గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 116-హరి విజయ కావ్య కర్త –రత్నపతి (16 వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4

116-హరి విజయ కావ్య కర్త –రత్నపతి (16 వ శతాబ్దం )

అమరావతి కి చెందిన కవిరత్న కుమారుడు ,దారి హర వంశీకుడు ,కాశ్యప గోత్రీకుడు మహా మహో పాధ్యాయ రత్నపతి .భావదేవుని సోదరి రత్నావతి ని పెళ్ళాడాడు .భావదేవుడు రత్నపతి కొడుకు మహా మహోపాధ్యాయ ఉమాపతికి మేనమామే కాకు గురువుకూడా .ఉమాపతి ‘’పదార్ధయా దివ్య చక్షు ‘’రాశాడు .రత్నపతి హరివిజయం రామ చరిత కావ్యాలు ,వివేకోదయం  రచించాడు.హరి విజయాన్ని మాఘుని శిశుపాల వధ పద్ధతిలో రాశానని కవే చెప్పాడు .రామ చరిత గురించి ఒక్క చోటే పేర్కొన్నాడు కాని గ్రంధం దొరకలేదు .

117-గీతా గోపీశ్వర కర్త –మహోపాధ్యాయ రామనాధ థక్కూర (16 వ శతాబ్దం )

తర్క పంచానన ,మహామహోపాధ్యాయ  సప్త కౌముది కర్త దేవనాద థక్కూర పెద్ద కొడుకు మహోపాధ్యాయ రామనాధ థక్కూర ..తల్లి  సావిత్రి .16 వ శతాబ్ది ప్రధమ భాగం లో తండ్రి దేవనాధ సాహితీ సామ్రాజ్యం యేలితే ,ద్వితీయార్ధం లో కొడుకు రామనాధ సాహితీ విజ్రు౦భణ చేశాడు .రస తరంగిణి లో తాను చెప్పుకున్నట్లు రామనాధ గీతా గోపీశ్వర ,శృంగార శతక ,మదన మంజరి ,కృష్ణహాస్య చంద్రిక కూడా రాశాడు .

118-అనిరుద్ధ (16 వ శతాబ్దం  )

మందార వంశం సిహౌళి శాఖకు చెందిన మహామహోపాధ్యాయ అనిరుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు .రాఘవ ఝా కుమార్తె దేవ సేన ఇతని భార్య .మారుటిసోదరుడు మహామహోపాధ్యాయ హరిహర కంటే దేవసేన పెద్దది .అనిరుద్ధుని కొడుకు మహామహోపాధ్యాయ మోహన తన ‘’భావసింహ విరుదావళి’’లో తన తండ్రి అనిరుద్ధుడు అక్బర్ ఆస్థానం లో గొప్ప పేరున్నవాడు అని చెప్పాడు .రాజా మాన్ సింగ్ ను స్తుతిస్తూ అనిరుద్ధ చెప్పిన శ్లోకాలు ‘’విద్యాకర సహస్రిక ‘’లో మాత్రమె లభించాయి.

119- వి(బి)రుదావళి కర్త –దిగంబర థక్కూర(16 వశతాబ్దం )

 దిగంబర థక్కూరవంశం వారందరూ మహా మహోపాధ్యాయ బిరుదాన్ని వంశపారంపర్యంగా సాహిత్య ప్రతిభతో పొందినవారే .మిథిల శ్రోత్రియ బ్రాహ్మణ వంశం ఘుశాంత కు చెందినవాడు .కుటుంబం వారంతా సంస్కృతం లో ఉద్దండ పండితులే .ఈ వంశం లో మహామహోపాధ్యాయ ప్రజ్ఞాకార నుండి 8 వతరం వాడు దిగంబర.యితడు రాసిన ‘’విరుదావళి ‘’ వ్రాత ప్రతి దర్భంగా సంస్కృత విశ్వ విద్యాలయం లో భద్రంగా ఉన్నది .కూర్మాచల లేక కుమౌన్ వంశ రాజు ఉద్యోతనుడిని కవిత్వం లో ఆకాశానికి ఎత్తేశాడు .విరుదావళి పొ పేర్కొన్న దానిని బట్టి ఈ కవి ‘’ఉషా కర బంధ కావ్యం ‘’కూడా రాసినట్లున్నది కాని అలభ్యం.వృత్త రహస్యం అనే చందోగ్రంధం రాశాడు . అదీ కనిపించలేదు

120-భర్తృ హరి నిర్వేద కర్త –హరిహర (17 వ శతాబ్దం )

బిత్తూ గ్రామవాసి మహామహోపాధ్యాయ హరిహర కరమహా వంశీకుడు .సాదుపాధ్యాయ రాఘవ ఝా కుమారుడు .రుచిపతి తండ్రి మహామహోపాధ్యాయ నీలకంఠ పెద్దన్నగారు .మహాకవి నాటకకర్త హరిహర –సూక్తిముక్తావలి ,ప్రభావతీ పరిణయం ,భర్తృ హరి నిర్వేదం రాశాడు .ఇతని సూక్తిముక్తావలి లేక హరిహర సుభాషితం ముక్తకాల కూర్పు .ఆశువుగా సందర్భాన్ని బట్టి చెప్పిన శ్లోక సముదాయం .ఇందులో దేవీ,దేవతలు పిల్లలు వారి సంరక్షణ ,యువత,రాజధర్మాలు ,రాజకీయం వగైరాలున్నాయి .దీనికి చారిత్రిక ప్రాదాన్యమూ ఉన్నది .16, 17 శతాబ్దాల మిధిలానగర జన జీవిత విదాన విషయాలు కళ్ళకు కట్టినట్లు ఇందులో హరిహర  వర్ణించి చెప్పాడు, చూపాడు .అంతకు ముందు ఎవరూ వినని ‘’రామేశ్వర కవి ‘’గురించి పేర్కొనటం మరో విశేషం .

121 –భావ సింహ బిరుదావళి కర్త –మహామహోపాధ్యాయ మోహన (17 వ శతాబ్దం )

అనిరుద్ధ ,దేవ సేనలకుమారుడు మోహన .రాజా మాన్ సింగ్ కుమారుడు రాజా భావ  సి౦హుని  ఆస్థాన కవి .భావ సింహ విరుదావళి తోపాటు అన్యోక్తి శతకమూ రాశాడు .17 వశతాబ్ది కవి .విరుదావళి 8 అధ్యాలు .అన్యోక్తి వంద శ్లోకాల శతకం .

122-భ్రు౦గ  దూత కర్త –కవీంద్ర గంగానంద  (17 వశతాబ్దం )

17 వశతాబ్ది కవీంద్ర గంగానంద తాను ‘’తైరభుక్త ‘’అంటే తిర్హూట్ నివాసి అని చెప్పుకున్నాడు .మాతామహుని ఇంట్లోసారిసవ గ్రామం లో పెరిగాడు .ఆ గ్రామాన్ని ‘’గ్రామ రత్న ‘’గా పొగిడాడు .ఈ గ్రామ తరతరాలుగా సంస్కృతానికి పట్టు కొమ్మ .తాను ‘’పౌత్రి తనూజుడు ‘’గా అంటే తాతగారి కొడుకుగా చెప్పుకున్నాడు .తండ్రి పండిత రాయ రఘునందన .కవిత్వం లో గంగా నంద ప్రసిద్ధుడై కవీంద్ర బిరుదు పొందాడు .ఒకనాటకం ,నాలుగు అలంకార గ్రంధాలు రాశాడు . భ్రుంగ  దూతం అనేది 171 శ్లోకాల ఖండ కావ్యం .మేఘ దూతం బాణిలో ఉంటుంది .దూతకావ్యాలలో పేరు పొందింది .కాళిదాసు లాగా మందాక్రాంత  వృత్తాలనే వాడాడు .దీనికి  దర్భాంగ రాజు మహారాజాధిరాజ రామేశ్వరసింహ ఆస్థానకవి ,నవతోలగ్రామవాసి చేతనాద ఝా ‘’రామేశ్వర ప్రసాదిని ‘’పేరిట మంచి వ్యాఖ్యానం రాశాడు .గంగానంద కు బికనీర్ రాజు కర్ణ సింహ ఆశ్రయం కల్పించాడు .రాజు కోరికపై ‘’కర్ణ భూషణ౦ ‘’అనే అలంకార శాస్త్రం రాశాడు .

123-నరపతి జయ చర్య కర్త –మహోపాధ్యాయ వంశీమణి ఝా (17 వశతాబ్దం )

17 వ శతాబ్ది మహోపాధ్యాయ వంశీ మణి ఝా –మహోపాధ్యాయ రామచంద్ర ఝా కొడుకు ,దామోదర ఝా మనవడు మిధిలా వాసి భారద్వాజ గోత్రీక బ్రాహ్మణుడు .తల్లి జయమతి దేవి నేపాల్ లోభక్తపూర జగాజ్యోతిర్మల్ల రాజు ఆస్థాన కవి గా ఉన్నాడు .నరపతి జయ చర్య రాశాడు .రాజు పట్టాభిషేకం తర్వాత హరి కేళి మహాకావ్యం అద్భుత ధారా శుద్ధితో రాశాడు

124- జహంగీర్ బిరుదావళి కర్త –హరిదేవ మిశ్రా (1535-16 40 )

‘’అవిలంబిత సరస్వతి ‘’బిరుదాంకితుడు హరి దేవ మిశ్రా  15 35 లో పుట్టి 1640 లోచనిపోయాడు .తలిదండ్రులు విశ్వేశ్వర మిశ్రా ,కుముదినీ దేవి .జహంగీర్ గొప్పతనాన్ని కీర్తిస్తూ విరుదావళి రాశాడు .అనుప్రాస ,ఉత్ప్రేక్ష లను గుప్పించి చక్రవర్తి గొప్పతనాన్ని పెంచేశాడు .

125- షాజహాన్ బిరుదావళి కర్త –మహామహోపాధ్యాయ రఘునాధ మిశ్ర (17 వశతాబ్దం )

బాలకవి ,పండిత రాయ ,శ్రుతి ధర బిరుదులున్న మహామహోపాధ్యాయ రఘునాధ మిశ్రా 17 వ శతాబ్ది కవి .రఘుదేవ ,కుముదిని దేవి లపుత్రుడు .జమతారి నివాసి .16 38 లో ఢిల్లీ చక్రవర్తి శాహజాన్   ఆస్థానానికి వెళ్లి తన ప్రతిభా సంపన్నత ,జ్ఞాపక శక్తి తో మెప్పించి ఆస్థానకవి అయ్యాడు శాహజాన్ పై ‘’బిరుదావళి ‘’రాశాడు .మెచ్చిన చక్రవర్తి కవిని అతని అన్న హరి దేవ ను ఘన౦గా సత్కరించాడు .వారి విద్వత్తుకు అబ్బురపడి ఇద్దరికీ ‘’సరస్వతి ‘’బిరుదు ప్రదానం చేశాడు . రఘునాధ శ్లోకాలు విద్యాకరుని సంకలనం లో చోటు చేసుకున్నాయి .బిరుదావళి ని చిన్నతమ్ముడు సదానంద కు అంకితమిచ్చాడు మిశ్రా .యమక ,అనుప్రాసలతో షాజహాన్ కీర్తి మారు మోగేట్లు రాశాడు .సాగర పురానికి చెందిన చక్రధర ఝా దీనికి చక్కని వ్యాఖ్యానం ‘’విబుధ రాజిరంజిని ‘’రచించాడు .

ఇందులోని 11 6-నుండి 125 వరకు కవుల చరిత్రకు ఆధారం –మాఅబ్బాయి శర్మ సేకరించి పంపిన ‘’contribution of Mithila  to Sanskrit Kavya and Sahitya Sastra ‘’

  సశేషం

 26-1-18 శుక్రవారం భారత రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో

   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-18 –ఉయ్యూరు

 

 

 

 .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితాగీర్వాణ౦  -4 106-భూ ,పురుష పరిక్రమ ల కర్త –విద్యాపతి థక్కూర (13 50-1440 )

  గీర్వాణ కవుల కవితాగీర్వాణ౦  -4

106-భూ ,పురుష పరిక్రమ ల కర్త –విద్యాపతి థక్కూర (13 50-1440  )

విద్యా పతి రాసిన పాటలు మిధిలా సామ్రాజ్యం లో ప్రతిధ్వనించేవి .బెంగాలీ వాసనలతో గుబాళించేవి .బెంగాలీ వాడినని చెప్పుకున్నా మిదిలలోనే ఉండి పోయాడు .తండ్రి గణపతి .తాత జయదత్తుడు .ముత్తాత’’ మహా వార్తిక నైబంధిక దీరేశ్వరుడు .వీరిది ‘’గాధా బిసాపి ‘’కుటుంబం .కాశ్యప గోత్రం .దేవ సింహ ,కీర్తి సింహ ,శివ సింహ ,పద్మ సింహ ,లక్షిమ దేవి ,విశ్వాస దేవి రాజాస్థానాలలో కవి గా విరాజిల్లాడు .క్రీశ 13 50 లో జన్మించి 14 40 లో 90 వ ఏట మరణించాడు కాని ప్రొఫెసర్ ఆర్ కె చౌదరి ఇతనికాలాన్ని 13 60-14 80 గా చెప్పాడు .

  మైధిలీ భాష లో రాసిన పాటలు విస్తృత ప్రచారం పొందినా విద్యాపతి సంస్కృత ,అవహత్తా భాషలలో రచనలు కూడా చేశాడు .వీటిలో నీతి శాస్త్రం ,న్యాయ శాస్త్రం ,ధర్మశాస్త్రం  తాంత్రిక విషయాలు ఉన్నాయి .దొరికిన వాటిలో భూ పరిక్రమ ,పురుష పరిక్రమ ప్రసిద్ధి చెందినవి .

107-సంస్కృత గీతాల కర్త –చంద్ర కళా దేవి (14 00 )

విద్యాపతి కోడలు ,అతని పెద్దకొడుకు మహామహోపాధ్యాయ హర పతి థక్కూర భార్య చంద్ర కళాదేవి .లోచనుడు తన రాగ తరంగిణి లో కళావతి సంస్కృత గీతాలు ఉదాహరించాడు .సంస్కృత –మైధిలీ కలగలుపు గీతాలు కూడా రాసింది .

108-రసదీపిక వ్యాఖ్య కర్త –జగద్ధార (15 00 )

సురగణ వంశానికి చెందిన మిదిలావాసి జగద్ధార పరాశర గోత్రీకుడు .’’ధర్మాధి కరణీకుడు’’అంటే మత ధర్మ సంరక్షకుడుగా ఉన్నాడు .ధర్మసింహ రాజు ఆస్థానకవి .రత్నధార దమయంతి దంపతుల కుమారుడు .విద్యాధరుని మనవడు .తాంత్రిక గదాధరుని ముని మనవడు .మీమాంసక చండేశ్వరుని  ‘’ఇని మనవడు ‘’.(ముని మనవడి కొడుకు ).కవి కాలం 15 వ శతాబ్ది గా భావిస్తారు .జగద్ధార గొప్ప వ్యాఖ్యాన కర్త .కాళిదాస మేఘ దూత కావ్యానికి రసదీపిక వ్యాఖ్యానం రాశాడు .గీత  గోవింద శైలిలో ‘’సారదీపిక ‘’రాశాడు .భగవద్గీత కు ‘’ప్రదీప’’వ్యాఖ్యానం చేశాడు .దేవీ మహాత్మ్యానికి వ్యాఖ్య రాశాడు .శివ స్తోత్రం కూడా రాసినట్లు చెబుతారు .

  మరో జగద్దారుడు ‘’కుమార సంభవం ‘’కు వ్యాఖ్యానం రాసినట్లు తెలుస్తోంది .

109-అన్యోక్తి శైలిలో రచించిన –మహా మహోపాధ్యాయ భావనాధ మిశ్ర (15 వ శతాబ్ది పూర్వార్ధం )

శోడారపుర వంశం సారస్వత శాఖకు చెందిన శ్రోత్రియ బ్రాహ్మణుడు భావనాధ మిశ్ర .15 శతాబ్ది పూర్వార్ధం వాడు .తండ్రి మహా మహోపాధ్యాయ రవి నాధుడు .మందార వంశానికి చెందిన మహా మహోపాధ్యాయ వటేశ్వరుని కూతురు కొడుకు .తత్వవేత్తలలో పేరెన్నికగన్నవాడు మిశ్ర .విద్యాకర మిశ్రా సంతరించిన ‘’విద్యా కరణ సహస్రిక ‘’లో భావనాధుని శ్లోకాలు ఉదాహరింప బడినాయి .కొడుకు మహా మహోపాధ్యాయ శంకర తో అన్యోక్తిగా చెప్పిన శ్లోకాలకు సాహిత్యం లో విశేష స్థానం పొందాయి .దేనికీ చెందని భావ ధార ఉండటం తో ఈయనను ‘’అయాచి ‘’అని మారు పేరుతో పిలుస్తారు .

110 –రసార్ణ వ కర్త –మహామహోపాధ్యాయ శంకర మిశ్ర (16 వ శతాబ్ద పూర్వ భాగం  )

భావనాధ మిశ్ర కుమారుడే శంకర మిశ్ర .తల్లి  భవాని .మిధిలా నగర మహోన్నత తత్వ వేత్తగా మహామహోపాధ్యాయ శంకర మిశ్రా కీర్తి గడించాడు .న్యాయ ,వైశేషికాలలో  అఖండుడు .కవి నాటకకర్త కూడా .తన కవితలను ‘’రసార్ణవం ‘’గా ప్రచురించాడు .వీటిలో అతని కవితావేశం భావ ఉద్దీపనం ప్రస్పుటం గా కనిపిస్తాయి .అతని ‘’అన్యోక్తి ‘’కీర్తి శిఖరాలను ఎక్కించింది .సాధారణ చదువరి కూడా అందులోని చమత్కారానికి మురిసి నమస్కారం చేయాల్సిందే .భాను దత్తుని ‘’రస పారిజాత౦ ‘’తో సరితూగుతుంది .అలాగే కవి శేఖర భాద్రీనాద్ ఝా ‘’అన్యోక్తి సహస్రి ‘’కి సరి తూగుతుంది .శంకర రాసిన మరో అద్భుత రచన ‘’రస కల్లోల సారోద్ధారం ‘’అరుదైనదిగా మహా పండితకవులు కీర్తించారు .’’పండిత విజయం ‘’కూడా రాసినా అలభ్యం .ఆనాడు మిధిల లో శంకర కవిని అపర శంకరునిగా ఆరాధించారు .ఆయన విజయ గాధలను ఇప్పటికీ చెప్పుకుంటారు .

111-సుభాషిత సుధా రత్న భండార కర్త –గణపతి (1435 )

గనేశ్వర ,గణనాధ ,గణపతి అని పిలువబడే గణపతి మహాదేవుని కుమారుడు శంకర మిశ్రా చిన్నతమ్ముడు .మిధిలానగర్ ఆస్థానకవి ఆలంకారికుడు పద్య వేణి ,పద్యామృత తరంగిణి ,సూక్తి సుందర ,సభ్యాలంకరణ ,సుభాషిత సార సముచ్చయ లలో గణపతి పద్యాలు ఉదాహరింపబడినాయి .ఇతని కొడుకు భాను దత్తుడు తన రసమంజరి ,రసతరంగిణి ,అలంకార తిలక ,రసపారిజాతం లలో తండ్రి శ్లోకాలను చేర్చాడు .రసపారిజాత౦ లో గణపతి రాసిన 104  శ్లోకా లున్నాయి .తండ్రి కవితా మాధుర్యాన్ని కొడుకు భానుదత్తుడు అద్భుతంగా ఆవిష్కరించాడు .అందుకే తండ్రి గణపతి ని ‘’కవికులాలంకార చూడామణి ‘’అని శ్లాఘించాడు .గణపతి’’ మహా మోద ‘’కూడా రత్న భాండారం లా గా  సంపుటీకరించాడు .

112- భక్తి  రత్నావళి కర్త –జయ కృష్ణ పరమహంస విష్ణు పూరి (15 వశతాబ్దం )

15 వ శతాబ్దికి చెందిన జయ కృష్ణ పరమహంస విష్ణు పూరి కరమహా వంశానికి చెందినతరుణీ శాఖ వైష్ణవకవి .రతిదర ,మౌర ల కుమారుడు .భక్తి  రత్నావళి అనే విష్ణు భక్తీ శ్లోకాలు రాశాడు .ఇతని శిష్యుడు ప్రేమానంద పూరి ‘’ప్రేమ చంద్రిక ‘’రచించాడు .

113-గీతా గౌరీపతి కావ్య కర్త –కవిరాజ భానుదత్తుడు (15 వ శతాబ్దం )

గణపతి కుమారుడైన భానుదత్తుడు 15 వశతాబ్దివాడు .శివుని పై తన అనన్య భక్తికి నిదర్శనంగా ‘’గీతా గౌరీపతి కావ్యం ‘’రచించాడు .ఇందులో సూర్య గణేశ అగ్ని దుర్గ శివులైన శివ పంచాయతనం వర్ణించాడు .తన రసమంజరిలో అర్ధనారీశ్వర తత్త్వం వివరించాడు .శివుడిని అనేక రకాలుగా అభివర్ణించి గీతా గణపతి అని పించుకున్నాడు జయదేవునిగీత గోవింద శైలి అనుసరించాడు .అలంకారిక తిలకం లో సరస్వతీ దేవి ప్రార్ధన అత్యుత్తమంగా చేశాడు .10 అద్యాయాలతో ‘’రస పారిజాత౦ ‘’రాశాడు .వీటికి పల్లవాలు అని పేరుపెట్టాడు .రసబంధుర కవిత్వం తో దీన్ని తీర్చి దిద్దాడు .గీతా గౌరీ పతి కావ్యానికి తానే వ్యాఖ్యానం రాశాడు అది అలభ్యం .

114-  అజ్ఞాత కవి  –రుచికార (15 శతాబ్ది  )

శ్రోత్రియ బ్రాహ్మణుడు రుచికార థక్కూర-మాహో కున్న 5 గురు సంతానం లో పెద్దవాడు .గొప్ప కవిత సంపద ఉన్నవాడు . .ఇతని సవతి తమ్ముడు మహామహోపాధ్యాయ గోవింద ‘’కావ్య ప్రదీప’’లో  రుచికారను గొప్పకవిగా చెప్పాడు .కాని రచనలు దొరకలేదు ‘

115-సుపద్మ వ్యాకరణ  కర్త –పద్మనాభ మిశ్ర (15 వ శతాబ్దం )

15 వశతాబ్దికి చెందిన పద్మ నాభ మిశ్రా –‘’వాణీభూషణ ‘’కర్త దామోదర మిశ్రా కుమారుడు .దీర్ఘ ఘోష అనే మైధిల బ్రాహ్మణ వంశానికి చెందినవాడు .సుపద్మ వ్యాకరణం ,గోపాల చరిత్ర రచించాడు శిశుపాల వధ ,ఆనంద లహరి లకు వ్యాఖ్య రాశాడు .

 ఇందులోని 10 6-నుండి 115 వరకు కవుల చరిత్రకు ఆధారం –మాఅబ్బాయి శర్మ సేకరించి పంపిన ‘’contribution of Mithila  to Sanskrit Kavya and Sahitya Sastra ‘’.

సారీ-నిన్న 106 నుంచి ”ఢిల్లీ ”దారిపడతానని రాశా .కానీ మధ్యలో ”మిథిల”ఆకర్షించింది .ఎంతైనా మిథిల  మా  గోత్రీకురాలైన సీతమ్మ తల్లి పుట్టిన నగరం  కదా 

సశేషం

   రధ సప్తమి శుభాకాంక్షలతో

  మీ గబ్బిట దుర్గాప్రసాద్ -24-1-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

24-1-18 బుధవారం మా ఇంట్లో రధ సప్తమి చిత్రాలు

https://photos.google.com/share/AF1QipMtT7QMCpUCeSjrZhDufuUPn3WdS7tQpWENnxTFUlUcMchQ0DVf4l7f5v9IKCc5Ig?key=bW9mdFBLSVFnd25BTWp3ajJSRTNLN1BYNXZnZWdn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 101- సామవేదార్షేయ దీపః సంపాదకుడు -ఆర్.ఆర్. శర్మ(20 వ శతాబ్దం ౦ )

   గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4

మనవి –గీర్వాణ౦  -4 లో ఇప్పటి వరకు రాసిన 100 మంది కవుల రచనకు ఎక్కువభాగం ఆధారం –రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ – న్యు ఢిల్లీ వారు శ్రీ రాదావల్లభ త్రిపాఠీ గారి ముఖ్య సంపాదకత్వాన  ఆంగ్లం లో వెలువరించిన ‘’Inventory Of Sanskrit Scholors ‘’  అనిమనవి చేస్తూ ,అందులో ఆవగింజలో శతభాగం మాత్రమె వాడానని,మిగిలిన వారి గురించి తరువాత రాస్తానని తెలియ జేస్తూ ,ఇప్పటికి దానికి’’ కామా’’మాత్రమే పెడుతూ ,ఇప్పుడు 101 నుండి రాసే దానికి ఆధారం – రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ –తిరుపతి వారు ప్రచురించిన సంస్కృత ప్రచురణల జాబితా అని తెలుపుతున్నాను .

101- సామవేదార్షేయ దీపః సంపాదకుడు -ఆర్.ఆర్. శర్మ(20 వ శతాబ్దం ౦ )

సామవేద అనుక్రమణిక విధానం లో అపురూపమైనతొలి ప్రచురణ పొందిన  గ్రంధం.ఛందస్సు క్రమపద్ధతి అనుసరి౦పబడింది  .దేవతల ఋషుల ,రుచ ,గాన ల రికార్డ్ ఉన్నది .  సంపాదకుడు చాలా శ్రమ కోర్చి 4 వ్రాత ప్రతులను అధ్యయనం చేసి కూర్చిన గ్రంధం .దీని నుండి మనకు కావాల్సిన గీతం ,గానం లను తేలికగా పొందవచ్చు .అనుబంధం లో సామగాన ,గ్రామ గేయ ,ఆరణ్య కాలను వర్ణక్రమం లో కూర్చారు .ఛ౦దో ,వేద పరిశోధకులకు ఇది కరదీపిక .

10 2-పంచ విధ సూత్ర మాతృకా లక్షణే –సంపాదకుడు –బి ఆర్ .శర్మ (20 వ శతాబ్దం ౦ )

సామవేదానికి చెందిన 10చిన్న  పరిశీలన గ్రంధాలలో వరుస క్రమ౦ లో 8 వది .ఇది ముఖ్యంగా ప్రస్తావ ,ప్రతి హరణ ,నిధాన అనే మూడు భక్తిమార్గాలను వివరిస్తుంది .మిగిలిన రెండు భక్తిమార్గాలు ఉద్గీత ,ఉపద్రవల విషయం ఇందులో ఉండదు .1913 లో ఆర్.సైమన్ సంపాదకత్వం లో వచ్చిన ‘’పంచ విధ సూత్ర’’తోపాటు శర్మగారు 9 వ్రాతప్రతులనాధారంగా దీన్ని కూర్చారు .విస్తృత వ్యాఖ్య  కూడా రాశారు .మాతృకా లక్షణ అనే చిన్న పరిశీలనలో హ్రస్వ ,దీర్ఘ ,ఫ్లుత,వృద్ధ లక్షణాలు వివరించారు .దీనికోసం 5 వ్రాతప్రతులను పరిశీలించారు .ప్రస్తుతం ఈ రెండు కలిపి ప్రచురణ పొందింది .ఛందస్సు పై సాదికారానికి ఇది గొప్ప మార్గ దర్శనం చేస్తుంది .

103- ప్రతి హరణ సూత్రం –సంపాదకుడు –బి ఆర్ శర్మ(20 వ శతాబ్దం ౦ )

 కల్ప సూత్రాలలో అనుబంధంగా ఉన్నవాటిని వివరించేది ప్రతిహరణ సూత్రం .సామ వేద సాంకేతిక క్షేత్రానికి చెందిన ఈ పుస్తకం సామ లక్షణ గ్రంధాలలో విలక్షణమైనది . సులభ గ్రాహ్యత కోసం వరద రాజ వ్యాఖ్య జోడి౦పబడింది .9 వ్రాతప్రతులు అనేక మైక్రో  ఫిలిం లు పరిశీలించి కూర్చిన పుస్తకం .ముఖ్య  గ్రంథం లోని అనేక సమస్యలపై సంపాదకుడు శర్మగారు అర్ధవంతమైన సులభ గ్రాహ్యమైన వ్యాఖ్యానం రచించి తమ ప్రతిభను వెల్లడించారు .ముందుమాటలు ,అనుబంధం వేదాధ్యయన పరులకు మంచి సహకారి .

104-దేవతాధ్యాయ సంహితోపనిషత్   -సంపాదకుడు –బి ఆర్ శర్మ (20 వ శతాబ్దం ౦ )

సామవేదం లోని మూడు బ్రాహ్మణాలను ఒకే చోట చేర్చిన గ్రంథమిది .7 వ్రాతప్రతుల ,సత్య వ్రత సమశ్రామిన్ ,జీవనాద విద్యా సాగర్ ,రామనాధ దీక్షితార్ ల3 ప్రచురణ గ్రందాల విస్తృత పరిశోధనతో శర్మగారు దీన్ని తెచ్చారు .దీని వ్యాఖ్యానం సాయనుని అనుసరించి రాశారు .ఇందులో సంహితోపనిషత్ బ్రాహ్మణం మొదటి కీలక గ్రంధం .దీనికి టీకా ఉంది.మూలం తో పాటు సాయనాచార్య  ,ద్విజ రాజ వ్యాఖ్యానాలు చేర్చారు.వంశ బ్రాహ్మణాన్ని  వ్రాతప్రతులు ,బర్నేల్ ,సత్యవ్రత సమాశ్రమిన్ లు ముద్రించిన ప్రతులను పరిశీలించి కూర్చారు .ఈ బ్రాహ్మ ణ౦  లో రుషుల వంశక్రమం ,వారు సామవేద వ్యాప్తికి చేసిన సేవల వివరణ ఉన్నది .వేదాధ్యన పరులకు ఇందులోని గమనికలు ,వ్యాఖ్యానం అనుబంధం అద్భుతంగా ఉపయోగపడుతాయి .

105-ఛందో విచితి –సంపాదకులు –బి ఆర్ శర్మ ,ఎల్ యెన్ భట్ట (20 వ శతాబ్దం ౦ )

సామవేదానికి చెందిన పరిశీలనమే ఛందో విచితి .నిదాన సూత్రంలో భాగం .వేద ఛందస్సులు ,అందులోని రకాల గూర్చి చెప్పేది .ఇది తాతాప్రసాద ‘’తత్వ బోధిని వ్రుత్తి ‘’,పెద్ద శాస్త్రి ‘ఛందో విచితి వ్రుత్తి ‘’వ్యాఖ్యలతో సహా చేర్చి ప్రచురింప బడింది .వేద గ్రందాల ప్రచురణ నిష్ణాతుడైన శర్మగారు దీనిని అత్యంత వ్యయ ప్రయాసలతో చక్కని వ్యాఖ్యతో వెలువరించారు .ఇండాలజిస్ట్ లకు ఇతోధికంగా ఉపయోగ పదే గ్రంథమిది .

 ఇంతటి తో ‘’తిరుపతి ‘’వదిలి, 106 నుండి మళ్ళీ ‘’ఢిల్లీ’’ దారి పడుతున్నాను –

 సశేషం

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-18 –ఉయ్యూరు  

 

 .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 91-శిక్షా దార్శనిక ప్రభా భూమి కర్త –రామ చంద్రుల బాలాజీ (19 63)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

91-శిక్షా దార్శనిక ప్రభా భూమి కర్త –రామ చంద్రుల బాలాజీ (19 63)

19 63 జులై 10 ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రం లోపుట్టిన రామ చంద్రుల బాలాజీ తెలుగు ,దర్శన ,తత్వ శాస్త్రాలలో నిధి .ఎం ఎడ్ ,పిహెచ్ డి.శృంగేరి లోని ఆర్ ఎస్ కె ఎస్ రాజీవ్ గాంధి కాంపస్ లో అసిస్టంట్ ప్రొఫెసర్ .సారస్వతం ,శిక్షా దార్శనిక ప్రభాభూమి సంస్కృత రచనలు చేశాడు .

92 –అమృతానంద ఉపనిషత్ కర్త-కె.ఎస్. బాల సుబ్రహ్మణ్యం (1959 )

54 గ్రంధాలు రాసిన కె ఎస్ బాలసుబ్రహ్మణ్యం 16-2-19 59 చెన్నై లో జన్మించాడు .విద్యా వారిది ,పిహెచ్ డి.కుప్పుస్వామి శాస్త్రి రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ .ఉపమన్యు వ్యాఖ్యానం తో నందికేశ్వర కాశిక ,అమృతానంద ఉపనిషత్ ,అద్వయ తర్క ఉపనిషత్ ,అనేకభాగాల తో దర్శన ఉపనిషత్ ,అనేక పరిశోధనా వ్యాసాలూ రాశాడు .రాజ యోగం పై ప్రత్యెక కృషి చేసి అంతర్జాతీయ కీర్తి పొందాడు .యోగ శాస్త్ర ప్రవీణ సాహిత్య విశారద ,యోగ కళా కలాప  బిరుదులు పొందాడు .20 02 లో స్విట్జర్  లాండ్ ,20 03 లో ఫ్రాన్స్ ,20 08 లో సింగపూర్ ,మలేసియా ,2009 లో ఇటలీ వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు విద్య నేర్పాడు .25  ఏళ్ళలో అనేక దేశాలు పర్యటించి విద్యా బోధన చేశాడు .సంస్కృతం  ఇండోలాజికల్ విషయాలపై యాభై పుస్తకాలు రాశాడు  .చెన్నైసంస్కృత రంగ ,సంస్కృత అకాడెమి లలో క్రియా శీలక పాత్ర పోషించాడు .వేదాంత కేసరి ,సంస్కృత రంగ పత్రికలో విశేషమైన వ్యాసాలూ రాశాడు .

93-దశ మేష చరితం కర్త –బాలుని శ్రీధర్ ప్రసాద్ (1941 )

సాహిత్యాచార్య సాహిత్య రత్న బాలుని శ్రీధర్ ప్రసాద్ 1941 జనవరి 12  గడ్వాల్ లో పౌరిలో పుట్టాడు.ఢిల్లీ ప్రభుత్వ సంస్కృత కాలేజి వైస్ ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .దశమేష చరితం ,  శ్రీ బద్రీనాధ స్తోత్రం ,శ్రీ కేదారనాధ స్తోత్రం వగైరా 5 రాశాడు .రాజ్య శిక్షక్ ,ఢిల్లీ సంస్క్రుత అకాడెమి పురస్కార గ్రహీత .

94 –వేద మంధన కర్త –మనుదేవ బంధు (19 58 )

5-4-19 58 జార్ఖండ్ లోని పతర్గమ లో జన్మించిన మనుదేవ బంధు వేద ,దర్శన ,సంస్కృత ,హిందీ ఎం ఏ .హిందీ  ,వ్యాకరణ ఆచార్య .వేద ,సంస్కృత పి హెచ్ డి.ఇంగ్లిష్ లో డిప్లొమా .హరిద్వార్ గురుకుల కంగాడి యూని వర్సిటి ప్రొఫెసర్ .గురు పరంపర –స్వామి ఓమనానంద్ సరస్వతి ,ఆచార్య వేద ప్రకాష్ శాస్త్రి లు .వేద మంధన ,బృహదారణ్యక ఉపనిషత్ –ఏక్ అధ్యయన ,చాన్దోగ్య్పనిషత్ ఏక్ అధ్యయన ,ఉపనిషత్ వాజ్మయమే యోగ విద్య ,,భాష్యకార దయానంద వంటి 5 గ్రంథాలు రాశాడు .వైదిక  విద్వాన్, హిందీ సాహిత్య సేవి అవార్డ్ లు పొందాడు .

95 –మాధ్యమిక సాహిత్య సంభార కర్త –అనీతా బందో పాధ్యాయ (19 61  )

అనీతా బందోపాధ్యాయ కలకత్తా లో 19 61 మార్చి 31 పుట్టింది .సంస్కృత ఎం ఏ ఎం ఫిల్ ,పిహెచ్ డి.మాధ్యమిక సాహిత్య సంభార ఒక్కటే రాసింది .96-భాస  కర్త –ప్రతాప్ బందోపాధ్యాయ (1939 )

కలకత్తాలో 1-5-19 39 జన్మించిన ప్రతాప్ బందోపాధ్యాయ ఎం ఏ పి హెచ్ డి .పశ్చిమ బెంగాల్ బర్ద్వాన్ యూని వర్సిటి అసిస్టంట్ ప్రోఫెర్ .భాస  స్మైల్స్ ఇన్ నైషద చరిత్ర రాశాడు .

97-సంస్కృత అలంకార శాస్త్రే యమకం కర్త –అలకానంద బందోపాధ్యాయ (1942 )

ఎం ఏ పి హెచ్ డి అలకానంద బందోపాధ్యాయ పశ్చిమబెంగాల్ బీర్భం లో ని బోల్పూర్ లో పుట్టాడు .విశ్వ భారతి లో ప్రొఫెసర్ .సంస్కృత అలంకార శాస్త్రే యమకం సంస్కృత రచన చేశాడు

98 –మీమాంస పరిభాష కర్త –నవ నారాయణ బందోపాధ్యాయ (19 54 )

19 54 అక్టోబర్ 29  వెస్ట్ బెంగాల్ బర్ద్వాన్ లో పుట్టిన నవనారాయణ బందోపాధ్యాయ  ఎం ఏ పిహెచ్ డి.కలకత్తా రవీంద్ర భారతి యూని వర్సిటి స్కూల్ ఆఫ్ వేదిక్ స్టడీస్ డైరెక్టర్, ప్రొఫెసర్ .11 పుస్తకాలు రాశాడు .వేదిక్ స్టడీస్ ,బెంగాల్స్ కాన్ ట్రి  బ్యూషన్ టు వేదిక్ స్టడీస్ ,మీమాంస పరిభాష ,ఎన్శేంట్ ఇండియన్స్ వ్యూస్ ఆన్ ట్రూత్ అండ్ ఫాల్సిటి ముఖ్యమైనవి .బుడాపెస్ట్ హంగేరి ఫిన్లాండ్ పర్యటన చేశాడు .

99—నేపాల్ సంస్కృత శాసన పరిశోధకుడు –మాన వేందు బెనర్జీ (19 39 )

నేపాల్  సంస్కృత శాసనాలు ,హిస్టారికల్ అండ్ సోషల్ ఇంటర్  ప్రి టేషన్స్ ఆఫ్  ది గుప్తా ఇన్స్క్రిప్షన్స్ ,లుకింగ్ ఇంటు ఇండియాస్ పాస్ట్ త్రు ఎపిగ్రాఫిక్ లిటరేచర్, యాస్పెక్ట్స్ ఆఫ్ సాంస్క్రిట్ ఆర్కి టేక్చరల్ టెక్స్ట్స్,అభినయ దర్పణ  ఆఫ్ నందికేశ్వర వంటిచారిత్రక పరిశోధన గ్రంధాలు రాసిన మాన వేందు బెనర్జీ 12-7-19 39 కలకత్తాలో జన్మించి ఎంఏ పిహెచ్ డి,శాస్త్రి డిగ్రీలు పొందాడు .కలకత్తా సంస్కృత సాహిత్య పరిషత్ గౌరవ కార్య దర్శి .ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌరవ పురస్కారం ,33, 34 ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫ రెన్స్  లనిర్వహణ బాధ్యతచేబట్టాడు .

100-పంచ కన్య కర్త –పుణ్య బరిజా (19 8 3 )

అస్సాం లో  జోర్హాట్ లో 2-1-19 8 3 పుట్టిన పుణ్య బారిజా గర్వాల్ యూని వర్సిటి రిసేర్చ్ స్కాలర్ .జోర్హాట్ గర్ల్స్ కాలేజి హెడ్ .రచనలు -జోగికోన ,పంచకన్య ,సాహిత్య సదని .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 83- ‘’సంస్కృత కురానం ‘’ కర్త –సహరాణాపూర్ రజియా సుల్తానా(19 30 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

83- ‘’సంస్కృత కురానం ‘’ కర్త –సహరాణాపూర్ రజియా సుల్తానా(19 30  )

సహరాణాపూర్ రజియా సుల్తానా ఉర్దూ లో ఉన్న పవిత్ర కొరాన్ గ్రంధాన్ని అనువదించింది .దీనికి ఆమెకు 12 ఏళ్ళకాలం పట్టింది .కొరాన్ పదాలకు సరైన సంస్కృత పదాల వెతుకులాట తనకు చాలా కష్టమైనట్లు ఆమె చెప్పింది .ఈ అనువాదాన్ని ఇరాన్ అమెరికా ,రష్యా ,యూరోపియన్ దేశాలు బాగా మెచ్చుకోవటమే కాదు ఆయా దేశాలలో  పర్య టి౦చమని అభ్యర్ధించాయి కూడా . దీనితో ఆమె ప్రతిభ జగద్విదితమైంది .ఈమె ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్  సంస్కృత హిందీ భాషలలో మహా ప్రవీణుడు మొహమ్మద్ సులేమాన్ మనవరాలు .సులేమాన్ అప్పటికి 20 సంవత్సరాల క్రితం కొరాన్ ను హిందీ లోకి అనువదించి లబ్ధ ప్రతిష్టు డయ్యాడు .ఈ గ్రంథాన్ని రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ ఆవిష్కరించారు .సంస్క్రుతానువాదానికి మనవరాలికి తాతగారు కొంత సాయం చేశాడు .

  1964 లో ‘’సంస్కృతం కురానం ‘’గా అనువాదం పొంది, ప్రచురింప బడిన  ఈ గ్రంథ౦ ప్రపంచం మొత్తం మీద మొదటి సారిగా కొరాన్ సంస్క్రుతానువాదం పొంది రికార్డ్ సాధించింది . సుల్తానా చేసిన ఈ సాహసానికి ,సాధనకు తోడ్పడిన వాడు హర్యానా ,యమునానగర్ కు చెందిన ప్రోఫెసర్ సత్య దేవ వర్మ .

                            ప్రధమపారా

‘’సురే బకర్ కా అవసర రగ్ మదీనే మే హువా –ఇస్మేశబ్ద జ్ఞాన వాక్య శౌర్ 40 రుక్కూ హై .

84-శ్రీ చండీ సిద్ది రహస్యం కర్త –చండీ ప్రసాద్ బహుగుణ (19 26 )

న్యాయ వ్యాకరణ ఆచార్య ,హిందీ సాహిత్య రత్న ,శిక్షాశాస్త్రి చండీ ప్రసాద్ బహుగుణ 19 26 ఏప్రిల్ 15 పంజాబ్ లో జన్మించాడు .పంజాబ్ సింద్ క్షేత్ర మహావిద్యాలయ –ఋషీకేశ్ ఆచార్యుడు .శ్రీ చండీ సిద్ధి రహస్యం ,భారత దర్శనం ,స్వతంత్రతా విజయం రచించాడు .పురాణ ప్రవచన ప్రసిద్ధుడు .శాస్త్ర చూడామణి బిరుదాంకితుడు .ప్రెసిడెంట్ పురస్కార గ్రహీత .

85-ముక్తక మంజూష కర్త –దిగంబర దత్తాత్రేయ బహులికర్ (1916 )

11-3-1916 జన్మించిన దిగంబర దత్తాత్రేయ బహులికర్ సంస్కృత ఉపాధ్యాయుడు .కల్లోలిని ,త్రిశంకు ,ముక్త మంజూష ,ముక్తకాంజలి రచించాడు.  

8 6-శ్రీ కృ ష్ణ చరితామృత కర్త –గోపాల నారాయణ బాహురా (1911 )

సంస్కృత సైన్స్ హిందీలలో నిష్ణాతుడు గోపాల నారాయణ బాహురా 14-5-1911 జైపూర్ వాసి .భట్ట మధురానాద శాస్త్రి గురువు .39 పుస్తకాలు రాసిన మహా రచయిత.మహాకవి సూరదాస ,శ్రీకృష్ణ చరితా మృతం ,భువనేశ్వరి మహా స్తోత్రం ,రస దీర్ఘిక ,లిటరరీ రూలర్స్ ఆఫ్ అమెర్ అండ్ జైపూర్ ,మొదలైనవి . 19 51 ప్రాచ్య ప్రతిస్టాన్ విద్యాలయం స్థాపించాడు .ప్రెసిడెంట్ అవార్డీ .

87-గంగా శతక కర్త –సుధా బాజ్ పాయ్ (1953 )

9-11-19 53 వారణాసి లో జన్మించిన సుధా బాజ్ పాయ్ హిస్టరీ సైకాలజీ ఇంగ్లిష్ లలో పిహెచ్ డి. .లక్నో యూని వర్సిటిసీనియర్  రీడర్ .విశ్వనాధ భట్టాచార్య ,ప్రొఫెసర్ కె యెన్ చటర్జీలు గురువులు.రచనలు -గంగా శతకం ,మహా కవి మాఘ ,సంస్కృత ప్రాకృత  కావ్య ధారా కె అను చింతన వగైరా 6 పుస్తకాలు.సాంఖ్య యోగ దర్శన నిధి ,గ్రామీణ మహిళా సంస్థాన్ వైస్ ప్రెసిడెంట్ .

8 8-అవంతి సింఘాస్టక  కావ్య కర్త –దయా శంకర్ వాజ్ పాయి (19 18 -1987 )

1918 యు.పి .ఉన్నా లో పుట్టిన దయా శంకర వాజ్ పాయి వ్యాకరణ ,సాహిత్యాలలో ఆచార్య .ఉజ్జైన్ లో రిటైర్డ్ ప్రిన్సిపాల్ . అవంతి సింఘాస్టక  కావ్య౦,కాళి కౌతుకం,అనేహసాహ్వానం ,రచనలు . 69 ఏళ్ళ జీవనం .ఆశుకవి ,ప్రెసిడెంట్ అవార్డీ .మద్యప్రదేశ ప్రభుత్వ పురస్కార గ్రహీత .

89-సంపూర్ణ మహాభాష్య ప్రచురణకర్త –బాల శాస్త్రి (19 54 )

వ్యాకరణ సాహిత్యాచార్య ,సాహిత్య రత్న ,పిహెచ్ డి బాలశాస్త్రి 19 54 అక్టోబర్ 16 వారణాసిలో పుట్టాడు ..గురువులు సీతారామ శాస్త్రి ,రాం ప్రసాద్ త్రిపాఠీ,విశ్వనాధ భట్టాచార్య ,నారాయణ మిశ్ర  లు .వ్యాకరణ సాహిత్య నిధి .బనారస్ సంస్కృత విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ . మహా భాష్యం సంపూర్ణంగా ప్రచురించాడు .

90-జాతక ఫల వ్యాఖ్య కర్త –అంజు బాల (1971 )

16-9-1971 ఢిల్లీ లో జన్మించిన అంజు బాల  సంస్కృత టీచర్ .రచన -జాతక ఫలం ,జాతక మాల ,-ఏ కంపారటివ్ అప్రైజల్ .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-18-ఉయ్యూరు

 

 .

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 81-మార్కండేయ సంహిత సంపాదకులు –చలమచర్ల వేంకట శేషాచార్యులు (19 25 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

81-మార్కండేయ సంహిత సంపాదకులు –చలమచర్ల వేంకట శేషాచార్యులు (19 25 )

సంస్కృతాంధ్ర భాషా పండితుడు ,వ్యాకరణ వేత్త చలమ చర్ల  వేంకట శేషాచార్యులు 195 6-61 లో కృష్ణా జిల్లా చిట్టి గూడూరు శ్రీ లక్ష్మీ నృసింహ సంస్కృత కళాశాలలో మహామహోపాధ్యాయ ఎస్ టి జి వరదాచార్యులు,టి నరసింహా చార్యుల వద్ద కావ్య శాస్త్రాలు నేర్చి ,19 61 లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ప్రధమ శ్రేణిలో విద్యా ప్రవీణ పొంది తాతా సుబ్బరాయ శాస్త్రి స్మారక పురస్కారం ,కామేశ్వరీ విశ్వనాథ్ స్వర్ణ పతకం అందుకున్నారు ..1969 లో తిరుపతి సంస్కృత విద్యా పీఠం నుండి శిక్షా శాస్త్రి డిప్లొమా ప్రధమ శ్రేణిలో సాధించారు .

    తిరుమల తిరుపతి దేవస్థాన  కళాశాల సంస్కృత అధ్యాపకుడుగా పని చేసి రిటైరయ్యారు . .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంఅందుకున్నారు .

  స్వీయ సంపాదకత్వం లో మార్కండేయ సంహిత(పాంచ రాత్ర ఆగమ గ్రంథం) వెలువరించారు.తెలుగులో సంస్కృత సంగ్రహ వ్యాకరణం ,శ్రీ మద్రామాయణం 8 భాగాలు ,,సంస్కృతాంధ్ర వివరణలతో తెలుగులో అమరకోశం,ఆధ్యాత్మ రామాయణం ,శ్రీరామ కర్ణామృతం  ,సంస్కృతాంధ్ర నిఘంటువు ,రఘువంశం మొదటి 5 సర్గలు ,కుమార సంభవం 5,6 సర్గలకు  అర్ధ తాత్పర్య వ్యాకరణా౦ శాలు, ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత పాఠశాలలు ,జూనియర్ కాలేజీల పాఠ్య గ్రంధాలు రచించాడు .ప్రస్తుతం వాల్మీకి రామాయణం గోవింద రాజ వ్యాఖ్య ముద్రణకు పర్యవేక్షకులుగా ఉన్నారు.  ఆకాశవాణి లో సంస్కృత పాఠాలు 19 7 7 నుండి 20 01 వరకు 24 ఏళ్ళు నిరాటంకంగా బోధించారు .ఆచార్యశ్రీ గారి స్వీయ రచన-1, సంపాదకత్వం చేసినవి -2,అనువాదాలు 2,కూర్పు 2 .

82-మేదినీ కోశ కర్త –మేదినీ కరుడు

నానార్ధ శబ్ద సర్వసం అయిన’’ మేదినీ కోశం ‘’ను మేదినీ కరుడు రచించినట్లు తెలుస్తోంది .పుట్టు పూర్వోత్తరాలు తెలియ రాలేదు .గ్రంథం చివర మాత్రం ‘’మేదిని కరేణు కోశః ప్రాణ కర సూనునా రచితః ‘’అని మాత్రమె చెప్పుకున్నాడు రచయిత .ఎక్కడ పుట్టాడో తలిదంద్రులెవరో ఏ కాలం వాడో కూడా తెలియలేదు .గ్రంథం చివరలో –‘’ఉత్పలినీ శబ్దార్నవ సంసారావర్త నామ పాలాఖ్యాన్ —– షట్శత గాథాకోశ ప్రణయన విఖ్యాత కౌశలేనాయం –మేదిని కరేణ కోశః ప్రాణ కర సూనునా విరచితః ‘’అని ఉన్నదానిని బట్టి ఈ కవి ‘’ఉత్పలినీ శబ్దార్నవం ‘’,విశ్వ ప్రకాశ ‘’మొదలైన గ్రంథ ములను సాకల్యంగా అధ్యయనం చేసి మేదినీ కోశం రాసినట్లు తెలుస్తోంది అన్నారుపీఠికలో  వావిళ్ళ రామ స్వామి శాస్త్రులు  ఈ గ్రంధాన్ని తెలుగు లో ముద్రిస్తూ .అంతేకాక ‘’అపి బహుదోషం విశ్వ ప్రకాశ కోశం చ సు విచార్య’’ అనటం వలన విశ్వ ప్రకాశ కోశం లో చాలా తప్పులున్నాయని తన గ్రంథం దోష రహితమైనదని కితాబిచ్చుకున్నాడు మేదినీ కరుడు .దీన్ని బట్టి కోశ కారులలో యితడు చాలా అర్వాచీనుడు అని శాస్త్రులు తేల్చారు .షట్శతగాథా కోశ ప్రణయన విఖ్యాత కౌశాలేనాయం ‘’అని తనను తాను చెప్పుకోవటం వలనఅనేక కథాగ్రంథాలు రాసినట్లు భావించారు .

‘’నానార్ధ కోశ పుస్తక భారార్జన దుఃఖ హానయే కృతినః  -మేదినీ కర కోశో విశుద్ధ లింగో భి లిఖ్యతా మేకః ‘’అని కూడా కవి గ్రంథం మొదట్లో చెప్పటం వలన ‘’నా గ్రంథం ఒక్కటి ఉంటె చాలు .వేరే నానార్ధ కోశాలను చూడాల్సిన పనే లేదు ‘’అని ఢంకా  బజాయించి చెప్పాడు .విశ్వ కోశం లాగా మేదినీ కోశం కూడా శబ్ద అంత్య వర్ణ క్రమం అనుసరించి రాయబడింది .కనుక కావలసిన పదం వెతుక్కోవటం చాలా సులభం అవుతోంది అంటారు వావిళ్ళ.సంస్కృతం తెలుగు నేర్చుకునే విద్యార్ధులకు ఇది కరతలామలకమే .వావిళ్ళవారు బహు వ్యయ ప్రయాసలకోర్చి చక్కని తెలుగు టీకతో ఈ గ్రంధాన్ని ప్రచురించి సాహితీ జిజ్ఞాసులకు అందుబాటు లోకి తెచ్చినందుకు అభినందనీయులు .ఇందులో మచ్చుకి కొన్ని శ్లోకాలు చూద్దాం –

1-వృషాంకాయ నమస్తస్మై యస్య మౌళి విళంబినీ –జటా వేస్ట నజాం శోభాం విభావయతి జాహ్నవీ .

10-క్లీబే నపు౦సకే పు౦సి స్త్రియాం యోషితి చ ద్వయో –త్రిషు చేత్యాది యద్రూపం తల్లి౦గ స్యైవ వాచకం .

చివరి శ్లోకం –నానార్ధ కోశ పుస్తక భారార్జన దుఃఖ హానయే కృతినః-మేదినీ కర కృత  కోశో విశుద్ధ లింగో భి లిఖ్య తామేకః .

కద్వికం –కో బ్రహ్మణి సమీరాత్మ యమ దక్షేషు భాస్కరే –కామే గ్రన్ధౌచక్రిణి చ పతత్రిని చ పార్దివే –మయూరేగ్నౌచ పు౦సిస్యాత్ సుఖ శీర్ష జలే షుకం.

తెలుగులో అర్ధం –ఏకాక్షర శబ్దాలు –కః –బ్రహ్మ ,వాయువు ,ఆత్మ ,యముడు, దక్ష ప్రజాపతి ,సూర్యుడు మన్మధుడు ,ముడి ,విష్ణువు ,పక్షి ,రాజు ,నెమలి ,అగ్ని .కం –సుఖము ,శిరస్సు జలం .

సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-1-18- ఉయ్యూరు 

Inline image 1
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రధ సప్తమి -శ్రీ సూర్య నారా (నామా )యణ౦

శ్రీ సూర్య నారా (నామా )యణ౦

మాఘ శుద్ధ సప్తమి రధ సప్తమి .సూర్యుని పుట్టిన రోజు పండుగ .ఆయన ప్రత్యక్ష దైవం .అన్ని ఇంద్రియాలకు ఆయన తెలియ వస్తాడు .సర్వ జీవ కోటికీ పుష్టిని,తుస్టినీ ఇస్తాడు .కనుక ఆయన నామ రహస్యాన్ని తెలుసుకోవటం మన విధి .సూర్యునికి సంస్కృతం లో చాలా పర్యాయ పదాలున్నా  ‘’అమరకోశం ‘’లో –

‘’సూరా ,సూర్యార్యమాదిత్య ద్వాదశాదిత్య దివాకరాః-భాస్కరా హస్కర బ్రద్న ప్రభాకర విభాకరాః-భాస్వద్వివస్వ త్సప్తాశ్వహరి దశ్వోష్మ రస్మయః –వికర్తనార్క మార్తాండ మిహిరారుణ పూషణః-ద్యుమణి స్తరణిర్మిత్రశ్చిత్ర భాను ర్విరోచనః –విభావసు ర్గ్రహ పతి స్త్వషాంపతి రహర్పతిః-భానుర్హంస స్సహస్స్రా౦శు స్తపన స్సవితా రవిః’’అని చెప్పి ఇవికాక

‘’కర్మ సాక్షీ జగచ్చక్షు రంశుమాలీ త్రయీతనుః –ప్రద్యోతనో దినమణిః ఖద్యోతో లోక బాన్ధవః –సురోత్తమో ధామ నిధిః పద్మినీ వల్లభో హరిః’’అనీ చెప్పింది .

కనుక రధ సప్తమీ పర్వదినాన సూర్య నారా (నామా )యణ రహస్యాలను తెలుసుకొని తరిద్దాం .దీని వివరణ అంతా ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు తమ రచన ‘’కదంబ వనం ‘’లో ‘’ప్రత్యక్ష దైవం సూర్యుడు ‘’వ్యాసం లో తెలియ జేశారు .

సూర్యుని ముఖ్యనామాలు 37 .ఇవికాక మరో 12 తో కలిపి 49 పేర్లు ఉన్నట్లు పైన చెప్పబడిన శ్లోకాల ద్వారా తెలుస్తోంది .ఇవన్నీ గుణాలను బట్టి ఏర్పడ్డాయి .నామాధిక్యం గుణాధిక్యానికి సూచన .పై పట్టిక లో ‘’ఇన’’శబ్దం లేదు .ముందు దాన్ని గురించి తెలుసుకొందాం ‘’ఏతి ఇతి ఇనః ‘’అంటే సంచరించేవాడు .సూర్యుడు స్థిరంగా ఉండి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని విజ్ఞానశాస్త్రం చెబుతోంది .కనుక సూర్య గమనం అంటే కిరణప్రసారం అనుకొంటే ఇబ్బంది రాదు అన్నారు  శర్మ గారు .సూర్య కిరణప్రసారం అన్ని వైపులకు అన్నికాలాలలో జరుగుతు౦ది కనుక అది గమన శీలమే .’’సర్వే గత్యార్దాః బుద్ధ్యర్ధః ‘’అనే వ్యాకరణ సూత్రం ప్రకారం సూర్యుడు జ్ఞాన ,విజ్ఞాన మూర్తి .కనుకనే ఆయనను గురూత్తమునిగా వానరోత్తముడైన హనుమ భావించి నవ వ్యాకరణాలు అధ్యయనం చేశాడు .తరువాత ‘’సూర ‘’శబ్దం.’’సరతి గచ్చతి ఇతి సూరః ‘’అని లింగా భట్టు చెప్పాడు .దీనికీ ఇన శబ్దార్ధమే .శూర అని అనుకొ౦టే విక్రమించేవాడు అవుతాడు .సూర్య అంటే సర్వ ప్రాణులకు చైతన్య ప్రదాత అని అర్ధం .తరువాత ‘’ఆర్యమ ‘’అన్నా గమనం ఉన్నవాడనే అర్ధం –‘’ఋ గతౌ ‘’అనే ధాతువు నుండి ఏర్పడిన శబ్దం ఇది .కశ్యప ప్రజాపతి భార్య అదితి కి పుట్టాడు కనుక ఆదిత్యుడు .ఆమె దేవతలకు మాత .ధాతు చర్చలో ఆమె అఖండ బుద్ధి విశేషానికి ప్రతీక .గౌతమి పుత్ర శాతకర్ణి కి ముందే తల్లి పేరుతో చలామణి అయినవాడు ఆదిత్యుడు . ఇంద్ర ,ధాత ,పర్జన్య ,త్వష్ట ,పూష,ఆర్యమ ,భగ ,వివస్వత ,విష్ణు ,అంశుమంత ,వరుణ ,మిత్ర అనే 12 మూర్తులున్నవాడుకనుక ద్వాదశాత్ముడు .దివము అంటే పగలును చేసేవాడుకనుక దివాకరుడు .దిన భాగం లో ప్రాణులను చైతన్యం చేసేవాడనీ అర్ధం .’’భాసం కరోతి –ఇతి భాస్కరః ‘’అమేయమైన కా౦తినిచ్చేవాడు .ఆహస్సును చేసేవాడు ఆహస్కరుడు .నిజానికి సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు .ఆయన కాంతికి కొన్ని ప్రదేశాలలో అవరోధం కలుగుతుంది కనుక రాత్రి అవుతుంది .ఆ అడ్డంకి తొలగితే అహస్సు.  ‘’న జహాతి ప్రత్యాగమనమితి అహః ‘’అని లింగాభట్టు  విచిత్రమైన అర్ధం చెప్పాడు దీని అర్ధం తిరిగి రావటాన్ని విడువనిది .మరో అర్ధం –‘’సూర్యేణ న హీయతే ఇత్యహః ‘’అంటే సూర్యుడిని వదలి పెట్టి ఉండనిది .ఇలాంటి అహస్సును యేర్పరచేవాడు ఆహస్కరుడు .ఇతర తేజస్సులను అడ్డుకోనేవాడు ,చీకటిని కట్ట కట్టి దూరంగా విసిరేసేవాడు కనుక ‘’బ్రద్నుడు ‘’.బంధించే వాడని భావం .

ప్రభ ,విభ అనే ప్రశస్త అత్యధిక కాంతి నిచ్చేవాడు కనుక ప్రభాకరుడు ,విభాకరుడు .సర్వ ప్రాణి కోటికీ దర్శన సామర్ధ్యం కలిగించటాన్ని ప్రశస్తత అంటారు .కిరణాల ద్వారా అన్నాదులను ఏర్పాటు చేయటం విశిష్టత .ఇలాంటి ప్రయోజనాలు ,అనేక లోకాలకు అనంత వెలుగులు కలిగించేవాడు కనుక భాస్వంతుడు .కాంతి తో సర్వాన్నీ కప్పేస్తాడు కనుక వివస్వంతుడు .’’వస ‘’అనే ధాతువుకు ఆచ్ఛాదనం అని అర్ధం .ఏడు గుర్రాలపై వస్తాడుకనుక సప్తాశ్వుడు .వ్యాపించే గుణం ఉండటం వలన గుర్రానికి అశ్వం అని పేరు .ఈ వ్యాపన శీలం అగ్ని ,విద్యుత్తూ ,దీపం మనకు సూర్య ప్రతిరూపంగా దర్శనమిస్తుంది అంటారు శర్మ గారు .సూర్యుడికి ఒకే ఒక అశ్వం ఉందని దానిపేరే ‘’సప్త ‘’అనీ ‘’గురుబాల ప్రబోధిని ‘’తెలియ జేస్తోంది .అయితే లోకం లో 7 గుర్రాలు అని వాడుక .7 అనేవి 1 ఎలా అవుతుంది?న్యూటన్ వర్ణ చక్రం ను వేగంగా తిప్పితే 7 రంగులు కలిసి తెల్ల రంగు అవుతుందని మనకు తెలుసు .అసలు తెలుపు కూడా కాదు యే రంగూ లేని తనం .సూర్య రశ్మి లో 7 రంగులుంటాయి కదా అలా .హరిదశ్వ అనే పదానికి పచ్చ గుర్రాలున్నవాడు అని అర్ధం .సృష్టి లోని పచ్చదనానికి సూర్యుడు ప్రతీక .ఈ పచ్చదనం సంపద,సౌభాగ్యాలకు ప్రతీక .

సూర్యుడికి ‘’ఉష్ణ రశ్మి ‘’ అనే పేరుంది .కిరణాలు కలవాడని అర్ధం .సూర్యుడు విశ్వ దేహానికి అవసరమైన వేడిని తగిన ప్రమాణం లో కిరణాల ద్వారా అందిస్తూ విశ్వాన్నిరక్షిస్తాడు .ఈ ఉష్ణం ప్రాణికోటికి కావాల్సిన వాటిని పచనం పాకానికి తెచ్చి పోషిస్తాడు .’’వికర్తనుడు ‘’అంటే ‘’వికృతంతి తమః ‘’-చీకటిని చీల్చేవాడు ,’’వికృత కర్మణా విక్రుతః ‘’అనే మరో అర్ధం లో విశ్వ కర్మ సూర్యుడిని సానబెట్టి ప్రతాపాన్ని సహ్యంఅంటే సహి౦చేట్లు  చేశాడని  అర్ధం వస్తుంది .ప్రాణికోటికి ఈ రెండూ కావాల్సినవే .భౌతికమైన చీకటి సరే లోపల చీకటి కూడా ఉంది .అదే అజ్ఞానం .ఈ రెండిటినీ చీల్చి ప్రయోజనం కలిగిస్తాడు .’’అర్కుడు ‘’లోకాల చేత అర్చించ బడేవాడు .మృతండ మహర్షి కొడుకు కనుక మార్తాండుడు .మరో అర్ధం –‘’మృతం బ్రహ్మాండం జీవయతీతి మార్తా౦డః’’.మృతమైన బ్రహ్మాండాన్ని జీవింప జేస్తున్నాడు కనుక మార్తాండుడు .’’మిహిరుడు ‘’అంటే మేఘ రూపుడై విశ్వాన్ని తడిపి జీవనం ప్రసాదించే వాడు .సూర్య కిరణాలు జలరాశిని ఆవిరి చేసి మేఘాలుగా మార్చి వర్షాన్ని స్తాయి కనుక మార్తాండ ,మిహిర శబ్దాలు సూర్యునికి పర్యాయ పదాలను చేశారు మన మహర్షులు .

నిరంతర సంచారి కనుక అరుణుడు.ఈ గమనం దేనికి అంటే ప్రాణి పోషణకు .అదే ‘’పూష’’.ఈ గమనం లో దివ్య జ్యోతులు కనిపిస్తాయికనుక ద్యుమణి .దీప్తి తుష్టి పుష్టి ఆరోగ్యాలను అందించే మణి.అందరికోసమే  ఆకాశం లో ఆయన అన౦త గమనం చేస్తాడు . ఆయన గమనం వలన ప్రాణులు చీకట్లను తరిస్తారు .ఆయన ఆకాశాన్ని తరిస్తాడు కనుక ‘’తరణి ‘’.సర్వ భూతరాశిపై స్నేహ భావం ఉండటం వలన ‘’మిత్రుడు ‘’..వివిధ  వర్ణాలున్నవాడుకనుక ‘’చిత్ర భానువు ‘’.సృష్టిలోని అన్ని రంగులు సూర్య కిరణ స్వరూపాలే .  విశేషంగా ప్రకాశించేవాడు కనుక ‘’విరోచనుడు ‘’ఆ కాంతి పు౦జ మే ఆయనకు ధనం అంటే వసువు అందుకే విభావసువు . ఆ ధనతత్వం ప్రాణుల ప్రయోజనం కోసమే కనుక దైవం అయ్యాడు .గ్రహాలకు నాయకుడుకనుక గ్రహ పతి .తన కిరణాలను ,ప్రతిరూపాలైన అగ్నులను ,ఓషధులను ,దేహం లోపలి జఠరాగ్నిమొదలైన వాటిని సంరక్షిస్తాడు కనుక ‘’త్విషాంపతి ‘’’’త్విట్టులుఅంటే కాంతులు అని అర్ధం .పగటికి ప్రభువుకనుక ఆహస్పతి.

‘’హంతి తమః ఇతి హంసః ‘’చీకట్లను రూపు మాపేవాడు కనుక హంస .అనంత కిరణాలున్నవాడు కనుక ‘’సహశ్వుస్రాంశువు  ‘’.నిద్రించే వారిని మేల్కొల్పే వాడుకనుక ‘’సవిత ‘’-సువతి –సుప్తం ప్రేరయతి ‘’.ఇన్ని గొప్ప పనులు మనకోసం చేసేమహాత్ముడు కనుక ఆయన్ను స్తుతించాలి .స్తుతి అర్ధాన్నిచ్చే ‘’రు ‘’ధాతువు నుండి ఏర్పడినది ‘’రవి ‘’.లోకాలకు ఆయన కిరణాలు మాలలు మాలలుగా చేరుతాయి కనుక ‘’అంశుమాలి ‘’.మూడు వేదాలు అయన శరీరం గా ఏర్పడ్డాయి .వెలుగు అంటే విద్య కనుక .అవి ఆయన నుంచి వస్తున్నాయికనుక ‘త్రయీ తనువు’’.

14 లోకాలకూ వెలుగులివ్వ వలసిన వాడు కనుక ప్రకృస్టం గా ప్రకాశించాలి కనుక ‘’ప్రద్యోతనుడు ‘’.అందుకే దినమణి.ఆకాశం లో వెలిగేవాడుకనుక ‘’ఖద్యోతుడు ‘’.ఆపని లోక బాంధవ్యం కోసమేకనుక ‘’లోక బాంధవుడు ‘’.అన్ని రకాల మహోపకారాలు లోకాలకు చేసే ఉత్తమ దేవత కనుక ‘’సురోత్తముడు ‘’.ధామం అంటే కాంతికి నిదికనుక ‘’ధామనిది ‘’.తామర పూలను వికసింప జేసేవాడు కనుక పద్మినీ వల్లభుడు .తమస్సు హరించేవాడు కనుక ‘’హరి ‘’.

ఇదీ ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్య నారా (నామా )యణం’.ఇంతటి అర్ధ భావాలను విశదీకరించిన శ్రీ శలాక వారు నిజంగా ‘’శబ్ద దినమణి’’ .ఆయన వెలుగే ఇదంతా .

రధ సప్తమి శ్లోకాలు

1-సప్త సప్తి ప్రియే దేవీ -సప్త లోకైక పూజితే-సప్త జన్మార్జితం పాపం -హర సప్తమి సత్వరః

2-లోల కిరణా సప్తమ్యాం-స్నాత్వా గంగాది సంగమం -సప్త జన్మ క్రుతైఃః పాపం -ముక్తిర్భవతి తక్షణాత్ .

3-మాఘే మాసే సిత పక్షే -సప్తమీ కోటి భాస్కరా -కుర్యాత్ స్నానార్ఘ్యం దానాభ్యాం -ఆయురారోగ్య సంపదః

4-నమస్తే రుద్ర రూపాయ -రసానాం పతయే నమః – అరుణాయచ నమస్తేస్తు -హరి వాస నమోస్తుతే .

ఎల్లుండి 24-1-18 బుధవారం రధ సప్తమి కి శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-22-1-18 -ఉయ్యూరు

— Inline image 1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 73 –నారీ గీతం కర్త –శంకర దేవ్ అవతారే (1921 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

73 –నారీ గీతం కర్త –శంకర దేవ్ అవతారే (1921 )

15-4-1921 ఉత్తరప్రదేశ్ బులంద సహర్ లో పుట్టిన శంకర దేవ్ అవతారే సంస్కృత హిందీ ఎం ఏ ,ఆచార్య,పి హెచ్ డి,డిలిట్.ఢిల్లీ మోతీలాల్ నెహ్రు ఈవెనింగ్ కాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .సంస్కృతం లో జీవన ముక్తకం  నారీ గీతం ,సీతారామీయం రచించాడు .ఢిల్లీ సంస్కృత అకాడెమి ,మైసూర్ హిందీ పరిషత్ అవార్డ్ లతోపాటు రాష్ట్రపతి పురస్కార గ్రహీత .

74-యుగ దర్శనం కర్త –బాబూరాం అవస్తి (1929 )

యుగ దర్శనం ,లోక గీతాంజలి ,కథా ద్వాదశి ,నయా నవనీతం ,నయా నీరాయణం రాసిన బాబూరాం అవస్తి 1929 ఫిబ్రవరి 28 లక్ష్మి పుర ఖేరి లో జన్మించాడు .సంస్కృత ఎం ఏ ,ఆచార్య .కవి ఏవం సాహిత్యకార్ అనే భావన ఉన్నవాడు .

75-కావ్య తత్వ బోధిని కర్త –బచ్చూలాల్ అవస్తి –(1918 )

వ్యాకరణ ,దర్శన ,సాహిత్యాలలో ఆచార్య ,ఎం ఏ పిహెచ్ డి, డిలిట్ బచ్చూలాల్ అవస్తి 8-8-1918 యుపి లో బహారైచ్ జిల్లా సిపాహియా లో జన్మించాడు .సాగర్ వర్సిటి ఆచార్యుడు .పండిట్ రాజారాం భట్ట ,భాగీరధ మిశ్రా ,వేదాంత మిశ్రా ,పండిట్ ఘుతార్ ఝా ,సంతోష్ పాండ్యా లు గురుపరంపర .20 గ్రంధాలు రాశాడు .అందులో కావ్య తత్వ బోధిని ,భారతీయ దర్శన శాస్త్ర కా బృహత్కోశ,కావ్యమే రహస్య వాద,ధ్వని సిద్ధాంత ,తులనీయ సాహిత్య చింతామణి ,భారతీయ కావ్య సమీక్ష మే ధ్వని సిద్ధాంత ,కావ్య తత్వ బోధిని ,ప్రతానిని ముఖ్యమైనవి. ప్రతానిని అనే కవితా  సంపుటికి  కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ పొందాడు 1993 లో రాష్ట్రపతి పురస్కారం అందుకున్నాడు .

76 –శ్రీ మద్భగవద్గీతా విజ్ఞాన భాష్య కర్త –నరేంద్ర అవస్తి (1955 )

22-9-1955 రాజస్థాన్  జోద్పూర్ లో పుట్టిన నరేంద్ర అవస్తి ఎం ఏ పి హెచ్ డి..జోద్ పూర్ జే యెన్ వ్యాస్  యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ .దయానంద భార్గవ  శిష్యుడు .శ్రీమతి రాణి దధీచి కి గురువు ., –శ్రీ మద్భగవద్గీతా విజ్ఞాన భాష్య,,అత్రి ఖ్యాతిః,నూపుర ధ్వని ,వేద ఉపనిషత్ వంటి 6 పుస్తకాలు రాశాడు .జర్మని ,ఫ్రాన్స్ మొదలైన దేశాలలో పర్యటించి భారతీయ వేదాంత ప్రచారం చేశాడు .

77-సుధర్మ ,నారాయణీయం సంపాదకుడు –కల్లె నలత్తూర్ వరద రాజ అయ్యంగార్ (1921 )

30-9-19 21 కర్నాటక కల్లె లో జన్మించిన కల్లె నలత్తూర్ వరద రాజ అయ్యంగార్ –కస్తూరి శ్రీనివాసా చార్య ,లక్ష్మీ కాంత అయ్యంగార్ ల శిష్యుడై విద్వాన్ అయ్యాడు .సంస్కృత ప్రెస్ నిర్వహించాడు .సుధర్మ ,నారాయణీయం లను తన సంపాదకత్వం లో వెలువరించాడు .విశిష్టా ద్వైత వేదాంత వ్యాప్తికి విశిష్ట సేవలు చేశాడు .సంస్కృత సేవా ధురీణ ,వాణీ భూషణ ,విద్యానిధి బిరుదాంకితుడు .

78- సావిత్రి కావ్య కర్త –నీలకంఠ శాస్త్రి సుందరం అయ్యర్ (19 04 )

20-6-19 04 తమిళనాడు తిరునల్వేలి జిల్లా శింగా కులం లో జన్మించిన నీలకంఠ శాస్త్రి సుందరం అయ్యర్ వ్యాకరణ ఆచార్యుడు .ఉపాధ్యాయుడు  చేసి రిటైరయ్యాడు .పద్మనాభ శాస్త్రి ,రాఘ వేంద్రా చార్య ,శ్రీ కృష్ణ శాస్త్రి గురువులు .సావిత్రి కావ్యం ఒక్కటే రాశాడు .వ్యాకరణ ,కావ్య శాస్త్రాలలో గొప్ప కృషి చేశాడు .

79- భారత గౌరవం కర్త –పరమేశ్వర అయ్యర్ (1916 )

16-7-19 16 కేరళలో పుట్టిన పరమేశ్వర అయ్యర్ మహర్షి యూరోపియన్ రిసెర్చ్ యూని వర్సిటి లెక్చరర్ .న్యాయ,వేదాంత  శాస్త్ర ఆచార్యుడు .దేవి నవరత్నమాల ,భారత గౌరవం ,ఆభానక మంజరి సంస్కృత రచనలు చేశాడు .ఆంగ్ల జాతీయాలకు సంస్క్రుతానువాదం చేసి రాసినదే ఆభానక మంజరి .

80-ధర్మ సూరి కృత నరకాసుర విజయ వ్యాయోగ కర్త –షర్మిలా బగాచీ (19 60  )

6-8-1960 ఉత్తర ప్రదేశ్ ఝాన్సి లో జన్మించిన షర్మిలా బగాచీ ఎం ఏ ,బిఎద్ ,పిహెచ్ డి..బరోడా ఓరియెంటల్ ఇన్ స్టి ట్యూట్ రిసెర్చ్ ఆఫీసర్ .గురువు ప్రొఫెసర్ రాదా వల్లభ త్రిపాఠి .రచనలు-ధర్మ సూరి కృత నరకాసుర విజయ వ్యాయోగ,అభినయ లక్షణ ఆఫ్ శివదాస ,మొదలైనవి.

సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్-21-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 64 – ఇంద్రధ్వజ విధాన కర్త -జ్ఞానమతి మాతాజీ ఆర్యిక(19 34 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

64 – ఇంద్రధ్వజ విధాన కర్త -జ్ఞానమతి మాతాజీ ఆర్యిక(19 34 )

1934 లో ఉత్తరప్రదేశ్ బారాబంకి  తికైట్ నగర్ లో జన్మించిన జ్ఞానామతి మాతాజీ ఆర్యిక ఆచార్య దేశాభూషణ్ మహారాజ్ శిష్యురాలు .ఇంద్ర ధ్వజ విధానం ,ఆశా సహస్రి ప్రబందే ,శ్రీ పంచమేశ స్తుతి ,సహా జయతు గురు వర్యః మొదలైన అయిదు రచనలు చేసింది .సమ్యజ్ఞానమేగజైన్ సంపాదకురాలు .

65 –శివాకాశ స్తోత్ర కర్త –జిన్మతి మాతాజీ ఆర్యిక –(1945 )

జ్ఞానమతి మాతాజీ ,ఆచార్య వీర సాగర్ జీ ,ఆచార్య శివ సాగర్ మహారాజ్ శిష్యురాలైన జిన్మతి మాతాజీ  ‘’శివాకాశ స్తోత్రం ‘’అనే ఒక్క కృతి మాత్రమె చేసింది .

66 –సాగర ధర్మామృత కర్త –సుపార్శ్వ మతి మాతాజీ ఆర్యిక (1985 )

రాజస్థాన్ నగౌర్ లోని మెయిన్ సార్ లో 1985 లో జన్మించిన సుపార్శ్వమతి మాతాజీ గురువులు ఆచార్య అజిత్ సాగర్ జీ ,ఆచార్య వీర సాగర్ మహారాజ్ లు .సాగర ధర్మామృతం ,సా ప్రభ్రుతం ,వార్యాంగ చరిత్ర ,పరమ ఆధ్యాత్మ తరణి మొదలైన 5 రచనలు చేసింది .

67-సమాధి దీపిక కర్త –విష్ణు ధమతి మాతాజీ ఆర్యిక (1929-2001  )

12-4-1929 మధ్య ప్రదేశ్ లోని రితి కత్ని లో జన్మించిన విష్ణు దమతి ఆర్యిక –సాహిత్య రత్న ,విద్యాలంకార .ప్రదానోపాధ్యాయురాలుగా పని చేసింది .శుశ్రుత సాగర్ ,అజిత్ సాగర్ ,రతన్ చంద్రలు గురువులు .22-1-20 01 న 72 వ ఏట సిద్ధి పొందింది .వత్తు విజయ ,శ్రమణాచార్య,సమాధి దీపిక ,స్తోత్ర సంగ్రహం ,శ్రావకా సోపాన రచించింది .

68-త్రిలోక సార కర్త –విష్ణు ధమతి మాతాజే ఆర్యిక (1980 )

మధ్యప్రదేశ్ జబల్పూర్ లో రతి గ్రామం లో జన్మించింది .సాగర్ లోని శ్రీ దిగంబర జైన్ మహిళా ఆశ్రమ ప్రిన్సిపాల్ చేసింది .పన్నాలాల్ సాహిత్య రత్న ,ఆచార్య శివ సాగర్ లు గురువులు .త్రిలోక సార ,అష్టోత్తర శతనామ స్తోత్రం రచించింది  .సంస్కృత ,ప్రాకృతాలలో సమాన ప్రజ్నతో రాణించిన విదుషీమణి .

69-కాళిదాస క్రియా పద కోశ కర్త –ఆషా (1959 )

ఢిల్లీ లో 1959  ఆగస్ట్ 28 జన్మించిన ఆషా రొహ్ తక్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ ,ఎం డి.కాళిదాస క్రియా పదకోశం మాత్రమె రచించింది .

70 –వాసిష్ట దర్శన కర్త –భీక్షన్ లాల్ ఆత్రే (1930 )

 ఫణి భూషణ అధికారి శిష్యుడైన భీక్షన్ లాల్ ఆత్రే బెనారస్ హిందూ యూని వర్సిటి లో ఎం ఏ పి హెచ్ డి చేసి ,13 రచనలు చేశాడు .అందులో ముఖ్యమైనవి –వాసిష్ట దర్శనం ,యోగ వాసిష్ట సారం ,శంకరాచార్యకా మాయా వాద,దిఎలిమెంట్స్ ఆఫ్ ఇండియన్ లాజిక్ ,యోగ వాసిష్ట అండ్ ది మోడరన్ థాట్ .

71-మహాకవి సమాగమః –కర్త –వి .స్వామి నాధ ఆత్రేయ (1919 )

తమిళనాడు తంజావూర్ లో 1919 లో జన్మించిన వి.స్వామినాథాచార్య –కుప్పుస్వామి శాస్త్రి దండపాణి ల శిష్యుడు .అనురూప ,మహాకవి సమాగమః ,బద్రీ –కేదారనాధ యాత్రా ప్రబంధ ,మొదలైన 6 రచనలు చేశాడు .మాన్యు స్క్రిప్టాలజిస్ట్ గా ప్రసిద్ధుడు .ఆశుకవి గా లబ్ధ ప్రతిస్టుడు .ఆశుకవి తిలక ,సాహిత్య వల్లభ  బిరుదులు  పొందాడు

72-పాణిని దాత్వాను క్రమ కోశః కర్త –అవనీంద్ర కుమార్ (1940 )

1940 మార్చి 13 ఉత్తర ప్రదేశ్ ఈతా లో పుట్టిన అవనీంద్ర కుమార్ వ్యాకరణ ,నిరుక్తా చార్య .ఎం ఏ పిహెచ్ డి..ఢిల్లీ యూని వర్సిటి సంస్కృత శాఖాధ్యక్షుడు పండిట్ బ్రహ్మదత్త జిగ్యాసు ,పండిట్ యుధిష్టిర మీమా౦సక్ ,పండిట్ జ్యోతిస్వరూప్ ఆచార్య లకు శిష్యుడు .ప్రొఫెసర్ మిదిలేష్ చతుర్వేది ,డా.ఓం నాద బిమ్లి లకు గురువు . పాణిని దాత్వాను క్రమ కోశః.అష్టాధ్యాయి పదానుక్రమ కోశ ,వ్యాకరణ్ కా ఇతిహాస్ మొదలైన 6పుస్తకాలు  రాశాడు .వ్యాకరణం లో అద్వితీయుడు .ప్రెసిడెంట్ అవార్డీ .సాహిత్య సేవా సమ్మాన్ ,పాణిని సాయన్ సమ్మాన్ ,న్యు మెక్సికో పురస్కార గ్రహీత .

సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 57-కోదండ రామ దేవస్థాన స్థల పురాణ కర్త –అన౦త రాజ గోపాలాచార్య (1923 )

— .గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

57-కోదండ రామ దేవస్థాన స్థల పురాణ కర్త –అన౦త రాజ గోపాలాచార్య (1923 )ణం -4

1923 మే 8  తమిళనాడు చెంగల్పట్టు లోని అన్నదూర్ లో జన్మించిన అనంత రాజ గోపాలాచార్య  శిరోమణి .గురువులు –గోష్టి పూర్ వాసు దేవాచార్య ,దొరై స్వామి అయ్యంగార్లు .కోదండ రామ స్వామి స్థల పురాణం  అనే ఒకే ఒక సంస్కృత గ్రంథం రాసినట్లు తెలుస్తోంది .

58-సాహిత్య దర్శన కర్త –అరలి  కట్టి రామ చంద్ర నరసింహ (19 31 )

కర్నాటక జాం ఖండి లో 5-5-1931 జన్మించిన అరలి కట్టి రామ చంద్ర నరసింహ సంస్కృత ఎం ఏ .తిరుపతి కేంద్రీయ సంస్కృత విశ్వ విద్యాలయ ప్రోఫెసర్ ,రిజిస్ట్రార్ .సాహిత్య ,దర్శన లింగ్విస్టిక్స్ లలో నిధి .వీటిపై 21 పుస్తకాలు రాశాడు .రాష్ట్ర పతి పురస్కార గ్రహీత అయిన నరసింహ ప్రస్తుతం పూనే లోని తిలక్ మహారాష్ట్ర విద్యా పీఠ్ విద్యామణి.

59-సంస్కృత ,అర్ధమాగధి  నిధి –అర్జున్ వాద్కర్ కృష్ణ (  19 26 )

సంస్కృత ,అర్ధమాగధి  నిధి –అర్జున్ వాద్కర్ కృష్ణ 31-10-19 26 బెల్గాం లో జన్మించాడు .బాంబే యూని వర్సిటి రీడర్ .20 గ్రంధాలు ,300 పరిశోధక పత్రాలు రచించాడు .బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటి విజిటింగ్ ప్రొఫెసర్ (1973-74 ),1999 -2000 లో లండన్ వేదిక్ పాఠశాల విజిటింగ్ లెక్చరర్ . సంస్కృత  సంస్కృతీ సంశోధిక కు గౌరవ డైరెక్టర్ .ప్రెసిడెంట్ అవార్డీ .

60 –కావ్య మనీషి –నారాయణ శంకర్ అర్వికార్ (1906 )

1906 మార్చి లో మధ్యప్రదేశ్ నాగపూర్ లో జన్మించిన నారాయణ శంకర్ అర్వికార్ కావ్య తీర్ధ ,సాహిత్య మనీషి ,పంజాబ్ శాస్త్రి .అసిస్టెంట్ ప్రొఫెసర్ .గురువు –పండరినాద శాస్త్రి ఘటే .కావ్య ,సాహిత్యాలలో విశేష కృషి చేశాడు .సంస్కృత భాషపై ఉన్న సాధికారతకు కంచి కామ కోటి పీఠం నుండి స్వర్ణ పతకం పొందాడు .

61 –కావ్య దీపికా పరిష్కరణ కర్త –మధు ఆర్య (1947)

సంస్కృత ఎం ఏ పిహెచ్ డి మధు ఆర్య 20-7-1947 న మీరట్ లో జన్మించాడు ,రఘునాద్ గర్ల్స్ పిజి కాలేజి అసిస్టంట్ ప్రొఫెసర్ .కావ్య దీపికా పరిష్కరణ అనే ఒకే ఒక్క సంస్కృత రచన చేశాడు .

62-ప్రపంచ వేదిక్ కాలెండర్ నిర్మాత –రవి ప్రకాష్ ఆర్య (1961 )

6-6-1961 హర్యానాలో జన్మించిన రవి ప్రకాష్ ఆచార్య 35 పుస్తకాలు రాశాడు .ఆంగ్లం లో రచించిన –ఆరిజిన్ ఆఫ్ ఇండో యూరోపియన్స్ ,ధనుర్వేద ,వైదిక కన్కార్డన్స్,కంకార్డన్స్ ఆఫ్ వేదిక్ మంత్రాస్ ఆజ్ పర్  దేవతాస్ అండ్ రిషీస్,ప్రముఖమైనవి .అనేక సార్లు విదేశే పర్యటన చేశాడు .అమెరికా ,కెనడా ట్రినిడాడ్ బ్రిటిష్ గయానా ,రష్యా , హంగేరి , హాలండ్   జర్మని ,ఆస్ట్రేలియా ప్రభుత్వాల ప్రశంసా పత్రాలు అందుకున్నాడు.ప్రస్తుతంపన్నెండే ళ్ళు గా ‘’వేదిక్ జర్నల్ ‘’సంపాదకుడుగా ఉన్నాడు .6 సంవత్సరాలనుండి ‘’వరల్డ్ వేదిక్ కాలెండర్ ‘’తయారు చేస్తున్నాడు

63-మాతలి మహిమ కర్త –హరి హర శర్మ ఆర్యాల్ (1952 )

1952 లో నేపాల్ లోని లుంబినిలో పుట్టిన హరిహర శర్మ ఆర్యాల్ –ఆచార్య ,విద్యా వారధి ఉత్తర ప్రదేశ్ కబీర్ నగర్ లోని శ్రీరాం శంకర్ వేదిక్ పాఠశాల ప్రొఫెసర్ చేశాడు .రాసిన అయిదు పుస్తకాలలో –మాతలి మహిమ ,సమయా శతకం ,నవగ్రహావదానం ,భావ నక్షత్ర మాలిక ముఖ్యమైనవి .

  సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 56-తంత్ర మంత్ర శాస్త్ర రహస్యవేత్త –బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాథ శాస్త్రి గారు (19 00 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

56-తంత్ర మంత్ర శాస్త్ర రహస్యవేత్త –బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాథ శాస్త్రి గారు (19 00  )

తూర్పు గోదావరిజిల్లా రాజమండ్రి కి చెందిన బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాధ శాస్త్రిగారు బాల మేధావి .చిన్నతనం లోనే తర్క ,వ్యాకరణ ,మీమా౦స లను మదించి ,యజుర్వేద కర్మకాండ ,అధర్వవేద మంత్రప్రయోగ భాగాలపై సాధికారత సాధించారు .అధర్వ వేదం లో రహస్యంగా నిక్షిప్తమై ఉన్న తంత్ర ,మంత్ర శాస్త్ర రహస్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు .1930 లలో మొదటి ప్రపంచ యుద్ధసమయం లో జర్మనీ పరభుత్వ ఆహ్వానం పై జర్మనీ వెళ్లి అక్కడ వారు తయారు చేస్తున్న మిసైల్ టెక్నాలజీ కి  రహస్య మంత్రాలను డీకోడ్ చేయటానికి సహాయ పడ్డారు .దీనికి కృతజ్ఞతగా ఫ్రాంక్ ఫర్ట్ యూని వర్సిటీ లో ఆయన చిత్రపటాన్ని అత్యంత గౌరవ స్థానం లో ఉంచారు .జర్మన్ పార్లమెంట్ లోని ‘’హాల్ ఆఫ్ ఫేం ‘’లో ఆయన పేరును చేర్చి అత్యంత గౌరవం చూపించారు .

 హిట్లర్ కు సహాయ పడుతున్న  జర్మనీ సైంటిస్ట్ లు కొద్దిమంది శాస్త్రిగారిని 1938 లో జర్మనీకి ఆహ్వానించి యజుర్వేద ,అధర్వ వేదాలలోఉన్న రహస్య మంత్రాలను డీ కోడ్ చేయమని కోరారు .ఆయన అది తనకు నల్లేరు పై బండి కనుక అతిత్వరలో ఆ రహస్యాలను ఆవిష్కరించి వివరించారు .వీటి ఆధారం గా రెండవ ప్రపంచ యుద్ధం లో జర్మనీ సైంటిస్ట్ లు మిసైల్ అంటే క్షిపణి తయారు చేసి, యుద్ధం లో ప్రయోగించారు .అంతేకాదు నాజీ జర్మన్లు ఫస్ట్ ప్రాక్టికల్ పల్స్ జెట్ ఇంజన్ ను v8 రాకెట్ ‘’బజ్ బాంబ్స్’’ కోసం నిర్మించారు .భారత్ ,టిబెట్ లలో శాస్త్ర రహస్యాలెన్నో ఉన్నాయని హిట్లర్ అతని బృందం పూర్తిగా విశ్వశించి 1930 నుండి ప్రతి ఏడాది ఒక అన్వేషణ బృందాన్ని ఈ దేశాలకు పంపించేది .ఆ బృందాలు వచ్చి ఇక్కడి ఆ శాస్త్ర మేధావులను కలిసి వాటిలోని రహస్యాలను ఆకళింపు చేసుకొని జర్మనీ లో సైంటిఫిక్ రిసెర్చ్ కి ఉపయోగించేవారు .

  కొన్నేళ్ళ క్రిందట మాత్రమె చైనీయులు  లాసా ,టిబెట్ లలో సంస్కృత  డాక్యు మెంట్లు  కనుగొన్నారు .వాటిని చండీ ఘర్ పంపి చైనా భాష లోని అనువాదం చేయించుకున్నారు  ఈ డాక్యుమెంట్ లలో ‘’ఇంటర్   స్టెల్లార్ స్పేస్ షిప్ ‘’నిర్మాణ రహస్యాలున్నాయి .వాటి చోదక శక్తి  అంటే ప్రపల్షన్ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకం (యాంటి గ్రావిటేషన్) .ఇది అచ్చంగా మనలోని ‘’లఘిమ శక్తి ‘’గా కనిపిస్తుంది .ఇదిఅన్ని గ్రావిటేషనల్ పుల్స్ ను అధిగమించే సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్ అన్నమాట .మనిషి సాధించగలిగే అష్ట సిద్దులలో లఘిమ ఒకటి .ఈ శక్తియే మనిషి గాలిలో పైకి లేవటానికి (లీవియేట్)ఉపయోగ పడుతుంది .

‘’అస్త్రాలు ‘’అని పిలువబడే ఈ యంత్రాలను వేలాది సంవత్సరాల క్రితమే మన పూర్వీకులైన భారతీయులు  మనిషిని వేరు చేసి గ్రహాలపై పంపి ఉంటారని ఆ డాక్యుమెంట్ లవలన అర్ధమౌతోంది .ఆ వ్రాత ప్రతులలో ‘’అంతిమ ‘’అంటే అదృశ్య శక్తి రహస్యాలు ,’’గరిమ ‘’అంటే విపరీతం గా బరువు పెరగటం యొక్క రహస్యాలు కూడా ఉన్నాయి .రామాయణం లో హనుమంతుడు లంకను దాటటం ,తన శరీరాన్ని విపరీతం గా బలిష్ట పరచటం ఈ శక్తుల వలననే .దురదృష్ట వశాత్తు భారతీయులు ఈ గ్రంధాలని విషయాలను సీరియస్ గా తీసుకోకుండా అలక్ష్యం చేశారు .చైనీయులు తమ అంతరిక్ష శోధనకు  ఈ గ్రంధాలలోని విషయాలు బాగా తోడ్పడ్డాయి అని ప్రకటించిన తర్వాతే మనకు’’ కాక’’ పుట్టింది  .

  భరద్వాజ మహర్షి విమాన నిర్మాణ శాస్త్రం రాశాడని మనకు తెలుసు .రైట్ సోదరులకంటే ముందే ఇండియాలో 1895 లోశివ కుమార్ బాపూజీ తల్పడే మెర్క్యురి ఇంజన్ విమానం తయారు బొంబాయి శివార్లలో చనడిపాడని మనం మర్చి పోయాం .అలాగే న్యూక్లియర్ యుద్ధం ఇవాల్టి  దికాదు.  8 వేలసంవత్సరాలనాడే ఉందని గ్రంధాలు తెలిపాయి .రాజస్థాన్ లో జోధ్పూర్ కు పది మైళ్ళ పడమటి భాగాన మూడు చదరపు మైళ్ళ విస్తీర్ణం లో రేడియో యాక్టివ్ ధూళి పేరుకుని పోయి కనిపిస్తుంది .ఇక్కడ ఇళ్ళనిర్మాణ౦  చేసే ప్రయత్నం చేసి త్రవ్వుతుంటే శాస్త్ర వేత్తలకు అక్కడ అతి పురాతన నగర శిధిలాలు ,వేలాది సంవత్సరాలక్రితం అణు విస్ఫోటనం  8 వేలనుంచి 12 వేల ఏళ్ళ కిందట జరిగి వేలాది ఇళ్ళను సుమారు అరమిలియన్ జనాభాను కబళింఛి  నట్లు దాఖలాలు కనిపించాయి .ఇక్కడ వేసిన న్యూక్లియర్ బాంబ్  1945 లో జపాన్ పై వేసిన బాంబ్ పరిమాణం లో ఉండి ఉంటుందని నిర్ణయించారు .

మన పురాణ ఇతిహాసాలలో విమానాలు అంతరిక్ష నౌకల ప్రస్తావన ఉండనే ఉంది .డబల్ డెకర్ సిలిండ్రికల్ విమానం రామాయణకాలం నాటిదే.అది వాయు వేగం తో ప్రయాణి౦చేది . విమానాలు నిలపటానికి అనువైన శాలలు ఉండేవి  .అశ్విన్ అంతరిక్ష నౌకలో చంద్రుని చేరినట్లు తెలుస్తోంది .కృష్ణుడితో యుద్ధం చేసిన సాల్వుడు సౌభ విమానం లో అదృశ్యమైతే కృష్ణుడు ధ్వనివేగం తో వెళ్ళే అస్త్రాన్ని ప్రయోగించి వాడిని చంపింట్లు మహాభారత కధనం .అత్యంత వేగం గా ప్రయాణించే విమానంలో గూర్ఖుడు ఒకే ప్రక్షేపకం (ప్రోజక్టైల్  )కల ప్రపంచం లోని శక్తి అంతా కలిసిన శక్తి కలిగిన విమానం లో  అంధక ,వ్రుషిల త్రిపురాలను దాటి పోతుంటే  పది వేల సూర్యులకాంతి ,అంతేపొగ అంతరిక్షమంతా వ్యాపించింది .అదే అదృశ్య అస్త్రం అంటే దండర్బోల్ట్ అంటే పిడుగు . అంధక వ్రుషిల  పురాలను వేలాది పురజనాలను మాడ్చి భస్మీపటలం చేసింది .సంస్కృత సంగ్రామ సూత్ర ధారగ్రంధం లో ఇలాంటి విషయాలెన్నో ఉన్నాయి.

  అశోక చక్రవర్తి ‘’రహస్య నవ మానవ సంఘం  ‘’ను అన్ని శాస్త్రాలలో పండిపోయిన విజ్నులతో ఏర్పాటు చేసివారితో పరిశోధనలు చేయించి వారి పరిశోధనా ఫలితాలను అత్యంత రహస్యంగా భద్ర పరచాడు .తాను గౌతమబుద్ధుని శిష్యుడు అహింసా  ధర్మ  వ్యాపకుడు కనుక వీటి రహస్యాలు జనాలకు తెలిస్తే వారి బుద్ధులు మారి మళ్ళీ హి౦సా వలంబకు లౌతారని  భయానక ఆయుధాలు తయారు చేసి జనుల ప్రాణాలతో ఆడుకుంటారని భయం తో అలా నిక్షిప్తం చేశాడు  .ఈ తొమ్మిది మంది తొమ్మిది గ్రంధాలు రాశారు .అందులో ఒకాయన రాసిన గ్రంధం ‘’గురుత్వాకర్షణ రహస్యాలు ‘’అందులో గ్రావిటీ కంట్రోల్ ‘’విషయం ఉన్నది .ఈ గ్రంధం ఇండియాలో లేక టిబెట్ లేక వేరొక చోట ఎక్కడైనా ఉండి ఉండచ్చునని చారిత్రకుల భావన

 1931 లో లభించిన ‘’అంశు బోధిని ‘’గ్రంధం లో గ్రహాలూ వాటి రంగు , కాంతి ,ఉష్ణం విద్యుదయస్కాంత క్షేత్ర విషయాలున్నాయి .సోలార్ రేస్ ను ఆకర్షించే యంత్రాలు తయారు చేసేవిదానాలున్నాయి .అంతరిక్షం లో సుదూర ప్రాంత గ్రహ వాసులతో మాట్లాడే విషయాలున్నాయి .ఆ గ్రహాలకు మానవులను చేరవేసే యంత్రాల తయారీ విషయాలున్నాయి . విశ్వనాధ శాస్త్రి గారితో ప్రారంభించి అంతరిక్షం లో చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాం కదా .

ఆధారం –మా అబ్బాయి శర్మ సేకరించి పంపిన ఆంగ్ల వ్యాసం .

శాస్త్రిగారి ఫోటో ,హిట్లర్ తో ఉన్న ఫోటో జత చేశాను చూడండి

  సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-18- ఉయ్యూరు

దండిభొట్ల వారి దర్జా..(విద్వాన్ సర్వత్ర పూజ్యతే.)

 

స్వగృహే పూజ్యతే మూర్ఖః  స్వగ్రామే పూజ్యతే ప్రభుః

స్వదేశే పూజ్యతే రాజా  విద్వాన్సర్వత్ర పూజ్యతే–

అంటే మూర్ఖుడిని వారి ఇంటిలోని వారే గౌరవిస్తారు ( వాని మీద ఆధార పడి బ్రతుకు తారు కనుక తప్పదుకదా ? ). గ్రామాధికారికి తన వూళ్ళోనే మర్యాద ఉంటుంది. రాజుకు తన రాజ్యంలోనే గౌరవం. కానీ విద్వత్తు ఉన్న వాడు  ప్రపంచంలో ఎక్కడైనా గౌరవింపబడుతాడని భావం. ఎంత చక్కటి నిజం!

ఇది ఎరిగిన వారు కనుకనే పండితులైన వారు తమ పాండిత్యాన్ని కాపాడుకుంటూ మర్యాదగా జీవించేవారు. బ్రాహ్మణుడైన వాడు ధనాశను వీడి తనకు లభించిన దానితో సంతృప్తిని చెంది మరునాటి గురించి కూడా ఆలోచించకుండా జీవించాలట. ఇది సనాతన బ్రాహ్మణ ధర్మం. అందువల్లనే కొందరు బ్రాహ్మణోత్తములైన పండితులు తమ పాండిత్యాన్నే నమ్ముకుని ఎవరి ఆశ్రయం కోసం పాకులాడక స్వతంత్ర ప్రవృత్తితో ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటూ రాజులనైనా లెక్కచేయకుండా మహోన్నత వ్యక్తిత్వంతో జీవించేవారు. ఇలాంటి మహాను భావులగురించి ఇంతకు ముందు పోస్టు ( డబ్బంటే చేదా..) లో చెప్పి ఉన్నాను.  ఆ టపా చదవడం కోసం
( ఇక్కడ నొక్కండి ) ఇటువంటి మహానుభావుడు మరొకరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలాకాలం క్రితం కాశీలో మహాపండితులు కాపురం ఉండేవారు. అలాంటి వారిలో మన తెలుగు వారైన దండిభొట్ల విశ్వనాథశాస్త్రి గారొకరు. వారు తెలుగు వారనే మనకు తెలుసు గాని ఎక్కడి వారో తెలియదు. వారి అత్తవారిది మాత్రం గోదావరి జిల్లాలో నేదునూరి ప్రాంతం. ఆయన తన చిన్నతనం లోనే భార్యతో కలసి కాశీ వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టారు. పిల్లా పీచూ ఎవరూ లేరు. వీరు ఏం దర్జాగా బ్రతికేరో చూడండి:

అప్పట్లో విజయనగర సంస్థానాధీశులైన ఆనందగజపతి రాజుగారు ఏడాది లో కొన్నినెలల పాటు కాశీలో ఉంటూ ఉండేవారు. స్వయంగా పండితులైన ఆనంద గజపతిగారికి సాహిత్యాభిలాష మెండుగా ఉండేది. పాండిత్య సభలు ఏర్పాటు చేసి  కాశీలోని పండితులందరినీ గౌరవిస్తూ ఉండేవారు. ఇదిగో ఇలాంటి సమయాల్లోనే దండిభొట్ల వారికీ ఆనందగజపతుల వారికీ పరిచయం ఏర్పడి స్నేహంగా వృధ్ధి చెందింది.

ఒకసారి దండిభొట్ల వారు దక్షిణ దేశం  రైల్లోవస్తూ విజయనగరంలో దిగారు. ముతక పంచె మాసిన గడ్డం పొడుగాటి లాంకోటూ ఇదీ వారి వేషం. చేతిలో సంచీ కూడా లేదు. రైలు దిగీ దిగడంతో సరాసరి రాజుగారి కోటకే వెళ్లారు. తాను రాజుగారి మిత్రుడినని అనర్గళంగా హిందీలో చెబుతున్నఈ పండితుణ్ణి నివారించడానికి అక్కడున్నఉత్తరాది సైనికులెవరూ సాహసించేలేక పోయారు. శాస్త్రిగారు నేరుగా రాజమహల్ హల్లో ప్రవేశించి కుర్చీలో కూర్చున్నారు. అక్కడకు వచ్చిన అంతరంగికుడైన పనివాడిని పిలిచి రాజుగారితో దండిభొట్ల విశ్వనాథం వచ్చేడని చెప్పమన్నారు. దానికిది సమయం కాదు బాబూ అంటూ అతడు సంశయిస్తున్నంత లోనే శాస్త్రిగారి గొంతు గుర్తు పట్టి రాజా వారు హాల్లోకి వచ్చి శాస్త్రిగారిని ఎప్పుడు వచ్చేరని అడిగితే దానికాయన తాను ఊరికే దక్షిణాదికి వెళ్ళి వద్దామని బయల్దేరాననీ ఇంతలో రైలు బరం పురం వచ్చే సరికి తన దగ్గర భంగు అయిపోయిందనీ అది విజయనగరం ప్రభువుల వద్దనే దొరుకుతుందని తెలిసి ఇటు వచ్చానని అన్నారు. రాజు గారు పాలు మిఠాయిలూ భంగూ తెప్పిస్తే ఇద్దరూ కలిసి వాటిని సేవించాక  మరికొంత భంగుని పొట్లం కట్టించి జేబులో వేసుకుని ఇక వెళ్ళి వస్తానని రాజుగారిని సెలవడిగారట. రాజుగారు నాలుగు రోజులుండి తమ ఆతిధ్యం స్వీకరించమనీ, తమ ఆస్థాన పండితుల వారింట బస చేయమని కోరితే తానెవ్వరి ఇంటా బస చేయనని రైలు స్టేషను దగ్గర మంచుకొండ వారి సత్రం చూసేనని అక్కడ ఆ రోజుకి ఉండి మరునాడు ఉదయం 10 గంటల రైల్లో వెళ్ళిపోతాననీ చెప్పారు. రాజుగారు ఆసాయంత్రం తమ ఆస్థాన పండితుల్ని పిలిచి పండితులందరూ వెళ్ళి సత్రంలో శాస్త్రిగారి దర్శనం చేసుకోమని ఆజ్ఞాపించేరు.. మరునాడు వారందరూ తమతమ శిష్యగణంతో పాటు శాస్త్రిగారిని దర్శనం చేసుకున్నారు. వారి కోరిక పై  దండిభొట్లవారు వారి శిష్యులను పరీక్ష చేసి వారిలో శేఖరం (వ్యాకరణ గ్రంథం) చదువుకుంటున్న అబ్బాయి చాలా పైకి వస్తాడనీ అయితే ఆ అబ్బాయి వేసుకున్న ఇస్తిరీ బట్టలూ షోకూ శాస్త్రానికి పనికి రావనీ అన్నారు. ( ఆ ఇస్తిరీ బట్టల అబ్బాయి మరెవరో కాదు- తరువాతి కాలంలో మహామహోపాధ్యాయ బిరుదు పొందిన రాయుడు శాస్త్రిగారే). ఆ తర్వాత వారు టిక్కట్టు కొని ఇస్తామన్నా వద్దని వారిస్తూ తమను రైల్లో టికట్టు ఎవరూ అడగరని చెబుతూ రైలెక్కి వెళ్లిపోయారు.

***

మహా వ్యాకరణ పండితులైన విశ్వనాథం గారికి  కాశీలో అనేక మైన పండిత సభల్లో రెండేసి శాలువలను కప్పేవారు. వారు సభానంతరం ఇంటికి వస్తూ వస్తూ దారిలోఇద్దరు వేద వేత్తలైన పండితులను ఇంటికి పిలుచుకు పోయి భార్యతో “ ఏమేవ్ వేదవేత్తలొచ్చారు, వీరు దేవతా స్వరూపులు. వీరికి చెరొక శాలువా ఇచ్చి నమస్కరించుకో ” అనే వారు. తమకోసం ఏనాడూ ఏదీ మిగుల్చుకోలేదు. కప్పుకోవడానికి వారికి మామూలు దుప్పట్లే గతి.

***

ఒక సారి  వారి శ్రీమతికి శివరాత్రికి కోటిపల్లి వెళ్ళాలని మనసైంది. ఆవిడ కోరిక తీర్చడం కోసం వారిద్దరూ శివరాత్రికి ఒక వారం ముందరే కాశీలో బయల్దేరి రైల్లో కాకినాడ వరకూ వచ్చారు.

( రైల్లో ఏనాడూ ఎవరూ వారిని టికట్టు అడిగే వారు కారట ) . అక్కడినుండి కోటిపల్లికి బండిమీద వెళ్ళడానికి వారి దగ్గర డబ్బులు లేక నడిచే అంచెలంచెలుగా ప్రయాణిస్తూ శివరాత్రి నాడు సూర్యోదయ సమయానికి కోటి పల్లి చేరుకున్నారు. అది శివరాత్రి పర్వదినం కావడంతో చాలారద్దీగా ఉంది, వారు భార్యను ఒడ్డునే తమ సంచీ చూసుకుంటూ ఉండమని తాను గోదావరిలో స్నానం చేసి వచ్చారు. తర్వాత ఆమెనుస్నానం చేసిరమ్మంటే ఆమె తటపటాయిస్తూ “ఎంత సేపు ములిగి రావాలి కాకి స్నానమేగా” అంది. ఆమె చూస్తున్న గోదావరి వైపు ఆయన దృష్టి సారించేసరికి  వారికి అక్కడ స్నానాలు చేస్తూ బ్రాహ్మణులందరికీ రూపాయిలు దానం చేస్తున్న ధనికులైన కమ్మవారి ఆడువారు కనిపించేరు. తమ భార్య మనోగతాన్ని గ్రహించిన వారై “ వారి లాగా దానాలివ్వడానికి డబ్బులేదనేగా నీ సందేహం. జాగ్రత్తగాఇక్కడే ఉండు ఇప్పుడే తెస్తాను”అంటూ  పిఠాపురం రాజావారు శ్రీ హరిశాస్త్రి గారింట బస చేసారని తెలుసుకుని అక్కడకు వెళ్ళారు. అప్పుడే స్నానాదులు ముగించుకుని సోమేశ్వర స్వామి దర్శనానికి బయల్దేరబోతున్న రాజు గారు వీరినిచూసి ఆగారు. కుశల ప్రశ్నలయేక ఏమిటిలా దయచేశారని రాజుగారడిగితే తాను భార్యాసమేతంగా సోమేశ్వరస్వామి దర్శనానికని ఆవూరు వచ్చాననీ తన భార్య బ్రాహ్మణులకి దానాలివ్వడానికి కొంత సొమ్ము అవసరమై వచ్చాననీ చెప్పారు శాస్త్రిగారు. రాజుగారు వెంటనే ఒక వెండి పళ్ళెంనిండా రూపాయిలు పోయించి తెప్పించి స్వీకరించమన్నారు.. శాస్త్రిగారు రెండు గుప్పిళ్లనిండా రూపాయిలు తీసుకుని అవి చాలని వెళ్ళివస్తానని అన్నారు.. రాజు గారు “ అలాక్కాదు గుడిలో చాలా రద్దీగా ఉంది. మీరు స్నానాలు ముగించుకుని సతీ సమేతంగా వస్తే మాతో తీసుకు వెళ్ళి శీఘ్ర దర్శనం చేయిస్తా” మని అన్నారు. దానికి శాస్త్రిగారు అక్కర లేదనీ తాము అంతకంటే రద్దీలో కాశీలో దర్శనాలు చేసుకున్నామని చెప్పి సెలవుతీసుకుని  గోదావరి ఒడ్డుకు వెళ్ళి ఆ రూపాయిలు తనభార్య చేతిలో పోసి అందులో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా దానం చేసేయమన్నారు.

****

 

అయ్యా ఇదీ దండిబొట్ల వారి కథ. ఇందులో ఏం పెద్ద విశేషముందని ఈ కథ చెప్పావయ్యా అని ఎవరైనా అని అడగొచ్చు. స్థూలదృష్టితో చూస్తే దీనిలో విశేషం కనిపించక పోవచ్చు. కానీ చేతిలో దమ్మిడీ లేనప్పుడు అనాయాచితంగా అంత ధనం వస్తుంటే తీసుకోకుండా ఉండగలగడం సామాన్యమైన గృహస్తులకు సాధ్యపడే విషయం కాదు. చేతిలో ఏ సొమ్మూ లేకుండా తీర్థ యాత్రకి పత్నీ సమేతంగా బయలు దేరడానికి ఎవ్వరైనా సాహసించగలరా? శాస్త్రిగారు శాలువలు స్వీకరించినా రూపాయిలు తీసుకున్నా అవి ఇతరులకివ్వడానికే గాని తనకోసం ఏమీ తీసుకోలేదు.

మన పెద్దలు ఏమన్నారంటే—

సద్యో దదాతి చతురః సద్యో నాస్తీతి చతురతమః

అంటే (అడగ్గానే) ఆలస్యం చేయకుండా (ధనం) ఇచ్చేవాడు తెలివైన వాడైతే,

( అడక్కుండానే వచ్చే ధనాన్ని)ఆలస్యం చేయకుండానే వద్దనే వాడు అంతకన్న తెలివైన వాడు-అని భావం. ( ఇక్కడ తెలివైన వాడంటే ధర్మం తెలిసినవాడని అర్థం). మరి దండిభొట్ల వారు ఎంత గొప్ప ధర్మపరుడు ? నప్రతిగృహీతృత్వం- అంటే ఎవరి దగ్గర నుంచీ ఏదీ ఉచితంగా తీసుకోరాదన్నది మనధర్మమని ఇదివరకే చెప్పి ఉన్నాను కదా? దానిని తూ.చ. తప్పకుండా పాటించిన మహాను భావుల్లో దండిభొట్ల వారు కూడా ఒకరన్నమాట. అదీ ఆయన దర్జా.

***

ఇక్కడితో ఆపేస్తే నా ఈ వ్యాసం ఉద్దేశం పూర్తి గా నెరవేరినట్లుకాదు. ఇటువంటి ధర్మ వర్తనుల సహధర్మచారిణులు కూడా ఎన్ని కష్టాలనోర్చుకుని వారు కూడా తమ సహచరుల ధర్మ దీక్షాయజ్ఞంలో పాలు పంచుకున్నారో మనం తెలుసుకుని వారికీ మన జోహార్లు పలకాలి. ఎంతో కొంత ధనాశని చంపుకుని జీవితాలను గడుపుకుంటే మనంకూడా మన పాఠాలను నేర్చుకున్నట్లే.

( ఈ విషయాలను గ్రంథస్థం చేసి వెలుగులోకి తెచ్చిన శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారికి కృతజ్ఞతలతో—సెలవు.)

 

ref: http://apuroopam.blogspot.in/2012/07/blog-post_13.html

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 51-సంస్కృత  భాష్య కర్త –అ౦పల్లూర్ శ్రీధరన్ (1928 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

51-సంస్కృత  భాష్య కర్త –అ౦పల్లూర్ శ్రీధరన్ (1928 )

16-8-19 28 కేరళ అమ్పల్లూర్ లో జన్మించిన అమ్పల్లూర్ శ్రీధరన్ కావ్య భూషణ .సంస్కృత భాష్యం పాశ్చాత్య దర్శన గ్రంధః రాశాడు .కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ను సంస్క్రుతీకరించాడు .

52-కృష్ణ యజుర్వేద ,కర్మకాండ లస్పెషలిస్ట్ –రాజగోపాలన్ అనంతాచార్య (1940 )

30-11- 1940 తమిళనాడు తంజావూర్ జిల్లా తెరాజుందూర్ లో  జన్మించిన రాజగోపాలన్ అనంతాచార్య ఆర్ కృష్ణ స్వామి అయ్యంగార్ ,కేకే యమునాచార్య వద్ద వేద విద్య నేర్చాడు .తిరుమల తిరుపతి దేవాలయ సలహాదారు .కృష్ణ యజుర్వేద,కర్మకా౦డ నిష్ణాతుడు .

53-కాళిదాస స్పెషలిస్ట్ –అనంత రంగా చార్య (1920 )

వేదాంత విద్వత్ ,సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.కర్ణాటకలో మైసూర్ లో 15-2-1920 జననం .మహారాజా సంస్కృత కాలేజ్ ప్రిన్సిపాల్ చేశారు .సంస్కృతం కన్నడ భాషలలో 75 గ్రంధాలు రచించారు .విశిష్టాద్వైత వేదాంతం ,వేద ,ఉపనిషత్ సాహిత్యాలలో ప్రత్యెక కృషి చేశాడు .జిల్లా విద్యాశాఖాధికారి గా ,కర్నాటక రాష్ట్ర లలిత సాహిత్య సంగీత నాటక అకాడేమి సేక్రేటరిగా  భారతీయ విద్యాభవన్ గౌరవ రిజిస్ట్రార్ గా అమూల్య సేవలు అందించాడు .దేశమంతా పర్యటించి వేద ,ఉపనిషత్ దర్శన కాళిదాస సాహిత్య విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు .ఈయన సాహితీ సేవకు రాష్ట్ర పతి పురస్కారం అందుకున్నాడు .

54-శ్రీ తిలక యశోర్నవః –కర్త –మాధవ్ శ్రీహరి  ఆనే (1880-1968 )

1880 లో మహారాష్ట్ర పూనాలో జన్మించిన మాధవ్ శ్రీహరి ఆనే మహారాష్ట్ర విద్యా పీఠం వైస్ చాన్సలర్ చేశాడు .శ్రీ తిలక యశోర్నవః అనే ఒకే ఒక్క సంస్కృత గ్రంధం రాశాడు .88 ఏళ్ళు నిండు జీవితం అనుభవించి 1968 లో మరణించాడు .ఈయన విద్వత్తును గుర్తించి కేంద్ర  ప్రభుత్వం పద్మ విభూషణ పురస్కారం అందజేసింది

55 –చపల శతకకర్త – అంజు రాణి(1980 )

సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.అంజు రాణి 15-1-19 80 గడ్వాల్ లోని చమోలీ లో జన్మించింది . రేలాయాత్ర ,చపల శతకం రాసింది .ఇంతకంటే వివరాలు తెలియలేదు .

  సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -18-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హోసూర్ జానపద గాథా షడ్వింశతిశతి –దణి

హోసూర్ జానపద గాథా షడ్వింశతిశతి  –దణి

హోసూర్ తెలుగు జానపదుల గుండె చప్పుళ్ళ కమనీయ పాటల కతలే 20 17 లో  ‘’దణి’’గా ప్రతిధ్వనించి మనగుండెలను తాకాయి . తాను విన్నా ,కన్నా ,చేర్చిన ,కూర్చిన పాటలకు మినీకథానికా స్వరూపాన్ని అందంగా అమర్చి శ్రీ అగరం వసంత్ అందించిన మరొక హోసూరు సాహితీ ముత్యాలహారం .ఆయన క్లినిక్ లో రోగుల రోగాలనే చూస్తాడో, వారి బాధలనే వింటాడో ,లేక వారు పాడే జానపద పాటల కతలే వింటాడో అర్ధం కాదు .విన్న ప్రతిదానికీ అక్షర రూపం సంతరించే సాహితీ మాంత్రికుడు డాక్టర్ వసంత్.అక్కడి ఆటా పాటల్లో ,గుళ్ళల్లో ,పందిళ్ళ ల్లో ,ముసలివారి అనుభవ సారం లో ,పల్లె పడుచుల ,పడుచుగాళ్ళ సింగార కతల్లో,వేదనాభరిత చరితల్లో ,ఒక్కోసారి ఆశువుగా వినిపించే పాటల్లో ,భోజనాల వేళల్లో ,విహారాలలో ,జాతర్లలో,ఘర్షణల్లో ,అత్త ఆరళ్ళల్లో, కొంటె కోడలి చమత్కారాల్లో జాలువారి తరతరాలుగా జానపదుల నోళ్ళల్లో నాని నాని మధురమై వినిపించినవే ఈ పాటలు .వీటిని అత్యంత శ్రద్ధగా రికార్డ్ చేయించి శాశ్వతం చేశాడు వసంత్.తర్వాత పుస్తకరూపం గా తెచ్చి జానపద సరస్వతి కి కంఠా భరణంగా కూర్చాడు .అతను తిండి తింటాడో లేదో ,కునుకు తీస్తాడో లేదో తెలీదు . అతని మనసు నిండా, బుర్ర నిండా ఆ ప్రాంతపు మట్టి వాసనలే గుబాళిస్తాయి ..వాటినే పొందికగా కూర్చి ఇదివరకూ చాలా అందించాడు . ఇప్పుడు ఈ’’ దణి’’ గా ధ్వనింప జేయించాడు .హాట్స్ ఆఫ్ డాక్టర్ వసంత్.నిన్ను చూసి తెలుగు తల్లి మురిసిపోయి పులకిస్తుంది .వసంత్ చేసే ఈ జానపద సేవ ఎక్కడ తెలుగువారున్నా  వారందరికీ మార్గదర్శకమే .వారూ తమప్రాంత పాటలకు కతల రూపమిచ్చి వ్యాప్తి చెందించే ఆలోచన కల్గించాడు వసంత స్వామి . ఇందులో తెలుగు తమిళ కన్నడ భాషల కలయిక పాట కూడా ఒకటి ఉంది .ఈ దణిలోని కొన్ని ఇంపైన సొంపైన ధ్వనులను పరిచయం చేస్తాను .దణి అంటే ధ్వని ,పలుకు ,శబ్దం అని అర్ధం .

హోసూర్ ప్రాంతం లో మనిషి పుట్టినా ,చచ్చినా పాటే . బతుక్కి పాటకీ అంతటి సంబంధం ఉందిక్కడ .బహుశా అన్ని ప్రాంతాలలోనూ ఇలానే ఉంటుంది .దీన్ని పట్టించుకుని సాహితీ పంట పండించుకున్నారు మాత్రం వీరు .ఇక్కడ తరచుగా వినిపించేది జేజి పాట .-‘’జేజమ్మ జేజి –మహిమల జేజి మా వూరు జేజి మహిమలా జేజి ‘’.ఒకత్త కోడలుపై సాడీలు కొడుక్కి చెప్పి వాడి బుర్రతిని ఇద్దరికీ కానీకుండా చేసి చివరికి కొ౦పలోంచి నేట్టేయిస్తుంటే  .మోకాల్లో ఉన్న వాడి మెదడు బల్బు ఎప్పుడో వెలిగి పెండ్లామును తీసుకోనేచ్చుందుకు  ఎప్పుడోస్తావని  బతిమాలితే ఆమె గడుసుగా ‘’ఉడకేసిన ఉలవలు మొలకెత్తినబుడు మొగడా’’అన్నదట.పనికీ కులానికి సంబంధమున్న రోజుల్లో ఒక అవ్వను ‘’ఏ పనీ చేయ్యని వాడిది ఏకులం ?అని అడిగితె ‘’పెద్దకులమప్పా ‘’అందట.మరో పాటలో ‘’గోలు గొలున ఏడ్సు కొని గౌరమ్మ –చిలకవన్నే చీర చించి  కాకికాలితో అమ్మకు కమ్మ పంపినాదట .’’తిరుపతి దేవుణ్ణి గూర్చి ‘’నాలుగు స్తంబాలపై దేవస్తానమున్నది-నల్లని వాడు అదినారాయణుడు –తెర లోపల ఉన్నాడు తెల్లనామాల వాడు ‘’అని ‘’కటాక్షించు తిరుపతి వెంకటా చలపతి ‘’అని ముక్తాయిస్తారు .’’మామిడి వనము తిరిగే టప్పుడు,మామకు సేవలు చేసే తబుడు –ఒకసారి రామా అనరాదా ?ఓ వెర్రి మనసా –తులసి వనము తిరిగేటప్పుడు ,అత్తకు మామకు మొక్కేతబుడు ఒక సారి రామా అనరాదా ‘’అని హితవు పాటలో అనుక్షణ హరి స్మరణ అవసరం తెలియ జేస్తుంది . నెల పై పడి ఉన్న జటాయువు ను చూసి ‘’లే-పక్షీ ‘’అన్న చోటే లేపాక్షి .తెలుగులో అన్నాడుకనుక రాముడు తెలుగు వాడే అనే ధర్మ సందేహం తీర్చుకున్నాడోక జానపదుడు .’’తాగుతా నీ యబ్బ తాగుతా –నీసోమ్ముతాగుతా నా సొమ్ము తాగుతా –దేవేంద్రుడు తాగినాడు –దేవలోకమేలినాడు –కాళిదాసు తాగినాడు –కావ్యాలెన్నో రాసినాడు –రామదాసు తాగినాడు తత్వాలెన్నో రాసినాడు ‘’అంటూ ఒక తాగుమోతు తన గుణాలన్నీ పై పెద్దోళ్ళకు అంటగట్టాడు .’

‘’ఆవక్కుండేది బరుగూరు –ఈ పక్కుండేది లక్కూరు –నట్టనడమ గంగమ్మ తల్లికి నిత్యపూజలు ‘’అనే అవ్వ పాటలో బరుగూరు తమిళనాడులో ,లక్కూరు కర్నాటక లో ఉంది.ఈ రెంటికీ లంకె ఏమిటని అడిగిన బస్తీ యువకుడికి ‘’రాజా ఇలాకా అయినా కు౦ఫిణీ ఇలాకా అయినా మన తెలుగు వాళ్ళదే పెద్ద గుంపు .అప్పుడు తెలుగు బాస బాగా ఎలిగే .మనకర్మ 1953 లో ఆంధ్రావోల్లు మాకు రాజ్జెం కావాలని అ౦గలార్సి ,సిక్కిందే సాలని బొక్కేసి మల్ని నడి ఈదిలో పారేసి పోయి౦ డ్రప్పా’’అని ఫ్లాష్ బాక్ కత చెప్పింది . ఎంగిలిపాట –‘’ఎంగిలి ఎంగిలి అని ఎగ్గు పడుదురు జనులు –ఎంగిలి ఎంగిలి నారాయణా –ఈ జగమంత ఎవురెంగిలి ?నీళ్ళు తాగుదామని బెమసి ఏటికి పొతే –ఎటంతా ఎనుము ఎంగిలి –పువ్వులు తెస్తామని తోటకి పొతే పువ్వంతా పురుగు ఎంగిలి ‘’అని మన బాలమురళి గారి తత్వాల పాట బాణీ ‘’గంగ ఉదకము దెచ్చిశుద్ధిగా పూజ్జేద్దమంటే గంగలోని చేపకప్పా లెంగిలంటు న్నాయి శివా ‘’ వినిపిస్తుంది .’’మూడు నామాల వాడ –ముద్దూ వెంకట రమణ –ఏడు కొండలవాడా యేడ నున్నావు –వచ్చే తబుడు మీ వాళ్ళు ,పోయే తబుడు నా వాళ్ళంటివి-చెయ్యి పట్టిన ఆలికి చెండు మల్లె లిస్తివి –కూడిన లంజికి మల్లె మొగ్గ లిస్తివి ‘’పాట అర్ధం తెలిస్తే బుర్ర తిరిగి పోతుంది .ఏడు కొండలాయనకి కొండమీద ఒక పెండ్లాం కొండ దిగువ బీబీ  నాంచారి మరో పెళ్ళాం అని మనకు తెలుసు .’’ఇలా చేశావేంటి మొగడా’’అని నాంచారి నిలదీస్తే లౌక్యంగా ‘’కొండకి నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు నీ వాళ్ళు .కొండ దిగి వచ్చే వెళ్ళే వాళ్ళు  నా వాళ్ళు ‘’అని తొకరా మాట చెప్పి ఊరడించాడు నామాల సామీ .దీని భావమేమి తిరుమలేశా అంటే –కొండ ఎక్కే టప్పుడు అందరూ గడ్డాలు మీసాలతో ,పెరిగిన పొడవైన జుట్టుతో మొక్కు బడి తీర్చుకోవటానికి  వెళ్ళే వారందరూ  ‘’బూబమ్మ అంటే బేబీ నాచారి బంధువులు’’ అని ,కొండమీద మొక్కు తీర్చుకుని గుండు కొట్టించుకుని నామాలు పెట్టించుకుని దిగి వచ్చేవాళ్ళంతా సామి బంధువులు ‘’అని అర్ధం .

తెలుగు తమిళ,కన్నడాలున్నపాట –‘’అచ్చమూరింది బండి –అరికల్ పోన బండి –తచ్చణ౦ తయ్యారే బండి –నీ రంగం తంగం రైలు మోటారే బండి –పున్గనూరికే పోరే మగళే పువ్వులగందం వాంగ మగళే-గుడియాతం పోరే మగళే-పువ్వుల గందం వాన్గా మగళే’’. ఇందులో పోరే, తమిళపద౦ –పోవే అని అర్ధం .మగళే-కన్నడపదం- బిడ్డా కూతురా అని అర్ధం  .వాన్గా తమిళపదం అర్ధం –తీసుకో ,కొనుక్కో .మరో నీతిపాట –‘’నీవు పోయే దోవల బ్రామ్ములు ఉంటారు –బ్రామ్ముల మోసాలకు నువ్వు చిక్కొద్దు సామీ –నీవు పోయే దోవల లంజేలుంటారు –లంజెల మోసాలకీ నువ్వు మోసపోవద్దు సామీ ‘’అనే పాటలో మోసాలు చేయటానికి బ్రాహ్మలైనా ,లంజే అయినా ఒకటే .మోసాలేపుడూ మోసాలే మోస్తాయి మంచిని కాయవు .’’రాగులు మలిసిండ రాతి మీద పెట్టి –యేమని పాడుదును రాతి బసవన్న –తల్లి తండ్రిని పాడు తనూరిని పాడు –అన్నదమ్ములపాడు ,అందరిని పాడు ‘’అని ‘’న్యాక్ ‘’అంటే బుద్ధిచేప్పింది .

చివరికి మంగళ హారతి పాటతో ఆపేస్తాను –వేప కొమ్మలే ఎత్తైన మేడలే ఏ దిక్కు చూసినా పంజిరాలే –వజ్రాల వనములో నిలసిండే తొలసమ్మ నీకు హారతి –జయమంగళ ,నీకు శుభ మంగళ ‘’.

శాలివాహన గాదా సప్త శతి లాగా ఈ హోసూరు జానపద పాటల నాధారంగా చిక్కని చక్కని కతల తో ‘’దణి’’ అలరారింది .ఆనందాన్నిచ్చింది .ముసిముసి నవ్వులతోపాటు బాగా పగల లబడి నవ్వే పాటల కతలూ ఉన్నాయి .చేతికి  అందించాడు వసంత్ .ఆస్వాదించటం మనవంతు .మరిన్ని అర్ధవంతమైన రచనలు హోసూరు తెలుగు వారినుండి ,ముఖ్యంగా డా ,వసంత్ కలం నుండి జాలువారాలని కోరుతున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-18 –ఉయ్యూరు

 

 

.

— 

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 41-తర్క సంగ్రహ కర్త –బీనా అగర్వాల్ (1959 )

20 రోజుల్లో (29-12-17 నుండి 17-1-18 వరకు )గీర్వాణం -4 అర్ధ శతం పూర్తయింది అని తెలియజేయటానికి సంతోషంగా ఉన్నది -దుర్గాప్రసాద్ 

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4

41-తర్క సంగ్రహ కర్త –బీనా అగర్వాల్ (1959 )

1-1-1959 జన్మించిన బీనా అగర్వాల్ సంస్కృత ఎం ఏ పి హెచ్ డి.రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటీ సంస్కృత ప్రోఫెసర్ .తర్క సంగ్రహం ,నాట్య శాస్త్రం (రసోధ్యాయం )సంస్కృతం లోను  సంస్కృత  సాహిత్య కా ప్రాచీన ఔర్ అర్వాచీన ఇతిహాస ను హిందీ లో రచించారు .

42-వైదిక అర్ధ వ్యవస్థ కర్త –మహావీర్ అగర్వాల్ –(1951 )

మహారాష్ట్ర పాల సహన్ లో 9-10-1951 జన్మించిన మహావీర్ అగర్వాల్ వ్యాకరణం లో ఎం ఏ ,డి లిట్.ఉత్తరాంచల్ సంస్కృత అకాడెమీ వైస్ ప్రెసిడెంట్ .వైదిక అర్ధ వ్యవస్థ ,సంస్కృత గద్య లతిక ,రుక్ సూత్ర సౌరభం గీర్వాణం లోను హిందీలో వాల్మీకి రామాయణ మే రస విమర్శ రాశాడు .

43- పాణిని కాలీన భరత వర్ష కర్త –వాసుదేవ శరణ అగర్వాల్ (20 వ శతాబ్ది )

చరిత్రలో ఎం ఏ .డి.లిట్ .కాశీ భారతీ కాలేజ్ ప్రిన్సిపాల్ .సెంట్రల్ ఏషియన్ ఆన్టిక్విటీస్ డైరెక్టర్ .మధురలోని కర్జన్ మ్యూజియం క్యురేటర్ .ఉత్తర ప్రదేశ్ లో జన్మించినట్లు భావించాలి .అంతకంటే జనన వివరాలు తెలియదు .20 వ శతాబ్ది వాడు. 10 గ్రంథాలు రాశాడు. అందులో –పాణిని కాలీన భరత వర్ష ,పద్మావత ,పృధ్వీ పుత్ర,గీతా నవనీతం ,గుప్తా ఆర్ట్ ముఖ్యమైనవి .

44- సంస్కృత సామెతల నిఘంటు కర్త –రఘునాద్ ఐరి (1935 )

సంస్కృతం లో ఎం ఏ హిందీలో ప్రభాకర్ డిగ్రీ పొందిన రఘునాద్ ఐరి 1935 లో మే 1 న పంజాబ్ లో హోషియార్ పూర్ లో జన్మించాడు .సంస్కృత విద్యా భూషణ్ ,పిహెచ్ డి.హర్యానా విద్యా వ్యవస్థలో  ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .పండిత పరమేశ్వరానంద శాస్త్రి డా శ్రీ ధర్మానంద శాస్త్రి ల వద్ద చదివాడు .10 గ్రంథాలు రచించాడు .అందులో సంస్కృతం లోని సామెతలు జాతీయాల నిఘంటు నిర్మాణం ముఖ్యమైనది .కాన్సెప్ట్ ఆఫ్ సరస్వతి ఇన్ వేదిక్ ఇతిహాస అండ్ పౌరాణిక్ లిటరేచర్ ,ఆన్నోటేటేడ్ బిబ్లియాగ్రఫీ ఆఫ్ పాప్యులర్ బుక్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిటెన్ ఇన్ సంస్కృత ,స్టడీస్ ఇన్ వేదిక్ సాంస్క్రిట్ లిటరేచర్ మొదలైనవి .

45-దేవ రాజ లేఖామాల కర్త –అజిత కుమార్ (19 50 )

వ్యాకరణ సాహిత్యా చార్య అజిత కుమార15-7-1950 ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా దిన్దావాలి లో జన్మించాడు .భగవాన్ మహా వీర్ సంస్కృత విద్యా పీఠంలో ఉపాధ్యాయుడు .దేవరాజ లేఖా మాల అనే ఒక్క గరందాన్నిమాత్రమే సంస్కృతం లో రచించాడు.

46-అప్పా శాస్త్రి సాహిత్య సమీక్ష కర్త –అక్లుజ్ కర్ అశోక్ (1941 )

6-11-1941 మహారాష్ట్ర పండరీ పురం లో జన్మించిన అక్లుజ్ కర్ అశోక్ –బ్రిటిష్ కొలంబియా యాన్కోవార్ బి సి కెనడా ప్రొఫెసర్ .’’మారాహి మాటి ‘సమీక్ష ,అప్పాశాస్త్రి సాహిత్య సమీక్ష ,సంస్కృతం లోను ,ఇంట్ర డక్షన్ టు యాన్ ఎంచాన్టింగ్ లాంగ్వేజ్ ,ధీరీ ఆఫ్ నిపాతాస్ ఇన్ యాస్కాస్ నిరుక్త మొదలైన 10 పుస్తకాలు రాశాడు .

47 –దేవ ప్రశస్తి కావ్య కర్త –వీరేంద్ర కుమార్ అలంకార (1962  ) ,

సంస్కృతం వేద సాహిత్యం ఎం ఏ ఎం ఫైల్ ,సాహిత్యం లో ఆచార్య ,రష్యన్ ,ప్రాకృతాలలో అడ్వాన్సేడ్ డిప్లొమా ,పిహెచ్ డి ,డి లిట్ సాధించిన వీరేంద్ర కుమార్ అలంకార 15-10-1962 లో జన్మించాడు .పంజాబ్ సంస్కృత   యూని వర్సిటి సంస్కృత ప్రోఫెసర్ ,,చైర్ పర్సన్ ..16 గ్రంథాలు రచించాడు .ముఖ్యమైనవి-పాలిప్ప దీపిక ,మీమాంస దర్శన (తర్క అధ్యాయం ),దేవ ప్రశస్తి కావ్యం ,భారతీ కావ్యం ,మానవామూల్య విశ్వ కోశం .సంస్కృతం వేదం వ్యాకరణం వేదాంతాలలో   నిష్ణాతుడు.  మహాకవి గా లబ్ధ ప్రతి స్టుడు.మహాకవి బాణభట్ట పురస్కార గ్రహీత .

48-శంకర యోగ వివరణ కర్త –వేదవ్రత అలోక్ (1938 )’

అస్ట కోపాధ్యాయ ,ఆచార్య ,సంస్కృత ఎం ఏ పి హెచ్ డి,లింగ్విస్టిక్స్  లో  డిప్లొమా పొందిన వేదవ్రత అలోక్ 1938 జులై 20 న పాత ఢిల్లీ సీతారాం బజార్ లో జన్మించాడు .కాలేజి టీచర్ గా రిటైరయ్యాడు .ఈయన గురు పరంపరలో స్వామి దయానంద సరస్వతి ఆశ్రమ పరంపర ,స్వామి శ్రీ యోగీశ వరానంద సరస్వతి ,స్వామి సచ్చిదానంద యోగి వంటి మహానుభావులున్నారు .ముఖ్య శిష్యుడు డా దేవ శర్మ .5 గ్రంథాలు రాశాడు.ప్రణవ యోగ ,ప్రణవ యోగ సార ,శంకర యోగ వివరణ ,ముద్రా ప్రాణ యోగ తోపాటు ,ఫిలాసఫీ అండ్ ప్రాక్టీస్ ,ప్రాణయోగ ప్రాక్టీసెస్ ఉన్నాయి .న్యూజిలాండ్ సింగపూర్ ఆస్ట్రేలియాలను సందర్శించాడు .

49-పాళీ భాషా శాస్త్రవేత్త –అమృత రాజ్ రాహుల్ (1982 )

పాళీ భాష లో ఎం ఏ .NET,JRF,పి హెచ్ డి అయిన అమృత రాజ్ రాహుల్ 5-1-1982 బీహార్ లో    గోపాల్ గంజ్ లో జన్మించాడు .లక్నో సంస్కృత సంస్థాన్ లో పాళీ భాష ఆచార్యుడు .గురువు ప్రోఫెసర్ బిమలేంద్ర కుమార్ .8 మంది ప్రముఖ శిష్యులున్నారు .పాళీ భాషలో ఈ నాటి మేటి భాషా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు .

50-మహా సంస్కృత పండితుడు –కమలానంద్ (1942 )

18-10-1942 లాహోర్ లో జన్మించిన కమలానంద్ సంస్కృత ఎం ఏ పిహెచ్ డి,డి.లిట్.హోషియార్పూర్ లోని విశ్వేశ్వరానంద వేదిక్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ఆనరరి ప్రోఫెసర్ .విశ్వ సంస్కృతం ,విశ్వ జ్యోతి సంస్కృత మాసపత్రికల సంపాదకుడు .సంస్కృతం లో నాలుగు గ్రంధాలు ,50 కి పైగా పరిశోధనా వ్యాసాలూ రాశాడు .కెనడా నుండి రామకృష్ణ అవార్డ్ , శిరోమణి , సంస్కృత సాహిత్యకార్ పురస్కారాలను పంజాబ్ ప్రభుత్వం నుండి అందుకున్నాడు .రాష్ట్రపతి పురస్కారాన్ని సంస్కృత సేవ కు పొందాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్- 17-1-18 –ఉయ్యూరు

 

 

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈ యేటి” సంకురేత్రి స్పెషల్  పందాలు” 

ఈ యేటి” సంకురేత్రి స్పెషల్  పందాలు”

1-ఢిల్లీ లోఘనత వహించిన  సుప్రీం సి . జె.  కు అసమ్మతి జస్టిస్ లకూ రమ్యమైన రసకందాయ విమర్శానాస్త్ర పోటీలు  .
2- ”అజ్ఞాత వాసి”కి ,”జై సింహా ”కు సక్సెస్ దాగుడు మూత పోటా పోటీలు
3-పవన్ కు జగన్ కు దాగుడుమూత కత్తి  కోడి పోటీలు
4-పోలవరం లో ”వరం ”కోసం గడ్కరీ ,బాబు దోబూచి సిగపట్టు పోటీలు
5-గడ్డం మోడీకి గడ్డం చంద్రన్నకు నిధుల విదిలింపు పవర్ పాయింట్ ప్రదర్శన పోటీలు
6-కాపుల కాపు కాయడం లో ముఖ్యమంత్రికి ముద్రగడకు నిరశన పోటీలు
7-నిరాశతో జగన్ ఓదార్పు కాళ్ళరుగుడు యాత్ర సూటీ  పోటీలు
8-రాబోయే రాష్ట్రాల ఎన్నికల విజయం పై ఎన్నికల మల్లయోధుడు”అమిత్  షా ”కు కాకలు తీరినా పట్టు లేని  కాంగీ లకు మల్ల యుద్ధ తూతూ పోటీలు
9-తలాక్ తగాదాలో మహిళలకు  భర్తలకు ఎడతెగని ఉత్కంఠ పోటీలు
10-వీసా పై మీసం మెలేసి కక్ష కత్తి కట్టిన అమెరికా  ”ట్ర0ప్ ”కోడికీ – ఔత్సాహ అమెరికేతర విద్యార్థి ఉద్యోగుల ”సాదు కోళ్లకు” అంతర్జాతీయ పోటీలు .
11-ఇవి కాక ఒళ్ళు గగుర్పొడిచే ”జల్లి కట్టు ”రక్త సిక్త దారుణ ఎడ్లపోటీలు
12-బెజవాడ దుర్గ గుడిలో అర్చక ,ఆరాధకుల సై  అంటే సై అనే అర్ధరాత్రి క్షుద్ర పోటీలు
13-అన్నిటికన్నా బరి తెగించి ముందే కూసిన, కాసిన రాచకీయ ”పందెం కోళ్లు ”
14-”కుల గొబ్బెమ్మల ” హోరా హోరీ పోటీ
15 -ఇన్నున్నామహిళల  నయనానందకర రంగవల్లుల ప్రదర్శన పోటీ అందరికీ ఆహ్లాద ఆనందమయ సంతృప్తి నిచ్చి పై పోటీలను మరచేట్లు చేసింది ,ఉపశమనం కల్గించింది . .
   సంక్రాంతి శుభా కాంక్షలతో
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-18 -ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సామూహిక సత్యనారాయణ వ్రతం -21-1-18 ఆదివారం 

సామూహిక సత్యనారాయణ వ్రతం -21-1-18 ఆదివారం

మాఘ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 21-1-18 ఆదివారం మాఘ శుద్ధ చతుర్థి నాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో ఉదయం 9 గం .లకు సామూహిక పాలు పొంగింపు కార్యక్రమం ,అనంతరం 9-30గం లకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వ హింప బడుతాయి .  పాల్గొనే భక్తులు   ఏ విధమైన రుసుము చెల్లించ నవసరము లేదు .కావలసిన ద్రవ్యాలను ఎవరికి వారు తెచ్చుకుంటే సరిపోతుంది .ముందుగా అర్చకస్వామిని సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవలసినది గా కోరుతున్నాం -గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త -16-1-18

Inline image 1Inline image 2

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 36-కాత్యాయన యజ్న పధ్ధతి విమర్శ కర్త –భగవాన్ లాల్ అగ్ని హోత్రి (1873-1959 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

36-కాత్యాయన యజ్న పధ్ధతి విమర్శ కర్త –భగవాన్ లాల్ అగ్ని హోత్రి (1873-1959 )

చియావా జిల్లా ఝు౦జి హూన్ లో 1873 లో జన్మించిన భగవాన్ లాల్ ఆచార్య ఋగ్వేద ,అధర్వణ వేద సాహిత్యాలలో ఆచార్య.సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.కాశీలోని ఎస్ ఎస్ వి వి లో సంస్కృత లెక్చరర్ .గురువు లక్ష్మీ శంకర ద్వివేది .శిష్య పరంపరలో తంగిరాల శ్రీ గంగాధర్ ,నాదూలాల్ పంచోలి ,భగవాన్ లాల్ పంచోలి ,నారాయణ ధూలే ,నర్మదా శంకర్ పంచోలి ,పరశురామ రాం ధోకర్కర్ మొదలైన విద్వాంసు  లున్నారు .భగవాన్ లాల్ రాసిన ఏకైక గ్రంధం –‘’కాత్యాయన యజ్నపద్దతి విమర్శ’’ .శ్రీ వల్లభ రాం సాలిగ్రాం సంగ వేద పాఠశాల నెలకొల్పి నిర్వహించాడు .1959 లో 86 వ ఏట  మరణించాడు .

37-అభినవ మనోవిజ్ఞాన కర్త –ప్రభు దయాళ్ అగ్ని హోత్రి (1914 )

వ్యాకరణాచార్య ,కావ్య తీర్ధ ,హిందీ ప్రభాకర్ ,సాహిత్య రత్న ,ఎం ఏ పిహెచ్ డి ప్రభుదయాల్ అగ్ని హోత్రి .20-7-19 14 న ఉత్తరప్రదేశ్ సహజాన్ పూర్ లో జన్మించాడు .జబల్పూర్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ .పండిట్ లక్ష్మీ నారాయణ శర్మ ,పండిట్ పరమానంద మిశ్ర ,పండిట్ శివ రత్న ద్వివేదీలు గురుపరంపర .60 గ్రంధాలు రచించాడు .అందులో ముఖ్యమైనవి –అభినవ మనో విజ్ఞానం ,అరుణిమ ,అగ్ని గర్భ ,మహాకవి కాళిదాస మొదలైనవి .

38- శ్రౌత పదార్ధ వివేచన కర్త –ప్రభు దత్త అగ్ని హోత్రి (1864-1929  )

1864 లో హర్యానాలోని ఖేడి జిల్లా సిర్సా లో జన్మించిన ప్రభుదత్త అగ్ని హోత్రి శుక్ల యజుర్వేద ,శతపథ బ్రాహ్మణ ,వ్యాకరణ ,సాంఖ్య యోగ ,కర్మకాండ లలో అద్వితీయ ప్రతిభ ఉన్నవాడు .కాశీలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి అనుబంధమైన రణవీర్ సంస్కృత పాఠశాల లెక్చరర్ .చింతామణి గుర్జార్ ,పండిట్ మూల చంద్ గుర్జార్ ,పండిట్ జగనాద శర్మ,పండిట్ అనంతరాం శాస్త్రి ,పండిట్ యుగళ్ కిషోర్ పాథక్ లవద్ద విద్య నేర్చాడు .శిష్యపరంపరలోపండిట్  భీమ సేన్ చతుర్వేది ,పండిట్ విజయ చంద్ చతుర్వేది ,పండిట్ ధర్మదత్ వేద శాస్త్రి వంటి ప్రసిద్దులున్నారు .9 గ్రంధాలు రచించాడు అందులో ముఖ్యమైనవి-శ్రౌత పదార్ధ వివేచన ,శ్రార్ధ ప్రకాశిక ,రుక్ ప్రాతిశాఖ్య ,మహా రుద్ర పధ్ధతి,జీవిత శ్రద్ధా పధ్ధతి . 1929 లో 65 వ ఏట ప్రభుదత్త అగ్ని హోత్రి’’ అగ్ని ప్రభు’’ ను చేరుకున్నాడు .1924 లో బ్రిటిష్ ప్రభుత్వం మహా మహోపాధ్యాయ బిరుదు నిచ్చి సత్కరించింది .బిర్లా కుటుంబానికి ‘’కుల గురువు ‘’గా విరాజిల్లాడు .

39-ఆగ్నేయః కర్త –రుషిరాజ్ చున్నీలాల్ అగ్ని హోత్రి (19 27 )

2-9-1927 గుజరాత్ లోని రాజ్ ఘర్ లో జన్మించిన రుషిరాజ్ చున్నీలాల్ అగ్ని హోత్రి వేదాంతం లో ఎం ఏ .కావ్యతీర్ధ .ఒకే ఒక్క గీర్వాణ గ్రంధం ‘’ఆగ్నేయః ‘’రచించాడు .

40- కారక దీపిక కర్త –శివ ప్రసాద్ అగ్ని హోత్రి (1957 )

శుక్ల యజుర్వేద నిష్ణాతుడు ,నవ్య వ్యాకరణం లో ఆచార్యుడు ,విద్యా వారిది బిరుదాంకితుడు శివ ప్రసాద్ అగ్ని హోత్రి 5-6-1957 న ఉత్తర ప్రదేశ్ లో జన్మించాడు .కాన్పూర్ డి .బి .ఎస్.పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశాడు .అభిజ్ఞాన శాకుంతలం కు ‘’శివ టీక’’, ‘’కారక దీపిక ‘’(సిద్ధాంత కౌముది ) రాశాడు .కాళిదాస సమ్మాన్ పురస్కార గ్రహీత .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-18- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 31-మార్క్సిజం మతం శాస్త్రం కర్త –అదత్ ధర్మ రాజ్ (1957 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4

31-మార్క్సిజం మతం శాస్త్రం కర్త –అదత్ ధర్మ రాజ్ (1957 )

10-4-19 5 7 జన్మించిన అదత్ ధర్మరాజ్ సంస్కృతం లో ఎం ఏ పిహెచ్ డి..కాలడి శంకరాచార్య సంస్కృత  విశ్వ విద్యాలయ సంస్కృత ప్రొఫెసర్ .25 గ్రంధాలు రాశాడు .అందులో మార్క్సిజం –భగ వద్గీతాం , మార్క్సిజం మతం శాస్త్రం,లోకాయత దర్శనం వగైరా .

32-మధుర సంస్కృతం కర్త –అధికారి హరి ప్రసాద్ (19 6 3 )

సంస్క్రతం లో పిహెచ్ డి మరియు  వారణాసి సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ .ఈయన గురు పరంపర కాశీనాద్ ,పండిట్ రాం పతి త్రిపాఠీ ,పండిట్ మహేష్ చంద్ర శర్మ ,ప్రొఫెసర్ రాధేశ్యాం ద్వివేది .హరిప్రసాద్ రచించిన నాలుగు గీర్వాణ గ్రంధాలలో మధుర సంస్కృతం ,భారతీయ తత్వ మీ మాంస ,సరళ సంస్కృతం మానవీయ జ్ఞాన విషయ సహస్రం .ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ బహుమతి ,గాండీవం సంస్కృత మేగజైన్ బహుమతి పొందాడు .

33-అద్వైత వేదాంతి స్వామి వివేకానంద కర్త –అధికారి మదన్ మోహన్ (19 54 )

కావ్య ,వ్యాకరణ స్మృతి తీర్ధ ,.న్యాయం లో ఎం ఏ .,పిహెచ్ డిఅయిన అధికారి మదన్ మోహన్ 1954 లో ఆగస్ట్ ఏడు న పశ్చిమ బెంగాల్ ఫులై లో జన్మించాడు .స౦స్కృత ,ఆంగ్ల బెంగాలీ భాషలలో 8 గ్రంధాలు రాశాడు .ఓం యోగా కాస్మోపాలిటన్ లవ్ అండ్ పీస్ ,అద్వైత వేదాంతి స్వామి వివేకానంద ,గీతామృతం ,హిడెన్ రూట్స్ ఆఫ్ లైబ్రరి క్లాసిఫికేషన్ వగైరా .వేదవ్యాకరణ న్యాయాలలో సిద్ధ హస్తుడు .

34-ద్వైత వేదాంత గ్రంధ కర్త –ఆడిగ కె శంకరనారాయణ (1962  )

సంస్కృతం లో ఎం ఏ ఎం ఫిల్,.నవ్య న్యాయ విద్వదుత్తమ ,ద్వైత వేదాంత విద్యుదుత్తమ,అలంకార విద్వత్ మధ్యమ .కర్నాటక ఉడిపిలో 6-8-19 62 జననం .పూర్ణ ప్రయాగ విద్యా పీఠ్  డిప్యూటీ డైరెక్టర్ .ద్వైత వేదాంత ,న్యాయాలపై నాలుగు గ్రంధాలు రచించాడు .సచ్చాస్త్ర విచక్షణ బిరుదు పొందాడు .1977 నుండి  ఔత్సాహిక౦గా  సంస్కృతం నేర్చుకునే వారికి సాయం తరగతులు నిర్వహిస్తున్నాడు .భారత రాష్ట్ర పతి నుండి మహర్షి బాదరాయణ వ్యాస్ సమ్మాన్ అందుకున్నాడు .

35-కాల చక్రం కర్త –లక్ష్మి సింగ్ అగర్వాల్ (19 39)

12-5-19 39 హర్యానా ఫరీదాబాద్ లో జన్మించిన లక్ష్మి సింగ్ అగర్వాల్ సంస్కృతం లో ఎం ఏ .రచనలు -కాళరాత్రి ,కాల చక్రం ,అభినవ వీణ ,శ్రీరామ రసాయనం  .హర్యానా సంస్కృత అకాడెమి  ఢిల్లీ సంస్కృత అకాడెమీ లనుండి పురస్కారాలు .

  సశేషం

  సంక్రాంతి శుభాకాంక్షలతో

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -15-1-18 –ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

14-1-18 ఆదివారం భోగినాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగ నాయకుల శాంతి కళ్యాణ మహోత్సవం చిత్రాలు -పార్ట్ -1

14-1-18 ఆదివారం భోగినాడు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ గోదా రంగ నాయకుల శాంతి కళ్యాణ మహోత్సవం చిత్రాలు -పార్ట్ -1

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీ ర్వాణం -4 26-సీమాతిక్రమణ౦ కర్త –ఆచార్య శ్రీకాంత్

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4

26-సీమాతిక్రమణ౦ కర్త –ఆచార్య శ్రీకాంత్

జననాది పూర్తి  వివరాలు లభ్యంకాని ఆచార్య శ్రీకాంత్ ఉత్తరాంచల్ లోని డెహ్రాడూన్ లో జన్మించాడు .హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ ప్రభుత్వ సంస్కృత కాలేజి లెక్చరర్ గా పని చేశాడు .సీమాతిక్రమణ౦,ప్రతాప విజయం సంస్కృతం లో రాసినట్లు తెలుస్తోంది .

27-వేద గణితాన్ని ఆధునిక గణితం తో పోల్చిన –ఆచార్య సుద్యుమ్న (1946 )

సంస్కృతం లో ఎం ఏ పిహెచ్ డి అయిన ఆచార్య సుద్యుమ్న 9-1-1946 న మధ్యప్రదేశ్ లోని సాత్నాలో జన్మించాడు .సాత్నా లోని వేదవాణి వితాన్ ఓరియెంటల్ పబ్లికేషన్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ చేశాడు.గణిత శాస్త్రం పై 10 పుస్తకాలు రచించాడు .వ్యాకరణం లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ ,ఫిజికల్ సైన్స్, వేద , వేదిక్ సైన్స్ ,పూర్వ గణితాలపై ప్రత్యెక పరిశోధన చేశాడు .ప్రాచీన శాస్త్రాల లను ఆధునిక విజ్ఞానం తో సరిపోల్చి అనేక రచనలను ఆధునికులకోసం రాసి ప్రాచీన వేద  విజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాడు .ప్రాచీన గణిత శాస్త్ర వేత్తల సిద్ధాంతాలు ,సూత్రాలను హై లైట్ చేయటమే ధ్యేయంగా ఆయన రిసెర్చ్ సాగింది .సుద్యుమ్న సాటి లేని సాహిత్య కృషికి రాష్ట్ర పతి పురస్కారం లభించింది .

28-ఉద్యోగ లహరి కర్త –ఆచార్య సూర్యనారాయణ –(1883 )

1883 లో భివానీ లోని కనోద్ లో జన్మించిన ఆచార్య సూర్య నారాయణ వ్యాకరణం లో ఆచార్య .జైపూర్ మహారాజా సంస్కృత కాలేజి లో సంస్కృత ప్రొఫెసర్ .సవాయ్ .మాన్సింగ్ లో సీనియర్ ప్రొఫెసర్ . మానవాంశ,ఉద్యోగ లహరి సంస్కృత కావ్యాలు రాశాడు .సంస్కృత రత్నాకర పత్రిక కు సంపాదకుడు .సాహిత్య భూషణ్ బిరుడుపొండాడు .

29-కర్తవ్య సా త్రి౦సిక కర్త –ఆచార్య తులసి (

రాజస్థాన్ లోని లడాను లో జన్మించిన ఆచార్య తులసి సంస్కృతం లో 8 గ్రంథాలు రాశాడు . అవే -కర్తవ్య సా త్రి౦సిక ,పంచ సూత్రం ,శిక్షా సన్నవతి మొదలైనవి .ఇంతకంటే వివరాలు తెలియలేదు .

30-పంచశతి కర్త –ఆచార్య విద్యా సాగర్ (1946 )

10-10-1946 కర్నాటక బెలగాం లో జన్మించిన ఆచార్య విద్యాసాగర్ సన్యాసం స్వీకరించాడు .మరాటీ .దర్శన ,ఇతిహాస ,మత ,సాహిత్య న్యాయ వ్యాకరణ ,సైకాలజీలలో అఖండ ప్రజ్ఞావంతుడు .అయిదు శతకాల సంపుటిగా ‘’పంచశతి ‘’రాశాడు .

సశేషం

  సంక్రాంతి శుభా కాంక్షలతో

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

14-1-18 ఆదివారం భోగినాడు ఉయ్యూరులో సంక్రాంతి ముగ్గులు ,మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ధనుర్మాస ప్రభాత పూజగా ”శాకంబరి ”(కాయ గూరలు )ప్రత్యెక పూజ

14-1-18 ఆదివారం భోగినాడు ఉయ్యూరులో సంక్రాంతి ముగ్గులు ,మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ధనుర్మాస ప్రభాత పూజగా ”శాకంబరి ”(కాయ గూరలు )ప్రత్యెక పూజ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 13-సంస్కార రచన కర్త -అభయంకర్ కమల్ శంకర్ –(1938 )

—   గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

13-సంస్కార రచన కర్త -అభయంకర్ కమల్ శంకర్ –(1938 )

15-12-1938 న మహారాష్ట్ర లో జన్మించిన అభయ౦కర్ కమల్ శంకర్ సంస్కృతం లో ఎం. ఏ., పి హెచ్ డి చేశాడు  బొంబాయ్ మహిళా విద్యా పీఠం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేశాడు .సంస్కృతం లో ఆరు గ్రంధాలు రాశారు.అందులో 1-సంస్కార రచన 2-సంస్కృత నిబంధాదర్శం3  కావ్య మీమాంస 4-హాస్య తుషారా మొదలైనవి .

14-ఉద్దవ శతకకర్త –ఆచార్య బుద్ధి వల్లభ (1936 )

వ్యాకరణం లో ఆచార్య అయిన బుద్ధివల్లభ 15-6-1936 న ఉత్తరాఖండ్ లోని  అండీ పట్టి లో జన్మించాడు .విద్యా వాచస్పతి గా వెలిగాడు .హరిద్వార్ లోని జగత్ దేవ్ సింగ్ సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేశాడు .రసకలసి,ఉద్దవ శతకం రచించాడు .

15-జైన దర్శన సార కర్త –ఆచార్య చిన్ సుఖ్ దాస్  (19 00 )

న్యాయం లో ఆచార్య,తీర్ధ డిగ్రీలు పొందిన చిన్ సుఖదాస్ 1900 లో జైపూర్ లో జన్మించాడు .జైపూర్ దిగంబర జైన సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్ చేశాడు .జైన దర్శన సార ,పావన ప్రవాహ ,భావనా వివేకః ,షోడశ కారణా భావన ,అర్హత ప్రవచన సంస్కృతం లో రచించాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి వేద విద్వత్ సభలు -”నాడా ”దొరికింది ”

సాహితీ బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు – సరసభారతి ఆధ్వర్యంలో ఉయ్యూరులో వేదవిద్వత్ సభలు ఏప్రిల్ 29, 30 ఆది సోమవారాలలో  రెండు రోజులు నిర్వహించాలని డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు కోరటం ఆ విషయం మీకు తెలియ జేయటం తిరిగింది .ఈ నెల 2 వతేదీ కెసిపి సిఇఓ గారి తో ఆ విషయం మాట్లాడాలను కొని ఫోన్ చేస్తే వారు చాలా పనులఒత్తిడిలో ఉన్నామని అనుకూలమైన తేదీ తామే ఫోన్ చేసి తెలియ జేస్తామని అన్నారు .గబ్బిట వారు 4 వ తేదీ యలమర్రు లో వేదపండితుల లిస్ట్ నమూనా ఆహ్వానపత్రం  తెచ్చి నాకు ఇచ్చి కాశీకి వెడతానన్నారు .నిన్న ఉదయం వరకు వై రెండువైపులనుంచి వార్తలేమీ రాలేదు .ఇక ఇది మనవల్లకాని  విషయ మనుకోని ఆలోచన విరమించి ఉగాదినాడు సరసభారతి వేడుకలలో నలుగురు వేదపండితులకు  సత్కారం చేసి సరి పుచ్చుకుందాం అని పించి ఈ విషయం గబ్బిట వారికి ఫోన్  చేసి చెబుదామనుకున్నా

 కానీ నిన్న ఉదయం మా దేవాలయం లో ధనుర్మాసఉదయ  పూజాదికాలు అయి ఇంటికి రాగానే కెసిపి నుండి ఫోన్ వచ్చి మధ్యాహ్నం 3 -15 కు సి యి ఓ గారితో అపాయింట్ మెంట్ ఉంది రమ్మన్నారు నేనూ మా అబ్బాయి రమణ వెళ్లాం వారు చాలా మర్యాదగా ఆహ్వానించారు మన”ద్వయం”వారికి అందజేసి సూటిగా విషయం  చెప్పాం .వారు చాలాసంతోషించి తమ ప్రాంగణం లో వేద సభలు నిర్వహించటానికి అనుమతించి ,కావలసిన ఇన్ఫ్రా  స్ట్రక్చర్ అంతా  అందజేస్తామని హామీ ఇచ్చారు . డబ్బు యెంత ఖర్చవుతుంది అంటే చెప్పాం . ఫండ్స్ ప్రయత్నించండి అన్నారు మేము నిధులు దొరికితేనే ముందుకు సాగుతాం లేకుంటే లేదు అని చెప్పాం . .దీనినే నేను ”నాడా దొరికింది ”అన్నాను ఇక గుర్రం కొనాలి .. పడకేసింది అనుకొన్నది మళ్ళీ సాగి ఆశలు చిగురించాయి .జనవరి 18 మాఘమాసం వచ్చాక మిగిన పెద్దలను కలిసి సరసభారతి కెసిపి గ్రామ పెద్దల సహకారం తో కార్య క్రమ0ఆలోచించాలి .ఇదీప్రస్తుత తాజా వార్త. .వేదమాత అనుగ్రహం ఆంజనేయస్వామి కరుణ ఎలాఉంటే అలా జరుగుతుంది -దుర్గాప్రసాద్ 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాంబశివుని ‘’శ్రీరామ తీర్థం’’

సాంబశివుని ‘’శ్రీరామ తీర్థం’’

కొన్ని పరిచయాలు చాలా ఆకస్మాత్తుగా జరుగుతాయి .సరసభారతి పుస్తకాలపై పత్రికలలో వచ్చిన వార్తలను చూసి  ఆపుస్తకాలు తమకు పంపించమనటం  నేను వెంటనే పంపటం జరుగుతూ ఇటీవలె  శ్రీ వేలమూరి నాగేశ్వరరావు ., వారబ్బాయి తో మా ఇంటికి వచ్చారు విజయనగర౦ సాహితీ పిపాసి ,సేవా దీక్షాతత్పరులు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు . వారిద్వారా పరిచయమైన ‘’విజీనగరం ‘’జిల్లా గంట్యాడ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ,కవి పండితులులు ప్రస్తుత విజయవాడ వాసి చావలి సాంబశివ సుబ్రహ్మణ్య౦ గారు .వీరు రేపల్లె గ్రంధద్వయ ఆవిష్కరణ సభకు ,విచ్చేసి  మా సత్కారానికి సంతసించి సభ జరిగిన తీరుకు పులకించి  .నూతన ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం తో భద్రాచలానికి దీటుగా భాసించిన శ్రీ రామ తీర్ధం పై ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని  తామేప్పుడో పాతిక ఏళ్ళక్రితం రచించి తిరుపతి దేవస్థానం వారి సహకారం తో ప్రచురించి ,అందరికీ ఉచితంగా అందించి తమవద్ద మిగిలిన  ఒకే ఒక్క పుస్తకాన్ని రిజిస్టర్డ్ పోస్ట్ లో నిన్న పంపితే ఇవాళ అందితే వెంటనే ఫోన్ చేసి చెప్పి అరగంటలో పూర్తిగా చదివేసి క్షేత్ర విశేషాలకు ఆశ్చర్యం పొంది ,ఆ కావ్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.

విజయనగరం జిల్లా ఒకప్పుడు కు౦భినీ పురం అని నేడు ‘’కుమిలి ‘’అని పిలువబడుతున్న గ్రామం లో దూదేకుల కులం లో జన్మించి ,పుట్టు మూగది అయిన ఒక ముసలి స్త్రీ నాలుకపై శ్రీ రాముడు మూడు బీజాక్షరాలు రాసి భక్తవరడుడై ఆమె మాట్లాడేట్లు చేశాడు.నేటి విజయనగర రాజ వంశీకుల పూర్వీకుడైన నాటి కు౦భినీ పురాధిపతి కి శ్రీరామ చంద్రుడు కలలో కనిపించి తన ఉనికిని చెప్పి ,ఆలయ పునర్నిర్మాణ౦  చేయించాడు .స్వామి ఇక్కడే ‘’వనవాస రాముని ‘’గా కొలువై భక్తులపాలిటి కొంగుబంగారం గా విరాజిల్లాడు .ఈ కధను శ్రీ సుబ్రహ్మణ్యంగారు తమ కవితా శక్తినీ ఊహాశక్తినీ జోడించి కమనీయ కావ్యం గా రచించి తమ తండ్రి ‘’శ్రీ చావలి సూర్యనారాయణ ‘’గారికి అంకితమిచ్చి పిత్రూణ౦ ,దైవ ఋణం తీర్చుకున్నారు .

ఒకప్పుడు రామ తీర్ధం బౌద్ధారామ౦గా   భక్తులకు రామ తీర్ధంగా వెలిగింది . ఆనాటి పూసపాటి సీతారామ చంద్ర రాజు ఈ క్షేత్ర దేవతా మూర్తులను ప్రతిష్టించి స్వామి భక్తీ ప్రకటించుకున్నారు .ఈ క్షేత్ర మహాత్మ్యం బ్రహ్మాండ పురాణం లో వివరంగా ఉన్నది  .యధాప్రకారం మునులు సూతమ మహర్షి ని  ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి తెలియ జేయమని అడగటం తో కధ ప్రారంభమౌతుంది .నారదుడు చెప్పినదాన్ని తాను తెలియజేస్తానని సూతుడు చెప్పి  నారదుడు బ్రహ్మను అడగటం ఆయన వివరించటం ఆ కధను మునులకు చెప్పటం జరిగింది .

ఒక సారి పుట్టు మూగ అయిన ఒక దూదేకుల ముసలిఅడవిలో తుఫానులో చిక్కుకుని దిక్కు తోచక ‘’నీవే తప్ప ఇతః పరంబెరుగ’’అని శ్రీరాముని మనసులో ప్రార్ధిస్తే ,విని హనుమతో ‘’ఆర్తనాద మొక్క డబల రోదనమందు –వినగనయ్య నీవు  వీర వర్య ‘’అని కనుక్కోమని పంపితే ,ఆయన మూగవనిత దయనీయ స్థితి చూసి రాముని వద్దకు తీసుకు వెడితే ,లక్ష్మణుడు ఆమె మూగదని అన్నకు తెలియజేస్తే ,దయాళువైన రామ చంద్ర ప్రభువు ‘’నాల్క జాపు మంచు నయముగ బల్కి ‘’దర్భతో ఆమె నాలుకపై మూడు బీజాక్షరాలు రాయగా ఆమెకు వెంటనే మాటలు వచ్చాయి .వెంటనే ‘’శ్రీరామ ఇంతకాలము –నోరారగ నిన్ను బిలువ నోపని నాకున్ –ఈ రాత్రి ఉదయమాయెను –నీరాకను వెల్గు నిండి నెమ్మాన మలరెన్ ‘’అని కృతజ్ఞతలు చెప్పుకొన్నది .ఆమె భక్తికి సంతోషించి సోదర ,సీతా సమేతంగా ఆ రాత్రి రాముడు అక్కడే ఆమె ఆతిధ్యం లో బస చేశాడు .శ్రీరామ చరిత వినిపించమని ఆమె హనుమను కోరగా రావణ వృత్తాంతం తో సహా విఅవరించాడు .

ద్వాపరం లో శ్రీ కృష్ణుడు పాండవులకు రామకధ చెప్పి శ్రీరామాదుల అర్చావతార మూర్తులను వారికి అందజేశాడు .వారందరూ రాముడిని అత్యంత భక్తీ తో సేవించారు .సంతసించిన రాముడు ధర్మరాజాదులకు ధర్మ బోధ చేస్తూ ‘’కలియుగములోన భువి ఎల్లకలుషితమయి –ధర్మమనుమాట ఎపుడును తప్పి యుండు ‘’అంటూ ‘ధర్మమార్గము తప్పవలదు ‘’అని బోధించాడు .రాముడు మూగవనిత వద్ద  వీడ్కోలు పొందగా ఆమె తన బంధువులను వెతుక్కుంటూ వెళ్లి కలుసుకొన్నది .ఆమె తుఫానులో చచ్చిపోయిందని భావించిన వాళ్లకు ఆమె కనిపించటం దైవ లీల అని పించి వివరాలు తెలుసుకొని ,మహారాజుకు ఆమె సందేశాన్ని తెలియజేయగా రాజు వేటనిమిత్తం ఇక్కడికి వచ్చి ముసలిదాన్ని చూసి ప్రశ్నించి ,రాముని వెదకి దొరకక వేసారి ఆమె పై కోపించి ,చివరికి  చేసినదానికి చింతించి వైరాగ్యం ప్రకటించగ రాముడు కలలో కనిపించి ఉనికి చెప్పగా ,రాజు అడవి వదలి కుమ్భినీపురం చేరి ,పురజనుల సంకల్పం తో మళ్ళీ అడవికి వచ్చిమట్టిలో కూరుకుపోయిన  విగ్రహాలను కనుక్కొని బయటికి తీయించి  పులకించి శ్రీరామ క్షేత్రం లో ప్రతిష్టించి దేవాలయం కట్టించాడు .అప్పటినుంచి శ్రీరామ క్షేత్రం ప్రసిద్ధ  వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లింది .ఇప్పుడు భద్రాచలానికి  బదులు నవ్యాంధ్ర ప్రదేశ్ కు  శ్రీరామ క్షేత్రం అఫీషియల్ గా అపర భద్రాద్రి అయి ప్రభుత్వ లాంచనాలతో నవమినాడు సీతారామ కల్యాణం పరమ వైభవంగా జరుగుతోంది .

ఈ కధను శ్రీ’’ చావలి’’ వారు చవులూరించే పద్యాలతో’’ సదాశివ’’నామం తో చేసిన శ్రీరామ నామ భజనగా ,’’సుబ్రహ్మణ్య స్వామి ‘’జానకీరాముల కరుణా కటాక్షాలకు దర్పణంగా రచించి కావ్య గౌరవాన్ని కల్గించి శ్రీరామ పద సేవలో ధన్యులై  శ్రీరామ క్షేత్ర వైభవాన్ని ఆస్తిక జనులకు అందుబాటులోకి తెచ్చి  చరితార్దులయ్యారు  .ఈ క్షేత్ర రాముడు మామూలు రామయ్య కాదండోయ్ –‘’పాండు సుతుల కలత బాపగా వెలసిన –రాముడితడు సుగుణ ధాముడితడు ‘’చలో శ్రీరామ క్షేత్రం .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-18- ఉయ్యూరు

 

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4  12-భక్త్యుద్బోధక పంచకం కర్త –శ్రీమాన్ కోవెల రంగాచార్య

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4

12-భక్త్యుద్బోధక పంచకం కర్త –శ్రీమాన్ కోవెల రంగాచార్య

ఆంద్ర దేశం లో జరిగే వేద విద్వత్ సభలలో తెలంగాణా ప్రాంతం నుండి శ్రీమాన్ కోవెల రంగా చార్యులుగారు ‘’యే కంఠలగ్న తులసీ నళినాక్ష మాలాః ‘’అన్నట్లుగా  విలక్షణ వైష్ణవ చిహ్నాలుకలిగి ,పాండిత్య స్పోరకమైన సింహ తలాటాలు హస్త భూషణాలుగా  ధరించి ,కంచు కంఠం తో గంభీరంగా విస్తృత ఉపన్యాసాలు చేసేవారు .ఆ సభలకు  గొప్ప ఆకర్షణగా నిలిచేవారు . వీరితోపాటు శ్రీ అమరవాది నారాయణాచార్యస్వామి గారు కూడా గంభీరోపన్యాసాలతో ఆకట్టుకునేవారు వీరిద్దరిని సూర్య చంద్రులుగా భావించేవారు .అమరవాదివారిది సంస్కృత వేదాంతం లో అందె వేసిన చేయి .కోవెలవారు తూర్పు గోదావరి జిల్లా తుని లో శ్రీ నల్లాన్ చక్రవర్తుల రంగా చార్యుల వారి వద్ద మూడేళ్ళు తర్క శాస్త్రాధ్యయనం తో సహా శ్రీ భాష్యం అభ్యసింఛి ఉభయ వేదాంత ప్రవచకులయ్యారు .

  సంస్కృత సాహిత్యం గీతాభాష్య శ్రీ భాష్యాలు కరతలామలకం అవటం తో ప్రౌఢ పాండిత్యం తో పాటు అద్భుత కవిత్వమూ అబ్బింది .గొప్ప సంస్కృత రచనలు చేసి తమ ఉభయ వేదాంత నిధి ని సార్ధకం చేసుకున్నారు .కావలసిన అధికారులు లేకపోవటం తో శ్రీ భాష్య ప్రవచనం చేయలేదు చివరికి తన కుమారు లిద్దరి కూర్చోబెట్టుకుని శ్రీభాష్య ప్రవచనం ప్రారంభించారు .అప్పటికే 75 వయసులో ఉన్నా ఎక్కడా విస్మ్రుతికాని ,పూర్వోత్తర విషయ ప్రస్తావనలో విస్పస్టత కాని తగ్గలేదట .అదీ వారి పటుతర విషయ ధారణ.

  తమ విషయ పరిజ్ఞానికి ,కవిత్వ పటుత్వానికి దీటుగా కోవేలవారు సంస్కృతం లో రచనలు’’ శాయించారు’’ .123శ్లోకాలతో రాసిన ‘’శాస్త్ర హృదయం ‘’పండితలోకాన్ని మెప్పించింది .ఇతర కృతులు వేదాంత పంచ విమ్శతి ,గీతార్ధ సంగ్రహం ,భక్త్యుద్బోధ పంచకం ,చన్నూరు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ,పర్ణశాల శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ,గోపాల విమ్శతీ ,భగవత్ప్రార్ధనా వ .120 సంవత్సరాల పూర్ణాయుర్దాయం తో జీవించి’’ ద్వి షష్టిపూర్తి ‘’ఉత్సవాలు ఘనంగా పుత్ర పౌత్రాదుల సమక్షం లో నిర్వహించుకున్న ఘనత శ్రీమాన్ కోయిల్  కందాళై రంగా చార్యుల వారిది .వీరి గ్రంధాలను ‘’కోవెల రంగాచార్య మెమోరియల్ ట్రస్ట్ ‘’వారు శ్రీ కోవెల సంపత్కుమారాచార్య శ్రీ కోవెల సుప్రసన్నాచార్య సోదర బృందం 20 05 లో ప్రచురించి లోకానికి అందించింది  .అర్ధ తాత్పర్యాలు కూడా చేరిస్తే జిజ్ఞాసులకు ఉపయుక్తంగా ఉండేది .  ఇప్పుడు కోవెలవారి గీర్వాణ కవితా కోవెల లోకి ప్రవేశిద్దాం –

1-శాస్త్ర హృదయం

1-శ్లోకం -యజ్జన్మాద్యస్య జగతః నిర్ధూతాఖిల కల్మషం –నమస్తస్మై మహానంద రూపిణే గుణ దీపినే ‘’

8- జ్ఞానాజ్ఞాన ద్వయం లోకే మోక్ష బంధైక కారణం –జ్ఞానాన్మోక్ష మథాజ్ఞానాత్ సంసార ఇతి సూత్రితం .

18- శ్రీపతిత్వం వ్యాపకత్వం నిత్యత్వ మనవద్యతా –నైర్గుణ్య౦ నిర్వికారత్వం నిరాకారత్వ మిత్యపి .

39-ఇత్యాది తత్వ మస్యా౦తకమ్ వాక్య ముద్దాలకో బ్రవీత్ –కారణత్వ నియంత్రత్వ శేషిత్వా ధారతాదికం ‘’

 సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4  5-అసమాన వైయాకరణులు –ఖండవల్లి నరసింహ శాస్త్రి (1920-1980 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

5-అసమాన వైయాకరణులు –ఖండవల్లి నరసింహ శాస్త్రి (1920-1980 )

తెలంగాణలో బిజినేపల్లి మండలం వట్టెం గ్రామం లో 1920 లో జన్మించి 60 ఏళ్ళు సార్ధక జీవనం గడిపి 1980 లో మరణించిన ఖండవల్లి నరసింహ శాస్త్రి గారు ‘’వట్టెం శాస్త్రులవారు ‘’గా సుప్రసిద్ధులు .వ్యాకరణ ,సాహిత్య న్యాయ మీమాంస జ్యోతిశాలలో అసమాన ప్రజ్ఞావంతులు హైదరాబాద్ వివేక వర్దినీ సంస్కృత కళాశాలో 30 ఏళ్ళు అధ్యాపకులుగా సేవలందించారు .హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుంచి చేసిన ‘’అమరవాణి’’ ప్రసంగాలు ప్రశస్తి చెందాయి .సంస్కృతం లో పాణినీయ వ్యాఖ్య శంకర విజయం రాశారు అనేక సంస్తానాలలో  విద్వత్ సభలలోపాల్గొని తమ అమేయ విద్వత్తు ప్రదర్శించి ప్రశంసలు బహుమతులు సత్కారాలు అందుకున్నారు . దక్షిణ భారత దేశం లో వీరి వంటి వైయాకరణులు లేరని  కీర్తి గడించారు .వీరి ప్రాసంగిక శ్లోకాలు అనేకం బహుళ వ్యాప్తి చెందాయి .

6-జ్యోతిష సిద్ధాంత ప్రదీపిక కర్త –సింగం పల్లి సీతారామ సిద్ధాంతి (1910-1970 )

జ్యోతిష సిద్ధాంత ప్రదీపిక రచించిన సింగం పల్లి సీతారామ సిద్ధాంతి గొప్ప జ్యోతిశ్శాస్త్ర పండితులుగా ప్రసిద్దులు .తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రిగారు భార్యతో సింగం పల్లె లోనే ఉండి సిద్ధాంతి గారి భావాలకు వాక్య రూపం కల్పించినట్లు భావిస్తారు .ఈ గ్రంధం గద్వాల చెన్నకేశవ ముద్రణాలయ ప్రచురణ .అనేక సంస్కృత గ్రంథాధ్యయనం చేసిన మహా పండితులు సిద్దా౦తి గారు .యజుర్వేదాది సంహితలు ,విష్ణు వాయు ,కూర్మ పద్మ పురాణాలు ,భారత భాగవతాలు ,ఆర్య భట్టీయం ,సిద్ధాంత  శిరోమణి  వీరికి కరతలామలకాలు .వయసులో తెల్కపల్లి వారికీ వీరికీ తేడా ఉన్నా ,మంచి మిత్రులు .

7-‘’రాజ యోగ ప్రభావము’’కర్త  –విక్రాల వెంకటాచార్యులు (18 90 )

వనపర్తి దగ్గర రాజానగర వాసి విక్రాల వెంకటాచార్యులు 1890 లో జన్మించారు .11 ఏళ్ళు కాశీలో వ్యాకరణ శాస్త్రాధ్యయనం చేశారు  సంస్కృతాంధ్రాలలో గొప్పకవులు పురాణ ప్రవచన ప్రసిద్ధులు .కర్నూలు వేదశాస్త్ర విద్యాలయ వ్యాకరణ అధ్యాపకులు .ఇక్కడే తెల్కపల్లి వారు వీరి శిష్యులైనారు . ఆచార్యులవారి సుప్రసిద్ధ సంస్కృత రచన ‘’రాజ యోగ ప్రభావం ‘’.

8-ప్రచండ హైడింబీయం –కర్త –గుడిమంచి సుబ్రహ్మణ్య శర్మ (1892 -1930 )

తెల్కపల్లి రామచంద్ర శాస్త్రిగారి పెదతల్లి కుమారులైన గుడి మంచి సుబ్రహ్మణ్య శర్మగారు 1892 లో జన్మించి కేవలం 38 సంవత్సరాలు మాత్రమె జీవించారు .తెలంగాణలో వనపర్తి తాలూకా శ్రీ రంగాపుర నివాసి .గద్వాల సంస్థానం లో ‘’భావ కల్పక శిరోమణి ‘’బిరుదు పొందిన కవి వరేణ్యులు .సమస్యా పూరణ సుప్రసిద్ధులు .భారత సంగ్రహం ,ప్రచండ హైడింబీయం సంస్కృత రచనలు .’’స్వైరిణీ విలాసం ‘’అనే వీరి 11 శ్లోకాల సంస్కృత ఖండిక శర్మగారి కవితా వైదుష్యానికి ప్రతీక .

9-రస నిరూపణ కర్త –పల్లా చంద్ర శేఖర శాస్త్రి (19 02-19 70 )

తెల్కపల్లి వారికి సహాధ్యాయులైన పల్లా చంద్ర శేఖర శాస్త్రి కొల్లాపురం సంస్థానం లో తర్క వేదాంత శాస్త్రజ్ఞులు .సంస్కృతం లో రసనిరూపణ౦  ,శంకరపూజ ,వినాయక నవ గ్రహార్చన విధానం రచించారు వీరి అన్నగారు రామ కృష్ణ శాస్త్రి గారు కూడా మహా గీర్వాణ విద్వాంసులు .

10-శూద్రులకు సంస్కృతం నేర్పిన –అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (1888 -1959)

61 సంవత్సరాలు మాత్రమె జీవించిన అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1888 లో జన్మించి 1959 లో మరణించారు .సంస్కృతాంధ్ర ఆంగ్ల  ఉర్దూ భాషలలో నిష్ణాతులు .1909 నుండి 1923 వరకు యాపర్ల లో ఉపాధ్యాయులుగా ఉన్నారు శూద్రులకు సంస్కృతం నేర్పి  పరీక్షించటానికి వచ్చిన జాగీర్దార్ చేత ప్రశంసలు అందుకున్నారు .వీరిపై సురవరం ప్రతాప రెడ్డి గారి ప్రభావం ఎక్కువ .

11-దుందుభి కావ్యకర్త –గంగాపురం హనుమచ్ఛర్మ (1925-1996 )

దుందుభి కావ్యకర్తగా సుప్రసిద్ధులైన గంగాపురం హనుమచ్చర్మ 1925 లో జన్మించి71 వ ఏట 1996 లో మరణించారు .వీరు  ‘’గుండూరు హనుమాండ్లు ‘’గా సుప్రసిద్ధులు .11 వ ఏట వేద విద్య నేర్చారు .14 వ ఏట చిన్నమరూరు ఇరువెంటి నరసింహ శాస్త్రి వద్ద సంస్కృత సాహిత్యం నేర్చారు .17 వ ఏట సాహిత్య శాస్త్రం ,19 వ ఏట కరివెన అగ్రహారం లో నంద్యాల మ౦కాల శాస్త్రి వద్ద పాణినీయం అభ్యసించి  జ్యోతిష ధర్మ శాస్త్రాల పారమెరిగారు .సంస్కృతం లో చెన్నకేశవ స్వామి సుప్రభాతం రాశారు.

ఆధారం –శ్రీమతి పాణ్యం మీనాకుమారి రచన ‘’తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి ‘’

సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4  4-చిట్టి రాష్ట్రానికి పోట్టిగవర్నర్ –డా .బూర్గుల రామ కృష్ణారావు(1899-1967 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

4-చిట్టి రాష్ట్రానికి పోట్టిగవర్నర్ –డా .బూర్గుల రామ కృష్ణారావు(1899-1967 )

‘’సంస్కృత శ్లోకం ,పార్సీ గజల్ ,తెలుగు పద్యం ‘’వెరసి బూర్గుల ‘’అని దాశరధి చేత కితాబు అందుకున్నవారు శ్రీ బూర్గుల రామ కృష్ణారావు .ఆ నాటి తెలంగాణా ముఖ్యమంత్రి .చిన్న రాష్ట్రం కేరళకు గవర్నర్ గా పని చేసిన పొట్టి వాడైనా గర్రి పండిత సత్కవి బూర్గుల బాల్యం లోనే సంప్రదాయ బద్ధంగా గీర్వాణ భాషను కూలంకషంగా నేర్చారు .కాలిదాసాది కవులను ఆపోసన పట్టిన మేధావి .సంస్కృతం లో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ,శ్రీశృంగ గిరి శారదా స్తుతి  ,శ్రీరామ స్తవం ,శ్రీనివాస పంచశతి రచించారు .’’పండిత రాజ మంచామృతం ‘’స్తోత్రాన్ని తెలుగులోకి అనువదించారు .వీరు లోతుగా పరిశీలించి పత్రికలో రాసిన సాహితీ వ్యాసాలూ ‘’సారస్వత వ్యాస ముక్తావళి ‘’గా వచ్చింది బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవాడు. పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమునుశంకరాచార్యుల సౌందర్యలహరికనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంశారదస్తుతిగౌరీస్తుతివాణీస్తుతిలక్ష్మీస్తుతిశ్రీకృష్ణాష్టకం, రెడ్డి రాజుల కాలం-మత సంస్కృతులు (పరిశోధనా వ్యాసం) మొదలైనవి ఆయన ఇతర రచనలు. ఈయన రచించిన వ్యాసాలు ‘సారస్వత వ్యాస ముక్తావళి’ పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, కృష్ణశతకంవేంకటేశ్వర సుప్రభాతం, నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశాడు. అనువాద రచనలు కూడా చేశాడు. వానమామలైకాళోజీదాశరథినారాయణరెడ్డి ప్రోత్సాహంతో ‘తెలంగాణ రచయితల సంఘం’ ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యాడు.

  13-3-1899 న మెహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకా పాదకల్లు లో జన్మించారు .ఇంటిపేరు’’ పుల్లంరాజు ‘’అయినా పుట్టిన గ్రామం’’ బూర్గుల’’ ఇంటిపేరుగా చలామణి  అయింది .ధర్మవంత్ లోనూ హైదరాబాద్ లోని ఎక్సేల్సియర్ హై స్కూల్ లోనూ చదివి  పూనా  ఫెర్గూసన్ కాలేజి లో బి ఏ ఆనర్స్ ,బాంబే యూని వర్సిటి నుంచి లా డిగ్రీ పొందారు .హైదరాబాద్ లో లా ప్రాక్టీస్ చేసి న్యాయ వాదిగా సుప్రసిద్దులయ్యారు .నిజాం రాష్ట్రాన్ని భారత దేశం లో విలీనం చేసే ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు .హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులు .1913 లో దేవరకొండ లో జరిగిన మూడవ ఆంద్ర మహా సభకు అధ్యక్షత వహించారు .రజాకార్ల ఉద్యమానికి ఎదురొడ్డి పోరాడిన ఘనులు .వెల్లోడి ప్రభుత్వం లో 1950 లో హైదరాబాద్ రాష్ట్ర రెవిన్యు మంత్రిగాతెలుగు సాహిత్యానికి ,హిందూ సంస్కృతీ వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు .

  రాజకీయాలలో ఉంటున్నా సాహిత్యమే ఊపిరిగా జీవించారు .1956 లో ఆంద్ర ప్రదేశ్ ఏర్పడ్డాక కేరళ గవర్నర్ అయ్యారు.ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా ఉండగా రాజ్య సభకు ఎంపికై రాజకీయాలకు స్వస్తి పలికారు .సంస్కృతం పార్సీ ఉర్దూ తెలుగు మరాటీ కన్నడ ఇంగ్లిష్ మొదలైన భాషలలో అద్వితీయులు .ఇంటర్ చదువుతుండగానే ‘’య౦గ్ మాన్ యూనియన్ ‘’స్థాపించి సాహిత్యాన్ని అందరికి అందుబాటులోకి తెచ్చారు .మాడపాటి హనుమంత రావు గారితో కలిసి రాష్ట్ర సంస్కరణలకు మార్గ దర్శి అయ్యారు .క్విట్ ఇండియా ఉద్యమం లో ప్రధాన పాత్ర పోషించి కె ఎం మున్షి అభిమానం పొంది ,నిజాం పతనం తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనంయ్యాక 1948 లో  వెల్లోడినాయకత్వం లో ఏర్పడిన మంత్రి వర్గం లో రెవెన్యు మరియు విద్యా మంత్రిగా సేవలు అందించారు .1952  సార్వత్రిక  ఎన్నికలలో  షాద్ నగర్ నుంచి ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు .హైదరాబాద్ రాష్ట్రానికి రెండున్నర శతాబ్దాలలో మొదటి ,చివరి తెలుగు ముఖ్యమంత్రి బూర్గులవారే .14-9-1967 న 68  వ ఏట సాహితీ రాజకీయ విరాట్ వామన మూర్తి  బూర్గుల రామకృష్ణారావు గారు మరణించారు  .

 ఆధారం –శ్రీమతి పాణ్యం మీనాకుమారి రచన ‘’తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి ‘’మరియు వీకీ పీడియా

 సశేషం

   గబ్బిట దుర్గాప్రసాద్ -11-1-18 – ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహితీ బంధం -కవిసమ్మేళనం కవితలు -3 (చివరిభాగం )

సాహితీ బంధం -కవిసమ్మేళనం కవితలు -3 (చివరిభాగం )

24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు -3

7- శ్రీమతి కోపూరి పుష్పాదేవి –విజయవాడ -9440766375

సాహితీ సుగంధం

అనాగారకులకు అక్షర భిక్ష పెట్టింది సాహిత్యం

మాట ,మన్నన నేర్పి –మనుజులుగా తీర్చి దిద్దింది సాహిత్యం

ఒడి దుడుకులలో తోడుగా నిలబడి –మునుముందుకు సాగించింది సాహిత్యం

అద్భుత కావ్య రాజాల నందించి –విశ్వమందు భారతావనికి

అజరామర కీర్తి నంది౦చి౦ది  సాహిత్యం

అవనిలో అద్భుతాలకు ఆలంబనమై –అచంచలసేవ చేసింది సాహిత్యం

మనిషి మనుగడకు ఉత్సాహం –మహాత్కార్యాలకు ఉత్ప్రేరకం సాహిత్యం

స్పూర్తిని రగిలిస్తూ –కీర్తిని అందిస్తూ చేస్తుంది సహవాసం

మనిషితో యెడ తగనిది సాహితీ బంధం

మరణం వరకు వెన్నంటి ఉంటుంది –ఆ తీయని సుగంధం .

8-శ్రీ విష్ణు మొలకుల భీమేశ్వర ప్రసాద్ –తెనాలి -8897659364

1-కవికుల తిలకుడు కాళిదాస కవీంద్రు –భోజ భూపాలుని భూరి కీర్తి

మన ఆదికవి యైన మహనీయ నన్నయ –రాజరాజ నరేంద్రు ప్రబల కీర్తి

కవి సార్వభౌమ విఖ్యాతుడౌ శ్రీనాధ-అనవేమ భూ విభు అమలకీర్తి

ఆంద్ర భోజు౦డైన ఆ కృష్ణరాయని –అష్ట దిగ్విజపు విశిష్ట కీర్తి

అవని సుస్థిర విఖ్యాతి యలరె గాదె –రవి సుధాకర కిరణాల గ్రాలనాడు

కనగ సాహితీ బంధము కతన గాదె –అక్షరంబంది సత్యంబు ఆక్షయముగ.

2-ఏనాడు మలగని యెన లేని జ్ఞాన దీ-పంబులవెలిగించు పసిడి తల్లి

ఏనాడు వాడని ఇంపైన భావ సు –మంబులు పూయించు మమతవల్లి

ఏనాడు తరగని ఈశ్వరు కృపవోలె-కమ్మగా కాచెడి కల్పవల్లి

ఏనాడు చెదరని యిన తేజమున్ భంగి –ఘన యుగం బొసగెడి  కావ్య వల్లి

అమ్మ తీరుగ ఆచి తూచి  అనవతరము –మనల దీవించు పావన మహిత వల్లి

ఉత్తమోత్తముడనగను ఉర్విలోన –బ్రతుకు పండించు సాహిత్య బంధ మరయ .

9-శ్రీమతి గుడిపూడి రాధికా రాణి –మచిలీ పట్నం -9494942583

నా అక్షర నేస్తాలు

నాకు తెలిసి నా గుండె కొట్టు కుంటోంది-లబ్ డబ్ అని కాదు  -అఆ ఇఈ అని .

నా అక్షర నేస్తాలు –సమీక్షా సమీరాలై –సాహితీ సౌరభాలను –నిజాయితీ గా వెదజల్లుతాయి

నా అక్షర నేస్తాలు –కవితా కరవాలాలై-కరడు కట్టిన అవినీతిని –కరుకుగా చెండాడుతాయి

నా అక్షర నేస్తాలు –పిల్లల కథల పిల్లన గ్రోవిగ-పెద్దలలోని పసి మనసులని –ప్రేమతోటి పలకరిస్తాయి .

నా అక్షర నేస్తాలు –గజల్స్ గజ్జేలై –ఘల్లు ఘల్లున గళసీమ మ్రోగి –గ్రామగ్రామం సంచరిస్తాయి .

నా అక్షర నేస్తాలు  -సాహితీ గగనాన విజయ విహారం చేసే –గాలి పటాలై –నా నైతికటే సూత్రం గా –చెలిమిఅనే దారంతో –నన్ను వదలక తోడు వుంటాయి .

10-శ్రీ మరో చలం –దుగ్గిరాల -8125752234

జీవన మర్మం

గురువులంతా గతించారు –గతవైభవ చిహ్నాలయ్యారు

ఒంటరినై ప్రశాంత నిశా దారుల్లోకవిత్వాన్ని వెదకుతుంటే

ప్రతి రాత్రి ధాత్రి సుగంధపు పరిష్వంగం లో రాత్రినై పోతుంటే

నిత్యం నాలోకి నేను మనో సర్పంలా పాకుతుంటాను

జీవితపు రహస్య ద్వారమేదోఅకస్మాత్తుగా తెరుచుకోవాలి

జరీ పోగుల అల్లిక లాంటి కవితా వస్త్ర దారి ఎవరో కనిపించాలి

అర్ధ శూన్య శబ్దాల అసంగత అభినయ విన్యాసాలకు తెరదించాలి

అబద్ధాల రంగ స్థలాలపై పొగడు దండల మెరుపు నింపి

మానవీయ హృదయ మాలికల సుగంధం నింపి

ప్రేమాస్పద సరస చంద్రికలతో ఇలను తడపాలి

నవకవిత్వపు మొలక లెగసి సహృదయవృక్షాలై నవరస ఫలాలనివ్వాలి

మనిషి చరిత హృదయగతం –మనిషి విచిత్ర ప్రేమయుగం

వితం చితి దాకా  తరుముకు  వెళ్ళే లోపు

అలవడుతుంది ఆపేక్షల అంతరంగపు చూపు

ప్రకృతి నించి ప్రకృతికి సాగే జీవితం లో

పరస్పర సాయమేగా ఓదార్పు ఒయాసీస్సు .

11-ప్రొఫెసర్ శ్రీమతి పంచుమర్తి నాగ సుశీల –గుంటూరు -9985444686

మాట

1-మనసులి కలిపేది మాట –మనుషులమధ్య –విస్ఫోటాలు రగిలించేది మాట .

అపార్ధాలు కలిగించి –అనర్ధాలు సృష్టించేదీ మాటే

ఓదార్పు నిచ్చేదీ –ఓరిమితో నిలిపేదీఆ మాటే

ప్రేమను పంచేదీ మాటే –ప్రపంచాన్ని చూపేదీ మాటే

2-మాట మాట కీ –ఉంది ఎంతో తేడా –పలికే మనిషిలో –పలికించే గొంతులో –పలుకుతున్న రీతిలో

అర్ధాలు గూడార్ధాలు –అనేక అర్ధాలు –అనంత అర్ధాలు

3-తీసేయ్యలెం మాటేగా అని –పెట్టేయ్యలెం ప్రక్కన –ఏముందిలే మాటగా అని

మాట నిలుపుకోటానికి –జరిగాయి యుద్ధాలెన్నో ప్రపంచ చరిత్రలో

మాట ఇచ్చినందుకు వచ్చాయి ప్రళయాలు గతం లో మరెన్నో .

4-మాటకున్న బలం –మరి దేనికుంది లోకం లో !

తూటా కంటే శక్తికలది –కత్తికంటే పదునైనది

తేనే కంటే తియ్యనైనదీ –వెన్నకంటే మృదువైనది –మాట లేనిదే –లేదు మనుగడ మనిషికి .

5-ఊహించలేం మనం మాట లేని లోకాన్ని –

మాటతో శాసిస్తాం మాటతోనే శ్వాసిస్తాం

కాలం గడిచేదీ-జీవితం నడిచేదీ –జీవనం ముగిసేదీ –మాటతోనే –మాటాడే తీరుతోనే .

6-సాహితీ బంధాన్నిబలపరచేదీ-సమాజాన్ని ఆలోచిమ్పజేసేదీ మాటే –అందుకే వాగ్భూషణమే సుభూషణం .

12- శ్రీమతి కోపూరి పుష్పాదేవి

‘’చంద్రునికో నూలు పోగు ‘’

సంగీత సాహిత్య సేవకుడు –శారదాదేవి ముద్దుల తనయుడు –కృషి ,పట్టుదల ఆలంబనతో –వయసును ఓడించిన శ్రామికుడు

సరసభారతి స్థాపించి –సత్కార్యాలు సాధించినవాడు –కవి పండితుల ఆడరణే లక్ష్యంగా –అర్దాంగితో అడుగు లేస్తాడు .

ఎవరమ్మా ?వేరేవరమ్మా  ?

ఉయ్యూరుకు ,ఉపాధ్యాయ వృత్తికీ –వన్నె తెచ్చిన దుర్గాప్రసాదుడు –అందుకొనుడు –మా అందరి అభినందన మందార మాలలు .

సమాప్తం

గబ్బిట దుర్గాప్రసాద్ -11-1-18 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు-2

సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు-2

24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు -2

6-శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు –గుంటూరు -9573423303

సాహితీ బంధం

మనుషులను కలిపి –మనసులను ముడి వేసి –మురిపింఛి మెరిపించు దివ్యౌషధము –సాహిత్యము .

ఎల్లలను చెరిపేసి –ఎల్లవారికి సుమ సౌరభము పంచి –శాంతి సౌఖ్యములనిచ్చు కల్పవల్లి –సాహిత్యము .

కొత్తజ్ఞానము నిచ్చి -,పాత యాతన తీర్చి-సంస్కారము నేర్పి –సత్కార్యములు చేయు –సజ్జనుల మైత్రి కుదుర్చు సాధనము –సాహిత్యము .

కమ్మని కల-కమనీయ కళ –సమ్మోహ పరుచు పరిమళం –సాహితీ మిత్రుల  సమ్మేళనములకు వేదిక – సాహిత్యము .

మన౦దరిని కలుపు మాధ్యమము –సంస్కృతి కాపాడు సదనము –నవయవ్వన వదనము –రేపటి లోకి నడుపు ఇంధనము –సత్పురుషుల ధనము –సాహిత్యము .

సువిశాలమది –ఆనందాల నిధి –సజ్జనుల సన్నిధి –తరతరాలకు వారధి –ఆదర్శాలకు సారధి –సాహిత్యము .

సంస్కరణల గని –వెలలేని మణి-పచ్చని మాగాణి –తెలుగుతల్లి కాలి  పారాణి –తెలుగు వారి ఆభరణం –సాహిత్యం .

సాహిత్యాభిమానులను ఒక్కటి చేసిన –సాహితీ బంధం .

జ్ఞానామృత ఫలముల నిచ్చు వృక్షమై –క్రమ శిక్షణ నిచ్చు –రక్షణ కవచమై –కొంగ్రొత్త ఆశలకు ఆలవాలమై –అనుభూతులకు ఆలంబనై –కొత్త పొత్తముల కూర్పుకు రూపై –మా ‘’నవ ‘’శక్తైమానవ శక్తై –జగమంతా ఆనందము నింపు చుండగ-సాహితీ బంధువులకు-మనసారా జేజేలు పలుకుదాం –మన బంధాన్ని మరింత బలపరుచు కుందాం .

7- శ్రీ కంచి భొట్ల ఫణి రామ లింగేశ్వర శర్మ –చెరుకూరు –ప్రకాశం జిల్లా

1-ఏ జన్మమందు చేసిన –పూజలో జపమో –ఈ జనని పాదములకడ –సుజనుల సాంగత్య మంది –శుభములు వడసెన్ .

2-అమ్మ పిలుపు తోటి –అమృతమైన భాష అమ్మ భాష –మాట మాట లోన మధురస భావాల –తేనె లొలుకు తీపి తెలుగు భాష .

3-నన్నయాది కవుల నందించెనా తల్లి  – కృష్ణరాయ చేత కీర్తి నొందె-పొరుగు భాషలన్ని పొలుపున చేరగా –తలుపు తీసి వలచె తెలుగు భాష .

8-మధురకవి -శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ-విజయవాడ -9299303035

1-బంధము లుండగా వలయు పాపము పుణ్యము పొంద గోరినన్ –బంధమె జీవజాతికిని బాసట యౌనుగజీవితంబునన్

బంధమె భోగ మోక్షముల బంధువుగా తలపోయ వచ్చుగా –అందము చిందు జీవనము నాశలు తీరగ నెల్ల కాలముల్ .

2-కొన్ని బంధాలు పుణ్యంబు గూర్చు గాదె –కొన్ని బంధాలు పాపాలు కూర్చుగాదె

కొన్ని దుఃఖమ్ము దుర్గతుల్ కూర్చుగాక –తె౦పవలెనట్టి బంధాలు తెగువ తోడ .

3-కాని

సరస సారస్వత సంబంధ బంధమే-సుధలను చిందించు శోభ గూర్చు

మధుర మధురములౌ మధురోహలను నింపు –మాన్యుని చేయు సామాన్యున్యునైన

వ్యధలను తొలగించి వాంచలు తీర్చును –లలిత పదములతో లాలిపాడు

నరులను వరులుగా నవ్య రీతుల జూపు –మనసు దోచు మధుర మధురసమ్మె

కాన సాహితీ బంధమె కనకమగుచు –మరువ లేనిది మనభాష మరులు గొల్పు

ఎల్లవారికిది ఇచ్చు నీప్సితములు –బుధుల చేయును మహర్షుల బుద్ధి నిచ్చి .

4-నన్నయ్య మొదలుగ నవకవులను గూడి –విజ్ఞానమిచ్చును వేదమట్లు

అమ్మ పాలను వోలె నాదరంబున చూచి –అలరించు సతతము ను అమ్మ వోలె

సాహితీ బంధమై సారెకు యెద నిల్పు –అజ్ఞాత బంధువై అమృతమగును

సాహితీ గగనాన చల్లని జాబిలై –వెన్నెలల్ కురిపించి వెలుగు చుండ

రక్తగతమైన బంధమై భాషగా రాణ కెక్కె-తెలుగు సాహిత్యమెనరుల తీరు మార్చు

జీవమున్నంత వరకును చేవ నిచ్చు –విడువరానట్టి ది యగు విడువ లేము .

5-నన్నయ్య తిక్కన్న నాటిన వృక్షాల –ఫలరసము గ్రోలు భాగ్యమంది

బద్దెన వేమన్న బుద్ధులు నేర్పింప –బుధులుగా మారెడి బుద్ధి నంది

రామణీయమైనట్టి రామభక్తిని పొంది –త్యాగయ్య గీతాల రాగమంది

గురజాడ శ్రీశ్రీ లగురుజాడలను పొంది –గౌరవమైనట్టి గమనమంది

మేటి కవులు ను నడయాడ సాటిలేని –వెలుగులను పొంది కీర్తికి ప్రీతి నంది

తెలుగు దేశాన పుట్టుటన్ కలిగె నంచు –సతత మానంద మార్గాన సాగు మనము .

6-భారత భారతీ బహు భాగ్యముల గూర్చె-భావి తరాలకు బంధమయ్యె

భాగవతము చూపెభక్తీ రసాస్వాద-మానంద సంద్రాన మగ్నమగుచు

శ్రీనాధు డిచ్చిన సీసాల సుధలను –గ్రోలి దివిజ సుఖము కొంత పొంది

నీతి పానీయములు నిర్మల మనసులో –మనకు పంచెను నాడు మాన్యతలను

నాటి వారలతో పాటు నేతికవులు –ఇచ్చె మనకెన్నో సుధలను యింపు మీర

రక్త గత బంధమై రాణ కెక్కె-తె౦పరాని దీ బంధమ్ము యిల తెలుగు తోడ .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -10-1-18 –ఉయ్యూరు

 

 


Posted in కవితలు | Tagged | Leave a comment

సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు

             సాహితీ బంధం కవి సమ్మేళన కవితలు

24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు

1-       సహజ కవి డా ఐనాల మల్లేశ్వరరావు –తెనాలి -9347537635

సీ –‘’సాహితీ బంధంబు సత్సంగముం బెంచి-సచ్ఛీల సుధలను చవుల జూపు

సాహితీ బంధంబు సహ్రుదుల్ పులకించ –సాంగత్య మధురిమల్ జగతి పంచు

సాహితీ బంధంబు సద్గ్ర౦థ పఠన చే –సుజ్ఞాన జ్యోతుల సుగతి జూపు

సాహితీ బంధంబు సమతానురాగాల –శాంతి సౌభాగ్యాల కాంతులీను

తే.గీ .-‘’ఎచట సాహిత్య బంధంబు హేల లీల – విరిసి వ్యాపించి భువి దివి విస్తరిల్లి

నవ నవోద్భవ లోకాల నవ్య సృష్టి –దివ్య కాంతుల తేజమ్ము దీప్తి జిమ్ము ‘’

2-‘’సాహితీ బంధమ్ము సమయజ్ఞాతాన్ బెంచి –సరస సంభాషణా సౌరు బెంచు

సాహితీ బంధమ్ము సౌశీల్య మందించి –సాంగత్య సంపదన్ సతము మించు

సాహితీ బంధమ్ము సౌహార్ద్ర మొలికించి –సహ్రుదిని పులకించ సహకరించు

సాహితీ బంధమ్ము సహనమ్ము దీపించ –సత్కార్య సఫలతన్ సంతరించు

తే.గీ .-ఎచట సాహితీ బంధమ్ము ఇగురు తొడగు –నచట నవపారిజాతాల హోరి విరియు

        ప్రమద పరిమళ ప్రభలచే పరిఢ విల్లి –శాంతి దాంతుల భూకాంత సంతసిల్ల ‘’

3-క౦-‘’ఈ మా  సాహితీ బంధము –నేమని వర్ణింతు నేను ఇహలోకమునన్

ప్రేముడి నడవడి నేర్పును –కామిత వర్దినిగ వరల కల్పక మనగన్.

4-కం-‘’కృతి కర్తయు కృతి భర్తయు –అతులిత ఆత్మాను బంధ మది ఇది యనగన్

         క్షితి నెవ్వరికి సాధ్యము –నుతులందెడి నలువ రాణి నుడులకు గాకన్ ‘’

  2-శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –విజయవాడ -9247558854

                  రస బంధుర –సాహితీ బంధమ్ము

1-చిననాట శతకము లప్ప జెప్ప-చప్పట్ల పతకము తెచ్చె నే బంధమ్ము

పద్య భావార్ధములలో నుడువగా –ఈవితార్ధము చెప్పే నే బంధమ్ము

పసి పాఠకుడనై నడక సాగని వేళ-‘’చందమామ ‘’గ వెలుగు దారులు చూపె నే బంధమ్ము

బ్రతుకు భారమై భయపెట్టు వేళ –ఆత్మ బలము పెంచి వెన్ను తట్టె నే బంధమ్ము

విశిష్ట సాహితీ శ్రస్టల నడుమ తిష్ట వేసెడి-తెగువ నిచ్చె నే బంధమ్ము

సౌశీల్య ,సౌహార్ద్ర ,సుహృన్మిత్రుల మైత్రి నిచ్చె నే బంధమ్ము

సమభావ సూత్రీకరణ తోడ ప్రపంచామంతను –ఉయ్యూరు రప్పించు ఇంద్ర జాలమ్ము

యాసలు వేరై వీడిపోయిన గాని –‘’బాస ‘’గా కలిపి బాసట గా నిల్పు సాధనమ్ము

రసబంధుర సింధూరమ్ము –సుఖ జీవన సుమ గంధమ్ము

చదువులమ్మ అమృత నైవేద్యము –పంచునట్టి సౌజన్యమ్ము

అనవతర నిత్యనూత్ననాదు సాహితీ బంధమ్ము .

3-లయన్ శ్రీ కాకరపర్తి సుబ్రహ్మణ్యం –తెనాలి -9848297711

                  సాహితీ బంధం

అమ్మానాన్నలతో ఆనందం –

ఆచార్యులతో అనుభవం

ఆలోచనలతో అసమర్ధతకు బంధం

దేవుని దర్శనం లో తన్మయత్వం –

ఆయన అభయం తో పరవశం

ఆలయంతో ఒక ఆధ్యాత్మిక బంధం

మంచిమనిషికి మనసుతో

మంచి మనసుకి ప్రేమతో

జీవితం భార్యాభర్తలకి బంధం

అల్లుకున్న తీగె తో పందిరికి

పుష్పించే కొమ్మతో కాయకి

ఆహారం తో ఆకలికి బంధం

వెలుగుతో చీకటికి

సాయంతో చిరునవ్వు కి

ప్రేమతో చిట్టి గుండె కి బంధం

మంచి పుస్తకం తో విజ్ఞానానికి

 ‘మంచి దృశ్యంతో వినోదానికి

కాగితం తో కలానికి సాహితీ బంధం .

4-శ్రీ పంతుల వెంకటేశ్వరరావు (తపస్వి )విజయవాడ -9908344249

      సాహితీ బంధం

-1-సీ .దేశభాషలందు దేదీప్యమానమై –వెలుగొందునట్టి దీ తెలుగు భాష

అవధాన క్రీడలో నానందమందించు –ఆంద్ర తెలంగాణ అమ్మభాష

సంస్కృత భాష కు సన్నిహితంబైన –లలిత సౌందర్యాల  ద్రవిడ భాష

సాహితీ లోకాన సౌలభ్యమౌ రీతి –జ్ఞానంబు నిచ్చు సంస్కార భాష

తే. గీ.-అట్టి తెలుగు భాషను కడు నాదరించి –బ్రౌను వంటి ఆంగ్లేయులు పటిమ పెంచె

నాటి నేటికవులు ఘనాపాటి లగుచు –ఆంద్ర భాషకు సర్వత్ర యశము గూర్చె.

2-సీ –నాచన సోమన నన్నయాది కవుల –కమ్మని పద్యము ఘనత నిచ్చె

ఎఱ్ఱన పిల్లలమఱ్ఱి కవిత్వము –వర్ణనాతీతమై వన్నె తెచ్చె

తిక్కన మారన తీయని భావాలు –తెలుగు పదాలకు వెలుగు నిచ్చె

గోన బుద్దారెడ్డి శ్రీనాథ పోతన –వైవిధ్యభరితమై చేవ నిచ్చె

తే.గీ. అష్ట దిగ్గజకవులు రాయల రచనలు –నవరసాల ప్రబంధమై అవతరించె

మధుర కావ్య రస ఝరితిమ్మక్క మొల్ల –సాటి నారీ జగత్తున మేటి యయ్యె.

3-సీ.-బద్దెన వేమన ఫక్కి అప్పల నర-సయ్య లక్ష్మణ కవి శతక పటిమ

త్యాగయ్య క్షేత్రయ్య అన్నమాచార్యుల –సంకీర్తనామృత సారమహిమ

ఆధునిక యుగంబు నందున గురజాడ- కుందుర్తి జాషువా కందుకూరి

పద్య గద్య౦బుల వ్యాస ప్రహసనాల –సాహితీ బంధమై సంగమించె

పలు విధ ప్రక్రియల పుష్పముల నొసంగి –తెలుగు భాష యజ౦తమై దేశమందు

సర్వ జగతికి నిచ్చు సౌరభమ్ము –అద్భుతంబుగ నిలవాలి అవని యందు .

5-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు –విజయవాడ -9703776650

                 సాహితీ బంధం

1-ఎక్కడి ఉయ్యూరో మరి నెక్కడి రేపల మేరి కెక్కడో –ప్రక్కల జేర్చేనో సరసభారతి యుక్కున సాహితీ సభన్

చొక్కగ రేపలెన్ జనులు శోభనమాయెను పండితాళిచే-చక్కటి బంధ మేర్పడెను స్వాగత మీయగ క్రొత్త యేటికిన్ .

2-ఘన రేపల్లె పురాన  సొంపెగగా కైతన్ మనోహారులై –వినిపించన్ పోరుగూళ్ళ నుండిటకు నుద్వేగాత్ములై వచ్చుటల్

కన సాహిత్య రసాను బంధమిది యౌగా !సాహితీ ప్రేమికుల్ –తనివారంగ ప్రసంగ మాధురుల   డెందమ్ముల్ ముదా పూరమై .

3-ఎంతటి దివ్య బంధమిది ఎల్లలు లేనిది యుల్లమెంతయో-సంతస మంద కూడిరిట సార కవీంద్ర వరేణ్య సాక్ష్యమౌ

చింతగ శారదా చరణ సేవకు కన్నుల పండువాయెగా –నింతలు నంతలై సహకరించుచు సాగగ క్రొత్త బంధముల్ .

4-అందగా రాని బంధమిది అక్షరమించుక నేర్వకున్న సం –బంధము సాహితీ సరస బంధుర మౌ నెడ నంద గించెడిన్’

ఎందరొ మేటి పండితులు నిచ్చును క్రిందును లేక సాహితీ –బంధము తోడ దగ్గరయి పంచరె మోదము తెల్గు జాతికిన్ .

5-వ్యాసుని భారతంబు మరి వాల్మికి రామ కథేతి హాసమున్ –భాసుర కావ్య గాధలయి వాజ్మయ మెంతయు నేటి దన్కయున్

మోసులు వార వెల్వడెను మోదము నందగ సాహితీ రసా –శ్వాసిత బంధ మియ్యదియు  సాగెడు గాక యుగా౦త రంబునన్ ‘.

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-1-18 –ఉయ్యూరు

.

Posted in కవితలు | Tagged | Leave a comment

ధనుర్మాస సందర్భంగా 10-1-18 బుధవారం ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామికి అరిసెలతో ప్రత్యెక ప్రభాత పూజ

ధనుర్మాస సందర్భంగా 10-1-18 బుధవారం ఉదయం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామికి అరిసెలతో ప్రత్యెక ప్రభాత పూజ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు

 

డొక్క నిండితేనే మనిషి కి డొక్క శుద్ధి కలుగుతుందని నమ్మి ,ఆకలి ఉన్నవారికి పిలిచిడొక్క నిండేదాకా అమ్మలాగా  అన్నం పెట్టి న అపర అన్నపూర్ణ ,నిరతాన్నదాత శ్రీమతి డొక్కా సీతమ్మగారి ”డెల్టా గన్నారం”,ఆమె అన్నపూర్ణగా వెలసిన గృహం వగైరాలను” ఆ దూరం” లో ఉన్నఅందరికి అందుబాటుగా చూపించిన” ఆదూరి”అభినందనీయులు -దుర్గాప్రసాద్

Posted in సేకరణలు | Tagged | Leave a comment

7-1-18 ఆదివారం విజయవాడ పుస్తక మహోత్సవం లో నేను ,పూర్ణచంద్ ,మనోరమ ,

7-1-18 ఆదివారం విజయవాడ పుస్తక మహోత్సవం లో నేను ,పూర్ణచంద్ ,మనోరమ ,

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ త్యాగరాజ ఆరాధన సందర్భంగా … 

 శ్రీ త్యాగరాజ ఆరాధన సందర్భంగా …

త్యాగరాజ ఆరాధనోత్సవం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయం మహిత మందిరంలోసరసభారతి సాహిత్య – సాంస్కృతిక సంస్థ అధ్వర్యంలో శనివారం సాయంత్రం ఉయ్యురు సంగీత కళాకారులూ పాల్గొని శ్రీ త్యాగరాజ కృతులను ఆలపించారు. స్వర్గీయ ఘంటసాల, బాలమురళీకృష్ణలను స్మరిస్తూ వారి కృతులను ఆలపించారు. గాత్ర కచేరిలో పాల్గొన్న కళాకారులూ శ్రీమతి జ్యోస్యుల శ్యామలాదేవి, నూతి శారద, పోపురి పద్మజ, వేమూరి కళ్యాణి, దత్త, బిందు దత్తశ్రీ లకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ కళాకారులను, ఈ రోజు స్వామివారికి నవనీతంతో అలంకరణ చేసిన శ్రీ మామిళ్ళపల్లి సోమేశ్వరరావు లను సన్మానించారు.

https://www.facebook.com/photo.php?fbid=1572167739525731&set=pcb.1572169492858889&type=3&theater

https://www.facebook.com/venkataramana.gabbita/videos/pcb.1952990068063248/1952875221408066/?type=3&theater

https://www.facebook.com/photo.php?fbid=1952850404743881&set=pcb.1952862301409358&type=3&theater

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంగీత సద్గురు త్యాగరాజస్వామి 171 ఆరాధనోత్సవం6-1-18 శనివారం -సరసభారతి 117 వ సమావేశం ఫోటోలు-పార్ట్ -1

సంగీత సద్గురు త్యాగరాజస్వామి 171 ఆరాధనోత్సవం6-1-18 శనివారం -సరసభారతి 117 వ సమావేశం ఫోటోలు-పార్ట్ -1

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

త్యాగరాజ ఆరాధనోత్సవం

సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి 171 ఆరాధనోత్సవం పుష్యబహుళ పంచమి 6-1-18 శనివారం

సాయంత్రం 6-30 గం లకు సరసభారతి 117 వ కార్యక్రమంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో జరుగును .సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ అధ్యక్షతన సరసభారతి గౌరవాధ్యక్షులు  లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో శ్రీమతి కందాల విజయ ,శ్రీమతి పోపూరి పద్మజ ,శ్రీమతి వేమూరి గీతాకళ్యాణి ,కుమారుడు ,,శ్రీమతి నూతి  శారదా కుమారి  కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ లు త్యాగరాజ పంచరత్నకీర్తనలు ,గానం చేస్తారు .గాయకులకు స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ స్మారక పురస్కారాన్ని శ్రీ కోమలి సాంబావదాని శ్రీమతి విజయలక్ష్మి (అమెరికా)దంపతుల సౌజన్యం తోసరసభారతి అధ్యక్షులు  ప్రదానంచేస్తారు  ..సంగీత సాహిత్యాభిమానులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన -గబ్బిట దుర్గాప్రసాద్

Inline image 1Inline image 2


Inline image 3
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ధనుర్మాస సందర్భం గా 6-1-18 శనివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో ప్రభాత పూజగా నవనీత (వెన్నపూస )అర్చన ,అలంకరణ

ధనుర్మాస సందర్భం గా 6-1-18 శనివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో ప్రభాత పూజగా నవనీత (వెన్నపూస )అర్చన ,అలంకరణ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహిళా స్పీకర్ – శ్రీమతి సుశీలా నయ్యర్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక జనవరి 2018

గాంధీజీ వ్యక్తిగత డాక్టర్ ,కేంద్ర ఆరోగ్య మంత్రి,తొలి మహిళా స్పీకర్ – శ్రీమతి సుశీలా నయ్యర్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక జనవరి 2018

సుశీల నాయర్ గా పిలువబడే శ్రీమతి సుశీలా నయ్యర్ గాంధీ మహాత్ముని ఆంతరంగిక కార్యదర్శి ప్యారేలాల్ కు చిన్న చెల్లెలు.గాంధీ జీకి వ్యక్తిగత డాక్టర్ .

ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లోని కుంజా లో 1914 లో జన్మించింది .యవ్వనం లో ఢిల్లీ కి వచ్చి లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజి లో మెడిసిన్ లో చేరింది.1939 లో అన్న ప్యారేలాల్ కు సాయ పడటానికి సేవాగ్రా౦ వచ్చి, గాంధీ జీ వ్యక్తిత్వానికి ,దేశ సేవకు ఆకర్షితురాలై ,సన్నిహితురాలైంది .ఆమె వచ్చిన కొద్ది కాలానికే వార్ధా లో కలరా తీవ్రంగా వ్యాపించి జనాలను కబళించింది .అప్పుడు యువ డాక్టర్ సుశీలా నయ్యర్ తానొక్కతే రాత్రిం బవళ్ళు అంకిత భావం తో కస్టపడి కలరా వ్యాప్తిని అరికట్టగలిగింది.గాంధీ జీ ఆమె సేవానిరతిని మెచ్చి అభినందించాడు .డాక్టర్ బి .సి. రాయ్ ఆశీస్సులతో మహాత్ముడు ఆమెను తన వ్యక్తిగత డాక్టర్ గా నియమించాడు .1942 లో ఎం .డి. పూర్తీ చేసి ,మళ్ళీ మహాత్ముని సేవలో పాల్గొని ,ఆనాడు దేశమంతా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న క్విట్ ఇండియా ఉద్యమం లో గాంధీతో పాటు పాల్గొన్న దేశాభక్తురాలు నాయర్ . అందరు ప్రముఖ దేశభక్తులతోపాటు అరెస్ట్ అయి ,పూనాలోని ఆగా ఖాన్ పాలస్ లో బందీ గా ఉంది.

1944 లో సేవాగ్రాం లోనే నాయర్ ఒక చిన్న డిస్పెన్సరి ప్రారంభించింది . ఆమె పై ఉన్న నమ్మకం తో ప్రజలు విపరీతంగా వచ్చి వ్యాధి నివారణ పొండుతున్నందున ఆశ్రమ ప్రశాంతతకు భంగం కలుగుతోందని గ్రహించింది .వార్ధా లో బిర్లా ఏర్పాటుచేసిన ఒక గెస్ట్ హౌస్ లోకి ఆస్పత్రిని మార్చింది . 1945 లో ఈ చిన్న హాస్పిటల్ బాగా వృద్ధి చెంది కస్తూర్బా హాస్పిటల్ అయింది .ఇప్పుడు మరింతగా అభి వృద్ధి చెంది మహాత్మా గాంధి ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గా పిలువబడుతోంది .ఆ కాలం లో అనేక కుట్రలు ,కుతంత్రాలు జరిగి మహాత్ముని ప్రాణాలకే ఎసరు పెట్టె సంఘటనలు జరిగాయి . అందులో గాంధీ ని హత్య చేసిన నాధూరాం గాడ్సే జరిపిన దాడులూ ఉన్నాయి .వీటన్నిటికి ప్రత్యక్ష సాక్షి సుశీలా నయ్యర్ .1944 లో పంచగని లో నాధూ రాం గాడ్సేగాంధీజీ పై బాకు తో దాడికి ప్రయత్నం చేశాడన్న ఆరోపణపై విచారిస్తున్న కాన్పూర్ కమీషనర్ ముందు1948లో సుశీలా నాయర్ హాజరై సాక్ష మిచ్చింది .

1948 లో ఢిల్లీ లో గాంధీ మహాత్ముని హత్య జరిగిన ఆతర్వాత సుశీలా నయ్యర్ అమెరిక వెళ్లి జాన్ ఆప్కిన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో రెండేళ్ళు చదివి పబ్లిక్ హెల్త్ లో రెండు డిగ్రీలు పొందింది .1950 లో ఇండియా కు తిరిగి వచ్చి తోటి గాంధీ అనుయాయి శ్రీమతి కమలాదేవి చట్టోపాద్యాయ్ తో కలిసి సహకార విధానం లో ఢిల్లీ కి వెలుపల మోడల్ టౌన్ షిప్ గా ఉన్న ఫరీదాబాద్ లో టి .బి.శాని టోరియం ప్రారంభించింది .గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్ నూ నడిపింది .

1952 లో రాజకీయాలలో ప్రవేశించి ఢిల్లీ శాసనసభకు సభ్యురాలుగా ఎన్నికైంది.1952 నుంచి 55 వరకు నెహ్రు మంత్రి వర్గం లో ఆరోగ్య శాఖ మంత్రి గా పని చేసింది .1955 -56 లో ఢిల్లీ విధానసభ స్పీకర్ గా నాయర్ ఉన్నది . తొలి మహిళాస్పీకర్ సుశీలా నాయర్ .1957 లో లోక్ సభకు ఎన్నికై 1971 వరకు సేవలందించింది . కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా నాయర్ నియమింపబడి 1962 నుండి 1967 వరకు అయిదేళ్ళు ప్రజాసేవలో ధన్యురాలైంది .కాంగ్రెస్ పాలనలో విధానాలు నచ్చక ,పార్టీని వదలి జనతా పార్టీలో చేరి ప్రతి పక్ష నాయకు రాలైంది .ఇందిరా గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయం సాధించిన జనతాపార్టీ ఆధ్వర్యం లో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం లో కొద్దికాలం బాధ్యతలు చేబట్టి౦ది నాయర్ .తర్వాత రాజకీయాలనుంచి విరమించి గాంధీ సిద్ధాంత వ్యాప్తికిఅంకిత భావం తో కృషి చేసింది .1969 లో మహాత్మా గాంధీ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాపించి ,దాని అభివృద్ధికి జీవితాంతం కృషి చేసింది .3-1-2001 న 87 వ ఏట గుండె పోటు తో సుశీలా నయ్యర్ మరణించింది .

గాంధీ సిద్ధాంతాలపై అచంచల విశ్వాసం ఉన్న సుశీలా నయ్యర్ ఆ భావ వ్యాప్తికి అవిరళ కృషి చేసింది .ముఖ్యంగా మద్య నిషేధం ఖచ్చితంగా అమలు జరగాలని కోరేది .దేశాభి వృద్ధికి జనాభా నియంత్రణ అవసరమని కనుక కుటుంబ నియంత్రణ చేబట్టటం ప్రభుత్వ ,ప్రజల బాధ్యత అని హితవు చెప్పేది .స్త్రీలకూ సమానహక్కులు ఉండాలని ,పేద స్త్రీల హక్కుల రక్షణ బాధ్యత కు ప్రభుత్వం చేబట్టాలని కోరేది .వ్యక్తిగతం గా అత్యంత క్రమ శిక్షణతో ప్రవర్తిస్తూ , యువత లో స్పూర్తి నింపుతూ ,వారిలో మణి పూసగా వెలిగిన నాయకు రాలు నాయర్ .ఎవరి సహాయ సహకారాలూ లేకుండా ఏక వ్యక్తిగా తన తెలివితేటలూ, సామర్ధ్యం ,ముందు చూపులతో మగవారితోపోటీ పడి,అన్ని అర్హతలు, గౌరవాలు పొందిన మహిళా మాణిక్యం ఆమె . గాంధీ లాగా ఆమె కూడా ఏ పనీ నీచమైనది కాదు అని నమ్మేది అలానే ఆచరించి ఆదర్శ ప్రాయమైనది .ముఖ్యంగా వైద్య వృత్తిలో అంకిత భావం చాలా ముఖ్యం అని భావించేది .సేవ ,అంకిత భావం ,త్యాగం ,నిరంతర కృషి ,అభి వృద్ధి సుశీలా నయ్యర్ మహనీయ గుణగణాలు.

గొప్ప రచయిత్రి అయిన సుశీలా నయ్యర్ మహాత్మా గాంధీ పై 7 ,కస్తూర్బా గాంధీపై 1, ఇద్దరిపై 1, కాక కుటుంబ నియంత్రణ పై 1 ,మద్య నిషేధం లో మహిళల పాత్రపై 1 పుస్తకాలు ఇంగ్లిష్ లో రచించింది .అందులో కొన్ని- ది స్టోరీ ఆఫ్ బాపూస్ ఇ౦ప్రి జన్ మెంట్ , కస్తూర్బా గాంధి –ఎ పర్సనల్ రెమినిసెన్సేస్ ,ఫామిలీ ప్లానింగ్ ,రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ప్రొహిబిషన్ ,మహాత్మాగాంధీ –సత్యాగ్రహ ఎట్ వర్క్ ,మహాత్మా గాంధీ ప్రేపేరింగ్ ఫర్ స్వరాజ్ ,ఫైనల్ ఫైట్ ఫర్ ఫ్రీడం ,మహాత్మా గాంధి –ది లాస్ట్ ఫేజ్ .

– గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

ధనుర్మాసం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో 5-1-19 శుక్రవారం సామూహిక ప్రభాత కుంకుమ పూజ

ధనుర్మాసం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో 5-1-19 శుక్రవారం సామూహిక ప్రభాత కుంకుమ పూజ

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

4-1-18 గురువారం యలమర్రులో శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారి స్వగృహం లో వారి తండ్రిగారి ఆబ్దీకానికి వెళ్లి అక్కడ 50 ఏళ్ళక్రితం మానికొండ హై స్కూల్ లో నూ ఇంటివద్ద ప్రైవేట్ లోనూ శిష్యుడైన నాపేరే కలిగిన చి. గబ్బిట దుర్గాప్రసాద్ ,95 ఏళ్ళ అతని తల్లిగారు ,కుమారుడు లతో మేమిద్దరం

4-1-18 గురువారం యలమర్రులో శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారి స్వగృహం లో వారి తండ్రిగారి ఆబ్దీకానికి వెళ్లి అక్కడ 50 ఏళ్ళక్రితం మానికొండ హై స్కూల్ లో నూ ఇంటివద్ద ప్రైవేట్ లోనూ శిష్యుడైన నాపేరే కలిగిన చి. గబ్బిట దుర్గాప్రసాద్ ,95 ఏళ్ళ అతని తల్లిగారు ,కుమారుడు లతో మేమిద్దరం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

డా పరకాలతో

28-12-17 గురువారం ఆంద్ర ప్రదేశ్ రాజధాని అమరావతి సెక్రెటేరియట్ లో డా శ్రీ పరకాల ప్రభాకర్ గారితో నేనూ ,,డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రిగారు (బెనారస్ హిందూ యూని వర్సిటి న్యాయ శాఖాధ్యక్షులు )

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సాహితీ బంధం” కవి సమ్మేళన కవితలు-1

సాహితీ బంధం” కవి సమ్మేళన కవితలు-1

24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు

1-       సహజ కవి డా ఐనాల మల్లేశ్వరరావు –తెనాలి -9347537635

సీ –‘’సాహితీ బంధంబు సత్సంగముం బెంచి-సచ్ఛీల సుధలను చవుల జూపు

సాహితీ బంధంబు సహ్రుదుల్ పులకించ –సాంగత్య మధురిమల్ జగతి పంచు

సాహితీ బంధంబు సద్గ్ర౦థ పఠన చే –సుజ్ఞాన జ్యోతుల సుగతి జూపు

సాహితీ బంధంబు సమతానురాగాల –శాంతి సౌభాగ్యాల కాంతులీను

తే.గీ .-‘’ఎచట సాహిత్య బంధంబు హేల లీల – విరిసి వ్యాపించి భువి దివి విస్తరిల్లి

నవ నవోద్భవ లోకాల నవ్య సృష్టి –దివ్య కాంతుల తేజమ్ము దీప్తి జిమ్ము ‘’

2-‘’సాహితీ బంధమ్ము సమయజ్ఞాతాన్ బెంచి –సరస సంభాషణా సౌరు బెంచు

సాహితీ బంధమ్ము సౌశీల్య మందించి –సాంగత్య సంపదన్ సతము మించు

సాహితీ బంధమ్ము సౌహార్ద్ర మొలికించి –సహ్రుదిని పులకించ సహకరించు

సాహితీ బంధమ్ము సహనమ్ము దీపించ –సత్కార్య సఫలతన్ సంతరించు

తే.గీ .-ఎచట సాహితీ బంధమ్ము ఇగురు తొడగు –నచట నవపారిజాతాల హోరి విరియు  

        ప్రమద పరిమళ ప్రభలచే పరిఢ విల్లి –శాంతి దాంతుల భూకాంత సంతసిల్ల ‘’

3-క౦-‘’ఈ మా  సాహితీ బంధము –నేమని వర్ణింతు నేను ఇహలోకమునన్

ప్రేముడి నడవడి నేర్పును –కామిత వర్దినిగ వరల కల్పక మనగన్.

4-కం-‘’కృతి కర్తయు కృతి భర్తయు –అతులిత ఆత్మాను బంధ మది ఇది యనగన్  

         క్షితి నెవ్వరికి సాధ్యము –నుతులందెడి నలువ రాణి నుడులకు గాకన్ ‘’

  సశేషం

20 18 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-1- 2018 –ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-2

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం

3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-2

‘’భారతీ తారామాల ‘’ప్రతి జటప్రోలు సంస్థానం లో ఉన్న వెల్లాల సదాశివ శాస్త్రి గారికి చేరి విమర్శ తో ఒక పుస్తకమే రాశారు .దీనికిశాస్త్రిగారు  ప్రతిఖండనం రాసి గ్రంధంగా ప్రచురించారు .శాస్త్రిగారు బెజవాడలో ఉన్నప్పుడు మరుపూరి వారు ,బాలక్రిష్ణారెడ్డి  గారు సంస్కృతం అభ్యసించారు .ఆరునెలలలో  తెనాలిలో ‘’ప్రౌఢ మనోరమ ‘’చదివి ఆరి తేరారు .ఇరవై రెండు ఏళ్ళ వయసులో వనపర్తి అయ్యప్పగారి కూతురు కృష్ణ వేణమ్మను మేనరిక వివాహమాడారు . ఈ సందర్భంగా శాస్త్రిగారు ‘’కాంతా స్వయం వరం ‘’కావ్యం రాశారు.  ప్రతి ఏడాది మన్నెం కొండ నుండి గద్వాల జాతరకు వెళ్ళేవారు .రాణీ గారిపై శ్లోకాలు రాసి చదివారు.  చివరి శ్లోకం లో ‘’ఫలకారీ ‘’అనే ప్రయోగం చేశారు .సభలోని పండిత కవి బృందం ఆనందంగా చప్పట్లు కొట్టి అభినందించారు.  శృంగేరి వెళ్లి విద్యా తీర్ధ స్వామి ఆశ్రమ స్వీకార మహోత్సవం లో ‘’శారదా నవరత్న మాలిక ‘’ఆశువుగా చెప్పారు.  లలితాంబ ను ద్వితీయం చేసుకొని అమ్మవారిపై .’’లలితా స్తవ ఝరి’’రెండవ కావ్యం రాశారు .రాజాపురం గ్రామప్రజలు ఏకగ్రీవంగా శాస్త్రి గారిని సర్పంచ్ గా ఎన్నుకోగా ఆయన గ్రామాభి వృద్ధికి గొప్ప కృషి చేశారు .ఒకసారి రాణి గారి ఎదుట ‘’హయగ్రీవ శతకం ‘’నుండి కొన్ని శ్లోకాలు వినిపించగా  రాణి గారు ముప్పై రూపాయల వార్షికం ఏర్పాటు చేశారు  .ఒక శ్లోకం –

‘’యద్రాజ్యం ప్రావి మాశ్య గుణ్య సచివం ధర్మాత్మ భీరాజభిః-సన్యాయం సజనాభి వృద్ధి సబుధా మేనం పురా రక్షితం

తుద్యు చ్ఛేజ్జన మధ్య దుర్జన క్షిత క్షోభం కలౌతే యుగే –హా కష్టం విధ వాహ్య వంతి మకుటిలా నేపధ్య మధ్యస్థితా’’

కంచికామ కోటి స్వామి గద్వాల వచ్చి రాణీ గారి ఆతిధ్యాన్ని అందుకుని ,అగ్రహారం లో శాస్త్రి గారి ఆధ్వర్యం లో భిక్ష గ్రహించిహైదరాబాద్ వెళ్ళిపోయారు .సత్సంతానం పొంది  సతీ సమేతంగా తీర్ధ యాత్రలు చేసి పుణ్యఫలం మూటగట్టుకున్నారు .

27-3-1914 న ‘’యావర్ణ సప్తాహం’’ గోవింద నాయక్  నిర్వహించారు .108 బ్రాహ్మణులు రామాయణ పారాయణ ,చేయగా ,రుద్రయాగం లో 40 మందిపాల్గొనగా  వేలాది  మంది వీక్షించారు  .12 ఏళ్ళ శాస్త్రి గారు పాల్గొన్నారు . రోజూ నాలుగు వేలమందికి భోజనం . 1927 లో హైదరాబాద్ గౌళి గూడ లో ‘’కృష్ణాజీ సప్తాహం ‘’జరిగింది .అలాగె ఉల్లెండ కొండ సప్తాహం ,పెంట్ల వెల్లి  సప్తహాలలో పాల్గొని సత్కారాలు అందుకున్నారు .

  శాస్త్రి గారి విద్వత్తు కు తగిన ‘’అభినవ కాళిదాస ‘’’’కవి కులాలంకార ‘’,కవి కల్ప ద్రుమ ‘’బిరుదులు పొందారు .1970 లో ఉత్తమ సంస్కృత విద్వాంసుని గా అకాడెమి గుర్తించి సత్కరించింది . అకాడెమీ అధ్యక్షులు బెజవాడ గోపాల రెడ్డిగారు .సన్మానపత్రం రాసి చదివినవారు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు .శాస్త్రిగారు కేశవపంతుల నరసింహ శాస్త్రిగారికి సుందరకాండ మంత్రోపదేశం చేసి అకాడెమీ నుండి ఆర్ధిక సాయం వచ్చే ఏర్పాటు చేయించారు .2016 కృష్ణా పుష్కరాలలో శాస్త్రి గారు 40 ఏళ్ళ క్రితం రచించిన ‘’భజే కృష్ణ వేణీం ‘’స్తోత్రాన్ని సిడి గా విడుదల చేసి గౌరవించారు .

   శాస్త్రి గారి గీర్వాణ రచనలు 29 ఉన్నాయి .అందులో వాసర సరస్వతీ స్తుతి ,భారత ధరణి  స్తుతి ,చెన్నకేశవ కుసుమాంజలి, చంద్ర శేఖర సరస్వతీ పంచ రత్న స్తుతి ,శ్రీ జయేంద్ర సరస్వతీ స్తుతి ,శారదా శతకం ,హయగ్రీవ శతకం ,ధూమ శకట ప్రమాదం ,రవీంద్ర తపః ఫలం ,అయ్యప్ప పంచ రత్నాలు ,జితామిత్ర స్వామి చరిత్ర ,బీచుపల్లి ఆంజనేయ  సుప్రభాతం మొదలైనవి .శాస్త్రి గారి సంస్కృత రచనలోని విశేషాలను తర్వాత తెలుసుకొందాము .

ఆధారం –శ్రీమతి పాణ్యం మీనాకుమారి రచన –‘’తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి ‘’మోనోగ్రాఫ్

  సశేషం

  2018 నూతన సంవత్సర శుభాకాంక్షలతో

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-12-17-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-3(చివరిభాగం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4  

3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-3(చివరిభాగం )

                   గీర్వాణ రామ చంద్రీయం

1-       శ్రీ శృంగేరీ శారదా నవరత్న మాలిక

‘’రత్న శ్రేణీరచిత వివిధా లేఖ్య విభ్రాజ నూనా –మధ్యాసీనాం స్పటిక ద్రుష పదాబ్జ మధ్యాంవితర్దిం

పాద ద్వంద్వోపరి పరిచల ద్ధౌత కౌశేయ కచ్చాం-నానారత్నోత్ఖచిత కమల స్వర్ణ కాంచీ సనాధాం’’

2-       వాసర సరస్వతీ స్తుతి

‘’మందీ భూత జన ప్రబోధన విధౌ సూర్య ప్రకాశాయితాం –కుందేందు ద్విషదాత్మకాంతి కలితాంబృందారకై ర్వందితాం

మంద స్మేర యుతాం విరించి హృదయా నందాను సంధాయినీ౦ –వందే వాసర వాసినీం భగవతీ మిస్టారదా౦ భారతీం ‘’

3-కావ్య లక్ష్మి

‘’సులలిత పద సంపద్బోదినీం కామినీవా –నవరస పరిపూర్ణా జాహ్నవీ వ ప్రసన్నా –కిమపి వశద యంతీ మంగళా చారతత్వం

రసిక హృదయ మాన్యా వర్ధతాం కావ్య లక్ష్మీ ‘’

4-మానస సౌభ్రాత్రం

‘’అభినవ కాళిదాస శ్రీ తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి –సౌభ్రాత్రం యది లభ్యతే సుజనతా సాధ్యం పరం మానవైః

ఏస్తేషాం న భవన్త్య కీర్తి నిలయాః కామోద యోదుర్గుణా-దంభాధ్యశ్ఛ తతో భవ  త్యనుపమం శ్రీశ్రేయ సంలఘ్వత

సౌభ్రాత్వం లభాతార్ధదం హితకరంభో భారతీ యా జనాః .’’

5- వింశతి సూత్ర యోధ

‘’జాతో గాంధి మహాత్మనో దృఢ వారా త్పూజ్యేందిరాంబా హృదం –ప్రాప్యత్వం జనిమాత్ర తోప విమల౦ సద్గూఢ చారాత్మకం

కుర్వన్గుప్త ధనాద్రి పక్ష దళనం శ్లాఘ్యోసి శక్రో యదా –ధీమ న్వి౦శతి సూత్రా యోధ సమతాం సంపాద్య సంరక్షనః ‘’

6- భజే కృష్ణ వేణీం

‘’చలద్రంగదుత్తంగ భంగాభి రామం –పథస్సంభవాం పస్చిమద్ర్యంతర స్థాత్ –సరంతీం ధ్వనంతీం యదా సామగానాం –దదానాంపవిత్రాం భజే కృష్ణ వేణీం ‘’

‘’సమప్రాణినాం క్షుత్పిపాసో ప శాంతిం –విధాతుం వ తీర్ణాం జగత్యాం పయొభిః-సమస్తాని సస్యాని మాతేవపాంతీం-అమర్త్యాభి గమ్యా౦ భజే కృష్ణ వేణీం ‘

  సశేషం

   మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -1-1-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment