లైట్  కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్  రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ

లైట్  కా౦బట్ ఎయిర్ క్రాఫ్ట్,సూపర్ సానిక్  రూప శిల్పి –డా. శ్రీ కోట హరినారాయణ

ఒరిస్సా రాష్ట్రం బరం పురం లోతెలుగు  బ్రాహ్మణ కుటుంబం లో శ్రీ కోట హరినారాయణ 194 3లో జన్మించారు .బెనారస్ హిందూ యూని వర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులై ,బెంగుళూరు ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో చేరి ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు .బొంబాయి ఐ .ఐ .టి.లో పి.హెచ్ .డి .చేశారు .ఉన్నతవిద్య నంతా మనదేశం లోనే పూర్తి  చేసి దేశీయంగా ఎదిగిన ఉత్తమశ్రేణి శాస్త్రవేత్త శ్రీ హరి నారాయణగారు .

దేనికీ విదేశాలపై ఆధారపడరాదన్ననిశ్చల మనోరధమున్నవారు .1967 లో హిందూస్థాన్ ఏరో నాటికల్ లో ఉద్యోగం లో చేరారు .1970 రక్షణ పరిశోధన సంస్థ ‘’డి. ఆర్. డి .వో.కు బదిలీ అయి ,సుమారు 12 ఏళ్ళు అనేక కీలక పదవులలో రాణిస్తూ తనకిష్టమైన పరిశోధనలు చేస్తూ ఎదిగారు .1982 లో మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న హిందూస్థాన్ ఏరో నాటికల్ ( హెచ్. ఏ .ఎల్ )లో చీఫ్ డిజైనర్ గా గురుతర బాధ్యతలు చేబట్టారు .మిగ్ -21 విమాన ఆయుర్దాయాన్ని పెంచటం లో సఫలీ కృతులయ్యారు . అంతే కాక దాని సామర్ధ్యాన్ని పెంచి ,బరువు తగ్గించటం లో విజయం సాధించారు .దీనివల్ల మనదేశం మిగ్ -21 విమానాల విడిభాగాల ఉత్పత్తి చేసే సామర్ధ్యం సాధించి ప్రగతిపధం లో దూసుకు వెళ్ళింది .

డా నారాయణ 1985 లో బెంగుళూరు  ఏరో నాటికల్ డెవలప్ ఎస్టాబ్లిష్ మెంట్ లో డైరెక్టర్ అయ్యారు .అప్పటికే ఆయన లైట్ ఎయిర్ క్రాఫ్ట్ నిర్మాణం లో బహు పరిశోధనలు చేసి దాన్ని  ఎల్ .ఎ .సి .ప్రాజెక్ట్ నిర్మాణాన్ని  సాకారం  చేశారు .తన శక్తియుక్తులు సామర్ధ్యం ,సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలబోసి ‘’లైట్ కా౦బట్ ఏర్ క్రాఫ్ట్’’అంటే LCA అనగా తేలికపాటి యుద్ధ విమానం తయారు చేసే ప్రోగ్రాం డైరెక్టర్ అయ్యారు .ఎల్. సి.ఎ. విమానం తయారు చేసి విజయవంతంగా ఫ్లైట్ పరీక్షలు నిర్వహించారు .పరిమిత ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతించింది .హరి నారాయణగారి మేధో వికసనం వలన భారత దేశం తేలిక పాటి యుద్ధ విమాన ఉత్పత్తి లో ప్రపంచ దేశాల స్థాయిన నిలబడింది. ‘’హాట్స్ ఆఫ్ టు నారాయణ్ జీ’’.. ఈ ఘనత ఆయన సాధించినట్లు మనకు తెలియనే తెలియదు .

LC A విజయం తో ప్రముఖ శాస్త్ర వేత్తగా గుర్తింపుపొందిన హరి గారు దేశ గౌరవ ప్రతిష్టలకు అత్యున్నత స్థానం సాధించి పెట్టారు .ఆధునిక కాలం లో విజయాలకు యుద్ధ విమానాలే కీలక పాత్ర పోషిస్తాయని ఆయన నమ్మకం . నెహ్రూ కాలం లో మనదేశం చైనా యుద్ధంలో దారుణంగా ఓడిపోవటానికి కారణం శత్రువు పై ప్రయోగించే అత్యాధునిక ఆయుధ సామగ్రి మనకు లేకపోవటమే .తర్వాత పాకిస్తాన్ పై యుద్ధ విజయానికి మన యుద్ధ విమానాలే కీలకమయ్యాయి .వీటిని ఇతర దేశాలనుంచి కొని తెచ్చుకొంటే తడిసి మోపెడౌతుంది కనుక స్వదేశీ యుద్ధ విమానాలకే మొగ్గు చూపారు .అన్నిరకాల యుద్ధ విమానాల తయారీకి నడుం కట్టారు .దీనికి తగినట్లుగా స్పందించి కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలను మంజూరు చేసింది .

మొట్టమొదట బెంగుళూరు HAL లో ఏటా  8 LCA ల ఉత్పత్తికి ప్రణాళిక సిద్ధం చేసింది.నౌకాదళ తీర సంరక్షణలో కీలకం కనుక దానికి ఉపయోగ పడేట్లు ఒకే ఇంజన్ ఉన్న LCA లను కూడా తయారీ చేసింది వీటికి ”తేజస్” అని పెట్టారు . .ప్రపంచం లోనే ఇలాంటి వాటి తయారీలో  భారత దేశమే ముందుంది .దీనికి ముఖ్యకారణం తెలుగు బిడ్డ డా కోట హరినారాయణ గారు  అని మనం గర్వపడాలి .తేలిక యుద్ధ విమానాల తయారీ లో 300 పరిశ్రమలు ,40 విద్యా సంస్థలు ,ఎన్నో పరిశోధనా సంస్థల భాగస్వామ్యముంది .దాదాపు మూడు దశాబ్దాలవరకు LCA కు దీటైన యుద్ధ విమానం రాదు, రాలేదు, రాబోదు అని హరినారాయణ పాంచజన్యం పూరించి చెప్పినట్లు చెప్పారు .అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ,ప్రతిభ , పోరాట పటిమ ,నైపుణ్యం దృష్ట్యా ప్రపంచం లో దీన్ని’’ బీటౌట్ ‘’చేసే ‘’కాంబట్ ప్లేన్’’ లేదని అభిజ్నులంటారు .ఈ విజయం అంతసులువుగా లభించలేదు .అమెరికా పెట్టె ఎన్నో ఆంక్షలు ,రూపకల్పనలో అడ్డంకులు అధిగమించి,దీక్ష ,దక్షత , ముందుచూపు ,లక్ష్యసాధన , అంకితభావం లతో విజయ శిఖరాలకు చేరారు .అందుకే వీరికి 2002 లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది ‘.

దీనికి ముందే డా హరి గారికి DRDOవారి టెక్నాలజీ నేతృత్వ బహుమానం ,డా యలవర్తి నాయుడమ్మ అవార్డ్ ,శాస్త్ర సాంకేతిక రంగ రూప కల్పనకు ఇచ్చే  జి. డి .మోడీ. అవార్డ్( 20 06)  మొదలైన పురస్కారాలెన్నో పొందారు .ఏరో నాటికల్ ఇండియా లో దాని అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం సేవ చేసి ,20 02 లో అబ్దుల్ కలాం గారిలాగా  స్వచ్చంద పదవీ  విరమణ చేశారు.హైదరాబాద్ లో సెంట్రల్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా విద్యార్ధుల భవితవ్యాన్ని తీర్చి దిద్దుతూ, వారిని భవిషత్ శాస్త్ర వేత్తలుగా మలిచే ప్రయత్నం చేశారు  .లాక్(LCA) రూప శిల్పి అయిన  డా . హరినారాయణగారిని ‘’లాక్ మాన్ ‘’గా సంబోధిస్తారు .కలాం గారిని’’మిసైల్ మాన్ ‘’అన్నట్లే. ఇదికూడా సార్ధకం అయింది.నారాయణ గారి పరిశోధనలు LCA  కు మాత్రమె పరిమితం కాలేదు .ఏవియోనిక్స్ ,ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ మొదలైన అత్యాధునిక ఏరో నాటికల్ టెక్నాలజీ అభివృద్ధికి కూడా అనితరసాధ్యమైన కృషి చేశారు .భారత దేశపు మొదటి సూపర్ సానిక్ ఫైటర్ఏర్ క్రాఫ్ట్ సృష్టికర్త ,యుద్ధ విమాన నిర్మాణం లో భారత్ ను అగ్రదేశాల సరసన కూర్చో బెట్టిన ప్రతిభామూర్తి డా కోట హరినారాయణగారు .శ్రీ మన్నానారాయణుడైన  శ్రీహరికి సుదర్శన చక్రం అలంకారం శత్రు సంహార ఆయుధం అయినట్లు   ,డా  హరినారాయగారికి మిగ్ , లాక్ సూపర్ సానిక్ లు కీర్తికి అలంకారాలు , భారత దేశ భద్రతకు దివ్యాస్త్రాలు .,

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-10-8-18 –ఉయ్యూరు

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎవరీ చిత్రరథుడు?

ఎవరీ చిత్రరథుడు?

భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం  ఇవాళ పారాయణ చేస్తుంటే లో శ్రీ కృష్ణ పరమాత్మ తన విభూతులు ఎవరెవరిలో ఉన్నాయో వివరిస్తూ –

‘’ఆశ్వత్దః సర్వ వృక్షాణా౦ ,దేవర్షీ ణా౦ చ నారదః –గంధర్వాణా౦ చిత్ర రథః సిద్ధానాం కపిలో మునిః’’అని చెప్పిన 26 వ శ్లోకం   యధాలాపం గా వెళ్ళిపోయింది .తర్వాత చిత్రరథుడు ఎవర్రాబాబూ అని చిన్న ఫ్లాష్ ఆలోచన వచ్చింది . తెలుసుకొనే ప్రయత్నం చేసి, తెలిసింది తెలుసుకొన్నది మీము౦దు ఉంచే  ప్రయత్నం చేశా . .

మనం గీత ను పారాయణం చేస్తాం .మనవాళ్ళు కొందరు దానిలోని గొప్పతనాన్ని ఉపన్యాసాలలో వివరిస్తారు .దానిలోని ధర్మ సూక్షాలు తెలియ జేస్తారు .చదివే మనం కాని ,చెప్పే వాళ్ళు కాని శ్లోకం లో ఉన్న పేర్లలోని విశేషాల గురించి ఆలోచించం .తెలుసుకోవాలనే ధ్యాస జిజ్ఞాసా కూడా ఉండదు .ఇది లోక సహజం .ముక్కస్య ముక్కః గా ‘’పరమాత్మ ఏం చెప్పాడంటే వృక్షాలలో తాను అశ్వత్ధ వృక్షాన్నని ,దేవ మునులలో నారడదుడనని  గంధర్వ్వులలో చిత్ర రథుడ నని ,సిద్దులలో కపిల ముని నని చెప్పాడు .’’అనిముగిస్తాం .కనుక నాయనలారా అశ్వత్ధ వృక్షాన్ని ,నారదుడిని ,చిత్ర రథుడిని ,కపిల మహర్షి ని పూజిస్తే ఆయన్ను పూజించినట్లే అంటాం .రావి చెట్టు దేవాలయాలలో, గ్రామాలలో రచ్చబండ వద్ద ఉంటాయికనుక వాటికి పసుపు కుంకుమలు పెట్టి కాదుకాదు రుద్ది  వీలయితే కోరికలు తీరటానికి ఉట్లు కట్టి పూజిస్తాం .లేక అనంతపురం దగ్గరున్న ‘’విదురాశ్వత్ధం’’వెళ్లి చూసి ఆహో ఇక్కడే  విదురుడు ఈ చెట్టు కింద తపస్సు చేశాడని చెప్పుకొంటాం .పనిలో పనిగా లేపాక్షి వెళ్లి అక్కడి జగత్ప్రసిద్ద నందిని చూసి మురిసిపోతాం .అక్కడి వీరన్న విరూపాక్ష సోదరుల కధ తెలుసుకొంటాం .విరూపన్న కళ్ళను గోడకేసి కొట్టిన చోటు చూసి అయ్యో పాపం అనుకొంటాం .కాని శ్లోకం లో ఉన్న చిత్ర రథుడి గురించి పట్టించుకోం .ఎవరోలే ఎవరైతే నేమిలె అని ఉదాసీనం గా ఉంటాం .  కృష్ణ పరమాత్మ అతని పేరు చెప్పాడు అంటే అందులో ఏదో గొప్పతనం ఉండి ఉండాలి అన్న స్పృహ సహజంగా మనకు రాదు .నాకు తెలిసినంత వరకు తెలుసుకోన్నంత వరకు తెలియ జేస్తా .

  భారతం లో చిత్ర రధుని పాత్ర వస్తుంది .అతనికి అంగార పర్ణుడు అనే పేరుంది .గంధర్వ రాజు .కుబేరునికి పరమ మిత్రుడుకూడా .ద్రుపద నగరానికి పాండవులు వెడుతున్నప్పుడు ఒక రోజు రాత్రి ,అతడు తన స్త్రీలతో విహరిస్తుండగా వాళ్ల పాద ధ్వనిని  విని ‘’ఎవరుమీరు ?ఎక్కడికి వెడుతున్నారు ?’’ఇది నాకు చెందిన అడవి .నా అనుమతి లేకుండా నిస్సంకోచంగా రాత్రి వేళ సంచరిస్తున్నారు .ఈ అరణ్యం ,ఇక్కడున్న గంగానది  అంగార పర్ణుడివి  అని మీకు తెలియదా ‘’అనికోపం తో కేకలు వేస్తూ  అడిగాడు .అప్పుడు అర్జునుడు ‘’ఈ నదిలో ఎవరు స్నానం చేస్తే వాళ్ళది అవుతు౦ది కాని నీకుగుత్తాదిపత్యం కాదు .సముద్రం, నది, పర్వతాలు, అడవులు ఎవరో ఒక్కరికి చెందినవికావు .సమస్త జనులకు వాటిపై అనుభవించే హక్కు ఉంది .నువ్వు వద్దన్నమాత్రాన మేము వెనక్కి పోతామనుకొన్నావా ?.గంధర్వులంటే భయపడి శక్తిలేని సామాన్య  మానవులు  పూజిస్తారు కాని వీరులు కాదు . మమ్మల్ని అడ్డగించటానికి , ఆపటానికి నీకు హక్కులేదు .గంగానది దివిజగంగ .పాపాలను క్షాళనం చేస్తుంది .శాశ్వతమైనది .ఆపవిత్ర నదీమ తల్లి పై  హక్కు ఉందనటం మూర్ఖత్వం ‘’అని జవాబు ఘాటుగానే ఇచ్చాడు .

  తనను ఎదిరించే వాడువచ్చాడన్న కోపం అసూయతో వాడు అర్జునిపై బాణాలు వేసి గాయపర్చాడు .సర్పాస్త్రాన్ని వాడు సంధిస్తే ,అర్జునుడు కూడా వెనువెంటనే శర సంధానం చేసి వాడిని తీవ్రమైన బాణాలతో నొప్పించి అగ్ని అస్త్రం ప్రయోగించాడు .కొంత సేపు ఇద్దరిమధ్య భీకర పోరాటమే జరిగింది .’’శస్త్రాస్త్ర ప్రయోగం తెలిసిన వీరుడిపై  ,తెలియని అస్త్రాలు ప్రయోగించటం  తెలివి తక్కువ పని, వ్యర్ధం కూడా.అగ్ని తత్త్వం తెలుసుకోకుండా అంగార పర్ణుడు అనే పేరు పెట్టుకొని కులుకుతున్నావు .అంటే అగ్ని హోత్రునికే ద్రోహం చేస్తున్నావు కనుక నువ్వు శిక్షార్హుడవే ‘’అని  హెచ్చరించి  చెప్పాడు గాండీవి . కాని అంగారపర్ణుడు అర్జునుని ధాటికి నిలవలేక ఓడిపోయాడు . ఫల్గుణుడు ఆ గ౦ధర్వ ని జుట్టుపట్టుకొని ఈడ్చుకొంటూ అన్న ధర్మరాజు పాదాల చెంత పడేశాడు .ఇంతలో విషయం తెలిసిన అంగార పర్ణు ని భార్య గోడుగోడున విలపిస్తూ వచ్చి తనకు పతి భిక్ష పెట్టమని యుదిస్టిరుని వేడుకొన్నది  .ఆమె పై జాలిపడి ఆతడిని వదిలేయమని తమ్ముడికి చెప్పాడు .  అర్జునుని శౌర్య బలపరాక్రమాలు గ్రహించి మెచ్చుకొన్న అంగార పర్ణుడు ,అప్పటినుంచి తాను  అంగార పర్ణుడుగా పిలువబడనని,తన రధం చిత్ర గతులతో నడుస్తుంది కనక చిత్ర రధుడనే పేరు వచ్చిందని దాన్నికూడా అర్జునుడు ధ్వంసం చేశాడుకనుక ఆపేరూ ఇక ఉపయోగించుకోనని చెప్పాడు  . అర్జునునితో స్నేహం చేయాలని అభిలషించాడు .అంతేకాదు  పార్దుడికి ‘’చాక్షుషి ‘’అనే గ౦ధర్వ విద్య ఉపదేశించాడు . ఈ విద్యను ఇస్తూ అతడు ‘’ మనువు సోముడు అంటే చంద్రునికి బోధించాడు .సోముడు అంతరిక్ష దేవత .అగ్ని పృథ్వి దేవత .ఇంద్రుడు దేవతలకు అధిపతి .చంద్రుడు విశ్వావసు అనే గాంధర్వ రాజుకు ఉపదేశించాడు .విశ్వావసు  గంధర్వ  రాజు నైననాకు  ఆ విద్య నిచ్చాడు .చాక్షుషి విద్యవలన దివి ,భువి అంతరిక్షాలలో  దేన్ని  చూడాలనుకొంటే దాన్ని,  ఏ రూపం లో కావాలంటే ఆ రూపం లో చూడగలుగుతారు ..ఈ విద్య స్వాధీనం కావాలంటే ఆరునెలలు కఠోర అనుష్టానం చేయాలి  .ఈ విద్యవలననే మా గంధర్వులు మనుష్యులకంటే ఉత్తమజాతి వారయ్యారు .దేవతలకు సములయ్యారు .’’అని వివరించాడు .

  అతేకాడు చిత్ర రధుడు పాండవులకు ఒక్కొక్కరికి 100  వాజీ లు అనే ప్రత్యేక   గంధర్వలోకం లో ఉపయోగించే అశ్వాలను ఇచ్చాడు .వీటిని దేవగంధర్వ అశ్వాలు అంటారు .అత్యుత్తమ జాతి గుర్రాలివి .అవి కృశించినా, బలహీనమైనా వాటి వేగం ఏమాత్రమూ తగ్గదని చిత్రరథుడు చెప్పాడు . ఈ వాజీ లు  ఏరంగుకావాలంటే ఆ రంగును, యెంత వేగం కావాలంటే అంతవేగం పొందగల ప్రత్యేక లక్షణాలు  కల దివ్యాశ్వాలు  .యజమాని అనతరంగాన్ని అర్ధం చేసుకొని ప్రవర్తించే ప్రత్యేక లక్షణం వీటిది .గంధర్వులలో ఉత్తమ జాతి వారు  దేవతలతో సమానమైనవారు ,కొంచెం తక్కువజాతివారు సామాన్య మానవులతో సమానమై’’ నరులు ‘’అని పిలవబడుతారని చెప్పాడు.

  అర్జునుడు అతనికి కృతజ్ఞతలు చెప్పి తనకు చాక్షుషి విద్య , వాజీలు అవసరం లేదని చెప్పాడు .కాని అతడు తనకు ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞతగా తీసుకోవాల్సిందేనని బ్రతిమిలాడాడు .అర్జునుడు కూడా దీనికి బదులుగా తన అగ్ని అస్త్రాన్ని అతడిచ్చిన వాజీలకు బదులుగా ఇచ్చాడు .పాండుకుమారుల జన్మ రహస్యాలు తనకు తెలుసునని ,వారు యమ ,ఇంద్ర వాయు అశ్వినీ దేవతల వర జన్ములని ,వారి పౌరుష పరాక్రమాలూ తనకు అవగతమేనని చెప్పాడు .గంధర్వులకు రాత్రివేళ పరాక్రమం ఎక్కువ అని ,అర్జునుని బ్రహ్మ చర్యం,ధర్మ వర్తనం  వలననే తాను అతని చేతిలో ఓడిపోయానని అన్నాడు .అర్జునుని మాటిమాటికీ ‘’తాపత్యా ‘’అని సంబోధిస్తుంటే ఎందుకు అలా అంటున్నావో చెప్పమని అడిగాడు .అప్పుడు అతడు ‘’దేవలోకం లో తపతి సౌందర్య రాశి .ఆమె చిన్నతనం లోనే ఆమెను వివాహమాడాలని దేవ గాంధర్వ యక్ష రాక్షసులు  ఉవ్విళ్ళూ రారు .యుక్త వయసు రానిదే పెళ్లి చేయనని తండ్రి వివస్వుడు అన్నాడు .సంవర్ణు డు అనే అందమైన వినయవిదేయతలు ధర్మపాలన ఉన్న యువ  మహారాజు తనకూతురుకు తగిన వరుడు అని నిశ్చయించాడు .అతడు క్షత్రియ కన్యకు బ్రాహ్మణుడికి జన్మించాడు .క్షత్రియ విద్యలలో ఆరితేరినవాడు .నర్మదానదికి ఉత్తర ,దక్షిణభాగాలన్నీ అతని ఏలుబడి ఉన్నాయి .ఒక రోజు వనవిహారం లో తపతి కన బడి అతని మనసు లాగేసింది .ఎవరు నువ్వు అని అడిగేలోపు సిగ్గుతో అదృశ్యమైంది .మళ్ళీకనబడితే గాంధర్వ వివాహం చేసుకొందామని అంటే ఆమె తాను తండ్రి సంరక్షణలో ఉన్నానని ఆయన అనుమతి అవసరమని చెప్పింది .

  తపతిపై గాఢ ప్రేమలో పడి ,అదే ధ్యాసగా ఉన్న అతడిని వశిస్టమహర్షి కలిసి ఉపాయంగా తపతిని అతనికి పెళ్లి చేసి రాజ్యపాలన మంత్రికి అప్పగింప జేసి , నర్మదానది పర్వతాలలపై విహరి౦చమన్నాడు .కాని రాజ్యం లో 12 ఏళ్ళు వర్షాలు లేక కరువుకాటకాలేర్పడ్డాయి ..అప్పుడు మహర్షి ,నూతన  దంపతులను రాజ్యానికి రమ్మని కోరాడు .వారురావటం తో వర్షాలు కురిసి భువి సస్య  శ్యామలమైంది .సంవర్ణ ,తపతుల కుమారుడే  కురు అంటే మీ వంశ పూర్వీకుడు .అందుకే నిన్ను  తాపత్యా అన్నాను  ‘’అని వివరంగా చెప్పాడు అర్జునునికి చిత్ర రధుడు .తన పూర్వీకుని వృత్తాంతం సవిస్తరంగా తెలియ జేసినందుకు  కృతజ్ఞత తెలిపాడు .

   చిత్ర రథుడు ధర్మరాజుతో లోక హితము ,ధర్మ సూక్ష్మాలు తెలియ జెప్పే పురోహితుని ఏర్పాటు  చేసుకో మని సూచించాడు .అలాంటి వారెవరున్నారని అడిగితే ‘’ధౌమ్యుడు ‘’ఉత్తమజాతిబ్రాహ్మణుడ ని ఆయనను పురోహితునిగా చేసుకోమని సలహా ఇచ్చాడు .కనుక సకల ధర్మ శాస్త్రాలు తెలిసిన నీతి కోవిదుడు గా చిత్ర రధుడు మనకు కన్పిస్తాడు .గ౦ధర్వ రాజులలో ఇంతటి బుద్ధి  సూక్ష్మత ఉన్న వారులేరు .కనుకనే  శ్రీ కృష్ణుడు ‘’గంధర్వాణా౦ చిత్రరదః ‘’అని నొక్కి వక్కాణించాడు .’’ఇంట లెక్ట్’’  ఎక్కడ ఉంటే పరమాత్మ అక్కడ ఉంటాడుకదా .

  రామాయణం లో ఒక చిత్ర రథుడున్నాడు .ఈయన దివి రథుని కుమారుడు .ధర్మ రధుని పుత్రుడు .ఇతని మొదటి పేరు చిత్రరథుడు .అంగ దేశ రాజు .ఇతడినే రోమపాదుడు అంటారు దశరధమహారాజుకు మంచి మిత్రుడు .దశరధుడు తనకూతురు శాంతను రోమపాదునికిచ్చి వివాహం చేశాడు .చాలాకాల౦  సంతానం లేకపోవటం తో దానధర్మాలు విరివిగా చేశాడు భార్యతోకలిసి .ఒకసారి ఒక బ్రాహ్మణుడు  దానం పుచ్చుకొని, ఇంటికి వెళ్లి కొడుకును కూడా తెచ్చి అతడికి ఆవును దానం ఇమ్మని కోరాడు. బ్రాహ్మణుడి ఆశాపాతాన్ని చూసి రోమపాదుడు నవ్వగా ఆయన రాజ్యంలో అనావృస్టి కలగాలని శపించాడు .బ్రాహ్మణ అవమానానికి విప్రులు దేశంవదిలి వెళ్ళిపోయారు . అంగ దేశం అనా వృష్టి తో కుంగిపోయింది .ఏరకమైన కల్మష కాపట్యాలు  లేని బ్రహ్మచారి అయిన ఋష్యశృంగుడు వస్తేనే వర్షాలు పడతాయని గ్రహించి ఆయన్ను తీసుకురావటానికి వేశ్యలను పంపాడు .ఆడవాళ్ళు అనే వారు ఉంటారని అస్సలు తెలియని ఆయన ,వాళ్ల ఆకర్షణకు లోనై  వాళ్ళతో వెళ్ళగా   సు వృష్టి కురిసి  పంటలుబాగా పండి కరువు నశించింది .రోమపాదుడికి సంతానం కలగటానికి ఋష్యశృంగుడు ఇంద్రుని గూర్చి ఇష్టి నిర్వహించాడు .చతురంగుడు అనే కుమారుడు పుట్టాడు .

  కురు కుమారులలో ఒక చిత్ర రథుడున్నాడు .అంగరాజు. చిత్ర రధుని భార్య ,దేవ శర్మ అనే బ్రాహ్మణుడి భార్య అక్కా చెల్లెళ్ళు .మరో చిత్రరథుడు లక్ష మంది భార్యలున్న ఒక రాజు శశి బిందుని కొడుకు .ఒక్కోపెళ్ళానికి అనేకమంది కొడుకులు .

  ఇందరిలో చుక్కల్లో చంద్రుడు అర్జునునికి చాక్షుషి  విద్యనూ వాజీ లను ఇచ్చిన అంగార పర్ణ చిత్ర రధుడే  మనకు కావలసినవాడు కదా .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చర్మ విజ్ఞాన శాస్త్ర నిపుణులు –డా .యలవర్తి నాయుడమ్మ

చర్మ విజ్ఞాన శాస్త్ర నిపుణులు –డా .యలవర్తి నాయుడమ్మ

10-9-19 22 గుంటూరు జిల్లా తెనాలి తాలూకా యలవర్రు లో రైతు కుటుంబం లో జన్మించిన యలవర్తి నాయుడమ్మ ,అక్కడే ప్రాధమిక విద్య నేర్చి ,గుంటూరు ఎ .సి .కాలేజిలో ఇంటర్ చదివి ,19 43 లో బెనారస్ హిందూ యూని వర్సి టిలో బి .ఎస్ .సి .డిగ్రీ పొంది ,మద్రాస్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ లో చేరి ,సునుశిత మేదావి అవటం తో ఆ సంస్థ ఆయన్ను లెదర్ టెక్నాలజిలో పరిశోధనలకోసం బ్రిటన్ పంపింది .అక్కడి అధ్యయనం పూర్తయ్యాక అమెరికాలో లీహై యూని వర్సిటి లో అంతర్జాతీయ చర్మ శుద్ధి అంశం పై డాక్టరేట్ అయ్యారు .అక్కడే చర్మ శుద్ధి పై వివిధ పరిశోధనలు చేసి  1943 లో మద్రాస్ వచ్చి ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ లో సైంటిస్ట్ గా చేరి ,రెండేళ్ళు పనిచేసి మళ్ళీ అమెరికా వెళ్లి లోగడ తాను చేసిన పరిశోధనలకు మెరుగులు దిద్దారు .1951 లో ఇండియావచ్చి సెంట్రల్ లెదర్ రిసెర్చ్ యూని వర్సిటిలో సైంటిస్ట్ అయ్యారు .ఎన్నో ప్రణాలికలు రూపొందించి చర్మకార పరిశ్రమ అభి వృద్ధికి విశేష కృషి చేసి ,కేంద్ర చర్మ పరిశోధకాభివృద్ధి ,కి  సంస్థను సాటిలేని మేటి సంస్థగా తీర్చి దిద్దారు .1956 లో దీనికి డైరెక్టర్ అయ్యారు .జాతీయ స్థాయిలో ఈ సంస్థ ఎదిగి పారిశ్రామిక ,గ్రామీణాభి వృద్ధి సంస్థగా గణనీయై మైన సేవలందించింది .ప్రొఫెసర్ నాయుడమ్మ ఖ్యాతి దేశ విదేశాలలో మారు మోగింది .

నాయుడమ్మ  సామర్ధ్యానికి  తగిన హోదాలెన్నో పొందారు .కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రి యల్ రిసెర్చ్ సంస్థకు 19 71 -77 వరకు డైరెక్టర్ జనరల్ అయ్యారు .1981 లో ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా ,మద్రాస్ యూని వర్సిటి ఆనరరి ప్రొఫెసర్ గా ,సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ కు  డిస్టి౦గ్వి ష్డ్ సైంటిస్ట్ గా సేవలందించారు .చర్మ పరిశోధనలోనేకాకుండా ఖనిజాలు వృక్షాలు ఆల్డే హైడ్స్ మొదలైన వాటి కలయిక ,నిర్మాణ శైలి లలోనూ విశేష పరిశోధనలు గావించారు ,ఇవన్నీ తోళ్ళను   పదును చేయటానికి కొత్త ఏజెంట్స్ గా పనికొస్తాయని రుఉజువు చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు .’’జన్మ చేత రైతును ,వృత్తి చేత  అస్ప్రు శ్యు డను’’అని డా నాయుడమ్మ తనపై తాను జోక్ వేసుకొన్నారు .ఆయనవలన మన చర్మ కార వస్తువులకు అంతర్జాతీయ ప్రమాణం ,నాణ్యత గిరాకీ హెచ్చింది .

అలీన దేశాలకు ,ఇతర దేశాలకు మధ్య స్నేహ వారధిగా నాయుడమ్మ విఖ్యాతి గాంచారు .మద్రాస్ CRRIలో వివిధ ప్రయోగాలకుకావలసిన  లేబరేటరీల రూపకల్పనకు ప్రణాలికలు తయారు చేసి ,డిజైన్ ల రూప కల్పన చేశారు .ఆ సంస్థ పేరు  చెబితే  ఎవరికైనా నాయుడమ్మ గుర్తుకొస్తారు .దాని సర్వతోముఖాభివృద్ధికి అహరహం శ్రమించిన విజ్ఞాని .అత్యాధునిక శైలిలో తోళ్ళ పదును ,శుద్ధి కి పైలట్ ప్లాంట్ లనుమొదటి సారిగా జాతీయ స్థాయిలో  నెలకొల్పటం లో దోహదపడ్డారు .సమాచారం అందరికి అందుబాటులో ఉండాలని భావించి ‘’లెదర్ సైన్స్ ‘’పత్రిక స్థాపించి సంపాదకులైనారు .

నాయుడమ్మగారి సునిశిత మేధా శక్తి గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు గా నియమించి గౌరవించారు .తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులుకూడా అయన నే కొనసాగించారు .తమిళనాడు  ప్రభుత్వానికీ గౌరవ సలహాదారయ్యారు .1977 ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమి ,ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ఇండియన్ స్టాండర్డ్ ఇన్ స్టి ట్యూట్ సంస్థల  ఫెలోషిప్ పొంది,పరిశోధనలో సాటి లేని వారనిపించుకొన్నారు .మనదేశం లోనే విదేశాలలోని సంస్థలూ ఆయనకు విశేష గౌరవాన్నిచ్చాయి .అమెరికన్ లెదర్ కేమిస్ట్స్అసోసియేషన్ ,ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ లెదర్ ట్రేడ్ కేమిస్ట్స్  మొదలైన  సంస్థలు  గౌరవ సభ్యుని చేసి గౌరవించాయి .అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ కెమికల్ సొసైటీ ,ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ కేమిస్త్స్ కు అధ్యక్షులు .అంతర్జాతీయంగా ఇంతటి ఘనకీర్తి సాధించినా ,సభలు , సమావేశాలలో ‘’నాపేరు నాయుడమ్మ అంటారండీ  ‘’అని అత్యంత వినయంగా కొత్తవారితో పరి చయం చేసుకొనేవారు .నిరాడంబరత ,వినయ విధేయతలు సునిసిత మేధా శక్తి ఆయన ప్రత్యేకతలు  ఐరాస సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకుని దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు.

మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు సైన్స్ ,టెక్నాలజీ లను ఉపయోగించి వెనుకబడిన జిల్లాలను దత్తత తీసుకొని అభి వృద్ధి చేయటానికి కృషి చేసి సత్ఫలితాలు సాధించారు .1965 లో గుజరాత్ లోని వడోదర లో ఉన్న ఎం .ఎస్ .యూని వర్సిటి వారు డాక్టర్ కే .జి  నాయక్ గోల్డ్ మెడల్ ఇచ్చి సత్కరించింది .1971 లో కేంద్ర ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందజేసింది .ఇంగ్లీష్ లో రమణీయంగా ,తెలుగు లో కమ్మగా తియ్యగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత .నాయుడమ్మ గారికి కళా పిపాస బాగా ఉండేది .ఎన్టి రామారావు హీరోగా ఎస్. డి .లాల్ డైరెక్టర్ గా తీసిన ‘’రాజపుత్ర రహస్యం ‘’జానపద చిత్రానికి నాయుడమ్మగారు నిర్మాత .ఇందులో మనిషి ఏ ప్రాంతం లో పెరిగితే ఆ భాష మాత్రమే మాట్లాడుతాడు ‘’అనే వైజ్ఞానిక సత్యాన్ని ఆవిష్కరించారు .అలాగే దీనిలో  హీరో చిన్నతనం లో అడవి జంతువుల సహవాసం లో పెరిగినప్పుడు కేవలం సైగలే చేస్తూంటాడు .తరువాత జనారణ్యం లోకి వచ్చాక మాటలు నేర్చుకొంటాడు .

1985 జూన్ 23 మాంట్రియాల్ లో జరిగే సదస్సులో పాల్గొని ఇండియారావటానికి లండన్   ‘’కనిష్క ‘’ విమానం ఎక్కగా  అది పేలిపోయి డా నాయుడమ్మ దుర్మరణం పాలయ్యారు .ఆయనతోపాటు 331 మంది నిర్దాక్షిణ్యంగా చంపి వేసింది ఒక నరహంతకుల ముఠా అని విచారణచేసిన దర్యాప్తు  సంస్థ 20 05 మార్చి మూడవ వారం లో   తీర్పు నిచ్చింది ఈ తీర్పు చరిత్రలోనే అసమర్ధపు, నిరాశాజనక దర్యాప్తుగా ప్రసిద్ధి చెందింది .నాయుడమ్మగారి కుమారుడు శ్రీ రతీష్ నాయుడమ్మ ఈ తీర్పుపట్ల ఆవేదన వ్యక్తపరచారు .కనిష్క పేల్చివేతలో ముద్దాయిలను నిర్దోషులుగా బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అన్యాయం అని లోకమంతా కోడై కూసింది .భారత ప్రభుత్వమూ ఉదాసీనతగా  వ్యవహరించింది .కిరాతక ,అమానుష చర్యకు ఎందరో బలయ్యారు .భారత దేశం,ఆంధ్రరాష్ట్రం  ఒక అంతర్జాతీయ మేధావి సైంటిస్ట్ విలువైన జీవితాన్ని కోల్పోయింది .

2006 జూన్ 23 హైదరాబాద్ లో ఆంద్ర ప్రదేశ్ సైన్స్ అకాడెమి ఆధ్వర్యం లో జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్తహలో ప్రొఫెసర్ నాయుడమ్మ స్మారక సభ జరిగింది .శాస్త్ర రంగం లో విశేష కృషి చేసి ,ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ డా, జి త్యాగరాజన్ కు ‘’నాయుడమ్మ స్మారక స్వర్ణ పతకం ‘’బహూకరించారు .నాటి ఆర్ధికమంత్రి శ్రీ రోశయ్య ,నాయుడమ్మ గారు సాధించిన విషయాలపై కేంద్రం ఒక డాక్యుమెంటరి ఫిలిం రూపొందించాలని కోరారు

డా. యలవర్తి నాయుడమ్మ మెమొరియల్ అవార్డ్

తెనాలి లో 1986 లో ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.వై నాయుడమ్మ సంస్మరణార్థం స్థాపించిన అవార్డును సైన్స్, టెక్నాలజీ, రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ప్రతి సంవత్సరం అందిస్తున్నారు.

ఈ అవార్డ్ పొందిన ప్రముఖులు టి.రామస్వామి, ఎ శివతాను పిళ్ళై, నోరి దత్తాత్రేయుడు, శామ్ పిట్రోడా, జి. మాధవన్ నయర్, కోట హరినారాయణ, వి.కె. ఆత్రె, ఆర్. చిదంబరం, ఆర్.ఎ. మశేల్కర్ జె.ఎస్. బజాజ్, కె. కస్తూరిరంగన్, వెర్ఘీస్ కురిఎన్, ఎస్.జెడ్. ఖసిం, ఎం.జి. కె.మీనన్ మరియు ఎం.ఎస్. స్వామినాథన్ వి.కె. సరస్వత్ (2009) తదీతరులు…

.19 90 లో  అవార్డ్ గ్రహీత –శ్రీ ఏం జి కే మీనన్ .20 05 లో యూని వర్సిటి ఆఫ్ కొలరాడో ఫెలో ప్రొఫెసర్ బెర్నార్డ్ అమడైకు ,20 06 లో భారత టెలికాం విప్లవ శిల్పి శ్యాం పెట్రోడాకు  అంద జేశారు .

“సామాన్య మానవుని కోనం విజ్ఞాన శాస్త్రం” అనే ఉత్తమ సదాశయాన్ని ఆచరణలోకి తెచ్చిన ఉదాత్తుడైన నాయుడమ్మ గొప్ప వైజ్ఞానికుడు, విద్యావేత్త, చదువులు ముగించుకొని ఉద్యోగాలలో ప్రవేశించిన తర్వాత కాస్త మంచి జీతమే వస్తుందనుకోగానే సంవత్సరములో ఒక నెలజీతం అందుబాటులో ఉన్న పేద విద్యార్థులకు కేటాయించారు. ఈ సహాయమును దానంగా పరిగణించనూలేదు. తాను సహకరిస్తున్నట్లుగా అన్యులెవరికీ తెలియకుండా గుప్తంగా అందిస్తూ వచ్చారు.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-18 –ఉయ్యూరు

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

యోగి నివృత్తి నాధుడు

యోగి నివృత్తి నాధుడు

నాధ సంప్రదాయానికి చెందిన నివృత్తి నాధుడు 13 వ శతాబ్దపు మహారాష్ట్ర కు చెందిన మహా భక్తుడు,కవి ,తత్వవేత్త మహాయోగి .మొదటి వర్కారి సంత్ అయిన సంత్ జ్ఞానేశ్వర్ కు పెద్దన్నయ్య , గురువుకూడా .మహారాష్ట్ర  గోదావరీ తీరం లోని  పైఠాన్ దగ్గరున్న ఆపెగావ్ లో దేశస్థ బ్రాహ్మణ  కుటుంబం లో జన్మించాడు .అప్పుడు ఆ ప్రాంతాన్ని మహారాష్ట్ర యాదవ  రాజు  రామదేవ వర్మ పాలిస్తున్నాడు .

గ్రామ కరణం అయిన తండ్రి విఠల్ పంత్ కు  జన్మించిన నలుగురు సంతానం లో  నివృత్తి నాథుడు పెద్దవాడు.  తల్లి  రుక్మిణి  బాయ్ . .నివృత్తి నాథుని తర్వాత జ్ఞానేశ్వరుడు ,సోపాన్ దేవుడు , అనే కుమారులు ,ముక్తాబాయ్ అనే కుమార్తె ఆ దంపతులకు జన్మించారు . .

నివృత్తి నాథుడు  పదేళ్ళ వయసులో  ముక్తాబాయ్ నాలుగేళ్ల వయసు లో  ఉండగా తండ్రి  కుటుంబాన్ని నాసిక్ కు మార్చాడు. ఒక సారి కుటుంబం తో  జ్యోతిర్లి౦గ మైన త్ర్యంబకేశ్వరుని దర్శించటానికి  తీర్ధ యాత్ర చేస్తూ దట్టమైన అరణ్యం లో ప్రయాణిస్తుండగా  అకస్మాత్తుగా ఒక పెద్ద పులి బారిన కుటుంబమంతా పడింది .భయపడి ప్రాణాలు దక్కించుకోవటానికి పారి పోయారు .అదృష్ట వశాత్తు ఎవ్వరికీ ఏ ప్రమాదమూ జరగలేదుకాని నివృత్తి నాథుడు మాత్రం కుటుంబానికి దూరమయ్యాడు .తండ్రి అతనికోసం చాలా కాలం వెతికించాడు కాని జాడ తెలియలేదు .అతడు అంజని పర్వతం పైకి చేరి అక్కడ గుహలో తలదాచుకున్నాడు .అక్కడే గహాని నాథ్ అనే యోగి తపస్సమాధిలో ఉండటం గమనించాడు .  ఆయన  సమాధి నుంచి బయటకు రాగానే ఆయన పాదాలపై వాలి శరణు కోరాడు . ఆయన ‘’సంతోషం ,చివరికి నువ్వు ఇక్కడికి వచ్చావన్నమాట ‘’అన్నాడు.  ఆయన  అన్నమాటలు అర్ధం కాలేదు .ఆశ్చర్యం తో చూస్తున్నాడు .’’ఆడవి లోకి పులిని పంపింది నేనే .నువ్వు ఇక్కడికి వస్తావని ఈ గుహలో ఎదురు చూస్తున్నాను ‘’అంటూ ఆప్యాయంగా హత్తుకొని శిరసుపై హస్తం ఉంచి  ఆశీర్వ దించాడు . అలనాడు శంకర  భాగవత్పాదులకోసం గోవింద భగవత్పాదులు ,,వివేకానందుని కోసం రామ కృష్ణ పరమహంస ఎదురు చూసిన సంగతి మనకు తెలుసు .నివృత్తి నాదుని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలిగి ఆయన మహాగురువు గహనీనాథు లని గ్రహించాడు .గురువు అతనిని శిష్యునిగా స్వీకరించి నాథ సంప్రదాయం లో చేర్చుకున్నాడు .గహనీ నాథమహాయోగి శిష్యుడు నివృత్తి నాదుని పై సంపూర్ణ అనుగ్రహామృతాన్నివర్షించి , ఆత్మజ్ఞానం పొందిన మహాత్మునిగా యోగి మహారాజ్ గా  మలచాడు .అతని జీవిత ధ్యేయం  కర్తవ్య౦ బోధించాడు .గురువును వదిలి పెట్టటానికి శిష్యుడు అంగీకరించలేక తపించి పోయాడు .ఉన్నట్టుండి ఒక రోజు గురుమహరాజ్ అక్కడి నుండి అదృశ్యమయ్యాడు . .ఇప్పుడు నివృత్తి నాథుడు  సంపూర్ణ  ఆత్మజ్ఞానం పొందిన  నాథ గురువై పూర్ణ యోగి యై జ్ఞాన బోధ చేస్తూ లోకానికి మార్గ దర్శనం చేశాడు . ,

గుర్వాజ్న నెరవేర్చటానికి అక్కడనుండి బయల్దేరి  నివృత్తి నాథుడు దేశ సంచారం చేస్తూ నాద సంప్రదాయాన్ని వ్యాప్తి చేస్తూ  కుటుంబాన్ని కలిసి  జ్ఞానేశ్వర్ ను  కూడా నాథ సంప్రదాయం లో చేర్చి గురువయ్యాడు .నాథసంప్రదాయం అంతా గురు శిష్య సంబంధం పై నడుస్తుంది .జ్ఞానేశ్వర్ కున్న అపూర్వ జ్ఞానం , భక్తి  ,మేధస్సు, అతీ౦ద్రియ శక్తి , అనుభవాలను  గుర్తించి అన్నగారు అతనిని వేదాంత విషయాలపై మంచి గ్రంథం రాయమని కోరాడు . అన్న కోరికపై సంత్ జ్ఞానేశ్వర్ ‘’అమృతానుభవం ‘’గ్రంథం అతని చిన్నవయసులోనే రచించాడు .దీనికి విశేషమైన కీర్తి ,ఆదరణ లభించాయి .భగవద్గీతపై వ్యాఖ్యానంగా ‘’జ్ఞానేశ్వరి ‘’రాశాడు .ఇదీ అద్భుతమైన గ్రంథమే. అమృతానుభవం రాశాక ,యోగి మహారాజ్ జ్ఞానేశ్వర్ పండరి పురం వెళ్లి పాండురంగని దర్శించి అక్కడే ఉన్న భక్త శిఖామణి నామ దేవుని పరిచయభాగ్యం పొందాడు .అనేక ప్రాంతాలు తిరుగుతూ వర్కారి సంప్రదాయ వ్యాప్తి చేశాడు .జ్ఞానేశ్వర్ నామదేవ్ ల మహాత్మ్యాలను జనం కథలు గాథలుగా చెప్పుకొంటారు .అలందిలో ఉన్నాడు .

తమ్ముడు సంత్ జ్ఞానేశ్వర్ ‘’ అలంది’’ లో సమాధి చెందిన తర్వాత, సంత్ నివృత్తి నాథుడు చెల్లెలు ముక్తాబాయ్ తో కలిసి అలంది ని విడిచి తీర్ధ యాత్రకు వెళ్ళాడు .ముక్తాబాయ్ చిన్నన్న సోపాన దేవ్ కు గురువై  ఆత్మజ్ఞానం బోధించి అనేక అభంగాలు రాసి కీర్తి గడించింది .సోపాన్ దేవ్ మరాఠీ.భగవద్గీత ఆధారం గా ‘’సోపాన్ దేవి ‘’తో పాటు సుమారు 50 అభంగాలు రాశాడు .పూనా వద్ద సస్వద్ లో సమాధి పొందాడు .ఒకనాటి తుఫాను ఉరుములు మెరుపులు జడి వాన లో ముక్తాబాయ్ దారి తప్పి పోయింది .అలంది లో నిర్యాణం చెందింది .నివృత్తి నాథుడు త్రయంబకేశ్వరం వద్ద మహా సమాధి చెందాడు .సమాధిపై గొప్ప ఆలయాన్ని తర్వాత నిర్మించారు .వేలాది భక్తులు నాథ సంప్రదాయం వారు సందర్శించి స్పూర్తి పొందుతూ ఉంటారు .మొత్తం మీద నివృత్తి నాథుని కుటుంబం వారంతా మహా జ్ఞానసంపన్నులై ,భక్తిజ్ఞాన వైరాగ్య మార్గ దర్శులై నారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-8-18 –ఉయ్యూరు

 


 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు

సానెట్ లకు సాన బెట్టిన 95 ఏళ్ళ డా.రాచకొండ శర్మ గారు .

సరసభారతికి, నాకు అత్యంత  ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణగారి డాక్టర్ బావగారు ,ఆయన అక్కగారు డా శ్రీమతి అన్నపూర్ణ గారి భర్తగారు ,’’లంపెన్ ప్రోలి టేరియట్’’ కథా శిల్పి శ్రీ రావి శాస్త్రిగారి తమ్ములు౦ గారు అయిన ,  డా శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఎం.డి. గారు .నేను రాసి,  మైనేనిగారు స్పాన్సర్ చేసి ,సరసభారతి   ప్రచురించిన ‘’పూర్వాంగ్లకవుల ముచ్చట్లు ‘’ను 90 వ జన్మ దినోత్సవం 28-8-14  నాడు  అంకితం అందుకున్న ఆంగ్లాంధ్ర కవిత్వ సవ్య సాచి .’’విశాఖ అందానికి  ఏరాడ కొండ  సాహిత్యానికి రాచకొండ ‘’అని లబ్ధ ప్రతిస్టులైన వారు  యవ్వనం లో పట్టిన కాలాన్ని 95 వ ఏట కూడా దించని సాహితీ భిషగ్వరులు ..ఇప్పటికే ‘’సంధ్యా రాగం ‘’ ‘’అయితే ‘’అనురాగాలు –ఆత్మీయతలు ‘’వగైరా వండి  వడ్డించిన కవి .రావి శాస్త్రి కథలకు ఆంగ్లానువాదం చేసిన నేర్పరి .ఇప్పుడు తాజాగా తమ 95 వ జన్మ దినోత్సవ కానుకగా ఆంగ్లం లో విశిస్టకవి రాబర్ట్ బ్రౌనింగ్ భార్య ,ఆయనకంటే ప్రసిద్ధ కవయిత్రి  ‘’ఎలిజబెత్ బెరెట్ బ్రౌనింగ్ ‘’రాసిన పోస్ట్ చెయ్యని ఉత్తరాలవంటి ప్రేమలేఖల లాంటి 44 సానెట్ లను శర్మగారు  తమ అనుభావాన్ని , విద్వత్తును ,తమకున్న ప్రేమ లోతులను కలిపి త్రివేణీ సంగమంగా అనువదించి పుస్తక రూపం తెచ్చి  నాకు ఆత్మీయంగా పంపగా ఇవాళ ఉదయం 11 గంటలకు పోస్ట్ లో చేరింది .అందిందని వారికి తెలియజేద్దామని వారి ఫోన్ ,సెల్ లకు ఫోన్ చేశాను .కాని వారు ఎత్తలేదు . భోజనం చేశాక ఆ పుస్తకం చదివేసి అందులోని మేలిమి ముత్యాలను మీకు తెలియ జేద్దామని కూర్చున్నాను .ఈ పుస్తకాన్ని శర్మగారు ‘’ద్వాదశ భాషా ప్రవీణ ,మేధావి ,సహృదయ గురు తుల్యులు ,వదాన్యులు ,ఇందులోని 20 సోనెట్ ల పరిష్కర్త  బ్రహ్మశ్రీ కోట సుందర రామ శర్మ గారి దివ్య స్మృతిగా  అంకితమిచ్చారు .ఈ పుస్తకం పై’’అవతరణిక ‘’పేరిట విపుల సమీక్ష చేశారు ఆచార్య సార్వభౌమ డా.వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .అది గొప్ప కరదీపిక గా భాసించింది .

‘’ లేడీబ్రౌనింగ్ రాసిన ఈ సానెట్స్ కు ఆంగ్లం లో ‘’పోర్చు గీస్ సానెట్స్’’అంటారు .అంటే పోర్చుగీసు భాషలో  రాసినవి కావు. ఆంగ్లం లో  రాసినవే .వీటిని చదివిన భర్త బ్రౌనింగ్ కవి షేక్స్ పియర్ తర్వాత అంత అద్భుతమైన సానెట్స్ రాసిన వారు లేరని భార్యకు కితాబిచ్చి ,ఆమె చామన చాయలో ఉండటం వలన ‘’పోర్చ్ గీస్ ప్రిన్సెస్ ‘’అని తను ముద్దుగా పిలుస్తూ ఉండటం చేతనూ,ఆమె కిష్టమైన  ‘’కేటరినా టు కామో వెన్స్’’  అనే పోర్చుగీసు ప్రేమ కవితల్లాగా  లయబద్దం గా, తూగు తో ఉండటం వలన ,ఆయన వీటికి ‘’పోర్చు గీస్ సానెట్స్’’అనే అందమైన పేరు పెట్టాడని డా శర్మగారు ఉవాచ .  ఆంగ్లం లో ఈ కవితలు 1806 –నుండి 1846 మధ్యాకాలం లో రాసినవి .సొనెట్ లేక సానెట్ అనేది 14 పంక్తుల ఆంగ్ల కవిత . ఎడమ వైపు ఆంగ్ల కవిత ,కుడివైపు తెలుగు అనువాదం కవిత ఉండటం తో బేరీజు వేసుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది .. ఈ కవిత్వ పొత్తం’’ మొగలి పొత్తు’’ లాగా సువాసన భరితం  .స్కాలిత్యం లేని ముద్రణ ,స్వచ్ఛ తెలుపు మిసిమి పుటలతో  లోపలి కవితలకు సొబగు కూర్చింది .లేడీ బ్రౌనింగ్ ఆంగ్లం లో పెట్టిన వివిధ అర్ధవంతమైన శీర్షికల కవిత్వ డాక్టర్ శర్మగారు దీటైన నామకరణం చేసి అచ్చ తెలుగు కవితలేమో ననిపించారు . నేను ఆ కవితలలోని నాకు నచ్చిన భావాలు,అందాలు ‘’ శర్మగారి మాటలలో

కాకుండా ‘’ నా భాషలో’’ అంది.స్తాను . ప్రేమికుడితో ప్రేయసి అంటున్న మాటలు ఇవి ,పంపిన సందేశాలివి ,గాఢ ప్రేమకు చిహ్నాలివి .ప్రేమికుల భాష తెలిసిన వారికే ఇందులోని ప్రేమైక సౌందర్యం తెలుస్తుంది, అర్ధమౌతుంది . నాకు అంత సీను లేదు కనుక ఏమాత్రం కృతక్రుత్యుడనౌతానో అనే  సందేహం నాకుంది .శర్మగారికి అర్ధాంగి అన్నపూర్ణ గారిపై ఉన్నగాఢ ప్రేమానురాగాలు  ఈకవితల అనువాదానికి బాగా అచ్చి వచ్చాయేమోనని పించింది                              .‘’నీ గుండె నా కూర్మి కి ప్రేమ మూలం అయి ,దోష రహితమైన  నీ కటాక్షం లభించి,ఫలం లభించక పోయినా ప్రేమిస్తూ జీవిస్తాను .నీరసం తో మూర్చ పోయిన నా ఆత్మను ఉద్ధరించి,నిన్నొక్కడినే ప్రేమించే నా ప్రేమను స్వర్ణ సింహాసనం పై నీ ప్రక్కనే కూర్చో బెట్టావు .నా గుండెను యేది తాకినా దుఖం పొంగిపోతుంది కనుక నా జీవిత వస్త్రాన్ని నిర్భయంగా సహన నీరవం తో చించి పారేస్తాను .ప్రేమ  అడుగంటేదాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను కనుక ప్రేమ శాశ్వతంగా ఉండిపోతుంది .నేను ప్రేమ అనే స్వర్గం లో సురక్షితంగా ఉండటం వల్ల  స్పటికం లోని తుమ్మెద లాగా చింత లేకుండా నన్ను చూస్తూ నే ఉంటావు .నా ప్రేమ పెరగటానికి నీ ప్రేమ విశాలం చేయి .సామాన్య ఘోషలు ,ఆదుర్దాల నుండి నువ్వు ప్రశాంత శ్రావ్య గానం ప్రసరించగలవు .మానవ విషమాతి విషమ వ్యాధులకు నీ గానం పరిహారం .అనంతంగా పాటపాడి అలసిన నీకు నీడ నిచ్చే చెట్టు కాని ,విశ్రాంతి నిచ్చే  సమాధి కాని ఔతాను .

‘’నా జుట్టు శోకభారం తో పాలిపోయిన నా చెక్కిళ్ళ  కన్నీటి  చారికలను దాచే కేశాలుగా మిగిలిందేమో ?గిరికి ,ఝరికి,వనాలకు కోయిల కలకూజితం లేనిదే వసంతం హసించదు .మన భావాలు అర్ధం చేసుకోలేని జనం మృత్యు ఘంటికలు వినేదాకా భూమి మీదే చీకట్లో నైనా ఉందాం .స్వర్గ మాదుర్యాన్నే కాదు నీతో ఉండటానికి నా గోరీ ని కూడా వదిలేస్తా .స్వర్గం నుంచి జారిన మంచు బిందువులను తాగటం వలన మన జీవన మల్లికలు అత్యంత తెల్లగా శోభిస్తున్నాయి .పూలకు నమ్మకం మూలమే కదా .శాంత గంభీరమైన నీ అంతరాత్మ లో ,నా హృదయం తెచ్చి జార్చమని ఆజ్న ఇచ్చావు . నెరవేరని విధికి , నక్షత్రాలకు  మధ్యవర్తిగా ఉంటూ ,నీ హృదయం  సహజంగా ,వేగంగా జారి పోయే నా హృదయాన్ని ఎగిసి పట్టుకో .మృత్యువు లాగానే ప్రేమకూడా అతి శక్తి వంతమైనది అని ,మళ్ళీ పుడుతుందని నేను సాక్షమిస్తాను  . నువ్వు నన్ను ప్రేమిస్తాను అనగానే ఎంతో సంతోషించా .కాని నేను నీవాడనే అని రాసిన ప్రేమలేఖ ,వేగంగా కొట్టుకొనే నా గుండెలపై ఉంచటం వలన అందులో సిరా పాలిపోయి అక్షరాలు  కనిపించటం లేదు .నీ మాటలు, వాగ్దానాలు వినీ వినీ మూర్చ పోయాను .మళ్ళీ ఆకాంతి శాంతి నాకు వస్తాయా? .పూర్వపు కూర్మి ,ఇప్పుడూ లభిస్తుందా ? అప్పటి ఆర్ద్రత తోనే పిలు .బదులు పలకటానికి సిద్ధమౌతా .ప్రియతమా సర్వోత్తమా !నీ చెయ్యి నా ఎదపై చేర్చి ఊరట కలిగించు .నీ గుండె విశాలంగా తెరచి .ప్రేమతో తడిసిన పావురపు రెక్కలను పొదవి కొని సమాశ్వాస కల్గించు .కలసిన మన చేతులు విడిపోతాయేమో ననే భయం తో వణికి పోతున్నా .నీసాత్విక దివ్యత్వాన్ని నమ్మిన నేను ఇప్పుడు నమ్మకం కోల్పోయి ఇసక బొమ్మలా అయ్యాను .క్షమించు.  తలపై నుదుటిపై పెదవులపై నువ్వు పెట్టిన మూడు ముద్దులు నన్ను ముకుళిం జేశాయ్ .నన్ను నేనే మర్చి ‘’నాప్రియతమా ,నా స్వకీయ ‘’అని మురిసిపోయాను .ప్రేమ ,విశ్వాసం నీకే ఉన్నాయ్ .నా ఆత్మను పరీక్షలో విసిగించేది ఏదీ నిన్ను మరల్చలేదు .నువ్వు మంచిని మించిన వాడివి . ‘’నిజమైన ప్రేమ ‘’అంటే ఏమిటో చెబుతూ దుఖం లో ,దురవస్థ లో వేచి ఉండటం .ఎదలు రెండూ ఏకమయ్యేదాకా ఓపికపట్టటం నిజమైన ప్రేమ లక్షణాలు .కన్నీటిలో, చిరునవ్వులో, ప్రాణం పోయిన తర్వాత, దైవం  అనుమతిస్తే నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’అని చివరి 44 వ సానెట్ ను పూర్తి  చేశారు  .

అందర్నీ ప్రేమించే మనస్తత్వం ఉన్న శర్మగారు ఈ సానెట్ లతో తమ కవితా విశ్వరూపాన్ని ప్రదర్శించారు .తెలుగులో ‘’మరో ప్రేమ లేఖలు ‘’అందించారు .ప్రేమకు శాశ్వతత్వం కలిగించారు .చలం ‘’మ్యూజింగ్స్ ‘’చదివిన అనుభూతి ,వెంకట పార్వతీశ్వర  కవుల’’ ఏకాంత సేవ’’ ,టాగూర్ ‘’గీతాంజలి ‘’భావనకు వస్తాయి  .డా.శ్రీ శర్మగారు డా.శ్రీమతి అన్నపూర్ణ గార్ల దాంపత్యం అన్యోన్యంగా కలకాలం  ఇతోధిక ఆరోగ్యం తో సాగాలని భగవంతుని ప్రార్దిస్తున్నా .  వారినుండి మరిన్ని ఆణిముత్యాలు జాలువారాలని ఆశిస్తున్నాను .వారు అపూర్వ అనురాగ ఆత్మీయతలతో  ఈ  ‘’సానెట్ ‘’ల పుస్తకం నాకు పంపినందుకు కృతజ్ఞతలతో ధన్యవాదాలు,  నమస్సులు తెలుపు కొంటున్నాను .వీరి పరిచయ భాగ్యం శ్రీ  మైనేని గోపాలకృష్ణ గారి చలవే అని మరొక మారు తెలియ జేస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-18 –ఉయ్యూరు

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 అణు ఇంధన కల్పన పిత  –డా.శ్రీ నిడమర్తి కొండలరావు

 అణు ఇంధన కల్పన పిత  –డా.శ్రీ నిడమర్తి కొండలరావు

పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామం లో డా.శ్రీ నిడమర్తి కొండలరావు 15-7-1824 జన్మించారు .తండ్రి  మంగయ్య గారు .బెనారస్ హిందూ యూని వర్సిటి లో మెటలర్జీ లో ఇంజనీరింగ్ చదివి పాసై ,పశ్చిమ జర్మని లని’’ఆషెం యూని వర్సిటి లో చదివి 1955 లో మెటలర్జీ లో డాక్టర్ ఇంజనీర్ ( డి .ఇంగ్)డిగ్రీ పొందారు .ఖనిజాలనుంచి లోహాలను తయారు చేసే విధానం కరతలామలకం చేసుకున్నారు .అంటే లోహ సంగ్రహణ శాస్త్ర వేత్తగా ప్రసిద్ధి చెందారు .బొంబాయి లోని దేవీ దయాళ్ మెటల్ ఇండస్ట్రీస్ లో 1948 నుండి ఒక సంవత్సరం పని చేశారు .బొంబాయి లోనే ఇండియన్ సెల్టింగ్ అండ్ రిఫైనింగ్ కంపెనీ  లో 1949 నుండి 19 53  వరకు నాలుగేళ్ళు పని చేశారు .

  బొంబాయి నుంచి కలకత్తా వెళ్లి హిందూ స్థాన్ మోటార్స్ లో శాస్త్ర వేత్తగా 1955 నుండి ఒక ఏడాది ఉన్నారు .మళ్ళీ బొంబాయి వచ్చి ‘’ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్  సైన్స్ ‘’అయిన డా .హోమీ జహంగీర్ భాభా చేత స్వయంగా  సెలెక్ట్ కాబడి  భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లో అటామిక్ ఫ్యుయల్ డివిజన్ హెడ్ గా పని చేశారు. దీన్ని బట్టి రావు గారి సర్వ సమర్ధత ఏమిటో అర్ధమౌతుంది ..ట్రా౦బే లోని CIRUS అణు రియాక్టర్ స్థాపన అంతా కొండలరావు గారి ఆలోచన అమలు తోనే జరిగింది .ఇది న్యూక్లియర్ ఎనర్జికి కావలసిన ఇంధనమూలకాల సప్లై కి బాగా ఉపయోగపడింది . న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ చీఫ్ ఎక్సి క్యూటివ్ గా 1972 లో ఉన్నారు .కోటా లోని రావత్ భటా రియాక్టర్ ‘’RAPSI’’కూడా రావు గారి నేతృత్వం లోనే ఏర్పడింది .దీనికే  మొట్టమొదటి హాఫ్ చార్జి ఆఫ్ ఫ్యుయేల్  అందించారు .ఈ ఇంధనం తాము తయారు చేసిన ఇంధనంకంటే చాలా మెరుగైనది అని కెనడియన్ సైంటిస్ట్ లు ధృవీకరించారు .ఇదంతా రావు గారి మేధో విలసనమే . టంగ్ స్టన్ లోహపు పొడి తయారీ రంగం లో విశేష కృషి,పరిశోధనలు  చేశారు .టా క్స్టేషన్ఎలక్ట్రాలిక్  కెపాసిటర్స్ ,ఫాబ్రికేషన్ అండ్ వెల్డింగ్ ఆఫ్ అల్యుమినం  ,సిలికాన్ –నికెల్ ఎల్లాయ్ ట్యూబ్స్  మెటల్లర్జికల్  ప్రాబ్లెమ్స్ ఇన్ న్యూక్లియర్ మెటల్స్ మొదలైన అతి ముఖ్య మైన అంశాలపై విలువైన పరిశోధనలు అవిశ్రాంతంగా నిర్వ హించారు .ఆయన పరిశోధనా ఫలితాలను అనేక జాతీయ ,అంతర్జాతీయ పత్రికలు ప్రచురించి గౌరవించాయి .

   హైదరాబాద్ లో న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ (NFC) ఏర్పరచటానికి ముఖ్య కారకులైన రావు గారు 1978 నుంచి 1984 లో రిటైర్ అయ్యేదాకా అక్కడే పని చేశారు .’’ఫ్యుయల్ ఫాబ్రికేషన్ టెక్నాలజీ’’లో ఆయన లోతులు తరచి ,అందులో ఎన్నో ఆవిష్కరణలు జరిపారు .రావు గారి కృషి ఫలితంగా భారత దేశం న్యూక్లియర్ ఫుయల్ లో స్వయం సమృద్ధి సాధించి ,ఈ విషయంలో ,ప్రపంచ దేశాలో  సరి సమానమైన స్థాయి పొందింది .ఇదంతా కొండలరావు గారి పుణ్యమే అని  విజ్ఞులు భావిస్తున్నారు .భాభా’’ అణుశాస్త్ర పిత ‘’,అయితే కొండలరావు గారు ‘’అణు ఇంధన కల్పన పిత ‘’  వ్యూహాత్మక ,వాణిజ్య పరమైన  అనేక పదార్ధాల సీమ్లెస్ ట్యూబ్స్ ను NFC  తయారు చేసి అంతర్జాతీయ ప్రామాణికత తో దూసుకు పోతోంది .ఇది రావు గారి అవిశ్రాంత కృషి మహత్యమే .

కొండలరావు గారు ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,మహారాష్ట్ర అకాడెమీ ఆఫ్ సైన్సెస్ మొదలైన ప్రేస్టేజియస్ సంస్థలనుండి  తమ ప్రతిభకు తగిన  ఫెలోషిప్ లు  పొందారు .చాలా సంస్దలు  వారికి గౌరవ సభ్యత్వమిచ్చి వారి  అనుభవాలను విని యోగించుకోన్నాయి .అనేక సైంటిఫిక్ ,ఇంజనీరింగ్ సంస్థలు రావు గారి సేవలను అనేక విధాలుగా సద్విని యోగం చేసు కున్నాయి . ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ది పౌడర్ మెటలర్జీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా,ఇండియన్ వాక్యూం సొసైటీ లకు అధ్యక్షులుగా ఉన్నారు .ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెటల్స్ ,ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్ర క్టివ్ టెస్టింగ్ కు చైర్మన్ గా వ్యవహరించారు .విదుట్ స్టీల్స్ లిమిటెడ్ ,నాగార్జున సిమెంట్స్ ,గోల్కొండ అబ్రేసివ్  లిమిటెడ్ ,ఓడిం మెటల్ పౌడర్స్ లిమిటెడ్ ,నాగార్జున స్టీల్స్ ,రాసి సిమెంట్ ,ఎ.పి .స్టీల్ లిమిటెడ్ ,ఎనర్జీ ట్యూబ్స్ లిమిటెడ్ ,ఆయిల్ కంట్రీ  ట్యూబ్యులర్స్, బ్రాస్కో మొదలైన సంస్థలలో కీలక బాధ్యత వహించారు .

 రావు గారు  నేషనల్ మెటలర్జిస్ట్ డే అవార్డ్ 1968 లోను  ,డిస్టింగ్విష్డ్ ఆల్మనన్ అవార్డ్ బెనారస్ హిందూ యూని వర్సిటి అవార్డ్ లు పొందిన ఘనత ఆయనది  .తెలుగు వెలుగు అవార్డ్ పొందారు .ప్రస్తుతం హైదరాబాద్ నాచారం లో స్నేహపురి లో స్థిర పడ్డారు  .  మెటలర్జిస్ట్ ,న్యూక్లియర్ సైంటిస్ట్ గా విఖ్యాతులైనశ్రీ నిడమర్తి కొండలరావు గారు పదేళ్ళ క్రితం అక్టోబర్ 22 చనిపోయారని  ఇప్పుడే వారబ్బాయికి ఫోన్ చేస్తే తెలియ జేశారు .రావు గారికి భార్య ,ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు లో ‘’గోరంత’’, వీకీ పీడియాలో ‘’కొండంత’’.

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-18 –ఉయ్యూరు    . ,


— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్లాక్ అండ్ వైట్ టి.వి. సోలార్ సెల్  రూపకర్త- యు వి .వర్లు

బ్లాక్ అండ్ వైట్ టి.వి. సోలార్ సెల్  రూపకర్త- యు వి .వర్లు

కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో16-12-1927 న  జన్మిచిన శ్రీ ఉప్పలపాటి వెంకటేశ్వర్లు ‘’యు. వి .వర్లు.’’గా సుప్రసిద్ధులు .ఘంటసాలలో సెకండరి విద్య పూర్తి  చేసి, బందరు హిందూ కాలేజి లో బి. ఎస్. సి .డిగ్రీ పొంది ,మద్రాస్ ఐ. ఐ .టి. లో  చేరి ,ఈ నాడు బి .టెక్. తో సమానమైన ‘’డి .ఎం.,ఐ .టి.ఆనర్స్ డిగ్రీ  డిస్టింక్షన్ తో సాధించారు .సాధారణ రైతు  కుటుంబం లో జన్మించిన వర్లుగారు ఇంతటి ఉన్నత విద్య అభ్యసి౦చారు  అంటే ఆయన ఎన్ని కస్టాలు కన్నీళ్లు అనుభవించారో ,తాను అనుకున్నది ఎలా సాధించాగాలిగారో మనకు అర్ధమౌతోంది .కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు అనటానికి ఈయనే సాక్షం .

  1954 లో బాంబే లో ట్రా౦బే టాటా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్  ఫండ మెంటల్  రిసెర్చ్ సెంటర్ లో వర్లు అసిస్టెంట్ సైంటిస్ట్ గా చేరారు .తనకిష్టమైన పరిశోధన పై దృష్టిపెట్టి న్యూక్లియర్ సాధన సంపత్తి పై అధ్యయనం చేశారు .1955 లో కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లో ఉన్న అటామిక్ ఎనర్జీ శాఖలో చేరారు.తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం లో చేరి ,అనేక అణుశక్తి పరిశోధనలలో పాల్గొన్నారు .అత్యుత్తమ శిక్షణ కోసం జపాన్ ,అమెరికా ,జపాన్ దేశాలలో పర్య టించారు .భారత తొలి అణు రియాక్టర్ ‘’అప్సర ‘’రూప కల్పన లో భాగస్వాములైన ముగ్గురు అత్యున్నత సాంకేతిక నిపుణులలో వర్లు గారు కూడా ఒకరు అవటం విశేషం .1957-58 లో  అమెరికా , ,ఇంగ్లాండ్ లలో అణు శక్తి పై గాఢ మైన అధ్యయనం చేసిన ఫలితాలు అణు రియాక్టర్ రూప కల్పనకు బాగా తోడ్పడాయి .’’జర్లీనా ‘’అణు రియాక్టర్ తయారీ బృందానికి  వర్లు సారధ్యం వహించారు .తారాపూర్ కేంద్రం లో 12 ఏళ్ళపాటు సేవ లందించారు  .ఈ కాలం లో రెండు విభాగాల ఏర్పాటు కూ చాల దోహదపడ్డారు .1965 నుండి ఆయన ఆలోచనలన్నీ అణుఉత్పత్తి రంగం పై  కేంద్రీకరించారు .కార్బన్ ఫిలిమ్స్ , రెసిస్టర్స్ ల ఉత్పత్తి లో వాటిని దేశీయ పరిజ్ఞానం తో తయారు చేయటానికి ప్రాధమిక స్థాయి ప్రాజెక్ట్ రూపొందించారు ..

   1967 లో స్వ రాష్ట్రానికి తిరిగి వచ్చి హైదరాబాద్ లో ఇ .సి .ఎల్ .లో  నియమింప బడ్డారు . .ఈ సంస్థను  బొంబాయి నుంచి  ఇక్కడికి తరలించటానికి వర్లు విశేష కృషి చేశారు.రెసిస్టర్స్ కెపాసిటర్స్ విభాల పర్య వేక్షణ చేశారు .ఎలెక్ట్రానిక్ రంగం లో నిరంతర కృషి కొన సాగిస్తూనే ఉన్నారు .తన అనుభవాన్ని ఆచరణలో పెట్టి ఇక్కడ నాలుగు ప్రత్యేక విభాగాలను నెలకొల్పి వాటి అధిపతి అయ్యారు .అప్పుడు డా  .ఎ ఎస్. రావు దీనికి చైర్మన్ .ఆయన ప్రోత్సాహం తో వర్లు ఎలెక్ట్రానిక్ సాంకేతిక రంగం లో అవిశ్రాంత కృషి సల్పారు .కేవలం ఏడేళ్ళ వ్యవధిలో వీరి రెసిస్టర్స్ కెపాసిటర్స్  కోటి రూపాయల ఉత్పత్తి సాధించి కేంద్ర ప్రభుత్వ బంగారు పతాకాన్ని ఈ విభాగం పొందటం వర్లు గారి అమోఘ కృషి ఫలితమే .ఆయన పని చేసిన కాలం సంస్థకూ స్వర్ణయుగమే అయింది .

  అమెరికాలో  అంతరిక్ష పరిశోధనా సంస్థలో శాటిలైట్ వ్యవస్థను అధ్యయనం చేసిన వర్లు గారికి ఇ.సి. ఐ .ఎల్ ,లో టి.వి. సాంకేతిక అభి వృద్ధి చేయటం నల్లేరు పై బండీ అయింది  .ఇక్కడ ప్రత్యేక టి .వి .విభాగం నెలకొల్పారు .ఆంద్ర రాష్ట్ర౦ లోమొదటి శ్రేణి  బ్లాక్ అండ్ వైట్ టి. వి.లను రూపొందించిన ఘనత ఉప్పలపాటి వెంకటేశ్వర్లు గారిదే .ఇది ఎలెక్ట్రానిక్ రంగం లో విప్లవం సృష్టించి ,అద్భుతాలు సాధించి సంస్థ కు భారీ లాభాలు తెచ్చి పెట్టింది . .తర్వాత ఉత్తర ప్రదేశ్ సెంట్రల్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు .ఇందులోనూ తన పరిశోధనలు నిరంతరం చేస్తూ ,’’సోలార్ సెల్స్’’ ఉత్పత్తి పై దృష్టి పెట్టారు .ఈ రోజు సౌర శక్తి రంగం లో  ప్రపంచ౦ లో ఆగ్రగామి గా ఉన్న ఆరు దేశాలలో భారత దేశం ఒకటి అవటం వర్లు గారి దూర దృష్టికి గొప్ప నిదర్శనం .

   న్యూక్లియర్ ఇంజనీరింగ్ లో 1957 లో బ్రిటన్ ,1958 లో అమెరికా లో అత్యుత్తమ శిక్షణ పొందిన వర్లుగారు 1963లో  ఇటలీ లో ‘’బేర్ సంస్థ ‘’తరఫున ఒక ఇంజనీరింగ్ ప్రదర్శన నిర్వహించి భారతదేశ కీర్తి ప్రతిష్టలకు పతాకమై నిలిచారు .అధ్యయనం, శిక్షణ కోసం అనేక దేశాలు పర్యటించి ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి సమర్ధతకు మెరుగులు దిద్దుకున్నారు .1974లో  ఎలక్ట్రానిక్స్ చైర్మన్ తో పాటు  విదేశాలు పర్యటించి విశేష అనుభవం  గడించారు . .కేంద్ర ప్రభుత్వం తరఫున విదేశాలతో అనేక ఒప్పందాలను కుదర్చటానికి , భారత్ లో నూతన వ్యవస్థలను నెలకొల్పటానికి వర్లు గారు చేసిన కృషి అద్వితీయం.

  1984 నుండి 89 వరకు అయిదేళ్ళు ఎలెక్ట్రానిక్స్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్న వర్లు గారు 100 కోట్ల పెట్టుబడి తో ,100 ఎలెక్ట్రానిక్ పరిశ్రమలను స్థాపించటం లో ఘనత పొందారు .రాష్ట్ర ప్రభుత్వ నిధులున్న సంస్థలలో ఉత్పత్తి 30 కోట్ల నుంచి ,400 కోట్లకు భారీగా  పెరగటం లో రావు గారి అనన్య సదృశ కృషి ఉంది .1989-90 లో ఉత్పత్తి గరిష్టంగా 500 కోట్లకు పెరగటం  విశేషం .

  బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ల రూప కల్పనకు విశేష కృషి చేసిన వర్లు కలర్ టి.వి.ట్యూబ్ ల ఉత్పత్తికి అనుమతి సంపాదించటానికి విశ్వ ప్రయత్నం చేశారు .కాని అనుమతి పొందలేక పోవటం ఆయనను తీవ్రంగా కలచి వేసింది .1986 లోనే జపాన్, జర్మని ,అమెరికా దేశాల పర్యటనలో కలర్ ట్యూబ్ ల ఉత్పత్తికి అనుమతులకోసం ఒప్పందాలు  సాధించారు .అయినా ఇప్పుడు పరాజయం పొందారు .సాంకేతిక శాస్త్ర వేత్తగా,అణు రియాక్టర్ల రూప కర్తగా ,అనేక కీలక రంగాలలో బహుముఖ ప్రజ్న చూపిన వర్లు గారికి ఏ డాక్టరేట్ లేదు అంటే అవాక్కౌతాం . .అయినా ఐ .ఐ. టి .డాక్టరేట్ విద్యార్ధులకు ఇన్విజి లేటర్ గా  ఉన్నారు .

 తమ కృషికి తగిన పలు పురస్కారాలు వర్లు పొందారు .1986 లో డా యలవర్తి నాయుడమ్మ అవార్డ్ , రఘుపతి వెంకట రత్నం అవార్డ్  అందుకున్నారు  రాష్ట్రం లో  సాంకేతిక విద్యా వ్యాప్తి కోసం ‘’వర్లు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ‘’సంస్థ స్థాపించి  స్వగ్రామం ఘంట శాలలో సాంకేతిక శిక్షణా సంస్థ ,సాంకేతిక విద్యా బోధనా సంస్థలను గ్రామస్తుల సహకారం తో ఏర్పాటు చేసి సామాజిక వేత్తగా మానవతా మూర్తి గా కూడా వెలుగొందారు ,విజయవాడ కు దగ్గర లో ఉన్న నిడమానూరు గ్రామం లో ‘’ఇన్ కాప్’’సంస్థను ఏర్పరచి ,చైర్మన్ గా ఉన్నారు . ఎపెక్స్ ఫోరం ఆఫ్ ఐ .ఇ. టి.ఇ .కు 2003-04కాలం లో ‘’వైస్ ప్రెసిడెంట్ కం చైర్మన్’’ గా ఉన్నారు .1996 లో ఆయన పేరుమీద ఎండోమెంట్ లెక్చర్ ను ప్రారంభించి ఇప్పటికి 9 ఉపన్యాసాలు హైదరాబాద్  ఐ .ఇ .టి .ఇ .లో జరిపించారు .12ప్రముఖ  సంస్థ లకు చైర్మన్ గా ఉన్నారు .అనేక కమిటీలు ,పానల్స్ కు చైర్మన్ గా వ్యవహరించారు . ఎలెక్ట్రానిక్స్ , ఎనర్జీ  సబ్జెక్ట్ లపై 12 టెక్నికల్ పేపర్లు ,20 పాలసి పేపర్స్ రచించి ప్రచురించారు . .

    పదవీ విరమణ తర్వాత హైదరాబాద్ లోని ‘’ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్’’సంస్థ కార్యకలాపాలను తీర్చి దిద్దారు  .  హైదరాబాద్ కాప్రా మునిసి పాలిటి లోని’’ అణుపురం ‘’అని పిలువబడే డా.ఎ .ఎస్. రావు నగర్ లో శేషజీవితాన్ని గడిపారు .2-10-2004 శనివారం శ్రీ వర్లు గారు 77 వ ఏట పరమపదించారు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’ఇండియన్’’ హానిమన్ ‘’హోమియో డాక్టర్ ఎం .గురు రాజు

‘’ఇండియన్’’ హానిమన్ ‘’హోమియో డాక్టర్ ఎం .గురు రాజు

హోమియో వైద్యాన్ని జర్మన్ ఫిజిషియన్ సామ్యుల్  హానిమన్ కనిపెట్టి సంప్రదాయేతర వైద్య విధానం లో ఆయుర్వేదం తర్వాత అంతటి ప్రాముఖ్యతను తెచ్చాడు .ఇండియాలో ,ఆంధ్రాలో ముఖ్యం గా కృష్ణా జిల్లా కు హోమియో వైద్యం లో విప్లవాత్మక అభి వృద్ధి చెందించి ‘’ఇండియన్ హానిమన్’’అని పించుకున్నవారు డా.ఎం.గురురాజు .కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర 28-6- 189 7 జన్మించారు .స్కూల్ టీచర్ గాఉద్యోగం ప్రారంభించారు .తర్వాత మద్రా స్ మెడికల్ కాలేజి లో  అల్లోపతి వైద్యం చదివి 1922 లో డిగ్రీ తీసుకున్నారు .ఎం .బి.బి .ఎస్ .ను ఆ రోజుల్లో అల్లోపతి అనేవారు.1824 లో గుడివాడ లోనే డాక్టర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. అప్పటికి  గుడివాడ తాలూకా మొత్తం మీద  గురు రాజుగారు ఒక్కరే డాక్టరీ  చదివి డిగ్రీ తీసుకున్నవారు .అందువల్ల ప్రాక్టీస్ బాగా ఉండేది .మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతులు లభించాయి .1932 లో స్వాతంత్రోద్యమం లో పాల్గొని  శాసనోల్లంఘన చేసి అరెస్ట్ అయి  జైలు శిక్ష అనుభవించిన దేశభక్తులాయన .జైలులో ఉండగానే ఆయనకు హోమియో వైద్యం పై మక్కువ కలిగి,దానికి సంబంధిన ఇంగ్లిష్ గ్రంధాలు అధ్యయనం చేశారు .దీనితో ఆయన జీవితం గొప్ప మలుపు తిరిగింది .

  హోమియో వైద్యం అంటే రోగ లక్షణాలకు పూర్తిగా  చికిత్స చేయటం .ఇది ఒక విలక్షణమైన చికిత్సా విధానంగా గురురాజు గారి మనసును బాగా ఆకర్షించింది .జైలు లో ఉండగానే హోమియో వైద్య బీజాలు మనసులో పడి,నాటుకొని మహా వృక్షమై ,హోమియో వైద్య ప్రచారం లో హానిమాన్ లాగా ఉండాలని నిశ్చయించుకొన్నారు .జైలు నుండి విడుదలకాగానే అల్లో పతి కి స్వస్తి చెప్పి పూర్తిగా హోమియో వైద్యానికే అంకితమయ్యారు .హోమియో మందులు పరమ ప్రామాణీక మైనవని ,వాటిలో దివ్యత్వం ఉందని పూర్తిగా నమ్మారు .హోమియో వైద్యం లోను ఘనకీర్తి గడించారు .1936 లో ప్రసిద్ధ హోమియో వైద్యులవద్ద శిక్షణ పొంది క్వాలిఫైడ్ డాక్టర్ అనిపించుకున్నారు .అంతటితో ఆగి పోకుండా దానిపై తీవ్ర అధ్యయనం, పరిశోధనలు చేశారు .ప్రముఖ హోమియో డాక్టర్లు  హానిమాన్,  కెంట్ ల చికిత్సా విధానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని,అదే మార్గం లో చాలాకాలం పరిశోధనలు సలిపారు గురు రాజుగారు .దీనితో కొత్త ఔషధ మిశ్రమాలను ఆవిష్కరించారు .అమెరికా వెళ్లి హోమియోపతి లో పోస్ట్ గ్రాడ్యుయేషన్  ట్రెయినింగ్ పొందారు .అక్కడ ప్రసిద్ధ హోమియో వైద్యులు , స్టాల్ వర్ట్స్ అని పిలువబడిన  డాక్టర్ వుడ్ బరి,డా.రాబర్ట్స్ ,.స్పాల్డింగ్  ఎలిజబెత్ హబ్బార్డ్ లతో  పని చేసే గౌరవం లభించింది

  హోమియో వైద్య చేస్తూనే  దాని ప్రచారానికీ తగిన సమయం కేటాయించారు .నాటు వైద్యుల కబంధ హస్తాలనుండి రోగుల చెర విడిపించారు .దీనికి విపరీతంగా కష్ట పడాల్సి వచ్చింది  .తనవద్దకు చికిత్సకు వచ్చేవారిని ఆత్మీయంగా పలకరిస్తూ రోగ లక్షణాలు పూర్తిగా తెలుసుకొంటూ వారికి అత్యంత ఆప్తుడను అనే నమ్మకం కలిగించేవారు .అందువలన రోగులకు ఆయనపై సంపూర్ణ  విశ్వాసం , నమ్మకం కలిగి హోమియో కు గొప్ప ప్రచారం జరిగింది .1951 లో లక్నో లో జరిగిన రెండవ   అఖిలభారత హోమియోపతిక్ కాంగ్రెస్ కు అధ్యక్షులయ్యారు . హోమియో వైద్యానికి ఒక కళాశాల ఉంటె బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది .1954  లో తన ఇంటి వద్దనే’’ఆంధ్రా ప్రోవిన్షియల్ హోమియో పతిక్ మెడికల్ కాలేజి  అండ్ హాస్పిటల్ ‘’స్థాపించారు .1958 లో దీన్నిఆంద్ర ప్రదేశ్  ప్రభుత్వం గుర్తించింది.. .1954 లో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’ఎక్స్ పర్ట్ హోమియోపతిక్ కమిటీ ఏర్పరచి రాజుగారిని సభ్యులను చేసింది .1958 లో రాజుగారిని కేంద్ర ప్రభుత్వం హోమియోపతిక్ అడ్వైజరీ కమిటీ లో సభ్యుని చేసి గౌరవించింది .కేంద్ర ప్రభుత్వపు ‘’అ డ్ హాక్ సిలబస్ కమిటీ ,ఫార్మోకోపియా కమిటీలలోగౌరవంగా  సభ్యులయ్యారు .ఇవన్నీ రాజుగారి సమర్ధతకు హోమియోలో  విద్వత్తుకు ,కృషి, సామర్ధ్యాలకు గుర్తింపు .1956 నుంచి ‘’ఆంధ్రా బోర్డ్  ఫర్  హోమియోపతి ‘’లో సభ్యులు .

  రెండవ ప్రపంచ యుద్ధ౦ పూర్తయిన కాల౦లొ ఒక సందిగ్ధ వాతావరణం ప్రపంచమంతా వ్యాపించి ఉంది .గుడివాడ లోనూ అదే పరిస్థితి ఉండేది . ‘ అదే సమయం లో కలరా, మసూచి ,క్షయ వ్యాధులు ప్రబలి  ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. వీటి చికిత్సకు ,మందులకు చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. సంపన్నులకు మాత్రమే అల్లోపతి చికిత్స అందుబాటులో ఉండేది. పేద ,నిరుపేదలకు దేవుడే దిక్కు అన్నట్లు ఉండేది .పేదలకు ఈ ఆపత్సమయం లో వెన్ను దన్నుగానిలిచి ,,అతి తక్కువ ఖరీదైన మందులతో వైద్యం చేస్తూ రోగాలను పారదోలుతూ వారికి ఊరట కలిగించి తమ పాలిటి దేవుడు గురురాజు గారు అనిపించారు ఆయన .హోమియో వైద్యం సైడ్ ఎఫెక్ట్ లు లేని వైద్య విధానంగా  ప్రజలలో గొప్ప నమ్మకం కలిగించారు .ఎలాంటి జబ్బునైనా దీనితో నయం చేయవచ్చుననే ధీమా వారిలో కలిగింది .

  ఇదే సమయం లో కేంద్ర ప్రభుత్వం కూడా హోమియో వైద్యం బాగా ప్రచారం పొంది ప్రజలకు ఉపయోగ పడాలని భావించి జాతీయ స్థాయిలో ‘’హోమియోపతిక్ కాంగ్రెస్ ‘’ను ఏర్పరచింది .ఈ సభకు గురురాజు గారు అధ్యక్షత వహించి ,హోమియో వైద్యవిధానం ఎంతబాగా ప్రజలకు ఉపయోగపడుతుందో సాధికారికంగా తెలియ జేశారు .దీనికి ప్రభుత్వమూ ఒప్పుకున్నది .అందుకోసం చెయ్యాల్సిన చట్టాన్ని రూపొందించటం లో డా గుర్రాజు గారి పాత్ర చిరస్మరణీయం .విస్తృత స్థాయిలో దేశ వ్యాప్తంగా హోమియో పతి ని అభి వృద్ధి చేయటానికి రాజుగారు అహరహం శ్రమించారు స్వంత ధనం దీనికోసం చాలా ఖర్చు చేశారు .ధనం, మనం ,అంకితభావం తో దేశవ్యాప్తంగా హోమియోకు గొప్ప వైభవం తెచ్చారు .ఆయన కృషి ఫలించి రాజు గారికీ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది . ప్రజా జీవితం లోనూ రాజుగారు బాగా రాణించారు .ప్రజా వైద్యులనిపించుకొన్నారు కనుకనే గుడివాడ మునిసిపల్ చైర్మన్ గా రాజు గారు రెండు సార్లు ఎన్నికయ్యారు .ఆంద్ర ప్రదేశ్ హోమియోపతిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సేవలందించారు.

1968 అక్టోబర్ 25 న’’ఇండియన్ హానిమన్ డా గురురాజు ‘’గారు  71 వయేట మరణించారు .రాజు గారిమరణానంతరం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడివాడలో ఉన్న హోమియో కాలేజి కి  ఆయన గౌరవార్ధ౦ ‘’డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియో పతిక్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుడివాడ ‘’గా ‘నామకరణం చేసి గురురాజు గారి సేవలను చిరస్మరణీయం చేసింది .నిజంగా గుర్రాజుగారు ‘’హోమియో గురువులలో రాజు  ‘’.

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రఖ్యాత గణాంక శాస్త్ర వేత్త పద్మ విభూషణ్ డా. సి ఆర్ రావు

ప్రఖ్యాత గణాంక శాస్త్ర వేత్త పద్మ విభూషణ్ డా. సి ఆర్ రావు

చల్యం  పూడి రాదా కృష్ణారావు గారు  అందరికీ  సి .ఆర్ .రావు గారు  గా పరిచయం .1920 సెప్టెంబర్ 10 న కర్నాటక బళ్లారి జిల్లా ‘’ హడగల్లి’’ లో జన్మించిన అచ్చమైన తెలుగు వారు . . పది మంది సంతానం లో ఎనిమిదవ వారు .తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్ కనుక ఆయన బదిలీ అయినప్పుడల్లా వేర్వేరు చోట్ల చదవాల్సి వచ్చింది ..గూడూరు ,కృష్ణా జిల్లా నూజివీడు  నందిగామ లలో చదివి ,విశాఖ పట్నం లో స్కూల్ ఫైనల్ నుంచి డిగ్రీ వరకు స్కాలర్షిప్ లతో చదివారు .అన్ని తరగతులలో ఫస్ట్ రాంక్ విద్యార్ధి . బి .ఏ. ఆనర్స్ చేసి గణితం లో ,ఎం ఏ డిగ్రీ పొందారు .ఇరవై ఏళ్ళ నాటికే ఇవన్నీ సాధించిన మేధావి రావు గారు .

కలకత్తా వెళ్లి ఇండియన్ స్టాటి స్టికల్  ఇన్ స్టి ట్యూట్ లో ఎం ఏ .స్టాటిస్టిక్స్ మొదటి బాచ్  లో చేరి ,  ఇప్పుడూ యూని వర్సిటి మొదటి రాంక్ తో స్వర్ణపతకం సాధించారు .రావు గారు సాధించినన్ని మార్కులు ఇప్పటి వరకు ఇంకెవ్వరికీ రాలేదట .అదొక అరుదైన రికార్డ్ .అక్కడే నెలకు 75 రూపాయల జీతం తో లెక్చరర్ గా చేరి  ఉద్యోగం చేస్తూనే పరిశోధనలు చేశారు .దీనివలన కేంబ్రిడ్జి యూని వర్సిటి లో పరిశోధనలు కొనసాగించే అరుదైన అవకాశం పొందిన అదృష్ట వంతులు .అత్యున్నత స్థాయిలో ఉన్న వీరి పరిశోధనాంశాలను లండన్ లోని కేంబ్రిడ్జి యూని వర్సిటి ప్రెస్ తమ అదృష్టంగా భావించి ఆయన గ్రంథ రచనలను ముద్రించారు .అప్పటికి రావు గారి వయసు 26 అంటే ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే .

ఇంగ్లాండ్ నుంచి ఇండియాతిరిగి వచ్చి కలకత్తా లో మాతృ సంస్థ లోనే మళ్ళీ ఉద్యోగించారు ..కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు రెండు పంచ వర్ష ప్రణాళి కల రూపకల్పన   బాధ్యత అప్పగించింది .వీటిలో డా సి .ఆర్. రావు గారి తోడ్పాటు అనితర సాధ్యంగా ఉంది .దేశ స్థాయిలో అపారిశ్రామిక  అభి వృద్ధికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని   ఆయన ప్రభుత్వానికి సూచించారు .నాటి ప్రధాని నెహ్రు అంగీకరించారు .ఆంధ్రా యూని వర్సిటి, రావు గారికి అప్పడు ఇస్తున్న జీతానికి 5 రెట్లు ఎక్కువ జీతం ఇస్తామని ఆఫర్ చేసినా ,అంగీకరించక  ప్రొఫెసర్ గా గణాంక శాఖ హెడ్ గా కూరుకు పోవటం కంటే తన పరిశోధనలకే  ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.

కలకత్తా యూని వర్సిటి లో నలభై ఏళ్ళు ఉండి,తన పరిశోధనలు నిరంతరం కొన సాగించి మనసులో ఉన్న అభిప్రాయాన్ని  ఆచరణ లో పెట్టారు .  వేలమంది విద్యార్ధుల జీవితాలను తీర్చిదిద్ది మార్గ దర్శనం చేసిన విద్యావేత్త రావు గారు . అత్యుత్తమ శాస్త్ర వేత్తలకు అందజేసే ‘’శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కారం ‘’ను ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా అందుకున్న  అత్యున్నత  ఉత్తమ శ్రేణి గణాంక సైంటిస్ట్ ఆయన .దీనికి అంద జేసిన  ప్రైజ్ మనీ ని అదే వేదికపై ప్రధానికి దేశ రక్షణ నిధి కి సమర్పించిన వదాన్యులు .అమెరికా లో ప్రతి ఏడాదీ అత్యత్తమ స్థాయి శాస్త్ర వేత్తలకు అందించే ‘’నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ‘’అవార్డ్ ను అమెరికాలో , అమెరికా ప్రెసిడెంట్ జార్జి బుష్ చేతులమీదుగా అందుకున్న మేధావి .

‘’ రష్యా సైన్స్ అకాడెమీ ‘’ తన 200 సంవత్సరాల వేడుకలో ఆహ్వాని౦పబడిన  ప్రపంచ వ్యాప్తం గా ఉన్న 200 మంది శాస్త్ర వేత్తలలో రావు గారు  ఉండటం ఆయనకే కాక మనదేశానికీ గర్వ కారణం .ఈ కార్య క్రమ ప్రారంభం లో వీర మరణం పొందిన సైనికులకు నివాళి  అర్పించే ,స్మృతి చిహ్నం పై పుష్ప గుచ్చాన్ని సమర్పించే అరుదైన అవకాసం మొదటగా రావు గారికే దక్కింది .గత దశాబ్ద కాలం లో ప్రపంచ వ్యాప్తంగా విశేష కృషి చేసిన 70 మంది శాస్త్ర వేత్తల జీవిత చరిత్రలను ,ఫోటో లను ప్రచురించిన ‘’అమెరికన్ పబ్లికేషన్ ‘’లో రావు గారు స్థానం పొందటం అపురూపమైన ప్రపంచ వ్యాప్త సత్కారం ,గుర్తింపు .గణాంక శాస్త్ర అభి వృద్ధికోసం హైదరాబాద్ లో ఒక సంస్థ ఏర్పాటు చేయాలని రావు గారి సంకల్పం .మన రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూని వర్సిటి లో స్థలం కూడా కేటా యించింది .ఆరు దశాబ్దాల అవిశ్రాంత కృషిలో ఉన్నా నవ యవ్వనం తో తొణికిసలాడే ఉత్సాహం తో ఆయన కనిపిస్తారు .

లండన్ లోన 1662 లో స్థాపింపబడి ,  అత్యంత ప్రాచీనమైంది, ప్రపంచ వ్యాప్త ప్రతిస్టాత్మకమైన’’రాయల్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ ‘’ కు ‘’ ఫెలో ‘’గా ఎన్నికైన ప్రధమ ఆంధ్రుడు రావు గారే .చాలామందికి ఆయన అసలు సిసలైన తెలుగు వారని ఇప్పటికీ తెలియదు .భారత ప్రభుత్వం ‘’పద్మ విభూషణ్ ‘’పురస్కారం అందజేసి గౌరవించింది ..350పరిశోధనా పత్రాలు రాశారు .14 గ్రంథాలు రచించారు .ఇవన్నీ ప్రపంచ  వ్యాప్తం గా  వివిధ భాషలలోకి అనువాదం పొందాయి  19 దేశాల నుండి 38  డాక్టరేట్లు అందుకున్న అరుదైన ప్రతిభాశాలి . గణాంక శాస్త్రం లో లో 50 మంది పరి శోధకులకు మార్గ దర్శకం చేశారు .టైమ్స్ ఆఫ్ ఇండియా’’ టాప్ టెన్ సైంటిస్ట్ ‘’లలో ఒకరుగా రావు గారు గుర్తింపు పొందారు .సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న రావు గారు మన తెలుగు వారుకావటం మన అదృష్టం

అమెరికా లో పెన్సి ల్వేనియన్ స్టేట్ యూనివర్సిటి ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ,బఫ్ఫెల్లో యూని వర్సిటి రిసెర్చ్ ప్రొఫెసర్ గా ,ఉన్నారు .అమెరికా దేశపు ‘’నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అందుకున్న ఘనులు .అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ రావు గురించి ‘’ a living legend whose work has influenced not just statistics, but has had far reaching implications for fields as varied as economics, genetics, anthropology, geology, national planning, demography, biometry, and medicine.”[.

అని అభి వర్ణించింది .లాభా పేక్ష లేని ‘’ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ‘’కు సీనియర్ స్టాటిస్టిక్స్ అడ్వైజర్ ,సీనియర్ పాలసీ మేకర్ గా ఉన్నారు.  పిట్స్ బర్గ్ యూని వర్సిటి ప్రొఫెసర్ గా ,పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటి లో మల్టి వేరియేట్ అనాలిసిస్ సెంటర్ డైరెక్టర్ గా అక్కడి  స్టాటి స్టీషి యన్  డా పరుచూరి రామకృష్ణయ్య గారి ఆహ్వానం పై పని చేశారు .2010 లో దేశం లో అత్యున్నతమైన ‘’ఇండియా సైన్స్ అవార్డ్’’ పొందారు .’’ఇంటర్ నేషనల్ ఎన్ సైక్లో పీడియా ఆఫ్ స్టాటిస్టి కల్ సైన్స్’’కు సహకరించినందుకు ,మియోడ్రాగ్ లోవ్రిక్ ,షియోమో సావిలోస్కి లతో  పాటు రావు గారు 2013 లో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు 19 14 జులై 26 న ఖర్గపూర్ ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  38 వ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది ..ఇంటర్నేషనల్ స్టాటి స్టికల్ ఇన్ స్టి ట్యూట్ ప్రెసిడెంట్ గా ,అమెరికాలోని ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మాదమాటికల్ స్టాటిస్టిక్స్,ఇంటర్ నేషనల్ బయో మెట్రిక్ సొసైటీలకు రావు అధ్యక్షులు .’’ఇండియాస్ నేషనల్  ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ క్వాలిటి అండ్ రిలయబిలిటి హాల్ ఆఫ్ ఫేం’’లో స్థానం పొందారు .1991 లో ‘’ది జర్నల్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఎకనమిక్స్ ‘’రావు గారిపై గౌరవ ప్రత్యేక సంచిక ప్రచురించింది. ఆ సంచికలో రావు గారి గురించి ‘’ Dr Rao is a very distinguished scientist and a highly eminent statistician of our time. His contributions to statistical theory and applications are well known, and many of his results, which bear his name, are included in the curriculum of courses in statistics at bachelor’s and master’s level all over the world. He is an inspiring teacher and has guided the research work of numerous students in all areas of statistics. His early work had greatly influenced the course of statistical research during the last four decades. One of the purposes of this special issue is to recognise Dr Rao’s own contributions to econometrics and acknowledge his major role in the development of econometric research in India.”

అని రాసింది  .

రావు గారు ‘’ఎస్టి మేషన్ దీరీ ‘’,స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అండ్ లీనియర్ మోడల్స్ .మల్టి వేరియేట్ అనాలిసిస్ ,కాంబి నెటోరియల్ డిజైన్ ,ఆర్థో గనల్ ఎర్రెస్ లలో  ప్రత్యేక పరిశోధనలు చేశారు .6 ప్రసిద్ధ అవార్డ్ లు మెడల్స్ పొందారు .పద్మ భూషణ్ ,పద్మ విభూషణ్ లతో సహా 10 జాతీయ ,అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నారు .97 ఏళ్ళ వయసులో ఉన్న రావు గారు అరుదైన స్టాటి స్టిక్స్ శాస్త్రవేత్త .శతాధిక ఆయుష్మాన్ భవతి .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంధ్ర శాస్త్ర వేత్తలు  మరియు వీకీ పీడియా

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-18 –ఉయ్యూరు

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం”  

ఏక్ దిన్ కా సుల్తాన్’’ గా  మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే ”భిస్టీ నిజాం”

ఢిల్లీ లో మేక  చర్మాలు అంటే తోళ్ళ తో పంది ఆకారపు సంచులలో నీళ్ళు నింపుకొని  వీపుకు  లేక బుజానికి  వ్రేలాడ దీసుకొని  ఇళ్ళకు నీళ్ళు చేర్చే వారిని ‘’భిస్టీలు ‘’అంటారు .వీళ్ళు ముస్లిం తెగకు చెందినవారు .మేక తోలును చాలా శుభ్రం చేసి  ఎక్కడా వాసన రాకుండా  నీటి సంచీలు తయారు చేసుకొంటారు .అదొక గొప్ప ప్రక్రియ వాళ్లకు .భిస్టీలను బిరదారీలు అనీ పిలుస్తారు .ఉత్తర భారతం లో ,పాకిస్తాన్ ,నేపాల్ లోని టేరై ప్రాంతం లో ఎక్కువగా ఉంటారు .వీరికి షేక్ అబ్బాసి ,ధుండ్ అబ్బాసి ,సక్వా అనే ఇంటి పేర్లు కూడా ఉన్నాయి .మహారాష్ట్ర లో వీరిని పఖాలి అంటారు .వీరంతా అరబ్ తెగ కు చెందిన వాళ్ళు .వీరిని అబ్బాసి ఆరబ్బులు అంటారు .వీరిది సున్నీ మతం .ప్రముఖ ఆంగ్ల కవి  రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ‘’గంగా దిన్ ‘’కవిత లో ముఖ్యపాత్ర ఒక  భిస్టీయే .

భిస్టీలు తరతరాలుగా దక్షిణ ఆసియాలో ‘’జలవాహకులు ‘’అనే నీళ్ళు మోసేవారు .భిస్టి అనే మాట పర్షియన్ పదం. ‘’బెహెస్ట్ ‘’నుంచి వచ్చింది .అంటే స్వర్గం అని అర్ధం .యుద్ధాలలో ముస్లిం సైనికులకు నీళ్ళు మోసుకొని వెళ్లి దాహార్తులకు అందించేవారు .అది పవిత్రమైన పని కనుక గౌరవంగా వారిని ఆ పేరుతొ పిలిచేవారు .వీళ్ళు ముఖ్యంగా మేక తోలు సంచీలలో నీరు  తీసుకు వెళ్ళేవారు .ఈ సంచీలను మష్క్ లు   లేక మషక్ లు అంటారు .

గుజరాత్ లోని భిస్టీ లు తాము అక్బర్ పాలనలో ఉత్తరభారతం నుంచి వచ్చామని చెబుతారు .వీళ్ళను కూడా అబ్బాసి ఆరబ్బులు అంటారు .గుజరాత్ ను జయించిన మొఘల్ రాజ సైన్యానికి వీళ్ళు నీళ్ళు మోసుకు వెళ్లి అందించేవారు . భూములు లేని వీరంతా దినకూలి చేసి బ్రతుకు తున్నారు .కొందరు రిక్షాలు లాగుతూ, మరికొందరు బీడీలు చుడుతూ , సిగరెట్ పరిశ్రమలో పని చేస్తూ   సంపాదిస్తున్నారు .గుజరాతీ మాట్లాడతారు ఎక్కువ మంది అహమ్మదాబాద్ లో ఉన్నారు .వీరూ సున్నీలే .ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకొన్నారు .ఎక్కువమంది డియో బిందీ ఉప తెగకు చెందిన వాళ్ళే .

మహారాష్ట్రలో సాంగ్లి, షోలాపూర్,కొల్హాపూర్, పూనా జిల్లాలో కూడా ఉన్నారు .వీరంతా ఉర్దూ భాషలోని ‘’దఖాని ‘’మాండలీకం లోనూ, మరాఠీ భాష లోనూ  మాట్లాడతారు .ఢిల్లీ లోని షేక్ అబ్బాసీలు భారత విభజన సమయం లో పాకిస్తాన్ నుంచి వచ్చి స్థిరపడ్డారు .పాకిస్తాన్ లోని కరాచీలో వీరి సంఖ్య ఎక్కువ .మొహాజిర్ అనే పెద్ద తెగలో ఉప తెగ గా అక్కడ ఉంటున్నారు .

ఉత్తర ప్రదేశ్  భిస్టీలు భూమిలేని వారు .జలవాహనం తోపాటు రోజు కూలీలుగా పని చేస్తారు .పండుగ పబ్బాలలో మంచినీటిని సప్లై చేస్తారు .వీరిలో అంతర్వివాహాలు ఎక్కువ అంటే వారిలో వారే పెళ్ళిళ్ళు చేసుకొంటారు .ఉర్దూ తో పాటు ఖరి బోలి మాండలికం మాట్లాడతారు.ఉత్తరప్రదేశ్ అంతటావిస్తరించి  ఉన్నా, వీరు ఎక్కువగా మీరట్, ఆలిఘర్  జిల్లాలో అత్యధికంగా ఉంటారు .

ఢిల్లీ లోని అబ్బాసీలు ఢిల్లీ మునిసిపాలిటీకి వాటర్ సప్లైయర్స్ గా ఉన్నారు .కొందరు మోటార్ మెకానిక్స్ ,కార్పెంటర్స్ , వెల్డర్స్ ,టర్నర్స్ ,ఫిట్టర్స్ ,పెయింటర్స్ గా కూడా పని చేస్తున్నారు .వీరంతా సున్నీ ముస్లిం లే .భారత దేశంలో ఉన్న భిస్టీ లంతా కలిసి  ‘’ఆల్ ఇండియా జమాయిత్ ఉల్ అబ్బాస్ ‘’ అనే సంఘం ఏర్పరచుకున్నారు.ఇది వారి సంక్షేమానికి అభివృద్ధికి హక్కుల  కోసం  పోరాడే సంస్థగా ఉంది .వీరికి ప్రభుత్వం ‘’ఇతర వెనుకబడిన తరగతుల హోదా ‘’ఇచ్చింది . తరతరాలుగా వస్తున్ననీరు మోసే పని క్రమంగా తగ్గి పోవటం తో, బతుకు తెరువుకు ఏదో ఒక పని చేయాల్సి వస్తోంది .వీరందరిలో సంఘీభావం బాగా ఎక్కువ .సమైక్య పోరాటానికి సిద్ధంగా ఉంటారు .ఇప్పటికీ ఢిల్లీ మీనా బజార్ లో మంచినీటి సరఫరా పైపులద్వారా జరగటం లేదు .అంతటి మురికి కూపం ఢిల్లీ మొత్తం మీద లేదు .ఇక్కడి దర్గా దగ్గరున్న 450 ఏళ్ళ బావి ఒక్కటే అందరికి మంచినీటికి ఆధారం .దీనిలో నీళ్ళు 80 అడుగుల లోతులో ఉంటాయి .మెట్రో లైన్ తో ఈ బావి పూర్తిగా ఎండిపోయింది కాని కొద్దికాలం లోనే మళ్ళీ మంచి నీళ్ళు ఊరి దాహార్తి తీరుస్తోంది .అందుకని ఈ బావి ఇక్కడి వారి పాలిట పవిత్ర మైన బావి .భిస్టీ కుటుంబానికి చెందినవారు ఈ పవిత్రమైన నీరు తోడి దాహార్తులకు గ్లాసులలో ఉచితంగా అంద జేసి పుణ్యం మూటకట్టుకొంటారు .

ఏ రాష్ట్రం లో ఎక్కడ ఉన్నా వీరంతా దాదాపు నిరక్షరాస్యులు ,స్వంత భూమి ఒక్క గజం కూడా లేని నిర్భాగ్యులే .జనావాసాలకు చాల దూరం గా దుర్గంధ భూయిష్ట ప్రదేశాలలో జీవిస్తున్నారు . సరైన జీవన సదుపాయాలేమిటో వారికి తెలియదు . ప్లాస్టిక్ గుడ్డ గుడారాలలో ,పొలిమేరల్లో,స్మశానాలలో మురికి వాడలలో  వీరి ఆవాసం అంటే ఆశ్చర్య పోనక్కరలేదు .రాత్రిళ్ళు వారు తాగే బీడీలే వారికి దీపాలు .సమాజం వీరిపట్ల చాల చిన్న చూపు చూస్తూ ఉదాసీనంగా ఉండటం వారిని మరీ కలచి వేస్తోంది .

ఇలా  అత్య౦త పేదరికం లో తరతరాలుగా జీవిస్తున్న భిస్టీ లకూ చరిత్ర లో ఒకే ఒక్క రోజు మహర్దశ ప్రాప్తించింది . ‘’అమృతం’’ సీరియల్ ఫేం ‘’గుణ్ణం గంగ రాజు ‘’తీసిన  ‘’ఏమో గుర్రం ఎగరా వచ్చు ‘’అనే  సినిమాలో లాగా వీరిలో ఒకరికి ఎక్కడో తేనె తుట్ట పట్టి ఆ అదృష్టం  దక్కింది . .

పాత ఢిల్లీ లోని అతి పురాతన భిస్టీ లలో చివరి తరం వాడు మొహమ్మద్ తరతరాలుగా  ఢిల్లీ ఏర్పడటానికి చాలా ముందుకాలం నుంచే  నీళ్ళు మోసే తెగకు చెందినవాడు .1897 లో బ్రిటిష్ నాచురలిస్ట్ ఎడ్వర్డ్ యైత్కెన్ తన ‘’బిహైండ్ ది బాంగలోస్ అనే పుస్తకం లో వీరిని గురించి విపులంగా చర్చించాడు . యూఫ్రటేస్ నదీ తీరం లో క్రీ శ.680 లో జరిగిన  ‘’కర్బాలా ‘’ అనే పౌరాణిక ,పవిత్ర యుద్ధం లో శత్రువు వేసిన బాణం   మహమ్మద్ ప్రవక్త  మనవడు హుస్సేన్ నీటి సంచీని చీల్చేసింది  .గొంతు తడుపుకోవటానికి కూడా చుక్క నీరు  లేక పోవటం తో  ఒంట్లో ఓపిక అంతా నశించి, అతడు పోరాడలేని పరిస్థితిలోఉంటె  శత్రువు అతడిని జయించి చంపేశాడు .హుస్సేన్ ఓటమి, వీర మరణానికి  స్మారకంగా సున్నీ మతస్తులు  మొహర్రం పండుగ దినాలలో ఊరేగింపు చేసి రక్తతర్పణం చేస్తారు .నీటి సంచులు మోయటానికి ముందు భిస్టీలు వీధులలో పారిన రక్తాన్ని, వాటి మరకలను శుభ్రం చేసేవారు ..సరే బాబూ నువ్వు పెట్టిన  హెడ్డింగ్ ఏమిటి ? ఈ సోది ఏమిటి అనుకొంటున్నారా ? దానికే వస్తున్నానిప్పుడు .

రెండవ మొఘల్ చక్రవర్తి హుమాయూన్  జీవితాన్ని కాపాడి ఒక భిస్టీ చరిత్ర సృస్టించాడు.ఒకరకంగా మలుపే తిప్పాడు .ఎలా అంటారా  ? చరిత్ర పుట తిరగేద్దాం .ఒక సారి హుమాయూన్ ఆఫ్ఘన్ లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రమాద వశాత్తు గంగానదిలో పడి మునిగిపోయాడు .అక్కడే ఉన్న ‘’నిజాం అనే భిస్టి’’ తన మంచి నీటి మేక తోలు సంచీ’’మషక్ ‘’లో ఉన్న నీటిని పారబోసి ,సంచీ  లోకి నోటితో బలంగా గాలి  ఊది ,పూర్తిగా నింపి  హుమాయూన్ కు అందించి దాన్ని  పడవ గా చేసుకొని  నీటిపై తేలుతూ ,నీటి నుంచి ఈదుకొని ఒడ్డుకు చేర్చాడు. తనను కాపాడి ,ప్రాణ భిక్ష పెట్టిన ఆ ‘’భిస్టీ నిజాం’’ కు కృతజ్ఞతగా ఆగ్రా సింహాసనాన్ని ఒక రోజు అధిస్టించి పరిపాలించే అవకాశమిచ్చాడుచక్రవర్తి హుమాయూన్ . .భిస్టీ నిజాం పాలించిన ఆ ఒక్క రోజులో తన నీటి తోలు సంచి ముషాక్ ను చించి, చిన్నచిన్న  ముక్కలు చేసి, వాటికి బంగారు పూత పూయించి తన పేరు ,తాను సామ్రాజ్యాన్ని పాలించిన రోజు లతో ముద్రించి కరెన్సీ గా చలామణి చేశాడు .ఇలా ఒక్క రోజు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించి’’ ఏక్ దిన్ కా సుల్తాన్’’ అని చరిత్ర సృష్టించాడు భిస్టీ నిజాం .ఈ విషయాన్ని భిస్టీ లందరూ చెప్పుకొని తెగ గర్వ పడతారు ,

ఆధారం -5-8-18 ఆదివారం  హిందూ పత్రికలో అమితాంగ్ షు ఆచార్య  రాసిన ‘’ఎ భిస్టి రూల్డ్ యాన్ ఎంపైర్ వన్స్’’ ఆర్టికల్ లో కొద్దిభాగం . మిగిలింది వీకీ పీడియా .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-18 –ఉయ్యూరు

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అంతరిక్ష పరిశోధన శాస్త్ర వేత్త ,ప్రముఖ పాప్యులర్ సైన్స్ రచయిత –డా మహీధర నళినీ మోహన రావు 

అంతరిక్ష పరిశోధన శాస్త్ర వేత్త ,ప్రముఖ పాప్యులర్ సైన్స్ రచయిత –డా మహీధర నళినీ మోహన రావు

తూర్పు గోదావరి జిల్లా ముంగండ లోసంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో  డా .మహీధర నళినీ మోహన రావు 1933 లో ఆగస్ట్ 4  అంటే ఈ  ఈ రోజే  జన్మించారు .ఇక్కడే రస గంగాధరం అనే అలంకార శాస్త్రం రాసిన జగన్నాధ పండితరాయలు జన్మించాడు .మహీధర కుటుంబం ముగ్గురు స్వాతంత్ర సమర యోధులను అందించింది .తండ్రి మహీధర రామ మోహనరావు  ప్రముఖ రచయిత, నవలాకారుడు స్వాతంత్ర్యోద్యమ సమర యోధుడు .ఈయన రాసిన ’’కత్తులవంతెన ‘’ నవల బాగా ప్రచారం పొందింది .‘’కొల్లాయి గట్టితే నేమి ‘’నవలకు 1960 లో తెలుగు సాహిత్య అకాడెమి పురస్కారం వచ్చింది .’’కత్తులవంతెన ‘’  .ప్రముఖ కవి ‘’మో’’ అని పిలువబడే శ్రీ వేగుంట మోహన ప్రసాద్ తో కలిసి దీన్ని ‘’స్వరాజ్యం ‘’గా ఆంగ్లీకరించారు .19 36 లో విశ్వ సాహిత్య మాల స్థాపించి 1964 వరకు అనేక పుస్తకాలు ప్రచురించారు .ముంగండ అగ్రహారం సంప్రదాయానికి నిలయమైనా ,మహీధర కుటుంబం వామ పక్ష భావాలున్నవారు .ప్రజాశక్తి ,విశాలాంధ్ర పత్రికల సంపాదకుడిగా చేశారు .తండ్రి సూర్య నారాయణగారు బ్రహ్మ సమాజ అభిమానులు కావటం తో కొడుకుకు రాజారామ మోహనరాయ్ పేరు పెట్టుకున్నారు .ఈ కుటుంబలో మహీధర జగన్మోహనరావు కూడా ప్రముఖ రచయిత.లెనిన్ జీవిత కధలు మధ్యయుగాల మహా చరిత్ర పుస్తకాలు రాశారు .

  నళినీ మోహన్  ప్రాధమిక విద్య విజయవాడ సి. వి .ఆర్.స్కూల్ లో  లో నేర్చి,15 వ ఏటనే కవిత్వం రాయటం మొదలు పెట్టారు . 1953-55 లో ఉస్మానియా యూని వర్సిటి నుంచి భౌతిక శాస్త్రం లో ఎం.ఎస్ .సి. పాసయ్యారు .తర్వాత మాస్కో వెళ్లి196౦ -63 లో –  మాస్కో,  లుముంబా యూని వర్సిటిల లో చదివి  డాక్టరేట్ పొందారు ..స్వీడన్ వెళ్లి ఆయనో స్పెరిక్ అబ్జర్వేటరీ లోనూ ,బల్గేరియా దేశపు అకాడెమీ ఆఫ్ లాబ రేటరిలోనూ డిప్యూటీ డైరెక్టర్ గా ఉంటూనే తనకభిమానమైన అంతరిక్ష  పరిశోధనలు చేశారు .

ఇండియా తిరిగి వచ్చి న్యు ఢిల్లీ నేషనల్ ఫిజికల్ లాబ్  డైరెక్టర్ అయ్యారు .రోదసీ శాస్త్ర వేత్తగా నళినీమోహన్ 16 రాకెట్ ప్రయోగాలలో పాల్గొన్నారు .శాస్త్ర పరిశోధనలు ప్రయోగాలు చేస్తూనే  తెలుగులో వైజ్ఞానిక రచనలు చేసి పాప్యులర్ సైన్స్  ఆర్టికల్స్ రాశారు .ఇది తెలుగు వారికి వరమై అప్పటివరకు ఎవరికీ అందుబాటు లో లేని వైజ్ఞానిక విషయాలు కరతలామలక మయ్యాయి .దీనికి రావు గారికి మనం కృతజ్ఞులమై ఉండాలి .తెలుగు బాలలకోసం బాల సాహిత్యాన్నీ రాశారు .అందులో చొప్పదంటు ప్రశ్నలు , ,పిడుగు కధ ,క్షేత్ర వీధులలో మొదలైన 16 పుస్తకాలున్నాయి .నిత్య ,అనుక్షణ పరిశోధనలో మునిగి తేలుతూ కూడా వీటిని రాయటం  మెచ్చదగినవిషయం .ఇవే కాక యువత కోసం 35 పుస్తకాలు రాసిన సైన్స్ పాప్యులర్ రచయిత సైంటిస్ట్ నళినీమోహన్ ..వీటిలో కాలెండర్ కథ ,గ్రహణాలకథ ,విద్యుత్కథ మొదలైనవి ఉన్నాయి .భారతీయ దార్శనికులు ,ప్రాచీన శాస్త్రజ్ఞుల భావాలకు గౌరవం కలిపిస్తూ ,ఎన్నో ఆధునిక విషయాలు వివరించి యువతకు స్పూర్తి కలిగించారు .ఒకరకంగా అంతరిక్షం లో విహరిస్తున్న సైన్స్ ను భూ మార్గం పట్టించారు .మూఢ విశ్వాసాలను శాస్త్రీయ దృక్పధం తో విమర్శించారు.

నళినీ మోహన్ రచించిన ‘’వనసీమలలో  పండిత రాయల భావ తరంగాలు ‘’పండితుల ప్రశంసలను అందుకొన్నది .తెలుగు భాషపై ఉన్న మక్కువ ,అభిమానం, గౌరవాలతో ఆయన 35 కి పైగా సైన్స్ గ్రంథాలు,176 బాలసాహిత్య రచనలు చేశారు .మంచి కవి కూడా అవటం తో కవితా సంకలనాలు వెలువరించారు .కావ్యాలు వ్యాస సంపుటాలు రాసి ప్రచురించిన శాస్త్ర కవి .అప్పటి వరకు సైన్స్ పుస్తకాలు రష్యా నుంచి దిగుమతి అయి అర్ధం పర్ధం లేని తెలుగు అనువాదాలతో తెలుగు వాడి బుర్రలను తినేశాయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టి దేశీయమైన తెలుగుతో సైన్స్ కు పరి పుస్టికలిగించారు నళినీ మోహన్ .రష్యా అనువాద జడి వాన నుంచి అచ్చమైన తెలుగు రచన గొడుగుతో కాపాడిన శాస్త్రీయ భాషా ఉద్యమకారుడు నళినీ మోహన్ గొప్ప సంస్కృత పండితుడు కూడా .

రావు గారి విజ్ఞాన శాస్త్ర కృషిని మెచ్చి  1968 లో దువ్వూరి రామి రెడ్డి స్మారక  ప్రతిష్టాత్మక  ‘’విజ్ఞాన బహుమతి’’ మొట్టమొదటి సారిగా అంద జేశారు . .తర్వాత ఇందిరాగాంధీ విజ్ఞాన బహుమతి పొందారు .తెలుగులో ఇంత విస్తృతంగా సైన్స్ గ్రంధాలు రాసిన వారు లేరు .శాస్త్రీయ విజ్ఞానాన్ని తెలుగునాట వ్యాపింపజేసిన ప్రాతస్మరణీయులు నళినీ మోహన్ .ఆకర్షణీయమైన శైలి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు సైంటిఫిక్ భావాలను స్పష్టంగా విడమర్చి చెప్పే విధానం గొప్ప ఆకర్షణగా నిలిచి ఆయన్ను అందరికీ దగ్గర చేశాయి  .గణితం లో గమ్మత్తులను కూడా  సరదాగా అరచేతిలో ఉసిరికాయ ను చేశారు .పత్రికలలో ఆయన రాసిన వ్యాసాలకు లెక్కే లేదు .శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని జనబాహుళ్యానికి అందుబాటులోకి తెచ్చిన రచనా శిల్పి ఆయన .ఆ ఘనత రావు గారిదే. అనితరసాధ్య కృషి ఇది . మహీధర గేయకధలు,ప్రపంచానికి ఆఖరి ఘడియలు ,మెదడుకి పదును  ఆయన రచనలలో ఆణిముత్యాలు .

పదవీ విరమణ చేశాక ఆల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధికి గురైన నలినీకాంత రావు ,హైదరాబాద్ సరూర్ నగర్ వృద్ధాశ్రమంలో చికిత్స పొందుతూ 72 వ ఏట 21-10-20 05 న మరణించారు .ఆయనకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఔషధ మొక్కల శాస్త్ర వేత్త డా.శ్రీ కొప్పుల హేమాద్రి

ఔషధ మొక్కల శాస్త్ర వేత్త డా.శ్రీ కొప్పుల హేమాద్రి

తూర్పు గోదావరి జిల్లా  గొల్లప్రోలు  లో జన్మించిన శ్రీ కొప్పుల హేమాద్రి అనకాపల్లి ఎమ్. ఎ.ఎల్ కాలేజీ లో కెమిస్ట్రీ లో బిఎస్ సి చదివి పాసై ,బాంబే యూని వర్సిటీనుండి  బి .ఎస్ .సి. ఆనర్స్ పొందారు .పూనా లోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులుగా చేరారు .మొక్కలలోని జాతులు వైవిధ్యాలగురించి తీవ్రమైన అధ్యయనం చేశారు .ఏం ఎస్ సి చదువుతూనే పరి శోధనా పత్రాలు సమర్పించేందుకుశివాజీ మహారాజ్ జన్మించిన  ‘’ఫ్లోరా ఆఫ్ జన్నర్ ‘’ప్రాంతం లో మొక్కలలో వివిధ జాతులపై పరిశోధన చేశారు.సహ్యాద్రి కొండలనడుమ దట్టమైన అటవీ ప్రాంతమే ఫ్లోరా ఆఫ్ జన్నర్ .అక్కడ అణు అణువూ గాలించి 14 కొత్త మొక్కలను కనిపెట్టారు .వీటి గురించి అప్పటికి ఎవరికీ ఏమీ తెలియదు .అందుకోసం ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలించి ,ఆ మొక్కల వినియోగం ప్రయోజనాలను తెలుసు కొన్నారు .తన పరిశోధన సారాంశాన్ని ‘’బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ‘’డైరెక్టర్ కు పరిశీలనకోసం పంపారు .ఆయన దానికి కొద్ది మార్పులు సూచించి  పి .హెచ్ .డి. కి పంపమని సలహా ఇచ్చారు .వెంటనే హాలండ్ లోని ‘’రిజ్క్ హీర్బే రియం ‘’కు పంపారు .దాని డైరెక్టర్ దీన్ని బాగా పరిశీలించి ,హేమాద్రిగారికి పి .హెచ్ .డి. కి బదులు ‘’ డాక్టర్ ఆఫ్ సైన్స్ ‘’పట్టా ప్రదానం చేశాడు .ఈ ప్రోత్సాహం తో ప్రామాణిక పద్ధతులలో పరిశోధనలు చేసి   కొత్త మొక్కలు ఎక్కడున్నా’’ కొప్పు పట్టి లాగి’’ ,40 మొక్కలను నూతనంగా కనుక్కొని వైద్య రంగానికి అందజేశారు కొప్పుల హేమాద్రిగారు .

      బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సుమారు 9 సంవత్సరాలు పని చేసి తన పరిశోధనా ఫలాలను పక్వానికి తెచ్చారు .ఔషధ మొక్కలపై వీరికున్న అవగాహనకు ప్రోత్సాహకరం గా కేంద్రీయ ప్రభుత్వ ఆయుర్వేద సంస్థ లో సర్వే అధికారి గా నియమి౦ప బడ్డారు .అప్పటికి ఆయుర్వేద గ్రంధాలలో మందుల మొక్కల పేర్లు అన్నీ తప్పుల తడక గా ఉన్నట్లు ఆయన గుర్తించారు .వెంటనే పనికి పూనుకొని వాటిని వర్గీకరించి అసలైన సరైన పేర్లు పెట్టారు .దీనిపై 35 ఏళ్ళు తీవ్ర కృషి చేశారు .మన  రాష్ట్రం తో పాటు మహారాష్ట్ర ,ఒరిస్సా ,పశ్చిమ బెంగాల్ ,కర్నాటక లలో కూడా పర్యటించి,పరిశీలించి ,పరిశోధించి  చరిత్ర గర్భం లో దాగి ఉన్న 24 మొక్కలను కొత్తగా పరి చయం చేశారు  .

   మన రాష్ట్రం లోని ఉభయ గోదావరి ,విశాఖ ,ప్రకాశం ,కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో తిరిగి ,ఆ ప్రాంతాలలో ఉన్న ఔషధ మొక్కలను గుర్తించి ,సేకరించి ,గిరిజన సంప్రదాయ వైద్యం గురించి పూర్తిగా అధ్యయనమూ చేశారు .తర్వాత వీటిని గ్రంధస్ధం  చేశారు .కడపజిల్లా లోని వేంపల్లి కొండలమీద ‘’రక్త మండలం ‘’పేరుతోనూ ,అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతం లోని బంగారు నాయకుని కొండ పై ఉన్న ‘’ముని రెట్ట ‘’పేరుతోనూ ,మహబూబ్ నగర్ జిల్లా లో ‘’కొండముచ్చు మూత్రం ‘’గా వివిధ పేర్లతో ఆటవికులు పిలిచే దాన్ని ‘’గోమూత్ర శిలాజిత్ ‘’ గా హేమాద్రిగారు గుర్తించి , సంప్రదాయ వైద్య  రంగానికి యెనలేని సేవలు చేశారు .

  హేమాద్రిగారు 15 వైద్య గ్రంధాలు రచించారు .’’ఆంద్ర ప్రదేశ్ లో  మందు మొక్కలు’’ ,’’ఔషధీ వృక్షశాస్త్రం ‘’గ్రంధాలను తెలుగు అకాడెమి ప్రచురించి బి .ఎస్ .సి .ఆయుర్వేద విద్యార్ధులకు పాఠ్య గ్రంధాలను చేసింది .మన రాష్ట్రం లో లభించే ఔషధ మొక్కలపై హేమాద్రిగారు చాలా పుస్తకాలు రాశారు .వారి రచన ‘’గిరిజన మూలికా వైద్యం ‘’బహుళ ప్రచారం లో ఉంది ఆయుర్వేద గ్రంధాలను అక్షర క్రమం లో పేర్లు పెట్టి సరి చేసిన ఘనత కొప్పులవారిది .కొప్పులవారి శేముషికి దర్పణం ’’గిరిజన వైద్య సర్వస్వం’’ అనే ఉద్గ్రంధం .మెడికో బొటానికల్ ఎక్స్ప్లో రేషన్ ,శాస్త్ర వేత్తలను ఆకర్షిస్తున్న గిరిజన వైద్యం ,గ్రాసెస్ ఆఫ్ జున్నార్ అండ్ ఇట్స్ సరౌ౦డింగ్స్,దిఫ్లోరా ఆఫ్ జున్నార్ అండ్ ఇట్స్ సరౌ౦డింగ్స్ గ్రంధాలు’’ కొప్పుల ‘’సిగలో అనర్ఘ రత్నాలు .

   జీవిత కాలమంతా వృక్ష శాస్త్రానికే అంకితం చేసిన శ్రీ కొప్పుల హేమాద్రి గారు 72 పరిశోధనా పత్రాలు రాసి ప్రచురించారు .ఆయనలో గోప్పకవికూడా ఉన్నారు. చక్కని కవితలతో అలరిస్తారుకూడా .జనరంజకమైన కాల్పనిక కథలూ రాశారు .ప్రస్తుతం విజయవాడలో  స్థిర నివాసం గా  ఉన్నారు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-18 –ఉయ్యూరు


— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి మందిరం

శృంగి

ఉత్తరప్రదేశ్ లోని  నైమిశారణ్యం లో శ్రీ లలితా దేవి ఆలయం అతి ప్రాచీనమైనది .108 శక్తి పీఠాలలోఒకటిగా ప్రసిద్ధి చెందింది .మధ్యయుగ కాలం నాటి ఈ ఆలయం విజయదత్తుల దండ యాత్రలో ధ్వంసమైంది .కాశీ దేవాలయాలను పునరుద్ధరించిన రాణీ అహల్యా బాయి  ఈ ఆలయ పునరుద్ధరణ చేసింది .

తండ్రి దక్షప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి తనకూ భర్త శివుడికీ ఆహ్వానం లేకపోయినా ,పుట్టింటి పై మమకారం తో , భర్త పరమేశ్వరుడు వద్దని వారించినా , పిలువని పేరంటానికి  వెళ్లి నట్లు సతీ దేవి వెళ్లి ,అక్కడ తండ్రి వలన తీవ్ర అవమానికి గురై ,భరించలేక యోగాగ్నిలో దగ్ధమై పోయింది .ఇది తెలిసిన శివుడు ఉగ్రరూపం తో సతీదేవి శరీరాన్ని తన భుజాలపై మోస్తూ , నిరంతర తాండవ నృత్యం సలిపాడు .లోకాలన్నీ తల్లడిల్లి పోయాయి . బ్రహ్మాది దేవతలంతా దిక్కుతోచక విష్ణు మూర్తికి మొరపెట్టారు. ఆయన వచ్చి సతీదేవి శరీరం శివుడు మోసినంత సేపూ  ఆయనను శాంతి౦ప జేయలేమని గ్రహించి తన సుదర్శనచక్రం తో సతీ దేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించాడు .అవి 10 8 ముక్కలుగా  ఖండింప బడి  భారత దేశమంతటా వివిధ ప్రదేశాలలో పడ్డాయి .ఈ ఖండాలు పడిన చోట అమ్మవారి ఆలయాలు వెలిసి,108  శక్తి పీఠాలయ్యాయి .నైమిశారణ్యం లో అమ్మవారి గుండె తెగిపడింది .అందుకే మహోత్క్రుస్ట శక్తి పీఠం గా వన్నె కెక్కింది .

‘’వారాణసీ విశాలాక్షీ ,నైమిశే లింగ దారిణి’’అన్న ప్రసిద్ధ శోకం ఉంది .కాశీలో విశాలాక్షి  రూపం లో , నైమిశారణ్యం లో’’ లింగధారిణి’’  అయిన లలితా పరాభట్టారికా రూపం లో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది .అమ్మవారి దగ్గర ప్రతిస్టింప బడిన శ్రీ చక్ర యంత్రం మహామహిమాన్వితమైనది అంటారు .మహిషాసుర,  భండాసురాది క్రూర రాక్షస సంహారం చేసి లోకాలను కాపాడిన చల్లని తల్లి లలితాదేవి అనిమనకు తెలుసు .  మహామంగళ స్వరూపిణి గా ఇక్కడ విశేష పూజలందుకొంటున్నది .భక్తుల కొంగుబంగారం లలితాంబ .

ఉత్తర ప్రదేశ్ లోని లక్నో కు 90 కిలోమీటర్లలో  సీతాపూర్ జిల్లాలో గోమతీ నదీ తీరాన  నైమిశారణ్యం ఉంది .’’నైమిశే అనిమిష క్షేత్రే ‘’అన్న దానిప్రకారం ఇది దేవతా క్షేత్రమేకాక ,విష్ణు క్షేత్రం కూడా .అనిమిషులు అంటే రెప్పపాటు లేని దేవతలు .విష్ణు సహస్ర నామాలలో   అనిమిష అనేది ఒకటి .అంటే ఆయన నిత్య జాగరూకుడు   కను రెప్పలు  మూయని వాడు , నిద్ర పోనివాడు ,,మహా మేధావి అని అర్ధం.-‘’గురుః,గురు తమో ధామః సత్యః సత్య పరాక్రమః నిమిషో ,అనిమిషః స్రగ్వీ ,వాచస్పతిర్  ఉదారదీః’’.

నైమిశం  16 కిలోమీటర్ల చుట్టుకొలత కలది. దీనినే పరిక్రమ అంటారు .ఇక్కడే భగవాన్  వేద వ్యాసుడు వేద విభజన చేసి ,బ్రహ్మ సూత్రాలు ,  భాగవతాది పురాణాలు ,మహాభారతం ఉపనిషత్తులు  మొదలైన ప్రసిద్ధ రచనలు చేశాడు .ఆయన కూర్చున్న చోటును ‘’వ్యాసగద్ది’’అంటారు ఇప్పుడు మనం చూడచ్చు .మహాభారతం మొదటి సారిగా పారాయణం చేసిన ‘’పురాణ మందిరం ‘’ఉన్నది . శృంగి మహర్షి తపస్సు చేసిన మందిరం ఉంది . సూత మహర్షి ఇక్కడే శౌనకాది మునులకు ఎన్నో పురాణాలు ప్రవచించాడు . ఇంద్రుడి వజ్రాయుధం తయారు కావటానికి  దధీచి మహర్షి తన వెన్నెముకను దానంచేసిన పవిత్ర స్థలం ఇది.  శ్రీరాముడు రావణ సంహారం అనే బ్రహ్మ హత్యా పాపం పోగొట్టుకోవటానికి ఇక్కడి’’మిశ్రిక్’’ లో ఉన్న  ‘’హత్యా హరణ తీర్ధం ‘’లో పవిత్ర స్నానం చేశాడు  .ఇది  నైమిశానికి  11 కిలోమీటర్ల దూరం లో సీతాపూర్ వైపు ఉంది.విక్రమాదిత్య చక్రవర్తి శ్రీరామ పత్ని సీతా సాధ్వి పేరిట సీతాపూర్ నిర్మించాడు .అంతే కాదు చారిత్రకంగా కూడా నైమిశం ప్రసిద్ధి చెందింది .1857 ప్రధమ స్వాతంత్ర సమరం లో ఈ జిల్లా ఆదివాసులు బ్రిటిష్ కంటోన్ మెంట్ పై  దాడి చేసి కాల్పులు జరిపారు  . ఈదాడిలో చాలామంది మిలిటరీ ఆఫీసర్లు, పౌరులు తప్పించుకు పారి పోయే ప్రయత్నం  లో మరణించారు.

నైమిశం లోని చక్రతీర్ధం పుణ్యస్నానాలకు ప్రసిద్ధి .విష్ణు మూర్తి చక్రం ఆగిన ప్రదేశం లో ఏర్పడిన పుష్కరిణి ఇది .నైమిశారణ్యం లో ఆది శంకరాచార్యులవారు లలితా దేవిపై ‘’లలితా పంచకం ‘’రాశారు .సతీదేవి ఇక్కడే తపస్సు చేసింది . ఇక్కడి హనుమాన్ గర్హిలో ‘’పెద్ద హనుమంతుడు ‘’కొలువై ఉన్నాడు .పాతాళంలో  అహి మహి  రావణులను  మర్దించి భూమిపైకి వచ్చి మొదటిసారిగా ఇక్కడే ఆంజనేయుడు శ్రీరామ లక్ష్మణులకు కనిపించాడు .9 వశతాబ్దికి  చెందిన’’తిరు మంగై ఆళ్వార్ ‘’నైమిశం పై తమిళం లో 10 పద్యాలు రాసి ఇదే’’మహా  విష్ణు క్షేత్రం ‘’ అన్నాడు .ఇక్కడ ఆహోబిలమఠం ,రామానుజ కూటం కూడా ఉన్నాయి .శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయమూ నిర్మించారు .కనుక నైమిశారణ్యం లో కాలుపెడితే ఎన్నెన్నో విశేషాలను శ్రీ లలితాదేవిమందిరం తో పాటు దర్శించవచ్చు .’’టూమెనీ బర్డ్స్ ఎట్ వన్ షాట్ ‘’.అన్నమాట .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-18 –ఉయ్యూరు

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేన్సర్  మహమ్మారి సంహారి  డా శ్రీ నోరి దత్తాత్రేయుడు

కేన్సర్  మహమ్మారి సంహారి  డా శ్రీ నోరి దత్తాత్రేయుడు

కృష్ణా జిల్లా ఉయ్యూరుకు దగ్గరలోని మంటాడ గ్రామం లో డా.శ్రీ నోరి దత్తాత్రేయుడు గారు 21-10-1947 న స్వతంత్ర భారత దేశం లో జన్మించారు .తండ్రి శ్రీ నోరి సత్యనారాయణగారు టీచర్ .తల్లి గారు శ్రీమతి కనక దుర్గ .చాలా పేద కుటుంబం నోరి వారిది .దత్తత్రేయుడు గారికి అయిదుగురు అన్నదమ్ములు ,అయిదుగురు అక్కచెల్లెళ్ళు .అందరిలో చిన్నవాడు దత్తాత్రేయుడు .5 వ ఏటనే తండ్రిని కోల్పోయిన నిర్భాగ్యుడు . .మచిలీ పట్నం లోతల్లి సంరక్షణలో 7 వ తరగతి వరకు చదివారు . ఆంద్ర జాతీయ కళాశాలలో ప్రీ యూని వర్సిటి ,బి ఎస్ సి పూర్తి  చేసి , .కర్నూలు మెడికల్ కాలేజి లో 1965 నుండి 71 వరకు చదివి ,ఉస్మానియా యూని వర్సిటి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ పొందారు .1976 లో ఎం. డి. అయ్యారు .పెత్తల్లి శ్రీ మతి జొన్నలగడ్డ సుందరమ్మ గారు దొడ్డ ఇల్లాలు .నెల నెలా ఆమె పంపే డబ్బుతోనే నోరివారు చదువ౦తా పూర్తి  చేశారు .పెద్దమ్మ పంపిన డబ్బుకు సార్ధకత చేకూర్చారు . సు౦దరమ్మ గారి చేతి చలవ మహా గొప్పది .ఆమె వల్లనే ప్రపంచానికి ఒక సమర్ధుడైన కాన్సర్ వ్యాధి వైద్యుడు లభించాడు .

 

ఫిబ్రవరి  1972- ఫిబ్రవరి 73వరకు దత్తాత్రేయుడు గారు హైదరాబాద్ గాంధి హాస్పిటల్ లో పని చేశారు .1973  నుంచి 1976 వరకు ఉస్మానియా యూని వర్సిటి అనుబంధ ‘’రేడియం ఇన్ స్టి ట్యూట్ అండ్ కాన్సర్ హాస్పిటల్’’ లో రెసిడెంట్ డాక్టర్ గా ఉన్నారు .ఆయనకు మొదటి నుంచి కాన్సర్ వ్యాధి నివారణోపాయం  కనిపెట్టాలన్న తపన ఉండేది .ఇది అమెరికాలోనే సాధ్యం అని గ్రహించారు .

అమెరికా వెళ్లి కేన్సర్ వ్యాధిపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు .న్యూయార్క్ లోని మెమోరియల్ స్లోన్ -కెట్టేరింగ్ కాన్సర్ సెంటర్ లో అధ్యయనం కొనసాగించారు .బ్రాకీ థెరపి విభాగానికి అధ్యక్షులై ,పరిశోధనలు చేశారు .కార్నెల్ నగరం లో రేడియేషన్ ఆంకాలజీ చైర్మన్ గా ఉంటున్నారు .వీరి భార్య శ్రీమతి సుభద్ర కూడా డాక్టర్ .వీరి కుమారుడు సంతోష్ న్యాయవాది .అమ్మాయి  డాక్టర్ .

ఆధునిక కాలం లో కేన్సర్ వ్యాధి వ్యాప్తికి వాతావర ణం లో వస్తున్న మార్పులు ,ముఖ్య కారణాలని డా నోరి పరిశోధనలలో తేలింది.దీనిపై విస్తృత అధ్యనం చేయాల్సిన  అవసరం ఉందని భావించి న్యూయార్క్ ప్రేస్బిటేరియన్ హాస్పిటల్ –విల్ కార్నెల్ మెడికల్  సెంటర్ లో తీవ్ర పరిశోధనలు చేసి ఆ వ్యాధి నివారణకు 27 ఆరోగ్య రక్షణ సౌకర్యాలు కలిగించి , అమెరికా దేశం లో కాన్సర్ బాధితుల పాటి ప్రత్యక్ష దైవం అనిపించారు .అన్ని వసతులు సౌకర్యాలు ఉన్న సమగ్ర కాన్సర్ చికిత్సాలయాలను 10 కేంద్రాలలో నెలకొల్పారు .న్యు యార్క్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ ఆఫ్ క్వీన్స్ లో రేడియేషన్ ఆంకాలజీప్రొఫెసర్ , చైర్మన్ గా చేశారు..క్వీన్స్ కు ఆంకాలజీ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు .

గైనలాజికల్ ,డెంటి ట్యూరినరి, , ధోరాసిక్ అండ్ హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్ మొదలైన వాటిపై అధిక స్థాయి బ్రాకీ దెరపి లో  కొత్త చికిత్సా పద్ధతులు , అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఆవిష్కరించిన ఘనత నోరి వారిదే .2002 జులై లో అమెరికా వైద్య రంగం లో ఒక భారీ స్థాయి సర్వే జరిపారు.సుమారు రెండున్నర లక్షల ప్రముఖ వైద్యుల కుటుంబాల వద్దకు వెళ్లి  , వాళ్ల ఇళ్ళల్లో ,ఏదైనా  అనారోగ్య సమస్య వస్తే ఏ డాక్టర్ ను సంప్రదిస్తారని అడిగితే ,వారందరూ కాన్సర్ విషయం లో అందులోనూ ముఖ్యంగా మహిళల కాన్సర్ విషయం లో డా .నోరి దత్తాత్రేయుడు గారినే సంప్రదిస్తాం అని నిర్ద్వంద్వంగా తెలిపారు .అంటే అమెరికాలో అత్యున్నత కేన్సర్ వైద్యులు నోరివారే నని చాటి చెప్పారన్నమాట .మహిళల కాన్సర్ నివారణ కు ప్రపంచం లోనే ‘’టాప్ డాక్టర్’’ గా డా నోరివారికి సుస్థిర స్థానం లభించింది .

నోరి వారివైద్య సేవానిరతి గుర్తించిన అనేక దేశాలు సంస్థలు ,ప్రముఖులు వారిని ఆహ్వానించి సత్కరించి గౌరవించి ప్రాణ  రక్షకుని గా ప్రాణదాత గా  కీర్తించారు .ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వర్ణ పతకం అందించి సన్మానించింది .వీరి వద్దశిక్షణ పొందిన 300 మంది కి పైగా కాన్సర్ నిపుణులు  ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య పదవులలో రాణిస్తున్నారు .వీరందరికీ స్పూర్తి ప్రదాత డా నోరి. కాన్సర్ రాకుండా పేగులలోపల ఉండే సున్నితమైన పొరను కాపాడేది ‘’పసుపు ‘’అని స్పష్టంగా చెప్పారు డా,నోరి .వంటనూనె ను అనేక సార్లు కాచి వాడటం ప్రమాదకరం అని హెచ్చరించారు .మన సంప్రదాయ వైద్య విధానాలలో ఉన్న మేలును కూడా గుర్తించారాయన .50 ఏళ్ళుగా అమెరికాలో కాన్సర్ వ్యాధి నిపుణులుగా సేవలందిస్తున్న దత్తత్రేయుడుగారికి అమెరికన్ కాన్సర్ సొసైటీ ‘’ట్రిబ్యూట్ టు లైఫ్ ‘’అనే గౌరవాన్ని బహూక రించి సత్కరించింది .భారత ప్రభుత్వం 1915 లో ‘’పద్మశ్రీ ‘’తో సరి పుచ్చింది .

  • బసవతారక క్యాన్స్ ర్ ఇంస్టి్ట్యూట్ నిర్మాణము అప్పటి ముఖ్యమంత్రి యన్‌.టి.రామారావు గారి సహాయ సహకారాలతో జరిగినది . ఎన్‌టీ రామారావు భార్య బసవ తారకంకి క్యాన్సర్ సోకడంతో ఆమెను అమెరికాలో ఉన్నా దత్తాత్రేయుడు దగ్గరకు తీసుకొచ్చారు . చికిత్స జరిగి బాగు అయిన కొన్నాళ్ళు బ్రతికింది. అంతకు ముందే దత్తాత్రేయుడికి ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించాలనే ఉద్దేశము ఉండడం … దానికి తోడు ముఖ్యమంత్రి అడగడం జరిగిన పిమ్మట ప్రభుత్వము 7 ఎకరాల భూమిని హైదరాబాద్ లో ఇవ్వడము, కొంతమంది అమెరికా తెలుగు వారి చందాలతోను, ప్రభుత్వ ఆర్థిక సాయముతో 200 పడకల ఆసుపత్రితో అన్ని నూతన వైద్య పరికరాలతో ” బసవతారక ఇండో-అమెరికన్‌ కాన్సర్ ఇంస్టిట్యూట్ ” నిర్మాణము జరిగి ఫెలోషిప్ కోర్సులను కూడా ప్రారంభమంచడం జరిగింది.

 

.ఉచితంగా ఇక్కడ ఈ వ్యాధికి చికిత్స చేయటం  విశేషం .తరచుగా ఇక్కడికి వచ్చి డా.నోరి చికిత్సలు చేస్తూ ఉంటారు  .స్త్రీలకూ కాన్సర్ రాకుండా ఉండటానికి ఎన్నో మెళకువలు  చెప్పి చైతన్య వంతులను చేస్తున్నారు .పురుష కాన్సర్ పై కూడా విస్తృత అధ్యయనం చేశారు .జాతీయ ,అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ లో వారు లెక్కకు మించిన ఆర్టికల్స్ రచించి మార్గ దర్శనం చేశారు .2006 జులై లో ప్రతిష్టాత్మకమైన ‘’కనాలి మెడికల్ లిమిటెడ్ సంస్థ ‘’నిర్వ హించిన సర్వే లో ,మొత్తం లక్షమంది కాన్సర్ నిపుణులలో డా నోరి దత్తాత్రేయుడు గారు ప్రప్రధమ౦గా  నిలిచి చరిత్ర సృష్టించారు .అనేక కోణాలలో జరిగిన సర్వే లో కూడా ఈయనే అమెరికా అత్యుత్తమ డాక్టర్ గా ఎంపికయ్యారు .వీరు  కాన్సర్ వ్యాధి పై ర 4 గ్రంధాలు ,200 కు పైగా పరిశోధనా వ్యాసాలూ రాశారు .వీటిలో ఒక గ్రంథం ‘’యాన్ అట్లాస్ ఆఫ్  బ్రాకి థెరపి ‘’20 06 ఆగస్ట్ లో హైదరాబాద్ లో ఆవిష్కరణ పొందింది .2007 మార్చి 4 న వీరికి ప్రతిష్టాత్మక ‘’డా .యలవర్తి నాయుడమ్మ అవార్డ్ ‘’నిచ్చి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది .కాన్సర్ అంటేనే ‘’మరణ శాసనం ‘’అ నే భయాన్ని పోగొట్టి ,అసంభవమైన కేసుల్లోకూడా’’కాన్సర్ ?నో ఫియర్’’అని ఊరడిస్తూ , మరణాన్ని వాయిదా వేయించే అత్యంత సమర్ధులు డా నోరి దత్తాత్రేయుడు గారు ఆంధ్రులు ,కృష్ణా జిల్లావారు కావటం మనకు గర్వకారణం .

తాము సంపాదించినదంతా ‘’ఆరోగ్య సంపద పెంచటం అభి వృద్ధి చేయటం ‘’లకే ఖర్చు చేసిన వితరణ శీలి డా నోరి .’’బ్రాకీ థెరపి.’’వైద్య ప్రక్రియతో కాన్సర్ రాక్షస సంహారం చేస్తున్న అపర దత్తాత్రేయుడు డా నోరి దత్తాత్రేయుడు గారు .’లాంగ్ లివ్ డా నోరి ‘’ ‘’వైద్యో నారాయణో నోరి దత్తాత్రేయః’’

 

     గౌరవాలు – పురస్కారాలు

  • 1962 లో ప్రీ-యూనివర్సిటీలో చదివేటపుడు, 1965 లో బి.యస్ .సి చదివేటపుడు, ఉష్మానియాలో ఎం.డి. చేసినపుడు అత్యధిక మార్కులు రావడంతో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు .
  • 1984 లో అమెరికన్‌ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ పెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డ్ ఇచ్చారు . 1990 లో అమెరికన్‌ కాలేజీ ఆఫ్ రేడియేషన్‌ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు . 1994 లో అలుమిని సొసైటీ, మెమోరియల్ స్లాన్‌-కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విష్డ్ అలునినస్ అవార్డ్ అందుకున్నారు .
  • 2000 లో ఇప్పటి వరకు కాస్టల్ అండ్ కానల్లే పబ్లికేషం వారి అమెరికా బెస్ట్ డాక్టర్, లేడిస్ హోం జర్నల్ నిర్వహించే సర్వేలో మహిలల క్యాన్సర్ నివారణలో ఉత్తం డాక్టర్ ఎంపికయ్యారు .
  • 1995 లో ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ గోల్డ్ మెడల్ అందుకున్నారు .
  • 2003 లో అమెరికన్‌ కాలేజి ఆఫ్ రేడియేషన్‌ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నారు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-18 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-18 బుధవారం ఉదయం10  గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,129 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

 ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

ముఖ్య అతిధి –శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు –ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,మరియు  స్పెషల్ అసిస్టెంట్ కలెక్టర్ –పులిచింతల ప్రాజెక్ట్

 విశిష్ట అతిధి – ”కవి రాజ మౌళి ,కవి సార్వ భౌమ ,మధురకవి ,అష్టావధాని ,కనకాభి షేకి ,70 గ్రంథాల  రచయిత ,విశ్రాంత తెలుగు పండితులు ,గుంటూరు జిల్లావాసి ,93 ఏళ్ళ

శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారు

ఆత్మీయ అతిధులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు  ,శాసనమండలి సభ్యులు

                        శ్రీ చలపాక ప్రకాష్ గారు –రమ్యభారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి

                        శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట సీతారామంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )

 మొదలగు పెద్దలు

                         కార్యక్రమ వివరం

స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం  ,పుష్ప సమర్పణ

ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు

1-విశిష్ట అతిధి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారికి

2-డా.శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి గారు –తెలుగు లెక్చరర్ ,ఏ. జి .అండ్ ఎస్. జి .సిద్ధార్ధ జూనియర్ కాలేజి

3-అమరవాణి పాఠశాల కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు

              ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం

1–2018 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1- శాంతినికేతన్  పాఠశాల విద్యార్థి-చి.కరిమి పవన్ కుమార్ కు ,-5 వేలరూపాయలు

 2- అమరవాణి పాఠశాల విద్యార్థినిలు  -కుమారి ఎం. డి.సఫూర మరియు కుమారి పి .తులసి లకుకలిపి – 5 వేల రూపాయలు .

ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు  ఏర్పాటు చేసిన  ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం –

3- ఎ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్ధినులలైన అక్కా చెల్లెళ్ళు -కుమారి చౌడాడ మౌనిక,కుమారి హేమలతలకు కలిపి  –రూ 5,వేల రూపాయలు .

-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు  శ్రీమతి సీతమ్మ దంపతుల  పేరిట    ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధికి  ఏర్పాటు చేసిన 10 ,11 6 రూపాయల స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦  –

4-2018 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 9.8 మార్కులతో  ఉత్తీర్ణత  సాధించి, స్థానిక .ఎ. జి. అండ్ ఎస్ .జి . సిద్ధార్ధ జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి గూడూరి చరిత కు

శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .

 సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

                                                                        ఆహ్వాని౦చు వారు

ఉయ్యూరు -3-8-18                                            గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

                                                                     పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమ 
— 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్ పైడి జయరాజ్

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్  పైడి జయరాజ్

ఈ తరం వారికి గుర్తు ఉండక పోవచ్చు కాని ,పాతతరం వారికీ జై రాజ్ లేక జయరాజ్ నటన బాగా గుర్తుండే ఉంటుంది .నటుడుగా ,నిర్మాత ,దర్శకుడుగా  హిందీ సినిమాలను కొన్నేళ్ళు శాసించిన  జైరాజ్ తెలుగు వాడని అసలు ఎవరికీ తెలియదు. ఆయనకూడా ఎప్పుడూ చెప్పుకోలేదు కూడా .అలాంటి విలక్షణ హిందీ హీరో అసలుపేరు పైడి పాటి  జయరాజ నాయుడు  .బాలీవుడ్ లో పైడి జైరాజ్ .వెడల్పైన ముఖం ,కాంతివంతమైన కళ్ళు, చక్కని నటన ఆజానుబాహు స్పురద్రూపం  , మంచి వాచకం జైరాజ్ ను హిందీ చిత్రసీమ అందలం ఎక్కించింది .

28-9-1909 లో తెలంగాణా కరీం నగర్ లో జైరాజ్ జన్మించాడు .సరోజినీ నాయుడుకు  మేనల్లుడు  .ఇతని అన్నలు సుందరరాజ నాయుడు ,దీన దయాళ్ నాయడు .

   నిజాం కాలేజిలో డిగ్రీ చదివి,అప్పటికే  తెలుగు నాటకాలలో  నటించి ప్రతిభ చాటాడు .సినిమాలో నటించాలన్న కోరికఉండేది .ఆ రోజుల్లో సినిమా వ్యాపారం లాభ సాటికాదు అని అందరి అభిప్రాయం . ఆతను తన కోరికను పెద్దలకు చెప్పగా వాళ్ళు వెళ్ళవద్దని  ఆంక్ష విధించారు.తన నిశ్చయాన్ని మార్చు కోకుండా  జయరాజ్ వారికి చెప్పకుండా  1929 లోఇంట్లోంచి పారిపోయి  బొంబాయి  చేరాడు .అప్పటికి తెలుగు సినీ పరిశ్రమ ఇంకా తప్పటడుగులు వేస్తోంది .అప్పటికే బొంబాయి లో ఏడాదికి 200 సినిమాలు రిలీజ్ అయ్యేవి .సంపన్న కుటుంబాలకు చెందినవారికి మాత్రమే అప్పుడు అక్కడ సినీ వేషాలు దక్కేవి .ఇంట్లో వాళ్ళు ఇతని సాహసానికి మెచ్చక   దాదాపు పాతిక ఏళ్ళు అతని గురించి పట్టించుకోలేదు .ఉత్తర ప్రత్యుత్తరాలే లేవు .ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు .చిన్న చిన్న కూలి పనులు చేశాడు .అన్నిటినీ మనో ధైర్యం తో  తట్టుకొని  నిలబడ్డాడు .తన ధ్యేయాన్ని నేరవేర్చుకున్నాడు .తొలితరం బాలీ వుడ్ నటుడుగా తెలంగాణా తెలుగు బిడ్డ విజయపతాకాన్ని ఎగర వేసి సూపర్ స్టార్ అయ్యాడు .

బొంబాయిలో డూప్లికేట్ స్టంట్ మాస్టర్ గా ముందు పని చేశాడు  .సెట్ లను అమర్చేవాడు .కెమెరా వాళ్లకు సహాయం చేసేవాడు  .  కాలం కలిసోచ్చి శారదా ఫిలిం కంపెనీ లో చేరి  అదే ఏడాది మూకీ చిత్రం ‘’స్టార్ కింగ్ యూత్ ‘’లో 19 వ ఏటనే  మొట్టమొదటగా నటించిన అదృష్ట వంతుడు జైరాజ్ .వెంటవెంటనే 11 సైలెంట్ సినిమాలలో నటించాడు. అందులో ‘’ట్రయాంగిల్ ఆఫ్ లవ్ ‘,మాతృభూమి ,ఆల్ ఫర్ లవర్ ,మహాసాగర్ మోతి,ఫ్లైట్ ఇంటూ డెత్ ,మై హీరో మొదలైనవి ఉన్నాయి .

  తెలుగు నాటకానుభవం, మంచి ఆకర్షణతో ఉన్న పర్సనాలిటి  జైరాజ్ కు బాగా తోడ్పడి ,అతనిని ఏ మాత్రం సంకోచించకుండా కత్తి వీరులైన ధీరోదాత్త రాజపుత్ర వీరుల ,రాజుల పాత్రలకు ఎంపిక చేసి నటింప జేశారు .1957 లో ‘’అమర్ సింగ్ రాధోడ్’’1859 లో ‘’పృథ్వి చౌహాన్ ‘’1960 లో ‘’మహారాణా ప్రతాప్ ‘’మొదలైన చిత్రాలలో హీరో వేషం వేసి అసలు వారంతా జైరాజ్ లాగానే ఉండేవారా అన్న౦తగా నటించి మెప్పించాడు .ఇవన్నీ సూపర్ హిట్ సాధించాయి .19 47 లో ‘’షాజహాన్ ‘’పాత్రలో గాంభీర్యం ఒలికించాడు .1959 లో ‘’టిప్పు సుల్తాన్ ‘’,1962 లో ‘’హైదరాలి ‘’సినిమాలలో లీడ్ రోల్స్ పోషించి  సెభాష్ జైరాజ్ అని పించుకున్నాడు .ఇంతటి వైవిధ్య పాత్రలలో నటించి తనకు సాటిలేరని పించుకొన్నాడు

   1947 నాటి ‘’సస్సి పున్నా ‘’,1956 ‘’హాతిం తాయ్ ‘’1963 ‘’చంద్రశేఖర ఆజాద్ ‘’1964 లో ‘’ దుర్గా దాస్ ‘’చిత్రాలు ఆయన కీర్తి కిరీటం లో కలికితు రాళ్ళు . ఆపాత్రలకోసమే ఆయన పుట్టాడా అన్నంత సహజం గా నటించాడు కాదు జీవించాడు .చారిత్రాత్మక, జానపద ,సాంఘిక హీరో పాత్రలలో తనకు సాటి లేరని పించాడు .

   ఆ తరం మేటి నటి’’ సురయా ‘’ తో 6 సినిమాలలో19 40 నుండి దశాబ్దం పాటు 1950 వరకు  నటించాడు .అందులో 1943 లోని ‘’హుమారిబాత్ ‘’1949 ‘’శింగార్ ‘’,అదే ఏడాది లో ’’అమర్ కహాని ‘’1951నాటి ‘’రాజపుట్ ‘’ ,1952లో రేషం’’చిత్రాలలో  సురయా ప్రక్కన హీరో గా నటించారు .ఆ రోజుల్లో ఆ ఇద్దర్నీ ‘’వెండితెర వేల్పులు ‘’గా భావించేవారు .1952 లోనే వచ్చిన  ’’లాల్ కున్వార్ ‘’లో సురయా తో  సెకండ్  హీరో గా చేశాడు .ఇంతటి నటనానుభవం ఉందికదా అని ‘’ ప్రసిద్ధ ఆంగ్లకవి టెన్నిసన్ రాసిన ఒక కవిత ఆధారం గా నటుడు భారత్ భూషణ్ హీరో గా ‘’  సాగర్ ‘’సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు .అట్టర్ ఫ్లాప్ అయి మళ్ళీ నిర్మాణం జోలికి పోకుండా బుద్ధిగా ఉన్నాడు . అతని నట జీవితంపై ఈ ఫైల్యూర్ ప్రభావం పడలేదు .హీరో గా దూసుకు పోతూనే ఉన్నాడు ,జైత్రయాత్ర సాగిస్తూనే ఉన్నాడు జయ రాజ్ .

  ఢిల్లీ కి  చెందిన పంజాబీ అమ్మాయి సావిత్రి ని కుటుంబ పెద్దలు కుదర్చగా పెళ్లి చేసుకొన్నాడు  .ఈ సంబంధాన్ని నాటి సాటిలేని మేటినటుడు పృధ్వీ రాజకపూర్ తండ్రి ఇరువైపులవారినీ సంప్రదించి కుదిర్చాడు .పృధ్వీ రాజ్ కపూర్ జైరాజ్ కు మంచి మిత్రుడు .అశోక్ కుమార్ తో సాన్నిహిత్యం బాగా ఉండేది .అంతర్జాతీయ సినీ నటులు రాబర్ట్ మోర్లీ ,జోస్ ఫెర్రెర్ లతో కలిసి పని చేసిన హీరో జైరాజ్ . అతడు అతి సునాయాసంగా చాలా భాషలు మాట్లాడే శక్తి సామర్ధ్యాలున్నవాడు .అందుకే భిన్నభాషల సినిమాలలోనూ రాణించాడు .ఇంగ్లీష్ ,ఉర్దూ లలో అమోఘ పాండిత్యం ఉండేది ఆయనకు ..మేనత్త నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు తో  మేనల్లుడు జైరాజ్ చాలా చనువుగా గౌరవంగా ఉండేవాడు ఆమెకూ అతనిపై అభిమానం జాస్తీ గా ఉండేది .జైరాజ్ సినిమా రంగం లోని చెడు పోకడలకు  చాలాదూరం గా ఉండేవాడు .భార్యను అమిత ప్రేమతో చూసేవాడు .వాళ్ళది అన్యోన్య, ఆదర్శ దాంపత్యం .ఇద్దరు కొడుకులు నలుగురు కూతుళ్ళు పుట్టారు.

1980 లో జైరాజ్ మొట్ట  మొదటిగా   ‘’దాదా సాహెబ్ ఫాల్కే ‘’అవార్డ్ పొందాడు . అంటే అక్కినేనికంటే ముందే ఫాల్కే అవార్డ్ పొందిన తెలుగు బిడ్డడు  జైరాజ్ .దురదృష్ట వశాత్తూ ఈ విషయాన్ని మనవాళ్ళు ఎవరూ అప్పుడు ప్రచారంచేయనే లేదు .తెలుగు వాడికి వచ్చిందని గర్వ పడనూ లేదు    .గుజరాతీ ,మరాఠీ ,హిందీ లలో మొత్తం  350 కి పైగా సినిమాలలో నటించాడు .హిందూలాల్ యాజ్ఞిక్ ‘’ది ప్రిజనర్ ఆఫ్ జెండా ‘’లో అతనికి మొదటి అవకాశం ఇచ్చాడు .ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకపోయింది .ఇందులో మాధురి హీరోయిన్ .ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవటం తో   యాజ్ఞిక్ మరినాలుగు సినిమాలలో అవకాశమిచ్చాడు ..అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి హీరో గా రికార్డ్ సృష్టించాడు జై రాజ్ .1930 లో అతని పారితోషికం వంద రూపాయలు .అతని సినిమాలో పైన పేర్కొన్నవికాక  సూపర్ హిట్లు  సాధించి సూపర్ స్టార్ ను చేసిన సినిమాలలో ‘’షికారి ,మజ్దూర్ ,స్వామి ,పన్నా ,రాజ్ పుటాని,ముంతాజ్ మహల్ ,లాల్ కిలా ఉన్నాయి .స్వామి సినిమా తో దశ తిరిగి రెమ్యూనరేషన్ విపరీతంగా పెంచారు .ప్రఖ్యాత డ్రీం గర్ల్  దేవికా రాణి సరసన ‘’హమారీ బాత్ ‘’లో నటించాడు .ఇది మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయింది .మాధురి ,షకీలా  ,నటనకే భాష్యం చెప్పిన  మీనాకుమారి, శశికళ వంటి టాప్ హీరోయిన్స్ తో  కూడా నటించాడు .1950 నుండి 1960 వరకు జైరాజ్ సినీ జీవితం లో స్వర్ణ యుగం .156 చిత్రాలలో హీరోగా , 200 సినిమాలలోవిలన్ , కేరెక్టర్ యాక్టర్  కామెడీ యాక్టర్   గా చేశాడు ..జైరాజ్ 3 సినిమాలకు దర్శకత్వం వహించాడు . .అన్నీ కనకవర్షాలే కురిపించాయి .ప్రతిమా ,సాగర్ . మొహర్ సినిమాలు మూడూ  అద్భుత విజయాలు సాధించాయి . సాగర్ ,మొహర్ రెండిటిలో తన శిష్యుడు షమ్మీ కపూర్ కు హీరో గా అవకాశం ఇచ్చాడు జైరాజ్ .సోదరులు రాజ్ కపూర్ ,షమ్మీకపూర్ లు జైరాజ్ ను ‘’పాపాజీ ‘’అని గౌరవంగా సంబోధించేవారు .

 జైరాజ్ సుదీర్ఘ సినీ రంగ సేవకు 1980 లో ప్రతిష్టాత్మకమైన ‘’దాదా సాహెబ్ ఫాల్కే ‘’పురస్కారం అందుకున్నాడు ..ఫాల్కే అవార్డ్ అందుకున్న మొట్టమొదటి తెలుగు  నట దర్శక నిర్మాత జైరాజ్ గుజరాత్  మహారాష్ట్ర ప్రభుత్వాలు జైరాజ్ ను ఘనంగా సత్కరించాయి . దిలీప్ కుమార్ రెండవ సినిమా’’ప్రతిభ ‘’ కు డైరెక్టర్ జయరాజ్ అంటే మనకు ఆశ్చర్యమేస్తుంది .మధుర సంగీత సృష్టికర్త  నౌషాద్ ను వెండి తెరకు పరిచయం చేసింది జైరాజే .1913 లో దాదాసాహెబ్ ఫాల్కే మొదటి సినిమా తీసి రికార్డ్ సృష్టించాడు .జైరాజ్ బాంబే సినీ రంగ ప్రవేశం 1929 లో చేసి ఆయన పేరిట   ఉన్న అవార్డ్ ను 1980 లో పొందిన ఘనుడు జైరాజ్  .మన అక్కినేని రామారావు లు సినీ అరంగేట్రం చేయకముందే బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన  వాడు జైరాజ్ .ఇంత గోప్పతెలుగు నటుడిని  మనవాళ్ళు మరచి పోయి అతని ఆనవాళ్ళు లేకుండా చేయటాని ప్రయత్నించినట్లు కనిపిస్తోందని సినీ విమర్శకులు అంటారు .తెలుగు సినీ చరిత్ర పుస్తకం లో అగ్రస్థానాన ఉండాల్సిన వాడిని ఇంతగా విస్మరించిన జాతి మనది .ఆయన శిలా విగ్రహం, ఆయన పేరిట పారితోషికం కూడా ఇవ్వని గొప్పమనసు మనది .  సినీకళాకారుల సంక్షేమం కోసం, మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన మానవతా మూర్తి జైరాజ్ .జాతీయ విపత్తులలో సర్వం కోల్పోయినవారి సహాయార్ధం సంగీత కచేరీలు నిర్వహించి అందజేసేవాడు

.జైరాజ్ చని పోవటానికి ఏడాది ముందే భార్య సావిత్రి  కేన్సర్ తో చనిపోయింది..  ఆమె మరణం అతని ఆరోగ్యం పై బాగా ప్రభావం చూపింది .తట్టుకోలేక పోయాడు .ఆతర్వాత అతని మరణం దాకా  తండ్రి బాగోగులు కూతురు గీత చూసుకొనేది .భార్యపై మమకారం ,బెంగ లతో జైరాజ్ 11-8-2000 న 91 వ ఏట మరణించాడు .అతని మనవడు అంటే ఈకూతురి కొడుకు ‘’రాజన్ షాహి’’ టి.వి. ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా మంచి పేరు పొందాడు .ఇతనొక్కడే జై రాజ్ కుటుంబానికి మిగిలిన ఏకైక వారసుడు .మిగిలిన వారంతా చనిపోయారు .

20 18 లో తెలంగాణా ప్రభుత్వం ‘’లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్ ‘’అనే డాక్యుమెంటరి ఫిలిం నిర్మించి ఈతరానికి పరిచయం చేసి,అతని శత జయంతిని ఘనంగా నిర్వహించి ఋణం తీర్చుకొన్నది .

కొసమెరుపు –హీరో,విలన్ ,కేరక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాలలో నటించి నిర్మాత దర్శకుడిగా ప్రాభవం పొందిన జైరాజ్ యెంత సంపాదించాడో, .డబ్బుతో ఎన్నో బంగళాలు  ఇళ్ళూ, స్థలాలుకొన్నాడో ,  బ్యాంకుల్లో  యెంత డబ్బు మూలుగుతోందో ఆయనకే తెలియదు .అంతటి సంపన్నుడు .ఆ తరం లో కుబేరుడే .’’మనీ మేనేజ్’’ మెంట్ పై అసలు దృష్టి పెట్టలేదు సంపాదించింది పధ్ధతి ప్రకారం కొడుకులకు, వారసులకు ఇవ్వ లేకపోయాడు .దీనితో కొడుకు  లిద్దరిదీ ఇస్టా రాజ్యమై పోయింది .అందినంత బొక్కేశారు.వ్యసనాలకు బానిసలై  ఉన్నదిఅంతా ఊడ్చేశారు .చివరికి మిగిలిన ఒకే ఒక్క ఇల్లు ను కూడా కొడుకు కోడలు ఆక్రమించి ఆయన్ను ఒక చీకటి గదికే పరిమితం చేసి,మానవత్వం మరచి ప్రవర్తించారు .అతనికి కట్టుకోవటానికి సరైన బట్టలే ఉండేవి కావట .తిండీ తిప్పల సంగతి ,ఆరోగ్యం విషయం అస్సలు పట్టించు కోకుండా గాలికి వదిలేశారు ఒకప్పటి ఆసూపర్ స్టార్ జైరాజ్ ను.తప్పని సరి పరిస్థితులలో గత్య౦తరం లేక కూతురు గీత కు ఫోన్ చేస్తే ఆమె వచ్చి ,ఇక్కడి పరిస్తి  స్థితులకు బిక్క చచ్చి తండ్రి దీనావస్థ కు పరిష్కారం గా అన్నావదినలను ఇంటినుంచి గెంటేసి  ఇంటిని స్వాదీనంచేసుకొని  ,విషయాలను  చక్క దిద్ది  తండ్రి బాగోగులు చూస్తూ ఊరట కల్గించి ,తండ్రి తరఫున వాళ్ళపై కోర్ట్ లో కేసు వేసింది.ఒక రోజు కోర్టు లో జైరాజ్ జడ్జి గారితో ‘’నన్ను నా ఇంట్లో ప్రశాంతంగా మరణించే అవకాశం కల్పించండి ప్లీజ్ ‘’అని దీనంగా వేడుకొన్నాడు .కోర్టు అన్నికోణాల్లో పరిశీలించి జైరాజ్ కు న్యాయం కలిగించి ,ఆ ఇల్లు  ఆయన కే చెందుతుందని తీర్పు ఇచ్చింది .ఎంతటి హీరోకు ఎంతటి పరిస్థితి ?దైవ లీలలు చిత్రాలే కానీ మనం కూడా మన విషయాలలో జాగ్రత్తగా ఉండక పొతే ఇలాంటి పరిస్థితులే వస్తాయిఅని అందరూ గుర్తించాలి .అతని జీవితం అందరికీ అన్ని విధాలా గుణ పాఠం  .

  మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-18 –ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు  రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు

ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు  రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు

12-2-1916 పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామం లో శ్రీ లక్కరాజు రామచంద్ర రావు జన్మించారు .తండ్రి శ్రీ వెంకట రామయ్య .ఆంద్ర విశ్వ విద్యాలయం లో చదివి బి .ఎస్ .సి .ఆనర్స్ ,ఎం .ఎస్. సి. పాసైనారు .1939 లో ఇక్కడే రసాయనిక శాస్త్ర డిమాన్ స్ట్రేటర్ గా  ఉద్యోగం ప్రారంభించారు .1943 లో మైక్రో అనలిస్ట్ గా పదోన్నతిపొందారు .1946లో డి .ఎస్. సి .డిగ్రీ పొంది లెక్చరర్ అయి యూని వర్సిటీలోనే రిటైరయ్యారు  .

కొన్ని మొక్కలలో వర్ణ ద్రవ్యాల రసాయనిక పరిశీలనం ( కెమికల్ ఇన్వెస్టి గేషన్ ఆఫ్ సం ప్లాంట్ కలరింగ్ మాటర్స్)  పై పరిశోధనలు చేశారు .ఈ పరిశోధనలలో చాలా ప్లావోన్ లను ,ప్లావనోవ్ లను గుర్తించారు .ఇవి మొక్కలలో సాఫ్ట్ ఆక్సిడైజేషన్ పొందుతున్నట్లు కనుగొన్నారు .ఆల్కలైన్ పొటాషియం పెర్ సల్ఫేట్ ద్రావణం లో ప్లావోన్ లను కొద్దిగా వేడి చేయటం తో అనేక ప్లావోనోల్ కాంపౌండ్స్ తయారు చేయవచ్చునని నిర్ధారణకు వచ్చారు .సీమ బంతిపూల (టాజిక్టస్ పాట్యుల)నుంచి వేరు చేసిన ప్లావోనోల్ పాట్యు లెటాన్ యొక్క అణు నిర్మాణం ను నిర్ధారించటానికి చేసిన పరిశోధనలే ఇవన్నీ .ఈ పూలలో పాట్యులెటిన్ యొక్క 7 గ్లైకో సైడ్ గా పాట్యు లెటిన్ ను శాస్త్రజ్ఞులు గుర్తించారు .దీనితో ఆంధ్రా యూని వర్సిటి లో ఆర్గానిక్  కెమిస్ట్రి లో విస్తృత పరిశోధనలు అవకాశం కలిగింది .

రావు గారు ఈయూని  వర్సిటి లో 1953-నుంచి పదేళ్ళు 1963 వరకు రీడర్ గా ఉన్న కాలం లోనే ఈ పరిశోధనలు ఊపందుకున్నాయి .ఎనలిటికల్ ,ఇంజనీరింగ్ ,ఆర్గానిక్ ,ఫిజికల్ ,న్యూక్లియర్ కెమిస్ట్రి శాఖలను రావు గారే అభి వృద్ధి చేశారు .ఎంతో మంది పరిశోధక విద్యార్ధులకు స్పూర్తిగా నిలిచి ,అత్యుత్తమ స్థాయి పరిశోధనలకు మార్గ దర్శకం చేసి వారిని తీర్చి దిద్దిన ఆచార్యులుగా ఘనకీర్తి పొందారు రామచంద్ర  రావు  గారు .1968 నుంచి 78 వరకు దశాబ్దకాలం రసాయనశాఖ అధిపతిగా ఉన్నారు .తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజి ప్రిన్సిపాల్ గా సేవలందించి రిటైరయ్యారు . వీరి పర్య వేక్షణలో 14 మంది పరిశోధనలు చేసి డాక్టరేట్ పొంది ఆయన కీర్తిని ద్విగుణీకృతం చేశారు .రావు గారు రాసిన 175 పరిశోధనా పత్రాలు జాతీయ ,అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ లో వెలువడి ఆయన సామర్ధ్యానికి ప్రతీకలుగా నిలిచాయి .విదేశీ యూనివర్సిటీలు వారికి గౌరవ పదవులిచ్చి గౌరవించాయి .చాల దేశాల  లో పర్యటించి అక్కడి యూని వర్సిటీలలో  తన పరిశోధనలపై ప్రసంగించి  విద్యార్ధి, అధ్యాపకులకు ప్రేరణ, స్పూర్తి కలిగించారు .

1977 లో కృష్ణా జిల్లా నూజి వీడులోని ఆంద్ర యూనివర్సిటి పోస్ట్ గ్రాడ్యుయేట్  సెంటర్ కు రావు గారు స్పెషల్ ఆఫీసర్ గా నియమి౦ప బడ్డారు .తర్వాత ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ఉన్నారు .ఇక్కడ కూడా పరిశోధక విద్యార్ధులకు అండ దండగా ఉండి వారికి మార్గ  దర్శనం  చేశారు  ..వారి ‘’ఎక్ ట్రా మ్యూరల్ రిసర్చ్ కమిటీ సభ్యులుగా ఉంటూ ,విజ్ఞాన శాస్త్ర విషయాలు సామాన్యులకు సరళభాషలో అందించటానికి గొప్ప కృషి చేశారు .ప్రకృతి జన్యు రసాయనిక పరిశోధనలో నలభై ఏళ్ళు పని చేసి పండిపోయిన ఆచార్యులు రావు గారు .వారి పరిశోధనా ఫలితాలు అమూల్యమైనవిగా గుర్తింపు పొందాయి .సువిఖ్యాతులైన ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు గారిని ‘’ఆచార్యులకే ఆచార్యులు’’ అని కీర్తించారు .డా.సి. వి. రామన్ శిష్యరికం ,డా సూరి భగవంతం సాన్నిహిత్యం రావు గారికి రసాయనిక శాస్త్రం లో నూతన ఆవిష్కరణలకు ఎంతగానో తోడ్పడ్డాయి .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రోకలి బ0డ పురుగుల బహు  సంతానం 

మా దొడ్లో వర్షాకాలం లో రోకలి  బండ పురుగులు ఎక్కువ .అవి ఒకే సారి చాలా పిల్లలను ప్రసవిస్తాయి  పది నిమిషాల తర్వాత  అవన్నీకలిసి సామూహికంగా  గున గున నడుచు కొంటూ వెళ్లి పోతాయి .ఎక్కడికి పోతాయో తెలీదు .ఇవాళ మా అదొడ్లో అలాంటి రెండు రోకలి  బండ పురుగులు  ఇప్పుడే కన్న వాటి  సంతానం   నా కెమెరాకు చిక్కాయి . చూడండి – దుర్గాప్రసాద్

—

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హైదరాబాద్ ఇ .సి. ఎల్ .నిర్మాణ శాస్త్రవేత్త డా ఏ. ఎస్. రావు

హైదరాబాద్ ఇ .సి. ఎల్ .నిర్మాణ శాస్త్రవేత్త డా ఏ. ఎస్. రావు

ఇ.సి .ఎల్. అంటే ఎలెక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా .హైదరాబద్ లో దీని నిర్మాణ రూప శిల్పి డా.ఏ ఎస్ రావు అని అందరూపిలిచే  డా శ్రీ అయ్యగారి సాంబశివరావు గారు.ఆయన కృషికి,సేవకు  కృతజ్ఞతగా వెలసినదే  హైదరాబాద్ లోని ఏ. ఎస్.  రావు నగర్.

రావు గారు 20-9-1914 న పశ్చిమ గోదావరిజిల్లా మోగల్లు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ అయ్యగారి వెంకటాచలం

బెనారస్ హిందూ యూనివర్సిటిలో బి. ఎస్. సి.  ,ఎం. ఎస్. సి .1937 నుండి చదివి ఉత్తీర్ణులై,1947 లో  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర స్టాన్ ఫోర్డ్  యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చదివి డిగ్రీ పొందారు ఇండియా వచ్చి 1940- నుంచి ఎనిమిదేళ్ళు బెనారస్ హిందూ యూని వర్సిటి లెక్చరర్ గా పని చేశారు .తర్వాత బొంబాయిలోని టాటా ఇన్ స్టి ట్యూట్  ఆఫ్ ఫ౦డమెంటల్ రిసెర్చ్ లో రీడర్ గా 1948నుంచి 54 వరకు ఆరేళ్ళు చేశారు .ట్రా౦బే.లోని అటామిక్ ఎనర్జి ఎస్టాబ్లిష్ మెంట్ కు 1954 లో డైరెక్టర్ అయ్యారు .తర్వాత భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్కు 1967 లో  డైరెక్టర్ అయ్యారు  .ఆతర్వాత హైదరాబాద్ ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా 1967 నుండి 1978 వరకు 11 ఏళ్ళు పనిచేసి సంస్థ అభి వృద్ధికి యెనలేని కృషి చేశారు .

ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ సంస్థల ఫెలోషిప్ అందుకుని పరిశోధనలు చేసిన   సమర్ధులు రావు గారు .ఆయన టాటా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్  ఫండమెంటల్ రిసెర్చ్  లో అయిదేళ్ళు  తీవ్ర పరిశోధనలు చేసి హై ఆల్టిట్యూడ్ ల వద్ద కాస్మిక్ కిరణాల అత్యధిక కొలతలను కనిపెట్టారు .ట్రా౦బేలోని రెండు రియాక్టర్ లైన ‘’ అప్సర ,జర్లినా’’ నిర్మాణం ,డిజైనింగ్ ,పర్య వేక్షణ చేసి అవి సమర్ధవంతంగా పని చేయటానికి శక్తి యుక్తులను ధారపోసిన వారు సైంటిస్ట్ రావు గారు .వాటి నియంత్రణ విధానాల రూప శిల్పిగా మంచిపేరు సంపాదించుకొన్నారు .న్యూక్లియర్ విస్ఫోటనాల ప్రభావం వలన పర్యావరణ౦  అణు దార్మికతతో  కాలుష్యం కాకుండా దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయించిన ఘనత ఆయనదే .వీటిలో 1600 కు పైగా ఇంజనీర్లు ,సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు .

డా హోమీ జే భాభాకు అణు శక్తిని మానవ సంక్షేమ సౌభాగ్యాలకు విని యోగించాలనే ప్రగాఢ మైన కోరిక ఉండేది .దీన్ని అమలు చేయటానికి ఒక ప్రణాళిక రచించి , అందుకోసం ఒకకమిటీ ఏర్పాటు చేసి మనదేశం  లోనూ ఇతరదేశాలలోను ఉన్న శాస్త్ర వేత్తలను, ఇంజనీర్లను ప్రావీణ్యం ప్రాతిపదిక పై ఎంపిక చేసి సభ్యులను చేశారు .ఆ కమిటీకి ఎంపికైన తొలి భారతీయ శాస్త్ర వేత్త శ్రీ ఏ .ఎస్. రావు గారు .1955 లో సృష్టించిన ‘’అప్సరస ‘’న్యూక్లియర్ రియాక్టర్ డిజైన్ చేసిన కీర్తి రావు గారిదే .భాభా ,నెహ్రూ లతో రావు గారికి అత్యంత సాన్ని హిత్యం ఉండేది .అందువలన డజనుకు పైగా నోబెల్ ప్రైజు అందుకున్న శాస్త్ర వేత్తలతో రావు గారికి పరిచయభాగ్యం కలిగింది .

1955 లో జెనీవాలో’జరిగిన ’ ఆటం ఫర్ పీస్ ‘’(శాంతికోసం అణువు ) అనే  అంతర్జాతీయ సదస్సు లో రావు గారు పాల్గొని ప్రపంచ శాంతిని న్యూక్లియర్ శక్తి తో  సాధించవచ్చునని సందిగ్ధ రహితంగా స్పష్టంగా సూటిగా చెప్పి ప్రశంసల౦దుకొన్నారు .సర్ సి. వి. రామన్ స్వయంగా ‘’అప్సర ‘’రియాక్టర్ ను చూసి ,పరీక్షించి రావు గారి వెన్నుతట్టి ప్రశంసలతో ,అభినందనలతో ముంచెత్తారు .రావు గారు అణుఇంధన (న్యూక్లియర్ ఫ్యుయల్ )విభాగం లో డైరెక్టర్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ సలహాదారుగా మానవ విలువలకు ,శాంతి పరిరక్షణకు సేవలు అందించి, సైంటిస్ట్ వృత్తికి సార్ధకత తెచ్చారు .’’అణు మహర్షి ‘’గా అంతర్జాతీయ కీర్తి పొందిన ‘’అణుశాస్త్ర’’ వేత్త రావు గారు .

బెంగుళూరు భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ బోర్డ్ కు డైరెక్టర్ గా 1958 నుండి 64 వరకు ఆరేళ్ళు మహత్తర సేవ చేశారు .హైదరాబాద్ ఇ.సి .ఎల్. కు మేనేజింగ్ డైరెక్టర్ 1967-6 8 లో పని చేసి ,రిటైరయ్యారు .తర్వాత కూడా కేరళ రాష్ట్ర డెవలప్ మెంట్ కార్పోరేషన్ బోర్డ్ డైరెక్టర్ గా నియమింపబడి అక్కడా తన నిరుపమ కౌశలాన్ని ప్రదర్శించారు .ఎందరెందరో దిగ్దంతులవంటి వారితో అత్యంత సాన్నిహిత్యం ,పరిచయాలు ఉన్నా ఎన్నడూ తన స్వీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోని’’ సై౦టిస్ట్ ఋషి ‘’రావు గారు .బహు నిరాడంబర జీవితం గడిపిన మాననీయులాయన .

తనకున్న విజ్ఞానం, విచక్షణ ,కృషి ,లక్ష్య శుద్ధి,ముందు చూపు , అంకిత భావాలతో వేలాది మంది శాస్త్ర సాంకేతిక వేత్తలకు ఉపాధి కలిగించి ,భారత దేశ పురోగతికి తోడ్పడిన అణకువకల ‘’అణుశాస్త్ర వేత్త ‘’.

రావు గారి పరిశోధనలకు, సేవలకు ఎన్నెన్నో అవార్డులు రివార్డ్ లు అందు కున్నారు .ఆయనకు జాతీయ ఎలెక్ట్రానిక్ కమీషన్ లో గౌరవ సభ్యత్వమిచ్చి గౌరవించారు .పద్మ శ్రీ ని 1960 లో,1972 లో పద్మ భూషణ్ పురస్కారాలు భారత ప్రభుత్వం అందజేసింది .1965 లో శాంతి స్వరూప్ భట్నగర్ ప్రైజ్ పొందారు . ఆంద్ర విశ్వ విద్యాలయం  గౌరవ డి. ఎస్. సి.ప్రదానం చేసి సత్కరించింది   .1976 లో ఫిక్కి అవార్డ్ ,1977 లో ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అవార్డ్ ,నేషనల్ డిజైన్ అవార్డ్ పొందారు .

టెక్నాలజీ దిగుమతి లేకుండా స్వావలంబన విధానం తో భారత దేశం అభి వృద్ధి చెందాలని రావు గారి సంకల్పం .తన పరిశోధనలద్వారా వైద్య ,పారిశ్రామిక ,వ్యవసాయ రంగాలకు అనన్య సాధ్యమైన కృషి చేశారు .అణుశక్తిని ఔషధ ,వ్యవసాయ రంగాలలో ఉపయోగించటానికి ఆచరణాత్మక కృషి చేసిన మొట్టమొదటి శాస్త్ర వేత్త రావు గారు .హైదరాబాద్ లో ఎలెక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 1-4-1967 లో స్థాపించిన దూర దృష్టి ఉన్న  సైంటిస్ట్ ఆయన  .స్థానికంగానే టెక్నాలజీ రూపకల్పన చేసి తయారు చేయటానికే దీన్ని ఏర్పాటు చేసి 1978 వరకు దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించి, విస్తృత పరచి దాన్ని ప్రజోపకారంగా మలచిన ప్రజ్ఞ ఆయనది .కంప్యూటర్లు, వాటి విడిభాగాలను ఇక్కడే తయారు చేయించారు .ఇ సి. ఐ .ఎల్. ను పూర్తి  స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో తయారు చేసే సంస్థగా మారటానికి ,ప్రపంచం లోనే ప్రఖ్యాత సంస్థగా ఎదగటానికి  రూపు రేఖలు తీర్చి దిద్దిన శాస్త్ర సాంకేతిక శిల్పిరావూ జీ .ఆయన కృషి ఫలితమే దేశం లోని భాభా అణుపరిశోధన కేంద్రం లోని హెల్త్ ఫిజిక్స్ డివిజన్ ,రియాక్టర్ కంట్రోల్ డివిజన్ ,డిపార్ట్ మెంట్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ లు ఏర్పడి విస్తృత సేవలందిస్తున్నాయి .

రావు గారి ప్రతిభా సామర్ధ్యాలను తెలియజేస్తూ ‘’ద మాన్ విత్ ఎ విజన్’’గ్రంథం ఆయన పేరుమీదనే 1999 లో వెలువడింది  .’’ప్రతి సూక్ష విషయాన్నీఒక విశ్వ విద్యాలయం లాగా ఆలోచించే దార్శనికుడైన మేధావి సైంటిస్ట్ ‘’అంటారు ఆయనను .భారత దేశ సాంకేతిక స్వావలంబనకు ఆద్యులైన ఎ.ఎస్ .రావు అనబడే  డా.శ్రీ అయ్యగారి సాంబశివరావు గారు తెలుగు వారు అవటం మనకు గర్వకారణం ,అదృష్టం కూడా .రావు గారు 31-10- 2003 న హైదరాబాద్ లో 89 వ ఏట మరణించారు .ఇ.సి.ఎల్. దగ్గరున్న కాలనీకి డా ఏ .ఎస్. రావు నగర్ అనే పేరు ఆయన జీవించి ఉన్నప్పుడే పెట్టి ప్రాతస్మరణీయుని చేశారు .

హైదరాబాద్ ఇసి ఎల్ లో ఎందరెందరో శాస్త్ర సాంకేతికనిపుణులు పని చేశారు .వేద గణిత౦ లో స్పెషలిస్ట్ డా .శ్రీ రేమెళ్ళ అవధాని గారు ఇందులో పని చేశారు .ఇక్కడే సంస్కృత౦, తెలుగులను కంప్యూటర్ లో వాడే విధానాన్ని తమ బృందమే ఆవిష్క రించిందని శ్రీ  అవధాని తెలియ జేశారు .నాకు మోపిదేవి హై స్కూల్ లో శిష్యుడు ,నాకు అత్యంత ఆత్మీయ ఆదర్శ ప్రధానోపాధ్యాయులు శ్రీ పసుమర్తి సీతారామ  శర్మగారి తమ్ముడు చి పసుమర్తి భగవంతం ఇక్కడే పని చేస్తున్నట్లు పది నెలల క్రితం ఫోన్ లో మాట్లాడుతూ చెప్పాడు .రావు గారి వటవృక్షం నీడన ఎందరో మేదావులున్నారని అర్ధమవుతోంది .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

—




Land Line : 08676-232797

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ

భారత దేశ రక్షణ శాఖ సలహాదారుగా ,ప్రధాని నెహ్రూకు శాస్త్రీయ అంతరంగిక  సలహాదారుగా ఉన్న ఆంధ్రా శాస్త్ర వేత్త సూరి భగవంతం గారి గురించి మనలో చాలామందికి తెలియదు అంటే ఆశ్చర్యమేమీ లేదు .ఆయన సత్యసాయి బాబావారి  ఆంతరంగిక  శిష్యుడు అంటే ఎక్కువ మందికి తెలుసు .’’ఆచట పుట్టిన చివురు కొమ్మైన చేవ ‘’అన్నట్లు ఆయన కుమారుడు సూరి బాలకృష్ణ భూ భౌతిక శాస్త్ర వేత్త అంటే అస్సలు ఎవరికీ తెలిసి ఉండదన్నది యదార్ధం .ఇద్దరూ కృష్ణా  జిల్లావారవటం జిల్లాకు, మనకు గర్వకారణం .

                  శ్రీ సూరిభగవంతం

  భగవంతం గారు ప్రముఖ సైంటిస్ట్ ,భారతరత్న నోబెల్ పురస్కార లెనిన్ పీస్ ప్రైజ్  గ్రహీత ,సి .వి .రామన్ శిష్యులు .శాస్త్రీయ దృక్పధం, ప్రయోగ నైపుణ్యాలే ఆయనను రామన్ కు సన్నిహితుని చేశాయి .మద్రాస్ యూ ని వర్సిటి నుంచి ఎం .ఎస్ .సి.  పొంది ,అందులోనే భౌతిక శాస్త్ర లెక్చర గాచేరి  ప్రొఫెసర్ గా,డిపార్ట్ మెంట్ అధిపతిగా చకచకా 28 ఏళ్ళ వయసుకే ఎదిగారు  .అదే యూని వర్సిటి ఆయనకు డి.ఎస్ సి,ప్రదానం చేసింది .1948 వరకు ఇక్కడే పని చేశారు .1948- 49 లో లండన్ లో’’ ఇండియన్ సైంటిఫిక్ లైజాన్ ఆఫీసర్ ‘’అయ్యారు అంటే సైంటిఫిక్ అడ్వైజర్ అన్నమాట .బ్రిటన్ ,యూరప్ దేశాలు రష్యాలలో పర్యటించి  యూని వర్సిటీలలో ఉపన్యాసాలిచ్చారు .అప్పటి లండన్ హై కమిషనర్ వి.కె. కృష్ణమీనన్ తో పరిచయం పెంచుకొని ,ఇండియా  వచ్చి , ఉస్మానియా యూని వర్సిటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్,  లాబ్ డైరెక్టర్ , వైస్ చాన్సలర్ అయ్యారు .

 1957 లో బెంగుళూర్ ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ అయి ,నాలుగేళ్ళు పనిచేశాక  ఈయన ప్రతిభ గుర్తించి మీనన్ ఈయన్ను కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్ బాధ్యత అప్పగించాడు  , ఈ పదవిలో ఉంటూనే డిఫెన్స్ రి సెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ కు డైరెక్టర్ జనరల్ గా కూడా వ్యవహరించారు .దేశ రక్షణ వ్యవస్థకు దీన్ని అత్యంత  శక్తివంతమైనదిగా తీర్చి దిద్దారు .అప్పుడే భారతదేశం మిస్సైల్స్ ,ఏయిరో ఇంజెన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, టాంకులు అనబడే కా౦బట్ వెహికల్స్,  ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్ ,హై ఎక్స్ప్లోజివ్స్ ,అండర్ వాటర్ మెషిన్స్ మొదలైనవి 9 ఏళ్ళ కాలపరిమితిలో అందుబాటులోకి తెచ్చారు .వీటి అభి వృద్ధికి విశాఖ, లే ,తేజ్ పూర్ మొదలైన చోట్ల లాబ్స్ ఏర్పాటు చేయించారు.డి. ఆర్. డి. వో. అభి వృద్ధి అంతా భగవంతం గారి కృషియే .రక్షణ సామగ్రిని దేశీయంగా నిర్మించి విదేశీ దిగుమతులపై ఆధార పడకుండా చేసిన అసలైన సైంటిఫిక్  సలహాదారు ఆయన .ఒకరకంగా భారత రక్షణ వ్యవస్థకు భగవంతుని వంటి వారు భగవంతం గారు .ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భౌతిక శాస్త్ర విభాగానికి 1946 లో అధ్యక్షులయ్యారు .రామన్ ఎఫెక్ట్ పై అనేక కోణాలలో అధ్యయనం చేసిన సైంటిస్ట్ భగవంతం మూడు ఉద్గ్రంధాలు రాశారు .అందులో లొ1961 లో వచ్చిన ‘’క్రిస్టల్  సెమెట్రి అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ‘’కు మంచి పేరుంది .ఇదికాక గ్రూప్ దీరీ ,రామన్ ఎఫెక్ట్ గ్రంధాలు కూడా అత్యంత ప్రామాణికమైనవే .రామన్ ఎఫెక్ట్ పై ప్రామాణికత, సాధికారత ఉన్నవారు భగవంతం .300లకు పైగా పరిశోధనా పత్రాలు రాసిన మేధావి .ఆయన రచనలు పలు భాషలలోకి అనువాదం పొందాయి .అనేక సైంటిఫిక్ , ప్రొఫెషనల్ సంస్థలకు ఫెలో గా ఎన్నికయ్యారు .తెలుగు ,సంస్క్రుతాలలోనూ  ఆయన పాండిత్యం అమోఘం మంచి వక్త .హాస్యం ,చతురత కలబోసి మాట్లాడే నైపుణ్యం ఆయనది . సూరి భగవంతం గారు 6-2-1989 న 80 వ ఏట మరణించారు ఆయన జననం 14-10-1909 కృష్ణాజిల్లా గుడివాడలో .

                  శ్రీ సూరి బాలకృష్ణ

శ్రీ సూరి భగవంతం గారబ్బాయి శ్రీ సూరి బాలకృష్ణ గుంటూరులో 3-8-1941 జన్మించారు .19 53 లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ఏం ఎస్ సి .సాధించారు .19 55లో ఉస్మానియా యూని వర్సిటి నుండి పి హెచ్ డి అందుకున్నారు .195 2 నుంచే భూ విజ్ఞానం  భూ భౌతిక శాస్త్రాలలో విశేష పరిశోధనలు చేశారు .భూజల అన్వేశానపి గొప్ప కృషి సల్పిన శాస్త్ర వేత్త బాలకృష్ణ .ఉస్మానియా యూని వర్సిటిలో 19 53 లో రిసెర్చ్ స్కాలర్ గా చేరి ,జియాలజీ అధిపతి అయి 19 61 నుండి 64 వరకు పని చేశారు .ఇదే విభాగానికి రీడర్ గా 19 5 7 నుండి నాలుగేళ్ళు పని చేసి ,19 6 2 లో హెడ్ 19 64 లో గౌరవ ప్రొఫెసర్ ,19 6 5 లో అసిస్టెంట్  డైరెక్టర్  అయ్యారు  .ప్రతి శాఖలోనూ తన ప్రతిభను చాటారు

  హైదరాబాద్ లోని నేషనల్ జియో ఫిజికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్కు అసిస్టెంట్ డైరెక్టర్ గా యాక్టింగ్ డైరెక్టర్ గా 19 7 9 నుంచి 81 వరకు సేవలందించారు .ఇండియన్ జియో ఫిజికల్యూనియాన్ కు కార్య దర్శి గా ఉంటూ ఫెలోషిప్ అందుకున్నారు .ఆంద్ర ప్రదేశ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఫిలోశిప్ కూడా పొందారు .జియలాజికల్  సొసైటీ ఆఫ్ ఇండియా కు ఫౌండర్ ఫెలో శ్రీ బాలకృష్ణ ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షునిగా కూడా పని చేశారు

  న్యు  ఢిల్లీ లోని నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో రిసెర్చ్ ఫెలో గా 1954 లో  చేరారు .1956-5 7 కాలం లో హార్వర్డ్ యూని వర్సిటి లో పోస్ట్ గ్రాడ్యుయల్  రిసెర్చ్ ఫెలో గా  గుర్తింపు పొందారు .జపాన్ ప్రాభుత్వ గౌరవ పురస్కారం తో పాటు ,జపాన్ జియోలాజికల్ సొసైటీ ఫెలోషిప్ నూ అందుకున్న  జియాలజీ ఘనాపాఠీ బాలకృష్ణ .

  పర్వతాలు, శిలల స్థితి స్థాపకత్వం (ఎలాస్టిసిటి )మీదా ,భూ సంబంధ లక్షణాలున్న వాటి అనుబందాలపైనా పరిశోధించి సాధికారిక పత్రాలు రాశారు .అనేక దేశాలు పర్యటించి ఉపన్యాసాలిచ్చి ,అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని విలువైన 125 ప్రామాణిక పరిశోధనా పత్రాలు సమర్పించారు ..భూ ప్రకంపనాలు, భూ కంపాలు, భూ అయస్కాంత క్షేత్రాలు ,గురుత్వాకర్షణ క్షేత్రాలు ,వాటి పని తీరు లపై సునిశిత పరిశోధన చేసిన పరిశోధనా  పరమేష్టి ఆయన  . భూ విజ్నానశాస్త్రం లో సాటిలేని విజ్ఞాన ఖనిగా ,పాలనా దక్షునిగా ,క్రమ శిక్షణగల నాయకునిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మేధావి సైంటిస్ట్ శ్రీ సూరి రామకృష్ణ తండ్రి భగవంతం గారికి  తగ్గ తనయుడు అనిపించారు .

 బాలకృష్ణ గారి శాస్త్రీయ కృషికి 1967 లో కృష్ణన్ గోల్డ్ మెడల్ ,1979 లో ఆంధ్రప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ అవార్డ్ పొందారు .హైదరాబాద్ లో ఉప్పల్ రోడ్డు లో ఉన్న యెన్. జి .ఆర్. ఐ ..సంస్థలో స్థిరపడ్డారు బాలకృష్ణ .ఆయనకు ఇప్పుడు 77 ఏళ్ళ వయసు .అంతకు మించి వివరాలు తెలియలేదు .గూగుల్ లో అసలు ఆయన  గురించే లేకపోవటం దురదృష్టం  .

విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు  తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ    

 అని నిన్న రాసిన వ్యాసం లో శ్రీ సూరి బాలకృష్ణ గారి చివరి రోజులు గురించి తెలియక రాయలేదని చెప్పాను .ఈ ఉదయం వారి బంధువులు హైదరాబాద్ వాసి  శ్రీ సూరి ఆంగీరస శర్మ గారికి ఫోన్ చేసి వివరాలు అడిగాను . బాలకృష్ణ గారు భగవంతం గారు జీవించి ఉండగానే మరణించారని చెప్పారు .భగవంతం గారికి నలుగురు కుమారులు ,ఒక కుమార్తె అనీ ,ప్రస్తుతం తనకు తెలిసిన దాన్ని బట్టి రెండవ కుమారుడు శ్రీ రామకృష్ణ శర్మ గారు ఒక్కరే జీవించిఉన్నారని ,మిగిలిన వారంతా గతించారని తెలిపారు .ఆంగీరస శర్మ గారికి ధన్యవాదాలు తెలియ జేస్తూ -దుర్గాప్రసాద్

   ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12

3-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు -2

  అనేకమార్గాలలో సంపాదన చేశారు .స్మార్తం లోనేకాక శ్రౌతం లోనూ చేయి తిరిగినవారు .సాధారణంగా ఏదో ఒక దానిలోనే ప్రావీణ్యం ఉంటుంది .రెంటినీ సునాయాసంగా నిర్వహించి సవ్యసాచి అయ్యారు.బాబళ్ళ శాస్త్రి కుటుంబానికి తరతరాలుగా బులుసువారే గృహ పురోహితులు .ఇప్పుడూ అంతే .15 ఏళ్ళకే స్మార్తం లో ప్రవేశించి మూడేళ్ళ తర్వాత పరీక్ష పాసై ,విజ్రుమ్భించారు .అపరకర్మలు  చేయి౦చేవారుకాదు.. వేదపాఠశాలలో14 ఏళ్ళు వేదం బోధి౦చారు .అందులో వేదపరీక్షాదికారిగానూ ఉన్నారు .జీవితకాలం లో 60 శ్రౌత కార్యక్రమాలు ,6 పౌండరీకాలు చేయించినట్లు గుర్తు చేసుకున్నారు .దీనికి ఉద్గాతగా ఉండేవారు .1960 కాలం కోనసీమ అంతా బులుసువారి వేద ధ్వనులతో పులకించిపోయింది .50 వ ఏట 1965మాఘమాసం  లో అగ్నిస్టోమాన్ని ఆధానాగ్నితో  శ్రీరామపురం దేవాలయ ప్రాంగణం లో చేశారు .నాలుగేళ్ల తర్వాత 1969 లో పుట్టినవూరు వ్యాఘ్రేశ్వరం లో ‘’సర్వ ప్రస్త అగ్ని చయనం ‘’చేసి చయనులు అయ్యారు .అదే ఏడాది ఆయన పొరుగునున్న దువ్వూరి యాజులు గారు పొండరీకం చేసి పౌ౦డరీక చయనులయ్యారు .దీనికి బాబళ్ళశాస్త్రిగారు చయనులుగారికి తోడ్పడ్డారు .

  వితరణ శీలురైన డొక్కా వారు వీరికి ఒక ఇల్లు ఎకరం పొలం ఇచ్చి శ్రీరామపురానికి ఆహ్వానించారు .కానీ కూతురి పెళ్లి ఖర్చులకు కట్న కానుకలకు పిత్రార్జితమేకాక దీనినీ అమ్మేయాల్సి వచ్చింది .61 ఏళ్ళ వయసులో టిటిడి వారి పారాయణ స్కీం లో చేరి పుట్టిన ఊరిలోని దేవాలయం లో చేసేవారు .78 వ ఏట  రిటైరయి ,పెన్షన్ పొందారు .ఆర్ధిక భారం వలన వేద సభలకు వెళ్లి సంభావన పుచ్చుకోనేవారు .కేంద్ర ప్రభుత్వం అగ్ని స్టోమం చేసినవారికి గౌరవ వేతనం ఇచ్చేది .ఆ విషయం వీరికి  ఇతర ఆహతాగ్నిలు చెప్పనే లేదు. అది దూరమైపోయింది .

  ఎన్నో సంస్థలు ,వ్యక్తులు బులుసు వారిని ఆహ్వానించి సన్మానించాయి .హైదరాబాద్ లో భారతప్రధాని పి.వి. నరసింహారావు గారి చేతులమీదుగా సన్మానం అందుకొని ఆశ్చర్యపోయారు .ఎవ్వరూ ఆయన సాధించిన విజయాలను చెప్పలేదు .ఈ గౌరవ పురస్కారాన్నీ ప్రచారం చేయలేదు .80 ఏళ్ళ వయసులో క్రిక్కిరిసిన బస్సుల్లో పడి 20 గంటలు  ప్రయాణం చేయాల్సి వచ్చింది..ఇది మనకు ‘’స్వర్ణకమలం ‘’సినిమాలో వృద్ధ వేదపండితుడు పడిన బాధ గుర్తుకు తెస్తుంది .ఆనాడు ఇచ్చిన  గౌరవ భ్రుతి 35.13 డాలర్లు మాత్రమే .కానీ దీనికే పరమ సంతోషం పొందారు .నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టి రామారావు కూడా బులుసువారిని సత్కరించారు .

 బులుసు చయనులుగారు యవ్వనం లో బహు అందంగా ఉండేవారు .ఇతర దేశీయులను ఆప్యాయంగా ఆహ్వాని౦చేవారాయన .1996 ఫిబ్రవరి లో 81 వ ఏట  భార్య సుబ్బలక్ష్మిగారితో కలిసి చేసిన  అగ్రయనం ,ఏదో ఒక కారణం తో 1995 చలికాలం లో చేయలేకపోయిన అగ్ని కార్యానికి ప్రాయశ్చిత్త విధీ చేశారు .వేదాంతి మాత్రం కాదు .బాబళ్ళ,లంకా ,దువ్వూరి మాత్రం వేదా౦తులే . మృత్యు దేవత ఆయనకు హెచ్చరిక ఇవ్వకుండానే మీద పడింది .కూతురు అల్లుడు ఇంటికి వస్తారని సైకిల్ మీద సరుకులు తెచ్చి ఇంట్లో దించు తుండగా అధిక శ్రమతో హార్ట్ ఎటాక్ వచ్చింది .అందరికీ తెలిసే లోపే ఆయనను  మృత్యువు  కబళించింది .ఆయన అంత్య క్రియలు అగ్రహారం వెలుపల బ్రహ్మ మేధం ,పునర్ధహన, లోష్ట చయనాలతో పూర్తయ్యాయి .

 చయనులు గారి భార్య ‘’14 వ ఏట కాపురానికి వచ్చాను .మొదట్లో ఆయన అంటే భయం గా ఉండేది .ఇద్దరం కలిసి 32 ఏళ్ళు  అగ్ని హోత్రం చేసి నన్ను సోమిదేవమ్మ ను  చేశారు’’అని గుర్తుకు తెచ్చుకున్నారు  .తర్వాత కూతురు దగ్గరకు రాజమండ్రి చేరి, దశావతార స్తోత్రం, విష్ణు ,లలితా  సహస్రనామ స్తోత్రం బిగ్గరగా చదువుకుంటూ గడిపారు .భర్త చనిపోయాక చాలాకాలం దాకా తనకు అక్షర జ్ఞానం లేదంటారు .ఆడవారి చదువును భర్త ప్రోత్సహి౦చ లేదన్నారు .ఇతర సోమి దేవమ్మల కూతుళ్ళు తల్లులకు దగ్గరగా ఉంటె ,సోమిదేవమ్మ సుబ్బలక్ష్మిగారి కూతుళ్ళు మాత్రం దూర దూరంగా కోనసీమ అంతా వ్యాపించి ఉన్నారు .

  బులుసు చయనులు గారి వంశం మగపిల్లలు లేకుండా ఆగిపోయింది .చయనులుగారి మొదటిభార్యకుమారుడు రామమూర్తి మాతామహుల ఇంటపెరిగి ,స్మార్తం నేర్చాడు అతనికొడుకు కూడాస్మార్తం లో ఉద్దండుడు. వీరివలన బులుసు వంశం కొనసాగింది .బులుసు చయనులుగారు  శ్రీరామపురాగ్రహారం లో చనిపోయిన ముగ్గురు ఆహితాగ్నులలో రెండవ వారు .

 సశేషం

ప్రస్తుతం ఈ ధారావాహికకు’’ విరామం’’ ఇచ్చి, మళ్ళీ కొన్ని రోజులకు కోనసీమలో ప్రవేశిద్దాం –

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -11

3-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు

శ్రీరామపురం అగ్రహారం లో మూడవ ఆహితాగ్ని బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు .1915 లో జన్మించి 82 ఏళ్ళు జీవించి 1997 లో మరణించారు .భార్య సుబ్బలక్ష్మి సోమిదేవమ్మ .ముప్పై ఏళ్ళు ఇక్కడే సోమి దేవమ్మగా ఉండి,చయనులు గారి మరణా నంతరం  రాజమండ్రి కూతురు వద్దకు చేరారు .చయనులగారి మరణం తో ఇంట్లో అగ్ని హోత్రాలన్నీ తీసేశారుఅప్పటికే . వైదికులైన గౌతమస గోత్రానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు .ఒకరు బులుసు వ్యాఘ్రేశ్వర సోమయాజులుగారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వ్యాఘ్రేశ్వరం లోనే ఉంటె ,రెండవవారైన ఈ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులుగారు శ్రీ రామ పురాగ్రహార వాసి .అగ్ని చయనం చేసి చయనులయ్యారు .ఈయననే అందరూ’’ బులుసు చయనులు గారు’’ అని సంబోధిస్తారు .శ్రీరామపురం లో రావి చయనులు అనే స్మార్త బ్రాహ్మణుడు ఉన్నారుకాని ఆయన ఆహితాగ్నీ కాదు ,అగ్ని చయనమూ చేయలేదు .

బులుసు చయనులుగారు గారి పూర్వీకులంతా  గణపతి ఆరాధకులు .ఒకసారి ఆయనపూర్వీకుని ముసలితనం లో గణేశుడు ప్రత్యక్షమైనాడని అందరూ చెప్పుకొనే వారు .వీరిలో మూడుతరాలవారు వేదపండితులు అవుతారని తర్వాత తరం వారుకూడా ప్రముఖ వేదపండితులే అవుతారని వినాయకుడు అప్పుడు ఆయనకు వరమిచ్చారట . మన చయనులుగారు చివరి మూడవ తరం వారు .

ముగ్గురన్నదమ్ములలో ఈయనకే వేదం అబ్బింది .అదే వయసున్న రెండు చింతల వెంకటా   చలు  తండ్రి గారి వద్ద బ్రహ్మ చారిగా   వేదాభ్యాసానికి చయనులు గారు చేరారు . రెండు చింతల వెంకటాచలు తర్వాత రెండు చింతల యాజులు గా శ్రౌత స్మార్తాలలో ఎదురు లేని వాడి గా  ప్రసిద్ధి చెందాడు .30 క్రతువులు చేసి వేదం లోనూ  భారత దేశం లోనే సాటిలేని వాడనిపించారు .ఆయన వేదం గానం చేస్తుంటే మహామహా  వేదపండితులు ఆశ్చర్యం తో నోరు వెళ్ళబెట్టి చూసేవారట .అంతటి గొప్పవారు  రెండు  చింతలవారు .ఎక్కువ కాలం  కాశీ లోనే గడిపేవారు .అప్పుడప్పుడు విజయవాడ లోని స్వగృహానికి వచ్చి వెళ్ళేవారు .కోనసీమలో వేదం, శ్రౌతాల పరిస్థితి తెలుసుకొనేవారు .   1936 లో భార్య లక్ష్మీ కాంతతో కలిసి మొదటి యజ్ఞం ,అగ్ని స్టోమం చేశారు .1980 లో కాశీ లోనే చివరి యజ్ఞం చేశారు .50 ఏళ్ళకు పైగా అగ్ని హోత్రాన్ని ఆరాధించి 1987 లో వారణాసిలోనే మరణించారు రెండు చింతల యాజులు గారు .

బులుసు చయనులు గారు ,రెండు చింతల చయనులుగారు కలిసి 82 పన్నాలు పూర్తి  చేసి వేదపండితులని పించుకున్నారు .ఇద్దరూ వివాహాలు చేసుకొని జీవిత సౌఖ్యం అనుభవించారు .కాని వ్యాఘ్రేశ్వరుల భార్య రామ సూర్యకాంత గారు 24 వ ఏట టైఫాయిడ్ జ్వరం తో 1945 లో చనిపోయారు..కర్మ కాండ పదవ రోజున మూసివాయనం అంటే చేటలు ,గాజులు  రాజమండ్రి నుంచి వచ్చి వ్యాఘ్రేశ్వరం లో  ఇప్పించారు .ఈ యువ దంపతుల కుమారుడు రామ మూర్తి వయసు కేవలం 6 .రెండు చింతల యాజులు బులుసువారిని తాను చేయబోయే పౌ౦డరీక యాగానికి నికి ఋత్విక్కుగా నియమించాలనుకున్నాడు కాని ‘’అపత్నీకుడు ‘’ఋత్విక్కు కాకూడదు అనే నియమం ఉండటం వలన ఆయన కు కన్యను ఇచ్చి అయిదు రోజుల వివాహం చేయాలి .తన మిత్రునికి ఈ విషయం లో సాయం చేయాలని గంగలకుర్రులో తన 14 ఏళ్ళ కూతురు సుబ్బ లక్ష్మి ని 30 ఏళ్ళ యువకుడు ,భార్య లేనివాడు ,  వేదపండితుడైన బులుసు వారికిచ్చి పెళ్లి చేయటానికి ఆమె తండ్రి  అంగీకరించాడు.8 నెలలతర్వాత వీరి వివాహం జరిగింది .మళ్ళీ ఇప్పుడు బులుసువారు శ్రౌతకర్మలు చేయటానికి పూర్తిగా అర్హులయ్యారు. ‘

సుబ్బలక్ష్మి వ్యాఘ్రేశ్వరులకు ముగ్గురు  ఆడపిల్లలు,తర్వాత ఒక కొడుకు ,మళ్ళీ కూతురు    కలిగారు .చయనులుగారి మొదటి భార్య సంతానం రామమూర్తి వ్యాఘ్రేశ్వరం లో  అమ్మమ్మ గారింట్లో పెరిగాడు .తర్వాత శ్రీరామ పురం తండ్రి వద్దకు వచ్చాడు.బులుసు ,రెండు చింతల కుటుంబాలు  పెళ్ళిళ్ళతో బంధువులూ అయ్యారు .రెండు చింతలవారి అబ్బాయి  సత్యనారాయణ  కు బులుసువారి మూడవ కుమార్తెతో వివాహం చేసి మూడవ సారి గా మళ్ళీ బంధువులవ్వాలనుకొన్నారు . .కట్నకానుకలు లేవు కాని అల్లుడికి  బులుసువారు విద్యా గురువులై వేదం నేర్పారు .అతనికి 15 ,ఆమెకు 10 వయసులో ఇద్దరికీ విజయవాడలో వివాహం చేశారు . బులుసు ఛయనుల గారి ఫోటో జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

—

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ జాలయ్య గారి జాబు

శ్రీ జాలయ్య గారి జాబు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సహృదయులు రమ్య సాహితీ సమితి -తణుకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏం ఆర్ వి సత్యనారాయణ మూర్తిగారి స్పందన

సహృదయులు రమ్య సాహితీ సమితి -తణుకు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏం ఆర్ వి సత్యనారాయణ మూర్తిగారి స్పందన

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -10

2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు -3

శ్రీ దువ్వూరి సోమయాజులు గారి మూడవ కుమారుడు శ్రీ వెంకట సూర్య ప్రకాశ అవధాని

19 53లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజ మండ్రివద్ద పాత రైల్వే బ్రిడ్జి ని తాకు తూ 65 అడుగుల ఎత్తున నీరు వచ్చి తీర ప్రాంతాలను అతలాకుతలం చేసి ,  కపిళేశ్వరప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది .పంటలన్నీ పాడైపోయాయి .కానీ యాజులు గారి ‘’పంట పండింది’’ వారింట మూడవకుమారుడు వెంకటసూర్య ప్రకాశ అవధాని అన్మించటం తో .సర్వేశ్వర పుట్టిన దశాబ్దానికి ఈ పుత్రోదయం .ఎనిమిదవ ఏట ఉపనయన సంస్కారం పొంది తండ్రి వద్ద వేదం 8 ఏళ్ళు నేర్చి పూర్తి  చేశాడు .ఉదయం 5 కే లేచి ,స్నాన సంధ్యలు  చేసి ,తండ్రిగారి అగ్ని హోత్రం పూర్తయ్యాక  వేదాభ్యాసం ప్రారంభించి మధ్యాహ్నం 12 వరకు కొనసాగేది .20 వ ఏట వేదం శ్రౌతాలలో గోదావరి మండల పరిషత్ వద్ద వ్యాఘ్రేశ్వరం లో 19 73  లో  పరీక్ష నిచ్చిఅవధాని అయ్యాడు .కనక దుర్గ అనే గుళ్ళపల్లి వారి అమ్మాయిని ఇరగవరం లో 19 70 కే  పెళ్ళాడాడు .అప్పుడామెకు 12 ,అతడికి 17 .16 వ ఏడు దాకాబడి చదువు లేదు .అక్షరం ముక్క అబ్బకపోతే లాభం లేదని శ్రీరామ పురం నుంచి ముక్కామలకు నడిచి వెళ్లి చదివాడు .తండ్రి అడుగు జాడలలో అప్పటిదాకా ఉన్నా, తర్వాత తెలుగు లేక సంస్కృత పండితుడి ఉద్యోగం లో చేరాలనిపించి ,మొద్దె కూరు లోని కాలేజిలో చేరి 1976 లో లోకోర్సు పూర్తి  చేశాడు .ట్రెయిన్ లో ప్రయాణం చేస్తూ వరంగల్ లో అయిదునెలల కోర్సు చేశాడు .అప్పటికే పండితుల సంఖ్య ఎక్కువైందున ఉద్యోగం రావటం కష్టమైంది .శ్రీరామపురం లోనే రావి చయనులుగారి దగ్గర  కావ్యాలు నేర్చాడు .వీటికి అయిన ఖర్చులకు అప్పు చేసీ, సభలో వచ్చే పారితోషికాలతో తీర్చాడు .వ్యాఘ్రేశ్వరం ,రాజమండ్రి ,గుంటూరు విజయవాడ వేదసభలకు వెళ్లి తన ప్రావీణ్య ప్రదర్శన తో నగదు పారితోషికాలు పొందాడు.

 1982 లో శ్రీరామపురం వదిలి రాజమండ్రిలో శ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి వద్ద అయిదేళ్ళు మీమాంస శాస్త్రం అధ్యయనం చేశాడు .సుదూర ప్రాంతాలైన హైదరాబాద్ ,సిరిసిల్ల లకు సంభావన కోసం వెళ్ళేవాడు .ఊళ్ళో ఏదో ఒక కర్మకాండ చేయిస్తూ ధనం పొందేవాడు. .సంస్కార విదానాలన్నీ తండ్రి యాజులు గారి వద్దనే నేర్చాడు .ఒక సారి హైదరాబాద్ కుఒక బ్రాహ్మణ కుటుంబం లో  పెళ్లి చేయించటానికి వెడితే ,అక్కడ ఏ అగ్ని హోత్రి భార్యా అన్నం వండి పెట్టకపోయేసరికి అవాక్కై  అల్పాహారం తో గడిపాడు .ఇప్పటిదాకా తండ్రిగారి నిత్య ఇష్టి,ఇతర ఆహితాగ్నిలకు అధ్వర్యుగా ఉన్నాడు .నిత్యం ముక్కామల దేవాలయం లో  రాజమండ్రి సత్య నారాయణ స్వామి దేవాలయం లో టిటిడి తరఫున నియమింపబడి  వేదపారాయణ చేసేవాడు  .

  నలుగురు పుత్రులకు తల్లిదండ్రులైన  అవధాని, భార్య 1988 జనవరి లోపెద్ద కొడుకు వేదం తాతగారు యాజులు గారి వద్దనేర్చిన  ఫణి యజ్ఞేశ్వర యాజుల  పెళ్లి చేశారు. ఆడపిల్లలు లేనందువల్ల కట్నాల బాద లేదు.గుళ్ళపల్లి వారమ్మాయి లక్ష్మి ,ఫణి భార్య .పిల్లలు అక్కరకు వచ్చారు.కనుక మళ్ళీ శ్రీరామపురం చేరి తండ్రి గారివద్ద వేదంతో కాలక్షేపం చేయాలని 1987 లో నిశ్చయించాడు.టిటిడి ఉద్యోగం చేస్తూ, వేద పారాయణ కొనసాగించాడు .అగ్ని ఆరాధన ,ఇష్టి ,అగ్ని స్టోమం చేశాడు .తండ్రి గారి పద్ధతినే అనుసరించాడు .తండ్రి తరానికి ,తనతరానికి ఉన్న దూరం, తేడా గమనించాడు .’’నాచుట్టూ ఉన్నసమాజం గురించి కూడా నేను ఆలోచించాలి వారికోసం పని చేయాలి .ఆదర్శ  వైదిక జీవితం గడపాలి  .నా అవసరాలను తగ్గించుకోవాలి ‘’అని తాను  నిర్ణ యించుకొన్నట్లు  అవధాని చెప్పాడు .

  అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది .పదేళ్ళ ఆతర్వాత అవధాని ఇంకా రాజమండ్రిలోనే ఉండగా దువ్వూరి కుటుంబానికి చెందిన ఒక సంపన్న దాత శ్రీరామ పురం లో  చుట్టూ గోడలు ఉన్న ఒక అందమైన  ఇంటిని  దానిలో ఒక పాఠశాల పెట్టటానికి శృంగేరి పీఠానికి అందజేశాడు .ఉద్దేశ్యం బాగానే ఉంది కాని అక్కడ పని చేయటానికి ఉపాధ్యాయుడేవరూ ముందుకు రాలేదు .అప్పుడు దాన్ని సూర్య ప్రకాశావ దానికే  ఇచ్చిఅక్కడే ఉండిపోమ్మనీ తన కొడుకులకు ,తమ్ముడికొడుకులకు వేదం నేర్పుతూ ఉండమని కోరగా వచ్చి చేరాడు .

   శ్రీ దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర యాజులు  -అన్నిటా ప్రధమం

వైదిక –లౌకిక జీవితానికి సమన్వయము సాధించినవాడు సూర్య ప్రకాశ అవధాని పెద్దకుమారుడు ఫణి యజ్ఞేశ్వర యాజులు .1974 లో జన్మించి శ్రీరామపురం లోనే తాతగారు యాజులుగారి వద్ద ఆయన ముసలి గుడ్డి తనపు రోజుల్లో వేదం నేర్చి,ఇంటర్ చదివి ,ఇంగ్లిష్ నేర్చిమాట్లాడగలిగిన మొట్టమొదటి వేదపండితుడుగా రికార్డ్ సాధించాడు .బి.కాం. చదివి ,మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఆర్ట్స్ సాధించి కర్నాటక స్టేట్ బాంక్ లో ఉద్యోగం పొందాలనుకున్నాడు  .కాని మళ్ళీ వేదం లోకి వచ్చి ,క్రమ౦ లోను  శ్రీరామపురం లో సామవేదం వెంకట రమణగారి వద్ద నేర్చిన ఘనం లోను పరీక్ష ఇచ్చి ,విజయవాడలో శ్రీ విష్ణుభొట్ల లక్ష్మీ నారాయణ ఘనపాఠి గారి వద్ద  రైల్ లో వచ్చి వారానికి మూడు రోజులు  ఘనం నేర్చి  ,1999 లో ‘’ఘన ‘’లో ఘనంగా సర్టిఫికేట్ సాధించాడు .25 వ ఏట మీమా౦స పై మనసుపడి తండ్రి తో సమానమై శ్రౌత విద్యలో మరీ ముందుకు వెళ్ళాడు

  14 వయసులో 10 ఏళ్ళ మేనమామ గొల్లపల్లి వెంకట రామ సూర్యనారాయణ గారి  కూతురు  లక్ష్మిని పెళ్ళాడి  ఇద్దరు మగపిల్లలు సూర్య ప్రకాశ పవన కుమార శర్మ,శ్యామ సుందర శ్రీరామ శర్మలను  జన్మనిచ్చి , కుటుంబ నియంత్రణ పాటించాడు .పెద్దాడు 8 వ ఏటనే తైత్తిరీయం తండ్రి వద్ద మొదలుపెట్టి నేర్చాడు .తండ్రిలాగే ఇంగ్లిష్ లో ఆసక్తి కలిగి ఇంగ్లిష్ మీడియం లో చేరి చదువుతూ కూడా రోజుకుకనీసం  అయిదు గంటలు వేదాధ్యయనం చేసేవాడు.ప్రాధమిక విద్య ఆంగ్ల మాధ్యమలో చదివిన ఏకైక వేద పండితుడు అనిపించాడు .

  చాలాదేవాలయాలనుంచి వేద పారాయణకు ఫణి  ఆహ్వానాలు పొందాడు .అమెరికాలోని న్యు జెర్సీ దేవాలయం లో ఋత్విక్ గా ఆహ్వానమూ వచ్చింది .’’తాత గారు ఇలాంటి వాటికి ఆశపడ వద్దు అన్నారు .కనుక ఇప్పుడేకాడు మరెప్పుడూ అమెరికావంటి ఇతర దేశాలకు వెళ్ళను ‘’  అని ఖచ్చితంగా చెప్పాడు .2000 ఫిబ్రవరిలో రాజమండ్రిలో అయిదుగదుల ఫ్లాట్ కట్టుకొని గృహ ప్రవేశం చేశాడు .2009 లో తిరుపతి వేంకటేశ్వర యూని వర్సిటిలో అధ్యాపక ఉద్యోగం అందుకొని శృంగేరి పీఠం బదివదిలేసి ,కృష్ణ యజుర్వేదం లో అసిస్టెంట్ ప్రొఫెసర్  తర్వాత ప్రొఫెసర్ అయ్యాడు  , ఆ ప్రాంతం లో వేద పండితుడు యూని వర్సిటి ప్రొఫెసర్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఫణి . ,కంచి పీఠం ఫణిని ఆహ్వానించి ,సన్మానించి ‘’వేద భాష్య రత్న ‘’బిరుదుతో సత్కరించింది .’’నా జీవితం లో ఇదొక గొప్ప మలుపు. తాతగారు యాజులుగారు ‘’దీనినే కొనసాగించు ‘’అన్నారు .అంతే ఇక వేదం –లౌకికం లమధ్య ఊగిసలాడలేదు నేను’’ అన్నాడు ఫణి 1998 లో  .16 ఏళ్ళ తర్వాత వేద ప్రవీణులైన దువ్వూరి కుటుంబం కొత్త అర్హత, విలువ సాధించింది ఫణి వలన .కాని దువ్వూరి శ్రౌతం  బలహీనమైన దారానికి వ్రేలాడుతూ  ఉండిపోయింది .

2014 లో డయాబెటిస్ వలన సూర్య ప్రకాశ ,కనక దుర్గలు బాధపడి 2007 లో చేద్దామనుకొన్న ఆదాన ,అగ్ని స్ట మాలతో చేయాలనుకున్న ‘’వైశ్వ దేవం చేయలేక పోయారు .వారసత్వాన్ని కాపాడాలనుకున్న  శ్రీ దువ్వూరి సీతారామ శాస్త్రి

అన్న ఫణి లాగానే తమ్ముడు సీతారామ శాస్త్రి అధ్వర్యుగా తాత యాజులుగారి వద్ద ప్రారంభించాడు .తైత్తిరీయం ముందుకు సాగలేదు .మాతామహుడు గొల్లపల్లి వారి వద్ద కూడా ఇలాగే జరిగింది .బలవంతం గా భట్టీయం వేస్తె  గొంతు నెప్పి వచ్చేది.తాను వేదవారసత్వాన్ని కాపాడుదామనుకొన్నా పరిస్తితులు సహకరించన౦దుకు బాధ పడ్డాడు .టెక్నికల్ కోర్సు చేసి ,అమెరికా వెళ్లి పుష్కలంగా డాలర్లుసంపాదించి  అన్న ఫణి, ఫణి కొడుకులు వేద,శ్రోతాల  వారసత్వాన్ని నిలబెట్టటానికి సాయ పడుదామని అతని కోరిక.తనకు వేదవిద్య అబ్బదని గ్రహించి ,తన మన్సులోని ఆశయం సాధించటానికి అప్పటి 65వేల ప్రవాస భారతీయులతో పాటు అమెరికా కు కనెక్టికట్ లోని హాఫర్డ్  కు విమానం లో వెళ్ళాడు .ఆంద్ర ప్రదేశ నే అంతవరకూ దాటని వాడు దేశాలు ఖండాలు దాటాడు .సత్యం కంప్యూటర్స్ కు చెందిన’’సిగ్నా ఇన్సూరెన్స్ కంపెనీ ‘’లో చేరి ,తర్వాత భార్య గౌరి శ్యామల ,కొడుకు కార్తికేయ ,కూతురు ప్రణతి లను కూడా అమెరికా తెచ్చుకున్నాడు .ఇతని కజిన్ యజ్ఞేశ్వర యాజులు అంటే యాజులుగారిపెద్దబ్బాయి సర్వేశ్వర కొడుకు అంటే మనవడు    కూడా విస్కాన్సిస్ లోని మిల్వాకీ కి వచ్చాడు . యాజులుగారి మూడవ మనవడు హైదరాబాద్ లో వాల్యు లాబ్ ఉద్యోగి  గిరిజా శంకర్ కూడా అమెరికాకు యెగిరి పోయె  ప్రయత్నం లో ఉన్నాడు .అమెరికాలోని హిందూ దేవాలయాల పూజారులకోసం ,హైటెక్ కార్పోరేషన్ల అవసరాలు  అప్పుడు వరాలయ్యాయి .అందరి దృష్టీ భారత దేశం పైనే ఉంది అప్పుడు .ఒకప్పుడు సీమాంతర ప్రయాణానికి ఒప్పుకోని సనాతనులు ఇప్పుడు మనవళ్ళను పంపటానికి ముందుకొచ్చారు .

  సూర్య ప్రకాశ అవధాని నలుగురు కుమారులు అంటే యాజులుగారి మనవళ్ళుగొల్లపల్లి కుటుంబం వారి పిల్లలనే పెళ్లి చేసుకున్నారు .సత్సంతానమూ పొందారు .అందులో ఒకరు ఘనాపాఠీ మాత్రమె కాక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ..మరొకరు అమెరికాలో అయిదేళ్ళ ఉద్యోగం లో చేరాడు .ఇంకొకరు కూడా వెళ్ళటానికి సిద్ధం .యాజులు గారు శ్రీరామ పురం లో పంచాయతన దేవాలయం లో అధర్వ వేదం పారాయణ చేస్తుంటే దేవతలే దిగి వచ్చి ఆసక్తిగా వినేట్లు ఉండేది. ఆస్వరం ఆ సాధనా  ముచ్చటగా పరమ పవిత్రంగా  ఉండేదని పెద్దల ఉవాచ .ఒక సారి ఒక  అమెరికన్ వచ్చి ఆయన ఇంటర్వ్యు తీసుకుంటుండగా యాజులు గారు ఆతనితో ‘’మీరు అమెరికా వెళ్ళాక, అక్కడివాళ్ళతో నాకు అమెరికా లో ఉద్యోగం ఇప్పించని సిఫార్సు చేయ౦డి’’అని చమత్కరించారట  .

  దీనితో దువ్వూరి వారి చరిత్ర పూర్తి  .మరో ఆహితాగ్ని గారిని ఈసారి పలకరిద్దాం .

శ్రీ సూర్య ప్రకాశం అవధాని గారి ఫోటో జత చేశాను చూడండి

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9

2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు -2

1922 లోశ్రీమతి సూర్య గారిని వివాహమాడిన దువ్వూరి యాజులుగారు 67 ఏళ్ళ వైవాహిక జీవిత సౌఖ్యం అనుభవవించి 10 మంది సంతానం పొందారు .వైవాహిక జీవితం పై పూర్తి  నమ్మకం,గౌరవం కలవారాయన .వివాహం లో పరమార్ధం ,శ్రర్ధ ,బ్రహ్మ లోకం ఉన్నాయని అంటారు .వివాహ వేడుక దంపతులకే కాక బంధు మిత్ర అభిమానులకూ ఆన౦ద  దాయకం కన్నుల పండుగ  .పెళ్లి చూపులలో మొదలైన చూపులు అయిదు రోజుల వివాహం లో ఎన్నో సార్లు భార్యను భర్త చూస్తాడు .ఆ చూపుల్లో ఆమె అంద చందాలనుకాక , ఆమె అంతస్సౌన్దర్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు .అప్పుడే అది నిజమైన చూపు అవుతుంది .ఆమెకు 7 ఆయనకు 14 ఏళ్ళ వయసులో వివాహమైంది .యాజులుగారి తండ్రి, మేనమామ సంబంధం ఖాయం చేశారు. గౌతమి గోదావరిపై అన్ని వసతులు, రోడ్డు, పడవ ప్రయాణ సౌకర్యం ఉన్న  నేదునూరు కు చెందిన దూరపు బంధువు ఆమె .‘’ఆ అయిదు రోజుల పెళ్లి మరువరాని అనుభవం ‘’అంటారు ఆయన .మామగారు వంట చేసేవాడు అత్తగారుకాదు. మిఠాయిలు వండేవాడు.అవి ఎంతో పవిత్రమైన రోజులు .ఆయనకు కట్నంగా 116 వెండి రూపాయలిచ్చారు .ఆయన బామ్మర్ది వాటిని అన్గోస్త్రం లో మూటకట్టి మోసుకు వచ్చాడు .అప్పుడు ఒక రూపాయి అంటే రెండున్నర తులాల వెండి ..పెళ్లి కొడుక్కి పట్టు పంచలు ఆడపడుచుకు తలా13 రూపాయలు ఇచ్చారు .పెళ్లి కుమాతె నగలకోసం యాజులుగారు 200 రూపాయలు ఖర్చు చేసి వడ్డాణ౦ , ,నెక్లెస్ ,గాజులు చేయించారు .

యాజులుగారు భార్యకు తానే గురువై మంత్రార్ధాలు వివరిస్తూ  విధులకు ఎలా తోడ్పడాలో బోధించారు .అందులో ఆడవారికోసం చాలా ప్రత్యేక మంత్రాలున్నాయి .వీటిని భట్టీయం వేయాల్సిందే .పెళ్లి అయిన 16 ఏళ్ళకు యజ్ఞానికి ముహూర్తం ఏర్పాటు చేసుకున్నారు .ఆమెకు అగ్ని స్టోమ మంత్రాలు నేర్పారు .ఆమె చనిపోయిన నాలు గేళ్ళ తర్వాత సోమి దేవమ్మ గా ,ఆమె అంత్యేస్టికి పునర్ధహనం చేశారు .ఆహితాగ్ని భార్యకు ఇలాచేయటం సంప్రదాయం .ఆమె తనలాగా సోమపానం చేయక పోయినా దాని ప్రభావం ఆమెకు లభించాయి అని యాజులు గారు వివరించారు .ఆమె చనిపోయే దాక భర్త వదిలేసిన భోజనం అంటే ‘’ఉచ్చిస్టం ‘’తినేది .ఈ నియమాన్ని జీవితా౦త౦ పాటించిన సాధ్వి .

24 ఏళ్ళకే విద్యపూర్తి  చేసిన యజులుగారు మొదట కొడుకును తర్వాత కుమార్తెకు తండ్రి అయ్యారు ‘’నాభార్య 14 కాన్పులు కన్నది .అన్నీ ఇంట్లోనే .ఎరుకలసాని వచ్చి 4 రూపాయలకే పురుడు పోసేది  .ఆకాలం లో మందులు , సాధారణమైనవి ,చవక, తేలికగా దొరికేవి .నలుగురు పిల్లలు చిన్నతనం లోనే చనిపోయారు .’’బహు సంతానానికి తండ్రి గా గర్వపడే వాడిని.ఒక సారి హైదరాబాద్ లో  నా సంతానం సంగతి తెలిసిన ఒక స్త్రీ అమాంతంగా నాపాదాలను స్పృశించి కళ్ళకు అద్దుకుని నమస్కారం చేసింది .అగ్రహారాలలో ఉండేవారికి  కనీసం 20 మంది మనవాళ్ళు మనవ రాళ్ళు ఉండటం  ఆనాడు సహజం, సమంజసం .నాకు 40 మంది ఉండటం నా అదృష్టం ‘’అని చెప్పారు .

తేలికగానే అయిదుగురు ఆడపిల్లల వివాహాలు చేశారు వరకట్నం ను ఆక్షేపించే వారిని లెక్క చేసేవారు కాదాయన .1940 -50 దశకం లో డెల్టా ప్రాంతమంతా ఆయన పేరు మారు మోగేది .1990 నాటికి పరిస్థితులు చాలామారిపోయాయని ,పెళ్ళిళ్ళు కుదర్చటం కష్టమై పోతోందని బాధ పడ్డారు .విలువలు పతనమయ్యాయని అన్నారు .వేదం ,యజ్నయాగాది క్రతువులపై  జనం లో ఆసక్తి తగ్గిందని వ్యధ చెందారు .తన కుటుంబంలోనే మనవరాళ్ళ పెళ్ళిళ్ళు   చేయటం తనకు ఆశక్యంగా ఉందని కారణం కట్నకానుకలు విపరీతంగా పెరగటమే నని అన్నారు .

1936 లో యాజులుగారబ్బాయి సర్వేశ్వర సోమయాజులు ఆహితాగ్ని అవుతాడని ఆశించారు .19 ఏళ్ళప్పుడే తండ్రివద్ద  వేదం పూర్తి చేసి ,పెళ్లి చేసుకొని ,గొర్తి వారి వద్ద చేరి  ఘన పాఠీ అవుదామనుకొంటే ఈశ్వరానుగ్రహం వేరుగా ఉండి ,శివ పురాణం పై ఆసక్తిపెరిగి ,తరచుగా కాశీవెళ్లి   గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేస్తూ,కోన సీమలో శుభార్యాలలో సంభావన తీసుకొంటూ శతరుద్రీయం సాధించి వేద పండితుడై జీవనం గడపాల్సి వచ్చింది .దీనిపై అతన్ని కదిలిస్తే ‘’యోగం దైవం ఈశ్వర ఈశ్వర ‘’అనేవాడు శివారాధనమే ముక్తి నిస్తుందని నమ్మాడు .యాజులు గారు 25 ఏళ్ళు ఈకొడుకు పేరు ఎక్కడా ఎత్తలేదు .సర్వేశ్వర ఇద్దరు కొడుకులు వేదం నేర్వలేదు. కాని ఒకమ్మాయిని మాత్రం వేద పండితుడికిచ్చి పెళ్లి చేశాడు .వీళ్ళ కొడుకు ఇరగవరం వెళ్లి ముత్తాత గుళ్ళపల్లి సీతారామ శాస్త్రి గారి వద్ద  అధ్యయనం చేశాడు..

‘’ నేదు నూరు ఋషి’’గా ప్రసిద్ధులైన లంకా వారు సర్వేశ్వరను ఆపస్తంభ సూత్రాలు బోధించమని కోరినా వినలేదు .దువ్వూరి కుటుంబలో ఎగుడు దిగుడులు  వచ్చి శ్రౌతమార్గం గాడి తప్పింది .సర్వేశ్వర శివ భక్తుడు అనిపించుకున్నా పౌరాణికుడు,వేదపండితుడు ఘనాపాఠీ కాకపోయినా తిరుపతి దేవస్థానం ఆయనకు వృద్ధాప్యపు పెన్షన్ 1994,లో అందజేసింది. ఆయన  వేదవిధి  –హిందూ మత౦   మధ్య క్రాస్ రోడ్ పై ఉండిపోయాడు .20 07 లో అకస్మాత్తుగా అయన నిత్యాగ్ని హోత్రునిగా  అగ్ని స్టోమం చేయాలని అనుకొన్నాడు .అదే సమయం లో చిన్నతమ్ముడు సూర్య ప్రకాశ అవధాని ,భార్య కనకదుర్గ అదే నిర్ణయానికి వచ్చారు .కానీ ఈ ఇద్దరూ’’ వైశ్వ దేవం’’ దాటి ముందుకు పోలేకపోయారు .యాజులుగారి రెండు నాలుగు అయిదవ కుమారులు వేదమార్గం వదిలి లౌకికం లో ఉన్నారు .

యాజులు గారి అంతిమ యాత్ర

1 996 డిసెంబర్  .ఒక  రోజు యాజులు గారి భార్య  సూర్య ఆవూళ్ళో సామవేదం వారింట్లో జరిగిన పెళ్ళికి వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరి భర్తకు,ప్రోదున్నే లేచ్చి కాలకృత్యాలతర్వాత తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేసి నవరాత్రుల సందర్భం గా ప్రత్యేక ప్రసాదం వ౦డాలనుకొన్నది  . ఇంతలో గోడకు ఆనుకొని ఆమె  పడి పోయారు .అప్పుడాయన అగ్ని హోత్రం చేస్తున్నారు .వెంటనేబయటికి వచ్చి ,అప్పటికే ఆమె ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతున్నాయని గ్రహించి ఆ సమయం లో చదవాల్సిన కర్మ మంత్రాలు చదివారు .అవి తైత్తిరీయ ఉపనిషత్ మంత్రాలు .ఈమెకు ప్రాయశ్చిత్త కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు .దంపతులిద్దరూ అప్పటికే దీపావళి నాడు అగ్రయనం చేసి ఉన్నారు .పునిస్త్రీ మరణం పొందినదుకు కాలవదగ్గర మూసివాయనం జరిపారు .పత్నిగాబ్రహ్మమేధం చేశారు .అప్పటికే కళ్ళు కనిపించని ,51 ఏళ్ళుగా ఇష్టి,సోమయాగం చేసిన ఆయన ఆమె చితివడ్డ  నిశ్చేస్టంగా  మౌనంగా ఉన్నారు ‘’అగ్నిని ఆమె తనతో తీసుకు వెళ్ళింది .నాకు వంటింటి అగ్గిపుల్లలే మిగిలాయి ‘’అని విచారించారు .62 ఏళ్ళ నిండు దాంపత్యం విచ్చిన్నమైంది .అగ్నికి ఆమె పార్ధివ దేహం ఆహుతైంది .ఆమెఅస్తులకూ పునర్దహనం చేశారు .

చాలాకాలం క్రితం  అగ్ని స్టోమం చేసి, ఆయన ఒక సారి గోదావరి జిల్లా లో జరిగిన వేద సభకు శ్రావణ మాసం లో వెళ్ళారు .అప్పుడు ఒక ముసలాయన ‘’నువ్వేనా యజ్ఞం చేసిన వాడివి ?’’అని అడిగాడు .’’నేనే ‘’అన్నారు .’’చాలా డబ్బు అనవసరంగా ప్రయోజనం లేకుండా ఖర్చు చేశావు ‘’అనగానే యాజులుగారు నివ్వెరపోగా ఆయన ‘’భయపడకు .నీకు 80ఏళ్ళు దాటాక నీఅగ్ని హోత్రాన్ని నీ భార్య  తీసుకు వెడుతుంది ‘’అన్నాడు .పెద్దాయన ఆనాడే నిజం చెప్పాడు అనుకున్నారిప్పుడు .తన నాయనమ్మగారు కూడా తాతగారి కంటే ముందే చనిపోయారు .ఆమె అత్తగారూ ,తండ్రిగారి పెద్దన్న భార్యా అలాగే పోయారు .

భార్య మరణం తర్వాత యాజులు గారు రాత్రి పూట భోజనం చేయకుండా మధ్యాహ్నం  ఫలహారం మాత్రమే చేసేవారు  .చివరికాలం లో 86 వ ఏట ఒకరోజు ఆయన తనతల్లిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు .ఒక రోజు తననుఆమె  ఒక వింత ప్రశ్న అడిగిందట ‘’ఒరే నాయనా !దేవుడు నన్ను మరచి పోయాడేమోరా ? ఎవరైనా ఆయనకు జ్ఞాపకం చేస్తే బాగుండు ‘’అని .ఇప్పుడు ఆ మాటలు  ఆయన తలచుకున్నారు .2005 జులై 30 న శ్రీరామ పురం లో ఆయన పేరిట ఏర్పాటు చేసిన వార్షిక వేద సభ జరిపిన నాలుగు నెలలకు  యాజులుగారు తుది శ్వాస విడిచారు .పదేల్ల క్రితం భార్య సూర్య అంత్యక్రియలు జరిపిన చోటే యాజులు గారివీ జరిపారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-18 –ఉయ్యూరు

 

 

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -8

2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు

బాబళ్ళ శాస్త్రి గారి కుటుంబం శ్రీరామ పురం చేరేనాటికి శ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక యాజులుగారు అప్పటికే 17 ఏళ్ళనుంచి రోజు రెండు సార్లు అగ్ని హోత్రాన్ని చేస్తున్నారు . .వీరిని ‘దువ్వూరి యాజులుగారు’’ అనే అందరూ పిలిచేవారు .రెండుకుటుంబాలు ప్రక్కప్రక్కనే ఉండేవి.,చివరి ఏడేళ్ళు నూతన  గృహం లో అగ్ని హోత్రం చేశారు .1915 లో కపిళేశ్వరపురం లో జన్మించిన  ఆయన ఆత్రేయస గోత్రీకులు .ఉదార హృదయులు .వీరి కుటుంబం లో నాలుగు తరాలవారు వేదం లో సర్టిఫికేట్ పొందినవారు .ఈయన మూడవ కొడుకు 27 ఏళ్ళకే వేదపండితుడయ్యాడు .మూడవ కొడుకు కొడుకు అంటే యాజులుగారి మనవడు ఘనాపాఠి.

  యాజులుగారు నాలుగేళ్ళు తండ్రి వద్దనే వేదం అభ్యసించారు .మరో అయిదేళ్ళు ముక్కామలలో బాబళ్ళశాస్త్రి గారి తండ్రి చిన్న సుబ్రహ్మణ్య సోమయాజులు గారి వద్ద  నేర్చారు .పరీక్ష ఇచ్చాక ,పెద్దక్క గారి భర్తవద్ద అంటే బావగారి వద్ద కోరుమిల్లి ,తణుకు వ్యాఘ్రేశ్వరాలలో చదివారు .శ్రౌతం తో మిగిలిన విషయాలనూ 24 వయేట 1939 కి పూర్తి  చేశారు .అప్పటికే పెళ్లి అయి ఒక కొడుకు,కూతురు  కలిగారు .శ్రౌతం నేరుస్తూ వేద పాఠాలు బోధించారు .’’నేను చదువుకో లేదు సంతకం చేయటం కూడా రాదు ‘’అని ఆరోజులను జ్ఞాపకం చేసుకొన్నారు .తర్వాతే రాయటం చదవటం అలవాటైంది .బడికి వెళ్ళనే లేదు .వేదం  తప్పమరే వ్యాపకం లేదు .తమతాతగారు ‘’ వైదికోగ్రవాది’’(మిలిటెంట్ వైదిక్ )అని చెప్పేవారు

  స్వస్తి వాచకం ,ఋగ్వేదం 1-8 9  క్రమ ఘన జట లు తప్పులు లేకుండా వల్లి౦చి నందుకు  పారితోషికాలు పొందారు .తప్పులు లేకుండా స్వస్తి చెప్పిన వారిని  ‘’వీరుని ‘’గా  భావించేవారట .అంటే హీరో అన్నమాట .సామూహిక స్వస్తి అంటే ఆయనకు చాలా ఇష్టం. అలా చేయటం లో ఎంతో ఉత్తేజం కలుగుతుందన్నారు. ఒకసారి శ్రీరామ పురం నుండి తమ బృందం భార్యలతో సహా హైదరాబాద్ వెళ్లి 27 రోజులు స్వస్తి చెప్పారు. అది అద్భుతమైన కాలం అని గుర్తు చేసుకొన్నారు. వేదం నేర్వటానికి తరచు ఊరు వదలి వెళ్ళాల్సి రావటం తో   తన పోరుగువారైన లంకా వారిలాగా వ్యవసాయం పై దృష్టి పెట్ట లేక పోయానని బాధ పడ్డారు . లంకావారు యాభై ఏళ్ళు వ్యవసాయం చేశారని చెప్పారు .

   ఆహితాగ్ని మనవడు, ఆహితాగ్ని కుమారుడు ఆహితాగ్ని అయిన తమ్ముడికి అన్న ,ఆహితాగ్ని బాబళ్ళ శాస్త్రి గారి ఆహితాగ్ని తండ్రిగారి  శిష్యుడు అయిన యాజులుగారు ‘’నా జీవితమంతా  శ్రౌతం లోనే గడిచింది .అది తప్ప నాకు వేరే ఏమీ తెలీదు ‘’అని చెప్పారు .ఇది పూర్తి సత్యం కాదు .ఎందుకంటె ముసలితనం లో కళ్ళు కనబడకపోయినా ,ఇతరుల సాయం తో నదికి వెళ్లి నిత్య స్నానం చేసేవారు .86 ఏళ్ళ వయసులో కూడా మనవడు కిరణ్ కు  వేదం నేర్పేవారు .ఈ వయసులోకంటి చూపు లేని వారెవ్వరూ  అలా బోధించినవారు లేరు .  జీవితం లో 1-ప్రధాన 2-మధ్య ౩- ముసలితనం అనే మూడు దశలుంటాయి .33 ఏళ్ళ వయసులోఅంటే మధ్య వయసు ప్రారంభం లో  యజ్ఞం చేయాలి .61వ ఏట కదలలేని స్తితి వస్తుంది .ఈ వయసులో కాళ్ళు చేతులు మనం చెప్పినట్లు వినవుకనుక కర్మకాండ కు ఇబ్బందికలుగుతుంది .బాబళ్ళశాస్త్రి గారు  అగ్ని హోత్రం ప్రారంభించే సమయానికి యాజులుగారు 30 వ ఏటనే 1945 నాటికి అగ్ని స్టోమం చేసి ఆహితాగ్నిలలో కూడా  ముందున్నారు  .  ఒక దశాబ్దం తర్వాత  ఆయన మేనల్లుడు  మిత్రనారాయణ అగ్ని హోత్రం ప్రారంభించి 22 వ ఏటనే యజ్ఞం చేసి  యాజులుగారి రికార్డ్ ను అధిగమించాడు .

   యాజులుగారి ఆధానం, అగ్ని హోత్రం కపిళేశ్వర పురం లోనే జరిగాయి .అన్నగారు చేస్తుంటే చూసి నేర్చుకున్నారు .నాలుగేళ్ల తర్వాత 1949 లో అక్కడే  అగ్ని చయనం,శ్రౌతం నిర్వహించారు  .ఇప్పుడూ పెద్దన్నగారిని ముందు చేయించి తాను చేశారు . చయనం,40 రోజుల అగ్ని చయన౦ ను పౌ౦డరీకం అంటారు. వీటిని చేయిస్తున్నప్పుడు తానే ఎందుకు పౌండ రీకం చేయకూడదు అనే ఆలోచనకలిగింది .శాస్త్రాలు తిరగేసి కావలసిన సమాచారం సేకరించారు .పౌ౦డరీకం లో ఉన్న మహా వ్రతం లో ‘’అంతర వేది’’పై   వేదం చదివిన బ్రహ్మచారి బ్రహ్మ చర్య దీక్ష చేబట్టలటానికి పుంశ్చలి అంటే వేశ్యతో సంభోగం చేయిస్తారు దీనివలన అతనిలో బ్రహ్మాండమైన వీర్య వృద్ధి జరుగుతుందని నమ్మకం .చాలా తెలివిగా దీన్ని నిర్వహించారు యాజులు గారు .

  వ్యాఘ్రేశ్వరం లోనిఆహితాగ్ని  బులుసు కామేశ్వర ,సత్యవతి దంపతులు తమ అగ్ని హోత్రాన్ని ఫోటోలు తీయటానికి ఆనందంగా ఒప్పుకున్నారు   .యాజులుగారి కి మనవడు సీతారామ శాస్త్రి  ఈ విషయం చెప్పగా దిగ్భ్రాంతి చెందారట .’’అగ్ని హోత్రాన్ని ఇతరులకు చూపించటం అంటే కన్నతల్లి వస్త్రాలను ఊడదీయటమే’’అన్నారట యాజులు .తన అగ్నిహోత్రం పవిత్రం రహస్యం అనే వారట .భార్య సూర్యసోమిదేవమ్మ గారినీ ఎవరికీ కనిపించ నిచ్చేవారుకారు .

 దువ్వూరి దంపతుల ఫోటో జత చేశాను చూడండి

   సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-18 –ఉయ్యూరు   ,

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

29-7-18 ఆదివారం ఉదయం మా ఇంట్లో స్వర్గీయ ఆర్ .ఎస్ .కే.మూర్తి గారి కోడలు డా .శ్రీమతి తుమ్మలపల్లి వాణీ కుమారి గారు

29-7-18 ఆదివారం ఉదయం మా ఇంట్లో స్వర్గీయ ఆర్ .ఎస్ .కే.మూర్తి గారి కోడలు డా .శ్రీమతి తుమ్మలపల్లి వాణీ కుమారి గారు

https://photos.google.com/share/AF1QipOruneWiC_SdGKtEHzjngrhI7-EZ-984wXfooTK8jpzsWKB6zGeA9KA9xv0h64zTQ?key=QTBHRFVTR01HcHZqaHJWT0wwYXRGWkZpNGlwamVR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7

గురువుగా ఋత్విక్కు గా .తితిదే ఆస్థాన పండితునిగా దక్షిణ స్వీకరించని , అర్హులు కాని   వారితో సోమరసం తాగని   బాబళ్ల శాస్త్రి గారు  ఆనాటి వైదిక ఉన్నత బ్రాహ్మణులలో అరుదైన వ్యక్తి .ఆయన౦త వారు ఆయనే .ఆయన తర్వాత వేరెవరూ లేరు అన్నారు వారి ప్రక్కింటి సామవేదం వారు .1993 జూన్ 1  లో  తుంటి ఎముకకు గాయమైనప్పటినుంచి  మంచం పై దర్భ  పరచుకొని పడుకునే వారు .ప్రక్క మంచం పై కేన్సర్ వ్యాధితో చావు బతుకులమధ్య ఉన్న ఒక్కగానొక్క కుమారుడు బుల్లెబ్బాయి  పడుకోనేవాడు .శాస్త్రి గారి చేయి ఎప్పుడూ ఆప్యాయంగా అతని మీదనే ఉంచేవారు  .కుమారుడికంటే తన ‘’అంత్యేస్టి’’ము౦దు జరిగితే బాగుండుననికోరుకొనేవారు .ఇలా జరిగితే తండ్రి శ్రార్ధం కొడుకు పెట్టే అవకాశం ఉంటుందని వారి భావన. కొడుకు చేతులమీదుగా చనిపోయానన్న సంతృప్తి మిగులుతుందని ఆశ .భగవంతుడు శాస్త్రిగారి కోరిక నెరవేర్చాడు .శాస్త్రిగారు 1993 ఆగస్ట్ 6 న ఉత్తమలోకాలకు వెడితే, 64 ఏళ్ళ కొడుకు ఆరు నెలల తర్వాత1994 జనవరి 1 న చనిపోయాడు .

ఆహితాగ్ని అయిన శాస్త్రిగారు మరణించారు కనుక వారికి ‘’బ్రహ్మ మేధ’’అంతిమ సంస్కారం జరగాలి .ఇది మూడుగంటలు త్రేతాగ్నులతో ఇతర దహన కృత్యాలతో పాటు ,ఎముకలను  మళ్ళీ  దహనం చేసి ,సోమ యాజులకు చేసే ప్రక్రియగా చేశారు .దీన్ని ‘’పునర్దహనం ‘’అంటారు .దీన్ని ‘’లోష్ట చితి ‘’   పై నిర్వహిస్తారు .శ్రీరామపురం ,నేదునూరు ,వ్యాఘ్రేశ్వర యువ ఆహితాగ్ని లు చూసిన మొదటి ‘’బ్రహ్మ మేధం ‘’.తర్వాత కాలం లో చాలామందికి జరిపారు .దువ్వూరి యాజులుగారి భార్య సూర్య గారికి ,పుల్లెలవారి భార్య కామేశ్వరిగారికీ,బులుసు చయనులు గారికి ,లంకావారికి ఇలాగే చేశారు .ఆహితాగ్ని మరణిస్తే మరణించిన క్షణం నుంచి ‘’అశౌచం ‘’అంటే’’ మైల’’ పాటించరు .బ్రహ్మ మేధం జరినప్పటినుంచి మైల పాటిస్తారు .తాను చనిపొతే పూనాలో ఉన్న తన ప్రియ శిష్యుడు ఆధ్యాత్మిక కుమారుడు   చిర్రావూరి  రామం వచ్చేదాకా అంత్యక్రియలు చేయవద్దనీ చావు మంచంలో ఉండగానే ఆదేశించారు శాస్త్రి గారు .టెలిగ్రా౦ అందుకొని రైల్లోపడి రాజమండ్రి వచ్చి టాక్సీలో  రోజున్నరతర్వాత  శ్రీరాంపురం చేరాడురామం . .చిక్కిశల్యమైన శాస్త్రిగారి పార్ధివ దేహాన్ని అగ్ని హోత్రం గదికి వెలుపల మంచు గడ్డలపై ఉంచారు .శాస్త్రీయంగా ,న్యాయబద్ధంగా ఆయన అప్పటికి ఇంకా చనిపోనట్లే లెక్క .

రామం రాగానే మిగిలినవారితోకలిసి శాస్త్రిగారి మండుతున్న  ‘’ఆరణి’’ చితులను బయటికి తీసి ,గార్హపత్యాగ్ని లో కలిపి ,ఆహవనీయ ,దక్షినణాగ్నిలో కూడా కలిపి  మూడిటిలోను మహాజ్వాల వచ్చేట్లు చేశారు .చివరి ఇష్టి ఇంటిలోనే నిర్వహించి ,ఆయన, భార్యా   చివరి రోజులలో చేయలేకపోయిన అగ్నిహోత్రం ఇష్టి ,అగ్రయనాలకు ప్రాయశ్చిత్త హోమాలు చేసి ఈ సమిధలను మూడు  కుండల లో గార్హపత్య ,ఆహవనీయ ,దక్షిణాగ్ని లుగా  సేకరించారు నాలుగవ కుండ గృహగ్ని ఔపసనాగ్ని లను మూడువైపులా తాళ్ళతో కట్టి ఇంటిబయటకు చేర్చి,కొడుకు బుల్లెబ్బాయి కి ఆసరాగా ఉంటూ ,భార్య సుందరి గారికి కడసారి చూపు కల్పించి , బుల్లెబ్బాయి  బతికి  ఉన్నాడు కనుక మనవడు మనవడు ప్రసాద్ అంత్యక్రియలలో పాల్గొన రాదుకనుక అతన్ని ఇంటివద్దనే ఉండిపొమ్మని ,స్మశానానికి పార్ధివ దేహాన్ని చేర్చి ,త్రేతాగ్నులను ఆయన దేహం పై ఉంచి ,ఆహవనీయాగ్నిని ఆయన శిరసు క్రింద ఉంచి ,దక్షిణాగ్ని ని, ఛాతీపై కుడివైపున ,గార్హ పత్యాగ్ని ని కుడి తొడవద్దఉంచి కట్టెపుల్లలను కప్పి యధా విధిగా దహనక్రియ పూర్తి  చేశారు .మూడుగంటలలో  ఆయన దేహం తాను ఇంతకాలం ఆరాధించిన  అగ్నికి ఆహుతై, ఆయన పవిత్రాగ్ని దేవునిలో  చేరిపోయారు.

బ్రహ్మ మేధ ,పునర్ దహన ,లోష్ట చితి విషయాలు  స్థానిక లౌకిక అపర కర్మలు చేయించేవారికి అవగాహన ఉండనివి .ఒకవేళ ఉన్నా వాటిని నిర్దుష్టంగా చేయించే సాహసం చేయలేరు .శాస్త్రిగారి అపరకర్మ అంటే దహనం తర్వాత రోజు నుంచి 12 వ రోజు వరకు నిర్వర్తించాల్సిన వాటిని అమలాపురం లోని ఆకొండి సూర్యనారాయణ గారిని పిలిపించి యధా విధిగా చేయించారు .13 వ రోజు ఆస్తి సంచయనం ,పునర్ దహనం ,లోష్ట చితి ఏర్పాటు లను చిర్రావూరి రామం గారు అనే  బాబళ్ళ శాస్త్రి గారి ముఖ్య శిష్యుడు ,ఆయనకు ఆధ్యాత్మిక కుమారుడు ,దువ్వూరి  యాజులు ,బులుసు చయనులు గారి సాయం తో పితృ మేధ సూత్రాలతో  చేశారు .ఇవి అందరికి అందుబాటులో లేనివి కనుక పుస్తకమే శరణ్యం .ఆయన చితాభస్మాన్ని భద్ర పరచి గంగలో కలపాల్సిన పనే లేదు,కారణం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన కౌశికీనది సమీపం లోనే ఉ౦దికనుక . సపిండీకరణ జరిగిన రెండు వారాల తర్వాత ఇంట్లో ఉన్న ఆయతన మట్టి హోమ గుండాలను చిద్రం చేశారు .అయన ప్రేతాత్మ పితృ రూపం పొందింది .నెలమాసికాలు పెట్టారు .కొడుకు బుల్లెబ్బాయి నాలుగు పెట్టాడు .నాల్గవది పెట్టె రోజు ఉదయమే ఆయన చనిపోయాడు .శాస్త్రి గారి భార్యను వోదార్చటం ఎవరి తరమూకాలేదు .అసలే చెవుడు .ఇప్పుడు కొడుకు మరణం తో ,తాను గుడ్డి దాన్నీ అయ్యానని   రోదించింది .ఆమె కూడా జులై లో చనిపోయింది .విధవ అయిన కోడలు సావిత్రి రెండు తరాలు కళ్ళముందే అదృశ్యమవటం జీర్ణించు కోలేకపోయింది .

ఊరిజనం శాస్త్రి గారింటికి  ముహూర్తాలకోసం,ధర్మసందేహాలు తీర్చుకోవటానికి రావటం పరిపాటి  .  ఇప్పుడు మనవడు యజ్ఞేశ్వర ప్రసాద్ ఆ పని చేస్తున్నాడు .ఇతడు తాతగారి వద్ద ఎనభై రెండుపన్నాల  తైత్తిరీయం 19 వ ఏటికే నేర్చాడు .తర్వాత లౌకిక విద్యానేర్చి సైన్స్ గ్రాడ్యుయేట్ అయ్యాడు  .దగ్గర ఊరిలో టీచర్ గా పని చేశాడు .పాలకొల్లు పిల్ల లక్ష్మీ నరస కాంత ను వివాహమాడి వరుసగా అందమైన ముగ్గురు ఆడపిల్లలు రేఖ ,మాధురి ,కల్యాణి లకు  తండ్రి అయ్యాడు.దురదృస్టవశాత్తు  ఇక ఆమెకు సంతానం కలగదని డాక్టర్లు చెప్పారు .దీనితో’’ బ్రహ్మీ భూత ‘’బాబళ్ళ శాస్త్రిగారి వంశం ఆగిపోవటం విచారకరం .ప్రసాద్ సైన్స్ లెక్కలు  సోషల్  ,తెలుగు లను చక్కగా బోధించేవాడు .తెలుగు తప్ప ఆ విద్యలను హూణ విద్యలని ఆకాలం లో అనేవారు .అతడు అమలాపురం లోని గోదావరి మండల వేద పరిషత్ కు కార్యదర్శి .యవ్వనం లో ఋత్విక్కుగా బాగా రాణించాడు .తన పూర్వీకుల శ్రౌతం తమకు అచ్చిరాలేదని భావించాడు .

తన తాతగారు తన తండ్రికంటే పూర్తి అధికారి  తనను తీర్చి దిద్దింది ఆయనే అనేవాడు ప్రసాద్ .తాతగారి సలహా ఆనాడు దైవాజ్న గా భావించేవారు .స్మార్తం లో ప్రతి సూక్ష్మ విషయం తాతగారికి తెలుసునని కాని ఎన్నడూ దాన్ని కర్మకాండలకు వాడలేదని అన్నాడు .తమ ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నీ తరతరాలుగా ఇంటి పురోహితుడు,గా ఉన్న   అగ్రహారం లోని ఆహితాగ్ని బులుసు చయనులు గారే చేసేవారని అన్నారు.వేద సభలకు ,పెళ్లిళ్లకు ఉపనయనాలకు వచ్చే ఆహితాగ్ని బ్రాహ్మణులకు ఆహితాగ్ని అవసరం ఉందని గ్రహించి శాస్త్రి గారు ,అర్ధాంగి సుందరిగారు 1970 నుండి 1990 వరకు ఇరవై ఏళ్ళు శ్రావణ ,భాద్రపద మాసాలలో ముక్కామలకు వెళ్లి నలభై రోజులు ఉండి ఆమె చేతిమీదుగా వంట చేయించి ఆహితాగ్ని వేదపండితులకు భోజనాలు పెట్టేవారు .దీన్ని శాస్త్రిగారు ‘’ప్రసాదం ‘’అనేవారు .19 80 లో ఒక విదేశీ ఇక్కడికి విషయాలు తెలుసుకోనాలనే ఆసక్తితో  వస్తే, అతనితో శాస్త్రిగారు ‘’మీరు మాలో ఒకరు .మీరు ఇక్కడి వారికంటేమా సంప్రదాయాలు, ఆచారాలు తెలుసుకోవటానికి మిక్కిలి ఉత్సాహం ,ఆసక్తి చూపిస్తున్న సహృదయులు .ఏదో పూర్వ జన్మ వశాత్తు మీరు ఆదేశం లో పుట్టారు .కాని మీరు మా దేశానికి, మా ప్రాంతానికి ,మా సంప్రదాయానికి చెందిన వారే ‘’అని మనస్పూర్తిగా ఆహ్వానించిన గొప్పసంస్కారి శాస్త్రి గారు .

చిర్రావూరి రామం శాస్త్రిగారి అంతేవాసి, ఆత్మీయ సుపుత్రుని వంటి వారు  అందుకే శాస్త్రి గారు తన అన్త్యేస్టి ఈయన వచ్చాకనే జరగాలని కోరారు .గురువుగారికి ఇస్టిలో చాలా ఏళ్ళు సహాయకులుగా ఉన్నారు .కలిసి వేదం ,మీమాంస,వ్యాకరణం  తర్కం నేర్చారు .ఆయన రాజమండ్రిలో ప్రభుత్వ ఓరిఎంటల్  కాలేజిలో సంసృతం బోధించారు .శాస్త్రిగారి మరణ సమయం లోనూ వారు  ఉద్యోగం  చేస్తూనే ఉన్నారు  .పూనా యూనివర్సిటి లో బోధన   చేసినా , నచ్చక వదిలేశారు .వేదాలలో ప్రాచీన విజ్ఞానం ఉందని అంటారు .ఆయనకు ‘’సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ ది సైన్సెస్ అఫ్ ఎన్శేంట్ ఇండియా’’ స్థాపించాలని ఉండేది .దీనిద్వారా కుష్టు ,ల్యూకో డేర్మా ,చెవుడు ,పాముకాటు ,జ్వరం ,గుండె జబ్బు ,క్షయ ,తెల్లజుట్టు మొదలైన వాటి నివారణకు మందులు కనిపెట్టాలని ఆయన ఆలోచన .భోపాల్ గాస్ దుర్ఘటనలో కంటి చూపు కోల్పోయిన వారికి కంటి చూపు తెప్పించటానికి ,వేదపండితులచే అక్కడ హోమాలు చేయించారు .

బాబళ్ళ శాస్త్రిగారి మరణం శ్రీరామపురం,నేదునూరు ,వ్యాఘ్రేశ్వరం లలోని   నలుగురు ఆహితాగ్నులపై ప్రభావం చూపించింది .భావి తరాలను ప్రభావితం చేసే శాస్త్రి గారు లేకపోవటం పెద్ద లోటే అని ఆ అగాధాన్ని పూడ్చలేమని అనుకున్నారు .శాస్త్రిగారి నిజాయితీ ,సమర్ధత ,ముందుచూపు ,సద్యో స్పందన  నిజాన్ని గుర్తించే నైజం ఇతరులెవ్వరిలోను లేనివి, రానివి, రాలేనివికూడా .ఒకసారి శాస్త్రి గారు ఏదో గ్రంధం తిరగేస్తున్న దువ్వూరి యాజులు గారిని చూసి ఏం చేస్తున్నారు ?అని అడిగితె ఆయన ‘’గ్రంధం తిరగేస్తున్నా ‘’అనగానే ‘’ఎందుకా శ్రమ ?మీరే ఒక ఉద్గ్రంధం కదా ‘’అన్నారట .అదీ ఆ మనీషి  గొప్పతనం .

మరో ఆహితాగ్ని గురించి తర్వాత తెలుసుకొందాం .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ – 28-7-18 –ఉయ్యూరు

 

.

 

 

 

 

 

 

 

 

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6

1962 లో శాస్త్రిగారికి శ్రీరాం పురం లో ఒక ఇళ్లస్థలం ఏర్పాటు చేయబడగా కుటుంబాన్ని ముక్కామల నుంచి ఇక్కడికి మార్చారు .ఆయన మనసులో సప్తగోదావరి ఎప్పుడూ మసలుతూ ఉండేది .కౌశికుడైన విశ్వామిత్రుని వరం గా తలుస్తూ ఉండేవారు ,స్థలం ఇచ్చినవారు ఇల్లు కట్టుకోవటానికి ధనమూ అందజేయటం తో కట్టుకొని అందులో అగ్ని హోత్ర గదినీ ఏర్పాటు చేసుకున్నారు .దాత  15 బస్తాలు పండే ఒక ఎకరం పల్లం భూమిని కూడా ఇచ్చాడు .నిత్యాగ్ని హోత్రులు, ఆహితాగ్ని అవటం, వేద పండితులకు నిరంతరం ఆ దంపతులు అతిధ్యమిస్తూ ఉండటం వలన దాత వీరికి రోడ్డు ప్రక్కనే ఉన్న స్థలం ఇచ్చి అతిధి అభ్యాగతులెవరు ఊళ్లోకి వచ్చినా తెలుసుకొనే వీలు కల్పించాడు .ఏ ఆహితాగ్ని అయినా  వేరొక ఆహితాగ్ని ఇంట్లో ఆయన భార్య చేతి వంటతింటాడు .ఆమె  ఇచ్చిన ఉదకం పుచ్చుకొంటాడు .అది విధానం .అందుకని ముక్కామల ,సీతారామపురం ,వ్యాఘ్రేశ్వరాలలో వేదసభలు జరిగినప్పుడల్లా వీరంతా శాస్త్రి గారింటికి వచ్చి ఆతిధ్యం పొంది వెళ్ళేవారు .తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులను వేదం విద్యను  అమితంగా పోషించింది .వారికి నెలవారీ వేతనం ,స్తైఫ౦డ్ ,పెన్షన్ ,గౌరవ భ్రుతి వగైరాలను కలిపించి వారి జీవితాలలో వెలుగులు నింపింది .ఈ దేవస్థానం చాలాసార్లు శాస్త్రిగారిని వచ్చి వేదపారాయణ చేయమని  కనీసం గౌరవ భ్రుతి స్వీకరించమని కోరింది .’’ఆహితాగ్ని వేదాన్ని అమ్ముకోడు ‘అని చెప్పి సున్నితంగా తిరస్కరించేవారాయన .వేద విక్రయం మహా పాపం అని భావించేవారు .కనుక వారెప్పుడూ దాన గ్రహీతగా లేరు .ఎప్పుడూ ‘’అపరిగ్రాహీత ‘’గానే ఉండి పోయారు .తిరుపతి దేవస్తానం పట్టువదలని విక్రమార్కుడి లా వెంటపడుతూనే ఉంది .ఆయన ఇక ఒప్పుకోరు అని గ్రహించి ఆయనను పెన్షన్ ప్లాన్ లో చేర్చి , ఉద్యోగం లేని ఆయన కుమారుడికి   బహుమానంగా అందజేసింది .వేద పరీక్షలకు శాస్త్రిగారిని పరీక్షాదికారిగా ఆహ్వానించినా తన విది సంతృప్తికరంగాచేసేవారే కాని దానికిచ్చే భ్రుతిని ఎన్నడూ స్వీకరించని నిస్టా గరిస్టులాయన.తప్పని సరై కనీసం శాలువా అయినా కప్పే భాగ్యం కలిగించమని వేడితే   ‘’సరే ఇది దత్తాత్రేయునికి సమర్పణ ‘’అని నవ్వేవారు .తర్వాత దాన్ని వేరొకరికి కప్పి సంతృప్తి పడేవారు .14 వ శతాబ్ది కి చెందిన అద్వైత మత ప్రచారకులు ‘’పంచదశి ‘’వంటి వేదాంత గ్రంథ కర్త విజయనగర సామ్రాజ్య స్థాపనా చారులు  శ్రీ   విద్యారణ్య స్వామి  దేవాలయం కౌశికనదీ తీరం లో ,తమ ఇంటికి అతి సమీపం లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని జపతపాలకు అక్కడ అందరికి వసతిగా ఉంటుందని  శాస్త్రి గారు భావించి ,చివరకు విద్యారణ్యులవారి గురించి జనాలకు పెద్దగా తెలియదని విరమించుకున్నారు .కాని అత్రి మహర్షి కుమారుడు దత్తాత్రేయ స్వామి బహుజన హితుడు అని భావించి ,ఆయన త్రిమూర్తి స్వరూపుడు అవటం తో మొగ్గు చూపారు .కొందరు దత్తాత్రేయుడు వేదం చెప్పిన దేవత కాడు అనగా బోసినవ్వుతో ‘’విష్ణువు గార్హపత్యాగ్నిలో ,శివుడు దక్షిణాగ్ని లో ,బ్రహ్మ ఆహవనీయాగ్నిగా ఉన్నారు ‘’అని బదులు చెప్పారు .ఇంతటి గొప్ప ఆహితాగ్ని ,విశిష్ట వేదపండితులైన శాస్త్రిగారి ‘’అగ్ని హోత్రం గది ‘ని స్థానికు లెవ్వరూ  చూడనే లేదు చూసే అవకాశమూ దొరికేదికాదు . 1987 లో ఒక ఉత్సాహవంతుడైన దాత ముందుకు రావటం తో చిన్న దత్తాత్రేయ దేవాలయాన్ని శాస్త్రి గారు విధి విధానంగా  నిర్మించి తనకోరిక తీర్చుకున్నారు .దీని చుట్టూ రావి, మర్రి ,వేప ,మేడి వంటి పవిత్ర వృక్షాలు పెంచటానికి స్థలం సేకరించాలనీ  అనుకున్నారు .ఈ వృక్షాలను ,దత్తాత్రేయస్వామిని దర్శించే ప్రజలకు మనో భీస్టి కలుగుతుందని అభిప్రాయ పడ్డాడు .

బాబళ్ల శాస్త్రి గారు ముక్కు సూటి మనిషి .స్వేచ్చాజీవి .సంభాషణలో తన విద్యాగర్వంప్రదర్శించరు .చాలా నిక్కచ్చిగా అభిప్రాయాలు చెప్పటం ఆయన నైజం .బహు విద్యలలో ఆరితేరిన పండితులు కూడా, బ్రహ్మ చెవుడు తో బాధపడుతున్న శాస్త్రి గారి వద్దకు వచ్చి సందేహ నివృత్తి చేసుకొనేవారు .పంచములు కూడా వారి దర్శనం చేసుకొని తరించేవాళ్ళు .అందుకే స్థానికులు వారిని ‘’మహా పురుషుడు ‘’అన్నారు .ఇలాంటి వారిని ఆంగ్లం లో ‘’క్రాకర్ బారల్ ఫిలాసఫర్స్ ‘’అంటారు . మహాపండితులైనా ,అక్షరం ముక్క రాని వారైనా ఆయనను ఏదైనా దిగితే తక్షణ సమాధానం చెప్పే సంస్కారి .పరులకోసమే తప్ప తనకోసం జీవించని ఉత్తమ పురుషులు శాస్త్రి గారు .

శ్రీరామ పురం లో’’ శాస్త్రిగారి అరుగు’’ వేదపండితులతో, వారి మధ్యఅనేక విషయాలపై  చర్చలతో హోరెత్తి పోయేది .ఒక్కోసారి ఆయన అధ్యాపనానికి ఇబ్బందీ కలిగేది .అదొక మినీ సభా ప్రాంగణ౦ గా  భాసిం చేది . ఆయన దీనికి సాక్షీభూతంగా ఉంటూ ,ఉద్రేకాలకు వారు లోనుకాకుండా చూస్తూ ,అర్ధవంతమైన సమతుల్యమైన చర్చలుగా మార్చేసేవారు .ఘర్షణ వాతావరణాన్ని నివారించి ప్రశా౦తత కల్గించటం ఆయన నేర్పు .శాస్త్రిగారి అరుగు గురించి విన్నవారికి కృష్ణ శాస్త్రిగారు రచినన ‘’మా అరుగు ‘’గు ర్తుకు రావటం సహజం . శాస్త్రాలలో నిష్ణాతులే అయినా ,కాలానికంటే ముందే ఉండే ఆలోచనా పరులాయన .దేశం లో విస్తరించిన బహు  సంస్కృతుల వ్యాప్తిని చూసినవారు .కనుక సహనానికి ప్రతీకగా ఉండేవారు .

శాస్త్రిగారిలో పవిత్రత ,విలువలు ప్రత్యక్షాలు .అప్పటికే అదృశ్యమైన సువర్ణ యుగానికి ఆయన వెలకట్టలేని వారధి .ఆయన క్రోధినామ సంవత్సర మార్గ శిర శుద్ధ చవితి నాడు జన్మిచి ,దుందుభి నామ సంవత్సర జ్యేష్ట శుద్ధ౦లొసు౦దరిగారిని వివాహమాడి నట్లు ప్రసంగవశాత్తు  తరచుగా చెప్పేవారు.  19 వశతాబ్దం లో తమ తండ్రి ,గురువులు నడచిన మార్గాన్నే శాశ్వతం చేసే ప్రయత్నం తాను చేశాను అనేవారు .ధర్మవిషయం  లో, కర్మకాండ విషయం లో ఆయన చాలా నిక్కచ్చి .ఆధునికతను దీనిలో ప్రవేశించటానికి అంగీకరించని వ్యక్తిత్వం ఆయనది .సాధారణ శ్రౌత విధులకు కట్టుబడే ఉండాలని ,సూత్రప్రాయంగా అంగీకరించేవారు .ఒక్కసారి మాత్రమే లంకా వారి యజ్ఞం లో తన మాట, మార్గం నుంచి కొంచెం ప్రక్కకు జరగాల్సి వచ్చిందని బాధ పడ్డారు. లంకావారి అగ్ని స్టోమం లో చిన్న సదస్యం పాత్ర అంటే 17 వ పురోహితుడిగా,  బ్రహ్మకు సహాయకుడిగా ఉండాల్సి వచ్చిందట .

తమ ‘’అపరిగ్రహత్వం ‘’,అనే స్వచ్చంద నియమం వలన  కర్మ కాండ లకు  వెళ్ళేవారు కాదు .వేదవిద్యాభ్యసనం చేసిన ఏ శిష్యుని నుంచీ ఆయన ఒక్క దమ్మిడీ కూడా దక్షిణగా పుచ్చుకోలేదు .రుత్విజులకిచ్చే దక్షిణ  స్వీకరించే వారు కాదు .ఇలా పుచ్చుకుంటే వేద విక్రయం అని వారి గట్టి నమ్మకం .భూమిఎవరైనా దానం ఇస్తే తీసుకోవటానికి, శ్రౌత క్రియలకు దక్షిణ తీసుకోవటానికి తేడా ఉందంటారు .ఋత్విక్కు గా ఉండటానికి కూడా పెద్దగా ఇష్టపడే వారు కాదు .సరైన శిక్షణ లేని వారితో ,సరైన సంబారాలు లేకుండా చేస్తే దాని ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది అంటారు .సంప్రదాయంగా వస్తున్నా వేదం విద్యాభ్యాసం లో కొన్ని తప్పులు జరుగుతాయనీ  ,పరీక్షా విధానం సరళతరం చేస్తున్నారని ,గురు ముఖ విద్య కంటే పుస్తకాలతో నేర్చుకోవటం ఆయన అంగీకరించలేదు .దీని వలన క్రియలో పొరబాట్లు జరిగి ,క్రియలకు తగిన మంత్రాలు చెప్పకపోవటం జరిగి చేసే వాడికీ చేయి౦చేవాడికి మాత్రమేకాకుండా విశ్వానికి కూడా అనర్ధం జరుగుతుంది అనేవారు .అందుకే రుత్విజ  శిక్షణ పాసైనవారితో కలిసి పని చేయటం ఇష్టం ఉండేదికాదు  .వారిలో పరిపూర్ణత ఉంటుందనటం తనకు తెలీని విషయం అనేవారు .చాలా సార్లు సోమభక్షణ లోని ప్రమాదాలపై   ఆయన హెచ్చరించేవారు .కాలం లో ఎన్నోమార్పులోస్తున్నాయి .భమిడి పాటి వంశం లోనే అగ్నిస్టో  మానికి  18 మంది ఋత్విజులు,సర్వతోముఖానికి తగినంత మంది  తయారయ్యారని సంతోషంగా చెప్పేవారు .

ఒకప్పుడు నాలుగు గైదు రోజులు చెసేఉపనయన౦  ఇవాళ కొన్ని గంటల తంతు తో సరిపుచ్చటం ఆయనకు నచ్చని విషయం .అలాంటివాడు ఏ విధంగా బ్రాహ్మణుడు అనిపించుకొంటాడని ప్రశ్నిస్తారు .తన ఆహితాగ్నిగురువు బులుసు సోమయాజులు గారు అని గర్వంగా శాస్త్రిగారు చెప్పుకొంటారు .’’అభిచారం’’ ఎలా చేయాలో ఆయనే దగ్గరుండి నేర్పారని కృతజ్ఞత తెలియ జేస్తారు .నిత్యాగ్ని హోత్ర విధానం లో తనకు ఎన్నో అద్భుత దృశ్యాలు కనపడినాయన్నారు . .ఒక సారి అగ్ని హోత్ర సమయంలో ఒక అద్భుత తేజస్సు హోమం నుండి బయటికి వచ్చి తన కళ్ళ ముందు దర్శనమిచ్చిందని ఇదొక శుభ సూచనగా తాను భావించానని ,తన కోడలు ప్రసవించి మగపిల్లాడికి జన్మ నిచ్చిందని ఆనందంగా చెప్పారు .మరో సారి ఆహవనీయాగ్ని పూజ చేస్తుంటే ఒక చతుర్భుజ పురుషుడు కనిపించాడని ,దీని ఫలితం ఏమిటి అని ఆలోచించగా ,రెండవ మనవడుకూడా త్వరలోనే రాబోతున్నాడని తెలిసిందని ఆ’’వేదపండు’’అయిన ఆహితాగ్నిబాబళ్ళ శాస్త్రిగారనే  బ్రహ్మశ్రీ భమిడిపాటి యజ్నేశ్వర సోమయాజులు గారు చెప్పారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-18 –ఉయ్యూరు     .

 

 

 

 

 

 

 

 

 

—



— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5

బాబళ్ళ శాస్త్రి గారు 82 పన్నాలు పూర్తి  చేయగానే,తనకు సంక్రమించిన’’ గంగలకుర్రు పొలాలపై  అజమాయిషీ చేస్తూ ,  ,కొద్దిమందికి వేదపాఠాలు చెబుతూ ,తాను తైత్తిరీయ శాఖపై సాధించిన పట్టు ను నిలబెట్టుకొంటూ మరింత ముందుకు సాగారు .వేదం ,శ్రౌతం ,ధర్మ శాస్త్రం, మీమాంస , జ్యోతిషం,వేదాంతం, వ్యాకరణం మొదలైన వాటిపై లోతైన అవగాహన సాధించి తన జ్ఞాన  తృష్ణ తీర్చుకున్నారు .అనునిత్యం వీటిని స్పృశిస్తూ అవగాహన పెంచుకున్నారు .వార్ధక్యం లో కూడా ,చెవుడు వచ్చినా కళ్ళు సరిగ్గా  కనిపించక పోయినా ,రోజూ ఏదో ఒక తాటాకు గ్రంధాన్ని కంటి సులోచానాలకు  రెండుమూడు అంగుళాల దూరం లో ఉంచుకుని పరిశీలించేవారు .అంతటి విజ్ఞాన తృష్ణ ఉండేది .

  తమ తండ్రిగారు తన జీవితం లో ఆర్దికబాధలకు గురికాకుండా ఆర్దికసౌకర్యం కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొనేవారు .తండ్రిగారితో తన అనుబంధం చాలా గొప్పదని అనేవారు .తన చదువు నిరాటంకంగా సాగాలని తండ్రి కోరేవారు .ప్రతి విషయం పై ఆయనే శ్రద్ధ చూపేవారు .తనకే రకమైన ఇబ్బంది కలిగించలేదు .యవ్వనమంతా ఉయ్యాలలో ఊగుతూ సుఖ సంతోషాలతో గడిపారు .తండ్రిగారి కంటే తక్కువ మంది విద్యార్ధులను చేర్చుకొని వారిపై పూర్తీ అంకితభావం తో బోధించేవారు .గ్రంథ పఠన కాలం లోకూడా నలుగురు విద్యార్ధులు ఇంట్లో ఉండేవారు .తన మనవడు ప్రసాద్ కు  కూడా 82 పన్నాలు 19 71 నుండి 19 80 వరకు తొమ్మిదేళ్ళు క్షుణ్ణంగా నేర్పిన గురూత్తములాయన .పరీక్షలకు కట్టకపోయినా ప్రసాద్ 1986 లో దగ్గర స్కూల్ లో స్కూల్ మాస్టర్ అయ్యాడు.తాతగారితో నిత్యం పొలాలకు వెళ్లివచ్చేవాడు    .అతని సహాధ్యాయులు చిర్రావూరి రామం ,శ్రీపాద మాణిక్య ,,ప్రభల కృష్ణమూర్తి ,సామవేదం నారాయణ .వీరిలో ఎవరో ఒకరు ప్రసాద్ వెంట తాతగారితో వెళ్ళేవారు .వీరుకాక ఆయనవద్ద నేర్చిన వారు కోనసీమలో చాలామంది వేదపండితులైనారు.పొలాల గట్లమీదో, కొబ్బరి చెట్ల నీడనో కూర్చుని వీరు అధ్యయనం సాగిస్తూ కన్పించేవారు  .వీరిని శాస్త్రిగారు పర్యవేక్షిస్తూ ఉండేవారు .మధ్యాహ్న సమయానికి ఇంటికి చేరి ఉదయ పాఠాలను సమీక్షి౦చుకోనేవారు .నాగలిపట్టి భూమిని దున్నగలిగే  శాస్త్రిగారు ముసలితనం లో పర్యవేక్షణకే పరిమితమయ్యారు .

  వేదపరీక్షలను నిర్దుష్టంగా కఠినంగా జరిపేవారు  శాస్త్రి గారు .అందుకే మనవడు ప్రసాద్ పరిషత్ పరీక్షలకు హాజరవ లేదు .శాస్త్రి గారు ,మరికొందరు సహాధ్యాయులైన వేదపండితులు కలిసి తాము కొంత ధనం వేసుకుని, కొంత వితరణ శీలురవద్ద సేకరించి ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు .దీనితో వేదం సంస్కృతం ,శ్రౌతం స్మార్తం ,అపరం ,ఆగమం ,మీమాంస ,వ్యాకరణం మొదలైన విషయాలపై అమలాపురం ,రాజమండ్రి ,మొదలైన చోట్ల లో సభలు జరిపి పరీక్ష లు నిర్వహించి ఉత్తీర్నులైనవారికి పురస్కారాలు అందించారు .1987 వైశాఖమాసం లో వ్యాఘ్రేశ్వర గ్రామం  ముందుకు వచ్చి వీటికి పూర్తి  సహకారం అందించి ,ఆతిధ్యమిచ్చింది .30 మంది వేదం లో ,నలుగురు స్మార్తం లో ,ఒకరు  ఆగమం లో  పరీక్షనిచ్చారు. వీరంతా పది నుంచి పన్నెండేళ్ళు కస్టపడి విద్యనేర్చినవారే .రెండు  రోజుల పాటు వివిధ శాస్త్రాలలో , ,వేదపారాయణ  లో పరీక్షలు నిర్వహించి ,రెండవ రోజు సాయంత్రం ఉత్తీర్ణు లైనవారినీ, ,నిష్ణాతులైన గురువులను ఘనంగా సన్మానించి చిరస్మరణీయం చేశారు .ఉత్తీర్ణులైన విద్యార్ధులకు 150 నుంచి 200 రూపాయలవరకు ప్రోత్సాహక నగదు పారితోషికాలను అందజేశారు .

  శాస్త్రిగారికి నడి వయస్సు  నాటికి కుటుంబం లో శ్రౌతం ఉత్కృష్ట స్థితిపొంది ,ఆహితాగ్నులు పెరిగి తానుస్వయంగా ఏదీ చేసుకోవాల్సిన అవసరం కలగలేదు .ఆయనకు ఎన్నో చోట్లనుండి ఆహ్వానాలు వచ్చాయి .కాని వెళ్ళటానికి ఇష్టపడలేదు .’’వెళ్ళే ధైర్యం నాకు లేకపోయింది ‘’అని నవ్వుతూ చెప్పేవారు .1959 లో 55 వ ఏడు వచ్చేదాకా నిత్యాగ్ని హోత్రానికి ఆధానం చేసేవారు.ఆరునెలల తర్వాత’’అగ్ని స్టోమం ‘’ మొదటి సోమ క్రతువు  చేశారు .దీనినే కోనసీమలో యజ్ఞం అంటారు .దగ్గరలో నేదునూరు గ్రామవాసి ,ఆయన స్నేహితుడు ,వేదం లో విశేషమైన ప్రాభవం ఉన్న  లంకా వెంకటరామ శాస్త్రిగారు అధ్వర్యు గా వ్యవహరించారు .లంకావారు కొద్ది రోజుల్లో అగ్ని స్టోమం పూర్తి  చేసే ఏర్పాట్లలో ఉన్నారు .శాస్త్రిగారి యజ్ఞం అందరిలో గొప్ప ఉత్సాహం కలిగించి శ్రౌతానికి మహోన్నత దశ అయింది .ఇలా అయిదేళ్ళు  గడిపారు..ఆయన గౌరవం విపరీత౦ గాపెరిగి కుటుంబం లో అగ్రహారాలలో కోససీమ అంతా ఆయనకు బ్రహ్మ రధం పట్టింది .’’నా పూర్వీకులు చేసిన దానినే నేనూ కొనసాగిస్తున్నాను అన్న సంతృప్తి నాది ‘’అనే వారాయన .అగ్ని స్టోమం తర్వాత ‘’శ్రావణ పశు ‘’ నిర్వహించారు .1960 లో భాద్ర పదమాసం లో ‘’అరుణ కేతుక ‘’చేశారు .ఇందులోఅగ్ని హోత్రం లో ప్రతీకాత్మక ఇటుకలు ,  నీటి నైవేద్యం ఉంటాయి,శాస్త్రిగారి పెంపుడు తాబేలు దీనికి సహకరి౦చి౦ది . దీనికి 12 రోజులు మదూకరం ఎత్తాలి .ఎప్పుడో బ్రహ్మ చర్యం లో చేసింది ఇప్పుడు మళ్ళీ చేయటం అన్నమాట .చాతుర్మాస్య ఆహుతులను సమర్పించాలి .కొత్తపంట చేతికి వచ్చే సమయం లో ‘’అగ్రయనం ‘’చేయాలి .ఇలా శాస్త్రి గారు అర్ధా౦గి  సుందరి దంపతులు 1990 లో ఆయన 87 వ ఏడు ,ఆమెకు 81 వచ్చేదాకా చేశారు . .1991 లో ఇద్దరూ చెవిటి వారు ఆవటం తోదీన్ని మొట్టమొదటి సారి గా వదిలేశారు.యధావిధిగా నిత్యాగ్ని హోత్రం ఇష్టి చేశారు .

 శాస్త్రిగారి ప్రత్యేకత దీర్ఘకాలం నిర్వహించే నక్షత్ర ,లేక పవిత్ర హోమాలలో కనిపిస్తుంది .సాధారణంగా  గ్రహశాంతి  కోసం నవగ్రహ పూజలుచేసి , దానాలు ఇస్తూ ఉంటారు .శ్రీరామ పురానికి నడక దూరం లోనే శనీశ్వర దేవాలయం మందపల్లి లో ఉంది .హిందువులతోపాటు ముస్లిం లు, క్రిస్తియన్లు కూడా ఈ దేవాలయం దర్శించి శనిబాద నివృత్తి చేసుకొంటారు .శాస్త్రిగారు ఏనాడూ మందపల్లి వెళ్లనూ లేదు లేక మరో చోటనైనా నవగ్రహ పూజ చేయలేదు .శాస్త్రిగారు నలభై రోజుల నక్షత్ర ఇష్టి మాత్రం చేసేవారు .1960 వరకు ఇవి నిరాటంకంగా సాగాయి .అది ఆయన శక్తి పరవళ్ళు తొక్కిన కాలం .ఆయనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి .చయనం లో యజమాని  దీక్ష తీసుకోకుండా యజ్నవాటిక ఇటుకలు తాకరాదు.తాకితే చేతికి గ్లోవ్స్ లేకుండా ఎలక్ట్రీషియన్  విద్యుత్ప్రవహించే తీగలను ముట్టుకొంటే ఎలా షాక్ తగిలి చస్తాడో అలా అగ్ని దేవుడు దహిస్తాడు అని నమ్మకం .సోమాన్ని అగ్నిలో వ్రేల్చి సోమయాజి అయితే జీవితాన్ని  సరైన మార్గం లోఅంటే  గాడిలో బండి నడిచినట్లు హాయిగా గడపగలడు.

 సశేషం

 గురుపౌర్ణమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4

కోనసీమలో ఉచ్చస్థితి లో ,స్వర్ణ యుగం గా ఉన్న శ్రౌత కార్యక్రమాలు 1980 నాటికి  ప్రాభవం కోల్పోయాయి .కాని దెందుకూరి ,విష్ణు భొట్ల ,వంటి కొన్ని కుటుంబాలు మాత్రమే శ్రౌతాన్ని కొనసాగిస్తున్నాయి .1940లో శ్రీ డొక్కా రామయ్య అనే ధనిక వితరణ శీలి అయిన బ్రాహ్మణుడు వేద పండితులకు శ్రీరామ పురం అగ్రహారాన్ని ఇచ్చిఉండటానికి  ఏర్పాటు చేశాడు .అప్పుడు 14 మాత్రమే బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి .ఈశ్వర ,రాధాకృష్ణ ,సూర్య ,అంబిక ,విఘ్నేశ్వరులతో కూడిన ఒక పంచాయతన దేవాలయం ఉండేది ,ఒకే ఒక్క మట్టి ముఖ్యవీది,ఒక చిన్న బడి ,పోస్టాఫీసు ,సుబ్రహ్మణ్య దత్తాత్రేయ మందిరాలు ఉండేవి .కుగ్రామమే అయినా ,వైదిక బ్రాహ్మణులు లౌకిక బ్రాహ్మణులతో కలిసి భోజనం చేసేవారుకాదు .కనుక వేరు వేరుగా వైదిక ,లౌకిక బ్రాహ్మణులు నివసించేవారు   .ఆహితాగ్ని లు ఆహితాగ్నిలు కాని వారింట భోజనం చేసేవారుకాదు  వారి ఆడవారు వండినా తినే వారుకాదు .  దీనికి దగ్గరలో  ప్రధాన రహ దారికి బహుదూరం లో కామేశ్వరి అగ్రహారంలో  కొద్దిమ౦ది బ్రాహ్మణులుండేవారు .వేద విధానం ఉచ్చస్థితిలో ఉన్నాకూడా  ,త్రేతాగ్నులను అర్చిస్తున్న ఆహిఆగ్నులు, వేదపండితులుతమపిల్లలకు నేర్పుకొంటూ ఈరెండు అగ్రహారాలలో ఉండేవారు .ఈ రెండూ అమలాపురం కాలువకు చెరి ఒకవైపున ఉండేవి .శ్రీరామ పురానికి మైలున్నరదూరం లోఉన్న  వ్యాఘ్రేశ్వరం  ఒకప్పటి అగ్రహారం .ఇక్కడ ముగ్గురు ఆహితాగ్నులు ఉండేవారు .అంటే అతి సమీపం లో ఉన్న ఈ గ్రామాలలో మొత్తం మీద ఏడుగురు ఆహితాగ్ని లుండేవారు .గోదావరి నదిపై ఉన్న ఇరగవరం బ్రాహ్మణపల్లెలో వేదపండితులు ఎక్కువ .

  బ్రహ్మశ్రీ భమిడిపాటి యజ్ఞేశ్వర సోమయాజి

 కోన సీమలోని లోని శ్రీరామపురం అగ్రహార వాసి బ్రాహ్మశ్రీ భమిడిపాటి యజ్ఞేశ్వర సోమయాజి గారు .వీరిని అందరూ ‘’బాబళ్ళశాస్త్రి గారు ‘’అని పిలుస్తారు .వీరింట్లో మిగిలిన ఆహి తాగ్నిల ఇళ్ళల్లో లాగానే కుక్కలు ,పిల్లులు కనిపించవు .అదొక నియమం వారికి .శ్రౌత కర్మల సందర్భం లో ఇంట్లో కూర్మం అంటే తాబేలు  తిరగాలి .అప్పుడు దాన్ని అతిజాగ్రత్తగా కాపాడుకొంటారు .

 భమిడిపాటి యజ్ఞేశ్వర సోమయాజి గారు శ్రీ వత్స గోత్రీకులు .1930 లో జన్మించారు .దాదాపు ఇరవై వ శతబ్దం అంతా జీవించారు .బయట అరుగు పై కూర్చుని అందరితో సంభాషించేవారు .తొంభైవ పడికి దగ్గర పడుతున్న కొన్ని నెలలవరకు ఈ వ్యాసంగం సాగింది .భారత దేశం లో 19 ,20 శతాబ్దాలలోని ఆహితగ్ని లలో ఉత్కృష్టమైన వారు గా గణన కెక్కిన మహాను భావులాయన .ఆయన కుటుంబం లో మూల పురుషులు  18 వ శతాబ్దికి చెందిన భమిడిపాటి బ్రహ్మీకృత ఆచార్యులు .వివాహమాడి సంతానం పొందకుండానే  సన్యసించిన వారాయన .అదొక గొప్ప విషయంగా ఆనాడు చెప్పుకునేవారు .తండ్రి తరఫు వారిలో వీరభద్ర సోమయాజి ,అచ్యుతరామ సోమయాజులు ,యజ్ఞేశ్వర సోమయాజులు చిన సుబ్రహ్మణ్య సోమయాజి ,ముఖ్యులు . వీరిలో చిన సుబ్రహ్మణ్య సోమయాజులుగారే  బాబళ్ళ సోమయాజులగారి తండ్రిగారు .తల్లిగారు ఆకెళ్ళ వేద కుటుంబానికి చెందిన కామేశ్వరి .ఈ అయిదవతరం వారు ఆరవతరానికి జన్మ నిచ్చి ఆరుగురు కుమారులను కన్నారు. ఈ ఆరుగురూ ఆహితాగ్నులే .ఇందులో అయిదుగురు సోమయాజులయ్యారు .ఆరవ ఆయన కూడా అయ్యేవారు కాని అగ్ని స్టోమమ దశలో చనిపోయారు .

   బాబళ్ళ గారి ఒకే ఒక కుమారుడు ‘’బుల్లెబ్బాయి ‘’అని పిలువబడే సుబ్రహ్మణ్య సోమయాజి అంతుపట్టని వ్యాధులతో ఇబ్బందిపడి వేదపండితుడు కాకుండానే మరణించి పుత్రశోకం కలిగించగా  ,ఇరవై  రోజుల ఏకైక  కుమార్తెకూడా చనిపోవటం ఆ కుటుంబానికి  ఆశినిపాతమైంది .కాని కొడుకు బుల్లెబ్బాయికి సోమశేఖర ,యజ్ఞేశ్వర ప్రసాద్ ఇద్దరు కొడుకులు .సోమశేఖర ను  బాబళ్ల గారి చిన్న తమ్ముడికి  పెంపుడిచ్చారు .యజ్ఞేశ్వర ప్రసాద్ కు ముగ్గురు అందమైన కూతుళ్ళు .మగసంతానం లేదు .అందుకని బాబళ్ళవారి వంశం ఆగిపోయింది .  ఈ ముగ్గురు కుమార్తెలే బ్రాహ్మీ భూతులవారి తొమ్మిదవ తరం వారు .

  స్కూల్ టీచర్ అయిన యజ్ఞేశ్వర ప్రసాద్ ,భార్య లక్ష్మి వీధి మొదటి ఇంట్లో ఉంటూ అతిధి అభ్యాగతులకు స్వాగతం పలికి ఆతిధ్యమిచ్చి తృప్తి పడుతున్నారు .1961 లో పుట్టిన బాబళ్ళ వారి మనవడు యజ్ఞేశ్వర వెంకట  సత్య సూర్య రామ సుబ్రహ్మణ్య సోమయాజి  ఏడవతరం సోమయాజి అవ్వాల్సినవాడు కాలేకపోయాడు .

 బాబళ్ళ వారు ముక్కామలలో జన్మించినా ,దగ్గరలోని ఇరుసుమండ గ్ర్రామం లో మేనమామలింట పెరిగారు. బాబళ్ళ వారి భార్య సుందరి ,ఆకెళ్ళ సుబ్బావదానిగారి కుమార్తె .ఆయనకంటే ఆరేళ్ళు చిన్నది .ఇరుసుమండ లో ఇద్దరూ కలిసి బడికి వెళ్ళేవారు .ఆయన కు తొమ్మిదో ఏటనే తెలుగు రాయటం చదవటం  వచ్చేశాయి .ఆమె మూడవ తరగతిలో ఉండగా ఆయనకు 18, ఆవిడకు 12 వ ఏట ఐదురోజుల వివాహం జరిగి 71 ఏళ్ళు దాంపత్య జీవితాన్ని అనుభవించిన జంట అయ్యారు .మొదట్లో ముక్కామలలో కాపురం పెట్టినా, తర్వాత శ్రీరామ పురం చేరారు .

  బాబళ్ళ గారి తండ్రి తనకొడుకులకేకాక చాలామందికి విద్యాగురువు .శ్రీరామపురం లో రెండవ ఆహితాగ్నిగా గుర్తింపు పొందినవారుకూడా .అప్పుడు ముక్కామాలలో 20 మంది వేదపండితులు  ఉండేవారు .కొందరు సమీప గ్రామాలనుండి తెరచాప పడవ లో కాలువ దాటి ,కొందరు ఫంట్ లలో లేక ఆ ఒడ్డునా, ఈ ఒడ్డునా పాతబడిన కొయ్య  స్తంభాలకు  కట్టిన తాడును ఆధారంగా వచ్చేవారు ,దువ్వూరి యాజులు అనే ఆయన కపిలేశ్వర పురం నుంచి వచ్చేవాడు.  బాబళ్ళ తండ్రి గారు వేదాన్ని వల్లిస్తూ తదేక ధ్యానం లో ఉంటె ,’’పిల్లలమైన మేము ఒంటేలి కని , రెండేళ్ళ కనీ సాకుతో నెమ్మదిగా జారుకొనే వాళ్ళం’’ అని దువ్వూరి గుర్తు చేసుకున్నారు

బాబళ్ల శాస్త్రి దంపతుల ఫోటో జతచేశాను చూడండి .

  సశేషం

  గురు పూర్ణమి  శుభా కాంక్షలతో  ..

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమం

27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమంగా ఉదయం శ్రీ సువర్చాలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాసపూజ ,విష్ణు సహస్రనామ,శ్రీ కృష్ణ, లక్ష్మీఅష్టోత్తర పూజ జరిపి ,కుమారి బిందు దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయించి ఆన్ లైన్ లో ఆమె భగవద్గీత నేర్పుతున్నందుకు ”ఆన్ లైన్ గురువు గా ”గురుపూజోత్సవం నాడు నగదు పారితోషికం తో పాటు చిరు సత్కారం చేసిన ఫోటోలు

7-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాస జయంతి సందర్భంగా సారస భారతి 128 వ కార్యక్రమంగా  ఉదయం శ్రీ సువర్చాలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాసపూజ ,విష్ణు సహస్రనామ,శ్రీ కృష్ణ, లక్ష్మీఅష్టోత్తర పూజ జరిపి ,కుమారి బిందు దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయించి ఆన్ లైన్ లో ఆమె భగవద్గీత నేర్పుతున్నందుకు ”ఆన్ లైన్ గురువు గా ”గురుపూజోత్సవం నాడు నగదు పారితోషికం తో పాటు చిరు సత్కారం చేసిన ఫోటోలు

https://photos.google.com/share/AF1QipM-vhpMXXhOjhSVtomEws2svrY86Isiuuv4oqqxkDOq6kwZClTzZUqbF349A1eoGQ?key=TnhrdWo5NGNNc21vRjhyX01vanFKWjR1LXMxMXF3

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గురు పూర్ణిమ –వ్యాసజయంతి

గురు పూర్ణిమ –వ్యాసజయంతి

 

వ్యాస అష్టోత్తర స్తోత్రం

‘’1-వేద వ్యాసో విష్ణు రూపః పరాశరార్యాస్తపోనిదిః -సత్య సందః ప్రశాంతస్య సత్య వాదీ సుతః

2-కృష్ణ ద్వైపాయనో దాంతో బాదరాయణ  సంజ్ఞితః -బ్రహ్మ సూత్ర ప్రథితవాన్ భగవాన్ జ్ఞాన భాస్కరః

3-సర్వ వేదాంత తత్వజ్ఞః సర్వేజనా వేద మూర్తిమాన్-వేద శాఖావ్యసన కృత కృత్యో మహా మునిః

4-మహా బుద్ధిర్మహాసిద్ధిర్మహా శక్తి ర్మహా ధృతిః మహా కర్మా మహా ధర్మా మహా భారత కల్పకః

5-మహా పురాణ కృజ్ఞానీ జ్ఞాన విజ్ఞాన భాజనం -చిరంజీవీ చిదాకారీ శ్చిత్త దోష నివారకః

6-వాశిష్ఠః శక్తి పౌత్రస్య శుకదేవర్గుర్గురుహః -ఆషాఢ పూర్ణిమా పూజ్యా పూర్ణ చంద్ర నిభాననః

7-విశ్వనాథ స్తుతికరో విశ్వజనో జగద్గురుః  – జితేన్ద్రియో జితక్రోధో వైరాగ్య నిరతః శుచిః

8-జైమిన్యాది సదాచార్యః సదాచార సదాస్థితః స్థితప్రజ్ఞః స్థిరమతిః సమాధి సంస్ధితారతహః

9-ప్రశాంతిదః ప్రసన్నాత్మా శంకరార్యప్రసాద కృత్ -నారాయణాత్మకః స్తవ్యః సర్వ లోక హితే  రతః

10-అఛత్రవదన బ్రహ్మ ద్విభుజ పర కేశవః -అఫాల లోచనశ్శివః పరబ్రహ్మ స్వరూపకః

11- బ్రహ్మణ్యో   బ్రహ్మణో బ్రాహ్మీ బ్రహ్మ విద్యా విశారదః -బ్రహ్మాత్మైకత విజ్ఞాతా బ్రహ్మ భూతః సుఖాత్మకః

12-వేదాంగ భాస్కరో విద్వాన్ వేద వేదాంత పారగః -ఉపాంతరతమో నామా వేదాచారో విచారవాన్.

వ్యాసునిపై కొన్ని ప్రత్యేక శ్లోకాలు

1-వేద వ్యాసః  స్వాత్మ రూపం సత్య  సంధం పరాయణం –  శాంతం జితేంద్రియ క్రోధం సా శిష్యం ప్రణమామ్యహం

2-వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌరుష మకల్మషం -పరాశరాత్మజం వ౦దే శుక తాతం తపోనిధిమ్

3-వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే -నమో వై బ్రహ్మ నిధ్యాయ వాసిష్టాయ నమోనమః

4-అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే -సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే

5-వ్యాస స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే -నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే

పరాశర స్తుతి

6-కరుణాతీత చిద్రూపం పరి పూర్ణ పరాయణం – పరమానంద సంతుష్టం పరాశర మొహం శ్రయే

శుక స్తుతి

7-త్రికాలాతీత చిన్మాత్ర ప్రశాంత స్వా0త సంయుతం -వికార ఘోర సంస్కృష్టం శుకం గురు మోహం శ్రయే

 

శంకరాచార్య  స్తుతి

8–శంకా   రూపేణ మచ్చిత్తం పంకీకృత మాభూద్యేయా -కింకరీ  యస్య సా మాయా శంకరాచార్య మాశ్రయే

భావం -మాయ అందర్నీ కప్పి ఆడిస్తుంది .మనసు బుద్ధిలలో కల్లోలాలు తుఫాన్లు సృష్టిస్తుంది .అలాంటి మాయను కింకరి అంటే సేవకురాలినిగా చేసుకొన్నశంకరాచార్యులు ప్రణామం .

వేద వ్యాస చరిత్ర

నేపాల్ దేశం లో తానాహుజిల్లా ‘’దమౌళీ ‘’లో వ్యాసుడు తపస్సు చేసి బ్రహ్మ సూత్రాలు పురాణాలు  వేద విభజన చేసిన గుహ ఉంది. అది గొప్ప యాత్రాస్థలం .విష్ణు మూర్తి యొక్క ‘’కాలావతారం ‘’వ్యాసుడు .చిరంజీవులలో ఒకడు .అద్వైత ఋషిపరంపరలో నాల్గవవాడు .ప్రతి యుగం లో ఒక వ్యాసుడు పుడతాడు .వ్యాసుడు అనేది ఒక అధికారం .ద్వాపరం లో కృష్ణ ద్వైపాయనుడు లేక బాదరాయణుడు వ్యాసుడయ్యాడు .వ్యాస పరంపరలో 28 వ వాడు .మొదటి ద్వాపరం లో స్వాయంభువు వ్యాసుడు అయ్యాడు .రెండవ ద్వాపరం లో ప్రజాపతి వ్యాసుడు .మూడవదానిలో శుక్రుడు వ్యాసుడు .ఆ తర్వాత వసిష్ఠుడు ,త్రివర్షుడు ,సనద్వాజుడు వగైరా 27 మంది వ్యాసులు అయ్యాక ద్వాపరం లో కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు అయ్యాడు .

విష్ణు మూర్తి నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టి నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలను ప్రసరింప జేయాలనుకొన్నప్పుడు విష్ణువు మనసులో తలచుకోగానే ‘’అపాంతర తముడు ‘’జన్మించాడు .పుత్రోత్సాహం తో నారాయణ మూర్తి ‘’వ్యాసా !రా నాయనా !నా మానస పుత్రుడివిగా పుట్టి  నాకు ఆనందాన్నిచ్చావు .అన్ని మన్వంతరాలలోనూ ఇలానే జన్మించు .తర్వాత పరాశర కుమారునిగా పుట్టి ,కురురాజుల అధర్మ క్రూర హింసా దౌర్జన్యాలను అదుపు చేసి ,వేదాన్ని వ్యాపకం చెయ్యి .నీకు రాగద్వేష రహితుడైన కొడుకు పుట్టి నిన్ను మించిపోతాడు ‘’అన్నాడు .రాబోయే సూర్య సావర్ణికాలం లో వ్యాసుడు సప్తర్షులలో ఒకడు అవుతాడు . .

కృష్ణ ద్వైపాయన వ్యాస జననం

లోకోద్ధరణకోసం నారాయణుడు కొన్ని ధర్మాలు ఏర్పాటు చేశాడు. కాలక్రమంలో అవి లోపించాయి .బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని దర్శించి ధర్మ  పునరుద్ధరణ చేయమని ప్రార్ధించగా మూడవదైన ద్వాపర యుగం లో పరాశార సత్యవతి దంపతులకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడునారాయణుడు వ్యాసభగవానుడుగా అవతరించాడు ..ఒక రోజు వ్యాసుడు సరస్వతీ నదిలో స్నానం చేసి తపోధ్యానాలు పూర్తి చేసి ఏకాంతం లో ఆసీనుడై దివ్య దృష్టితో యుగ విశేషాలను తెలుసుకున్నాడు .కాల ప్రభావాన భౌతిక భావనలు అంటే శక్తులు తగ్గుతున్నాయని గ్రహించాడు .శ్రద్ధ బలం ఆయుస్సు తగ్గి దౌర్బల్యం పెరిగి నట్లు గుర్తించాడు .అన్ని వర్ణాలవారికి ఉపయోగ పడేట్లు వైదిక కర్మలను పరీక్షించి యజ్ఞ విస్తరణకు ఒక్కటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు .పంచమ వేదంగా మహా భారతం రచించాడు .పైలుడికి ఋగ్వేదం ,వైశంపాయుడికి యజుర్వేదం జైమినికి సామం ,సుమంతునికి అదర్వణం ఉపదేశించాడు .ఇతిహాస పురాణం అనే పంచమ వేదం భారతాన్ని రోమ హర్షుడు అనే సూతమునికి  చెప్పాడు .వీరంతా తమ శిష్యులకు బోధిస్తే వారు వారి శిష్యులకు ఉపదేశించగా అనేకశాఖలయ్యాయి .

కొంచెం బుద్ధి తక్కువ గా ఉన్నవారికి ఉపాఖ్యాన కథా రూపం గా మహాభారతం రాశాడు దీనిలో ధర్మం సంస్కృతీ మొదలైన విషయాలన్నీ చెప్పాడు వ్యాసుడు .ద్వాపరాంతం లో వచ్చే కలియుగం లోవచ్చేఅనర్దాలు,ఆపద గ్రహించటానికి భారత రచన చేశాడు .అన్ని వర్ణాలవారు జాతులవారు  లింగ వయో భేదం లేకుండా ఆచరించదగిన  ధర్మాలు  ధర్మ సూక్ష్మాలు చిన్న చిన్న కథలలో చెప్పాడు .

దీనితో తృప్తిపడక జ్ఞానులకు పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవటానికి 545 బ్రహ్మ సూత్రాలు రాశాడు. దీనికి శంకరాచార్య భాష్యం రాశారు ..అష్టాదశ అంటే 18 పురాణాలు రచించాడు. వేదానికి అంతాలైన ఉపనిషత్తులు రాశాడు.వీటిలో దశోపనిషత్తులకు శంకర భాష్యం ఉంది . అంతా బాగానే ఉంది కానీ సర్వ వ్యాపకుడైన పరమేశ్వరుడి గురించి భక్తి తాత్పర్యాలతో రాయలేక పోయానని చింతి స్తుంటే నారద ముని హితోపదేశం తో శ్రీ విష్ణు లీలామృతమైన శ్రీ మద్ భాగవతం రాశాడు ..దీన్ని పోతనామాత్యుడు మందార మకరంద తుందిలంగా తెలుగులోకి అనువదించాడు .భారతాన్ని నన్నయ తిక్కన ఎర్రనలనే కవిత్రయం అనువదించారు ..ఇవన్నీ లోక శ్రేయస్సుకోసం రాయబడినవే .భారతం హరివంశం కలిపి 1 లక్షా 25 వేలు ,పురాణాల్లో 5 లక్షల శ్లోకాలు మొత్తం 6 లక్షల 25 వేల శ్లోకాలు రాశాడు భగవాన్ వేదం వ్యాసుడు .. భారతం చివరలో వ్యాసుడు  -’’యదాహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి సతత్  క్వచిత్ ‘’ అని ఒక ప్రతిజ్ఞ చేశాడు-అంటే ‘’భారతం లో లేనిది ఎక్కడా ఉండదు -ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదు ‘’శాంతి ఆనుశాశానిక స్వర్గా రోహణ పర్వలలో 26 వేల  శ్లోకాలలో  రాజనీతి,ఆపద్ధర్మాలు ,దాన0  ధర్మం ,మోక్షప్రాప్తి,స్త్రీ ధర్మాలు విడి విడిగా చెప్పాడు .అంటే పాత్రలచేత చెప్పించాడు .భారతం లోని పాత్రలు మనమే. మన ఇళ్లల్లో జరిగే కథయే భారత కధ ..

ఇన్ని ఇన్ని రకాలుగా చెప్పినా పెడ  చెవిని పెట్టి వారిని చూసి జాలితో బాధతో వ్యధతో ‘’ఊర్ధ్వ బాహుః విరోమ్యేష నహి కశ్చిత్ శృణోతిమే -పరోపకారాయ పుణ్యాయ ,పాపాయి పర పీడనం ‘’అని చేతు  లెత్తి మొక్కాడు -అంటే‘’ఇతరులకు మేలు చేస్తే పుణ్యం -ఇతరులను బాధిస్తే పాపం  ‘’అని చేతులు పైకెత్తి నెత్తీ నోరూ మొత్తుకున్నా నా మాట ఎవరూ వినటం లేదే ‘’అని పరితపించాడు  ఆ విశాల దయార్ద్ర హృదయుడు వ్యాస భగవానుడు .

భారతం లో వ్యాస పాత్ర

భారత రచన చేయటమేకాక అందులో తానూ పాత్రధారియే వ్యాసుడు .తల్లికిచ్చిన మాటకోసం కురు వంశాన్ని నిలపటానికి పాండవ ధృతరాష్ట్ర విదురులకు జన్మ నిచ్చాడు .అవసరమైనప్పుడు రంగ ప్రవేశం చేసి ధర్మ సూక్ష్మాలు  చెప్పాడు అర్జునుడు మత్శ్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని దక్కించుకొంటే ధర్మరాజు ఆమె సోదరులందరికి భార్య  అవ్వాలంటే ద్రుపదుడు వ్యాసుడిని తలచుకొంటే వచ్చి ఆమె సామాన్య మానవ స్త్రీ కాదు అయోనిజ యాజ్ఞ సేనీ  కనుక పంచ భర్త్రుక అవటం లో తప్పు లేదని తీర్పు చెప్పాడు .వనవాసం లో పాండవులు కస్టాలు పడుతూ ప్రార్ధిస్తే ‘’మీకే కాదు కస్టాలు మీ ముందు నలమహారాజు దమయంతి ఎన్నో కష్టాలుపడి చివరికి సుఖపడ్డారని ఆ కద చెప్పి ఊరట కలిగిచాడు .అర్జుడిని శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించమని సలహా ఇచ్చాడు .కురుపాండ బలాలను బేరీజు వేసి చెప్పమని గుడ్డిరాజు కోరితే ధర్మ0  కృష్ణ రూపం లో పాండవుల వద్ద ఉంది ధర్మం ఉన్న చోట విజయం తప్పదు అని నిష్కర్షగా చెప్పాడు ..కురుక్షేత్ర సంగ్రామం ముందు వచ్చి ‘’నువ్వు తెచ్చిన యుద్ధం యెంత అనర్ధాన్ని తెస్తోందో చాడాలని ఉంటే కళ్ళు ఇస్తానంటాడు .చేసిన తప్పు తెలుసు కనుక తాను ఆ భీభత్సాన్ని చూసి తట్టుకోలేను అంటే సూతుడికి దివ్య దృష్టి ప్రసాదించి యుద్ధాన్ని ప్రత్యక్ష ప్రసారం గా చూసి గుడ్డిరాజుకు  చెప్పించాడు  .

అశ్వత్ధామ కృష్ణార్జునులపై నారాయణాస్త్రం స౦ధించగా వారిద్దరూ  దానికి నమస్కరించగానే అది నిర్వీర్యమై పొతే ,కారణం తెలీక జుట్టు పీక్కొని వ్యాసుని స్మరిస్తే వచ్చి ‘’మీ, మీ శివ పూజా ఫలితం ఇది .వాళ్లిద్దరూ పూర్వ జన్మలో శివుడిని మట్టి లింగంగా చేసి ఆరాధిస్తే, నువ్వు విగ్రహ రూపం లో పూజించావు .  లింగా రాధన సర్వ శ్రేయస్కరం .అది వారిని కాపాడింది ‘’అని ధర్మ సూక్షం చెప్పాడు .వ్యాసునికి ఆంద్ర దేశానికీ సంబంధం ఉంది .ఏడు రోజులు కాశీలో వ్యాసునికి శిష్యులకు భోజనం దొరక్కపోతే కోపం తో కాశీని శపించాలని సంకల్పించి భిక్షా పాత్రను నేలమీద శతధా భిన్నం అయేట్లు పగలకొడితే ముదుసలి సాధ్వీరూపం లో పార్వతీదేవి వచ్చి విందుకు ఆహ్వానించి కమ్మని భోజనం పెడితే అప్పుడు శివపార్వతులు వారి వద్ద ప్రత్యక్షమవగా శివుడు కోపం తో ‘’పుణ్యరాశి కాశీ పైశాపం పెడతావా పొమ్ము నిర్భాగ్య మా యూరి పొలము విడిచి ‘’అని కాశీనుంచి గెంటేస్తే బ్రతిమాలితే, దక్షిణకాశి దాక్షారామం వెళ్లి భీమేశ్వర సేవలో తరించమని చెబితే విడవ లేక విడవ లేక ద్రాక్షారామ చేరగా అక్కడ అగస్త్య మహర్షి ఊరట కలిగిస్తాడు .బాసర సరస్వతీ ఆలయం మనకు తెలుసు.  వ్యాస బాసర అయింది

అలాగే కాశ్మీర్లో ప్రవహించే బియాస్ నది అంటే వ్యాస నది అని అర్ధం . ఇలా ప్రకృతితో మమేక మైనవాడు వ్యాసుడు .

రెండు చిలుకలు సంసార0 చేస్తుంటే ముచ్చటపడి తనకు ఒక కొడుకు కావాలనుకొని హిమాలయాలకు వెళ్లి’’శక్తిని గూర్చి  తీవ్ర తపస్సు చెస్తే ,తపోభ0 గానికి వచ్చిన ఘృతాచి అనే అప్సరస చేసిన ప్రయత్నాలు ఫలించక చిలుక రూపం లో వస్తే రేతస్కలనం జరిగి పుట్టిన కుమారుడే శుకమహర్షి .ఆయన మూతి చిలక మూతిలాగా ఉంటుందంటారు .పుట్టగానే సకలశాస్త్రాలు వచ్చేశాయి. జనకమహా రాజు  వద్ద బ్రహ్మ విద్య నేర్చాడు . పరీక్షిత్తుకు ఏడు రోజులలో మహా భారత కథ అంతా  చెప్పాడు శుకమహర్షి . నిరీహుడు నిస్సంగుడు శుకుడు . తండ్రి పరాశరుని పేర పరాశర సంహిత ఉంది .ఆంజనేయ చరిత్ర అంతా అందులో ఉంటుంది .

ఇంతటి జ్ఞానాన్ని ధర్మాలను నీతులను అక్షరరూపం గా ప్రసాదించిన భారత జాతి వ్యాసభగవానునికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు  కనీసం వ్యాస పూర్ణిమ నాడైనా ఆ గురుమహారాజు ను స్మరిద్దాం .ఇలాంటి అరుదైన అవకాశం అమెరికాలో షార్లెట్ లో సరసభారతి 104 వ సమావేశంగా వ్యాస జయంతిని తమ ఇంట్లో  జరిపించిన  రాంకీ  ఉషా ద0పతులకు ,ఆసక్తిగా వచ్చి పాల్గొన్న వారందరికీ సరసభారతి ధన్యవాదాలు తెలియ జేసింది  .ప్రతి సంవత్సరం మా అమ్మాయి శ్రీమతి  విజయ లక్ష్మి  అల్లుడు శ్రీ అవధాని శంకర జయంతి జరుపుతున్నట్లే వ్యాస జయంతి ని గురుపౌర్ణమిగా నిర్వహించాలని ఈ దంపతులను కోరుతున్నాను ‘’

అని చెప్పి ఇక్కడ భారతీయ సంస్కృతిని ఆచరిస్తూ నిలబెడుతున్న చి అడుసుమిల్లి రామకృష్ణ(రాంకీ ) కు సరసభారతి ఆనందంగా ‘’సంస్కృతీ ప్రదీపక  ‘’బిరుదు ప్రదానం చేస్తున్నానని  అనగానే అందరు హర్ష ధ్వానాలతో చప్పట్లు మోగించారు .సరసభారతి గ్రంధం ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 (రెండవ భాగం ) రాంకీ దంపతులకు మా ద0పతులం కానుకగా అంద  జేశాము . మంత్ర పుష్పం తో కార్యక్రమం పూర్తయింది .

27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాసజయంతి సందర్భంగా సరసభారతి 128 వ సమావేశంగా ఉదయం 8 గంటలకు శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాస జయంతి నిర్వహిస్తోంది .వ్యాస  అష్టోత్తర పూజ ,విష్ణు సహస్రనామ పూజ నిర్వహించి ,తర్వాత భగవద్గీత ఫేం కుమారి మాది రాజు  బిందు వెంకట దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయిస్తున్నాము .

27-7-18  శుక్రవారం వ్యాసజయంతి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3

తీరాంద్ర లో అగ్ని స్టోమం అనేక రకాల అగ్ని చయనం తో చేస్తారు .దీనినే సూక్ష్మ౦ గా ‘’చయనం ‘’అంటారు .వేలాది ఇటుకలను దీనికి వాడుతారు .అడుగున  స్యేన అంటే ఎగిరే గరుడ పక్షి ఆకారం గా చేస్తారు .దీన్ని స్యేన చితి అంటారు .అయిదు అంతస్తులలో ఇటుకలుపేర్చి ,అగ్ని హోత్రం చేయటానికి అనువుగా తయారు చేస్తారు .అగ్ని దేవుడికి ,పురుష ప్రజాపతికి హవిస్సులు సమర్పిస్తారు .శుక్ల యజుర్వేదానికి చెందిన శతపధ బ్రాహ్మణం అగ్ని చయనం పై విస్తృతంగా వివరించింది .పాశ్చాత్యులకు ఇది బాగా అర్ధమైన విషయం .చయనం చేసేవారు అగ్నిని తీసుకురావటానికి’’ ఉక్ష’’ అనే బూర్లమూకుడు లాంటి దానిని ఉపయోగిస్తారు .కానీ కోనసీమ బ్రాహ్మణ్యం తైత్తిరీయ విధానాన్నే ఉపయోగిస్తారు .అగ్ని చయనం అందర్నీ విశేషంగా ఆకర్షిస్తుంది .1975 లో కేరళ నంబూద్రి బ్రాహ్మణులు చేసిన అగ్ని చయనాన్నిఫ్రిట్స్ స్టాల్ ,రాబర్ట్ గార్డే నర్ లు రెండుభాగాల అతి పెద్ద గ్రంథంగా చిత్రాలతో సహా ముద్రించారు .దీనినే ‘’అల్టార్ ఆఫ్ ఫైర్’’ సినిమాగా కూడా తీశారు .దీన్ని’’ అతి ప్రాచీన  సజీవ సాక్షాత్కార చివరి  క్రతువు’’గా పేర్కొన్నారు .  ఆంధ్రాలోమాత్రం ఏమాత్రం మార్పులు లేకుండా అగ్ని చయనం చేస్తూనే ఉన్నారు .చయనం  చేసినవారిని గౌరవంగా చయనులు అని  సంబోధిస్తారు.

అగ్ని చయనం తర్వాత ఆంధ్రలో ‘’వాజపేయం ‘’ప్రాముఖ్యత పొందింది .17 మంది ప్రజాపతులకు హవిస్సులు అందజేసే కార్యమిది .17 రోజుల దీక్షతో చేస్తారు .ప్రతిరోజూ సుర ను బియ్యం ,లేక బార్లీ  లేకచిరు ధాన్యాలను  పులియబెట్టి తయారు చేస్తారు .దీన్నే కిణ్వన ప్రక్రియ లేక ఫెర్మెంటేషన్ అంటారు .చివరి రోజు సోమలతను  పిండి  సోమ రసం తయారు చేసి మంత్రాలను చదువుతూ ఆహుతులుగా సమర్పిస్తారు .ఒకప్పుడు నల్లమేకను బలి ఇచ్చేవారు .యజమాని, భార్య కలిసి యూప స్థంభం ఎక్కి తమకు అమరత్వం సిద్ధి౦చి౦దని ప్రకటించటం ఇందులో పరాకాష్ట . దీనికి పైమెట్టుగా’’ పౌ౦డరీక౦’’అనే క్రతువు ఉంది .ఇది 40 రోజుల దీక్షతో చేసేది.ఈ క్రతువులన్నీ ఎన్నో రోజుల ముందు ఆలోచన,,వస్తుసేకరణ ,తగిన  ప్రణాళిక లతో చేయాల్సినవి .వీటికి హోత, అధ్వర్యుడు ,ఉద్గారుడు ,బ్రాహ్మణులు కావాలి .మహావేది నిర్మాణం చేయాలి .ఎంతో డబ్బు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం .అందరికీ వారి వారి అర్హతను బట్టి దక్షిణ సమర్పించాలి .పై నలుగురిలో ప్రతి ఒక్కరికీ ముగ్గురేసి సహాయకులు కావాలి .అంటే 16 మంది ఉండాలి 17 వవారు కొన్ని ప్రత్యేక విధులు చేస్తారు .18 వ వారు సదస్యం నిర్వహిస్తారు .వీళ్ళందర్నీ యజమాని అందులో నిష్ణాతులైన వారి సలహాతో  ఎంపిక చేస్తాడు .ఇతనినే సోమప్రవాకుడు అంటారు .ఇందులో ఏమాత్రం దోషం జరిగినా తాను పాపకూపం లో పడినట్లు భావిస్తారు .

ఆహితాగ్నికి ఒకరు సహాయంగా ఉంటె చాలు. కొడుకు కాని  తమ్ముడుకాని దగ్గర బంధువుకాని పనికొస్తాడు .ఇష్టిని పాడ్యమి ,పౌర్ణమి నాడు చేస్తారు  .పంటలకాలం లో ‘’అగ్రయనం’’చేస్తారు .దీనికి యజమాని ఆధ్వర్య , హోత,బ్రాహ్మణ ,ఆగ్నీధ్ర లను ఏర్పాటు చేసుకోవాలి .ఆగ్నీధ్ర అధ్వర్యుడికి సాయం గా ఉంటాడు .అగ్రహారం లోని ఇతర ఆహితాగ్ని లను దీనికి వినియోగించుకో వచ్చు .ఆధ్వర్యుడు ,హోతా ఇద్దరు ఉంటే చాలు అని ఆపస్తంభ సూత్రాలు చెబుతున్నాయి

కోన సీమలోని శ్రీరామ పురం,ఇరగవరం ,కామేశ్వరి,వ్యాఘ్రేశ్వరం  అగ్రహారాలలో ఆహితాగ్నులు అగ్ని హోత్రం అంతటి పవిత్రులు . వీరి గురించి వరుసగా తెలుసుకొందాం .

సశేషం

27-7-18 శుక్రవారం గురుపౌర్ణమి వ్యాస జయంతి శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-18 –ఉయ్యూరు

 

 

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం –హోషంగాబాద్

శ్రీ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం –హోషంగాబాద్

మధ్యప్రదేశ్ లో నర్మదా పురం అనబడే హోషంగా బాద్ నర్మదానదీ తీరాన ఉన్న అందమైన పట్టణం .ఇక్కడున్న నర్మదానది ఘాట్లు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి .ముఖ్యంగా ‘’సెతాంగి ఘాట్ ‘’అందాలొలక బోస్తూ  పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది .హోషా౦గ్ షా అనే మొదటి మాల్వా రాజు పేరిట నర్మదానగర్ ను హోషంగాబాద్ గా  మార్చారు.నర్మదా నది ఒడ్డునున్న సత్సంగ భవనం లో సాదు ,సంతులు తరచుగా సమావేశమై ధర్మ చింతన చేస్తూ ప్రజలకు మార్గ దర్శనం చేస్తారు .ముఖ్యంగా తులసీ దాసు రచించిన రామ చరితమానస్,భగవద్గీత లపై చర్చలు జరుగుతాయి .దగ్గరలో పచ్ మర్హి అనే హిల్ స్టేషన్ కూడా ఉంది .ఇక్కడే సాత్పురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది .అందమైన ప్రకృతి ని అనుభవించటానికి యాత్రికులు పెద్ద సంఖ్య లో వస్తారు .

హోషంగా బాద్ కు 35 కిలోమీటర్ల దూరం లోని సల్కన్ పూర్ లో  శ్రీ దుర్గా దేవి దేవాలయం ఉంది .భోపాల్ నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు .ఇది వి౦ధ్యవాసిని బీజసాన్ దేవి యొక్క సిద్ధ పీఠం .వెయ్యిమెట్లున్న కొండపై వెలసిన మాతను దర్శించటానికి నిత్యం వేలాది  భక్త జనం వస్తారు .ఆమె కరుణ ఉంటె తమజీవితాలకు ఏ ఢోకా ఉండదని  వారి విశ్వాసం .నవరాత్రి దినాలలో సల్కాన్ పూర్ లో అమ్మవారికి బ్రహ్మాండమైన ఉత్సవాలు నిర్వహిస్తారు .లక్షలాది భక్తులు సందర్శించి ధన్యులౌతారు .

పురాణకధనం  ప్రకారం రక్తబీజ రాక్షస సంహారం చేశాక అమ్మవారు ఇక్కడికి వచ్చి విజయ దరహాసం తో కూర్చున్నది .కనుక ఆయుద్ధ అవశేషాలు ఇక్కడ గోచరిస్తాయి .’’సల్కాన్ దేవి ధాం రోప్ వే’’కూడా ఇక్కడ ఉండటం తో యాత్రికులు కొండమెట్లు ఎక్కి ఆయాసపడకుండా తేలికగా దేవాలయానికి చేరి అమ్మవారిని దర్శించుకో వచ్చు .అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటి అయిన ఈ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా మాత  క్షేత్రం తప్పక దర్శించి తరించాల్సినది .

 

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

—


Posted in రచనలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2

               ఆహితాగ్ని దిన చర్య

శ్రౌతం నేర్చిన వారు సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటి౦చి ఆహితాగ్నిగా ఉంటారు .త్రేతాగ్నులను అర్చిస్తారు .రోజుకు రె౦డుసార్లు వేడిపాలను అగ్నిహోత్రానికి సమర్పిస్తారు .తర్వాత  అగ్ని స్టోమం చేస్తారు .భారత, నేపాల్ దేశాలలో ఉన్న ఆహితాగ్నుల సంఖ్య 626 అయితే అందులో ఆంద్ర ప్రాంతం లోనే 200 మంది ఉన్నట్లు తెలుస్తోంది .శ్రౌత కర్మ విధానం గృహిణి తో చేసే క్లిష్ట విధానం .వీరి భాషకూడా ప్రత్యేకంగా ఉంటుంది .నిత్యకర్మలని, కామ్య కర్మలనే మాటలు వాడుతారు .నిత్యకర్మ విధిగా తాను ఆచరి౦ చాల్సినది .కామ్యకర్మ మనసులో ఉన్న కోర్కె ఫలించటానికి చేసేదిగా భావించవచ్చు .దీన్ని నైమిత్తికం అనీ అంటారు .అంటే జాతకర్మ ,అంత్యక్రియ ,ఆయుర్ వృద్ధి ,ఆరోగ్యాభి వృద్ధి లకోసం చేసేవి .వీటికి ప్రాయశ్చిత్తా లు  కూడా చేయాలి  .

  వేద విహిత కర్మలను చేసేవారిని శ్రౌత లేక యజమాని అంటారు .యజమాని అర్దాంగితో కలిసి ఉదయమే ఔపోసనాగ్నిని ఆధానం చేయాలి .దీనితో త్రేతాగ్నులను అర్చించాలి .ఇంట్లోని ప్ర త్యేక గదిలో పడమర వైపు గుండ్రని గార్హ పత్య అగ్నిఅంటే వంట చేసుకునే అగ్ని ,తూర్పున చతురస్రాకారపు ఆహవనీయ ,దక్షిణాన దక్షిణాగ్ని లను మట్టిముద్దలతో   ఏర్పాటు చేసుకొంటారు  . ఒకదానికొకటి సంబంధం ఉండేట్లు మధ్యలో వేది ఉంటుంది .వేది అంటే హోమ ద్రవ్యాలు ఉంచే ప్రదేశం .ఈ పవిత్ర అగ్ని హోత్రాలు దంపతులు ప్రత్యేకంగా సంరక్షించు కోనేవి మాత్రమె .కుటుంబం లోని వారు ,సహకరించేవారు  మాత్రమేవీటిని చూడటానికి అర్హులు .మిగిలవారెవ్వరికీ ఈ గదిలో ప్రవేశం ఉండదు .దంపతులలో ఒకరు మరణించేదాకా ఇంతే .మరణిస్తే వాటిని తొలగిస్తారు .ఆ ఇంటికి మాత్రమే ఆ అగ్ని హోత్రం ప్రత్యేకం అని భావం .అగ్ని వారికి ప్రత్యక్ష దైవం .

  ఆహితాగ్ని భార్యతో ఔపోసనాగ్ని తో  నిత్యాగ్ని హోమం చేస్తూ అంటే గార్హపత్యాగ్నిని కొలుస్తాడు.అగ్ని హోత్ర గోవును సూర్యోదయ ,సూర్యాస్తమయ వేళలో పాలు పితికి ,అగ్నికార్యం నిర్వహించి ,నైవేద్యం పెట్టగా మిగిలిన వాటిని ఉదయ ,సాయం వేళల ప్రసాదంగా కుటుంబం అంతా స్వీకరిస్తారు .అగ్ని హోత్రం లో సమిధలు వేయటమూ ఒక పవిత్ర కార్యమే .ఉదయ సాయం సంధ్యలలో సంధ్యావందనం ,అగ్ని హోత్రం  వైశ్వ దేవం చేస్తూ దేవతలందరి కి సంతుష్టి కలిగిస్తారు .సాంకేతికంగా వివాహమైన నవ దంపతులు అగ్ని హోత్రి లుగా , ఆ ఇంటి గార్హ పత్యాగ్ని ఆరాధనకు అర్హులవుతారు .గార్హ పత్యాగ్ని తో పాలను వేడి చేసి ఆహవనీయ అగ్నికి సమర్పిస్తారు .దంపతులు ఆధానం తో   త్రేతాగ్ని  అర్చన చేస్తారు . ఒక్కొక్క దంపతులు తమ జీవితకాలం లో ఇలా అనేక వేలసార్లు చేయటం జరుగుతుంది .ఉదయం సూర్య ,ప్రజాపతి లకు ,సాయంత్రం అగ్ని,ప్రజాపతి లకు హవిస్సులు సమర్పిస్తారు .15 రోజులకొకసారి ‘’దర్శ పూర్ణ మాస ‘’ను ,ఇష్టి ని నిర్వహించి దేవతలకు హవిస్సు సమర్పిస్తారు అగ్నికి సోమకు చేసేదే అగ్ని స్టోమం ,అగ్ని ఇంద్రులకూ ,అగ్నికి ,ప్రజాపతి కి ప్రత్యేకంగా కూడా చేస్తారు .బియ్యపు పిండికి నీళ్లుకలిపి గుడ్రంగా తట్టి  గార్హ పత్యాగ్ని లో ఉడికించి కూడా పురొడాశ౦ గా దేవతలకు  సమర్పిస్తారు .పాలతో పాటు ఇదీ ప్రసాదంగా భుజిస్తారు .

  ఇలా నిత్యం అగ్ని ఆధానం ,అగ్ని హోత్రం పక్షానికోసారి ఇష్టి తోపాటు మిగిలిన నిత్య కార్యాలు చేస్తారు .ఒక ఏడాది దీక్షగా త్రేతాగ్ని హోత్రం చేసిన దంపతులు ఇంట్లోనే కాక బయటకూడా శ్రౌతకర్మలు చేయటానికి అర్హులౌతారు  .బయటి దాన్ని అగ్ని క్షేత్రమని ,అక్కడి అగ్ని ని మహా వేది అనీ అంటారు .దీనికి ముందు అగ్ని స్టోమం చేసి అర్హత సాధించాలి .సోమరసం తయారు చేసి అగ్నికి ఆహుతిగా ఇవ్వాలి .పశుబలికూడా  ఉండేది కాని ఇప్పుడు అమలు లో లేదు .ముంజ లేక దర్భ తాడు భర్త నడుం చుట్టూ కట్టుకోవాలి. యోక్త్రను భార్య నడుముకు కట్టాలి .అప్పుడు అగ్నిస్టోమం చేయాలి .సోమలత దొరకటం కష్టం కనుక ఇప్పుడు వేర్వేరు లతలను  ఉపయోగిస్తున్నారు .సోమలతను గొప్ప అతిధిగా మహారాజుగా భావించి గౌరవంగా స్వాగతం పలుకుతారు .అయిదవ రోజు సవనం చేస్తారు.అంటే తీగను పిండటం చేస్తాడు అధ్వర్యుడు .సామవేదం లోని 12 సూత్రాలను ,12యజుర్వేద మంత్రాలను  స్తోత్రంగా గానం చేస్తారు . సోమరసాన్ని వడపోసి మొదట కుండలోను తర్వాత కోయ్యపాత్రలైన చమస్సులలోను పోసి అగ్నికి ఆహుతిస్తారు .తర్వాత సోమరసం త్రాగుతారు .రెండవసారికూడా ఇలానే చేస్తారు .ఇలా అగ్నిస్టోమం పూర్తయ్యాక అవ భ్రుత స్నాన విది ఉంటుంది .దీనితో పూర్తిగా దంపతులు పరమ పవిత్రులౌతారు .ఇదంతా జనన ,మరణాలకు  ప్రతీకగా భావిస్తారు.దీన్ని చేసిన దంపతులకు కొత్తపేర్లు పెడతారు .సోమాన్ని అగ్ని హోత్రానికి సమర్పించినందువలన ఆయనను సోమయాజి లేక సోమయాజులు  అనీ , ఆమెను సోమిదేవమ్మ అనీ పిలుస్తారు. మొదటినుంచీ ఉన్న పేర్లతో ఇక పిలవనే పిలవరు .

  సశేషం

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-18 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రహ్మజ్ఞాన యోగి బ్రహ్మస్వామి -గబ్బిట దుర్గాప్రసాద్ -జులై -గురు సాయి స్థాన్ పత్రిక

బ్రహ్మజ్ఞాన యోగి బ్రహ్మస్వామి -జులై -గురు సాయి స్థాన్ పత్రిక

”సిద్ద యోగి పుంగవులు ”అని నేను రాసిన పుస్తకం లోని ”బ్రహ్మజ్ఞానయోగి  బ్రహ్మస్వామి ”వ్యాసం జులై నెల ”గురు సాయి స్థాన్” పత్రికలో
పునర్ముద్రితం -దుర్గాప్రసాద్
Posted in రచనలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1

అసలే అందాల సీమలు .ప్రకృతి సోయగాలకు ఆటపట్టులు .ముక్కారు పంటలకు నిలయాలు .పవిత్ర దేవాలయ క్షేత్రాలు .కొబ్బరి తోటల పరవశాలు .ఒక్కసారి చూస్తె అక్కడి నుండి రాబుద్ధి పుట్టని ఆకర్షణ విలసితాలు కోనసీమ సీమలు .మరి వీటికి తోడు పవిత్రతా కలిస్తే,వేద గానాలు పరవశి౦పజేస్తే ,వీటికి మరింత శోభ తెచ్చే నిత్యాగ్ని హోత్రాలు ప్రజ్వరిల్లు తుంటే, ఆహితాగ్నులు పవిత్రాగ్నులను కంటికి రెప్ప లాగా కాపాడుకొంటూ ఉంటె ఇక ఆ అనుభవం ,అనుభూతి మరువగలమా !  అప్పుడు అది భూలోక స్వర్గం అనటం చాలుతుందా?చాలనే చాలదు .అందుకే ‘’కోనసీమ అందాలకు వేద పవిత్ర సొబగులు,సౌరభాలు అలదినట్లు౦ టాయని అన్నాను .దీనికి కారణభూతులు అక్కడి  ఆహితాగ్నులు .ఆహితాగ్ని అంటే గృహం లో పవిత్రాగ్నిని అంటే వేద సంస్కాం ప్రకారం అగ్ని హోత్రాన్ని ఉంచుకున్నవాడు అని నిఘంటు అర్ధం .అగ్ని హోత్రాన్ని కాపాడే వాడు .ఆయననే సోమయాజి అనీ అంటారు .ఆహితాగ్నులు కోనసీమ ప్రాంతం లో ఉన్న బ్రాహ్మణ అగ్రహారాలలో ఉంటారు .వీరిని ‘’వేదం లో ఉన్నవారు ‘’అనీ పిలుస్తారు .వారు కూడా ‘’నేను వేదం లో ఉన్నాను ‘’అని చెప్పుకొంటారు .అది గౌరవం .గర్భాస్టమం  లో ఉపనయన సంస్కారం జరిగి ,త్రికాల సంధ్యావందనం ,అగ్ని కార్యం  చేస్తూ ,గురువు వద్ద ఉంటూ  82పన్నాల తైత్తిరీయ సంహిత ను ఎనిమిది నుంచి పన్నెండేళ్ళు లో నేర్చుకొంటారు .మధుకర వృత్తి నవలంబించి ,దానినే భుజిస్తాడు .తెల్లవారు ఝామున 4 గంటలకే కాలకృత్యాదులు తీర్చుకొని గురువు ఎదుట కూర్చుని  ఆయన చెప్పింది మరలా చెబుతూ అంటే ‘’సమవర్తన ‘’చేస్తూ నేరుస్తాడు .ఇదంతా బ్రహ్మ చర్యం లో  పూర్తవుతుంది .

రెండవ గృహస్థాశ్రమ౦ లోకి ప్రవేశించటానికి అగ్ని సాక్షిగా పెద్దలు కుదిర్చిన  అనుకూల వతిఅయిన కన్యను భార్యగా పొంది గృహస్తు అవుతాడు .అర్దాంగితో నిత్య౦అగ్నిని ఆరాధిస్తాడు దీనిని గార్హస్పత్యాగ్ని అంటారు .అతడికి ఇంకా చదవాలని నేర్చుకోవాలని ఉంటె అగ్రహారం లోనే చెప్పగలిగిన గురువు వద్ద చేరి నేరుస్తాడు .లేక బయటి ప్రదేశాలకు వెళ్లి నేర్చుకుంటాడు పాఠం ,పద పాఠం ,క్రమ పాఠం లలో నిష్ణాతులౌతారు ఎక్కువ మంది ఇక్కడే ఆగి పోయి పరీక్షలకు హాజరై ,సర్టిఫికెట్లు పొంది సంతృప్తి చెందుతారు .ఇంకా ముందుకు పోవాలనుకోనేవారు ఇంతకన్నా కష్టమైన ఘన పాఠం నేర్చుకుంటారు .దీన్ని సాధించిన వారిని’’ ఘన పాటి ‘’లేక’’ ఘనా పాఠి ‘’అంటారు .వీరు వేదసభల్లో ,పండిత సభలో ఉపనయన, వివాహకార్యక్రమాలో  పాల్గొని తమ విద్య ప్రదర్శించి బహుమతులు పొందుతారు .దీని పైది ‘’జటాపాఠం’’అనే మరింత క్లిష్ట ప్రక్రియ .ఎక్కువమంది దీన్ని నేర్చే ప్రయత్నం చేసినా బహు కొద్ది మందే దీని అంతు చూడగలిగి నిష్ణాతులవుతారు  .కేరళలో ‘’రధపాఠం ‘’అనే మరో ప్రక్రియ ఉంది .దీన్ని నంబూద్రి బ్రాహ్మణులు ఎక్కువగా నేరుస్తారు .కాని తీరాంద్రలేక సాగరాంధ్ర  లో అలవాటులో లేదు .

తైత్తిరీయ సంహిత ,బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ,ఉపనిషత్తుల ను సంపూర్తిగా నేర్చినవారు ,మిగిలిన వేదాలను వాని శాఖలను నేరుస్తారు .ఋగ్వేదంను అదే గురువుకాని  వేరొక గురువు వద్దకానీ అభ్యసిస్తారు .ఇంకా ఉత్సాహముంటే సామ వేదాన్ని నేర్చుకుంటారు .ఇది సోమ క్రతువులకు తప్పని సరి .గాన విధానం ఇందులో ప్రత్యేకత . ఇందులో జైమినేయ ,కౌతుమ ,రనయనీయ శాఖలలో అద్వితీయులయ్యే ప్రయత్నం చేస్తారు .

వేదం లోని లోతులను  తరచటానికి ఈ ముఖీయ అధ్యయనం పెద్దగా తోడ్పడదు .అందుకని మీమాంస ,వ్యాకరణాలు  చదివి వేదార్ధ ప్రవీణులౌతారు . వివాహాది కార్యాలు చేయించటానికి స్మార్తం నేరుస్తారు.ఆపస్తంభ ధర్మ సూత్రాలను క్షుణ్ణంగా నేర్చుకొంటేనే ఇది సాధ్యమవుతుంది .మిగిలిన వాటిలో కూడా  సరి ఫికెట్లు కావాలంటే వాటినీ తరచి సాధిస్తారు .పురోహితుడు అనిపించుకుంటాడు .శ్రౌతం లో నిష్ణాతులు రుత్విజులౌతారు .గృహ్య సూత్రాలు నేర్చి నిత్యకర్మలు ఉపనయనాది కార్యాలు చేయిస్తారు. శ్రౌత సూత్రాలు నేరిస్తే యజ్ఞయాగాదులకు పనికొస్తారు .వేదం చదివి పండిత పరీక్షనిచ్చి  ఉత్తీర్ణులైన  వారిని వేదపండితులంటారు .

శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి ఋణం తీర్చుకోలేనిది

అన్నేళ్ళు కస్టపడి వేద విద్యనేర్చి పండితులైతే పొట్ట గడిచేది యెట్లా ?  వారి ఇళ్ళల్లో పొయ్యిలో పిల్లి లేచేదేట్లా .కోనసీమ లో దీనిపై ముందుగా ఆలోచించి పరిష్కార మార్గం కనిపెట్టినవారు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు .ప్రతి దేవాలయం లోనూ వేద పండితుల చేత  సామూహిక వేదపారాయణ రోజుకు కనీసం మూడు గంటలు  చేయించారు ఇలా చేసే ఏర్పాటు చేయాలని  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .దీన్ని గమనించిన ప్రభుత్వం తిరుపతి తిరుమల దేవస్థానం కార్య ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేసింది .దేవాలయాలలో పూజారి ప్రసాదాలు మాత్రమేకాక వేద పారాయణ చేసే పండితులను నియమించింది .శ్రీశైలం, తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ మొదలైన ముఖ్య దేవాలయాలలో ఈ పధకం ముందు ప్రారంభమైంది .నాలుగువేదాలలో నిష్ణాతులైన పండితులు ఎనిమిది మందికి అవకాశాలు లభించాయి .దీనివలన అప్పుల్లో కూరుకుపోయిన బ్రాహ్మణ పండితులకు కొంచెం ఊరట కలిగింది .ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతనం వలన పిల్లల పెళ్ళిళ్ళు చేసే వీలు కలిగింది .ఈ విధానాన్ని కోనసీమలో ప్రారంభింప జేసిన శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి చిత్రపటాన్ని ప్రతి బ్రాహ్మణ కుటుంబలో దేవుని మందిరం లో ఉంచి కృతజ్ఞత లు తెలుపు కుంటోంది.ఆయన్ను ప్రాతస్మరణీయులను చేసుకున్నారు కొనసీమవారు   .పండితులు తమ పిల్లలకు కూడా వేదం విద్యనేర్పిస్తున్నారు ,ఈ వేదపండితులకు పెన్షన్ సౌకర్యం కూడా కలిగించమనే ఆందోళనా ఉన్నది .అయితే ఆహితాగ్నులు మాత్రం ‘’వేదాన్ని పండితులు అమ్ముకుంటున్నారు .ఇది వేద విక్రయం అవుతుంది ‘’అని బాధ పడ్డారు .

భారత దేశ వేద పండితులలో ప్రధమ స్థానం లో ఉన్నవారు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు .1980 లో ఆయన 92వ ఏటకూడా ఆయన కాకినాడ స్వగృహం లో   తైత్తిరీయ సంహితలోని అగ్ని సూత్రాలు ,అశ్వమేధ యాగ మంత్రాలు స్పుటంగా ,ఉచ్చైశ్వరం తో గానం చేశారు .ఎక్కడా తొట్రుపాటు వణుకు లేవట .ఒక మహర్షి మంత్ర పఠనం లాగా ఉందని చూసినవారు ఆశ్చర్య పోయారట .కారణ  జన్ములాయన.దీనికి 74 ఏళ్ళ క్రితం అంటే ఆయన 18 వ ఏటనే ఒక క్రతువుకు అధ్వర్యులుగా ఉన్నారట .ఏమి జన్మ సుకృతం ?

గణపతి శాస్త్రి గగారు కోనసీమలో ప్రారంభించిన  సామూహిక వేదపారాయణ ప్రతివారినీ చైతన్యవంతులను చేసి, వేద విద్య వ్యాప్తి,  వేదపండితసత్కారం తమవిధి అని గుర్తించెట్లు చేసింది  .దీనితో సంక్రమణం నాడులేక నెలకోసారి కాని స్థానిక బ్రాహ్మణ సంఘాలు  వేదపండితులను ఆహ్వానించి మొదటి నలభై నాలుగు పన్నాలలో ఏదో ఒకదాన్ని వల్లించమని కోరేవారు .వారికి సంఘం తగిన పరితోషికమిచ్చి సత్కరించి పంపేది. ఈ సంస్కృతీ  ఆంద్ర దేశమంతటా విస్తరించింది . వీలైన చోట్ల వేదసభలు  శాస్త్రార్ద చర్చలు చేయించి గౌరవిస్తున్నారు  .వాటిని చూసి ఆనంద పారవశ్యం పొందని వారు ఉండరు .కంచి, ,శృంగేరి పీతాదిపతులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహిస్తున్నారు .వేదపండితులు గ్రామ ,పట్టణాలు సందర్శించి తమ విద్వత్తు ప్రదర్శించి తగిన బహుమానాలు అందుకోవటం నేడు సర్వ సాధారణమై పోయింది .ఇదంతా శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రిగారి పూనికా, వేదమాత సేవా భాగ్యమే

దేవాలయాలలో ఘనపండితుడికి నెలకు 1800 ,క్రమ పండితుడికి నెలకు 1500 రూపాయలు గౌరవ భ్రుతి  ఇస్తున్నారు .రిటైరైనవారికి కూడా నెలకు వెయ్యి రూపాయలిస్తున్నారు .వీరికి అమెరికాలో గొప్ప ఆదరణ లభిస్తోంది .కాని కేరళ పండిత  నంబూద్రి కుటుంబాలు మాత్రం అమెరికా వెళ్ళటానికి ఉత్సాహం చూపటం లేదట .ఇప్పటికీ కోనసీమ సంప్రదాయ కుటుంబీకులువేదం లో సర్టి ఫికేట్ ఉన్న కొడుకులను, మనవళ్ళను అమెరికా  పంపటానికి ఇష్టపడటం లేదట . వీరు చెప్పే సామెత ‘’దూరపుకొండలు నునుపు ‘’.వేదపండిత సర్టిఫికేట్ ఉన్నవారినే పంపటానికి ఇష్టపడక పొతే నిత్యాగ్ని హోత్రులైన ఆహితాగ్నులు బయట దేశానికి ఎలా వెడతారు ?వారికి గృహమే స్వర్గ సీమ .వీరి  విశేషాలు తర్వాత తెలుసుకొందాం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

—


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ”

సరసభారతి 128 ఆ కార్యక్రమంగా ”వ్యాస జయంతి ”

27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి గురుపౌర్ణమి వ్యాస జయంతి సందర్భం సరసభారతి 128 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో  ఉదయం 8 గంటలకు ”వ్యాస జయంతి ”నిర్వహిస్తోంది
  కార్యక్రమ వివరాలు
ఉదయం 8 గం లకు -వ్యాస స్తోత్ర పఠనం -విష్ణు సహస్రనామ అష్టోత్తర పూజ
             8-30 గం  లకు – భగవద్గీత ఫేమ్ ,భగవద్గీత గాన ప్రచారాలకు ఇటీవలే మైసూర్ లో దత్త పీఠాదిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి నుండి ”స్వర్ణ పతకం ”పొందిన కుమారి మాది రాజు వెంకట బిందు దత్తశ్రీ (బి.టెక్).చే భగవద్గీత గాన ప్రవచనం  –
 అందరికీ ఆహ్వానం -పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
  గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ,ఆలయ ధర్మకర్త 

—

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు     

చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు

1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి

‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ జ్ఞాపక చిహ్నంగా అంటే స్మృతి చిహ్నంగా   ఆయన భార్య రాణి  ఉదయమతి దీన్ని కట్టించింది  .ఆమె కాలం లో మిగిలిపోయిన దాన్ని కొడుకు రాజాకర్ణ పూర్తి  చేశాడు . 1304 కాలపు జైనకవి  ‘’మేరుతంగ సూరి’’ తన ‘’ప్రబంధ చింతామణి ‘’లో దీనిని ఉదాహరించాడు . సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఈ బావి సరస్వతీ నదికి వచ్చిన వరదలో మట్టిలో పూడుకు పోయి’’మిట్టీమే సోనా ‘’గా మిగిలింది .64 మీటర్ల పొడవు ,20 మీటర్ల వెడల్పు ,27 మీటర్ల లోతుగా ఉన్న ఇది చూడటానికి రాతితో నిర్మించబడిన పెద్ద కోట లా ఉంటుంది .దీనికి అన్నివైపులా ఉన్న స్తంభాలపై భారతీయ చిత్రకళ  అంటే మరు –ఘూర్జర శైలి తాండవం చేస్తుంది .ఏడు అంతస్తుల ఈ బావిలో 500శిల్పాలు ,మరో 800 కళా ఖండాలున్నాయి .వీటిపై దశావతారాలు ,సొల శృంగారం గా ఉన్న 16రకాల  అప్సరసల శిల్పాలు ‘’వావ్! ఇదేం వావ్! ‘’అని పిస్తాయి . ఇంతపెద్ద విశాలమైన ప్రత్యేకమైన కట్టడం అపూర్వం గా భావిస్తారు .ఈ బావిలో కింద చివరి మెట్టువద్ద ఉన్న గేటు నుండి  30 మీటర్ల సొరంగం కూడా మట్టిలో పూడుకు పోయింది .ఈ సొరంగం నుండి వెడితే పఠాన్ వద్ద ఉన్న సిద్ధ పూర్ కు సురక్షితంగా చేరేవారు . ఈ బావి 1980 లో పురావస్తు శాఖ త్రవ్వకాలలో మళ్ళీ వెలుగు చూసింది .యుద్దాలకాలం లో లేక ఆపదలు సంభవించినపుడు రాజా౦తః పుర స్త్రీలు  ఈ సొరంగం ద్వారా తప్పించుకొని బయటకు వెళ్ళేవారు .50 ఏళ్ళక్రితం వరకూ బావి చుట్టూ ఔషధ మొక్కలు ఉండేవి .ఇలాంటి దిగుడుబావులు మంచి నీటికోసమే కాక ఆధ్యాత్మిక చింతనకు , శిల్పకళా వైభవానికిచిహ్నాలు . 2014 యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ బావి చోటు దక్కించుకున్నది .2016 లో ‘’క్లీనెస్ట్ ఐకానిక్ ప్లేస్ ‘’గా అవార్డ్ పొందింది .అందుకే భారత ప్రభుత్వం కొత్తగా ముద్రిస్తున్నవంద రూపాయల నోటు పై స్థానం పొంది కను విందు చేస్తూ ,చారిత్రిక నిదర్శనం గా దర్శనమిస్తోంది

2-అత్యంత  సుందరమైన రాజస్థాన్ లోని చాంద్ బావోరి దిగుడుబావి

రాజస్థాన్ లో జైపూర్ కు 90 కిలోమీటర్లలో అభనేరి గ్రామం లో  చాంద్ బవోరి దిగుడు బావి అత్యంత సుందరం, విశాలమైనది .800-900 కాలపు నికుంభ వంశరాజు రాజా చంద్ర దీన్ని  నిర్మించాడు .13 అంతస్తులతో ,3,500 మెట్లతో’’ హర్షత్ మాత ‘’దేవాలయానికి ఎదురుగా ఉంటుంది .బాలీవుడ్ సినిమాల షూటింగ్ కేంద్రం గా ప్రసిద్ధమై ,ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ అయింది .

3-రాజోం కి బావోలి –ఢిల్లీ

వంద చారిత్రాత్మక కట్టడాలున్న మెహ్రౌలీ ఆర్కిలాజికల్ పార్క్ సమీపం లో రాజోం కి బావోలి దిగుడుబావి రాజుల కట్టడం కాదు కాని 1516 లో దౌలత్ ఖాన్ కు చెందిన తాపీ మేస్త్రీలు కట్టినది .అందానికి, శిల్పకళకు పెట్టిందిపేరు .

4-అగ్రసేన్ కి బావోలి-ఢిల్లీ

60 మీటర్లపోడవు,20 మీటర్ల వెడల్పు ఉన్న ఈ బావి ఢిల్లీ కన్నాట్ ప్లేస్ కు దగ్గరలో ఉంది.10 3 చిన్న రాతి మెట్లుంటాయి .ఎర్రరాయి నిర్మితం .అగ్రసేన మహారాజు మొదట దీన్ని నిర్మిస్తే ,14 వ శతాబ్ది అగర్వాల్ వంశస్తులు పునర్నిర్మించారు .

5- నగర్ సాగర్ కుండ్-బుండి

రాస్తాన్ లో బుండీదగ్గరున్న నగర్ సాగర్ కుండ్  ఎదురెదురు మెట్లతో చోగాన్ గేట్ కు దగ్గర ఉంది .వీటికి జనానా సాగర్ ,గంగా సాగర్ దిగుడు బావులని పేరుండేది .తర్వాత రెండూ కలిపి నగర్ సాగర్ కుండ్ అంటున్నారు .మహారాజా రాం సింగ్ పాలనలో 1871 లోను ,1875 లోనూ మహారాణి చంద్రభాను కుమారి నిర్మించింది

6-అదలాజ్ దిగుడుబావి –అహమ్మదాబాద్

గుజరాత్ రాష్ట్రం అహమ్మదాబాద్ కు సుమారు 20 కిలోమీటర్ల దూరం లో ‘’ఆదలాజ్ ని వావి ‘’ఉన్నది .దీనికి వెనుక విషాద గాధ ఒకటి ఉన్నది .ఈ ప్రాంతపు పాలకుడు దండైదేశ్ దీని నిర్మాణం మొదలు పెట్టగా 1499 లో ఒక ముస్లిం రాజు అతన్ని ఓడించి ,ఆ ప్రాంతాన్ని ఆక్రమించి ధ్వంసం చేశాడు .ముస్లిం రాజు కు ఓడిపోయిన హిందూ రాజు భార్యరాణి పై వ్యామోహం కలిగి కోరిక తెలియజేశాడు .ఆమె తనభర్త మొదలు పెట్టిన బావి ని ఆయన స్మృతి చిహ్నంగా పూర్తిచేస్తే అతడిని వివాహమాడతానని కబురు చేసింది . నమ్మిన ముస్లిం రాజు హిందూ ముస్లిం సంయుక్త శిల్పకళతో ఆ బావిని పూర్తిచేశాడు .బావి పూర్తి అవగానే రాణి అమాంతంగా అందులోకి దూకి మరణించింది .

7- రాణీ జీకి బావోరి –బుండి

రాజస్థాన్ బుండి లో రాణీ జీకి బావోరి అనే దిగుడుబావి గుజరాత్ లోని ప్రసిద్ధ రాణి కి వావ్ లాగా ఉంటుంది .1699 లో రాణి నాధావతి దీన్ని నిర్మించటం వలన ఆ పేరొచ్చింది .బుండీ లో దిగుడుబావులు చాలా ఉండటం చేత దాన్ని’’ దిగుడుబావుల నగరం’’ అంటారు .అక్కడి 50 బావుల్లో రాణి నాధావతి కట్టించినవే 21 ఉండటం విశేషం

8- తూర్ జి కా  ఝల్రా –రాజస్థాన్

1740 లో చారిత్రాత్మక కట్టడంగా నిర్మించబడిన తూర్ జీ కా ఝల్రా ఇటీవలికాలం లో త్రవ్వకాలలో బయట పడింది .స్వచ్చమైన జలం తో మిలమిల మెరిసే చేపలతో సుందరా తిసుందరంగా ఉంటుంది .

9-పన్నా మీనా కా బావోలి-అమేర్

రాజస్థాన్ జైపూర్-అమెర్ రోడ్డుపై అమేర్ లో పన్నా మీనాకా కుండ్ ఎనిమిది అంతస్తుల దిగుడుబావి.16 వ శతాబ్ది కట్టడం .నీటికోసమే కాకుండా,జలకాలాటలకు , ప్రశాంతంగా విశ్రాంతి గా  కూర్చోటానికి ,సమావేశాలు జరుపుకోవటానికి కూడా బాగుంటుంది.

10-లక్కుండి దిగుడుబావి- కర్నాటక

కర్ణాటకలో హంపీకి వెళ్ళే దారిలో లక్కుండి చిన్న గ్రామం .ఇది చాళుక్య దేవాలయాలకు ప్రసిద్ధి . టూరిజం డిపార్ట్ మెంట్ కు దీనిపై దృష్టి పడకపోవటం విడ్డూరం .కాని చరిత్ర ,పురావస్తు అభిమానుల పాలిటి దివ్యవరం ఇది .ఈ ప్రాంతం లో 100 దిగుడు బావులున్నాయి .దేనికదే ప్రత్యేకతతో శోభిస్తుంది .

11-సూర్యకుండ్ –మొధేరా

గుజరాత్ లో మోదేరావద్ద సూర్యకుండ్  దిగుడుబావి సూర్య దేవాలయం సమీపాన ఉంది .పుష్పావతి నది ఒడ్డున భీమదేవ మహారాజు 1026 లో నిర్మించాడు .ఇప్పుడు పురావస్తు శాఖ అధీనం లో ఉంది .రేఖాగణిత శాస్త్రానికి ఇది గొప్ప ఉదాహరణగా భావిస్తారు

12 హంపి పుష్కరిణి –కర్నాటక

చాళుక్య శిల్పకలళావైభవానికి అద్దంపట్టే దిగుడుబావి హంపీ పుష్కరిణి .  15 వశతాబ్ది కట్టడం .రోమన్ శిల్పకళ లో ఎలా నీటిని పారించే తూములు ఉండేవో  అలానే దీన్ని నింపటానికి వ్యవస్థ ఉంది .నల్లరాతికట్టడం .కళ హంగులు లేకుండా అత్యంత సాధారణంగా జ్యామితి ని దృష్టిలో పెట్టుకొని ఉదాహరణగా తీర్చి దిద్దబడిన దిగుడుబావి ఇది .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-18- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు     

   చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు

1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి

‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ జ్ఞాపక చిహ్నంగా అంటే స్మృతి చిహ్నంగా   ఆయన భార్య రాణి  ఉదయమతి దీన్ని కట్టించింది  .ఆమె కాలం లో మిగిలిపోయిన దాన్ని కొడుకు రాజాకర్ణ పూర్తి  చేశాడు . 1304 కాలపు జైనకవి  ‘’మేరుతంగ సూరి’’ తన ‘’ప్రబంధ చింతామణి ‘’లో దీనిని ఉదాహరించాడు . సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఈ బావి సరస్వతీ నదికి వచ్చిన వరదలో మట్టిలో పూడుకు పోయి’’మిట్టీమే సోనా ‘’గా మిగిలింది .64 మీటర్ల పొడవు ,20 మీటర్ల వెడల్పు ,27 మీటర్ల లోతుగా ఉన్న ఇది చూడటానికి రాతితో నిర్మించబడిన పెద్ద కోట లా ఉంటుంది .దీనికి అన్నివైపులా ఉన్న స్తంభాలపై భారతీయ చిత్రకళ  అంటే మరు –ఘూర్జర శైలి తాండవం చేస్తుంది .ఏడు అంతస్తుల ఈ బావిలో 500శిల్పాలు ,మరో 800 కళా ఖండాలున్నాయి .వీటిపై దశావతారాలు ,సొల శృంగారం గా ఉన్న 16రకాల  అప్సరసల శిల్పాలు ‘’వావ్! ఇదేం వావ్! ‘’అని పిస్తాయి . ఇంతపెద్ద విశాలమైన ప్రత్యేకమైన కట్టడం అపూర్వం గా భావిస్తారు .ఈ బావిలో కింద చివరి మెట్టువద్ద ఉన్న గేటు నుండి  30 మీటర్ల సొరంగం కూడా మట్టిలో పూడుకు పోయింది .ఈ సొరంగం నుండి వెడితే పఠాన్ వద్ద ఉన్న సిద్ధ పూర్ కు సురక్షితంగా చేరేవారు . ఈ బావి 1980 లో పురావస్తు శాఖ త్రవ్వకాలలో మళ్ళీ వెలుగు చూసింది .యుద్దాలకాలం లో లేక ఆపదలు సంభవించినపుడు రాజా౦తః పుర స్త్రీలు  ఈ సొరంగం ద్వారా తప్పించుకొని బయటకు వెళ్ళేవారు .50 ఏళ్ళక్రితం వరకూ బావి చుట్టూ ఔషధ మొక్కలు ఉండేవి .ఇలాంటి దిగుడుబావులు మంచి నీటికోసమే కాక ఆధ్యాత్మిక చింతనకు , శిల్పకళా వైభవానికిచిహ్నాలు . 2014 యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ బావి చోటు దక్కించుకున్నది .2016 లో ‘’క్లీనెస్ట్ ఐకానిక్ ప్లేస్ ‘’గా అవార్డ్ పొందింది .అందుకే భారత ప్రభుత్వం కొత్తగా ముద్రిస్తున్నవంద రూపాయల నోటు పై స్థానం పొంది కను విందు చేస్తూ ,చారిత్రిక నిదర్శనం గా దర్శనమిస్తోంది

Posted in రచనలు | Tagged | Leave a comment

గుజరాత్ దిగుడుబావుల  చరిత్ర  

గుజరాత్ దిగుడుబావుల  చరిత్ర

గుజరాత్ రాష్ట్రం సోమనాద్ ,ద్వారక వంటి పుణ్యక్షేత్రాలు, గాంధీ పటేల్ మొరార్జీ వంటి రాజకీయనాయకులకు ,జౌళి పరిశ్రమకే కాక దిగుడుబావులకూ ప్రసిద్ధి చెందింది .ఇటువంటివి 120 దాకా ఉన్నాయి .సి౦ధునాగరకత కాలానికే ఇవి బహుళ వ్యాప్తమైనాయి .దోలావీర్ మొహంజదారో లలో ఇవి కనిపించాయి .ఇవి గుజరాత్ వాయవ్య భాగాన ఉన్నాయి.ఇక్కడినుండి ఉత్తరానున్న రాజస్థాన్ కు వ్యాపించాయి .చాళుక్య ,వాఘేల వంశారాజుల పాలనలో 10 నుంచి 13 వ శతాబ్దం వరకు. ,.కాని వీటి నిర్మాణం   11 నుండి 16 వ శతాబ్దాలకుమహోత్క్రుస్ట దశకు చేరింది .13 నుండి 16 శతాబ్దం వరకు పాలించిన మహమ్మదీయులు ఈ నిర్మాణాలను యధాతధంగానే ఉంచటమేకాక ప్రోత్సహించారుకూడా.

  దిగుడుబావుల నీరు పవిత్రమైనదని అనాదికాలం నుండీ  విశ్వసిస్తున్నారు .అతి ప్రాచీనమైన దిగుడుబావి జునాగడ్ లోని ఊపర్ కోట్ గుహలలో ఉన్నాయి .ఇవి నాలుగవ శతాబ్దికి చెందినవి .నవ ఘాన్ కువో అనే బావి మెట్లు గుండ్రంగా ఉండటం ప్రత్యేకత .బహుశా ఇవి పశ్చిమ సాత్రపుల కాలం 200-400 లో  లేక మిత్రకార పాలన 600-700 కాలం లో నిర్మింపబడి ఉండవచ్చునని ఊహిస్తున్నారు .బావి ని గుజరాతీ లో’’వావి ‘’అంటారు .వకు బా కు భేదం లేదని మనకు తెలిసిందే .దీని ప్రక్కనే ఉన్న’’ ఆది కాదిని బావి ‘’10 వశతాబ్ది పూర్వార్ధం లో కట్టారని భావిస్తారు  చాళుక్యరాజులపాలనకు పూర్వమే రాజ్ కోట్ జిల్లా’’ధంక్’’లో లో దిగుడుబావులనిర్మాణ౦  జరిగి, అవే అతి పురాతనమైనవిగా గుర్తింపు పొందాయి .దీనికి దగ్గరలో అలేక్ కొండలపై’’ బొచావ్డి నెస్’’ వద్ద ఉన్న బావి పై వాటికంటే ప్రాచీనమైనది.600 ప్రాంతం లో నిర్మించబడిన ఝిలాని ,మంజుశ్రీ దిగుడుబావులు సౌరాష్ట్ర శిల్పకళతో ఉండటంవలన 7 వశతాబ్దికి చెందినవని తేల్చారు .

   చాలుక్యులపాలనలో నిర్మింపబడిన దిగుడుబావులు కళాత్మకంగా ఉన్నాయి .మొధేరా సూర్య దేవాలయానికి పడమరగా ఉన్న నీటి కుండం 11 వ శతాబ్ది ది.భూమిపైకి ఉన్నమండపం  10 వశతాబ్ది ది. 1050 లో పఠాన్ లో  ‘’రాణీగారి బావి’’ నిర్మించారు .దావడ్ లోని అంకోల్ మాత బావి , అహ్మదాబాద్ లోని భవానీమాత బావి 11 వశతాబ్ది చివరలో ఏర్పడినవి .చాళుక్యరాజు జయసింహ సిద్ధ రాజు తల్లి మినాల్ దేవి జ్ఞాపకార్ధం వీరగావ్ తటాకం ,నాదియాడ్ లో దిగుడుబావి నిర్మాణం జరిగాయి .సబర్కాంత జిల్లా బలేజ్ గ్రామం లో ఉన్న మినాల్ దిగుడుబావి 1095 లో నిర్మించారు .రాజ్ కోట్ జిల్లా విర్పూర్ లో ఉన్న మినాల్ దేవి  బావి చాళుక్య కళాత్మికంగా నిర్మించారు.అహమ్మదాబాద్ లోని అసపూరి వద్దా ,ఝింజువాడా లోని దిగుడుబావులు 12 వ శతాబ్దికి చెందినవి .సురేంద్రనగర్ జిల్లా చోబారి లోను ,ధన్దాల్ పూర్ లోని బావి జయసింహ సిద్ధరాజ్ నిర్మించాడు .12 శతాబ్దిపాలకుడు కుమారపాల కాలం లో చాలా దిగుడు బావులు నిర్మించాడు .పఠాన్ దగ్గర వాయడిబావీ ఇప్పటిదే .వద్వాన్ వద్ద ఉన్న గంగా దిగుడుబావి 1169 లో కట్టబడింది .చాళుక్యరాజుల పాలన చివరి రోజులలో రాకీయ అనిశ్చిత పరిస్థితులవలన బావుల నిర్మాణం మందగించింది.నవ్లఖా దేవాలయం దగ్గరున్న వీకియా, జీతా బావులు ,బరోడా కొండలపైఉన్న ఘూమ్లి బావి 13 వ శతాబ్ది వి .బరోడాకొండలదగ్గర  విసవాడ గ్రామం లోని జ్ఞాన బావి రెండవ భీమరాజు కాలం లో కట్టబడినవి .

  వంతాలి జునాగడ్ ల మధ్య ఉన్న రాకేంఘర్ బావి తేజపాల్ ,వాస్తుపాల్ – అనే వాఘెలాఆస్థాన మంత్రి సోదరులు కట్టించారు .వాఘేల రాజు విలాస దేవ్ 1225 లో దభోయ్ వద్ద దిగుడుబావికట్టించి  గేట్లూ,దేవాలయాలు నిర్మించాడు.దభోయ్ లోని సత్ముఖి బావి పైన దేవాలయం ఉంది .ఇవికాక 7 బావులుకూడా నిర్మించాడు .వాద్వాన్ లోని మాధవవ్ బావి 12 94 లోమహారాజ కర్ణ ఆస్థానం లోని  మాధవ ,కేశవ అనే బ్రాహ్మణులు కట్టించారు .కపాద్ వంజ్ లోని బతీష్ కోట బావి 13 వ శతాబ్ది ది.

14 వ శతాబ్దం దిగుడుబవులకుస్వ ర్ణయుగం  .మంగ్రోల్ లో   సోదాలి బావిని 1319 లో మోధా కులస్తుడు వాలి సోధాల కట్టించాడు .ఖేడ్ బ్రహ్మలోదేవాలయం దగ్గర లోని   బ్రహ్మ  దిగుడుబావి14 వ శతాబ్దికి చెందింది .1381 నాటి మధువ లోని సూదా బావి ,  దందుసార్ లోని హని ,  ధోల్కా లోని సిద్ధాంత మహాదేవ బావులు  తుఘ్లక్ పాలనలో కట్టబడినవి .అహమ్మదాబాద్ దగ్గర సంపా ,రాజ్ పురాదగ్గర  రాజ్ బా బావులు  ,1328 నాటివి . 1499 లో హరేం మహిళ మహమ్మద్ బెగడ దాదా హరీర్ బావి నిర్మించింది .లూనావాల దగ్గర కాలేశ్వరి, నీ నాల్ అనే రెండుబావులు 14 -15 శతాబ్దులలో కట్టారు .వడోదర దగ్గరున్న రెండూ 15 శతాబ్దం లో కట్టినవే .1499 లో రుడాబాయ్ అదలాజ్ బావి ,చత్రాల్ బావి నిర్మించింది

     ధ్రన్గ్ధరలోని నాగబావ , మొర్బిలోని జీవమేహతా బావులు 1525లో ఒకే శైలిలో నిర్మించ బడినాయి .1560 లో రాజా శ్రీనానాజీ భార్య చంపా రోహోఅనేదాన్నినిర్మించింది .15- 17 శాతాబ్దు లమధ్య చాలా బావులు వచ్చాయికాని చాలా సాధారణంగా నిర్మించారు .హంపూర్ ,ఇడార్ లలో వీటిని చూడచ్చు 1633 లో సి౦ధవి మాతబావి ని పఠాన్ లో కట్టారు .17 వశతాబ్దిలో రవి బావి ,1628 లో లిమ్బోయిలో చాళుక్య శైలిలో బావి కట్టారు .అహమ్మదాబాద్ లో  అమృత వాహిని బావి ని’’ L ఆకారం’’గా నిర్మించారు

 19 ,20 శతాబ్దపు బ్రిటిష్ పాలనలో దిగుడుబావినీరు ఆరోగ్యానికి మంచిదికాదని గొట్టాలు దింపి పైపులద్వారా నీటి సరఫరా చేయటం మొదలుపెట్టారు .1860 లో అహమ్మదాబాద్ లోనిఇసాన్పూర్ లోజీతాభాయి  దిగుడుబాయి నిర్మాణం పూర్తి  చేసి వ్యవసాయానికి ఉపయోగించారు .వంకనీర్ పాలెస్ దిగుడుబావిని 1930 నాటిపాలకులు తెల్లమార్బుల్ రాయితో కట్టించి అందాలు చిమ్మించి  ఆకర్షణ తెచ్చారు .చల్లని ప్రదేశం కనుక ఇది వేసవి విడిదిగా యాత్రికులను బాగా ఆకర్షిస్తుంది .

ఇదండీ గుజరాత్ దిగుడు బావుల వంశ చరిత్ర .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-18 –ఉయ్యూరు   ,

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు

శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు

స్వామీ !

ఏమీ !

నాధా!

ఏమిటి బాధ ?

తమరు ఈ రాత్రినుంచి శయ్యాక్రా౦తు లవుతారు కదా !

అవును ఇదేమీ కొత్తకాదే.ప్రతి ఏడూ జరిగే ముచ్చటే గా !

మీకు ముచ్చటే .మాకు చెమటలు పోస్తాయి ఆ నాలుగు నెలలూ

దేనికి ?

ఎవరైనా అధికారి ఊరికి వెడితే తనబాధ్యత తన తర్వాత అధికారికి అప్పగించి వెళ్ళటం లోక రివాజు .

ఓహో అలాగా !

మరి తమరు ఏకంగా నాలుగు నెలలు నిద్రకు ఉపక్రమి౦చ బోతున్నారాయే .మధ్యలో రెండు నెలలతర్వాత కాస్త మరోపక్కకు ఒత్తిగిలి పరుంటారే కాని మెలకువ తెచ్చుకోరుకదా ఆ నాలుగు మాసాలూ పూర్తయ్యేదాకా !

అవును నిజమే ఇందులో వి౦త కాని విడ్డూరం కానీ ఏమీ లేవే!

మీకు అలా అనిపించవచ్చు .కాని లోకానికి అది తగనిదిగాఅనిపిస్తుందేమో .స్థితి కారకులే నిశ్చింతగా నిద్రిస్తుంటే లోక పాలన ఏమైపోవాలి స్వామీ ?ఎవరికైనా ఈ నాలుగు నెలలూ బాధ్యత నప్పగించి హాయిగా పడుకోండి కాదన్నది ఎవరు ?

సరే నీ ఉపాయం బాగానే ఉంది .నువ్వే సలహా చెప్పుఎవరికిస్తే బాగుంటుందో ?

నన్ను ఎందుకు ఇందులోకి లాగుతారు బాబూ ! మీ  ఏర్పాటేదో మీరే చేసుకోండి .నేనేదైనా చెబితే ఆడపెత్తనం అంటారేమో లోకులు .అయినా మనవాళ్ళలో ఎవరికైనా ఒకరికి అప్పగించండి .మీ మిత్రుడూ మా అన్నయ్య శివుడున్నాడు కదా .ఆయనకు అప్పగిస్తే ?

భలే సలహా ఇచ్చావు సాధ్వీ .పుట్టి౦టి వాళ్ళను బాగానే వెనకేసుకొచ్చావు .

ఈసోడ్డు వేస్తారని ముందే అనుకున్నా .కాని గమ్మున మీలాగా ఉండలేను కదా .శివన్నయ్య కిస్తే ఏం ?

ఏమీ లేదు కానీ అసలే భోళాశంకరుడు .ఎవరికే వరాలిచ్చి ప్రాణం మీదకు తెస్తాడేమో నని భయం  కానీ—

కానీ లేదు దమ్మిడీ లేదు ఇంకా ఆలోచన ఎందుకు  స్వామీ !ఎప్పుడో ఏదో చేశాడనిఇప్పుడు దెప్పుడా ?  అప్పుడు అలా జరగాలి కనుక జరిగి ఉండచ్చు. ఆయనది దోషం కాకపోవచ్చు కదా .

 నీమాటే నమ్ముదాం .కాని ఆయన ఎప్పుడూ లయకారుడు గానే గుర్తింపు పొందాడు .ఇప్పుడు స్థితి కారక బాధ్యత అప్పగిస్తే నేను నిద్ర లేచేసరికి జనక్షయం ?

శుభం పలకమంటే సామెత చెప్పినట్లు ఈ విపరీతమేమిటండీ.మా అన్నయ్యకు ఇవ్వాలని లేదని సూటిగా చెప్పలేక ఈ డొంక తిరుగుళ్ళు ఎందుకు  హరీ !

సిరీ !నా మనసు బాగానే అర్ధం చేసుకున్నావ్ –వేరొకరి పేరు చెప్పు ఆలోచించి .

ఇంకెవరున్నారు కమలగర్భ జనకా? మనబ్బాయి బ్రహ్మకు అప్పగించండి సంకోచం దేనికి ?

సంకోచం కాదు –ఎప్పుడూ  అడ్డగోలుగా   సృష్టించి పారెయ్యటం ,వాళ్ళు నామీద పడిఏ డవటం ! అదేగా అతడి నిర్వాకం .పాలన గురించి పట్టించుకున్న వాడుకాదు కదా –

కాలికేస్తే వేలికి , వేలికేస్తే  కాలికీ బాగానే బిగిస్త్తున్నారు –యెట్లా మీతోవేగేది ?

చంద్ర సహోదరీ ! దీనికే అంత కోపమా ?వ్యవహారాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి నిర్ణయం చేస్తేనే కదా సమన్యాయం జరిగేది ?

అవునను కోండి –మీ సంబోధనలో నాకొక సూచన కనిపించింది –చెప్పనా ?

చెప్పాలనేకదా చంద్రవదనా !

అయితే,  మా సోదరుడు మీకు బావమరది ‘’చంద్రన్న’’కు అప్పగించండి కమలదళాయతాక్షా !

భేషైన సూచన .వాడు తారా సందోహం తో   ఇరవై ఏడుగురు భార్యలతో సతమతమవుతూ ,ప్రియురాళ్ళ విరహ వేదన కలిగిస్తూ క్షోభ పెడతాడు .వాడికి దీనిమీద దృష్టి పెట్టె తీరిక ఉంటుందనుకొన్నావా ?

బాబోయ్ మదన జనకా !మీ మనసుకు నచ్చిన వాళ్లే వరో నాకెలా తెలుస్తుంది ?నేను చెప్పిన వాళ్ళను   చదరంగం లో పావుల్లాగా తీసి పారేస్తున్నారు .ఎలా మీతో ?

అవునూ ఇప్పుడే ఏదో విశేషం వాడావు ..

వాడాను నిజమే .మన మన్మధుడికి బాధ్యత ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి .

బాగానే ఉండచ్చు కానీ –

మళ్ళీ బేడా కానీ కబుర్లు వద్దు .ఏదో తేల్చండి –

వాడు అశరీరుడైతేనే లోకం లో కామాగ్ని చిచ్చు రగిలించి నిద్రలేకుండా చేస్తూ ఉంటాడు .వాడికి శరీరం ఇచ్చి బాధ్యతా చేతికి అప్పగిస్తే నీకూ నాకూ తెలీకుండా ఎందరెందరో సుందరాంగులను కోడళ్ళు గా తెచ్చి కొంప కొల్లేరు చేస్తాడని భయం   –అంతే

వీడికీ కట్టబెట్టటం ఇష్టం లేదని మొహమాటం లేకుండా డొంక తిరుగుడుగానైనా నిజం చెప్పారు . ఇక చాలు సంబడం .మీ మనసులోని మాటేమితో నాన్చకుండా  సెలవియ్యండి ప్రాణేశ్వరా !

నా అర్ధాంగీ! చివరగా నీ మనసులోని మాటగా చెప్పు. దానికే విలువనిస్తానని నీకు తెలుసుగా !అనగానే లక్ష్మీదేవి ముసిముసి నగవులతో తల ఒకింత కిందికి దించి ,కాలి వ్రేళ్ళను నేలపై రాస్తూ, సిగ్గులొలికిస్తూ, మొహం పైకేత్తకుండా –‘’మాయా మోహ జగన్నాటక సూత్రధారీ మురారీహరీ !నా మనసులో మాటతెలిసే మీరు చెప్పకుండా నాతో చెప్పిస్తున్నారుకదూ.ఆ మాత్రం కనిపెట్ట లేననుకున్నారు కామోసు కామారి మిత్రమా !అయినా సిగ్గు విడిచి నేనే చెప్పేస్తున్నాను మీరు గట్టిగా చెప్పమన్నారుకనుక .ఆర్ధిక శాఖ నా చేతుల్లోనే ఉంది .నేను దయతలిస్తేనే లోకం లో డబ్బూ హోదా వస్తాయి .ఈ రెండూ  లేకపోతె దుబ్బుకు కూడా కొరగాడు మానవుడు .మీనిద్రాసమయం లో బాధ్యత అంతా నాకే అప్పగించి నిశ్చింతగా నిద్రించండి .నాలుగు నెలలు కాదు కావాలంటే మరో నాలుగు నెలలు శయని౦చ౦డి   మహానుభావా ! మీకు అడ్డేమిటి ?మై హూనా .అయినా మీమనస్సులో ఒక సంకోచం ఉన్నట్లుంది .లక్ష్మి చంచల.ఒక్క చోట నిలవదు అని .ఆ భయమేమీ లేదు .నేను అప్పుడు సర్వం సహా చక్రవర్తిని ..ఎక్కడికీ కాలుపెట్టే అవసరం లేదు .ఇదంతా మీమనసులో ఉంచుకుని నన్ను బయట పెట్టారా ? ‘’అని మొహం పైకెత్తేసరికి శ్రీహరి యోగనిద్రలోకి జారి అరగంటయింది .ఉసూరుమని నిట్టూర్చి ‘’ఈ మాయలాడు అందర్నీ మోసం చేస్తాడనుకున్నాకానీ నన్నూ మాయ చేశాడు మాయావినోది .ఎటూ తేల్చకుండా  ఎవరికీ బాధ్యత అప్పగించకుండా హాయిగా శేషతల్పం పై క్షీరసాగరం లో యోగ నిద్రలోకి వెళ్లి పోయారు పరమాత్మ .అయినా నా వెఱ్రి కాని  .సర్వలోక రక్షకుడికి ,సర్వలోకాలు తనలోనే ఉంచుకున్నవాడికీ  నిద్ర ఏమిటి మన అమాయకత్వం కాని .ఆయనకు జాగ్రత్ స్వప్న సుషుప్తి నిద్రావస్తలు౦ టాయా ?సర్వాతీతుడు స్వామి .నాకూ కాస్త మోహం వ్యామోహం కలిగించి చూడండి ఎలా చిరునవ్వు నవ్వుతూ ఏమీతెలియని అమాయకుడిగా నిదిరిస్తున్నారో నాస్వామి .ఆయనకు ఇక నిద్రాభంగం కలగనీయను .

శయన ఏకాదశి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-18 –ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

విష్ణు సహస్రనామ పారాయణ

విష్ణు సహస్రనామ పారాయణ

 

23-7-18 సోమవారం సాయంత్రం తొలి ఏకాదశి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మహిళామణులచే శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ దృశ్యాలు  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment