గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

 

Inline image 1

15-మహామహోపాధ్యాయ ,భారత రత్న పాండు రంగ వామన్ కాణే

7-5-1880న జన్మించి 8-5-1972 న 9 2 వ ఏట మరణించిన మహా మహోపాధ్యాయ ,భారత రత్న పాండురంగ వామన్ కాణే గొప్ప ఇండాలజిస్ట్ .సంస్కృత మహా విద్వాంసుడు .విద్యా రంగం లో 40 ఏళ్ళు సుదీర్ఘం గా విజయవంతంగా గడిపిన కాణే కు భారత ప్రభుత్వం 1963 లో6,500పేజీల ఉద్గ్రంధం  ‘’ధర్మ శాస్త్ర చరిత్ర ‘’(హిస్టరీ ఆఫ్ ధర్మ శాస్త్ర ) రచించి నందుకు  భారత దేశ అత్యున్నత జాతీయ పురస్కార౦ ‘’భారత రత్న ‘ ‘అందజేసి గౌరవించింది .చరిత్రకారుడు రాం చరణ్ శర్మ ‘’గొప్ప సంస్కృత పండితుడైన పాండు రంగ కాణే సాంఘిక సంస్కరణలను ప్రోత్సహిస్తూనే సంప్రదాయ శాస్త్రౌన్నత్యాన్ని పరి రక్షించాడు ‘’అని మెచ్చాడు .5 భాగాలుగా ప్రచురింపబడిన ‘’ధర్మ శాస్త్ర చరిత్ర ‘’ప్రాచీన సాంఘిక న్యాయాలు ,ఆచారాలకు విజ్ఞానసర్వస్వం గా నిలిచింది .ప్రాచీన భారతం లో సాంఘిక మార్పు సోపానాన్ని విస్పష్టంగా ఈ గ్రంధం తెలియ జేసింది .

ధర్మ  శాస్త్ర చరిత్రను ఇంగ్లీష్ లో రాసి దానికి ఉప శీర్షికగా ‘’ భారత దేశం లో ప్రాచీన ,మధ్యయుగాల మతాలు ,పౌర న్యాయాలు’’ అని పేరు పెట్టాడు. ఈ ఉద్గ్రంధం  ఆయన ‘’మాగ్నం ఓపస్’’గాఅంటే – మేధో సర్వస్వం గా భావిస్తారు  .  పరిశోధనాత్మకమైన ఈ మహా గ్రంధం భారతీయ శిక్షా  స్మృతి యొక్క పరిణామ దశలను అనేక శతాబ్దాల  లోని గ్రంధాలను  వ్రాత ప్రతులను పరిశీలించి రాయ బడింది .1932 లో మొదటిభాగం 1962 అంటే 30 ఏళ్ళ తర్వాత  చివరిదైన 5 వ భాగం ప్రచురింప బడ్డాయి .తన రచనకు ఆధారాలను ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే ,భండార్కర్ ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ మొదలైన చోట్ల ల నుండి సేకరించాడు .మహాభారతం ,పురాణాలు, చాణక్యం మొదలైన వన్నీ తిరగేసి లోతుగా తరచి ,సారాన్ని నిక్షిప్తం చేశాడు .ఎంత కఠోర శ్రమ చేశాడో అర్ధమవుతుంది .నిగూఢంగా ఉన్న అనేక రహస్యాలను వెలుగులోకి తెచ్చాడు .రచనలో నాణ్యత ఆయనకు సంస్కృత భాషలో ఉన్న లోతైన పరిజ్ఞానానికి,అవగాహనా శక్తికి  దర్పణమై నిలిచింది .వ్యతిరేక భావాలున్న గ్రంధాలను కూడా తృణీకరించి వదిలి వేయకుండా వాటినీ సమగ్రంగా అధ్యయనం చేయటం కాణే పండితుని గొప్ప సంస్కారం .అదేవిజయమై నిలిచి౦ది కూడా .

కాణే పండితుడు సంస్కృతం లో ‘’వ్యవహార మయూఖా ‘’అనే గ్రంధాన్ని రాశాడు .అంతే కాక తన ధర్మ శాస్త్ర చరిత్ర కు విస్తృత ఉపోద్ఘాతం  రాసి అందులో తన గ్రంధం లో చెప్పబడిన ముఖ్య విషయాలను తెలియ జేసి దానిపై గొప్ప అవగాహన కల్పించి గ్రంధం పై అభిమానం కలిగేట్లు చేశాడు .ఇంత  కష్ట పడి రాసినా సంస్కృతం లోని ‘’ధర్మ ‘’అనే పదానికి ఇంగ్లీష్ లో సమానమైన సరైన  పదం దొరకలేదని బాధ పడ్డాడు మహామహోపాధ్యాయ కాణే పండితుడు .సంస్కృత౦ , ఇంగ్లీష్, మరాటీ భాషలలో కాణే పండితుని రచనా సర్వస్వం 15,౦౦౦పేజీలు  ఉండటం మహాశ్చర్యం కలిగిస్తుంది.

మూడు భాషలలో చేసిన సాహిత్య కృషికి కాణే పండితుడు ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు  నందుకొన్నాడు .బొంబాయ్ యూని వర్సిటి వైస్ చాన్సెలర్ గా పని చేశాడు .కురుక్షేత్రం లో భారతీయ భాషాధ్యయనం కోసం ‘’కురుక్షేత్ర విశ్వ విద్యాలయం ‘’ఏర్పాటు చేయటం లో కాణే పండితుని అకు౦ఠిత దీక్షా ,పట్టుదల, విజయము కనిపిస్తాయి .ధర్మ శాస్త్ర చరిత్ర గ్రంధ౦ 4 వ భాగానికి  సంస్కృత  అనువాదం విభాగం పరిశోధనకు గాను లో  1956 లో సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .భారతీయ విద్యా భవన్ కు గౌరవ సభ్యులుగా కాణే పండితుని నియమించి గౌరవించారు .విద్యా రంగం లో చేసిన సుదీర్ఘ కృషికి కాణే పండితుని రాజ్య సభ సభ్యత్వమిచ్చారు .అన్నిటి కంటే అత్యున్నత మైన  ‘’భారత రత్న’’ పురస్కారాన్ని భారత ప్రభుత్వం 1963లో అందించి ఆ మహామహోపాధ్యాయుని భారత రత్నను చేసింది .

భారత రాజ్యాంగం ఇండియాలో ఉన్న  సనాతన భావ పరంపరకు గండి కొట్టి భారత ప్రజలకు హక్కులే కాని బాధ్యతలు లేవు అన్న అభిప్రాయం కలిగించింది అని కాణే పండితుని నిశ్చితాభిప్రాయం .సాధికారిక విజ్ఞాన సర్వస్వం అయిన కాణే బృహద్రచన అనేక రాజకీయ దుమారాలకు ఆయువు పట్టు అయింది .కేంద్రం లో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం అధికారం లో ఉండగా ప్రాచీన భారతీయులు  ఆవు  మాంసం తిన్నారు అన్న విషయం పై రెండు వర్గాలు ఏర్పడి రెండు వైపుల వారూ కాణే గారి ఉద్గ్రంధ౦ లోని భాగాలనే  విస్తృతంగా ఉదహరించటం తమాషా అయిన విశేషం .ఈ సమస్య గోవును మాతఃగా పవిత్రంగా చూసే హిందువుల కు చాలా ముఖ్యమై , గోమాంసాన్ని తినటం పై నిషేధం విధించాలని గట్టి పట్టు బట్టారు .రెండవ సమస్య- ప్రాచీన భారతం లో బాలికలకు యజ్ఞోప వీతం వేసుకొనే హక్కు అయిన ఉపనయనం చేసేవారు అని ,కాలక్రమం లోఇటీవలి కాలం లోనే  అది మగ పిల్లలకు మాత్రమే హక్కు గా మారింది అనేది …

మహా మహోపాధ్యాయ కాణే పండితుని స్మృతి చిహ్నంగా ఆయన మరణానంతరం ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ము౦బే వారు’’ప్రాచ్య భాషాధ్యయనాన్ని  ప్రోత్సాహించటం కోసం  ,1974 లో ‘’డా.పి .వి.కాణే  ఇన్ స్టి ట్యూట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ రిసెర్చ్ ‘’సంస్థను స్థాపించారు .అంతేకాక వేద ధర్మ శాస్త్రం,లేక  అలంకార శాస్త్రం లో అత్యద్భుత కృషి చేసిన వారికి మూడేళ్ళ కోక సారి డా.పి.వి కాణే స్వర్ణ పతకాన్ని ప్రదానం చేస్తున్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-16- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

14-కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత –హర్ష దేవ మాధవ్

గుజరాతీ సంస్కృత భాషలలో దిట్ట మైనకవి హర్ష దేవ మాధవ్ 20-10-1954 న గుజరాత్ లోని భావనగర్ జిల్లా వార్తెజ్ లో మన్ సుఖలాల్ , నందన్ బెన్ దంపతులకు జన్మించాడు .ప్రాధమిక విద్య స్వగ్రామం లోనే పూర్తి చేసి, సెకండరీ విద్యను కొలియాక్ లోని మాధ్యమిక పాఠశాలలో చదివి 1971 లో ఎస్.ఎస్.సి పాసయ్యాడు .1975 లో గుజరాత్ యూనివర్సిటీ లో ఎక్స్టెర్నల్ విద్యార్ధిగా పరీక్ష రాసి బి ఏ డిగ్రీ అందుకొన్నాడు .టెలిఫోన్ ఆఫీస్ లో పని చేస్తూనే సౌరాస్ట్ర యూని వర్సిటి నుండి 1981 లో సంస్కృతం ఎం .ఏ. డిగ్రీ ప్రధమ శ్రేణి లో సాధించాడు .అహమ్మదా బాద్ లోని హెచ్ ,కె .ఆర్ట్స్ .కాలేజి లో లెక్చరర్ గా పని చేశాడు .1983 లో బి ఎడ్ ,1990 లో పి .హెచ్. డి.గుజరాత్ యూని వర్సిటి నుండి అందుకున్నాడు .’’ముఖ్య పురాణాలలో శాపాలు ప్రభావాలు ‘’అనే అంశం పై పరిశోధన చేసి గుజరాతీ భాషలో దిసీస్ రాసి పి హెచ్ డి.పొందాడు .శ్రీమతి సృతిజాని ని వివాహమాడి రుషి రాజ్ జానికి తండ్రి అయ్యాడు .

కవిత్వం లో ప్రత్యేకతలు

హర్ష దేవ మాధవ్ జపాన్’’ హైకూ’’ ,’’తంకా’’లను ,కొరియన్ ‘’సిజో ‘’నుసంస్కృత భాషలో రాసి గీర్వాణ భాషకు కొత్త వెలుగులు అద్ది తన ప్రత్యేకతను చాటుకొన్నాడు . .’’సంస్కృత కవులలో ఆధునిక ,విప్లవ కవులలో ఒకడు ‘’అని  సమీర్ కుమార్ దత్తా, హర్షను ప్రశంసిస్తూ హర్షం వెలిబుచ్చాడు . Harshadev Madhav is a modern poet in true sense of the term. He thinks that poetry should appeal first to intellect and thereafter to emotion. In the eternal controversy between intellectuality and emotionalism Harshadeva takes side of intellectuality […] Harshadev happens to be one of the most profound modern Sanskrit poets. He betrays the great influence exerted on him by modern vernacular poetry and some of the images carved out by modern vernacular poets.

హర్ష దేవ్ సంస్కృత రచనలు

1-అలకానంద 2 మృగయా 3-బృహన్నల 4-లవ రస దిగ్దాఃస్వప్న మయా పర్వ తాః 5-ఆశిచ్చ మే మనసి 6-నిష్క్రాంతాః సర్వే  7-మృత్యుస్వం కస్తూరి మృగోస్తిఅనే పేరుతొ స౦స్కృత నాటకాలు వ్యాసాల సంకలనం 8-బుద్ధస్య భిక్ష పత్రే 9-భావాస్థిరాని జననాంతర సౌహృదాని 10-కన్నఖ్యా క్షిప్తం మాణిక్య నూపురం 11-భాతితే భారతం అనే సంస్కృత ప్రతికావ్యం . 1992 నాటికే 2,200 కవితలను సంస్కృతం లో రాసిన పోస్ట్ మోడరన్ సంస్కృత కవి హర్షదేవ మాధవ్ .

‘’మాధవ’’ గుజరాతీయం

1-హత్ ఫంఫోసే ఆంధియా సుగందినే(కావ్యం ) 2-మహాకవి మాఘ 3-శ్రీవాణి చిత్ర శబ్ద కోశ (సంస్కృతం –ఇంగ్లీష్ -హిందీ –గుజరాతి బొమ్మల నిఘంటువు (పిక్చర్ డిక్ష్ణ రి)

ఆంగ్ల ‘’దేవం’’

హర్ష దేవ మాధవ్ ఇంగ్లీష్ లో ‘’ మోడరన్ సాంస్క్రిట్ పోయెట్రి ఆఫ్ గుజరాత్ అప్ టు ది ఎండ్ ఆఫ్ 20త్ సెంచరి (కంట్రి బ్యూషన్ ఆఫ్ గుజరాత్ టు సాంస్క్రిట్ లిట రేచర్ -1998 ).

‘’హర్షా’’తిశయ పురాస్కారాలు

హర్ష దేవమాధవ్ 1994 లో గుజరాత్  సంస్కృత అకాడెమి  అవార్డ్ అందుకొన్నాడు .1997 -98 లో భారతీయ భాషా పరిషత్ అవార్డ్ పొందాడు ఆయన రచించిన ‘’నిష్క్యాన్తయః సర్వే’’సంస్కృత రచనకు  1997 లో అఖిలభారత కాళి దాస సమ్మానాన్ని మధ్య ప్రదేశ్ కాళిదాస అకాడెమి నుండి పొందాడు .2006 లో ‘’’’తవ స్పర్శే స్పర్శే ‘’ సంస్కృత కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ అందుకొన్నాడు . 2010 లో గుజరాత్ సాహిత్య గౌరవ పురస్కారం గ్రహించాడు .ఎడిన్ బర్గ్ లో జరిగిన 13 వ ప్రపంచ సంస్కృత సభలో జరిగిన కవి సమ్మేళనం  లోను.క్యోటో లో జరిగిన ప్రపంచ సంస్కృత సదస్సులోనూ పాల్గొని గౌరవ పురస్కారాలు అందుకొన్నాడు .

Inline image 1

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-16- ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 13-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

Inline image 1

13-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు

జనన విద్యాభ్యాసాలు

సంస్కృతాంధ్రాలలో మహా విద్వత్తు  కలిగిన మహా పండితప్రకాండులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారు కృష్ణా జిల్లా నూజివీడు తాలూకా గొల్లపల్లి లో 23-7-1941 న శ్రీ శలాక నరసయ్య శ్రీమతి దుర్గాంబ దంపతులకు జన్మించారు .గొల్లపల్లి హైస్కూల్ లో సెకండరీ విద్య పూర్తి చేశారు .ఆగిరిపల్లి లో ప్రసిద్ధ శ్రీ మార్కండేయ సంస్కృత కళాశాలలో 1955 -56  లో చేరి శ్రీ  పేరి వెంకటేశ్వర శాస్త్రి గారి వద్ద సంస్కృత వ్యాకరణం అభ్యసించారు .శ్రీ రామ చంద్రుల కోటేశ్వర శర్మగారి దగ్గర కావ్యాలు నేర్చారు .ప్రైవేట్ గా మెట్రిక్ చదివి ఉత్తీర్ణులై 1960 తెలుగు సంస్కృతాలలో భాషా ప్రవీణ ప్రధమ శ్రేణిలో పాసయ్యారు .,ప్రైవేట్ గానే చదివి బి .ఎ .డిగ్రీ కూడా1963 -64లో పొందారు .  1965-67 మధ్యకాలం లో ఉస్మానియా యూని వర్సిటి లో తెలుగు లోఎం ఏ .చదివి మొదటి తరగతి డిస్టింక్షన్ లో  కృతార్ధులై స్వర్ణ పతకం పొందారు . వీరి గురుపర౦పరలో డా దివాకర్ల వెంకటావధాని ,డా .పాటి బండ్ల మాధవ రామ శర్మ, ఆచార్య బిరుదురాజు రామ రాజు గారు ఉన్నారు .1975 లో శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో ‘’మహా భారతం లో ధ్వని సిద్ధాంత సమన్వయము ‘’పై పరిశోధన చేసి పి .హెచ్ .డి.పొందారు .ఇదే ‘’భారతం లో ధ్వని దర్శనం ‘’గా పుస్తక రూపం లో వెలువడింది .వీరి గైడ్ పరిశోధన పర బ్రహ్మ ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి గారు .

ఉద్యోగ సోపానం

1960 నుండి 65 వరకు అయిదేళ్ళు హైస్కూల్ ,హయ్యర్ సెకండరీ స్కూల్స్ లో తెలుగు పండితులుగా పని చేశారు . శ్రీ దేవుల పల్లి రామానుజరావు గారు నిర్వహిస్తున్నఆంద్ర సారస్వత పరిషత్ కు చెందిన హైదరాబాద్ తిలక్ రోడ్ లోని ఓరియెంటల్ కాలేజి లో1967-68 లో  ఒక ఏడాది ఆంద్ర  సంస్కృత లెక్చరర్ గా ఉద్యోగించారు . .1968.అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం లో గీర్వాణాంధ్ర లెక్చరర్ గా చేరి 17 ఏళ్ళు పని చేసి ,శాఖాధ్యక్షులుగా ,డాక్టోరియల్ ప్రొఫెసర్ గా ,డీన్ గా  క్రమంగా పదోన్నతి పొంది 16 ఏళ్ళు పనిచేసి మొత్తం 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఘనత పొంది 2001 లో పదవీ విరమణ చేశారు .

తెలుగు సంస్కృత వ్యాకరణాలపై శర్మగారికి అభిమానం జాస్తి .సంప్రదాయ సాహిత్యమన్నా ,సాహిత్య విమర్శనమన్నా కూడా విపరీతమైన ఆసక్తి ఉన్నది .రిసెర్చ్ పై మక్కువ ఎక్కువ .ఎన్నో విషయాలపై పరి శోధన చేసి దాదాపు 40  విలువైన గ్రంధాలను ప్రచురించారు .100 సెమినార్లలో పాల్గొని రిసెర్చ్ పేపర్లు రాసి సమర్పించారు .3 రిసెర్చ్ ప్రాజెక్ట్ లు నిర్వహించారు .80 దాకా ప్రత్యేక వ్యాసాలూ రాశారు . శర్మగారి వద్ద 24విద్యార్ధులు పరిశోధనలు చేసి పి .హెచ్. డి .పొందారు . .23మందికి  ఎం .ఫిల్. కు మార్గ దర్శనం చేశారు .

శాస్త్రి గారి విద్యా విశేషాలకు తగిన గుర్తింపు లభించింది .ప్రశాంతి నిలయం లోని సత్య సాయి ఇన్ స్టి ట్యూట్ ఆఫ్  హయ్యర్ లెర్నింగ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో  15 ఏళ్ళు మెంబర్ గా ఉన్నారు . శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ,కాకతీయ విశ్వ విద్యాలయం ఉస్మానియా విశ్వ విద్యాలయం, తిరుపతి పద్మావతీ మహిళా కళాశాల, నాగార్జున విశ్వ విద్యాలయంలలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులుగా గౌరవం పొందారు . ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అకాడెమిక్ సెనేట్ ,హయ్యర్ పవర్ కమిటీలలోసభ్యులుగా పని చేశారు .  స్టేట్ లైబ్రరి కమిటీ ,అనంతపూర్ లోని చిన్మయా మిషన్ ఎక్సి క్యూ టివ్ కౌన్సిల్,  హైదరాబాద్ యూని వర్సిటి స్కూల్ బోర్డ్ ఆఫ్ హ్యుమానిటీస్  లో మెంబర్ .అనంతపూర్ శ్రీ రమణ సత్సంగ్ కు అధ్యక్షులు .

వివాహం –సంతానం

నూజి వీడుకు చెందిన శ్రీ చెరుకుపల్లి  సుందర శివ శర్మ శ్రీమతి బుచ్చిరామ కృష్ణమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి రాజ రాజేశ్వరి గారిని శ్రీ రఘునాధ శర్మగారు 26-5-1962లో వివాహమాడారు . ఈ దంపతులకు అయిదుగురు కుమార్తెలు. .  .వారందరి వివాహ బాధ్యతలు తీర్చి ,ప్రస్తుతం రాజ మండ్రి లో ఉంటున్నారు .

శ్రీ శలాక వాజ్మయ స్రవంతి

1-దండి ‘’దశకుమార చరిత్ర ‘’ను తెలుగులోకి అనువది౦చి  వ్యాఖ్యానం రాశారు .2-బాణుని ‘’హర్ష చరితాను వాదం వ్యాఖ్య 3-శ్రీ బ్రహ్మ దత్త జిజ్ఞాసువు హిందీ లో రాసిన ‘’సరలతమ విధి’’ ని  తెలుగులోకి తర్జుమా చేశారు .4-భారతధ్వని దర్శనం అనే పి హెచ్.డి ధీసిస్ –రెండు సార్లు ముద్రణ పొంది ఖ్యాతి చెందింది .5-సంస్కృత వ్యాకరణం ‘’లఘు సిద్ధాంత కౌముది ‘’ని అనువదించారు .6-నన్నయ భారతం పై ‘’భట్టారక భారత భారతి ‘’రాశారు 7-మహా భారత విరాట పర్వాన్ని తెనిగించారు 8-‘’షట్పది కనక దారలు’’ 2 స్తోత్రాలకు వ్యాఖ్యానం రచించారు .9-మహా భారతం లోని ఉద్యోగ పర్వం ,విదుర నీతి ,యక్ష ప్రశ్నలు అనువాదం చేశారు .10-అంతరంగ నివేదనం అనే కవితా సంపుటి 11-సహృదయ భావ లహరి అనే సాహిత్య వ్యాస సంకలనం 12-సనత్సుజాతీయం ,భాగవత నవనీతం ,మహా భారతం –శాంతి పర్వం-ఆర్ష భావ చంద్రికలు,అనుగీత కరదీపిక ,స్పురణ దీప కలికలు ,జగద్గురు శ్రీ పాదార్చన ,ఉత్తర గీత సౌరభ౦ వంటివి ఎన్నో రచనలు చేశారు .13-కవిత్రయ భారతం మొత్తం లో 120 రమణీయ పద్యాలను ఎంపిక చేసి విస్తృత వివరణ రచించారు .14-ప్రశ్నోపనిషత్ సౌరభవం రాశారు 15-పంచామృత రసవాహిని భాగవత నవనీతం ఉత్తర గీత సౌరభం  రచించి ఎన్నెన్నో విలువైన విషయాలను వెలుగులోకి తెచ్చారు .

శ్రీ శర్మగారు ప్రస్తుతం శ్రీపమిడి ఘంటం కోదండ రామయ్య గారి ‘’ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ‘’ఆధ్వర్యంలో వేదవ్యాస మహా భారతాన్ని శ్లోక తాత్పర్యాలతో తెలుగులోకి అనువదించే బృహత్ కృషిలో మునిగి ఆర్ష సేవ చేస్తున్నారు .ఇప్పటికి 10 పర్వాలు పూర్తి చేశారు .త్వరలో మిగిలిన 8 పర్వాలు తెలుగులో వెలుగు చూడ నున్నాయి .ఇదొక వాజ్మయ దీక్షాతపస్సు .శర్మ గారు మాత్రమే చేయ గలిగిన ,చేయదగ్గ వాజ్మయ యజ్ఞం .

ఎందుకోకాని శర్మ గారి దృష్టి వాల్మీకి రామాయణం పైనా,ఇతర రామాయణ రచనలపైనా  పడినట్లు లేదు.పడి ఉంటే వాటి లోని అనర్ఘ రత్న రాశులను కూడా త్ర్వవ్వి తలకెత్తే వారు అనిపించింది నాకు .

శర్మ గారి కంఠం శ౦ఖ ధ్వనిని పోలి ఉంటుంది .ఏ విషయం పై ప్రసంగించినా  అమృత ధారా ప్రవాహం గా ,మూలాలను తరుస్తూ ,చేతిలో పుస్తక సాయం లేకు౦డానే   సంస్కృతా౦ధ్ర  వాజ్మయం లోని సకల విషయాలను సందర్భోచితంగా వివరిస్తూ తన్మయం చెందిస్తారు .దూర దర్శన్ లో ధర్మ సందేహాలు తీర్చారు మరో వ్యాసునిలా .రేడియోలో సాహిత్య ,ధార్మిక ఆధ్యాత్మిక ప్రసంగాలను లెక్కకు మించి చేశారు .ఏది చేసిన శ్రోతృ పర్వం గా ,రమణీయంగా ఉండటం శర్మగారి ప్రసంగ ప్రత్యేకత .

బిరుదులూ –సత్కార సన్మానాలు

ఇంతటి విస్తృత పరిశోధన ,రచన ,ప్రవచనం చేస్తున్న శ్రీశలాక శర్మగారి విద్వద్వైభవానికి తగిన సత్కారా సన్మానాలు అందుకొన్నారు .ప్రభుత్వ, ప్రభుత్వేతి సంస్థలు పోటీ పడి ముందుకొచ్చి వారిని గౌరవించి వాజ్మయ సరస్వతీ సమార్చన చేశాయి .

1986 లో బెస్ట్ టీచర్ అవార్డ్ ను ప్రభుత్వం నుంచి పొందటం తో ప్రారంభమైన ఈ పురస్కార వేడుక అప్రతి హతంగాసాగి   కవిత్వవేది నారాయణ రావు అవార్డ్ ,పేరాల భరత శర్మ మెమోరియల్ అవార్డ్ ,భూతపురి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియలవార్డ్ ,సద్గురు శ్రీ శివానందఎమినెంట్ట్ సిటిజెన్ ప్రైజ్ ,ఏలూరు గుప్తా అవార్డ్ ,శ్రీకాకుళం మహతి విశిస్టసాహితి అవార్డ్,మంత్రాలయం రాఘ వేంద్ర స్పెషల్ అవార్డ్ , తణుకు శ్రీ నన్నయ భట్టారక పీఠం పురస్కారం ,శ్రీ పులికంటి కృష్ణా రెడ్డి సాహితీ సత్కీర్తి పురస్కారం ,మల్లాప్రగడ శ్రీ రంగరాయ స్మారక పురస్కారం ,శృంగేరి శారదా పీఠ పురస్కారం , ,రాజమహేంద్రవర కళా గౌతమి సన్మాన పురస్కారం ,రాజమండ్రి విరించి చారిటీస్ వారి నుండి ‘’సువర్ణ కంకణ ప్రదానం ‘’శ్రీ కంచికామ కోటి పీఠ పురస్కారం ,అజో –విభో –కందాళ౦ వారి విశిష్ట సాహితీ మూర్తి పురస్కారం వంటివి ఎన్నో అందుకుని పులకింప జేసేదాకా వచ్చి౦ది .  సాహితీ సరస్వతి స్వరూపులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు అని నిశ్చయంగా చెప్పవచ్చు ..2015 ఉగాది వేడుకలలో సరసభారతి శ్రీశర్మ గారిని సగౌరవంగా ఆహ్వానించి  మా తలిదండ్రులు కీ .శే .లు గబ్బిట భావానమ్మ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక పురస్కారాన్ని అందజేసి ,వారి సమక్షం లో నా రచన ‘’’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ను హైదరాబద్ రేడియో స్టేషన్  రిటైర్డ్ డిప్యూటీ  డైరెక్టర్ జనరల్ మాన్య శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి చేతుల మీదుగా  ఆవిష్కరి౦ప జేసి ధన్యులమయ్యాం .

ఒక్కమాటగా చెప్పాలంటే శ్రీ శర్మ గారితో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ .వారికి సరసభారతి రచనలు పంపినప్పుడల్లా ఫోన్ చేసి ,అందిందని చెప్పే సంస్కారం వారిది .  వారిని శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీతీర్ధ స్వాముల వారు తరచూ పిలిపించి సంస్కృత కవిసమ్మేళణాలు,ధార్మిక ప్రసంగాలు వారి ఆధ్వర్యం లో జరిపిస్తూ సత్కరిస్తూ సమ్మానిస్తున్నారు .ఇంతటి మహనీయులు శర్మగారు సంస్కృతం లో కూడా యేవో రచనలు చేసి ఉంటారని అనిపించింది .వారి గురించి నెట్ లో వెదికితే నాకేమీ కనిపించలేదు .తప్పక శర్మ గారి గురించి రాయాలి అని పించి వారి ముఖత వారి వివరాలు తెలుసుకొందామని  నేను నాలుగు రోజుల క్రితం వారు విశాఖ లో ఉండగా ఫోన్ ద్వారా ఇంటర్వ్యు చేసినప్పుడు చాలా ఓపికగా నాకు కొన్ని వివరాలు చెప్పారు. అప్పటికప్పుడు నేను నోట్ చేసేసుకొన్నాను.  . తమ సంస్కృత  రచనలు, సంస్కృత కవి  సమ్మేళనాలలో పృచ్చకులుగా  సంధించిన ప్రశ్నలు ,పూరణల వివరాలు త్వరలోనే నాకు పోస్ట్ లో పంపిస్తామని చెప్పారు . ఈ ఉదయం హైదరాబాద్ నుండి వారి మనుమడిగారి ద్వారా ఇంగ్లీష్ లో ఉన్న వారి బయోడేటా అంతా మెయిల్ లో పంపారు .ఈ రచనకు నా ఫోన్ ఇంటర్వ్యు ,వారి బయోడేటా ఈ రెండూ ఆధారం .వారి  గీర్వాణ వాణీ వైభవాన్ని  రెండవ ఎపిసోడ్ లో వారు పంపిన వాటి ఆధారం గా రాసి తెలియ  జేస్తాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-16 –ఉయ్యూరు .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -29

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -29

‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -3

ఏకావలి లో రసవిధానం -2

మల్లినాధుడు అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు స్వయం వివరణలుగా ఉంటాయి .’’’’వ్యక్తి ‘’పై  అభిప్రాయాన్ని  రాయటం ఆరంభిస్తూ’’అని మొదలు పెడతాడు .ఇక్కడ వ్యక్తిఅంటే అభినవ గుప్తుని అభి వ్యక్తి అని అర్ధం .దీనిని విద్యాధర ,మల్లినాదులిద్దరూ సమర్ధించారు .కొన్ని పదాలకు పర్యాయ పదాలిస్తాడు .అనుభవ స్థితికి ఎదగటం అంటే పరిపక్వత అనుభవ స్థాయిని అందుకోవటం అని అర్ధం చెప్పాడు .అది చివరికి  మనోభావానికి ఎదుగుతుంది .అందువలన రసం సార్వత్రిక స్థాయి ఎదిగి స్వంతం ,అన్యులు ,ఉదాసీనత వంటి సంబంధాలన్నీ దూరమై పోతాయి . అది ప్రేక్షకులమనసులలో  ఆనందాన్ని నింపుతుంది .’’కదాపి ‘’అనే మాటలో విద్యాధరుడు రసం అనేది ఏ ఇతర మానసిక క్రియ కు ప్రత్యేకతలు ,దాని ఉద్దేశిత స్వభావాన్ని స్థాపించటానికి వస్తువు కాదు  అందుకే ‘’కదాపిత్యా ధీన ‘’అన్నాడు

‘’నానుభూత ‘’వంటి పదాలలో అర్ధాన్ని అన్ని కోణాలనుంచి తీసుకోవాలి కాని ఒకే ఒక ప్రత్యేక కార్యానికే ఉపయోగించరాదు  .సాధన కారణం తెలియ జెప్పే ది గా ఉండాలి . రసం విభావ మొదలైన ధనాత్మక ఋణాత్మక భూమిక మీద ఉత్పత్తి అవుతుంది అని చెబుతూ గ్రంధ కర్త రసం ఉత్పత్తి అయితే విభావ మొదలైనవి అదృశ్యమై పోతాయి అన్నాడు .’’న జ్ఞాత ‘’వాక్యం లో రసం భౌతిక రుజువులకు లోను కాదు .’’న క్రాన్తః కార్య తయేతి ‘’=మల్లినాధుడు దీనికి –‘’కార్యత్వే ఘటాదివత్ విభావాదినిమిత్తనాశేపి ,రసాను వ్రుత్తి ప్రసంగఇతి భావః -అది భౌతికాతీతమైనదే కాక అది స్వయం ప్రకాశం కూడా .’’విగలిత ‘’స్వభావం పరమ  ఉత్కృష్టమైనఆనందం .అప్పుడు ఇతర మైన విషయాలన్నీ తొలగిపోతాయి .అప్పుడది పరిపూర్ణమై రెండవ దేదీ లేనిదౌతుంది .’’పరిమితౌ ‘’అంటే బ్రహ్మానందాను భూతి కంటే వేరైనదికాదు  .’’అనదీతి ‘’అంటే ‘’అపరిచితి ‘’’విగలితేతి-విగలితాని వేద్యాన్తరాణియస్మిన్ తస్య భావస్తత్వం తేనోప లక్షితః నిరతిశయానందాత్మకయా విజాతీయ విషయ స్పురణ పరిహరేణసత్య మేవా ద్వితీయ భావేనా భాసమాన ఇత్యర్ధః ‘’

రసం రుజువులకు చిక్కేదికాదు ,అది స్వయం గా సూటిగా అనుభావి౦చగలిగేది మాత్రమె .అది దృశ్యమానం కాదా?దీనికి సమాధానం ‘’ధ్వవనన ‘’మొదలైనవి .ధ్వవనన చేసే పనినే ‘’వ్యంజన ‘’అంటారు .అది అపూర్వమైన నూతనమైన అసాధారణమైన ధర్మం .’’అపరిచితి అంటే అపరిమితి ‘’అధీతమనేనేతి అధీతీ –సూత్రం లో ఇతి అనేదికలిపాడు ‘’ఇష్టాదిభ్యః ‘’ఉనికి చూపటానికి వార్తిక లో ‘’కతస్యోన్విషయస్య కర్మన్యుప సంఖ్యానాం ఇతి సప్తమీ ‘’

పరిరమ్య అనేది విషయం నిర్భారతయా అంటే ద్రుఢం గా అని అర్ధం .సముల్లాసన్ నువ్యవహితే నన్వయః అంటే అర్ధం అనుభావి0 చేదేకాని చెప్పటానికి కుదరనిది ‘’అనుకార్యానుకర్త్రు గతత్వ పరిహరేణోతి ‘’అనే వ్యక్తీకరణ ను రచయిత భట్ట తౌతుడు మొదలైన వారు చెప్పిన వాటిని తిరస్కరించాడు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -28

— వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -28

‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -2

ఏకావలి లో రసవిధానం

రసం పై విస్తృత వర్ణన అసలు అర్ధం తెలుసుకోవటానికి  నిర్వచన పరిధి దాటి పోయింది .రస  వివరణ  అతి విస్తృతం గా  ఉంది .ఇప్పుడు రుచి –మనోభావం యొక్క స్వభావం తెలుసుకొందాం.అది విభావాల-నిర్ణయాల  నుంచి అంకురిస్తుంది.మరియు ఆలంబనలు  పనికత్తేలలాగాకారణ మవుతాయి .అది ప్రేరణ కలిగించే కారణాలైన చంద్రకాంతి , ,మధురమైన కోయిల పాట,చల్లని మలయ మారుతం అనే దక్షిణానిలం ,శృంగార క్రీడలు ,సుందరవనాల వలన ఉత్తేజితమవుతుంది .అది ప్రక్క చూపులు ,చిరునవ్వు ,లతలనుచేతులు ఊపినట్లు  నెమ్మదిగా కదిలించటం ,ఆదుర్దా వంటి ఆకస్మిక స్వభాలను పెంచుతుంది .ఇలాగా అని స్పష్టంగా అర్ధం చెప్పేట్లుఉండదు .వినిపించుకొనే స్థితిలో ఉండదు రెండవ దాన్ని గురించి ఆలోచించటం ఉండదు .ఇదమిద్ధం గా ఏమీ చెప్పలేని పరిస్థితి  .జ్ఞాపకాల బాట నుంచి వెనక్కి వచ్చే వీలు ఉండకపోవటం .సృజనను అధిగమించ లేకపోవటం,గుర్తింపు ను గుర్తించలేక పోవటం ఉంటుంది ..  తెలిసిన మరో వస్తువుతో గుర్తించ లేని స్థితి .నిత్యమైన మానసిక స్థితి అంటే స్థాయీ భావం అంటే ఆనందాన్ని ప్రేక్షకులకు కలిగిస్తుంది .అదే మానసిక స్థితి విభావ వరకు నిలిచి ఉంటుంది .పానక రస సూత్రం వలన మహా రుచికలుగుతుంది  .అదే ఆనందం .ఆనందం మెరుపులా వచ్చినపుడు అదే పరమాన౦దమై బ్రహ్మానందమై ,ఉత్కృష్ట బ్రహ్మ జ్ఞాన అనుభూతికలుగుతుంది .అది అపూర్వ ,అపరిచిత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది .అదే అస్పష్టమైన ఆనందం .అని లాల్యే వ్యాఖ్య .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -27

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -27

‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాలా౦కార విషయాలు

అలంకారం –రసం

కవిత్వం లో ధ్వని ముఖ్య భూమికను పోషిస్తుంది అని సంస్కృత ఆలంకారికుల భావన .ఇదే సాంకేతికంగా రసం అనబడుతుంది .దాదాపు   ఆలంకారి కులందరూ మొట్టమొదటి ఆలంకారికుడు  భరతుడు దగ్గర్నుంచి దాదాపు ఆలంకారికులు అందరూ రస చర్చ చేసినవారే .కళ లో రసం సౌందర్యానికి భావన .ఈ భావన మీద తాత్విక విచారణ విస్తృతంగా జరిగింది .ప్రొఫెసర్ వి.రాఘవన్ దీనిపై అద్భుత ఆవిష్కరణ చేశారు .రసము ,అలంకారం అనే రెండు పదాలు సంస్కృతం లో సౌందర్యాన్ని వివరించే ముఖ్య విభాగాలు (కాన్ స్టి ట్యుఎంట్స్).వైభవ౦ (పాంప్ ),అలంకరణ ( ఆర్న మెంటేషన్)అనేవి అలంకారానికి లక్షణాలు .శోభ( (స్ప్లెండర్,)రమణీయం (డెలెక్టి బిలిటి )రసానికి ముఖ్య లక్షణాలు .స్థాయీ భావాల ఆధారం గా రసం 9 రకాలు .అవి వేర్వేరు భావాలను అంటే  ఆహ్లాద ,అనాహ్లాద మొదలైన వాటిలో చేరి కళాకారుని భావ వ్యక్తీకరణలో ప్రేరణ చేత భాగమై  వ్యక్తిగతం చేసి  అనుభూతికలిగించి పరమానంద స్థితిని ,ప్రశాంతతను లేక  సమదృష్టిని కలిగిస్తాయి .భరతుడు దీనిని –సూత్రీకరిస్తూ –‘’విభావానుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తి ‘’అన్నాడు .

కవులు ,అందులోనూ ముఖ్యంగా మహా కావ్య కవులు తమ రచనలను అలంకార పుస్టితో సౌందర్య రుచి సంభూతంగా మలిచారు .కాని కావ్యానికి రసమే ఆత్మ.కావ్యాలు  ఈ రకంగా వృద్ధి చెందుతుంటే ,కవిత్వ శాస్త్రం కూడా ఏకకాలం లో స్థానం పొందింది .పూర్వ రచయితలైన భామహుడు దండి  ఉద్భటులు అలంకారానికి  అధిక ప్రాధాన్యమిస్తే ,ఆనంద వర్ధనుడు లాంటి వారు రసానికి ప్రాధాన్యమిచ్చి అలంకార ,రసాల మధ్య ఉన్న భేదాలను స్పష్టం గా తెలియ జేశారు ,అలంకారం లో ముఖ్య అర్ధం ఆధిపత్యం వహిస్తే ,రసం లో సూచించిన అర్ధ౦ (ప్రతీయమానం )ఇంకా ఎక్కువ ఆధిపత్యం వహిస్తుంది .ఆన౦ద  వర్ధనుని తరువాతి ఆలంకారికులు విస్తృతంగా ఈ రెండు భావనలమీదా సమగ్రమైన  చర్చ చేసి వెలుగులు కుమ్మరించారు .అలంకార రసాలకున్న సూక్ష్మధర్మాలను వివరించటానికి శక్తి యుక్తులన్నీ ధార పోశారు -అని పి. బి లాల్యే పండితుడు వివరించాడు .

ఏకావలి

14 వ శతాబ్దానికి చెందిన ఒరిస్సా ఆలంకారికుడు విద్యాధరుడు ‘’ఏకావలి ‘’రచించాడు .ఆయన ధ్వని సిద్ధాంతాన్ని కొద్దిగా చర్చించాడు .అందరు ఆలంకారికులు లాగానే విద్యాధరుడు కూడా ఉత్తమకవిత్వానికి ధ్వని ఆధారం అని సూచన చేశాడు .అయినా కొన్ని అలంకారాలను ఏకావలి లో  చర్చింఛి  నిర్వచింఛి ఉదాహరించి అందులోని రకాలను వివరించాడు .అవి తన స్వంత౦  అని విద్యాధరుడూ చెప్పుకోలేదు దానిపై వ్యాఖ్య రాసినా మల్లినాదుడూ చెప్పుకోలేదు .విద్యాధర ఆలంకారికునికి మల్లినాధుడు వ్యాఖ్యాన కర్త .అయినా సూరి ప్రామాణికమైన మమ్మటుని కావ్య ప్రకాశ ,రుయ్యకుని అలంకార సర్వస్వం లనుండి ఉదాహరణలనిచ్చి తన వాదనలను సమర్ధించుకొన్నాడు  . ధ్వని సిద్ధాంతం రససిద్దా౦తానికి అతి సన్నిహిత సంబంధం కలిగిఉంది .నిజానికి ధ్వని కవిత్వానికి ఆత్మ లేకజీవం .ఏకావలి లోని 4 వ ఉన్మేలనం లో విద్యాధర ,మల్లినాదులు దీనిని విస్తృతంగా చర్చించారు .తరువాత ఏకావలి లో లో రసచర్చ చూద్దాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-16-ఉయ్యూరు  .

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘంటసాల 94వ జయంతి

‘ సంగీత జ్ఞానేశ్వర ‘, ‘ఘంటసాల గాన ప్రవక్త ‘ , విశ్రాంత ఆకాశవాణి డిప్యూటీ డై రెక్టర్ జనరల్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ I.B.S     గారు… వంశీ రామరాజు గారు హయత్ నగర్ మండలం కుంట్లూరులో  నిర్మాణం చేసి నిర్వహిస్తున్న గానగంధర్వుడు ‘సద్గురు ‘ ఘంటసాల గుడిలో జరిగిన dsc_0586 dsc_0597 dsc_0689 dsc_0350 dsc_0544 dsc_0576 వేడుకలలో ముఖ్య అతిథిగా విచ్చేసి సద్గురు పాదుకలను శిరసున ఉంచుకొని ప్రదక్షిణాలు చేసి, పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ఘంటసాల పాడిన పాటలు వినిపించారు.

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కృష్ణాజిల్లా రచయితల సంఘం తోడ్పాటు

కృష్ణాజిల్లా రచయితల సంఘం తోడ్పాటు
విజయవాడ పుస్తక మహోత్సవంలో రచయితల స్వీయ ప్రచురణల అమ్మకం. విజయవాడ పుస్తక మహోత్సవం (బుక్ ఎగ్జిబిషన్) సాహితీ సాంస్కృతిక వేదికగా గత 28యేళ్ళుగా పుస్తక సేవ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే! నిర్వాహకులు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు జనవరి 1 నుండీ 11వరకూ నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాన్ని ఈ ఏడాది సాహితీ మహోత్సవంగా నిర్వహించే సంకల్పం చెప్పుకున్నారు. అందుకు వారికి అభినందనలు.
ఈ మహోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా రచయితల సంఘం తన వంతుగా ఈ సాహితీ సేవలో భాగస్వామి అవుతోంది.
ఈ రచయితలు స్వంత ఖర్చుతో అచ్చు వేసుకున్న సాహితీ విలువలు కలిగిన పుస్తకాలను ఈ పుస్తక ప్రదర్శనలో అమ్మకం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ బుక్‘ఫెష్టివల్ సొసైటీ వారు స్టాలును ఉచితంగా ఇచ్చి సహకరిస్తున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
కృష్ణాజిల్లా రచయితల సంఘం ఇప్పటివరకూ 15కు పైగా బృహద్గ్రంథాలను ప్రచురించి, అనేకమంది పరిశోధనాత్మక రచయితలకు చక్కని వేదికను కల్పించింది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను 3 పర్యాయాలు నిర్వహించింది. అసంఖ్యాకంగా జాతీయ సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహించి, భాషోద్యమానికి బాటలు వేసింది. విజయవాడ బుక్ ఫెష్టివల్ సొసైటీ వారి సహకారంతో రచయితల కోసం ఇప్పుడు ఈ పుస్తక విక్రయ సేవా కార్యక్రమం చేపడుతోంది.
రచయితలు స్వంతంగా ప్రచురించుకున్న పుస్తకాలను 50% ధరకే పాఠకులకు అందించాలని, తక్కిన 50% సొమ్మును రచయితకే ఇవ్వాలని కృష్ణాజిల్లా రచయితల సంఘం భావిస్తోంది. స్టాలు నిర్వహణా వ్యయాన్ని కృష్ణాజిల్లా రచయితల సంఘమే భరిస్తుంది.
స్వీయ ప్రచురణలను రచయితలు 10 కాపీలను మాత్రమే పంపవలసిందిగా కోర్తున్నాము. అమ్మకాన్ని బట్టి ఎప్పటికప్పుడు అదనపు కాపీలు అడిగి తెప్పించుకునే అవకాశం ఉంది. ఉన్నత సాహితీ విలువలు కలిగిన పుస్తకాలకు, చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన పుస్తకాలకు ప్రాధాన్యతనీయ వలసిందిగా ప్రార్థన. అనేక రచనలను స్వంతంగా ప్రచురించుకుని ఉంటే, ఒక్కోదానికీ 10 కాపీలకు మించకుండా అన్ని పుస్తకాలనూ పంపవచ్చు.
 ప్రాంతాల కతీతంగా తెలుగు రచయిత లందరికీ తమ పుస్తకాలను ఈ ష్టాలులో అమ్మకానికి ఉంచవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. మరిన్ని వివరాలకు అధ్యక్షుడు గుత్తికొండసుబ్బారావు (99440167697), ప్రధాన కార్యదర్శి డా. జి వి పూర్ణచందు (9440172642) లను సంప్రదించవచ్చు.
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం -9 18-కంచి పరమాఛార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామి

గీర్వాణ భాషా వైభవం -9

18-కంచి పరమాఛార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామి

గీర్వాణవాణి ప్రాచీనత

ఒకసారి కంచి పరమాచార్యులవారి దర్శనానికి నలుగురు విదేశీ విద్యార్ధులు వచ్చారు .వారు  ఇస్రాయిలీ, ఇటలీ ,జర్మన్, బ్రిటిష్  దేశాలకు చెందినవారు . ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో ప్రాచీన భాష విషయ౦  పై పరిశోధన చేస్తున్న ఫైలాలజీ విద్యార్ధులు .వాళ్ళు పాశ్చాత్య భాషలలో గ్రీక్ హీబ్రూ లాటిన్ భాషలను ,ప్రాచ్య భాషలలో సంస్కృతం తమిళ భాషలను అభ్యసిస్తున్నారు .స్వామి వారు నిత్యానుస్టానం లో ఉన్నందున వారికి దర్శనం, ఫోటో తీసుకొనే అవకాశం లేక వారికి తెలియ కుండానే మఠం అవతలున్న చెట్టుకింద 6 గంటలు నిలబడే నిరీక్షించారు .స్వామివారి కఠోర దీక్షకు ఆశ్చర్యపోయి ‘’పెరియ స్వామి కాలాతీత మహా పురుషులు అని నిశ్చయంగా చెప్పవచ్చు’’నని అనుకొన్నారు .పదినిమిషాల  తర్వాత దర్శనానికి అనుమతి లభించింది.ఫోటోలు తీసుకోవటానికి అనుజ్న నిచ్చారు .

వారందరినీ పలకరిస్తూ స్వామి ,వారి రాకకు కారణం అడిగి తెలుసుకొన్నారు .విషయ౦  తెలుసుకొని ప్రాచీన భాష పై వాళ్ళ అభిప్రాయమడిగారు. హీబ్రూయే అతి ప్రాచీనభాష పాశ్చాత్య దేశాలలోఅని ,కాని ప్రాచ్య దేశాలవారు సంస్కృతమే ప్రాచీనం అంటున్నారని చెప్పారు .అప్పుడు మహాస్వామి వారు ఈ రెండిటికంటే ప్రాచీనమైన భాష ఉంది .అదే వేద భాష అన్నారు .వేద భాష హీబ్రూ సంస్క్రుతాలకు జన్మ స్థానం ‘’అన్నారు .స్వామి ఇస్రాయిల్ కుర్రాడిని హీబ్రూ లో పునర్జన్మ గురించి ఒక కవిత ఉంది అని ముందు పదాలు  అందించి  మిగతాది చెప్పమన్నారు .అతడు మూడు నాలుగు నిమిషాలలో గుర్తు చేసుకొని అప్పగించాడు .మిగిలినవారి వైపు తిరిగి మీరు రుగ్వేదం చదువుకున్నారు కదా అని ఋగ్వేదం లో ఒక మంత్రాన్ని సూచించి పఠించ మన్నారు.వాళ్ళు 5 నిమిషాలు ఆ మంత్రాన్ని చదివారు .ఇస్రాయిల్ కుర్రాడిని ఆ మంత్రార్ధం తెలుసా అని అడిగారు.ఆ నలుగురు నోరు విప్పలేక పోయారు .అప్పుడు చిరునవ్వు నవ్వి పెరియ స్వామి వారితో ‘’ఈ కుర్రాడు హీబ్రూలో చదివినదాని అర్ధం మీకు ఎవరికీ తలిసి ఉండదను కొంటాను  .మళ్ళీ ఇస్రాయిలీ వానితో నువ్వు హీబ్రూలో ఏది చదివావొఇప్పుడు అదే వీళ్ళు పఠించారు ‘’అన్నారు .అవాక్కైన ఆ నలుగురి నోట మాట రాలేదు .తాను చెప్పింది రుజువు చేస్తానని పేపరూ పెన్ను తెప్పించమన్నారు . పరమాచార్య మాట్లాడుతూ ‘’ప్రపంచం 32  ప్రాంతాలుగా  విభజింప బడింది అని వేదం లో ఉంది  .అవి 32 భౌగోళిక పరిస్థితులపై ఏర్పడ్డాయి .ఈ 32 ప్రాంతాలలో వేదాక్షరం ఏరకం గా మార్పు చెంది ,పలక బడుతోందో వేదం చెప్పింది .ఆ నలుగురిని వారు వచ్చిన ప్రాంతాల పేరు అడిగి తెలుసుకొని వారి ప్రాంతం లో ఋగ్వేద ౦ లోని ప్రతి అక్షరం ఎలా మార్పు చెందిందో ఏ విధంగా పలక బడుతోందో  వివరించారు .స్వామివారు ఒక్కొక్క అక్షరం ఒత్తిఒత్తి పలుకుతూ రుగ్వేదమంత్రాలకు హీబ్రూ లో చదివిన దానికి ఉన్న సారూప్యం తెలియ జేశారు .అప్పుడు మహా స్వామి అందరికి ‘’వీళ్ళు చదివిన ఋగ్వేద మంత్రమే మీరు చదివిన హీబ్రూ కవిత అక్షరాలు మార్పు  పొంది అలా అయింది .యమున జమున ఉత్తర భారతం లోను వ బెంగాల్ లో బ అయినట్లు ,తమిళం లో ప కన్నడం లో హ అయినట్లే   ఈమార్పు కూడా .కనుక అతిప్రాచీన భాష వేద భాష మాత్రమే ‘’అని స్పష్టం చేశారు .పేపరు పెన్ను తెప్పించి ఆ  నలుగురికి ఇచ్చి ఋగ్వేద అక్షరాలు  వారి వారి భాషలో ఏ విధంగా ఉచ్చ రింప బడుతాయో కాగితం పై రాయమన్నారు .వారందరూ ఆపనిని 15 నిమిషాలలో పూర్తీ చేశారు .

ఇస్రాయిల్ కుర్రాడు ఆశ్చర్య పోయి ,’’ఇది ఊహించటానికి శక్యం గా లేదు ‘’అన్నాడు .మహా స్వామి ‘’ఇప్పుడైనా తెలిసిందా మీకు అన్ని ప్రపంచ భాషలకు వేదమే మూలం అని ‘’అన్నారు .ఇస్రాయిల్ కుర్రాడి ముఖం లో సంతృప్తి కనిపించలేదు .గమనించిన పెద్ద స్వామి వారు ‘’నీ ఉద్దేశ్యం లో హీబ్రూ భాష నుంచే వేడాలు  వచ్చాయేమో  అని అనుమానమా ?అని ప్రశ్నించారు .’’అవును ‘’అన్నాడు ఆ కుర్రాడు .మహా స్వామి ‘’నీ దగ్గర తాళం మాత్రమే ఉంది .మా దగ్గర తాళమూ దాని తాళం చెవీ రెండూ ఉన్నాయి .వేదాలలో ఏ మహర్షి ఇస్రాయిల్ లోని  ఏ ప్రాంతానికి వెళ్లి వేద వ్యాప్తి ,వేద బోధ చేశాడో వేదం లో చెప్పబడి ఉంది ‘’అన్నారు .దీంతో పూర్తిగా సంతృప్తి చెందిన ఇస్రాయిల్ కుర్రాడు అన్ని భాషలకు వేద భాషమాత్రమే మూలం అని పూర్తిగా సంతృప్తిగా నమ్మాడు .

ఆధారం –పరమాచార్యులవారు ఇచ్చిన ఇంటర్వ్యు .తమిళం లో ఉన్న దీనిని  వెల్లూర్ కు చెందిన వంశీ ఈమని చేసిన ఆంగ్లాను వాదం  .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం -8

గీర్వాణ భాషా వైభవం -8

17-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని –విజయవాడ -9346978829

గీర్వాణ భాషా వైభవం

1-సీ-భాషలందున రాజ భాష గీర్వాణమై -మనసు దోచిన గొప్ప మధుర భాష

వేద వేదాంగాల వెల్లి విరిసి నట్టి –సత్యవాక్కుల జాటు సౌమ్య భాష

శబ్ద మధురిమల శోభిల్లు చుండెడి –వీనుల వి౦దగు వేద భాష

ప్రాచీన భాషగా ప్రాచుర్య మొందిన –అద్భుతమైనట్టి అమర భాష

ఆ.-ఆది కవినుండి కవిత కాల వాలమనగ-ఎన్నదగిన రచనలున్న భాష

కవులు పండితులకు ఘనకీర్తి నొసగి-వాజ్మయమున నెంతో వాసి కెక్కె.

2-సీ.భవ్య భాగవతాది దివ్య గ్రంధావళి –తొలుత గీర్వాణాన వెలసె నిలను

అష్ట పదులతోడ నిష్ట దేవత గొల్చి –జయదేవ కవి పొందె జగతి కీర్తి

పలు ప్రశంసల నొంద పంచ తంత్రము వ్రాసి –విశ్వ విఖ్యాతి బడసె విష్ణు శర్మ

భర్త్రు హరి రచియించె భాష గీర్వాణాన –భక్తి వైరాగ్య సుభాషితముల

ఆ –రాజ పూజ్యంబై వెలిగిన రమ్య భాష –దేవనాగరి యనబడు దివ్య భాష

శబ్ద మాధుర్య రసభావ లబ్ది నొంది –తనరె గీర్వాణ భాషగా తరతరాల .

3-సీ-వాల్మీకి కృతమై వరలె రామాయణం –సంస్కృతాన జనులు సన్నుతింప

కాళి యాశీస్సుల గీర్వాణ కవిగనై-ఖ్యాతి గాంచెను కవి కాళిదాసు

ఆచార్య శ౦కరు౦ డద్భుత స్తోత్రాలు –సంస్కృత భాషలోన సంకలి౦చె

పండితోత్తము లెంతో ప్రస్తుతించిన యట్టి –సంస్కృత భాషయే శ్రావ్య మిలను

తే.రాజు లెందరొ మెచ్చిన రాజభాష –కవుల కారాధ్యమైనట్టి కావ్య భాష

దివ్య రచనలు విలసిల్లు భవ్య భాష –భాష గీర్వాణమును బోలు  భాష కలదె.

4-సీ-భరత దేశము నందు భాష లంద౦న్నింట –మూలమై నిల్చు నమూల్య భాష

గీర్వాణ పదములు గణనీయముగా జేరి –తెలుగుజిలుగు లెంతొ తేజరిల్లె

సంస్క్రుతోద్భవ గ్రంధ సముదాయము లనెన్నొ-ఆంధ్రీకరించిరి ఆదికవులు

శృతి లయాత్మకమైన సంస్కృతంబిలలోన-అసమానమగు నట్టి అమరభాష

తే.మంత్ర తంత్రాల కాధార మైన యట్టి –దేవతలు మెచ్చి దీవించు దివిజ భాష

యజ్ఞయాగాది కార్యాలు ప్రజ్ఞ తోడ –ఆచరించగా తోడ్పడు ఆది భాష .

5-సీ-సంస్కృతంబు దెలియ సులభ సాధ్యంబౌను –పెక్కు భాషలలోని చక్కదనము

ఆదికవులు నాడు ఆంధ్రీకరించిన –గీర్వాణ గ్రంధాలు గంతికేక్కె

ఉభయ భాషలలోన యుద్దండ రచనల –ప్రతిభ చాటిరి వారు ప్రజ్న తోడ

వివిధ ప్రక్రియల లో వెలలేని గ్రంధాలు –అవతరించెను జగతి అద్భుతముగ

తే-అమ్మ వాగ్దేవిఆశేస్సుల౦దు కొనిన –ఆణి ముత్యములను బోలు ఆది కవులు

జన్మ ధన్యత నొంద జగతి నందు –తల్లి భారతి సేవించి తనరి రిలను .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-20-12-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి

నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి

‘’నువ్వైనా చెప్పవమ్మ సాంబనువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికిశివుడికి ‘’అన్న తనికెళ్ళ భరణి పాటకు పేరడీ

‘’నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి

పెద్ద నోట్ల రద్దు గొడవ నీ బాబు మోడికి  – నువ్వైనా

రద్దు చేస్తే వచ్చే కష్టం నష్టం  తెలియ లేకనే

దబాయింపు సెక్షన్ లో పడిలొల్లి లొల్లి చేసినాడనీ –నువ్వైనా

బ్యాంకుల్లో క్యూల వరుస కొండవీటి చేంతా డై౦దనీ

క్యూలలోనే ప్రాణాలు హరీ మంటూ క్యూలు కట్టాయనీ –నువ్వైనా

నల్ల కుబేరులేమో  బెదర లేదని , పాత నోట్లు పోయినా

డూప్లికేటు నోట్లు క్షణాలలో గుద్దిపారేసి మళ్ళీ కుబేరులైపోయి నారనీ –నువ్వైనా

ఏది తెలుపో ఏది నలుపో తెలియలేక, దిక్కు తోచక

సామాన్యులు  కుదేలై  కళ్ళు తేలేసి గుడ్లు మిటక రిస్తున్నారని –నువ్వైనా

పులి మీద స్వారీ చేస్తూ ఎవరినీ లెక్క చేయక

మీసం లేకున్నా తెల్ల గడ్డం దువ్వుతున్నాడని       -నువ్వైనా

పార్టీ లో లుకలుకలు ,ఎంపీల్లో నైరాశ్యం ,సహమిత్రుల అసహాయత్వం

అన్నీ పెనవేసి కొంప ముంచుతుంటేను నీరోలా ఫిడేల్ వాయిస్తున్నాడని –నువ్వైనా

కాళ్ళు తెగిన కాంగిరేసుకు కాళ్ళు తెచ్చి ఇచ్చినాడని

 తిరస్కరింప బడ్డ  కమ్మీలకే కాక  చిల్లర మల్లర పార్టీలకూ  ప్రాణం పోసినాడని—నువ్వైనా

హోం వర్క్ చేయకుండా అర్ధ రాత్రి చేస్తే నిర్ణయాలు

బెడిసికొట్టి కొంప కూల్చిందనీ ,కొల్లేరు చేసిందనీ –

నువ్వైనా చెప్పవమ్మ  నీ కొడుకు మోడికి

పెద్ద నోట్ల రద్దు గొడవ నీ బాబు మోడికి .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-16 –ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి -3(చివరిభాగం )

పెరియ స్వామి వారి గీర్వాణ రచన

పెరియ స్వామి అని అందరి చేత పిలువబడే పరమాచార్యులవారు రచించిన ‘’మైత్రీం భజతా ‘’అనే సంస్కృత గీతాన్ని ఐక్య రాజ్య సమితిలో సమితి వార్షికోత్సవం నాడు శ్రీమతి ఎం ఎస్.సుబ్బు లక్ష్మి గానం చేసినట్లు చెప్పుకొన్నాం . ఆ గీత వైభవం దర్శిద్దాం –

‘’మైత్రీం భజతా అఖిల హృజ్జేత్రీం –ఆత్మా వదేవ పరానాపి పశ్యంతా

యుద్ధం త్యజతా స్వార్ధం త్యాజ్యతా –త్యాగతా పరేషు అక్రమమాక్రమణ౦

జననీ పృధ్వీ కామ దుఘాస్తే-జనకో దేవా సకల దయాళూ

దామ్యతా దత్తా దయాద్వం జనతాః-శ్రేయో భూయాత్ సకల జనానాం

శ్రేయో భూయా సకల జనానాం- – శ్రేయో భూయాత్ సకలజనానాం.

భావం –స్నేహం వినయం అందరి హృదయాలను గెలుస్తాయి –నీలాగా అందరినీ చూడు .యుద్ధం త్యజించు .స్వార్ధాన్ని త్యజించు .ఆవేశ పూరిత దాడిని ,ఆక్రమణను త్యజించు .భూమితల్లి మన కోరికలన్నీ తీరుస్తుంది .అందరికీ ఉన్న ఒకే ఒకతండ్రి పరమేశ్వరుడు .హద్దులో ఉండటం ,ఇతరులకు దానం చేయటం ,పరులపై కరుణ చూపటం అలవాటు చేసుకో.ప్రపంచ ప్రజలారా సుఖ సంతోషాలతో వర్ధిల్లండి .

మనకు భూ సూక్తం ఉన్నది .దానికి సాటిగా స్వామివారి రచన సాగింది .వారినోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యమూ అమృత తుల్యమే .ఈ గీతం విశ్వ వేదిక పై గానం చేయబడటం  భారతీయ ఆకాంక్ష కీర్తికి ఎత్తిన పతాక .ఇదే అంతర్జాతీయ గేయంగా వర్ధిల్లితే ఎంతో హృద్యంగా ఉంటుంది .

అదీ పరమాచార్యుల ఉత్తమోత్తమ ఉన్నతోన్నత భావ లహరి .అందుకే జగద్గురువు లయ్యారు .

శ్రీ వారు శ్రీ దుర్గా ప్రతిష్ట సందర్భం గా’’ శ్రీ దుర్గా పంచ రత్న స్తోత్రం ‘’  రచించినట్లు శ్రీ విశాఖ పేర్కొని దానిని ‘’జగద్గురు బోధలు -10 ‘’లో ఇచ్చారు .దానిని ఇప్పుడు దర్శిద్దాం –

1-తే ధ్యాన యోగానుగతా అపశ్యన్ –త్వా మేవ దేవీం స్వగుణై ర్నిగూఢతాం

త్వమేవ శక్తిః పరమేశ్వరస్య –మాం పాహి విశ్వేశ్వరి మోక్ష దాత్రి

2-దేవాత్మ శక్తిః శ్రుతి వాక్య గీతా –మహర్షి లోకస్య పురః ప్రసన్నా

గుహా పరం వ్యోమ సతః ప్రతిష్టా-మాం పాహి విశ్వేశ్వరి మోక్ష ధాత్రి .

3-పరాస్య శక్తిః వివిధవ శ్రూయతే –శ్వేతాశ్వ వాక్యోదిత దేవి డుర్గే

స్వాభావికీ జ్ఞాన బలక్రియాతే – మాం పాహి విశ్వేశ్వరి మోక్ష ధాత్రి .

4-దేవాత్మ శబ్దేన శివాత్మ భూతా –యత్కూర్మ వాయవ్య వచో వివ్రుత్యా

త్వం పాశ విచ్చేదకరీ ప్రసిద్ధా – మాం పాహి విశ్వేశ్వరి మోక్ష ధాత్రి .

5-త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ –బ్రహ్మ ప్రతిష్టా స్యుపదిస్ట గీతా

జ్ఞాన స్వరూపాత్మతయాఖిలానాం – మాం పాహి విశ్వేశ్వరి మోక్ష ధాత్రి .

స్వామివారు ‘’శ్వేతాశ్వవాక్యోదిత దేవి దుర్గే ‘’అన్నారు .శ్వేతాశ్వ తరుడు అనే రుషి ఉన్నాడని శ్రీ వారు చెప్పేదాకా చాలా మందికి తెలిసి ఉండదు .శ్వేతాశ్వ వాక్యోదిత దుర్గ ఎలా ఉన్నది –అన్నదానికి శ్రీ విశాఖ ఒక శ్లోకం ఉటంకించారు –

‘’భూతాని దుర్గా భువనాని దుర్గా –స్త్రియో నరా శ్చాపి పశుశ్చ దుర్గా –

యద్యద్ధి దృశ్యం ఖలుసైవ దుర్గా –దుర్గా స్వరూపా దపారం న కించిత్ ‘’

అంటే సర్వభూతాలు సర్వ లోకాలు ,స్త్రీ పురుష పశువులు అంతా దుర్గా స్వరూపమే .కనిపించింది ,కనిపించనిది అంతా దుర్గా స్వరూపమే .దుర్గా స్వరూపం కానిది ఏదీ లేదు .దుర్గ ఏక ప్రాభవ శాలిని ,అఖండ చైతన్య స్వరూపిణి.

పాల్ బర్టన్ వంటి పాశ్చాత్యులు మహా స్వామిని దర్శించి స్పూర్తిపొందారు .మన కళ్ళముందు నడయాడిన దైవం శతమానం జీవించి 8-1-1994 న శంకర సన్నిధికి చేరుకొన్నారు .వారి సంస్కృత రచనలు నాకు ఈ రెండు మాత్రమే లభించాయి .ఎవరి వద్ద అయినా వారి రచనలు ఉంటె నాకు పంపితే వాటినీ చేర్చి సంతృప్తి చెందుతాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-16- ఉయ్యూరు

 

 

Inline image 1Inline image 2

 

 

 

.

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం -7-శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారి పద్యాలు

photo-2 photo photo-1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం -6 15-డా.గబ్బిట జయమాణిక్య శాస్త్రి –పూరీ -0860847403

— గీర్వాణ భాషా వైభవం -6

15-డా.గబ్బిట జయమాణిక్య శాస్త్రి –పూరీ -0860847403

గీర్వాణ భాషా వైశిష్యః

1-అధ్యక్ష సరసస్వభాసు విలసత్ భారత్సుదీత సంసదః –క్షత్ర వేదయ  మహాంధ్ర వేదమయ   విద్యాల౦ క్రుతి శ్రీనిధిః

మిత్రశ్రీ సురమందిరానిలజ  సద్గాధాప్రసంగోజ్వలః –శ్రీమద్గబ్బిట వంశ మౌక్తికమణిః దుర్గా ప్రసాద కృతీ .

2-పూర్వా౦గ్ల కవి ప్రపంచ  సరసల్లాప ప్రసారోదరః –మాణిక్య మలమానినీ సుచరితయా శ్రీ రంజనా భాషణాః

జ్యోతిశ్లేషణ సాహితి సుకవితా విద్వత్వ సంశ్లిష్ట ధీః-శ్రీమద్గబ్బిట వంశ  మౌక్తిక మణిః దుర్గా ప్రసాద కృతీ .

3-విజ్ఞానామలం బోధనోజ్వల కళానైపుణ్య విఖ్యాతధీః-ఉర్మి గ్రామ రసాకృతి  సకల సచ్చాత్ర ప్రియ ప్రాభవః

సేవానంద విధాయి భాషణాలసత్ సంస్కార సంస్తాశ్రయః – శ్రీమద్గబ్బిట వంశ మౌళి మౌక్తిక మణిః దుర్గా ప్రసాద కృతీ .

4-శ్రీమృత్యుంజయ శాస్త్రిణః శుభ భవానీ మాతృః అచ్ఛాత్మజః –శ్రీ మృత్యుంజయ నారసింహ రమణా శ్రీకృష్ణ లక్ష్మ్యాత్మజః

శ్రీ దుర్గా సువివేక౦ బంధు రందః పత్నీ ప్రభావత్యసు – శ్రీమద్గబ్బిట వంశ మౌళి మౌక్తిక మణిః దుర్గా ప్రసాద కృతీ .

5-గీర్వాణాత్మ సుదీకవి ప్రవర  గైర్వాణ యాద్ర హ్రుద్వాక్  వపుః-శ్రీమత్ శంకర కాళిదాస కవిరాట్ వ్యాసాది  భాషా ప్రియః

బాణ ప్రాణ ఉదాత్త  భద్ర చరితం జీయాత్ శతం వత్సరాన్ – శ్రీమద్గబ్బిట వంశ మౌళి మౌక్తిక మణిః దుర్గా ప్రసాద కృతీ .

6-శ్రీమద్గబ్బిట వంశ మౌక్తిక మణిం దుర్గా ప్రసాద సుధీః-నిర్మాయాంధ్ర మయీ౦చ దివ్య కవితా గీర్వాణవాణి విదాం

లోకానాముపకార మద భుమహో  సమ్యక్ వ్యదాత్ శ్రద్ధయా –వార్ధక్యే పరమేశ దివ్య కృపయా భాసతాం .

7-ఏతద్ కృత్యా  మిహాదయః సర్వ జననా సంతోష సంపాదకం –చైక త్రేవ సమస్త దివ్య విదుషాం వాగ్వైఖరీ జీవనాం

జాతుం శక్యమతో అన్య గ్రంధ పఠనం కర్తవ్య మేవాస్తినా –విద్వత్తల్లజ శక్తి రపి అసులభా విజయతే వై ధృవం .

8-ఉయ్యూరిత్యాని మంగలే జనిమతా౦  కృష్ణా తటిన్యా తటై  -భ్రాజత్ పుత్ర మిత్ర పౌత్ర నివహేస్యంత శోభావతాం

శ్రీమద్గబ్బిట వంశ పూర్ణ జలధే ఉదయత్ ప్రభా భాసతాం-పూజ్యానాం ప్రణతిః మమాదయ భవతాత్ దుర్గాప్రసాద ధ్రుతాం .            శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిపై శ్లోకం

‘’మండల్యాస్య సుసద్వంశో కృష్ణారాయ సుపుత్రకః –బుద్ధప్రసాద ఇత్యాఖ్య రాజతే అసౌ కవిప్రియః ‘’

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారిపై శ్లోకం

‘’శ్రీమైనేని సుసద్వంశ విఖ్యాతః క్రుతిరాట్ స్వయం –గోపాల కృష్ణ ఇత్యాఖ్యయః  రాజతే అమెరికా వాసీ ‘’. .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-16 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి -2

జనన విద్యాభ్యాసాలు

కంచికామకోటి 68 వ పీతాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖర మహా స్వామి వారు 20-5-1894 న అనూరాధా నక్షత్రం లో తమిళనాడు దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లిపురం లో సనాతన సద్బ్రాహ్మణ కుటుంబం లో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి అనే జిల్లా విద్యాశాఖాధికారి గారి కి ధర్మపత్ని శ్రీమతి మహా లక్ష్మి కి జన్మించారు .ఇలవేల్పు పేరు గా స్వామినాధన్ అనే పేరుపెట్టారు .దక్షిణ ఆర్కాటు జిల్లా లోని తిండివనం లోని అమెరికన్ మిషన్ హైస్కూల్ లో ప్రాధమిక విద్య నేర్చారు .అపూర్వ మేధావి అవటం తో అన్నిటా మొదటి స్థానం పొందేవాడు .1905 లో ఉపనయనం జరిగింది .అన్న సదాశివ శాస్త్రిని అందరూ ‘’శివం సార్ ‘’అని పిలిచేవారు .

మహార్జాతకులు -68 వ పీఠాదిపతులు

తండ్రి స్వామినాధన్ కొడుకు జాతకాన్ని ఒక గొప్ప జ్యోతిష్ శాస్త్ర  వేత్తకు చూపించాడు. ఆయన అమాంతం కుర్రాడి పాదాలపై వ్రాలి ‘’ఏదో ఒక రోజు ప్రపంచమంతా ఈ కుర్రాడి పాదాలపై వ్రాలుతుంది ‘’అని చెప్పాడు .కంచి 66  వ పీఠాధిపతి తిన్దీవనం సమీపం లో చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారు ..తండ్రి ఈ పిల్లాడితో స్వామి దర్శనం చేసుకొనగా స్వామి ఈ బాలుని పై అవ్యాజ కటాక్షం చూపారు .1907 లో ఈ బాలుడి తండ్రికి అతనిమేనమామ కొడుకుని 67 వ పీఠాదిపతిగా ఎంపిక చేశామని కబురు చేసి రమ్మని ఆహ్వానించారు .అప్పటికే స్వామివారు మసూచికం తో తీవ్రంగా బాధ పడుతున్నారు ఎక్కువ కాలం జీవించే పరిస్థితి లేక చనిపోగాకొత్తగా వచ్చిన  67వ స్వామి కూడా వెంటనే చనిపోగా వెంటనే స్వామినాధన్ ను68 వ అధిపతిగాచంద్ర శేఖర సరస్వతి దీక్షా నామధేయం తో 9-5-1907 న  అప్పటికప్పుడు కుంభకోణం మఠంలో పట్టాభిషేకం చేసేశారు .గార్డియన్ గా శ్రీ వెంకట రమణ అయ్యర్ ఉన్నారు .స్వామికి 21 వ సంవత్సరం రాగానే 1915 శంకర జయంతి నాడు పూర్తీ బాధ్యతలతో పీఠాదిపతి అయ్యారు .1913 నుండి 15 వరకు వేద వేదాంగాలను కుంభ కోణం మఠం లో అభ్యసించారు .మహా విద్యావంతులై తపస్సాదనలో ఆధ్యాత్మికాను భవం పొంది జగద్గురువులయ్యారు .ధర్మ శాస్త్రాలన్నీ స్వయం గా చదివి మదించి నిష్ణాతులయ్యారు .

ఆధ్యాత్మిక కార్యక్రమ పరంపర

కాలినడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు ప్రయాణం చేసి గ్రామ సీమలలో అద్వైత మత ప్రచారాన్ని చేశారు .ఎన్నో పురాతన దేవాలయాలను పునరుద్ధరించారు .ముఖ్యంగాశ్రీ కాళహస్తి దేవాలయ చరిత్రను త్రవ్వి తీయించి లోకానికి చాటారు .సదాశివ బ్రహ్మేంద్ర యతి సమాధిని మనమదురైలో  గుర్తించి వైభవం తెచ్చారు .వేద పాఠ శాలలను నెలకొల్పి వేద విద్యా వ్యాప్తి చేశారు .దీనికోసం వేద రక్షణ నిధిని ఏర్పాటు చేశారు .అన్ని వేద శాఖలలో విద్యార్ధులు చేరేట్లు చేసి శాఖలను పునరుజ్జీవింప జేశారు .అధర్వ వేదం లోని శౌనిక శాఖను ,సామవేదం లోని రనయయిన శాఖలను శిధిలం కాకుండా కాపాడారు .కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ఏర్పాటు కు నాటి ముఖ్యమంత్రి భక్త వత్సలం అడ్డు పడుతుంటే దాని రూప శిల్పి శ్రీ ఏకనాద్ రానడే పరమాచా ర్యను కలిసి వివరించగా భక్తవత్సలం వెంటనే ఒప్పుకున్నాడు .తిరుపతిలో వేద పరిరక్షణ స్కీం ను తిరుమల తిరుపతి దేవస్థానం తో ఏర్పాటు చేయించిన ఘనత పరమాచార్యుల వారిదే ‘స్వామి వారు రచంచిన ‘’మైత్రీం భజతా ‘’అనే సంస్కృత గీతాన్ని ఐక్య రాజ సమితిలో 23-10-1965 న ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రత్న సంగీత సామ్రాజ్ఞి శ్రీమతి ఎం ఎస్. సుబ్బు లక్ష్మి గారు గానం చేసి చిరస్మరణీయం చేశారు .

ఆది శంకరుల దివ్య సేవలో పరమాచార్య

ఆది శంకరాచార్య అంటేమహా స్వామికి అవిపరీతమైన ఆరాధనా భావం ఉంది .అందుకనే శంకరాచార్య జన్మించిన కాలడి ,తిరిగిన ప్రదేశాలైన శ్రీ శైలం ,ప్రయాగ ,రామేశ్వరం లలో స్మ్రుతి  చిహ్నాలను నెలకొల్పారు.కాలడి లో  కంచి మఠం తరఫున కీర్తి స్థంభంఅనే 8 అంతస్తుల భవనాన్ని నిర్మించి  ఆచార్యుల పాదుకలు మొదలైనవి భద్ర పరచారు .కంచిదగ్గర ఎనతూర్ లో  60 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం ప్రతిస్టిం చారు .స్వామి వారు పీఠాదిపతులుగా ఉన్నకాలాన్ని స్వర్ణ యుగం అంటారు .8-1-19 9 4 న మహా స్వామి మహా సమాధి చెందారు .

 

Inline image 1 Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-16-ఉయ్యూరు

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి

కంచి కామకోటి 68 వ పీఠాదీశ్వ రులు శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ మహా స్వాములవారు సర్వ దేవతా స్వరూపులు .నేలమీద నడిచే దైవం .స్వామి ఉనికి కృత యుగం కంటే గొప్పది –‘’కృతా దవ్యతి రిచ్యతే ‘.స్వామి భక్తిజ్ఞాన వైరాగ్యాల అవతారమే .స్వామి దర్శనం సర్వ దేవతా దర్శనమే .స్వామిని గురి౦చి ఒక భక్త కవి –‘’సమాగతో నా భావ దీక్షణ-ప్రక్షీణ సర్వాక్షమలోమలాన్తరః –నిక్షిప్త చిత్తో భాగవత్యధోక్షజే –ముముక్షు వర్యో భవతి క్షణేన వై ‘’అని స్తుతించాడు –అంటే –‘’మీ కడగంటి చూపులు ప్రసరిస్తే చాలు ఇంద్రియ చాపల్యం నశిస్తుంది .మనస్సు పరి శుద్ధమవుతుంది .అంతఃకరణం మీ పాదపద్మ సంలగ్న మౌతుంది .ఇదంతా మీ కడగంటి చూపు ప్రసరించిన క్షణ కాలం లోనే జరిగిపోతుంది .కంచిలో శ్రీ కామాక్షీదేవి అమ్మవారు స్వామి రూపం లో మనమధ్య నడయాడుతుంది .కాంచీ కామకోటి యతి రాజ దర్శనం తో పునరపి జననం పునరపి మరణం ఉండదని గాఢ మైన విశ్వాసం .చందోలు లోని మహాతపస్సంపన్నులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు స్వామిని ‘’నడుస్తున్న బ్రహ్మ పదార్ధం .వారిని గూర్చి అసలు చెప్పటం అసాధ్యం ‘’.యతో వాచో నివర్తన్తే ‘’అన్న ఉపనిషద్వాక్యం మహా స్వాముల యెడ పూర్ణ సత్యం ‘’అన్నారు .

సూర్యుడు అధి దేవతయై వృశ్చిక రాశికి చెందిన అనూరాధ నక్షత్రం లో మహా స్వామి జన్మించారు .’’నాన్ మురుగన్ ‘’అంటే నేను  షణ్ముఖుడు అయిన సుబ్రహ్మణ్య స్వామిని ‘’అని వారే చెప్పుకొన్నారు .స్వామి పూర్వాశ్రమనామం స్వామి నాధుడే అనగా సుబ్రహ్మణ్యేశ్వరుడే .స్వాములందరికి స్వామి స్వామినాధుడు –సుబ్రహ్మణ్యుడే.మధురకవి శ్రీ కాటూరి వెంకటేశ్వర రావు గారు స్వామివారిని ‘’శ్రీమద్భారత కాంచీ –దామాయిత కా౦చి నగర దామునకు నవి –ద్యామయ హరణ సుదాకల-శీ మంజుల దర్శనునకు సిద్ధ పదునకున్ ‘’అని –‘’పరమశమ నిరతునకు శం –కర దేశిక కామకోటి కల్పిత పీఠ-స్థిర మంగళ దీపశ్రీ –చరణునకున్  మాద్రుశ ప్రసన్న శివునకున్ ‘’ అని కైమోడ్పు పలికారు .ఎవరైనా  తలిదండ్రులతో స్వామి దర్శనానికి వెడితే ముందుగా తలిదండ్రులకు నమస్కరింప జేసి తరువాత తమకు నమస్కరి౦చ మని సంస్కార యుతంగా చెప్పేవారు .స్వామివారు శంకర భగవత్ పాదుల వారిలా అద్వైత మత ప్రచారాన్ని చేసినా  సర్వమత ములు స్వామివారికి సమ్మతములే .ఇతరమతాలకు అద్వైతం అంటే కన్నేర్రగా ఉన్నా అద్వైతానికి దేనిలోనూ విరోధం కనిపించదు .అద్వైతం అంటే ‘’సర్వతః సంఫ్లుతోదక స్థితి ‘’అన్నారు .శివ విష్ణువుల అభేదాన్ని స్వాములవారు తరచుగా చెబుతూకాళిదాస మహాకవి శ్లోకం ఉదహరిస్తారు అని శ్రీ విశాఖ తెలియ జేశారు –‘’ఏకైవ మూర్తి ర్బిభిధే త్రిదాసా –సామాన్య మేషాం ప్రధమావరత్వం – విష్ణో ర్హరస్తస్య హరిః కదాచిత్ –వేదాస్తయోస్తావపి ధాతురాద్యాః’’.’

మనం ఏదో మూట కట్టుకొని ఈలోకానికి వచ్చామని ,ఆ మూటను ఇక్కడే దులిపేసుకొని వెళ్ళిపోవాలని ,దానికి దారి చూపేది త్రిపుర సుందరి అని ,ఆమె అనుగ్రహం కోసం పరితపించమని బోధిస్తారు స్వామి .’’ఆమ్ర తరుమూల వసతే-రాదిమ పురుషస్య నయన పీయూషం –ఆరబ్ద యవ్వనోత్సవ –మామ్నాయ రహస్య మంతరవలంబే’’అన్న మూక కవి శ్లోకాన్ని పదే పదే గుర్తు చేస్తారు .శ్రీ వారి జ్ఞాపక శక్తి పరమాద్భుతం .ఆర్యా ద్విశతి గురించి చెబుతుండగా  అదెక్కడ దొరుకుతుందని  శ్రీ విశాఖ అడిగినప్పుడు అలవోకగా ‘’వందే గజేంద్ర వదనం –వామాకా రూఢ వల్లభాశ్లిస్టం –కుంకుమ పరాగ శోణ౦-కువలయి నీరజకోరకాపీడం  ‘’తో మొదలుపెట్టి చాలా శ్లోకాలు చెప్పారట .ఇది శ్రీ శంకరాచార్యుల ‘’ప్రపంచ సారం ‘’లో ఉన్నదని ఆర్యా వృత్తం లో వ్రాయబదిందని ఎరుక పరచారు .’’వ్యక్తాన్ని సాధన గా చేసుకొని అవ్యక్తాన్ని సాధించాలి ‘’అన్నది స్వామి ముఖ్య బోధ అంటే గురువుద్వారా నే ఏదైనా సాధించాలని భావం .ఉపాసనం అంటే ధ్యానమే –‘’ధ్యానమేవ ఉపాసనం ‘’అంటారు .’’మనం చేసే అన్వేషణే ఆనందం సుఖం ‘’అంటారు .శివాజీ మహారాజు కంచి ఆచార్యులవారికి కనకాభిషేకం చేసి కప్పిన శాలువాను భద్రంగా దాచి తనకు కనకాభి షేకం చేసే సమయం లో బయటకు తీసి కప్పుకొని ఇంతకంటే గొప్ప కనకాభిషేకం ఉంటుందా అని ప్రశ్నించారు .స్వామి నిత్య ఉపవాస కృశి.ఉజ్వల తపోనిస్టాగరిస్టులు,మహా తేజస్వి ,మౌని ,బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు ,మంత్రం ద్రష్ట అయిన రుషి పుంగవులు .ఇవే వారి లోవేలుగుకు ముఖ్య కారణం అంటారు శ్రీ విశాఖ .

మహా తపో సంపన్నులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు పరమాచార్యులపై ‘రచించిన ’ఉపాస్తి ‘’లో

1-స్వస్మై నమః పదమహం కరవాణి వాణి-మత్తో నహీతర దనేక మధైకకం వా

అస్మాదసత్తదధివా స్వరస ప్రాసారా –దావివత్వమాకమః ప్రతి యోగి త్వం త్వం .

2-శ్రీచంద్ర శేఖర పదా౦కిత సంయమీంద్ర-శ్రీ పూజ్య పాద మహనీయ వపుర్విశేషే

నారాయణాధిపద రాఘవ పూర్వ నామ –ప్రహ్వం వపుర్భవతు సంవ్యవహారి హారి .అని సంస్తుతించారు .’అలాంటి మహాస్వాముల జీవిత చరిత్ర తెలుసుకొన్న జీవితం ధన్యం .ఆ చరిత్రతోపాటు వారి గీర్వాణ కవితనూ తరువాత దర్శిద్దాం.

ఆధారం –సాధన గ్రంధ మండలి తెనాలి వారు శ్రీ విశాఖ తో  అనువాదం చేయించి  ప్రచురించిన ‘’సద్గురు బోధలు -10 వ భాగం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-16 –ఉయ్యూరు

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

15-12-16గురువారం సాయంత్రం 6 గం లకు మహా కధకులు శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య గారి జన్మ దినోత్సవ సందర్భంగా విజయవాడ మొగల్రాజ పురం మధుమాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో పెద్దిభొట్ల స్పూర్తిపురస్కార ప్రదాన సభా దృశ్యాలు

15-12-16గురువారం సాయంత్రం 6 గం లకు మహా కధకులు శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య గారి జన్మ దినోత్సవ సందర్భంగా విజయవాడ మొగల్రాజ పురం మధుమాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో పెద్దిభొట్ల స్పూర్తిపురస్కార ప్రదాన సభా దృశ్యాలు

https://plus.google.com/u/0/photos/115752370674452071762/album/6364357980663881633/6364357990059202722

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

5-12-16 సోమవారం బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం న్యాయశాఖ ప్రొఫెసర్ డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారి స్వగ్రామం ఎలమర్రులో వారి స్వరుహం లో మేమిద్దరం ,మా కోడలు రాణి ,మనుమరాలు రమ్య ,శివలక్ష్మి

5-12-16 సోమవారం బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం న్యాయశాఖ ప్రొఫెసర్ డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారి స్వగ్రామం ఎలమర్రులో వారి స్వరుహం లో మేమిద్దరం ,మా కోడలు రాణి ,మనుమరాలు రమ్య ,శివలక్ష్మి

https://plus.google.com/u/0/photos/115752370674452071762/album/6360627498141715921/6360627496877151202

 

https://plus.google.com/u/0/photos/115752370674452071762/album/6360547462162467553/6360547471992032338

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు గారిపై 15-12-16న విజయవాడ ఆకాశవాణి నుంచి ప్రసారమైన నా రేడియో టాక్

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు గారిపై 15-12-16న విజయవాడ ఆకాశవాణి నుంచి ప్రసారమైన నా రేడియో టాక్sv-ramarao

Posted in రేడియో లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -3 (చివరిభాగం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

11-పంచశతి రచించిన మూక కవి -3 (చివరిభాగం )

4-కటాక్ష శతకం

1-‘’మొహా౦దకార నివహం వినిహంతు మీడే-మూకాత్మనామది మహాకవితా వదాన్యాన్

శ్రీ కాంచి దేశ శిశిరీకృత జాగరూకా –నేకామ్రనాధ తరుణీ కరునణావ లోకాన్ ‘’

భావం – కాంచీనగర ప్రాంతాన్ని చల్లబరచటానికి మేల్కొనేవి ,మూగ పోయిన మనసుకలవారికి సైతం గొప్ప కవిత్వాన్ని ప్రసాదించేవి ,అయిన ఏకామ్రేశ్వరుని భార్య కామాక్షీ దేవి చల్లని చూపులను నాకు ఉన్న మోహమనే చీకటిరాశిని నశి౦పజేయమని స్తుతిస్తాను.

47- ‘’కైవల్యదాయ కరుణారస కి౦కరాయ –కామాక్షి కందళిత విభ్రమ శంకరాయ

ఆలోకనాయ తవ భక్త వశ౦కరాయ మాతర్నమోస్తు పరతంత్రిత శంకరాయ ‘’

భావం –మోక్ష దాయినీ ,కరుణ రసమే సేవకునిగా కలిగి ఉన్నది ,అంకురించిన విలాసాలతో సుఖాన్నిచ్చేది ,భక్తపరాదీనుడైన పరమేశ్వరుని వశం చేసుకోన్నదీ అయిన నీ దివ్య కటాక్షం కోసం నేను నమస్కరిస్తున్నాను .

 

74 –‘’మూకో విరించతిపరం పురుషః –కందర్పతి త్రిదశ రాజతి కింప చానః

కామాక్షి కేవల ముపక్రమకాల ఏవ –లీలాతరంగిత కటాక్ష రుచః క్షణం తే ‘’

భావం –నీ విలాసవంత కటాక్ష కాంతి కొద్దిగా ప్రసరించటం ప్రారంభం కాగానే  మూగవాడు బ్రహ్మగా ,వికృత రూపుడు మన్మదుడుగా ,పేదవాడు ఇంద్రుడుగా మారిపోతున్నారు .

93-‘’ఏషా తవాక్షి సుషమా విషమాయుధస్య –నారాచ వర్ష లహరీ నాగరాజ కన్యే

శంకే కరోతి శతధా హృది ధైర్య ముద్రాం-శ్రీకామకోటి యదసౌ శిశిరా౦శుమౌళే ‘

భావం –పార్వతీ కామకోటీ కామాక్షీ !నీ కటాక్ష కాంతి మన్మధుడి బాణవర్షం .ఎందుకంటె చంద్ర రేఖను శిగలో ధరించిన శివుని మనసులోని ధైర్యాన్ని వందముక్కలు చేస్తోందని నేను శంకిస్తున్నాను .

101-పాతేన లోచన రుచే స్తవ కామకోటి –పోతేన పాతక పయోధి భయాతురాణా౦

పూతేన తేన  నవకా౦చన కుండ లాంశు-వీతేన శీతలయ భూధర కన్యకే మాం ‘’

భావం –పాపాల సముద్రం ముంచేస్తుంది అని భయపడేవారికి  నీ చూపు ఓడలా రక్షిస్తుంది .అది నీ చెవులకున్న నూతన కుండలాల కాంతితో పవిత్రమైనది .అలాంటి పావన మైన నీ కంటి ప్రసారం తో నన్ను ము౦చెయ్యి తల్లీ.

5-మందస్మిత శతకం

1-బధ్నీమో వయ మంజలిం ప్రతిదినం బంధచ్చిదే దేహినాం –కదర్పాగమ మంత్రం మూల గురవే కళ్యాణ కేళీ భువే

కామాక్ష్యా ఘనసార పంజ రజసే కామద్రుహ శ్చ క్షుషాం-మందార స్తబక ప్రభా ముద ముషే మందస్మిత జ్యోతిషే’’

భావం –సకల ప్రాణ భవబంధ విమోచని ,మన్మదానురాగ తంత్రానికి గురు స్థానం లో ఉన్నదీ ,కల్యాణం అనే ఆట ఆడుకొనే శివుడి కనులకు ముద్ద కర్పూరం పొడి వంటిది ,మందార పూల మకరందాన్ని దొంగిలించేది అయిన కామాక్షీ దేవి చిరునవ్వు అనే వెలుగు కోసం ప్రతిరోజూ మేము దోసిలి ఒగ్గుతాము .

34-‘’క్రమేణ స్నాపయస్వ కర్మ కుహనా చోరేణ మారాగమ –వ్యాఖ్యా శిక్షణ దీక్షితేన విదుషా మక్షీణలక్ష్మీ పుషా

కామాక్షి స్మిత కందళేన కలుష స్పోటక్రియా చు౦చునా –కారుణ్యామృత వీచికా విహరణ ప్రాచుర్య దుర్యేణమాం .’’

భావం – కమ్మగా ఉండి ,కర్మఅనే కపతాన్ని దొంగిలించేది ,మన్మధ తంత్ర వ్యాఖ్యానం లో దిట్ట ,అపారజ్ఞాని ,పాప హరణం లో  అత్యంత సమర్ధురాలు ,కరుణ అనే అమృత తరంగాలలోవిహరించటానికి ముందుకు వచ్చేది ,అయిన నీ చిరునవ్వు మొలకలతో నన్ను స్నానం చేయించు తల్లీ .

58-‘’యన్నాకంపిత కాలకూట కబళీకారేచుచుంబేనయ –గ్లాన్యా చక్షుషి రూక్షితానల శిఖే రుద్రస్య తత్తాద్రుశం

చేతో యత్ప్రసభం స్వరజ్వర శిఖి జ్వాలేన లేలిహ్యతే –తత్కామాక్షీ తవస్మితాం శుకణికా హేలాభవం ప్రాభవం ‘’

భావం –కాలకూట విషాన్ని మింగటానికి ఏమాత్రం భయపడలేదో ,కన్ను అగ్ని జ్వాలలు కక్కుతున్నా హాని పొందలేదో ,అలాంటి రుద్రుని మనసు ఈనాడు మన్మదాగ్ని తో చుట్టుముట్ట బడింది .దీనికి కారణం నీ మధుర దరహాస వైభవమే .

92-శ్రీ కామాక్షి తవస్మితై౦ దవమహః పూరే పరిస్పూర్జతి –ప్రౌఢాం వారిది చాతురీ౦ కలయతే భాక్తాత్మనాం ప్రాతిభం

దౌర్గత్య ప్రసరాస్తమః పటలికా సాధర్మ్య మా భిభ్రతే –కిం కిం కైరవ సాహచర్య పదవీరీతిం నధత్తే పదం .

భావం –నీ దరహాస చంద్రికా ప్రవాహం చల్లగా ఉండగా ,భక్తులైన జీవుల ప్రతిభా వ్యుత్పత్తులు సముద్రంలాగా పొంగిపోతాయి .దరిద్రం లాంటి దుర్గతులు చీకటి గుంపులో కలిసిపోతాయి .ఈ విధంగా జీవులకు చంద్రత్వం అంటే తెల్లకలువల సాహ చర్యం కలిగినపుడు ఏ కార్యాలు జరక్కుండా ఉంటాయి ?

101-‘’ఆర్యామేవ విభాయన్మనసి యః పాదార వి౦ద౦ పురః –పశ్యన్నారభతే స్తుతిం స నియతం లబ్ధ్వా కటాక్షచ్చవిం

కామాక్ష్యా మృదుల స్మితాంశులహరీ జ్యోత్స్నా వయస్యాన్వితా –మారోహత్య పవర్గ సౌద వలభీ మానంద వీచీమయీం ‘’

భావం-మనసులో ఎవరు ఆర్యాదేవి అయిన శ్రీ కామాక్షీ దేవిని భావిస్తాడో ,ఆమె పాదకమలాల ఎదుట నిలబడి స్తోత్రం ప్రారంభిస్తాడో ,అతడు దేవీ కటాక్షాన్ని తప్పక పొందుతాడు .కామాక్షీదేవికి  మందస్మిత కాంతి ప్రవాహం అనే ఒక స్నేహితురాలు ఉన్నది .ఆమె మోక్షం అనే భవనం లో నివశిస్తుంది. శ్రీ దేవి అనుగ్రహ ,కటాక్షాలను పొందిన సాధకుడు ,ఆ మోక్ష భవనం పై అంతస్తు లోనిమొదటి భాగానికి అంటే అమ్మవారి పద సన్నిధికి చేరుకుంటాడు .

అంటూ మూక కవి తన మూక పంచశతిని పూర్తి చేశాడు .

ఆర్యాలో 101,పాదారవింద లో 103 ,స్తుతిలో 102 ,కటాక్ష లో 101,మందస్మిత శతకం లో 101 శ్లోకాలున్నాయి మొత్తం 508 శ్లోకాలు మూక పంచశతి లో ఉన్నాయి .ప్రతి శ్లోకం ఆణిముత్యమే .ఊహాపోహ సౌందర్యమే భక్తీ భావ విలసితమే .అమ్మ కరుణా కటాక్ష రసస్నానమే .

భావానికి ఆధారం –డాక్టర్ జయంతి చక్రవర్తి  సరళ తాత్పర్యాలతో రచించి గొల్లపూడి వీరాస్వామి సన్స్ ప్రచురించిన ‘’మూక పంచశతి ‘’.

మరొక కవితో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -2

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

11-పంచశతి రచించిన మూక కవి -2

మూక కవి గీర్వాణ కవితా వైభవం

విద్యాపతి కుమారుడైన మూకకవి మూక శంకరులుగా కాంచీ కామకోటి 20 వ పీఠాదిపతిఅయిన సంగతి తెలుసుకొన్నాం .ఇప్పుడు మూక పంచశతి లోని మొదటి దైన  ఆర్యా శతక విశేషాలను తెలుసుకొందాం .

1- ఆర్యా శతకం

‘’కారణ పర చిద్రూపా-కాంచీ పుర సీమ్ని కామగత పీఠా

కాచన విహరతి కరుణా –కాశ్మీర స్తబక కోమలాంగ లతా ‘’అన్నది అందులో మొదటి శ్లోకం –కుంకుమ పూల గుత్తి లా కోమల మైన తీగవంటి శరీరం కలిగి ,కారణ పర చైతన్య స్వరూపిణిగా కామపీఠాన్ని  ఆశ్రయించి న ఒకానొక దయారూపిణి కాంచీపురం లో విహరిస్తున్నది .

74 వ శ్లోకం –‘’వేదమయీం నాద మయీం –బి౦దుమయీం పరపదోద్య దిందు మయీం

మంత్రమయీం  తంత్ర మయీం –ప్రకృతి మయీం నౌమి విశ్వ వికృతి మయీం ‘’

భావం –పరమ పదం(సహస్రారం ) లో ఉదయించే చంద్రుని స్వరూపంకలిగి ,వేద ,నాద బిందు రూపిణి,మంత్రం తంత్రమయినది ,విశ్వ వికార రూపిణిగా ఉన్నది అయిన ప్రకృతి –అంటే కామాక్షీ దేవి కి నమస్కరిస్తున్నాను .

99 వ శ్లోకం –‘’కళ మంజుల వాగనుమిత –గళ పంజర శుక గ్రహౌత్కంఠత్యాత్

అంబ రదనా౦బర౦ తే –బింబ ఫలం శంబరారి ణా న్యస్తం ‘’

భావం –చెప్పటానికి వీలు లేనంత మధుర మృదు సౌందర్య పలుకులు పలికే చిలక ,నీ కంఠం అనే పంజరం లో ఉందని తెలిసి ,మన్మధుడు ఆ చిలుకను పట్టుకోవటానికి యెర్రని పెదవి అనే దొండ పండుని ఎరగా  ఉంచాడు .అంటే అమ్మవారి మాటలు  మంజుల మనోహరం గా ఉన్నాయని అర్ధం .

ఈ శ్లోకాన్ని శ్రీ నాగ ఫణి శర్మ గారు ప్రతి విద్యాలయం లోని పిల్లలతో పాడించి గొప్ప వ్యాప్తి కలిగించి వారు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై గొప్ప విద్యా బుద్ధులు సాధించటానికి తోడ్పడ్డారు .

2-పాదార వింద శతకం

మొదటి శ్లోకం –‘’మహిమ్నః పంధానం మదన పరి పంధిప్రణయిని –ప్రభుర్నిర్నేతుం తే భవతి యత మానోపి కతమః

తదాపి శ్రీకాంచీ విహ్రుతి రసికే కోపి మనసో –విపాకస్త్వాత్పాదస్తుతి విదిషు జల్పాక యతిమాం ‘’

భావం –కంచి లో హాయిగా విహరించే మన్మధ విరోధి అయిన శివుని ప్రియురాలైన కామాక్షీ దేవీ !నీ దివ్యమహిమను తెలియ జెప్పే సమర్ధులో లోకం లో లేరు .నాపూర్వ జన్మ సుకృతం ఫలించి నీపాదార వి౦దా లను స్తుతించే కవిత్వాన్ని నాతో పలికిస్తున్నావు .

33 వ శోకం –

స్పురన్మధ్యే శుద్దే నఖ కిరణ దుగ్దాబ్ది పయసాం –వహన్నబ్జం చక్రం దరమపి చ రేఖాత్మ కతయా

శ్రితోమాత్ష్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం-త్రిదామా కామాక్ష్యాఃపద నళిన నామా విజయతే .

భావం-నీపాదాల గోళ్ళకాంతి అనే పాల సముద్రం మధ్యలో శంఖ ,చక్ర కమలాలను రేఖా మాత్రం గా ధరించి ,గొప్పదైన లక్ష్మీ దేవిని కూడా ధరించి ,కామాక్షీ దేవి వైన నీ పాదపద్మాలు అనే పేరుగలవిష్ణు మూర్తి చేప రూపంలో సర్వొన్నతుడుగా వర్ధిల్లు తున్నాడు .అంటే అమ్మవారి పాదాలలో శంఖ ,చక్ర ,కమల ,మత్స్య రేఖలున్నాయని అర్ధం .

64 వ శ్లోకం –‘’మహా భాష్య వ్యాఖ్యా పటు శయన మారో పయతి –స్మర వ్యాపారే ర్శ్వ్యాపి శున నిటలంకారయతి వా

ద్విరేఫాణామధ్యాసయతి సతతం వాధి వసితం –ప్రణమ్రాన్కామాక్ష్యాః పద నళిన మహాత్మ్యా గరిమా ‘’

భావం –నీపద కమలాలు మహిమాన్వితమైనవి వాటికి నమస్కరించేవాడిని మహాభాష్య వ్యాఖ్యాత గా కాని కామాన్ని తిరస్కరించే సన్యాసిగా కాని ,తుమ్మెదలకు ఆవాసమైన కమలాన్ని అంటే సహస్రార కమలానికి చేరే యోగాన్ని అధిస్టింప చేయటంకానీ చేస్తాయి .

96-వ శ్లోకం –‘’రణన్మంజీరాభ్యాంలలిత గమనాభ్యాంసుకృతినాం –మనో వాస్తవ్యాఖ్యాంమధిత తిమిరాభ్యాం నఖ రుచా

నిదేయాభ్యాం పత్యా నిజ శిరశి కామాక్షి సతతం –నమస్తే పాదాభ్యాం నళిన మ్రుదులాభ్యాం గిరి సుతే ‘’

భావం –అమ్మవారి పాదాలుచాక్కగా నాదం చేస్తున్న అందెలను ధరించి ,అందమైన నడకలతో ప్రకాశిస్తున్నాయి .ఆమె కాలి గోళ్ళ కాంతులు చీకట్లను నాశనం చేస్తున్నాయి .అవి కమలాలులాగా అతి కోమలంగా ఉన్నాయి .భర్త అయిన శివుని శిరసుపై ఉంచబడుతున్నాయి .అలాంటి దేవిపాదాలకు నమస్కారం .

చివరిదైన 103 వ శ్లోకం –‘’ఇదం యః కామాక్ష్యాః శ్చరణనళిన స్తోత్ర శతకం –జపేన్నిత్యం భక్త్వా నిఖిల జగదాహ్లాదజనకం

స విశ్వేషాంవంద్యస్సకల కవి లోకైక తిలక –శ్శిరం భుక్త్వా భోగా స్సరిణమపి చిద్రూప కలయా ‘’’

భావం –సకలలోకాలకు ఆనందాన్ని కలిగించే శ్రీ కామాక్షీదేవి పాదార వింద శతకం గా ప్రసిద్ధి చెందిన ఈ స్తోత్రాన్ని భక్తితో ప్రతి రోజూ పఠించే వారు అందరి చేత నమస్కరి౦పబడే గొప్ప కవీశ్వరులౌతారు .సకల సుఖ భోగాలు అనుభవించి చివరికి చిద్రూప కలగా మారి అమ్మవారిని చేరు కొంటారు అని ఫలశ్రుతి చెప్పాడు మూక కవి .

3-స్తుతి శతకం

1 వ శ్లోకం –‘’’పాండిత్యం పరమేశ్వరి స్తుతి విధౌ నైవాశ్రయంతేగిరాం –వైరి౦చాన్యపి గు౦ఫనాని విగళద్గర్వాని శర్వాణి తే

స్తోతుం త్వాం పరిఫుల్ల నీల నళిన శ్యామాక్షి కామాక్షి మాం –వాచాలీ కురుతే తదాపి నితరాం త్వత్పాద సేవాదరః ‘’

బావం –వికసిత నీలోత్పల కనుల కాంతితో ప్రకాశించే కామాక్షీ దేవీ !పరమేశ్వరీ,శర్వాణీ!నిన్ను స్తుతించే ప్పుడు బ్రహ్మ వాక్కులు కూడా రసహీనమై పాండిత్యం కనిపించటం లేదు .అయినా నీపాద సేవ రాధకుడినైన నేను నిన్ను  కీర్తించా టానికి  వాచాలత్వం ప్రదర్శిస్తూ కవిగా పేరురుపొండుతున్నాను.

29-‘’మునిజనమనః పేటీ రత్నం స్పురత్కరుణా నటీ –విహరణ కలాగేహం కా౦ ఛీపురీ మణి భూషణం

జగతి మహతో మోహ వ్యాధే ర్నృణా౦ పరమౌషధం –పురహర దృశాం సాఫల్యం మే పురః ప్రరిఝ్రుంభతాం’’

భావం –మునీశ్వరుల మనసు అనే పెట్టెలో ఉన్న రత్నం లాంటిది ,ప్రకాశించే దయ అనే నటి విహరించటానికి నిలయమైనది ,కా౦ఛీనగారానికి మణి భూషణం గా వెలుగొందుతున్నదీ ,ఈ జగత్తులో వ్యాపించిన మొహం అనే వ్యాధికి దివ్యౌషధమైనది ,శివుని నేత్రాల కు సాఫల్యమైనది అయిన కామాక్షి రూపం నా ముందు సాక్షాత్కరించు గాక .

96 –‘’త్వయైవ జగదంబయా భువన మండలం సూయతే –త్వయైవ కరుణార్ద్రయా తదపి రక్షణం నీయతే

త్వయైవ ఖర కోపయా నయన పావకే హూయతే –త్వయైవకిల నిత్యయా జగతి సంతత౦ స్థితం ‘’

భావం -అమ్మా ! నీ వల్ల ఈ సకల భూమండలం ప్రసవం చెందుతుంది .నీదయా రసం తో నే జగత్తు పాలింప బడుతోంది ,రక్షింప బడుతోంది .నీ తీక్ష్ణ కోపానికి ,నీ నేత్రాగ్నిలో హరించ బడుతోంది .నిత్యు రాలైన నీ చేతనే ఎల్లప్పుడూ జగత్తు నిలుస్తోంది .

100-‘’క్వణ త్కాంచీ పుర మణివిపంచీ లయ ఝరీ –శిరః కంపాకంపా వసతి రను కంపా –జలనిధిః

ఘనశ్యామా శ్యామాకఠిన కుచ సీమా మనసిమే-మృగాక్షీ కామాక్షీ హర నటన సాక్షీ విహరతాం’’

భావం –అందమైన వడ్డాణం ధరించి ,కాంచీపురం లో మాణిక్య వీణ లయ ప్రవాహానికి ఆనందంగా తలూపేది ,కంపా నదీ తీరమే నివాసంగా ఉన్నదీ దయసంద్ర మేఘంలా నల్లనైన నిండు యవ్వన కఠిన స్తనాలు కలదీ ,జింక కళ్ళవంటి విశాల కనుదోయి కలది ,పరమేశ్వరుని నటనకు సాక్షీ భూతమైనదీ అయిన కామాక్షీ దేవి నా మనసులో నిత్యంవిహరించు గాక .

101- ‘’సమర విజయ కోటీ సాధకానంద దాటీ –మృదు గుణ మణిపేటీ ముఖ్య కాదంబ వాటీ

మునిసుత పరిపాటీ మొహితాజాండకోటీ –పరమశివ వధూటీ పాతుమాం కామకోటీ .’’

భావం –రాక్షసులపై అనేక యుద్దాలో విజయం సాధించినదీ ,సాధకుల ఆనందానికి ఆవలి తీరమైనదీ ,మృదు రత్నాలకు పెట్టె లాంటిది ,కదంబ వృక్ష వనం కలదీ ,మునుల చేత స్తుతి౦పబడే సుగుణ రాశి అయినదీ ,కోట్లాది బ్రహ్మాండాల ను మోహింప జేసేదీ ,పరమేశ్వరుని అర్ధాంగి అయినదీ ,కామకోటి అనే పేరు తో విఖ్యాతమైనదీ అయిన కామాక్షీ తల్లి నన్ను కాపాడుగాక .

మూక కవి చిత్రం ఈ కింద జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

11-పంచశతి రచించిన మూక కవి

మూకం కరోతి వాచాలం

‘’పరమపద వదూటీం-పాతుమాం కామకోటీ ‘’అని ఒక మూగవాడు అమ్మవారి దర్శన భాగ్యం తో నోరు తెరచి పరవంశం తో స్తుతించాడు .ఆయనే కంచి కామాక్షీదేవిపై ‘’పంచశతి ‘’రచించి  మూక కవిగా జగత్ ప్రసిద్ధు డైనాడు .’’ప్రకృత్యా మూకానామపిచ కవితా కారణతయా ‘’అమ్మవారి తాంబూల రాసనా లేశ స్పురణ మాత్రం ‘’చేత  సిద్ధకవి గా రూపాంతరం చెంది కామాక్షీ దేవిపై 1-ఆర్యా శతకం 2-పాదార వింద శతకం 3-స్తుతి శతకం 4-కటాక్ష శతకం  5-మందస్మిత శతకం అనే 5 శతకాలు ఆర్యా వృత్తం లో రాసిన మహా భక్తుడు మూక కవి .కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు తమ ఉపన్యాస లహరిలో తరచుగా మూక కవి కవితా వైభవాన్ని అమ్మవారిపై ఆయనకున్న భక్తీ తాత్పర్యాన్ని బహుదా ప్రశంసించే వారు .కంచిలో అమ్మవారి దేవాలయం లోపలి ప్రాకారంలో మూక పంచ శతి శ్లోకాలను దేవనాగర లిపి లో చెక్కించి అమ్మవారి మహిమను భక్తులకు విశదమయేట్లు చేశారు  .మూక పంచశతిని శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు తెలుగులోకి అనువదించి ఆకవి భక్త్యావేశాన్ని ఆంధ్రులకు అవగాహన కలిగించారు . .

మూక కవి జీవిత విశేషాలు

మూకకవి అమ్మవారి తాంబూల రస మధుర బిందువులచే ధన్యుడై శతకాలు రాసి జగద్విఖ్యాతుడై కంచి కామకోటి పీఠానికి  20 వ పీఠాదిపతిగా క్రీ శ.398లో అధిరోహించి 27  సంవత్సరాలు437 వరకు సేవ చేసి అద్వైత మత ప్రచారం లో జన్మ చరితార్ధం చేసుకొని గోదావరీ తీరం లో సిద్ధి పొందినట్లు కంచి మఠ వివరాల వలన తెలుస్తోంది . ఖగోళ జ్యోతిష శాస్త్ర వేత్త విద్యా వతి కుమారుడు  .పుట్టు మూగ చెవిటి వాడైన ఈ కవిఅనునిత్యం ఇరుగు వారు తోటి పిల్లలు అవహేళన చేస్తూ ఏడిపిస్తుంటే  నిత్యం కంచిలోని శ్రీ కామాక్షీ దేవిని దర్శింఛి సాష్టాంగ నమస్కారం చేసిముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి అమ్మవారిని ధ్యానం చేస్తూ మౌనంగా రోదిస్తూ మనశ్శాంతి పొందేవాడు .అతని అనన్య సామాన్యమైనదని అమ్మగ్రహించి అనుగ్రహించాలని భావించింది .అతని మూగ తనాన్ని పోగొట్టి అద్భుత వాక్శక్తి ప్రసాదించాలని ,అతనిద్వారా లోకానికి మహత్తర మైన గ్రంధాన్ని కానుకగా ఇవ్వాలని సంకల్పించింది . .

.                 కామాక్షి కరుణా కటాక్షం

.  ఒక రోజు మూక కవితో పాటు మరొక సాధకుడు అమ్మవారి ఎదుట కూర్చుని ధ్యానం లో ఉన్నారు .అమ్మవారు వీరి భక్తికి మెచ్చి అనుగ్రహించాలనే తలంపుతో ఒక సాధారణ స్త్రీగా దర్శనమిచ్చితననోటిలోని తాంబూలం ముద్ద(పిడచ )కొంత తీసి మూకకవి ప్రక్కనే ఉన్న సాధకునికి ఇచ్చింది .ఆయన ఆమెను ఒక మామూలు స్త్రీ అనుకోని దాన్ని ఎంగిలిగా భావించి తీసుకోలేదు .వెంటనే జగదంబ దానిని మూకకవిని అనుగ్రహించి చేతిలో పెట్టింది .దాన్ని మహా ప్రసాదంగా భావించిన మూకకవి భక్తిగా కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకొన్నాడు .అంతే మూకకవికి మాట వచ్చి మహా ప్రవాహంగా ఆశువుగా కవిత జాలువారి అమ్మవారి దివ్య సుందర విగ్రహాన్ని కనులారా దర్శిస్తూ 500 శ్లోకాలు ఏకధాటిగా చెప్పాడు .అదే మూక పంచశతి అయింది .అమ్మవారి గొప్ప తనాన్ని వర్ణించినది ఆర్యా శతకం ,అమ్మవారిని స్తుతిస్తూ చెప్పింది స్తుతి శతకం .,కనులను వర్ణించేది కటాక్ష శతకం .అమ్మవారి నవ్వును వర్ణిస్తూ చెప్పింది మందస్మిత శతకం ,పాదాలను వర్ణిస్తూ చెప్పింది పాదార వింద శతకం . మధుర మంజుల  భావ గర్భిత శతకాలివి  .అణువణువునా భక్తీ కదం తొక్కింది అందులో .మహిమాన్విత మైన,మంత్రపూతమైన  ఆ శ్లోకాలను అమ్మ మహా పరవశంగా ఆలకించి తానూ పులకించింది . అయిదు శతకాలు చెప్పిన తర్వాత అమ్మవారుప్రత్యక్షమైంది . కవిని వరం ఏదైనా కోరుకోమన్నది . కనులనుండి ఆనంద  బాష్పాలు రాలుతుండగా గడగడ స్వరం తో మూకకవిఏదో అనబోయాడు .అతని ఆంతర్యం గ్రహించి౦ది  అమ్మ. బిడ్డ కోరిక తల్లికి తెలియదా ! అయినా అతని నోటి నుండి వినాలని చెప్పమని కోరి ఆసక్తిగా విన్నది ‘’ ‘అమ్మా! జీవితాంతం మూగవాడిగానే వుండిపోతాననుకున్నాను. అదృష్టవశాత్తు మీ అనుగ్రహం వల్ల వాక్‌శక్తి సిద్ధించింది. మాట్లాడే శక్తి ఏర్పడడం భగవదనుగ్రహం చేతనే సాధ్యమవుతుందన్న విషయం స్వానుభవంతో గ్రహించాను. ఈ శ్లోకాలను శ్రద్దా భక్తులతో పఠించే మూగవారికి చక్కని వాక్ శక్తిని ప్రసాదించు తల్లీ! నత్తిగా మాట్లాడే వారికి, తడబడుతూ మాట్లాడేవారిక సైతం ఈ పంచశతిని పఠించడంవల్ల ఆ దోషం తొలగిపోయేలా అనుగ్రహించు మాతా! నేను ఎవరినో, నా పేరు ఏమిటో, నేను ఏ కాలానికి చెందిన వాడినో ఈ లోకానికి తెలియనవసరం లేదు. ఈ శ్లోకాలు మూగకవి నోటినుండి వెలువడ్డాయని మాత్రం ప్రపంచానికి చాటిచెప్పుతల్లీ!’ ముకుళిత హస్తాలతో అమ్మను వేడుకున్నాడు.మూక కవి .. పరుల శ్రేయస్సును కాంక్షిస్తున్న అతని కోరిక నెరవేరేలా కామాక్షి అనుగ్రహించింది. వరాలు లోకహితానికి ఉపయోగపడాలి కానీ స్వప్రయోజనానికి ఉద్దేశించినవి కావని గ్రహిచిన వివేకవంతుడైన అతన్ని అభినందనగా చూసింది జగన్మాత. ‘అలాగే నాయనా! మంత్రశక్తితో కూడిన ఈ శ్లోకాలనుపఠించడంవల్ల మూగతనం, నత్తి, మాటలో తడబాటు తొలగిపోయి మధుర మంజులవాక్కు, కీర్తి,సిరిసంపదలు సిద్ధిస్తాయి. మంత్రపూరితమైన ఈ శ్లోకాల్లోని అక్షరాల విన్యాస వరసలో అంతటి శక్తి దాగి వుంది. నీవు కోరిన విధంగానే ఈ నామధేయంతో కాకుండా మూక మహాకవి పేరుతోనే ఈ పంచశతి విశ్వవ్యాప్తమవుతుంది. మూక పంచశతి పఠించేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం, సరస్వతీదేవి ఆశీస్సులు లభిస్తాయని వరమిస్తున్నాను’ మరక్షణం కామాక్షి తాయి అతని ఎదుటనుండి అదృశ్యమైంది. విగ్రహంలోనుండి చల్లని చూపులతో దేవి కనిపిస్తోంది అతనికి. ఆర్య శతకము, పాదారవింద శతకము, స్తుతి శతకము, కటాక్ష శతకము,మందస్మిత శతకము అనే ఐదు శతకాలతో కూడిన మూకపంచశతిలోని శ్లోకాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తూ విశుద్ధి చక్రంలోని దోషాలను అధిగమించి ఎందరో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. ఆ విధంగా లక్ష్మీ సరస్వతుల అనుగ్రహానికి ఏకకాలంలో పాత్రులవుతూ జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. మూక కవిని గురువుగా భావిస్తూ కామాక్షీ మహాదేవి పట్ల భక్త్భివంతో శుభ దాకమైన మూకపంచశతిలోని శ్లోకాలను పఠిస్తూ హరిప్రియ అనుగ్రహానికి వాగ్దేవి శుభాశీస్సులకు పాత్రులవుతున్నారు.

ఆతను మృదు మధురమైన మాటలతో  ‘’అమ్మా !మూగ వాడికి మాట ఇచ్చి అనుగ్రహించి నాలో ప్రవేశంచి నా చేత పంచశతి శతకం చెప్పించావు .ఈ నోటితో నీ స్వరూప స్వభావాలను  వర్ణించేట్లు  చేశావు .ఈ అనుగ్రహం చాలు  .నిన్ను స్తుతించిన నోటితో వేరే మాటలు మాట్లాడలేను .దయతో మళ్ళీ నన్ను మూగ వాడిని చేయి ‘’అని సవినయంగా కోరాడు .అమ్మ అతనిని మళ్ళీ మూగవానిగా చేసింది అని ఒక కద ప్రచారం లో ఉన్నది .

మూక కవి మూక శంకరులైన విధం

ఈ విషయం తెలిసిన 19 వ కంచి పీఠాదిపతులు శ్రీ శ్రీ మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతీ స్వాములవారు ఆ బాలుడి తలిదండ్రులకు కబురు చేసి పిలిపించారు .మూక కవిని  ఉత్తరాధికారిగా అంటే 20 వ పీఠాదిపతిగాచేయాలని సంకల్పించానని వారి అనుమతి ని, బాలుడి అనుమతి కోరగా వారు సంతోషంగా అనుమతించారు . .యుక్త వయసు రాగానే వేద శాస్త్రాలలో మహా విద్వాంసు డయ్యాడు .19 వ పీఠాదిపతులైన శ్రీ శ్రీ మార్కండేయ విద్యాఘన  స్వాములవారు మూక కవికి దీక్షనిచ్చి ‘’మూక శంకర ‘’నామ ధారణ చేశారు  .మూక కవి  ఊహా చిత్రాన్ని కంచి పీఠం చిత్రి౦ప జేసింది .మూక కవి సామర్ధ్యం, ప్రభావం వర్ణనాతీతం .ఆయన ఎదుట పడిన అక్షర జ్ఞాన శూన్యులైన పశువుల కాపరులు కూడా మహా కవులై పోయారు .కాశ్మీర రాజు మాతృ గుప్తుడు ,ప్రవర సేనుడు మొదలైన రాజులు అనన్య భక్తితో మూక శంకర సేవలో ధన్యులయ్యారు .కామాక్షీ కటాక్ష సిద్దితో పీఠాదిపతులైన మూక శంకరులు ధాతు నామ సంవత్సర శ్రావణ పౌర్ణమినాడు గోదావరీ నదీ తీరం లో ముక్తిని పొంది శ్రీ కామాక్షీ- ఏకాంబరేశ్వర స్వామి వారలలో ఐక్యమయ్యారు .

మూక పంచశతి ప్రాశస్త్యం

మూక పంచశతిలో తంత్ర శాస్త్ర ప్రాధాన్యం ఉన్నది .బీజాక్షరాల తో కూడిన మంత్రములతో కూడిన శ్లోకాలు ఉన్నట్లు పరిశోధకులు తెలియ జేశారు .ఆధ్యాత్మిక కుండలినీ యోగ రహస్యాలూ దీనిలో ఉండటం మరొక విశేషం .కంచి పరమేశ్వరి కొందరికి కాళికా మాత లా దర్శనమిస్తే మూక కవికి ఆ అమ్మ ‘’కారణ పరచిద్రూపా కాంచీపురా సీమ్నికామ పీఠ గతా –కాచన విహరతి కరుణా  కాశ్మీర స్తబ కోమలాంగ లతా ‘’గా దివ్య దర్శనమిచ్చింది .అంటే’’ కాంచీ పురం లో ఒకానొక’’ కరుణ ‘’యెర్రని శరీరం తో తిరుగుతోంది ‘’అన్నాడు కవి .ఆమెను అమ్మ అనలేదు శక్తి అనీ అనలేదు .అనిర్వచనీయమైన కరుణకు మూర్తిస్వరూపం అని అర్ధం .అపార ,అనంత ,అనిర్వచనీయ దయాంత రంగ ఆమె .అఖండ మైన కరుణ అరుణగా కంచి పట్టణం లో విహరిస్తోందని మూక కవి భావన చేశాడు .అమ్మ వారి దివ్య తేజో స్వరూపాన్ని భక్త్యావేశం తో పరమాద్భుతంగా వర్ణించాడు మూకకవి .లీలాశుకుని శ్రీ కృష్ణ  కర్ణామృతానికి సాటి మూక పంచశతి అని విజ్ఞుల అభిప్రాయం .అద్వైత స్థాపనాచార్యులైన జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య పై మూకకవి ‘’ప్రాచీన శంకర విజయం ‘’రాశాడు.ఇందులో కంచి మఠ ప్రాచీనత తో పాటు, శ్రీ శంకరుల కాల నిర్ణయమూ ఉన్నది .ద్విసహస్రావధాని డా శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మగారు ఆర్యా శతకాన్ని గానం చేసి కేసెట్ లుగా సి. డి.లుగా విడుదల చేసి మూకకవికి ,మూక పంచశతికి గొప్ప ప్రచారం తెచ్చారు .

మూక పంచశతి లో కవి గీర్వాణ కవితా వైభవాన్ని తరువాత తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్

మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్

 

                            శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ఈయన పేరు వినగానే 35 మంది యోగుల చరిత్రను తెలిపే ‘సిద్ధ యోగి పుంగవులు’,షేక్స్ పియర్ వంటి పూర్వ ఆంగ్లేయుల జీవిత చరిత్రకు నిలువుటద్దం ‘పూర్వాoగ్ల కవుల ముచ్చట్లు’’,మరీ ముఖ్యంగా యాబై మంది జాతీయ అంతర్జాతీయ మహిళా మణులను పరిచయం చేసే ‘మహిళా మాణిక్యాలు’ సాహితీ ప్రియులకు కరదీపిక లాంటిది. ఈయన గురించి ప్రముఖ రచయిత్రి ,ప్రరవే జాతీయ అధ్యక్షురాలు డా.పుట్ల హేమలత గారి ఇంటికి వెళ్ళినప్పుడు సాహిత్య సంభాషణల్లో గబ్బిట గారి పాండిత్య ప్రకర్షను,వారి అవిరళ కృషిని పరిచయం చేసారు.అప్పటినుండి ఆయన కృషికి తార్కాణాలుగా నిలిచిన గ్రంథాలను  చదావాలనే ఆశ కలిగింది.

సరస భారతి ఉయ్యూరు వారు 3-4-2016 న 90 వ సమావేశంగా ”మా అన్నయ్య” పై కవిసమ్మేళనం నిర్వహించి పుస్తకాన్ని ఆవిష్కరించటం హర్షించదగ్గ విషయం.ఈ కవితా సంకలనం  మొత్తం  ముప్పై ఐదు కవితల సమాహారం.కుటుంబం లో అమ్మా,నాన్న తర్వాత  అన్నయ్యకు అత్యంత ప్రాధాన్యత కలదు.గబ్బిట దుర్గా ప్రసాద్ తన అన్నయ్య పై పెంచుకున్న అభిమానాన్ని  ‘మా శర్మన్నయ్య చిరంజీవి’ కవితలో అక్షరీకరించారు.ఇందులో ‘గోర్కీ సాహిత్యమంతా దాచాడు …..సినిమాలు నాకు చూపించి  వాటిపై చక్కని విమర్శ చేసే వాడు  అంటూ అన్న గారి జ్ఞాపకాలను దుర్గా ప్రసాద్ గారు కవిత్వీకరించారు.

‘ఆత్మీయ అనురాగ పుంభావ మూర్తి అన్నయ్య ‘అన్న కవితలో దండి భొట్ల దత్తాత్రేయ శర్మ అమ్మా నాన్నఇద్దరికీ ఉద్యోగo వల్ల దూరం గా ఉన్నప్పటికీ ‘అన్న అంటే అందుబాటులో వుండే నాన్నే అంటారు.అన్నతో గడిపిన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ‘అమ్మ గోరు ముద్దల్లోను ,నూతి చన్నీళ్ళ స్నానాలలోను/తిరునాళ్ళ తీపి జీడి కొనుగోళ్ళలోను /వేసవి వెన్నెల రాత్రుల ఆరు బయట పడకల్లోను జతకాడే కాదు /చదువు సందేహాలలో సరస్వతి సందేశం లా సంస్కరించే వాడు మా అన్నయ్య’అంటాడు.

అన్నయ్య అంటే కేవలం రక్త సంబoధం మాత్రమే కాదు ఏ సంబంధం లేకపోయినా ఆపదలో ఆదుకున్నవాడు  అన్నయ్య  అవుతాడని చెప్తూ  శ్రీమతి మేరీ కృపాబాయి రాసిన ‘రక్షాబంధనమే అన్నయ్య’ అన్న కవితలో ‘విశాల సమాజంలో ఎందరో అన్నయ్యలు/అనాధ చిన్నారిని ఆదుకునే  వేళ అతడే అన్నయ్య /పేదరికం లో మగ్గి పోయే వేళ అమ్మాయికి ఫీజు కడితే అతడే అన్నయ్య /చిమ్మ చీకటిలో చిక్కుకున్న స్త్రీకి దారి చూపి రక్షించే వేళ అతడే అన్నయ్య అంటూ అన్నయ్యకు నిర్వచనమిచ్చారు.

అమ్మా నాన్న కి పెద్దకొడుకు కొండంత అండ.ఇంటి వ్యవహారాలలోను, అన్నయ్య బాధ్యత ఎక్కువగా ఉంటుంది.తల్లిదండ్రుల గౌరవ ప్రతిష్టలు నిలపాల్సినది కూడా అన్నయ్యే.ఈ విషయాన్ని ‘మిన్నంటిన గౌరవం అన్న ‘అన్న కవితలో పంతుల వెంకటేశ్వరరావు సీస పద్యం లో చాలా చక్కగా వివరించారు.ఆ విధాత బ్రహ్మ అమ్మను సృష్టించే -ఆదరింప నెప్పుడు అవని యందు /అటులే నాన్న బదులు అన్నను పుట్టించే -ఆదరింపనెప్పుడు అవనియందు’అన్నను వర్ణించారు.

శ్రీమతి పెళ్లూరు శేషు కుమారి రాసిన  ‘అన్నయ్య మనసు నిర్మలం’,శ్రీమతి సింహాద్రి వాణి రాసిన ‘అన్నయ్య అమల బంధం ,తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు రాసిన ‘అన్నయ్య   పురుషోత్తముడు’శ్రీమతి కోపూరి పుష్పా దేవి రాసిన ‘అపురూప ఫలo అన్నయ్య’ అన్న కవితలు అన్నతో గల బంధం  అనుభూతి చెందేలా వున్నాయి . వర్ణనలు అందరిని ఆకట్టుకుని ఏకబిగిన చదివించడానికి ఉపక్రమిoపజేస్తాయి

-పెరుమాళ్ళ రవి కుమార్

————————————————————————————————————————————-


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’గీర్వాణ భాషా వైభవం ‘’-5

’గీర్వాణ భాషా వైభవం ‘’-5

11-శ్రీమతి సింహాద్రి వాణి-విజయవాడ-7799381133

జయహో సంస్కృత భాష

1-ఉ –భారత జాతి కంతటికి భాగ్య సమూహములై  వెలుంగుచున్ –

ధారుణి నీతి మార్గమును ధర్మము న్యాయము బోధ సల్పుచున్

భూరిగ జ్ఞానమిచ్చు కడు పూజిత గ్రంధము లెన్నియో కవుల్

కూరిచె సంస్కృతమ్ముననుగొప్పగ మ్రొక్కెద వారికి నెల్లవేళలన్ .

2-అ వె.-సంస్కృతమ్ము జనని సకలభాషలకును –ఆది భాష అదియె అమృతభాష

అందమైన భాష ఆదికావ్యపు భాష –తేనె రుచులపంచు తేటభాష .

3-తే.గీ.-వ్యాస వాల్మీక విరచిత వాణి భాష –కాళిదాసు కలమ్మున కావ్యభాష

వేదముల వెలసిన మేటి వేల్పు భాష –గిరిధరుడు నుడివిన గొప్ప గీత భాష .

4-ఆ.వె.-మందిరములలోన మంత్రాల స్తుతి యించి –వేల్పులను కొలిచెడి వేల్పు భాష

పరిణయమ్ముల యందు ప్రఖ్యాతి నొందిన –మంత్రముల వెలిగెడి మధురభాష .

5-ఆ.వె.-యజ్న యాగములను ప్రజ్ఞతో గావించు –మేటి పండితులకు  మేలు భాష

సుప్రభాత వేళ శోభాయమానమై –దేవళముల వెలుగు దేవ భాష .

6-తే.గీ.-ఎన్నొగ్రంధాలు శాస్త్రాలు ఎసగ వ్రాసి –భారత మాతకు విలువైన  భాగ్య మిచ్చి

సంస్కృతమ్మునఎనలేని సాగు చేసి –అమరమై నిలిచె భువిని అమరకవులు .

12-శ్రీ చీమలమర్తి వెంకట బృందావన రావు –విజయవాడ -99663399189

తల్లి గీర్వాణమ్మె

1-సప్త ద్వీప ప్రవేస్టితాఖిల చిరస్థాయీగత మ్మౌచు –సం

దీప్తమ్మైన సమస్త లోకము న నెందేనిం బ్రవర్తిల్లు చుం

బ్రాప్తంబై చను సర్వ భాషలను దీవ్యల్లీల శోధింప

వ్యాప్తంబైన సుసంస్కృత మ్మయిన గీర్వాణమ్మె కాన్పించెడున్.

2-ఎల్లబాసలకు తల్లి గీర్వాణ మ్మె-కడుపురాతనంపు నుడియు నదియె

దేవ భాష నుండి దేశ భాషలు వచ్చె-పలుకు చెలికి వింత జిలుగులిచ్చె.

3-పంచదార  లోన పాలన్నికలిసిన –చెలగి వేరు జేయ జాలనట్లు

తేనె యూటవంటి తెలుగున కలిసె-స –పర్వ భాష లోని ప్రౌఢిమమ్ము.

4- వ్యాసుడు ,వల్మికోద్భవుడు ,భారవి ,మాఘుడు ,కాళిదాసుడున్

భాస ,మయూర ,భామహులు బాణుడు ,శూద్రక ముఖ్య సత్కవుల్

ధీ సముపేత నిర్భర మతిన్ వెలయి౦చిరి దీప్త సత్కృతుల్

ఈ సువిశాలలోకమున హిందు సుసంస్క్రుతి మిన్ను ముట్టగన్.

5-అమ్రుతతుల్యమైన అమరవాణి నేడు –మృతమటంచు ధూర్త మతులు యండ్రు

విశ్వ స్తుత్యమైన విమల వాజ్మయ రాశి –యెసగు బాస –మృత మదెట్టులగును ?

6-హైందవ జీవధారకును యాదిమ మూలము సస్క్రుతమ్ము –నే

డెందరుధర్మ భ్రష్టులు-పరేంగిత దాసులు –ఏడ్చి చచ్చినన్

సుందర భారతీయ రుషి సూక్తము సుసభ్యత కింత సేగి రా

దందునె గుంటనక్కలకు ఆకసమంటెడు ద్రాక్ష గుచ్చముల్ .

13- శ్రీ జి.వి.ఎస్.డి.ఎస్.వరప్రసాద శర్మ –నున్న -9290618317

గీర్వాణ భాషా వైభవం

1-ఆ.వె.-ఎల్లభాశాలకును తల్లిగా నొప్పారి –సంస్కృతంబు నిలిచె సన్నుతముగ

వర్ణమాల లెల్ల పలికించి ,ఢమరుకం-తండ్రిగాగ శివుని తాను వినిచె.

2-తే.గీ-సృష్టి కాలంబు నుండియు చిన్మయంపు –భాష గీర్వాణమేదేవ భాష యయ్యె

సకలజీవుల భావాల సరిగ తెలుప –వాణి వినసొంపు శబ్దాల పరగ గూర్చె.

3-తే.గీ.-ఆది నుండియు సంస్క్రుతంబతిశయముగ –ఆర్యావర్తాన వేదాల నార్షమగుచు

సకల శాస్త్రాల కావ్యాల సరణి నిలిచి –మంత్రం తంత్రాల యజ్ఞాల మహిని నిండె.

4-తే.గీ. బ్రహ్మ సృష్టితో యజ్ఞాల బ్రతుకు బాట –ముందు చూపుతోసృజియించి మురిసిపొయె

దైవ  సంతృప్తి యజ్ఞాన దాన వాన –పుడమి జీవ రాసులకెల్ల పూర్ణ జయము .

5-తే.గీ.-ఆది కవియైన వాల్మీకి హరియు బొంగ –రామకధా లోన గాయత్రి రమణ నిలిపె

వేద వ్యాసుండు విడమర్చి వేద రాశి –ఆర్తి భారత భాగవతాది కృతుల –పదియు నెనిమిది పౌరాణ ప్రతుల గూర్చె.

6-తే.గీ –కాళిదాసుని యుపమాన ఘనత జూడ –భారవీయర్ధ గౌరవంబట్టేచూడు

దండి దేవ పదలాలిత్య  డాబు లెంచ –మాఘు శిశుపాలవధ లోని మర్మమాయె.

7-తే.గీ-భాస భవభూతి మయూర భర్త్రుహరులు –సంకుసాల నృసి౦హాది శంకరులును

అస్టపదివ్రాయుజయదేవ ,ఆర్య శుకులు –శాఖ లన్నింట గైర్వాణి సాగ జేస్రి .

8-తే.గీ.ఇతర భాషల యజ్ఞాలు ఇముడవయ్య –కర్మ బంధాలు గీర్వాణి గదిసి యుండె

మోక్ష విద్యకు నిద్దియ మొదటి గురువు –సంస్కృతానికి ఏ భాష సాటి రాదు .

9-విశ్వ మేలిన భాషగా ఇనుతికెక్కి –నాడు గీర్వాణ మెన్నోట నాట్యమాడె

ఆంగ్ల మే నేడు విశ్వాన నదిక మగుచు –అమృత భాషకు మృతభాష యనగ రోత

బాణ కవిదైన కాండ్రింపు భంగి యాంగ్లి.

‘’జయ౦తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః ‘’

14-శ్రీ పంతుల వెంకటేశ్వర రావు –విజయవాడ -9908344249

అహో సంస్కృతం అద్భుతం నిరంతరం

1-తే గీ –జనని సంస్క్రుతంబని బుధ జనులు పొగడ –నాల్గు వేదాల సారమ్ము వెల్గు జూప

ఋషులు ,ప్రాజ్ఞులు ,పండితుల్ రుక్కులనగ-భాష గీర్వాణము మనలో భాగమయ్యె.

2-సీ-మానిషాద యనెడు మాట శ్లోకంబయ్యె-లీలగా నాడు వాల్మీకి నోట

ఆదికావ్యంబయ్యె నారాముని చరిత –ఏడేడు లోకాల నిలుచుండ

సద్గురువైన వ్యాసభగవానుడు వ్రాయ –సారమై నిలచెను భారతమ్ము

పూర్వమందు జరిగె ముక్తిప్రదాతయై –అష్టాదశ పురాణ సృష్టి యంత

ఆ.వె.అద్భుతమున నిల్చె నా భగవద్గీత –భర్తృహరి రచన సుభాషితంబు

ఆది శంకరుని శివానంద లహరి యున్-భాషలో సతతము వాసి గాంచె.

3-ఉ-గుప్తుల రాజభాష యయి గొప్పగ వెల్గుచు సంస్కృతంబు-సం

తృప్తి యు నిచ్చెవారలకు దేశ విదేశ జనుల్ నుతి౦చగన్

గుప్త ధన౦బుగన్  బుధులు కొందరు భావన సేసిరేయనం

తృప్తియు లేక జీవితము తీయగ హాయిగ వెళ్ళ బుచ్చుచున్ .

4-సీ-నవరత్నములనేడు కవులను పొషించె-రాజసంబున తాను భోజరాజు

రఘువంశ కావ్యంబు రసరమ్యమై నిల్చె-కమ్మగా వ్రాయంగ కాళిదాసు

దండి భారవి కవిత్వంబులన్ జూచినన్ –గీర్వాణ భాషకే గీటు రాళ్ళు

హర్షుని నైషద మానాటి కాలమున్ –భాష పటుత్వంబు పరిఢ విల్లు

తే.గీ-శత సహస్ర నామంబులు వెతలు దీర్చు –దండకంబులు దైవ మంత్రంబులకును

పేరు దెచ్చిన గోప్పదౌ వేద భాష –భారతీ యశము పెంచు గీర్వాణ భాష .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’గీర్వాణ భాషా వైభవం ‘’-4

’గీర్వాణ భాషా వైభవం ‘’-4

9- శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీపట్టణం -9849812443

గీర్వాణ భాషా వైభవం

1-సీ –గీర్వాణ భాషలో గీతా మహాత్మ్యమున్ –పరమాత్మ బోధించె పార్థునకును

గీతాలాపనన్ గీతామృతమ్మును –గ్రోలినంతనె కల్గు మేలు మనకు

ఉపనిషత్సారమ్ము నుపదేశమున  గీత –సామాన్యులు తరియించ సాధనమ్ము

దైవ సన్నిధి చేరు త్రోవ ను’’ పదునెంది’’-అధ్యాయముల చూపు నదియె గీత

తే.గీ.-భక్తీ పారవశ్యమునొంది ప్రణతులనెడు-రీతి గీర్వాణ భాష పై ప్రీతి గొలుప

స్తోత్ర పారాయణ ము విన సొంపు గూర్చు –దైవ దత్తమగు వరమె దేవ భాష .

2-సీ-గీర్వాణ భాషను నేర్చుకొనిన మేలు –సకల పురాణముల్ చదువ గలరు

వేదసారమ్మునూ విదితమై సంస్కృత –పండితులనుపేరు బడయ గలరు

దేవ భాషను నేర్చి దివ్య తేజము నంది –ఆదర్శమూర్తులై అలరగలరు

శాస్త్ర విజ్ఞానమున్ సార్వజనీనతన్ –సర్వ సమర్ధులై సాగగలరు

తే.గీ.-ఉత్తమోత్తమ గ్రంధముల్ ఉదధి నురుకు –కెరటముల వలె నెల్లరి దరి జేర

తెలుగున కనువదించి యందించ గలరు –జన్మ సార్ధకంబై వారు ధన్యులగును .

3-సీ-పద్య మూలంబగు ‘’పదగతౌ ‘’సంస్కృత- ధాతువుపద్య పథమును నడుపు

నియమ బద్ధమగుచు నిర్ణీత పరిధిలో –హ్రుద్యమంబుగా సాగు పద్య లహరి

భాష యశ్వంబన  భావమ్ము రధమైన –ఛందో పధము సాగు సారధి కవి

యతియు ప్రాసలను సంస్కృత భూయిష్ట మౌ –పద్యముల వ్రాయు విద్య ఘనము

తే.గీ-వారసత్వమ్ము నబ్బిన వరమె మనకు –పద్య మన్న నతిశయోక్తి పదము కాదు

శోభ గూర్చెడు గీర్వాణ  శ్లోకములకు –తెలుగు పద్య రూపము నిచ్చు తెగువ వరమె.

4-సీ-సాహిత్య సంపద సంస్కృతమ్మునెతొలి-ప్రాడుర్భవి౦చ౦గ ప్రణతు లందె

ప్రాక్రుతుడైనను ప్రాచేతసుడు  వ్రాసె-ఆదికావ్యంబు రామాయణమ్ము

సంస్కృత కావ్యముల్ సంస్తవమ్మును చేసె-ప్రాజ్ఞు లు తెలుగున భాగ్య వశము

వ్యాస భారత భాగవతముల్ కవిత్రయం -పోతన వ్రాసిరి రపూర్వముగను

తే.గీ.-తొలుత మునులు పురాణముల్  పలురకములు –దేవ భాషను వ్రాసిరి దివ్యముగను

పిదప భవభూతి కాళిదాసేతరులు ను -విశ్వనాధాది విబుధులు వివిధ కవులు- కలము పట్టిరి భాషపై కాంక్ష తీర .

5-సీ.-సంస్క్రుతమును నేర్చు సంస్కృతి పెరిగిన –దేవనాగరలిపి తెలియవచ్చు

భాష యౌన్నత్యమున్ బాగుగా నెరిగిన –భాషాభిమానమ్ము పట్టు పెరుగు

తరచిన పూర్వ వృత్తాంతము లనెల్ల-మూలపు రాణి ప్రాముఖ్య మెరుగు

ఆ పుణ్య గాధల నద్భుతమగు పాత్ర-లాదర్శ ప్రాయమై యవధరి౦చు

తే.గీ.-రామ చంద్రుని వంటి కుమారు ననగ-సీత వలెసుగుణాల రాశి తనయగను

భారత లక్ష్మణుల వంటి సోదరులుగలుగ-కోరు కుందురు జనులెల్ల కుశల మరసి .

10-శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర –విజయవాడ -8885803170

గీర్వాణ భాష గొప్పతనం

1-మహర్షి వాల్మీకి రామాయణం కడు రమ్యం –దేశ విదేశాలలోఘన

తకెక్కి ,భారతీయుల గౌరవం ఇనుమ –డింప జేసిన సాహిత్యము .

2భారతీయుల సంస్కృతి ఆచార వ్యవహా –రము వ్యాసుని ఉపనిష-

తత్తులు,వేదములు అనుసరణీయము –ప్రపంచం లోగణుతి కెక్కె.

3- రసజ్ఞుల హృదయాలపై చిరు జ-ల్లులు కురిపించు మన

స్సుమై మరపించె దేవ భాష –సుధ లొలుకు కన్న తల్లి.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-11-12-16- ఉయ్యూరు  .

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’గీర్వాణ భాషా వైభవం ‘’-3

’గీర్వాణ భాషా వైభవం ‘’-3

7-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు –విజయవాడ -9703776650

సంస్కృత సంస్కృతి

1-వాల్మీకిన్నుతియింతుసీత చరితం బత్యద్భుతంబై మహా –వాల్మీకంబయి ధర్మ సూత్రవిలసద్వాణీ పతీయంబునై

వ్రేల్మిన్ తానొనరించె సత్క్రుతిని భావి౦పన్మహా మౌనికిన్ –కాల్మొక్కేను మదీయ భావనల నెక్కొలంబు దీవి౦పగన్ .

2- వ్యాసుడు విష్ణు సన్నిభుడు వైదిక మార్గ వివర్ధను౦ డహో-దీసము డెవ్వరాతనికి తీరిచి దిద్దెను వేద సంహతిన్

భాసుర భారతంబు మరి భాగవతంబు పురాణ గాధలన్ –భాసిలు భారతీయతకు పాటిలు తాత్విక బ్రహ్మ సూత్రముల్

3-.ఉపమకు కాళిదాసు సమయోచిత భావ ప్రభారవీ౦ద్రుడున్ –సుపద మనోహరాల సుమ శోభకు దండి త్రయంపు మాఘుడున్

సుపధము చూప సంస్కృత యశో విభవంబు ప్రపంచ కావ్యమై –సుపఠన పాఠనంబుల రసోచిత బంధ మెలర్ప జేయరే .4-ఆధ్యాత్మ జ్ఞానంబు నంద గోరితివేమొ-ఉపనిషత్తుల తనివొంద జూడు

భక్తి తత్పరుడవై ముక్తి గోరితివేమొ-బహు పురాణమ్ముల పఠన మేలు

సంస్కృత పాండిత్య సాధనే లక్ష్యమా –కావ్య పంచక మీవు కాంచి చదువు

గద్య కవిత్వంపు హృదయ సౌందర్యమ్ము –భట్టు బాణు  నడుగు భళిర జూపు

భారతీయాత్మకు పావన మూలమ్ము –వేదాల సారమ్ము వెల్లడించు

కావ్య నాటక గీతికా వైభవానంద –గంధ మిచ్చును నీకు కాళిదాసు

అంగాంగ రసబంధ శృంగార సూత్రాలు –వాత్సాయనంబునై వాసి గాంచె

శృంగార గీతాల భ్రుంగీ రావాలేన్నొ-నిష్టంబు జయదేవు నస్టపదుల

లలిత లలిత పద కలిత స్వరితము, నారాయణ తీర్థు తరంగ హేల

వైప్లవ్య భావాల విక్రాంతి శూద్రకు –మృచ్ఛ కటికము నందచ్చమగును

ఎన్నొన్నొ చందంబు లెన్నెన్నొప్రక్రియల్ –గీర్వాణ మండుండె నేర్వ గాను

పాణినీయంబును పాతంజలంబును- చరక సంహితకూ సంస్కృతంబె

నాదు సంస్కృత సంస్కృతి సాదు సాదు –అఖిల భారత భాషల కాత్మ యగును

దివ్య భారత వెలుగుల దిశల చివర –శాశ్వతంబుగా నిలిపెనా సంస్కృతంబు .

8-శ్రీ శ్రిస్టి శ్రీనివాస శర్మ –నిమ్మకూరు -9849036311

సంస్కృత భాషా ప్రాశస్త్యం

1-భారత భారతి వైభవ –భారతి సంస్క్రుతముకాదె భాషలకెల్లన్

‘’సారస భారతి’’ ఇచ్చిన –హారతి సంస్కరణము సంస్థలకెల్లన్.

2-బీజాక్షరముల మంత్రము –పూజా విధుల పఠన మగుచు భువిలో మహిమన్

భూజము వోలెనిలిపి ,తా-భాజనమగు సంస్కృతాన భాగ్యము కలుగన్.

3-సంస్కృతము చదువ భాషా –సంస్క్రుతులబ్బునిజము ,శాస్త్రోపజ్నా

సంస్కారోపస్కారపు –సంస్కృతిచేతనుమనుజులు సద్గతి కనరే?

4-భారత గౌరవ కారణ –మీరెంటి వలన నిలిచెను ఇమ్ముగ నేడున్

పారంపరమౌ సంస్కృతి-చారణ కృత సంస్కృతమును సంపద కాగన్ .

5-సంస్కృతము సనాతన భాష ,శాస్త్ర భాష లకును శక్తి నిచ్చిన భాష –లక్షణముగ

గడన కెక్కిన భాష ,కంప్యూటరు మడమ తొక్కు –భాష ,నిత్య నూతనమగు భద్ర భాష  .

6-దేవనాగరి ప్రాచీన దేవ భాష –  యనగ నెట్లు చెల్లు ?గణన యంత్రముల కు

చక్కగ యమరునని శాస్త్ర సాధకులును –తెలుపు చుండ నట్టి కీర్తి నిలుప వలదె?

సశేషం

గబ్బిట దుర్గా ప్రసాద్ -11-12-16-ఉయ్యూరు

 

.

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ భాషా వైభవం ‘’-2

’గీర్వాణ భాషా వైభవం ‘’-2

5-డా.గుడిసేవ విష్ణు ప్రసాద్ –అవనిగడ్డ -9441149608

మంజుల మంజూష –సుందర సుర భాష

1-అ.వె.శ్రీకరములొసగి చెలు వారు మా తల్లి –జనని భారతంబ జయము జయము

జ్ఞాన సుధలు నింపి జగమేలు మా తల్లి-జనని శారదాంబ జయతు జయతు .

2-సీ-రామయణాఖ్యంబు రఘువర చరితంబు- వాల్మీకి సృజన గీర్వాణ భాష

పంచమ వేదంబు భారతకావ్యంబు -వ్యాస ముఖోధిత శ్వాస భాష

విశ్వ వందిత గీత విజ్ఞాన సముపేత ,-శ్రీ కృష్ణ పరమాత్మ శ్రేయ భాష

కవికుల గురువర్యు కాళిదాస సుకవి –కావ్య నాటకముల శ్రావ్య భాష

ఆ.వె.-వేద విషయ జ్ఞాన ,వేదాంత శాస్త్రంబు –వైద్య వ్యోమ శాస్త్ర  వర్ణితంబు

శ్రుతి సుఖ నినదంబు స్మృతిహిత వరదంబు –సుందరసుర భాష శోభితంబు.

3-సీ-వేద ప్రవచనంబు విజ్ఞాన సారంబు –వివరించి తెల్పెడి వేదభాష

నాక లోకము నందు పాకారి ప్రముఖులౌ –దేవతల వచియించు దేవ భాష

అద్వైత తత్వమౌ ఆధ్యాత్మ బోధనల్-సంతరించు కొనిన జ్ఞాన భాష

అతి పురాతన భాష అతి సనాతన భాష –నిత్య నూతన మైన నిగమ భాష

ఆ . వె.-భాషలకు భాష గీర్వాణ వాణి భాష –అన్నిభాషల మూలమౌ నమర భాష

సకల సుజ్నేయ భాష సంస్కార భాష –సరళమౌ భాష నరయంగ సంస్కృతంబు .

4-ధ్యానంబు చేయ నద్యయనంబు చేయంగ –సహకరించెడి భాష  సంస్కృతంబు

నిత్య పూజల యందు నిలిచి యుండెడిభాష –సాఫల్యమగు భాష సంస్కృతంబు

శబ్దార్ధ జ్ఞానంబు చక్కగా వివరించు –శక్తి గల్గిన భాష సంస్కృతంబు

అన్ని భాషలకు ఆధారముగా నుండి – సంస్కరించిన భాష సంస్కృతంబు

ఆ.వె.-మధురమైన మంజుల భాష –సదమల హృదయంబు సంస్కృతంబు

నరనరముల నిలిచి నాదమై పలికెడి –సరిగమల సరిభాష సంస్కృతంబు .

6-మధురకవి శ్రీమతి ముదిగొండ  సీతారావమ్మ –విజయవాడ -9299303035

గీర్వాణ వాణి

1-కం .ఆమునులే ప్రార్ది౦చిరి –ఆ మహాదేవుని ,వినగనె,ఆర్తిని బాపన్

డమరుకమును మ్రోగించెను –అమలంబౌ భాష నొసగె అవనికి దయతో .

2-కం .ఆకాశమందు మ్రోగగ-సాకారము చెందినట్టి చక్కని భాషే

చీకాకులు తొలగించెను –నాకదునీ ధరుడొసంగె నవ గీర్వాణిన్.

3-కం .గీర్వాణ భాష ఇయ్యది –గీర్వాణికి సాటి యగును కీర్తిని పెంచున్

గీర్వాణ గతుల నరసిన –గీర్వాణ కవీశ్వరులకు కేలును మోడ్తున్ .

4-కం –గీర్వాణ వాణి తెలిసిన –గీర్వాణుల గూర్చి వ్రాతు గీర్వాణముగా

గీర్వాణ వైభవంబిల –గీర్వాణముతో వచింప కీర్తియె నాకున్ .

5-ఆ.వె.-సూరిగాదు అతడు సూర్యుడై వెలుగిచ్చె –మల్లినాద సూరి మహిత గుణుడు

అతడు చేసినట్టి వ్యాఖ్యానమె మనల –సంస్కృతంబు దరికి సాగ నిచ్చె.

6- సీ-వేద పురాణాలు వివిధ శాస్త్రంబులు –సంస్క్రుతమందున సాగు చుండు

పూజలు వ్రతములు పుణ్య యాగంబులు –సంస్కృత మంత్రాల సాగు చుండు

పుట్టిన గిట్టిన పుణ్య కార్యములును –సంస్క్రుతమందునె సాగు చుండు

అస్టోత్తరంబులు ,ఆ సహస్రంబుల-స్తోత్రములన్నియు సంస్క్రుతంబె

అ.వె.దివ్యమైనదిదియె దేవభాషనబడు-సాటి లేని మేటి సంస్క్రుతంబు

జనని యగును గాదె జగతి భాషలకును –భారతాన పుట్టె భాగ్య వశము .

7-సీ-వేద వేదాంగాలు విడదీసి ప్రకటించె-వ్యాసుడు భారత భాగ్య దాత

ఆ పురాణమ్ములు లఖిలేతి హాసాలు –మనకు చేకూర్చిన మాన్యు డితడు

వాల్మీకి రచియించె  వన్నెకెక్కు విధాన –రామాయణమ్మును రమ్యముగను

చాణిక్య చరకులు చక్కగ వ్రాసిరి –నీతులు ,వైద్యమ్ము నిత్యముగను

కాళిదాసు రచియించె కాళికా శక్తి చే కావ్య నాటకములు కమ్మగాను

భవ భూతి చూపించె భవ్యమౌ కరుణను –కాదంబరిని గూర్చె గద్య దండి

అర్ధ గౌరవమును సార్ధకముగా జూపె-భారవి కావ్యాన భవ్యముగను

మాఘుడు కావ్యాన మాధుర్యమును నింపి –శిశుపాల వధ వ్రాసె శేముషిగను

హర్షుడు నైషధం హర్షాన వెలయించె-విద్వదౌషధమన్న విభవ మందె

పాణిని కౌముదిన్ పరమ మయ్యెను భాష –వ్యాకరణ ప్రతిభా వైభవమున

తే.గీ –భరత భూమిని గీర్వాణ భాష యందు –పెక్కు శాస్త్రాలు కావ్యాలు పేర్మి వ్రాసె

దివ్యతమమును చేసిరి దివ్యులంత-నాటి కీర్తిని మరువక నడచు టొప్పు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-16- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’గీర్వాణ భాషా వైభవం ‘’-1

‘’గీర్వాణ భాషా వైభవం ‘’-1

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2-రెండవ భాగం 4-12-16 ఆదివారం ఆవిష్కరణ సందర్భం గా   ‘’గీర్వాణ భాషా వైభవం ‘’ పై జరిగిన పద్య కవి  సమ్మేళనం లో కవుల పద్య మకరంద ధారను ధారావాహికం గా అందజేస్తున్నాను .అనుభవించి ఆస్వాదించండి .

1-డా రామడుగు వెంకటేశ్వర శర్మ (గుంటూరు ) 9966944287

గీర్వాణ భాషా వైభవం

1-సీ –రామ నీరద  సుదర్శన మాత్ర కవన నృత్యతా కేకి వాల్మీకి !అంజలు లివె

శ్రుతి పురాణార్ధ భారత పద్మ వికసనోల్లాస  వేద వ్యాస !ప్రణతి వినుతి

ప్రతిభా సమేత రూపక దీపికా వాస ! భాసా నమోస్తు

కమ్రోపమాన సత్కవితా విలాస శ్రీ కాళిదాసా!నమస్కార శతము

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి– ,నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మ యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

2-సీ-‘’కవి భారవే రర్ధ గౌరవ ‘’ఖ్యాతి చేకొన్న భారవి !ఏటి కోళు లివియె

శబ్ద లాలిత్యైక సంపస్సముద్దండి!దండి మహా కవీ దండమయ్య

మల్లినాద ప్రశంసా ‘’మాఘ మేఘేతి’’ వాక్య కారక మాఘ !ప్రణతి శతము

శివ మహిమ్న స్తోత్ర కవి గాఢ భక్తాగ్ర గణ్య సత్కీర్తి సౌజన్య !నతులు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

3-సీ –నవ విద్వ దౌషధ  నైషద కవితా ప్రవర్ష ,హర్షా !ఇదే ప్రణుతి శతము

కాదంబరీ రసజ్ఞాన దాయక బాణ !బాణ భట్టారకా  వందనములు

‘’సరస పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి ‘’యౌ జయదేవ  వందనములు

‘’ కృష్ణ కర్ణామృత లీలాశుకా ‘’!జ్ఞాన చింతామణి కవీంద్ర !చేతు నతులు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

4-సీ –కరుణా రసైక సత్కవన గోదావరీ వర భూతి ,భవ భూతి !వందనములు

గుణ్య సామాన్య నైపుణ్య జీవన రూపకా !మృచ్చ కటికాఖ్య కర్త !నతులు

చాణక్య రాజ్యాంగ చతురతా పూర్ణ ‘’ముద్రారాక్షస ‘’విశాఖ దత్త నతులు

తృతీయ పంథా ప్రధానా !’’అనర్ఘ రాఘవ రూపకా !నమస్కార శతము

బంధుర రసానంద పరీమళ’’!కుందమాలా కార! వందనములు

నిర్మల ప్రియదర్శినీ రూప నవ్య నాగానంద హర్షాధిపా నమోస్తు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

 

2- డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి-పొన్నూరు -8106766197

పద్య మందార మాలతో అభినందన చందనం  –

1-జయశీలంబును ,కార్య శూరతయు ,సౌజన్యంబు రూపంబు దా

ల్చి ,యపూర్వంబుగ దీర్చి దిద్దిన గీర్వాణ కళాక్షేత్రంబు’’ గీర్వాణ వా

ణి’’,యమూల్యంబగు భావ సంపదల నున్మేషింప,సారస్వత

ప్రియు లిద్దాని గుణంబులన్ గని ,ప్రహర్షింపన్,సమర్ధంబగున్ .

2- ఘనులై సంస్కృత భాష నధ్యయనమున్ గావించి ,కావ్యాలు వ్రా

సిన ,ఆయా కవి జీవితంబుల ప్రశస్తిన్ ,జ్ఞాన విజ్ఞాన భా

వనలన్, బ్రోది యొనర్చి ,భావి తరముల్ భద్రంబు లై వర్దిల౦

గను ,గీర్వాణ కవి ప్రణీతములు  సద్గ్రంధంబులన్ దెల్పుచున్ .

3-తరువుల్ బూచిన పుష్ప సౌరభము ,లుత్సాహంబు తో, వాయు

వెల్లరకున్ బంచిన రీతి ,సంస్కృతుల సంలాపంబు ,లాంద్రోక్తి సుం

దరమై  భాసిల జేయు సత్కవులు ,సత్కారార్హులాత్మోన్నతిన్

బర మార్ధంబు గ్రహించి ,లోకులకు జెప్పన్ ,సద్విర్మంబగున్ .

4-అభినందించు బ్రపంచ మీ కృతికి ,నత్యంతంబు సత్య౦బు ,దు

ర్లభౌ ,సంస్కృత కావ్యముల్ విబుధు లౌరా !యంచు గీర్తింప ,ద

చ్చుభ సందర్భ,ముదాహరి౦చుచు ,కవీశుల్ మెచ్చ సాహిత్య ,సౌ

రభ ముల్,దిక్కుల నింపు మీ కృషి ,సువర్ణం బై విరాజిల్లెడున్  .

5-తినబోవన్ రుచి గూర్చి చెప్పవలెనా ?తియ్య౦దన౦ ,భిక్షుఖా

దన మన్నన్ బునరుక్తి కాదొకొ ?ప్రసాదంబిట్టి దౌనంచు ,వ

ర్ణన గావి౦పగ శక్యమే ?సవిత నారాధింప ,దీపంబు జూ,

పిన చందంబిది,గబ్బిటాన్వయ మణీ!విద్వద్విమర్శాగ్రణీ’’.

డా .తూములూరు శ్రీ దాక్షిణా మూర్తి శాస్త్రి

రిటైర్డ్ ప్రిన్సిపాల్ – శ్రీ భావనారాయణ స౦స్కృత కళాశాల –పొన్నూరు

3-శతావధాని శేఖర ,కాశీకావి ,విద్యా వారిది ,అసమాన అవధాన సార్వ భౌమ ,అవధాన కళా తపస్వి

డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ –విజయవాడ -9440346287

వందేహం గీర్వాణీం

1-సంస్కృతస్య ప్రతిస్ఠేద్వే సంస్కారః సంస్కృతిస్తధా-వ్యక్తీనాం చ సమాజస్య మార్గోప దేశం భజే ‘’

2-బాసల గన్న బాస ముది బాసల ముందటి బాస ,చాల మేల్-బాస ,పరాయి బాస తెలబారగ వెల్గెడు బాస ,తన్ను రా

జేసిన పెక్కు బాసలకు చిక్కులు దీసిన వేల్పు బాస ఈ –బాస యొసంగు గాక  సరి బాటను ,కైతను ,కట్టు బాటులన్ .3మాతృ స్తన్యేన కొ భ్రస్టః పుష్ప ఏవ సదా భవేత్ –గీర్వాణ భాషయాసర్వాః భాషా వర్ధంత ఇత్యలం ‘’

4-వందేహం గీర్వాణీ౦ –వాణీ మజ్నాన తిమిర దీపాం త్వాం

చతురోక్తి రూప హేలాం –లీలా రస మార్గ మోక్ష సంధాత్రీం ‘’

5-జయతు జయతు వాణీ సంస్కతాఖ్య పురాణే-సురస సరస దానీ భారతీ చేక్షు పాణీ

బహు యుగ పరిదీప్తా దుర్గ మార్ధ ప్రదాత్రీ –రసమయ కవితొక్తిః వేద వేదా౦గ మూర్తిః’’

 

4-డా .ధూళిపాళ రామ కృష్ణ –విజయవాడ -9963668214

సంస్కృత సంస్కృతి

1-దుర్గా ప్రసాద కవితా సరసాసుర భారతీ –ఆసక్తి కర సంలగ్నా భూయాత్ కవి యశః కరీ

2-రాజ్యాది భోగ నిష్కామాః రస సిద్ధాః కవీశ్వరాః-ఏయే కామ దుఘా జాతా అమరాన్ తానుపాస్మహే ‘

3-కాంతా సంమితకావ్య మంజుల పదైః రమ్యోప దేశా గిరః –రామాజ్యాచరణ ప్రబోధ రసికా ఉత్తేజ యంత్యఃప్రజాః

ధర్మా ధర్మ వివేక పావన ధియః కుర్వంత్య ఏవానిశం –ఆవేదాత్ సుకవీశ్వరావధి సఖే గీర్వాణ వాణ్యా౦ స్థితాః’’

4-వక్తహ గణికాస్యేవం మాకస్యా పేతి సంస్కృతా-తచ్చూద్రక వచో మూలం మానిషాదేతి మంగళం ‘

5-స్త్రీ వ్యాద ద్విజ సంవాదే పరిణీతేన కర్మణా-సర్వ తోషణ మాదిస్టం వ్యాసేనాద్బుతకర్మణా ‘’

6-భవ వత్స విమత్సరస్సదా-ధృవ మాతా యదవచో దాత్మ జాతం

మనశ్శమ మాదిమ గురుః-సురభాషైవ దిదేశ లక్ష్య సిద్ధౌ ‘’

7-లోక జ్ఞాన దర్శితౌ కావ్యే కణ్వవ్యాధౌ వనౌకసౌ –శాకున్తలే భారవేచ సంస్కృతే సంశ్రూతి స్తదా ‘’

8-గుణేషు క్రియతాం యత్నః గుణ లుబ్ధాహి సంపదః –విమృశ్య కారితా తత్ర ధర్మ రాజేన బోధితా ‘’

9-ఏతద్వ్రతం మమేత్యాహ రాజా రామో మహా యశాః-సర్వాభయ  ప్రదానం హి సర్వ దానాధికం మతం ‘’

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -9-12-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ శతకం

సాహితీ బంధువులకు నమస్కారం -ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి శతకం రాయిస్తున్నామని పూర్వం తెలియ జేసిన సంగతి గుర్తుండే ఉంటుంది .అనివార్య కారణాలవలన ఆ శతకాన్ని డా తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు రాయటం లేదు దాన్ని ప్రముఖకవి విమర్శకులు విశ్లేషకులు 30ఏళ్లుగా నాకు పరిచయం ఉన్న సాహితీ మూర్తి శ్రీ తుమ్మొజు రామలక్ష్మణాచార్యులు గారు  రాస్తున్నారు .ముందు చెప్పినట్లు ఈ నెల 12 వతేది శ్రీ హనుమద్ వ్రతము రోజున ఆవిష్కరణ జరగటం లేదు కవి మారారుకానుక కొంత సమయం పడుతుంది బహుశా జనవరి లో ఆవిష్కరణ జరుగవచ్చు .ఈ శతకానికి  చాలా ఉత్సాహం గా ముందుకొచ్చి విరాళాలు పంపిన వారందరికీ కృతజ్ఞతలు .ఇంకా ఆసక్తి ఉన్నవారు పంపటానికి అవకాశం ఉంది ఈ శతకం లో దాతల గోత్రనామాలు ప్రచురిస్తామని ముందే తెలియ జేశాను .

 గీర్వాణం -2  ఆవిష్కరణ రోజున స్వామి వార్లపై రెండవ శతకాన్ని కూడా రచింప జేస్తున్నట్లు తెలియజేయటం దానిని మధురకవి బహుగ్రంథకర్త ,శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు రచించటానికి అంగీకరించి రచన చేస్తున్నారని తెలియ జేస్తున్నాము .ఈ శతకాన్ని సరసభారతి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం మాత్రమే ఖర్చు భరించి ముద్రిస్తున్నాము దీనికై ఎవరూ విరాళాలు పంపనక్కరలేదు . ఈ శతకాన్ని ఫిబ్రవరి చివరలో లేక మార్చి మొదటి వారం లో ఆవిష్కరింప జేస్తాము రెండు శతకాల ఆవిష్కరణలు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లోనే నిర్వహిస్తామని తెలియ జేస్తున్నాను -వీటితో సరసభారతి ప్రచురణా స0ఖ్య  24 అవుతుంది -దుర్గాప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

4-12-2016 ఆదివారం సాయంత్రం ఉయ్యూరు రోటరీ ఆడిటోరియంలో సరసభారతి – రోటరీ క్లబ్ సంయుక్తంగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం పుస్తక ఆవిష్కరణ

ది 4-12-2016 ఆదివారం సాయంత్రం ఉయ్యూరు రోటరీ ఆడిటోరియంలో సరసభారతి – రోటరీ క్లబ్ సంయుక్తంగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం పుస్తక ఆవిష్కరణ నిర్వహించబడినది. శాసన సభ ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుధప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్, జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు – పూర్ణచంద్ పుస్తక రచయిత సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్, పద్మశ్రీ ఎస్ వి రామారావు గారు , ఆత్మీయ అతిధులు, తదితర సాహితీ బంధువులు పాల్గొన్నారు .

https://plus.google.com/photos/115752370674452071762/album/6360294741927450513/6360294745637225506

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

live now

http://www.blossomslive.com/

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పుస్తకావిష్కరణ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పుస్తకావిష్కరణ

అతిధుల పరిచయం

2-డా.శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి

కృష్ణాజిల్లా పామర్రు దగ్గర ఎలమర్రు గ్రామానికి చెందిన శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి కృష్ణా జిల్లా నందిగామలో డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి శ్రీమతి పద్మావతి దంపతులకు 3-10-1983 న జన్మించారు . ,తిరుపతిలో నే చదువు ప్రారంభించి ,శాస్త్రాధ్యయనం  కొనసాగించారు . .తర్క శాస్త్రం లో మహా పండితులైన తండ్రి శ్రీ ఆంజనేయ శాస్త్రి గారి వద్దనే తర్క భాష్యాన్ని అధ్యయనం చేసి ,శ్రీ ప్రద్యోత్ కుమార్ ముఖోపాధ్యాయ శ్రీ సుధాంశు శేఖర్ శాస్త్రి గార్ల వద్ద లోతులు తరచి నిష్ణాతు లయ్యారు .మూడు  గ్రంధాలు -1-తర్కామృతం-మాణిక్య ప్రభ కు హిందీ వ్యాఖ్యానం 2-కారికావళి గురుకృపకు హిందీ వ్యాఖ్యానం 3-సామాన్య నికృతి కి క్రోడపత్రం రాశారు . .ఇవికాక 3  గ్రంధాలు 1-శాస్త్ర దీపిక 2-చైతన్య  3- కాళికా స్తుతి సంస్కృత వ్యాఖ్య లకు సంపాదకత్వం వహించారు .

శ్రీ మాణిక్య శాస్త్రి గారి విద్వత్ కు తగిన పురస్కారాలు పొందారు  .1- బెనారస్ హిందూ యూని వర్సిటి నుండి 20 06 శాస్త్రి ఆనర్స్ పరీక్షలో ప్రధమ స్థానం  సాధించినందుకు స్వర్ణ పతాకాన్ని భారత రాష్ట్ర పతి శ్రీ ఎ.పి.జే.అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అందుకొన్నారు .2-మరొక బంగారు పతాకాన్ని 20 07 లో ఆచార్య పరీక్ష లో మొదటి స్థానం పొందినందుకు ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి నుండి స్వీకరించారు .3 మహా మహోపాధ్యాయ గోపీనాధ పురస్కారం 4-సంస్కృత భారతి నుండి మనోరమ పురస్కారం అందుకుని విద్యా’’ జయ’’కేతనం ఎగురవేసి తర్క న్యాయ శాస్త్రాలలో ‘’మాణిక్య౦’’ గా ప్రకాశిస్తున్నారు శాస్త్రిగారు .నిజంగా విద్వత్ లో’’ శాస్త్రి’’అనిపించారు ..

శ్రీ మాణిక్య శాస్త్రి గారు 40 జాతీయ సెమినార్లలోను,10 అంతర్జాతీయ సెమినార్లలోను పాల్గొని తమ అనుభవాలను ఇతర మేధావులతో  పంచుకొని సెమినార్ల కే విలువ పెంచారు ..ప్రముఖ సంస్థల ఆహ్వానంపై తర్కం, మీమాంస ,వేదాంత శాస్త్రాల పై 10 దాకా మహోపన్యాసాలనిచ్చి రాణించారు  ప్రస్తుతం పూరీలోని  శ్రీ జగన్నాధ సంస్కృత  విశ్వ విద్యాలయం లో న్యాయ శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా సేవల౦దిస్తున్నారు  .

సరస భారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ భాగం ‘’గ్రంధా విష్కరణ సభకు విశేష అతిధిగా  శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి గారి ని వేదికపై కి సాదరం గా ఆహ్వానిస్తున్నాము .

 

2-    శ్రీ గుండు హనుమంత రావు

విజయవాడలో జన్మించి ,పెరిగిన శ్రీ గుండు హనుమంతరావు గారికి విజయవాడలో చాక్లెట్ ,బిస్కట్ కంపెని తోపాటు వ్యాపారం లో రాణిస్తున్నారు  .1974 నుంచి స్టేజ్ షో లు నిర్వ హించటం ప్రారంభించి ,రావణ బ్రహ్మ పాత్రతో మొదటిసారి రంగ ప్రవేశం చేశారు . .అనేక టి వి .సీరియల్స్ లో నటించారు .వీటిలో  జెమినీ  టి వి వారు 2001 నవంబర్ నుండి 2007  నవంబర్ వరకు 313ఎపిసోడ్ లుసీరియల్ గా వచ్చిన ‘’అమృతం ‘’సీరియల్ మహా హాస్య భరితమై కమ్మని ఆహ్లాదభరిత ఆరోగ్యకర  హాస్యానికి నిర్వచనంగా ,ఒక లెజేండ్ గా మిగిలిపోయింది. అందులో ఆముదాల ఆంజనేయులు ఉరఫ్ ‘’అంజి ‘’పాత్ర ధారి గా అత్యద్భుత నటన ప్రదర్శింఛి అందరి అభిమానం పొందారు .అన్ని ఎపిసోడ్ లలో ఉన్న ఏకైక పాత్ర దారి  దాదాపు హీరోలాంటి పాత్రధారి   శ్రీ హనుమంత రావు ఒక్కరే అవటం గర్వ కారణం .అమృతం సీరియల్ కోసం కనీసం 32 సినిమాలను తిరస్కరించి ఆ సీరియల్ లో అంతటి అంకిత భావం తో నటించి అపూర్వ విజయం చేకూర్చిన ఘనత శ్రీ గుండు హనుమంత రావు గారిదే .అందుకే ఆయన ‘’అమృతం ఫేం ‘’అయ్యారు .

1985 లో ‘’ఇదేమిటి ‘’నాటకాన్నినటించి  ప్రదర్శించారు . దీన్ని చూసిన ప్రముఖ హాస్య దర్శకులు శ్రీ జంధ్యాల , శ్రీ హనుమంతరావు గారి నటనా ప్రతిభ గుర్తించి ‘’అహ నా పెళ్ళంట ‘’సినిమాలో అవకాశమిచ్చారు . ఈ సినిమాలో మొదటి సారిగా నటించి  సినీ అరంగేట్రం చేశారు.సపోర్టింగ్ యాక్టర్ గా  వందలాది సినిమాలలో ప్రముఖ హాస్యనటులుగా ప్రముఖ దర్శకులు జంధ్యాల ఎస్ వి కృష్ణా రెడ్డి వంటి హాస్య దర్శకులవద్ద చాలా సినిమాలలో నటించి హాస్యనటనకు తమదైన ఒరవడి  సృస్టిం చారు .

అమృతం సీరియల్ లో నటించినందుకు ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘’నంది అవార్డ్ ‘’ను తొలిసారి అందుకొని , రెండవ సారి ‘’శ్రీ మతి శ్రీ సుబ్రహ్మణ్యం ‘’సీరియల్ కూ మూడవది ‘’ఆది తాళం ‘’లో నటనకు  పురస్కారాలు అందుకొన్న ఘనత శ్రీ హనుమంత రావు గారిది .’’నవ్వుల నారప్ప ‘’,కెవ్వు –కేక ‘’హాస్య ప్రోగ్రాం లను బుల్లి తెరకు చేసి నవ్వులు పూయించి పండించారు . .సుమారు 30 ఏళ్ళ నటనానుభవం వారిది .దాదాపు 300 చిత్రాలలో నటించి మెప్పించారు .తన కృషినే అభిమానించి ,ప్రేమించి సంతృప్తి చెందే మనస్తత్వం శ్రీ హనుమంతరావు గారిది . .ఆరోగ్య ప్రదమైన సున్నిత హాస్యం తో ప్రజలను నవ్వి౦చ టమే  రావు గారి ధ్యేయం .

కమ్మని సునిసిత హాస్యానికి చిరునామాగా నిలిచిన  అమృతం ఫేం శ్రీ గుండు హనుమంత రావు గారిని సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ భాగం ‘’గ్రంధా విష్కరణ సభకు ఆత్మీయ అతిధిగా వేదిక నలంకరించ వలసినదిగా  సాదరం గా ఆహ్వానిస్తున్నాం .

3-  యాంకర్ ఝాన్సి

ఝాన్సీ లక్ష్మి టెలివిజన్ యాంకర్ గా ,సినీ నటిగా ,దర్శకురాలిగా ,నిర్మాతగా ,రచయిత్రిగా ,కాలమిస్ట్ గా సుప్రసిద్ధులు .20 ఏళ్ళ సుదీర్ఘ బుల్లి తెర అనుభవం ఆమెను బహు పాత్ర పోషణ చేయించింది .8 నందీ పురస్కారాలు అందుకొన్న ఘనత ఆమెది .సాధారణ యాంకర్ గా మాత్రమేకాక సాంఘిక ,మానవతా విషయాలలో చాలా క్రియాశీల వ్యక్తీ అని  నవీన ,చేతన ప్రదర్శనల ఆమె  ద్వారా నిరూపించుకొన్నారు .1997 నుండి 2007 వరకు పదేళ్ళు సుదీర్ఘంగా ఆమె జెమిని టి వి .లో సమర్పిచినసీరియల్  ‘’టాక్ ఆఫ్ ది టైం’’ఆమెను విజయ శిఖరాలకు చేర్చింది .లింగ విచక్షణ ,సమాన హక్కులు వంటి సమస్యలపై టివి 9 లో సమర్పించిన ‘’నవీన ‘’ సీరియల్  రామనాధ గోయెంకా అవార్డ్ ను సాధించి పెట్టింది .పట్టణ పేద ప్రజల జీవిత చిత్రణగా విప్లవాత్మక భావాలతో సమర్పించిన ‘’చేతన’’సీరియల్ ఝాన్సీ సాహస ధైర్యాలకు ప్రతీక .2014 ఎన్నికలలో టి. వి. 9 కోసం చేసిన  ‘’ఓపెన్ హార్ట్ ‘’కోసం తెలంగాణా ,ఆంధ్రా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి రాజకీయ చర్చలలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి మనముందు నిలిపారు …ఇవేకాక ‘’బ్రెయిన్ ఆఫ్ ఆంద్ర ‘’,’’పెళ్లి పుస్తకం ‘’,’’సండే సందడి ‘’,కనకవర్షం ‘’ కొ అంటే కోటి ,లక్కూ –కిక్కూ ‘’ధారావాహికలు బాగా ప్రాచుర్యం పొందాయి .జెమిని టి .వి. లో ‘’అమృతం ‘’హాస్య ధారావాహికలో సంజు ‘’గా గొప్పనటన ప్రదర్శించి ప్రేక్షకాభిమానం పొందారు .

తెలుగు మా౦డలీకాలన్నింటి లోను   ధారాళంగా మాట్లాడే ఝాన్సి ప్రతిభకు అమితాశ్చర్యమేస్తుంది.ఈ అనుభవం సినీ రంగ ప్రవేశానికి రాచ బాట వేసిఅందులోను స్థిరపడటానికి దోహదం చేసింది .తులసి సినిమాలో ‘’కొకాపేట కనకం ,’తో దూసుకు వచ్చిన ఝాన్సి ,అష్టాచెమ్మా ‘’,సింహ ,.పంజా ,జయం మనదేరా మొదలైన చిత్రాలలో తనదైన నటననతో సినీ ప్రేక్షకులను మై మరపించారు .పత్రికా రంగం లోనూ ఆమె ప్రవేశించి ‘’సాక్షి ‘’పత్రికలో ‘’ఝాన్సీకి వాణి’’కాలం ఆమెలోని రచయితను ప్రజల దగ్గరకు చేర్చింది .

‘’ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవిరి ధింగ్ ‘’అనే ఆంగ్ల చిత్రాన్నిశీతల్ మొర్జారియా దర్శకత్వం వహించగా  రేఖా పప్పు తోకలిసి నిర్మించారు ఝాన్సి .ఈ సినిమా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడి ప్రశంసలు పొందింది .వంటల పోటీ కై ఆమె డైరెక్ట్ చేసి సమర్పించిన ’’చెఫ్ నంబర్ వన్’’ చాలా ఉత్తేజంగా కొన సాగింది .

బాలల విద్య ,ఆరోగ్యం ,హక్కులు ,పరిసరాలపై ఝాన్సి చాలా ప్రోగ్రాములు చేశారు .తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాల పిల్లల విద్య కోసం ఆమె సహాయ సహకారాలు ‘’వుమెన్ ఇన్ నెట్ వర్క్ ‘’ద్వారా అందిస్తూ సేవ చేస్తున్నారు .బాల్య వివాహాలు , వినికిడి సమస్య తీర్చే సంస్థ,ఆర౦భ్,లెప్రా ఇండియా వంటి సంస్థలకు కు ఝాన్సి ‘’బ్రాండ్ ‘ఎంబా సడర్ ‘’గా ఉన్నారు .’’రైన్ బొ హోమ్స్ ‘’,విశ్వ ద్రక్ష ‘’చేయూత ‘’వంటి స్వచ్చంద సంస్థలకు ఝాన్సి వెన్ను దన్ను గా నిలిచారు .

1997 లో ‘’తోడు’’సినిమాలో సహాయ పాత్రధారణకు మొదటి సారిగా నందీ అవార్డ్ అందుకొన్న ఝాన్సి వరుసగా ‘’జయం మనదేరా ‘’లోనూ 2007 ,2010 లలో తులసి ,సింహా లలో  ఉత్తమ హాస్య నటిగా ,శారద టీ వి సీరియల్ లో ఉత్తమనటిగా ,పెళ్ళిపుస్తకం సీరియల్ లో  ఉత్తమ యాంకర్ గా’’ ఎ..టి ఎం .టి వి షో’’లో బెస్ట్ యాంకర్ గా నందీ పురస్కారాలు అందుకున్నారు .ఇవికాక ‘’యాంకర్ ఆఫ్ ది డికేడ్ ,వార్తా వాసవి అవార్డ్ ,యునిసెఫ్ వారి లాడ్లీ అవార్డ్ ఢిల్లీ తెలుగు అకాడెమి అవార్డ్ లవంటి వి ఎన్నో ఆమె కీర్తి కిరీటం లో కలికితురాయిలుగా వెలిగిపోతున్నాయి .

బహుముఖ ప్రజ్ఞావంతురాలై అమృతం ఫేం అయిన  ‘’యాంకర్ కీ రాణి ఝాన్సీ’’ గారిని సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘-రెండవభాగం ‘’గ్రంధా విష్కరణ సభలో ఆత్మీయ అతిధిగా వేదిక నలంకరించావలసినదిగా ఆత్మీయం స్వాగతం పలుకుతున్నాం .

 

3-  డా .శ్రీ ధూళిపాళ రామ కృష్ణ

డా ధూళిపాళ రామ కృష్ణ గారు కృష్ణా జిల్లా విజయవాడలో 23-11 -1964 న శ్రీ ధూళి పాళ అచ్యుత రామయ్య ,శ్రీమతి సీతారామమ్మ  దంపతులకు జన్మించారు .బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి వద్ద గురుకుల పద్ధతిలో తర్క ,వేదాంత శాస్త్రాలను ,కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా స్వాముల వారి వద్ద  బ్రహ్మ సూత్ర శంకర భాష్యాదులను అధ్యయనం చేసిన అదృష్ట వంతులు శ్రీ రామ కృష్ణ గారు . 1987 నుంచి సంస్కృతాధ్యాపనం చేస్తూ ,విజయవాడ  మేరిస్ స్టెల్లా కళాశాల సంస్కృత విభాగాధ్యక్షులుగా ఉన్నారు . ఆంద్ర దేశం లో స్వాతంత్ర్యానంతర౦ గత 60 ఏళ్ళలో  సంస్కృత సాహిత్య రచన’’పై  –యు జి .సి ఆధ్వర్యం లో విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజిలో  డా ధూళిపాళ రామకృష్ణ  గారి ఆధ్వర్యం లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ హరే కృష్ణ శతపధి ,శ్రీ వెంకటేశ్వర వేదిక్యూని వర్సిటి  వైస్ చాన్సెలర్ శ్రీ సన్నిధానం సుదర్శన శర్మ ,మద్రాస్ యూని వర్సిటి వైష్ణవిజం ప్రొఫెసర్ శ్రీ నరసింహా చార్యులు ,రాజస్థాన్సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సెలర్ శ్రీ . వి.రామ కృష్ణమాచార్యులు వంటి ఉద్దండుల సమక్షం లో  ,2008 ఆగస్ట్ 11 ,12 తేదీలలో జరిగినసదస్సు లో పత్ర సమర్పకుల రచనల కదంబాన్ని ‘’సంహూతిః’’అంటే ‘’సామూహిక పిలుపు ‘’ గ్రంధంగా వెలువరించటం లో శ్రీ రామ కృష్ణ గారి పాత్ర అద్వితీయం . .ఇది గొప్ప ఆకర గ్రంధంగా ,సంస్కృత కవుల గురించి తెలుసుకోవాలనే ఆధునికులకు చాలా ఉప యుక్తంగా ఉంది.

మంచి కవులు, అధ్యయన శీలురు అయిన శ్రీ రామ కృష్ణ గారు సంస్కృతం లో ‘’శ్రీ మద్భాగవతే అద్వైత మత ప్రతిష్టా’’ రచించి భాగవతపురాణం లోని అద్వైత మత ప్రతిస్టాపనం గురించి గొప్ప పరిశోధన చేసి ఎరుక పరచారు .’’వందే కాశ్మీర భారతం ‘’అనే 14 శ్లోకాలు, కార్గిల్ లో 2016 సెప్టెంబర్ 26 ,27 తేదీలలో కేంద్ర సాహిత్య అకాడెమి నిర్వహించిన ఉత్తర భారత మరియు ఈశాన్య భారత రాష్ట్రాల  రచయితల గోష్టి లో కాశ్మీర్ పై స్పందించి రాసిన గీర్వాణ  కవిత .

ఆంగ్లం లో ‘’ఎ స్టడీ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ స్క్రి ప్శన్స్ ఇన్ ఆంద్ర ప్రదేశ్ ‘’అనే గ్రంధాన్ని ఆంద్ర దేశం లోని శాసన అధ్యయనం పై తమకున్న గాఢ పరిశీలనకు దర్పణంగా రచించారు .కొన్ని సంస్కృత కావ్యాలను తెలుగు లోకి అనువాదం చేసి వాటి లోని భావ పరంపరను తెలుగు వారికి పరిచయం చేసి సంస్కృత సాహిత్యం లో ఉన్న తమలోతైన పాండిత్యాన్ని తెలియ జేశారు .అందులో ‘’శ్రీ రామ కీర్తి మహా కావ్యం ‘’,శివ కర్ణామృతం ‘’,’’శివ మహిమ కలికా స్తుతి ‘’,సుమనో వాగ్విలాసః ‘’,కృష్ణ లీలా తరంగిణి ‘’ముఖ్యమైనవి .ఇవన్నీ ముద్రితాలే.

డా రామ కృష్ణ గారి గీర్వాణ పాండిత్య ప్రతిభా  విశేషాలను గుర్తించిన ధాయ్ లాండ్ ప్రభుత్వం రాకుమారి చే 2013 లో రాజ సత్కారం చేసి గౌరవించింది .2014 సెప్టెంబర్ 5 వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’ఉత్తమ సంస్కృతాధ్యాపన పురస్కారం’’ అందజేసి వారి విద్వత్ కు నీరాజనం పట్టింది .

సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవ భాగం ‘’గ్రంధా విష్కరణ సభకు గౌరవ అతిధిగా శ్రీ ఉత్తమ సంస్కృతాధ్యాపన పురస్కారం అందుకొన్న డా ధూళి పాళ రామ క్రష్ణగారిని సగౌరవం గా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం .

1-    మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్

శ్రీ బుద్ధ ప్రసాద్ కృష్ణా జిల్లా దివితాలూకా నాగాయలంకలో 26-5-1956 ఆంద్ర ప్రదేశ్ మాజీ విద్యామంత్రి ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించిన శ్రీ మండలి కృష్ణా రావు శ్రీమతి ప్రభావతీ దేవి దంపతులకు జన్మించారు .తండ్రిగారి సుగుణ సంపత్తి పూర్తిగా పుణికి పుచ్చుకొన్న వ్యక్తి శ్రీ బుద్ధ ప్రసాద్ .అవనిగడ్డలో సెకండరీ విద్య పూర్తి చేసి ఉస్మానియా యూని వర్సిటినుండి డిగ్రీ పొందారు .

తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పొందిన శ్రీ ప్రసాద్ 1919 లో మొదటి సారిగా అవనిగడ్డ నుంచి  శాసన సభకు ఎన్నికయ్యారు .2014 లో మరల ఎన్నికై దాదాపు 700కోట్ల రూపాయలతో ప్రజాభి వృద్ధి కార్యక్రమాలు చేశారు .2007 లో మొదటి సారిగా మంత్రి పదవిని పొంది పశు సంవర్ధక శాఖ బాధ్యతలు చేబట్టి ‘’పశుక్రాంతి ‘’’’మత్స క్రాంతి ‘’పధకాలను అమలు చేసి రైతుల ,మత్సకారుల జీవితాలలో వెలుగులు నింపారు .పులి వెందలలో పశు సంవర్ధక శాఖలో ‘’అడ్వాన్సేడ్ రిసెర్చ్ సెంటర్ ‘’ను ఏర్పరచారు .హైదరాబాద్ విజయవాడ ,పులి వెందలలో సూపర్ స్పెషాలిటి పశువుల హాస్పిటల్స్ నెలకొల్పారు. పులిగడ్డ వద్ద మండలి వెంకట కృష్ణారావు  పెనుమూడి వంతెన నిర్మించి గుంటూరు జిల్లాను అతి సమీపానికి తెచ్చారు .కృష్ణా జిల్లా అన్ని అభివ్రుద్ధికార్యక్రమాలలో ఆయన సలహా సంప్రదింపులు ఉన్నాయి .2005 సునామీకి సర్వస్వం కోల్పోయిన వారి పునరావాస కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు .తండ్రిలాగా మాటలో, నడవడిలో, అచ్చమైన  గాంధేయ వాది.శ్రీ ప్రసాద్ . కృష్ణా మహోత్సవ, దివిమహోత్సవ నిర్వహణ,శ్రీకాకుళం లో శ్రీకృష్ణ దేవరాయ ,కాసుల పురుషోత్తమ కవి విగ్రహ ప్రతిష్ట సాగర సంగమం అభి వృద్ధి ,ఘంటసాల లో బౌద్ధ ఆరామ నిర్వహణ ,పరిరక్షణ , కూచిపూడి కళాక్షేత్ర  అభివృద్ధి ,లండన్ లో సి పి బ్రౌన్ సమాధి ఆధునీకరణ ,విజయవాడలో క్షేత్రయ్య కళాక్షేత్ర ఆవరణలో  లబ్ధ ప్రతిస్టులైన  మహనీయుల కాంశ్య విగ్రహాల ఏర్పాటు ,బందరు కోట పునర్వైభవం ,కృష్ణావిశ్వ విద్యాలయం,  అందులో తెలుగు శాఖ ఏర్పాటు  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో జాతీయ , అంతర్జాతీయ తెలుగు మహా సభలనిర్వహణ ,రిఫరెన్స్ గ్రందాల ప్రచురణ  ఘనం గానిర్వహించారు .,కోర్టులలో తెలుగు లో తీర్పు కోసం విశేష కృషిచేశారు .తండ్రిగారరి పేరిట ప్రతి ఏడాది పురస్కారాలను అందిస్తున్నారు .  .లండన్ లోని తెలుగు హిస్టరీ సదస్సుకు అధ్యక్షులుగా ఉన్నారు .వ్రుత్తి రాజకీయమే అయినా ప్రవ్రుత్తి సాహిత్యం,సంస్కృతీ  అయిన మనీషి శ్రీ బుద్ధ ప్రసాద్ . ప్రపంచ౦ లో చాలా దేశాలు పర్యటించి విశేషాలను అక్షర బద్ధం చేసి యాత్రా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు .వారి పుస్తకాలలో ముఖ్యమైనవి మారిషస్ లో తెలుగు తేజం ,ప్రజలు –ప్రగతి ,ఇంగ్లాండ్ లో తెలుగు వైభవ స్మృతులు .అధికార భాషాసంఘ అధ్యక్షులుగా పనిచేసి తెలుగు అమలుకు గొప్ప కృషి చేశారు .తెలుగుకు  ప్రాచీన హోదా కై ఉద్యమించి అందరి సహకారం తో  సాధించారు .భువన విజయాలలో కృష్ణదేవరాయలుగా వన్నె తెచ్చారు .2014నుండి నవ్యాంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఉప సభాపతి గా  పదవికే గౌరవం తెచ్చారు .భాషా సంస్కృతుల పరిరక్షణ అభి వృద్ధి పకోసం శ్రీ బుద్ధ ప్రసాద్ గారిలాగా  అంకిత భావం తో పని చేసే రాజకీయ నాయకులు లేరు అని నిస్సందేహంగా చెప్పవచ్చు .

, సరసభారతి నిర్వహించిన తెలుగు భాషా సదస్సులో,ఉగాది వేడుకలలో ,గురజాడ ,రవీంద్రుల 150 వ జయంతి సభలలోశ్రీ బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా  పాల్గొని స్పూర్తి నిచ్చి ప్రోత్సహించారు .

వారి సమర్ధతకు తగిన మరిన్ని ఉన్నత పదవులలో రాణించి వర్ధిల్లాలని ఆశిస్తూ  సరసభారతి నిర్వహిస్తున్న ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవభాగం ‘’గ్రంధా విష్కరణ సభకు సంస్కృతీ సంపన్నులు ,మాన్య ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారిని ముఖ్యతిధిగా వేదిక నలంకరించి ,తమ అమృత హస్తాలతో పుస్తకావిష్కరణ చేయవలసినదిగా సగౌరవంగా వేద్దికపై కి ఆహ్వానిస్తున్నాం .

 

గీర్వాణ భాషా వైభవం –కవి సమ్మేళనం –డా రామడుగు వెంకటేశ్వర శర్మ (గుంటూరు )గారి కవిత

1-సీ –రామ నీరద  సుదర్శన మాత్ర కవన నృత్యతా కేకి వాల్మీకి !అంజలు లివె

శ్రుతి పురాణార్ధ భారత పద్మ వికసనోల్లాస  వేద వ్యాస !ప్రణతి వినుతి

ప్రతిభా సమేత రూపక దీపికా వాస ! భాసా నమోస్తు

కమ్రోపమాన సత్కవితా విలాస శ్రీ కాళిదాసా!నమస్కార శతము

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి– ,నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మ యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

2-సీ-‘’కవి భారవే రర్ధ గౌరవ ‘’ఖ్యాతి చేకొన్న భారవి !ఏటి కోళు లివియె

శబ్ద లాలిత్యైక సంపస్సముద్దండి!దండి మహా కవీ దండమయ్య

మల్లినాద ప్రశంసా ‘’మాఘ మేఘేతి’’ వాక్య కారక మాఘ !ప్రణతి శతము

శివ మహిమ్న స్తోత్ర కవి గాఢ భక్తాగ్ర గణ్య సత్కీర్తి సౌజన్య !నతులు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

3-సీ –నవ విద్వ దౌషధ  నైషద కవితా ప్రవర్ష ,హర్షా !ఇదే ప్రణుతి శతము

కాదంబరీ రసజ్ఞాన దాయక బాణ !బాణ భట్టారకా  వందనములు

‘’సరస పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి ‘’యౌ జయదేవ  వందనములు

‘’ కృష్ణ కర్ణామృత లీలాశుకా ‘’!జ్ఞాన చింతామణి కవీంద్ర !చేతు నతులు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

4-సీ –కరుణా రసైక సత్కవన గోదావరీ వర భూతి ,భవ భూతి !వందనములు

గుణ్య సామాన్య నైపుణ్య జీవన రూపకా !మృచ్చ కటికాఖ్య కర్త !నతులు

చాణక్య రాజ్యాంగ చతురతా పూర్ణ ‘’ముద్రారాక్షస ‘’విశాఖ దత్త నతులు

తృతీయ పంథా ప్రధానా !’’అనర్ఘ రాఘవ రూపకా !నమస్కార శతము

బంధుర రసానంద పరీమళ’’!కుందమాలా కార! వందనములు

నిర్మల ప్రియదర్శినీ రూప నవ్య నాగానంద హర్షాధిపా నమోస్తు

మహిత మమృతమ్ము జ్ఞాన సంపత్తి కోరి – నవ్య మానంద సంస్పంద నంబు తోడ

రామడుగు వేంకటేశ శర్మయె యొసంగు- అక్షర సువర్ణ సీస పద్యాల మాల .

 

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవభాగం

గ్రంధ పరిచయం –పద్య మందార మాలతో అభినందన చందనం  -డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి

1-జయశీలంబును ,కార్య శూరతయు ,సౌజన్యంబు రూపంబు దా

ల్చి ,యపూర్వంబుగ దీర్చి దిద్దిన గీర్వాణ కళాక్షేత్రంబు’’ గీర్వాణ వా

ణి’’,యమూల్యంబగు భావ సంపదల నున్మేషింప,సారస్వత

ప్రియు లిద్దాని గుణంబులన్ గని ,ప్రహర్షింపన్,సమర్ధంబగున్ .

2- ఘనులై సంస్కృత భాష నధ్యయనమున్ గావించి ,కావ్యాలు వ్రా

సిన ,ఆయా కవి జీవితంబుల ప్రశస్తిన్ ,జ్ఞాన విజ్ఞాన భా

వనలన్, బ్రోది యొనర్చి ,భావి తరముల్ భద్రంబు లై వర్దిల౦

గను ,గీర్వాణ కవి ప్రణీతములు  సద్గ్రంధంబులన్ దెల్పుచున్ .

3-తరువుల్ బూచిన పుష్ప సౌరభము ,లుత్సాహంబు తో, వాయు

వెల్లరకున్ బంచిన రీతి ,సంస్కృతుల సంలాపంబు ,లాంద్రోక్తి సుం

దరమై  భాసిల జేయు సత్కవులు ,సత్కారార్హులాత్మోన్నతిన్

బర మార్ధంబు గ్రహించి ,లోకులకు జెప్పన్ ,సద్విర్మంబగున్ .

4-అభినందించు బ్రపంచ మీ కృతికి ,నత్యంతంబు సత్య౦బు ,దు

ర్లభౌ ,సంస్కృత కావ్యముల్ విబుధు లౌరా !యంచు గీర్తింప ,ద

చ్చుభ సందర్భ,ముదాహరి౦చుచు ,కవీశుల్ మెచ్చ సాహిత్య ,సౌ

రభ ముల్,దిక్కుల నింపు మీ కృషి ,సువర్ణం బై విరాజిల్లెడున్  .

5-తినబోవన్ రుచి గూర్చి చెప్పవలెనా ?తియ్య౦దన౦ ,భిక్షుఖా

దన మన్నన్ బునరుక్తి కాదొకొ ?ప్రసాదంబిట్టి దౌనంచు ,వ

ర్ణన గావి౦పగ శక్యమే ?సవిత నారాధింప ,దీపంబు జూ,

పిన చందంబిది,గబ్బిటాన్వయ మణీ!విద్వద్విమర్శాగ్రణీ’’.

డా .తూములూరు శ్రీ దాక్షిణా మూర్తి శాస్త్రి

రిటైర్డ్ ప్రిన్సిపాల్

,శ్రీ భావనారాయణ స౦స్కృత కళాశాల –పొన్నూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా

పెద్ద నోట్ల రద్దుతో బుర్రతిరిగి మైండ్ బ్లాంకై

బ్యాంకుల వద్ద నల్ల కుబేరులు క్యూలు కట్టి

నల్లదనం వదిలించు కొంటారని ఆశపడితే

బంకుల్లోనే ఉండి పోయి వెక్కి రిస్తూ నల్లమాలచ్చి

బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అని పాడుతోంది .

‘’నల్ల’’వారి బదులు వేతనజీవులైన ‘’తెల్లకాలర్ ‘’వాళ్ళు

‘’కాలర్లెస్’’మాత్రమేకాక బడుగు జీవులే బ్యాంకుల వద్ద

పడిగాపులు పడుతూ కష్టార్జితమైన  తెల్ల సొమ్మునే

హడావిడిగా భద్ర పరచుకొంటున్నారే తప్ప

నల్లదనం బయటికే రాలేదింకా

పైగా ఫిఫ్టీ ,సెవెంటీ పెర్సెంట్ అంటూ ఊరింపు

మధ్యలో దళారీలు ,అప్పుడే దొంగానోట్లూ వచ్చి వాలిపోతుంటే

బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అంటూ నం. పా.సా .పాట పాడుతున్నాడు .

క్రమశిక్షణ గల మన సైన్యం పాక్ పై

సర్జికల్ ఆపరేషన్ చేసి విజయవంతమైంది

 ఆర్ధిక క్రమ శిక్షణ లేని దేశం లో అరాచక

అస్తవ్యస్త పరిస్థితి ఇన్నేళ్ళుగా రాజ్యమేలుతుంటే

స్వచ్చ భారత్ అంటూ ఫోటోలకోసం

పోజు లిచ్చే నాయక గణం భజనే తప్ప

క్రియా శూన్యమై నోరు వెళ్ళ బెడుతుంటే

చేస్ట లుడిగి  యెన్ ఫోర్స్ మెంట్  కాడి పారేస్తుంటే

ప్రభుత్వాన్ని శాసించేది ‘’మనీ డాన్ ‘’లేనని అర్ధమై

ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ died చందమై

సంస్కరణ చట్టు బండలై వెక్కి రిస్తుంటే 

 ప్రజావస్తను చూసి ఈ వ్యవస్థ జాలితో  పాడుతోంది

బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అంటూ వెక్కిరింపుగా 

.

నిన్న రాసిన ‘’మోతాదు మించిన మోదుడు’’కవిత చదివి స్పందించిన శ్రీ మైనేని గోపాలకృష్ణగారు (అమెరికా )’’బోల్తా కొట్టి౦దిలే మోడీ పిట్టా’’అంటూ పాతపాటను  జ్ఞాపకం చేస్తూ కామెంట్ రాశారు. అదే శీర్షికగా నేను  ఈ కవిత రాసినందుకు శ్రీమైనేని వారికి కృతజ్ఞతలతో –

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-12-16 –ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

మోతాదు మించిన మోదుడు

మోతాదు మించిన మోదుడు

మంచి వాడనుకొంటే మంచమంతా చెడగొట్టినట్లు

ఏదో పొడి చేస్తాడనుకొంటే  పొడిచి పారేశాడు

సామాన్యుడిని ,ముసలి ముతకా  బీదజనాన్ని

రోడ్డున పడేసి రద్దు తో మోదీ

జనాన్ని మోది మోది బాది

పారేసి లబోదిబో మనిపించాడు .

నల్ల కుబేరుల నేమీ పీక లేక

నలుపు తెలుపౌతుందని నమ్మి

అడ్డ దిడ్డంగా అర్ధ రాత్రి పెద్ద నోట్లు రద్దు చేసి

వీరంగం వేస్తుంటే వెంకయ్యా అండ్ పార్టీ

 డప్పూ డోలు వాయిస్తూ వీర భజన చేస్తుంటే

జనం బాంకుల వద్ద క్యూలలో పడిగాపులు పడుతూ

లేస్తూ ,వారికి రావాల్సినది అవసరమైనది

దేబిరించి తీసుకొనే పరిస్థితి కల్పించిన

ఈ ముఠాను జనం జీర్ణించుకోలేక

మొహం మీదనే కక్కేస్తుంటే

ఆర్ధికం చక్కబడేదెన్నడు?

జనం ఆర్తి తీరేదెన్నడు ?

నగదు రహితం చివరికి నగదే రహితమై

పోతుందేమో ?ఏమో ?ఏమో ఎవరికి తెలుసు ?

ఇక దారేది ఓ జాతిపితా !మహాత్మా  !

  గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-16 –ఉయ్యూరు 

Posted in కవితలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం రచనకు ఉపయుక్తమైన గ్రంధాలు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం రచనకు ఉపయుక్తమైన గ్రంధాలు

1-హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ –శ్రీ ఎం .కృష్ణమాచారియార్

2-కాంట్రి బ్యూషన్ ఆఫ్ ఆంధ్రా టు సాంస్క్రిట్ లిటరేచర్ –డా.శ్రీ బిరుద రాజు రామ రాజు

3-సంహూతిః(అందరూ కలిసి ఇచ్చిన పిలుపు )—ఆంద్ర దేశం లో స్వాతంత్ర్యానంతర౦గత 60 ఏళ్ళలో  సంస్కృత సాహిత్య రచన’’పై  –యు జి.సి ఆధ్వర్యం లో విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజి లో సంస్కృత శాఖాధిపతి డా ధూళిపాళ రామకృష్ణ  గారి ఆధ్వర్యం లో రాష్ట్రీయ సంస్కృతవిద్యాపీఠం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ హరే కృష్ణ శతపది ,శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూని వర్సిటి వాస్ చాన్సెలర్ శ్రీ సన్నిధానం సుదర్శన శర్మ,మద్రాస్ యూని వర్సిటి వైష్ణవిజం ప్రొఫెసర్ శ్రీ నరసింహా చార్యులు ,రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటి వైస్ చాన్సెలర్ శ్రీ . వి.రామకృష్ణమాచార్యులు వంటి ఉద్దండుల సమక్షం లో  ,2008 ఆగస్ట్ 11 ,12 తేదీలలో జరిగిన సదస్సు లో పత్ర సమర్పకుల రచనల కదంబం .

4-సంస్కృత వాజ్మయ చరిత్ర –రెండు భాగాలు –శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి .

5 -వరూధినీ ప్రవరం ,తత్వమసి ,కల్యాణం (నాటిక )శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి

6-లింగోద్బవ  వృత్త మాలికా స్తుతి  ,గజేంద్ర మోక్షం ,ఉమాకల్యాణం ,  రాజవాహన విజయకావ్యం  –శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి

7-డా.చెరువు సత్యనారాయణ శాస్త్రి సమగ్ర సంస్కృత శతావధానం –శ్రీ నోరి భోగేశ్వర శర్మ విశ్లేషణ

8-శ్రీ శైల సారోద్ధారం           శ్రీతాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి

9-మత్స్వప్నః ,-శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి

10-పుత్ర సంజీవనం –శ్రీ ముళ్ళపూడి నారాయణ శాస్త్రి

11-హర్శనైషద, దర్శన పరామర్శ –డా.శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి

12-మానస పూజ ,వర్షోత్సవ కీర్తనలు –శ్రీ కొలచిన యజ్న నారాయణ సోమయాజి

13-జగద్వంద్యులైన జగద్గురువులు- ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడు

14- పుట్టపర్తి నారాయణా చార్య –శ్రీ శశిశ్రీ

15-శ్రీ సువర్చలా౦జనేయం –శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ

16-గుప్త పాశుపతం ,అమృత శర్మిష్ట –శ్రీ విశ్వనాధ సత్యనారాయణ

17- పావక ప్రభ ,శృంగార లహరి ,అంబికా కరావలంబ స్తోత్రం –  డా.శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ

18-బ్రహ్మశ్రీ కాశీ భట్ట బ్రహ్మయ్య     -శ్రీ జటావల్లభుల పురుషోత్తం

19—పైడి చూపు – శ్రీ మాడభూషి నరసింహా చార్యుల గారి పల్లవీ పల్లవోల్లాసం (జాంబవతి చరిత్ర)  రచనకు’’పైడి చూపు ‘’అనే  ముందు మాటరాసిన శ్రీ ఉన్నం జ్యోతి వాసు

20  -శ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రి గారికి రాష్ట్ర పతి పురస్కారం లభించిన సందర్భంగా పై వెలువడిన ‘’సంస్కృత విద్యా’’ప్రత్యేక సంచిక –అందులో శ్రీ డా .మద్దులపల్లి దక్షిణామూర్తి శాస్త్రి గారు తండ్రి గారిపై హిందీలో రాసిన వ్యాసం .

21-రామాయణ సారోద్ధారం -7 భాగాలు –శ్రీ ములుకుట్ల నరసింహా వధాని

 

.సరస భారతి ప్రచురణకు విరాళాలు అందజేసిన వదాన్యులకు కృతజ్ఞతలు

1-శ్రీ వేలూరి రామ కృష్ణ ,శ్రీమతి వేదవల్లి దంపతులు –గరివిడి –రూ 2 ,501

2-శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీమతి సమత దంపతులు –హైదరాబాద్ –రూ 1,116

3-శ్రీ పువ్వుల నరసింహా రావు,శ్రీమతి కరుణానిధి దంపతులు –ఉయ్యూరు-రూ 1,116

4-శ్రీ టి వి .ఎస్ బి శాస్త్రి (ఆనంద్ )శ్రీమతి రుక్మిణి దంపతులు –హైదరాబాద్ –రూ 500

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం

వందనం అభివందనం            గబ్బిట దుర్గాప్రసాద్

 

గీర్వాణ కవుల కవితా గీర్వాణం మొదటి భాగం గ్రంధాన్ని ఉస్మానియా విశ్వ విద్యాలయ సంస్కృత ప్రాచార్యులు డా.శ్రీ ఇప్పగుంట సాయి బాబాగారికి పంపగా, క్షుణ్ణంగా చదివి అభినందిస్తూనే ,నేను చేసిన తప్పులను సవివరంగా వ్రాత పూర్వకంగా తెలియ జేశారు .ఆ పత్రాలను అందరికిఅంతర్జాలం ద్వారా తెలియ బర్చాను .అందులో వారు నాకొక గొప్పసూచన చేశారు .శ్రీ ఎం .కృష్ణమాచారియార్ గారు ఆంగ్లం లో రాసిన ‘’హిస్టరీఆఫ్  క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’తెప్పించుకొని చదవమన్నారు .ఈ విషయాన్ని గుర్తించిన నా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారుసుమారు వెయ్యిపెజీలున్న ఆ గ్రంధాన్ని  నాకు తెలియ కుండానే ఆర్డర్ ఇచ్చి తెప్పించి నాకు పంపారు .అద్భుతం అనిపించింది చదువు తుంటే.దాని ఆధారం గా గీర్వాణ కవుల కవితా గీర్వాణం రెండవ భాగం నెట్ లో రాయటం ప్రారంభించాను .ఇందులో ఉన్న దాదాపు అందరుకవులను,అన్ని ప్రక్రియలను గురించి రాయగలిగాను .దీనికి శ్రీ సాయిబాబాగారికి శ్రీ మైనేని వారికీ ఎంతైనా రుణపడి ఉంటాను .

మొదటిభాగానికి ముందుమాట రాసిన డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు కూడా ఇంకా రాయవాసిన కవులు చాలా మంది ఉన్నారనివారిని గూర్చి కూడా రెండవ భాగం లో రాయమని మంచి సలహా ఇస్తూ ఆ కవుల వివరాలు గుంటూరు జిల్లా పొన్నూరు సంస్కృత కళాశాలరిటైర్డ్ ప్రిన్సిపాల్ డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ఇవ్వగలరని వారి ఫోన్ నంబర్ నాకు ఇవ్వగా కిందటిఏడాది  సెప్టెంబర్ లోవారితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నాను .వారి వలననే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు శ్రీవెంకటప్పయ్య శాస్త్రిగారు ,శ్రీ తూములూరు వారి బావగారు ,శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారి దౌహిత్రులు అయిన శ్రీచెరువు సత్యనారాయణశాస్త్రిగారు,శ్రీ కొలచిన యజ్ఞనారాయణ దీక్షితులు  గార్ల గురించి శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు పై వారు రచించిన పుస్తకాలు పంపగారాయగలిగాను .శాస్త్రి గారి ద్వారానే శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారిని పరిచయం చేసుకొని సీతారామ శాస్త్రి గారు పంపిన తమవీ,తమ తండ్రి గారు శ్రీ నారాయణ శాస్త్రి గారి గ్రంధాలనాధారంగా వీరిద్దరి సంస్కృత సేవను వివరించాను .అలాగే శ్రీ ములుకుట్ల   నరసింహావధాని గారు రచించిన ‘’రామాయణ సారోద్ధారం ‘’7 భాగాలు శ్రీ తూములూరు వారు నాకు అందజేయగా అవధాని గారి గూర్చి సవివరంగా రాయగలిగాను .

.చీరాల విశ్రాంత లెక్చరర్ ,సంస్కృత భాషా సేవకులు ,ఆత్మ జ్యోతి మాసపత్రిక సంపాదకులు శ్రీ రావి మోహన రావు గారినీ శ్రీ తూములూరు వారు పరిచయం చేయగా ,వారు పంపిన వాటి ఆధారం గా శ్రీ చింత గుంట సుబ్బారావు గారి గురించి రాశాను .శ్రీ మోహన రావు గారి ద్వారాశ్రీగరిమెళ్ళ సోమయాజులుగారు పరిచయమవ్వగా వారు పంపిన రచనల నాదారంగా శ్రీ గరిమెళ్ళ వారి గూర్చి రాశాను .గుంటూరు జిల్లాజిల్లెళ్ళమూడి  అమ్మ సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి తో ఉన్న పూర్వ పరిచయాన్నిపురస్కరించుకొని వారిద్వారా జిల్లెళ్లమూడి సంస్కృత కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డా.శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ గారి ఫోన్ నంబర్ తెలుసుకొని ,  హైదరాబాద్ లో వారి స్వగృహం లో కలిసి ఇంటర్వ్యు చేసి ,వారు అందజేసిన తమ రచనల నాధారంగా శర్మ గారి గీర్వాణ కృషి నిపరిచయం చేయగలిగాను.

ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రాహ్మణ్య  శాస్త్రి  గారు వారంతకు వారే నాగురించి తెలుసుకొని వారి గ్రంధాలను పంపగా వారి గూర్చి రాసేభాగ్యం దక్కింది  .ఈ రెండవ భాగం తీగ కదలటానికి ముఖ్య కారకులు ,నాపై అమితమైన ప్రేమ ఆదరణ కురిపిస్తూ,అభినందిస్తూ  ‘’ప్రసాద్గారూ !సంస్కృతం చదువుకొన్న మేమెవ్వరం చేయ లేని మహత్కార్యాన్ని మీరు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి నాకు గర్వం గా ఉంది’’అనిఎప్పటికప్పుడు ఫోన్ లో దీని ప్రగతిని తెలుసుకొంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహించిన శ్రీ తూములూరు వారి సౌజన్యానికి ఎంతో రుణపడిఉంటాను .

శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ గారి పరిచయం లో మరో గొప్ప ముందడుగు పడింది .వారు ఆచార్య శ్రీ  బిరుద రాజు  రామ రాజుగారు ఆంగ్లం లో రాసిన ‘’కంట్రి బ్యూషన్ ఆఫ్ ఆంద్ర టు సాంస్క్రిట్ లిటరేచర్ ‘’‘’గ్రంధం చదివారా అంటే, లేదని చెప్పాను .ఎక్కడైనాదొరుకుతుందేమో నెట్ లో వెతకమని శ్రీ మైనేని వారిని కోరటం  వారు వెంటనే దాన్ని ఆర్డర్ ఇచ్చిస్వర్గీయ  సద్గురు శ్రీ శివానంద  మూర్తి గారిగారి కుమారులు శ్రీ బసవ రాజు గారి తో ఫోన్ లో మాట్లాడగా తమ వద్ద ఉన్నదని చెప్పి కొరియర్ లో 700 పేజీలున్న   దానిని భద్రం గాఉచితంగా పంపి అందజేశారు. దీన్ని ఆధారం గా ఆంధ్రదేశం లోని  సంస్కృత కవులను ,వారిరచనలను చదివి రాయగలిగాను .పుస్తకం ఇంగ్లీష్లో ఉండటం ,కవుల రచనలను సంస్కృత లిపిలోనే శ్రీ రాజు గారు ఇవ్వటం వలన అర్ధం చేసుకొని రాయటం కష్టమని పించినా ఇష్టంగాచేస్తున్నందుకు మహా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణం -2 లో ముందుమాటలు -నతి -నుతి డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు

నతి –నుతి –

డా .శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి

సజ్జన సాంగత్యం

బహు భాషా కోవిదులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ,నా కంటే వయసులోనూ ,జ్ఞానం లోను పెద్ద వారు .ఏ పూర్వ పుణ్యమో ,వారితో పరిచయ భాగ్యాన్ని నాకు కలుగ జేసింది .’’సతాంస౦గస్సద్భిః కథమివహి పుణ్యేన ,భవతి ‘’అన్న భవభూతి వాణి అక్షరాలా నిజమని తెలిసింది .మన భారత దేశం యొక్క గొప్ప తనాన్ని చాటి చెప్పేవి సంస్కృతీ ,సంస్కృత భాష అని పెద్దలు వివరించారు .అవి వీరికి ప్రాణ నాడులై నిలిచాయి .

మాతృ దేవో పితృ దేవో భవ

గొప్ప సంప్రదాయ కుటుంబం లో పుట్టి ,ఉత్తములైన తల్లి దండ్రుల సంస్కార సంపద పుణికి పుచ్చుకొన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు ,వారిని దైవములుగా భావించి ,సేవించి ,తమ కృషికి ఫలితమైన ఈ గ్రంథాన్నివారికి భక్తితో సమర్పించటం చాలా సంతోషాన్ని కలిగించింది .చక్కని సంప్రదాయాన్ని పాటించి ,ఇతరులకు మార్గ దర్శకం గా నిలిచారు .వృత్తి రీత్యా సైన్సు ,లెక్కలు ,ఇంగ్లీషు భాష అభ్యసించి కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో ఉపాధ్యాయులుగా కొంతకాలం ,ప్రదానోపాధ్యాయులుగామరి కొంత కాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ,ఉత్తమ ఉపాధ్యాయులుగా కీర్తి గడించి ,ఎందరో విద్యార్ధులకు జ్ఞాన దానం చేసిన మనీషి శ్రీ దుర్గా ప్రసాద్ గారు .                             సాహిత్యాభిలాష

స్నేహ సంపన్నమైన హృదయం కావటం చేత ,బంధువులతో ,మిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండి ,జీవితాన్ని అన్ని విధాలా ,బహు పుష్ప ఫల భరితంగా పండించుకొన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు ,అమర సాహితీ నందనోద్యాన వనం లో ప్రవేశించి ,ఆ సౌందర్యాన్ని చూసి ,పరవశించి ,తన ఆనందాన్ని సమకాలీన సమాజానికి అందిస్తూ ,భావి తరానికి భద్ర పరచాలనే సంకల్పం తో ,ఎంతో శ్రమ కోర్చి ,వ్యయ ప్రయాసలను లెక్క చేయక ,నిత్యకృషీ వలులై బంగారు పంట పండించారు .అది వారి జీవ సంస్కారము .పూర్వ జన్మ వాసనా వాసితముగా బోధ పడుతుంది .

భాషా సేవ

ఆ కార్య క్రమం లో ఎందరో పండితులను స్వయంగా కలుసుకొని ,వారితో సంభాషించి ,వారిలో గల ప్రతిభ ను గుర్తించి ,అభి నందిస్తూ ,వారి కావ్య విశేషాలను అక్షర బద్ధం చేశారు .వీరు మరి కొన్ని గ్రంథములను కూడా తెలుగులో రచించి ,ప్రచురించి ,ఆంద్ర భాషామతల్లికి ఎనలేని సేవ చేశారు .ఇతరులు వ్రాసిన కొన్ని గ్రంథములకు  వెలుగు చూపించారు .

‘’సరసభారతి ‘’అనే పేరుతో సాహిత్య సంస్థనొక దానిని స్థాపించి ,సభలు ,సమావేశాలు ,సన్మానాలు నిర్వ హిస్తూ ,సంగీత సాహిత్యములను సమాదరిస్తున్నారు .సంస్థ పక్షాన ఇతర కవుల గ్రంథములను ప్రచురించి ,ప్రోత్స హిస్తున్నారు .

సాహిత్య ,విజ్ఞాన విశేషముల నెన్నింటినో నిత్యము అంతర్జాలము నందు విద్యుల్లేఖల ద్వారా అందరికి అందజేస్తూ ,అభినంద నీయులయ్యారు.ప్రపంచ ఇంగ్లీష్ కవులను ,వారి రచనలను కూడా పరిశీలించి ,,తెలుగు వారికి పరిచయం చేస్తూ గ్రంథములు రచించారు .77 సంవత్సరములు పైబడిన వయస్సును లెక్క చేయకుండా ,నిత్య నూతనమైన ఉత్సాహ౦తో చక్కని పని చేస్తున్నారు .శ్రమ వారిది ,ఫలితం మనందరిది .కాలాన్ని వృధా గా గడుపుతూ ,చింతలతో వంతలతో కృంగి,కృశించే వారికి మంచి స్పూర్తి నిస్తూ ,జగము వర్ధిల్లు వార్త నిస్తున్నారు .-ప్రగతి మార్గ దర్శనం చేస్తున్నారు .

ఇటు వంటి వారిని సత్పురుషులని కీర్తిస్తూ  పెద్దలు ఉన్నతవృక్షము లతో పోల్చారు .వృక్షములు ఎండలో ఉండి ,చెంత చేరిన వారికి నీడ నిచ్చి ,సేద తీరుస్తాయి . ఫలాల నిచ్చి ,తృప్తిని గూర్చి ,ఆనందింప జేస్తాయి .ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తాయి .పరోపకారమే ప్రకృతి పరమార్ధము

 

శ్లో –‘’ఛాయా మన్యస్య కుర్వంతి,తిస్ఠంతి స్వయ మాతపే

ఫలాన్యపి పరార్ధాయ వృక్షాస్సత్పురుషా ఇవ’’

వీరికి లభించిన మరో వరం ,మనసెరిగి మెలగే భార్యా ,బిడ్డలు .అది వారిని విజయ పథం లో పయనించటానికి మరింత బలవంతులను చేసింది .

ఉద్యమ స్పూర్తి

కోరిక మాత్రం చేతనే కాక ,ప్రయత్నం తోనే కార్యములు ఫలిస్తాయి .అది సింహమే అయినా ఎప్పుడూ నిద్ర పోతూ ఉంటే ,ఆకలి ఎలా తీరుతుంది .’’మృగ రాజు ‘’అనే పేరు ఎలా వస్తుంది ?

‘’ఉద్యమే నహి  సిద్ధ్యంతి కార్యాణి ,నమనోరథైః

నహి సుప్తస్య సింహస్య ,ముఖే ప్రవిశంతి మృగాః’’

సంస్కృత కవుల జీవిత విశేషాలను వివరిస్తూ ,కావ్య పరిమళాలను ఆస్వాదించటానికి పూను కొన్న శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి ప్రొఫెసర్ గారి సలహా ,మైనేని వారి సహాయం లభించాయి .చేతిలో నిఘంటువులు అంతర్జాలం ఉండనే ఉన్నాయి .చక్కని సమన్వయం తో ఇంతటి బృహత్కార్యాన్ని తలపెట్టి ,సాధించారు .సంస్కృత పరిరక్షణ ,సంస్కృత భాషా ప్రచారమే కాని ,స్వార్ధ మెరుగని వారు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు .తమ శక్తి యుక్తులన్నీ లోక హితం కొరకు వెచ్చించారు .ఇతరులకు సాయం చేయటం లోముందుంటారు .

గుణ గ్రహణ పారీణత

కవిలో ,కావ్యం లో గుణాన్ని గుర్తించి ,ప్రకటించే మంచి లక్షణం శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి వెన్నతో పెట్టిన విద్య .సద్విమర్శకునికి ఉండవలసిన ఉత్తమ గుణమది.శివుడు గరళమును కంఠము నందు నిలుపు కొని ,చంద్ర కళను శిరసున ధరించుట ఇందులకు నిదర్శనము .

శ్లో –‘’గుణ దోషౌబుధో గృహ్ణన్ ,ఇందు క్ష్వేడా వివేశ్వరః

శిరసా శ్లాఘ్యతే పూర్వం ,పరం కంఠే నియచ్ఛతి’’.

హనుమదుపాసన

ఇంతటి మహత్కార్యాన్ని అవలీలగా సాధించిన శ్రీ దుర్గా ప్రసాద్ గారికి  ఉపాస్య దైవమగు శ్రీ హనుమదనుగ్రహం పరిపూర్ణం గా ఉంది .ఇప్పటికి వారు 50 పైగా సుందర కాండ పారాయణలు పూర్తి చేసి ,,స్వామి పాదముల చెంత సమర్పించారు .ఉయ్యూరు లో గల శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం కేంద్రంగా చేసుకొని వారు పారాయణాలు వ్రతములు ,హోమములు ,ఉత్సవములు నిర్వహిస్తూ,భక్త కోటికి స్పూర్తి నిస్తూ ,ప్రీతిపాత్రులైనారు .దేశ ,విదేశాలలో ఉన్న ఆంజనేయ దేవాలయాలను ,దర్శనీయ స్థలాలనుతెలియ జేసి ,ప్రజలకు మహోపకారం చేశారు .

పరోపకారము

వారి విద్యా, ధన . శక్తి యుక్తులు ,జ్ఞానానికి ,దానానికి ,సంస్కృతి పరి రక్షణకు వినియోగ పడి ,లోకం లో శాశ్వతములయ్యాయి .

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

దేశం లో ,విభిన్న కాలాలలో ,భిన్న రాష్ట్రాలలో గల సంస్కృత కవులు ,వారి రచనలతో బాటు ,కవుల జీవిత విశేషాలను కూడా పరి శీలించి ప్రకటించారు .ఆయా కవుల చారిత్రిక నేపధ్యం వివరింప బడి ,చరిత్ర గ్రంధంగా కూడా ఇది పరిగణింప దగి ఉన్నది .విశ్వ విద్యాలయం వారు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికృషికి మెచ్చి,నిర్నిబంధంగా డి.లిట్.(డాక్టర్ ఆఫ్ లిటరేచర్ )పట్టము నిచ్చి ,గౌరవించ వలసి ఉంటుంది .ముందుముందు పి .హెచ్ .డి.చేసే విద్యార్ధులకు ఈ గ్రంధం పరిశీలింప దగిన ‘’ఆకర గ్రంధము ‘’గా  (రిఫరెన్స్ బుక్ )ఉంటుంది .ఈ గ్రంధము ద్వారా  నేను ఎన్నో నూతన విషయాలు తెలుసుకోగలిగాను . .ఇందులోని ప్రాచీన కవులు ,స్వాతంత్ర్యానంతర సంస్కృత కవులు ,ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు కూడా ప్రస్తావి౦ప బడ్డారు . ఎందరో మహాను భావులు అందరికి వందనాలు.

శ్రీ దుర్గా ప్రసాద్ గారు ఈ గ్రంధం లో ఉట్ట౦కించిన ‘’ఉప శీర్షికలు ‘’సహితం ,అన్వర్ధములై ,ఆలోచింప జేస్తూ వారి పరిశీలనా దృక్పధమునకు ,అభిరుచికి అద్దం పడుతున్నాయి .ఇందులోని విశేషాలను వివరిస్తూ వ్రాయటం మొదలు పెడితే మరొక గ్రంథం అవుతుంది .వారి కృషి కి ప్రత్యక్ష సాక్ష్యం మీ కరములను అలంకరించిన ఈ సాహిత్య లక్ష్మి అని చెప్పటం అతిశయోక్తి కాదు .సూర్యునకు దివిటీ పట్టటం ( దీపం చూపించటం ),భక్తి ప్రకటనము మాత్రమే అని  విన్నవిస్తూ ,వాత్సల్యంతో నాకీ అవకాశాన్ని  కల్పించిన బ్ర .వే .గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి ,సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను .వారి కృషికి జేజేలు పలుకుతున్నాను .

శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారిని ఒక వ్యక్తిగా కాక సాహితీ సంస్థ గా సంభావిస్తూ ,వారి బహుముఖ ప్రజ్ఞా విశేషములను ప్రస్తుతిస్తున్నాను .

డా. తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి

రిటైర్డ్ ప్రిన్సిపాల్ –శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ,పొన్నూరు .

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణం -2స్పాన్సర్ -సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ మరియు ఆ దంపతుల ”మా మాట ”

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం  గ్రంధ ప్రాయోజకులు

సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు  శ్రీ మైనేని గోపాల కృష్ణ

జననం –విద్యా భ్యాసం

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు సమీపం లోని కుమ్మమూరు గ్రామం లో శ్రీ మైనేని వెంకట నరసయ్య ,,శ్రీమతిసౌభాగ్యమ్మ దంపతులకు 10-1-1935న ఆరవ సంతానం గా జన్మించారు .వీరి అన్నగార్లు స్వర్గీయ సూర్య నారాయణ ,స్వర్గీయ తాతయ్య అనేరాజ శేఖర్ ,అక్కయ్యలు శ్రీమతి అన్నపూర్ణాదేవి ,స్వర్గీయ శ్రీమతి  కనక దుర్గా దేవి ,శ్రీమతి భారతీదేవి .చెల్లెళ్ళు శ్రీమతి హేమలతా దేవి,శ్రీమతి సత్యవాణి .బాల్యం లోనే పిల్లల చదువుకోసం తండ్రిగారు కుటుంబాన్ని ఉయ్యూరు కు మార్చారు .ప్రాధమిక విద్య ను గోపాల కృష్ణ గారుకీ శే కోట సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద నేర్చారు .కోటమాస్టారు అంటే మైనేని వారికి అమితమైన గౌరవం భక్తీ .వారి పేరు చెబితే పులకి౦చిపోతారు ..1950వరకు తాడంకి స్కూల్ లోచదివి ఎస్. ఎస్. ఎల్. సి .పాసై ,తరువాత విజయవాడ ఎస్ .ఆర్ .ఆర్ .కాలేజి లో ఇంటర్ చదివి1954లో ఉత్తీర్ణులయ్యారు .కొంతకాలం నాటకాలు ,సోషలిస్ట్ పార్టీ సభలతో  కాలేజీకి  డుమ్మా కొట్టారు ..బెజవాడ హోటల్ వర్కర్స్ యూనియన్తో చేరి ,వర్కర్ల జీవన పరిస్థితులను మెరుగు పరచటానికి వారిని యాజమాన్యం గౌరవం గా చూడటానికి కృషి చేశారు .

ఉన్నత విద్య –వివాహం –మొదటిసారి అమెరికా ప్రయాణం

1953-54లో ఉయ్యూరులో డ్రమాటిక్ అసోసియేషన్ స్థాపించి ఆత్రేయ గారి యెన్ .జి.వో నాటికను ప్రాక్టీస్ చేశారు .1955-58కాలం లోవిశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీ మెయిన్ సబ్జెక్ట్ గా ఎడ్యుకేషనల్,సోషల్ అండ్ చైల్డ్ సైకాలజీ మైనర్ సబ్జెక్ట్ లుగా తీసుకొని చదివి1959లో ఏం.ఏ .సెకండ్ క్లాస్ లో పాసైనారు .1960లో గుంటూరు జిల్లా రేపల్లెతాలూకా నల్లూరు గ్రామవాసి కీ శే .పరుచూరి భావ నారాయణచౌదరి ,శ్రీమతి రత్న మాణిక్యమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి సత్య వతి ని వివాహం చేసుకొన్నారు .1960-61లో అమెరికా వెళ్లి మిన్నియాపోలీస్ లోని మిన్నెసోటా యూని వర్సిటి లో ఎడ్యుకేషన్ సైకాలజీ ,స్టాటిస్టిక్స్ లో కొంత కోర్సు వర్క్ చేశారు  .గోపాల కృష్ణ గారు 1961-62లోమాడిసన్ లోని విస్కాన్సిన్ విశ్వ విద్యాలయం లో ఇండియన్ స్టడీస్ కు అనుబంధం గా ఉన్న తెలుగు గ్రంధాలను కేటలాగ్ చేయటానికిసహాయ పడుతూ ,కొన్ని లైబ్రరీ కోర్సులు పూర్తి చేశారు . .1962లో ఇండియా తిరిగి వచ్చికొంతకాలం  .చిరు ఉద్యోగాలు చేస్తూ ,కొంతకాలంనిరుద్యోగి గా ఉంటూ ,కొంతకాలం ఉయ్యూరు కే సి పిలో అతి చిన్న ఉద్యోగం  చేసి,స్థిరమైన రాబడి లేక కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందిపడుతూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ 1968వరకు ఆరేళ్ళు  గడిపారు .

తలపు తట్టిన అదృష్టం  లైబ్రరీ సైన్స్  కోర్స్ -ఉద్యోగం

అదృష్టం తలుపు తట్టగా 1969లో అమెరికా వెళ్లి టెన్నేసిలో   లైబ్రరీ  సైన్స్ లో ఎం..ఎస్..చేసి,,అందరి ఆదరాభిమానాలు పొంది డిగ్రీ తీసుకొనిసంతృప్తి చెందారు .సుమారు ఏడేళ్ళు పడిన మానసిక వేదనకు ,శారీరక శ్రమకు విముక్తికలిగింది . కోర్సులో ఉండగానే  కెంటకీలోని లూవిల్ యూని వర్సిటి లో కేటలాగర్  అండ్  ఇన్ స్త్రక్టర్  ఇన్ లైబ్రరీ సైన్స్ కు ఎంపికై ,పదవీ  బాధ్యతలు చేబట్టారు .అమెరికన్ లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్,న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరి ,ఇతర విశ్వ విద్యాలయాల లైబ్రరీలను సందర్శించారు . .మెషీన్ రీడబుల్ కేట లాగింగ్ కు ఇన్ హౌస్ ట్రెయినింగ్ఇచ్చారు .ఆంగ్లో అమెరికన్ కేటలాగింగ్ రూల్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు .ఆబ్ స్ట్రాక్ట్ ఆఫ్ అకడేమిక్ ప్లాన్ అండ్ బిల్డింగ్ ప్రోగ్రాం కుసహకరించారు .లాంగ్  రేంజ్ బడ్జెట్ ,పర్సనల్ అండ్ రిసోర్సెస్ ప్రొజెక్షన్ కు సహాయకుడిగా సేవలందించారు .యూనివర్సిటి ఆఫ్ లూయీ విల్లైబ్రరి సిస్టం కు టెక్నికల్ సిస్టం అందించటం లో ప్రముఖ పాత్ర పోషించారు . మైనేనిగారి బాస్   ప్రోత్సాహం తో  కేటలాగింగ్ కన్సల్టంట్ గా  1974నుంచి 76వరకు రెండేళ్ళు   యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్ట్ నాక్స్ లైబ్రరీ  ,నేషనల్ ఆర్కైవ్స్ ,సన్స్ ఆఫ్ అమెరికన్రివల్యూషన్ లో 1976-78 వరకుసలహా దారుగా ,కెంటకీ లోని లూయీ విల్ లో ఉన్న లైబ్రరీ ఆఫ్ వరల్డ్ ఫెయిత్  సెంటర్ లో 1980-82 వరకు ఏంతో సంతృప్తిగా సేవ లందించారు .  తనపై బాస్ కున్న నమ్మకానికి ఎంతో కృతజ్ఞత చూపిస్తారు శ్రీ గోపాల కృష్ణ ..,పై ఉద్యోగులచేత ప్రశంసలు,సహోద్యోగుల చేత ఆత్మీయ మిత్రులుగా అభినందనలు పొందారు .1997లో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ స్పెషల్ అసిస్టంట్ టు యూని వర్సిటిలైబ్రేరియన్ గా పదవీ విరమణ చేశారు .

కుటుంబం

మొదటి నుండి సత్యం ధర్మం న్యాయం లపై మక్కువ ఉన్న గోపాల కృష్ణగారు కెంటకీ సదరన్ బాప్టిస్ట్ దియలాజికల్  సెమినరి,ముర్రె స్టేట్యూని వర్సిటీలలో హిందూ ధర్మం పై ప్రసంగాలు చేశారు .లూయీవిల్ యూని వర్సిటి లో రెలిజియన్ స్టడీ డిపార్ట్ మెంట్ ఆహ్వానం పై బౌద్ధధర్మం పై దార్మికోపన్యాసమిచ్చి అందరి మన్ననలు అందుకొన్నారు .అతిధులను గౌరవం గా ఆదరించటం .బాధితులకు సాను భూతిసహవేదనలనుచూపటం మైనేని వారికి తలిదండ్రుల నుండి సంక్రమించిన గొప్ప సుగుణం .గోపాల కృష్ణ దంపతులకు   ఇద్దరు కుమారులు.పెద్దకుమారుడు శ్రీ కృష్ణ –కోడలు శ్రీమతి రమ.మనుమ రాళ్ళు ఛి శ్రేయ ,సెరీన.చిన్న కుమారుడు శ్రీ రవి .కోడలు శ్రీమతి కవిత .మనుమడు ఛికిరణ్ .మనుమరాళ్ళు ఛి రియా ,కరీనా .  మనసాంప్రదాయం ప్రకారం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -26

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -26

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-5 (చివరిభాగం )

‘’తదుక్తం’’ అని మల్లినాధుడు చెప్పిన అలంకార సూత్రాలను డా.పి .ప్రభునాద ద్వివేది తన పి హెచ్ డి ధీసిస్ లో కాళిదాస కావ్యాలపై మాత్రమె ఉటంకించిన విషయాలను ఈ  విధంగా వివరించాడు .

అలంకారం పేరు             ప్రతాపరుద్రీయం లోని కొటేషన్లు                                      కావ్యం పేరు

1-తుల్య యోగిత                ప్రస్తుతానాం తదాన్వేషా కేవలం తుల్య ధర్మతః                   కుమార సంభవం -1-2

ఔపోస్యాం గమ్యతే యత్ర  సమతా తుల్య యోగితా

2-పరిణామ           అరస్యోమాణ రేప్య విషయాత్మనా స్థితం ప్రక్రుతత్యేష యోగిత్వే               ‘కుమార -1-10-

పరిణామ ఉదాహృతః

మల్లినాధుడు ఇందులోని ముఖ్యమైన మాటలే చెప్పాడు

ఆరోప్యామాణస్య ప్రకృతోపయోగిత్వే పరిణామ రతి

3-నిదర్శన             అసభ్యా వద్ధర్మ యోగ దుపమానోపమేయ మెయయోః                          కుమార -1-3-

స్యా నిదర్శనా

4-వ్యతిరేక       భేద ప్రాదాన్యే నోపమాన దుపమేయ స్తాదికయే విపర్యయే వా వ్యతిరేకః                కుమార -1-43

5-కావ్య లింగ     హోతార్వాక్య య పదార్ధత్వే కావ్య లింగ ముదాహృతం                               కుమార -1-48

6-స్వభావోక్తి       స్వభావోక్తిరసౌ చారు యధావద్వస్తు వర్ణనాం                                         కుమార-1- 56

7-ప్రతి వస్తూ పమ   యాత్ర సామాన్య నిర్దేశః ప్రుధవ్యాక్య ద్వయే యది –                                 కుమార -3 -21

చాసౌ విశామలంగమ్యోపమ్యాశ్రితే సా స్యాత్

ప్రతి వస్తూపమా మతా

8-విషమ               విరుద్దే కార్యస్యో త్పతిర్య న్ననార్యస్య వా భవేత్ –విరూపఘటనాచాసౌ        మేఘ -1-5

విశామాలంకే కృతి స్విదా

9-అర్దా౦తరన్యాస  కార్యకారణ సామాన్య విశేషణా౦ పరస్పరం –సమర్ధనం                         మేఘ -1-8

యత్ర సోర్దాన్తర న్యాస ఉదాహృతః

10-స్మరణ       సద్రుశాను భావవా దన్యస్మ్రుతిఃస్మరణాభ్యుచతే                                     మేఘ -11-14

ధ్వని పైమల్లినాధుని భావన

రసానికి ,అలంకారానికి దగ్గర సంబంధమున్న అనేక అలంకారాలను ఉదహరించవచ్చు .సంస్కృత అలంకార శాస్త్రం లో మరొక ముఖ్య విషయం అయిన ధ్వని లేక వ్యంజనం ఉంది .ధ్వని క్షేత్ర సూచన అభిదా అనే సూటి విషయానికి,లక్షణ అనే రెండవ అర్ధానికి  భేదం ఉంది .ఏ సాహిత్య విషయమైనా అది ఇచ్చే సూటి అయిన అర్ధానికి ,లేక ఉపార్ధాన్ని బట్టి మెచ్చుకో బడటం లేదు .సాహిత్య సౌందర్యం స్త్రీ అందాన్ని చెప్పలేక పోయినా అనుభవించ గలిగినట్లు (ప్రతీయమాన౦  ) గా ఉంటుంది .ఈ విధంగా వ్యక్తం చేయగలిగిన సూచననే ధ్వని అంటారు .ధ్వని భావన1-వస్తు ధ్వని-అంటే సత్య లక్ష్యం 2-అలంకార ధ్వని-అంటే ఏదో దానితోతులనాత్మక  పోలిక , 3-రసధ్వని-అంటే ఏదో  భావ లేకఅవ్యక్తానుభూతి  అని  మూడు రకాలుగా  ఉంటుందని చెప్ప వచ్చు ..

సాధారణం గా అలంకారం లో ప్రాధమిక భావన మరియు సూచ్యార్ధం ఉండ వచ్చు .కానిఇందులో ప్రాధమిక భావన ఆది పత్యం వహిస్తుంది .అలాకాకుండా సూచ్యార్ధ లేక ఉద్దేషిత భావం ఆధిపత్యం వహిస్తే పైన చెప్పిన 3 రకాలలో ఏదో ఒక ధ్వని  ‘’ధ్వని ‘’ఉందన్నమాట .కవిత్వం లో ధ్వని అతిముఖ్యమైన కీలక సూత్రం .సుచేతన (కాన్షస్)ఉన్న  వ్యాఖ్యాత ,సౌందర్య భావనలన్నీ తెలిసిన మల్లినాధుడు   .ధ్వనిని చాలా విస్తరించే ఎక్కడ అవకాశం వస్తే  అక్కడ బాహాటంగా బహుళంగా తెలియ జేశాడు అన్నాడు లాల్యే పండితుడు .

శిశుపాల వధ కావ్యం లో ఎవరు నల్లని లేక చెడు మనసుతో ఉంటారో వారు శిశుపాలుని అనుసరిస్తారు ,ఎవరు చీకటి లేక చెడు మనసు లేకుండా శుద్ధ మనస్కత తో ఉంటారో వారు  కోమల కాంతిని అనుసరిస్తారు –‘’యత్ర ధ్వాంతం రజనీముఖ  మనుయాతితహిదితి ,తద్విదితి వస్తునా అలంకార ధ్వని అని మల్లిననాధుడు వ్యాఖ్యానించాడు .ఇక్కడ తమస్ –స్వభావ –ప్రదోష మాటలు ద్వంద్వార్ధ౦   కలవే కాక ,పోలిక ను సూచించేవి .ఇక్కడ ఉన్నది ఉపమాలంకారం ధ్వని ఆధారం గా ఉన్నది .ఒక్కో సారి మల్లినాధుడు శ్లోకం లోని  అలంకార సూచనలను  పక్కన పెట్టేసి ,అక్కడ ఉన్న ధ్వనిని వెలుగులోకి తెచ్చాడు శిశుపాల వధ 4-19 శ్లోకం లో రైవత పర్వత వర్ణన ఉంది .దాన్ని కవి మాఘుడు  శివునితో పోల్చాడు .అది ఆకాశాన్ని కప్పేసి అంతరిక్షానికి ముసుగు గా మారింది .భూమికి చాలా ఎత్తుగా ఉండటం ,దాని శిఖరాలు అత్యున్నతాలుగా ఉండటం వాటిపై చంద్ర కాంతి ప్రసరించి శోభిస్తోంది .-‘’ఆచ్చాదితాయత దిగంబర ముచ్చ కైర్గామ క్రమ్య సంస్తతముదగ్ర విశాల శృంగం –మూర్ధ్ని స్పురత్తుహిన దీధితి కోటమేన ముద్రీక్ష్య కొ భువి న విస్మయతే నగేంద్రం ‘’.

శిశుపాల వధ లోనే మరో శ్లోకం లో పదాలు ఒక స్పష్టమైన అర్ధానికే పరిమితమై ఉంటాయి .కాని మనకు వేరే అర్ధాలు కూడా ఉన్నాయేమో ననే సందేహం కలుగుతుంది .అక్కడ శ్లేష ఉండదు .ఉదాహరణకు ‘’నగేంద్ర ‘’అనే ముఖ్య ‘పదానికి రెండు అర్ధాలు లేవు . విశేషణం ఒకే సందర్భానికి మాత్రమే చెందింది కాకపోవటం వలన అది సమాసోక్తి అలంకారం కాదు .అది తుల్య యోగిత  కాదు కారణం రెండూ ప్రక్రుతంకావు (రైవతం)అప్రక్రుతమైన శివుని ఉద్దేశించినవి .సూటి అర్ధాలు వేరే భావన అంటే శివుడు అనే  కలిగిస్తాయి .కనుక ఇక్కడ ధ్వని ఉందని కనుక ఈ శ్లోకం లో ఏ విధమైన అలంకారం లేదని మల్లినాధుడు వివరించాడు –‘’తస్మాత్ ప్రకణికార్య మాన  పర్యసితాభి ధన్య పరే ణాపి శబ్దేన అర్దాన్తరీకృద్ధ్వని రిత్యాహుః   ‘’అని ధ్వనినే ఇక్కడ మల్లినాధుడు ప్రతిస్టించాడు అని లాల్యే  పండితుడు తెలియ జేశాడు .

తరువాత విద్యాధరుని ‘’ఏకావలి ‘’లో రస, అలంకార విశేషాలను  మల్లినాధుడు  రాసిన తరల వ్యాఖ్యానం లో ఎలా వివరించాడో తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

4-12-16 న ఆవిష్కరింపబడే632 పేజీల గీర్వాణం -2 ముందు వెనుక కవర్ పేజీలు

geervaanam-2-front-cover geervaanam-2-back-cover

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం –అంకితం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం –అంకితం

మా తలిదద్రులు కీ .శే.శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  ,కీ .శే..శ్రీమతి భవానమ్మ దంపతులకు

నాన్న అమ్మ

మా తండ్రిగారు శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారుక్రీ శ 1900, వికారి నామ సంవత్సరం లో కృష్ణా జిల్లా ఉయ్యూరు లో శ్రీ గబ్బిట దుర్గా పతిశాస్త్రి ,శ్రీమతి నాగమ్మ దంపతులకు జన్మించారు .మాది వైదిక తెలగాణ్య శాఖ . గౌతమస గోత్రం ఆంగీరస ,అయాస్య ,గౌతమ త్రయార్షేయం.మా తాతగారిది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర దెందులూరు మండలం లోని రామారావు గూడెం అగ్రహారం .బాగా స్థితి పరులైనఅగ్రహారీకులు .అక్కడ మాకు ఒక భక్తాంజనేయ స్వామి వారి చిన్న దేవాలయం ఉంది .మా నాన్నగారు జన్మించిన కొద్దికాలానికే తండ్రిగారుచనిపోయారు. ఆస్థికూడా తగ్గి పోయింది .మా నాయనమ్మ నాగమ్మ గారి తండ్రి శ్రీ గుండు లక్ష్మీ నరసి౦హావధానులు గారు ఉయ్యూరు నివాసి.అందుకని మా నాయనమ్మగారు భర్త మరణం తో తండ్రి  వద్దకు  కుమారునితో సహా ఉయ్యూరు చేరారు  .దౌహిత్రుడైన మా నాన్న గారికి,మాతామహులు ఉయ్యూరులోని ఆయన పొలం ,ఇల్లు ,స్థలం రాసి ఇచ్చి అల్లారు ముద్దుగా పెంచారు .మా మామ్మ అక్క చెల్లెళ్ళలో అప్పటికిఎవరికీ సంతానం లేనందున అందరూ మా నాన్నగారిని  అతి గారాబం గా చూసుకోనేవారు .చిన్నప్పటి నుంచే సంగీత ,నాటక,సాహిత్యాలపైపరిచయం బాగా ఉండేది .ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఉయ్యూరు ఆస్థినంతా దౌహిత్రుడుగా మా నాన్న గారికి ,మా నాయనమ్మగారితండ్రి శ్రీ లక్ష్మీ నరసింహా వదానులు గారి ద్వారా సంక్రమించినదే  .ఇది కాక రామారావు గూడెం లో పిత్రార్జితమూ మా నాన్న గారికి దక్కింది .మా అమ్మ గారు శ్రీమతి భవానమ్మగారు గుండు వారి ఆడబడుచు .ఉయ్యూరులో మా ఇంటి ప్రక్కనే ఉత్తరాన వారి ఇల్లు ఉంది .తలిదండ్రులు శ్రీగుండు సింగిరి శాస్త్రి ,శ్రీమతి దుర్గ .మాఅమ్మగారు తన 12 వ ఏటనే మా నాన్నగారిని వలచి వరించటంవలన  ,పెద్దలు  అనుమతి౦ఛి ఇద్దరికీవివాహం జరిపించారు .

చదువు ఉద్యోగం

మా తండ్రిగారు విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై ,బ్రహ్మశ్రీ చెరుకుపల్లి లక్ష్మీ నరసింహ శాస్త్రి మొదలైన గురువులవద్ద వేద,వేదా౦తాలను,కావ్యాలను అభ్యసించి  సంస్కృత ,ఆంధ్రాలలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు .కవిత్వమూ బాగానే అబ్బింది .ఉయ్యూరు లోని సి. బి.ఎం.స్కూల్ లో తెలుగు పండితులుగా కొంత కాలం పని చేశారు .ఆ తర్వాత అనంత పురం జిల్లా లోని హిందూ పూర్ లో ఉన్న ఇ.సి.ఎం.హైస్కూల్ లో  సీనియర్ తెలుగు పండితులుగా చేరి ,22 సంవత్సరాలు అక్కడే పని చేశారు .మా బాల్యం లో కొంత భాగం అక్కడే గడిచింది.మాంచి రేషన్ కాలం లోను పేద విద్యార్ధులకు మా ఇంట్లో వారాలు  ఇచ్చి చదువుకొనే విద్యార్ధులను  ప్రోత్సహించారు .ఇంటి వద్ద ఉచితంగాతెలుగు బోధించేవారు .రాయల సీమ ప్రాంత కవి పండితులైన శ్రీ కల్లూరి సుబ్బారావు మొదలైన వారితో  ప్రత్యక్ష పరిచయం ఉండేది .ఆంద్రప్రాంతం నుండి ఉపన్యాసాలకై హిందూ పురం వచ్చే కవిపండితులకు, గాయకులకు, హరి కధకులకు మా ఇంట్లోనే వసతి ,భోజన సౌకర్యంకల్పించేవారు . ఇలా ఆతిధ్యం పొందిన వారిలో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ ,శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి ,శ్రీ జటావల్లబులపురుషోత్తం ఉన్నారని మా అమ్మ చెప్పింది .నాన్నగారి నాటకం, సంగీతకచేరీలు మహా ఇష్టం .ఎంతదూరమైనా వెళ్లి చూసి వచ్చేవారట .బ్యాడ్మింటన్ బాగా అడేవారట .ప్రసిద్ధ హరికధకులు శ్రీ పిల్లలమఱ్ఱి రామ దాసు గారి హరికధలు నెలల తరబడి హిందూ పూర్ లో జరిగేవి .దీనికినాన్నగారి ప్రోత్సాహమే కారణం అని చెప్పేవారు .హిందూ పుర వైశ్య ప్రముఖులు  గొప్ప వదాన్యులు,వితరణ శీలురు కూడా. వీరందరికీనాన్నగారంటే మహా గౌరవం ..కవి పండితులను ఆహ్వానించి ఘన సన్మానం చేసేవారు .వీటన్నిటికి వెనుక నాన్నగారి చేయూత ఉండేది .

ఉయ్యూరుకు బదిలీ

కృష్ణా జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ గా శ్రీ కాకాని వెంకట రత్నం గారున్నప్పుడు ,మా నాన్న గారిని హిందూ పురం మునిసిపల్ హైస్కూల్ సర్వీస్ తోకృష్ణా జిల్లా జగ్గయ్య పేట హై స్కూల్ కు జిల్లామార్పు ప్రాతి పదిక మీద తీసుకొని వచ్చారు .ఆ తర్వాత ఉయ్యూరు ఉన్నత పాఠ శాలకు బదిలీఅయి ,1954 లో పదవీ విరమణ చేశారు .పిమ్మట తాత్కాలిక ప్రాతిపదికపై ఉంగుటూరు హైస్కూల్ లో రెండేళ్ళు పని చేశారు . రిటైర్డ్ హెడ్మాస్టర్  శ్రీ పుచ్చా శివయ్యగారు  ,శ్రీ అన్నే హనుమంత రావు గారు అనే లెక్కల మేష్టారు కలిసి స్థాపించిన శ్రీ సరస్వతి ట్యుటోరియల్ కాలేజిలో 5 సంవత్సరాలు తెలుగు పండితులుగా పని చేశారు .ఎక్కడ పని చేసినా నాన్న గారు అద్భుతంగా పాఠాలు బోధిస్తారనే పేరుండేది .కృష్ణాజిల్లాలో ఆంద్ర , సంస్కృతాలలో  అంతటి పండితుడు ఆనాడు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -25 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-4

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -25

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-4

కిరాతార్జునీయం లో నిదర్శనాలంకారానికి గొప్ప ఉదాహరణ ఉన్నది .అర్జునుడు ధనుర్బాణాలను  వదిలేసి సన్యాసం తీసుకొంటాను అన్నప్పుడు ఇంద్రుడు చెప్పిన హితం –‘’యాః కరోతి విద్యోదర్క నిః శ్శ్రేయ స్కరీఃక్రియాః –గ్లాని దోషచ్చిదః స్వచ్చాః స మూఢః పంగకచ్చాపః ‘’–అని చెప్పినసందర్భం లో ‘’తన పోరాట పటిమను ప్రదర్శించాల్సిన వాడు విముక్తి కి ప్రయత్నిస్తే చివరికి సర్వనాశనానికి సహాయకారి అవుతాడు ‘’నీటిని శుభ్రం చేయక   అలసత్వం చూపినట్లు అష్కల్మష మనస్కుడు అలసట పొందరాదు ‘’.ఇందులో నిదర్శనాలంకారం ఉందని మల్లినాధుడు గుర్తించాడు .

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండితీ గరిమ చూస్తె మహాశ్చర్య మేస్తుంది .అనంతంగా ఉన్న సమాచారం నుంచి ఉదాహరణలను ఎన్నుకొని  అన్వయించటం బహు కష్టమైన పని .అంతేకాదు ఒకటికంటే ఎక్కువ అలంకారాలు ఉంటె ఈ పని మరీ కష్టమౌతుంది .వాటినన్నిటినీ యాసిడ్ టెస్ట్ చేసినట్లు పరీక్షించి నిగ్గు తేల్చి న్యాయం చేకూర్చి , మరీ ఉదాహరించాడు .దీనికి ఎంతో లోతైన అవగాహన ,పాండిత్యం జమిలిగా ఉండాలి అలా ఉన్నది కనుకనే మల్లినాధుడు వ్యాఖ్యాన చక్రవర్తి అయ్యాడు .కిరాతార్జునీయం 2-31 శ్లోకం లో మరో ఉదాహరణ గమనిద్దాం –‘’అభి వర్షతి యోనృపాలయం విధి వీజాని వివేక వారిణా-స సదా ఫలశాలినీం క్రియో శరద౦ లోక ఇవాధితిస్టతి’’దీనిపై మల్లినాధుడు –‘’సాహసి కరస్య కాకతాలీయ న్యాయేన ఫలసిద్ధిర్వివేక నస్తునియతేతి భావః –అన్న ఫల శబ్దేన సస్య హేతు క్రుతయోరర్ధయో రభే రాభేదాధ్య వసయాత్ శ్లేష మూలాతిశయోస్యోక్తి స్తదను గృహీతా చోపమేత్యను సంద ఏం’’.ఈ సర్గ ప్రారంభం లో యుధిష్టిరుడు ,భీముని రౌద్ర భీమ వచనాలు విన్నతర్వాతకూడా చలించకుండా  శాంతి వచనాలే పలికాడు .తీవ్ర స్వభావమున్నవాడు కూడా విజయం సాధిస్తే ప్రశాంతతకు నిలువ ఎక్కడ ఉంటుంది ?ఈ ప్రశ్నకు ధర్మ రాజు సమాధానం చెప్పాడు –‘’ఎవరు విధి అనే విత్తనాలువివేకమనే జలం తో కలిపి  చల్లుతాడో అతడు శరదృతువులో పంటకు వచ్చినట్లు  ఫలాలను గ్రహిస్తాడు .ఇక్కడ శ్లేషతో కూడిన అతిశయోక్తి అల౦కారముందని చెప్పాడు .ఫలం అంటే పంట అని ,ఫలితం అని రెండు అర్ధాలున్నాయి .ఇవి భేదార్ధం ఉన్నవికావు .వీటిలో భావం ‘’ఫలితం ‘’ఉపమేయంగా ,పంట ఉపమానం గా భావించాలి .అర్ధం చేసుకోవటానికి రెండర్ధాలు తెలియాలికనుక శ్లేష ఇక్కడ ఉన్నట్లు చెప్పుకోవాలి .విధి బీజాని వివేక వారినః పదాలు సందర్భానికి ఉపమేయ ,ఉపమానాలుగా ప్రవర్తిస్తాయి . నిశ్చల పవిత్ర జలాలలో పడవపై వెడుతూ దాన్ని మురికి చేయటం లాగా బలవంతపు సన్యాసం లేక తపస్సు చావుకుకారణ మౌతుంది .ఇందులో ఒక వాక్యం యొక్క అర్ధం వేరొక వాక్యార్ధం పై బలంగా పడింది .వస్తువు కున్న సంబంధం లో ఏకత ఉంది  .మల్లినాధుడు నిదర్శన అలంకారం విషయం లో కూడా ఇలానే చెప్పాడు .సంబంధం లేనివి ఒకదానిపై ఒకటి రెండు విభిన్న వాక్యాలలో ఉండటం చేత ఇది ‘’వాక్యార్ధ వ్రుత్తి నిదర్శనలంకారం ‘’అని వివరించాడు –‘’యత్ర వస్తుసంబందేన ప్రతిబి౦బనం గమ్యతే సా నిదర్శనా ‘’అని తెలియ జేశాడు .

భట్టికావ్యం లో ప్రత్యెక విషయాలు తెలుసుకోవాలి .జయమంగళ వ్యాఖ్యాత ఇందులోని 10 వకాండం లోని అలంకారాలను మాత్రమె గుర్తించి చెబితే మల్లినాధుడు అన్ని కా౦డలలోని అలంకారాల గురించి పూర్తిగా వివరించి చెప్పాడు.సుమారు 25 అర్దాలంకారాలను మల్లినాధుడు నిర్వచించాడు .దీనికి విద్యానాధుడు రాసిన ‘’ప్రతాప రుద్రీయం ‘’నుచక్కగా వినియోగించుకొన్నాడు .కొన్ని అలంకారాలు ముఖ్యంగా 6 అలంకారాలు భట్టికాలం నాటికీ వాడుకలో లేవని చెప్పాడు .అవే కారణ మాల ,కావ్య లింగ ,ప్రతీప ,భ్రాన్తిమాన్ ,సమ ,దృష్టాంత  .భట్టికాలం లో చలామణి లో ఉన్న ‘’విభావన ,సమాసోక్తి , రసవత్ ,ఊర్జవి ,ఆశిష్ ,పర్యాయోక్తి ,వ్యాజస్తుతి ,సమాహిత ,విశేషోక్తి ,హేతు ,కావ్య లింగ ,ఉపమారాపక ,నిదర్శన ,పరి వ్రుత్తి ,ఉత్ప్రేక్ష ,తుల్య యోగిత అలంకారాలను గురించి మల్లినాధుడు పేర్కొనలేదని లాల్యే పండితాభిప్రాయం. 10 వ కాండలో లోని అన్ని శ్లోకాల అలంకారాలు జయమంగళ తెలిపాడు .అలాగే మల్లినాదుడూ చేసాడు .కాని ఈ రెండిలో భేదాలున్నాయి .ఆ తేడాలేమిటో గమనిద్దాం.

భట్టికావ్యం 10-22 శ్లోకం లో ‘’ఆది దీపక ‘’10-24లొ అంతా దీపిక అల౦కారాలున్నాయని జయమంగళ వ్యాఖ్య .కాని అవి కారణమాల ,కావ్య లింగ అలంకారాలని మల్లి నాధుడు గుర్తించాడు .10-40లో ప్రియ అలంకారం ఉందని జయమంగళ అంటే ప్రతీప అలంకారం అని సూరి చెప్పి దానికి తగిన బలమైన సాక్ష్యాలను తెలియజేశాడు –‘’మధుకర విస్తానాం సరసీరుహాణా౦ చోపమానాము యమే యత్వ కల్పపాద నాద్వితీయ ప్రతీపాలంకారః ‘’అని స్పష్టం చేశాడు .అలాగే భట్టి కావ్యం లో నిదర్శనాలంకారాన్ని –‘’వాక్యార్దానాం పరాజయ వాక్యార్దేన సమానాధిక రణ్యా భావాత్ సాదృశ్య క్షేపాద్ బహూనాం మాలయా నిబంధనాచ్చా స౦భవస్తు సంబందో వాక్యార్ధ నిష్టామాలా నిదర్శనా ‘’అంటూ బలంగా చెప్పాడు .మూడు అసాధ్య విషయాలు ఒక చోట చేర్చబడ్డాయి –అవే నీటిపైరాయి తేలటం ,సూర్యుని నుంచి చీకట్లు రావటం ,చంద్రుని నుంచి అగ్ని బయల్దేరటం మరియు మహా పరాక్రమ శాలి అయిన రావణుడిపై విజయం సాధించటం –‘’శిలా తరిష్యదుదకే  న పర్ణా౦ –ద్వాన్తః రవేః .శామ్యతి వహ్ని రి౦దోః-జతా పరేహం యుధి జ్జ్యేష్యమాణాస్తుత్యాని –మన్యక పులస్య నప్తః ‘’.జయ మంగళ ‘’బ్రహ్మ ‘’ను అనుసరిస్తే మల్లినాధుడు అలంకార సర్వస్వ కర్త ‘’రుయ్యకుని’’ అనుసరించాడు .

అలంకార విషయం లో మరో ముఖ్య విషయం గమనించాలి .కొన్ని చోట్ల అలంకార నిర్వచన ప్రస్తావనలో మల్లినాధుడు దాన్ని తాను ఎక్కడనుంచి తెచ్చి చెప్పాడో తెలియ జేయలేదు .అవసరం మేరకు వాక్యాలు ఉదాహరించి ‘’తదుక్తం ‘’అని తేల్చేశాడు .కనుక ఎక్కడో ఒక గ్రంధం  నుంచి దాన్ని పొందాడని గ్రహించాలి .చాలా సందర్భాలలో కర్త పేరు తెలియ జేసినా సూరి ఇలా ఎందుకు చేశాడు అన్నది ఒక పెద్ద ప్రశ్న .దీనికి సంతృప్తి కర సమాధానం చెప్పటం కష్టం అన్నాడు లాల్యే .అయినప్పటికీ ,ఆ ఉల్లేఖనం (కొటేషన్ )చాలావరకు ఏక రీతిగా నే ఉంది .సంకోచం లేకుండా ఈ చర్చలోని అలంకార శీర్షికలకు  కొన్నిపదాలకు ముందే ఉన్న  నిర్వచనాలు విద్యానాధుని ప్రతాప రుద్రీయం నుండి గ్రహించినట్లు భావించాలి .కాకతీయ ప్రతాపరుద్ర చక్ర వర్తి ఆస్థానకవి విద్యానాధుడు అని మనకు తెలుసు …మల్లినాదునికుమారుడు కుమారస్వామి ప్రతాపరుద్రీయం పై ‘’రత్నాపన ‘’వ్యాఖ్యానం రాశాడని ముందే చెప్పుకొన్నాం .

‘’ తదుక్త౦ ‘’ అంటూ ముక్తాయింపు ఇచ్చిన మల్లినాడుడు విద్యానాధుని అలంకారాలను గురించి ఎలాచేప్పాడో తరువాత  తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -24 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-3

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -24

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-3

పంచ మహాకావ్యాలలో ‘’ప్రతి వస్తూపమాలంకారం ‘’ఎక్కువగా వాడ బడింది .మల్లినాధుడు ఈ అల౦ కారం కని పించిన చోటల్లా విజ్రుమ్భించి  చాలా విస్తృతంగా రాశాడు .అందులో ఒకటి చూద్దాం .శిశుపాల వధ 11-22-‘’ఉపప్లుతం పాతుమదో మదోద్ధతేశ్వమేవ విశ్వంభరం –విశ్వమీశిషె-క్రుతేర్వేః క్షాలాయితుం క్షమతే కః క్షపాతమస్ఖండ మలీమాసం నభాః’’అనే  శ్లోకం లో రెండు వాక్యాలు ఉన్నాయి .అందులో ఒకదాని పై అలంకార ప్రశ్న ఏర్పడింది .’’ఆకాశాన్ని రాత్రి కటిక చీకటిగా మారిస్తే ,దాన్ని పూర్తిగా కడిగేసే సామర్ధ్యం సూర్యునికి తప్ప మరెవరికి ఉంది ?.తరువాత వాక్యం లో ‘’ఓ విశ్వ పాలకా !తీవ్ర మోహా వేశం లో ఉన్న జనాలను నువ్వు తప్ప రక్షించేవారెవరు ?ఈ రెండు వాక్యాలలో సాధారణ విషయం సమర్ధత .ఇది  ‘’ఈషిసే ‘’,’’క్షమేత’’అనే రెండుపదాల చేత ప్రతికూల పద్ధతిలో చెప్పబడింది .కనుక ఇక్కడ అలంకారం ‘’ప్రతి వస్తూపమ’’అంటే విలక్షణ పోలికతో సూచించబడింది .కృష్ణుడికి ,సూర్యుడికి మధ్య సంబంధం సాంకేతికంగా ‘’వస్తు ప్రతి వస్తూభావ ‘’ఎలాగంటే రెండిటిలోనూ ఒకే రకమైన గుణ౦ రెండువిభిన్న  వాక్యాలలో రెండు సార్లు ఆపాది౦పబడింది కనుక .అంటూ వివరణ ఇచ్చాడు సూరి మహాశయుడు .

మరో ఉదాహరణ –కిరాతార్జునీయం 2-8 శ్లోకం’’ విషమేపి విగాహయతే నయః కృత తీర్ధః ప్రయసాభి వాశయః

సతు తత్ర విశేష దుర్లభః సదుపన్యాస్యాతికృత్య వర్తమా యః ‘’లో యుద్ధ తంత్రాన్ని సరస్సు  తో పోల్చాడు భారవికవి .కనుక అందులో పదాల అర్ధాలు అనుమానాస్పదం గా ఉంటాయి .అవి రెండిటికీ వర్తిస్తాయి .కవి హృదయాన్ని విప్పి చెప్పటానికి శ్లోక౦ లోని భావాన్ని మల్లినాధుడు చాలా చక్కగా విశదీకరింఛి తన వ్యాఖ్యాన నైపుణ్యానికి అద్దంపట్టాడు .వాటి అర్ధాలను ఇలా తెలియ జేశాడు-‘’విషమేపి’’ పదం –యుద్ధ తంత్ర విషయం లో ‘’దుర్బోదోపి ‘’అంటే తెలుసుకోలేనంత అని, సరస్సువిషయం లో దుష్ప్రవేశేపి –అంటే చేరలేని ,లేక దుర్గమమైన అనే అర్ధాలు చెప్పాడు . ‘’కృత తీర్ధః ‘’పదానికి క్రుతాభ్యా సాదు పాయః ‘’అంటే-ఎంతో ప్రయత్నం చేస్తే కాని అని యుద్ధ విషయం లోను ,క్రుతజలావతారః అని అంటే దిగటానికి మెట్లు అని  సరస్సు విషయం లోను ,’’కృత్యవర్త్మ’’శబ్దానికి –సంధి విగ్రహాది కార్యం అని యుద్ధ పరంగా ,స్నానాదికం అని సరస్సు పరంగా అర్ధాలు చెప్పాడు .అలాగే’’ సత్సాదు ‘’కు ‘’దేశ కాలాది విరుద్ధం ‘’అని అంటే కాలమాన పరిస్తితులను బట్టి అని రణ తంత్ర పరంగా ,’’గర్త గ్రహ పాషాణాది’’అని అంటే గోతులు ,మొసళ్ళు ,రాళ్ళు అని సరస్సు పరంగా అద్భుతంగా అర్ధాలు చెప్పి కవి హృదయాన్ని గొప్పగా ఆవిష్కరించాడు .ఈ శ్లోకం లో ఉపమా అర్ధాంతర న్యాస అలంకారాలు జోడింప బడ్డాయి అని తెలియ జేశాడు .మొత్తం మీద ఇందులోని చర్చాసార పిండితార్ధాన్ని –‘’యదా కేనాచిత్ కృత తీర్దే వయసి గంభీరేపి ప్రవేస్టారః సంతి తీర్ధ కరస్తు విరలః –తద్వార్నీతావాపి గూఢ మపి  తత్త్వం వ తరి బోద్దారః సంతి .-వక్తా తు న సులభః –అతః ఇయం పఠితామపి సాదు వక్తీతి యుజ్యతే విస్మయ ఇత్యర్ధః ‘’అని ముగించాడు .’’రూడ్ బెర్జెన్ ‘’దీనిపై వ్యాఖ్యానిస్తూ సరస్సులోని లోతైన నీటిలోకి ప్రవేశించాలంటే మెట్లనిర్మాణం  అవసరం .మెట్లు కట్టేవాడు అరుదుగా ఉంటారు .యుద్ధ తంత్రం లో జనం చాలామంది  దాని సారాంశం గ్రహించేవాళ్ళు ఉన్నా కొందరే దాన్ని వివరించగలిగే వాళ్ళు ఉంటారు .కనుక ఇక్కడ ద్రౌపది యుద్ధ విషయం లో యేమాత్రపు శిక్షణ పొందకున్నా యుద్ధ తంత్రాన్ని గూర్చి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది ‘’అని రూడ్ బెర్జేర్ రాసినట్లు లాల్యే పండితుడు పేర్కొన్నాడు

‘’శిశు ‘’లోనే మరొక శ్లోకం లోఅనేక అలంకారాలను కవి గుది గుచ్చాడు .ఖండిత నాయిక ప్రేమికుడిని ఇబ్బంది పెట్టె సన్నివేశం లో ‘’తుమ్మెద సమూహాలు లతలను పరిత్యజించి పుష్పాలను కోసిన స్త్రీలపై పడ్డాయి .అవి ఆ లలితా కోమల పుష్పాలతో మాలలు అల్లే ఆ స్త్రీల చుట్టూ మూగి రొద చేస్తూ తిరుగుతున్నాయి ఇక్కడ పౌరధర్మఅవగాహన అంత ప్రాముఖ్యం పొందలేదు ‘’-ఆశ్లోకం –‘’అవిచిత కుసుమా విహాయ వల్లీర్యువతిషు కోమలమాత్మమాలినీషు –పదముపదదిరే కులాన్యాలీనాం న పరిచాయో మలినాత్మానాం ప్రధానం ‘’ఇక్కడ మలినాత్మనాం దుర్మార్గుడు తనలోని నల్లదనాన్ని కరగిచుకొని అతిక్రమించటం .కనుక ఇక్కడ’’అతిశయోక్తి ‘’ఉన్నది .తేనెటీగల సహజ స్వభావం ఇక్కడ చెప్పబడింది .మలినాత్మ పదానికి నలుపు అని కౌటిల్యం లేక దుష్టత్వం అనే రెండు అర్ధాలు ఉండటం వలన అతిశయోక్తి ఉన్నందున రెండు అలంకారాలు ప్రత్యేకంగా ముఖ్యమైనది ,దానిపై ఆధార పడిందీ  ఉండటం వలన ‘’సంకర అలంకారం ‘’అయిందని –‘’అత్ర మలినాత్మనా మితి కృష్ణాంగారస్య దుస్ట చిత్తత్వేన సహభేదాధ్యాసా యేనార్ధాంతర న్యాసస్తాపనం శ్లేష ప్రతి బౌద్ధాపి తాతిశయోక్తానుప్రాణితోయామితి ‘’సంకరః ‘’అని తేల్చాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-12-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -23 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-2

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -23

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-2

అలంకారాలను కలిపే విషయం లో మల్లినాధుడు స్పష్టమైన వివరణలిచ్చాడు .శిశుపాలవధ -1- 89 శ్లోకం లోకంసుని ఇతర రాజులను లేడి తో పోల్చిన సందర్భం లో  ఉన్న అలంకారం ,’’శ్లిష్ట పరంపరిత రూపకం ,ఉపమాలంకారం తో కలిసిన మిశ్రమాలంకారం అని చెప్పాడు మరొక వాక్యం లో సింహం హరి(కృష్ణ ) రూపం లో ఉన్నదని చెప్పాడు.మరో చోట రాక్షసులు ఏనుగులు అన్న శ్లోకం లో రూపకాలంకారం ఉందన్నాడు .అసురపై ద్విశ  అధ్యారోపణ ,హరి(సింహం ) పై హరి (కృష్ణ )ను అధ్యారోహణ౦ చేసినప్పుడు శ్లేష లో  చెల్లుతుందని చెప్పాడు .ఇలాంటి సంకర అలంకారాలను మొదటి సారి లోకం దృష్టికి తెచ్చినవాడు మల్లినాదుడే .

ప్రామాణిక అలంకార శాస్త్రం లోస్పష్టంగా నిర్వచించ బడిన  చెప్పబడిన అలంకారాలను మల్లినాధుడు గుర్తించి ముఖ్య మైన అలంకారాలను వివరించాడు .కొన్ని ఇతర అలంకారాలు ఉంటె అర్దాలంకార ,శబ్దాలంకారాల సంసృస్టిలేక రెండూ గా భావిస్తూ మరిన్ని అలంకారాలను ఆయన గుర్తించి చెప్పాడు .కిరాతార్జునీయం -4-41  శ్లోకం –‘’భవ కీతయే హత వ్రుహంతమసమవబోధ పారి రజసః శమనం –పరిపీయ మాణానివ వో సకలే స్వసాదమే తినాయనా౦జలిభిః’’’’ లోని అలంకారం విషయం లో అందులో 1-శ్లిష్ట రూపక 2-రూపక 3-ఉత్ప్రేక్ష 4-సంకర అనే నాలుగు అల౦కా రాలున్నట్లు గుర్తించాడు  .  ‘’అవబోధ వారి ‘’శబ్దం లో  రజస్అంటే దుమ్ము అయితే వారి అంటే నీరు అయి ప్రాముఖ్యం పొందింది అన్నాడు  .దుమ్ము కుదుటబడటాన్ని’’సామన ‘’శబ్దం రూపకం గా సూచించిందని చెప్పాడు .భారవికవి అవబోధ జలాన్నివనదేవతల దోసిలి అనే  కనులు తాగాయని ,వివరించాడు ఇది ఉత్ప్రేక్షాలంకారమే నని కారణం రెండూకూడా స్వతంత్రమైనవే అని ఇక్కడ అలంకారాలు సంస్రస్టి చెందాయని తెలిపాడు ..మరో చోట పరిణామ ,రూపక అలంకారాల మధ్య తేడాను స్పష్టం చేశాడు .’’రూడ్బెర్జెన్ ‘’మహాశయుడు మల్లినాద  అనతరంగాన్ని విశ్లేషించి చెప్పినదాన్ని ఇక్కడ తెలుసుకొందాం –‘’యత్ర ప్రకృత కార్యోపయోగితాయ విషయ విషయ్యాత్మనా పరిణమితిస పరిణామాలంకారః  ‘’–‘’ఏకావలి పై వ్యాఖ్య రాస్తూ మల్లినాధుడు తరువాతి దానిపై ఒక విషయం ఆరోపిస్తేఅక్కడ విచారణలో ఉన్న  విషయం ఉపయోగపడేది అయితే అది ‘’పరిణామ అలంకారం ‘’.ఇలాంటి సందర్భాలను వివరిస్తూమల్లినాధుడు రూపక ,పరిణామ అలంకారాల మధ్య భేదాన్ని విద్యా చక్రవర్తి భావాలను బట్టి వివరించాడు  .ఏకావలి పై త్రివేది  రాస్తూ శిశుపాల వధలోని అనేక ప్రకరణాలను ఉదాహరించాడు .మల్లినాధుడు విద్యాధరుడు చెప్పిన పరిణామాలంకారాన్నే ఎన్నుకొన్నాడు ‘’అని చెప్పాడు .

ఇప్పుడు మల్లినాధుడు  చర్చించిన  మరికొన్నిఅలంకారాలను చూద్దాం .మహా కావ్యాలలోని ‘’సమాసోక్తి ‘’అలంకారాన్ని చాలా నేర్పుగా వివరించాడు .శిశుపాల వదలోని రాత్రి వేళ కలువల  అందాన్ని వర్ణించే సందర్భం లోకవి  ‘’చంద్రుడు కలువలతో  తెల్లారేదాకా సయ్యాటలు ఆడాడని ‘’చెప్పాడు .అతని చేతులు అంటే కిరణాలు పడమటి వైపుకు సాగిపోతూ వాటిపై విశ్రమించాడు .చంద్రునికి అలసట వచ్చి వివర్ణుడయ్యాడు.చంద్రుని చర్యలు దక్షిణ నాయకత్వాన్ని తలపిస్తాయి .రెండర్ధాల విశేషణాలను వాడటం వల్లనే ఇది సాధ్యం కనుక ఇది ‘’సమాసోక్తి ‘’అల౦కారం అని స్పష్టం చేశాడు .దీనిపై మల్లినాధుడు అతి విస్పష్టం గా విశ్లేషించి చెప్పాడు –శిశుపాల వదలోని 11-22 శ్లోకం –‘’ఉపకుముదవన దీహాస కేళి ప్రసంగా-దధి కరూది రశేశా ప్యుషాం జాగరిత్వా –ఆయమపర దిశో౦కే ముజ్వతి స్రస్త హస్త –శిశియిషురివ పాండుం మ్లానమాత్మా ని మి౦దుమ్’’.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1 of 18,439 Print all In new window — వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -22 మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -22

మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ

అలంకార శాస్త్రం లో మహా పాండిత్య గరిమ ఉన్న మల్లినాధుడు ,తాను వ్యాఖ్యానించిన పంచ మహాకావ్యాలలోని ప్రతి శ్లోకం లో ఉన్న అలంకార వైభవాన్ని వివరించాడు .తాను చెప్పిన అలంకారాన్ని సమర్ధించే అలంకార శాస్త్ర సూత్రాలను చెప్పి ,ప్రత్యామ్నాయాలను కాదనటానికి స్పష్టమైన కారణాలు తెలియ జేశాడు .దీనికి చాలా ఉదాహరణలు ఇవ్వ వచ్చు .అందులో మహా కావ్యాలలోని కొన్నిటిని  మాత్రమే  తెలుసుకొందాం శిశుపాల వధ 2-42 శ్లోకం  –‘’విధాయ వరం సమర్షె నరోరై చ ఉదాసతే –ప్రక్షిప్యోదర్చిషం కక్షే రోరతేతేభి మారుతం ‘’పై చేసిన వ్యాఖ్యలో ‘’ఆగ్రహించిన శత్రువు తో శత్రుత్వం ప్రాముఖ్యం లేక మార్పు లేని విధంగా ఎదురుగాలిలో నిలవటంలా ఉంటుంది’’ .అన్నాడు శిశుపాల వధ లోనే మరో శ్లోకం లో నిదర్శన అలంకారం ఉందని ,మొదటి వాక్యం లో చెప్పబడిన మనుషులు ,రెండవ వాక్యం లోనూ ఉన్నారని –‘’విశిస్టో దాసీ న్యశయ నయోచాక్యర్ధ యోర్నిర్దిస్టే కత్వా సంభవాత్ –సాదృశ్య లక్షణా యమ సంభ ద్రర్తుసంబందో వాక్యార్ధనివ్రుత్తిరితి నిదర్శనా చేద్’’అని వ్యాఖ్యానించాడు .కనుక ఇక్కడ అలంకారం దృష్టాంతాలంకారం కాదని ,అది రెండువిభిన్న వాక్యాలున్నప్పుడే ,వస్తు ప్రతిబింబం రెండు వస్తువుల మధ్య ఉంటేనే అవుతుందని ,కాని ప్రస్తుత విషయం లో ఇక్కడ ఒకే ఒక వాక్యం మాత్రమె ఉందని  కనుక దృష్టాంతం కాదని స్పష్టం చేసి దానికి బలంగా అలంకార సూత్రాన్ని తెలియ జేశాడు.

శిశుపాల వధ 2-109  శ్లోక వ్యాఖ్యలో దీపకాలంకారం అందులో ఉందని ,దానికి కారణం  బుద్ధి ,కర్మ ,మానస లలో సమాన లక్షణాలున్నాయని ,కాని ఇవి అసంబద్ధంగా ఉన్నాయని సూచించాడు .ఈ సమాన లక్షణం రెండిటిమధ్య పోలికను ఉపమేయ ,ఉపమానాలుగా సూచిస్తుందని అన్నాడు –‘’వాక్య భేదేన ప్రతిబింబ కారణాక్షేపే తస్యో త్ధా నాత్ –అత్ర తు వాక్యార్దేవాక్యార్ధ సమారోపాద్ వాక్య యేవాక్యతయాం తద్భావ ఇత్యలంకార సర్వస్వకారాః’’అని చెప్పాడు అలంకారాలలో ఉన్న రకాలను గురించి చెప్పటం లోమల్లినాధుడు మహా దిట్ట అన్నాడు లాల్యే .శిశుపాల వధలో అర్దా౦తరన్యాస అలంకారాన్ని గుర్తించి ,కారణం వలన ఫలితం రూఢి అయిందని అన్నాడు ఇందులోకారణం కొందరికి స్వీయ గౌరవమే సంపద అని భావిస్తారు .అందులోనే మరో శ్లోకం లో అర్దా౦త రన్యాసం’’సతీవ యోసిత్ ‘’అనే  ఉపమానం పై ఆధారపడి౦దని –‘’మారని ప్రవ్రుత్తి వ్యక్తిని అతనిభార్య లాగా ఇతరలోకాలలో కూడా అనుసరించే ఉంటుంది ‘’అని చెప్పాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-16- ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment