గబ్బిట దుర్గా ప్రసాద్
సత్యం బహుముఖీనం
‘’మానవుడు కనిపించేదానికి ఆవల ద్రుష్టి సారించాడు .తనను తాను విస్తృత పరచుకొన్నాడు .దీనినంతా అభివృద్ధి అని ,పరిణామం అని అంటున్నాం .అతని గమ్యం వైపు ప్రయాణానికి,భగవంతుని చేరడానికి వీటితో కోలుస్తున్నాం .ఇదంతా మతం గొప్పతనానికి అంటగడుతున్నాం .దీనితో అతనిజీవితాన్ని భయానకం చేస్తున్నాం .మతం అతనికి ప్రశాంతిని ,ప్రేమను అందించింది .అదేమతం అతనిలో భయాన్ని ,ద్వేషాన్నీ కూడా రగిలించింది .మతం అతనిలో సోదర భావాన్ని పెంపొందించింది .అదే సమయం లో మనిషి మనిషి మధ్య విద్వేష మూ పుట్టించింది .మతమే దాన గుణం తో విద్యా వైద్య సంస్థలను మనుషులతోబాటు జంతువులకుకూడా నెలకొల్పెట్లు చేసింది .ఇదే మతం వాటిమధ్య వైరాన్ని రక్తపాతాన్ని సృష్టించింది .ప్రతి ఆలోచనలో అంతర్గత ప్రవాహం ఒకటి ఉంటుంది అని గ్రహించాలి .ఇదేమనుషులలో విభిన్న పక్షాలకు దారి చూపిస్తుంది .వేదా0తులమధ్య ,భిన్నమతాల మధ్య తులనాత్మక పరిశీలన చేసి అందరిలో సామరస్యాన్ని సాధించే విద్యార్ధుల మధ్య చిచ్చు పెడుతుంది .ఇలా మతం వలన భిన్నమైన తెగల మనుష్యులంగా మారిపోతున్నాం .ఈ సామరస్య సాధన కొన్ని దేశాలలో సాధించగలిగితే ఎన్నో దేశాలలో అది విఫలమైంది .
ప్రపంచం లో ఉన్న గొప్పమతాలన్నీ అతి ప్రాచీనమైనవే .అవి ఇటీవలికాలం లో వచ్చినవికావు అని గమనించాలి .దాదాపు ఈ పురాతన మతాలన్నీ గంగా –యూఫ్రటీస్ నదుల మధ్య మాత్రమె పుట్టాయి .ఇందులో ఏ ఒక్క గోప్పమతమూ యూరప్ లోకాని అమెరికాలో కాని పుట్టలేదని తెలుసుకోవటం ముఖ్యం .ఒక్కటికూడా అక్కడ పుట్టలేదు .అదీ విచిత్రం .ప్రతిమత ఆవిర్భావానికి ఆసియా ఖండమె జన్మస్తలమై,,ప్రపంచ వ్యాప్తమైంది .ఆసియావాసులు మంచి మత బోధక వ్యాపారులని లని పించుకున్నారు .పాశ్చాత్య దేశీయులుసాంఘిక సంస్థలు ,సైన్యం ,ప్రభుత్వాలు మొదలైన వాటి నిర్వహణలో ఆరితేరినవారయ్యారు . మత బోధనా విషయానికి వస్తేమాత్రం ఆసియన్ల కు సాటి రారు .కారణం వీరికి మొదటినుంచి మతం వ్యాపార గుణమైంది .అదివారి రక్త గతం వ్యక్తిగతం. దీనికోసం వాళ్ళు ప్రచార సాధనాలను పెద్దగా ఉపయోగించలేదు .’’
‘’ ప్రస్తుత మానవ సమాజం లో అనేక మతాలు ,పెరుగుతూ విస్తరిస్తూపోతున్నాయి అనేది యదార్ధ విషయం . ఇప్పుడు దీనికి ఒక అర్ధం ,పరమార్ధం ఏర్పడ్డాయి .సృష్టికర్త అయిన భగవంతుడు ఏదో ఒకమతమే ఉండాలని మిగిలినవి కాలగర్భం లో కలిసి పోవాలని అనుకొంటే ఇన్ని మతాలూ ఇన్ని రకాలుగా విస్తరించేవి కావు అన్న సత్యం గ్రహించాలి అందరూ .ఇందులో ఒక మతమే యదార్ధమైనదని మిగిలినవి కావని అనుకోని ఉంటె అదే ప్రపంచమంతా ఈపాటికి ఆక్రమించి ఉండేది .కాని అలా జరగలేదు కదా .ఒక్కమతానికే వ్రేళ్ళు బలమై ప్రపంచమంతా పాకలేదు .కొన్నిమతాలు కొంతకాలం ముందున్నాయి తర్వాత వెనక బడి ఉండచ్చు .ప్రపంచ వ్యాప్తంగా గణాంకాలు సేకరిస్తే కొన్నిమతాలు బాగా పుంజుకొని ముందుకు వెళ్లి కాలప్రభావం వలన ప్రాభవం కోల్పోయి వెనుకడుగు వేసినట్లు గమనించగలం .దీనితో అనేక తెగలు ఏర్పడ్డాయి ‘’.
‘’ఒకమతం తనకే సత్య దర్శనం అయిందని ,దేవుడు తనమతం వారికే సత్యాన్నితమ పవిత్ర గ్రంధం లో అందించాడని .నిజంగా అనుకోని ఉంటె ఇన్ని తెగలు వచ్చేవికావు కదా .అలా ఒకే గ్రంధం లో తన భావనలు నిక్షిప్తం చేసి దేవుడు ,ఆ గ్రందాల విషయం లో పోట్లాటలు పెడతాడా?ఒక వేళ సత్యం ఉన్న ఒక మత గ్రంధం దేవుడే ఇచ్చి ఉంటే,దాన్ని అర్ధం చేసుకోవటం అందరికీ సాధ్యమవుతుందా ?బైబిల్ నే ఉదాహరణ గా తీసుకొందాం .క్రైస్తవులలో ఎన్ని తెగలు ఏర్పడ్డాలేర్పడి నాయో ఎవరైనా చెప్పగలరా ? అది భగవంతుడిచ్చిన సత్య దర్శనమేగా ?మరెందుదుకు ఇన్నిచీలికలు ?అదే పవిత్ర గ్రంధం మీద ఒక్కో తెగ తనకు తోచిన వ్యాఖ్యానం చేసింది .తానే బైబిల్ ను పూర్తిగా అర్ధం చేసుకోన్నానని నొక్కి చెబుతుంది .మిగిలినవారివన్నీ అసత్యాలని బుకాయిస్తుంది .ఇలాగే అన్నిమతాల విషయం లో కూడా జరిగింది అని అర్ధం చేసుకోవాలి ‘’.
‘’ మహామ్మదీయుల్లో, బౌద్దులలో ఇలానే తెగలేర్పడ్డాయి .హిందువులలో లెక్కలేనన్ని ఉన్నాయని తెలిసిన విషయమే .దీన్ని బట్టి తేలింది ఏమిటి ? ప్రపంచ మానవాళి నంతా ఒకే ఆధ్యాత్మిక విధానం లోకి ఒకే ఆలోచన కిందకు తెచ్చిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయని .అందరికీ ఒకే రకమైన నమ్మకాన్ని ,విశ్వాసాన్ని కల్గి౦చ లేమని. .ఇది పూర్తి యదార్ధం .దీనికి మనం భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి .నేను ఏ తెగకు వ్యతిరేకం కాదు .ఇన్ని రకాల తెగలేర్పడినందుకు నాకు మహాదానందంగానే ఉంది .అవి ఇంకా తామర తంపరగా పెరగాలని, విస్తరించాలని నేను కోరుకొంటున్నాను .ఇలా నేను అనుకోవటానికి కారణం ఏమిటి అంటే –ఇక్కడున్న మీరు, నేను, మనమందరం ఒకే రకంగా ఆలోచిస్తే ,ఇంక మనకు కొత్తగా ఆలోచి౦చా ల్సినదేదీ ఉండదు .వస్తువుల మధ్య చలనం జరగాలంటే రెండు లేక ఎక్కువ శక్తులు పరస్పరం ఘర్షణ చెందాల్సిందే .ఆలోచనలలో అభిప్రాయభేదం ,మానవ ఆలోచనల ను మేల్కొల్పుతుంది .ఇక్కడ చేరిన మనమందరం ఒకే విధంగా ఆలోచిస్తే మనం మ్యూజియం లో ఉండే ‘’ఈజిప్షియన్ మమ్మీలు ‘’అయిపోయి ఒకరినొకరు శూన్య దృక్కులతో చూసుకొంటూ అచేతనంగా ఉండిపోతాం .అంతకంటే ఏమీ ఉండదు .ప్రవాహం ఉన్ననీటిలోనే సుడిగుండాలు , అగాధాలు ఉంటాయి .ప్రవహించని మరణ సదృశ నిలవ నీటిలో ఇవేవీ ఉండవు .మతాలు మరణిస్తే తెగలకు ఆస్కారం ఉండదు .అప్పుడు లభించేది స్మశాన నిశ్చల ప్రశాంతి మాత్రమే .మానవాళి ఆలోచనలు సాగినంత కాలం ఈ తెగలు ఉంటూనే ఉంటాయి, ఉండాలి కూడా .భిన్నత్వం ప్రాణి చిహ్నం .అది ఉండాల్సిందే .ప్రపంచం లో ఎంతమంది మనుషులున్నారో అన్ని తెగలు ఏర్పడాలనే నేను ప్రార్ధిస్తాను .అందువలన ప్రతి వ్యక్తీ తన స్వంత ఆలోచన ,స్వయం విధానం రూపొందించుకొని,మత భావాలను సుసంపన్నం చేయాలని నా కోరిక ‘’.అన్నాడు స్వామి వివేకానంద ‘’Many facets of the Truth ‘’లో .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-15- ఉయ్యూరు
లోతైన శాంతి వేదాంతం వైపుకు -2
41 పి హెచ్ కాలం లో ఉంటున్న వారికి విశ్వా౦త రాళ ,వ్యక్తిగత స్థాయిలలో ఒకే విధమైన సమస్యలు ఎదురౌతున్నాయి .మనం ఉన్న సంస్క్రుతికాలం ప్రపంచం లేకుండా సమాప్తమవుతుందా ?అనేది అందరిని వేధించే ప్రశ్న .సత్యాన్ని విస్మరించి బతుకుతున్నామా అనేదీ ఒక ప్రశ్నగా మిగిలింది .దీనికి రెండు రకాల సమాధానాలు కనిపిస్తున్నాయి .అందులో ఒకటి ‘’అటామిస్ట్ సెపరేటిస్ట్’’అయితే రెండవది ‘ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ ‘’.స్తూలంగా ఆలోచిస్తే మనం మెటా ఫిజికల్ అపార్ధీ,కి లోబడి మిగిలిన ప్రపంచం టో సంబంధం లేకుండా గడపటం లేక మనం మనమున్న పరిసరాల లో ఒకరుగా బతకటం అంటే ఒక చెట్టుగానో డాల్ఫిన్ గానో ఒక పర్వతంగానో ఉండిపోవటం .
మనం ఆధునిక వ్యక్తిగత సమాజం లో ఉంటున్నాం కనుక కాలం గురించిన అవగాహన అందరిదీ ఒకటిగానే ఉంటుంది .సభ్య సమాజ సభ్యులమే మంనమంతా. ఆనుభావాలు అందరివీ దాదాపు ఒకటిగానే ఉంటాయి .గాఢమైన ప్రాపంచిక విషయాలు కాలం తోఅంటే ‘’అంతా అయిపొయింది –చివరిదశకు చేరుకోబోతున్నాం అనేదానితో ముడిపడి ఉంటాయి .’’ఇప్పుడు ‘’అనే మాటకు అర్ధమే మారిపోయింది .ఈకాలం లో ఇప్పుడు అంటే ‘’అటామిక్ రిడక్షనిస్ట్ ‘’భావం కనిపిస్తుంది .విస్తృతమైన ‘’ఇప్పుడు ‘’జేనేసిస్ ‘అపోకలిప్టిక్ టైం లైన్ ‘’ ’తోబంధం ఏర్పడి కనిపించదు .మనకు కనిపించేది మనం అనుభవించేదానికి మొదలు ,తుది లేనిది .డాక్టర్లు మొదలైనవారి పరిశోధనలలో ఈ ప్రపంచ విలువ లెక్కకు మించి పెరిగింది .శత్రువు అనే భావం నశించి ,మనమే అంతా అనేది ఏర్పడింది .
ప్రపంచ అగ్రగామి వేదాంతి జిడ్డుకృష్ణ మూర్తి ఎప్పుదూకూడా ప్రజలు ‘’కాల సమాప్తి ‘’ని అనుభవించాలి అని బోధించేవాడు .అంటే పరంపరాగతమైన కాలం ఆలోచన నుండి విముక్తి చెందాలని ఆయన భావం .ఆయన బోధించిన రెండు సిద్ధాంతాలు ఈ నాటి కాలానికి సరిగ్గా వర్తిస్తాయి .మొదటిది ’’ప్రేమ ,శాంతి అనేవి కారణాలేవీ లేకుండానే కలిగేవి ‘’రెండవది ‘’వ్యక్తీ అంటేనే ప్రపంచం .’’
ద్వంద్వంగా,వేరువేరుగా కనిపించే రెండురకాల టైం వరల్డ్స్ అనేవి మనసంస్కృతీ పరంపరలో ,మత భావనలలోనే గర్భస్తమై ఉన్నాయి .అత్యున్నతమైన సంస్కృతీ అనేక శతాబ్దాలుగావిలువలను వెదజల్లి ,ప్రస్తుత కాల ప్రపంచానికి దూరంగా మరో అందని ప్రపంచానికి దారి చూపిస్తున్నాయి .వీటన్నిటి ఫలితంగా ఉన్నత కాలాతీత విలువలు మానవ మస్తిష్కం లోనే ప్రభవించి ఈ ప్రపంచానికి సంబంది౦చి నవిగానే అనిపించి ‘’దేవుడు లేడు’’అన్నభావనకు తప్పుగా సంకేతాలిస్తున్నాయి .ఇవి మతానికి వ్యతిరేకం అని కూడా అనిపిస్తుంది .ఇదే ప్రముఖ వేదాంతులు స్పినోజా ,ఫ్యూయర్ బాచ్ విషయం లో జరిగింది .నిజానికి వారిద్దరూ ఈ ప్రపంచం లో ఆధ్యాత్మిక భావనలు నెలకొల్పినవారే .
స్థూల జగత్తుకు సూక్ష్మ జగత్తుకు మధ్య అతి సన్నిహిత సంబంధం ఉన్నదని అందరికి తెలిసిన విషయమే .ఇది అనాదిగా విస్తరిల్లిన భావమే .’’టావోయిస్ట్’’వేదాంతం లోను ,పశ్చిమ దేశ వేదాంతం లోను చెప్పబడినదే .పదహారవ శతాబ్ది వైద్య శాస్త్రవేత్త,దార్శనికుడు ‘’పెరాక్లియాస్ ‘’కూడా ఈ భావాన్ని వ్యాప్తి చేశాడు .ఎవరేమి చెప్పనా ప్రతి వ్యక్తీ ఒక సూక్ష్మ ప్రపంచమే .అన్నికాలాల్లో అందరు మానవుల కు ప్రతినిదియే అనేది సార్వకాలిక సత్యం .
ఈ స్థూల సూక్ష్మ భావన భౌతిక ప్రపంచం లో ఏ కాలం లో జరిగే సంఘటన అయినా మనిషి వ్యక్తిగత మనసుపై ప్రతిఫలిస్తుంది .ఫిలాసఫర్ ‘’జంగ్ ‘’పైదానినే ప్రతి దిన సంఘటనలో కూడా జరుగుతుందని చెప్పాడు .ఆయన ‘’సింక్ర నాసిటి’’అనేకొత్త శబ్దాన్ని దీనికోసంవాడాడు .దీనిపై సమగ్రంగా చర్చించి ‘’An Acausal connecting principle ‘’గా రాశాడు .కోట్లాది ప్రజల విషయం లో ఈ సింక్రనిష్టిక్ అనుభవం వారి జీవితాలలో ఒక భాగమై ఉంటుంది .దీనివలన ఆంతరంగిక శాంతి ,సానుభూతి సహవేదన ఏర్పడి అనంతమైన సంతోషం ఆనందాలను పొండుతాడువ్యక్తి .ఇది గుర్తించటానికి వీలులేనంతగా ఉంటుంది. అవి అసాధారణమై ఉంటాయి .ఏ గణాంకాలు సర్వేలు వీటిని గుర్తించలేవు .ఈ రకమైన భావాత్మక అనుభవాలు పశ్చిమ దేశాలలోకంటే ప్రాక్ దేశాలలో ఎక్కువగా కనిపించటం విశేషం .
ఈ శతాబ్దపు చివరలో విలియం జేమ్స్ ఒక క్రమ పద్ధతిలో ఈ అనుభవాలపై మతాతీత౦గా విశాల దృక్పధం తో పరిశోధింఛి రికార్డ్ చేశాడు .దీనితో కాలానికి సంబంధించిన కొత్త పదజాలం ఏర్పడింది .రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ,ధనాత్మక ఆలోచనాభివ్రుద్ధితో ఇంకా పరిశోధన1969 లో సాగింది .దీనికోసం మెరైన్ బయాలజిస్ట్ ఆలిస్టార్ హార్డీ ఆక్స్ ఫర్డ్ లో ఒక రిసెర్చ్ సెంటర్ ను ఏర్పరచాడు .దీనిని ఇప్పుడు ;;’’ఆలిస్టార్ హార్డీ రిసెర్చ్ సెంటర్ ‘’గా పిలుస్తున్నారు .
ఈ రకమైన భావనలు పరిశోధనలు మనసమాజాన్ని మళ్ళీఅనంత మనవ సంబంధాలకోసం అర్రులు చాచేట్లు చేస్తున్నాయి . .ఇది విశ్వవ్యాప్తమై కాలానికి తగినదిగా విస్తరించింది .ముఖ్యంగా హీరోషీ మా ఉదంతం తరవాత వచ్చిన గొప్ప గుణాత్మక మార్పు ఇది .ప్రముఖ రచయిత ఆల్డస్ హక్స్లీ ‘’రాజకీయ సిద్ధాంతాలు సార్వకాలికమైన వేదాంత మూలాలనుండే వస్తాయి .అవి సహిష్ణుతను ,అహింసను బోధిస్తాయి ‘’అన్నాడు .ఈ వేదాంత భావనలు సూటిగా మెటాఫిజికల్ విముక్తి అనుభవాల ఆధారంగా ఏర్పడ్డవే ఈ ఉత్తమ అనుభవ దృష్టాం తాల నుండి వచ్చిన రాజకీయ నిర్ణయాలు ఇంకొంచెం లోతుగా అధ్యయన వేదికలవ్వాలి . సూటి అనుభవాలనుండి వచ్చిన ఈ కాలాతీత విలువలు సహజ ,సాధారణ జీవిత0 లో మమేకమై ,రాకకీయాలలో చేరి చివరకు మెటా ఫిజికల్ విముక్తి కారణాలౌతాయి .
పశ్చిమ దేశ వేదా౦తు లలో అగ్రగణ్యు డైన ‘’స్పినోజా ‘’ఈ ప్రపంచాన్ని అనంతమైనదిగా భావించాడు .శాంతిని నిర్వచించాడు .అందులో ‘’శాంతి అంటే యుద్ధం లేక పోవటం కాదు. శాంతిమనిషి హృదయపు శక్తి లో నుంచి జన్మించిన ఒక నైతిక ధార్మిక ప్రవరరతనా గుణం ‘’అన్నాడు (peace is not the absence of war –it is a virtue born out of the strength of the heart ‘’’-ex animi i fortitudine)అన్నాడు .ఈ ప్రపంచం అనంతమైనది కనుక పవిత్రమైనదిఅనుకొన్నవాడు ఈ భూమికి తగిన వారసుడే .అలాంటి వాడి మనసులో మైక్రో సెకండ్ కాలం లోకూడా ప్రపంచ వినాశనాన్ని తలపెట్టడు .అది వాడి సంస్కారం అవుతుంది .
కనుక ఏతా వాతా తెలి౦దేమిటి అంటే శాంతి అంటే ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొని గుణాత్మక శాంతి వేదాంతం అనంత కాలాతీత విలువల ఆధారంగా ఉండాలిఅని . .పశ్చిమ దేశావాసులుకూడా భారతీయమైన ‘’అహింస ‘’ను అవలంబించాలి .నాన్ వయోలెన్స్ అంటే వ్యతిరేకార్ధం వచ్చే భావన దూరమవ్వాలి .మొదలు చివర అనేవాటికి వాటి ఉపయోగాలు వాటికి ఉన్నాయి .ఫ్యూర్ బాచ్ చెప్పినది అందరికీ ఆలోచనానుసరణం కావాలి ఆయనమాటల్లో చెబితేనే దాని ఎఫెక్ట్, అందం –‘’it was granted only to a few to ‘’see the end of the present ,to be raised beyond its boundaries and to feel through the hard skin and crust of the currently secure maxims and principles to the eternally bubbling spring of eve lasting life –to press into the depths and perceive the pulsebeat of the creative new time ‘’
ఇప్పుడు కొద్దిమందే ఉండవచ్చు .క్రమంగా బాగా పెరగాలి సంఖ్య.ఫ్యూర్ బాచ్ ‘’History teaches us that when something stands at the very verge of its total destruction ,it once again raises itself with all its force ,as if it wished to begin anew its already finished course of life ‘’’
ఈ వ్యాసానికి ఆధారం –‘’దర్శన ఇంటర్నేషనల్’’ -1986 జనవరి లో ‘’జాన్ ఫ్రాన్సిస్ ఫిప్ప్ ‘’రాసిన ‘’Towards a deeper philosophy of peace ‘’వ్యాసం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-15- కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు కాకతీయుల చరిత్రపై అధ్యాయనం చేసి అనేక గ్రంథాలు రాసిన డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రికి భారత చారిత్రక పరిశోధనా మండలి (ఐసిహెచ్‌ఆర్) జాతీయ ఫెలోషిప్‌ను ప్రకటించింది. డాక్టర్ పరబ్రహ్మశాస్త్రితో పాటు బెనారస్ హిందూ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఠాకూర్ ప్రసాద్ వర్మకు కూడా ఫెలోషిప్ దక్కింది. 1921లో గుంటూరు జిల్లా పెదకొండూరులో పరబ్రహ్మశాస్ర్తీ జన్మించారు. గురుకుల పద్ధతిలో సంస్కృతం చదువుకున్నారు. జాతీయ ఫెలోషిప్ కింద ఆయనకు నెలకు 55వేల రూపాయిలు చొప్పున రెండేళ్లపాటు గ్రాంట్‌ను అందిస్తారు. దీనికి అదనంగా ఏటా మరో 60 వేల రూపాయిలను ప్రస్తుత పరిశోధనలకు వెచ్చించేందుకు ఇస్తారు. యావజ్జీవితం శాసన పరిశోధనలకు అంకితమైన వాసుదేవ పరబ్రహ్మశాస్ర్తీ ఆంధ్రచరిత్రకు ఆకరాలు అందించారు. శాసనాధారాలతో కాకతీయ వంశానుక్రమణిక, శాతవాహనుల గురించి లోతైన నికార్సయిన అధ్యయనం చేసిన ఏకైక పరిశోధకుడు పరబ్రహ్మశాస్ర్తీ. నాణాల పరిశీలనతో శాతవాహన శకాల నిర్ణయం చేసి పరిశోధకుల మెప్పు పొందారు. కాకతీయ వైభవానికి సంబంధించి కొన్ని అంశాలను గుర్తించి అజ్ఞాతంగా ఉన్న శాసనాలను వెలికి తీసి ప్రామాణిక గ్రంథాలను రచించారు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న చరిత్రను విశ్వవిఖ్యాతం చేసిన పండితుల్లో అగ్రగణ్యుడు. గ్రామాలకు వెళ్లి అసలు చరిత్ర ప్రజల జీవన విధానంలోనే ఉందని గుర్తించి, అదే తపనతో ఆ సమాచారాన్ని ఒడిసిపట్టుకుని ఏ హంగులూ లేని కాలంలో అద్భుతమైన యజ్ఞం చేశారు. సంస్కృతం మీద ఉన్న పట్టుతో ఎన్నో బ్రహ్మీ లిపి శాసనాలను అవలీలగా పరిష్కరించడమేగాక, లిపి పరిణామాన్ని కూడా వివరించి పండితులను మెప్పించారు. 12 గ్రంథాలు రాసిన పరబ్రహ్మశాస్ర్తీ శాసనాల్లో ఉన్న అన్నమాచార్య కీర్తనల పుస్తకానికి సహ సంపాదకత్వం వహించారు. 94 ఏళ్ల ప్రాయంలో సైతం పరిశోధనల్లోనే మునిగి తేలే వారి జీవితం భావి పరిశోధకులకు ఆదర్శప్రాయం.
1938లో పరబ్రహ్మశాస్ర్తీ మద్రాస్ రెసిడెన్సి నుండి ఎస్సెస్సెల్సీ ఉత్తీర్ణులయ్యారు. కాశీలో సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించిన పరబ్రహ్మశాస్ర్తీ కర్నాటక ధార్వాడ్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో డాక్టరేట్ పొందారు. 1959 నుండి పురావస్తుశాఖలో దీర్ఘకాలం పనిచేసి పదవీవిరమణ చేశారు. తెలుగువిశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్శిటీల్లోనూ కొంత కాలం పనిచేశారు. 500 బిసిలో ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక ఆర్ధిక పరిస్థితులపై పరిశోధనలు చేశారు. అనేక ప్రసిద్ధ జర్నల్స్‌లో పరబ్రహ్మశాస్ర్తీ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
లోతైన శాంతి వేదాంతం వైపుకు
‘’ఇక నుండి పురాతన ,మధ్యయుగ, ఆధునిక యుగ చరిత్ర అనే పేరుండదు .ఇప్పటినుండి పూర్వ అణుకాలం ,అణుకాలం అనే పిలవాల్సి ఉంటుంది .కొత్త చారిత్రిక కాలాన్ని ఆవిష్కరించుకోవాలి ‘’అన్నాడు 19 49 లో హీరోషీమా ఉదంతం జరిగిన నాలుగేళ్ళతర్వాత మొట్ట మొదట సారిగా ప్రచురించిన ‘’ఫిలాసఫీ ఆఫ్ పీస్’’ పుస్తకం లో జాన్ సోమేర్ విల్లీ .మన ప్రస్తుత కాలెండర్ మన ద్రుష్టిని 6-8-19 45మరల్చి మానవ చరిత్రలో ఒక విభజనను ఏర్పరచి ,యేసు క్రీస్తు పుట్టినకాలం కంటే అత్యధిక సంచలనమే సృష్టించింది ..కనుక ఈ సంవత్సరాన్ని,1986A.D అనటం కంటే 41 పోస్ట్ హెచ్ (41post H)అని పిలవాలి .ఇది ఒక మానసిక వ్యాయాయమే .ఇది మన దృక్పధం అంతా మార్చేస్తుంది .ఇదేమీ కొత్తకాదు .ఆర్ధర్ కెప్లర్ సుమారు వందయేళ్ళ కిందటే ఇలాంటి కేలండర్ ను వాడమని సూచించాడు .కాని అయన ఆలోచనలను ఎవరూ పట్టించుకోలేదు .
1945ఆగస్ట్ 6 కు ముందున్న శతాబ్దం కు సంబంధించిన కాలం ఇంకా కాలగర్భం లో సుప్తంగానే చీకటిలో ఉండిపోయింది .ఇది అటామిక్ కార్డ్ ను పూర్వకాలానికి కలిపేదే .హీరోషీమా అటామిక్ బాంబ్ ఉదంతం తర్వాత బతికి ఉన్న వారిని అధ్యయనం చేస్తూ రాబర్ట్ లిఫ్టన్ ‘’హిబా కుష ‘’ తమకు ఇంతకంటే శక్తి వంతమైనదేదీ తామున్న పరిస్తితులలో సాయం చేయగలిగినది కనిపించలేదని పదే పదే చెప్పినట్లు గుర్తు చేసు కున్నాడు .
ఇంతకీ హిబా కుష అంటే ‘’చావులో మునిగిపోయిన ‘’లేక’’ విస్ఫోటన బారిన’’ పడిన అని అర్ధం .ఆది భౌతిక (మెటాఫిజికల్ ), మానసిక (సైకలాజికల్),భావాత్మక (ఎమోషనల్)ముగా మనమందరం విస్ఫోటన బాధితులమే .లోతుగా ఆలోచిస్తే మనమందరం( ‘’హిబా కుష )లమే .
క్లాడ్ లాంజ్ మాన్ అనే ఆయన ఆమధ్యనే తొమ్మిది గంటల సినిమాను ఈ హోలోకాస్ట్ గురించి తీశాడు . ఆ ఉదంత ప్రభావం క్రానాలజిపై మొదట పడి దాన్ని విచ్చిన్నం చేస్స్తుందని తెలిపాడు .ఈ మారణ హోమం జ్యూయిష్ హోలోకాస్ట్ కు వర్తిస్తుంది .అంతే కాక ఒక మిలియన్ హీరోషీమా వాసులు అంతరించిపోవటానికి కారణమైంది కూడా .ఇంత భారీ అనంత మానవ హనననం పశ్చిమ దేశాల ఆలోచనననే మార్చేసింది .
దీనితో మనం ఉన్న సాధారణ కాలమానాలు ,వాటిపై ఇప్పటికి ఉన్న అభిప్రాయాలు మార్చుకోక తప్పదనిపిస్తోంది .ఆకాలం మనల్ని అణగ తోక్కిపడేసింది ,పెత్తనం చేసింది . లేవకుండా చేసింది .తప్పించుకొని పారిపోకుండా ,చావు నుండి తప్పించుకోకు0డాకూడా చేసింది . ఇంకే విధమైన సంస్కృతీ ఇంతటి ‘’చావు కాలాన్ని ‘’(కిల్లింగ్ టైం )ఆలోచించి ఉండలేదు .దీనితో క్షీణత,వినాశనం, చావు లపై ద్రుష్టి ఎక్కువై సృజన ,నివారణ కాలం గురించి ఆలోచించలేదు .ఒడిలో పసిపాపను౦చు కొన్న బాలింత యువతీ కాలాన్నిగూర్చి ఆలోచించలేదు .కాని ఈ తర్వాతి కాలం-‘’ చావు-కాలాల ‘’ మధ్య దానితో సంబంధం కలిగి ఉన్నదికదా .
ఈ నాటి ఆధునిక సమాజం సమస్య ఏమిటి అంటే మనం కొత్త పురాణ కధలు ,భావ చిత్రాల గురించి మంచిగా ఆలోచించ లేక పోతున్నాం .మనది ‘’మైతో పొయేటికల్ పెర్సే ప్షన్ ఫైల్యూర్ ‘’అన్నాడు రసెల్ హోబాన్ .కనుక ఇది ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి .అందుకని ఆటం బాంబ్ తో మొదలు పెడదాం .అది యదార్ధమేకాక మనందరి శత్రువుకూడా .
ఇప్పుడు మనం ఒక ప్రత్యేక సంస్కృతీ అంచున ఉన్నాం .నిజంగా చెప్పాలంటే హీరో షీమా ఉదంతం తర్వాత ఆ అంచును కూడా దాటేశాం .దీన్ని అంటిపెట్టుకు వచ్చిన కాలం ,చరిత్రలను అంటిపెట్టుకొని ఉంది .అందుకే కాలం లో మిలియన్ సెకండ్ లలో భిన్నంగా అంటే ‘’నానో సెకండ్ ‘’గా మార్చే ప్రయత్నం జరిగింది
ఈ ఉదంతం తో ఒక సంస్కృతీ మిగిలిన వాటిపై విజయం సాధించినట్లు అనిపిస్తుంది .ఇదే సంపూర్తిగా ‘’టోటలిటేరియనిజం’’ (నియంతృత్వం)గా మారింది .ఇప్పటిదాకా ‘’హీబా కుష’’అంటే క్రిస్టియన్ బాంబ్ అనే పేరు సార్ధకమైపోయింది .
హీరోషీమ బాంబ్ బ్లాస్ట్ తర్వాత దానికి దగ్గరలో ఉన్న ఒక కేధలిక్ ప్రీస్ట్ బాంబు విస్ఫోటన సమయం లో తన ‘’గోడ గడియారం ఆగిపోయినట్లు’’ గుర్తించాడు. ఆ మూగ కదలలేని గడియారం జరిగిన మానవ మారణ కాండకు సాక్షిగా నిలిచింది .హిబా కుష లకు మాత్రం పాత ప్రపంచకాలం ఆగిపోయిందని మనకుకూడా టైం వరల్డ్ కూడా6-8-1945కు సమాప్తమై పోయిందని అనిపిస్తుంది .హీరో షీమ ఒక ‘’పార హిస్టారిక్ ఈవెంట్ ‘’ను సూచిస్తు0దని అన్నారు .దీనితో మనమంతా మామూలు పడమటి చారిత్రిక విధానం నుంచి దాటి జీవిస్తున్నాం .ఇప్పుడు మనం వాస్తవంగా ప్రపంచ వినాశనానికి ముందుకాలం దాటివచ్చి ‘’ ప్రపంచ వినాశన’ఆన0 తర కాలం ‘’లో జీవిస్తున్నాం .
ఆధారం ‘’దర్శన ఇంటర్ నేషనల్ -1986 జనవరి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-15 –ఉయ్యూరు
విశ్వనాధ సాహిత్య యుగ దశలు
విశ్వనాధ సాహిత్య యాత్రాను గమనిస్తే అందులో విభిన్న దశలున్నట్లు కనిపిస్తాయి పరిశీలకులు అందులో ముఖ్యమైన నాలుగు దశలను గుర్తించారు విశ్వనాధ కూడా వాటిని అంగీకరించాడు .వాటి వివరాలూ ఆయనే చెప్పాడు .వాటిని గురించి ఇప్పుడు తెలుసుకొందాం .
విశ్వనాధ సాహిత్య యుగం లో మొదటి దశ ‘’బాల్యావస్థ ‘’ప్రయత్నాలు చేయటం అధ్యయనాలు సాగించటం ,ప్రయోగాలు చేయటం ఇందులో ముఖ్యమైనవి .
ఆయన సాహిత్య యుగపు రెండవ దశ ‘’యోగ వంతమైన కాలం ‘’అని ఆయనే చెప్పుకొన్నాడు .ఆ దశలో సంస్కృతం ఇంగ్లీషు బాగా చదివాడు .ఈకాలం లో మచిలీపట్నం హిందూకాలేజీ లోను గుంటూరు ఏ సి కాలేజీ లోను లెక్చరర్ గా పని చేశాడు .అప్పుడే సంస్క్రుత కావ్యాధ్యయనం చేస్తూ సంస్కృత ,నాటకాలను ,ఆంగ్ల రచనలను కూలంకషంగా అభ్యసించారు .
మూడవ దశ 1938లో ప్రారంభమైనట్లు ఆయనే చెప్పాడు .ఆకాలం లోనే విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఉపన్యాసకునిగా చేరాడు .19 34లోనే రామాయణ కల్ప వృక్ష రచన ప్రారంభించి రెండు వేల పద్యాలలో పదహారు వందల పద్యాలు పూర్తీ చేశాడు కాని పుస్తకం పూర్తీ అయితే ఎలా అచ్చువేయాలో ఆయనకు తెలియలేదు .’’నేను నిత్య చైతన్యం గల రచయితను .నా పుస్తకాలను సరిగా పరిచయం చేయగల పండితుడు నాకు లభించటం చాలా అరుదు .నా పుస్తకాలలోని పదాలను తెరచి చూపగల వాడు నాకు దొరకడం లేదు .నాకు తెలియని అందాలను కూడా చూపించే సమర్ధుడు అలభ్యం ‘’అన్నాడు విశ్వనాధ .
ఆయన కవితాలు చాలాభాగం ప్రచురితమై ఆయన్ను కవిగా చేసి కూచోబెట్టాయి .అప్పటికి ఆయన్ను పాక్షికంగా కొందరే అంగీకరిస్తున్నారు .తనకు ఫాలోయింగ్ బాగా తక్కువగానే ఉన్నట్లు భావించాడు .రామాయణాన్ని పూర్తిగా ప్రచురిస్తే అందులోని గూఢమైన విషయాలు గుర్తించకుండా పోతాయేమోనని వ్యధ కూడా చెందాడు .రామాయణ ప్రచురణకు ఎవరైనా స్పాన్సర్ గా వస్తారేమో నని ఎదురు చూపులో ఉన్నాడు.తనకు సహాయం కావాలని తనను విస్తృతంగా చదవాలని కోరుకున్నాడు ‘’ప్రజలు నా కవిత్వాన్ని ,నా కళా వైదగ్ధ్యాన్ని అర్ధం చేసుకోలేరు .నేను వచనం లో రాస్తే వారు బాగా అర్ధం చేసుకో గలుగుతారు ‘’ఇలా ఆయన ఆలోచనలు సాగుతున్నాయి .
అదేసమయం లో వేయిపడగలు ఒకవార పత్రికలో ధారా వాహికంగా ప్రచురిస్తామని విశ్వనాధ విద్యార్ధి అయిన దాని సంపాదకుడు తన పత్రికలో ప్రచురిస్తానని కోరాడు .దీనినైనా అర్ధం చేసుకోగలుగుతారా అనే అనుమానం ఆయన్ను వదలలేదు వెంటాడుతూనే ఉంది .దాన్ని అర్ధం చేసుకోవటానికి క్షున్నమైన సంస్క్రుతజ్ఞానం ఉండాలి అంటాడు విశ్వనాధ ముందుగా రెండు నవలలు రాసి పాఠకుల స్థాయిని పెంచి వేయిపడగలు చదివి అర్ధం చేసుకొనే స్థాయి కల్పిస్తానని ఆ సంపాదకుడిని అడిగాడు .ఆయన ఒప్పుకున్నాడు .అప్పుడే ‘’మా బాబు ‘’నవల చాలా ఇళ్ళల్లో సామాన్యం గా అర్ధం చేసుకొనే వ్యవహారిక భాషలో రాశాడు .కాని దీనివలన శత్రు వర్గం పెరిగింది ‘’నేను సనాతన కాలపు రచయితనని ,కొత్త పరిణామాలను ప్రతిఘటించే వ్యక్తినని ముద్ర పడి పోయింది ‘’అని చెప్పాడు విశ్వనాధ .
వేయిపడగలు సీరియల్ ప్రారంభమైంది .ఇంకా అందులోని రహస్యాలను అర్ధం చేసుకోగల స్తితిలో చదువరులు లేరు అనే అభిప్రాయమే ఆయనది .’’ఒక పెద్ద కాన్వాసు పై చిత్రించిన విషయాన్ని అర్ధం చేసుకొనే స్థాయి పాఠకలలో రాలేదు.’’కొన్ని చివరలను కలిపి ఒక కధలో రహస్యం గా నేర్పుగా అల్లాను .దీన్ని చదివి నేను కరడుగట్టిన సనాతన వాదిని ‘అని గగ్గోలు పెట్టారు’’అని పాపం విశ్వనాధ నిర్వేదం చెందాడు .ఇవన్నీ 1938 కి ముందు .అప్పటిదాకా ఆయన నవలా రచయితకాడు .ముఖ్యంగా కవి మాత్రమె .’’ఏకవీర ‘’రాసి చాలాకాలమైంది ‘’భారతి ‘’లో ప్రచురితమైంది తనను విస్తృతంగా జనం చదవాలి అని కోరుకున్నాడు .
ఇక మొదలు పెట్టి వరుసగా నవలలు రాసిపారేశాడు .ముప్ఫై ఏళ్ళలో యాభై నవలలు రాశాడు .రాయటం ఒక వ్యసనం గా మారిపోయింది విశ్వనాధ కు .సమర్ధుడైన రాయసకాడు ఉంటె నవల చెబుతూ పది పదిహేను రోజుల్లో పూర్తీ చేసేవాడు .ముక్త్యాల రాజా ఆహ్వానిస్తే వెళ్లగా రచన పూర్తీ అయితే కల్ప వృక్షాన్ని అచ్చు వేయిస్తానని వాగ్దానం చేశాడు . . ఇంకా బాలకాండలో కొంత మిగిలిఉంది అప్పటికి .బాలకాన్డను ఆంద్ర దేశం లో చాలా చోట్ల చదివి వినిపించాడు విశ్వనాధ .సాహిత్య వర్గాలలో మంచి ప్రాచుర్యం పొందింది .బాలకాండ పూర్తీ చేసిన తర్వాత దాన్నిముక్త్యాలరాజా ముద్రించాడు .అయోధ్య మొదలెట్టి చాలాకాలమైనా సహాయం చేసేవారు కరువైనారు .అప్పటిదాకా ఆయన రచన ఏదీ పూర్తియిన తర్వాత ఇంట్లో నిద్రించి ఎరుగదు. హాట్ కేక్ లాగా ముద్రణ జరిగి పోయేది .
నాలుగవ దశ19 40 తోప్రారంభామై 61 వరకు సాగింది . 19 40 -50 కాలం లో నవలలే ఎక్కువ రాశాడు .61 వరకు ఇంతే 19 5 6 లో గుడివాడ కరీం నగర్ లలో షష్టిపూర్తిఉత్సవం జరిగింది 1957 బెజవాదకాలేజీ ఉద్యోగ విరమణ చేశారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి మొదటి ఉపాధ్యక్షులైనారు .1958లో శాసన మండలి సభ్యులైనారు .1959 -6 1 కరీం నగర్ కాలేజి ప్రిన్సిపాల్ .62 లోకల్ప వృక్షం పూర్తీ .6 3 లో మధ్యాక్కరాలకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వచ్చింది 64లో ఆంధ్రా యూని వర్సిటి నుండి ‘’కళా ప్రపూర్ణ ‘’అందుకున్నారు .1969 లో ఉత్తర ప్రదేశ్ పర్యటన . ..రామాయణ రచన కొనసాగుతూనే ఉంది మరికొన్ని కూడా రాస్తూనే ఉన్నాడు .విశ్వనాధకు దాబ్బు అవసరం ఎప్పుడూ ఉండేది .ఎవారైనా పుస్తకం రాయమని అడిగితె దాబ్బు తీసుకొని రాసి ఇచ్చేవాడు ‘’నాశత్రువులు ఆవేశం ప్రోద్బలం లేకుండా రాసే రచయితను ‘’అన్నారని విశ్వనాధ చెప్పాడు. కాని వారెవరూ వాటిని చెత్త పుస్తకాలని అనలేదట .సద్విమర్శకులు మాత్రం మంచి నవలలు అని మెచ్చుకొన్నారు .
19 34 నుండి విశ్వనాధ సాహిత్య యుగం లో అయిదవది అయిన ఉచ్చదశ .వందల సంఖ్యలో గౌరవాలు సన్మానాలు అందుకొన్నాడు విశ్వనాధ .బొంబాయి కలకత్తా ,లక్నో ,మద్రాస్ నగరాలు ఆహ్వానించి గౌరవించాయి .ఉత్తర రాష్ట్రాలలో ప్రముఖ మైన అన్ని పట్నాలలో సన్మానాలు జరిగాయి .’’మా గురువుగారు వెంకట శాస్త్రి గారికి ఎన్ని సన్మానాలు జరిగాయో శిష్యుడైన నాకూ అన్నీ జరిగాయి ‘’అని చెప్పుకొన్నాడు .తన యెడల అప్పటికీ రెండు ప్రవాహాలని ఒకటి తన మిత్రులు నడిపే స్వచ్చమైన గంగా ప్రవాహం అయితే రెండవది తన శత్రువుల కలుషిత నీటి ప్రవాహం అంటాడు .భువన విజయం లో ఆయన శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర పోషించేవాడు .1946 లో బెజవాడ పురపాలక సంఘ వజ్రోత్సవ ఉపన్యాసం చేశాడు .రామాయణ కల్ప వృక్ష కనకాభిషేకం బెజవాడ శ్రీ విజయేశ్వరాలయం లో శ్రీ మల్లాది కుటుంబ రాగారు జరిపించారు .196 7 లో అకాడెమీ ఫెలోషిప్ వచ్చింది. ఏకవీర నవల సినిమా తీస్తున్నందుకు డి ఎల్ నారాయణ విశ్వనాధకు రెండు వేల రూపాయలిచ్చాడు .1970 జనవరి 26న రిపబ్లిక్ డే నాడు పద్మ భూషణ్ ప్రకటించి 21-4-19 70 న రాష్ట్రపతి పద్మభూషణ్ ను ప్రదానం చేశారు . 1971 అక్టోబర్ లో ఆంద్ర ప్రభుత్వ ఆస్థానకవి ‘’పదవీ స్వీకారం చేశారు
16-11 -19 71 లో సాహిత్యం లో అత్యున్నత ‘’జ్ఞాన పీఠం’’పురస్కారం అందుకొని తొలితెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత గా రికార్డ్ స్థాపించాడు విశ్వనాధ .1971లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘’డాక్టరేట్ ‘’ప్రదానం చేసింది .
2 -1 -73 ‘’కోటి శివపంచాక్షరి ‘’ప్రారంభించి పూర్తీ చేశాడు .9 10- 74 మిమిక్రీ ఆర్టిస్ట్ వేణు మాధవ్ కు ‘’శివపురాణం ‘’అంకితమిచ్చాడు .7 -10-74 న విశ్వనాధ పుట్టిన రోజు పండుగను పిల్లలు ఆత్మీయంగా జరిపారు .19 10-7 5 ఉషశ్రీ శ్రీ సన్మాన సభకు అధ్యక్షత వహించారు .13 1 7 6 సహస్ర చంద్ర దర్శనమహోత్సవాన్ని శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరావు మొదలైన వారి సమక్షం లో 16- 9- 76 వరకు జరుపుకున్నారు . గుండె జబ్బురాగా గుంటూరు జనరల్ హాస్పిటల్ లో చేరి 18 -10-1977 కవిసామ్రాట్ ,పద్మభూషణ్ ,తొలి తెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డా.విశ్వనాధ సత్యనారాయణగారు తనునమ్మిన శ్రీ రాముడు పంచాక్షరి తారక మంత్రం చెవిలో చెబుతుండగా తను ఆరాధించిన శ్రీ విశ్వేశ్వర సన్నిధానం చేరారు .
విశ్వనాధ పై సీరియల్ వ్యాసాలు సమాప్తం
శ్రీ లాల్ బహదూర్ శాస్ట్రి జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
—
విశ్వ నాధీయం
‘’తెలుగుకవులది ఒకదారి ,విశ్వనాధది వేరొక దారి ‘’అని ఎర్రద్దాలు పెట్టుకున్నవారన్నమాట .ఆయన ఏది రాసినా మానవ జీవితోద్ధరణకే ,ఉత్తమ మానవతకే రాశాడని ఎందరో ఎలుగెత్తి చెప్పారు ఆయనా అప్పుడప్పుడు చెప్పుకొన్నాడు .ఆయన ద్రుష్టి నిజంగానే వేరు ఆయనది అందరూ నడిచే బాటకాదు. అందరి చూపులాంటి చూపుకాదు .అందుకే విలక్షణంగా కనిపిస్తాడు .లోచూపున్నవాడు .పైమెరుగులకు భ్రమసేవాడుకాడు .ఆయన ప్రతి మాట కదలిక ఆలోచనల్లో నిజాయితీ భారతీయత ఆంధ్రత్వం తొణికిస లాడుతుంది.ఒక్కడు నాచనసోమన అని ఆయనే అన్నట్లు ‘’ఒక్కడు విశ్వనాధ ‘’ఇది తిరుగు లేనిమాట .ఆ మహోన్నత వ్యక్తిత్వాన్ని అన్ని కోణాల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం .
నవ్య సంప్రదాయ ఉద్యమానికి నాయకుడై విశ్వనాధ నాలుగు దశాబ్దాలు యుగ కర్తగా నిలిచాడు .కవి సార్వ భౌముడైన శ్రీనాదునితో సరిసమానం గా ఈ’’ కవిసామ్రాట్’’నిలిచాడు .విషాదాంత నాటక రచన చేసి ప్రాక్ పశ్చిమ నాటక శిల్ప సమన్వయము చేసిన ప్రయోగశీలి .ఆయన ముట్టని ప్రయోగం శిల్పం లేదు. సమకాలీన జీవిత చైతన్యానికి ఎత్తిన పతాకగా నిలిచాడు . ఆయన మధ్యాక్కరలు ప్రవ్రుత్తి నివృత్తుల మధ్య ప్రతిస్పందించే జీవుని వేదనలే.భవ్య సంగీతాలే .కల్ప వృక్ష రామాయణం ఆధునిక మానవ చైతన్యం లో ప్రపంచమంతా ప్రతిఫలిస్తున్న ఆధ్యాత్మిక అన్వేషణకు అద్దం పట్టే ఇతిహాస కావ్యం ‘’.నాభక్తిరచనలు నావి కాన’’ అని మళ్ళీ రామాయణమా? అన్నదానికి సమాధానంగా చెప్పాడు .పరానికి పనికొచ్చే రచన చేయమన్న తండ్రిగారి ఆదేశామూ నెరవేర్చాడు .ఈ శతాబ్ది చైతన్యాన్ని ఆపోసనపట్టి భారతీయ దార్శనిక మూలాలతో విలువకట్టిన ప్రజ్ఞా మూర్తి .ఆయన పలికిన పలుకే ఒక ప్రమాణం .ఒక ఆలోచనా సరళికి ఆదర్శంగా నిలచిన పూర్ణ ప్రతిభా మూర్తి .
ఇంగ్లీషు నవలా ప్రక్రియలో వచ్చిన ప్రయోగాలకు సాటి వచ్చే తెలుగు నవలలు రాసిన ఏకైక నవలా కర్త .రచయితగా సమగ్ర వ్యక్తీ .కళా ప్రపూర్నుడు .శిల్పానికి తెలుగు తోట అయిన నన్నయ తిక్కనలే ఆయన్ను ఆవేశించారు .పాశ్చాత్య శిల్పం తో బలపడి వినూత్న భారతీయ వ్యక్తిత్వం తో వెలిగే సాహిత్య శిల్పాన్నికోరి అలాగే ప్రత్యక్షరం రాసి చూపించాడు .’’నాలాంటి కృతి శత నిర్మాత ను బిడ్డగా పొంది నా తండ్రి గొప్పవాడయ్యాడు’’అన్నదానిలో ఆత్మ విశ్వాసమే ఉంది ,గర్వంకాదు .’’అలనన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యంబు ‘’అన్నప్పుడూ అంతే .వీటిలో ధ్వని గ్రహించాలి .ఆయనది వ్యవహార భాష .మంధర శైలి .రస ధ్వనులకు ప్రాధాన్యం .ఆయన చేతన నిత్య వేగి .శబ్దాన్ని ఏరుకోవటానికి చిన్నము కూడా నిలవలేదు .అంతటి భావ తీవ్రత ఆయనది .
విశ్వనాధ రాసిన ‘’నా కన్నుల ఎట్ట యెదుటన నాపుత్రుని కంఠ ముత్తరించి –నేను దయా౦బు ధిని కాదా యటంచు నన్నడిగే ఓ ప్రభూ ‘’అనే పద్యాన్నిశ్రీ అబ్బూరి వరద రా రాజేశ్వర రావు మేనత్త బియ్యం యేరు కుంటూ తనలో తానూ చదివేదట .ఆమె చదువుతూ ఉంటె హృదయం ద్రవి౦చి పోయినట్లు ఉండేదని వరద చెప్పాడు .శ్రీ దాసు శ్రీరాములుగారు ‘’తెలుగునాడు ‘’మొదటి భాగమే రాశారు .రెండవది రాయలేకపోయారు .విశ్వనాధ వరదతో ‘’శ్రీరాములుగారు రెండోభాగం కూడా రాసి ఉంటె ఆంద్ర దేశం లో కన్యాశుల్కం తోబాటు ఇదీ చిరస్థాయిగా ఉండేది ‘’అని నిండుమనసుతో మెచ్చిన సహృదయుడు విశ్వనాధ .
‘’భావనా శబ్దాలత వల్లా ,ఆవేశ శుద్ధి చేత ,అనుభవ వస్తు గుణం వలన ఎంతోమందికి ఎన్నో ప్రాంతాలలో విశ్వనాధ పద్యాలు వాచో విదేయాలుగా ఉన్నాయి .కవిత్వానికి ఇదే మూల లక్షణం ‘’అన్నారు గురువు శ్రీ చెళ్ళపిళ్ళ శాస్త్రిగారు .ఇదేభావాన్ని ఆంగ్లకవి డబ్ల్యు హెచ్ ఆడెన్ కూడా చెప్పాడు .కవిత్వం లో విశ్వనాధ ఎన్నో రూపకల్పనలు చేసి ,పద్యాన్ని వశ పరచుకొన్నారు .తెలుగు జీవితాన్ని అమూలం విశ్లేషించి చూసి తన పద్యాలలో నిక్షేపించారు .అందుకే ఆయన ఖండక్రుతులు కల్ప వృక్షం కలకాలం నిలుస్తాయి .తన ఆనందం ముఖ్యంగా ‘’కావ్యానందమే ‘’అని చెప్పుకొన్నాడు .
విశ్వనాధ శబ్దాలు ,,తత్వ బోధలు ,కావ్యలక్షణాలు అన్నిటినీ ‘’శ్రీరామ చంద్రాత్మ’’గా భావన చేసి కల్ప వృక్షం రాశారు .ఇదంతా ఆయన సాధనయే .లోకానికి అదికావ్యం .దీనికి ఆయన కోరింది కూడా కావ్యానందమే తప్ప వేరుకాదు .పూర్వజన్మ సంస్కారం వలన అద్వైతి అయ్యారు .ఆయనకు శివకేశవులకు రామ విష్ణువులకు భేద మేలేదు .రామాయణం రాసి ఇలవేల్పు విశ్వేశ్వరునికి అంకితమిచ్చారు .ఖండా౦తపద్యాలన్నీ శివభక్తిపారమ్యాలే.ఆయనే రాముడు ఆయనే పరబ్రహ్మ .నిజానికి అయన గుండెపై స్వారి చేయాల్సినవాడు శ్రీ కృష్ణుడు .వాళ్ళ ఊరిలో సంతాన వేణుగోపాల స్వామి అంటే ప్రాణం .స్వామి విగ్రహం లో చాలామార్పులు చేశారు .తండ్రి శోభనాద్రి గారు ప్రతిష్టించిన శివలింగం జ్ఞానమూర్తిగా విశ్వనాధ భ్రూ మధ్యమంలో ఆడుతూ ఉంటాడు .
కల్ప వృక్షం లో భరతుడు అగ్ని ప్రవేశం చేసే సందర్భాన్ని ఆంజనేయుడు రాముడికి సంగీతం పాడుతూ వినిపించాడు యుద్ధకాండ చివరలో ఉన్నఘట్టమిది .చివర్లో రాసిన 325వ పద్యం లో మూడు చరణాలు పూర్తియ్యాయి. నాలుగవది యెంత ప్రయత్నించినా రావటం లేదు .స్నానం చేశాడుకాని భోజనం చేయబుద్ధికాలేదు ఇంట్లో అందరూ గొడవ . చివరికి స్పురించి ‘’జైత్ర యాత్రా0 చ చ్చ్రీ మధుసూదనాస్య పవమానా పూర్ణ మైనట్టులన్ ‘’అని పూర్తీ చేశారు .పై చరణాలలో ‘’కంఠ శంఖం ‘’అని రాశారు .రాముడు విజయ యాత్రకు బయల్దేరినప్పుడు పరమేశ్వరుని కంఠం నుండి వచ్చిన వాయువు చేత నినదించి నట్లున్నది అనిభావం .భరతుడు శంఖావతారం .దీన్ని తన ఆత్మారాముడు పూరించిన చరణంగా విశ్వనాధ భావించాడు .’నా స్వామి రాముడు నాభాష వాడే ,ఆయనకు తెలుగు వచ్చు ‘’అని చమత్కరించాడు విశ్వనాధ .విశ్వనాధను ఆవేశించి రాముడు తన కద రాయి౦చు కున్నాడుకదా
తనను తాను’’బ్రాహ్మీమయ మూర్తి ‘’అని చెప్పుకోవటానికి ఎన్ని గుండే లు ఉండాలో అన్నీ ఉన్నవాడు విశ్వనాధ .ఆయన ఎన్నో కష్టాల్ని , ఆపదల్ని పోతనగారి భాగవత షస్ట స్కంధం లోని’’ నారాయణ కవచ ‘’పారాయణం చేసి పోగొట్టుకున్నాడు .శుక్రవారం బజారు వెళ్ళినప్పుడు తెలిసిన కొట్టువాడు కొబ్బరిముక్క ప్రసాదంగా ఇస్తే ,ఇంకోకోట్లో ‘’ఉప్పు గల్లు’’అడిగి తీసుకొని ,పచ్చిమిరపకాయలు కనిపించగానే దానితో కొబ్బరీ ఉప్పూ కలిపి నోట్లో వేసుకొని రుచి ఆనందాన్ని పొందేవాడు .అప్పుడే ఆయనమనసు ఏకాగ్రమై గోప్పభావనతో ఇరవై ముప్ఫై పద్యాలు మనసులోనే రాసుకోనేవారు .ఇంటికి రాగానే గ్రంధస్తంమయ్యేవి .ఆయన శరీరం లోని జీవుడు అంటీ ముట్టకుండా ఉంటాడా అన్నదానికి ఇదే సమాధానం అన్నారు శ్రీ పేరాల భారత శర్మ
ఆయనది ఆడంబరం లేని జప విధానం .రోజుకి కనీసం ఒక్కొక్క మంత్రాన్ని మూడు వేల సార్లు మూడు మంత్రాలు జపించేవారు .పగలు తక్కువ కాలం రాత్రి ఎక్కువకాలం జపం లోగడిపేవారు .రాత్రి సుమారు రెండుగంటలకు నిద్ర కు ఉపక్రమించి ఉదయం కొంచెం ఆలస్యంగా లేచేవారు .లేవగానే వ్యాయామం శీర్షాసనం ఆసనాలు ,పొట్ట అక్కళించటం తప్పనిసరిగా చేసేవారు .మయూర ,హలాసన ,సర్వా౦గాసనాలు 75 ఏళ్ళ వయసులోనూ వేసేవారు .రాత్ర్తిపూట తలకింద దీపం పెట్టుకొని తెల్లవారేదాకా ఇంగ్లీష్ నవలలు చదివేవారని పేరాలవారి ఉవాచ .రాముడికి36ఏళ్ళ వయసులో సీతా వియోగం జరిగితే విశ్వనాధకూ అదేవయసులో భార్య వరలక్షమ్మగారు చనిపోయారు .విశ్వనాధ శరీరం నేలమీద ఒక మోటారు .ఆయన మనసు ఆకాశం లో ఒక విమానం .గ్రంధ రచనలో ఆయన ధారణ అపారం,ఆశ్చర్యకరం .మాస్కో లోని తెలుగు అకాడెమీ అధ్యక్షురాలు వేయిపడగలను స్తుతించటం గురజాడ వారి పూర్ణమ్మను విశ్వనాధవారి కిన్నెర సానిని పొగడటంచేస్తే కమ్యూ నిస్ట్ నాయకుడు ముక్కామల నాగభూషణంగారు ముక్కు మీద వేలేసుకొన్నారు .
కైక రాముని సాధారణ మనిషిగా ఊహించినదుకు రాముడి మనసు చివుక్కుమన్నదట .దీన్ని విశ్వనాధ అద్భుత శిల్ప నైపుణ్యం తో చెప్పాడు .పాత్రను పాఠకుల హృదయంలో చిర ప్రతిష్ట చేసి రసాస్వాదన కలిగించే నేర్పు తిక్కనగారిది మళ్ళీ విశ్వనాధది. ఊర్మిలా లక్ష్మణుల సంసార రహస్యం గురించి వాల్మీకి మౌనం వహిస్తే విశ్వనాధ ఆ మౌనానికి అద్భుత వ్యాఖ్యానం చేశాడు. వైదిక సంస్కృతీ ,సంప్రదాయం ,తాత్విక సిద్ధాంతాలను ఆధారంగా విశ్వనాధ కల్పనలు చేస్తాడు ‘’అనాసక్తి యోగం ‘’తో ఊర్మిళా ,లక్ష్మణుల సంసార యాత్ర సాగింది. ఊహ సంపత్తి ,కధాకధన శిల్పం ,వాల్మీకానికి బయటికారణం వీటికి తోడుజీవుని వేదన మొదలైన వాటిని పరమేశ్వరార్పణంగా విశ్వనాధ పండించాడు అది ఆయన కవితా రూప తపస్సు .’’నన్ను కూల్చటానికే కాని సీతను అపహరించటానికి కాదు ‘’అన్నమారీచుని భావం లో యెంత అర్ధముందో గ్రహించాలి .మాయలేడి కధలో ఋషుల భావన ఆయా వ్యక్తుల ప్రభావాన్ని ప్రబోధింప జేసే అకార్య నిర్వహణం చేయగలిగింది అని విశ్వనాధ వ్యాఖ్యానం .మారీచునిలోను జీవుని వేదన చొప్పించాడు .విశ్వనాధ ఊహ మన పరిధిని దాటి ఉండటం ప్రత్యేకత . కిష్కింద కాండలో చేసిన రుతు వర్ణనలు సీతా రాముల కదా తో ముడి పడి ఉంటాయి .అరణ్యవాసం లో వారివి ‘’సాదు శృంగార లీలా ప్రసన్న గాధలే ‘’అన్నాడు .
విశ్వనాధ ‘’కధక చక్రవర్తి ‘’.ఆయనకున్నది మంచితనంపై పూర్తినమ్మకం .ప్రతిమనిషికి ‘’డ్రై వింగ్ ఫోర్స్ ‘’ఉంటుందిఅది ఉన్నత ఆశయాలకోసం పరుగు పెడుతుంది అన్వేషణ చేయిస్తుంది మనిషికిఉన్న ఆవేదన లో మానవత్వం ఉంటుంది అదే మనిషిని మంచివాడిని చేస్తుంది .సుగ్రీవుడిలాగా కొందరికి లక్ష్యం మరుగున పడుతుంది అప్పుడు మేల్కొలపటానికి హనుమ ,లక్ష్మణులు కావాలి .విశ్వనాధ ‘’అవిచ్చిన్న సంప్రదాయార్ది ‘’.ఆయన పాత్రలు మూసలో ఇమడవు .అల్పాక్షరాల్లో అనల్పార్ధ రచనకు ఉదాహరణ ‘’దుందుభి కద’’.సంధ్యాకాలం నుండి మళ్ళీ సంధ్యాకాలం వరకు జరిగిన సుందరకా0 డకద ఆయన ఒక’’ ఉపాసన’’గా భావించాడు .బాలకాండలో కనిపించిన మనస్సౌన్దర్యం మళ్ళీ సుందరకాండలో కనిపిస్తుంది .శృతి కాఠిన్యం లేని వార్తాకధనానికి ,ఆవేశం లేని సరళ భక్తి నివేదనకు విశ్వనాధ మధ్యాక్కరలు వాడాడు .హనుమ లంకలో సీతను వెతికేటప్పుడు మత్తకోకిల వృత్తాలలో రఘువంశ పురుషుల గొప్పతనాన్ని వర్ణించారు మహేంద్ర గిరి నుండి హనుమ దిగేటప్పుడు సముద్రాన్ని భుజంగ వృత్తం లో వర్ణించాడు .అలాగే సముద్ర వర్ణన కు ‘’అష్ట మూర్తి ‘’,వరాహ ;;వృత్తాలను ఎన్నుకొన్నాడు .రాముడు సముద్రునిపై కోపం తో బాణం ఎక్కు పెట్టినప్పుడు ‘’శాలూరం ‘’సముద్రుడి వేదనను ‘’దుర్మిల’’,సముద్రునిస్తిమితమనస్సును ;;కిరీటం ;;, సంతోషాన్ని ‘’హంసి ‘’వృత్తాలలో చెప్పాడు .నరేంద్ర వృత్తం కూడా ప్రయోగించాడు .బహువిధ ఛందస్సులతో సుందరాన్ని మరింత సుందరం చేశాడు .కల్ప వృక్షం మొదటినుంచి చివరిదాకా ‘’శ్రీరామ చంద్ర తేజస్సంక్రాంతి’’విజ్రుమ్భించింది .
విశ్వనాధ వర్ణనలు మహా విచిత్రాలు .ఆయనది ఆలోచనామృతం ‘’పురుగు తొలచిన దూలం నుండి పొడి రాలినట్లు సన్నని మంచు కురుస్తోంది ‘’అన్నాడు వేయిపడగలలో ‘’,’’రస ఉపనిషత్ రహస్య వేత్త ‘’విశ్వనాధ .జ్ఞాత శిల్పి .’’విశ్వనాధ సాహిత్య విలసనం ఆంద్ర సాహితీ నందనోద్యానమున వేయి శరజ్జ్యోత్స్నాలు వెదజల్లిన సమయం .ఆయన సాహిత్య సృష్టి విచ్చిన నెమలి పించం లాగా తళ తళలాడుతూ కన్నులు మిరుమిట్లు గొల్పును ‘’అన్నమాట యదార్ధం .’’నాకు ఏదో ఒక రోజు చావు ఉంది ‘అని తెలుసుకొన్నవాడు విజ్ఞానియే ‘’అన్న వివేకానందుని మాట విశ్వనాధకు స్పూర్తి .మధ్యాక్కరలలో వ్యాజ స్తుతి ఎక్కువగానే చేశారు .నెత్తినెక్కి పిండికోడుతున్నావ్ వంటి పలుకుబడులు విపరీతం .’’కాలికి వేస్తె వేలికేస్తావు ,పిచ్చి కుదిరింది పెళ్లి కుదరలేదు , .కాళ్ళను బదడ్డపాము కరవక మానదు ,మొదలైనవెన్నో రాశాడు .’’నీకంటే పల్నాటి నూతులు నయం ,నీకు మూతి మొహం లేవు జనం యెట్లా చూడగలరు ?నిన్ను అయినకాడికి అమ్మేస్తాను అని విశ్వేశ్వరునే బెదిరించిన భక్త శిఖామణి విశ్వనాధ .ఆయన మధ్యాక్కరలు మధు బిందు సమానాలు .
‘’శృంగార వీధి ‘’ మైమరపిస్తుంది .ఈకావ్యం తోనే అయన లోఉన్న మహాకవిబీజాలు మొలకెత్త సాగాయి .దీనిలో శృంగారం భక్తీ పర్యవసానం అయింది .లౌకిక భావాన్ని అలౌకిక సత్యం తోకలిపి ‘’గోపికా గీతలు ‘’రాశాడు .ప్రతి వృత్తం మీదా విశ్వనాధ ముద్ర ఉంటుంది .పద్యంలాగే మనోహర వచనమూ సాగుతుంది .కవితా సుందరి శరీరం శబ్దం .నడకలో ఒయ్యారం ఛందస్సు .శబ్దార్ధ చమత్కారాలే గతి విన్యాస శోభ .అదే శ్రోతల్ని ఆకర్షిస్తుంది ప్రాచీనతలేకపోతే నవీనతకు అర్ధం లేదు అన్నది విశ్వనాధ నమ్మకం .
‘’‘’ ఏకవీర ‘’నవల మధురలోని వైగై నదీతీరాన ప్రారంభమై అక్కడే అంతమవుతుంది. నదికూడా నవలలో ఒక పాత్ర .’’ధర్మం చెయ్యి ‘’ అనేది దీని ముఖ్య సంకేతం. భావ కవిత్వోద్యమకాలం లో వచ్చిన ఏకవీర లోని అమృతం పాత్ర వేయిపడగలు నవలలో పసరికగా రూపు దాల్చింది ‘’అన్నారు ప్రోలాప్రగాదవారు .’’ధర్మ రేఖను అతిక్రమిస్తే దారుణ మరణమే తప్ప నిష్కృతి లేదు ‘’అని చెప్పిన నవల ఇది . ‘’తెరచి రాజు ‘’లో పతాక సన్నివేశం ఏకవీర పతాక సన్నివేశం నుండి రూపు దిద్దుకోన్నది .నైతిక సూత్రాలపట్లా ,సాంప్రదాయ జీవన మార్గం పట్లా విశ్వనాధకున్న విశ్వాసం గౌరవం ప్రతిఫలించే నవలలలివి .’’కాళిదాస భావభూతుల శైలిని తిక్కన మార్గాన్ని ,టాగూర్ శరీర వాంచలేని ‘’నౌకభంగం ;;లోని ప్రేమను నా భావనా రచనా చమత్క్రుతినికలిపి ఏక వీర రాశాను ‘’అని విశ్వనాధ చెప్పుకొన్నాడు .
విశ్వనాధ తులసీదాసు ,సూరదాసు ,మైధిలీ శరణ గుప్త ,దినకర్ మహాదేవివర్మ కవితలు చదివాడు .ఆయన మాటలకున్న అర్ధాలను మూలాలలోకి వెళ్లి చెప్పగలరు. లావణ్యం అంటే లవణం అంటే ఉప్పుకుండే నిగనిగ అని అర్ధం చెప్పారు .శ్రీ ఆచంట సాంఖ్యాయన శర్మగారిని కలిశాడు ఒకసారి విశ్వనాధ ఈయన సత్తా ఏమిటో ఆయన ప్రశ్న పరంపరాలతో ఆయన తెలుసుకొని సన్మానం చేసి పంపారు .ఆయన టేబుల్ సొరుగులో ‘’భగవద్గీతా, ఈయన ఆంద్ర ప్రశస్తి ‘’పుస్తకాలు ఉండటం చూసి అవాక్కయ్యాడు విశ్వనాధ .’’ప్రేమను అణచుకోవటం మహా పురుషుల లక్షణం ‘’అని అప్పుడు గ్రహించాడు విశ్వనాధ.
రామ ధూర్జటుల తత్త్వం విశ్వనాధను ఆవహించి కల్ప వృక్షం లో హనుమ కార్య శూరత్వానికి దారి చూపింది .రామకధను ‘’నాధ కద ‘’అన్నాడు .కట్టు కధకాదు మోక్షకద .’’ఇష్టిఖండం ‘’తోప్రారంభమై ‘’ఉపసంహరణ ఖండం ‘’టో పూర్తయింది .ప్రతికా0డ ను అయిదు భాగాలుగా విభజించటం ఆయన ప్రత్యేకత .అది ప్రతీకాత్మకాంశం .షట్ చక్రాలకు ప్రతీక .అదొక మహామాలా మంత్రం .కైకేయీ తత్త్వం రామాయణ కల్ప వృక్ష శాఖలపై సుపుష్పితమైంది. ఆయన వాల్మీకానికి చేసిన వ్యాఖ్యానాలు కావ్యమార్గం ఆశ్రయించి వ్యంగ్య మర్యాదను పాటించాయి .ముని వేషం లోఉన్న రాముడు పూర్వం దశరధుని బాణం చేత కొట్టబడ్డ ముని కుమారుడులాగా ఉన్నాడట .కార్యకారణ సంబంధాన్ని ఇక్కడ ధ్వనింప జేశాడు. సీత అశోక వనం లో అగ్నిలా ఉందనటం వైశ్వనాదీయం .రాముడు నడుస్తున్న రత్న దీపం అట .కల్ప వృక్షం అర్ధం చేసుకోవటానికి భావుకత్వం అత్యవసరం .’’కనకదుర్గమ్మ నవ్వులకు మల్లికార్జునుడికి పులకలు వచ్చాయట. ‘’శివుని మౌళి పై నుంచి వెన్నెలలు కృష్ణపై నుంచి వచ్చే చల్లని గాలులు పూచిక ముల్లుల్లాగా స్వామిని పోడుస్తున్నాయట.మనోహరభావం .
‘’నాపాట ‘’లో ఆయన అల్లిన లలితగీతం దిగంతాలకు పోయి నిలవలేక ఉపసంహరించిన అస్త్రం లాగా మళ్ళీ తననే వరించింది అంటాడు .’’సంధ్యవార్చడు ,అధ్యయనం లేదు ,కర్మపై నమ్మకం లేదు ‘’ఇదీ నేటి బ్రాహ్మణ్యం స్తితి అని వాపోయాడాయన .ఒకడు ‘’నార్మా షెవర్ ‘’అనే హాలీవుడ్ నటికీ ఉత్తరం రాసి జవాబుకోసం రోజూ పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నాడట .తనకు నోబుల్ ప్రైజ్ వస్తుందని దాన్ని ఏయర్ పోర్ట్ లేని తన వూళ్ళో విమానం లో తీసుకోస్తారని ఇంకోడు రోజూ ఆకాశం వైపు చూస్తున్నాడు అని చమత్కరిస్తాడు ‘’’విశ్వనాధ వాడిన భాష నవ్యం అది ఆయన సృష్టి .దాన్ని విశ్వనాధ శైలి అనాలి ‘’అని శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మగారు తరచుగా సభలలో చెప్పేవారట .
విశ్వనాధ ఉపన్యాస ధోరణి విలక్షణమైనది .అక్షర తూణీరం నుండి వ్రేలికి వచ్చే అస్త్ర పరంపరలాగా పాఠకుల హృదయాలలోకి చొచ్చుకుపోతాయి ఆయన మాటలు .’’నాచన సోమన ,కృష్ణ దేవ రాయలు ,తెనాలి రామ కృష్ణుడు-ఈ ముగ్గుర్ని కాచి వడగడితే అయిన వాడు విశ్వనాధ ‘’అన్నాడుశ్రీ కాటూరికవి .’’సత్యనారాయణ భావయిత్రీ శక్తి ముందు రాయలదికూడా తీసికట్టే .ఆయన సోమన అంతటివాడు .ఒకడు నాచన సోమన అన్నట్లే ఒకడు విశ్వనాధ .
ఆధారం –శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ –‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’
గాంధీజయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
—
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
మెదక్ జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏ .రాములు
510 –శ్రీ యామవరం రామ శాస్త్రి (19 ౦౦
మెదక్ జిల్లా కాకుమాను గ్రామం లో జన్మించిన శ్రీ రామ శాస్స్త్రి రామకృష్ణ పండితుని మనవడు ,.కుటుంబం లో అందరూ కవి పండితులే .కాకుమాను రామ శాస్త్రి గా ప్రసిద్ధులు .శ్రీ విఠల చంద్ర మౌళి వద్ద వేదాంతాన్ని ,పినతండ్రి కృష్ణ శాస్త్రి వద్ద సంస్కృత కవిత్వాన్ని అభ్యసించారు .దొంతి సంస్థాన విద్వాంసుడు వెంకట పౌన్దరీక యజ్వ దగ్గర కావ్య శాస్త్రాలు నేర్చారు .
పాతికేళ్ళ వయసులోనే(19 19 ) రామశాస్త్రి’’ చిత్ర కవిత్వానికి ‘’ఆకర్షితులయ్యారు .25 0 శ్లోకాలతో నాలుగు భాగాలుగా ,18 ఖండాలుగా ‘’గురు స్తుతి ‘’కావ్యం రాశారు .కాని మొదటిభాగం లో 88 శ్లోకాలు మాత్రమె తెలుగు అచ్చులో అచ్చు అయ్యాయి .మొదటిభాగం లో 5 ఖండాలున్నాయి అవి-ప్రణవాదిశ్లేష ఖండం ,బ్రహ్మాది శ్లేష ఖండం ,బృహస్పత్యాది శ్లేష ఖండం ,సంకీర్ణ శ్లేష ఖండం ,చిత్ర శ్లేష ఖండం .గురువు యొక్క గొప్పతనాన్ని శ్లేష ,యమక ,అనుప్రాస ,ఏకాక్షర ,ద్వ్యక్షర కవిత్వాలలో చెప్పారు .చిత్ర కవితకు గొప్ప ఉదాహరణగా ఈ కావ్యం ఈ ఇరవయ్యవ శతాబ్దం లో శాశ్వతంగా నిలిచింది .ఇన్ని రకాల శ్లేష లను ప్రయోగించటం వలన ‘’శ్లేష యమక చక్ర వర్తి ‘’బిరుదు పొందారు .కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం –
విష్ణువును గురువును శ్లేషలో వర్ణించే శ్లోకం –‘’పరతవ బుద్ధ్యా చ ప్రవిస్టాన్-దసస్వ సుదర్శనాభ్యాం-స్వరస్తాన్ గురుః పుణ్య జనాన్ సుసత్వాన్ –కుర్వన్ స దామోదర తాముపైతి ‘’
మరోశ్లోకం లో గురువును స్త్రీని శ్లేష లో పోలుస్తూ చెప్పారు –‘’అభ్రా మధ్యా నయజ్నా త్య సమస్త నమితా సుహృత్ –ప్రాతివ్రత్య పరా పాతత్ –భామేవ హ్యక్రుతి ర్గురేః’’
ప్రశ్నోత్తర మాలి కి ఒక ఉదాహరణ –‘’కోపమాన్ విహీనః స్యాత్ ?(కోప మాన విహీనః స్యాత్ )
‘’సద్గురొఃకా మహాత్మా ?(సద్గురేః కా మహాత్మతా )
చిత్ర శ్లేష ఖండం నుంచి ఒక ఉదాహరణ –పామావాంశ్చ పరాజితః –సుసమితౌ కాపాలికా సన్మతా
విస్టఃకోపమాలా శ్యాస్చ పశుభౌ –లబ్ధ్వా విపద్వి జ్జనితం –కృత్వా తాపాప రాయ ణాన్శ్రిత జనాన్ సర్వోపకారీ మహా
పాపాత్మా పది తోశిరే పరహితత్వం త్వం భావాప్యామలః ‘’
ఇందులో’’ ప ‘’అక్షరం ఉన్నప్పుడు ఒక శబ్దం తీసేస్తే వేరొక శబ్దం వస్తాయి ప ఉంటె చెడు అర్ధం తీసేస్తే మంచి అర్ధం రావటం ఈ చిత్ర కవిత్వ లక్షణం .
ఈ విధంగాఇరవై వ శతాబ్ది లో ద్వ్యర్ధి ,యమక కావ్యాలురాసిన కవులు చాలా అరుదుగా మెదక్ జిల్లాలో ఉన్నారు
51 1-శ్రీ గౌరీ భట్ల రామ కృష్ణ శర్మ
మెదక్ జిల్లా తోగూటమండలం .వెంకట్రావు పేటకు చెందిన కృష్ణశర్మ గారు మహా పండితులు .అవదానాలలో చేయి తిరిగినవారు .సికందరాబాద్ లోనిలాల్గుడి లో ఉన్న తూములూరి శివ రామ కృష్ణ శర్మ మునిసిపల్ సంస్కృత విద్యాలయం విద్యార్ధి .అక్కడే మహా గురువులవద్ద సిద్ధాంత కౌముది ,పంచ మహాకావ్యాలు అవధాన విద్యా నేర్చారు .ప్రసిద్ధ అవధానిగా పేరొందారు .సంస్కృతాంధ్రాలలో చాలా అవధానాలు చేసి సమర్ధతను చాటారు .’’కవి శార్దూల కిశోరం ‘’బిరుదును శ్రీ యాదగిరి గుట్ట దేవాలయం లో శ్రీ ఖండవల్లి నరసింహ శాస్త్రి ,శ్రీ మల్లాది దక్షిణా మూర్తి శాస్త్రి గారల సమక్షం లో అందుకొన్నారు .సంస్కృతం లో విస్తృత రచన చేశారు . ‘’సహ బాల మానస పూజ ‘’అనే 10 8 శ్లోకాల భారతం ను యమకం లో రాశారు .మచ్చుకి ఒకటి –
‘’విలాపనం లపనం మామ మామిమాం –కలయ పాలయ పార్ధ కుటుంబినీం
స్వస్తితే స్తితోగ్రపరా భవత్ –నిస్త భారత భార వహ ప్రభో ‘’
51 2 –మహాత్మా అప్పల విశ్వనాధ శర్మ (19 ౩౦ -20 ౦౦ )
యశోదా ,నారాయణ బాబుల సుపుత్రులే విశ్వనాధ శర్మగారు .మెదక్ జిల్లా మార్కూర్ లోని పాండు రంగాశ్రమం లో జన్మించారు .’’పాండురంగ సుప్రభాతం ‘’ను ద్రాక్షాపాకం లో రాశారు .’’రాదా కృష్ణ సంవాదం ‘’కూడా రచించారు –ఒక ఉదాహరణ శ్లోకం –
‘’నీతం నవ నవ నీతం నీతం నీతంచ కిం తేన –ఆతపాతా పితా భూమై మాధవ మాధావ మధావ
శ్రీ రసారామ ప్రహ్రుత్య శండ్యా స్వీకృతం యది పలాయనంతట్-మానసే మమ నితాంత తమసే నంద నందన కిమహో నిలీయసే ‘’
51 3 –శ్రీ ఉమాపతి పద్మనాభ శర్మ (19 40
సిద్ధిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజి తెలుగు లెక్చరర్ అయిన పద్మనాభ శర్మగారు ‘’అద్వైత గీత ‘’సంస్కృత రచన చేశారు .తెలుగు వ్యాఖ్యానమూ రాసి ‘’దర్శన ‘’మాసపత్రికలో ప్రచురించారు .గురుకుల విద్యాభ్యాసం తర్వాత అద్వైత వేదాంతాన్ని నేర్చారు .
కరీం నగర్ ,మందని లలో సంస్కృత విద్వాంసులున్నారు కాని సంస్కృత రచనలు చేసినట్లు కనిపించదు .
51 4 –శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (19 35
ధర్మ పురి లో శ్రీ లక్ష్మీ నరసింహ సంస్క్రుతకళా శాల ఉంది .ఎందరో దీనిలో చదివి గొప్ప పండితులయ్యారు .రచనలూ చేశారు .వారిలో రాజన్న శాస్త్రిగారు ప్రధములు .’’శ్రీ ధర్మ పురి లక్ష్మీ నరసింహ సుప్రభాతం ‘’రాశారు .’’సుమనోంజలి ;;ణి ‘’వసుమతీ సుధాకరం ‘’అనే సంస్కృత నాటకాన్ని రచించారు .ఈ నాటకం ‘’కుటుంబ నియంత్రణ ‘’విషయం పై రాసినది .
ఇక్కడే సంగన భట్ల వారున్నారు వారు కూడా సంస్కృత కావ్యాలు రాసినట్లు తెలుస్తోంది .శ్రీ సంగణ భట్ల నరసయ్యగారు ధర్మ పురి సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేసి చాలా గ్రంధాలు రచించారు
51 5 –శ్రీ మామిడి పల్లి సాంబయ్య (19 ౦౦-19 70)
వేములవాడకు చెందిన సాంబయ్య గారు నూట ఎనిమిది శ్లోకాలతో ‘’వేములవాడ రాజ రాజేశ్వరి శతకం ‘’రాశారు . ‘’సుప్రభాతం’’కూడా చేశారు దీని మకుటం ‘’లెంబాల వాటిక విభో తవ సుప్రభాతం ‘’
51 6 –శ్రీ త్రిగుళ్ళ శ్రీహరి శర్మ (19 50
శర్మగారు వేములవాడకు చెందినవారు .అక్కడిసంస్క్రుతకాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్నారు .సంస్క్రుతకావ్యాలు చాలా రాశారు .సంస్కృతం లో అవధానాలూ చేశారు .
51 7 –శ్రీ కోరుట్ల కృష్ణమాచార్య
కరీం నగర్ జిల్లా కోరుట్ల సంస్క్రుతకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయిన కృష్ణమాచార్య గారు మూడు సంస్కృత కావ్యాలు రచించారు . శ్రీ వైష్ణవ తత్వాన్ని వర్ణించే ‘’గురువంశ మహా కావ్యం [‘’,రాశారు .మెల్కోటే లో ఉన్న రామ ప్రియ దైవానికి బీబీ నాంచారి కి ఉన్న ప్రేమను వివాహాన్ని వర్ణిస్తూ ‘’సంపత్ కుమార సంభవం ‘’కావ్యం రాశారు .కాళిదాసు మేఘ సందేశానికి అనురూపంగా ‘’మనః సందేశం ‘’రాశారు .
51 8 –శ్రీ కొల్లేగల్ ఆర్ .సుబ్రహ్మణ్యం (19 29
కర్ణాటకలో కొల్లేగల్ అనే వ్హిన్న గ్రామానికి చెందినవారు .హైదరాబాద్ లో స్థిర పడ్డారు .ఆంధ్రప్రదేశ్ లో గొప్ప సంగీత విద్వాంసులుగా పేరుపొందారు . సంగీత విద్యను శ్రీ బాలక్కవాదివరద రాజ అయ్యంగార్ ,శ్రీ ఆర్ బాల కృష్ణ ల వద్ద నేర్చుకు న్నారు .శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో దీక్షగా ‘’ఉంచ వ్రుత్తి ‘’చేస్తూ భక్తిగా పాల్గొంటారు .అన్నిభాషలలో గొప్ప పాండిత్యమున్నవారు .సంస్కృత తెలుగు కన్నడ ,తమిళ భాషల్లో ఎన్నో కృతులు రాశారు .హిందీ మలయాళం లలోనూ కొన్ని కృతులు చేశారు .మొత్తం మీద 45 0 కృతులు చేసిన ఘనత వీరిది .
ఇక్కడి తోఆంద్ర ,తెలంగాణా లలో స్వాతంత్ర్యానంతర గీర్వాణ కవుల గురించి రాయటం పూర్తీ అయింది .
మనవి –ఏదో సరదాగా మొదలు పెట్టిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’మొదటి భాగం లో 1 4 6 కవుల గురించి రాసి పుస్తకం గా తెచ్చిన విషయం మీకు తెలుసు .రెండవ భాగం ప్రారంభించి 1 4 7 నుంచి 4 0 0 వరకు అంటే 2 5 4 మంది సంస్కృతకవులను గూర్చి రాశాను .మూడవ భాగం లో 4 0 1 నుండి 5 1 8 వరకు అంటే 1 1 8 మంది స్వాతంత్ర్యానంతర గీర్వాణ కవులను పరిచయం చేశాను .అంటే సంస్కృత కవుల ను శ్రీ శంకరాచార్యులవారితో ప్రారంభించి,అన్ని రాష్ట్రాల ,అన్ని సమీప దేశాలలో,అన్నికాలాల్లో ఉన్న కవులను , దాదాపు నిన్నటి మొన్నటి వరకు సంస్కృత రచనలు చేసిన వారందరి గురింఛి అంటే మొత్తం 5 1 8 కవుల గురించి రాసిన అదృష్ట వంతుడిని .అది నా పూర్వజన్మ సుకృతం మా తలిదండ్రుల ,మా శ్రీ సువర్చలాన్జనేయ స్వాముల సంపూర్ణ అనుగ్రహం ,సాహితీ బంధువుల తోడ్పాటు అని సవినయంగా మనవి చేస్తున్నాను .ఇంత విస్తృత రచన చేయగలనని నేను భావించలేదు .అన్ని ప్రక్రియలను ,అన్నికాలాల వారిని పరిచయం చేసినందుకు మహదానందంగా ఉంది .చదివి ప్రోత్సహించిన వారికి, నాకు కావలసిన విషయాలను గ్రంధ రూపం గా అందజేసిన సహ్రుదయులందరికి మరొక్క సారి వినయాంజలి ఘటిస్తున్నాను .,ఇప్పుడు రాసినది అంతా సమగ్రం, సంపూర్ణం కాదని ,కేవలం ప్రాధమిక విషయాలేనని ,ఇంకావారిని గురించి రాయవలసింది ఎంతో ఉండవచ్చని , రాయవలసిన వారు ఇంకా ఉండిపోయి ఉండవచ్చు నని , సకృత్తుగా ఇంకెవరైనా మిగిలిపోతే వారి విషయాలు తెలిస్తే వారిని గూర్చి కూడా రాయగలనని తెలియ జేస్తున్నాను . .ప్రస్తుతానికి ఇంతే .సెలవు –
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -౩1 -9-15 –కాంప్- మల్లాపూర్ -హైదరాబాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలు -స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఎల్ లక్ష్మణ మూర్తి
498 –శ్రీ కోవి కందాలై రంగా చార్య (188 5 -19 6 7 )
వరంగల్ లో ఉంది వందలాది విద్యార్ధులకువసతి భోజనం కల్పించి సంస్కృతం బోధించిన రంగా చార్య సంస్కృతం లో మహా పండితులు .గీర్వాణం లో ‘’వేదాంత శాస్త్ర హృదయం ,వేదాంత పంచ వింశతి ,గీతార్ధ సంగ్రహం ‘’రాశారు .గీతార్ధ సార సంగ్రహాన్ని స్రగ్ధరా వృత్తాలో రచించారు .
499 –శ్రీ శ్రీ దూపాటి వెంకట రామణా చార్య (—19 6 1 )
శేషాద్రి రమణ కవులలో వీరు ఒకరు .’’మేదినీ కోశం ,ఏకాక్షర నిఘంటు మాల ,విశ్వ నిఘంటు ,అమర శేషం ‘’కూర్చారు .19 6 1 లో చనిపోయారు .
50 0 –శ్రీ ఒద్దిరాజు సోదరులు (19 7 0
ఒద్దిరాజు సోదరులైన సీతా రామ చంద్ర రావు ,రాఘవ రంగారావు లు పాణిని అస్టాధ్యాయికి ‘’వ్యాఖ్యానం ‘’రాశారు .అలాగే ‘’భట్టికావ్యం ‘’పైనా వ్యాఖ్య రచించిన విజ్ఞాన సర్వస్వం అనిపించే సమర్ధ జ్ఞాన సంపన్నులు .సంస్కృత పాఠ శాల ఏర్పరచి సమర్ధంగా నిర్వహించారు .
50 1 –శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రి (19 ౩౦
భగవద్గీత పై నీల కం ఠ భాష్యానికి వ్యాఖ్య రాశారు ‘’భగవద్గీత తాత్పర్య నిర్ణయ ‘’సంస్కృతం లో19 50 లో రచించారు .
50 2 –శ్రీ ముదిగొండ వీరేశ లింగ శాస్త్రి
వరంగల్ ఎస్ వి ఎస్ ఏ కళాశాల ప్రిన్సిపాల్ చేశారు .’’భగవద్గీతా తత్వ ప్రభ ‘’రాశారు .
శ్రీ ఉదయరాజు శేషగిరి రావు ‘’శారదా స్తుతి ,శృంగార తరంగిణి ‘’రాశారు .
50 3 –శ్రీమాన్ ఎస్ యెన్ వి రఘునాదా చార్య
వరంగల్ కాలేజిలో ఆచార్య లెక్చరర్ .’’విద్వాన్. మనో రంజని ‘’అనే వ్యాస సంపుటిని ‘’మణిమాల ‘’అనే కవితా సంపుటిని వెలయించారు .తిరుపతి ర్రాస్త్రీయ సంస్కృత పరిషత్ నుండి ‘’మహామహోపాధ్యాయ ‘’బిరుదు పొందారు .
50 4 –శ్రీ శ్రీ భాష్యం విజయ సారధి
రాష్ట్రం లోనేకాక రాస్త్రే తరంగా కూడా సంస్కృతం లో ప్రాముఖ్యం పొందారు .సంస్కృతం లో 20 ఖండ కావ్యాలు రాశారు .అందులో మణిపూస ‘’మందాకినీ ‘’అనే దీర్ఘ కవితా కావ్యం .గంగానది ఆకాశం నుండి దిగిన ట్లు అతి వేగంగా ప్రవహిన్చినట్లు కవితా ప్రవాహం తో రాశారు .’’బిర్లా ఫౌండేషన్ అవార్డ్ ‘’అందుకున్నారు .
నల్గొండ జిల్లా
50 5-శ్రీ అంబటి పూడి వెంకట రత్నం
వీరు తెలుగు సంస్క్రుతాన్గ్లాలలో గొప్ప పట్టు ఉన్నవారు .ఇందిరా గాంధీకి అంకితమిస్తూ ‘’ఇందిరా విజయం ‘’నాటకం రాశారు .19 7 2 లో ప్రచురితం .ఇంగ్లీష్ మాతృక ఆధారం గా సంస్కృతం లో ‘’అక్రుతజ్నో నరః ‘’నాటకం రాశారు .
50 6 –శ్రీ పెరుమ్బుదూర్ రాఘవాచార్య బహు స్తోత్ర ,స్తుతులు రాయగా ,శ్రీ నల్లడిగ శ్రీనివాసా చార్య ‘’భద్రాచల రామ ‘’శతకం ,శ్రీ కల్వ కుంట అలహా శృంగార ఆచార్య మహా వ్యాకరణ వేత్త .నృసింహ శ్రీరంగానాదులపై స్తోత్రాలు రాశారు .
50 7 –శ్రీ చిదంబరం వీరభద్ర శర్మ
ఆజన్మ విద్వాంసులైన శర్మగారు కాశీ శివా రాధ్య పీఠం ‘’కు ముఖ్యాధికారి .కాశీలో విద్య నేర్చారు .న్యాయ ,మీమామ్సలను మధించారు .తెలుగు కన్నడ మరాటిసంస్కృతాలలో రచనలు చేశారు .సంస్కృతం లో కొన్ని శ్లోకాలు తప్ప మిగిలినవి ప్రచురితం కాలేదు .
50 8- ఆచార్య శ్రీ రవ్వా శ్రీహరి
ఆచార్య శ్రీ రవ్వా శ్రీహరి కుప్పం ద్రవిడియన్ విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ గా ఉన్నారు . గురుకులాభ్యాసం లో విద్యనేర్చారు .ఫిరదౌసి గబ్బిలం తోబాటు నారాయణ రెడ్డిగారి ‘’ప్రపంచ పది ‘’నికూడా సంస్కృతీకరించారు .ఆయన వ్యాసాలు ‘’సంస్కృత వైజయంతి ‘’గా ప్రచురితమైనాయి .అన్నమాచార్య సూక్తి సుధను సంస్కృతంలో రాశారు .వారి స్వంత రచన ‘’మాత్రు గీతి ‘’
ఖమ్మం జిల్లా
50 9-యెన్ సి పార్ధ సారధి అయ్యంగార్ ‘’రామ పాదుకా స్తవం ‘’,శ్రీ దాశరధి వెంకటా చార్య ‘’సంస్కృత శబ్ద ధాతు పద వాక్యాలపై వ్యాకరణం ,శ్రీ తిరుమల గుడి మెళ్ళఅంతర్వేది నరసింహా చార్యులు ‘’పాంచచ జన్యం ;;పై వందలాదిస్రగ్ధరా శ్లోకాలు రాశారు.శ్రీ మల్లాది సుబ్బా రాయుడు’’ శ్యామల ,వైద్యనాధ ,మాతంగి ‘’స్తోత్రాలు రాశారు .
తరువాత మెదక్ జిల్లా చూద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦ 9 -15- ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
కడప ,కర్నూలు జిల్లా లు –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన-డా.కోరాడ సత్యనారాయణ
486 –శ్రీ దుర్భాక రాజ శేఖర శతావధాని (18 88-19 50 )
కడప జిల్లా జమ్మలమడుగు నివాసి శ్రీ దుర్భాక వారు .శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారితో కలిసి జంట అవధానాలను ‘’రాజశేఖర-వెంకట కవులు ‘’పేరుతొ చేశారు .శాతావదానమూ నిర్వహించింది ఈ జంట .రాజశేఖరం గారు ‘’రాణా ప్రతాప సింహ చరితము ‘’కావ్యం రాసి ‘’వీర ప్రబంధ పరమేశ్వర ‘’చారిత్రిక కవితాచార్య ‘’బిరుదులూ పొందారు .సంస్కృతం లో ఒకే ఒక్కటి ‘’కామేశ్వరీ స్తోత్రమాల ‘’రాశారు .’’ఉత్తర రఘు వంశం ‘’కూడా రాశారు కాని పూర్తీ చేయలేదు
48 7 –శ్రీ అవధానం చంద్ర శేఖర శర్మ(19 14-19 9 6 )
కడపలోని కలశపాదుకు చెందినశర్మగారు ప్రొద్దుటూరు లోని శ్రీమళయాళ స్వామి వారి ఓరియెంటల్ కాలేజి లో పనిచేశారు .’’దేవీ సువర్నమాలా స్తోత్రం ,కన్యా తీర్ధ దేవీ సుప్రభాతం ,కల్గ్హత సిద్దేశ్వర సుప్రభాతం ,రసా వీటి వీర భద్ర సుప్రభాతం ‘’సంస్కృతం లో రాశారు .
488 –శ్రీ అయ్యల సోమయాజుల నరసింహ శర్మ (19 13
కావ్య క వాసిష్ట గణపతి ముని బంధువే నరసింహ శర్మ .ప్రొద్దుటూరు ప్రాచ్య కళాశాలలో పని చేసి ‘’పాండవ దార్త్ర రాష్ట్ర సంభవం ‘’అనే గణపతిముని కృతికి సంస్కృత వ్యాఖ్యానం రాశారు .
489 –శ్రీ భూపతి సుబ్రహ్మణ్య శర్మ (19 38-20 02)
శర్మగారి గీర్వాణ రచనలు –‘’భద్రాచల రామ సుప్రభాతం ,షిర్డీ సాయినాధ సుప్రభాతం ,శ్రీ కృష్ణ రక్షణం అనే నాటకం .ఈ నాటకం లో కృష్ణ దేవరాయల వైభవ చరిత్ర ఉంది .
490 –శ్రీ ఇచ్చం పాటి శఠ కోపాచార్య (19 28 -19 9 2 )
తమిళ శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందినవారు .ప్రొద్దుటూరు మళయాళ స్వామి కాలేజిలో పని చేసి గొప్ప పేరుపొందారు .సంస్కృత భాషా వ్యాప్తికి అనన్య సేవలందించారు .రాసిన వ్యాసాలూ కవితలు అన్నీకలిపి ‘’సుర వాణీ మణి హారం ‘’గా వెలువరించారు .ఇందులో పద్య మణి ,గద్య మణి,ద్రుశ్యమణి అని మూడు భాగాలున్నాయి .మొదటి భాగం లో ‘’హయగ్రీవ లహరి ,సూక్తి ముక్తావళి ,అమరావాణీ ప్రశస్తి ,శ్రీ సువర్ణ హారం ,ఆర్తి విజ్ఞప్తి ,మహాదేవీ వింశతి ,శ్రీ బగలా నక్షత్ర మాల ,కృపా రాజ్ఞీ ,భారత భూ వైభవం ,సూక్తి సుధానిధి ‘’ఉన్నాయి .రెండవ భాగం లో-‘’భక్తిమార్గ ప్రాశస్త్యం ,గురు శుశ్రూషయా విద్య ‘’ఉన్నాయి మూడవ దానిలో 5 నాటకాలున్నాయి-ధ్రువ విజయం ,కుచేల విజయం ,ప్రహ్లాద విజయం ,శ్రీ రామ విజయం ,భారతీ విజయం ‘’
కర్నూలు జిల్లా
491 – శ్రీ శ్రీధర పరశురామ శాస్త్రి (18 8 8 -19 6 5 )
కర్నూలు జిల్లా కరివెన ఆగ్రహారానికి చెందిన శాస్త్రి గారు విశ్వపతి సుబ్బమాంబ ల కుమారుడు .తండ్రిగారు మొదటి గురువై కావ్య ,వ్యాకరణ శాస్త్రాలు నేర్పారు . సర్వజ్ఞ స్వాత్మానంద సంయమీం ద్రుల శిష్యులై ,మరింత విజ్ఞానం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పుల్లేటికుర్రు చేరి చదివి ,బెంగాల్ లో హరనాధ తారక సిద్ధాంత శిరోమణి భట్టా చార్యులవద్ద న్యాయ శాస్త్రం నేర్చారు .తిరిగి వచ్చి ఆత్మకూరు హైస్కూల్ లో తెలుగుపండిట్ గా పని చేశారు .
శాస్త్రిగారి గీర్వాణ కృతులు -1-సింధు కౌస్తుభం –కలియుగం లో వాజపేయ యాగము ఎలాచేయాలో వివరించారు .2-ఇందిరా నందనం –నాట్య ,అలంకార శాస్త్ర విషయాల వివరణ చేశారు .౩-భట్ట తాత్పర్య భూషణం –శక్తివాడంపై చర్చ చేశారు అలంకార వక్రోక్తి మున్నగువానిపై రాశారు .ఈయన తమ్ముడు చంద్ర శేఖరుడు ‘’శ్రీరామ మందహాసం ‘’అనే సంస్కృత మహా కావ్యం రాశారు .
4 9 2 –శ్రీ పుల్లా పంతుల వెంకట రామ శర్మ
గొప్ప సంస్కృత విజ్ఞాని. ఆజన్మ కవి .గద్వాల్ సంస్థాన0 లో పదమూడుఏళ్ళ కే ఆశుకవిత్వం చెప్పి మెప్పించారు కర్నూల్ మునిసిపల్ హైస్కూల్ తెలుగు పండిట్ గా ఉన్నారు .లెక్కలేనన్ని అష్టావధానాలు చేశారు .శర్మగారి సంస్కృత రచనలు –గజేంద్ర మోక్షం పద్ధతిలో ‘’రాజ రాజ కావ్యం ‘’రాశారు ‘’శ్రీ రాఘవేంద్ర ప్రభాత స్తవ రత్నమాల ‘’,రాశారు
493–శ్రీ బచ్చు సుబ్బారాయుడు (19 02 -19 75)
బనగాన పల్లిలో ‘’ఔకు ‘’గ్రామం లో పుట్టిన రాయుడుగారి తలిదండ్రులు పార్వతమ్మ ,నాగయ్యలు .రాచర్ల శ్రీనివాసాచార్యులు గారి వద్ద సంస్కృతం అభ్యసించారు .సంస్కృతం లో ‘’సీతా రావణ సంవాదఝరి ‘’రాసారు .దీనికి ఒక నేపధ్యం ఉంది .మైసూర్ సంస్థా నకవి చామ రాజ రామ శాస్త్రి ‘’సీతా రావణ సంవాద ఝారి ‘’అనే శ్లేష కావ్యం రాశాడు .ఇందులో సీతా రావణులమధ్య సంభాష ణనలున్నాయి .రామ శాస్త్రి దీన్ని వంద శ్లోకాలలో రాస్తానని యాభై రాయగానే చనిపోయాడు .తన కావ్యాన్ని ఎవరైనా పూర్తీ చేస్తే కృతజ్ఞత ప్రకటిస్తానని మరణానికి ముందు చెప్పాడు .మన సుబ్బారాయుడుగారు దీన్ని సవాలుగా తీసుకుని పూర్తీ చేసి కవికి ఆత్మ శాంతి కలిగించాడు .
ఇదికాక ‘’శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ సుప్రభాతం ‘’,స్తవ మంజరీ ‘’కూడా రాశారు .
494 –శ్రీ పండిత పద్మనాభాచార్యులు (19 25-19 9 2 )
ఆత్మ కూరులో 19 25 లో పుట్టిన శ్రీ ఆచార్యులవారు ఆనంద తీర్ధ నాగాంబ లకుమారుడు .సంస్కృత వ్యాకరణ శాస్త్రం లో ఇటీవల కాలం లో వీరంత గొప్ప పండితులే లేరని పించారు .సర్వ శాస్త్ర పారంగతులు .మహా మహోపాధ్యాయులైన గురువులవడద్ద తర్క వ్యాకరణ మీమాంస వేదాన్తాలను నేర్చారు .కంచి స్వామి శ్రీ జయేంద్ర సరస్వతి ఆత్మకూరు వచ్చినప్పుడు ఆచార్యుల వారింటికి వచ్చి ‘’ద్వైతా ద్వైత చర్చ ‘’చేసారు .అంతకు పూర్వం కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర సరస్వతి పద్మనాభా చార్యుల వారింట ‘’న్యాయామ్రుతాద్వైత సిద్ధి ‘’పై చర్చించారు అంతటి మహా పండితులు ఆచార్యులవారు .
వీరి సంస్కృత రచనలు –‘’పరిభా షేందు శేఖర వ్యాఖ్య ,’’, శబ్దేందు శేఖర వ్యాఖ్య ,న్యాయ కుసుమాంజలి వ్యాఖ్య ,పంచ సూక్తి వ్యాఖ్య ‘’చాలా ప్రసిద్ధమైనవి .’’అద్వైత తత్వ చంద్రిక ‘’అనేవీరి అపూర్వ గ్రంధం సర్వ జనామోదం పొందింది .పాణిని విద్యాలయం స్థాపించి ప్రిన్సిపాల్ గా పని చేశారు కంచి కామ కోటి పీఠంసహాయం తో వేద పాఠ శాల స్థాపించారు .వీరి కుమారుడు ఆనంద తీర్ధ వ్యాకరణ వేదాంత పండితులు
495 –శ్రీ పత్రీ రాఘవ శర్మ
కందుకూరు వాసి .’’శివ సహస్ర నామ స్తోత్రం ‘’కు వ్యాఖ్యానం రాశారు .
496 –శ్రీ మంకాల కృష్ణ శాస్త్రి
కరివెన వారి ఆగ్రహారానికి చెందిన శాస్త్రిగారు గొప్ప వైయాకరణులు .’’అహోబిల సుప్రభాతం ‘’రాశారు .
4 9 7 –శ్రీ కానాల నల చక్ర వర్తి (19 53
ఆత్మకూరుకు చెందిన కానాల వారు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం లో పని చేస్తున్నారు .సంస్కృత విద్యపై బహుగ్రంధ రచన చేశారు .వారి రచనలలో ‘’శ్రీ వెంకటేశ్వర శతకం ,శ్రీ మళయాళ యతీంద్ర శతకం ,వాల్మీకి మహర్షేః-విప్లవాత్మక భావః ‘’,ఆటవిక బాలకః ‘’ముఖ్యమైనవి .
కడప కర్నూలు కవులు సమాప్తం –వరంగల్ వెడదాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦ -9 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
తెలుగు వాడైన విశ్వనాధ చాందసుడని ఆయన రాసినకొద్దీ వేదకాలం మరీ వెనక్కి పోయిందని ఎక్కిరించారు .ఆయనకు ప్రపంచ సాహిత్యం, అందులోని మార్పులు కవితోద్యమాలు ప్రక్రియా వైవిధ్యం ఏమీ తెలియవని అన్నారు .ఈ అన్నవారందరికంటే ఆయనే ఎక్కువగా విశ్వ సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవలోడనం చేసుకొన్నట్లు కనిపిస్తుంది .ఆయనకే సాహిత్యమూ ‘’అంటరానిది కాదు ‘’.వాటిలో ఉత్కృష్ట భావనలుంటే వాటిని భారతీయీకరణం చేసి ఈ ప్రధాన ప్రవాహం లో కలిపేసిన నేర్పు ఆయనది .ఇందులో కొన్ని ఆయనే చెప్పుకొన్నవి .కొన్ని ఆయన శిష్య పరంపర ,అభిమానులు చెప్పినవిఉన్నాయి .వాటిని వివరించే ప్రయత్నమే చేస్తున్నాను .
జ్ఞాన పీఠ పురస్కారం లభించినప్పుడు ఆయన్ను క్షుణ్ణంగా ఇంటర్వ్యు చేశారు .ఒక రకంగా శల్య పరీక్ష చేశారు .అప్పుడాయన చెప్పిన మాటలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం .అయన వాణి లోనే ‘’నాకు గోగోల్ తెలుసు .టాల్ స్టాయ్ ,దాస్తోవిస్కి తెలుసు . మాక్సిం గోర్కీకొంతవరకు తెలుసు .సోమర్ సెట్ మాం ,ఇబ్సన్ ,నియోత్ ,కూర్ట్ ల గురించి తెలుసు .బుద్ధిజం గురించి విస్తృతంగా చదువుకొన్నాను .వందల కొద్ది పేర్లు నాకిప్పుడు గుర్తులేవు .ఎంత మందిని చదివానో అ పేర్లుకూడా గుర్తులేవు .శాస్స్త్రాలు మతాలూ కళలు ,నేను చదివిన వాటి గురించి నా నవలలో చర్చించాను .వేట గురించి కూడా నాకు తెలుసు .జిమ్ కార్బెట్ ,పాండల్సన్ సింగ్ మొదలైన వారిని చదివాను .ఈ పరిజ్ఞానాన్ని నా రామాయణం లో ఉపయోగించుకున్నాను . రాముని అరణ్య వాస రచనలో ఈ నా పరిజ్ఞానమంతా ఉపయోగ పడింది .
‘’నేను అర్ధ శాస్త్రం చదివాను .కారల్ మార్క్స్ దాస్ కేపిటల్ గురించి కొంత తెలుసు .డబ్బు గురించి బాగా తెలుసు .ప్రతి వారి గురించి నాకు కొంతలో కొంత తెలుసు .ప్లాటో గురించి ,షోపనాల్ ,స్పినోజా ,బెర్గ్ సన్ ,శాంతాయన ,క్లోస్ ,డైలీ ల గురించికొంత తెలుసు .సైన్సు విజ్ఞాన చరిత్ర కూడా చదివా .అయిన్ స్టీన్ గురించి ,మాధవ పోర్ట్ గురించి చదివా .గ్రాంధిక వ్యావహారిక భాషల గురించి నన్నడిగితే ,వాటి గురించి ఒక ఒక పుస్తకమే రాయాల్సినంత గ్రంధం ఉంది నేను రాస్తే .
‘’నేను తులసీదాసు రామాయణం ‘’చదివాను .కంబ రామాయణాన్ని చదివానని చెప్పలేను .కొంత వినికిడి వలన తెలుసుకొన్నాను .రామాయణాన్ని ‘’అద్వైత మత స్థాపన ‘’కోసం రాశాను .వాల్మీకి విశిష్టాద్వైతానని స్థాపించటానికి రాశాడు అనే వాదాన్ని కాదనటానికీ రాశాను .రామకధ జరిగిన కాలం లో ఉన్నది ‘’సాంఖ్య దర్శనం ‘’ఇది అద్వైతం తోప్రక్కప్రక్కనే సంచరించేది .సీతా, లలితాదేవి ల గురించీ రాశాను. వాల్మీకి కంటే గొప్ప కళాకారుడు ఉండడు.దీన్ని వివరించటానికి కనీసం రెండుమూడు వేల పేజీల గ్రంధం రాయాలి .
‘’రాజ్య తంత్రం గురించి రాశాను .యుద్ధ తంత్రం సైనికులకు సంబంధించిన ‘’మిలిటరి ‘’గురించి కూడా రాశాను రాముడు సర్వాంతర్యామి అనే కోణం లో వాల్మీకాన్ని వ్యాఖ్యానించాను .నా రామాయణం లో అనేక వేదాంత తత్వాలను బోధించాను .మంత్రం శాస్త్రం చెప్పాను .పశ్చిమ దేశ గొప్ప కళాకారుల కు కూడా నేను కృతజ్ఞుడను .ఎడ్గార్ అలాన్ పో శిల్పం ప్రత్యేకమైనది .నియోల్ కవార్డ్ ,సోమర్సెట్ మాం లలో ఎవరి శిల్ప రీతి వారిది .హెమింగ్వే శిల్పరీతి వేరు .సర వాల్టర్ స్కాట్ తీరువేరు ఇది కాలదోషం పట్టింది .సిన్క్లార్ లూయీస్ రీతి వేరు .ఆధునిక విజ్ఞాన శాస్త్ర వేత్తలు అయిన్ స్టీన్, రూధర్ ఫోర్డ్ ల వెనకాల పడ్డారు .విజ్ఞాన పరిధిలో వారిది ప్రత్యేక మైన రీతి .ఈ విధంగానే నేను నా సొంత శిల్ప రీతిని సాధించుకోన్నాను.నా శిల్ప రీతి అనేక ఇతర విషయాలతో కలబోసి ఉంటుంది .వైదిక సత్యాలు ,భాషా శాస్త్ర విషయాలు సత్యాలు .మన స్మృతులలో ఉన్న సత్యాలు భాష్యాలలో ఉన్నాయి .అందుకనే వీటిని తెలుసుకోవటం కష్టం .
‘’నేను సుమిత్రను సృష్టించినట్లు ఎవరూ ఊహించి ఉండరు .ఆమె ఎంతో నెమ్మది .మన తెలుగు మధ్య తరగతి స్త్రీ లాగా ఉంటుంది.ఆమె ఉన్నట్లు వ్యక్తిగా స్పష్టంగా కనిపించదు కాని ఆవిడ లేకుండా ఇల్లు నడవదు .విచారం వల్లకలిగే కల్లోలాన్ని కుటుంబం లో ఇతరులు సహించేలా చేస్తుంది .రామాయణం లో ప్రతిపాత్రను నేను కొత్తగా సృష్టించాను .రావణుడిని కొత్తగా తయారు చేశాను .ఆయన ‘’ఖడ్గ రావణ మంత్రం ‘’అనే ఒక మంత్రానికి అది దేవత .శ్రీవిద్యలో ఈ రహస్యం దాగిఉంది .దాన్ని నేను సాధించి రాశాను .ఇది తెలియాలంటే ‘’కామకళా విలాసం ‘’చదవాలి .శ్రీ విద్యోపాసనకు ఇది ‘’బైబిల్ ‘’వంటిది .
‘’జాన్ సరూ వర్డ్ బ్లాకీ ‘’ప్రసిద్ధ గ్రీకు పండితుడు .స్కాట్ లాండ్ వాడు .ఆస్చిలాస్ రాసిన అయిదు ప్రఖ్యాత నాటకాలను అనువదించాడు .తన అనువాదానికి ముందుమాట రాస్తూ ‘’పద్యం అనేది కవికీ తత్వ వేత్తకూ సాధారణమైన సంగతి .తత్వ వేత్తకు తత్వ వేత్తగా పద్యం అందదు .కవికి కవిగా పద్యం’’ కీ’’దొరుకు తుంది .’’అన్నాడు మిల్టన్ ఒక కవి .కీట్స్ ఒక కవి.షేక్స్ పియర్ గొప్ప నాటక కర్త .,తాత్వికుడు .మౌలికంగా కవికాడు .పాఠకుడు నిజమైన కవిత్వం విన్నప్పుడు మరోప్రపంచం లోకి వెడతాడు .అతనికళ్ళుఆ సంగతిని వ్యక్తం చేస్తాయి .
విశ్వనాధ చాలామంది యూరోపియన్ అమెరికన్ రచయితలను చదివాడు .ఆయనమాటల్లోనే ‘’విస్తృతంగా చదివాను ‘’.ఆయనకు హెచ్ జి వేల్స్ అంటే ఇష్టం అన్నాడు .ఆల్డస్ హక్స్లీ ,మపాసా ,ఓ హెన్రి ధామస్ హార్డీ ల రచనలన్నీ లోతుగా చదివాడు .ఇంగ్లీష్ నాటక కర్తల రచనలన్నీ చదివాడు .గార్దేనర్ ,మిలని ,ప్రాస్ట్ ,రాబర్ట్ లిండ్ ,బ్లోవోస్కి ,బెర్ట్రాండ్ రసెల్ లను తరచాడు..ఆయన మాటల్లోనే ‘’ రష్యన్ రచయితల అనువాదాలు ఫ్రెంచ్ రచయితల రచనలు ఆపోసనం పట్టాను .మీరు నవ్వకుండా ఉంటె వందల కొద్దీ క్రైం కధలు చదివాను ‘’అని చెప్పాడు . ‘’జేమ్స్ బాండ్ ,బాస్ నవలలు చదివాడు .ఇగాన్ స్టాన్లీ ,గార్దేనల్ రచనలు చదివేశాడు .’’పశ్చిమ దేశాలనుండి వచ్చిన చదువ దగ్గ పుస్తకాన్ని దేన్నీ వదిలిపెట్టలేదు .బానిసల వ్యాపారానికి చెందిన అమెరికన్ నవలలు చాలా చదివాను .’’అని స్పష్టంగా చెప్పాడు .సైన్సు చరిత్ర ,పశ్చిమ దేశాల తత్వ శాస్త్రం భూ గర్భ శాస్త్రం ,డార్విన్ పరిణామ సిద్ధాంతం లను కూడా పూర్తిగా తరచి చదివాడు విశ్వనాధ .’’బెక్సన్ ‘’గురించి ‘’ధిల్లీ’’అనే ప్రఖ్యాత అమెరికన్ తత్వ వేత్తనూ చదివాడు .’’షేక్స్పియర్ నాటకాలన్నీ చదటమేకాదు .ఆయన పై వచ్చిన విమర్శన గ్రంధాలు దాదాపుగా అన్నీ చదివాను ‘’అని చెప్పుకున్నాడు .’’తెలుగు పద్ధతిలో వ్యక్తం చేయాలంటే నేను ఆంగ్ల సాహిత్య చరిత్ర ,ఆంగ్ల భాషాచార్యులు విస్తు పోయెంతగా చదివాను ‘’అని ఢంకా బజాయించి మరీ చెప్పాడు .’’కేమిస్ట్రి లెక్కలు ఫిజిక్స్ ఆల్జీబ్రా తప్ప మిగిలిన శాస్త్రాలన్నీ ఎంతో కొంత తెలుసు .’’అన్నాడు .ప్రాక్ ,పశ్చిమాల గురించి విశ్వనాధకు బాగా తెలుసు .ఉపనిషత్తులు బ్రాహ్మణాలు ,భాష్యాలు చదువుకున్నాడు .’’ప్రతి శాస్త్రం గురించీ కొంతవరకు తెలుసు ‘’అని తన సర్వ శాస్త్ర జ్ఞానాన్ని గురించి చెప్పాడు .సంస్కృత కావ్య నాటకాలు బాగా తెలుసు ‘’తెలుగులో యెంత ప్రసిద్ధ విమర్శకుడి నో సంస్కృతం లో కూడా అంతే ‘’అంటాడు .
‘’ఇంగ్లీసుభాష లోని ఆధునిక నాటకాలు చాలా చదివాను .ప్రీస్త్నీ ,గైట్స్ఇంకా ఇతర నాటక కర్తలవి చూశాను .19 50-60కాలం లో వచ్చిన వారిరచనలు కూడా చదివాను .కొంతమంది ఆదునిక విమర్శకులవి చదివాను .వారిలోపాలు మెరుగులు అవగతమైనాయి .’’అన్నాడు విశ్వనాధ .అందుకే సాహిత్య విమర్శ కు చెందిన కొన్ని గ్రంధాలు రాశాడు విశ్వనాధ .దానిపై ‘’తెలుగులో విమర్శనా విధానాన్ని మార్చి అనగా పరి వర్తనం చేసి అవి కొత్త విప్లవాన్ని సృష్టించాయి తెలుగు సాహిత్యం లో కొత్తగా ఆలోచించే విమర్శనా పద్ధతులకు నేనే శ్రీకారం చుట్టాను ‘’అని రొమ్ము విరుచుకుని చెప్పాడు .
‘’బెంగాలీ పధ్ధతి చిత్ర కళా రీతుల గురించి నాకు తెలుసు .నేను నాటక ప్రయోక్తను .నాటక కళ బాగా తెలిసిన వాడను .రెండు మూడు నాటక కంపెనీలకు శిక్షణ ఇచ్చాను .చిన్నప్పుడు పాటలు బాగా పాడే వాడిననే పేరు0డేది నాకు.’’మ్రోయు తుమ్మెద ‘’నవలలో హిందూస్తానీ సంగీతం పుట్టుక,పెరుగుదల గురించి రాశాను .కర్నాటక సంగీతం గురించి నాకు కొంత తెలుసు .సుమారు యాభై ఏళ్ళ కిందటే ‘’ఏక వీర ‘’నవలలో కూచి పూడి నృత్యం గురించి రాసిన మొదటి వాడిని .కూచిపూడి నృత్యానికి వేయిపడగలు లోని ‘’గిరిక ‘’ప్రతిభా వంతమైన దర్పణం .నేను కళాత్మక ఆంగ్ల చిత్రాలు చాలా చూశాను అలా చూడటం నా హాబీకూడా ‘’
సంస్క్రుతకవుల మార్గాలను బేరీజు వేస్తూ కాళిదాసు సహజ సుకుమార మార్గ గామి. భవ భూతి మురారిలుశబ్ద బ్రాహ్మలు .భారవి అర్ధ సంగ్రహణ శీలి .అలాగే తెలుగు కవుల గురించి విశ్లేషిస్తూ నన్నయ సహజ సుకుమార మార్గం లో ప్రయాణించాడు .ప్రౌఢకదా నిర్మాణం లో ,జ్యోతిశ్శాస్త్ర విషయాలు గుప్పించటం లో ,లోకజ్నత్వం లో ,లోకం లోకి పలుకుబడులు నుడికారం ,లోకోక్తులు విరివిగా వాడాడు .తిక్కన మార్గం వేరు సౌకుమార్యం ఉండదు కాని లోతైన పరిశీలనం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది అన్నాడు ‘’నాది తిక్కన మార్గం .నన్నయ గారి పోకడ నా దగ్గర లేదు .నాస్వభావం లో ప్రక్రుతిలోకూడా లేదు శైలి అనేది కవి జీవ లక్షణం దాన్ని ఎవడూ మార్చు కోలేడు.అందుకే మహా కవులకు వారి వారి ముద్రలు ఉంటాయి .
విశ్వనాధ కాల్పనిక సాహిత్యాన్ని కాని కవిత్వాన్నికాని రాస్తున్నప్పుడు ఆనందిస్తూ అనుభవిస్తాడు.ఎప్పుడూ ఒక మానసిక స్తితిలో ఉంటాడు .ఒకరకమైన పారవశ్య స్తితిలో తన్మయత్వం లో ఉంటాడు .దాన్ని డిస్టర్బ్ చేస్తే సహించడు.రవీంద్రుని ప్రేరణతో భావకవిత్వ ఉద్యమం వచ్చిందని ,తనపై టాగూర్ ప్రభావం కొద్దికాలమే ఉందని ,అది తనకేమీ ఉపకారం చేయలేదని ,కాని ఆయనకదానికలు చదివి ఆనందించానని అన్నాడు .’’మన సుసంపన్నమైన తెలుగు సాహిత్యం టాగూరు ను మించినది .పాశ్చాత్య రచయితలనుకూడా మించి పోయినది’. ఇక్కడ వేదోపనిషత్తులున్నాయి .డాస్తోవిస్కి భారత దేశం లో పుట్టి ఉంటె ‘’ఇడియట్ ‘’నవల రాసి ఉండేవాడు కాదు .ఇక్కడ పుట్టి ఉంటే షేక్స్పియర్ ‘’హామ్లెట్ ‘’రాసేవాడుకాడు .ఎందుకంటె ఒక దేశపు సంస్కృతీ ,మతం ,భాష ,ఆచారాలు ,ఆ దేశపు రాజ్యాంగం తప్పకుండా వాటి ప్రభావాన్ని ఆ దేశపు గొప్ప కవు లందరిమీదా చూపిస్తాయి ‘’అని నిర్ద్వందంగా విశ్వనాధ చెప్పాడు .దీన్ని బట్టి విశ్వనాధ విశ్వ సాహిత్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశాడనిఅర్ధమౌతోంది ..
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦-9 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
చిత్తూరు జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.శ్రీమతి లలితా రాణి ,డా.రాణి సదాశివ మూర్తి
472 –శ్రీ కొరవి రామ కవి
కార్వేటి నగర జమీందారుల ఆస్థానకవి శ్రీ కొరవి రామ కవి .సంస్కృత రచనలు –‘’దశ రూపక పధ్ధతి ,కువలయానంద ,విశ్వ గుణ దర్శన చంపు వ్యాఖ్య ,మొదలైనవి రచించారు .
47 3-శ్రీ శిస్టు కృష్ణ మూర్తి శాస్త్రి
కాళహస్తి జమీందార్ల ఆస్థానకవి .’’యక్షోల్లాసం ,మదనాభ్యుదయభాణం,కంకణాబద్ధ రామాయణం మున్నగు సంస్కృత రచనలు చేశారు .
47 4 –శ్రీ పురుషోత్తమ పండితులు
వెంకట గిరి ఆస్థానపు ఈ కవి ‘’కుమారా యాచ నృపాల ‘’,చతుష్టష్టి విద్యా సంగ్రహం ‘’సంస్కృతం లో రాశారు .
47 5 –శ్రీ కందుకూరి నాగ నాద సూరి
ఇరవై వ శతాబ్ది నియోగి బ్రాహ్మణుడు .’’మీనాక్షీ కళ్యాణ చంపు ‘’,రామ విజయ చంపు ,మొదలైన చంపువులు రాసి చంపూ కవిగా ప్రసిద్ధుడైనాడు .కందుకూరి చొక్కనాద కవి శిష్యుడు .శేషమాంబ కుమారుడు .మలయధ్వజుని కూతురు మీనాక్షి వివాహ వర్ణనే మొదటి చంపువు .
47 6 –శ్రీ వత్తిపల్లి నర కంఠీరవ శాస్త్రి
వెంకట లక్ష్మి ,సాంబశివ ల కుమారుడు .తిరుపతి సంస్కృత కళాశాలలో ప్రసిద్ధ సంస్క్రుతాచార్యుడు .ఇరవయ్యవ శతాబ్ది ముందే చనిపోయాడు .చాలాకావ్య రచన చేశాడు కాని లభించినవి కొన్ని లఘుకావ్యాలు మాత్రమె .అవే –శ్రీ వెంకటేశ్వర స్తోత్రం శ్రీ జ్ఞాన ప్రసూనామ్బికా స్తోత్రం ,మాత్రమె అచ్చయ్యాయి మిగిలినవి వ్రాతప్రతి లోనే ఉండిపోయాయి
47 7 –శ్రీ విక్కిరాల శేషాచార్య
కాళహస్తి కవిగా ప్రసిద్ధులు .’’మదన విజయ భాణం’’అనే దాన్ని మదనమంజరి ,పల్లవ శేఖరుల ప్రేమ పెళ్ళిగా రాశారు .47 8 –బాణాల శేష సూది
వాదూల భావనారాయణ శిష్యుడు .శ్రీ కృష్ణుని పై పద్య గద్య రచన చేశాడు ..
47 9 –శ్రీ చంద్ర గిరి వేంకటాచార్య –శ్రీనివాసాచార్య మనవడు .తాతాచార్య కుమారుడు .చంద్ర గిరి వాసి .’’శృంగార భూషణ భాణం ‘’,ను వామన భట్ట భాణుని రచనకు అనుకరణగా రాశాడు
480 –శ్రీ మాడభూషి అనంత శయనం అయ్యంగార్
సంస్కృత మహా విద్వాంసుడు .మత గ్రంధాలు సంస్కృతం లో రాశారు ..లోక సభ మాజీ స్పీకర్ .
శ్రీ తిరుచానూర్ కృష్ణ కవి మంగా పుర నివాసి .’’సత్యభామా పరిణయం ,అనే అయిదు అంకాల నాటకం ,రాశాడు.సర్వశ్రీ ఎస్ వి ఎస్ కృష్ణమాచార్యులు ‘’మృత సంజీవనం భాణం ‘’,జయలక్ష్మి వృక్ష శాస్త్రంపై రచన ,చేశారు .
481 –డా.యెన్ సి వి.నరసింహా చార్యులు(19 23 –
7-8-19 23జన్మించిన ఆచార్యులవారు సాహిత్య శిరోమణి విద్వాన్ బి ఓ ఎల్ బి ఏ .వేదాంత వారధిని సంస్క్రుతకలాశాలలో పని చేశారు .100పైగా సంస్కృతం లో రిసెర్చ్ పేపర్లు రాసిన ఘనత ఆయనది .ఆయన రాసిన ‘’ముక్తా మౌక్తికమాల ‘’మానవ జీవితాన్ని తీర్చి దిద్దుకోవటానికి ఉపకరించే విలువైన గ్రంధం .ఇందులో 232 ముక్తకాలున్నాయి దేనికదే సాటి .తిరుపతి లో సుప్రసిద్ధ కవిగా పేరొందారు .’’వాచస్పతి ‘’బిరుదు ,రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం అందుకొన్నారు .’’పండిత రాజ ‘’,సాహిత్య విశారద ‘’గౌరవాలుపొందారు .
482- శ్రీ వి ఆంజనేయ శర్మ
సంస్కృతం లో అఖండ పండితుడు మహా కవి ‘’శ్రీ పరమ హంస ,శ్రీ శారదా దేవి ‘’వీరి మహత్తర రచనలు .’’కవిరాజ హంస ‘’,’’దర్శన కళానిధి ‘’.వీరి బిరుదులు .
483-శ్రీ ఎస్ హెచ్ .రఘునాదాచార్య
తిరుపతి సంస్క్రుతకాలేజి వైస్ చాన్సెలర్ .సంస్కృత వ్యాప్తికి విశేష కృషి చేశారు .’’రామ విజయ కావ్య ‘’రచయిత.’’దశావతార సుప్రభాతం ,మరొక రచన .
48 4 –ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి
బహు ముఖీన ప్రతిభగలవారు .రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ కు వైస్ చాన్సలర్ .అనేక విధ కావ్య రచన చేశారు .’’శ్రీశ వింశతి ‘’,శ్రీ జగన్నాధ షోడశి ,శ్రీ గురు ప్రపత్తి ‘’ధన్యాస్టకంలను రాసి ‘అన్నిటిని కలిపి ‘’వన మాల ‘’అనే సార్ధక నామం తో ప్రచురించారు మధుర మంజుల కవిత్వం ఇందులో ప్రవహించింది .జాషువాగారి ‘’పిరదౌసి .కరుణశ్రీ ‘’కుంతీకుమారి ‘’లను సంస్కృతీకరించారు .
485 –ప్రొఫెసర్ హరే కృష్ణ శతపది
తిరుపతి సంస్క్రుతకాలేజి వైస్ చాన్సలర్ .ఒరిస్సా వారైన ఈయన జగన్నాదుని ఒడి లో నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒడిలోకి చేరారు .సంస్కృతం లో సంస్కృతీ ,వారసత్వం లపై యాభై వ్యాసాలూ రాశారు .అనేక అంతర్జాతీయ పురస్కారాలన్డుకొన్నారు .ఒరిస్సా సాహిత్య అకాడెమి అవార్డ్ ,దిల్లీ సంస్కృత అకాడెమి అవార్డ్ మొదలైనవి వీరి కీర్తి కిరీటం లో కలికి తురాయిలు .సంస్కృతం లో అనేక కావ్యాలు రాశారు .ఆయన కవిత్వం లో పదాలు నాట్యం చేస్తాయి .వీరి ‘’మహోదధి సుప్రభాతం ‘’విశేష ప్రాచుర్యం పొందింది .ఇందులో ఉన్నవి 28 శ్లోకాలు మాత్రమె. భావన పరమ వైభవం గా ఉంటుంది .మహోదధి స్తోత్రం లో అయిదు శ్లోకాలు ,మంగళాశాసనం లో మూడు శ్లోకాలున్నాయి .పూరీ క్షేత్రమైన శ్రీ క్షేత్రం లో ఉన్న సముద్రానికి అక్కడి జగన్నాధ స్వామికి ఉన్న సంబంధాన్ని విశేషంగా వర్ణించారు కవి .మహోదధి కి జగన్నాధుని అల్లునిగా చిత్రించారు .తనకుమార్తె శ్రీమహా లక్ష్మిని సముద్రుడు జగన్నాదునికి భార్యగా సమర్పించి మామగారైనాడు .హిమవంతుడు తన కూతురు పార్వతీ దేవిని శివుని అర్ధాంగిని చేసి మామగారైనట్లు గా ఇది ఉంది ..కవిత్వం పూరీ సముద్రంలా ఉప్పొంగి హృదయాలను రసప్లావితం చేస్తుంది .
చిత్తూరు జిల్లాకవులు పూర్తీ .కడప ,కర్నూల్ కవుల పరామర్శ చేద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -౩౦ 9- 15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
ప్రకాశం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.డి ఏం దీక్షిత్
470-శ్రీ మేళ్ళ చెర్వుసుబ్రహ్మణ్య శాస్త్రి
ఒంగోలు మండలం ఉప్పు గుండూరు గ్రామవాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ జగన్నాధ శాస్స్త్రి శ్రీమతి మహా లక్ష్మమ్మ లకు జన్మించారు .భారద్వాజ గోత్రం .అనన్య సాధారణ పండితులు .చందవోలు శాస్త్రిగారిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద సంస్క్రుతకావ్యాలంకార ,వ్యాకరణ శాస్త్రాదులు నేర్చారు .తెనాలి సంస్క్రుతకాలేజిలో విద్యా ప్రవీణ అయ్యారు .సంస్క్రుతాధ్యాపకులయ్యారు .ఆంద్ర సంస్కృతాలలో ఏం ఏ పొందారు .సంస్కృతం లో బహు గ్రంధాలు రాశారు ‘
‘’శ్రీ గురు చరితం ‘’లో శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ని గురించి సమగ్రంగా రాశారు .’’శ్రీ దేవీ మానసానంద హేతవే ధర్మ సేతవే –గుర్వే శిష్య లోకస్య నమోవాకం ప్రశాస్మహే ‘’అని గురు కీర్తన చేశారు .’’భావనా బృందావనం ‘’కావ్యం లో ముక్తక శ్లోకాలు రాశారు .’’సాలభంజికా సూత్ర దారం ‘’’’లాలితానంద లహరి, స్తన్య ధారా స్తవం ;;రచించారు .ఇందులో ఒక శ్లోకం –‘’హే నిత్య ప్రసావిత్రీ తే స్తన యుగం ధారా ధారా హ్రీకరం-క్లీం మధ్యాక్రుతి మాత్రుగాదర గృహీత స్వాదితం భావయే –శ్రీ పీయూష ముపాస్య యస్య కవయ స్వెం బీజ వాజీ కృతా –అన్నాముత్ర జయంతి హన్తః –సుమనస్యో రాజ్య రారాజితాః’’
‘’వేదనాద స్తవం ‘’లో ‘’శరీరే యూపా గహనా కశేరుకా –విజ్ఞాన సంబందా మనసే మే జడస్య –ఆలస్య కచిద్ గోపికా హంత సుప్తా –నూనం కించిత్ స్ప్రుశతీ వాద్వ యోక్త్రం ‘’అన్నారు .
వేదనా నివేదనం ‘’కావ్యం లో శిఖరిణీ శార్దూల విక్రేడి తాలలో కవనాన్ని కధనం తొక్కించారు .-‘’కిం దుఃఖం కిం సుఖం కిం శుభమితి మానసా వర్తమానాతీతం-నిస్చేతుం పంగ గుబుద్ధిః -సతతామిద మా విశ్వాసజే ధ్నేయ్యమానః ‘’
ఇవికాక ‘’పరి ప్రశ్న మంజరి ‘’,లింగ దర్శనం ,కర్మ వాద నిర్మధనం’’,దయా దారిద్ర్యం ,పరాకాయ ప్రవేశ స్తోత్రం ,తత్వ మంజరి ,నమశ్శివాయ ,బిన్డుమాలినీ స్తవం ,రఘు కౌత్సం ,నిరపంనప ద్వాదశి ,శివ దోష స్తుతి ,అన్గాగార క్రుష్ణాగారః మొద లైనవి రాశారు
471-.సంస్కృత భాష సేవలో తరించిన వదాన్యుడు శ్రీ గోరంట్ల వెంకన్న (18 71-19 47)
ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతం లో సంస్కృత భాష ను బ్రతికించి సేవలందించిన మహనీయుడు శ్రీ గోరంట్ల వెంకన్న .జీవితం అంతా గీర్వాణ సేవకు , విద్యా సాంస్కృతిక సేవలో గడిపిన వదాన్యుడు .ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రం లో 1871 లో వెంకన్న జన్మించాడు భాగ్య నంతుడు .వీరన్న పున్నమ్మల కుమారుడు .సంస్కృత విద్యాలయాలలకు సంస్క్రుతకవిపండి తులకు విద్యాలయాల స్థాపనకు చేతికి ఎముక లేకుండా దానం చేసిన అభినవ కర్ణుడు .ఒంగోలులో హైస్కూలు ,ఓరియెంటల్ స్కూలు , తిమ్మ సముద్రం లో సంస్కృత కళాశాల స్థాపించిన వదాన్యుడు విద్యాభిమాని .విద్యార్ధులందరికీ ఉచిత భోజన వసతులు కలిపించిన మహనీయుడు .వేటపాలెం లో ‘’సరస్వతి నికేతన్ ‘’అనే గొప్ప గ్రంధాలయాన్ని నిర్మించాడు దీనికి ఉన్న పేరు దేనికీ రాలేదు .సంస్కృత విద్యా వ్యాప్తికి ఆయుర్వేద వ్యాప్తికి ౩౦౦ ఎకరాల స్థలాన్ని ట్రస్ట్ కు రాసిచ్చిన మహా దాత . టంగుటూరి ప్రకాశం పంతులుగారి ముఖ్య అనుయాయి .గాంధీగారికి వెంకన్న దాతృత్వం తెలిసి తిమ్మ సముద్రం వచ్చి చూసి అభినందించాడు .తుఫానులో సర్వస్వం కోల్పోయిన వారందరికీ గృహాలు కట్టించి ఇచ్చాడు హరిజనులకు నివేశనస్తలాలను అందజేశాడు .యావదాస్తినీ ప్రజాసేవకు సంస్కృతభాషా వ్యాప్తికి రాసిచ్చి సన్యాసం స్వీకరించి అతి పవిత్ర జీవితాన్ని గడిపి మహా దాత గోరంట్ల వెంకన్నగారు 1947 లో డెబ్భై ఆరవ ఏట పరమ పదించారు .
ప్రకాశం జిల్లా కవులు సమాప్తం –తరువాత చిత్తూరు జిల్లా కవుల్ని పరమర్శిద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29 -9 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ .
26-9-15 శనివారం మా హైదరాబాద్ ట్రిప్ మొదటి రోజు మా పెద్దతోదల్లుడు గారింట్లో ,శర్మావాళ్ళ క్వార్టర్స్ లో గణేష్ హోమం అన్నప్రసాడం ,మా అక్కయ్యా బావ గార్ల ఇంట్లో
విశ్వనాధ రాయాలనుకొని రాయని రచనలు
‘’మా అన్న గారు వ్రాసినాన్ని కావ్యాలు రాసి ,వ్రాసినాన్ని కావ్యాలు రాయకుండా వదిలేశాడు ‘’అని విశ్వనాధవారి తమ్ముడు శ్రీ వెంకటేశ్వర్లు గారు రాశారు .దీన్ని బట్టి విశ్వనాధ మనసులో ఎన్నో రచనలు గర్భస్తంగా నే ఉండిపోయాయని పురుడు పోసుకోలేదని తెలుస్తోంది .కొన్నిటికి పేర్లు కూడా పెట్టి ప్లాట్ తయారు చేసు కొని ,ప్రణాలికను కూడా మనసులో రచించుకొని , ,కారణాంతరాల వలన రాయలేక పోయారు .దీనివల్ల ‘’విశ్వ నాద భారతి ‘’కి సంపూర్ణ ఠాసాహిత్యాభారణాలు సమకూరక కొంత లోటు గా కనిపిస్తుంది ఆ విషయాలనే తెలుసుకో బోతున్నాం .
మొట్ట మొదటి సారిగా కిన్నెర సాని పాటలు రాసేటప్పుడే ‘’రధంతరి ‘’అనే పాటకూడా రాయాలని విశ్వనాధ సంకల్పించారు .’’రధ0తరీ! రద0తరీ!నాట్యమాడవే రధంతరీ’’అనే మకుటం టో ఒక పాట రాస్తానన్నాడు .అది వ్రాయనేలేదు ‘’అన్నారు వెంకటేశ్వర్లు .అలాగే’’ మా స్వామి ‘’చివరలో ఒకపద్యం లో ‘’ఈ కిన్చిత్క్రుతి ఎట్టులైన మరి ఏమీ లేదు లేవయ్యా ,వే-దా !కాపర్దశిఖాదునీ !స్వనిత గాదా !విశ్వనాధా !భవవి -శ్రీ కంఠాభరణంబు చెప్పెదను రాజీవంబు లో తేనియల్ ‘’ మొదలైన పద్యాలలో ‘’శ్రీ కంఠా భరణం ‘’అనే కావ్యం రాయాలని విశ్వనాధ అనుకొన్నట్లు తెలుస్తోంది .’’షష్టిపూర్తికి ముందో ,తరువాతో నేను ఆయన్ను శ్రీ కంఠాభరణం రాయకూడదా అని అడిగాను .రాయాలిరా 1 అది సామాన్యమైన పనికాదు .జైమినీ భారతం లో సురధుని పాలనాన్ని కుమార స్వామి సంపాదించి ,శివ కపాల మాలలో సంఘటింప చేసిన కదఉన్నది .దానితో బాటు నూట ఎనిమిది కధలను కల్పించి శివ కపాల మాల ను పూర్తీ చేయ వలసి ఉన్నది .నాన్న కధను కూడా అందులో నొక దానిని చేసి ఆయన కపాలాన్ని కూడా అందులో గ్రుచ్చి నట్లుగా వ్రాయాలని ఉన్నది ‘’అని అన్నాడని వెంకటేశ్వర్లుగారు రాశారు . ‘’నేనాయన భావనా పార మేష్ట్యమునకు అబ్బుర పడి ఊరుకొంటిని .మేధ పరాశక్తి యొక్క వివర్త స్వరూపము .ఆవిడ వాక్య రూపము పొందటానికి మహనీయమైన సుకృత ఫలము కావలసి ఉంటుంది ‘’అని రాయలేక పోయిన కారణానికి ఆధ్యాత్మికతను జోడించి చెప్పారు తమ్ముడుగారు . .ఎంత గొప్ప ప్రణాళిక ను విశ్వనాధ రచించుకోన్నాదోమనసులో అని పిస్తుంది ఇది తెలిస్తే .ఆ కంఠాభరణం భారతీశ్రీ కి అలంకారం కాకుండా పోయినందుకు బాధ గానే అనిపిస్తుంది మనకు .
గుంటూరులో విశ్వనాధ ఉన్నప్పుడు ‘’శ్రీ మంతా చార్యుల’’ వారి వద్ద ‘’చాన్దోగ్యోపనిషత్ ‘’చదువుకొన్నారు. తరువాత ‘’చందోగులు ‘’అనే పేరుతో ఒక నవల రాస్తానని తమ్ముడితో విశ్వనాధ చెప్పాడు .కాని కార్య రూపం దాల్చలేదు .అలాగే ‘’ఊచ యుద్ధం ‘’అనే కృతి అయన రచనలో దొరకటం లేదన్నారు .దానిపై స్పందిస్తూ ‘’అది వ్రాసిన కదా దొరకటానికి ! ఊచ యుద్ధం పల్నాటి వీరులైన అలరాజు ,ప్రోల రాజు ల యుద్ధం .వివరాల గోడిగ’’ను గూర్చిన పద్యాలలో అది కొంతవరకే వర్ణింప బడింది.దాన్ని వేరే కావ్యంగా రాద్దామనుకొన్నాడు .అది జరుగలేదు ‘’అని నిర్వేదం వెలిబుచ్చారు వెంకటేశ్వర్లుగారు .ఇలా మహత్తర రచనలకు మనసులోనే శ్రీకారం చుట్టారు కాని వాటిని రాసి వెలువరి౦చలేక పోయారు విశ్వనాధ .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
మా (మా అన్నగారి )ముని మనవడు ఛి కార్తిక్ రేయా౦శ్బారసాల ,నామకరణ మహోత్సవ చిత్ర మాల -27-9 -15 ఆదివారం -హైదరాబాద్ లోని విద్యానగర్ కాలనీ లో
విశ్వనాధ సోదరులు కర్త ,కర్మ క్రియలు
విశ్వనాధ సత్యనారాయణ ,పెద్ద తమ్ముడు వెంకటేశ్వర్లు చిన్న తమ్ముడు రామ మూర్తి త్రయాన్ని బండరుజనం ‘’కర్తా కర్మా క్రియ ‘’అనేవారట .మొదటి ఇద్దర్నీ రామ లక్ష్మణులనేవారు .వారి అనుబంధం అంత గొప్పగా గాఢం గా ఉండేది విశ్వనాధ వ్యాసునికి వ్రాయసగాడైన గణపతి వెంకటేశ్వర్లు .ఇది మరీ దగ్గర సంబంధం .ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని వెంకటేశ్వర్లుగారు అక్షర బద్ధం చేశారు వారికి విశ్వనాధ భార్య వరలక్ష్మిగార్లు సాక్షాత్తు సీతా రాములే .గురువు వెంకట శాస్త్రి గారు బందరు భైరవ ప్రెస్ లోనే కాపురం పెట్టారు .వారిభార్య మహా లక్ష్మమ్మగారు దొడ్డ ఇల్లాలు .సోదరులు హోటల్ లో భోజనం చేసేవారు .ఒక రోజు వీరు భోజనానికి వెడుతుంటే ఆమె అడ్డగించి ఆ హోటల్లో మసూచికం ఉన్నవాల్లున్నారు వెళ్ళద్దు అని బ్రతిమిలాడి అన్నం వడ్డించి పెట్టి తినిపించింది అప్పటినుంచే విశ్వనాధ కవితా తపస్వి అయ్యాడని అంటారు వెంకటేశ్వర్లు గారు .
రామ మూర్తిగారు వదిన ను తల్లిగానే భావించాడు .’’నాకేమో వాళ్ళ మీద రుస రుస ఉండేది ‘’అన్నాడు వెంకటేశ్వర్లు గారు .రామమూర్తికి ‘’పంచ కోశాల్లో ఎక్కడ వెతికినా వాళ్ళ మీద మాతా పితృ భావమే తప్ప మరొక భావం లేదు .విశ్వనాధ వీరిద్దరి గురించి కల్ప వృక్ష పీఠికలో రాశాడు .’’నన్ను గురించి రాసిన దానిలో కొంత అతి శయోక్తి ఉన్నాదని నా భయం .రామమూర్తి’’ . గురించి రాసింది అక్షరాలా నిజం ‘’అని కితాబిచ్చారు శ్రీ వెం గారు .’’మా అన్నకూ నాకు సోదర సంబంధం కంటే గురు శిష్య సంబంధం ఎక్కువ .తానూ కృష్ణాపత్రికలో పని చేశానని శ్రీ ముట్నూరి తనను కమ్మచ్చు తీర్చినట్లు తీర్చి దిద్దారని వెంకటేశ్వర ఉవాచ .ఇంటిదగ్గర అన్నగారు తానూ రాసిందల్లా చదివి వినిపించేవాడు .’’అయన సర్వ రచనకు నేను ప్రధమ శ్రోతను .నాకు బద్ధకం గా ఉన్నా విని తీరాల్సిందే .ఆయన చెప్పే విమర్శలనన్నిటినీ ముందు నాకే వినిపించేవాడు .తానూ చదివే గ్రంధాలన్నీ నా చేత చదివి౦చి వినేవాడు .హ్యూగో రాసిన ‘’లారాబిలే ‘,త్రీ మస్క్క్వి టీర్స్’’,టాల్ స్టాయ్ నవల ‘’వెందేట్టా ‘’నవల ఆయనతో బాటే నేనూ చదివా .భారతిలో సంస్కృత నాటకాలపై రాసిన విమర్శలన్నీ ఇంటి దగ్గరే చదివాను ‘’అని చెప్పుకొన్నారు వెంకటేశ్వర్లు .
‘’వేయి పడగలు మా బాబు మొదలైనవన్నీ విశ్వనాధ చెబుతుంటే వెంకటేశ్వర్లె రాశారు .వీటివల్ల తానూ ఎంతో సారస్వత లాభం పొందానని గర్వించారు .తాను పెద్దగా ప్రాచీన సాహిత్యం చదవ లేదని ,తిరుపతికవుల సాహిత్యం అన్నగారి సాహిత్యాలే తనను పండితుని చేశాయని నిజాయితీగా చెప్పుకొన్నారు .’’నేను అన్నగారి కంటే ఎక్కువ పండితుడను ‘’అను కొనేవారిది భ్రాంతి మాత్రమె ‘’అన్నారు నిష్కర్షగా .అన్నగారి జీవితం అంతా స్నేహిత బృందం తోనే గడిచి పోయింది. వీరందరూ ఆయన నవలలో పాత్ర ధారులై చిరంజీవులయ్యారు .ఆయన సౌజన్యం అదీ ..దీనికి బందుగణానికి కన్నేర్రగా కూడా ఉండేదట .దారిద్ర బాధ అనుభవిస్తూ కూడా తమ్ముడి సంసారం తో బాటు తన సంసారాన్నే పోషించాడు విశ్వనాధ .ఆ కాలం లో కిన్నెరా సాని నర్తన శాల ,కోకిలమ్మ పెళ్లి అచ్చు వేసి సంసారాన్ని పోషించాడు .ఒకసారి స్నేహితుడు బెల్లంకొండ రాఘవరావు గారింటికి పమిడిపాడు వెళ్ళాడు .ఆయనభార్య కనకమ్మగారూ కవిత్వం రాసేవారు . భోజనం విస్తళ్లలో వడ్డించింది .విశ్వనాధ స్నానాల గదిలో ఉన్నాడు యెంత సేపటికీ బయటికి రావటం లేదు .రాఘవ రావు వెళ్లి చూస్తె తడి బట్టలతో గోడ వంక చూస్తూ ఏకాగ్రభావం లో ఉండిపోయాడు .నెమ్మదిగా ఇహలోక స్పృహ లోకి తెచ్చి భోజనానికి కూర్చోబెట్టారు .
తండ్రిలాగానే విశ్వనాధ నిత్య రామ మంత్రోపాసాకుడు .నేషనల్ కాలేజిలో ప్రమోదకుమార చటర్జీ చిత్రకళాధ్యాపకుడు బాపిరాజుగారాయన శిష్యుడు .ఆయన వేసిన ‘’త్రిశూలం ‘’చిత్రం చూసి ఉప్పొంగిపోయిన విశ్వనాధ ‘’నాకు రాజ్యం ఉంటె ఆ రాజ్యాన్ని మీకు ఇచ్చేసేవాడిని ‘’అన్నాడు .ఎంతో ఆనందించిన చటర్జీ కాలేజి వదిలి వెళ్ళేటప్పుడు విశ్వనాధను పిలిచి ‘’మీరు రాజ్యం పోగొట్టుకోనక్కరలేదు .ఈ త్రిశూలం మీకు బహుమతిగా ఇస్తున్నాను ‘’అంటే గుండె ద్రవించింది విశ్వనాధకు .త్రిశూలం పేరుతొ నాటకం రాసి ఆ త్రిశూలాన్నే ముఖ చిత్రంగా వేయించి కృతజ్ఞత చెప్పుకొన్నారు .ఒక సారి మా బాబు నవల రాస్తూ ‘దాన్ని గురించి తనకేమి తెలిసిందో చెప్పమని అన్న తమ్ముడిని అడిగాడు ‘’నవలలో కధానాయకుడికి తండ్రితనం పాములవాడిలో ,తల్లితనం రంగమ్మలో బందించావు అదీ నవలలో గొప్పతనం ‘’అని చెబితే సంతృప్తిగా తల ఊపాడు అన్న .అంతకు ముందువరకు తమ్ముడి అభిప్రాయం పై గొప్పగా సదభిప్రాయం అన్నకు ఉండేదికాదట .అప్పటినుంచి తమ్ముడేది చెప్పినా మౌనంగా అంగీకరించేవాడు అన్న విశ్వనాధ .
బందర్లో గురుభాగవతుల సుబ్బారావు గారు సబ్ రిజిస్త్రార్ గా ఉండేవారు గొప్ప సాహిత్యాభిమాని విశ్వనాధకు వీరాభిమాని .ఎప్పుడు విశ్వనాధ ‘’శ్రీ కృష్ణ సంగీతం ‘’లో పద్యాలు చదివి వినిపించినా పులకించిపోయి సాష్టాంగ ప్రణామం చేసేవారు .ఉభయ భాషా ప్రవీణకు కడుతూ అన్నగారి వద్ద కాదంబరి చెప్పించుకొన్నారు వెంకటేశ్వర్లు గారు అప్పటికే వరలక్ష్మిగారు గుంటూరుకాపురం లో జబ్బు పడి మంచాన పడిచనిపోయారు. ఆబాధలోనూ కాదంబరి బోధ చేశాడు .’’నీకు సంస్కృతం బాగా వచ్చురా ‘’అని పొంగిపోయాడు తమ్ముడి విద్వత్తుకు .తమ పూర్వీకుల కధను వీరవల్లడు నవలగా రాసి గొర్రెపాటి బాల కృష్ణ అనే కొడుకులాగా చూసుకొనే శిష్యుడికి అంకితమిచ్చాడు విశ్వనాధ .బాల కృష్ణ అకస్మాత్తుగా చనిపోయాడు ఆ వార్త న0దమూరు లో ఉన్న విశ్వనాధకు తెలిసి పడిన దుఖాన్ని గురించి చెబుతూ ‘’మా అన్న దుఃఖం పట్టలేక పందిట్లో పడి దొర్లి దొర్లి ఏడ్చాడు .ఇలాంటి దుఖాన్నే మా వదిన పోయినప్పుడు పడటం చూశాను మళ్ళీ ఇప్పుడే ‘’అన్నారు వెంకటేశ్వర్లు .
అన్నగారు రెండవ భార్య తో బెజవాడలో కాపురం పెట్టారు ఈమె కాపురానికి రాగానే విశ్వనాధ సుడి తిరిగింది .అన్నీ కలిసొచ్చాయి దరిద్రం దూరమైంది గౌరవాదరాలు పెరిగాయి బిరుదులూ సత్కారాల జోరు హెచ్చింది అంతా చిన్నవది కాలు పెట్టిన వేళా విశేషమేనన్నారు తమ్ముడు .సమష్టికాపురమే అప్పటిదాకా. ఇదీ రెండు మూడేళ్ళు సాగి తర్వాత ఎవరి దారి వారిడైంది .వెంకటేశ్వర్లుగారికి 40 ఏళ్ళు వచ్చేదాకా అందరిదీ ఉమ్మడి కాపురమే. తండ్రితర్వాత అన్ని కుటుంబ బాధ్యతలూ విశ్వనాదే భుజాలపై వేసుకొని నిర్వర్తించాడు .తనను ‘’పండిత రాజ మౌళి ‘’అని అవతారికలో రాస్తే తమ్ముడు హడలిపోయి బతిమిలాడి ‘’పండిత కీర్తనేయుడు ‘’అని మార్పించారు వెంకటేశ్వర్లు .తమ్ముడు ‘’కాళిందీ పరిణయం ‘’రాస్తే దానికి ముందుమాట అన్నగారిని రాయమంటే తమ్ముడు కాపురమున్న వరంగల్ కు వెళ్లి చదవగా విని ‘’నేను యుదిష్టి రంబగు నిభ్రుత తతేజమను ‘’పద్యాన్ని విని ‘’యెంత గొప్ప పద్యం రాశావురా !’’అని అభినందించాడు విశ్వనాధ .కల్ప వృక్ష యుద్ధ కాండను తమ్ముడు స్వంత ప్రెస్ లో ముద్రించి అందించాడు .’’మా అన్నగారు యెంత సంపాదించాడో అంతకు మించి దాన ధర్మాలు చేశాడు .లేమి దశలో ఆదుకొన్న వారి రుణాలన్నీ తీర్చి ఈ లోకాన్ని వదిలాడు .కొల్లిపర సూరయ్యగారు ఉయ్యూరుదగ్గర కపిలేశ్వర పురం నివాసి .మంచి స్నేహితుడు .సూరయ్యగారు బతికి ఉండగానే ఆ ఊరు వెళ్లి కొడుకులకు తలొక వెయ్యి రూపాయలూ ఇచ్చి వచ్చాడు .రాఘవ రావు గారి ఋణం మూడింతలు చెల్లించాడు అన్న ‘’అని వెంకటేశ్వర్ల్ రాశారు .తమ్ముడు ‘’పరా ప్రాసాదం ‘’కావ్యం రాసి అన్న విశ్వనాధకు అంకితమిచ్చాడు .
కరీం నగర్ ప్రిన్సిపాల్ గిరీ తర్వాత ‘’అన్నగారు మా వాడు కాకుండా పోయారు .ఏదో అంతర్ ద్రుష్టి ,ఏదో ఆత్మ వత్వం ఆయనలో కనిపించేది అంతర్ముఖ లక్షణాలు గమనించాను .ఏదో అశాంతిగా ఉందని అంటే పంచాక్షరీ జపం కోటిసార్లు చేయమంటే సంవత్సరన్నరలోపే పూర్తీ చేశాడు .ఏం చెయ్యమంటావు మళ్ళీ అని అడిగితె శాంత్యర్ధం మరో యాభై వేలు చేయమంటే అయిదారు నెలల్లోనే పూర్తీ చేసి ఆశ్చర్య పరచాడు .ఎవడో గంధర్వుడు ఈ ఉపాధిలో ప్రవేశించాడేమోననుకోన్నాను .’’అన్నారు వెంకటేశ్వర్లు .కరీం నగర్ ఉద్యోగం నుంచే నిత్య యోగాభ్యాస నిత్య జపాలు అభ్యాసమైనాట విశ్వనాధకు .’’అయన కావాలని మంత్రించి విభూతి ఇస్తే యెంత రోగమైనా ,యెంతఆపదైనానా వెనుకాడేది ‘’అని నిజాయితీతో చెప్పారు తమ్ముడు .\
చివరి దశలో సంగీతం పైన మనసుపోయి కొడుకు పావనికి జొన్న విత్తుల సుబ్బారాగారు వచ్చి సంగీతం నేర్పిస్తుంటే ఈయనకూ వచ్చేసింది .ఆయనతోనే త్రిశూలం నాటకం లో ‘’శివ గిరి విభో ‘’పాటకు స్వరరచన చేయించారు . .‘’మోయు తుమ్మేదనాడు నారాయణ రావు గారి సంగీతం లో ,చిన్నతనం లో హరినాగ భూషణం గార వాయులీనం లో లీనమైతే ఇప్పుడు పూర్ణ సరస్వతీ రూపుడైన ఆయన ఆత్మలో సంగీతం మోగటం సహజమే నని పించింది .’ఏతత్సామ గాయాన్నాస్తే హా ఊహా ఉహా ఉ ‘’అని అని తైత్తిరీయంఅన్నది అది అన్నగారిపట్ల రుజువైంది ‘’వెంకటేశ్వర్లుగారు .’
‘’మా అన్నగారు కవిమాత్రుడుకాడు .కవితను దర్శన స్థాయికి అందజేసిన మహానుభావుడు .ఆయనతో సమానుడు ఒక్కడే ఉన్నాడు –భవ భూతి ‘’మా అన్నగారు పూర్ణ పురుషుడు ‘’ఇదీ ఆ అన్నదమ్ముల అనుబంధం .
ఆధారం –శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ-‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
విజయ నగరం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.ఇవటూరి శ్రీనివాస రావు
461శ్రీ ముడుంబై నరసింహా చార్య స్వామి -!841-19 27 )
శ్రీ కాకుళం లో పుట్టిన నరసింహా చార్యులు ఆనంద గజపతి మహా రాజ కాలేజిలో సంస్కృత ఉపాధ్యాయులు .స్వంత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పరచుకొని తన గ్రంధాలను అచ్చు వేసుకొన్నారు .దాదాపు ఆయన రచనలు 200ఉన్నాయి.ఇప్పుడు లభ్యమయ్యేవి 53మాత్రమె సంస్కృత రచనలు –‘’బ్రహ్మ సూత్రభాష్యం ,బ్రహ్మ సూత్రా రోమాంతం ,ప్రపత్తి చింత ,ఉజ్జ్వలానంద చంపు ,వాసవ పరాశారీయ నాటకం ,కావ్య సూత్రా వ్రుత్తి ‘’
462- శ్రీ పేరి కాశీ నాద శాస్త్రి (18 5 8 -19 18 )
విశాఖ లోపుట్టి విజీనగరం చేరిన శాస్త్రీజీ ‘’గంగా స్తవం ,గోదావరి లహరి ,యామినీ పూర్ణ తిలకం ,’’సంస్కృతం లో రాశారు .గొప్ప గీర్వాణ విద్వాంసులు .వీరి మరణా న0తరమే గ్రంధ ప్రచురణ జరిగింది .
463-శ్రీ మేడేపల్లి వెంకట రమణాచార్యులు(186 2 -19 43)
అనకాపల్లి లోపుట్టి ,విజయనగారలో స్తిరపడ్డారు .అలక నారాయణ గజపతి రాజు దర్బార్ కవి .మహారాజకాలేజి సంస్కృత లెక్చరర్ .ఆంద్ర గీర్వాణాలలో గొప్పకవి .గీర్వాణం లో ‘’శఠ గోప సహస్రం ‘’,ఆర్య భాష చరిత్రం ,’’రాశారు . తమిళ ‘’తిరువైమోడి ‘’ని సంస్కృతీకరించారు .షేక్స్ పియర్ నాటకాలను ‘’షేక్స్ పియర్ నాటక కదామంజరిగా’’సంస్కృతం లో రాశారు .\\సంస్కృత కవుల చరిత్ర ‘’ను దేవ భాషలో రచించారు
464 హరికధా పితామహ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు (18 6 4 -19 45 )
అమృతవాక్కుల రచయితా బహుభాషా పండితుడు కవి శ్రీ నారాయణ దాసు హరికధకు ఆద్యుడు అచ్చతెలుగుకవి సంస్కృతాంధ్రాలలో వందకు పైగా గ్రంధ రచన చేశారు .సంస్కృత రచనలు –‘’హరికధా మృతం అనే మూడు హరికదల సంపుటి ,తారకం అనే వ్యంగ్య కావ్యం ,రామచంద్ర శతకం కాశీ శతకం ‘’రాశారు .ఉమర్ ఖయ్యాం రుబాయత్ లను ‘’సంస్కృతీకరించారు ‘’.విజయనగర సంగీత కళాశాలకు మొదటిప్రిన్సిపాల్(19 19) దాసు గారే .
465 –శ్రీ గొర్తి సూర్యనారాయణ శాస్త్రి (188 2 -19 45 )
శ్రీకాకుళం లో జన్మించిన శాస్త్రి గారు మహారాజాకాలేజి ఉపాధ్యాయులుగా పని చేశారు ‘’గజపతి స్తవ రాజం ,వీశమయూధ విజయ భాణం’’సంస్కృతం లో రాశారు ..
శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి (1839-1922)
విజయనగరం లో పుట్ట్టిన శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి మహారాజ కాలేజిలో సంస్కృత టీచర్ పని చేశారు .శ్రీ రామ విజయం ‘’సంస్కృత నాటకం రాశారు .శ్రీ కొల్లూరి కామ శాస్త్రి (1840-1907)విజయ నగర సంస్థానం లో ఉండి ‘’నరసింహ –కరుణా స్తవం ‘’రాశారు .శ్రీ మండా కామేశ్వర కవి (1840 -19 04)’’దేవి లీలా తరంగిణి ‘’చేశారు .శ్రీ వీటూరి వెంకట రామ శాస్త్రి (18 07 )యలమంచిలి వారు .’’హరి స్తోత్రం ‘’రాశారు
వీరు అందరూ స్వాతంత్ర్య పూర్వకవులే .ఇప్పుడు ఆనంతర కవులను చూద్దాం .
46 6 –శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి (18 8 2 -19 6 1 )
చీపురుపల్లిలో పుట్టిన వాసావారు సంస్క్రుతగ్రందాలు చాలా రాశారు .అందులో ‘’కపాలేశ్వర విభూతి ‘’,శ్రీనివాసా విభూతి ,ముకుందమాల ,లోకమాన్య బాల గంగాధర తిలక్ చరిత్ర ‘’రాశారు .
46 7 –శ్రీ పరవస్తు వెంకట రామానుజ స్వామి (18 8 9
స్వామీజీ విశాఖలోపుట్టి సంస్కృత ,ప్రాకృత ఇంగ్లీష్ లలో మహా పండితుడైనారు .19 51లో ‘’ధర్మ సంగ్రహం ‘’సంస్కృత రచన చేశారు .
శ్రీ పరవస్తు గోవిందస్వామి (18 9 4 )మహా రాజాకాలేజిలో పని చేసి ఆనంద వర్ధని పత్రిక నడిపి ,సోడ్ద్దాలకుని ఉదయ సుందరికదను తెలుగు చేశారు .శ్రీమతి బుర్రా కమలాదేవి (19 08-19 7 6 )తెలుగు ఇంగ్లీష్ సంస్కృతాలలో చాలా రాశారు ఆమె ‘’సుమలత ‘’కు మంచిపెరోచ్చింది .
46 8 –డా.ఈశ్వర వరాహ నరసింహం (18 9 8 -19 7 9 )
విశాఖ జిల్లా ఉప్మాక లోపుట్టి ,మెడికల్ ఆఫీసర్ గా సేవచేసి ,దశోపనిషత్తులను తెలుగు చేశారు .పతంజలి యోగ సూత్రాలను,సంఖ్య కారికలను ప్రచురించారు .తెలుగువారు సంస్కృతం నేర్చుకోవటానికి ‘’సంస్కృత పాఠ మాల ‘’రాశారు .
46 9 –డా.కొల్లూరు అవతార శర్మ(19 47)
విజయనగరం జన్మించిన శ్రీ శర్మాజీ పి ఆర్ కాలేజి కాకినాడలో ఉద్యోగించి బహు సంస్కృత గ్రంధ రచన చేశారు .కాకినాడ ‘’ఐశ్వర్యామ్బికా దేవి ‘’పూజా విధానం ‘’బాలకల్పకం ‘’రచించారు .’’అయ్యప్ప దర్శనం ‘’,మందాక్రాంత వృత్తాలలో సౌందర్య లహరి చేశారు .
వీరితో విజీనగరం జిల్లా కవులు పూర్తీ –‘’ప్రకాశం ‘’కవులతో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28 9-15 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
విశాఖ పట్నం జిల్లా-స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏం వి.రమణ
457-శ్రీ భాష్యం అప్పలాచార్యులు
శ్రీనివాసాచార్యులు ,తిరు వెంగమాంబ ల తనయుడు శ్రీ అప్పలాచార్య 6-4-1922న విశాఖ పట్నం జిల్ల్లా పద్మనాభం గ్రామం లో జన్మించారు .ఈ కుటుంబం లో వ్యాసమహర్షి బ్రహ్మ సూత్రాలకు రామానుజుల శ్రీభాష్యం పై గొప్ప వ్యాఖ్యానం చెప్పగలిగే వారు ఉండటం చేత అదే ఇంటి పేరు అయింది .రామానుజాచార్య శిష్య పరమపరకు చెందినవారు .అప్పలాచార్య రామాయణం పై తత్వా దీపిక వ్యాఖ్యానం రాశారు .దీనికీ తిరుమల శ్రీనివాసునికి సంబంధం గూర్చి చర్చ చేసి తన ఉపన్యాసాలను ‘’ఏడు కొండలు-ఏడు కాండలు ‘’పేరిట చెప్పేవారు .రాముడికి ఆరు కాన్దలవరకు తాను దైవం అనే స్పృహ లేదని ఎదవా కాండలో మాత్రమె తానూ నారాయణ స్వరూపం అని గ్రహించాడని చెప్పారు .అందుకే ఎదవా కొండ నారాయనాద్రిపై బాలాజీ ఉన్నాడని అంటారు .2003లో విశఖ వాసులు శిష్యులు ఆచార్యుల సహస్ర చాన్ద్రమాసోత్సవం ఘనంగా నిర్వహించారు .వీరి జీవిత చరిత్రను ‘’ప్రవచన శిరోమణి ‘’గా శిష్యుడు చిత్రకవి ఆత్రేయ రాస్శారు .1992లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం పొందారు .
458-సద్గురు కందుకూరి శివానంద మూర్తి
కందుకూరి శివానంద మూర్తి మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. భారతదేశం లోనూ,విదేశాల్లోనూ ఆయనకు ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. విశాఖపట్నంలోని భీమునిపట్నంలో ఆనందవనం పేరిట ఉన్న ఆశ్రమంలో నివసిస్తున్నారు. సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తకాలు రచించారు.
ఆయన తల్లిదండ్రులు సర్వమంగళ, వీరబసవరాజులు శివభక్తులు, దాదాపు 200 శివాలయాలను నిర్మించారు. చిన్నతనం నుండి శివానందమూర్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవారు. 1949 లో సైన్సు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సభ ఆర్డినేట్ సర్వీస్ లో చేరారు. పోలీసు డిపార్టుమెంటులో హన్మకొండలో పని చేస్తున్నప్పుడు కూడా ఆర్తులకు, పేదవారిక సేవచేయడం పట్ల, హిందు ధర్మ బోధన పట్ల ఎక్కువ సమయం వెచ్చించే వారు. ఆఫీసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సేవాకార్యక్రమాల పట్ల, సాంస్కృతిక సేవ పట్ల దృష్టి సారించారు.
సమున్నతమైన భారతదేశం, సనాతన ధర్మంల వేళ్లూనుకున్న ప్రాచీన సంస్కృతి పట్ల ఆయనకు అమితప్రేమ. సన్యాసులతో సహా అందరూ ప్రజాసంక్షేమానికి ట్రస్టీలుగా, సంరక్షకలుగా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని తన ప్రసంగాల్లో తరుచూ చెబుతుంటారు. హిందు ధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.
‘’సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ,లలితకళలు విజ్ఞానం సాంకేతికం వైద్యం జర్నలిజం మానవ శాస్త్రాలు మొదలైనవాటిపై ప్రసిద్దుల చేత ఉపన్యాసాలిప్పించి సత్కరిస్తారు .రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డ ,తెలుగు విశ్వ విద్యాలయ డాక్టరేట్ అందుకొన్నారు .87 సంవత్సరాల సార్ధక జీవితం గడపి 10-6-2015 శివైక్యం చెందారు .
సైన్స్ ఆఫ్ ప్రాణాయామం ,సివనండా కంపానియన్ టుయోగ ,లార్డ్ కృష్ణ హిస్ లీలా అండ్ టీచిన్గ్స్ ‘’మొదలైన గ్రంధాలు రాశారు .శివపురి కీర్తనలు చేశారు .
459-శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
సామవేదం షణ్ముఖశర్మ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి మరియు సినీ గేయ రచయిత. ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు.
షణ్ముఖశర్మ 1967లో ఒడిషా – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుపైన ఉన్న గంజాం జిల్లా, అస్క గ్రామంలో,పండిత కుటుంబంలో పుట్టి పెరిగాడు.[1] బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ విజయవాడ చేరాడు. 1988లో స్వాతి వారపత్రికలో ఉపసంపాదకుడిగా చేరి అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశాడు. తన గీతరచనా నైపుణ్యానికి విజయవాడలోని స్వాతి కార్యాలయంలో పునాది పడిందని శర్మ చెప్పుకున్నాడు.[2] స్వాతి పత్రిక సంపాదకబృందంలో పనిచేసి సంపాదించిన అనుభవం ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక పత్రిక యొక్క స్థాపనలో సహకరించింది. ఋషీపీఠాన్ని గుంటూరులో ప్రసాదరాయ కులపతి (ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతిగా పేరుబడ్డారు) వంటి పండితుల సమక్షంలో ప్రారంభించాడు.
శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించాడు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు ఎస్.పీ.బాలసుబ్రమణ్యంసహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశాడు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో చెన్నైలోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి.[3] కొంతకాలం పాటు సినీరంగంలో పాటలు వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చాడు.
పురస్కారాలు
460-శ్రీ చర్ల గణపతి శాస్త్రి
వేదం వేదంగా శాస్త ఉపనిషత్ లలో నిష్ణాతులు శ్రీ చర్ల గణపతి శాస్త్రి .బహుగ్రంధ కర్త ‘’వైశేషిక మీమాంసా దర్శనం ,గగాంధర్వ వేదం సంగీత రత్నాకరం ,హరిహర మహిమా స్తోత్రం ,గౌడ పాదీయకారిక ,వేదం విజ్ఞానం ,మొదలైనవి శాస్త్రిగారి రచనలు .
కాకరపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామము.[1]. పాలకొల్లు మరియు నిడదవోలు ప్రధాన రహదారిపై పెరవలికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామము. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం కలదు. ఈ గ్రామం ఒకప్పుడు అగ్రహారం. రాణి రుద్రమదేవి ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామము ను ఏర్పాటు చేసెను.గోదావరి తీరప్రాంత గ్రామము అయినందున వరి పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా పసుపు, కంద పండిస్తారు. ఇవేకాక పూలతోటలు, కూరగాయలతోటలు కూడా కలవు.
వీరుకాక శ్రీ అప్పల సోమేశ్వర శర్మ ,శ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శర్మ ,శ్రీ పేరాల భారత శర్మ ,శ్రీ జి వి ఎస్ సుబ్రహ్మణ్య శర్మ శ్రీ వాసా సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీ వేలూరి సుబ్బారావు కూడా గీర్వాణ రచన చేశారు .
విశాఖ కవులు పూర్తీ –విజయనగరం చేరుదాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-౩
451-శ్రీ కందుకూరి రామారావు
హిమాలయ వర్ణనం ‘’కావ్యం రాసిన శ్రీ కందుకూరి రామారావు సంస్కృత రచనలో సిద్ధ హస్తులు .ఇందులో ఒక శ్లోకం
‘’బభౌ స హిమవాన్ రాజా ,కాంచీ భూత మహార్నవః –ఆవ రోహణ సుస్తంభః సూర్య లోక సుధర్వణః’’
452-శ్రీ వడ్లమాని లక్ష్మే నరసింహ శాస్త్రి
రైల్ యాత్ర ‘’మొదలైన ఖండకావ్య నిర్మాత శ్రీ నరసింహ శాస్త్రి .ఉదాహరణగా ఒక శ్లోకం
‘’మయా క్రుతమిదం గ్రంధం తీర్ధ యాత్రా విరాజితం –శృణు త్వం సావదానేన శ్యామలే లలితాంబికే ‘’
45౩-శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి
శ్రీపతి చరితం ను గొప్ప కవితా ధారగా రాసిన శ్రీ శాస్త్రిగారు బహు గ్రంధ కర్త .ఒక శ్లోకం –
‘’కాన్తానాం సదనం సుధాంశు సదనం చేస్టం సురాన్న ప్రపా –వక్షోజై సుమ కందు కౌ సునయనే నిర్నిద్ర నీలోత్పలం ‘’అని గొప్ప అలంకార యుతం గా రాశారు .మరొకటి –‘’దంతా మౌక్తిక తల్లజా ఇతిజానా భ్రామ్యంతి మొహాటవీ –మధ్యే త్వ క్సురాణి మిషా స్తినికరం సర్వం చ త్వంఘ్రీపతే ‘’
454-శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి(1888)
వెంకమాంబ ,శ్రీ రామావదానులకు చిన కడియం లో 20-2-1888న జన్మించారు .శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రిగారి వద్ద వ్యాకరణం నేర్చారు . స్వయం కృషితో ఉభయ భాషా ప్రవీణులైనారు .అమలాపురం హైస్కూల్ లో నాలుగేళ్ళు మేస్టే రీ చేసి ,ఆంద్ర సాహిత్య పరిషత్ వ్యవహర్తాగా ఒక ఏడాదిపని చేసి అనంతపురం కాలేజి లెక్చరర్ గా మూడేళ్ళు సేవ చేశారు .వెంకట గిరి రాజావారి ఆస్థాన కవి పదవి అలంకరించారు .సంస్కృత వాజ్మయ చరిత్ర రెండుభాగాలుగా రాశారు ఆంద్ర భాషాను శాసనం ,దశ రూపకాలు ,ప్రేమ తత్త్వం ,ఉత్తర రామ చరిత్ర బీష్మ ప్రతిజ్ఞ నాటకం ఆంద్ర భవిష్య పర్వం ,విక్రమోర్వశీయం మొదలైన 17గ్రంధాలు రాశారు .
సంస్కృతం లో ‘’బ్రహ్మ సూత్రార్ధ దీపిక ,రక్షోనంతర వివాహం ,సంస్కృతభాషా గ్రంధాలు రచించారు . ,శాస్త్ర్రి గారు ‘’ఉపాధ్యాయ పండిత పరిషత్ ‘’ను స్థాపించారు ఈ నాటికీ దిగ్విజయం గా కోన సాగుతోంది . చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద వ్యాకరణం,సంస్కృత సాహిత్యం నేర్చారు .సంస్కృతం లో రాసిన ‘’సూర్యాష్టకం ‘’ప్రసిద్ధి చెందింది .’సంస్కృత సాహిత్య చరితం ‘’రాశారు సూర్యాష్టకం లో సూర్యునికున్న వైదికపర్యాయ పద విచారణ చేశారు .ఆరామ ,భ్రాజ ,పటర ,పతంగ,స్వర్ణర జ్యోతిష్మాన్ ,విభాస,కాశ్యప మొదలైన పదాలకు చక్కని వివరణ నిచ్చారు . ‘’తన్మే రుమార్గాని హతిక రద రా తలస్య –సందీపన ప్రవణాది దీధితి దివ్య మోమూర్తిః-అఖ్యోయ సంస్థితి మగోచర కాలకర్మ విజ్ఞా పాకం –పటర మూర్జదుహం నమామి ‘
455-శ్రీ మహీధర వెంకట రామ శాస్త్రి (1909
అమలాపురం తాలూకా ముంగండ లో 1909లో జన్మించారు . ‘దాక్షారామం అమలాపురం లలో పని చేశారు .సంస్కృతం లో రాసిన వాటిలో ‘’సరోజినీ సౌరభం ‘’నాటకం ప్రసిద్ధి చెందింది .’’మానస రాసకేలీ శాంతి ‘’కావ్యం ,దహర చంద్రికా తాత్వికం ,భారతాంబా సుప్రభాతం ,దేశ భక్తీ గీతం ,మణి మజీరం ,వకుళాభరణం ఖండకావ్యాలు రాశారు
456-శ్రీ కొత్త పల్లి ఘనశ్యామల రావు
రావు గారు అనేక గీర్వాణ లఘు కవితలు రాశారు .అందులో ‘’భారత ప్రశస్తి ,శ్రీమాతం ‘’కొన్ని మాత్రమె . , ‘
శ్రీ రాణి సదాశివ మూర్తి ‘’జగన్నాధ సుప్రభాతం శారదా స్తవ మంజరీయం ,ఋతు సందేశం ,వాస్తు పురుష అ స్టోత్తరం చాక్షుష యుగ్మం ,అగ్నిపిత్రకావ్య రచన చేశారు .శ్రీ ఖండవల్లి సూర్య నారాయణ శాస్త్రి ;;కాళిదాసకవితా సౌరభం ‘’రాశారు .శ్రీ పుల్య ఉమామహేశ్వర శాస్త్రి కంసవధం ,శ్రీ పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి ‘’ఆర్యా శతకం ‘’,మహీధర వెంకట రామ శాస్త్రి ;;కళ్యాణ మైత్రీ ‘’,యారం సూరి మల్లికార్జున’’ రాయ కళాపూర్ణోదయ సంస్కృత గద్య రచన ‘’చేశారు .
వీరితో తూ గో జి కవులు పూర్తీ .తర్వాత విశాఖ విజయ నగర సందర్శన .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-15-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ ,
గీర్వాణకవుల కవితా గీర్వాణం-3
పశ్చిమ గోదావరి జిల్లా –స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్య
రచన డాక్టర్ .శ్రీ చిలకమర్తి దుర్గా ప్రసాద రావు
450-డా.శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి
వేదగణితం లో డాక్టరేట్ పొందిన శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి సంస్క్రుతకావ్యాలెన్నో రాసి విద్వత్తు కు తగ్గ ప్రశంసలు పొందారు .ఆయన శిష్యులనేకులు పేరుపొందారు .’’సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య’’ ఇంగ్లీష్ గ్రంధం రాశారు .’’ఏ క్రిటికల్ స్టేడి ఆ ఫ యెన్సేంట్ ఆస్ట్రానమి ‘’,’’సం జెమ్స్ ఇన్ ది ఓషన్ ఆఫ్ సాంస్క్రిట్,’’తోబాతుపిల్లలకు ఎన్నో గ్రంధాలూ రాశారు .సంస్కృతం లో లఘు కావ్యం ‘’కోహం ‘’రచించారు .ఒకటి రెండు శ్లోకాలు చూద్దాం –‘’కుతో దేశ గర్భాత్ అహం సంప్రజాతః –గమిష్యామి కుత్రేతివాహం న జానే ‘’చివరి శ్లోకం –నరత్వేన జాతో మహాదేవదేవ –త్వదీయ దయా దదౌ జన్మతాద్రిక్ ‘’
‘’ శ్రీమత్ ప్రసన్నాంజనేయ,నామ హనుమత్సందేశం ,మందా క్రాంత సప్తశతి , బ్రహ్మాన్జలినామ పరమేశ్వరార్పిత శ్లోకమాలిక ,జ్యొతిర్జీవనమ్ ‘’,మొదలైన సంస్కృత రచనలు చేశారు .
451-ఆస్థానకవి శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి (1866-1960)
ఆంధ్రప్రదేశ్ ప్రధమ ఆస్థానకవి శ్రీ శ్రీపాదక్రిష్ణ మూర్తి శాస్త్రి రామాయణ భారత భాగవతాలతో బాటు వందకు పైగా ఉద్ర్గ్రందాలు రాశారు సంస్కృతం లో తన జీవిత చరిత్ర ‘’శ్రీ కృష్ణ స్వీయ చరితం ‘’రాసుకొన్నారు .
452- శ్రీ దోర్బల ప్రభాకర శర్మ
సంస్కృతాంధ్రాలలో నిష్ణాతులైన శ్రీ దోర్బల ప్రభాకర శర్మ కొవ్వూరు గీర్వాణ కళాశాల ప్రిన్సిపాల్ చేసిరిటైర్ అయ్యారు .అనేక సంస్క్రుతనాటకాలు పాటలు రాశారు .’’వివేకానంద ‘’గ్రంధం రాస్తే ఇంటర్ కు బోధనాంశం చేశారు.
453-శ్రీ వేలూరి సుబ్బారావు
సంస్కృత విద్వాంసులైన సుబ్బారాగారు ‘’సుందరి మేఘ సందేశం ‘’’’దాక్షిణాత్య మేఘ సందేశం ‘’అనే సంస్క్రుతకావ్యాలు రాశారు .ఇందులో కద –కొత్తగా పెళ్లి అయిన కవిగారిని ప్రభుత్వ౦ దూరానికి బదిలీ చేసింది. మంగళూరు వెళ్లి సంస్కృతం బోధించమన్నది .భీమవరం లో భార్యను ఉంచి వెళ్ళాడు .భార్యా వియోగం పెళ్లి అయిన కొద్దిరోజులకే జరగటం తో మతి భ్రమించి ఆశాఢ మాసపు తొలి మేఘం తో తన గోడు వెల్ల బోసుకొన్నాడు
454-డా జి ఎస్ ఆర్ కృష్ణ మూర్తి –
ప గో జి లో అరాగవరం కు చెందిన ఈయన సంస్కృతంలో గొప్పకవి.యువకుడిగా ఉన్నప్పుడే ‘’వానకి ‘’,సువర్ణ స్వచ్చలితం ‘’రాశాడు .ఉత్తర ప్రదేశ్ సంస్కృత అకాడెమి ఈయన ప్రతిభను గుర్తించి గౌరవించి సత్కరించింది .’’నవ రూపకం ‘’అనే ఏకాంకికలు రాశారు .ప్రస్తుతం తిరుపతి సంస్కృత విద్యా పీఠం లో ప్రొఫెసర్ గా ఉన్నారు .
455- వీరితో బాటు కొందరు రాసిన వాటిని చూద్దాం –నరసాపురానికి చెందిన శ్రీ అత్తిలి గోపాల కృష్ణమాచార్య సంస్కృత లఘుకావ్యాలు చాలా రాశారు .రేలంగికి చెందిన శ్రీ సోమంచి కృష్ణ శాస్త్రి ‘’విదుర నీతులు ‘’పై భాష్యం రాశారు .శ్రీ కాకరపర్తి కృష్ణ మూర్తి శాస్త్రి ‘’వ్యాజ వ్యవహారం ,అహల్యా సౌశీల్యం ,సదాముక్తి సుదార్నవం రాయగా ,పాలకొల్లు వారైన శ్రీ మానేపల్లి కుమారస్వామి ‘’సుస్వరాలు ‘’ఖండకావ్యం రాశారు .శ్రీ ఆచంట వెంకట సీతా రామ మూర్తి ‘’కుమారవిజయం ‘’రాస్తే ,శ్రీ భారతం శ్రీమన్నారాయణ ‘’గాయత్రి సుప్రభాతం’’,నరసాపురానికి చెందిన శ్రీ పెద్ద్దింటి సూర్య నారాయణ భాగవతార్అనే దీక్షిత దాసు గారు సంస్కృతం లో ఎన్నో హరికధలు రాసి గానం చేసి ప్రసిద్ధి పొందారు .శ్రీ చిర్రావూరి శివ రామ కృష్ణ శర్మ న్యాయ వేదాంత వ్యాకరణాలలో దిట్ట .సంస్కృతం లో చాలా రచనలు చేశారు .బందరు జాతీయ కళాశాలలో పని చేసి రిటైర్ అయ్యారు .శ్రీ ధూళిపాల వెంకట సత్య నారాయణ గీర్వాణ ‘’రామాయణం ‘’రచించారు .ఎందరో మహా కవులు అందరికి వందనాలు .
వీరితో ప.గో.జి.కవులు సమాప్తం . ‘ఇక తూ గో జి లో ప్రవేశిద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -’ ‘’25-9-15-ఉయ్యూరు ,
‘’
గీర్వాణకవుల కవితా గీర్వాణం-3
గుంటూరు జిల్లా- స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన డా’డి. ఏం .దీక్షిత్
440-శ్రీ అ౦బటిపూడి వెంకట రత్నం (19౦8-1982)
ప్రకాశం జిల్లా ఏదుబాడుఅగ్రహారం లో 18-7-1908న అ౦బ టిపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి సుబ్బమ్మ దంపతులకు శ్రీ వెంకటరత్నం జన్మించారు గుంటూరులో చదివి ఏం ఏ,పాసైనారు .శతావధాని వేలూరి శివ రామ శాస్స్త్రి గారి వద్ద తర్క ,వ్యాకరణ ,అలంకార శాస్త్రాలు నేర్చారు .స్వయంగా ఆంగ్లాన్ద్రాలను తులనాత్మకం గా పరిశీలించారు .ఉద్యోగం చేయకుండా నల్లగొండ లో చుండూరు చేరి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని విద్యా అన్న వస్త్ర దానాలు చేస్తూ కృష్ణ భక్తీ ప్రచారం చేశారు .రావినారాయన రెడ్డిగారి సహకారం తో ఒక హరిజన విద్యాలయం స్థాపించారు .’’సాహితీ మేఖల ‘’అనే సంస్థను నెలకోల్పారు .రచనలు చేస్తూ చేయించారు .ఈ సంస్థ ద్వారా 32గ్రంధాలు ప్రచురించారు .ఎందరినో గొప్ప రచయితలుగా తీర్చి దిద్దారు .’’దక్షిణ కౌమోదికి,ఇందిరా విజయం ,చంద్ర శాల ‘సంస్కృతం లో రాశారు .చంద్రశాలను వీరే ఆంగ్లం లోకి అనువదించారు .చూడాల నాటిక ,కృష్ణ బోధ షడ్దర్శన రహస్యాలు ,తత్వ సమవర్తనం ,వేదాంత సారం మొదలైనవి రచించారు .1943లో హైదరాబాద్ శ్రీకృష్ణ దేవా రాయాంధ్ర భాషా నిలయం లో ఘన సత్కారం పొందారు .
441 –శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య (1926-1984)
1926ఆగస్ట్ 11న గుంటూరు జిల్లా బాపట్లలో ఎక్కిరాల అనంతాచార్యులు ,బుచ్చంమలకు కృష్ణమాచార్య జన్మించారు .ఆంధ్ర,ఆంగ్ల సంస్కృతాలలో పాండిత్యం సాధించి ‘’పాండురంగ మహాత్మ్యం ‘’కావ్య పరిశోధన చేసి బృహత్ గ్రంధం రాసి పి.హెచ్ డి పొందారు .ఆంధ్రా యూనివర్సిటిలో తెలుగు లెక్చర్ గా పని చేసి ఎన్నో గ్రంధాలు రాశారు .’’వరల్డ్ టీచర్’’ప్రసిద్ధులు .’’మాస్టర్ యి కే ‘’ గా గుర్తింపుపొందారు ఎన్నో వేదాంత గ్రంధాలను రాశారు .17-3-1984 మరణించారు .సంస్కృతం లో అనేక స్తోత్రాలు ,స్తుతి సౌఖ్యం రాశారు .
442-శ్రీ కోగంటి సీతారామాచార్య (1927-1996)
చతుర్వాణి బిరుదాంకితులైన సీతారామాచార్య గారు ‘’ప్రతిజ్ఞా కౌసల్యం ,అనూర్వం ,ఎకలవ్యం ,పద్మావతీ చరన చారణ చక్ర వర్తి ‘’లను సంస్కృతం లో రాశారు .
443-శ్రీమతి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ (1917-1996)
21-12-1917న మధురకవి నాళం కృష్ణారావు దంపతులకు లక్ష్మీ కాంతమ్మ పుతారు .రాజమండ్రిలో చదివిసంస్క్రుతాన్ని నేర్చారు .మెట్టినిల్లు బాపట్ల చేరి హితైషిణిసభ్యురాలై మహిళాభ్యుదయానికి కృషి చేశారు శ్రీహయగ్రీవ గుప్తాను వివాహమాడారు ..1947లో ‘’ఆంద్ర యువతీ సంస్కృత కళాశాల ‘’స్థాపించినప్రదానాధ్యాపకురాలు శ్రీమతి కామాక్షిగారి షష్టి పూర్తీ ఘనంగా చేసి మొదటి స్త్రీ షష్టిపూర్తిగా రికార్డ్ సృష్టించారు . తెలుగులో ఆత్మకధ ,సాహితీ రుద్రమ రాసి పేరుపొందారు ‘ఆంద్ర సరస్వతి ‘’బిరుడుపొందారు .సంస్కృతం లో ‘’కావ్య మణిత్రయం ‘’,శ్రీ కన్యకా పరమేశ్వరీ స్తోత్రం ,సుప్రభాతం సరళ సుందరంగా రాశారు .1-2-1996న చనిపోయారు .
,444-శ్రీ దీవి శ్రీని వాసాచార్య
ఉపన్యాస చక్రవర్తి శ్రీ శ్రీనివాసాచార్య రాచూరు లో పుట్టారు .’’ప్రక్రుతి విజయం ‘’అనే చమత్కార నాటక రచన సంస్కృతం లో చేశారు ‘’శ్రీమన్నారాయనః ‘’రాశారు .
445-శ్రీ ఓగేటి పరీక్షిత శర్మ (19౩౦ -2007)
గుంటూరు దగ్గర యాజిలిగ్రామం లో శర్మగారు జన్మించారు .పూనా లో సంస్కృతం నేర్చారు .సంస్కృతం లో ‘’లలితా గీతాలహరి ,యశోధరా మహాకావ్యం ,శ్రీమత్ప్రతాప రాణాయణం ,జానపద నృత్య గీతమంజరి ,పరీక్షాన్నాటక చక్రం అక్షయ గీతా రామాయణం రాశారు ఇందులో ప్రతాప రాయనామ్ ప్రబంధ శైలిలో మహోత్క్రుస్తంగా రచించారు .
446-అవధాన సరస్వతి డాక్టర్ శ్రీ ప్రసాద రాయ కులపతి (1937
23-1-1937 న శ్రీ ప్రసాద రాయ కులపతి ప్రకాశం జిల్లా ఏల్చూరులో శ్రీ పోతరాజు దంపతులకు జన్మించారు .సంప్రదాయ బద్ధంగా సంస్కృతాంధ్రాలు చదివారు .19ఏళ్ళకే గొప్పకవిగా పేరు తెచ్చు కొన్నారు .ఆశుకవిత్వం అవధానాలు లో జగత్ ప్రసిద్ధులయ్యారు .గుంటూరులో బి ఏ .విశాఖలో ఏం ఏపిహెచ్ డి సాధించారు .1956లో గుంటూరు హిందూకాలేజిలో లెక్చరర్ గా చేరి క్రమంగా పదోన్నతి పొంది నలభై ఏళ్ళు పని చేసి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు .’’అవధాన సరస్వతి ,సాహితీ సార్వ భౌమ ,రూపక సామ్రాట్ ,కవితా సుధారా మొదలైన ఎన్నో బిరుదులూ అందుకొన్నారు .’’రసవాహిని ,ఆనంద యోగిని ,రస గంగ ,గాంధర్వ గీతి మొదలైనవి రచించారు సంస్కృతం లో ‘’శివత్రిశతి ,అంబికా త్రిశతి ,ఏంద్రీ సప్తశతి ‘’రాశారు .రిటైర్ అయ్యాక కుర్తాళం పీఠాదిపతులై శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాములుగా విరాజిల్లుతున్నారు .
447-శ్రీ మేల్ల చెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి
గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన శాస్త్రిగారు అక్కడే ఉద్యోగించి ఎన్నో గ్రంధాలు రచించారు వారి సంస్కృత రచనలు –‘’శ్రీ గురు చరిత మహా కావ్యం ,భావనా బృందావనం హేహయ ప్రతిభా ,యాతనా శతకం .
448-శ్రీదీవి నరసింహ దీక్షితులు –
కవి ,పత్రికా రచయితా అయిన శ్రీ దీక్షితులు గేయ ,పద్య కావ్యాలు సంస్కృతం లో రాశారు .పద్య కావ్యాలు –‘’విశ్వ నృత్యం ,సాగర జీఎవితం ,నభో నర్తకి ,వందే హనూ మంతం ,అంకితం ‘’.నృత్య రూపకం గా ‘’శ్రమ ఏవ జయతే ‘’రాశారు .’’భారతీ భూషణం ‘’లో భారత దేశ ప్రధాన మంత్రులజీవిత చరిత్రలనురాశారు .
శ్రీ జొన్నా భట్ల గోపాల కృష్ణ మూర్తి
‘’ ‘’సంస్కృతం లో జొన్నాభోట్ల కృష్ణ మూర్తిగారు ‘’ శ్రీ కృష్ణ భాగవతం. ‘’రాశారు .
శ్రీ దీక్షితులు గారి రచన దీనితో పూర్తీ అయింది .తరువాత వచ్చే శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారిపై రచన నేను సేకరించి వ్రాసింది .
449 -శ్రీశైల తీర్ధ సారం రాసిన శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు (20వ శతాబ్ది పూర్వార్ధం )
బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అనే చందవోలు శాస్త్రి గారి పితృ దేవులే వెంకటప్పయ్య శాస్త్రి గారు .తండ్రి హనుమచ్చాస్త్రి. తల్లి లక్ష్మమ్మ . .పరమ నిస్టా గరిస్టూలని పేరొందిన వారు .శ్రీమతి హనుమమ్మ ను వివాహ మాడారు.నిష్టా గరిష్టంగా జీవిస్తూ శిష్యులకు విద్య గరపే వారు . ‘’శ్రీరామ కదామృతం’’అనే మహత్తర కావ్యాన్నిఆరు కాండలలో రాశారు .ఇది రామాయణమే .ఉత్తర రామాయణాన్ని ‘’ఉత్తరకాండ ‘’గా మహా గ్రంధం గా రచించారు .చివరలో ఉండగా పరమ పదిస్తే కుమారులు రాఘవ నారాయణ శాస్త్రి గారు పూర్తీ చేశారు . ఇదికాక మరొక యాత్రా సందర్శనం వంటి కావ్యం ‘’శ్రీశైల తీర్ధ సారం ‘’ను 34 అధ్యాయాలలో విపులంగా వర్ణించారు . వీరి ఇతర రచనలు ‘’కవి గుణ ప్రకాశిక ,’త్రిశంకు స్వర్గం నాటకం ,బద్రాయురుపాఖ్యానం,శ్రీ శంకర విజుయ కదా సార సంగ్రహసోత్రం .వీరు తమ ముఖ్య గురువులుగా శ్రీ కొలిచిన యజ్ఞనారాయణ సోమయాజి దీక్షితులు గారని చెప్పుకున్నారు .దీక్షితులు గారు తర్వాత సన్యాసం స్వీకరించి కల్యాణానంద స్వామి గా మారారు .
శ్రీ శైల తీర్ధ సారం
ఇందులోశ్రీ వెంకటప్పయ్య శాస్త్రిగారు 34వచివరి అధ్యాయం లో తమ గురించి చెప్పుకొన్నారు .వెలనాటి బ్రాహ్మణులమని చందోలు వాస్తవ్య్దానని తమ వంశ మూలపురుషుడు రామ భట్టు అని ప్రపితామహుడు సింగ రాయ సింహ అని సుబ్రహ్మణ్య అవధాని పితామహులని బుచ్చయ్యగారు తమ సద్గురువులని ,తమ తలిదండ్రుల సంతానం లో తానే పెద్దవాడిననిశ్రీ కల్యానంద భారతీస్వామి గురు వర్యుల కటాక్షం తమపై ఉందని రామ కదా మృతం ,దత్త పురాణం స్వయంగా రాశానని స్కాంద పురాణం లో ఉన్న శ్రీశైల తీర్ధ సారం ‘’ను సంస్కృతం లో రాసి శ్రీ పరమేశ్వరార్పితం చేశానని సవినయంగా తెలియ జేశారు .
ప్రధమాధ్యాయం ‘’ఓమిత్యేకాక్షరం బ్రహ్మా శాశ్వతం శివ మచ్యుతం –ఈశానం భూత భవ్యస్య భర్గో దేవస్య దీమహి ‘’అనే శ్లోకం తో ప్రారంభించారు .’’మహిత మహిత వర్గ ధ్వంసి మల్లీశితు స్త-చ్చరితం మఖిల హృద్యంసర్వతస్సార భూతం –రస యతి యది మర్త్యః కోపి మృత్యం నిరస్యో –ల్లసతి తరతి శోకం ప్రాంచతి బ్రహ్మ లోకం ‘’అని ఫల శృతి చెప్పారు .మూడధ్యాయాలు ఉపన్యాస ప్రకరణం గా రాసి నాలుగులో వ్యాసుడు కాశీ వదిలి వేసే కధను చెప్పారు .అయిదులో అగస్త్యర్షి వింధ్య పర్వత గర్వం ఖర్వం చేయటం చెప్పి ,ఆరులో శ్రీశైలమహిమ వర్ణించారు .’’తీర్ధం లింగం వనం కుండ మసంఖ్యాతం,తదా గుహాన్ –సర్వం శ్రీశైల సంస్థానే జగత్పావన మీరితం ‘’అన్నారు .అక్కడి ప్రతిశిలా శివయోగిలా దర్శన మిస్తు౦దన్నారు .
ఏడవ అధ్యాయం లో శ్రీ గిరి ప్రభావాన్ని చెప్పారు .’’సేవే శ్రీ గిరి శ్రుంగ రంగ నటనోదయ ద్విస్ఫుర చంద్రికా-శ్రీ వర్దిష్ణు సుధా మయూఖ నన లక్ష్మీ భ్రుజ్జటామండలం –ప్రావారోచిత మల్లికా కుసుమ సంభార డ్యాష స్సంభ్రుతి-ప్రావీణ్య ప్రధమా నసద్గుణ గణం మల్లీశ్వరం ప్రత్యహం ‘’అని ప్రభావాన్ని మహా భక్తిగా రసబందురగా చెప్పారు .కవిత్వం పాతాళ గంగా సదృశం గా జాలువారింది .ఏడు ఎనిమిదిలలో శిలాతనయుడి శివ ప్రసాద లబ్ది ,తొమ్మిదిలో శ్రీ పర్వతసిద్ధికధనం,పదిలో చంద్రావతీ చరిత్ర ,పదకొండులో మల్లికార్జున పేరు వచ్చిన విధం వివరించారు –పన్నెండు లో ఆమ్మవారు అయ్యవారుల మృగయా విహారం , పదమూడులో విప్రలంభ శృంగారం ,పద్నాలుగులో మల్లికార్జున సమాగమం ,పదిహేనులో శిబి చక్రవర్తి శరీర దాన కద ,పదహారులో కపోతాఖ్యానం –ఉన్నాయి .శివునిపేరు తో అప్పయ్య శాస్త్రిగారికి పూనకమే వస్తుంది –‘’నమో భవాయ భువన సృష్టి హేతవే –నమో మ్రుడాయ తదను పాలనోద్యతే –నమోహరాయ తదుప సంహ్రుతి స్ఫురే –నమశ్శివాయ భవ విముక్తి దాయినే ‘’అని పొంగిపోయి రాశారు .పదిహేడు లో శిబి కైలాసప్రాప్తి ,18లో త్రికూటాచల క్షేత్ర వివరణ ,22లో పరదేశియతి నిర్యాణం 23లో అనంత తీర్ధ వివరం ,24 25లో నందారాధ్య చరిత్ర ముక్తి ,26లో శివ పారామ్య కధనం ,27లో పంచాక్షరీ మంత్రం మహిమ ను చెబుతూ ‘’అక్ష్య్య ఫల మాప్నోతి స ఇష్టాపూర్తయోన్నరః –ఉపాస్తే దీక్షయా నిత్యం మంత్రం రాజం శివస్యయః ‘’అని మహిమ వర్ణించారు .28లో శివపూజా ప్రభావం ,29లో భస్మ ప్రభావం 30లో రుద్రాక్ష ప్రభావం చెబుతూ ‘’రుద్రాక్ష వ్రత నిస్టస్య జప హోమార్చనాదికం –రక్షోఘ్నంశివ సాయుజ్య దాయకం ‘’అన్నారు .32లో వైశ్యకుమారుని శివలోక ప్రాప్తి ,33లో అంకినీడు ప్రభువు కు శివ ప్రసాద లబ్ది ,చివరిదైన 34వ సర్గలో దుర్గాక్షేత్ర మహాత్మ్యం చెప్పి శ్రీ శైల సారోఖ్యోయం ను శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు పూర్తీ చేశారు .చాలా సులభమైన సుందరమైన సరళమైన శ్లోకాలతో గ్రంధ రచన సాగింది హాయిగా తెలుగు చదువుతున్నట్లే అనిపిస్తుంది. అన్వయ కాఠిన్యం లేని బహు సుందర రచన ఇది .తెలుగు వారికి గర్వకారణం .
ఇంతటితో గుంటూరు జిల్లా కవుల రచనలు సమాప్తం
మరో జిల్లాలో మళ్ళీ కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-15-ఉయ్యూరు
‘’
విశ్వనాధ కొంటె కోణంగి
రెండు అనటం ,పది పడటం విశ్వనాధకు చిన్నప్పటి నుంచి ఉంది .’’కర్రపుల్లలా ఉన్నా ,మనసులో చచ్చేంత అహంకారం ఉండేది ‘’అని ఆయనేచేప్పుకొన్నాడు .ఎవరికీ అపకారం మాత్రం చేయలేదు ఉపకారమే చేశాడు జీవితాంతం .సద్యస్పురణ వల్లవిరోదులేర్పడ్డారు .బాల్యం లో అంగ రక్షకులు లేకుండా కాలు కదిపేవాడు కాదు.ఈయన పుస్తకాలూ ,అన్నం గిన్నా వాళ్ళే మోయాలి . అంతగారాబం చేశాడు తండ్రి .ఎంతత గారం చేసేవాడో ఆయనకిష్టం లేనిది చేస్తేతండ్రి అంతగా చచ్చేట్లు కొట్టేవాడు .’’నా నోటిలో ఉన్నది దురహంకారం .నోటికి వచ్చి నట్లు మాట్లాడే వాడిని నా వాక్కునకు నియమం లేకుండా పెరిగాను .నా యదేచ్చా వ్యాపారం వల్ల శత్రువుల్ని సంపాది౦చుకొన్నాను .విరోదుల్ని ప్రబలి౦చు కొన్నాను ‘’‘’ఆయనే ఉవాచ .
బందరు లో రెండోఫారం చదివాడు విశ్వనాధ .’’క్లాస్ మానీటర్ ‘’కూడా .ఒక మేస్టారు తప్పులు చెప్పేదాకా ప్రశ్నలు వేసి తప్పు చెప్పగానే చితగ్గోట్టేవాడు .ఒక సారి ఆ శాస్తి ఈయనకీ జరిగింది .కోపం వచ్చి ‘’కొట్టు .నీ అన్యాయం సిగ్గోయ్యా !’’అన్నాడు మేస్టర్ని అంతకోపం లోను ఆయన ఈమాటకు పకపకా నవ్వాడట.ఒక సారి ఈయన ట్యూటర్ మను చరిత్ర చదివి ఇస్తానంటే ఇచ్చాడు .ఆయన ట్యూషన్ చెప్పేవాడు విశ్వనాధ. కొంత బాకీ పడ్డాడు .ఆయన తిరిగి ఇవ్వనే లేదు .చెళ్ళపిళ్ళ వారికి చెప్పుకొన్నాడు ఆయన ఎవరితోనో విచారింప జేసి విశ్వనాధ చెప్పింది నిజాని నమ్మి ఆ ట్యూటర్ ని పుస్తకం తిరిగి ఇచ్చేయమన్నాడు .సరే అన్నాడుకాని ఆ ఆచార్యులగారు తిరిగి ఇవ్వనే లేదని రాసుకొన్నాడు విశ్వనాధ .
‘’నా అల్లరి తిరుగుళ్ళకి ,నా చెడ్డ స్నేహాలకి ,నా దివారాత్ర సంచారాలకు నా నాటక ప్రియత్వానికి ,నా ‘’కొకిబికి ‘’మనస్సునకు నేను సహజంగా పైకి రావలసిన వాడను కాను .నేను పరీక్షలలో ఉత్తీర్ణుడను కాకూడదు .స్కూలుకు వెళ్ళి మాస్టార్లు చెప్పింది శ్రద్ధగా వినట౦ ,మంచి జ్ఞాపక శక్తి నా విజయానికి కారణం ‘’అన్నాడు .కవిత్వం రాయటం బాగా అబ్బి ఇంట్లో బడిలో చెప్పినపా ఠాలు చదివే వాడుకాదు .’’కాగి తాలపై పద్యాలు రాయటమే పని .అవి తగల బెట్టటానికి క్కూడా పనికి రావు.ఒక సారి మా అమ్మ పొయ్యి వెలిగించటానికి ఈ కాగితాలు అంటిస్తే అవి మండలేదు .అప్పుడు తెలిసింది వాటి విలువ ‘’అని నిజాయితీగా చెప్పాడు .
శ్రీ ఉప్పు లూరి సంజీవరావు మంచి డ్రామానటుడు . పద్యం పరమ రామణీయకం గా చదివే వాడు .అప్పటికే ముసలివాడు .అందరు పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం చేసేవారు .ఆయన పట్టు బట్ట కట్టుకు తింటే విశ్వనాధ ముఠా లాగు చొక్కాలతో లాగించేవాళ్ళు .రావు గారు సంధ్యావందనాన్ని సంక్షిప్తం చేసి రాశారట .చేశారట .మాకు తెలిసి ఆయన్ను ‘’కేత్’’అని ‘’ముసలాడు ‘’అని పరిహసించే వాళ్ళం .కేత్అంటే కేశవ నామాలలో మొదటి అక్షరం ,త్అంటే సంధ్యావందనం చివర చెప్పే ‘’అభివాదయేత్ ‘’లో చివరి అక్షరం కలపగా వచ్చిందే .కాని తర్వాత తెలిసింది తకారం లేదని .వెంకట శాస్స్త్రిగారు కూడా బేతపూడి లక్ష్మీకాంతకవి రాసిన రుక్మాంగద నాటకాన్ని మెచ్చుకొనేవారు ‘’అని తప్పు తెలుసుకొన్నాడు .
ఆ రోజుల్లో ఎస్ ఎస్ ఎల్ సి పరీక్ష పూర్తీ అవటం అనేది ఉండేదికాదు .కాలేజిలో చేరటానికి దీనిలో వచ్చిన మార్కులతో పని లేదు .కుర్రాడు ఏ సబ్జెక్ట్ ఇస్టపడతాడో దానిలో మార్కులని బట్టి ప్రిన్సిపాల్ బి ఏ లో చేర్చుకోనేవాడు .’’నాకు లెక్కల్లో పదిహేను మార్కులోచ్చాయి .చరిత్రలో అరవై .చరిత్ర పరీక్ష రోజు ముందురాత్రి సినిమాకెళ్ళాను .పరీక్ష రోజు పొద్దున్న తొమ్మిదిన్నరకి లేచి ,పావుగంట ఆలస్యంగా పరీక్ష హాల్ కు వెళ్లాను .కాని అరవై మార్కులోచ్చాయి. ఎప్పుడూ ఫస్ట్ వచ్చే ‘’కోట ‘’వాడికి నా కంటే రెండు తక్కువ .నాది అంతాజ్ఞాపక శక్తి మీదే ఆధారం ‘’అని రాసుకొన్నాడు .బందరు నోబుల్ కాలేజిలో ‘’పెన్’’ దొర బి. ఏ .లో సీటిచ్చాడు .అంతకు ముందు గుంటూరులో ప్రయత్నించాడు .అక్కడ ఈయనా ,దుగ్గిరాల రాఘవ చంద్రయ్య చౌదరి ఒకే సారి ఇంటర్వ్యు కి వెళ్ళారు ఆయనకిచ్చి ఈయనకు లేదుపోమ్మన్నారు .’’చౌదరిగారి కంటే ఎక్కువ పండితుడను అని నా భావం ‘’అని ఆ సంఘటనపై స్పందించాడు .
కూరగాయలు కొనడానికి వెడితే విశ్వనాధ కూరలమ్మి బుట్టముందు కూచుని అన్నీ కెలుకుతూ మాట్లాడిస్తూ బేరం చేసేవాడు .ఆ అమ్మాయి ఒకసారి ఏదో మాట్లాడుతూ ‘’తదుపరి ‘’అన్నది .ఈయన పక్కనున్నశ్రీ జువ్వాడి గౌతమ రావు తో ‘’అబ్బ యెంత బాగా మాటలాడిం దండీ’’అని మెచ్చాడు .ఒక సారి నలుగురితో కలిసి లాంచిమీద అమరావతి వెళ్తున్నారు .సాహిత్య చర్చ జోరుగా సాగుతోంది .అందులో ఎవరో ఒకాయన శివుడికి అభిషేకం చేసి వస్తానన్నాడు .’’శివుడూ లేదు గాడిద గుడ్డూ లేదు .ఊరికే కృష్ణ మీద షికారు పోయి రావటమే ‘’అన్నాడు విశ్వనాధ .
ఒకసారి శ్రీ పేరాల భరత శర్మ ‘’మీ జీవితచరిత్ర పూర్తిగా రాయండి ‘’అన్నాడు .విశ్వనాధ వెంటనే ‘’నీక్కూడా ఈ పిచ్చి పట్టిందా ?నా గ్రంధాలన్నీ చదివిన వాడికి నా జీవితమంతా తెలుస్తుంది. ఇక నా పుట్టిన తేది, చచ్చిన తేది కి మధ్య తేదీలలో నేను బతక లేక చచ్చినవి ,చావ లేక బతికినవీ ఘట్టాలేగా చరిత్ర రాయాలంటే ‘’అన్నాడు .
బెజవాడలోతెలుగు లెక్చరర్ గా ఉన్నకాలం లో శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి ఇంగ్లీష్ లెక్చరర్ .విశ్వనాధ క్లాసులో తన్మయ భావం తో చెప్పేవాడు .దీన్ని చూసి జొన్నలగడ్డ ‘’కవి సామ్రాట్ .యు ఆర్ టాకింగ్ సమ్ వాట్ ‘’అనేవాడు. ఆయనొక్కడే ఈయన్ను వేళాకోళం చేసేవాడు .ఒకసారి వేమన వ్యాసాలు బోధిస్తూ కృష్ణ దేవరాయలవలన అందరూ వైష్ణవులయ్యారని అంటూ ,అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లోకి వెళ్లి ‘’మధ్యాహ్న పూట దంపతులు కలియ కూడదు .’’మాటినీ’’ వేస్తే కమ్యూనిస్టులు పుడతారు ‘’అన్నాడనిఆక్లాసులోనే ఉన్న శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాశాడు .దీనితో రామారావు అనే కమ్యూనిస్ట్ అభిమాన విద్యార్ధి ‘’మీరు అనవసరంగా కమ్యూనిస్ట్ లను తిడుతున్నారు .మీరు గుంటూరు లో ఉన్నప్పుడు ‘’ఒక స్త్రీని ఉంచుకున్నారని ‘’విన్నాము .ఆ మాట ఇప్పుడు అంటే మీకు కష్టం గా ఉండదా ?’’అన్నాడు .తెలివి తెచ్చుకొన్న కవిసామ్రాట్ ‘’నీ బోటి వాడు అంటే లెక్క చేయను .నాతొ సమాన హోదా ఉన్న వాడంటే అప్పుడాలోచిస్తాను ‘’అన్నాడు. రామారావు ను తోటి విద్యార్ధులే కేకలేశారు .తర్వాత విశ్వనాధకు క్షమాపణ చెప్పి గొప్ప శిష్యుడయ్యాడు .ఈ సంఘటన జరిగినప్పుడు అప్పటి హైకోర్ట్ న్యాయ మూర్తి సి కోదండ రామయ్య గారుకూడా క్లాసు లో ఉన్నారని’’ పురాణం’’ రాశాడు .మాస్టారు క్లాసులో ఎప్పుడూ ఏదో తగూ, వివాదం లేవ దీయటం సరదా అన్నాడు కూడా .
బెజవాడ రామా టాకీస్ దారిలో దొమ్మరి సానుల సీన్లు అప్పటిజనానికి బాగా తెలుసు .విశ్వనాధ అటువెడుతుంటే ఒకమ్మాయి రమ్మని పిలిచి ‘’ఎంతిస్తావు ?’’అని అడిగితె కొంటెగా ఈయన ‘’వస్తే ఎంతిస్తావు ?’’అన్నాడు చమత్కారంగా .మరోసారి విజయా టాకీస్ దగ్గరా ఇలాంటి సీనే ఉన్న చోట నులక మంచాలు అమ్మే ఆడ మనిషితో ‘’ఒక మనిషి పడుకుంటే ఆగుతుందా ?అని అడిగాడు ‘’ఇద్దరు కూర్చున్నా ఆగుతు౦దిబాబూ ‘’అంది ‘’కోణంగి విశ్వనాధ ‘’నువ్వూ, నేనూ పడుకుంటే ఆగుతుందా ?’’అన్నాడు .ఆవిడ బూతులు లంకి౦చు కొంటే ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ చకచకా వెళ్ళిపోయాడు ఈ కొంటె కోణంగి ,
‘’ఆధునిక సాహిత్యం పై మీ అభిప్రాయమేమిటి ?’’అని ఇలస్త్రేటేడ్ వీక్లీ మాజీ సంపాదకుడు ఏ ఎస్ రామన్ ఇంగ్లీష్ లో అడిగితె ఇంగ్లీష్ లోనే ‘’ఇట్ ఈజ్ నైదర్ మోడరన్ నార్ లిటరేచర్ ‘’అని చమత్కార బాణం వేశాడు విశ్వనాధ.’’అన్నం ‘’తెలుగా సంస్కృతమా అని ఒక కొంటె ప్రశ్నకు ‘’అదికూడా తెలీకుండా యెట్లా తింటున్నావు ?’’అని కోణంగి జవాబు .’’పుల్ల ,తియ్య ,వెన్న మజ్జిగల్లో ఏరకం మజ్జిగ పోయమంటారు ?’’అన్న భార్య ప్రశ్నకు ‘’మారకం లేకుండా ఏదైనా సరే ‘’అని కొంటె జవాబు .ఒక జాయంట్ కలెక్టర్ ముఖ్య అతిధిగా ఉన్న సభలో ‘’ఈ సారి సభలో వీరి ‘’జాయంట్’’ ఊడిపోవాలని కోరిక ‘’అన్న చమత్కారి .’’నేను మన్మధ లోపుట్టాను నువ్వు’’ ఖర గాడి’’ వను కొంటా’’అన్నాడు విశ్వనాధ .‘’ఒకసారి బందర్లో ఉండగా చుట్టపు చూపుగా వచ్చినాయన ‘’మీ బందర్లో గాడిదలు ఎక్కువే ‘’అని కొంటెగా అంటే ‘’అబ్బే !ఇక్కడివి తక్కువే నండీ .బయటి నుంచి వచ్చినవే ఎక్కువ ‘’అని రిపార్టీ ఇచ్చిన కోణంగి విశ్వనాధ .ఏదైనా తప్పు చేసి సంర్ధించుకొనే వాడంటే విశ్వనాధకు అసహ్యం .అలాంటి వారి గురించి తరచుగా ఒక చిన్న సంభాషణ చెప్పేవారు –
‘’ఎరా ! సంధ్యావందనం చేశావా?’’చేశాను ‘’.ఎక్కడ?’’’’’’ఊరి చివర చెరువు దగ్గర ‘’’’ఆ చెరువులో నీళ్ళు లేవుకదా ?’’’’అరె !వాడెవడో ఉన్నాయని చెప్పాడే !’’
‘’నిన్న మీ శిష్యుడి రేడియో టాక్ విన్నాను. నా మొహం లాఉంది ‘’ఒకాయన విశ్వనాధ తో .’’మీ మొహం అంత బాగుంటుందా ?మన కోణంగి గారి రిపార్టీ .స్థానాన్ని బట్టి వస్తువుకు గౌరవం వస్తుంది అని చెబుతూ ‘’తలమీద ఉన్న జుట్టును కేశాలు అంటారు .కళ్ళమీద ఉంటె వెంట్రుకలు అంటారు .రొమ్ము మీద ఉంటె రోమాలుఅనీ ,మూతిమీద ఉంటె గౌరవంగా మీసాలని ,’’అక్కడ ఉండే ‘’దాన్ని’’ బొచ్చు ‘’అని క్లాసులో చెప్పాడు చమత్కారంగా .ఒకడుఒంటికి సెంటు రాసుకొని వెడుతుంటే ‘’ఊరి దుర్వాసన పోగొట్టటానికి వాడి ఔదార్యానికి జనంమెచ్చారు ‘’అంటాడు .’’స్కూలు పిల్లల మిస్సమ్మ కొంగ రెక్కలా నడుస్తుందట .ఉద్యోగం ఊడితే ఆమె పాళీ లేని కలంగా ఉంటుందిట ‘’.
ఒకడు పత్రిక పెట్టాడు వాడికి చదువురాదు.అర్హత ఏమిటి అని విశ్వనాధను అడిగితె ‘’వాడు విప్పే పురాణం ముందు ముల్లోకాలు డీలా పడ్డాయి .వాడి భార్య ఊర్లో ఉంటె వంటింట్లో పొగలు వస్తాయి లేకపోతె హాలులో పొగలోస్తాయని ‘’అన్న కొంటె వాడు .డప్పు బుజాన వేసుకొని ‘’గూని గుప్పిగాడు ‘’పెళ్ళాం వెనక పోతుంటే ‘’గజోత్సవం ముందు వెడుతుంటే వెనక నౌబత్తుతో వెళ్ళే లోట్టిపిట్ట (ఒంటె)లాగా ఉన్నాడట .
పెళ్ళాం చచ్చిపోయిందని ఒకడు చచ్చేట్లు ఏడ్చాడు .భయం తో రెండో పెళ్లి చేశారు .ఈవిడ అంటే నిజంగానే చచ్చిపోతున్నాడు అంతప్రేమ ‘’అని చమత్కారాలు నూరారు .ఒకడి భార్య పుట్టింటికి వెడితే ‘’కూరలమ్మి’లోపల ఉందేమిటి ఇంతసేపు?ఎన్ని కూరలు కొన్నాడో ఏమో?’’అని లోగుట్టు విప్పిన చమత్కారి .
ఇదీ విశ్వ నాద కొంటెతనం కోణంగిత్వం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-15 –ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం౩-3
శ్రీకాకుళం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –శ్రీ ఎస్ ఎస్ విజయ రాఘవన్ ,శ్రీ పి.బి.వి.శివప్రసాద్
432-విశ్వదాత కర్త-శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి (1882
1882లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో జన్మించిన శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి పర్లాకిమిడి సంస్థాన ఆస్థాన పండితులు .’’కవి శిరోమణి ‘’.వీరి సంస్కృత రచనలు దేశ భక్తీ ప్రబోధకాలు .తిలక్ పై ‘’లోకమాన్య చరితం ‘’కావ్యం రాశారు .ఇందులో తిలక్ గారు శివాజీ చరిత్రతో స్పూర్తి పొందినట్లు రాశారు .స్వాతంత్ర్య సమరస్పూర్తి నింపే కావ్యం ఇది .ఒక శ్లోకం-‘’కారాగార ప్రవాసాది దండోవాప్రాణ విప్లవః –భవతీశ్వర సంకల్పాన్నా స్థానః పంచ భౌతికే –యశశ్శరీర మాచంద్ర తారకం జీయాదకల్మషం-వయమేవాను భోక్ష్యామః స్వరాజ్య ఫల మూర్జితం –అధవా నస్సంతతతిర్వా ఫలభాగ్ వృద్ధి మేష్యతి –షట్త్ర్యయం షట్కోటి సమ్ఖ్యాకైహ్ భారతీయ సహొదరైః’’
శ్రీ కాశీనాధుని నాగేశ్వర రాగారి చరిత్రను ‘’విశ్వ దాతా ‘’కావ్యం గా గీర్వాణం లో రాశారు
433-‘’భిషగ్రత్న ‘’-శ్రీ మహేంద్రాడవెంకట జగన్నాధ స్వామి
కళింగ సంస్కృత కళాశాల స్థాపకులు ,ఆయుర్వేద విశారద ,వేదాంత భూషణ శ్రీ మహేంద్రాడ వెంకట జగన్నాధ స్వామి సాహిత్య భాషా ప్రవీణులు ,భిషగ్రత్న ,వేదాంత విద్యా విశారదులు .శ్రీకాకుళం నివాసి .ప్రభుత్వ సహాయం లేకుండా స్వయంగా సంస్కృత పాఠశాలస్థాపించారు .సంస్కృతం లో ,వేదాంతం లో దిట్ట .సౌరమంత్రాలకు ‘’ద్యుమణి నందనం ‘’అనే వ్యాఖ్య రాశారు శ్రీ సూక్తానికి సంస్కృతం లో ‘’రమా స్వాగతం ‘’రాశారు .’’రంగనాధ సుప్రభాతం ,అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని స్తుతించారు .తల్లిగారిపై ‘’మాత్రు శతకం ‘’రాసిన ధన్యులు .
434-సూర్య శతక కర్త-శ్రీ గుండుగొల జగన్నాధ శర్మ (1908
1908లో వంశధార దగ్గర లుకులాం అగ్రహారం లో జగన్నాధ శర్మ జన్మించారు శ్రీ పేరేపు సత్యనారాయణ గారి శిష్యులు .1955లో ‘’సూర్య శతకం ‘అరసవిల్లి సూర్యదేవునిపై రాశారు
‘’శ్రీ సదన శుభంకర నిజ భాషా వాసవ దిశా విభాస్వ దురు శ్రీ –భాసుర మూర్తి యరస విలి వాసా ,దాసజన సౌఖ్య ,వరద హే సూర్య –సారసభ హరి ఘనసార సమయాశః ప్రసార సంశ్రిత సంప –త్సార సమున్నతిదా,సంసార సముద్ర తరణ ద్రుత సారస సూర్య –మిహి రహిరణ్మయవిగ్రహ మహిత హిత తత్వ విత్తమ తమో బందీ ‘’అని చాలా సరళంగా ,అనర్గళంగా అర్ధస్పోరకం గా రాశారు
వెంకటేశ్వర శతకం ,ఉమామహేశ్వర శతకం ,శ్రీకామేశ్వర శతకం పరదేవతా స్తోత్రం’’రాశారు .పరదేవతా స్తోత్రం లో లో ‘’సంతారిణీ,కలుష కాంతార సంచరణ తాంతం నితాంతం జనం –భ్రాన్తిం విరస్య విశ్రాన్తిం విధాయ ,దుఖా౦తేన సంతుష్యతీ-స్వంతం మదీయ మది శాంతం కరోతి నిశ్చింతం చిరం సంతతం –కాంతా శివస్య జగతాంతీవ్ర బాదాంనిహన్త్రీ పరదేవతా ‘’ప్రవాహ సదృశం గా భక్తీ ధారగా రాశారు .
435-శ్రీ సత్యసాయి స్తోత్రం రాసిన –శ్రీ మేడూరి సూర్యనారాయణ మూర్తి (1954
1954లో పాలకొండలో పుట్టిన సూర్యనారాయణ మూర్తిగారు మహారాజ కాలేజిలో సంస్కృతం చదివి తెలుగుపండితులుగా పాలకొండ వగైరాలలో పని చేసి డెంకాడజూనియర్ కాలేజిలో అధ్యాపకులయ్యారు .సంస్కృతం లో’’ దుర్గాంబ శతకం ,శ్రీ కూర్మనాధ సుధా ,భవానీ శతకం శ్రీ రమణ సుధా శ్రీ సత్య సాయి స్తోత్రం రాశారు ఇందులోంచి ఒక ఉదాహరణ
‘’సత్య ధర్మ శమా కారం సద్గుణానాం జలాకరం –సమస్త సజ్జనాధారం సాయినం ప్రణమామ్యహం –ప్రశాంతి నిలయోద్భాసీ ప్రసాద గుణ భూషణః-అశాంతి వారకస్సాయీ వసేత్ హృది మమానిశం ‘’
436-పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి నాటక కర్త-శ్రీ మానా ప్రగడ శేష సాయి(1927
సంస్కృతాంధ్రాలలో మహా పండితకవులైన సాయిగారు విజయ నగర సంస్కృత కళాశాల అధ్యాపకులు .సంస్కృతం లో ‘’’పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి ‘’నాటకం ,’’జయ దేవ సరస్వతి ‘’నాటిక రాశారు .ఉగాదిపురస్కారగ్రహీతలు .ఆకాశ వాణి దూరదర్శన్ కార్యక్రమ వ్యాఖ్యాతగా లబ్ధ ప్రతిస్టులు .
437-చమత్కార శతక కర్త –శ్రీ పి.టి జి వి రంగా చార్యులు (1952
రాష్ట్రపతి పురస్కారగ్రహీత ,స్వర్ణ ఘంటా కంకణాలంక్రుతులు బహు గ్రంధ కర్త శ్రీ రంగా చార్యులు 1952లో కృష్ణా జిల్లా శ్రీరంగ పురం లో జన్మించారు .సంస్కృతాంధ్రాలలో ఏం ఏ .’’సంస్కృత వాజ్మయం లో వైజ్ఞానిక విశేషాలు ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొందారు .పాలకొండలో పని చేస్తుండగా ఉత్తమజాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు .1999లో స్వర్ణ ఘంటా కంకణం చేత అలంకరింప బడ్డారు .’’కూర్మనాధ సుప్రభాతం ,అష్ట విధ క్రియ ,కరతల సంస్కృతం ,చమత్కార శతకం ,శ్రీ ధర్మ శాస్త్ర సుప్రభాతం ,షిర్డిసాయి సుప్రభాతం ,వాజపేయి కవితా ‘’సంస్కృత రచనలు .ఒక ఉదాహరణ –‘’రాత్రౌ తు నూపురధారం బహు సుందరత్వాం –నృత్యంత మద్భుత తనుం ,సముదీక్ష్య భక్తాః-ఖంజీర వాదక మహో పరి తోష యంతి-శ్రీ షిర్డీ భగవన్ తవ సుప్రభాతం ‘’
438-శ్రీ గుణ రత్న కోశం –కర్త –శ్రీ టి పి శ్రీనివాస రామానుజం
ఉపన్యాస బ్రహ్మ ,తిరుప్పావై ఉద్గాత గా ప్రసిద్ధులైన రామానుజం గారు సంస్కృతం లో నిష్ణాతులు .డబుల్ గోల్డ్ మెడల్స్ ను ఏం ఏ లో పొందారు ‘’సాంప్రదాయ సమన్వయము –రామాయణం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ డి సాధించారు .బెస్ట్ దిసీస్ అవార్డ్ దీనికి వచ్చింది .ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో సంస్కృత లెక్చరర్ గా ఉన్నారు .సంస్కృతం లో ‘’శ్రీ గుణ రత్న కోశః ‘’ముకుందమాల ,గోదా స్తుతి ,దశావతారస్తోత్రం ,భగవధ్యాన సోపానం రాశారు .
439-హయగ్రీవ శతక కర్త –శ్రీ చామర్తి కూర్మాచార్యులు
సింగుపురం లో జన్మించిన కూర్మాచార్యులుగారు సంస్కృత భాషా ప్రవీణులు తెలుగుపండిట్ గా చేసి రిటైర్ అయ్యారు .సంస్కృత భాషా ప్రచారకులు .’’హయ గ్రీవ శతకం ,సీతారామ సుప్రబాతం ,ద్వాదశాక్షరీ స్తోత్రం ,’’వీరి గీర్వాణ రచనలు .
శ్రీకాకుళం దాటి గుంటూరు సీమలో ప్రవేశిద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-15-ఉయ్యూరు
–
‘’
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
426-శ్రీ కంచి పరమాచార్యులపై ‘’గురూపహారం ‘’రాసిన –శ్రీ మట్టి పల్లి మల్లినాద శర్మ(1926)
కాశ్యప గోత్రీకులు ,వీరేశ్వర శేషమాంబా పుత్రులు శ్తీ మట్టి పల్లి మల్లినాద శర్మ1926లో నెల్లూరు జిల్లా కార్వేటి నగరం దగ్గర ముక్కరవానిపాలెం లో పుట్టారు .కుటుంబం ఇందుకూరి పేట చేరి నెల్లూరు వేదసంస్కృతా కళాశాలలో చేరి 1960లో భాషా ప్రవీణ పాసైనారు .ఇందుకూరు ఉన్నత పాఠశాలలో తెలుగుపండితులుగా పని చేశారు . బాల్యం నుండి రచనలో పండిన వీరుగీర్వాణ ఆంద్ర భాషలలో నలభైకి పైగా గ్రంధాలు రాశారు .
మట్టిపల్లి వారి ‘’మిట్టీమే సోనా ‘’సంస్కృత రచనా సోయగం
శ్రీ జన్నవాడ కామాక్షీ సుప్రభాతం ,మధుర స్మ్రుతి (6సర్గలు)గురూపహారః ,ఇందుకూర్ పేట కామాక్షీ సుప్రభాతం ,భద్ర కాళీ స్తవం ,శుభాషితాని అనే చాటువులు ,నాటికా త్రయం ,చంద్రమండల యాత్ర వీరి సంస్కృత రచనలు .గురూపహారం లో శ్రీ కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీన్ద్రులవారిని ‘’నడిచే దైవం ‘’గా అభి వర్ణించారు .ఆరు సర్గల కామాక్షీ సుప్రభాతం లో అమ్మవారి సేవకోసం సకల దేవతలూ వచ్చారని- ‘’ల్లక్ష్మీః కుశేశ సమాంచిత పాత్ర హస్తా-వాణీ స్వపాణితల మండిత వల్లకేచ –అనాశ్చవాద్య నిపుణామంజూది ద్రుత్వా-కామాక్షి దివ్య నిలయే తవ సుప్రభాతం’’ .
427-బాల నైషద కర్త –శ్రీ సముద్రాల లక్ష్మయ్య (1937)
నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర కాట్రకాయల గుంటలో 19-11-1937నజన్మించారు .కొత్తపాలెం ఓరియెంటల్ఉన్నత విద్యాలయం లోచదివి,ఏర్పేడు వ్యాసాశ్రమ శిష్యులుగా అనేక గ్రంధాలు రాశారు .తిరుపతి ప్రాచ్య కళాశాలలో ఉద్యోగించి అనంతరం ‘’బాలనైషధ ‘’కావ్య రచన చేశారు .కావ్య వ్యాఖ్యాన గ్రందాలనేకం తెలుగులో రాశారు .’’శ్రీ మళయాళ‘యతీంద్ర ఉపదేశామృతం ‘’సంస్కృతకావ్యం రాశారు .స్వామి వారి వేదాంతాన్ని లలిత సుందరంగా అందించారు .’’అగ్నేః సందుక్షణే ధూమః ప్రధమం దృశ్యతే తతః –జ్వాలా దేదీప్య మానా స్యాత్తదాత్మధ్యాన వర్తినాం’’ఒక మచ్చు శ్లోకం .
‘’దివ్య జనన్యాఃశారదా దేవ్యాః ఉపదేశామృతం’’,శ్రీ తిరుమా౦బా సుప్రభాతం ,’’శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సుప్రభాతం , గొల్లా పురా౦బాస్తుతిః.’’వివేకానంద సూక్తయః ‘’వీరి ఇతర గీర్వాణ రచనలు .
428-విద్యా వారిది –శ్రీ చింతలపాటి పూర్ణానంద శాస్త్రి
నెల్లూరు సంస్క్రుతకలేజిలో సంస్కృత వ్యాకరణ పండితులైన శ్రీ శాస్త్రి ,ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు.సంస్కృత సమాస విషయాలను ‘’సమాసపారిజాతః ‘’గా రాశారు .రాష్ట్రీయ విద్యా పీఠం నుండి ‘’విద్యా వారధి ‘’పొందారు .శాస్త్రార్ధాలలో ను వ్యాకరణ శాస్త్ర నిర్ణయాలలోను అందే వేసిన చేయి శాస్త్రి గారిది .
429-చతుర్భాషా పదకోశ నిర్మాత – డా.శ్రీ అమృత వాక్కుల శేష కుమార్
తిరుపతి సంస్క్రుతకాలేజిలో చదివి వ్యాకరణ శాస్స్త్రం ప్రధాన అంశంగా బి ఏ చేశారు .తర్వాత వ్యాకరణం లో ఏం ఏ డిగ్రీ పొందారు .స్వయం కృషితో సాహిత్యం లో ఏం ఏ పాసైనారు .తెలుగు హిందీలలో కూడా ఏం ఏ .ఆంద్ర యూని వర్సిటి నుండి పి.హెచ్ డి.సాధించారు .భట్తోజీ దీక్షితుల సిద్ధాంత కౌముదికి ‘’రూప ప్రక్రియా కౌముది ‘’రాశారు .కాళిదాసః అనే లఘునాటికరాసి ప్రదర్శించారు .ఆకాశావాణిద్వారా సంస్కృతం లో అనేక కధలు వ్యాసాలూ రాసి ప్రసంగించారు .సంస్కృత భాషకు చెందినఆరు వేల పదాలకు విషయ విభజన చేస్సి ,తెలుగు హిందీ ,ఇంగ్లీష్ లలో సమానార్ధాలపదాల తో ‘’చతుర్భాషా పదకోశం ‘’రాశారు . సంస్కృతాన్ని తేలికగా నేర్చుకోవటానికి ‘’అమృత వాణీ పరిచయః ‘’రచించారు .2004లో తిరుపతిలో ‘’అఖిల భారత సంస్కృత సభలు ‘’జయ ప్రదంగా నిర్వహించారు .
430-వ్యాకరణ విద్యా ప్రవీణ –శ్రీ కందాళలక్ష్మీనారాయణ
నెల్లూరు సంస్క్రుతకాలేజిలో వ్యాకరణ లెక్చరర్అయిన కందాళ వారు వ్యాకరణ విద్యా ప్రవీణ ,పి.హెచ్ డి పొందారు .ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు .’కూర్మ నాద వింశతి’’, ‘’ఆచార్య వైభవః ‘రామానుజాచార్యులవారిపై పద్దెనిమిది శ్లోకాల లఘు రచన చేశారు .
431-శ్రీమతి గుమ్మా (అమృతవాక్కుల )శ్రీశైల
సంస్కృత శ్రీ కృష్ణ స్తుతిశతకాలపై పరిశోధన చేసి శ్రీ చంద్ర శేఖర స్వామికి అంకితమిచ్చిన శ్రీమతి శ్రీశైల శ్రీ వరదాచార్యుల కృష్ణ శతకాన్ని సంస్కృతం లో రాశారు .
వీరుకాక శ్రీ యెన్ యెన్ హరిశాస్త్రి కుమారవిజయం ,మేఘ దూతం సంస్కృతం లో రాయగా ,శ్రీ చావలి లక్ష్మీకాంత శాస్త్రి ‘’ప్రస్థాన త్రయం ‘’పేర భాష్య త్రయాన్ని వివరిస్తూ వ్యాఖ్యన సంస్కృత గ్రంధం రాశారు .శ్రీ విక్రాల రాఘవాచార్యులు ‘’మదన విజయం ‘’కావ్యాన్ని ,శ్రీనివాస ప్రసాదః ‘’కావ్యాలు రాసి శ్రీకాళహస్తి ఆస్థానకవులై ,’’చతుర్విధ కవితా విశారద ‘’కంఠీరవ’’బిరుడుల౦దు కున్నారు .
వీరుగాక అనేక మంది కవులు ఉండివుండ వచ్చు .వివరాలు తెలియకనే రాయలేక పోయాను .
దీనికి ఆధారం –శ్రీ అమృతవాక్కుల శేషకుమార్ రచన అని మరొక సారి తెలియ జేస్తున్నాను .
ఇంతటితో నెల్లూరు జిల్లా కవులు సమాప్తం .తరువాత శ్రీకాకుళం వెడదాం.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-15-ఉయ్యూరు