ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -210 78 – -భావ చిత్ర కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -3(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -210

78 –   -భావ చిత్ర  కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -3(చివరిభాగం )

సృజన సాహిత్య కుదుపులతో విపరీత ధోరణితో  పారిస్ లో కూడా తనసహాయకులను చికాకుపెడుతూ ,ఉద్దీపన కలిగించాడు .తన విపరీత పాండిత్యం తో కవులను మెడలో బిళ్ళల్లాగా చేసుకొని వినోదించాడు .ఈ కాలం లోనే కొత్త వగరు శైలిని ,సంభాషణా రూపం తో ,విరుద్ధ భావనలతో రూపొందించు కొన్నాడు .35 వ ఏట ‘’హఘ్ సేల్విన్ మాబర్లి ‘’అనే మిరుమిట్లు గొలిపే వ్యంగ్యం ,చమత్కారం ,రోత కలిగించే పుస్తకం ప్రచురించాడు .సాంకేతిక పరిణతి ఉన్న గొలుసులా ,వినసొంపైన భాగాలతో ,తెచ్చిపెట్టుకొన్న మొరటుతనం తో ,ఇంద్రియ పరోక్ష వివరాలతో కూడిన మహా ప్రవాహంగా మధ్యమధ్యలో సంబంధం లేని గుర్తుకొచ్చే విషయాలు అడ్డు పడుతుండగా కొత్త తరహా కవిత్వం చెప్పాడు .దీనినే ఇలియట్ కవి ‘’’a’positive document of sensibility .it is compact of a certain man in a certain place at a certain time ,and it is also the document of an epoch –it is genuine tragedy and comedy and it is in the best sense of Arnold’s worm phrase a ‘’criticism  of life’’అని విశ్లేషించాడు .

పౌండ్ రాసిన ‘’కాంటోస్ ‘’ఒక శృంఖల రచన .అందులో విడిపోతూ కలుస్తున్న ఆశావహ ఏక పాత్రాభినయాలు (మొనోలాగ్స్ )ఉన్నాయి వాటిని పాతికేళ్ళుగా రాస్తూనే ఉన్నాడు .కొందరు దాన్ని ఆయన సాహిత్య శిఖరారోహణం ,ఒక ఎపిక్ అన్నారు మరి కొందరు అర్ధం పర్ధం లేని సంబంధం లేని సాహిత్య దిగాజారుడుతనం అన్నారు .ఇది 100ఆధ్యాయాలు ..మొదటి 16 అధ్యాయాలు 1925 లో ,వెలువడితే మిగిలినవి ఆ తర్వాత 20 ఏళ్ళలో వచ్చాయి .1945 లో పౌండ్ పీసా  జైలు లో నిర్బంది౦చ బడినప్పుడు వచ్చిన 10 అధ్యాయాలను ‘’పీసాన్ కాంటోస్’’అన్నారు . ఈ మహా కావ్యాన్ని  చదవటానికి కుస్తీ పట్టినవాళ్ళు మింగుడు పడక అది కోడ్ భాషలో ఉందని దాన్ని చేదించి చెప్పే వివరణ ఉంటె కాని బుర్రకు యెక్కదని బుర్రలు పగలకొట్టుకొన్నారు .వాళ్ళు పొరబడ్డారు కాని పూర్తిగా అబద్ధం మాత్రం కాదు .సంపూర్నమైనదికాకపోయినా చాలా స్పష్టంగా నే ఉంటుంది .ఈ కావ్యాన్ని దున్నాలంటే యెన్ సైక్లో పీడియాలు ,పరభాషా డిక్షనరీలు ,సంస్కృతిక రాజకీయ చరిత్రలు ,పౌండ్ సమకాలికుల గురించి విస్మృత పుకార్లు ,ఆయన కున్న పరిచయాలు ,ఆయన రచనలలోని తికమకలు ,క్రమరాహిత్యాలు ,ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలు ఆధారాలుగా ఉండాల్సిందే .ఈ కాంటోస్ పై స్పందన వెను వెంటనే కాకుండా నిదానంగా ,భావోద్రేక రహితంగా వచ్చింది .దీనిపై రిచార్డ్ ఎబెర్ హార్ట్ రాస్తూ ‘’the student is recommended to read them about six times  before their flavor can diffuse through the blood ‘’పౌండ్ కున్న జాతీయాల వెదుకులాట ,ఆయనకున్న బహుభాషా పాండిత్యం మనకు అర్ధమై మనం కూడా తప్పకుండా ఉపయోగిస్తాం .

బాగా భాషా పాండిత్యం ఉన్న వాళ్ళే ఇందులోకి చొరబడగలరు .గ్రీకుల ,రినైసేన్స్ ల మొదటి ప్రపంచ యుద్ధకాలపు విషయాలు ‘’ఇంఫెర్నో ‘’లోను ,డబ్బు బాంక్ లావాదేవీలలో అవినీతిని ‘’ప్యురాగేటోరియో’’లో ,వాతావరణ అంతాన్ని ‘’పారాడిసో’’లో వర్ణించాడు .మన సంస్కృతికి పుట్టినిల్లు అయిన ప్రపంచం యొక్క యదార్ధ స్థితిని తీరం నుంచి గమనించి రాసిన సాటిలేని చరిత్ర  .ఎడ్వర్డ్ ఫిట్జరాల్ద్ ‘’there hangs a dismal mist of un resolved confusion ‘’అని చెప్పాడు .మామూలు భాషను కవిత్వం తో రంగరించటమే పౌండ్ శైలి అయింది .యేట్స్ కవి పౌండ్ ను ‘’సెక్స్ లెస్ అమెరికన్ ప్రొఫెసర్ ‘’గొప్ప మార్పు తెచ్చిన వాడు అంటూ ‘’a brilliant  improvisator who had more style than form, a style continually interrupted ,broken ,twisted into nervous obsession ,night mare ,stammering confusion ‘’అని తేల్చాడు .ఈ కన్ఫ్యూజన్ ఆయన శిష్యులు కూడాపడినా ఆయన శైలి తమ పాలిటి గాస్పెల్ –దైవ వాక్యం గా భావించారు .వాళ్లకు కావలసిన అత్యవసర విషయాలన్నీ పౌండ్ అందించాడు .ఆయన రాసిన ‘’స్పిరిట్ ఆఫ్ రోమాన్స్ ‘’,ఇన్స్టి గేషన్స్,పోలిట్ ఎస్సేస్ ,,సోషల్ క్రెడిట్ ,యాన్ ఇంపాక్ట్ ‘’మొదలైన రచనలన్నీ సంప్రదాయ రొమాంటిక్ విధానాలకు వ్యతిరేకాలే .

ఫ్రాన్స్  వదలి  ఇటలి  1924 లోచేరి  రివేర్రా దగ్గర  రాపల్లో లో ఉన్నాడు .1939 లో కొద్దికాలం అమెరికా వెళ్లి వచ్చాడు అక్కడ ఫాసిజాన్ని మెచ్చు కొని ముసోలిని జెఫర్సన్ తో పోల్చి వ్యతిరేకతను కొని తెచ్చుకొన్నాడు .ఆయన అనుయాయులు విస్తు పోయారు .చాలాకాలం అమెరికాకు దూరం గా ఉండటం వలన  మతి భ్రమణ వలన తమ’’గురూజీ  ‘’ఇక్కడి పరిస్తితులను తెలుసుకోకు౦డా గుప్పించిన కామెంట్ లన్నారు .విమర్శను తట్టుకోలేని రక్తం పౌండ్ ది .ఇటలీకి మళ్ళీ చేరి ఫాసిస్ట్ ధోరణి మితిమీరగా 1941 లో రోమ్ నుంచి షార్ట్ వేవ్ రెడియోద్వారా ప్రచారం చేశాడు  అమెరికాను ,దాని విధానాన్ని దుమ్మెత్తి పోశాడు . ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నాడని చెప్పాడు. చివరికి ఇవన్నీ అతన్ని అమెరికా దేశ ద్రోహి గా ముద్ర వేసే స్థితికి తెచ్చుకొన్నాడు 1945 లో పౌండ్ ను బంధించి అమెరికాకు చేర్చింది ప్రభుత్వం .వాషింగ్టన్ జైల్లో పెట్టి విచారణ చేసింది .విచారణకు నిరాకరించాడు .నలుగురు మానసిక వైద్యులు పరీక్షించి పౌండ్ మానసిక స్థితి ఆరోగ్యం గా లేదని రిపోర్ట్ ఇచ్చారు .మరణ శిక్ష పడితేకాని పిచ్చి కుదరదు అన్నారు .కాని  తర్వాత సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్లో 14 2- 1946న  మానసికరోగిగా అంటే ఉన్మాదిగా చేర్చి వైద్యం అందించారు ..12 ఏళ్ళు కేసు నడిచింది .పౌండ్ ఇక ఏమాత్రం విచారణకు నిలబడ లేడనిప్రజలు , ప్రజా సంఘాలు కవులు ,రచయితలూ వాల్ట్ విట్మన్ కవి నాయకత్వం లో పెద్దపెద్దనిరసనలు చేసి  విడుదల చేయమని ప్రబుత్వం పై ఒత్తిడి తెచ్చారు .1958 లో హాస్పిటల్ నుండి విడుదలై ఇటలీకి వెళ్ళిపోయాడు. ఇటలీ తన పెంపుడు తల్లి అంటూ ఫాసిస్ట్ పద్ధతిలో సెల్యూట్ చేసి ‘’అమెరికా ఒక పిచి వాళ్ళ శరణాలయం ‘’అని స్టేట్మెంట్ ఇచ్చాడు ,

63 వ ఏట ఇంకా నేరగానిగా విచారణ జరుగుతుండగానే పౌండ్ కు ‘’పిసాన్ కాంటోస్ ‘’రచనకు గాను వెయ్యి డాలర్ల బోలింజన్ ప్రైజ్ను ఫెల్లోస్  అందజేశారు .దీన్ని స్వీకరించటానికి ప్రభుత్వ అనుమతి అవసరమైంది .ఈ ఫెల్లోస్ లో ఎక్కువ మంది అమెరికన్ కవులే ఉన్నారు .వాళ్ళు పౌండ్ రాజకీయాలతో తమకు సంబంధం లేదని ,ఆయన కవిత్వానికిచ్చిన అవార్డ్, రివార్డ్ అనీ తెలియ జేశారు .కొన్ని నెలలు దీనిపై ప్రతిస్తంభన ఏర్పడింది .వస్తువా,విదానమా అనే ఈ వివాదం  యా౦ డ్రూమేల్లాన్ బెల్లిన్జేన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచేఉంది .పౌండ్ రాజకీయ భావనలు క్షణికోద్రేకమైనవే   కాని ఆయన చేసిన కవితా తపస్సు అద్వితీయమణి  అమోఘం అనితర సాధ్యం అని గుర్తించారు .ఆయన నవ రచయితలలో చాంపియన్ మాత్రమేకాదు మార్గ దర్శి .నిర్లఖ్యానికి పౌండ్ పూర్తీ వ్యతిరేకి ,దానిపై నిరంతర పోరాటం చేసినవాడు .’’పౌండ్ అంతం ఆయన ఆది ‘’అవుతుందని క్రిటిక్స్ అన్నారు .అయన రాసిన ‘’I am weathered the storms –I have beaten out my exile ‘’అనేది అందరికి ఆదర్శమైంది .పౌండ్ తన అనుయాయులకు కొత్తగా ఏదీ బోధించలేదు కాని వాళ్ళు కవిత్వాన్ని ఎలా చెప్పాలో ఉదాహరణ పూర్వకం గానిరూపించిన మార్గ దర్శి .కవిత్వాన్ని సంగీతం లో రంగ రించి రాశాడు .’’కౌంటర్ పాయింట్ ‘’కు ప్రాధాన్య మిచ్చాడు .అనువాదకుడుగా పౌండ్ గొప్ప చరిత్ర సృష్టించాడు .చవరికి మనచలం లాగా చెంపలేసుకొని ‘’the worst mistake I made was that stupid ,suburban prejudice of anti Semitism ‘’అన్నాడు పశ్చాత్తాపం తో . ‘’

పౌండ్ చెప్పిన కవితా సిద్ధాంతాలు –సామాన్య భాషలో సరైన మాటను ఉపయోగించి దానికి తళుకులు బెళుకులు అద్దకుండా రాయాలి .రిథం ను పాత పద్ధతిలో కాకుండా ,కొత్త రైమ్స్ ను కొత్త మూడ్స్ ననుసరించి ఫ్రీ వెర్స్ లో రాయాలి .కవిత్వ ఉత్పత్తి అస్పష్టంగా ఉండిపోవాలి .అంతర్జాతీయ భావనా పరమావధిగా రాయాలి .టెక్నిక్ కు ప్రాధ్యాన్యం ఎక్కువ ఉండాలి .కమ్యూనికేషన్ కంటే శైలికే అధిక ప్రాధాన్యమివ్వాలి .ఈ సెంటిమెంట్ కల్లోలం సృష్టించి ‘’ఫ్రీ వేర్స్ ఫ్యూరోర్  ‘’అని పించుకోన్నది .తన కాంటోస్ కు రాసిన సూచికే 320పేజీలు  ఉంది .ఇదంతా చైతన్య స్రవంతి అంటే స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ ‘’రచన అప్పటికి అది చాలా కొత్త . హ్యూమన్  కామెడీని అనేక గొంతుకలతో ,అనేక పరిమాణాలలో కోణాలలో చెప్పానని చెప్పుకొన్నాడు పౌండ్ .ఒక నిర్దుష్ట ప్రణాళిక తోనే రాశాడు ఆషామాషీ వ్యవహారం కాదు .ఇందులో వస్తువు వ్యతిరేక వస్తువు ,చరిత్ర పునరావృత్తాలు ,ఉంటాయి .కొన్ని కవితా పంక్తులు –‘’hang it all Robert Browining –there can be but the one ‘’Sordello ‘’and my Sordello –lo sordels sifo di Mintovans –so  shu –churned in the sea ‘’

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య పుస్తకావిష్కరణ సభ 17-7-16 -ఆదివారం ఉదయం 10గం లకు మొగలరాజ పురం సి ఆర్ లైబ్రరీ లో

ps

మా అన్నయ్య పుస్తకావిష్కరణ సభ 17-7-16 -ఆదివారం ఉదయం 10గం లకు మొగలరాజ పురం సి ఆర్ లైబ్రరీ లో

ahvanam

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంకరం బడి సాహిత్య పీఠం తిరుపతి

004 003

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -209 78 – -భావ చిత్ర కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -2

’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -209

78 –   -భావ చిత్ర  కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -2

వాల్ట్ విట్మన్ కవిని ఒకప్పుడు ద్వేషించినా ,ఇప్పుడు ఆయనతో సయోధ్య కుదుర్చుకొనే ప్రయత్నం చేశాడు ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’కవిత్వం రాసిన కుర్రాడు బాగా ఎదిగిపోయాడని మెచ్చి ,’’కొత్త కట్టె ను విరగ్గొట్టిన నువ్వు ఇప్పుడు ఆకర్రతో నగిషీలు చెప్పే సమయం వచ్చింది ‘’అని ప్రోత్సహించాడు .కొన్నేళ్ళకే ఎజ్రా పౌండ్ తనకు తగిన ప్రదేశాన్ని ఎంచుకొని ఇంగ్లాండ్ వెళ్లి మొదట్లో అక్కడి వారిని ఆకర్షించలేక పోయినా ,క్రమంగా వారి కి దగ్గరయ్యాడు .19 వ ఏట కొంచెం నెర్వస్ గా ,ఉద్రిక్తంగా ,కుదుపులతో రెడ్డిష్ బ్రౌన్ అమెరికన్ ‘’లాగా ఉండేవాడని వింధాం లెవిస్ రాశాడు .గ్లాసు నీటిలో నూనె చుక్క ‘’లాగా ఉండేవాడు .ఆయన ఎవరితోనూ కలవని రకం .ఆకట్టుకోవటానికి ప్రయత్నించే వాడు .దీనిలో మాత్రం విజయం సాధించాడు .ఆయన అహంకారం ,పాండిత్యాలు చరిత్రనే సృష్టించాయి .కళల లో నూతన పరిశోధనాలను వివరించి చెబుతూ విక్టోరియన్ యుగ లక్షణాలను ప్రేల్చి వేస్తూ ఉపన్యాసాలిస్తూ ,తానుచికాగో లో పెట్ట్టిన ’’పొయిట్రి ‘’మేగజైన్ కు ‘’యూరోపియన్  విలేకరి అయ్యాడు .అహంకార పూరిత ఎర్ర గడ్డం తో కంద గడ్డ లాంటి మొహం తో దూరం గాతిరుగుబాటు మాండరిన్ గా  ఉండే వాడు .శిష్యుల్నిఆకర్షిస్తూ  నిరాకరిస్తూఘాటుగా చివాట్లు పెడుతూ  ఉన్నా వినాశకరంగా ప్రవర్తించే వాడు మాత్రం కాదు  . పౌండ్ విమర్శలకు లాభ పాడినవాడు టి ఎస్ ఇలియట్ కవి .ఆయన సలహాపై తన ‘’వేస్ట్ లాండ్ ‘’కావ్యాన్ని సగానికి సగం తగ్గించి ఆకర్షణీయం చేశాడు .పౌండ్ రాసిన ‘’సేలక్టేడ్ పోయెమ్స్ ‘’కు ఇలియట్ ముందుమాటరాస్తూ ‘’అతని ప్రభావం చాలా గొప్పది .ఆయన కవిత్వాన్ని ఉపన్యాసం చేశాడు .తర్వాత కవిత్వాన్ని పాట ను చేశాడు .

1914లోసమకాలీన రొమాంటిక్ కవిత్వాన్ని నిరసించే  కవి బృందాన్ని పోగేసి ,వారికొక మేని ఫెస్టో తయారు చేసి ఆ గ్రూప్ కు’’ఇమేజిస్ట్ ‘’లని  ఒక పేరు కూడాపెట్టాడు  . వీళ్ళు భావ చిత్రాలకు ప్రాధాన్యమిచ్చి ,రోమా౦ టిజం బంధనాలలోంచి కవిత్వపు చెర విడిపించి నందుకే ఈ పేరు పెట్టాడు .ఇమేజిస్ట్ లు సాధారణ భాషను ,సరైన వర్ణనాత్మక పదాలతో రాస్తూ ,ఛందస్సు ను వదిలి  కొత్త లయ తో ,కొత్త మూడ్స్ తో అనిబద్ధ కవిత్వం రాస్తూ ,కఠిన స్పష్టమైన  కళంక రహిత,అనిర్దిష్ట  కవిత్వ సృష్టిచేశారు .ఈసిద్దా౦తాలవలననే ఉత్తమ కవిత్వం మాత్రమె కాక సాహిత్య సృష్టి జరుగుతుందని నమ్మారు . ఈ సిద్ధాంతాలు జనం లో కల్లోలం నిరసన  అవహేళన సృష్టించాయి .ముఖ్యంగా ఆమిలోవెల్ అనే కవయిత్రి ఇమేజిస్ట్ గా మారి పౌండ్ బాటలో నడిచి నూతన కవిత్వాన్ని రాసి ప్రసిద్ధి పొందింది .అయితే పౌండ్ తమ గ్రూపును ఆమె డామినేట్ చేసి రాస్తోందని,ఆమె కవిత్వం తాము ఆశించిన స్థాయిలో లేదని ప్రాణం లేని జీవి చిత్రంలా ఆమె కవిత్వం ఉందని  మండిపడ్డాడు .లోవెల్ భార్య అయిన ఈమె రాసింది ఇమేజిస్ట్ కవిత్వంకాదని దాన్ని ‘’అమీజిస్ట్ ‘’కవిత్వం అనాలని అన్నాడు .తాను ఏర్పరచిన గ్రూప్ నుంచి విడిపోయి ,ఆ సిద్ధాంతాలకు ఇక తానేమీ బాధ్యుడినికానని ప్రకటించాడు .తర్వాత ‘’దిలిటిల్ రివ్యు ‘’పత్రికకు ఎడిటర్ అయి మొదటి ప్రపంచ యుద్ధం అయ్యాక లండన్ వదిలి పారిస్ చేరాడు .

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య పుస్తకావిష్కరణ సభ 17-7-16 -ఆదివారం ఉదయం 10గం లకు మొగలరాజ పురం సి ఆర్ లైబ్రరీ లో

సరసభారతి 94వ సమావేశం గా రమ్య భారతి తోకలిసి 17-7-16 ఆదివారం ఉదయం ..”మా అన్నయ్య ”పుస్తకావిష్కరణ సభ జరుపుతున్నాం .సాహిత్యాభిమానులందరూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన

తేదీ సమయం ——–17-7-16 -ఆదివారం -ఉదయం 10 గం లకు
వేదిక –                 మొగలరాజాపురం లోని చండ్ర  రాజేశ్వర రావు లైబ్రరీ (సి ఆర్ లైబ్రరీ )
సభాధ్యక్షులు —       శ్రీ గబ్బిట  దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
ముఖ్య అతిధి ,ఆవిష్కర్త –     శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ -ప్రముఖ కదా రచయిత ,                                                           న్యాయవాది ,విమర్శకులు ‘
ఆత్మీయ అతిధి —–              శ్రీ కె .నిరుత్తమ రావు ,ప్రసిద్ధ రచయిత
పుస్తక పరిచయం                  శ్రీ కె ఆంజనేయ ప్రసాద్ ,కవి ,సాహితీ విమర్శకులు
పుస్తక ప్రాయోజకులు —         శ్రీమతి సీతంరాజు మల్లిక
కార్య క్రమ నిర్వహణ ——        శ్రీ చలపాక ప్రకాష్ -రమ్య భారతి సాంపాదకులు
సభా కార్యక్రమ సహకారం —-శ్రీమతి మాది రాజు శివ లక్ష్మీ -సరసభారతి కార్య దృష్టి
                                            మీ ఆగమనాభిలాషులు
                                           గబ్బిట దుర్గా ప్రసాద్
                                           చలపాక ప్రకాష్
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

yoga vybhavam

yoga1 001 yoga3 001 yoga4 001 yoga5 001 yoga6 001 yoga7 001 yoga8 001 yoga 2 001

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -208 78 – -ప్రతీక కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్

’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –208

78 –   -ప్రతీక కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్

తన పోరబాట్లఅస్తిత్వంతో బతుకు విషాదం చేసుకొన్నఆధునిక అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ .రాజకీయ ప్రచారం లో ఉద్దండుడు.ఈ ప్రాపగాండా తో తనలోని ఆర్టిస్ట్ ను  వాచాలత్వం,  బూతులతో సన్నిహితులను దూరం చేసుకొని చివరికి దేహ ద్రోహ నేరం మోపబడి న విధి వంచితుడు .30-10-1885 న అమెరికాలోని ఇడాహోరాష్ట్రం లో హైలీ లో పుట్టాడు .ఆతనిది న్యు ఇంగ్లాండ్ వంశం .తల్లి లాంగ్ ఫెలో కవికి దూరపు చుట్టం .తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ,మొదటి ప్లాస్టర్డ్ హౌస్ నిర్మించిన మార్గ దర్శి .చిన్నతనం లోనే పెన్సిల్వేనియా కు తీసుకు పోబడి తూర్పు వాతావరణం లో పెంచబడ్డాడు  .15 ఏళ్ళకు అక్కడి యూని వర్సిటి లో చేరి కార్రిక్యులం లేని  తులనాత్మక సాహిత్యం చదివి జీర్ణించుకొన్నాడు .16 వయసులో స్పెషల్ స్టూడెంట్ గా నమోదయ్యాడు .18 వ ఏట న్యూయార్క్ హామిల్టన్ కాలేజి లో చేరి ,ఇరవైకే గ్రాడ్యుయేట్ అయి రోమాన్స్ లాంగ్వేజెస్ లో ఫెలో అయి పెన్సిల్వేనియా యూని వర్సిటిలో ,ప్రొఫెసర్ సమాన హోదా గల ఇంస్ట్రక్ట్క్తర్ అయ్యాడు .21 కె మాస్టర్ డిగ్రీ పొంది ,స్పెయిన్ ఇటలి ఫ్రాన్స్ లు తిరిగొచ్చాడు .ఒక ఏడాది స్పానిష్ నాటక రచయిత లోప్ డి వేగా పై పరిశోధన చేశాడు .1907 లో తిరిగి రాగా ఇండియానా రాష్ట్రం క్రాస్ ఫోర్డ్స్ విల్ లో వాబాష్ కాలేజి లో ఫాకల్టిలో చేరమని ఆహ్వానం అందుకొన్నాడు .ఆ టౌన్ సాహిత్య సంప్రదాయాలకు ,ముఖ్యంగా బెన్హర్ రాసిన ల్యు వాలెస్ చనిపోయిన ప్రదేశం గా గుర్తింపు పొందింది .నాలుగు నెలల తర్వాత బోహిమినియనిజం తో   సంప్రదాయ విరోధి అని నిందలు మోపి ఉద్యోగం ఊడ గొట్టారని పౌండ్ చెప్పుకొన్నాడు .

     పుట్టుకతోనేవిద్యా వేత్తగా  బోధనా  సామర్ధ్యంఉన్నా విఫలమైన టీచర్ గా నిరాశ చెంది , తన బహిష్కృత అమెరికన్ లకు చదువు నేర్పాలను కొని , యూరప్ కు  వెళ్లి  జేబులో ఎనభై డాలర్లతో జిబ్రాల్టర్ చేరి కొంత డబ్బు వడ్డీకిచ్చి దానితో బతుకుతూ గడిపాడు .ఇటలీ వెళ్లి మొదటి పుస్తకం ‘’ఎ ల్యూం స్పేంటి ‘’1908 లో వెనిస్ లో ప్రచురించాడు .ఇది చిన్నపుస్తకమే అయినా తన విద్యకు తగిన ఉన్నత రంగుల ప్రతి బి౦బాలతో పగిలిన అద్దం పెంకుల్లా ఉంది .కొన్ని నెలల తర్వాత లండన్ లో ఉన్నాడు. అక్కడ  ఆధునిక యువ రచయితలతో కలిసి ,వారి వైవిధ్య కార్యక్రమాలకు నాయకత్వం వహించి చైనా జపాన్ కవిత్వమైన ఫెనలోసా సంపుటికి ఎక్సి క్యూటర్ బాధ్యత చేబట్టాడు.25 వఏట మరో రెండు చిన్న పుస్తకాలు ‘’పర్సోనే ‘’’’,ఎక్సల్టేషన్స్ ‘’రాసి ముద్రించాడు  .తర్వాత ‘’కాన్జోని ,’’రిపోజిల్స్ ‘’కూడా రాసి మొత్తం అయిదు పుస్తకాలను 27 ఏళ్ళకే ప్రచురించాడు .29 కి డోరోతి షేక్స్ పియర్ ను పెళ్లి చేసుకొని ఒక కొడుకుకు తండ్రి అయ్యాడు .

   పౌండ్ రాసిన మొదటి  కవితలు ప్రాచీన ఫ్రెంచ్ ఆధునిక ఇంగ్లీష్ ప్రభావ సమ్మేళనాలే .ప్రోవెన్షియల్ కవులు,మధ్యయుగపు ప్రేమ గీతాలతో బ్రౌనింగ్ ,విలియం మారిస్ ,స్విన్ బరన్, ప్రి రాఫలైట్స్ కవిత్వాల రంగ రింపు ప్రాముఖ్య యాస తో ఉంది .మధ్యలో అనేక వైరుధ్యాలు ,కొత్తదనం తాజాదనం కృత్రిమ ఆకర్షణ తో ఉంది .బాలడ్స్ సేస్టినా,ఫ్రెంచ్ కవితల అనువాదం  పాత వాసనతో కొత్తగా,వాడుక భాషలో స్వీయ చైతన్య స్పూర్తితో ఉంది .ఉదాహరణకు –  ‘’come ,my songs ,let us speak of perfection –we shall get ourselves rather disliked –the gilded phaloi  of the crocuses –are thrusting at the spring air ‘’

 

Inline image 1Inline image 2

        సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-13-7-16-ఉయ్యూరు

 

 

‘’

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు(వ్యాసం)- విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -జులై -గబ్బిట దుర్గాప్రసాద్

—

ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

భారత దేశ స్వాతంత్ర్య సమరం లోబెంగాల్ రాష్ట్రం లోని చిట్టగాంగ్ జిల్లాకు కు ప్రత్యెక ప్రాధాన్యత ఉంది .అక్కడి వీర నారీమణులు సాయుధ పోరాటం చేసి చరిత్రకెక్కారు .వారిలో కల్పనా దత్తా ,ప్రీతి లతా వాడేదార్ ల గురించి తెలుసు కొందాం .

1- కల్పనా దత్తా

కల్పనా దత్ అనే పేరుతో పిలువ బడే కల్పనా దత్తా జాతీయ బెంగాలీ విప్లవ నారి .బెంగాల్ లో చిట్టగాంగ్ జిల్లా సిరిపూర్ గ్రామం లో 1913 జులై 27న జన్మించింది .చిట్టగాంగ్ లో చదివి మెట్రిక్ పాసై కలకత్తా చేరింది .బెతూనే కాలేజి లో సైన్స్ లో డిగ్రీ కోర్స్ లో చేరింది . అక్కడే వీణా దాస్, ప్రీతీ లాల్ వాడేకర్ ల ఆధ్వర్యం లో నడుస్తున్న చిన్న విప్లవ సంఘం ‘’చాత్రి సంఘం ‘’లో సభ్యురాలై చురుకైన కార్య కర్త అయింది .

1930 ఏప్రిల్ 18న జరిగిన చిట్టగాంగ్ ఆయుధ దోపిడీ లో చిట్టగాంగ్ లోని ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ తరఫున సూర్య సేన్ తో కలిసి పని చేసింది .1931లో సూర్య సేన్ కల్పనకు ,ప్రీతీలత కు చిట్టగాంగ్ లోని యూరోపియన్ క్లబ్ పై దాడి జరిపే బాధ్యతను అప్పగించాడు .కాని ఒక వారం ముందే ఆమె ఆ ప్రాంతం లో సంచరిస్తుండగా అనుమానమొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది .బెయిల్ పై విడుదలై సాయుధ పోరాటం కోసం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయింది .1923 ఫిబ్రవరి 17న వారి స్థావరాన్ని గుర్తించి పోలీసులు చుట్టుముట్టి సూర్య సేన్ ను అరెస్ట్ చేశారు .కల్పన వారికి అందకుండా తప్పించుకొన్నది .సుమారు పదేళ్ళ తర్వాత 19-5-1933న ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగలిగారు .చిట్టగాంగ్ ఆయుధ దోపిడీ పై రెండవ సారి జరిగిన విచారణ లో యావజ్జీవిత ఖైదు విధించారు .కాని 1939లో ఆరేళ్ళ తర్వాత విడుదల చేశారు .

కలకత్తా యూని వర్సిటీ నుండి1940లో సైన్స్ లో డిగ్రీ పొందింది .భారత కమ్యూనిస్ట్ పార్టీ లో చేరి 1943లో వచ్చిన బెంగాల్ కరువు ,ఆ తర్వాత బెంగాల్ విభజన లలో బాధితుల సేవాకార్యక్రమాలలో పాల్గొని ఆదుకోన్నది .అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరి పూర్ణ చాంద్ జోషి ని వివాహ మాడిఇద్దరు కుమారులను కన్నది .పెద్దకొడుకు చాంద్ జోషి గొప్ప జర్నలిస్ట్ .హిందూస్తాన్ టైమ్స్ లో పనిచేశాడు .ఆయన 1985లో రాసిన ‘’భి౦ద్రేన్ వాలే –మిత్ అండ్ రియాలిటి ‘’పుస్తకం బహుళ ప్రచారం పొందింది . ‘’చిట్టగాంగ్ ఆయుధ దోపిడీ జ్ఞాపకాలు ‘’అనే స్వీయ జీవిత చరిత్రను కల్పన రాసింది .ఇది 1945లో ఆంగ్లభాషలో అచ్చయింది .1946 బెంగాల్ శాసన సభకు జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చిట్టగాంగ్ నుంచి పోటీ చేసింది కాని గెలవలేదు .తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ లో చేరి ,అక్కడే రిటైర్ అయింది .8-2-1995న 82ఏళ్ళ వయసులో స్వాతంత్ర సమార యోధురాలు కల్పనా దత్త మరణించింది .

కల్పనా దత్తా పై సినిమా తీశారు .అందులే దీపికా పడుకొనే కల్పన పాత్ర ధరించింది .హిందీలో తీసిన ఈ సినిమా పేరు ‘’ఖేలేన్ హం జీ జాన్ సె ‘’.ఇందులో చిట్టగాంగ్ సాయుధ దోపిడీ ,ఆతర్వాత జరిగిన పరిణామాలు చిత్రించారు .పూర్వపు నాసా సైంటిస్ట్ వేదవ్రత పైన్ దర్శకత్వం వహించాడు .12-102012న ఈ సినిమా విడుదలైంది .

2-ప్రీతీ లతా వాడేదార్

మధ్యతరగతి వైద్య బ్రాహ్మణ కుటుంబం లో ఇప్పటి బంగ్లాదేశ్ లోఉన్న చిట్టగాంగ్ ఉపజిల్లా పాటియా లోని దాల్ఘాట్ గ్రామం లో 5-5-1911న ప్రీతిలతా వాడేదార్ జన్మించింది .తండ్రి జగబందు వాడేదర్ చిట్టగాంగ్ మునిసిపాలిటీ గుమాస్తా .తల్లి ప్రతిభా మాయి గృహిణి .వారి 6గురు సంతానం లో ప్రీతి రెండవది .ఇంట్లో ‘’రాణి ‘’అని ముద్దుగా పిలిచేవారు .తండ్రికి వంశ పారంపర్యంగా వచ్చిన ‘’దాస్ గుప్త’’ బిరుదు ఉంది .పిల్లకు తనకున్న శక్తి సామర్ధ్యాలతో ,ఆర్ధిక వనరులతో విద్య నేర్పించాడు .చిట్టగాంగ్ లోని డాక్టర్ ఖాస్ట గిర్ ప్రభుత్వ బాలికల పాఠ శాలలో చేర్పించాడు .మెట్రిక్ పాసై౦ది. అక్కడే టీచర్ గా ఉన్న విద్యార్ధుల అభిమానం పొందిన’’ ఉషాదీ’’ చెప్పే ఝాన్సి లక్ష్మీ బాయి చరిత్ర లతా ,ఆమె సహ విద్యార్ధులలో జాతీయ భావన ను ప్రేరేపించింది .ప్రీతి లో సాహసం ధైర్యం రావటానికి ఇదే కారణమైంది .కల్పనా దత్తా ఈమెకు సహ విద్యార్ధిని.ప్రీతికి కళా సాహిత్యాలు ప్రీతి పాత్రమైనాయి .ఢాకా లోని ఈడెన్ కాలేజి లో చేరి ఇంటర్ లో మొదటి స్థానం సాధించింది .అనేక సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది .. లీలానాగా నడిపే శ్రీ సంఘం లో దిపాలీ సంఘం ఆధ్వర్యం లో పని చేసింది .

కలకత్తా వెళ్లి బెతూనే కాలేజి లో చేరి రెండేళ్ళు ఫిలాసఫీ చదివి డిస్టింక్షన్ తో గ్రాడ్యుయేట్ అయింది . కాని బ్రిటిష్ అధికారులు ఆమె సర్టిఫికేట్ ను యూని వర్సిటీ జారీ చేయకుండా నిలిపేశారు .చనిపోయాక 2012లో ఆమెకూ,వీణా దాస్ కు మరణానంతర డిగ్రీ ప్రదానం చేశారు .డిగ్రీ తర్వాత చిట్టగాంగ్ చేరి నందన్ కానన్ అపర్ణాచరణ్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పని చేసింది . భారత స్వాతంత్రయుద్ధం వార్త విని తానూ పాల్గోనాలనినిర్ణయించు కొన్నది .సూర్య సేన్ ఆమె భావాలను గమనించి తమతో విప్లవ సంఘం తో కలిసిసాయుధ పోరాటం లో పని చేయమని ఆహ్వానించాడు .1932జూన్ 13న దాల్ఘట్ కాంప్ లో సూర్యా సేన్ ,నిర్మల్ సేన్ లను కలిసింది .సహా విప్లవ కారుడు వినోద్ బీహారీ చౌదరి ఆడవాళ్ళను చేర్చుకోవద్దని అభ్యంతరం పెట్టాడు .ఆయుధాలను చేరవేయటం లో అనుమానం రాకుండా ,పట్టుబడకుండా నైపుణ్యం గా చేర వేసే సామర్ధ్యం స్త్రీలకకేఉందని చెప్పి సూర్య సేన్ ఒప్పించి చేర్చుకొన్నాడు .

చిట్టగాంగ్ ఇన్స్పెక్టర్ జనరల్ క్రైగ్ ను హత్య చేయటానికి సూర్య సేన్ విప్లవ దళం నిర్ణయించింది . రామకృష్ణ బిశ్వాస్ ,కాళీ పాద చక్రవర్తి లకు సేన్ ఈ బాధ్యతఅప్పగించాడు . కాని వీళ్ళు పొరబాటున చందాపూర్ ఎస్పిని, త్రయాణీ ముఖర్జీని కాల్చి చంపారు .దీనికి బిశ్వాస్ ను చక్రవర్తిని ప్రభుత్వం 2-12-31న అరెస్ట్ చేసింది .విచారణ తర్వాత బిశ్వాస్ ను ప్రాణం పోయే దాకా ఉరితీసే శిక్ష విధించారు .చక్ర వర్తిని సెల్యులర్ జైలు కు ప్రవాసం పంపారు .చిట్టగాంగ్ నుంచి ఆలీపూర్ జైలు కు వెళ్ళటానికి కుటుంబ సభ్యుల వద్ద డబ్బు లేదు .కలకత్తాలో ఉంటున్న ప్రీతి లతను ఆలీపూర్ జైలు కు వెళ్లి బిశ్వాస్ ను కలుసుకోమని పంపారు .

సూర్య సేన్ బృందం తో కలిసి విప్లవ కార్యక్రమాలు చేస్తూనే ప్రీతి టెలిఫోన్ ,టేలిగ్రాఫ్ ఆఫీసులపై దాడి నిర్వహించింది .రిజర్వ్ పోలీస్ లనుజలాలాబాద్ పోరాటం లో పట్టుకొన్నది.విప్లవకారులకు ప్రేలుడు సామగ్రి అందజేసే బాధ్యతను ప్రీతీ లతా స్వీకరించి సమర్ధ వంతంగా నిర్వహించింది .’’కుక్కలకు ,ఇండియన్ లకు ప్రవేశం లేదు ‘’అని వ్రేలాడ దీసి ఉన్న ప్రహర్తాలి యూరోపియన్ క్లబ్ పై ఆ వాక్యం పై ఉన్న తీవ్ర ఆవేదన నిరసనలతో 1932లో దాడి చేయాలని సూర్య సేన్ ప్రణాళిక సిద్ధం చేశాడు .దీన్నిఅమలు చేయటానికి మహిళకు బాధ్యత ఇవ్వాలని సేన్ భావించాడు .కాని కల్పనా దత్త వారం రోజులు ముందే అరెస్ట్ అయింది .అందుకని ఈ బాధ్యతను ప్రీతిలతకు అప్పగించాడు సేన్ .ప్రీతిలత కొటోవాలి సముద్ర తీరం చేరి ఆయుధ విద్య లో శిక్షణ పొంది ఆరితేరి౦ది ..ప్లాన్ అంతా సిద్ధం చేసుకొన్నది .

డిసెంబర్ 23న దాడికి పక్కా ప్లాన్ సిద్ధమైంది .బృందానికి పొటాషియం సయనైడ్ ఇచ్చి పట్టుబడితే మింగేసి చనిపోమ్మని ఆజ్ఞలు జారీచేశాడు నాయకుడు సేన్ .దాడి చేసే రోజు న ప్రీతి పంజాబీ మగ వాడి దుస్తులు ధరించింది .ఆమె అనుచరులు కాళీ శంకర్ డే,శాంతిలాల్ చక్రవర్తి పంచాచొక్కా వేషం వేసుకొన్నారు .మహేంద్ర చౌదరి ,సుషీల్ డే,పన్నా సేన్ లు లుంగీ చొక్కా తో సిద్ధమయ్యారు . ఈ విప్లవ బృందం ఆ రాత్రి 10-45కు క్లబ్ దగ్గరకు చేరి,దాడి ప్రారంభించారు .అప్పుడు క్లబ్ లో 40మంది ఉన్నారు .విప్లవ బృదం మూడు గ్రూపులుగా చీలి దాడి చేయాలని భావించింది .క్లబ్ లోపల ఉన్న కొందరు పోలీస్ ఆఫీసర్లు తమ రివాల్వర్ లతోఎదురు కాల్పులు సాగించారు .ప్రీతిలత కు చిన్న బులెట్ గాయం అయింది .పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఈ దాడిలో సల్లివాన్ అనే ఇంటి పేరున్న స్త్రీ ,చనిపోయిందని నలుగురు మగాళ్ళు ఎందరో ఆడవాళ్ళు గాయపడ్డారని ఉంది .
గాయ పడిన ప్రీతి లతను వలపన్ని బ్రిటిష్ పోలీసులుపట్టుకొ బోయారు .

ఆమె సయనైడ్ మింగి అరెస్ట్ కాకుండానే వీర మరణం పొందింది .మర్నాడు ఆమె శవాన్ని గుర్తించి ప్రీతిలత చని పోయిందని తేల్చారు .ఆమె వస్తువులను సోదా చేస్తుంటే బిశ్వాస్ ఫోటో ,విప్లవ సాహిత్యం బుల్లెట్లు ఈ దాడి కి సిద్ధం చేసిన ప్లాన్ ప్రతి దొరికాయి .పోస్ట్ మార్టెం తర్వాత ఆమెకు తగిలిన బులెట్ గాయం చాలాస్వల్పమైనదని ,సయనైడ్ తీసుకోన్నందుకే చనిపోయిందని తెలిసింది .బెంగాల్ చీఫ్ సెక్రెటరి లండన్ లోని బ్రిటిష్ ప్రభుత్వాధికారులకు సందేశం పంపుతూ’’ ప్రీతి, టెర్రరిస్ట్ బిశ్వాస్ భార్య కాదని . దాల్ఘాట్ లో అరెస్ట్ ను తప్పించుకొ బోయే సమయం లో కెప్టెన్ కేమరాన్ పడిపోయినప్పుడు పోలీస్ కాల్పులలో మరణించిన నిర్మల్ సేన్ భార్య అని కొంత సమాచారం ఉంది’’ అని తెలియ జేశాడు .

బంగ్లా దేశ్ రచయిత సాలీనా హోస్సైన్ రాస్తూ ‘’ప్రీతీ జీవితం అందరికి ఆదర్శమని ,ఆమె జ్ఞాపకార్ధం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారని , ఆ ట్రస్ట్ ప్రీతిని బీకన్ లైట్ అంటే దారి దీపం అనీ అందిఅని చెప్పింది .ఆమె పుట్టిన రోజును ట్రస్ట్ బంగ్లా దేశ్, భారత దేశాలలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తోందని ,చిట్టగాంగ్ లో ఒక వీదికి ‘’ప్రీతిలత వాడేదార్ మార్గం ‘’అని పేరు పెట్టి గౌరవించారని ,2012లో ఆమె బస్ట్ సైజ్ కాంస్య విగ్రహాన్నిచారిత్రాత్మక యూరోపియన్ క్లబ్ దగ్గరున్న ప్రహర్తాలి రైల్వే స్కూల్ సమీపం లో ఏర్పాటు చేశారని ,రాసింది .2010లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘’ఖేలేన్ హం జీ జాన్ సే’’లో ప్రీతిలత పాత్రను విశాఖా సింగ్ పోషించింది .2012లో వచ్చిన చిట్టగాంగ్ హిందీ సినిమాలో ప్రీతిలత వాడేదర్ గా వేగా తమోషియానటించింది .
భారత స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న సమయం లో ఈ ఇద్దరు వీర విప్లవ నారీమణులను గురించి తెలుసుకొని ధన్యులమవుదాం .వారి బలిదానానికి నివాళు లర్పించి ఋణం తీర్చుకొందాం ..

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Share

– See more at: http://vihanga.com/?p=17320#sthash.3uf19uRp.dpuf

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -207 77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -5(చివరిభాగం )

’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –207

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -5(చివరిభాగం )

  చాటర్లీన్ నవల ప్రభావం అత్యద్భుతమై విశ్వ వ్యాప్తమైంది .’’పిల్గ్రిం ఆఫ్ అపోకలిప్సే ‘’నవలలో అర్ధ శతాబ్ది కాలపు సెక్స్ స్వేచ్చ కై పోరాటం యే ఆంగ్ల రచనలలోను  లేని విధంగా రాశాడు లారెన్స్ ,సెక్స్ చిహ్నాలను యాంటి క్లైమాటిక్ గా వాడాడు ‘’అన్నాడు హోరేస్ గ్రెగరీ .అదొక సుదీర్ఘ పోరాటం .మహాకవి వాల్ట్ విట్మన్ ‘’సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’నుండి ఆస్కార్ వైల్డ్ విచారణ ద్వారా ,తర్వాత ఫ్రాయిడ్ చివరి రచన ఇటలి ,పారిస్ లలో ప్రింట్ అయ్యేదాకా చివరికి ఈ నవల వరకు జరిగిన పోరాటం ,ఇప్పుడు 19 28 తో  పూర్తీ అయి విజయం సాధించింది .లారెన్స్ కు ఇక రెండేళ్ళ జీవితమే మిగిలి ఉంది .ఈ కాలం లో మరో నవల అది భౌతిక విచారణ తో ఉన్న నవల ‘’అపోక లేప్సి ‘’రాశాడు .సూర్యుని స్తుతి ,చాటర్లిన్ పై  విమర్శలకు కొన్ని సమాధానాలతో వంద కు పైగా కవితలతో,అరడజన్ తీవ్రమైన కధలతో ,ఒక సూపర్ నేచురల్ పిల్ల కద తో  దీన్ని ముగించాడు .ఈ కధే ప్రపంచ ప్రసిద్ధ హారర్ స్టోరీ లలో ఒకటి అయింది .భయంకరత్వానికి పరాకాష్ట అయింది .రచన రిలీఫ్ గా ఉన్నా ఒత్తిడిగా కూడా ఉంది లారెన్స్ కు .’’పాన్సీస్ ‘’పేరుతొ ఉన్న కవితా సంపుటిని హోం సెక్రెటరి సీజ్ చేశారు .అయన పెయింటింగ్ షోను పోలీసులు ఆపేశారు .అయినా మొక్కవోని ధైర్యం తో’’’సంపూర్ణ జీవితానికి ,ఏకీభావ జీవితంకోసం  ‘’రచన చేస్తూనే ఉన్నాడు .ఆరు నెలల తర్వాత ‘’మనిషికి ,పుష్పానికి ,జంతువుకు ,పక్షికి సర్వోన్నత విజయం అత్యంత స్పష్టంగా జీవించి ఉండటమే ‘’అని బోధించిన లారెన్స్ మరణించాడు .సూర్యారాధకుడైన మహా రచయిత’’బ్యూ సోలీల్ భవంతిని యడ్ ఆస్ట్రా కోసం కేటాయి౦చాననే వ్యంగ్యాన్ని అభినందిస్తూ తీవ్రం గా జబ్బు పడ్డాడు .పురాతన ప్రపంచ ప్రసిద్ధ వెనిస్ నగరం లో ఫ్రెంచ్ రేవేర్రా పైన 1 -3-1930న 45ఏళ్ళకే  చనిపోయాడు .

  లారెన్స్ మరణం తర్వాత ఆయనపై  రచనలు చాలా ప్రచురణ పొందాయి .ఆయనపై జీవిత చరిత్రలు, జ్ఞాపకాలు,ఉత్తర ప్రత్యుత్తరాలు  ,అంచనాలు ,పునర్ మూల్యా౦కనాలు ,సమర్ధనలు ,నిజ నిర్ధారణలు విరివిగా వెల్లువగా వెలువడ్డాయి .తమాషా ఏమిటంటే లారెన్స్ తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ పుస్తకం రాయటం .లారెన్స్ పై తుది నివేదిక రావాల్సిఉంది .సాహిత్యం లో ఆయన స్థానం ఏమిటో ద్రువీకరించాల్సి ఉంది .’’no one of his generation pursued the cry of sex so passionately  and so painfully ‘’అన్నది నిర్వివాదం .ఆయన ముట్టుకున్నది అంతా పోరాటం ,చావు ,పునరుద్ధానం గా పరిణమించింది .బూర్జువా విక్టోరియన్ నీతి ప్రభావాన్ని కోల్పెయే సమయం లో మెధలిస్టు లు పునర్వికాసాన్ని బోధించినట్లు లారెన్స్ యవ్వన గీత ను బోధించాడు .పవిత్ర బోధకుడు పాపకూపం లోకి జారి పోతున్నప్పుడు ఉత్తేజ  ఉత్సాహాలు కలిగించే మత బోధకుడిలాగా   ‘’పొంగే రక్తపు కనుగప్పు కళ ‘’(ది హాట్ బ్లడ్స్బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ )ను లారెన్స్  అమోఘ వాక్చాతుర్యం తో ప్రబోధించి ఎరుక పరచాడు’’అన్నాడు రచయితా లూయీ అంటర్ మేయర్ .

    If I had my way, I would build a lethal chamber as big as the Crystal Palace, with a military band playing softly, and a Cinematograph working brightly; then I’d go out in the back streets and main streets and bring them in, all the sick, the halt, and the maimed; I would lead them gently, and they would smile me a weary thanks; and the band would softly bubble out the “Hallelujah Chorus”.[16]

అని కలలు కంటూ లారెన్స్ స్నేహితుడికి జాబు రాశాడు .

In the deep, strange-scented shade of the great dark carob tree
I came down the steps with my pitcher
And must wait, must stand and wait, for there he was at the trough before me.
(From “Snake”)

  అన్నది ఆయన ప్రసిద్ధ ‘’ది స్నేక్ ‘’కవితలో ఒక భాగం .గ్రిగేరియన్ పీరియడ్ తర్వాత వచ్చిన లారెన్స్ రచనలను ఆధునిక రచనలని అన్నారు

O the stale old dogs who pretend to guard
the morals of the masses,
how smelly they make the great back-yard
wetting after everyone that passes.
(From “The Young and Their Moral Guardians”)

లారెన్స్ ప్రతి రచనలో అంతర్ ద్రుష్టి ఉంటుంది .వాల్ట్ విట్మన్ మెల్ విల్లి ,ఎడ్గార్  అల్లెన్ పో చాయాలలో రాసినా తనదైన విస్పష్ట స్వరం తో లారెన్స్ నినదించాడు .ఆయనపై సినిమాలు వచ్చాయి ఆయన నవలలను సినిమాలుగా తీశారు .12 నవలలు ,10 చిన్న కదల సంపుటాలు ,పది ఉత్తర ప్రత్యుత్తర సంకలనాలు ,16 కవితా సంపుటులు ,పది నాటకాలు ,12 నాన్ ఫిక్షన్ రచనలు ,నాలుగు యాత్రా సాహిత్యాలు ,ఆరు అనువాద రచనలు ,ఆరు వ్రాత ప్రతులు కాక  లారెన్స్ ఖాతాలో మూడు పెయింటింగ్స్ కూడా ఉన్నాయి .లారెన్స్ పేరులోనే ఏదో గొప్ప ఆకర్షణ ఉంది .పుస్తకం చదవటం మొదలు పెడితే పూర్తీ అయ్యేదాకా మరో దానిపై యావ ఉండక పోవటం. ఆయన రచనా ప్రభావం అనంతం అద్వితీయం అమోఘం  .

Inline image 1 Inline image 2     Inline image 3   Inline image 4 Inline image 5Inline image 6Inline image 7

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-16 –ఉయ్యూరు  .

 

 

‘’

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -206

’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –206

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -4

అమెరికా ఆగ్నేయ భాగం లో ,మెక్సికో లో లారెన్స్ తనకు తాను నాయకుడు ,మత ప్రవక్త గా ప్రవర్తించాడు .సృజన శీలఆలోచనా పరులను ,ఆర్టిస్ట్ లను ,వర్కర్లను ఒక చోట చేర్చే ప్రయత్నం చేశాడు .భారతీయుడులాగా అవినీతి ఆశ్రిత పక్షపాతం ,నిరాశా లేని ప్రపంచాన్ని కలగన్నాడు .ఇక్కడే రూసో భావమైన ‘’బ్లడ్ స్ట్రీం కాన్షస్ నెస్ ‘’ను సమర్ధిస్తూ ఇరవై వ శతాబ్ది యాంత్రిక జీవితాన్ని నిరసించాడు .డార్క్ గాడ్స్  ‘’’’లాస్ట్ మాజిక్ ‘’లలో చిక్కుకొన్నా తన ప్రతిభ వ్యక్తమయే ‘’ది ప్లూమేడ్ సర్పెంట్ ‘’,’’మార్నింగ్ ఇన్ మెక్సికో ‘’నవలలు రాశాడు .వీటిలో ఆయనకున్న సూర్యారాధన ,మాయలు ,మంత్రాలు ,ప్రక్కృతి ఆరాధన అన్నీ చెప్పాడు . ప్రజాస్వామ్య వ్యతిరేకత ,అధికార కాంక్ష ,అరిస్టాక్రటిక్ మేధావులతో కలయిక ,అన్నీ ఆయన్ను ఫాసిస్ట్ అనుకూలుడు అని అనిపించాయి .

  క్రమంగా రచనలో స్పష్టత ,హృదయం లోకి సూటిగా దూసుకు పోయే లక్షణం పెరిగింది .జీవితం లో చివరి ఎనిమిదేళ్ళ రచనలు మహా అతి అయ్యాయి .ఇండియన్ ,కీటకం ,సూర్యాస్తమయం ,ఆవు లలో ఆయన దేన్నీ తీసుకొన్నా అదొక క్రియాశీల చిహ్నమై పోయి,ఆయన ప్రాణావశ్యక బాధ్యతా అయింది .’’మామూలు వస్తువులలో ఉన్న నిగూఢ అంతరార్ధాన్ని విడమర్చి చెప్పే నేర్పు లారెన్స్ సాధించాడు ,.తాత్కాలిక భావోద్రేకాల ప్రాముఖ్యతనూ  గుర్తించి వాటికి తీవ్రమైన ప్రాముఖ్యముందని వివరించాడు .ఆయన్ను విమర్శించేవారికి చేతి నిండా పనే ఉన్నా ఆయనమాత్రం సృజన రచయితలకు దివ్యానుభావాన్ని అందజేశాడు .చాల జటిలమైన విషయాలను రాయటం మొదలు పెట్టాడు ‘’రచనలో సంగీతం ప్రవహిస్తుంది .చిత్రం గీసి చూపిస్తున్నట్లు రాస్తాడు .చలనం లో లయ సృష్టిస్తాడు .రంగులు ఉపయోగించకుండానే చీకటి వెలుగులు సృష్టిస్తాడు .నాట్య విలాసం ఉంటుంది .పదాలను విడగోట్టుతూ ,తేలిపొయేట్లు చస్తాడు .ఒక్కోసారి అర్ధంకంటే శబ్దమాదుర్యానికే ప్రాణం పోస్తాడు .ఇలా చేయటానికి ఎంతో గుండె ధైర్యం కావాలి .ఉంది కనుకనే రాశాడు .ఒక్కో సారి విఫలుడు అవుతాడు .లారెన్స్ రచన  గోడలో పగులు లాగా ఉండి కొత్త ప్రపంచాన్నిదర్శింప జేస్తుంది ‘’అని చాలా గొప్పగా  మహోత్క్రుస్టంగా ఎనైస్ నిన్ అనే విశ్లేషకుడు ‘’లారెన్స్ యాన్ యాన్ ప్రొఫెషనల్ స్టడి ‘’‘లో రాశాడు .

   ఈ చంచల ప్రపంచం లో లారెన్స్ ఒక ముఖ్య ఆవాసాన్ని ,భార్య ఫ్రీడా యొక్క అత్యంత విశ్వాసాన్నిపొందటం మూలంగానే  ఇంత గొప్ప రచనలు చేయగలిగాడు .ఒక్కో సారి భార్య ఫ్రీడా కూడా శాంతినివ్వలేక పోయేది .పోట్లాటల మాటల యుద్ధాలు శారీరక హింస ,పరస్పర ఆరోపణలు  ఉన్నా మళ్ళీ కలిసిపోయేవారు . లారెంస్ వలన పిల్లలు కావాలని భార్య ఫ్రీడా కోరుకొనేది .లారెన్స్ కు అదంటే ఇష్టం లేదుపైగా ఆమాట అంటే విపరీతమైన కోపం వచ్చేది . .ఆమే అర్ధం చేసుకొని  రాజీ పడి సర్దుకొని భర్తనే పిల్లాడిలాగా చూసుకొ౦టూఅతని సృజనను ప్రోత్సహిస్తూ ఓదారుస్తూ ఉండేది .సాంఘిక స్థితిలో,శిక్షణలో ,స్వాభావంలో  ఇద్దరివీ  వేరు వేరు తరగతులే  .కాని అరిస్టో క్రాట్ కు కూతురైన ఆమె ,పరిస్తితులను అవగాహన చేసుకొని ఆతనికి సహచరి అయి ,నేలతల్లి లాంటి సహనాన్ని అలవరచుకొని ద్రుఢంగా,అత్యంత సాధారణ మహిళగా మెలగింది .ఆమె పై ఆధారపడి బతకటానికి భర్త లారెన్స్ కస్టపడి పోరాటం చేశాడు .స్త్రీల వలననే లారెన్స్ సాహిత్య ప్రేరణ పొందాడు .వారితోకలిసి పనిచేశాడు .సన్స్ అన్డ్ లవర్స్ నవలలో చాలా భాగం లారెన్స్ స్వీట్ హార్ట్ జెస్సీ చే౦బర్స్ కధలోని ఓడిపోయిన హీరోయిన్  రాసింది .రెండో నవల ‘’ట్రేస్ పాసర్స్ ‘’ను తనతో పనిచేసిన  ఇరవైల  వయసులో దగ్గరకు చేరిన హెలెన్ కోర్క్అనే టీచర్   రాసిన రాత ప్రతి నాధారంగా రాసిందే .ఆస్ట్రెలియన్ కద’’ది బాయ్ ఇన్ దిబుష్ ‘’అనేది స్కిన్నర్ రాసిన .’’ది హౌస్ ఆఫ్ ఎల్లిస్ ‘’కు, మారు రూపం .అలాగే కేధరిన్ కార్స్ వెల్ ,మేబెల్ డాడ్జ్  లుహాన్ అనే స్త్రీల జీవితాలనాదారమైన కదలనే రాశాడు .ఇతర స్త్రీలు లారెన్స్ ను తమ వాడిని చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారుకాని భార్య ఫ్రీడా ,వాళ్ళ నీడా పీడా పడ కుండా ఆయనకు కావాల్సిన మహిళగా రుజువు చేసుకొన్నది .

   40 వ పుట్టిన రోజు తర్వాత 1925 లో లారెన్స్ తిరిగి వచ్చే ఆశతో   అమెరికా వెళ్ళాడు .కాని ఆ ఆశ నిరాశే అయింది .సూర్య నమస్కారాలు సముద్ర స్నానాలపై  ఉన్న ఆరాటం అనేక ప్రదేశాలను తిప్పించింది .స్విట్జర్లాండ్ లోని ఫ్లారెన్స్ కు సమీపం లో జెనోవా దగ్గరకు చేరాడు .అక్కడినుంచి ఆస్ట్రియా ,జెర్మని ,బాలరిక్ ఐలాండ్స్ తిరిగి చివరికి ఫ్రాన్స్ వచ్చి ఇక్కడే ఉండిపోయాడు .ఇక్కడే చిరస్మరణీయ వచన రచనలను ,అత్యుత్తమమైన ,ఆయన కోపోద్రిక్తమైన కవితలను రాశాడు .లారెన్స్ కున్న శారీరక ,మానసిక నిరోధాలను (ఇన్హిబిషన్స్)అత్యున్నత స్థితిలో ‘’లేడీ చాటర్లీన్స్ లవర్ ‘’నవలలో ఆవిష్కరించాడు .ఇందులో సెక్స్ పై  కోరిక ,పవిత్ర ప్రేమ ల పై ద్వంద్వాలపై తెగించిన ఆరాటం ఉంటుంది . సమకాలీన సాహిత్యం లో దీనిపై వచ్చినంత వ్యతిరేకత దేనికీ రాలేదు .పశు ప్రేమతో కొన్ని అధ్యాయాలున్నా అందులో లోతైన సానుభూతి ఉంటుంది .అసలు దీనికి మొదట్లో లారెన్స్ పెట్టాలనుకొన్న పేరు ‘’టెండర్ నెస్ ‘’.ఈ పుస్తకాన్ని అశ్లీలం అని  సెన్సార్ చేశారు,నిషేధించారు’.కాని లారెన్స్ దీన్నిఆధునిక యుగం లోని  ముతక వికారం ,మానసిక బౌద్ధిక వంధ్యత్వాలు ,త్వరపరచే లింగ ఇంద్రియ జ్ఞానం ల  మధ్య సమతూకం తో రాశానని చెప్పుకొన్నాడు .అసలైన సౌందర్యం ,అసలైన మంచితనం మూలాలఅన్వేషణ అందులో ఉందన్నాడు .’’Lawrence laid sex and those basic words for it on the salver of his art and held them up before creation and prayed that both might be transmuted to the highest that man could use ‘’.

Inline image 1Inline image 2

 

   సశేషం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -205 77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –205

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -3

         మొదటి ప్రపంచ యుద్ధం లారెన్స్ జీవితం లో కొత్త చిక్కులు తెచ్చింది .మనిషి దీర్ఘ జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటే క్రమ ప్రకారం జరుగుతున్నసమూహ హత్యలు ఆయనను కలవర పర్చాయి .ఈపరిణామం మానవత మరణి౦చటానికే దారి తీస్తుందని హెచ్చరించాడు .భార్యతోకలిసి ఇంగ్లాండ్ దక్షిణ తీరం చిన్నదైన కార్న్ వాల్ టౌన్ ఆఫ్ జేన్నార్ స్వర్గ సౌఖ్య మిస్తుందని వెళ్ళాడు .అక్కడ యుద్ధ బాధిత పీడితజనం కోసం ఒక ఊహా స్వర్గం (యుటోపియ )నిర్మించే ఆలోచన చేశాడు .దీనికి పరితపించి చేయలేకపోయారు ఆ నాడు కాల్ రిడ్జ్ ,సూదీలకవులు .ఈసమయం లో లారెన్స్ చిన్న గడ్డాన్నిగుబురు వెంట్రుకలతో కప్పి పుచ్చాడు ,అది ఎర్రగా మరీ వికృతంగా కనిపించింది .దీన్నే ఒక స్నేహితుడు ‘’రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ ‘’అని పరిహసించాడు .ఇతర మనుషులలాగా పని చేసే వీలు దీని వలన కలుగుతుందని అర్ధం .ఆ ఊళ్ళో స్నేహితులెవరూ లేరు .ఒక వేళ స్నేహం చేద్దామని ఉన్నా గడ్డం ఆయన వంట చేస్తాడు ఇల్లూడుస్తాడు అంట్లు తోముతాడు అని తెలుసుకొని ఏదో గూఢ చారి మనిషేమోనని అనుమానించారు .యుద్ధ సమయమవటం ,భార్య జర్మన్ అవటం అనుమాలకు బలమైనది .ఆమె సోదరుడు మాన్ఫ్రేడ్ వాన్ రిచ్ తోఫెన్ జర్మనీలో ప్రసిద్ధ  పైలట్ కూడా .ఇవన్నీ లారెన్స్ లను   గూఢ చారులు అనటానికి బాగా తోడ్పడ్డాయి.ముందుగా లైట్లు తీసేయించారు. తర్వాత  ఇల్లు సోదా చేయించారు .చివరికి ఊరి లోని గేట్టి౦ చేశారు .భార్యకు విచారంకలిగితే భర్తకు పిచ్చ కోపం వచ్చింది .

      తరువాత రెండేళ్ళు వాళ్ళిద్దరూ ఒక ఇంటి నుంచి మరో ఇంటికి గెంటి  వేయబడుతూ చివరికి లండన్ చేరారు .అక్కడ కూడా బెర్క్ షైర్ ,డేర్బి షైర్ ,మిడ్లాండ్ హిల్స్ కు  మారారు  .యుద్ధ సమాప్తి కాగానే 1919 లో కాంటినేంట్ కు వెళ్ళారు .రచనపై రచన ఉత్పత్తి చేస్తున్నా నిత్య దరిద్రం వెంటాడుతోంది .అతని పుస్తకాలు అచ్చువేయటం రిస్క్ అనుకొన్నారు పబ్లిషర్లు .శారీరక బలం లేకపోయినా మానసిక ధైర్యం తో రాస్తూనే ఉన్నాడు .35 వ ఏట ‘’వుమెన్ ఇన్ లవ్ ‘’రాశాడు .దీన్ని రైన్ బో కు సీక్వెల్ అన్నాడు లారెన్స్ .ఇందులో లారెన్స్ హీరో శారీరక శృంగారానికి అతీతమైన ప్రేమ ను గురించి చెప్పాడు .సూటి మనస్తత్వం ఉండటం తో మరో ఆరేళ్ళు దేశ ద్రిమ్మరిగా తిరిగాడు .అస్తిత్వనిరూపణకోసం  ,రక్షణకోసం ఇంగ్లాండ్ ను 19 19 లో వదిలేసి ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాడు .వాస్తవం చెప్పాలంటే పారిపోయాడు .ఒక్కోసారి తననుంచి తానుపారిపోతున్నానేమో అనుకొన్నాడు .తనకు ఎక్కడా చోటు లేదని ఎవరూ ఆహ్వానించి ఆదరించరని తెలుసుకొన్నాడు  .తీరా ఒక చోటికి ఆశగా వెళ్ళినా కొన్ని రోజుల్లోనే అది మంచిది కాదు అనుకొనేవాడు .భ్రమల్లో తేలిపోయాడు .డార్క్ మాజిక్ లో కూరుకు పోయాడు .అల్టిమాతూలేకు వెళ్ళాలనుకోన్నవాడు బేడేన్   బేడేన్  కు ,అబ్రూజి హిల్స్ కు ,కాప్రి ,టావోర్మినా,సార్దీనియా ,ఆస్ట్రియా ,లను తిరిగి అర్ధప్రపంచం చుట్టి సిలోన్ ఆస్ట్రేలియా ,తాహితి, అమెరికాకు చేరాడు . .19 20 లో మేబెల్ దాడ్జ్ లుహాన్ ఆహ్వానం పై టావోస్,న్యు మెక్సికో ,చివరికి ఓల్డ్ మెక్సికో లో అడుగు పెట్టాడు .ఇక్కడ మూడేళ్ళు తీవ్రకల్లోల పరిస్థితులలో గడిపాడు .19 24 లో ప్రయత్నం చేసి ,కొన్ని నెలలలోనే న్యు వరల్డ్ చేరాడు .మెక్సికో సిటి లో ఉండగా 1925 ఫిబ్రవరిలో తీవ్రమైన క్షయ కు గురైనాడు .ఇంకా నలభై ఏళ్ళు రాకపోయినా ఇక బతకను అనుకొన్నాడు 

.Inline image 1Inline image 2

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-16- ఉయ్యూరు

 

‘’

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -204 77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –204

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -2

పంతులు ఉద్యోగం ,రచనల మధ్య నలుగుతున్నప్పుడే లారెన్స్ తల్లి చనిపోయింది .బంధ విముక్తి అయి౦ దనుకోలేదు .ఆమెపై ఆరాధన పెరిగి సుళ్ళు తిరుగుతోంది .ప్రపంచం తనముందు కరిగిపోతోంది అనిపించింది .తర్వాత తానూ కరగిపోయాడు .అన్నీ కోల్పోయాను అనుకొన్నాడు .చావు మిస్టరీ నుండి రక్షించాలి అని ,జీవితంలో వెంటాడే చావు భయం నుండి బయట పడాలని  భావించాడు .తరువాత రెండేళ్లలో ప్రేమింప బడటం కోసం చాలా అమ్మాయిల చుట్టూ తిరిగాడు .ఒకమ్మాయితో ఎంగేజ్మెంట్ దాకా వచ్చాడు కాని తల్లి జ్ఞాపకాలు ఇంకా బలమై పోయాయి .తల్లితో తప్ప అంతటి అనుబంధం వేరే యే అమ్మాయితోనూ అసాధ్యం అనిపించింది .శారీరక జబ్బు తోపాటు సైకో సోమాటిక్ లక్షణాలూపెరిగి వస్తున్న దగ్గు క్షయ లక్షణాలేమో అనుకొన్నాడు  .కొంత భయం, కాస్త విరామం కోసం టీచింగ్ మానేశాడు .కవితల్లో ,సంభాషణలలో దీన్ని వివరిస్తూ ‘’నేను మళ్ళీ బోధనలో ఉండాలని కల వస్తుంది అది దారుణమైన కల అనుకొంటా.’’అని రాశాడు .

   27 వయసులో’’ ఫ్రీడా వాన్ రిచ్ తోఫెన్ వీక్లీ ‘’అనే 32 ఏళ్ళ  జర్మన్ జన్మ కల  ముగ్గురు పిల్లలున్న తన మాజీ ప్రొఫెసర్ కూతురు తో ప్రేమలో పడ్డాడు .ఆమెలో పరిపక్వ మాతృత్వానికి ముగ్ధుడై తన ప్రేమను వ్యక్తం చేశాడు .ఆమె కూడా తల ఊపటం తో ఇద్దరూ జర్మనీ ఆస్ట్రియా ఇటలికి ‘’జంప్ జిలానీ’’ .ఏడాదిన్నర తర్వాత ఆమె విడాకులు పొందాక పెళ్లి చేసుకొన్నారు .ఈ లవ్ స్టోరీ మూడవ కవితా సంపుటి ‘’లవ్ పోయెమ్స్ అండ్ ఎమోరీస్ ‘’లో ను ‘’లుక్ వుయ్ హావ్ కం త్రూ ‘’అనే ఆటోబయాగ్రఫీ లోను దట్టించాడు.చివరికవితలు చాలా విషాద భరితం గా ఉంటాయి .ప్రేమ ద్వారా శాంతి కోసం తపిస్తున్న వాడు లారెన్స్ .28 వ ఏట ఇటాలియన్ లేక్ గార్డా లో ఉండగానే మూడవ నవల పూర్తీ చేశాడు  .అది బాదాకలిత ఆత్మా వేదన .’’శీలవతీ ,అంతస్శుద్ధి ఉన్న స్త్రీ దిగువతరగతిలో ఉంటుంది .ఆమెకు తన జీవితం లో  తృప్తి ఉండదు .మొదట్లో భర్తపై ఆరాధన ,దానిఫలితంగా పిల్లల పుట్టుక ,పిమ్మట వీరిపై మమకారం ,వీళ్ళు పెరిగి ప్రయోజకు లయ్యాక వాళ్ళపై విపరీతమైన ప్రేమ ,ఆలాంటి ప్రేమను కొడుకులు తల్లికి ఇవ్వక పోతే మానసిక క్షోభ ,మాత్రమేకాక ఆమె తమ జీవితాలలో అత్యంత శక్తి వంతు రాలవటం .ప్రేమించినదాన్ని పెళ్ళాడి కొడుకు తల్లికి వ్యతిరేకి అవటం .ఇలా ఒక సుదీర్ఘ సీరియల్ లా ఆమె జీవితం సాగి పోతూ ఉంటుంది అంతం ఉండదు .కొడుకు తన ఆత్మను వదిలి ,అమ్మ చేతుల్ని దులిపెసుకొని దూరమై పోతాడు .చివరికి పిల్లలు అన్నీ పోగొట్టుకొని దిగంబరులౌతారు ‘’ ఈ పుస్తకం పై మంచి రివ్యు ను రాస్తూ ‘’రెండు గొప్పముఖ్య  పాత్రలను అందమైన బంధం తో ముడి వేసే కద.విరామమెరుగని కొడుకు,నాయిక లక్షణాలున్న తల్లి ఇందులో ముఖ్యపాత్రలు .సోఫోక్లిస్ మళ్ళీ పుట్టి కొత్త కాలం లో భీభత్స సంఘర్షణ లను మహాద్భుత౦గా కళాత్మకంగా వర్ణించా డేమో ననిపిస్తుంది .

  29 వ ఏట మొదటి కదా సంపుటి ‘’ది ప్రష్యన్ ఆఫీసర్ ‘’ప్రచురించాడు .’’ది రెయన్ బో  ‘’నాలుగవ నవల .ఈ దశలోనే’’ అంతః ప్రేరణ మేధాస్సుకన్నా మిన్న ‘’అనే ఎరుక కలిగింది .’’నా గొప్ప మతం-రక్తం ,మాంసం ,లపై నమ్మకం ,అవి తెలివి తేటలకంటే గొప్పవి అని .బుద్ధి తో మనం తప్పులు చేస్తాం .కానిమన రక్తం అనుభవించేది నమ్మేది ఎప్పుడూ సత్యమైనదే అవుతుంది .లారెన్స్ ఇన్స్టింక్ట్ లు ఆయన మేధస్సుకొంటే గొప్పది కావచ్చుకాని ఆయన నమ్మకాలు మాత్రం ఇబ్బందుల్లో  ప్రజా వ్యతిరేకతలో పడేశాయి ఆయనను .రైన్ బో నవల చట్టవ్యతిరేకమై ,ఇంగ్లాండ్ లోని మూడు ప్రముఖ పత్రికలు లెస్బియనిజం ను ప్రోత్సహిస్తున్నాడని గగ్గోలు పెట్టాయి .పబ్లిషర్  స్క్రిప్ట్ చదవలేదని తప్పించుకొన్నాడు .దీనితో చట్టం తనపని తానూ చేసుకొని పోయి మొదటి ఎడిషన్ వెనక్కి తీసుకొన్నాడు .చదువరులుమాత్రం లారెన్స్ ఊహకు ,మంత్రముగ్ధ రచనకు అబ్బురపడ్డారు .విభేదించిన విమర్శకులుకూడా అది flushed with a moving  animal vitality ‘’అని మెచ్చుకొన్నారు .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-16- ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -203 77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –203

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్

  సమకాలీన సంఘం లో ఇమడలేక ,,స్వయం వేధకు బలైన మేధావి ,ప్రపంచ వ్యాప్త ఒత్తిడులకు  బలహీనత తో  భరించలేని  ఉద్రిక్తలకు లోనైన ఆధునిక ఆంగ్ల నవలా రచయిత డేవిడ్ హెర్బర్ట్ లారెన్స్ . ‘’మనది ముఖ్యంగా విషాద యుగం ‘’ అనే వాక్యం తో ప్రారంభించి’’మనం దాన్ని విషాదంగా తీసుకోవటం లేదు .ఉపద్రవం జరిగిపోయింది .మనం శిధిలాల క్రింద ఉన్నాం. మనం కొత్త చిన్న ఆవాసాలనునిర్మించుకోవాలి ,కొత్త ఆశలు నింపుకోవాలి .అది కష్టమైన పనే .భవిష్యత్తుకు దారి సున్నితంగా ఉండదు  అయినా అడ్డంకులను చేదించు కొంటూ మనం ముందుకు సాగాలి .ఎన్ని అవా౦త రాలోచ్చినా, మిన్ను విరిగి మీద పడినా మనం బతకాల్సిందే ‘’అని  ‘’లేడీ చాటర్లీస్ లవర్ ‘’నవల రాశాడు .

      లారెన్స్ 11-11-1885 న డేర్బి షైర్ , నాట్టింగ్ హాం షైర్ ల మధ్య ఉన్నబొగ్గు  గనుల పట్టణం ఈస్ట్ వుడ్ లో పుట్టాడు .తండ్రి సంతానం లో ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు .అందులో డేవిడ్ హెర్బర్ట్ అతి చిన్నవాడికంటే పెద్దవాడు .కాంతి హీనమైనఇటుకల  ఇంట్లో,కొండ దిగువ రోడ్డులో ఉండేవాడు .తండ్రి సంతకం కూడా చేయలేని చదువులేని పగటి కూలి ,జీవితమంతా బొగ్గుగని పని చేశాడు . తల్లి సాధారణ మాజీ స్కూల్ టీచర్ .ఆడంబరం ,అసహనం ,పెత్తనం ఉన్న స్త్రీ .భర్త  తాగుబోతు అయినా ఆయన ఊహలకు మేడలు కడదామనుకోనేది .  ఆతను మంచి డాన్సర్ ,చక్కని  స్వరం ఉన్న గాయకుడు ,చతురోక్తులతో నవ్వించే హాస్యగాడు .లారెన్స్ చిన్నప్పటినుంచి బలహీనంగా ఉండేవాడు .చిన్నప్పుడు న్యుమోనియా సోకి మళ్ళీ పెద్దగా కోలుకోలేక పోయాడు .బాల్యం లోవచ్చిన  నరాల బలహీనత ,దగ్గు జీవితాంతం అంటి పెట్టుకొనే ఉన్నాయి .సిగ్గరి .ఆకట్టుకొనే స్వభావం లేని విద్యార్ధి అయినా స్కాలర్షిప్ సాధింఛి నాటింగ్ హాం హైస్కూల్ లో 16 వ ఏట చేరి, పక్కింటి అమ్మాయి జెస్సి చేంబర్స్  తో ప్రేమలో పడ్డాడు. అది రొమాంటిక్ లిటరరీ లవ్ .దీన్నే ఫిక్షన్ గా ‘’సన్స్ అండ్ లవర్స్ ‘’పేరుతొ రాశాడు .తల్లి ప్రభావం  తోప్రేమ అంటే భౌతిక ఆనందం కాదు మానసిక విషయం అని గ్రహించాడు  భోతికత తో దాన్ని దిగజార్చ కూడదని తెలుసుకొన్నాడు .ఈవిషషయాలన్నీ జేస్సితో   చర్చించే వాడు .

   17 వ ఏట చదువుకొంటూ తన ఊళ్ళో  పిల్లలకు చదువు చెప్పాడు . ఆ గనికార్మిక పిల్లలకు నాలుగేళ్ళు బోధించాడు .బాటని,ఫ్రెంచ్ లను చదివి నేర్చాడు .ఫ్రెంచ్ భాషను ప్రొఫెసర్ ఎర్నెస్ట్ వీక్లీ దగ్గర చదివాడు .23 ఏళ్ళకు   దక్షిణ లండన్ లోని క్రియోడన్ లో ఉన్న డేవిడ్సన్ రోడ్ స్కూల్ లో పైక్లాస్ పిల్లలకు చదువు చెప్పాడు  . ఇక్కడసాహిత్యం బోధించటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు  .కాని సున్నితమైన పూల చిత్రాలు బహు అందంగా గీసేవాడు .పెద్దమనిషి అయినానని చెప్పుకోవటానికి కని సన్నని మీసం పెంఛి బాలుడిని కాదు అని రుజువు చేసుకొన్నాడు  .జుట్టులేని చెంపలు ,బలహీనమైన గడ్డం  ములక్కాడల్లా  వేలాడే చేతులు , మాట్లాడేకొద్దీకీచుమనే మృదు స్వరం అప్పటి లారెన్స్ లక్షణాలు .

Inline image 1

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -203 76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్-2(చివరి భాగం

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –203

76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన  అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్-2(చివరి భాగం )

కధలన్నీ ‘’హౌ టు రైట్ షార్ట్ స్టోరీస్  అండ్ రౌండ్ అప్ ‘’పేరుతో వచ్చాయి .క్రిటిక్స్ విశ్లేషణలో చాలా దూరం పోయారు .ఆకాలపు ఉత్పత్తులపై ఏవగింపు చూపాడని ,అమెరిక కేపిటలిజం పై సాదికారిక విమర్శ చేశాడని ,మరణావస్త లో ఉన్న సాంఘిక వ్యవస్థ పై తీవ్ర కధనం  చేశాడని   అన్నిరకాల వ్యాఖ్యానం చేశారు కాని వారు అందులోని కామిక్ ఎలిమెంట్ ను ,యెంత మూసుకుని ఉందామనుకొన్న వారినైనా పళ్ళికిలించేట్లు నవ్వి౦చాడని మర్చిపోయారు .అతని ఆటగాయి తనం రచనలు భావ రహిత వర్ణనలు ,సరిగ్గా తగ్గట్టు ఉండే డైలాగులు సందర్భోచిన శ్లేషలు  ఎవరినైనా ఆకట్టుకొంటాయి .’’కోరా స్పాన్ ఎట్ యే స్పాట్ ‘’క్లేమో యూటి వంటివాటిలో పొసగని సర్రియలిజాన్ని ,’’పబ్లిక్ బూత్ఇన్ యే బాత్ రూమ్ ‘’’’త్రీ అవుట్ సైడర్స్ క్లీన్  గో’’ అక్రాస్  ది స్టేజ్జ్ త్రీ టైమ్స్ ‘’లలో స్టేజ్ దర్శకత్వం పై చతురోక్తులు గుప్పించాడు .మేధావుల కౌగలి౦తలకు,వాళ్ళు ఊహించిన స్థాయిలో ఎదగ లేక పోయానేమోననేభయ పడ్డాడు .స్వీయ చరిత్ర’’ది స్టోరీ ఆఫ్ యే వండర్ మాన్ ‘’లో తనను తాను నిందించు కొన్నాడు   .తాను  చనిపోయాక తన సెక్రెటరి పగ తీర్చుకోనేట్లు ఒక చాప్టర్ దానికి చేర్చాలన్నాడు అందులో ‘’యజమాని వెళ్ళిపోయాడు ,ఆయనకు ఎవరు వారసులు ?బహుశా ఆయన ఇంకా పుట్టి ఉండ డేమో !బహుశా అలాంటి వాడు పుట్టడేమో అసలు .అదే నేరు కోరేది ‘’అంటూ రాయాలట.ఇలాంటి రాతలు ఆయన రోగ లక్షణాలను తెలియ జేస్తుంది అన్నారుజనం .

     ది యాంగ్ విజిటర్స్ కు పేరడిగా ‘’ది యంగ్ ఇమ్మిగ్రంట్స్ ‘’రాశాడు .భయాన్ని తనపై పరిహాసం తోకప్పి పుచ్చుకొన్నాడుఇది క్రమంగా లైంగిక ప్రకోపానికి దారి తీసింది .ఇదేదో అశ్లీలమైన మాటకాదు -దీనర్ధం స్వీయాన్ని  నాశనం చేసుకోవటమే .తానున్న సమాజం పై విమర్శ చేస్తూ తాను అశ్రద్ధ కు గురయ్యాడు .తన సున్నిత మనస్తత్వాన్ని వ్యంగ్యం తో కప్పి పుచ్చుకొన్నాడు. ఆయన పాత్రలు తమను లోకం తిట్టుకొంటారని తెలియదు .

1926 లో ఆయనభారీ ఆరోగ్య శరీరం వ్యాధి గ్రస్తమై దగ్గు  .అలసట ఆయాసాలకు గురైంది .టి బి వచ్చిందని ప్రారంభ దశలోనే ఉందని డాక్టర్లు  కనిపెట్టి చెప్పినా డిప్రేస్ అయ్యాడు .చాలా రోజులు డిప్రెషన్ లోనే ఉండిపోయాడు .జబ్బుకంటే డిప్రెషన్ ఎక్కువ బాధించింది .అర్ధం చేసుకోలేక పోయాడు .అపరాధభావం వెంటాడింది .ఏదో జరిగిందని దాన్ని జరగకుండా జాగ్రత్త పడలేక పోయానని అనుకొన్నాడు .అప్పటికే ప్రసిద్ధ రచయిత అయిపోయాడు .కాని కీర్తి గూర్చి అనుమానించాడు.తనలో తానూ మాట్లాడుకోవటం మొదలు పెట్టాడు .జన౦ మీద  అనుమానం ఎక్కువైంది .

‘’ది పోర్టబుల్ రింగ్ లార్దేనర్ ‘’పుస్తకం లో ముందుమాట రాస్తూ గిల్బర్ట్ సేల్దేస్ ‘’మార్క్ ట్వేన్ టెంపరమేంట్లో సగం ఉన్నవాడు స్విఫ్ట్ అంతటి ఆలోచనా పరుడూ కాదు కాని ,ఈ ఇద్దరిలాగానే ఎవరూ తమవైపు కన్నెత్తి చూడని ఉపేక్షిత జనాన్ని  పలకరించిన వాడు   .ఆప్రజల భాషా ఆలోచనలే ఆయన రచనలలో ప్రతి ఫలించాయి .అందుకే వారు ఆయన్ను ప్రేమించారు .’’అన్నాడు .ఫిక్షన్ రాయటం ఆపేసి ఇంటికే పరిమితమయ్యాడు కాని ‘’నో విజిటర్స్ ‘’,అవుట్ టు లంచ్ ‘’న్యూయార్క్ ‘’లు పత్రికల కాలంస్ లో ప్రత్యక్షమయ్యాయి.ఆయన ప్రాముఖ్యత ఏనాడు తగ్గలేదు కాని ఆయన దాన్ని ఆనందించి అనుభవించలేక పోయాడు .నలభై లలో జబ్బుపడి హస్పిటల్ లో చేరి  రెండేళ్ళు ఉన్నాడు .గదిలో ఉన్న రెడియో కొంత కాలక్షేపానికి ,కొంత సెటైర్ ప్రాక్టీస్ చేసు కొవటానికి ఉపయోగ పడింది . ‘’he turned out some of the best reviews of broadcasting ever produced ‘’కాని పెరిగిపోతున్న డిప్రెషన్ ను ,ఓడిపోవటాన్ని అధిగమించలేక పోయాడు .జాగ్రత్తగా ఉన్నా బాగా అలసిపోయాడు .గుండె ఆగి లాంగ్ ఐలాండ్ లోని ఈస్ట్ హాంప్టన్ స్వగృహం లో 25-9 -1933 న 48 ఏళ్ళకే అందర్ని నవ్వించిన నవ్వుల రేడు రింగ్ లార్డ్ నర్ రివ్వుమని చుక్కల్లో చేరాడు .

    లార్డ్ నర్ కు జీవితాంతం దియేటర్ తో సంబంధం ఉండేది .అతని మూడు అంకాల నాటకం బ్రాడ్వే లో ప్రదర్శింపబడి ,మూడు సార్లు తెరకెక్కింది .ఆయన గొప్ప స్వరకర్త ,గీత రచయిత కూడా .ఆయన రాసిన ‘’జాంజిబార్ ‘’జూన్ మూన్ ‘’లు తను కూర్చిన బాణీలతోనే ప్రదర్శించి ముద్రించారు .బెర్ట్ విలియమ్స్ కు ఒక రికార్డ్ సాంగ్ రాశాడు .ఓల్డ్ క్వార్టర్ కు లిరిక్స్ రాశాడు .స్కాట్  ఫిట్జ రాల్ద్   ,జాజ్ యుగ రచయితలతోను  దోస్తీ మస్తుగా ఉండేది . ఫిట్జ రాల్డ్ చివరినవల ‘’టెండర్ ఈజ్ ది నైట్ ‘’లో విషాద పాత్ర ‘’ఏబ్ నార్త్ ‘’కు మోడల్గా  లార్డ్ నర్ ఉంటాడు .లార్డ్ నర్ ప్రభావం  అత్యంత౦గా ఉన్నవాడు ఎర్నెస్ట్ హెమింగ్ వే .హెమింగ్వే తన హైస్కూల్ న్యూస్ పేపర్ కు ‘’రింగ్ లార్డ్ నర్ ‘’అనే మారు పేరుతో ఆర్టికల్స్ రాసేవాడు ఈ ఇద్దరూ 1928 డిసెంబర్ లో మార్క్ పెర్కిన్స్ చోరవతో కలుసుకొన్నారు కాని స్నేహం పెరగలేదు .జే  డి సాలింజేర్ తన ‘’కాచర్ ఇన్ ది రై ‘’,ఫరానీ అండ్ జూయీ ‘’నవలలో లార్డ్ నర్ ను ఉదాహరించాడు .బ్లాక్ సెక్స్ స్కాండల్ కు సంబంధించిన ‘’ఎయిట్ మెన్ అవుట్ ‘’సినిమాలో రచయితా దర్శకుడు జాన్ స్టీల్స్ లార్డ్ నర్ పాత్ర పోషించాడు .మేనల్లుడుజూనియర్ రింగ్ లార్డ్ నర్  స్క్రీన్ రైటర్ –రెండవ ప్రపంచ యుద్ధం లో అమెరికన్ కాంగ్రెస్ ను ధిక్కరించినందుకు బంధింప బడి ,’’హౌస్ అన్ –అమెరికన్ యాక్టివిటీస్ కమిటి ‘’ముందు సంజాయిషీ చెప్పనందుకు  బ్లాక్ లిస్టు లో పెట్టబడిన వాడు ..అతని స్క్రీన్ ప్లే లకు రెండు సార్లు అకాడెమి అవార్డ్ లభించింది .కనుక లార్డ్ నర్ లందరూ రచనా రింగు రంగం లో సుప్రసిద్దులే ,లార్డ్ లే .రచనా వారసత్వం నిలుపుకొన్న వారే .

Inline image 3Inline image 1Inline image 2

 సశేషం

        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10—7-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -202

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –202

76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన  అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్

స్పోర్టివ్ హ్యూమరిస్ట్ గా జీవితం ప్రారంభించి,అసాంఘిక వ్యంగ్య రచయితగా మారిన అమెరికన్ జర్నలిస్ట్ రింగ్ లార్డేనర్ .మొదట రాసిన కధలన్నీ పూర్తీ వినోదం ఇచ్చినవే. తరువాతి రచనలు క్రూరంగా ,చిత్ర హింసగా ,నిరాశగా ,ఆత్మ న్యూనతగా ఉంటాయి .క్రిటిక్ జర్నలిస్ట్ అయిన విలియం బోలితో అతనిని ‘’ అమెరికా తయారు చేసిన అతి గొప్ప నిజాయితీ గల ఆశావాది ‘’(the greatest and sincerest pessimist America has produced )అన్నాడు .6 -3-1885న అమెరికా మిచిగాన్ రాష్ట్రము నైల్స్ లో పుట్టాడు .అసలు పేరు రింగ్ గోల్డ్ విల్మార్ లార్డేనర్ .పెద్దయ్యాక తానె రింగ్ డబ్ల్యు.లార్డేనర్ గా మార్చుకొన్నాడు ..మధ్యలో ఉన్న డబ్ల్యు ను అందరూ ‘’వర్మ్’’అని అపోహ పడుతారని దాన్నీ తీసేసి మిగిలిన పేరు ఉంచుకొన్నాడు .హైస్కూల్  చదువు అయ్యాక మిచిగన్ యూని వర్సిటి లో చేరి ఫుట్ బాల్ ,డెంటిస్ట్రి చదవాలనుకొన్నాడు .మిచిగన్అంటే మరీ ఇంట్లో నే ఉన్నట్లు ఉంటుందనుకొని చికాగో లో ఆర్మర్ ఇన్ స్టి ట్యూట్ లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ లో  మొదటి సెమిస్టర్ తర్వాత అలంకార శాస్త్రంచదివి బయటికొచ్చాడు నిరలంకారంగా .ర్రైల్ రోడ్ పనుల్లో కొంతకాలం ,సరుకు రవాణా ఏజెంట్ గా   కొద్దికాలం  పనిచేసి ఒక సారి అతి భారీగా ‘’క్రీం చీజ్ ‘’ను తప్పుడు అడ్రస్ కు పంపిస్తే ఉద్యోగం ఊడింది .గాస్ ఆఫీస్ లో బాయ్ లాగా అన్ని పనులు చేస్తూ వారానికి ఆరు డాలర్లు సంపాదించాడు .20 వయసులో ఇతని అన్నకు ఇండియానాలోని సౌత్ బెండ్ లో ‘’టైమ్స్ ‘’లో ఉద్యోగం వస్తే ,దాన్ని ఆతను తిరస్కరిస్తే మనోడు దాన్ని జాక్పాట్ లాఒడిసి పట్టుకొన్నాడు .రెండేళ్ళు అందులో రిపోర్టర్ గా పన్జేసి కోర్టులు ,పోలీస్ స్టేషన్లు ,బాల్ గేమ్స్ ,కొత్త సినిమాల రివ్యూలు ,,వినోద ప్రదర్శనలపై ప్రశంసలు ఒకటేమిటి సకల కళా వల్లభుడుగా అన్నీ రాశాడు .

  22 వయసులో ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అయి మంచి పేరు పొందాడు .చికాగో ట్రిబ్యూన్ లో రాసిన ‘’ఇన్ ది వేక్ ఆఫ్ ది న్యూస్ ‘’అందర్నీ ఆకర్షించి ఒక నమూనా గా నిలిచి పోయింది .ఇరవైలలో చికాగో పిచ్చేర్ జాక్ కీఫే పై పరిహాసం ,సరదా కలిపి రాసిన కధలు ‘’ది సాటర్ డే ఈవెనింగ్ పోస్ట్ ‘’లో వస్తే  పిచ్చ పిచ్చ గా నచ్చి అది ‘’యు నో మి అల్ ‘’గా పుస్తక రూపం పొందిన తర్వాత  మరీ మరీ ఆకర్షణీయమైంది . విరగబడి పగలబడి పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వుకొన్నారు చదివి .పాత్రలను అంత గొప్పగా హాస్యం రంగరించి తయారుచేయటం ఆషామాషీ కాదు –మన ముళ్ళపూడి వెంకట రమణ లాగా అంతే ‘’వీజీ ‘’కాదు .దీనిపై హెన్రి ఎల్.మెంకేన్ స్పందిస్తూ ‘’లార్డ్ నర్ తీర్చి  దిద్దిన తీరు న భూతో గా ఉంది అమెరికా జనం దీన్ని బాగా అర్ధం చేసుకొని విపరీతంగా ఎంజాయ్ చేశారు ‘’అని రాశాడు .

1911 లో ఇంకా రిపోర్టర్ గానే ఉండగా పాతికేళ్ళ వయసులో ఎల్లిస్ ఆబ్బట్ ను  పెళ్లి చేసుకొన్నాడు .ఆరడుగుల అందగాడు ,బలిష్ట మైన శరీరం రెండొందల పౌండ్ల బరువున్నవాడు .తండ్రి కావాలనే ఉబలాటం ఎక్కువ .నలుగురు మగపిల్ల తండ్రి అయ్యాడు .పెద్దకొడుకు జాన్ తండ్రిలాగానే స్పోర్ట్ రైటర్ అయ్యాడు .కామిక్ గాఘాటుగా రాసేవాడు .లార్డ్ నర్ లాగా రాయాలని చాలామంది ప్రయత్నించారుకాని అతని శైలి అందుకోలేక చతికిల పడ్డారు .అది ‘’అననుకరణీయం ‘’అని గ్రహించారు .అతని భాష సామాన్య అమెరికన్ మనిషి మాట్లాడేఇంగ్లీషే .ఆయన రాసే ఇంగ్లీష్ ను  ఆయన పేరు మీద ‘’రింగ్లిష్’’అన్నారు  .’’హల్లిబుల్స్ ట్రావెల్స్ ‘’,ట్రీట్ ఏం రఫ్ ‘’లు కూడా పూర్తిగా హాస్య రస పానీయాలే .అదే ప్రత్యేకతను సంతరించుకోన్నవే .

30 లోకి  అడుగుపెట్టగానే హ్యూమరిస్ట్ స్తైరిస్ట్ గా రూపాంతరం చెందాడు .’’హౌ టు రైట్ షార్ట్ స్టోరీస్ ‘’,’’ది లవ్ నెస్ట్ (ప్రేమగూడు  ) లు పూర్తిగా హాస్యాస్పద సంఘటనలతో ,వింత పరిస్థితు లతో కడుపుబ్బా నవ్వు పుట్టిస్తాయి .ఒక ప్రాంతానికి ,ఒక లెవెల్ కు మాత్రమే సంబందినవి కాకుండా అన్ని చోట్లా అన్ని తరహాల వారినీ ఆకర్షింఛి వినోదం పంచాయి .’’అలీబి ఇకి ‘’కూడా బేస్ బాల్ వజ్రం గురించినదే కాని ఇతి వృత్తం అసంబద్ధంగా ఉంటుంది .ఇందులోని ఫ్రాంక్ ఎర్నేల్ ఒక విదూషకుడు( క్లౌన్)  కాదు  అసలు మనిషే .అనిపిస్తాడు డికెన్స్ పాత్రలలాగా .’హెయిర్ కట్ ‘’ఒక అతి వాగుడు బార్బర్  యొక్క  ఇబ్బంది ,చికాకు పరచే స్వగతం అయినా చిన్న పట్ణంలోని నిజజీవిత జోకర్ అనిపిస్తాడు .లవ్ నెస్ట్  పరోక్ష వివరణ .ఒక రిపోర్టర్ ఒక బిజినెస్ మాగ్నెట్ ను ఇంటర్వ్యు చేయటం .పాఠకుడిని బాధించి ,దిగ్భ్రాంతి చెందించి చివరికి కదిలించి స్థానిక భయాన్ని దిగాజారుడును కళ్ళ ముందు నిలుపుతుంది .పదికధలను 1924  లో పుస్తకంగా తెచ్చాడు .హాస్యం నుంచి సీరియస్నెస్ కు అతని ప్రస్థానం కనిపిస్తుంది .తరువాత తనకు తాను తక్కువ చేసుకొన్నాడు .ఈ పది కధలు కధలు ఎలా రాయాలో తెలియ జేసే మార్గ దర్శకత్వ౦ చేస్తాయి .  .మిస్టరికద ఎలా ప్రచురింప బడిందో అందరికి మిస్టరీ గానే ఉంది .ఈ కధలలోని జీవులు చెడు పద్ధతులు న్నవారు ,అసహ్యం పుట్టించే తెలివి తక్కువ వాళ్ళు ,మధ్య వయసున్న   కౌమారదశవాళ్ళు ,తప్పు చేసి దాక్కొనే నకిలీ వాళ్ళు ,చవకబారువాళ్ళు ,పనికి మాలిన వాళ్ళు .వీళ్ళను చూసి పెద్దగా నవ్వడురచయిత.వాళ్ళపై జాలి ఉంటుంది .అందరూ అన్నిటా శూన్యులే అవటం వింత గొలుపుతుంది .

 Inline image 1Inline image 2

     సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-16 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -202 76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –202

76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన  అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్

స్పోర్టివ్ హ్యూమరిస్ట్ గా జీవితం ప్రారంభించి,అసాంఘిక వ్యంగ్య రచయితగా మారిన అమెరికన్ జర్నలిస్ట్ రింగ్ లార్డేనర్ .మొదట రాసిన కధలన్నీ పూర్తీ వినోదం ఇచ్చినవే. తరువాతి రచనలు క్రూరంగా ,చిత్ర హింసగా ,నిరాశగా ,ఆత్మ న్యూనతగా ఉంటాయి .క్రిటిక్ జర్నలిస్ట్ అయిన విలియం బోలితో అతనిని ‘’ అమెరికా తయారు చేసిన అతి గొప్ప నిజాయితీ గల ఆశావాది ‘’(the greatest and sincerest pessimist America has produced )అన్నాడు .6 -3-1885న అమెరికా మిచిగాన్ రాష్ట్రము నైల్స్ లో పుట్టాడు .అసలు పేరు రింగ్ గోల్డ్ విల్మార్ లార్డేనర్ .పెద్దయ్యాక తానె రింగ్ డబ్ల్యు.లార్డేనర్ గా మార్చుకొన్నాడు ..మధ్యలో ఉన్న డబ్ల్యు ను అందరూ ‘’వర్మ్’’అని అపోహ పడుతారని దాన్నీ తీసేసి మిగిలిన పేరు ఉంచుకొన్నాడు .హైస్కూల్  చదువు అయ్యాక మిచిగన్ యూని వర్సిటి లో చేరి ఫుట్ బాల్ ,డెంటిస్ట్రి చదవాలనుకొన్నాడు .మిచిగన్అంటే మరీ ఇంట్లో నే ఉన్నట్లు ఉంటుందనుకొని చికాగో లో ఆర్మర్ ఇన్ స్టి ట్యూట్ లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ లో  మొదటి సెమిస్టర్ తర్వాత అలంకార శాస్త్రంచదివి బయటికొచ్చాడు నిరలంకారంగా .ర్రైల్ రోడ్ పనుల్లో కొంతకాలం ,సరుకు రవాణా ఏజెంట్ గా   కొద్దికాలం  పనిచేసి ఒక సారి అతి భారీగా ‘’క్రీం చీజ్ ‘’ను తప్పుడు అడ్రస్ కు పంపిస్తే ఉద్యోగం ఊడింది .గాస్ ఆఫీస్ లో బాయ్ లాగా అన్ని పనులు చేస్తూ వారానికి ఆరు డాలర్లు సంపాదించాడు .20 వయసులో ఇతని అన్నకు ఇండియానాలోని సౌత్ బెండ్ లో ‘’టైమ్స్ ‘’లో ఉద్యోగం వస్తే ,దాన్ని ఆతను తిరస్కరిస్తే మనోడు దాన్ని జాక్పాట్ లాఒడిసి పట్టుకొన్నాడు .రెండేళ్ళు అందులో రిపోర్టర్ గా పన్జేసి కోర్టులు ,పోలీస్ స్టేషన్లు ,బాల్ గేమ్స్ ,కొత్త సినిమాల రివ్యూలు ,,వినోద ప్రదర్శనలపై ప్రశంసలు ఒకటేమిటి సకల కళా వల్లభుడుగా అన్నీ రాశాడు .

  22 వయసులో ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అయి మంచి పేరు పొందాడు .చికాగో ట్రిబ్యూన్ లో రాసిన ‘’ఇన్ ది వేక్ ఆఫ్ ది న్యూస్ ‘’అందర్నీ ఆకర్షించి ఒక నమూనా గా నిలిచి పోయింది .ఇరవైలలో చికాగో పిచ్చేర్ జాక్ కీఫే పై పరిహాసం ,సరదా కలిపి రాసిన కధలు ‘’ది సాటర్ డే ఈవెనింగ్ పోస్ట్ ‘’లో వస్తే  పిచ్చ పిచ్చ గా నచ్చి అది ‘’యు నో మి అల్ ‘’గా పుస్తక రూపం పొందిన తర్వాత  మరీ మరీ ఆకర్షణీయమైంది . విరగబడి పగలబడి పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వుకొన్నారు చదివి .పాత్రలను అంత గొప్పగా హాస్యం రంగరించి తయారుచేయటం ఆషామాషీ కాదు –మన ముళ్ళపూడి వెంకట రమణ లాగా అంతే ‘’వీజీ ‘’కాదు .దీనిపై హెన్రి ఎల్.మెంకేన్ స్పందిస్తూ ‘’లార్డ్ నర్ తీర్చి  దిద్దిన తీరు న భూతో గా ఉంది అమెరికా జనం దీన్ని బాగా అర్ధం చేసుకొని విపరీతంగా ఎంజాయ్ చేశారు ‘’అని రాశాడు .

1911 లో ఇంకా రిపోర్టర్ గానే ఉండగా పాతికేళ్ళ వయసులో ఎల్లిస్ ఆబ్బట్ ను  పెళ్లి చేసుకొన్నాడు .ఆరడుగుల అందగాడు ,బలిష్ట మైన శరీరం రెండొందల పౌండ్ల బరువున్నవాడు .తండ్రి కావాలనే ఉబలాటం ఎక్కువ .నలుగురు మగపిల్ల తండ్రి అయ్యాడు .పెద్దకొడుకు జాన్ తండ్రిలాగానే స్పోర్ట్ రైటర్ అయ్యాడు .కామిక్ గాఘాటుగా రాసేవాడు .లార్డ్ నర్ లాగా రాయాలని చాలామంది ప్రయత్నించారుకాని అతని శైలి అందుకోలేక చతికిల పడ్డారు .అది ‘’అననుకరణీయం ‘’అని గ్రహించారు .అతని భాష సామాన్య అమెరికన్ మనిషి మాట్లాడేఇంగ్లీషే .ఆయన రాసే ఇంగ్లీష్ ను  ఆయన పేరు మీద ‘’రింగ్లిష్’’అన్నారు  .’’హల్లిబుల్స్ ట్రావెల్స్ ‘’,ట్రీట్ ఏం రఫ్ ‘’లు కూడా పూర్తిగా హాస్య రస పానీయాలే .అదే ప్రత్యేకతను సంతరించుకోన్నవే .

30 లోకి  అడుగుపెట్టగానే హ్యూమరిస్ట్ స్తైరిస్ట్ గా రూపాంతరం చెందాడు .’’హౌ టు రైట్ షార్ట్ స్టోరీస్ ‘’,’’ది లవ్ నెస్ట్ (ప్రేమగూడు  ) లు పూర్తిగా హాస్యాస్పద సంఘటనలతో ,వింత పరిస్థితు లతో కడుపుబ్బా నవ్వు పుట్టిస్తాయి .ఒక ప్రాంతానికి ,ఒక లెవెల్ కు మాత్రమే సంబందినవి కాకుండా అన్ని చోట్లా అన్ని తరహాల వారినీ ఆకర్షింఛి వినోదం పంచాయి .’’అలీబి ఇకి ‘’కూడా బేస్ బాల్ వజ్రం గురించినదే కాని ఇతి వృత్తం అసంబద్ధంగా ఉంటుంది .ఇందులోని ఫ్రాంక్ ఎర్నేల్ ఒక విదూషకుడు( క్లౌన్)  కాదు  అసలు మనిషే .అనిపిస్తాడు డికెన్స్ పాత్రలలాగా .’హెయిర్ కట్ ‘’ఒక అతి వాగుడు బార్బర్  యొక్క  ఇబ్బంది ,చికాకు పరచే స్వగతం అయినా చిన్న పట్ణంలోని నిజజీవిత జోకర్ అనిపిస్తాడు .లవ్ నెస్ట్  పరోక్ష వివరణ .ఒక రిపోర్టర్ ఒక బిజినెస్ మాగ్నెట్ ను ఇంటర్వ్యు చేయటం .పాఠకుడిని బాధించి ,దిగ్భ్రాంతి చెందించి చివరికి కదిలించి స్థానిక భయాన్ని దిగాజారుడును కళ్ళ ముందు నిలుపుతుంది .పదికధలను 1924  లో పుస్తకంగా తెచ్చాడు .హాస్యం నుంచి సీరియస్నెస్ కు అతని ప్రస్థానం కనిపిస్తుంది .తరువాత తనకు తాను తక్కువ చేసుకొన్నాడు .ఈ పది కధలు కధలు ఎలా రాయాలో తెలియ జేసే మార్గ దర్శకత్వ౦ చేస్తాయి .  .మిస్టరికద ఎలా ప్రచురింప బడిందో అందరికి మిస్టరీ గానే ఉంది .ఈ కధలలోని జీవులు చెడు పద్ధతులు న్నవారు ,అసహ్యం పుట్టించే తెలివి తక్కువ వాళ్ళు ,మధ్య వయసున్న   కౌమారదశవాళ్ళు ,తప్పు చేసి దాక్కొనే నకిలీ వాళ్ళు ,చవకబారువాళ్ళు ,పనికి మాలిన వాళ్ళు .వీళ్ళను చూసి పెద్దగా నవ్వడురచయిత.వాళ్ళపై జాలి ఉంటుంది .అందరూ అన్నిటా శూన్యులే అవటం వింత గొలుపుతుంది .

 Inline image 1Inline image 2

     సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -201 75- అమెరికాలో మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన -సింక్లైర్ లెవిస్ -2(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –201

75-   అమెరికాలో  మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన    -సింక్లైర్ లెవిస్ -2(చివరిభాగం )

రియలిస్ట్ ,సేటైరిస్ట్ ,విజనరీ అయిన లెవిస్ భౌతికాభి వృద్ధిని నిరసించాడు .’’యారో స్మిత్ ‘’లో డాక్టర్ –సైంటిస్ట్ ను వ్యాపార ధోరణికి అసహ్యించాడు ‘’ఎల్మేర్ గంట్రి లో హైక్లాస్ ప్రీచర్లను ,క్వేకర్లనూ ,దొంగ సన్యాసులను ,మతాన్ని లాభసాటి వ్యాపారం చేసే రివైవలిస్ట్ లను ఉతికి ఆరేశాడు .’’ది మాన్ హు న్యు క్కాల్ రిడ్జ్ ‘’ఓ అంటే నా రాని బిజినెస్ మాగ్నేట్లపై రాసిన పెద్ద కార్టూన్ .ఇందులో ముఖ్యపాత్రధారి లోవెల్ స్మాల్జ్ పెద్దమోసగాడే అయినా పై అధికారుల ప్రతినిధి .ఎందుకూ పనికిరాని డాడ్స్ వర్త్ అందరితో ఆటలాడుకొంటూ  .ముందుకు తోస్తూ శూన్యం లోకి నేట్టేసేవాడు .’’వర్క్ ఆఫ్ ఆర్ట్ ‘’ అమెరికాలో ఆర్టిస్ట్ అంటే విజయాలు సాధించటమేకాక ,హోటల్ నడపటం లోనూ సామర్ధ్యం ఉన్నవాడు అనే నిర్ణయానికి వస్తాం .ఒకసారి తన జాతీయం ఏర్పడ్డాక క్లిష్టమైన ,అసమ్మతిని తీవ్రంగా చేశాడు .ఆతను కారికేచర్ కు ఎక్కువ పాత్రకు తక్కువ అని తీర్మానించారు .సామాన్య భాషలో అసామాన్యంగా రచనలను నిర్మించటం ఆయన ప్రత్యేకత .ఫోటోగ్రాఫర్ కూడా అంత చక్కగా వెలుగు నీడలను ప్రదర్శించలేడు.ఆయన ఒక సందేహాస్పద రిపోర్టర్ .గొప్ప నైపుణ్యం ఉన్నవాడే కాక దక్షుడైన సంస్కర్త .1926 లో ‘’యారోస్మిత్ ‘’కు పులిట్జర్ బహుమతి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించటమేకాకుండా  వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్య చేశాడు .సాహిత్య స్వేచ్చా ప్రియుడుకనుక గౌరవాలు బిరుదులూ చాలా ప్రమాదకరమైనవి అంటాడు .దానివలన ఇలాగే రాయాలని అలా రాయకూడదనే దానికి లోనౌతాడు రచయితా అన్నాడు .నాలుగేళ్ల తర్వాత వచ్చిన నోబెల్ ప్రైజ్ విషయం లో స్పందిస్తూ దాన్ని తీసుకొంటున్నందుకు క్షమించమని కోరాడు .దియోడర్ డ్రీజర్ ,విల్లా కేధర్ ,జేమ్స్ బ్రాంచ్ కాబెల్ లు ఈ బహుమానాని అన్నివిధాలా అర్హులని ,వారు అమెరికన్ వ్యవస్థలను హేళన చేయకుండా సంయమనం పాటించారని అన్నాడు .

  లెవిస్ మరింత నిర్ణయాలకు శస్త్ర చికిత్సలకు  సిద్ధ పడ్డాడు .50 దాటాక అల్ప ,విపరీతమైన ఇతి వృత్తాలను ఎన్నుకొన్నాడు .వారానికొకటి రాసి వదిలాడు .మొదట ‘’ఆన్ వికర్స్ ‘’ ను సామాన్య విషయం తీసుకొని రాసాడు తర్వాత ‘’ఇట్ కన్ నాట్ హాప్పెన్ హియర్ ‘’లోఅమెరికా లో  రాబోయే ఫాసిస్ట్ సామ్రాజ్యాన్ని ఊహించి చెప్పాడు .ఒక సెటైర్  ఫైరీ టేల్ ను తర్వాత స్మగ్గ్లర్ల ,డబ్బు నీతి విషయం లో కష్టం అధికారుల ద్వంద్వ ప్రవృత్తిని ఎండగడుతూ ‘’గిడియాన్ ప్లానిష్ ‘’రాశాడు ..జాతుల సమస్య,నీతి అది అమలవటం లో అపహాస్యం గురించి రాశాడు .వీటన్నిటిని బట్టి ఆయన్ను సంస్కర్త అన్నారు .క్రమంగాకంజర్వేటివ్ అవుతున్నాడు . ‘’లేబర్ నవల ‘’రాయాలనుకొన్నాడు .యూనియన్లను ,వర్కర్లను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాడు .యువత పై మమత ఉన్నా వాళ్ళ తీవ్రవాదాన్ని ఒప్పుకోలేదు .’’ప్రాడిగల్ పేరెంట్స్ ‘’నవల రాసిన 22 నవలలో  నాసిరకమే .అది యువతరం పై తీవ్ర విమర్శే .

రెండవ సారి విడాకుల తర్వాత వెర్మాంట్ కౌంటి వదిలి డోరోతి దాంప్సన్ తో న్యూయార్క్ లో   కలిసిఉంటూ , ,మిన్నెసోటా లోని దూలత్ లో ,మాసాచూసేట్స్లోని విలియంస్ టౌన్ లో విలాసవంతమైన విశాల భవనం లో ఉన్నాడు .పూటుగా తాగిన తర్వాత పిచ్చి ప్రేలాపనలతో ,బెదిరింపులతో స్నేహితులకు దూరమై పోయాడు .అంతులేని సంపద మధ్య చింతతో వంటరి వాడయ్యాడు .దీనికి తోడు జబ్బు చేసింది .బలవంతం మీద మందుమానేసి ప్రత్యామ్నాయంగా స్వీట్లు కాన్డీలు బస్తాలకొద్దీ లాగించేవాడు . తర్వాత వీటికీ స్వస్తి చెప్పాల్సి వచ్చింది .అయినా చదువు ,పరిశోధనా , రచన మానలేదు . 64 లో చారిత్రాత్మక నవల ‘’ది గాడ్ సీకర్ ‘’రాశాడు .అదేమీ గొప్పదని పించలేదు .జబ్బుతో ఉన్నా  మరో గొప్ప నవల’’ వరల్డ్ సో వైడ్ ‘’ రాయాలనే ప్రయత్నం లోనే ఉన్నాడు.ఇటలీ కి వెళ్లి ఊరేగింపులో పాల్గొని న్యుమోనియా తో అకస్మాత్తుగా కుప్ప కూలాడు .తనకు స౦బ౦ధించిన అన్నిటికీ దూరమైన రోమ్ నగరం లో 10-1-19 51న 64వ ఏట లెవిస్ మరణించాడు .

లెవిస్ రచనలలో ఆదర్శవాదం వ్యంగ్యం తో మిళితమై ఉంటుంది .తన దారి ఏదో తెలుసుకాని లెవిస్ కు గమ్యం తెలియదు .ముసలి లెవిస్ యువ లెవిస్ ను వ్యతిరేకిస్తాడు .పరిణత దశలో కూడా తన లక్స్యాలేమిటో ఆయనకు తెలియదు .ఆయన యుటోపియన్ అయినా యుటోపియాస్ లను  చూసి నవ్వు కొంటాడు .ఆయన యాంటి సెంటి మెంటలిస్ట్ .రోటరీక్లబ్బులంటే వెక్కిరింపు .అసాధారణ మనిషి .క్రియాశీలక రాడికలిజం తో గొడవ పడి ,రెబెల్ నుంచి రోటేరియన్ గా మారాడు .లాభసాటి సోషలిజాన్ని ,లాభా పేక్ష లేని కేపిటలిజం తో కలుపుదామని ప్రయత్నించిన సుమనస్కుడు .కళా కవితా దీపకాంతిని వాటిని వ్యతిరేకించే వారిపై ప్రసరింప జేసే ప్రయత్నం చేశాడు .దీనిఫలితం వ్యర్ధ కలల కళాకారులు ,కాసుల బంధం లో చిక్కుకున్న కవులు ఏర్పడ్డారు .ఆయన ఆదర్శాలకు ఆచరణ విదానాలకు చాలా వ్యత్యాసం ఉంది .లెవిస్ సాగా లో ముఖ్యమైనది ‘’బాబ్బిట్ ‘’నవల,అందులో ఆతను దృఢమైన పౌరుడు ,ము౦దే అల్లుకుపోయిన బూర్జువా ,అన్నీ కలిసిన బిగి౦పు న్నవాడు  .వెదర్ ప్రూఫేడ్ మధ్యతరగతి మనిషి .లెవిస్ అతన్ని ప్రేమించటం కంటే ఎక్కువగాద్వేషిం చాడు .బాబ్బిట్ ,ఆయన  సృస్టికర్త లెవిస్ లు స్వయం క్షోభకులుఅయినా స్వీయ సాధన ఉన్న స్వయం రక్షకులైన ‘’సయామీస్ ట్విన్స్ .‘’ఇద్దరినీ విడదీసి వేరు చేయలేము. .

అమెరికన్ దేశభాష ను ,విధానాలను మొదటిసారిగా అతి ఖచ్చితంగా రికార్డ్ చేసినవాడు లెవిస్ .ఇంగ్లీష్ నవలా కారుడు యి. ఏం. ఫార్ స్టర్ ‘’lodges a piece of continent in the world’s imagination ‘’ అని చాలా చక్కగా చెప్పాడు .పిక్విక్ ,డాన్ క్విక్సోట్,సీగ్ ఫ్రీడ్.రాస్కలోనికోవ్ సిరానో లాగా లెవిస్ పాత్రలు ,  ఆయన దేశమైన అమెరికా  ప్రతినిధులు .సింక్లైర్ లెవిస్ పుస్తకం లో జార్జ .ఎఫ్ .బాబ్బిట్ పుట్టే దాకా ,అమెరికాఫిక్షన్ లో మార్క్ ట్వేన్ గారి టాం సాయర్ తర్వాత ఇలాంటి పాత్ర రానేలేదు .అంతర్జాతీయంగా ఒక గుర్తింపు పొందిన సిటిజన్ గా ఆపాత్ర నిలిచిపోయింది .    1940  లలో అమెరిలాలో లెక్చర్ టూర్ చేస్తూ ‘’ఆధునిక యువతీ మంచిగా ఉందా ‘?పల్లా? పట్నమా?యాంత్రికత నాగరికతకు చేటా?మొదలైన సమస్యలపై కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షం లో మాట్లాడాడు ’.-19 43 లో హాలి వుడ్ లో ఒక సినిమాకు డోరే  స్కారి తో  కలిసి పనిచేయటానికి వెళ్ళాడు .సినిమాపేరు ‘’స్టారం ఇన్ ది వెస్ట్ ‘’రెండవ ప్రపంచ యుద్ధానికి అన్యార్ధమైన కధ.పూర్తికా రాజకేయం కనుక అది ముందుకు సాగలేదు .ఆయనవి 22 నవలలు ,7 భాగాలలుగా చిన్న కధలు ,నాలుగు నాటకాలు ,సుమారు పది  వ్యాసాలూ నాలుగు కవితా సంకలనాలు  రాశాడు .

Inline image 1Inline image 2Inline image 3

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-7-16- ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -200 75- అమెరికాలో మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన -సింక్లైర్ లెవిస్

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –200

75-   అమెరికాలో  మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన    -సింక్లైర్ లెవిస్

అమెరికాలో సాహిత్యం లో మొదటి సారి నోబుల్ పురస్కృతి  సింక్లైర్ లెవిస్ కు  దక్కింది అంటే అది పారడాక్స్ అన్నారు .కారణం ఆయన రాసినవి  స్థానిక విషయాలకు సంబంధించిన చౌకబారు పుస్తకాలు .అవి స్థానిక సాంఘిక ప్రమాణాలకు మాత్రమే సరిపోయేవి .అమెరికా బిజినెస్ మనస్తత్వానికి కాపట్యానికి వ్యతిరేకి .7-2-1885 న అమెరికా మిన్నేసోటలోని సౌక్ సెంటర్ లో పుట్టాడు .తాను పుట్టింది   సెంట్రల్ వెస్ట్ లోని సంస్కృతికి విరుద్ధమైన ,కిక్కిరిసిన ఇళ్ళతో నైతికంగా దిగజారిన గోఫర్ ప్రయరి లో అని చెప్పుకొన్నాడు .తండ్రి గ్రామీణ వైద్యుడు .తండ్రి పై అభిమానాన్ని నవలలో చెప్పుకొన్నాడు .అటు పల్లెకాక ,ఇటు పట్నామూకాని ఊరు అది .చిన్నప్పటినుండి తూర్పుగాలి పై ధ్యాస ఉండేది .లోకల్ స్కూళ్ళలో చదివి ఏల్స్ వెళ్లి ,ఒక సాహిత్య పత్రికకు సంపాదకుడై 1908 లో గ్రాడ్యుయేట్ అయ్యాడు ‘వికృతంగా పొడుగ్గా ఎముకలపోగుగా ,ఉబ్బిన కనుబొమలతో  గట్టి నుదురు తో ‘’యవ్వనం లో కనిపించేవాడు .అండర్ గ్రాడ్యుయేట్ గా ఉండగానే కాల్పనిక శృంగారం ను కవిత్వం వచనం కలగలిపి కధలు రాశాడు .మొదటి రచనలన్నీవిపరీతమైన ఎమోషన్ తో నైపుణ్యంగా రాసిన  వచనాలే .45వ ఏట ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకొని అప్పటిదాకా రాసింది వ్యర్ధమేనని భావించి అసలైన జీవిత చిత్రణ చేయాలనుకొని మిన్నెసోటా ప్రయరి గ్రామాల నేపధ్యం తో రాశాడు .

           అప్టాన్ సింక్లైర్ స్థాపించి ఏంగిల్ వుడ్ లోని కొ ఆపరేటివ్ కాలని గురించి తెలిసి సోషలిజం దెబ్బతినటానికి కారణాలను అన్వేషించాడు .న్యు జేర్సిలో హేల్పర్లు అవసరం అని గ్రహించి తానే స్వయంగా కాపలాదారుగా ,లాండ్రి మాన్ గా సేవలు అందించాడు .తాను  అసంతృప్తితో పేరుపెట్టిన హేలికాన్ హాల్ దగ్ధమైతే ,నిరాశ చెందినా ధైర్యంగా నిలబడ్డాడు .పనామా కు చేరి ,ఆ విస్తృత కాలువ త్రవ్వకం పనుల్లో పై ఉద్యోగం రాక ,కాలి ఫోర్నియా చేరుకొన్నాడు .డబ్బుల్లేక అప్పులతో ఏడాదిన్నర గడిపాడు .చిన్నకధలు రాసి పత్రికలకు పంపిస్తే అంతే వేగంగా తిరిగొచ్చేవి ..మళ్ళీ తూర్పు పై గాలి మళ్ళి,ఇయోవాలో రిపోర్టర్ గా చేరి ,వాషింగ్టన్ డి సి లో జూనియర్ అసిస్టంట్ గా పనిచేసి ,25 ఏళ్ళ వయసులో న్యు యార్క్ లో ఒక పబ్లిషింగ్ హౌస్ లో వారానికి 15 డాలర్ల కు చెవిటి వారికి ప్రత్యేకమైన మేగజైన్ లో సబ్ ఎడిటర్ గా పని చేశాడు .’’లేబర్ మార్కెట్ లో ఇదే నా అసలైన విలువ ‘’అని జోక్ చేస్తూ  19 30  లో నోబెల్ ఫౌండేషన్ లో ఆటో బయాగ్రఫి రాస్తూ చెప్పుకొన్నాడు .ఇదీ ఆయనకేమీ నచ్చలేదు .తానూ ఏదైనా గొప్ప సాహిత్యం రాసిఉంటేకళ్ళకద్దుకొని పెద్ద జీతం ఇచ్చేవారు అనుకొన్నాడు .తరువాత అయిదేళ్ళు ఆఫీస్ బాయ్ గాఒక పబ్లిషర్ వద్ద ,రాతప్రతి సరి చేసే వాడుగా ,’’అడ్వెంచర్ ‘’పత్రికకు అసిస్టంట్ ఎడిటర్ గా ,యాడ్ రైటర్ గ ,కేటలాగర్ గా ,బుక్ రివ్యూయేర్ గా పనిచేసి పొట్ట గడుపుకొన్నాడు .మొదటి పుస్తకం ‘’హైక్ అండ్ ది ఏరోప్లేన్ ‘’అనే ఒక కుర్రాడి కద 25 వ ఏట రాసి’’టాం గ్రాహం ‘’అనే మారు పేరుతో  ప్రచురించాడు  .

  29 వ ఏట గ్రేస్ హేగ్గర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ,11 ఏళ్ళ తర్వాత విడాకులిచ్చాడు .19 28 లో జర్నలిస్ట్ ,కాలమిస్ట్ దోరోతి థామ్సన్ ను పెళ్ళాడాడు .14 ఏళ్ళ కాపురం తర్వాత విడాకులు .మొదటి భార్యకు పుట్టిన కొడుకు కు ‘’వెల్స్’’అని తన అభిమాన రచయిత హెచ్ జి వెల్స్ పేరు  పెట్టుకొన్నాడు .యితడు రెండవ ప్రపంచయుద్ధం లో చనిపోయాడు .వెల్స్ ప్రభావం మొదటినవలలపై బాగా ఉంది .’’ది ట్రయల్ ఆఫ్ ది హాక్ ‘’నవల మిడ్వెస్ట్ లోని ఒక కార్పెంటర్ కొడుకు ప్రాంతీయ సాంప్రదాయాలనుండి విముక్తుడై ,నిరంతర సంచారిగా చివరికి కొత్త నావికా ప్రపంచం లో అడుగు పెట్టటం కధ.బిజినెస్ వృత్తిలోని స్త్రీ పోరాటాలను ‘’ది జాబ్ ‘’లో ,మధ్యవయసుసాహసం మధ్యతరగతి ప్రేమ మందహాసం ‘’ది ఇన్నోసెంట్ ‘’లో ,తూర్పు సమాజపు పిల్ల .మధ్య ప్రాచ్య మెకానిక్ ల మధ్య ప్రేమాయణం విభేదాలు ,స్స్వేచ్చ కోసం తపన ‘’ఫ్రీ ఎయిర్ ‘’లో రాశాడు .ఇవన్నీ 30 ఏళ్ళ లోపే  రాశాడు .35 వయేట ఈ విధానానికి గుడ్ బై చెప్పి రాజీలేని నిజాయితీ ,జంకని వాస్తవికత లతో రచన చేశాడు .ఇప్పటిదాకా సంతోష పెట్టటానికే రాశాడు .ఇప్పడు నిజం చెప్పటానికి ,ఆ నిజం యెంత ఘాటుగా ఉన్నా జనం చదవక పోయినా ఫరవాలేదన్న భావం తో రాశాడు .ఈ ధోరణిలో ‘’మెయిన్ స్ట్రీట్ ;’’రాశాడు .ఇదొక బాంబు ప్రేలుడు లాగా జనానికి షాక్ ఇచ్చింది .స్థానిక సరిహద్దులు దాటి విస్తృత పరిధిలో రాసిన రచన ఇది .కనుక వివాదాస్పదమై  ,ఒక మిలియన్ కాపీలు అమ్ముడై సంచనం సృష్టించి ,అన్ని యూరోపియన్ ఆసియా భాషలలోకి అనువాదం పొంది అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు .ఆయనలోని తిరుగుబాటు మనస్తత్వానికి ,సంకుచితత్వ౦పై పోరాటానికి  డాలర్ ప్రభావంతో క్రూసిఫిక్స్ అయిన పల్లెటూరుజనం పై సానుభూతికి నిదర్శనం .అమెరికన్ మార్మిక కధలన్నీ అమెరికా గ్రామాలు మహోన్నతమైనవని సంతోష భరితమైనవని తెలియ జేస్తుంటే ఈ అమెరికన్ రచయిత లెవిస్ దాన్నంతటిని పుక్కిటి పురాణం –మిత్ అని చెప్పటం వివాదాస్పదమైంది .’’hundreds and thousands  read the book with the same masochistic pleasure that one has  sucking an aching tooth ‘’లక్షలాది జనం ఈ పుస్తకాన్నిబాధా సర్ప దస్ట ఆనందం తో  పంటి నొప్పితో బాధ పడుతూ చప్పరిస్తున్నట్లుగాచదివి ఆనందించారు అని అర్ధం .

 మొదట్లో ,ఆ తర్వాత రాసిన నవలమధ్యలో దాదాపు 200కధలు రాస్తూ ప్రచురించి అమ్మాడు .ఇందులో కొన్ని సెలెక్ట్ చేసి ‘’సేలేక్తేడ్ షార్ట్ స్టోరీస్ ;;గా 1935 లో 50 వ ఏట ముద్రించాడు . ఇందులో ఆయనకే నచ్చనికధలు కొన్ని ఉన్నాయి .ఈలోగా ఆయన బుర్రంతా నవల ప్లాట్ లతో నిండిపోయింది .మెయిన్ స్ట్రీట్ తర్వాత ప్రసిద్ధ నవల ‘’బాబ్బిట్ ‘’ప్రచురించాడు .రెండూ విపరీతమైన క్రేజ్ సృష్టించాయి ఒకదాన్ని మించి ఒకటి .బాబ్బిట్ ఇంగ్లాండ్ లో హాగ్ వాల్పోల్ ము౦దుమాటలతో 200  అమెరికన్ ఎక్స్ప్రెషన్స్ తో  అచ్చయింది .మెయిన్ స్ట్రీట్ చిన్న టౌన్ కు ప్రతినిధి అయితే బాబ్బిట్ పెద్ద సిటికి ప్రాతినిధ్యం పొందింది .ఇందులోనూ మోసాలు ,హిపోక్రసీలు ,జిమ్మిక్కులు ,ధనమేరా అన్నిటికీ మూలం అదే విజయసాధనకు కొలబద్ద అనిపించటం మంచి జీవితానికి  వ్యాపారమే కొలమానమవటం దర్శనమిస్తాయి . వీటిలోని మానవుడికి ‘’the standard advertized wares –toothpastes ,socks ,tires ,cameras ,instantaneous hot water heaters –were his symbols and proofs of excellence –at first the signs then the substitutes for joy and passion and wisdom ‘’అనిపిస్తుందని నిజాలు నిర్భయంగా చెప్పాడు .


సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -198 74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్ నవలా రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -3 (చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -198

74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్  నవలా  రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -3 (చివరి భాగం )

కాఫ్కా పుస్తకాలు నిరాశ గాదామయ ధారావాహికం .గట్టిమనసు ,అన్నిటిని ఎదుర్కొనే  ధైర్యం కావాలని కోరుకున్నాడుకాని పొందలేక పోయాడు .ఆ అదృష్టం తనకు దక్కదని గ్రహించాడు .’’ది ట్రయల్ ‘’నవలలో బాంక్ లో ధనసంబంధ ఉన్నతాధికారి యే నేరం చేయక పోయినా చట్టాన్ని ఉల్లంఘించక పోయినా అరెస్ట్ అవుతాడు .నేరం మోపిన వారినికాని ఎందుకు అరెస్స్ట్ చేశారో ఏనిబంధనలతో చేశారో  కాని తెలియదు .అయిష్టంగానే లాయర్ని కుదుర్చుకొన్నాడు .పైన పడిన అపరాధం తో కుంగి పోయాడు .భయపడిపోయాడు .అటార్నీ రహస్య డాక్యుమెంట్ కోర్ట్ లో దాఖలు చేస్తే కేసు నిరంతరం సాగుతూనే ఉంటుందని సలహా ఇచ్చాడు .తన వెనక ఏదో ముఠావ్యతిరేకంగా పని చేస్తోందనుకొన్నాడు .అలాగే జరిగి కత్తిపోట్లకు గురై చనిపోయాడు .ఈ నవలనే ఆండ్రే గైడ్ ,జీన్ లూయీ బార్రట్లు నాటకం గా మలిచారు .గోటిఫ్రైడ్వాన్ ఈనేం ఒపెరగా మార్చాడు .

‘ ది కాజిల్ ‘’లో ఈ నిరాశ మరీ విస్త్రుతమైనది .హీరోకు బాగా ఎత్తుమీదున్న బడాకేజిల్ అధికారులు లాండ్ సర్వేయర్ ఉద్యోగ౦ ఆశ చూపించి .దానిపైకి మంచు చీకటి లో ఎక్కలేక ఎక్కలేక ఆభాస శూన్యం గా భావించాడు .ఇంత కస్టపడి ఇంటర్వ్యు కు వెడితే లోపలి అనుమతించలేదు .ఎన్నో విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు .స్టేటస్ సాధించే ప్రయత్నాలు లాభించలేదు .ఒక బార్ మెయిడ్ సాయం తో ప్రయత్నించినా కుదరలేదు .’’అమెరికా ‘’నవల కనిపించని శత్రువు ఉంటాడు .ఈ మూడిటిని’’ ట్రయాలజి ఆఫ్ లోన్లినెస్ ‘’అన్నారు  .కాఫ్కా తండ్రి సగం నియంత సగం దేవుడు .బ్యూరాక్రాసి ప్రపంచం లో ,యాంత్రిక పారిశ్రామికాభి వృద్ధిలో ఒంటరి అవటం మనుషులకు దూరం కావటం సహజం అని సూత్రీకరించాడు .కాఫ్కాను బాగా సంర్ది౦ చేవారూ బాగా వ్యతిరేకి౦ చేవారూ ఉన్నారు’కాఫ్కాలో మానవత్వం వంటరిదైపోయింది ,ప్రేమలేదు ,రక్షణ ఉండదు .అన్ని ఆసరాలు కోల్పోతారు .కాఫ్కా వీటన్నిటిని భూతద్దంలో చూపించాడు .

చిన్నతనం లో వ్యాయమ౦ అంటే మోజు లేదు కాని పెద్దయ్యాక ఆటలు, ఫిజికల్ యాక్టి విటీలలో బాగా పాల్గొన్నాడు .మంచి రైడర్ ,స్విమ్మర్ ,రోవర్ .ప్రత్యామ్నాయ మందులపై ఆసక్తి ఉండేది .మాంటిస్సొరి ,టెక్నికల్ విద్యలపై అభిరుచిఉండేది ‘’.రచన కాఫ్కా కు ఒక విధమైన ప్రార్ధన’’ .శబ్దకాలుష్యానికి దూరం.అతనిది ‘’స్కిజాయడ్ పర్సనాలిటి డిసార్దర్ ‘’.Enclosed in my own four walls, I found myself as an immigrant imprisoned in a foreign country;… I saw my family as strange aliens whose foreign customs, rites, and very language defied comprehension;… though I did not want it, they forced me to participate in their bizarre rituals;… I could not resist.[193]

 

రచన అంతా జర్మన్ భాషలోనే చేశాడు .సుదీర్ఘ వాక్యాలు ఒక్కోసారి పేజీ అంత ఉండేవి .వీటిని ఇంగ్లీష్ లోకి అనువదించటం కష్టమయ్యేది .జర్మన్ భాష తమాషా ఏమిటి అంటే ఒకే వాక్యాన్ని అనేక రకాలుగా అనువాదం చేయచ్చు .అతనిది ‘’మెటామార్ఫసిస్ ‘’శైలి అంటారు .మిగిలిన రచయితల వాక్యాలను ఉదాహరించినట్లుగా కాఫ్కా వాక్యాలు ఉదాహరించటం అరుదు . Michel-André Bossy writes that Kafka created a rigidly inflexible and sterile bureaucratic universe. Kafka wrote in an aloof manner full of legal and scientific terms. Yet his serious universe also had insightful humour, all highlighting the “irrationality at the roots of a supposedly rational world”.[180] His characters are trapped, confused, full of guilt, frustrated, and lacking understanding of their surreal world. Much of the post-Kafka fiction, especially science fiction, follow the themes and precepts of Kafka’s universe. This can be seen in the works of authors such as George Orwell and Ray Bradbury.[180]

  “Kafkaesque”

Kafka’s writing has inspired the term “Kafkaesque”, used to describe concepts and situations reminiscent of his work, particularly Der Process(The Trial) and “Die Verwandlung” (The Metamorphosis). Examples include instances in which bureaucracies overpower people, often in a surreal, nightmarish milieu which evokes feelings of senselessness, disorientation, and helplessness. Characters in a Kafkaesque setting often lack a clear course of action to escape a labyrinthine situation. Kafkaesque elements often appear in existential works, but the term has transcended the literary realm to apply to real-life occurrences and situations that are incomprehensibly complex, bizarre, or illogical.[

ఆల్బర్ట్ కాము ,జీన్ పాల్ సాత్రే ,లూయీ బోర్జేర్ లు కాఫ్కా ప్రభావానికి బాగా గురైనవారు .అతని సాహిత్యం విజువల్ ఆర్ట్ మీద ,సంగీతం మీద ,పాప్యులర్ కల్చర్ మీద అపారం .20 వ శతాబ్దం నవలలు ఎక్కువ భాగం ఆతని ప్రభావం తో రాయబడినవే . Steinhauer, a professor of German and Jewish literature, says that Kafka “has made a more powerful impact on literate society than any other writer of the twentieth century”.[5]Brod said that the 20th century will one day be known as the “century of Kafka”.[5]

 Inline image 1  Inline image 2


Inline image 3Inline image 4

 

ఫ్రాంజ్ కాఫ్కా మ్యూజియం ను ప్రేగ్ లో నెలకొల్పారు .అతనిపేర ఏటా సాహిత్య  అవార్డ్ అందిస్తున్నారు .కాఫ్కా సొసైటీ ఏర్పడి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది .


 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మల్లినాథ సూరి వంశీకుడు శ్రీ కోలాచలం వెంకటరావు గారి జీవిత విశేషాలు -1

సంస్కృత పంచకావ్య విమర్శకులు శ్రీ కోలాచలం మల్లినాథ సూరిగారి వంశానికి చెందిన శ్రీ కోలాచలం వెంకట రావు గారి దేశ భక్తి ,సాంఘిక సేవాకార్యక్రమాల విశేషాలున్న  9 పేజీల ఆంగ్ల వ్యాసాన్ని బళ్ళారి నుండిలాయర్  శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు ఎలా తెలుసుకొన్నారో నా చిరునామా తెలియదుకాని ఈ రోజు పంపారు .ఆ విశేషాలు అందరూ తెలుసుకో తగినవి కనుక మీకు 2 భాగాలలో అంద  జేస్తున్నాను -ఎందరో మహానుభావులు అందరికి వందనాలు –దుర్గా ప్రసాద్ 
kvr4 001
kvr5 001 kvr1 001 kvr2 001 kvr3 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -197 74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్ నవలా రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -197

74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్  నవలా  రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -2

కాఫ్కా తనకు నరాల బలహీనత ,తప్పు చేస్తున్నానేమోననే భయం ,పట్టుకొని పీడిస్తున్నాయి .స్కూల్ లో ఆతను అందరికంటే పెద్దవాడు .తమ్ముళ్ళు ఇద్దరూ ముందే చనిపోయారు .చెల్లెళ్ళు ముగ్గురికీదూరమై ఒంటరి వాడై పోయాడు .జర్మన్ ఎల మెంటరిహైస్కూల్ లలో చదివి ప్రేగ్ యూనివర్సిటిలో తనకిష్ట మైన సాహిత్యం భాష లను చదివాడు .డిబేటింగ్ సొసైటీ లో చేరి యువ ,ప్రయోగ శీల రచయితలను ప్రోత్సహించాడు .21 వ ఏడు వచ్చాక తాను  లోయీ డ్రీమర్ గా ఇక ఉండలేననుకొన్నాడు .ఏదో ఒకటి  చేసి కస్టపడి డబ్బు సంపాదించి జీవించాలని నిర్ణ యించుకొన్నాడు .తండ్రి బిజెనెస్ లోకి రమ్మని ఒత్తిడి చేసినా ఆ వైపుకు కన్నెత్తి చూడక ,తనకున్న వాదనా పటిమ ను లాయర్ గా ఉపయోగి౦చు కొందామనుకొని లా చదివాడు .23 కే‘’డాక్టర్ ఆఫ్ లా’’ అయ్యాడు. కాని ప్రాక్టిస్ పెట్టలేదు .ఒక చిన్న ఇన్సురెన్స్ ఆఫీస్ లో గుమాస్తాగా చేరి ,తర్వాత పైకి ఎదిగాడు .ఆస్ట్రియన్ ప్రభుత్వ శాఖలో పని చేస్తూ ఖాళీ సమయం లో ఆత్మకధ రాస్తూ లోపలి టెన్షన్ లకు విముక్తి కలిగించే ప్రయత్నం చేశాడు .

ఒంటరిగా ఉండాలన్న భావాన్ని వదిలేసి గ్రూపులతో కలిసి ఉంటున్నాడు .మహా కవి దార్శనికుడు ,జర్మన్ రచయితా గోదే ను ఆవిష్కరించే సామర్ధ్యం ఉన్న రుడాల్ఫ్ స్టేనర్ పరిచయమై ప్రవర్తనా శీల అధ్యయన శాస్త్రం ( యాన్త్రోపోస్కోపి ),తాంత్రిక శాస్త్రాలవైపు ఆకర్షింప బడ్డాడు .కొంతకాలం తానే ‘’కాబాలిస్ట్ ‘’అయ్యాడు .మాక్స్ బ్రాడ్ ,ఫ్రాంజ్ వేర్ఫెర్ మొదలైన వారి ప్రభావంతో ‘’జియోనిస్ట్ ‘’అయ్యాడు .ఇద్దరు ముగ్గురికంటే సన్నిహితంగా ఉండేవాడుకాదు .బృంద ఆలోచనలలో పాల్గొనే వాడుకాదు .ఒక గంట మాట్లాడాక నరాల ఒత్తిడి పెరిగిపోయేది పెదిమలు ఆకస్మికంగా బిగుసుకు పోయేవి ,అసాధారణమైన నల్ల కళ్ళు మండిపోయేవి .విపరీతమైన తలనొప్పి వచ్చి బాధ పడేవాడు .29 వయసులో బెర్లిన్ వయ్యారి  పొగడ్తలతో ఉబ్బు లింగమై పోయాడు . ఆమెతో సాన్నిహిత్యం ప్రేరణ భయమూ కూడా కలిగించాయి.రెండేళ్ళతర్వాత పెళ్లి చేసుకోమని అడిగాడు .ఎంగేజ్ మెంట్ జరిగింది కూడా కాని మూడు నెలలకే దాన్ని కాఫ్కా రద్దు చేయించాడు .తన అకసమిక  నిర్ణయానికి లెంపలేసుకొని క్షమాపణ కోరాడు చాలా సార్లు .తన నరాల బలహీనత ,టి బి లక్షణాలు ఏకరువు పెట్టాడు కాని జబ్బుకంటే మానసికంగా బలహీనమయ్యాడు .’’హనీ మూన్ ఆలోచన అంటే నాకు భయమేస్తుంది ‘’అని చెప్పుకొన్నాడు ఒకసారి .’’నాప్రేమ ఉక్కిరి బిక్కిరికి భయం, నా విదానాలకింద సమాధి అయింది  ‘’అని మాక్స్ బ్రాడ్ కు జాబు రాశాడు .గృహస్త జీవితానికి సంసార బాధ్యతలకు  అనుకోకుండా స్వస్తి  చెప్పినవాడిని చూస్తె ;;కర్క్ గాడ్ ‘’గుర్తుకొస్తాడు కాఫ్కా నేరాన్ని తండ్రిపై నెట్టేసి తప్పించుకొన్నాడు .తండ్రికి రాసిన ఉత్తరం లోనే ఈ అధ్యాయాన్నీ చేర్చి  ‘’సంసారం  ఈడ్చాలంటే నీలాగా సర్వ సమర్డుడనై ఉండాలి  .కానీ నాకవేమీ లేవు .అంటే మంచీ చెడూ లేవునాకు .అవి నీలో సహజంగా ఉన్నాయి .అందర్నీ ప్రేమిస్తున్నట్లే ఉంటావుకాని ఎవరినీ నమ్మవు ‘’అని ఏకరువుపెట్టాడు .జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలనుకొని 34 వ ఏట మళ్ళీ ఒకమ్మాయికి లైనేసి ఎంగేజ్ మెంట్ చేసుకొన్నాడు .కాని విషయం పక్వంకాకుండానే అతని అధైర్యం ,అనాసక్తత వలన ఒక్కసారిగా బ్రేక్ పడింది  .మళ్ళీ సీరియస్ గా జబ్బుపడి ఒంటరివాడయ్యాడు .

అప్పటికే తాను  రాసిన వ్యాసాలూ ,కొన్ని చిన్నకధలు చేర్చి ‘’దిస్టోకర్ ‘’పేరిట ముద్రించాడు .ఇది ప్రైజ్ పొందింది .ఇదే  తర్వాత వచ్చిన ‘’అమెరికా ‘’అనే ఫాంటసి లో చోటు చేసుకొన్నది .మిగిలిన రచనలు అతని అతి తక్కువ స్నేహబృందానికి తప్ప లోకానికి తెలియ లేదు .చనిపోయాక మూడు నవలలు విడుదలై అనువాదం పొందాయి .మొదటి ప్రపంచ యుద్ధకాలం లో ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది .డబ్బులకేమీ ఇబ్బంది లేదు కాని అప్పుడు బొగ్గు కొరత ఏర్పడింది .కనుక వెచ్చదనానికి అవకాశం లేక రక్తం కక్కుకోనేవాడు .అతనికి ‘’పల్మనరి కటార్  ‘’జబ్బు వచ్చిందని ,అందుకని ఎవరొ ఒకరు  తోడు ఉండాలికనుక సాజ్ దగ్గర జురావు ఎస్టేట్ లో ఉన్న చిన్న చెల్లెలి దగ్గర ఉండమని డాక్టర్లు సలహా చ్చారు .అక్కడ ఆరోగ్యం కొంత నయమైంది .’’ది ట్రయల్ అండ్ ది  కాజిల్’’ రాయటం లో విశ్రాంతి లేక దగ్గు పట్టుకోంది.తర్వాత చాలా శానిటోరియం లలో చేరాడు .

40 వ ఏట 18 ఏళ్ళ జ్యూయిష్ అమ్మాయి డోరా డిమాంట్ తో ప్రేమలో పడి ఇద్దరూ కలిసి ప్రేగ్ కు వెళ్ళారు .కాని మళ్ళీ ప్రేమ విఫలమైంది.జబ్బు తీవ్రమై ప్రమాద స్థితికి చేరింది .తలిదండ్రులకు తెలిసి అతనికి తక్షణ వైద్యం కోసం తీసుకొని వెళ్లి వీనర్ వాల్డ్ శానిటోరియం ‘లో చేర్చాలనుకొని ఓపెన్ కారు లో తీసుకు వెడుతుంటే మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు అకస్మాత్తుగా తుఫాను చుట్టు ముట్టింది .ఒళ్లంతా తడిసి ముద్దఅయి ఒణుకుతూ అచేతన స్థిలో చేరాడు .అక్కడ రోగులు విపరీతంగా ఉన్నారు .కాఫ్కాను బాధ తో చచ్చిపోతున్న ఒకవ్యాదిగ్రస్తుడి ప్రక్క బెడ్ లో పడుకోబెట్టారు .తర్వాత కీర్లింగ్ శానిటోరియం లో ఒక ప్రత్యేకగదిలో పెట్టారు . అక్కడే కాఫ్కా 3- 6-1924 న 41వ పుట్టిన రోజు ఒక నెల ఉందనగా  ఈ లోకం నుంచి కనుమరుగైపోయాడు శాశ్వతంగా  .స్వగ్రామానికి తీసుకొని వెళ్లి జ్యూయిష్ పద్ధతిలో ప్రాగ్ –స్ట్రాస్స్ చిన్జ్ లో  ఖననం చేశారు ,అతని చెల్లెళ్ళు ముగ్గురూ విజ్ కాన్సేంట్రేషన్ కాంప్ లో నాజీ దురాగతానికి బలైపోయారు  . మగ నలుసు కూడా ఎవరూ  మిగల లేదు .

Inline image 1Inline image 2

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-16 –ఉయ్యూరు

 

 

 

   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -196 74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్ నవలా రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -196

74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్  నవలా  రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా

‘’విజయవంతమైన జీవితానికి తగిన లక్షణాలేవీ నాలో లేవు ‘’అని చెప్పుకోన్నవాడు జెక్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ..రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ అపనమ్మకం ,ప్రపంచ వ్యాప్త అభుద్రత భావం లను గురించి ముందే ప్రజలను తన అవాంతర ఉపమాన నీతి కధలతో జాగృతం చేసిన జెకోస్లోవేకియాయువ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా 3-జులై 1883 న ప్రేగ్ లో జన్మించాడు .మొదటి నుండి వంటరివాడు .అణచబడిన అణగారినజాతివాడు ..ఆస్ట్రియన్ సామ్రాజ్యం లో జెక్ ప్రజలు మైనారిటీలు .అతను జ్యూఅవటం తో మైనారిటీలలో మరీ మైనారిటీ వాడయ్యాడు .పరిసరాలకు తగినట్లు ప్రవర్తించటం చేత కాకపోవటం మరీ వంటరి వాడిని చేసింది .తల్లి జ్యూయీ లోవీ చాలా సున్నిత మనస్కురాలు .ఆమె అసాధారణ వైపరీత్యం ఉన్న మహిళ.శతాబ్దాల తరబడి లూవీలు విద్యా వేత్తలు ,దార్శనికులు ..బాల్యం నుండి కాఫ్కా వారిలో ఒదిగిపోయాడు .తండ్రి హెర్మన్ కాఫ్కా బడా వ్యాపారి  ,హోల్ సేల్ బిజినెస్ లో పూటుగా సంపాదించాడు .అందుకనే ఫాన్సీ వస్తువులు ఇంట్లో బాగా వాడుకలో ఉండేవి .తండ్రి యెడల కొడుకు ప్రవర్తన బాధాకరంగా సందిగ్ధంగా ఉండేది .తండ్రి పర్సనాలిటి ,వ్యాపారం లో బుద్ధి సూక్ష్మత ,నిర్ణయ సామర్ధ్యాలను చూసి అసూయ పడేవాడు ఈ అర్భక కుర్రాడు .ఆయన శక్తిని ఆరాది౦చాడుకాని ఆయన క్రూరత్వాన్ని అసహ్యి౦చు కొన్నాడు .

   దీన్నించి ఇక ఎప్పుడూ తేరుకోలేక పోయాడు .36 వ ఏట తండ్రికి ‘’పుస్తకం అంత’’’’ఎ లెటర్ టు మై ఫాదర్ ‘’ఉత్తరం రాసి అందులో ఆరోపణలు ఫాంటసీలు ,స్వీయ రక్షణలు గుప్పించాడు .ఉత్తరం ఇలా ప్రారంభించాడు ‘’ప్రియమైన నాన్నా !ఒకప్పుడు నువ్వు నా గురించి ఎందుకు భయం అని అడిగావు .అప్పుడు ఏం జవాబు చెప్పాలో భయం తో నాకు తెలియలేదు .’’అని కొనసాగిస్తూ తన బలహీనతలను తండ్రి సామర్ధ్యాలను వరసపెట్టి చెప్పుకొచ్చాడు .తండ్రికున్న సాఫల్యత తనకున్న అభద్రతాభావం వైఫల్యం అన్నీ రాశాడు .’’మనిద్దరినీ బేరీజు వేస్తె నేను కొంచెంకాఫ్కా లలోని  లోయీ ని.అయితే జీవించటానికి  ,బిజినెస్ విజయవంతం చేయటానికి, డామినేట్ చేసి జయించటానికి  కావలసిన కాఫ్కా లక్షణాలు నాకు లేవు .నీ సంగతి చూస్తె కాఫ్కాలలోని బలం ,ఆరోగ్యం తిండి పుష్టి ,మాట్లాడే నేర్పు స్వీయామోదం ,ఆధునిక ఆడంబరం ,పట్టుదల ,ఏకాగ్రత ,ప్రజల గురించిన జ్ఞానం ,ఒకప్రత్యేక హుందా తనం నీ సొమ్ము .కుర్చీలో కూర్చుని ప్రపంచాన్ని ఏలే తెలివి తేటలు నీవి .నీ నిర్ణయం ఎప్పుడూ తప్పదు .మిగిలిన వన్నీ ఆడంబరం అసాధారణం .నీ ఆత్మ విశ్వాసం మహత్తరమైనది .నీది స్థిర బుద్ధి .జెక్ లకు వ్యతిరేకంగా నాటకంగా మాట్లాడగలవు .జర్మన్ల, జ్యూస్ ల  విషయం లోనూ ఇదే ధోరణి నీది . ఇవన్నీ ఏదో కారణం ఉండికాదు కారణం లేకుండానే .నిన్ను ఎవరూ దేనిలోనూ ఓడించలేరు .ఎప్పుడూ నువ్వే విజేతవు .ఇలాంటి రహస్యమైన గుణం నీది .నియంతల౦దరిది ఇదే ధోరణి .వాళ్ళు లాజిక్ తోకాక మేజిక్ తో ,తెలివి తేటలతోకాక పరనాలిటీ తో అవతలి వారిని దెబ్బ తీస్తారు .’’అనిరాశాడు ఈ ఉత్తరం ఒక రకం గా కాఫ్కా జీవిత చరిత్ర యే.చిన్నప్పుడు కాఫ్కా పిరికి తనాన్ని ,మనిషిగా అపనమ్మకాన్ని వ్యక్తపరిచింది .తండ్రి మహోన్నత వ్యక్తిత్వం అడుగడుగునా కాఫ్కా అసమర్ధతను  ,వ్యక్తం చేసింది .’’you made me lose all possible self confidence and exchange a boundless sense of guilt for it ‘’అని ఆవేదన చెందాడు కాఫ్కా 

.Inline image 1

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్- 7-7-16 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -195

 

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19573-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్–3(చివరి భాగం )

ఎడ్డింగ్ టన్ఉపన్యాసాలు ఇవ్వటానికీ సిద్ధమయ్యాడు .నెమ్మదిగా మొదలు పెట్టి గంభీరంగా మాట్లాడేవాడు .దృఢమైన నోరు ,లోతైన కళ్ళు ,వాటిని సగం మూసి ఉంచే కనురెప్ప వెంట్రుకలు చూస్తీ ఈ వ్యక్తీ ప్రపంచం అంతా, ఆలోచనలతో మునిగి ఉన్నట్లు అనిపిస్తుంది .వక్తగా చూస్తే  దీనికి పారడాక్స్ గా ఉంటుంది  .వ్యక్తీకరణ చాలా డల్ గా  ఉన్నా విషయ వివరణం సూటిగా స్పష్టంగా ఉండేది .విని ప్రేరణకు లోనవ్వాల్సిందే .రాత ,కూత తర్వాత కాలాన్ని గోల్ఫ్ ,పజిల్స్ ,డిటెక్టివ్ కధలలో గడిపాడు .కనుక పెళ్లి ఆలోచనే లేదు .ఐన్ స్టీన్ వర్క్ లోని  జామెట్రీకల్ రీజనింగ్ పై ఆలోచన పెట్టాడు .దీనిలో చాలాక్లిస్టమైన ‘’కాల్క్యులస్ ‘’గణితం ఉంది .’’రిలేటివిటి దీరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ‘’లో తన సూత్రాన్ని వివరించాడు .ఫిజిక్స్ లోని నంబర్లు ‘’కాన్ స్టంట్స్ఆఫ్ నేచర్ ‘’ను పూర్తిగా ప్రేరక తార్కికత(ఇండ్యూసివ్ లాజిక్ ) తో గుర్తించి పరిష్కరించ వచ్చుఅన్నాడు  .విశ్వ సత్యాలను కాంతి వేగాన్ని కాని అణువు బరువు ను బట్టికాకుండా కూడా సాధించవచ్చు .మొదట్లో ఏదో ఒక దాన్నిఅతి సరళంగా మూలంగా ఉన్న దాన్ని  ఊహించి తరువాత ముందుకు వెళ్ళవచ్చు .అని చెప్పాడు .

  ఉదాహరణకు మనం మూడు పరిమాణాలప్రపంచం లో లో ఉన్నామని అనుకొంటే కాలం ఉందనిభావిస్తే,విద్యుత్ కు ధన రుణ తటస్థ స్వభావాలు ఉన్నాయనుకొంటే వీటి ఆధారం గా గణిత  చట్రనిర్మాణాన్ని  తయారు చేయవచ్చు .ఇది చాలా సంక్లిష్టమైనది కాని కొలువదగినంత ఫలితాలనిచ్చే దానిగా చేయచ్చు .ఎలక్ట్రాన్ కంటే ప్రోటాన్ 18 40 రెట్లు బరువైనదని ఈయన  సిద్ధాంతం రుజువు చేసింది .అటామిక్ ఫిజిక్స్ లోఆయన ఊహా గణిత భావనలు ప్రయోగ ఫలితాకు అతి దగ్గరగా ఉండటం గొప్ప విశేషం .ప్రోటాన్ కు ఎలెక్ట్రాన్ కు మధ్య ఒక ఊహాత్మక అటామిక్ పార్టికల్ ఉంటుందని చెప్పాడు .తరువాత పరిశోధనలో అదే’’ మీసాన్ ‘’ అని కనిపెట్టారు .ఆయన ఊహించిన అన్ని లక్షణాలు బరువు చార్జి లతో సహా దానికి ఉన్నాయి .

విశ్వం లో 204 x2to the power of 256 కణాలు ఉంటాయని చెప్పాడు .ఈ సంఖ్య  16 తర్వాత 78సున్నాల సంఖ్య కు సమానం .కాని వ్యోమగాముల గణనాల ప్రకారం విశ్వం ద్రవ్యరాశి అన్ని కణాలు కలిగి ఉండే వీలు లేదు .లెక్కల్లో ఏదో కొద్ది తేడా తప్ప ఆయన ఊహ దాదాపు యదార్ధమే .సైంటిస్ట్ లు ఆయనను మేధావి అనాలో లేక సంఖ్యల మర్మజ్ఞుడనాలో అర్ధకాక జుట్టు పీక్కున్నారు .భౌతిక స్థిరత్వాల సంఖ్యా సంబంధ యాదృచ్చికాలు ఎడ్డింగ్ టన్ ఫలితాలతో సరిపోతున్నాయని విమర్శకులు తేల్చి చెప్పారు .1944లో కేన్సర్ సోకి రెండేళ్ళు బాగా పోరాడుతూ నూతన జామెట్రీకల్ సూత్రాలను వివరిస్తూ విశ్లేషిస్తూ గడిపాడు .22-12-19 44న 62ఏళ్ళ వయసులోకేంబ్రిడ్జ్ నర్సింగ్ హోం లో  చనిపోయాడు .

ఇంకా శోదిన్చాల్సినవెన్నో మిగిలే పోయాయి .యువ శాస్స్త్ర, గణిత వేత్తలు వీటిని సాధించాలి .కాని ఎడ్డింగ్ టన్ కృషి చెల్లుబాటు అవుతుందో కాదో తేల్చాల్సిన పనేమీ లేదు .ఆయన విధానాలలోనిర్ణయాలలో తప్పులు ఉండవచ్చు కాని లాజిక్ నుండి ఫలితాలు సాధించవచ్చునని ఆయన రుజువు చేసింది పూర్తీ యదార్ధం .జామెట్రికల్ రీజనింగ్ పరిధి బాగా విస్తరించి,మిశ్రమ లోహాల ,నెబ్యులాలపై మరింత విజ్ఞానం లభించింది .ఆయన కృషి పరిధి పెరిగింది .సైన్స్ పరికరాల కంటే మనిషి తార్కిక శక్తి ఎక్కువ ఫలితాలనిస్తుందని ఎడ్డింగ్ టన్ నిరూపించాడు .కాస్మలాజికల్ కాన్ స్టంట్ విశ్వ ఆవిర్భావానికి ముఖ్య దోహదకారి అయి ఉండచ్చు అని నిర్ణయించి, కస్మలాజికల్ పరిశోధనలను ఆ  కాన్ స్టంట్ పాత్ర ,దాని లక్షణాల పరిశీలనపై  కేంద్రీకరించాడు .వీటిని ‘’మాదేమేటికల్ దీరీ ఆఫ్ రిలేటివిటి ‘’గ్రంధం లో పొందుపరచాడు .ఈ కాన్ స్టంట్ అంటే విశ్వ స్వీయ కొలమానం ..

  ఫండమెంటల్ ఫిజిక్స్ కు E numbers అనే ఆల్జీబ్రా ఆధారితమైనది ఉందని తెలుసుకోన్నట్లు చెప్పాడు .దీనినే క్లిఫోర్డ్ ఆల్జీబ్రా అన్నారు .స్పేస్ టైం ను హయ్యర్ డైమెన్షనల్ ఆకృతికి దారి తీసింది .క్వాంటం దీరీ ,రిలేటివిటి ,కాస్మాలజి ,గ్రావిటేషన్ లను కలిపి విశ్వానికి ఒక ఏక సూత్రత సాధించే ప్రయత్నం లో చివరి రోజులు గడిపాడు .

సైక్లిస్ట్ లు ఎక్కువ దూరం తొక్కే సామర్ధ్యానికి చెందిన’’ఎడ్డింగ్ టన్  నంబర్ ‘’ను కనిపెట్టాడు .ఎడ్డింగ్టన్ నంబర్ 60 అంటే ఒక సైక్లిస్ట్ సైకిల్నురోజుకు 60 మైళ్ళు  60  సార్లలో   తోక్కాడని అర్ధం .62మైళ్ళు 100 కిలోమీటర్ లకు సమానం .కానీ తర్వాత లెక్కల ప్రకారం నంబర్ 62అంటే వందకిలోమీటర్లు 6 2రోజుల్లో తోక్కాడనే అర్హం కాని వందకిలోమీటర్లు వంద రోజుల్లో తోక్కాడని కాదు .1919 సూర్య గ్రహణం నాడు ఉమర్ ఖయ్యాం కవితకు పేరడీగా ఎడ్డింగ్ టన్ Oh leave the Wise our measures to collate
One thing at least is certain, LIGHT has WEIGHT,
One thing is certain, and the rest debate —
Light-rays, when near the Sun, DO NOT GO STRAIGHT.కవిత రాశాడు .

చంద్ర మండలం లో ఒక గుంటకు ,ఆస్టెరాయిడ్ 2761 కి ,ఆయన పేరు పెట్టారు .స్మిత్ ప్రైజ్, బ్రూస్ మెడల్,గోల్డ్ మెడల్ ,రాయల్ మెడల్,కింగ్ హుడ్ ,ఆర్డర్ ఆఫ్ మెరిట్ వంటివివి ఎన్నో పురస్కారాలు అందుకొన్నాడు .దాదాపు 15 పుస్తకాలు రాశాడు .

 

మన భారతీయ ఆస్ట్రో ఫిజిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్ర శేఖర్ లండన్ కేంబ్రిడ్జ్ లో చదువుతున్నప్పుడు ఎడ్డింగ్ టన్ ప్రొఫెసర్ .చంద్ర శేఖర్ ఫలితాలు బ్లాక్ హోల్స్ ఉన్నాయని తెలియ జేశాయి .ఆయన చంద్ర శేఖర్ లిమిట్ చాలా ప్రాచుర్యం పొందింది .అది భౌతికంగా అసంబద్ధమ౦ (అబ్సర్డ్ )అని కొట్టిపారేసి దాన్ని తిరస్కరించాడు తోక్కిపట్టేశాడు .పూర్తిగణితాదారిత నిర్ణయాలు యదార్ధ ప్రపంచానికి దుష్పరిణామాలు తెస్తాయన్నాడు .లేకపోతే అప్పుడే  చంద్ర శేఖర్ కు నోబెల్ బహుమతి వచ్చి ఉండేది .తరువాత ఎడ్డింగ్ టన్ భావన తప్పు అని తేలింది .ప్రతిభకు పట్టిన గ్రహణం వీడింది .తరువాత ఎప్పుడో యాభై  ఏళ్ళ తర్వాత ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది .ఎడ్డింగ్ టన్ అసూయా ద్రుష్టి,నిరంకుశత్వం ,పిడి వాదం, జాతి వివక్షత  ఇంతపని చేసిందనిచరిత్రకారులు నిర్ధారించారు చంద్ర శేఖర్ కూడా చాలా వ్యధకు గురయ్యాడు  .దీనినే నేను ‘’యాభై ఏళ్ళ ప్రతిభా ‘’చంద్ర’’ గ్రహణం ‘’పేరుతొ ఒక వ్యాసాన్ని సుమారు ఏడెనిమిదేళ్ళ క్రితం రాస్తే ‘’చినుకు ‘’మాస పత్రిక లో అచ్చయింది .

  Inline image 1  Inline image 2

                                                                                             s  . చంద్ర శేఖర్  

సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-16- ఉయ్యూరు

   

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -194

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -194

73-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్-2

  పూర్వపు సైంటిస్ట్ లు నక్షత్ర౦ లోని పరిస్థితులను అతి సామాన్యంగా చెప్పారు .కాని ఎడ్డింగ్ టన్ ధేర్మో డైనమిక్స్ ను ,అటామిక్ ఫిజిక్స్ తో మిక్స్  చేసి సేఫీడ్ వేరియబుల్స్ అంటే కొన్ని నక్షత్రాలు క్రమప్రకారం వాటిలోని కాంతి తగ్గి మళ్ళీపెరగటం ,మళ్ళీ పెరుగదలనుంచి కాంతి క్రమంగా తగ్గిపోవటం వంటి ప్రత్యేక సమస్యలను అధ్యయనం చేసి చెప్పాడు .కొన్ని నక్షత్రాలలో గరిష్ట కాంతి కి చేరటానికి కొన్ని గంటలే పడితే ,మిగిలినవాటిలో చాలా ఎక్కువ కాలంఅంటే సంవత్సరకాలం  పడుతుందని చెప్పాడు .కాంతి లో వచ్చే ఈ మార్పులు నక్షత్ర ఉష్ణోగ్రత లో మార్పులు తెచ్చి ,ఒకదాని తర్వాత ఒకటి తగలబడి చివరికి నక్షత్రం మొత్తం కుంచి౦చుకు పోతుంది .ఎక్కువ కాంతి కల నక్షత్రాలు ఈ మార్పుకు నెమ్మదిగా గురౌతాయి .వాటిలోని పరిస్థితులను కూలంకషంగా అధ్యయనం చేసి నక్షత్రాల బరువుకు ,వాటి పల్సేషన్ ఫ్రీక్వెంసి  కు ఉన్న సంబంధాన్ని సూత్రప్రాయంగా వివరించాడు .వాటి సుమారు బరువు ,కాంతి లను పరిశీలనద్వారా తెలుసుకొన్నాడు .తర్వాత సూత్రాన్ని చాలా ఖచ్చితం చేసి చెప్పాడు .సేఫీడ్స్ పీరియడ్ నుంచి దాని ద్రవ్య రాశి కనుక్కోవచ్చు ,దానిద్వారా దాని అసలు కాంతి ఎంతో తెలుసుకోవచ్చు .ఈ సేఫీడ్స్ ను లైట్ హౌస్ లు గా భావిస్తే  వాటి ఫ్లాషింగ్ సిగ్నల్ ద్వారా వాటి కాండిల్ పవర్ తెలుసుకోన్నట్లే వాటి కనిపించే కాంతి ,దూరాలను లెక్కించవచ్చు .

 చాలా సందర్భాలలో నెబ్యూలాలు మన మొత్తం గెలాక్సీ లోని నక్షత్రాలకంటే ,మిల్కీ వేకు చాలా దూరం లో ఉంటాయి .అంటే మన సూర్యుడు ఒక పెద్ద టౌన్ కు శివారు లో నక్షత్రాలు మన చుట్టూ కాంతి నిచ్చేటట్లు కనిపిచ టమన్నమాట . మన గెలాక్సీ కి బయట ఉన్న నెబ్యూలాలు దూరపు సిటీ లోని తక్కువ కాంతిగా(ఫైంట్ ) కనిపించే లైట్లు అన్నమాట .వీటి దూరాలను వీటి’’ డిగ్రీ ఆఫ్ ఫైంట్ నెస్ ‘’ ను బట్టి కాంతి సంవత్సరాల ద్వారా  తెలుసుకోవచ్చు ..అతని సేఫీడ్ వేరియబుల్స్  అంత రిక్ష యాత్రికులకు విలువైన ఏక రీతి కొలమానాన్ని అంద జేసింది .సాధారణ నక్షత్ర గర్బవిషయ౦  అంత అద్భుతమైనదేమీ కాకపోయినా అది రేడియేషన్ ప్రేసర్ కు వినియోగించి మొదటి సారిగా స్టెల్లార్ అంతర్భాగాలను తెలుసుకోవటానికి సహకరించింది .ఈ రేడియేషన్ పీడనం  నిజంగా అది బాగా ప్రకాశ వంతంగా ఉన్నప్పుడున్న  ఒక శక్తి లేక  కాంతి  తోపుడే నక్షత్ర  నిర్మాణాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశం .’’ఆన్ ది రేడియేటివ్ ఈక్విలిబ్రియం ఆఫ్ స్టార్స్ ‘’లో రాసి వివరించాడు .దీనిలో   అతని కీలక భావనలు అన్ని రకాల నక్షత్రాల ద్రవ్య రాశి, ప్రకాశాలకున్న సంబంధాన్ని ,వాటికి ఉష్ణం, కాంతి లను ఎర్పరచటానికి    జరిగే వివిధ పరమాణు చర్యలను తెలుసుకొన్నాడు .

   రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ కి 19 12 నుంచి 17వరకు సెక్రెటరిగా ఉన్నాడు .డచ్ గణిత వేత్త విల్లెం డీ సిట్టర్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .ఈయనకు  రిలేటివిటిపై ఉన్న అభిరుచి గమనించి ఐన్ స్టీన్ రాసిన జెనరల్ దీరీ పుస్తకాన్ని కొన్ని వివరణ పత్రాలను  పంపాడు . అది యుద్ధ సమయ౦ కనుక ఈ విషయం ఇంగ్లాండ్ లోనే ఉండి పోయింది .జామె ట్రికల్ ,న్యూమేరికల్ రీజనింగ్ కు  అది బాగా ఉపయోగ పడుతుందని గ్రహించాడు .సంఖ్యల మూల లక్షణాలు ,అంత రిక్ష శోధనలో మునిగాడు .తన పనిలో తానూ మునిగిఉన్నా జనరల్ దీరీ ఆఫ్ రిలేటివిటిని సహచరులకు ప్రజలకు  వివరించి చెబుతున్నాడు .1918 లో 91పేజీల ‘’రిపోర్ట్ ఆన్ రిలేటివిటి ‘’అనే బృహత్తర వ్యాసం రాశాడు. మరుసటి ఏడాది సూర్యుని శక్తి వంతమైన గురుత్వాకర్షణ క్షేత్రం లో కాంతి పుంజం  వంగిపోవటం పై ఐన్ స్టీన్ చెప్పిన జోస్యాన్ని అధ్యయనం చేసే అన్వేషణ యాత్రలో పాల్గొన్నాడు .1920 లో ‘’స్పేస్ ,టైం ,గ్రావిటేషన్’’పుస్తకం ప్రచురించాడు .ఇందులో ఐన్ స్టీన్ సిద్ధాంతాలను తన విభజనలతో వివరించాడు ఇది సైంటిఫిక్ అన్వేషణలో విధానాలను ఫలితాలను బాగా వివరించింది .దీనితర్వాత ‘’స్టార్స్ అండ్ ఆటమ్స్ ‘’,’’ది నేచర్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్ ‘’,ది  ఎక్స్పా౦ డింగ్ యూనివేర్స్ ,’’న్యు పాత్ వేస్ ఇన్ సైన్స్ ,’’ది ఫిలాసఫీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ‘’గ్రంధాలు రాశాడు .తన భావజాలాన్ని సాన్ద్రతరం చేసి విస్పష్టం చేశాడు ,సైన్స్ కున్న ఊహాజనిత లక్షణాన్ని మెచ్చుకొన్నాడు .

   జటిలమైన గణితాన్ని సమగ్ర౦ గా మార్చే ప్రయత్నం చేశాడు .గ్రావిటేషన్ ను సొట్ట గా పోల్చాడు .అదే స్పేస్ టైం లమెత్తని వస్త్రం అన్నాడు .వస్తువులు గ్రావిటి వలన ఆకర్షింప బడుతాయి .దీన్ని ఎలా పోల్చవచ్చు అంటే –మంచు తో ఉన్న చెరువు పై దొర్లే  రాయి ఐస్ లోని డిప్రెషన్ (అణచటం ) కు ఆకర్షింప బడి నట్లు ఉంటుంది .విశ్వం అంతా వక్రంగా నాలుగవ పరిమాణం లో దానింతటికి అదే మూసుకు పోయినట్లు ఉంటుందే తప్ప అనంతం కాదు అని తన రిలేటివిటి సిద్ధాంతం తో చెప్పాడు ..ఆస్ట్రో ఫిజికల్ గణనాలు ఒక అంత రిక్ష నౌక కనబడే  ఒక సరళ రేఖ పై చాలా దూరం ప్రయాణం చేస్తే ,అది వ్యతిరేక దిశ  నుండి తిరిగి వస్తుంది అని తెలియ జేస్తున్నాయని చెప్పాడు  .ఆయన ఖగోళ విషయాలలో మరో ముఖ్యమైంది –నెబ్యూలాలు మనకు దూరంగా కదిలి పోతున్నాయి అని .’’the  fundamental view point was not the apparent recession of nebulae ,but the expansion of the whole four –dimensional curved universe ‘’ఈ వ్యాప్తి నిరంతర ఎంట్రోపి అభి వృద్ధి తో  సంబంధం  కలిగి ఉంటుంది .విశ్వం లోని శక్తి అనేక రకాలుగా వాడుకోబడి లేక నశింపు పొందుతుంది కాని మళ్ళీ సృష్టింప బడదు అని తెలిపాడు .

Inline image 1Inline image 2

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -193

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -193

73-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్

‘’మనిషి తర్కం అతని గొప్ప ఆయుధం ‘’అంటాడు బ్రిటిష్ ఖగోళ ,గణిత శాస్త్ర వేత్త ఆర్ధర్ ఎడ్డింగ్ట న్ .సంఖ్యలతో ప్రారంభమై సంఖ్యలతో అంతమయే తీరులో మధ్యలో ప్రభావిత సైంటిఫిక్ పాండిత్యం అని ఆర్ధర్ స్టాన్లీ ఎడ్డింగ్ట న్ ను విశ్లేషించ వచ్చు .చివర్లో నంబర్ల విషయం లో మేధస్సు తగ్గుతుందో , ,లేక భవిష్యత్తులో మేధస్సు  గుర్తింపు తెస్తుందో చెప్పలేని స్థితి .ఏది ఏమైనా ఎడ్డింగ్ టన్ సూత్రంలోని కీలక భావన శాస్త్రీయ ఆలోచనలో కొత్త విధానానికి నాంది పలికింది . ఎడ్డింగ్ టన్ 28 12- 18 82న స్కాట్లాండ్ సరిహద్దుకు యాభై మైళ్ళ దూరం లోని కేండాల్లో జన్మించాడు ..రెండవ ఏటనే తండ్రి ఆ ఊళ్ళో ఒక స్కూల్ నడుపుతూ చనిపోయాడు .తల్లి అతన్ని సోమర్సెట్ కు తీసుకువెళ్ళి క్వేకర్ విధానం సరైన విద్య నేర్పి లో పెంచాలనుకోన్నది .సౌకర్యాలు ,నంబర్ల మీద ధ్యాసచిన్నప్పటి నుంచి ఉన్నాయి .24 వ ఎక్కం వరకు క్షుణ్ణం గా వచ్చేసింది .ఆరవ ఏట పెద్ద పెద్ద సంఖ్యలతో ఆడుకోవటం ఖగోళ శాస్త్రం వైపుకు ఆకర్షించింది .గణిత విషయాలన్నీ  అప్పటికే హస్తగతమయ్యాయి .పదవ ఏట మూడు అంగుళాల టెలిస్కోప్ తో ఆకాశాన్ని అధ్యయనం చేశాడు .

గొప్ప విద్య అడ్వొకేట్ అయిన  తల్లి కొడుకును ప్రత్యేకత కల బ్రిమిలిన్ బోర్డింగ్ స్కూల్ లో చేర్చింది .బోర్డింగ్ స్కూల్ లో చదివి౦ చేంత ఆర్ధిక స్తోమత లేదు .కాని ఈ స్కూల్ మాత్రమె మిగిలిన వాటి కంటే మంచి విద్య ఇస్తుందని నమ్మింది .కుర్రాడి ప్రత్త్యేక అభిరుచులను టీచర్లు బాగా ప్రోత్సహించారు .13 వయసులో కేంబ్రిడ్జ్ జూనియర్ లోకల్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి ప్రశంసలు పొంది ,సోమర్సెట్ కౌంటి స్కాలర్షిప్180 పౌండ్లు పొందాడు .ఇది మాంచేస్టర్లో ఓవెన్స్ కాలేజి లో   చేరటానికి వీలు కలిగించింది 1902లో కేంబ్రిడ్జ్ ట్రినిటి కాలేజ్ లో చేరి ట్రిపోస్ గణిత పరీక్షలో పాల్గొని మొదటి గౌరవం –సీనియర్ రాంగ్లెర్ సాధించాడు .దీన్ని మిగిలిన పోటీ దారులకంటే ఒక్క ఏడాదిలోనే సాధించటం అతని ప్రతిభా విశేషం .లెక్కలలో అపార పాండిత్యం ,ఆస్ట్రానమి మీద అభిరుచి అతన్ని గ్రీన్విచ్ అబ్సర్వేటరి  చీఫ్ అసిస్టంట్ అవటానికి దోహదం చేసింది .అక్కడ సమగ్ర నక్షత్ర గమనాలపై అధ్యయనం చేశాడు .ఒక ఏడాది తరువాత 19 07లో ‘’స్టెల్లార్ మోషన్స్ ‘’పైన రాసిన వ్యాసంఅనేక నక్షత్ర సమూహాలతో ఏర్పడిన  మన గెలాక్సీగమనాన్ని ,ఆకారాన్ని గురించి తెలిపింది .తన పరిశోధనల కేటలాగ్ ను 1910లో ప్రచురించాడు .దీనికి ‘’సిస్టెమాటిక్ మోషన్ ఆఫ్ స్టార్స్ ‘’అని పేరుపెట్టాడు .ఇందులో 6 ,188  నక్షత్రాల సైజు, స్థితి, గమనాలను విశ్లేషించి తెలియ జేశాడు .

31 వ ఏట  ఆస్ట్రానమి లో  ప్లూమియన్ ప్రొఫెసర్   అయ్యాడు .ఏడాది తర్వాత ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొంది కేంబ్రిడ్జ్ అబ్సర్వటరి డైరెక్టర్ అయ్యాడు .ఈ కాలం లో 12 ఏళ్ళు అక్షాంశాల తేడాలు ఖచ్చితమైన భూ గమనం తెలుసుకోవటానికి ఎలా ఉపయోగ పడతాయో ,కనిపెట్టాడు .నక్షత్ర గమనాలు ,నక్షత్ర అంతర్భాగ నిర్మాణ విశేషాలను అందరూ వదిలేసిన ఐన్ స్టీన్ సిద్ధాంతం ఆధారంగా వివరించాడు .

Inline image 1Inline image 2

      సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-16 –ఉయ్యూరు  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”మా అన్నయ్య ”ఆత్మీయ కవితా సంకలనం ఆవిష్కరణ సభ

సాహితీ బంధువులకు శుభకామనలు -సరససభారతి 94 వ సమావేశంగా ,సరసభారతి రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో న ”మా అన్నయ్య ”పై నిర్వహించిన ఆత్మీయ కవిసమ్మేళనం కవితా సంకలనాన్ని 17-7-16 ఆదివారం ఉదయం 10 గం  లకు విజయవాడ చండ్ర  రాజేశ్వర రావు లైబ్రరీ(బందరు రోడ్డులోని పశువుల ఆస్పత్రి కి ఎదురు రోడ్డు లో ) ప్రముఖ కథానికా రచయిత ,న్యాయవాది,విశ్లేషకులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఆవిష్కరిస్తారు . సరసభారతి కార్య వర్గ సభ్యురాలు శ్రీమతి సీతం రాజు మల్లికగారు ఈ పుస్తకానికి స్పాన్సర్ అని మీకు తెలిసిన విషయమే .పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం త్వరలోనే అంద  జేస్తాము  .సాహితీ మిత్రులు అందరూ పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా కోరుతున్నాం –

గబ్బిట దుర్గాప్రసాద్ -సరస భారతి  అధ్యక్షులు  ,చలపాక ప్రకాష్ -రమ్య భారతి అధ్యక్షులు 

—

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -192

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -192

72-20 వ శతాబ్ది ప్రముఖ ప్రభావ రష్యన్ స్వర కర్త –ఇగార్ స్ట్రావిన్స్కి-2 (చివరి భాగం )

సాధారణ సంగీత సూత్రాలకు విరుద్ధంగా పెట్రౌచాకా ,షాకెర్ లను చేశాడు .ఆకస్మిక అంతర్వేశనం(ఇంటర్ పోలేషన్ ) ,దారుణ దాట్లు,సంబంధం లేని ఫ్రేజులుతో  ఒక తరాన్ని అంతటిని ప్రభావితం చేశాడు .సంగీత కర్తలు కొత్తగా చెప్పాలన్న ఆలోచనలకు వచ్చారు .వీటితోపరిచయం లేని వారు నేర్చుకొని చేయాల్సి వచ్చింది .స్ట్రా విన్స్కి ఎక్కడా రాజీ పడలేదు .వినేవారికి చేసేవారికి అసూయ కలిగించలేదు  .తన నెర్వస్ ఎనర్జికి సమాధానం చెప్పాడు .శబ్ద జంఝకు,వైరుధ్యానికి  విముక్తి కల్గించి దూసుకు పోయాడు .1914లో స్వల్పకాలం రష్యాలో గడిపాడు .ఇదే చివరి దర్శనం .తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళాడు .దీనివలన రష్యా నేపధ్యం తో ఏవేవో చేయాలనే ఊహ కలిగింది .వెంటనే రష్యన్ జానపద గీతాలతో ‘’ప్రిబౌతి ‘’,ను ఒకే గాత్రం తో ఎనిమిది వాయిద్యాలతో ను ,’’బెర్స్యూఎస్ డి చాట్ ‘’ను మూడు క్లారినెట్ లతో ,’’రేనార్డ్ ‘’ను రష్యన్ ఫోక్ మేలదీస్ తో ఒపెరాను చేశాడు .రష్యా విప్లవ సమయం లో రోమ్ లో ఉండి పోయాడు .అక్కడే ‘’వోల్గా బోట్ మన్స్ సాంగ్స్ ‘’పేరఒక ఆర్కెస్ట్రా కు రాశాడు .దీని డయాఘిలేవ్ నిర్మాణం లో చేశాడు .

మరో రష్యన్ ఆధార ‘’లేస్ నోసెస్ ‘’అనే పెళ్లి సందడి ని రష్యా సంప్రదాయ జానపద బాణీలతో నేపధ్యం తో శతాబ్దాలక్రితం రష్యా పల్లెటూర్లలో  జరిగే  పెళ్లి వేడుకలలోని అన్ని విషయాలకు పునః ప్రాణ ప్రతిష్ట చేశాడు .’’ఆ ఆచారాలు కట్టుబాట్లు నాకోసమే ఉన్నాయా అన్నట్లు స్వేచ్చగా వాడుకొన్నాను సంగీతం లో ఆడుకొన్నాను ‘’అన్నాడు .అదొక బృహత్తర ,నమ్మశక్యం కాని17 విభిన్న వాయిద్యాల సమ్మేళనం .దీన్ని గురించి వివరిస్తూ ‘’there were no strings or wood winds  no harmonic pleasantries  or instrumental sonorities ,choruses  piled on top of choruses –dwarfed the soloists –the constant use  of voices ,chanting in authentic folk accents even shouting and at times screaming ,is a guarantee against any intrusion not nakedly indigenous ‘’అని అర్ధర్ బెర్జేర్ ‘’మ్యూజిక్ ఫర్ ది బాలెట్ ‘’లో రాశాడు .ఎల్ హిస్ట్ రే డు సోల్దాట్’’ ను స్విస్ లో ఉండగానే చేశాడు .దెయ్యం వలలో చిక్కిన ఒక రష్యన్ సైనికుడి కద.యుద్ధ సమయం కనుక చాలా పొదుపుగా చేశాడు .స్టేజి పైఒక ప్రక్క  వివరించే వాడు ,రెండవ వైపు 7 వాయిద్యాలు మాత్రమే ఉంచాడు .ఈ రెండిటినడుమ నాటకం నడుస్తుంది .చిన్న చిన్న ఎపిసోడ్ లతో ఒకదానికొకటి ఉన్న సంబంధం తో నడిచే దీన్ని ఆయన ‘’రాగ్ టైం ‘’అన్నాడు .అప్పటికే 1916కె అమెరికాలోని నూతన సంగీతం ఆయన చెవిన పడింది .తనతో ఎంతో జాజ్ సంగీతాన్ని తెచ్చుకొన్నాడు 11-11-1918 ‘’ఆర్మిస్టిస్ ‘’రోజున ఒక నివాళిగా భవిష్యత్తులో తన దేశం కాబోతున్న అమెరికాకు కానుకగా ఇచ్చాడు.దీన్నీ ‘’రాగ్ టైం ‘’అనే అన్నాడు .11 వాయిద్యాలతో అద్భుత శబ్ద సృష్టి చేశాడు .తనను తానే అధిగమించాడు .

  ప్రేక్షకులకు స్ట్రా విన్స్కి ‘’ఆబ్స్ట్రాక్ట్ మ్యూజిక్ ‘’ను కోరుకొంటున్నారు .టోన్ పోయెమ్స్  ,ప్రోగ్రాం మ్యూజిక్ లపై వీటిని రాశాడు .ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం ఆయనకు దియేటర్ పరిధి దాటిన విస్తృత స్వర సమ్మేళనాలు ఉండాలని కోరుకొన్నారు .అవే ఆయన సంగీత విలువలను ,ఆచరణీయఅంశాలను గా మారుస్తాయి .35వయసులొ స్విస్ ను వదిలి ఫ్రాన్స్ చేరి 16ఏళ్ళ తర్వాత పౌరసత్వం పొందాడు .హార్మానిక్ రిధమిక్ అతి ని వదిలి నిరాడంబర నియో క్లాసిజం వైపుకు మారాడు .’’సంగీతం సరైన విజ్ఞానం .కనుక దానినుండి ఏదో సందేశం లేక అర్ధం ఆశించరాదు దాన్ని దానిగానే అనుభవించాలి ‘’అన్నాడు .నలభై లలో చేసినదంతా స్వచ్చమైన ఆబ్ స్ట్రాక్ట్ సంగీతమే .

నలభై దాటాక క్లాసికల్ మ్యూజిక్ వైపుకు కదిలాడు .గాలి వాయిద్యాలకోసం ఒక ఆక్టేవ్ రాశాడు .పియానో వయోలిన్ ల మేళనం వదిలేశాడు .గాలి వాద్యాలపైనే ఎక్కువగా పని చేశాడు .అవి స్వచ్చమైనవి ,ప్రతిధ్వనినిచ్చి మానసికానందాన్ని చ్చేవి అన్నాడు .స్వచ్చమైన నాదం కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు .గతాన్ని మళ్ళీ నెమరేసుకొన్నాడు .’’పల్సినేల్ల ‘’లోపాత మాధుర్య స్వరాలను వాడాడు .పెర్గోలేసి ,చికో విస్కీ ల సుస్వరాలను వాడుకొన్నాడు .దీనిపై స్పందిస్తూ ‘’శిశు జననం తర్వాత రేప్ నిజమే ననిపిస్తుంది ‘’అని సమర్ధించుకొన్నాడు .ఇతర సంగీత కర్తల ట్యూన్స్ ను చక్కగా వాడి కొత్తతరానికి పరిచయం చేశాడు .

 ఇటలీ పర్యటనలో ఉండగా తాను మరీ మరీ ప్రాచీనం వైపు వెడుతున్నానని భావించాడు .దీనిఫలితంగా తన స్నేహితుడు జీన్ కాక్టువా ను ‘ఫ్రెంచ్ భాషలో ఉన్న ’ఈడిపస్ రెక్స్ ‘’ను లాటిన్ లోకి అనువాదం చేయమని కోరాడు .కొద్దిగా తనకు లాటిన్ వచ్చుకనుక అందులోని పదాలను ఫోనెటిక్ సామగ్రికోసం వాడుకోవచ్చు అనుకొన్నాడు .శబ్దాలపై ఒత్తిడి కల్పించి ఇంద్రియాలు వాటి జాగ్రత్త అవి పడేట్లు చేయాలని సంకల్పించాడు  .ఈ ఒపేరా –ఆర టోరియో  తర్వాత మరొకటి క్లాసిజ ప్రకాశం తో ‘’అపోలాన్ ముసగేట్స్ ‘’చేసి మొదటి సారి 1925లో అమెరికా వెళ్లి అక్కడ ఎలిజబెత్ స్ప్రేగ్ కూలిడ్జ్ తో ఆవిష్కరింప జేశాడు  .మళ్ళీ తంత్రీ వాయిద్యాలు ఉపయోగించి ఆర్కెస్ట్రా తో డామినేట్ చేయింఛి బహు సొగసైన వీనుల విందైన ,మార్మిక అస్థిరత తో మారు మోగింఛి సంగీతం లో రస ధునులు సృష్టించిన బాష్ ,హాండెల్ లను గుర్తుకు తెచ్చాడు . .

1929లో  డయాఘలేవ్ మరణం తర్వాత పూర్తిగా దియేటర్ సంబంధం లేని సంగీతాన్నే కూర్చాడు యూరప్ లో ఉంటున్నా ద్రుష్టి అమెరికావైపే ఉండేది .19 30 లో బోస్టన్ సింఫనీ  50 వ వార్షికోత్సవానికి ఒక సింఫనీ రాయమని ఆహ్వానించారు .’’19 వ శతాబ్ది నుండి వార సత్వంగా వచ్చిన సింఫనీ మనకు భాష ,ఆలోచనలు రెండిటిలోనూ విదేశీ వాసన కలది ‘’అని భావించి ఉపేక్షించాడు .కనుక మానవ స్వరాలను ఆర్కెస్ట్రా స్వరాలతో కలిపి నియోక్లాసిక్ పీరియడ్ కు చెందిన అద్భుత స్వర సృష్టి చేశాడు .తన జీవితచరిత్రలో దీనిపై రాస్తూ ‘’సింఫనీ భిన్నస్వరాలతోఅభి వృద్ధి చెందినఒక విశేషమేకాని కాని నా ఆలోచనల మేరకు విస్తృత పరచాలనుకోన్నాను .కనుక కోరల్ ,వాయిద్యాల కలగలుపు తో వినూత్న అందాన్ని తెద్దామనుకోన్నాను .రెండిటికి సమాన ప్రాదాన్యమిచ్చి ఒకదాన్ని మరొకటి ఆక్రమి౦ చ కుండా జాగ్రత్త పడ్డాను .పదాలను ప్రత్యేకంగా సృష్టించి పాడించాను .సాల్టర్ నుంచి దీన్ని వాడుకోవాలనే ఆలోచన వచ్చింది .’’సింఫనీ ఆఫ్ సాల్మ్స్ ‘’లో స్ట్రా విన్స్కి పదాలను నాదాల కోసం లాటిన్ లోని వల్గేట్ నుంచి గ్రహించాడు ..50 ఏళ్ళు వచ్చేసరికి మరింత ఘనమైన స్వర కర్త అయ్యాడు .వయోలిన్ ,పియానోలకు ‘’యుగళ కన్సర్తెంట్ ‘’చేశాడు .’’పెర్సేఫోన్ ‘’కంసర్ట్ కు రెండు పియానాలతో  సమకూర్చాడు .16 వాయిద్యాలతో మరో కంసేర్ట్ చేశాడు .

 20వ ఏట రెండవ కజిన్ నడేజా సౌలిమాను పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు త౦డ్రి అయ్యాడు .పెళ్లి అయిన 33 ఏళ్ళకు భార్య చనిపోయింది .యూరప్ అంటే విసుగు పుట్టి అమెరికాకు వెళ్ళిపోయాడు .అక్కడ మాసా చూసేట్స్ లోని  బెడ్ ఫోర్డ్ లో 58వ ఏట వేరాసుడేకేన్ ను పెళ్ళాడి ,మూడవ పిత్రు దేశమైన అమెరికాలో స్థిరపడి 63వ ఏట అమెరికన్ పౌరుడయ్యాడు .70 వయసులో పూర్తీ ఒపేరా ‘’ది రేక్స్  ప్రోగ్రెస్ ‘’ను 18న్ వ శతాబ్ది కి చెందినవిలియం హోగార్త్ శిల్పరచనకు  పరవశుడై ,దానినాదారంగా 20 వ శతాబ్ది కధనుమాంచి శక్తి వంతంగా దూకుడుగా డబ్ల్యు హెచ్ ఆడెన్ , చెస్టర్ర్ కాల్ మన్  కవులు కల్పిత కధగా మలిచిన దాన్ని తీసుకొని ,తనదికాని భాషలో ఉన్నదాన్ని అక్షర నాదాలను బట్టి సోనాట్ యూనిటీ గా పరివర్తన చెందించాడు .ఇప్పుడుకూడా విమర్శకులు అది స్వీయమా ,లేక ఇతర స్వరకర్తలైన హాన్డెల్, మొజార్ట్  టేకోవ్ స్కి ల   కాపీ యా?అని ప్రశ్నించారు   .కాని ఇర్వింగ్ కోలేడిన్ మాత్రం అంతగా మెచ్చక పోయినా ,ఆడెన్ ,కల్లాం పాఠాన్ని అతి నూతనంగా ,తెలివిగా ,చిరస్థాయిగా నిలిచే సంగీతం తో ప్రకాశింప జేశాడు .ఇది ఏనాటికైనా మనతరం లోనే కాదు భవిష్యత్ తరాలలో కూడా అరుదైన ప్రయోగం అని పించు కొంటుంది  అన్నాడు .

స్ట్రా విన్స్కి చిత్రాన్ని పికాసో ,కాక్టువాలు అద్భుతంగా గీశారు .’’లైఫ్ ‘’మేగజైన్ లో విన్త్రాప్ సార్జంట్ దీనిపై రాస్తూ ‘’ఒక కొత్త ఇమేజ్ లాఉంది .బరువైన హారన్ రిమ్మేడ్ కళ్ళ అద్దాలతో అయన దేనిమీదో ముందు ద్రుష్టి పెట్టిన గొల్లభామ లాగా కనిపిస్తున్నాడు ‘’అని  కామెంట్ చేశాడు (his aquiline nose and heavy horn –rimmed glasses give him the look of a deeply preoccupied grasshopper ‘’ )ఇక్కడ ‘’ప్రీ ఆక్యు పైడ్’’అంటేఒక మేధావి  ఏదో విషయం పై నిరంతర అన్వేషణలో మునిగి ఉన్నట్లు ‘’అని అర్ధం చెప్పారు .’’his willingness to write to order had made him more a craftsman than a creator ‘’అని గిట్టని వాళ్ళు విశ్లేషించారు .అంటే ఆయన సృజన కర్త కంటే గొప్ప కళాకారుడు .కాని ఆయన అభిమానులు మాత్రం ‘’అంతటి జీవకళ ,ఉత్సాహం వైవిధ్యం ,ప్రతి సూక్ష్మ విషయం పై దృష్టి,దాన్ని స్వర్ణమయం చేసే నేర్పు ,అసాధారణమైన  మిరుమిట్లు గొల్పే ప్రయోగాలు ,ప్రశాంత సాధనా, సాఫల్యత, ఆగ్రహ లయల అనుసంధానం, ,అంతటి క్రమపద్ధతి  నిర్మాణం స్ట్రా విన్స్కి సంగీతం లో తప్ప ఇంకెక్కడా కనిపించదు కాక కనిపించదు ‘’అని ప్రశంసించారు .పొగడ్తల తెగడ్తల , దూషణ భూషణ లేమీపట్టించుకోకుండా తన పనేదే తానూ చేసుకు పోయాడు .కొత్త శ్రుతులకోసం ,కొత్త వాయిద్య సమ్మేళనాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు .ఆతను ఎలా పని చేస్తాడంటే ‘’  He lives only on music ,shaping ,cutting ,and correcting it on a desk as severe as an architect;s drafting table .అంతటి దీక్ష తపన ,అంకితభావం తాదాత్మ్యం ఆయనది .ఆయనకు  ప్రేరణ ఒక లేబర్ . ‘’He knows how to sublimate instinct to a regular force ‘’అని ఆయన పనితనాన్ని డచ్ క్రిటిక్ ఫ్రాంక్ ఆనేన్ విశ్లేషించాడు .స్ట్రా విన్స్కి కి ‘’A thing of beauty is not a joy until it conforms to discipline bringing form out of chaos ,fulfilling the stern definition of St.Thomos ‘’Beauty is the essence and glory of order ‘’

6-4-19 71న అమెరికాలో 89వ ఏటఅమర సంగీతమ౦  అందించిన  స్ట్రా విన్స్కి అమరుడయ్యాడు .

 

    ఆయన జీవితం లో 1-రష్యన్ పీరియడ్ -19 07 -19, 2-నియో క్లాసికల్ పీరియడ్ -19 20-54,3-సీరియల్ పీరియడ్ -19 54 -68అనే నాలుగు దశలు నడిచాయి .ఆయనను ‘’one of music;s truly epochal innovators ‘’అంటారు .కాంపోజిషన్ శైలిని ఎప్పటికప్పుడు మార్చటం ఆయన గొప్ప ప్రత్యేకత .అందులో స్పష్టత ,తాదాత్మ్యాలను కాపాడు కొన్నాడు .అనేక రకాల వాయిద్యాలతో మానవ స్వరాలతో ,ఏక వాయిద్యం నుంచి అనేక వాయిద్య సమ్మేళనాలతో  చరిత్ర సృష్టించాడు .ఆయనకు రాయల్ ఫి హార్మోనిక్ సొసైటీ గోల్డ్ మెడల్ ను ,అందజేస్తే సానింగ్ మ్యూజిక్ ప్రైజ్ ను లియోని ఇచ్చింది .బెస్ట్ క్లాసికల్ పెర్ఫార్మార్ గా ,బెస్ట్ క్లాసికల్ కంపోజర్ గా ఆర్కేస్ట్రాలోను సోలో లోను పొందాడు జీవిత సాఫల్య పురస్కారం మరణానంతరం 1987 లో అందజేశారు .తన జీవితం లోసంగీతపరమైన  అనేక గ్రంధాలు రాశాడు ,’’క్రానికల్ ఆఫ్ మై లైఫ్’’అనే ఆటో బయాగ్రఫి రాసుకొన్నాడు మరికొందరితో కలిసీ రచనలు చేశాడు .

  Inline image 4  Inline image 2Inline image 3

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-16- ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా మేనమామ కొడుకు విశ్వనాధం

 

మామేనమామ గుండుగంగయ్య గారి 63ఏళ్ల నాలుగవ కొడుకు విశ్వనాధం జూన్ 27 సోమవారం రాత్రి  కొంతకాలంగా కిడ్నీ వ్యాధి తో బాధపడి చనిపోయాడు .వాడిది ఒక వింత కధ . చిన్నప్పటి నుంచి మాటలు రావు .కానీ మంచి అవగాహన ఉండేది .వయసు వచ్చినా పసిపిల్లాడి మనస్తత్వం .చెప్పిన పని చేసేవాడు .మా ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉండేవాడు .పిల్లల్ని ఆడించేవాడు .ఎత్తుకొనేవాడు పడేస్తాడేమోనని మా భయం .ఒక రకం గా జడ భరతుడు ,అవధూత . మా మామయ్య అత్తయ్య చాలా బాగా చూసుకునేవారు .మా మామయ్య చని పోయాక వాడి బాధ్యతను మూడవ కొడుకునరసయ్య  ఇంటి బాధ్యతలు పొలం వ్యవహారాలతో పాటు వాడి బాధ్యతనూ తీసుకొన్నాడు ..వీడి అక్క చెల్లెల్లు తమ్ముళ్లు కూడా విశ్వనాధానికి సేవ చేసేవారు  నరసయ్య కొడు కు కూతుళ్లు నలుగురూ అందరూ వాడిని ”విస్సు బాబాయ్ ”అని ఆత్మీయంగా పిలిచేవారు.వాడి సేవ చేసేవారు .వాడికి స్నానం కూడా ఎవరో ఒకరు చేయించాల్సిందే .అన్నంకూడా కలిపి నోట్లో పెట్టి తినిపించాల్సిందే..   .అయినా ఆడా  మగా ఎవ్వరూ వాడినిఏవ గించుకోవటం కానీ  విసుక్కోవటం కానీ చేసేవారు కాదు.  బాధ్యతగా వాడి సేవ చేసేవారు .  అంత ఓర్పుగా వాడికి కుటుంబం అంతా బాసటగా ఉండేవారు ..చురుగ్గా నడిచేవాడు నోటి వెంట ఎప్పుడూ చొంగ కారుతూ ఉండేది ఏదో మాటలు నోటి నుంచి వచ్చేవికాని అర్ధం తెలిసేది కాదు .ఇలాంటి వాళ్ళు మన ఊర్లో మరో ముగ్గురు ఉండేవారు .ఒకరు గోవింద రాజు శ్రీరామ మూర్తి గారబ్బాయి, రెండవ వాడు బూరగడ్డ బసవయ్య గారబ్బాయి మూడవ వాడు మా హిందీమాస్టారు కొడాలి రామారావు గారి అబ్బాయి .ఈ ముగ్గురికంటే విశ్వం చాలా నయం .వాళ్ళు ముగ్గురూ చొక్కా ఎవరైనా తొడిగితే తప్ప ఒంటి మీద ఉండేదికాదు ఎప్పుడూ దిశమొలతోనే రోడ్డు మీద ఉండేవారు  .వీడు వాళ్ళకంటే వెయ్యి రెట్లు నయం  చొక్కా లాగూ లేకుండా ఎప్పుడూ ఉండేవాడు కాదు .. మాటలు రావు అంతే . మా ఆవిడను అక్కయ్యా నన్ను బావ అని అస్పష్టంగా అనేవాడు .మా పిల్లలకూ వాడు అంటే ఆధరమే .వాళ్ళ ఇల్లు మాఇంటికి ఉత్తరం వైపునే ఉంది మధ్యలో చిన్న సందు ఉంది .సుమారు పదేళ్లక్రితం మా వీధిలోనే రోడ్డుమీద ఇల్లు కట్టుకొని అక్కడే వీడితో సహా ఉంటున్నారు  .నరసయ్య నలుగురు కూతుళ్ళకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు .కొడుక్కి చేయాలి .మామామయ్య ఆస్థి లో   విశ్వనాధానికి కూడా వాటా ఇచ్చాడు . ఆస్థి  వాడికి ఉంది అని వీళ్ళు సేవ చేయలేదు .బాధ్యతగా చేశారు .బహుశా ఈ కాలం లో ఇలాంటి వాడి కి కుటుంబం ఇంతగా అండగా ఉండటం ఆశ్చర్యమే   కలిగిస్తుంది  .దాన్ని మా మామయ్య కొడుకు నర్సింహం ఆచరించిఆదర్శంగా నిలిచాడు .. నరసయ్య పిల్లలు విశ్వం అక్క చెల్లెల్లు అందరూ కలిసి విశ్వనాధానికి  ఉత్సాహంగా షష్టి పూర్తి ఉత్సవం జరిపారు .
   .  విశ్వాన్ని హాస్పిటల్ లో కొంత కాలం ఉంచి కిడ్నీలకు ట్రీట్  మెంట్ ఇప్పించి రెండూ ఫెయిల్ అయ్యాయని,ఒకటి రెండు రోజులే అని  డాక్టర్ చెబితే ఆదివారం ఉదయం మా ప్రక్కన ఉన్న వాళ్ళ పాత ఇంట్లో ఉంచి జాగ్రత్త్తగా చూశారు .సోమవారం రాత్రి పదిగంటలకు వాడు వెళ్లి పోయాడు .మంగళ వారం  ఉదయం అంత్య క్రియలు జరిపి అప్పటి నుంచే  విధి విధానంగా దినవారాలు ఈ పాత ఇంట్లో నే శిల ఉంచి పుల్లేరు గట్టుమీద ఉన్న ఊర తాతయ్య గారు కట్టించిన అపరకర్మల సత్రం లో చేస్తున్నారు . .  . . మనమధ్య ఉన్న మనుషుల్లోనూ ఇంతటి సేవాభావం ఉన్న వాళ్లు న్నారని  తెలియ జేయటానికే ఇదంతా .మా మామయ్యకు పక్షవాతం వచ్చినప్పుడు నరసయ్య చంటి పిల్లాడికి చేసినట్లు సేవ చేశాడు .విశ్వం తర్వాత వాడు మోహనాయ్ ఏం కామ్ బందరులో చదువుతూ మామామయ్య హాస్పిటల్ లో ఉండగా చూడటానికి వచ్చి ఉయ్యూరు సెంటర్ లో రోడ్డుమీద లారీ ఆక్సిడెంట్ లో చనిపోయాడు . అప్పుడూ ఇలానే సేవ చేసింది కుటుంబం .  . వాళ్ళమ్మ అంటే మా అత్తయ్య కూ ఇలాగే సేవచేశాడు ఆవిడ పోయి దాదాపు ఆరేళ్ళుఅయి  ఉంటుంది   .పోనీ నర్సయ్య ఆరోగ్యమైనా  బాగుందా అంటే వాడికీ బి పి ,షుగరు బాగా ఉన్నాయి ..అయినా ఏ లోటు రానీయకుండా తలిదండ్రులకు తమ్ముడికి ఈ విధంగా సేవ చేసి వాడూ వాడికుటుంబం రుణం తీర్చుకొన్నారు .ఇలాంటివాళ్ళు బహు అరుదు . మానవత్వం పరిమళించటం అంటే ఇదేనేమో !ఇవాళ 10 వ రోజు .ధర్మోదకాలు వదిలి వచ్చాను . మానవ సేవే  మాధవ సేవ అని నిరూపించాడు నరసయ్య  -దుర్గా ప్రసాద్
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -191

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -191

72-20 వ శతాబ్ది ప్రముఖ ప్రభావ రష్యన్ స్వర కర్త –ఇగార్ స్ట్రావిన్స్కి

‘’క్రమం యొక్క కీర్తి సారమే సౌందర్యం ‘’అన్నాడు  రష్యన్ స్వరకర్త ఇగార్ స్ట్రా విన్స్కి.1913లో పార్శియన్ పబ్లిక్ ముందు ‘’ది రైట్ ఆఫ్ స్ప్రింగ్ ‘’బాల్లేట్ ను  అన్ని సంప్రదాయాలను విస్మరించి విభిన్నంగా  ప్రదర్శించినపుడు అది విప్లవాత్మకమో ,విధ్వంసకమో శూన్యమో తెలియక జుట్లు పీక్కుని ప్రేక్షకులు నిరసన ,ఆందోళన ,ఈలలు ,అరుపులు ,పిల్లికూతలు ,కేకలతో  రాళ్ళవాన తో భీభత్సం సృష్టించారు . ఈ భీభత్సం వాగ్నర్ కు జరిగిన పరాభవాన్ని గుర్తు చేసింది .వేదిక మీద వాద్య ధ్వనులకంటే ,ఈ గొడవే ఎక్కువగా విని పించింది .సభలో ఉన్న అమెరికన్ క్రిటిక్ కార్ల్ వాన్ వేచ్ టెన్ లేచి నిలబడి ‘’ఈ కుర్రాడి సంగీతం వింటుంటే నా నెత్తి మీద అతని చేతులతో ముష్టి ఘాతాలు చేస్తున్నట్లుంది .అన్ని సంప్రదాయాల్ని నాశనం చేశాడు .నా భావోద్వేగం ఏమిటంటే ఆ దెబ్బలు కొంచెం సేపు నాకు బాధ కలిగించలేదు ‘’అన్నాడు .

 ఇగార్ స్ట్రా విస్కీ ముఖ్య లక్షణం  భావోద్విగ్నత ను ప్రేరేపించటం .సంగీత పరమార్ధం ‘’వస్తువుల విషయాలమధ్య క్రమాన్ని సృష్టించటం ,దీనికి మించి మనిషికి ,కాలానికి మధ్య క్రమత్వం నెలకొల్పటం ‘’అంటాడు ఇగార్ ..ఎమోషన్ ను ప్రసరి౦ప చేయటం లేక సృజనలో అర్ధాన్ని కల్పించటమే కాక స్ట్రా విన్స్కి ఆర్ట్ –ఒక మేధా కార్యక్రమం ,స్వర సమూహాన్ని కొన్ని విరామాలలో క్రమబద్ధం చేయటం  అతని ప్రత్యేకత .ఇంద్రియాలకు ప్రత్యేక విన్నపాలను చేయటం ,శృంగార స్పూర్తి కలిగించా-టాన్ని వ్యతిరేకించాడు .అలా చేస్తే కాక్టియాచెప్పినట్లు  ‘’హృదయాన్ని బ్లాక్ మెయిల్ ‘’చేయటమే నంటాడు .హేతు వాది .ఎమర్సన్ చెప్పిన ‘’transcendentalism’’అంటే అతీత భావ వాదం ,అందులోని ‘’beauty is its own excuse  for being ‘’నచ్చినవాడు .దీన్ని సాధనక్రమం లో సాధించాలనుకొన్నాడు .స్వర కల్పన నిత్యకృత్యం అంటాడు  .అలాకాకపోతే వాడని వాయిద్యం పనికి రాకుండా పోయినట్లు ఇదీ పాడై పోతుంది .నిత్యాభ్యాసం లేక పోతే సంగీత కర్త కు ప్రగతి ఉండదు అంటాడు .ఏదైనా సృష్టించే ముందు స్పూర్తికోసం ఎదురు చూడాలి అను కొంటారు ఎక్కువ మంది ..ప్రేరణ ను తాను కాదు అనలేనని ,అది ముందుకు తీసుకుపోయే శక్తి అని ,ప్రతి మానవ క్రియకు అవసరమేనని అంతమాత్రం చేత అది ఒక్కటే ఆర్టిస్ట్ యొక్క ఆస్థికాదని  అంటాడు .నిరంతర ప్రయత్నం ,ప్రయాస బుద్ధికి అవసరం .అదే స్ట్రావిన్స్కి సంగీత వైవిధ్యానికి ముఖ్య సోపానాలు .అదే ఆతని ‘’thinking of the music ‘’.

1882లో రష్యన్ కాలెండర్ ప్రకారం జూన్ 5,పాశ్చాత్య కాలమానం ప్రకారం  17 న సెయింట్ ఇగార్ దినోత్సవం నాడుజన్మించాడు .తండ్రి ఫియోడర్  స్ట్రావిన్స్కిప్రసిద్ధ బాస్ సింగర్ .ఇదే మూడోకొడుకు విగార్ కు సెయింట్ పీటర్స్ బర్గ్ దగ్గరున్న ఒరానీన్ బాం లో సంక్రమించింది .ఆరేళ్ళ వయసులోనే పియానో పై చిన్న చిన్న విషయాలు వాయించేవాడు .అవి గోప్పవేమీకాడు .19 వయసులో రిమ్స్కి కోరాకాఫ్ కు వాయించినప్పుడూ అభి వృద్ధి  కనిపించలేదు.24 లో షిహారజేడ్   కంపోజర్ అతనికి నేర్పటానికి ఒప్పుకొన్నాడు .గురువుగారికంటే ఓరిఎంటల్ మ్యూజిక్ లో చాలా ముందుకు దూసుకు పోయినా  తన ప్రేరకుడిని ఎప్పుడూ గుర్తుంచుకొంటాడు .గురువు కూతురు రిమ్స్కి ని పెళ్లి చేసుకొన్నప్పుడు స్ట్రా విన్స్కి ఒక సింఫనీ కవిత ‘’ఫైర్ వర్క్స్ ‘’రాశాడు  ,గర్భాదానంతర్వాత నాలుగు రోజులకు రిమ్స్కి కోర్సాకాఫ్ చనిపోయాడు .గురువు స్మృత్యర్ధం శిష్యుడు ‘’చాంట్ ఫోనేబర్ ‘’ కంపోజ్ చేశాడు .

ఇంకా చదువులోనే ఉండి,పియానో పై ఎట్యూడ్స్ ను సాధన చేస్తుండగా రష్యన్ బాలెట్ ను విప్లవావాత్మకంగా మార్చేసిన సెర్జీ డయాఘిలేవ్ తో పరిచయం కలిగింది .ఈయన 70బాలెట్ లను ప్రదర్శించే  ఆలోచనలో ఉండి,డేబస్సి,ఫాలా ,ఆలిక్ ,పౌలీన్ రిమ్స్కి లతో  సంగీత౦ చేయిస్తున్నాడు .కర్టెన్లు  రంగాలంకరణ దుస్తుల డిజైన్ కు  పికాసో వంటి ప్రసిద్ధులను నియమించుకొన్నాడు .స్ట్రా విన్స్కి శక్తి సామర్ధ్యాలు తెలిసిన వాడుకనుక చేరమనికోరాడు .అతనికి పని ఎలా చేయించుకో వాలో తెలుసు ..అతని మార్గదర్శకత్వం లో స్ట్రావిన్స్కి స్థానిక రష్యన్ సంగీత కారుడి అవతారం నుండి అంతర్జాతీయ యూరోపియన్ అవతారమెత్తాడు .

    1909 లో డయాఘిలేవ్ ప్రోత్సాహం తో స్ట్రా విన్స్కి ‘’ది ఫైర్ బర్డ్ ‘’,తో బాటు మరొక దానికీ సంగీత సమకూర్చాడు .కాని అతనిపై రష్యా సంగీత ప్రభావం ఇంకా దూరం కాలేదు .పియానో శబ్దాలను మిగతా ఆర్కెస్ట్రా మింగేసి కర్ణ కఠోర శబ్దాలను సృష్టించింది .పపెట్ ప్రదర్శన దారుణంగా విఫలమైంది .అయినా డయాఘిలేవ్ స్వయంగా తర్వాత కలిసి జరిగిందేదో జరిగింది దాన్ని పూర్తీ బాల్లేట్ గా మార్చే ప్రయత్నం చేసి సత్తా చూపించమని ప్రోత్సహించాడు .’’పెట్రౌ చకా ‘’లో తన  సామర్ధ్యం  ప్రదర్శించాడు .రష్యన్ జానపద ట్యూన్స్ వాడి ,స్వంత బాణీ ప్రదర్శించాడు .కొత్త రిధం లను ప్రయోగించాడు .మధురం శ్రావ్యత కలిపించాడు .కాని ఇదంతా చాలా ప్రాధమిక దశకు చెందినదే అనిపించింది .స్వేచ్చా వాతావరణానికి 31 వ ఏడాది లో ప్రవేశించి ‘’లీ సాక్రే డుప్రిన్టేమ్స్’’కు స్వర రచన చేశాడు .చరిత్రాతీత త్యాగ కద ఒక్కసారిగా ఆయన మనసులోకి వచ్చింది .తన ఊహలో ‘’ఒక పాగాన్ ఉత్సవం లో గుండ్రంగా కూర్చున్న వృద్ధ తాపసులు చూస్తూ ఉండగా  నడుమ ఒక యువతి డాన్స్ చేస్తూ చేస్తూ చనిపోవటం .ఆమెను రాబోయే శుభ వసంతానికి బలిగా చేయటం  ఇందులో కద.ఒక గుహ ,అందులో వెర్రి ఆవేశపు స్త్రీలు ,హిప్నటైజ్ అయిన కౌమారదశ వారు ,కన్యరికాన్ని కాపాడుకోన్నవాళ్ళు ,వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోవటం కలుసుకోవటం ,ఆనందించటం విడిపోవటం అంతా అత్యంత సహజమైన డాన్స్ లతో ప్రక్రుతి శక్తుల నృత్యాలతో  తీర్చి దిద్దాడు .నియంత్రణలో ఉన్న హింస ఉండటం తో ఇది మాస్టర్ పీస్ అని పించుకోన్నది .దీనిపై జీన్ కాక్టువా రాస్తూ ‘’ఆటవిక దుఖం బాధ ,చి౦తల పుట్టుకలో భూమి ,పొలాలపై కేకలు, సన్నని మాధుర్యాలు ,శతాబ్దాల కిందటి వాతావరణం ,పశువుల నెమరువేతలు,పూర్తీ ప్రక్రుతి సౌందర్యాన్నిఒడిసి పట్టి  చాలా గొప్పగా సిమ్ఫనైజ్ చేశాడు ‘’అని రాశాడు .ఇందులోని సంగీత విలువలు చిరస్మరణీయం .ప్రతిదీ సెంట్రి ఫ్యూగల్ శక్తితో చలించింది .రెండు విభిన్న తాళాలతో శ్రుతి కల్గించాడు .వరుసక్రమంలో మనుషులు వంగటం ,తుఫాను గోధుమ చేను పై విరుచుకు పడ్డట్టు  ఆడవాళ్ళ భుజాల మీద నుండి  దాటుకు పోవటం,తమ మడమలను కాల్చుకోవటం ఓహ్ పరమాద్భుతం అని పించింది   .’’Srtavinsky  ;s dancers  are not merely electrified by these rhythmic disturbances ,they are electrocuted ‘’   అని  మహా ఇదిగా మెచ్చుకొన్నారు అతని సృజన విజ్రుమ్భించి శత పత్ర పద్మ సుందరిలావికసించి మనసులకు హృదయాలకు మహదానందాన్ని పంచింది .అలౌకిక అనుభూతికి లోను చేసింది .రాళ్ళ దెబ్బలు కొట్టిన ప్రేక్షకులను స్వర సమ్మోహనం చేసి తానే ఇప్పుడు సు స్వరాలతో బాది పారేసి ప్రతీకారం తీర్చుకొన్నాడు స్ట్రా విస్కీ.

Inline image 1Inline image 2

  సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-16 –ఉయ్యూరు  .

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -190 71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్ -3(చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -190

71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్ -3(చివరి భాగం )

‘’ఫిన్నేగాన్స్ వేక్స్ ‘’ను ‘’the rivering waters of hitherandthithering waters of night ‘’అన్నారు ,రాత్రి ‘’ఫిన్నేగాన్స్ ‘’ను కంట్రోల్ చేస్తే పగలు ‘’యులిసెస్ ‘’ను పరిపాలించింది .కాల నిబంధనల నుండి విడుదల అవటానికి జాయిస్ తాను  చెప్పేవిదానాన్ని మార్చి ఇందులో ఒక కలల సముదాయంగా మార్చాడు .స్వప్నఅనంతత్వాన్ని ,దాని ప్రత్యేక పరిభాషను ,దాని అసంబద్ధ లాజిక్ ను చేర్చాడు .యులిసెస్ లాగా ఇదీ మిత్ ఆధారంగా రాసిందే .కాని ‘’it is  an impersonal rather than personal mythology which makes the central figure mankind itself .ఇది అందరికి అన్నిచోట్లా అన్నికాలాల్లో జరిగేదే .ఒకరకంగా ‘’allegorical  ,psychological spiritual history of humanity in a single theme .దీన్ని అనేక ప్లేన్స్ లో రాశాడు జాయిస్ .ఫ్రాయిడ్ భావాలకు రూపకల్పన గా ఉంటుంది .విరుద్దాల యాదృచ్చిక సంఘటనం .ఎన్నో .షేక్స్ పియర్ టాగ్ లు ,దారితప్పిన సామెతలు ,భాషాయాసలు ,జాతీయాలు ,వికార భాషా శాస్త్ర విషయాలు ,జారుళ్లు,చర్చలు ,టేలిస్కోపేడ్ శబ్దాలు ,పద సమ్మేళనాలు ,పేరడీలు ,శ్లేషలతో ముంచేశాడు .శ్లేష ఆయన శ్వాసగా కనిపిస్తుంది .12 భాషలలో వేలాది శ్లేషలను ఇందులో గుప్పించాడు .షేక్స్పియర్ తర్వాత ‘’పన్ లో పాదుషా’’ జాయిస్ మాత్రమే .ఒకే పదానికి రెండు మూడర్దాలుంటాయి .సామాన్యుడికి అదొక కారడవి అనిపిస్తుంది .వ్యాఖ్యాన దీపం లేక పోతే కారు చీకటే .క్రాస్ వర్డ్ పజిల్ గాఅర్ధం కాని కోడ్ భాషగా  తికమక పెడుతుంది .అంత్యక్రియలకు నాంది గా అనిపిస్తుంది .ఆ శైలీ విన్యాసం చూద్దాం –

‘’Buy a book in brown paper –from Faber and Faber –to hear Annie Liffie ,trip ,tumble and caper –sevensinns in her singthings –Plurabell;s on her prose –sheashell ebb music wayriver she flows ‘’ఈపుస్తకం అతి పెద్ద బూటకం అన్నారు .17 ఏళ్ళు కస్టపడి పబ్లిక్ పై ట్రిక్కులు ప్రయోగించాడు అన్నారు.

59 వ ఏట జాయిస్ కస్టాలు మరీ పెరిగాయి .’’ఫిన్నేగాన్స్ ‘’పుస్తకం ఫెయిల్ అయింది దమ్మిడీ రాలేదు .భవిష్యత్తు అంధకారమై కూతురి ఆరోగ్యం ఏమై పోతుందో అనే బెంగతో కుంగి పోయాడు .ప్రాణాంతక ఆంత్రమూల అల్సర్ ఏర్పడింది .ఆపరేషన్ జరిగింది .రెండు సార్లు రక్తం ఎక్కించారు .కోలులోలేక జ్యూరిచ్ లో13-1-19-41 న 59ఏళ్ళకే జేమ్స్ జాయిస్ చనిపోయాడు .

  ‘’ విమర్శకులు జాయిస్ ను విమర్శించే ముందు ఆయన చదివినంత చదుకోవాలి ‘’అన్నాడు ఎల్. యే జి,స్ట్రాంగ్ .ఇందులో నిజం కొంత ఉంది .ఏ సాయం లేకుండా అతని సాహిత్యం చాలా భాగం చదవచ్చు. కాని కొన్నిటికి తప్పక గైడ్ ఉండాల్సిందే .ఆయనను విశ్లేషిస్తూ ‘’in the beginning there was the word and the word was the life .in the end there was only the word ‘’అన్నాడు .జాయిస్ కవి ,అర్ధ జ్ఞాని, సృజన శీలి .దారుణ మైనవాడు స్పూర్తికలిగించేవాడు కూడా .’’he enlarges Shakespearean soliloquy into an interior monolog of unexampled length breadth ,and richness .He was the first to employ ‘’the stream of consciousness ‘’as a running commentary ,a tossing flood of free association .He caught and preserved in a fluid amalgam part speech ,partsliding ,suggestive syllables ,the shapes of dissolving dreams .A genius who united the comic with the cosmic ,a renegade Jesuit with the lustiness of a Rabelais and the savagery of a Swift ,Joyce was an influence so great that imitators were imitable and so unique that imitation was impossible ‘’అంటూ అనుకరణకు అందని సాహితీ మూర్తి జాయిస్ అన్న రచయితలూయీ అంటర్ మేయర్ మాటలు యదార్ధం.

 జాయిస్ సాంఘిక వ్యవస్థను క్రస్టియానిటి ని వ్యతిరేకించాడు .వీటితో తానెప్పుడూ అంతర్యుద్ధం చేసేవాడిని అని చెప్పాడు .కేధలిక్కుల అణచి వేత విధానం పై పోరాడాడు .జాయిస్ చనిపోయినప్పుడు క్రిస్టియన్ మతగురువు వచ్చి కార్యక్రమం చేస్తానంటే భార్య అబ్యంతరం చెప్పింది . సంగీతం అంటే విపరీతమైన మోజున్న జాయిస్ కవితల్లో వచనం లో సంగీతం కట్టలు తెంచుకొని ప్రవహించింది .ధామస్ మూర్ ‘’ఐరిష్ మేలోడీలు ‘’,జార్జ్ బార్కర్ బాలడ్ లను చాలా చోట్ల ఉపయోగించాడు .సంగీతజ్నులైన సల్లివాన్ ,మొజార్ట్, వాగ్నేర్ లను బాగా అధ్యయనం చేశాడు .జాయిస్ రచనలు సంగీతానికి ,వాద్య సంగీతానికి ప్రేరణ అయాయి .

  జాయిస్ ప్రభావం చాలా మందిమీద ఉంది .ముఖ్యంగా నాటక రచయిత శామ్యూల్ బెకెట్ పై ఎక్కువ .జోసెఫ్ కాంప్బెల్, జాన్ అప్ డైక్,మలార్మే రింగ్ బాడ్లపై కూడా జాస్తీగానే ఉంది .జూన్ 16 ను ‘’బ్లూమ్స్ డే’’గా జాయిస్ రచనలు ,జీవితం పై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు .1999 లోటైమ్స్ మేగజైన్  వంద మంది ప్రసిద్దుల పేర్లలో జాయిస్ పేరూ చేర్చింది .2013 లో ఐర్లాండ్ ప్రభుత్వం ఆయన స్మారక సిల్వర్ కాయిన్ ముద్రించి,దానిపై యులిసెస్ లోని ప్రఖ్యాత వాక్యాన్నిచేర్చి గౌరవించింది .ఐరిష్ నౌకకు ఆయన పేరు పెట్టారు .జాయ్స్ జీవించి ఉండగా 8 పుస్తకాలు చనిపోయాక 10పుస్తకాలు ముద్రణ పొందాయి .  Shortly after the publication of Ulysses, he elucidated this preoccupation somewhat, saying, “For myself, I always write about Dublin, because if I can get to the heart of Dublin I can get to the heart of all the cities of the world. In the particular is contained the universal.”[2]

అని తన డబ్లిన్ అభిమానాన్ని గుండె డప్పుతో మోగించి చాటిన ఐరిష్ దేశభక్తుడు ,శాశ్వత౦గా  ఐర్లాండ్ ను వదిలి ప్రవాస జీవితం గడిపిన చైతన్య స్రవంతి రచయిత జేమ్స్ జాయిస్ .

   Inline image 1   Inline image 3

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-16-ఉయ్యూరు  

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -189

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -189

71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్ -2

ట్రిస్టేలో ఒంటరిగా ఉంటూ సున్నిత మైన బతుకు బతుకుతున్నానని చెప్పుకొన్నాడు.పెళ్ళాం ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్నాడు .స్కూల్ లో ఇంగ్లీష్ బోధిస్తూ ఏడాదికి వచ్చే ఎనభై పౌండ్ల జీతం తో బతుకు బండీ  లాగిస్తున్నాడు .ఒక పుష్కరం ముందే’’ పోర్ట్రైట్ ‘’  నవల పూర్తీ చేశాడు .ఇది ఆయన మొదటి పాతికేళ్ళ జీవిత చిత్రణే..దీనికి మొదట్లో ‘’స్టీఫెన్ హీరో ‘’పేరు పెడదామనుకొన్నాడు .పేర్లలో ఉన్న రిదం బాగా తెలిసిన వాడు .ఇందులో ముఖ్యపాత్ర జాయిస్ ను పోలి ఉంటుంది .చివరి పేరును డేడాలస్ గా  మార్చాడు .డేడాలస్ మనిషిని భూమి నుంచి పైకి తీసుకు పోవటానికి రెక్కలు సృష్టించుకొన్న వాడు .డేడాలస్ అంటే కపట  వేషధారి అని అర్ధం .ఇదంతా ఆయన ఊహ .సింబాలిజం సృష్టి .జార్జ్ రస్సెల్ AE అనే మరు పేరుతొ రాశాదు  ఈయనఐర్లాండ్ లో ఆధునిక వ్యవసాయ పద్ధతులను గురించి ‘’ఐరిష్ హోం స్తేడ్ ‘’పుస్తకం రాస్తూ ,సెల్టిక్ ఉద్యమ రచయితలపై  పుస్తకం తెస్తూ జాయిస్ ను అందరికి అర్ధమయ్యేట్లు సరళంగా రాస్తే ఎడిటర్ వ్యాసానికి ఒక పౌండ్ చొప్పున ఇస్తాడని తనకు ఎప్పుడు వీలయితే అప్పుడు అగ్రిమెంట్ మీదసంతకం చేయచ్చునని మారు పేరు వాడుకోవచ్చని సలహా ఇచ్చాడు .సరేనని ‘’స్టీఫెన్ డేడాలస్ ‘’అనే మారు పేరుతొ మూడు కధలు రాశాడు .

‘’పోర్ట్రైట్ ‘’,నవల ద్వివిధమైన వ్వ్యక్తీకరణ ఉన్న నవల .అందులో తాను  అమితంగా ప్రేమించి ఆరాధించే ఐర్లాండ్ ,అందులో ఒక విలువైన యువరచయిత  వ్యంగ్య చిత్రం కలిసి ఉన్నాయి .శబ్దాలమీద పూర్తీ అధికారం తో ,మాంత్రిక శబ్దజాలం తో అదరగొట్టాడు దీనిపై ఆయనే స్పందిస్తూ ‘’to encounter for the millionth time the reality of experience and forge in the smithy of my soul the uncreated conscience of my race ‘’అంటూ తన ఉద్దేశ్యాన్ని వివరించాడు .ఇందులో విద్యా చరిత్ర ,అసాధారణ జ్ఞానం ఉన్న కౌమారదశలోని కుర్రాడు పరిపక్వతకు చేరుకోవటం అదే సమయం లో దాపరికం లేనిఆ వయసులోని  శృంగార భావనలు కలిసి ఉంటాయి .ఇది సాధారణ రచన కాదు .తరువాత రాయబోయే ఎపిక్ కు నేపధ్యం .ఈ పుస్తకమూ ముద్రణ ప్రసవ వేదన అనుభవించింది .’’ఈగోయిస్ట్ ‘’పత్రికలో సీరియల్ గా వచ్చింది .పుస్తక రూపం లోకి తేవటానికి యే పబ్లిషర్ కూడా సాహసించలేదు .కాగితాలు అమెరికా నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది .

జాయిస్ రాసిన మరో గొప్ప రచన ‘’యులిసెస్ ‘’అది ఆయన ఐరిష్ స్వదేశీయ భక్తీ .హోమర్ రాసిన గ్రీక్ ఎపిక్ పేరును వాడుకొన్నాడు .అందులో హీరో యులిసెస్ తనలాగే దేశం వదిలి ప్రవాసం లో ఉంటూ  దేశదిమ్మరిగా తిరిగాడు .హోమర్ రాసిన కధలోని సంఘటనలు ఇక్కడ ఒక రోజు 1904జూన్ 16న డబ్లిన్ లో జరుగుతాయి .అందులో టేలిమాకాస్ ,యులేసేస్  భార్య మోలీ లు బదులు డేడాలస్,లియో పోల్ద్ బ్లూమ్ పెనెలోప్ ఉన్నారు మిగతా పాత్రలూ చాలా ఉన్నాయి .కదా బ్లూమ్ మీడే ఎక్కువగా నడుస్తుంది .అతని కొడుకు తప్పిపోతాడు మరోకడికోసం తపన పడతాడు .డేడాలస్ మానవులకు దూరమై తండ్రికోసం వెతుకుతుంటాడు .ఇదిఆబాల వృద్ధుల  అందరి జీవితాలలో ఉన్న సమస్య యే .దేనికోసమో పరితపించటం అంతు  లేని అన్వేషణ చేయటం .దీనినే జాయిస్ తండ్రికోసం వెతుకులాటగా సింబలైజ్ చేశాడు .తన జీవితం సంగతి చెబుతూనే ఆధునిక మానవుని అయోమయ పరిస్థితిని చిత్రించాడు .

   యులిసేస్ ను ప్రచురించటానికి చాలాముందే సెన్సార్ కత్తి ఝళిపించింది .1918లో అది ‘’ది లిటిల్ రివ్యు ‘’లో ధారావాహికగా వస్తున్నప్పుడే గుసగుసలు సాగాయి .’’గెట్టిమాక్ డేవేల్’’భాగం ప్రచురితమైనప్పుడు అమెరికాలోని ఆశ్హ్లీల సాహిత్య నిరోధక సంఘం రంగం లోకి దిగింది .అమెరికా పోస్టాఫీస్ అన్ని కాపీలను స్వాధీనం చేసుకొన్నది .సంపాదకులకు జరిమానా విధించి ,వ్రేలి ముద్రలు తీసుకొని ధారావాహికను ఆపేయించింది .అతని అభిమాని సిల్వియా బీచ్ ఆ పుస్తాకాన్ని రహస్యంగా ఫ్రాన్స్ లో ముద్రింప జేసి ,మొదటికాపీని జాయిస్ కు ఆయన 40వ పుట్టిన రోజున అందజేసింది .పుస్తకానికి గ్రీస్ కు చెందిన బ్లూ వైట్ రంగుల కవర్ పేజీనిఏర్పాటు చేయించింది .అది జాగ్రత్తగా సేకరించి భద్ర పరచాల్సిన పుస్తకం అయింది .దుకాణాలలో అమ్మారు .మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేసి దొంగాచాటుగానూ  వదిలారు .ప్రముఖ రచయితా డి హెచ్ లారెన్స్ కూ ఆయన రాసిన ‘’లేడీ చాటర్లీస్ లవర్ ‘’నవల విషయం లో ఇలానే జరిగింది .పుస్తకం అయితే అనేక కాపీలు అమ్ముడు పోయి౦దికాని అయ్యగారి చేతిలో  పెన్నీకూడా  రాలలేదు .పోస్టాఫీస్ వారికి దొరికిన అయిదు వందల పుస్తకాలను తగల బెట్టేశారు .అది సీరియల్ దశనుండి పుస్తకం గా రావటానికి మరొక 15 ఏళ్ళు పట్టింది .ఈ కేసు విచారించితీర్పు చెప్పిన జడ్జి జాన్  ఏం . ఊల్సేచెప్పిన వాక్యాలను .’’whilst in some places ,the effect on the reader is somewhat emetic(వాంతిమందు ) ,nowhere does it tend to be an aphrodisiac (నిరోదిన్చాల్సింది కాదు ) ‘’ ప్రపంచమంతా ఘనంగా చెప్పుకొన్నది.జడ్జి ఊల్సే ఆ పుస్తకాన్ని ‘in terms of catharsis ,the purge of the emotions through pity and terror that Aristotle attributes to tragedy ‘’అని విశ్లేషకులు తెలియ జేశారు .

  పుస్తకం పై నిషేధం తొలగినా విమర్శల జడి వానలు కురుస్తూనే ఉన్నాయి .’’ఇంతదరిద్ర గొట్టు ,నీచ పుస్తకం చరిత్రలో లేదు ‘’అన్నారు .అందులో పాక్షిక రాజకీయం ,ద్వేషం ఉన్నాయన్నారు .సమకాలీన సమాజ నిరర్ధకత్వం ,అరాచకం పెద్ద కాన్వాస్ పై చిత్రించాడు అన్నారు .టి ఎస్ ఇలియట్ మాత్రం ‘’సిన్జీ తర్వాత ఇంతఅద్భుతమైన వచనం రాసిన వాళ్ళు లేరు .ఇదొక మహా కావ్యం .మార్మికతను వాడుకొంటూ సమకాలీనతను ,పురాతనత్వాన్ని కలగలుపుగా చిత్రించాడు .దీనితో ఆర్ట్ లో ఒక కొత్త ప్రపంచ౦ వైపు అడుగులు వేయటం సాధ్యంఅయింది  అని జేమ్స్ జాయిస్ రుజువు చేశాడు ‘’అన్నాడు .ఇందులో చాలాభాగం యే హోమర్ రిఫరెన్స్ లేకుండా హాయిగా చదువుకోవచ్చు .అయితే కొన్నిటికి అర్ధం వివరణ లేక పొతే కీకారణ్యం లో ఉన్నట్లు ఉంటుంది .ఇందులో డిసిప్లినేడ్ లాజిక్ ఉందని అన్నారు .పదాల ఆట సయ్యాటలున్నాయి .మైదాలజి ఫిలాసఫీ ,ఎక్కువ మందికి తెలియని గ్రంధాలు ,వి౦త పాత్రలు,అన్యమత నమ్మకాలు ,కేధలిక్ మత ఉత్సవాలు ,రహస్య ,గూఢవిజ్ఞాన విశేషాలు ఉన్నాయి .అందుకే యులిసెస్ ‘’un questionably the most complex ,the most confusing ,and the most learned novel-if it is a novel –in all literature ‘’

  

యులిసెస్ రాయటానికి జాయిస్ కు ఏడేళ్ళు పట్టింది .అమెరికాలో అది చట్ట రీత్యా చదవతగింది అని తేలినప్పుడు జాయిస్ కు 52 ఏళ్ళు వచ్చాయి .కళ్ళు కనిపించకుండా పోయాయి .చని పోయే లోపు పది ఆపరేషన్లు జరిగాయి .ఇవన్నీ ఎనేస్తీషియా ఇవ్వకుండా జరిపారు .అందుకే వేలాది పేపర్లపై పెద్ద పెద్ద అక్షరాలతో రాయాల్సి వచ్చేది .పొడుగ్గా సన్నగా ఉండి ఎక్కడికి వెళ్ళినా వారిని అతి మర్యాదగా పలకరించటం తో ఆయన్ను అందరూ తేలిగ్గా గుర్తు పట్టేవారు .ఆయన ప్రవాస జీవితం అంతా కష్టాలమయమే .మొ ప్ర యు లో ఆస్త్రియాలోని త్రిస్టీనుంచి స్విట్జర్లాండ్ పంపారు .ఎక్కడా ఆయన్ను ఉంచుకోవటానికి ఒప్పుకొనే వారు కాదు .ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాడు .యుద్ధ విరమణ తర్వాత పారిస్ వెళ్లి శాశ్వత శాంతి ఏర్పడుతుందని కలలు కన్నాడు.జబ్బు ,డబ్బులేమి ,కుటుంబ గొడవలు అతన్ని బాధిస్తూనే ఉన్నాయి .పుస్తకాల పై వచ్చే రాబడి అతి తక్కువ .స్నేహితుల అభిమానుల  సాయం మీదే బతకాల్సి వస్తోంది .వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం కూతురు లూసీ నరాల జబ్బు నయం చేయటానికే ఖర్చయేది .కొంత భరోసా కలిగిన సమయం లో మళ్ళీ అగాధం లో పడ్డాడు ..1940లోరెండవ ప్రపంచ యుద్ధం లో  జర్మన్ సైన్యం ఫ్రాన్స్ ను ఆక్రమించే ప్రయత్నం చేసినప్పుడు జాయిస్ ,కూతుర్ని కదిలించలేక మిగిలిన వారితో స్విట్జర్లాండ్ చేరాడు .కట్టుకొన్న బట్టలు తప్ప యే ఆధారం లేకుండా వచ్చారు.అమెరికానుంచి వచ్చిన సాయం తో జ్యూరిచ్ చేరారు .

దరిద్రం తో పోరాటం ,వంటరితనం ,త్వరగా పోతున్న కంటి చూపు తో ఉన్నా ,జాయిస్ మరొక వివాదాస్పద ‘’ఫిన్నేగాన్స్ వేక్’’రాశాడు .సరళంగా చక్కని భాషలో రాశాడు .ఇందులో కూడా యెడ తెగని ఆలోచనా స్రవంతి నిఅంటే స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ ను కొనసాగించాడు .

Inline image 1 Inline image 2 Inline image 3 Inline image 4


       సశేషం

        మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -188 71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -188

71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్

 పుట్టిన దేశం  ఐర్లాండ్  అంటే అమిత భక్తీ ,ఐరిష్ ప్రజలంటేయూరప్ లో ఆలస్యంగా వచ్చిన జాతి అనే  విపరీత ద్వేషం ఉన్నవాడు జేమ్స్ జాయిస్ .స్వయం నిర్ణయం తో జీవితమంతా ప్రవాసం లో గడిపాడు .దరిద్రం, పక్షపాత ధోరణి ,అనారోగ్యం, దాదాపు గుడ్డితనం తో పోరాడుతూబతికాడు .యవ్వన దశలో ఐరిష్ రినైసంస్ అనే సంకుచిత జాతీయత కు వ్యతిరేకంగా ,పోరాడాడు .’’సెల్టిక్ ట్వి లైట్’’ను కల్టిక్ ట్వాలైట్అంటేకృత్రిమ  వస్త్రాలంకరణఅంటూ నిరశి౦చాడు .సెల్టిక్ ఉద్యమ౦ లో ముఖ్యుడైన కవి విలియం బట్లర్ ఈట్స్ తో ‘’మనం చాలా ఆలస్యంగా కలుసుకొన్నాం .నువ్వు నా ప్రభావం పడటానికి చాలా ముసలాడివై పోయావు ‘’అన్నాడు .ఐరిష్ రివైవల్ కు చెందిన మిస్టిక్ సింబాలిజం ,స్థానిక పురాతన గాధలను తిరస్కరించి ,ఒక కొత్త హింసాత్మక భాషను కొత్త సింబల్స్ తో  దానికి చెందిన ధారావాహిక జటిల విషయాలతో  ఒక విస్తృత మైన తికమక పెట్టె ఆధునిక ప్రపంచ పురాణం  రాశాడు.

      అసలు పేరు జేమ్స్ ఆగస్టైన్  ఆలోసియస్ జాయిస్ .2 -2  -1882 న ఐర్లాండ్  రాజధాని డబ్లిన్ దగ్గర జన్మించాడు .తల్లి గొప్ప సంగీత విద్వాంసురాలు .అది భర్తకు చర్చి కి మధ్య విభజన పొందింది .తండ్రి ఏదీ పట్టని , బాధ్యత లేని అందగాడు  .తండ్రి నుంచి తీవ్ర స్వభావం ,సుస్వర గాత్రం వచ్చాయి .తనకు పుట్టిన 17మంది పిల్లలో జాయిస్ తన అభిమాన పుత్రుడు అని చెప్పుకోనేవాడు తండ్రి .అరవ  ఏట జేసూట్ స్కూల్ లో చేరి ,తర్వాత కాన్గోస్ వుడ్ కాలేజి లో 3 ఏళ్ళు చదివాడు .తొమ్మిదో ఏట తండ్రి పొగడ్తలకు ఉబ్బిపోయి ఒక విలువైన అభినందన రాస్తే ,దాన్ని అచ్చు వేయించి తండ్రి డబ్లిన్ అంతా పంచిపెట్టాడు .11వ ఏట మరో జెసూట్ సంస్థకు కు చెందిన బెల్వేదర్ కాలేజి లో  చేరి 4 ఏళ్ళు చదివాడు .ఇక్కడ తానూ రాసిన వ్యాసాలకు బహుమతులు పొందాడు .అందులో ముఖ్యమైనది ‘’నా అభిమాన హీరో ‘’.15వయసులోనే ఆయనకు నిరంతర దేశ సంచారి ,తుఫాను బాధితుడు యులిసెస్ అభిమాన హీరో అయ్యాడు .  

  16 నుంచి 20 వెళ్ళే వరకు యూని వర్సిటి కాలేజిలో చదివి చాలా పవిత్రమైన విద్యార్ధి అనిపించుకొని జెసూట్ ఆర్డర్ లో చేరుదామనుకొన్నాడు .ఇతరభాషా సాహిత్యాలను విపరీతంగా చదవటం తో అభిరుచి మారింది .20 కె లాటిన్ ఫ్రెంచ్ ,ఇటాలియన్ భాషలలో ఇంగ్లీష్ లో లాగానే ప్రావీణ్యం సాధించాడు.ఇబ్సెన్ అసలు సాహిత్యం చదవాలనుకొని నార్వేజియన్ భాష నేర్చాడు.18లో ‘’ఇబ్సన్స్ న్యు డ్రామా ‘’అనే వ్యాసం రాస్తే ప్రముఖ పత్రిక ‘’ఫోర్ట్ నైట్లి రివ్యు ‘’ప్రచురించింది . నార్వేజియన్ నాటక రచయిత ఇబ్సన్ కు జాబు రాసి అందులో ఆయన సత్యా రాదనను ,ఆయన కు కళా నియమాలపై ఉన్న ఉదాసీనతను అభినందించాడు .20 లో డిగ్రీ పొంది ‘’డబ్లిన్ గాంగ్  ‘’తో ఉండటం ఇష్టం లేక డబ్లిన్ వదిలి పారిస్ చేరాడు .’’ఎ పోర్ట్రైట్ ఆఫ్ ఆన్ ఆర్టిస్ట్ అస్ ఎ యాంగ్ మాన్ ‘’రచనలో దీన్ని వివరిస్తూ ‘’నాకు నమ్మకం లేని  నా స్వంత ఇల్లు అయినా పితృ దేశమైనా లేక నా చర్చ్ అయినా  నేను సేవ చేయలేను ‘’అన్నాడు .దీన్ని మరింత చేదుగా దూషణ భాషలోకవిత లో  ఇలా చెప్పాడు  –

‘’This lovely land always sent –her writers and artists to banishment –and in a spirit of Irish fun-betrayed her own leaders ,one by one ‘’.

 పారిస్ కు ఒక సిఫార్సు ఉత్తరం రెండు పూడు పౌండ్లడబ్బు ,  కొన్నికవితలతో తో చేరాడు  .అక్కడ ఏదో ఒక కాలేజి లో మెడిసిన్ చదవాలనుకొన్నాడు ,కాని దానికి ముందే డబ్బు కట్టాలని తెలుసుకొని విరమించుకొన్నాడు .డబ్బు సంపాదించే కవితలేవీ రాయలేక పోయాడు .కనుక చేతిలో పైసా కూడా లేకకడుపు మాడ్చుకొని దాదాపు పస్తులతో గడిపాడు .అతనికి అందుబాటులో ఉన్నది కోకా ఒక్కటే .అదే ఆయన యులిసేస్ లో సంస్కారపర౦గా సింబాలిక్ అయింది .తి౦డిలేకపోతే కండ ఉండదు కనుక జబ్బు పడ్డాడు .విపరీతమైన పంటి నొప్పి బాగా బాధించింది .పంటి చికిత్సకు డబ్బుల్లేవు .ఈ దెబ్బ తిన్న దంతాలవలననే తరువాత కంటి వ్యాధి వచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి .ప్రొఫెషనల్ సింగర్ అవుదామని ఉంది .సంగీతపాఠాలు నేర్చుకొందామనుకొంటే గురు దక్షిణ కు గుడ్డి గవ్వ కూడా లేదు .ఆరు నెలల తర్వాత ఇంటికి రమ్మని కబురొచ్చింది తల్లి చావు బ్రతుకుల్లో ఉంది కొడుకును మత ప్రచారకునిగా ఉండమని  కోరితే కాదు పోమ్మందుకు ఆమె జబ్బు మరీ పెరిగి చనిపోయింది

  21 వ ఏడు సందడిగా గడిచింది .పూటుగా తాగి చేత పెన్నీ కూడా లేకుండాచింకి బొంత తో  కొంప వదిలి వచ్చేశాడు .మురికి కూపాల గదులలో బతుకుతూ మారుతూ గడిపాడు .డాల్కీలోని క్లిఫ్తన్ స్కూల్  లో టీచర్ గా చేరి ఇతర భాషలను నేర్వటం మళ్ళీ మొదలు పెట్టాడు .నేషనల్ ఫెస్టివల్స్ లో టెనార్ పోటీలలో పాల్గొని అంతకు పూర్వం జన మెక్ కొమార్క్ లాగా విజయం సాధించాలనుకొన్నాడు .ప్రేక్షకులు ,న్యాయ నిర్ణేతలు ఆతని విధానాన్ని బాగా మెచ్చారు .అతనికే ప్రైజ్ వస్తుందని అందరూ అనుకొన్నారు.  కాని మూడవ పరీక్ష సైట్ రీడింగ్ టెస్ట్ కు తాను  సంగీతం  చదవలేదని కనుక పూర్తీ న్యాయం చేయ లేనని చెప్పి  అంగీకరించలేదు  . రాజీ మార్గం వదిలేసి అక్కడినుండి బయటికి వెళ్ళిపోయాడు .అతని స్వర మాధుర్యం గ్రహించిన ఒక కోచ్ కొద్ది పాటి ఫీజు తో ఒపేరా సంగీతం నేర్పు తానని ముందుకొచ్చాడు .కాని ఆయనతో నిబంధనల గురించి మాట్లాడటానికి ఇష్ట పడలేదు .డాల్కేలో నారా బర్నాకిల్ అనే అమ్మాయిని ప్రేమించి 1904అక్టోబర్ లో పెళ్లి చేసుకొన్నాడు .కొత్తదంపతులు స్విట్జర్లాండ్ చేరారు .అక్కడ అనుకొన్న ఉద్యోగం రాక ,ట్రీస్టీచేరి  బ్ర్లిత్జ్ స్కూల్ లో భాషా బోధకుడు గా కుదిరాడు .

  ఇకపై పాతికేళ్ళ జాయిస్ జీవితం అంతా బాధ ,ప్రవాస చరిత్రే .ఒకదానిపై ఒకటి రోకటి పోట్లే.ముద్రణకు కానీ లేదు .ఆదరణ లేదు .అసంతృప్తి అసహనం ,అనుకొన్నది ఆలస్యంగా జరగటం ,డిప్రెషన్ లతో బాధామయ గాధ అయింది జేవితం .23 లో కొన్ని చిన్న కధలు రాసి ముద్రణకిస్తే  పబ్లిషర్ కు అందులో ఉన్న నేచురలిజం చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పి పుస్తకం పూర్తీ అయినా చేతికివ్వలేదు .మరొకడు ఒప్పుకొని అచ్చువేసి జాయిస్ స్వంతంగా ప్రింట్ చేసుకొంటానంటే జాయిస్ కు అమ్మకానికి కూడా  ఒప్పుకో లేదు .కోపం వచ్చి టైప్ ను ధ్వంసం చేసి కాగితాలను చింపి పారేశాడు .ఇది అచ్చు వేయటానికి పదేళ్ళు పట్టింది .1914లో లండన్ లో ఇదే ‘’డబ్లినర్స్ ‘’గా వెలుగు చూసింది .

  జాయిస్ ముద్రించిన మొదటి పుస్తకం  ‘’చేంబర్ మ్యూజిక్ ‘’కవితా సంపుటి 25 వ ఏట వెలువడింది.ఇందులో శ్లేష ,పరిహాసం ఉన్నాయి .ఈ విరుద్ధ విపరీత ప్రతి వాద కవిత్వ౦  తోనే జాయిస్  గుర్తింపు పొందాడు .ఇది ప్రయోగం కాదు .పూర్తిగా సంప్రదాయమే  .17 వశతాబ్ది గాయకుల ,ఫ్రెంచ్ సింబాలిస్ట్ ల ,విలియం బట్లర్ ఈట్స్ తొలి లిరిక్కుల ప్రతిధ్వనులే ఇవి .దీని తర్వాత రచనలన్నీ తన సృజన ,కొత్త విషయాలతో రాసినవే .మైనర్ ఎలిజబెతేన్ సంగీతం అంటే జాయిస్ కు ప్రాణం . వచనాన్ని వదిలేశాక నలభైలలో మళ్ళీ కవిత్వం రాసి ‘’పోయెమ్స్ ఆఫ్ పెనీచ్ ‘’పేర ప్రచురించాడు .’’డబ్లినర్స్ ‘’అనువాదం .దీనిలోరిపోర్టర్ గా  జాయిస్ ఉంటాడు .తాను  పుట్టిన సిటి డబ్లిన్ లోని విషాద గాధల వివరణ .ఒకరకంగా స్వీయ చరిత్రకూడా .మొదటి మూడు కధలలో తనబాల్యం లో కొన్ని భాగాలున్నాయి .మిగిలినవన్నీ తన సమకాలికుల గర్వం పొగరు దాష్టీకం లపై దయారహిత వ్యాఖ్యానాలే .వ్యంగ్య చిత్రణే.ఇందులోని టు గాలంట్స్ ,ఈవేలిన్ ,కౌంటార్ పార్ట్ ,ది డేడ్ ఎపిసోడ్ లు బాగా ఆలోచింప జేసి యధార్ధాన్ని తెలియ బరుస్తాయి .చివరిది చాలా పదునైన సున్నితమైనకధ.ఇందులో పూర్తీ రియలిస్ట్ ,పూర్తిగా సింబలిస్ట్ గా మారుతాడు  .

 

Inline image 1Inline image 2

          సశేషం

      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లిబరలిజం తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-4(చివరి భాగం

—

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -187

70-న్యు డీల్  ,అమెరికన్ లిబరలిజం  తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-4(చివరి భాగం )

రెండవ ప్రపంచ యుద్ధం లోకి7-12 -1941న జపాన్ ప్రభువులు అమెరికాలోని పెరల్ హార్బర్ పై ఆత్మ హత్యా సదృశ పాశవిక దాడులతో ఆక్రమించే ప్రయత్నం లో  అమెరికా బలవంతాన లాగ బడింది .ఇలా చాల దేశాలలో జరిగినా రూజ్ వెల్ట్ దీన్ని ‘’ప్రజలలో విశ్వాసం ఉన్న వారికి నియంతలపై విశ్వాసం ఉన్న వారికి మధ్య జరిగే యుద్ధం ‘’అన్నాడు .చర్చిల్ తో చర్చించి ఐక్య రాజ్య సమితి ఏర్పాటు చేయించాడు .ఉత్తర ఆఫ్రికా పై ఆంగ్లో అమెరికన్ దాడి చేయించాడు .మిత్ర దేశ సైన్యాల పరస్పర సహకారం తో నాజీ నియంతృత్వాన్ని ఎదుర్కొవాలన్నాడు .టెహరాన్ లో మొదటి సారి రష్యా నియంత స్టాలిన్ తో సమావేశమై యుద్ధం లో గొప్ప ముందడుగుకు సిద్ధమై యూరప్ పడమటి తీరం పై విరుచుకుపడి జర్మని సర్వనాశనానికి పూను కొన్నాడు .

  1944లో అన్ని సంప్రదాయాలకు భిన్నంగా నాలుగో సారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశాడు .పూర్వం అంత కాకపోయినా మంచి మేజారిటీతోనే నెగ్గాడు .ప్రజలకు ఆయనపై పూర్తీ విశ్వాసం ఉంది .విపక్షులు కాకి గోల చేశాయి .రిపబ్లికన్ అభ్యర్ధి ధామస్ యి డ్యూయీ కి కేవలం 99ఎలెక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి .రూజ్ వెల్ట్ కు 432 .దేశావ్యాప్తంగా వేలాదిమందితో పరిచయాలు ,మిలియన్ల కొద్దీ  ఆరాధకులు ,ఉన్నప్పటికీ సన్నిహితులు అతి తక్కువ మందే ఉండేవారు .ఆయనపై భారం అధికమైంది .62 ఏళ్ళ వాడు బాగా ముసలాడిగాకనిపిస్తున్నాడు .జుట్టు తెల్లబడింది కవళికలు బలహీనమై  భావ వ్యక్తీకరణ గంభీరమై  ముఖం పాలి పోయింది.ఒంటరివాడై దిగులుగా ఉన్నాడు .యుద్ద౦ ఎలాంటి ముగింపు ఇస్తు౦దోనని ఆందోళన పడుతున్నాడు .శాంతి భయ పెడుతోంది .శాంతికోసం మళ్ళీ యాల్టా లో చర్చిల్ స్టాలిన్ లతో భేటీ వేశాడు .ఈ సమావేశం బాధాకర వివాదాలను ,అనంతమైన వైరుధ్యాలను కలిగించింది . నిందించే వాళ్ళు ‘’బుజ్జగింపులు ‘’,ద్రోహం ‘’,అమ్మేశాడు ‘’అన్నారు .ఈ వ్యతిరేకత ఆయన చనిపోయినా ,డెమొక్రాట్ లు1952లో  ఘోరం గా ఓడిపోయేదాకా ఆగలేదు  .రష్యా సైన్యం పోలాండ్ ను ఆక్రమించి,పడమటి వైపుకు దూసుకొస్తున్నాయి .రూజ్ వెల్ట్ బేరాలు ,ఒడంబడిక లలో మునిగాడు కొన్ని బెడిసి కొట్టాయి .శాశ్వత శాంతి స్థాపన సాధ్యమే నని పూర్తిగా నమ్మాడు కాని అది తప్పు అని తేలింది .యుద్ధం ముగియటానికి ,అతి త్వరగా పూర్తీ అవటానికి తొందర పడ్డాడు .ఒడంబడికలన్నీ రష్యా ఉల్లంఘించింది .దీన్ని రూజ్ వెల్ట్ ముందే గ్రహించి ఉండాల్సింది .కాని ఆయన ఆశతో ,భయం తో పరస్పర అవగాహన ,సౌహార్దత పొందవచ్చు అనుకొన్నాడు .

   కొన్ని వారాల తర్వాత 63వ పుట్టిన రోజున కాంగ్రెస్ కు యాల్తాసమావేశ విషయాలు వివరించి చెప్పాడు .అలసి సొలసి వార్మ్ స్ప్రింగ్స్ కు  మార్చ్ చివరలో విశ్రాంతికి వెళ్ళాడు   .రెండు వారాల తర్వాత ఆయన పోర్ట్రైట్ పూర్తి అయ్యాక అకస్మాత్తుగా ఒక రోజు  విపరీతమైన తల నొప్పి వచ్చి బాధ పడ్డాడు .మరొక మూడు గంటల లోపే సెరిబ్రల్ హేమరేజ్ వచ్చి 1945ఏప్రిల్ 12 సాయంత్రం 5-47గం లకు తుది శ్వాస విడిచాడు .ఈ విషాద వార్తా దేశమంతా వార్తామాధ్యమాల ద్వారా జనాలకు తెలిసింది .అమెరికా మొత్తం అచేతనమై వణికి పోయింది .ఆయనను నమ్ముకొని  ఆయనపైనే ఆధార పడి ఈ 13 ఏళ్ళు జీవించిన మిలియన్ల జనం ఒక్కసారిగా నిశ్చేస్టు లయ్యారు .ఆయన అంత్య క్రియలనాడు ఆబాల వృద్ధ జనం అందరూ ఆపుకోలేని ఏడుపుతో పొర్లి పొర్లి దుఖించారు .ప్రపంచ వ్యాప్తంగా నాయకులు ఒకరినొకరు కలుసుకొని ఊరడించు కొన్నారు .ఆయనకు నలుగురు కొడుకులు ,ఒక కుమార్తె. భార్య అన్నా ఎలినార్ గొప్ప మానవతా వాది,ప్రజాసంబంధాలు బాగా కలిగిన ప్రధమ మహిళ.

  రూజ్ వెల్ట్ పై పన్నీరు చల్లారు బురదాచిమ్మారు .ఆయన పాలనలో కాపిటలిజం బాగా పెరిగిందని ,స్వేచ్చా వాణిజ్యం దెబ్బతిందని,తన క్లాస్ వారిని మోసగించాడని ఆరోపణలున్నాయి .అయినా ఆయన చేసిందిఅంతా  ప్రజా సంక్షేమం కోసమే .అభి వృద్ధి విధానం లో న్యు డీల్ గొప్ప ముందడుగు .సామాన్యమానవుడు అంటే ఆలోచన లేని వాడుకాడని ఆతను ఒక వినియోగ దారుడు అని గుర్తించి గౌరవించిన వాడు రూజ్ వెల్ట్ .ఈ సామాన్య మానవులే వినియోగ దారులుగా ప్రవర్తించక పొతే తన క్లాస్ వాళ్ళు నట్టేట మునిగే వాళ్ళు అంటాడు .కేపిటలిజం అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది అన్నాడు .’’వైట్ హౌస్ లో కుంటాడు ‘’అని శత్రువులు దెప్పినా ,ఆయన్ను అర్ధం చేసుకోన్నవాళ్ళు ఆరాధించారు .ఆయన్నుమరింత హాయిగా జీవించగలిగే  ప్రపంచాన్నిచ్చిన ప్రపంచ  పౌరుడు అన్నారు .స్టీఫెన్ వింసేట్ బెంట్ కవి మాటలలో రూజ్ వెల్ట్ ‘A country squire from Hyde Park with a Harvard  accent –who never failed the people –and whom the people will not fail ‘’

    మాంచి దాటీ వక్త యే కాని గొప్ప రచయిత కాదు రూజ్ వెల్ట్ .వివాదం లో ,అసమ్మతి ప్రకటనలో గొప్పవాడు కాదు కాని గొప్పతనం పొందాడు .దాన్ని ప్రతి సందర్భం లోనూ వికిరణ  కాంతి లాగా ప్రదర్శించేవాడు .ఆయన ప్రతి పాడించిన ’’ ది సమ్మరి ఆఫ్ ఫోర్ ఫ్రీడంస్ ‘’ప్రపంచ వ్యాప్త ప్రచారం పొందింది .’’the first is the  freedom of speech and expression –everywhere in the world .The second is freedom of every person to worship god in his own way –everywhere in the world .The third is freedom from want –everywhere in the world .The fourth is freedom from fear which translated into world terms ,means a worldwide reduction of armaments to such a point  that no nation will be in a position to commit an act of physical aggression against any neighbor –anywhere in the world .That is no vision of a distant millennium .It is a definite base for a kind of world attainable in our own time and generation ‘’అన్న మహోన్నత మానవతా మూర్తిమత్వం రూజ్ వెల్ట్ ది .   రూజ్ వెల్ట్ మైనారిటీల హీరో .ముఖ్యంగా ఆఫ్రో అమెరికన్ ల ,కేధలిక్కుల, జ్యూ ల సంక్షేమాన్ని అమలు చేశాడు .చైనా ,ఫిలిప్పినో అమెరికన్ల అభిమానం ,మద్దతు పొందాడు ,న్యు డీల్ లో వీరందరి అభి వృద్ధికి దోహద పడ్డాడు .ఆఫ్రికన్ అమెరికన్ ల పౌరహక్కులకోసం ప్రయత్నించాడు . అమెరికాలోఉన్నపౌరసత్వం లేని  ఇటలీ పౌరులు ఆరు లక్షలమంది పై  ఉన్న ఆంక్షలను 1942అక్టోబర్ లో తొలగించాడు .లక్షా ఇరవై వేలమంది జపనీయులను వెస్ట్ కోస్ట్ ను వదిలి పొమ్మన్నాడు . Reflecting on Roosevelt’s presidency, “which brought the United States through the Great Depression and World War II to a prosperous future”, said FDR’s biographer Jean Edward Smith in 2007, “He lifted himself from a wheelchair to lift the nation from its knees.

ఆయన హైడ్ పార్క్ నివాసం జాతీయ చారిత్రిక చిహ్నంగా మార్చారు .వాషింగ్టన్ డి సి లో ఏడున్నర ఎకరాలలో ఆయన మెమోరియల్ ఏర్పాటు చేశారు .

Inline image 1Inline image 2

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3 7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -186 70-న్యు డీల్ ,అమెరికన్ లిబరలిజం తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-3

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -186

70-న్యు డీల్  ,అమెరికన్ లిబరలిజం  తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-3

   అయినా అమెరికా ఇంకా భయ విహ్వాలతతోనే ఉంది .రూజ్  వెల్ట్ మొదటి బాధ్యత ఉదాసీన ,అనుమాన౦ , నమ్మకం లేని స్థితి నుంచి  ప్రశాంత స్థితి కల్పించటం ‘’.వాస్తవ స్థితులను గమనించి కు౦గి పోకూడదు .ఇలాటి ఎన్నో ఉపద్రవాలను తట్టుకొన్న దేశం ,జాతి మనది ,ప్రతి సంక్షోభం నుంచీ విజయవంతంగా బయట పడింది .ఇప్పుడు మనం భయ పడాల్సింది భయం గురించి తప్ప మరి దేని గురించి కాదు .మళ్ళీ మనం అభివ్రుద్ధిసాధించి ,విజయం తో విలసిల్లుతాం .సమస్యలు చుట్టుముట్టి ప్రగతిని పక్షవాతానికి గురి  చేసింది .దానికి తగిన ట్రీట్ మెంట్ ఇచ్చి మళ్ళీ చైతన్యవంతం చేద్దాం  ‘’అని రూజ్ వెల్ట్ ప్రెసిడెంట్ గా పదవీ స్వీకారం చేసిన రోజు జాతిని ఉద్దేశించి చెప్పి ధైర్యం కలిగించాడు .పదవిలోకి రాగానే విస్తృత యాజమాన్యం తో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు .అధిక లాభం ,డివిడెండ్ లపై పన్నులు విధించాడు .ప్రభుతోద్యోగుల జీతాలు  పెన్షన్లు తగ్గించాడు  ,బాంక్ లపై కంట్రోల్ కోసం కాంగ్రెస్ అనుమతి పొందాడు .డాలర్ విలువ తగ్గించాడు .దేశం లో ఉన్న బంగారాన్ని అంతా బయటికి తీయించి గోల్డ్ స్టాండర్డ్ కల్పించాడు .

ఇది ఆరంభం మాత్రమే .వాషింగ్టన్ లో ఆర్ధిక వేత్తల ,సైంటిస్ట్ ల ,రచయితల టీచర్ల ,రాజకీయ పండితుల ను సమావేశ పరచి చర్చించాడు .ప్రెసిడెంట్ సరళీ కృత విధానాలను ‘’ది బ్రెయిన్ ట్రస్ట్ ‘’అని హేళన చేశారు .లెక్కచేయలేదు .మూడే మూడు నెలల్లో ఆయనా ,ఆయన తో  ఉన్న మేధావులు కలిసి ‘’న్యు డీల్ ‘’ప్రయోగానికి సిద్ధమయ్యారు .నేషనల్ ఇండస్ట్రి యల్ రికవరీ యాక్ట్ తో సహా అగ్రికల్చరల్ అడ్జెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ,సివిల్ కన్జర్వేషన్  కార్ప్స్ మొదలైన  వాటిని ఏర్పాటు చేశాడు .ఇందులో కొన్ని ఫెయిలయ్యాయి కాని  1933కు అవే అత్యవసరమైనవయ్యాయి .సెక్యూరిటి యాక్ట్ వాల్ స్ట్రీట్ ను నియంత్రించింది .సివిలియన్ కన్జర్వేషన్ కార్ప్స్అరమిలియన్ యువకులకు ఉద్యోగాలు కల్పించింది .హోం ఓనర్స్ లోన్ అసోసియేషన్ తేలికగా తనఖాపై అప్పు సౌకర్యం కల్పించింది .టేనస్సీ వాలీ అధారిటి భూ క్షయాన్ని నివారింఛి పారిశుధ్యం విద్యుత్తూ ,వరద నివారణ లను చేసి దక్షిణ ప్రాంతం లో దరిద్రం లో మగ్గు తున్న వారి పాలిటి ఆశా జ్యోతి అయింది .నేషనల్ ఇండస్ట్రియల్ యాక్ట్ బాలకార్మికులపై నిషేధం విధించి,వస్తువుల ధరలు తగ్గించింది ,అన్యాయపు పనులకు చెక్ పెట్టింది ,ఉద్యోగుల వేతనాలు  పెంచింది  ,పని చేసే చోట్ల అద్భుత సౌకర్యాలు కలిపించింది ,ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో లేబర్ హక్కులను సాధించింది .లేబర్ యూనియన్ ను సంప్రదించకుండా యజమాని ఉద్యోగాలు ఇవ్వరాదనేది అమలైంది .

  వీటితో గొడవ ,పేచీలతో పరిస్థితి  కొంత భయానకమైంది .దాదాపు పత్రికలన్నీ రిపబ్లికన్ ల చేతుల్లో ఉన్నాయి కనుక అవి విషం కక్కాయి  .ఒక పత్రిక కాలం లో న్యు డీల్ ఫాసిస్ట్ విధానం అంది .మరోటి కమ్యూనిస్ట్ విధానం అన్నది .తాను తెచ్చిన ప్రతి కొత్త చట్ట౦ తో వ్యతిరేకులు పెరుతున్నా ,తన సంస్కరణలకే కట్టు బడి ముందుకు కదిలాడు రూజ్ వెల్ట్ .’’సంపద పన్ను ‘  నినాదం ’బాంకర్లను  వాణిజ్య వర్గ స్నేహితులను దూరం చేసింది .కాని ఆయనలో కనిపిస్తున్న మానవతా కార్యక్రమాలకు ప్రజా సమూహాలు విపరీతమైన మద్దత్తు నిచ్చాయి. కనుక రెండవ సారి ప్రెసిడెంట్ గా ఎన్నికవటానికి ఢోకాలేదని పించింది .1936లో నామినేషన్ వేసి ఒక ఇంగ్లిష్ జడ్జి చెప్పిన ‘’necessitious men are not free men ‘’అన్న వాక్యం ఉదాహరించాడు .ఎకనామిక్ రాయలిస్ట్ లనుద్దేశించి ‘’better the occasional faults of a government that lives in a spirit of charity than the consistent omissions of a government frozen in the ice of its own indifference ‘’అని మెత్తని చెప్పుతో కొట్టినట్లు చెప్పాడు .

    రేడియో ద్వారా సామాన్య జనాన్ని’’ఫైర్ సైడ్ చాట్ ‘’’(కుర్చీలో కూని రాగాలు )పేరుతొ తరచుగా   పలకరిస్తూ ప్రతిసారి యాభై వేల మిలియన్ల ప్రజలు రేడియో లో తన ప్రతిమాటా వినేట్లు చేసి మరీ దగ్గరయ్యాడు .ఆయన మాటలు వారిని మంత్రం ముగ్ధం చేసేవి ,అందులోని ప్రతి విషయం వారి గుండెల్లోకి సూటి గా చేరేట్లు చేశాడు తన అత్యద్భుత వాక్చాతుర్యం తో .వివేకం కల రాజకీయ వేత్తగా,తన శక్తి సామర్ధ్యాలను గొప్పగా వ్యక్తీకరించే మహా నటుడిగా ,తన దేశ ప్రజల పాలిటి ఆపద్బా౦ధ వుడిగా ఒక ‘’పెద్దన్న’’ గా వారి మనసులలో నిలిచి ఉండిపోయాడు .ప్రతి ఉపన్యాసమూ ‘’మై ఫ్రెండ్స్ ‘’అంటూ ప్రారంభించి వాళ్ళ మనసుల్ని దోచుకొన్నాడు .వీటన్నిటితో ప్రజలు ఆయనకు సన్నిహితస్నేహితులు అవటమేకాదు వారికి ఆరాధ్య దైవమే అయ్యాడు  .రెండో సారి గెలుస్తాడనే అందరూ అనుకొన్నా మొదటి సారికంటే భారీ మెజార్టీతో గెలవటం అందర్నీ ఆశ్చర్య పరచింది .కాన్సాస్ రాష్ట్ర పూర్వ గవర్నర్ ఆల్ఫ్రెడ్ ఏం లండన్ తో ఈ సారి పోటీ .అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల చరిత్ర లో ఎప్పుడూ రాని భారీ మెజారిటీతో గెలిచి ఏక పక్ష విజయం గా నిరూపించాడు .523 లో 521ఎలెక్టో రల్ ఓట్లు సాధించాడు కేవలం రిపబ్లికన్ లకు అధికబలమైన మెయిన్ ,వెర్మాంట్ లలో ఆ రెండూ పోయాయి .

   రెండవ సారి అధ్యక్షోపన్యాసం లో మొదట దేశపు చురుకైన ఆరోగ్యానికి చేయవలసింది చాలా ఉందని ,దేశం లో మూడవ వంతు ప్రజలు సరైన నివాసం వస్త్రాలు ,పోషకాహారం లేక ఇబ్బంది పడుతున్నారని ,మిలియన్లజనం వ్యవసాయ ,పారిశ్రామిక ఉత్పత్తులను కొనే సామర్ధ్యం లేకుండా ఉన్నారని ,వారి దారిద్ర్యం పనికి దూరం చేస్తోందని ,వీటినన్నిటినీ సరి చేయాల్సిన తక్షణ అవసరం ఉందని చెప్పాడు .ఆశా వివేకం తో రాగల ఉజ్వల భవిష్యత్తును గురించి చెప్పిన మాటలివి ‘’మొదటి సారి గద్దేనేక్కినప్పుడు నేను స్వార్ధం పదవీ వ్యామోహ శక్తుల పై నాపోరాటం అన్నాను .,ఇప్పడు రెండో సారి పదవీ బాధ్యతతీసుకొంటున్నప్పుడు ఆ శక్తులు వాటి యజమానిని కలిశాయి ‘’అన్నాడు .అయన వ్యతిరేకులు దేన్నీ ఉపెక్షించలేదు .విషపు మాటలతో ద్వేషం కక్కారు .’’మాకియవెలేన్ ఈగోయిస్ట్ ‘’అన్నారు .రూజ్ వెల్ట్ తప్పులూ చేశాడు .సుప్రీం కోర్ట్ లో తోమ్మిదిమందికి బదులు 15 మంది జడ్జీలు ఉండాలని కాంగ్రెస్ ను కోరాడు .ప్రముఖ డెమొక్రాట్ నాయకులే దీన్ని వ్యతిరేకించారు .కనుక వోటింగ్ కు రాకుండానే ఈ సూచన చచ్చిపోయింది .ఆయన్ను ఓడించవచ్చుననే నమ్మకం తో రిపబ్లికన్లు ఎదురు తిరిగారు .కాంగ్రెస్ ఇప్పటివరకు ఆయన సూచనను అంగీకరించే స్థితిలో ఉంది కాని దీనివలన ఆయనకు విస్తృత ఎక్సిక్యూటివ్ అధికారాలు లభి స్తాయని , పబ్లిక్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ తో సహా అన్నిటా  ఇష్ట మొచ్చినవారికి కాబినెట్ పదవుల పందారం చేస్తాడని భావించి తిరస్కరించింది .

  దేశం రెండు అతి ముఖ్య విషయాలతో సతమతమై గిలగిల లాడుతోంది .అందులో ఒకటి యుద్ధ ప్రమాదం .రెండవది పాత సంప్రదాయాన్ని కాదని నిబంధనలను తుంగలో తొక్కి ,అన్నిటికి విరుద్ధంగా   రూజ్ వెల్ట్ మూడవ సారి 1940లో  ప్రెసిడెంట్ పదవికి సిద్ధమౌతున్నాడని .మొదటిది రెండోదానికి దారి చూపించింది .చాలాకాలంగా ఇక ప్రెసిడెంట్ పదవి చాలు అనుకొంటూ నే ఉన్నాడు కాని విస్తరిస్తున్న యూరోపియన్ యుద్ధంవలన  తటస్థ దేశమైన అమెరికా కు ఇబ్బందులెదురౌతాయేమో నని ,చికాగో లో డెలిగేట్లు మొదటి బాలెట్ లోనే రూజ్ వెల్ట్ ను నామినేట్ చేశారు .దీనితో అమెరికా రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు జార్జ్  వాషింగ్టన్ ఏర్పరచిన రెండు సార్లు మాత్రమె పోటీ చేయాలనే    సంప్రదాయాన్ని కాదని మూడవ సారి నిలబడటానికి సిద్ధమయ్యాడు .58ఏళ్ళ వయసులో దీన్ని  సమర్ధించు కొంటూ తానూ నియంతగా మారటం లేదని ,అంతర్జాతీయ విపత్తు సమయం లో ,అన్ని పక్షాలవారు ప్రభుత్వానికి బాసటగా నిలవాలని అభ్యర్ధించాడు .

  యుద్ధానికి దేశాన్ని సన్నద్ధం చేయటమే ఇప్పుడు ఆయన ప్రధాన విషయమై పోయింది .నిర్బంధ సైనిక శిక్షణ అమలు చేశాడు .యాభై పాత డిస్ట్రాయర్ లను 99 ఏళ్ళ లీజ్ కు తీసుకొని అట్లాంటిక్ సముద్ర బ్రిటిష్ స్థావరాల వద్ద నిఘా ఉంచాడు .న్యు డీల్ ను పారిశ్రామిక సంస్థలు అధిక తుపాకుల టాంకు ల ,ఆయుధ సామగ్రి  తయారీకోసం  కొంత ఉదారం చేశాడు .దీనితో అమెరికాను ‘’ఆర్సేనల్ డెమోక్రసీ ‘’(సాయుధ ప్రజాస్వామ్యం )గా మార్చాడు .ఇంగ్లాండ్ ఫ్రెంచ్ మిలిటరీ సహకారం పొందాడు .అమెరికాలోని అన్ని జపాన్ ,ఇటలీ నౌకలను స్వాధీనం చేసుకొన్నాడు .గ్రీన్ లాండ్ కు సైన్యాన్నిపంపాడు .ఇంగ్లాండ్ ప్రధాని చర్చిల్ తో అతి రహస్య సమావేశం జరిపి ‘’అట్లాంటిక్ చాప్టర్ ‘’రూపకల్పన చేసి నాజీ నియంతృత్వం నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించి యుద్ధానంతర ప్రపంచం సముద్రాలపై అంతర్జాతీయ స్వాతంత్ర్య౦ ,ప్రజల స్వీయ నిర్ణయ హక్కు ,బలవంతపు దాడులులేకపోవటం  ,ముడి సరుకులను విజేత ,పరాజిత ,నాశనమైన  దేశాలతో సహా అందరూ  పంచుకోవటం ‘’అనే అంశాలకు ప్రాముఖ్యత నిచ్చారు .

Inline image 3

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -185 70-న్యు డీల్ ,అమెరికన్ లిబరలిజం తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -185

70-న్యు డీల్  ,అమెరికన్ లిబరలిజం  తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-2

 

  వివాహ సమయం లో రూజ్ వెల్ట్ కొలంబియా లా స్కూల్ లో చదువుతున్నాడు .రెండేళ్ళ తర్వాత ‘’అడ్మిరాల్టి లా’’(దళాధిపతి చట్టం )ను స్పెషలైజ్ చేద్దామనుకొన్నాడు .బార్ కౌన్సిల్ లో చేరాడు .ఇంతలో తండ్రి చనిపోతే హైడ్ పార్క్ లో ఆతిధ్య బాధ్యతలు చేబట్టాడు ఇక్కడే ఇద్దరు పిల్లలు పుట్టారు .స్థానిక రాజకీయాలలో ప్రవేశించి బలపడి స్టేట్ సెనేట్ కు నామినేట్ అయ్యాడు .ఆయన పేరు మంత్రం ముగ్ధం అయి  విపరీతమైన పేరు ప్రఖ్యాతులొచ్చాయి .రిపబ్లికన్ లకు బలమున్న చోట డెమొక్రాట్ అభ్యర్ధిగా పోటీ చేశాడు .సివిల్ వార్ తర్వాత ఇక్కడి నుంచి ఎన్నికైన ఏకైక డెమోక్రాటిక్ సెనేటర్  రూజ్ వెల్ట్ ఒక్కడే .ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కొన్నాడు .నిలువెత్తు మనిషి, నీలి కళ్ళతో అందమైన జుట్టుతో బలమైన ముక్కు, దవడలు తో అందగాడు .’’ఆయన అంత ధన సంపన్నుడు కాక పోయి ఉంటె ,ఆ  పర్సనాలిటీ సినిమా ఇండస్ట్రిని ఏలుతూ ఉండేది ‘’అని న్యూయార్క్ హెరాల్డ్’’ రాసింది .అననుకూల పరిస్థితులలో, ఓడిపోతాడనే జోష్యాలతో ఉక్కిరి బిక్కిరౌతూ కూడా ఏది ఏమైనా గెలిచి తీరాల్సిందే అని నిర్ణయించుకొన్నాడు .ఈ సందర్భం లోనే ‘’there is nothing I love so much as a good fight ‘’అన్నాడు .తీవ్రమైన ప్రచారం తో ప్రత్యర్ధిని ఆత్మ రక్షణలోకి తోసేసి ,వ్యంగ్యం తో,నయనా భయానా బెదర గొడుతూ ,పల్లెలు పట్టణాలు కారులో తిరిగి చుట్టేస్తూ ,ఇదివరకు యే పార్టీ అభ్యర్ధీ తిరగని మారు మూల ఊళ్ళన్నీ చుట్ట బెడుతూ అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ దారికి తెచ్చుకొంటూ న్యు యార్క్ రాష్ట్రం అంతా కలయ  తిరిగాడు .రూజ్ వెల్ట్ కు తప్ప అందరికి ఆశ్చర్యం కలిగే విధంగా గెలిచి తన సామర్ధ్యమేమిటో రుజువు చేసుకొన్నాడు .లా ఫర్మ్ వదిలి ఆల్బనికి చేరాడు .

   స్టేట్ సెనేటర్ గా లిబరల్ దృక్పధం తో పనిచేశాడు.అభివ్రుద్ధికరమైనవాటిని స్వాగతించాడు  .స్త్రీ వోటు హక్కు ఆ నాడు వివాదాస్పదమైనదే అయినా సమర్ధించాడు .ఉడ్రో విల్సన్అభి వృద్ధి  విధానాలను మెచ్చుతూ 1912డెమోక్రాటిక్ సమావేశం లో విల్సన్ నామినేట్ అవటానికి ఎక్కువ కృషి చేశాడు .విల్సన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగానే 31 ఏళ్ళ రూజ్ వెల్ట్ ను నేవీ కి అసిస్టెంట్ సెక్రెటరి ని చేశాడు .దీనితో తనుఇన్నాళ్ళు  కన్నకల నెరవేరింది .మొదటి ప్రపంచ యుద్ధం ఆయనకు నౌకారంగం  పై ఉన్న అనుభవం సామర్ధ్యం తెలివి తేటలు ప్రదర్శించటానికి బాగా దోహదమయింది .రహస్యంగా నౌకా సంస్థలను ,సబ్ మేరీన్లను సమర్ధవంతంగా అధ్యయనం చేసి జర్మనీ వాళ్ళ జలాంతర్గాములను తుత్తునియలు చేసే  విధానాలు ప్రయోగించాడు .లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో పని చేశాడు .38 వ ఏటవిపరీతమైన ఆర్ధిక మాంద్యం ఉన్న కాలం లో  శాన్ ఫ్రాన్సిస్కో లో డెమోక్రాటిక్ పార్టీ సదస్సు జరిగి౦ది .యుద్ధం లో జయం లభించి౦ది కాని శాంతి నష్ట పోయింది .ప్రెసిడెంట్ విల్సన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ప్లాన్  సెనేట్ చేత తిరస్కరింప బడింది  .గుండెపోటు వచ్చి విల్సన్ చావు బతుకుల్లో ఉన్నాడు .ఒహాయో రాష్ట్రానికి చెందిన జేమ్స్ ఏం .కాక్స్ ను రాజీ అభ్యర్ధిగా ప్రెసిడెంట్ పదవికి ,రూజ్ వెల్ట్ ను వైస్ ప్రెసిడెంట్ పదవికి నిర్ణయించారు .ఇద్దరూ కలిసి ప్రచారం చేసినా రూజ్ వెల్ట్ 800కు పైగా ఉపన్యాసాలిచ్చి దున్నేసినా రిపబ్లికన్ అభ్యర్ధులు హార్డింగ్ ,కూలిడ్జ్ చేతుల్లో  ‘’మళ్ళీ యధాస్థితి కి ‘’అన్న వాళ్ళ ఆకర్షణీయమైన స్లోగన్ తో పరాజయం పొందారు .

         ఒక ఏడాది తర్వాత మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించి ,పెద్ద ప్రాణాంతక మహా విపత్తుకు గురైనాడు .1921ఆగస్ట్ లో కుటుంబం అంతా కాంప్ బళ్లో ఐలాండ్ లోని న్యు బ్రన్స్ విక్ లోసెలవులు  గడుపుతుండగా  రూజ్ వెల్ట్ ఒక రోజంతా విపరీతంగా బే లోని మంచు నీటిలో ఈతకొడుతూ పూర్తిగా అలసిపోయాడు .చలి ,వణుకు తో జ్వరం  ప్రారంభమై పాక్షిక పక్ష వాతం వచ్చింది .డాక్టర్లు సరిగ్గా రోగ నిర్దారకం చేయక పోవటం తో ‘’పోలియో మైలేటిస్’’వ్యాధికి గురైనాడు .పూర్తిగా వికలాంగుడై ,కాళ్ళను కదల్చలేక బ్రేసులు, క్రచ్ లూ లేకుండా ఒక అడుగు కూడా నడవలేని స్థితికి వచ్చాడు .ఎంతో కస్టపడితేకాని , సహాయకుడు ఎవరైనా ఉంటేకాని కుర్చీలోంచి లేవగలిగే వాడు కాదు  . నిలబడటానికి ఎవరో ఒక ఆసరా లేక ఒక కర్ర  ఉండాల్సోచ్చేది .దీనితో రూజ్ వెల్ట్ ప్రజా జీవితం సమాప్తం అనుకొన్నారు అందరూ .పదవికి పనికి రానని చెప్పి రిజైన్ చేసి హాయిగా హైడ్ పార్క్ ఇంట్లో విశ్రాంతి తీసుకోమని తల్లి సలహా ఇచ్చింది .పరాజయాన్ని రూజ్ వెల్ట్ ఏనాడూ అంగీకరించలేదు .ఒక ఏడాది ఈ బాధ తోనే ఉంది మళ్ళీ తన పని ప్రారంభించాడు .

  జార్జియాలోని వార్మ్ స్ప్రింగ్స్ లో ఒక రిసార్ట్ లోపూర్తిగా మినరల్ సాల్ట్ లు,  ఎక్కువ స్పెసిఫిక్ గ్రావిటిఉన్న   ఒక బేదింగ్  పూల్ ను కనుక్కొని నిత్య స్నానం చేస్తూ మూడేళ్ళకు  బిగుసుకు పోయిన అవయవాలకు కొద్దికొద్దిగా చలనం వచ్చేట్లు చేసుకొన్నాడు .ఆ తర్వాత ఏడాదికి రెండు సార్లు ఇక్కడికి వచ్చేవాడు .ఈ చికిత్స కోసం మిలియన్ డాలర్లలో నాలుగో వంతు  డబ్బు ఖర్చయింది .డబ్బు పెట్టి దీన్ని కొని లాభ నష్టాలు లేని విధానం లో తన లాంటి వ్యాధి గ్రస్తులకు ఉపయోగ పడేట్లు చేశాడు. 42వ ఏట న్యు యార్క్ లో డెమోక్రాటిక్ పార్టీ సదస్సుకు  క్రచేస్ సాయం తో హాజరవ గలిగాడు .నాలుగేళ్ల తర్వాత  ,టెక్సాస్ లోని  హూస్టన్ సభకు క్రచేస్ లేకుండా  తుంటి నుండి పాదం వరకు  స్టీల్ బ్రేసేస్ తో దర్జాగా హాజరై అందర్నీ ఆశ్చర్య పరచాడు .

   1928 లో ప్రెసిడెంట్ అభ్యర్ధిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఆల్ఫ్రెడ్ స్మిత్ ,న్యూయార్క్ గవర్నర్ గా రూజ్ వెల్ట్ ను ,ఆయన సహాయకుడిగా హెర్బర్ట్ లె మాన్ ను ఎంపిక చేశారు  .తీవ్రంగా జరిగిన పోటీలో స్మిత్ ఒడి పోయి ,రూజ్ వెల్ట్ గవర్నర్ గా ఎన్నికయ్యాడు .ఈ ‘’గూబర్ నేటోరియల్  పోస్ట్ ‘’లో నాలుగేళ్ళు ఉన్నతరువాత1932 ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఎంపికయ్యాడు .ఇంకా కొంతకాలం గవర్నర్ పదవీకాలం ఉంది ,కాని దేశం అతి తీవ్రమైన డిప్రెషన్ లో కొట్టు మిట్టాడు తున్నప్పుడు ఆయన ‘’మరువ బడిన  మనిషి ‘’అని  భవిష్యత్ వాణిగా  చెప్పాడు  .వ్యవస్థ మళ్ళీ వైభవం లోకి రావాలంటే సంస్కరణలు పై నుంచి కాక అట్టడుగు నుంచి ప్రారంభం కావాలని నొక్కి వక్కాణించాడు .’’ఆర్ధిక పిరమిడ్ లో అట్టడుగు మనుషులను మర్చి పోయారని వారి సంక్షేమం దేశ ప్రగతికి గతి అన్నాడు .యాభై వయసులో అయన ఉపన్యాసాలలో దీనినే మరీ మరీ చెప్పి ప్రజల దృష్టికి తెస్తూ ప్రెసిడెంట్ పదవీ ప్రచారం చేశాడు .అమెరికన్ ప్రజలకోసం ‘’న్యు డీల్ ‘’ను అందజేస్తానని ప్రతిజ్ఞ చేశాడు .ప్రతి పౌరుడు బాగా సౌకర్యాలతో ఆర్ధిక పుస్టి తో జీవించాలని అన్నాడు .అమెరికా పారిశ్రామిక వ్యవస్తలు,వ్యావసాయక యంత్రాంగం బాగా ఉత్పత్తి చేస్తూ తగినంత మిగిల్చాలి .ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలు ,రాజకీయ నాయకులు ,ఆర్ధిక వేత్తలు అందరూ తగినంత ఉత్పత్తి చేసి మిగల్చాలి  ..దేశం లో అంతులేని వనరులున్నాయని ,15 మిలియన్ల జనం వీధుల్లో తిండిలేక  అవమానకరంగా అడుక్కు తింటున్నారని ,పూరిగుడిసేల్లో ,అట్టముక్కల ఇళ్ళల్లో ఉంటూ దిక్కూ మొక్కూ లేక బతుకుతున్నారని ,వారి పరిస్థితి దయనీయంగా ఉందని .వీళ్ళందరి జీవితాలలో ఉషోదయం రావాలంటే ధైర్యంగా నిరంతర ప్రయోగాలు చేయాలని ,దీనికి చాలా కామన్ సెన్స్ కావాలని ,ఒక వేళ ఈ ప్రయోగాలలో అపజయం పాలైతే ధైర్యంగా ఒప్పుకోవాలని ,మరొక ప్రయోగం చేయాలని చెప్పాడు .మిలియన్ల మంది పేద ప్రజలు  తమకు రావాల్సినవి తమ దగ్గరకు రాకపోతే ఇక ఉపేక్షిస్తూ ఊరుకొంటారను కొంటె పొరబాటని గట్టిగా అన్నాడు .తమకిప్పుడు ఏం కావాలో ఆయన మాటల్లోనే ‘’we need enthusiasm ,imagination ,and the ability to face facts ,even unpleasant ones bravely .We need to correct by drastic means ,if necessary ,the faults in our economic system from which we now suffer .We need the courage of the young ‘’.

   ఇలాంటి ధైర్య వచనాలు ,నివేదనలు ఆ సమయం లో బాగా ప్రభావం చూపాయి .రూజ్ వెల్ట్ అయస్కాంత ఆకర్షణ వ్యక్తిత్వం ,దేశపు దుస్థితి రూజ్ వెల్ట్ చాలా సరైన దిశలోనే ఆలోచిస్తున్నాడని అర్ధం చేసుకొన్న జనం ఆయన్ను విపరీతంగా ఆరాధించారు అభిమానించారు .ప్రజా బలం తో దేశాన్ని దారుణ సమ్మెలు ,విప్లవ స్థితులనుండి కాపాడాడు .అదొక గొప్ప నాటకీయ సమయమై ఆయనకు బాగా కలిసొచ్చింది .దీని ఫలితంగా అతి భారీ మెజారిటి తో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు .ఎనభై ఏళ్ళ అమెరికా చరిత్రలో ఆరు రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలోను మెజారిటీ సాధించి న డెమోక్రాటిక్ అభ్యర్ధిగా రికార్డ్ సాధించాడు .హోవర్ కు కేవలం 59 ,రూజ్ వెల్ట్ కు 472 ఎలెక్టోరల్ వోట్లు వచ్చాయి .అదీ రూజ్ వెల్ట్ వీరవిజయ గాధ.

   సశేషం

Inline image 2

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-16-ఉయ్యూరు

   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -184-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -184-

70-న్యు డీల్  ,అమెరికన్ లిబరలిజం  తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్

 

‘’మంచి పోరాటం కంటే నాకిస్ట మైంది ఏదీ లేదు ‘’అనే అమెరిక ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ,నాలుగు సార్లు ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి గెలిచి రికార్డ్ సృష్టించిన వ్యక్తీ ..అమెరికన్లు ఆయను ఆరాధించారు ,అలక్ష్యమూ చేశారు .అంకిత భావమున్న క్రుసేడర్ గా అభిమానించారు .వినాశకర నియంతగా తిట్టీ పోశారు .శాశ్వత అంగ వైకల్యం తో విపరీతమైన ఆర్ధిక మాంద్యం ,చరిత్రలోనే భయంకర యుద్ధ సమయం లో  ధైర్య స్తైర్యాలతో నిలబడి ‘’the only thing we have to fear is fear itself ‘’అని జాతికి చాటి చెప్పి సంక్షోభం నుండి గట్టేక్కి౦చినవాడు .

30-1-1882న రెండవ జేమ్స్ రూజ్వెల్ట్ కు ఆయన రెండవ భార్యసారా డేలనో  కు ఏకైక సంతానంగా అమెరికా లో న్యూయార్క్ లోని హైడ్ పార్క్ లో ఫ్రాంక్లిన్ డేలనో రూజ్ వెల్ట్  జన్మించాడు .ఇరువైపుల వారు పూర్తిగా అమెరికా జీవులే .రూజ్ వెల్ట్ లకు కొత్త ప్రపంచం అయిన అమెరికా లో రెండు విధాల అంటే సీనియర్ ,జూనియర్ లైన్ లు గ  పేరు ప్రతిష్ట లున్నాయి .దియోదర్ రూజ్ వెల్ట్ డచ్ జాతి వాడు .వీరిలో మొదటి రూజ్ వెల్ట్ న్యు ఆమ్ స్టర్ డాం కు 1644లోనే వచ్చాడు .జూనియర్ లైన్ లో వచ్చిన ఫ్రాంక్లిన్ డేలనో డచ్ ,ఇంగ్లిష్ ,ఫ్రాన్స్ ,జర్మన్ కొంత స్వీడిష్  మిశ్రమం .అతని తల్లి వంశం-ఫ్రెంచ్ సముద్ర నావికుడు ఫ్రెంచ్ తలిదండ్రులకు లేదేన్ లో పుట్టినవాడు ,అమెరికాలోని మాసా చూసేట్స్ రాష్ట్రం న్యు బెడ్ ఫోర్డ్ లో 1624లో పుట్టిన  ఫిలిప్పి డీ లా నాయ్ కు చెందింది. దీనినే డేలనో అన్నారు .ఇంత ఘన చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రూజ్ వెల్ట్ అమెరికా 32వ ప్రెసిడెంట్ అయ్యాడు .అందుకే ఆయనకు ఓడలన్నా సముద్ర యానమన్నా విపరీతమైన ఇష్టం .

 రూజ్ వెల్ట్ లంటే ఏదో ఒక కుటుంబం కాదు .అదొక రాజ వంశం (డైనాస్టి ).ముఖ్యంగా వాళ్ళు వాణిజ్య వేత్తలు .ఐజాక్ రూజ్ వెల్ట్ సంపన్ను డైన బాంకర్ వ్యాపార వేత్త ,సెనేటర్, రివల్యూషనరి యుద్ధం లో సైనికుడు .ఈయన ముత్తాత తండ్రికి ఫ్రాంక్లిన్ అనే గౌరవనామం ఇచ్చారు అప్పటి నుంచి ఆ వంశం వారందరికీ అది పారంపర్యంగా వస్తోంది .ఈయన మనవడు మొదటి జేమ్స్ రూజ్ వెల్ట్ రిటైర్ అయి ,హడ్సన్ రివర్ తీరం లో డాచేస్ కౌంటి లో హైడ్ పార్క్ లో చాలా ఖరీదైన విశాలమైన ఎస్టేట్ కొన్నాడు .డేలనో లు కూడా సరి సమానంగా భాగ్యవంతులే .ఫ్రాంక్లిన్ తల్లి అందంతో పాటు పెత్తనం ,సంఘ గౌరవ స్పృహ ఉన్నావిడ .తనపై తనకు అత్యంత నమ్మకం ,స్వీయ అభయం ఉదాత్త గుణం తో పాటు ,సర్వ సమర్ధత ఉన్న మహిళ.తల్లి కున్న ఈ లక్షణాలన్నీ వారసత్వంగా రూజ్ వెల్ట్ కు సంక్రమించాయి .ఇతడిని డాబు దర్పం తో పెంచారు .నౌకాయానం అతనికి పరమ ప్రీతికరమైన వ్రుత్తి .కెనడా ,,మైమ్ మధ్య ఉన్న పస్సామా ఖాతం లో ఒంటరిగా స్వంత బోటు ను నడిపేవాడు .15ఏళ్ళు  నిండకముందే యూరప్ కు  10సార్లు తీసుకు వెళ్ళారు .జర్మనీలో నాఔహెల్మ్ లో జర్మన్ భాష నేర్చాడు .అప్పటికే కాస్మోపాలిటన్ యువకుడయ్యాడు .14వ ఏట కాలేజి లో చేరే నిమిత్తం అప్పర్ క్లాస్ గ్రోటాన్ కు తప్పనిసరిగా పంపబడే ప్రయత్నం లో ఉన్నారు .

  గ్రోటాన్ లో స్టూడెంట్ గాకంటే ఇతర వ్యాపకాలపై మోజు పడ్డాడు .అక్కడి కోర్సులు పెద్దగా అభిరుచి కలిగించలేదు .టెన్నిస్ ఆడుతూ ,సముద్ర కధలు చదివాడు.కాని వారానికి మూడు సార్లు అమ్మ దగ్గరకు వెళ్ళేవాడు .ఇప్పడు అది దూరమయింది .16వ ఏట వివాదాస్పద విషయాలపై దృష్టిపడి ,డిబేట్ లలో లిబరల్ అయ్యాడు .ఫిలిప్పీన్ స్వాతంత్ర్యం గురించి ,ఇమ్మిగ్రేషన్ లపై నిబంధనల కు వ్యతిరేకంగా మాట్లాడేవాడు .17 వయసులో అసమ్మతి వాది  అయ్యాడు .తన సహచర గ్రోటేనియన్  మిత్రుల తో విభేదించి అగ్రకుల భూ యజమాని విషయం లో వింత భావాలు ప్రకటించాడు .జాన్ గందర్ తన ‘’రూజ్ వెల్ట్ ఇన్ రెట్రాస్పెక్ట్ ‘’పుస్తకం లో ‘’ఆయనకు స్కూల్ లో చదివే జ్యూ విద్యార్ధి ఎవరూ లేకపోయినా  జ్యూస్ అంటే అభిమానం పెరిగింది .దక్షిణ రాష్ట్రాలలో నీగ్రోల్ కు చదువు నేర్చుకొనే అవకాశాలు లేవని ,వారు విద్యా వంతులు కావాలని ఉపన్యాసాలిచ్చాడు .దక్షిణ ప్రాంతం లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే బోఎర్ల పై సానుభూతి చూపాడు .బోఎర్ల పక్షాన చేరి వారికి నిధులు సమకూర్చి అందజేశాడు .

   రూజ్ వెల్ట్ కు నౌకాయానం పై యెంత పిచ్చి అంటే ,ఒక రోజు ఎవరికీ చెప్పకుండా గ్రోటాన్ నుంచి పారిపోయి నేవీ లో పేరు నమోదు చేయి౦చు కోవాలనుకొన్నాడు. కాని పొంగు జబ్బు సోకి ఆగిపోయాడు .కాని నావల్ అకాడెమి లోఅన్నా పోలిస్ లో గ్రాడ్యు ఏషన్ అయ్యాక  చేరాలని నిర్ణయించుకొన్నాడు  .కాని తండ్రికి కొడుకును తమ వంశంవారందరికి మాతృ విద్యాలయమైన హార్వర్డ్ లో చదివించాలని కోరిక .అలాగే 1900 లో హార్వర్డ్ యూని వర్సిటి లో చేరాడు.18వయసులో రేస్ట్ లెస్ అయి ఫుట్ బాల్ ఆటలో తన టీం కు సరైన శిక్షణ ఇవ్వలేక ,తెడ్డూ,పడవ పుచ్చుకొని దానికోసమే తానూ పుట్టాడేమో అన్నట్లు నీటి  విహారం చేశాడు .అథ్లెటిక్స్ వదిలి జర్నలిజం లో చేరాడు .కాలేజి న్యూస్ మేగజైన్ ‘’క్రిమ్సన్ ‘’లోముఖ్య పదవి దొరికి మేగజైన్ ఎడిటర్ ,ప్రెసిడెంట్ కూడా అయ్యాడు .నాలుగేళ్ల హార్వర్డ్ చదువులోచిన్నప్పటి నుంచి పరిచయమున్న  అన్నా ఎలినార్ రూజ్ వెల్ట్   తో ప్రేమాయణం సాగించి ,చివరి ఏడాదిలో ఎంగేజ్ మెంట్ దాకావచ్చి ,తల్లి అభ్యంతరం తో పెళ్లి 1905వరకు వాయిదా పడి ,ఆయనకు 23 ,ఆవిడకు 20 వయసులో పెళ్లి చేసుకొన్నారు .ప్రెసిడెంట్ దియోడర్ రూజ్ వెల్ట్ వాషింగ్ట న్ నుంచి ప్రత్యేకంగా తన ,దైవదత్త కుమార్తె ,అనాధ అయిన నీస్   వివాహానికి హాజరై వేడుక జరిపించాడు .

 

Inline image 1

సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2 -7-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -183

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -183

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -5(చివరి భాగం )

  పికాసో చూపిన సాహసం దౌర్జన్యం పై ఏహ్యభావ ప్రకటన ,టెర్రర్ ను రేకెత్తించే చిత్రాలు ‘’గుయెర్నికా ‘’లో ప్రస్పుటంగా తెలియ జేశాడు .కాని అందులోని సంకేతాలు ,రాక్షసులు ,విరిగి పోయిన శరీరభాగాలు ,వక్రీకరించబడిన ఎద్దులు ,అరిచే గుర్రాలను గ్రే ,బ్లాక్ ,తెలుపు రంగుల్లో భయంకరంగా ఉన్నా స్పష్టంగా భావ వ్యక్తీకరణ చేయనట్లు గా చిత్రించాడు .1937లో జరిగిన పారిస్ వరల్డ్ ఫెయిర్  లో పికాసో ప్రదర్శించిన విస్తృత చిత్రాన్ని చాలా నిశితంగా పరీక్షించి తన పుస్తకం లో చాలా పేజీలు  కేటాయించి రాశాడు ఆల్ఫ్రెడ్ హెచ్ బార్ .’’సైన్స్ అండ్ సొసైటీ ‘’లో వెర్నాన్ క్లార్క్ ఉదాహరించిన ‘’గుర్నేకా చిత్రం ఉన్న స్థితిని  అన్నిధోరణుల  పరాకాష్టగా ,కళాత్మక౦గా ,మానసికంగా ,పాత విధానాలపై నిర్మించిన కొత్త విధానంగా ఉంది ‘’అని మెచ్చినట్లు తెలిపాడు .న్యు యార్క్ మెట్రో పాలిటన్ మ్యూజియం అండ్ ఆర్ట్    డైరెక్టర్ ఫ్రాన్సిస్ హెన్రి టేలర్ ‘’బాబెల్స్ టవర్ ‘’సామాన్యాన్ని పెద్ద ప్రకటన గా చెప్పాడు ‘’అని వెక్కిరించాడు .కానిఆంగ్ల  కవి ,రచయితా హెర్బర్ట్ రీడ్ మాత్రం ‘’A monument to disillusion ,to despair ,to destruction .His symbols are  are banal ,like the symbols of Homer ,Dante ,Cervantes .It is a great work of art transcending all schools and categories ,is being born and being born lives  immortally ‘’అని మహా మెచ్చాడు .పికాసో ఒక ప్రపంచ మహా విపత్తు ను సామాన్యుడికి ఇప్పటికిప్పుడు అర్ధమయ్యేట్లు కాని చిత్ర భాష లోరచించాడు .’’ఈ చిత్రం పూర్తిగా తనను తాను వివరించుకోక పోయినా ,దాన్ని తేలికగా అనుకూలంగా రక్షించు కొంటుంది .ఇది సరి పోయేంత డోసులో లేని మహోన్నత చిత్రంకాదు  అన్నవారికిఅది రాబోయే కాలం లో జరిగే అనర్ధాన్ని చాటి చెబుతుంది .బహుశా మనం ఉన్న శతాబ్దం లోనే ఆ వికృత రూపాన్ని చూస్తాం ‘’అన్నాడు బార్ .

1937నుండి పికాసో గీసిన చాలా చిత్రాలు చాలా నిరాశతో భంగ కరం గా ఉన్నాయి .మనం చూస్తున్న అవిటి అనాకారి మానవ రూపాలు ,మానవులు పరస్పర కలహం దౌర్జన్యం ,హింసలతో ఆవిర్భవి౦ఛినవే  ,కావాలని వినాశనం కొని తెచ్చుకొన్నవే .క్రమంగా పికాసో ఉపరితల ప్రదర్శనకు దూరమై ,సామాన్య మానవుడికి అప్పటికప్పుడు అర్ధమయ్యే రీతి లేని విధంగా శక్తి వంతమైన నిగూఢ కళను చేబట్టాడు .సాద్రుశ్యత లేని విధంగా సాంకేతికతతో  భయ విహ్వలంగా ,ముఖం లోపలి భావాలను పికాసో చిత్రిస్తున్నట్లు ,ముసుగువెనక  ఉన్న బుద్ధి ,మనసు లాగా  చిత్రిస్తున్నాడు .కవళికలను పునః పంపిణీ చేస్స్తున్నట్లు ,రేఖాచిత్ర దృశ్యంగా(ప్రొఫైల్) ముఖంకూడా  బాగా కనిపించేట్లు  ముక్కు కన్ను ఉన్న స్థానం లో ,ఉండేట్లు గీశాడు .’’The simultaneity of two different aspects has a distinctive purpose .Picasso hopes to give a feeling of the live and active person  not a static replica –he presents a face with all its complexity ofplanes in motion ,moving not only in space but time ‘’అని వీటికి భాష్యం చెప్పారు .అతని చిత్రాలు వింతగా ,అర్ధం చేసుకోవటానికి వీలు లేనివిగా ఉన్నాయ౦టే ,దానికి కారణ౦ మన విజన్ .మనం ఎప్పుడూ ఒకే దృష్టితో వస్తువులను చూడటానికి ఇప్పటిదాకా అలవాటు పడటం ,ఒకటే విషయాన్ని చూడటమే దీనికి కారణం .అందుకే ఒకేసమయం లో అనేక విషయాలు, పార్శ్వాలు చూసే దిక్సూచి లాంటిది మనకు లోపించటమే.  బ్లేక్ కవి ‘’ఆగరీస్ ఆఫ్ ఇన్నో సెన్స్ ‘’కవిత పికాసో కు బాగా తెలుసు నని పిస్తుంది .ఆ కవితా సౌందర్యం బ్లేక్ మాటలలోనే –

‘’we are led to believe a lie –when we see with ,not through the eyes ‘’కంటి తో చూసిన అబద్ధాన్ని నమ్మటానికి అలవాటు పడ్డాం కాని కంటి లోంచి చూసింది కాదు  .పికాసో చేసిన,చూపిన రెండు ముఖాల తలలతో బాటు మరింత లోతుగా నైరూప్యానికి అన్వేషణ సాగించాడు .ఒక  పీడకల లాంటి ఐరానిక్ నాటకం రాశాడు  .ఇంకా తెగువతో ప్రాజెక్ట్ లను చేయాలని ఆలోచిస్తుండగా రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది .,జర్మన్ సైన్యం పారిస్ ను ఆక్రమించినప్పుడు పికాసో అక్కడే ఉన్నాడు .తన కళ ను దిగజారి పోయిన కళ అని ఈసడించిన నాజీలు ,అతని ప్రాణానికి  ప్రమాదం తెచ్చారు  .పారిపోవటానికి నచ్చ చెప్పుకోలేక పోయాడు ..యుద్ధ కాలమంతా పారిస్ లోనే ఉంటూ శత్రు దేశం తో చేతులు కలిపి పని చేయటానికి తిరస్కరించాడు .దీనికి విరుద్ధంగా తన ‘’గుయెర్నికా ‘’చిత్రాలను అందరికి పంచి పెడుతూ ఆనందిస్తున్నాడు .లిబరేషన్ –విముక్తి తర్వాత క్లాడే, పలోమా అనే ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు .తన వయసుకు 42ఏళ్ళ జూనియర్ అయిన ఆవిడ ద్వారా .ఫ్రెంచ్ రేవేర్రా మీద యాన్టైర్ దగ్గరున్నవల్లారిస్ కు చేరాడు .మళ్ళీ ఆయన ఆర్ట్ మార్పు చెందింది .ఈ పెయింటింగ్ లు కొత్త అత్యుత్సాహం ,కొంత ఉపశమనం మరికొంత తేలిక హృదయం తో .అలరించాయి .నిరంతర అన్వేషణ  సృజన శీలి కనుక లితోగ్రఫీ లో కొత్త టెక్నిక్ ప్రయోగించి ,సరి కొత్త పాత మాధ్యమం పింగాణీని కనిపెట్టి మట్టిని పిగ్మేంట్ ల్లాగా సృజనతో కొత్త ఆకారాలు చేశాడు .నీడింగ్ , వస్తువుల్ని కాల్చటం ,ప్రాచీన ప్లేట్ల మీద ,డేగిసాలమీద గీశాడు .మట్టి కుండల్ని అనేక రూపాలతో చేశాడు .మేక లాంటి జగ్గులు ,స్త్రీ లాంటి జాడీలు ,టీ పాట్ లను పక్షి ముక్కు స్పౌట్స్ (జారే ప్రదేశం )లు తయారు చేశాడు .

   70 వ పడిలో కూడా నిరంతర సృజన శీలి గానే ఉన్నాడు .పూర్తిగా విగ్రహ వినాశకారి అయ్యాడు .1952లో ఒక ‘’మిడటరేనియన్  లాండ్ స్కేప్ ‘’ను దట్టమైన రంగుల కాంపోజిషన్ తో పూర్వం ఎప్పుడూ చిత్రించని విధంగా  భిన్నంగా చిత్రించాడు .’’మాసకర్ ఇన్ కొరియా ‘’మరో కనికరం లేని సమకాలీన భయంకర చిత్రం .1953మే లో అంతకు పూర్వం ఎవరూ చూడని తన ‘’వన్ మాన్ ‘’50చిత్రాల ప్రదర్శనను రోమ్ నగరం లో ఏర్పాటు చేశాడు .ఇవి మ్యూజియం ఆఫ్ మోడరన్  ఆర్ట్ భవనం లో 14 గదులలో అమర్చాడు .విమర్శకులు యదా ప్రకారం అతని కొత్త విధానాలను ఒకటి కాదని వేరొక దానికి మొగ్గటాన్ని విమర్శిస్తూనే ఉన్నారు .ఆయన అభిమానులు ఒక దానిలో పరి పూర్ణత సాధించాకే ఇంకో దానిని స్వీకరిస్తున్నాడని అన్నారు .ఆయన్ను వ్యతిరేకించేవారు ఈ మార్పులన్నీ ఆయన కు సీరియస్ నెస్ ఉద్దేశ్యం లేక పోవటంగా(గాంభీర్య రాహిత్యం గా )  ఆయన విధానానికే తప్ప అర్ధానికి విలువ ఇవ్వటం లేదని దెప్పారు .అయన కళ  ఎప్పుడో అర్ధ రహితమై పోయిందన్నారు .’’మోడరన్ ఆర్ట్ ‘’పుస్తకం లో ధామస్ క్రేవన్ ‘’పికాసో కు జీవితంపై ఆసక్తి లేదు ఆయనకు  యాంత్రిక చిత్ర నిర్మాణమే ఉన్న కళ మాత్రమె కావాలి .తన చురుకైన తెలివిని నిరింద్రియ ప్రపంచం ను  కళా రాహిత్యంగా చేయటానికి శ్రమిస్తున్నాడు .ఆయన కళ పరిపూర్నమైనదే ఎందుకంటె ,అది ఏమీ ఇవ్వదు కనుక .అది స్వచ్చమైనది కారణం అది సంతృప్త మానవ  ప్రక్షాళన  చేస్తుంది కనుక .అది క్లాసిక్ –ఎందుకు అంటే అది చచ్చిపోయింది కనుక .’’అని రాశాడు .

  పికాసో ఇలాంటి ఉడత ఊపులకు జవాబు ఇవ్వలేదు .కాని గుయెర్నికా  లాంటి పెయింటింగ్ లతో ,తన రచనలతో మాత్రమే జవాబిచ్చాడు .ఆయన ‘’artists who live with spiritual values cannot remain in different to the conflicts about them struggles ‘’in which the highest values of humanity and civilization are at stake’’ అని రాశాడు .రూపం అనేదే నిర్హేతుక స్వేచ్చ కలదే అయినా తాను  ‘’నైరూప్యకళ ‘’(ఆబ్స్ట్రాక్ట్ )ఉందని నమ్మనని ,కళ కు ఉన్న లోతైన ధర్మం మానవుని భావోద్వేగాలను సమతుల్యం ,క్రమతలను సాధించటమే ‘’అన్నాడు పికాసో .’’if the subjects I have wanted to express have suggested different ways of expression I have never hesitated to adopt them ‘’అని చెప్పాడు రాతలలో .’’నేను ఎప్పుడు ఏది చెప్పాలను కొన్నా ,దాన్ని నేను అనుభవించిన విధానం లోనే ,చెప్పాల్సిన పద్ధతిలోనే చెప్పాను .విభన్నమైన ఉద్దేశ్యాలు తప్పని సరిగా విభిన్న విధానాలలో చెప్పాల్సిన అవసరం ఉంది .దీనికి పరిణామ క్రియకాని ,లేక అభి వృద్ధి కాని అన్వయించదు.కాని ఒక ఆలోచన కు అనువర్తనం అయి చెప్పాల్సిన దాన్ని అతి విస్పష్టంగా ఆవిష్కరించే  వీలు కలుగుతుంది  .’’అని చెప్పాడు పికాసో .’’painting of his pictures as ‘’the result of  sudden vision ,rather than of calculated manipulation of form ‘’అని విశ్లేషిస్తూ  జేమ్స్ త్రాల్ సోబే చివరగా ‘’he was and remains one of the most extraordinary creators of imagery in the long history of art ‘’అని ముగించాడు .91 వ ఏట మహా చిత్రకారుడు పాబ్లో పికాసో 8- 4 -1973న ఫ్రాన్స్ లోని మొగిన్స్ లో మరణించాడు .

 పికాసో చిత్రకళా సోపానాన్ని చూస్తుంటే మన కృష్ణా జిల్లా గుడి వాడకు చెందిన ఆధునిక చిత్రకారులు శ్రీ ఎస్ ,వి రామా రావు గారు జ్ఞాపక మొస్తున్నారు .ఆయన కూడా చిత్ర కళ లో అనేక ప్రయోగాలు చేసి ,నిరంతర ప్రయోగ శీలియై నైరూప్య చిత్రకళ అవధిని దాటి సుమారు 50 ఏళ్ళనుంచి అమెరికాలో ఉంటూచిత్రకళా లోతులనుతరచి   ‘’ఆధునిక పికాసో ‘’అని పించుకొన్నారు  .మంచి కవి కూడా .తమ కవితలను సంకలనాలుగా తెచ్చారు .ఈ మధ్య ఆరేళ్ళ నుంచి ఢిల్లీ లో ఉంటూ మరొక కొత్త ప్రక్రియ కోసం తపిస్తున్నారు . శ్రీ రామోజీ రావు గారి ఆధ్వర్యం లో నడుస్తున్న ‘’తెలుగు వెలుగు ‘’మాసపత్రిక మే సంచికకు ఇంటర్వ్యు ఇస్తూ ‘’నేను పికాసో కంటే గొప్ప వాడిని ‘’అని స్పష్టంగా చెప్పిన చిత్రకారులాయన .నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు రామారావు సావిత్రి ,శాంతకుమారి నటించి ఆత్రేయ రచన చేసి పెండ్యాల సంగీత దర్శకత్వం చేసిన  శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం చలన చిత్రానికి కళా దర్శకత్వం వహించింది రామా రావు గారే .

ఇప్పుడు పికాసో గురించి మరికొన్ని సంగతులు తెలుసు కొందాం –ఆయన చిత్ర యాత్రలో మొదటికాలం బ్లూ పీరియడ్ .ఇది 1901నుంచి మూడేళ్ళు సాగింది .ఈ కాలం లో బార్సెలోనా ,పారిస్ ల మధ్య తిరిగాడు .ఇప్పుడు గీసిన ‘’ది ఫ్రూగల్ రిపాస్ట్ ‘’లో గుడ్డివాడు కళ్ళున్న స్త్రీ ఉంటారు .ఆయన చిత్రాల్లో గుడ్డితనం పునరావ్రుత్త మౌతుంది .’’బ్లైండ్ మాన్స్ మీల్’’గొప్ప చిత్రం .19 04నుండి 06వరకు ఉన్న రెండవ కాలాన్ని ‘’రోజ్ పీరియడ్ ‘’అంటారు .సర్కస్ జనాన్ని ఆరంజ్ ,పింక్ రంగులలో చిత్రించాడు .హీర్లేక్విన్ అనే హాస్యగాడిని గళ్ళ దుస్తులతో చిత్రించాడు .స్నేహితురాలు భార్య  ఫెర్నాడే ఆలివర్ ను ఈకాలం లో చాలాచిత్రాలలో చూపాడు .లియో గేర్త్రుడ్ స్టెయిన్ ల అభిమానం పొందాడు .1907లో పారిస్ లో డేనియల్ హెన్రి కావీలర్ పెట్టిన ఆర్ట్ గాలేరీలో చేరాడు .

తరువాతది  ఆఫ్రికన్ ప్రభావ కాలం .ఇది 1907నుంచి రెండేళ్ళు సాగింది .ఇదే తర్వాత క్యూబిజం లోకి దారి తీసింది .1909 నుంచి 12వరకు ఉన్నకాలాన్ని అనలిటికల్ క్యూబిజం పీరియడ్ అన్నారు .మోనో క్రోం బ్రౌనిష్ ,న్యూట్రల్ రంగులు వాడాడు .తర్వాత సిన్దేటిక్ క్యూబిజం లోకి ,తర్వాతా కోల్లెగ్ లోకి ప్రవేశించాడు(19 12-19).1911 .లో ఇటలీ చిత్రకారుడు లియోనార్డో డావిన్సి చిత్రించిన పరిసిద్ధ ‘’మోనాలిసా ‘’చిత్రాన్ని దొంగిలించాడని అరెస్ట్ చేశారు .విచారణ జరిగి వదిలేశారు .1915-17మధ్య రేఖీయ చిత్రాలకాలం .స్క్వేర్ కట్ డయమండ్స్ తో ప్రయోగాలు చేశాడు .ఈ కాలాన్ని ‘’క్రిస్టల్ పీరియడ్ ‘’అంటారు .

  1917లో ఇటలీ మొదటిసారి వెళ్ళాడు .నియో క్లాసిక్ చిత్రాలు గీశాడు .1925లో సర్రియలిస్ట్ రచయిత  ఆండ్రే బేటన్ -పికాసో ను తమవాడు అని ప్రకటించాడు .’’దేశ డిమో సిల్లెస్ మొదటిసారిగా యూరప్ లో తిరిగి సృష్టించాడు .సర్రియలిస్ట్ ఎక్సి బిషన్ లో క్యూబిస్ట్ ప్రదర్శన చేశాడు .1930లలో హీర్లేక్విన్ బదులు మినోటార్ను ఎక్కువగా గీశాడు .1935 నుంచి 1959వరకు 24 ఏళ్ళు పికాసో 300కు పైగా కవితలు రాశాడు 1949లో మూడవ అంతర్జాతీయ శిల్ప సదస్సు ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో జరిగింది .ప్రపంచ వ్యాప్తంగా 250మంది శిల్పులు పికాసో తో  సహా పాల్గొన్నారు .మళ్ళీ శైలి మార్చాడు .చికాగో లో 50అడుగుల ఎత్తు ఉండే విగ్రహాన్ని  నిర్మించటానికి పికాసోను ఆహ్వానించారు .దాన్ని ఇప్పుడు ‘’చికాగో పికాసా ‘’అంటారు .ఆయన జీవితం చివరలో చేసినవన్నీ మిశ్రమ శైలికి చెందినవే .

  జీవితకాలం లో పికాసో యాభై వేల పనులు చేశాడు  .అందులో 1885 పెయింటింగ్ లు ,1228శిల్పాలు ,28 80 సిరామిక్స్ ,సుమారు 12వేల డ్రాయింగ్ లున్నాయి  . రంగును భావ వ్యక్తీకరణకు బాగా ఉయోగించిన వాడు పికాసో .పెయింట్ లో ఇసుక కూడా కలిపి రావాల్సిన ఎఫెక్ట్ సాధించాడు .అయన క్యూబిక్ విధానం ఆబ్స్ట్రాక్ట్ పద్ధతిలోకి దారి తీసింది .ఆయనది ‘’అతి విశాల చిత్ర స్వీయ చరిత్ర ‘’(వాస్ట్ పిక్టోరల్  ఆటో బయాగ్రఫి ).ఆయన చిత్రాలు అత్యంత ఎక్కువ ఖరీదుకు అమ్ముడయ్యాయి .’’గార్కాన్ ఆ లా పైప్ ‘’చిత్రం 104మిలియన్ డాలర్లకు లండన్ లో  అమ్ముడయి రికార్డ్ సృష్టించింది .20 16 జూన్ 21న ‘’ఫెమ్మి అస్సేస్సే ‘’చిత్రం 43 .2మిలియన్ డాలర్లకులండన్ లోని సౌత్ బె లో  కొన్నారంటే ఆయనపై అభిమానం ఈనాటికీ యెంత ఉందో తెలుస్తోంది  .అదీ పాబ్లో పికాసో చిత్ర విజయం ..

Inline image 1Inline image 2Inline image 3Inline image 4

ప్రఖ్యాత గుయెర్నికా చిత్రం 

 సశేషం                                చికాగో లో 50అడుగుల పికాసో చేసిన శిల్పం  

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలెగ్జాండ్రియా గ్రంధాలయం – మిసిమి – గబ్బిట కృష్ణ మోహన్

 

77

 

 

 

 

79

 

 

 

 

78

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -182

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -182

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో –4

34వ ఏట రియలిజాన్ని వదిలేసిన పదేళ్లకు ఒక్క సారిగా మళ్ళీ వెనక్కి మళ్ళి ,అతి జాగ్రత్తగా తన స్నేహితుల, సహాయకుల నేచుర లిస్టిక్ గ్రాఫిక్ పోర్ట్రైట్ లు గీశాడు .’’ఈ క్లాసిక్ పీరియడ్ ‘’రోమ్ కు వెళ్లి విస్తృత పరచాడు .అక్కడ ‘’పెరేడ్ ‘’అనే ఒక బాలెట్ కు కర్టెన్, స్క్రీన్ ,కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు .దీన్ని సెర్జీ డయాఘిలేవ్ నిర్మిస్తే ఎరిక్ సాటీ సంగీతం సమకూర్చాడు .అక్కడ స్ట్రావేన్స్కిఅనే కంపోజర్ ను కలిసి ఆయన ‘’రాగ్ టైం ‘’ కవర్ కు స్కెచ్ వేశాడు .రష్యన్ బాలెట్ బృందం తో బాగా ఉల్లాసంగా గడిపాడు .వారితో రిహార్సల్ లను రోమన్ సెల్లార్ల  లో  చేస్తూ రాత్రి వేళ చంద్రకాంతిలో తిరుగుతూ నేపుల్స్ ,పాంపీలు తిరిగి చూస్తూ ,ఆ ట్రూప్ లో డాన్సర్ యువతి వోల్గా కొక్లోవా ను పెళ్లి చేసుకొని ,పాల్ అనే కొడుకుకు  జన్మ నిచ్చాడు .మూడేళ్ళ వయసులో తీవ్రమైన కాంక్ష కళ హాస్య గాడిగా ఒకటి ,నాలుగో ఏట అందమైన ఆకర్షణ,కొద్దిపాటి విచక్షణ తో ఫ్రెంచ్ పాంటోమైమ్ లోని విచార పాలిపోయిన ముఖం ,వదులైన తెల్లటి బట్టలతో పాయి౦టెడ్ హాట్ పెట్టుకొన్న వాడిగా   ఒకటి  మొత్తం రెండు కొడుకు పాల్ చిత్రాలను చిరస్మరణీయంగా చిత్రించాడు తండ్రి పికాసో .  ముప్ఫై లలో ఎప్పుడూ పికాసో పరిణతి చెందినవాడిగా కనిపించాడు .కాని యే శైలికి కట్టు బడక ,నైరూప్య (ఆబ్ స్ట్రాక్ట్ ), క్యూబిక్ నమూనాలు ,అలంకరణ ఉన్న లాండ్ స్కేప్ ,సున్నిత లైన్ డ్రాయింగ్ చిత్రాలు గీస్తూ ‘’ఇంగ్రేస్ ‘’చిత్రకారుని నాజూకు ,సొంపుతో తో పోటీ పడే చిత్రాలు తయారు చేశాడు .

  ముప్ఫై ల చివరలో పికాసో ‘’నియో క్లాసికల్ పీరియడ్ ‘’ప్రారంభమైంది .సెమి ట్రాపికల్ ఫ్రెంచ్ రేవేరాలో ఉంటూ పూల ముక్కల్ని పరిణతి చెందింప  జేస్తూ ,పండ్లను 17 ,18 శతాబ్దాలనాటి యూరోపియన్ ఆర్కిటెక్చర్ లాఅమరుస్తూ ,వస్తువులను ఆకర్షణ తోకళకళ లాడేట్లు గుండ్రంగా ,అసలు ఇది వరకు ఎప్పుడూ క్యూబ్ ను చూడని వాడిలాగా మెస్మరైజ్ చేశాడు .నలభైలలో అతని చిత్ర రూపాలు హీరోయిక్ సమతుల్యత తో గీశాడు .మొదటి ప్రపంచ యుద్ధం  అనంతర పరిణామాలు పికాసోను మళ్ళీ పూర్వపు మానవత్వ భావాలకు చేర్చాయి.అనేక సార్లు గీసిన ‘’వుమన్ ఇన్ వైట్ ‘’ఇప్పుడు సున్నితంగా కొంతవరకు  అభివ్యక్తీకరణంగా  ఉన్నాయి  .  కాని అందులో ఎక్కువ భాగం పురాతన శిలను నరికి మలచినట్లు ఉండేవి .అవి ద్రుఢత్వం  లో క్లాసికల్ గాఉండటమే కాక ఆవి విషయం  కంటే రూపానికి ప్రాధాన్య మిచ్చి నట్లు ఉండేవి .అంతేకాదు హుందా ,గౌరవం కలబోసినట్లు ఉండేవే కాని రొమాంటిక్ ప్రయోగాలతో ఏర్పడ్డవి కాదు .ఈ పికాసో పెయింటింగ్ లను ‘’Monumental ,impassive ,immovable are a few of the adjectives with which the critics described the heavy –limbed sculptural paintings ‘’.‘’

  తరువాత 12 ఏళ్ళలో పికాసో అనేక రూపవిక్రియ లకు( మెటామార్ఫసెస్ )లోనైనాడు .వైర్ లతో తుప్పు పట్టిన ఇనుము ,కొయ్య లతో  నిర్మాణాలు చేశాడు .సర్రియలిస్టిక్ కవిత్వం రాశాడు .శిల్పకళ లో ప్రవేశించి ,అతి పెద్ద తలకాయలు ,జంతువులను రూపమార్పిడిచేశాడు .స్మారక చిహ్నాల ప్రాజెక్ట్ లు చేబట్టాడు .నైరూప్య వరదలో నుండి బయటపడి హింసాత్మక ,తిరుగు బాటు ధోరణి తో ,అవాంచనీయ లక్షణాలతో ,గాఢమైన అలజడితో సరసమైన సొగసైన ఒంటికాలిపై నిలబడి ,రెండవ కాలు సమాంతరంగా జాపినట్లున్న కేవలం ఆనందం కలుగ జేసే డిజైన్ లను రూపొందించాడు .అంటే ఇప్పుడు పికాసో ప్రవహించే గీతలో అందాన్ని దర్శింఛి ఆ వైపుకు తన దృష్టిని కేంద్రీకరిస్తున్నాడన్న మాట .దీనిలో ఆకృతిని దాటి అర్ధం లేదని లేక ఆక్రుతే పరమార్ధమని అదే పరిపూర్ణ మైన రూపం అని భావించాడు .

   స్పానిష్ సివిల్ వార్ పికాసో యాభైలలో ఉండగా వచ్చింది .యుద్ధ సన్నద్ధమౌతున్న లాయలిస్ట్ ల తో స్పెయిన్ లో ఉన్నాడు .ఆయన్ను యుద్దోత్సాహం లేని ,ఫ్రాన్స్ లోనివసిస్తున్న  స్పానియార్డ్ గా మొ ప్ర.యు కాలం లో భావించారు .ఇప్పుడు ఆయన రాజకీయాలకు దూరంగా  ఉన్నా , .ఫ్రాంకో నాయకత్వం వహిస్తున్న నిరంకుశత్వ తిరుగు బాటు దారులకు ,వారి మిలిటరీ క్రూర విప్లవ భావాలకు ఎదురు నిలిచి పోరాడుతున్న రిబలికన్ ప్రభుత్వానికి పికాసో మద్దతు చూపే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు .మాంచి ప్రచార కర్తగా దూసుకు పోతూ ‘’పారడో’’కు డైరెక్టర్ అయి మ్యూజియం లోని విలువైన వస్తువులు దుండగుల చేతుల్లో వినాశనం కాకుండా కాపాడ గలిగాడు .అందుకే ఆయన ‘’painting is not done to decorate  apartments .It is an instrument of war for attack and defense against the enemy ,against brutality and darkness ‘’అని అన్నాడు ..నాజీ విమానాలు స్పానిష్ ఫాసిస్ట్ లతో చేతులు కలిపి గ్యూర్నికాలోని ప్రశాంత బ్రాస్క్యు టౌన్ పై బాంబుల వర్షం కరిపించి తుడిచి పెట్టేసినప్పుడు పికాసో అందరూ భావించినట్లుఅతని సర్వోత్కృష్టమైంది కాకపోయినా అత్యంత భావాత్మకవ్యక్తీకరణమైన  ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నాడు .300 చదరపు అడుగుల అతి పెద్ద కేన్వాస్ మీద యుద్ధపు క్రూరత్వాన్ని,ముఖ్యంగా ఇప్పడు జరుగుతున్నా యుద్ధ అనాగరకత్వాన్ని   నిరశిస్తూ రాశాడు .తన భావాలను తెలియ బరుస్తూ ‘’The Spanish struggle  is the fight of  reaction against the people ,against freedom ‘’అన్నాడు .పెయింటింగ్ లో ఉండి’’నా జీవితమంతా కళాత్మకమే ,ప్రతిక్రియపై ,కళ మరణం పై నిరంతర సమరమే . మిలిటరీ కులం స్పెయిన్ దేశాన్ని బాధా మరణ సముద్రం లో ముంచేసింది అని నేను విస్పష్టంగా నా అసహాయతను వ్యక్త పరుస్తున్నాను ‘’అని చెప్పిన ప్రజాభిమాని పికాసో .

Inline image 1

            సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1- 7 -16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”మునిగిపోతున్న బల్లకట్టు ”శ్రీ ఏ వి రెడ్డి శాస్త్రి గారి ఉత్తరాంధ్ర కధ -నా కంఠ స్వరం తో

Ballakattu

”మునిగిపోతున్న బల్లకట్టు ”శ్రీ ఏ వి రెడ్డి శాస్త్రి గారి ఉత్తరాంధ్ర కధ -నా కంఠ స్వరం తో

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -181 69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -181

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -3

   అన్నీ విసర్జించే  ప్రయత్నం లో వస్తు నిర్మాణం కంటే వాటి కారక అంశాలకు సంబంధించిన సూత్రాలను  స్థాపించే ప్రయత్నం లో ఉన్న పికాసో పూర్వపు రూపం కోసం వస్తువుల ఆకారం మార్చి ,పూర్వపు బలమైన రంగుల్ని వదిలేసి పొడిలక్షణాలను ,విలక్షణమైన ఆకర్షణ ను కలిపించాడు .దీనికోసం కోల్డ్ గ్రే ,ఆకర్షణ లేని బ్రౌన్ పాలిపోయిన సా౦డోయిష్ ఎల్లో బ్రౌన్,స్తబ్దత గా కనిపించే 19వ శతాబ్దిలో మోనో క్రోం ఫోటోగ్రాఫ్ లలో వాడిన రెడ్డిష్ బ్రౌన్ రంగులను ఉపయోగించాడు .తీవ్రత అంచులదాకా వెళ్లి ,తన వస్తువుల నుండి సారాన్ని పీల్చి స్వచ్చ మైన రూప కల్పనను కాపాడుతూ చిత్రించి ,అస్తవ్యస్తత తో పోగు చేసిన అనవసర వివరాలకు స్వస్తి చెప్పాడు .నిశిత కోణ రూప భేదాలను ,అవి ఎలాంటి అక్రమ ప్లాస్టక్ ప్లేన్ లైనా ,పికాసో అనాటమీ ని అతి శాస్త్రీయంగా భాగాలుగా విడగొట్టిఆపరేషన్ విజయవంతం అయినా  ,తరచుగా వ్యక్తీ  బతక నట్లు ప్రయోగాలు చేశాడు .సమాంతర ,నిలువు లకు ముసుగేసి అసలు వస్తువే దాదాపు కనిపించకుండా పోయేట్లు చిత్రించాడు .అందులో ఒక సలహా  ,అస్పష్ట సూచన  ,ఉండి   ధీం అంటే నేపధ్యం వైవిధ్య సంక్లిష్ట త తో  ఒక ‘’ఐడియో గ్రామ్’’లాగా మారి పోయేట్లు చేశాడు.The true Picassophile  divides this period into proto –cubism ,analytical cubism ,hermeti ccubism ,synthetic cubism ,-there is even a completely contradictory  but solemnly announced ‘’curvilinear cubism ‘’.ఇన్ని విధాలుగా ఆయన చిత్రకళ రూపాంతరం చెందింది .అన్నీ ప్రయోగాలే .ఎందులోనూ అసంతృప్తే .అందుకే ప్రయోగాలమీద ప్రయోగాలు అంతులేకుండా చేశాడు పికాసో .

   తన అభి వృద్ధి గురించి అతి తక్కువగా పికాసో వివరించేవాడు .క్యూబిజం కు దాదాపు బానిస అయ్యానని సమర్ధించుకొనే వాడు .1923మే నెలలో ప్రచురితమైన ‘’ది ఆర్ట్స్ ‘’పత్రికలో ‘’క్యూబిజం మిగిలిన యే రకమైన పెయింటింగ్ కంటే తేడా ఉన్నది కాదు  .అవే సూత్రాలు అవే మూలకాలు ఇందులోనూ ఉన్నాయి .నిజానికి క్యూబిజాన్ని ఇవాల్టి వరకు ఎవరూ అర్ధం చేసుకో లేక పోయారు .కొంతమందికి అందులో ఏమీ కనిపించలేదు .ఏమీ లేదు అన్నారు కూడా .నేను ఇంగ్లీష్ చదవ లేను .ఇంగ్లీష్ పుస్తకం నాకు బ్లాంక్ పుస్తకం .దీనర్ధం నేను ఎవరిపైనో నింద వేస్తున్నాననికాదు విమర్శిస్తున్నానని కాదు . లెక్కలు ,కేమిస్ట్రి,ఫిజిక్స్ ,సైకో అనాలిసిస్ ,మ్యూజిక్ మొదలైనవి నాకు అర్ధం కానంత మాత్రాన అవి క్యూబిజానికి సంబంధించినవి  కావు అనటాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నాను .ఇదంతా సాహిత్యమే .సిద్ధాంతాలతో ప్రజలకు అంధత్వం ,చెడుఫలితాల నిచ్చినంత మాత్రాన  అర్ధం పర్ధం లేనిది అనటం అర్ధం చేసుకోలేక పోతున్నాను .క్యూబిజం తనను తాను పెయింటింగ్  హద్దుల్లో ఉంచుకొని ,ఎప్పుడూ దాని హద్దు దాట నని అది మభ్య పెట్టలేదు . .విషయం ,రూపాలను గతం లో విస్మరించగా మేము పెయింటింగ్ లలో పరిచయం చేసిన వస్తువులు తేడాలుగా ఉండవచ్చు .పరిసరాలను  మా కళ్ళు  మెదడూ  ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి .’’అన్నాడు పికాసో .తన కళ్ళు  ఎప్పుడూ తెరుచుకొని ఉండటమే కాదు పికాసో తన విమర్శకులను ఒక అత్యున్నత వివాద వైరుధ్యాలలో పడేస్తూ  20ఏళ్ళు దాటగానే’’ లెజెండ్’’ అని పించుకొన్నాడు .30 వ ఏట తన 84 చిత్రాలతో 1911 ఏప్రిల్ లో అమెరికాలో ఏక వ్యక్తి  ప్రదర్శన నిర్వహించాడు  .

   క్యూబిజం తో ఉన్న ఆర్ట్ అంతా ఖర్చు చేసి ఆగిపోలేదు .అంతకన్నా మరింత తీవ్రమైన ప్రయోగాలు చేశాడు .కొంతకాలం ‘’కోల్లెజేస్ ‘’తో ఆడు కొన్నాడు .కోల్లెజేస్ అంటే ఫోటోగ్రాఫ్ లు ,కాగితం ముక్కలు,గుడ్డ ముక్కలు  మొదలైన అనేక రకాల వస్తువులను ,ఆర్టిస్టిక్ గా అంటించటం .అలాగే ఉపరి తలాలపై పేపర్ ,మొదలైన వస్తువులను ఒకదానిపై ఒకటి ఇష్టమొచ్చినట్లు అతికింఛి ,వాటిపైకాని వాటి చుట్టూ కాని పెయింట్ చేయటం చేశాడు .అంటే అతి సామాన్య వస్తువుల నుంచి అందాన్ని రేకేత్తించటం ,చేశాడు .న్యూస్ ప్రింట్ పై ,తాడు ముక్కలపై ,లినోలియం అంటే లిన్ సీడ్ ఆయిల్ ,పౌడర్డ్  కార్క్ లను కాన్వాస్ పై దట్టంగా అంటించటం  సాండ్ ,క్లాత్ ,గ్లాస్,గుర్తించలేని విధంగా కొయ్యను ,షీట్ మ్యూజిక్ అంటే ప్రింటెడ్ మ్యూజిక్ ను చార్కోల్ ,ఇంకు లేక ఆయిల్ లతో కలిపి అతికించటం చేశాడు .ఇదంతా కోల్లెజ్ టెక్నిక్ .ఇది ఒక సరళీకృత మోజాక్ .నేత విధానంకు ప్రాధాన్యమిచ్చి ,అతి సాధారణ చెత్తా చెదారం ను మిశ్రమం చేసి అపూర్వ ,అసాధారణ ,అవాస్తవిక అందాన్ని చేకూర్చి ఒక రకంగా ‘’పెయి౦టర్స్ పార డాక్స్ ‘’(చిత్రకారుని విరుద్ధత )ను వింత ,విలక్షణ అందమైన నిరాడంబర రూప కల్పన చేశాడు .

Inline image 1Inline image 2Inline image 3Inline image 4

      సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30 -8-16- ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -180

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -180

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -2

సర్కస్ ఆటమాత్రమే కాదు అది చేసేవాళ్ళ జీవితాలపై అభిమానం ;అధ్యయనం పికాసో జీవితాన్ని మలుపు తిప్పింది .వీరిపై కళా ఖండాలు అనదగ్గ చిత్రాలు గీశాడు .అందులో బఫూన్లు విషాదంగా కనిపిస్తారు .అప్పటిదాకా ఉపయోగించిన బ్లూ కలర్ ను వదిలేసి రోజ్ కలర్ లో కి దిగాడు .లేకపోతే పింక్ కలర్ వాడాడు .దీనివలన భౌతిక అందం తగ్గి౦చాదు .హాలండ్ వెళ్లి వచ్చాక బ్లూ పీరియడ్ ను వదిలేసి గుండ్రని రమ్యాక్రుతులు ,రక్తం మాంసం తోఉన్న ,వయోరహిత ఔన్నత్యాన్ని కలిపించాడు .ఇదంతా ఇంకా 25 దాటని కుర్ర చిత్రకారుని ప్రతిభ .రిల్కీ చిత్రాల్లా సగం కాంతి తో నిత్య వాస్తవికతకు దూరంగా ఉండేవి .తీవ్రంగా ఉన్నా ప్రశాంత ఆహ్లాదంగా కనిపించేవి కాని అవి వ్యక్తీకరణ లేనట్లు ఉండేవి .శైలి కోసం ఆయన పడుతున్న ఏక మానసిక స్థితి గుర్తించాం అన్నాడు. ‘’మారిస్ రేయ్నాల్ ..సంప్రదాయంగా ఉన్న అన్ని సరిహద్దుల్ని అధిగమించి కొత్త క్లాసిజం వైపు అడుగులేస్తున్నాడు .దీనితో అత్యంత ఖచ్చితత్వం వచ్చింది .అతని రోజ్ పీరియడ్ లో వచ్చిన కూర్పులు పెయింటింగ్ లో ఉత్తమమైనవి ,మాస్టర్ పీస్ అనిపించుకోన్నవాటికి పోలిక లో సరి పోతాయి .

    25ఏళ్ళకే పికాసో సుస్థిర చిత్రకారుడైనాడు .ఆయన చిత్రాలను కొనటం ,వాటిపై గొప్ప వ్యాఖ్యానాలు చేయటం వంటివి ప్రఖ్యాత చిత్రకారుడు విమర్శకుడు అయిన జేర్త్రూడ్ స్టెయిన్ లాంటి వాళ్ళు చేశారు .రష్యన్ డీలర్ సెర్జీ శేకిన్ 50 పెద్ద కాన్వాస్ లు కొన్నాడు.తన చిత్రాన్ని గీయటానికి పికాసో దగ్గర మోడల్  గా ఎనభై సిట్టింగులు ఇచ్చానని స్టెయిన్ చెప్పింది .దాదాపు చిత్రం పూర్తీ అయిందికాని అది పికాసో కు నచ్చక ముఖాన్ని చెరిపేశాడు .కొంతకాలం ఎక్కడెక్కడో తిరిగి వచ్చి మోడల్ లేకుండానే ముఖ కవళికలను గొప్పగా చిత్రించాడు .వస్తువు ను చూసి చేయటం కంటే ఇమాజినేషన్ తో చేయటం దీనితో ప్రారంభించాడు .

  ‘’వైల్డ్ బీస్ట్ ‘’లని పిలువ బడేమాతిస్సే ,రౌవాల్ట్ ,వ్లామింక్ ,డిరైన్  మొదలైన అతని  పెర్షియన్ స్నేహితుల చిత్రాలు పికాసో లో ఆలోచనలు రేపి స్వయం ప్రతిపత్తిగల కళ ను సృస్టించే అవకాశం ఉంది అనే  భావన కలిగింది .అప్పటికి ఇంకా ప్రాతి నిధ్యాన్ని వదిలి పెట్టటానికి సిద్ధంగా లేడు . ప్రధానమైన బహుశా పూర్తిగా చిత్ర సంబంధ మైన ‘’కళ కళ కోసమే ‘’అని నిందించిన దానికి మరింత అనువర్తనం గా ,సహజానికి విరుద్ధం కాకుండా ,యదార్ధం కానట్లుగా ఉండే వక్రీకరించని ,సృజనాత్మక  కళను  పికాసో ఊహిస్తున్నాడు .అతని స్నేహితులు ఆఫ్రికన్ నీగ్రో ల మాస్క్ లు ,కొయ్య శిల్పాలుకనుక్కొంటే పికాసో పదునైన కోణాలు ,ఆకస్మిక స్తరాలు(ప్లే న్స్),నాటకీయ,జ్ఞాన శూన్య క్రౌర్యం తో  వక్రీకరణల  పై మోజు పడ్డాడు .అవన్నీ ఈస్తేటిక్ షాక్ ఇచ్చాయి .సంప్రదాయ కళను  ద్రుష్టి కోణాన్ని సవాలు చేసి పెయింటింగ్ కు నూతన పరిమాణాన్ని ఆవిష్కరించాయి . ఆ పరిణామమే క్యూబిజం .అయినా పికాసో రేఖీయ ఆక్రుతుల అవకాశాలకోసం అన్వేషిస్తూనే ఉన్నాడు .’’ఆఫ్రికా దేశపు ఆదిమ జాతుల విగ్రహాలు అసలైన విలువ కలవని అనుకొని ,తన ఈస్తేటిక్  అనుభవాలను మార్చు కొంటూ ,ప్రపంచపు కొత్త చిత్రాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తూ ,సహజ అనుభవం ,అతీంద్రియ అనుభవం ఒకదానిపై ఒకటి పడి ఒక ప్రత్యేక వాస్తవ చిత్రాన్ని తయారు చేసే కృషి కొనసాగించాడు పికాసో ‘’అన్నాడు క్రిస్టియన్ జేర్వోస్ .

  ఆ’’ ప్రత్యెక వాస్తవం’ను కొట్టవచ్చేట్లు 26వ ఏట’పెయింట్ చేసిన ’ లెస్ డేమాసేల్స్  డి అవిగ్నాన్’’లో చూపించి కళాప్రపంచాన్ని ఒక కొత్త వివాదాస్పద ఈస్తెటిక్స్ తో పెద్ద కుదుపు కుదిపాడు .దీనిపై జేర్వోస్ సమీక్షిస్తూ ‘’this about- face of all aesthetic values marked the beginning of a period which revolutionized painting and enriched all art .’’అని అంటే ,ఆల్ఫ్రెడ్ హెచ్ .బార్ జూనియర్ ‘’పికాసో –ఫిఫ్టి యియర్స్ ఆఫ్ హిజ్ ఆర్ట్ ‘’లో ఈ చిత్రం మొట్ట మొదటి క్యూబిస్ట్ చిత్రం –అది సాధారణ రూపాలను అవి వస్తువులైనా స్టిల్ లైఫ్ చిత్రాలైనా ,పరదాలైనా వాటిని సెమి అబ్ స్ట్రాక్ట్ డిజైన్ లుగా జారిపోయేట్లు , స్తరాలమార్పులతో ,బోలు ప్రదేశంగా అదిమి మార్చాడు .ఇదే క్యూబిజం .అదొక సంధికాలపు చిత్రం ,ప్రయోగ శాల ,అంతకు మించి యుద్ధ భూమి ,విచారణ, ప్రయోగం .కాని అది కూడా ఒక దారుణమైన ,చైతన్య వంతమైన శక్తి –ఆ కాలం లో ఐరోపా కళ లో అన్నిటిని మించి అద్వితీయమైనది .’’అన్నాడు .

   తన స్నేహితుడు ,సాటి చిత్రకారుడు జార్జెస్ బ్రేక్ తో కలిసి పికాసో బలీయ మైన వెంచర్లను శక్తి వంతమైన క్యూబిజం లోకి మార్చాడు .ప్రముఖ చిత్రకారుడు సిజానే –లాండ్ స్కేపులు ,సాధారణ వస్తువులు శంకువులు స్తూపాలు గోళాలుగా అమరి ఉంటాయని సూచించాడు .ఈ ఇద్దరుకలిసి దాని క్యూబ్ అంటే ఘనం లోకి వ్యాప్తి చెందించారు .ప్రిజం ,త్రిభుజ౦ ,మరికొన్ని పదునైన కోణాలు కల వానిగా ,సాలిడ్ జామెట్రీ అనుకరణ  గా మార్చారు .మరో చిత్రకారుడు స్యురాట్ పెయింటింగ్ ను ‘’the art of hallowing surface ‘’అన్నాడు .పికాసో విరుద్ధ కళ ను తయారు చేసే ప్రయత్నం లో ఉన్నాడు .ఉపరితలాన్ని శుద్ధ ఘన పరిమాణం ద్రవ్య రాసి తో నిర్మించాడు .తనకు కనిపించిన ప్రతి దాన్నీ విశ్లేషించి వ్యక్తిగత భౌతిక కంటి తో కాక తనమనో నేత్రం తో  ఊహను జోడించి చిత్రించాడు .’’ఇప్పడు పికాసో వస్తువును ఒకే అనేక పార్శ్వాలనుండిఅంతర్ నేత్రం తో దర్శించినట్లు గమనిస్తాడు . ఆర్టిస్ట్ ఊహ కు అనుగుణంగా భౌతిక వస్తు పధకం కాక వస్తువు పూర్తిగా ఒక్కసారే దర్శనమిస్తుంది .వస్తువు యొక్క ప్రాతినిధ్యం గా ఆర్ట్ ఉండాలి .అది స్వయం సమృద్ధ మవ్వాలి ‘’అనేది పికాసో సిద్ధాంతం అని మారిస్ రెయ్నాల్ అన్నాడు .

  Inline image 4Inline image 5Inline image 1  Inline image 2Inline image 3

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -179

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -179

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో

‘’పెయింటింగ్ అంటే అపార్ట్ మెంట్ లకు  అలంకారం తెచ్చేదికాదు . ఛీకటి ,క్రూరత్వాలపై యుద్ధం ‘’అన్న మహా చిత్రకారుడు పికాసో .సాధారణం గా యే ఆర్టిస్ట్ అయినా మొదట్లో అనుకరణ స్థాయి నుంచి ప్రారంభిస్తాడు ,క్రమంగా తనదైన విధానాన్ని అవలంబించి ప్రతిభ చూపిస్తాడు .అప్పుడు ఏమీ తెలియని వాడైనా అది ఫలానా వాడి చిత్రం అని గుర్తిస్తాడు .కాని పికాసోఒక అసాధారణ చిత్రకారుడు .ఆయన వేసే చిత్రం సాధారణం గా ఉండదు .కనీసం అందులో అర డజన్ శైలీ భేదాలుంటాయి .ఆయన అనేక తీవ్ర మార్పులకు లోనయ్యాడు .అన్నిటిలో ఆయన ఉత్కృష్ట చిత్రకారుడని పించుకొన్నాడు .ఒక ప్రయోగం తర్వాత మరొకటి చేస్తూ ముందు దాన్ని వదిలేస్తూ సాగింది ఆయన చిత్ర కదా పయనం .అయినా తానూ పూర్తిగా పరిణతి చెందలేదని భావించేవాడు .ఒకే మూసలో వస్తువులు స్థలాలు మనుష్యులు చిత్రింప బడటం ఆయనకు అసంతృప్తి కలిగించింది .అన్నికాలాల్లోనూ అస్థిర ,అత్యుత్సాహ ఆర్టిస్ట్ పికాసో .మేధో సృష్టి కర్త పికాసో .ప్రయోగ శిఖరారోహకుడు .

    5-10 -18 81న స్పెయిన్ లోని మాలగా లో పుట్టిన పికాసో అసలు పేరు  చర్చి లోరాసిన దానిప్రకారం  ‘’పాబ్లో నేపెనూసేనో క్రిస్పినియానో డి లా సా౦టిస్మా ట్రినిడాడ్ రూయిజ్ యపికాసో ‘’.స్నేహితులు ఈ చాంతాడు పేరును పాబ్లో రూయిజ్ గా కుదించారు .తండ్రి జోసె రూయిజ్ బ్లాస్కో ,బాస్క్ వంశానికి చెందిన ఆర్ట్ టీచర్ .కుర్ర పికాసో మొదటి పెయింటింగ్ గీసి తల్లి ,తండ్రి పేర్లు వచ్చేట్లు పి.రూయిజ్ పికాసో అని సంతకం చేశాడు .ఇరవై వ ఏట తండ్రి పేరు సామాన్యమైనదే అని భావించి దాన్ని వదిలి అసాధారణం ,శ్రావ్యం అయిన ఆతల్లి పేరు నే ఉ౦చేసుకొన్నాడు .కొన్ని కధనాల ప్రకారం పికాసో చేతిలో పెన్సిల్ తో జన్మించాడు .కనుకనే నిర్దుష్టమైన డ్రాఫ్ట్స్ మన్ గా ,నిర్ణయాత్మక ఆర్టిస్ట్ గా ఎదిగాడు .14వ ఏట పోర్ట్రైట్ లను చిత్రించాడు .వాటిని ఎక్స్ప్రేసివ్ రియలిజం కు  లోతైన మోడలింగ్ కు ఉదాహరణలుగా భద్రపరచి రక్షిస్తున్నారు .కుటుంబం బార్సెలోనా కు మారినప్పుడు ,అక్కడ ప్రొఫెసర్ గా ఉన్న తండ్రి కొడుకును స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేర్పించాడు .అత్యంత కఠిన మైన ఎంట్రెన్స్ పరీక్షలకు సిద్ధం కావటానికి ఒక నెల మాత్రమె గడువు ఇచ్చారు .కాని మనవాడు ఒకే ఒక్క రోజులో  వాటిని పూర్తీ చేశాడు .పదారేళ్ళ వయసులో మాడ్రిడ్ లో జరిగిన ఫైన్ ఆర్ట్స్ ఎక్సి బిషన్ లో చిత్ర ప్రదర్శన లో పాల్గొని అవార్డ్ పొందాడు .కొన్ని నెలలతర్వాత స్వంత స్టూడియో ఏర్పాటు చేసుకొన్నాడు .చిత్రం వేసుకొనే ఏటవాలు బల్ల (ఈజేల్ )కాక ఆ రూమ్ లో ఒక మంచం ఒక కుర్చీ మాత్రమె ఉండేవి .అందుకని గోడలపై విలాసవంతమైన ,అలంకరించ బడిన ఫర్నిచర్ ను పెయింట్ చేసి సంతృప్తి చెందేవాడు .వీధుల వెంట తిరుగుతూ కేబెరాలు ,రేవులు చూస్తూ  కనిపించిన ప్రతిదాన్నీ చిత్రించేవాడు ,ఆయన చిత్రించన వాటిలో సోమరిపోతులు ,నన్స్ ,వేశ్యలు ,రేవు పనివాళ్ళు ,కుక్కలు ,అందం ఫాషన్ ఉన్న స్త్రీలు ,నీరసించిన ముసలి ముతకా జనం ,బలిసిన కాబ్ డ్రైవర్లు ఉన్నారు .వీరి కారికేచర్ నే చిత్రించేవాడు .

        19ఏళ్ళ వయసులో మొదటి సారి పారిస్ వెళ్ళాడు .అక్కడ పికాసో విజయం సాధించటం సామాన్యమైన విషయమే .నెల లోపల మూడు కాన్వాసులను అమ్మాడు .మాడ్రిడ్ తిరిగొచ్చి ,’’య౦గ్ ఆర్ట్ ‘’అనే మేగజైన్ ప్రారంభించాడు .తన పాస్టెల్స్ ప్రదర్శించి మళ్ళీ పారిస్ చేరాడు .అక్కడ బాగా ప్రచారం లో ఉన్న తోలోసే లాట్రేస్  బోహీమియన్ స్టూడియో తో  ,వాన్ గో బ్రష్ వర్క్ ,గాగిన్ కలర్ మాస్ చిత్రాలతో ప్రభావితుడయ్యాడు .,తర్వాత మృదు త్వం తగ్గించి అస్పష్ట అవుట్ లైన్స్ తో ,వివక్షా పూరిత పాలెట్ తో చిత్రించాడు .అనేక రీతులను అధ్యయనం చేసి ,తానే విభిన్న శైలులు అవలంబించి చివరికి తనదైన సృజనాత్మక చిత్రాలకు ప్రాణం పోశాడు .ఇరవై ఏళ్ళకే బీద ,అసంతృప్త శుష్కించిన  ఎముకలు పొడుచుకు వచ్చిన చేతులు పొడవైన బొమి కల్లాంటి వేళ్ళు ,విషాద మాత్రుమూర్తులు ,వారి శరీరాలకు అతుక్కుపోయిన పసి పిల్లలు ,బిచ్చగాళ్ళు ,దీనులైన శ్రమ జీవులు ,అ౦గవిహీనులు ఆకలితో అలమటించే జంటలు ,సంఘ బహిష్కృతులు అయిన  స్త్రీ పురుషులను సీరియల్ గా  గీశాడు .విషాదానికి చిహ్నమైన నీలి రంగు తో వ్యంగ్య చిత్రాలుగా కాకుండా లోకం లో ఉన్న దరిద్రం అలసత్వం కాపట్యం  కారుణ్య హీనత కు అద్దం పట్టేట్లు చూపించాడు .ఒక మానవ సజీవ చిత్ర శాల అది .తాడిత పీడిత దీన గాదా చిత్రమాలిక అది .పికాసో స్నేహితుడు అవి మనుషులపై ఆయనకున్న మమకారం సానుభూతి సహవేదనకు చిహ్నాలు అన్నాడు

  23వ ఏట పికాసో చిన్న ,నల్లగా  బలంగా ,అశాంతిగా ,చింత తో ,నిరుత్సాహపులోతైన  కళ్ళతో ,గుచ్చే చూపులతో వింతగా కదలిక లేని వాడుగా ఉండేవాడు .దుబ్బ జుట్టు నుదిటిపై పడుతూ వికారంగా ,సున్నితమైన స్త్రీ చేతులతో ,నిర్లక్ష్యంగా డ్రెస్ వేసుకొని కనిపించేవాడు .మేధావి నుదురు, దానిపై నల్లని కనుబొమలతో సగం బోహిమియన్ లాగా ,సగం వర్కర్ లాగా కనిపించేవాడు .రాత్రి వేళల్లోనే పెయింట్ చేసేవాడు .డైవ్స్  ప్రైజ్ ఫైట్స్ తిరిగి చూస్తూ సర్కస్ మోజులో పడ్డాడు .

Inline image 1Inline image 2

                సశేషం

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా పుట్టిన రోజు

ఇవాళ జూన్ 27 సోమవారం నా పుట్టిన రోజు . వయసు 77లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు బంధు మిత్రులకు శుభ కామనలు-దుర్గా ప్రసాద్

27-6-16సోమవారం నా పుట్టిన రోజు పండుగకు అమెరికా నుంచి నా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఆత్మీయంగా అభిమానంగా విజయవాడ కు ఆర్డర్ ఇచ్చి ఉయ్యూరు లో అందజేయించిన పుష్ప గుచ్చం ,కాశ్మీర్ శాలువా ,బత్తాయి , ఆపిల్ ,పైనాపిల్ ,దానిమ్మ ,బంగినపల్లి మామిడిపళ్ళు-చిత్రాలు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -178

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -178

68-పెనిసిలిన్ ప్రదాత –అలేక్సాండర్ ఫ్లెమింగ్ -2(చివరి భాగం )

     మోల్డ్ నుంచి పెనిసిలిన్ తయారవటం ఫ్లెమింగ్ మర్యాదగా చెప్పినట్లు యాదృచ్చికం కాదు .అనేక పరిశోధనల ,పరిశీలనల ,అనుకూల పరిస్థితుల వలననే జరిగింది  .దీనికి నోబెల్ బహుమానం అందుకొన్న రోజు ఫ్లెమింగ్ ‘’ అదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో  పెనిసిలిన్ ఏర్పడింది .అప్పుడు నేను మామూలుగా బాక్టీరియాలజీ సమస్యలపై పరిశోదిస్తున్నానే కాని బాక్టీరియా సంహారకాలపై కాని మోల్డ్ లపైకాని యాంటి సెప్టిక్క్స్,యాంటి బయోటిక్స్లపై    నా ద్రుష్టి యే మాత్రం లేదు .నా మొదటి పరిశోధనా పత్రం లో మోల్డ్స్ ద్వారా యాంటి బాక్టీరియల్ పదార్ధం తయారు చేయవచ్చు అని మాత్రమె చెప్పాను .అందుకనే ఆసమస్యపై పరిశోదిస్తున్నాను .అది సత్యంకాక పోవచ్చని ,సత్యాన్ని చెప్పాలని మాత్రమె నా తపన .అప్పుడే పెనిసిలిన్ అకస్మాత్తుగా ఒక చాన్స్ గా నాకు అబ్సర్వేషన్ లో కనిపించింది .నా గొప్పతనం ఏమిటి అంటే నా శోధనను అలక్ష్యం చేయక పోవటమే .అందుకే నిరంతర శోధన చేయటం తో నన్ను బాక్టీరియాలజిస్ట్అన్నారు ‘’అని చెప్పాడు .

   చాలా పరిశోధనలు లాగానే పెనిసిలిన్ చాలా కాలం ఉపేక్షకు గురైంది .’’ది సైన్స్ బుక్ ఆఫ్ వండర్ డ్రగ్స్ ‘’పుస్తకం లో డోనాల్డ్ జి.కూలే ‘making herbs extracts and so on was scarcely respectable in leading scientific circles  .it was all a bit too with witch –doctorish  ,savoring of superstition and folklore ,like the belief of some ignorant people that a poultice of molded bread made a wound heal more cleanly .The nature of pharmaceutical research was overwhelmingly along lines of laboratory synthesis of organic molecules and the impact of sulfas gave tremendous impettusto such directions .’’అని పూర్వ గాదాలహరి వివరించాడు .నిరంతర౦గా మోల్డ్ లను పెంచుతూ ఉన్నాడే కాని దానిపై ఏమీ చేయలేదు .పెనిసిలిన్ శక్తి తెలుసుకోవటానికి పదేళ్ళు పట్టింది .

   ఫ్లెమింగ్ పబ్లిష్ చేసిన పత్రం ఇద్దరు ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి స్పెషలిస్ట్ లు డాక్టర్ హోవార్డ్ ,ఫ్లోరీ లను ఆకర్షించింది .అతని జర్మన్ సహాయకుడు ఎర్నెస్ట్ బోరిస్ చిన్ నెలల తరబడి ఫ్లెమింగ్ మోల్డ్ నుంచి ఏదైనా పదార్ధాన్ని పొందచ్చునేమో నని ప్రయత్నించాడు .చివరికి చిక్కని గరిటెడు ఎల్లో బ్రౌన్ పౌడర్ ను పొందగలిగాడు .ఇదే పెన్సిలిన్ నుంచి పొందిన మొదటి లవణం ,దాన్ని అనేక తరహా బాక్టీరియా మైస్ లపై ప్రయోగించాడు  .12-2-1941న వేరు చేసిన పెనిసిలిన్ ను మొదటి సారిగా లండన్ లో స్టాఫిలో కొకి బాక్టీరియాతో బాగా ఇన్ఫెక్ట్ అయిన 105డిగ్రీల జ్వరం  తో  బాగా జబ్బు పడ్డ ఒక పోలీస్ కు  ఇంజెక్షన్ గా ఇచ్చాడు .అంతకు ముందు అతనికి చాలా పెద్ద డోసులో సల్ఫానిలమైడ్ఇచ్చారు కాని గుణం కనిపించలేదు .కాని ఇప్పుడు ఈ పెనిసిలిన్ తో క్రమంగా జ్వరం  తగ్గి౦ది కాని అప్పటికే చాలా ప్రమాదం అంచున ఉండటం వలన చనిపోయాడు .అతనిమూత్రం నుండి కొద్దిమోతాదు లో  పదార్ధాన్ని సేకరించి రెండు నెలలు సాంద్రత పరచి ,స్ట్రె ప్టో కాకి బాక్టీరియా తో చావు బతుకులమధ్య ఉన్న 15 ఏళ్ళ కుర్రాడికి దాన్ని ఇంజెక్షన్ గా ఇస్తే వాడు కోలుకొని బతికి బట్టకట్టాడు .కొన్ని నెలల తర్వాత ఫ్లెమింగ్ తన మిత్రుడు ప్రాణాపాయం లో ఉంటె వెన్నెముక ద్వారా మందు ఎక్కించి ప్రాణాలు కాపాడాడు .

   ఈ విధంగా పెనిసిలిన్ ప్రపంచ వ్యాప్త ప్రాణ సంజీవనిగా పేరు పొందింది .రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో యుద్ధం లో ఇరుక్కుని ,ప్రతి ప్రయోగ శాల ఆయుధాల కోసమే పని చేయటం తో తగినంత పెనిసిలిన్ ను తయారు చేయ లేక పోయింది .డాక్టర్ ఫ్లోరె అమెరికా వెళ్లి అక్కడ విస్తృత స్థాయిలో పెనిసిలిన్ తయారు చేసే ఏర్పాటు చేశాడు .1942నాటికి ఒక 100మందికి మాత్రమె సరి పడ పెనిసిలిన్ మందు ఉంది .మరు సటి ఏడాదికి లెక్క లేనంత మందికి ఆ మందు ఇచ్చి ప్రాణాలు కాపాడే స్థితికి వచ్చారు .1943లో ఫ్లెమింగ్ ను ఫెలో ఆఫ్ ది రాయల్ సోసైటీ ని చేశారు.తరువాత నైట్ హుడ్ ఇచ్చి గౌరవించారు .1945లో ఫ్లోరీ,చైన్లతో కలిపి ఫ్లెమింగ్ కు నోబెల్ పురస్కారం ప్రదానం చేశారు .

  అనేక మట్టి నమూనాలనుంచి మోల్డ్ లను వృద్ధి చెందించారు .రాట్జేర్స్ యూని వర్సిటి కి చెందినవాక్స్ మన్ న్యు జెర్సీ మట్టి నుండి ‘’స్ట్రెప్టోమైసిన్ ‘’కనిపెట్టాడు .ఎల్ యూని వర్సిటికి చెందిన పాల్ బార్క్ హోల్డర్ వెనిజుల దుమ్ము నుంచి’’ క్లోరోమైసిటిన్’’ మందు తయారు చేశాడు .అది దక్షిణ అమెరికా లో టైఫస్ బాక్టీరియాను నివారించి టైఫాయిడ్ నుంచి విముక్తి కలిగించింది . 75ఏళ్ళ బెంజమిన్ ద్రగ్గర్ అనే రిటైర్డ్ బాటనీ ప్రొఫెసర్ పుట్టగొడుగులపై తీవ్ర పరిశోధన చేసి మిస్సోరి బురద నుంచి బంగారపు పసుపురంగు మోల్డ్ పెంచి దాని నుంచి వచ్చిన మందుకు’’ ఆరో మైసిన్ ‘’అని పేరు పెట్టాడు .బ్రూక్లిన్ లోని ఒక సంస్థ ఇండియానా లో కుళ్ళిన సాయిల్ నుంచి’’ టేర్రామైసిన్’’ తయారు చేసింది .దీనితో వైద్య రంగం లో నూతన అధ్యాయం ఆరంభమైంది .దీనినే ‘’కేమో దెరపీ శకం ‘’అన్నారు .ఈ మందులన్నీ భూమి లోని మట్టి సారం నుంచి తీసినవే .

   ఎక్కువ డోస్ లో యాంటి బయాటిక్స్ వాడితే పేషెంట్ లకు ఎలర్జీ లు వచ్చి ఇబ్బంది పడతారు .ఫ్లెమింగ్ చలవ వలన వైద్య ప్రపంచం గణనీయమైన అభి వృద్ధి సాధించి జన జీవితం లో వసంతోదయాన్ని తెచ్చింది .చెవి ఎముక (మాస్టాయిడ్)ఆపరేషన్లు ఒకప్పుడు అతి ప్రమాదకరం .ఇప్పుడు ‘’వీజీ ‘’అయింది .పిల్లల చెవి బాధలుతగ్గాయి .మధ్య చెవిలో వచ్చే భయంకర ఇన్ఫెక్షన్ ఇప్పుడు యాంటి బయాటిక్స్ తో ఉష మాయం అవుతోంది .బోస్టన్ లోని పిల్లల ఆసుపత్రిలో మాస్టా యిడ్ఆపరేషన్లు మూడు వందలనుంచి ఒక దశాబ్దకాలం లో అయిదుకు తగ్గి గొప్ప మార్పు తెచ్చింది .ఎపెండి సైటిస్, మేనేంజేటిస్ (మజ్జా రోగం )టులారెమియా  (ప్లేగు వంటి వ్యాధి )ప్యూర్ పెరల్ ఫీవర్ (ప్రసూతి జ్వరం )ఇప్పుడు భయంకరమైనవి కానేకాదు .పూర్తిగా నివారింప దగినవే  .ప్రపంచం ఫ్లెమింగ్ కు ఎంతో రుణ పడి ఉంది .యువకులు ఉత్సాహంగా పని చేస్తూ 65ఏళ్ళకు హాయిగా రిటైరై   ధోకా లేకుండా జీవిస్తున్నారు .అంటే లైఫ్ స్పాన్ పెరిగింది అన్నమాటం .

         బాక్టీరియాలజీ లోనే కాక పెయింటంగ్ లోనూ సిద్ధ హస్తుడైన ఫ్లెమింగ్ తన ఇంటి గోడలపై జేర్మ్ కల్చర్ ను చిత్రించాడు .70వ పుట్టిన రోజురిటైర్మెంట్ పొందినా  మైక్రో బయాలజీ పై ఇంకా  పరిశ్రమ చేయాలని  నిర్ణయించాడు .అతని మాటల్లోనే ‘’I have still got a few useful years before me ,.The happy man keeps on working ‘’అన్నాడు .74వ ఏట ఫ్లెమింగ్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది .11-3-1955న కోట్లాది ప్రాణులకు పెనిసిలిన్ ద్వారా ప్రాణ దానం చేసిన ప్రాణదాత అలేక్సాందర్ ఫ్లెమింగ్ అమరుడయ్యాడు .ఆయన లండన్ ఇంటికి దగ్గరలో ఉన్న లాబరేటరి లో ఆయన వృద్ధి చెందించిన అసలు మోల్డ్ (ఏన్సేస్టర్ )గాజు మూసలో ఇంకా భద్రంగా ఉన్నది .దీనినుంచే ప్రపంచానికి అవసరమైన పెనిసిలిన్  ఆవిర్భ వించింది’

2000సంవత్సరం లోప్రవేశించే ముందు స్వీడన్ కు చెందినా మూడు పెద్ద మేగజైన్ లు ఆ శతాబ్దపు గొప్ప పరిశోధన ఏదని అభిప్రాయ సేకరణ చేస్తే పెనిసిలిన్ అనే అందరూ చెప్పారు .2002లో బి బి సి వందమంది ప్రసిద్ధ బ్రిటన్ల జాబితాలో ఫ్లెమింగ్ ను చేర్చింది .ఆయన కాంశ్య విగ్రహాన్ని మాడ్రిడ్ లో ఏర్పాటు చేశారు .ఆయన పేరుతొ బాంక్ నోట్లు ముద్రించారు .ఆస్టెరాయిడ్ బెల్ట్ లో ఒక దానికి ఫ్లెమింగ్ పేరు పెట్టారు .ఆయన లెక్కలేనన్ని అవార్డులు రివార్డ్ లు పొందాడు .1999లో టైం మేగజైన్ ఆయన పై ప్రత్యెక సంచిక తెచ్చింది .ధన్యజీవి ఫ్లెమింగ్ .  

  

It was a discovery that would change the course of history. The active ingredient in that mould, which Fleming named penicillin, turned out to be an infection-fighting agent of enormous potency. When it was finally recognized for what it was, the most efficacious life-saving drug in the world, penicillin would alter forever the treatment of bacterial infections. By the middle of the century, Fleming’s discovery had spawned a huge pharmaceutical industry, churning out synthetic penicillins that would conquer some of mankind’s most ancient scourges, including syphilis, gangrene and tuberculosis.[32

 

Inline image 1Inline image 2Inline image 3Inline image 5Inline image 4

    సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment