లోకం ఉంది .నాగ జాతికి చెందిన కద్రువ ను కశ్యపప్రజాపతి వివాహ మాడటం వలన ఆమెకు కలిగిన కుమారులను నాగులు అన్నారు .ఆయనభార్య వినతకు దేవతలతోపాటు గరుత్మంతుడు జన్మించి విష్ణుమూర్తి వాహనమయ్యాడు . పాములను పూజించటం మనకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం . నాగజాతి పరిపాలకులల రాష్ట్రం నాగాలాండ్ .నాగ ప్రార్ధన –

‘’నాగ ప్రీతా భవంతి –శా౦తిమాప్నోతి –సశాంతి లోక మా సాధ్య మేదతే-సస్థిత శమః ‘’

నాగ పంచమినే ‘’భ్రాతృ పంచమి ‘’అంటారు.స్త్రీలుసోదరులతోకలిసి పుట్టలో పాల్లుపోసి నాగ పూజ చేస్తారు .దీనివలన పాము కాటు భయం ఉండదని మమ్మిక . దీనికీ ఒక  కథ ఉంది .ఒకప్పుడు ఒక రైతు కు ఇద్దరుకొడుకులు, ఒక కూతురు ఉన్నారు .ఒక కొడుకు పొలం దున్నుతుండగా నాగలి కి౦దనలిగి మూడు పాములు చచ్చాయి. వాటి తల్లి పగబట్టి ఆ రాత్రే ఆ రైతును, భార్యను ,ఇద్దరుకొడుకులను కరచి  చంపి పగ తీర్చుకున్నది .వాళ్ల మరణాన్ని జీర్ణించుకోలేని కూతురు తల్లి పామున్న పుట్టదగ్గరకు వెళ్లి పాలు నైవేద్యం పెట్టి ప్రార్ధించి చనిపోయిన తనవారిని బ్రతికించమని కోరింది ఆమే అమాయకత్వానికి, భక్తికి మెచ్చిన ఆనాగు వాళ్లను బ్రతికించింది . అందుకే ఇది బ్రాతృ పంచమి అయింది .మనదేశం లో అన్ని ప్రాంతాలలోని వారు నాగపంచమి తప్పని సరిగా పాటిస్తారు. నాగపంచమి సినిమా కూడా వచ్చినట్లు జ్ఞాపకం .నేపాల్ లోనూ చేస్తారు .అక్కడ చెంగూ నారాయన దేవాలయం లో గరుడ విగ్రహం ఉంది . గరుత్మంత పూజ చేస్తారు

                   స్వాతంత్ర్య దినోత్సవం

  ఆగస్ట్ 15బుధ వారం  భారత స్వాతంత్ర్య దినోత్సవం .యావద్భారత జాతి జాతిపండుగ. జెండాపండగ .ఎందరెందరో త్యాగధనుల ఆత్మబలిదానంతో లభించిన స్వాతంత్ర్యం మనది .

                జంధ్యాల పౌర్ణమి, రాఖీ ,రక్షాబంధన్

  శ్రావణ పౌర్ణమి 26 వ తేది ఆదివారం .పాత జంధ్యాలు తీసి కొత్త జంధ్యాలువేసుకొనే జంధ్యాల పూర్ణిమ .కొత్తగా ఉపనయనం చేసుకున్నవారు జంధ్యానికికున్న ‘’మౌంజి ‘’అంటే జింక తోలుముక్కను (అసలు అప్పటిదాకా ఉంచుకుంటే )తీసేసే రోజు. దీనికే ఉపాకర్మఅంటారు

 .రాఖీ పండగ కూడా .దీనినే రక్షాబంధనం అంటారు. స్త్రీలు తమ సోదరులకు రక్ష కట్టి వారికి అన్నిరకాల విజయాలు కలగాలని కోరుకుంటారు .సోదరులు  వారి కోరికలు తీరుస్తారు .

                   స్వయం సేవకుల రక్షా బంధన్

రాస్త్రీయస్వయం సేవక్ సంఘ్ ఈ రోజు రక్షాబంధన దినోత్సవాన్ని పరమ పవిత్రంగా నిర్వహిస్తుంది . ధ్వజానికి   పూజ చేసిన రక్షలనుకట్టి స్వయంసేవకులు ఒకరికొకరు రక్ష కట్టుకొని దేశం కోసం సర్వాన్ని త్యాగం చేస్తామని శపథం చేస్తారు. ఆర్. ఎస్. ఎస్. నిధికోసం తమకు తోచిన ధనాన్ని కవర్లలో పెట్టి గుప్తంగా ధ్వజం దగ్గర ఉంచుతారు .ఇవన్నీ రాష్ట్రానికి అక్కడినుంచి నాగపూర్ లోని  కేంద్ర సంస్థకు  చేరుతాయి .ఇందులో నిర్బంధ వసూలు ఉండదు స్వచ్చందంగా యెంత ఇవ్వాలనిపిస్తే తమ శక్తిని బట్టి సమర్పిస్తారు .ఎవరెంత సమర్పించారో మిగిలినవారికి తెలీదు

      అలెక్జాండర్ ప్రాణం  కాపాడిన రాఖీ

   అలెక్జా౦ డర్ పురుషో త్తముడితో యుద్ధం చేస్తున్నప్పుడు  గ్రీసు దేశం నుండి అతనితో పాటు వచ్చిన అతడి ప్రియురాలు రుక్సానా భారత వీరుడైన పురుషోత్తమ పరాక్రమం ముందు గ్రీకు వీరుడు నిలువ లేడని గ్రహించి ,మారువేషం లో వచ్చి పురుషోత్తముడికి రక్షబంధనం కట్టి సోదరిగా తనభర్త ఓడిపోయినా చంపవద్దని కోరింది .అలేగ్జాండర్ పురుషోత్తముడి చేతికి చిక్కి అతనిపై కత్తి ఎత్తగా చేతికున్న రాఖీ కనబడి చంపకుండా వదిలేశాడు .ఆతర్వాత జరిగిన కథ మనకు తెలిసిందే .

                   ఇంద్రుని విజయానికి రక్ష కట్టిన శచీదేవి

 భవిష్య పురాణం  ఇంద్రుడు బలి చక్రవర్తిపై యుద్ధానికి వెడుతున్నప్పుడు భార్య శచీ దేవి విష్ణు మూర్తిని ప్రార్ధించి  ఆయన సలహాతో లక్ష్మీ దేవి ఇచ్చిన  దారపు రక్షకట్టి విజయ౦ కలగాలని కోరిందని ,దాని వలన బలిని ఓడించాడని చెబుతోంది .అప్పటి నుంచే రక్షాబంధనం లోకం లో ఆనవాయితీగా వస్తోందన్నమాట .

             వినాయకుని కుమారులులకు రక్ష కట్టిన కూతురు సంతోషిమాత

  వినాయకుడికి శుభుడు లాభుడు అనే ఇద్దరు కొడుకులు .తమతో ఆడుకోవటానికి ,రక్షాబంధనం కట్టటానికి ఒక చెల్లెలు ఉంటే బాగుండును అనుకొని తండ్రికి చెప్పారు .అది జరగనిఅపని అన్నాడాయన .నారదమహర్షి వచ్చి కుమార్తె ఉంటేనే ఇంటికి మంగళ ప్రదం కనుక వారి కోర్కె తీర్చమన్నాడు .సరేనని ‘’సంతోషి మాత’’ను సృష్టించి తనభార్యలు రిద్ధి, సిద్ధిలకు ఇచ్చాడు  .గణేశ పుత్రులు తమ చిట్టి చెల్లెలు సంతోషి చేత  రక్షాబంధనం కట్టించుకొని కోరిక తీర్చుకున్నారు .

                   బలికి రక్షకట్టి ‘’హరి’’కి పాతాళ  చెర విడిపించిన ‘’ సిరి’’

  భాగవతం లో విష్ణుమూర్తి వామనావతార మెత్తి మూడడుగులదానం పుచ్చుకొని ,త్రివిక్ర ముడై ముల్లోకాలను ఆక్రమి౦చాడని ,దీనికి ప్రతిఫలంగా బాలి ఆయనను పాతాళం లో తనదగ్గరే ఉండి పొమ్మని వరం కోరితేసరే నని అక్కడే ఉన్నాడని .భర్త శ్రీ మహా విష్ణువు లేని వైకుంఠం లో ఉండలేక ఎలాగైనా భర్తను తెచ్చుకోవాలని లక్ష్మీదేవి  పాతాళం చేరి, బలికి సోదరిగా రక్షాబంధన్ కట్టి వరం గా తనభర్తకు  స్వేచ్చ కలిగి౦చమని కోరగా అంగీ కరించి విష్ణువుకుపాతాళం చెర విడిపించాడని ఉంది .

  ద్రౌపది కుంతీ యమధర్మరాజులకు రక్షాబంధనం

  భారతం లో ద్రౌపది శ్రీ కృష్ణునికి ,కుంతీదేవి మనవడు అభి మన్యుడికి రక్ష కట్టినట్లుంది .యముడు తన సోదరి ‘’యమున’’ను చూసి 12 ఏళ్ళు అయింది .ఆమె చాలాబాధపడి గంగను సంప్రదించింది .ఆమె యముడికి విషయం తెలియజేసింది యముడు యమునవద్దకు వచ్చి సంతోషం కలిగించి వరం కోరుకోమనగా   వీలైనప్పుడు వచ్చి సోదరి క్షేమ సమాచారాలు కనుక్కోమని కోరింది .ఆమె నిష్కల్మష  భ్రాతృ భక్తి కి  సంతసించి ఆమె శాశ్వ తమైన యమునానదిగా మారిపోయే వరం కూడా ప్రసాదించాడు .ఈ పండుగను కొన్నిప్రాంతాలలో ‘’భాయ్ దుజ్ ‘’పేరిట రక్షాబంధన దినోత్సవంగా నిర్వహిస్తారు .ఇక్కడ మరొక్క ముఖ్య విషయం ఉంది .ఆడపిల్ల  పుట్టింటికి తప్పని సరిగా 12 ఏళ్ళలోపు మళ్ళీ వెళ్ళాలి .అలాగే సోదరుడుకూడా సోదరి ఇంటికి పన్నెండు  ఏళ్ళు దాటకుండా మళ్ళీ వెళ్ళాలనే సంప్రదాయం కూడా ఉంది .ఏ కాగితానికైనా గడువుకూడా 12 ఏళ్ళు .తర్వాత లిమిటేషన్ దాటింది కనుక చెల్లదు అంటారు .

                  రవీంద్రుడు భారీ ఎత్తున నిర్వహించిన రక్షా బంధన్

  1905 లో బ్రిటిష్ ప్రభుత్వం  బెంగాల్ విభజన చేసింది .అప్పుడు రవీంద్రనాధ టాగూర్ బెంగాల్ లోని హిందూ ముస్లిం ల నందరినీ సమావేశ పరచి ‘’రక్షాబంధన దినోత్సవం ‘’పెద్ద ఎత్తున జరిపి ,అందరూకలిసి కలిసికట్టుగా అన్నదమ్ములలాగా మెలగుతూ బ్రిటిష్ పాలనను ఎదిరించాలని పిలుపు నిచ్చాడు .ప్రజల మనోభావాలకు దెబ్బతగిలిందని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజన ను 1911 లో  ఆరేళ్ళ తర్వాత  వెనక్కు తీసుకున్నది .కానీ దీన్ని ముస్లిం లు వ్యతిరేకించగా పాపం ఇంత శ్రమపడిన టాగూర్ ప్రయత్నం విఫలమైంది .మళ్ళీ బెంగాల్ విభజన చేసి తూర్పు బెంగాల్ అంటే బంగ్లాదేశ్ ఏర్పరచి ముస్లిం డామి నేషన్ కు  బలం కూర్చింది .మిగిలినదానికి పశ్చిమబెంగాల్ అన్నది .అయినా టాగూర్ రక్షాబంధన మహోత్సవాలను భారీ జనసమూహాలతో క్రమ౦  తప్పకుండా నిర్వహిస్తూ ఐక్యత కోసం శ్రమించాడు .ఇప్పటికీ అక్కడ రక్షాబంధన్ మహోత్సవంగా జరుగుతూనే ఉంది .రవీంద్రుడు ‘’రాఖీ పై ఒక దివ్య కవిత కూడా రాశాడు –చూడండి

The love in my body and heart
For the earth’s shadow and light
Has stayed over years.

With its cares and its hope it has thrown
A language of its own
Into blue skies.

It lives in my joys and glooms
In the spring night’s buds and blooms
Like a Rakhi-band
On the Future’s hand..

 సిక్కులు జరిపిన రాఖీ పండగ

 18 వ శతాబ్దం లో శిఖ్ ఖాల్సా సైన్యం రాఖీ అంటే రక్షాబంధన్ ను ప్రవేశపెట్టి ఆఫ్ఘన్ చొరబాటు దారుల నుండి రైతుల రక్షణకు వారికి రక్షకట్టి కాపాడారు .వారికి పలువిధాల పొలంకోతలు వగైరాలకు సాయం చేశారు ‘

 సిక్కు సామ్రాజ్య స్థాపక పాలకుడు రాజా రంజిత్ సింగ్ రాఖీ బంధనోత్సవాన్ని జరిపేవాడు .ఆయన భార్య మహారాణి ‘’జిందా ‘’నేపాల్ రాజుకు రక్షా బంధనాన్ని పంపింది .ఆమెను అతడు సోదరిగా భావించి సిక్కు సామ్రాజ్య పతనం తర్వాత ఆమెకు నేపాల్ లో ఆశ్రయం కలిగించాడు .సిక్కులు రాఖీని ‘’రఖార్డ్డి’’అంటారు అంటే రిస్ట్ బాండ్ అంటే మోచేతికి కట్టేది అని అర్ధం .దీన్ని కానుకల దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తారు .

 మనదేశం లో మహిళలు ముఖ్యమంత్రులకు ప్రధాని రాష్ట్రపతి మొదలైన వారికి రాఖీలు  విజయం చేకూర్చాలని కోరు తారు .ఫోటోలు దిగుతారు ఫేస్ బుక్కుల్లో అ౦టిస్తారు .

    శ్రీ కృష్ణాష్టమి

ఇలా శ్రావణ శుక్ల పక్షమంతా నోములు వ్రతాలు పండగలతో గడిచిపోతుంది .శ్రావణ కృష్ణ అష్టమి శ్రీ కృష్ణాష్టమి శ్రీ కృష్ణుడు జన్మించిన కృష్ణాష్టమి .జన్మాష్టమి .రోహిణీ నక్షత్రం లో కృష్ణుడు దేవకీ దేవికి సకల విధ ఆయుధాలు ఆభరణాలలతో కారాగారం లో అంటే ఈనాటి మధుర లో పుట్టాడు .ఆసమయం లో కృష్ణ జననం పారాయణ చేస్తారు .సెప్టెంబర్ ౩సోమవారం జన్మాష్టమి .వైష్ణవాలయాలన్నీ మహా సంబరంగా జరుపుతాయి .వీధులలో ఉట్టి వేలాడ దీసి కొట్టటం ఒక పెద్ద వేడుక ..ఆలయాలలో  బాలింతరాల్లకు పెట్టె కట్టె కరం చేసి  నైవేద్యం పెడతారు .గోపికా కృష్ణ వేషాలు దరించి జనాలకు ఆనందం కలిగిస్తారు .అన్నమయ్య ‘’సఖులాలా సఖులాలా చూడరో శ్రావణ బహులాస్టమి ‘’అనే కీర్తాన రాసి చరితార్ధం చేశాడు .బాలకృష్ణ లీలలకు మురుస్తాం యవ్వన కృష్ణ లీలలకు పరవశమౌతా౦.పెద్ద కృష్ణుని రాజకీయ చాత్రుర్యానికి అబ్బో అంటాం .ఏ దశలోనైనా కృష్ణుడు మనోహరుడు .అందుకే ఆయనను ‘’లార్డ్ ఆఫ్ ఆటం మూన్స్ ‘’అంటే ‘’శరత్ చంద్ర ప్రభువు ‘’అన్నారు  .మీరాబాయ్వంటి మహాభక్తులెందరో   శ్రీ క్రష్ణభక్తులు జన్మ చరితార్ధం చేసుకున్నారు .కృష్ణలీలలు మధురాతిమధురం .వాటికి పరమ మాధుర్యం కలిగించాడు భాగవత పోతన్న .మధురలో కృష్ణాష్టమి వేడుకలు పులకరి౦ప జేస్తాయి.

     సర్వేపల్లి జయంతి ఉపాధ్యాయ దినోత్సవం

సెప్టెంబర్ 5 సర్వే పల్లి రాధాకృష్ణ పండితుని అన్మదినం .ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతా నిర్వహిస్తారు .ఉత్తముపాధ్యాయులనుప్రభుత్వాలు గుర్తించి సన్మానిస్తాయి .సరసభారతి ఈ రోజునే ఉదయం 10 గ౦.లకు శ్రీ కోటగురువరేణ్యులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రిగారి గురుపూజోత్సవం స్థానిక అమరవాణీ హైస్కూల్ లో సంయుక్తంగా నిర్వహిస్తోంది .ప్రముఖ అతిధులు  ,గురు పుత్రులు కోట సోదరులు పాల్గొనే ఈ కార్యక్రమ౦లో”కవి రాజ మౌళి ,కవి సార్వ భౌమ ,మధురకవి ,అష్టావధాని ,కనకాభి షేకి ,70 గ్రంథాల  రచయిత ,విశ్రాంత తెలుగు పండితులు ,గుంటూరు జిల్లావాసి ,93 ఏళ్ళ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారికి సన్మానం చేస్తూ ,స్థానిక ఉపాధ్యాయును సన్మానిస్తూ , శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ,కోటసోదరులు ఏర్పాటు చేసిన  మాస్టారి స్మారక నగదు బహుమతులను అర్హులైన  విద్యార్ధులకు అందజేసి సార్ధకం చేస్తోంది .

                  పొలాల అమావాస్య

  శ్రావణ బహుళ అమావాస్య ‘’పోలాల అమావాస్య’’సెప్టెంబర్ 9 ఆదివారం .పోలా౦బా వ్రతం చేస్తారు  వృషభానికి ఆహారం పెట్టే రోజు .హిరణ్య కశిపుని సోదరి సింహిక .విప్రసిద్ధి  భార్య కొడుకు అంధకాసురుడు .బ్రహ్మను తపస్సుతో మెప్పించి వరాలు పొందాడు .వీడు గుడ్డివాడేకాదు , కామా౦ధుడుకూడా .వరగర్వం తో వీడికామ దృష్టి జగన్మాత పార్వతీదేవిపై పడింది .శివుడు భూలోకం వెళ్ళినప్పుడు, కైలాసం వెళ్లి అమ్మవారితో అనుచితంగా మాట్లాడగా నందీశ్వరునికి కోపంవచ్చి వాడిపై యుద్ధం చేస్తుండగా శివుడు కూడావచ్చి ,వాడిని అడ్డగించి సంహరించాడు .అందుకే శివుడిని ‘’అంధకాసురకా౦తకే  మమ కి౦ కరష్యతి వైళమః  ‘’అని శివుడిని స్తుతిస్తాం .నందీశ్వరుని పోరాటపటిమకు మెచ్చి వరం కోరుకోమనగా తాను తన తండ్రి శిలాదునికి పొలం దున్నుతుంటే వృషభ రూపం లో లభించానని, కనుక ఆ రోజున  వృషభ లేక గోపూజ చేసేవారికి  ఆహారం  పెట్టేవారికి సకల శుభాలు కలిగేట్లు చేయి అని అడగగా తథాస్తు అన్నాడు శివుడు .కనుక వృషభ పూజ పోలాల అమావాస్య నాడు తప్పని సరిగా చేస్తారు .అవి దొరక్కపోతే ఆవులకైనా పూజ చేయవచ్చు .

  మరో కధ కూడా ఉంది .ఈ రోజున పోలేరమ్మతల్లి అనుగ్రహం కూడా పొందాలి,దీనికొక కథ ఉంది .పూర్వం ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు .  శ్రావణ బహుళ అమావాస్య నాడు పోలేరమ్మ తల్లి పూజ చేసేవారు  .ఏడవ బిడ్డ పుట్టి మరణిస్తుంటే పూజ చేయలేకపోయారు..చివరి సారిగామళ్ళీ ఏడవ బిడ్డ పుట్టగానే చనిపోయాడు. ఏమైతే అయిందనే మొండి ధైర్యం తో  వాడిని గదిలోపెట్టేసి బయటికి వచ్చి మిగిలిన కొడుకులతో పోలేరమ్మ పూజ చేసింది అతనిభార్య .ఆ రాత్రి పిల్లాడి శవాన్ని తీసుకువెళ్ళి పోలేరమ్మ గుడి మెట్ల పై  పడేసి  రోదిస్తూ కూర్చుంది .పోలేరమ్మ ఆరాత్రి గ్రామ సంచారం చేస్తూ, ఏడుస్తున్న ఆమెను వోదార్చికారణం అడిగి తెలుసుకొని వాడినిబతికి౦చటమేకాక, అక్షతలిచ్చి ఇదివరకు చనిపోయిన బిడ్డలను పూడ్చిన చోట చల్లమని చెప్పింది .ఆమె అలా చేయగా, చనిపోయిన పిల్లలందరూ బతికి వచ్చారు .అందుకే కృతజ్ఞతగా  పొలాల మావాస్యనాడు పోలేరమ్మ తల్లి అనుగ్రహాన్ని ,శివానుగ్రహాన్ని పొందటానికి పోలేరమ్మ పూజ చేస్తారు .

  గోదావరి జిల్లాలలో ఇదే రోజు ‘’కంద పిలకలు ‘’అమర్చి పూజ చేసే అలవాటు ఉంది .కంద లో ఎభాగ౦లొను౦చైనా మొలకలు వస్తాయి .అది సంతానహేతువుగా భావించి పూజిస్తారని నా ఊహ .గోదావరి జిల్లాలో వివాహాది శుభకార్యాలలో అందుకే కందా బచ్చలి కూర వండటం కూడా శుభం కోసమే . ఇప్పుడు ఆవంటకం అన్ని జిల్లాలకూ పాకింది .

 ఇదీ శ్రావణ శోభ

 రేపు శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-13-8-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు

దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు

మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొడుకు ,ఆరవ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు జీవితం లో ఎక్కువభాగం అంటే చివరి 27 ఏళ్ళు దక్షిణాపధం లో నే యుద్దాలలోనే  గడిపాడు .ఔరంగజేబ్ అంటే’’ సింహాసనానికి వన్నె తెచ్చేవాడు ‘’అని అర్ధం అతనికి ‘’ఆలంగీర్’’ అనే పేరు ఉంది దీనర్ధం ‘ప్రపంచాధినేత ‘’..అతని 48ఏళ్ళ పాలన లో సామ్రాజ్యం దక్షిణాన కర్నాటక ,తమిళనాడు వరకు బాగా విస్తరించింది .అంతకు ముందెప్పుడూ ఇంత విశాల మొఘల్ సామ్రాజ్యం లేనేలేదు .అతని ఏలుబడిలో 158 మిలియన్ల ప్రజలు౦డేవారు .సామ్రాజ్య సాలుసరి ఆదాయం 2,879,469,894  రూపాయలు .అప్పటి దాకా ప్రపంచం లో చైనా ఆర్ధిక వ్యవస్థ అత్యంత గరిష్టంగా ఉండేది జేబు కాలం లో చైనా ను అధిగమించింది భారత ఆర్ధిక వ్యవస్ధ .  అయితే ఛత్రపతి శివాజీ మొఘల్ సామ్రాజ్యానికి గండికొట్టాడు .షాజహాన్ ముంతాజ్ బేగం ల మూడవ కొడుకైన ఔరంగజేబు గుజరాత్ రాష్ట్రం లో దాహోడ్  నగరం లో 1618 నవంబర్ 3 పుట్టాడు .1707 మార్చి 3 న 88 ఏళ్ళ వయసులో మరణించాడు. అతని సమాధి మహారాష్ట్రలో ఖుల్దాబాద్ గ్రామం లో ఉంది .

  మొఘల్ చక్రవర్తుల పరమత సహనానికి ప్రసిద్ధులు .దీనివలన తిరుగు బాట్లు రాకుండా సామ్రాజ్యాన్ని కాపాడుకొన్నారు. కాని ఔరంగ జేబు దానికి విరుద్ధం ఇతరమతాలను అష్టకష్టాలు పెట్టాడు .హిందూ సిక్కులపై జుట్టుపన్ను ‘’జిజియా ‘’విధించి కొరివితో తలగోక్కున్నాడు .రాజనీతిజ్ఞుడు అయినా ముస్లిం మతావేశం అతన్ని రెచ్చగొట్టి దెబ్బతీసింది .’’హిందువుల ఆదర సౌఖ్యాలపై మొఘల్ సామ్రాజ్యసౌధం నిర్మించాలి ‘’అన్న అక్బర్ చక్రవర్తి విశాల దృక్పధం’’ జేబు ‘’మొండితనం తో ‘’జేబు’’ లో దూరి ఇరుక్కు పోయింది .ప్రజలంతా సున్నీలు కాలని , రాజ్యాంగం ఖురాను ననుసరించి నడవాలని శాసించాడు .ఇతరమతస్తులను బలవంతంగా ముస్లిం మతం లోకి మార్పించాడు .తొమ్మిదవ సిక్కు గురువు’’ గురు తేజబహదూర్’’ను ఉరితీయించాడు .దీనికి  ఆయన దేవాలయాలు నిర్మించాడన్న ఒకే ఒక కారణం . అతని మూర్ఖ ,క్రోధ, కోపతాపాలకు వేలాది హిందూ దేవాలయాలు 1669 లో ధ్వంసమై నేలమట్టమయ్యాయి .అందులో ముఖ్యంగా కాశీ విశ్వనాధ దేవాలయం ,మధురలో రాజా  వీర  సింగ్ 30 లక్షలతో అత్యంత సుందరంగా నిర్మించిన కృష్ణ దేవాలయం ఉన్నాయి .ఎన్నో మత గ్రంధాలు నాశనం చేయించాడు ,పరమత సహనం లేకపోవటం వలన మొఘల్ సామ్రాజ్య పతనం ఔరంగ జేబు తో ప్రారంభమైంది .                                  మహమ్మదీయ విద్యకు ఎన్నో పాఠశాలలు కళాశాలాలూ నిర్మించాడు .సుప్రసిద్ధ పండితులను ఉపాధ్యాయులుగా నియమించి మంచి జీతాలు ఇచ్చి విద్యార్ధులకు పారితోషికాలందించి ప్రోత్సహించాడు .బానిసల అభివృద్ధికీ పాటుపడ్డాడు .గుజరాత్ లోని బోహ్రానులు అనే బానిసలకు చదువు చెప్పించి ఫిరోజ్ షా తుఘ్లక్ లాగా బానిసల ఉద్ధరణ చేశాడు . .గ్రంధాలయాలు నిర్మంచి వివిధ విషయ గ్రందాలు వాటికి తెప్పించి విస్తృత పరచాడు .కాని అతనిది స్ప్లిట్ పర్సనాలిటి .అందుకే లలితకళలు ,శిల్ప, గాన అలంకారాలను జనసామాన్యానికి దూరం చేసి తప్పు చేశాడు .అంతకు ముందు రోజుకొక కావ్యం తో విలసిల్లిన దేశం పూర్తిగా నిస్తేజమైపోయింది .అతడు ఒక సన్యాసిగా జీవించటం తో రాజ్యం నిర్వీర్యమైంది .కళలు సర్వతోముఖాభి వృద్ధి చెందినచోట వాటికి గోరీకట్టి చెడ్డపేరు తెచ్చుకున్నాడు .

   మాతృభాషలోనే విద్య నేర్పించాలని ఔరంగ జేబు దృఢంగా నిశ్చయించి అమలు పరచాడు .చరిత్ర ,భూగోళం వంటి  మానవ విజ్ఞాన వికాస విషయాలను తప్పని సరిగా బోధించేట్లు చేశాడు .పాఠశాల విద్య ,వారికి జీవిత విద్య కావాలని ,వృత్తివిద్యా నైపుణ్యం ఇక్కడే ప్రారంభంయ్యేట్లు చేశాడు .విద్య బ్రతుకు తెరువు కలిగించేది గా ఉండాలని  కోరాడు .ఇతరభాషలలో విద్య నేర్పటం వలన విద్యార్దిమనోవికాసం దెబ్బతింటుందని అతని సృజన కు అడ్డు అవుతుందని నిష్కర్షగా చెప్పాడు .దీనికి ఉదాహరణగా ఔరంగజేబుకు పారశీక విద్య నేర్పిన గురువుకు నిర్మొహమాటంగా రాసిన ఒక లేఖ సాక్ష్యంగా ఉంది .ఆ లేఖ ఎలా ఉందో చూడండి –

–‘’ నాకు  చిన్నతనంలో మతవిద్య, తత్త్వవిద్య, పారశీక భాష వంటివి నేర్పినందుకు మిమ్మల్ని  తీవ్రంగా గర్హిస్తున్నాను . పైగా ప్రపంచంలోని ముఖ్యమైన సామ్రాజ్యానికి భావిసామ్రాట్టుకు భూగోళం, ఇతర రాజ్యాల స్థితిగతులు,రాజనీతి, ఆర్థిక విషయాలు వంటివి బోధించకుండా జీవితంపై వైరాగ్యం పొంది సన్యసించవలసిన దశలో నేర్వాల్సిన విషయాలు బోధించారు ఇది దారుణం . మీ వలన . మీ విద్యావిధానం వల్ల నా జీవితంలో అత్యంత ముఖ్యమై వ్యక్తిత్వాన్ని సంతరించుకునే బాల్యదశ, యువత అంతా వ్యర్థమైన విషయాల్లో గడచిపోయింది. విద్యను అభ్యసించేందుకు బాలలకు మాతృభాషే సరైనది, అలాకాక వేరే భాషను మాధ్యమంగా స్వీకరించి విద్య నేర్పితే ఆ భాష నేర్చుకుని, ఆపైన ఆ భాషలో విద్య నేర్చుకునేందుకు చాలా శ్రమపడ వలసి వస్తుంది  .నా  మాతృభాషలోనూ, రాజ్యంలోని వాడుకలో ఉన్న భాషల్లో కాక విదేశీభాషలో విద్య నేర్పినందుకూ ,నేను బాగా ఈసడిస్తున్నాను  .నా కొలువులో సర్దారుగా నియమించాలని  మీరు చేసిన విన్నపాన్ని కొట్టివేస్తూ సికిందర్ (అలెగ్జాండర్) కు ఆయన గురువు అరిస్టాటిల్ బోధించినట్లు జీవితానికి ఉపకరించే విద్యను, వికాసాన్ని కలిగించే పద్ధతిలోనూ నేర్పివుంటే సర్దారుగానే కాక అంతకు వేయిరెట్లు గౌరవాన్ని ఇచ్చేవాడిని, ఇప్పటికి మాత్రం మీరు నా   గురువన్న విషయం నా కొలువులోని మరెవరికైనా తెలియడం కూడానాకు  ఇష్టంలేదు .తిరిగి మీ ఊరు చేరుకోమని ఆదేశిస్తున్నాను ‘’

మాతృభాష పై ఇంతటి మమకారం ,గౌరవం కనబర్చినందుకు ఔరంగ జేబుకు మనం  రుణ పడి ఉన్నాం .మనపాలకులకు, తలిదండ్రులకు ఈ లేఖ కనువిప్పు కలిగించాలని ఆశిస్తున్నాను .ఈ లేఖ ను 1910 లో శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు గారు సేకరించి ‘’ఔరంగ జేబు తన గురువుకు వ్రాసిన యుత్తరము ‘’గా ప్రచురించగా ,దీన్ని 1957  ఆంద్ర పత్రిక సంవత్సరాది సంచికలో ముద్రితమైంది .లక్ష్మణరావు గారికి ఏమిచ్చి ఈ జాతి ఋణం తీర్చుకోగలదు ?మన మాతృభాషోద్యమకారులకు ఈ లేఖ విషయం తెలియనట్లే ఉంది .వారెప్పుడూ ఈ లేఖను ఉల్లేఖించిన దాఖలాలు నాకు కనిపించ లేదు .మీకెవరికైనా తెల్సిఉంటే నా అజ్ఞానానికి మన్నించండి .

  అతి సాధారణ జీవితం గడుపుతూ ,తన జీవిక కోసం టోపీలు కుట్టి అమ్ముతూ నిరుపేద గా గడిపిన  సామ్రాట్టు ఔరంగజేబు .ఇదీ మోడీ లాంటి పాలకులకు  ఆదర్శం కావాలి  .కొందరు చరిత్రకారులు రాసిన దాని ప్రకారం అతడు అలహాబాద్ సోమేశ్వర దేవాలయ నిర్మాణానికి ,స్థలాన్ని ఇచ్చాడు .ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం ,చిత్రకూట్ బాలాజీ ఆలయం ,గౌహతిలోని శత్రు౦జయ ,ఉమానంద జైన దేవాలయాలకు అనేక గురుద్వారాలకు నిధులు సమకూర్చాడని రాశారు ‘

  గోల్కొండ  తానీషా  ప్రజలనుంచికోట్లాది రూపాయలు  శిస్తులు వసూలు చేసి ఢిల్లీ పాదుషా కు  పంపించకుండా భూమిలో పాతిపెట్టి  ,ఎవరికీ తెలియకుండా ఉండటానికి దానిపై’’ జామా మసీదు ‘’కట్టించాడు .ఈ విషయం తెలుసుకొన్న ఔరంగజేబు మసీదు పడగొట్టించి ,నిధిని బయటికి తీయించి ,ప్రజోపకార్యాలకు  విని యోగించాడని  తెలుస్తోంది .  ఇప్పుడు దక్కన్ లో  ఔరంగజేబు  సుబేదారుగా ఉన్నప్పుడు తన పరిపాలనకు సంబంధించిన లక్షన్నర వ్రాతప్రతులను  అతి భద్రంగా జాగ్రత్త చేశాడు .తెలంగాణా ఆర్కైవ్స్ అండ్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో  చేతితో తయారైన పేపర్ లపై ఉన్న లక్షన్నర డాక్యుమెంట్ లున్నాయి .అందులో 1628-1658 నాటి షాజహాన్ చక్రవర్తి కాలం నాటి 5,000,  ,1658 -1707 నాటి ఔరంగజేబ్ చక్రవర్తి కాలంనాటి లక్షన్నర  డాక్యుమెంట్లు ఉన్నాయి .ఢిల్లీ లోని నేషనల్ ఆర్కైవ్స్ లోకాని ,మరెక్కడా కాని ఇన్ని డాక్యుమెంట్లు లేవు అంటే అవాక్కవ్వాల్సిందే .వీటివలన దక్కన్ లోని మొఘల్ లుల మునసబు దారి వ్యవస్థ ,సైనిక పాలన వ్యవస్థ ,రెవెన్యూ వ్యవస్థ విషయాలు కళ్ళముందు కనిపిస్తాయి .ఇవన్నీ పర్సియన్ భాషలో ‘’షికస్తా’’లిపిలో ఉన్నాయి .గొలుసుకట్టు గా రాయబడ్డాయి ,కాలక్రమానుసారంగా అంటే క్రానలాజికల్ ఆర్డర్ లో ఉన్నాయి .తేది ,నెల సంవత్సరాలతో సహా నమోదై ఉన్నాయి .

   ఈ సాక్ష్యాధారపత్రాలలలో 1-చక్రవర్తి ఆజ్ఞలు  అంటే ఫర్మానాలు 2-  రాచకుటుంబాలవారి ఆజ్ఞలు అంటే నిషాన్ లు ,3- ఇంపీరియల్   అజ్నలకు సంబంధించిన నివేదికలు అంటే ‘’యద్దాస్ట్ ఇ ఆహ్కం ఇ ముకద్దాస్ ‘’4 –ఉన్నతాధికారులు జారీ చేసిన ఆజ్ఞలు అంటే’’ పర్వానా ‘’  లు ,5- ప్రాంతీయ న్యాయస్థానాల విచారణ ప్రక్రియలు అంటే ‘’సియాహ హుజూర్ ‘’లు 6- దినవారీ వార్తాల నివేదికలు అంటే ‘’రోజ్ఞా౦చయివ కాయ్ ‘’7-నగదు  చెల్లింపు లు అంటే ‘’క్వబ్జుల్ వసీల్ లు 8-సిబ్బంది, గుర్రాల పత్రాలు అంటే ‘’అర్జ్ వో చిహ్ర ‘’లు ఉన్నాయి .

 తండ్రి షాజహాన్ చక్రవర్తి ఢిల్లీ సామ్రాజ్య నిర్వహణలో ఉండగా ఔరంగజేబు దక్కన్ లో ఉన్నకాలం లో రాజకీయ రాజకీయేతర విషయాలలో గొప్ప అనుభవం సంపాదించాడు.1658 జులై 25 న చక్రవర్తిగా ఢిల్లీ సింహాసం  అది ష్టించి నప్పుడు ,దక్కన్ పై ఒక కన్ను వేసే ఉంచి అక్కడ జరుగుతున్న విషయాలను గమనిస్తూ కొడుకు మహమ్మద్ అక్బర్ తిరుగుబాటు ధోరణి గమనిస్తూ బిజాపూర్ గోల్కొండ లను1687 లో వశపరచుకొన్నాడు .

1916 లో   స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్ జరీనా పర్వీన్ చె ప్పినదానిప్రకారం  పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర అక్కౌంటెంట్ జనరల్ సయ్యద్ ముహిబుద్దీన్  మొగలుల హెడ్ క్వార్టర్  ఔరంగాబాద్  కు  తనిఖీ కోసం వెడితే ,అక్కడ  ఫోర్ట్ ఆర్క్  ‘’లో నేలమాళిగలలో (వాల్ట్స్)ఎన్నో పాత డాక్యు మెంట్ లు చెల్లాచెదురుగా పడి  ఉన్నట్లు గమనించాడు.పై అధికారులకు ఈ విషయం తెలియ జేసి వాటిని భద్రంగా హైదరాబాద్ ఆర్కైవ్స్ కు చేర్చాడు .పర్షియా భాషలో నిధి ఐన  పర్వీన్  ఆ డాక్యుమెంట్ లను క్రమపద్ధతిలో ఏర్పరచి ఆమ్ల రహిత డాకేట్స్ లో భద్రపరచినది ఈ డాక్యుమెంట్ లలో ఔరంగజేబ్ పరిపాలనా సామర్ధ్యం  ,నైపుణ్యం అవగతమవుతాయి .అందులో ఉన్న ‘’యద్దాస్ట్ ఇ ఆహ్కం ఇ ముకద్దాస్ ‘’లో అతడు తన సిబ్బందికి జీతాల పెంపు విషయం లో చక్రవర్తికి పంపిన రికమండేషన్ పత్రాలు కూడా ఉండటం విశేషం . విధులలో  నిర్లక్షయం ,ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఆలోచనలను కనిపెట్టటానికి ఔరంగజేబు గూద చారులను నియమించాడు .

 ఇలా  సగం మంచి సగం,  చెడు,   ఉన్న స్ప్లిట్ పర్సనాలిటి ఔరంగ జేబులో కనిపిస్తుంది’.

  ఆధారం -12-8-18 హిందూ పత్రికలో ఎం. రాజీవ్ రాసిన ‘’డెక్కన్ పేపర్స్ షైన్ ది లైట్ ఆన్ ఔరంగ జేబ్ రూల్ ‘’అనే ఆర్టికల్ లో కొంతమేరకు మాత్రమే.

   శ్రావణమాస శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-18 –ఉయ్యూరు

 .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు

బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు

నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు శ్రీ పేర్నేటిగంగాధరరావు గారు పామర్రుకు నాలుగు కిలోమీటర్ల దూరం అవనిగడ్డ దారిలో  మెయిన్ రోడ్డుకు ఎడం వైపు కొంచెం దూరం లో ఉన్న జమీ దగ్గుమిల్లి హెడ్ మాస్టర్ గా ఉన్నారు .ఆయనకు ముందు అక్కడ శ్రీ అ౦జయ్యగారు హెచ్.ఎం  .ఇద్దరూ నాకు ఆత్మీయ మిత్రులే .గంగాధరరావుగారిది బందరు ,అ౦జయ్యగారిది చినముత్తేవిదగ్గర  కారకం పాడు గ్రామం మోతుబరి రైతు కూడా . .అ౦జయ్యగారు లెక్కల మేష్టారు .రావు గారు సోషల్ .

గంగాధర రావు గారు బహు సౌమ్యులు .అతి సాధారణంగా ఉంటారు .మొహమాటస్తులు .విధినిర్వహణలో అత్యంత చురుకు .గ్రామస్తుల సాయం తో దగ్గుమిల్లి హైస్కూల్ అభి వృద్ధికి చాలా కృషి చేశారు .ఆయనంటే గ్రామస్తులకు విపరీతమైన అభిమానం .అంజయ్య ,రావు గార్లకు ముందు అక్కడ పని చేస్సిన హెడ్ లందరూ కాలం దొర్లించుకు వెళ్ళినవారే కాని విద్యార్ధుల విషయం లో స్కూల్ అభివృద్ధి విషయం లో అస్సలు పట్టించుకోలేదు .కనుక ఆస్కూల్ ఒక పనిష్మెంట్ స్కూలనే అభిప్రాయం ఉండేది .అ౦జయ్యగారు కొంత చక్కబరిస్తే రావు గారు  దాన్ని కొనసాగించి దగ్గుమిల్లి స్కూల్ ను  ఆదర్శ వంతంగా తీర్చి దిద్దారు .వనరుల సదుపాయం కలిగించారు .ఆస్కూల్ లో పని చేయాలనే కాంక్ష ఉపాధ్యాయులలో తెచ్చారు .వీరిద్దరి వలన ఆ స్కూల్ సర్వతోముఖాభి వృద్ధి  చెందింది .అడ్డాడ హై స్కూల్ లో జరిగే ప్రతికార్యక్రమానికి  వారు వారి స్టాఫ్ వస్తే ,అక్కడ జరిగేవాటికి నేనూ నాస్టాఫ్ తప్పక వెళ్ళేవాళ్ళం .కనుక మా స్కూళ్ళకు ఆత్మీయ బంధుత్వం ఏర్పడింది .అ౦జయ్యగారి రిటైర్మెంట్ ను ,ఉపాధ్యాయ విద్యార్ధి బృందం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. అలాగే రావు గారి పదవీ విరమణనూ చిరస్మరణీయంగా చేసి ఋణం తీర్చుకున్నారు .అ౦జయ్యగారు సరదామనిషి జోకులు పేలుస్తూ మాట్లాడితే రావుగారు గారు పరమ ప్రశా౦త మూర్తిగా ఉండేవారు .

గంగాధరరావు గారికి సాహిత్య ప్రవేశం బాగా ఉంది .ఎప్పుడూ ఏదో ఒక ఉపయుక్త గ్రంథం రాసి ప్రచురించేవారు .రిటైరయ్యాక ఈ వ్యాపకం బాగా హెచ్చి జీవితాన్ని సార్ధకం చేసుకొంటున్నారు .వారి పుస్తకాలు నాకు పంపిస్తే మన సరసభారతి పుస్తకాలు వారికి పంపటం ఆ  నాటి నుంచి అలవాటు .వారు చేతలమనిషే తప్పమాటల వారుకాదు .పనియే దైవం అని భావించే వారు .దగ్గుమిల్లి కి రాకపూర్వం నుంచి పరిచయమున్నా ,అక్కడికి వచ్చాక మరీ దగ్గరయ్యాం .నాకు నచ్చిన స్నేహితులాయన .ఆయ సద్గుణాల పోగు .నెమ్మదిగా సూటిగా మాట్లాడటం ఆయన నైజం .బ్రహ్మ కుమారీ సమాజం పై వారికి మక్కువ ఎక్కువ .రాజస్థాన్ లోని మౌంట్ యాబు పై జరిగే కార్యక్రమాలకు క్రమ౦ తప్పకుండా వెళ్ళేవారు .కనిపించినప్పుడు ఆ విశేషాలు తెలిపెవారు .నాకూ వెళ్ళాలనే ఉ౦డేదికాని ఎప్పుడూ సాహసించలేదు .ఆసమాజంపై నాకు అవగాహనా లేక పోవటం ఒక కారణం .రిటైరయ్యాక బందరులో సెటిల్ అయి స్వగృహం ఏర్పరచుకొని తమ ఆధ్యాత్మిక ,సాహితీ వ్యాసంగాన్ని కొన సాగిస్తున్నారు  . పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాసి ప్రచురిస్తున్నారు. అవి సమాజానికి ,వ్యక్తి వికాసానికి  ఆధ్యాత్మిక వికసనానికి  దోహద పడేవి .

ఈ నెల 10 వ తేదీ శుక్రవారం గంగాధరరావు గారు తాజాగా పంపిన 1-వజ్రకాయం (మూలకణ౦ )అనే యోగరహస్యాల పుస్తకం 2-శ్రీ లలితా సహస్రనామాలకు స్వర్గీయ శ్రీ మల్లాప్రగడ శ్రీ రంగారావు గారి వ్యాఖ్యానానికి రావు గారు రాసిన సులభ వ్యాఖ్యానం అందాయి .ఈ పుస్తకాల పేర్లు వింటేనే వారిలోని దివ్యత్వం ,ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం గోచరమౌతాయి .బందరు ఆధ్యాత్మిక గురు మహారాజ్ గా నాకు వారు కనిపిస్తారు .ఎప్పుడూ తెల్లని పైజమా లాల్చీతో, పైన శాలువాతో స్వచ్చతకు స్వచ్చం గా ఉంటారు .వాల్మీకి, వ్యాసుల లాగా పొడవైన గుబురు తెల్ల గడ్డం తో దర్శన మిస్తారు .కనుక వారిని గురుమహరాజ్ అన్నాను .

ఒక్కసారి వారు రాసిన గ్రందాల వివరాలు  తెలుసుకొని వారి విద్వత్ ఎట్టిదో గ్రహిద్దాం .1-ఆత్మ దర్శనం  3భాగాలుగా రాశారు. రెండవ దానికి ఆత్మిక విజ్ఞాన శాస్త్రం అని మూడవ భాగానికి మృత్యుంజయుడు అని సార్ధక నామకరణం చేశారు .అత్యంత గహనమైన విషయాలను అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు సరళ సులభంగా సాగిన ఆధ్యాత్మిక త్రివేణి ఇది .4 క్షీర సాగర మధనం 5  కామవేదం  ముక్తికి మార్గం 6-ఆధ్యాత్మిక రత్నాలు 7-మోడల్ పార్లమెంట్ 8-Think it over HOW to become Success ful in Life 9-అష్టోత్తర శత సుందరకాండ 10-యోగ వాసిస్టసారం –వచనం 11-ఆరోగ్య సూత్రాలు –యోగ మార్గాలు 12-సర్వ యోగ సమన్వయము మరియు సీక్రెట్ డాక్ట్రిన్13-బ్రహ్మ జ్ఞానము (దృక్కు దృశ్యము వివేకము )14-వివేక చూడామణి 15-ఫేస్ బుక్ (యోగ సారం ).పైన చెప్పిన రెండిటితో కలిపి 17 అపూర్వ గ్రంథాలు రాశారన్నమాట .

ఇలాంటి గ్రంథాలు రాయాలంటే యెంత ఆలోచన ,పరిశీలన పరిశోధన ,అనుసరణ ,అభిరుచి అనుభవం, కావాలో మనకు అర్ధమౌతుంది .ఇదంతా ఆ గంగాధరుని జ్ఞాన ‘’గంగ’’ అని పిస్తుంది నాకు .అలాంటి ‘’మనీషి’’ బందరులో ఉన్నారంటే ఆ పురజనుల భాగ్యమే భాగ్యం .ఆయన తన పనేదో తాను చేసుకొంటూ పోయేమనీషి .డాబు ,దర్ప౦ ,పటాటోపం ఎక్స్పోజింగ్ లేని వారు . సాహిత్య సభలకు తప్పక హాజరౌతారు శ్రద్ధగా వింటారు .స్టేజి పైకి ఎప్పుడూ రాగా నేను చూడలేదు .వారి విద్వత్తు అక్కడి వారు గ్రహించారో లేదో నాకు తెలియదు .వారిని పిలిచి ఎక్కడా సన్మానించిన దాఖలాలు నాకు పేపర్ ద్వారా తెలియదు .చేసి ఉంటె సంతోషం .చేయకపోతే ప్రయత్నించమని కోరిక .ఇంతటి సౌజన్య సహృదయ మూర్తి నాకు పరమ ఆత్మీయ మిత్రులైనారంటే అది నా అదృష్టంగా భావిస్తూ ,వారు మంచి ఆరోగ్యం తో  మరిన్ని గ్రంథ రచనలు చేయమని కోరుతున్నాను .వారిని పరిచయం చేసే భాగ్యం కలిగినందుకు గర్విస్తున్నాను .

శ్రావణ మాస శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-18 –ఉయ్యూరు

 

 

— 



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రెండవ ప్రపంచ యుద్ధం లో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ గా విఖ్యాతురాలైన – నూర్ ఇనాయత్ ఖాన్

రెండవ ప్రపంచ యుద్ధం లో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ గా విఖ్యాతురాలైన – నూర్ ఇనాయత్ ఖాన్

జనన విద్యాభ్యాసాలు:

బ్రిటన్ లో మొదటి మహిళా వైర్లెస్ ఆపరేటర్ గా ఉన్న నూర్ ఇనాయత్ ఖాన్ బ్రిటిష్ ప్రభుత్వం ఆక్రమిత ఫ్రాన్స్ కు ఫ్రెంచ్ రెసిస్టన్స్ సాయం కోసం రెండవ ప్రపంచ యుద్ధం లో పంపబడిన బ్రిటన్ దేశానికి చెందిన మొట్టమొదటి ముస్లిం వార్ హీరోయిన్ . ఆమె సేవలకు ఆ ప్రభుత్వం అత్యున్నత ‘’జార్జి క్రాస్ ‘’పురస్కారం అందించి గౌరవించింది .

1-1-1914 భారత సంతతి ఉన్నత కుటుంబ ముస్లిం ఇనాయత్ ఖాన్ కు ,, టిప్పు సుల్తాన్ వంశీకు రాలైన అమెరికాకు చెందిన పిరానీ అమీనా బేగం అయిన తల్లికి మాస్కో లో జన్మించిన ఇనాయత్ ఖాన్ ‘’ననోరా ఇనాయత్ ఖాన్ గా పిలువబడేది .తండ్రి సంగీతవేత్త గా ,సూఫీ ఉపాధ్యాయుడిగా ఉద్యమకారుడు గా యూరప్ లో ఉండేవాడు .1914 మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ సమయం లో కుటుంబం రష్యా ను వదిలి లండన్ చేరి బ్లూమ్స్ బరీ లో నివాసమున్నారు .ఇక్కడ నర్సరీ పూర్తి చేసిన నూర్ ,తర్వాత ఫ్రాన్స్ చేరి ,పారిస్ దగ్గరున్న సురేస్నేస్ లో విద్య కొనసాగించింది సూఫీ ఉద్యమవేత్త అయిన తండ్రికి ఆ సంస్థ ఉచితం గా ఇల్లు అందజేసింది .1927 లో తండ్రి మరణం తర్వాత తల్లీ ,ముగ్గురు తోబుట్టువుల పెంపకం బాధ్యతలను ఆమె చేబట్టింది .చిన్నప్పుడు బహు ప్రశాంతంగా ,సిగ్గుల మొగ్గగా ,కలలరాణిగా సున్నిత మనస్కురాలుగా ఉండేది . సోర్బొనే లో చైల్డ్ సైకాలజీ ,నేర్చి పారిస్ కన్జర్వేషన్ లోనాడియా బోలానర్ వద్ద సంగీతం లో షార్ప్ ,పియానో కంపోజింగ్ నేర్చుకున్నది . .

రచనా వ్యాసంగం:

కవిత్వం ,చిన్నపిల్లల కథలురాసి మాగజైన్ లకు పంపితే అవి ముద్రింపబడి ఆమెకు గొప్ప ఉత్సాహం తెప్పించేవి .ఫ్రెంచ్ రేడియో లో ఆమె రచనలు తరచూ ప్రసారమయ్యేవి .1939 లో ‘బౌద్ధ జాతకకథలు 20 రాసి ‘’ట్వెంటి జాతక టేల్స్ ‘’గా లండన్ లో ప్రచురించింది .

లండన్ చేరిక:

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమై ఫ్రాన్స్ ను జర్మనీ ఆక్రమించాక కుటుంబం బోర్డాక్స్ కు పారిపోయి ,అక్కడి నుండి సముద్రమార్గం లో లండన్ లోని ఫాల్మౌత్ కార్న్ వాల్ కు 22-6-1940 న చేరింది.

సూఫీ భావాలు నరనరానా జీర్ణించుకున్న నూర్ ,ఆమె సోదరుడు విలాయత్ ఇద్దరూ నాజీ నియంతృత్వాన్ని ఎదిరించి ఓడించటానికి నిర్ణయించారు .అప్పుడు ఆమె మనసులో ‘’ఈ యుద్ధం లో భారతీయ వీరులు అత్యున్నత ధైర్య శౌర్య పరాక్రమాలకు పతకాలు సాధి౦చి అందరి చేత ప్రశంసి౦చబడితే బాగుంటుంది .అప్పుడు బ్రిటిష్ దేశస్తులకు, భారతీయులకు వారు స్నేహ సేతువులవుతారు ‘’అని పించేదట .పిచ్చితల్లి బ్రిటన్ లో ఉన్నా భారత దేశం పై అభిమానం ఏమాత్రం తగ్గలేదు .

మొదటి మహిళా వైర్లెస్ ఆపరేటర్:

1940 నవంబర్ లో నూర్ ఇనాయత్ ఖాన్ ‘’ఉమెన్స్ ఆక్సిలరి ఎయిర్ ఫోర్స్ ‘’లో చేరింది . ‘’ఎయిర్ క్రాఫ్ట్ ఉమన్-సెకండ్ క్లాస్ ‘’గ ఆమె ను వైర్లెస్ ఆపరేటర్ ట్రెయినింగ్ కు పంపారు .19 41 జూన్ లో ‘’బాంబర్ ట్రెయినింగ్ స్కూల్ పని పూర్తయ్యాక ,ఈ పని బోర్ కొట్టి ‘’కమిషన్ ‘’లో చేరటానికి దరఖాస్తు చేసింది .

తొలి మహిళా స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్:

ఖాన్ కోర్కె ఫలించి ఆమెను 1943 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ సెక్షన్ లోని’’ స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ ‘’ గా నియమించారు .తర్వాత ఎయిర్ మినిస్ట్రీ ,ఎయిర్ ఇంటలిజెన్స్ ,ఫస్ట్ ఎయిడ్ నర్సింగ్ లలో శిక్షణ పొంది ,సర్రేలోని గిల్డ్ ఫోర్డ్ కు ,ఆతర్వాత బకింగ్ హాం షైర్ లోని ఏల్స్ బరీ కి బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతం లో స్పెషల్ వైర్లెస్ ఆపరేటర్ ట్రెయి నింగ్ కోసం పంపారు.

అంతకు ముందు స్త్రీలను కొరియర్స్ ఏజెంట్స్ గానే పంపేవారు.ఇప్పడు ఈమెను అప్పటికే వైర్లెస్ టేలిగ్రఫీలో అనుభవం ఉండటం ,మిగిలిన స్త్రీ శిక్షకులకంటే ఆమె చాలా చురుకుగా గ్రహింపుతో వ్యవహరించటం వలన నూర్ ఖాన్ కు ఈ అవకాశం దక్కి,మొట్టమొదటి మహిళా వైర్ లెస్ ఆపరేటర్ గా యుద్ధ భూమికి వెళ్ళే వీరవనితగా చరిత్ర సృష్టించింది .వీరా అట్కిన్స్ అనే ఇంటలిజెన్స్ ఆఫీసర్ ఈమెలోని అంకిత భావానికీ ,నిజాయితీ, తెలివి తేటలకు మెచ్చి మిగిలిన వారందరికంటే ఈమెయే అర్హురాలని వాదించి ఆపని అప్పగించాడు .

నూర్ కు అప్పగించిన బాధ్యత చాలా ప్రమాద భూయిస్టమైనది .ఆమె సోదరుడు విలాయత్ ఖాన్ కు ఆమెను అలా పంపటం ఇష్టం లేదు .ఈ విషయం గ్రహించిన అట్కిన్స్ అతనితో మాట్లాడి ఒప్పించాడు .కుటుంబానికి ఏ ప్రమాదం రాకుండా చూస్తానని ,బాధ్యత వహిస్తాననీ మాట ఇచ్చి ,ఆమెకూ నచ్చ చెప్పి ఉత్సాహపరిచాడు .

దురదృష్టం:

ఇనాయత్ ఖాన్ జూన్ మూన్ నాడు లైజాండర్ ఎయిర్ క్రాఫ్ట్ లో దగ్గరలో ఉన్న ఎంగేర్స్ యుద్ధభూమికి వెళ్లి ,అక్కడి నుంచి పారిస్ కు ‘’ప్రాస్పర్ సబ్ సర్క్యూట్ లీడర్ ఎమిలీ గారీ తో కలిసి పారిస్ వెళ్ళాలి .ఎమిలీ గారీ ప్రముఖ సినీ స్టార్ గారీ కూపర్ ను పోలి ఉంటాడు .నూర్ ఖాన్ ధారాళంగా ఫ్రెంచ్ భాష మాట్లాడటం ,వైర్లెస్ ఆపరేషన్ లో అనితర సాధ్యమైన ప్రతిభ ఉండటం ఈ నాజీ ఆక్రమిత ఫ్రాన్స్ పై ఆపరేషన్ కు ఆమెకు దక్కిన వరాలు .కాని విధి వక్రించి ,ఆమెకు సహాయకులుగా ఉన్నవారిలో ఒకరిద్దరు నాజీ లంచాలకు బానిసలై మిషన్ రహస్యాన్నిచేరవేశారు . 1943 అక్టోబర్ 13 న ఆమెను అరెస్ట్ చేసి ,పారిస్ లో విచారణ జరిపారు .రెండు సార్లు తప్పించుకొని పారిపోవటానికి ఆమె తీవ్ర ప్రయత్నం చేసి విఫలురాలైంది .గెస్టపోలు ఎంతబాధించినా, హింసించినా ఏమాత్రమూ రహస్యాలు బయట పెట్టలేదనీ ,గు౦భనగానే ఉండి పోయిందని అబద్దాలమీద అబద్ధాలాడి రహస్యాలు భద్రంగా ఉంచిందని హాన్స్ కీఫర్ అనే మాజీ హెచ్. డి. హెడ్ ధృవీకరించాడు .ఆమె పంపిన సందేశాలను డీకోడ్ చేసి కూపీ లాగినా ఏమీ లభించలేదట .

పారిపోయే చివరి యత్నం:

19 43 నవంబర్ 25 నూర్ ఇనాయత్ ఖాన్,తన అనుచరులతో హెచ్ డి హెడ్ క్వార్టర్స్ నుంచి తప్పించుకు పారిపోయేప్రయత్నం లో మళ్ళీ బంధింప బడ్డారు .పైకప్పు నుంచి దూకి పారిపోయే ప్రయత్నం లో ఉండగా విమానదాడి హెచ్చరికతో అధికారులు అప్రమత్తమై సెల్ లోని ఖైదీల సంఖ్య లెక్కపెట్టటం వలన పట్టుబడ్డారు .మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేయం అని హామీ పత్రం రాసి ఇవ్వమంటే ఇనాయత్ ఖాన్ తిరస్కరించగా ఆమెను జర్మనీకి 27-11-1943న తరలించి సాలిటరి సెల్ లో బంధించారు .మహా తీవ్రవాది అనే ముద్ర వేసి ఆమెను నిరంతరం కాళ్ళకూ చేతులకూ సంకెళ్ళ తోనే ఉంచారు .ఇంత చిత్ర హింసలకు గురి అవుతున్నా, రవ్వంతైనా రహస్యం బయట పెట్టని వీర ధీర నారి ఇనాయత్ ఖాన్ .రాత్రి తెల్లవార్లూ ఏడుస్తూ రోదిస్తూ గడిపేదని ప్రక్క ఖైదీలు చెప్పేవారు .

కప్పుపై పిచ్చి గీతలతో చిరునామా:

బతుకు తాను అనే ,బతకాలి అనే తీవ్ర కాంక్ష ఉండటం వలన ఆఖరి ప్రయత్నంగా తాను ఎక్కడ ఉన్నదో తనవాళ్ళకు తెలియ జెప్పే ప్రయత్నమూ చేసింది .నోరాబెకర్ అనే తన రహస్య నామాన్ని ,తల్లి లండన్ అడ్రస్ ను కాఫీ కప్ లపై ఎవరికీ తెలియకుండా పిచ్చి గీతలుగా చెక్కి, స్నేహితురాలైన తోటి ఖైదీకి తెలియ జేసింది .

వీర మరణం:

ఇనాయత్ ఖాన్ ను ,తోటి ఏజెంట్స్ యోలాండర్ బీక్ మన్ ,మెడలీన్ డామేర్మేంట్,ఎలీనే ప్లీవన్ లను తర్వాత ఈకా౦ప్ నుంచి మార్చి డచ్చౌ కాన్సేన్ట్రేషన్ కాంప్ కు తరలించారు .13 -9- 1944 వ తేదీ ఉదయాన్నే వీరిని కాల్చి చంపారు .1958 లో ఒక డచ్ ప్రిజనర్ ఎస్. ఎస్ .ఆఫీసర్ విల్ హెల్మ్ రుప్పర్ట్ ఇనాయత్ ఖాన్ ను కాల్చి చంపటానికి ముందు తీవ్రంగా , అతి దారుణంగా ,కిరాతకంగా పైశాచికంగా,నిర్దాక్షిణ్యంగా కొట్టాడనీ ఆమె నోటి నుంచి వచ్చిన చివరిమాట ‘’లిబర్టి ‘’అనీ చెప్పాడు , ఆమె చనిపోయే నాటికి తల్లీ ,ముగ్గురు తోబుట్టువులు జీవించి ఉన్నారు .

వీర పురస్కారం:

బ్రిటిష్ ప్రభుత్వం నూర్ ఇనాయత్ ఖాన్ త్యాగానికి తమ దేశ అత్యున్నత మిలిటరీ పురస్కారం ‘’జార్జి క్రాస్ ‘’ ను ఆమె మరణా నంతరం 1949 లో అందజేసింది .బ్రిటన్ వారి రికార్డ్ లో ఆమె ‘’మిస్సింగ్ ఉమన్’’ గానే ఉండటం వలన ‘’మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఎంపైర్ ‘’ఇవ్వలేదట .2011 లో లండన్ లో ఆమె వ్యవసాయ క్షేత్రం దగ్గర కాంశ్య విగ్రహం కోసం బ్రిటన్ పౌరులు లక్ష పౌండ్ల నిధి వసూలు చేసి, ఏర్పాటు చేసి 8-11-2012 న ప్రిన్సెస్ రాయల్ చేత ఆవిష్కరింప జేసి ఋణం తీర్చుకున్నారు . .ఒక ముస్లిం లేక ఆసియా వనితకు ఏర్పాటు చేసిన మొట్టమొదటి విగ్రహం గా రికార్డ్ కెక్కింది .నూర్ ఇనాయత్ ఖాన్ అనుపమ త్యాగనిరతి అందరికి ప్రేరణ కలిగిస్తుంది .

– గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

ఎవరీ అర్యముడు ?

ఎవరీ అర్యముడు ?

దీన్తస్సాదియ్యా ఏదైనా మనసు లో పడితే అదేమిటో తెలుసుకొనే దాకా తోచదు .మళ్ళీ ఇవాళ గీత విభూతి యోగం లో శ్లోకమొకటి ఆలోచనకు పదును పెట్టింది –

‘’అన౦తశ్చాస్మి నాగానాం ,వరుణోయాదసామహం –పిత్రూణామర్యమా చాస్మి యమః సంయతామహం ‘’

నాగులలో అనంతుడు అంటే ఆదిశేషు డను ,జలం ఇచ్చే వాళ్ళలో వరుణుడను ,పితృ దేవతలలో అర్యముడను ,అణచి ఉ౦ఛేవాళ్ళలో యముడను నేను అని భగవాన్ శ్రీ కృష్ణ ఉవాచ .

అందరూ మనకు కొద్దో గొప్పో పరిచయమున్నవాళ్ళే.కాని అర్యముడి గురించి నాకు పెద్దగా తెలియదు .కనుక తిరగేయాల్సి వచ్చింది .తెలిసిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాను .అర్యముడు వేదకాలం నాటి దేవత .ఆపేరు లో దగ్గర స్నేహితుడు అని ,సహచరుడు అని  అర్ధాలున్నాయి .ఆదిత్యులకు తల్లి అయిన అదితి కుమారుడే అర్యముడు .తండ్రి కశ్యప ప్రజాపతి .’’మధ్యోదయ సూర్య చక్ర౦ ‘’గా కూడా  వర్ణిం బడ్డాడు .

ఋగ్వేద సంహితలో ఆడ జాతి గుర్రాల సంరక్షకుడుగా చెప్ప బడ్డాడు .ఋగ్వేదం ఆదిత్యులు –వరుణ ,మిత్ర ,సూర్య ,చంద్ర ,కామదేవ ,అగ్ని ఇంద్రులనే ఏడుగురినే  చెప్పింది .ఎనిమిదవ వాడైన మార్తా౦డుని అదితి అంగీకరించలేదు కనుక సంఖ్య 7 మాత్రమే ..కానీ యజుర్వేద సంహిత 8 గా పేర్కొన్నది .ఎనిమిదవవాడు వివస్వుడు .కాని ఋగ్వేదం లోని మరోంత్రం తొమ్మిది మంది ఆదిత్యులున్నట్లు చెప్పింది .ఎనిమిదవవాడు మార్తా౦డుడు అన్నది .ఇతడే తర్వాత వివస్వుడు అయ్యాడు .తన ఏడుగురు కొడుకులతోకలిసి అదితి పూర్వ వయసు పొందింది .మార్తా౦డునికి జన్మనిచ్చి మళ్ళీ చనిపోయింది .రుగ్వేదాదిత్యులు దేవతలు .వీళ్ళు మరుత్తులు లేక విశ్వే దేవులకంటే ఉన్నతులు .

భాగవత పురాణం విష్ణు ,ఆర్యమ ,ఇంద్ర ,త్వష్ట ,వరుణ ,ధాత ,భగ ,పర్జన్య లేక సవిత్రు ,వివస్వ ,అంశుమాన్,మిత్ర ,పూష అనే 12 మంది ఆదిత్యులను చెప్పింది . వీరే ద్వాదశాదిత్యులు.ఒక్కో నెలలో ఒక్కో ఆదిత్యుడు సూర్యుడుగా ప్రకాశిస్తాడు .ఇంద్ర ,సూర్యులు దేవతల శత్రువులసంహారం చేస్తారు .ధాతగా ప్రాణుల సృష్టి చేస్తాడు .పర్జన్యుడిగా వర్షాలు కురిపిస్తాడు .త్వష్ట గా మొక్కలలో  వృక్షాలలో ,ఔషదులలో ఉంటాడు .పూషగా ఆహార పదార్ధాల ను వృద్ధి చేస్తాడు .అర్యముడిగా వాయువు అవుతాడు .భగుడుగా ప్రాణుల శరీరాలలో ఉంటాడు .వివస్వతుడుగా ఆహారపదార్ధాల పచనానికి సహకరిస్తాడు .అంటే వంటకుపయోగాపడుతాడు .విష్ణువుగా దేవతలశతృ సంహారం చేస్తాడు .అంశు మంతుడుగా వాయువు చేసేపనే చేస్తాడు .వరుణుడు గా వర్షాలు కురిపిస్తూ నీటికి అధిదేవతగా ఉంటాడు .మిత్రుడుగా చంద్రునిలో ,సముద్రాలలో ఉంటాడు .

అంతరిక్షం లో పాలపుంత అర్యముడి  మార్గం.వరుణ ,మిత్ర ,భగ, బృహస్పతి మొదలైన ద్వాదసాదిత్యులతో పాటు అర్యముని సంస్మరించి ప్రార్ధిస్తారు .అర్యముడు మిత్ర, వరుణులతో సమాన స్థాయి ఉన్న ఉత్తమ దేవత గా ఋగ్వేదం చెప్పింది .స్వర్గాధిపతి ,వేద దేవత అయిన ఇంద్రుడుకూడా అర్యముని వరాలకోసం ,కానుకలకోసం ప్రార్ధిస్తాడని ఋగ్వేదం అంటోంది .కనుక దేవేంద్రునికంటే అర్యముడు గొప్పవాడన్నమాట .హిందూ వివాహాలలో వివాహానికి సాక్షిగా అర్యముడు ఉంటాడనే మంత్రాలున్నాయి .అందుకే కృష్ణుడు అర్యముని ఉటంకించి ఉంటాడని అతనీలో తన విభూతి ఉందని చెప్పిఉ౦టాడని  పిండితార్ధం .

ఇంకా ఎవరికైనా దీనిపై విశేష అభిప్రాయాలు తెలిస్తే జత చేసి వెలుగు నింపమని కోరిక .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-18 –ఉయ్యూరు

 

 


 

Posted in రచనలు | Tagged | Leave a comment

117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి రామయ్య

117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి రామయ్య

శ్రీ ఆకునూరి రామయ్య ,20 మంది బృందం కలిసి 2010 లో పీరియాడిక్ టేబుల్ లో 11 7 వ మూలకం కనిపెట్టారు .ఇటీవలే దానికి ‘’టేన్నేస్సిన్ ‘’అని నామకరణం చేశారు .దీని సింబల్  ‘’Ts’’.ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ రామయ్యగారు  వాండర్ బిల్ట్ యూనివర్సిటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్ .ఈ ఆవిష్కరణకు ఆయనను, ఆయన తోపాటు పనిచేసిన జోసెఫ్ హామిల్టన్ నూ టెన్నెస్సీ కాంగ్రెస్ మన్  జిమ్ కూపర్  ఈ మధ్యనే ఘనంగా సత్కరించారు .వారు పని చేస్తున్న యూనివర్సిటి టెన్నెస్సీ రాష్ట్రం లో ఉన్నందున అ మూలకానికి ఆ రాష్ట్ర గౌరవార్ధం  ‘’టేన్నేస్సిన్ ‘’అని పేరు పెట్టి తమకూ, తమ రాష్ట్రానికి ఘనకీర్తి నార్జి౦చి పెట్టారు .

ఆంద్ర విశ్వ విద్యాలయం లో చదివి బాచిలర్,  మాస్టర్ డిగ్రీలు  పొంది శ్రీ ఆకునూరి రామయ్య,అమెరికా వెళ్లి  ఇండియానా యూని వర్సిటి లో 1960 లో పి. హెచ్ .డి. సాధించారు .అతిభార మూలకాల ఉనికిపై అత్యంత ఆసక్తి కల ఆయన నిరంతర పరిశోధనల ఫలితమే తాను ఈ ఘన విజయాన్ని సాధించగలిగానని చెప్పారు .ఓక్ రిడ్జ్  నేషనల్ లాబొరేటరి ,రష్యాలోని ఫియర్రోవ్ లాబరేటరి ఫర్ న్యూక్లియర్ రియాక్షన్స్ ,కాలి ఫోర్నియాలోని లారెన్స్ లివర్ మోర్ నేషనల్ లాబరేటరి ,నాక్స్ విల్ లోని యూని వర్సిటి ఆఫ్ టెన్నెస్సీ కి చెందిన రామయ్య ,హామిల్టన్ ,20 మంది రిసేర్చర్స్ కలిసి సాధించిన అతి నూతన మూలకం ఆవిష్కరణ  ఇది .ఈ పరిశోధన ఎక్కువ భాగం రష్యాలో సాగిందని కారణం అక్కడ సైక్లోట్రాన్,రీకాయిల్ మాస్ సర్క్యులేటర్ లు ఉండటమేనని రామయ్య చెప్పారు .ఒకటిన్నర సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనాఫలితం ఇది అన్నారు .

ఈ ఏడాది జులై లో ‘’టేన్నేస్సిన్ ‘’ గా నామకరణం పొందిన ఈ కొత్త మూలకం జీవితకాలం 100 మిల్లి సెకన్లు .రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఉన్న  ఈ కొత్తమూలకాన్ని ‘’హై ఎక్సైటేడ్ స్టేట్ ‘’లోఅంటే అత్యధిక ఉత్తేజిత స్థితి లో  తయారు చేశామని రామయ్య ఉవాచ .ఈ ఆవిష్కరణ  2000 సంవత్సరం లో సూపర్ హెవీ ఎలిమెంట్  ఉండవచ్చు ,దాన్ని కనుగొనవచ్చు అనే ముందస్తు ఊహ అంటే ప్రేడిక్షన్ తో  ప్రారంభమైంది .కాని రామయ్యగారి బృందం ఇటీవలి సంవత్సరాలలోనే దీనిపై పరిశోధించి సాధించారు .’’వర్క్ ఎథిక్’’అయిన తన భర్తకు ఇది అసాధ్యమేమీకాదని రామయ్యగారి భార్య అన్నారు .తమ 51 ఏళ్ళ వైవాహిక జీవితం లో రామయ్యగారిని ఎప్పుడూ  సీరియస్ సైంటిస్ట్ గానే చూశానని భార్య శ్రీమతి కృష్ణ తెలియ జేశారు .రామయ్యగారు తెల్లవారుజామున 2 గంటలకే లేచి లాబరేటరికి వెడతారని ,పరిశోధనలకోసం ప్రపంచమంతా పర్యటిస్తారని ముఖ్యంగా జర్మనికి చాలా సార్లు వెళ్ళారని ,19 82 లో స్ప్రింగ్ సెమిస్టర్ అంతా అక్కడే గడిపారని గుర్తు చేసుకున్నారామే  .తమ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కనుక తానిప్పుడు భర్తతో రిసెర్చ్ ట్రిప్ లకు వెడుతున్నానన్నారు.ఈ ట్రిప్ లలో అనేక దేశాలు చూసే వీలు కలుగుతోందని   తనకు చాలా ఉత్తేజంగా ఉంటున్నాయని రామయ్యగారు పని అంటే తీవ్రమైన భావావేశం, అభిరుచి ఉన్నవారని అంటారు .

తమ ప్రాంతం లో సమావేశాలు జరిగినపుడు వచ్చేవారికి ఆతిధ్యం ఇవ్వటం తమ దంపతులకు ఎంతో ఇష్టంగా ఉంటుందని ,అలాగే ఇతర దేశాలలోనూ తమకు ఆత్మీయ ఆతిధ్యం లభిస్తుందని చెప్పారు  పాక్షిక రిటైర్మెంట్ లో ఉన్న 76 ఏళ్ళ ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్ ను ,   వా౦డర్ బిల్ట్ సహచరుడు హామిల్టన్ నూ కలిపి  ఈ యునివర్సిటి  నూతన మూలకా ఆవిష్కకరణకు  గాను ఆగస్ట్ లో జిమ్ కూపర్ ,డి .టేన్న్  లచేత ఘనంగా సత్కరి౦పజేసింది  .దీనితోపాటు ఇండియన్ అమెరికన్ సంఘమూ గుర్తించి సన్మా నించింది .ఇటీవలే ‘’ఇండియా దినోత్సవం ‘’నాడు నాష్ విల్ ఇండియన్ అసోసియేషన్ కూడా సత్కారం చేసింది . . ఆసందర్భంగా ఐ. .ఎ .యెన్ .ప్రెసిడెంట్ హెటేల్ మెహతా’’మాసమక్షం లో ఇంతగొప్ప సైంటిస్ట్ ఉన్నందుకు మేము అదృష్టవంతులం .ఇక్కడి భారతీయ సంతతి కి గర్వకారణం డా రామయ్య గారు .అతి సాధారణ౦ గా   ,నిరాడంబర౦తో మూర్తీభవించిన వినయ సౌజన్య సద్గుణ మూర్తి మత్వం తో  అందరి హృదయాలను ఆకర్షిస్తారు ,గెలుస్తారు ,స్పర్శిస్తారు ‘’అని శ్లాఘించారు      .       ఇండియన్ కమ్యూనిటి సీనియర్ సపోర్ట్  సర్వీసెస్ సంస్థ కూడా రామయ్యగారి కృషికి అభినందన సత్కారం చేసింది .ఐ .సి .ఎస్ .ఎస్ .ఎస్ .సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డా.ప్రమోద్ వాసుదేవ్ ‘’వృత్తిలో నిబద్ధత రామయ్యగారి సుగుణం .వృత్తికి ఎంతటి న్యాయం చేస్తారో మిగిలిన విషయాలలోనూ అలాగే ఉంటారు .పదేళ్ళ క్రితం తండ్రిగారు మరణిస్తే, కుటుంబ బాధ్యత తీసుకొని తమ్ముళ్ళ అభి వృద్ధికి కృషి చేశారు .తమ మనోభావాలకు తగిన అతి సాధారణ జీవితం గడుపుతూ ,వృత్తికీ, కుటుంబానికి అంకిత భావం తో సేవలందిస్తున్న సత్పురుషులు డా రామయ్య ‘’అని మెచ్చుకున్నారు .  తాము ఆవిష్కరించిన కొత్తమూలకం టేన్నేస్సిన్ అత్యంత అస్థిర మూలకం అయినందున ,పీరియాడిక్ టేబుల్ లో స్థిర అటామిక్ నంబర్ ఉన్న హీలియం ,ఆక్సిజన్ లాంటి మూలకాన్ని ఆవిష్కరించే  ప్రయత్నం లో ఉన్న నిర౦తర ప్రయోగ, పరిశోధన శీలి రామయ్యగారు .’’ఎంతకాలం లో కనుక్కోగలుగుతారు ‘’అని ప్రశ్నిస్తే , ‘’మరి కొన్నేళ్ళ లోనే ‘’అని   ఆశావహం గా బదులిచ్చారు .’’ఇలాంటి ఆవిష్కరణలకు నిర్దేశ కాలపరిమితి అంటూ ఉండదు .నేనూ నా బృందం 120 వ మూలకం  తయారు చేసే   ప్రయత్నం లో ఉన్నాం’.దీనికీ టైం టేబుల్ లేదు .ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది ‘’అన్నారు చిరునవ్వుతో.తాను ఇప్పుడు కొందరు గ్రాడ్యుయేట్ విద్యార్ధులతో కలిసి పని చేస్తున్నానని కానీ 2018 స్ప్రింగ్ సెమిస్టర్ తర్వాత పూర్తిగా రిటైరౌతానని తన మనో నిశ్చయాన్ని నిస్సంకోచంగా తెలిపారు  .మన దేశం రామయ్యగారు విదేశాలలో అద్భుతాలు సాదిస్తున్నదుకు గర్వపడదాం .వారు త్వరలో  కొత్తగా ఆవిష్కరించ బోయే మూలకం కోసం ఎదురు చూస్తూ స్వాగ తీద్దాం .’’లాంగ్ లివ్ డా .రామయ్య ‘’

ఆధారం –ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణగారు ఈ ఉదయమే మెయిల్ లో పంపిన ‘’‘’  Latest Periodic Table Element Found by Akunuri Ramayya-led Research Team Gets Name ‘’

అన్న అమెరికాలోని ‘’ఇండియా –వెస్ట్ ‘’పత్రికలో  ప్రచురింపబడిన ఆర్టికల్ . ఒక  భారతీయ ,ఆంద్ర  సైంటిస్ట్  అయిన డా. శ్రీ ఆకునూరి రామయ్య గారి  నూతన ఆవిష్కరణ  విషయాన్ని సరసభారతి సాహితీ బంధువులకు తెలియాలనే సదుద్దేశం తో  శ్రీ గోపాల కృష్ణ గారు పంపినదుకు  వారి సౌజన్యానికి ధన్యవాదాలతో కృతజ్ఞతలు .ఈ ఆర్టికల్ వారు పంపి ఉండక పొతే ,ఇంత అతి నూతన మూలకా విష్కరణ గురించి మనకెవ్వరికీ ఇంత త్వరగా, ఇంత విపులంగా తెలిసేదే కాదు . నాకూ ఇలాంటి ప్రతిభామూర్తి గురించి రాసే అదృష్టం కలిగినందుకు గర్వంగా ఉంది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రోజూ ఉదయం రెండుగంటలు మాత్రమే తెరచి ఉండే  శ్రీ వారాహి దేవి ఆలయం –వారణాసి

రోజూ ఉదయం రెండుగంటలు మాత్రమే తెరచి ఉండే  శ్రీ వారాహి దేవి ఆలయం –వారణాసి

కాశీ అంటే వారణాసి లో శ్రీ వారాహి దేవి అమ్మవారి ఆలయానికి  కొన్ని ప్రత్యేకతలున్నాయి .ఆలయం భూ గృహం లో ఉండటం ఒక విశేషం అయితే ,రోజూ ఉదయం 5-30  గంటలనుండి 7-30  గంటల వరకు  రెండు గంటలు  మాత్ర మే తెరచి ఉండటం మరొక విచిత్రం .తర్వాత పూర్తిగా మూసేస్తారు ..అమ్మవారిని సరాసరి చూసే వీలులేకపోవటం తలుపులకున్న రెండు రంధ్రాలనుంచి మాత్రమే  అమ్మవారిని దర్శించటం మరో వింత .ఒకదాని నుంచి చూస్తే దేవి పాదాలు ,మరో దాని నుంచి చూస్తే అమ్మవారి ముఖం కనిపించటం ఇంకో వింత .

కాశీ ఖండం లో వారాహీ దేవి గురించి ఉన్నది .’’వారాహీ  వీర్య వందితా ‘’అని లలితా సహస్రనామాలలో కూడా ఉన్నది .ఈమెను పూజిస్తే ఏరకమైన కస్టాలు నష్టాలు ఉండవని ఉంది కాశీ రాజు .రాజా దివోదాసు పాలనలో దుర్మార్గం పెచ్చుపెరిగినప్పుడు ,పరమశివుడు 64 మంది యోగినులకు కాశీకి పంపి కాశీని విధ్వంసం చేయమన్నాడు .అయితే వాళ్ళు కాశీ అంద చందాలకు ముగ్ధులై కాశీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకొన్నారు .వారిలోసర్వ శక్తి వంతురాలైన వారాహీ ఒకరు .సప్త మాతృకలలో ఒకరుగా ఆమెను భావిస్తారు .

కాశీలో మన్మ౦దిర్ ఘాట్ వద్ద వారాహీ దేవి ఆలయం ఉంది .దశాశ్వమేద విశ్వనాధ దేవాలయ గల్లీ లో కుడిప్రక్కకు తిరిగి సుమారు నూట యాభై గజాలు నడిస్తే వారాహీ దేవి దేవాలయం వస్తుంది .కోర్ట్ వ్యవాహారాలలో జయం ,లిటిగేషన్ నుండి బయటపడటానికి సర్వ విధాల విజయాలకోసం ఈ అమ్మవారిని భక్తులు ప్రార్ధించి పూజ చేస్తారు .ఉదయం మాత్రమే అమ్మవారికి హారతి ఇస్తారు. హారతిచ్చేసమయం లో తలుపులు మూసేస్తారు ఇది మరో విశేషం .భక్తులు లోపలుండి హారతి చూడచ్చు .తర్వాత అమ్మవారి దర్శనం ఉంటుంది తర్వాత గుడి మూసేస్తారు ..పూజారి తప్ప వేరెవరూ భూ గృహం లో ప్రవేశించారాదనే నియమం ఉంది .అమ్మవారు మహోగ్ర స్వరూపిణి .కనుక భయపడే ప్రమాదము౦ది .పూజారి అమ్మవారికి చేసే నిత్య పూజ తప్ప ప్రత్యేక పూజలంటూ ఉండనే ఉండవు .

వారాహేదేవి వరాహ రూపమైన  విష్ణు మూర్తి రూపం లో ఉంటుంది .విష్ణుదేవుని శక్తి స్వరూపమే వారాహీదేవి .తాంత్రిక గ్రంథాలలోఆమె తల తల్లి పంది రూపం లోఅంటే వరాహ రూపం లో  ఉంటుందనిఅందుకే వారాహీ అంటారని ,నాలుగు చేతులు౦ టాయని,ఎడమ పై చేతిలో హలంఅంటే  నాగలి ,కుడి పై చేతిలో ముసలం అంటే రోకలి ,కుడి కింద చేయి అభయముద్ర ,ఎడమ కింది చేయి వరద ముద్రతో ఉంటుందని వర్ణించాయి .వారాహీ దేవి శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారిఅంటే లలితా పరమేశ్వరి సర్వ  సైన్యాధ్యక్షురాలు .సర్వ శక్తి స్వరూపిణి కనుక ఆమె పూజ అపజయం కల్గించక సర్వదా  విజయకారకం .తమిళం లో ఒక సామెత ఉంది ‘’వారాహీ దేవి భక్తులతో తగాదా పెట్టుకోకు మసై పోతావు ‘’అని .ఆమెను అర్చిస్తే యుద్ధం లో తప్పక విజయం సిద్ధిస్తుందని రాజుల నమ్మకం .కనుక రాజులందరూ వచ్చి పూజించి వెళ్ళటం రివాజు .దీనికి నిదర్శనమే తంజావూర్ బృహదీశ్వరాలయ నిర్మాత  రాజ రాజ చోళుడు అమ్మవారి పరమభక్తుడు అవటం వలన ఏ యుద్ధం లోను అపజయం పొందలేదు .అతనేకాడు అతని వారసులూ వారాహీదేవి భక్తులే . త్రిభువనైక అఖిలా౦ డేశ్వరి అంటే వారాహీ దేవి .ఆమె ఉగ్ర రూపం తగ్గించటానికి ఆది శంకరాచార్యులవారు  అమ్మవారి రెండు చేవులకుశ్రీ చక్రాలు తయారుచేయించి అలంకరించారు .అయినా ఆమె ఉగ్రం పూర్తిగా తగ్గక పోయే సరికి ఆమె సన్నిధిలో ‘’ప్రసన్న గణపతి ‘’ని ప్రతిష్టించి కొంత శాంత పరచారు .కుమార గణపతి పై ప్రేమాభిమానాలు కురిపిస్తూ అమ్మవారు శాంతించింది .కనుక ఆలయం ఉదయ వేళలలో తెరచి ఉన్నప్పుడు ఆమె శాంత స్వరూపిణి అయిన అఖిలాండే శ్వరిగా దర్శనమిస్తుంది .ఆలయం మూసెయ్యగానే ఉగ్ర వారాహీ రూపం పొంది భయకంపితులనుచేస్తుంది .పూజారులుకూడా ఆలయం మూసి ఉన్నప్పుడు లోపల భయంకర శబ్దాలు  వినిపిస్తాయని  చెబుతారు .కనుక ఎవరూ సాహసించి దర్శన వేళలో తప్ప అమ్మవారిని చూడటానికి వెళ్లరు .

అమ్మవారిని ఇక్కడ ‘’పాతాళ వారాహీ దేవి ‘’అనికూడా పిలుస్తారు .అమ్మవారు యెంత భయంకర ఉగ్రరూపిణి అంటే ,ఒక సారి పూజారి మంత్రాలు తప్పుగా చదువుతుంటే అతడిని అమ్మవారు  అమాంతం  మింగేసింది అని కధనం .ఆలయ దర్శనవేళలు సూర్యోదయాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు ‘’.శ్రీమన్నగర వాసిని’’అని అమ్మవారిని ఆర్యా ద్విశతిలోవర్ణించారు .  కాశీనగర గ్రామ దేవతగా వారాహీదేవి ప్రసిద్ధి చెందింది.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-18 –ఉయ్యూరు

 

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లైట్  కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్  రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ

లైట్  కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్  రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ

ఒరిస్సా రాష్ట్రం బరం పురం లోతెలుగు  బ్రాహ్మణ కుటుంబం లో శ్రీ కోట హరినారాయణ 194 3లో జన్మించారు .బెనారస్ హిందూ యూని వర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులై ,బెంగుళూరు ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో చేరి ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు .బొంబాయి ఐ .ఐ .టి.లో పి.హెచ్ .డి .చేశారు .ఉన్నతవిద్య నంతా మనదేశం లోనే పూర్తి  చేసి దేశీయంగా ఎదిగిన ఉత్తమశ్రేణి శాస్త్రవేత్త శ్రీ హరి నారాయణగారు .

దేనికీ విదేశాలపై ఆధారపడరాదన్ననిశ్చల మనోరధమున్నవారు .1967 లో హిందూస్థాన్ ఏరో నాటికల్ లో ఉద్యోగం లో చేరారు .1970 రక్షణ పరిశోధన సంస్థ ‘’డి. ఆర్. డి .వో.కు బదిలీ అయి ,సుమారు 12 ఏళ్ళు అనేక కీలక పదవులలో రాణిస్తూ తనకిష్టమైన పరిశోధనలు చేస్తూ ఎదిగారు .1982 లో మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న హిందూస్థాన్ ఏరో నాటికల్ ( హెచ్. ఏ .ఎల్ )లో చీఫ్ డిజైనర్ గా గురుతర బాధ్యతలు చేబట్టారు .మిగ్ -21 విమాన ఆయుర్దాయాన్ని పెంచటం లో సఫలీ కృతులయ్యారు . అంతే కాక దాని సామర్ధ్యాన్ని పెంచి ,బరువు తగ్గించటం లో విజయం సాధించారు .దీనివల్ల మనదేశం మిగ్ -21 విమానాల విడిభాగాల ఉత్పత్తి చేసే సామర్ధ్యం సాధించి ప్రగతిపధం లో దూసుకు వెళ్ళింది .

డా నారాయణ 1985 లో బెంగుళూరు  ఏరో నాటికల్ డెవలప్ ఎస్టాబ్లిష్ మెంట్ లో డైరెక్టర్ అయ్యారు .అప్పటికే ఆయన లైట్ ఎయిర్ క్రాఫ్ట్ నిర్మాణం లో బహు పరిశోధనలు చేసి దాన్ని  ఎల్ .ఎ .సి .ప్రాజెక్ట్ నిర్మాణాన్ని  సాకారం  చేశారు .తన శక్తియుక్తులు సామర్ధ్యం ,సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలబోసి ‘’లైట్ కా౦బట్ ఏర్ క్రాఫ్ట్’’అంటే LCA అనగా తేలికపాటి యుద్ధ విమానం తయారు చేసే ప్రోగ్రాం డైరెక్టర్ అయ్యారు .ఎల్. సి.ఎ. విమానం తయారు చేసి విజయవంతంగా ఫ్లైట్ పరీక్షలు నిర్వహించారు .పరిమిత ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతించింది .హరి నారాయణగారి మేధో వికసనం వలన భారత దేశం తేలిక పాటి యుద్ధ విమాన ఉత్పత్తి లో ప్రపంచ దేశాల స్థాయిన నిలబడింది. ‘’హాట్స్ ఆఫ్ టు నారాయణ్ జీ’’.. ఈ ఘనత ఆయన సాధించినట్లు మనకు తెలియనే తెలియదు .

LC A విజయం తో ప్రముఖ శాస్త్ర వేత్తగా గుర్తింపుపొందిన హరి గారు దేశ గౌరవ ప్రతిష్టలకు అత్యున్నత స్థానం సాధించి పెట్టారు .ఆధునిక కాలం లో విజయాలకు యుద్ధ విమానాలే కీలక పాత్ర పోషిస్తాయని ఆయన నమ్మకం . నెహ్రూ కాలం లో మనదేశం చైనా యుద్ధంలో దారుణంగా ఓడిపోవటానికి కారణం శత్రువు పై ప్రయోగించే అత్యాధునిక ఆయుధ సామగ్రి మనకు లేకపోవటమే .తర్వాత పాకిస్తాన్ పై యుద్ధ విజయానికి మన యుద్ధ విమానాలే కీలకమయ్యాయి .వీటిని ఇతర దేశాలనుంచి కొని తెచ్చుకొంటే తడిసి మోపెడౌతుంది కనుక స్వదేశీ యుద్ధ విమానాలకే మొగ్గు చూపారు .అన్నిరకాల యుద్ధ విమానాల తయారీకి నడుం కట్టారు .దీనికి తగినట్లుగా స్పందించి కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలను మంజూరు చేసింది .

మొట్టమొదట బెంగుళూరు HAL లో ఏటా  8 LCA ల ఉత్పత్తికి ప్రణాళిక సిద్ధం చేసింది.నౌకాదళ తీర సంరక్షణలో కీలకం కనుక దానికి ఉపయోగ పడేట్లు ఒకే ఇంజన్ ఉన్న LCA లను కూడా తయారీ చేసింది వీటికి ”తేజస్” అని పెట్టారు . .ప్రపంచం లోనే ఇలాంటి వాటి తయారీలో  భారత దేశమే ముందుంది .దీనికి ముఖ్యకారణం తెలుగు బిడ్డ డా కోట హరినారాయణ గారు  అని మనం గర్వపడాలి .తేలిక యుద్ధ విమానాల తయారీ లో 300 పరిశ్రమలు ,40 విద్యా సంస్థలు ,ఎన్నో పరిశోధనా సంస్థల భాగస్వామ్యముంది .దాదాపు మూడు దశాబ్దాలవరకు LCA కు దీటైన యుద్ధ విమానం రాదు, రాలేదు, రాబోదు అని హరినారాయణ పాంచజన్యం పూరించి చెప్పినట్లు చెప్పారు .అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ,ప్రతిభ , పోరాట పటిమ ,నైపుణ్యం దృష్ట్యా ప్రపంచం లో దీన్ని’’ బీటౌట్ ‘’చేసే ‘’కాంబట్ ప్లేన్’’ లేదని అభిజ్నులంటారు .ఈ విజయం అంతసులువుగా లభించలేదు .అమెరికా పెట్టె ఎన్నో ఆంక్షలు ,రూపకల్పనలో అడ్డంకులు అధిగమించి,దీక్ష ,దక్షత , ముందుచూపు ,లక్ష్యసాధన , అంకితభావం లతో విజయ శిఖరాలకు చేరారు .అందుకే వీరికి 2002 లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది ‘.

దీనికి ముందే డా హరి గారికి DRDOవారి టెక్నాలజీ నేతృత్వ బహుమానం ,డా యలవర్తి నాయుడమ్మ అవార్డ్ ,శాస్త్ర సాంకేతిక రంగ రూప కల్పనకు ఇచ్చే  జి. డి .మోడీ. అవార్డ్( 20 06)  మొదలైన పురస్కారాలెన్నో పొందారు .ఏరో నాటికల్ ఇండియా లో దాని అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం సేవ చేసి ,20 02 లో అబ్దుల్ కలాం గారిలాగా  స్వచ్చంద పదవీ  విరమణ చేశారు.హైదరాబాద్ లో సెంట్రల్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా విద్యార్ధుల భవితవ్యాన్ని తీర్చి దిద్దుతూ, వారిని భవిషత్ శాస్త్ర వేత్తలుగా మలిచే ప్రయత్నం చేశారు  .లాక్(LCA) రూప శిల్పి అయిన  డా . హరినారాయణగారిని ‘’లాక్ మాన్ ‘’గా సంబోధిస్తారు .కలాం గారిని’’మిసైల్ మాన్ ‘’అన్నట్లే. ఇదికూడా సార్ధకం అయింది.నారాయణ గారి పరిశోధనలు LCA  కు మాత్రమె పరిమితం కాలేదు .ఏవియోనిక్స్ ,ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ మొదలైన అత్యాధునిక ఏరో నాటికల్ టెక్నాలజీ అభివృద్ధికి కూడా అనితరసాధ్యమైన కృషి చేశారు .భారత దేశపు మొదటి సూపర్ సానిక్ ఫైటర్ఏర్ క్రాఫ్ట్ సృష్టికర్త ,యుద్ధ విమాన నిర్మాణం లో భారత్ ను అగ్రదేశాల సరసన కూర్చో బెట్టిన ప్రతిభామూర్తి డా కోట హరినారాయణగారు .శ్రీ మన్నానారాయణుడైన  శ్రీహరికి సుదర్శన చక్రం అలంకారం శత్రు సంహార ఆయుధం అయినట్లు   ,డా  హరినారాయగారికి మిగ్ , లాక్ సూపర్ సానిక్ లు కీర్తికి అలంకారాలు , భారత దేశ భద్రతకు దివ్యాస్త్రాలు .,

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-10-8-18 –ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎవరీ చిత్రరథుడు?

ఎవరీ చిత్రరథుడు?

భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం  ఇవాళ పారాయణ చేస్తుంటే లో శ్రీ కృష్ణ పరమాత్మ తన విభూతులు ఎవరెవరిలో ఉన్నాయో వివరిస్తూ –

‘’ఆశ్వత్దః సర్వ వృక్షాణా౦ ,దేవర్షీ ణా౦ చ నారదః –గంధర్వాణా౦ చిత్ర రథః సిద్ధానాం కపిలో మునిః’’అని చెప్పిన 26 వ శ్లోకం   యధాలాపం గా వెళ్ళిపోయింది .తర్వాత చిత్రరథుడు ఎవర్రాబాబూ అని చిన్న ఫ్లాష్ ఆలోచన వచ్చింది . తెలుసుకొనే ప్రయత్నం చేసి, తెలిసింది తెలుసుకొన్నది మీము౦దు ఉంచే  ప్రయత్నం చేశా . .

మనం గీత ను పారాయణం చేస్తాం .మనవాళ్ళు కొందరు దానిలోని గొప్పతనాన్ని ఉపన్యాసాలలో వివరిస్తారు .దానిలోని ధర్మ సూక్షాలు తెలియ జేస్తారు .చదివే మనం కాని ,చెప్పే వాళ్ళు కాని శ్లోకం లో ఉన్న పేర్లలోని విశేషాల గురించి ఆలోచించం .తెలుసుకోవాలనే ధ్యాస జిజ్ఞాసా కూడా ఉండదు .ఇది లోక సహజం .ముక్కస్య ముక్కః గా ‘’పరమాత్మ ఏం చెప్పాడంటే వృక్షాలలో తాను అశ్వత్ధ వృక్షాన్నని ,దేవ మునులలో నారడదుడనని  గంధర్వ్వులలో చిత్ర రథుడ నని ,సిద్దులలో కపిల ముని నని చెప్పాడు .’’అనిముగిస్తాం .కనుక నాయనలారా అశ్వత్ధ వృక్షాన్ని ,నారదుడిని ,చిత్ర రథుడిని ,కపిల మహర్షి ని పూజిస్తే ఆయన్ను పూజించినట్లే అంటాం .రావి చెట్టు దేవాలయాలలో, గ్రామాలలో రచ్చబండ వద్ద ఉంటాయికనుక వాటికి పసుపు కుంకుమలు పెట్టి కాదుకాదు రుద్ది  వీలయితే కోరికలు తీరటానికి ఉట్లు కట్టి పూజిస్తాం .లేక అనంతపురం దగ్గరున్న ‘’విదురాశ్వత్ధం’’వెళ్లి చూసి ఆహో ఇక్కడే  విదురుడు ఈ చెట్టు కింద తపస్సు చేశాడని చెప్పుకొంటాం .పనిలో పనిగా లేపాక్షి వెళ్లి అక్కడి జగత్ప్రసిద్ద నందిని చూసి మురిసిపోతాం .అక్కడి వీరన్న విరూపాక్ష సోదరుల కధ తెలుసుకొంటాం .విరూపన్న కళ్ళను గోడకేసి కొట్టిన చోటు చూసి అయ్యో పాపం అనుకొంటాం .కాని శ్లోకం లో ఉన్న చిత్ర రథుడి గురించి పట్టించుకోం .ఎవరోలే ఎవరైతే నేమిలె అని ఉదాసీనం గా ఉంటాం .  కృష్ణ పరమాత్మ అతని పేరు చెప్పాడు అంటే అందులో ఏదో గొప్పతనం ఉండి ఉండాలి అన్న స్పృహ సహజంగా మనకు రాదు .నాకు తెలిసినంత వరకు తెలుసుకోన్నంత వరకు తెలియ జేస్తా .

  భారతం లో చిత్ర రధుని పాత్ర వస్తుంది .అతనికి అంగార పర్ణుడు అనే పేరుంది .గంధర్వ రాజు .కుబేరునికి పరమ మిత్రుడుకూడా .ద్రుపద నగరానికి పాండవులు వెడుతున్నప్పుడు ఒక రోజు రాత్రి ,అతడు తన స్త్రీలతో విహరిస్తుండగా వాళ్ల పాద ధ్వనిని  విని ‘’ఎవరుమీరు ?ఎక్కడికి వెడుతున్నారు ?’’ఇది నాకు చెందిన అడవి .నా అనుమతి లేకుండా నిస్సంకోచంగా రాత్రి వేళ సంచరిస్తున్నారు .ఈ అరణ్యం ,ఇక్కడున్న గంగానది  అంగార పర్ణుడివి  అని మీకు తెలియదా ‘’అనికోపం తో కేకలు వేస్తూ  అడిగాడు .అప్పుడు అర్జునుడు ‘’ఈ నదిలో ఎవరు స్నానం చేస్తే వాళ్ళది అవుతు౦ది కాని నీకుగుత్తాదిపత్యం కాదు .సముద్రం, నది, పర్వతాలు, అడవులు ఎవరో ఒక్కరికి చెందినవికావు .సమస్త జనులకు వాటిపై అనుభవించే హక్కు ఉంది .నువ్వు వద్దన్నమాత్రాన మేము వెనక్కి పోతామనుకొన్నావా ?.గంధర్వులంటే భయపడి శక్తిలేని సామాన్య  మానవులు  పూజిస్తారు కాని వీరులు కాదు . మమ్మల్ని అడ్డగించటానికి , ఆపటానికి నీకు హక్కులేదు .గంగానది దివిజగంగ .పాపాలను క్షాళనం చేస్తుంది .శాశ్వతమైనది .ఆపవిత్ర నదీమ తల్లి పై  హక్కు ఉందనటం మూర్ఖత్వం ‘’అని జవాబు ఘాటుగానే ఇచ్చాడు .

  తనను ఎదిరించే వాడువచ్చాడన్న కోపం అసూయతో వాడు అర్జునిపై బాణాలు వేసి గాయపర్చాడు .సర్పాస్త్రాన్ని వాడు సంధిస్తే ,అర్జునుడు కూడా వెనువెంటనే శర సంధానం చేసి వాడిని తీవ్రమైన బాణాలతో నొప్పించి అగ్ని అస్త్రం ప్రయోగించాడు .కొంత సేపు ఇద్దరిమధ్య భీకర పోరాటమే జరిగింది .’’శస్త్రాస్త్ర ప్రయోగం తెలిసిన వీరుడిపై  ,తెలియని అస్త్రాలు ప్రయోగించటం  తెలివి తక్కువ పని, వ్యర్ధం కూడా.అగ్ని తత్త్వం తెలుసుకోకుండా అంగార పర్ణుడు అనే పేరు పెట్టుకొని కులుకుతున్నావు .అంటే అగ్ని హోత్రునికే ద్రోహం చేస్తున్నావు కనుక నువ్వు శిక్షార్హుడవే ‘’అని  హెచ్చరించి  చెప్పాడు గాండీవి . కాని అంగారపర్ణుడు అర్జునుని ధాటికి నిలవలేక ఓడిపోయాడు . ఫల్గుణుడు ఆ గ౦ధర్వ ని జుట్టుపట్టుకొని ఈడ్చుకొంటూ అన్న ధర్మరాజు పాదాల చెంత పడేశాడు .ఇంతలో విషయం తెలిసిన అంగార పర్ణు ని భార్య గోడుగోడున విలపిస్తూ వచ్చి తనకు పతి భిక్ష పెట్టమని యుదిస్టిరుని వేడుకొన్నది  .ఆమె పై జాలిపడి ఆతడిని వదిలేయమని తమ్ముడికి చెప్పాడు .  అర్జునుని శౌర్య బలపరాక్రమాలు గ్రహించి మెచ్చుకొన్న అంగార పర్ణుడు ,అప్పటినుంచి తాను  అంగార పర్ణుడుగా పిలువబడనని,తన రధం చిత్ర గతులతో నడుస్తుంది కనక చిత్ర రధుడనే పేరు వచ్చిందని దాన్నికూడా అర్జునుడు ధ్వంసం చేశాడుకనుక ఆపేరూ ఇక ఉపయోగించుకోనని చెప్పాడు  . అర్జునునితో స్నేహం చేయాలని అభిలషించాడు .అంతేకాదు  పార్దుడికి ‘’చాక్షుషి ‘’అనే గ౦ధర్వ విద్య ఉపదేశించాడు . ఈ విద్యను ఇస్తూ అతడు ‘’ మనువు సోముడు అంటే చంద్రునికి బోధించాడు .సోముడు అంతరిక్ష దేవత .అగ్ని పృథ్వి దేవత .ఇంద్రుడు దేవతలకు అధిపతి .చంద్రుడు విశ్వావసు అనే గాంధర్వ రాజుకు ఉపదేశించాడు .విశ్వావసు  గంధర్వ  రాజు నైననాకు  ఆ విద్య నిచ్చాడు .చాక్షుషి విద్యవలన దివి ,భువి అంతరిక్షాలలో  దేన్ని  చూడాలనుకొంటే దాన్ని,  ఏ రూపం లో కావాలంటే ఆ రూపం లో చూడగలుగుతారు ..ఈ విద్య స్వాధీనం కావాలంటే ఆరునెలలు కఠోర అనుష్టానం చేయాలి  .ఈ విద్యవలననే మా గంధర్వులు మనుష్యులకంటే ఉత్తమజాతి వారయ్యారు .దేవతలకు సములయ్యారు .’’అని వివరించాడు .

  అతేకాడు చిత్ర రధుడు పాండవులకు ఒక్కొక్కరికి 100  వాజీ లు అనే ప్రత్యేక   గంధర్వలోకం లో ఉపయోగించే అశ్వాలను ఇచ్చాడు .వీటిని దేవగంధర్వ అశ్వాలు అంటారు .అత్యుత్తమ జాతి గుర్రాలివి .అవి కృశించినా, బలహీనమైనా వాటి వేగం ఏమాత్రమూ తగ్గదని చిత్రరథుడు చెప్పాడు . ఈ వాజీ లు  ఏరంగుకావాలంటే ఆ రంగును, యెంత వేగం కావాలంటే అంతవేగం పొందగల ప్రత్యేక లక్షణాలు  కల దివ్యాశ్వాలు  .యజమాని అనతరంగాన్ని అర్ధం చేసుకొని ప్రవర్తించే ప్రత్యేక లక్షణం వీటిది .గంధర్వులలో ఉత్తమ జాతి వారు  దేవతలతో సమానమైనవారు ,కొంచెం తక్కువజాతివారు సామాన్య మానవులతో సమానమై’’ నరులు ‘’అని పిలవబడుతారని చెప్పాడు.

  అర్జునుడు అతనికి కృతజ్ఞతలు చెప్పి తనకు చాక్షుషి విద్య , వాజీలు అవసరం లేదని చెప్పాడు .కాని అతడు తనకు ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞతగా తీసుకోవాల్సిందేనని బ్రతిమిలాడాడు .అర్జునుడు కూడా దీనికి బదులుగా తన అగ్ని అస్త్రాన్ని అతడిచ్చిన వాజీలకు బదులుగా ఇచ్చాడు .పాండుకుమారుల జన్మ రహస్యాలు తనకు తెలుసునని ,వారు యమ ,ఇంద్ర వాయు అశ్వినీ దేవతల వర జన్ములని ,వారి పౌరుష పరాక్రమాలూ తనకు అవగతమేనని చెప్పాడు .గంధర్వులకు రాత్రివేళ పరాక్రమం ఎక్కువ అని ,అర్జునుని బ్రహ్మ చర్యం,ధర్మ వర్తనం  వలననే తాను అతని చేతిలో ఓడిపోయానని అన్నాడు .అర్జునుని మాటిమాటికీ ‘’తాపత్యా ‘’అని సంబోధిస్తుంటే ఎందుకు అలా అంటున్నావో చెప్పమని అడిగాడు .అప్పుడు అతడు ‘’దేవలోకం లో తపతి సౌందర్య రాశి .ఆమె చిన్నతనం లోనే ఆమెను వివాహమాడాలని దేవ గాంధర్వ యక్ష రాక్షసులు  ఉవ్విళ్ళూ రారు .యుక్త వయసు రానిదే పెళ్లి చేయనని తండ్రి వివస్వుడు అన్నాడు .సంవర్ణు డు అనే అందమైన వినయవిదేయతలు ధర్మపాలన ఉన్న యువ  మహారాజు తనకూతురుకు తగిన వరుడు అని నిశ్చయించాడు .అతడు క్షత్రియ కన్యకు బ్రాహ్మణుడికి జన్మించాడు .క్షత్రియ విద్యలలో ఆరితేరినవాడు .నర్మదానదికి ఉత్తర ,దక్షిణభాగాలన్నీ అతని ఏలుబడి ఉన్నాయి .ఒక రోజు వనవిహారం లో తపతి కన బడి అతని మనసు లాగేసింది .ఎవరు నువ్వు అని అడిగేలోపు సిగ్గుతో అదృశ్యమైంది .మళ్ళీకనబడితే గాంధర్వ వివాహం చేసుకొందామని అంటే ఆమె తాను తండ్రి సంరక్షణలో ఉన్నానని ఆయన అనుమతి అవసరమని చెప్పింది .

  తపతిపై గాఢ ప్రేమలో పడి ,అదే ధ్యాసగా ఉన్న అతడిని వశిస్టమహర్షి కలిసి ఉపాయంగా తపతిని అతనికి పెళ్లి చేసి రాజ్యపాలన మంత్రికి అప్పగింప జేసి , నర్మదానది పర్వతాలలపై విహరి౦చమన్నాడు .కాని రాజ్యం లో 12 ఏళ్ళు వర్షాలు లేక కరువుకాటకాలేర్పడ్డాయి ..అప్పుడు మహర్షి ,నూతన  దంపతులను రాజ్యానికి రమ్మని కోరాడు .వారురావటం తో వర్షాలు కురిసి భువి సస్య  శ్యామలమైంది .సంవర్ణ ,తపతుల కుమారుడే  కురు అంటే మీ వంశ పూర్వీకుడు .అందుకే నిన్ను  తాపత్యా అన్నాను  ‘’అని వివరంగా చెప్పాడు అర్జునునికి చిత్ర రధుడు .తన పూర్వీకుని వృత్తాంతం సవిస్తరంగా తెలియ జేసినందుకు  కృతజ్ఞత తెలిపాడు .

   చిత్ర రథుడు ధర్మరాజుతో లోక హితము ,ధర్మ సూక్ష్మాలు తెలియ జెప్పే పురోహితుని ఏర్పాటు  చేసుకో మని సూచించాడు .అలాంటి వారెవరున్నారని అడిగితే ‘’ధౌమ్యుడు ‘’ఉత్తమజాతిబ్రాహ్మణుడ ని ఆయనను పురోహితునిగా చేసుకోమని సలహా ఇచ్చాడు .కనుక సకల ధర్మ శాస్త్రాలు తెలిసిన నీతి కోవిదుడు గా చిత్ర రధుడు మనకు కన్పిస్తాడు .గ౦ధర్వ రాజులలో ఇంతటి బుద్ధి  సూక్ష్మత ఉన్న వారులేరు .కనుకనే  శ్రీ కృష్ణుడు ‘’గంధర్వాణా౦ చిత్రరదః ‘’అని నొక్కి వక్కాణించాడు .’’ఇంట లెక్ట్’’  ఎక్కడ ఉంటే పరమాత్మ అక్కడ ఉంటాడుకదా .

  రామాయణం లో ఒక చిత్ర రథుడున్నాడు .ఈయన దివి రథుని కుమారుడు .ధర్మ రధుని పుత్రుడు .ఇతని మొదటి పేరు చిత్రరథుడు .అంగ దేశ రాజు .ఇతడినే రోమపాదుడు అంటారు దశరధమహారాజుకు మంచి మిత్రుడు .దశరధుడు తనకూతురు శాంతను రోమపాదునికిచ్చి వివాహం చేశాడు .చాలాకాల౦  సంతానం లేకపోవటం తో దానధర్మాలు విరివిగా చేశాడు భార్యతోకలిసి .ఒకసారి ఒక బ్రాహ్మణుడు  దానం పుచ్చుకొని, ఇంటికి వెళ్లి కొడుకును కూడా తెచ్చి అతడికి ఆవును దానం ఇమ్మని కోరాడు. బ్రాహ్మణుడి ఆశాపాతాన్ని చూసి రోమపాదుడు నవ్వగా ఆయన రాజ్యంలో అనావృస్టి కలగాలని శపించాడు .బ్రాహ్మణ అవమానానికి విప్రులు దేశంవదిలి వెళ్ళిపోయారు . అంగ దేశం అనా వృష్టి తో కుంగిపోయింది .ఏరకమైన కల్మష కాపట్యాలు  లేని బ్రహ్మచారి అయిన ఋష్యశృంగుడు వస్తేనే వర్షాలు పడతాయని గ్రహించి ఆయన్ను తీసుకురావటానికి వేశ్యలను పంపాడు .ఆడవాళ్ళు అనే వారు ఉంటారని అస్సలు తెలియని ఆయన ,వాళ్ల ఆకర్షణకు లోనై  వాళ్ళతో వెళ్ళగా   సు వృష్టి కురిసి  పంటలుబాగా పండి కరువు నశించింది .రోమపాదుడికి సంతానం కలగటానికి ఋష్యశృంగుడు ఇంద్రుని గూర్చి ఇష్టి నిర్వహించాడు .చతురంగుడు అనే కుమారుడు పుట్టాడు .

  కురు కుమారులలో ఒక చిత్ర రథుడున్నాడు .అంగరాజు. చిత్ర రధుని భార్య ,దేవ శర్మ అనే బ్రాహ్మణుడి భార్య అక్కా చెల్లెళ్ళు .మరో చిత్రరథుడు లక్ష మంది భార్యలున్న ఒక రాజు శశి బిందుని కొడుకు .ఒక్కోపెళ్ళానికి అనేకమంది కొడుకులు .

  ఇందరిలో చుక్కల్లో చంద్రుడు అర్జునునికి చాక్షుషి  విద్యనూ వాజీ లను ఇచ్చిన అంగార పర్ణ చిత్ర రధుడే  మనకు కావలసినవాడు కదా .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చర్మ విజ్ఞాన శాస్త్ర నిపుణులు –డా .యలవర్తి నాయుడమ్మ

చర్మ విజ్ఞాన శాస్త్ర నిపుణులు –డా .యలవర్తి నాయుడమ్మ

10-9-19 22 గుంటూరు జిల్లా తెనాలి తాలూకా యలవర్రు లో రైతు కుటుంబం లో జన్మించిన యలవర్తి నాయుడమ్మ ,అక్కడే ప్రాధమిక విద్య నేర్చి ,గుంటూరు ఎ .సి .కాలేజిలో ఇంటర్ చదివి ,19 43 లో బెనారస్ హిందూ యూని వర్సి టిలో బి .ఎస్ .సి .డిగ్రీ పొంది ,మద్రాస్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ లో చేరి ,సునుశిత మేదావి అవటం తో ఆ సంస్థ ఆయన్ను లెదర్ టెక్నాలజిలో పరిశోధనలకోసం బ్రిటన్ పంపింది .అక్కడి అధ్యయనం పూర్తయ్యాక అమెరికాలో లీహై యూని వర్సిటి లో అంతర్జాతీయ చర్మ శుద్ధి అంశం పై డాక్టరేట్ అయ్యారు .అక్కడే చర్మ శుద్ధి పై వివిధ పరిశోధనలు చేసి  1943 లో మద్రాస్ వచ్చి ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ లో సైంటిస్ట్ గా చేరి ,రెండేళ్ళు పనిచేసి మళ్ళీ అమెరికా వెళ్లి లోగడ తాను చేసిన పరిశోధనలకు మెరుగులు దిద్దారు .1951 లో ఇండియావచ్చి సెంట్రల్ లెదర్ రిసెర్చ్ యూని వర్సిటిలో సైంటిస్ట్ అయ్యారు .ఎన్నో ప్రణాలికలు రూపొందించి చర్మకార పరిశ్రమ అభి వృద్ధికి విశేష కృషి చేసి ,కేంద్ర చర్మ పరిశోధకాభివృద్ధి ,కి  సంస్థను సాటిలేని మేటి సంస్థగా తీర్చి దిద్దారు .1956 లో దీనికి డైరెక్టర్ అయ్యారు .జాతీయ స్థాయిలో ఈ సంస్థ ఎదిగి పారిశ్రామిక ,గ్రామీణాభి వృద్ధి సంస్థగా గణనీయై మైన సేవలందించింది .ప్రొఫెసర్ నాయుడమ్మ ఖ్యాతి దేశ విదేశాలలో మారు మోగింది .

నాయుడమ్మ  సామర్ధ్యానికి  తగిన హోదాలెన్నో పొందారు .కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రి యల్ రిసెర్చ్ సంస్థకు 19 71 -77 వరకు డైరెక్టర్ జనరల్ అయ్యారు .1981 లో ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా ,మద్రాస్ యూని వర్సిటి ఆనరరి ప్రొఫెసర్ గా ,సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ కు  డిస్టి౦గ్వి ష్డ్ సైంటిస్ట్ గా సేవలందించారు .చర్మ పరిశోధనలోనేకాకుండా ఖనిజాలు వృక్షాలు ఆల్డే హైడ్స్ మొదలైన వాటి కలయిక ,నిర్మాణ శైలి లలోనూ విశేష పరిశోధనలు గావించారు ,ఇవన్నీ తోళ్ళను   పదును చేయటానికి కొత్త ఏజెంట్స్ గా పనికొస్తాయని రుఉజువు చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు .’’జన్మ చేత రైతును ,వృత్తి చేత  అస్ప్రు శ్యు డను’’అని డా నాయుడమ్మ తనపై తాను జోక్ వేసుకొన్నారు .ఆయనవలన మన చర్మ కార వస్తువులకు అంతర్జాతీయ ప్రమాణం ,నాణ్యత గిరాకీ హెచ్చింది .

అలీన దేశాలకు ,ఇతర దేశాలకు మధ్య స్నేహ వారధిగా నాయుడమ్మ విఖ్యాతి గాంచారు .మద్రాస్ CRRIలో వివిధ ప్రయోగాలకుకావలసిన  లేబరేటరీల రూపకల్పనకు ప్రణాలికలు తయారు చేసి ,డిజైన్ ల రూప కల్పన చేశారు .ఆ సంస్థ పేరు  చెబితే  ఎవరికైనా నాయుడమ్మ గుర్తుకొస్తారు .దాని సర్వతోముఖాభివృద్ధికి అహరహం శ్రమించిన విజ్ఞాని .అత్యాధునిక శైలిలో తోళ్ళ పదును ,శుద్ధి కి పైలట్ ప్లాంట్ లనుమొదటి సారిగా జాతీయ స్థాయిలో  నెలకొల్పటం లో దోహదపడ్డారు .సమాచారం అందరికి అందుబాటులో ఉండాలని భావించి ‘’లెదర్ సైన్స్ ‘’పత్రిక స్థాపించి సంపాదకులైనారు .

నాయుడమ్మగారి సునిశిత మేధా శక్తి గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు గా నియమించి గౌరవించారు .తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులుకూడా అయన నే కొనసాగించారు .తమిళనాడు  ప్రభుత్వానికీ గౌరవ సలహాదారయ్యారు .1977 ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమి ,ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ఇండియన్ స్టాండర్డ్ ఇన్ స్టి ట్యూట్ సంస్థల  ఫెలోషిప్ పొంది,పరిశోధనలో సాటి లేని వారనిపించుకొన్నారు .మనదేశం లోనే విదేశాలలోని సంస్థలూ ఆయనకు విశేష గౌరవాన్నిచ్చాయి .అమెరికన్ లెదర్ కేమిస్ట్స్అసోసియేషన్ ,ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ లెదర్ ట్రేడ్ కేమిస్ట్స్  మొదలైన  సంస్థలు  గౌరవ సభ్యుని చేసి గౌరవించాయి .అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ కెమికల్ సొసైటీ ,ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ కేమిస్త్స్ కు అధ్యక్షులు .అంతర్జాతీయంగా ఇంతటి ఘనకీర్తి సాధించినా ,సభలు , సమావేశాలలో ‘’నాపేరు నాయుడమ్మ అంటారండీ  ‘’అని అత్యంత వినయంగా కొత్తవారితో పరి చయం చేసుకొనేవారు .నిరాడంబరత ,వినయ విధేయతలు సునిసిత మేధా శక్తి ఆయన ప్రత్యేకతలు  ఐరాస సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకుని దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు.

మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు సైన్స్ ,టెక్నాలజీ లను ఉపయోగించి వెనుకబడిన జిల్లాలను దత్తత తీసుకొని అభి వృద్ధి చేయటానికి కృషి చేసి సత్ఫలితాలు సాధించారు .1965 లో గుజరాత్ లోని వడోదర లో ఉన్న ఎం .ఎస్ .యూని వర్సిటి వారు డాక్టర్ కే .జి  నాయక్ గోల్డ్ మెడల్ ఇచ్చి సత్కరించింది .1971 లో కేంద్ర ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందజేసింది .ఇంగ్లీష్ లో రమణీయంగా ,తెలుగు లో కమ్మగా తియ్యగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత .నాయుడమ్మ గారికి కళా పిపాస బాగా ఉండేది .ఎన్టి రామారావు హీరోగా ఎస్. డి .లాల్ డైరెక్టర్ గా తీసిన ‘’రాజపుత్ర రహస్యం ‘’జానపద చిత్రానికి నాయుడమ్మగారు నిర్మాత .ఇందులో మనిషి ఏ ప్రాంతం లో పెరిగితే ఆ భాష మాత్రమే మాట్లాడుతాడు ‘’అనే వైజ్ఞానిక సత్యాన్ని ఆవిష్కరించారు .అలాగే దీనిలో  హీరో చిన్నతనం లో అడవి జంతువుల సహవాసం లో పెరిగినప్పుడు కేవలం సైగలే చేస్తూంటాడు .తరువాత జనారణ్యం లోకి వచ్చాక మాటలు నేర్చుకొంటాడు .

1985 జూన్ 23 మాంట్రియాల్ లో జరిగే సదస్సులో పాల్గొని ఇండియారావటానికి లండన్   ‘’కనిష్క ‘’ విమానం ఎక్కగా  అది పేలిపోయి డా నాయుడమ్మ దుర్మరణం పాలయ్యారు .ఆయనతోపాటు 331 మంది నిర్దాక్షిణ్యంగా చంపి వేసింది ఒక నరహంతకుల ముఠా అని విచారణచేసిన దర్యాప్తు  సంస్థ 20 05 మార్చి మూడవ వారం లో   తీర్పు నిచ్చింది ఈ తీర్పు చరిత్రలోనే అసమర్ధపు, నిరాశాజనక దర్యాప్తుగా ప్రసిద్ధి చెందింది .నాయుడమ్మగారి కుమారుడు శ్రీ రతీష్ నాయుడమ్మ ఈ తీర్పుపట్ల ఆవేదన వ్యక్తపరచారు .కనిష్క పేల్చివేతలో ముద్దాయిలను నిర్దోషులుగా బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అన్యాయం అని లోకమంతా కోడై కూసింది .భారత ప్రభుత్వమూ ఉదాసీనతగా  వ్యవహరించింది .కిరాతక ,అమానుష చర్యకు ఎందరో బలయ్యారు .భారత దేశం,ఆంధ్రరాష్ట్రం  ఒక అంతర్జాతీయ మేధావి సైంటిస్ట్ విలువైన జీవితాన్ని కోల్పోయింది .

2006 జూన్ 23 హైదరాబాద్ లో ఆంద్ర ప్రదేశ్ సైన్స్ అకాడెమి ఆధ్వర్యం లో జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్తహలో ప్రొఫెసర్ నాయుడమ్మ స్మారక సభ జరిగింది .శాస్త్ర రంగం లో విశేష కృషి చేసి ,ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ డా, జి త్యాగరాజన్ కు ‘’నాయుడమ్మ స్మారక స్వర్ణ పతకం ‘’బహూకరించారు .నాటి ఆర్ధికమంత్రి శ్రీ రోశయ్య ,నాయుడమ్మ గారు సాధించిన విషయాలపై కేంద్రం ఒక డాక్యుమెంటరి ఫిలిం రూపొందించాలని కోరారు

డా. యలవర్తి నాయుడమ్మ మెమొరియల్ అవార్డ్

తెనాలి లో 1986 లో ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.వై నాయుడమ్మ సంస్మరణార్థం స్థాపించిన అవార్డును సైన్స్, టెక్నాలజీ, రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ప్రతి సంవత్సరం అందిస్తున్నారు.

ఈ అవార్డ్ పొందిన ప్రముఖులు టి.రామస్వామిఎ శివతాను పిళ్ళైనోరి దత్తాత్రేయుడుశామ్ పిట్రోడాజి. మాధవన్ నయర్కోట హరినారాయణవి.కె. ఆత్రెఆర్. చిదంబరంఆర్.ఎ. మశేల్కర్ జె.ఎస్. బజాజ్కె. కస్తూరిరంగన్వెర్ఘీస్ కురిఎన్ఎస్.జెడ్. ఖసింఎం.జి. కె.మీనన్ మరియు ఎం.ఎస్. స్వామినాథన్ వి.కె. సరస్వత్ (2009) తదీతరులు…

.19 90 లో  అవార్డ్ గ్రహీత –శ్రీ ఏం జి కే మీనన్ .20 05 లో యూని వర్సిటి ఆఫ్ కొలరాడో ఫెలో ప్రొఫెసర్ బెర్నార్డ్ అమడైకు ,20 06 లో భారత టెలికాం విప్లవ శిల్పి శ్యాం పెట్రోడాకు  అంద జేశారు .

“సామాన్య మానవుని కోనం విజ్ఞాన శాస్త్రం” అనే ఉత్తమ సదాశయాన్ని ఆచరణలోకి తెచ్చిన ఉదాత్తుడైన నాయుడమ్మ గొప్ప వైజ్ఞానికుడు, విద్యావేత్త, చదువులు ముగించుకొని ఉద్యోగాలలో ప్రవేశించిన తర్వాత కాస్త మంచి జీతమే వస్తుందనుకోగానే సంవత్సరములో ఒక నెలజీతం అందుబాటులో ఉన్న పేద విద్యార్థులకు కేటాయించారు. ఈ సహాయమును దానంగా పరిగణించనూలేదు. తాను సహకరిస్తున్నట్లుగా అన్యులెవరికీ తెలియకుండా గుప్తంగా అందిస్తూ వచ్చారు.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యోగి నివృత్తి నాధుడు

యోగి నివృత్తి నాధుడు

నాధ సంప్రదాయానికి చెందిన నివృత్తి నాధుడు 13 వ శతాబ్దపు మహారాష్ట్ర కు చెందిన మహా భక్తుడు,కవి ,తత్వవేత్త మహాయోగి .మొదటి వర్కారి సంత్ అయిన సంత్ జ్ఞానేశ్వర్ కు పెద్దన్నయ్య , గురువుకూడా .మహారాష్ట్ర  గోదావరీ తీరం లోని  పైఠాన్ దగ్గరున్న ఆపెగావ్ లో దేశస్థ బ్రాహ్మణ  కుటుంబం లో జన్మించాడు .అప్పుడు ఆ ప్రాంతాన్ని మహారాష్ట్ర యాదవ  రాజు  రామదేవ వర్మ పాలిస్తున్నాడు .

గ్రామ కరణం అయిన తండ్రి విఠల్ పంత్ కు  జన్మించిన నలుగురు సంతానం లో  నివృత్తి నాథుడు పెద్దవాడు.  తల్లి  రుక్మిణి  బాయ్ . .నివృత్తి నాథుని తర్వాత జ్ఞానేశ్వరుడు ,సోపాన్ దేవుడు , అనే కుమారులు ,ముక్తాబాయ్ అనే కుమార్తె ఆ దంపతులకు జన్మించారు . .

నివృత్తి నాథుడు  పదేళ్ళ వయసులో  ముక్తాబాయ్ నాలుగేళ్ల వయసు లో  ఉండగా తండ్రి  కుటుంబాన్ని నాసిక్ కు మార్చాడు. ఒక సారి కుటుంబం తో  జ్యోతిర్లి౦గ మైన త్ర్యంబకేశ్వరుని దర్శించటానికి  తీర్ధ యాత్ర చేస్తూ దట్టమైన అరణ్యం లో ప్రయాణిస్తుండగా  అకస్మాత్తుగా ఒక పెద్ద పులి బారిన కుటుంబమంతా పడింది .భయపడి ప్రాణాలు దక్కించుకోవటానికి పారి పోయారు .అదృష్ట వశాత్తు ఎవ్వరికీ ఏ ప్రమాదమూ జరగలేదుకాని నివృత్తి నాథుడు మాత్రం కుటుంబానికి దూరమయ్యాడు .తండ్రి అతనికోసం చాలా కాలం వెతికించాడు కాని జాడ తెలియలేదు .అతడు అంజని పర్వతం పైకి చేరి అక్కడ గుహలో తలదాచుకున్నాడు .అక్కడే గహాని నాథ్ అనే యోగి తపస్సమాధిలో ఉండటం గమనించాడు .  ఆయన  సమాధి నుంచి బయటకు రాగానే ఆయన పాదాలపై వాలి శరణు కోరాడు . ఆయన ‘’సంతోషం ,చివరికి నువ్వు ఇక్కడికి వచ్చావన్నమాట ‘’అన్నాడు.  ఆయన  అన్నమాటలు అర్ధం కాలేదు .ఆశ్చర్యం తో చూస్తున్నాడు .’’ఆడవి లోకి పులిని పంపింది నేనే .నువ్వు ఇక్కడికి వస్తావని ఈ గుహలో ఎదురు చూస్తున్నాను ‘’అంటూ ఆప్యాయంగా హత్తుకొని శిరసుపై హస్తం ఉంచి  ఆశీర్వ దించాడు . అలనాడు శంకర  భాగవత్పాదులకోసం గోవింద భగవత్పాదులు ,,వివేకానందుని కోసం రామ కృష్ణ పరమహంస ఎదురు చూసిన సంగతి మనకు తెలుసు .నివృత్తి నాదుని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలిగి ఆయన మహాగురువు గహనీనాథు లని గ్రహించాడు .గురువు అతనిని శిష్యునిగా స్వీకరించి నాథ సంప్రదాయం లో చేర్చుకున్నాడు .గహనీ నాథమహాయోగి శిష్యుడు నివృత్తి నాదుని పై సంపూర్ణ అనుగ్రహామృతాన్నివర్షించి , ఆత్మజ్ఞానం పొందిన మహాత్మునిగా యోగి మహారాజ్ గా  మలచాడు .అతని జీవిత ధ్యేయం  కర్తవ్య౦ బోధించాడు .గురువును వదిలి పెట్టటానికి శిష్యుడు అంగీకరించలేక తపించి పోయాడు .ఉన్నట్టుండి ఒక రోజు గురుమహరాజ్ అక్కడి నుండి అదృశ్యమయ్యాడు . .ఇప్పుడు నివృత్తి నాథుడు  సంపూర్ణ  ఆత్మజ్ఞానం పొందిన  నాథ గురువై పూర్ణ యోగి యై జ్ఞాన బోధ చేస్తూ లోకానికి మార్గ దర్శనం చేశాడు . ,

గుర్వాజ్న నెరవేర్చటానికి అక్కడనుండి బయల్దేరి  నివృత్తి నాథుడు దేశ సంచారం చేస్తూ నాద సంప్రదాయాన్ని వ్యాప్తి చేస్తూ  కుటుంబాన్ని కలిసి  జ్ఞానేశ్వర్ ను  కూడా నాథ సంప్రదాయం లో చేర్చి గురువయ్యాడు .నాథసంప్రదాయం అంతా గురు శిష్య సంబంధం పై నడుస్తుంది .జ్ఞానేశ్వర్ కున్న అపూర్వ జ్ఞానం , భక్తి  ,మేధస్సు, అతీ౦ద్రియ శక్తి , అనుభవాలను  గుర్తించి అన్నగారు అతనిని వేదాంత విషయాలపై మంచి గ్రంథం రాయమని కోరాడు . అన్న కోరికపై సంత్ జ్ఞానేశ్వర్ ‘’అమృతానుభవం ‘’గ్రంథం అతని చిన్నవయసులోనే రచించాడు .దీనికి విశేషమైన కీర్తి ,ఆదరణ లభించాయి .భగవద్గీతపై వ్యాఖ్యానంగా ‘’జ్ఞానేశ్వరి ‘’రాశాడు .ఇదీ అద్భుతమైన గ్రంథమే. అమృతానుభవం రాశాక ,యోగి మహారాజ్ జ్ఞానేశ్వర్ పండరి పురం వెళ్లి పాండురంగని దర్శించి అక్కడే ఉన్న భక్త శిఖామణి నామ దేవుని పరిచయభాగ్యం పొందాడు .అనేక ప్రాంతాలు తిరుగుతూ వర్కారి సంప్రదాయ వ్యాప్తి చేశాడు .జ్ఞానేశ్వర్ నామదేవ్ ల మహాత్మ్యాలను జనం కథలు గాథలుగా చెప్పుకొంటారు .అలందిలో ఉన్నాడు .

తమ్ముడు సంత్ జ్ఞానేశ్వర్ ‘’ అలంది’’ లో సమాధి చెందిన తర్వాత, సంత్ నివృత్తి నాథుడు చెల్లెలు ముక్తాబాయ్ తో కలిసి అలంది ని విడిచి తీర్ధ యాత్రకు వెళ్ళాడు .ముక్తాబాయ్ చిన్నన్న సోపాన దేవ్ కు గురువై  ఆత్మజ్ఞానం బోధించి అనేక అభంగాలు రాసి కీర్తి గడించింది .సోపాన్ దేవ్ మరాఠీ.భగవద్గీత ఆధారం గా ‘’సోపాన్ దేవి ‘’తో పాటు సుమారు 50 అభంగాలు రాశాడు .పూనా వద్ద సస్వద్ లో సమాధి పొందాడు .ఒకనాటి తుఫాను ఉరుములు మెరుపులు జడి వాన లో ముక్తాబాయ్ దారి తప్పి పోయింది .అలంది లో నిర్యాణం చెందింది .నివృత్తి నాథుడు త్రయంబకేశ్వరం వద్ద మహా సమాధి చెందాడు .సమాధిపై గొప్ప ఆలయాన్ని తర్వాత నిర్మించారు .వేలాది భక్తులు నాథ సంప్రదాయం వారు సందర్శించి స్పూర్తి పొందుతూ ఉంటారు .మొత్తం మీద నివృత్తి నాథుని కుటుంబం వారంతా మహా జ్ఞానసంపన్నులై ,భక్తిజ్ఞాన వైరాగ్య మార్గ దర్శులై నారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-8-18 –ఉయ్యూరు

 


 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు .

సరసభారతికి, నాకు అత్యంత  ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణగారి డాక్టర్ బావగారు ,ఆయన అక్కగారు డా శ్రీమతి అన్నపూర్ణ గారి భర్తగారు ,’’లంపెన్ ప్రోలి టేరియట్’’ కథా శిల్పి శ్రీ రావి శాస్త్రిగారి తమ్ములు౦ గారు అయిన ,  డా శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఎం.డి. గారు .నేను రాసి,  మైనేనిగారు స్పాన్సర్ చేసి ,సరసభారతి   ప్రచురించిన ‘’పూర్వాంగ్లకవుల ముచ్చట్లు ‘’ను 90 వ జన్మ దినోత్సవం 28-8-14  నాడు  అంకితం అందుకున్న ఆంగ్లాంధ్ర కవిత్వ సవ్య సాచి .’’విశాఖ అందానికి  ఏరాడ కొండ  సాహిత్యానికి రాచకొండ ‘’అని లబ్ధ ప్రతిస్టులైన వారు  యవ్వనం లో పట్టిన కాలాన్ని 95 వ ఏట కూడా దించని సాహితీ భిషగ్వరులు ..ఇప్పటికే ‘’సంధ్యా రాగం ‘’ ‘’అయితే ‘’అనురాగాలు –ఆత్మీయతలు ‘’వగైరా వండి  వడ్డించిన కవి .రావి శాస్త్రి కథలకు ఆంగ్లానువాదం చేసిన నేర్పరి .ఇప్పుడు తాజాగా తమ 95 వ జన్మ దినోత్సవ కానుకగా ఆంగ్లం లో విశిస్టకవి రాబర్ట్ బ్రౌనింగ్ భార్య ,ఆయనకంటే ప్రసిద్ధ కవయిత్రి  ‘’ఎలిజబెత్ బెరెట్ బ్రౌనింగ్ ‘’రాసిన పోస్ట్ చెయ్యని ఉత్తరాలవంటి ప్రేమలేఖల లాంటి 44 సానెట్ లను శర్మగారు  తమ అనుభావాన్ని , విద్వత్తును ,తమకున్న ప్రేమ లోతులను కలిపి త్రివేణీ సంగమంగా అనువదించి పుస్తక రూపం తెచ్చి  నాకు ఆత్మీయంగా పంపగా ఇవాళ ఉదయం 11 గంటలకు పోస్ట్ లో చేరింది .అందిందని వారికి తెలియజేద్దామని వారి ఫోన్ ,సెల్ లకు ఫోన్ చేశాను .కాని వారు ఎత్తలేదు . భోజనం చేశాక ఆ పుస్తకం చదివేసి అందులోని మేలిమి ముత్యాలను మీకు తెలియ జేద్దామని కూర్చున్నాను .ఈ పుస్తకాన్ని శర్మగారు ‘’ద్వాదశ భాషా ప్రవీణ ,మేధావి ,సహృదయ గురు తుల్యులు ,వదాన్యులు ,ఇందులోని 20 సోనెట్ ల పరిష్కర్త  బ్రహ్మశ్రీ కోట సుందర రామ శర్మ గారి దివ్య స్మృతిగా  అంకితమిచ్చారు .ఈ పుస్తకం పై’’అవతరణిక ‘’పేరిట విపుల సమీక్ష చేశారు ఆచార్య సార్వభౌమ డా.వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .అది గొప్ప కరదీపిక గా భాసించింది .

‘’ లేడీబ్రౌనింగ్ రాసిన ఈ సానెట్స్ కు ఆంగ్లం లో ‘’పోర్చు గీస్ సానెట్స్’’అంటారు .అంటే పోర్చుగీసు భాషలో  రాసినవి కావు. ఆంగ్లం లో  రాసినవే .వీటిని చదివిన భర్త బ్రౌనింగ్ కవి షేక్స్ పియర్ తర్వాత అంత అద్భుతమైన సానెట్స్ రాసిన వారు లేరని భార్యకు కితాబిచ్చి ,ఆమె చామన చాయలో ఉండటం వలన ‘’పోర్చ్ గీస్ ప్రిన్సెస్ ‘’అని తను ముద్దుగా పిలుస్తూ ఉండటం చేతనూ,ఆమె కిష్టమైన  ‘’కేటరినా టు కామో వెన్స్’’  అనే పోర్చుగీసు ప్రేమ కవితల్లాగా  లయబద్దం గా, తూగు తో ఉండటం వలన ,ఆయన వీటికి ‘’పోర్చు గీస్ సానెట్స్’’అనే అందమైన పేరు పెట్టాడని డా శర్మగారు ఉవాచ .  ఆంగ్లం లో ఈ కవితలు 1806 –నుండి 1846 మధ్యాకాలం లో రాసినవి .సొనెట్ లేక సానెట్ అనేది 14 పంక్తుల ఆంగ్ల కవిత . ఎడమ వైపు ఆంగ్ల కవిత ,కుడివైపు తెలుగు అనువాదం కవిత ఉండటం తో బేరీజు వేసుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది .. ఈ కవిత్వ పొత్తం’’ మొగలి పొత్తు’’ లాగా సువాసన భరితం  .స్కాలిత్యం లేని ముద్రణ ,స్వచ్ఛ తెలుపు మిసిమి పుటలతో  లోపలి కవితలకు సొబగు కూర్చింది .లేడీ బ్రౌనింగ్ ఆంగ్లం లో పెట్టిన వివిధ అర్ధవంతమైన శీర్షికల కవిత్వ డాక్టర్ శర్మగారు దీటైన నామకరణం చేసి అచ్చ తెలుగు కవితలేమో ననిపించారు . నేను ఆ కవితలలోని నాకు నచ్చిన భావాలు,అందాలు ‘’ శర్మగారి మాటలలో

కాకుండా ‘’ నా భాషలో’’ అంది.స్తాను . ప్రేమికుడితో ప్రేయసి అంటున్న మాటలు ఇవి ,పంపిన సందేశాలివి ,గాఢ ప్రేమకు చిహ్నాలివి .ప్రేమికుల భాష తెలిసిన వారికే ఇందులోని ప్రేమైక సౌందర్యం తెలుస్తుంది, అర్ధమౌతుంది . నాకు అంత సీను లేదు కనుక ఏమాత్రం కృతక్రుత్యుడనౌతానో అనే  సందేహం నాకుంది .శర్మగారికి అర్ధాంగి అన్నపూర్ణ గారిపై ఉన్నగాఢ ప్రేమానురాగాలు  ఈకవితల అనువాదానికి బాగా అచ్చి వచ్చాయేమోనని పించింది                              .‘’నీ గుండె నా కూర్మి కి ప్రేమ మూలం అయి ,దోష రహితమైన  నీ కటాక్షం లభించి,ఫలం లభించక పోయినా ప్రేమిస్తూ జీవిస్తాను .నీరసం తో మూర్చ పోయిన నా ఆత్మను ఉద్ధరించి,నిన్నొక్కడినే ప్రేమించే నా ప్రేమను స్వర్ణ సింహాసనం పై నీ ప్రక్కనే కూర్చో బెట్టావు .నా గుండెను యేది తాకినా దుఖం పొంగిపోతుంది కనుక నా జీవిత వస్త్రాన్ని నిర్భయంగా సహన నీరవం తో చించి పారేస్తాను .ప్రేమ  అడుగంటేదాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను కనుక ప్రేమ శాశ్వతంగా ఉండిపోతుంది .నేను ప్రేమ అనే స్వర్గం లో సురక్షితంగా ఉండటం వల్ల  స్పటికం లోని తుమ్మెద లాగా చింత లేకుండా నన్ను చూస్తూ నే ఉంటావు .నా ప్రేమ పెరగటానికి నీ ప్రేమ విశాలం చేయి .సామాన్య ఘోషలు ,ఆదుర్దాల నుండి నువ్వు ప్రశాంత శ్రావ్య గానం ప్రసరించగలవు .మానవ విషమాతి విషమ వ్యాధులకు నీ గానం పరిహారం .అనంతంగా పాటపాడి అలసిన నీకు నీడ నిచ్చే చెట్టు కాని ,విశ్రాంతి నిచ్చే  సమాధి కాని ఔతాను .

‘’నా జుట్టు శోకభారం తో పాలిపోయిన నా చెక్కిళ్ళ  కన్నీటి  చారికలను దాచే కేశాలుగా మిగిలిందేమో ?గిరికి ,ఝరికి,వనాలకు కోయిల కలకూజితం లేనిదే వసంతం హసించదు .మన భావాలు అర్ధం చేసుకోలేని జనం మృత్యు ఘంటికలు వినేదాకా భూమి మీదే చీకట్లో నైనా ఉందాం .స్వర్గ మాదుర్యాన్నే కాదు నీతో ఉండటానికి నా గోరీ ని కూడా వదిలేస్తా .స్వర్గం నుంచి జారిన మంచు బిందువులను తాగటం వలన మన జీవన మల్లికలు అత్యంత తెల్లగా శోభిస్తున్నాయి .పూలకు నమ్మకం మూలమే కదా .శాంత గంభీరమైన నీ అంతరాత్మ లో ,నా హృదయం తెచ్చి జార్చమని ఆజ్న ఇచ్చావు . నెరవేరని విధికి , నక్షత్రాలకు  మధ్యవర్తిగా ఉంటూ ,నీ హృదయం  సహజంగా ,వేగంగా జారి పోయే నా హృదయాన్ని ఎగిసి పట్టుకో .మృత్యువు లాగానే ప్రేమకూడా అతి శక్తి వంతమైనది అని ,మళ్ళీ పుడుతుందని నేను సాక్షమిస్తాను  . నువ్వు నన్ను ప్రేమిస్తాను అనగానే ఎంతో సంతోషించా .కాని నేను నీవాడనే అని రాసిన ప్రేమలేఖ ,వేగంగా కొట్టుకొనే నా గుండెలపై ఉంచటం వలన అందులో సిరా పాలిపోయి అక్షరాలు  కనిపించటం లేదు .నీ మాటలు, వాగ్దానాలు వినీ వినీ మూర్చ పోయాను .మళ్ళీ ఆకాంతి శాంతి నాకు వస్తాయా? .పూర్వపు కూర్మి ,ఇప్పుడూ లభిస్తుందా ? అప్పటి ఆర్ద్రత తోనే పిలు .బదులు పలకటానికి సిద్ధమౌతా .ప్రియతమా సర్వోత్తమా !నీ చెయ్యి నా ఎదపై చేర్చి ఊరట కలిగించు .నీ గుండె విశాలంగా తెరచి .ప్రేమతో తడిసిన పావురపు రెక్కలను పొదవి కొని సమాశ్వాస కల్గించు .కలసిన మన చేతులు విడిపోతాయేమో ననే భయం తో వణికి పోతున్నా .నీసాత్విక దివ్యత్వాన్ని నమ్మిన నేను ఇప్పుడు నమ్మకం కోల్పోయి ఇసక బొమ్మలా అయ్యాను .క్షమించు.  తలపై నుదుటిపై పెదవులపై నువ్వు పెట్టిన మూడు ముద్దులు నన్ను ముకుళిం జేశాయ్ .నన్ను నేనే మర్చి ‘’నాప్రియతమా ,నా స్వకీయ ‘’అని మురిసిపోయాను .ప్రేమ ,విశ్వాసం నీకే ఉన్నాయ్ .నా ఆత్మను పరీక్షలో విసిగించేది ఏదీ నిన్ను మరల్చలేదు .నువ్వు మంచిని మించిన వాడివి . ‘’నిజమైన ప్రేమ ‘’అంటే ఏమిటో చెబుతూ దుఖం లో ,దురవస్థ లో వేచి ఉండటం .ఎదలు రెండూ ఏకమయ్యేదాకా ఓపికపట్టటం నిజమైన ప్రేమ లక్షణాలు .కన్నీటిలో, చిరునవ్వులో, ప్రాణం పోయిన తర్వాత, దైవం  అనుమతిస్తే నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’అని చివరి 44 వ సానెట్ ను పూర్తి  చేశారు  .

అందర్నీ ప్రేమించే మనస్తత్వం ఉన్న శర్మగారు ఈ సానెట్ లతో తమ కవితా విశ్వరూపాన్ని ప్రదర్శించారు .తెలుగులో ‘’మరో ప్రేమ లేఖలు ‘’అందించారు .ప్రేమకు శాశ్వతత్వం కలిగించారు .చలం ‘’మ్యూజింగ్స్ ‘’చదివిన అనుభూతి ,వెంకట పార్వతీశ్వర  కవుల’’ ఏకాంత సేవ’’ ,టాగూర్ ‘’గీతాంజలి ‘’భావనకు వస్తాయి  .డా.శ్రీ శర్మగారు డా.శ్రీమతి అన్నపూర్ణ గార్ల దాంపత్యం అన్యోన్యంగా కలకాలం  ఇతోధిక ఆరోగ్యం తో సాగాలని భగవంతుని ప్రార్దిస్తున్నా .  వారినుండి మరిన్ని ఆణిముత్యాలు జాలువారాలని ఆశిస్తున్నాను .వారు అపూర్వ అనురాగ ఆత్మీయతలతో  ఈ  ‘’సానెట్ ‘’ల పుస్తకం నాకు పంపినందుకు కృతజ్ఞతలతో ధన్యవాదాలు,  నమస్సులు తెలుపు కొంటున్నాను .వీరి పరిచయ భాగ్యం శ్రీ  మైనేని గోపాలకృష్ణ గారి చలవే అని మరొక మారు తెలియ జేస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-18 –ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 అణు ఇంధన కల్పన పిత  –డా.శ్రీ నిడమర్తి కొండలరావు

 అణు ఇంధన కల్పన పిత  –డా.శ్రీ నిడమర్తి కొండలరావు

పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామం లో డా.శ్రీ నిడమర్తి కొండలరావు 15-7-1824 జన్మించారు .తండ్రి  మంగయ్య గారు .బెనారస్ హిందూ యూని వర్సిటి లో మెటలర్జీ లో ఇంజనీరింగ్ చదివి పాసై ,పశ్చిమ జర్మని లని’’ఆషెం యూని వర్సిటి లో చదివి 1955 లో మెటలర్జీ లో డాక్టర్ ఇంజనీర్ ( డి .ఇంగ్)డిగ్రీ పొందారు .ఖనిజాలనుంచి లోహాలను తయారు చేసే విధానం కరతలామలకం చేసుకున్నారు .అంటే లోహ సంగ్రహణ శాస్త్ర వేత్తగా ప్రసిద్ధి చెందారు .బొంబాయి లోని దేవీ దయాళ్ మెటల్ ఇండస్ట్రీస్ లో 1948 నుండి ఒక సంవత్సరం పని చేశారు .బొంబాయి లోనే ఇండియన్ సెల్టింగ్ అండ్ రిఫైనింగ్ కంపెనీ  లో 1949 నుండి 19 53  వరకు నాలుగేళ్ళు పని చేశారు .

  బొంబాయి నుంచి కలకత్తా వెళ్లి హిందూ స్థాన్ మోటార్స్ లో శాస్త్ర వేత్తగా 1955 నుండి ఒక ఏడాది ఉన్నారు .మళ్ళీ బొంబాయి వచ్చి ‘’ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్  సైన్స్ ‘’అయిన డా .హోమీ జహంగీర్ భాభా చేత స్వయంగా  సెలెక్ట్ కాబడి  భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లో అటామిక్ ఫ్యుయల్ డివిజన్ హెడ్ గా పని చేశారు. దీన్ని బట్టి రావు గారి సర్వ సమర్ధత ఏమిటో అర్ధమౌతుంది ..ట్రా౦బే లోని CIRUS అణు రియాక్టర్ స్థాపన అంతా కొండలరావు గారి ఆలోచన అమలు తోనే జరిగింది .ఇది న్యూక్లియర్ ఎనర్జికి కావలసిన ఇంధనమూలకాల సప్లై కి బాగా ఉపయోగపడింది . న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ చీఫ్ ఎక్సి క్యూటివ్ గా 1972 లో ఉన్నారు .కోటా లోని రావత్ భటా రియాక్టర్ ‘’RAPSI’’కూడా రావు గారి నేతృత్వం లోనే ఏర్పడింది .దీనికే  మొట్టమొదటి హాఫ్ చార్జి ఆఫ్ ఫ్యుయేల్  అందించారు .ఈ ఇంధనం తాము తయారు చేసిన ఇంధనంకంటే చాలా మెరుగైనది అని కెనడియన్ సైంటిస్ట్ లు ధృవీకరించారు .ఇదంతా రావు గారి మేధో విలసనమే . టంగ్ స్టన్ లోహపు పొడి తయారీ రంగం లో విశేష కృషి,పరిశోధనలు  చేశారు .టా క్స్టేషన్ఎలక్ట్రాలిక్  కెపాసిటర్స్ ,ఫాబ్రికేషన్ అండ్ వెల్డింగ్ ఆఫ్ అల్యుమినం  ,సిలికాన్ –నికెల్ ఎల్లాయ్ ట్యూబ్స్  మెటల్లర్జికల్  ప్రాబ్లెమ్స్ ఇన్ న్యూక్లియర్ మెటల్స్ మొదలైన అతి ముఖ్య మైన అంశాలపై విలువైన పరిశోధనలు అవిశ్రాంతంగా నిర్వ హించారు .ఆయన పరిశోధనా ఫలితాలను అనేక జాతీయ ,అంతర్జాతీయ పత్రికలు ప్రచురించి గౌరవించాయి .

   హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ (NFC) ఏర్పరచటానికి ముఖ్య కారకులైన రావు గారు 1978 నుంచి 1984 లో రిటైర్ అయ్యేదాకా అక్కడే పని చేశారు .’’ఫ్యుయల్ ఫాబ్రికేషన్ టెక్నాలజీ’’లో ఆయన లోతులు తరచి ,అందులో ఎన్నో ఆవిష్కరణలు జరిపారు .రావు గారి కృషి ఫలితంగా భారత దేశం న్యూక్లియర్ ఫుయల్ లో స్వయం సమృద్ధి సాధించి ,ఈ విషయంలో ,ప్రపంచ దేశాలో  సరి సమానమైన స్థాయి పొందింది .ఇదంతా కొండలరావు గారి పుణ్యమే అని  విజ్ఞులు భావిస్తున్నారు .భాభా’’ అణుశాస్త్ర పిత ‘’,అయితే కొండలరావు గారు ‘’అణు ఇంధన కల్పన పిత ‘’  వ్యూహాత్మక ,వాణిజ్య పరమైన  అనేక పదార్ధాల సీమ్లెస్ ట్యూబ్స్ ను NFC  తయారు చేసి అంతర్జాతీయ ప్రామాణికత తో దూసుకు పోతోంది .ఇది రావు గారి అవిశ్రాంత కృషి మహత్యమే .

కొండలరావు గారు ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,మహారాష్ట్ర అకాడెమీ ఆఫ్ సైన్సెస్ మొదలైన ప్రేస్టేజియస్ సంస్థలనుండి  తమ ప్రతిభకు తగిన  ఫెలోషిప్ లు  పొందారు .చాలా సంస్దలు  వారికి గౌరవ సభ్యత్వమిచ్చి వారి  అనుభవాలను విని యోగించుకోన్నాయి .అనేక సైంటిఫిక్ ,ఇంజనీరింగ్ సంస్థలు రావు గారి సేవలను అనేక విధాలుగా సద్విని యోగం చేసు కున్నాయి . ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ది పౌడర్ మెటలర్జీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా,ఇండియన్ వాక్యూం సొసైటీ లకు అధ్యక్షులుగా ఉన్నారు .ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెటల్స్ ,ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్ర క్టివ్ టెస్టింగ్ కు చైర్మన్ గా వ్యవహరించారు .విదుట్ స్టీల్స్ లిమిటెడ్ ,నాగార్జున సిమెంట్స్ ,గోల్కొండ అబ్రేసివ్  లిమిటెడ్ ,ఓడిం మెటల్ పౌడర్స్ లిమిటెడ్ ,నాగార్జున స్టీల్స్ ,రాసి సిమెంట్ ,ఎ.పి .స్టీల్ లిమిటెడ్ ,ఎనర్జీ ట్యూబ్స్ లిమిటెడ్ ,ఆయిల్ కంట్రీ  ట్యూబ్యులర్స్, బ్రాస్కో మొదలైన సంస్థలలో కీలక బాధ్యత వహించారు .

 రావు గారు  నేషనల్ మెటలర్జిస్ట్ డే అవార్డ్ 1968 లోను  ,డిస్టింగ్విష్డ్ ఆల్మనన్ అవార్డ్ బెనారస్ హిందూ యూని వర్సిటి అవార్డ్ లు పొందిన ఘనత ఆయనది  .తెలుగు వెలుగు అవార్డ్ పొందారు .ప్రస్తుతం హైదరాబాద్ నాచారం లో స్నేహపురి లో స్థిర పడ్డారు  .  మెటలర్జిస్ట్ ,న్యూక్లియర్ సైంటిస్ట్ గా విఖ్యాతులైనశ్రీ నిడమర్తి కొండలరావు గారు పదేళ్ళ క్రితం అక్టోబర్ 22 చనిపోయారని  ఇప్పుడే వారబ్బాయికి ఫోన్ చేస్తే తెలియ జేశారు .రావు గారికి భార్య ,ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు లో ‘’గోరంత’’, వీకీ పీడియాలో ‘’కొండంత’’.

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-18 –ఉయ్యూరు    . ,


— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్లాక్ అండ్ వైట్ టి.వి. సోలార్ సెల్  రూపకర్త- యు వి .వర్లు

బ్లాక్ అండ్ వైట్ టి.వి. సోలార్ సెల్  రూపకర్త- యు వి .వర్లు

కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో16-12-1927 న  జన్మిచిన శ్రీ ఉప్పలపాటి వెంకటేశ్వర్లు ‘’యు. వి .వర్లు.’’గా సుప్రసిద్ధులు .ఘంటసాలలో సెకండరి విద్య పూర్తి  చేసి, బందరు హిందూ కాలేజి లో బి. ఎస్. సి .డిగ్రీ పొంది ,మద్రాస్ ఐ. ఐ .టి. లో  చేరి ,ఈ నాడు బి .టెక్. తో సమానమైన ‘’డి .ఎం.,ఐ .టి.ఆనర్స్ డిగ్రీ  డిస్టింక్షన్ తో సాధించారు .సాధారణ రైతు  కుటుంబం లో జన్మించిన వర్లుగారు ఇంతటి ఉన్నత విద్య అభ్యసి౦చారు  అంటే ఆయన ఎన్ని కస్టాలు కన్నీళ్లు అనుభవించారో ,తాను అనుకున్నది ఎలా సాధించాగాలిగారో మనకు అర్ధమౌతోంది .కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు అనటానికి ఈయనే సాక్షం .

  1954 లో బాంబే లో ట్రా౦బే టాటా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్  ఫండ మెంటల్  రిసెర్చ్ సెంటర్ లో వర్లు అసిస్టెంట్ సైంటిస్ట్ గా చేరారు .తనకిష్టమైన పరిశోధన పై దృష్టిపెట్టి న్యూక్లియర్ సాధన సంపత్తి పై అధ్యయనం చేశారు .1955 లో కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లో ఉన్న అటామిక్ ఎనర్జీ శాఖలో చేరారు.తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం లో చేరి ,అనేక అణుశక్తి పరిశోధనలలో పాల్గొన్నారు .అత్యుత్తమ శిక్షణ కోసం జపాన్ ,అమెరికా ,జపాన్ దేశాలలో పర్య టించారు .భారత తొలి అణు రియాక్టర్ ‘’అప్సర ‘’రూప కల్పన లో భాగస్వాములైన ముగ్గురు అత్యున్నత సాంకేతిక నిపుణులలో వర్లు గారు కూడా ఒకరు అవటం విశేషం .1957-58 లో  అమెరికా , ,ఇంగ్లాండ్ లలో అణు శక్తి పై గాఢ మైన అధ్యయనం చేసిన ఫలితాలు అణు రియాక్టర్ రూప కల్పనకు బాగా తోడ్పడాయి .’’జర్లీనా ‘’అణు రియాక్టర్ తయారీ బృందానికి  వర్లు సారధ్యం వహించారు .తారాపూర్ కేంద్రం లో 12 ఏళ్ళపాటు సేవ లందించారు  .ఈ కాలం లో రెండు విభాగాల ఏర్పాటు కూ చాల దోహదపడ్డారు .1965 నుండి ఆయన ఆలోచనలన్నీ అణుఉత్పత్తి రంగం పై  కేంద్రీకరించారు .కార్బన్ ఫిలిమ్స్ , రెసిస్టర్స్ ల ఉత్పత్తి లో వాటిని దేశీయ పరిజ్ఞానం తో తయారు చేయటానికి ప్రాధమిక స్థాయి ప్రాజెక్ట్ రూపొందించారు ..

   1967 లో స్వ రాష్ట్రానికి తిరిగి వచ్చి హైదరాబాద్ లో ఇ .సి .ఎల్ .లో  నియమింప బడ్డారు . .ఈ సంస్థను  బొంబాయి నుంచి  ఇక్కడికి తరలించటానికి వర్లు విశేష కృషి చేశారు.రెసిస్టర్స్ కెపాసిటర్స్ విభాల పర్య వేక్షణ చేశారు .ఎలెక్ట్రానిక్ రంగం లో నిరంతర కృషి కొన సాగిస్తూనే ఉన్నారు .తన అనుభవాన్ని ఆచరణలో పెట్టి ఇక్కడ నాలుగు ప్రత్యేక విభాగాలను నెలకొల్పి వాటి అధిపతి అయ్యారు .అప్పుడు డా  .ఎ ఎస్. రావు దీనికి చైర్మన్ .ఆయన ప్రోత్సాహం తో వర్లు ఎలెక్ట్రానిక్ సాంకేతిక రంగం లో అవిశ్రాంత కృషి సల్పారు .కేవలం ఏడేళ్ళ వ్యవధిలో వీరి రెసిస్టర్స్ కెపాసిటర్స్  కోటి రూపాయల ఉత్పత్తి సాధించి కేంద్ర ప్రభుత్వ బంగారు పతాకాన్ని ఈ విభాగం పొందటం వర్లు గారి అమోఘ కృషి ఫలితమే .ఆయన పని చేసిన కాలం సంస్థకూ స్వర్ణయుగమే అయింది .

  అమెరికాలో  అంతరిక్ష పరిశోధనా సంస్థలో శాటిలైట్ వ్యవస్థను అధ్యయనం చేసిన వర్లు గారికి ఇ.సి. ఐ .ఎల్ ,లో టి.వి. సాంకేతిక అభి వృద్ధి చేయటం నల్లేరు పై బండీ అయింది  .ఇక్కడ ప్రత్యేక టి .వి .విభాగం నెలకొల్పారు .ఆంద్ర రాష్ట్ర౦ లోమొదటి శ్రేణి  బ్లాక్ అండ్ వైట్ టి. వి.లను రూపొందించిన ఘనత ఉప్పలపాటి వెంకటేశ్వర్లు గారిదే .ఇది ఎలెక్ట్రానిక్ రంగం లో విప్లవం సృష్టించి ,అద్భుతాలు సాధించి సంస్థ కు భారీ లాభాలు తెచ్చి పెట్టింది . .తర్వాత ఉత్తర ప్రదేశ్ సెంట్రల్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు .ఇందులోనూ తన పరిశోధనలు నిరంతరం చేస్తూ ,’’సోలార్ సెల్స్’’ ఉత్పత్తి పై దృష్టి పెట్టారు .ఈ రోజు సౌర శక్తి రంగం లో  ప్రపంచ౦ లో ఆగ్రగామి గా ఉన్న ఆరు దేశాలలో భారత దేశం ఒకటి అవటం వర్లు గారి దూర దృష్టికి గొప్ప నిదర్శనం .

   న్యూక్లియర్ ఇంజనీరింగ్ లో 1957 లో బ్రిటన్ ,1958 లో అమెరికా లో అత్యుత్తమ శిక్షణ పొందిన వర్లుగారు 1963లో  ఇటలీ లో ‘’బేర్ సంస్థ ‘’తరఫున ఒక ఇంజనీరింగ్ ప్రదర్శన నిర్వహించి భారతదేశ కీర్తి ప్రతిష్టలకు పతాకమై నిలిచారు .అధ్యయనం, శిక్షణ కోసం అనేక దేశాలు పర్యటించి ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి సమర్ధతకు మెరుగులు దిద్దుకున్నారు .1974లో  ఎలక్ట్రానిక్స్ చైర్మన్ తో పాటు  విదేశాలు పర్యటించి విశేష అనుభవం  గడించారు . .కేంద్ర ప్రభుత్వం తరఫున విదేశాలతో అనేక ఒప్పందాలను కుదర్చటానికి , భారత్ లో నూతన వ్యవస్థలను నెలకొల్పటానికి వర్లు గారు చేసిన కృషి అద్వితీయం.

  1984 నుండి 89 వరకు అయిదేళ్ళు ఎలెక్ట్రానిక్స్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్న వర్లు గారు 100 కోట్ల పెట్టుబడి తో ,100 ఎలెక్ట్రానిక్ పరిశ్రమలను స్థాపించటం లో ఘనత పొందారు .రాష్ట్ర ప్రభుత్వ నిధులున్న సంస్థలలో ఉత్పత్తి 30 కోట్ల నుంచి ,400 కోట్లకు భారీగా  పెరగటం లో రావు గారి అనన్య సదృశ కృషి ఉంది .1989-90 లో ఉత్పత్తి గరిష్టంగా 500 కోట్లకు పెరగటం  విశేషం .

  బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ల రూప కల్పనకు విశేష కృషి చేసిన వర్లు కలర్ టి.వి.ట్యూబ్ ల ఉత్పత్తికి అనుమతి సంపాదించటానికి విశ్వ ప్రయత్నం చేశారు .కాని అనుమతి పొందలేక పోవటం ఆయనను తీవ్రంగా కలచి వేసింది .1986 లోనే జపాన్, జర్మని ,అమెరికా దేశాల పర్యటనలో కలర్ ట్యూబ్ ల ఉత్పత్తికి అనుమతులకోసం ఒప్పందాలు  సాధించారు .అయినా ఇప్పుడు పరాజయం పొందారు .సాంకేతిక శాస్త్ర వేత్తగా,అణు రియాక్టర్ల రూప కర్తగా ,అనేక కీలక రంగాలలో బహుముఖ ప్రజ్న చూపిన వర్లు గారికి ఏ డాక్టరేట్ లేదు అంటే అవాక్కౌతాం . .అయినా ఐ .ఐ. టి .డాక్టరేట్ విద్యార్ధులకు ఇన్విజి లేటర్ గా  ఉన్నారు .

 తమ కృషికి తగిన పలు పురస్కారాలు వర్లు పొందారు .1986 లో డా యలవర్తి నాయుడమ్మ అవార్డ్ , రఘుపతి వెంకట రత్నం అవార్డ్  అందుకున్నారు  రాష్ట్రం లో  సాంకేతిక విద్యా వ్యాప్తి కోసం ‘’వర్లు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ‘’సంస్థ స్థాపించి  స్వగ్రామం ఘంట శాలలో సాంకేతిక శిక్షణా సంస్థ ,సాంకేతిక విద్యా బోధనా సంస్థలను గ్రామస్తుల సహకారం తో ఏర్పాటు చేసి సామాజిక వేత్తగా మానవతా మూర్తి గా కూడా వెలుగొందారు ,విజయవాడ కు దగ్గర లో ఉన్న నిడమానూరు గ్రామం లో ‘’ఇన్ కాప్’’సంస్థను ఏర్పరచి ,చైర్మన్ గా ఉన్నారు . ఎపెక్స్ ఫోరం ఆఫ్ ఐ .ఇ. టి.ఇ .కు 2003-04కాలం లో ‘’వైస్ ప్రెసిడెంట్ కం చైర్మన్’’ గా ఉన్నారు .1996 లో ఆయన పేరుమీద ఎండోమెంట్ లెక్చర్ ను ప్రారంభించి ఇప్పటికి 9 ఉపన్యాసాలు హైదరాబాద్  ఐ .ఇ .టి .ఇ .లో జరిపించారు .12ప్రముఖ  సంస్థ లకు చైర్మన్ గా ఉన్నారు .అనేక కమిటీలు ,పానల్స్ కు చైర్మన్ గా వ్యవహరించారు . ఎలెక్ట్రానిక్స్ , ఎనర్జీ  సబ్జెక్ట్ లపై 12 టెక్నికల్ పేపర్లు ,20 పాలసి పేపర్స్ రచించి ప్రచురించారు . .

    పదవీ విరమణ తర్వాత హైదరాబాద్ లోని ‘’ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్’’సంస్థ కార్యకలాపాలను తీర్చి దిద్దారు  .  హైదరాబాద్ కాప్రా మునిసి పాలిటి లోని’’ అణుపురం ‘’అని పిలువబడే డా.ఎ .ఎస్. రావు నగర్ లో శేషజీవితాన్ని గడిపారు .2-10-2004 శనివారం శ్రీ వర్లు గారు 77 వ ఏట పరమపదించారు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’ఇండియన్’’ హానిమన్ ‘’హోమియో డాక్టర్ ఎం .గురు రాజు

‘’ఇండియన్’’ హానిమన్ ‘’హోమియో డాక్టర్ ఎం .గురు రాజు

హోమియో వైద్యాన్ని జర్మన్ ఫిజిషియన్ సామ్యుల్  హానిమన్ కనిపెట్టి సంప్రదాయేతర వైద్య విధానం లో ఆయుర్వేదం తర్వాత అంతటి ప్రాముఖ్యతను తెచ్చాడు .ఇండియాలో ,ఆంధ్రాలో ముఖ్యం గా కృష్ణా జిల్లా కు హోమియో వైద్యం లో విప్లవాత్మక అభి వృద్ధి చెందించి ‘’ఇండియన్ హానిమన్’’అని పించుకున్నవారు డా.ఎం.గురురాజు .కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర 28-6- 189 7 జన్మించారు .స్కూల్ టీచర్ గాఉద్యోగం ప్రారంభించారు .తర్వాత మద్రా స్ మెడికల్ కాలేజి లో  అల్లోపతి వైద్యం చదివి 1922 లో డిగ్రీ తీసుకున్నారు .ఎం .బి.బి .ఎస్ .ను ఆ రోజుల్లో అల్లోపతి అనేవారు.1824 లో గుడివాడ లోనే డాక్టర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. అప్పటికి  గుడివాడ తాలూకా మొత్తం మీద  గురు రాజుగారు ఒక్కరే డాక్టరీ  చదివి డిగ్రీ తీసుకున్నవారు .అందువల్ల ప్రాక్టీస్ బాగా ఉండేది .మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతులు లభించాయి .1932 లో స్వాతంత్రోద్యమం లో పాల్గొని  శాసనోల్లంఘన చేసి అరెస్ట్ అయి  జైలు శిక్ష అనుభవించిన దేశభక్తులాయన .జైలులో ఉండగానే ఆయనకు హోమియో వైద్యం పై మక్కువ కలిగి,దానికి సంబంధిన ఇంగ్లిష్ గ్రంధాలు అధ్యయనం చేశారు .దీనితో ఆయన జీవితం గొప్ప మలుపు తిరిగింది .

  హోమియో వైద్యం అంటే రోగ లక్షణాలకు పూర్తిగా  చికిత్స చేయటం .ఇది ఒక విలక్షణమైన చికిత్సా విధానంగా గురురాజు గారి మనసును బాగా ఆకర్షించింది .జైలు లో ఉండగానే హోమియో వైద్య బీజాలు మనసులో పడి,నాటుకొని మహా వృక్షమై ,హోమియో వైద్య ప్రచారం లో హానిమాన్ లాగా ఉండాలని నిశ్చయించుకొన్నారు .జైలు నుండి విడుదలకాగానే అల్లో పతి కి స్వస్తి చెప్పి పూర్తిగా హోమియో వైద్యానికే అంకితమయ్యారు .హోమియో మందులు పరమ ప్రామాణీక మైనవని ,వాటిలో దివ్యత్వం ఉందని పూర్తిగా నమ్మారు .హోమియో వైద్యం లోను ఘనకీర్తి గడించారు .1936 లో ప్రసిద్ధ హోమియో వైద్యులవద్ద శిక్షణ పొంది క్వాలిఫైడ్ డాక్టర్ అనిపించుకున్నారు .అంతటితో ఆగి పోకుండా దానిపై తీవ్ర అధ్యయనం, పరిశోధనలు చేశారు .ప్రముఖ హోమియో డాక్టర్లు  హానిమాన్,  కెంట్ ల చికిత్సా విధానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని,అదే మార్గం లో చాలాకాలం పరిశోధనలు సలిపారు గురు రాజుగారు .దీనితో కొత్త ఔషధ మిశ్రమాలను ఆవిష్కరించారు .అమెరికా వెళ్లి హోమియోపతి లో పోస్ట్ గ్రాడ్యుయేషన్  ట్రెయినింగ్ పొందారు .అక్కడ ప్రసిద్ధ హోమియో వైద్యులు , స్టాల్ వర్ట్స్ అని పిలువబడిన  డాక్టర్ వుడ్ బరి,డా.రాబర్ట్స్ ,.స్పాల్డింగ్  ఎలిజబెత్ హబ్బార్డ్ లతో  పని చేసే గౌరవం లభించింది

  హోమియో వైద్య చేస్తూనే  దాని ప్రచారానికీ తగిన సమయం కేటాయించారు .నాటు వైద్యుల కబంధ హస్తాలనుండి రోగుల చెర విడిపించారు .దీనికి విపరీతంగా కష్ట పడాల్సి వచ్చింది  .తనవద్దకు చికిత్సకు వచ్చేవారిని ఆత్మీయంగా పలకరిస్తూ రోగ లక్షణాలు పూర్తిగా తెలుసుకొంటూ వారికి అత్యంత ఆప్తుడను అనే నమ్మకం కలిగించేవారు .అందువలన రోగులకు ఆయనపై సంపూర్ణ  విశ్వాసం , నమ్మకం కలిగి హోమియో కు గొప్ప ప్రచారం జరిగింది .1951 లో లక్నో లో జరిగిన రెండవ   అఖిలభారత హోమియోపతిక్ కాంగ్రెస్ కు అధ్యక్షులయ్యారు . హోమియో వైద్యానికి ఒక కళాశాల ఉంటె బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది .1954  లో తన ఇంటి వద్దనే’’ఆంధ్రా ప్రోవిన్షియల్ హోమియో పతిక్ మెడికల్ కాలేజి  అండ్ హాస్పిటల్ ‘’స్థాపించారు .1958 లో దీన్నిఆంద్ర ప్రదేశ్  ప్రభుత్వం గుర్తించింది.. .1954 లో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’ఎక్స్ పర్ట్ హోమియోపతిక్ కమిటీ ఏర్పరచి రాజుగారిని సభ్యులను చేసింది .1958 లో రాజుగారిని కేంద్ర ప్రభుత్వం హోమియోపతిక్ అడ్వైజరీ కమిటీ లో సభ్యుని చేసి గౌరవించింది .కేంద్ర ప్రభుత్వపు ‘’అ డ్ హాక్ సిలబస్ కమిటీ ,ఫార్మోకోపియా కమిటీలలోగౌరవంగా  సభ్యులయ్యారు .ఇవన్నీ రాజుగారి సమర్ధతకు హోమియోలో  విద్వత్తుకు ,కృషి, సామర్ధ్యాలకు గుర్తింపు .1956 నుంచి ‘’ఆంధ్రా బోర్డ్  ఫర్  హోమియోపతి ‘’లో సభ్యులు .

  రెండవ ప్రపంచ యుద్ధ౦ పూర్తయిన కాల౦లొ ఒక సందిగ్ధ వాతావరణం ప్రపంచమంతా వ్యాపించి ఉంది .గుడివాడ లోనూ అదే పరిస్థితి ఉండేది . ‘ అదే సమయం లో కలరా, మసూచి ,క్షయ వ్యాధులు ప్రబలి  ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. వీటి చికిత్సకు ,మందులకు చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. సంపన్నులకు మాత్రమే అల్లోపతి చికిత్స అందుబాటులో ఉండేది. పేద ,నిరుపేదలకు దేవుడే దిక్కు అన్నట్లు ఉండేది .పేదలకు ఈ ఆపత్సమయం లో వెన్ను దన్నుగానిలిచి ,,అతి తక్కువ ఖరీదైన మందులతో వైద్యం చేస్తూ రోగాలను పారదోలుతూ వారికి ఊరట కలిగించి తమ పాలిటి దేవుడు గురురాజు గారు అనిపించారు ఆయన .హోమియో వైద్యం సైడ్ ఎఫెక్ట్ లు లేని వైద్య విధానంగా  ప్రజలలో గొప్ప నమ్మకం కలిగించారు .ఎలాంటి జబ్బునైనా దీనితో నయం చేయవచ్చుననే ధీమా వారిలో కలిగింది .

  ఇదే సమయం లో కేంద్ర ప్రభుత్వం కూడా హోమియో వైద్యం బాగా ప్రచారం పొంది ప్రజలకు ఉపయోగ పడాలని భావించి జాతీయ స్థాయిలో ‘’హోమియోపతిక్ కాంగ్రెస్ ‘’ను ఏర్పరచింది .ఈ సభకు గురురాజు గారు అధ్యక్షత వహించి ,హోమియో వైద్యవిధానం ఎంతబాగా ప్రజలకు ఉపయోగపడుతుందో సాధికారికంగా తెలియ జేశారు .దీనికి ప్రభుత్వమూ ఒప్పుకున్నది .అందుకోసం చెయ్యాల్సిన చట్టాన్ని రూపొందించటం లో డా గుర్రాజు గారి పాత్ర చిరస్మరణీయం .విస్తృత స్థాయిలో దేశ వ్యాప్తంగా హోమియో పతి ని అభి వృద్ధి చేయటానికి రాజుగారు అహరహం శ్రమించారు స్వంత ధనం దీనికోసం చాలా ఖర్చు చేశారు .ధనం, మనం ,అంకితభావం తో దేశవ్యాప్తంగా హోమియోకు గొప్ప వైభవం తెచ్చారు .ఆయన కృషి ఫలించి రాజు గారికీ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది . ప్రజా జీవితం లోనూ రాజుగారు బాగా రాణించారు .ప్రజా వైద్యులనిపించుకొన్నారు కనుకనే గుడివాడ మునిసిపల్ చైర్మన్ గా రాజు గారు రెండు సార్లు ఎన్నికయ్యారు .ఆంద్ర ప్రదేశ్ హోమియోపతిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సేవలందించారు.

1968 అక్టోబర్ 25 న’’ఇండియన్ హానిమన్ డా గురురాజు ‘’గారు  71 వయేట మరణించారు .రాజు గారిమరణానంతరం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడివాడలో ఉన్న హోమియో కాలేజి కి  ఆయన గౌరవార్ధ౦ ‘’డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియో పతిక్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుడివాడ ‘’గా ‘నామకరణం చేసి గురురాజు గారి సేవలను చిరస్మరణీయం చేసింది .నిజంగా గుర్రాజుగారు ‘’హోమియో గురువులలో రాజు  ‘’.

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రఖ్యాత గణాంక శాస్త్ర వేత్త పద్మ విభూషణ్ డా. సి ఆర్ రావు

ప్రఖ్యాత గణాంక శాస్త్ర వేత్త పద్మ విభూషణ్ డా. సి ఆర్ రావు

చల్యం  పూడి రాదా కృష్ణారావు గారు  అందరికీ  సి .ఆర్ .రావు గారు  గా పరిచయం .1920 సెప్టెంబర్ 10 న కర్నాటక బళ్లారి జిల్లా ‘’ హడగల్లి’’ లో జన్మించిన అచ్చమైన తెలుగు వారు . . పది మంది సంతానం లో ఎనిమిదవ వారు .తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్ కనుక ఆయన బదిలీ అయినప్పుడల్లా వేర్వేరు చోట్ల చదవాల్సి వచ్చింది ..గూడూరు ,కృష్ణా జిల్లా నూజివీడు  నందిగామ లలో చదివి ,విశాఖ పట్నం లో స్కూల్ ఫైనల్ నుంచి డిగ్రీ వరకు స్కాలర్షిప్ లతో చదివారు .అన్ని తరగతులలో ఫస్ట్ రాంక్ విద్యార్ధి . బి .ఏ. ఆనర్స్ చేసి గణితం లో ,ఎం ఏ డిగ్రీ పొందారు .ఇరవై ఏళ్ళ నాటికే ఇవన్నీ సాధించిన మేధావి రావు గారు .

కలకత్తా వెళ్లి ఇండియన్ స్టాటి స్టికల్  ఇన్ స్టి ట్యూట్ లో ఎం ఏ .స్టాటిస్టిక్స్ మొదటి బాచ్  లో చేరి ,  ఇప్పుడూ యూని వర్సిటి మొదటి రాంక్ తో స్వర్ణపతకం సాధించారు .రావు గారు సాధించినన్ని మార్కులు ఇప్పటి వరకు ఇంకెవ్వరికీ రాలేదట .అదొక అరుదైన రికార్డ్ .అక్కడే నెలకు 75 రూపాయల జీతం తో లెక్చరర్ గా చేరి  ఉద్యోగం చేస్తూనే పరిశోధనలు చేశారు .దీనివలన కేంబ్రిడ్జి యూని వర్సిటి లో పరిశోధనలు కొనసాగించే అరుదైన అవకాశం పొందిన అదృష్ట వంతులు .అత్యున్నత స్థాయిలో ఉన్న వీరి పరిశోధనాంశాలను లండన్ లోని కేంబ్రిడ్జి యూని వర్సిటి ప్రెస్ తమ అదృష్టంగా భావించి ఆయన గ్రంథ రచనలను ముద్రించారు .అప్పటికి రావు గారి వయసు 26 అంటే ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే .

ఇంగ్లాండ్ నుంచి ఇండియాతిరిగి వచ్చి కలకత్తా లో మాతృ సంస్థ లోనే మళ్ళీ ఉద్యోగించారు ..కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు రెండు పంచ వర్ష ప్రణాళి కల రూపకల్పన   బాధ్యత అప్పగించింది .వీటిలో డా సి .ఆర్. రావు గారి తోడ్పాటు అనితర సాధ్యంగా ఉంది .దేశ స్థాయిలో అపారిశ్రామిక  అభి వృద్ధికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని   ఆయన ప్రభుత్వానికి సూచించారు .నాటి ప్రధాని నెహ్రు అంగీకరించారు .ఆంధ్రా యూని వర్సిటి, రావు గారికి అప్పడు ఇస్తున్న జీతానికి 5 రెట్లు ఎక్కువ జీతం ఇస్తామని ఆఫర్ చేసినా ,అంగీకరించక  ప్రొఫెసర్ గా గణాంక శాఖ హెడ్ గా కూరుకు పోవటం కంటే తన పరిశోధనలకే  ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.

కలకత్తా యూని వర్సిటి లో నలభై ఏళ్ళు ఉండి,తన పరిశోధనలు నిరంతరం కొన సాగించి మనసులో ఉన్న అభిప్రాయాన్ని  ఆచరణ లో పెట్టారు .  వేలమంది విద్యార్ధుల జీవితాలను తీర్చిదిద్ది మార్గ దర్శనం చేసిన విద్యావేత్త రావు గారు . అత్యుత్తమ శాస్త్ర వేత్తలకు అందజేసే ‘’శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కారం ‘’ను ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా అందుకున్న  అత్యున్నత  ఉత్తమ శ్రేణి గణాంక సైంటిస్ట్ ఆయన .దీనికి అంద జేసిన  ప్రైజ్ మనీ ని అదే వేదికపై ప్రధానికి దేశ రక్షణ నిధి కి సమర్పించిన వదాన్యులు .అమెరికా లో ప్రతి ఏడాదీ అత్యత్తమ స్థాయి శాస్త్ర వేత్తలకు అందించే ‘’నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ‘’అవార్డ్ ను అమెరికాలో , అమెరికా ప్రెసిడెంట్ జార్జి బుష్ చేతులమీదుగా అందుకున్న మేధావి .

‘’ రష్యా సైన్స్ అకాడెమీ ‘’ తన 200 సంవత్సరాల వేడుకలో ఆహ్వాని౦పబడిన  ప్రపంచ వ్యాప్తం గా ఉన్న 200 మంది శాస్త్ర వేత్తలలో రావు గారు  ఉండటం ఆయనకే కాక మనదేశానికీ గర్వ కారణం .ఈ కార్య క్రమ ప్రారంభం లో వీర మరణం పొందిన సైనికులకు నివాళి  అర్పించే ,స్మృతి చిహ్నం పై పుష్ప గుచ్చాన్ని సమర్పించే అరుదైన అవకాసం మొదటగా రావు గారికే దక్కింది .గత దశాబ్ద కాలం లో ప్రపంచ వ్యాప్తంగా విశేష కృషి చేసిన 70 మంది శాస్త్ర వేత్తల జీవిత చరిత్రలను ,ఫోటో లను ప్రచురించిన ‘’అమెరికన్ పబ్లికేషన్ ‘’లో రావు గారు స్థానం పొందటం అపురూపమైన ప్రపంచ వ్యాప్త సత్కారం ,గుర్తింపు .గణాంక శాస్త్ర అభి వృద్ధికోసం హైదరాబాద్ లో ఒక సంస్థ ఏర్పాటు చేయాలని రావు గారి సంకల్పం .మన రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూని వర్సిటి లో స్థలం కూడా కేటా యించింది .ఆరు దశాబ్దాల అవిశ్రాంత కృషిలో ఉన్నా నవ యవ్వనం తో తొణికిసలాడే ఉత్సాహం తో ఆయన కనిపిస్తారు .

లండన్ లోన 1662 లో స్థాపింపబడి ,  అత్యంత ప్రాచీనమైంది, ప్రపంచ వ్యాప్త ప్రతిస్టాత్మకమైన’’రాయల్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ ‘’ కు ‘’ ఫెలో ‘’గా ఎన్నికైన ప్రధమ ఆంధ్రుడు రావు గారే .చాలామందికి ఆయన అసలు సిసలైన తెలుగు వారని ఇప్పటికీ తెలియదు .భారత ప్రభుత్వం ‘’పద్మ విభూషణ్ ‘’పురస్కారం అందజేసి గౌరవించింది ..350పరిశోధనా పత్రాలు రాశారు .14 గ్రంథాలు రచించారు .ఇవన్నీ ప్రపంచ  వ్యాప్తం గా  వివిధ భాషలలోకి అనువాదం పొందాయి  19 దేశాల నుండి 38  డాక్టరేట్లు అందుకున్న అరుదైన ప్రతిభాశాలి . గణాంక శాస్త్రం లో లో 50 మంది పరి శోధకులకు మార్గ దర్శకం చేశారు .టైమ్స్ ఆఫ్ ఇండియా’’ టాప్ టెన్ సైంటిస్ట్ ‘’లలో ఒకరుగా రావు గారు గుర్తింపు పొందారు .సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న రావు గారు మన తెలుగు వారుకావటం మన అదృష్టం

అమెరికా లో పెన్సి ల్వేనియన్ స్టేట్ యూనివర్సిటి ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ,బఫ్ఫెల్లో యూని వర్సిటి రిసెర్చ్ ప్రొఫెసర్ గా ,ఉన్నారు .అమెరికా దేశపు ‘’నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అందుకున్న ఘనులు .అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ రావు గురించి ‘’ a living legend whose work has influenced not just statistics, but has had far reaching implications for fields as varied as economics, genetics, anthropology, geology, national planning, demography, biometry, and medicine.”[.

అని అభి వర్ణించింది .లాభా పేక్ష లేని ‘’ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ‘’కు సీనియర్ స్టాటిస్టిక్స్ అడ్వైజర్ ,సీనియర్ పాలసీ మేకర్ గా ఉన్నారు.  పిట్స్ బర్గ్ యూని వర్సిటి ప్రొఫెసర్ గా ,పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటి లో మల్టి వేరియేట్ అనాలిసిస్ సెంటర్ డైరెక్టర్ గా అక్కడి  స్టాటి స్టీషి యన్  డా పరుచూరి రామకృష్ణయ్య గారి ఆహ్వానం పై పని చేశారు .2010 లో దేశం లో అత్యున్నతమైన ‘’ఇండియా సైన్స్ అవార్డ్’’ పొందారు .’’ఇంటర్ నేషనల్ ఎన్ సైక్లో పీడియా ఆఫ్ స్టాటిస్టి కల్ సైన్స్’’కు సహకరించినందుకు ,మియోడ్రాగ్ లోవ్రిక్ ,షియోమో సావిలోస్కి లతో  పాటు రావు గారు 2013 లో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు 19 14 జులై 26 న ఖర్గపూర్ ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  38 వ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది ..ఇంటర్నేషనల్ స్టాటి స్టికల్ ఇన్ స్టి ట్యూట్ ప్రెసిడెంట్ గా ,అమెరికాలోని ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మాదమాటికల్ స్టాటిస్టిక్స్,ఇంటర్ నేషనల్ బయో మెట్రిక్ సొసైటీలకు రావు అధ్యక్షులు .’’ఇండియాస్ నేషనల్  ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ క్వాలిటి అండ్ రిలయబిలిటి హాల్ ఆఫ్ ఫేం’’లో స్థానం పొందారు .1991 లో ‘’ది జర్నల్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఎకనమిక్స్ ‘’రావు గారిపై గౌరవ ప్రత్యేక సంచిక ప్రచురించింది. ఆ సంచికలో రావు గారి గురించి ‘’ Dr Rao is a very distinguished scientist and a highly eminent statistician of our time. His contributions to statistical theory and applications are well known, and many of his results, which bear his name, are included in the curriculum of courses in statistics at bachelor’s and master’s level all over the world. He is an inspiring teacher and has guided the research work of numerous students in all areas of statistics. His early work had greatly influenced the course of statistical research during the last four decades. One of the purposes of this special issue is to recognise Dr Rao’s own contributions to econometrics and acknowledge his major role in the development of econometric research in India.”

అని రాసింది  .

రావు గారు ‘’ఎస్టి మేషన్ దీరీ ‘’,స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అండ్ లీనియర్ మోడల్స్ .మల్టి వేరియేట్ అనాలిసిస్ ,కాంబి నెటోరియల్ డిజైన్ ,ఆర్థో గనల్ ఎర్రెస్ లలో  ప్రత్యేక పరిశోధనలు చేశారు .6 ప్రసిద్ధ అవార్డ్ లు మెడల్స్ పొందారు .పద్మ భూషణ్ ,పద్మ విభూషణ్ లతో సహా 10 జాతీయ ,అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నారు .97 ఏళ్ళ వయసులో ఉన్న రావు గారు అరుదైన స్టాటి స్టిక్స్ శాస్త్రవేత్త .శతాధిక ఆయుష్మాన్ భవతి .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంధ్ర శాస్త్ర వేత్తలు  మరియు వీకీ పీడియా

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం”  

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం”

ఢిల్లీ లో మేక  చర్మాలు అంటే తోళ్ళ తో పంది ఆకారపు సంచులలో నీళ్ళు నింపుకొని  వీపుకు  లేక బుజానికి  వ్రేలాడ దీసుకొని  ఇళ్ళకు నీళ్ళు చేర్చే వారిని ‘’భిస్టీలు ‘’అంటారు .వీళ్ళు ముస్లిం తెగకు చెందినవారు .మేక తోలును చాలా శుభ్రం చేసి  ఎక్కడా వాసన రాకుండా  నీటి సంచీలు తయారు చేసుకొంటారు .అదొక గొప్ప ప్రక్రియ వాళ్లకు .భిస్టీలను బిరదారీలు అనీ పిలుస్తారు .ఉత్తర భారతం లో ,పాకిస్తాన్ ,నేపాల్ లోని టేరై ప్రాంతం లో ఎక్కువగా ఉంటారు .వీరికి షేక్ అబ్బాసి ,ధుండ్ అబ్బాసి ,సక్వా అనే ఇంటి పేర్లు కూడా ఉన్నాయి .మహారాష్ట్ర లో వీరిని పఖాలి అంటారు .వీరంతా అరబ్ తెగ కు చెందిన వాళ్ళు .వీరిని అబ్బాసి ఆరబ్బులు అంటారు .వీరిది సున్నీ మతం .ప్రముఖ ఆంగ్ల కవి  రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ‘’గంగా దిన్ ‘’కవిత లో ముఖ్యపాత్ర ఒక  భిస్టీయే .

భిస్టీలు తరతరాలుగా దక్షిణ ఆసియాలో ‘’జలవాహకులు ‘’అనే నీళ్ళు మోసేవారు .భిస్టి అనే మాట పర్షియన్ పదం. ‘’బెహెస్ట్ ‘’నుంచి వచ్చింది .అంటే స్వర్గం అని అర్ధం .యుద్ధాలలో ముస్లిం సైనికులకు నీళ్ళు మోసుకొని వెళ్లి దాహార్తులకు అందించేవారు .అది పవిత్రమైన పని కనుక గౌరవంగా వారిని ఆ పేరుతొ పిలిచేవారు .వీళ్ళు ముఖ్యంగా మేక తోలు సంచీలలో నీరు  తీసుకు వెళ్ళేవారు .ఈ సంచీలను మష్క్ లు   లేక మషక్ లు అంటారు .

గుజరాత్ లోని భిస్టీ లు తాము అక్బర్ పాలనలో ఉత్తరభారతం నుంచి వచ్చామని చెబుతారు .వీళ్ళను కూడా అబ్బాసి ఆరబ్బులు అంటారు .గుజరాత్ ను జయించిన మొఘల్ రాజ సైన్యానికి వీళ్ళు నీళ్ళు మోసుకు వెళ్లి అందించేవారు . భూములు లేని వీరంతా దినకూలి చేసి బ్రతుకు తున్నారు .కొందరు రిక్షాలు లాగుతూ, మరికొందరు బీడీలు చుడుతూ , సిగరెట్ పరిశ్రమలో పని చేస్తూ   సంపాదిస్తున్నారు .గుజరాతీ మాట్లాడతారు ఎక్కువ మంది అహమ్మదాబాద్ లో ఉన్నారు .వీరూ సున్నీలే .ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకొన్నారు .ఎక్కువమంది డియో బిందీ ఉప తెగకు చెందిన వాళ్ళే .

మహారాష్ట్రలో సాంగ్లి, షోలాపూర్,కొల్హాపూర్, పూనా జిల్లాలో కూడా ఉన్నారు .వీరంతా ఉర్దూ భాషలోని ‘’దఖాని ‘’మాండలీకం లోనూ, మరాఠీ భాష లోనూ  మాట్లాడతారు .ఢిల్లీ లోని షేక్ అబ్బాసీలు భారత విభజన సమయం లో పాకిస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డారు .పాకిస్తాన్ లోని కరాచీలో వీరి సంఖ్య ఎక్కువ .మొహాజిర్ అనే పెద్ద తెగలో ఉప తెగ గా అక్కడ ఉంటున్నారు .

ఉత్తర ప్రదేశ్  భిస్టీలు భూమిలేని వారు .జలవాహనం తోపాటు రోజు కూలీలుగా పని చేస్తారు .పండుగ పబ్బాలలో మంచినీటిని సప్లై చేస్తారు .వీరిలో అంతర్వివాహాలు ఎక్కువ అంటే వారిలో వారే పెళ్ళిళ్ళు చేసుకొంటారు .ఉర్దూ తో పాటు ఖరి బోలి మాండలికం మాట్లాడతారు.ఉత్తరప్రదేశ్ అంతటావిస్తరించి  ఉన్నా, వీరు ఎక్కువగా మీరట్, ఆలిఘర్  జిల్లాలో అత్యధికంగా ఉంటారు .

ఢిల్లీ లోని అబ్బాసీలు ఢిల్లీ మునిసిపాలిటీకి వాటర్ సప్లైయర్స్ గా ఉన్నారు .కొందరు మోటార్ మెకానిక్స్ ,కార్పెంటర్స్ , వెల్డర్స్ ,టర్నర్స్ ,ఫిట్టర్స్ ,పెయింటర్స్ గా కూడా పని చేస్తున్నారు .వీరంతా సున్నీ ముస్లిం లే .భారత దేశంలో ఉన్న భిస్టీ లంతా కలిసి  ‘’ఆల్ ఇండియా జమాయిత్ ఉల్ అబ్బాస్ ‘’ అనే సంఘం ఏర్పరచుకున్నారు.ఇది వారి సంక్షేమానికి అభివృద్ధికి హక్కుల  కోసం  పోరాడే సంస్థగా ఉంది .వీరికి ప్రభుత్వం ‘’ఇతర వెనుకబడిన తరగతుల హోదా ‘’ఇచ్చింది . తరతరాలుగా వస్తున్ననీరు మోసే పని క్రమంగా తగ్గి పోవటం తో, బతుకు తెరువుకు ఏదో ఒక పని చేయాల్సి వస్తోంది .వీరందరిలో సంఘీభావం బాగా ఎక్కువ .సమైక్య పోరాటానికి సిద్ధంగా ఉంటారు .ఇప్పటికీ ఢిల్లీ మీనా బజార్ లో మంచినీటి సరఫరా పైపులద్వారా జరగటం లేదు .అంతటి మురికి కూపం ఢిల్లీ మొత్తం మీద లేదు .ఇక్కడి దర్గా దగ్గరున్న 450 ఏళ్ళ బావి ఒక్కటే అందరికి మంచినీటికి ఆధారం .దీనిలో నీళ్ళు 80 అడుగుల లోతులో ఉంటాయి .మెట్రో లైన్ తో ఈ బావి పూర్తిగా ఎండిపోయింది కాని కొద్దికాలం లోనే మళ్ళీ మంచి నీళ్ళు ఊరి దాహార్తి తీరుస్తోంది .అందుకని ఈ బావి ఇక్కడి వారి పాలిట పవిత్ర మైన బావి .భిస్టీ కుటుంబానికి చెందినవారు ఈ పవిత్రమైన నీరు తోడి దాహార్తులకు గ్లాసులలో ఉచితంగా అంద జేసి పుణ్యం మూటకట్టుకొంటారు .

ఏ రాష్ట్రం లో ఎక్కడ ఉన్నా వీరంతా దాదాపు నిరక్షరాస్యులు ,స్వంత భూమి ఒక్క గజం కూడా లేని నిర్భాగ్యులే .జనావాసాలకు చాల దూరం గా దుర్గంధ భూయిష్ట ప్రదేశాలలో జీవిస్తున్నారు . సరైన జీవన సదుపాయాలేమిటో వారికి తెలియదు . ప్లాస్టిక్ గుడ్డ గుడారాలలో ,పొలిమేరల్లో,స్మశానాలలో మురికి వాడలలో  వీరి ఆవాసం అంటే ఆశ్చర్య పోనక్కరలేదు .రాత్రిళ్ళు వారు తాగే బీడీలే వారికి దీపాలు .సమాజం వీరిపట్ల చాల చిన్న చూపు చూస్తూ ఉదాసీనంగా ఉండటం వారిని మరీ కలచి వేస్తోంది .

ఇలా  అత్య౦త పేదరికం లో తరతరాలుగా జీవిస్తున్న భిస్టీ లకూ చరిత్ర లో ఒకే ఒక్క రోజు మహర్దశ ప్రాప్తించింది . ‘’అమృతం’’ సీరియల్ ఫేం ‘’గుణ్ణం గంగ రాజు ‘’తీసిన  ‘’ఏమో గుర్రం ఎగరా వచ్చు ‘’అనే  సినిమాలో లాగా వీరిలో ఒకరికి ఎక్కడో తేనె తుట్ట పట్టి ఆ అదృష్టం  దక్కింది . .

పాత ఢిల్లీ లోని అతి పురాతన భిస్టీ లలో చివరి తరం వాడు మొహమ్మద్ తరతరాలుగా  ఢిల్లీ ఏర్పడటానికి చాలా ముందుకాలం నుంచే  నీళ్ళు మోసే తెగకు చెందినవాడు .1897 లో బ్రిటిష్ నాచురలిస్ట్ ఎడ్వర్డ్ యైత్కెన్ తన ‘’బిహైండ్ ది బాంగలోస్ అనే పుస్తకం లో వీరిని గురించి విపులంగా చర్చించాడు . యూఫ్రటేస్ నదీ తీరం లో క్రీ శ.680 లో జరిగిన  ‘’కర్బాలా ‘’ అనే పౌరాణిక ,పవిత్ర యుద్ధం లో శత్రువు వేసిన బాణం   మహమ్మద్ ప్రవక్త  మనవడు హుస్సేన్ నీటి సంచీని చీల్చేసింది  .గొంతు తడుపుకోవటానికి కూడా చుక్క నీరు  లేక పోవటం తో  ఒంట్లో ఓపిక అంతా నశించి, అతడు పోరాడలేని పరిస్థితిలోఉంటె  శత్రువు అతడిని జయించి చంపేశాడు .హుస్సేన్ ఓటమి, వీర మరణానికి  స్మారకంగా సున్నీ మతస్తులు  మొహర్రం పండుగ దినాలలో ఊరేగింపు చేసి రక్తతర్పణం చేస్తారు .నీటి సంచులు మోయటానికి ముందు భిస్టీలు వీధులలో పారిన రక్తాన్ని, వాటి మరకలను శుభ్రం చేసేవారు ..సరే బాబూ నువ్వు పెట్టిన  హెడ్డింగ్ ఏమిటి ? ఈ సోది ఏమిటి అనుకొంటున్నారా ? దానికే వస్తున్నానిప్పుడు .

రెండవ మొఘల్ చక్రవర్తి హుమాయూన్  జీవితాన్ని కాపాడి ఒక భిస్టీ చరిత్ర సృస్టించాడు.ఒకరకంగా మలుపే తిప్పాడు .ఎలా అంటారా  ? చరిత్ర పుట తిరగేద్దాం .ఒక సారి హుమాయూన్ ఆఫ్ఘన్ లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రమాద వశాత్తు గంగానదిలో పడి మునిగిపోయాడు .అక్కడే ఉన్న ‘’నిజాం అనే భిస్టి’’ తన మంచి నీటి మేక తోలు సంచీ’’మషక్ ‘’లో ఉన్న నీటిని పారబోసి ,సంచీ  లోకి నోటితో బలంగా గాలి  ఊది ,పూర్తిగా నింపి  హుమాయూన్ కు అందించి దాన్ని  పడవ గా చేసుకొని  నీటిపై తేలుతూ ,నీటి నుంచి ఈదుకొని ఒడ్డుకు చేర్చాడు. తనను కాపాడి ,ప్రాణ భిక్ష పెట్టిన ఆ ‘’భిస్టీ నిజాం’’ కు కృతజ్ఞతగా ఆగ్రా సింహాసనాన్ని ఒక రోజు అధిస్టించి పరిపాలించే అవకాశమిచ్చాడుచక్రవర్తి హుమాయూన్ . .భిస్టీ నిజాం పాలించిన ఆ ఒక్క రోజులో తన నీటి తోలు సంచి ముషాక్ ను చించి, చిన్నచిన్న  ముక్కలు చేసి, వాటికి బంగారు పూత పూయించి తన పేరు ,తాను సామ్రాజ్యాన్ని పాలించిన రోజు లతో ముద్రించి కరెన్సీ గా చలామణి చేశాడు .ఇలా ఒక్క రోజు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించి’’ ఏక్ దిన్ కా సుల్తాన్’’ అని చరిత్ర సృష్టించాడు భిస్టీ నిజాం .ఈ విషయాన్ని భిస్టీ లందరూ చెప్పుకొని తెగ గర్వ పడతారు ,

ఆధారం -5-8-18 ఆదివారం  హిందూ పత్రికలో అమితాంగ్ షు ఆచార్య  రాసిన ‘’ఎ భిస్టి రూల్డ్ యాన్ ఎంపైర్ వన్స్’’ ఆర్టికల్ లో కొద్దిభాగం . మిగిలింది వీకీ పీడియా .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-18 –ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అంతరిక్ష పరిశోధన శాస్త్ర వేత్త ,ప్రముఖ పాప్యులర్ సైన్స్ రచయిత –డా మహీధర నళినీ మోహన రావు 

అంతరిక్ష పరిశోధన శాస్త్ర వేత్త ,ప్రముఖ పాప్యులర్ సైన్స్ రచయిత –డా మహీధర నళినీ మోహన రావు

తూర్పు గోదావరి జిల్లా ముంగండ లోసంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో  డా .మహీధర నళినీ మోహన రావు 1933 లో ఆగస్ట్ 4  అంటే ఈ  ఈ రోజే  జన్మించారు .ఇక్కడే రస గంగాధరం అనే అలంకార శాస్త్రం రాసిన జగన్నాధ పండితరాయలు జన్మించాడు .మహీధర కుటుంబం ముగ్గురు స్వాతంత్ర సమర యోధులను అందించింది .తండ్రి మహీధర రామ మోహనరావు  ప్రముఖ రచయిత, నవలాకారుడు స్వాతంత్ర్యోద్యమ సమర యోధుడు .ఈయన రాసిన ’’కత్తులవంతెన ‘’ నవల బాగా ప్రచారం పొందింది .‘’కొల్లాయి గట్టితే నేమి ‘’నవలకు 1960 లో తెలుగు సాహిత్య అకాడెమి పురస్కారం వచ్చింది .’’కత్తులవంతెన ‘’  .ప్రముఖ కవి ‘’మో’’ అని పిలువబడే శ్రీ వేగుంట మోహన ప్రసాద్ తో కలిసి దీన్ని ‘’స్వరాజ్యం ‘’గా ఆంగ్లీకరించారు .19 36 లో విశ్వ సాహిత్య మాల స్థాపించి 1964 వరకు అనేక పుస్తకాలు ప్రచురించారు .ముంగండ అగ్రహారం సంప్రదాయానికి నిలయమైనా ,మహీధర కుటుంబం వామ పక్ష భావాలున్నవారు .ప్రజాశక్తి ,విశాలాంధ్ర పత్రికల సంపాదకుడిగా చేశారు .తండ్రి సూర్య నారాయణగారు బ్రహ్మ సమాజ అభిమానులు కావటం తో కొడుకుకు రాజారామ మోహనరాయ్ పేరు పెట్టుకున్నారు .ఈ కుటుంబలో మహీధర జగన్మోహనరావు కూడా ప్రముఖ రచయిత.లెనిన్ జీవిత కధలు మధ్యయుగాల మహా చరిత్ర పుస్తకాలు రాశారు .

  నళినీ మోహన్  ప్రాధమిక విద్య విజయవాడ సి. వి .ఆర్.స్కూల్ లో  లో నేర్చి,15 వ ఏటనే కవిత్వం రాయటం మొదలు పెట్టారు . 1953-55 లో ఉస్మానియా యూని వర్సిటి నుంచి భౌతిక శాస్త్రం లో ఎం.ఎస్ .సి. పాసయ్యారు .తర్వాత మాస్కో వెళ్లి196౦ -63 లో –  మాస్కో,  లుముంబా యూని వర్సిటిల లో చదివి  డాక్టరేట్ పొందారు ..స్వీడన్ వెళ్లి ఆయనో స్పెరిక్ అబ్జర్వేటరీ లోనూ ,బల్గేరియా దేశపు అకాడెమీ ఆఫ్ లాబ రేటరిలోనూ డిప్యూటీ డైరెక్టర్ గా ఉంటూనే తనకభిమానమైన అంతరిక్ష  పరిశోధనలు చేశారు .

ఇండియా తిరిగి వచ్చి న్యు ఢిల్లీ నేషనల్ ఫిజికల్ లాబ్  డైరెక్టర్ అయ్యారు .రోదసీ శాస్త్ర వేత్తగా నళినీమోహన్ 16 రాకెట్ ప్రయోగాలలో పాల్గొన్నారు .శాస్త్ర పరిశోధనలు ప్రయోగాలు చేస్తూనే  తెలుగులో వైజ్ఞానిక రచనలు చేసి పాప్యులర్ సైన్స్  ఆర్టికల్స్ రాశారు .ఇది తెలుగు వారికి వరమై అప్పటివరకు ఎవరికీ అందుబాటు లో లేని వైజ్ఞానిక విషయాలు కరతలామలక మయ్యాయి .దీనికి రావు గారికి మనం కృతజ్ఞులమై ఉండాలి .తెలుగు బాలలకోసం బాల సాహిత్యాన్నీ రాశారు .అందులో చొప్పదంటు ప్రశ్నలు , ,పిడుగు కధ ,క్షేత్ర వీధులలో మొదలైన 16 పుస్తకాలున్నాయి .నిత్య ,అనుక్షణ పరిశోధనలో మునిగి తేలుతూ కూడా వీటిని రాయటం  మెచ్చదగినవిషయం .ఇవే కాక యువత కోసం 35 పుస్తకాలు రాసిన సైన్స్ పాప్యులర్ రచయిత సైంటిస్ట్ నళినీమోహన్ ..వీటిలో కాలెండర్ కథ ,గ్రహణాలకథ ,విద్యుత్కథ మొదలైనవి ఉన్నాయి .భారతీయ దార్శనికులు ,ప్రాచీన శాస్త్రజ్ఞుల భావాలకు గౌరవం కలిపిస్తూ ,ఎన్నో ఆధునిక విషయాలు వివరించి యువతకు స్పూర్తి కలిగించారు .ఒకరకంగా అంతరిక్షం లో విహరిస్తున్న సైన్స్ ను భూ మార్గం పట్టించారు .మూఢ విశ్వాసాలను శాస్త్రీయ దృక్పధం తో విమర్శించారు.

నళినీ మోహన్ రచించిన ‘’వనసీమలలో  పండిత రాయల భావ తరంగాలు ‘’పండితుల ప్రశంసలను అందుకొన్నది .తెలుగు భాషపై ఉన్న మక్కువ ,అభిమానం, గౌరవాలతో ఆయన 35 కి పైగా సైన్స్ గ్రంథాలు,176 బాలసాహిత్య రచనలు చేశారు .మంచి కవి కూడా అవటం తో కవితా సంకలనాలు వెలువరించారు .కావ్యాలు వ్యాస సంపుటాలు రాసి ప్రచురించిన శాస్త్ర కవి .అప్పటి వరకు సైన్స్ పుస్తకాలు రష్యా నుంచి దిగుమతి అయి అర్ధం పర్ధం లేని తెలుగు అనువాదాలతో తెలుగు వాడి బుర్రలను తినేశాయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టి దేశీయమైన తెలుగుతో సైన్స్ కు పరి పుస్టికలిగించారు నళినీ మోహన్ .రష్యా అనువాద జడి వాన నుంచి అచ్చమైన తెలుగు రచన గొడుగుతో కాపాడిన శాస్త్రీయ భాషా ఉద్యమకారుడు నళినీ మోహన్ గొప్ప సంస్కృత పండితుడు కూడా .

రావు గారి విజ్ఞాన శాస్త్ర కృషిని మెచ్చి  1968 లో దువ్వూరి రామి రెడ్డి స్మారక  ప్రతిష్టాత్మక  ‘’విజ్ఞాన బహుమతి’’ మొట్టమొదటి సారిగా అంద జేశారు . .తర్వాత ఇందిరాగాంధీ విజ్ఞాన బహుమతి పొందారు .తెలుగులో ఇంత విస్తృతంగా సైన్స్ గ్రంధాలు రాసిన వారు లేరు .శాస్త్రీయ విజ్ఞానాన్ని తెలుగునాట వ్యాపింపజేసిన ప్రాతస్మరణీయులు నళినీ మోహన్ .ఆకర్షణీయమైన శైలి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు సైంటిఫిక్ భావాలను స్పష్టంగా విడమర్చి చెప్పే విధానం గొప్ప ఆకర్షణగా నిలిచి ఆయన్ను అందరికీ దగ్గర చేశాయి  .గణితం లో గమ్మత్తులను కూడా  సరదాగా అరచేతిలో ఉసిరికాయ ను చేశారు .పత్రికలలో ఆయన రాసిన వ్యాసాలకు లెక్కే లేదు .శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని జనబాహుళ్యానికి అందుబాటులోకి తెచ్చిన రచనా శిల్పి ఆయన .ఆ ఘనత రావు గారిదే. అనితరసాధ్య కృషి ఇది . మహీధర గేయకధలు,ప్రపంచానికి ఆఖరి ఘడియలు ,మెదడుకి పదును  ఆయన రచనలలో ఆణిముత్యాలు .

పదవీ విరమణ చేశాక ఆల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధికి గురైన నలినీకాంత రావు ,హైదరాబాద్ సరూర్ నగర్ వృద్ధాశ్రమంలో చికిత్స పొందుతూ 72 వ ఏట 21-10-20 05 న మరణించారు .ఆయనకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఔషధ మొక్కల శాస్త్ర వేత్త డా.శ్రీ కొప్పుల హేమాద్రి

ఔషధ మొక్కల శాస్త్ర వేత్త డా.శ్రీ కొప్పుల హేమాద్రి

తూర్పు గోదావరి జిల్లా  గొల్లప్రోలు  లో జన్మించిన శ్రీ కొప్పుల హేమాద్రి అనకాపల్లి ఎమ్. ఎ.ఎల్ కాలేజీ లో కెమిస్ట్రీ లో బిఎస్ సి చదివి పాసై ,బాంబే యూని వర్సిటీనుండి  బి .ఎస్ .సి. ఆనర్స్ పొందారు .పూనా లోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులుగా చేరారు .మొక్కలలోని జాతులు వైవిధ్యాలగురించి తీవ్రమైన అధ్యయనం చేశారు .ఏం ఎస్ సి చదువుతూనే పరి శోధనా పత్రాలు సమర్పించేందుకుశివాజీ మహారాజ్ జన్మించిన  ‘’ఫ్లోరా ఆఫ్ జన్నర్ ‘’ప్రాంతం లో మొక్కలలో వివిధ జాతులపై పరిశోధన చేశారు.సహ్యాద్రి కొండలనడుమ దట్టమైన అటవీ ప్రాంతమే ఫ్లోరా ఆఫ్ జన్నర్ .అక్కడ అణు అణువూ గాలించి 14 కొత్త మొక్కలను కనిపెట్టారు .వీటి గురించి అప్పటికి ఎవరికీ ఏమీ తెలియదు .అందుకోసం ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలించి ,ఆ మొక్కల వినియోగం ప్రయోజనాలను తెలుసు కొన్నారు .తన పరిశోధన సారాంశాన్ని ‘’బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ‘’డైరెక్టర్ కు పరిశీలనకోసం పంపారు .ఆయన దానికి కొద్ది మార్పులు సూచించి  పి .హెచ్ .డి. కి పంపమని సలహా ఇచ్చారు .వెంటనే హాలండ్ లోని ‘’రిజ్క్ హీర్బే రియం ‘’కు పంపారు .దాని డైరెక్టర్ దీన్ని బాగా పరిశీలించి ,హేమాద్రిగారికి పి .హెచ్ .డి. కి బదులు ‘’ డాక్టర్ ఆఫ్ సైన్స్ ‘’పట్టా ప్రదానం చేశాడు .ఈ ప్రోత్సాహం తో ప్రామాణిక పద్ధతులలో పరిశోధనలు చేసి   కొత్త మొక్కలు ఎక్కడున్నా’’ కొప్పు పట్టి లాగి’’ ,40 మొక్కలను నూతనంగా కనుక్కొని వైద్య రంగానికి అందజేశారు కొప్పుల హేమాద్రిగారు .

      బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సుమారు 9 సంవత్సరాలు పని చేసి తన పరిశోధనా ఫలాలను పక్వానికి తెచ్చారు .ఔషధ మొక్కలపై వీరికున్న అవగాహనకు ప్రోత్సాహకరం గా కేంద్రీయ ప్రభుత్వ ఆయుర్వేద సంస్థ లో సర్వే అధికారి గా నియమి౦ప బడ్డారు .అప్పటికి ఆయుర్వేద గ్రంధాలలో మందుల మొక్కల పేర్లు అన్నీ తప్పుల తడక గా ఉన్నట్లు ఆయన గుర్తించారు .వెంటనే పనికి పూనుకొని వాటిని వర్గీకరించి అసలైన సరైన పేర్లు పెట్టారు .దీనిపై 35 ఏళ్ళు తీవ్ర కృషి చేశారు .మన  రాష్ట్రం తో పాటు మహారాష్ట్ర ,ఒరిస్సా ,పశ్చిమ బెంగాల్ ,కర్నాటక లలో కూడా పర్యటించి,పరిశీలించి ,పరిశోధించి  చరిత్ర గర్భం లో దాగి ఉన్న 24 మొక్కలను కొత్తగా పరి చయం చేశారు  .

   మన రాష్ట్రం లోని ఉభయ గోదావరి ,విశాఖ ,ప్రకాశం ,కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో తిరిగి ,ఆ ప్రాంతాలలో ఉన్న ఔషధ మొక్కలను గుర్తించి ,సేకరించి ,గిరిజన సంప్రదాయ వైద్యం గురించి పూర్తిగా అధ్యయనమూ చేశారు .తర్వాత వీటిని గ్రంధస్ధం  చేశారు .కడపజిల్లా లోని వేంపల్లి కొండలమీద ‘’రక్త మండలం ‘’పేరుతోనూ ,అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతం లోని బంగారు నాయకుని కొండ పై ఉన్న ‘’ముని రెట్ట ‘’పేరుతోనూ ,మహబూబ్ నగర్ జిల్లా లో ‘’కొండముచ్చు మూత్రం ‘’గా వివిధ పేర్లతో ఆటవికులు పిలిచే దాన్ని ‘’గోమూత్ర శిలాజిత్ ‘’ గా హేమాద్రిగారు గుర్తించి , సంప్రదాయ వైద్య  రంగానికి యెనలేని సేవలు చేశారు .

  హేమాద్రిగారు 15 వైద్య గ్రంధాలు రచించారు .’’ఆంద్ర ప్రదేశ్ లో  మందు మొక్కలు’’ ,’’ఔషధీ వృక్షశాస్త్రం ‘’గ్రంధాలను తెలుగు అకాడెమి ప్రచురించి బి .ఎస్ .సి .ఆయుర్వేద విద్యార్ధులకు పాఠ్య గ్రంధాలను చేసింది .మన రాష్ట్రం లో లభించే ఔషధ మొక్కలపై హేమాద్రిగారు చాలా పుస్తకాలు రాశారు .వారి రచన ‘’గిరిజన మూలికా వైద్యం ‘’బహుళ ప్రచారం లో ఉంది ఆయుర్వేద గ్రంధాలను అక్షర క్రమం లో పేర్లు పెట్టి సరి చేసిన ఘనత కొప్పులవారిది .కొప్పులవారి శేముషికి దర్పణం ’’గిరిజన వైద్య సర్వస్వం’’ అనే ఉద్గ్రంధం .మెడికో బొటానికల్ ఎక్స్ప్లో రేషన్ ,శాస్త్ర వేత్తలను ఆకర్షిస్తున్న గిరిజన వైద్యం ,గ్రాసెస్ ఆఫ్ జున్నార్ అండ్ ఇట్స్ సరౌ౦డింగ్స్,దిఫ్లోరా ఆఫ్ జున్నార్ అండ్ ఇట్స్ సరౌ౦డింగ్స్ గ్రంధాలు’’ కొప్పుల ‘’సిగలో అనర్ఘ రత్నాలు .

   జీవిత కాలమంతా వృక్ష శాస్త్రానికే అంకితం చేసిన శ్రీ కొప్పుల హేమాద్రి గారు 72 పరిశోధనా పత్రాలు రాసి ప్రచురించారు .ఆయనలో గోప్పకవికూడా ఉన్నారు. చక్కని కవితలతో అలరిస్తారుకూడా .జనరంజకమైన కాల్పనిక కథలూ రాశారు .ప్రస్తుతం విజయవాడలో  స్థిర నివాసం గా  ఉన్నారు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-18 –ఉయ్యూరు


— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి మందిరం

శృంగి

ఉత్తరప్రదేశ్ లోని  నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి ఆలయం అతి ప్రాచీనమైనది .108 శక్తి పీఠాలలోఒకటిగా ప్రసిద్ధి చెందింది .మధ్యయుగ కాలం నాటి ఈ ఆలయం విజయదత్తుల దండ యాత్రలో ధ్వంసమైంది .కాశీ దేవాలయాలను పునరుద్ధరించిన రాణీ అహల్యా బాయి  ఈ ఆలయ పునరుద్ధరణ చేసింది .

తండ్రి దక్షప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి తనకూ భర్త శివుడికీ ఆహ్వానం లేకపోయినా ,పుట్టింటి పై మమకారం తో , భర్త పరమేశ్వరుడు వద్దని వారించినా , పిలువని పేరంటానికి  వెళ్లి నట్లు సతీ దేవి వెళ్లి ,అక్కడ తండ్రి వలన తీవ్ర అవమానికి గురై ,భరించలేక యోగాగ్నిలో దగ్ధమై పోయింది .ఇది తెలిసిన శివుడు ఉగ్రరూపం తో సతీదేవి శరీరాన్ని తన భుజాలపై మోస్తూ , నిరంతర తాండవ నృత్యం సలిపాడు .లోకాలన్నీ తల్లడిల్లి పోయాయి . బ్రహ్మాది దేవతలంతా దిక్కుతోచక విష్ణు మూర్తికి మొరపెట్టారు. ఆయన వచ్చి సతీదేవి శరీరం శివుడు మోసినంత సేపూ  ఆయనను శాంతి౦ప జేయలేమని గ్రహించి తన సుదర్శనచక్రం తో సతీ దేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించాడు .అవి 10 8 ముక్కలుగా  ఖండింప బడి  భారత దేశమంతటా వివిధ ప్రదేశాలలో పడ్డాయి .ఈ ఖండాలు పడిన చోట అమ్మవారి ఆలయాలు వెలిసి,108  శక్తి పీఠాలయ్యాయి .నైమిశారణ్యం లో అమ్మవారి గుండె తెగిపడింది .అందుకే మహోత్క్రుస్ట శక్తి పీఠం గా వన్నె కెక్కింది .

‘’వారాణసీ విశాలాక్షీ ,నైమిశే లింగ దారిణి’’అన్న ప్రసిద్ధ శోకం ఉంది .కాశీలో విశాలాక్షి  రూపం లో , నైమిశారణ్యం లో’’ లింగధారిణి’’  అయిన లలితా పరాభట్టారికా రూపం లో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది .అమ్మవారి దగ్గర ప్రతిస్టింప బడిన శ్రీ చక్ర యంత్రం మహామహిమాన్వితమైనది అంటారు .మహిషాసుర,  భండాసురాది క్రూర రాక్షస సంహారం చేసి లోకాలను కాపాడిన చల్లని తల్లి లలితాదేవి అనిమనకు తెలుసు .  మహామంగళ స్వరూపిణి గా ఇక్కడ విశేష పూజలందుకొంటున్నది .భక్తుల కొంగుబంగారం లలితాంబ .

ఉత్తర ప్రదేశ్ లోని లక్నో కు 90 కిలోమీటర్లలో  సీతాపూర్ జిల్లాలో గోమతీ నదీ తీరాన  నైమిశారణ్యం ఉంది .’’నైమిశే అనిమిష క్షేత్రే ‘’అన్న దానిప్రకారం ఇది దేవతా క్షేత్రమేకాక ,విష్ణు క్షేత్రం కూడా .అనిమిషులు అంటే రెప్పపాటు లేని దేవతలు .విష్ణు సహస్ర నామాలలో   అనిమిష అనేది ఒకటి .అంటే ఆయన నిత్య జాగరూకుడు   కను రెప్పలు  మూయని వాడు , నిద్ర పోనివాడు ,,మహా మేధావి అని అర్ధం.-‘’గురుః,గురు తమో ధామః సత్యః సత్య పరాక్రమః నిమిషో ,అనిమిషః స్రగ్వీ ,వాచస్పతిర్  ఉదారదీః’’.

నైమిశం  16 కిలోమీటర్ల చుట్టుకొలత కలది. దీనినే పరిక్రమ అంటారు .ఇక్కడే భగవాన్  వేద వ్యాసుడు వేద విభజన చేసి ,బ్రహ్మ సూత్రాలు ,  భాగవతాది పురాణాలు ,మహాభారతం ఉపనిషత్తులు  మొదలైన ప్రసిద్ధ రచనలు చేశాడు .ఆయన కూర్చున్న చోటును ‘’వ్యాసగద్ది’’అంటారు ఇప్పుడు మనం చూడచ్చు .మహాభారతం మొదటి సారిగా పారాయణం చేసిన ‘’పురాణ మందిరం ‘’ఉన్నది . శృంగి మహర్షి తపస్సు చేసిన మందిరం ఉంది . సూత మహర్షి ఇక్కడే శౌనకాది మునులకు ఎన్నో పురాణాలు ప్రవచించాడు . ఇంద్రుడి వజ్రాయుధం తయారు కావటానికి  దధీచి మహర్షి తన వెన్నెముకను దానంచేసిన పవిత్ర స్థలం ఇది.  శ్రీరాముడు రావణ సంహారం అనే బ్రహ్మ హత్యా పాపం పోగొట్టుకోవటానికి ఇక్కడి’’మిశ్రిక్’’ లో ఉన్న  ‘’హత్యా హరణ తీర్ధం ‘’లో పవిత్ర స్నానం చేశాడు  .ఇది  నైమిశానికి  11 కిలోమీటర్ల దూరం లో సీతాపూర్ వైపు ఉంది.విక్రమాదిత్య చక్రవర్తి శ్రీరామ పత్ని సీతా సాధ్వి పేరిట సీతాపూర్ నిర్మించాడు .అంతే కాదు చారిత్రకంగా కూడా నైమిశం ప్రసిద్ధి చెందింది .1857 ప్రధమ స్వాతంత్ర సమరం లో ఈ జిల్లా ఆదివాసులు బ్రిటిష్ కంటోన్ మెంట్ పై  దాడి చేసి కాల్పులు జరిపారు  . ఈదాడిలో చాలామంది మిలిటరీ ఆఫీసర్లు, పౌరులు తప్పించుకు పారి పోయే ప్రయత్నం  లో మరణించారు.

నైమిశం లోని చక్రతీర్ధం పుణ్యస్నానాలకు ప్రసిద్ధి .విష్ణు మూర్తి చక్రం ఆగిన ప్రదేశం లో ఏర్పడిన పుష్కరిణి ఇది .నైమిశారణ్యం లో ఆది శంకరాచార్యులవారు లలితా దేవిపై ‘’లలితా పంచకం ‘’రాశారు .సతీదేవి ఇక్కడే తపస్సు చేసింది . ఇక్కడి హనుమాన్ గర్హిలో ‘’పెద్ద హనుమంతుడు ‘’కొలువై ఉన్నాడు .పాతాళంలో  అహి మహి  రావణులను  మర్దించి భూమిపైకి వచ్చి మొదటిసారిగా ఇక్కడే ఆంజనేయుడు శ్రీరామ లక్ష్మణులకు కనిపించాడు .9 వశతాబ్దికి  చెందిన’’తిరు మంగై ఆళ్వార్ ‘’నైమిశం పై తమిళం లో 10 పద్యాలు రాసి ఇదే’’మహా  విష్ణు క్షేత్రం ‘’ అన్నాడు .ఇక్కడ ఆహోబిలమఠం ,రామానుజ కూటం కూడా ఉన్నాయి .శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయమూ నిర్మించారు .కనుక నైమిశారణ్యం లో కాలుపెడితే ఎన్నెన్నో విశేషాలను శ్రీ లలితాదేవిమందిరం తో పాటు దర్శించవచ్చు .’’టూమెనీ బర్డ్స్ ఎట్ వన్ షాట్ ‘’.అన్నమాట .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-18 –ఉయ్యూరు


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేన్సర్  మహమ్మారి సంహారి  డా శ్రీ నోరి దత్తాత్రేయుడు

కేన్సర్  మహమ్మారి సంహారి  డా శ్రీ నోరి దత్తాత్రేయుడు

కృష్ణా జిల్లా ఉయ్యూరుకు దగ్గరలోని మంటాడ గ్రామం లో డా.శ్రీ నోరి దత్తాత్రేయుడు గారు 21-10-1947 న స్వతంత్ర భారత దేశం లో జన్మించారు .తండ్రి శ్రీ నోరి సత్యనారాయణగారు టీచర్ .తల్లి గారు శ్రీమతి కనక దుర్గ .చాలా పేద కుటుంబం నోరి వారిది .దత్తత్రేయుడు గారికి అయిదుగురు అన్నదమ్ములు ,అయిదుగురు అక్కచెల్లెళ్ళు .అందరిలో చిన్నవాడు దత్తాత్రేయుడు .5 వ ఏటనే తండ్రిని కోల్పోయిన నిర్భాగ్యుడు . .మచిలీ పట్నం లోతల్లి సంరక్షణలో 7 వ తరగతి వరకు చదివారు . ఆంద్ర జాతీయ కళాశాలలో ప్రీ యూని వర్సిటి ,బి ఎస్ సి పూర్తి  చేసి , .కర్నూలు మెడికల్ కాలేజి లో 1965 నుండి 71 వరకు చదివి ,ఉస్మానియా యూని వర్సిటి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ పొందారు .1976 లో ఎం. డి. అయ్యారు .పెత్తల్లి శ్రీ మతి జొన్నలగడ్డ సుందరమ్మ గారు దొడ్డ ఇల్లాలు .నెల నెలా ఆమె పంపే డబ్బుతోనే నోరివారు చదువ౦తా పూర్తి  చేశారు .పెద్దమ్మ పంపిన డబ్బుకు సార్ధకత చేకూర్చారు . సు౦దరమ్మ గారి చేతి చలవ మహా గొప్పది .ఆమె వల్లనే ప్రపంచానికి ఒక సమర్ధుడైన కాన్సర్ వ్యాధి వైద్యుడు లభించాడు .

 

ఫిబ్రవరి  1972- ఫిబ్రవరి 73వరకు దత్తాత్రేయుడు గారు హైదరాబాద్ గాంధి హాస్పిటల్ లో పని చేశారు .1973  నుంచి 1976 వరకు ఉస్మానియా యూని వర్సిటి అనుబంధ ‘’రేడియం ఇన్ స్టి ట్యూట్ అండ్ కాన్సర్ హాస్పిటల్’’ లో రెసిడెంట్ డాక్టర్ గా ఉన్నారు .ఆయనకు మొదటి నుంచి కాన్సర్ వ్యాధి నివారణోపాయం  కనిపెట్టాలన్న తపన ఉండేది .ఇది అమెరికాలోనే సాధ్యం అని గ్రహించారు .

అమెరికా వెళ్లి కేన్సర్ వ్యాధిపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు .న్యూయార్క్ లోని మెమోరియల్ స్లోన్ -కెట్టేరింగ్ కాన్సర్ సెంటర్ లో అధ్యయనం కొనసాగించారు .బ్రాకీ థెరపి విభాగానికి అధ్యక్షులై ,పరిశోధనలు చేశారు .కార్నెల్ నగరం లో రేడియేషన్ ఆంకాలజీ చైర్మన్ గా ఉంటున్నారు .వీరి భార్య శ్రీమతి సుభద్ర కూడా డాక్టర్ .వీరి కుమారుడు సంతోష్ న్యాయవాది .అమ్మాయి  డాక్టర్ .

ఆధునిక కాలం లో కేన్సర్ వ్యాధి వ్యాప్తికి వాతావర ణం లో వస్తున్న మార్పులు ,ముఖ్య కారణాలని డా నోరి పరిశోధనలలో తేలింది.దీనిపై విస్తృత అధ్యనం చేయాల్సిన  అవసరం ఉందని భావించి న్యూయార్క్ ప్రేస్బిటేరియన్ హాస్పిటల్ –విల్ కార్నెల్ మెడికల్  సెంటర్ లో తీవ్ర పరిశోధనలు చేసి ఆ వ్యాధి నివారణకు 27 ఆరోగ్య రక్షణ సౌకర్యాలు కలిగించి , అమెరికా దేశం లో కాన్సర్ బాధితుల పాటి ప్రత్యక్ష దైవం అనిపించారు .అన్ని వసతులు సౌకర్యాలు ఉన్న సమగ్ర కాన్సర్ చికిత్సాలయాలను 10 కేంద్రాలలో నెలకొల్పారు .న్యు యార్క్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ ఆఫ్ క్వీన్స్ లో రేడియేషన్ ఆంకాలజీప్రొఫెసర్ , చైర్మన్ గా చేశారు..క్వీన్స్ కు ఆంకాలజీ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు .

గైనలాజికల్ ,డెంటి ట్యూరినరి, , ధోరాసిక్ అండ్ హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్ మొదలైన వాటిపై అధిక స్థాయి బ్రాకీ దెరపి లో  కొత్త చికిత్సా పద్ధతులు , అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఆవిష్కరించిన ఘనత నోరి వారిదే .2002 జులై లో అమెరికా వైద్య రంగం లో ఒక భారీ స్థాయి సర్వే జరిపారు.సుమారు రెండున్నర లక్షల ప్రముఖ వైద్యుల కుటుంబాల వద్దకు వెళ్లి  , వాళ్ల ఇళ్ళల్లో ,ఏదైనా  అనారోగ్య సమస్య వస్తే ఏ డాక్టర్ ను సంప్రదిస్తారని అడిగితే ,వారందరూ కాన్సర్ విషయం లో అందులోనూ ముఖ్యంగా మహిళల కాన్సర్ విషయం లో డా .నోరి దత్తాత్రేయుడు గారినే సంప్రదిస్తాం అని నిర్ద్వంద్వంగా తెలిపారు .అంటే అమెరికాలో అత్యున్నత కేన్సర్ వైద్యులు నోరివారే నని చాటి చెప్పారన్నమాట .మహిళల కాన్సర్ నివారణ కు ప్రపంచం లోనే ‘’టాప్ డాక్టర్’’ గా డా నోరివారికి సుస్థిర స్థానం లభించింది .

నోరి వారివైద్య సేవానిరతి గుర్తించిన అనేక దేశాలు సంస్థలు ,ప్రముఖులు వారిని ఆహ్వానించి సత్కరించి గౌరవించి ప్రాణ  రక్షకుని గా ప్రాణదాత గా  కీర్తించారు .ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వర్ణ పతకం అందించి సన్మానించింది .వీరి వద్దశిక్షణ పొందిన 300 మంది కి పైగా కాన్సర్ నిపుణులు  ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య పదవులలో రాణిస్తున్నారు .వీరందరికీ స్పూర్తి ప్రదాత డా నోరి. కాన్సర్ రాకుండా పేగులలోపల ఉండే సున్నితమైన పొరను కాపాడేది ‘’పసుపు ‘’అని స్పష్టంగా చెప్పారు డా,నోరి .వంటనూనె ను అనేక సార్లు కాచి వాడటం ప్రమాదకరం అని హెచ్చరించారు .మన సంప్రదాయ వైద్య విధానాలలో ఉన్న మేలును కూడా గుర్తించారాయన .50 ఏళ్ళుగా అమెరికాలో కాన్సర్ వ్యాధి నిపుణులుగా సేవలందిస్తున్న దత్తత్రేయుడుగారికి అమెరికన్ కాన్సర్ సొసైటీ ‘’ట్రిబ్యూట్ టు లైఫ్ ‘’అనే గౌరవాన్ని బహూక రించి సత్కరించింది .భారత ప్రభుత్వం 1915 లో ‘’పద్మశ్రీ ‘’తో సరి పుచ్చింది .

  • బసవతారక క్యాన్స్ ర్ ఇంస్టి్ట్యూట్ నిర్మాణము అప్పటి ముఖ్యమంత్రి యన్‌.టి.రామారావు గారి సహాయ సహకారాలతో జరిగినది . ఎన్‌టీ రామారావు భార్య బసవ తారకంకి క్యాన్సర్ సోకడంతో ఆమెను అమెరికాలో ఉన్నా దత్తాత్రేయుడు దగ్గరకు తీసుకొచ్చారు . చికిత్స జరిగి బాగు అయిన కొన్నాళ్ళు బ్రతికింది. అంతకు ముందే దత్తాత్రేయుడికి ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించాలనే ఉద్దేశము ఉండడం … దానికి తోడు ముఖ్యమంత్రి అడగడం జరిగిన పిమ్మట ప్రభుత్వము 7 ఎకరాల భూమిని హైదరాబాద్ లో ఇవ్వడము, కొంతమంది అమెరికా తెలుగు వారి చందాలతోను, ప్రభుత్వ ఆర్థిక సాయముతో 200 పడకల ఆసుపత్రితో అన్ని నూతన వైద్య పరికరాలతో ” బసవతారక ఇండో-అమెరికన్‌ కాన్సర్ ఇంస్టిట్యూట్ ” నిర్మాణము జరిగి ఫెలోషిప్ కోర్సులను కూడా ప్రారంభమంచడం జరిగింది.

 

.ఉచితంగా ఇక్కడ ఈ వ్యాధికి చికిత్స చేయటం  విశేషం .తరచుగా ఇక్కడికి వచ్చి డా.నోరి చికిత్సలు చేస్తూ ఉంటారు  .స్త్రీలకూ కాన్సర్ రాకుండా ఉండటానికి ఎన్నో మెళకువలు  చెప్పి చైతన్య వంతులను చేస్తున్నారు .పురుష కాన్సర్ పై కూడా విస్తృత అధ్యయనం చేశారు .జాతీయ ,అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ లో వారు లెక్కకు మించిన ఆర్టికల్స్ రచించి మార్గ దర్శనం చేశారు .2006 జులై లో ప్రతిష్టాత్మకమైన ‘’కనాలి మెడికల్ లిమిటెడ్ సంస్థ ‘’నిర్వ హించిన సర్వే లో ,మొత్తం లక్షమంది కాన్సర్ నిపుణులలో డా నోరి దత్తాత్రేయుడు గారు ప్రప్రధమ౦గా  నిలిచి చరిత్ర సృష్టించారు .అనేక కోణాలలో జరిగిన సర్వే లో కూడా ఈయనే అమెరికా అత్యుత్తమ డాక్టర్ గా ఎంపికయ్యారు .వీరు  కాన్సర్ వ్యాధి పై ర 4 గ్రంధాలు ,200 కు పైగా పరిశోధనా వ్యాసాలూ రాశారు .వీటిలో ఒక గ్రంథం ‘’యాన్ అట్లాస్ ఆఫ్  బ్రాకి థెరపి ‘’20 06 ఆగస్ట్ లో హైదరాబాద్ లో ఆవిష్కరణ పొందింది .2007 మార్చి 4 న వీరికి ప్రతిష్టాత్మక ‘’డా .యలవర్తి నాయుడమ్మ అవార్డ్ ‘’నిచ్చి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది .కాన్సర్ అంటేనే ‘’మరణ శాసనం ‘’అ నే భయాన్ని పోగొట్టి ,అసంభవమైన కేసుల్లోకూడా’’కాన్సర్ ?నో ఫియర్’’అని ఊరడిస్తూ , మరణాన్ని వాయిదా వేయించే అత్యంత సమర్ధులు డా నోరి దత్తాత్రేయుడు గారు ఆంధ్రులు ,కృష్ణా జిల్లావారు కావటం మనకు గర్వకారణం .

తాము సంపాదించినదంతా ‘’ఆరోగ్య సంపద పెంచటం అభి వృద్ధి చేయటం ‘’లకే ఖర్చు చేసిన వితరణ శీలి డా నోరి .’’బ్రాకీ థెరపి.’’వైద్య ప్రక్రియతో కాన్సర్ రాక్షస సంహారం చేస్తున్న అపర దత్తాత్రేయుడు డా నోరి దత్తాత్రేయుడు గారు .’లాంగ్ లివ్ డా నోరి ‘’ ‘’వైద్యో నారాయణో నోరి దత్తాత్రేయః’’

 

     గౌరవాలు – పురస్కారాలు

  • 1962 లో ప్రీ-యూనివర్సిటీలో చదివేటపుడు, 1965 లో బి.యస్ .సి చదివేటపుడు, ఉష్మానియాలో ఎం.డి. చేసినపుడు అత్యధిక మార్కులు రావడంతో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు .
  • 1984 లో అమెరికన్‌ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ పెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డ్ ఇచ్చారు . 1990 లో అమెరికన్‌ కాలేజీ ఆఫ్ రేడియేషన్‌ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు . 1994 లో అలుమిని సొసైటీ, మెమోరియల్ స్లాన్‌-కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విష్డ్ అలునినస్ అవార్డ్ అందుకున్నారు .
  • 2000 లో ఇప్పటి వరకు కాస్టల్ అండ్ కానల్లే పబ్లికేషం వారి అమెరికా బెస్ట్ డాక్టర్, లేడిస్ హోం జర్నల్ నిర్వహించే సర్వేలో మహిలల క్యాన్సర్ నివారణలో ఉత్తం డాక్టర్ ఎంపికయ్యారు .
  • 1995 లో ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ గోల్డ్ మెడల్ అందుకున్నారు .
  • 2003 లో అమెరికన్‌ కాలేజి ఆఫ్ రేడియేషన్‌ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నారు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

 ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,మరియు  స్పెషల్ అసిస్టెంట్ కలెక్టర్ –పులిచింతల ప్రాజెక్ట్

 విశిష్ట అతిధి – ”కవి రాజ మౌళి ,కవి సార్వ భౌమ ,మధురకవి ,అష్టావధాని ,కనకాభి షేకి ,70 గ్రంథాల  రచయిత ,విశ్రాంత తెలుగు పండితులు ,గుంటూరు జిల్లావాసి ,93 ఏళ్ళ

శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారు

ఆత్మీయ అతిధులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు  ,శాసనమండలి సభ్యులు

                        శ్రీ చలపాక ప్రకాష్ గారు –రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి

                        శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట సీతారామంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )

 మొదలగు పెద్దలు

                         కార్యక్రమ వివరం

స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం  ,పుష్ప సమర్పణ

ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు

1-విశిష్ట అతిధి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారికి

2-డా.శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి గారు –తెలుగు లెక్చరర్ ,ఏ. జి .అండ్ ఎస్. జి .సిద్ధార్ధ జూనియర్ కాలేజి

3-అమరవాణి పాఠశాల కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు

              ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం

1–2018 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1- శాంతినికేతన్  పాఠశాల విద్యార్థి-చి.కరిమి పవన్ కుమార్ కు ,-5 వేలరూపాయలు

 2- అమరవాణి పాఠశాల విద్యార్థినిలు  -కుమారి ఎం. డి.సఫూర మరియు కుమారి పి .తులసి లకుకలిపి – 5 వేల రూపాయలు .

ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు  ఏర్పాటు చేసిన  ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం –

3- ఎ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్ధినులలైన అక్కా చెల్లెళ్ళు -కుమారి చౌడాడ మౌనిక,కుమారి హేమలతలకు కలిపి  –రూ 5,వేల రూపాయలు .

-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు  శ్రీమతి సీతమ్మ దంపతుల  పేరిట    ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధికి  ఏర్పాటు చేసిన 10 ,11 6 రూపాయల స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦  –

4-2018 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 9.8 మార్కులతో  ఉత్తీర్ణత  సాధించి, స్థానిక .ఎ. జి. అండ్ ఎస్ .జి . సిద్ధార్ధ జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి గూడూరి చరిత కు

శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .

 సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

                                                                        ఆహ్వాని౦చు వారు

ఉయ్యూరు -3-8-18                                            గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

                                                                     పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమ 
— 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్ పైడి జయరాజ్

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్  పైడి జయరాజ్

ఈ తరం వారికి గుర్తు ఉండక పోవచ్చు కాని ,పాతతరం వారికీ జై రాజ్ లేక జయరాజ్ నటన బాగా గుర్తుండే ఉంటుంది .నటుడుగా ,నిర్మాత ,దర్శకుడుగా  హిందీ సినిమాలను కొన్నేళ్ళు శాసించిన  జైరాజ్ తెలుగు వాడని అసలు ఎవరికీ తెలియదు. ఆయనకూడా ఎప్పుడూ చెప్పుకోలేదు కూడా .అలాంటి విలక్షణ హిందీ హీరో అసలుపేరు పైడి పాటి  జయరాజ నాయుడు  .బాలీవుడ్ లో పైడి జైరాజ్ .వెడల్పైన ముఖం ,కాంతివంతమైన కళ్ళు, చక్కని నటన ఆజానుబాహు స్పురద్రూపం  , మంచి వాచకం జైరాజ్ ను హిందీ చిత్రసీమ అందలం ఎక్కించింది .

28-9-1909 లో తెలంగాణా కరీం నగర్ లో జైరాజ్ జన్మించాడు .సరోజినీ నాయుడుకు  మేనల్లుడు  .ఇతని అన్నలు సుందరరాజ నాయుడు ,దీన దయాళ్ నాయడు .

   నిజాం కాలేజిలో డిగ్రీ చదివి,అప్పటికే  తెలుగు నాటకాలలో  నటించి ప్రతిభ చాటాడు .సినిమాలో నటించాలన్న కోరికఉండేది .ఆ రోజుల్లో సినిమా వ్యాపారం లాభ సాటికాదు అని అందరి అభిప్రాయం . ఆతను తన కోరికను పెద్దలకు చెప్పగా వాళ్ళు వెళ్ళవద్దని  ఆంక్ష విధించారు.తన నిశ్చయాన్ని మార్చు కోకుండా  జయరాజ్ వారికి చెప్పకుండా  1929 లోఇంట్లోంచి పారిపోయి  బొంబాయి  చేరాడు .అప్పటికి తెలుగు సినీ పరిశ్రమ ఇంకా తప్పటడుగులు వేస్తోంది .అప్పటికే బొంబాయి లో ఏడాదికి 200 సినిమాలు రిలీజ్ అయ్యేవి .సంపన్న కుటుంబాలకు చెందినవారికి మాత్రమే అప్పుడు అక్కడ సినీ వేషాలు దక్కేవి .ఇంట్లో వాళ్ళు ఇతని సాహసానికి మెచ్చక   దాదాపు పాతిక ఏళ్ళు అతని గురించి పట్టించుకోలేదు .ఉత్తర ప్రత్యుత్తరాలే లేవు .ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు .చిన్న చిన్న కూలి పనులు చేశాడు .అన్నిటినీ మనో ధైర్యం తో  తట్టుకొని  నిలబడ్డాడు .తన ధ్యేయాన్ని నేరవేర్చుకున్నాడు .తొలితరం బాలీ వుడ్ నటుడుగా తెలంగాణా తెలుగు బిడ్డ విజయపతాకాన్ని ఎగర వేసి సూపర్ స్టార్ అయ్యాడు .

బొంబాయిలో డూప్లికేట్ స్టంట్ మాస్టర్ గా ముందు పని చేశాడు  .సెట్ లను అమర్చేవాడు .కెమెరా వాళ్లకు సహాయం చేసేవాడు  .  కాలం కలిసోచ్చి శారదా ఫిలిం కంపెనీ లో చేరి  అదే ఏడాది మూకీ చిత్రం ‘’స్టార్ కింగ్ యూత్ ‘’లో 19 వ ఏటనే  మొట్టమొదటగా నటించిన అదృష్ట వంతుడు జైరాజ్ .వెంటవెంటనే 11 సైలెంట్ సినిమాలలో నటించాడు. అందులో ‘’ట్రయాంగిల్ ఆఫ్ లవ్ ‘,మాతృభూమి ,ఆల్ ఫర్ లవర్ ,మహాసాగర్ మోతి,ఫ్లైట్ ఇంటూ డెత్ ,మై హీరో మొదలైనవి ఉన్నాయి .

  తెలుగు నాటకానుభవం, మంచి ఆకర్షణతో ఉన్న పర్సనాలిటి  జైరాజ్ కు బాగా తోడ్పడి ,అతనిని ఏ మాత్రం సంకోచించకుండా కత్తి వీరులైన ధీరోదాత్త రాజపుత్ర వీరుల ,రాజుల పాత్రలకు ఎంపిక చేసి నటింప జేశారు .1957 లో ‘’అమర్ సింగ్ రాధోడ్’’1859 లో ‘’పృథ్వి చౌహాన్ ‘’1960 లో ‘’మహారాణా ప్రతాప్ ‘’మొదలైన చిత్రాలలో హీరో వేషం వేసి అసలు వారంతా జైరాజ్ లాగానే ఉండేవారా అన్న౦తగా నటించి మెప్పించాడు .ఇవన్నీ సూపర్ హిట్ సాధించాయి .19 47 లో ‘’షాజహాన్ ‘’పాత్రలో గాంభీర్యం ఒలికించాడు .1959 లో ‘’టిప్పు సుల్తాన్ ‘’,1962 లో ‘’హైదరాలి ‘’సినిమాలలో లీడ్ రోల్స్ పోషించి  సెభాష్ జైరాజ్ అని పించుకున్నాడు .ఇంతటి వైవిధ్య పాత్రలలో నటించి తనకు సాటిలేరని పించుకొన్నాడు

   1947 నాటి ‘’సస్సి పున్నా ‘’,1956 ‘’హాతిం తాయ్ ‘’1963 ‘’చంద్రశేఖర ఆజాద్ ‘’1964 లో ‘’ దుర్గా దాస్ ‘’చిత్రాలు ఆయన కీర్తి కిరీటం లో కలికితు రాళ్ళు . ఆపాత్రలకోసమే ఆయన పుట్టాడా అన్నంత సహజం గా నటించాడు కాదు జీవించాడు .చారిత్రాత్మక, జానపద ,సాంఘిక హీరో పాత్రలలో తనకు సాటి లేరని పించాడు .

   ఆ తరం మేటి నటి’’ సురయా ‘’ తో 6 సినిమాలలో19 40 నుండి దశాబ్దం పాటు 1950 వరకు  నటించాడు .అందులో 1943 లోని ‘’హుమారిబాత్ ‘’1949 ‘’శింగార్ ‘’,అదే ఏడాది లో ’’అమర్ కహాని ‘’1951నాటి ‘’రాజపుట్ ‘’ ,1952లో రేషం’’చిత్రాలలో  సురయా ప్రక్కన హీరో గా నటించారు .ఆ రోజుల్లో ఆ ఇద్దర్నీ ‘’వెండితెర వేల్పులు ‘’గా భావించేవారు .1952 లోనే వచ్చిన  ’’లాల్ కున్వార్ ‘’లో సురయా తో  సెకండ్  హీరో గా చేశాడు .ఇంతటి నటనానుభవం ఉందికదా అని ‘’ ప్రసిద్ధ ఆంగ్లకవి టెన్నిసన్ రాసిన ఒక కవిత ఆధారం గా నటుడు భారత్ భూషణ్ హీరో గా ‘’  సాగర్ ‘’సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు .అట్టర్ ఫ్లాప్ అయి మళ్ళీ నిర్మాణం జోలికి పోకుండా బుద్ధిగా ఉన్నాడు . అతని నట జీవితంపై ఈ ఫైల్యూర్ ప్రభావం పడలేదు .హీరో గా దూసుకు పోతూనే ఉన్నాడు ,జైత్రయాత్ర సాగిస్తూనే ఉన్నాడు జయ రాజ్ .

  ఢిల్లీ కి  చెందిన పంజాబీ అమ్మాయి సావిత్రి ని కుటుంబ పెద్దలు కుదర్చగా పెళ్లి చేసుకొన్నాడు  .ఈ సంబంధాన్ని నాటి సాటిలేని మేటినటుడు పృధ్వీ రాజకపూర్ తండ్రి ఇరువైపులవారినీ సంప్రదించి కుదిర్చాడు .పృధ్వీ రాజ్ కపూర్ జైరాజ్ కు మంచి మిత్రుడు .అశోక్ కుమార్ తో సాన్నిహిత్యం బాగా ఉండేది .అంతర్జాతీయ సినీ నటులు రాబర్ట్ మోర్లీ ,జోస్ ఫెర్రెర్ లతో కలిసి పని చేసిన హీరో జైరాజ్ . అతడు అతి సునాయాసంగా చాలా భాషలు మాట్లాడే శక్తి సామర్ధ్యాలున్నవాడు .అందుకే భిన్నభాషల సినిమాలలోనూ రాణించాడు .ఇంగ్లీష్ ,ఉర్దూ లలో అమోఘ పాండిత్యం ఉండేది ఆయనకు ..మేనత్త నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు తో  మేనల్లుడు జైరాజ్ చాలా చనువుగా గౌరవంగా ఉండేవాడు ఆమెకూ అతనిపై అభిమానం జాస్తీ గా ఉండేది .జైరాజ్ సినిమా రంగం లోని చెడు పోకడలకు  చాలాదూరం గా ఉండేవాడు .భార్యను అమిత ప్రేమతో చూసేవాడు .వాళ్ళది అన్యోన్య, ఆదర్శ దాంపత్యం .ఇద్దరు కొడుకులు నలుగురు కూతుళ్ళు పుట్టారు.

1980 లో జైరాజ్ మొట్ట  మొదటిగా   ‘’దాదా సాహెబ్ ఫాల్కే ‘’అవార్డ్ పొందాడు . అంటే అక్కినేనికంటే ముందే ఫాల్కే అవార్డ్ పొందిన తెలుగు బిడ్డడు  జైరాజ్ .దురదృష్ట వశాత్తూ ఈ విషయాన్ని మనవాళ్ళు ఎవరూ అప్పుడు ప్రచారంచేయనే లేదు .తెలుగు వాడికి వచ్చిందని గర్వ పడనూ లేదు    .గుజరాతీ ,మరాఠీ ,హిందీ లలో మొత్తం  350 కి పైగా సినిమాలలో నటించాడు .హిందూలాల్ యాజ్ఞిక్ ‘’ది ప్రిజనర్ ఆఫ్ జెండా ‘’లో అతనికి మొదటి అవకాశం ఇచ్చాడు .ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకపోయింది .ఇందులో మాధురి హీరోయిన్ .ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవటం తో   యాజ్ఞిక్ మరినాలుగు సినిమాలలో అవకాశమిచ్చాడు ..అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి హీరో గా రికార్డ్ సృష్టించాడు జై రాజ్ .1930 లో అతని పారితోషికం వంద రూపాయలు .అతని సినిమాలో పైన పేర్కొన్నవికాక  సూపర్ హిట్లు  సాధించి సూపర్ స్టార్ ను చేసిన సినిమాలలో ‘’షికారి ,మజ్దూర్ ,స్వామి ,పన్నా ,రాజ్ పుటాని,ముంతాజ్ మహల్ ,లాల్ కిలా ఉన్నాయి .స్వామి సినిమా తో దశ తిరిగి రెమ్యూనరేషన్ విపరీతంగా పెంచారు .ప్రఖ్యాత డ్రీం గర్ల్  దేవికా రాణి సరసన ‘’హమారీ బాత్ ‘’లో నటించాడు .ఇది మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయింది .మాధురి ,షకీలా  ,నటనకే భాష్యం చెప్పిన  మీనాకుమారి, శశికళ వంటి టాప్ హీరోయిన్స్ తో  కూడా నటించాడు .1950 నుండి 1960 వరకు జైరాజ్ సినీ జీవితం లో స్వర్ణ యుగం .156 చిత్రాలలో హీరోగా , 200 సినిమాలలోవిలన్ , కేరెక్టర్ యాక్టర్  కామెడీ యాక్టర్   గా చేశాడు ..జైరాజ్ 3 సినిమాలకు దర్శకత్వం వహించాడు . .అన్నీ కనకవర్షాలే కురిపించాయి .ప్రతిమా ,సాగర్ . మొహర్ సినిమాలు మూడూ  అద్భుత విజయాలు సాధించాయి . సాగర్ ,మొహర్ రెండిటిలో తన శిష్యుడు షమ్మీ కపూర్ కు హీరో గా అవకాశం ఇచ్చాడు జైరాజ్ .సోదరులు రాజ్ కపూర్ ,షమ్మీకపూర్ లు జైరాజ్ ను ‘’పాపాజీ ‘’అని గౌరవంగా సంబోధించేవారు .

 జైరాజ్ సుదీర్ఘ సినీ రంగ సేవకు 1980 లో ప్రతిష్టాత్మకమైన ‘’దాదా సాహెబ్ ఫాల్కే ‘’పురస్కారం అందుకున్నాడు ..ఫాల్కే అవార్డ్ అందుకున్న మొట్టమొదటి తెలుగు  నట దర్శక నిర్మాత జైరాజ్ గుజరాత్  మహారాష్ట్ర ప్రభుత్వాలు జైరాజ్ ను ఘనంగా సత్కరించాయి . దిలీప్ కుమార్ రెండవ సినిమా’’ప్రతిభ ‘’ కు డైరెక్టర్ జయరాజ్ అంటే మనకు ఆశ్చర్యమేస్తుంది .మధుర సంగీత సృష్టికర్త  నౌషాద్ ను వెండి తెరకు పరిచయం చేసింది జైరాజే .1913 లో దాదాసాహెబ్ ఫాల్కే మొదటి సినిమా తీసి రికార్డ్ సృష్టించాడు .జైరాజ్ బాంబే సినీ రంగ ప్రవేశం 1929 లో చేసి ఆయన పేరిట   ఉన్న అవార్డ్ ను 1980 లో పొందిన ఘనుడు జైరాజ్  .మన అక్కినేని రామారావు లు సినీ అరంగేట్రం చేయకముందే బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన  వాడు జైరాజ్ .ఇంత గోప్పతెలుగు నటుడిని  మనవాళ్ళు మరచి పోయి అతని ఆనవాళ్ళు లేకుండా చేయటాని ప్రయత్నించినట్లు కనిపిస్తోందని సినీ విమర్శకులు అంటారు .తెలుగు సినీ చరిత్ర పుస్తకం లో అగ్రస్థానాన ఉండాల్సిన వాడిని ఇంతగా విస్మరించిన జాతి మనది .ఆయన శిలా విగ్రహం, ఆయన పేరిట పారితోషికం కూడా ఇవ్వని గొప్పమనసు మనది .  సినీకళాకారుల సంక్షేమం కోసం, మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన మానవతా మూర్తి జైరాజ్ .జాతీయ విపత్తులలో సర్వం కోల్పోయినవారి సహాయార్ధం సంగీత కచేరీలు నిర్వహించి అందజేసేవాడు

.జైరాజ్ చని పోవటానికి ఏడాది ముందే భార్య సావిత్రి  కేన్సర్ తో చనిపోయింది..  ఆమె మరణం అతని ఆరోగ్యం పై బాగా ప్రభావం చూపింది .తట్టుకోలేక పోయాడు .ఆతర్వాత అతని మరణం దాకా  తండ్రి బాగోగులు కూతురు గీత చూసుకొనేది .భార్యపై మమకారం ,బెంగ లతో జైరాజ్ 11-8-2000 న 91 వ ఏట మరణించాడు .అతని మనవడు అంటే ఈకూతురి కొడుకు ‘’రాజన్ షాహి’’ టి.వి. ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా మంచి పేరు పొందాడు .ఇతనొక్కడే జై రాజ్ కుటుంబానికి మిగిలిన ఏకైక వారసుడు .మిగిలిన వారంతా చనిపోయారు .

20 18 లో తెలంగాణా ప్రభుత్వం ‘’లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్ ‘’అనే డాక్యుమెంటరి ఫిలిం నిర్మించి ఈతరానికి పరిచయం చేసి,అతని శత జయంతిని ఘనంగా నిర్వహించి ఋణం తీర్చుకొన్నది .

కొసమెరుపు –హీరో,విలన్ ,కేరక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాలలో నటించి నిర్మాత దర్శకుడిగా ప్రాభవం పొందిన జైరాజ్ యెంత సంపాదించాడో, .డబ్బుతో ఎన్నో బంగళాలు  ఇళ్ళూ, స్థలాలుకొన్నాడో ,  బ్యాంకుల్లో  యెంత డబ్బు మూలుగుతోందో ఆయనకే తెలియదు .అంతటి సంపన్నుడు .ఆ తరం లో కుబేరుడే .’’మనీ మేనేజ్’’ మెంట్ పై అసలు దృష్టి పెట్టలేదు సంపాదించింది పధ్ధతి ప్రకారం కొడుకులకు, వారసులకు ఇవ్వ లేకపోయాడు .దీనితో కొడుకు  లిద్దరిదీ ఇస్టా రాజ్యమై పోయింది .అందినంత బొక్కేశారు.వ్యసనాలకు బానిసలై  ఉన్నదిఅంతా ఊడ్చేశారు .చివరికి మిగిలిన ఒకే ఒక్క ఇల్లు ను కూడా కొడుకు కోడలు ఆక్రమించి ఆయన్ను ఒక చీకటి గదికే పరిమితం చేసి,మానవత్వం మరచి ప్రవర్తించారు .అతనికి కట్టుకోవటానికి సరైన బట్టలే ఉండేవి కావట .తిండీ తిప్పల సంగతి ,ఆరోగ్యం విషయం అస్సలు పట్టించు కోకుండా గాలికి వదిలేశారు ఒకప్పటి ఆసూపర్ స్టార్ జైరాజ్ ను.తప్పని సరి పరిస్థితులలో గత్య౦తరం లేక కూతురు గీత కు ఫోన్ చేస్తే ఆమె వచ్చి ,ఇక్కడి పరిస్తి  స్థితులకు బిక్క చచ్చి తండ్రి దీనావస్థ కు పరిష్కారం గా అన్నావదినలను ఇంటినుంచి గెంటేసి  ఇంటిని స్వాదీనంచేసుకొని  ,విషయాలను  చక్క దిద్ది  తండ్రి బాగోగులు చూస్తూ ఊరట కల్గించి ,తండ్రి తరఫున వాళ్ళపై కోర్ట్ లో కేసు వేసింది.ఒక రోజు కోర్టు లో జైరాజ్ జడ్జి గారితో ‘’నన్ను నా ఇంట్లో ప్రశాంతంగా మరణించే అవకాశం కల్పించండి ప్లీజ్ ‘’అని దీనంగా వేడుకొన్నాడు .కోర్టు అన్నికోణాల్లో పరిశీలించి జైరాజ్ కు న్యాయం కలిగించి ,ఆ ఇల్లు  ఆయన కే చెందుతుందని తీర్పు ఇచ్చింది .ఎంతటి హీరోకు ఎంతటి పరిస్థితి ?దైవ లీలలు చిత్రాలే కానీ మనం కూడా మన విషయాలలో జాగ్రత్తగా ఉండక పొతే ఇలాంటి పరిస్థితులే వస్తాయిఅని అందరూ గుర్తించాలి .అతని జీవితం అందరికీ అన్ని విధాలా గుణ పాఠం  .

  మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-18 –ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు  రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు

ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు  రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు

12-2-1916 పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామం లో శ్రీ లక్కరాజు రామచంద్ర రావు జన్మించారు .తండ్రి శ్రీ వెంకట రామయ్య .ఆంద్ర విశ్వ విద్యాలయం లో చదివి బి .ఎస్ .సి .ఆనర్స్ ,ఎం .ఎస్. సి. పాసైనారు .1939 లో ఇక్కడే రసాయనిక శాస్త్ర డిమాన్ స్ట్రేటర్ గా  ఉద్యోగం ప్రారంభించారు .1943 లో మైక్రో అనలిస్ట్ గా పదోన్నతిపొందారు .1946లో డి .ఎస్. సి .డిగ్రీ పొంది లెక్చరర్ అయి యూని వర్సిటీలోనే రిటైరయ్యారు  .

కొన్ని మొక్కలలో వర్ణ ద్రవ్యాల రసాయనిక పరిశీలనం ( కెమికల్ ఇన్వెస్టి గేషన్ ఆఫ్ సం ప్లాంట్ కలరింగ్ మాటర్స్)  పై పరిశోధనలు చేశారు .ఈ పరిశోధనలలో చాలా ప్లావోన్ లను ,ప్లావనోవ్ లను గుర్తించారు .ఇవి మొక్కలలో సాఫ్ట్ ఆక్సిడైజేషన్ పొందుతున్నట్లు కనుగొన్నారు .ఆల్కలైన్ పొటాషియం పెర్ సల్ఫేట్ ద్రావణం లో ప్లావోన్ లను కొద్దిగా వేడి చేయటం తో అనేక ప్లావోనోల్ కాంపౌండ్స్ తయారు చేయవచ్చునని నిర్ధారణకు వచ్చారు .సీమ బంతిపూల (టాజిక్టస్ పాట్యుల)నుంచి వేరు చేసిన ప్లావోనోల్ పాట్యు లెటాన్ యొక్క అణు నిర్మాణం ను నిర్ధారించటానికి చేసిన పరిశోధనలే ఇవన్నీ .ఈ పూలలో పాట్యులెటిన్ యొక్క 7 గ్లైకో సైడ్ గా పాట్యు లెటిన్ ను శాస్త్రజ్ఞులు గుర్తించారు .దీనితో ఆంధ్రా యూని వర్సిటి లో ఆర్గానిక్  కెమిస్ట్రి లో విస్తృత పరిశోధనలు అవకాశం కలిగింది .

రావు గారు ఈయూని  వర్సిటి లో 1953-నుంచి పదేళ్ళు 1963 వరకు రీడర్ గా ఉన్న కాలం లోనే ఈ పరిశోధనలు ఊపందుకున్నాయి .ఎనలిటికల్ ,ఇంజనీరింగ్ ,ఆర్గానిక్ ,ఫిజికల్ ,న్యూక్లియర్ కెమిస్ట్రి శాఖలను రావు గారే అభి వృద్ధి చేశారు .ఎంతో మంది పరిశోధక విద్యార్ధులకు స్పూర్తిగా నిలిచి ,అత్యుత్తమ స్థాయి పరిశోధనలకు మార్గ దర్శకం చేసి వారిని తీర్చి దిద్దిన ఆచార్యులుగా ఘనకీర్తి పొందారు రామచంద్ర  రావు  గారు .1968 నుంచి 78 వరకు దశాబ్దకాలం రసాయనశాఖ అధిపతిగా ఉన్నారు .తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజి ప్రిన్సిపాల్ గా సేవలందించి రిటైరయ్యారు . వీరి పర్య వేక్షణలో 14 మంది పరిశోధనలు చేసి డాక్టరేట్ పొంది ఆయన కీర్తిని ద్విగుణీకృతం చేశారు .రావు గారు రాసిన 175 పరిశోధనా పత్రాలు జాతీయ ,అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ లో వెలువడి ఆయన సామర్ధ్యానికి ప్రతీకలుగా నిలిచాయి .విదేశీ యూనివర్సిటీలు వారికి గౌరవ పదవులిచ్చి గౌరవించాయి .చాల దేశాల  లో పర్యటించి అక్కడి యూని వర్సిటీలలో  తన పరిశోధనలపై ప్రసంగించి  విద్యార్ధి, అధ్యాపకులకు ప్రేరణ, స్పూర్తి కలిగించారు .

1977 లో కృష్ణా జిల్లా నూజి వీడులోని ఆంద్ర యూనివర్సిటి పోస్ట్ గ్రాడ్యుయేట్  సెంటర్ కు రావు గారు స్పెషల్ ఆఫీసర్ గా నియమి౦ప బడ్డారు .తర్వాత ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ఉన్నారు .ఇక్కడ కూడా పరిశోధక విద్యార్ధులకు అండ దండగా ఉండి వారికి మార్గ  దర్శనం  చేశారు  ..వారి ‘’ఎక్ ట్రా మ్యూరల్ రిసర్చ్ కమిటీ సభ్యులుగా ఉంటూ ,విజ్ఞాన శాస్త్ర విషయాలు సామాన్యులకు సరళభాషలో అందించటానికి గొప్ప కృషి చేశారు .ప్రకృతి జన్యు రసాయనిక పరిశోధనలో నలభై ఏళ్ళు పని చేసి పండిపోయిన ఆచార్యులు రావు గారు .వారి పరిశోధనా ఫలితాలు అమూల్యమైనవిగా గుర్తింపు పొందాయి .సువిఖ్యాతులైన ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు గారిని ‘’ఆచార్యులకే ఆచార్యులు’’ అని కీర్తించారు .డా.సి. వి. రామన్ శిష్యరికం ,డా సూరి భగవంతం సాన్నిహిత్యం రావు గారికి రసాయనిక శాస్త్రం లో నూతన ఆవిష్కరణలకు ఎంతగానో తోడ్పడ్డాయి .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రోకలి బ0డ పురుగుల బహు  సంతానం 

మా దొడ్లో వర్షాకాలం లో రోకలి  బండ పురుగులు ఎక్కువ .అవి ఒకే సారి చాలా పిల్లలను ప్రసవిస్తాయి  పది నిమిషాల తర్వాత  అవన్నీకలిసి సామూహికంగా  గున గున నడుచు కొంటూ వెళ్లి పోతాయి .ఎక్కడికి పోతాయో తెలీదు .ఇవాళ మా అదొడ్లో అలాంటి రెండు రోకలి  బండ పురుగులు  ఇప్పుడే కన్న వాటి  సంతానం   నా కెమెరాకు చిక్కాయి . చూడండి – దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హైదరాబాద్ ఇ .సి. ఎల్ .నిర్మాణ శాస్త్రవేత్త డా ఏ. ఎస్. రావు

హైదరాబాద్ ఇ .సి. ఎల్ .నిర్మాణ శాస్త్రవేత్త డా ఏ. ఎస్. రావు

ఇ.సి .ఎల్. అంటే ఎలెక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా .హైదరాబద్ లో దీని నిర్మాణ రూప శిల్పి డా.ఏ ఎస్ రావు అని అందరూపిలిచే  డా శ్రీ అయ్యగారి సాంబశివరావు గారు.ఆయన కృషికి,సేవకు  కృతజ్ఞతగా వెలసినదే  హైదరాబాద్ లోని ఏ. ఎస్.  రావు నగర్.

రావు గారు 20-9-1914 న పశ్చిమ గోదావరిజిల్లా మోగల్లు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ అయ్యగారి వెంకటాచలం

బెనారస్ హిందూ యూనివర్సిటిలో బి. ఎస్. సి.  ,ఎం. ఎస్. సి .1937 నుండి చదివి ఉత్తీర్ణులై,1947 లో  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర స్టాన్ ఫోర్డ్  యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చదివి డిగ్రీ పొందారు ఇండియా వచ్చి 1940- నుంచి ఎనిమిదేళ్ళు బెనారస్ హిందూ యూని వర్సిటి లెక్చరర్ గా పని చేశారు .తర్వాత బొంబాయిలోని టాటా ఇన్ స్టి ట్యూట్  ఆఫ్ ఫ౦డమెంటల్ రిసెర్చ్ లో రీడర్ గా 1948నుంచి 54 వరకు ఆరేళ్ళు చేశారు .ట్రా౦బే.లోని అటామిక్ ఎనర్జి ఎస్టాబ్లిష్ మెంట్ కు 1954 లో డైరెక్టర్ అయ్యారు .తర్వాత భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్కు 1967 లో  డైరెక్టర్ అయ్యారు  .ఆతర్వాత హైదరాబాద్ ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా 1967 నుండి 1978 వరకు 11 ఏళ్ళు పనిచేసి సంస్థ అభి వృద్ధికి యెనలేని కృషి చేశారు .

ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ సంస్థల ఫెలోషిప్ అందుకుని పరిశోధనలు చేసిన   సమర్ధులు రావు గారు .ఆయన టాటా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్  ఫండమెంటల్ రిసెర్చ్  లో అయిదేళ్ళు  తీవ్ర పరిశోధనలు చేసి హై ఆల్టిట్యూడ్ ల వద్ద కాస్మిక్ కిరణాల అత్యధిక కొలతలను కనిపెట్టారు .ట్రా౦బేలోని రెండు రియాక్టర్ లైన ‘’ అప్సర ,జర్లినా’’ నిర్మాణం ,డిజైనింగ్ ,పర్య వేక్షణ చేసి అవి సమర్ధవంతంగా పని చేయటానికి శక్తి యుక్తులను ధారపోసిన వారు సైంటిస్ట్ రావు గారు .వాటి నియంత్రణ విధానాల రూప శిల్పిగా మంచిపేరు సంపాదించుకొన్నారు .న్యూక్లియర్ విస్ఫోటనాల ప్రభావం వలన పర్యావరణ౦  అణు దార్మికతతో  కాలుష్యం కాకుండా దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయించిన ఘనత ఆయనదే .వీటిలో 1600 కు పైగా ఇంజనీర్లు ,సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు .

డా హోమీ జే భాభాకు అణు శక్తిని మానవ సంక్షేమ సౌభాగ్యాలకు విని యోగించాలనే ప్రగాఢ మైన కోరిక ఉండేది .దీన్ని అమలు చేయటానికి ఒక ప్రణాళిక రచించి , అందుకోసం ఒకకమిటీ ఏర్పాటు చేసి మనదేశం  లోనూ ఇతరదేశాలలోను ఉన్న శాస్త్ర వేత్తలను, ఇంజనీర్లను ప్రావీణ్యం ప్రాతిపదిక పై ఎంపిక చేసి సభ్యులను చేశారు .ఆ కమిటీకి ఎంపికైన తొలి భారతీయ శాస్త్ర వేత్త శ్రీ ఏ .ఎస్. రావు గారు .1955 లో సృష్టించిన ‘’అప్సరస ‘’న్యూక్లియర్ రియాక్టర్ డిజైన్ చేసిన కీర్తి రావు గారిదే .భాభా ,నెహ్రూ లతో రావు గారికి అత్యంత సాన్ని హిత్యం ఉండేది .అందువలన డజనుకు పైగా నోబెల్ ప్రైజు అందుకున్న శాస్త్ర వేత్తలతో రావు గారికి పరిచయభాగ్యం కలిగింది .

1955 లో జెనీవాలో’జరిగిన ’ ఆటం ఫర్ పీస్ ‘’(శాంతికోసం అణువు ) అనే  అంతర్జాతీయ సదస్సు లో రావు గారు పాల్గొని ప్రపంచ శాంతిని న్యూక్లియర్ శక్తి తో  సాధించవచ్చునని సందిగ్ధ రహితంగా స్పష్టంగా సూటిగా చెప్పి ప్రశంసల౦దుకొన్నారు .సర్ సి. వి. రామన్ స్వయంగా ‘’అప్సర ‘’రియాక్టర్ ను చూసి ,పరీక్షించి రావు గారి వెన్నుతట్టి ప్రశంసలతో ,అభినందనలతో ముంచెత్తారు .రావు గారు అణుఇంధన (న్యూక్లియర్ ఫ్యుయల్ )విభాగం లో డైరెక్టర్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ సలహాదారుగా మానవ విలువలకు ,శాంతి పరిరక్షణకు సేవలు అందించి, సైంటిస్ట్ వృత్తికి సార్ధకత తెచ్చారు .’’అణు మహర్షి ‘’గా అంతర్జాతీయ కీర్తి పొందిన ‘’అణుశాస్త్ర’’ వేత్త రావు గారు .

బెంగుళూరు భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ బోర్డ్ కు డైరెక్టర్ గా 1958 నుండి 64 వరకు ఆరేళ్ళు మహత్తర సేవ చేశారు .హైదరాబాద్ ఇ.సి .ఎల్. కు మేనేజింగ్ డైరెక్టర్ 1967-6 8 లో పని చేసి ,రిటైరయ్యారు .తర్వాత కూడా కేరళ రాష్ట్ర డెవలప్ మెంట్ కార్పోరేషన్ బోర్డ్ డైరెక్టర్ గా నియమింపబడి అక్కడా తన నిరుపమ కౌశలాన్ని ప్రదర్శించారు .ఎందరెందరో దిగ్దంతులవంటి వారితో అత్యంత సాన్నిహిత్యం ,పరిచయాలు ఉన్నా ఎన్నడూ తన స్వీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోని’’ సై౦టిస్ట్ ఋషి ‘’రావు గారు .బహు నిరాడంబర జీవితం గడిపిన మాననీయులాయన .

తనకున్న విజ్ఞానం, విచక్షణ ,కృషి ,లక్ష్య శుద్ధి,ముందు చూపు , అంకిత భావాలతో వేలాది మంది శాస్త్ర సాంకేతిక వేత్తలకు ఉపాధి కలిగించి ,భారత దేశ పురోగతికి తోడ్పడిన అణకువకల ‘’అణుశాస్త్ర వేత్త ‘’.

రావు గారి పరిశోధనలకు, సేవలకు ఎన్నెన్నో అవార్డులు రివార్డ్ లు అందు కున్నారు .ఆయనకు జాతీయ ఎలెక్ట్రానిక్ కమీషన్ లో గౌరవ సభ్యత్వమిచ్చి గౌరవించారు .పద్మ శ్రీ ని 1960 లో,1972 లో పద్మ భూషణ్ పురస్కారాలు భారత ప్రభుత్వం అందజేసింది .1965 లో శాంతి స్వరూప్ భట్నగర్ ప్రైజ్ పొందారు . ఆంద్ర విశ్వ విద్యాలయం  గౌరవ డి. ఎస్. సి.ప్రదానం చేసి సత్కరించింది   .1976 లో ఫిక్కి అవార్డ్ ,1977 లో ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అవార్డ్ ,నేషనల్ డిజైన్ అవార్డ్ పొందారు .

టెక్నాలజీ దిగుమతి లేకుండా స్వావలంబన విధానం తో భారత దేశం అభి వృద్ధి చెందాలని రావు గారి సంకల్పం .తన పరిశోధనలద్వారా వైద్య ,పారిశ్రామిక ,వ్యవసాయ రంగాలకు అనన్య సాధ్యమైన కృషి చేశారు .అణుశక్తిని ఔషధ ,వ్యవసాయ రంగాలలో ఉపయోగించటానికి ఆచరణాత్మక కృషి చేసిన మొట్టమొదటి శాస్త్ర వేత్త రావు గారు .హైదరాబాద్ లో ఎలెక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 1-4-1967 లో స్థాపించిన దూర దృష్టి ఉన్న  సైంటిస్ట్ ఆయన  .స్థానికంగానే టెక్నాలజీ రూపకల్పన చేసి తయారు చేయటానికే దీన్ని ఏర్పాటు చేసి 1978 వరకు దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించి, విస్తృత పరచి దాన్ని ప్రజోపకారంగా మలచిన ప్రజ్ఞ ఆయనది .కంప్యూటర్లు, వాటి విడిభాగాలను ఇక్కడే తయారు చేయించారు .ఇ సి. ఐ .ఎల్. ను పూర్తి  స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో తయారు చేసే సంస్థగా మారటానికి ,ప్రపంచం లోనే ప్రఖ్యాత సంస్థగా ఎదగటానికి  రూపు రేఖలు తీర్చి దిద్దిన శాస్త్ర సాంకేతిక శిల్పిరావూ జీ .ఆయన కృషి ఫలితమే దేశం లోని భాభా అణుపరిశోధన కేంద్రం లోని హెల్త్ ఫిజిక్స్ డివిజన్ ,రియాక్టర్ కంట్రోల్ డివిజన్ ,డిపార్ట్ మెంట్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ లు ఏర్పడి విస్తృత సేవలందిస్తున్నాయి .

రావు గారి ప్రతిభా సామర్ధ్యాలను తెలియజేస్తూ ‘’ద మాన్ విత్ ఎ విజన్’’గ్రంథం ఆయన పేరుమీదనే 1999 లో వెలువడింది  .’’ప్రతి సూక్ష విషయాన్నీఒక విశ్వ విద్యాలయం లాగా ఆలోచించే దార్శనికుడైన మేధావి సైంటిస్ట్ ‘’అంటారు ఆయనను .భారత దేశ సాంకేతిక స్వావలంబనకు ఆద్యులైన ఎ.ఎస్ .రావు అనబడే  డా.శ్రీ అయ్యగారి సాంబశివరావు గారు తెలుగు వారు అవటం మనకు గర్వకారణం ,అదృష్టం కూడా .రావు గారు 31-10- 2003 న హైదరాబాద్ లో 89 వ ఏట మరణించారు .ఇ.సి.ఎల్. దగ్గరున్న కాలనీకి డా ఏ .ఎస్. రావు నగర్ అనే పేరు ఆయన జీవించి ఉన్నప్పుడే పెట్టి ప్రాతస్మరణీయుని చేశారు .

హైదరాబాద్ ఇసి ఎల్ లో ఎందరెందరో శాస్త్ర సాంకేతికనిపుణులు పని చేశారు .వేద గణిత౦ లో స్పెషలిస్ట్ డా .శ్రీ రేమెళ్ళ అవధాని గారు ఇందులో పని చేశారు .ఇక్కడే సంస్కృత౦, తెలుగులను కంప్యూటర్ లో వాడే విధానాన్ని తమ బృందమే ఆవిష్క రించిందని శ్రీ  అవధాని తెలియ జేశారు .నాకు మోపిదేవి హై స్కూల్ లో శిష్యుడు ,నాకు అత్యంత ఆత్మీయ ఆదర్శ ప్రధానోపాధ్యాయులు శ్రీ పసుమర్తి సీతారామ  శర్మగారి తమ్ముడు చి పసుమర్తి భగవంతం ఇక్కడే పని చేస్తున్నట్లు పది నెలల క్రితం ఫోన్ లో మాట్లాడుతూ చెప్పాడు .రావు గారి వటవృక్షం నీడన ఎందరో మేదావులున్నారని అర్ధమవుతోంది .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 




Land Line : 08676-232797

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ

భారత దేశ రక్షణ శాఖ సలహాదారుగా ,ప్రధాని నెహ్రూకు శాస్త్రీయ అంతరంగిక  సలహాదారుగా ఉన్న ఆంధ్రా శాస్త్ర వేత్త సూరి భగవంతం గారి గురించి మనలో చాలామందికి తెలియదు అంటే ఆశ్చర్యమేమీ లేదు .ఆయన సత్యసాయి బాబావారి  ఆంతరంగిక  శిష్యుడు అంటే ఎక్కువ మందికి తెలుసు .’’ఆచట పుట్టిన చివురు కొమ్మైన చేవ ‘’అన్నట్లు ఆయన కుమారుడు సూరి బాలకృష్ణ భూ భౌతిక శాస్త్ర వేత్త అంటే అస్సలు ఎవరికీ తెలిసి ఉండదన్నది యదార్ధం .ఇద్దరూ కృష్ణా  జిల్లావారవటం జిల్లాకు, మనకు గర్వకారణం .

                  శ్రీ సూరిభగవంతం

  భగవంతం గారు ప్రముఖ సైంటిస్ట్ ,భారతరత్న నోబెల్ పురస్కార లెనిన్ పీస్ ప్రైజ్  గ్రహీత ,సి .వి .రామన్ శిష్యులు .శాస్త్రీయ దృక్పధం, ప్రయోగ నైపుణ్యాలే ఆయనను రామన్ కు సన్నిహితుని చేశాయి .మద్రాస్ యూ ని వర్సిటి నుంచి ఎం .ఎస్ .సి.  పొంది ,అందులోనే భౌతిక శాస్త్ర లెక్చర గాచేరి  ప్రొఫెసర్ గా,డిపార్ట్ మెంట్ అధిపతిగా చకచకా 28 ఏళ్ళ వయసుకే ఎదిగారు  .అదే యూని వర్సిటి ఆయనకు డి.ఎస్ సి,ప్రదానం చేసింది .1948 వరకు ఇక్కడే పని చేశారు .1948- 49 లో లండన్ లో’’ ఇండియన్ సైంటిఫిక్ లైజాన్ ఆఫీసర్ ‘’అయ్యారు అంటే సైంటిఫిక్ అడ్వైజర్ అన్నమాట .బ్రిటన్ ,యూరప్ దేశాలు రష్యాలలో పర్యటించి  యూని వర్సిటీలలో ఉపన్యాసాలిచ్చారు .అప్పటి లండన్ హై కమిషనర్ వి.కె. కృష్ణమీనన్ తో పరిచయం పెంచుకొని ,ఇండియా  వచ్చి , ఉస్మానియా యూని వర్సిటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్,  లాబ్ డైరెక్టర్ , వైస్ చాన్సలర్ అయ్యారు .

 1957 లో బెంగుళూర్ ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ అయి ,నాలుగేళ్ళు పనిచేశాక  ఈయన ప్రతిభ గుర్తించి మీనన్ ఈయన్ను కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్ బాధ్యత అప్పగించాడు  , ఈ పదవిలో ఉంటూనే డిఫెన్స్ రి సెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ కు డైరెక్టర్ జనరల్ గా కూడా వ్యవహరించారు .దేశ రక్షణ వ్యవస్థకు దీన్ని అత్యంత  శక్తివంతమైనదిగా తీర్చి దిద్దారు .అప్పుడే భారతదేశం మిస్సైల్స్ ,ఏయిరో ఇంజెన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, టాంకులు అనబడే కా౦బట్ వెహికల్స్,  ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్ ,హై ఎక్స్ప్లోజివ్స్ ,అండర్ వాటర్ మెషిన్స్ మొదలైనవి 9 ఏళ్ళ కాలపరిమితిలో అందుబాటులోకి తెచ్చారు .వీటి అభి వృద్ధికి విశాఖ, లే ,తేజ్ పూర్ మొదలైన చోట్ల లాబ్స్ ఏర్పాటు చేయించారు.డి. ఆర్. డి. వో. అభి వృద్ధి అంతా భగవంతం గారి కృషియే .రక్షణ సామగ్రిని దేశీయంగా నిర్మించి విదేశీ దిగుమతులపై ఆధార పడకుండా చేసిన అసలైన సైంటిఫిక్  సలహాదారు ఆయన .ఒకరకంగా భారత రక్షణ వ్యవస్థకు భగవంతుని వంటి వారు భగవంతం గారు .ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భౌతిక శాస్త్ర విభాగానికి 1946 లో అధ్యక్షులయ్యారు .రామన్ ఎఫెక్ట్ పై అనేక కోణాలలో అధ్యయనం చేసిన సైంటిస్ట్ భగవంతం మూడు ఉద్గ్రంధాలు రాశారు .అందులో లొ1961 లో వచ్చిన ‘’క్రిస్టల్  సెమెట్రి అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ‘’కు మంచి పేరుంది .ఇదికాక గ్రూప్ దీరీ ,రామన్ ఎఫెక్ట్ గ్రంధాలు కూడా అత్యంత ప్రామాణికమైనవే .రామన్ ఎఫెక్ట్ పై ప్రామాణికత, సాధికారత ఉన్నవారు భగవంతం .300లకు పైగా పరిశోధనా పత్రాలు రాసిన మేధావి .ఆయన రచనలు పలు భాషలలోకి అనువాదం పొందాయి .అనేక సైంటిఫిక్ , ప్రొఫెషనల్ సంస్థలకు ఫెలో గా ఎన్నికయ్యారు .తెలుగు ,సంస్క్రుతాలలోనూ  ఆయన పాండిత్యం అమోఘం మంచి వక్త .హాస్యం ,చతురత కలబోసి మాట్లాడే నైపుణ్యం ఆయనది . సూరి భగవంతం గారు 6-2-1989 న 80 వ ఏట మరణించారు ఆయన జననం 14-10-1909 కృష్ణాజిల్లా గుడివాడలో .

                  శ్రీ సూరి బాలకృష్ణ

శ్రీ సూరి భగవంతం గారబ్బాయి శ్రీ సూరి బాలకృష్ణ గుంటూరులో 3-8-1941 జన్మించారు .19 53 లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ఏం ఎస్ సి .సాధించారు .19 55లో ఉస్మానియా యూని వర్సిటి నుండి పి హెచ్ డి అందుకున్నారు .195 2 నుంచే భూ విజ్ఞానం  భూ భౌతిక శాస్త్రాలలో విశేష పరిశోధనలు చేశారు .భూజల అన్వేశానపి గొప్ప కృషి సల్పిన శాస్త్ర వేత్త బాలకృష్ణ .ఉస్మానియా యూని వర్సిటిలో 19 53 లో రిసెర్చ్ స్కాలర్ గా చేరి ,జియాలజీ అధిపతి అయి 19 61 నుండి 64 వరకు పని చేశారు .ఇదే విభాగానికి రీడర్ గా 19 5 7 నుండి నాలుగేళ్ళు పని చేసి ,19 6 2 లో హెడ్ 19 64 లో గౌరవ ప్రొఫెసర్ ,19 6 5 లో అసిస్టెంట్  డైరెక్టర్  అయ్యారు  .ప్రతి శాఖలోనూ తన ప్రతిభను చాటారు

  హైదరాబాద్ లోని నేషనల్ జియో ఫిజికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్కు అసిస్టెంట్ డైరెక్టర్ గా యాక్టింగ్ డైరెక్టర్ గా 19 7 9 నుంచి 81 వరకు సేవలందించారు .ఇండియన్ జియో ఫిజికల్యూనియాన్ కు కార్య దర్శి గా ఉంటూ ఫెలోషిప్ అందుకున్నారు .ఆంద్ర ప్రదేశ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఫిలోశిప్ కూడా పొందారు .జియలాజికల్  సొసైటీ ఆఫ్ ఇండియా కు ఫౌండర్ ఫెలో శ్రీ బాలకృష్ణ ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షునిగా కూడా పని చేశారు

  న్యు  ఢిల్లీ లోని నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో రిసెర్చ్ ఫెలో గా 1954 లో  చేరారు .1956-5 7 కాలం లో హార్వర్డ్ యూని వర్సిటి లో పోస్ట్ గ్రాడ్యుయల్  రిసెర్చ్ ఫెలో గా  గుర్తింపు పొందారు .జపాన్ ప్రాభుత్వ గౌరవ పురస్కారం తో పాటు ,జపాన్ జియోలాజికల్ సొసైటీ ఫెలోషిప్ నూ అందుకున్న  జియాలజీ ఘనాపాఠీ బాలకృష్ణ .

  పర్వతాలు, శిలల స్థితి స్థాపకత్వం (ఎలాస్టిసిటి )మీదా ,భూ సంబంధ లక్షణాలున్న వాటి అనుబందాలపైనా పరిశోధించి సాధికారిక పత్రాలు రాశారు .అనేక దేశాలు పర్యటించి ఉపన్యాసాలిచ్చి ,అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని విలువైన 125 ప్రామాణిక పరిశోధనా పత్రాలు సమర్పించారు ..భూ ప్రకంపనాలు, భూ కంపాలు, భూ అయస్కాంత క్షేత్రాలు ,గురుత్వాకర్షణ క్షేత్రాలు ,వాటి పని తీరు లపై సునిశిత పరిశోధన చేసిన పరిశోధనా  పరమేష్టి ఆయన  . భూ విజ్నానశాస్త్రం లో సాటిలేని విజ్ఞాన ఖనిగా ,పాలనా దక్షునిగా ,క్రమ శిక్షణగల నాయకునిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మేధావి సైంటిస్ట్ శ్రీ సూరి రామకృష్ణ తండ్రి భగవంతం గారికి  తగ్గ తనయుడు అనిపించారు .

 బాలకృష్ణ గారి శాస్త్రీయ కృషికి 1967 లో కృష్ణన్ గోల్డ్ మెడల్ ,1979 లో ఆంధ్రప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ అవార్డ్ పొందారు .హైదరాబాద్ లో ఉప్పల్ రోడ్డు లో ఉన్న యెన్. జి .ఆర్. ఐ ..సంస్థలో స్థిరపడ్డారు బాలకృష్ణ .ఆయనకు ఇప్పుడు 77 ఏళ్ళ వయసు .అంతకు మించి వివరాలు తెలియలేదు .గూగుల్ లో అసలు ఆయన  గురించే లేకపోవటం దురదృష్టం  .

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ    

 అని నిన్న రాసిన వ్యాసం లో శ్రీ సూరి బాలకృష్ణ గారి చివరి రోజులు గురించి తెలియక రాయలేదని చెప్పాను .ఈ ఉదయం వారి బంధువులు హైదరాబాద్ వాసి  శ్రీ సూరి ఆంగీరస శర్మ గారికి ఫోన్ చేసి వివరాలు అడిగాను . బాలకృష్ణ గారు భగవంతం గారు జీవించి ఉండగానే మరణించారని చెప్పారు .భగవంతం గారికి నలుగురు కుమారులు ,ఒక కుమార్తె అనీ ,ప్రస్తుతం తనకు తెలిసిన దాన్ని బట్టి రెండవ కుమారుడు శ్రీ రామకృష్ణ శర్మ గారు ఒక్కరే జీవించిఉన్నారని ,మిగిలిన వారంతా గతించారని తెలిపారు .ఆంగీరస శర్మ గారికి ధన్యవాదాలు తెలియ జేస్తూ -దుర్గాప్రసాద్

   ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12

3-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు -2

  అనేకమార్గాలలో సంపాదన చేశారు .స్మార్తం లోనేకాక శ్రౌతం లోనూ చేయి తిరిగినవారు .సాధారణంగా ఏదో ఒక దానిలోనే ప్రావీణ్యం ఉంటుంది .రెంటినీ సునాయాసంగా నిర్వహించి సవ్యసాచి అయ్యారు.బాబళ్ళ శాస్త్రి కుటుంబానికి తరతరాలుగా బులుసువారే గృహ పురోహితులు .ఇప్పుడూ అంతే .15 ఏళ్ళకే స్మార్తం లో ప్రవేశించి మూడేళ్ళ తర్వాత పరీక్ష పాసై ,విజ్రుమ్భించారు .అపరకర్మలు  చేయి౦చేవారుకాదు.. వేదపాఠశాలలో14 ఏళ్ళు వేదం బోధి౦చారు .అందులో వేదపరీక్షాదికారిగానూ ఉన్నారు .జీవితకాలం లో 60 శ్రౌత కార్యక్రమాలు ,6 పౌండరీకాలు చేయించినట్లు గుర్తు చేసుకున్నారు .దీనికి ఉద్గాతగా ఉండేవారు .1960 కాలం కోనసీమ అంతా బులుసువారి వేద ధ్వనులతో పులకించిపోయింది .50 వ ఏట 1965మాఘమాసం  లో అగ్నిస్టోమాన్ని ఆధానాగ్నితో  శ్రీరామపురం దేవాలయ ప్రాంగణం లో చేశారు .నాలుగేళ్ల తర్వాత 1969 లో పుట్టినవూరు వ్యాఘ్రేశ్వరం లో ‘’సర్వ ప్రస్త అగ్ని చయనం ‘’చేసి చయనులు అయ్యారు .అదే ఏడాది ఆయన పొరుగునున్న దువ్వూరి యాజులు గారు పొండరీకం చేసి పౌ౦డరీక చయనులయ్యారు .దీనికి బాబళ్ళశాస్త్రిగారు చయనులుగారికి తోడ్పడ్డారు .

  వితరణ శీలురైన డొక్కా వారు వీరికి ఒక ఇల్లు ఎకరం పొలం ఇచ్చి శ్రీరామపురానికి ఆహ్వానించారు .కానీ కూతురి పెళ్లి ఖర్చులకు కట్న కానుకలకు పిత్రార్జితమేకాక దీనినీ అమ్మేయాల్సి వచ్చింది .61 ఏళ్ళ వయసులో టిటిడి వారి పారాయణ స్కీం లో చేరి పుట్టిన ఊరిలోని దేవాలయం లో చేసేవారు .78 వ ఏట  రిటైరయి ,పెన్షన్ పొందారు .ఆర్ధిక భారం వలన వేద సభలకు వెళ్లి సంభావన పుచ్చుకోనేవారు .కేంద్ర ప్రభుత్వం అగ్ని స్టోమం చేసినవారికి గౌరవ వేతనం ఇచ్చేది .ఆ విషయం వీరికి  ఇతర ఆహతాగ్నిలు చెప్పనే లేదు. అది దూరమైపోయింది .

  ఎన్నో సంస్థలు ,వ్యక్తులు బులుసు వారిని ఆహ్వానించి సన్మానించాయి .హైదరాబాద్ లో భారతప్రధాని పి.వి. నరసింహారావు గారి చేతులమీదుగా సన్మానం అందుకొని ఆశ్చర్యపోయారు .ఎవ్వరూ ఆయన సాధించిన విజయాలను చెప్పలేదు .ఈ గౌరవ పురస్కారాన్నీ ప్రచారం చేయలేదు .80 ఏళ్ళ వయసులో క్రిక్కిరిసిన బస్సుల్లో పడి 20 గంటలు  ప్రయాణం చేయాల్సి వచ్చింది..ఇది మనకు ‘’స్వర్ణకమలం ‘’సినిమాలో వృద్ధ వేదపండితుడు పడిన బాధ గుర్తుకు తెస్తుంది .ఆనాడు ఇచ్చిన  గౌరవ భ్రుతి 35.13 డాలర్లు మాత్రమే .కానీ దీనికే పరమ సంతోషం పొందారు .నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టి రామారావు కూడా బులుసువారిని సత్కరించారు .

 బులుసు చయనులుగారు యవ్వనం లో బహు అందంగా ఉండేవారు .ఇతర దేశీయులను ఆప్యాయంగా ఆహ్వాని౦చేవారాయన .1996 ఫిబ్రవరి లో 81 వ ఏట  భార్య సుబ్బలక్ష్మిగారితో కలిసి చేసిన  అగ్రయనం ,ఏదో ఒక కారణం తో 1995 చలికాలం లో చేయలేకపోయిన అగ్ని కార్యానికి ప్రాయశ్చిత్త విధీ చేశారు .వేదాంతి మాత్రం కాదు .బాబళ్ళ,లంకా ,దువ్వూరి మాత్రం వేదా౦తులే . మృత్యు దేవత ఆయనకు హెచ్చరిక ఇవ్వకుండానే మీద పడింది .కూతురు అల్లుడు ఇంటికి వస్తారని సైకిల్ మీద సరుకులు తెచ్చి ఇంట్లో దించు తుండగా అధిక శ్రమతో హార్ట్ ఎటాక్ వచ్చింది .అందరికీ తెలిసే లోపే ఆయనను  మృత్యువు  కబళించింది .ఆయన అంత్య క్రియలు అగ్రహారం వెలుపల బ్రహ్మ మేధం ,పునర్ధహన, లోష్ట చయనాలతో పూర్తయ్యాయి .

 చయనులు గారి భార్య ‘’14 వ ఏట కాపురానికి వచ్చాను .మొదట్లో ఆయన అంటే భయం గా ఉండేది .ఇద్దరం కలిసి 32 ఏళ్ళు  అగ్ని హోత్రం చేసి నన్ను సోమిదేవమ్మ ను  చేశారు’’అని గుర్తుకు తెచ్చుకున్నారు  .తర్వాత కూతురు దగ్గరకు రాజమండ్రి చేరి, దశావతార స్తోత్రం, విష్ణు ,లలితా  సహస్రనామ స్తోత్రం బిగ్గరగా చదువుకుంటూ గడిపారు .భర్త చనిపోయాక చాలాకాలం దాకా తనకు అక్షర జ్ఞానం లేదంటారు .ఆడవారి చదువును భర్త ప్రోత్సహి౦చ లేదన్నారు .ఇతర సోమి దేవమ్మల కూతుళ్ళు తల్లులకు దగ్గరగా ఉంటె ,సోమిదేవమ్మ సుబ్బలక్ష్మిగారి కూతుళ్ళు మాత్రం దూర దూరంగా కోనసీమ అంతా వ్యాపించి ఉన్నారు .

  బులుసు చయనులు గారి వంశం మగపిల్లలు లేకుండా ఆగిపోయింది .చయనులుగారి మొదటిభార్యకుమారుడు రామమూర్తి మాతామహుల ఇంటపెరిగి ,స్మార్తం నేర్చాడు అతనికొడుకు కూడాస్మార్తం లో ఉద్దండుడు. వీరివలన బులుసు వంశం కొనసాగింది .బులుసు చయనులుగారు  శ్రీరామపురాగ్రహారం లో చనిపోయిన ముగ్గురు ఆహితాగ్నులలో రెండవ వారు .

 సశేషం

ప్రస్తుతం ఈ ధారావాహికకు’’ విరామం’’ ఇచ్చి, మళ్ళీ కొన్ని రోజులకు కోనసీమలో ప్రవేశిద్దాం –

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11

3-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు

శ్రీరామపురం అగ్రహారం లో మూడవ ఆహితాగ్ని బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు .1915 లో జన్మించి 82 ఏళ్ళు జీవించి 1997 లో మరణించారు .భార్య సుబ్బలక్ష్మి సోమిదేవమ్మ .ముప్పై ఏళ్ళు ఇక్కడే సోమి దేవమ్మగా ఉండి,చయనులు గారి మరణా నంతరం  రాజమండ్రి కూతురు వద్దకు చేరారు .చయనులగారి మరణం తో ఇంట్లో అగ్ని హోత్రాలన్నీ తీసేశారుఅప్పటికే . వైదికులైన గౌతమస గోత్రానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు .ఒకరు బులుసు వ్యాఘ్రేశ్వర సోమయాజులుగారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వ్యాఘ్రేశ్వరం లోనే ఉంటె ,రెండవవారైన ఈ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులుగారు శ్రీ రామ పురాగ్రహార వాసి .అగ్ని చయనం చేసి చయనులయ్యారు .ఈయననే అందరూ’’ బులుసు చయనులు గారు’’ అని సంబోధిస్తారు .శ్రీరామపురం లో రావి చయనులు అనే స్మార్త బ్రాహ్మణుడు ఉన్నారుకాని ఆయన ఆహితాగ్నీ కాదు ,అగ్ని చయనమూ చేయలేదు .

బులుసు చయనులుగారు గారి పూర్వీకులంతా  గణపతి ఆరాధకులు .ఒకసారి ఆయనపూర్వీకుని ముసలితనం లో గణేశుడు ప్రత్యక్షమైనాడని అందరూ చెప్పుకొనే వారు .వీరిలో మూడుతరాలవారు వేదపండితులు అవుతారని తర్వాత తరం వారుకూడా ప్రముఖ వేదపండితులే అవుతారని వినాయకుడు అప్పుడు ఆయనకు వరమిచ్చారట . మన చయనులుగారు చివరి మూడవ తరం వారు .

ముగ్గురన్నదమ్ములలో ఈయనకే వేదం అబ్బింది .అదే వయసున్న రెండు చింతల వెంకటా   చలు  తండ్రి గారి వద్ద బ్రహ్మ చారిగా   వేదాభ్యాసానికి చయనులు గారు చేరారు . రెండు చింతల వెంకటాచలు తర్వాత రెండు చింతల యాజులు గా శ్రౌత స్మార్తాలలో ఎదురు లేని వాడి గా  ప్రసిద్ధి చెందాడు .30 క్రతువులు చేసి వేదం లోనూ  భారత దేశం లోనే సాటిలేని వాడనిపించారు .ఆయన వేదం గానం చేస్తుంటే మహామహా  వేదపండితులు ఆశ్చర్యం తో నోరు వెళ్ళబెట్టి చూసేవారట .అంతటి గొప్పవారు  రెండు  చింతలవారు .ఎక్కువ కాలం  కాశీ లోనే గడిపేవారు .అప్పుడప్పుడు విజయవాడ లోని స్వగృహానికి వచ్చి వెళ్ళేవారు .కోనసీమలో వేదం, శ్రౌతాల పరిస్థితి తెలుసుకొనేవారు .   1936 లో భార్య లక్ష్మీ కాంతతో కలిసి మొదటి యజ్ఞం ,అగ్ని స్టోమం చేశారు .1980 లో కాశీ లోనే చివరి యజ్ఞం చేశారు .50 ఏళ్ళకు పైగా అగ్ని హోత్రాన్ని ఆరాధించి 1987 లో వారణాసిలోనే మరణించారు రెండు చింతల యాజులు గారు .

బులుసు చయనులు గారు ,రెండు చింతల చయనులుగారు కలిసి 82 పన్నాలు పూర్తి  చేసి వేదపండితులని పించుకున్నారు .ఇద్దరూ వివాహాలు చేసుకొని జీవిత సౌఖ్యం అనుభవించారు .కాని వ్యాఘ్రేశ్వరుల భార్య రామ సూర్యకాంత గారు 24 వ ఏట టైఫాయిడ్ జ్వరం తో 1945 లో చనిపోయారు..కర్మ కాండ పదవ రోజున మూసివాయనం అంటే చేటలు ,గాజులు  రాజమండ్రి నుంచి వచ్చి వ్యాఘ్రేశ్వరం లో  ఇప్పించారు .ఈ యువ దంపతుల కుమారుడు రామ మూర్తి వయసు కేవలం 6 .రెండు చింతల యాజులు బులుసువారిని తాను చేయబోయే పౌ౦డరీక యాగానికి నికి ఋత్విక్కుగా నియమించాలనుకున్నాడు కాని ‘’అపత్నీకుడు ‘’ఋత్విక్కు కాకూడదు అనే నియమం ఉండటం వలన ఆయన కు కన్యను ఇచ్చి అయిదు రోజుల వివాహం చేయాలి .తన మిత్రునికి ఈ విషయం లో సాయం చేయాలని గంగలకుర్రులో తన 14 ఏళ్ళ కూతురు సుబ్బ లక్ష్మి ని 30 ఏళ్ళ యువకుడు ,భార్య లేనివాడు ,  వేదపండితుడైన బులుసు వారికిచ్చి పెళ్లి చేయటానికి ఆమె తండ్రి  అంగీకరించాడు.8 నెలలతర్వాత వీరి వివాహం జరిగింది .మళ్ళీ ఇప్పుడు బులుసువారు శ్రౌతకర్మలు చేయటానికి పూర్తిగా అర్హులయ్యారు. ‘

సుబ్బలక్ష్మి వ్యాఘ్రేశ్వరులకు ముగ్గురు  ఆడపిల్లలు,తర్వాత ఒక కొడుకు ,మళ్ళీ కూతురు    కలిగారు .చయనులుగారి మొదటి భార్య సంతానం రామమూర్తి వ్యాఘ్రేశ్వరం లో  అమ్మమ్మ గారింట్లో పెరిగాడు .తర్వాత శ్రీరామ పురం తండ్రి వద్దకు వచ్చాడు.బులుసు ,రెండు చింతల కుటుంబాలు  పెళ్ళిళ్ళతో బంధువులూ అయ్యారు .రెండు చింతలవారి అబ్బాయి  సత్యనారాయణ  కు బులుసువారి మూడవ కుమార్తెతో వివాహం చేసి మూడవ సారి గా మళ్ళీ బంధువులవ్వాలనుకొన్నారు . .కట్నకానుకలు లేవు కాని అల్లుడికి  బులుసువారు విద్యా గురువులై వేదం నేర్పారు .అతనికి 15 ,ఆమెకు 10 వయసులో ఇద్దరికీ విజయవాడలో వివాహం చేశారు . బులుసు ఛయనుల గారి ఫోటో జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ జాలయ్య గారి జాబు

శ్రీ జాలయ్య గారి జాబు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సహృదయులు రమ్య సాహితీ సమితి -తణుకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏం ఆర్ వి సత్యనారాయణ మూర్తిగారి స్పందన

సహృదయులు రమ్య సాహితీ సమితి -తణుకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏం ఆర్ వి సత్యనారాయణ మూర్తిగారి స్పందన

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10

2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు -3

శ్రీ దువ్వూరి సోమయాజులు గారి మూడవ కుమారుడు శ్రీ వెంకట సూర్య ప్రకాశ అవధాని

19 53లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజ మండ్రివద్ద పాత రైల్వే బ్రిడ్జి ని తాకు తూ 65 అడుగుల ఎత్తున నీరు వచ్చి తీర ప్రాంతాలను అతలాకుతలం చేసి ,  కపిళేశ్వరప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది .పంటలన్నీ పాడైపోయాయి .కానీ యాజులు గారి ‘’పంట పండింది’’ వారింట మూడవకుమారుడు వెంకటసూర్య ప్రకాశ అవధాని అన్మించటం తో .సర్వేశ్వర పుట్టిన దశాబ్దానికి ఈ పుత్రోదయం .ఎనిమిదవ ఏట ఉపనయన సంస్కారం పొంది తండ్రి వద్ద వేదం 8 ఏళ్ళు నేర్చి పూర్తి  చేశాడు .ఉదయం 5 కే లేచి ,స్నాన సంధ్యలు  చేసి ,తండ్రిగారి అగ్ని హోత్రం పూర్తయ్యాక  వేదాభ్యాసం ప్రారంభించి మధ్యాహ్నం 12 వరకు కొనసాగేది .20 వ ఏట వేదం శ్రౌతాలలో గోదావరి మండల పరిషత్ వద్ద వ్యాఘ్రేశ్వరం లో 19 73  లో  పరీక్ష నిచ్చిఅవధాని అయ్యాడు .కనక దుర్గ అనే గుళ్ళపల్లి వారి అమ్మాయిని ఇరగవరం లో 19 70 కే  పెళ్ళాడాడు .అప్పుడామెకు 12 ,అతడికి 17 .16 వ ఏడు దాకాబడి చదువు లేదు .అక్షరం ముక్క అబ్బకపోతే లాభం లేదని శ్రీరామ పురం నుంచి ముక్కామలకు నడిచి వెళ్లి చదివాడు .తండ్రి అడుగు జాడలలో అప్పటిదాకా ఉన్నా, తర్వాత తెలుగు లేక సంస్కృత పండితుడి ఉద్యోగం లో చేరాలనిపించి ,మొద్దె కూరు లోని కాలేజిలో చేరి 1976 లో లోకోర్సు పూర్తి  చేశాడు .ట్రెయిన్ లో ప్రయాణం చేస్తూ వరంగల్ లో అయిదునెలల కోర్సు చేశాడు .అప్పటికే పండితుల సంఖ్య ఎక్కువైందున ఉద్యోగం రావటం కష్టమైంది .శ్రీరామపురం లోనే రావి చయనులుగారి దగ్గర  కావ్యాలు నేర్చాడు .వీటికి అయిన ఖర్చులకు అప్పు చేసీ, సభలో వచ్చే పారితోషికాలతో తీర్చాడు .వ్యాఘ్రేశ్వరం ,రాజమండ్రి ,గుంటూరు విజయవాడ వేదసభలకు వెళ్లి తన ప్రావీణ్య ప్రదర్శన తో నగదు పారితోషికాలు పొందాడు.

 1982 లో శ్రీరామపురం వదిలి రాజమండ్రిలో శ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి వద్ద అయిదేళ్ళు మీమాంస శాస్త్రం అధ్యయనం చేశాడు .సుదూర ప్రాంతాలైన హైదరాబాద్ ,సిరిసిల్ల లకు సంభావన కోసం వెళ్ళేవాడు .ఊళ్ళో ఏదో ఒక కర్మకాండ చేయిస్తూ ధనం పొందేవాడు. .సంస్కార విదానాలన్నీ తండ్రి యాజులు గారి వద్దనే నేర్చాడు .ఒక సారి హైదరాబాద్ కుఒక బ్రాహ్మణ కుటుంబం లో  పెళ్లి చేయించటానికి వెడితే ,అక్కడ ఏ అగ్ని హోత్రి భార్యా అన్నం వండి పెట్టకపోయేసరికి అవాక్కై  అల్పాహారం తో గడిపాడు .ఇప్పటిదాకా తండ్రిగారి నిత్య ఇష్టి,ఇతర ఆహితాగ్నిలకు అధ్వర్యుగా ఉన్నాడు .నిత్యం ముక్కామల దేవాలయం లో  రాజమండ్రి సత్య నారాయణ స్వామి దేవాలయం లో టిటిడి తరఫున నియమింపబడి  వేదపారాయణ చేసేవాడు  .

  నలుగురు పుత్రులకు తల్లిదండ్రులైన  అవధాని, భార్య 1988 జనవరి లోపెద్ద కొడుకు వేదం తాతగారు యాజులు గారి వద్దనేర్చిన  ఫణి యజ్ఞేశ్వర యాజుల  పెళ్లి చేశారు. ఆడపిల్లలు లేనందువల్ల కట్నాల బాద లేదు.గుళ్ళపల్లి వారమ్మాయి లక్ష్మి ,ఫణి భార్య .పిల్లలు అక్కరకు వచ్చారు.కనుక మళ్ళీ శ్రీరామపురం చేరి తండ్రి గారివద్ద వేదంతో కాలక్షేపం చేయాలని 1987 లో నిశ్చయించాడు.టిటిడి ఉద్యోగం చేస్తూ, వేద పారాయణ కొనసాగించాడు .అగ్ని ఆరాధన ,ఇష్టి ,అగ్ని స్టోమం చేశాడు .తండ్రి గారి పద్ధతినే అనుసరించాడు .తండ్రి తరానికి ,తనతరానికి ఉన్న దూరం, తేడా గమనించాడు .’’నాచుట్టూ ఉన్నసమాజం గురించి కూడా నేను ఆలోచించాలి వారికోసం పని చేయాలి .ఆదర్శ  వైదిక జీవితం గడపాలి  .నా అవసరాలను తగ్గించుకోవాలి ‘’అని తాను  నిర్ణ యించుకొన్నట్లు  అవధాని చెప్పాడు .

  అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది .పదేళ్ళ ఆతర్వాత అవధాని ఇంకా రాజమండ్రిలోనే ఉండగా దువ్వూరి కుటుంబానికి చెందిన ఒక సంపన్న దాత శ్రీరామ పురం లో  చుట్టూ గోడలు ఉన్న ఒక అందమైన  ఇంటిని  దానిలో ఒక పాఠశాల పెట్టటానికి శృంగేరి పీఠానికి అందజేశాడు .ఉద్దేశ్యం బాగానే ఉంది కాని అక్కడ పని చేయటానికి ఉపాధ్యాయుడేవరూ ముందుకు రాలేదు .అప్పుడు దాన్ని సూర్య ప్రకాశావ దానికే  ఇచ్చిఅక్కడే ఉండిపోమ్మనీ తన కొడుకులకు ,తమ్ముడికొడుకులకు వేదం నేర్పుతూ ఉండమని కోరగా వచ్చి చేరాడు .

   శ్రీ దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర యాజులు  -అన్నిటా ప్రధమం

వైదిక –లౌకిక జీవితానికి సమన్వయము సాధించినవాడు సూర్య ప్రకాశ అవధాని పెద్దకుమారుడు ఫణి యజ్ఞేశ్వర యాజులు .1974 లో జన్మించి శ్రీరామపురం లోనే తాతగారు యాజులుగారి వద్ద ఆయన ముసలి గుడ్డి తనపు రోజుల్లో వేదం నేర్చి,ఇంటర్ చదివి ,ఇంగ్లిష్ నేర్చిమాట్లాడగలిగిన మొట్టమొదటి వేదపండితుడుగా రికార్డ్ సాధించాడు .బి.కాం. చదివి ,మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఆర్ట్స్ సాధించి కర్నాటక స్టేట్ బాంక్ లో ఉద్యోగం పొందాలనుకున్నాడు  .కాని మళ్ళీ వేదం లోకి వచ్చి ,క్రమ౦ లోను  శ్రీరామపురం లో సామవేదం వెంకట రమణగారి వద్ద నేర్చిన ఘనం లోను పరీక్ష ఇచ్చి ,విజయవాడలో శ్రీ విష్ణుభొట్ల లక్ష్మీ నారాయణ ఘనపాఠి గారి వద్ద  రైల్ లో వచ్చి వారానికి మూడు రోజులు  ఘనం నేర్చి  ,1999 లో ‘’ఘన ‘’లో ఘనంగా సర్టిఫికేట్ సాధించాడు .25 వ ఏట మీమా౦స పై మనసుపడి తండ్రి తో సమానమై శ్రౌత విద్యలో మరీ ముందుకు వెళ్ళాడు

  14 వయసులో 10 ఏళ్ళ మేనమామ గొల్లపల్లి వెంకట రామ సూర్యనారాయణ గారి  కూతురు  లక్ష్మిని పెళ్ళాడి  ఇద్దరు మగపిల్లలు సూర్య ప్రకాశ పవన కుమార శర్మ,శ్యామ సుందర శ్రీరామ శర్మలను  జన్మనిచ్చి , కుటుంబ నియంత్రణ పాటించాడు .పెద్దాడు 8 వ ఏటనే తైత్తిరీయం తండ్రి వద్ద మొదలుపెట్టి నేర్చాడు .తండ్రిలాగే ఇంగ్లిష్ లో ఆసక్తి కలిగి ఇంగ్లిష్ మీడియం లో చేరి చదువుతూ కూడా రోజుకుకనీసం  అయిదు గంటలు వేదాధ్యయనం చేసేవాడు.ప్రాధమిక విద్య ఆంగ్ల మాధ్యమలో చదివిన ఏకైక వేద పండితుడు అనిపించాడు .

  చాలాదేవాలయాలనుంచి వేద పారాయణకు ఫణి  ఆహ్వానాలు పొందాడు .అమెరికాలోని న్యు జెర్సీ దేవాలయం లో ఋత్విక్ గా ఆహ్వానమూ వచ్చింది .’’తాత గారు ఇలాంటి వాటికి ఆశపడ వద్దు అన్నారు .కనుక ఇప్పుడేకాడు మరెప్పుడూ అమెరికావంటి ఇతర దేశాలకు వెళ్ళను ‘’  అని ఖచ్చితంగా చెప్పాడు .2000 ఫిబ్రవరిలో రాజమండ్రిలో అయిదుగదుల ఫ్లాట్ కట్టుకొని గృహ ప్రవేశం చేశాడు .2009 లో తిరుపతి వేంకటేశ్వర యూని వర్సిటిలో అధ్యాపక ఉద్యోగం అందుకొని శృంగేరి పీఠం బదివదిలేసి ,కృష్ణ యజుర్వేదం లో అసిస్టెంట్ ప్రొఫెసర్  తర్వాత ప్రొఫెసర్ అయ్యాడు  , ఆ ప్రాంతం లో వేద పండితుడు యూని వర్సిటి ప్రొఫెసర్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఫణి . ,కంచి పీఠం ఫణిని ఆహ్వానించి ,సన్మానించి ‘’వేద భాష్య రత్న ‘’బిరుదుతో సత్కరించింది .’’నా జీవితం లో ఇదొక గొప్ప మలుపు. తాతగారు యాజులుగారు ‘’దీనినే కొనసాగించు ‘’అన్నారు .అంతే ఇక వేదం –లౌకికం లమధ్య ఊగిసలాడలేదు నేను’’ అన్నాడు ఫణి 1998 లో  .16 ఏళ్ళ తర్వాత వేద ప్రవీణులైన దువ్వూరి కుటుంబం కొత్త అర్హత, విలువ సాధించింది ఫణి వలన .కాని దువ్వూరి శ్రౌతం  బలహీనమైన దారానికి వ్రేలాడుతూ  ఉండిపోయింది .

2014 లో డయాబెటిస్ వలన సూర్య ప్రకాశ ,కనక దుర్గలు బాధపడి 2007 లో చేద్దామనుకొన్న ఆదాన ,అగ్ని స్ట మాలతో చేయాలనుకున్న ‘’వైశ్వ దేవం చేయలేక పోయారు .వారసత్వాన్ని కాపాడాలనుకున్న  శ్రీ దువ్వూరి సీతారామ శాస్త్రి

అన్న ఫణి లాగానే తమ్ముడు సీతారామ శాస్త్రి అధ్వర్యుగా తాత యాజులుగారి వద్ద ప్రారంభించాడు .తైత్తిరీయం ముందుకు సాగలేదు .మాతామహుడు గొల్లపల్లి వారి వద్ద కూడా ఇలాగే జరిగింది .బలవంతం గా భట్టీయం వేస్తె  గొంతు నెప్పి వచ్చేది.తాను వేదవారసత్వాన్ని కాపాడుదామనుకొన్నా పరిస్తితులు సహకరించన౦దుకు బాధ పడ్డాడు .టెక్నికల్ కోర్సు చేసి ,అమెరికా వెళ్లి పుష్కలంగా డాలర్లుసంపాదించి  అన్న ఫణి, ఫణి కొడుకులు వేద,శ్రోతాల  వారసత్వాన్ని నిలబెట్టటానికి సాయ పడుదామని అతని కోరిక.తనకు వేదవిద్య అబ్బదని గ్రహించి ,తన మన్సులోని ఆశయం సాధించటానికి అప్పటి 65వేల ప్రవాస భారతీయులతో పాటు అమెరికా కు కనెక్టికట్ లోని హాఫర్డ్  కు విమానం లో వెళ్ళాడు .ఆంద్ర ప్రదేశ నే అంతవరకూ దాటని వాడు దేశాలు ఖండాలు దాటాడు .సత్యం కంప్యూటర్స్ కు చెందిన’’సిగ్నా ఇన్సూరెన్స్ కంపెనీ ‘’లో చేరి ,తర్వాత భార్య గౌరి శ్యామల ,కొడుకు కార్తికేయ ,కూతురు ప్రణతి లను కూడా అమెరికా తెచ్చుకున్నాడు .ఇతని కజిన్ యజ్ఞేశ్వర యాజులు అంటే యాజులుగారిపెద్దబ్బాయి సర్వేశ్వర కొడుకు అంటే మనవడు    కూడా విస్కాన్సిస్ లోని మిల్వాకీ కి వచ్చాడు . యాజులుగారి మూడవ మనవడు హైదరాబాద్ లో వాల్యు లాబ్ ఉద్యోగి  గిరిజా శంకర్ కూడా అమెరికాకు యెగిరి పోయె  ప్రయత్నం లో ఉన్నాడు .అమెరికాలోని హిందూ దేవాలయాల పూజారులకోసం ,హైటెక్ కార్పోరేషన్ల అవసరాలు  అప్పుడు వరాలయ్యాయి .అందరి దృష్టీ భారత దేశం పైనే ఉంది అప్పుడు .ఒకప్పుడు సీమాంతర ప్రయాణానికి ఒప్పుకోని సనాతనులు ఇప్పుడు మనవళ్ళను పంపటానికి ముందుకొచ్చారు .

  సూర్య ప్రకాశ అవధాని నలుగురు కుమారులు అంటే యాజులుగారి మనవళ్ళుగొల్లపల్లి కుటుంబం వారి పిల్లలనే పెళ్లి చేసుకున్నారు .సత్సంతానమూ పొందారు .అందులో ఒకరు ఘనాపాఠీ మాత్రమె కాక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ..మరొకరు అమెరికాలో అయిదేళ్ళ ఉద్యోగం లో చేరాడు .ఇంకొకరు కూడా వెళ్ళటానికి సిద్ధం .యాజులు గారు శ్రీరామ పురం లో పంచాయతన దేవాలయం లో అధర్వ వేదం పారాయణ చేస్తుంటే దేవతలే దిగి వచ్చి ఆసక్తిగా వినేట్లు ఉండేది. ఆస్వరం ఆ సాధనా  ముచ్చటగా పరమ పవిత్రంగా  ఉండేదని పెద్దల ఉవాచ .ఒక సారి ఒక  అమెరికన్ వచ్చి ఆయన ఇంటర్వ్యు తీసుకుంటుండగా యాజులు గారు ఆతనితో ‘’మీరు అమెరికా వెళ్ళాక, అక్కడివాళ్ళతో నాకు అమెరికా లో ఉద్యోగం ఇప్పించని సిఫార్సు చేయ౦డి’’అని చమత్కరించారట  .

  దీనితో దువ్వూరి వారి చరిత్ర పూర్తి  .మరో ఆహితాగ్ని గారిని ఈసారి పలకరిద్దాం .

శ్రీ సూర్య ప్రకాశం అవధాని గారి ఫోటో జత చేశాను చూడండి

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment