సాహిత్య శిరోమణి శ్రీ తిరుమల రామ చంద్రగారు (వినాయకచవితి సందర్భంగా) విసిరిన అక్షర పల్లెరుకాయలు ఉమ్మెత్తకాయలూ

సాహిత్య శిరోమణి శ్రీ తిరుమల రామ చంద్రగారు (వినాయకచవితి సందర్భంగా) విసిరిన అక్షర పల్లెరుకాయలు ఉమ్మెత్తకాయలూ నూ

‘’మన దేశం లో శైవం, వైష్ణవం ప్రబలటమే కాదు మాదేవుడు గొప్పంటే మా దేవుడు గొప్ప ,మా మతం గొప్పదంటే మామతం గొప్ప ఆని వీరంగం వేసే దాకా వెళ్ళింది .వీర శైవులు గణాధిపతిని నరసింహావతారం ఎత్తిన విష్ణువు సంహరిం చాడని తమ పుస్తకాలలో రాసుకొంటే ,నరసింహుని శివుడు వీరభద్రావతరమెత్తి పీచమడచాడని ,శరభావతార మెత్తి కాల రాచాడని శైవులు కౌంటర్ ఇచ్చారు .మా దేవుడికి నంది వాహనం అంటూ   దశ్శరభ శరభ అంటూ వీరంగం వేశారు ,మాదేవుడికి ఆకాశం లో తేలిగ్గా ఎగిరే గరుడుడు వాహనమని జబ్బలుచరచుకొన్నారు మూడు నామాలవాళ్ళు .మా దేవుడు హాలాహలం తాగి బ్రేవున త్రేంచాడని,పాములను పగ్గాలుగా పేని హారాలుగా  మణికట్టుకు చుట్టుకున్నాడు ఆని విబూది రేకల వారంటే  , మా దేవుడు ఆ నా గేంద్రుని తలత్రోక్కి ,గరళం కక్కించి ,పీటీ దెబ్బకొట్టి హాయిగా పక్కగా పరచుకొన్నాడు ఆని రెండో వారు జవాబిచ్చారు  .మా దేవుడు భార్యను రొమ్ము మీద పెట్టుకోన్నాడని వారంటే ,అదే౦  గొప్ప? మా దేవుడు భార్యను తలమీదే పెట్టుకొన్నాడు ,ఇంకా తగాదాకొస్తే ,సగందేహమే రాసిచ్చీశాడు మావోడు ‘’ఆని మీసాలు దువ్వారు ఎదుటి వారు.ఇలాంటి వాదాల వలన కొంత కీడు జరిగినా మంచి కూడా జరిగింది.బసవపురాణం హరవిలాసం లాంటివి ఆముక్తమాల్యద ,విష్ణు మాయావిలాసం వంటి నాటకాలు వచ్చి వాజ్మయ పరిపుష్టి జరిగింది .ప్రపంచాన్ని బ్రహ్మ రుద్ర మహేశ్వరుల ను అధిగమించి నఒక  అనిర్వచనీయ ప్రభావ శక్తిగల ఒక మహా శక్తి మాయ నడిపిస్తోందని పిల్లిపోరు ,పిల్లిపోరు పిట్ట తీర్చిందని చెప్పే శాక్తేయులు  వారికి ఆసరాగా శ్రీ దేవీ భాగవతం వచ్చాయి ‘’ఆని విష్ణు మాయా విలాసం నాటకం సమీక్షలో అయ్యవారు తిరుమల రామ చంద్రగారు ఇద్దర్నీ అక్షర కొరడాలతో   వాయించారు .దాన్నినేను  వినాయక చవితి సాయంత్రం మనకు పక్కున్న ఇళ్లపై పల్లేరు కాయలు ,ఉమ్మెత్తకాయలు వేసే అలవాటుందని దీనికి లంకే ,కనెక్షన్ ఇచ్చి  శీర్షిక పెట్టాను ‘సరదాగా నవ్వుకోవటానికి .

వినాయక చవితి శుభాకాంక్షలతో

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-25-ఉయ్యూరు  

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.17 వ చివరి భాగం.27.8.25.

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.17 వ చివరి భాగం.27.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.11 వ భాగం.27.8.25.

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.11 వ భాగం.27.8.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.63 వ భాగం.27.8.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.63 వ భాగం.27.8.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.63 వ భాగం.27.8.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.18 వ భాగం.27.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.18 వ భాగం.27.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.18 వ భాగం.27.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.16 వ భాగం.26.8.25.

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.16 వ భాగం.26.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.10 వ భాగం.26.8.25.

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.10 వ భాగం.26.8.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.61 వ భాగం.26.8.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.61 వ భాగం.26.8.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.17. వ భాగం.26.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.17. వ భాగం.26.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.17. వ భాగం.26.8.25.

Posted in రచనలు | Leave a comment

‘’శ్రీ రంగరాజ చరిత్ర ‘’తొలి తెలుగు నవలా రచయిత- నరహరి గోపాలకృష్ణమ శెట్టి

‘’శ్రీ రంగరాజ చరిత్ర ‘’తొలి తెలుగు నవలా రచయిత- నరహరి గోపాలకృష్ణమ శెట్టి

నరహరి గోపాల కృష్ణమ శెట్టి (1833–1885) ఒక తెలుగు రచయిత మరియు 19వ శతాబ్దపు కర్నూలు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన రచించిన “శ్రీ రంగరాజ చరిత్ర” (1872) తెలుగులో తొలి నవలగా పరిగణించబడుతుంది. ఈ నవల సోనాబాయి అనే లంబాడి కన్య కథ ఆధారంగా వ్రాయబడింది మరియు ఇది తొలి తెలుగు నవలగా గుర్తింపు పొందింది. 

బెంగాల్‌ గెజిట్‌ ప్రకటన “తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను వచన (ప్రబంధ ప్రక్రియలో రచన గావించిన వారికి బహుమానం ఇవ్వబడుతుంది ” ప్రకటన గావించినవారు బెంగాల్‌ గవర్నరు లార్డు మెయోగారు కలకత్తా నుంచి గజిటేరియర్‌ ద్వారా వెలువడిన (ప్రకటన అది! ఆ సమయంలో నరహరి గోపాలకృష్ణనుశెట్టిగారు కర్నూలులో డెప్యూటీ కలెక్టరు హోదాలో పదవీ బాధ్యతలు నిర్వహిస్తుండేవారు కృష్ణనుశెట్టిగారు ప్రతిభావంతుడైన ఉద్యోగే కాదు, కవి కూడా! పై ధకటనతో ఆయన కవి హృదయం వికసించింది సమర్ధుడైన అధికారి కాబట్టి విధి నిర్వహణకే మాత్రము భంగము వాటిల్లకుండా సమయము ‘కేటాయించుకుని, అహోరాత్రులు శ్రమించి 1572లో (శ్రీ రంగరాజు చరిత్ర రచించి పరిశీలనార్థం పంపీనారు కృష్ణనుశెట్టిగారు తాను వ్రాసిన గ్రంధం ఉపోద్దాతంలో ఇలా విన్నవించుకున్నారు “నేటి హిందువుల (తెలుగువారి) జీవన సంస్కృతికి ప్రతిబింబం ఈ నవీన ప్రబంధం ” ఆంగ్లంలో నావెల్‌ అన్న పదానికి సమానార్రంలో వచన (ప్రబంధము అన్న పేరును కూడా వీరు సూచించినారు శ్రీ! రంగరాజు చరిత్రకు “సోనబాయి పరిణయ” నుని నామాంతరము కూడా ఉన్నది ఈ (ప్రబంధంలో కులాచారాలు, వర్ణ భేదాలు, మూఢాచారాలను నిశితంగా వినుర్శించినారు రచయిత ఈ నవీన ద్రబంధమును లార్డు మెయోగారికి అంకితం గావించినారు గోపాలకృష్ణనుశెట్టిగారు బాధ్యతాయుతమైన ఉన్నత ఉద్యోగములో వుంటూ రచన చేయడమన్నది అంత తేలికైన వ్యవహారముకాదు అందుకే వారి కృషీ ఫలించినది గజిటేరియర్‌లో గోపాలకృష్ణనుశెట్టిగారి “రంగరాజు చరిత్ర? ను సమీక్షిస్తూ, తెలుగులో వెలువడ్డ తొలి తెలుగు నవల ఆని ప్రకటించబడినది పురుషార్ట ప్రదాయిని మాసపత్రిక (మచిలీపట్నం)లో రంగరాజు చరిత్ర పై సమీక్ష ఇలా వ్రాయబడింది “రంగరాజు చరిత్ర మధుర గ్రాంధిక సాలంకారిక శైలిలో వ్రాయబడిన నవల ”’ గోపాలకృష్ణమశెట్టి గారి హృదయం ఆనంద డోలికల పూయలలూగినది తొలి తెలుగు నవలా రచయితగా లార్డు మెయోగారు అధికార ముద్ర వేసినా, మన సాహిత్య చరిత్రకారులు ఆమోదముద్ర వేయకపోవటం విచారించదగ్గ విషయము రాయలపీమ రచయితల దురదృష్టం కాక మరేమిటి? (తరువాయి 

నరహరి గోపాలకృష్ణనుశెట్టిగారు తొలి తెలుగు నవలా రచయితగా ్రకటించబడి, కర్నూలు జిల్లాకే ఎనలేని ఖ్యాతిని చేకూర్చినారు చిన్నయసూరి, వీరు కలసి హిందూ ధర్మశాస్త్రమును తెలుగులోనికి అనువదించినారు కర్నూలు జిల్లా మాన్యువల్‌ను ఆంగ్రమున రచించినారు వీరి కుమారులు కె రాజామణిశెట్టి తమ తండ్రిగారి పేరున గోపాలశృష్ణనుశెట్టి జీవితమును “గోపాలకృష్ణమూర్తి శతకము” గా రచించిరి అందులో గోపాలకృష్ణమూర్తిగారు బ్రౌన్‌ దొరవారి కత్యంత మిత్రుడని, సహాయకుడని తెలువబడినది అంధ్ర వ్యాకరణము, కందనోలు భూగోళము కూడా రవించి ఖ్యాతి గాంచినారు .  

ఆధారం – కె యన్‌ యస్‌ రాజా-కర్నూలు జిల్లా రచయితల చరిత్ర

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.15 వ భాగం.25.8.25.

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.15 వ భాగం.25.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.9 వ భాగం.25.8.25.

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.9 వ భాగం.25.8.25.

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.9 వ భాగం.25.8.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.60 వభాగం.25.8.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.60 వభాగం.25.8.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.16 వ భాగం.25.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.16 వ భాగం.25.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి.కానుక.14 వ భాగం.24.8.25.

శ్రీ ఎమ్వీయల్ గారి.కానుక.14 వ భాగం.24.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.8 వ భాగం.24.8.25.

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.8 వ భాగం.24.8.25. https://youtu.be/S_qfqONwKHg

Posted in రచనలు | Leave a comment

సైనిక వైద్యుడు, సివిల్ సర్జన్ ,వృక్షశాస్త్రజ్ఞుడు జాతీయవాది, చరిత్రకారుడు, రచయిత, భువనేశ్వరి లైబ్రరీస్థాపకుడు,సంస్కర్త   -మేజర్ వామన్ దాస్ బసు

సైనిక వైద్యుడు, సివిల్ సర్జన్ ,వృక్షశాస్త్రజ్ఞుడు జాతీయవాది, చరిత్రకారుడు, రచయిత, భువనేశ్వరి లైబ్రరీస్థాపకుడు,సంస్కర్త   -మేజర్ వామన్ దాస్ బసు

మేజర్ బామన్ దాస్ బసు (24 మార్చి 1867 – 23 సెప్టెంబర్ 1930) ఒక భారతీయ సైనిక వైద్యుడు, వృక్షశాస్త్రజ్ఞుడు, జాతీయవాది, చరిత్రకారుడు మరియు రచయిత. తన జాతీయవాదంతో వివాదం కారణంగా చిత్రాల్ మరియు సూడాన్‌లలో పనిచేసిన తర్వాత ఆయన ఇండియన్ మెడికల్ సర్వీస్‌కు రాజీనామా చేసి, అలహాబాద్‌లోని పాణిని కార్యాలయం నుండి హిందూ మతంపై పుస్తకాలను సవరించడం మరియు ప్రచురించడంలో తన సోదరుడు శ్రీస్ చంద్ర బసుతో చేరారు. భారతీయ వైద్య సంప్రదాయాలను ప్రోత్సహించే ఆయన, భారతీయ ఔషధ మొక్కలపై కె.ఆర్. కీర్తికర్ ప్రారంభించిన వృక్షశాస్త్ర పనిని పూర్తి చేశారు.

జీవిత చరిత్ర

బామన్ దాస్ బసు లాహోర్‌లో జన్మించారు, భువనేశ్వరి దేవి మరియు శ్యామా చరణ్ బసు (ఖుల్నాలోని తంగ్రా భబానీపూర్ నుండి వచ్చి కలకత్తాలో అలెగ్జాండర్ డఫ్ ఆధ్వర్యంలో చదువుకున్నారు) దంపతుల చిన్న కుమారుడు. అతని తండ్రి లాహోర్‌కు వెళ్లి ప్రారంభంలో అమెరికన్ మిషన్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయంతో సహా పంజాబ్‌లో విద్యా విభాగాన్ని నిర్వహించడంలో ఆయన పాలుపంచుకున్నారు, కానీ బసుకు కేవలం ఐదు నెలల వయసులో మరణించారు. అన్నయ్య శ్రీష చంద్ర బసు, అతని తల్లి అతనిని జాగ్రత్తగా చూసుకున్నారు. పెన్షన్ పొందే హక్కు ఉన్నప్పటికీ, కుటుంబాన్ని మోసం చేసి పేదరికంలోకి నెట్టారు. పిల్లలను పెంచడానికి అతని తల్లి తన నగలను అమ్మవలసి వచ్చింది. శ్రీష ఆరు సంవత్సరాలు పెద్దది మరియు బామన్‌కు భారతీయ వైద్య విధానాలను చదవమని సలహా ఇచ్చింది. బసు 1882లో లాహోర్ మెడికల్ కాలేజీలో చేరాడు కానీ 1887లో తన మిడ్‌వైఫరీ పరీక్షలో విఫలమయ్యాడు. అయితే, తన సోదరుడి ప్రోత్సాహంతో ఇంగ్లాండ్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్ళాడు. అతను LSA, MRCS మరియు IMS పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు మరియు ఏప్రిల్ 1891లో కమిషన్ అయ్యాడు మరియు బాంబే ప్రెసిడెన్సీకి పోస్టింగ్ పొందాడు, అక్కడ అతను 1907 వరకు పనిచేశాడు. అతను సూడాన్ మరియు చిత్రాల్‌లో యుద్ధకాల కార్యకలాపాలను చూశాడు మరియు స్కర్వీతో బాధపడ్డాడు, కానీ అతని ఎక్కువ కాలం అహ్మద్‌నగర్‌లో సివిల్ సర్జన్‌గా ఉన్నాడు. సామ్రాజ్యవాదులకు మద్దతు ఇవ్వడం మరియు అతని జాతీయవాద దృక్పథాన్ని భరించలేనప్పుడు అతను ముందస్తు పదవీ విరమణ తీసుకున్నాడు.

పదవీ విరమణ తర్వాత, బసు అలహాబాద్‌లోని శ్రీష ప్రారంభించిన పాణిని కార్యాలయంలో పనిచేశాడు. ఆయన భారతీయ వైద్య ప్రముఖుల జీవిత చరిత్రలు, “మై సోజర్న్ ఇన్ ఇంగ్లాండ్” అనే పుస్తకం మరియు మోడరన్ రివ్యూకు అనేక చిన్న రచనలు రాశారు. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పత్రిక ఇండియాకు ఇండియన్ మెడికల్ సర్వీస్ పరీక్షల యొక్క తీవ్రమైన నేరారోపణపై రాశారు. (1890). ఆయన పెద్ద పుస్తకాల సేకరణను సేకరించి అలహాబాద్‌లో తన తల్లి పేరు మీద భువనేశ్వరి లైబ్రరీని ఏర్పాటు చేశారు. కల్నల్ కె. ఆర్. కీర్తికర్ ఆ లైబ్రరీని చూసి ఎంతగానో ఆకట్టుకుని దానికి తన సొంత సేకరణను అప్పగించారు. 1920లో బసు కీర్తికర్ హెర్బేరియా, వృక్షశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు మరియు జర్నల్స్‌ను కలకత్తా విశ్వవిద్యాలయానికి బహుమతిగా ఇచ్చారు మరియు వారు కీర్తికర్ హెర్బేరియంను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన అలహాబాద్‌లో జగత్-తరణ్ గర్ల్స్ హైస్కూల్‌ను (తన సోదరీమణుల పేరు పెట్టారు) స్థాపించారు.

బసు 1887లో అలహాబాద్‌కు చెందిన బాబు హరి మోహన్ డే కుమార్తె శ్రీమతి సుకుమారి దేవిని వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు పుట్టిన వెంటనే అతని భార్య క్షయవ్యాధితో బాధపడుతూ 1902లో మరణించింది. ఆ తర్వాత అతని కొడుకును అతని సోదరి పెంచింది. జగత్ మోహిని దాస్. బసు కుల వ్యవస్థను వ్యతిరేకించారు మరియు అది హిందూ మతం పతనానికి దారితీస్తుందని అన్నారు మరియు బాల్య వివాహాలను మరియు పర్దా వ్యవస్థను బహిరంగంగా ఖండించారు. ఆయన ఇస్లాం మరియు ఆంగ్లీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన స్వామి భాస్కరానంద సరస్వతిని ఆరాధించారు. లాహోర్‌లో జరిగిన 9వ అఖిల భారత ఆయుర్వేద సమావేశానికి ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు.

డయాబెటిస్

శాఖాహార ఆహారం ద్వారా మధుమేహాన్ని నయం చేయవచ్చని బసు విశ్వసించారు మరియు 1909లో ది డైటెటిక్ ట్రీట్‌మెంట్ ఆఫ్ డయాబెటిస్ అనే పుస్తకాన్ని రాశారు. పుస్తకంలో ఆయన “మాంసాహారులుగా ఉన్న మధుమేహ రోగులు మాంసం తినే వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారు” అని పేర్కొన్నారు. ఈ ప్రకటనను ది బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ఒక సమీక్షకుడు వివాదం చేశారు.

డయాబెటిక్ రోగులకు ఆయన సిఫార్సు చేసిన ఆహారంలో మాంసం మినహాయించబడింది, పాలు, వెన్న మరియు కూరగాయల నూనెలను అనుమతించారు. డయాబెటిక్ రోగులకు మాంసం సూచించే యూరోపియన్ వైద్యులను బసు ఖండించారు. బసు పుస్తకం 1909–1925 మధ్య పదమూడు ఎడిషన్‌ల ద్వారా ప్రజలకు బాగా అమ్ముడైంది.

బసు డయాబెటిస్‌తో – 23 సెప్టెంబర్ 1930 న63వ ఏట  మరణించాడు .

ప్రచురణలు

అతను రాసిన మరియు సవరించిన ప్రధాన పుస్తకాలు:

ది సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ది హిందువులు (సంకలనం)

సంపుటి 1

సంపుటి 8. గౌతమ న్యాయ సూత్రాలు

సంపుటి 13

సంపుటి 17. భాగం 1. మత్స్య పురాణం

భక్తిరత్నావళి

ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణం

మధుమేహం యొక్క ఆహార చికిత్స (1909)

భారతీయ ఔషధ మొక్కలు (1918, కె.ఆర్. కీర్తికర్‌తో)

భారతదేశంలో విద్య చరిత్ర, తూర్పు భారతదేశం కంపెనీ పాలనలో (1922, 1934)

బ్రిటిష్ క్రౌన్ కింద భారతదేశం (1933, ఫణీంద్ర నాథ్ మరియు నాగేంద్ర నాథ్ బోస్‌తో)

డయాబెటిస్ మెల్లిటస్ మరియు దాని ఆహార చికిత్స (1930)

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-8-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.59 వ భాగం.24.8.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.59 వ భాగం.24.8.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.15 వ భాగం.24.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.15 వ భాగం.24.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.15 వ భాగం.24.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎం వియెల్ గారి. కానుక.13 వ భాగం.23.8.25.

శ్రీ ఎం వియెల్ గారి. కానుక.13 వ భాగం.23.8.25.

శ్రీ ఎం వియెల్ గారి. కానుక.13 వ భాగం.23.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.7 వ భాగం.23.8.25

శ్రీ తిరుమల రామచంద్ర గారి. సాహితీ సుగ తుని స్వగతం.7 వ భాగం.23.8.25

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీదేవీ భాగవత0.14 వ భాగం.23.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీదేవీ భాగవత0.14 వ భాగం.23.8.25.

Posted in రచనలు | Leave a comment

పాండవులు రాజసూయ యాగం చేసినా రాజ్యం కోల్పోయి ఎందుకు కష్టాల పాలయ్యారు ?

పాండవులు రాజసూయ యాగం చేసినా రాజ్యం కోల్పోయి ఎందుకు కష్టాల పాలయ్యారు ?

జనమేజయునికి వ్యాసభగవానుడు ఈ విషయాన్ని దేవీ భాగవతం లో చెప్పాడు .శ్రీ కృష్ణుడు స్వయంగా వచ్చి పూజలందుకొనగా  పాండవులు  రాజసూయ యాగం చేసినా భూరి దక్షిణలు సమర్పించినా ,యధావిధిగా యాగం చేసినా ,బ్రహ్మాండమైన అన్నదానాలు చేసినా , మూడు నెలలు తిరక్కుండానే ,వాళ్ళు జూదం లో ఓడిపోయి రాజ్యం కోల్పోయి,పాండవ ధర్మపత్నినిండు సభలో  అవమానం పాలై , అడవులపాలై కష్టాల మున్నీటిలో మునిగిపోయారు .ఎందుకు ఇలా జరిగింది ?యజ్ఞ ఫలం ఏమైంది ?మహా పరాక్రములై ఉండి కూడా విరాట రాజు కొలువులో ప్రచ్చన్న వేషధారణతో ఎందుకు గడపాల్సి వచ్చింది?కీచకుని చేతిలో యాజ్ఞ సేని పరాభవం ఎందుకు పొందింది ?యాగంలో పాల్గొన్న సద్బ్రాహ్మణులు వర్షించిన అమోఘ  పవిత్ర ఆశీర్వాదాలు ఏమయ్యాయి ?స్వయంగా వాసుదేవుడే దగ్గర ఉండి నడిపించిన యాగ ఫలం ఏమైంది ?శ్రీ కృష్ణ పరమాత్మయడల పాండవులకున్న అచంచల భక్తిఏమైంది? సభలో ద్రుపద రాజకుమారిని జుట్టు పట్టుకు ఈడుస్తుంటే పాండవులు ఎందుకు కాపాడ లేకపోయారు ?ఈ ధర్మ విపర్యానికి కారణం ఏమిటి ?

అలా వాళ్ళ ముఖాలమీద రాసి పెట్టి ఉంది కనుక అలాజరిగింది అనుకొంటే పవిత్ర వేద మంత్రాలు వ్యర్ధం అయిపోయినట్లేగా ?అవే వ్యర్ధమైతే మొత్తం వ్యవస్థ వ్యర్ధమై పోయినట్లేగా ?అన్ని ప్రమాణాలు,సర్వ విధ ఉపాయాలు  వ్యర్ధమైనట్లేగా ?కనుక జరగాల్సింది జరుగు తుంది అనే ఆలోచన బుద్ధి లోకి రాకూడదు .దైవాన్నీ ,ఉపాయాన్నీ రెండిటిని కలిపి ఆలోచించాలి .

‘’సర్వం ప్రమాణం వ్యర్ధం స్యాత్ భవితవ్యే కృతేహృది -ఉభయం చాపి మంతవ్యం దైవం చోపాయ ఏవచ

‘’కృతే కర్మణిచేత్సద్ది  ర్విపరీతా యదా భవేత్ -వైగుణ్యం కల్ప నీయం స్యాత్ ప్రాజ్నైఃపండిత మౌళిభిః’’.

ఒక పని చేసినప్పుడు విపరీత ఫలం వస్తే ,ఆ పనిలో ఎక్కడో పొరబాటు జరిగిందని గ్రహించాలి .దాన్ని శోధించి తెలుసుకోవాలి ?  కర్తృ భేదమా ,  ద్రవ్య భేదమా ?మంత్ర భేదమా ?ఈ మూడింటిలో ఏదో ఒక లోపం జరిగి ఉంటుందని అర్ధం చేసుకోవాలి .పాండవుల విషయం లో ఏం జరిగింది ?అన్యాయార్జిత ద్రవ్యం యజ్ఞానికి పనికి రాదు.దాని వల్ల ఇహలోకం లో కీర్తి రాదు.న్యాయర్జిత ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి .రాజసూయ యాగానికి పాండవులు ఉపయోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు .రాజులతో యుద్ధాలు చేసి ఓడించి దోచి తెచ్చిన ద్రవ్యం .అందుకే బెడిసి కొట్టింది .గర్విష్టులై అంటే సాభిమానులై అధికార ప్రదర్శనగా చేశారు కనుక వ్యతిరేక ఫలితం వచ్చి అన్నీ కోల్పోయి కస్టాలపాలయ్యారు .ఆని జనమేజయునికి వ్యాసుడు చెప్పాడు .

  ఒక సారి దేవేంద్రుడు రాక్షస నాశనం కోసం విశ్వ రూపుడు ను బ్రహ్మగా పెట్టుకొని యాగం చేశాడు .అతడు రాక్షస పక్షం వాడు. వాడు తన రాక్షస పక్షపాతం వదలకుండా ‘’దానవులకు దేవతలకు స్వస్తి అగుగాక ‘’ఆని మంత్రం చెప్పి ముగించాడు. రాక్షస వినాశనం జరగక పోగా వాళ్ళు అంతా తల్లి దగ్గర చేరి దిన దినాభి వృద్ధి చెందారు .ఇదేమిటా ఆని ఇంద్రుడు ఆలోచించి ‘’కర్త్రు’’దోషం ఆని గ్రహించి ఒక రాక్షసుడిని బ్రహ్మ గా తాను పెట్టుకోవటం వలన జరిగిన అనర్ధం ఆని గ్రహించి ,వజ్రాయుధం తొ విశ్వ రూపుడి తన నరికేశాడు .

 ద్రుపదుడు ద్రోణుడిని చంపే పుత్రుడు కావాలని ఎలాంటి లోపం లేకుండా కర్త్రుద్రవ్య మంత్ర లోపం లేకుండా యజ్ఞం చేశాడు .ద్రుష్టద్యుమ్నుడు,ద్రౌపది జన్మించారు .యజ్ఞఫలం సఫలమైంది .దశరధ మహారాజు పుత్రకామేష్టి లోపాలు లేకుండా చేసి నలుగురు కుమారులను పొందాడు .అంటే నిర్దుష్టంగా ,యుక్తి యుక్తంగా యజ్ఞాలు నిర్వహిస్తేనే సత్ఫలితాలు ఇస్తాయి .దోష జుష్టంగా చేస్తే విపరీత ఫలితాలిస్తాయి .కనుక అత్యంత జాగ్రత్తగా యజ్ఞ కార్యం నిర్వహించాలని వ్యాసర్షి జనమేజయునికి చెప్పాడు .

ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ గారి శ్రీ దేవీ భాగవతం .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-8-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

నాటక చక్రవర్తి  -శ్రీ మల్లాది అచ్యుత రామ శాస్త్రి

నాటక చక్రవర్తి  -శ్రీ మల్లాది అచ్యుత రామ శాస్త్రి

కృష్ణా జిల్లా మచిలీ పట్నం లో శ్రీ మల్లాది అచ్యుత రామ శాస్త్రి1872లో జన్మించి 1943లో 71వ ఏట విజయవాడ లో మరణించారు .నాటక రచయితగా బెజవాడలో స్థిరపడ్డారు .విజయవాడ హిందూ ధియేటర్ లో ,మైలవరం కంపెని కోసం ద్రౌపదీ వస్త్రాపహరణం ,సక్కు బాయి మొదలైన నాటకాలు రాశారు .అవి చాలా చోట్ల ప్రదర్శింప బడి గొప్ప పేరు తెచ్చి పెట్టాయి .రత్నమాల అనే గద్య పద్యాత్మక నాటకం రాశారు .భక్త చోకా మిళ ,అహల్య ,సంగీత సత్యామోద చంద్రోదయం,భక్త కుచేల ,రామ దూత (లంకా దహనం )నాటకాలు రాసి ప్రదర్శించారు .వీరి పద్యరచన హృద్యంగా కర్ణపేయంగా ఉంటుంది .1922లో శాస్త్రి గారికి ఘన సత్కారం జరిగింది .నాటక చక్రవర్తి బిరుదు పొందారు .

వీరి ఫోటోదొరకలేదు.

ఆధారం -శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి వ్యాసం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

సంగీత సాహిత్య-శ్రీ  శిష్టు కృష్ణమూర్తి కవి.

సంగీత సాహిత్య-శ్రీ  శిష్టు కృష్ణమూర్తి కవి.

ఇతఁడు ద్వ్యర్థికావ్యకవి యగు ల. కవియొక్క కాలీనప్రసిద్ధ కవి. ల. కవితో నెదిరింపఁదగుకవిత్వసమర్థతయును, ల. కవి యెదిరింపలేని సంగీతప్రజ్ఞయుఁ గలవాఁ డని యీకృష్ణమూర్తికవి చెప్పఁదగి యున్నాఁడు. అయినను సర్వకామదాపరిణయపూర్వపక్షములచేఁగానోవు నీకృష్ణమూర్తికవి కవిత్వవ్యాపారమునకంటె సంగీతవ్యాపారములో నెక్కుడు ప్రతిష్ఠ సంపాదించెను. నేఁటికిని ఆంధ్రదేశమున నీకృష్ణమూర్తి కవి శిష్యులు పెక్కండ్రు సంగీతములోను బెక్కండ్రు సాహిత్యములోఁ గూడ బ్రసిద్ధు లగుముదుసలిపండితులుగా నున్నారు. ఈకృష్ణమూర్తి కవిని వృద్ధావస్థలో నీచరిత్రకారుఁడు తనబాల్యములో ననఁగా ఆ|| 1870 సంవత్సరప్రాంతములోఁజూచియున్నాడు. అప్పటి కాకవికి 70 సంవత్సరములకుఁ బైగా నుండినట్లు కాన్పించెను. ఎటుల నైన నీకవి జననకాలము (క్రీ. శ. 1800-77) = 1723 శాలివాహన సంవత్సరప్రాంతమై యుండును. ఈపండితుఁడు సర్ వాల్టరు ఎల్లియట్టుదొర (Sir Walter Elliot) దొర చరిత్రవిషయమై చేసినయుద్యమములో సహాయభూతుఁడుగా నుండుటంబట్టి యీచారిత్రోద్యమములోఁగూడ సహాయభూతుఁడైన వాఁడే అనిచెప్పవలసియున్నది. పైదొర శిలాశాసన పరీక్ష చేయునపు డీకృష్ణమూర్తికవి శాసనాక్షరశోధకుఁడై యుండెననియును ద్రాక్షారామములో నుండెడునసంఖ్య మగుశిలాశాసనములన్నియు నీకవివలననే యెత్తి వ్రాయంబడెననియు సంప్రదాయజ్ఞాభిప్రాయము. ఈకవికాఁపురస్థలము గోదావరీమండలములోని రామచంద్రపురము తాలూకాలోఁ జేరినగొల్లపాలెముగ్రామము పిత్రార్జితస్థల మనియు నీతఁడు బాల్యమునం దచ్చటనే యుండి విద్యాభ్యాసము చేసి తదనంతరము రామచంద్రపురము వచ్చి కొన్నిదినము లుండెననియు వాడుకొనంబడు. ఈకవి ఆంధ్రదేశములో నుండుసర్వభాగములం జూచి అచ్చటచ్చటఁ గొన్నికొన్నిసంవత్సరములు నివసించియుండెను. రామచంద్రపురమునుండి విశాఖపట్టణము మండలములోని కొన్నిగ్రామములలోఁ గొన్ని సంవత్సరము లితఁడు నివసించెను. అనంతపురము చిత్తూరుజిల్లాలోని కాళహస్తిలోఁ గొన్నిసంవత్సరములు నివసించెను. పిమ్మట గోదావరీ మండలములోని పెద్దాపురము తాలూకాలో జగ్గంపేటగ్రామములో తుదిని మాడుగులు గ్రామములో స్థిరపడెను. పైగ్రామములలో నుండెడు జమీన్ దారు లీకవిశిఖామణిని ఆదరించి యుండఁగోరినమీఁదట నీతఁ డాయాస్థలములలో నివసించినట్లుగాఁ గానిపించును. కృ. కవిని మాడుగులు కృష్ణభూపతి విశేషమాన్యక్షేత్రము లిచ్చి నిల్పఁగా నా గ్రామములోనే నిర్యాణము నందెను.

కృ. కవి లాలీనులు.

కొంచె మెచ్చుతగ్గుగాఁ గ్రీస్తుశకము పందొమ్మిదవశతాబ్దము యొక్క మొదటిమూఁడుఖండములలోనిపండితులును, కవులును కృ. కవి కాలీనులనియే చెప్పవలసియున్నది. అందులోఁ గృష్ణమూర్తికవి యుత్తరార్ధవయఃకాలములోఁ బరవస్తు చిన్నయసూరియును, ఓగిరాలవారిలో ద్విరేఫవర్ణ దర్పణకారుఁ డగురంగనాథకవియును, నతని పితృవ్య పుత్రుఁడును సుమనోమనోభిరంజనప్రబంధకర్త యగు నోగిరాల జగన్నాథకవియును, పై యిర్వురికిని గురుం డగు మంత్రిప్రగడ. వేంకటరామన మంత్రియును కాలీను లని చెప్పవలసియున్నది. ఆనాఁటికిఁ గృ. కవియును వేంకటరామన మంత్రియును సంగీత సాహిత్యవిద్యాప్రవీణు లగు గురువులుగా నుండిరి. రంగ నాథకవి మొదలగువారు తమగురుఁ డధికుఁడని ప్రకటించువారుగను, కృ. కవి యధికుఁ డని అతనిశిష్యవర్గముం జెప్పుకొనుస్థితిలో నుండిరి. అందుఁ గృ. కవి శిష్యులు పెక్కండ్రు వైదికశాకలోనివారును, వేంకటరామనమంత్రి శిష్యులు పెక్కండ్రు నియోగిశాఖలోని వారు నైయుండిరి. రెండవ తెగవారందఱును కోరంగి, తాళ్లరేవు, నీలపల్లి, సీతారామపుర మనుకోరంగిగ్రామ సమీపవాసులు. కృ. కవి నీలపల్లి మొదలగు స్థలములలోనికిం బోవునప్పటికి పైరంగనాథ జగనాథకవులు కృ. కవితోఁ బ్రసంగించి రనియు, నందుఁ గృష్ణక మూర్తకవికే పరాజయము కల్గె నని జగన్నాథకవివలనఁ జరిత్రకారుఁడు తెలిసికొనెను. ఆప్రసంగముయొక్క వివరమును జ్ఞాపకముంచుకొనలేకపోతి నని విచారించుచు చారిత్రకారుఁడు కృ. కవి యొక్క యితరవిశేషముల వ్రాయును.

కృ. కవి. విద్యావిశేషము.

ఈకవి యాంధ్రమునకంటెను. గీర్వాణమందు విశేషప్రజ్ఞ కలవాఁ డని చెప్పవలసియున్నది. అందు సిద్ధాంతకౌముదీ వ్యాకరణమం దీతనికి సంపూర్ణజ్ఞానము కల దని వాడుక గలదు. ఆంధ్రంబునం గూడ నసాధారణకవిత్వప్రజ్ఞ కల దని ప్రబంధకవి యగుటయే కాక ఆవఱలోఁ బ్రసిద్ధిం జెందియున్న పిండిప్రోలు. లక్ష్మణకవితో సమానుఁడ ననిపించుకోవలయు నని చేసిన విద్యాప్రసంగమువలన నతని కాలీన కవులలోఁ బెక్కండ్రకంటె నధిక ప్రజ్ఞాశాలి యని చెప్పవలసియున్నది. ఆశుకవిత్వమునకు కృ. కవి. మిగులఁ బ్రసిద్ధుండు. పురాణమును, ప్రత్యక్ష, బాహాట, పాంచాల, నటన శయ్యలఁ జదువుట యితనినాఁడే ప్రసిద్ధివడసెను. ఇతనికంటెం గొంచెము పూర్వుఁ డగువక్కలంకవీరభద్రకవి తన ప్రజ్ఞావిశేషంబు లితరులు వర్ణించినట్లు చెప్పుకొను పద్యములలోఁ

“బ్రత్యక్ష బాహాట పాంచాల నటనలఁ జదివింప నేర్పుఁదాఁ జదువనేర్చు”

నని చెప్పుకొనియుండిన నిప్పటికిఁ బ్రస్తుతములోఁ బురాణములు చదువువారందఱును సంగీత విద్యాప్రవీణుం డగు నీ కృ. కవి శయ్యనే యవలంబించిచదువుచున్నారు. ఈ కృ. కవికిఁ గలప్రజ్ఞలలో మఱియొక గొప్పప్రజ్ఞ యేమనఁగా. ఏపురాణముఁ జదువుచున్నను ఏ రసము గలపట్టు చదువుచున్నను ఆగ్రంథ మటు నిల్పి తరువాయి గ్రంథమును స్వకపోలకల్పితముం జేయు మనఁగా నటనుండి అభాగములో నుండుశయ్యతో నారసములోనే చాలు నని చెప్పవఱకు నాశుధారను గవనము చెప్పుటయును అది చాలించి తిరుగ నటుపై నుండు కథాభాగముఁ జదువఁగా నించుకయైన శైలీభేదముగాని, రసభేదముగాని లేకుండుటయుఁ గల్గె నని అనేకపండితులు చూచి వచ్చి చెప్పిన వృత్తాంతమై యున్నది. ఈప్రజ్ఞ అసాధరణము. వసుచరిత్ర కావ్యమునకు నీపండితుఁ డెన్మిదియర్థములు చెప్పుచువచ్చె నని వాడుక గలదు. ఈకవి భళిరకవి వేల్పుశతకములోఁగొఱఁతవడియున్న పద్యములఁ బూర్తిచేసె ననియు నతనిశయ్య యాపూర్వపద్యములశయ్యతో సమానముగా నుండె ననియు నెన్నంబడును.

కృ. కవిగ్రంథవివరము.

ఈ కవియు ననేకచాటువులు చెప్పినట్లును వానివలన నాయాకృతిపతులు విశేష బహుమానాదికముం జేసినట్లును వాడుక గలదు. ప్రస్తుతములో దొరికినవఱకు దీనిలోఁ బ్రకటించెదను. ఇట్టిచాటుకవిత్వము చెప్పుటయేకాక సంగీతములోఁ గూడ ననేకకృతులును, వర్ణములును గాయకుల కుపయోగించునట్లు విశేషముగా రచియించెను. వానిలోఁ బెక్కులు కృ. కవితమ్మునికుమారులకడ జగ్గమపేఁటలో నున్నవి. గోదావరిమండలములో నుండువైణికులు పెక్కండ్రు వానిని నేర్చుకొని యున్నారు. వసుచరిత్రకారుఁ డగురామభూషణుని సంగీత సాహిత్యప్రజ్ఞ లెట్టివో ఆధునికులలోఁ గృష్ణమూర్తికవియు నట్లే యున్నవి. వీణా విషయములో నతనినాఁడు లోకోపకారకార్యములు జరిగిన ట్లీ కవినాఁడు వీణోపయోగము లగుననేకవిశేషములు చేయంబడినవి. అవి కాలాంతరమున నైన లోకములో సర్వవైణికులకు లభ్యములై విశే షోపయోగకారులు కాఁగోరుచున్నాము. ఈయనప్రబంధములు కొన్ని రచియించె నని వాడుక గలదు. వానిలోఁ బయలు వెడలినది యొక్క సర్వకామదాపరిణయమే. అది పూర్వపక్షకోటిలోఁ బడిపోవుటచేతఁ దక్కినగ్రంథములు వ్యాపకములోనికి రాలే దని తోఁచెడిని. సర్వకామదాపరిణయముకూడఁ జిరకాలము పేరైన వినఁబడకయుండెను. ఈసంవత్సరమే మామిత్త్రునివలన యత్నించఁబడి అతని కతికష్టముపైని సర్వకామదా పరిణయ గ్రంథముమట్టుకు దొరికిన దనియు నింకను కృ. కవి గ్రంథములంగూర్చి యత్నించుచుండె ననియు విని అత్యానందము నందినాఁడను. ఈ కృ. కవి కాళహస్తిసంస్థానములో నుండఁగ వేంకటేశ్వర మాహాత్మ్యము నాంధ్రీకరించెను. అది కొంతకాలముక్రిందట ముద్రితమై ప్రకటింపఁబడినది. అదియొక్కటియే ప్రస్తుతములో గృ. కవిప్రణీతగ్రంథ మని చెప్పవలసియున్నది. అది ప్రబంధశైలిని లేక సామాన్యశైలి నుండును గావున నందలి విశేషములఁ గూర్చి వివరింప మానెదను.

కాకర్లపూఁడివారిపై కృ. కవి చెప్పినయుత్పలమాలికలు.

“ఉ. వీరు తెనుంగుసాము లరబీతరబీయతు నొప్పుగొప్పస
      ర్కారువలే జమీలు దరఖాస్తుగ నేలినరాజమాన్యహం
      వీరులు ఢక్క ణేలు తజివీజుకులాహికు లున్న మేటిమం
      జూరు జొహారు యాఖిదుమషూరు ఖరారు మదారు బారు బ
      ర్దారు మిఠా ర్గురాలపరదారులుఠౌరు కడానితేరులం
      బారుమిఠారునౌబతు సుమారు పుకారును మీరుకుడ్తినీ
      దారుగుడారుపైకము బిడారుబజారుకొటారులందు నే
      దారుపఠాణిబారుదళదారుసవారు షికారులందు బి
      ల్కూరుసతాసవారు పిలగోలతుపాకులఫైరులందు లే
      ఖ్యారుగఁ బెక్కుమారులు తయారుగ వీరిహజారులందు వె
      య్యాఱులు పెద్దపేరుల జొహారులు చూచి హమీరు లెంచి ద
      ర్బారుపసందుమీఱ వహవా యని మెచ్చునవాబుఖానుషేం
      షేరు బహాదరుల్ పెరవజీరుల మాఱులమాఱుకెన్న తా
      ర్మాఱుగ మోఁది గీములు త మాము వదల్చి మఖాములెల్ల ఫీ
      ర్ఫారొనరించి మిక్కిలి మరాతబులందిరి చేరుమాలు త

ల్వారుల జేరుదారు దళవాయుల చాయలమీఱుచారుకై
జారుకరారుబాఁకునెలజాలుతళుక్కునబందుబస్తుగా
పోరుభుజోరుకాకరలపూఁడివజీరు లదే యన న్మహో
దారులు పూర్ణనిర్మల సుధాకరకాంతికలాపకీర్తివి
స్తారులు భూరిభూసుర వితానమహాహుతిగంధగౌతమీ
తీరనిసర్గ దుర్గపుర దీపితహర్మ్యతలాగ్రభాగసం
చారులు దేవవారవనజాతముఖీసమవారకామినీ
వారక రాబ్జకీలితసువర్ణమణిద్యుతిదండచామర
ప్రేరితవాతధూతనవఫేనసమానవితానమంగళా
కారసువర్ణపీఠపరికల్పితరాజ్యరమామహామహో
దారులు సేతుశీతవసుధాధరమధ్యతలస్ఫురల్ల స
ద్వీరవిశేషసంజనితతీవ్రదవానలబాడబాగ్నిత
త్వారినృపాలజాలమకుటార్పితపాదపయోధిపీఠసం
స్కారులు రామచంద్రపురసాలనివాసులు రామచంద్రవం
దారులు రామచంద్రవసుధావరపౌత్త్రులు రామచంద్రధా
త్రీరమణాభిధానులు వరిష్ఠవసిష్ఠసగోత్రపావనుల్
కారణజన్ము లబ్ధిశశికల్పకమేఘసమాన గానదీ
క్షారతు లిందిరాసుత జయంత వసంత సమాన సుందరా
కారులు బ్రహ్మకల్పము సుఖంబుగ వర్ధిలువార లీధరన్.”

ఈ పద్యము విశాఖపట్టణముజిల్లా వేముపాడు గ్రామకాఁపురస్థుఁడు గుంటూరి పెద్దకవివలనఁ జెప్పఁబడిన ట్లాజిల్లాలోఁ బ్రసిద్ధి గలదు.

కాళహస్తి ప్రభునిపైఁ జెప్పినపద్యము.

ఉ. దామెరవేంకటక్షితిప తావకపాండురకీర్తిదీధితి
    స్తోమము లిందుభా స్తతులతో నెదిరించి తృణీకరింబె నౌ
    గాములకేమి యోజనలుకాని యశంబులు మేయు శంబరం
    బేమరకుబ్బుమీఱ వసియించునె డాపి తదంతరంబునన్

వైణికజనోపయోగిగాఁ జెప్పినయుత్పలమాలికావృత్తములు.

“ఉ. ఏయెడనో యదెక్కడనొ యెవ్వరియొద్దనొ యెందు కెందుకో
      చేయది నేర్చి యున్న యది చెల్లునె వీణె యనంగఁ గొండలన్
      గోయలు దండివచ్చు మెఱుఁగుం బచరించినయట్లుగాక నో

హో యెవరైన నిద్దమగునొద్దికనేర్పగ నేర్చువైణికా
గ్రీయునిశిక్ష గాంచి పలికించు విపంచిని రేఁబగళ్లులం
బాయనిసాధకంబు పరిపాటిగఁ జేతురొ వారివిద్య ని
ర్మాయికవృత్తి రాజసభమాని తమై హితమై తనర్చుఁ ద
న్యాయ మొకింత దెల్పె దనయంబలరన్ శ్రుతిరంజనశ్రుతిం
గాయన గాయనీహృదయకంజ వికాసము మున్ను గా మొదల్
సేయుచు నాటతేట సవిశేషముగా ఘటించి గౌళయున్,
శ్రీయు, వరాళి, యారభియు, సింధు, ఘనద్వని, గౌళి, పాడి, నా
రాయణగౌళి ఆదిఘనరాగము లెన్నిక కొన్ని కొన్ని వా
లాయము గాఁగఁ బూర్వమతలక్షణలక్ష్యత విన్కిఁజేసి యౌ
రా యని విన్న వారు తమయౌఁదల లాదట నూఁచి సన్ను తుల్
సేయఁగ వ్రేళ్లు సారెలకుఁ జేరినయట్లును జేరనట్లు నౌ
డాయు నెడల్ దడల్ దగుకడంక తడంబడకుండఁ దంత్రులన్
వేయువిధంబులన్ నడచువీఁకఁబడన్ బగుతూటుధాటిఘో
డాయనఁగాగఁ జాలగనుడాలు బెడంగుతులంగుహంగుతో
–యముఁ జెందియుండవలెఁ గేల్గదలించి యొకింత మీట నీ
టై యలరారి గౌరి, గిరిశాభరణంబు, ముఖారి, తోడి, పూ
రీయు, వసంతయున్ బిలహారీ మొద లౌనయరాగసంజ్ఞ బా
గై యటు లింపునింపవలె నట్టుల భట్టుల నట్టిరామఖ
ల్లీ, యమునా, అహంగు, మహరీ, గుజరీ, శవానా, బెహాగు, ఠ
క్కాయు, నఠాణ, మారువయు. కాఫీ, ఖమాచి, హుసేని యాది దే
ళీయవిశేషరాగములఁ జెప్పవలెన్ దననేర్పుమీఱ సు
మ్మాయతరాగమర్థనసమాన మరిస్ఫురితాహతోగ్రహ
స్థాయితురంగసంచరణసంకుచితో త్కుచితప్రచారిము
క్తాయివిభేదతాన కటనస్ఫుట తానతనాగ్రమూర్ఛమో
చ్ఛ్రాయమునాదియాదిస్వర జాతియుగీతిననుగ్రహింపఁ బ్ర
త్యాయుత మైనగ్రామయుగ మందము చందము సప్రబంథగీ
తాయతి దాయసంగతి యుదారత దారకమంద్రమధ్యమ
స్థాయిపదచ్యుతాచ్యుతవిచారములన్ గమకప్రచారముల్
ధీయుతవేద్య మిట్టి గడి దేఱినవాద్యము నెందుఁ జూడ మీ
చాయల చాయలంచును రసజ్ఞలు తజ్జ్ఞులు మెచ్చఁగావలెన్
హాయిఁగఁ బామరావళియు నచ్చెరువందఁగ మచ్చుమందుతీ

రై యతిరక్తి హెచ్చి మది నంటుట నొక్కటఁ జొక్కఁగావలెన్
బ్రాయపుసోయగంబు గనుపట్టి తయారగుమేలొయారితో
ఢీయనునొక్కపల్లవి కడిందివడిం దగి యెల్లవారి కా
ప్యాయనలీలఁ గూర్పవలెఁ బ్రాదులు, గాదులు నాదు లెన్న రెం
డై యుగయుగ్మమయ్యు తనరారిననౌనటగోటిమీటులొ
ప్పై యెనయంగ నిబ్బరము నబ్బుర మూనినతాళలీలఁ బ్రా
ణాయితకాలషట్కకలనం జలనం బొకయింతయైన లే
దాయె నయారె యంచు భరతాగమభాగవతప్రచారు లా
మ్నా యవిచేయధుగ్రహనిమగ్రహ భాగ్విషమాదిభేరజా
త్యాయతఖండమిశ్రచతురశ్రముఖాఖిలభేదయుక్క ళా
ప్రాయికసల్లయద్వియుగబంధమృదంగపీపిలికాదిని
శ్చేయయతిప్రసంగపరి శీలన ఖేలననిర్వ్యపాయగో
పాయితదక్షిణానుగత వార్తిక చిత్రముఖాఖిలాయన
స్థాయదమేయశబ్దయుతశబ్దవిహీనముఖాక్రియానుసం
ధేయ మటంచు నెంచవలె నిశ్చలచంచలవృత్తు లిట్టు ల
ట్లై యటు లిట్టులై వెలయ నద్భుతవృత్తి సుధాబ్ధిపూరప
ర్యాయసమాప్లవోత్ల్ప వనరంజన సంజననాంతరాత్మని
ధ్యాయపరాత్మభావనియతిస్థిరనాదవినోదధీరని
ర్ణేయవివక్షణత్వపరినిష్టితలక్షణతం బ్రతిష్టత
త్వాయన మంది యుండవలె నందఱికిన్ దర మౌనె యట్టివి
ద్యాయతకోటి కొక్కఁ డగు నట్టిప్రవీణుఁడు సత్క ళాసము
న్నాయక కాళహస్తిపుర నాయక సన్నిధిదేశ సంగతిం
బాయక కొల్చి యున్న ననపాయకథార్థసమృద్ధినిత్యసౌ
ఖ్యాయతసత్త్వసిద్ధి యగు నం దిఁక సందియ మందనేల వి
ద్యాయతు లైనవారల కుపాయ మిదే నిరపాయ మై తగున్.”

ఇంతియకాక కృ. కవి కొన్ని సాహిత్యముల జేసె. అం దిమిడించిన కొన్ని వర్ణనల చమత్కృతుల నీక్రింద వివరించెదను.

1. “శ్రీరమణపాదజలరుహ బంభరాయమాన హృదయ, మదనమథ ధరరూప, దానరాధేయ, సుజన విధేయ, సద్గుణవిధేయ, శ్రీరావుకుల జలధి చంద్ర నీలాద్రిరాయచంద్ర, శ్రీవేంకటరాయచంద్ర, సుగుణసాంద్ర.

2. నయవినయాదిక సుగుణాకర, సకల దిగంతరాశ్రిత విశేషపాలితా, శేషబుధజన పాలిత, మకుటాళి మణిదీప, మధురాలాప, సురవిజయ, రనిజయ, విజయ, జయ, సంపత్ప్రతాప బలశీలా సుమహితల సదయ,మహితల సదయ, హితలసదయ, తలసదయ, లసదయ, సదయ, దయ, యనకలితవిమత శ్రీవేంకటరాయచద్ర, సుగుణసాంద్ర.”

ఈరెండును సావేరీ రాగములో ధృవతాళమున స్వరములువేసి వానికి సాహిత్యముగా రచియింపఁబడినవి. ఇం దుదాహరింపఁబడిన రావు వేంకటరాయ ప్రభుఁడు బుచ్చితమ్మయాపరనాముఁ డగుజగ్గముపేఁట జమీదారుఁడు. వెలమకులస్థుఁడు.

కృష్ణమూర్తికవి మురుమళ్ల పోలవరం జమీందా రగు దంతులూరి వేంకటకృష్ణమరాజు భద్రాచలయాత్ర పోవుట వర్ణించి చెప్పిన సీసమాలిక.

“సీ. శ్రీనాయకతులితభూనాయకం బగు, నలదంతులూర్యన్వయమున వెలసి
      విలసితసత్కీర్తివిస్ఫూర్తులకును వి,శాలాక్షులకు ధౌతచేలము లయి
      వెలయఁగ చతురంబుధులు మేరగా ధారు,ణీరాజ్య మేలుచు నెగడఁజాలు
      వీలుగలుగురాజు పాలితాశ్రితజాలుఁ డతివేలసౌందర్యజితకమలని
      వాసినీబాలుఁ డై వాసిమీఱగఁ దను, వేంకటకృష్ణ భూవిభుఁ డొకప్డు
      శ్రీభద్రగిరియాత్రఁ జేయుటకై మది, నెంచి సౌందర్యసమంచితముగ
      శుభముహూర్తంబున విభవానుసారి యై, చతురంగబలముతో నతులితముగ
      రాజధాని యగుచు తేజరిల్లెడుపోల, వరము 

కాళహస్తి ప్రభునిపైఁ జెప్పినపద్యము.

ఉ. దామెరవేంకటక్షితిప తావకపాండురకీర్తిదీధితి
    స్తోమము లిందుభా స్తతులతో నెదిరించి తృణీకరింబె నౌ
    గాములకేమి యోజనలుకాని యశంబులు మేయు శంబరం
    బేమరకుబ్బుమీఱ వసియించునె డాపి తదంతరంబునన్

వైణికజనోపయోగిగాఁ జెప్పినయుత్పలమాలికావృత్తములు.

“ఉ. ఏయెడనో యదెక్కడనొ యెవ్వరియొద్దనొ యెందు కెందుకో
      చేయది నేర్చి యున్న యది చెల్లునె వీణె యనంగఁ గొండలన్
      గోయలు దండివచ్చు మెఱుఁగుం బచరించినయట్లుగాక నో

హో యెవరైన నిద్దమగునొద్దికనేర్పగ నేర్చువైణికా
గ్రీయునిశిక్ష గాంచి పలికించు విపంచిని రేఁబగళ్లులం
బాయనిసాధకంబు పరిపాటిగఁ జేతురొ వారివిద్య ని
ర్మాయికవృత్తి రాజసభమాని తమై హితమై తనర్చుఁ ద
న్యాయ మొకింత దెల్పె దనయంబలరన్ శ్రుతిరంజనశ్రుతిం
గాయన గాయనీహృదయకంజ వికాసము మున్ను గా మొదల్
సేయుచు నాటతేట సవిశేషముగా ఘటించి గౌళయున్,
శ్రీయు, వరాళి, యారభియు, సింధు, ఘనద్వని, గౌళి, పాడి, నా
రాయణగౌళి ఆదిఘనరాగము లెన్నిక కొన్ని కొన్ని వా
లాయము గాఁగఁ బూర్వమతలక్షణలక్ష్యత విన్కిఁజేసి యౌ
రా యని విన్న వారు తమయౌఁదల లాదట నూఁచి సన్ను తుల్
సేయఁగ వ్రేళ్లు సారెలకుఁ జేరినయట్లును జేరనట్లు నౌ
డాయు నెడల్ దడల్ దగుకడంక తడంబడకుండఁ దంత్రులన్
వేయువిధంబులన్ నడచువీఁకఁబడన్ బగుతూటుధాటిఘో
డాయనఁగాగఁ జాలగనుడాలు బెడంగుతులంగుహంగుతో
–యముఁ జెందియుండవలెఁ గేల్గదలించి యొకింత మీట నీ
టై యలరారి గౌరి, గిరిశాభరణంబు, ముఖారి, తోడి, పూ
రీయు, వసంతయున్ బిలహారీ మొద లౌనయరాగసంజ్ఞ బా
గై యటు లింపునింపవలె నట్టుల భట్టుల నట్టిరామఖ
ల్లీ, యమునా, అహంగు, మహరీ, గుజరీ, శవానా, బెహాగు, ఠ
క్కాయు, నఠాణ, మారువయు. కాఫీ, ఖమాచి, హుసేని యాది దే
ళీయవిశేషరాగములఁ జెప్పవలెన్ దననేర్పుమీఱ సు
మ్మాయతరాగమర్థనసమాన మరిస్ఫురితాహతోగ్రహ
స్థాయితురంగసంచరణసంకుచితో త్కుచితప్రచారిము
క్తాయివిభేదతాన కటనస్ఫుట తానతనాగ్రమూర్ఛమో
చ్ఛ్రాయమునాదియాదిస్వర జాతియుగీతిననుగ్రహింపఁ బ్ర
త్యాయుత మైనగ్రామయుగ మందము చందము సప్రబంథగీ
తాయతి దాయసంగతి యుదారత దారకమంద్రమధ్యమ
స్థాయిపదచ్యుతాచ్యుతవిచారములన్ గమకప్రచారముల్
ధీయుతవేద్య మిట్టి గడి దేఱినవాద్యము నెందుఁ జూడ మీ
చాయల చాయలంచును రసజ్ఞలు తజ్జ్ఞులు మెచ్చఁగావలెన్
హాయిఁగఁ బామరావళియు నచ్చెరువందఁగ మచ్చుమందుతీ

ఆధారం -శ్రీ గురజాడ శ్రీరామ మూర్తి గారి ‘’కవి జీవితములు ‘’.

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-25-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

త్రిమూర్తులకు డూప్లికేట్ లున్నారా ?ముగురయ్యలు మగువ లయ్యారా ?

త్రిమూర్తులకు డూప్లికేట్ లున్నారా ?ముగురయ్యలు మగువ లయ్యారా ?

అవును అంటోంది దేవీ భాగవతం

జనమేజయుడికి  వ్యాస మహర్షి దేవీ భాగవతం వివరిస్తుండగా తను మోహ జలాలు నిండిన సంసార సముద్రం లో మునిగితేలుతున్నానని జ్ఞాన నావతో దాటించమని కోరగా ,వ్యాసుడు తనుకూడా ఒకప్పుడు ఇలాంటి సంకట స్థితినే అనుభవించి నారద మహర్షి ని  అడిగానని ,ఆయనకు తండ్రి బ్రహ్మ చెప్పిన విషయాలే తెలియ జేస్తానని చెప్పాడు .నారదునికి బ్రహ్మ చెప్పిన విషయాలు .

 ‘’ మహా ప్రళయం సంభవించి నప్పుడు అన౦త  జలరాశిలో కమలం నుంచి నేను పుట్టాను .నేను ఎలా పుట్టాను నాకు రక్షకుడు ఎవరు నేను ఏమి చేయాలి ? ఈ నీటికి ఆధారం ఏది,పంకజం చుట్టూ బురద ఏమిటి ?భూమి ఉందా ?ఆని ఆలోచించి బురద లోకి దిగా .వెయ్యేళ్ళు వెతికినా ఏమీ కనిపించలేదు .’’త’’ప ఆని అశరీర వాణి వినిపిస్తే ,పద్మలో కూర్చుని వెయ్యేళ్ళు తపస్సు చేశా .మళ్లీ ఆకాశ వాణి ‘’సృజ ‘’అన్నది .ఎలా ?అనుకోగా మధుకైటభ రాక్షసులు వచ్చి యుద్ధానికి రమ్మన్నారు .నీటిలోకి నెమ్మదిగా జారి తప్పుకున్నా .విష్ణుమూర్తి, ఆతర్వాత శివుడు కనిపించారు .నన్ను రక్క్షించే వారు లేరా ?ఆని అరిచా .జగదంబ నవ్వింది ఇంతలో ఒక దివ్యవిమానం వచ్చింది .త్రిమూర్తులారా మీకో అద్భుతం చూపిస్తా ఎక్కండి అంది  .ఓం అంటూ అంగీకారం చెప్పి ముగ్గురం ఎక్కాం.

  విమానం స్వర్గం చేరింది అక్కడ మహేంద్రుడుశచీ దేవితో  కనిపించాడు .నందన వనం పారిజాతం వగైరాలు కనిపించాయి .ఇంకా పైకి విమానం వెళ్లగా బ్రహ్మలోకం కనిపించింది .అక్కడ మరొక బ్రహ్మ సకల వేదాలు వేదాంగాలు సాగర నదీ పర్వతాలతొ   కనిపించి మాకు ఆశ్చర్యం కలిగించాడు .నాల్గు ముఖాలతోఅచ్చం నీలాగా ఉన్నాడు ఎవరయ్యా ?ఆని శివ కేశవులు నన్ను ప్రశ్నించారు .ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాను .తర్వాత విమానం కైలాసం చేరింది .ప్రమధులు యక్షులు  అక్కడ ఉన్నారు .వృషభారూఢుడై త్రిలోచనుడు కనిపించాడు .ఈ డూప్లికేట్ శంకరుడిని చూసి నేను మా బాబు విష్ణువు ఆశ్చర్య పోయాం .తర్వాత విమానం ఇంకా పైకి వెళ్లి విష్ణులోకం చేరింది అక్కడ పీతాంబర ధారి శ్రీ మహా విష్ణువు దర్శన మిచ్చాడు .లక్ష్మీ దేవి వింజామర వీస్తోంది .నేనూ శివుడు మరింత ఆశ్చర్యపోయాం .త్రిమూర్తులం ముగ్గురం ఒకరి మొహాలు ఒకళ్ళం చూసుకొంటూ ఆశ్చర్యపోయాం మాకు డూప్లికేట్  లు ఉన్నందుకు .ఎందుకో తెలియనందుకు ?విమానం క్షీర సముద్రం చేరింది .

  క్షీర సముద్ర మధ్య లో  ఒక శివాకార పర్య౦క౦ పై మహా తేజ్స్వంతంగా ఎర్రని చీర ,ఎర్రని వస్త్రాలు ,ఎర్రపూమాలలు ఎర్రనిపెదవులు ఎర్రని కనులతో ,మిరుమిట్లు గొలిపే చూపులతో ,వరదాభయ హస్తాలతో ,పాశా౦కుశాలతోకరుణా మూర్తిగా చిరునవ్వులు చిందిస్తూ నిత్యారుణ,,నవ యవ్వని ,కుమారి మణి మయ భూషణాలతో  కిరీటంతో షట్కోణ పీఠంపై  దేవ కన్యలు పరివేష్టించి ఉండగా శ్రీ భువనేశ్వరి దర్శన మిచ్చింది .మేము ముగ్గురం మహాదాశ్చర్యం పొంది పరమానందం పొందాము ..

   విష్ణుమూర్తి ‘’ఈవిడే మహాదేచి మహావిద్య మహామాయ .పూర్ణ .సర్వ జనకోటి చిహ్నాలు తన శరీరం లో లీనం చేసుకొంటుంది .మనం ధన్యులం. దుర్లభమైన దేవీ దర్శనం పొందాం .సమస్తం దృశ్యమైతే ఈమె ద్రష్ట .ప్రళయంలో మర్రాకుపై నాకు ఉయ్యాలలూపింది ఈమహాశక్తియే .’’ ముగ్గురం వేర్వేరుగా అమ్మవారిని స్తుతించాం.మా చూపులు దేవి పద్మాలపై పడినాయి బొటన వ్రేలిగోరు అద్దం లాప్రకాశించి బ్రహ్మాండం అంతా అందులో ప్రతి ఫలించింది .నేను నాపద్మం ,సరస్వతి ,శేషశాయి ,లక్ష్మి ,,కైలాసం శివ పార్వతులు అందరూ  కనిపించారు .ఆమెను విశ్వ మాత గా భావించాం .ఆమె ఇష్ట సఖులు మమ్మల్ని తమ సఖులుగా భావించారు .మగువలుగా మారిన మా రూప సౌందర్యాలు మాకే మహా మోహనంగా కనిపించాయి. అలా అమ్మ సన్నిధానం లో వంద ఏళ్ళు ఉండిపోయాం .’’ఆని బ్రహ్మ నారదుడికి చెప్పగా ,నారదుడు వ్యాసునికి వివరించగా వ్యాసర్షి జనమేజయునికి తెలియ జేశాడు  .

ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ౦గారి శ్రీ దేవీ భాగవతం .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

ప్రముఖ ఆంగ్ల చరిత్రకారుడు,రచయిత ,సోషలిస్ట్’మేధావి ’,’’ ది మేకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్’’ఫేం ,శాంతి ప్రచార కర్త – ఎడ్వర్డ్ పామర్ థాంప్సన్-1

ప్రముఖ ఆంగ్ల చరిత్రకారుడు,రచయిత ,సోషలిస్ట్’మేధావి ’,’’ ది మేకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్’’ఫేం ,శాంతి ప్రచార కర్త – ఎడ్వర్డ్ పామర్ థాంప్సన్-1

ఎడ్వర్డ్ పామర్ థాంప్సన్ (3 ఫిబ్రవరి 1924 – 28 ఆగస్టు 1993) ఒక ఆంగ్ల చరిత్రకారుడు, రచయిత, సోషలిస్ట్ మరియు శాంతి ప్రచారకర్త. 18వ శతాబ్దపు చివరి మరియు 19వ శతాబ్దపు ప్రారంభంలో జరిగిన రాడికల్ ఉద్యమాలపై, ముఖ్యంగా ది మేకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్ (1963)పై ఆయన రాసిన చారిత్రక రచనలకు ఆయన బాగా ప్రసిద్ధి చెందారు.

1966లో, థాంప్సన్ సామాజిక చరిత్రకు తన విధానాన్ని వివరించడానికి “హిస్టరీ ఫ్రమ్ బిలో” అనే పదాన్ని రూపొందించారు, ఇది ప్రపంచ చరిత్ర విభాగంలో అత్యంత పర్యవసాన పరిణామాలలో ఒకటిగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీ హిస్టారియన్స్ గ్రూప్ మరియు చారిత్రక భౌతికవాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి దాని కృషి నుండి హిస్టరీ ఫ్రమ్ బిలో ఉద్భవించింది. థాంప్సన్ రచనను కొందరు ఇరవయ్యవ శతాబ్దం చివరిలో సామాజిక చరిత్రకు చేసిన అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటిగా భావిస్తారు, ఇది ఆసియా మరియు ఆఫ్రికాలో పాండిత్యంతో సహా ప్రపంచ ప్రభావాన్ని చూపుతుంది. హిస్టరీ టుడే మ్యాగజైన్ 2011లో నిర్వహించిన పోల్‌లో, ఫెర్నాండ్ బ్రాడెల్ తర్వాత గత 60 సంవత్సరాలలో ఆయన రెండవ అత్యంత ముఖ్యమైన చరిత్రకారుడిగా ఎంపికయ్యారు.

ప్రారంభ జీవితం

ఇ. పి. థాంప్సన్ ఆక్స్‌ఫర్డ్ లో మెథడిస్ట్ మిషనరీ తల్లిదండ్రులకు జన్మించాడు: అతని తండ్రి, ఎడ్వర్డ్ జాన్ థాంప్సన్ (1886–1946), నోబెల్ బహుమతి గ్రహీత కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు కవి మరియు ఆరాధకుడు. అతని అన్నయ్య విలియం ఫ్రాంక్ థాంప్సన్ (1920–1944), రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ అధికారి, బల్గేరియన్ ఫాసిస్ట్ వ్యతిరేక పక్షపాతాలకు సహాయం చేస్తూ పట్టుబడి కాల్చి చంపబడ్డాడు. ఎడ్వర్డ్ థాంప్సన్ మరియు అతని తల్లి దేర్ ఈజ్ ఎ స్పిరిట్ ఇన్ యూరప్: ఎ మెమోయిర్ ఆఫ్ ఫ్రాంక్ థాంప్సన్ (1947) రాశారు. ఈ ముద్రణలో లేని జ్ఞాపకాన్ని 2024లో బ్రిట్టన్‌కులి రికార్డ్స్ & బుక్స్ తిరిగి విడుదల చేసింది. థాంప్సన్ తరువాత తన సోదరుడి గురించి మరొక పుస్తకం రాశాడు, ఇది మరణానంతరం 1996లో ప్రచురించబడింది.

థాంప్సన్ రెండు ప్రైవేట్ పాఠశాలల్లో, ఆక్స్‌ఫర్డ్‌లోని ది డ్రాగన్ స్కూల్ మరియు బాత్‌లోని కింగ్స్‌వుడ్ స్కూల్‌లో చదివాడు. చాలా మందిలాగే అతను 1941లో రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడటానికి పాఠశాలను విడిచిపెట్టాడు. అతను ఇటాలియన్ ప్రచారంలో ఒక ట్యాంక్ యూనిట్‌లో పనిచేశాడు, అందులో నాల్గవ కాసినో యుద్ధం కూడా ఉంది.

తన సైనిక సేవ తర్వాత, అతను కేంబ్రిడ్జ్‌లోని కార్పస్ క్రిస్టి కళాశాలలో చదువుకున్నాడు, అక్కడ అతను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌లో చేరాడు. 1946లో, థాంప్సన్ క్రిస్టోఫర్ హిల్, ఎరిక్ హాబ్స్‌బామ్, రోడ్నీ హిల్టన్, డోనా టోర్ మరియు ఇతరులతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రకారుల సమూహాన్ని స్థాపించాడు. 1952లో వారు పాస్ట్ అండ్ ప్రెజెంట్ అనే జర్నల్‌ను ప్రారంభించారు.

స్కాలర్షిప్

థాంప్సన్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉన్నప్పుడు రాసిన విలియం మోరిస్ జీవిత చరిత్ర అతని మొదటి ప్రధాన పాండిత్య రచన. ఫ్రమ్ రొమాంటిక్ టు రివల్యూషనరీ అనే ఉపశీర్షికతో, కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లప్పుడూ మాస్కో మార్గాన్ని అనుసరిస్తున్నందుకు దాడికి గురైన సమయంలో బ్రిటన్‌లో మార్క్సిజం యొక్క దేశీయ మూలాలను నొక్కి చెప్పడానికి టోర్ ప్రేరణతో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రకారుల బృందం చేసిన ప్రయత్నంలో ఇది భాగం. 50 సంవత్సరాలకు పైగా తన కళను నొక్కిచెప్పిన మరియు తన రాజకీయాలను తక్కువ అంచనా వేసిన విమర్శకుల నుండి మోరిస్‌ను వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా ఇది.

మోరిస్ రాజకీయ రచనలు బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ, థాంప్సన్ తన సాహిత్య ప్రతిభను మోరిస్ రచనలోని అంశాలపై వ్యాఖ్యానించడానికి కూడా ఉపయోగించాడు, అతని ప్రారంభ రొమాంటిక్ కవిత్వం వంటివి, గతంలో సాపేక్షంగా తక్కువ పరిశీలన పొందాయి. థాంప్సన్ రెండవ ఎడిషన్ (1976)కి తన ముందుమాటలో పేర్కొన్నట్లుగా, మొదటి ఎడిషన్ (1955) అప్పటి ఫ్యాషన్ లేని మార్క్సిస్ట్ దృక్పథం కారణంగా సాహిత్య సంస్థ నుండి చాలా తక్కువ శ్రద్ధను పొందినట్లు కనిపిస్తుంది. అయితే, కొంతవరకు తిరిగి వ్రాయబడిన రెండవ ఎడిషన్‌కు మంచి స్పందన లభించింది.

1957 వేసవిలో థాంప్సన్ అసమ్మతి మార్క్సిస్ట్ జర్నల్ ది న్యూ రీజనర్‌ను ప్రారంభించాడు. ఈ ప్రచురణ విలీనంతో 1960లో న్యూ లెఫ్ట్ రివ్యూగా ఏర్పడింది.

1956లో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్‌లో నికితా క్రుష్చెవ్ చేసిన “రహస్య ప్రసంగం” తర్వాత, సోవియట్ పార్టీ నాయకత్వం స్టాలిన్ నేరాల గురించి చాలా కాలంగా తెలుసని వెల్లడించిన తర్వాత, థాంప్సన్ (జాన్ సవిల్లె మరియు ఇతరులతో కలిసి) CP లోపల ది రీజనర్ అనే అసమ్మతి ప్రచురణను ప్రారంభించాడు. ఆరు నెలల తర్వాత, అతను మరియు అతని సహచరులు చాలా మంది హంగేరీపై సోవియట్ దండయాత్ర పట్ల అసహ్యంతో పార్టీని విడిచిపెట్టారు.

కానీ థాంప్సన్ అతను “సోషలిస్ట్ హ్యూమనిస్ట్” అని పిలిచే దానిగానే ఉన్నాడు. సవిల్లె మరియు ఇతరులతో కలిసి, అతను న్యూ రీజనర్‌ను స్థాపించాడు, ఇది దాని సంపాదకులు కమ్యూనిస్ట్ మరియు ట్రోత్స్కీయిస్ట్ పార్టీల యొక్క అధికారిక మార్క్సిజం మరియు లేబర్ పార్టీ మరియు దాని అంతర్జాతీయ మిత్రదేశాల నిర్వహణా శీతల యుద్ధ సామాజిక ప్రజాస్వామ్యం యొక్క అస్సిఫైడ్ అధికారిక మార్క్సిజం అని దాని సంపాదకులు భావించిన దానికి ప్రజాస్వామ్య సోషలిస్ట్ ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిన ఒక జర్నల్. 1950ల చివరలో మరియు 1960ల ప్రారంభంలో అణ్వాయుధ నిరాయుధీకరణ కోసం ప్రారంభ ఉద్యమంతో దగ్గరి సంబంధం కలిగి ఉన్న అసమ్మతి వామపక్షవాదుల అనధికారిక ఉద్యమం “న్యూ లెఫ్ట్” అని పిలువబడే దానిలో న్యూ రీజనర్ అత్యంత ముఖ్యమైన విభాగం.

న్యూ రీజనర్ 1960లో యూనివర్సిటీస్ మరియు లెఫ్ట్ రివ్యూతో కలిసి న్యూ లెఫ్ట్ రివ్యూను ఏర్పాటు చేసింది, అయితే థాంప్సన్ మరియు ఇతరులు 1962లో జర్నల్‌ను స్వాధీనం చేసుకున్న పెర్రీ ఆండర్సన్ చుట్టూ ఉన్న సమూహంతో విడిపోయారు. అప్పటి నుండి థాంప్సన్ మరియు ఇతరులు న్యూ లెఫ్ట్‌ను “మొదటి న్యూ లెఫ్ట్”గా మరియు 1968 నాటికి తారిక్ అలీ మరియు వివిధ ట్రోత్స్కీయిస్టులను స్వీకరించిన ఆండర్సన్ మరియు ఇతరుల సమూహాన్ని రెండవదిగా వర్ణించడం ఫ్యాషన్‌గా ఉంది.

1960ల ప్రారంభంలో: ది మేకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్

థాంప్సన్ యొక్క అత్యంత ప్రభావవంతమైన రచన ది మేకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్, అతను లీడ్స్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు 1963లో ప్రచురించబడింది మరియు ఇప్పటికీ ఉంది. 800 పేజీలకు పైగా ఉన్న ఈ భారీ పుస్తకం సామాజిక చరిత్ర రంగానికి పునాది వేసింది. గతంలో విస్మరించబడిన వారి డాక్యుమెంటరీ అవశేషాల ద్వారా శ్రామిక ప్రజల సాధారణ సంస్కృతులను అన్వేషించడం ద్వారా, థాంప్సన్ 18వ శతాబ్దపు చివరి మరియు 19వ శతాబ్దపు ప్రారంభంలో ప్రపంచంలోని మొట్టమొదటి శ్రామిక-తరగతి రాజకీయ వామపక్షం యొక్క మరచిపోయిన చరిత్రను చెప్పాడు. పుస్తకం 50వ వార్షికోత్సవానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ, ఎమ్మా గ్రిఫిన్ వివరించిన ప్రకారం, థాంప్సన్ “వర్క్‌షాప్ ఆచారాలు మరియు ఆచారాలు, విఫలమైన కుట్రలు, బెదిరింపు లేఖలు, ప్రసిద్ధ పాటలు మరియు యూనియన్ క్లబ్ కార్డుల గురించి వివరాలను బయటపెట్టాడు. ఇతరులు ఆర్కైవ్ నుండి స్క్రాప్‌లుగా భావించిన వాటిని అతను తీసుకొని, గెలిచిన వైపు లేని వారి నమ్మకాలు మరియు లక్ష్యాల గురించి వారు మాకు చెప్పిన దాని కోసం వారిని విచారించాడు. అప్పుడు, వారి చరిత్రకారుడిని ఇంతకు ముందు ఎన్నడూ చూడని మానవ అనుభవ అంశాలపై విరుచుకుపడిన పుస్తకం ఇక్కడ ఉంది.

ది మేకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్ బ్రిటిష్ చరిత్ర చరిత్ర ఆకృతిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది మరియు 1963లో దాని మొదటి ప్రచురణ తర్వాత 50 సంవత్సరాలకు పైగా విశ్వవిద్యాలయ పఠన జాబితాలలో ప్రధానమైనదిగా ఇప్పటికీ కొనసాగుతోంది. 2013లో టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వ్రాస్తూ, రాబర్ట్ కోల్స్ తన తరం యువ బ్రిటిష్ వామపక్షవాదుల కోసం థాంప్సన్ పుస్తకం యొక్క శక్తిని గుర్తుచేసుకున్నాడు:

నేను 1968లో నా మొదటి కాపీని కొన్నాను – ముందు భాగంలో యార్క్‌షైర్ మైనర్ చిత్రంతో పెలికాన్ యొక్క చిన్న, లావుగా ఉన్న కట్ట – మరియు నా దగ్గర ఇప్పటికీ అది ఉంది, కట్టు కట్టబడి ఉంది. మరియు సంవత్సరాల శ్రమతో అలసిపోయాను. దాని 900-బేసి పేజీలలో మొదటి పేజీ నుండి, ఇది వేరే విషయం అని నాకు తెలుసు, మరియు సస్సెక్స్ విశ్వవిద్యాలయంలోని నా స్నేహితులకు తెలుసు. మేము బార్‌లో, బస్సులో మరియు రెఫెక్టరీ క్యూలో దాని గురించి మాట్లాడాము. ఊహించుకోండి: యువ మగ విద్యార్థులు గూస్బెర్రీ టార్ట్ మరియు కస్టర్డ్ కంటే పుస్తకంపై ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ఈ పుస్తకానికి తన ముందుమాటలో, E.P. థాంప్సన్ కింది నుండి చరిత్ర రాయడానికి తన విధానాన్ని నిర్దేశించాడు, “నేను పేద స్టాకింగర్, లుడ్డైట్ క్రాపర్, “వాడుకలో లేని” చేతి మగ్గం నేత, “యుటోపియన్” కళాకారుడు మరియు జోవన్నా సౌత్‌కాట్ యొక్క మోసపోయిన అనుచరుడిని కూడా, వంశపారంపర్యత యొక్క అపారమైన దయ నుండి రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. వారి చేతిపనులు మరియు సంప్రదాయాలు b కలిగి ఉండవచ్చు

థాంప్సన్ ఆలోచన కూడా అసలైనది మరియు ముఖ్యమైనది ఎందుకంటే అతను “తరగతి”ని నిర్వచించాడు. థాంప్సన్‌కు, తరగతి అనేది ఒక నిర్మాణం కాదు, కానీ ఒక సంబంధం:

మరియు కొంతమంది పురుషులు, సాధారణ అనుభవాల ఫలితంగా (వారసత్వంగా లేదా పంచుకున్న), తమ ఆసక్తుల గుర్తింపును తమ మధ్య ఉన్నట్లుగా భావించి, వ్యక్తీకరించినప్పుడు తరగతి జరుగుతుంది, మరియు వారి ఆసక్తులు వారి ప్రయోజనాలకు భిన్నంగా (మరియు సాధారణంగా వాటికి వ్యతిరేకంగా) ఉన్న ఇతర పురుషులకు వ్యతిరేకంగా. తరగతి అనుభవం ఎక్కువగా పురుషులు జన్మించిన ఉత్పాదక సంబంధాల ద్వారా నిర్ణయించబడుతుంది – లేదా అసంకల్పితంగా ప్రవేశిస్తుంది. తరగతి-స్పృహ అనేది ఈ అనుభవాలను సాంస్కృతిక పరంగా నిర్వహించే మార్గం: సంప్రదాయాలు, విలువ-వ్యవస్థలు, ఆలోచనలు మరియు సంస్థాగత రూపాల్లో మూర్తీభవించింది. అనుభవం నిర్ణయించబడినట్లుగా కనిపిస్తే, తరగతి-స్పృహ కనిపించదు. సారూప్య అనుభవాలకు లోనవుతున్న సారూప్య వృత్తి సమూహాల ప్రతిస్పందనలలో మనం ఒక తర్కాన్ని చూడవచ్చు, కానీ మనం ఏ చట్టాన్ని అంచనా వేయలేము. తరగతి యొక్క స్పృహ వేర్వేరు సమయాల్లో మరియు ప్రదేశాలలో ఒకే విధంగా పుడుతుంది, కానీ ఎప్పుడూ ఒకే విధంగా పుడదు.

తరగతి మారిన సంబంధంగా తరగతిని తిరిగి నిర్వచించడం ద్వారా, థాంప్సన్ తరగతి చారిత్రక పరిశోధనకు ఎలా అర్హమైనదో ప్రదర్శించడం కొనసాగించాడు. అమెరికన్ కార్మిక వర్గాల గురించి ఇలాంటి అధ్యయనాలు చేసిన డేవిడ్ మోంట్‌గోమెరీ మరియు హెర్బర్ట్ గట్‌మాన్ వంటి కార్మిక చరిత్రకారుల తరానికి ఆయన ద్వారాలు తెరిచారు.

పరిశోధన , సంశ్లేషణ యొక్క ప్రధాన రచన అయిన ఈ పుస్తకం చారిత్రక పరంగా కూడా ముఖ్యమైనది: దానితో, థాంప్సన్ నిజమైన రక్తమాంసాల కార్మికుల అనుభవంలో పాతుకుపోయిన చారిత్రక మార్క్సిజం యొక్క శక్తిని ప్రదర్శించాడు. థాంప్సన్ వెస్ట్ యార్క్‌షైర్‌లోని సిడాల్, హాలిఫాక్స్‌లో నివసిస్తున్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశాడు మరియు స్థానిక హాలిఫాక్స్ జనాభాతో తన అనుభవాల ఆధారంగా కొంత రచనను రూపొందించాడు.

తరువాతి వ్యాసాలలో, నేరం మరియు రుగ్మత అనేది శ్రామిక మరియు దిగువ తరగతుల వారిపై విధించబడిన అణచివేతలకు వారి లక్షణ ప్రతిస్పందనలు అని థాంప్సన్ నొక్కిచెప్పాడు. నేరాన్ని ప్రధానంగా ఉన్నత వర్గాల స్థితి, ఆస్తి మరియు ప్రయోజనాలకు ముప్పు కలిగించే చర్యగా నిర్వచించి శిక్షించారని ఆయన వాదించారు. ఇంగ్లాండ్ యొక్క దిగువ తరగతులను పెద్ద ఎత్తున ఉరితీయడం, కాలనీలకు రవాణా చేయడం మరియు పాత యుద్ధనౌకల భయంకరమైన హల్క్‌లలో జైలు శిక్ష విధించడం ద్వారా నియంత్రణలో ఉంచారు. నేరస్థులను సంస్కరించడంలో ఆసక్తి లేదు, అత్యంత కఠినమైన శిక్ష ద్వారా నిరోధించడం లక్ష్యం.

1960ల చివరిలో: సమయం, పని-క్రమశిక్షణ మరియు పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం

సామాజిక శాస్త్రం మరియు మానవ శాస్త్రానికి సంబంధించిన సమయ క్రమశిక్షణ అనేది సమయం యొక్క కొలత, సామాజిక కరెన్సీ మరియు సమయ కొలతలపై అవగాహన మరియు ఇతరులు ఈ ఆచారాలను పాటించడం గురించి ప్రజల అంచనాలను నియంత్రించే సామాజిక మరియు ఆర్థిక నియమాలు, సంప్రదాయాలు, ఆచారాలు మరియు అంచనాలకు ఇవ్వబడిన సాధారణ పేరు.

థాంప్సన్ 1967లో ప్రచురించబడిన సమయం, పని-క్రమశిక్షణ మరియు పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానాన్ని రచించారు, ఇది గడియార-సమయంపై ఆధారపడటం యూరోపియన్ పారిశ్రామిక విప్లవం యొక్క ఫలితమని మరియు సమయం మరియు పని క్రమశిక్షణ యొక్క సమకాలీన రూపాలను విధించకుండా పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం లేదా ఆధునిక రాజ్యం యొక్క సృష్టి సాధ్యం కాదని పేర్కొంది.  పారిశ్రామిక విప్లవానికి ముందు సమయం యొక్క ఖచ్చితమైన మరియు ఖచ్చితమైన రికార్డు ఉంచబడలేదు. ప్రభుత్వం మరియు పెట్టుబడిదారీ ప్రయోజనాలచే విధించబడిన కొత్త గడియార-సమయం సూర్యోదయం, సూర్యాస్తమయం మరియు కాలానుగుణ మార్పులు వంటి సమయం యొక్క మునుపటి, సమిష్టి అవగాహనలను భర్తీ చేసింది, ఇది థాంప్సన్ విశ్వసించిన సూర్యోదయం, సూర్యాస్తమయం మరియు కాలానుగుణ మార్పులు వంటి సమయం యొక్క సహజ లయలు వంటి సమయం యొక్క సమిష్టి అవగాహనలను భర్తీ చేసింది. అయితే, పారిశ్రామిక విప్లవానికి ముందు మతపరమైన మరియు ఇతర సామాజిక అధికారులచే సమయం యొక్క పూర్వ అభిప్రాయాలు విధించబడినప్పటికీ, థాంప్సన్ రచన సామాజిక శాస్త్రాలలో అధ్యయనం కోసం సమయ క్రమశిక్షణను ఒక ముఖ్యమైన భావనగా గుర్తించింది.

థాంప్సన్ సమయం అభివృద్ధిని విలువను కలిగి ఉన్న మరియు సామాజిక నిర్మాణాల ద్వారా నియంత్రించగల కొలతగా ప్రస్తావిస్తుంది. పారిశ్రామిక విప్లవం సమయంలో శ్రమ మరింత యాంత్రికీకరించబడినందున, సమయం మరింత ఖచ్చితమైనది మరియు ప్రామాణికమైంది. ఫ్యాక్టరీ పని పెట్టుబడిదారుడికి మరియు కార్మికులకు సమయం మరియు గడియారంతో ఉన్న సంబంధాన్ని మార్చివేసింది; గడియార సమయం సామాజిక నియంత్రణకు ఒక సాధనంగా మారింది. శ్రమ ఖర్చు పెట్టుబడిదారునికి గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా చూసుకోవడానికి కార్మికుల పనిని ఖచ్చితంగా పర్యవేక్షించాలని పెట్టుబడిదారీ ప్రయోజనాలు డిమాండ్ చేశాయి.

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-25-

Posted in రచనలు | Leave a comment

వేద శాస్త్ర పారంగతులైన ఉద్దండ పండితులు,దర్శనాలంకార ,తర్క వేదాంత సార్వ భౌమ  -బ్రహ్మశ్రీ మాండలీక వేంకట శాస్త్రి

వేద శాస్త్ర పారంగతులైన ఉద్దండ పండితులు,దర్శనాలంకార ,తర్క వేదాంత సార్వ భౌమ  -బ్రహ్మశ్రీ మాండలీక వేంకట శాస్త్రి

తూగోజి అమలాపురం దగ్గర భట్నవిల్లి గ్రామం లో 20-10-1900 మాండలీక సుబ్రహ్మణ్యం ,రామ లక్ష్మమ్మ దంపతులకు బ్రహ్మశ్రీ మాండలీక వేంకట శాస్త్రి జన్మించారు .అక్కడే పండిత గొర్తి సుబ్బయ్య శాస్త్రి గారి వద్ద సంస్కృతం నేర్చి కావ్య నాటక అలంకార గ్రంథాలు అభ్యసించారు .తర్క వేదాంత శ్రీ బులుసు అప్పన్న శాస్త్రి గారి వద్ద తర్కశాస్త్రం కొంతవరకు చదివి ,పిఠాపురం ఆస్థాన సంస్కృత పండితులు శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ,’’తర్క పంచానన ‘’ధూళిపాల  సూర్య నారాయణ శాస్త్రి లవద్ద సంప్రదాయ పద్ధతిలో తర్కాన్ని సంపూర్ణంగా నేర్చారు .పిఠాపురం వారు నిర్వహించిన పోటీ పరిక్షలో ఉత్తమ శ్రేణిలో  కృతార్ధు లయ్యారు .మహారాజా వారి ఉపకార వేతనం తొ శ్రీ దెందుకూరు నరసింహ శాస్త్రి గారి వద్ద అద్వైత వేదాంతాన్ని నేర్చి పరీక్షలో ఉత్తీర్ణులై గురువు అనుగ్రహం పొందారు .

  పండితులలో ఉండాల్సిన భేదకత ,బోధకత ,వాదకత శాస్త్రిగారికి విద్యార్ధి దశనుంచి అలవడిన సుగుణాలు .అసాధారణ ప్రజ్ఞా విశేషం మాండలీక వారిది .శ్రీ జోశ్యుల సీతారామ శాస్త్రి గారి పుత్రిక సుబ్బ లక్ష్మమ్మ గారిని వివాహమాడారు .1926 అక్టోబర్ లో పగోజి గణపవరం వద్ద సిరిపల్లె గ్రామం లో ఈమని వెంకటేశ్వర్లు గారు స్థాపించిన ‘’సఖ్యాభి వర్ధక నిలయం ‘’సంస్కృత పాఠశాలలో తర్క ,వేదాంత ఉపాధ్యాయులై 1920వరకు పని చేశారు .ఎందఱో విద్యార్ధులను తర్క వేదాంత విశారదులను చేసిన ఆదర్శ గురు వరేణ్యులు శాస్త్రి గారు .

  తర్వాత ద్రాక్షారామం లో ‘’ద్రాక్షారామ సంస్కృత పాఠ శాల’’లోఅధ్యాపకులుగా పని చేసి ,తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాల’’లో లెక్చరర్ గా ఒక ఏడాది పని చేసి ,అక్కడి నియమాలు సరిపడక పదవీ విరమణ చేసి ,శ్రీ కంచి కామ కోటి పీఠాధిపతి శ్రీ చంద్ర శేఖరసరస్వతీ మహా స్వాముల  ఆదేశానుసారం కాశీలో కంచి మఠం లో విద్యార్ధులకు తర్క వేదాంతాలు బోధించారు .1942లో మచిలీ పట్నం లోని ‘’సాంగ వేద పాఠశాల ‘’ ప్రిన్సిపాల్ అయి దాని అభివృద్ధికి విశేష కృషి చేశారు .

  1962లో కంచిలో పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి తర్క వేదాంతాలు బోధించారు .కొంతకాలం నెల్లూరు ,ఏలూరు మొదలైన చోట్ల తర్క వేదాంత అలంకార శాస్త్రాలు విద్యార్ధులకు బోధించి తీర్చి దిద్దారు .ఏలూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని 25ఏళ్ళు ఉండి,చుట్టుప్రక్కల భాగవత రామాయణ భారత పురాణ ప్రవచనాలు నిర్విఘ్నం గా సాగించారు .ఆసేతు హిమాచల పర్యంతం తీర్ధ యాత్రలు చేసి ,ధార్మిక ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో చైతన్యపరచి ,ఏలూరు విశాఖ తొ సహా అనేక చోట్ల  ఆస్తిక దేవతా జ్ఞాన మందిరాలను ,గీతాభవనం శంకర మఠం లను నెలకొల్పారు .పండిత పరిషత్తులలో తమ వాద కౌశలంతో జ్ఞాన జ్యోతులు వెలిగించారు .

 మాండలీక శాస్త్రి గారి అశేష పాండిత్యాన్ని గుర్తించి మచిలీపట్నం లో పండితులు ,పురజనులు ‘’తర్క వేదాంత సార్వ భౌమ ‘’బిరుదునిచ్చి ఘనంగా సత్కరించగా ,నడయాడే దైవం కంచి మహాస్వామి వారు శాస్త్రి గారికి ‘’దర్శనాలంకార ‘’,శాస్త్ర రత్నాకర ‘’బిరుదులందించి గౌరవించి మహాసత్కారం జరిపించారు .1960లో ఏలూరు పురజనులు ,పండితులు ,శిష్యులు షష్టిపూర్తి సమ్మానోత్సవాన్ని నేత్ర పర్వంగా జరిపారు .శాస్త్రి గారు 23-12-1970న 70వ ఏట పరమపదించి ‘’దివిజ పండితవరుల గుండియల్ దిగ్గురనగ ‘’ సరస్వతీ మహాసామ్రాజ్యం చేరారు

ఆధారం -ఏలూరుకు చెందిన శ్రీ బి.వి .దాశరధి గారి వ్యాసం  

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

సరస భారతి 192 వ కార్యక్రమంగా శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం

అక్షరం లోక రక్షకం

సరస భారతి 192 వ కార్యక్రమంగా శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం

5-9-2025 శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సరసభారతి 192వ కార్యక్రమం గా సుమారు 80 సంవత్సరాల క్రితం మా గురు వరేణ్యులు కీ .శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం 5-9-25-శుక్రవారం సాయంత్రం 6-30గం లకు శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో జరుగుతుది . 2025పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన  ప్రతిభ గల విద్యార్ధినీ విద్యార్ధులకు నగదు బహుమాన బహూకరణం  ,ఉపాధ్యాయులకు సన్మానం నిర్వ హిస్తున్నాము .పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

  కార్యక్రమం

సభాధ్యక్షులు -శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభం -శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి -సరసభారతి గౌరవాధ్యక్షులు

ముఖ్య అతిధి -డా.పరుచూరి శ్రీనివాసరావు -ప్రిన్సిపాల్ ,శ్రీనివాస అక్షరాలయం -ఉయ్యూరు

ఆత్మీయ అతిధి -శ్రీ కోడే సాంబశివ రావు -వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు -ఉయ్యూరు

సభ నిర్వహణ -శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి – సరసభారతి కార్య దర్శి

శ్రీ కోట గురు వరేణ్యుల ,శ్రీ సర్వేపల్లి రాధా కృష్ణ చిత్రపటాలకు పుష్పాలంకరణ

కోట గురువరేణ్యుల పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ కోట సీతారామాంజనేయులు శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గార్లు బ్రాహ్మణ విద్యార్ధినీ విద్యార్ధులకు ఏర్పాటు చేసిన నగదు బహుమతి ప్రదానం

1-కీ.శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక నగదు బహుమతి

 కుమారి కరమి  చెట్టి  యాగశ్రీ పూర్ణ కు -రూ 10,116

(ఫ్లోరా హైస్కూల్ లో చదివి 2025పబ్లిక్ పరీక్షలో 521/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధిని )

2-కీ.శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక నగదు బహుమతి

చిరంజీవి భేతనభొట్ల నాగశ్రీ సాయికృష్ణ కార్తీక్ కు -రూ 10,116

(ఫ్లోరా హైస్కూల్ లో చదివి 2025పబ్లిక్ పరీక్షలో 475/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధి)

కీ.శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన నగదు బహుమతులు

1-       కీ.శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక నగదు బహుమతి

చిరంజీవి నిడుమోలు యోగేశ్వర్ కు   -B.C.విద్యార్ధి -రూ-5000

(శ్రీనివాస అక్షరాలయం లోచదివి 2025పబ్లిక్ పరీక్షలో 575/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధి )

2-కీ.శే .కోటసీతమ్మ గారి స్మారక నగదు బహుమతి

కుమారి కూడాట జోత్శ్నా దేవి కు -ST విద్యార్ధిని -రూ 5000

(శ్రీనివాస అక్షరాలయం లోచదివి 2025పబ్లిక్ పరీక్షలో 583/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధిని  )

గమనిక -నగదు బహుమతికి ఎంపికైన  వారు తప్పక తమ పేరెంట్స్ తొ హాజరై  స్వీకరించాలి .

ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం

1-శ్రీమతి  చాగర్లమూడి పద్మజ -సీనియర్ తెలుగు పండిట్ ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -గరికపర్రు 

2-శ్రీమతి భాగవతుల నాగవల్లి – ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయిని -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -ఉయ్యూరు

తెలుగులో మాట్లాడటం మనజన్మ హక్కు

శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి   మాదిరాజు శివ లక్ష్మి   గబ్బిట వెంకట రమణ  

గౌరవాధ్యక్షురాలు                     కార్యదర్శి                కోశాధికారి

  గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -20-8-25-

Posted in రచనలు | Leave a comment

పరీక్షిత్ కాలం లోనే ‘’ఆమ్యామ్యా ‘’ఉందా?

పరీక్షిత్ కాలం లోనే ‘’ఆమ్యామ్యా ‘’ఉందా?

ఉన్నదనే దేవీ భాగవతం చెబుతోంది .

పరీక్షిన్మహారాజు 60 ఏళ్ళు ధర్మ బద్ధంగా రాజ్యపాలన చేశాడు .ఒక రోజు వేటకు వెళ్లి అలసి దాహార్తుడై ఒక ముని ఆశ్రమం చేరటం ఆయన్ను దాహం అడగటం ఆయన సమాధి ఉండగా కోపంతో విధి వక్రించి చచ్చిన పాము మెడలో వేయటం,విషయం ముని కుమారుడికి తెలిసి ‘’నా తండ్రి మెడలో సర్పాన్ని వేసిన వాడిని  ఇవాల్టికి ఏడవ రాత్రి తక్షకుడు కాటు వేయుగాక ‘’ఆని శపించటం ,దాన్ని తప్పించుకోవటానికి ఒంటి స్థంభం మేడలో ఇతరులెవరూ చొరటానికి వీల్లెకుండా కట్టు దిట్టం చేసుకొని ప్రాణభీతితో ఉండటం మనకు తెలుసు .ముని అనామకుడే కొడుకు అనామకుడే .కాని శాపం మాత్రంభీకరం .కాలం కాకపొతే తాడే పామై కరవటమంటే ఇదే  .

ఎక్కడో ఉన్న కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి ఈ విషయం తెలిసి ,తాను  మంత్రవేత్త కనుక రాజును కాపాడితే పుష్కలం గా డబ్బు పొందచ్చు అని ఆశ పడ్డాడు. ఏడవ రోజు శాపానికి చివర రోజు తక్షకుడు పరీక్షిత్తును కాటు వేయటానికి బయల్దేరాడు .దారిలో కశ్యపుడు ఎదురయ్యాడు .ఎక్కడికి వెడుతున్నావు ?ఆని అడిగితె ‘’మా రాజును కా పాడటానికి వెడుతున్నాను .తక్షకుడే కాదు వాడి  తలలో జేజమ్మ వచ్చి కరిచినా రాజును కాపాడే మంత్రం నా దగ్గర ఉంది’’ఆని అన్నాడు .ఖంగు తిన్న తక్షకుడు ‘’నేనే తక్షకుడిని .నా కాటుకు విరుగుడు లేదు . వెనక్కి తిరిగి కొంపకు చేరు ‘’అన్నాడు .పౌరుషం పొంగిన పిచ్చి బాపడు ‘’ముని శాపం ఉన్నా ,నువ్వు కరచినా పరీక్షిత్తును కాపాడి తీరుతాను ‘’అన్నాడు ,అయితే ‘’ఈ మర్రి చెట్టును కాటేస్తా .అది క్షణం లో మాడి మసి అవుతుంది .దానికి ప్రాణం పోసి బతికించు ‘’ఆని పందెం వేసి అలానే చేయగా బ్రాహ్మణుడు ఆ బూడిద అంతా పోగేసి తన మంత్ర ప్రభావంతో దాన్ని మళ్లీ కొమ్మలు ఆకులూ కాయలూ ఉన్న చెట్టుగా మార్చేశాడు .కశ్యపుడు మహా మంత్ర వేత్త ఆని గ్రహించి సామ దానాలతో లొంగదీసే ప్రయత్నం చేశాడు.’’బాపనయ్యా! రాజును రక్షించే నీ ప్రయత్నమంతా డబ్బు కోసమే కదా .ఆ డబ్బు నేనే ఇస్తాను ఇంటికి వెళ్ళు ‘’అన్నాడు .

  ధర్మ సందేహంలో పడిన ఆ కశ్యపుడు ‘’డబ్బుకు లొంగితే రాజును కాపాడిన కీర్తి రాదు .కీర్తి శాశ్వతం .రఘుమహారాజు ,హరిశ్చంద్రుడు కర్ణుడు మనకు ఆదర్శం . ప్రజా క్షేమం కోసం నా రాజును కాపాడుకోవాలి .అనుకొని ధ్యానం లోకి వెళ్లి దివ్య దృష్టితో రాజు భవిష్యత్తు చూశాడు  .రాజుకు నూకలు చెల్లిపోయినట్లు అర్ధమయింది.ఆసన్న మరణం. ఇక ఎవరూఏమీ చేయలేరు .తక్షకుడు ఇచ్చే డబ్బు తీసుకొంటే దరిద్రమైనా తీరుతుంది .కీర్తి కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా ?ఆనుకొని తక్షకుడు పుష్కలంగా ఇచ్చిన ధనం పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు .ఇదే ఆమ్యామ్యా ప్రభావం .ఆకాలం లోనే ఉంది కదా .

  తక్షకుడికి పరిక్షిత్తు గురించి ఆలోచన వచ్చి చివరి రోజుల్లో దాన ధర్మాలు చేసుకోకుండా ,భయంతో ఒంటి స్థంభం మేడలో బతకటమేమిటి చావుకు భయపడి?ఎవరూ ఆయనకు ఇలాంటి సలహా ఇవ్వలేదా? దురదృష్టం. విధి బలీయం . అతని చావుకు నేను నిమిత్త మాత్రుడిని.అనుకొన్నాడు .ఒకపండులో కీటకంగా దూరి,కొన్ని పాములను తాపసుల వేషాలతో పళ్ళూ ఫలాలుతీసుకొని ఒంటి స్థంభం మేడలోకి వెళ్లటం ,తాపసులకు రేపు దర్శనం ఇస్తానని చెప్పి ఆ పళ్ళు  మాత్రం లోపలి పంపమనటం ,సూర్యాస్తమయం అయింది ఇక తనకు చావు భయం లేదనుకోవటం ,విప్రశాపం తీరిపోయింది అయినా శాపాన్ని మన్ని౦చ టానికి  ఈ పండు తీసుకొంటా. అనగా అందులోనుంచి చిన్న పురుగు బయటికి రాగా ‘’ఈ పురుగు నన్ను కాటు వేయుగాక ‘’ఆని దాన్ని మెడ మీద పెట్టుకోగా ,  తక్షక రూపం లో ఉన్న అది మహా విష సర్పమై పరీక్షిత్తు ను చుట్టేసి కాటు వేయగా  మొదలు నరికిన చెట్టుగా కూలిపోగా ,తక్షకుడు నిప్పులు కక్కుతూ నింగికి ఎగిరిపోయాడు .పాపం స్వయం కృతాపరాధం.చావుదగ్గర పడ్డప్పుడు చావు తెలివి తేటలు వస్తాయంటే ఇదే నేమో .

ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి -శ్రీ దేవీ భాగవతం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-25-ఉయ్యూరు ..  

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి . కానుక.7 వ భాగం.

శ్రీ ఎమ్వీయల్ గారి . కానుక.7 వ భాగం.

https://youtu.be/LPT9tnOr5us
శ్రీ ఎమ్వీయల్ గారి . కానుక.7 వ భాగం.

Posted in రచనలు | Leave a comment

శ్రీ తిరుమల రామచంద్ర గారి.సాహితీ సుగ తుని స్వగతం.1 వ భాగం.16.8.25.

శ్రీ తిరుమల రామచంద్ర గారి.సాహితీ సుగ తుని స్వగతం.1 వ భాగం.16.8.25.

శ్రీ తిరుమల రామచంద్ర గారి.సాహితీ సుగ తుని స్వగతం.1 వ భాగం.16.8.25.

Posted in రచనలు | Leave a comment

గంగా దేవి తెలియ కుండా చేసిన తప్పు ,పొందిన శాపం, ఫలితం

గంగా దేవి తెలియ కుండా చేసిన తప్పు ,పొందిన శాపం, ఫలితం

ఇక్ష్వాకు వంశం లో ‘’మహాభిషుడు ‘’అనే చక్రవర్తి వెయ్యి అశ్వమేధాలు వంద వాజపేయాలు చేసి చక్కగా పాలిస్తున్న ధర్మ శీలుడు, సత్యవ్రతుడు.దేవేంద్రుడిని సంతోషపెట్టి స్వర్గం లో నివాసం పొందాడు .ఒక సారి ఆయన బ్రహ్మ దర్శనానికి సత్యలోకం వెళ్లాడు .అప్పుడ దేవతలు ,దేవనది గంగాదేవి కూడా వచ్చారు .ఆ సంరంభం లో గాలి తాకిడికి గంగాదేవి పైట జారింది .చూడటం తప్పు ఆని దేవతలు తల వంచు కొన్నారు .మహాభిముఖుడు మాత్రం తదేక దృష్టితో చూశాడు .ఆమె కొంత అనురక్తి చూపగా ,ఇద్దరి చూపులు కలిశాయి .ఆమెలో ప్రేమ అంకురించి కామ మోహిత అయింది .సిగ్గుతో పారిపోయింది .ఇద్దరూ పరిసరాలు మరచి ఒకరి నొకరు చూసుకొంటూ మైమరచి పోయారు .బ్రహ్మ దేవుడు గమనించి ఇద్దర్నీ మానవ లోకం లో పుట్టమని శపించాడు .అప్పటికి స్పృహలోకి వచ్చి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు .

 మహాభిముఖుడు మంచి వంశం లో పుట్టాలని వెదికి వెదికి ‘’పురు వ౦శం ‘’లో ‘’ప్రతీప రాజు’’ కొడుకు గా పుట్టాడు .ఆ సమయం లో అష్ట వసువులు తమ భార్యలతో ఆకాశ సంచారం చేస్టూ వశిష్టాశ్రమ ప్రాంతానికి వచ్చారు .అందులో ఒక వసువు పేరు ‘’ద్యు’’.అతడి భార్య వశిష్టాశ్రమం లో  నందిని ధేనువును చూసి ముచ్చటపడి అది వశిష్టునిది ఆని,అది దివ్య ధేనువు ఆని ,దాని పాలుతాగితే ,దీర్ఘాయుస్సు ,నిత్య యవ్వనం సిద్ధిస్తాయని   భర్త వల్ల  ఆని తెలుసుకొని  గోముగా భర్త ద్యుతో ‘’నాధా !నా ఇష్టసఖి ఉశీనర రాజర్షి పుత్రిక మృత్యులోకం లో ఉంది .ఆమె కోసం ఈ ధేనువును దూడతో సహా తీసుకు పోదాం .ఈ ఆవు పాలుతాగి నా స్నేహితురాలు మళ్లీ ఆరోగ్య వంతు రాలవుతుంది ,నిత్య యౌవనం తొ శోభిస్తుంది ‘’ఆని పట్టు బట్టింది .అప్పుడు మహర్షిఆశ్రమం లో లేడు .ఇదే లక్కీ చాన్స్ అనుకొని ఆ వసువులు ద్యు ప్రోత్సాహంతో నందిని ధేనువును అపహరించి తీసుకు పోయారు .

  కొంతసేపటికి మహర్షి వశిష్టుడు వచ్చి జరిగింది తెలుసుకొని ఆ అష్ట వసువులను భూలోకం లో జన్మించమని శపించాడు .వాళ్లకు హాట్ ట్రాక్ లో తెలిసి పరిగెత్తుకొని వచ్చి మహర్షి పాదాలపై వ్రాలారు .పొరబాటును క్షమించమని కాళ్ళావేళ్ళా బ్రతిమిలాడారు .మహర్షి శాంతించి కోప తీవ్రత తగ్గించి ‘’ఏడాదికి ఒక్కరు చొప్పున మీరు శాప విముక్తి పొందుతారు .దీనికి వ్యూహ రచన చేసిన ద్యు మాత్రం చాలా కాలం మానవ శరీరంతో ఉండక తప్పదు ‘’అన్నాడు .

 ‘’అను వత్సరం సర్వె శాపమోక్ష మవాప్స్య ధ -యే నేయం విహ్రుతా దేను ర్నందినీ మమ వత్సలా -తస్మాత్ ద్యౌ ర్మానుషె దేహే దీర్గకాలం వసిష్యతి’’ .

మానవ జన్మలో ఏడాది కాలం ఎలా బతకాలి అనుకొంటూ ఉంటే ,భూలోకానికి వస్తున్న గంగా దేవి కనిపించగా తమల్ని ఉద్ధరించమని ఆమెను శరణు వేడుతూ ఆమెను భూలోకం లో శ౦తన మహారాజు భార్యగా జన్మించి ,ఏడాదికోక్కో క్కరినిగా తమల్ని ప్రసవించి ,పుట్టిన వాడిని పుట్టినట్లు తన పవిత్ర జలాలలో కలిపె తమకు ముక్తి ప్రసాదించమని ప్రార్ధించారు . సరే ననగా వారు వెళ్ళిపోయారు .

  ప్రతీప మహారాజుకు సంతానం లేదు .గంగాతీరంలో పుత్ర సంతానం కోసం  సూర్యోపాసన తీవ్ర తపస్సుతో  చేశాడు.ఒక రోజు గంగనుంచి ఒక సుందర స్త్రీ వచ్చి ప్రతీపుడి కుడి తొడమీద కూర్చుంది .కళ్ళు తెరిచి చూసి విషయం గ్రహించి తన అనుమతి లేకుండా అలా కుడి తొడమీద కూర్చున్న ఆమె ఎవ్వరో ప్రశ్నించాడు .కామించి వచ్చాను స్వీకరించమన్నది సుందరాంగి .ప్రతీపుడు ‘’నేను పర స్త్రీ వ్యామోహం లేని వాడిని .నా కుడి తొడమీద కూర్చున్నావు.అలా కూర్చునే  ఆర్హత కొడుకు, కూతురు, కోడలు కు మాత్రమె ఉంది  .

‘’స్థితా దక్షిణ మూరు౦ మె సమాశ్లిష్యచ భామిని – అపత్యానాం ,స్నుషాణా౦ చ స్థానం విద్ధి సుచిస్మితే ‘’

.నాకు సంతానం లేదు .ఒక వేళ నాకు కనుక  కొడుకు పుడితే  నిన్ను నా కోడలిని చేసుకొంటాను.’’అన్నాడు సరే ఆని వెళ్ళిపోయింది .కానీ ఆమెను గురించే ఆలోచిస్తున్నాడు .కొంతకాలానికి ప్రతీపుడికి శంతనుడు పుత్రుడుగా పుట్టాడు .పెరిగి పెద్ద వాడయ్యాక రాజ్యం అప్పగించి వానప్రస్థానానికివెళ్ళా లనుకొని  కొడుకుకు సుందరాంగి  వృత్తాంతం  చెప్పాడు  .అడవికి వేటకు వెడితే ఆమె కనిపించి మొహిస్తుందని తిరస్కరించవద్దని ,ప్రశ్నించకుండా ధర్మ పత్నిగా స్వీకరించ మని .ఇదీ తన ఆజ్ఞ ఆని హితవు చెప్పాడు  .శంతనుడికి ఆమె కనిపించింది అతడే ‘’మహాభిషుడు ‘’గా గుర్తించి౦ది .ఆ సుందరి గంగా దేవి ఆని అతడు గుర్తించలేదు .ఇద్దరికీ ప్రేమ అంకురించిఒడి ఆమె అతడిని ‘’నాకు ఒక వరం ఇస్తే పెళ్ళికి సిద్ధం .నేనేపని చేసినా ప్రశ్నించకూడదు .ప్రశ్నించి ఆపితే నేను నిన్ను విడిచి వెళ్లిపోతా ‘’అన్నది సరే అన్నాడు

‘’యచ్చ కుర్యామహం కార్యం శుభం వా యదివా అశుభం -న నిషేధ్యా త్వయా రాజన్  న వక్తవ్యం తదాప్రియం ‘’

శంతనుడు ఒప్పుకోవటం గంగాదేవి ఏదాదికి ఒకడిని  కనటం వాడిని గంగలో పడేయ్యటం అలా ఏడుగురు వసువులు శాపవిముక్తి పొందటం ఎనిమిదవ వసువు భీష్ముడుగా పుట్టటం ఈసారి కనీసం వీడినైనా బ్రతించమని కోరటం ఆమె శ౦తనుడిని కొడుకును తీసుకొని వెళ్లి పోవటం అతడికి వేద వేదాంగాలు నేర్పి మళ్లీ శంతనుడికి అప్పగించటం మనక తెలిసిన కధే .దీని వెనక ఇంత ఫ్లాష్ బాక్ ఉంది .

ఆధారం – ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి శ్రీదేవీ భాగవతం

 శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.53 వ భాగం.16.8.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.53 వ భాగం.16.8.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.9 వ భాగం.16.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.9 వ భాగం.16.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.9 వ భాగం.16.8.25.

Posted in రచనలు | Leave a comment

ప్రముఖ చారిత్రక పరిశోధ కులు న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి. నా సాహిత్య జీవితం.12 వ భాగం.14.8.25.

ప్రముఖ చారిత్రక పరిశోధ కులు న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి. నా సాహిత్య జీవితం.12 వ భాగం.14.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.లీ వ భాగం.14.8.25.

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.లీ వ భాగం.14.8.25.

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.లీ వ భాగం.14.8.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.52 వ భాగం.14.8.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.52 వ భాగం.14.8.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.8 వ భాగం.,14.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.8 వ భాగం.,14.8.25.

Posted in రచనలు | Leave a comment

ప్రముఖ చారిత్రక పరిశోధ కులు న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి. నా సాహిత్య జీవితం.11 వ భాగం.23.8.25.

ప్రముఖ చారిత్రక పరిశోధ కులు న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి. నా సాహిత్య జీవితం.11 వ భాగం.23.8.25.

ప్రముఖ చారిత్రక పరిశోధ కులు న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి. నా సాహిత్య జీవితం.11 వ భాగం.23.8.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.5 వ భాగం.13.8.25.

శ్రీ ఎమ్వీయల్ గారి. కానుక.5 వ భాగం.13.8.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.51 వ భాగం.13.8.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.51 వ భాగం.13.8.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.7 వ భాగం.13.8.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.7 వ భాగం.13.8.25.

Posted in రచనలు | Leave a comment

శుక మహర్షికి పిల్లా జెల్లా ఉన్నారా ?

శుక మహర్షికి పిల్లా జెల్లా ఉన్నారా ?

ఉన్నారనే దేవీ భాగవతం చెబుతోంది .శుక  మహర్షి తన  తండ్రి  వేద వ్యాస మహర్షి అయిన కృష్ణ ద్వైపాయనుని కుమారుడు .తండ్రి వద్ద వేద వేదాంగాలు అభ్యసించి మహా జ్ఞాని అయ్యాడు .తండ్రి చాలా సంతోషించాడు .ఒక రోజు కొడుకుతో ‘’నాయనా !సకల శాస్త్రాలు నేర్చి మహాజ్ఞాని వయ్యావు .ఇక పెళ్ళి చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాలు నెరవేర్చు .వివాహం చేసుకొని కుమారుని పొంది  వంశ విస్తరణ చేయి ‘’అన్నాడు .దానికి ‘’తండ్రీ !నాకు సంసార లంపటం లో దిగాలని లేదు.హాయిగా అరణ్యాలలో ఉంటూ  తాపోధ్యానాలతో మోక్షం పొందాలనుకొంటున్నాను.;;అన్నాడు తండ్రి ‘’గృహస్థాశ్రమం చాలా పవిత్రమైనది .అందరికి  ఆదర్శ ప్రాయం. గృహస్తు లేకపోతె అతిధి అభ్యాగతుల్ని యతుల్ని సన్యాసుల్ని ఎవరుఆదరిస్తారు ?’’అన్నాడు ‘సంసారం లో ఉంటే కామసుఖం మీదే ధ్యాస ఉంటుంది .మరిదేనిపైనా ఆలోచన ఉండదు. ఇంత చదివి నేర్చి నేను మళ్లీ ఆ కూపం లో ఇరుక్కోలేను తండ్రీ .మన్నించు ‘’అన్నాడు .తండ్రి ‘’బాబూ !విదేహ రాజ జనకుడు రాజర్షి .జీవితం సాగిస్తూనే రాజ్యపాలన చేస్తూనే జీవన్ముక్తుడు ఆని పించుకొన్నాడు .నేకేమైనా సందేహాలుంటే ఆయన ను సందర్శించి అనుమానాలు నివృత్తి చేసుకొని  మళ్లీ  నాదగ్గరకు రా’’అన్నాడు .సరే ఆని .శుకుడు మిధిలకు వెళ్లాడు .

  మిధిలా నగరం లో ద్వారపాలకుడి తొ మాట్లాడగానే అక్కడి తత్వజ్ఞత ఏమిటో అర్ధమైంది .అతడు శుకునిలోని బ్రహ్మజ్ఞానిని గుర్తించి గౌరవించాడు .రాజప్రాసాదానికి తీసుకు వెళ్లాడు .ఇంతలో మంత్రివచ్చి శుక మహర్షికి స్వాగతం చెప్పి జనక చక్రవర్తి వద్దకు తీసుకు వెళ్లాడు .అరణి గర్భ సంభూతుడైన పవిత్రమూర్తి శుక మహర్షి  దర్శనంతో మహారాజు పరమానందభరితుడై పూజించి సత్కరించి వచ్చిన పని అడిగాడు .శుకుడు తండ్రి దగ్గర పెట్టిన’’ రికార్డే’’ మళ్లీ పెట్టాడు . ఇద్దరిమధ్య చర్చలు తీవ్రంగా జరిగాయి .చివరికి జనకుడు ‘’మహర్షీ !చీమ చెట్టు మొదట్నించి పాకుకుంటూ పైకి హాయిగా అలసట లేకుండా ఎక్కిఫలం  అందు కొంటుంది .పక్షి మహావేగం గా , ఎవరైనకోసుకుపోతారేమోఅనే భయంతో  ఎగిరి అలసి పోతుంది .మనసుగట్టి పిండం .తగినంత అభ్యాసం లేకపోతె దాన్ని జయించటం కష్టం .అందుకే ఆశ్రమాల క్రమం లోనే జయించాలి .గృహస్థాశ్రమం లో ఉన్నా మంచి బుద్ధి ,శాంతం ,ఆత్మజ్ఞానం ఉన్నవాడు దేనికీ లొంగడు ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ అన్నిటిని సమ దృష్టితో చూస్తాడు .జీయయాత్ర సాగిస్తూనే ముక్తుడౌతాడు .నేను రాజ్యపాలన చేస్తూ కూడా జీవన్ముక్తుడిని అందుకే కాగలిగాను .కనపడేదాన్నిఎలాగో అలా బంధించవచ్చు .నిరంజనం నిర్వికారం అయిన ఆత్మ ఎవరికీ కనిపించనిది .దాన్ని ఎలా బంధిస్తావు? ?.సుఖ దుఃఖాలకు మనస్సు కారణం .మనసు నిర్మలంగా ఉంటే అంతా నిర్మలంగా ఉంటుంది .యాగాలలో నువ్వన్నట్టు హి౦స లేదు .నిజానికి అది అహింస .అగ్నిలో సమిధ వేస్తె పొగ వస్తుంది.వెయ్యనప్పుడు ,కాలిపోయినప్పుడు ఏమీ ఉండదు .నువ్వుగురుపుత్రుడివి .నాకు ఆరాధ్యుడవు .పితృ బంధం వదిలేసి అడవులకు  వెడతాన౦టున్నావు . అక్కడ  జంతువులూ ఉండవా ?వాటితో అనుబంధం ఏర్పడదా ? మరి నీ నిస్సంగత్వం ఎలా సాగుతుంది ?’’నేను బద్ధుడను కాను ‘’అనుకొన్న వాడికి ఎప్పుడూ సుఖమే .బద్దుడిని అనుకొంటే దుఖం .అందుకే నాకు సుఖం నీకుదుఖం.దేహం ,బంధం నాది కాదు అనితెలుసుకోవటమే ముక్తత్వం .ఈ ధనం రాజ్యం సంపదా ఏవీ నావికావు .అనుకొంటాను .అందుకే జీవన్ముక్తుడిని ‘’ఆని జనక మహారాజు చెప్పాడు సంతృప్తి చెందాడు శుకమహర్షి .

 ఇంటికి చేరి తండ్రి వ్యాసునికి ఆనందం కలిగించాడు .సమాయత్త చిత్తం తొ తండ్రి ఆశ్రమం లో  కొంతకాలం గడిపాడు . జనకుని తొ సంభాషణ వలన పరనిర్వ్యుతి  కలిగింది .యోగమార్గం అనుసరించాడు.’’పీవరి’’  అనే సుందరిని పెళ్ళి చేసుకొన్నాడు .ఆ దంపతులకు కృష్ణ ,గౌరప్రభ ,భూరి , దేవ శ్రుతుడు అనే నలుగురు కొడుకులు ,,కీర్తి అనే కూతురు కలిగారు .కీర్తిని విభ్రాజుడి కుమారుడు ‘’అణుహుడు’’కుఇచ్చి వివాహం చేశాడు .వీరికి బ్రహ్మదత్తుడు పుత్రుడు .ఇతడు రాజయ్యాడు .చాలాకాలం రాజ్యం చేసి నారద ఉపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి ,కొడుక్కి రాజ్యం అప్పగించి బదరికాశ్రమం చేరి యోగ మార్గాన్ని అవలంబించాడు.

 మనకు దాదాపు ఈ విషయాలేమీ పెద్దగా తెలియవు .

ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి ‘’శ్రీ దేవీ భాగవతం ‘’.

మీ -గబ్బిట దర్గా ప్రసాద్ -13-8-25-ఉయ్యూరు  

Posted in రచనలు | Leave a comment

ప్రముఖ చారిత్రక పరిశోధ కులు న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి. నా సాహిత్య జీవితం.10 వ భాగం. 12.8.25.

ప్రముఖ చారిత్రక పరిశోధ కులు న్యాయ వాది శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి. నా సాహిత్య జీవితం.10 వ భాగం. 12.8.25.

Posted in రచనలు | Leave a comment