రెండు శుభ వార్తలు

నమ స్తే గోపాల కృష్ణ గారు -మొన్న గురువారం విశ్వనాధ వైభవం సదస్సులో మధ్యాహ్నం నేను పేపర్ ప్రెసెంట్ చేసిన సభకు కుప్పం ద్రవిడియన్ యూని  వర్సిటి తెలుగు ప్రొఫెసర్ ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు అధ్యక్షత వహించారు ..వారు ఏంతో గొప్ప పండితులు కవులు విమర్శకులు . సభను చాలా బాగా నడిపించి మార్గ దర్శనం చేశారు .వారి అడ్రస్ తీసుకొని మన సరసభారతి గ్రంధాలు వారికి శుక్రవారం రిజిస్టర్డ్ పోస్ట్ లోపంపాను .వారికి ఇవాళ సోమవారం వారికి అందగానే నాకు ఫోన్ చేసి చెప్పి ”చాలా శ్రమ పడి  రాశారండీ  ! చదివి మళ్ళీ చేస్తాను ”అన్న సంస్కారి .. అలాంటి వారి చేతిలో మన పుస్తకాలు ఉండటం మనకు, అదృష్టం గర్వకారణం .

  రెండో విషయం -శ్రీ ఎస్ ఆర్ భల్లం గారి రెండు పుస్తకాలు ”జ్ఞాన దర్శిని ””వేకువ పిట్ట ”లపై నేను నిన్న అంతర్జాలం  లో రాసిన సమీక్ష లను ఆయనకూ నెట్ లో పంపాను  . అయన ఇవాళ ఉదయం ఫోన్ చేసి సమీక్షలు చాలా బాగా ఉన్నాయని ,తనకు నారాయణ రెడ్డి గారు అత్యంత ఆప్తులని తన సభలు 80 కి పైగా ఆయనే అధ్యక్షత వహించారని ,ఇవాళ ఉదయం నా సమీక్షను సి నా రే ;గారికి ఫోన్ చేసి చదివి వినిపించానని ,ఆయనా చాలా సంతృప్తి చెందారని ,తాను  త్వరలోనే ”వేకువ పిట్ట  ”పై స్పందనలనన్నిటి ని ఒక పుస్తకం గా తేవాలని అనుకొంటు న్నానని,అందుకోసం నేను రాసిన సమీక్షకు మరికొంత కలిపి సమగ్రంగా తనకు పంపించమని కోరారు .
 మరో విషయ0 -మన ”కేమటా లజి పిత  కోలాచల సీతారామయ్య గారి మనవరాలు అనస్తే షియా తాతగారి మూలాలను  వెతుక్కొంటూ ఉయ్యూరు వచ్చిన విషయాన్ని నేను సమీక్షలో సమగ్రంగా రాయటం వలన తనకు ఆమె విషయం పూర్తిగా తెలిసిందన్నారు .తాను ఆమె రాకను పేపర్లో చదివి స్పందించి రాసిన ”పడమటి సంధ్యా రాగం ”కవిత ను ఆకాశ వాణి జాతీయ కవి సమ్మేళనం లో చదివానని తోటి కవులు ఏంతో  అభినందించారని తెలియ జేశారు భల్లం గారికి మన పుస్తకాలు ఈ రోజే పోస్ట్ లో పంపాను  ఇవి మీకూ  సంతోషం కలిగిస్తాయని తెలియ జేశాను -దుర్గాప్రసాద్ –
శ్రీ శ్రీ శ్రీ దుర్గాప్రసాద్గారికి అనేకానేక వందనములతో: విషయాలు చదివి చాలా సంతోషించాను . బహు ముఖ ప్రజ్ఞాశీలి ప్రొఫెసర్ ఆచార్య బూదాటి వెంకటే శ్వర్లు గారి  , శ్రీ ఎస్ . ర్ . భల్లం గారి స్పందనలు,   మీ సాహిత్యరచన, విమర్శలలో అద్వితీయమైన ప్రతిభకు అద్దం పడుతోన్నై. మీలో నాకు తెలిసిన ఇతర పార్శ్వాలు (  సునిసిత హాస్యధొరణులతో మిళితమైన రాజకీయ ద్విప్లేట్స్ , సందర్భోజిత సంభాషణ , సమయ కాల నియమావళి, ధైర్యంతోకూడిన మనోభావ ప్రకటన, స్నేహ  సౌభ్రాతుత్వం, సౌశీల్యం , అన్నిo టికీ మించిన ఆధ్యాత్మికత) ఇవన్నీ కలిసి రంగరించిన వెలకట్టలేని లక్షణాలకు దరి కావటం మా అదృష్టం . భాషలో తప్పులు మన్నించగలరు . –మీ గోపాలకృష్ణ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఏకవీర నవలలో సాంఖ్య యోగం ;డా జి వి.పూర్ణ చంద్

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సానియా వన్స్ మోర్

 
 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”స్మర సమరం ”మరియు నిస్శ్బ్దనాదాలైన హిందీ సినీపాటలు


 
 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బోయి భీమన్న ,అమ్మంగి వేణుగోపాల్ లపై వ్యాసాలూ ,ఒక కవిత


 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేకువ పిట్ట

వేకువ పిట్ట

శ్రీ ఎస్ .ఆర్.భల్లం గారి ‘’వేకువ పిట్ట ‘’56 కవితల సంపుటి .సందర్భాను సారంగా చెప్పినవి అనుభవం తో చేసినవి స్పందించి రాసినవి ,చెప్పాలని చెప్పిన కవితలివి .చాలా సాంద్రమైన కవిత్వం ఉంది. సుతిమెత్తగా చెప్పాల్సిన చోట చెబుతూ ,అవసరమైన ప్పుడు బల్లెం తో పోడిచినట్లూ చెప్పటం భల్లం వారి ప్రత్యేకత ‘       .ముందుగా మా ఉయ్యూరుకు సంబంధించిన కవితను గురించి తెలియ జేస్తాను .కొలచల సీతారామయ్యగారు అనే ఆయన 1917లో ఉన్నత చదువులకోసం మదారాస్ కు ఉయ్యూరు నుండి కాలినడకన వెళ్లి అక్కడ మదనపల్లి కాలేజిలో చదివి ,విద్యా తృష్ణ తీరక సైంటిస్ట్ అవ్వాలనే కోరికతో ఉండగా తండ్రి గారు చనిపోయారనే వార్త తెలిసి ఉయ్యూరు వచ్చి ఆ పది రోజులూ గడిపి అన్నగారు గాయత్రి అనంత రామయ్యగారికి మనసులో మాట చెప్పి ,ఆయన కాదనలేని పరిస్తితిలో అనుమతిపొంది తండ్రిగారు కూడ బెట్టి ఇచ్చిన రెండు వేల రూపాయలను అన్నగారివ్వ గా  తీసుకొని మద్రాస్ వెళ్లి అక్కడి నుండి అమెరికా వెళ్ళే ఏర్పాటు చేసుకొన్నారు .పొగ వోడఎక్కి  స్నేహితుడిగా నటించిన ఒక తమిళుడు డాలర్లుగా మార్చి డబ్బు తెస్తానని రెండు వేలు కాజేసి ఉడాఇంచగా బొగ్గు గదిలో కెప్టెన్ దయా దాక్షిన్యాలతో ప్రయాణం చేసి సింగపూర్ చేరి అక్కడ కొందరు సాయం చేయగా మళ్ళీ షిప్ లో ఎక్కి కెప్టెన్ చెప్పిన అరవ చాకిరీ అంతా చేస్తూ అమెరికా చేరాడు .అక్కడ నెమ్మదిగా చదువుపూర్తీ చేసి స్వంత కాళ్లమీద నిలబడి అనుకొన్నది సాధించాడు .

తనకు సరైన దేశం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న సోవియట్ రష్యా అని భావించి అక్కడికి వెళ్లి మాస్కో నగరం లో ఉండి ఆయిల్ సైన్స్ లో అనేక పరిశోధనలు చేసి యుద్ధపు టాంక్ లలో ఉపయోగించే ఇంధనం సమర్ధ వంతంగా ,పని చేయటానికి కలుపవలసిన వాటినికనిపెట్టి సామర్ధ్యాన్ని పెంచి తేలిక రకమైన టాంక్ ల నిర్మాణానికి దారి చూపి ఆధునికకాలం లో ‘’కేమటాలజి’’గా పిలువ బడుతున్న శాస్త్రానికి ఆద్యుడై ‘’ఫాదర్ ఆఫ్ కేమటాలజి ‘’గా పేరు పొందిన సీతారామయ్యగారు ఉయ్యూరు వాడు కావటం మా అదృష్టం .ఆయన ఉయ్యూరు వదిలిన 46 ఏళ్ళకు రష్యానుండి ఇండియాకు 46 రోజులు ఉండటానికి వచ్చి ,ఇక్కడ పౌర సన్మానం పొంది బంధువులతో గడిపి క్షేత్ర సందర్శనం చేసి  వెళ్లి పోయారు అప్పుడు1963లో  ఆయన్ను చూసిన భాగ్యం మాకు కలిగింది .ఇక్కడి నుంచి వెళ్ళిన కొన్ని ఏళ్ళకే మాస్కోలో మరణించారు  రష్యా యువతినే వివాహమాడి ఇద్దరు ఆడపిల్లలకు జన్మ నిచ్చి భారతీయ పేర్లే వారికి పెట్టి అక్కడ వారింట్లో అచ్చమైన తెలుగు భోజనమే అతిధులకు అందిస్తూ సంప్రదాయాన్ని lతెలుగుదనాన్ని కాపాడుకొన్న మహనీయుడు .

ఆయన పెద్ద కూతురి కూతురు ‘’అనస్తేషియా ‘’సుమారు పదేళ్ళక్రితం తాతగారు సీతారామయ్యగారి స్వగ్రామం దర్శించాలని అమెరికాలోని కాలి ఫోర్నియా నుండి ఉయ్యూరు వచ్చింది .’’హాం రేడియో’’ వ్యవస్తాపకుడు మా ఉయ్యూరు వాసి మాకు హైస్కూల్ లో జూనియర్ అయిన సూరి శ్రీరామ మూర్తి (సూరి)ఆమెను హైదరాబాద్ నుండి వెంబడి పెట్టుకొని ఉయ్యూరు తీసుకు వచ్చి ఆమె తాతగారి మూలాలను గుర్తింపజేసి ,సభ పెట్టి ఆమెను సత్కరించి మా బోటి వారితో మాట్లాడించాడు .ఆమె అచ్చమైన భారతీయ మహిళగా చీర జాకెట్ కట్టి బొట్టూకాటుక ,తలలో పూలుపెట్టుకొని గాజులు తొడుక్కుని వచ్చి అందర్నీ ఆశ్చర్య పరచింది .మా ఏం ఎల్ సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ కూడా ఆసభలో పాల్గొన్నాడు . సీతారామయ్య గారి జీవితం పై ఆయన పెద్దల్లుడు బ్రేజేనేస్కి రష్యన్ భాషలో రాస్తే దాన్ని ఇంగ్లీష్ భాష లోకిశ్రీ  ఎస్.పి.కే గుప్త ,శ్రీమతి అచలా జైన్ ‘’A wreath for doctor Ramayya ‘’గా రాస్తే నేను దాన్ని ఆధారం గా అనేక శీర్హికలతో అంతర్జాలం లో ‘’కేమటాలజి పిత కోలచల సీతా రామయ్య ‘’అని 32 ఎపిసోడ్ లు రాసి దానికి టాగ్ గా ‘’పుల్లేరు నుండి ఓల్గా వరకు ‘’అని పెట్ట్టాను .ఈ నెలలో 5-9-15ఉపాధ్యాయ దినోత్సవాన్ని   సరసభారతి నిర్వహించిన కీ శే కోట  సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవంగా శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల సౌజన్యం తో మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులు ,గురువు గారి వర్ణ చిత్రాన్ని రచించిన ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ ,శ్రీ రాజేంద్ర మొదలైన వారి సమక్షం లో ఆవిష్కరింప జేశాం ఈ సందర్భం గా నేను రామయ్యగారిపై రాసిన దాన్ని తాను  పుస్తక రూపం లో తెస్తానని రాజేంద్ర తెలియ జేశాడు .

ఎనస్తేషియా రాక సంఘటన ను చూసిన లేక తెలుసుకొన్న భల్లం గారు ‘’పడమటి సంధ్యారాగం ‘’కవితలో  అక్షర బద్ధం చేసి చిరస్తాయి కల్పించారు .’’ఒక మెలకువ లాంటి కలలోంచి –పూర్వీకం పుడమి పుట్టిల్లని –ప్రేమ పూత రేకులుగా వత్తడానికి –పెంగ్విన్ పిట్టలా ఎగి రోచ్చావా ?అని మొదలు పెట్టి రాశారు .’’అనురాగ రహిత సంగీతపు అపశ్రుతుల్ని వినటానికి –అలవాటు పడ్డ మా కర్ణ పుటలపై –పడమటి సంధ్యా రాగం లో ఇమిడే ఆత్మీయ చరణానివి ‘’అన్నారు .ఆమె రాకలో ‘’చెలిమి చెరువు ,శిధిలమైన ప్రేమ కింద చిగురించిన ప్రియ బాంధవ్య స్పర్శ ‘’కనిపించింది కవికి .

‘’నీ రాకతో అమ్మా అనస్తీషియా—ఉయ్యూరు చెరుకు మరీ తియ్యగించింది –పగుళ్ళు బారిన గుడి ధ్వజ స్థంభం పై చిరు గంట  –నీ  కరస్పర్శ కై కొంగ జపం చేస్తోంది .’’అని మా కెసీపి షుగర్ కు మరింత తీయ దానాన్ని తెప్పించారు .

‘’అమెరికా ఆంధ్రాకి దూరా భారమైతేనేం –నీ ఆత్మీయతా రెక్క ఎగురుడు ముందు తక్కువేగా’’ ?’’అని ఆత్మీయత ముందు దూరం చిన్నబోతున్దన్నారు .

‘’ఉయ్యూరు కంటే కాలిఫోర్నియా పెద్దదైతేనేం –నీ ప్రేమ సంకల్పం ముందు చిన్నదేగా’’అంటూ

‘’ప్రియాతి ప్రియమైన అనాస్తేషియా-నువ్వీ మట్టిని స్పర్శించి వెల్లడ మంటే –పూర్వీకం పేగుల్లో –పట్టెడు ప్రేమ మెతుకుల్ని పదిల పరచుకోవడమే ‘’అని గుండెలోని ఆనందాన్ని వ్యక్తపరచారు భలేగా భల్లం గారు .

మరోకవిత బుజ్జాయి లో ‘’చిగురు ముందు చెట్టు  శీర్షా సనమేయడం’’గా ఉందట .’’మరచెంబు ‘’తీపిజ్ఞాపకాలు నేమరేస్తూ ‘’బియ్యపు గింజ మీద తాజ్ మహల్ ని చిత్రించినట్లు –సంప్రదాయాన్ని వదులుకోలేని –ఈ మరచెంబు ఎన్నెన్ని రుచుల్ని గర్భీక రించు కొందో ‘’అన్నారు .’’

పల్లెటూరి లోని ‘’ఈతకొలను ,పూత రేకూ –గున్నమావీ ,గిలక బావి –గుడ్డ ఊయల ,బడి బంగాళా ‘’అన్నీ ఇప్పుడు ‘’రంగుల కరెన్సీ కంపే ‘’కొడుతున్నాయట .’’వంగడాల కోసం –లొంగ డాలు మొదలయ్యాక –పెంట ఎరువు సారం కంట కింపు ‘’అయిన్దంటారు ‘’పల్లె విత్తనం ‘’లో .’’ధింసా ‘’కవితలో ‘’ధింసా అంటే –నది  మీద  యెగిరి –మైదానం లో కురిసే వర్షం కాదు –పురాతనం మట్టి లోంచి –ప్రేమగా వీచే నాట్య సుగంధ సమీరం ‘’అనే అర్ధం చెప్పారు .తల్లికి జ్ఞాన బోధ చేస్తూ ‘’అమ్మాయీ !బుడ్డోడిని ఏడవ నివ్వకు-దేహం దేవిడీ లో –ధింసా స్వరాలు మటు మాయ మౌతాయేమో/అని సందేహం వెలిబుచ్చారు .సహజత్వానికి గొప్ప ఉదాహరణ ఈ కవిత . తండ్రి కవి సుధానిధి భల్లం తిరుపతి రాజుగారిని  ‘’ను  గుర్తుకు తెచ్చుకొంటూ ‘’నాయనా ‘’కవిత లో’’ మనిద్దరి మధ్య దివ్య భాష తప్ప –ద్రవ్య భాష ఎప్పుడూ స్పర్శించేదికాడు ‘’అనటం వారి ఆత్మీయ బంధానికి నిదర్శనం .పుస్తకం శీర్షిక అయిన ‘’వేకువ పిట్ట ‘’కవితలో రోడ్డు ప్రమాదం లో మరణించిన విలేకరి మిత్రునికి అశ్రుతర్పణం చేస్తూ అతడు ‘’గ్లోబల్ తోడేళ్ళ నోళ్ళకి –మానవీయ వలువల మాంస ఖండాల్ని అందించే –రాజకీయ ఋతువులలో కూడా –ఒక నులి వెచ్చని స్పర్శలా మెలగుతాడు ‘’అని మెచ్చుకొన్నారు .

పొలం భాష అయిన ‘’మునుం పాట ‘’లో ‘’కనుపాపా మనదే ,కను రేప్పా మనదే –చూపులే మనవికావు –బతుకు సరుకుగా మారినప్పుడే –మనిషి కలలు ఎప్పుడో చెదరి పోయాయి –మనసు పొరలు ఎప్పుడో చిరిగి పోయాయి ‘’అని ఆవేదన చెందాడుకవి .‘’ఆరుద్ర పురుగు తోల్వని మట్టి పుటలో –మునుం పాట చరణాలేమయ్యాయో-నాగేటి చాలులో రైతు నాటుకొన్న –ఆశల విత్తనాలేలా బుగిలి పోయాయో ‘’అని రైతు దయనీయ స్తితిని కవితాత్మకం చేశారు .అన్నం కారియర్లు అందించే అసిరిగాడిని  ఆకలి కబలిస్తే స్పందించి ‘’అమ్మలాంటి అతడు ‘’రాశారు .’’ఆకలి బెబ్బుల్ని హతమార్చతానికి –ఆత్మీయ ఆహార ఆయుధం తెచ్చిన ఇతడిని –గౌరవించ కుండా ఎలా ఉండగలను ?’’అని సహవేదన చెందారు సానుభూతి వర్షించారు .’’పేగు ని౦పని పోగు ‘’కవితచేనేతి వ్రుత్తి వారి చావులు ,దుర్భర జీవిత చిత్రణ –

‘’గంజి నీళ్ళలో గుంజి ఆరేసిన పోగుల పేగుల మీద –బుటాలు బుటాలుగా జరీ పూలు ఎలా అందగిస్తాయో –అరిగిన రూపాయి అడుగు జాడలలో –ముడి నూలుకి అంటు కట్టిన చక్ర వడ్డీల చీడ పీడా ఎలా వదుల్తుందో?’’ఎవరి మూసల్లో కాదు –మాసాల్లో వాళ్ళు కార్చే –మొసలి కంటి తుడుపు వాగ్దానాల జలదారాలకి –చచ్చిపడిన పచ్చి పడుక్కి ప్రాణ మొస్తుందా ?’’అని వారిభాషలోనే గొప్ప కవిత్వం అల్లారు భల్లం .’’మనిషి చరిత్ర పుస్తకం  అట్టమీద –చేనేత చెలికాని అసహజ మరణం మరకల్లేని –బొమ్మేపుడు ముద్రించ బడుతుందో ?’’అంటూ వారి చీకటి బతుకుల్లో వెలుగులేప్పుడు వస్తాయోనని ఆవేదన చెందారు .బొర్రా అంటే రంధ్రం –అవి గుహలు మాత్రమే కావు –అనంతానంత జల శిఖరాలు కూడా –పచ్చ మీగడ వంటి ప్రక్రుతి ఆకృతులు ‘’అని బొర్రా గుహల అండదచందాలను ప్రక్రుతి  రామణీయకతను ప్రశంసించారు భల్లం .గీతకార్మికులపై ‘’తాటి ముంజే దీపం ‘’,పిల్లలు సరిగ్గా చూడని అనాధ వృద్ధులమరణాలపై ‘’పోలి కట్టే ‘’,అవినీతిపై ‘’ఆమ్యామ్యా ‘’,హాస్టల్ విద్యార్ధుల అవస్తలపై ‘’ఇలా ఎందరో ‘’కవితలు రాసి కదిలించారు .

మహా రాష్ట్రలో అదనపు కలెక్టర్ ‘’యశ్వంత్ సోనావానే’’ను సజీవ దహనం చేసినపుడు ‘’దేశం కన్నా దేహమూ –కర్తవ్యమ్ కన్నా కరెన్సీ ఎక్కువైన చోట –పెట్రో కొలిమిలో చిట్లిన మృత్యు సంగీతం సాక్షిగా –ఊదు కడ్డీ పొగ తీగలకు వేలాడ దీయ బడిన దుర్మరణం ‘’అని కన్నీరు కార్చాడుకవి .

రోడ్డుమీద బొగ్గుతో బొమ్మలేసే వాడి గురించి ‘’బొగ్గు బొమ్మ ‘’కవితలో –

‘’శిలనైనా చిరునవ్వు కుంచెతో –పగుల  గొట్టగల నమ్మకం వాడిది –అవసరం ముందు అవనత చిత్ర మయ్యాడంతే ‘’-‘’గతుకుల బతుకు బాటలో –అతకని చిత్రాలు ఎపుడూ ప్రశ్నించవు –అరిగి అరిగి చెరిగిపోతాయ౦తే-రహదారి నుంచి విడివడని రంగుల వ్యామోహాల మధ్య –ఒక శూన్య చిత్రంగా నిర్జీవంగా నిలబడే ఉన్నాడు ‘’అని కాసులు రాల్చని వాడి కళకు నీరాజనమెత్తాడు కవి .

అనాలోచితంగా ఆత్మ హత్య చేసుకొనే వారికి ‘’ఎవరికోసం ‘’కవితలో ‘’అర్ధాంగి ఋణం తీర్చటమంటే –మరణానంతరం మౌనంగా దుఖించటం కాదు –ప్రతి రోజు ప్రేమ సామ్రాజ్యాన్ని –ఆమె పాదాల ముందు ప్రణమిల్ల చేయటం ‘’’’దహన  దాహాల తదనంతరం –తనని పోగొట్టుకొన్న అతడు తప్ప –ఉసురు తీసిన –ఇన్ని దాహాలతో యెట్లా బతికేది ఆమె లేకుండా ?’’అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి జీవితాన్ని సరిదిద్దుకోవాలి కాని మరణమే శరణ్యం అనుకోరాదని హితవు .

‘తల్లి అంటే –అప్పుడప్పుడు గుర్తు చేసుకొనే గతం కాదు –పల్లె అంటే –అనేకానేక అభిమానాల మధ్య గుర్తు పట్టే వర్తమానం ‘’

ఇలా చాలా రసార్ద్ర్డంగా ,కమనీయం గా మూలాల లోకి వెళ్లి కవిత్వం చెప్పారు .ప్రతికవిత ‘’కదిలించేదే –కర్తవ్యమ్ బోధించేదే సానుభూతి కురిపించేదే సహవేదన తెలియ బరచేదే ,కకృతజ్ఞత  చూపించేదే సెభాష్ అని మెప్పించేదే . జన జాగృతిని చేసేదే  అందుకే  ‘’వేకువ పిట్ట ‘’అయింది .అందమైన ముఖ చిత్రం క్వాలిటీ ముద్రణ అదనపు ఆకర్షణలు .2004-14 కాల వ్యవధిలో అంటే పదేళ్ళలో రాసిన  చిక్కని చక్కని కవిత్వమేఇది . .పదబంధాలు పడభావ చిత్రాలు కోకొల్లలు . శబ్దం భల్లం గారి చేతిలో పల్లవమే అవుతుంది .సోగసులులతో సుగంధ భరితమౌతుంది .పదం కోసం వెతుకు లాట ఉండదు .సూటిగా హృదయానికి బల్లెంలా తాకేదే శ్రీ భల్లం కవిత .చదివి ఆస్వాదించి ఆనందం  పొందండి .

ముఖ చిత్రం జత చేశాను చూడండి

100 రూపాయల ఈ అపురూప ‘’వేకువ పిట్ట ‘’లభించే స్థలం

భల్లం సామ్రాజ్య లక్ష్మి 4 -87—12  -ఇందిరా నగర్ –గాంధి బొమ్మ సెంటర్

తాడేపల్లి గూడెం -534 101

Email-sr.bhallam @gmail.com

Cell-98854 42642

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ భల్లం రచనలు

jnanadarshini 1 001 jnana darshini2 001శ్రీ భల్లం రచనలు

శ్రీ భల్లం సూర్యనారాయణ రాజు అనే ఎస్. ఆర్. భల్లం భాషా ప్రవీణ ,తెలుగు ఏం ఏ .పశ్చిమ గోదావరి జిల్లా బాదం పూడి జి ప.ప. ఉన్నత పాఠశాల లో తెలుగు పండితులు .తాడేపల్లి గూడెం నివాసం .’’నీటి భూమి ‘’,గూడు వదిలిన గువ్వలు ,చిగురు కేక ,కొల్లేరు, కొల్లేరు జీల్ ,జ్ఞాన దర్శిని ,వేకువ పిట్ట ‘’మొదలైన రచనలు చేశారు .ఉగాది కవితాపురస్కారం ,తెలుగు భాషా వికాసం పురస్కారం ,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ,ధిల్లీ తెలుగు అకాడెమి సత్కార్ ,ఆంద్ర మహాసభ కవితా పురస్కార్ ,శాంతినికేతన్  పురస్కార్ అందుకొన్నారు .పశ్చిమ గోదావరిజిల్లా అధికార భాషా సంఘ కన్వీనర్ ,రచన సాహితీ గృహం –వ్యవస్థాపక అధ్యక్షులు .శ్రీ నారాయణ రెడ్డి కవితా యాత్ర ను   పల్లె నుండి ధిల్లీ దాకా శత ప్రసంగాలతో చేశారు .అలాగే సి నా రే కవితా ప్రసంగాలతో ఆంధ్రా నుండి అమెరికా వరకు ప్రయాణించారు .తిరుమల స్వామి వారి నిత్య కళ్యాణోత్సవ ప్రత్యక్ష వ్యాఖ్యాతలు .అమెరికా తెలుగు వెబ్ సైట్ లో వీరి రచనలు అనేకం చోటు చేసుకొన్నాయి .వీరి కవితలు బహుభాషలలోకి అనువాదం పొందాయి .ఇంతటి లబ్ధ ప్రతిస్స్టితుడైన శ్రీ భల్లం తన ప్రచురణలను నాకు ఎప్పటికప్పుడు పంపుతున్నారు .ఈ నెలలో వేకువ పిట్ట ,జ్ఞాన దర్శిని హిందీ రచన కొల్లేరు జీల్ పంపారు .జీల్ హిందీ కనుక నాకు అందులో ప్రవేశం లేదుకనుక మొదటి రెండు పుస్తకాలపై నా భావాలను మీతో పంచుకొంటున్నాను .

1-       జ్ఞాన దర్శిని

యాభై విభిన్న విషయాలపై రాసి జ్ఞాన బోధ చేశారు .’’ఆనందో బ్రహ్మ’’ తో ప్రారంభించి ‘’అనుభవ సారం ‘’తో పూర్తి చేశారు .ఏ విషయం తీసుకొన్నా లోతైన చర్చ చేసి నిగ్గు తేల్చారు .వేదోపనిషత్తులు ,మను స్మ్రుతి ,పురాణాలు మొదలైన మన పూర్వ గ్రంధాలనుండి అనేక ఉదాహరణలిచ్చారు వీరి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఓహో అని అనుకొంటాం చక్కని భాష మధురమైన పదాలు తేట తెల్లనైన భావాలతో గ్రంధం ఆద్యంతం రక్తి కట్టి శిఖరారోహణం చేయిస్తుంది భల్లంగారి ప్రతిభ శత పత్ర వికసనం గా పరిమళ భరితమై అలరిస్తుంది .ఎన్నో అనర్ఘ రత్నాలను జాలువార్చారు ఏరుకొనే వారికి ఎరుకోన్నంత .అందులో అతి ముఖ్యమైన వాటి గురించి మాత్రమె నేను తెలియ జేస్తాను .మిగిలినవి మీరే చదివి గ్రహించగలరు .

‘’సంతోషం శరీరానికి ,మనసుకు వావలసిన శక్తి సామర్ధ్యాలను సాధించి పెడుతుంది .సంతోషం గా ఉండే వారి వద్దకు ఉత్సాహం ఆసక్తి ,శ్రద్ధ ,పట్టుదల ,ఆరోగ్యం వగైరా గుణాలు వచ్చి చేరుతాయి .సుఖం శరీరానిది .సంతోషం మనసుది ,ఆనందం మనిషి చైతన్యానిది ‘’అంటూ సుఖ సంతోష ఆనందలలోని భేదాలను వివరించారు .ఆనందం భౌతికమైనదికాడు .ఆత్మీయకమైనది అన్నారు .

‘’కార్య సాధకులకు సంకల్పమే చక్కని సాధనం .అదే మొక్కవోని ఆయుధం .విశ్వాసం విజయ సాధనకు పునాది .’’ ‘’ప్రకృతిలో ప్రతిదీ నిస్వార్ధంగా తన పనిని నిబద్ధతతో చేసుకొంటూ పోతుంది .ప్రక్రుతి పంచ భూతాత్మికం అయితే విశ్వం ఏక పదార్ధ నిర్మితం .ప్రక్రుతి సామరస్యకతకు ,సాయుజ్యానికి ప్రతీక .ఇందులో పరస్పర ఆధారం పరస్పర సహకారం ఉన్నాయి .మానవుడిలో మహిషి ప్రవ్రుత్తి ,మనిషి ప్రవ్రుత్తి ఉన్నాయి .జంతు ప్రవ్రుత్తి మనిషి ప్రవ్రుత్తిలోకి మారాలి. అదే సమాజ హితం .ప్రక్రుతి అందరిదీ ఏ ఒక్కరిదోకాడు .

‘’శరీరం ఒక సముద్రం లాంటిది .ఇంద్రియాలు అనే ఉత్తుంగ తరంగాలు ఇందులో పడి లేస్తూ కల్లోలం చేస్తాయి వాటికి కామ క్రోధ లోభాది అరిషడ్వర్గాలు ప్రభువులు .వీటిని  జయిస్తేనే ఈ సముద్రాన్ని దాటి జ్ఞానం వైపుకు నడక సాగించగలం .శరీరానికి మనసు మన్సుకుశారీరం అవసరం .

‘’అయం నిజః పరోవేతి ,గణనా లఘు చేతసాం –ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం ‘’వీడు నా వాడు వాడు పరాయి వాడు అనే భావం అల్ప బుద్ధులకే ఉంటుంది .ఉదార చిత్తులకు లోకం అంటా తన కుటుంబం గానే ఉంటుంది .’’మన జీవితం మనకు నచ్చినట్టే కాదు ,పది మంది మెచ్చేట్టు ఉండాలి ‘’..’’క్షీరం అనే ఈ విశ్వంలో బ్రహ్మ జ్ఞానం అనే కవ్వం తో చిలికి నవనీతం లాంటి భగవంతుడిని సొంతం చేసుకోవచ్చు .’’చెరువు నీటికి రక్షణ దానికి ఉన్న తూము .అలాగే దాచి పెట్టిన దనానికి రక్షణ దానం ధర్మం దయా గుణం .

‘’తర్కం చంచలం .శ్రుతి అనేక విధాలు .ఏ ఒక్కరుషి చెప్పిన ప్రవచనమో ప్రమాణం కాదు. ధర్మం యొక్క మూల తత్త్వం అవగాహనకు అందనిది .ఉత్తమ పురుషుల మార్గమే శరణ్యం .’’’’దానం ఇవ్వటం మనిషి వ్యక్తీ గత బాధ్యత’’అన్నది ఋగ్వేదం .

‘’మను ధర్మ శాస్త్రం కేవలం చట్టాలను మాత్రమే చెప్పే గ్రంధం కాదు .మనుషులను గుణ శీలురు గా మార్చే గ్రంధం .’’’’మనకు కనిపించని పరమాత్మను ఉపనిషత్తులు హృదయం లో ఆవిష్కరింప జేస్తాయి .ధర్మ లక్షణాలను చెబుతూ మనుస్మృతి –

‘’వేదః  స్మృతిః సదాచారః స్వస్వచ ప్రియమాత్మనః  ఏత చ్చతుర్విధం ప్రాహుః-సాక్షాద్ధర్మ స్య లక్షణం ‘’

వేద ప్రమాణం ,స్మ్రుతి వాక్యం ,సత్పురుషుల నడవడి కి అనుగుణమైంది ,తన ఆత్మకు ఇ౦పైనది అనే నాలుగు ధర్మానికున్న లక్షణాలు .

అర్ధ నారీశ్వర తత్వాన్ని వివరిస్తూ చెప్పిన ఒక శ్లోకం అద్భుతం

‘’రుద్రో ముండ దరో భుజంగ సహితో గౌరీతు సద్భూషణా-స్కన్దః శంభు సుతః షడానన  యుతస్తుం డీ చ లంబోదరః

సింహ క్రేలిమ మూషకం చ వృష భాస్తేషాం నిజం వాహన –మిత్ధంశంభు గృహే విభిన్న మతిషు చైక్యం సదా వర్తతే ‘’

ఈశ్వరుడు కపాలాన్ని పాముల్ని ,పార్వతి సుందర ఆభరణాలను ధరిస్తారు .కుమారస్వామికి ఆరు ముఖాలు .వినాయకుడికి ఏనుగు తొండం .మరి వీళ్ళ వాహనాలేమో –ఎద్దు సింహం ,నెమలి ,మూషికం .ఇవన్నీ పరస్పర విరోధ స్వభావం కలవి .ఇలా విరుద్ధ స్వభావం గల శివ పరివారం నిత్యం భిన్నత్వం లో ఏకత్వాన్ని కలిగి సహజీవనం చేస్తున్నారు .అలాగే ఒక కుటుంబం లోని సభ్యులు విభిన్న మనస్తత్వాలు కల వారైనా ఏక భావనతో ఉండాలి .అప్పుడే ఆ కుటుంబానికి సమాజం లో గౌరవం .

‘’మాట అనేది తూటా కాదు ,తత్వమూకాడు .అదొక మహా మార్గం .అన్నిటికన్నా భిన్నమైనది. అది బహిరంగ ప్రదేశం లాంటిది .విశాలమైన రహదారి లాటిది ..మాట నిర్మలంగా ,నిస్వార్ధంగా ,నిష్కలంకంగా ఉండాలి .

‘’సత్యం మృదు ప్రియం ధీరో ,వాక్యం హితకరం వదేత్ –ఆత్మోత్కర్ష స్తదా నిందం పరేషాంపరి వర్జయేత్ ‘’అని ధర్మ శాస్త్రం .మృదువుగా ప్రియంగా ,ధైర్యంగా ,హితం గా ,సత్యవాక్యాన్నే పలకాలి .ఆత్మ స్తుతి ,పరనింద మాటలలో దోర్లరాదు అని అర్ధం .

‘’మనం అంతా నిమిత్తమాత్రులం .దేవుడు తనకు ఇష్టమైన పనినే మనతో చేయిస్తాడు ‘’ఇదే మాటను కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారు చెప్పారు .

‘’సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమ్రుతోపమే –కావ్యామృత రాసాస్వాదః సంగమస్సజ్జనై స్సహః ‘’

సంసారం అనే విష వృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు ఉంటాయి .మొదటిది కావ్యామృత రసాస్వాదనం రెండవది సత్పురుష సహవాసం .

‘’ఎవరిలో ఎటు వంటి స్వచ్చతను కోరుకొంతున్నావో ,నీలో దాన్ని పెంపొందించుకో ‘’అన్నారు శంకర భగవత్పాదులు

ఈ విధంగా శ్రీ భల్లం గారు తమ అనుభవ సారాన్ని విద్యా విజ్ఞాన సంపదను రంగ రించి చెప్పిన సూక్తి ముక్తావళి .ఇది చదివి ఆనంద సోపానాన్ని అధిరోహించాలి  .ఒక సద్గురువు చేసే ఉపదేశంగా, ఒక మహా మనిషి పలికే అమృత బిందువులుగా ,.ఈ వ్యాస పరంపర ఉంది .చదివిన వారు ఆనందామ్రుతాన్ని అనుభవిస్తారు .

100 రూపాయలు ఖరీదైన ఈ పుస్తకం కోటి విలువైన మాటల సముదాయం .ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలో లభిస్తుంది.ఈ పుస్తక ముఖ చిత్రాన్ని జత  చేశాను చూడండి .

భల్లంగారి ‘’వేకువ పిట్ట ‘’కువకువలు మరోమారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-15-ఉయ్యూరు

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”ఎనస్తేషి యా ”ఉయ్యూరు రాక సందర్భం గా ఎస్ ఆర్ భల్లం గారి కవిత ”పడమటి సంధ్యా రాగం ”


సాహితీ బంధువులకు -ఉయ్యూరు వాసి ,రష్యాలో స్తిరపడిన ఆయిల్ శాస్త్రజ్ఞుడు ”,కేమటాలజి పిత ” 
స్వర్గీయ కొ లచల సీతారామయ్యగారి మనవరాలు ”ఎనస్తీషియా ”తాతగారి మూలాలను సందర్శించేందుకు తాను  ఉంటున్న అమెరికాలోని కాలిఫోర్నియా నుండి ఉయ్యూరు వచ్చిన సందర్భం గా ఈ మట్టి మీద ఆమెకున్న మమకారానికి పులకించి ప్రముఖకవి అనేక పురస్కారాల గ్రహీత ,తాడేపల్లి గూడెం వాస్తవ్యులు ,ఆత్మీయ కవిమిత్రులు అయిన శ్రీ యెస్ఽఅర్ .భల్లమ్ అనే భల్లం సూర్య నారాయణ రాజు గారు రాసిన కవిత ”పడమటి సంధ్యారాగం ”.దీనిని 2015 మే నెలలోవెలువడిన  వారి కవితా సంపుటి ”వేకువ పిట్ట ”లో చేర్చారు ఆ పుస్తకాన్ని నాకు అభిమానం తో పంపారు . అందులోని ఈ కవితను మీ అందరి ఆస్వాదన కోసం అంద  జేస్తున్నాను .-దుర్గా ప్రసాద్ 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఊళ్లు తిరగటం మానేయాల్సోస్తోంది -జయధీర్ తిరుమల రావు


 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిశ్శబ్ద అన్తార్యుద్ధాలు


 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆడలేక మీడియా ఓడు



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయవాడ విశాఖలకు మెట్రో కేంద్రం ఖాయం వెంకన్న సన్నిధిలో తమాషా సీతా కోక చిలుక ,పెముడి చమురు దామల్


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పేదలకు సేవ చేసినా వారికి పట్టక బాల్కనీ వారిచేతనే పోషింప బడుతున్న ‘’శ్రీమంతుడు ‘’

పేదలకు సేవ చేసినా వారికి పట్టక బాల్కనీ వారిచేతనే పోషింప  బడుతున్న ‘’శ్రీమంతుడు ‘’

  యువ కిశోరం మహేష్ బాబు కమల హసన్ కుమార్తె శృతి హసన్ జంటగా దూసుకొచ్చిన ‘’శ్రీమంతుడు ‘’సినిమాకు నేను మా మనవడు చరణ్ కిందటి ఆదివారం 6 వ తేదీ మాటనీ కి వెళ్లి ఉయ్యూరు లో చూశాము .బాల్కనీ ఫుల్లు  ,కింద సీట్లలో జనం నిల్లు .ఆశ్చర్యం వేసింది .శ్రీమంతుడిని శ్రీమంతులే పోషిస్తున్నారని పించింది . మా దియేటర్ లోపం కొంత ఉన్నమాట వాస్తవం . తెర బూజులు వేలాడుతున్నట్లు కూడా ఉండటం వాస్తవం మాటినీ అవటం మరి కొంత ఇబ్బంది . అయినా మా వూరు కనుక చూశాను .జగపతిబాబు రాజేంద్ర ప్రసాద్ వంటి హేమా హేమీలున్నారు .దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ .కదవండటం డైరెక్ట్ చేయటం   కొరటాల శివ .

      ఆ వూళ్ళో అభివృద్ధికి అడ్డుపడే ముఠాను ఎదుర్కోలేక తండ్రి జగపతి బాబు  బయటికి వచ్చేసి కోట్లు సంపాదించి కొడుకూ తనలాగానే కోట్లు కూడ బెట్టాలని ఆశిస్తాడు. కాని దీనికి వ్యతిరేకం కొడుకు మహేష్ . ఆలోచనలే వేరు .ఇంట్లో ఎవరూ అతన్ని సమర్ధించరు  .మరో సోషల్ వర్కర్ శృతి తో కలిసి రూరల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లో ఉంటాడు .ఇద్దరూ దగ్గరౌతారు .అకస్మాత్తుగా ‘’దేవర కోట ‘’గ్రామం అధికార దెయ్యాల కోటగా మారి జనం ఏదీ అందకా అన్నీ విలనీ ముఠా చేతికే  అందుతుంటే . ఊరు వదిలి వలస పోతూ ఉంటారు . నారాయణ రావు అనే మాస్టారు రాజేంద్రప్రసాద్ అందర్నీ వెళ్ళిపోకుండా ఆపే ప్రయత్నం చేస్తాడు .కాని ఫలించదు . మహేష్ కి ఈ విషయం తెలిసి గ్రామాన్ని దత్తత తీసుకొని చెక్ బుక్ చేత్తో పట్టుకొని తిరుగుతూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సైకిల్ మీద విలాసంగా తిరుగుతూ అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లాగా నిమిషాల్లో గ్రామం లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు .రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో గృహకల్లోలాలేర్పడి  అందర్నీ  ఊరు వదిలి వెళ్ళ వద్దని చెప్పిన వాడే విలనీ దుశ్చర్యలకు ఆగలేక తానూ వెళ్లి పోయే ప్రయత్నం లో ఉంటాడు .అంతకు ముందు జగపతి బాబు వచ్చి ఊరు మారిపోయినా విలన్ల దొంగ దెబ్బ తో గాయపడ్డ కొడుకు మహేష్ ను ఆ వూరు వదిలి పెట్టి తనతో రమ్మంటే వెళ్ళిపోయి .కోట్లు కూడా బెట్టినా మనసులో ఆ ఊరే జ్ఞాపకం వచ్చి మళ్ళీ అందర్నీ ఒప్పించి సమయానికి ఇక్కడికి చేరి గ్రామాన్ని కాపాడతాడు . ఇదీ కద .చంద్రబాబు ఆదర్శానికి రూపం . ఇది చూడటానికి వినటానికీ  బాగానే ఉంది .కాని సాధ్యా సాధ్యాలే మనకు ముక్కు మీద వేలు వేయిస్తాయి .

   విలన్లు బలవంతులు క్రూరులు .ఆయుధ సంపత్తి ఉన్నవారు. వాళ్ళను ఏ ఆయుధం లేకుండా పాంటు షర్ట్ నలగా కుండా   చేతి దెబ్బలతో దెబ్బకి పదిమందిని లేపేస్తూ ,వారిని పీటీ దెబ్బ కొడతాడు మైండ్ బ్లాక్ అయి వాళ్ళు దొంగ దెబ్బ తీస్తుంటారు .వాళ్లకు అదే పని ఇతనికి ఇదే పని . మహేష్ బాబు ఫైట్ చేస్తుంటే కొంగ బకాసురులతో చేస్తున్నట్లనిపించింది  .శ్రుతితో కలిసి డాన్సులు చేస్తుంటే రెండు కొంగలు చేస్తున్నట్లుంది నాకు మాత్రం అది దియేటర్ ,లెన్స్ లోపం కావచ్చేమో . సాగదీసి సాగదీసి ‘’రామా రామా రామా ‘’పాట హిట్ చేశాడు దేవిశ్రీ .మరేపాటా మనసుకు పట్టదు. అర్ధవంతంగానూ లేదు .నాకు అనిపిస్తుంది ఇలాంటి హీరోలకోసం మ్యూజిక్ డైరెక్టర్లు మాధుర్యమైన పాటలు చెయ్యకుండా మోత పాటలతో గంతులతో సంగీతానికి చేటు తెస్తున్నారేమో నని .

         పేదలకోసం కోట్లాను కోట్లు మంచినీళ్ళ ప్రాయం గా ఖర్చు పెట్టిన హీరో సినిమా చూడటానికి మధ్య ,దిగువ తరగతి ప్రేక్షకులు రాక పోవటం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు . శ్రీమంతులే శ్రీమంతుడు ను పోషిస్తున్నారనిపించి బాధేసింది . ‘’తాతా!సినిమా యెట్లా ఉంది?’’అని అడిగాడు హాలు లోంచి బయటికోస్తున్నమామనవడు ‘’ఏముందిరా  .రెండుకొంగల ఎగురుడు ,డాన్సు.ఊళ్ళో అందరూ ఎదురు తిరిగి బుద్ధి చెప్పలేక పొతే ఒక బక్క కుర్రాడు బట్టలు నలక్కుండా విలన్లను చితక్కోట్టటం నీ లాంటి వాళ్లకు బాగుంటుంది కాని నాకు కాదు ‘’అన్నాను ‘’తాతా! నువ్వెప్పుడూ ఇంతే .నీకేదీ నచ్చదు. ఏదో ఒక వంక పెడతావు ‘’అన్నాడు .మరి వాడి దృష్టిలో అంతేకదా .

    మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-9-15-ఉయ్యూరు   

Posted in రచనలు | Tagged | Leave a comment

డా .వెంకటేశ్వర గారి ‘’మధ్యాక్కరలు ‘’

డా .వెంకటేశ్వర గారి ‘’మధ్యాక్కరలు ‘’

చెన్నైలో ఉంటూ ఆ నగర జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ ఏది రాసినా దానిపై ఉన్నమక్కువను తెలియ జేసుకొంటూ తెలుగును జీవి౦పజేస్తూ  వ్రుత్తి వేరే అయినా ప్రవృత్తిగా సాహిత్యాన్ని ఎంచుకొని అరుదైన రచనలు తెలుగులో చేస్తున్న డా ఉప్పలధడియం వెంకటేశ్వర్లు సరసభారతికి  ఆత్మీయులే . వారు ఇటీవలే  అరుదైన తెలుగు దేశీ ఛందస్సు ‘’మధ్యాక్కరలు ‘’లో శతకం రాసి 2015లో వెలువ రించారు .అందులోని నాకు తెలిసిన సొబగులను మీకు అందజేస్తున్నాను .

సాధారణం గా కవికి అక్కర వస్తేనే మధ్యాక్కరలు జోలికి పోతాడు .లేక పొతేపోరు . చాలామంది తెలుగు కవులు దాని జోలికి పోలేదు .ఒక వేళ రాసినా కొద్దిమంది మాత్రమె రాశారు. విశ్వనాధ సత్యనారాయణ గారు మాత్రం మధ్యాక్కర శతకాలు పది రాశారు అంటే 1,010.మధ్యాక్కరలు రాశారు . కల్పవృక్షం లో దాదాపు ౩౦౦మధ్యాక్కరాలతో సన్నివేశ అక్కర తీర్చారు .ఆదికవి నన్నయ గారు 39  రాస్తే ఎర్రాప్రగడ ఒకదానికే పరిమితమైతే తిక్కన గారు ఆ చాయలకే పోలేదు .తర్వాత తుమ్మల ,నాయని ఆరుద్ర ,సుప్రసన్న ,మొదలైన వారు తలో శతకం కాని  కొన్నిపద్యాలు కాని    సంతరించారు .అలాంటి ‘’నన్ను ముట్టుకోకు ‘’అన్న మధ్యాక్కరలపై వెంకటేశ్వర కు మోజు కలిగి శ్రీమతి ప్రోత్సాహం తో తన అనుభవాలను ఈ దేశీ ఛందస్సులో చెప్పాలని తపించి ఆ తపనకు అక్షర రూపం కల్పించి సరస్వతీ కంఠా భరణం చేశారు.  .

ఈ దేశీ ఛందస్సులో ఆధ్యాత్మికమే కాక ఇతర భావాలనూ చెప్పటానికి అణుమాత్రం సందేహం లేదన్నారు మొదటి పద్యం లో .తాను  పాటించిన నియమాలను వివరించారు .తెలుగు ఛందస్సులోని సొగసును దర్శింప జేయటమే తన ఆదర్శం అన్నారు .’’దేహంబు ఉండు నందాక దాహంబు తీరదట’’.సామాన్య మానవ జీవిత విశేషాలనుఈ  అసామాన్య ఛందస్సులో అతి సునాయాసంగా చెప్పటం ఉప్పలధడియం వారి గొప్పతనం .ఒకరకం గా పప్పు దప్పళం .

‘’భారత రామాయణాది ప్రాచీన వాజ్మయ మందు –నేరము లేన్నుత కంటే తిరముగా నిజ విద్య మెరయ –చారు కృతుల్ వెలయించు టే౦తేని  సత్కార్య మగును –పేరిమి కల్గునే ప్రుద్విని పెదవి విరుపుల చేత ‘’అని చక్కని జాతీయం తో చీకటిని తిట్ట్టు కుంటూ  కూచోకుండా చిరు దీపం వెలిగించాలని చెప్పారు .సిద్ధాంతాలు వల్లిన్చేవాడి చేత హుళక్కి . రాద్ధాంతాలు  చేసేవాడి రాణ కూడా అంతే .పధ్ధతి లేని మనుషులలో ఔచిత్యం ఉండదు అంటారు .కూరలు కొందామని వెడితే కొబ్బరి కూడా కాటా లో పెట్టి తూచటం చూసి ఔరా అనుకొన్నారు .మరో అందమైన మధ్యాక్కర ముక్కెర –

‘’గగన మండలమెల్ల క్రమ్ముకొన్నవి కారు చీకటులు –అగణిత సంఖ్యలో తారలగుపించే ,నన్నింటి నడుమ –నిగనిగ మని కళ లొలుకుచు౦డెను నిండు జాబిల్లి –తెగిన పూసల దండ వోలె ,నందలి దివ్యమణి వలె’’.

‘’పెట్రోలు ఖర్చులు తగ్గు ననెడి అభిప్రాయ మెసగ –మెట్రో కు స్వాగతం ‘’పలికాడు కవి .కాని నగా నట్రా  అమ్మితే కాని అణువు మాత్రం స్థలం కూడా రావటం లేదు .ఇదీ ‘’మెట్రోలియం ‘’గాధ .మద్రాస్ మహానగరం లో మానవాక్రుతులు కవికి ‘’సింహ శరభోర గేంద్ర శార్దూల –మద గజా కీర్ణంబు’’గా ఉన్దికనుక సామాన్య జనం జాగ్రత్తగా మసలాలి అని హెచ్చరించారు నన్నయ్యగారి భాషలో .’’రాయల వారు ‘’అనే మాట  కర్ణాలకు తాకితే కవి కి శరీరం  పులకి౦చి .పోతుందట . హృదయం రసజ్ఞత పొందుతుందట .రణ గోణ ధ్వనులతో కంపించిపోయే మద్రాస్ మహానగరం లో టి నగర్ ,మైలాపూర్ లు  శ్రావ్య సంగీతం వినిపిస్తూ ఘనమైన సంప్రదాయాన్ని పాదు  కోనేట్లు చేస్తున్నాయి .స్వర గంగలో మునకలు వేయిస్తున్నాయని మెచ్చుకొన్నారు .దక్షిణాది తెలుగును ఈసడించేవారికి  చెంప దెబ్బలాగా గా

‘’దక్షిణాది తెలుగు వారి మాటల తరహాయే వేరు –లక్షణో పేతమ్ము కాదనుచు  బుదులా పలుకులకు –ఆక్షేపణల్ తెలప వచ్చుగాని శతాబ్దాలుగా పరి –రక్షించు కొనినారు భాష ననుచు వారల మెచ్చవలదే ? ఇది అక్షర సత్యం స్వాభిమానం తో తెలుగును ఇంట్లో మాట్లాడుకొంటూ ,తమిళం పెత్తనాన్ని సహిస్తూ తెలుగు భాషను ప్రాణ ప్రదంగా కాపాడు కొంటున్న దక్షినాది తెలుగు వారికి జేజేలు .వారి సంకల్ప దీక్షకు అభినందనలు .

‘’రేవు ‘’అనే మాట మరుగై పోయి ;;పోర్ట్ ‘’అనే ఆంగ్ల పదమే విరివిగా వాడుకలో ఉండటం ఆంగ్లాను రక్తిఏ కాని   భాషాభిమానం కాదని బాధ పడ్డారు .

‘’మౌలికమైన భావనల వ్రాసితి మధ్యాక్కరలను –శ్రీలు పొంగెడు తెల్గు సౌష్ట వమ్మున చెలగు కృతి యని –మేలిమి బుధులు ,భాషాభిమానులు మెచ్చిన నదియె –చాలును ,పది వేలటంచు నే నాత్మ సంతృప్తి గొనుదు’’ అని ఏంతో వినయంగా చెప్పారు మధ్యాక్కరకవి వెంకటేశ్వర .దాక్షిణాత్యకవుల కృతులను వారిని కీర్తిస్తూ కవి

‘’లాక్షణికుల మెచ్చు వెంకట సుకవి ,లాఘవ మొప్ప-అక్షయంబగు దివ్య కృతులు పలికిన అల త్యాగ రాజు –దక్షిణ ప్రాంతపు కవుల వార సత్వము నిల్పు కొరకు –అక్షరార్చన సేతు నష్ట దిక్పరి వ్యాప్తాంద్రి కేను ‘’అని హృదయ పూర్వక అంజలి ఘటించారు .చెన్నైలో ప్రముఖ తెలుగు సంస్థలు ‘’వేద విజ్ఞాన వేదిక ,ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించే ‘’తర తరాల తెలుగు కవిత ‘’ప్రసంగాలకు గొప్పగా స్పందించారు .పూర్వం రోజుల్లోనే కాదు ‘’నేటికిని చెన్న పట్టణమందు –కైతలు నవలలు ,కధలు వ్రాయు దిగ్దంతులు గలరు ‘’అని చాటి చెప్పారు .

‘’జీవన  సన్న వేశములు  కొన్నింటి చిత్రించినాను –భావము ,భాష ఇత్యాదిగా దీని పరికించి బుధులు –చేవగల క్రుతియో కాదో నిర్ణ యించెదరు ,తెలుగునకు –నా వంతుగా నొక కొన్ని పద్యాల నర్పించు చుంటి ‘’అని శతకాన్ని ముగించారు .దీన్ని చదివి బేరీజు వేసి నిగ్గు తేల్చమని కవి గారి కోరిక .పండితులు ఆపనికి పూనుకోవాలని నా విజ్ఞప్తి .

సాహసంగా మధ్యాక్కరలను మాధ్యమం గా గ్రహించి చక్కని తేట తెలుగు పదాలతో ఈ శతకం కూర్చిన శ్రీ వెంకటేశ్వరకు హార్దిక అభినందనలు .ప్రోత్సహించిన వారి అర్ధాంగి శ్రీ మతి ఉష గారికి శుభాశీస్సులు .అంకితం పొందిన శ్రీ విద్వాన్ ఎస్ దశరధ రామ రెడ్డి గారు ధన్యులు .

ముచ్చ్చటైన తెలుగు తల్లి వర్ణ ముఖ చిత్రం తో అచ్చు తప్పులు లేని అక్కరాల మధ్యాక్కరలు చూపులకే కాదు మనసుకూ ఆహ్లాదం కలిగిస్తాయి .ఆస్వాదించి కవిని అభినందించండి .స్కాన్ చేసిన పుస్తకం కవర్ పేజీలు  జత చేశాను చూడండి .

‘’అమూల్యం ‘’అయిన ఈ పుస్తక ప్రాప్తి స్థానం

General secretary

Janani (social and cultural Academy )

13/53 second street ,Vasuki nagar

Kodungaiyur ,Chennai -600,1118

Phone -044-25541 572

మీ-గబ్బట దుర్గా ప్రసాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సూక్తి సుధ 4 క్రోధం

సూక్తి సుధ

క్రోధం

4

‘’తనకోపమె తన శత్రువు ,-తనశా౦తమే తనకు రక్ష ,దయ చుట్టంబౌ ‘’అన్నాడు సుమతీ శతక కర్త .అసలు మనుషులకు క్రోధం ఎందుకు వస్తుంది ?దానివల్ల జరిగే పరిణామం ఏమిటి ?అనే దాన్ని గురించి తెలుసు కొందాం .’’క్రోధాద్భవతి సంమోహః సమ్మోహాత్ స్మ్రుతి విభ్రమః స్మ్రుతి భ్రంశాత్ బుద్ధి నాశో –బుద్ధినాశాత్ ప్రణశ్యతి ‘’అని గీతా చార్యుడు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పాడు .’’అను క్షణం విషయ సుఖాల గురించి ఆలోచిస్తే దానిమీదే ఆసక్తి పెరుగుతుంది .ఆసక్తి క్రమంగా కామం లేక కోరిక గా మారు తుంది .కోరిక తీరక పొతే కోపం లేక క్రోధం కలుగుతుంది .క్రోధం అవివేకానికి దారి చూపుతుంది .దీని వలన మరపు కలిగి ,బుద్ధి నశిస్తుంది .బుద్ధి నాశనమైతే ,అయోగ్యుడై మనిషి నశిస్తాడు .అంటే ‘’ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి ‘’లాగ క్రమంగా పతనమై జీవి నశి౦చి పోతాడు .మరి దీనికి విరుగుడు లేదా?ఉన్నది ‘’రాగ ద్వేషాలు లేకుండా ఇంద్రియాలనుస్వాదీనం లో ఉంచుకొని ,విషయ సుఖాలను అనుభ విస్తూ కూడా మానవుడు నిర్మలుడే అవుతాడని ఆ భగవద్గీతే చెప్పింది .

అందుకే భగవద్గీత ను ‘’మనస్తత్వ శాస్త్రం ‘’అన్నారు .మానవ మనో లీలలను  పరమాద్భుతం గా వర్ణించింది .బందానికీ ,మోక్షానికీ కారణం మనసే .ఉద్ధరించినా అధోగతి పాలు చేసినా మనస్సే’’అదే బంధం శత్రువుకూడా .కనుక కోరిక పెరిగితే ,కామం పెరిగి మోక్షానికి అవరోధమవుతుంది .’’వీత రాగ భయ క్రోదో ,మన్మయా మా ముపాశ్రితాః-బహవో జనన తపసా పూతా మద్భావ మాగతాః’’అని పరమాత్మ తరుణోపాయమూ చెప్పాడు .అన్నిటికి కారణమైన కామాన్ని పిశాచం తో పోల్చింది ‘’యోగ వాసిస్టం ‘’’’తవనావహితం చిత్తం కామః కవల యిష్యతి –సావదానస్య బుద్ధస్స పిశాచః కిం కరిష్యతి ?అన్నది అంటే ‘’అజాగ్రత్తగా ఉంటె చిత్తాన్ని కామం మింగేస్తుంది .జాగ్రత్తగా ఉంటె కామ పిశాచి చిత్తాన్ని ఏమీ చేయలేదు ‘’అని భావం .కనుక సర్వ వేళల ,సర్వా వస్థలలో మెలకువగా అంటే జాగ్రత్తగా ఉండాలి .

పరశురాముని క్రోధం 14 సార్లుక్షత్రియ రాజ వంశాలపై దండెత్టించి,రాజ వంశ నిర్మూలనం చేసింది .మహా భారతం లో పరీక్షిత్తు మహారాజు తపస్సమాధిలో ఉన్న ‘’శమీక మహర్షి ‘’తనకు ఆతిధ్యం ఇవ్వలేదని ఆగ్రహించి ,చచ్చిన పామును తెచ్చి ముని మెడలో వేస్తె ఆ తర్వాత వచ్చి చూసిన కొడుకు ‘’శృంగి ‘’7 రోజుల్లో పరీక్షిత్తు మరణిస్తాడని శపించాడు .జరిగింది తెలుసుకొన్న మహర్షి కొడుకుతో ‘’క్రోధం తపస్సుకు భంగం .అణిమాద్యస్టసిద్ధి సాధనకు ఆవ రోధం .ధర్మ మార్గానికి అడ్డంకి .తపస్వికి క్రోధం పనికి రాదు .చేసే పని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేస్తే క్రోధం తగ్గుతుంది ‘’అని హితవు చెప్పాడు .విశ్వామిత్రుడికి వసిష్ట మహర్షిపై ఉన్న కోపం బ్రహ్మర్షి పదవికి అడ్డంకి అయింది .కార్త వీర్యార్జునుని కోపం పతన హేతువైనది .దుర్యోధనుని క్రోధం కౌరవ వంశ నిర్మూలనం చేసింది .’’కామం ఆవహిస్తే క్రోధం నాట్యం చేస్తుంది ‘’అనే సామెత లోకం లో ఉంది .కామ ,క్రోధాలు పరమ మిత్రులు .లోకోపకారానికి అవతార పురుషులు ‘’ధర్మాగ్రహం ‘’చూపిస్తారు .శ్రీరాముడిది రావణాది రాక్షస సంహారం లో ధర్మాగ్రహమే .భారత స్వాతంత్ర్య సముపార్జనకు మహాత్మా గాంధి  బ్రిటిష్ వారిని ఎదిరించింది ‘’సత్యాగ్రహం ‘’తోనే .

కామ క్రోదాలకు తోడు డంబం ,గర్వం ,అభిమానం అంటే దురహంకారం ,కాఠిన్యం,అవివేకం అసుర లక్షణాలుగా ఉపనిషత్తులు పేర్కొన్నాయి .అందుకే ‘’కామ క్రోధ స్తదా లోభాస్తస్మా దే త్రయం వ్యజేత్ ‘’అన్నారు నరక ద్వారాలైన కామ క్రోధ లోభాలను మూడింటిని విసర్జించాలి .అహంకారం బలం దర్పం ,కామం క్రోధపరిగ్రహం –విముచ్య నిర్మమస్శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే ‘’అని చెప్పి వీటిని విసర్జించి మన శ్శాంతి తో జీవించమని మహాత్ముల సందేశం .

శ్రీరాముడు తాను  రాజ సూయ యాగం చేస్తానని తమ్ములతో చెప్పాడు .వివేకి అయిన తమ్ముడు లక్ష్మణుడు ‘’రాజ సూయ యాగం వలన రాజులతో అనవసర కలహాలేర్పడి ప్రశాంతతకు భంగం కలుగుతుంది .రాజ వంశ వినాశనం జరుగుతుంది .వసుంధరా వధ చేయ వద్దు ‘’అని చక్కని సలహా ఇచ్చాడు .ధర్మ సూక్ష్మం గ్రహించిన రాముడు ‘’శుభం పలికావు చిన్నవాడివైనా .వివేకి లోక పీడా చర్యలు చేయరాదు ‘’అని విరమించుకొన్నాడు .చనిపోయే ముందు మనిషి కామ క్రోధాదుల వేగం అరి కట్ట గలిగితే ,యోగి ,సుఖి అవుతాడు .కామ క్రోధాలు తొలగి పోవటం ‘’వాసనా క్షయం ‘’అంటారు .దీని వలన చిత్తం స్వాధీనమై ,ఆత్మ జ్ఞానం కలిగి మోక్షం లభిస్తుంది .

5(చివరి భాగం )

‘’కామం లేక కోరిక క్రోదానికి హేతువు .కామ౦  వల్ల ద్యూతం ,వేట ,స్త్రీవ్యసనం ,మద్యపానం నిరర్ధక ధన వ్యయం అనే అయిదు వ్యసనాలు కలుగుతాయి .వీటి వలలో పడి ,కోరికలు పెరిగి ,అవి తీరక పొతే క్రోధం విజ్రు౦భిస్తుంది .క్రోధం వల్ల వాక్పారుషత్వం ,దండ పారుష్యం అనే రెండు వ్యసనాలొస్తాయి .’’అని భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి ధర్మ రాజుకు ఉపదేశిం చాడు .’’ధర్మార్ధ కామాలు అనే వర్గ త్రయం ,ప్రభుత్వ మంత్రోత్సాహాలైన శక్తి త్రయం ,రాజు అధీనం లో ఉంటె ,సత్వ ర స్తమ గుణాల వివేచనతో రాజు ధర్మ పాలన చేస్తాడు .రాజు ప్రజలను జాగ్రత్తగా కాపాడుతూ ,ప్రజలు చేసే సత్కార్యాలను మెచ్చుకుంటూ ,కౌటిల్యం ఆత్మ స్తుతి ,దురహంకారం ,క్రోధం విడనాడాలి’’ అని భీష్మ ఉవాచ .ఇవి  పరిపాలనలో ఉండే అందరికీ వర్తించే నిత్య సత్యాలు .పాలకులు ఈ మార్గం లో నడిస్తే ప్రజాశాంతి సాధన జరుగుతుంది .

కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను ‘’అరిషడ్వర్గం ‘’అంటారు .ఇవి ఎలాకలుగుతాయో ఏ విధం గా తొలగి పోతాయో కూడా చెప్పారు .’’సంకల్పం వల్ల కామం జనిస్తుంది .దేహాత్మ విభేద జ్ఞానం వలన నశిస్తుంది .పరుల దోషాల వల్లక్రోధం ఏర్పడుతుంది .ఓర్పుతో ఇది నశిస్తుంది .అస్తిర జ్ఞానం లోపిస్తే లోభం కలుగుతుంది .ఎరుక వలన తొలగి పోతుంది .అజ్ఞానం వలన మోహావేశం కలిగి ధర్మాచరణ తో దూరమౌతుంది .కులం విద్య ,ధనం మదాన్ని పెంచుతాయి .అవి అశాశ్వతం అని గ్రహిస్తే మదం నశిస్తుంది .సాత్విక గుణ సంపత్తి లేకపోతె మాత్సర్యం ఏర్పడి సత్పురుష సా౦గత్యం వలన నిర్మూలనమౌతుంది .ఈ ఆరు మనసులో చేరితే ధైర్యం కోల్పోతారు .అయితే దీమంతుడిని ఇవి ఏమీ చేయలేవు .బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొంటే వీటి వలన ప్రమాదం రాదు .

మన ఆలోచనా విధానం సక్రమ మార్గం లో ఉండాలి .మనసు నిర్మలం గా ఉంచుకోవాలి .ఈ ఆధునిక కాలం లో ఇది సాధ్యమేనా ?అంటే సాధ్యమే .వృత్తి ఉద్యోగాలలో అనుక్షణం టెన్షన్ లో ఉంటాం .సమాజం లో అసమానతలు ,చుట్ట్టూ దరిద్రం ,పరపీడన ,పురుషాహంకారం ,ప్రేమ పేరిట మృగాలవుతున్నమగాళ్ళు , ,అన్నిట్లో వివక్షత  మనల్ని అశా౦తులను చేస్తున్నాయి .అందుకని ఉద్రేకపడి ఉపద్రవాలు తెచ్చుకోకూడదు .కనుకనే శారీరిక మానసిక ఆరోగ్యం కోసం యోగ సాధన చేయాలి ‘’యోగః కర్మ సుకౌశలం ‘’అన్నాడు యోగాచార్యుడు కృష్ణుడు .యోగిగా  ఈ సమాజం లో జీవించు అని గీత చెప్పింది .చెప్పటం సులువే కాని ఆచరణ సాధ్యమా అనిసందేహం వస్తుంది .  .అందుకే ‘’మనసులో సమత్వం ఉన్నవారంతా యోగులే ‘’అన్నారు కంచి పరమాచార్య .’’మన వేదనా స్వరూపానికి శాంతి ప్రకరణమే వేదం ‘’అని గ్రహించమన్నారు .ప్రపంచం లో ప్రజలకోసం చేసే సేవ పరమేశ్వరా రాధనం అవుతుంది .అందుకే ‘’సమాజ పరమేశ్వరుడు ‘’అన్నారు .దీని వలన ఆత్మ సంతుష్టి కలిగి సేవలో పడిన క్లేశ ,దుఖాలు ఆనందాన్ని ,సుఖాన్ని ఇస్తాయి .

సమాజం లో జరిగే వాటిని చూసి భయపడి పని చేయకుండా ఉండరాదు .భగవంతుని తో సహా అందరం కర్మ చేయాల్సిందే .కర్మ లేక పొతే లోక కార్యం జరగదు .కర్మ వలన చిత్త శుద్ధికలిగి ,దాని వలన నిష్కామ కర్మ తెలిసి ,దీనిద్వారా ధ్యానం ,యోగం కలిగి చివరికి ఆత్మాను సంధానం లభిస్తుందని గీతలో పరమాత్మ చెప్పాడు .మనం శ్రద్ధ తో చేసేపని భక్తీ అయి ముక్తిగా విలసిల్లు తుంది .’’ఉద్రేకాలు అణచుకొని ,సదాలోచనలు పెంచుకొని ,ఉద్వేగాలకు లోనుకాకుండా ,బ్రతికితేనే శాంతి .మనసులో నిర్మలత్వం ,ద్రుష్టి లో విశాలత్వం ,ఆలోచనలలో అనంతత్వం ఉంటేనే శాంతి లభిస్తుంది ‘’అని జ్ఞాన ,వయో వృద్ధులైన రచయిత శ్రీ పోతుకూచి సాంబశివ రావు గారు అన్నారు .

‘’మనసు కలయిక గా విద్య ఉండాలి .అంతరిక సమతుల్యత ,సామరస్యం ఉన్న వ్యక్తులను విద్య సమాజానికి అందించాలి .జీవితాన్ని ,మానవుడిని ,ప్రవర్తనను నిర్మించే విద్య నేర్పితే ,అరిషడ్వర్గాలను అధిగమించే స్థితి కలుగుతుంది ‘’అని స్వామి  వివేకానంద  ప్రవచనం .విజ్ఞాన ,ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేస్తూ ,వ్యక్తిత్వ వికాసాన్ని విద్య పెంపొందిస్తే ,సమాజం లో రుగ్మతలు ఉండవు .

అందర్నీ కలిపి ఉంచేది ప్రేమ తత్వమే .ప్రపంచాన్ని కామక్రోధాలు పాలించ కూడదు .ప్రేమ మాత్రమె ప్రపంచ పాలన సాగించాలి .అప్పుడే సుఖం శాంతి ,పురోగమనం లభిస్తాయి .ప్రేమ వికశించి ,సంకుచితత్వాన్ని త్రెంచి పారెయ్యాలి . ‘’ప్రేమ వికశించి మస్తిష్కం పునర్వ్యవ స్థీక రించ బడాలి .సమస్త జీవుల్లో ఊర్జవం, శక్తి ,మాధుర్యం ,తేజస్సులు చొచ్చుకు పోవాలి .ప్రేమలో శాంతి సుఖ సంతోషాలు సేవ ఉన్నాయి .ప్రేమ విశ్వం కన్నా విశాలమైనది యుగాలు కల్పాలకన్నా శాశ్వతమైనది .అనంతమైనది .ప్రేమ అంటే మీరే .నేనే ,మనమే ‘’అన్నారు అరవిందాశ్రమ మాత .

సంపూర్ణం

మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -12-9-15-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

శ్రేష్ట భాష గా తెలుగు -ఆచార్య గంగి శెట్టి లక్ష్మీ నారాయణ



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘అక్షరార్చన ”


 
 

 

 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ లో గోవధ నిషేధం మరియు దయనీయ స్తితిలో బ్రాహ్మణులు పంచదార చిలక కద


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బీహార్ ఎన్నికలు విశాఖ స్మార్ట్త తె లుగుకు తానా ,తమిళనాడులో తెలుగు



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూక్తి సుధ-

సూక్తి సుధ-

3

ధార్మిక జీవిత వైశిష్ట్యం ఏమిటి అంటే ‘’కష్ట సహిష్ణుత ,స్వార్జిత విత్తానుభవ ప్రశస్తి ,సోదరత్వ సౌజన్యం ,ఆధ్యాత్మిక చింతన ,ద్వేష రాహిత్యం ,భగవద్భక్తి ,బాంధవ్యం ,సత్య నిష్ట,రుజు ప్రవర్తన ,స్నేహ శీలం ,విద్యా వినయ సంపద ,ఐకమత్యం ,పరోపకారం ,సానుభూతి ,సహవేదన .వీటిని ఆవరచుకొని ఆచరిస్తే సమాజం లో హింస ,క్రూర ప్రవ్రుత్తి నశించి ,సుఖ శాంతులు వర్ధిల్లి ,పురోగమనం చేకూరుతుంది .ఈ భావనలు కలగాలంటే నిరంతర ధార్మిక చింతన ఉండాలి .సద్గ్రంధ పఠనం ఆవశ్యకం. సత్సాంగత్యం ,సద్గురు బోధ ,ఉండాలి .మహా భారతం లో లేనిది ఏదీ లేదు .అది మనిషి కద.మనిషి మనసు కధ.మనిషిలోని ఉన్నత శిఖరాలను ,అతి భయంకరమైన లోయలను ,కుదుపులను చెప్పే కధ..విప్పే కధ. మానవ జీవితానికి అద్దం భారతం .వ్యక్తీ ప్రగతికి ,సమాజ ప్రగతికి , ,సుఖ దుఖాలకు అవసరమైన ధర్మాలు ,ధర్మ సూక్ష్మాలు వివరించింది .మానవ జీవితానికి వాటిని సమన్వయం చేసి , రసమయం చేసింది ,లోచూపు వెలిగించే దీపంగా భాసిస్తుంది భారతం .

రక్త మాంసాలతో ,రకరకాల మనస్తత్వాలతో ,మనతో పాటే ఉండే ,శకునులు ,శల్యులు ,సైంధవులు ,కీచకులు బకాసురులు ,దుర్యోధన ధృత  రాష్ట్రాదులు అన్ని యుగాల్లో ,అన్నికాలాల్లో ,అన్ని జాతుల్లో ఉన్నారు,ఉంటారు .వారిని పెరగనీయ కుండా మనమే జాగ్రత్త పడాలి .లేక పొతే మానవ జీవితం కల్లోలమయమై పోతుంది .ధర్మాన్ని ఆచరి౦చటమేకాదు ,ధార్మిక బోధనా అవసరమే .శాస్త్ర సాంకేతిక విద్యావలయం లో పరిభ్రమిస్తున్న నేటి ప్రపంచం మేధస్సుకు ఇస్తున్న విలువను ,ప్రాధాన్యాన్ని హృదయానికి ఇవ్వటం లేదు .హృదయం లేని మనిషి దానవుడు అయ్యే ప్రమాదం ఉంది .ఉంటోంది కూడా .ఇది అందరికి అనుభవమే .అందుకే మానవ విలువలను బోధించే సాంఘిక శాస్త్రం విద్యలో అంతర్భాగం కావాలి .హ్యుమానిటీస్ లేక పొతే మనిషి ‘’ఇన్ హ్యూమన్ ‘’అవుతాడు .పరస్పర గౌరవం ,మర్యాద అవగాహన అందించే విద్య నేర్పాలి .ప్రపంచం కుగ్రామం అయిన కొద్దీ ,మనిషి స్వార్ధం తో మరీ కుంచించు కు పోతున్నాడు .మానవత్వాన్ని మంట గలుపుతున్నాడు .బుద్ధి ,మేధస్సు వికసిస్తోందికాని హృదయ వికాసం రావటం లేదు .

ధార్మిక ప్రవ్రుత్తి నుంచి మనిషి వైదొలగితే వచ్చే ప్రమాదం ఇదే .’’మనం బ్రతికే అచ్చమైన ,స్వచ్చమైన బ్రతుకే ధర్మ స్వరూపం ‘’అన్నది కాశ్మీర దేశపు సంస్కర్త ,యోగిని ‘’లల్లాదేవి ‘’.అందుకే ముస్లిములు కూడా ఏంతో గౌరవించి ఆమెను ‘’లల్లారిఫా ‘’అని ఆత్మీయంగా గౌరవం గా పిలుచుకొన్నారు . ధర్మమే అందరిని కలిపి ఉంచుతుంది అని దీనిని బట్టి మనకు అర్ధమవుతుంది .’’ఇదంశరీరం కౌంతేయ క్షేత్ర  మిత్యభిదీయతే ‘’అని చెప్పిన భగవద్గీత వాక్యానికి ‘’ఈ శరీరం ధర్మం అనే పంట పండించే క్షేత్రం ‘’అని పరమోత్క్రుస్టమైన  అర్ధం చెప్పారు శ్రీ కంచి పరమాచార్య .

‘’సర్వేషాం యః సుహృత్ నిత్యం –సర్వషాంచ హితే రతః –కర్మణా ,మనసా ,వాచా ,స ధర్మం వేదం జాజలే ‘’అని జాజలికి వర్తకుడు తులాభారుడు భారతం లో ధర్మ విషయం గురించి బోధించాడు .’’’’జాజలీ !నిత్యం అందరికి స్నేహితుడిగా ,మనో వాక్కాయ కర్మలా ,పర హితంగా ,ఉండే వాడే నిజంగా ధర్మం తెలిసిన వాడు ‘’అని భావం .’’తనను అధిగమించి ,తనను నిర్మించుకోక పొతే –యెంత పేదవాడు ఈ మనిషి ?’’అన్నాడు ప్రముఖ ఆంగ్లకవి వర్డ్స్ వర్త్ .

రామాయణం లో రాముడు రావణాసురుడికి ధర్మ బోధ చేస్తూ ‘’ధర్మ ఏవ హతో హంతి-ధర్మో రక్షతి రక్షితః –తస్మాధర్మో న హంతవ్యః –మానో ధర్మో హతో వదీత్ ‘’అన్నాడు ‘’అధర్మాన్ని అణచి వేసే ధర్మాన్ని నువ్వు అణచి వేశావు రావణా !అందుకే ధర్మం నిన్ను హతం చేస్తుంది .ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది .ధర్మాన్ని అణచ కూడదు.ధర్మం హతమైతే మనల్ని ధర్మం హతం చేస్తుంది ‘’.

‘’సత్యం పరమం ధర్మం ‘’అన్నారు .సత్యం లో ధర్మం ఉంది సత్యమే నాశనం లేనిది .సత్యం తర్వాత పదమే మోక్షం .విశ్వాన్ని సుఖ శాంతులతో ,ఉన్నతిలో ఉంచటమే అందరి ధ్యేయం కావాలి . ‘’అందర్నీ ప్రేమించే మనసు ,అందర్నీ సేవించే వయసు ,అందరి క్షేమం కోరే బుద్ధి నాకు ప్రసాదించు ‘’అన్నది మన ప్రార్ధన కావాలి .’’కుర్వంతు విశ్వం ఆర్యం ‘’అనేది భారతీయ సంప్రదాయం .విశ్వాన్ని సర్వోత్క్రుస్ట ,ఉన్నత మయమానవులనుగా తీర్చి దిద్దటమే భారతీయ ధార్మిక ఆదర్శం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-15-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged | Leave a comment

విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’

సూక్తి సుధ

విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’అనే రెండు విషయాలపై మాట్లాడమి కోరగా రాసి మాట్లాడాను .దానిని ఆగస్ట్ 1,8,15,22,29 తేదీలలో ఉదయం 6గంటల సూక్తి సుధలో అయిదు భాగాలుగా ప్రసారం చేశారు .దానినే మీకు అంద జేస్తున్నాను .

‘’ద్రుజ్ ధరణే’’అనే ధాతువు నుండి ‘’ధర్మం ‘’అనే పదం వచ్చింది .’’ధరతి విశ్వమితి ధర్మః –ధారణాత్ ధర్మః ‘’అని వ్యుత్పత్తి .సమస్త విశ్వాన్నీ ధరించేది ధర్మం .విశ్వ స్థితికి ఆధారమైనది ధర్మం .’’ధర్మ విశ్వస్య జగతిః ప్రతిష్టాలోకే –ధర్మిస్టం ప్రజా ఉప స్సర్ప౦తి-ధర్మేణ పాప మనువదతి-ధర్మే సర్వం ప్రతిష్టి తం –తస్మాధర్మం పరమం వదంతి ‘’అంటుంది శ్రుతి.అంటే ‘’సమస్తలోక స్థితికి పరమ ఆధారం ధర్మమే .ధర్మ నిస్ట కలవారిని ప్రజలు ఆశ్ర ఇస్తారు .ధర్మం పాపాన్ని తొలగిస్తుంది .ధర్మం లోనే అన్నీ ఉన్నాయి .కనుక ధర్మం సర్వ శ్రేష్ట మైనది ‘’అని భావం .రామాయణం లో కైక కూడా శ్రీ రామునితో ‘’ధర్మ మూల మిదం రామ విదితం చ సదామపి ‘’అని హితవు చెప్పింది .’’జగత్తు ధర్మ పైనే ఆధార పడి నడుస్తోందిరామా  .ఈ విషయం పండితులకు తెలుసు ‘’అని ఆమె మనో భావం .వనవాసానికి వెడుతున్న కొడుకు రాముడితో తల్లి కౌసల్య ‘’నువ్వు ఆచరిస్తున్న ధర్మమే నిన్ను రక్షిస్తుంది ‘’అని ధైర్యం చెప్పి పంపించింది .

ఇంతకీ ధర్మం మనకు చేసే మేలు ఏమిటి ?’’యతోభ్యుదయ నిస్శ్రేయససిద్ద్దిః స ధర్మః ‘’అభ్యుదయం నిస్శ్రేయస్సు లను ధర్మం కలిగిస్తుంది .మనుస్మృతి ‘’దశ లక్షణోధర్మః సేవితవ్యః ప్రయత్నతః –ధృతి ,క్షమా ,దమోస్తేయం ,శౌచ మింద్రియ నిగ్రహః –ధీః,విద్యా ,సత్యమక్రోదః దశకం ధర్మ లక్షణం ‘’అని ధర్మానికి ఉన్న పది లక్షణాలను చెప్పింది .ధర్మాలు రెండు రకాలు .ఆశ్రమ ధర్మాలు ,సామాన్య ధర్మాలు .గృహస్థాశ్రమ ,వానప్రస్థాశ్రమ ,సన్యాసాశ్రమాలలోని వారు ఆశ్చరించాల్సినవి ఆశ్రమ ధర్మాలు .సామాన్య జనులందరూ ఆచారిమ్చాల్సినవి సామాన్య ధర్మాలు .ఇవే సత్యం ,క్షమా ,భూత దయ ,కృతజ్ఞత మొదలైనవి .వాల్మీకి మహర్షి రామాయణం లో సామాన్య ధర్మాలకే ప్రాధాన్య మిచ్చాడు .ఇవన్నీ మానవతా ధర్మాలుగా లోకం లో పిలువ బడుతున్నాయి .ఇవే సమాజ పురోగతికి అవసరమైనవి .

ఐతే మానవత్వం అంటే ?’’మన్యతే అనేనా ఇతి ‘’అని చెప్పారు .’’దేని వలన సమస్తవ్యక్త ప్రపంచం ,దానికి కారణమైన అవ్యక్త ప్రపంచం తెలియ బడుతుందో అదే మానవత్వం ‘’.మానవత్వం లేని బ్రతుకు నిరర్ధకం .సాటి మానవునిలో దైవాన్ని చూసే చూపు కావాలి ,రావాలి .అప్పుడే మనిషి జన్మ సార్ధకం .సమాజం అలాంటి మానవులతోనే అభ్యుదయం చెందుతుంది .’’యతో ధర్మ స్తతో జయతి ‘’సుఖ సంతోషాలతో అందరూ వర్దిల్లటానికి ఈ ధర్మాలు అందరూ ఆనుస్టించాలి .ఈ రకమైన ధార్మిక పరమైన ఆలోచనా ,నిరంతర మననం  ను ‘’ధార్మిక చింతన ‘’అంటారు .

ధర్మం పురుషార్ధ హేతువు .కటుంబ ,బంధు ,సోదర ,దాంపత్య ,సాంఘిక ,న్యాయ ,రాజకీయాది ధర్మాలను అందరం ఆచరించాలి .అసత్యానికి మించిన అధర్మం లేదు .’’ధర్మ మూల జగత్సర్వం –ధర్మశ్చశ్రుతిమూలకః –భారతం పంచామో వేదః –శ్రుతి సర్వస్వ విస్తరం ‘’. ‘’సమస్త వేదాలకు మూలం ధర్మం .మహా భారతం పంచమ వేదం .వేదం సర్వస్వాన్ని మహా భారతం వివరించి చెబుతుంది .’’అని దీని భావం .భారతం చదివి అర్ధం చేసుకొని ,జీవితానికి అన్వయించుకొని ఆచరిస్తే ప్రపంచం సుఖ శాంతి మయమవుతుంది .అందుకే వివేకానందుడు ‘’ప్రాక్టికల్ వేదాంతం ‘’అవసరమని చెప్పాడు .ధర్మాలలో భూత దయ ఉత్త్తమమైనది .ఇదే భగవాన్ బుద్ధుని బోధనా సారాంశం .మానవుల విషయాలలోనే కాక పశు పక్షాదుల విషయం లో కూడా భూత దయ ఉండాలి అని వాల్మీకి మహర్షి బోధించాడు ..

ఒక క్రమ పద్ధతిలో ,అందరితో సహజీవనం తో ,అందరికి సమాన సంతృప్తిని కలిగిస్తూ జీవించటమే ధర్మం .’’అనేక ప్రాణి జేతే రహతి –త్యా సర్వా౦చి రహ వి సుస్తితి –సామాన్ సంధానాంఛి గతి వ్యాస –ధర్మ మహానవే ‘’.విశ్వాన్ని అంతటిని మన ఇల్లుగా భావించటం ,అందులో మన ఉన్నతి తో బాటు ,ఇతరుల సుఖ సంతోషాలు చూసే గొప్ప సంస్కృతినే ధర్మం అన వచ్చు .ఇందులో న్యాయం నీటి ,సమానత్వం ఉంటాయి .ఒకరికొకరు నిజాయితీగా సాయం చేసుకోవటమే లౌకికార్ధం లో ధర్మం .

2

ప్రపంచాన్ని ధరించేది రాక్షించేది ధర్మం .అనేక ధర్మాలు లోకం లో ఉన్నా వేదం ధర్మం శ్రేయస్కరం .’’ద్వివిదోహి వేదోక్తో ధర్మః ప్రవ్రుత్తి లక్షణో నివృత్తి లక్షణ శ్చ జగతః స్థితి కారణం ‘అని శ్రీ శంకర భగవత్పాదులు ‘’గీతా భాష్యం ‘’లో చెప్పారు .వేదం ధర్మాలు ప్రవ్రుత్తిధర్మం , నివృత్తి ధర్మం అని రెండు రకాలు .ప్రవ్రుత్తి ధర్మం అంటే ముందుకు వెళ్ళటం- ప్రోగ్రెస్ .నివృత్తి ధర్మం అంటే వెనక్కి తిరిగి చూసుకొని సవరించుకోవటం-రిగ్రేస్ .ఈ రెండు ధర్మాలు ప్రపంచం లో ప్రాణులన్నిటికి సహజమే .ఇందులో ఏది ముఖ్యమైనది అంటే రెండూ ముఖ్యమైనవే .ఉదాహరణకు-మానవుని పెరుగుదల శిశుత్వం తో ప్రారంభమై అనేక దశలలో,అనేక రకాలుగా విస్తరిస్తుంది .ఇది ప్రవ్రుత్తి ధర్మం .వృద్ధాప్యం లోఎదుగుదల ఆగిపోతుంది .మనిషి నెమ్మదిగా కుంచించుకు పోతాడు .ఇదే నివృత్తి ధర్మం .అంటే మొదట ప్రవ్రుత్తి ధర్మం ,తర్వాత నివృత్తి ధర్మం అనే దశలు ఉంటాయి .ఇవి ఒకదాన్ని వదలి రెండవది ఉండదు .ప్రవృత్తిలో ప్రేమ ప్రధానం .అదే అభ్యుదయ మార్గం .నివృత్తి లో శ్రేయస్సు ప్రధానం గా ఉండి ,ముక్తికి సోపానమవుతుంది .అలాగే మనసుకు కూడా  ఈ రెండు ధర్మాలు వర్తిస్తాయి . జీవితం లో ముందుకు సాగటం ప్రవ్రుత్తి .ఏవైనా అడ్డంకులు ఎదురైతే ,కొంచెం వెనక్కి తగ్గి ,మనల్ని మనం రక్షించుకోవటం నివృత్తి .మెలకువ స్థితిలో ప్రవ్రుత్తి లో ఉన్న మనసు ,ఇంద్రియాలు , నిద్రించే చేముందు నివృత్తి లోకి చేరతాయి .ముందుగా కర్మేంద్రియాలు ,తర్వాత జ్ఞానేంద్రియాలు ,మనసు విషయాల నుంచి వెనక్కి మరలి ,ఆత్మలో కరగి పోతాయి .నివృత్తి తో బాటు ధర్మాన్ని కూడా అలవరచు కొంటేనే నిజమైన ఫలితం కలుగుతుంది .

కేవలం నిద్రించటమే నివృత్తి ధర్మం కాదు .దానికి తోడుగా జ్ఞానం ఉండాలి అప్పుడే మోక్షం లభిస్తుంది .నివృత్తి స్థితికి చేరాలంటే మొదట ఇంద్రియ స్వేచ్చను అరి కట్టుకోవాలి .తర్వాత అనేక విషయాలపై ఉన్న దుఖాన్ని గుర్తిస్తూ వివేకం తో వాటిని విశ్లేషిస్తూ ,అనవసరమైన వాటిని విసర్జించాలి .అప్పుడు మాత్రమె మనసు నివృత్తి చెంది ఆత్మను తెలుసుకో గలుగుతుంది .అంటే ఆత్మ జ్ఞానం లభిస్తుందన్నమాట .అయితే ఇదంతా సద్గురువుల సాన్నిధ్యం లో ,మార్గ దర్శకం లో మాత్రమె సాధ్యమవుతుంది .అప్పుడే ప్రవ్రుత్తి ,నివృత్తి ధర్మాలకు ధర్మ సూక్ష్మాలు గ్రహించే జ్ఞానం వస్తుందని సాధనలో పరి పక్వమైనవారు  తెలియ జేశారు .ఈ జ్ఞాన సాధన వలననే పునరావృత్తి రహిత మోక్ష పదం సిద్ధిస్తుంది .

‘’శరీరమాద్యం ఖాలు ధర్మ సాధనం ‘’అన్నారు ఏది సాధించాలన్నా శరీరం కావాలి .అది ఆరోగ్యం గా ఉండాలి .’’A sound mind in a sound body ‘’శరీరం ఆరోగ్యం గా ఉంటె మనసూ ఆరోగ్యంగా ఉంటుంది .’’బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి ‘’బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు బ్రహ్మమే అవుతాడు .అలాగే ‘’ధర్మ విద్ ధర్మైవ భవతి ‘’ధర్మం తెలిసిన వాడు ధర్మ మూర్తి అయిన పరమాత్మయే అవుతాడు .ఇహ లోక వ్యవహారాలతో ముడి పడి  ఉన్నదే ప్రవ్రుత్తి ధర్మం .పరలోక వ్యవహారాలకు సంబంధించింది నివృత్తి ధర్మం .’’అరయగ ధర్మ తంత్రముల యందు –నిరర్ధకము లేదోకండు-నెవ్వరి మది యందు వ్రాలె దగ –వారు ,దానిన పూని యాచరింతురు’’అని తిక్కన గారు శాంతి పర్వం లో చెప్పారు .అంటే మానవుడికి ధర్మ స్వీకార స్వేచ్చ ఉన్నదన్నమాట .అనుమానం లేదు .ప్రవ్రుత్తి నివృత్తి ధర్మాలు ఒక దానికొకటి విరుద్ధం కావు .పరస్పర పోషకాలే . దీనికి మహత్తర ఉదాహరణ మన జాతి పిత మహాత్మా గాంధీయే –‘’ఒడలు దేశ సేవకు –ఎడద రాముని సేవకు –అప్పగించి ముక్తి గాంచె గాంధి ‘’అన్నారు తెనుగులెంక శ్రీ తుమ్మల సీతారామ మూర్తిగారు .

మానవ జీవితం లో దాగి ఉన్న దైవత్వాన్ని వెలికి తీస్సి ,సమాజ సేవకు అన్క్తం కావాలని మహా భారతం బోధించింది .జీవితం ద్వంద్వాత్మకం .మంచిని గ్రహించి ముందుకు సాగి జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-15-ఉయ్యూరు

Posted in రేడియో లో | Tagged , | Leave a comment

యాభై ఏళ్ళ తెలుగు సి ఐ డి ,మరియు అత్రేయం


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోటపల్లి తో శుభారంభం ,దేశసేవలో ఆమె వెన్నముద్దల జనార్దన మహర్షి

 


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

10-9-15 గురువారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారి 120జయంతి రోజున కృష్ణా జిల్లా రచయితల సంఘం ,సిద్ధార్ధ కాలేజి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ”విశ్వనాధ సాహితీ వైభవం ”దృశ్యమాలిక

10-9-15 గురువారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారి 120జయంతి రోజున కృష్ణా జిల్లా రచయితల సంఘం ,సిద్ధార్ధ కాలేజి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ”విశ్వనాధ సాహితీ వైభవం ”దృశ్యమాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విశ్వనాధ సాహితీ వైభవం లో నా పత్ర సమర్పణ

Image result for viswanatha satyanarayana

కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి 120 వజయంతి సందర్భం గా కృష్ణా జిల్లా రచయితాల సంఘం ,విజయవాడ సిద్ధార్ధ కళాశాల  ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యం లో నిర్వహించిన

విశ్వనాధ వారి సాహితీ వైభవం –జాతీయ సదస్సు -10-9-15-సిద్ధార్ధ కళాశాల –విజయవాడ

‘’తెలుగు భాషోద్యమం –విశ్వనాధ ప్రేరణ ‘’పై

పత్ర సమర్పణ– గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

శ్రీ మన్మధ నామ సంవత్సరం లో జన్మించిన విశ్వనాధ వారి నూట ఇరవై వ జన్మదినోత్సవాన్ని శ్రీ మన్మధ నామ సంవత్సరంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 10 న నిర్వహించటం చారిత్రాత్మక విషయం . అనుభూతికవి స్వర్గీయ తిలక్ మాటలలో ఇది ‘’అద్వైత మాన్మదం ‘’.

‘. ప్రపంచవ్యాప్తంగా 21నాగరకతలు వర్ధిల్లితే అందులో 19రూపు రేఖల్లేకుండా  నశించిపోయాయి .కారణం విదేశీ దండయాత్రకాదు ’ఎప్పుడైతే ఒక జాతి తన మూలాలను ,గత చరిత్రను మరచిపోతుందో అప్పుడు ఆ సంస్కృతీ దేశమూ నశించిపోతాయి ‘’అన్నాడు ఆర్నాల్డ్ టోయన్బీ.అదే నేడు భాషావిషయం లోనూ జరిగిపోతోంది .ప్రపంచ వ్యాప్తంగా భాషలు అంతరించి పోయి ఆ సంస్కృతులు కనుమరుగవుతున్నాయని యునెస్కో ఆవేదనే మన రాష్ట్రం లో తెలుగును బతికి౦చుకోవటానికి ‘’తెలుగు భాషోద్యమం ‘’వచ్చింది .కార్పోరేట్ సంస్కృతిలో  ఆంగ్ల మాధ్యమ ప్రభావ వ్యామోహం లో పడి మాత్రుభాషనే మర్చి పోయే విపరీత వింత పరిణామం వచ్చింది. దీని నుండి బయటపడటానికి మేదావి వర్గం  సాంఘిక ఆలోచనా పరులు భాషాభిమానులు నడుం కట్టి కదిలి కొంత మార్పు తెచ్చారు .అయినా జరగాల్సింది ఇంకా ఎంతో ఉంది .

ఈ ప్రభావాన్ని సుమారు డెబ్భై ఎనభై ఏళ్ళ క్రిందటే  గుర్తించిన కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తెలుగు క్లాసిక్ నవల ‘’వేయి పడగలు ‘’లో ఈ విద్యా విధానం పై తీవ్రంగా పాత్రల చేత చర్చి౦పజేసి తన మనోభావాలను వారి నోటితో చెప్పించాడు .హరప్పకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పే ఈట్సన్ దొరకు నెలకు పన్నెండు వందల జీతం ఇస్తే తెలుగు ,సంస్కృతాలు బోధించే ధర్మారావు కు జీతం అ౦దు తోందో లేదో కనుక్కొనే అతీగతీ లేదు  .సుబ్బన్న పేటలో కేశవ రావు జాతీయ కళాశాల పెట్టి తెలుగు హిందీ సంస్కృతం రాట్నం వడకటం నేర్పిస్తుంటే  ,జమీందార్ ఇంగ్లీష్ కాలేజి పెట్టి పాశ్చాత్య  వ్యామోహం పెంచాడు .దీనికి ఎక్కినట్లు జనం జాతీయ కళాశాలలో చేరక ,లుకలుకలతో అవినీతితో ద్వంద్వ ప్రవృత్తుల పాలనలో క్రమంగా క్షీణించి , జమీందార్ కాలేజి దిన దిన ప్రవర్ధమానమైంది .అందులో జీతాలకు కటకట.ఇందులో పుష్కలం .యూరోపియన్ అధికారి చేతిలో జమీందార్ కాలేజి నడిపించాడు .జాతీయకళాశాల’’ పాలక సంఘం’’ ఆధ్వర్యం లో నడిచింది .

ఇంగ్లీష్ రాకుండా మనకు సాగదు అంటాడు వేయిపడగలలో శఠ గోపాచారి.కళాశాల కనుమరుగైపోతోంది .అది ఆనాటి పరిస్తితి .నేడు ప్రభుత్వ విద్యాలయాలు బక్క చిక్కి పోయాయి చేరేవారు లేకుండా పోతున్నారు . .కాన్వెంట్లు బలిసి పు౦జు కున్నాయి .ఆదర్శం గా ఉండి కళాశాలలో పనిచేసిన ధర్మా రావు సతీష్కే పోట్టగడవటం.లేదు .రాజా గారి కాలేజిలో తెలుగు పండితుడవ్వాల్సిన పరిస్తితి  వచ్చింది   .మన చరిత్ర సంస్కృతీ పై అవగాహన ఈ విద్యా వ్యవస్థ ఇవ్వటం లేదు .చదువు జ్ఞానాన్ని పెంచటం లేదు .’’టెక్కుల’’వరవడిలో కొట్టుకు పోతోంది జాతి .దీని నుంచి బయట పడాలి .అందుకే విశ్వనాధ ధర్మా రావు తో ‘’వందేళ్ళు బానిస చదువులు చదివి  భావనా శక్తి దరిద్రమై పోయింది .ఇది నశి౦చటానికే ఈ  విద్య  నేర్పిస్తున్నారు డిగ్రీ పొందినా ప్రపంచ జ్ఞానం రావటం లేదు ‘’.మరి దీనికి పరిష్కారం కూడా విశ్వనాధ అతనితోనే పశుపతికి  చెప్పించాడు .’’తెలుగు చక్కగా వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్పించు .బుద్ధి వికసించిన తర్వాత ఏ భాష అయినా త్వరగానే వస్తుంది .16ఏళ్ళ వరకు తెలుగులో చెప్పి ,,ఆ తర్వాత ఒక ఏడాది ఇంగ్లీష్ నేర్పిస్తే వ్యవహార జ్ఞానం వస్తుంది . మొదటి నుంచి ఇంగ్లీష్ చెప్పి చెడ గొడుతున్నారు. .మనం ఇంగ్లీష్ మానస పుత్రులం కాకూడదు .పరీక్షలు పాసై పోతున్నారుకాని అందులోని విషయాలు తెలియవు,అనుభవం లోకి రావు .పనికి మాలిన పుస్తకాలు ఎన్నో నేర్పించటం కంటే ఒక మంచి పుస్తకం నేర్పించు .’’పెద్ద బాల శిక్ష’’ చెబితే తెలుగు రాక పోవటం ఉండదు .’’అంటాడు  ఇప్పుడు మన పరిస్తితి అలాగే  ఉంది .అందుకే జ్ఞానోదయమై మళ్ళీ పెద్ద బాల శిక్షకు గిరాకీ పెరిగింది .

గుమాస్తాలుగా ,విదేశీయులకు బానిసలుగా చేసే విదేశీ విద్యనూ గాంధీజీ బహిష్కరించమని ఇచ్చిన పిలుపునే వేయి పడగలలో విశ్వనాధ నిక్షిప్తం చేశాడు .సుబ్బన్న పేటలో కరెంటు ,మిల్లులుఆధునిక సౌకర్యాలు  అన్నీ వచ్చాయి.విశ్వనాధ వీటికి వ్యతిరేకం కాదు .’’మనిషిలో మానసిక వికాసానికి అవసరమైన విలువల్ని ,సంస్కారాన్ని మర్చి పోనంతవరకు ఏ ఆధునిక మార్పునైనా పరిగ్రహించ వలసిందే ‘’అన్నాడు విశ్వనాధ .ఎక్కడా ఏమనిషీ ప్రేమలేనివాడు ,నిష్కరణుడు కాకూడదు ‘’అన్నదే ఆయన ధ్యేయం .జుగుప్స లేని కరుణా ,సానుభూతి మానవాళి పై ఉన్నవాడు .’’continuation with the past ‘’తో నిలబడ్డ యుగకర్త విశ్వనాద .కాలం కంటే యాభై ఏళ్ళు ము౦దున్నవాడు .శిల్ప సాహిత్యాదు లు జాతీయమై ఉండాలి.రాసిన వాడికి ముక్తి ,చదివిన వాడికి రక్తి ,ముక్తి .’’ఎంతసముద్రం మీద ఎగిరినా పక్షి రాత్రికి గూడు చేరుతుంది .ఇదీ జాతీయత ,ఇదే సంప్రదాయం ‘’..ప్రాచీన ,ఆధునిక సాహిత్యానికి ఏకైక ప్రతినిధి విశ్వనాధ .భారతీయ సంప్రదాయ పరి రక్షణకు జీవితం అంకితం చేసిన విరాణ్మూర్తి .అందుకే ‘’ఒకడు విశ్వనాధ ‘’ అన్నారు ఆచార్య బేతవోలు  రామ బ్రహ్మం గారు .’’That is Visva Nadha  ‘’Unique one .’

పి. జి .వుడ్ హౌస్ ‘’your spine is made of tooth paste ,your veins flow water’’అని ఎద్దేవా చేశాడు .అలాంటి జాతిగా మనం మారిపోయాం దీనిని ఉద్ధరించటానికే విశ్వనాధ సాహితీ అవతారం ఎత్తాడు . సాహిత్యం,శిల్పం విజాతీయం కాకుండా జాతీయం కావాలి అనే ఆలోచన వచ్చిన కాలం లో ఆ సమకాలిక చైతన్యానికి సృజనాత్మక సాహిత్య శక్తి అయ్యాడువిశ్వనాధ ‘అంటారు ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం .ఈ దేశం లో పుట్టిన ప్రక్రియల్లో పాశ్చాత్య ప్రక్రియలు లీనం కావాలి అనికోరాడు ఆపనే చేశాడు .మానవ జీవితం అర్ధ వంతం కావాలని కోరుకున్నాడు .రాజకీయ దాస్యం కంటే సాంస్కృతిక దాస్య౦ ఎక్కువ ఆవేదన కలిగించింది . .అందులో నుంచిజాతి  బయట పడాలి .  అప్పుడే వ్యక్తిత్వం గల జాతి అవుతుంది అంటాడు . ఆంద్ర పౌరుషం ఆంద్ర ప్రశస్తి లతో సకల చరాచారాలను కలుప్తూ ప్రబోధించాడు చైతన్యం తెచ్చాడు .’’తెలుగు తల్లి ,మానేల ,ఆంద్ర రాష్ట్రం, ఉరిత్రాళ్ళు ,బానిసల సముద్రం ‘’ మొదలైన వాటిలో తెలుగు జాతి గౌరవాన్ని నిలిపాడు .స్వదేశీ అభిమానాన్ని చాటటానికే ‘’కిన్నెర సాని పాటలు’’ రాశాడు. ‘’తనకాలం నాటి తెలుగు నాట సామాజిక ,రాజకీయ ,పాలనా పరంగా వస్తున్న పాశ్చాత్య ధోరణుల పెనుగాలులకు రాక్షముఖంగా ప్రాతి నిధ్యం కల్పించి ఎడుర్కొన్నవాడు విశ్వనాధ ‘’అన్న ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి మాట యదార్ధం .

విశ్వనాధ చెప్పినట్లే  డాక్టర్ కొఠారి’’విద్యలో జ్ఞానం లోపించింది .దీనివలన యువతకు గుణాత్మక జీవన విధానం తెలియ కుండా పోయింది .మంచి వ్యక్తిగా పోరుడుగా  నైపుణ్య కారుడుగా తీర్చి దిద్దే విద్య నేర్పాలి ‘’అని యాభై ఏళ్ళ కిందటే చెప్పాడు .ఇప్పుడు మనం భాషోద్యమం లో అదే అంటున్నాం చరిత్ర మొదలైన హ్యుమానిటీస్ చేర్పించాలనికోరుతున్నాం .భారత రత్న ,మిసైల్ పితామహుడు అబుల్ కలాం కూడా ‘’విజ్ఞాన సముపార్జనకు పనికొచ్చేది అమ్మ భాష మాత్రమే . మాతృ భాషలో చదివితే మెదడు లోని ‘’నియో కోర్టే క్స్ ‘’బాగా స్పందించి ,సూక్ష్మ బుద్ధి ,కొత్త ఆలోచన ,వ్యక్తీకరణ సామర్ధ్యం పెరుగుతాయి . మాతృ భాష కు ఇంతటి మహత్తర శక్తి ఉంది .కలాం కూడా పదవ తరగతి వరకు తమిళ మాతృభాషలోనే చదువుకొన్నాడు .కలాం మాటలు మనకు శిరోధార్యం కారణం ఆయన మట్టి మనిషి .’’రామేశ్వరం నుండి రాష్ట్ర పతి భవనానికి దూసుకెళ్లిన రాకెట్ ‘’..’’విజ్ఞాన సాంకేతిక శాస్త్రాల మీద నవతరానికి ఆసక్తి పెరగాలంటే అమ్మ భాష లోనే బోధించాలి .అప్పుడే సృజనాత్మకత పెరుగుతుంది ‘’అన్నాడు కలాం దీన్ని ఇస్రో చంద్రయాన ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ అన్నాదురై కూడా సమర్ధించాడు ఇంగ్లీష్ వాళ్ళు తప్ప, మిగిలిన ప్రపంచ శాస్త్ర వేత్తలందరూ సైన్స్ ను వాళ్ళ భాషలోనే రాస్తారు మాట్లాడతారు .మాతృ భాషలో విద్య నేర్పిస్తే వైజ్ఞానిక సాంకేతిక రంగాలకు అవసరమైన స్వంత ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది .సహజ మేధస్సును పదును పెడుతుంది .’’వైజ్ఞానిక సాధనకు అమ్మభాషే పెట్టు బడి’’అన్నాడు డాక్టర్ కలాం .’’కన్న పేగుతో అనుబంధం లేని ఇంగ్లీష్ అవసరాన్ని మాత్రమే తీరుస్తుంది .చదువుపై ఆసక్తి పెంచలేదు ‘’అన్నాడు రాకెట్ వీరుడు కలాం .మద్రాస్ ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కలాం చదివేటప్పుడు తమిళం లో రాసిన ‘’మన విమానాన్ని మనమే తయారు చేసుకొందాం ‘’వ్యాసానికి మొదటి బహుమతి వచ్చింది .’’జీవద్భాషలో చెబితే హృదయం స్పందిస్తుంది .ఎంతా పెద్ద ఉద్యోగానికైనా తెలుగే అర్హతకావాలి .వృత్తి, సాంకేతిక విద్యలలో కూడా తెలుగుకు ప్రాధాన్యమిచ్చి అందులో వచ్చిన మార్కులు అంతిమ ఫలితాలకు కలపాలి .అప్పుడే భాష బాగుపడుతుంది ‘’అని శ్రీ తిరుమల శ్రీనివాసాచార్య ఈ మధ్య చెప్పిన దాన్ని, వందేళ్ళ క్రితమే గిడుగు రామమూర్తిగారు ‘’అన్ని శాస్త్రాలూ మాత్రు భాషలో బోధిస్తేనే స్పష్టంగా అర్ధమవుతుంది .ఉగ్గుపాలనుండి తల్లిభాష లోనే అంటా నేర్పాలి ‘’అన్నారు .అందుకే ‘’అమ్మనుడి’’ సహజమైనది .దీనికోసం ప్రభుత్వానికి సరైన భాషా విధానం ఉండాలి దాన్ని నిర్దుష్టంగా అమలు చేయాలి .చట్టాలు న్యాయ వ్యవహారాలూ పాలనా అ౦తా తెలుగులోనే జరగాలి.తెలుగు మూలాల మీద పరిశోధన జరగాలి .మాధ్యమాలలో ఆంద్ర పద ధోరణి తగ్గాలి . ఇవన్నీ విశ్వనాధా ప్రేరణలే

.  ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్లనూ, ఆ జాతిలో పుట్టిన మహాత్ముల వల్లనూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్లనూ విలసిల్లుతూ ఉంటుంది. జ్ఞానవైరాగ్యముల పుట్టినిల్లయిన భారతావనిలో భాషాపరంగా జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థానమున్నది. సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష ఇప్పుడు సొంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం. ఒక జాతిపాశ్చాత్య సామ్రాజ్య వాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థాయిలో దేశ స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఒకవైపు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా, సాంస్కృతిక స్థాయిలో తన సాహిత్య శక్తులను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పోరాటం నిర్వహించిన సాహిత్య సమరయోధుడు విశ్వనాధ సత్యనారాయణ. ‘ ‘జాతీయతకు సంప్రదాయమ్ము, ప్రాణభూతిమ్మది ప్రాణశక్తి’’అన్న మహనీయుడు

ఈ పోరాటం దిశగా, తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఒకే ఒక రచన విశ్వనాధగారి వేయి పడగలుమాత్రమే. భారతీ యాత్మను ఆధునికంగా ఆవిష్కరిస్తూ దేశీయమయిన ఉదాత్తజీవితపు విలువలను ఆత్మోత్తరణ కోసం అవశ్యంగా కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తింప జేస్తూ ఇంకా ఈ జాతి చైతన్యశక్తి చావలేదని, అది సనాతనమని ఎలుగెత్తి చాటిన ఒకే ఒక గొప్ప నవలేతిహాసంవేయిపడగలు‘. అది మరింత విస్తరించి ఆయా భాషల వారు స్వీయ రాష్ట్రాన్ని మాతృదేశంగా దేశమాతగా పరిగణింపజేసింది. ‘’నేను చదవ వలసిన వాడినేకాని చూడవలసిన వాడిని కాదు ‘’ అని చెప్పగల సత్తా ఉన్నవాడు .ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరం. శ్రీ విశ్వనాథ, సాహితీ కల్పవృక్షం .

  గబ్బిట దుర్గా ప్రసాద్ .

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు

2-405 శివాలయం వీధి– ఉయ్యూరు -521165-కృష్ణా జిల్లా

చరవాణి-9989066375 ,o8676-232 797

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

బీహార్ లో నితీష్ కె మళ్ళీ చాన్స్



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెల్లి మళ్ళీ మళ్ళీ సెరినా గెలుపు మరో ఏడాది సోనియా ,ఆరేళ్ళ సానియా ఆదర్శం


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణా గోదావరీ సంగమ హెల ,సంగీత శక్తి అనంతం



 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 3- 403- బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం  -3

403-  బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి

 

‘’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలు లో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారున్నారు కదా !ప్రతి గురువారం వారిని దర్శించండి ‘’అని కంచి కామ కోటి పీఠ పరమా చార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారు చెప్పారు అంటే శాస్త్రి గారి యోగ సిద్ధి మహిమ ఎంతటి దో మనకు అర్ధమవు తుంది .

 

Inline image 1  

గుంటూరు జిల్లా చంద వోలులో  తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి ,హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896 ఆగస్ట్ ఇరవై అయిదున లో జన్మించారు .నిష్టా గరిష్ట కుటుంబం వారిది .చంద వోలు శాస్త్రి గారని అందరు పిలుస్తారు .తాడి కొండ వాసి కేదార లింగం గారు ‘’బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని ‘’వీరికి ఇచ్చారు .పదహారో సంవత్సరం దాకా ఆ మంత్రోపాసన చేసినందు వల్ల అమ్మ వారు వీరికి పిలిస్తే పలికేది .దెందు కూరి పాన కాల శాస్త్రి వద్ద తర్కం ,పొదిలి సీతా రామ శాస్త్రి వద్ద మంత్రం నేర్చారు .యవ్వనం లోనే సన్య సించాలి లనే కోరిక కలిగింది .శ్యామ లాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపం లో జన్మించాడని చెప్పింది .శాస్త్రి గారికి చిన్న తనం లో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచ రించింది .అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వరి అయిన కామేశ్వరి దూరం గా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది .ఒకరిని మోసుకొని ఇద్దర్నీ  తీసుకొచ్చాడు .అమ్మ వారు చిరు నవ్వు తో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకం లో జన్మించమని  తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది .19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ ,పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతి తో వివాహ మైంది .పిన్ని చూపించింది కూడా ఈమెనే .ఆమె పేరు ను శ్రీ దేవి గా శాస్త్రి గారు మార్చారు .

పాండిత్య ప్రకర్ష

శాస్త్రి గారు తండ్రి గారి వేద పాఠ  శాల నిర్వహణ లో తోడు  పడుతూ ఉన్నారు .అయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికా కు రమ్మన్నారు .వారికి ఇష్టం లేదు .పిన పాటి వీరభద్రయ్య తో నేత్రావధానం ,ఏలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రి తో కవిత్వ సాధన చేశారు .అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్  ఇచ్చారు .వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగ లింగ శాస్త్రి గారి తో అనేక అవధానాలు చేసి ,ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు .పుష్పగిరి పీఠా ది పతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధి లో జరిగిన అష్టావదానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యం గా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతం గా చెప్పి ఒప్పించారు .

అమ్మ వారి సాక్షాత్కారం

దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది .ఇంటి వద్దే ఉండి  తండ్రికి తోడ్పడ్డారు .తిండికి గడవని పరిస్థితి .మూడు రోజులు అంతా ఉపవాసమే .మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి  అంగోస్త్రం నేల మీద పరచి నిద్ర పోయారు .10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఒరే ! ముష్టి పె డ  తాను .కొంగు పట్టు ‘’అన్నది .దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది .అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది .తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజు గారి బండి వచ్చింది .అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది . అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే .

అనేక గ్రామాలలో భాగవతం ,హరి వంశం ,పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరే వారు .పరమ నిష్టా గరిష్టం గా జీవించే వారు .ప్రాణాయామం ,తపస్సు కొన సాగించారు .ఇంట్లో వేరు సెనగ  నూనె, వేరు సెనగ వాడ లేదు .దొండకాయ ,టమేటా ,బంగాళా దుంప ,ముల్లంగి  కాబేజీ ,నిషిద్దం .కాశీ కి తప్ప ఎప్పుడు రైలు ప్రయాణం చేయ లేదు .శాస్త్రి గారికి మగ సంతానం లేదు కూతురు లక్ష్మి ని చెరువు సత్య నారాయణ శాస్త్రి కిచ్చి వివాహం చేశారు .ఆయనే శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు.

అష్ట సిద్దులు కైవశం

‘’  శాస్త్రి గారిని చందవోలు శాస్త్రి గారు ‘’  అని ఆ ప్రాంతంవారంతా గౌరవం గా సంబోధిస్తారు .   శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశ మైనాయి .వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకో లేదు .తాడి కొండ వేద పాఠ శాలలో దయ్యాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు .ఒక సారి ‘’వశ్యంకర ఔషధి ‘’ని సేకరించాలని చంద్ర గ్రహణం రోజున కొండ ఎక్కి ,దాన్ని గుర్తు పట్టి తీసుకొందామని దగ్గరకు వెళ్తే ఒక బాలుడు అడ్డుకొన్నాడు .బలవంతాన లాక్కో బోతే ‘’నీకు ఈ మొక్క తో పని లేదు .నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’అన్నాడు .ఇంతలో గ్రహణం వదిలింది .బాలుడు మాయమయ్యాడు .తనకు దాన్ని పొందే యోగం లేదని భావించారు .అది దత్తాత్రేయ స్వామి అది పతి గా ఉన్న ఓషధి .పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు .సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి  పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు .శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృశ్యుడైనాడు .

తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కదామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తీ చేస్తున్నారు. అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు .అమ్మను ఉపాసించి నిద్ర పోయారు .కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు .శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బద్దావు ‘’?అని అడిగింది .’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు .మెలకువ వచ్చి ‘’భర్మ  మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది.శాస్త్రి గారు మహా ఆగమ పండితులు .ఇంటి ఆవరణలో దత్తాత్రేయ ,సుబ్రహ్మణ్య ,సీతా రామ లక్ష్మణ ,హనుమాన్ దేవాలయ నిర్మాణం చేశారు .తనకు వ్యాకరణం నేర్పిన గురువుగారిని నిత్యం పూజా సమయం లో స్మరించేవారు .

ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెన పల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతి కని పించి,నమస్కరించి లోపలి వెళ్ళింది .ఆమె గ్రహ పీడితురాలు .అందర్ని కొడుతూ ,తిడుతూ ఉండేది .అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది .ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు ?’’అని అడిగారు .’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది .శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు .ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది .దెయ్యం వదిలింది .వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది .అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వేయ బూనితే ‘’గారుడ మంత్రం ‘’జపించారు .సర్పం తల నేల కు వాల్చింది .’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు .నా జోలికి నువ్వు రావద్దు .పొర పాటున నా కాలు తగిలింది .వెళ్లి పొండి  ‘’అనగానే పాము వెళ్లి పోయింది .ఆ రోజంతా గారుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు .

చందవోలు శాస్త్రి గారి రచనలు

చందవోలు శాస్త్రి గారు గొప్పకవి .సంస్కృతం లో తెలుగులో రచనలు చేశారు .అందులో సంస్కృత రచన ‘’మత్స్వప్నః అనేది చాలా ప్రసిద్ధమైనది .ఇదికాక ‘’హేమ దుర్గా౦బికా శతకం ‘’,పాండు  రంగేశ్వర ప్రశస్తి ‘’,బాలా త్రిపుర సుందరీ సమేత రాజ రాజ నరేంద్ర స్తవం , శాంకరీ స్తవం ప్రభు ప్రపత్తి ,సహస్ర లింగేశ్వర స్తుతి ,దత్త్తాత్రేయాస్టక గర్భితాత్మ సుప్రభాతం ‘’;ప్రారబ్ధ ప్రాబల్యం ‘’,దత్త భగవంతం,’’ శ్రీరామ కదామృత శేష పురాణం ,శివలీల, తుకారామదాసు చరితం ,వాసుదేవ సారదీయం ,మొదలైనవి రచించారు .లౌకిక వ్యవహారంగా ‘’ ‘’నాయోగము ‘’పాడిన పాట’’,నా యాత్ర (కాశీ ),’’నాకు తోచిన మాట ‘’,ఇంకొకమాట (వ్యాసావళి ).

‘’మత్స్వప్నం ‘’లోని శాస్త్రి గారి కవితా వైదుష్యాన్ని దర్శిద్దాం .

‘’శ్రీమాతా శ్రీ మహా రాజ్ఞీ –స్వధ్యాసీనా దేహలీ మధ్య మార్యా –స్వప్నే దృష్టా ద్రుస్టతః –శిల్పా నల్పాకల్ప భాసమానా ‘’

తాత్పర్యం –మంగళకరమైన తల్లి బాలా త్రిపుర సుందరీ దేవి ,సహస్రనామాలకు అధిదేవత .లక్ష్మీ వైభవం ఇచ్చేది ,శ్రీ విద్యా స్వరూపిణి ,దేవతలందరికీ అధినేత్రి అయిన ముత్తైదువ మా ఇంటి గడప మధ్య భాగం లో కూర్చుని కల్ప లతలతో సృష్టింప బడిన అంతు  లేని శిల్ప ప్రావీణ్యం గల సర్వాభరణాలతో ప్రకాశించే నా తల్లి నా అదృస్టవశాన స్వప్నం లో సాక్షాత్కరించింది .

అప్పుడు శాస్త్రిగారు అమ్మవారిని ‘’అమ్మా ! మమ్మల్ని అందరిని కన్న తర్వాత శంకరుని వివాహం ఆడావా లేక ము౦దేనా ?’’అని ప్రశ్నించారు అమ్మ నవ్వి భండాసుర వధను తానూ ఎలా చేసిందో వివరించింది ఆ కధను .అంతటినీ శాస్త్రి గారు ఇందులో రాశారు .మళ్ళీ సందేహం రావటం బాలా దేవికి నివేదించటం ఆమె కదా రూపం లో తెలియ జేయటం ఇందలో విశేషం .త్రిమూర్తులకు భేదం లేదని చెప్పారు .

‘’ఈశో  విష్ణుః శ్రీ రుమా వాణ్యు మాజో –పీశ శ్శక్ర స్చేశ ఈశా శాచీడ్యా-స్త్రీ సర్వోమా పూరుషస్సర్వ  ఈశః –ఇత్యూచే కోపి శ్రుతే ర్మౌళిభాగః ‘’

భావం –విష్ణువే ఈశ్వరుడు ,లక్ష్మి పార్వతి ,వాణిపార్వతి ,బ్రహ్మ ఈశ్వరుడు ,ఇంద్రుడు ఈశ్వరుడు ,శచీదేవి పార్వతి .ఇలా స్త్రీలు అందరూ పార్వతీ స్వరూపులే ,పురుషులంతా ఈశ్వర రూపులే అని ఉమామహేశ్వర ఉపనిషత్ బోధించిందిఅని చెప్పారు . .చివరికి తనకు విద్యలో రచనలో సహాయం చేసిన శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి శ్రీ  నాగ లింగ శాస్త్రి వంటి మహనీయులను స్మరించి చివరి శ్లోకం గా

‘’తద్వద్యో యో మేలమేకం దదౌతు –చిత్తేనాహం గౌరవేణార్చయామి –దైవేభ్యో మిత్రేభ్య ఉచ్చైర్గురుభ్యః –పాండి త్యౌన్నత్యర్ది వద్భ్యో నమా౦ స్యోం ‘’చెప్పారు .

అర్ధం –ఏ ఏ మహాత్ములు నాకు ఒక్క అక్షరమైనా ఇచ్చారో వారందర్నీ గౌరవ ప్రపత్తులతో అర్చిస్తున్నాను .దేవతలకు మిత్రులకు ,సహచరులకు ,పెద్దలైన గురువులకు ,సర్వ సమత్వాన్ని ప్రవచించే ప్రబుద్దులకందరికి నమస్కారాలు .ఇంతకంటే చేయాల్సింది ,చెప్పాల్సింది ఏమీ లేదు ‘’అని అంతటి కర్మిషష్టి  బ్రహ్మిష్టి వశ్యవాక్కు ,నిత్య బాలా త్రిపుర సుందరీ దర్శన పులకా౦కితులు ,శ్రీ విద్యోపాసకులు బ్రహ్మశ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అత్యంత వినయంగా చెప్పుకొన్నారు ఇది మనందరికీ ఆదర్శం .శ్రీ విద్యోపాసకులు కనుకనే ఈ గ్రందాన్ని రాయగలిగారు .చిన్నదే అయినా ఈ శ్లోక గ్రంధం  అందరికి  పఠనీయం .ఈగ్రందాన్ని శాస్త్రిగారి దౌహిత్రులు ఉభయభారతి బిరుదుపొందిన సంపూర్ణ సంస్కృత శతావాధానం నిర్వహించిన  సంస్కృత౦లొ ‘’ కవితా మయూఖా ‘వంటి ’బహుగ్రంధ కర్త శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ముద్రించి లోకానికి అందజేశారు . చందవోలు శాస్త్రిగారి తండ్రి గారు శ్రీ వెంకటప్పయ్య శాస్త్రిగారు కూడా విద్వత్ కవులే సంస్కృతం లో ‘’శ్రీ శైల తీర్ధ సారోఖ్యోయం ‘’వంటి గ్రంధ రచయిత .

 

శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు .ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు  గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది .శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ  ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు .బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది .తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు ..గంగమ్మ కని పించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది .’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉప యోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది .’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు .ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే .’’అన్నారు .మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది. అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ .శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు .

ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో ,పేరు పెట్టమనో అడిగే వారు .కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త న్నిర్ణయం చేసే వారు .అంతే .ఆ కార్య క్రమం శుభప్రదం గా జరిగి పోయేది .దానికి తిరుగు లేదు .అదీ వారి మంత్ర సిద్ధి .

దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం ,గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్య క్రమం లో వారం రోజులున్నారు .అప్పుడు రాఘవ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు .అప్పుడు వారిని చూశాను .జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది .అప్పుడే ‘’నడయాడే దైవం ‘’అని పరమా చార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం .10-12-1990ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతం గా చేరి పోయారు .వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారం గా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతం గా వర్ణించారు .వార్తా పత్రికలలో వేశారు .శాస్త్రి గారు కారణ జన్ములు .వారి పేరు వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి  . –

సశేషం

మరో కవితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

425కోట్ల బిర్లా ఇల్లు ,మాతా అమృతానందమయి భూరి విరాళం ,మరో శతఘ్నిమోడల్ సిటి గుంటూర్


 

 

 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇప్పటికీ ఇండియానే బెస్ట్ ,చదువులో కత్తిసాములో కత్తి ,మోడీ మాజిక్ తో సెన్సెక్స్ పైపైకి



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఔరంగజేబు ను మళ్ళీ బతికించారు ,ఆదిభట్ల ,తెన్నేటి బూర్గులపై వ్యాసాలూ


 
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణను కలిసే గోదారి -భాషా దినోత్సవాలు


 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వనాధ జయంతి

విశ్వనాధ జయంతిfinal invitation00010002

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

జై జవాన్

 


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెయ్యేళ్ళ కేరళ శివాలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ వ్యాసాలు


 

 


గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎందుకు పడినట్లా వెలుగు మరక?

ఎందుకు పడినట్లా వెలుగు మరక?
Updated :07-09-2015 00:39:49
బైరాగి సంశయాత్మకతే అతడిని ‘మాస్టర్స్‌ ఆఫ్‌ సస్పిషన్‌’ గా పిలువబడే ఫ్రాయిడ్‌, మార్క్స్‌, నీషేల త్రోవన నడిపించింది. ఇన్నేళ్ళు గడిచాక కూడా బైరాగి ఈ తరం పాఠకులలో కూడా ఆసక్తి కలిగించడానికి ఈ సంశయాత్మకతే కారణం. బైరాగి తాత్త్విక మూలాలు అస్తిత్వవాదం లో ఉన్నాయి. అది కూడా కీర్క్‌ గార్డ్‌, దోస్తయెవ్‌స్కీల అస్తిత్వవాదం. వేదన ద్వారా మాత్రమే ఒక దివ్యస్ఫురణకు పాత్రులం కాగలమనేది ఈ మార్గంలోని ముఖ్యాంశం. ఇది సార్ర్త్‌, హైడెగ్గర్‌, హుస్సెర్ల్‌ వంటి వారి అస్తిత్వవాదం కన్నా భిన్నమైనది.
‘ప్రేమను కనుగొనటం లాగా, సముద్రాన్ని కనుగొనటంలాగా దోస్తెయెవ్‌స్కిని కనుగొనటం జీవితంలో ఒక ముఖ్య ఘట్టం’ అని హోర్హె లూయీ బొర్హెస్‌ ఒక వ్యాసంలో అంటాడు. ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’ నవలలో చిత్రితమైన రాస్కల్నికోవ్‌ అవస్థ మొత్తాన్నీ ‘త్రోవ ఎక్కడ సోనియా!’ అన్న ఒక్క కవితావాక్యంతో సూచించిన కవి బైరాగిని కనుగొనడం కూడా అటువంటి ముఖ్యఘట్టమే. అప్పటిదాకా అనుభవిస్తూ వచ్చిన ‘నీరస తథ్యాల’ సుఖాలు మనవి కాకుండా పోవచ్చు. బైరాగిని రెండు కోణాలనుంచి లోతుగా చర్చించవలసి ఉంది. ఒకటి- సాహిత్య చరిత్ర, రెండు- తాత్త్విక చింతన. సాహిత్య చరిత్ర కొన్ని అనుక్రమాల్ని తయారు చేసి పెట్టుకుంటుంది. తన పరిధికవతల ఉన్న అన్ని సవాళ్ళని, వైపరీత్యాల్ని చదును చేసివేస్తుంది. ప్రత్యేకించి, తెలుగు సాహిత్య చరిత్ర మనకు మన సాహిత్యాన్ని గురించి ఒక అతి సరళ కథనాన్ని వినిపిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు విస్మరణకు గురైన రాజకీయ-సామాజిక సమూహాలు దీన్ని విమర్శకు పెడుతూ కొత్త చేర్పులకు దోహదం చేస్తూనే ఉన్నాయి. ఈ సమూహాలకు చెందకుండా ‘విడిగా, పెడగా’ నిల్చున్న రచయితల్ని సాహిత్యచరిత్ర తను నిర్మించుకున్న చట్రాల్లోనే బలవంతంగా ఇరికిస్తుంది. ఆమేరకు, ఆయా రచయితల సాహిత్యకృషిని అర్థం చేసుకోవడానికి అవసరమైన విమర్శనా పద్ధతుల్ని అన్వేషించాల్సిన బాధ్యతనుండి తప్పించుకుంటుంది. పైగా, ఇటువంటి బాధ్యతను కనీసం గుర్తించనైనా గుర్తించదు.
ప్రస్తుత సమస్యని తులనాత్మక సాహిత్య దృక్పథం తో సమీపించవచ్చు. కన్నడ సాహిత్యం లో ‘నవోదయ’ ఉద్యమం మన భావకవిత్వంతో పోల్చదగిందే అయినా, ఆ తరువాత వచ్చిన ‘నవ్య’ సాహిత్యోద్యమం మన అభ్యుదయోద్యమం కన్నా భిన్నమైనది. ‘నవ్య’ సాహిత్యం అభ్యుదయ లక్షణాలు కలిగివుండటంతో పాటుగా అభ్యుదయాదర్శాల్ని, ఆధునికతనీ కూడా విమర్శించింది. హిందీలో కూడా ఛాయావాదం, ప్రగతివాదం రెంటినీ తిరస్కరిస్తూ నయీ కహాని (నవీన కథ), నయీ కవిత (నవీన కవిత) వచ్చాయి. గోపాలకృష్ణ అడిగ, ముక్తిబోధ్‌, బి.ఎ్‌స.మర్ధేకర్‌, అయ్యప్ప పణ్ణిక్కర్‌ల కవిత్వాన్ని గాని, రామచంద్ర శర్మ, యు.ఆర్‌.అనంతమూర్తి, నిర్మల్‌ వర్మ, ఓ.వి.విజయన్‌ ల కథల్ని గాని అభ్యుదయవాద/ప్రగతిశీల రచనలనలేము. అలాగే, శ్రీశ్రీ ’చరమ రాత్రి’ కథల్లో కూడా ఆధునిక అనుభవాల్ని వాస్తవికవాద పద్ధతిలోకాక కొత్త శైలీవిశేషాలతో (ఉదాహరణకి, ‘డ్రమాటిక్‌ మోనోలోగ్‌’, ‘మెటాఫిక్షన్‌’) వ్యాఖ్యానించడం కనిపిస్తుంది.
బైరాగిని అభ్యుదయ కవి అనడమూ, అభ్యుదయ వ్యతిరేక కవి అనడమూ రెండు తప్పే. ఆయనను సాహిత్య పరంపరలో స్థాపించడానికి ‘ఆధునికవాదం’ (మోడర్నిజం) అన్న చట్రం ఉపయుక్తమూ, ఉచితమూ కూడా. ఇది యురోపియన్‌ సాహిత్యచరిత్రలలో నుంచి తీసుకున్న మాటే అయినా కొన్ని మార్పులతో భారతీయ సాహిత్య సందర్భానికీ అన్వయిస్తుంది. ఆధునికవాదం మానవాత్మ ‘ఊసర క్షేత్రంగా’ మారడాన్ని చిత్రిస్తుంది. ఆధునిక జీవితం మనిషిని ఎన్ని విధాలుగా అమానవీకరణకు (డీహ్యుమనైజేషన్‌), పరాయీకరణ (ఏలియనేషన్‌)కు గురిచేస్తోందో గుర్తించడం స్థూలంగా ఆధునికవాద సాహిత్య ముఖ్యలక్షణం. ఆధునికత మీద విమర్శగా ఆధునికవాదాన్ని అర్థం చేసుకోవలసివుంటుంది. వీటితో పాటు, బైరాగి రచనల్లో మరికొన్ని ప్రత్యేక గుణాలున్నాయి.

బుద్ధికీ, హృదయానికి మధ్య కృత్రిమ వైరుధ్యాన్ని బైరాగి కవిత్వం నిరాకరిస్తుంది. ‘డిస్కర్సివిటి’ని శిల్పవిశేషంగా చేసుకుని కావ్యం నిర్మించడం, అది కావ్యత్వానికి భంగం కలిగించకపోవడం ‘నూతిలో గొంతుకలు’ లోని విశిష్టత. అందుకే, రాచమల్లు రామచంద్రారెడ్డి అంటారు- ‘నూతిలో గొంతుకలు తెలుగు కవిత్వంలోని ఏకైక తాత్త్విక కావ్యం. అందులోని సిద్ధాంతాలు, తాత్త్విక సూత్రాలు, మానవ హృదయాంతరాళంలోని గాఢమైన ఆరాటం నుండి, తపన నుండి ఉద్భవిస్తాయి. జిజ్ఞాసువు హృదయంలోని తపన, అన్వేషకుని గుండెలోని ఆర్తి -అవే తాత్త్విక చర్చల రూపం ధరిస్తాయి. అందుకే అది (సిద్ధాంతపు మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా) తెలుగు సాహిత్యంలో ఒక అపురూప కావ్యమయింది.’’ (సారస్వత వివేచన, 1976, పు.56) అలాగే బైరాగి ప్రేమకవితల్లో కూడా ‘ప్రణయం’ అనే భావన వెనుక దాగున్న అంతర్గత కల్పనల్ని విశ్లేషిస్తారు. ప్రేమ నెపంగా శాశ్వతం/నశ్వరం, యౌవనం/వృద్ధాప్యం, సౌందర్యం/విరూపం వంటి ద్వంద్వాల్ని అస్థిరం చేయడం ఈ ప్రేమకవితల వైశిష్ట్యం.

ఒక సాహిత్యకృతిని ఇతర సాహిత్యకృతుల స్ఫురణలతో, వాసనలతో ప్రయత్నపూర్వకంగా నిర్మించడాన్ని Intertextuality అని అంటారు. బైరాగి కవిత్వంలో ‘ఇంటర్టెక్స్టువాలిటి’ ఒక ప్రత్యేక, ప్రధాన నిర్మాణ వ్యూహం. అది ప్రస్ఫుటంగా ‘నూతిలో గొంతుకలు’ లోని మూడు ‘స్వగతాలలోనూ’, ప్రచ్ఛన్నంగా ‘ఆగమగీతి’లోని చాల కవితలలోనూ కనిపిస్తుంది. ‘దివ్యభవనం’ కథాసంపుటిలోని ‘ఒక గంట జీవితం’ కథనైతే బైరాగి వివిధ సాహిత్యకృతులనుంచి తీసుకున్న ఉటంకింపుల అల్లికగా (Roland Barthes అన్నట్టు tissue quotations గా) ‘క్యూరేట్‌’ చేసాడని చెప్పవచ్చు. హామ్లెట్‌ నాటకాన్ని, భగవద్గీతనీ, క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌ని ఎంచుకుని, కావ్యప్రణాళికలో ఒక క్రమంలో అమర్చడం, ఈ మూలకృతులను చదివే దృష్టికోణాల్లో సైతం మౌలికమైన మార్పుకు దోహదం చేసేదిగా ఉంది. సాహిత్యాన్ని సాహిత్య విమర్శగా, ప్రశంసగా సృజించిన కవి బైరాగి.
బైరాగి కావ్యజగత్తులో ప్రతి ఎత్తుగడలోనూ, ప్రతి చలనంలోనూ నీడల్లా వెన్నాడే భావనలు కొన్ని ఉన్నాయి. ఒకటి, అనిత్యత. ఈ అనిత్యతని సూచించేందుకు ‘పద్మపత్రమివాంభసా’, ‘స్మృతి పటలపు సౌదామిని’ వంటి పదచిత్రాలు వేరువేరు రూపాల్లో ‘వేరియేషన్స్‌ ఆన్‌ ఎ థీమ్‌’ లాగా అనేక కవితల్లో దర్శనమిస్తాయి. (దేశం,కాలం) గడచిపోవటం, మాసిపోవటం, అందకపోవటం, ఓడిపోవటం కవిత్వవిషయమవ్వడం అనే ఆధునికవాద లక్షణం బైరాగి కవితలన్నిటా కనిపిస్తుంది. ఆధునికవాదులైన వర్జీనియా వుల్ఫ్‌, జాయిస్‌, ఇలియట్‌ వారి రచనల్లో ‘క్షణాలకు’ ప్రాధాన్యతనిస్తారు. బైరాగి ‘త్రిశంకు స్వర్గం’ అనే దీర్ఘకవితలోని, ‘చావు పుట్టుకల బ్రతుకుల విషమబాహు త్రిభుజంలో/మధ్యనున్న ఒక అదృశ్యబిందువులా/ ఘనీభూత వాస్తవ కేంద్రీకరణం, ఒక్క క్షణం!’ వంటి పంక్తుల్లో ఇటువంటి సాక్షాత్కార క్షణాలు (‘ఎపిఫనిక్‌ మొమెంట్స్‌’) మాత్రమే ‘మనుష్యుని దేవతుల్యుణ్ణిగా’ చేయగలవనే విశ్వాసం కనిపిస్తుంది. ఇక మరొక భావన, మృత్యువు. బైరాగి కవితల్లో మృత్యువు కామరూపి. మృత్యువు (బైరాగి వాడే పదం ‘మిత్తవ’) మంత్రసానిగా, నర్తకిగా, మహాఫణి గా జీవితపు ప్రతి మలుపులో పొంచి ఉపహసిస్తుంది. ’పాప పోయింది’ నవలలో అధికభాగం మృత్యువు గురించిన సువిస్తారమైన తాత్త్విక వివేచనే.

వాడ్రేవు చినవీరభద్రుడు బైరాగి గురించిన ఒక విమర్శా వ్యాసంలో అన్నట్టుగా, ‘బైరాగిని మనకు దగ్గర చేసేది అతడి సందేహాలే’. ఆధునికత, ఆధునిక విజ్ఞానశాసా్త్రలు, హేతువు మనిషిని విముక్తుణ్ణి చేయగలవని వికాసయుగం నమ్మకం. వికాసయుగపు విలువలనే కాక, అన్ని విలువల్ని పునర్మూల్యాంకనం చేయవలసి ఉంటుందని నీషే ప్రతిపాదించాడు. అభ్యుదయ కవికి ఈ స్పృహ ఉండదు. అతడికి బైరాగే అన్నట్టుగా సౌందర్యంలో విరూపాన్ని, విరూపంలో సౌందర్యాన్ని చూడగలిగే సామర్థ్యం లేదు. బైరాగి సంశయాత్మకతే (దీన్ని బైరాగి వైయక్తిక స్వభావంగా కాక అతడి కావ్యస్వభావంగా చూడాలి) అతడిని ‘మాస్టర్స్‌ ఆఫ్‌ సస్పిషన్‌’ గా పిలువబడే ఫ్రాయిడ్‌, మార్క్స్‌, నీషేల త్రోవన నడిపించింది. ఇన్నేళ్ళు గడిచాక కూడా, బైరాగి ఈ తరం పాఠకులలో కూడా ఆసక్తి కలిగించడానికి ఈ సంశయాత్మకతే కారణం. ఇక, బైరాగి తాత్త్విక మూలాలు అస్తిత్వవాదం (ఎక్సిస్టెన్షలిజం) లో ఉన్నాయనవచ్చు. అది కూడా కీర్క్‌ గార్డ్‌, దోస్తయెవ్‌స్కీల అస్తిత్వవాదం. వేదన ద్వారా మాత్రమే ఒక దివ్యస్ఫురణకు పాత్రులం కాగలమనేది ఈ మార్గంలోని ముఖ్యాంశం. ఇది సార్ర్త్‌, హైడెగ్గర్‌, హుస్సెర్ల్‌ వంటి వారి అస్తిత్వవాదం కన్నా భిన్నమైనది. ‘ఎర్రక్రీస్తు’, ‘రెండు క్రిస్మస్‌ గీతాలు’, ‘కామ్రేడ్‌ రాయ్‌ స్మృత్యర్థం’ లాంటి ఆధ్యాత్మిక అనుభవాల గాఢతని చిత్రించే కవితల్లో విశ్వసనీయత, తాదాత్మ్యం బైరాగి లోని దివ్యశ్రద్ధ – సందేహాల కలయికవల్లే సాధ్యమయ్యాయనిపిస్తుంది. ‘నమ్మిక లేని తరంవారు’ అని ఆయన అంటున్నప్పుడు, అది ఏకకాలం లో ఆశనీ, నిస్పృహని సూచించే వాక్యం అని గమనించాల్సివుంటుంది.

బైరాగి సంభావ్యతల కవి. మన దృష్టి, పఠనం, అనుభవం విశాలమయ్యే కొలదీ కొత్త అర్థాలతో మనల్ని తిరిగి తన రంగుల తోటలోకి లాక్కుపోయే కవి. ‘అప్రసవిత ప్రసవాలను, అసంభవ నవలభవాలను పిలుస్తాను’ అన్న కవిని, ‘నేను వ్రాసిన కవితల కన్నా వ్రాయదలచి వ్రాయనివే అందమైనవి’ అన్న కవిని ఆయన వ్రాసిన కవితల ‘నైశ్శబ్ద్యాలలో’ దాగున్న సంభావ్య కావ్యాల్లోనే వెతుకవలసివుంటుంది. ఆయన ‘సూక్ష్మశ్రవణుడు’ (బిరుదురాజు రామరాజు గారి మాట). బైరాగి కవిత్వానికి మరింత చేరువవ్వడానికి మనం ‘జాగ్రత్తగా ఆలించే’ విద్యని సాధన చేయవలసి ఉంటుంది.
ఆదిత్య కొర్రపాటి
8978863234
(సెప్టెంబరు 5 ఆలూరి బైరాగి 90వ జయంతి. 9వ తేదీన వర్థంతి)
తస్మాత్‌ జాగ్రత్త
Updated :07-09-2015 00:43:29
ఒక అప్రకటిత నిషేధాజ్ఞ
ఇక ఎప్పుడూ నీ కనురెప్పల
నీడ కింద నీడలా మెదులుతుంది
అదృశ్య ఆంక్షల ఇనప వలల విసురు శబ్దాలు
ఎప్పుడూ నీ దేహం లోలోపలి చెవుల్లో అలజడి సృష్టిస్తాయి
నీ అక్షరాలమీద నీ కలమే
నిఘా కన్ను వేస్తుంది
కాళ్ళూ చేతులూ కళ్ళూ చెవులూ
కనపడని తాళాలు మోసుకుంటూ కదులుతాయి
అంతా ఎప్పట్లానే వుంటుంది కానీ
స్వేచ్ఛగా నీ గుండె ఊపిరి పీల్చుకునేప్పుడు మాత్రమే
శ్వాసనాళంలో ఓ చూపుడు వేలు అడ్డు తగులుతుంది
నీతికీ అవినీతికీ కొత్త నిర్వచనాల
నిఘంటువుల తయారీ మొదలవుతుంది
ఇక అంతా మోరల్‌ పోలీసింగ్‌
పద్మవ్యూహాల కత్తుల పంజరాలే
వేలాడదీయండి…
మీ కలలకైనా..
కనుచూపులు ముడిపడే మునిమాపులకైనా
తూర్పును చెక్కే వెలుగు ఉలులకైనా
రాత్రిని పాడే అక్షరాల అలలకైనా
ఎక్కడైనా సరే వేలాడాల్సింది
సంస్కృతీ సంప్రదాయాల శిలాఫలకాలు మాత్రమే
ఇక భయం కూడా
ఒకానొక అవ్యక్త సుషుప్త నిశీధి నిశ్శబ్దంలో
భయం భయంగా ముడుచుకుపోవాల్సిందే
ఉన్నట్టుండి నీలో దేశభక్తి లబ్‌ డబ్‌ శబ్దాలు
కనపడని నియంత్రణ రేఖల దగ్గర నెత్తురు కక్కుకుంటాయి
వస్త్రాలనే కాదు చర్మాలను చీల్చి కూడా
నీలో లౌకికత్వానికి డిఎన్‌ఏ పరీక్షలు సాగుతాయి
నీ చుట్టూ నీ ఆలోచనల కంచె నీచేతే వేయించి
చేను మేసిన నేరారోపణ నీమీదే మోపి
నిన్ను చూసి నువ్వే నవ్వుకునే ఏడ్చుకునే
నీ నుండి నువ్వే పారిపోయే పరిస్థితులు కల్పించి
నీ పక్కనుంచే ఓ గాలి దెయ్యం కదిలిపోతుంది
వాసన.. వాసన..
పురా సంస్కృతి సురావాసన
మిత్రులారా
ఇక జాగ్రత్త
ఇక్కడ దేశం ఉంది
దేశమంటే మనుషులు కాదోయ్‌ మతమోయ్‌!

ప్రసాదమూర్తి
8498004488
తెలంగాణ విమోచనోద్యమంలో కాళోజీ కవిత్వం
Updated :07-09-2015 00:31:46
‘పుటక చావులు మాత్రమే తనవి – బతుకంతా దేశానిది’గా బతికిన పద్మవిభూషణుడు కాళోజీ నారాయణరావు. తెలంగాణ విమోచనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని, జైలు శిక్షను అనుభవించి రాటుదేలిన ప్రజాకవి. గార్లపాటి రాఘవరెడ్డిగారి సాహచర్యం కాళోజీ కవితారచనకు తోడ్పడింది. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక నేపథ్యం ఇతని కవిత్వానికి పదును తెచ్చింది.

1939వ సంవత్సరం – పెల్లుబుకుతున్న ప్రజా వెల్లువను ఏదో ఒక మేరకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో నిజాం నిరంకుశ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఉర్దూలో ఈ ప్రక్రియను ‘ఇస్లహాత్‌’ అంటారు. దీని ప్రకారం హైదరాబాద్‌ సంస్థానంలో వృత్తుల ప్రాతిపదికన ఎన్నికలు జరిపి, మంత్రి వర్గాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అయితే ఈ మంత్రి వర్గం అసెంబ్లీకి బాధ్యత వహించదు. దాని ఏర్పాటు మొత్తం నిజాం నవాబు ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సంస్కరణలను స్టేట్‌ కాంగ్రెస్‌ బహిష్కరించింది. ప్రజాపక్షపాతియైన కాళోజీ ఈ ఇస్లహాత్‌ను వ్యతిరేకిస్తూ …
‘‘ఎందులకు? ఎందులకు? – ఇస్లహాత్‌ ఎందులకు?
అయ్యలు మెచ్చని మియ్యలు వొల్లని – ఇస్లహాత్‌ ఎందులకు?
…‘కాదు’ అనుచు చాటుగాను – కన్నుగీటుటెందులకు?
పలుకు పలుకునకు అనుజ్ఞ అయితే – ప్రతినిధులగుట ఎందులకు?
ఆధిపత్యమియ్యలేని – ఆయీన్‌ అది ఎందులకు?’’

అంటూ కేవలం అలంకార ప్రాయమైన మంత్రివర్గ ప్రాతినిధ్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంగిలి విస్తరికన్నా హేయమైన పదవులను పొందినవారిని మందలించారు. మరోవైపు నిజాం నవాబు మంత్రివర్గంలో చేరవలసిందిగా ఆహ్వానం రాగా, తిరస్కరించి స్వాభిమానాన్ని ప్రకటించిన బూర్గుల రామకృష్ణారావు గారిని అభినందిస్తూ …

‘‘రాజరికము మోజులేక – తేజరిల్లు నాయకుడా!…
కాలదన్నుమనుటె కాదు – కాలదన్న గల్గినావు’’

అంటూ తెలుగువారు తలెత్తి తిరుగునట్లు చేసిన త్యాగశీలతను ప్రశంసించారు. 1943 మే 26 నాడు హైదరాబాద్‌ ఆబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో జరిగిన దశమాంధ్ర మహాసభ సమావేశంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనోత్సవ సందర్భంగా …‘‘మాతృదేశము మాటముచ్చట – ముదముగూర్పదు మదికిననియెడి…/ అగ్గి కొండల అవనియైనను – మాతృదేశము మాతృదేశమే’’ అంటూ మాతృదేశ భక్తి ప్రబోధాత్మకమైన గేయాన్ని రచించారు. మాతృదేశాన్నీ, మాతృభాషనూ అమితంగా అభిమానించిన కాళోజీ, నిజాం రాష్ట్రంలోని తెలుగు ప్రజల్లో కొందరు తెలుగు భాష పట్ల చూపే నిరాదరణకు స్పందించి …

‘‘ఏ భాషరా నీది ఏమి వేషమురా –
…అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు –
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!!’’
అని సూటిగానే హెచ్చరించారు. భావదాస్యాన్ని ఎండగట్టారు. స్వాభిమానాన్ని తట్టిలేపారు. ఒకవైపు ప్రగతిశీల ప్రజాకవులు దుర్మార్గపు రాజరికాన్ని నిలదీస్తూ అరణ్య, అజ్ఞాత, కారాగార వాసాలు గడుపుతుంటే, మరోవైపు రాజరికానికి అమ్ముడుపోయిన ముగ్గురు ఆనాటి సాహితీవేత్తలను ’రాకాసీ’ అన్న సంకేతనామంతో ప్రజాస్వామ్యవాదులు గర్హించారు. వీరిలో ఒకరు రాయప్రోలు సుబ్బారావు, రెండవ వారు కాసింఖాన్‌, మూడవవారు కురుగంటి సీతారామాచార్యులు. 1943వ సంవత్సరం- వరంగల్లులోని ‘శబ్దానుశాసన గ్రంథాలయ’ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కవి సమ్మేళనానికి రాయప్రోలు అధ్యక్షులు. తెలంగాణా ప్రజల పోరాటానికి సంఘీభావం ప్రకటించని ఆనాటి ఉస్మానియా విశ్వ విద్యాలయ తెలుగు శాఖాధిపతి రాయప్రోలును అధిక్షేపిస్తూ, ఆనాటి కవి సమ్మేళనంలో కాళోజీ చదివిన కవితలో

‘‘లేమావిచిగురులను లెస్సగా మేసేవు – ఋతురాజువచ్చెనని అతి

సంభ్రమముతోడ/ మావి కొమ్మల మిద మైమరిచి పాడేవు/ తిన్న తిండెవ్వారిదే కోకిలా! – పాడు పాటెవ్వారిదే?’’ అని సూటిగానే నిలదీశారు.
1944లో వరంగల్లులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవం జరిగింది. రజాకార్లు ఈ ఉత్సవాలను భగ్నం చేయాలని, వరంగల్‌ కోటలోని ఏర్పాట్లనన్నింటినీ ధ్వంసం చేశారు. కాలి కూలిన పందిళ్ళలోనే కవి సమ్మేళనం నిర్వహించారు. దాదాపు అరవై మంది కవులు కావ్యగానం చేశారు.‘‘కూలిపోయిన కోటగోడలను జూపి/ శిథిలమైన గుళ్ళ శిల్పముల జూపి/…పూర్వ గాథలు జెప్పి పొంగేటి’’ మనస్తత్వాలను కాళోజీ విమర్శించారు. ప్రస్తుత దీనస్థితిని చూసి ప్రతిఘటించాల్సిందిగా ప్రబోధించారు.
కాళోజీ కవిత్వానికి పర్యాయ పదంగా పేర్కొన దగిన గీతం … ‘‘నల్లగొండలో నాజీ వృత్తుల – నగ్న నృత్యమింకెన్నాళ్లు?/ దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని – దొరలై వెలిగే దెన్నాళ్లు? / హింసను పాపమనెంచు దేశమున – హిట్లరత్వమింకెన్నాళ్లు?’’ అని ప్రశ్నించిన కాళోజీ … ‘‘ప్రజా శక్తికి పరీక్ష సమయము – ప్రతీక్ష మనకింకెన్నాళ్లు?’’అనడంలోనే ప్రతిఘటన పోరాటాలకు సమయం ఆసన్నమైందని ధ్వనింపచేశారు. అలాగే 1946వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినప్పుడు … ‘‘…బేజారైన బీదలవోపిక – పెద్దలపై పిడుగయిరాలున్‌/ ‘అయ్య! బానిస’ను అనిన పౌరుడే-అయ్య గొంతుక నట్టేఅదుమున్‌’’ అనే ప్రజా తీర్పును క్రాంతదర్శిగా ప్రకటించారు. నిజాం సైనికులు, రజాకార్లు కలిసి జనగామ తాలూకాలోని మాచిరెడ్డి పల్లె, ఆకునూరు గ్రామాలపైబడి స్త్రీలపై అత్యాచారాలు జరిపారు. ఈ దుశ్చర్యను నిరసించిన కాళోజీ …‘రక్కసి తనముకు పిశాచవృత్తికి -దొరికిన రక్షణ చాలింక/ మాచిరెడ్డిలో ఆకునూరులో – దోచిన మానము చాలింక/ రక్షణకై ఏర్పడ్డ బలగమే – చేసే భక్షణ చాలింక’’ అంటూ అధికార వర్గము ఆడే ఆటలు ఇక సాగడానికి వీలులేదని హెచ్చరించారు. ఈ గేయం అప్పటి ‘తెలుగు స్వతంత్ర’లో ప్రచురించబడింది.
రజాకార్ల హత్యాకాండకు పరాకాష్ఠ జనగాం తాలూకాలోని బైరాన్‌పల్లి గ్రామ ప్రజలపై జరిగిన మూకుమ్మడి దాడి. స్త్రీలపై అత్యాచారాలు, పురుషులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం వంటి ఘటనలతో సంస్థానమంతా అట్టుడికిపోయింది. గుల్బర్గా జైల్లో నిర్బంధంలో వున్న ప్రజాకవి కాళోజీ ఈ వార్తలను చదివి ఆగ్రహోదగ్రులయ్యారు. ‘‘మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన/ మన పిల్లలను చంపి మనల బంధించిన/ మానవాధములను మండలాధీశులను/ మరచి పోకుండగ గురుతుంచుకోవాలె/ కసి ఆరిపోకుండ బుసకొట్టు చుండాలె/ కాలంబు రాగానే కాటేసి తీరాలె/ తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె/ కొంగు లాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలె/ కన్నుగీటిన కళ్ల కారాలు చల్లాలె..’’ అనే కసిగీతాన్ని రచించారు. సత్యం, అహింస, దయ, ధర్మం, క్షమ అన్న పదాలను కట్టిపెట్టి చాణక్యనీతిని ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. ‘‘సాగిపోవుటే బ్రతుకు – ఆగిపోవుటే చావు..’’ అంటూ తెలుగు ప్రజలను ఆగకుండా సాగిపొమ్మని ప్రబోధించారు.

ఆ మహామనీషితో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొనడం, వారి ఉపన్యాస ధోరణిని మంత్ర ముగ్ధులమై వినడం, వారి ధిక్కార స్వరంతో ప్రేరణ పొందడం, వారు బ్రతికిన కాలంలో బ్రతకడం ఒక మధురమైన స్మృతి. మాటలను కత్తులుగా, కొడవళ్లుగా మలచినవారు. పాటలను ఈటెలుగా ప్రయోగించినవారు. కవితాపంక్తులను సూక్తులుగా, సామెతలుగా, నుడులుగా, నానుడులుగా వాడుకునే వెసులుబాటు కల్పించినవారు. నిరంతరం పోరాటాలతో త్రికరణ శుద్ధిగా మమేకమైన పరిపూర్ణ మానవుడు కాళోజీ.
(సెప్టెంబరు 9న కాళోజీ 101వ జన్మదినోత్సవం)

ఎస్వీ సత్యనారాయణ
9618032390

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

81 వ సమావేశంగా సరసభారతి నిర్వహించిన ‘’గురు పూజోత్సవం ‘’

81  వ సమావేశంగా సరసభారతి నిర్వహించిన ‘’గురు పూజోత్సవం ‘’

సరసభారతి 81వ సమావేశం గా గురుపూజోత్సవం

‘’కృష్ణం వందే జగద్గురుం ‘’అనే శ్రీ కృష్ణ పరమాత్మ జయంతి అయిన శ్రీ కృష్ణాష్టమి ,ప్రాచ్య పాశ్చాత్య వేదాంతానికి వారధి, భారతీయ సంస్కృతికి నిలువెత్తు మూర్తిమత్వం ఉన్న డా సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని 127 వ జయంతి కలిసి ఒకే రోజు 5-9-15 శనివారం రావటం గొప్పఅదృష్టం . ఈ మహత్తరమైన రోజున ఉదయం పదకొండు గంటలకు సరస భారతి ,స్థానిక పరి౦కాయల రామస్వామి మెమోరియల్ జాతీయ కళాశాల సంయుక్తంగా సరసభారతికి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా) దంపతుల పూర్తి సౌజన్య సహకారాలతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని  నాకు ,మైనేనిగారికి సుమారు 70సంవత్సరాల కిందట ప్రాధమిక విద్య బోధించిన గురువరేణ్యులు ‘’కీ శే కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం గా ,శ్రీ టి వి ఎస్ బి శాస్త్రి (ఆనంద్)చిత్రించినగురుమూర్తుల  వారి చిత్రపటావిష్కరణ’కార్యక్రమాన్ని ఘనం గా, వేడుకగా నిర్వహించాం .సరసభారతికి ఇది 81వసమావేశం .

పరి౦కాయల కాలేజి విద్యార్ధులు రెండు వందల మంది ,సాహిత్య ,సంగీతాభిమానులు సుమారు వంద మంది   మొత్తం300మంది తో సమావేశ మందిరం అయిన శ్రీ కన్యకపరమేశ్వరి ఏ. సి .కళ్యాణ మందిరం కళకళ లాడింది .మహిళలు కూడా విశేష సంఖ్యలో హాజరయ్యారు .మొదటగా ‘’మచిలీ పట్నం సోదరీ మణులేమో’’ నని పించే శ్రీమతి సింగ రాజు కల్యాణి ,శ్రీమతి కాళీపట్నపు ఉమ గార్లు గాత్ర  సంగీత కచేరి చేశారు .ఇద్దరు సహాయకులు వారికి  వాద్య సహకారం అందించారు .ఆ రోజుకున్న ప్రాధాన్యాన్ని   పురస్కరించుకొని శ్రీ కృష్ణునిపై, గురువులపై ,గీతాలు గానం చేయటమేకాక విద్యార్ధులకు ప్రబోధ గేయాలు కూడా ఒకగంట సేపు  పాడి కచేరీని చాలా రసవత్తరం గా రక్తి కట్టించారు ఇద్దరూ .హర్ష ధ్వానాల అభినందన కరతాళ ధ్వనులతో హాలు మారు మోగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ చేత సరసభారతి -గాయనీ మణులకు నూతన వస్త్రాలు ,శాలువా ,గురుపూజోత్సవ జ్ఞాపిక చెరొక మూడు వేల రూపాయల నగదు చందన పుష్పహార సమేతంగా  ఘనంగా సన్మానించి గౌరవించింది . సహకార వాద్యాల వారిద్దరికీ  చెరొక వెయ్యి రూపాయలు శాలువా సరసభారతి ప్రచురణలు జ్ఞాపికచందన తాంబూల హారాలతో సత్కరించింది .సరసభారతి అధ్యక్షునిగా నేను మాట్లాడుతూ కల్యాణి ,ఉమా గారాల సౌజన్యంమరువ లేనిదని కోరినవెంటనే అంగీకరించి కచేరి చేయటం వారి పెద్దమనసుకు నిదర్శనమని కల్యాణిగారి కచేరీ తోనే ఆరేళ్ళ క్రితం సరసభారతి మొదటి సమావేశం ప్రారంభమైనదని ఇదంతా ఆమె చేతి చలువయే నని అన్నాను .

తరువాత  గురు పూజోత్సవ కార్య క్రమం నా అధ్యక్షతన జరిగింది .ఈ మొత్తం కార్య క్రమానికి శ్రీమైనేని గారు స్పాన్సర్ చేశారని వారి సూచనలు మాత్రమే సరసభారతి అమలు చేస్తోందని దీని క్రెడిట్ అంతా గోపాల కృష్ణ గారిదే నని చెప్పాను. కీ శే .డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి తెలియ జేసి, అంతటి వారి  మనవడు  ఎనభై ఏళ్ళ ప్రొఫెసర్ రామమోహన రావు (అమెరికా )గారు మైనేని గారిని అభినందిస్తూ ‘’గోపాల కృష్ణా నువ్వు  అదృష్ట వంతుడివయ్యా!గురు పూజ చేసి ధన్యుడ వౌతున్నావు’’అని మెయిల్ రాసారని  తెలియ జేశా .మొదట హైదరాబాద్ స్టేట్ బాంక్ ఉద్యోగి  శ్రీ టి వి ఏఎస్  బి శాస్త్రి (ఆనంద్ )చిత్రించిన శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రిగారి వర్ణ చిత్ర ఆవిష్కరణగౌరవ అతిధి సుప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు ,కేంద్ర సంగీత నాటక అకాడెమి పురస్కారగ్రహీత శ్రీ వేదాంతం రాధేశ్యాం  ఆత్మీయ అతిదులైన  గురు పుత్రులు ,కోటసోదరులు  శ్రీ చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ సీతా రామాంజనేయులు శ్రీ గాయత్రి ప్రసాద్  ,ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ ,     శ్రీమతి వరలక్ష్మి ,శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,శ్రీ రావి శివాజీ శ్రీ ఏం. నరసింహారావు గారల సమక్షం లోముఖ్య అతిధి  శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు .అతిధులందరూ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి గురు భక్తిని చాటుకొన్నారు .

నేను ‘’నాకూ మైనేనిగారికి సుమారు  డెబ్భై ఏళ్ళ క్రితం ప్రాధమిక విద్య నేర్పిన స్వర్గీయ కోట మేస్టారుగారిని మరువ  లేదని  వారిని నిత్యం స్మరించుకొంటూనే ఉన్నామనీ గుర్తు చేశాను .మైనేని వారి కొన్ని తీపి జ్ఞాపకాలు ‘’మేస్టారి గారింట్లో నేను నా సోదరి భారతీ దేవి చదివాము . రాత్రిళ్ళు అక్కడే పడుకొనే వారం(స్లీప్ ఓవర్)  మా ఇంటికి వచ్చి కూడా బోధించారు  గురుపత్ని చాలా రుచికరంగా ‘’తోటకూర సెనగ పప్పు పులుసు ‘’ చేసి  భోజనం లో ఆప్యాయంగా తిని పించేవారు . మా ఇద్దరినీ  తాడంకి హైస్కూల్ లో ఆరవ తరగతి లో మేస్టారే చేర్చారు .నా పేరు గోపాల కృష్ణ గోఖలే అని మా నాన్న గారు నామ కరణం చేశారు. ‘’గోఖలే –ఢోకలే ‘’అని నన్ను ఏడిపించేవారు. ఇదిగామనించిన మేష్టారు ‘’గోపాల కిషన్ ‘’అని రిజిస్టర్ లో రాయించారు .కాని ఎస్ ఎస్ ఎల్ సి సర్టి ఫికేట్ లో గోపాల కృష్ణ అని పడి అదే ఖాయమైంది .మేస్టారికి  సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ .బాగా చదివే వాడిని ‘’వెధవ ‘’అంటే వెయ్యేళ్ళు ధనధాన్యాలతో వర్ధిల్లు అని దీవించేవారు. అల్లరి పిల్లల్ని ‘’వెదవ ‘’అంటే వెయ్యేళ్ళు దరిద్రం తో వర్ధిల్లు అని అనేవారు .అనుమానం వాడికి ‘’అదేదో అయిదు చోట్ల అంటు కుంది రా ‘’అని నన్ను అనేవారు .మేస్టార్ని మర్చి పోవటం అసాధ్యం .ఈ స్తితిలొ నేను నా కుటుంబం ఉన్నది అంటే మేష్టారు పెట్టిన అక్షర భిక్ష యే కారణం ‘.అందుకే మా గురుపుత్రులదంపతులను, వారి బంధువులను   గురు పూజోత్సవం నాడు ఘనం గా సత్కరించాలని శ్రీ దుర్గా ప్రసాద్ గారి తో చెప్పాను. వారి అంగీకారం తో వారబ్బాయి రమణ  సహకారం తో  ఈ కార్య క్రమం ఇంత బాగా జరుపుతున్నాం ఇది .గురువు ఋణం తీర్చుకోవటమే తప్ప ప్రచార  ఆర్భాటం కాదు భవిష్యత్తు తరాలకు తెలియాలని స్పూర్తి పొందాలని సవినయం గా చేస్తున్న కార్య క్రమం .దీనిలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు అందజేస్స్తున్నాను .గురు ఋణం తీర్చుకోలేనిది .’’అని నాకు రాసిన మెయిల్ లోని విషయాలను సభా ముఖం గా నేను తెలియ జేశాను .

నాకు అక్షరా భ్యాసం  చేసింది కోట మాస్టారేనని ,మా ఇంటికి దక్షిణాన మూడవ ఇంట్లో ఉండేవారని ,నేను మారాం చేసి బడికి వెళ్ళాక పొతే మేస్టారే మా ఇంటికి వచ్చి బుజ్జగించి తీసుకు వెళ్ళేవారని వారు మా నాన్నగారి శిష్యులని చెప్పాను  .భారత దేశం వదిలి అర్ధ శతాబ్దం అయినా గోపాల కృష్ణ గారికి ఉయ్యూరు తో అనుబంధం ఇంకా ఉంచుకొన్న మనీషి ఎన్నో కార్యక్రమాలు సరసభారతి ద్వారా చేయిస్తున్నారు .వారి ఆత్మీయత మరువలేనిది అన్నాను . తరువాతకోట సోదరులలో పెద్దవారు  శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి గారు(హైదరాబాద్ ) తమ తండ్రిగారి శిక్షణ తమను ఉన్నత విద్యా వంతులనుగా ఉన్నతోద్యోగులనుగా చేసిందని వారి పుత్రప్రేమకు హద్దు లేదని జ్ఞాపకం చేసుకొన్నారు .శ్రీ సీతా రామాంజనేయులు గారు(గుడివాడ)   తమ తలిదండ్రుల చలువతో ఎదిగిన వాళ్ళం మేము .వారు మా మనసులలో నిలిచి ఉన్నారన్నారు  .శ్రీ గాయత్రి ప్రసాద్ (నిజామాబాద్ )తండ్రిగారిని మనసారా స్మరించి కృతజ్ఞతలు తెలియ జేసుకొన్నారు .

గౌరవ అతిధి శ్రీ రాధేశ్యాం ఆంగికాభినయం తో అద్భుత ప్రసంగం చేశారు. సంగీతం నాట్యం నేర్చుకొంటే ఆరోగ్యానికీ బుద్ధి వికాసానికి ఉపయోగపడుతుందని కావలసిన వారికి ఉచితంగా నేర్పిస్తానని ఏ సాహిత్య సంస్థ తనను గుర్తించలేదని సరసభారతి వారు ఆహ్వానించి సత్కరించాలను కోవటం మర్చిపోలేని విషయమనీ అన్నారు .

శ్రీ రాజేంద్ర ప్రసాద్ ‘’దుర్గాప్రసాద్ మాస్టారు  మైనేని వారి సహకారం తో పరింకాయల కాలేజి తో కలిసి ఇంత ఘనమైన గురు పూజోత్సవం జరపటం అభినందనీయం .న్ని విద్యార్ధులు గుర్తించి అనుసరించాలి .ఉయ్యూరు మహా మేధావులు కాకాని వంటి రాజకీయ దురంధరులకు  ,సూరి రామం వంటి గోవా వీరులకు  ,కొలచల సీతా రామయ్య గారి వంటి శాస్త్ర వేత్తలలకు  ఎందరో కవులకు కళాకారులకు నిలయం అన్నారు.

నేను మాట్లాడుతూ   ఇంటర్ నెట్ లో నేను రాసిన ‘’కేమటాలజి పిత కొలచల సీతా రామయ్య –పుల్లేరు నుండి వోల్గా వరకు ‘’అనేదాన్ని పుస్తక రూపం లోకి తీసుకు రావటానికి స్పాన్సర్ గా శ్రీరాజేంద్ర ముందుకు వచ్చారని దీనికి సరసబారతి తరఫున కృతజ్ఞతలు అని చెప్పగానే హర్ష ధ్వానాలతో హాలు దద్దరిల్లింది .ఇది సరసభారతి ప్రచురించే 18 పుస్తకం, నేను రాసిన 12 పుస్తకం అవుతుందని తెలియ జేశాను .ఈ బాధ్యత మా అబ్బాయి రమణ మీద వేస్తున్నాను అన్నాను .శ్రీమతి వరలక్ష్మి ,శ్రీ శివాజీ శ్రీ నరసింహా రావు గార్లు క్లుప్తంగా మాట్లాడాక, శ్రీమతి శ్యామలాదేవి గానం తో సభ సమాప్తమైనది .

పిమ్మట అతిధులకు ఆత్మీయ సత్కారం జరిగింది .శ్రీ కోట సోదరులకు దంపతులతో సహా నూతన వస్త్రాలు ,శాలువా జ్ఞాపిక చందన తాంబూలాలతో నేనూ మా శ్రీమతి శ్రీమతి ప్రభావతి  శ్రీ రాజేంద్ర సహకారం తో ఘనంగా నిర్వహించాం .గురుపుత్రుల ఆచూకీ తెలిపిన శ్రీ కోట సీతా రామ శాస్త్రి గారి దంపతులకు ఇదే విధంగా సత్కారం చేశాం  కోట వారి మనవడు మనవ రాలికి, వారి బంధువులకు ఈవిద మైన సన్మానమే చేసి సంతో షిం చాం తరువాత శ్రీ రాధేశ్యాం గారి సన్మానం రెండు వేల రూపాయల నగదు ,నూతన వస్త్రాలు ,శాలువా జ్ఞాపిక ,సరస భారతి పుస్తకాలు చందన తాంబూలాలు  అందజేసి సత్కరించాం రాధేశ్యాం గారి విద్య ఉద్యోగం సన్మానాలు మొదలైన వివరాలను నేనే తెలియ జేశాను అందరికి ..గురువు గారి చిత్రపట చిత్రకారుడు శ్రీ ఆనంద్ దంపతులను   పై విధంగానే (నగదు లేకుండా)సన్మానిం చాం ఈ సందర్భం గా నేను మాట్లాడుతూ ‘’ఆనంద్ మా బావ మరది .హైదరాబాద్ స్టేట్ బాంక్ ఉద్యోగి .ఎన్నో చిత్రాలు గీసి పేరు పొందిన ఆర్టిస్ట్ .చాలా చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించాడు .నేను మైనేనిగారు అడగ గానే కోట మాస్టారి చిత్రపటాన్ని వేయ టానికి అంగీకరించి ,దానికి  ప్రతి ఫలం తనకు వద్దని ఈ పవిత్ర కార్యం లో తానూ ఒకడి నవుతున్న సంతృప్తిని ఇవ్వమని చెప్పిన సౌజన్యుడని చిత్రం గీసి ఫ్రేం కట్టించి వాళ్ళబ్బాయి  వంశీతో సహా హైదరాబాద్ నుండి  ఉయ్యూరు వచ్చి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశాడు అని చెప్పాను .

తరువాత ముఖ్య అతిధిశ్రీ రాజేంద్ర ప్రసాద్ కు చందాన తాంబూలాలు పుష్పహారం ఆయనకు భార్యకు  నూతన వస్త్రాలు  శాలువా ,జ్ఞాపిక అందజేసి అందరం ఘనం గా సన్మాననించాం.తర్వాత శ్రీమతి వరలక్ష్మి దంపతులను శాలువ జ్ఞాపిక తోను ,శ్రీ శివాజీ శ్రీ నరసింహా రావు దంపతులను శాలువా జ్ఞాపిక  సరసభారతి పుస్తకాలు అందజేసి సత్కరించాం .మా అబ్బాయి రమణ దంపతులకు మైనేని వారి ఆదేశం తో నూతన వస్త్రాలు శాలువా ,జ్ఞాపక చందన తాంబూలాలతో శ్రీ రాజేంద్ర ప్రసాద్ చేత సత్కరింప జేశాం .తరువాత పై విధంగానే మా దంపతులకు మైనేని వారి సత్కారం రాజేంద్ర చేయగా  ,ఆనంద్ ,రాజేంద్ర మొదలైనవారు శాలువాలతో సన్మానించారు . ఆనంద్ తన ఉయ్యూరు హైస్కూల్ లెక్కల మేష్టారు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రిగారిని శాలువాతో సన్మానించాడు .  శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసినపేద ప్రతిభ గల విద్యార్ధికి  ‘’కీ శే కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారం ‘’ను శాంతి నికేతన్ లో   పదవ తరగతి విద్యార్ధి ఛి గేదల మనోజ్ కుమార్ కు 10,000 రూపాయలు ,పెన్ సెట్ ,సరసభారతి గ్రంధాలు జ్ఞాపిక తో సహా శ్రీ రాజేంద్ర చేతులమీదుగా అంద జేయిం చాం .అలాగే ఆయన ద్వారానే పరి౦కాయల కాలేజి ఇంటర్ మొదటిసంవత్సరంవిద్యార్ధిని ఛి ఆరేపల్లి దీపికకు 10,000రూపాయలు పెన్ సెట్ జ్ఞాపిక ,పుస్తకాలు అందజేయి౦ఛాం .మా గురు పుత్రులు శ్రీ కోట సోదరులు తమ తండ్రిగారి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన స్మారక నగదు బహుమతి 10 , 000రూపాయలు ఉయ్యూరు సిద్ధార్ధ కాలేజి లో ఇంటర్  రెండవ సంవత్సరం  చదువుతున్న పేద ప్రతిభ గల విద్యార్ధిని ఛి.అంబటిపూడి మోనికా భవానికి శ్రీ కోటసోదరులు తమ చేతులమీదుగా అంద జేశారు .ఈ  సందర్భం గా సోదరులు ఈ నగదు బహుమతిని ప్రతి ఏడాది ఇస్తామని హర్ష ధ్వానాల మధ్య తెలియ జేశారు .

సరస భారతి నిర్వహణకు ప్రోత్సాహం గా గురజాడ కు చెందిన శ్రీ వీణెం గోపాల కృష్ణ గారు సభా ముఖం గా 1,116రూపాయలు అందజేయగా కృతజ్ఞతలు తెల్పుకొన్నాను .

సభానిర్వహణను ఆద్యంతం నేర్పుగా సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి నిర్వహించగా సాంకేతిక సహకారం శ్రీ వీర రమాచనేని బాలగంగాధర రావు అందించారు .సరసభారతి కార్య వర్గ సభ్యుల సహకారం ఎన్నదిగినదే .

ఉదయం అందరికి టిఫిన్ కాఫీ లు ,కార్యక్రమానంతరం అందరికి విందు ఏర్పాటు చేశాం .విద్యార్ధులందరికీ స్వీటు హాటు పొట్లాలు అందజేయి౦ చాం .ఈ ఆర్య క్రమం ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు చూడ టానికి వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయించాం .

సుమారు మూడు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమం విజయ వంతం కావటానికి ముఖ్య కారణం పాల్గొన్నకాలేజీ  విద్యార్ధినీ విద్యా ర్దుల సహన౦ , సహకారం  క్రమ శిక్షణ .వారి లెక్చరర్ల పర్య వేక్షణ .వారి వలననే ఇంత దిగ్విజయమైఁన దని సభా ముఖం గా నేను తెలి

య జేశాను .

శ్రీ కోట  సోదరులుదంపత్యుక్తంగా  బంధు మిత్రులతో తరలిరావటం ఎంతో హృద్యంగా నిండుగా  ఉండి మాకు, గోపాలకృష్ణ గారికి పరమ సంతోష కారణ మైంది .వారన్దరూ  కార్య క్రమం జరిగిన తీరు ,వారి పట్ల కనబరచిన గౌరవ ఆత్మీయతలకు పరవశించి ఎంతోమురిసిపోయి చాలాసార్లు కృతజ్ఞతలు తెలియ జేశారు అది వారి  సౌజన్య సంస్కారమే . మైనేనిగారి కోరిక ఏంతో ఘనం గా తీరి అందరికి సంతోషాన్ని సంతృప్తిని కలిగించింది .వారి సహృదయత అలాంటిది .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-15 –ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘నీ అన్యాయo సిగ గొయ్య ”అని మేస్టా రినే అన్న శిష్యుడు విశ్వనాధ –


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొలువు పిలుస్తోంది!

కొలువు పిలుస్తోంది!

  • 06/09/2015
  • -బి.వి.ప్రసాద్ -శ్రీధర్, కాటపల్లి అశోక్‌కుమార్

‘మీరేం చేస్తూంటారు..?’ .. కుర్రకారు ఎదురైతే వారిని చాలామంది అడిగే తొలిప్రశ్న ఇది. ప్రభుత్వ ఉద్యోగమేనా..? జీతమెంత..? గీతం ఏమైనా ఉంటుందా..? పీఎఫ్ వగైరా ఉంటాయా..? బదిలీలుంటాయా..? .. ఇవీ తరువాత దూసుకొచ్చే ప్రశ్నలు. ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై మోజున్నా, లక్షల్లో జీతాలొస్తున్నా- ప్రభుత్వ ఉద్యోగమంటే ఆ ప్రత్యేకతే వేరు. ఆ ఉద్యోగాల్లో ఉండే భద్రత ప్రైవేటు నౌకరీల్లో లేదు. దీంతో యువత, మెజారిటీ తల్లిదండ్రులు సర్కారీ కొలువులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గడచిన కొనే్నళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు మందగించడంతో ప్రైవేటురంగం వైపుకన్నువేసిన యువతకు ఇపుడు మంచికాలం వచ్చిందనే చెప్పాలి. అటు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, ఇటు కేంద్రప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు పెద్దఎత్తున నియామకాలకు కసరత్తు చేస్తున్నాయి. అపుడే నోటిఫికేషన్ల పరంపర మొదలైంది. దీంతో నిరుద్యోగ యువత ఇప్పుడు సర్కారీ కొలువు కొట్టేయడానికి సిద్ధవౌతున్నారు. పుస్తకాలతో కుస్తీ మొదలెట్టారు. కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. లైబ్రరీల్లో రద్దీ పెరిగింది. మొత్తమీద కొలువుల జాతర సందడి తెలుగునేలపై కన్పిస్తోంది. *** ఒకప్పుడు వ్యవసాయం చేయడాన్ని గర్వంగా చెప్పుకునేవారు. ఇవాళ అది నామోషీగా మారింది. స్వయం ఉపాధిపై దృష్టి తగ్గింది. ప్రభుత్వ ఉద్యోగం రాకపోతేనే ప్రైవేటు ఉద్యోగంలో కుదురుకునేది. అందరి దృష్టీ సర్కారీ నౌకరీపైనే. ప్రపంచవ్యాప్తంగా జరిగిన విశే్లషణలు చూస్తే 90 శాతం మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి. కేవలం 3 శాతం మంది మాత్రమే ప్రైవేటు ఉద్యోగాలపై దృష్టిపెడుతున్నారు. మిగిలిన ఏడు శాతం మంది పరిశోధనలు, ఇతర వ్యాపకాలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సౌఖ్యం, సౌకర్యం, భద్రత మిగిలిన ఉద్యోగాల్లో ఉండవనే భావనే దీనికి కారణం. జీతాలు సక్రమంగా ఇవ్వడం, కావల్సినపుడు సెలవులు, వేతన చట్టాలను కచ్చితంగా పాటించడం, పని భారం తక్కువగా ఉండటం, ఒత్తిడి లేకపోవడం, తక్కువ అర్హతలున్నా సీనియారిటీపై ఉన్నత పదవులకు చేరుకునే వీలుండటం వంటి అంశాలు దీనికి కారణం. ప్రభుత్వ ఉద్యోగంలో జీతంతో పాటు గీతం కూడా దక్కే అవకాశం ఉండటం, కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం, హోదా ఉన్నాయి. ఆ సర్వేలో చాలాకొద్దిమంది మాత్రమే సమాజానికి సేవ చేయాలనే దృక్పథం, పేదవారికి సహాయపడాలనే ఆలోచన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతులు, పెట్టుబడి సమస్య, వ్యాపారంలో గ్యారంటీ లేకపోవడం, ఎక్కువ సమయం కేటాయించాల్సిరావడం, స్థిరత్వం లేకపోవడం, ఎదుగుదలకు ప్రతిబంధకాలు వంటివి ఎన్నో ఉండటంతో స్వయం ఉపాధిపై నిరుద్యోగ యువత ఆసక్తి చూపడం లేదు. ఏతావతా యువతలో ప్రభుత్వ ఉద్యోగంపైనే మోజు కనిపిస్తోంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మునుపెన్నడూ లేనివిధంగా సాగనుంది. దీంతో ఉద్యోగార్థులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణలో లక్షకుపైగా ఖాళీలు తెలంగాణ రాష్ట్రంలో తొలుత 1.06 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు భావించినా, ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తక్షణం వివిధ విభాగాల్లో దాదాపు 25వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. నోటిఫికేషన్లు వరసగా వెలువడుతున్నాయి. తెలంగాణ పోలీసు శాఖలో10,810 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కానిస్టేబుల్ క్యాడర్ నుండి ఎస్‌ఐ వరకూ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఎస్‌ఐ మేల్ 467, ఎస్‌ఐ ఫిమేల్ 77, ఆర్‌ఎస్‌ఐ 59, కానిస్టేబుల్ మేల్ 2978, కానిస్టేబుల్ ఫిమేల్ 38, ఎఆర్ కానిస్టేబుల్ 2169, ఎఆర్ కానిస్టేబుల్ ఫిమేల్ 57, ఎస్‌పిఎఫ్ 174,కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు మరో 3600 ఉన్నాయి. ఫారెస్టు డిపార్టుమెంట్‌లో 2వేల పోస్టుల భర్తీ జరగనుంది. ఇరిగేషన్, వాటర్ గ్రిడ్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌కో, జెన్‌కో తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో ఆరు వేల పోస్టులు నింపుతారు. వెటర్నరీ డిపార్టుమెంట్‌లో 477 , ఎక్సైజ్ కానిస్టేబుల్స్ 321, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు 276, ఎసిటిఓలు 147, డిప్యూటీ తహసీల్దార్‌లు 20 పోస్టులు భర్తీ చేస్తారు. వైద్య, అనుబంధ కోర్సులు చేసిన వారికి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్ట్ఫా నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్-1లో కనీసం 300 పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆంధ్రాలో… ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షను నిర్వహించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ) పరిధిలో ఇప్పటికే 3వేల ఉద్యోగాలను డిప్యూటేషన్, డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేశారు. రాష్టవ్రిభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్పష్టత వస్తే మరిన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. యూనివర్శిటీల్లోనే బోధన, బోధనేతర పోస్టులు దాదాపు 5వేల వరకూ ఉన్నాయి. అటవీ, పోలీసు, వైద్య, సంక్షేమ శాఖల్లో మరో 6వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. జాతీయస్థాయిలో… జాతీయ స్థాయిలో కీలక ఉద్యోగాలు పొందాలన్న ఆకాంక్ష ఉన్నవారు సివిల్ సర్వీసు పరీక్షలు రాయడం ద్వారా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో నియామకానికి కూడా సివిల్ సర్వీసు రిక్రూట్‌మెంట్ ద్వారా మార్గం సుగమం అవుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఎన్నో కీలకమైన పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తుంది. ఆ తరహా ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ సంస్థలు దేశంలో చాలానే ఉన్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో ఈ ఏడాది లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో వచ్చే ఏడాది పదవీ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య భారీగానే ఉంటుంది. దీంతో ఆయా పోస్టుల భర్తీ తప్పనిసరి కానుంది. కొత్తరాష్ట్రంలో యువత ఆశలు, ప్రభుత్వం హామీలు, విభజిత రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలన్న అక్కడి ప్రభుత్వం చర్యలు ఉద్యోగాల భర్తీ తప్పనిసరి కాబోతోంది. ఈ ఏడాది కనీసం వేలల్లోనైనా ఉద్యోగాల భర్తీ చేయకతప్పదు. ప్రశాంత జీవితం చిన్న ఉద్యోగమైనా ఫర్వాలేదు, ప్రభుత్వ ఉద్యోగమైతే చాలన్న భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. అందువల్ల చిన్న పోటీ పరీక్ష నిర్వహించినా లక్షలాది మంది పరీక్ష రాస్తున్నారు. ఈ మధ్య జరిగిన బ్యాంకింగ్ సర్వీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన క్లర్కు పోస్టులకు 18 లక్షల మంది పరీక్ష రాశారు. అందులో టెన్త్ పాసైన వారు మొదలు పీజీలు, పిహెచ్‌డిలు చేసిన వారు కూడా ఉండటం, ఇంజనీరింగ్ చదివిన వారు సైతం పోటీ పడటం పరీక్ష నిర్వాహకులనే ఆశ్చర్యపరిచింది. అనేక వడపోతలు నిర్వహించి ఉద్యోగం ఇవ్వగానే స్పెషలైజ్డ్ కోర్సులు చేసిన వారు తమకు తగిన ఉద్యోగం రాగానే వెళ్లిపోతున్నారు. దాంతో మరోమారు రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించుకోవల్సి వస్తోంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే కొన్ని పోస్టులకు అర్హతలను ఖరారు చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో అదనపు అర్హతలు ఉన్నవారిని నిరాకరిస్తున్నారు. ఎక్కువ అర్హతలకు ప్రభుత్వం రంగంలో ప్రాధాన్యం లభిస్తుండగా, సరిపడా అర్హతలకే ప్రైవేటు రంగం పరిమితం అవుతోంది. మారిన దృక్పథం ఉద్యోగం అంటే యజమాని దగ్గర, యజమాని కోసం పనిచేస్తూ ఆ పనికి తగినట్టు నెలకు కొంత మొత్తాన్ని జీతం లేదా వేతనంగా పొందడం అని చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో హిందీ నానుడి ఒకటి వాడుకలో ఉండేది. ‘వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మాధ్యమం, ఉద్యోగం అథమం’ అని, ఉద్యోగం అంటేనే గాడిద చాకిరీగా భావించేవారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్కరి వ్యాపకం వ్యవసాయంగానే ఉండేది. రానురాను వ్యవసాయం వైపు ఆసక్తి తగ్గి ఉద్యోగాలకు అనే్వషణ పెరిగింది. హరితవిప్లవం పేరిట రసాయన మందులను యథేచ్ఛగా వాడటంతో వ్యవసాయం పెట్టుబడి పెరిగి గిట్టుబాటు తగ్గి జీవనమార్గాలను అనే్వషించాల్సి వచ్చింది. దీంతో ఇపుడు ఉద్యోగం ఉత్తమమైనదిగా భావిస్తున్నారు. ఏ వ్యక్తి అయినా స్వశక్తిపై నమ్మకం లేనపుడు, భవిష్యత్ అంటే భయం ఉన్నవాడు, ఆర్థిక ఆసరా లేనివాడు మాత్రమే ఉద్యోగాలకు వెళ్లేవారు. ఉద్యోగం అంటే ఒకరి దగ్గర ఊడిగం చేయడంగానూ, అవమానకరంగానూ గతంలో ఆలోచించేవారు. రోజురోజుకూ పరిస్థితి మారింది. సొంత ఉపాధి కంటే ఉద్యోగంలో ఉన్న అవకాశాలు, ఆర్ధిక సదుపాయాలు, సెలవుల వెసులుబాటు, హోదా, సమాజంలో గౌరవం, కొన్ని శాఖల్లో అస్సలు ఒత్తిడి లేకపోవడం, హాయిగా ఏదో ఒకటి రెండు గంటలు గడిపేస్తే లక్షలాది రూపాయల వేతనం పొందే వీలుండటం వంటివి ఉద్యోగంపై దృష్టి పెరిగేలా చేశాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగం పొందినా లేని మరిన్ని విస్తృత సౌకర్యాలు, సదుపాయాలు నేడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటంతో అందరి దృష్టీ వీటిపై పడింది. ఇదీ వాస్తవం బాగా డబ్బు సంపాదించాలన్నది సమాజంలో చాలామంది కోరిక. ప్రభుత్వ ఉద్యోగం చేస్తే నిలకడైన ఆదాయం, హోదా ఉండొచ్చు. కానీ ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించే అవకాశం ప్రైవేటు ఉద్యోగాలతో పోలిస్తే తక్కువ. కానీ ఆ రంగంలో భద్రత తక్కువ. వ్యాపారం, స్వయం ఉపాధిలో నాయకత్వ లక్షణాలు, పదిమందికి ఉపాధి చూపడం, బాగా డబ్బు సంపాదించే వెసులుబాటు ఉన్నా సవాళ్లూ ఎక్కువే. ఉద్యోగాలు చేసిన వారిలో 90 శాతం మంది వేతనాలు కేవలం 30వేల రూపాయల లోపు మాత్రమే. 5 శాతం మంది వేతనం లక్ష వరకూ ఉండగా, మరో ఐదు శాతం మంది వేతనం లక్షదాటి ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర, రాష్ట్ర వేతన సవరణ చట్టాల వల్ల ఒక్కొక్కరి వేతనం ఐదు నుండి పదివేలు పెరిగినా, మొత్తం మీద చూస్తే అత్యధిక వేతనం పొందేవారు 10 శాతం కాగా, తక్కువ వేతనాలతో నెట్టుకొచ్చేవారు 90 శాతం మంది ఉన్నారు. ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేటు రంగంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఫలితంగా వీరు నిత్యం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. ఉద్యోగంతో రోజులు గడుపుకోవడమేగాని, ఆస్తులు సంపాదించలేం అని చాలా మంది అంటుంటారు. నిజానికి సంపాదనకు, చదువుకు సంబంధం లేదు. సంపాదనకు కాస్తంత తెలివి ఉండాలి అంతే. సెటిల్మెంట్ ఆ మధ్య ‘రంగీలా’ సినిమాలో ‘ఏం చేయదలుచుకున్నావ్?’ అని హీరోయిన్ అడిగితే హీరో ‘సెటిల్ అవుతా’ అంటుంటాడు. సెటిల్ అవ్వడం అంటే వయసులో ఉండగానే పనిచేయకపోయినా నెలతిరగ్గానే చేతికి డబ్బు వచ్చేలా ప్రణాళిక వేసుకోవడమే. అందుకే సామర్ధ్యం ఉన్న ప్రతి వ్యక్తి వయసులో ఉండగానే సెటిల్ కావాలని కోరుకుంటాడు. నిపుణులకే.. కార్పొరేట్ సంస్థల్లో కాలుమోపాలనే ఉద్యోగార్ధుల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మేకిన్ ఇండియా, ఇ గవర్నెన్స్, డిజిటల్ పాలన, స్మార్టు సిటీస్ కానె్సప్ట్, డెవలప్‌మెంట్ గోల్స్‌తో పాటు ఐటి, ఐటిఇఎస్, టెలికం, హాస్పిటాలిటీ, ఫార్మా-హెల్త్ రంగం, బిఎఫ్‌ఎస్‌ఐ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, అవుట్ సోర్సింగ్, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, ఆతిథ్య -రిటైల్ రంగాలు అవకాశాల ద్వారాలను తెరుస్తున్నాయి. అయితే అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇకపై ఉపాధి పొందడం అంత సులభమేమీ కాదంటున్నారు నిపుణులు. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో సంస్థలు ఉండటంతో, అపారమైన నైపుణ్యం ఉన్న నిపుణులకే ఐటి కొలువులు దరిచేరుతున్నాయి. సుమారు 35 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని ఇచ్చిన ఐటి రంగంలో, కొత్త ఉద్యోగ నియామకాలు గత ఏడాది తగ్గిపోయాయి. సాఫ్ట్‌వేర్ కోడింగ్ విభాగంలో ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి రావడంతో, సంప్రదాయ ఐటి సేవలకు గిరాకీ గణనీయంగా తగ్గిపోయింది. తక్కువ నైపుణ్యం ఉన్న సామాజిక మొబిలిటీ, బిగ్ డేటా విశే్లషణ, ఐఓటీ ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలో నైపుణ్యం చూపించే వారికే ఐటి ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయని చెబుతున్నారు. ఇటీవలి కాలం వరకూ భారత్ కొత్తగాకల్పిస్తున్న ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం సంప్రదాయ ఐటి విభాగంలోనే వచ్చాయి. ఇకపై ఆ తరహా పరిస్థితులు ఉండవు. 2014-15లో ఐటి రంగంలో 2.24 లక్షల ఉద్యోగాలు ఇవ్వగా, 2015-16లో ఆ సంఖ్య రెండు లక్షలు దాటబోదని ‘నాస్కామ్’ అంచనా వేస్తోంది. రాబోయే కాలంలో ఐటి కంపెనీల ఆదాయాల వృద్ధిరేటుకు సమానంగా ఉద్యోగ నియామకాల వృద్ధి ఉండే అవకాశాలు లేవని విశే్లషకులు చెబుతున్నారు. 2003లో ఐటి పరిశ్రమకు 6300 కోట్ల రూపాయిల ఆదాయం దక్కితే 38వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2015లో మార్చి నాటికి ఏడాదిలో 6300 కోట్ల ఆదాయానికి కేవలం 14300 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ‘నాస్కామ్’ చెబుతోంది. పెరుగుతున్న అవకాశాలు భారతీయ కంపెనీలు అధికమొత్తంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాయి. అలాగే కంపెనీలు ఉద్యోగుల వేతనాలను పెంచాలని చూస్తున్నాయి. ఈ విషయాలు ‘కెరీర్ బిల్డర్ ఇండియా’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రానున్నకాలంలో శాశ్వత ఉద్యోగుల నియామకాలు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు 73 శాతం కంపెనీలు వెల్లడించాయి. కాంట్రాక్టు ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టనున్నట్టు 60 శాతం కంపెనీలు తెలిపాయి. దాదాపు 46 శాతం మంది వర్కర్లు ఉద్యోగ బదిలీల వేటలో ఉన్నారు. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో ఉద్యోగ వేతనాలు పెంచాలని దాదాపు 86 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఉద్యోగుల ప్రారంభ జీతాన్ని ఐదుశాతం కన్నా పైగానే పెంచాలనే భావనతో 57 శాతం కంపెనీలున్నాయి. రానున్నకాలంలో కస్టమర్ సర్వీసెస్, సేల్స్, మార్కెటింగ్, ఐటి తయారీ, ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగాల్లో అధిక ఉద్యోగ నియామకాలు నమోదు కానున్నాయి. మొబైల్ టెక్నాలజీ , క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి తదితర విభాగాల్లో కూడా నియామకాలు జోరుంటుంది. చీర్ లీడర్స్ క్రికెట్‌లో చీర్ లీడర్స్ టైప్‌లో ఇపుడు కంపెనీల్లో కూడా ప్రోగ్రామింగ్ చీర్ లీడర్స్ వచ్చేస్తున్నారు. ఖాతాదారులతో నవ్వుతూ, జోకులేస్తూ, సరదాగా మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించే ఉద్యోగాలు ఈమధ్య ‘పొట్టి స్కర్టులు ధరించే అమ్మాయిల’కే దక్కుతున్నాయి. ఖాతాదారులు రాగానే వారితో ముచ్చట్లు పెట్టడం, ఏం కావాలో అడిగి తెలుసుకోవడం, నవ్వించడం, వీటన్నింటితో పాటు ఆఫీసుల్లో ఉన్నవారితో ఆటలాడుతూ, ఉద్యోగులను ఉత్సాహపరిచి, మంచి ఉత్పాదకతను సాధించే బాధ్యతలను వీరికి అప్పగిస్తున్నారు. చైనాలోని టెక్నాలజీ కంపెనీలు అన్నీ ఇదే బాటలో ఉన్నాయి. అక్కడి పలు ఐటి కంపెనీలు ప్రస్తుతం వీరిని నియమించి ఉద్యోగులకు ఉల్లాసం కలిగిస్తున్నాయని ‘ట్రెండింగ్ ఇన్ చైనా’ సంస్థ ప్రకటించింది. అందమైన అమ్మాయిలను నియమించిన తర్వాత కంపెనీల వాతావరణం మారిపోతోంది. ముఖ్యంగా పురుషులు ఉత్సాహంగా పనిచేస్తున్నారని తేలింది. అయితే ఈ కొత్త పోకడలను ప్రశ్నిస్తున్నవారూ లేకపోలేదు. స్పీడ్ హైరింగ్ దేశంలో ఉద్యోగ నియామక ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతోంది. సంస్థల వ్యాపార పంథాతో పాటు రిక్రూట్‌మెంట్ విధానమూ కొత్తగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ కామర్స్, స్టార్టప్ వంటి నేటి తరం కంపెనీలు వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాల్సి వస్తున్నందు వల్ల ఉద్యోగుల భర్తీప్రక్రియకు ఎక్కువ సమయం వెచ్చించడానికి ఇష్టపడటం లేదు. సమయం వృథా చేయడం ఇష్టం లేక స్వల్ప సమయంలోనే మంచి సమర్ధులను ఎంచుకునే దానిపై ఆధారపడుతున్నాయి. దీంతో తక్కువ సమయంలో కంపెనీ వ్యాపార స్థితిగతులకు తగిన వ్యక్తిని నియమించుకునే విధానాలను అవలంబిస్తున్నాయి. అలా పుట్టుకొచ్చిందే- స్పీడ్ హైరింగ్ కానె్సప్ట్. ఈ విధానంలో కేవలం 12 నిమిషాల్లోనే ఇంటర్వ్యూకు హాజరైన వ్యక్తి భవితవ్యం తేల్చేస్తారు. ఇందుకోసం అభ్యర్ధుల గ్రాహక శక్తిని పరీక్షించడం ద్వారా ఉద్యోగం ఇవ్వాలా లేదా అనేది కంపెనీలు తేల్చేస్తాయి. స్నాప్‌డీల్, ఓలా క్యాబ్స్, క్వికర్, ఫుడ్ పాండా, ప్రాక్టో, డబ్ల్యుఎస్‌ఎస్ వంటి టెక్నాలజీ ఆధారిత సేవల సంస్థలు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవల్సి ఉంటుంది. వేల మందిని ఇంటర్వ్యూలు నిర్వహించుకుంటూ రోజులు, నెలల తరబడి కాలాన్ని వెచ్చించడం ఇష్టం లేక ఆ కంపెనీలు రిక్రూట్‌మెంట్ సంస్థలకు బాధ్యతను అప్పగించి ఒకటి రెండురోజుల్లోనే అభ్యర్ధులను ఎంపిక చేసి ఇవ్వమని కోరుతున్నాయి. స్పీడ్ హైరింగ్ టెస్టు నిర్వహించదలచుకున్న వారికి కో క్యూబ్ టెక్నాలజీస్ సంస్థ కాగ్నిటివ్ ఎబిలిటీ స్పీడ్ టెస్టు (కాస్ట్) పేరుతో ప్రత్యేక టూల్‌ను తయారుచేసింది. ఈ టూల్ ద్వారా ఇంగ్లీషు గ్రామర్, తేలికపాటి లెక్కలు, విశే్లషణ శక్తిని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. తద్వారా సంస్థల హెచ్‌ఆర్ మేనేజర్లు అభ్యర్ధుల గ్రాహణ శక్తిని అంచనా వేసి, తమ కంపెనీకి సరిపోతారనుకున్నవారికి వెంటనే ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు. ‘రిస్క్’తోనే కొందరికి కిక్.. సంపాదనే లక్ష్యంగా చదువుతున్నవారి ప్రాధాన్యతలు చాలా త్వరగా మారిపోతున్నాయి. రిస్క్ తీసుకుంటూ సవాళ్లను ఎదుర్కొనాలనుకునే వారు మాత్రం ధైర్యంగా, సొంతంగా ముందుడుగు వేస్తున్నారు. వ్యాపారమా? ప్రైవేటు ఉద్యోగమా? అని ఆలోచించకుండా వారు స్వశక్తిని నమ్ముకుంటున్నారు. ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో ఏ రంగంలోనైనా వీరు మాత్రమే దూసుకుపోతున్నారు. నిజానికి ఇలాంటి వారికి ప్రైవేటురంగంలోనే అవకాశాలు పుష్కలం. రిస్క్ ఇష్టం లేనివారు, భద్రత కావాలనుకున్నవారు ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. కాస్తంత సామాజిక స్పృహ, ధైర్యం ఉన్నవారు స్వయం ఉపాధి రంగంవైపు చూస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మాత్రం ఎవరూ మానడం లేదు. ముందుగా సర్కారీ నౌకరీలో చేరి, ఆ తరువాత తమసొంత కోర్కెలకు తగ్గట్టు భవిష్యత్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. అందుకే ఇప్పుడు సర్కారీ కొలువులకోసం కొత్తపోటీ మొదలైంది. * గత వైభవం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తున్న వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌లను జారీ చేస్తోంది. తెలంగాణ ఆవతరణ దినోత్సవం నాటి నుండి హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాలకు సంబంధించిన నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిలో పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. ప్రయివేట్, కార్పొరేట్ స్థాయి ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా నేటి యువతరం ప్రభుత్వ ఉద్యోగాలపై మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమైతే పూర్తిస్థాయి భద్రతతో పాటు అనేక రకాల లాభాలుంటాయన్నది వారి నమ్మకం. ప్రభుత్వం ప్రకటించిన వయోపరిమితి సడలింపుతో అనేకమంది కార్యాలయానికి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకుంటుండంతో రద్దీ పెరిగింది. తెలంగాణలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ జిల్లాలో గత జూన్ మాసం నుండి నెలకు వెయ్యి చొప్పున ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల మంది ఎంప్లాయిమెంట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి తెలంగాణ వెబ్ సైట్‌కు సంబంధించిన డబ్ల్యుడబ్ల్యు.టిఎస్‌పిఎస్.జిఓవి.ఇన్‌లో తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నట్లయితే ప్రభుత్వపరంగా రానున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు ఫోన్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందుంతుంది. తప్పకుండా నిరుద్యోగ డిగ్రీ విద్యార్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోడానికి వచ్చేవారి కోసం అన్ని ఏర్పాట్లు చేశాము. – కె.నాగభారతి, హైదరాబాద్ జిల్లా ఉపాధి అధికారి ‘టెంపరరీ’ అయినా ఓకే… ఉద్యోగంకోసం ఎదురుచూస్తున్న యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తూనే ప్రైవేటు రంగంలోనూ అవకాశాలను వదులుకోవడం లేదు. పైగా అర్హతకు తగ్గ, స్థిరమైన ఉద్యోగం కోసం కాలాన్ని వృథా చేయడం లేదు. నవతరం ఆలోచనాధోరణిలో చెప్పుకోదగ్గ మార్పు గోచరిస్తోంది. అర్హతలకు తగ్గ ఉద్యోగం తాత్కాలికమైనదే అయినా, కాంట్రాక్టు పద్ధతిలోనే అయినా చేరిపోతున్నారు. అలాంటి ఉద్యోగాల్లో ఉంటే కావలసినప్పుడు, మంచి ఉద్యోగం వచ్చినప్పుడు వెళ్లిపోవడం సులభమని వారి నమ్మకం. పైగా అలాంటి ఉద్యోగాల్లో ఉన్నప్పుడే కొత్త టెక్నిక్స్, పనిలో మెళకువలు, కొత్త అంశాలను నేర్చుకోవడం సులభమని, ప్రతిభకు పదునుపెట్టే ఛాన్స్ అక్కడే దొరుకుతుందని, ఉద్యోగ విధుల నిర్వహణలో ఓనమాలు నేర్చుకోవడం అంటూ జరిగేది అలాంటి ఉద్యోగాల్లోనేనని వారంటున్నారు. ఇది పుక్కిట పురాణం కాదు. ఫెక్సిబిలిటీతో కూడిన తాత్కాలిక ఉద్యోగాలవైపు యువత ఆకర్షితులవుతున్నారన్నది ‘ఇండియన్ స్ట్ఫాంగ్ ఫెడరేషన్’ సర్వేలో తేలిన వాస్తవం. దేశంలో 49.7 మిలియన్లమంది ఉద్యోగాలు చేస్తూంటే వారిలో 28.8మంది ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నారు. మిగతా వారంతా తాత్కాలిక, ఫ్లెక్సిబుల్ ఉద్యోగాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా చేనేత, హస్తకళలు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, గుమాస్తాలు, బోధనారంగాల్లో ఈ ధోరణి కన్పిస్తోంది. ఎయిమ్స్, ఆధార్ వ్యవహారులు నిర్వహించిన యుఐడిఎఐ సహా ఎన్నో ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తున్నది ఇలాంటి ఔత్సాహికులనే. వారివల్ల ప్రభుత్వం చేయాల్సిన పనులు చౌకగా, వేగంగా సాగిపోతున్నాయి. ఇటు నిరుద్యోగులకు ఉపాధితోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు, విధివిధానాలపై అవగాహన పెరుగుతోంది. రేపోమాపో ఎప్పుడైనా పర్మినెంట్ చేస్తే ఈ అనుభవం పనికొస్తుందన్నది వారి ఆశ. నిజానికి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, కంప్యూటర్స్‌లో కొంత అవగాహన ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశాలే ఉన్నాయంటున్నారు ఇండియన్ స్ట్ఫాంగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు రితుపూర్ణ చక్రవర్తి. ముఖ్యంగా రిసెప్షనిస్టులు, సెక్రటేరియట్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, టెక్నికల్ లీడర్స్, సీనియర్ డెవలపర్స్ వంటి ఉద్యోగాల్లో వారిని నియమించవచ్చన్నది రితు అభిప్రాయం. ఇక ప్రైవేటురంగంలో 1.7 మిలియన్లమంది ఏటా ఇలాంటి ఉద్యోగాల్లో చేరుతున్నారు. అవినీతి లేని నియామకాలు కావాలి నిరుద్యోగుల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు దక్కాలి. నియామకాల్లో పారదర్శకత ఉండాలి. ఉద్యోగాల భర్తీలో లంచగొండితనానికి తావ్వివద్దు. సీనియార్టి ప్రకారం ఉద్యోగం లభించేలా అధికారులు కృషి చేయాలి. తెలంగాణలో కొలువుల జాతర అంటున్నారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో నియామకాలు జరపాలి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కొరత ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంప్లాయిమెంట్ కార్డులున్నా ఇన్నాళ్లూ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఎంప్లాయిమెంట్ కార్డు రెన్యువల్‌కోసం హైదరాబాద్ ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి వచ్చా. ఎంప్లాయిమెంట్ కార్డు రెన్యువల్‌లో వయోపరిమితిని తగ్గించడం కూడా సంతోషకరమైన విషయం. -కె.మహేంద్రనాథ్, ఫలక్‌నూమ-జంగమ్మెట్ అన్ని ఖాళీలూ భర్తీ చేయాలి చాలా కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు జాబ్‌ల జాతరను నిర్వహించటాన్ని స్వాగతిస్తున్నాం. వెయ్యి, రెండువేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా పూర్తి స్థాయిలో అన్ని శాఖల్లోని ఖాళీలకు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఆదేశాలివ్వాలి. నోటిఫికేషన్ విడుదల తర్వాత పరీక్షలకు కనీసం మూడు నెలల గడువునివ్వాలి. మారిన సిలబస్‌తో అభ్యర్థుల్లో అయోమయం నెలకొందని, వారు ఆత్మస్ధైర్యం కోల్పోకుండా పరీక్షలకు సిద్ధమయ్యేలా వారిని ప్రోత్సహించాలి. పరీక్షలను కూడా అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పారదర్శకతతో నిర్వహించాలి. పోటీ ఎక్కువగానే ఉన్న నేటి తరుణంలో ఉద్యోగాలు దక్కని అభ్యర్థులకు కనీసం ఎంపిక పారదర్శకతతో జరిగిందన్న నమ్మకాన్ని కలిగించాలి. -తోట అంజన్న, ఎంటెక్ , విద్యుత్ ఇంజనీరింగ్ అభ్యర్థి ఉద్యోగాల వెల్లువ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆతిథ్యం, ఐటి రంగాల్లో ఆశాజనకమైన వృద్ధి కనిపిస్తున్నందున రానున్న రోజుల్లో ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరగబోతున్నాయి. ‘ఆన్‌లైన్’లో ఉపాధి సేవలందిస్తున్న ‘నౌక్రీ’ సంస్థ జరిపిన తాజా సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే, వృద్ధి కనిపిస్తున్న రంగాల్లో – అనుభవం ఉన్న వారికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని తేలింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఉపాధి అవకాశాలు బాగా అందుబాటులోకి వస్తాయని ఆ సర్వే చెబుతోంది. నాలుగు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న వారికి అగ్రతాంబూలం లభించే పరిస్థితి ఉందని ‘నౌక్రీ హైరింగ్ ఔట్‌లుక్’ సర్వే చెబుతోంది. కొత్తగా ఉపాధి అవకాశాల కల్పనకు కూడా ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగావకాశాలతో పాటు కొన్ని రంగాల్లో వేతనాలు కూడా బాగా పెరుగుతాయని సర్వేలో పాల్గొన్న పలు కార్పొరేట్ సంస్థల యాజమాన్య ప్రతినిధులు తెలియజేశారు. సేవల విస్తరణకు పరిస్థితులు కలిసొస్తున్నందున ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సర్వేలో 60 శాతం మంది విశ్వాసం ప్రకటించారు. ఇపుడు వస్తున్న జీతభత్యాల కంటే మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు లభించే పక్షంలో ఉద్యోగాలు మారతామని ఎంతోమంది యువకులు చెప్పారు. ఉద్యోగ, వ్యక్తిత్వ జీవితాలు మెరుగ్గా ఉండాలని యువత ఆశించడమే ఇందుకు కారణం. కాగా, పలురంగాల్లో ప్రతిభావంతుల కొరత ఉన్నందున అనుభవం ఉన్నవారికి మంచి ఉద్యోగాలు, మేలైన వేతనాలు లభించే పరిస్థితి కనిపిస్తోంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మల్లన్నగుడికి 8దారులు ,అలిగితివా సఖి పాట

8ways 1 001

దారులన్నీ అటువైపే

  • 04/09/2015
  • – శ్రీ

కథలకు కరువాచిన తెలుగు తెర -ప్రయోగాలను పక్కనపెట్టి పాత కథల బూజు దులుపుతోంది. జానర్‌లను జాడీల్లో మూతపెట్టి -సకుటుంబ సపరివారాన్ని తెరకుఎక్కిస్తోంది. తెర నిండుగా ఉంటేనే ప్రేక్షకుడికి కనువిందు. తాతా మామ్మా, అమ్మా నాన్న, అత్తా మామ, అన్నా వదిన, తోబుట్టువులు, బంధువర్గం… ఇలా కుటుంబగణంతో కళకళలాడే ఇళ్లు నిజానికి నందనవనమే. అందుకే -ఆ బంధాలను, అనుబంధాలను తెరపై ఇంపుగా చూపించే తెలుగు సినిమాలు వరుస పెడుతున్నాయి. ప్రధానంగా స్టార్ హీరోలే యాక్షన్‌పాళ్లు తగ్గించి -ఎమోషన్ స్ట్రోక్ పెంచుతున్నారు. అవును తెలుగులో కుటుంబ కథలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వరుసగా వస్తున్న కథలతోపాటు -ఈ ఏడాది చివరినాటికి మరిన్ని కుటుంబ కథా చిత్రాలు తెరపై దర్శనమివ్వబోతున్నాయి. =================== ప్రపంచం చిన్నది గురూ! ఎక్కడ మొదలెట్టామో తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటాం -అంటూ చాలా సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగులే ఇప్పుడు టాలీవుడ్‌లో నిజం అవుతున్నాయి. భూమి గుండ్రంగా ఉంది కనుక -ప్రయాణం ఎక్కడ మొదలెట్టామో తిరిగి అక్కడికే చేరుకుంటాం. ఇప్పుడు తెలుగు సినిమా కూడా అలాగే ప్రయాణించి -మళ్లీ కుటుంబ కథా చిత్రాలను భుజానికి ఎత్తుకునే చోటుకు చేరుకుంది. నిజానికి -తెలుగు సినిమా ఖ్యాతి బాహుబలితో ఒక్కసారిగా పెరిగింది. దేశం మొత్తం తెలుగు సినిమావైపు చూసే సందర్భం ఆ సినిమాతోనే ఆరంభమైంది. ఈ ఏడాది ప్రథమార్థం అంతంత మాత్రంగానే విజయాలతో నెట్టుకొచ్చిన పరిశ్రమకు -ద్వితీయార్థంలో భారీ అంచనాలతో వచ్చిన బాహుబలి సినిమాతో ఘన విజయం దక్కింది. అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న బాహుబలికి -రాజరికపు కుటుంబ కథే మూలం. ఇక కొద్దిరోజుల క్రితం విడుదలైన మహేష్‌బాబు శ్రీమంతుడూ ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బాహుబలి తరువాత టాలీవుడ్‌లో వంద కోట్ల మార్కెట్ దాటిన సినిమాగా నిలిచింది. తరువాత వెంటనే చిన్న సినిమాగా విడుదలైన ‘సినిమా చూపిస్త మావ’కూ మంచి విజయమే దక్కింది. ఈ విజయాలకు అసలు కారణం -ఇవన్నీ కుటుంబ కథా చిత్రాలే కావడం. ఇలా వరుసగా మూడు హిట్ చిత్రాలతో తెలుగు సినిమా వాతావరణం మారింది. అందుకే ప్రస్తుతం సినిమావాళ్ళ దృష్టి అంతా ఫ్యామిలీ ఆడియన్స్‌పై పడింది. ఇప్పటివరకూ మాస్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ అంటూ ఎన్ని జోనర్లలో సినిమాలు చేసినా, చివరాఖరుకు వారందరికీ నచ్చేది ఫ్యామిలీ జోనరే. హీరోయిజమ్ ఉన్న సినిమాలు, విలనిజంవున్న సినిమాలు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అనే నేపథ్యాలు ఎన్నివున్నా అన్నింటికీ మూలం ఫ్యామిలీ చిత్రాలే. ఎన్ని వైవిధ్యాలతో చిత్రాలు నిర్మించినా -్ఫ్యమిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే సేఫ్ అని భావిస్తోంది తెలుగు పరిశ్రమ. అందుకోసమే ఇప్పుడు ఫ్యామిలీ కానె్సప్టుతో సినిమాలు రూపొందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా దీనికి గట్టి ప్రయత్నాన్ని వేసింది -కొరటాల శివ. కొద్దికాలం క్రితం మిర్చి సినిమాతో కుటుంబ కథా చిత్రాలకు కొత్త అర్థాన్ని చెప్పి, ఆ సినిమాతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాడు. ఇటీవలే శ్రీమంతుడుతో కుటుంబ కథా చిత్రాల జోనరే సేఫ్ అని మరోసారి నిరూపించాడు. శ్రీమంతుడు సినిమాతో ఫ్యామిలీ కథా చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. ఇప్పుడు యువ హీరోలు కూడా హీరోయిజమ్ వున్న కథల్ని పక్కనపెట్టి కుటుంబ చిత్రాల బాటపట్టారు. అయితే, కొద్దికాలం క్రితంనుంచే పెద్ద హీరోలు సైతం కుటుంబ కథా చిత్రాలపై నమ్మకం పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆమధ్య వచ్చిన రామ్‌చరణ్ ‘గోవిందుడు అందరివాడే’ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. అల్లు అర్జున్ కూడా సన్నాఫ్ సత్యమూర్తి చేసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ అంటూ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రెడీ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మరోవైపు గోపీచంద్, శర్వానంద్, అల్లరి నరేష్, నాని వంటి హీరోలు సైతం కుటుంబ కథా చిత్రాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. అమ్మ.. నాన్న.. అక్కా.. చెల్లి.. అన్నా.. తమ్ముడు.. వంటి అనుబంధాలే కాకుండా కుటుంబ కథా చిత్రాలు అనగానే తెరనిండా నటీనటుల సందడితో పిన్నిలు, బాబాయిలు, అత్తయ్యలు, మామయ్యలు, మరదళ్లు, బావలు వంటి హంగామాతో చూడ్డానికి ఆకట్టుకునేలా ఉంటాయి సినిమాల్లోని కుటుంబాలు. ఇలాంటి నేపథ్యంలో వచ్చే సినిమాల్ని చూడడానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఏ నేపథ్యంలో సినిమా అయినా కథే ముఖ్యం. కథానుగుణంగా ఒక్కో దర్శకుడు ఒక్కో శైలితో కుటుంబ కథా చిత్రాలను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మహేష్‌బాబు మరోసారి ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మొగుడితో నీరసపడినా మొక్కవోని ధైర్యంతో గోపీచంద్ కూడా తాజా చిత్రంతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ కుటుంబ కథా చిత్రాల నేపథ్యానికి అసలైన కారణం మరొకటుంది. యూత్‌ఫుల్ సినిమాలు అయితే కేవలం యూత్‌ను మాత్రమే ఆకర్షిస్తాయి. మాస్ సినిమాలు పట్ల మహిళా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిచూపరు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ కథా చిత్రాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది కనుక -సినిమాకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో రాబడి, సినిమాకు హిట్టు రేటు పెరుగుతుంది. టీవీ మీడియా, వెబ్ మీడియా హంగామా సృష్టిస్తున్న ఈ రోజుల్లో మహిళా ప్రేక్షకులను థియేటర్ వరకూ రప్పించే ఏకైక మార్గం ఫ్యామిలీ సినిమానే. ఇప్పటికే బాలీవుడ్‌లో కుటుంబ కథా చిత్రాలకు కొదవే లేదు. అప్పట్లో ‘మైనే ప్యార్‌కియా’, ‘హమ్ ఆప్‌కే హై కౌన్’, దిల్‌వాలే దుల్హానియా లేజాయింగే వంటి చిత్రాలు సంచలన విజయం సాధించి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేయి. ఇంకా మరిన్ని సినిమాలూ సిద్ధమవుతున్నాయి. మరికొందరు టాలీవుడ్ హీరోలూ కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు మరి! సో.. రేపటి పొద్దు ఎర్రని తెల్లని రంగులు విదుల్చుకుని పచ్చని పైరుల వంటి కుటుంబాల్లోకి విచ్చుకుంటోందన్న మాట! ఇంకేం.. పాజిటివ్ ఆలోచనలతో కుటుంబ కథా చిత్రాలను చేయాలనుకునే వారికి ఇదే మంచి తరుణం, శుభపరిణామం!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

“‘యాభై ఏళ్ళ రొయ్యలు ”(చెమ్మీన్ సినిమా),ప్రభాకర కిరణాలు

chemmin 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గురుపూజోత్సవ వార్తలు దినపత్రికల్లో- సరసభారతి 81వ సమావేశం గా గురుపూజోత్సవం 5-9-15 శనివారం ఆర్య వైశ్య కళ్యాణ మందిరం

Sakshi 001_1 vartha 001_1 andhrajyothi 001 Enadu 001_1 Sakshi 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మనకూ ఉంది ఒక మొఘల్ గార్డెన్ ,పాలపిట్టకు ముప్పు


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment