నా దారి తీరు -121  గుడివాడ డివిజన్ లో విద్యా విషయక కార్యక్రమాలు

నా దారి తీరు -121

 గుడివాడ డివిజన్ లో విద్యా విషయక కార్యక్రమాలు

నేను అడ్డాడ హైస్కూల్ హెడ్ మాస్టర్ గా ఉండగా ,గుడివాడ డివిజన్ డిప్యూటీ విద్యా శాకాది కారులు కొందరుమారి కొత్తవారు వచ్చారు .శ్రీమతి ఇందీవరం గారి తర్వాత ఎవరొచ్చారో గుర్తులేదుకాని శ్రీ ఏసుపాదం గారు రావటం బాగా జ్ఞాపకం .ఆయన రావటం తోనే చాలాహడివిడి చేసి  మీటింగులు పెట్టి  డివిజన్ లో ఏవేవో గొప్పమార్పులు తేవాలని తీవ్ర ప్రయత్నం చేశారు .హెడ్ తలాడిస్తే  తోకలూఊపాల్సినదేకద.మేమూ  తలాడించి పనిచేశాం .ఆయన ‘’గాడ్ ఫియర్ ‘’పర్సన్ గా కనిపించారు .అప్పుడే కొత్తగా పబ్లిక్ పరీక్షలకు వెళ్ళే విద్యార్ధులకు కరదీపికగా హాండ్ బుక్ తయారు చేయటం ప్రారంభమైనదని జ్ఞాపకం .దీనికిగాను సబ్జెక్ట్ లో కాస్త పట్టు ఉన్న హెడ్ మాస్టర్లు అసిస్టెంట్ లు కలిసి సబ్జెక్ట్ కమిటీలుగా ఏర్పాటై పరేక్షలలో  వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు  వాటి సమాధానాలతో ఏ సబ్జెక్ట్ కు ఆ సబ్జెక్ట్ కు తయారు చేసే పనిపట్టాం .నేను ఇంగ్లీష్ ,ఫిజికల్ సైన్స్ కమిటీలలో ఉన్నాను .ఇంగ్లీష్ లో నిధి అంగలూరు హెడ్మాస్టర్ శ్రీ జోశ్యుల సూర్యనారాయణ మూర్తిగారు మాకు ఇంగ్లిష్ కమిటీ హెడ్ .ఫిజిక్స్ కు నారాయణశర్మగారు అనే శ్రీ కూచిభొట్ల లక్ష్మీ నారాయణ శర్మ గారు హెడ్ అని గుర్తు .వీరు నామిత్రులు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారికి తోడల్లుడు .సబ్జెక్ట్ లో నిధి .అన్ని విషయాలు  వ్రేళ్ళమీద ఉండేవి .చైన్ స్మోకర్  ప్రైవేట్ కాలేజీలో ఫిజిక్స్  లెక్చరర్ గా సాయం కాలాలో పని చేసేవారు .ఆయన తెల్లటి మల్లు పంచే తెల్ల హాఫ్ హాండ్స్ షర్ట్ తో ఉండేవారు .కొంచెం నలుపురంగుగా ఉన్నా  చిరునవ్వు ముఖం .చాలా సరదాగా మాట్లాడేవారు . జోక్స్ పేల్చటం ఆయన హాబీ .ఆయన నవ్వు కూడా విటగా ఉండేది .లోకల్ ప్రైవేట్  హై స్కూల్ లో సైన్స్ టీచర్ . ఎవరికి ఏ సందేహమోచ్చినా తీర్చగలసత్తా ఉన్న వ్యక్తీ .నేను రిటైరయ్యాకే ఆంజనేయ శాస్త్రి  గారికి ఈ శర్మగారు తోడల్లుడు అని తెలిసింది .అంతటిదాకా తెలీదు  నేన౦టే  పరమ ఆత్మీయంగా ఉండేవారు . మీటింగ్ లలో ఇద్దరం ప్రక్కప్రక్కనే కూర్చునే వాళ్ళం .ఆయన పలకరింపు ఒక పులకరి౦పే .రిటైరయ్యాకకూడా ఫోన్ లో పలకరించుకొనే వాళ్ళం . అతిగా సిగరెట్లు తాగటం వలననో ,ఏమోఆయన సుమారు పది, పదిహేనేళ్ళ  క్రితమే  మరణించారని విన్నాను .

    నేనూ, అంగలూరు సైన్స్ మాస్టర్ శ్రీ పొట్లూరి రాజేంద్రప్రసాద్ మొదలైనవాళ్ళం ఫిజిక్స్ బాచ్ లో ఉన్నాం  .మేము సలహాలుఇస్తే రాజేంద్రప్రసాద్ గారు బాధ్యత అంతా తానేతీసుకొని పూర్తి చేసేవారు .ఇక్కడే చిరివాడకు చెందిన సోషల్ మేస్టర్ వేలూరి ఆయన (కృష్ణమూర్తి ?)బాగా పరిచయమయ్యారు .అలా అన్ని సబ్జెక్ట్ ల వారూ తయారు చేసి డివిజన్ తరఫున ప్రింట్  చేయించి ప్రతిస్కూల్ కు అక్కడున్న విద్యార్ధుల సంఖ్యను బట్టి సరఫరాచేసే ఏర్పాటు జరిగింది .జనవరి ,ఫిబ్రవరి ,మార్చి నెలలో ఈ పుస్తకాలు చదివితే ఉత్తీర్ణత గారంటీ అనే అభిప్రాయం తో తయారైనపుస్తకాలివి .వీటిని ప్రతి స్కూల్ లోను ఆవరేజ్, బిలో ఆవరేజ్ విద్యార్ధులతో బాగా చదివించి లెక్కలు అయితే చేయించి పాస్ అవటానికి మార్గం సుగమం చేశారు .దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన డివిజన్స్ వాళ్ళూ  అనుసరించారు  .తర్వాతతర్వాత ఏ డివిజన్ కు ఆ డివిజన్ వాళ్ళు శ్రమపడి తయారు చేశారు .శ్రీ ఏసుపాదం గారు తర్వాత జిల్లా విద్యాశాఖాధికారి అయ్యారు .అప్పుడు జిల్లాలోని సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్శ్ కూర్చుని జిల్లాకంతటికీ ఈ సోర్స్ బుక్స్ లేక గైడ్ బుక్స్ తయారు చేయించి పంచిపెట్టి౦చి నట్లు జ్ఞాపకం .తర్వాత కొన్నేళ్ళు ఈ జాతర కొనసాగింది .కృష్ణా జిల్లా ప్రదానోపాధ్యాయ సంఘం కూడా కీలక బాధ్యతలు చేబట్టి ఈ బృహత్ప్రయత్నానికి యధా శక్తి సాయం చేసింది .తరువాత తర్వాత దీనిపై మోజుతగ్గి మొహం మొత్తి విరమించారని విన్నాను .ఏసుపాదంగారు ఇక్కడ ఉండగానో లేక ఏలూరు బదిలీ అయ్యాకో ‘’అవినీతి కుంభకోణం’’ లో బుక్ అయి సస్పెండ్ అయ్యారని తెలిసింది .ఒకప్పుడు 1970దశకం లో జాన్ గారనే డియివో కూడా ఇలాగే దెబ్బతిన్నారు .అధికారులు పైకి నిర్దుష్టంగా  ,లోపల లోపభూయిష్టంగా ఉండటమే దెబ్బతినటానికి కారణం .

   నేను రిటైరవ్వటానికి ముందు గుడివాడ  డిప్యూటీ ఎడ్యుకేషనల్ఆఫీసర్ గా  శ్రీ టి. శ్రీరామమూర్తిగారు  వచ్చారు  .మితభాషి . సజావుగా చక్కగా పని చేసి అందరి మన్ననలు అందుకొన్నారు .ప్రతిస్కూల్ కు విజిట్లు, వార్షిక తనిఖీలు పెండింగ్ లేకుండా చేసి విద్యా రంగానికి మార్గదర్శనం చేశారు .పరీక్షలు నిర్దుష్టంగా జరిపించారు .మంచి మనిషిగా బాధ్యత గల ఆఫీసర్ గా గుర్తింపు పొందారు .మా అడ్డాడ హైస్కూల్ ఇన్స్పెక్షన్ కూడా చేసి బాగా సంతృప్తి చెందారు .మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలాఉందని మిగిలిన స్కూల్స్ లో చెప్పేవారు .నా రిటైర్మెంట్ రోజున మా ఆహ్వానం పై వచ్చి ,నా పి.ఎఫ్. (ప్రావిడెంట్ ఫండ్ )నుంచి రావాల్సిన 60 వేల రూపాయల డబ్బు ను చెక్కు రూపంగా తెచ్చి నా చేతిలో పెట్టి సర్ప్రైజ్ చేశారు .ఇలాంటి ఆఫీసర్లు ఉంటే పని చేసేవారికి ఆనందం సంతృప్తి .మనసులు గెలవటం అంటే ఇదే .

   సశేషం

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-19-ఉయ్యూరు

—

—


—


— 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు శుభవార్త 

సాహితీ బంధువులకు శుభవార్త

నిన్నసాయంత్రం ఉయ్యూరు సిటీ కేబుల్ అనబడే ”మన ఛానల్ ”కు చెందిన జర్నలిస్ట్ శ్రీ ప్రకాష్ నన్నుకలిసి ”మాస్టారూ !సరసభారతి ప్రచురణలన్నీ ”మనఛానల్ ”ద్వారా ప్రసారం చేద్దాము మీకు ఎప్పుడు వీలు ఉంటుందో చెబితే కెమెరామన్ ను మీ ఇంటికి పంపిస్తాను ”అన్నారు .సంతోషం అని థాన్క్స్ చెప్పాను .ఇవాళఉదయం కెమెరామన్ శ్రీకాంత్ ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటారు అని అడిగితె ”నీకు వీలున్నప్పుడు రా ”అన్నాను ”ఐతే సాయంత్రం 4గంటలకు వస్తాను ”అన్నాడు ఒకే అన్నాను
  అన్నట్లుగానే వచ్చాడు మొదటగా  ”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకాన్ని పరిచయం చేశాను .సుమారు 15 నిమిషాలలో .ఇది ఈరోజు రాత్రికి ప్రసారం అవుతుందని చెప్పాడు .సరే అన్నా .రేపు”ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పిత  డా పుచ్చా వెంకటేశ్శ్వర్లు ”గారి పుస్తకం పరిచయ చేస్తాను .తర్వాత ”కెమోటాలజి పీత కోలాచల సీతారామయ్య ”గారి పుస్తకాన్ని ఆతర్వాత వరుసగా మరికొన్నిటిని పరిచయం చేస్తాను .దీనికి ప్రకాష్ గారి ఉత్సాహానికి ,సరసభారతి పై ఆయనకు మా ఛానల్ కూ ఉన్న  ఆదరాభిమానాలకు, వీడియో తీసిన శ్రీకాంత్ కు ధన్యవాదాలు -దుర్గాప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నా దారి తీరు -120 సంఘం ద్వారా చేబట్టిన మరికొన్ని మంచిపనులు

నా దారి తీరు -120

సంఘం ద్వారా చేబట్టిన మరికొన్ని మంచిపనులు

జిల్లాపరిషత్ హెడ్ మాస్టర్ల వార్షిక ఇంక్రిమెంట్ శాంక్షన్ గుమాస్తాకు లక్ష్మీ ప్రసన్నం చేస్తేనే కాని జరిగేదికాదు .అలాగే ఎవరైనా హెడ్మాస్టర్ లీవ్ పెడితే ,అది శాంక్షన్ అవటానికి ,జాయినింగ్ పర్మిషన్ పెడితే దాన్ని ఆమోదించి విధులలో చేరమని ఆర్డర్ ఇవ్వటానికీ కూడా ఇదే ‘’ఆమ్యామ్యా ‘’తంతు జరిగేది .బందరు దగ్గరున్నవాళ్ళు ఈ పని తేలికగా చేయి౦చు కొనేవాళ్ళు .దూరంగా ఉన్నవాళ్ళు ఇక్కడికొచ్చి గుమాస్తానుకలిసి ‘’చేతులకు తడి అంటించి ‘’వెడితే కాని ఇవేవీ గ్రాంట్ అయ్యేవికావు .పరిషత్ విద్యాశాఖాధి  కారి అంటే పియివో ఎవరొచ్చినా దీన్ని ఆపగలిగేవారుకాదు .కృష్ణా జిల్లా గిల్డ్ ,పి.ఆ.ర్టి,కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ నాయకులు కూడా ఏమీ చేయలేక  వాళ్లవంతు ప్రయత్నం చేసేవారు .జరిగితే సరి లేకపోతెఖర్మ అన్నట్లు ఉండేది .ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి శ్రీ పి.వెంకటేశ్వరరావు అనే లెఫ్ట్ నాయకుడు రోజూ జిల్లాపరిషత్, డియివోఆఫీసుల చుట్టూ తిరిగి  వాళ్ళవాళ్లకు దమ్మిడీ ఖర్చు లేకుండా పనులు చేయించేవారు .ఆయన సహృదయుడు మాటకారి సంస్థ వెన్నుదన్ను బలంగా ఉన్నవాడు .కనుక ఆయన చెబితే చేయకపోతే ధర్నానో నినాదాలో వీధి పోరాటాలకో దిగుతాడని భయపడి ఆయన చెప్పిన పనులన్నీ,అన్ని కేడర్ల వారికీ  దాదాపు చేసేవారు .ట్రాన్స్ ఫర్స్ విషయం లోనూ ఆయనమాట చెల్లుబడి అయ్యేది .మిగిలినవారికి ‘’ప్రసన్నం ‘’చేసుకోవటమే సొల్యూషన్ గా ఉండేది .ఈ బాధలు తీర్చేవారెవరు అని మా  సంఘం  ఎదురు చూసేది .

ఆపద్బాంధవుడు శ్రీ పివి .రామారావు

పరిషత్ విద్యా శాఖాదికారిగా శ్రీ పెండ్యాల వెంకటరామారావు గారు గోదావరి జిల్లానుంచి బదిలీ అయి వచ్చారు .రూల్స్ బాగా తెలిసినమనిషి .పనికంటే మాటలు ఎక్కువ .కానిమంచి వారు సహృదయులు .ఒకసారి నేనూ ఆదినారాయణ  విశ్వం కలిసి సాయంవేళ ఆయన్ను ఆఫీసులో కలిసి మాట్లాడాము .జిల్లాలో పెండింగ్ సమస్యలు గుర్తు చేశాము .వచ్చినవారందరికీ టీ బిస్కెట్లు తనస్వంత ఖర్చుతో ఇచ్చాకనే ఆయన  మాట్లాడేవారు .ఎప్పుడైనా ఇది తప్పకుండా జరిపే విధానంగా ఉండేది .మేము వెళ్లేసరికి ఆయన టేబుల్ నిండా ఇటూ అటూ, టేబుల్ కిందా ప్రక్కనా అటూ ఇటూ కనీసం ఒకవంద ఫైళ్ళు ఉన్నాయి .ఆయన ముందు అందర్నీ మాటల్లోకి ది౦చేవారు ఆప్రవాహం లో ఆయన అనుభవాల ధారలో అలా కొట్టుకు పోయేట్లు చేసేవారు .ఈ మాటల్లో అసలు ఫైళ్ళు ముట్టుకునేవారుకాదు గుమాస్తాలు వచ్చి గోలపెట్టేవారు చూస్తాను చూస్తాను అని వాయిదాలపై వాయిదాలు .దీనితో అక్కడి స్టాఫ్ లో అసంతృప్తి పైగా  బ్రాహ్మణుడుకనుక మరీ చులకనయ్యారు .మేము రెండు మూడు సార్లు ఈ పరిస్థితిని గమనించాం .ఇకలాభం లేదని ‘’సార్!ఇలా పెండింగ్ రామారావుగా పెండ్యాలరామారావు మారితే జిల్లా లో కలకలం బయల్దేరి   అసంతృప్తిపెరిగి ,మాకు మీపై ఉన్న సాఫ్ట్ కార్నర్ తొలగి మేమూ అందరితోకలిసి యాజిటేషన్ చేయాల్సి వస్తుంది. దయ చేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు .మీకు సాయంకావాలంటే మేము వస్తాం దగ్గరుంటాం ఫైల్స్ క్లియర్ అయ్యేదాకా ఎన్ని రోజులైనా మా స్కూల్ డ్యూటీ ముగించి మీదగ్గరకు వచ్చి కూర్చుంటాము .మీరు ‘’ఆపరేషన్ ఫైల్ క్లియరింగ్ ‘’ప్రారంభించాల్సిందే .మళ్ళీ ఇంకో సారి చెప్పము ‘’అని వార్న౦గ్ లాంటి సలహా ఇచ్చాము .’’ఏకళన‘ఉన్నారో’’ ఆయన ‘’ఒకే. మీరు ఇంతగా చెప్పారు కనుక రేపటించే ఫైల్ క్లియరింగ్ మొదలెడతాను .రేపు సాయంత్రం మీరు .రండి ఇక్కడ ఎవరి పర్మిషన్ మీకు అక్కర్లేదు .డైరె క్ట్ గా నా ఆఫీసు రూమ్ కి రండి’’అన్నారు .హమ్మయ్య అనుకొన్నాం  .

అనుకోన్నట్లే మళ్ళీ మర్నాడు ఆయన ఆఫీసుకు వెళ్లి కూర్చున్నాము .నిన్నటి ఫైల్స్ కుప్పలన్నీ అలాగే ఉన్నాయి .కిందపెట్టిన ఒక కుప్పదగ్గర తేలు కూడా కనిపించింది .అంటే ఫైల్స్ ఉన్నాయని ఊడవటం కూడా చేయలేదన్నమాట .మమ్మల్ని చూసి ఇక చకచకా ఫైల్స్ చూడటం క్లియర్ చేయటం అనుమానాలోస్తే గుమాస్తాని పిలవటం నివృత్తి చేసుకోవటం సంతకాలు పెట్టి వెంటనే వాటికి ఎవరికి పంపాలో అదేశాలివ్వటం జరిగింది. రాత్రి 9వరకు అలా కూర్చునే ఉన్నాం .ఆయన మాతో ఏదో హస్క్ కొడుతూనే ఉన్నారు .మధ్యలో నేను ‘’సార్ ఫైల్ ‘’అంటూనే ఉన్నాను .ఇకాయనకు సంతకాలు పెట్టీపెట్టీ చేతులు నొప్పెట్టి ‘’అయ్యా ఇవాల్టికి ఆపేద్దాం ‘’అన్నారు .బహుశా ఇలా నాలుగైదు రోజులు ఎవరో ఒకరం ఆయన ఆఫీసులో ఆయనవద్ద కూర్చుని మొత్తం ఫైల్స్ అన్నీ క్లియర్ చేసి ఆయనకు బాడ్ నేం రాకుండా మాపరువు పోకుండా కాపాడుకున్నాం .సమర్ధత ఉన్నా ఆయన అలసత్వం వల్ల జరిగిన డిలే ఇదంతా.

సైన్స్ పరికరాల కొనుగోలు

ప్రతి ఎదాదికానీ ,రెండేళ్ళకోసారి కాని జిల్లాపరిషత్ సైన్స్, లెక్కలు ,సోషల్ పరికరాలుకొని స్కూళ్ళకు సరఫరా చేస్తుంది .వీటిలో అనవసరమైనవి పనికిరాని గతఏడాది ఇచ్చినవీ కక్కూర్తిపడి కంపెనీల ప్రలోభానికిఆఫీసర్లు లొంగి కొన్నవీ సప్ప్లై చేసేవారు .రామారావుగారిని కలిసినప్పుడల్లా ఈ విషయాలు దృష్టికి తెచ్చేవాళ్ళం .ఒకసారి ఆయన నన్నుపిలిపించి ‘’కొత్తపరికారు కొనబోతున్నాము .ఇండెంట్లు ,ఖరీదు వివరాలు కంపెనీలు పంపాయి .మీరు వీటిని చెక్ చేసి ఆవస్తువుకు ఆధర తగినదాకాదా అవి ప్రస్తుతానికి అవసరమా ,ఇవికాక ఇంకా ఏమైనా కావాలా తేల్చాలి’’అన్నారు .’’నేనొక్కడినే చేస్తే మన  ఇద్దరికీ లాలూచీ అని నిందవేస్తారు .కనుక దీనికి ఒక కమిటీ వేయ౦డి  .ఆకమిటీ విచారించి  నిగ్గు తేల్చి మీకు రిపోర్ట్ ఇస్తుంది అప్పుడు ప్రాబ్లెం ఉండదు ‘’అన్నాను .’’మంచి సలహా .తప్పక అలాగే చేద్దాము ‘’అని ఎవరేవరైతే బాగుంటుందో నన్ను సలహా అడిగీ ఆయనా విచారించి కమిటీ వేయటం మేముమోహమాటం లేకుండా నిర్దుష్టంగా రిపోర్ట్ ఇవ్వటం మంచి అవసరమైన నాణ్యమైన పరికరాలు అ౦దుబాటుధరలో కోనేట్లు చేయటం జరిగింది .ఇది శ్రీ పెండ్యాలరామారావు గారి ఘనత.ఆయన ఒక నిర్ణయం తీసుకొంటే వెనక్కి తిరగటం ఉండేదికాదు. అంతటి మొండిమనిషికూడా  .ఆమ్యామ్యా లకు తావులేకుండా మంచితనం తో పనిచేశారు .

ఆయన రిటైర్ అయ్యాక జిల్లా ప్రధానోపాధ్యా సంఘం జిల్లాలోని ఇతర  సంఘాలను కలుపుకొని జిల్లాపరిషత్ మీటింగ్ హాల్ లో చైర్మన్  గారి అధ్యక్షతన ఘన సన్మానం చేశాం .

కార్డ్ కాంపైన్

నేను 1998 జూన్ లో ప్రధానొపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసేవరకు  కృష్ణా జిల్లా  ప్రధానోపాధ్యాయ సంఘం లో  ఉపాధ్యక్షుడిగా ఉన్నట్లు జ్ఞాపకం .రిటైర్ అయ్యాక కూడా సంఘానికి శ్రీ రామం గారితోపాటు నన్ను సలహా సంఘ సభ్యుడిని చేశారు .పదవిలో ఉన్నప్పుడూ ,రిటైర్ అయ్యాకకూడా సంఘ కార్యక్రమాలకు తప్పని సరిగా హాజరై ,నా అభి ప్రాయాలను సూచనలు తెలియ జేసేవాడిని  .కార్యక్రమాల వివరాలు శ్రీ ఆదినారాయణఎప్పటికప్పుడు ముందుగా ఫోన్ చేసి లేక కార్డ్ రాసి తెలియజేసి నన్ను తప్పక రమ్మని కోరేవారు .నేనూ అలానే వెళ్ళేవాడిని .కార్యక్రమాలలో ఏదైనా మంచి జరిగితే దానినీ ఏదైనా సవ్యంగా లేకపోతె దానినీ ఇంటికి వచ్చి శ్రీ ఆదినారాయణ కు ‘’కార్డు ‘’మీద నా అభి ప్రయాలు రాసేవాడిని .కార్డు లో మిల్లీమీటరు ఖాళీ కూడా లేకుండా రాయటం నా అలవాటు .అవన్నీ జాగ్రత్తగా చదివి మరుసటి సమావేశం లో ఆదినారాయణగారు  నేను రాసిన విషయాలు సభ్యులకు తెలియ జేసేవారు  .తీసుకున్న దిద్దుబాటు చర్యలు కూడా చెప్పేవారు .నేను ఇలా చాలాఉత్తరాలు ఆయనకు సంఘ అభివృద్ధి ,చేయాల్సిన కార్యక్రమాలు మర్చిపోయిన మనుషులు ,గుర్తి౦పు పొందని  హెడ్ మాస్టర్లు  ఇంకా పకడ్బందీగా సంఘం పని చేయటానికి ఎంతనే పరిష్కరించటానికి మార్గాలు  సూచనలు  హెడ్ మాస్టర్లు  నాకు ఫోన్ చేసికాని ఉత్తరాలద్వారాకాని తెలియజేసినవారి సమస్యలు  వాటిని సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ,పే స్కేల్స్ పై సమావేశాలు ,అమలు జరపటానికి మార్గాలు ఇలా ఒకటేమిటి సమస్త విషయాలు నేను సెక్రెటరి శ్రీ ఆదినారాయణ కు ‘’కార్డ్ కాంపై న్’లాగా కార్డు మీద మాత్రమె రాశాను .దాదాపు ఒక యాభై దాక రాసి ఉంటాను .ఆయన వీటిని అతి జాగ్రత్తగా భద్ర పరచుకొన్నారు .ఈ విషయం ఆయనే చాలా సార్లు నాకు ,సంఘానికి సమావేశాలలో తెలియ జేసేవారు .అవన్నీ ఆయనకు ‘’ఒక ట్రెజర్ ‘’అని పొంగిపోయేవారు .గట్టున ఉండి సలహా లు ఇవ్వటం తేలికే .కాని పని చేసి మెప్పించటం చాలాకష్టం .అందరి బాధ్యతా సంక్షేమం తనది సంఘానిదీ అని ఆయన పడిన కష్టం శ్రమ తపన బదులు తీర్చుకోలేనిది .జిల్లా హెడ్ మాస్టర్లు అందరూ ఆయన సేవకు రుణపడి ఉంటారు .సందేహం లేదు .

గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రమోషన్లు

జిల్లాపరిషత్ ,ప్రైవేట్ మేనేజిమెంట్ లలో పని చేస్తున్న బిఎడ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో లెక్చరర్ గా ప్రమోషన్లు ,హెడ్ మాష్టర్లకు గేజేటెడ్ హోదా ,వారికి డేప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ గా ,D.I.E.T.లెక్చరర్లు ప్రిన్సిపాల్స్ గా ,ప్రమోషన్లకోసం దాదాపు ఇరవై ఏళ్ళుగా చేసిన పోరాటం ఫలించి ఆ ప్రమోషన్లు లభించాయి .జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్లు అందరూ గేజేటేడ్ హోదా దక్కింది. పచ్చసంతకం చేసే అర్హతలభించింది . దీనికి అన్ని సంఘాలూ కృషి చేసినా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ కృషి శ్లాఘనీయం .జిల్లాపరిషత్ లో సీనియర్ హెడ్ మాస్టర్లు పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా ప్రమోషన్ పొందారు .అలాంటివారిలో శ్తీ వై విరాజు ,శ్రీ విశ్వం ,శ్రీ రమణారావు ,శ్రీమతి సుగుణకుమారి మొదలైనవారున్నారు .గోదావరిజిల్లానుంచి మన జిల్లాకు ప్రమోషన్ పై  వచ్చిన  హెడ్ మాస్టర్లున్నారు .అలాంటివారిలో మొవ్వ హెడ్ మాస్టర్గా వచ్చిన రాజుగారు ,కృష్ణా జిల్లాపరిషత్ విద్యాశాఖాధికారిగా వచ్చిన సూర్యనారాయణ రాజు ?గారు ఉన్నారు .వీరందరికీ హార్దిక స్వాగతం చెప్పాము .పియివో రాజుగారు మహా నిక్కచ్చిమనిషి . సూటిగా నడిచే మనస్తత్వం .కనుక జిల్లాపరిషత్ లో పైరవీలు సాగలేదు. అర్హులకు దక్కాల్సినవన్నీ దక్కాయి .వాళ్ళిద్దరూ రిటైర్ అయి వెళ్ళిపోయినా ఈ జిల్లాతో, మాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు .బెజవాడ డివిజన్ విద్యా శాఖాదికారిగా శ్రీ వైవి రాజు తన  సమర్ధతను ఒత్తిడిలోనూ చాటి ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా తన వ్యక్తిత్వాన్ని  నిలబెట్టుకొన్నారు .వచ్చిన అరుదైన అవకాశం ఇది హెడ్ మాస్టర్లకు .దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొన్నారు .వీరి ప్రమోషన్ లకు బదిలీలకు పోస్టింగ్ లకు మా సంఘం చేసిన కృషి అద్వితీయం హైదరాబాద్ లెవెల్ లోకూడా మాకు సానుభోతిపరులుఆఫేసర్లు ఉండటం బాగా కలిసొచ్చింది వీరి తర్వాత వచ్చినవారు అవినీతి బంధు ప్రీతికి పాలై పరువు గంగలోకలిపారని అనుకోన్నారుజనం . వీరి ప్రమోషన్ లకు .

స్పాట్ వాల్యుయేషన్లో ఆఫీసర్ హోదా

పదవతరగతి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లో దేప్యోటీ కా౦ప్ ఆఫీసర్లుగా జిల్లాపరిషత్ సీనియర్ హెడ్ మాస్టర్లను  కూడా నియమించాలని  చేసిన ఆందోళన ఫలించింది .వాల్యుయేషన్ కు రెమ్యూనరేషన్ పెంచాలనీ చీఫ్ కు మిగిలినవారికీ తేడా ఉండాలన్నకోరికకూడాతీరింది.

ఉత్తమ ఉన్నతపాఠ శాలల ఎంపిక

చాలాకాలం నుండీ జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించి అన్నిటా ముందున్న స్కూళ్ళను గుర్తించి ఆ స్కూల్స్ కు ఆ ప్రదానోపాధ్యాయులకు బహుమతులు అందజేస్తామని జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ కడియాల రాఘవరావు గారు చెప్పారుకానీ అమలుకాలేదు .ఇప్పుడు పియివోగా ఉన్న రాజుగారి దృష్టికి తెచ్చాము .ఆయన ఏమైనా సరే ఈఏడాది అమలు చేద్దాం అనిహామీ  ఇచ్చారు .రామంగారు, ఆదినారాయణ ,నన్ను  ,వైవిరాజు  లతో ఒకకమిటీ వేసి ఒక కారు ఇచ్చి ముఖ్యమైన స్కూళ్ళు సందర్శించి అక్కడి చదువు తీరు ఉత్తీర్ణత శాతం ఆటలు ,పొందిన బహుమతులు  మొదలైన విషయాలపై క్షుణ్ణంగా నిష్పక్షపాతంగా పరిశీలించి రిపోర్ట్ ఇమ్మన్నారు .అందరం కారులో తిరిగి చూసి మొదటి ,రెండు ,మూడు స్థానాలకు ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి రిపోర్ట్ ఇచ్చాము  .అప్పటికే నేను రిటైరయ్యాను .తర్వాత ఆ బహుమతులు ఇచ్చే ఉంటారని  భావిస్తాను .సమర్ధులు అధికారం లో ఉంటె  సాధించలేనిది  ఏదీ ఉండదు అని చెప్పటానికి ఇదిఒక నిదర్శనం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-6-19-ఉయ్యూరు

శ్రీ దేవినేని మధుసూదనరావుగారి స్పందన

Devineni Madhusudana Rao

Sun, Jun 16, 6:51 PM (17 hours ago)
to me, sahitibandhu@googlegroups.com, Andukuri, Vani, Vasanth, Vuppaladhadiyam, kasturi, Bharathi, Sugunakumari, adinarayana_kosuru, Bharathi, mrvs, Murali, Vishwanatha, dr.Madugula, Dorbala, Sastri, Gopala, Krishna, akunuri, Radha, Lavanya, Padma, Padmasri, laxmi

Dear Durga Prasad Garu

Thank you for mentioning about me in the note shared by you and shared the nostalgia. I don’t deserve so much praise. It is all happened but for your interest to improve school education.  I feel I was lucky to get associated with all good people like you to come to my house whenever I requested and deliberate on the issues faced by school education.  If you are were there for few more years in the system, we might have made more contribution.

Two important things emerged are 1. Conducting annual Head Masters conference meaningful and useful, than mere formality and give voice to all HMs.  2. The present day Academic Calendar was born out of all your efforts and contribution made byShri Ramam Garu and Mrs P Prameela Rani Garu, can’t be measured by any yardstick.

Shri MVP Sastri IAS then Secretary Education and Shri N Srirama Murthy then DEO has not only encouraged us and allowed us in doing the work to make improvements. If we all continued for few more years you all might have made solid foundation which could not have been reversed.

Great Memories and thank you and all of our friends for contributing the cause of education

I hope all your family members are doing well.

నమస్తే మధుసూదనరావు గారు -గుర్తుకొ చ్చిన విషయాలు రాసే ప్రయత్నం చేశాను .నిజంగా మనం చేసింది తలచుకొంటే ఇంతటి మహత్కార్యాలు మనవల్ల జరిగాయా  అని మనమే ఆశ్చర్య పడేట్లున్నాయి .ఇది అందరి సమష్టి కృషి .అందరూ అభినందనీయులే -దుర్గాప్రసాద్

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -119 కృaష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సాధించిన విజయాలు

నా దారి తీరు -119

కృaష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సాధించిన విజయాలు

శ్రీ రామం గారు ఎప్పుడు  సంఘం మీటింగ్ పెట్టినా హాజరైనవారి సంఖ్య20లోపలే ఉండేది .ఇది మంచిదికాదని మేము తీవ్రంగా ఆలోచించి మెంబర్షిప్ డ్రైవ్ చే బట్టాం .డివిజన్ల వారిగా హెడ్ మాస్టర్స్ లో చురుకైన వారికి  సభ్యులుగా చేర్చే బాధ్యత అప్పగించి ,రసీదు పుస్తకాలు ప్రింట్ చేయించి ,ప్రతినెలా జీతం చెక్కులను కలెక్ట్ చేసుకొనే సెంటర్లలో  హెడ్ మాస్టర్ల తో మాట్లాడించి సభ్యులుగా చేర్పించే ఏర్పాటు జరిపించా.ఇలా గుడివాడ బందరు ఉయ్యూరు బెజవాడ నందిగామ జగ్గయ్యపేట మైలవరం నూజివీడు తిరువూరు కైకలూరు  మొవ్వ మోపిదేవి కోడూరు  నాగాయలంక  మొదలైన చెక్ సెంటర్లలో బలమైన కార్యకర్తలైన హెడ్ మాస్టర్లకు బాధ్యత అప్పగించాం .వారంతా శక్తి వంచన లేకుండా పని చేసి జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం లో సభ్యులుగా చేర్పించారు .దీనితో సంఘబలం పెరిగింది. ఆర్ధిక పరి పుస్టికలిగింది. ఏదో రకం గా సేవ చేయాలనే దృక్పధమేర్పడింది .ప్రైవేట్ హైస్కూల్స్, మునిసిపాలిటీ మొదలైన వాటిలో పని చేసే హెచ్ ఏం లుకూడా సభ్యులై సంఘ బలాన్ని మరింతపెంచి మానమ్మకానికి మద్దతు నిచ్చారు .దీనితో మీటింగ్ లు కూడా వేర్వేరు డివిజన్స్ లో  ఏర్పాటు చేసి  వారికీ, మిగిలినవారికీ గొప్ప ఉత్సాహం ,ప్రేరణా కలిగించాం .ఎక్కడ మీటింగ్ జరిగినా బిలబిలలాడుతూ హెడ్ మాస్టర్లు హాజరయ్యేవారు. సభలు కళకళ లాడేవి సంస్థకు గొప్ప జవజీవాలేర్పడ్డాయి .సంఘబలమే వ్యక్తిబలం అని నిరూపించాం .మమ్మల్ని నమ్మి మా అభిప్రాయాలతో ఏకీభవించి మాతో కాలుకదిపి నడిచినందుకు ప్రధానోపాధ్యాయులను ముఖ్యంగా అభినదించాలి .కరేస్పాన్డేన్స్  ,కమ్మ్యూనికేషన్ బాధ్యత శ్రీ ఆదినారాయణ సమర్దవంతం గా నిర్వహించి అందరికి తలలో నాలుకై గౌరవాన్ని పొందారు .

   కామన్ ఎక్సామినేషన్ బోర్డ్ తో సంఘం కలిసి పని చేయటం

 సి.యి. బోర్డ్, హెచ్ ఎమ్స్ అసోసియేషన్ శ్రీమతి ప్రమీలారాణిగారి ఆధ్వర్యం లో చాలా ఆదర్శంగా పని చేసి సభ్యుల ,పాలకుల ఉపాధ్యాయుల విద్యార్ధుల మన్ననలు అందుకొన్నారు .అనవసర వ్యయం లేకుండా సిలబస్ పుస్తకాలు తయారు చేయటం ,ప్రశ్నాపత్రాలు, ప్రోగ్రెస్ కార్డుల ప్రింటింగ్ ,సరఫరా అన్నీ పకడ్బందీ గా జరిగాయి .జిల్లాలోఇందుకు సమర్దులైనవారిని ఆమె ఎంపిక చేసుకొని ,అన్నీ సవ్యంగా సక్రమంగా జరిగేట్లు చేశారు .ఎక్కడా క్వస్చిన్ పేపర్ల లీకులు ,అమ్మకాలు లేవు .బురద గుంటలో పడి కంపుకోట్టుకు పోయిన వ్యవస్థను సుపరిపాలనా సుగంధం తో పరిమళభరితం చేయటం తోప్రమీలారాణి నిజంగానే రాణి అనిపించారు .

        సిలబస్ ,పబ్లిక్ ప్రశ్నాపత్రాలలో మార్పులు –పునశ్చరణ తరగతులు

కొత్త సిలబస్ తో బరువైన పాఠ్య పుస్తకాలు వచ్చాయి .నా లాంటివాళ్ళు డిగ్రీలోకూడా  చదవని అంశాలు ఫిజిక్స్ లో ఉన్నాయి .అలాగే లెక్కలు జీవశాస్త్రం ఇంగ్లీష్  సోషల్ లోనూ ఉన్నాయి మేమైతే ఎలాగో అలా నేర్చుకొని చెబుతాం .కానీ  విద్యార్షులకు అర్ధం చేసుకొనే స్థాయి కూడా ఉండాలికదా  .అందుకని ముందుగా జిల్లా విద్యాశాఖాదికారికీ ,పై అధికారులకు విన్నపాలు పంపాం .సిలబస్ పై టీచర్లకు ఓరిఎన్ టేషన్ క్లాసులు చాలా ఇంటెన్సివ్ గాఏర్పాటు చేసి సబ్జెక్ట్ విషయం లో అవగాహన కల్పించమని కోరాం .చివరికి వారికీ తెలిసివచ్చి ముందు జిల్లాస్థాయిలో తర్వాత డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు కాలేజీ లెక్చరర్ల తో పునశ్చరణ తరగతులు నిర్వహి౦పజేసి సబ్జెక్ట్ లపై ఆధిపత్యం వచ్చేట్లు చేశారు .మాలో కొందరు రిసోర్స్ పెర్సన్స్ గా కూడా వ్యవహరించి సాయం చేశారు .ఇంత చేసినా కొన్ని సబ్జెక్ట్ లలో కొన్ని టాపిక్స్ బోధించటం చాలాకస్టంగా  ఉండేది..సెమినార్లుపెట్టి  వాటిని సిలబస్ నుంచి ఉపసంహరింప చేయించాం .

  పబ్లిక్ ఇంగ్లిష్ ప్రశ్నా పత్రం లో డైలాగ్ రైటింగ్ ఉండేది .మూడునాలుగేళ్ళు చూశాం .నూటికి తొంభై మంది దాన్ని వదిలేసేవారు .రాసే ప్రయత్నమే చేసేవారుకాదు .కనుక దీన్ని తొలగించాలని కోరాం.తప్పని సరి అయి  తొలగించేశారు .అలాగే లెటర్ రైటింగ్ కూడా చాలా ఆబ్స్ట్రాక్ట్ గా ఉండేది .దానిలోనూ మార్పులు చేయించాం .మా అందరి ఉద్దేశ్యం ఒక్కటే .సబ్జెక్ట్ బోధనా నిర్దుష్టంగా అర్ధవంతంగా జరగాలి .ప్రశ్నాపత్రాలు విద్యార్ధుల అజ్ఞానాన్ని పరీక్షించేవికాకుండా వారికి ఏమి తెలిసిందో ఏది నేర్చుకున్నారో దానిపై పరీక్ష జరగాలని .ఇది అమలుకావటానికి మా సంఘం తీవ్ర కృషి చేసింది .రాష్ట్రం లో జిల్లాకొక ప్రధానోపాధ్యాయ సంఘం ఉన్నది .కొన్నిట్లో నామమాత్రపు సభ్యులే ఉండేవారు .కాని నాయకులు బలమైనవారు .ముఖ్యంగా రాయలసీమ లో నాయకత్వం బలీయంగా ఉండేది .వాళ్ళే డిసైడింగ్ ఫాక్టర్ గా ఉండేవాళ్ళు .కాని కృష్ణాజిల్లా సంఘం బలీయమై పోవటం వల్ల వాళ్ళ వాయిస్ తగ్గి మాకు అవకాశాలు హెచ్చాయి .మామాటే అమలులోకి వచ్చేవి .కనుక జిల్లా సంఘబలం ముందు రాస్త్రసంఘ బలం పేలవమై పోయింది .రాష్ట్ర సంఘ సమావేశాలకూ మేము వెళ్ళేవాళ్ళం .మా వాయిస్ వినిపించి అందరికీ న్యాయం జరిగేట్లుచేసేవాళ్ళం .ఇందులో మా నాయకులు శ్రీ రామం గారే .మేమంతా ‘’శ్రీరామభక్తులం ‘’ఆయనమాటకే విలువ,గౌరవం ఇచ్చేవాళ్ళం.ఆయన అతిమంచితనం  సాఫ్ట్ కార్నర్ వలన  మా జిల్లాసంఘానికి కొన్ని సార్లుక్ చేదు అనుభవాలు మిగిలాయి .ఆయన్ను మంచి చేసుకొని మాపై మిగిలిన జిల్లాలవాళ్ళు పెత్తనం చేయటం మొదలుపెట్టారు .త్వరలోనే గ్రహించి రామంగారికి అసలు విషయం తెలిపి మాతో సంప్రదించకుండా ఏ నిర్ణయమూ చేయవద్దనీ ,బయటివారి ప్రభావం మనపై ఉండరాదని నచ్చ చెప్పి ఇబ్బంది లేకుండా చేయగలిగాము .

             స్కూళ్ళు మూసేనాటికి పాఠ్య పుస్తకాలు

  ప్రతిఏడాది ఎకడమిక్ యియర్ ప్రారంభమైన రెండుమూడు నెలలదాకా టెక్స్ట్ బుక్స్ వచ్చేవికావు .ప్రభుత్వ అలసత్వం ,పర్యవేక్షణ లోపం ,సరఫరాలో ఇబ్బందులు వలన విద్యార్ధుల చేతికి పుస్తకాలు అందే సరికి పుణ్యకాలం కాస్తా దాటి పోయేది .వీటిని తెచ్చుకోవటానికి జిల్లాకేంద్రాలకు వెళ్లి పడిగాపులుకాసి ,స్వంతఖర్చులతో తెచ్చుకోవాల్సి వచ్చేది .ఇదంతా తడిసి మోపెడై ఉచిత పుస్తకాలైనా ఆపుస్తకాలకు ఎంతోకొంత డబ్బు విద్యార్దులనుంచి వసూలు చేయక తప్పేదికాదు.నిజంగా  ఇది నేరమే కానీ స్కూల్స్ లో డబ్బు నిలువ ఉండేదికాదు .కనుక తప్పని సరి అయింది .కొందరు ఎక్కువ వసూలు చేసి ఫిర్యాదులతో హెడ్ మాస్టర్లు ఇబ్బంది పడటం జరిగింది .వీటికి నివారణోపాయం ఆలోచించాము .కాని వినే నాధుడూ ఉండాలికదా .

     విద్యా మంత్రిగా స్వర్గీయ దేవినేని వెంకటరమణ

కృష్ణాజిల్లాకు చెందిన శ్రీ దేవినేని వెంకటరమణ విద్యాశాఖ మంత్రి అయ్యారు .ఈయన మా దేవినేని మధుసూదనరావుగారికి బాగా పరిచయం ఉన్నవారు .అదే సమయం లో హైదరాబాద్ లో రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సదస్సు జరిగింది .మంత్రిగారిని ఆహ్వానించారు .జిల్లా తరఫున రామంగారు ఆదినారాయణ ప్రమీలా రాణి, రాజుగారు విశ్వం నేనూ మొదలైనవాళ్ళం తప్పక వెళ్లాలని ఆదినారాయణ హుకం .అందరికి సంఘమే ఖర్చు పెడుతు౦దని,లేకపోతే తానె స్పాన్సర్ చేస్తానని ఫోన్లు చేశాడు .నేను వెంటనే స్పందించి ‘’ఎవరి డబ్బు వాళ్ళు పెట్టుకొని వెడదాం.ఎవరిపైనా భారం పడరాదు .మీరు పెట్టుకొంటాననటం భావ్యం కాదు .ఇలా ఎన్ని సార్లు ఎన్ని సభలకు పెడతారు డబ్బు ?అది మంచి సంప్రదాయం కాదు ‘’అని నిష్కర్షగా చెప్పాను .ఆయన ‘’మీ మాట మాకు శిరోధార్యం ‘’అన్నారు .అలా ఎవరిఖర్చులు వారే భరించి వెళ్లాం .సభ బాగా జరిగింది .మంత్రిగారు చాలా ఆదర్శప్రాయంగా మాట్లాడారు .ఈయన ఉంటె విద్యారంగం గొప్ప అభి వృద్ధి చెందుతుంది అన్నభావన మాకు కలిగింది .

   కృష్ణా జిల్లా సంఘబాద్యులను మాట్లాడమని మంత్రిగారు కోరగా ,అప్పటికే ఏమేమి మాట్లాడాలో రిహార్సిల్స్ వేసుకోన్నాం కనుక రామంగారిని ,ప్రమీలా రాణి ఆదినారాయణ లను మాట్లాడమన్నాం .ముఖ్యంగా మేము చెప్పింది ‘’స్కూళ్ళు మూసేనాటికి, లేకపోతె కనీసం స్కూళ్ళు తెరిచేనాటికి పాఠ్యపుస్తకాలు స్కూళ్ళకు చేరేట్లు చర్యలు తీసుకోవాలి .సుమారు పది   ఒక సెంటర్ స్కూల్ ను ఎంపిక చేసి పుస్తకాలు జిల్లాదికారులే అక్కడికి చేర్పించాలి అక్కడినుండి స్కూళ్ళకు తెచ్చుకోవటం తేలిక. ఖర్చు ఉండదు ‘’అని చెప్పాం ‘’వెరీ వెరీ గుడ్ సజెషన్ .తప్పకుండా ఈ ఏడాది నుంచే అమలు చేయిస్తాను ‘’అనగానే హాలంతా హర్షధ్వానాలతో మారు మోగింది .ఈ ఆలోచన ఏజిల్లావారికీ రాకపోవటం  కృష్ణా జిల్లావారే సూచించటం అమలు చేస్తానని మంత్రిగారు హామీ ఇవ్వటం మా జిల్లా ప్రధానోపాధ్యాయ  సంఘ౦ సాధించిన అద్భుతఘన విజయం .

      విద్యా వాలంటీర్ల నియామకం

  తరువాత నేను మాట్లాడుతూ ‘’స్కూళ్ళు మూసేసినతర్వాత విద్యార్ధులకు దాదాపు రెండునెలలు ఏ పనీ, వ్యాసంగం లేకుండా పోతోంది .పైతరగతి సబ్జెక్ట్ లు ఏముంటాయి ఎలాఉంటాయి అనే ఉత్సుకత ఉంటుంది .కనుక తక్కువ ఖర్చుతో ప్రభుత్వం వేసవి సెలవులలో విద్యార్ధులకు తరువాతక్లాసు లోని విషయాలు అవగాహన కలిగించటానికి  ఉత్సాహవంతులైనవారిని నియమిస్తే బాగుంటుంది’’అని చెప్పాను .’’వెరీ నావెల్ సజెషన్ ‘’అని ఇదీ ఈసంవత్సరం నుండే అమలు చేస్తామని చెప్పారు దీనితో ‘’విద్యా వాలంటీర్ ‘’ల వ్యవస్థ ప్రారంభమైంది. దీనికీ కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయ సంఘమే మార్గదర్శి అవటం మాకు గర్వకారణం .సదస్సు అవగానే మధుసూదనరావుగారు మమ్మల్ని మంత్రిగారికి  పరిచయం చేసినట్లు గుర్తు .తర్వాత ఆయన స్వంతకార్లలో మమ్మల్ని పెద్ద స్టార్ హోటల్ కు తీసుకు వెళ్లి విందు ఇచ్చారు .ఆతర్వాత సోమాజిగూడా లోని ఆయన స్వంత ఇంటికి  తీసుకు వెళ్లి భార్య , కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు .మధ్యాహ్నం టిఫిన్ జ్యూస్ ఇచ్చి అందరిని  ఇళ్ళకు సాగనంపారు .నేను రావటం మా అబ్బాయి శర్మ ఇంటికే వచ్చి మళ్ళీ అక్కడినుంచే ఉయ్యూరు వెళ్లాను .

         శ్రీ మధుసూదనరావుగారి విద్యారంగ  వ్యాసంగం

తెన్నేరుకు చెందిన శ్రీ దేవినేని మధుసూదనరావుగారు విద్యావంతులు .గన్నవరం దగ్గర పెద అవటపల్లి లో’’ హై టెక్ ప్రింట్స్ ‘’అనే సంస్థ ఉండేది .అక్కడ నాణ్యమైన పేపర్ తయారయ్యేది .సర్టిఫికెట్స్ ,బాంక్ ట్రాన్సాక్షన్ పేపర్స్  చెక్కులు మొదలైనవన్నీ హైక్వాలిటితో ప్రింట్ చేసేవారు ప్రభుత్వం తో మంచి పరిచయాలు ఉండేవి .విద్యారంగానికి ఏదో చేయాలనే తపన ఆయనలో నిరంతరం జ్వలించేది .శ్రీ దేవినేని వెంకటరమణ గారు విద్యామంత్రి అయ్యాక ఈ తపన మరింత పెరిగి కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ తో బాగా పరిచయాలు పెంచుకొని మా అందరితో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకొన్నారు .డియివో ఏర్పాటు చేసే జిల్లా ప్రధానోపాధ్యా య సంఘ సమావేశానికి ఆయనే స్పాన్సరయి అన్ని  ఏర్పాట్లు చేసేవారు .ఖర్చు ఎంతైనా లెక్క ఉండేదికాదు .సమావేశానికి కావలసిన ఎజెండా ,దానికి ప్రెసెంట్ చేసే పేపర్స్ తయారీ కోసం  ఆయన ఇంటికే మమ్మల్ని ఆహ్వానించి కార్లలో తీసుకువెళ్ళిభోజన భాజనాదులు ఏర్పాటు చేసేవారు .అందరినీ అత్యంత గౌరవంగా చూసేవారు ఆయన శ్రీమతీ  అంతే.వారిల్లుమాకు అతిధి గృహం కాదు స్వంత ఇల్లు అనిపించేది .పెద్ద లైబ్రరీ ఆయనది పుస్తకాలు ఇతరులకివ్వటం ఆయనకు హాబీ  .హెచ్ ఎమ్స్ కాన్ఫరెన్స్ లో పుస్తకాలు, ఫైల్స్ , లెటర్ పాడ్స్ నోట్ బుక్స్ , మంచిపెన్నులు అందరికి ఇచ్చేవారు .ఉదయం సుమారు 9గంటలకు మేము వారింటికి వెడితే రాత్రి 8గంటలకు బయటపడేవాళ్ళం ప్రతి  దానిలో పెర్ఫెక్షన్ కోరేవారు .మేము తయారు చేసే పేపర్స్ కు సహాయం చేసేవారు .ఆయనతో గడపటం ఒక ఎడ్యుకేషన్ గా ఉండేది .

   ఒకసారి ప్రధానోపాధ్యాయ సమావేశానికి విద్యామంత్రి శ్రీ దేవినేని రమణ గారిని శ్రీ శ్రీ చినజియ్యర్ స్వామీజీ ని ఆహ్వానించాము .స్వామీజీని సభకు పరిచయం చేసే బాధ్యత నాకు అప్పగించారు .ఆమీటింగ్ గ్రాండ్ సక్సెస్ .

  విద్యార్ధులకు అసైన్మెంట్స్ తయారు చేయించారు .విద్యా విషయాలపై మా అభిప్రాయాలను రాయమని ప్రభుత్వానికి పంపేవారు .అంటే మాకు ప్రభుత్వానికి లైజాన్ ఆఫీసర్ గా వ్యవహరించేవారు .వారితో పని చేయటం మాకు చాలా సరదాగా ఇష్టంగా ఉండేది .

  తనతల్లిగారి పేర ట్రస్ట్ ఏర్పరచి అనేక సత్కార్యాలు చేసేవారు. పుస్తకాలు అచ్చువేసి అందరికీ పంచేవారు .శ్రీ రమణ రాసిన ‘’మిధునం ‘’ను బాపు స్వదస్తూరితో రాసిన పుస్తకాన్ని అచ్చు వేసి అందుబాటులోకి తెచ్చారు .బాలబందు శ్రీ బివి నరసింహారావు గారి సమగ్ర సాహిత్యాన్ని ముద్రించి అందరికి ఇచ్చారు .కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వెంకట రమణశాస్త్రి  గారి ‘’స్వీయ చరిత్ర ‘’ మొదలైనవి  మళ్ళీ ముద్రించిన సాహిత్యాభిమాని .

     నవ్యాంధ్ర ప్రదేశ్ లో శ్రీ చంద్రబాబు ముఖ్యమంత్రిత్వం లో రాష్ట్ర ఉన్నత విద్యాదికారులన్దరితో పరిచయం పెంచుకొని ఎన్నో విద్యా సంస్తలు ,సందర్శించి సెమినార్లలో పాల్గొని, తన నాయకత్వం  లోనూ  ఏర్పాటు చేసి అన్ని జిల్లాలలోని  D.I.E.T సంస్థలనూ చూసి వాటి అభి వృద్ధికి మార్గదర్శనం చేసి ,అవి ఉపాధ్యాయుల విద్యార్ధుల భవితవ్యానికి ఇతోధికంగా తోడ్పడేట్లుచేసిన నిత్య విద్యా కృషీవలుడు .

  అదుకే మేమ౦దర౦  రిటైర్ అయి పదేళ్ళు దాటినా మాతో అత్యంత అభిమాన స్నేహితునిలా వ్యవహరిస్తారు .కనీసం ఆరుననెలలకోసారి తెన్నేరులో వారింట్లో సమావేశమై వారి ఆర్గానిక్ ఫుడ్ ఆస్వాది౦చకపోతే ఊరుకోని మనస్తత్వం ఆయనది .’’మళ్ళీ ఎప్పుడు కలుద్దాం ?“’ అనేదే ఆయనుండి వచ్చే ప్రశ్న .ఇ౦తటి ఉదార హృదయుడు ,స్నేహ శీలి ,  విద్యారంగంపై అత్య౦త మక్కువ ఉన్నవారు ,ఇంకా ఏదో చేయాలన్నతపన ఉన్నవారు మధుసూదనరావు గారు మాకు స్పూర్తి ప్రేరణ ,ఆదర్శం ,మార్గదర్శి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-19-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -118 కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ

నా దారి తీరు -118

కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ

నేను హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొందాక ,అంతకుముందు కూడా కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘానికి అధ్యక్షులు సో’’మంచి’’ రామం అని అందరి చేతా  ఆప్యాయ౦గ  పిలువబడిన  శ్రీ సోమంచి శ్రీరామ చంద్ర మూర్తిగారు  .కవి ,నాటకరచయిత ప్రయోక్త మంచి కథకులు ముఖ్యంగా బాలసాహిత్యం లో తనదైనముద్ర వేసినవారు.  బందరు లో ఫోర్ట్ రోడ్లో ఉండేవారు .నాకూ శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి వంటి మా అందరికి ఆదర్శం .ఒకరకంగా హెడ్ మాస్టర్ లకు గైడ్ ,ఫిలాసఫర్ .హెడ్ మాస్టర్స్  హాండ్ బుక్ రాసి కొత్తగా ప్రమోట్ అయిన  హెడ్ మాస్టర్లకు  రూల్స్ ,విద్యాలయాల నిర్వహణ వార్షిక తనిఖి అనే ఇన్స్పెక్షన్  పరీక్షల,స్కూల్ ఫీజులనిర్వహణ మొదలైన అంశాలపై గొప్ప అవగాహన కలిపించారు .ఆ పుస్తకం అనేక ముద్రణలు పొందింది .అసలు జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఆయన శ్రీ ఏ వి సుబ్బారావు గారు ఆయన ప్రాతస్మరణీయులు .తర్వాత దాన్ని రాష్ట్ర సంఘంగా తీర్చిదిద్ది జిల్లా సంఘాలకు ప్రాతినిధ్యం కలిపించారు .ఆయన  రిటైరయ్యాక శ్రీరామం  గారు జిల్లా సంఘం నాయకులుగా రాష్ట్ర సంఘం నాయకులుగా ఎంతో కాలం విశిష్ట సేవలు అందించి అందరికి చేరువయ్యారు .జిల్లా విద్యాశాఖాధికారి ప్రతి ఏడాది, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం  వార్షిక సమావేశం ఏర్పాటు చేయటం ,అందులో ఉత్తమ ఫలితాలు సాధించిన  హైస్కూల్స్ ,ప్రధానోపాధ్యాయులు ,సబ్జెక్ట్ టీచర్స్ ,విద్యార్ధులకు కు సన్మానం చేయటం, తర్వాత వచ్చేఏడాది ఆటలపోటీలకు సబ్ జోన్లు, సెంట్రల్ జోన్ ఏర్పాటు వ్యాయామోపాధ్యాయుల సహకారం తో జరిగేది  .ఇవనీ అయ్యాక జిల్లా ప్రధానోపాధ్యాయుల  సంఘ సమావేశం జరిగేది .అన్నిటిలో క్రియా శీలకపాత్ర పోషించేవారు రామంగారు ,డియివోలకు తలలో నాలుకగామీటింగ్  ఎజెండా తయారు చేయటం అమలు పరచటం లో ఆయన పాత్ర అద్వితీయంగా ఉండేది .

  చివరికి జరిగే సంఘ సమావేశానికి మాత్రం హెడ్ మాస్టర్లు  వ్రేళ్ళమీద  లెక్కించ తగినట్లుగా మిగిలేవారు .నాబోటి వాళ్లకు చాలా బాధగా ఉండేది .కానీ ఏమీ చేయలేము .రామం గారు రిటైరయ్యాక పెనమలూరు హెడ్ మాస్టర్ శ్రీ ప్రసాద్ ,నున్న హెడ్ శ్రీ రమణారావు వగైరా ఆరునెలలు ,ఏడాది పని చేసి తప్పుకోవటం వలన సంఘం కుంటి నడక  నడిచింది .దీన్ని గాడిలో పెట్టాలనే ఆలోచన ఆసక్తికల మాందరికీ వచ్చింది .అయితే ‘’హు బెల్స్ ది కాట్ ?’’అన్నది సమస్య.

   దీనికి తోడు జిల్లా కామన్ ఎక్సామినేషన్ బోర్డ్  పరిస్థితీ బాగాలేదు .చాలాకాలం దీన్ని పెడన జిల్లాపరిషత్ హై స్కూల్ హెడ్  మాస్టర్ , జిల్లాలో చాలా సీనియర్ మోస్ట్ హెచ్ ఏం శ్రీ  వీరమాచనేని విష్ణువర్ధనరావు గారు అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు .అయన ఒకకాలు కుంటి కాని తెల్లని పంచ తెల్లచొక్కా ఖండువాతో వెడల్పు ముఖం దబ్బపండు మై చాయతో చాలా ఆకర్షణీయంగా  హుందాగా ఉండేవారు .ఆయనంటే భయంగా కూడా ఉండేది .అన్ని రకాల పరీక్షలు చాలా పకడ్బందీ గా జరిగేవి .పేపర్లు లీక్ అవటం అనేది లేదు. సమర్ధులైన  హెడ్ మాస్టర్లు , సబ్జెక్ట్ టీచర్ల చేతక్వస్చిన్  పేపర్స్ తయారు చేయి౦ చేవారాయన .కక్కుర్తి లేని పాలనగా ఉండేది .ఆయనతర్వాత ఎవరెవరు మారారో గుర్తు లేదుకాని మేము ప్రమోషన్ పొందేనాటికి బెజవాడ ఎస్ కే పి వి హిందూ హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ నరసింహారావు గారున్నారు .ఆయన చేస్టలగురించి అప్పటికే కధలు గాధలు ప్రచారం లో ఉండేవి .అందులోనూ కామన్  ఎక్సామినేషన్ బోర్డ్ జిల్లా పరిషత్ వాళ్ళ చేతుల్లోంచి జారిపోయి ప్రైవేట్ మేనేజిమెంట్ వారి చేతుల్లోకి వచ్చింది .దీన్ని నియమించేది డియివో .ఆయనను ఏదో రకంగా ప్రసన్నం చేసుకొని పొందే పదవి అయిపొయింది. పరువు పాతాళానికి పోయింది. ఇది మా బోటివారికి నచ్చని విషయం .పైగా క్వార్టర్లీ హాఫియర్లీ యాన్యువల్ పరీక్ష పేపర్లే కాదు ప్రతినెలా జరిగే టెస్ట్ పేపర్లు కూడా లీకై బజారు లో విక్రయాలు జరుగుతున్నట్లు పేపర్లన్నీ కోడై కూశాయి .ఇంతటి అవినీతి అసమర్ధత కామన్ ఎక్సామినేషన్ బోర్డ్ లో  విశ్రుంఖలంగా  విజ్రుమ్భించటం తో జిల్లాపరిషత్ హెడ్ మాస్టర్లు గా సహి౦చ లేకపోయాం .ఏదో చేయాలి ఏదో చేయాలనే తలంపు తీవ్రమైనది .

   ఒకసారి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ హనుమారెడ్డి గారు పామర్రు జిల్లాపరిషత్ హై స్కూల్ సందర్శించినపుడు అడ్డాడ హెడ్ మాస్టర్ గానేను ఆయనను కలిసి  కామన్ బోర్డ్ తంతూ తమాషా అంతా వివరించి ,ఆపదవిని మెజారిటీ హెడ్ మాస్టర్లు ఉన్న సమర్ధుడైన జిల్లాపరిషత్  హెడ్ మాస్టర్ కు అప్పగించి అవినీతి పంకిలం నుంచి ఆపదవిని ఉద్ధరించాలని చెప్పాను .ఆయన ప్రశాంతంగా నేను చెప్పినదంతా విన్నారు .’’మంచి ఆలోచన  హెడ్ మాస్టారూ  !తప్పకుండా దీన్ని అన్ని కోణాలలోనూ పరిశీలించి తగిన న్యాయమైన నిర్ణయం చేస్తాను ‘’అన్నారు .కొంత ఊరట లభించింది .కాలం కూడా కలిసిరావాలికదా .అప్పుడు పామర్రు హెడ్ మాస్టర్ శ్రీ సుబ్బారెడ్డి గారని గుర్తు

        నాందీబీజం

  ఒకసారి బందరు హిందూ హైస్కూల్లో పదవతరగతి పరీక్షపేపర్ల  స్పాట్ వాల్యుయేషన్ జరుగుతున్నప్పుడు నేను ఇంగ్లీష్ -1పేపరుకు చీఫ్ ఎక్సామినర్ గా ఉన్నాను .నాకు అసిస్టెంట్స్ గా ఉన్నవాళ్ళల్లో పెదముత్తేవి ఓరిఎంటల్ హైస్కూల్ హెడ్మాస్టర్ శ్రీ కోసూరి ఆదినారాయణరావు ఒకరు .రోజూ మాట్లాడుకొనే విషయాలలో హెడ్మాస్టర్ సంఘం గురించి మాటలు వచ్చెవి . అతని సమర్ధత స్పీడ్ చాతుర్యం నిబద్ధర అంకితభావం నన్ను బాగా ఆకర్షించాయి . ఆ సందర్భం లో ఒకరోజు నేను ‘’మీరు సంఘ కార్యదర్శిగా ఉంటె మంచి భవిష్యత్తు ఉంటుంది ,సమర్ధులను అధ్యక్షులుగా  ఎన్నుకొందాం ,వారికే కామన్  ఎక్సామినేషన్ బోర్డ్ కూడా అప్పగిస్తే మరీ బాగుంటుంది ‘’అన్నాను .ఆయన నాతో ‘’మీరే సమర్ధులు మీరు ఉండండి మేమంతా సహకరిస్తాం ‘’అన్నారు .కాసేపు ఇలా ఇద్దరం అనుకొన్నాక ఆయనే నా మాట విని ఉండటానికి ఒప్పుకొన్నారు .కనుక సమర్ధుడు కార్యదర్శి అవుతున్నాడని అందరం హాయిగా ఊపిరి పీల్చా౦  .

    కలిసోచ్చినకాలం

  మళ్ళీ ఒకసారి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లో బహుశా సర్కిల్ పేట దగ్గరున్న మిషన్ హైస్కూల్ లో మేమంతా ఈ సెంటర్ లోనే జిల్లా ప్రదానోపాధ్యాయ   సంఘ అధ్యక్ష కార్య దర్శులను  ఎన్నుకోవాలనీ కామన్ యెక్సామినేషన్ బోర్డ్ కూడా జిల్లాపరిషత్ కు సాధించాలని నేనూ ఆదినారాయణ మొదలైన లైక్ మైండెడ్ మిత్రులం నిర్ణయించాం .అనుకోకుండా అప్పుడే కొత్త విద్యాశాఖాధికారిగా శ్రీ నూకల శ్రీరామమూర్తి గారు రావటం మా అదృష్టంగా మారింది .ఆయన లోగడ పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా సమర్ధంగా పని చేసిన ఆఫీసర్ .ముక్కు సూటిమనిషి. జిల్లాలో అందరి సంగతీ బాగా తెలిసినవారు .మా రామంగారికి చాలా ఇష్టమైన ఆఫీసర్ కూడా. ఇద్దరి మధ్య గొప్ప అన్యోన్యత ఉండేది .మూర్తిగారు  స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ బాధ్యతలో ఉన్నారు .పటమట హైస్కూల్ ప్రదానోపాధ్యాయిని శ్రీమతి ప్రమీలారాణి,గన్నవరం గరల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రేస్ గా చాలామంచి  పేరు పొందారు. నిర్దుష్టంగా ఉంటారు .దేనికీ లొంగని వ్యక్తిత్వం .సమర్ధత ఆమె సుగుణం .’’లేడీ లయన్ ‘’.ఆమె కూడా ఈ స్పాట్ లో మాతో ఉండటం ఇంకా కలిసొచ్చింది .ఒకరోజు స్పాట్ లో ఆమెను నేను ఆదినారాయణ మొదలైనవాళ్ళం కలిసి మా ప్రపోజల్ చెప్పాము .ఆమె ముందు వద్దన్నా మా పైఉన్న అభిమానం తో అంగీకరించారు .కామన్ బోర్డ్ కూడా ఆమె తీసుకోవాలని కోరాం. సరే అన్నారు .

   ఈ విషయం వెంటనే లీకైంది . కొడాలి హెడ్మాస్టర్  శ్రీ గోపాలరావు గారు నాదగ్గరకు వచ్చి ‘’ప్రసాద్ గారూ !నరసింహారావు గారిని మార్చి సి.యి .బోర్డ్ వేరెవరికో ఇవ్వాలని  మీరూ కొందరూ అనుకొంటున్నట్లు చెప్పుకొంటున్నారు .ఆయన్ను ఈ ఏడాదికూడా కంటిన్యు చేస్తే బాగుంటుంది  రిటైరైపోతారు .నన్ను మీతోమాట్లాడమని పంపించారు .మీరు చెబితే అందరూ వింటారని కూడా అంటున్నారు ‘’అన్నారు .నేను ‘’గోపాలరావు గారూ !ఇప్పటికే నరసింహారావు గారి అవినీతి కంపుకొట్టి భరించారానిదిగా ఉంది .ఇక ఒక్క క్షణం ఆయన్ను ఆపదవిలో ఉంచటానికి మేమెవ్వరం ఒప్పుకోము .దయచేసి ఆప్రపోజల్ మానేయండి .మాతో సహకరించండి ‘’అని నిర్మొహమాటంగా చెప్పాను .ఆయన మొహం కందగడ్డ అయినా మా ముందు ఆయన బలహీనుడై ఇక మాట్లాడలేక వెళ్ళిపోయారు .కనుక మాకు లైన్ క్లియర్ అయింది .

   సాయంత్రం స్పాట్ పూర్తయ్యాక శ్రీ రామం గారిని పిలిపించి మా ప్రాపోజల్ చెప్పి ఆయన అధ్యక్షతగా మీటింగ్ పెట్టి ప్రమీలారాణిగారిని కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం అధ్యక్షురాలిగా ,శ్రీ కోసూరి ఆదినారాయణరావు కార్యదర్శిగా నేను ఉపాధ్యక్షుడిగా కొత్త బాడీని ఏర్పాటు చేసుకోన్నాము అందరూ సంతోషించారు .కొందరు ‘’ఆడది ఈ అని సమర్ధంగా చేస్తుందా ?/అని గోనుక్కున్నవాల్లూ ఉన్నారు .తర్వాత డియివోగారిని కలిసి ఈ విషయం చెప్పి ఆయనతో రామంగారు మేమూ కామన్ బోర్డ్ పదవికూడా ప్రమీలారాణిగారికిస్తే మళ్ళీ జిల్లాపరిషత్ చేతిలోకి పదవి వచ్చి మెజార్టీ కి న్యాయం జరుగుతుందని ఈరెండు పదవులు ఒకరి చేతిలోనే ఉంటె ఖర్చుతక్కువ సేవలు బాగా సమర్ధవంతంగా జరుగుతాయి అని చెప్పాము .ఆయనా మా ప్రపోజల్ అంగీకరించి ఆమెకే కామన్ ఎక్సామినేషణన్ బోర్డ్ పదవికూడా ఖాయం చేసి ఎన్నాళ్ళనుంచో ఉన్న మాకోరికి తీర్చారు .ఇలా ‘’టు బర్డ్స్ యట్ వాన్ షాట్ ‘’తో సాధించాము .మా సంఘం అత్యంత శక్తివంతంగా జవజీవాలతో సమర్ధవంతంగా పని చేసింది .మేము రిటైర్ అయినా నా శిష్యురాలు శ్రీమతి కొల్లిభారతీదేవి ని ,తర్వాత కాజ హెడ్మాస్టర్ శ్రీశర్మగారిని  ప్రెసిడెంట్ చేశాం .మా సంఘం విద్యాప్రణాలిక అమలు, పరీక్షపెపర్ల తయారీ, క్వస్చిన్ బాంక్, సోర్స్ బుక్స్ తయారు పబ్లిక్ పరీక్ష పేపర్ల లోని లోపాలు తొలగించటం ,లెక్కలు ,ఫిజిక్స్ ,ఇంగ్లిష్ పుస్తకాలలో కష్టతరమైన విషయాలనుతొలగి౦ప జేయటం   స్కూళ్ళను సమర్ధవంతంగా నడపటం లో సహాయం అందించటం సబ్జెక్ట్ టీచర్లు లేకపోతె ఆదినారాయణ వంటివాళ్ళు వెళ్లి లెక్కలు, ఇంగ్లీష్ బోధించటం లలో  బాగా కృషి చేసి మెప్పుపొందింది మా బాచ్ లో శ్రీ రాజు, శ్రీ ఆ౦జనేయులు, శ్రీ విశ్వం ,శ్రీమతి సుగుణకుమారి శ్రీమతికస్తూరి  శ్రీ రాజేంద్రప్రసాద్ మున్నగు సమర్దులేందరో ఉన్నారు   .ప్రాతిఏదాది సంఘ సమావేశం చాలా మందితో కళకళలాడుతూ జరిగేది .రిటైరయినవారిని ఘనం గా  సత్కరించేవాళ్ళం .అదొక గోల్డెన్ పీరియడ్ .తర్వాత సంఘం మా చేతుల్లోంచి జారిపోయింది .అయినా కనీసం పదిమందిమి తరచూ కలుస్తాము .దీనికితెన్నేరుకు చెందిన శ్రీ దేవినేని మధుసూదనరావుగారు  మాకు ఆత్మీయ సహకారం అంది౦చారు .ఇప్పటికీ  ఇస్తున్నారు .   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-19-ఉయ్యూరు

No

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

తెలుగు వెలుగు -జూన్ సంచికలో అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య పుస్తకం గురించి

తెలుగు వెలుగు -జూన్ సంచికలో అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య పుస్తకం గురించి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’సామాజిక సమస్యలు’’కు పద్యాలలో కన్నీరు కార్చిన టేకుమళ్ళ

‘’సామాజిక సమస్యలు’’కు పద్యాలలో కన్నీరు కార్చిన టేకుమళ్ళ

శ్రీటేకుమళ్ళ వెంకటప్పయ్య ఖండకావ్యం  గా రాసిన ‘’ ’సామాజిక సమస్యలు’’ కవితా సంపుటి డిసెంబర్ 2017లో ప్రచురితమై, ఆయన దాన్ని నాకు ఎప్పుడిచ్చారో తెలీదుకాని, ఇవాళ ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే బయటపడింది .నాకు అభిమాన వ్యక్తీ, రచయితా, కవి వెంకటప్పయ్య .బేతవోలు ,శ్యామలానంద ,చక్రాల ,పూర్ణచంద్ వంటి సాహితీ దిగ్గజాలు దీనికి ముందుమాటలు ,అభినందనలు, ప్రోత్సాహక ప్రశంసలు రాశారంటేనే వెంకటప్పయ్య అలాంటిలాంటి కవికాడు అని అర్ధమౌతుంది .చిన్నప్పుడే తండ్రి మరణిస్తే అన్నీ తానె అయి చూసి, పెంచి,పెద్ద చేసి, జీవితాన్ని తీర్చి దిద్ది ,ఇక తనవంతు కర్తవ్యమ్ ముగిసిందని  ఇహలోక౦ వీడిన అన్నగారు శ్రీ టేకుమళ్ళ లక్ష్మీ నరసి౦హ౦గారికి అంకితమిచ్చి ఋణం తీర్చుకొన్నాడు .

‘’నేతలందరి లక్ష్యంబు మేతకాగ –దేశమేగతి కేగునో తెలియరాదు ‘’అని కార్మిక సంక్షేమం కోసం మొసలి కన్నీరు కార్చే ప్రాభుత్వాల నేతల డొల్లతనాన్ని బయటపెట్టాడు.కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరరని వకాల్తాగా చెప్పి , బాధ్యత తగ్గని జీవితాలతో ‘’తీరని బాధలే మిగులు తీరం చేరవు మీ కథల్’’అన్నాడు .కార్మిక హక్కులు చాలాఉన్నాయని ,అదరక బెదరక ఐక్యతతో వాటిని సాధించుకోమని ‘’శాంతి జీవనమెన్నుమా ‘’అని  హింసా దౌర్జన్యాలు శ్రేయంకాదన్నభావంగా హితవు చెప్పి ‘’దేశనేతలు మారుతారని ,కృషికి తగ్గ ఫలితం లభిస్తుందని భరోసా ఇచ్చాడు .జలవనరులు సద్వినియోగం చేసుకొంటేనే ప్రగతి అంటూ ‘’మానవజాతికిన్ మిగుల మ్రాకుల వృద్దియే వర్ధన౦బుగా’’అని చెట్లు పెంచమని ,’’జలము వ్యర్ధంబు జేయంగ జాతినలిగి –కస్టనస్టంబు పాలగు –కరువు హెచ్చు ‘’అని ఘోషించాడు .వృద్ధుల ఆలలనా,పాలనా చూడక కొడుకులుంటే వాళ్ళ అధోగతికి బాధపడుతూ ‘’కాలము దీరగన్  దుదకు గట్టెగ మారెను గా౦చకే సుతుల్ ‘’ఇలాంటి తల్లిని డాలరుమత్తులో ఉన్న కొడుకు చూద్దామని ఊరికివస్తే జనులు తిట్టి శాపనార్ధాలు పెడితే ‘’కూలెను కుప్పగా నతడు కొట్లకు  లభ్యమే తల్లి దీవెనల్ ‘’అని  తల్లి దీవెనలోని ఉత్క్రుస్టత తెలిపాడుకవి .

దేశానికి వెన్నెముక రైతు అంటూ నినాదాలేకాని అతని ఆత్మహత్యలను పట్టించుకున్నవాడు లేడని బాధపడ్డాడు –‘’అన్నదాత లిట్టు లాత్మహత్య కు బూన –భావితరపు జనుల బ్రతుకు లుడుగు ‘’అని ప్రశ్నించి ,రాబోయే అనర్ధాన్ని కళ్ళకు కట్టించాడు.లక్షలు పోసి కార్పోరేట్ విద్యా సంస్థలో చదివేవారికి వచ్చేది’’పేలవమ్మగువిద్య ‘’మాత్రమేనని ఉచితంగా చదువు చెబుతూ ఉత్తమ ఉపాధ్యాయులు బోధించే సర్కారు బడులు నాణ్యమైనవీ ,మాన్యమైనవీ అని చెప్పి ‘’చదువుకొనెడి శ్రద్ధ ,చైతన్యమగు బుద్ధి ‘’ఉంటేచాలు ఘనత లభిస్తుందని చెప్పాడు .ప్రేమ కరువైతే భావిపౌరులు దొంగలు ,తీవ్రవాదులు గా మారుతారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారనీ’’భిన్న ధృవమ్ములన్  గలిపి పెద్లిని జేసినా పెద్దలు ‘’కంట్లో వత్తులు వేసుకొని కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలనీ చిన్న విషయాలు పెద్దవికాకుండా ‘’చిక్కులు దీర్చెడి వారె దేవతల్’’అని కితాబిచ్చాడు .సమాజ శ్రేయస్సే కర్తవ్యంగా పిల్లల్ని పెంచాలని ‘’చిన్ననాడే మనసు చిగురించు వేళలో –చెత్తనాట దగదు చిత్తమందు ‘’అని మనకూ బుద్ధి చెప్పి పరులకస్టాలలలో బాగులు కోరే బుద్ధి నేర్పమని సలహా ఇస్తాడు .మోసం చేసే సీరియళ్ళకు మూతలు బిగి౦చ మన్నాడు .’’ఆంగ్ల భాష మోజు అసలుకే మోసమ్ము’’’’వెలుగులనిచ్చు భాష మరి వీడుట ధర్మమే ?’’అని ప్రశ్నించాడు .కార్పోరేట్ వైద్యం వెర్రి తలలను స్పృశిస్తూ ‘’ఆపరేషను జేయుట యవసరమ్ము –గంటలోపల సొమ్మును గట్ట  వలయు –తలలు తాకట్టుబెట్టి యా ధనమునీయ –చాల శ్రద్ధగ నటియించి శవము నిచ్చు ‘’

భావ ప్రకటన స్వేచ్చ వికృత చేస్తను ఎత్తి చూపాడుకవి –‘’చట్టము లోగల లోసగుల –గట్టిగ కెలకంగాబూన’’ గబ్బే’’ మిగులున్ ‘’అని వేలుపెట్టి వాసన చూసే  వెర్రినాగన్నలకు  గున పాఠం చెప్పాడు .

అనుబంధంగా ఉన్నవాటిలో ‘’చీరే సొగసు చూడ తరమా ?’’లో స్త్రీచీరకట్టుకొంటే అందం రెట్టింపు అవుతుందనీ అదే చీరే కొంగు ఎండ వేడికి గొడుగౌతుందని ,కూలిపనికి తలపై చీర చుట్ట బరువు  జీవితభారం మోయటానికి సహకరిస్తుందని ,చివరికి అ౦తులేని బాధలతో ఉన్నవారికి ‘’ఉరి’’ కి కూడా ఉపయోగపడుతుందనిఅందంగా అర్ధవంతంగా బాధగానూ  చెప్పాడు .జడపై పద్యం చెబుతూ ‘’జడ య౦దము స్త్రీలకు –జడయల్లినయపుడే దాని ‘’జాణ’’న సబబౌ ‘’అంటాడు .ఇవికాక ఈశ్వరవైభవం ,ధనుర్మాస విశిష్టత ,దేశభాషలందు తెలుగులెస్స,పోలవరం, వ్యాస వైభవం ,నేటియువత, కర్తవ్యమ్ శీర్షికలతో అర్ధవంతమైన పద్యాలున్నాయి .

ఈ కవితా సంపుటిలో ప్రతి శీర్షికకు ఉపోద్ఘాతం, దానికి తగ్గ మంచి శ్రీ చిత్రం ఉండటం విశేషం .సమాజాన్ని అన్నికోణాలలోనూ దర్శించి ,జరుగుతున్న అన్యాయాలకు ,కుళ్ళిపోతున్నవ్యవస్థ ,కుటుంబం , సమాజానికి ,మానవ వనరులు సద్వినియోగపడకపోవటానికి సంక్షేమం మాటలలోనే కాని చేతలలో కనిపించకపోవటానికి, భావదారిద్ర్యానికి ,తెలుగు భాష దీనస్థితికి ,కార్పోరేట్ కారుమేఘాలు కమ్ము కోవటానికి ,బాధలు గుండె గొంతుదాటి బయటకు రాకపోవటానికి , సగటు మనిషి  ఏమీ చేయలేక కార్చిన’’ కన్నీటి బొట్టును ‘’అర్ధవంతమైన ముఖ చిత్రంగా మలచిన చిత్రకారుడు ‘’ శ్రీ అలహరి రాము ‘’కవితోపాటు మిక్కిలి అభినందనీయుడు .

‘’పూజా నైవేద్యం లేకుండా ఉన్నాడుకాని మా దేవుడు మహా గొప్పవాడు’’అని ఒక సామెత ఉంది  .ఇది మిత్రుడు వెంకటప్పయ్య విషయం లో పూర్తి యదార్ధం .అతడు సంస్కృతాంధ్రాలలో  నిష్ణాతుడు .ఆ రెండుభాషలలో కవిత్వ సవ్యసాచి . ఇంతవరకు కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం, ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం  మొన్ననే పుట్టిన ప్రపంచ తెలుగు రచయతల సంఘం , ఆంద్ర దేశం లోని మరి యే సాహితీసంస్థ వెంకటప్పయ్య సాహితీ ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వకపోవటం శోచనీయం .సరసభారతి మాత్రం ఆ గౌరవం దక్కి౦చు కొన్నది .అ మధ్య నాతోమాట్లాడుతూ శ్రీ టేకుమళ్ళ తాను  ‘’సాంఘిక ప్రబంథం’’రాస్తున్నానని త్వరలోనే పూర్తవుతుందని చెప్పాడు .శుభం భూయాత్ .గరికపాటివారి’’ సాగర ఘోష ‘’లోలాగా ఈయన ప్రాంతమైన నెల్లూరు దాని ప్రక్కనున్న పినాకినీ నదీ ఘోష ,,ప్రస్తుతం ఉంటున్న విజయవాడలోని కృష్ణానదీ ఘోష కలిసి అందులో ప్రతిధ్వనిస్తాయని ఆశిస్తూ ,మరిన్ని మంచి పద్యరచానలతో అలరించాలని  టేకుమళ్ళ వారిని కోరుతూ-

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-19-ఉయ్యూరు

 

—

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం )

తమిళనాడు కుంభకోణం కు చెందిన నాట్య కళాకారిణి జ్ఞానసుందరి .కుప్పుస్వామి శాస్త్రి శిష్యురాలు .మైసూరు రాజాస్థానం ఆమెకు ‘’కవి రత్న ‘’బిరుదునిచ్చి సత్కరించింది .చాలారచనలు చేసినట్లు ఆమె స్వయంగా చెప్పింది .అందులో ఆరు స్తబకాలలో రాసిన ‘’హాలస్య చంపు ‘’ఉన్నది .ఇది మదురైలోని శైవ సంప్రదాయానికి సంబంధించింది .కవిత్వం ఒకే తీరున సాగకపోయినా సంస్కృతం పై ఆమె పట్టు కనిపిస్తుంది .అనుప్రాసలతో కవిత్వం అలరించింది .

479-రామ చరిత కర్త -కామాక్షి(20వ శతాబ్దం )

పంచాపకేశాచార్య కుమార్తె ,జి.యే.ముత్తు కృష్ణ అయ్యర్ భార్య కామాక్షి తంజావూర్ కు చెందినకవి .కాళిదాసదాస సాహిత్యంపై గొప్ప అధారిటీ ఉన్న సంస్కృత విద్వాంసురాలు  .కాళిదాసశబ్దాలు పద సమూహాలు ఉపయోగించి ‘’రామ చరిత ‘’అనే చిన్న కావ్యం రాసింది.

480-బుద్ధ చరితామృతం కర్త -మందాయం ధాటి అలమేలమ్మ(20వ శతాబ్దం )

బుద్ధ చరితామృతం అనే కావ్యం రాసిన మందాయం ధాటి అలమేలమ్మదక్షిణభారత కవయిత్రి .20వ శతాబ్దం .481-రాధా గోవింద శరద్ రస కర్త – రాధాప్రియ (20 వ శతాబ్దం )

ఒరిస్సా రాజు రఘునాధదేవవర్మ కుమారుడు విశ్వనాధ దేవవర్మ మహారాణి రాదాప్రియ .భర్తతో కలిసి ‘’ రాధా గోవింద శరద్ రస’’రచించింది .ఇది  రాధా కృష్ణుల శరత్కాలవిహార కేళి .భర్త రాసిన ‘’రుక్మిణీ పరిణయం ‘’అనే 11 కాండలకు విపులమైన వ్యాఖ్యానమూ రాసింది .

482- లక్ష్మీశ్వర చంపు కావ్యకర్త -రమాబాయి(19వ శతాబ్దం )

మైసూర్ రాజ్యం లో గంగామూల లో రమాబాయి జన్మించింది .తండ్రి అనంతసూరి .తల్లి అంబ.  ఈమె’’ లక్ష్మీశ్వర చంపు’’ కావ్యం రాసింది .ఇది 1879-80లో ప్రచురితమైంది కనుక కాలం 19వ శతాబ్ది మధ్యకాలం .దర్భంగా అంటే మిదిలరాజు కలకత్తా సందర్శించినపుడు రమాబాయిని ఆహ్వానించి ఘనంగా సత్కరించాడు .దీనికి సంతృప్తి చెందిన ఈమె, రాజు పట్టాభి షేక విషయాలను కావ్యంగా రాస్తానని చెప్పి ‘’లక్ష్మీశ్వర చంపు ‘’రాసింది .ఇదే ఆమె మొదటి కావ్యం. రాజసత్కారం పొందిందంటే ఆమె ప్రతిభా   సంపన్ను రాలే అయి ఉంటుంది .దక్షిణభారత దేశానికి చెందిన ఆమె కవిత్వం మిధిలా కలకత్తా వరకు ప్రాకి గుర్తింపు పొందింది .

   ఈ కావ్యం లో 5స్తబకాలున్నాయి .దర్భంగా నగర వర్ణన లక్ష్మీశ్వరరాజు ,ఆయనతండ్రి  వర్ణన .రాజు జన్మించటం వేడుకలు బాల్యం తండ్రి చనిపోవటం తల్లి సతీ సహగమనం మొదలైనవి మొదటి సర్గలో ఉన్నాయి .రెండవ సర్గలో రాజు బెనారస్ చదువు రాజ్యశ్రీ తో వివాహం,వేడుకలు ,సుఖమయ దాంపత్యం .సమర్ధతతో రాజ్యపాలన ,రానణికోరికై కొద్దికాలం పాలనకు దూరమై ఉద్యానవన విహారం  ఉంటాయి .మూడులో కొత్తదంపతుల హనీ మూన్ విశేషాలు,  ,నాలుగులో ప్రకృతివర్ణన ,అయిదవ సర్గలో రాజ్య పట్టాబిషేక  విశేషాలు ,రాజదర్బారు విదేశీరాయబారులు వగైరా ఉన్నాయి .

  ఇంతున్నా తేదీలు సంవత్సరాల విషయం రాయలేదు .చారిత్రాత్మక సంఘటనలు లేకపోవటం తో నిరాశకలుగుతుంది .చరిత్రకారిణికాకపోయినా అలంకార శాస్త్రం లో బహు ప్రజ్ఞావంతురాలనిపిస్తుంది గౌడీ –వైదర్బి రీతులకు మధ్యగాఉండే’’పాంచాలీ ‘’రీతిలో కావ్యరచన చేసింది .హుందాగా శబ్దార్ధమాదుర్యంగా కవిత్వం  భాసించింది  .శబ్దానికున్న అన్ని రకాల అర్ధాలను సందర్భోచితంగా వాడటం ఆమె ప్రత్యేకత .చక్రబంధం మిశ్రఘటకబంధం ,గోమూత్ర ,గవాక్ష బంధాలను సమర్ధంగా ప్రయోగించి తన పాండితీ గరిమ చాటింది .వివిధ చందస్సులను సమయానుకూలంగా ఉపయోగించింది .

483-చంపు భాగవత కర్త -శ్రీదేవి బాలరాజ్ఞి

భాగవత పురాణం లోని ముఖ్యవిషయాలను తెలుపుతూ శ్రీదేవి బాలరాజ్ఞి ‘’చంపు భాగవతం ‘’రచించింది .

484-కామాక్షామృత కర్త సునమణి దేవి

‘’కామాక్షామృత’’అనే మతగ్రందాన్ని సునమణి దేవి రాసింది. వివరాలులేవు .

485-రామాయణ చంపు కర్త -సుందరవల్లి

మైసూర్ కు చెందిన సుందరవల్లి-నరసింహ అయ్యంగార్ కూతురు ,కస్తూరి రంగాచార్య శిష్యురాలు .6కాండల ‘’రామాయణ చంపు కావ్యం’’రాసింది .

486-యాదవ –రాఘవ –పాండవీయ త్ర్యర్దికావ్యకర్త –త్రివేణి

దక్షిణభారతానికి చెందినా త్రివేణి ‘’యాదవ –రాఘవ –పాండవీయ౦ ‘’అనే త్ర్యర్ది కావ్యం రచించింది .ఈమె  ఉదయేంద్రపురానికి చెందిన అనంతాచార్య కుమార్తె .భర్త శ్రీ పెరు౦బుదూర్ కు చెందిన వేంకటాచార్య .భర్త ,కుమారుడు అకాలమరణం చెందాక ప్రాపంచిక జీవితానికి దూరంగా భక్తీ రచనలతో జీవించింది  .ఈమె రాసినవి చాలాఉన్నాయి అందులో కొన్ని-లక్ష్మీ ,రంగనాధ సహస్రనామావళి  ,శుకసందేశం , భ్రుంగసందేశం ,రంగాభ్యుదయం, రంగరాట్ సముదాయ ,తత్వముద్రా భద్రోద్య’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం –

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-19-ఉయ్యూరు

మనవి-గీర్వాణకవుల కవితా గీర్వాణం మొదటి మూడుభాగాలలో 1090మంది సంస్కృతతకవులపైన నేను రాయటం, సరసభారతి తరఫునగ్రంథ రూపంలో  ప్రచురింఛి ఆవిష్కరించటం , ఈ మూడింటికి సరసభారతికి, నాకు మిక్కిలి ఆత్మీయులు శ్రీ మైనేని గొపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )  స్పాన్సర్లుగా ఉండటం  మీకు తెలుసు .

   ,నాలుగవ భాగం గా అంతర్జాలం లో ఇవాల్టికి రాసిన 486మందికవుల తోకలిపి 1576మంది గీర్వాణకవులపై రాసే అవకాశం ,అదృష్టం నాకు  కలిగింది .ఇదంతా మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి ,శ్రీ సరస్వతీ మాత అనుగ్రహమే .

  ఈ నాలుగవభాగం లో నాకు కావాల్సిన విషయాలను అన్ని రకాల సోర్సులనుండి ఏరి కూర్చి నాకు పంపి రాయటానికి సహకరించిన మా రెండవ అబ్బాయి శర్మ ,మనవడు హర్ష లకు అభినందనలు .

 ప్రస్తుతం ఈ ధారావాహికకు విరామం మాత్రమే ప్రకటిస్తూ ,సమాచారం లభిస్తే ,మరింతమందిగీర్వాణ  కవుల గురించి  రాస్తానని మనవి చేస్తూ –

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం )

1004-1016కాలం లో పాలించిన రాజేంద్ర చోలుడికి సమకాలికుడైన  రాజశేఖరుని ‘’రాజశేఖర చరిత్ర ‘’లో చోటు చేసుకొన్న 6గురు సంస్కృత కవయిత్రులపేర్లు మాత్రమే తెలిశాయికాని వారి గురించి వివరాలు  రచనలు లభించలేదు .వీరంతా 1004 కు పూర్వం వారై ఉండాలి .వారే -1-కామలీల 2కనకవల్లి 3-లలితాంగి 4-మధురాంగి 5-సునంద 6-విమలాంగి .వీరిలో లలితాంగి విమలాంగి ,మధురా౦గి లు మాత్రం మాళవ దేశానికి చెందినవారని తెలుస్తోంది .

472-ప్రభు దేవిలాటి(880కుపూర్వం )

క్రీశ 880-920కాలం వాడైన రాజ శేఖరుడు ‘’ప్రభు దేవిలాటి ‘’గురించి పేర్కొన్నాడు .ఈమె లాట దేశానికి చెందినది. ఆమెకున్న బహుముఖ ప్రజ్ఞను ఆకాలం లో అందరూ మెచ్చుకొన్నారు .తన రసరమ్యకవిత్వంద్వారా ప్రజల గుండెల్లో చిరంజీవిగా నిలిచింది .ప్రేమకవిత్వంలోనేకాక న్ని రకాల కళలలోనిష్ణాతురాలు .

‘’సూక్తీనాం స్మరకేలీనాం కలానాంచవిలాసభు –ప్రభుదేవీ కవి ర్లాటీ గతాపి హృది తిస్టతి’’

473-వైజయంతి (17వ శతాబ్దం )

జయ౦తిగా కూడా పిలువబడిన వైజయంతి 17వ శతాబ్దం లో ఫరీద్ పూర్ నివాసిని .మూరభట్ట కూతురు .సంస్కృత విద్వా౦సురాలేకాక మీమా౦సశాస్త్రం లో అద్వితీయురాలు .సంస్కృత మహా విద్వాంసుడైన కృష్ణనాధుని భార్య .ఈమె రాసినట్లుగా చెప్పబడే శ్లోకాలు చాలా ఉన్నాయి .భర్తతో కలిసి ‘’ఆనంద లతిక చంపు ‘’రాసింది .కాని అలభ్యం .

1-‘’ఆహిరయం కల ధౌత గిరభ్రమాత్ –స్తనమగాత్ కిలనాభి హృదోత్సితః

ఇతి నివేదయితుం నయనేహి యత్ –శ్రవరా శ్రీమణీ కిం సముపస్తితే ‘’

2-‘’వహ్ని కోరాగతేభానుః శీతాత్ సాక్కచితం దినం –వైశ్వానరో నరక్రోడే రాజాన్ శీతస్య కా కధా

3-‘’ఆనంద లతికా  చంపూర్యేనాకారి స్త్రియా సహ-

474-విజయా౦క (10వ శతాబ్ది పూర్వం )

కర్నాటకకు చెందిన’’ విజయాంక’’10వ శతాబ్దికి పూర్వం ఉండేది ఈమె శ్లోకాలు రాజశేఖర చరిత్రలో ఉన్నాయి .ఈమెను సరస్వతీదేవి అపర అవతారమని భావించేవారు .వైదర్భి శైలిలో ఆమెకవిత్వం కాళిదాసునుమరపిస్తుంది

‘’సరస్వతీ కర్నాటీ విజయాఖ్యా జయత్యసౌ –యా వైదర్భః గిరాం వాసుః కాళిలిదాసానంతరం ‘’

-ఆధునిక సంస్కృత కవయిత్రులు

475-అనసూయా కమలాబాయి బాపట్ (

మరాఠాకు చెందిన అనసూయా కమలాబాయి బాపట్ ‘’శ్రీ దత్త పంచామృతం ‘’అనే దత్తాత్రేయ నిత్య పూజా విధానాన్ని రాసింది .మొదటి రెండు అధ్యాయాలు ఆమె స్వయంగా సృజించి రాసినవే .మిగిలినవి వివిధగ్రంథాలనుంది సేకరించినవి

476-బాలాంబిక

సిస్టర్ బి.బాలంబాళ్ మద్రాస్  ప్రెసిడెన్సిలో డా.వైద్యనాధ శాస్త్రి కుమార్తె .తల్లి సంస్కృత విద్వాంసురాలు .తల్లివద్ద సంస్కృతం నేర్చింది .సంస్కృతం లో 1-‘’సుబోధ రామ చరిత ‘’,2-ఆర్యరామాయణ3-గానకదంబ4-దేవీ త్రయత్రి౦శ న్మాల రాసింది .ఆమె కవిత్వం సరళసుందరం .

సుబోధ రామ చరిత లో కవిత్వం

‘’కున్జరవదన కువలయనయన –కురు పరసుఖమనిశం మే –

చంచల శ్రవో౦జిల ప౦చికరంజిత ,పున్జితకరుణా-భంజిత ప్రత్యహ-అంచిత గతి యుత -వంచిత దురిత –  రంజిత శ్రితజన –భంజితవరగా

477-వెన్నెలకంటి హనుమా౦బ

నెల్లూరుకు  చెందిన వెన్నెలకంటి హనుమాంబ శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామిశిష్యురాలు  .భక్తితో ‘’బ్రహ్మానంద సరస్వతి స్వామి పాదుకా పూజన ‘’రాసింది .శ్లోకాలు వచనం ప్రయోగం పధ్ధతి కలిసిఉంటాయి .ఇదేకాక ‘’శంకర భగవత్ పాద పూజ’కూడా రాసింది .ఇందులో ఆదిశంకరాచార్యుల వివిధ గుణ, సాధన, విశేషాలను  సహస్రనామావళి గా కూర్చింది .మరొకటి ‘’దత్తపూజాకదంబం ‘’దత్తాత్రేయస్వామిపై రచించిన కీర్తనలకదంబ మాలిక ఇది.

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం )

పైన చెప్పినట్లు ఇద్ద్దరి ధోరణిలో విభేదాలున్నా ,కొట్టొచ్చినట్లు కనిపించే ఒక మంచి పోలిక కనిపిస్తుంది .బౌద్ధ సన్యాసినుల౦దరో ముక్త కంఠం తో మానవ ప్రేమను ఖండించినా  ,సంస్కృత కవయిత్రులలాగా మగవారిని చులకన చేసి ఎక్కడా చెప్పలేదు .మగవారు క్రూరంగా ప్రవర్తించినా ,మౌనంగా ఉన్నారు లేక తమ తలరాతకు బాధ పడ్డారే తప్ప మగవాళ్ళను ని౦ది౦చలేదు .ఈ విషయం లో ‘’ఈసి దాసి’’ రాసిన  కవిత్వం లో ఆమె ముగ్గురు భర్తలు ఒకరితర్వాత ఒకరు ఆమె తప్పు ఏమీ లేకపోయినా క్రూరంగా ప్రవర్తించి దూరం చేసినా ,వారికి నిస్వార్ధమైన  సేవ చేసి,తన విధేయతను కాపాడుకొన్నది .గతం లో తాను చేసిన తప్పులను తానె ని౦దిచు కొన్నది కానీ , పూర్వపు భర్తలను ఏమీ అనకపోవటం గమనిస్తాం .వారు స్వయం నియంత్రణ పాటించక అధిగమిస్తే ,వాళ్ళ అతిని ఎత్తి చూపక ,వారిలోని మానసిక బలహీనతలను అంగీకరించింది .’’సీహా ‘’తన కామవా౦చలను నియంత్రించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.రాజాస్థానం లోని’’ విమల ‘’  తనగత దుస్చే స్టలను  ఒప్పుకున్నదికాని ఎవరినీ ని౦ది౦చలేదు .వారి తప్పేమీ లేకపోయినా మన్మదుడనే మారుడు తమను హింసించినా ,భౌతికసుఖం అనుభవం మొదలైన తమ బలహీనతలను తెలుసుకొని  వాటికి అతీతంగా ప్రవర్తించి మంచి దారిపట్టారు .’’సుభ జీవ కంబానిక ‘’దుస్ట యువకుడి కామ కబంధహస్తాలలో నలిగిపోయినా,దూషణగా ఒక్కమాటైనా అనకపోగా ,అందంగా ఆకర్షణగా ఉన్న తన రెండు కళ్ళవలెనే అనర్ధం జరుగుతోందని గ్రహించి రెండుకళ్ళనూ ఇంకెవరూ ఆకర్షించకుండా ఉండటానికి  తానె పీకేసుకోన్నది  .’’సుమేధ ‘’తాను తపస్సులో ఉండగా భంగం చేసిన ప్రియుడిపై కోపంతో ద్వేషం తో విరుచుకు పడి హడావిడి చేయకుండా అత్యంత ప్రశాంత చిత్తం తో సహనం తో అతడి ప్రవర్తనను మార్చింది .

  ఇంతటి విశాల హృదయం,సహనం క్షమా  ఉన్నవారు  కొద్దిమంది మాత్రమె కనిపిస్తారు .కాని మెజారిటీ బౌద్ధ సన్యాసినులు ఆడవారిపై అఘాయిత్యాలు ,పురుషులను లొంగ దీసుకొనే ప్రయత్నాలను దారితప్పిన మగవారికి ఈ బుద్ధులు పనికిరావని వాటిని వదులుకొని జీవించాలనే  బోధించారు .ఇలా రెండురకాలుగా ఉన్న గాథలలో స్త్రీలకూ పురుషులకు మధ్యఉన్న మౌలిక భేదాన్నిచాటి చెప్పి అన్ని వయసులలో ఉన్నస్త్రీల సహజాత లక్షణాలను రక్షించుకోవాలని చెప్పారు .సంస్కృత ,ప్రాకృత కవయిత్రులు ప్రేమను ప్రేమించారుకనుక  వారి విషయం లో అర్ధం చేసుకోవచ్చు .అలా ఎందుకు ఉండలేక పోతున్నారో కూడా రోహా శశిప్రభలు  చెప్పారుకూడా .కాని బౌద్ధ సన్యాసిని కవయిత్రులకు పురుషులనుండి  ఏమీ ఆశించలేదు కనుక వీరిమార్గం పూర్తిగా భిన్నమైనదే .పురుషులను దూరం చేసుకొంటేనే ముక్తి అని భావించారు కాని పురుషద్వేషం వారిలో లేదని తెలుస్తుంది .స్త్రీ సహజమైన వాత్సల్యం ,సహిష్ణుత,సహనం లకు  ఇంతకంటే గొప్ప ఉదాహరణలేముంటాయి ?   

  గాథలలో మరో ముఖ్యవిషయం గా ఉన్న స్త్రీత్వం ఎక్కడైనా ఒకటే అనిపిస్తుంది .మనసులోని అంతర్గత కోరికలు మంచి గృహిణిగా ఉండటానికే ఇస్టపడుతాయికాని ,గుహలలో బంధింపబడి ఒంటరిగా పవిత్ర కార్యాలకు పరిమితం కారాదని పిస్తుంది .గృహం లో గృహిణి పొందే ఆనందం సంతృప్తి ఇంకెక్కడా లభించవు .దీన్నివదిలి ఇంకేదో ఉన్నతమైనదాని దానికోసం ఆరాటపడదు.

   గాథలలో కొన్ని ‘’నిర్హేతుక వైరాగ్యం ‘’అంటే సహజ వైరాగ్యం  బోధించాయి .దీనికి ఉదాహరణ ‘’ధమ్మా ‘’  .ఈమె తగినవరుని పెళ్లాడినా ,ప్రాపంచిక సుఖాలపై ఏవగింపుకలిగి ,భర్త అనుమతిపొందలేక , అతని మరణానంతరం సన్యాసి అయింది .’’అనోపమ’’సుందరమైనదీ ,అందరి ప్రేమకు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వివాహం చేసుకోరాదని నిర్ణయి౦చు కొన్నది .అలాగే ‘’గుత్తా ‘’ రోహిణి’’లు ధనిక స్త్రీలైనా పెండ్లికి విముఖత చూపారు .’’సుమేధ ‘’రాజకన్య తనను పెండ్లి చేసుకోవాలనుకొన్న రాజును కాదని బౌద్ధ సన్యాసినిగా మారిపోయింది .ఇవన్నీ నిర్హేతుక వైరాగ్యానికి ఉదాహరణలు .

 ఇప్పుడు ‘’సహేతుక వైరాగ్యం’’ గురించి తెలుసుకొందాం .ఈ వైరాగ్యం కోరికలు తీరనప్పుడు ,జీవితం లో అలసిపోయినప్పుడు ,కొంపలో విపరీతమైన చాకిరీ ,దా౦పత్య సౌఖ్యం , ఇంటి సుఖం లేకపోవటం ,కుటుంబంలో మరణాలవల్లకలిగే దుఖం ,దరిద్రం మొదలైన దుర  దృష్టాలవలన జీవితం పై విరక్తికలిగి సన్యాసం తీసుకోవటమే ‘’సహేతుక వైరాగ్యం’’ .దీనికి మంచి ఉదాహరణ ‘’ఈసి దాసి’’.మూడుసార్లు పెళ్ళాడి, ముగ్గురుభర్తలు దూరం చేస్తే ప్రపంచం మీద విరక్తితో ఆశాభంగం ,ఏవగింపు లతో ప్రపంచాన్ని వదిలేసింది .గూని వాడి భార్య ‘’ముత్తా,,పెళ్ళికి ముందే వరుని మృతికి తల్లడిల్లిన ‘’నందా ‘’, క్రూరుడైన భర్తకు  భార్య  ,ఇంటిచాకిరితో విసిగి వేసారిన’’సుమంగళ తల్లి ‘’,స్నేహితురాలి మరణంతో శొకమూర్తి ఐన ‘’సామా ‘’,ఒకే ఒక కూతురు చావుతో దుఖం ఆపుకోలేక   ‘’ఉబ్బిరి ‘’ ,భర్త ,సంతానం,సోదరులు , తలిదండ్రులను కోల్పోయిన ‘’పటకార ‘’,పిల్లలు ,స్నేహితులు లేని బీద విధవరాలు ‘’చందా ‘’,కొడుకును కోల్పోయిన ‘’వైసిత్తి’’,భర్త ,కొడుకు మరణం పాలైన ‘’కీస గోతమి ‘’,స్వీయ భద్రతాభావం తో భర్తను చంపిన ‘’భద్దా కుండలకేశ’’,విధి వైపరీత్యం వల్ల అల్లుడినే పెళ్ళాడిన ‘’ఉప్పలవన్నా ‘’,మొదలైనవారు .గృహ సౌఖ్యం బాగా ఉండిఉంటె ,ప్రపంచాన్ని వదిలి శాంతికోసం నిర్వాణ మార్గం పట్టే వాళ్ళు కాదని చెప్పటానికి ఆధారాలు లేవు .

  పైన చర్చి౦చిన అనేక విషయాలను బట్టి  ప్రాచీనభారత దేశ స్త్రీలు అంటే వేద ఋషీమణులు బౌద్ధ సన్యాసినులు ప్రాకృత కవయిత్రులు సంస్కృత సాహిత్యానికి చేసిన సేవ అపూర్వమైనది.  సన్యాసినులైనా ఊహాలోకంలో విహరించకుండా ,సాహిత్యం లో ఇతర రంగాలలో అంటే  నాటకం ,చరిత్ర స్మృతి తంత్ర ,వేదాంతం వైద్యం ఖగోళశాస్త్రం గణితం మొదలైన రంగాలలో లోకూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించారు .ప్రతిరంగాన్ని అంతర్ దృష్టితో వీక్షించి  సహేతుకంగా నిర్దుష్టంగా నిష్పక్షపాతంగా అద్భుత వివరణలతో  రాసి పరిపూర్ణత చేకూర్చారు .ప్రపంచం లో ఏ దేశం లోనూభారత దేశం లో లాగా  మహిళల చేత  ప్రాచీన సాహిత్యం వర్దిల్లలేదు అన్నది నిర్వివాదమైన  అంశం.దీనికి మనం గర్వపడాలి .మనలాగాసంపూర్ణ సంస్కృతి మహిళల చేత ఉత్తుంగ శృంగంగా పోషి౦ప బడిన  దేశం ప్రపంచం లో లేనే లేదు .ఇంతటి ఉన్నత సంస్కృతిని మన మహిళామణులు మనకు వారసత్వంగా అందించినందుకు మనం ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలం ?వాటిని అనుసరించి ఆచరించి  భద్రపరచి వారసులమని రుజువు చేసుకొని గర్వపడాలి .

  ఇటీవలికాలం లో భారత దేశంలోనూ బయట ప్రపంచం లోనూ ఆనాటి భారతీయ మహిళా గౌరవం అతితక్కువ ,బూజుపట్టింది అనే అభిప్రాయం ఉంది .ఇంట్లోను సమాజం లోను వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమైనదే .బాగా విద్యావంతులేకాక గొప్ప సృజన శీలురు .వారిమేధ అద్వితీయంమాత్రమేకాదు ఉత్తమ కళా సృజన చేసిన మహిళామణులు కూడా ..ఇంతటి ఉన్నత ఉత్తమ సృజన తో సమాజానికి మార్గ దర్శకులై ధృవతారలుగా నిలిచారు వారు. ‘’ఉత్త జమానా సరుకు ‘’కాదని గ్రహించాలి .పుతులతో సమానంగా  కూతుళ్ళనూ  చదివించి తీర్చి దిద్దిన విదుషీమణులు వారు  .సోదరులులాగే సోదరిలుకూడా ప్రతిభా విశేషాలతో  వన్నెకేక్కారు .భర్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ఉత్తమ గృహిణులు అనిపించారు .చదువు సమస్కారాలతో పిల్లలను తీర్చి దిద్ది ఆదర్శ మాతృమూర్తులు ,గురువులు అయ్యారు .ప్రజాసేవలో పునీతులయ్యారు .దక్షత ఉన్న ద్రష్టలయ్యారు .విద్యావేత్తలై సంఘం లో నైతికవిలువలకు మూలస్తంభాలయ్యారు .నిత్య సమాజోన్నతికి బద్ధ కంకణ ధారులై మార్గ నిర్దేశం చేశారు  .వారి కృషి ,అంకితభావం మహత్తరం .మహిళాభ్యున్నతిలేని సమాజం,దేశం ఏ విధంగానూ అభి వృద్ధి చెందదు అని అందరం గుర్తించాలి గ్రహించాలి  .భారతజాతి ధార్మిక పునరుజ్జేవనానికి పురుషునితోపాటు స్త్రీలకూ సమాన హక్కులు బాధ్యతలు ఉండాలి .అప్పుడు వారు సాధించలేనిది ఏమీ ఉండదు ..’’ఆడాళ్ళూ మీకు జోహార్లు ‘’

  సంస్కృత ప్రాకృత వేద బౌద్ధ సన్యాసినుల కవిత్వ పరిశీలన సమాప్తం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -3

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -1

సంస్కృత కవయిత్రుల ,బౌద్ధ  సన్యాసిని కవయిత్రుల కవిత్వం లో ఉన్న విశేషాలు తెలుసుకొందాం .71మంది బౌద్ధ సన్యాసినుల కవిత్వం ‘’ధేరి గాధ’’లో వేలాది శ్లోకాలున్నాయి .సంస్కృత కవయిత్రుల కవిత్వానికి ,వీరి కవిత్వానికి మధ్య చాలా భేదమే కనిపిస్తుంది .సంప్రదాయ సంస్కృత కవయిత్రులు ఈ లోకాన్నీ అమితంగా ప్రేమించారు .ఈ ప్రపంచం లోని అందాలు సుఖాలు విశిష్టతలను ప్రేమించారే తప్ప అలౌకిక విషయాలపై ధ్యాస లేదు ..కానీ బౌద్ధ సన్యాసినుల దృష్టి వీరికి భిన్నంగా ఉంటుంది . జీవితం  పునరపి జననం పునరపి మరణం కస్టాలు దుఖాలు బాధలమయం కనుక వీటికి అతీతమైన శాశ్వతమైన లోకాన్ని అన్వేషించి అందులో ఉండిపోవాలని నిర్వాణమే మార్గమని నమ్మి అలా జీవించారు .ఎప్పుడైతే భౌతికలోకాపేక్ష లేదో, ఇకవారికి ఈలోకం లోని సుఖం సంతోషం నూతనత్వం తాజాతనం ల తలుపులు మూసేసుకొని ఉండిపోయారు .

   వీరికి భిన్నంగా సంస్కృత కవయిత్రులు ప్రకృతి మానవుడు ,ప్రేమమొదలైన  అనేక అంశాలపై ఉత్తమమైన శ్రేష్టమైన కవిత్వం రాశారు .కాని బొద్ద సన్యాసినుల కవిత్వం దీనికి భిన్నంగా ఒకే విధమైన, మార్పులేని మూస కవిత్వం (మొనాటనస్ )రాశారు .బుద్ధుడు బౌద్ధ సిద్ధాంతాలు మరుజన్మలేని నిర్వాణం  పైనే దృష్టిపెట్టారు .ఆపరిధిని దాటలేదు .తమ చుట్టూ ఉన్న ప్రకృతినే వీరు పట్టించుకోలేదు కాని సంస్కృత కవయిత్రులు ప్రకృతిని ఆరాధించారు మమేకమైనారు .బొద్ద సన్యాసినులు  సన్యాసినులే అనిపించారుకాని కాని ,కవయిత్రులు గా గుర్తింపు పొందలేక పోయారు .అంతేకాదు మనిషిని కూడా నిర్లక్ష౦ చేశారు. ఎక్కడో చాలా అరుదుగా బిడ్డ చనిపోతే తల్లి రోదన ,భర్త దౌష్ట్యానికి బాధపడిన భార్య లపై రాసినా మనిషిని కర్త, కర్మగా సరైన దృక్పధంతో ఆలోచి౦చ లేదనే చెప్పాలి .

  సంస్కృత కవయిత్రులు మాత్రం స్త్రీత్వ సహజ విషయాలకు ప్రాదాన్యమిచ్ఛి  .ప్రేమకు పట్టాభి షేకం చేశారు .కాని బౌద్ధ  సన్యాసినులైన కవయిత్రులకు ప్రేమా దోమా జాన్తానై.’’ లైట్ .‘’తీసుకొన్నారు .అది అసలు వారికి విషయమే కాకుండా పోయింది .సంస్కృత కవయిత్రులు సహజ ప్రకృతి ధర్మాలను విస్మరించకుండా వాటిని పండించి ఫలవంతం చేశారు .మానవ ప్రేమకు మహోత్సవం జరిపారు .ప్రేమలోని సౌందర్యాన్ని ,ఆన౦దాన్ని ఆకాశానికి ఎత్తేశారు .దీనికి పూర్తి విరుద్ధంగా బౌద్ధ సన్యాసినులు ప్రవర్తించారు .అభిరుచి ఆసక్తి అన్ని అనర్ధాలకు మూల కారణం అనీ, కనుక దాన్ని త్యజించాలని భావించారు . కోరిక అభిరుచి భౌతికప్రేమ ,దాని వికార రూపం ,మలినత్వం పై పదే పదే విరుచుకు పడ్డారు .కనుక సంస్కృత కవయిత్రులకవిత్వం అత్య౦త తీవ్రమైన స్త్రీత్వపు హృదయం అందులోని సంతోషం ఆనందం బాధలు కన్నీళ్లు ,అల్ప సంతోషం,కడగండ్లు మొదలైన మానవత్వ విషయాలతో   ఘనంగా  పరిమళి౦చి౦ది .కాని బౌద్ధ సన్యాసినుల ‘’గాథాకవిత్వం’’ లో లక్ష్యాన్ని చేరుకొని ,ప్రశాంతత తో సంతృప్తి సాధించి,భౌతికానంద ,సుఖాలను పరిత్యజించి ,సుఖ దుఖాలకు అతీతంగా  ఆడ మగఅనే   భేదభావం లేని రుషిత్వం తో, కేవలం ఋషిగానే ,వ్యక్తులకు ప్రాధాన్యతలేని సర్వమానవ ప్రేమ దయ కరుణ లే ముఖ్యంగా భావించారు, జీవితాలు సాగించారు .

  సన్యాసినుల గాథలలో సహజ సరళ భావ వ్యక్తీకరణ ,కొన్ని చోట్ల పరమాశ్చర్యం కలిగించే ‘’ఉపమ’’ లతో ఉంటాయి .అయినా వాటిలో సహజ సదృశమైన అందం  సంగీతం ,లావణ్యం లోపించి మనసులను ఆకర్షించలేదు .ఈ విషయంలో సంస్కృతకవయిత్రులకవిత్వం సర్వాంగ సుందరం అనిపిస్తుంది .ఒక్కసారి పునశ్చరణ చేస్తే- సంస్కృతకవయిత్రులకవిత్వం అనేకానేకంశాలతో బహు కుతూహలంగా  రమ్యంగా ఆకర్షణీయంగా ఉంటె ,బౌద్ధ సన్యాసినుల గాథలలో కవిత్వం ఒకే ఒక్క విషయంపైనే దృష్టిపెట్టి రాసింది .మొదటి వానిలో లక్ష్యం ,స్పష్టత ఉండి,బాహ్యవిషయాలపై ఆసక్తి కనిపిస్తుంది .రెండవదానిలో ఎక్కువగా విషయపరమై ,నైరూప్యంగా అంటే ఆబ్స్ట్రాక్ట్ గా అనగా లోపలి అనుభవాలను చిత్రీకరించాయి మొదటి వాటిలో ఇంద్రియపరమైనవిగా భావగీతాలుగా మనసుకు హత్తుకొంటాయి .రెండవ రకమైనవాటిలో గంభీరత తీవ్రత ,సందేశాత్మక బోధనగా ఉంటాయి .మొదటివి ఆసక్తి రేపి ,సజీవంగా ఉంటె రెండవ రకానివి గంభీరంగా ప్రశాంతంగా ఉంటాయి .మొదటివాటిలో’’ ఫెమినైన్ టచ్’’అంటే స్త్రీత్వ స్పర్శ తో వైయక్తికమైతే రెండవవీ సహన దయాశీలం సార్వకాలికంగా దేనికీసంబంధంలేనట్లు౦ టాయి .మొదటివి సాధారణంగా మధురంగా ఉంటె  రెండోవి కూడా సరళ౦గాఉన్నా  నిరాడంబరంగా కఠినంగా కనిపిస్తాయి .మొత్తం మీద మొదటి వాటిలో  మక్కువ ఉద్వేగ ఉద్రేకాలు ఉంటె, రెండవవాటిలోలోతైన,గాఢమైన అభినివేశాలుంటాయి .మొదటివి చురుకుతో సజీవమైతే  రెండవవి గంభీరంగా ఉన్నతమైంది.మొదటిది ఈ లోకం గురించే ఆలోచిస్తూ తెలీని మరోలోకం వైపు చూడలేదు .రెండవది ఈ లోకాన్ని తృణీకరించి పరలోక మార్గాన్వేషణ చేసింది  .రెండురకాల కవిత్వాలను మహిళలే రాసినా పూర్తి వైరుధ్యం దర్శనమిస్తుంది .మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకొందాం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చంద్రుని అతిపెద్ద బిలం లో కప్పుకుపోయిన అతిపెద్ద ”హవాలి ”

An ‘Anomaly’ the Size of Hawaii Is Buried Beneath the Moon’s Biggest Crater

—

Earth’s moon is hiding an enormous secret on its storied dark side. Deep below the moon’s South Pole-Aitken basin (the largest preserved impact crater anywhere in the solar system), researchers have detected a gargantuan “anomaly” of heavy metal lodged in the mantle that is apparently altering the moon’s gravitational field.

According to a study of the mysterious blob, published April 5 in the journal Geophysical Research Letters, the anomaly may be the heavy leftovers of the asteroid that crashed into the far side of the moon and created the giant South Pole-Aitken crater some 4 billion years ago. However, all that researchers can say for sure at this point is that the blob is big — likely weighing somewhere in the neighborhood of 2.4 quadrillion US tons (2.18 quintillion kilograms).

“Imagine taking a pile of metal five times larger than the Big Island of Hawaii and burying it underground,” lead study author Peter James, assistant professor of planetary geophysics at Baylor University’s College of Arts & Sciences, said in a statement. “That’s roughly how much unexpected mass we detected.” [10 Interesting Places in the Solar System We’d Like to Visit]

James and his colleagues discovered the blob while comparing maps of lunar topography with data collected by NASA’s Gravity Recovery and Interior Laboratory (GRAIL) mission — a 2011 experiment wherein two satellites orbited the moon in tandem, mapping the precise strength of its gravitational pull at various locations.

The GRAIL readings revealed something very heavy tugging down the bottom of the South Pole-Aitken crater by more than half a mile.Whatever it was, the offending anomaly was buried hundreds of miles below the moon’s surface.

In the new study, the researchers ran impact simulations to show that this underground debris could, theoretically, be the remnants of a heavy iron-nickel asteroid that got stuck part way to the lunar core.

“We did the math and showed that a sufficiently dispersed core of the asteroid that made the impact could remain suspended in the Moon’s mantle until the present day,” James said.

Measuring about 1,553 miles (2,500 kilometers) wide, the South Pole-Aitken crater is already one of the moon’s largest mysteries. Not only is it the biggest impact crater in the solar system, but its towering rim and deep basin also contain the moon’s highest and lowest elevations.

Researchers aren’t totally sure what the vast bowl of dusty rock is made of, but think it could include some chunks of lunar mantle amidst the upper layers of crust and dust. China’s Chang’E-4 lander, which reached the far side of the moon earlier this year, recently began analyzing soil near the crater, giving scientists their first peek at what the moon’s innards might be made of. As a moon-walker might say, that’s one small step towardunderstanding the blob.

LiveScience
Posted in సైన్స్ | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన -2

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన -2

   సంస్కృత –వేద కవయిత్రులు-2

‘’సాస్వతి ‘’కవయిత్రి అభిప్రాయం పైదానికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది .ఆమెలో సర్వసమర్పణ ,అంకితభావం భర్తపట్ల పూర్తీ విధేయత ,భర్త చేసిన పాపాలకు పరిహారంగా తాను వ్రతాలు నోములు చేసి పాపవిముక్తుడిని చేయటం ,అతడు పూర్తిగా మంచి మనిషిగా మారాక అంతులేని ఆనదాన్ని సంతోషాన్ని పొందటం కనిపిస్తుంది (8-1-34)

ఒక  సుదీర్ఘ మంత్రం లో కొత్త పెళ్ళికూతురు గురించి కొన్నిప్రసిద్ధ  వివాహమంత్రాల గురించి ఉన్నది .గృహిణిగా ఇంటి పెత్తనాన్ని పొంది కొడుకులు కోడళ్ళు మనవలతో ఆమె పొందే ఆనందం వర్ణింపబడింది (10-35).అగస్త్యుని సోదరి కుమారులకోసం ఇంద్రుని తల్లులను ప్రార్ధించటం ,వారు తమ పుత్రుల ఘనత ,సాధించిన విషయాల ను  గర్వంగా చెప్పటం వర్ణించబడింది (4-18,10-153).

మరికొన్ని మంత్రాలలో స్త్రీ జీవితం లో వివిధ దశల వివరణ మరికొన్నిటిలో అనేక తరహాల స్త్రీలు వర్ణించబడ్డారు .’’గోధా’’అనే ఆమె ఇంద్రుని భక్తురాలుగా ,ఆయనపైనే ఆధారపడినదానిలాగా  కనిపిస్తుంది(10-134).’’యామి’’ చెప్పినట్లుగా ప్రచారం లో ఉన్న మరొక మంత్రం లో  మక్కువ ,ఉద్రేకం ,విలాసం, ఉన్న స్త్రీ చివరికి తన సోదరుడిని సైతం మోహింఛి చెడగొట్టిన వర్ణన ఉన్నది  (10-10).శీలం చెడినఒక  స్త్రీ శృంగారం పై తనకున్న నీచ అభిప్రాయాన్ని చెప్పి ఇతరులకు కూడా అదే భావాన్ని కలిగించి దాన్ని నీచంగా ప్రచారం చేయటం   కనిపిస్తుంది (10-95). ‘’సరమా ‘’చెప్పినట్లున్న మరొక మంత్రం లో  విశ్వాసమున్న దూత వ్యక్తిత్వ వర్ణన ఉన్నది (10-108).

  కనుక సంస్కృత కవయిత్రులులాగానే వేదఋషీమణులుకూడా వివిధ విషయాలపై నా, స్త్రీ జేవితం లోని వివిధదశలపైనా అంటే ముసలి పనికత్తెపెళ్ళికి ఆరాటపడటం(ఘోష ) ,కొత్త పెళ్ళికూతురు (సూర్యా),పతివ్రత అయినభార్య (సాస్వతి ),అసూయాపరురాలైన ఇల్లాలు (ఇంద్రాణి ),విలాస స్త్రీ (రోమసా,లోపాముద్ర )జబ్బుపడ్డ భార్యను దూరం చేసినభర్త (ఆపాలా ),సంతృప్తితో జీవించే గృహయజమానురాలు (విశ్వవార )పుత్రుల పరాక్రమాలకు గర్వపడే తల్లి (అగస్త్యుని సోదరి ,అదితి ఇంద్రమాతలు )కవితలు చెప్పారు .మత ధర్మాలకు అంకితమైన పతివ్రత  ( గోధ ) వేశ్య (యమి )శీలం చేడ్డ స్త్రీ (ఊర్వశి ),విశ్వాసపాత్రురాలైన  దూత (సరమా )లగురించీ మంత్రాలలో చెప్పారు .వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ,స్త్రీకి ఉన్న అపార మానవతా దృష్టి ,పూర్తిగా జీవం కలగజేయటం ,శక్తి ఓజస్సు ,కట్టలు తె౦చు కొనే ఉద్రేకం అన్నీ గుండెలోతుల్లోంచి పెల్లుబికి వస్తున్నట్లు తెలుస్తుంది .

  కాని వీరు ఇంత వైవిధ్యంగా ప్రకృతిని దర్శించి చెప్పింది చాలాతక్కువే .కొన్ని చోట్ల అగ్ని రాత్రి మొదలైన వర్ణనలు అద్భుతంగా చేశారు .సంస్కృత కవయిత్రుల కవితలను ,ఋషీమణులైన కవయిత్రుల మంత్రాలతో పోలిస్తే -స్త్రీ మనసు ,సహజమైన ఆత్మభావన ఎక్కడో కొన్ని ప్రత్యెక విషయాలను మినహాయిస్తే సమానంగానే కనిపిస్తాయి .తరువాత తరువాత వచ్చిన మంత్రాలు పూర్వపు వాటికంటే చాలా మోటుగా ఘాటుగా ,ఉద్రేకపూరితం మమకారం గా అత్యంత శక్తివంతంగా కనిపిస్తాయి .మొదటివి కళాత్మకంగా ,నగిషీలతో మెరిస్తే ,తరవాత వచ్చినవాటిలో  ఆ నిండుదనం ,శోభ ,కళ తగ్గినట్లనిపిస్తాయి .

  దీనితర్వాత సంస్కృత కవయిత్రుల, ,బౌద్ధ భిక్షిణుల కవిత్వానికి ఉన్న తేడాలను తెలుసుకొందాం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన

సంస్కృత ప్రాకృత కవయిత్రులకు ప్రేమ అతిముఖ్యమైన అంశం .ఇద్దరికీ అగమ్య గోచరమైన విధి ,దేవుడు విషయాలపై ఉదాసీనంగా ఉన్నారు .వీటికోసం కవితా మేధస్సును వృధా చేసుకోరాదని భావించారు .అజ్ఞాతం అజ్ఞాతంగానే ఎప్పుడూ ఉండిపోతుందని , .దీనికోసం ఆరాటం వృధా అనుకొన్నారు .

  ప్రాకృత కవయిత్రులు రెండు నూతనమైన ప్రేమమార్గాలను తెలిపారు .ఈపని సంస్కృత కవయిత్రులు చేయలేకపోయారు .అంటే ప్రియుడి పై ఆధిపత్యం సాధించలేకపోయారు .దీనికి బదులు వారు అణగిమణగి ఒదిగి ఉండిపోయారు ప్రియులకు .అందులోనే ఆనందాన్ని సంతృప్తి ని అనుభవించారు .భర్త లేక ప్రియుడి భావాలకు అభిప్రాయాలకు విలువనిచ్చి తమమనోభావాలను లోలోనే అణచి వేసుకొన్నారు .ప్రియుడి నిర్వచనం విషయం లో సంస్కృతకవయిత్రులకంటే ప్రాకృత కవయిత్రులకే అగ్రతాంబూలం .

 మొత్త౦మీద ప్రాకృత కవయిత్రులుతమ సోదరీమణులైన సంస్కృత కవయిత్రులకంటే స్వీయ నియంత్రణ కలవారు .ప్రేమ విషయంలో జాగ్రత్తలో ఉండేవారు .ప్రాకృత కవయిత్రులు లాగానే ఆ స్త్రీలు ప్రియుని దూషించటం చేయలేదు .మగవాళ్ళు లేక ప్రియులు పరిపూర్ణమైన లేక సమగ్రమైనవారు కాకపోయినా వారు క్షమించారు .వారిని వేధించలేదు ,కతఠినంగా విమర్శించనూలేదు .పైపెచ్చు తమపైనే నింద మోపు కొన్నారు .తమప్రియుల కోసం తమను తాము త్యాగమూ చేసుకొన్నారు .

  సంస్కృత ,ప్రాకృతకవయిత్రులు సెక్స్ విషయం లో అత్యున్నతమైన స్త్రీత్వ స్పర్శ  కనపరచారు  .ఆడంబరమైన పదాలు ,సంక్లిష్ట సమాసాల జోలికి వెళ్ళలేదు .స్పష్టత ,లావణ్యాలకు ప్రాధాన్యమిచ్చారు .లోతైన పరిశీలన ,అంతర్ దృష్టి ఈ కవయిత్రులకు అద్భుతంగా ఉండటం సహజం సుందరం సత్యం .

   సంస్కృత –వేద కవయిత్రులు-1

సంస్క్రుతకవయిత్రులను అనేకఋగ్వేద  మంత్రాల ద్రస్టలైన  వేద రుషి కవయిత్రులతో పోల్చటం తమాషాగా ఉంటుంది .అనూచానంగా వచ్చిన మంచి సంప్రదాయం ,సంపూర్ణ పాండిత్య౦, సంపూర్ణ వికాసం లకు  వారసులైన మహిళా వేదకవయిత్రులు ,స్త్రీత్వ సహజమైన కోరికలు భావాలు ఆన౦దానుభవం ,సౌందర్యం ,వినోదం ,సురుచికరమైన హాస్యం సంపూర్ణంగా అనుభవించారు .ఈ లోకం అందించినవాటిని అందిపుచ్చుకోవాలనే భావించారు .వీరందరికీ ప్రేమ అతిముఖ్యమైన విషయమే .దాంపత్య సౌఖ్యం గొప్పవరంగా భావించారు .మతం  భొతిక ఆన౦ద సుఖాలకు,సంక్షేమానికి  చేతి పనికత్తె గా అనుకొన్నారు .కనుక వేద రుషీమణులైన ఈ కవయిత్రులు చేసిన ప్రార్ధనలు స్తోత్రాలు అన్నీతగినభర్త లభించాలని ,భర్తప్రేమ అందుకోవాలని , భౌతిక సుఖానందం పొందాలనే భౌతిక వాంచలు తీరటం కోసమేనని అర్ధమౌతుంది  .ముక్తి ,మతోద్ధారణ అలౌకిక ఆన౦దాలకోసం మాత్రం కాదు .’’

 ‘’ విశ్వవార ‘’అనే వివాహిత స్త్రీ అగ్నిని భౌతికసుఖం ,రక్షణ జీవితం కోసం ప్రార్ధించింది (ఋగ్వేదం 5-28). ఘోష అనే రాజకన్య తనకు సోకిన కుష్టు వ్యాధినుంచి విముక్తికల్గించి మంచి వరునితో వివాహం జరిగేట్లు చేయమని ,తాను వంటరిగా ఇంట్లోనేముసలితనం ఆక్రమిస్తూ ఉండిపోయానని ,తనకు  వ్యాధి నయం చేసి, కురూపం పోయి సురూపం వచ్చేట్లు చేసి ,ధనవంతుడైన ప్రముఖునితో వివాహం జరిపించమని అనేకమంది దేవతలకు ,మనుషులకుఈవ్యాధిని నివారించిన అశ్వినీ దేవతలను ప్రార్ధించింది (10-39). .అంతేకాదు అశ్వినులు తనకు సంతృప్తిగా కాముకతను రసికతతో కూడిన ప్రేమపై మంచి అవగాహన కలగ జేయమని ,పరిస్థితులప్రాబల్యం వలన అవన్నీ తనకు దూరమైనాయని దీనంగా వేడుకొన్నది .కన్య మనసులోని కోరికలు పురి విప్పి నాట్యం చేసినట్లుగా ఘోష తన ఘోషను మంత్రాలలో దివిజ భిషగ్వరులైన అశ్వినీ దేవతలకు విన్నవి౦చు కొన్నది .

    అలాగే ‘’ఆపాల ‘’కూడా ఘోషలాగానే తన దీనగాధను  వెళ్ళబోసింది .శారీరకవ్యాది బహుశా బొల్లి తో బాధపడుతూ ,భర్తతో సహా అందరికి దూరమై, భర్త ప్రేమ  గగన కుసుమమై  చివరికి ఇంద్రుని తన జబ్బు నయం చేసి తనను భర్తతో కలిపి ,భర్తతో దాంపత్య సుఖం   ప్రసాదింపజేయమని ప్రార్ధించింది .ఆమె ప్రార్ధనమన్నించి ఇంద్రుడు ఆమె చర్మవ్యాధిని నయం చేసి శరీరానికి స్వచ్చమైన సూర్యకాంతి వంటి కాంతిని ప్రసాదించి  భర్తకు దగ్గర చేసి ఆమె కోరికతీర్చి ఉపశాంతిని కలిగించాడు .ఆపాలా  ప్రార్ధించిన మంత్రం లో భర్తకు దూరమైన భార్య వేదన ,మళ్ళీ అతనితో సమాగమవ్వాలనే గాఢవాంఛ కనిపిస్తాయి .

  ఇలాగే మరికొందరున్నారు .’’రోమాసా ‘’తన అపరిపక్వతవల భర్త కోపానికి బలై,తర్వాత తనతప్పు తెలుసుకొని పరిపక్వత సాధించి యవ్వనోద్రేకాన్ని కురిపించి  భర్త మెప్పు పొందింది .సుఖసంతోష స౦తృప్తి పొందింది .అగస్త్యమహర్షి పత్ని లోపాముద్ర ముసలివాడైనతనభర్తవలన రతి సౌఖ్యం పొందలేక నిర్లక్ష్యానికి గురై ఒకమంత్రం లో ఆయననను తన దగ్గరకు వచ్చి శృంగారకేళి జరిపి సౌఖ్యం ప్రసాదించమని కోరింది .ఆ మంత్రభావ౦ ‘’మనం చాలాయేళ్ళుకృషి చేశాం చాలా  శ్రమించాం.ముసలితనం మీదపడింది .ఇప్పుడైనా జీవితం లోని ఆనందం , సుఖం అనుభవిద్దాం .’’అని ఆహ్వానించింది .’’ఇంద్రాణి ‘’అరుదైన తన అందాన్ని, సౌందర్యాన్ని  విశేషమైన మధురానుభవాలను జ్ఞాపకం చేసి  భర్తను మళ్ళీ ఆకర్షించే ప్రయత్నం చేసింది .ఈ తపస్విని రెండుమంత్రాలలో అసూయాపరురాలైన భార్య ప్రవర్తన చూపించింది .మొదటి దానిలో తనభర్తకు అత్యంత ప్రియురాలైన తన సవతిని దూరం చేయటం కోసం ఒక మూలికను మంత్రించి సవతిని దూరంగా తరిమేసి భర్తప్రేమకు తానే సర్వాదికారిణి కావటం .ఇందులోని ప్రతిపదం లో ఆశాభ౦గం పొందిన అసలుభార్య మనసు లోతుల్లో సవతిపై ఉన్న ద్వేషం, పగా, ప్రతీకారం కన్పిస్తాయి .రెండ మంత్రం లోనూ మానవ సహజ గుణాలు కనిపిస్తాయి .అసూయాపరురాలైనభార్య ,సవతిని తట్టుకోలేక ,ఓర్చుకోలేక పోటమేకాదు, తనభర్త తనకన్నాస్నేహితుడిని ఆదరించటతమూ సహించ లేకపోతుంది .అతని దృష్టి మరల్చటానికి చేయని ప్రయత్నం ఉండదు .నెమ్మదినెమ్మదిగా భర్త మనసులోఅనేక విధాలుగా  విషం ప్రవేశపెడుతుంది.ముందుగా తన వ్యక్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని గుర్తుకు తెచ్చి ,అతని స్నేహితుడు భర్త అధికారాలనుఅన్యాయంగా  లాగేస్తున్నాడని చెప్పి అతని స్నేహితునిపై సానుభూతి చూపటం మానేయమని ,ప్రతీకారం తీర్చుకోమని హితవు చెబుతుంది .అతనిలో కోపాగ్ని బాగా రగిల్చటానికి భర్త శౌర్య ప్రతాపాలను కీర్తిస్తుంది .పరాకాష్టగా భర్త స్నేహితుడు తన అంద చందాలపై కన్ను వేశాడని ,ఇకతాను భర్తకు దక్కకుండా పోతానేమోనని ,తనభర్తకు దక్కాల్సినతన సౌందర్యం ,సుఖం వేరొకరికి దక్కటం తనకు ఇష్టం లేదని రెచ్చగొడుతుంది  .అసూయ నిండిన భార్య సైకాలజీ ఇక్కడ స్పష్టంగా ప్రత్యక్షమౌతుంది .భర్తమనసు మార్చటానికి, సవతిని దూరం చేయటానికి అసూయ కలభార్య యెంత దూరమైనా వెడుతుందని , ఎంతటి మాయోపాయాలైనా చేస్తుందని ఈ మంత్రాలు మనకు తెలియజేస్తాయి .ఇవన్నీ భౌతికానందం కోసమే  నని మరువరాదు .మిగిలినవారి మనస్తత్వమేమిటో తరువాత తెలుసుకొందాం

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 469-‘’ఆసేచనక ‘’రామాయణకర్త –బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి (1850)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

469–‘’ఆసేచనక ‘’రామాయణకర్త –బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి (1850)

రామాయణార్య లేక ‘’అసేచనక రామాయణం;; రాసిన బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి 1850లో పుదుక్కొట వద్ద కడయక్కుడి గ్రామం లో జన్మించాడు .కౌశిక్ గోత్రానికి చెందిన సామవేది .రామభద్ర దీక్షితుని మామ చొక్కనాధ దీక్షిత వంశంవాడు .గొప్ప వ్యాకరణ వేత్త అయిన రామభద్ర దీక్షితులు జానకీ పరిణయ కావ్యం రాశాడు .ఈ వంశీకులంతా తిరుచినాపల్లి తాలూకా బొమ్మసముద్రం దగ్గరున్న ‘’నాచికురిచి ‘’గ్రామానికి చెందినవారు .ఇక్కడినుంచి పుదుక్కోటరాజ్యం లో ని’’ పిన్నంగుడి’’ కి వలసవెళ్ళారు .మనకవి తండ్రి శంకరనారాయణ శాస్త్రి కడయక్కుడి లో స్థిరపడ్డాడు .ఇక్కడే ఉన్న స్వామి అయ్యంగార్ వద్ద కావ్య నాటక అలంకార శాస్త్రాలు,తంజావూర్ జిల్లా అనంతగిరి తాలూకా కారవాయాల్ లో ఉన్న   శ్రీనివాస శేషాచార్యవద్ద వ్యాకరణం నేర్చాడు సూరి .వీటన్నిటిలో నిష్ణాతుడై కవిత్వ ,చిత్రలేఖన సంగీతాలలోనూ అద్వితీయుడనిపించాడు .వీటితోపాటు హరికథాగానం లోనూ,రచనలోను  సిద్ధహస్తుడు .ఎన్నో హరికథలు స్వయంగా రాసి గానం చేసి సభలలో మెప్పించాడు .పుదుక్కొట రాజాగారికాలేజిలో సంస్కృత అసిస్టెంట్ గా 19-1-1894న చేరి ,16-2-1910లో శాఖాధిపతి అయ్యాడు .

  అసేచనక  రామాయణం తోపాటు ,వల్లీ బాహులేయం నాటకం ,’’చతుష్పదీ చతుశ్శనీ ‘మన్మధమధనం అనేభాణం,పూర్వాదునిక్ వృత్తపద్యాశికా ,వృత్తనామ సంగ్రహం ,కారకాణి రచించాడు .సంగీత రూపకాలుగా రామావతారం సీతాకల్యాణం ,రుక్మిణీ కల్యాణం,పార్వతీకల్యాణ౦  వగైరా రాశాడు .రామ చంద్ర పద్య పంచరత్నం ,శుక సూక్తి ,సుధారసాయనం డోలాగీతాని  మొదలైనవి రచించాడు .అయితే వీటిలో కొన్నిమాత్రమే తనవద్ద ఉన్నాయని సూరిగారి కుమారుడు మద్రాస్ లోని అకౌంటెంట్ జెనరల్ ఆఫీస్ సూపరిం టే౦డెంట్ శ్రీ ఎస్.శంకరనారాయణ 1932లో తెలియజేశారు .

సుబ్రహ్మణ్య సూరి రాసిన అసేచనక  రామాయణం లేక రామయాణార్య ఆర్యా ఛందస్సులో రాయబడిన కావ్యం .ప్రతిశ్లోకం లోని మూడుపాదాలలో కధాంశం ఉంటె నాలుగవపాదం లో వీటి లోని నీతి ఉంటుంది అదీ ప్రత్యేకత. ఇంతకీ అసేచనక అంటే ఏమిటి ?మిక్కిలి సుందరమైనది అని అర్ధం .సుందరకాండ మాత్రమేకాదు రామాయణ కాండలన్నీ బహు సుందరమైనవని తెలియ జేసి ,రచనలో రుజువు చేశాడు సూరి . కావ్యానికి అందమైన పేరు పెట్టటం లోనూ తన ప్రత్యేకత చూపించాడు .

బాలకాండ లో శ్లోకాలు –

యః పూర్వమాధ్యాం కవితోచ్చశాఖామారుహా రామేత్య శక్రుచ్చకూజ-రసం చ రసాక్షరమత్ర వందే వాల్మీకినామాద్రుత కొకిలం నమ

నారదః పయోదే ర్వాల్మీకీ రామ చరిత మయమమృతం –యన్నం వినేవ లేభే సాధుజన౦ సాధ్యమేవ సఫలయతి

క్రౌన్చమిదునా త్విలైకం వాల్మీకిః కాముకం కిరాతహతం –హ్రుశ్వ సుశోచ దయయా  భూతదయా భూతాదియానీ పుంసాం ‘’

200వ శ్లోకం –‘’కేసరికా పిజయాయం శ్వసనేనో ప్యాదితో౦జనా రవ్యాయతమ్ – దాసస్తవ రామాయం సద్దార్మికో హి మార్జరః  

ఫలహరణాయ జనన్యాం చాలితాయాం శోశవేయమానిలసుతః –ఫలబుధ్యతా ర్కముపాగమత్ బాలో వత్సోభయం న జానాతి ‘’

చివరిశ్లోకం –‘’ప్రతియుగ మవనాయ సతాం కతిపయ శఠ శిక్షణాయచ శ్రీశః-అవతారతి రఘోర్వంశేనివసతి నైకత్ర రాక్షకో నృణాం’’

‘’ఇతి ఉత్తరాకాండః

ఇతి కడయకుడి బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి కృతంశ్రీ మదసేచనక రామాయణం సంపూర్ణం ‘’ఓం తత్సత్ ‘’

ఇలా రామయణాన్ని బహు సుందరబందురంగా 289శ్లోకాలో కవిత్వీకరించి’’ అసేచనక రామాయణం’’ అనే అన్వర్ధనామాన్ని ఉంచి సమర్ధంగా, బహుజనరంజకంగా ఆర్యావృత్తం’లలో నిబంధించి సొగసు చేకూర్చిన బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి ధన్యుడు .

ఆధారం -సుబ్రహ్మణ్య సూరి కుమారుడు శంకరనారాయణ వ్యాసం

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-6-19-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )-2

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )-2

ఇప్పుడు వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కావ్యం లోరాణీ దేవకుమారిక కవితా ప్రాభవం చూద్దాం

మొదటి ప్రకరణ లోని వంశ వర్ణన –

1-‘’శివంసాంబ మహం వందే విద్యా విభవ సిద్ధయే-జగత్ సూతిహరం శంభు సురాసుర సమర్చితం ‘’

2-గుజ్జద్ భ్రమద్భ్రమరరాజ విరాజితాస్యాం-స్తంబే రామాననమహం నిరతాం నమామి

యత్ పాదపంకజపరాగ పవిత్రతానాం-ప్రత్యూష సమయైవ ప్రధమం ప్రయాన్తి ‘’

3-శారదా వస్తూ శరదంబుజ –స్వాననా మామ ముఖామ్బుజీ సదా

యత్ కృపాయుతకటాక్ష భాగయతో-భాగ్యలోపమయమేతి  మానవః ‘’

4-‘’స భూయాద్ ఏకలింగేశో జగతో భూతయేవిభుః-యస్య ప్రసాదాత్ కుర్వన్తి రాజ్యం రాణాభువఃస్థిరం ‘’

5-‘’యదేకలింగం సమభూత్ పృధివ్యాం-తేనేక లింగో త్యభిదాభ్య ధాయి ‘’

 చతుర్దశీ మాఘ భవాహికృష్ణా –తస్తాం సముద్రభూతిరాభూక్త్వస్య ‘’

6-‘’తదా సునీనాం ప్రవరస్త పస్వీ –హారేతనామ శివభక్త ఆసీత్

  స ఏకలింగం విధివత్ సపర్యా -విధోరతోషిష్ట శివేషు నిష్టః

కావ్యం లో చివరి రెండు శ్లోకాలు –

‘’హరిశ్చ౦ద్ర నామాహి జన్మాభ్యభాగోత్ –ఇదం వైద్యనాదాస్టకంభక్తియుక్తః

ప్రభాతే పరేత్ స్తోత్రఏతన్నరోయోస్పనేవా భ్సితార్ధం ససిద్ధం లభేత్

‘’ఇతి దేవకుమారికా నామ రాజ మాతృహుత వైద్యనాధప్రసాద ప్రశస్తి ప్రతిష్టాప్రకరణం పంచాస్వం ‘’-సమాప్తేయం ప్రశస్తిః’’

468-సంతానగోపాల కావ్యకర్త –లక్ష్మీ రాజ్ఞి(19వ శతాబ్దం )

ఉత్తర మలబార్ పాలకులు కటత్తన్నత్తు రాజుల   ఏకావలట్టుశాఖకు చెందిన లక్ష్మీ రాజ్ఞి సంతాన గోపాలకావ్యం రాసింది .45ఏళ్ళక్రితం రాసి 21ఏళ్ళక్రితం చనిపోయింది .19వ శతాబ్దం లో ఉన్నది .ఈమె ఇతరరచనలు అలభ్యం .రాజారవి వర్మపై ఉన్న అభిమానం తో అనారోగ్యం పాలబడినా రాసింది .ఇది మూడు సర్గల  130శ్లోకాలకావ్యం  .భాగవతం ఆధారంగా రాసింది .

 కధ-ఒక బ్రాహ్మణుడి8మంది సంతానం చనిపోతే చివరికి శ్రీ కృష్ణుని దర్శించి రెండుసార్లు మొరపెట్టుకొన్నా లాభం లేక9వ సంతానమూ నష్టమైతే , దారిలో అర్జునుడు కనిపించి వివరం తెలుసుకొని పదవ సంతానాన్ని ఎలాగైనా రక్షిస్తానని ,అలాచేయలేకపోతే అగ్నికి ఆహుతౌతానని అభయమిచ్చి,పదవ శిశువు ప్రసవానికి ఇంటిచుట్టూ బాణాలతో కోటకట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నప్పటికీ శిశువుజన్మించటం వెంటనే చావటం జరిగిపోగా, సంతాన శోకంతో ఉన్న బ్రాహ్మణుడు తిట్టని తిట్టకుండా క్షోభపెడితే అవమానం తో అర్జునుడు అగ్నికి ఆహుతయ్యే ప్రయత్నం  చేయగా కృష్ణుడు ప్రత్యక్షమై నివారించి ,తామిద్దరం  ఆ శిశువును వెతికి తెద్దామని బయల్దేరారు .

  రెండవ సర్గ లో కృష్ణార్జునులు శ్రీహరి దర్శనం కోసం బయల్దేరి లోకాలోక పర్వతం దాటి హరిని దర్శించగా విషయం తెలిసి తనలోకం లో,తన దర్శన౦చేసినందున పునర్జన్మ ఉండదని చెప్పి శిశువులను తెచ్చి అప్పగిస్తాడు .మూడవ సర్గ లో బ్రాహ్మణుడు తాను  కోల్పోయిన పది మంది సంతానం శ్రీ కృష్ణార్జున సాయంతో తిరిగి పొందినందుకు మిక్కిలి సంతోషించి అర్జునునికి ఆశీర్వాదం కృష్ణపరమాత్మకు నమస్కారం  స్తోత్రం చేసి కృతజ్ఞత వెల్ల డించుకోవటం తో కావ్యం పూర్తవుతుంది .

  కవయిత్రి లక్ష్మీ రాజ్ఞి మాతృహృదయమున్న మహిళ కనుక కురుక్షేత్ర సంగ్రామం లో కృష్ణార్జునులవలన నరసంహారం విపరీతంగా జరిగిందని దానికి తగిన ప్రాయశ్చిత్తం పొందాలని ,కురుక్షేత్ర విజయగర్వం ఎక్కువకాలం నిలవదనీ ,అందుకే కృష్ణార్జునులు హరిలోక సందర్శన చేశారని చెప్పింది .లక్ష్మి కవిత్వం సరళ సుందరం .మూడవ సర్గ ను  యమకం తో యమహాగా రాసింది .ఆమెకు పౌరాణిక అనుభవం పుష్టిగా ఉంది .వసంత తిలక మాలిని ఉపేంద్రవజ్ర ఉపజాతి పుష్పితాగ్ర ,ద్రుత విలంబిత పృథ్వి,శిఖరిణి వృత్తాలను సందర్భోచితంగా ప్రయోగించింది .

సంతానగోపాలం లో లక్ష్మీ కవిత్వ విలసనం చూద్దాం –

మొదటిసర్గ ప్రారంభ శ్లోకాలు –

‘’ఆసీ చ్చూయా విజిత నిర్జర రాజాపుర్యా౦ –కయితుపురా ద్విజ కిల కృష్ణా పుర్యాం

సోయం స్వధర్మనిరతః సహధర్మపత్న్యా –రేమే సుఖం హరి పదాంబుజదత్తచిత్తః ‘’

చవరి శ్లోకం –‘’త్యజ విజయ విషాదం సంప్రతం సర్వమేవ –ప్రియ సఖ తరసా యాన్చితంసాధయిష్యే

ఇతి సుమధుర వాచాసాన్త్వయిత్వా తమేనం –కరతలమవలంబా ప్రస్తుతో వాసుదేవః ‘’

చివరిదైన మూడవ సర్గ ప్రారంభ శ్లోకం –

‘’అధ తదా హరి లోకవిలోకనా –తుదితతత్వ ధియామ ధనున్జయః

కృతహరి స్తుతి రంత మదోయిగద్-ద్విజగృహే లఖహే పురాముదం’’’

చివరిశ్లోకం  –

‘’రోగా౦త రవివర్మ కుమారకస్య –జాతాదరేణ మనమా వచసి ప్రకామం

మౌఖ్యం సమప్యం విగ గాత్య కృతం మయేతత్-కావ్యం ముదా బుధవరాఃపరిశోధయన్తు

 

 

ఇతి తృతీయః సర్గః-సమాప్తం చేదం కావ్యం ‘’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-6-19-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాటక సినీ నటుడు ,రచయితా గిరీష్ కర్నాడ్ మరణించాడు (81)

Actor-playwright Girish Karnad passes away

Actor-playwright Girish Karnad passed away on Monday. He was 81.

—

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )

వైద్యనాధ ప్రసాద ప్రశస్తి ని రాసింది దేవకుమారిక అని మహామహోపాధ్యాయ హరిప్రసాద శాస్త్రి ధృవీకరించాడు .ఈ శ్లోకాలు వైద్యనాథ దేవాలయం గోడలపై చెక్కబడి ఉన్నాయి .చిత్తూర్ రాణాఅమరసి౦హునిపట్టమహిషి రాజకుమారిక .జయసింహుని కోడలు .సంగ్రామ సి౦హ, చంద్రకుమారికల తల్లి  , శబలసి౦హుని  కూతురు ,సుల్తాన సి౦హుని  సోదరి .కాలం 17వశతాబ్దం చివరలేక 18 శతాబ్ది ప్రారంభం .ఆమెకుమారుడి పట్టాభిషేకం 1710-11లో .భర్తమరణి౦చినతర్వాతకాల౦లొ 1716 లో వైద్యనాధ దేవాలయం నిర్మించింది .

 ఈమె రాసిన ప్రశస్తికావ్యం లో వంశవర్ణన ,సంగ్రామ సింహ పట్టాభిషేకం ,దానప్రశంస ,చాహూవానోదయ ,ప్రతిష్టఅనే 5ప్రకరణలున్నాయి .దీన్ని వైద్యనాధ దేవాలయ నిర్మాణ ప్రతిష్ట  సమయం లో రాసింది .మొదటిప్రకరణలో రాజవంశ చరిత్ర రాసింది .రాణాఅనేపేరును మొదట రాహప్ప ఉపయోగించాడనీ, అప్పటినుంచి అదే ప్రచారం లో ఉందని చెప్పింది .సంగ్రామ సింహునికొడుకు ఉదయసి౦హుడు ఉదయపురం నిర్మించాడు .క్షత్రియరాజులందరూ చేతులు ముడుచుకొని కూర్చుంటే రాణాప్రతాప సింహుడు హిందూమత సంరక్షణకోసం దిల్లీపాదుషా అక్బర్ తో పోరాటం ప్రారంభించి జీవితాంతం పోరాటం చేశాడు .కర్ణ సి౦హుని  కొడుకు జగత్ సింగ్ రాజప్రాకారం మధ్య అత్యున్నత విశేషమైన విష్ణు మూర్తి ఆలయం నిర్మించాడు .ఇతనికొడుకు రాజసింహ రాజసముద్ర తటాకం నిర్మించాడు .ఢిల్లీ చక్రవర్తికి చెందిన అజ్మీర్ సరిహద్దు మాల్పూర్ ను జయించి వశపరచుకొన్నాడు .ఇతనికొడుకు అమరసింహుడు ‘’వరసద్విలాసం ‘’అనే మహా అందమైన రాజ అంతపురం జగన్మందిర దేవాలయం కూడా  కట్టించాడు .సాహాపురం కూడా జయించి కీర్తి ఉద్ధృతంగా ఉన్న సమయం లో మరణించాడు .ప్రకరణ శీర్షిక ‘’రాణా’’గాపెట్టటం మేవాడ్ రాజ వంశ ధీర వీర గాధలను చిత్రించటం తగినట్లు ఉన్నది .

  రాహప్ప తర్వాత పాలించిన నరపాలుని ధైర్యసాహసాలకు దినకర అంటే సూర్య ప్రతాపం కు తగినట్లు బిరుదుపొందాడు .నాగపాలుని గజసైన్యం అమోఘమై౦దికనుక కూడా అతనికి నాగపాల సార్ధకం .పూర్ణపాలుడు ప్రజారంజకంగా పాలించాడు .పృధ్వీ పాలుడు శత్రువులనందర్నీ ఓడించి సామ్రాజ్యవ్యాప్తి చేశాడు .భీమసి౦హుడు అరి వీర భీకరుడై శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు .లక్ష్మణ సింహ శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుని తలపి౦ప జేశాడు .అరిసి౦హుని పాదాలు శత్రు రాజుల ఏనుగుల రత్నాలతో అల౦క రింప బడ్డాయి .లక్ష్మీ సింహ లక్షమంది ని చంపి లక్షనాణాలు ముద్రించాడు .మోకాల సింహుడు శివ విష్ణు స్వరూపంగా ప్రజలు భావించారు .రాణాకు౦భకర్ణ అగస్త్యుని అంతటి వాడు .రాయమల్లుని సాటి ఎవరూ లేరు .ప్రతాప సింహునికొడుకు అమరసింహుడు దేవతలనే మెప్పించగా కొడుకు కర్ణ సింహ దానకర్ణునే మరపించాడు .

   రెండవ ప్రకరణం సంగ్రామ సి౦హుని పట్టాభి షేక వర్ణన.వృద్ధ రాజపురోహితుడు’’సుఖరామ ‘’ఆధ్వర్యం లో పట్టాభిషేకం ఘనాతిఘనంగా జరిగింది .కాయస్తరాజు కాన్తజిత్ మేవాతిస్ లతో పోరాటానికి సాయం చేశాడు .యుద్ధంలో సంగ్రాముడు ,శత్రువు దాలేలఖాన్ ఇద్దరూ చనిపోయారు .చివరివిజయం రాణా దే .రెండవ సంగ్రామ సింహుడు చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ జయించాడు .మంత్రి విహారిసింహ తెలివి గలవాడు బుద్ధి సూక్ష్మత ఉన్నవాడు. రాజుకు చక్కగా దిశా నిర్దేశంచేసి   రాజనీతితో  ప్రజా సంక్షేమాన్ని అమలుపరచాడు .విద్యా సంస్కృతులను ప్రజలలో బాగా విస్తరించేట్లు చేశాడు .రాజు మంత్రి పరస్పర సహకారం తో రాజ్యం లో ధర్మపాలన సాగింది  .సంపద పెరిగి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లి  సంగ్రామ సి౦హుని  కీర్తి దశ దిశలా వ్యాపించింది .

 మూడవ ప్రకరణం లో సంగ్రామసి౦హు ని దాన ధర్మ కార్యాలు .విద్వాంసులకు సన్మానాలు ,అందులో ముఖ్యంగా దక్షిణాదికి చెందినా దక్షిణామూర్తికి,బెనారస్ కు చెందిన దినకర్ (1724-25),తర్క వేత్త సుఖానంద ,వేద కార్యనిర్వహణలో ప్రతిభ చూపిన పుండరీక ,దేవరామ ,జ్యోతిష పండితుడు కమలాకాంత భట్ట  మున్నగువారికి  ఘనసత్కారం దేదీప్యమానమై చరిత్రలో నిలిచాయి .

 నాలుగవ ప్రకరణం లో సంగ్రామ సి౦హుని మాతామహుల వంశ విశేషాలు .రచయిత్రి దేవకుమారిక జీవిత విశేషాలు ఉన్నాయి .అయిదవ ప్రకరణలో 1716లో వైద్యనాధ దేవాలయ ప్రారంభోత్సవ వైభవం హాజరైన కోటరాజు భీమ ,దుంగార రాజు రామ సింహ ,సమర్ధులైన పురోహితుల చే అత్య౦తనవైభవంగా జరిగిన తీరు ,రాజమాతగా దేవకుమారిక చేసిన మత విధులు మంత్రి హరాజి ,ఆమెచెలి కత్తే ‘’ప్రేమ’’  కుమారుడు’’ ఊదా ‘’అందించిన సహకారం ,దేవాలయ ప్రతిస్టామహోత్సవం .చివరలో రాజమాత నాలుగవసారి జరుపుకున్న తులాదానం చివరలో హరిశ్చంద్ర రాసిన శివ   అష్టోత్తరం తో కావ్యం పరిసమాప్తిఅవుతుంది .మిగిలిన విశేషాలు తరువాత తెలుసుకొందాం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-19-ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బఠాణీలవ్వ -కవిత -మూసి -జూన్

బఠాణీలవ్వ -కవిత -మూసి -జూన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పండిట్ రవి శంకర్ కు మామ ,గురువు డా బాబా అల్లాయుద్దీన్ ఖాన్ -మూసి -జూన్

పండిట్ రవి శంకర్ కు మామ ,గురువు డా బాబా అల్లాయుద్దీన్ ఖాన్ -మూసి -జూన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితా కాంతులు వెదజల్లే స్పాటిక ‘’ పటిక పువ్వులు ‘’

కవితా కాంతులు వెదజల్లే స్పాటిక ‘’ పటిక పువ్వులు ‘’

హోసూర్ బస్తీ యువక బృందం తరఫున డా అగరం వసంత్ కూర్పరిగా వెలువడిన 13వఉగాది కవితల’’పొత్తం’’నాకు ఈరోజే 8వతేదీ శనివారం ఉదయం అందింది .మధ్యాహ్నం చదివి సాయంత్రం స్పందిస్తున్నాను .ముఖచిత్రంగా ‘’పటికపువ్వులు ‘’తమఅందాన్ని , వైభవాన్ని తెలియ జేశాయి .పటిక ఒక స్పటికం కూడా కనుక రంగులు వెదజల్లే లక్షణాలుంటాయి .ఇందులోని42 కవితలు అలాగే ఉన్నాయి .వివిధభావాలకు వేదికగా , వేర్వేరు  ప్రాంతాల కవులు రాసిన కవితలు సామాజిక  స్పృహకు దర్పణంలా ఉన్నాయి .అందరూ అభినందనీయులే .హోసూరులో తెలుగు బడులన్నీ నిర్బంధ తమిళ చట్టం కారణంగా తమిళ బడులైపోయి తెలుగు పై అభిమానమున్న అందరికీ ఆశనిపాతమై బాధించిందని ,కనీసం అయ్యవార్లు చొరవ తీసుకొని ఆప్షనల్ భాషగా తెలుగు బోధించమని డా వసంత్ చేసిన విజ్ఞప్తి సత్ఫలితాలనివ్వాలని తెలుగువారందరం మనస్పూర్తిగా కోరుకొందాం .దీనికి తెలుగు సంఘాలు అభిమానులు  నాయకులు, తలిదండ్రులు తమ వంతు కృషి చేయాలి .

‘’వివాహం చేసుకున్న వితంతువులా ,జాగృతి నొందిన జాతిలా ,,చైతన్యానికి ప్రతీకలా ,పతాకలా వాడిన మోడు వురుటాకులు తొడిగే నవ వసంతానికి ‘’నిరీక్షిస్తున్నట్లు డా రాధశ్రీ చెప్పారు .’’భూమ్మీద భాషలకు వ్యాకరణాలకు కొదవ లేదు –సంభాషణలే సాధ్యం కాదు ‘’తాను  భాషల వైఫల్యం ను౦చి పుట్టానని ,అందుకే తనకు దినవారాలుతప్ప జన్మదినం లేదని ,తానొక నిశ్శబ్దాన్ని ‘’అనీ రాణి శివ శంకర శర్మ ఉవాచ .డా.యెన్ గోపీ మాత్రం ‘శబ్దం శబ్దత్వాన్ని కోల్పోవచ్చు కాని పర్యవసానం వ్యర్ధం కాదు ‘’అంటూ క్రమ౦గా నిశ్శబ్దమే మాట్లాడుతుంది అని ప్రాఫెటిక్ గా    చెప్పారు .’’ఈ దేశం లో ప్రశ్నించి ప్రతిఘటించే –ప్రజల సమీకరణేతప్ప –మరో దారిలేదని –‘’కొనసాగుతున్న చరిత్ర చెబుతోందని నిఖిలేశ్వర్ భావన .

భావుకుడు పలమనేరు బాలాజీ ‘’కథ లాంటి మనిషి కవి –మనిషిని చూడటం అంటే జీవించటం –కళ్ళతో కళలతో కలలతో జీవించటం ‘’అని అర్ధం చెప్పి ‘’మనిషిలోపలి మనసుని ,మనిషిలోపలి శిశువునీ –కాపాడుకొనే వాడే –కవి ,మనిషి’’ అని నిర్వచించాడు .’’అవసర హడావిడి –అంతశ్చేతన ను తొక్కేస్తోంద ‘’ ని బాధపడ్డాడు డా టి.శ్రీరంగస్వామి .’’ఉగాది పచ్చని ప్రకృతిలోపరిఢవించే –తొలిపండుగ’’అని సంబరపడ్డాడు రానాశ్రీ .చెన్నై డా.ఉప్పలధడియం వెంకటేశ్వరకు ‘’చెట్టుకొమ్మలన్నీ రామ చిలుకలై ‘’మురిసిపోయాయట.చల్లని సంజెవేళ అతడి’’ హృదయం కాగితప్పడవవుతుంది ‘’

డా.మౌనికి ‘’తాను అంతఎత్తులో నిలబడినప్పుడు –అమ్మ ఒదిగిన పండ్ల చెట్టు లా ,నిలువెల్లా ఆన౦దాశ్రువయింది ‘’అందుకే ‘’అమ్మను మించి మూర్తీభవించిన కవిత్వం ‘’ఈ ధరణిపై లేనే లేదని పించింది మౌనికి .

ఈ పోత్తంలో పెన్నేటి పాటకవి విద్వాన్ విశ్వం ను గుర్తు చేసుకొని కృతజ్ఞత తెలిపాడు ‘’విశ్వం పాట’’లో ఆకుల రఘురామయ్య .అభినందనలు రఘూ ..’’పెన్నేటి పాట అంటే –కస్ట జీవుల బతుకాట –కరువు జీవి కన్నీటి గాధ –చిద్రమై పోయిన బతుకుల అద్దం.’’గంజికరువు చేసిన గాయాన్ని –హృదయవేదనగా మలచాడు ‘’విశ్వం అనే’’ మీసరగండ విశ్వరూపాచారి. ‘’సాహిత్య సృజనతో మానవ పరివర్తన కోరుకొన్న ‘’విద్వాన్ పట్టనే ఇంటిపేరుగా ఉన్న విద్వాన్ విశ్వం .’’చెలి సోయగాల పరిమళాలు –సౌందర్య కుసుమాలై విస్తరించిన వేళ’’డా విస్తాలి శంకరరావు ప్రేమగీతం ఆలపించాడు .ఎస్.శశికళకు ‘’అమ్మానాన్నలే అక్షరాలయం ‘’అనిపించారు –అదే తన జీవితాలయం ‘’అని పరవశించింది .’’గాడితప్పిన బుద్ధులపై దాడి చేసి-మానవుడిగా మార్చమని ‘’సందేశమిచ్చాడు డా యడవల్లి పాండురంగ .’’నాగలి నానీలతో దున్నేసి రైతు ప్రతాపం చూపించాడు ఎస్ ఆర్ ప్రతాపరెడ్డి –‘’గుండె మండితే –రైతు ఝలిపిస్తాడు –దగాకోర్లపై –ముల్లుగర్రా చెర్నాకోలా ‘’అని హెచ్చరించాడు .హోసూరు పెద్దాయన నంద్యాల నారాయణ రెడ్డికి ‘’కొండా కోనా యేరూ సెలయేరూ ‘’లలో తెలుగు భజనాలు హరి కధలు ,కీర్తనలు ప్రతిధ్వనింఛి ‘’ప్రాణవాయువై ,ఊపిరై రక్తమై ప్రాణమై మానమై మౌనమై –గుండెల గుడిలో ,నవనాడుల్లో –వెలుగొందుతూ కొలువైఉన్న ‘’అమ్మనుడి –తెలుగు ‘’ ఇప్పుడు సర్వం కోల్పోయి ‘’ప్రాణవాయువే లేని బొగ్గుపులుసు వాయువే నిండిన ‘’స్థితి చూస్తె కల చెదిరి కన్నీరే మిగిలింది ‘’అనేక యుద్దముల నారియు తేరిన యోద్ధ నారాయణ రెడ్డిగారికి .హోసూరు ప్రాంతం లో తెలుగు ఉన్నతిని అధోగతిని కళ్ళకు కట్టించి కర్తవ్య బోధ చేశారు .రెడ్డిగారూ జిందాబాద్ .

‘’మారుతున్నమనిషిగా  -పులుముకొన్న మతం రంగు దులుపుకొని –అంటుకున్న కులతత్వాన్ని వదులుకొని –రాజకీయ  రొ౦పిని దాటుకొని –మానవత్వం తోడుగా ‘’కొత్త అడుగు లేస్తున్నానని డా కాళియప్ప పాండు రంగం  హామీ ఇచ్చాడు .తెలుగు సిమ్లా, కాశ్మీరం అయిన ‘’లంబసింగి ‘’ ని అక్షర బద్ధం చేశాడు బి శంకరరాజు .సాహో  రాజా –‘’అక్కడి కొండపనస –తియ్యని బాసలు చెబుతుంది –మనుషులు పరమ బుద్ధులుగా మారిపోతారు ప్రకృతి తోట తేనీటినందిస్తుంది –జలపాతం ఊయలలూపుతుంది –లిమ్కాకు బదులు తేనే ధారల రుచి తెలుస్తుంది ‘’అంటూ ‘’లంబ సింగి యాత్రలో –కాలం విలంబనమౌతుందని –దృశ్యం ‘’థింసా’’నృత్యమై హృదయం లో పెనవేసుకు పోతుందని పరవశించి చెప్పాడు .

‘’మన ప్రతి ఉశఃషు యుగాధవుతుందట –అందుకే వచ్చే ఉగాదులకు నామకరణం చేయ’’మని పురోహితురాలిగా ‘’ఏం ఆర్ అరుణకుమారి చెప్పింది . ‘’బాధ్యత మరచి  బేకారౌతున్న యువత – పెద్దల్ని విస్మరించి పెడతోవలో వనితా ‘’ లను చూసి బాధపడ్డ పరా౦కుశ నాగరాజు ‘’విస్మరించిన బాధ్యత విషాదాన్ని మిగిలిస్తే –పోగొట్టుకొన్న బంధం అతుకుతుందా ?’’అని ప్రశ్నించాడు .కవిని ఆలూరికి ‘’నాగరకతలో అనాగరకత ‘’కనిపించి మానవ సమాజ ‘’లోతులను , జీవనాన్నీ వెలికి తీయాలి ‘’అనిపించింది .’’ఊతకర్ర ‘’కవితలో పఠాన్ ఖాదర్ వలీ ‘’అవసరం ఆవిష్కణకు తల్లిలాంటిది –ఇప్పుడు కట్టెనే అయినా –ఒకప్పటి వృక్షాన్ని –పస్తులున్నవారికి ఫలహారమయ్యాను –సుస్తుగా ఉన్నవారికి శక్తినయ్యాను –రోగులకు ఔషధమయ్యాను  –మాడు కాలే వారికి  నీడనయ్యాను ‘’అని గతవైభవాన్ని స్మరించి ‘’ఇప్పుడు ఎవ్వరి ఆదరణ లేక –ఎండి ఎండుకట్టె నయ్యాను –నిజంగా పనికిరాని కట్టె నే నేను’’అని వ్యధ చెంది ‘’రేపు నీ సంగతేంటి మహా వృక్షమా “’అని తాత్వికంగా ప్రశ్నించాడు .తెలుగు అక్షరాలు  అ ఆఇఈ మొదలైనవి ‘అమృత వర్షం ‘అన్నాడు ఫణీంద్ర విస్సాప్రగడ .’’వచ్చే ,రావలసినకాలం –తప్పకుండా రైతుదే’’అని వంగాల  సంపత్ రెడ్డి ’’ఆశాభావంగా అన్నాడు .’’నాట్లు కాలం లోనే –నలగర్ని చూసి మాటలు నేర్చుకొన్నాను-కోతలు కాలం లోనే తెగిన వేళ్ళ సాచ్చిగా-బతుకు కతలు ఎన్నో సదువుకున్నాను-పైరు వాసన తగిలినపుడల్లా  -పైరు కర్రనై మొలకెత్తుతుంటాను –కయ్యా, కాలవా కళకళ్ళాడితే కదా-ఊళ్లైనా దేశమైనా ఊపిరి తో తిరగాడేది ‘’అని సుద్ది మాటలు ,పొలం కబుర్లతో అత్యంత నేటివిటి తో చెప్పాడు తెలుగు టీచర్ పల్లి పట్టు నాగరాజు .

‘’వసంతం వచ్చేది ఏడాదికి ఒకసారే –కానీ ఆకలి పేగు నవ్వే ప్రతిసారీ నీకు వసంత రుతువే –కలతెరగని కన్నీటి బొట్టురాలే ప్రాతిసారీ నీకు ఉగాది పండుగే ‘’అని కర్తవ్య బోధ చేశాడు వేంపల్లి అబ్దుల్ ఖాదర్ .’’చిట్టిపోట్టికవితలు ‘’లో డా అగరం వసంత్ గట్టి సత్యాలనే ఆవిష్కరించాడు .1-’’ప్రజలరక్తం ఏరులైతే  రాజులైనారు –చెమట చుక్కలు నదులై పారితే –రారాజు లైనారు ‘’’2-’చెమటోడ్చి సంపాదిస్తే నోట్లు –చెమటల్ని పూడ్చి సంపాదిస్తే –కోట్లు ‘’3-యాసిడ్డు గాయంపై –ఎగసి పడిన ఆవిరి –యముడిలామారి –యెన్ కౌంటరై మాయమయింది .4’-’ఎన్నికల్లో కురిసిన నోట్ల వర్షానికి- కొట్టుకు పోయింది –ప్రజాస్వామ్యం –పౌరులసాక్షిగా ‘’

హోసూరు మట్టి సువాసన ,పటిక పూలపరీమళం,అచ్చమైన తెనుగుతనం ,భావుకత ,నేటివిటీ ,సమాజ దృక్పధం  నిశిత పరిశీలన ,కర్తవ్యం ,కాపాడుకోవటం మొదలైన రంగులు ప్రతిఫలించిన స్పాటిక పటిక పువ్వులు అభిరుచికీ ,నిబద్ధతకు ప్రతిబింబాలు .కవి సమ్మేళనం  నిర్వహించే వారు ,పాల్గొనే కవులు తప్పక వీటిని చదివి స్పూర్తి పొందాలని కోరుతున్నాను  ;కూర్పరి డా వసంత్ ను  ,కవులందరినీ మనసారా అభినదిస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-19-ఉయ్యూరు

—


 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 466- మధ్వాచార్య’’ కాలమాధవ’’కు వ్యాఖ్య కర్త –లక్ష్మీ దేవి (18వ శతాబ్దం)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

466- మధ్వాచార్య’’ కాలమాధవ’’కు వ్యాఖ్య కర్త –లక్ష్మీ దేవి (18వ శతాబ్దం)

మధ్వమత సంస్థాపనాచార్య శ్రీ మధ్వాచార్య రచించిన’’ కాలమాధవ’’ కు పాయగుండ వైద్యనాధ భార్య లక్ష్మీ దేవి వ్యాఖ్యానం రాసింది .  ఈయన తండ్రి మహాదేవ, తల్లి వేణి.ఆమె తండ్రి మహాదేవ దీక్షిత తల్లి ఉమా .దీక్షితుని తండ్రి కృష్ణ .తాత గణేశ .ఆమెతండ్రి గొప్ప విద్యావంతుడు .గౌరవనీయ స్థానం లో ఉన్నవాడు .ఈమె కుమారుడు బాల లేక బాలక లేక  బాలకృష్ణ .ఈమె వ్యాఖ్యాన ప్రారంభం లోను ,మితాక్షర వ్యాఖ్యానం లోని ఆచారఖండంలోను ఒక శ్లోకం కనిపిస్తుంది .-

‘’శ్రీమాధవం గురుం నత్వా లదీర్లద్మీ౦ శిశుప్రాసః –ఖేరడే ముహుత్మాపాత్య గనేషపత్యకృష్ణాకః’’

మహాదేవఃస్తుతస్తస్య దేవమూర్తిర్జటాదివిత్-శ్రౌత స్మార్ధస్య నిపుణో దీక్షితో రాజపూజితః

పత్నీ యస్య హ్యుమారూపా సాధ్యుమా  తస్య కన్యకా –కాలమాధవ సద్వ్యాఖ్యాయాంతనుతే సర్వ సంవిదే’’

లక్ష్మీదేవికి ఉమా అనే మరో పేరున్నట్లు ఎక్కడా ఆధారం లేదు .లక్ష్మీదేవికాలం 18వ శతాబ్దం .కొడుకు బాలకృష్ణ 1730లో పుట్టి ఉంటాడు .కనుక లక్ష్మీదేవి 18వ శతాబ్దం ప్రారంభంలో పుట్టి ఉంటుంది .

లక్ష్మి వ్యాఖ్యానం లో  ఉపొద్ఘాత, అబ్ద లేక వత్సర ,ప్రతిపత్ ,ద్వితీయాది ,నక్షత్రాది పేర్లతో అయిదు ప్రకరణలున్నాయి ,.దేనికది సంపూర్ణం .కాలమాధవ ,లక్ష్మీ వ్యాఖ్యలు అనేక పురాణ స్మృతి జ్యోతిష మొదలైనవాటినుండి ఉదాహరణలతో నిండి ఉంటాయి .కాలమాధవానికి విద్యారణ్యఅనే పేరుంది ‘

కాలమాధవ లో మొదటిశ్లోకం –‘’వాగౌ శాద్యాఃసుమనసః సర్వార్ధ నాముపక్రమే –యమ నత్వా కృతక్రుత్యాఃస్యుత్వం నమామి గజాననం ‘’

దీనికి లక్ష్మి వ్యాఖ్య –‘’శ్రీమాధవం గురుం నత్వా లక్ష్మీర్లక్ష్మీ  శిశు ప్రసూః’’అని పైఅన చెప్పిన శ్లోకం తర్వాత –అస్య గ్రంధస్య స్వేయత్వ ధోతనాయ స్వ ముద్రా రూప సనేకార్ధసకలస్వగ్రంధసాధారణం తావత్ ‘’—అంటూ రాసింది .ప్రతిశ్లోకానికి విపులవ్యాఖ్యానమే చేసి ఆచార్య హృదయావిష్కరణ చేసి ధన్యురాలైంది లక్ష్మీదేవి  

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 465-తంత్రరాజ తంత్ర కు సుదర్శన వ్యాఖ్య కర్త –ప్రాణ మంజరి (18వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

465-తంత్రరాజ తంత్ర కు సుదర్శన వ్యాఖ్య కర్త –ప్రాణ మంజరి (18వ శతాబ్దం )

ప్రాణమంజరి తంత్ర రాజ తంత్ర అనే తంత్రశాస్త్రం లో మొదటి పటలం కు సుదర్శన అనే వ్యాఖ్యానం రాసింది .దీనిలో 101శ్లోకాలున్నాయి .ఈమె కూరమాచాల రాజు  హర్షదేవ -హర్షమతిల కుమార్తె   . ప్రాణమంజరి ‘’శారదా తిలక టీకా’’అనే శబ్దార్ధ చంద్రిక రాసిన ప్రేమనిది కి మూడవభార్య .హైహయుల  ఏలిక  కార్త వీర్యుడు కు భక్తురాలు .భర్తకుఅత్యంత విదేయురాలు. భర్త అండదండలతోనే వ్యాఖ్యానం రాసింది తప్ప కార్తవీర్యుని సాయం కోరలేదు .ఈదంపతుల కొడుకు సుదర్శన అకస్మాత్తు మరణి౦చతమ్ తో దుఃఖ భారాన్ని తగ్గించుకోవటానికి  ఆమె ఈ వ్యాఖ్యానాన్ని ప్రారంభించి ఊరట చెందింది .సుదర్శన కుమారుడులేని వెలితిని అక్షర సుదర్శనం లో నింపుకొన్నది .దేవి త్రిపురసుందరి స్తోత్రం తో ప్రారంభించింది. అంతకు ముందే ఆమె రాజరాజేశ్వరుని ప్రీతికోసం ‘’దీపప్రకాశ ‘’మొదలైన రచనలు చేసింది .

  ఆమె రాసిన తంత్ర శాస్త్రం పై వ్యాఖ్యానం ‘’నిత్యా ఖండ ‘’కు సంబంధించింది .స్త్రీలు ఎవరూ చేయని సాహసాన్ని ప్రాణమంజరి తంత్రరాజ తంత్ర వ్యాఖ్యానం రాయటం లో చూపి ప్రశంసలు పొందింది .మొదటి పటలానికి వ్యాఖ్యరాసినతర్వాత మిగాతాపటలాలకు వ్యాఖ్యరాసినట్లు ఎక్కడా లేదు .ఆమె చెప్పిన దాని ప్రకారం తంత్రరాజ తంత్రకు ముందు 9తంత్రాలున్నాయి  అవి –సుందరీ హృదయ ,నిత్య షోడశికార్నవ, చంద్రజ్ఞాన , మాత్రికాతంత్ర ,సమ్మోహనతంత్ర  వామకేశ్వర ,బహురూపక ,ప్రస్తార చింతామణి ,మేరుప్రస్తార .ఇవన్నీ  ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని, వాటిలో ఏ ఒక్కటీ ప్రత్యేకించి లేదని చెప్పింది .

  సంస్కృత సాహిత్యం పై ప్రాణమంజరికి  అపార జ్ఞానం ,పట్టుఉన్నాయి  .ఆమె సులభశైలి ,అంతులేని విజ్ఞానానికి మురిసిపోవాల్సిందే .వ్యాఖ్యానం లో ఆమె ప్రయోగించిన ఏ శబ్దానికీ నిఘంటువులు వెతకనక్కరలేదు .అంతటి సులభశైలిలో తంత్ర శాస్త్ర వ్యాఖ్యానం రాయటం సాధారణ కవులకు  అసాధ్యమైన విషయం .దాన్ని సుసాధ్యం చేసింది .మొదటిశ్లోక వ్యాఖ్యానం లోనే ఆమె ప్రతిభకు అప్రతిభులమవుతాం .విషయాలను విడమర్చి చెప్పటం లో అందెవేసిన చేయి ఆమెది. నిష్కర్షగా నిర్ణయాలు చెబుతుంది .త౦త్ర రాజం పై పూర్వపు వ్యాఖ్యాతలు చేసిన వాటిలో లోపాలను నిర్భయంగా బయటపెట్టి తన తీర్పు చెప్పింది .తంత్రరాజం లో గురువుకు 9సద్గునణాలు౦డాలని ,అవే నవనాధులకుప్రతీకలనీ ఉన్నది ఈమె శిష్యునికి కూడా అందులోని మొదటి నాలుగు లక్షణాలు తప్పక ఉండాలని చెప్పింది .ఈ తంత్రాన్ని శిష్యులకు బోధించేముందు గురువు అందులోని 25దోషాలను తొలగించి చెప్పాలని ఉంది . ‘నిర్జితమంత్రం ‘’విషయం లో నిధికార చెప్పిన దాన్ని ఈమెతోసిపుచ్చింది .ఆమెకున్న విశేష పరిజ్ఞానం అడుగడుగునా ద్యోతకమై మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది .

  ప్రాణమంజరి కాలం ఆమె రచనబట్టి తెలియదు.  కాని భర్త రాసిన’’ ప్రేమనిధి పంథా’’లో కొన్ని వివరాలున్నాయి .కుమాన్ కు చెందిన ప్రేమనిధి భారద్వాజ గోత్రీకుడైన ఉమాపతి, ఉద్యోతమతి దంపతులకుమారుడు .ఇతని రాజపోషకుడు ఘనశ్యామకొడుకు మలైవమ్మ తాత ముక్తి క్షేత్రదగ్గరున్న తాకమాకు చెందిన కొండరాజు .మలైవమ్మ అందించిన ఆర్ధికసాయం తో కాశీ లో చదివి పట్టాపొందాడు .చాల గ్రంథాలురాశాడుకాని ముద్రణ పొందలేదు ..ఇతడురాసిన దీపప్రకాశ దానికి తానే వ్యాఖ్యానం రాసిన శబ్దప్రకాశ లలో రచనాకాలం 1726-27గా చెప్పాడు .కాని ఇతరరచన అయిన శబ్దార్ధ చింతామణి కాలం 1737అని రాశాడు కనుక ప్రేమనిధి , ,భార్య ప్రాణమంజరి 18వ శతాబ్ది పూర్వభాగం లోని వారని చెప్పవచ్చు .తంత్రరాజ తంత్రం పై ప్రాణమంజరి రాసిన సుదర్శన వ్యాఖ్యలో మొదటి శ్లోకం –

‘’శ్రీనీశోపిశ్రేశోవిభురగతి పుంసాం గతికరో –పవర్గద్యం యస్మాత్ ఫల మలసూతిపి విమలం

శ్రమహేతుర్నానా విమతిరపి మత్యార్ధ మతిదః-మన్హాయఃకోప్యే షోత్రతు భవతు మే హ్రైద్యః పతిః

శ్రీ కార్తవీర్యం పదగడిహృ గ రూద్యా –స్వీయేస్టం దేవమపి కేవలం యోగాయున్త్యా

తంత్రరాజతంత్రం –మొదటిశ్లోకం –

‘’అనాద్యంతో పరాధీనః స్వాధీన భువనత్రయః –జయత్యవిరతోవ్యాప్త విశ్వం కాలో వినాయకః ‘’

దీనికి సుదర్శన వ్యాఖ్య –అధ శ్రీపతి గణపతి దివాకర దేవీ మహేశ్వరాత్మాక పంచాయతన దేవతానాం తదవానంతర భేదానం చన౦తత్వే నోపాస్య దేవతా నైయత్యేపి ఖఖ ఖఖపూర్వపూర్వ  కర్మ వే భవభవ రుచి వైచిత్రీ పగా — ‘’గ సాగింది .ఆతంత్రం లో మనం మునగకుండా బయట పడదాం .

వ్యాఖ్య లో చవరి శ్లోకం –‘’భూమి తత్వమయో వ్యాప్తిరితి సమ్యక్ సమోరితా –అస్యా నిష్ఫల నాచ్చిత్తేతత్తత్వం ఖాత్మాసత్ కృతం ‘

ఇతి షోడషనిత్యాతత్వేశ్రౌకాదిమతేప్రథమః పటలః’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-19-ఉయ్యూరు

 

 

 

  

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 463-ద్వారకా పట్టాల కర్త –బీనాబాయ్ (12-15శతాబ్దాలమధ్య

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

463-ద్వారకా పట్టాల కర్త –బీనాబాయ్ (12-15శతాబ్దాలమధ్య )

ద్వారకా పట్టాల రచించిన బీనాబాయ్ 12నుంచి 15శతాబ్దాల మధ్యకాలం లో ఉన్న కవయిత్రి .తనతండ్రి యదువంశరాజు మండలీకుడని వీర సాహస సద్గుణ సమేతుడని చెప్పింది .ఈ రాజు కధియవార్ ను   పాలించిన గిర్నార్ చూదాసమ మండలీకరాజులలో ఒకడై ఉండవచ్చు .మొదటి మ౦డలిక 11వ శతాబ్దం మొదట్లోని వాడు ఈమె తండ్రికాదు.తర్వాత వాళ్ళలో  ఒకరై ఉండవచ్చు .పాటలీపురరాజు వీరసి౦హుని కొడుకు హరసింహ రాణి  బీనాబాయ్ .అతడు చాహువాన వంశ వారసుడు .కనుక ఆమెకాలం 12-15శతాబ్దాలమధ్య అని నిర్ణయించారు .

 మహారాణీ ,మహా విద్యావంతురాలైనా బీనాబాయ్ తన గురించి గొప్పగా ఎక్కడా చెప్పుకోలేదు అదీ ఆమె సౌజన్యం .శ్రుతి,స్మృతి,పురాణాలలో నిష్ణాతురాలు .కృష్ణభక్తురాలు.అందుకే తన జీవితమంతా  స్కాంద పురాణా౦ర్గత ‘’ప్రభాస ఖండం ‘’లోని ‘’ద్వారకా మాహాత్మ్యం ‘’  రచించటానికే వెచ్చించింది .ఆమె భారత దేశమంతా పర్యటించి వివిధ తీర్దాలు సేవించింది .

  ఈ కావ్యం లో నాలుగు అధ్యాయాలున్నాయి .మొదటి అధ్యాయం లో తనగురించి చెప్పి ,స్కాంద పురాణం లో ద్వారక విశిష్టతను చెప్పిన విషయాలను రాసి ,శ్రీ కృష్ణుని సేవ చేస్తే,ద్వారక సందర్శిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని రాసింది .రెండవ అధ్యాయం లో ద్వారకదారిలో వచ్చే క్షేత్రాలగురించి చెప్పి ,ద్వారకలో గోమతీ నది ,చక్రతీర్ధం ద్వారకా-గంగా  తీర్ధం, శంకోద్ధార   దర్శనం చివరికి గోమతీనది స్నానం తో సర్వపాప ప్రక్షాళనం .స్నానవిధి తర్పణవిధానం పూసగుచ్చినట్లు వివరించింది .గోమతీ తీరం లో పెట్టె శ్రాద్ధవిదానమూ బాగా రాసింది .చివరికి శ్రీకృష్ణునికి అభిషేకం వివిధసేవలు నైవేద్యాలు వివరించింది .ఇదంతా రామనుజాచార్యులవారి విశిష్టాద్వైత విధానం ఆధారంగా రాసిందే .ద్వారకా మాహాత్మ్యాన్ని అనుసరించినా స్వకపోల విధానం చేబట్టింది .సంప్రదాయ ఆచార పధ్ధతి పాటించటం ఆమెకు అత్యంత ఇష్టమైన విషయం .ఇది చదివితే భారతనారి మతాన్నే కాక మతాతీత సంప్రదాయాన్నీ ఏలగలదనిపిస్తుంది .ఒక అజ్ఞాత యాత్రికుడికి తానొక గైడ్ గా ఉండి ద్వారక యాత్ర చేయించినట్లు అనిపిస్తుంది .ఇప్పుడామె కవితా ప్రతిభ దర్శిద్దాం .

‘’శ్యాయం రామానుజం కాంతం కృతంతందేవా విద్విషాం-నమామి బ్రహ్మ గోపాలవేషం ప్రత్యూహ శాంతయే

‘’ఆశీద్ యాదవ వంశజః పరిలసన్ కీర్తిఃప్రతాపోన్నతో-మానీ మాండలికా భిధః క్షితి పతిఃసద్ద్రం విద్వాశ్రయః

ఆసీర్నిర్జిత వీరవైర నిచయ స్త్యాగార్ధకోశోద్యమో-యోర్ధిప్రార్దితదఃకళావిహ ర్యుగే గణ్యైర్గుపౌర న్న్వితః

తస్య కన్యా వదాన్యాసీ ద్బీనాబాయీతివిశ్రుతా –హరిసింహ  మహీపస్య  వల్లభా పుణ్య   వల్లభా’ప్రధమాధ్యాయం ప్రధమ శ్లోకం –‘’ఏవం సంపూజితస్తేన హరినా బ్రాహ్మణోత్తమా  -ఉవాచ పరి సంతుస్టే వరం బ్రూహీతి కేశవం ‘’

చివరగా –‘’మజ్జన సంసార పాదోనిధిస్వలజల ప్రోద్ భవత్ పాపవార్తా –వర్తేసద్వ్రుత్తపోతైఃధృఢ గుణయుతైర్ఘ్రుతఃపుణ్య కీర్త్యా

ధర్మః శ్రీ బీనాబాయ్యాకిలకలియుగే జాతయాయాదవే కిం –వంశే తత్రాతిచిత్రం  స హరి రుదధరద్ యన్న ధర్మం ప్రసూనయః  

‘శివమస్తు సర్వం –వర్షే భాద్రపద సుది సోమే లిఖితం –శుభం భవత్ శ్రీః’’

464-గంగావాక్యావళికర్త –విశ్వాస దేవి(15వ శతాబ్దం )

మిథిలరాజు శివ సి౦హు ని తమ్ముడు పద్మ సి౦హుని భార్య విశ్వాస దేవి ‘’గంగా వాక్యావళి ‘’రాసింది .భర్త మరణం తర్వాత రాజ్యాన్నిపాలించింది .ఈమె .తోడికోడలైన  శివసి౦హుని భార్య లక్ష్మీదేవి కూడా రచనలు చేసిన విద్యా వంతులు .15వ శాతాబ్దికవి విద్యాపతి వంటి కవులకుఆశ్రయమిచ్చినవారు .

గంగావాక్యాని సుదీర్ఘ స్మృతి అంటే కర్మకాండకు సంబంధించింది .గంగానదికి  సంబంధిన సకల విషయాలు ఇందులో చెప్పింది .అనేక పురాణ స్మృతులనుండి విషయ సేకరణ చేసి కూర్చిన గ్రంథం .ఇందులోని 29ప్రకరనలున్నాయి .అవే – శ్రవణ కీర్తన యాత్ర వీక్షణ నమస్కార ,స్పర్శన అభయ ,సర్వబంధు పరికృతిక్షేత్ర అవగాహన ,స్నాన తర్పణ మృత్తిక ,జప దాన పిండ ,జల తోయపాన ఆశ్రయ ప్రాయశ్సిత్త,కృతకృత్య మృత్యు అస్తిస్థితి విఘ్న ప్రతిసిద్ధ వగైరాలున్నాయి

గంగను నిత్యస్మరణ చేయాలని స్మరణమాత్రం చేత సద్గతికలిగిస్తుందని .ధనంలేకపోయినా గంగాయాత్ర సంకల్పం బలీయంగా ఉంటె అవరోధాలు తొలగి దర్శనం కలిగి పుణ్యలోకాలు సిద్ధిస్తాయని విశ్వాస దేవి అత్యంత విశ్వాసంగా తెలియ జేసింది .ఈమె కూడా తానొక గైడ్ లా యాత్రికులకు మార్గదర్శనం చేసి ఫలితం సిద్ధింప జేసింది .ప్రతి విషయాన్ని కూలంకషంగా మనముందుంచి మేలు చేసింది .యాత్రిక కరదీపికగా ఉంటుంది కావ్యం .

 కంబాల ఆశ్వవతార   అనే రెండు పాములు ప్రయాగ ,ప్రతిష్టాన పురం మధ్య ఉంటాయని ,ప్రజాపతి ప్రయాగ బాహుమూలక మధ్య ఉంటాడని ఇక్కడఆని గంగా ,యమునలలో కాని  స్నానిస్తే పునర్జన్మ ఉండదని చెప్పింది. ప్రజాపతి ప్రాంతం లో మరణిస్తే ముక్తి లభిస్తుంది .ఇదంతా గమనిస్తే స్మృతి పురాణాలపై రాణి విశ్వావతికి ఉన్న అవగాహన అనంతం అని అర్ధమౌతుంది .ఇన్ని ముఖ్యవిషయాలను గుదిగుచ్చి వరుసక్రమం లో అందించటం లో ఆమె అందెవేసిన చెయ్యి అనిపిస్తుంది .ఉపనిషత్కాలం లోని గార్గి, వాచక్నవిల వైదుష్యం విశ్వావసి లో దర్శనమిస్తుంది .ఆమె ధన్యయై మనలనూ ధన్యులను చేసింది .

మొదటిశ్లోకం –‘’స్వస్త్యస్తువస్తుహ్నిన రశ్మి భ్రుతః ప్రసాదా –దేకం వపుః శ్రితవతోర్హరిణా సమేత్య

తస్మాభి పంకజ సద్రోత్య మృణాలలీలా –మావిష్కరోతి హృది యస్య భుజన్గరాజః ‘’

‘’యావద్ గంగా విభాతి త్రిపురహర జటా మండలం మండయంతీ-మల్లీ మాలా సుమేరేః శిరసి సితమహా వైజయంతీ జయన్తో ‘’

చివరగా –‘’యావత్ స్వర్గ తరంగిణీ హర జటాజూటారంతలంబతే –యావాహ్దిక వికాసి విస్తృత కరః సూర్యే యముజ్జ్హృమ్భతే

యావ న్మండలమేన్దివం వితనుతేశంభో శిరోమండనం-తావత్ కల్పలతే యమస్తు సఫలాదేవ్యాఃసతాం శేయసే

కియన్నిబంధమాలోక్య శ్రీ విద్యాపతి సూరిణా-గంగాం వాక్యావలీ దేవ్యాఃప్రమాణోర్విమలీకృతా’’

‘’ఇతి సమస్త ప్రక్రియా విరాజమాన దానదలిత కల్పలతాభి మానభవభక్తి భావిత బహుమాన మర్హమర్హదేవీ శ్రోమాహిస్వాస దేవీ విరచితా గంగా వాక్యావలీసమాప్తః ‘’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-19-ఉయ్యూరు

 

 

 

   

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృ భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం ) you

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

ప్రాకృ భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం )

459-రేవా

రేవా రాసిన రెండు శ్లోకాలు న్నాయి .ఒకటి ఖండిత నాయకి గురించి ,రెండవది కలహాంతరిత గురించి .గాథలుగా చెప్పబడే ఈ శ్లోకాలు కవయిత్రికవితా ప్రతిభకు జోహార్ అనాల్సిందే .

‘’కిం తావత్ కృతా అధవాకరోషికరిష్యసి సుభగేదానీం-అపరాధనా మలజ్జ శీల కధయ కతమే క్షమ్యతాం’’

‘’అవలంబితమాన పరాన్ముఖ్యాఆగచ్ఛతోమానిని ప్రియస్య –పుష్టపులకోద్దామస్తవ కధయతి స౦ముఖ  స్థితంహృదయం ‘’

460-రోహా

కలహాన్తరితపై రోహా రాసిన ఒక్కటే శ్లోకం లభించింది .

 ‘’యేన వినా న జీవ్యతే నునీయతే స కృతాపరాధోపి-ప్రాప్తేపి నగర దాహే భణకస్య న వల్లభోగ్నిః’’

461-శశిప్రభ

శశిప్రభ శ్లోకం  రోహా  కవితకు  భిన్నమైనది .ప్రియుడిని క్షమించే ఓర్పు నేర్పూఉన్నది .మగతోడు లేకుండా స్త్రీ ఉండలేదని ,లత వృక్షాలంబనం తోనే వర్ధిల్లుతుందని చెప్పింది .

‘’యధాయధావాదయతిప్రియస్తథా తథానృత్యామి చంచలేప్రేమ్ణా-వల్లీ వలయత్యన్గః స్వభావ స్తబ్ధోపి వృక్షే  ‘’

462-వద్ధావహి

పోషిత భర్త్రుక గురించి వద్ధావహి రాసిన శ్లోకం ప్రసిద్ధి చెందింది . వర్షరుతువులో నల్లని మేఘాలు వింధ్యపర్వతం శృంగాల్లాగా ఉన్నాయట .

‘’గ్రీష్మేదవాగ్ని మషీ మలినాని దృశ్యంతే వింధ్య శిఖరాణి-ఆశ్వాసిహి ప్రోషిత పతికే న భవాంతినవ ప్రవృడభ్రాణి’’’’

ఇంతటితో ప్రాకృత కవయిత్రులు సంపూర్ణం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-19-ఉయ్యూరు

 

 

 

  

 

 

 

 

 

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

Mysterious ‘Bridge’ of Radio Waves Between Galaxies Seems to Be Smashing the Laws of Physics

Mysterious ‘Bridge’ of Radio Waves Between Galaxies Seems to Be Smashing the Laws of Physics (But It’s Not)

— On the big roadmap of the universe, bustling clusters of galaxies are connected by long highways of plasma weaving around the wilderness of empty space. These interspace roadways are known as filaments, and they can stretch for hundreds of millions of light-years, populated only by dust, gas and busy electrons driving very close to the universal speed limit.Even when moving at near-light speed, particles should only be able to make it a fraction of the way down one of these filaments before running out of juice and breaking down. However, a team of astronomers patrolling a filament between two slowly colliding galaxy clusters has discovered a stream of electrons that isn’t abiding by these traffic rules. In the gassy filament between the galaxy clusters Abell 0399 and Abell 0401, the researchers have detected a vast bridge of radio-wave emissions, created by charged particles whizzing down a 10-million-light-year-long road for far longer than should be physically possible.

The source of this cosmic traffic violation, according to a new study published June 7 in the journal Science, may be a faint but turbulent magnetic field stretching from one galaxy cluster to the next, providing a mysterious particle accelerator that’s kicking electrons 10 times farther than they are ordinarily able to travel. [The 12 Strangest Objects in the Universe]

According to lead study author Federica Govoni, a researcher at the Italian National Institute for Astrophysics, this is the first time a magnetic field has been observed coursing through a galactic filament, and could call for some rethinking about how particles are accelerated over incredibly long distances.

“It is a very faint magnetic field, about 1 million times [weaker] than the Earth’s,” Govoni said in a video accompanying the study. However, she and her colleagues wrote in the paper, that may still be strong enough to emit shockwaves capable of re-accelerating fast-moving particles across incredible lengths as they slow down — effectively creating an electron superhighway.

Located about 1 billion light-years from Earth, Abell 0399 and Abell 0401 are neighboring galaxy clusters — groups of hundreds or thousands of galaxies all gravitationally bundled together, representing some of the most massive objects in the universe. In a few billion years, the two large clusters will probably collide; for now, they’re about 10 million light-years apart and linked by the aforementioned highway of plasma.

In a previous study, Govoni and her colleagues discovered that the two clusters were each creating a magnetic field bristling with radio waves. In their new work, the researchers wanted to find out whether that field was extending into space beyond the bounds of the two massive objects — and, in particular, whether it could be riding down the vast plasma filament between them.


Using a network of telescopes called the Low-Frequency Array (LOFAR), the researchers saw a long “ridge” of radio emissions clearly connecting one cluster to the next.

“This emission requires a population of relativistic [near light-speed] electronsand a magnetic field located in a filament between the two galaxy clusters,” the authors wrote in the study. Because there were no other obvious radio sources between the clusters, the team concluded that the ridge was most likely an extension of the magnetic fields and high-speed particle interactions occurring inside the clusters.

After running some computer simulations, the team found that even a relatively weak magnetic field (like this one) could create shockwaves strong enough to re-accelerate high-speed electrons that have slowed down and keep them whizzing down the length of the filament. However, that is only one possible explanation for a phenomenon that is, according to the researchers, still a pretty big mystery. Luckily, scientists still have a few billion years to solve it.

Posted in సైన్స్ | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృత భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

ప్రాకృత భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం )

సంస్కృత కవయిత్రులగురించి తెలుసుకొన్నాం .ప్రాకృత కవయిత్రుల గురించి తెలుసుకోకపోతే అసమగ్రమే అవుతుంది .వీరిలో తొమ్మిదిమంది ఉన్నారు .ఒక్క’’ అవంతీ సుందరి’’ని తప్ప మిగిలినవారిగురించి  శాతవాహనరాజు అంటే హాలుడు రాశాడు .7వ శతాబ్ది బాణుడుకూడా వీరిని ఉదాహరించాడు .ప్రాకృత కవయిత్రులు 7వ శతాబ్దికి ము౦దువారుగా భావించారు  .

454-అను లక్ష్మి

ప్రేమకు చెందిన అనులక్ష్మి శ్లోకాలు నాలుగున్నాయి .మొదటిదానిలో పొగడ్తలకు ఉప్పొంగి అగడ్త లో పడ్డ యువకుడి విషయం ,రెండవదానిలో అనుభవం లేని కుర్రాడు సాని బారినపడటం ,పురుషులను ఆడంబరం తో ఆకర్షించిన స్త్రీ ,నాలుగులో శిదిలవట వృక్షం పై ఆశ్రయం పొందిన పక్షుల వెతలు వర్ణించింది .మానవస్వభావాలను బలహీనతలను చక్కగా కవిత్వం లో ప్రతి బి౦బి౦ప జేసింది .దారితప్పినవారు పొందే అధోగతి నీ బాగా చెప్పింది .

‘’యత్తవ సతీ జాయా అసత్యేయచ్య సుభగ వయమపి-తత్ కిం స్ప్రుటతు బీజం తవ సమానో యువా నాస్తి ‘’

వట –‘’హసితం స హస్త తాళం శుష్కవట ముపగంతేః పథికైః-పసత్ర ఫలానాం  సద్రుశే ఉడ్డీనో శుక వృ౦దే’’   

455-అసులద్ధి

ప్రియులనుంచి ,భర్తలనుంచి వేరైనా స్త్రీల వ్యధలను రెండు శ్లోకాలో వర్ణించింది అసులద్ధి.మొదటిది పోషిత భర్త్రుక గురించి .రెండవది చతుర అయిన చేటి తన సఖి ప్రేమను ఆమె ప్రియుడికి తెలిపి సమాగమం కల్గించటం .

‘’సఖి వ్యధయంతి కదంవానియధా మాం తధా నశేష కుసుమాని –నూనమేషు దివసేషు వహతి గుటికాయా ధనుః కామః ‘’

‘’నాహం దూతీ త్వం ప్రియ ఇతి కోస్మాక మత్ర వ్యాపారః –సా మ్రియతే తవాయశాస్తేన చ ధర్మాక్షరం భణామః’’

456-అవంతీ సుందరి

రాజశేఖరుని భార్య అవంతీ సుందరి ధనదపాల సోదరి .చాహువాన్ వంశస్త్రీ .తన కర్పూరమంజరి నాటకాన్ని ఆమె కోరికపై ప్రదర్శించినట్లు రాజశేఖరుడు చెప్పాడు .కావ్యమీమాంస అలంకార శాస్త్రం లో ఆమె అభిప్రాయాలను పొందుపరచాడు .ఆమె రాసినవి మూడు శ్లోకాలు .మొదటిది విరహిని గురించి .రెండవది ప్రేయసి ప్రియుడిని అపార్ధం చేసుకోవటం .మూడవది దాంపత్య జీవితం లో ఆనందాను భూతి పొందిన జంట గురించి .ఈ మూడిటిలో అవంతి సుందరి కవితా ప్రతిభ గోచరమౌతుంది .ఆమె మాటలు సంగీతాన్ని వినిపిస్తాయి .

విరహిణి-‘’కిం తదపి హా విస్మ్రుతం నిష్క్రుప యద్గురు జనస్య మధ్యేపి –అభిదావ్య గృహీతస్త్వం స్రస్తోత్తరీయయా

పత్యుపహాస –‘’ఉపహసీతీన్ద్రాణీమింద్ర ఇందీవరాక్షీదనీయం –కౌమార ప్రేక్షితే తవముఖస్య శోభాం పశ్యన్ ‘’’’

457-మాధవి

మాధవి రాసిన ఒకే ఒక శ్లోకం హాస్యస్పోరకంగా ఉంటుంది .ఆడవారు తీవ్ర ప్రేమికులుకారని ,మనసు అర్పించి బానిసలలాగా ఉంటారని చెప్పింది

దుర్వీ దగ్ధ –గోపాయంతి యే ప్రభుత్వం కుపితా దాసా ఇవ యేప్రసాదయంతి-తయేవ మహిలానాంప్రియాః శేషాఃస్వామిని ఏవ వరాకాః’’

458-ప్రహత

స్వాదీనపతికపై ప్రహత చెప్పిన ఒకే ఒక్క శ్లోకం ఉన్నది

‘’ఏకం ప్రహరోద్విగ్నం హస్తం ముఖ మారుతేన వీజయన్-సోపి హసంత్యా మయా గృహీతో ద్వితీయేన కష్టే’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-19-ఉయ్యూరు

 

 

  

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 451-విద్యావతి

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

451-విద్యావతి

సుమీనాక్షి దేవతపై విద్యావతి అనుష్టుప్ లో రాసిన 12శ్లోకాల స్తోత్రం ఆమె భక్తీ తాత్పర్యాలకు ఉదాహరణగా నిలిచిపోయింది .ఇంతకంటే ఆమెవివరాలు తెలియవు

స్తుతి-‘’యా దేవీ జగత౦త్రీ శంకర శంకరస్యాపి శంకరో –నమస్తస్యై సుమీనాక్షై దేవ్యేమంగళ మూర్తయే ‘’

‘’సకృరారాధ్యయాం సర్వమభీస్టంలభతే జనః-నమస్తస్యై సుమీనాక్షై దేవ్యే మంగళమూర్తయే ‘’

‘’లక్ష్మీ సరస్వతీ ముఖ్య యస్తాస్తేజఃకరోద్భవాః – నమస్తస్యై సుమీనాక్షై దేవ్యే మంగళమూర్తయే’’

‘’ఇతి స్తుత్వా మహా దేవీ౦ ప్రణమ్యచ పునః పునః –అనుజ్ఞయా సుమీనాక్షయః ప్రార్ధయేహం సుకన్యయా

మాతస్త్వ వ పద ధ్యానే మనో నిశ్చల మస్తుతే’’

452-విజ్జా (7-9శతాబ్దాలమధ్య )

విజ్జా విజ్జిక  విజయ  బిజ్జక అని పిలువబడే ఈమె శ్లోకాలు ముకులభట్టరాసిన ‘’అభిదా వృత్తి మాత్రిక ‘’లోఉన్నాయి  ,కాశ్మీర్ రాజు అవంతివర్మ సమకాలికుడు భట్ట కల్లటునికొడుకే ముకులభట్టు.అవంతివర్మ రాజ్యపాలన క్రీ.శ.855-883.కనుక విజ్జిక ఇంతకంటే ముందుకాలం లో సుమారు 7-9వ శతాబ్దాల మధ్య  లో ఉండి ఉంటుంది.చంద్రాదిత్యుని రాణి విజయభాట్టారికా విజ్జికా ఒకరో కాదో చెప్పలేము .వివిధ గ్రంథాలలో విజ్జిక వి 29శ్లోకాలున్నాయి .మనుష్యులు వారిస్వభావాలు ,ముఖ సౌందర్యం ,మగవాని అందం వియోగిని మనసు ,ప్రేమకళ ,విధిరాత ,ప్రకృతి మొదలైన వైవిధ్య విషయాలపై కవిత్వం చెప్పింది .జీవించిన కాలంలో విజ్జిక గొప్ప సంస్కృత కవయిత్రిగా గుర్తింపు పొందింది .భాషపై ఆమెకున్న పట్టు అనితరసాధ్యమనిపిస్తుంది .పద్మావతికంటే శ్లేషను బాగా రాసింది .పర్యాయోక్త, అతిశయోక్తి ,తుల్యయోగిత విశేషోక్తి ,ఆక్షేప సంకర అలంకారాలను బాగా వాటంగా వాడి కవిత్వానికి జవజీవాలు కలిగించింది .

చాటు శ్లోకం –‘’భూపాలః శశి భాస్కరాన్వయ భువః కే నాంనాసాదితా

భర్తరం పునరేకమేవ  హి భువస్త్వాం దేవా మన్యామహే

ఏనాన్గః పరిముష్య కున్తలమథాకృష్యవ్యుదస్యా యతం –చోళం పాణ్యచ మధ్య దేశమధునా కామ్చయం కరః పాతితః ‘’

విశిష్ట కవి ప్రశంస ‘’నీలోత్పల దలశ్యామం విజ్జికాం మామ జానతా –వృధైవదరిండినా ప్రోక్తం సర్వ శుక్లా సరస్వతీ ‘’

సామాన్య కవి ప్రశంస –‘’కవేరభిప్రాయమశబ్ద గోచరం –స్పురంత మాద్రుషు పదేషు కేవలం ‘’

వాదద్భి రంగైః కృత రోమ విక్రియే –ర్జనస్య తూష్ణీంభవతోయమజ్జలః ‘’

గ్రామ్యా –‘’మంచే రోమాన్చితాంగీ రతి ముదితతనోః కర్కటీ వాటికాయాం

కాన్తస్యన్గే ప్రమోదముభయ భుజ  పరిష్వక్త కంఠే నిలీనా

పాదేన ప్రేఖ్యాంతీ ముఖరయతి ముహుః పామరీ పైరవాణాం

రాత్ర వృత్రాస హేతోర్వ్రుతిశిఖర లతా లంబినీం కంబు మాలాం ‘’

దృష్టి-‘’జనయతి జననాథ దృష్టి రేషా-తవనవ నీల సరోరుహాభిరామా

ప్రణయిషుసుసమాశ్రితేషు లక్ష్మీ –మారిషు చ మంగమన౦గ మంగ నాసు ‘’

సంభోగ –‘’ధన్యాసి యా కధయసిప్రియ మంగమేపి –నర్మోక్తి చాటుక శతాని రతాన్తరేషు

నీవీం ప్రతి ప్రణిహితేతు కరే ప్రియేణ సఖ్యః శపామియది కించిదపి స్మరామి ‘’

చంపక –‘’కేనాపి చంపక తరోవత్ శపి తోసి –కుగ్రామపామర జనాంతిక వాటికాయాం   

యత్ర ప్రరూఢనవశాఖ వివృ ద్వలోభాద్ –భో భగ్న వాటఘటనోచితపల్లవోసి ‘’

వసంతం –‘’కిమ్శుకం కలికాన్తర్గత మి౦దు కలాస్పర్ధి కేసారం భాతి-రక్త నిచోలక పిహితం ధనురివ జతుముద్రితం వితనోః’’

453-వికటనితంబ (9వ శతాబ్ది పూర్వార్ధం )

ధ్వన్యాలోకం లో ఆనందవర్ధనుడు వికటనితంబ శ్లోకం ఉదాహరించాడు .కనుక ఆమె కాలం 9వ శతాబ్ది పూర్వార్ధం .భోజుడు చెప్పినదాని బట్టి వికట నితంబ విధవరాలు .మళ్ళీ పెళ్లి చేసుకొన్నది .ఆమె మొదటి లేక రెండవభర్త ‘’మాష’’అని పలకటానికి బదులు ‘’మాస ‘’అని పలికినట్లు ,సకాషను సకాసగా పల్కినట్లు తెలుసుకొని తాను యెంత దయనీయ పరిస్థితిలో ఉన్నదో అర్ధం చేసుకొన్నది .అనేక కవుల చరిత్రలలో అలంకార శాస్త్రాలలో ఆమె కవితలున్నాయి .అందులో 11లభ్యం .గౌరీ పద్మావతి లలాగానే వివిధ విషయాలపై కవిత్వం చెప్పింది .

  ద్రుత విలబితం లో రాసిన  మొదటి శ్లోకం రాజుయొక్క శత్రు సైన్యవర్ణన.అందులో ఆ సైన్యాన్ని సిగ్గుపడే యువ కన్యగా  శ్లేషించింది .రథోద్దతిలో రాసిన రెండవ శ్లోకం లో రాజు కీర్తి వ్యాప్తిని వర్ణించింది .మూడవ శ్లోకం లో ప్రేయసి తన చెలికత్తెతో అర్ధరాత్రి అయినా ఒంటరిగాబయటకు పోవటానికి తనకు భయం లేదని కారణం పూవింటి విలుకాడు తనకు తోడుగా ఉంటాడని చెప్పింది .నాలుగో శ్లోకం లో సిగ్గుపడే భర్త సిగ్గు వదుల్చుకొని భర్తగా రుజువు చేసుకోమని హితవు చెప్పింది .ఆరవ శ్లోకం లో ధైర్యం లేని ప్రియుడు తనను చేర సాహసించలేక పోతున్నందుకు వ్యధ చెందుతూ ,తన ఆవేదన అరణ్య రోదనమే అంటుంది .7లో కన్యను సముద్రంతో చక్కగా పోల్చి చెప్పింది .8లో చేరువైన ప్రియునితో ప్రేయసిపొందే ఆనందం చెప్పింది .9లో అన్యోక్తి గా తుమ్మెదమీద రాసింది .10లోమకరందం లేని కేతకీ పుష్పాన్ని చేరలేని తుమ్మెద ను వర్ణించింది .11వ శ్లోకం లో  వసంత ఋతు వర్ణన చేస్తూ ,అన్ని ఋతువులలో ఆహ్లాదపరచే మామిడి చెట్టు ,ఇప్పుడు ఎడబాటులో ఉన్న ప్రియురాలికి మరణ శాపమే అయిందని ,కొద్దిగా చిగిర్చినా అది ఆమె చావుకే కారణమౌతోందని కవితాత్మకంగా చెప్పింది .

  ఆ కాలం లో బాగా పేరెన్నిక గన్న కవయిత్రిగా వికట నితంబ పేరు తెచ్చుకొన్నది .ఎందరో ఆమె కవిత్వాన్ని ఉల్లేఖించారు .విజ్జి కంటే సాధారణ కవిత్వం చెప్పింది .ఆమె శబ్దాలు అందం ఆనందం కలిగిస్తాయి .’’వికట నితంబ కవిత్వ౦ అనుభవించేవారు అందులోని తేనె పలుకులను మరచిపోలేరు ,తన హృదయ మకరందం కంటే అవి మిక్కిలి మధురంగా ఉంటాయని తెలుసుకొంటారు ‘’అన్నాడు రాజ శేఖరుడు .ఆధునిక కవితా సౌందర్యానికి ప్రతీక వికట నితంబ కవిత్వం .ఛందస్సును అద్భుతంగా సద్వినియోగం చేసుకొనే నేర్పు ఆమెది .మందాక్రాంతానని మన్మోహనంగా వాడింది. ‘’దోహాదికా ‘’అనే అరుదైన ఛందస్సును ఉపయోగించింది .

చాటువు –‘’అభిహితాప్యభియోగ పరాడంముఖీ –ప్రకటమంగం విలాస మకుర్వతీ

ఉపరితే పురుషాయితుమక్షమా నవ వధూరివ శత్రు పతాకినీ’’

మానిని –‘’అనాలోచ్య ప్రేమ్ణా పరిణతిమనాద్రుత్య సుహృద-సత్వయాకాండే మానః కిమితి సరలే ప్రేయసి కృతః

సమాకృ స్టాహ్యేతేవిరహ దహనోద్భాసుర శిఖాః-స్వహస్తే నగారాస్త దమలదునారణ్య రుదితైః’’

సంభోగం –‘’కాంతే తల్పముపాగతేవిగాలితా  నీవీ  స్వయం బంధనాద్

వాసశ్చ శ్లథ మేఖలా  గుణ ధృతం కిన్చిన్నితంబే స్థితం

ఎతావత్ సఖి వేద్మి కేవలమహో తస్యాంగం సంగే పునః –కోసౌ కస్మిరత౦ చకిమ్సఖి శపే స్వల్పాపి మేన స్మృతిః’’

మధుకరాన్యోక్తి –‘’అన్యాసు తావదృపమర్దసహాసు భ్రుంగం –లోలం వినోదయ మనః సుమనో లతాసు

ముగ్ధమజాత రజసం కాలికామకాలే –వ్యర్ధకదర్ధ యసి కిం నవమాలికాయాః’’

వసంత –‘’కిం దూరీ దైవ హతకే సహకార కేణా-సంవర్దితేనవిష వృక్షక ఏపమాపః

యస్మిన్ మనాగాపి వికాస వికార భాజి-ధోరా భవంతి మదనజ్వర సంనిపాతః ‘’

ఇంతటితో సంస్కృత కవయిత్రులు సమాప్తం –తర్వాత ప్రాకృత కవయిత్రులతో కలుద్దాం

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 441-పద్మావతి (17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

441-పద్మావతి (17వ శతాబ్దికి పూర్వం )

హరిభాస్కరుని ‘’పద్యామృత తరంగిణి ‘’లో పద్మావతి రాసిన రెండు శ్లోకాలున్నాయి .హరిభాస్కర  తండ్రి అప్పాజీ. తాత హరి .ముత్తాత 1676లో వృత్త రత్నాకరం వ్యాఖ్యరాసిన పురుషోత్తమ .1730లో పద్యామృతం వచ్చింది .వేణీదత్తుడు పద్యవేణిలో పద్మావతి వి 11శ్లోకాలు ఉదాహరించాడు .ఈమె గుజరాత్ కు చెందిన నాట్యకళాకారిణి .గౌరీ తోపాటు పద్మావతి కూడా ప్రతిభా సంపన్ను రాలు .పద్మావతి కవిత్వం రాజు ,పిసినారి ,దుష్టుడు లపై సాగింది .మనుష్యులు పశుపక్షాదులు ప్రకృతి పై కవితలల్లింది .తీసుకొన్న అంశాన్ని సానబెట్టి మెరుగులు తీర్చినట్లు రాసింది కనుక గొప్ప కవయిత్రిగా గుర్తింపు పొందింది. గౌరీ ,పద్మావతి లకవిత్వాలను తులనాత్మకంగా పరిశోధించారు .ఇద్దరూ సమానులే .కాని పద్మావతి శ్లేషకు పట్టాభిషేకం చేసింది  .అలంకార శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసింది .జాతి మాత్రా ఛందస్సులను వాడింది .

రాజ వర్ణన –‘’హరిణ్యస్త్వరణ్యేగ్ర గణ్య౦-నృపాణా౦ యమాలోక్య లోలాక్షి గోలాః

కరే చారు చాపం గలే నీల చోలం-మృగానువ్రజంత౦ సమరం భావయంతి ‘’

కృపణ-‘’కాషే నిషణ్ణస్య చ బద్ర ముషే-ర్మిలంలుచా కార విభీషణస్య

ఆకారతః కేవలమస్తి భేదః –కృపాణకాస్యాపి దణానాకస్య ‘’

కచం –‘’కిం చారు చందన లతాకలితా భుజంగతః –కిం పత్ర పద్మ ముఖ సంవలితా ను భంగ్యః

కిం వానతేందు జిత రాకందు రుచో బిబాల్యః –కిం భాంతి గుర్జర వర ప్రమదా కచాల్యః ‘’

సింహం –‘’మన్యోసిమానమంజుల సింహ మృగేంద్ర ప్రచండ భుజదండ –యః ప్రేటదిగ్గజోద్వయ పల్ల రతో హింస నో హరిణాత్ ‘’’

ప్రభాత వేళ సంధ్యా –‘’ప్రభాత వేలా స్మరరాజపుత్రీ –నీరాజనా భాజనమర్క బింబం

ఆయాతి నీరాజితుమబ్ధి పుత్రీ – పాణౌ ’గృహీత్వాకిరతా౦సు బాలం ‘

442-ఫల్గు హస్తిని(8వ శతాబ్దికి పూర్వం )

8వ శతాబ్ది కాశ్మీరరాజు జయాపీడుని మంత్రి వామనుడి ‘’కావ్యాలంకార వృత్తి ‘’లోఫల్గు హస్తిని 2శ్లోకాలున్నాయి కనుక  ఆమె అంతకు పూర్వకాలానికి చెందినదే . మొదటిశ్లోకం చంద్రోదయ వర్ణన  .రెండవది వేదాన్తపరమైనది. సృష్టికర్త అందరినీ  సృష్టించటం బాగానే ఉందికాని తనచేతులతో వారినే నాశనం చేయటం బాగాలేదని రాసింది .అలంకార శాస్త్ర వేత్త వామనుడే ఆమె శ్లోకాలను ఉదాహరించాడంటే ఆమె కవిత్వం లో ఏదో గొప్పతనం  ఉందని అర్ధమౌతోంది.

‘చంద్రోదయం –‘’త్రినయనజటావల్లీ పుష్పం నిశావదన స్మితం –గ్రహకిసలయం సంధ్యానారీ నితంబనఖ క్షత౦

తిమిర భిదురం వ్యోమ్నః శృంగం మనోభవ కార్ముకం –ప్రతిపది నవస్యేందోర్బి౦బ౦ సుఖోదయమస్తునః ‘’

దేవ –‘’సృజతి తావదశేష గుణాకరం-పురుషరత్నమలంకరణం భువః

     తదను తత్క్షణభంగికరోతి చే దహహకష్ట మపండితతావిధేః

443-రాజకన్యా

సారంగధర పధ్ధతి మొదలైన అలంకార గ్రంధాలలో రాజకన్యా శ్లోకాలు ఉదాహరణగా ఉన్నాయి .రాకుమారుడికి అతని ప్రేయసికి మధ్యజరిగిన సంభాషణ .తన తండ్రి హృదయం సింహం లాంటిదని దానికి ఏనుగు రక్తమే ఆహారమని అన్యాపదేశంగా చెప్పింది .రెండవ శ్లోకం ను సరస్వతి కంఠాభరణం ,రసగంగాధారం సాహిత్య దర్పణం పేర్కొన్నాయి .చంద్రకాంతిని చూడని కలువ జీవితం వ్యర్ధం .కలువ సౌందర్యాన్ని చూడని చంద్రుని జీవితమూ వ్యర్ధమే అంటుంది .

‘’అంగణంతడిదమున్మదద్రిప –శ్రేణి శ్రోణితవిహారిణో హరేః-

ఉల్లసత్తరూపా కేలిపల్లవాం –రల్లకీం త్యజతి కిం మతంగజః

పూర్వార్ధం తచ్చిత్తపరీక్ష కాయా రాజకన్యాయ –ఉక్తిఃఉత్తరార్ధం తదనురక్తస్యబిహ్లణస్య ‘’  

444-రసవతి ప్రియంవద (16వ శతాబ్దం )

16వ శతాబ్దం లో బెంగాల్ లోని ఫరీద్ పూర్ లో రసవతి ప్రియం వద ఉన్నది .’’శ్యామ రహస్యం ‘’అనే అద్భుత భక్తికావ్యం శ్రీ కృష్ణునిపై  రాసింది .కాని ఒకేఒక్క శ్లోకం లభ్యం

‘’కాలిందీ పులినేషు కేలికలనం కంసాది దైత్యద్విషం –గోపాలీభి రభిస్టుత౦ వ్రజవధూ నేత్రోత్పలైర్యర్చితం

బాహార్లంకృతమస్తకం సులలితైరంగః స్త్రిమ్భఃభజే

గోవిందం వ్రజసుందరం భవ హరం వంశీధరం  శ్యామలం ‘’

445-సరస్వతి (10వ శతాబ్ది కి పూర్వం )

10వ శతాబ్ది భోజుని ‘’సరస్వతీ క౦ఠాభరణం ‘’లో పద్మావతి రాసిన రెండు శ్లోకాలున్నాయి .అనుష్టుప్ లో రాసిన మొదటిశ్లోకం లో ఉత్తమగుణసంపంనుడైన రాజు ముల్లోకాధిపతి కాదగినవాడు అన్నది .రెండవది వసంత తిలక వృత్తం లో మకరంద పేక్ష ఉన్న  తుమ్మెద పుష్పాలకున్న ముళ్ళు ,మురికి దుమ్ము మొదలైన దుర్గుణాలను లెక్కచేయకుండా ఒక్క మకరందాన్ని మాత్రమె ఆస్వాదించి తన ‘’మేజేస్టి’’కాపాడుకొంటు౦ది .అలాగే ఉత్తములు ఉన్నతులు ఇతరులలోని లోపాలను ఎంచకు౦డా,వారిలోని మంచినే గ్రహిస్తారు అని చెప్పింది .రాజస్తుతి-‘’దేవ త్వమేవ పాతాలమాశానం త్వం నిబంధనం –త్వం చామర మరుద్భ్రమిరేకో లోకత్రయాత్మకః

కేతకీ –భ్రమర ‘’పత్రాణి కంటకసహస్ర దురాసదాని –వార్తాపి నాస్తి మధునే రాజస్యన్ధకారః

ఆమోదమాత్ర రసికేన మధువ్రతేన  -నాలోకితాని తవ కేతకి దూషణాని’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 436-మధురవాణి (17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

436-మధురవాణి (17వ శతాబ్దికి పూర్వం )

17వ శతాబ్ది హరికవి రాసిన ‘’సుభాషిత హారావళి ‘’లో మధురవాణి శ్లోకం ఉదాహరి౦ప బడింది .కనుక ఆమెకాలం 17 వ శతాబ్దం పూర్వం అయిఉండాలి .1614లో త౦జావూరుపాలకుడు రఘునాధనాయకుని ఆస్థానకవి ,ఆయన రాసిన ‘’ఆంద్ర రామాయణం ‘’ను సంస్క్రుతీకరించిన  మధురవాణి ఈమె అవునో కాదో తెలీదు.సంస్కృత సాహిత్యం లో అన్ని శాఖలపై ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తుంది .కాలిదాస కుమార సంభవం హర్షుని నైషధం లను సంస్కృతం లో రాయటమేకాక స్వయంగా చంపు రాసిన ప్రతిభ మధురవాణి ది..ఉదాహరింపబడిన శ్లోకం లో భర్తను ఆరాదించని భార్య తర్వాత తప్పు తెలుసుకొని పశ్చాత్తాపత్తపపడటం ఉంది .స్త్రీ సహజ మనోభావాలను  అర్ధవంతమైన కవిత్వం లో బంధించింది .

కులటోక్తి-‘’ఆకా రేణ శశీ గిరా పరభ్రుతః పారావత శ్చుం వనే –హంసక్షం క్రమనణే సమం దయితయా రత్యాం విమర్డే గజః

ఇత్యం భర్తరి మే సస్తయువాని శ్లాఘ్యై ర్గుణైః కించన –న్యూనం నాస్తి పరం వివాహిత ఇతి స్యాన్నేక దోషో యది ‘’

437-మదిరేక్షిణి

సుభాషిత సార సముచ్చయం లో మదిరేక్షిణి ప్రకృతి వర్ణన శ్లోకం ఉటంకి౦చ బడింది  .ఇది వసంత శోభను తెలిపే శ్లోకం మిగిలిన అయిదు రుతువులపైనా రాసే ఉంటుంది .వికసిత తామరలు నీటిపైభాగానికి చేరటం సంరంభంగా భ్రమరాలు తేనెకోసం వాలటం కనిపిస్తుంది .కాలభారిణి లేక మాలభారిణి అనే అరుదైన వృత్తం లో రాసిన శ్లోకం ఇది .

వసంత సంధి –‘’అనుభూత చరేషు దీర్దికాణా ముపకంఠేషు గతగతైక తానాః

మధుపాః కథయంతి పద్మినీనా౦ సలిలే రంతరితాని కోరకాణి’’

438-మారులా (13వ శతాబ్దికి పూర్వం )

13వ శతాబ్దికి చెందిన కల్హణుని’’సూక్తి ముక్తావళి ‘’లో ఒకటి ,14వ శతాబ్దికి చెందిన ‘’సారంగధర పధ్ధతి ‘’లో మరొకటి మారులా రాసిన శ్లోకాలున్నాయి .కనుకకాలం 13శతాబ్దికి పూర్వం .ప్రేమగురించి రాసినవే ఈరెండూ .మొదటిదానిలో విరహంతో బాధపడే ప్రేయసి తలిదండ్రులకు తెలీకుండా ఒంటరిగా కూచుని ప్రియుడి ఎడబాటుకు విలపిస్తూ కడవలకొద్దీ కన్నీరు కారుస్తుంది .రాత్రివేళ పడుకున్న పక్కాంతా కన్నీటితో తడిసి ముద్ద అయిపోతుంది .కాని ఇంట్లో వాళ్ళు గుర్తించకుండా మర్నాడు ఉదయ౦ పక్కబట్టలను  ను  ఎండలో ఆరబెడుతుంది .రెండవ శ్లోకం లో ప్రేయసీ ప్రియులు మళ్ళీ కలిశాక ,ఆమె బక్క చిక్కి శాల్యావసిస్తాయై ,నీరసపడి అతనిపై శ్రద్ధ చూపలేకపోతుంది అతడు గమనించి ,అర్ధం చేసుకోగా ఆమె అతడి ఎదపై వాలి మళ్ళీ ఆనంద బాష్పాలు రాల్చి అతడి వస్త్రాలను తడిపేస్తుంది .కనుక మారులా గొప్ప భావుకత ఉన్న కవయిత్రి అనిపిస్తుంది .ధనద దేవ కవి ఈమె కవిత్వాన్ని మనసార మెచ్చుకున్నాడు .సంస్కృతం లో ఈ రెండు ప్రేమ శ్లోకాలను  అత్యున్నత విలువకలవిగా విశ్లేషకులు భావించారు .విషాదాన్ని అద్భుతంగా పలికించే మందాక్రాంత వృత్తం లో వీటిని రాసి తన కవితా పటిమ చాటింది .

విరహిణీంప్రతి సఖ్యు క్తిః-‘’గోపయంతీ విరహ జనిత దుఖమగ్రేగురూణాం-కిం త్వం ముగ్ధే నయన విస్తృతం  బాష్పపూరం రుణతాసి

నక్తం నక్తం నయన సలిలేరేషఆర్డ్రీ కృతస్తే-శయ్యోపాన్తః కథయంతి దశామాతపే శోష్యమాణః’’

విహరిణా౦ ప్రలాపః –‘’కృశా కేనాసి త్వం ప్రకృతిరియమంగస్య  ననుమే-మలాధూమ్రా కస్మత్ గురుజన గృహే పాచకతయా

స్మరస్యస్మాన్   కంచిన్నహి నహి నహీ త్యేవమగమత్ –స్మరోత్కంపాం బాల మమ హృది నిపత్య ప్రరూదితా ‘’

439-మోరిక

మోరిక రాసిన నాలుగు శ్లోకాలు సూక్తి ముక్తావళి, సారంగధర పధ్ధతి సుభాషితావలి మొదలైనవాటిలో దొరికాయి .ఇవికూడా ఎడబాటు ,సందేశం,ప్రేమను చెప్పుకోవటం , కలయికలో ఆనందం  అనే నాలుగు దశలలో ఉన్న ప్రేమగీతాలే . మారులా లాగా మోరిక కూడా అత్యున్నత ప్రమాణ కవిత్వమే రాసింది .ఈమెనూ ధనద దేవుడు మెచ్చుకున్నాడు .

వియోగిని అవస్త –‘’లిఖతిన గణయతి రేఖాం నిర్భార బాష్పా౦బు ధౌత గండతటా

అవధి దివసావసాన0 మా భూదితిశంకితా బాలా ‘’

శృంగార పధ్ధతి –‘’యామీత్యాధ్యవసాయ ఏవ హృదయేబంధాతునామాస్పదం –వక్తుం ప్రాణసమా సమాక్షమ ఘ్రుణేత్ధం కధంపార్యతే

ఉక్తం నామ తథాపి నిర్భర గలద్ బాష్పం ప్రియాయా ముఖం – హృస్ట్వాపి ప్రవ సంత్యహో ధనలవ ప్రాప్తి స్పృహా మాద్రుశం ‘’

440-నాగమ్మ

దక్షిణభారత దేశానికి చెందిన నాగమ్మ  సూర్య స్తుతిశ్లోకం సారంగధర పద్ధతిలో ఉన్నది .అంతకు మించి వివరాలు తెలీవు .,

‘’శుక తుండచ్ఛవి సవిత్రు శ్చండరుచః పుండరీక వన బంధోః-మండల ముదితం వందే కుండల మాఖండ లాశాయాః’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-19-ఉయ్యూరు 

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కుమార ధూర్జటి చమత్కారపద్యం -జూన్ తెలుగువెలుగు

కుమార ధూర్జటి చమత్కారపద్యం -జూన్ తెలుగువెలుగు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 429-ఇందులేఖ (14వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

429-ఇందులేఖ (14వ శతాబ్దం )

15వ శతాబ్దికి చెందిన వల్లభ దేవుడు తన ‘’శుభాషితావలి ‘’లో ఇందులేఖ రాసిన ఒకే ఒక్క శ్లోకాన్నిమాత్రమే ఉదాహరించాడు .మంచికళాత్మకంగా ఉన్న శ్లోకం ఇది .విభావన అలంకారాన్ని తగినట్లుగా వాడింది .సూర్యాస్తమయాన్ని చూసి సూర్యుడురాత్రివేళ  ఎక్కడ దాక్కుంటాడు అనే సమస్య  వస్తుంది .దీనికి చాలామంది చాలారకాలుగా సమాధానాలు చెబుతారు .కానీ ఇందులేఖ మాత్రం ‘’సూర్యుడు ప్రేమతో తపించే వారి హృదయాలలో ఉండి,రాత్రింతా ఇంకా జ్వలిస్తూ ఉంటాడని ‘’చమత్కారంగా సమాధానం చెప్పింది .

‘’ఏకవారీనిధౌ ప్రవేశమపరే లోకాన్తరాలోకనం –కేచిత్ పావక యోగితాం నిజ గదృఃక్షీణోహ్ని చండార్చిషః

మిధ్యాచై తద సాక్షికం ప్రియ –సఖి ప్రత్యక్ష తీవ్రాతపం

మన్యేహం పునరధ్వనీన రమణీ చేతో ధీ శోతే రవిః’’

430-జఘన చపాల

భర్త దూరంగా ఉన్న భార్య కృతఘ్నత ను గురించి జఘన చపాల తనపేరుకూడా కలిసివచ్చేట్లు చెప్పిన శ్లోకం ‘’కవీన్ద్రవచన సముచ్చయ ‘’లో చోటు చేసుకొన్నది .

‘’దుర్దిన నిశీధ పవనే నిః సంచారాసు నగర వీధీషు

పాత్యౌ విదేశయాతే పరం సుఖం జఘన చపాలాయాః’’

431-కేరళి

వాణీ దత్తుని పద్యవాణిలో కేరళి ఆర్యా వృత్తం లో రాసిన శ్లోకం ఒకటి ఉంది .ఈ శ్లోకంలో సరస్వతీ దేవికి ఉన్న రెండురకాల స్వభావాలను వర్ణించింది .ఆమె బాగా చదువుకున్నవారికి ,కవులకు సమీపంగా ఉంటుంది  వారి ప్రతిభకు ప్రేరకురాలౌతుంది .

1-‘’యస్యాఃస్వరూప మఖిలం జ్ఞాతుం బ్రహ్మాదయోపి న స్పస్టాః

కామగావీ సుకవీనాం స జయతి సరస్వతీ దేవీ ‘’

432-కుటల (17శతాబ్దికి పూర్వం )

ఆర్యా వృత్తం లో ‘’కులటోక్తి’’గా కుటల రాసిన ఒక శ్లోకం 17వ శతాబ్దిలో హరికవి రాసిన ‘’శుభాషిత హారావళి ‘’లో కనిపించింది .అపవిత్రురాలి పై రాసిన శ్లోకం ఇది .

‘’సుఖ శయ్యా తాంబూలం విశ్రబ్ధాశ్లేష చు౦బనాదీని – తుల్యంతి న లక్షాంశంత్వరిత క్షణా చౌర్య సురతస్య ‘’

433-లక్ష్మి(14వ శతాబ్దికి పూర్వం )

14వ శతాబ్దిలోని సారంగధరపద్దతి లో లక్ష్మి శ్లోకం కనిపిస్తుంది .లయ,మధురశబ్ద , శృతి సుభగంగా ఉంటు౦ది కవిత్వం .భగద్విలాసమే సృష్టిలో మానవులలో ఉంటుంది.

‘’భ్రమన్ వనాంతే నవమంజరీషు  న షట్పదో గంధ ఫలీ మజిఘ్రత్

సా కిం న రమ్య స చ కిం న గంతా –బలీయసీ కేవలమీశ్వరేచ్ఛ’’

434-లక్ష్మీ దేవీ ఠాకూరాణి(15వ శతాబ్ది )

15వ శతాబ్ది మిధిలానగర రాజు శివ సి౦హుని భార్య రాణి లక్ష్మీదేవి .తోటక వృత్తం లో ఆమె రాసినకవితలో నాటి సామాజిక వర్ణన ,ఆమె సోదరిలు వివాహసమయం లో అమ్ముడుపోవటం ఇదంతా రాణికి నచ్చకపోవటం బాగా వర్ణించింది .

-ధనలోభి –‘’చపలం తురగం పరిణర్తయతః-పథి పౌర జనాన్ పరిమర్దయతః

నహి తే భుజ భాగ్యభవో విభావో –భగినీ భగ భాగ్యభావో  విభవః ‘’

435-మదాలస (14వ శతాబ్దం )

14వ శతాబ్దికి చెందిన మదాలస రాసిన రెండు శ్లోకాలు  సారంగధర పద్ధతిలో చోటు చేసుకొన్నాయి .వీటిలో ఒకదానిలో భక్తీ రెండవదానిలో ప్రకృతివర్ణన ఉన్నాయి .మొదటిదానిలో విత్తును బట్టే ఫలితం అని  మనం చేసే మంచీ చెడు మన జీవితాలను ప్రభావితం చేస్తాయని  చెప్పింది .రెండవదానిలో జోరుగా కురిసే వర్షం వియోగంలో ఉన్న వారిని ఎలా బాధిస్తాయో తెలియ జేసింది .మానవ ఆలోచనలను భగవంతునిపైకి మరల్చటానికి మదాలస బాగా ప్రయత్నించింది .

1-‘’ధర్మ వివృతి –‘’పరలోక హితం తాతప్రాత రుత్దాయ చిన్తయ –ఇహ తేకర్మణాభేవ విపాకశ్చింతార్యప్యతి’’

2-మేఘ గర్జన –‘’సాంద్ర చంద్ర విరూతైఃస్థిత వాణౌ నర్జితం జగదిదం మదనేన

అ౦బుదో దిశదిశ ప్రధమానో గర్జితైరితి నివేదయతీవ ‘’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలా రచయిత్రి హార్రియట్ బీచెర్ స్టవ్-గబ్బిట దుర్గా ప్రసాద్-జూన్ విహంగ

హార్రియట్ ఎలిసబెత్ బీచెర్ 14-6-1811 న అమెరికాలోని కనెక్టికట్ లో 13మంది సంతానం లో ఏడవ పిల్లగా జన్మించింది .తండ్రిలిమాన్ బీచేర్ కాల్వేనిస్ట్ ప్రీచర్ .తల్లి రొక్సానా .తల్లి తండ్రి అమెరికన్ రివల్యూషనరీ యుద్ధం లో జనరల్ ఆండ్రూవార్డ్ .ఒకసోదరి కేధరిన్ విద్యావేత్త ,రచయిత్రి .సోదరులు మినిస్టర్ లుగా ప్రీచర్ లుగా ప్రసిద్ధి చెందారు .పెద్దక్క నడిపే బడిలో చదివింది హార్రియట్ .మగపిల్లలకు మాత్రమే ప్రవేశమున్న స్కూల్ లో క్లాసిక్స్ ,భాషలు నేర్చింది . 1832లో21 ఏళ్ళ వయసులో ఒహాయ్ లోని సిన్సినాటి కి లేన్ థియోలాజికల్ సేమెటరి ప్రెసిడెంట్ అయిన తండ్రి దగ్గరకు చేరింది .అక్కడ సోషల్ క్లబ్ లో కూడా చేరి క్రియా శీలంగా పని చేసింది .ఒహాయో నదిపై ఉన్న సిన్సిన్నాటి నగరం ఓడలపై వ్యాపారానికి కేంద్రమై దేశం లోని అన్ని ప్రాంతాల నల్లజాతివారు ,ఐరిష్ ప్రవాసీయులు అక్కడికొచ్చి స్థిరపడ్డారు .1829లో అల్లర్ల వలన రోడ్లు భవనాలు దెబ్బతిన్నాయి .ఐరిష్ ప్రజలు నల్లవారిపై దాడులు చేశారు. పోటీతత్వం పెరిగింది .గాయపడిన నల్లజాతి వారికి హార్రియట్ అన్ని విధాల సాయం

.1836,1841లో కూడా ఇలాంటి దాడులు పునరా వృత్తయ్యాయి .దీనిపై స్పందించి బానిస విధానికి వ్యతిరేకంగా రచనలు చేసింది .కోపమొచ్చిన ప్రజలు ఆమెను తరిమికోట్టారుకూడా . ఇక్కడే ఆమెకు కాల్విన్ ఎల్లిస్ స్టవ్ అనే ప్రొఫెసర్ తో పరిచయమేర్పడి 1-6-1836న పెళ్ళాడింది .ఈయనకూడా బానిసత్వ వ్యతిరేకి .పారిపోయే బానిసలకు తమ ఇంట్లో ఈ దంపతులు ఆశ్రయమిచ్చేవారు .చాలామంది బానిసలు కెనడాలో స్వాతంత్ర్యం కోసం ఉత్తరాదికి వెళ్ళేవారు .ఈ దంపతులకు ఏడుగురు సంతానం. అందులో కవల ఆడ పిల్లలున్నారు .1850లో అమెరికా కాంగ్రెస్ ‘’ఫ్యుజిటివ్ స్లేవ్ లా ‘’ఆమోదించింది .దీనివలన బానిసలకు ఆశ్రయమిచ్చినవారికి తీవ్ర శిక్ష ఉండేది .ఈ పరిస్థితులలో బీచర్ కుటుంబం మైన్ లోని బ్రన్స్ విక్స్ కు చేరింది .భర్త కాలేజి లెక్చరర్ గా పని చేశాడు .ఇప్పుడు వీరి గృహం ‘’నేషనల్ హిస్టారిక్ లాండ్ మార్క్ ‘’గా గౌరవం, గుర్తింపు పొందింది .ఒకసారి ప్రార్ధన సమావేశం లో చనిపోతున్న ఒక బానిస దయనీయ స్థితి చూసి చలించి ,అతని కథ రాయాలనే గాఢమైన కోరికకలిగింది .అదే సమయం లో 18నెలల కొడుకు సామ్యుల్ చార్లెస్ చనిపోయాడు .ఈ సందర్భంగా ఆమె ‘’నాకు అత్యంత ఆప్తుడైన కొడుకు మరణించటం తో బానిసల అక్రమ విక్రయాలతో అన్యాయంగా ,దౌష్ట్యానికి చనిపోయిన బానిసల పై నాకు సానుభూతి పెరిగింది ‘’అని రాసుకొన్నది . 9-3-1850న నేషనల్ ఎరా అనే పత్రిక సంపాదకుడికి ‘’బానిసల కస్టాలు కన్నీటి గాధలు,సమస్యలు స్వేచ్చ ,మానవత్వం గురించి రాయటానికి పూనుకోన్నాను .ప్రతి తల్లీ నిశ్శబ్దంగా ఇంట్లో కూర్చోకుండా బానిస సమస్యలపై నాలాగే స్పందించాలని కోరుతున్నాను ‘’అని ఉత్తరం రాసింది .అదే ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలగా ఆమె 40వ ఏట నేషనల్ ఎరా ప్రచురించింది .ఆమె పెట్టినపేరు ‘’ది మాన్ దట్ వజ్ ఎ థింగ్’’.ఈ వీక్లీలో5 జూన్1851నుంచి ధారావాహికగా 1-4-1852వరకు నడిచి ,నవలగా వెలువడింది .5వేల కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడై ఆతర్వాత 3లక్షలకాపీలు అమ్ముడయ్యాయి .ఆమెకు 400 డాలర్లు పారితోషికంగా పత్రిక అందజేసింది .దక్షిణ రాష్ట్రాలలో బానిసలపై జరుగున్న దారుణాలు ఉత్తర రాస్ట్రాలవారికి తెలియ జెప్పటమే ఆమె ధ్యేయం . ఈ నవలలో వ్యక్తులపై బానిసత్వ విధానం ఎంతటి దారుణంగా ఉంటుందో అమెరికా దేశప్రజలకు చాలా ఎమోషనల్ గా చెప్పింది రచయిత్రి .బానిసత్వం బానిసల ,యజమానుల, బానిస వ్యాపారులనందర్నీ ప్రభావితం చేసింది .దేశమంతా దీనిపై చర్చోప చర్చలు జరిగాయి బానిసత్వ నిర్మూలన జరగాల్సిందే అనే అభిప్రాయం బలపడింది దక్షణ రాష్ట్రాలలో .ఒక్క ఏడాదిలో బోస్టన్ లో 300మంది పిల్లలకు ఆమె నవలలోని ఒకపాత్ర’’ ఈవా’’పేరు పెట్టుకొన్నారు ప్రజలు .తర్వాత చాలామంది రచయితలు బానిసత్వ సమస్యలపై రాసినా ఈమె నవలకొచ్చిన ప్రాచుర్యం రాలేదు .దక్షిణ రాష్ట్రాల సమాజాన్ని అత్యంత సహజంగా చిత్రించింది . సివిల్ వార్ అయ్యాక ఆమె వాషింగ్టన్ వెళ్లి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ను 25-11-1862న కలిసి మాట్లాడింది .లింకన్ ‘’అయితే ఇంత పెద్ద యుద్ధం రావటానికి కారణ మైన చిన్న స్త్రీవి నువ్వేనన్నమాట ‘’అని అభినందించాడు .యుద్ధం అయ్యాక ఫ్లారిడా కు వెళ్లి ఇల్లు స్థలం కొనుక్కొన్నది.అక్కడ తనకు ఎవరూ హక్కులభంగం కలిగించలేదని చెప్పింది .కాని తర్వాత కొన్ని చిక్కుల్లోపడి కొ౦పా గోడూ వదిలేసి కెనడా చేరింది .స్కాట్లాండ్ లోని దురాగతాలను ఎదిరించింది .1868లో ‘’హార్త్ అండ్ హోమ్’’మేగజైన్ కు మొదటి ఎడిటర్ అయింది .పెళ్లి అయిన స్త్రీలహక్కులకోసం పోరాటం చేసింది .1870లో ఆమె సోదరుడు హెన్రి వార్డ్ బీచెర్ వ్యభిచారం కేసులో జాతీయ అభియోగాన్ని ఎదుర్కున్నాడు .జనాలు దాడి చేయటం తో ఆమె అక్కడినుంచి మళ్ళీ ఫ్లారిడా వెళ్ళిపోయింది .సోదరుని తప్పులేదని నమ్మింది సమర్ధించింది . మళ్ళీ కనెక్టికట్ చేరి ‘’హార్ట్ ఫోర్డ్ ఆర్ట్ స్కూల్ ‘’స్థాపించి౦ది ఇది తర్వాత యూనివర్సిటి ఆఫ్ హార్ట్ ఫోర్డ్ గా మారింది .1886లో భర్త కాల్విన్ స్టవ్ మరణం తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించటం మొదలైంది.1888లో 77 ఏళ్ళ వయసులో ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలను మళ్ళీ రాయటం మొదలుపెట్టిందని ,రోజూ ఎన్నో గంటలు రాసేదని ,ఇదంతా ఆమెకు తెలియకుండానే చేసేదని దీనినే ‘’డేమెన్షియా’’అంటారని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసింది .ఈ జబ్బునే ఇప్పుడు ‘’ఆల్జిమీర్స్ వ్యాధి ‘’అంటున్నారు వాజ్ పాయ్ , ఫెర్నాండెజ్ వంటి వాళ్ళు కూడా ఈ వ్యాధి బారినపడ్డారు .దెబ్బతిన్న ఆమె మెదడుకు ఇప్పుడు ఆమె రాసేదంతా కొత్తగా అనిపించేది అదొక భ్రమ .హార్ట్ ఫోర్డ్ లో ఆమె నివాసానికి దగ్గరలౌన్న అమెరికా ప్రముఖ నవలాకారుడు మార్క్ ట్వేన్ తన స్వీయ చరిత్రలో ‘’ఆమె మెదడు క్షీణించి ,దయనీయంగా ఉండేది .రోజంతా ఐరిష్ అమ్మాయి వొళ్ళు అంతా మర్దన చేసేది .ఇంటి తలుపులు ఎప్పుడూ తెరచే ఉండేవి .డ్రాయింగ్ రూమ్ నుండి వచ్చే సుగమ సంగీత౦ విషాద గీతాలు ఆస్వాదించేది .’’ ప్రపంచ ప్రసిద్ధ ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలా రచయిత్రి హార్రియట్ బీచేర్ స్టవ్ 1-7-1896న 85వ ఏట కనెక్టికట్ లోని హార్ట్ ఫోర్డ్ లో మరణించింది .మాసాచూసేట్స్ లోని ఫిలిప్స్ అకాడెమి సెమిటరిలో ఆమెను ఖననం చేశారు. ఒహాయు ,మైన్ ,ఫ్లారిడా కనెక్టికట్ లలో ఆమెస్మారక చిహ్నాలు నెలకొల్పారు .జులై1న అమెరికాలో ఎపిస్కోపల్ చర్చ్ఆమె గౌరవార్ధం విందు ఇస్తుంది. 1986లో ‘’నేషనల్ ఉమెన్స్ హాల్ ‘’లో ఆమె పేరు రాసి గౌరవించారు 13-6-2007న అమెరికా ప్రభుత్వం 75 సెంట్ల పోస్టల్ స్టాంప్ ప్రచురించి గౌరవించింది .సెయింట్ లూయీ లోని ‘’హార్రిస్ స్టవ్ స్టేట్ యూని వర్సిటి ‘’పేరును ‘’స్టవ్ అండ్ విలియం టోర్రీ హార్రిస్ ‘’గా మార్చారు .ఒహాయు హిస్టారికల్ సొసైటీ ఆమె పేరును అమెరికా రాజధాని లోని స్టాట్యూటరి హాల్ లో చేర్చమని సిఫార్స్ చేసింది . అంకుల్ టామ్స్ నవల అనేకభాషలలో వెలువడింది .,ఇదికాక ‘’ Dred’’ ఏ టేల్ఆఫ్ దిగ్రేట్ డిస్మల్ స్వా౦ప్ ,అవర్ చార్లీ వాట్ టుడు విత్ హిం ,లిటిల్ పుస్సి విల్లో ,సిక్స్ ఆఫ్ వన్బై హాఫ్ ఏ డజన్ ఆఫ్ ది ఆదర్,ఉయ్అండ్ అవర్ నైబర్స్ మొదలైన నవలలలు,’’ది క్రిస్టియన్ స్లేవ్ ‘’డ్రామా ,రెలిజియస్ పోయెమ్స్ ,రాసింది. నాన్ ఫిక్షన్ గా ‘’న్యు ఇంగ్లాండ్ స్కెచ్ బుక్ ,ఎర్త్లి కేర్ ,ఎ హెవేన్లి డిసిప్లిన్ ,ఏ కీ టు అంకుల్ టామ్స్ కాబిన్ ,లైవ్స్ అండ్ డీడ్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మేడ్ మెన్ ,ఎ డాగ్స్ మిషన్ వగైరా చాలారాసింది .కధలు వ్యాసాలుగా –కజిన్ విలియం ,ఓల్డ్ ఫాదర్ మారిస్ ఒలి౦పియాన ది డ్రంకర్డ్ రిక్లైమ్డ్ ,మోరలిస్ట్ అండ్ మిస్సునలిస్ట్ ,విచ్ ఈజ్ ది లిబరల్ మాన్ ,ది టుఆల్టార్స్ మొదలైనవి చాలాఉన్నాయి .                                                                                                                      -గబ్బిట దుర్గాప్రసాద్~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

image.png
Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 426-చిన్నమ్మ (10వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

426-చిన్నమ్మ (10వ శతాబ్దికి పూర్వం )

భోజుని ‘’సరస్వతీ కంఠా భరణం ‘’లో చిన్నమ్మ  శార్దూల విక్రీడితం లో రాసిన ఒక్క శ్లోకం ఉదాహరి౦ప బడింది .10వ శతాబ్దికి ముందున్న కవయిత్రి ఆమె  .సారంగధర పద్ధతిలోనూ ఇదే శ్లోకం ఉంది .శివుడు తన మనోభావాన్ని దేబ్బతీశాడని నింద చేసే శ్లోకం .ఆయన తీవ్రస్వభావంకలవాడని అహంకారి అనీ ,మహాభైరవాకృతిలో ఆయన అయిదు అవతారాలెత్తిన విష్ణువును  తిరస్కరించాడని,మించిపోయాడని  చెప్పింది .గంభీరమైన శైలీ విన్యాసం ,సమ్మేళన పదార్భాటం ఆమె విధానం .ఆమెకు స్మృతి,శ్రుతులపై లోతన అవగాహన ఉన్నట్లు అర్ధమౌతుంది .

‘’కల్పాన్తే శమిత త్రివిక్రమ మహాకంకాళ దండో స్ఫురచ్-ఛేషస్యత్  నృసింహ పాణి నఖర ప్రోతాది కోలామిషః

విశ్వైకార్ణవతా  నితాంత ముదితౌ తౌ మాతృస్య కర్మా బుభౌ –కర్షన్ ధీవరతాం గాతోస్యతు మహా మోహం మహా భైరవః ‘’

427-గంధ దీపిక

సారంగధరపద్ధతిలో గంధ దీపిక ఆర్యా వృత్తం లో రాసిన ఒకే ఒక శ్లోకం ఉదాహరి౦ప బడింది .ఇందులో ఆమె గృహిణి ధర్మాలను విధులను  వస్త్రాలునేసే పద్ధతిని ,ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటాన్నీ తెలిపింది .

‘’శశి నరవ గిరిమదమా౦సీ జాతు భాగో మలయలోహమో ర్భాగ్యౌ –మిలితైర్గుణపరి మృదితై వస్త్ర ర్గుహాదీని ధూపయే శ్చతురః’’

428-గౌరి (17వ శతాబ్ది )

సుందరదేవుని సూక్తి సుందర లో గౌరీ షాజహాన్ ను పొగుడుతూ రాసిన శ్లోకం ఉదాహరించాడు .పంచతత్వ ప్రకాశిక రాసిన వేణీ దత్తకూడా తన పద్య వేణి లో గౌరీ రాసినశ్లోకాలు పేర్కొన్నాడు .శివుడు కల్ప వృక్షం ,రాజు ,స్త్రీ,ప్రకృతి రాజకీయం శృంగారం మొదలైన వాటిపై ఆమె కవనం  ధారతో అమృతతుల్యంగా ఉంటుంది  .శివుడిని భయంకరంగా లయకారుడుగా కాక ,అభయ దాతగా సంరక్షకునిగా వర్ణించింది .శివపార్వతులు లోకకల్యాణ కారకులని చెప్పింది .తనరాజుపౌరుషపరాక్రమాలను ఆరు శ్లోకాలలో వర్ణించింది  భ్రస్టుపట్టిన సనాతన ధర్మాన్ని రాజుమాత్రమే పునరుజ్జీవి౦ప చేయగలడలని చెప్పింది .భుశండి ఆయుధ వర్ణన  చేసింది .యుద్ధాన్ని బాగా చిత్రించింది .చివరి శ్లోకం లో లొంగిపోయిన వీరుని భార్యపడే కస్టాలు ఆశ్రయం ఆదరణ  దొరకకపోవటం ,విజేతరాజును ఆశ్రయం కొరలేని దైన్యస్థితి బాగా వర్ణించింది గౌరి .స్త్రీసౌన్దర్యాన్ని అద్భుతంగా వర్ణించింది .నీటిలో స్నానం చేసి బయటకు వచ్చిన స్త్రీ రతీ దేవిని మించిన సౌందర్యం తో కనిపించింది ఆమెకు .స్త్రీ సర్వాంగ సౌందర్యం ఆమె కవిత్వం లో పోతపోసుకోన్నది .ఆమె కోరికల కల్పవృక్షంగా కనిపిస్తుంది .సృజన ,భావుకత మేధావితనం ఆమె సొమ్ము .కృత్రిమతకు దూరం సహజత్వానికి అతి సమీపం ఆమె కవిత్వం .అలంకార శోభతో కవిత్వాన్ని మైమరపించే నేర్పు గౌరికి ఉన్నది .

శివుడు-‘’అనుఫుల్ల  గల్ల పరిఫుల్ల  ముఖారవింద –సౌగంధ్యలుబ్ధమధుపాకులయ రతాం

భుగ్న పీనకుచ చూచుకాయాతిగాఢ-మాలింగితౌగిరిజయా గిరిశః పునాతు ‘’

రాజు – ‘’ప్రభ్రశ్స౦గ తిమస్తకః ప్రవిగలత్ సద్వర్ణ విప్రస్థితి –ర్నశ్యత్ స్వాన్గబలః  ప్రణస్టవచన ప్రాగ్భార పూర్ణ స్మృతిః

వృద్ధో త్సంతమయం స్వయం కాలి మహా మ్లేచ్చేన నిర్మాలితౌ –ధర్మః సంప్రతి చాల్యతే తవ కరాలంబేన భూమీపతే’’

భుశండి –‘’మహా చండీయ సంభాతి భుజండీ భవతఃకరే –ప్రతాపజ్వర సంభ్రాంత గోలికా జీవ హారిణీ’’

అరినారి –‘’చంద్రాననా చంద్రక చారు గాయత్రీ –సా కోప విత్రస్తచకోర నేత్రా

శైలే య మృగాభిః స్మరభావ వద్భిః-సంసేవ్యతే ద్రావారి భామినీ తే ‘’

నేత్రం –‘’ముఖే శృంగార సరసి లావణ్యామృత పూరితే –కామక్రీడా హితం భాతి నయనం శఫరీ యుగం ‘’

కల్పతరు – సంత్యేవ నందనవనే శతశః సువృక్షాః-కాలేన పుష్ప ఫలతర్పిత నాకి దక్షాః

తేత్వేక ఏవ సురరాజ మనోభిలాష –తాత్కాల దాన పటురస్తి స కల్ప వృక్షీ’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

12 Questions For Arun Shourie That We Wish He Answers

12 Questions For Arun Shourie That We Wish He Answers

—

Posted in రాజకీయం | Tagged | Leave a comment

గారుడీ మంత్రం ”తో పాముకాటు నుంచి ప్రాణాలు రక్షించిన ప్రాణదాత పాములనరసయ్య-రామకృష్ణ ప్రభ -జూన్

గారుడీ మంత్రం ”తో పాముకాటు నుంచి ప్రాణాలు రక్షించిన ప్రాణదాత పాములనరసయ్య-రామకృష్ణ ప్రభ -జూన్ 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 422-అజ్ఞాత కవయిత్రి –(17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

422-అజ్ఞాత కవయిత్రి –(17వ శతాబ్దికి పూర్వం )

పేరు ఊరు తెలియని 17వ శతాబ్దికి ముందున్నట్లుగా భావింపబడే ఒక అజ్ఞాత కవయిత్రి ఒకే ఒక్క శ్లోకం ఒకటి ‘’శుభాషిత హారావళి ‘’లో బయటపడింది .ఇది ప్రేమ సందేశం .కాని చాలకవితాపరంగా అల్లింది .క్షోభించిన హృదయం పడే వేదనకు ఈ శ్లోకం ప్రతిబింబం .-

‘’పురుష వదోషి తోషి కవీ భవేయుః  -సంస్కారో హృగత్మని సమవైతి న స్త్రైరపం పౌరుషం వా విభాగ మపేక్షతే –శ్రూయంతే హృశ్యంతే చ రాజ పుణ్యో మహామాత్య దుహితరో గణికాః కైతుకి భార్యంచ శస్త్ర ప్రహత బుద్ధయః కవయంచ ‘’

423-భావదేవి (10వ శతాబ్దం )

 భావదేవి లేక భావకాదేవి కి చెందిన మూడు  శ్లోకాలు  మాత్రమే దొరికాయి.అందులో ఒకటి  హారావళి లో మరోటి   ‘’కవీంద్ర వచన సముచ్చయం ‘’లో  మిగిలినది ‘’సదుక్తి కర్ణామృతం ‘’లో ఉన్నాయి.వీటికాలాన్నిబట్టి భావదేవి 10వ శతాబ్దికి  చెంది ఉండవచ్చు.కవీన్ద్రవచన సముచ్చయం లోని శ్లోకం స్త్రీ వక్షోజం పై శ్లేషగా చెప్పబడింది .రెండవది ప్రియునితో జరిగిన ఎడబాటు ,మళ్ళీ కలయిక వర్ణించబడింది .ఒకరకంగా జీవేశ్వరుల ఎడబాటు కలయిక గా అన్వయించుకోవచ్చు .మూడవది భార్యదగ్గరకు భర్తవచ్చి కాళ్ళపై పడటం ,కానీ ఆమెలో మార్పురాకపోవటం ,చివరకు భర్తమంచితనాన్ని అర్ధం చేసుకొని తనను క్షమించమని భార్యకోరటం.

  కవయిత్రి స్త్రీ సహజమైన మనోభావాలను అద్భుతంగా ఆవిష్కరించింది .మంచి శైలి ,మధుర అర్ధవంతమైన  సందర్భోచిత శబ్దాలతో కవిత్వం పరిమళించింది .శృంగార రసాన్ని అద్భుతంగా పోషించగలనేర్పు కనిపిస్తుంది  .మొదటిశ్లోకం లో శ్లిస్ట సమాసోక్తి, రెండవదానిలో అతిశయోక్తి మూడవశ్లోకం లో అర్ధాంతరన్యాసం ,ఆక్షేపం రంగరించింది ‘

1-రాజన్మానౌ తుల్యా విభజన భువా జన్మ చ సహ – ప్రవృద్ధౌనామ్నా చ స్తన్ఇతిసమానా వుదాయినౌ

మిధః సీమామాత్రే యదిదమనయో ర్మండల వతౌ-రపి స్పర్దాయుద్ధం తదిహహి నమస్యః కఠినిం.

424-చండాల విద్యా (4వ శతాబ్దం )

మహాకవి కాళిదాసుకు సమకాలికురాలైన చండాలవిద్యా విక్రమార్క మహారాజు కు అత్యంత  ఇష్టమైన ఆస్థానకవయిత్రి  .విక్రమాదిత్య చండాలవిద్యా కాళిదాసు కవిత్రయ శ్లోకం ‘’సదుక్తి కర్ణామృతం ‘’లో ఉంది.పున్నమి నాటిరాత్రి చంద్ర కాంతి పాలలాగా భూమిపై చేరి జనులకు అలసట తీరుస్తున్నట్లువర్ణించబడిన శ్లోకం అది

‘’శ్రీ రంభోసి మిజ్జతీవ దివాసవ్యాపార ఖిన్నం జగ-తత్ క్షోభా జ జల  బుద్ధబుద్ధా ఇవ భావన్యాలో హితాస్తారకాః

చంద్రం క్షీరమివ క్షరత్యవిరతం ధారా సహస్రోతు కరై-రుద్వగ్నీ వై స్త్రుతిశితై రివాద్య కుముదై ర్జోతుస్మాపాయః పీయతే

చండాల విద్యా-విక్రమాదిత్య –కాళిదాసానాం ‘’(శార్దూల విక్రీడితం )

425-చంద్రకాంత భిక్షూని(–)

బౌద్ధభిక్షుకి చంద్రకాంత భిక్షూని నేపాల్ కు చెంది ఉంటుంది .ఆమె రాసిన 8 శ్లోకాల అవలోకితేశ్వర స్తోత్రం మాత్రమె దొరికింది .దీనిలో అవలోకితెశ్వరుని శారీరక బౌద్ధికమానసిక పరిణతి వర్ణించింది .ఆయన పూర్ణ చంద్ర నిభాననుడు .తామరరేకులలాంటి కనులు .చేతులు కాళ్ళు తామర తూడులు .రాయ౦చనడక .విజ్ఞాన పయోనిధి .బాధితుల ఆర్తి తీర్చే కరుణామయుడు .గురువు మార్గదర్శి .

  చంద్రకాంత కవిత్వం హృదయపు లోతుల్లోంచి భక్తిభావంతో మహాయాన బోధిసత్వ అవలోకితేశ్వరునిపై పెల్లుబికి ప్రవహించింది .స్తోత్రం తోటక వృత్తం లో రాయబడింది –

‘’భువనత్రయ వందితలోక గురుం –అమరాధిపతి స్తుతి బ్రహ్మవరం –మునిరాజవరం యుతిసిద్ధకరం –ప్రణమాణ్యవలోకిత నామ ధరం ‘’

‘’సుగతాత్మజరూప సురూపధరం –బహులక్షణ భూషిత దేహధరం –అమితాత్మ తథాగత మౌలిదరం-కనకాబ్జ విభూషిత వామకరం ‘’

‘’కుటిలామల పింగల ధూమ్రజటం-శశి బింబ సముజ్జ్వల పూర్ణముఖం –కమలాయత లోచన చారుకరం –హిమఖండ విమండల పుండ పుటం ‘’

చివరి శ్లోకం –

‘’పరిపూర్ణ మహామృత లబ్ధ ధృతిం –క్షీరోద జలార్ణవ నిత్యగతిం –శ్రీ పోతలకాభి నివాస రతిం –కరుణా కరుణామయ నిర్మల చారు భ్రుశం ‘’

‘’ఇతి శ్రీ మదార్యావలోకితేశ్వర భట్టారకస్య చంద్రకాంతా –భిక్షుణీ స్తవ స్తోత్రం సమాప్తం ‘’

    ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 421-చమత్కార తరంగిణి వ్యాఖ్యాన కర్తలు -సుందరి ,కమల (1705)

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

421-చమత్కార తరంగిణి  వ్యాఖ్యాన కర్తలు -సుందరి ,కమల (1705)

ఉత్తర రామ చరిత వ్యాఖ్యానకర్త ఘనశ్యామ క్రీ.శ. 1700 లలో జన్మించి, తంజావూర్ పాలకుడు మొదటి తుక్కోజి వద్ద మంత్రిగా ఉన్నాడు .నీలకంఠ చంపు సంజీవనికూడా రాశాడు .18వ ఏటనుంచే రచనావ్యాసంగం సాగించాడు .మహారాష్ట్రకు చెందినవడైనా తంజావూర్ లోనే ఉండిపోయాడు .తండ్రి మహాదేవ .తల్లి కాశీ .పెద్దన్న ఈశా ‘’చిదంబర బ్రహ్మచారి ‘’గా గుర్తింపు పొందాడు .ఘనశ్యామా మొదటి భార్య సుందరి .కమలను రెండవ భార్యగా చేసుకోనేదాకా ,.తనరచనలలో ఆమెను సుందరిగానే పేర్కొన్నాడు .ఈ ఇద్దరితో ఆనుకూల్య దాంపత్యమే నెరిపాడు .ఈ ఇద్దరి పేర్లను తన రచనలలో తరచుగా పేర్కొని , తన అభిమానాన్ని చాటుకొన్నాడు .తన అభిజ్ఞాన శాకుంతల సంజీవనిలో వారిద్దరి మేధో విలసనాన్ని తెలిపాడు .ఘనశ్యామ ఇద్దరుకోడుకులు చంద్ర శేఖర ,గోవర్ధన .చంద్ర శేఖర తన తండ్రిరాసిన ‘’డమరుక ‘’కావ్యానికి వ్యాఖ్యానం రాశాడు .గుడ్డివాడైన గోవర్ధన తండ్రి రచన ‘’ఘట కర్పక ‘’కు వ్యాఖ్య రాశాడు .ఘనశ్యామ ‘’పంచాయతన దేవత’’కు పరమభక్తుడు .

  ఘనశ్యామ సంస్కృత ,ప్రాకృతాలలో అనేక రచనలు చేశాడు .తను 64రచనలు చేసినట్లు నీలకంఠ చంపులో చెప్పుకొన్నాడు .రచనలో తనవాటినే ఎక్కువగా ఉదాహరణలిచ్చేవాడు .సుందరీ కమలలు కూడా అలాగే చేశారు .రాజశేఖరుని విద్ధ సాలభంజికపై ‘’చమత్కార తరంగిణి వ్యాఖ్య’’ రాశారు ఇద్దరూ .ఘనశ్యామ రచనలలో చాలాభాగం శిధిలమయ్యాయి .ఘనశ్యామ ‘’ధాతు కోశం ‘’రాశాడు .అందులో అమరా సి౦హు ని రచనపై తీవ్రంగా విమర్శలు చేసిన ధీమంతుడు .18వ ఏటనే రామాయణ చంపు ,20వ ఏట మదన సంజీవన ,కుమార విజయ నాటకం రాసిన ప్రతిభావంతుడు ఘన శ్యామ .22వ ఏట డమరుక ను 8వ రచనగా రాశాడు .ఏడాదికి కనీసం మూడు లేక నాలుగు పుస్తకాలు రాసినఘనుడు ఘనశ్యామ .మొదట్లో సృజనాత్మక రచనలు చేసి ,తర్వాత ఇతరకావ్యాలపై వ్యాఖ్యానాలు చేశాడు .క్లిస్టభాషలో రాసినా రచనలో ఆకర్షణ ఉంటుంది .మేధావే కాని ఇతరకవులను మెచ్చుకొనే సహృదయతదయలేని వాడుగా గుర్తి౦పు పొందాడు .అనేక’’ కోశాలు’’ నిర్మించాడు కనుక ‘’కోశావలీ వల్లభ ‘’బిరుదు సార్ధకమే .

   ఘనశ్యామ సుందరిని పిన్నవయసులోనే పెళ్ళాడాడు .పెళ్ళికి ఇద్దరివయసు 16లోపే .సుందరి 1705లో పుట్టింది .అతనికి 30 కమలకు 13వయసులో కమలా ఘనశ్యామా వివాహం జరిగింది అప్పుడు అతడు తుక్కోజి రాజ్యం లో మంత్రి .అప్పటికే చాలా రచనలు చేశాడు .ఈ ఇద్దరి పెళ్ళాల ముద్దులమొగుడు తనరచనలలో వారిపై ప్రేమను వారి ఆరాధనాభావనను వీలైనప్పుడల్లా వర్ణించి సంబరపడ్డాడు .ఇద్దరు భర్తను పుంభావ సరస్వతి అని భావించి సేవించారు .చమత్కార మంజరిలో తమభర్త ఘనశ్యామ రచనలద్వారా అమరత్వం పొందాడని ఆనందించారు .రాజశేఖరుడు మూడు రచనలు మాత్రమే చేస్తే తమనాధుడు చాలారచనలను అనేకభాషలలోచేశాడని చెప్పుకొన్నారు .రాజశేఖరుడు ఉదయం మాత్రమే రచన చేస్తే, తమ భర్త రోజులో ఇరవైనాలుగు గంటలు  అదే దీక్షతో రచన చేసే  సామర్ధ్య మున్నవాడని చెప్పారు .ఘనశ్యాముని’’ ప్రచండ రాహూదయ’’ వంటి కావ్యం కాని ఆయన ఇతర రచనలతో సరిసమానమైన రచనకాని వేరెవ్వరూ చేయలేదని సవాలు విసిరారు .భర్త శేముషీ వైభవాన్ని చాటే అనేక శ్లోకాలను డమరుక, జాతి గుణోల్లాస ,భారత చంపు ,హరిశ్చంద్ర చంపు ,భోజచంపు ఉత్తరరామ చరిత వ్యాఖ్యానం,అభిజ్ఞాన శాకుంతలం ,యుద్ధకాండ చంపు ప్రబోధ చంద్రోదయ ,ఆనంద సుందరి  మొదలైన  వివిధ రచనలనుండి ఉదహరించారు.

  దీనిని బట్టి సుందరి కమలలు తమ భర్త ఘనశ్యామారచనలన్నిటిపై లోతైన పరిశీలన  సాధికారమైన అవగాహన ఉందని అర్ధమౌతోంది  .తమ మేధకు తామే అబ్బురపడే వారిద్దరూ .ప్రతి శబ్దానికి వంద అర్ధాలను చెప్పగల సామర్ధ్యం తమకు ఉందని నిర్భయంగా ప్రకటించిన ధీ శక్తి వారిది .తమ బావగారు అంటే ఘనశ్యాముని అన్నగారైన ‘’కల్పతరు ‘’కర్త చిదంబర స్వామి అంటే ఈ ఇద్దరికీ విపరీతమైన గౌరవం భక్తీ,ఆరాధనా. చమత్కార తరంగిణిలో ఈయన గురించి రెండుసార్లు చెప్పారు .కాని కల్పతరు కనిపించటంలేదు .

    ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 420-రాజేశ్వర విలాస మహాకావ్యకర్త –పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి (16వశతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

420-రాజేశ్వర విలాస మహాకావ్యకర్త –పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి (16వశతాబ్దం )

పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి రచించిన రాజేశ్వర విలాస మహాకావ్యం లో ఆచార్య బిరుదురాజు రామరాజుగారికి కేవలం 12తాళపత్రాలు మాత్రమె లభించాయని ,అందులో రెండువందల శ్లోకాలున్నాయని ,ఇది సాహిత్య శాస్త్ర గ్రంథంఅని ,ప్రతాపరుద్రీయం లాగా పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరికవి రాజేశ్వర భూపాలుని పేరుతొ రాసిన సాహిత్య శాస్త్ర గ్రంథంఅన్నారు .

  కౌశిక గోత్రజుడైనకవి తండ్రి నాగలింగ సోమయాజి .కవికాలం నివాసం తెలీదు .కృతి భర్త మహాజని నాగమాంబా ,లక్ష్మీ నారాయణ అనే బ్రాహ్మణ దంపతులకు వేములవాడ రాజరాజేశ్వరుని అనుగ్రహంతో జన్మించాడు .భాగాపురవాసి .గొప్ప వంశం .గౌతమస గోత్రం .మూల పురుషుడు కీర్తిమన్నృపాలుడు బదరికాశ్రమం లో శ్రీ లక్ష్మీ నారాయణుని సేవించి వరప్రసాదంగా పుత్రుని పొందాడు .ఈయన మునిమనవడు’’ఆసాకేతము ఆకాశి’’వరకున్న రాజ్యాన్ని పాలించాడు .ఈ వంశంలో ఆరవతరం వారైన కాశీనాధ ,జగన్నాధ ,ఉమానాద సోదరత్రయం సాకేతం పాలిస్తూ ,నిజాముల్క్ తో యుద్ధం చేసి గెలిచారు .ఉమానాధుని మనవడు లక్ష్మీనారాయణ ధిల్లీ పాలకుని చేత బెంగాల్ సుబేదారుగా నియమింపబడ్డాడు ఈయనమనవాడు చంద్ర చూడుడు పాండురంగని వరప్రసాదం తో విఠల,కృష్ణ దోడారాములు అనే ముగ్గురుకోడుకులను కన్నాడు .వీరికి ఢిల్లీ రాజు మహాజనీ ,దేశముఖీ ఇచ్చాడు .బహుశా అప్పటినుంచి ఇంటిపేరులో మహాజని  చేరి ఉంటుంది .విఠలుని మునిమనవడు గోపాలరాయుడు మత్సపురిఅంటే మచిలీపట్నం  పాలకుడయ్యాడు .ఇతని 8మంది సంతానం లో రెండవాడు లక్ష్మీనారాయణ స్తంభాద్రి అంటే ఖమ్మం మెట్టు అనగా ఖమ్మం ను జయించాడు .ఇతనికి నాగాంబ వెంకమాంబ ,రాజేశ్వరుడు సంతానం .ఈ రాజేశ్వరుడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి వరప్రసాది .ఈయన పేరుతోనే ‘’రాజేశ్వర విలాస కావ్యం ‘’రాశాడు కవి పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి .రాజేశ్వరుడు భాగాపురం అంటే భాగ్యనగర నివాసి .కృతి కర్త, భర్త ఇద్దరూ సమకాలికులేకనుక కాలం 16వ శతాబ్దం అయి ఉంటుంది .

  వంశావళి చివరలో కవి –

‘’బాలన్యగ్రోధ వంశోత్తమ విమలయో రాశిరాకాశశాం కః-సంపూర్ణ బ్రహ్మ తేజః స్పుట ముఖ కములోల్లాస విద్యా మరందః

నాగార్యో యన్య సాక్షా త్కృత నగతనయా కాంత మూర్తిఃపితాసీ –దేనం శ్రీ వేంకటార్యం ప్రమదయతుముదా సాదు కారుణ్యవాదః ‘’

‘’ఇతి కౌశిక గోత్ర బాలన్యగ్రోధ కుల కలశాబ్ది సుధాకర శ్రీనాగలింగ సోమయాజి తనూభవ ‘’శ్రీ  వేంకటపతి సూరి విరచితే రాజేశ్వర విలాసే మహాకావ్యే వంశావాళీప్రకరణం నామ ప్రధమోమ్కః ‘’నాటకం లోని అంకంలాగా  మొదటి అంకం అనటం ఆశ్చర్యం .మిగత రెండిటిని నాయక ప్రకరణం అని ,అలంకార ప్రకరణం అనీ అన్నాడు .

  నిజాముల్కును ఓడించిన సోదరత్రయం పై శ్లోకం –

‘’శూరాస్సాహసికా స్త్రయస్సమధిక ప్రావీణ్యవంతో ధను –ర్విద్యాయాంగజవాజి రాజి రథసంపత్తి ప్రసేనాశతాః

సాకేతే నగరే వినోదనకదాలాపై నిశాయాపనం –కుర్వంతః పరిపాలయంతి విషయానర్ధ్యా దితేయద్రుమః ‘’

‘’తదన్తరే తన్న్రుపవీర దేశానాక్రామ్య దోర్దండ జితారి వర్గాః –మ్లేచ్ఛానిజాముల్కు మఖా ప్రసైన్య యుతాబబందు ర్నగరం చ తేషాం’’

ఢిల్లీ శ్వరుడిచ్చిన ‘’దేశముఖి గురించిన శ్లోకం –

‘’నృపాస్త్రుయంతే బహుభాగ్యవంతః  అనేకమాతంగ రాదాశ్వవంతః –తత్రైవ ఢిల్లీనగరాదినాదాత్ మహాజనీ ,దేశముఖత్వ  మాపుః

మచిలీ బందరును పాలించిన గోపాల రాయని పై శ్లోకం –

‘’శ్రీ గోపాల మహేపతిః  కులకరోదాంత స్తపస్వీ వరం –ధర్మాత్మామిత విక్రమో ద్విజకులాలంకార రూపోపి సః

శ్రీమాన్ మత్స్యపురేవారిచ నివసన్ తద్రాజ్య కార్యస్యవై –తత్రస్థాన్విషయా న్వశాద్రఘుపతీ రంయానివాలాపయత్ .

ఉపమాలంకారం –

‘’శ్రీ రాజరాజేశ్వర భూపతి కంఠీరవమంగ జోపమాత్మానన్ – సంరక్షిత భూపాలం రక్షతు లక్ష్మీపతిః పరగ్హ్నం  తమ్ ‘’

అపహ్నుతి అలంకారం-

‘’శుద్దాపహ్నుతి రాన్యారపార్దో ధర్మ నిహ్నవో యత్ర –నామీ సురాజ నృపతే స్సుగుణాః కిం తర్హి రత్నజాలాని ‘’

సయుక్తికో యత్ర కా ధర్మ నిహ్నవో బుధా స్తమాహుః కిల హేత్వవహ్నవం –

అయం న చేందుఃకమలనుమోదకో హరి –ర్నసౌమ్య స్సహి చక్రపాలకః ‘’

ధీరోదాత్త నాయక లక్షణాలు చెప్పే శ్లోకాలలో చాలా శిధిలాలని ,9శ్లోకాలు ఒక దీర్ఘగద్యం మాత్రమె ఉన్నాయని రాజుగారువాచ

(బిరుదురాజువారి ఈ వ్యాసం వేములవాడ రాజరాజేశ్వర సంస్కృత కళాశాల వార్షిక సంచిక -1981-82లో ప్రచురితం )

ఆధారం –ఆచార్య బిరుదురాజు గారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు

ఇంతటితో ఆచార్య బిరుడదురాజురామరాజు వారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’లో సంస్కృత కవులు సమాప్తం .

సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -3-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జూన్ తెలుగు వెలుగు మాసపత్రికలో పుచ్చా వారి పుస్తక పరిచయం ”కొండ అద్దంలో ‘

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 419-ఏక దిన ప్రబంధకర్త –ఆలూరి సూర్యనారాయణ వాజపేయ యాజీ

  • గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

419-ఏక దిన ప్రబంధకర్త –ఆలూరి సూర్యనారాయణ వాజపేయ యాజీ

విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ వేంకటపతి రాయలు పాలిస్తున్నకాలం (1586-1614)లో రాయవేలూరుకు సామంతరాజు లింగమనాయకుడు .తండ్రి చిన్నబొమ్మ నృపాలుడు (1549-1579)గొప్పకవి, గాయకుడు, కవిపండిత పోషకుడు .జయదేవుని గీత గోవిందం లాగా ఆరు కాండల రామాయణాన్నివివిధరాగ ,తాళాలతో, గేయాలతో, శ్లోకాలతో ‘’సంగీత రాఘవం ‘’కృతి రచించాడు .అప్పయ్యదీక్షితులవారికి చాలాకాలం పోషకరాజుకూడా.బొమ్మనాయకునికొడుకు లింగమనాయకుడు కూడా పరాక్రమశాలి, కవిపండిత పోషకుడు .విజయనగరరాజు రెండవ వేంకటపతి రాయలతో యుద్ధం చేసిన మేటి వీరుడు .రాయవేలూరుకోట రాయల వశంకాకపోతే దామెర్ల కరి చన్నమనాయకుడు అనే విజయనగర సామంత సైన్యాధికారి మోసం చేసి కోటను పట్టుకొన్నాడు .ఇంతటితో వేలూరులో ఈ నాయకులపాలన అంతమొందింది .

  లింగమనాయకుని ఆస్థానం లో కవిపండిత గాయక నర్తక,విద్యా గోస్టులు , ప్రదర్శనలు , చర్చలు ఎక్కువగా జరిగేవి .విద్యా గోష్టికి ఆలూరి సూర్యనారాయణ యజ్వ మూలస్థంభం .ఒకరోజు రాజాస్థానం లో కవులమధ్య పోటీవస్తే యజ్వగారు ఒక్క రోజులో ఒక ప్రబంథం  రాస్తానని సవాలు చేసి ‘’ఉలూచీ చిత్రాంగద సుభద్రాపరిణయం ‘’ రాసి మాట నిలబెట్టుకొని రాజును సంతోష పరచాడు  .ఇది అముద్రితం .

 మొదటిసర్గలో ఇంద్రప్రస్థ వర్ణన ,ధర్మరాజు ధర్మపాలన ,సమయభంగం చేసిన అర్జునుడు తీర్ధయాత్రలకు వెళ్ళటం ,గంగానదినుండి పాతాళానికి పోయి ఉలూచిని పెళ్ళాడి బభ్రువాహనుడికి జన్మనివ్వటం ,అక్కడినుంచి కావేరీ తీరం చేరటం ,పాండ్యరాజ వర్ణన కూతురు చిత్రంగదతో పరిణయం ,పంచహ్రద సేవనం ,ద్వారకకు చేరటం ఉన్నాయి .రెండవసర్గలో కృష్ణుని ప్రసన్నం చేసుకొని ద్వారక చేరి ,రైవతకాద్రిపై మాయా యతిగా  ఉంటూ సుభద్ర సేవలు అందుకొనటం ఇద్దరి విరహవేదన ఉంటాయి .మూడులో సుభద్ర చెలికత్తె ద్వారా మాయ యతి సుభాద్రమనో వేదన అర్ధం చేసుకోవటం ,సుభద్రతో తనగుట్టు చెప్పుకొని రహస్యక్రీడలాడటం ఉన్నాయి .నాలుగవ సర్గలో బలరాముడు యతిని సేవించి సముద్ర ద్వీపం లో జరిగే శివుని ఉత్సవాలకు వెళ్ళటం ,కృష్ణుడు సుభద్రార్జునుల వివాహ ప్రయత్నం చేయటం ,బలరాముడికి కోపంవస్తే తమ్ముడు శాం౦పచేయటం,నూతనదంపతులు ఇంద్రప్రస్థం చేరటం ,ధర్మరాజు సుభద్రార్జున వివాహాన్ని ఘనంగా జరిపించటం తో ప్రబంథం ముగుస్తుంది .

  ప్రార్ధన శ్లోకం –

‘’స్పురతుమే గురువరంఘ్రి నఖ ప్రభా దళిత సంతమసే హృదయా౦ తరే

ఆది కథా కరకంకణ కుండలీ క్వణిత శంకిత శంకర సంస్తుతః  ‘’

ధర్మరాజు ప్రాభవం –

‘’పుమభిలాష ఫలైర్ధ్రుత మూర్తి భిశ్చతనృణా౦ చ దిశాంవిజయైరివ

సహి చతుర్భిరశోభి సహోదరైర్హరిరివో చ్చ భుజై రాతి దుస్సహై ‘’

చిత్రాంగద –

‘’ముఖ రుచి ప్రవల్లహరీ స్తన క్షితి ధర ప్రతిఘాత వివర్తితా –ఝఠయుగీ పరిత స్పురతిధృవం

 భుజ యు గీతి భుజంగ శిశుభ్రువః ‘’

విజయుని విరహవేదనలోవసంతరుతు  శ్లేషరామణీయకత –

‘’స్వకామ భా జ్మాధవబద్ధ సఖ్య మప్యర్జునం హంతి ముహుర్వసంతః

పలాశ వర్గస్య వికాశ హేతోః క్వజాతి హీనస్య భవేద్వివేకః ‘’

  ఈశ్లోకం పండితరాజు చెప్పిన ‘’జాత్యావిహీనో నవివేక్తుమేస్టి’’శ్లోకాన్ని గుర్తుకు తెస్తు౦దన్నారు  రాజుగారు

సుభద్రార్జున రహః క్రీడ –

‘’వాతాహృత నవామ్భోజ సౌరభ్యేనసహార్జునః –సుభద్రా ముఖ సౌంగంధ్య తారతమ్యం పరీక్షితే ‘’లాక్షా లక్ష్మీం దదౌ పాదే కుంతలే  కుంకుమ శ్రియం –బాలతపః సుభాద్రాయాఃకర్ణే కమలపురాతం  ‘’

కావ్యం చివరలో తలిదంద్రులగురించి,రాజసభలో ప్రతిజ్ఞా గురించి చెప్పుకొన్నాడు –

‘’శ్రీ యజ్ఞేశ్వర యజ్వ న స్సితకరాదాలూరి వంశాంబుధే-జ్ఞానామ్బా సుషువేయమధ్వరివరం శ్రీ సూర్య నారాయణం

తస్య శ్రీమతి లింగయ ప్రభు సభా మధ్యే ప్రతిజ్ఞా కృత –శ్రీమానేక దిన ప్రబంద సుకృతౌ సర్గశ్చ   తుర్దోజని

నాడీభిర్దివసస్య నవ్యమచిరాదవ్యాహతో హాస్పదైః- శబ్డార్ధైఃప్రభు సత్య సమ్మత కదా వృత్త క్రమైర్యంత్రితం

యత్కావ్యం నిరమాయి సంప్రతి మయాతస్మిన్ హఠాత్కారతః –ప్రాప్తం దోషముపేక్ష్యకేవల గుణగ్రాహీ బుధస్తుష్యతు

స్వస్య గుణావిష్కరణ ప్రయోజనాత్స గౌరవాదపి వా-త్రింశద్ఘటిక నిబంధన సాహసతో వా సతాం ముదేస్తు మే కావ్యం ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -2-6-19-ఉయ్యూరు

‘’

— 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 418-‘’బాలసరస్వతి ‘’తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసా చార్యులు(1869)

  • గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

418-‘’బాలసరస్వతి ‘’తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసా చార్యులు(1869)

వీరి వంశ మూలపురుషుడు శ్రీశైలపూర్ణులు .ఇందులో బుచ్చి వెంకటాచార్యులకుమారుడే మన బాలసరస్వతి బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు .వీరిది కడప మండలం  లోని బుక్కపట్టణం .సురపుర సంస్థానాధీశుడైన స్వామి నాయకుని (1752-1773)ఆహ్వానం మేరకు అణ్ణయాచార్యుల మూడవ కుమారుడు శ్రీనివాసాచార్యులు బుక్కపట్టణం వదలి సురవరం లోరాజగురువులై  స్థిర నివాసమున్నారు .శ్రీనాథునిలాగా ఈ వంశం లోని కిరీటి వెంకటాచార్యుల సాహితీ జైత్రయాత్ర విలువైనది .

 మన శ్రీనివాసాచార్యులు తండ్రి వద్దనే11వ ఏట  సాహిత్య ,అలంకార గ్రంథాలు గ్రహించారు .సంస్కృత ఆంధ్రాలలో కవనం అల్లటమూ ప్రారంభించారు .16వ ఏట మైసూరుకు వెళ్లి రాజగురు పరకాల స్వామి వద్ద తర్కం నేర్చి, మహారాజు చామరాజు ఒడియార్ ను మెప్పించి ‘’బాలసరస్వతి ‘’బిరుదుపొండాడరు .రాజుగారిచ్చిన ఉపకార వేతనం తో కాశీ వెళ్లి అద్వైత వేదాంతాన్ని స్వామి శాస్త్రిగారి వద్ద ,న్యాయశాస్త్ర క్రోడంను జగాధీశుని కైలాస చంద్ర శిరోమణి భట్టాచార్యులవద్దా ఆపోసనపట్టి ,నవద్వీపానికి వెళ్లి మీమాంసను అధ్యయనం చేసి ,అక్కడి పండితులు 1889లో అందజేసిన ‘’తర్క తీర్ధ ‘’బిరుదు నందుకొన్నాడు .సాహితీ ఉత్తర జైత్రయాత్ర దిగ్విజయంగా ముగించుకొని ,స్వరాస్ట్రానికి బయల్దేరి మార్గ మద్యం లో ఉత్తరాది సంస్థానాలు దర్భంగా ,జోధ్పూర్ ,బుందీ దత్తియా ,గ్వాలియర్ ,కోటా౦ జరీ ,ఇందూర్ ,దారానగరం ,జమ్మూ-కాశ్మీర్ లను  ,దర్శించి అక్కడిపండితులను వాదం లో జయించి ,వారు నతమస్తా కులై అభినందించగా ,ఆరాజులు విశేష గౌరవం తో సత్కరించిపంపగా స్వరాష్ట్రం చేరారు .

 గంటకు వంద శ్లోకాలు అవలీలగా  చెప్పగల నేర్పు మన శ్రీనివాసాచార్యులది .అందుకే వారికి ‘’ఘంటా శతశ్లోక కవి ‘’అనే బిరుదు సార్ధకమైనది .ఆంద్ర దేశం లో బళ్ళారి ,కడప ,పెనుగొండ తాడిపత్రి ,మద్రాసు ,బనగానపల్లి ,మొదలైన చోట్ల అవదానాలు చేసి పండిత శాస్త్రవేత్తల మెప్పు పొందారు .కీర్తి,కనకాలు ఆయన వె౦టపడ్డాయి .తర్వాత దేశమంతా సాహిత్య జైత్రయాత్ర దిగ్విజయంగా ముగించి అరుదైన సన్మానాలు అందుకొని చివరికి తన జన్మస్థలమైన  ఆత్మకూరులో సంస్థానాధీశుల ప్రధాన విద్వాంసులుగా స్థిరపడ్డారు.రాజు అనేక అగ్రహారాలు వారికి ఈనాముగా అందించి గౌరవించాడు .తాను సత్కారాలు అందుకోవటమే కాదు ,స్వయంగా ‘’బ్రహ్మామృత వర్షిణి’’అనే సంస్థ నేర్పాటు చేసి ,ప్రతిఏడాది ఘనంగా వేద సభలు నిర్వహించి  వేద, శాస్త్ర పండితులను సత్కరించారు .ఈ ఆస్థానానికి వచ్చిన తిరుపతి వేంకటకవులు శ్రీనివాసాచార్యులవారి చేతిలోశాస్త్ర  వాదం లో ఓడిపోయారు  .ఈ విషయాలు బాలసరస్వతిగారి మనవడు శ్రీమాన్ తార్కిక సిమ్హాచార్యులు ,తిరుపతి కవులకు గద్వాలలో ఆతిధ్యమిచ్చిన మహా పండితుడు గుండేరావు హర్కార్ తెలియజేశారని బిరుదురాజువారు రాశారు .

  ఆచార్యులవారి ముద్రితాముద్రితగ్ర౦థాలు చాలాఉన్నాయి .ఇందులో నంజరాజ చంపూః,దుర్మద నిర్మధనం ,జాంబవతీ పరిణయం ,తత్వ మార్తాండ ప్రభామండలం ,రాజశేఖర చరితం ,సురపుర వెంకట గురు చరితం ,శత ఘంటావధానం ,శ్రీనివాస విలాసః ,వీరశైవ శిరస్తాడనం ,దుర్విగ్రహ నిగ్రహ౦ ,కిరీటి వేంకటాచార్య విజయ వైజయంతి ,రాజవంశరత్నావళీ,లక్ష్మీ సరస్వతీ దండకం ,విష్ణుస్తుతి వ్యాఖ్యా ,రహస్య త్రయ సారార్ధః ,గంగాస్తుతిః,ఆంగ్లేయ ,జర్మనీ యుద్ధ వివరణం,ప్రపత్తి పదవీ , హయగ్రీవ పంచాశత్ నరకేసరి స్తుతిః ,దశావతార స్తోత్రం ,విజయ దశమీ నిర్ణయః అనే 22ఉద్గ్రందాలున్నాయి .

 ఇందులో శతఘంటావధానం లో కడప పోద్దుటూరు బళ్ళారి  మద్రాస్ లలో ఆచార్యులవారు చేసిన అవధాన శ్లోకాలున్నాయి .దీన్ని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు పండిత డి.గోపాలాచార్యులు ప్రచురించారు .దీనిలో ఏడవ ఎడ్వర్డ్  రాజు పట్టాభిషేక సమయం లో చెప్పిన 23శ్లోకాలు ,శివునిపై స్తోత్రం చెప్పమని కోరితే చెప్పిన ‘’భవానీ సంగమేశ్వర స్తుతి ‘’ వివిధ ప్రాకృత భాషలలో ఆశువుగా చెప్పిన శ్లోకాలు కూడా ఉన్నాయి .హయగ్రీవ పంచాశత్ ,నరకేసరి స్తుతి కూడా ప్రాకృతం లో చెప్పినవే.

సంగమేశ్వర స్తుతిలోని  మూడు శ్లోకాలు –

‘’స్రవ౦తీమాభ్యాం వలయిత నిశాంతం కిమపిత –త్ప్రశాంతంజ్యోతిర్నఃప్రథయతు శశాన్కార్ధ మకుటం ‘’

‘’నిదానం లోకానాం నిరవధి చిదానంద హరీం –దధానం భక్తానాం శమధన హృదానందనచణం’’

‘’సురాసుర శిరస్తటీ మకుట చుంబి పాదాంబుజం –చరాచర కుటుంబినం,శమధ నాశయా లంబనం

ధరాధర కుమారికా ,స్మరవిలాస లోలాశయం –జనాస్తుహిన భాస్వరం ,భజత సంగమాధీశ్వరం ‘’ఆరాళచలకున్తలం పరమరాళయనా౦ చితం – ప్రవాళ మృదులాధర౦ ,సితకరాధికాస్య ప్రభం

స్మరామి పురవైరిణః కమపి నిత్య నేత్రోత్సవం ‘’.

ఆచార్యులవారి రచనలలో ;;కిరీటి వేంకటాచార్య వైజయన్తినాటకం  ‘’అముద్రితం అన్నారు రాజుగారు .దీనిప్రతి తమవద్ద ఉందని ఇది 8అ౦కాలనాటకమని చెప్పారు .ఇందులో మూడవ అణ్ణ  యాచార్యుల కుమారుడు కిరీటి వెంకటాచార్యుల సాహిత్య జీవితం ఉన్నది .ఈయన సురపుర సంస్థానాదీశుడు వెంకటప్పయ్యనాయకుని రాజగురువైన ఆస్థానకవి .

నా౦దీ శ్లోకం –‘’-

‘’కారుణ్యేన  కిరీటినే ప్రవితరన్నధ్యాత్మ విద్యామృతం-ద్వారానేనవిరొధినోవిదళయన్  శాస్త్రేషుసాదధీయసా

తస్యై తస్య యశ శ్శశాంక  ధవళం తన్వన్ధరామండలే-శ్రీమాన్ శ్రీనిధి రచ్యుతః ప్రదిశతుశ్రేయాంసి భూయంసినః  ‘’

8వ చివరి అంకం లో తిరుమల తిరుపతి ధర్మాధికారి మహంతు హాథీరాం బాబా  వేంకటాచార్య గురువు పిత్రువ్యులు అయిన శ్రీనివాస దేశికుల మహత్వం తెలుసుకొని ఆచార్యులవారిని స్వయంగా సత్కరించటం తో నాటకం పూర్తి .భరతవాక్యం –

‘’నిర్దోష నిత్య మధురాణి నిరామయాని –శాస్త్రాణి నిత్య శుభగాని జయంతు లోకే

నిత్యాద్రుతా నృపతి భి స్సదృశా౦  సభాశ్చ-వాక్సౌరభీ చ సుభగా సతతం కవీనాం ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 417-భద్రగిరి చంపు కర్త –భారద్వాజ రామా చార్య (17-18శతాబ్ది )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

417-భద్రగిరి చంపు కర్త –భారద్వాజ రామా చార్య (17-18శతాబ్ది )

భద్రాచల క్షేత్రమహిమను, అక్కడ జరిగే చైత్రోత్సవాన్నీ విపులంగా ‘’భద్రగిరి చంపు ‘’కావ్యం లో  వర్ణించిన కవి భారద్వాజ రామాచార్య ..ఇతని ఇంటిపేరు ఊరు కాలమూ తెలియదు .కాని బిరుదురాజు వారు ఈ కవి 17-18శతాబ్దుల కాలం వాడై ఉంటాడని ,పాల్వంచ జమీన్ దారులైన ఆశ్వారావుల ఆస్థానం లో ఉండి ఉంటాడని ఊహించారు .కావ్యం లో తండ్రి తాతలగురించి తనగురించి చెప్పుకొన్నాడు –

‘’భారద్వాజస కులార్ణవామృతకర శ్రీరామ వర్యస్య యః-పౌత్రో వెంకట దేశికస్య మహాతః పుత్రస్య తే నాదరాత్

రామాఖ్యేన మనీషిణావిరచితే చంపూ ప్రబంథే మహాన్ – భద్రాదీశ మహోత్సవా మృతయుతే భాగో ద్వితీయో భవత్ ‘’.కావ్యం లో మొదటిభాగానికి ‘’ధ్వజారోహణం ‘’అని పేరు పెట్టాడు . రెండవ భాగానికి ఏ పేరు పెట్టాడో ఆభాగం శిధిలం అవటం వలన తెలియలేదు .ప్రారంభ శ్లోకం –‘’శ్రీమద్భద్ర  నగాధిరాజ విలసత్సౌధాగ్ర భాగోజ్వల –జ్జ్వాలాభీల మవక్ర విక్రమ మహం చక్రేశ్వరం నశ్వరం

ఛేత్తుం బంధ మలి౦ధనాగ్ని శమదం,దుర్వార గర్వాధిక –క్రవ్యద క్షరితా క్షతక్షత రుహైస్స్యః ప్రశస్యం స్తువే ‘’.మొదటిభాగం లో భద్రాచల మహాత్మ్యం అక్కడి ఉత్సవాలు వర్ణించబడ్డాయి .రెండవభాగంలో మర్నాడు అక్కడ జరిగే తిరునాళ్ళు వీధులు యాత్రికులు వగైరాలున్నాయి .కావ్యం లో’’ వీథీ’’ లక్షణాలు కూడా జోడించాడు  .పద్మాక్షుడు అనేవాడు ప్రియురాలు  బిబ్బోకవతికి వివరించి చెబుతాడు . ఈ రెండు పాత్రలగురించిన శ్లోకం –

‘’చైత్రోత్సవం దాశరధేర్విలోకితం –భద్రాద్రి నామ్నస్తరుణీ సమాగతౌ

పద్మాక్ష బిబ్బోకవతీ సమాఖ్యయా –ప్రఖ్యాం గతౌ కౌచన రంగ వాసినో ‘’

ఈ చంపు కాకతీయ కాలం నాటి’’ క్రీడాభిరామం ‘’ను గుర్తుకు తెస్తుంది .ఆలయ గోపురం దూరానికి ఎలాకనపడిందో చూడండి –

‘’కనక కలశరాజ శ్రీ పరీక్షాంవిధాతుం-విపులగగన శాణోల్లేఖనే నోన్న తేభ్యః

సతత తరతి సహానాం సాదు పారావతానాం –విహరణ శరణేభ్యో నమోస్తు ‘’

గోదావరి నది వర్ణన –

‘’పులిన జఘన రమ్యా చక్రవాక స్తనీయం-తరళతర తరంగ ప్రోచ్చలసన్మమధ్య రేఖా

సరిదిహ చపలాక్షీ స్వచ్ఛ డిండీర హాసా –విహగకుల  నినారైర్నౌ శుభం పృచ్ఛతీవ ‘’

భద్రగిరి వర్ణన –

‘’శ్రీ భద్ర శైలం సుకృతైకమూలం –భజేను వేలం ,జలదౌఘనీలం

శ్రేయో విశాలం విలసద్రసాలం –శ్రితానుకూలం శ్రిత దేవజాలం ‘’

శ్రీరామభద్ర వర్ణన –

‘’నమోస్త్వసుర వైరిణీ,జనక భూ మనో హారిణే-హృద౦తర విహారిణే,మతిమతాంసుధా హారిణే  శ్రితావన చారిణే ,శ్రుతి వనాంత సంచారిణే-సదా సుకృత కారిణే,దశరధాత్మజా కారిణే’’.

కల్యాణం ముందు అమ్మవారి, అయ్యవారి వర్ణన –

‘’కలశ జలధి కన్యాం,సర్వ లోకైక మాన్యాం-జనకయజన జన్యాం,వాంచఛితానాం వదాన్యం

హృతనతజనదైన్యాం,రాఘవే౦దోరనన్యా-మలమకురుత ధన్యా ,మాళివర్గౌఘ శూన్యాం’’

‘’కాంచీ గుణేన కలకి౦కిణి కేన సింధు –కాంచీనుతా కటి తటీ గ్రధితా కయాచిత్

పంచాస్త్ర కార్ముకగుణ ప్రవరేణ రామ –పంచాననన్య విజయోద్యమ శాలి నేవ ‘’

కళ్యాణ ఘట్టం లో పాల్వంచ జమీన్ దారులైన అశ్వారావు లవర్ణన ఉండటంతో ఈకవి ,వారి ఆస్థానకవి అయి ఉండాలి అని రాజుగారి నిర్ణయం –

‘’ఆశ్వినోజ్వలో హ్యశ్వరాయ ప్రభు –శ్శాశ్వతీ౦ సంపదం విశ్వతః పృస్టతః

ఆశ్వ వాప్తుం తదా విశ్వసన్ భూ సుతా –ధీశ్వరం చామరం శాశ్వదా దూనతే’’

తల౦బ్రాలఘట్టాన్నీ కమనీయంగా వర్ణించాడు –

‘’సువర్ణ శోభనాక్షతా ని మౌ నఖేల మక్షతాం-కరా౦బుజ ద్వయేన తౌ సదా శ్రితా వన్నోన్నతౌ

వధూ వరౌ  ప్రవర్షత స్తదా ముదా నమర్షతః –పరస్పరస్య మూర్ధని ప్రసూన గంధ వర్దినీ ‘’

‘’ముక్తా విదేహ తనయా౦జలి శుక్తి కాంత –ర్ముక్తా రఘు క్షితి వర్స్య తదుత్తమా౦గే

నక్తా సమస్త తనుషు ప్రబభుర్వికాసో –ద్యుక్తాఃప్రసూన నికరా ఇవ పారిజాతే’’

మనం చెప్పుకొనే ‘’జానక్యాః కమలాంజలి పుటే ‘’శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది .రధోత్సవ వర్ణన లో వివిధ ఛందస్సులను పపేర్కొంటాడుకవి –

‘’సోయం రాఘవ నందనో ఖిలజనా నాన౦దయన్ స్యన్దనే –భక్తైర్భాగవతతైర్నిషేవితతనుః క్ష్మాజానుజాభ్యాం యుతః

ఆస్తే నిస్తుల నూత్నరత్న రుచిర శ్రీమాలికా౦ డోలికాం-యశ్చక్రే సమరే పురాసుర మృగాన్ శార్దూల విక్రీడితం ‘’

‘’అనుపమ మణి భూషణా౦చితా భా –న్మనుకుల నాథ వధూ రధోపరిస్దా

దనుజ రిపుసుతా ను తాప కృఛ్ర-స్తనుతర కల్ప లతేవ పుష్పితాగ్రా  ‘’

ఇంతటి చక్కని కావ్యాన్ని,అందులోని కమ్మని శ్లోకాలను , భద్రాద్రి సీతారామకల్యాణం ప్రత్యక్ష ప్రసారం లోనిలయ విద్వాంసులైన  ఏ విశ్లేషక కవి అయినా భద్రాద్రి రామాచార్యకవి శ్లోకాలను ఉదహరిస్తున్నారోలేదో !రామరాజుగారు శ్రమపడి వెలికి తీయకపోతే ఈ కవీ, కావ్యమూ కాలగర్భం లో కలిసి పోవటం జరిగేది .

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 416-పార్వతీ పరిణయ చంపూ కావ్యకర్త –చంద్ర భట్ట ఈశ్వరప్ప (16వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

416-పార్వతీ పరిణయ చంపూ కావ్యకర్త –చంద్ర భట్ట ఈశ్వరప్ప (16వ శతాబ్దం )

16వ శతాబ్దికి చెందినాచంద్రభట్ట ఈశ్వరప్ప ‘’పార్వతీపరిణయం ‘’అనే చంపూకావ్యం రాశాడు .దీని వ్రాయసకాడు కూడా చంద్ర భట్ట వంశం వాడే .గురు స్తుతి –

‘’సదా శివగురుం భజే సకల ధీర నిత్యస్తుతం –ద్విజాధిపతి సేవితం వివిధ వేద వక్త్రా౦ బుజం

స్పుట స్పటిక మాలికా స్పురిత కంబుకంఠంసదా –శ్రిత ప్రకార వాంఛిత ప్రబల దివ్య వస్తు ప్రదర్శితం ‘’

తర్వాత వంశ చరిత్ర చెప్పాడు .కథలో హిమవంతుడు మేనకను పెళ్ళాడటం ,మైనాక ,పార్వతీ జననాలు ,నారదుడు రావటం ,శివుని గుణగణాలు పార్వతి విని పరవశం చెందటం శివుడి తపస్సు ,శివుని సేవకు పార్వతి వెళ్ళటం ,దేవతలు తారకాసురునిఆగడాలుఇంద్రునికి  వివరించటం ,అతడు మన్మధ సాయంకోరటం,అంగీకరించి శివునిమనసును పార్వతిపై లగ్నం చేయటానికి వెళ్ళటం ,ముక్కంటికంటిమంటకు మాడి మసి అవటం ,రతీ విలాపం ,శివుని అనుగ్రహం పార్వతి తపస్సు ,చివరికి  పార్వతీ పరమేశ్వరుల వివాహం .

ఈశ్వరప్ప కాళిదాసమహాకవిరాసిన కుమారసంభవం ప్రేరణతో దీన్ని రాశాడు .కొన్ని చోట్ల వ్యాకరణ విరుద్ధాలు ,యతి భంగాలున్నాయి .ఇవి వ్రాయసకాని దోషాలు కూడాకావచ్చు అంటారు ఆచర్యశ్రీ .పార్వతీ దేవి పాదాల వర్ణన –

‘’రాత్రౌ సుధాంశు రిపు రేత్యవిజ్రు౦భణ౦ మే- హన్తీతిపర్వత సుతాంప్రతి సాదు జప్త్వా

పద్మ౦ తదీయ చరణావతర౦ ప్రపద్య –తత్సంజ్ఞయా విజయతే కిము నిత్య భ్రుంగం ‘’

మాయావటువు వేషం లో వచ్చిన శివుడు  పార్వతి మనసు శివునిపైనుండి మరల్చే యత్నం –‘’జానామి జానామి తవానుభావం –జాగర్తి జాగర్తి తదస్టమూర్తౌ-భావంతదాపి ప్రచురాన్ గుణా౦ స్తాం-తత్సాన్ని విస్టాన్వికృతాన్ ప్రపద్యే ‘’.-కాలకూటాశనోవాయు భుగ్భూషణః-క్రూర శుండాల చర్మా౦శుకో యాచకః –ప్రేతకా౦తార  సంచారణే తత్పరః –కిం వృతస్సత్వయా భీకర శ్చే స్టయా ‘’

పెళ్లి కొడుకైన శివుని వర్ణన –

‘’జటాజూట శ్శంభో స్సపది హరితోష్ణీష వసనం –సుధాంశు స్తత్రతః ప్రభవతి మహా భాషికమపి

గలాలంబా ముక్తావళి శ్శిరురగరాజస్స మణిః-కరాద్దిస్సాసర్పాఃకటక ముఖ భూషామహితః  ‘’

చివరగా పార్వతీ  పరమేశ్వర రహః కేళి వర్ణ న –

‘’ కళ్యాణ ప్రదస్తయోస్త్రిజగతా మాస్వాదితా మూల్యత –త్తాంబూలాది పదార్ధయోః కృత బహిర్జాతవ్య వాయాస్ధయోః

పర్యాయాత్కుసుమేషు వస్య మనసో రంతర్వ్యయా స్ధయో –రాచ్ఛి  న్నాత్మ మదృశ్యత త్రిభువనం మోదం ప్రపేదే తదా ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

 

 

 

 

 

—



Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 415-హనుమద్రామాయణ కావ్యకర్త –దిట్టకవి లక్ష్మణ కవి (16వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

415-హనుమద్రామాయణ కావ్యకర్త –దిట్టకవి లక్ష్మణ కవి (16వ శతాబ్దం )

ఏక సర్గ హనుమద్రామాయణ కావ్యం రాసిన దిట్టకవి లక్ష్మణ 16వ శతాబ్దికవి .18వ శతాబ్దికి చెందిన ఇంకొక దిట్టకవి ఇంటిపేరున్న నారాయణకవి తెలుగులో రంగరాయ చరిత్ర రాశాడు .వీరిద్దరికీ బంధుత్వం ఉందొ లేదో తెలీదు .వీరికి దిట్టకవి అనేది ఇంటిపేరు లేక బిరుదుకూడా కావచ్చు .మనలక్ష్మణకవి  తన ఇంటి పేరును ‘’మండల వేముల ‘’అని కూడా తెలిపాడు .తండ్రికాలం లో ఉన్న ఇంటిపేరు ‘’మండలవేముల’’ ,కొడుకుకాలం లో కవిత్వం లోసాధించిన దిట్టతనం వల్ల’’ దిట్టకవి’’గా మారి ఉండచ్చు .కౌండిన్య గోత్రం .నియోగి బ్రాహ్మణుడు .

  దిట్టకవి లక్ష్మణకవి ‘’హనుమద్రామాయణం ‘’ను వ్యాఖ్యాన సమేతంగా రాశాడు .కవి తనగురించి వచనం లో –‘’ఇహ ఖలు సంస్కృతాంధ్ర భాషాకవన చాతుర్య దుర్యో దిట్టకవి లక్ష్మణార్యః ‘’’’కావ్యం యశసే ర్దకృతే—‘’అని మాత్రం ఉన్నది .కావ్యం చివర రెండు శ్లోకాలలో మళ్ళీ చెప్పుకొన్నాడు –

1-‘’శ్రీమద్రామ వరప్రసాద కలనా సంప్రాప్త సారస్వత –శ్రీ మద్దిట్ట కవీంద్ర లక్ష్మణ సుధీ వరేణ్య సంపూరితే

షట్కా౦డేరిత ,యావదర్ధ కలితే సంక్షిప్త రామాయణే-శ్రోతృశ్రోత్ర సుఖావహే సర్గో ద్వితీయ సర్గః ‘’

2-మండల వేముల కులజః కౌ౦డిన్యస గోత్ర కృష్ణ కవిపుత్రః –లక్ష్మణ సుకవిః కృతవాన్ సర్గే ణై  కేన రఘుపతేశ్చరితం ‘’

అనేక పరిశోధనల అనంతరం రామరాజుగారు దిట్టకవి లక్ష్మణ కాలం 16వ శతాబ్దం అని తేల్చి చెప్పారు .

ఆరుకాడల వాల్మీకి రామాయణాన్ని ఈ కవి ఒకే కాండలో 118శ్లోకాలో ఇమిడ్చాడు .ప్రారంభ శ్లోకాల సౌరు  చూద్దాం –

‘’వరదం భజామి శరదంబుద ప్రభం ,ద్విరదం ముఖే శుభరదం తనౌ నరం –గణనాథ మాత్మ గణనా పరేస్టదం శశి ఖండ మండిత శిఖండ మీశ్వరం ‘’

‘’ప్రమితాక్షరోక్తి మమితా సురా౦తకం ,స్మిత భూషణం ,వితత భాను తేజసం –

కలయామి చాపవలయాన్వితం ముదాశర ధారిణం దశరథాత్మజం భజే ‘’

మొదటిశ్లోకానికి విస్తృత వ్యాఖ్య రాశాడు కవి .మిగిలినవాటికి సంక్షిప్తంగా రాశాడు .కవి శైలీ విన్యాసానికి కొన్ని ఉదాహరణ శ్లోకాలు –

‘’దశ కన్ధరేణభ్రుశ కంపితైస్సురైరభి యాచితోధిక భియా సమన్వితైః

మిహిరాన్వయే జనిహి రామనామతః కమలాపతిస్స విమలాంబు జేక్షణః  ‘’

‘’నవనావనాయ పవనాస్త్ర మోజసా దధతా సుబాహురధ తటకాసుతః

జ్వలనాశుగం చ బలనాశనేన తౌ కృశతాం గతౌ దశ శతాంగసూనునా ‘’

వర్ష ,శరత్తులను ఒకే శ్లోకం లో వర్ణించి తనకవితా ప్రతిభ చాటుకొని ‘’ దిట్టమైన కవి ‘’అనిపించాడు –

‘’సతతా నవగ్రహతటాభ్రమ౦డలా భ్రుత  నీలకంఠ కృత నృత్తకా జగత్

స్వకులాయ యుక్ఖగ కులాధవార్షుకీ సమయాత్ ప్రదోష సమయో యధోర్గతిః’’

మరో శ్లోకం లో ‘’ఆగ్రహ ‘’శబ్దాన్ని తెలుగులో ప్రచారంగా ఉన్న కోపం అనే అర్ధం తో ప్రయోగించాడు .’’వ్యాఖ్యాన౦ లోకూడా ‘’తెలుగు సంస్కృతం ‘’తొంగి చూస్తూ కనిపిస్తుందని వ్యాఖ్యానించారు రాజుగారు .

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment