’గీర్వాణ భాషా వైభవం ‘’-4
9- శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీపట్టణం -9849812443
గీర్వాణ భాషా వైభవం
1-సీ –గీర్వాణ భాషలో గీతా మహాత్మ్యమున్ –పరమాత్మ బోధించె పార్థునకును
గీతాలాపనన్ గీతామృతమ్మును –గ్రోలినంతనె కల్గు మేలు మనకు
ఉపనిషత్సారమ్ము నుపదేశమున గీత –సామాన్యులు తరియించ సాధనమ్ము
దైవ సన్నిధి చేరు త్రోవ ను’’ పదునెంది’’-అధ్యాయముల చూపు నదియె గీత
తే.గీ.-భక్తీ పారవశ్యమునొంది ప్రణతులనెడు-రీతి గీర్వాణ భాష పై ప్రీతి గొలుప
స్తోత్ర పారాయణ ము విన సొంపు గూర్చు –దైవ దత్తమగు వరమె దేవ భాష .
2-సీ-గీర్వాణ భాషను నేర్చుకొనిన మేలు –సకల పురాణముల్ చదువ గలరు
వేదసారమ్మునూ విదితమై సంస్కృత –పండితులనుపేరు బడయ గలరు
దేవ భాషను నేర్చి దివ్య తేజము నంది –ఆదర్శమూర్తులై అలరగలరు
శాస్త్ర విజ్ఞానమున్ సార్వజనీనతన్ –సర్వ సమర్ధులై సాగగలరు
తే.గీ.-ఉత్తమోత్తమ గ్రంధముల్ ఉదధి నురుకు –కెరటముల వలె నెల్లరి దరి జేర
తెలుగున కనువదించి యందించ గలరు –జన్మ సార్ధకంబై వారు ధన్యులగును .
3-సీ-పద్య మూలంబగు ‘’పదగతౌ ‘’సంస్కృత- ధాతువుపద్య పథమును నడుపు
నియమ బద్ధమగుచు నిర్ణీత పరిధిలో –హ్రుద్యమంబుగా సాగు పద్య లహరి
భాష యశ్వంబన భావమ్ము రధమైన –ఛందో పధము సాగు సారధి కవి
యతియు ప్రాసలను సంస్కృత భూయిష్ట మౌ –పద్యముల వ్రాయు విద్య ఘనము
తే.గీ-వారసత్వమ్ము నబ్బిన వరమె మనకు –పద్య మన్న నతిశయోక్తి పదము కాదు
శోభ గూర్చెడు గీర్వాణ శ్లోకములకు –తెలుగు పద్య రూపము నిచ్చు తెగువ వరమె.
4-సీ-సాహిత్య సంపద సంస్కృతమ్మునెతొలి-ప్రాడుర్భవి౦చ౦గ ప్రణతు లందె
ప్రాక్రుతుడైనను ప్రాచేతసుడు వ్రాసె-ఆదికావ్యంబు రామాయణమ్ము
సంస్కృత కావ్యముల్ సంస్తవమ్మును చేసె-ప్రాజ్ఞు లు తెలుగున భాగ్య వశము
వ్యాస భారత భాగవతముల్ కవిత్రయం -పోతన వ్రాసిరి రపూర్వముగను
తే.గీ.-తొలుత మునులు పురాణముల్ పలురకములు –దేవ భాషను వ్రాసిరి దివ్యముగను
పిదప భవభూతి కాళిదాసేతరులు ను -విశ్వనాధాది విబుధులు వివిధ కవులు- కలము పట్టిరి భాషపై కాంక్ష తీర .
5-సీ.-సంస్క్రుతమును నేర్చు సంస్కృతి పెరిగిన –దేవనాగరలిపి తెలియవచ్చు
భాష యౌన్నత్యమున్ బాగుగా నెరిగిన –భాషాభిమానమ్ము పట్టు పెరుగు
తరచిన పూర్వ వృత్తాంతము లనెల్ల-మూలపు రాణి ప్రాముఖ్య మెరుగు
ఆ పుణ్య గాధల నద్భుతమగు పాత్ర-లాదర్శ ప్రాయమై యవధరి౦చు
తే.గీ.-రామ చంద్రుని వంటి కుమారు ననగ-సీత వలెసుగుణాల రాశి తనయగను
భారత లక్ష్మణుల వంటి సోదరులుగలుగ-కోరు కుందురు జనులెల్ల కుశల మరసి .
10-శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర –విజయవాడ -8885803170
గీర్వాణ భాష గొప్పతనం
1-మహర్షి వాల్మీకి రామాయణం కడు రమ్యం –దేశ విదేశాలలోఘన
తకెక్కి ,భారతీయుల గౌరవం ఇనుమ –డింప జేసిన సాహిత్యము .
2భారతీయుల సంస్కృతి ఆచార వ్యవహా –రము వ్యాసుని ఉపనిష-
తత్తులు,వేదములు అనుసరణీయము –ప్రపంచం లోగణుతి కెక్కె.
3- రసజ్ఞుల హృదయాలపై చిరు జ-ల్లులు కురిపించు మన
స్సుమై మరపించె దేవ భాష –సుధ లొలుకు కన్న తల్లి.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-11-12-16- ఉయ్యూరు .
.
