గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -4 283-సులోచన మాధవ చంపు కర్త –బక్కా ఝా అనే ధర్మ దత్త (1856 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -4

283-సులోచన మాధవ చంపు కర్త –బక్కా ఝా అనే ధర్మ దత్త (1856  )

1856  లో పుట్టిన  కవి ధర్మదత్త అలియాస్ బక్కా ఝా ‘’సులోచన మాధవ చంపు’’సంస్కృత కావ్యం రాశాడు.గంగూలీ వంశం లో సకూరి శాఖకు చెందిన బ్రాహ్మణుడు .తండ్రి దుర్గాదత్త ఝా ,తాత మహా మహోపాధ్యాయ బాబూరియా ఝా .బక్కా ఎంచక్కా ముజఫర్ నగర్ డి ఎస్ ఎ.కాలేజి  ప్రిన్సిపాల్ చేశాడు .భారతీయ దర్శన శాస్త్రాలన్నిటి లో నిష్ణాతుడు .ఇతని చంపు పద్మ పురాణం లోని ‘’క్రియా యోగ సార సంగ్రంహం ‘’లో 5,6 అధ్యాయాల సారం .  36 ఉచ్చ్వాసాల కావ్యం .కధలో మార్పు లేవీ చెయ్యకుండా తన కవిత్వం తో రక్తి కట్టించాడు .సులోచన ను మభ్యపెట్టే ప్రచేస్ట పాత్ర సృష్టి బాగా చేశాడు .వచన రచనలో బాణ భట్ట ప్రభావం బాగా కనిపిస్తుంది .అనుప్రాస ఉత్ప్రేక్ష ఉపమ అర్దాల౦కారాలను బాగా సమర్ధవంతంగా వాడుకున్నాడు .సులోచన మాధవులమధ్య ప్రేమ శృంగారమే అసలు కధ.విప్రలంభ శృంగారానికి విశేష ప్రాధాన్యత నిచ్చాడు .చివరలో సంభోగ శృంగారాన్నీ దట్టించాడు .ఈ కావ్యాన్ని’’ పంచ తీర్ధి’’అంటారు .ఇందులోని 2498 శ్లోకాలను వివిధ ఛందస్సులలో రాశాడు .మూడవ ఉచ్చ్వాసం లో దండకం కూడా వడ్డించాడు.

కవి శేఖర బదరీ నాద ఝా ‘’గుణేశ్వర చరిత చంపు ‘’రాశాడు .ఇది తన పోషక రాజు మహారాజ కుమార గుణేశ్వర సింహా పై రాసిన చంపు .మిదిలను దాటి చేసిన తీర్ధ యాత్రా విశేషాలు ఇందులో ఉంటాయి . .ఖండబాల వంశ రాజులు- మహా రాజ మాధవ సింహ నుండి మహారాజాధి రాజ కామేశ్వర  సింహ వరకు రాజులను వర్ణించాడు .ఋతు వర్ణన బాగా చేసి వాల్మీకిని గుర్తుకు తెస్తాడు .దీన్ని అన్ని హంగులూ ఉన్న కావ్యం గా తీర్చి దిద్దాడు .సందర్భ శుద్ధిగా అలంకారాలను వాడాడు .వీర ,యుద్ధవీర ,దానవీర ,ధర్మవీర రసాలను చక్కగా పోషించాడు .

మిధిలకు చెందిన చంపూ కావ్యాలలో కిశోరీ ఝా రాసిన విద్వద్విలాస ,గిరిజానంద ఝా రాసిన దాశరధ భీశాప, బున్ని లాల దాస రాసిన అభిజ్ఞాన మైధిల ,శ్యామ సుందర ఝా రాసిన రామేశ్వర చంపు లు ఎన్నదగినవి .

 ఆధారం –Contribution of Mithila to Sanskrit

 సశేషం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు కవితేజం -2 7-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వేంకట శాస్త్రి (1828 -1915 )

తెలుగు కవితేజం -2

7-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వేంకట శాస్త్రి (1828 -1915 )

నరసింహ దేవర ఉమామహేశ్వర శాస్త్రి సీతాంబాల పుత్రుడు వేంకటశాస్త్రి ప.గో . జి.  తాడేపల్లి గూడెం లో 1828 లో పుట్టి 1915 లో 87 వ ఏట మరణించాడు .తణుకు లో వెలగదుర్రు లో నివాసమున్నాడు .ఇరవై ఏళ్ళు వచ్చేదాకా అష్టపదులు ,తరంగాలు మృత్యుంజయ విలాసం కీర్తనలు నేర్చుకుని పాడుకుంటూ గడిపాడు .మృదంగ విద్వాంసుడు కూడా కావటం తో ఒక సారి ఒక శాస్త్రి గారు వచ్చి సంస్కృతం లో సంభాషించాడు .అప్పుడు పట్టుదలపెరిగి సంస్కృతం నేర్చి రచనలు చేసి ప్రసిద్ధి చెందాడు .గోపీనాధ కవి రాసిన విచిత్ర రామాయణాన్ని గద్య పద్య రచనగా మలిచాడు .గౌరీ ,వెంకటేశ్వర శతకాలు కూడా రచించాడు .

8-నాగానంద నాటకీయ నవలా రచయిత-నరసింహ దేవర ఉమామహేశ్వర శాస్త్రి (1933 )

నరసింహ దేవర వెంకట శాస్త్రి సత్యవతి దంపతులకుమారుడే ఉమామ హేశ్వర శాస్త్రి .1933 లో జగన్నాధ గిరి లో పుట్టాడు .’’సుకవి కోకిల ‘’బిరుదున్నవాడు .సత్యవతి ,కావ్యసరసి, వినాయక వైభవం  పద్యకావ్యాలు ,విరాట పర్వం యక్షగానం ,నవ్యాంధ్ర పంచకావ్య పరిశీలనం(సౌందర నందం ,రాణా ప్రతాప చరిత్ర ,శివ భారతం ,ఆంద్ర పురాణం బాపూజీ ఆత్మకధ ) వ్యాసపీఠం భారత కధలను కదా తోరణంగా ,భాగవత కధలను భాగవత కదా సుధా గా ,నాగానందాన్ని నాటకీయ నవలగా ,పారిజాతాపహరణాన్ని వచన కధ గా రాశారు .మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి శిష్యుడు .వీరి పంచకావ్యాపరిశీలన గ్రంధాన్ని ఆంద్ర విశ్వ విద్యాలయం బి ఏ కు పాఠ్య గ్రంధంగా ఎంపిక చేసింది .

9-ఉత్తరా పరిణయ ప్రౌఢ ప్రబంధ కర్త –రేమెల వెంకట రాయ కవి (18 20-1847 )

1820 లో  పుట్టి ఇరవై ఏడు ఏళ్ళు మాత్రమె జీవించి 1847 లో మరణించిన రేమెల వెంకటరాయ కవి  తండ్రి భావయ .అంతకు మించి వివరాలు లేవు కాని యవ్వనం లోనే ఉత్తరాపరిణయ ప్రౌఢ ప్రబంధ రచన చేసిన దిట్ట .ప్రకృతికవి అని బిరుదు .జ్యోతిశాస్త్రం లో నిధి .జాతకరీత్యా తాను 27 ఏళ్ళు మాత్రమే బ్రతుకు తానని తెలుసుకొని పెళ్లి చేసుకోకుండా గ్రంధ రచనలో జీవితాన్ని ధన్యం చేసుకున్న పుణ్య మూర్తి .

10-పండిత రాయ శతక కర్త –తాడూరి లక్ష్మీ నరసింహ రాయ కవి (1856-1935)

తాడూరి రామారావు సీతమ్మ దంపతులకు 1856లో పుట్టి 79 వ ఏట 1935లో చనిపోయిన తాడూరి లక్ష్మీ నరసింహ రాయ కవి జన్మస్థల వివరాలు తెలియదు .శృంగార భూషణం ఉన్మత్త రాఘవం ,రుక్మిణీ స్వయం వరం ,భోజకుమారం ,లక్ష్మీ సంవాదం ,చంద్రాలోకం మేఘ సందేశం ,దైవ ప్రార్ధనం ,ఆంద్రీకృత భగవద్గీత ,శృంగార తిలకం ,ఋతు సంహారం ,సనత్సుజాతీయం ,నీతికధానిధి ,చమత్కార చంద్రిక ,పండితరాయ శతకం రాశాడు

11- కామినీ నిర్మోజన తారావళికర్త -త్రిపురాన తమ్మయ దొర(1849-1890 )

కామినీ నిర్మోజన తారావళికర్త త్రిపురాన తమ్మయ దొర 184 9 లో  చిట్టేమాంబ వెంకటస్వామి దొరలకుపుట్టి, 41ఏళ్ళు జీవించి 1890లో చనిపోయాడు .దేవీ భాగవత పురాణాన్ని ఆంధ్రీకరించిన వారిలో ముఖ్యుడు. నీతి శతకం పా౦డు రంగస్తోత్తరం ,కామినీ నిర్మోజన తారావళి ,ముఖ లింగేశ్వర శతకం ,నిద్రా విజయం రాశాడు .దొర కనుక ఆస్థానానికి వచ్చిన కవి పండితులను ఘనంగా సత్కరించేవాడు .

12-రామచంద్రోపాఖ్యాన కావ్య కర్త –వారణాసి వేంకటేశ్వర కవి (1820 )

1820 లో పుట్టాడు అన్న ఒక్క విషయం మాత్రమె వారణాసి వేంకటేశ్వర కవి గురించి తెలిసిన విషయం .రామ చంద్రోపాఖ్యానం అనే ఆరు ఆశ్వాసాల కావ్యాన్ని రచించి పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామికి అంకిత మిచ్చాడు కనుక ఆ ప్రాంతపు కవి అనుకో వచ్చు .

   సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-2-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (18 41-19 27)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (18 41-19 27)

శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం దగ్గర అచ్యుత పురిలో 18 41లో జన్మించి 86ఏళ్ళు జీవించి 19 27 లో మరణించిన శ్రీ ముడుంబ నృసింహా చార్య తండ్రిగారిపేరు వీర రాఘవాచార్యులు . తెలుగులో శతకాలు సంస్కృతం లో భాష్యాలు రాసిన పందిటకవి .  శ్రీ కృష్ణ చాటువులు ,సత్య శతకం ,గరుడాచల నాటకం ,బ్రహ్మ సూత్రా భాష్యం ,బ్రహ్మ సూత్ర రోమథము,ప్రపత్తి చింత ,నృసింహ శారీరక భాష్యం ,ఉజ్వలానంద చంపువు ,వాసవ పరాశారీయ నాటకం ,జయసిమ్హాశ్వమేదీయం చిత్సూర్యాలోకం ,కావ్య సూత్రా వ్రుత్తి ,ముగ్దా శృంగారం అంగ శృంగారం ,సంకీర్ణ శృంగారం ,రంగేశ శతకం రాశారు .’’భగవత్కవి ‘’గా సుప్రసిద్ధులు

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –22-2-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు కవి తేజం

తెలుగు కవి తేజం

తెలుగులో ఎందరెందరో మహాకవులు మరుగున పడిపోయారు .వారినివెతికి వారిలోని ప్రతిభను లోకానికి చాటి పుణ్యం కట్టుకున్నారు కొందరు మహానుభావులు .అందులో శ్రీ వంశీ గారు ముఖ్యులు .వారుసేకరించిన సమాచారాన్ని మా అబ్బాయి శర్మ నాకు పంపితే అందులో కొందరిని గురించి అందునా ఇదివరకు నేను వారి గురించి రాయని  వారిలో ఆణిముత్యాలవంటి వారిని ‘’తెలుగు కవి తేజం ‘’పేరిట పరిచయం చేసే సాహసం చేస్తున్నాను –దుర్గాప్రసాద్

1-శ్రీ బ్రహ్మానంద  భారతీ స్వామి వారి తత్వ సంగ్రహ రామాయణం అనువదించిన –ఆకొండి వెంకట కవి (1820 )

శ్రీ బ్రహ్మానంద భారతీ స్వామివారు సంస్కృతం లో రచించిన తత్వ సంగ్రహ రామాయణం ను తెలుగులో తొట్ట తొలిగా అనువదించిన వారు వారణాసి వారు . శ్రీ ఆకొండి వెంకట కవి 1820 లో అన్మించారు .తల్లి అచ్చమాంబ తండ్రి జగన్నాధ శాస్స్త్రి .పై అనువాదం తోపాటు రమా శతకం ,నారాయణ ,భాక్తపోషణా శ్రీ రమణా శతకం ,రామ ప్రభు శతకం రచించారు .వీరి రామాయణం లో అనేక పురాణ గాధలు ఎన్నో ఉన్నాయి .

2- ఆంద్ర కాళిదాసు ఆలూరి కుప్పన కవి (18 వ శతాబ్దం )

చెన్నపుర ప్రాంతీయుడు 18 వశతబ్దానికి చెందినా ఆలూరి కుప్పనకవి అభినవ కాళిదాసు బిరుదాంకితుడు .పంచనదీ స్థలీపురాణం ,రామాయణ యక్షగానం ,దశమస్కంద యక్షగానం ,పార్ధ సారధీ విజయం ,పరమభాగవత చరిత్ర ,ఇందుమతీ పరిణయం ,హరికధా సుధారసం ఆచార్య విజయం రాశారు .వీటిని బట్టే కవి ప్రతిభ తెలిసిపోతోంది .ఆ బిరుదు సార్ధకమనీ అర్ధమౌతోంది .

3-మండపాక పార్వతీశ్వర శాస్స్త్రి (1833-1897 )

జోగమ్మ కామకవి దంపతులకు బొబ్బిలి దగ్గర పాల తేరు లో 1833 జన్మించిన మండపాక పార్వతీశ్వర శాస్స్త్రిశ్రీ వెంకటగిరిద్వ్యర్దికావ్యం ,బ్రహ్మేశ ,చిత్రి ,వెంకటశైలనాయక ,విశ్వనాధ ,కాశీ విశ్వనాధ ,పార్దివలింగ ,పరమశివ ,సూర్య నారాయణ బాల శాశాన్కమౌలి ,చంద్ర ఖండ కలాప ,కలిపురుష ,ఈశ్వర ,జనార్దన ,పార్వతీశ్వర ,పరమాత్మ వెంకటరమణ వరాహ నరసింహ జగద్రక్షక ఆంజనేయ గోపాలకృష్ణ బాలకృష్ణ ,సర్వకామదా గణపతి హరి హరేశ్వర శతకాలు ,సీతారామ ద్వ్యర్ధి శతకం ,బొబ్బిలి రాజ వంశావళి ,కాన్చీమహాత్మ్యం అమరుకం అక్షరమాలి నిఘంటువు ,యాత్రాచరిత్ర గురు చిత్రకధ ,లఘు చిత్రకధ గుణ శ్లోకాది చిత్ర రచన ,కవితా వినోద కోశం ,మంగళాస్టక చతుస్టయంమొదలైన వైవిధ్యభరిత రచనలెన్నో చేసి ‘’అభినవ ఆంద్ర కవితా పితామహుడు ‘’అని పించుకున్నారు .శతక రచనతోపాటు ఆశుకవిత్వం లోనూ దిట్ట .వీటికి మించి ప్రబంధకవి కూడా అవటం ఆయన ప్రతిభకు నీరాజనం .శతకకవులలో మొదటి స్థానం మండపాక పార్వతీశ్వర కవి గారిదే .

5 ) మంత్రి ప్రగడ సూర్య ప్రకాశ కవి (1808 -187 5 )

సీతమ్మ శరభరాజా మాత్యుల కుమారుడే మంత్రి ప్రగడ సూర్య ప్రకాశ కవి 1808లో అన్మించి 1875 లో చనిపోయారు .గొప్ప విద్వత్కవిగా ప్రసిద్ధుడు.  మాడుగుల శ్రీ కృష్ణ భూపాలుని ఆస్థానకవి రాజు .సంస్థానానికి వచ్చే కవి పండితుల ప్రతిభను అంచనాకట్టి తగిన గౌరవ పురస్కారాలను రాజుగారి చే ఇప్పించేవారు .సాటికవులలో మహా ఆదరం సంపాదించిన సంస్కారి.

282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (1841-1927)

శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం దగ్గర అచ్యుత పురిలో 1841లో జన్మించి 86ఏళ్ళు జీవించి 1927 లో మరణించిన శ్రీ ముడుంబ నృసింహా చార్య తండ్రిగారిపేరు వీర రాఘవాచార్యులు . తెలుగులో శతకాలు సంస్కృతం లో భాష్యాలు రాసిన పండితకవి .  శ్రీ కృష్ణ చాటువులు ,సత్య శతకం ,గరుడాచల నాటకం ,బ్రహ్మ సూత్ర భాష్యం ,బ్రహ్మ సూత్ర రోమథము,ప్రపత్తి చింత ,నృసింహ శారీరక భాష్యం ,ఉజ్వలానంద చంపువు ,వాసవ పరాశరీయ నాటకం ,జయసిమ్హాశ్వమేదీయం, చిత్సూర్యాలోకం ,కావ్య సూత్రా వ్రుత్తి ,ముగ్దా శృంగారం అంగ శృంగారం ,సంకీర్ణ శృంగారం ,రంగేశ శతకం రాశారు .’’భగవత్కవి ‘’గా సుప్రసిద్ధులు ‘

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –22-2-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం

 

విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం )

గుంటూరు జిల్లా నల్లపాడ స్వగ్రామమైన  శ్రీదెందుకూరి దుర్గాప్రసాద్ శ్రీరామ మూర్తి వరలక్ష్మి దంపతులకు జన్మించారు విద్వద్వంశం .వేదపండితులకు ప్రసిద్ధి .,తండ్రి గొప్ప హరికథకులు,నటులు ,దేశ భక్తి పరాయణులు .ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని కారాగార క్లేశమనుభవించినవారు .చిన్నతనం లోనే తండ్రిని కోల్పోయి కుటుంబ  భారం నెత్తిన వేసుకున్నారు ప్రసాద్ గారు .స్మార్తం నేర్చి కొంతకాలం వైదిక వ్రుత్తి చేసి ,తర్వాత భాషా ప్రవీణ ,పండిత శిక్షణ పూర్తీ చేసి ,కృష్ణా జిల్లాపరిషత్ లో తెలుగు పండితులుగా ఉద్యోగించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు .విద్యార్ధులకు శ్లోకాలు పద్యాలు నేర్పి వారిలో సంస్కృతీ బీజాలు నాటారు .శ్రీమతి శ్యామల గారిని వివాహమాడి గృస్థ జీవితం ఆహ్లాదంగా గడిపారు .నాణ్యమైన నలుగురు పుత్రికా సంతానం పొంది మనవలతో మనవరాళ్ళతో ఆన౦దానుభూతి పొందుతున్నారు .

  పండితకవి కనుక ‘గేయాలు రాస్తూ ‘’పారిజాతాలు ‘’కదా సంపుటి తెచ్చిజాతీయ స్థాయి ప్రశంసా పత్రం అందుకున్నారు .సహజ సిద్ధ నటులు .తెలుగు లోనేకాక సంస్కృత  శాకుంతలం కర్ణభారం నాటకాలలో నటించారు . ఆంద్ర గీర్వాణాలలో చక్కని రచనలు చేశారు .సమగ్రంగా సంస్కృతం లో శ్రీమత్పుట్టలాంబాపూజా విధానం రాశారు .శనీశ్వర సుప్రభాతం ,శ్రీ సత్య సాయి నాధాస్టకం ,షిర్డీ సాయి సుప్రభాతం రాశారు తెలుగులో ‘’తెలంగాణా రాష్ట్ర గీతం ‘’,మణికిరణాలు వ్యాకరణ సుధ మొదలైనవి రాశారు ‘’సంపూర్ణ భక్తి స్తోత్ర మాల ‘’,శ్రీ మద్గురువాణి లను సంకలించారు .ప్రస్తుతం బెజవాడ దగ్గర గుంటుపల్లిలో ఉంటున్నారు .  ఉద్యోగానంతర విశ్రాంతి జీవితాన్ని గుంటు పల్లి లో ‘’శ్రీ సత్య సాయి లోక సేవక సంఘ౦ ‘’స్థాపించి సేవ చేస్తూ సత్కాలక్షేపం చేస్తున్నారు .

1-శ్రీమత్పుట్ట లాంబా పూజా విధానం –గుంటూరు దగ్గర చల్లావారిపాలెం  లో జన్మించి దేవతగా ఆరాధింపబడు తున్న పుట్టలాంబ తల్లి సద్బ్రాహ్మణ కుటుంబం కమలనాభుల వారింటి ఆడపడుచు గా లో జన్మించి ,రజస్వలానంతర వివాహం ఆరోజుల్లో నిషిద్ధం కనుక సమాజ బహిష్కరణకు గురై,ఎక్కడినుంచో చల్లావారిపాలెం చేరి౦ది ఆకుటుంబం .ఒక రోజు తలి దండ్రులు అంచి నీటికోసం వెళ్ళగా ఈమె ఒక పుట్టలో దూరినట్లు కధనం .తలిదండ్రులకు తెలిసి వచ్చి బ్రతిమిలాడినా  ల ఇంటికి వెళ్ళక అక్కడే ఉంటూ కనిపిస్తూ మాట్లాడుతూ ఆడుతూ ఉండేదని ప్రతీతి .నల్లపాడు ,చల్లావారి పాలెం ,వెంగళాయ పాలెం ,లింగాయపాలెం ,అంకిరెడ్డి పాలెం ,తురకపాలెం ,స్తంభాల గరువు అనే ఏడు గ్రామాల పుట్టలమ్మకు అత్య్నత భక్తి ప్రపత్తులతో పూజలాచారించారు .ఆ ప్రాంతం లో ఒక ప్రాధమిక  పా శాల కట్టారు . ఆమె శిలా విగ్రహం చెక్కింఛి పెట్టించారు ..అయినా నిత్యం అందరికి దర్శనమిస్తుంది .కవిగారి మేనత్త బండ్లమూడి హనుమాయమ్మ గారికి కనిపించేదని కనిపించినప్పుడల్లా గజ్జెల మోత వినబడేదని ఆమె చెప్పారట . .గ్రామ రక్షణగా ఊరంతా తిరిగేదట .  దెందులూరి వారి కుటు౦బ౦ ప్రతి శుక్రవారం ఆమెకు అభిషేకం చేసి దుర్గా ,లక్ష్మీ అస్తోత్తరం చదివి పొంగలి నైవేద్యం పెట్టేవారు .భక్తుల కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందటం వలన భక్తులు భారీగా విరాళాలు సేకరించి 29-5-1994 అమ్మవారిని పునః ప్రతిష్టించి మంచి ఆలయం కట్టించారు .పుట్టలమ్మ తల్లి యూత్ వారు 60వేల రూపాయల నిధి సేకరించి 15-1-2000 మకర సంక్రాంతినాడు ఎత్తైన ప్రభ కట్టించి ఘనంగా ఊరేగించారు .

   ఇంతటి ఘన చరిత్రగల పుట్టలాంబా దేవీ వైభవాన్ని స్తోత్ర అష్టక ,సుప్రభాతాలతో సమగ్ర పూజా విధానాన్ని శ్రీ దెందుకూరి దుర్గా ప్రసాద్ రచించి చరితార్ధు లయ్యారు .అందులోని విశేషాలు –

అష్టకం లో –‘’పుట్టలాంబా మహాదేవీం –పుణ్య శీలా తపస్వినీం –విప్ర పుత్రీం విశాలాక్షీం –నమో దేవీ నమామ్యహం ‘’తో ప్రారంభించి ‘’యాస్కసాన్వయ సంజాతో –దుర్గా ప్రసాద నామకః –పుట్టలాంబా ప్రసాదేనే-దంస్తబకం సమర్పితః ‘’అని ముగించారు .

సుప్రభాతం –పుట్ట లాంబా పుణ్య శీలే –పూర్వా సంధ్యా ప్రవర్తతే –ఉత్తిష్ట సర్వ లోకేశి-కర్తవ్యో లోక సంగ్రహః ‘’అని రొటీన్ గా ప్రారంభించి 9 వ శ్లోకం లో ‘’-త్వామేవ మాతార మివాశ్రంయామః –త్వామేవ పిత్రేవ సదాశ్రయామః –త్వామేవ గుర్వీ మివ భావ యామః –హేపుట్టలాంబే తవ సుప్రభాతం ‘’అని 12లో  ‘’మంగళం జన పాలిన్యై –మంగళం జ్ఞానభానవే –మంగళం భవనాసిన్యై –మంగళం లోక గురవే ‘’అని అమ్మ వారి ప్రతిభను చాటారు .

పూజా విధి లో దేవీ పూజా విధానం గా చెప్పి అష్టోత్తర శతనామాలు రాశారు –అందులో గ్రామ’’ దేవతాయైనమః,విప్ర ప్రపూజితాయైనమః ,గ్రామ రక్షా దక్షాయైనమః ,భ్రుగువార మహా పూజా సంతుస్టా యనమః అంటూ చివరినామం శ్రీ కమలనాభ వంశోద్భవాయైనమః అన్నారు .చివరగా భజనపాటలతో పూర్తయింది .

2-షిరిడి సాయి సుప్రభాతం లో-రెండవ శ్లోకం –శిర్దీశ్వరానంత మహేశ్వరామ్శిన్ –త్రైలోక్య వైశిష్ట్య సుపూజితాన్ఘ్రే –మానావమానాది గుణాద్వివేకిన్ –ప్రాభాత కాలే తవ సుప్రభాతం ‘అని మేల్కొల్పారు .10లో –‘’శ్రద్ధా సబూరీతిద్వయం ప్రజానాం –ప్రాచుర్యమానో సగుణాత్మ రూపః –ఏకాదశానాం ప్రవచన్ సదాత్మన్ –ప్రాభాత కాలే తవ సుప్రభాతం ‘’12లో ‘’బ్రహ్నాను భూత్యా సతతం స్థితోయః-రాదామయీ కృష్ణ మనోభిరామః –రాజర్షిణాశ్రీ రమణేన సేవిన్-శ్రీకంఠ రూపేణ తపోగ్రభావిన్ –ప్రాభాతకాలే తవ సుప్రభాతం ‘’అంటూ వైవిధ్యంగా రాశారు.

౩- సత్యసాయీ నాదాస్టకం-లో ‘’ప్రశాంతి నిలయ స్తాయ సత్య ధర్మ స్వరూపిణే –సకల లోక వంద్యాయ సోమనాధాయ వందనం –త్రిలోక పూజ నీయాయ సర్వ ధర్మ స్వరూపిణే –పరోపకార దీక్షాయ సాయినాధాయ వందనం ‘’అంటూ మొదలు పెట్టి ‘’సత్య సాయినముద్దిస్య సప్తత్సుత్సవ ప్రాంగణే-శ్రీ దుర్గాయాః ప్రసాదేన చేద౦ స్తోత్రం సమర్పితం .’’అని ముగించారు .

ప్రార్ధనాస్టకం కూడా పుట్టపర్తి సాయిపై రాశారు –‘’సత్య ధర్మ దయామూర్తిం –శాంతి ప్రేమ సమన్వితం –సర్వ భూతాన్తరాత్మాన౦-నమామి సత్య సాయినం ‘తో ప్రారంభించి ‘’యదుక్తం తత్కృతం యేన –యత్కృతం సుకృతం చ తత్-సూక్తం సుమతిం సుకృతం –నమామి సత్య సాయినం ‘’అని భక్తిగా ఆయన మహిమా గానం చేశారు రమ్యంగా .ప్రసాద్ గారి కవిత్వం లో చక్కని ధారాశుద్ధి ,అనాయాసంగా రాసే నేర్పు ,తన్మయ స్థితి ప్రస్పుటంగా కనిపిస్తాయి .ఈ కాలం లోనూ గీర్వాణ౦ లో రాసి మెప్పిస్తున్నందుకు సమాదరిస్తున్న చదువరులకు అభినందనలు .

దెందుకూరి వారి ‘’సంపూర్ణ భక్తి స్తోత్రమాల ‘’గొప్ప స్తోత్ర కదంబం .ఒకరకంగా కరతలం లో ఆమలకమే .అందరు దేవీ దేవతల స్తోత్రగానాలు రెడీ మేడ్ గా మనకు అందించారు .వీరు మరిన్న రచనలు చేసి గీర్వాణ  ఆంధ్ర భాషా వైభవానికి దోహదం చేయాలని మనవి .

ఆధారం –దెందు కూరి వారు పంపిన ‘’శ్రీమత్పుట్టలాంబా పూజావిధానం ,సంపూర్ణ భక్తి స్తోత్రమాల పుస్తకాలు ,శ్రీ షిరిడి సాయి సుప్రభాతం మొదలైనవి .అందులోను ముఖ్యంగా శ్రీ తూములూరువారు ‘’స్తోత్రమాల ‘’లో రాసిన ముందుమాటలు ‘’క్రుతజ్ఞతాంజలి ‘’మాత్రమె దెందు కూరి వారి జీవిత విశేషాలు రాయటానికి సహకరించింది .కవిగారి  గురించి నేను రాసిన దానికంటే అదనపు సమాచారంఅంటే పుట్టిన తేదీ వగైరా లు దొరకలేదు .

దెందుకూరి వారితో పరిచయం –సుమారు నెలక్రితం ఒకాయన ఫోన్ చేసి ‘’నాపేరు దుర్గాప్రసాద్ ,తెలుగు పండితుడిగా చేసి రిటైరయి గుంటుపల్లి లో ఉంటున్నాను ,సంస్కృతం తెలుగులలో పుస్తకాలు రాశాను ,పదేళ్ళక్రితం సాహితీ మండలి మీటింగ్ లో ప్రసంగించి ‘’ఏమీ బాగా లేదని మీతో చివాట్లు తిన్నాను ‘’ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తిగారు నాకు సహాధ్యాయులు. వారు మీ గురించి, రేపల్లెలో ఆవిష్కరించిన గ్రంధద్వయం గురించి చెప్పారు .నాకు వాటిని పంపండి నా రచనలు మీకు పంపుతాను ‘’అన్నారు .ఆ రోజే కొరియర్ లో పంపాను . వారినుంచి వారందాకా అందినట్లు సమాచారం లేదు .తమపుస్తకాలు పంపుతామన్న ఆయన నాలుగు రోజుల క్రితం వరకు పత్తాలేరు .శనివారంకొరియర్ లో  పంపితే అవి సోమవారం నాకు చేరటం ,ఇవాళే వాటిని చదవటం వారిపై రాయటం చకచకా జరిగిపోయాయి .నాకు తెలియని మరో గీర్వాణకవిని పరిచయం చేసి రాయించిన ఘనత శ్రీ తూము లూరు వారిది .వారి సౌజన్యానికి  ధన్యవాదాలు .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకలు -ఆహ్వానం (ఫైనల్)

సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకలు -ఆహ్వానం (ఫైనల్)

అక్షరం లోక రక్షకం

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

శ్రీ  విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు

119 వ సమావేశం  –ఆహ్వాన పత్రిక

సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం మధ్యాహ్నం -3గం .లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్న కీ.శే.శ్రీ మైనేని వేంక\టనరసయ్య,శ్రీ మతి సౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంథాలయం(శాఖా గ్రంధాలయం )  లో విశ్వనాథ వారి’’ ఏక వీర ‘’నవలపై ఏక ధాటి ప్రసంగం , ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,రెండు పుస్తకాల ఆవిష్కరణ , ఉగాది కవి సమ్మేళనం గా నిర్వహిస్తున్నాము ‘.

అతిధులకు కవి మిత్రులకు ,సాహితీ బంధువులకు ఉగాది శుభా కాంక్షలతో సాదర ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని జయ ప్రదం చేయండి .

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల  శ్యామలా దేవి,సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు

విశిష్ట అతిధి – –డా .ఈమని శివ నాగి రెడ్డి –,సి ఇ వో –కల్చరల్ సెంటర్  విజయవాడ అమరావతి ,స్థపతి.

విశేష అతిధి- శ్రీ మతి బెల్లంకొండ శివ కుమారి –ముఖ్య ఆంధ్రోపాధ్యాయిని ,ఏక వీర స్పెషలిస్ట్ –నరస రావు పేట

ఆత్మీయ ఆతిధులు-  శ్రీ పరవస్తు ఫణి శయన  సూరి ,పరవస్తు పద్య పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు  – –విశాఖ పట్నం

శ్రీ చలపాక ప్రకాష్ –ప్రధానకార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,రమ్యభారతి సంపాదకులు

శ్రీ వసుధ బసవేశ్వరరావు ,మినీ కవిత్వ సారధి ,ఆంధ్రా బాంక్ మేనేజర్ ,గుడివాడ

కార్య క్రమం

మధ్యాహ్నం -2-30  గం.లకు –అల్పాహార విందు

3- గం నుండి -4-30  – గం.వరకు –సాహిత్య ప్రసంగం

శ్రీ మతి బెల్లంకొండ శివ కుమారి చే –‘’ఏక వీర ‘’నవల పై  గంటన్నర  సేపు ఏక ధాటి ప్రసంగం .

4-30 -గం నుండి – 5- గం.వరకు – శ్రీమతి శివ కుమారి కి ఆశీరభి నందనలు  –శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు ,శ్రీ చావలి శివ సుబ్రహ్మణ్యం ,శ్రీ బందా  వెంకట రామారావు ,శ్రీదెందుకూరి .దుర్గాప్రసాద్ ,శ్రీ జి.వి ఎస్ .డి. ఎస్.వర ప్రసాద శర్మ ,శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ ,శ్రీమతి గుడిపూడి రాధికా రాణి .

5–గం నుండి -5-30  గం వరకు –పుస్తకావిష్కరణ

1-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన –షార్లెట్ సాహితీ మైత్రీ బంధం –

ఆవిష్కర్త లు –డా.ఈమని శివ నాగిరెడ్డి ,శ్రీ వై వి బి .రాజేంద్ర ప్రసాద్

2-వసుధైక కుటుంబం –శ్రీ హేవిళంబి ఉగాది కవితా సంకలనం –

ఆవిష్కర్తలు  –శ్రీ పరవస్తు ఫణి శయన  సూరి ,శ్రీ వసుధ బసవేశ్వర రావు –మేనేజర్ ఆంధ్రా బాంక్ ,గుడివాడ

సాయంత్రం 5-30-.గం నుండి -6–గం వరకు –శ్రీ విళంబి ఉగాది పురస్కార ప్రదానం

కీ .శే .గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు

గ్రహీతలు -1-డా ఈమని శివ నాగి రెడ్డి

2- శ్రీమతి బెల్లంకొండ శివ కుమారి

3- శ్రీ పరవస్తు ఫణి శయన  సూరి

స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు

గ్రహీతలు – చి వంశీ ,ప్రముఖ గాయకుడు ,”పాడుతా తీయగా పేమ్ ”.

శ్రీమతి పడమటి భువనేశ్వరి ,మహిళా స్ఫూర్తి వెల్ పేర్  సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు -ఉయ్యూరు

శ్రీమతి పామర్తి రాజి ,జాగృతి పొదుపు సహకార సంస్థ అధ్యక్షురాలు -ఉయ్యూరు

మరియు ఇద్దరు ప్రముఖ సామాజిక కార్యకర్తలు

కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్య దర్శి

సాయంత్రం -6- గం నుండి -7 -30గం వరకు –‘’  ఆశించి భంగ పడ్డ ఆంద్ర ‘’  అంశం పై ప్రముఖ కవులచే కవి సమ్మేళనం

నిర్వహణ –శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీమతి పుట్టి నాగ లక్ష్మి,

మనవి-4 పద్యాలు లేక 15 పంక్తుల వచన కవితకు పరిమితం  .చదివిన కవితను సరసభారతికి అందజేయండి.

పాల్గొను కవి మిత్రులు –శ్రీ చలపాక ప్రకాష్ , ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,శ్రీ మునగంటి వేంకట రామాచార్యులు శ్రీ పంతుల వెంకటేశ్వరరావు శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ ,  ,శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,శ్రీమతి వి ఉమామహేశ్వరి ,శ్రీమతి కోనేరు కల్పన ,శ్రీ మతి లక్కరాజు వాణీ సరోజినీ  ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి కొమాండూరి కృష్ణ ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి ఎస్.అన్నపూర్ణ  . శ్రీమతి పద్మావతి శర్మ, శ్రీమతి సామినేని శైలజ ,శ్రీమతి కందాళ జానకి  (విజయవాడ ) శ్రీ జి విజయకుమార్ (నందిగామ ) ,శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు ), శ్రీ వసుధ బసవేశ్వరరావు  (గుడివాడ) శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లె ) ,శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం(ఆకునూరు ),శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,(మారేడు మాక ) గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీ  మహమ్మద్ సిలార్ , (మచిలీ పట్నం ),శ్రీమతి సింహాద్రి పద్మ (అవనిగడ్డ ), మాదిరాజు శ్రీనివాసశర్మ ,శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి , కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు )

జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు                                       ఉగాది శుభాకాంక్షలతో

మాదిరాజు శివలక్ష్మి ,కార్య దర్శి                                                 గబ్బిట దుర్గాప్రసాద్

గబ్బిట వెంకట రమణ ,కోశాధికారి                                                 సరస భారతి అధ్యక్షులు

వి.బి.జి.రావు ,సాంకేతిక నిపుణులు                                           సెల్-9989066375

ఫోన్ -08676-232797

మనవి-ముద్రించిన ఆహ్వానాలు ఫిబ్రవరి నెలాఖరులో పంపిస్తాము

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కూర్చేదొకరైతే ఊడ్చేది వేరొకరు

కూర్చేదొకరైతే ఊడ్చేది వేరొకరు

అన్న చందంగా ఉంది

మన భారతీయ బ్యాంకుల స్థితి .

కస్టపడి చెమటోడ్చి డబ్బు సంపాదించి

నగానట్రా కుదువబెట్టి ,పొలం పుట్రా అమ్మేసి

ఆపత్కాలం లో  అదనుకు ఆదు కుంటుందని

నమ్మకం తో బాంకుల్లో ఆశగా కూడ బెడితే

అనాయాసం గా మోసం చేసి దోచుకుని

ప్రజల ,బాంకుల ,ప్రభుత్వాలనెత్తిపై

శటగోపం పెట్టె జాదూ ధన

 పూజారులెక్కువయ్యారు ఇదేం పోయే కాలం ?

ప్రధాని మోదీ రోడ్లూడ్చిస్వచ్చ భారత్ చేస్తుంటే

నీరవ మోదీ నీరవంగా నిశ్శబ్దంగా

బా౦కుల్ని ఊడ్చేసి

సొమ్ముచేసుకుని పరారీ .

 పంచనదుల సంగమ క్షేత్రం పంజాబ్

నేషనల్ బాంక్ అప్పనంగా

స్విఫ్ట్ సిస్టం ఆపరేషన్ వివరాలిచ్చేసి

ఇప్పుడు లబో దిబో మంటే ఏం లాభం ?

రోటోమాక్’’ కొఠారి ‘’

తెలివి తేటల కఠారి

మెత్తని కత్తితో నున్నగా చేశాడు క్షవరం .

పూర్వం లలితమోడీ ,హవాలా

కుంభ కోణాలకు దీటైనవి ఇవి

‘’ఆర్టి ఫిషియల్ ఇంటలిజెన్స్’’కు పరాకాస్టేమో!

మరో ‘’చొక్కీ ‘’ఎంచక్కా మెక్కి

వెక్కి రించి వెళ్లి పొయ్యాడు .

‘’మేరా భారత్ మహాన్ ‘’మోడీజీ!

బాంకుల్లో పేరుకు పోయిన నగదును

భారిగా ఊడ్చేసిన సంఘటనలివి

‘’కాంగీ హయాం ‘’లో అవినీతి జరిగిందని

నెత్తీ నోరూ కొట్టుకుని వీధినబడి

ఓట్లు దండుకుని అందలమెక్కిన  కమల నాధులూ!

 కాషాయ దారులూ ! తమనిర్వాకం మాత్రం

ఏం గొప్ప గా మెప్పుగా ఉంది ? అంటున్నాడు ఆం ఆద్మీ

రిటైర్ మెంట్ అయ్యే ముందు స౦భావనలు

అందుకోటం,దండుకోటం సర్వ సాధారణమే

కాని సదరు’’ పాంచ్ ఆబ్ ‘’ డిప్యూటీ మేనేజర్

బోనస్ గా బాంక్ నే కొల్లగొట్టాడట ఝారీగా భారీగా

నాలుగు గంటలకో ఉద్యోగి బాంక్ లను

మోసగిస్తున్నాడట –చిత్తగించారా జైట్లీ  మహాశయా !

అందులో గోకుల్ శెట్టి లాంటి వారెందరో ఉన్నారట

గమనించారా దేశ వ్యవహారాల మంత్రీజీ

ఈ సారి పద్మ పురస్కారాలు

ఆనవాయితీకి భిన్నంగా ఇచ్చామని

ఘన మోడీ ఘంట కొట్టిమరీ  బజాయించారు

కాని అక్రమదార్లకే అవార్డులని సామాన్యుడు

గొణుక్కుంటున్న సంగతి చెవిన బడిందా సారూ !

పై ముఠాలో ఇలాంటి వారూ ఉన్నారట తెలుసా సారూ !

‘’ఎవరు అధికారం లోకి వచ్చినా

మెక్కేది బొక్కేది ఆగదు గాక ఆగదు

మెక్కేవాళ్ళు బొక్కేవాళ్ళు మారుతారు అంతే’’

అన్నది ఆధునిక చాణక్య నీతి గురువర్యా .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-2-18-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీ  విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక

\అక్షరం లోక రక్షకం

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

శ్రీ  విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు

119 వ సమావేశం  –ఆహ్వాన పత్రిక

సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం మధ్యాహ్నం -3గం .లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్న కీ.శే.శ్రీ మైనేని వేంక\టనరసయ్య,శ్రీ మతి సౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంథాలయం  లో విశ్వనాథ వారి’’ ఏక వీర ‘’నవలపై ఏక ధాటి ప్రసంగం , ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,రెండు పుస్తకాల ఆవిష్కరణ , ఉగాది కవి సమ్మేళనం గా నిర్వహిస్తున్నాము ‘.

అతిధులకు కవి మిత్రులకు ,సాహితీ బంధువులకు ఉగాది శుభా కాంక్షలతో సాదర ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని జయ ప్రదం చేయండి .

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల  శ్యామలా దేవి,సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు

విశిష్ట అతిధి – –డా .ఈమని శివ నాగి రెడ్డి –,సి ఇ వో –కల్చరల్ సెంటర్  విజయవాడ అమరావతి ,స్థపతి.

విశేష అతిధి- శ్రీ మతి బెల్లంకొండ శివ కుమారి –ముఖ్య ఆంధ్రోపాధ్యాయిని ,ఏక వీర స్పెషలిస్ట్ –నరస రావు పేట

ఆత్మీయ ఆతిధులు-  శ్రీ పరవస్తు ఫణి శీల సూరి –సాహిత్య సాంస్కృతిక సేవాకార్య  కర్త –విశాఖ పట్నం

శ్రీ చలపాక ప్రకాష్ –ప్రధానకార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,రమ్యభారతి సంపాదకులు

కార్య క్రమం

మధ్యాహ్నం -2-30  గం.లకు –అల్పాహార విందు

3- గం నుండి -5 – గం.వరకు –సాహిత్య ప్రసంగం

శ్రీ మతి బెల్లంకొండ శివ కుమారి చే –‘’ఏక వీర ‘’నవల పై రెండు గంటల సేపు ఏక ధాటి ప్రసంగం .

5-గం నుండి – 5-30 గం.వరకు – శ్రీమతి శివ కుమారి కి ఆశీరభి నందనలు  –శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు ,శ్రీ చావలి శివ సుబ్రహ్మణ్యం ,శ్రీ బందా  వెంకట రామారావు ,శ్రీడి.దుర్గాప్రసాద్ ,శ్రీ జి.వి ఎస్ .డి. ఎస్.వర ప్రసాద శర్మ ,శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ ,శ్రీమతి గుడిపూడి రాధికా రాణి .

5-30-గం నుండి -6 గం వరకు –పుస్తకావిష్కరణ

1-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన –షార్లెట్ సాహితీ మైత్రీ బంధం –ఆవిష్కర్త లు –డా.ఈమని శివ నాగిరెడ్డి ,శ్రీ వై వి బి .రాజేంద్ర ప్రసాద్

2-వసుధైక కుటుంబం –కవితా సంకలనం –ఆవిష్కర్తలు  –శ్రీ పరవస్తు ఫణి శీల సూరి ,శ్రీ వసుధ బసవేశ్వర రావు –మేనేజర్ ఆంధ్రా బాంక్ ,గుడివాడ

సాయంత్రం 6-.గం నుండి -6–30గం వరకు –శ్రీ విళంబి ఉగాది పురస్కార ప్రదానం

కీ .శే .గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు

గ్రహీతలు -1-డా ఈమని శివ నాగి రెడ్డి

2- శ్రీమతి బెల్లంకొండ శివ కుమారి

3- శ్రీ పరవస్తు ఫణి శీల సూరి

స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు

గ్రహీతలు –ప్రముఖ సేవాకర్తలు –ఉయ్యూరు

 

కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్య దర్శి

సాయంత్రం -6-30 గం నుండి -7 -30 గం వరకు –‘’  ఆశించి భంగ పడ్డ ఆంద్ర ‘’  అంశం పై ప్రముఖ కవులచే కవి సమ్మేళనం

నిర్వహణ –శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీమతి పుట్టి నాగ లక్ష్మి

మనవి-4 పద్యాలు లేక 15 పంక్తుల వచన కవితకు పరిమితం  .చదివిన కవితను సరసభారతికి అందజేయండి.

పాల్గొను కవి మిత్రులు –శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ వసుధ బసవేశ్వరరావు ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,శ్రీ మునగంటి వేంకట రామాచార్యులు శ్రీ పంతుల వెంకటేశ్వరరావు శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ , శ్రీటేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,శ్రీమతి వి ఉమామహేశ్వరి ,శ్రీమతి కోనేరు కల్పన ,శ్రీ మతి లక్కరాజు వాణీ సరోజినీ  ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి ఎస్.అన్నపూర్ణ  .శ్రీమతి కొమాండూరి కృష్ణ  శ్రీమతి పద్మావతి శర్మ, శ్రీమతి సామినేని శైలజ ,శ్రీమతి కందాళ జానకి  (విజయవాడ ) శ్రీ జి విజయకుమార్ (నందిగామ ) ,శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు ), శ్రీ వసుధ బసవేశ్వరరావు ,శ్రీమతి పుట్టి నాగ లక్ష్మి (గుడివాడ) శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లె ) ,శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం(ఆకునూరు ),శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ (మారేడు మాక )శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీ  మహమ్మద్ సిలార్ , (మచిలీ పట్నం ),శ్రీమతి సింహాద్రి పద్మ (అవనిగడ్డ ), మాదిరాజు శ్రీనివాసశర్మ ,శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి , కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు )

జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు                                       ఉగాది శుభాకాంక్షలతో

మాదిరాజు శివలక్ష్మి ,కార్య దర్శి                                                 గబ్బిట దుర్గాప్రసాద్

గబ్బిట వెంకట రమణ ,కోశాధికారి                                                 సరస భారతి అధ్యక్షులు

వి.బి.జి.రావు ,సాంకేతిక నిపుణులు                                           సెల్-9989066375

ఫోన్ -08676-232797

 

gdurgaprasad | February 19, 2018 at 10:26 am | Tags: ఉయ్యూరు | Categories: సమయం – సందర్భం | URL:https://wp.me/p1jQnd-b0E

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 271-వీర పృథ్వి విరాజనాయక కర్త –మధురా ప్రసాద్ దీక్షిత్ (18 7 8-19 9 6 ))

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 271-వీర పృథ్వి విరాజనాయక కర్త –మధురా ప్రసాద్ దీక్షిత్ (18 7 8-19 9 6 ))

ఉత్తర ప్రదేశ్ హర్దోయి జిల్లా భగవంతనగర్ లో 1878 లో జన్మించిన మధురా ప్రసాద్ దీక్షిత్   25-9-1966 న 88 వ ఏట  మరణించాడు  .రాసిన 15 లో అందులో అత్రి నిర్వచనం , వీర పృథ్వి విరాజనాయక,భారత విజయం ,శంకర విజయం తోపాటు స్వీయ సంపాదకత్వం లో ‘’అభిదాన రాజేంద్ర ‘’తెచ్చాడు .మహా మహోపాధ్యాయ బిరుదున్నవాడు .

పవన్ కుమార్ దీక్షిత్ ‘’మనసిజ సూత్రం ‘’రాశాడు .పీయూష్ కాంతి దీక్షిత్ ‘’వ్యాప్తి సప్తక సారం ‘’రాశాడు .ప్రదీప్ కుమార్ దీక్షిత్ ‘’సంస్కృత గద్య సంకలనం ‘’తెచ్చాడు

272-విచార వాహిని కర్త –సాంబ దామోదర్ ఉపాధ్యాయ దీక్షిత్ (1934 )

వ్యాకరణ విద్వాన్ వేదం లో ఎం ఏ సాంబ దామోదర ఉపాధ్యాయ దీక్షిత్ 1934 ఫిబ్రవరి 14 కర్నాటక కార్వార్ జిల్లా గోకర్ణం లో జన్మించాడు .మహర్షి వేదిక్ విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ చేశాడు .14 గ్రంథాలు రచించాడు .అందులో గృహాగ్ని సారం, విచార వాహిని ,ఛందో దర్శనం ఉన్నాయి .వేద వార్నిధి ,వేద రత్న బిరుదులు పొంది రాష్ట్రపతి పురస్కార౦ అందుకున్నాడు .

273-కాళికా శతకోద్ది సార కర్త –శ్రీనివాస దీక్షిత్ (20   వ శతాబ్దం )

వ్యాకరణ ,శివాద్వైతాలలో విద్వాన్ ,అప్పయ్య దీక్షితుల  వంశం వాడైన  శ్రీనివాస దీక్షిత్. విజ్ఞప్తి శతకం ,కలి వైభవ శతకం ,ఆస్థానుభవశతకం ,కాళికా శాత కోద్ది సారం ,జగద్గురు ధామ సేవక శతకం రచించాడు

274-చిదంబర మహాత్మ్యం కర్త –సోం కేతు దీక్షిత్ (1928 )

తమిళనాడు చిదంబరం లో 1928 జన్మించిన సోం కేతు దీక్షిత్ శిరోమణి .సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీనివాస శాస్త్రి ల శిష్యుడు .చిదంబర మహాత్మ్యం ,నాగరాజ సహస్రనామ భాష్యం ,రీతి శాస్త్రం రాశాడు

275 –గోపస్వాప కావ్య కర్త –తురువేకరే సుబ్రహ్మణ్య విశ్వేశ్వర దీక్షిత్ (1924 )

శుక్ల యజుర్వేద వేదాంత అలంకార శాస్త్రాలలో విద్వాన్ తురువేకరే సుబ్రహ్మణ్య విశ్వేశ్వర దీక్షిత్ 1924 జులై 7 కర్నాటక తురువేకరే లో పుట్టాడు .ప్రొఫెసర్ . వెంకట రామావధాని ,రామ చంద్ర ,పతనాకర్ ల శిష్యుడు .స్తోత్ర విషయా చత్వారః ,లోభ సామ్రాజ్య౦ ఏకాంకికలు ,గోపస్వాప కావ్యం రాశాడు .

276-బృహతి కర్త-చిన్నస్వామి ద్రావిడ్ (1889-1956 )

1889 లో తమిళనాడు లో పుట్టి వారణాసి బి హెచ్ యు లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన చిన్నస్వామి ద్రావిడ్వెంకట రమణ శాస్త్రి ,కుప్పు శాస్త్రి , వెంకట సుబ్బా శాస్త్రిల వద్ద విద్య నేర్చాడు వ్యాకరణ ,సాహిత్య మీమా౦స లలో విద్వాన్ .రచించిన 5 గ్రంధాలలో మీమాంస కౌస్తుభం ,బృహతి ,తంత్ర సిద్ధాంత వల్లి ,వైదిక యజ్న మీమాంస యజ్న తత్వ ప్రకాశ ఉన్నాయి .,67 వ ఏట 1956 లో మరణించాడు .మహా మహోపాధ్యాయ బిరుదాంకితుడు .

277-కాళిదాసస్య బింబ విధానం కర్త –అయోధ్యా ప్రసాద్ ద్వివేది (1940 )

19 40  ఆగస్ట్ 1 మధ్యప్రదేశ్ సిది జిల్లా బెలాహ లో పుట్టిన అయోధ్యా ప్రసాద్ ద్వివేది దేవా  ప్రసాద ద్వివేదీ శిష్యుడు. కాళిదాసస్య బింబ విధానం అన్నది ఒక్కటే రాశాడు

278-అధర్వ వేద శుభాషితావలి కర్త –భారతేందు ద్వివేది (1956 )

1-3-1956 ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ లో పుట్టిన భారతేందు ద్వివేది ఎం ఏ డి ఫిల్.భాదోహిలోని కాశీ నరేష్ గవర్నమెంట్ పిజి కాలేజి సంస్కృత ప్రొఫెసర్ హెడ్డు కూడా .20 పుస్తకాలు రాశాడు .ఋగ్వేద శుభాషితావలి ,అధర్వ వేద శుభాషితావలి మొదలైనవి .

 శబ్దెందు శేఖరం పై ‘’రాధికా ‘’అనే వ్యాఖ్య రచించిన బ్రహ్మ దత్త ద్వివేది 1906 లో పుట్టి 1987 లో మరణించాడు ప్రొఫెసర్ .

279-రస వసు మూర్తిః కర్త –చంద్ర మౌళి ద్వివేది (1948 )

9-3-1948 వారణాసి లో పుట్టి బిహెచ్ యు లో సాహిత్య ప్రొఫెసర్ చేసిన చంద్ర మౌళి ద్వివేది –రేవా ప్రసాద్ ద్వివేది మహాదేవ పాండే లశిష్యుడై ,డా.శివరాం శర్మ ,డా అమరేంద్ర మిశ్రా వంటి సుప్రసిద్ధులకు గురువయ్యాడు ..వివేక లోకః చంద్రాలోకః ,కావ్య మీమాంశ భారత జీవనం కావ్యం ,రసవాసు మూర్తిః  వంటి 9 పుస్తకాలు రాశాడు .

280-అభినవ రస సిద్ధాంత కర్త –దశరద్ ద్వివేది (1940 )

14-12-1940 యు.పి .జోన్ పూర్ జిల్లా పచ్వాల్ లో పుట్టిన దశరద్ ద్వివేది గోరఖ్ పూర్ యూని వర్సిటి ప్రొఫెసర్ .రాసిన 14 పుస్తకాలలో వక్రోక్తి జీవితం ,అభినవ రస సిద్ధాంతం తోపాటు కాదంబరి అనువాదమూ ఉన్నాయి .

258 నుండి -280 వరకు ఆధారం –Inventory of Sanskrit Scholors .

  సశేషం

   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –19-2-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ  విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక

అక్షరం లోక రక్షకం

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

శ్రీ  విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు

119 వ సమావేశం  –ఆహ్వాన పత్రిక

సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం మధ్యాహ్నం -3గం .లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్న కీ.శే.శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీ మతి సౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంథాలయం  లో విశ్వనాథ వారి’’ ఏక వీర ‘’నవలపై ఏక ధాటి ప్రసంగం , ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,రెండు పుస్తకాల ఆవిష్కరణ , ఉగాది కవి సమ్మేళనం గా నిర్వహిస్తున్నాము ‘.

అతిధులకు కవి మిత్రులకు ,సాహితీ బంధువులకు ఉగాది శుభా కాంక్షలతో సాదర ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని జయ ప్రదం చేయండి .

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల  శ్యామలా దేవి,సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు

విశిష్ట అతిధి – –డా .ఈమని శివ నాగి రెడ్డి –,సి ఇ వో –కల్చరల్ సెంటర్  విజయవాడ అమరావతి ,స్థపతి.

విశేష అతిధి- శ్రీ మతి బెల్లంకొండ శివ కుమారి –ముఖ్య ఆంధ్రోపాధ్యాయిని ,ఏక వీర స్పెషలిస్ట్ –నరస రావు పేట

ఆత్మీయ ఆతిధులు-  శ్రీ పరవస్తు ఫణి శీల సూరి –సాహిత్య సాంస్కృతిక సేవాకార్య  కర్త –విశాఖ పట్నం

శ్రీ చలపాక ప్రకాష్ –ప్రధానకార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,రమ్యభారతి సంపాదకులు

కార్య క్రమం

మధ్యాహ్నం -2-30  గం.లకు –అల్పాహార విందు

3- గం నుండి -5 – గం.వరకు –సాహిత్య ప్రసంగం

శ్రీ మతి బెల్లంకొండ శివ కుమారి చే –‘’ఏక వీర ‘’నవల పై రెండు గంటల సేపు ఏక ధాటి ప్రసంగం .

5-గం నుండి – 5-30 గం.వరకు – శ్రీమతి శివ కుమారి కి ఆశీరభి నందనలు  –శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు ,శ్రీ చావలి శివ సుబ్రహ్మణ్యం ,శ్రీ బందా  వెంకట రామారావు ,శ్రీడి.దుర్గాప్రసాద్ ,శ్రీ జి.వి ఎస్ .డి. ఎస్.వర ప్రసాద శర్మ ,శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ ,శ్రీమతి గుడిపూడి రాధికా రాణి .

5-30-గం నుండి -6 గం వరకు –పుస్తకావిష్కరణ

1-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన –షార్లెట్ సాహితీ మైత్రీ బంధం –ఆవిష్కర్త లు –డా.ఈమని శివ నాగిరెడ్డి ,శ్రీ వై వి బి .రాజేంద్ర ప్రసాద్

2-వసుధైక కుటుంబం –కవితా సంకలనం –ఆవిష్కర్తలు  –శ్రీ పరవస్తు ఫణి శీల సూరి ,శ్రీ వసుధ బసవేశ్వర రావు –మేనేజర్ ఆంధ్రా బాంక్ ,గుడివాడ

సాయంత్రం 6-.గం నుండి -6–30గం వరకు –శ్రీ విళంబి ఉగాది పురస్కార ప్రదానం

కీ .శే .గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు

గ్రహీతలు -1-డా ఈమని శివ నాగి రెడ్డి

2- శ్రీమతి బెల్లంకొండ శివ కుమారి

3- శ్రీ పరవస్తు ఫణి శీల సూరి

స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం

ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు

గ్రహీతలు –ప్రముఖ సేవాకర్తలు –ఉయ్యూరు

 

కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్య దర్శి

సాయంత్రం -6-30 గం నుండి -7 -30 గం వరకు –‘’  ఆశించి భంగ పడ్డ ఆంద్ర ‘’  అంశం పై ప్రముఖ కవులచే కవి సమ్మేళనం

నిర్వహణ –శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీమతి పుట్టి నాగ లక్ష్మి

మనవి-4 పద్యాలు లేక 15 పంక్తుల వచన కవితకు పరిమితం  .చదివిన కవితను సరసభారతికి అందజేయండి.

పాల్గొను కవి మిత్రులు –శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ వసుధ బసవేశ్వరరావు ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,శ్రీ మునగంటి వేంకట రామాచార్యులు శ్రీ పంతుల వెంకటేశ్వరరావు శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ , శ్రీటేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,శ్రీమతి వి ఉమామహేశ్వరి ,శ్రీమతి కోనేరు కల్పన ,శ్రీ మతి లక్కరాజు వాణీ సరోజినీ  ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి ఎస్.అన్నపూర్ణ  .శ్రీమతి కొమాండూరి కృష్ణ  శ్రీమతి పద్మావతి శర్మ, శ్రీమతి సామినేని శైలజ ,శ్రీమతి కందాళ జానకి  (విజయవాడ ) శ్రీ జి విజయకుమార్ (నందిగామ ) ,శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు ), శ్రీ వసుధ బసవేశ్వరరావు ,శ్రీమతి పుట్టి నాగ లక్ష్మి (గుడివాడ) శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లె ) ,శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం(ఆకునూరు ),శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ (మారేడు మాక )శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీ  మహమ్మద్ సిలార్ , (మచిలీ పట్నం ),శ్రీమతి సింహాద్రి పద్మ (అవనిగడ్డ ), మాదిరాజు శ్రీనివాసశర్మ ,శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి , కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు )

జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు                                       ఉగాది శుభాకాంక్షలతో

మాదిరాజు శివలక్ష్మి ,కార్య దర్శి                                                 గబ్బిట దుర్గాప్రసాద్

గబ్బిట వెంకట రమణ ,కోశాధికారి                                                 సరస భారతి అధ్యక్షులు

వి.బి.జి.రావు ,సాంకేతిక నిపుణులు                                           సెల్-9989066375

ఫోన్ -08676-232797

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 261 –భారత్యాభరణం కర్త –శ్రీ రాం దవే (1922 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

261 –భారత్యాభరణం కర్త –శ్రీ రాం దవే (1922 )

న్యాయ ,వేదాంత ,ఆంగ్లలలో  ఎం ఏ ,కావ్యతీర్ధ శ్రీరాం దవే 22-9-1922 రాజస్థాన్ సందాది జిల్లా బడ్మేర్ లో జన్మించాడు .కరాచి హై స్కూల్ టీచర్ .మణి శంకర ద్వివేది ,ధర్దేవ్ జైట్లీ ల శిష్యుడు .19 గ్రంథాలు రచించాడు అందులో భారత్యాభరణం ,రాజ్యలక్ష్మీ స్వయం వరం ,శకట స౦గరం ,సౌందర్య లీలామృతం ,వియోగ శతకం ఉన్నాయి .రాజస్థాన్ సంస్కృత అకాడెమి ,అవార్డ్ ,మాఘ పురస్కార గ్రహీత .

262-ఆది శంకరాచార్య నాటక కర్త –అనంత గోపాల దేశ పాండే (1930 )

15-8-1930 బొంబాయిలో పుట్టిన అనంత గోపాల దేశపాండే గోదాలహరి కావ్యం ఆది శంకరాచార్య నాటకం సంస్కృతం లో రాశాడు

263- రసిక వినోదం కర్త –ఉమా శరత్ చంద్ర దేశపాండే (1944 )

బరోడాలో 1944 ఆగస్ట్ 26 జన్మించి జర్మన్ భాషలో డిప్లోమో ,ఎం ఏ పి హెచ్ డిపొందిన ఉమాశరత్ చంద్ర దేశపాండే గుజరాత్ లో టీచర్ .డా.అరుణోదయ జాని ,సురేష్ చంద్ర కంటావాలా వద్ద విద్య నేర్చాడు .ఒకే ఒక పుస్తకం ‘’రసిక వినోదనం స్వానుభూతిః హస్త లిఖిత గ్రంధ ద్వయస్య ప్రకాశనం ‘’రాశాడు .

26 4- గాంధీ సూక్తి ముక్తావళి కర్త –కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి సి .డి.దేశ్ ముఖ్ (1896-1982 )

అందరికి పరిచయమైన పేరు సి డి దేశ ముఖ్  అసలుపేరు చింతామణి ద్వారకానాద్ దేశ్ ముఖ్ 14-1- 1896 మహారాష్ట్ర పోర్ట్ రాయగడలో జన్మించి బొంబాయి లో చదివి ,మొదటి జగన్నాద  శంకర సేథ్ స్కాలర్షిప్ సంస్కృతం లో సాధించి  గణన కెక్కాడు .1915 లో ఇంగ్లాండ్ వెళ్లి కేంబ్రిడ్జి లో నాచురల్ సైన్సెస్ లో డిగ్రీ తీసుకుని ,బాటనీలో స్మార్ట్ ప్రైజ్ పొంది ,1918 లో ఐ సి ఎస్ పరీక్షలో సర్వో త్క్రుస్టంగాలండన్ నుంచి  పాసైన ఏకైక భారతీయుడిగా వినుతి కెక్కాడు .1920 లో ఇండియా తిరిగి వచ్చి బీహార్ మధ్య పరగణాలలో డిప్యూటీ కమీషనర్ ,సెటిల్మెంట్ ఆఫీసర్ మొదలైన హోదాలలో పని చేసి  ,1931 లో రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు సెక్రెటరి జనరల్ గా ఉండి ,తర్వాత ఫైనాన్స్ ,పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరి అయ్యాడు .భారత ప్రభుత్వ విద్యా ఆరోగ్య శాఖ జాయంట్ సెక్రెటరి గా పని చేసి ,కొంతకాలం  కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టి గా ఉన్నాడు .

   1939 లో రిజర్వ్ బాంక్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సెక్రెటరి అయి , డిప్యూటీ గవర్నర్  అయి గవర్నర్ అయ్యాడు.1943 లో రిజర్వ్ బాంక్ గవర్నర్ అయి  డిప్యూటీ గవర్నర్లు గవర్నర్ స్థాయి పొందిన ఇద్దరిలో ఒకడు అయ్యాడు , ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పరేషన్ ఏర్పాటులో చురుకైన పాత్ర వహించి గ్రామీణ అప్పులు ఇవ్వటానికి కృషి చేశాడు .500 రూపాయల  నోట్ల రద్దు చేసి బాంకింగ్ సిస్టం ను సరైనమార్గం లో నడిపిన ఘనత పొందాడు .బాంకుల జాతీయీకరణకు వ్యతిరేకించినా బోర్డ్ మీటింగ్ లో పాల్గొన్నాడు .దేశ్ ముఖ తర్వాత 1949 లో బెనెగల్ రామారావు రిజర్వ్ బా౦క్ గవర్నర్ అయ్యాడు.బ్రెట్టన్ వుడ్స్ కాన్ఫరెన్స్ కు ఇంటర్నేషనల్ బాంక్ ఆఫ్ రి కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్ కు  భారత దేశం తరఫున వెళ్ళిన అయిదుగురు ప్రతినిధుల బృందం లో ఒకడు . అందులో చర్చకు దారిద్ర్యాన్ని అభి వృద్ధిని చేర్చటానికి కృషి చేసి సఫలీ కృతుడయ్యాడు దేశ్ ముఖ్ .వీటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెంబరయ్యాడు

  భారత స్వాతంత్ర్యానంతరం దేశ్ ముఖ్ ప్లానింగ్ కమిటి సభ్యుడై ,1950 జాన్ మత్తయ్ స్థానం లో ఆర్ధిక మంత్రి అయ్యాడు .పంచ వర్ష ప్రణాళికల అమలుకు ఎంతో సాయం చేశాడు .కేంద్ర ఆర్దికమంత్రిగా 5 బడ్జెట్లు ఒక ఇక ఇంటీరియం బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత పొందాడు  .1956 లో ఆర్దికమంత్రిగా రాజీనామా చేసి యూని వర్సిటి గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ అయ్యాడు.విశ్వ విద్యాలయాల అభి వృద్ధికి కీలక పాత్ర పోషించాడు .195 7 లో నేషనల్ బుక్ ట్రస్ట్ కు వ్యవస్థాపక అధ్యక్షుడు.1962- నుండి 1967 వరకు ఢిల్లీ యూని వర్సిటి వైస్ చాన్సలర్ .ఫోర్డ్ ఫౌండేషన్ ను ఆహ్వానించి గ్రంధాలయ అభి వృద్ధికి ఒక మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం చేయమని కోరాడు .1953 లోఆంధ్రుల ఆడబడుచు మహిళాభ్యుదయానికి నిర్విరామ కృషి చేసిన  శ్రీమతి గుమ్మిడిదల దుర్గా బాయ్ ను వివాహమాడి ఆంధ్రా అల్లుడై ఆమెను’’ దుర్గాబాయ్ దేశ్ ముఖ్’’ ను చేశాడు .1974 లో ‘’ది కోర్స్ ఆఫ్ మై లైఫ్ ‘’పుస్తకం రాశాడు .2-2-1982 హైదరాబాద్ లో 86 వ ఏట సిడి దేశముఖ్ మరణించాడు .భర్త జీవిత విశేషాలను దుర్గాబాయి ‘’చింతామణి అండ్ ఐ ‘’పుస్తకంగా రాసింది .

  దేశ్ ముఖ్ సంస్కృతం లో గాంధీ సూక్తి ముక్తావళి ,సంస్కృత కావ్య మాలిక లను రాశాడు అని చాలామందికి తెలియదు ..మేఘ దూతం ను సంస్కృతం నుండి మరాఠీ భాషలోకి అనువాదం చేశాడు ,

265 –భారతీయ సాహిత్య శాస్త్రం కర్త –గణేష్ త్రయంబక దేశ పాండే (1809 )

1809 లో జన్మించిన గణేష్ త్రయంబక దేశ పాండే డి లిట్.సాహిత్య తత్వ శాస్త్రాలలో నిష్ణాతుడు .సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత .రెండు గ్రంధాలు –భారతీయ సాహిత్య శాస్త్రం , సాంఖ్య కారికా స్పందన కారిక ,అలంకార ప్రదీప తోపాటు అభినవ గుప్తుని పై మోనోగ్రాఫ్ రాశాడు .

266-అభినవ రాఘవం నాటక కర్త –పి ఎస్ దేవనాధా చార్య (1922 )

21-5-1922 తమిళనాడు చెంగల్ పట్టు జిల్లా మధురాంతకం తాలూకా పైయంబాడి లో జన్మించిన పి ఎస్ దేవనాధా చార్య మీమాంస ,సాహిత్య ,విశిస్టాద్వైతాలలో శిరోమణి .రంగ రామానుజ మహా పెరిక ,శ్రీవత్స సంఘ చారియార్ ల శిష్యుడు .అభినవ రాఘవ నాటకం ,మాత్రమె రాశాడు .

267-కవితా సుధానిధి కర్త –దేవీ ప్రసాద్ (1888-1931 )

1888 లో కాశీలో పుట్టి 53 వయేట 1931 లో మరణించిన దేవీ ప్రసాద్ ప్రాచీన న్యాయ,వ్యాకరణ ,సాంఖ్య యోగ ,మీమాంస ,ధర్మ శాస్త్ర సాహిత్య శాస్స్త్రాలలో మహా పండితుడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ సంస్కృత కాలేజి  ప్రొఫెసర్ .కవితా సుధానిధి ,శారదా పచ్చీసి రాసిన కవి చక్రవర్తి బిరుదాంకితుడు  ,మహామహోపాధ్యయుడు .

268-నామకరణ సంస్కార కర్త –వేద ప్రకాష్ దిన్దోరియా (1978 )

18 -12-1978 లో హోషియార్పూర్ లో జన్మించిన వేద ప్రకాష్ దిన్దోరియాపిహెచ్ డి చేసి ,హోషియార్పూర్ కాలేజి లెక్చరర్ అయ్యాడు .2009 లో ఉపనయన సంస్కారం ఒక్కటే రాశాడు .

269- గోపాల బంధు కర్త –హరినారాయణ దీక్షిత్ (1936  )

గోపాల బంధు ,భీష్మ చరితం ,మేనకా విశ్వామిత్రం ,ఉపదేశ శతి మొదలైనవాటి కర్త హరినారాయణ దీక్షిత్ ఉత్తరప్రదేశ్ జలూన్ జిల్లా పడ్కూల లో 13-1-1936 పుట్టి ,ఉత్తరాఖండ్ కౌమాన్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ చేశాడు .50 పుస్తకాలు రాసిన బహు గ్రంథ కర్త.రాసిన వాటిలో రాష్ట్రీయ కావ్య లేఖన్ మంచి గుర్తింపు నిచ్చింది .ప్రెసిడెంట్ అవార్డ్ ,సాహిత్య అకాడెమీ అవార్డ్ ,వనభట్ట పురస్కారం పండిట్ గౌరీ శంకర ద్వివేదీ పురస్కారం ,వాచస్పతి పురస్కారం  విద్యారత్న పురస్కారాలతో పాటు ,సరస్వతి సమ్మాన్ పొందాడు .

270-మాధవ కరుణ విలాస కర్త –చిదంబర మార్తాండ దీక్షిత్ (1916 )

చిదంబర మార్తాండ దీక్షిత్ నవ్య న్యాయ విద్వాన్ ,పూర్వ మీమాంస విద్వాన్ . 1916 జూన్ 1 బెల్గాం లో పుట్టాడు .దారార్ సంస్కృత కాలేజి లెక్చరర్ .పర్యాయ శబ్ద రత్నం ,గురు వచన సుధ ,మాధవ కరుణావిలాస కావ్యం రాశాడు కర్నాటక రాష్ట్ర అవార్డ్ ,కంచి సమ్మాన్ తోపాటు రాష్ట్ర పతి పురస్కారం పొందాడు .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –15-2-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

14-2-18 బుధవారం సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో శారద స్రవంతి సంస్థ ద్వితీయ వార్షికోత్సవం

https://photos.google.com/share/AF1QipMKe96FYyRvEjqRQr4BeF3_vSup3sihOK75cffCQ503lbpXdGDtEentfjzOCpnZ4A?key=bFpMakpDaUt2RzZOVnEwOGhKOVB1b2hqUUwtbnNB14-2-18 బుధవారం సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో శారద స్రవంతి సంస్థ ద్వితీయ వార్షికోత్సవం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 258-లిపి తత్వ కర్త –గోదావరీష్ దాష్(1910 -2010 ))

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

258-లిపి తత్వ కర్త –గోదావరీష్ దాష్(1910 -2010 ))

సంస్కృత ఆచార్య ,ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ గోదావరీష్ దాష్ 1910 ;లో ఒరిస్సా గంజాం జిల్లా పొడమారి లో జన్మించి  శతమానం భవతి గా నిండు నూరేళ్ళూ జీవించి 2010 మరణించాడు .సంస్కృతం లో ‘’లిపి తత్వ ‘’ఒక్కటే రాశాడు ఒరియాలో వేదాలకు ఏడు అద్భుత వ్యాఖ్యానాలు రచించాడు .

259-సంస్కృత మందాకినీ కర్త –గోపాల కృష్ణ దాష్(19 52)

24-11-19 52 పూరీ లో జన్మించిన గోపాల కృష్ణదాష్ యజుర్వేద మాధ్యందిన సంహిత లో ఎంఏ ఎం ఫిల్ పిహెచ్ డి చేసి,ఉత్కళ యూని వర్సిటి సంస్కృత పిజి డిపార్ట్మెంట్ హెడ్ అయ్యాడు .గొప్ప గురుపరంపర ఉన్నవాడు –పండిట్ పరమేశ్వరదాస్ ,జనార్దన  సరస్వతి ,ప్రొఫెసర్ ఏ సి స్వైన్ ప్రొఫెసర్ సదాశివ ప్రహరాజ్ లాంటి ఉద్దండులవద్ద విద్య నేర్చాడు .శిష్య పరంపరలో లబ్ధ ప్రతిష్టు లైన ప్ర రాదా మాధవ్ దాస్ ,ప్రొ .సురేంద్ర మోహన మిశ్రా ,ప్రొ .సుఖదేవ్ భోజ్ ,డా .మధు సూదన మిశ్రా వంటి వారున్నారు .27 గ్రంధాలు రాశాడు ముఖ్యమైనవి –సంస్కృత మందాకినీ ,వ్యాకరణ దర్పణ ,సంస్కృత ప్రభ ,సిద్ధాంత కౌముది .విద్వత్ సమ్మాన్ ,కవి  శ్రీ హర్ష సమ్మాన్ , సరస్వతి వరద పుత్ర సమ్మాన్ వంటివి చాలా పొందాడు .ఒడిస్సా సంస్కృత అకాడెమి అవార్డ్ తోపాటు ,స్కాలర్ ఆఫ్ ఎక్సెలెన్స్ అవార్డ్ ,కృష్ణ చంద్ర ఆర్య అవార్డ్ ,పూరీలోని నీలాచల తత్వ సంధాన పరిషత్ అవార్డులు అందుకున్న సరస్వతీ పుత్రుడు కృష్ణ దాష్  .మారిషస్ బోర్డ్ ఆఫ్ రైటర్స్ కు చైర్మన్ .

260-చారుదత్తం కర్త –కాదంబినీ దాష్ (1958 )

16-1-1958 పూరి లో జన్మించిన కాదంబినీ సంస్కృత పిహెచ్ డి చేసి ,రీడర్ గా కటక్ లోని శైలబాలా వుమెన్స్ కాలేజి లో పనిచేసింది పండిట్ దివాకర్ దాస్ ,ఎసి స్వైన్ ,ప్రొ ఏ .సి .సారంగి మొదలైన వారివద్ద విద్య నేర్చి ,భాగ్యలిపిమాల ,డా సురేఖా దాస్ ,నందితామిశ్రా ,రోజిలిన్ మహ౦తి అనే ప్రముఖ శిష్యులకు గురువైంది .రఘు వంశం ,చారుదత్తం ,మేఘదూతం సిద్ధాంత కౌముది మొదలైన 24 గ్రంధాలు రాసింది .డా కుంజ బిహారీ త్రిపాఠి స్మ్రుతి సమ్మాన్ , అందుకున్నది .ఆల్ ఒడిస్సా అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ టీచర్స్ ఇన్ సాంస్క్రిట్ కు పాట్రన్ గా ఉన్నది .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –14-2-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 257-కుమార సంభవ వ్యాఖ్య కర్త –విఠలదేవుని సుందర శర్మ (20 వ శతాబ్దం )

 గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

257-కుమార సంభవ వ్యాఖ్య కర్త –విఠలదేవుని సుందర శర్మ (20 వ శతాబ్దం )

     మనకు కాళిదాస కావ్యాలపై సంస్కృత  వ్యాఖ్య రాసింది వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి అనే బాగా తెలుసు .తర్వాత చాలా మంది రాశారు .కాని మనకు పట్టలేదు చారిత్రిక సత్యంగా అవి ఉండి పోయాయి .కాని మన తెలుగువాడు ఇరవయ్యవ శతాబ్దం ?వాడు అయిన  విఠల దేవుని సుందర శర్మ సంస్కృతం లో కుమార సంభవం కావ్యం పై చక్కని సంస్కృత వ్యాఖ్యానం రాశాడని అసలు తెలియదు అనే నేను అనుకొంటున్నా .కాని ఇది యదార్ధం. ఆయన కాలం జీవిత విశేషాలు గూగుల్ లో దుర్భిణీ వేసి వెదకినా దొరకలేదు .మూల౦ తో సహా విఠలదేవుని సుందర శర్మ సంస్కృత వ్యాఖ్యానాన్ని చిత్తూరు లోని ‘’సంస్కృత భాషా ప్రచారిణీ సభ ‘’ప్రచురించింది .దీని ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ధిక సహాయమందించింది .ఇంతకు  మించి ఏ రకమైన సమాచారమూ దొరకలేదు ఒట్టు ..ప్రధమ సర్గ లో ప్రధమ శ్లోకానికి సుందర శర్మ గారి వ్యాఖ్యానం చూద్దాం –

‘’అస్త్యుత్తరస్యే దివి దేవతాత్మ- హిమాలయో నామ నగాధి రాజా -పూర్వా పరౌ తోయ నిధీ విగాహ్య స్థితః పృదివ్యా ఇవ మాన దండః’’

అర్ధ వివరణ –ఉత్తరస్య దిశా =ఉదీచీ దిగ్భాగే ,దేవతాత్మా =దేవతాస్వరూపీ ,హిమాలయో నామ =హిమాలయ ఇతి ప్రసిద్ధ ,నగాధి రాజా = పర్వతానాం ఆధిప –పర్వత శ్రేష్ట ,పూర్వా పరౌ =ప్రాక్ పశ్చిమో ,విగాహ్య =ప్రవిశ్య ,పృదివ్యా =భూమే ,మానదండ ఇవ =ఆయామ పరిచ్చేదక దండ ఇవ ,స్థిత =విరాజమాన ,ఆస్తి=వర్తతే

దీనికి తాత్పర్యం –భారత వర్షో త్తర దిగ్భాగే దేవతా స్వరూపీ హిమాలయో నామ పర్వత రాజః ప్రాక్పశ్చిమౌ సముద్రే ప్రవిశ్య పృదివ్యా మానదండ ఇవ  విరాజమానో వర్తతే ‘’

అలాగే విగ్రహవాక్యాలనూ ప్రతి శ్లోకానికి రాశారు .సర్గ చివరలో కద ఎంతవరకు అర్ధమైనదో తెలుసుకోవటానికి  ‘’ప్రశ్నావళి ‘’ఇచ్చారు .వీటికి సమాధానం తెలిస్తే సర్గలోని ముఖ్య విషయాలు తెలిసి నట్లే .ప్రశ్నకు ఏ శ్లోకం లో సమాధానం దొరుకుతుందో క్లూ కూడా ఇచ్చారు .

1-హిమాలయ కుత్ర కధ మస్తి ? 2-సతీ దేవీ మేనకాయా కధ ముత్పన్నా ?

 సశేషం

   మహా శివరాత్రి శుభా కాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –13-2-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ 

సాహితీ బంధువులకు శివరాత్రి శుభాకాంక్షలు –

సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ
1- వసుధైక కుటుంబం -కవితా సంకలనం -ఆవిష్కరణ(118 వ సమావేశం ) -25-2- 18 ఆదివారం-సాయంత్రం -4 గం లకు  -గుడివాడ -రైల్వే స్టేషన్ రోడ్ లోని ఆఫీసర్స్ క్లబ్ లో -శ్రీ వసుధ గారి ఆధ్వర్యం లో
2-శ్రీ విళంబి ఉగాది వేడుకలు -11- 3- 18 ఆదివారం(119 వ సమావేశం )  వేదిక -స్థానిక  ఏ సి గ్రంధాలయం -ఉయ్యూరు
మధ్యాహ్నం -2-30 గం లకు -అల్పాహారం
 మధ్యాహ్నం -3 గం  -నుండి 5 గం .వరకు -ముఖ్య అతిధి ,ఏకవీర స్పెషలిస్ట్ -శ్రీమతి బెల్లం కొండ శివకుమారి (తెలుగు పండిట్ నరసరావు పేట  )గారిచే విశ్వనాథ  వారి ”ఏక వీర నవల”పై ”ఏక ధాటి ”ప్రసంగం
 సాయంత్రం -5 గం .నుండి 6 గం  వరకు – ఏక వీర ప్రసంగం పై కవిమిత్రుల- సద్యో స్పందన రూప కవిత్వవేడుక
సాయంత్రం -6 గం  లకు -”షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ”-యాత్రా సాహిత్యం పుస్తకా విష్కరణ –
సాయంత్రం -6- 30 కు ముఖ్యఅతిధికి సత్కారం
                                                                       గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు 13-2-18 మంగళవారం మహా శివ రాత్రి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు 13-2-18 మంగళవారం మహా శివ రాత్రి శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్

Inline image 2

— Inline image 1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 256 –  బాల విధవ కర్త –దీనా రావు దయాలు –(1993)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

256 –  బాల విధవ కర్త –దీనా రావు దయాలు –(1993)

బాల విధవ ఏకాంకిక కర్త దీనా రావు దయాలు ,బెంగళూర్ సురభారతి ప్రకాశన్ 1993 లో ప్రచురించింది .ఇందులో బాల విధవల దైన్యం ,గోడు ,సంఘం వారి పట్ల చూపుతున్న క్రూరత  లను ప్రత్యక్షం చేసింది .ఈమె ‘’లీలా నాటక చక్రం ‘’పేరుతొ మరొక 21 నాటికలు రాసి ప్రచురించింది .

 అనూప్ అనే 30 ఏళ్ళ రైతు  బాల వైధవ్యం అనుభవిస్తున్న పార్వతి అంద చందాల గురించి తన స్నేహితునితో జరిగే సంభాషణలో  నాటిక ప్రారంభమవుతుంది .స్నేహితుని మాటలకు అనూప్ కు  ఆమె పై ఆరాధనా భావం కలుగుతుంది .

‘’కోశ పాశి విహీనాపి న లావణ్య దువ్యయుజ్జతా –కోవా నిసర్గ సౌందర్యం యౌవనస్య విలోయేత్ ‘’అని చెప్పిఆమేను పెళ్లి చేసుకుంటాను అంటాడు స్నేహితుడు లోకం ఒప్పుకోదు వద్దంటాడు –‘’అశక్యం అసంభవ మేతత్ పునర్వివాహో విధవానాం న జాతు లోకక్రియః ‘’అని వారిస్తాడు .పార్వతి రాత్రింబవళ్ళు చాకిరీ చేస్తూ బతుకుతోంది .నిద్రకూడా పశువుల పాకలోనే .ఆమె దుర్భర స్థితిని చూసి ఒకరోజు ఆమె తో మాట్లాడటానికి వెడతాడు .వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది –

‘’ఆపి స్మరసి నిజబాల పాలిం ?అనూప్

‘’న ప్రేక్షితం తన్ముఖమపి మయా –స్మరామి యదల్ప కాలోనైవ ఆదిస్టాహం మాత్రా సౌభాగ్య కుంకుమ మార్జనాయా ‘’ పార్వతి

‘’అహో దైవ గతిః’’

‘’పరిహ్తక్ష మే మంగళ సూత్రమపి శవోప హాసయా ‘’

‘’తతస్తతః’’

‘’బోధితా చాహం యద్ విధ వాహం జాతోతి’’.

అని చెప్పి పూనాలో ఇద్దరం పెళ్లి చేసుకుందాం అక్కడ అందరూ కొత్త వాళ్ళే కదా ‘’అనటం తో మొదటి రంగం పూర్తి  .

పురోహితుడిని తమ వివాహం చేయించమని కోరితే తిరస్కరిస్తే ,ఆ విషయం ఆమెతో చెప్పటానికి రావటం తో రెండో దృశ్యం ఆరంభం .

అనూప్ -‘’పరం కృపణ చేతతస్తే నిర్వివేకా రూఢ ప్రాయః పౌరాణికాః నైక వారం భ్యార్దితా పరం నైకే నపి స్వీక్రుతో మే అనునయః ‘’అంటాడు .

ఆమె-‘’నిరాక్రుతం సర్వేః’’అని అడుగుతుంది .

అతడు –ధర్మలోప మాశ౦కం తే బ్రాహ్మణా ఇమే పునర్వివాహే విధవానాం’’అంటాడు .

చచ్చీ చెడి వెతికి వెతికి ఒక బకరాని కుదుర్చుకుని తీసుకొస్తే వాడు సరిగ్గా పెళ్లి ముందు ‘’నాకు విధవ ను పెళ్లి చేసు కొంటున్నట్లు ముందే చెప్పలేదు ‘’అని సాకు చెప్పి వెళ్ళిపోయాడు –వీరి సంభాషణ

‘’కుత్రే తస్తాఃపితరౌ ?’’పురోహిత్ ‘

‘’బాల్య ఏవ పరగతో తౌ’’అనూప్

‘’అధాన్యః కశ్చిత్ సంరక్షితః –దిక్ విజ్జతం మిధ్యా విశ్వాసితోడహం ‘’పురో

‘’కిమా పతితం ?’’

‘’కుతో నైదితం త్వయా విధవాం పరినయోష్యామితి’’

‘’కిమనేన తే ప్రయోజనం ‘’దక్షిణాద్రవ్యం సాదయ ‘’

‘’నాహం విత్త లోభీ ‘’అంటాడు వాడు

.బ్రతిమాలుతాడు .చివరికి ‘’ధర్మహాని కరోయం విధిః న కదాపి అనుస్టాస్సతే’’అంటే ధర్మ విరుద్ధం నేను  ఈ పెళ్లి చేయించాను అంటాడన్నమాట .

మూడవ రంగం లో ఆమెబందువర్గం ఎలా పార్వతిని సూటీ పోటీ మాటలతో కష్ట పెట్టిందీ ఉంటుంది .ఇంట్లోకి రానివ్వరు .బయటే మట్టి ధూళి లో పడిఉంటుంది .ఆమె కోసం చీకట్లో అనూప్ వెతుకుతూ ఉంటాడు ఆమె చీకటిలో కలిసి పోతుంది .

  ఈ ఎకా౦కికలో లీలా దయాలు సమకాలీన విధవ రాలి సమస్యను చాలా హృద్యంగా చూపించింది .ఇందులోని సంభాషణలు పాత్రోచితంగా సూటిగా గుండెకు తాకేవిగా  ఉండేట్లురాసిన నేర్పు ఆమెది .కుటుంబమూ సంఘమూ విధవ రాలి విషయం లో చూపే విచక్షత కు అద్దం పట్టిన నాటిక .

   చివరి సంభాషణ లు గుండెలను పిండి చేస్తాయి –

‘’హాం ప్రతికూలో మే విధిః – సాంప్రతం మరణ మేవ మే శ్రేయః ‘’అంటుంది ఇరుగుపొరుగు వారితో పార్వతి

‘’విదినాకు అనుకూలం గా లేదు .నాకు మరణమే శరణ్యం ‘’అని అర్ధం .

‘’తాహి గత్వా కృపే నిపాత యాత్మనం –తత్రైవ తే గతిః’’అంటుంది పేరులో ఉన్న మిత్రత్వం లేని పక్కింటి సుమిత్ర .

 ‘’అయితే వెళ్లి నూతిలో దూకు .అదే నీకు సరైన చోటు ‘’.

  25 1-నుండి 2 5 6 వరకు ఆధారం –‘’Contribution Of Women To Post Independence Sanskrit Literature’’  –

   శివరాత్రి శుభా కాంక్షలతో

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-2-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రహ్మా0డ భా0డోత్సవాలు

11-2-18 ఆదివారం శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగుభాషా బ్రహ్మోత్సవాలలో సత్కారం

బ్రహ్మా0డ భా0డోత్సవాలు

రెండు రోజుల తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాణ్డ భా0డోత్సవాలుగా శ్రీకాకుళం లోఈ నెల 10 ,11 శని ఆదివారాలలో జరిగాయి . ఒక్క అనంత శ్రీరామ్ మాత్రమే మనసుల్ని కాప్టి వేట్ చేశాడు  . యువతకు సందేశమిచ్చి కార్యోన్ముఖులను చేయటానికి తోడ్పడ్డాడు . మిగిలిన వారివన్నీ ప్రపంచ తెలుగు సభల్లో ,ఎప్పుడూ జరిగే సభల లోని రొటీన్ ఉపన్యాసాలే .
 ఎప్పుడూ చెప్పే ”మమ్మీ -డాడీ ”పై దాడులే ,”పెద్దబాల శిక్షలను ”ప్రవేశపెట్టమని  శతకాలు వల్లే వేయించమని నీతి  బోధలే  .రాగ యుక్తం గా పద్యాలు పాడే వారినే పిలిచి పాడింపు,  పద్య వైభోగపు పొగడ్తలే . పద్యం తప్ప ఇంకే ప్రక్రియా లేనట్లు ప్రవర్తింపే . పోనీ పద్యాలను పిల్లలతో పాడించి బహుమతులను స్వ0త డబ్బు తో ఇచ్చేవాళ్ల గురించి ప్రభుత్వానికి తెలియదు . వారిని పిలిచి ప్రోత్సహించటాలు లేవు .సాహితీ సంస్థల విషయాలను  వారి కార్యక్రమాలను గుర్తించే అలవాటు లేదు   నిర్వాహకులకు తెలుసుకునే బాధ్యత కనిపించదు    గౌరవంగా వారే పిలిచి చెప్పి నిర్వాహకులకు ప్రోత్సాహం కలిగించే ప్రయత్నాలు లేవు .  పైపెచ్చు  ఆసంస్థలు మాట్లాడటానికి ఒక నిమిషం లేక రెండు నిమిషాల సమయం .ఊక  దంపుడు వారికి సింహభాగం . మాకు సాయం చేయండి అని సంస్థలు అడిగే దుస్థితి ఎందుకు రావాలి ? వీరి భోగట్టా ప్రభుత్వం దగ్గర సేకరించి ఉంచుకో వద్దా .? జిల్లాలు దాటి వచ్చిన సంస్థల నిర్వాహకులకు అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వద్దా ? వీరు శాలువాలకోసమో ”కవర్ ”ల కోసమో వచ్చిన వారు కాదు .గౌరవం గా గోడు చెప్పుకోవటానికి ,తమ కార్యక్రమాలు అందరి ద్రుష్టి కి తేవటాటినికి ,పడే తపనే . మందపు చర్మాలకు పదునెక్కించటానికి వచ్చిన వారే  . అందరికీ ఇచ్చినట్లే వారికీ వేదికపై గౌరవ స్థానమిచ్చి రెండు మూడు రౌండ్లలో అభి ప్రాయాలు చెప్పిస్తే బాగుండేదని సామాన్యుడి సణుగుడు .
  ఎలాగూ ఇక్కడ ప్రతి ఏడాదీ ఎదో రూపం లో బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా .ఆలయ ప్రాంగణం లోనో బయట నో ఒక శాశ్వత  ఆడిటోరియం నిర్మించే ఆలోచన చేయచ్చు ప్రభుత్వం.  వదాన్యులు ముందుకు వచ్చి కార్య రూపం దాల్చెట్లు చేస్తారు .అలాగే ఘంటసాల మాస్టారు గారికీ ప్రతి ఏడాదీ జయంతి జరుపుతున్నారు కనుక ఆయన పెద్ద చిత్రపటాన్ని  ఆడి టోరియం  గోడకు అమర్చితే గొప్ప నీరాజనం అవుతుంది
  కాలేజీ విద్యార్థులను ఇక్కడికే ఆహ్వానించి కానీ లేక దగ్గర కాలేజీలలో కానీ వారి కోసం కథ ,నాటిక నవల వంటివి పరిచయం చేసే ప్రోగ్రామ్ లు చేయలేరా ? వాటిపై అవగాహన ఉన్న యువత తో మాట్లాడించ రాదా ?మనసుంటే మార్గం దొరుకు తుంది .శ్రీకాకుళం దేవాలయచరిత్ర ఆవిష్కరణకు విద్యార్థులు బహు  సంఖ్య లో వచ్చి ఉంటె యెంత ప్రేరణగా ఉండేది ?
   వీటన్నిటికీ మించి రోజుకు అన్ని సభలు అవసరమా /?అన్నీ పాడిందే పాటగా లేవా ?ఒక్క సాంకేతిక సదస్సు అందరి హృదయాలను తాకిందికదా .దీనిలో కూడా యువత ఉంటె రంజకం గా ఉండేది కాదా ?
 అన్ని ప్రక్రియలకు సమ ప్రాధాన్యత నిస్తూ  అన్నీ ఒక్క సారె కుక్కే ప్రయత్నం చేయకుండా భావి సభలు ఆహ్లాదం గా జరపాలి .
  సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఏమాత్రం కూడా సభలో ఉపయోగించక పోవటం చెప్పేదానికి ఆచరణకూ ఉన్న దూరాన్ని చెప్పకనే చెబుతుంది . శ్రీ కాకుళం నుంచి తడ దాకా ఎప్పుడొచ్చినా వీరేనా కొత్తవారిని దుర్భిణీలో వెతకలేరా ? ”ఇవి మన సభలు కావులే .మనకేమీ ప్రాతినిధ్యం ఉండదులే ”అను కొనే భావం రా కూడదు . మరిన్ని మంచి సభలు కొత్త ఆలోచనలతో రొటీన్ కి భిన్నంగా జరగాలన్న ఆరాటమే ఇదంతా . దుర్గా ప్రసాద్ 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

11-2-18 ఆదివారం శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగుభాషా బ్రహ్మోత్సవాలలో సత్కారం

11-2-18 ఆదివారం శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగుభాషా బ్రహ్మోత్సవాలలో సత్కారం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

11-2-18 ఆదివారం కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగు భాషా బ్రహ్మోత్సవ చిత్ర మాలిక

11-2-18 ఆదివారం కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగు భాషా బ్రహ్మోత్సవ చిత్ర మాలిక

 

https://photos.google.com/share/AF1QipOC4CzUb38jOtRY1JVJgBK1RPY12dPPzNjQP80_pmNPVX0WjopVk2hHMAS3ynG2AQ?key=ak01cWFkOU1QdmZIQXRJSFJtcWR5akN1NnB2aW9R

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 255-అర్చనం కర్త –ఉమా దేశ పాండే(1992)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 255-అర్చనం కర్త –ఉమా దేశ పాండే(1992)

 

254 –అగ్ని శిఖ కర్త –పుష్పా త్రివేది(1984 )

విప్రలంభ కావ్యమైన అగ్ని శిఖ ను డా .పుష్పా త్రివేది 1984 లో రాసింది .తలిదండ్రులకు వందనం చేస్తూ కావ్యారంభం చేసింది .

‘’ఏనాహం సురభారతీ సుర సరిస్త్రోతః సు సంప్లావితా-గీర్వాణీ రసమక్షరత్సురతరో చాయాసు సంవర్ధినీ

యత్సోత్శ్రంగ సురవరం నిషేవ్య జని  రప్యుక్తర్ష మా సాదితా-శ్రీమత్సుందర లాల శుక్లమనఘం  తాతం సదాహం నతా ‘’

అని తండ్రి సుందరలాల్ శుక్లా తనకు సంస్కృత జ్ఞానం కలిగించినందుకు వందనాలు చేసింది .తల్లిజానకి ,గురువు కృష్ణకాంత్ లు తనలోని అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతి వెలిగించినదుకు ప్రణమిల్లింది .50భాగాలుగా కావ్యం ఉంటుందని తెలిపింది .’’తవ నామాక్షరాణి’’అనే మొదటి భాగం లో భర్త అండలేక పొతే భార్య జీవితం నీరు లేని చేప గతి అవుతుందని చెప్పింది .

‘’మీన ఇవ మే జీవనం జలమంతరేణ న జీవ్యతే ప్రియ –నిర్మలా౦భసి తవ మనసి ధవలాయితం కదామివ విశాని తవ నామాక్షరాణి’’అన్నది .సేవావీయి భాగం లో పుష్పాలు బాగా వికసించి ఉన్నా మధుపాలు లేకపోతె శోభ లేనట్లు ప్రియుడు లేని ప్రియ జీవితం శోభించదు –‘’వాటికా పుష్పితా సౌరభైః సంయుతా –భ్రున్గ సంగం వినా నైవ సా శోభతే –సేవ వీయీ మయా త్వన్మనో గమ్యతే ‘’.’’లభ్యం న రత్న మేకం ‘’భాగం లో తన ప్రియుడి పై అనుమానం ,తాను  పొరబాటున  వ్రేళ్ళు లేని గగన కుసుమాలకోసం ఆరాట పడుతున్నానేమో అని సందేహించింది –‘’క్షేత్రం పుష్పమే తనూ చిత్తమాకులం కిమూ మూలం వినా క్వ వల్లీ వల్లీ వినా క్వ పుష్పం ‘’.

‘’జాలా విచిన్న తేయం ‘’విభాగం లో ప్రియుడి గుణాల కు సరిసమాన గుణాలు లేని తనను ని౦ది౦చు కున్నది –   ‘’గుణ రాశినా యుతెన బద్ధం త్వయా మనో మే-శక్యో మయా న బంధుం మనసా తిని ఘ్రుషేణ  .’’అతని గుణాలు తనను బంధించాయికాని తన గుణాలు అతనిని దగ్గరకు చేర్చ లేకపోతున్నాయని  వేదన .’’రోచతే నైవ కించిత్ ‘’లో ప్రియదర్శనం తో తన జీవిత విధానం అస్తవ్యస్తమై ,సుఖ శాంతులు కరువయ్యాయి .-‘’యద్విధానం సదా జీవనే మేభవత్ –యద్విధానం వినస్టం భవ దర్శనే-యాను భూతి ఘ్రుతాపూర్ణ తా సంయుతా సానుభూతిర్వినస్టా భవ దర్శనే –ధీరతాయా సదా జీవనం మే రతా సా గతా ధీరతామే తవ దర్శనే ‘’’. పవిత్ర గ్రంధాలు ,ప్రవచనాలు ధ్యానం ,ముక్తి మార్గం అన్నీ గుంట పెట్టి గంట కొట్టినట్లు  అయ్యాయట అతడిని చూడగానే –‘’క్వం గతం సకల శాస్స్త్రామృతం క్వను చింతితా తపసా వ్రతం –క్వ గతా విమోక్షసరణి రసౌ కేనాపి శకలం హర్యతే ‘’.ప్రియుడి దరహాసం శివుని నవ్వు లాగా తన హృదయాన్ని లాగేసింది,శాంతి లేకుండా చేసింది .అతని చేస్టలు ప్రశం౦చతగినవి అనిపించలేదట .   ‘’స్వవశతా కధం నీతా ‘’భాగం లో తన హృదయాన్ని లాగేసుకున్నవారెవరో తెలియ లేదని ,కాని అతని సుందర వీక్షణం తో తన జీవిత గతే పూర్తిగా మారిపోయిందని చెప్పింది –‘’మనో మే నీయ తేర భాసాంతి కంతే కేన నో జానే –క్షణం సంప్రేక్ష్య తే రూపం ధరా నిఖిలైవ విపరీతా ‘’.

‘’చేతో భావిని జన్మాని ‘’లో పునర్జన్మ విషయం చెప్పి ఈ జన్మలో ప్రియ సమగమనం కాకపోయినా వచ్చే జన్మలో నైనా కలగాలని భావించింది .

ఆమె దుఖం అనంతమైనది .కృష్ణ శాస్త్రి  ‘’నాకుగాదులు లేవు .ఉషస్సులు లేవు .ఏను అనంత శోక లోకైక తిమిర పతిని  ‘’అన్నట్లుగానే పుష్పాత్రివేది’’తన విరహ బాధను అత్యద్భుతం గా ఆవిష్కరించింది –చివరికి ‘’గతోవా గంతావా శమమపి పీడా నవసితా –న యాతా నో యాతా క్షణమపి విరాగే మామ కధా-న రేమే నంతా వా వికలిత విదంభే హతమనో –మనోజ్నేసి త్వం రే నమ మమ మనోజ్ఞాయత కధం’’అంటూ  ఈ అనంత దుఖం ఆరేదీ తీరేదీ కాదు ఆగేదీ ఆగిపోఏదీకాదుతన కల్లోలమానసం  స్వస్తత చెందేదీ  స్వస్తత చేకూర్చేదీ లేదు ,మనోజ్నునికి తన ఎద లోపలి పొరలలోని వేదనా , ఆవేదనా తెలుసుకోలేనిది అని  నిట్టూర్చింది .ఆమె దుఖం  ,వేదనా  ,విరహం ఆమెను’’ అగ్ని శిఖలా’’ దహించేస్తున్నాయి .దాన్ని తట్టుకోవటం చాలా కష్టమై పోతోందని కవయిత్రి తన మనో వేదనను ఒక రకంగా ఈశ్వరార్పణం గా నివేదిన్చుకున్నట్లు కనిపిస్తుంది .

ఈ విప్రలంభ కావ్యాన్ని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రొఫెసర్ సత్యవ్రత శాస్త్రి మంచి ముక్తాయింపు గీర్వాణ౦ లో ఇచ్చాడు –

‘’మనోహరం కావ్యమిదం నిపాఠం- నిపాఠమాయాతి మనో న తృప్తిం –భూయో రసాస్వాదన తత్పరం సద్-భద్నాతి భూయోపి చ తత్ర భావం –మాధ్వీక మాధుర్య ధరా మనోజ్ఞా

విరాజమానా గుణ రాజి  భిక్షా –వాగన్నసత్యం ప్రసభం మనాంసి –హరేత్సమేషామితి మే ప్రతీతిః

రసైః సు పుష్టం  సుమలంకృతం చ –నిర్దోష లేశం సుతరాం చ హారి- కావ్యం భవత్యా హృది సంధి బంధం –నేత్రద్వయా సేచనకం విభాతి ‘’

గొప్ప కవిత్వాని మరింత గొప్ప ప్రశంస .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——- 

               ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——-

లోక్ సభలోబడ్జెట్ అన్యాయం పై  ఆంద్ర సభ్యుల  తీవ్ర  నిరసన హోరు మధ్య ప్రధాని’’ మోడీ’’మాటల గారడీ చూస్తూ వింటున్నా చానళ్ళ పుణ్యమా అని .వింటున్న సభ్యుల ఎద్దేవా ?ఇదేంటి ఇంతకమ్మగా ఆకుకు అందకుండా పోకకు చెందకుండా ఝారీ గా భారీ గా మాట్లాడుతుంటే వీళ్ళకేం పోయేకాలం ‘’నూతిలోకి దూకటాలు ‘’’పతి’’ బల్లపై పుస్తకాలు లాగేయటాలూ నాకు పరమ నీచంగా అనిపించి అలా కూర్చుండిపోయా మైకం కమ్మేసిందేమో?తరువాత ఏం జరిగిందో నా మైండ్ రీల్  ను వెనక్కి తిప్పా .అప్పుడు నేను అనుభవించిన రాక్షసానందం మర్చిపోలేను .మీకు చెప్పకుండా ఉండనూ లేను .అదే ఇది-

‘’భయ్యా ఆంధ్రాకు అన్యాయం అంటారు మాటిమాటికి ,బాబు వారానికో తాప ఢిల్లీ వస్తారు అందరి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంతో అంతో రాల్చుకుంటారు .సంతృప్తి పడకుండా అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు.ఇప్పుడు ఈ బడ్జెట్ లో జైట్లీ ఏమీ ‘’చేపలేదని’’ఆందోళన నిరసన బందు .అన్యాయాలు ఇంతకు ముందు జరగలేదా ?మాతోనే మొదలైందా ?అని అడుగుతున్నా .విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ చేసిన  పెద్ద అన్యాయాన్ని ఎదిరించి మా వెంకయ్యనాయుడూ భాయ్ అండగా నిల్చి’’ ఓట్లేసి గెలిపించండి ,మేము సమన్యాయం చేస్తా౦ ‘’అన్నాం .హోదా అన్నాం పాకేజీ అన్నాం .పోలవరం వరంగా ఇస్తామన్నాం .ఆంధ్రాను భూలోక స్వర్గం చేస్తామన్నాం. జతకట్టాం ,ఓట్లు దండుకున్నాం ,జగన్ మా అంట కాగినా ,బాబు కేజై కొట్టాం .ఇది అన్యాయమా .హస్తిన కొచ్చి నప్పుడల్లా ఎంతో కొంత రాలుస్తునే ఉన్నామ్ గదా .ఇది అన్యాయమంటా డే౦టిమగడా ! ‘’నాయుడు లిద్దరూ’’ ఆంధ్రాను  బాగా ముందుకు నడిపిస్తున్నారని సంతోషిస్తూనే  లోపల అసంతృప్తితో పెద్దనాయుడిని’’ పెద్ద హోదాలో’’ కూర్చోబెట్టి ,ఆంధ్రా కు అత్యంత గౌరవమిచ్చానని కితాబు పొంది కొంత ఒత్తిడి తగ్గించాను గందామాపార్టీకి ?ఇందులోనూ అన్యాయం చూస్తారా ? వయసు అడ్డం పెట్టి రాష్ట్రపతి కావాల్సిన  వాజ్ పాయ్ తర్వాత అంత శ్రమపడ్డ ‘’ముసలాయన్ను’’ ‘’సోమనాధుని ‘’సాక్షిగా కిక్కురు మనకుండా చేశానా లేదా ?ఇది ఎలాంటి న్యాయమో మీకు తెల్దా . బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని అన్యాయం చేయలేదా ? తురుష్కులు ,మహమ్మదీయ పాలకులు మనల్ని అందలం ఎక్కించి గౌరవంగా పూజించారా ?కాంగ్రెస్ ‘’పటేల్ ‘’కు అన్యాయం చేయలేదా వీర సావర్కార్ కు ,హెడ్గేవార్ కుచేసింది అన్యాయం కాదా ?ప్రపంచబ్యాంకు అన్ని దేశాలకూ సమన్యాయం చేస్తోందా ? యుఎన్ వో చేస్తోందా న్యాయం ? అసలు సృష్టిలో సమన్యాయం ఉందా?ఆడా మగా సమానమా ?దేశం లో యుని కోడ్ఉందా?అమలు చేయటానికి ఎంత కష్ట పడాల్సి వస్తోందో తెలీదా ?

   పీఠాధిపతులు అందరూ ఒకటిగా ఉన్నారా ?ఒక్కటే చెబుతున్నారా ?మహిళా సాధికారత నీటి మూటకాక యదార్ధమౌతోందా?అంతెందుకు 18 ఏళ్ళు దాటిన వారికే ఓటు హక్కేమిటి ?పుట్టగానే ఓటు హక్కు ఇవ్వరాదా?ఇక్కడ అన్యాయం లేదా ?మంచి చేద్దామని చట్టాలు తెస్తుంటే కోర్టు లు అడ్డుపడటం అన్యాయం కాదా ?అసలు ఇందరు దేవుళ్ళను పూజించటం వాళ్లకు వేర్వేరు దేవాలయాలు వేర్వేరు పూజా విధానాలు ఏమిటి ?అఖండ భారత్ అంటాం కదా ‘’అఖండ భగవాన్’’ ను ఎందుకు పూజించం ? ప్రపంచం లో ఎన్నో దేశాలు ఎన్నో మతాలూ ఎన్నో రంగుల జాతుల మనుషులు ఎందుకున్నారు ?అందరూ ఒకరుగా ఉండటం లేదేమి ?ఇందులో న్యాయం ఉందా?అలాగే ఆంధ్రా విషయం లో మేము చేసి౦ దాంట్లో అన్యాయం మా కాషాయకళ్ళకు కన్పించటం లేదు .మీ పచ్చ,యెర్ర ,మూడురంగుల కళ్ళకు కనిపిస్తుందేమో ?అది మా తప్పా ?దీనికోసం వీధుల్లోకి రావాలా ? మళ్ళీ మళ్ళీ ఢిల్లీ రావాలి మంతనాలు చేయాలి కొద్దోగొప్పో బూడిదో , విభూతో, మట్టో,మశానమో ,నీటి చుక్కలో రాల్చుకు పోవాలి.ఆంధ్రా వాళ్ళు అంటే చెప్పు కింద తేలును నలిపినట్టు కాంగ్రెస్ నలిపేసింది మీకు గుర్తు లేదా ?అప్పుడు మీకు చమ్మగా  ఉందా ? మేము ఆప్యాయం కనిపిస్తూ నెత్తికెత్తుకుని  కిందకు తోసేసి బురదలో తోక్కేస్తున్నామని బాధగా ఉందా ?ఇదేటి అన్నాయం సెప్మీ.

  పెద్ద నోట్లు రద్దు చేసి భాండారం నింపేశామనుకున్నాం .తీరా చూస్తె ‘’పేద్ద బొక్క’’.అవాక్కయ్యా .అయినా అన్యాయం అని గీపెట్టలేదే .బుకాయిస్తూనే ఉన్నాం .రామాయణం లో రాజు కావాల్సిన రాఉడికి అన్యాయం జరిగి  అరణ్య వాసం చేశాడే ‘’పితృవాక్య పరిపాలన ‘’అంటూ కిక్కురుమనకుండా.  భారతం లో పాండవులు అన్యాయం జరిగినాఅరణ్య అజ్నాతవాసాలు చేస్తూ ఓర్పు ,ఓపిక కా పట్టారే .ఎలక్షన్లు అయి ఇంకా నాలుగేళ్ళు కాలేదు అప్పుడే అంత ఆక్రోశమా ?బ్రిటిష్ వాళ్ళు వందల ఏళ్ళు పాలిస్తే కిమ్మనకుండా ఉన్నాం .అప్పుడున్న ఓర్పుఇప్పుడేమైంది ?సహనానికి భూమాత ఉదాహరణ .ఆంధ్రులు ఈ నీతి తెలుసుకోవాలి .శిశుపాలుడి 99  తప్పులను క్రిష్నయ్య కాచలేదా ?చివరికి కదా భరతం పట్టింది ?అంత ఓపిక లేదా మీకు ?భాగవతం లోశ్రీ  హరి- జయ విజయుల పీచమణచటానికి ఎన్ని అవతారాలో ఎత్తి ఎంతో సహనం వహించి శిక్షించాడన్న పురాణ కద మర్చిపోయారా ?ఆంధ్రా యాజిటేషన్ లో ‘’కాన్గీలు’’ మిమ్మల్ని పూర్తిగా ము౦చెయ్యలేదా ?ఉద్యమించిన వాళ్ళే అందలాలెక్కలేదా ?ఇది చరిత్ర .కనుక ఏరకంగా చూసినా అంటే చరిత్ర ,పురాణ ఇతిహాసాల ను అర్ధం చేసుకుంటే మీకు సహనం లభిస్తుంది .అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం .నాకు నాలుగు  దేశాల పర్యటనఉంది.అర్జెంట్ గా వెళ్ళాలి .ఈ సమస్యలు ఎప్పుడూ ఉండేవే. సమస్యలు అనంతం వాటి పరిష్కారానికి  అనంతుడైన ఆదిశేషుని సహనం మీరు అలవర్చుకోండి .నేను తిరిగివచ్చి అక్కడ ఆ దేశాలవాళ్ళు రాల్చేదేమైనా ఉంటె  అందులో నాలుగు రేణువులు మీకూ రాలుస్తా ‘’

  కళ్ళంబడి ఆనంద బాష్పాలు  రాలుస్తూ జైజై లు కొడుతూ  లోక్ సభ ను ఒకసారి కలయ జూశా .అక్కడ స్పీకర్ కాని, మంత్రులు ,అధికార ,ప్రతిపక్ష సభ్యులు కాని పిట్ట కూడా ఎవ్వరూ కనబడ లేదు .ప్రధాని అటెండర్ కుండెడు నీళ్ళతో ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు  .ఇదేమిటి ఇంత అద్భుత ప్రసంగానికి అందరూ గైర్ హాజరయ్యారేమిటి అను కొంటు ఉండగా  మా ఆవిడ చీపురుమాలక్ష్మి తో ప్రత్యక్షమై ‘’ తెల్లార్లూ ఆ చానళ్ళు మార్చి మార్చి చూడోద్దురా మగడా, ఆ డిస్కషన్లు వినద్దు రా పతి దేవుడా  అని నెత్తీ నోరూ పెట్టుకుని మొత్తుకున్నా  ప్రయోజనం లేదు .పొద్దున్నే సంధి ప్రేలాపనలలు .ఏం మొగుడో ఏంటో?’’అని సణుక్కుంటూ కళ్ళాపి చల్లటానికి వెళ్ళింది .ఓరి నాయనో ఇదంతా కలా!అని సంబాళించుకుని పక్కమీంచి లేచి కూర్చున్నా .

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –9-2-18 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -4 254 –అగ్ని శిఖ కర్త –పుష్పా త్రివేది(1984 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -4

254 –అగ్ని శిఖ కర్త –పుష్పా త్రివేది(1984 )

విప్రలంభ కావ్యమైన అగ్ని శిఖ ను డా .పుష్పా త్రివేది 1984 లో రాసింది .తలిదండ్రులకు వందనం చేస్తూ కావ్యారంభం చేసింది .

‘’ఏనాహం సురభారతీ సుర సరిస్త్రోతః సు సంప్లావితా-గీర్వాణీ రసమక్షరత్సురతరో చాయాసు సంవర్ధినీ

యత్సోత్శ్రంగ సురవరం నిషేవ్య జని  రప్యుక్తర్ష మా సాదితా-శ్రీమత్సుందర లాల శుక్లమనఘం  తాతం సదాహం నతా ‘’

అని తండ్రి సుందరలాల్ శుక్లా తనకు సంస్కృత జ్ఞానం కలిగించినందుకు వందనాలు చేసింది .తల్లిజానకి ,గురువు కృష్ణకాంత్ లు తనలోని అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతి వెలిగించినదుకు ప్రణమిల్లింది .50భాగాలుగా కావ్యం ఉంటుందని తెలిపింది .’’తవ నామాక్షరాణి’’అనే మొదటి భాగం లో భర్త అండలేక పొతే భార్య జీవితం నీరు లేని చేప గతి అవుతుందని చెప్పింది .

‘’మీన ఇవ మే జీవనం జలమంతరేణ న జీవ్యతే ప్రియ –నిర్మలా౦భసి తవ మనసి ధవలాయితం కదామివ విశాని తవ నామాక్షరాణి’’అన్నది .సేవావీయి భాగం లో పుష్పాలు బాగా వికసించి ఉన్నా మధుపాలు లేకపోతె శోభ లేనట్లు ప్రియుడు లేని ప్రియ జీవితం శోభించదు –‘’వాటికా పుష్పితా సౌరభైః సంయుతా –భ్రున్గ సంగం వినా నైవ సా శోభతే –సేవ వీయీ మయా త్వన్మనో గమ్యతే ‘’.’’లభ్యం న రత్న మేకం ‘’భాగం లో తన ప్రియుడి పై అనుమానం ,తాను  పొరబాటున  వ్రేళ్ళు లేని గగన కుసుమాలకోసం ఆరాట పడుతున్నానేమో అని సందేహించింది –‘’క్షేత్రం పుష్పమే తనూ చిత్తమాకులం కిమూ మూలం వినా క్వ వల్లీ వల్లీ వినా క్వ పుష్పం ‘’.

‘’జాలా విచిన్న తేయం ‘’విభాగం లో ప్రియుడి గుణాల కు సరిసమాన గుణాలు లేని తనను ని౦ది౦చు కున్నది –   ‘’గుణ రాశినా యుతెన బద్ధం త్వయా మనో మే-శక్యో మయా న బంధుం మనసా తిని ఘ్రుషేణ  .’’అతని గుణాలు తనను బంధించాయికాని తన గుణాలు అతనిని దగ్గరకు చేర్చ లేకపోతున్నాయని  వేదన .’’రోచతే నైవ కించిత్ ‘’లో ప్రియదర్శనం తో తన జీవిత విధానం అస్తవ్యస్తమై ,సుఖ శాంతులు కరువయ్యాయి .-‘’యద్విధానం సదా జీవనే మేభవత్ –యద్విధానం వినస్టం భవ దర్శనే-యాను భూతి ఘ్రుతాపూర్ణ తా సంయుతా సానుభూతిర్వినస్టా భవ దర్శనే –ధీరతాయా సదా జీవనం మే రతా సా గతా ధీరతామే తవ దర్శనే ‘’’. పవిత్ర గ్రంధాలు ,ప్రవచనాలు ధ్యానం ,ముక్తి మార్గం అన్నీ గుంట పెట్టి గంట కొట్టినట్లు  అయ్యాయట అతడిని చూడగానే –‘’క్వం గతం సకల శాస్స్త్రామృతం క్వను చింతితా తపసా వ్రతం –క్వ గతా విమోక్షసరణి రసౌ కేనాపి శకలం హర్యతే ‘’.ప్రియుడి దరహాసం శివుని నవ్వు లాగా తన హృదయాన్ని లాగేసింది,శాంతి లేకుండా చేసింది .అతని చేస్టలు ప్రశం౦చతగినవి అనిపించలేదట .   ‘’స్వవశతా కధం నీతా ‘’భాగం లో తన హృదయాన్ని లాగేసుకున్నవారెవరో తెలియ లేదని ,కాని అతని సుందర వీక్షణం తో తన జీవిత గతే పూర్తిగా మారిపోయిందని చెప్పింది –‘’మనో మే నీయ తేర భాసాంతి కంతే కేన నో జానే –క్షణం సంప్రేక్ష్య తే రూపం ధరా నిఖిలైవ విపరీతా ‘’.

‘’చేతో భావిని జన్మాని ‘’లో పునర్జన్మ విషయం చెప్పి ఈ జన్మలో ప్రియ సమగమనం కాకపోయినా వచ్చే జన్మలో నైనా కలగాలని భావించింది .

ఆమె దుఖం అనంతమైనది .కృష్ణ శాస్త్రి  ‘’నాకుగాదులు లేవు .ఉషస్సులు లేవు .ఏను అనంత శోక లోకైక తిమిర పతిని  ‘’అన్నట్లుగానే పుష్పాత్రివేది’’తన విరహ బాధను అత్యద్భుతం గా ఆవిష్కరించింది –చివరికి ‘’గతోవా గంతావా శమమపి పీడా నవసితా –న యాతా నో యాతా క్షణమపి విరాగే మామ కధా-న రేమే నంతా వా వికలిత విదంభే హతమనో –మనోజ్నేసి త్వం రే నమ మమ మనోజ్ఞాయత కధం’’అంటూ  ఈ అనంత దుఖం ఆరేదీ తీరేదీ కాదు ఆగేదీ ఆగిపోఏదీకాదుతన కల్లోలమానసం  స్వస్తత చెందేదీ  స్వస్తత చేకూర్చేదీ లేదు ,మనోజ్నునికి తన ఎద లోపలి పొరలలోని వేదనా , ఆవేదనా తెలుసుకోలేనిది అని  నిట్టూర్చింది .ఆమె దుఖం  ,వేదనా  ,విరహం ఆమెను’’ అగ్ని శిఖలా’’ దహించేస్తున్నాయి .దాన్ని తట్టుకోవటం చాలా కష్టమై పోతోందని కవయిత్రి తన మనో వేదనను ఒక రకంగా ఈశ్వరార్పణం గా నివేదిన్చుకున్నట్లు కనిపిస్తుంది .

 ఈ విప్రలంభ కావ్యాన్ని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రొఫెసర్ సత్యవ్రత శాస్త్రి మంచి ముక్తాయింపు గీర్వాణ౦ లో ఇచ్చాడు –

‘’మనోహరం కావ్యమిదం నిపాఠం- నిపాఠమాయాతి మనో న తృప్తిం –భూయో రసాస్వాదన తత్పరం సద్-భద్నాతి భూయోపి చ తత్ర భావం –మాధ్వీక మాధుర్య ధరా మనోజ్ఞా

విరాజమానా గుణ రాజి  భిక్షా –వాగన్నసత్యం ప్రసభం మనాంసి –హరేత్సమేషామితి మే ప్రతీతిః

రసైః సు పుష్టం  సుమలంకృతం చ –నిర్దోష లేశం సుతరాం చ హారి- కావ్యం భవత్యా హృది సంధి బంధం –నేత్రద్వయా సేచనకం విభాతి ‘’

 గొప్ప కవిత్వాని మరింత గొప్ప ప్రశంస .

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంద్ర మాలవ్యా –బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు(19 7 5 )

ఆంద్ర మాలవ్యా –బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు(19 7 5 )

బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు 1875  శ్రీ యువ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ సప్తమి నాడు శ్రీ తల్లాప్రగడ వెంకటరామయ్య ,లచ్చమాంబ దంపతులకు  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరున్న కోనాల  గ్రామం లో జన్మించారు .ఓం నమశ్శివాయ శివ పంచాక్షరితో విద్యాభ్యాసం ప్రారంభించి రామాయణ ,భారతాలు స్తంభాలుగా తన విద్య సౌధాన్ని నిర్మించుకున్నారు .శ్రీ అత్తోట కామయ్యగారి వద్ద ఆంగ్లం నేర్చారు .కోనాల లో ప్రాధమిక విద్య పూర్తి చేసి తణుకు వెళ్లి మెట్రిక్ చదివి పాసై ,రాజమండ్రి చేరి ఎఫ్ ఏ తో పాటుసెకండ్ గ్రేడ్  ప్లీడర్ సర్టిఫికేట్ కూడా పొందారు .1911 వరకు తణుకు లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి గొప్ప పేరు ప్రతిస్ట, లక్ష్మీ కటాక్షమూ సాధించారు .ప్లీడరీ వృత్తిలో ఉంటూనే బెంగాలీ మరాటీ పాళీ భాషలలో లోతైన పాండిత్యాన్ని గడించారు .భారతీయ భాషలలోని అనేక నవలలు నాటకాలు ,కవిత్వం కధలను సులభ సుందరమైన  తెలుగులోకి అనువదింఛి లబ్ధ ప్రతిస్టితులయ్యారు.స్వయంగా చాలానవలలు రాశారు .అందులో ‘’సంజీవ రాయ చరితం ‘’గొప్ప పేరు పొందింది .నాటి బ్రిటిష్ ప్రభుత్వం పంతులుగారి సాహితీ కృషిని మెచ్చి  ఏం ఏ డిగ్రీ ప్రదానం చేసింది .

భారతీయ తత్వ శాస్త్రం పై మక్కువ ఏర్పడి కర్మ జ్ఞాన,మోక్ష  రహస్యాలను పూర్తిగా ఆకళింపు చేసుకొని మన ప్రాచీన వైభవాన్ని అర్ధం చేసుకున్నారు .ఈ భావాలను వ్యాప్తి చేయాలనే దృఢ సంకల్పం మనసులో నాటుకు పోయింది .తన కలలు సార్ధకం కావాలంటే సంస్కృత తెలుగు భాషలే మిక్కిలి అనువైనవని ఎంచుకున్నారు .ఇదే తన జీవిత ధ్యేయం అని నిర్ణయించుకున్నారు . కనుక తనక తగిన వాతావరణం కోసం అన్నిటికీ అనువైన గోదావరీ తీరాన ఉన్న గోష్పాద క్షేత్రమైన కొవ్వూరు కు1912 లో  మకాం మార్చేశారు .

గౌతమమహర్షి తపస్సు చేసిన పవిత్ర క్షేత్రం కొవ్వూరు .ఆత్మ విద్యకు అనువైన క్షేత్రం కొవ్వూరు అని భావించారు .భారతీయ సంస్కృతీ,   ఆంద్ర ,గీర్వాణ భాషాభివృద్ధికోసం కొవ్వూరులో తమ చిరకాల కల నెరవేర్చుకోవటానికి ‘’ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం’’సంస్థను 1912 లో నెలకొల్పారు .దీనికోసం తమ స్వంతభూమిని కొంత ఇచ్చారు .1913 లో గవర్నింగ్ బాడీ ఏర్పడి విద్యాపీఠం సాకారమై విద్యలకు అందుబాటులోకి వచ్చింది .పంతులుగారి ముఖ్య ఉద్దేశ్యం ఈ పీఠం లో విద్యార్ధులు ప్రాచ్య ,పాశ్చాత్య విద్యలు రెండిటిలోనూ నిష్ణాతులు కావాలని .తులనాత్మక పరిశీలన ,కీలక భావనల సాధన విద్యార్ధుల  లక్ష్యం కావాలని భావించారు.అంతేకాదు వేదాలు ముఖ్య ఆధార భూమిగా ఉండి,స్తంభాలు ,పైకప్పు పాశ్చాత్య విద్యలతో ఏర్పడాలని పంతులు గారి హృదయం .

జన్మతహా జమీందారు అయిన పంతులుగారు గీర్వాణ విద్యా పీఠం కోసం తన సర్వస్వం ధారపోసి పెంచి పోషించారు .దర్జాలకు విలాసాలకు వైభవాలకు,గౌరవానికి ,ప్రతిష్ట కు  అలవాటు పడిన జీవితం ఆయనది .తన శ్వాస ఊపిరి ధ్యాస అయిన విద్యాలయం కోసం అన్నిటికీ  క్రమక్రమంగా దూరమై అతి సామాన్య గృహస్తు లా జీవిస్తూ,విద్యార్హులకు సౌకర్యం కోసం ,పాఠశాల అభి వృద్ధి నిధులకోసం ,అవసరమైతే కొవ్వూరు పురవీధులలో జోలె పట్టుకుని తిరిగిన సందర్భాలు అనేకం .తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడిచే సందర్భాలవి .అంతటి స్వార్ధ రాహిత్య వ్యక్తిత్వం పంతులు గారిది .

పంతులు గారి విద్యా సేవకు ,పడుతున్న తపనకు కొవ్వూరులోని వదాన్యుల గుండెలు ధన రూపంగా  ద్రవించి  నిధుల ప్రవాహం తో పంతులుగారి పూనికకు బలమైన ఆసరా లభించి ఆ సరస్వతీ మందిర సౌభాగ్యానికి శక్తి యుక్తులు చేకూరాయి .మద్రాస్ విశ్వ విద్యాలయం కూడా  అర్ధం చేసుకొని విద్యా పీఠాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ లోకి చేర్చి ఆర్ధిక స్వాస్త్యత కల్పించి,.పంతులుగారికి కొండంత అండగా నిలబడింది .

కాశీలో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నిర్మించి చదువు కోవాలనే వారందరికీ అవకాశం కల్పించటానికి పండిత మదనమోహనా మాలవ్యా గారు ఎంత శ్రమ పడ్డారో ,ఎంత కృషి చేశారో , యెంత వేదన అనుభవించారో అవన్నీ ఇక్కడ కొవ్వూరులో తల్లాప్రగడ పంతులుగారు అనుభవించి తన కలను సాకారం చేసుకొన్నారు .అందుకే పంతులుగారిని ‘’ఆంధ్ర మాలవ్యా ‘’అని గౌరవంగా సంబోధించేవారు .వీరిద్దరూ కారణ జన్ములు.స్వార్ధ రాహిత్యమే వారి పెట్టుబడి . నమ్మకమే వారి వెన్ను దన్ను .భారతీయ సంస్కృతీ భాషా వికసనాలకు వీరిద్దరి సేవ అనిర్వచనీయం ,అజరామరం.

పంతులుగారి పేరు మీద ‘’సూర్యనారాయణీయ గ్రంథ మాల ‘’ ఏర్పడి ఎన్నో గ్రంథ కుసుమాలను ముద్రించి వారి  కీర్తిని శాశ్వతం చేశారు .ఎందరెందరో ఏ విద్యా పీఠం లో లెక్చరర్ లుగా ,ప్రిన్సిపల్స్ గా పని చేసి సంస్థకు వన్నె తెచ్చారు .’’గీర్వాణ విద్యా పీఠం విద్యార్ధులం అని రొమ్ము విరిచి ,గుండె చూపి గర్వం గా చెప్పుకుంటారు విద్యార్ధులు .అదీ పంతులుగారి విద్యా భిక్ష  ,నిరంతర కృషి, దీక్షా ఫలితం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-2-18- కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్  .

 

 

 


Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 153-భావాంజలి కర్త –డా. నళినీ శుక్లా (1977 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4

153-భావాంజలి కర్త –డా. నళినీ శుక్లా (1977 )

డా .నళినీ శుక్లా కాన్పూర్ ఏ యెన్ డి మహిళా మహా విద్యాలయ ప్రిన్సిపాల్ చేసి రిటైరయింది .సంస్కృతం లో చాల రచనలు చేసింది .మంచి కధకురాలుగా ప్రసిద్ధి చెందింది .తన కధలనుప్రచురించింది .కవితలను  భావాంజలి  సంపుటిగా 1977 లో ప్రచురించింది .–రూప వర్ణ నస్త్వం –కృష్ణా కేళి గీతం అద్భుత కవిత్వ ప్రవాహం –‘’అయి నిజపుత్రం పశ్య సుముగ్ధం కరముఖ ఘ్రుత నవనీతం –మధురసహాసం లలిత విలాసం  కుసుమాయుధ జయ శీలం ‘’

‘’అరుణ కపోలం కుండల లోలం  రింగణాచలన లసంతం-వికసిత హసనం మణిసమ దశనం స్వల్పం దర్శిత వంతం ‘’

భావం –చేత వెన్నముద్ద పెరుగుగడ్డ ,యెర్రని పెదవులు నల్లని మేను,సుందరముఖం  కాంతులీనే  కనుగవ ,చెవులకు రింగులు ,మెడలో ని మణులలాంటి దంత కాంతులతో కృష్ణ బాలుడు శోభాయమానంగా కనిపిస్తున్నాడు

2-భావనా మోదస్య గాంభీర్యం లో భారతీ చతుశ్లోకీ లో శ్లోకాలు పరమాద్భుతం –

‘’నామ్నేవా శు వరప్రదాన నిరతాం ధాత్రీం జగత్తారిణీం-స్తిత్యుత్పత్తి లయాద శక్తి వివిధైర్దెవవైః సదా సంస్తుతాం

మాత్రా బిందు విసర్గ వర్ణ రచనాసార్యేన సార్దాభిదాం –పశ్యన్తీమయం మధ్యమామపి పరాం వాచం శ్రయే శారదాం ‘’

౩-గుణ కీర్తనం లో –అహోసృస్టేః కర్తా సకలభువనస్యేక శాస్త్రం –త్వమైశ్వర్య గారః పృధివి మలరత్నా కర ఇవ ‘’

ఓ సృస్తికర్తా !నువ్వు అన్నిటికి అతీతుడవు .రత్నగర్భ అయిన మహా సముద్రం లాగా సకల నిధులు నీవద్దనే ఉన్నాయి .

4-వాణీ పంచదశి అని 15 శోకాలు రాసింది .మచ్చుకి –‘’యతస్తీర్నాఃపాపాః కృతాని రతాః సంతి బహవః

భవత్యాః భవ కారుణ్యాజ్జగతి మహిమా యస్య విషదః ‘

భావం –అమ్మా సరస్వతీ !అపారమైన నీ కారుణ్యం మమ్మల్ని పాపాలనుండి దూరం చేస్తోంది .నీ దయకు అంతూ దరీలేవు

5-లలితకళలను ప్రస్తుతిస్తూ ‘’లీలాకీర్తనం ‘’రాసింది –‘’ప్రియాం గాధికాం హ్లాదినీ శక్తి భూతం త్రుషా ర్తేక్షణంసాధయంతం వ్రజేశం

స్వలీలసవైర్మోహయంతం పరేశం జగత్పాలకం శ్రద్ధయా భావయామి ‘’

కృష్ణా మనోల్లాసం కలిగించే నీలీలలు అనంతం అద్భుతం అనిర్వచనీయం .

శైలి గురించి చెప్పిన శ్లోకాలు ఎన్నదగినవి .-‘’మదన వికారం మమతాజ్జ్వరం ప్రబలం గణయతి నాయం

హర్షో పేతైః కృత సంకేతః  క్రీడతి వారం వారం ‘

భావాలకు తగిన అనేక ఛందస్సులను  కవిత్వానికి పుష్టి చేకూర్చింది

ఈ కవిత్వమంతా చదివితే డా.నళినీ శుక్లా సహజ కవయిత్రి అనిపిస్తుంది .దైవం తో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్లు చెప్పిన శ్లోకాలు ఆమె ఆరాధనా భావానికి పరాకాష్ట గా నిలిచాయి .ఆమెలోని తాత్విక చింతనకు అద్దంపడతాయి .లయ ,తూగు ఊపు పుష్కలంగా ఉండటం తో కవిత్వం గొప్ప స్థాయిని చేరి మధురానుభూతినిస్తుంది .అలంకార దర్శన శాస్త్రాలలో ఆమె నిధి అని అర్ధమవుతుంది .యోగాభ్యాసం లోనూ ఆమె చాలా సాధించినట్లనిపిస్తుంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-2-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 152-తుకారామ చరితం కర్త –పండిత క్షమా రావు (1950)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4

152-తుకారామ చరితం కర్త –పండిత క్షమా రావు (1950)

1950 లో జన్మించిన క్షమా రావు సంస్కృత పండితురాలు .తుకారామ చరితంమహాకావ్యం మొదలైన రచనలు చేసింది  . ఇది 9 కాండల కావ్యం .మొదటికాండలో మహా కావ్య లక్షణాలు వివరించి తర్వాత నాయకుడైన తుకారాం ను వర్ణించింది –

‘’మహా రాస్ట్రే  షు ప్రజ్ఞాని శరదాం స్త్రిశతాని-తురీయో వర్ణనామపి తదితరే పూజిత గుణాః’’

తపస్వీ నిస్శ్వోపి క్షితిపతి శిరోర్యర్చిత పదః –తుకారామస్యోయం జయతి శ్రుణుతేతస్య చరితం .

రెండవ సర్గలో అప్పుడే జన్మించిన తుకారాం వర్ణన –

‘’బోలోజి నామస్య పితా బభూవ ,మాతాః కనాకీకనకాంగ యష్టిః-ప్రసూత మాత్రస్య శిశోః శరీరం కయాపి దివ్య ప్రభవా చకస్తే .’’

మూడవ కాండలో గృహస్తాశ్రమ ధర్మాన్ని చెప్పే శ్లోకం –భుభుక్షయా పరిష్యామో వయం త్వదుపజీవనం –గటహిణః ప్రధమో ధర్మః కుటుంబస్య పోషణం ‘’-భావం కుటుంబానికి కావలసిన ఆహార పదార్ధాలు వండి ఆకలి బాధలు తీర్చటం గృహిణి ప్రధమ కర్తవ్యమ్ .

నాల్గవ కాండలో తుకారాం భక్తీ తత్పరత వర్ణన –

‘’హరే ప్రసీద ద్రుత మోహి నయా క్షమస్వ మత్పాపమద ప్రణాశిన్-వ్రుయేవ కాలః క్షయితో మయా భూదితశ్చకార్యం వద నిశ్చితం మే’’-భావం –నా పాపాలను చెడును పోగొట్టి దారి చూపు హరీ .వృధాగా చాలాకాలం గడిచిపోయింది .ఈ ప్రపంచ బాదాగ్ని నుంచి నాకు ఉపశమనం కల్గించు ముకుందా .

అయిదవ కాండ  శ్లేషాలంకారం తో ప్రారంభం –‘’అయావాలీ తస్య మునేః కళత్రం ధన్యస్య చుకొప పత్యే-పరిగ్రహాన్ తాప ముదీస్య ధీరాః సదా ప్రహ్రష్య త్సపరిగ్రహేణ ‘’ భావం – ఎవరో దానం ఇస్తానన్న ధాన్యాన్ని వద్దు అన్నందుకు భార్య అవాలి తుకారం పైకోపం ప్రకటించింది .సద్గ్రుహస్తు దాన ధర్మాల స్వీకరణ విషయం లో మొహమాట పడి తీసుకో రాదు   అని భావం

‘’తుకారం పరమోత్క్రుస్టత ను తెలియ జేసే శ్లోకం 9 వ కాండ మొదట్లో క్ష్మమా రావు రాసింది –

‘’దినేదినే వృద్ధి మియాయ సంఖ్యా కలేవ  చాంద్రీ యతి వర్య భాజనం –ద్విషోపి మిత్రాణి బభూవు రస్య జైత్రీ న గుణః క్షమాయాం ‘’ భావం –రోజు రోజుకూ తుకారం శిష్య గానం పెరుగుతోంది .అతని శత్రువులూ మిత్రులై పోయారు .క్షమా గుణానికి మించినదేదీ సృష్టిలో లేనేలేదు .

పునర్జన్మ ఉందని చెబుతూ చెప్పిన శ్లోకం –

‘’ప్రాయేన జన్మాంతర డుష్క్రుతానాం ఫలోన్ముష్మానాం ఫలమధ్య హ్రుస్టం ‘’ ‘

భక్త తుకారం చరిత్రాన్ని మహా కావ్యంగా నవరస భరిత౦గా క్షమా రావు సృష్టించిన తీరు సుందరంగా ఉంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-2-18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

 

#_.

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 251-యోగినీ హృదయదీపికా వ్యాఖ్య కర్త – అమృతానంద నాధుడు (17 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4

251-యోగినీ హృదయదీపికా వ్యాఖ్య కర్త – అమృతానంద నాధుడు (17 వ శతాబ్దం )

త్రిపుర కు చెందిన వామతంత్రంగా ప్రసిద్ధి చెందిన వామకేశ్వర తంత్రంఅనబడే ‘’నిత్య షోడశికార్ణవం’’ లో చివరి మూడు అధ్యాయాలను అంటే 6 ,7 ,8 విశ్రామాలను  ‘’యోగినీ హృదయం ‘’అంటారు .దీనిని కాశ్మీర్ కు చెందిన వామాచారులు ‘’త్రిక ‘’గా గుర్తించారు .అంటే ఈ రెండు ఉపాసన విధానాలలో సమాన విషయాలున్నాయని తెలుస్తోంది .యోగినీ హృదయ౦ కు అమృతానంద నాధుడు ‘’దీపిక ‘’వ్యాఖ్యానం ,భాస్కరరాయ విరచిత ‘’ సేతు బంధన’’ వ్యాఖ్యానాలున్నాయి .18 వ శతాబ్దికి చెందిన భాస్కర రాయ వీటిని పెద్దగా ఒప్పుకోకపోయినా  దీపిక కు దగ్గరగా ఆయన అభిప్రాయాలున్నాయని భావించారు .అమరానాధుని తండ్రి పుణ్యానంద నాధుడు ‘’కామకలా విలాసం ‘’ఎప్పుడో రాశాడు .కనుక కాశ్మీరు వామతంత్ర వాదులు దీనిని యెంత క్షుణ్ణంగా అధ్యయనం చేశారో అర్ధమవుతోంది .నిత్యషోడశికార్ణవం ‘’కు   పు   ణ్యానందుడు   రాసిన వ్యాఖ్యానం ఆధారంగా శాక్త మతానికి చెందినా భాస్కరరాయ వ్యాఖ్యానం’’ సేతుబంధ ‘’ ఉంటుంది .

యోగినీ హృదయం కు నిత్య హృదయం ,సుందర హృదయం అని రెండు పేర్లున్నాయి . సంప్రదాయ శాక్త విధాన ఉపాసనలో 12 విభిన్న విధానాల ఉపాసన ఉన్నది .వీటిని మనువు ,కుబేరుడు ,లోపాముద్ర ,మన్మధ లేక ,కామదేవ,శివ ,దుర్వాసులు  స్థాపించారు కనుక వారి పేర్ల మీదనే ప్రచారం లో ఉన్నాయి .కాలగర్భం లో ఇందులో 10 పద్ధతులు కనుమరుగై ,రెండే రెండు పద్ధతులు లోపాముద్ర ,కామదేవ విధానాలు మిగిలి ఉన్నాయి .

15 అక్షరాలకు చెందిన కామ దేవ విద్య శాక్త , సంభావ అనే  రెండు విధానాలు   ,ఇందులో మొదటిది ఊర్ధ్వామ్నాయం దోషరహితమైనది .రెండవది పూర్వామ్నాయం కు చెందినది ,దోషాలతో ఉన్నది .లోపాముద్ర విద్య లోనూ 15 అక్షరాలే ఉంటాయి .ఇది తంత్ర రాజం లోనూ ,త్రిపురా  ఉపనిషత్ లోనూ ప్రాముఖ్యంగా ఉన్నది .హాదీ విద్యలోనూ 15 అక్షరాలే  .ఇది కొన్ని శాక్త ఉపనిషత్ లలో పెర్కొనబడినది .

దుర్వాస మహర్షి 13 అక్షరాల హదీ విద్య నే ఉపాశించాడు.ఈయన రాసిన లలితా స్తవరత్న౦ ప్రసిద్ది చెందింది . దుర్వాసుడు ‘’పరాశంభు స్తోత్రం ‘’కూడా రచింఛి ‘’క్రోధ భట్టారకుడు ‘’అని పించుకున్నాడు .త్రిపురా దేవిపై మహర్షి దుర్వాసుడు ‘’మహిమ్న స్తోత్రం ‘’కూడా రాశాడు .దీనికి శ్రీనివాస భట్ట అనే విద్యానందుని శిష్యుడు నిత్యానంద నాధుడు వ్యాఖ్యానం రాశాడు .

   కాది మతుడు రచించిన నాలుగు గ్రంధాలు తంత్ర రాజం ,మాతృకార్ణవం ,త్రిపురార్ణవం,యోగినీ హృదయం ఉన్నాయని కొందరి అభిప్రాయం .తంత్ర రాజం పై శుభగానంద నాధుడు రాసిన ‘’మనోరమ ‘’వ్యాఖ్యానం లో ,భావనా ఉపనిషత్ కు భాస్కర రాయడు రాసిన వ్యాఖ్యలో పై విషయాన్ని అంగీకరించారు .భాస్కర రాయ రాసిన ‘’వరి వస్య ‘’లో హాదీ వ్యాఖ్యానం యోగినీ హృదయానికి ఉందని చెప్పాడు .పరా మాత పూజా విధానం లో బాహ్య ,ఆంతరంగిక విధానాలు మాత్రమె ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పలేము .త్రిపుర తాపిని మొదలైన ఉపనిషత్తులలో నూ వీటి ప్రస్తావన ఉన్నది .భావనా విధానం కూడా చెప్పబడింది .వీటిలో కాల చక్రం లోని శ్రీ చక్రం పై భావన ఎలా నిలపాలో వివరణ ఉంది .ఖాదీ పధ్ధతి హాదీ పద్ధతుల లో వీటిపై కొన్ని భేదాభిప్రాయాలున్నాయి .అంతర్యాగ విధానం లో చక్రాలను శరీరం లోపలే వివిధ దశలలో వివిధ విదానాలలో  దర్శించాలని ఉంది .భావనా ఉపనిషత్ ఖాదీ మార్గాన్ని సమర్ధించింది .యోగినీ హృదయ బిందు సూత్ర, తంత్ర రాజాలు ఏకీభవించాయి .

  భావనా ఉపనిషత్ ప్రకారం మానవ శరీరమే శ్రీ చక్రం అంటే ఆత్మ అని  భావించాలి .కనుక శరీరం వేరు ఆత్మ వేరు కాదు .మొత్తం విశ్వ నిర్మాణం అంటే బాహ్య ప్రపంచం మన శరీరం లోనే ఉంది ,దానితో సంబందమై ఉన్నది .బాహ్య౦ దేశ ,కాలాలపై,ఆ రెండిటి కలయిక పై  ఆధారపడి ఉంటుంది .చంద్రునికి ఉన్న దర్శ,ద్రష్ట మొదలైన 15 కళలు ,15 తిధులకు సంబంధం కలిగి ఉంటాయి .ఇవే కామేశ్వరి, చిత్ర మొదలైన 15 నిత్య లు .16 వ కళనే’’సాధక్య ‘’అనే పరా దేవత లేక లలితాదేవిగా భావించాలి .అంటే కాలచక్రం లో ఉన్నది అంతా నిత్య లో అంటే శ్రీ చక్రం లో ఉన్నదే .భేదమేమీ లేదు .తిది చక్రం లేక కాల చక్రం నిత్యం భ్రమణం చెందుతూనే ఉంటుంది .శ్రీ చక్రం అందులో భాగమే .యోగుల రహస్య సాధన లో తిధులు అంటే మనవ శరీరం ద్వారా పీల్చే  2 1,600 శ్వాసలే .

  ఇక దేశ విషయానికి వస్తే -మన ప్రాచీన రుషి,పురాణ  సాంప్రదాయం ప్రకారం యావత్ ప్రపంచం భూమి నీరు మొదలైన  14 రకాల స్థాయీ భాగాల  భూ  జల భాగాలే .ఇవి జంబూద్వీపం నుండి మధుజల మహా సముద్రం అంటే ‘’మధు రోదం’’వరకు వ్యాపించి ఉన్నాయి .ఇందులో జ౦బూద్వీపానికి ఆవలున్న మేరువు ,మధు దేశానికి అవతలున్న పరావ్యోమ కూడా కలిసే ఉన్నాయి .నిత్యా మండల సంవత్సర ఆవర్తనం లో ప్రతి నిత్య, పై 14 భాగాలలో ఏదో ఒకదానితో సంబంధం కలిగి ఉంటుంది .మొదటి ఏడాది నిత్యల భ్రమణం   మేరువు నుండి ప్రారంభమై,16 వ నిత్య పరావ్యోమనుండి మొదలౌతుంది . ఈ మొత్తాన్నే ‘’దేశ చక్రం’’ అంటారు .

  యోగినీ హృదయం లో దానికి సంబంధించిన ప్రత్యేక విధి  విధానం ఉంది .ఇది పూర్తిగా మన ప్రాచీన విధానం లాగానే ఉంటుంది .క్రామ విధానం ఉన్న ‘’చిద్గగన చంద్రిక ‘’,మహార్త మంజరి గ్రంధాలలో దీని సంబంధ విలువైన సాహిత్యం చాలా స్పష్టంగా ఉంది . వాటిని చదివితే అద్భుతమైన సారం లభించి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది . ‘’

 అంటూ ఈ గ్రంధాన్ని తన సంపాదకత్వం లో  యోగినీ హృదయం ‘’ వెలువరించిన ‘’గోపీనాధ కవి రాజ ‘’వివరించాడు ..

అమృతానందుడు తాను  కాష్మీరానికి చెందిన పుణ్యా నందనాధుని శిష్యుడనని చెప్పుకున్నాడు .గురు శిష్యులిద్దరూ పరమ యోగులై ‘’పరమహంస’’లని పించుకున్నారు .పుణ్యానందుని రచన ‘’కామకలావిలాసం ‘’ను శిష్యుడు భక్తిగా తన గురువు రచన అని చాల చోట్ల పేర్కొన్నాడు .యోగినీ హృదయ దీపికతో పాటు   అమృతానందుడు’’షట్ట్వి౦మ్ షత్తత్త్వ  సందోహం ,సౌభాగ్య శుభగోదయం కూడా రాశాడు . అజ్ఞాన బోధిని టీకా ,తత్వదీపన అనే మరో రెండు కూడా ఇతని రచనలే అన్నారు .కృష్ణ నందుని తంత్ర సారాన్ని సరి చేశాడనీ అన్నారుకాని ఇవి అనుమానాలే .

  సేతు బంధన వ్యాఖ్యాత భాస్కరరాయ దీపికను కొన్ని చోట్ల సమర్ధించి చాలా చోట్ల వ్యతిరేకించాడు,అమృతానండదునిది సంప్రదాయమార్గమైతే భాస్కరునిది తద్విరుద్ధమైనదిగా కనిపిస్తుంది .సాధకులకు అమృతానందమార్గమే సరైన మార్గ దర్శనం చేస్తుందని నిపుణుల అభిప్రాయం .

  దీపికలో చక్ర ,మంత్రం ,పూజ మూడు భాగాలు అంటే పటలాలు ఉన్నాయి  .చక్ర అంటే శ్రీ చక్రం లేక త్రిపురా  చక్రం .ఇది సకల చరాచారానికికి ఆది మధ్యాన్తమైనది .ఇందిలో 9 త్రిభుజాలు ,అందులో 5 త్రిభుజ శీర్షాలు కింది వైపుకు ,నాలుగు శీర్షాలు పైకి ఉంటాయి .మొదటి 5శక్తికి ,మిగిలిన 4అగ్ని అంటే లయానికి సంకేతాలు .శివ ,శక్తి లు అగ్ని చంద్రుడు .వీటి కలయికలో ఉన్నది సూర్యుడు అనే బిందు రూపం . శివుని స్పర్శవలన ప్రకాశం లభిస్తుంది .బిందువు సకల చేతనాలకు మూలం .

 రెండవదైన మంత్రం భాగం లో 9 చక్రాల అధిదేవతా మంత్రం వివరణ ,చిన్మరీచి అనే చైతన్య కిరణవిషయం ఉంటాయి మంత్ర సంకేతం భావార్ధ ,సంప్రదాయార్ధ ,నిగ ర్మార్ధ,కౌలికార్ధ ,సర్వ రహస్యార్ధ ,మహాతత్వార్ధ అని ఆరు రూపాలు .

మూడవభాగమైన పూజ లో పరా ,పరాపరా అపర పూజా విధానాల వివరణ ఉన్నది .మొదటిదానిలో పరమశివ తత్వ బోధన జరిగితే రెండవ దానిలో కర్మ జ్ఞానాలు కలిసి భావన మిగులుతుంది .మూడవది తక్కువ స్థాయి కల సాధారణ పూజా విధానం .

మొదటి శ్లోకం –

‘’దేవ దేవ మహాదేవ పరిపూర్ణ ప్రదామయ –వామకేశ్వర తంత్రేస్మి అజ్నాతార్ధ స్త్వనేకశః

తాం స్థాన ర్యశేషేణ వక్తు మర్హసి భైరవ’’ .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-18 –కాంప్- మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

ఆకాశం లో సగ భాగమైన దక్షిణ కొరియా మహిళలు తమ స్వీయ వ్యక్తిత్వం తో ఆ దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశారు .అందులో కొందరు మహిళా మాణిక్యాల గురించి తెలుసు కుందాం .

1-కోరియాదేశ ప్రధమ మహిళా న్యాయ మూర్తి – తాయ్ య౦గ్ లీ

ఇప్పుడు నార్త్ కొరియా గా పిలువబడుతున్న సౌత్ కొరియా దేశం లో తాయ్ యంగ్ లీ 1914 లో జన్మించింది .దక్షిణ కొరియాలో 1946 లో సియోల్ నేషనల్ యూని వర్సిటి లో చేరిన మొట్టమొదటి మహిళగా చరిత్ర కెక్కింది .కొరియన్ నేషనల్ జుడీషియల్ పరీక్ష రాసి ఉత్తీర్ణురాలై రికార్డ్ సృష్టించింది .తర్వాత ఆ దేశ తొలి మహిళా న్యాయమూర్తి గా ,మొదటి న్యాయ సలహా కేంద్రం ఏర్పరచి ప్రసిద్ధి కెక్కింది .ఆ దేశ జాతీయ న్యాయ చట్టాలను సంస్కరించి ,ముఖ్యంగా మహిళలకు అందునా వివాహితులైన స్త్రీలకు అండగా నిలిచింది లీ.కొరియా స్త్రీలు స్వశక్తితో తమకాళ్ళ పై తాము నిలబడేట్లు చేసిన సాహసి తాయ్ యంగ్ లీ.

2-పాప్ సంగీతం తో కీర్తి శిఖరారోహణం చేసిన –సి .ఎల్ .

పాప్ సంగీత గాయనిగా ఆకర్షణీయ ముఖ వర్చస్సుతో అఖండ కీర్తి సాధించిన లీ చేరిన్ అందరికి సి ఎల్ గా పరిచితురాలు .అద్భుతమైన శైలీ విన్యాసంతో అకుంఠిత ఆత్మ విశ్వాసం తో అందరి హృదయాలను గెలిచి సంగీత సామ్రాజ్ని అని పించుకున్నది . పాత లాగుడు, పీకుడు సంగీతాన్ని ఊడ్చి అవతలపారేసి శక్తివంతమైన సంగీతం తో అలరించింది .తన సంగీత గీతాలలో అజేయమైన మహిళా శక్తికి ,వారి ఆత్మ విశ్వాసానికి ,స్వేచ్ఛ కు జేజేలు పలికించింది .టైం మేగజైన్ ప్రకటించిన వంద మంది ప్రతిభా సంపన్నుల జాబితాలో సి ఎల్ పేరు చోటు చేసుకున్నది అంటే ఆమె సంగీత విద్వత్తు ఎంతటిదో తెలుస్తుంది .

3-మొదటి మహిళా పైలట్ –కుంగ్ వాన్ పార్క్

1901 లో డేగన్ లో జన్మించిన కుంగ్ వాన్ పార్క్ దక్షిణ కొరియా ప్రధమ సివిలియన్ మహిళా పైలట్ గా గుర్తింపు పొందింది .ఫీజు కట్టటానికి డబ్బు కోసం నర్స్ గా పని చేసి తర్వాత 1925 లో జపాన్ చేరి,పైలట్ కావాలన్న తన చిరకాల కోరిక ను ఆచరణ లో పెట్టటానికి సంసిద్ధు రాలైంది .రెండేళ్ళ తర్వాత ఏవియేషన్ స్కూల్ లో చదివి గ్రాడ్యు యేట్ అయింది .మరుసటి ఏడాది సెకండ్ క్లాస్ పైలట్ లైసెన్స్ సాధించింది .

1933 లో పార్క్ సాల్మ్స్ సన్ 2 A 2అని పిలువబడిన ‘’బ్లూ స్వాలో ‘’ విమానం లో జపాన్ మంచు వాన్ లమధ్య నడిపే ప్రయత్నం చేసింది .దురదృష్ట వశాత్తు ఆ విమానం నేలమీదనుంచి పైకేగిరిన కొద్ది కాలం లోనే కూలి పోయి 32 ఏళ్ళ యువ పైలట్ కుంగ్ వాన్ పార్క్ ను బలి తీసుకున్నది .

4-స్కేటింగ్ లో తొలి ఒలింపిక్ పతకం సాధించిన మహిళ-యూనా కిమ్

‘’క్వీన్ యూనా ‘’గా అందరి చేత పిలువబడే యూనా కిమ్ ఒలింపిక్ పోటీలలో స్కేటింగ్ లో పతకం సాధించిన తొలి మహిళ.ప్రపంచ చాంపియన్ గా ,ఫోర్ కాంటి నెన్ట్స్ చాంపియన్ షిప్ ,గ్రాండ్ ప్రిక్స్ ఫైనల్ సాధించిన వీర వనితగా ప్రసిద్ధురాలు .దక్షిణ కొరియా ప్రజల స్వీట్ హార్ట్ అని పిలువబడే యూనా కిమ్ ను 2010 టైం మేగజైన్ ప్రపంచ ప్రసిద్ధ ప్రభావవంతమైన మహిళగా ప్రకటించింది .

క్రీడా కారిణి గా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నదో కిమ్,దాన ధర్మాలతోనూ అంతే పేరు ప్రఖ్యాతులు పొందింది .2010 లో యునిసెఫ్ సౌహార్ద యాత్రా ప్రతినిధిగా ఎంపికైంది .అప్పటి నుంచి ప్రపంచం లో ఎక్కడ ఎవరికి ఏ ఆపదా ,అవసరం వచ్చినా ఆమె సహాయ పడేది.హైతి ,జపాన్ లలో పునరావాస కార్యక్రమాలకు కిమ్ చూపిన చొరవ, సేవ చిరస్మరణీయం .ఫిలిప్పీన్స్ లో తుఫాను బాధితుల సహాయార్ధం యూనా కిమ్ ఒక లక్ష డాలర్ల ఆర్ధిక సహాయం చేసి ఆదుకుని తన వితరణను చాటింది .

5-మొదటి అంతరిక్ష యాత్రికురాలు – సోయియాన్ యీ

చిన్నతనం లోనే సోయియాన్ యీ కి సైన్స్ అంటే పిచ్చ అభిమానమేర్పడింది .ఆ కుటుంబం లోమిడిల్ స్కూల్ చదువు దాటి ముందుకు వెళ్ళిన మొట్టమొదటి బాలిక గా పేరు పొందింది .36 వేలమంది అభ్యర్ధులలో 20 08 లో ఎంపిక కాబడిన మొట్టమొదటి మహిళా అంతరిక్ష యాత్రికు రాలుగా చరిత్ర కెక్కింది .అప్పటికి ఆమె వయసు 30 లోపు మాత్రమే.

మగాళ్ళు మాత్రమే అన్నిటా ముందు ఉన్నకాలం లో ఒక మహిళా పైలట్ గా గొప్ప కీర్తి సాధించి ,తన అనుభవాలను నిర్మొహమాటం గా తెలియ బరచిన స్త్రీ యీ .తన అనుభవాలతో వేలాది బాలికలను స్త్రీలను ప్రభావితం చేసి అంతరిక్ష యాత్రలో వారికి అభిరుచి ,అభినివేశం కలిగేట్లు చేయగలిగింది .ఇప్పుడు సియాటిల్ లో ఉంటున్న సోయియాన్ యీ 2015 సీక్రెట్ స్పేస్ ఎస్కేప్స్ అనే అమెరికన్ డాక్యుమెంటరి సిరీస్ లో పని చేస్తోంది .

– గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 236-సంక్షిప్త మహా భారత కర్త –సత్య దేవ చౌదరి (1921 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

236-సంక్షిప్త మహా భారత కర్త –సత్య దేవ చౌదరి (1921 )

సంస్కృత ,హిందీలలో పిహెచ్ డి,ఎమిరితాస్ ప్రొఫెసర్ సత్యదేవ చౌదరి 1921 మే 21 పుట్టాడు 30 పుస్తకాలు రాశాడు .ముఖ్యమైనవి భారతీయ కావ్య శాస్త్ర ,సంక్షిప్త మహాభారత ,రుగ్వేదీయ సంవాద సూక్త .న్యు ఢిల్లీ వాణీ న్యాయ స సంస్థ డైరెక్టర్ .,జర్మని యూని వర్సిటి విజిటింగ్ ప్రొఫెసర్ .పంజాబ్ ,యుపి ప్రభుత్వ పురస్కార గ్రహీత .ఢిల్లీ సంస్కృత, హిందీ అకాడెమీ ,ప్రెసిడెంట్ అవార్డ్ గ్రహీత .

237-దేవతాత్మా  హిమాలయ కర్త –అశోక్ కుమార్ దర్బాల్ (1943)

14-4-1943 గడ్వాల్ లో పుట్టిన అశోక్ కుమార్ దర్బాల్ సంస్కృత ,హిందీ పిహెచ్ డి,సాహిత్య రత్న .సంస్కృత ప్రొఫెసర్ .దేవతాత్మా హిమాలయః ,దుక్షతే హా ధరిత్రి ,దయాద్యం ,దుదుక్ష ,అథా ఇతి వగైరా 7 రాశాడు .

238-కీర్తి విలాసం కర్త –సదా నంద దర్బాల్ –(1877-19 50  )

పాండిచ్చేరిలో 1877 లో ఉత్తరాఖండ్ లో పుట్టిన సదాన౦ద దర్బాల్ తమిళ సంస్కృత పండితుడు .నారాయణీయం మహాకావ్యం ,కీర్తి విలాసం ,దివ్య చరితం ,రాసవి లాసంరాశాడు .సిద్ధకవి. 1950 లో మరణించాడు .

239-ఉత్తర ప్రశస్తి కర్త – హరి శాస్త్రిదధీచి  (1893-1970 ) )

18-4-1893 జైపూర్ లో పుట్టిన దధీచి హరిశాస్త్రి వేద ,తంత్ర ,సాహిత్యాచార్యుడు .సంస్కృత లెక్చరర్ .గురుపరంపర –లక్ష్మీరాం స్వామి ,చంద్ర దత్త ఓజా ,పండిట్ బిహారీలాల్ శాస్త్రి .శిష్యపరంపర –విజయకుమార్ ,రాజ కుమార్ .12 పుస్తకాలు రాశాడు .ముఖ్యమైనవి –ఉదార ప్రశస్తి ,వాణీ లహరి ,లలితా సహస్ర కావ్యం ,77 వ ఏట 1970 లో మరణం .సంస్కృత భారతి పత్రిక సంపాదకుడు .ఆశుకవి ,కవి భూషణ బిరుదులు .ఆయుర్వేద భూషణ బిరుదు ఆయుర్వేద అనుషేలన్ సమితి ,జైపూర్ నుండి అందుకున్నాడు .ఆమ్నాయ దురంధరుడు ,సాహిత్య మహా మహోపాధ్యాయ బిరుదులకు సార్ధకత చేకూర్చిన విద్వత్కవి పండితుడు .

24 0-మాధవ స్వాతంత్రం కర్త – నా౦గల్య గోపీనాద్ దధీచి (19వ శతాబ్దం )

సాహిత్య ,న్యాయ ,మీమాంస ఆచార్యుడు .జైపూర్ నాన్గాల్య లో19 శతాబ్ది లో పుట్టాడు .జైపూర్ సంస్కృత కాలేజి లెక్చరర్ .29 గ్రంధాలు రాశాడు –వాటిలో ఆనంద నందన కావ్యం,మాధవ స్వాతంత్రం ,తర్కారికా ,సంతోష పంచాశికా ,కృష్ణరాయ సప్త శతి ఉన్నాయి

241- రామ కదా కల్ప లత మహా కావ్య  కర్త –నిత్యానంద శాస్త్రి దధీచి (18 8 9 -19 61 )

18 8 9 రాజస్థాన్ జోద్ పూర్ లో జన్మించిన నిత్యానంద శాస్త్రి దధీచి 20 వ శతాబ్దపు ప్రముఖ కవి .రామ కదా కల్పలతమహా  కావ్యం ,శ్రీదదీచి చరిత ,శ్రీరామ చరితాబ్ది రత్నం ,శ్రీ హనుమద్దూతం ,లఘు చందోలంకార దర్పణం మున్నగు నవి రాశాడు .19 61 లో 72 వ ఏట చనిపోయాడు .వ్యాకరణ ,కావ్య ,సాహిత్య ,ఛందో ,హిందీ చిత్రకవిత్వాలలో అసమాన ప్రవీణుడు

24 2- ఆధునిక సాహిత్యేతిహాసం కర్త –రాం కుమార్ దధీచి (1959 )

7-9-1959 రాజస్తాన్ సికార్ లో పుట్టిన రాం కుమార్ దధీచి అజ్మీర్ సంస్కృత కాలేజి ప్రోఫెసార్ ,ప్రిన్సిపాల్ .ఆధునిక  సంస్కృతేతి హాసం ,ప్రాచీన భారతస్య సాహిత్య సంస్కృతీ కాశ్చేతి హాస ,అలంకార శాస్త్రేతిహాస ,కావ్యాలంకార సూత్రకి వ్యాఖ్యాయ మొదలైనవి రచించాడు

243- రస రత్న ప్రదీపిక కర్త –రామచంద్ర నారాయణ దండేకర్  (19 09 )

రామ చంద్ర నారాయణ దండేకర్ 17-3-1909 మహారాష్ట్ర సతారాలో పుట్టాడు .సంస్కృత ఎం ఏ ,ఎన్శేంట్ ఇండియన్ కల్చర్ లో పిహెచ్ డి.ఇండాలజిస్ట్ స్కాలర్ ,నేషనల్ రిసెర్చ్ రోఫేసర్ .30 పుస్తకాలు రాశాడు .వేదిక్ మైధలాజికల్ త్రాక్త్స్ ,5 భాగాల వేదిక్ బిబ్లియాగ్రఫీ ,2 భాగాల శ్రౌత కోశం ,జ్ఞాన దీపిక ,రసరత్న ప్రదీపికలు ముఖ్యమైనవి .పద్మభూషణ పురస్కారం 1962 లో సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం నుండి వాచస్పతి బిరుదు ,బెనారస్ హిందూ యూని వర్సిటినుండి గౌరవ డాక్టరేట్ ,శంకరదేవ ,విశ్వభారతి అవార్డ్ లు రాష్ట్ర భూషణ ,లోకమాన్య తిలక్ సమ్మాన్ పురస్కారాలు అందుకున్న మహా విద్యా వేత్త పండితుడు కవి .

245-జైన ధర్మ మీమాంస కర్త –లాల్ సత్యభక్త దర్బారీ (.20 వశతాబ్దం )

లాల్ సత్య భక్త దర్బారీ జైన కవి .గణేష్ ప్రసాద్ వర్ణి శిష్యుడు .జైన దర్శన ,జైన ధర్మ మీమాంస రాశాడు .సత్య దర్శన పత్రిక  స్థాపించాడు .

246-సంస్కృత సాహిత్య మంజూష కర్త –దేవ కుమార్ దాస్ –(194 7 )

 వెస్ట్ బెంగాల్  మిడ్నపూర్ లో 15-9–1947పుట్టిన దేవ కుమార్ దాస్  ఘటాల్ రాష్ట్రీయ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ .11 పుస్తకాలు రాశాడు –సంస్కృత వైచిత్ర్య  ,నైషద చరితే దర్శనం ,సంస్కృత సాహిత్య లోకః ,సంస్కృత సాహిత్య మంజూష .ఉత్తరరామ చరితానికి సంపాదకత్వం చేశాడు

247- యవన భారతీయ కర్త –ఇంద్రమణి దాస్ (1950 )

1950 ఫిబ్రవరి 1 బీహార్ లో పుట్టిన ఇంద్రమణి దాస్ జ్యోతిష ఆచార్యుడు .జమ్మూ కాంపస్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ .యవన భారతీయ సిద్ధాంత జ్యోతిష యో స్తులనాత్మక మనుశీలనం అనే ఏకైక కృతి రాశాడు .

248- న్యాయ ప్రదీప కర్త –అచ్యుతానంద దాస్ (19 60 )

సంస్కృత ,పాళీ ఎం ఏ పిహెచ్ డిఅచ్యుతానంద దాశ్ శాస్త్రి డిగ్రీ హోల్డర్ .20-5-1960 ఒరిస్సా లో పుట్టాడు .సాగర్ హెచ్ ఎస్ గౌర్ యూని  వర్సిటి ప్రొఫెసర్ .రాసిన 19 పుస్తకాలు రాశాడు . న్యాయ ప్రదీప  రచించి ,వ్యుత్పత్తివాదం ,ఆత్మతత్వ వివేకం ఆత్మజ్ఞాన భక్తియోగంలను తన సంపాదకత్వం లో తెచ్చాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి విజిటింగ్ ప్రొఫెసర్ .సంస్కృత విజ్ఞాన సర్వస్వ నిఘంటువుకు సహాయ  సంపాదకుడు .మంగోలియా ,పారిస్ సంస్కృత విద్యాలయాల చైర్ పర్సన్ .రిఫ్లెక్షన్స్ ఆన్ కారక రాశాడు .సరస్వతి వరద పుత్ర ,ఒరిస్సా సంస్కృత అకాడెమి అవార్డ్ అందుకున్నాడు మారిషస్ బోర్డ్ ఆఫ్ రైటర్స్ చైర్మన్ .

249-సీతాలస్రత్న కర్త –చంద్ర కేశవ్ దాస్(1955 )

ఎం ఏ పిహెచ్ డి చంద్ర కేశవ దాస్,  ఆచార్య,జర్మన్ ,ఫ్రెంచ్ భాషలలో డిప్లోమో హోల్డర్ .6-3-1955 కటక్ లో  జననం . పూరీ జగన్నాద సంస్కృత విశ్వ విద్యాలయ దర్శన శాఖాధ్యక్షుడు .40 గ్రంధాలు రాశాడు . సీతాలస్రత్న,నికాస ,రత్నం ,అంజలి ,విసర్గ అందులో విశేషమైనవి .వాణీ సాహిత్య సంసద్ సమ్మాన్ ,ఢిల్లీ సంస్కృత  అకాడెమి నుండి తంత్ర సరస్వతి అవార్డ్ ,శంకర పురస్కారం వగైరాలు పొందాడు .

250-అర్ణ యశస్యం కర్త –క్షిరోద్ చంద్ర దాష్ (1954 )

26-4-19 54 ఒరిస్సా కటక్ లో పుట్టిన క్షిరోద్ చంద్ర దాష్ ఎం ఏ పి హెచ్ డి.పూరీ జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయ అసిస్టెంట్  ప్రొఫెసర్ .తారుణ్య శతకం ,చిలికా , అర్ణ యశస్యం,రమాకాంత కావ్యసంచయనం రాశాడు .ఒరిస్సా ,ఢిల్లీ సాహిత్య అకాడెమి పురస్కారాలతోపాటు అనువాద పురస్కారం ,జైమంత్ మిశ్రా అవార్డ్ లు అందుకున్నాడు .

 236-నుండి 250వరకు ఆధారం –Inventory of Sanskrit Scholors

 సశేషం  

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-18-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 226-జవహర్ జ్యోతి ర్మహాకావ్య కర్త –రఘునాధ ప్రసాద్ చతుర్వేది (1911-198 8 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

226-జవహర్ జ్యోతి ర్మహాకావ్య కర్త –రఘునాధ ప్రసాద్ చతుర్వేది (1911-198 8  )

1911 లో యుపి మధురలో పుట్టిన రఘునాధ ప్రసాద్ చతుర్వేది 1988 లో 77 వ ఏట మరణించాడు .జవహర్ జ్యోతి మహాకావ్యం రాశాడు .

227- హస్తామలక  స్తోత్ర అనుశీలన కర్త –రామేశ్వర ప్రసాద్ చతుర్వేది (19 62)

196 2 అక్టోబర్ 15 యుపి లో పుట్టిన రామేశ్వర ప్రసాద్ చతుర్వేది ఎం ఏ పిహెచ్ డి.రామ్బాయ్ నగర్ సంస్కృత కాలేజి లో సంస్కృత హెడ్ . హస్తామలక  స్తోత్ర అనుశీలన,వేద ఏవం అవెస్టా రచించాడు .

228- వైదిక శిక్షా స్వరూప విమర్శ కర్త –రామ మూర్తి చతుర్వేది (19 58 )

శుక్ల యజుర్వేద ,ఋగ్వేద న్యాయ వ్యాకరణ ఆచార్య రామ మూర్తి చతుర్వేది 19 58 జనవరి 1 యుపి శాంతాకబీర్ లో పుట్టాడు .వారణాసి కాశీ విద్యా పీఠ సంస్కృత ప్రొఫెసర్ .రాం సజీవన్ శుక్లా ,ఆచార్య రాం రాజ్ త్రిపాఠీ ,ఆచార్య రాధేశ్ మణి తిపాఠీలు గురువులు .శిష్యులు శ్రీ వాణీ విలాస దిమారి , డాక్టర్ ప్రవేశ కుమార్ మిశ్ర ,డా.శశి శేఖర్ మిశ్ర .సంస్కృతం లో యజ్ఞోపవీత వేదారంభ సమావర్తన సంస్కారః , వైదిక శిక్షా స్వరూప విమర్శరాశాడు .

229- సారస్వత సందర్శనం కర్త -సరస్వతీ ప్రసాద్ చతుర్వేది (1902-1979  )

1902 అలహాబాద్ జిల్లా లాలాపూర్ లో పుట్టాడు .నాగపూర్ ఎం హెచ్ యూని వర్సిటి ప్రొఫెసర్ .అలహాబాద్ యూని వర్సిటి డైరెక్టర్ .భారత ప్రభుత్వ సంస్కృత డైరెక్ట రేట్ డైరెక్టర్ .సారస్వత సందర్శనం ఒక్క పుస్తకమే రాశాడు .77 వ ఏట 1979 లో చనిపోయాడు .సంస్కృత సాహిత్య ,వ్యాకరణాలపై సంస్కృత హిందీ ఇంగ్లిష్ లలో చాలా పుస్తకాలు రాశాడు .

230-గోస్వామి తులసీ దాస శతక కర్త –శివ దత్త శర్మ చతుర్వేది (1934 )

19 34 ఏప్రిల్ 16 రాజస్థాన్ జైపూర్ లో పుట్టిన శివదట్ట శరం చతుర్వేది సాహిత్య ,వ్యాకరాన్ ఆచార్య .వారణాశి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ ప్రాచ్య విద్యా ప్రొఫెసర్ .6 గ్రంధాలు రాశాడు .గోస్వామి తులసీ దాస శతకం ,స్పూర్తి సప్తశతి ,లాలస మైత్రి చర్చా మహాకావ్యం ,సత్యం శివం సుందరం మహా కావ్యం . అభినవ కథా కుంజ .గొప్ప కదా వ్యాస రచయితా .ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మహా మహోపాధ్యాయ పొందాడు .మాఘ ,కాళిదాస పురస్కార గ్రహీత .

231-కావ్య దోష విమర్శ కర్త –ఉమాకాంత చతుర్వేది( 19 60 )

3-11-1960 బీహార్ బాభువా జిల్లా బనౌళి లో పుట్టిన ఉమాకాంత చతుర్వేది ఎం ఏ పిహెచ్ డి.ఆచార్య .జైపూర్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ప్రోఫెసార్ .కావ్య దోష విమర్శ ,అయోధ్యా తీర్ధ ప్రశంస ,స్తుతి కుసుమాంజలి రాశాడు .

232- శ్రీ వ్రజ స్తవ మాలిక కర్త –వాసుదేవ కృష్ణ చతుర్వేది (20  వ శతాబ్దం )

న్యాయ వ్యాకరణ ధర్మ శాస్త్ర ఆచార్య ,పురాణ జ్యోతిష సాంఖ్య యోగ సాహిత్య వల్లభుడు వాసుదేవ కృష్ణ చతుర్వేది,త్రిభాషలలో ఎం ఏ సాహిత్య రత్న,డిలిట్ ,కావ్యతీర్ధ, విద్యా వాచస్పతి ‘.కాలం 20 వ శతాబ్ది . ఓరియెంటల్ ఇన్ స్టి ట్యూట్  ఆఫ్ ఫిలాసఫీ హెడ్.రాసిన 5 గ్రంధాలలో ద్వారకాధీశ మహాకావ్యం ,శ్రీ వ్రజస్తవ మాలిక , నందోత్సవ ,భారత రాష్ట్ర గీతి, శ్రీమతి ఇందిరాగాంధీ కావ్యం ,.యుపి సంస్కృత అకాడెమి అవార్డీ .

233-తర్క భాష కర్త –అర్కనాద చతుర్వేది (1956 )

1956 ఆగస్ట్ 15 బిహార్ మధుబని జిల్లా రుద్ర పురి లో పుట్టిన అర్కనాద చతుర్వేది వ్యాకరణ ఆచార్య .రాజస్థాన్ జైపూర్ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ .గురుపరంపర –పండిట్ ఉమేష్ చౌదరి ,డా.హర్ష నాద  మిశ్ర ,డా.మణినాద ఝా .20 కి పైగా గ్రంధాలు రాశాడు .వాటిలో –లఘు సిద్ధాంత కౌముది ,వైయాకరణ సిద్ధాంత కౌముది ,మధ్య సిద్ధాంత కౌముది ,నిఘంటు శబ్ద కోశం ,తర్కభాష ,మేఘదూతం ఉన్నాయి .

234 –సరోజ సుందర కావ్యకర్త –గుంజేశ్వర చౌదరి (194 9 )

గుంజేశ్వర చౌదరి 7-8-1949 హర్యానాలో పుట్టి ,సాహిత్యం లో ఎం ఏ చేసి ,హర్యానాలోని హగోలా సంస్కృత విద్యా పీఠప్రొఫెసర్ ,ప్రిన్సిపాల్ . 8 పుస్తకాలు రాశాడు –విదుర నీతి ,పండిత రాజ కృత అప్పయ దీక్షిత సమీక్షా వివేచనం ,సరోజ సుందరం ,వాణీవీణా .ఆలిండియా రేడియో లో గీత రామాయణ భారత ,సంస్కృత సాహిత్యాలపై 20 కి పైగా ప్రసంగాలు చేశాడు .

235—నిబద్ద సౌరభ కర్త -ప్రభాదేవి చౌదరి (1954 )

27-7-1954 బీహార్ లో పుట్టిన ప్రభాదేవి చౌదరి ఎం ఏ పిహెచ్ డి.భోపాల్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ప్రొఫెసర్ .రాసిన 5 పుస్తకాలలో జలద్ రాగ, , నిబద్ద సౌరభ,భారతీయ శిక్షణం ,సమ సామయిక సమస్య నవీన ప్రత్యశ్చ ఉన్నాయి .

226- నుంచి 235 వరకు ఆధారం –Inventory of Sanskrit Scholors

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-2-18 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 216-సుశ్రుతార్ధ సందీపం కర్త –హరణ చంద్ర చటోపాధ్యాయ (1935 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

216-సుశ్రుతార్ధ సందీపం కర్త –హరణ చంద్ర చటోపాధ్యాయ (1935 )

పుట్టిన చోటు డేటూ తెలియని హరణచంద్ర చటోపాధ్యాయ 1935 లో మరణించినట్లు తెలుస్తోంది .సుశ్రుత సంహిత పై సుశ్రుతార్ధ సందీపనం వ్యాఖ్యానం రాశాడు .

రవీంద్రుని లాఖగా రహస్యానికి సంస్కృత అనువాదం ‘’వార్తాగ్రహం ‘’రాసిన ధ్యానేశ్ నారాయణ చక్రవర్తి 40 పుస్తకాలు రాసిన శాస్త్రి ,డిలిట్.

దుర్గా శంకర చక్రవర్తి 7, 8 తరగతులకు’’మంజు భాషిణి’’పేరిట  సంస్కృత పాఠ్య గ్రంధాలు రాశాడు .

217-మాతా విలాస కర్త –మహి మాధవ చక్యార్ (18 99 )

మహిమధవ చక్యార్ 1899 ఫిబ్రవరి 15 కేరళ కోజికోడ్ లో పుట్టాడు.అలంకార న్యాయ వ్యాకరణ ,న్యాయ జ్యోతిష ప్రవీణుడు .సంస్కృత పాఠశాల లో టీచర్  .రచించిన 5 గ్రంధాలలో న్యాయ కల్ప ద్రుమ , మాతావిలాసం ఉన్నాయి మిగిలినవి అట్టకాలు.ఆట్టం లో అనేక పురస్కారాలు పొందిన నటుడు నాటకకర్త .

218-ప్రతి యోగికా చంద్రిక కర్త –కృష్ణ చంద్(197 8 )

7-6-197 8 హర్యానా జింద్ లో పుట్టిన కృష్ణచంద్ సంస్కృత హిందీ ఆచార్య .ఢిల్లీ సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడు .కర్మకాండ మీమాంస ,ప్రతి యోగితా చంద్రిక రాసిన వేదంగ జ్యోతిష ప్రకాండుడు.

219-సంస్కృత కంప్యు టేషనల్ అనాలిసిస్ సిస్టం ఏర్పరచిన –రామ స్వామి చంద్ర శేఖర్ (20 శతాబ్దం )

ఎం ఏ పిహెచ్ డి రామ స్వామి చంద్ర శేఖర్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రు యూని వర్సిటి కన్సల్టంట్ లింగ్విస్ట్ .ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ సాంస్క్రిట్ లెక్సికోగ్రఫీ ,డెవలపింగ్ ఏ సాంస్క్రిట్ అనాలిసిస్ సిస్టం ఫర్ మెషీన్ ట్రాన్స్లేషన్ ,టువర్డ్స్ కంప్యు టేషనల్ అనాలిసిస్ సిస్టం ఫర్ సాంస్క్రిట్ రాశాడు .సంస్కృత లెక్సికోగ్రఫీ పాణినీయ వ్యాకరణాలపై గొప్ప పట్టు ఉన్నవాడు .

220-ఆత్మ బోధా ప్రకాశిక కర్త –చంద్రిక (19 60 )

15-11-1960 కేరళ కొల్లం లో పుట్టిన చంద్రిక ఎంఫిల్ పిహెచ్ డి.ఆత్మా బోధాప్రకాశిక సంస్కృతం లో వేదాంతసార మలయాళం లో రాశాడు .

221-పింగళ ఛందస్సూత్రం కర్త –అమర చంద్ర ఉపాధ్యాయ (1943 )

కలకత్తాలో 5-5-19 43 లో పుట్టిన అమర  కుమార్ చట్టోపాధ్యాయ సంస్కృత ఎం ఏ .వేద గ్రంధమాల ,వేద ఉపనిషత్ ,పింగళ ఛందస్సూత్రం ,ఆశ్వలాయన శ్రౌత సూత్రం రుగ్వేదీయ గృహ్య సూత్రం లకు సంపాదకుడు .

222- వజ్ర యాన దర్శన మీమాంస కర్త –ధర్మదత్త చతుర్వేది (19 59 )

సారనాద్  కేంద్రీయ టిబెటన్ స్టేడి ప్రొఫెసర్ ధర్మ దత్త చతుర్వేది  1959 మార్చి1 పుట్టాడు .కాతంత్రాది సూత్రా వ్రుత్తి ,కావ్యకల్లోలిని ,వజ్ర యాన దర్శన మీమాంస రాశాడు

223-వివేక మకరంద కర్త –కృష్ణకాంత చతుర్వేది (1937 )

1937 డిసెంబర్ 19 జబల్పూర్ లో పుట్టిన కృష్ణకాంత చతుర్వేది అక్కడే రాణి దుర్గావతి యూని వర్సిటి ప్రొఫెసర్ .ఉజ్జైన్ కాళిదాస అకాడెమి రాజశేఖర అకాడెమి ల డైరెక్టర్ . ఆచార్య ప్రభు దయాళ్ అగ్ని హోత్రి ,నీలమేఘాచార్య హరిలాల్ జైన్ ల శిష్యుడు .ద్వైత వేదాంతం ,తత్వ సమీక్ష ,స్టడీస్ ఇన్ రాజశేఖర ,వివేక మకరందం ,అధాతో బ్రహ్మ జిజ్ఞాస రాశాడు .ప్రెసిడెంట్ అవార్డ్ పొందాడు .రుతుమ్భర మాగజైన్ ఎడిటర్ .

224 –వేదనా రక్షక శతక కర్త –మాహా శ్వేత చతుర్వేది(19 53 )

సంస్కృత ఇంగ్లిష్ హిందీ లలో ఎంఏ ,సంగీత రత్నాకర మహా శ్వేత చతుర్వేది 2-2-1953 యుపి లో ఈతా వా లో పుట్టింది .జర్నలిజం లో డిప్లోమో హోల్డర్ .పిహెచ్ డి.డిలిట్.వేదాయన రక్షా శతకం ,హిందీలో జ్యోతి కలశ ,యజుర్వేద రహస్య రచనలు .కావ్య రత్న కావ్యాలంకార బిరుదులు .మైకేల్ మధుసూదనదత్ అవార్డీ .

225-గాంధర్వ తంత్రం కర్త –రాధేశ్యాం చతుర్వేది (1940 )

రాధేశ్యాం చతుర్వేది వ్యాకరణ పిహెచ్ డి.1-7-1940 యుపి అజామ్ఘర్ లో పుట్టాడు .హరిద్వార్ దేవ్ సంస్కృత విశ్వ విద్యాలయంప్రొఫెసర్ .గాంధర్వ తంత్రం ,గాయత్రి మహా తంత్రం , శ్రీ సిద్ధాంత శిక్షామణి.మహాకాల సంహిత ,స్వచ్చ౦ద తంత్రం రాశాడు .

  216-నుంచి 225 వరకు ఆధారం –Inventory of Sanskrit Scholors ‘’

  సశేషం

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

35 ఏళ్ళ క్రిందటి శిష్యుడు యశ్వంతరావు దంపతులు 31-1-18 బుధవారం మా ఇంట్లో

35 ఏళ్ళ క్రిందటి శిష్యుడు యశ్వంతరావు దంపతులు 31-1-18 బుధవారం మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సరసభారతి 118 వ సమావేశం ‘’అమోఘమాఘమాసం ‘’లో నా ప్రసంగం

సరసభారతి 11 8 వ సమావేశం ‘’అమోఘమాఘమాసం ‘’లో నా ప్రసంగం

30-1-18 మంగళవారం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దీవాలయం లో సరసభారతి నిర్వహించిన ‘’అమోఘమాఘమాసం ‘’కార్యక్రమం లో  అధ్యక్షునిగా నా ప్రసంగం –

శిశిర ఋతువు లో చెట్ల ఆకులు ఎర్రబడి రాలిపోతాయి .ఈ ఋతువు మాఘమాసం తో ప్రారంభమౌతుంది .మఖా నక్షత్రం పౌర్నమినాడున్ననెల మాఘ మాసం .అఘం అంటే పాపం .మా అంటే తొలగించేది దూరం చేసేది .పాపాలను  పోగొట్టే  నెల  మాఘం . చెట్లకు చివుళ్ళు కూడా వస్తాయి .అలాగే పాపాలను రాల్చి పుణ్యం చివుళ్ళను  ఏర్పరచే  నెల.సూర్యారాధనకు శ్రేష్టమైన నెల .మాఘ ఆదివారం ఆవుపాలను ఆవు పిడకలపై పొంగి౦చి సూర్యునికి నైవేద్యం పెడతారు .మాఘ పంచమి వసంత పంచమి సరస్వతీ దేవి పుట్టిన రోజు .మాఘ శుద్ధ సప్తమి  రధ సప్తమి . ఆకాశం లో నక్షత్రాలు ఈ రోజు రధం ఆకారం లో కనిపిస్తాయి .సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది .ఉత్తరాయణం దేవతారాధనకు ముఖ్యం .ఉత్తరాయణ ప్రవేశంతో సూర్యుని మార్గం ఉత్తరానికి మారుతుంది .సూర్య రధ సారధి అనూరుడు లేక  అరుణుడు సూర్య రధ సప్తాశ్వాల ను ఈశాన్యం వైపు మళ్ళిస్తాడు .మాఘ పౌర్ణమి సముద్ర స్నానానికి మంచిది .మాఘ బహుళ  త్రయోదశి   మహా శివరాత్రి . శివుడు ఆవిర్భవించిన రోజు .కనుక అటు విష్ణువుకు ఇటు శివునికి  ప్రీతికర మైన నెల మాఘం అందుకే అమోఘం .

ఆడవాళ్ళు కొత్త నోములను మాఘమాసం లో నే పడతారు .లక్షవత్తుల నోము చేస్తారు .యజ్ఞయాగాదులకు మంచినెల మాఘం .పెళ్లిళ్లకు శుభప్రదం ‘’మాఘ మాసం ఎప్పుడొస్తుందో ‘’అని కన్నెలు ఎదురు చూస్తారు గ్రామ దేవతల తిరునాళ్ళు ఈ నెలనుంచే ప్రారంభమవుతాయి .మాఘమాసం లోసుపర్ణ సూక్తం , ఆదిత్య హృదయం ,అరుణ పారాయణ ,మహా సౌరమంత్రాలు, మయూరుని సూర్య శతకం  ,కృష్ణుని కొడుకు సాంబుడు పఠించి కుష్టు రోగం పోగొట్టుకున్న 12 శ్లోకాలు భక్తీ తో పతిస్తారు .’’శ్రీ సూర్యనారాయణా –వేద పారాయణా’’అంటూ స్తుతిస్తారు .బాలాంత్రపు రజనీకాంత రావు గారుమహాద్భుత౦గా గానం చేసిన ‘’ఉదయిస్తూ బాలుడు ఉల్లిపువ్వూ ఛాయా ‘’పాటను పాడుతారు వింటారు .సూర్యాష్టకం చదువుతారు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ .సత్యనారాయణస్వామి వ్రతం మాఘం లో అమోఘ ఫలితమిస్తుంది .

మాఘ స్నానం మహా పుణ్యఫలదం.ప్రవహించే నీటిలో అఘమర్షణ స్నానం సూర్యోదయానికి ముందే చేయాలి .మను చరిత్రలో ప్రవరాఖ్యుడు ‘’అఘమర్షణ స్నానమాచరించి సాంధ్య కృత్యము  దీర్చి సావిత్రి జపియించి సైకతస్థలి  కర్మ సాక్షి కెరగి ‘’స్నాన జప అర్ఘ్య విధి చేసినట్లు పెద్దన రాశాడు .మాఘ స్నానం మార్కండేయుడిని అపమృత్యు బాధ నుంచి తప్పించి చిరంజీవి ని చేసింది .మనసు మంచిది ,శుభ్రమైనదిగా ఉంటె శరీరమూ అలానే ఉంటుంది కోరిన కోరికలు తీరుతాయి .దీనికి ఉదాహరణగా స్వామి వివేకానంద రాసినా, చెప్పినా ‘’నాగ మహాశయుని గురించి తెలుసుకుందాం .

దుర్గా చరణ్ నాగ్ అంటే ఎవరికీ తెలియదు నాగమహాశయుడు అంటే తెలియని వారుండరు బెంగాల్ లో .ఇప్పటి బంగ్లాదేశ్ లో దియోగర్ లో 184 6 లో పుట్టి 1899 లో మరణించాడు . శ్రీ రామ కృష్ణ పరమహంస ముఖ్య శిష్యుడు .హోమియో డాక్టర్ .సంతృప్తి ఆయన జేవిత పరమావధి . రెండు చేతులా సంపాదన నిష్కల్మష మనసు .ఫీజుగా వచ్చిన డబ్బు ను దారిలో బాధ పడుతూ ఎవరు కనబడినా వారి చేతుల్లో పెట్టి ఒత్తి చేతులతో ఇంటికిచేరేవాడు .భార్య ఆయనకు అన్నిరకాలా అనుకూలవతి .ఒకరోజు పరమహంస ఈయనతో ‘’నువ్వెప్పుడూ రోగుల బాధ లపైనే దృష్టి పెడతావు నీకు ఆధ్యాత్మిక అనుభవం ఎలా వస్తుంది ‘’?అని ప్రశ్నించగానే ఆయన మనో భావం  గ్రహించి  వైద్య వృతిని తృణ ప్రాయం గా  విసర్జించిన మహోన్నతుడు .భార్యా పిల్లలతో పూజా పునస్కారాలు ధ్యానలతో పరమహంస సేవతో సంతృప్తిగా గడిపాడు .

ఒక మాఘ పౌర్ణమి అంటే ‘’మహా మాఘి ‘’నాడు ఆయన కలకత్తా వెళ్లి గంగా స్నానం చేయాలను కొన్నాడు .రైళ్ళు అన్నీ కిక్కిరిసి ఉన్నాయి వెళ్ళే అవకాశమే కలగలేదు .ఇంటి దగ్గరే విచారం గా ఉండకుండా  భగవధ్యానం తో  ‘’గంగమ్మా కరుణిం చవా  ‘’అని ప్రార్ధించాడు  అంతే ఆయన పాదాల చెంత భూగర్భ గంగానది పెల్లుబికి బయటికి వచ్చింది .అయన ఆయన కుటుంబ సభ్యులు గ్రామజనం అందరూ ఆ పవిత్ర గంగా జలం లో మాఘ స్నానం చేసి  పుణ్యం పొందారు .ఈ విషయాన్ని స్వామి వివేకానంద ఎన్నో సభలలో చెప్పి నాగ మహా శయుని ఔన్నత్యాన్ని లోకానికి చాటాడు .

జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి  ముందు ప్రవాహ జలం లో  స్నానించాలి .అప్పుడు  సూర్య కిరణాలలోని ఇన్ఫ్రా రెడ్ అల్ట్రా వయొలెట్ కిరణాల సాంద్రతలో లో మార్పు వచ్చి, అప్పుడు చేసిన స్నానం గొప్ప ఆరోగ్యాన్నిస్తుందని సైంటిస్ట్ లు రుజువు చేసి చెప్పారు .అది తెలియకపోయినా వేలాది సంవత్సరాలనుంచి మనం ఆ పని చేస్తున్నాం .దిలీప మహారాజు ఒకసారి వేటకోసం హిమాలయాలకు వెడితే సరస్సుదగ్గర ఒకముని కనిపించి ‘’మాఘ మాసం ఆ రోజే ప్రారంభం కనుక మాఘ స్నానం చేసిరా ‘’అంటే   చేసి వచ్చి దాని ఫలితం గురించి చెప్పమని అడిగితే ,రాజధానికి వెళ్లి కులగురువు వసిస్టు ని  అడగమని చెప్పాడు .ఆయన్ను అడిగితె ‘’ఒక గంధర్వుడి ముఖం వికృతంగా ఉండి మానసిక బాధ పడుతుంటే భ్రుగు మహర్షి మాఘస్నానం గంగానదిలో చేయమంటే చేస్తే మంచి రూపం వచ్చి మనస్తాపం తీరింది అని చెప్పాడు .ఇంద్రుని  చెడ్డ పనులవలన దేవతలకూ అపకీర్తి అంటుకొని బాధ పడుతూ విష్ణు మూర్తికి తమ గోడు చెప్పుకుంటే మాఘస్నానం చేయమని చెబితే చేసి పాపాలమూట దులిపేసుకున్నారు .

ఆంద్ర దేశానికి చెందిన సుమంతుడు ,కుముద భార్యా భర్తలు. ఆమె ఎంత పుణ్యమూర్తో వాడు అంత నీచుడు దుర్మార్గుడు. ఆమె సద్ధర్మ పారాయణ .ఒకమాఘమాసం  రోజు భర్త పొరుగూరికి వెళ్ళినప్పుడు జోరున వర్షం లో తడుస్తున్న సాధువుకు ఇంట్లో ఆశ్రయ మిచ్చింది .అతడు పడుకుని తెల్లవారుఝామున విష్ణు భజన చేసి నదీ స్నానానికి వెళ్ళిపోయాడు .మాఘస్నానం విశేష ఫలదం అని గ్రహించి భర్త  రాగానే అతనితో నదీ స్నానానికి వెడదా మంటే ఒప్పుకోక ఆమెనూ  వెళ్ళ వద్దన్నాడు  .విసుగుపడి ఆమె ధైర్యం గా వెళ్ళింది  .వాడు కర్రుచ్చుకుని కొట్టటానికి వెంటబడ్డాడు ఆమె గబుక్కున నదిలోకి వెళ్లి స్నానం చేస్తుంటే వాడు కర్రతో కొడుతుంటే కర్ర లాక్కుంటే వాడూ నీళ్ళలో పడిపోయాడు. అనుకోకుండా మాఘ స్నానం చేశాడన్నమాట .వాడిపుణ్యం పుచ్చి  దంపతులు ఇద్దరూ వైకుంఠంచేరుకున్నారు .ఇలాంటి కధలు ‘’మాఘ పురాణం ‘’లో చాలా ఉన్నాయి ..అందుకే ‘’అమోఘమాఘమాసం అన్నాను .

మాఘుడు అనే సంస్కృత కవి ఉన్నాడని ,ఆయన శిశుపాల వధ కావ్యం రాశాడని దానికి వ్యాఖాన చక్రవర్తి మల్లినాద సూరి ‘’సర్వం కష ‘’అనే గొప్ప  వ్యాఖ్యానం రాశాడని ఇది రాసేటప్పటికి వయసు ముదిరిపోయిందని తానె చెప్పుకున్నాడని మనకు తెలిసిన విషయాలే .ఇవాళ మహాత్మా గాంధీ గారి 70  వ వర్ధంతి కూడా .జాతిపిత మనకు , మన దేశానికి శుభాశీస్సులు ఇవ్వాలని  కోరుకుందాం . నభోమండలమధ్యవర్తి ,ప్రత్యక్ష ,కర్మ సాక్షి ,సవిత్రు నారాయణుడు ఆదిత్య భగవానుడు సదామనకు ఆరోగ్య భోగభాగ్యాలనిచ్చి కాపాడాలని సూర్య నమస్కారాలు చేద్దాం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-18 –ఉయ్యూరు .

 

 

.

w

— 



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 20 4-మిధిలా తత్వ విమర్శ కర్త –నరపతి ఝా (18 శతాబ్దం )

గీ ర్వాణకవుల కవితా గీర్వాణం -4

20 4-మిధిలా తత్వ విమర్శ కర్త –నరపతి ఝా (18 శతాబ్దం )

పరమేశ్వర మనవడైన నరపతి ఝా తరౌని గ్రామం లో పుట్టాడు . మిధిలా తత్వ విమర్శ,రాఘవ కీర్తి శతకం ,గోపీ వల్లభ కావ్యం ,వీర విరుదావలి,హంసదూతం ,ప్రబోధ చంద్రోదయం రచించాడు .ఖండ బాల వంశ రాజుల చరిత్ర ఏ రాఘవ కీర్తి శతకం .శ్రీ కృష్ణ జీవిత విశేషమే గోపీ వల్లభ కావ్యం..అంబరీష స్తుతి వీరవిరుదావలి అలభ్యం .

205- వంశధర ఉపాధ్యాయ ,చిత్రధర ఉపాధ్యాయ (17 శతాబ్దం )

17 వశతాబ్దికి చెందిన మహా మహోపాధ్యాయ వంశధార ఉపాధ్యాయ ,గోకులనాధుని మేనల్లుడు .విద్యాధరుడు తన ‘’విద్యాధర సహస్రక ‘’లో ను ,ఇతనికొడుకు చిత్రధరుడు శృంగార సరిని లోను వంశధార శ్లోకాలను ఉదాహరించారు .అభి యోగి కీర్తి అని కూడా అన్నాడు  .ఇంతకు  మించి వివరాలు లేవు .

206-18 శతాబ్దికి వాడైన మహామహోపాధ్యాయ చిత్ర ధర ఉపాధ్యాయ ,వంశధరుని పెద్దకుమారుడు .  రాజ స్తుతి పద్యం ,వినాయక స్తవం రాశాడు .ఇతని 5 శ్లోకాలను తరంగిణి లో ఉదాహరింపబడినాయి .

207-గీతా గోపీ పతి కావ్యకర్త –బాలకవి క్రిష్ణదత్త  (18 వశతాబ్దం )

18 వ శతాబ్ది పూర్వార్ధ బాలకవి కృష్ణ దత్త గీతా గోపీ పతి కావ్యకర్త .సోడరపుర వంశీకుడు .బాల్యం లోనే పలు శాస్త్రాలను అప్పలించి బాలకవి అనిపించాడు .దుర్గా దేవి పరమభక్తుడు తన వైదుష్యం ఆ తల్లి చలవే అంటాడు .భోసలరాజు జానుజీ మహా రాజు ఆస్థానకవి .మంత్రి దేవాజిపతి కోరఘోరే కు అత్యంత ఆప్తుడు .కావ్యాన్ని జయదేవుని అడుగు జాడలలో రాశాడు .రసమయ శృంగార కావ్యం గా తీర్చి దిద్దాడు .గీతాలు మధుమధురం .గీతాలమధ్య వచనమూ రాశాడు .రాదా కృష్ణుల ప్రణయ శృంగార్ కేళీ విలాసమే కావ్యం .లక్ష్మి గుణమణిమాల  ఖండ కావ్యాన్ని రాణి లక్ష్మీదేవి ఔదార్య దయా దాన గుణాలను వర్ణిస్తూ రాసింది .చండికా చరిత చంద్రికా ను దేవీ మహాత్మ్యం లో భాగాన్ని తీసుకుని రాశాడు .స్కాందపురాణం లోని సేతు మహాత్మ్యం దీని భూమిక .ఈ కవి గీత గోవింద వ్యాఖ్యానకర్త కూడా .దీనికి గంగా లేక శశిలేఖ అని పేరు పెట్టాడు .మహిమ్న స్తోత్రానికీ వ్యాఖ్య చేశాడు .

  నలోదయం పై సాహిత్య దీపిక రాసిన మరో క్రిష్ణదత్తుడు ,చౌర పంచాశిక వ్యాఖ్యాత ఇంకో  క్రిష్ణదత్తుడు కూడా ఉన్నారు .

208-కాశీ శివ స్తుతి కర్త –ఖగేశ (18 వ శతాబ్దం )

18 శతాబ్ది ఖగేశ  కవిరత్న బిరుదున్నవాడు .సమస్తిపూర్ జిల్లా తబాకా లో పుట్టాడు .నర్హాన్ జమీందార్ ప్రాపు ఉన్నవాడు ..కాశీ శివస్తుతి ,శిఖరిణీ శతకం ,కాశ్యాభిలాష స్తవం రాశాడు .

కరుణాకర ఉపాధ్యాయ కొడుకు రామ చంద్ర ఉపాధ్యాయ ‘’ప్రశస్తి రత్న ‘’రాశాడు .

209-రస ప్రదీపిక కర్త –సచల మిశ్రా (18 వ శతాబ్దం )

మహా మహోపాధ్యాయ సచల మిశ్ర ,రఘుదేవ రంభ దంపతుల కుమారుడు .మహా న్యాయవేత్తగా ప్రసిద్ధుడు .చిత్రధరుని శిష్యుడు .తిర్హట్ న్యాయాధిపతి .సంస్కృతం లో ఈయన 17 9 4 జూన్ 10 న వెలువరించిన తీర్పును కేపి జయస్వాల్ ప్రచురించాడు.పీష్వామాధవరావు  నారాయణ రెండు అగ్రహారాలను ప్రదానం చేశాడు .ఈయన రాసిన ఏకైక సంస్కృత కావ్యం –రస ప్రదీపిక .

210-రాధా నయన ద్విశతి కర్త-మోహన మిశ్ర (18 వ శతాబ్దం )

18 వ శతాబ్ది మహామహోపాధ్యాయ మోహన మిశ్ర సచాలమిశ్ర చిన్నతమ్ముడు .రాదానయన ద్విశతి అనే ఖండ కావ్యం ఒక్కటే రాశాడు .217 శ్లోకాలలో రాదా దేవి కనుల సోయగాన్ని తనివి తీర మనోహరం గా వర్ణించాడు .రాధ కృష్ణుల దివ్య ప్రేమకు అక్షర బృందావనం నిర్మించాడు .భక్తికల్పద్రుమం అనేది కూడా రాసినట్లు తెలుస్తోంది .

211-తారా చంద్రోదయ కావ్యకర్త –వైద్యనాధమిధిల (18 వ శతాబ్దం )

18 వ శతాబ్ది కవి వైద్యనాధ మిధిల-కేశవ చరిత్ర ,తారా చంద్రోదయ కావ్యాలను రాశాడు .వీటిని తన ప్రభువు రాజా ,కేశవా దేవా ,కుమారుడు రాజా తారా చంద్ర ళ కోరికపై వీటిని రచించాడు .ఇంతకంటే వివరాలు తెలియవు .

212-నలోదయ కావ్య కర్త –కాళిదాస మిశ్ర (18 శతాబ్ది )

మిధిలా వాసి కాళిదాస మిశ్ర నాలుగు ఆశ్వాసాల నలోద్యకావ్యం రాశాడు .ప్రజ్ఞాకార మిశ్ర కుమారుడు విద్యాకారా మిశ్ర దీనికి ‘సుబోధిని ‘’వ్యాఖ్యానం రచించాడు

21 3- రామవిజయ మహా కావ్య కర్త –రూపనాథ (178 6-187 4 ) వశతాబ్దం )

18 శతాబ్ది ఉత్తరార్ధకవి రూపనాధ 1786 లో జన్మించి , 8 8 ఏళ్ళు జీవించి 1874 లో చనిపోయాడు కవిత్వ ,దర్శన ,వేదాంతాలలో ప్రసిద్ధుడు .9 కందాల రామ విజయ మహా కవ్యం రాశాడు .మూలం వాల్మీకి రామాయణం .రావనునిపై రామ విజయమే కధ.

214-విద్యాకార సహస్రక కూర్పరి –విద్యాకార మిశ్ర (18 శతాబ్దం )

మహా మహోపాధ్యాయ విద్యాకరుడు మహామహోపాధ్యాయ ఆన౦దకర కుమారుడు ,ప్రజ్ఞాకారుని తండ్రి .నలోదయకావ్యం లో తండ్రి గొప్పతనాన్ని సంపూర్ణం గా వర్ణించాడు .తండ్రి సర్వశాస్త్ర పారంగాతుదని తర్కం లో కర్కశుడనిచెప్పాడు .ఆంత్రోపాలజిస్ట్ గా విద్యాకారుడు సుప్రసిద్ధుడు .వివిధకవుల కవితలను ముఖ్యంగా మిదిలకవుల కవితలు  కూర్చి విద్యాకార సహస్రిక తయారు చేశాడు  .అమరుశతకం ,రాక్షస కావ్యం ,రుతువర్నన ,విదగ్ధ ముఖ మండన లకు గొప్ప వ్యాఖ్యానాలు రాశాడు

215-సుబోధిని కర్త –ప్రజ్ఞాకార (18 శతాబ్దం )

ప్రజ్ఞాకర ,మహోపాధ్యాయ విద్యాకర కొడుకు .నలోదయానికి సుబోధిని వ్యాఖ్య రాశాడు .ఉపద్ఘాటం లో తన కుటు౦బ  కవుల మహా వైదుష్యాన్ని మహా గొప్పగా అభి వర్ణించాడు .

201 నుంచి –   215 వరకు ఆధారం –contribution of Midhila to Sanskrit .

సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-18 –ఉయ్యూరు

 

  

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 201-ముదిత మదాలస నాటక కర్త –గోపీనాధ ఉపాధ్యాయ (17 09-1740 )

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4

201-ముదిత మదాలస నాటక కర్త –గోపీనాధ ఉపాధ్యాయ (17 09-1740  )

మిదిలలో అత్యంత సర్వ శ్రేస్టకవి పండితుడుగా గుర్తింపబడిన గోపీ నాథ ఉపాధ్యాయ 1709  కాలం వాడు .మహామహోపాధ్యాయ పీతాంబరవిద్యానిధి  ,ఉమల కుమారుడు .ఇతని సోదరులు రఘునాధ ,లక్ష్మీ నాథలు కూడా గొప్ప పండితులు మహా మహోపాధ్యాయులే .తండ్రి వద్దనే అనేక శాస్త్రాలు నేర్చాడు .’’సాకల సారస్వత సంసార సార నీవీ భగవిత ,వాణీ విలస కవి ‘’అని గోపీనాధ తండ్రి గురించి చెప్పాడు .’’మిధిలలో  గత 40 0 ఏళ్ళలో మహామహోపాధ్యాయ  గోకులనాధ వంటి ఉత్తమోత్తమ కవి శాస్త్ర పండితుడు పుట్టనే లేదు ‘’అని డిసి భట్టాచార్య అనే చారిత్రిక పరిశోధకుడు  అన్నాడు .కానిగోపీనాద కవి గురించి సమగ్ర సమాచారం లభించకపోవటం దురదృష్టం .

  తాను స్పృశించి ,ప్రభావితం చేసి వదిలి పెట్టని సంస్కృత ప్రక్రియ ఏదీ లేదు .స్వీయ రచనలోనైనా వ్యాఖ్యానాలలోనైనా అయన ముద్ర అమోఘం ,శాశ్వతం .మహా మేధావిగా గణన కెక్కాడు .ఇతని శిష్యుడు ,’’ప్రేత వివాహ పధ్ధతి ‘’కర్త రామేశ్వరుడు గురువు గూర్చి ఎన్నో ప్రశంసా వాక్యాలు రాశాడు .ఘర్వాల్ రాజు ఫతేషా ఆస్థాన కవి గోకుల నాధుడు .దీని రాజధాని శ్రీనగరం .తాను రాసిన ‘’ఏకావలి ‘’అలంకార గ్రంధం రాజుకు అంకితమిచ్చాడు .సూక్తిముక్తావలి అనే మరో రచనలో నరేంద్ర సింహ యువరాజు గోపాలసింహ శోర్య పరాక్రమ వర్ణన  చేశాడు .ఎందరు రాజులు ఆహ్వానించినా వెళ్ళని గోకుల నాధుడు ,ఏముస్లిం పాలకుడు ,సమీ పించటానికి సాహసం చేయని పరాక్రమశాలి ఫతేషా ఆస్థానకవి అయ్యాడు .90 ఏళ్ళ సంపూర్తి జీవితం అనుభవించి గోపీనాధుడు కాశీలో1740 లో మరణించాడు .100 కు పైగా గ్రంధాలు రచించినా ,అందులో వెలుగు చూడనివి ఎన్నో ఉన్నాయి .తన ‘’కావ్యప్రకాశక వివరణ ‘’లో 30 రచనలను పేర్కొన్నాడు .అందులో శివ స్తుతి లేక శివ శతకం ,కాదంబరి కృతి శ్లోక మాత్రమె లభ్యం.

202- కేదార శతకకర్త –త్రిలోచన ఉపాధ్యాయ (18  వశతాబ్దం )

మహామహోపాధ్యాయ త్రిలోచన ఉపాధ్యాయ  గోకులనాధుని పెద్దన్నగారు .శివునిపై ‘’కేదారనాధ శతకం ‘’రాశాడు .

203 –మాలవిజయ  కావ్య కర్త –కవి శేఖర(18 వశతాబ్దం )

మాలవిజయ కావ్య కర్త కవి శేఖరుని కావ్య వ్రాతప్రతి దర్భంగా లో భద్రం గా ఉంది.గోకులనాధ కంటే చిన్నవాడు  .గోకులనాధుని కోరికపై రాశాడు .ఇందులో కవి గోకులనాథు డిని ‘’సత్యయుగ పురుషుడు ‘’గా కీర్తించాడు .కావ్యం నాలుగు భాగాలు . వీటికి విరించి సభా వర్ణనం  ,సత్య కాళి   ప్రస్తావన ,కాళీ మర్త్యావతారం ,శ్రీమద్గోకులనాద మహాశయా విజయ విలాసం ‘.వైష్ణవ ఆరాధనకంటే ,తాంత్రిక ఆరాధన శ్రేష్టం అని ఇందులో తెలియ జేశాడు .దీని వ్రాతప్రతి పైకాలం 17 01 అని ఉన్నది

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి 118 ,119 కార్యక్రమాలు 

సరసభారతి 118 ,119 కార్యక్రమాలు

1-మాఘమాసం సందర్భం గా 30-1-18 మంగళవారం సాయంత్రం 6-30 గం కుసరసభారతి 118 వ కార్యక్రమంగా ఉయ్యూరు  శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ”అమోఘ మాఘ మాసం ”ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేయబడింది
2-119 వ కార్యక్రమంగా 11-2-18 ఆదివారం సాయంత్రం గుడివాడలో శ్రీ వసుధ బసవేశ్వరరావు గారి ఆధ్వర్యం లో ”వసుధైక కుటుంబం ”కవితా సంకలనం ఆవిష్కరణ కార్య క్రమం ఏర్పాటు చేయబడింది .దీని వివరాలు వసుధ గారు త్వరలో తెలియ జేస్తారు
   అందరూ పాల్గొని జయప్రదం చేయమనవి
   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-18 -ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 191-సమాశక్తి నిర్ణయ కర్త –వనమాలీ బిస్వాల్ (19 61 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

191-సమాశక్తి నిర్ణయ కర్త –వనమాలీ బిస్వాల్ (19 61 )

4-5-1961 ఒరిస్సా యజిపూర్ జిల్లా తెలియాలో పుట్టిన వనమాలీ బిస్వాల్ ఎం ఫిల్,పిహెచ్ డి.అలహాబాద్ ఝా కాంప్లెక్స్ అసిస్టంట్ ప్రొఫెసర్ . సమాశక్తి నిర్ణయ,దికాన్సెప్ట్ ఆఫ్ ఉపదేశ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ ,సంగామేనాభిరామ ,వ్యాత ,నిర్ణయ స్వనః మొదలైన 40 పుస్తకాలు రాశాడు .విద్యావేత్త ,కవి ,20 ప్రైజులు పొందాడు .యుపి సంస్కృత సంస్థాన్ ,ఢిల్లీ సంస్కృత అకాడెమీ ,హిందీ సాహిత్య సమ్మేలన్,సంస్కృత అకాడెమి ల నుంచి పురస్కారాలు పొందాడు .

192-సాహిత్య దర్పణ కర్త –భాగీరధీ బిస్వాస్ (1958 )

నాదియాలో 1-2-19 58 పుట్టిన భాగీరధి బిశ్వాస్ అస్సాం యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .సాహిత్య దర్పణం ,సోషియాలజీ ఆఫ్ సాంస్క్రిట్ డ్రామా రాసాడు .

193- నారదీయ శిక్ష కర్త –దీహిత్ బిశ్వాస్ (చక్రవర్తి )-1955

1955 సెప్టెంబర్ 29 కలకత్తాలో పుట్టిన దీహిత్ బిశ్వాస్ కలకత్తా యూని వర్సిటి ప్రొఫెసర్ .సంస్కృత -నారదీయ శిక్ష రాశాడు

194 –పంచలింగ ప్రకరణకర్త –హేమలతా బోలియ (19 52 )

హేమలతా బోలియా 19 52 ఏప్రిల్ 22 ఉదయపూర్ లో పుట్టి ,అక్కడే మానవికి సంస్కృత మహా విద్యాలయం లో సంస్కృత ప్రొఫసర్ .రామ చంద్ర ద్వివేది ,ప్రొఫెసర్ విష్ణు రాం  నగర్ , ప్రొఫెసర్ రాధా వల్లభ త్రిపాఠీ ,గిరిధర్ లాల్ శాస్త్రి వంటి ఉద్దనదుల వద్ద విద్య నేర్చాడు .ఎంఏ పిహెచ్ డి.శ్యామానంద  మిశ్ర ,హేమంత దుగార్వాల్ ముఖ్య శిష్యులు .రాసిన నాలుగు పుస్తకాలలో మహారధ మంజరి ఏక అధ్యయన ,కారకప్రబోధ ,పంచలింగ ప్రకరణ ,భాక్తామర స్తోత్రం ఉన్నాయి

195 –బృహత్ సంహిత కర్త –సాయికళ ఇందిరా బోరా (1957 )

సాయికళ ఇందిరాబోరా 19-9-1957 అస్సాం నవగావ్ లో పుట్టి ఎంఏ పిహెచ్ డిచేసి ,గౌహతి ప్రాగ్జోతిష కాలేజి ప్రొఫెసర్ చేసింది రచించిన 5 పుస్తకాలలో రామాయణం ,భాగవత పురాణం ,బృహత్ సంహిత ,అభిజ్ఞాన శాకుంతలం ,కారక సంహిత ఉన్నాయి

196- భక్తి రస విమర్శ కర్త –కపిల్ దేవ బ్రహ్మ చారి (1943 )

కపిల్దేవ బ్రహ్మచారి సీతామధి లో 13-8-1943 జన్మించాడు .రిటైర్డ్ ఉపాచార్య .శాస్త్ర చూడామణి .భక్తి రస విమర్శ రాశాడు .యుపి ప్రభుత్వ పురస్కార గ్రహీత .

197-ఆంద్ర ప్రదేశ పర్యటనం కర్త –గౌరీ కుమార్ బ్రహ్మ (1919 )

ఎంఏ ,డిఎడ్ గౌరీ కుమార్ బ్రహ్మ 1919 సెప్టెంబర్ 5 ఒరిస్సాలో పుట్టి ,ఒరిస్సాప్రబుత్వ టూరిస్ట్ డైరెక్టర్ చేశాడు .ఆంద్ర ప్రదేశ పర్యటనం ,భారత సంహిత ,భంజా పంచాశిక రాశాడు .ఉత్కళ వాచస్పతి ,పురుష సరస్వతి ,వాగ్మి ప్రవర ,భారత ప్రదీప బిరుదులతో అలరారిన పండిత కవి

198- -సంస్కృత వాక్యనిర్మాణం పై పరిశోధించిన –సురేంద్ర కుమార్ బ్రహ్మచారి(1933 )

1933 డిసెంబర్ 20 బీహార్ చాప్రాలో పుట్టిన సురేంద్ర కుమార్ బ్రహ్మచారి కెఎస్ డి సంస్క్రుతయూనివర్సిటి ప్రొఫెసర్ వైస్ చాన్సలర్ .సాంస్క్రిట్ సింటాక్స్ అండ్ ది గ్రామర్ ఆఫ్ కేస్ ,కొ ఆర్డినేషన్ ఇన్ సాంస్క్రిట్ రాశాడు.ప్రెసిడెంట్ అవార్డీ .

199—అద్భుత పంచతాకావ్యం కర్త –బ్రహ్మదత్త వాగ్మి (1925 )

బ్రహ్మ దత్త వాగ్మి 1925 మార్చి 19  హర్యానా గుర్గాం లో పుట్టాడు . అద్భుత పంచతాకావ్యం సంస్కృతం లో ,కావ్యావతరణంహిందీలో  రాశాడు జ్యోతిష సాహిత్య వ్యాకరణ ఆచార్య .

200-మహాభారత సంశోధన ప్రతిస్టాన్ స్థాపన చేసిన –రామ చంద్ర బుదీహాల్ (1971 )

రామ చంద్ర బుదీహాల్ ఎంఎస్సి పిహెచ్ డి.13-12- 19 71  బెంగుళూర్ లో పుట్టాడు .ఏయిరో స్పేస్ ,డిఫెన్స్ ,శాటిలైట్ సిస్టం ల సొల్యూషన్ ఆర్కిటెక్ట్ –బెంగుళూర్ విప్రో టెక్నాలజీస్ .భారతీయ సంస్కృతీ వారసత్వ పరిరక్షణకు దీక్ష పూని మహాభారత సంశోధన ప్రతిస్టాన్.స్థాపించాడు .’’వ్యాస ‘’అనే ప్రత్యెక పరికరం తో ప్రాచీన గ్రంధాలను డిజిటలైజ్ చేస్తున్నాడు . ‘’సంస్కృత మొబైల్ లాబరేటరి’’ కి ఆద్యుడు ..మహా భారతానికి సంపూర్ణ విజ్ఞాన సర్వస్వం తయారు చేసే కృషిలో నిమగ్నమయ్యాడు .భారత రాష్ట్ర పతి చేత మహర్షి బాదరాయణ పురస్కారం ప్రదానం చేయబడ్డాడు .

191- నుండి 200 వరకు ఆధారం  — Inventory Of Sanskrit  Scholors

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-18- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 .

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 176 –నైమిశారణ్య తీర్ధ కర్త –రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్య (19 64 )

 గీర్వాణకవుల కవితా గీర్వాణం -4

176 –నైమిశారణ్య తీర్ధ కర్త –రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్య (19 64 )

1-3-19 64 కలకత్తా లో పుట్టిన రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్యఎం ఏ పిహెచ్ డి. కలకత్తా యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్.నైమిశారణ్య మహా తీర్ధం ,శివరూప బ్రహ్మచారి ,శబ్ద స్వరూప విమర్శ రాశాడు.

177-రాధా తంత్ర కర్త – సత్యపాద భట్టాచార్య (19 4 4 )

194 4 జులై 4 ఒరిస్సా నిసాన్ పూర్ జిల్లా అనాలియా లో పుట్టిన సత్యపాద భట్టాచార్య సాహిత్య ,న్యాయ ,అద్వైత ,సాంఖ్య ఆచార్య .వ్యాకరణ తీర్ధ .కలకత్తా ప్రభుత్వ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ .జోగేన్ద్రనాద్ బగాచి ,శ్రీమాన్ తర్క వేదార్ధతీర్ధ లశిష్యుడు .యాన్ భట్టాచార్య ,సత్యవ్రత పహరి ,దేవవ్రత పహరి ,రమా బెనర్జీ భవానీ గంగూలీలకు గురువు .వేదాంత పరిభాష ,రాధా తంత్రం , తర్క సంగ్రహం రచించాడు .నిఖిలలోక మహా మండలి సభ్యుడు .పూర్వాంచల్ సంస్కృత ప్రచార పరిషత్ ఫౌండర్ సెక్రెటరి .వంగీయ సంస్కృత స్నిఖార  సమితి  ప్రెసిడెంట్ .

178-నిగామానంద చరితం కర్త –శ్రీ జీవ భట్టా చార్య (18 88 )

1888 పశ్చిమబెంగాల్ 24 పరగణాల భట్ పాద లో పుట్టిన శ్రీ జీవ భట్టాచార్య కావ్య ,వ్యాకరణ ,న్యాయ తీర్ధ .14 గ్రంథాల రచయిత .నిగమానంద చరితం ,సారస్వత శతకం ,పాండవ విక్రమం ,మహాకవి కాళిదాసం ముఖ్యమైనవి .

179-సప్త శాస్త్ర పారంగత –సుఖమయ భట్టాచార్య (1909 )

8-1-1909 ఇప్పటి బంగ్లాదేశ్ లోని సిల్హాట్ లో పుట్టిన సుఖమయ భట్టాచార్య విశ్వభారతి సంస్కృత ఉపన్యాసకుడు .అపురూప సంస్కృత వ్రాత ప్రతుల పరిశీలన చేశాడు. సప్త శాస్త్ర పార౦గతుడు.అత్యుత్తమ దేశికోత్తమ బిరుదు పొందాడు .రవీంద్ర ,శిశిర పురస్కారాలతోపాటు రాష్ట్రపతి ప్రశంసా పురస్కారం అందుకున్నాడు .11 సంస్కృత రచనలు చేశాడు .వివరాలు అలభ్యం .

180—దేవ భాష ప్రవేశ కర్త –తన్మయ కుమార్ భట్టాచార్య (1971 )

కలకత్తా లో 7-3-1971 జన్మించి కావ్య ,వ్యాకరణ తీర్ధ ,సాహిత్య ఆచార్య తన్మయ కుమార్ భట్టాచార్య కలకత్తా రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ప్రొఫెసర్ .సిద్దేశ్వర పంచ తీర్ధ ,పండిట్ నారాయణ మిశ్ర ,పండిట్ పద్మనవ పాణిగ్రాహి ,ఆచార్య రామ రంజన ముఖర్జీలవద్ద చదివాడు .దేవ భాషా ప్రవేశిక రెండుభాగాలలో ,స్తోత్ర సంగ్రహం ,కథా కల్లోలిని ,విశ్వ సభ్యతాయాం వివేకాన౦దస్య అవదానం ,వ్యావహారిక సంస్కృత దర్పణం రాశాడు .రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ కో ఆర్డినేటర్ .

181-వేష అనావ్యాయోగ కర్త –వీరేంద్ర కుమార్ భట్టాచార్య (1917 )

వీరేంద్ర కుమార్ భట్టాచార్య 1917 కలకత్తాలో పుట్టి సంస్కృత లెక్చరర్ గా పని చేశాడు .11 పుస్తకాలు రాశాడు .అందులో కాళిదాస చరితం గీతా గౌరాంగం ,సూర్పణఖాభిసార ,శార్దూల శతకం , వేష అనావ్యాయోగ ముఖ్యమైనవి .ఆంగ్ల బెంగాలీ సంస్కృతాలలో అద్వితీయుడు.

182-శ్రీ ప్రత్యయ  ప్రకరణ కర్త –తపన్ శంకర భట్టాచార్య (195 9 )

కావ్య ,వ్యాకర ,తర్క తీర్ధ ,న్యాయ వ్యాకరణ ఆచార్య తపన్ శంకర భట్టాచార్య 17-1-1959 మిడ్నపూర్ లో  జననం .జాదవ్ పూర్ యూనివర్సిటి సంస్కృత అసోసియేట్ ప్రొఫెసర్ .పండితవాద్ బిహారీ త్రిపాఠీ ,పండిట్ ఆశుతోష్ న్యాయాచార్య ,పండిట్ మృణాల్ కాంతి బందోపాధ్యాల శిష్యుడు .చంద్ర భట్టాచార్య ,విశ్వరంజన పండాలకు గురువు .రచించిన 7 గ్రంధాలలో వైదిక వ్యాకరణ ,లఘు సిద్ధాంత కౌముది ,లకారార్ధ విషయే శాబ్దిక న్యాయికామిత సమీక్ష ,సిద్ధాంత కౌముది , శ్రీ ప్రత్యయ  ప్రకరణ ఉన్నాయి .బర్ద్వాన్ యూని వర్సిటి గెస్ట్ లెక్చరర్ .యూని వర్సిటి ఆఫ్ బర్ద్వాన్ విజిటింగ్ ఫెలో .

183-వీర మిత్రోదయ కర్త –పద్మప్రసాద్ భారత్ రాయ్ (1896 )

1896 నేపాల్ రామేచ్చప్ జిల్లా శాలసుమాలి లో జన్మించిన పద్మప్రసాద్ భారత్ రాయ్ ,కాశీ సన్యాసి పాఠశాలప్రిన్సిపాల్ .గురుపరంపర –పండిట్ దీనా నాథ భట్టా రాయ్,మహామహోపాధ్యాయ లక్ష్మణ శాస్త్రి ద్రావిడ్ ,పండిట్ నిత్యానంద పర్వతీయ ,మహా మహోపాధ్యాయ వృద్ధ వామచరణ్. .శంకరానంద ,సరస్వతి ,చేతనానంద స్వామి శిష్యులు వాత్సాయన భాష్యం ,వీర మిత్రోదయ ,న్యాయ కుసుమాంజలి మొదలైన 4 రాశాడు .న్యాయరత్న ఉపాధి అవార్డీ .1984 లో పద్మ  స్మృతిగ్రంథం ప్రచురింపబడింది .

184 –వైదిక భేషద్య కర్త –దేవ దత్త భట్టి (1939 )

సంస్కృత శాస్త్రి ,ఆనర్స్ డిగ్రీ ఉన్న దేవ దత్త భట్టి 3-6-1939 పాటియాలాలోజననం. అగర్నగర్ మలేర్కోట వేదిక్ రిసెర్చ్ హౌస్ డైరెక్టర్ .16 గ్రంథాలు రచించాడు .అవి – వైదిక భేషద్య,చికిత్సా కె ఆది శ్రోత ,వేద ,సంపా మొదలైనవి .2003 లో ప్రెసిడెంట్ పురస్కారం .అమెరికా ఇంగ్లాండ్ నేపాల్ వగైరా సందర్శనం .సంస్కృత కవిత్వ శైలి లో ప్రయోగ శీలి .

185-నూత నాంగ నాకం కర్త –భగవతీ భావదేవ (1902 )

పురాణ ,వ్యాకరణ ,వేదాంత తీర్ధ ,వేదాంత వాగీశ భగవతీ భావదేవ 1902  జనవరి 27 అస్సాం నాల్బరిజిల్లా కైతల కూచి  జననం .రచనలు –సతి జయమతి ,శ్లోకమాల , నూత నాంగ నాకం.

186-రామవనగమనం సంగీత నాటకకర్త –వనమాలా భావల్కర్ (1940 )

చరిత్ర సంస్కృత పిహెచ్ డి వనమాలా భావల్కర్ సాగర్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .రామ వనగమనం,పార్వతీ పరమేశ్వరీయం సంస్కృత సంగీత నాటక రచన .చైనా యుద్ధం నేపధ్యంగా’’ పాప్దండ ‘’ఏకాంకిక రాశాడు .

187-ముని శతకకర్త –మహాకవి భూరమాల్ (197 3 )

1973 లో మరణించిన మహాకవి భూరమాల్ రాజస్థాన్ సికార్ లో పుట్టాడు .శాస్త్రి .7 పుస్తకాలు రాశాడు –జయోదయ  మహాకావ్యం ,వీరోదయ  మహాకావ్యం ,సుదర్శనోదయ మహా కావ్యం ,ముని శతకం రచించాడు .’’ ముని జ్ఞాన సాగర్ ‘’అనే జైనాచార్యుడుగా లబ్ధ ప్రతిస్టు డు.కవిపుంగవ బిరుదున్నవాడు .దర్శన సాహిత్యాలనిది .

188-అద్భుద్దూతం కర్త –బిజే ఏ భూషణ అయ్యంగార్ (19 70 )

సాహిత్య వేదాంత విద్వాన్ భూషణ అయ్యంగార్ కర్నాటక మెల్కోటే లో పుట్టి .మైసూర్ మహారాజా సంస్కృత విశ్వవిద్యాలయ విశిష్టాద్వైత ప్రొఫెసర్ గా ఉన్నాడు. అద్భుద్దూతం తోపాటు అనేక నాటకాలు ,చంపు ,గద్యకావ్యాలు ,మహాకావ్యాలు స్తోత్రాలు సంస్కృతంలో రచించాడు . సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత .

18 9-త్రికాల సంధ్యా దేవతార్చనకర్త –బిదిరేపల్లి గోవిందాచార్య జయరామాచార్య (1933 )

బిదిరేపల్లి గోవిందాచార్య జయరామాచార్య14-10-1933 బెంగుళూర్ దగ్గర బిదిరేపల్లిలో జన్మించాడు .శ్రౌత త ,స్మార్త విద్వాన్ .శుక్లయజుర్వేద ప్రొఫెసర్ .నారాయణ భట్ట ,రంగాచార్య గురువులు .త్రికాల సంధ్యా దేవతార్చనం రాశాడు

190-ముస్లిమానాం సంస్కృత అభ్యాసః –కర్త –జి .డి . బీరజ్దార్ (అబ్బాస్ ఆలీ )-1935

మహారాష్ట్ర షోలాపూర్ లో 24-8-1935 జన్మించిన బీరజ్దార్  బొంబాయి సోమయసంస్క్రుత కేంద్ర జాయంట్ కన్వీనర్ .విశ్వభాష పత్రిక  సంపాదకుడు .వారణాసి విశ్వ సంస్కృత ప్రతిస్టాన్   జనరల్ సెక్రెటరి . . ముస్లిమానాం సంస్కృత అభ్యాసః,ప్రాచీన భారతీయ భౌతిక వాజ్మయం మొదలైన 5 గ్రంధాలు సంస్కృతంలో రాశాడు .మహా పండిత ,పండితేంద్ర ,సంస్కృత రత్న ,పరశురామ శ్రీ ,విద్యాపారంగత బిరుదాంకితుడు .రాష్ట్ర పతి పురస్కార గ్రహీత .

176 నుండి 190వరకు ఆధారం — Inventory Of Sanskrit  Scholors

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-18 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 159-విరక్తి విధిక ,భక్తి  విధిక కర్త –ముగ్గేరి మంజునాథ భట్ –(1916 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

159-విరక్తి విధిక ,భక్తి  విధిక కర్త –ముగ్గేరి మంజునాథ భట్ –(1916 )

కర్నాటక ఉడిపి లోని ముగ్గేరిలో 6-9-1916 జన్మించిన ముగ్గేరి మంజునాధ భట్ –సంస్కృత ఎం ఏ ,సాహిత్య విద్వాన్ .గోదావర్మ ,రామస్వామి శాస్త్రి లశిష్యుడు .విరక్తి విధిక ,భక్తీ విధిక అనే రెండు రచనలు చేశాడు .ఋగ్వేద ,అద్వైత ,సాహిత్యాలలో గొప్ప కృషి చేశాడు .

160 –మధురవాణి కర్త –నారాయణ భట్ (19 24 )

19 24 జూన్ 16 కేరళ కాసర్ గోడ్ జిల్లా ముగు లో పుట్టిన నారాయనభట్ మధురవాణి ,ఉదయన పత్రిక గ్రంధాలు రాశాడు .

161 –రామాయణ నవనీతం కర్త –సవితాభాట్ (1958 )

డి.ఫిల్.చేసిన సవితాభాట్ 1958 జులై 1 ముస్సోరీ లో పుట్టింది .అసోసియేట్ ప్రోఫెసార్ .రామాయణ నవనీతం ,వాల్మీకి కె వన ఔర్ వృక్ష రాసింది .

162-ద్రాహ్యాయన సూత్ర కర్త –శివరాం శంభు భట్ (1928 )

2-10-19 28 కర్నాటక హోసకుల్లి లో పుట్టిన శివరాం శంభు భట్ –సామవేద ,శ్రౌత ,తాండ్య మహా బ్రాహ్మణ లలో విద్వాన్ ఉపాధి .అధ్యాపకుడు ,భాస్కరిలోని ఆర్ బి ఎస్ ఎస్ మహా పాఠ శాల అధ్యక్షుడు . ద్రాహ్యాన సూత్ర-,త్రికాల సంధ్యావందన రచయిత.తిరుపతి దేవస్థానానికి సామవేద సంహిత రికార్డ్ చేశాడు అనేక జాతీయ ,అంతర్జాతీయ సంస్కృత సంమేలనాలలో పాల్గొన్నాడు .ఊహా రహస్యాంత ప్రకృతి ,వికృతి ప్రాజెక్ట్ లో ఉన్నాడు ప్రెసిడెంట్ అవార్డీ .

163-సంస్కృత వాక్య సంరచన కర్త –వసంత కుమారం భట్ (1953 )

19 53 ఫిబ్రవరి 21 గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పుట్టిన వసంత కుమారం భట్ –స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ ,గుజరాత్ సంస్కృత యూని వర్సిటి ప్రొఫెసర్ ,హెడ్ .గురువు బాలకృష్ణ పంచోలి .శిష్యుడు కాళిందీ పాథక్ .36 పుస్తకాలు రాశాడు ముఖ్యమైనవి –సంస్కృత వాక్య సంరచన ,పాణినీయ వ్యాకరణ విమర్శ ,పాణినీయ వ్యాకరణ అర్ధ .

164-త్రయి కర్త –కె. నారాయణ భట్ట (1959 )

ఎం ఏ ,పిహెచ్ డి,శాస్త్ర ప్రౌఢి-కె నారాయణ భట్ 5-2-19 5 9 కర్నాటక కార్వార్ జిల్లా సాల్కోట లో పుట్టాడు .మైసూర్ సంస్కృత యూని వర్సిటి ప్రొఫెసర్ .త్రయి ,యాస్క నిరుక్తం ,ఋతు సంహారం రచించాడు

165 –శ్లోక బద్ధ  సిద్ధాంత కౌముది కర్త –నారాయణ భట్ట (1855 )

1855 లో గ్వాలియర్ లో పుట్టిన నారాయణ భట్ట –శ్లోక బద్ధ సిద్ధాంత కౌఉది ,పంచ పంచాశిక ,ప్రతిభా సప్రతి చవి ,సంస్కృత శ్లోక శత సంగ్రహః స్వమిత్ర శ్లోక సంగ్రహః అనే 5 సంస్కృత రచనలు చేశాడు .

166-పరమ దైవతాః పతి కర్త –రాజేశ్వరి భట్ట (1964 )

జైపూర్ ఎల్ బి ఎస్ పిజి కాలేజి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ రాజేశ్వరి భట్ట 1964 లో పుట్టింది .అనేక సంస్కృత వ్యాసాలూ అనేకానేక సంస్కృత కధలు రాసి ప్రసిద్ధి చెందింది .చాలా పురస్కారాలు అందుకున్నది .ఈమె రాసిన ‘’పరమ దైవతాః పతి ‘’అనే కథ రాజస్థాన కథా కుంజం లో చోటు చేసు కున్నది అంటే ఆమె ప్రతిభ ఏమిటో మనకు తెలుస్తుంది.

167-మీమాంస శాస్త్రార్ద వల్లరి కర్త –వి.సుబ్రాయ భట్ట (1964 )

1-6-19 64 కర్నాటక సిద్దాపూర్ లో పుట్టిన వి సుబ్రాయ్ భట్ట ఎం ఏ పిహెచ్ డి..శృంగేరి రాజీవ్ గాంధీ రాష్ట్రీయ సంస్కృత కాంపస్ లో ప్రొఫెసర్ .రచనలు -.జైమిని న్యాయమాల ,మీమాంస శాస్త్రార్ద వల్లరి ,ఆపస్త౦భ పరిభాషా సూత్రం ,కూష్మాండ మంత్రార్ధ దీపిక .

168-న్యాయ ప్రమాణ పరిక్రమ కర్త –అభేదానంద భట్టాచార్య (1937 )

19 37 ఏప్రిల్ 10 అస్సాం కామరూప జిల్లా  కామాఖ్య నగర్ లో పుట్టిన అభేదానంద భట్టాచార్య వేదాంత ఆచార్య ,దర్శన ఎంఏ .,పిహెచ్ డి.డిలిట్ .సంస్క్రుతకాలేజి ప్రిన్సిపాల్ .పండిట్ రఘునాధ శాస్త్రి ,పండిట్ కమలాకాంత ,పండిట్ త్రిలోకాదార ద్వివేదీ ,విశ్వనాధ భట్టా చార్యాలు గురుపరంపర . న్యాయ ప్రమాణ పరిక్రమ,వేదాంత సూత్రా ,ప్రతిపాద్య విమర్శ రాశాడు .

169-మూలమాధ్యమిక మత ప్రకాశిక కర్త –ఆదిత్యానాద్ భట్టాచార్య  (1937 )

నాడియా లో 1-8-1947పుట్టిన ఆదిత్యానాద్ భట్టాచార్య ఎం ఏ పిహెచ్ డి.బర్ద్వాన్ యూని వర్సిటి ప్రొఫెసర్ .14 గ్రంధాలు రాశాడు . మూలమాధ్యమిక మత ప్రకాశిక,బ్రహ్మ విచార్యత్వ సమీక్షా ,ఆన్ ఎనలిటికల్ ఎక్స్పోజర్ ఆఫ్ కేనోపనిషత్ ముఖ్యమైనవి .జీవన సాఫల్య పురస్కారం ‘’విద్యాలంకార్ ‘’,పొందాడు .20 04 లో ‘’మాన్ ఆఫ్ ది యియర్ ‘’అవార్డ్ అందుకున్నాడు .ఏ బి ఐ రిసెర్చ్ బోర్డ్ గౌరవ సభ్యుడు అనేక అంతర్జాతీయ సెమినార్లకు మెంబర్ గా జనరల సెక్రెటరి గా ఉన్నాడు .

170-స్తోత్ర పుష్పాంజలి కర్త –అమర ప్రసాద భట్టాచార్య (19 25 )

19 25 బెంగాల్ లోపుట్టిన అమర ప్రసాద భట్టా చార్య వేదాంత ,కావ్య తీర్ధ .వేదాంత శాస్త్రి .ఎం ఏ పిహెచ్ డికలకత్తా దీనబంధు ఆండ్రూస్ కాలేజి సంస్కృత ప్రొఫెసర్ .ఉపనిషత్ప్రదీపం ,స్తోత్ర పుష్పాంజలి సంస్కృతం లోను ,నిమ్బార్కర ద్వైతాద్వైత దర్శన ,సమీక్షా పంచక బెంగాలీలోనూ రాశాడు .

171-కళాసిద్ధాంత దర్శిని కర్త –హరన్ చంద్ర భట్టాచార్య (1889 )

18 8 9 పశ్చిమబెంగాల్ రాజ సాహి జిల్లా బలుభార లో పుట్టిన హరన్ చంద్ర భట్టాచార్య  షెఖావతి సంస్కృత కాలేజి హెడ్ .గురువు శివకుమార శాస్త్రి .కళా సిద్ధాంత దర్శిని రాశాడు .19 42 లో బ్రిటిష్ ప్రభుత్వం చే మహా మహోపాధ్యాయ బిరుదు పొందాడు .

172-క్రోడ పత్రకారుడు –కాళీ శంకర భట్టాచార్య

అనేక క్రోడపత్ర రచయితగా పేరు పొందిన కాళీ శంకర భట్టా చార్య పశ్చిమ బెంగాల్ వాసి .కాలం తెలియదు .’’క్రోడపత్రకార్ ‘’గా సుప్రసిద్ధుడు .

173- విశుద్ధ  వైభవ మహాకావ్య కర్త –మనుదేవ భట్టాచార్య (1946 )

1946 జూన్ 28 బంగాల్ లో పుట్టిన మనుదేవ భట్టాచార్య వారణాసి సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ .గోపీనాధ ,రాజేశ్వరశాస్త్రి  లు గురువులు .విశుద్ధ వైభవ మహా కావ్యం ,రామ కృష్ణ చరితామృతం ,పండిత రాజ వైభవం రాశాడు .వ్యాకరణ భూషణ బిరుదు .

174-కార్య కారణ రహస్య కర్త –మోహన భట్టాచార్య (1912 )

5-2-1912 వెస్ట్ బెంగాల్ లోపుట్టిన మోహన భట్టాచార్య తర్క ,వ్యాకరణ ,వేదాంత తీర్ధ .అసిస్టెంట్ ప్రొఫెసర్ .మహా మహోపాధ్యాయ శ్రీ కృష్ణ చరణ్ ,మహామహోపాధ్యాయ చండీ దాస్ ల శిష్యుడు.కార్య కారణ రహస్యం ,అద్వైత మత సమీక్ష రచించాడు .

175-అవచ్చేదకత్వ నివృత్తి కర్త –పండిట్ వామచరణ్ భట్టాచార్య(18 80 )

18 80 లో కాశీ లో పుట్టిన పండిట్ వామ చరణ్ భట్టాచార్య న్యాయ ,వైశేషిక ఆచార్యుడు .కాశీ సంస్క్రుతకాలేజి హెడ్ .గురుపరంపర –పండిట్ గదాధర్ శిరోమణి ,పండిట్ సురేంద్ర మోహన్ ,తర్కతీర్ధ కైలాస చంద్ర శిరోమణి .ముఖ్య శిష్యులు –రాజేశ్వర శాస్త్రి ద్రావిడ్ ,పండిట్ శివదత్త  మిశ్ర ,ఖగేన్ద్రనాద్ పాండే ,మహామహోపాధ్యాయ కుంజ విహారీతర్క తీర్ధ ,మహామహోపాధ్యాయ పండిట్ రమేష్ చంద్ర తర్కతీర్ధ . అవచ్చేదకత్వ నివృత్తి ,జగదీషి మనోరమా టీకా రాశాడు .19 25 లో బ్రిటిష్ ప్రభుత్వం మహా మహోపాధ్యాయబిరుదునిచ్చింది .

 15 9నుంచి 175 వరకు ఆధారం – Inventory Of Sanskrit  Scholors

 సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-18- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కితా గీర్వాణం -4 156-ఆగమ కోశ ప్రాజెక్ట్ లో పని చేసిన –లక్ష్మీ నరసింహ భట్ (19 39 )

గీర్వాణ కవుల కితా గీర్వాణం -4

156-ఆగమ కోశ ప్రాజెక్ట్ లో పని చేసిన –లక్ష్మీ నరసింహ భట్ (19 39 )

వేద ,అలంకార ,పాంచరాత్ర ఆగమ విద్వాన్ లక్ష్మీ నరసింహ భట్ 19 39 ఆగస్ట్ 8 జన్మించాడు .తిరుపతి సంస్కృత విద్యాపీఠం రిటైర్డ్ ప్రొఫెసర్ .సంస్కృత ప్రతిభ సంపాదకుడు .న్యు ఢిల్లీ సాహిత్య అకాడెమీ రిసెర్చ్ జెనరల్ . తిరుపతి సంస్కృత విద్యాపీఠం.ఆగమ ప్రాజెక్ట్ లో పని చేశాడు .రాష్ట్ర పతి పురస్కార గ్రహీత .

 15 కు  ఆధారం –Inventory Of Sanskrit  Scholors .

15 7-ద్వారకా –పట్టాల కర్త –బీనా బాయి (15 వ శతాబ్దం )

రామానుజ ధోరణికి చెందిన బీనాబాయి రామానుజులవారి తర్వాత జన్మించి 1518 లోపు మరణించి ఉంటుంది .యదు వంశానికి చెందిన రాజు మా౦డలికుడు తన తండ్రి అని తన ‘’ద్వారకా –పట్టాల ‘’రచనలో చెప్పుకున్నది .ఈ రాజు కధియవార్ కు చెందిన గిర్నార్ రాజు గా  ఊహిస్తున్నారు .మొదటి మందాకుడు 11 వ శతాబ్ది వాడు .  రెండవ మా౦డలికుడు ఈమె తండ్రికాదు .కాని బీనాబాయి హన్సి సింధు భార్య పట్టపు రాణి .రాణి గా ఆమె అత్యంత ప్రభావ  శీలి ,గొప్ప పాలనానుభవమున్న రాణి గా గుర్తింపు పొందింది .తానేమీ విద్యావంతురాలిని కాదని ఆమె చెప్పుకున్నది .కాని ఆమె రచన చదివితే సకల శాస్త్ర పార౦గతురాలు అని అర్ధమవుతుంది .తాను శ్రీ కృష్ణ భక్తురాలినని ,తన జీవితం ఆయన సేవకే అంకితమని చెప్పింది .స్కాంద పురాణం లోని ప్రభాస ఖండం లో ఉన్న ద్వారకా మహాత్మ్యాన్ని చదివి తాను మైమరచి పోయి అత్యంత భక్తి  శ్రద్ధలతో దీన్ని రాశానని అన్నది .

   బీనాబాయి భారత దేశం అంతటా విస్తృతంగా పర్యటించింది .అనేక పుణ్య క్షేత్ర దర్శనం చేసి అక్కడ ఇతోధికంగా దానధర్మాలు చేసినట్లు పేర్కొన్నది.. ప్రజలందరితో సన్నిహిత సంబంధాలు కలిగి వారికి కన్నతల్లిలాగా అన్ని రకాల సదుపాయాలూ అందించింది .అందుకే ప్రజలు ఆమెను తమపాలిటి ‘’కల్పతరువు ‘’ గా ఆరాధించారు .ఆమె జీవితం స్వచ్చ గంగానది అంత పవిత్రమైనదిగా కీర్తించారు .

                           బీనాదేవి కవితా గీర్వాణం

‘’ద్వారకా-పట్టాల ‘’రచన లో నాలుగు భాగాలున్నాయి .మొదట్లో తనగురించి కొంత చెప్పుకున్నది బీనాదేవి .మొదటి అధ్యాయం లో స్కాంద పురాణం లో ద్వారకా పట్టణ విభాగాన్ని వర్ణించిన శ్లోకాలు చేర్చింది .ద్వారకానగర దర్శనం తో లభించే స్వర్గాన్ని వివరించింది రెండవ అధ్యాయం లో ద్వారక దేవతలైన గణేశ బలరామ ,కృష్ణ లను వర్ణించింది .అక్కడి ద్వారకగంగ గా పిలువబడే గోమతీ నది ,చక్రతీర్ధాలను గూర్చి చెప్పింది .మూడవదానిలో అక్కడి స్నాన విధులు ,ప్రసాదాలు ,గరిక తో పూజ చెప్పి నాలుగవ ధ్యాయం లో శ్రీ కృష్ణ పూజా విధానం తెలియ జేసింది .

  మొదటి అధ్యాయం లో కొన్ని శ్లోకాలు –

1-     ఏవం సంపూజితస్తేన హరిణా బ్రాహ్మణోత్తమః-ఉవాచ హరి సంతుస్టౌవరం బ్రూహీతి కేశవం .

158-గంగా  వాక్యావళి కర్త –విశ్వాస దేవి (15 వ శతాబ్దం)

మిధిల రాజు పద్మ సింహ భార్య విశ్వాస దేవి .చిన్నతమ్ముడు శివ సింహ చనిపోయాక పద్మ సింహుడు రాజయ్యాడు .భర్త మరణానంతరం  విశ్వాసదేవి రాజ్య పాలన చేబట్టింది .విశ్వాస దేవి ,శివ సింహ భార్య లక్ష్మా దేవి గొప్ప విదుషీమణులు .ఈ తోడికోడళ్ళువిద్యాపతి వంటి  కవి పండితులను అపూర్వంగా ఆదరించి పోషించారు .కనుకకాలం 15 వ శతాబ్ది .

 విశ్వాస దేవి రచించిన గంగా వాక్యావళి స్మృతి .గంగా నది పూజా విశేషాలను తెలియే జేసేది .స్మ్రుతి ,పురాణ ఇతిహాసాలలో గంగను  గూర్చి చెప్పబడినవన్నీ ఇందులో చూపింది రచయిత్రి .ఇందులో ఇరవై తొమ్మిది అధ్యాయాలున్నాయి .వాటికి స్మరణ ,కీర్తన ,యాత్ర ,గతి ,వీక్షణ ,నమస్కార ,స్పర్శన ,అభయ ,క్షేత్ర ,అవగాహన ,స్నాన ,తర్పణ ,మృత్తిక ,జప, దాన ,పిండ ,జల ,పాన ,ఆశ్రయ ,,ప్రాయశ్చిత్త ,కృత కృత్య ,మృత్యు ,విఘ్న ,ప్రతి సిద్ధ అని సార్ధక నామాలు పెట్టింది .

  మొదటి అధ్యాయం లో గంగ గొప్పతనం  ,రెండవదానిలో గంగ స్మరణ ,తర్వాత గంగాయాత్ర వగైరాలను వర్ణించింది .

మొదటి శ్లోకం –

‘’స్వస్తాస్తు వస్తుహ్నిన రశ్మి భ్రుతః ప్రసాదా –దేకం వపుః శ్రిత వతో ద్వరిఘా సమేత్య –తన్నాభ పంకజ సాహోత్య మృణాళ లీలా –మావిష్కరోతు హృది యస్య భుజంగ రాజః ‘’

భావం –హరిహర అద్వైత స్వరూపాన్ని కవయిత్రి  వర్ణిస్తోంది .శివుని  కంఠాభరణమైన శేషుడు హరి నాభి నుండి వెలువడుతున్న పద్మ౦  శోభను ఆసక్తిగా గమనిస్తున్నాడు .

2-     ‘’యావత్ పాతాళ మూలం స్పురదమల రుచిః శేష నిర్మోక వల్లీ-తా వహ్నిశ్వాస  దేవ్య  జగతి  గంగా వాక్యావళీయం’’

    ఇందులో భూమి ,స్వర్గం లలో ఉన్న ,ఎక్కడా కనిపించకుండా ఉన్న గంగను గురించి చెప్పింది .అంటే త్రిపధ గామి అయిన గంగ వలె తన కావ్యం చిరకాలం శోభిల్లుతుంది అని భావం .స్రగ్ధరా వృత్త శ్లోకం ఇది .

 

157 ,158 లకు ఆధారం –contribution of women to Sanskrit ‘’

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-18 –ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ఇంట్లో శేషుకుమారి దంపతులు

-27-1-18 శనివారం మధ్యాహ్నం మా ఇంట్లో -ప్రముఖ సాహితీ విమర్శకుడు ,ఆప్త మితృడు  ఉయ్యూరు హైస్కూల్ లో సహ సైన్స్ ఉపాధ్యాయుడు ,అంతకు మించి మా ఆత్మీయ కుటుంబ సభ్యుడు  స్వర్గీయ శ్రీ టి .ఎల్.కాంతారావు గారి మేనకోడలు ,మంచి కవయిత్రి  శ్రీమతి శేషుకుమారి శ్రీ చలపతి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు 

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు

మాఘ శుద్ధ ఏకాదశి  27-1-18 శనివారం నుండి మాఘ బహుళ ఏకాదశి 10-2 18 శనివారం వరకు ఉయ్యూరులో 15 రోజులపాటు శ్రీ వీరమ్మతల్లి తిరునాళ మహా వైభవంగా జరుగుతుంది .27 వతేదీ రావి చెట్టు బజారు లోనిఅత్తవారింటి నుంచి  బయల్దేరి 28 సాయంత్రానికి  విజయవాడ రోడ్డు చెరువు ప్రక్కనున్నహోమ గుండం లో ప్రవేశించిన  ఆలయ ప్రవేశం చేస్తుంది ఈ పదిహేను రోజులూ పెద్దఎత్తున జరిగే జాతర లో హిందూ ముస్లిం క్రైస్తవ భేదం లేకుండా సకల జనులు అమ్మవారిని భక్తితో సందర్శించు కుంటారు . గండ దీపాలతో స్త్రీలు,పురుషులు  ఆబాల  వృద్ధులు ఆలయానికి వెళ్ళే అమ్మవారి వెంట కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు  వారిని చూస్తె నడిచి వచ్చే అమ్మవారి ప్రతి రూపంగా కనిపిస్తారు ఉయ్యూరు తిరుణాల వైభోగం మాటలతో చెప్పలేనిది ప్రత్యక్షంగా చూసి అనుభవించాల్సిందే. సంతానం కోసం తడి బట్టలతో అమ్మవారి గుడి చుట్టూ భక్తితో నిద్రించే వారి కల లు ఫలించి సత్సంతానం కలుగుతుందనేది తిరుగు లేని నిదర్శనం . 11 వ రోజు సిడి బండీ ఉత్సవం లో కూడా వేలాది జనులు పాల్గొంటారు.  ఈ15 రోజులూ తప్పెట్లు తాళాలు నగారాలు రాం డోళ్ళు,దశ్శరభలు  వేటపోతుల కోళ్ల బలిదానాలు ,ఇళ్ళల్లో బంధు మిత్రులతో భోజన సంబరాలు  రోజూ తెల్లవారు జామునదాకా గుడి ప్రాంగణం లో హరికదా, బుర్రకథ నాటకాలు అమ్మవారి చరిత్ర గానం మహావైభవం గా ఉంటాయి .. మీ-గబ్బిట దుర్గాప్రసాద్

Inline image 1Inline image 2
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 136-రాధికా ప్రేక్షిక కర్త –శివ ప్రసాద్ భరద్వాజ్ (19 24 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

136-రాధికా ప్రేక్షిక కర్త –శివ ప్రసాద్ భరద్వాజ్ (19 24 )

45 గ్రంథాలు రాసిన శివ ప్రసాద్ భరద్వాజ 1924 అక్టోబర్ 15 ఉత్తరాఖండ్ పౌరి ఘర్వాల్ లో జన్మించాడు .సాహిత్య ఆచార్య ,సాహిత్య రత్న ,ఎం ఏ ,ఎం వో.ఎల్ పిహెచ్ డి,డిలిట్.పంజాబ్ లోని హోషియార్పూర్ ,పంజాబ్ యూని వర్సిటీ లలో సంస్కృత ప్రొఫెసర్ .అతని రచనలో ముఖ్యమైనవి –భారత సందేశ్ ,హూణపరాజయం ,జీవన సలధి , రాధికా ప్రేక్షిక.,సాహిత్య  శాస్త్ర నిధి .ప్రెసిడెంట్ అవార్డీ .పంచనదీయ సాంస్క్రిట్ పరిషత్ వ్యవస్థాపకుడు .యుపి సంస్కృత అకాడెమి విశిష్ట పురస్కారం పొందాడు . ‘’విశ్వ సంస్కృతం ‘’ క్వార్టర్లి పత్రిక సంపాదకుడు .

137-14 సంస్కృత నవలా రచయిత –ప్రమోద్ భారతీయ (19 65 )

20-9-1965 బీహార్ ఖగారియా జిల్లా నయాగాం లో పుట్టిన ప్రమోద్ భారతీయ సంస్కృత ,ఆంగ్లాలలో పిహెచ్ డి.ముస్సోరీ ఎం పి జి కాలేజి అసిస్టంట్ ప్రొఫెసర్ .సహపాహిని మొదలైన 14 సంస్కృత నవలలు రాశాడు .

138- శారదామణి లీలాచరిత కర్త – బాలకృష్ణ భరద్వాజ (1921 )

1921 లో హర్యానా కురుక్షేత్రం లో పుట్టిన బాలకృష్ణ భరద్వాజ సంస్కృతం లో శారదామణి లీలాచరితం ,రామకృష్ణ పరమహంస దివ్య చరితం రాశాడు .139-పద్య పుష్పాంజలి కర్త –కృష్ణ దత్ భరద్వాజ (19 08 )

1908 ఆగస్ట్ 15 ఉత్తర ప్రదేశ్ బులందర్ సహర్ లో జన్మించిన క్రిష్ణదత్ భరద్వాజ సంస్కృతాచార్య ,ఎం ఏ పి హెచ్ డి .ఢిల్లీ మోడరన్ స్కూల్ ప్రిన్సిపాల్ .పద్య పుష్పాంజలి మాత్రమె రాసి ‘’పద్మశ్రీ ‘’పొందాడు .ఢిల్లీ సంస్కృత అకాడెమి ,అవార్డ్ ,భారత రాష్ట్ర పతి నుంచి శ్రేష్ట సంస్కృత విద్వాన్ పురస్కారం అందుకున్నాడు .

14 0-ఆర్యనామాది నివాసస్థానం కర్త –పురుషోత్తమలాల్ భార్గవ్ (1909 )

1909 జైపూర్ లో జన్మించిన పురుషోత్తమలాల్ భార్గవ్ సంస్కృత ,హిందీ ఎం ఏ పిహెచ్ డి.రాజస్థాన్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ ,హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ .’’ఆర్య నామాది నివాస స్థానం ‘’అనే రిసెర్చ్ పేపర్ రాసి ,అమెరికాలో ని ప్రాచ్య విద్యా ప్రతిస్టాన్  ‘’లో సమర్పించాడు .

141-ఋగ్వేద చ రహస్యం కర్త –దయానంద భార్గవ (1937 )

సంస్కృత ఎం ఏ పి హెచ్ డి దయానంద భార్గవ 22-2-1937 రాజస్థాన్ జోధ్పూర్ లో జన్మించాడు .గంగారామ శాస్త్రి ,ఇంద్ర చంద్ర శాస్త్రి ,క్రిష్ణదత్ శాస్త్రి లు గురువులు .పండిత మధుసూదన ఓజా వేద విజ్ఞాన పీఠం చైర్మన్ .రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటి రీడర్ .ఋగ్వేద చ రహస్యం సంస్కృతం లోరాసి ,వైదిక విజ్ఞానం  ,వేద ధర్మ వ్యాఖ్యానాలకు  సంపాదకత్వం వహించాడు .ప్రెసిడెంట్ అవార్డీ .

142-వైదిక స్వాధ్యాయ కారత్ –భావానీలాల్ భారతీయ –(1928 )

19 28 నాగోర్ లో పుట్టిన భావానీలాల్ భారతీయ ఎం ఏ పి హెచ్ డి.సంస్కృత హిందీ భాషలలో 80 పుస్తకాలు రాశాడు .అందులో వైదిక స్వాధ్యాయ ,వేదాధ్యయన్ కె సోపాన్ ,ఆర్య లేఖనా కోశ ,ఆర్య సమాజ్ కె సాహిత్య కా ఇతిహాస  ఉన్నాయి .

14 3-స్తవ కుసుమాంజలి కర్త –కె.ఎస్. భాస్కర భట్ (1921 )

3-2-19 21 కర్నాటక సాగర్ తాలూకా లో పుట్టిన భాస్కర భట్ –దేవీ విలాస కావ్యం ,స్తవ కుసుమాంజలి రచించాడు .సాహిత్య భూషణ ,కవి కిశోరం బిరుదులు పొందాడు .

14 4-జలవాధాద నిశ్చలతత్వ విచారః కర్త –కె గణపతి భట్ (196 2 )

కర్నాటక జల్సూర్ లో 21-2-196 2 పుట్టిన గణపతి భట్ ఎంఏ పి హెచ్ డి.తిరుపతి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో అసిస్టంట్ ప్రొఫెసర్ . -జలవాధాద నిసశ్చల తత్వ విచారః,న్యాయావయవ విచారః రాశాడు .ఋగ్వేద క్రమ పాఠ నిధి .

145-పద రూపావళి కర్త –కె గణపతి భట్ (19 60 )

సంస్కృత ,సంగీతాలలో ఎం ఏ చేసిన కె గణపతి భట్ కర్ణాటకలో 4-7-1960 పుట్టి సంస్కృత టీచర్ చేశాడు .పండిట్ బాల చంద్ర ,పండిట్ మార్తాండ దీక్షిత్ ,పండిట్ చంద్ర శేఖర పౌరాణిక్ లవద్ద విద్య నేర్చాడు.6 పుస్తకాలు రాశాడు –అవే-  పద రూపావళి ,వేద గణితం,సంస్కృత గాన ధ్వని ,సంస్కృత ప్రభ ,దేవ పూజావిధానం.

146-కావ్యస్య శబ్ద నిస్టత కర్త –రాఘవేంద్ర భట్ (1977 )

ఎంఏ పిహెచ్ డి రాఘవేంద్ర భట్ 19 77 ఏప్రిల్ 2 కర్నాటక సంప లో పుట్టాడు .శృంగేరి రాజీవ్ గాంధి కాంపస్ అసిస్టంట్ ప్రొఫెసర్ .కావ్యస్య శబ్ద నిస్టత రాశాడు .

147-సుభాషిత శతకం కర్త-సరోజా భాటే (19 42 )

సరోజా భాటే 5-1-19 42 మధ్యప్రదేశ్ ఔంద్ లో పుట్టి ఎం ఏ పి హెచ్ డి చేసి ,పూనే భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ సంస్కృత ,ప్రాకృత శాఖ హెడ్ గా పని చేసింది .మొత్తం 16 పుస్తకాలు రాసింది .అందులో సుభాషిత శతకం తో పాటు ,ది రోల్ ఆఫ్ పార్టికల్  ‘’చ’’ ఇన్ ది ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ అష్టాధ్యాయి ,ది ఫ౦డ మెంటల్స్ఆఫ్ అను వృత్తి ,ది మహాభాష్య దీపికా ఆఫ్ భర్తృహరి ఆహ్నిక 6 ,లా ఇన్ వైదిక అండ్ ప్రాకృత లిటరేచర్ రచించింది .రాష్ట్ర పతి పురస్కార గ్రహీత .

148-భాషా కౌస్తుభ కర్త-భువన ఘోటే గణేశ భట్ (19 29 )

21-1-19 29 కర్నాటక శృంగేరి లోని విశ్వనాధ పురం లో పుట్టిన భువన ఘోటే భట్ విద్వాన్ .మైసూర్ మహారాజా సంస్కృత మహావిద్యాలయ  టీచర్ చేసి రిటైరయ్యాడు .చతుర్వేది రామ చంద్ర ,విష్ణుమూర్తి భట్ట శిష్యుడు .భాషా కౌస్తుభం ఒక్కటే రాశాడు .

149-శబ్ద విద్యా సౌరభ కర్త-గంగాధర భట్ (1927 )

రాజస్థాన్ ఆల్వార్ లో 19 27 జనవరి 1 జన్మించిన గంగాధర భట్ ఎం ఏ పిహెచ్ డి.జైపూర్ లో రాజస్థాన్ యూని వర్సిటీ ప్రొఫెసర్ .రాయ్ బహదూర్ చంపాలాల్ రిసెర్చ్ యూని వర్సిటి డైరెక్టర్ .రాజస్థాన్ సంస్కృత అకాడెమి చైర్మన్ .రాజస్థానీ యమాభినవ సంస్కృత సాహిత్యం ,శబ్ద విద్యా సౌరభం ,రాజస్థాన గౌరవం సంస్కృత రచనలు .స్వరమంగళ సంస్కృత పత్రిక ఎడిటర్ .భారత ప్రభుత్వం చే విద్వత్ సమ్మాన్ అందుకున్నాడు ఆయన రచనలపై గుప్తా అనే విద్యార్ధి రిసెర్చ్ చేశాడు .మహా రాణామేవార్ ఫౌండేషన్ నుంచి హరిత్రిషి పురస్కారం లభించింది .

150-జయభారతాదర్శ కావ్య కర్త –గోస్వామి ఫల్గుణ్ భట్ (1915 )

1915 బికనీర్ లో పుట్టిన గోస్వామి ఫల్గుణ్ భట్ ,బికనీర్ నగర పాలికా డైరెక్టర్ .జయభారతాదర్శ కావ్యం రచించాడు .కావ్య ,జ్యోతిష ,సాహిత్య ,కర్మకాండ ,ఆయుర్వేద ఘనుడు .

151-లలనా లోచనోల్లాస కర్త –హరి వల్లభ భట్ (18 6 6-1920  )

1866 లో జన్మించి శ్రీ క్రిష్ణరాం భట్ ,శ్రీ కుందనరాం ,భాయినాద్ ఓజా వంటి సుప్రసిద్ధుల శిష్యుడై వ్యాకరణ ,వైద్యకశాస్త్ర ,న్యాయ శాస్త్ర విద్వా౦సుడ య్యాడు .జయనగర పంచరంగ ,లలనా లోచనోల్లాసం ,కాంత వక్షోజ శక్త్యోదయః ,శృంగార లహరి ,దాస కుమారదాసా వంటి 10 గ్రంధాలు రాశాడు. 54 ఏళ్ళు జీవించి 1920 లో చనిపోయాడు .కవిమల్ల అవార్డ్ గ్రహీత .

152-రామాయణ కాలీన  సమాజంఏవం  సంస్కృతి కర్త –జగదీశ్ చంద్ర భట్ (19 5 6 )

సాహిత్యాచార్య ,ఎం ఏ పిహెచ్ డి జగదీశ్ చంద్ర భట్ 10-5-1956 యుపి లోని పితౌఘర్ లో పుట్టాడు .గురువులు మదననారాయణ త్రిపాఠీ ,పండిట్ వేదానంద ఝా ,డా.హరినారాయణ దీక్షిత్ . -రామాయణ కాలీన  సమాజంఏవం  సంస్కృతి అనే గ్రంధం మాత్రమె రాశాడు .

153-శంకర భాష్య గీతా  ముద్దిస్య గీతాయా వివేచనాత్మకాధ్యయనం కర్త –జయంత్ కరుణా శంకర్ భట్ (1933 )

కావ్య తీర్ధ ,పురాణ ,ఇతిహాస ,సాహిత్య ,జ్యోతిష వేదాంత ములలో శాస్త్రి డిగ్రీ పొందిన జయంత్ శంకర భట్ 25-1-1933 గుజరాత్  జునాగడ్ జిల్లా బాదల్పూర్ లో జన్మించాడు .అసోసియేట్ ప్రొఫెసర్ .కమల్కాంత మిశ్ర ,ప్రతాప్ రాయ్ మోడీ గురువులు . శంకర భాష్య గీతా  ముద్దిస్య గీతాయా వివేచనాత్మకాధ్యయనంఅనే విలువైన ఒక్క గ్రంధమే రాశాడు .

154- అను భూతి శతక కర్త –జీత్ రాం భట్ (1 6 2 )

9-11-19 62 ఉత్తరాఖండ్ భట్వారి లో పుట్టిన జీత్ రాం భట్ ఎం ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ,బిఎడ్ ,పిహెచ్ డి.ఢిల్లీ సంస్కృత అకాడెమి డిప్యూటీ సెక్రెటరి .భక్తి  రసామృతంఏక అధ్యయన ,అనుభూతి శతకం రాశాడు .గొప్పకవి విమర్శకుడు .

155-స్వర్ణ కోశ కర్త –కాకు౦జే కృష్ణ భట్ (1916  )

కౌటిల్య అర్ధ శాస్త్రం ,స్వర్ణ  కోశం ,వ్యాకరణ వ్రుత్తి రచించిన కాకుంజే కృష్ణ భట్ 1916 ఏప్రిల్ 1 కేరళ కాసర్ గోడ్ జిల్లా కాకుంజే లో పుట్టాడు .కర్నాటక నీలాచల మహా రాజా సంస్కృత కాలేజి మీమాంస ప్రొఫెసర్ చేసి రిటైరయ్యాడు .విష్ణు  భట్ట ,వెంకటప్ప శర్మ ,బాల సుబ్రహ్మణ్య శాస్త్రి గురుపరంపర .మీమాంస ,అద్వైత వేదా౦తాలలొ ఘనుడు .

136 నుండి 155 వరకు ఆధారం –Inventory Of Sanskrit  Scholors .

 

   సశేషం

  భారత రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో

   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 .

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణ తంత్ర లో తంత్రమే మిగిలింది 

గణ తంత్ర లో తంత్రమే మిగిలింది

ఇన్నేళ్ల గణ తంత్రం లో మిగిలింది అన్నిటా తంత్రమే
అదీ  దుస్తంత్రమే మనపాలిటి దౌర్భాగ్యమే   
మర్చిపోయింది జన గణమన్సులనే   
జనగణన ”తలల లెక్కింపు ” ప్రతి ఎన్నిక ముందూ తప్పని సరే 
ఓట్లు రాల్చుకోటానికి నోట్లు పంచుకోటానికే 
గణతంత్ర వేడుక రాష్ట్ర పతి ముందు రోజు తీపి కబుర్లతో 
 ఆ రోజు కవాతు దృశ్యాల మురిపాలతో సరి 
ఇష్టమొచ్చినట్లు ప్రకటించే ”పద్మాల ”తోసరే సరి 
పొందిన వాళ్లకు ఘన పొగడ్తల తంత్రాలైతే 
రానివాళ్ళ కుతంత్రాలనే నిష్ఠూరప్పలుకుల మంత్రాలే 
ఒకరికొకరు పంపుకునే శుభా కాంక్షల హోరే 
బడిలో ,ప్రభుత్వ ఆఫీసులలో వేడుకలే కానీ 
ప్రజా స్పందన లేని ఉత్తుత్తి వేడుకలే మిఠాయి పంపకాలే 
రేడియో టీవీలలో ముందు రోజు అఖిలభారత కవి సమ్మేళనాలే 
వాటికి  ప్రాంతీయభాషా నాదస్వరాలే  
సాధించిన  ప్రగతికి ,అధిగమించాల్సిన  అధోగతి కీ
అంతరాలు తీరే రోజే నిజమైన జన ఘన  గణ తంత్ర వేడుక. 
 జన ఘన గణ తంత్ర వేడుకలను ఆహ్వానిస్తూ  
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-26-1-18 -ఉయ్యూరు 
               
Posted in కవితలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 126-సుప్రియ సార్ధ వాహ కర్త –సోమబసు సిక్దార్ (19 61 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4

126-సుప్రియ సార్ధ వాహ కర్త –సోమబసు సిక్దార్ (19 61 )

19 61 మే 1 బెంగాల్ చిన్సురా లో పుట్టిన సోమబసు సిక్దార్ సంస్కృత ఎం ఏ పి హెచ్ డి.  రవీంద్ర భారతి వేదిక్ స్కూల్ ,రీడర్ ,.సుప్రియ సార్ధవాహ ,జాతకా ఆఫ్ భద్ర కల్ప వాదన రాశాడు .

127- దాంపత్యం కర్త –నరేష్ బాత్రా (19 5 6 )

వ్యాకరణ ,సాహిత్యాచార్య నరేష్ బాత్రా హర్యానా పానిపట్ లో 28-12- 19 5 6 జన్మించాడు .అంబాలా ఆదర్శ సంస్కృత విద్యాలయ ప్రిన్సిపాల్ .దా౦పత్యమ్  కావ్యం రాశాడు .

128-శబ్ద బ్రహ్మ సమీక్షణం కర్త –జైదేవన్ బావ (19 36 )

కేరళలో 29-11-19 36 అలప్పూజ జిల్లా చేరువనం లో పుట్టిన జై దేవన్ బావ  సంస్కృత ఎం ఏ పి హెచ్ డి చేసి ,కాల్పేట్టా ప్లాటినం జూబిలీ సంస్కృత కళాశాల వ్యాకరణ హెడ్ గా పని చేశాడు .శబ్ద బ్రహ్మ సమీక్షణం మాత్రమె రాశాడు .వ్యాకరణ ,దర్శన ,వేదాంతాలలో లబ్ధ ప్రతిష్ట ఉన్నవాడు .

129-ఖండన ఖండ ఖాద్య సంపాదన కర్త –శ్రీ రామ శాస్త్రి భాగవతాచార్య (18 5 9-1913 )

18 59 ఫరూకా బాద్ కాశీ బదౌసి లో జన్మించిన భాగవతాచార్య శ్రీ రామ శాస్త్రి –సాహిత్య ,వ్యాకరణ ,న్యాయ ,వేదాంత ,సాంఖ్య యోగ ,న్యాయ వైశేషిక లలో ఆచార్యుడు .కాశీ సంస్కృత కళాశాల సంస్కృత లెక్చరర్ .బాలక్రిష్ణాచార్య ,రామకృష్ణ శాస్త్రి ,పండిట్ మహాదేవ శాస్త్రి గురువులు .బైబిల్ ను సంస్క్రుతీకరించిన జాన్సన్ ఈయన శిష్యుడే .15 గ్రంథాలు రచించాడు వాటిలో ఖండన ఖండ ఖాద్య సంపాదన ,శ్రీ భాష్య టీకా ,నయకమలాకర ,కావ్య ప్రకాశాస్య ,దోషోద్ధార ముఖ్యమైనవి .54 ఏళ్ళు  జీవించి 1913 లో మరణించాడు .మహామహోపాద్యాయ  బిరుదు పొందాడు .

130-సంస్కృత విద్యా వ్యాప్తి కర్త –వామన బాలకృష్ణ భగవత్ (1918  )

24-1-1918 మధ్యప్రదేశ్ సతారా లో జన్మించిన వామన బాల కృష్ణ భగవత్ –కావ్య తీర్ధ ,వ్యాకరణ రత్న ,వ్యాకరణ పార౦గతుడు.బాలముకుంద మహా విద్యాలయ ప్రిన్సిపాల్ .సంస్కృత టీచర్స్  ట్రెయింగ్ ప్రోగ్రాములు నిర్వహించి భాషా వ్యాప్తికి విశేష కృషి చేశాడు .భండార్కర్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ఫెలో .చాలా గ్రంధాలు రాశాడు .వేదిక్ సంశోధన మండల్ లో సేవ లందించాడు .రాష్ట్ర పతి పురస్కార గ్రహీత భగవత్ సంస్కృత పాఠాలను రికార్డ్ చేసి రికార్డ్ సృష్టించాడు .

131-రామ చంద్ర వాగ్విలాస కర్త –గంగాధర భల్లా (19 27 )

సంస్కృత ,హిందీ పి హెచ్ డి గంగాధర భల్లా 1-1- 19 27 రాజస్థాన్ ఆల్వార్ లో పుట్టి రాజకీయ మహా విద్యాలయ ,రాజస్థాన్ యూని వర్సిటీలలో బోధన చేశాడు .భగవాన్ అమృతా నాద వైభవం ,రామచంద్ర భగవాన్ వాగ్విలాసం రాశాడు .స్వరమంగళ సంస్కృత పత్రిక సంపాదకుడు .సంస్కృత అకాడెమీ ,అఖిలభారత విద్వత్ సమ్మాన్ అందుకున్న విదుషి .మహారాణా మేవార్ ఫౌండేషన్ వారి హరిత రుషి పురస్కార గ్రహీత .

132-ఉత్తరాంచల సందేశ కర్త –గోవింద సింగ్ భండారి (1955 )

1955 జూన్ 4 బాగేశ్వర్ లో పుట్టిన గోవింద సింగ్ భండారి ఎం ఏ ఎల్ ఎల్ బి .బాగేశ్వార్ జిల్లాకోర్ట్ అడ్వొకేట్ .ఉత్తరాంచల్ సందేశ ,మాతృభూమి రాశాడు .

133- ఆత్మ చరితం కర్త –త్రయంబక ఆత్మారాం భండార్కర్ (1897 )

1897 లో వారణాసి లో పుట్టిన త్రయంబక ఆత్మారాం ఆచార్య ఎం ఏ ,ఆచార్య ..వారణాసి వసంత కాలేజి ప్రాచార్యుడు .ఆత్మ చరితం ,శ్రీ వివేకానంద చరితం ,రాశాడు .ఢిల్లీ యూని వర్సిటి సంస్కృత పి జి క్లాసులలు వివేక చరితం పాఠ్య గ్రంధం .

134-శిక్షణే మాతృభాష   ప్రభావ కర్త –భాను మూర్తి జె . (1957 )

విద్యా ప్రవీణ ,ఎం ఏ ఎం ఎడ్ ,పిహెచ్ డి –జె.భాను మూర్తి 15-3-19 57 ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టాడు .భోపాల్ కాంపస్ ఆర్ఎస్ కె ఎస్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ . రాసిన 5 గ్రంధాలలో శిక్షణే మాతృ భాష ప్రభావ, అధిగమస్య మనో వైజ్ఞానిక ధారా ,క్షేమేంద్ర కవేహ్ చారు చర్య ,జగన్నాధస్య చిత్ర మీమాంసా ఖండనం ,చిత్ర బంధ రామాయణం ,కాక శివ సూత్రాణి కి సంపాదకత్వం వహించాడు .

135 –త్వం కధం విస్మ రామి –కర్త –రాజేష్ భరద్వాజ (1956 )

ఎం ఏ పి హెచ్ డిరాజేష్ భరద్వాజ 19 5 6 అక్టోబర్ 5 ఉత్తరప్రదేశ్ హాపూర్ లో పుట్టాడు .బరేలికాలేజి యూని వర్సిటీలలో ప్రొఫెసర్ .త్వం కధం విస్మరామి,మాలినీ శతకం ,బాల్య కదా సప్తకం రాశాడు  .

-12 6 నుండి ౧౩౫వరకు ఆధారం –Inventory Of Sanskrit  Scholors .

  సశేషం

 రిపబ్లిక్ దినోత్సవ శుభా కాంక్షలతో

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment